Sachin Tendulkar
-
ఉదయాన్నే బూత్‌లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్‌లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడి వికెట్ పారేసుకున్నాడు.ఈ నేపథ్యంలో కోహ్లి బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కివీస్ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్ కావడంతో భారత మాజీ క్రికెటర్లు సైతం కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది మాత్రం.. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం’’ అని ఈ రన్‌మెషీన్‌కు అండగా నిలిచారు.రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన రూపంలో కోహ్లి వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. తనను తాను మరోసారి నిరూపించుకునే సమయం వచ్చింది. మామూలుగానే కంగారూలతో టెస్టుల్లో చెలరేగి ఆడే ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మరింత గొప్పగా రాణిస్తాడని ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ఇక్కడా విఫలమైతే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే చివరిసారి అవుతుందని కూడా జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి గనుక మునుపటి ఫామ్ అందుకుంటే ఆస్ట్రేలియా గడ్డపై రెండు అరుదైన భారీ రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.మరో 458 పరుగులు చేస్తే!బీజీటీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లి గనుక 458 పరుగులు సాధిస్తే.. సచిన్ టెండుల్కర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలవుతుంది. కంగారూ గడ్డపై సచిన్ 20 టెస్టులు ఆడి 53.20 సగటుతో.. 1809 పరుగులు సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు కోహ్లి.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 54.08 సగటుతో 458 పరుగులు సాధించాడు. కాబట్టి ఈసారి ఇంకో 458 పరుగులు చేశాడంటే.. సచిన్ టెండ్కులర్ను అధిగమిస్తాడు.ఇక ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ టెండుల్కర్, కోహ్లి ఆరేసి శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈసారి కోహ్లి ఒక్క సెంచరీ చేస్తే.. సచిన్‌ను వెనక్కి నెట్టి భారత్ తరఫున ఆస్ట్రేలియాలో అత్యధిక శతకాలధీరుడిగా అవతరిస్తాడు.కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది. జనవరి 3-7 వరకు జరుగనున్న ఐదో టెస్టుతో టీమిండియా ఆసీస్ టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. కోహ్లి ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో రాబట్టిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.చదవండి: ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు ఆ జట్టు సొంతం! -
ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. మెగా వేలంలో...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.గోవాకు ప్రాతినిథ్యంకాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.పొర్వోరిమ్లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనేఅర్జున్ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్‌ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్‌డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముంబై తరఫున కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే! -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ఓపెనర్.. సచిన్, కోహ్లి రికార్డులు బద్దలు
షార్జా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అఫ్గాన్ విజయంలో స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 245 పరుగుల లక్ష్య చేధనలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. కాగా రహ్మానుల్లాకు ఇది ఎనిమిదో వన్డే అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. తద్వారా గుర్భాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.సచిన్, కోహ్లి రికార్డు బద్దలు..అంతర్జాతీయ వన్డేల్లో అతి పిన్న వయస్సులోనే ఎనిమిది సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా గుర్భాజ్ రికార్డులెక్కాడు. గుర్భాజ్ కేవలం 22 సంవత్సరాల, 349 రోజుల వయస్సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రన్ మిషన్ విరాట్ కోహ్లిని గుర్భాజ్ ఆధిగమించాడు. సచిన్ 22 ఏళ్ల 357 రోజుల వయస్సులో ఈ రికార్డు సాధించగా.. కోహ్లి 23 ఏళ్ల 27 రోజుల వయస్సులో అందుకున్నాడు.ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ అగ్రస్ధానంలో ఉన్నాడు. డికాక్ 22 ఏళ్ల 312 రోజుల్లో ఈ రికార్డును నమోదు చేశాడు. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో సాధించిన మొత్తం సెంచరీల(30)లో గుర్భాజ్ సాధించినివే 25 శాతం కావడం గమనార్హం.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
రికార్డుల రారాజు.. సచిన్‌ను మైమరిపించిన విరాటుడు
ప్రపంచ క్రికెట్లో అతడొక కింగ్. అతడికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. తండ్రి ఆశయం కోసం ఎంతటి సవాలునైనా ఎదిరించగల సాహసి. ప్రాణంలా ప్రేమించిన తండ్రి మరణం బాధిస్తున్నా.. ఆటగాడిగా తన విధిని నిర్వర్తించిన అంకితభావం గల వ్యక్తి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే అతడు బరిలోకి దిగనంతవరకే.. అతడు మైదానంలో అడుగుపెడితే ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.రికార్డులను తన ఇంటి పేరుగా మార్చుకుంటూ వరల్డ్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసుకున్న ధీరుడు అతడు. క్రికెట్ దేవుడు సచిన్‌ను మరిపించేలా పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది.కొండంత లక్ష్యాన్ని కూడా సరే అవలీలగా కరిగించే ఛేజ్ మాస్టర్. వరల్డ్‌క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు మారుపేరు అతడు. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. "విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు". ఇది సచిన్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేసినప్పుడు కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెసిన వాఖ్య ఇది. ఇది నిజంగా అక్షర సత్యం. కోహ్లి నేడు తన 36వ పుట్టిన రోజు జరుపునకుంటున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన పలు అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.👉: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన కోహ్లి మొత్తంగా 50 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ నమోదు చేసిన విరాట్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉండేది. ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేరని అంతా అనుకున్నారు. కానీ సచిన్ రికార్డు బద్దలు కొట్టి కోహ్లి చరిత్రకెక్కాడు. తన ఆటతో సచిన్‌ను కూడా ఫిదా చేసి.. క్రికెట్ దేవుడినే మైమరిపించాడు.👉: వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. 2023 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. కోహ్లి కేవలం 278వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్(321) పేరిటే ఉండేది.👉: మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. ఇప్పటివరకు 538 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కింగ్ కోహ్లి సొంతం చేసుకున్నాడు.👉: వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి ఏకంగా 765 పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివకు 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 39 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ కూడా సరిగ్గా 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డు సాధించాడు. కేవలం 96 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లిఈ ఫీట్ నమోదు చేశాడు. -
టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచి కివీస్ ముందు టీమిండిచా మోకరిల్లింది. 92 ఏళ్ల ఇండియన్ క్రికెట్లో సొంతగడ్డపై రెండు కంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో తొలిసారి వైట్‌వాష్‌కు గురై ఘోర అవమానాన్ని రోహిత్ సేన ఎదుర్కొంది. ఈ సిరీస్ అసాంతం భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకిల పడింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఘోర పరభావంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ ఓటమితో భారత జట్టు కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సచిన్ అభిప్రాయపడ్డాడు."స్వదేశంలో 3-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం మింగుడు పడని విషయం. కచ్చితంగా టీమిండియా ఈ ఓటుములపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఘోర పరభావానికి ప్రిపరేషన్ లోపమా, పేలవమైన షాట్ ఎంపికనా, లేక మ్యాచ్ ప్రాక్టీస్ లోపమా? కచ్చితంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. శుబ్‌మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో అతడు పూర్తిగా భిన్నంగా కన్పించాడు. పంత్ ఫుట్‌వర్క్ చాలా బాగుంది. అతడి బ్యాటింగ్‌ను చూస్తే వేరే పిచ్‌పై ఆడినట్లు అన్పించింది. పంత్ సింప్లీ సూపర్బ్ అంటూ" ఎక్స్‌లో లిటల్ మాస్టర్ రాసుకొచ్చాడు.చదవండి: Wriddhiman Saha Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్ -
Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే: సచిన్
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖానే!అద్భుత ఆట తీరుతో కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) తండ్రి సొంతూరిలో కివీస్ తరఫున రచిన్ శతకంమరోవైపు.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.ఎవరిది పైచేయి అవునో?!ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్‌కు ఉంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్... తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్ టెండుల్కర్ రచిన్, సర్ఫరాజ్లపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Cricket has a way of connecting us to our roots. Rachin Ravindra seems to have a special connection with Bengaluru, where his family hails from! Another century to his name.And Sarfaraz Khan, what an occasion to score your first Test century, when India needed it most!… pic.twitter.com/ER8IN5xFA5— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2024 -
అమెరికాలో సచిన్‌కు సత్కారం.. దేవుడు ఇక్కడే ఉన్నాడన్న ఉన్ముక్త్! (ఫొటోలు)
-
నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్
క్రికెట్ అభిమానులకు మరో టీ20 లీగ్ కనువిందు చేయనుంది. నవంబర్ 17 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి ఎడిషన్ ప్రారంభం కానుంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ లీగ్‌కు సంబంధించిన ఫిక్షర్స్ మరియు కెప్టెన్ల వివరాలను నిర్వహకులు ఇవాళ (అక్టోబర్ 8) వెల్లడించారు. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు సాగే ఈ లీగ్ భారత్‌లోని మూడు వేర్వేరు వేదికలపై (ముంబై, లక్నో, రాయ్‌పూర్) జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతాయి.ఈ లీగ్‌లో భారత్ సహా ఆరు ఐసీసీ సభ్యు దేశాలు పాల్గొంటున్నాయి. ఈ లీగ్‌లో భారత జట్టుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు. శ్రీలంక జట్టుకు కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా కెప్టెన్లు వహించనున్నారు.లీగ్ ఫిక్షర్స్..నవంబర్ 17- భారత్ వర్సెస్ శ్రీలంక (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 18- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 17- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 20- వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 21- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 23- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 25- వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 26- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 27- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 28- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)నవంబర్ 30- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 1- భారత్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 2- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 3- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 5- సెమీఫైనల్-1 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 6- సెమీఫైనల్-2 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)డిసెంబర్ 8- ఫైనల్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)చదవండి: PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్ -
అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ భాగస్వామిగా సచిన్
వాషింగ్టన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమెరికాకు చెందిన నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్సీఎల్) యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులు ఏదో ఒక రూపంలో పాల్గొంటుండగా... ఇప్పుడు ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు చేరింది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘క్రికెట్ నా జీవితంలో అతి ముఖ్య భాగం. అలాంటి ఈ ప్రయాణంలో ఎన్‌సీఎల్‌లో భాగం కావడం మరింత ఆనందాన్నిస్తోంది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభించే విధంగా కృషి చేస్తా. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎన్‌సీఎల్‌లో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ అని సచిన్ పేర్కొన్నాడు. ఎన్సీఎల్ తొలి సీజన్లో సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్, వెంకటేశ్ ప్రసాద్ (భారత్), జహీర్ అబ్బాస్, అక్రమ్, మొయిన్‌ఖాన్ (పాకిస్తాన్), రిచర్డ్స్ (వెస్టిండీస్), జయసూర్య (శ్రీలంక) వేర్వేరు జట్లకు కోచ్, మెంటార్లుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మార్పులను స్వాగతించే వారిలో ముందు వరుసలో ఉండే సచిన్... ఇప్పుడు ఈ 60 స్ట్రయిక్ ఫార్మాట్లో భాగం కానున్నారు. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా టి20, టి10, హండ్రెడ్ ఫార్మాట్లు ప్రాచుర్యం పొందగా... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఎన్సీఎల్ సిక్స్టీ స్ట్రయిక్స్ పేరుతో మరో కొత్త ఫార్మాట్‌కు తెరలేపుతోంది. తొలి ఎడిషన్‌లో రైనా, దినేశ్ కార్తీక్, అఫ్రిది, షకీబ్, షమ్సీ, క్రిస్ లిన్, ఏంజెలో మాథ్యూస్, బిల్లింగ్స్ వంటి పలువురు ప్లేయర్లు పాల్గొంటారు. -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్
వెటరన్ క్రికెటర్లు సందడి చేసేందుకు మరో టీ20 క్రికెట్ లీగ్ పుట్టుకొచ్చింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీ తొట్టతొలి సీజన్ ఈ ఏడాది జరగనుంది. సోమవారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంచ్ చేశారు. ఈ లీగ్ కమీషనర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ నియమితుడయ్యాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ ఆరు దేశాల నుంచి క్రికెట్ స్టార్లు పాల్గొనున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ లీగ్‌లో భారత తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది."క్రికెట్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. గత దశాబ్దం నుంచి టీ20 క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఈ పొట్టి క్రికెట్లో తమకు ఇష్టమైన మాజీ క్రికెటర్లు ఆడితే చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది. వెటరన్ క్రికెటర్లు ఆడే ప్రతీ లీగ్‌కు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారని సచిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా లీగ్‌లోని మ్యాచ్‌లు ముంబై, లక్నో, రాయ్‌పూర్‌లలో జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే..
శుక్రవారం నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పర్యాటక బంగ్లా జట్టు మాత్రం భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కాన్పూర్ టెస్టులో కోహ్లి మరో 35 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు 514 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి..26,965 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(34357) , కుమార సంగర్కకర(28016), రికీ పాంటింగ్(27483) ఉన్నారు.కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?కాగా టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత కోహ్లి తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విఫలమైన విరాట్.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అందరి కళ్లు కోహ్లిపైనే ఉన్నాయి. కాన్పూర్ టెస్టులో విరాట్ ఎలా రాణిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
కోహ్లిలో ఊపు తగ్గింది.. సచిన్ రికార్డులు బద్దలు కొట్టలేడు: ఆసీస్ మాజీ
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిలో మునుపటి ఊపు లేదని హాగ్ ఆరోపించాడు. పరుగులు సాధించడంలో విరాట్ లయ తప్పాడని హాగ్ అన్నాడు. గత కొంతకాలంగా విరాట్ టెస్ట్‌ల్లో అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయడం లేదని తెలిపాడు. ఇలాగే ఆడితే విరాట్ సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్లో 200 టెస్ట్‌లు ఆడి 15,921 పరుగులు చేయగా.. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 114 టెస్ట్‌లు ఆడి 8871 పరుగులు మాత్రమే సాధించాడని హాగ్ అన్నాడు. విరాట్ సచిన్ రికార్డును అధిగమించాలంటే మరో 7051 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫామ్‌తో కోహ్లి ఇన్ని పరుగులు సాధించడం దాదాపుగా అసాధ్యమే అని హాగ్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్‌ల్లో గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లి అస్థిరమైన ఫామ్ అతన్ని వెనక్కు నెట్టిందని హాగ్ పేర్కొన్నాడు. విరాట్ సచిన్ రికార్డులకు చేరవగా వెళ్లాలంటే తదుపరి 10 టెస్ట్‌ల్లో తిరిగి తన లయను అందుకోవాల్సి ఉంటుందని అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ హాగ్ ఈ విషయాలను ప్రస్తావించాడు.కాగా, ఫాబ్ ఫోర్‌గా చెప్పుకునే విరాట్, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లలో జో రూట్ సచిన్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఇప్పటివరకు 146 టెస్ట్‌లు ఆడి 12402 పరుగులు చేశాడు. రూట్ టెస్ట్‌ల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కొట్టాలంటే మరో 3500 పైచిలుకు పరుగులు సాధిస్తే చాలు. రూట్ ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇది అసాధ్యమేమి కాకపోవచ్చు. చదవండి: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా -
సచిన్ తనయుడి సూపర్ పెర్ఫార్మెన్స్..!
కేఎస్‌సీఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో (కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్బుత ప్రదర్శనతో మెరిశాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ 13 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభినవ్ తేజ్రాణా సెంచరీతో (109) కదంతొక్కడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసింది. గోవా ఇన్నింగ్స్‌లో మంతన్ కుట్కర్ అర్ద సెంచరీతో (69) రాణించాడు. భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక..సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. అర్జున్ 13.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గోవా భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జున్ 26.3 ఓవర్లు వేసి 87 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. వచ్చే వారం 25వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న అర్జున్.. సీనియర్ లెవెల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. ఇందులో 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ అర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ తన కెరీర్లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా -
సచిన్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్న కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో విరాట్ మరో 58 పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 27000 రన్స్ రికార్డును (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో) బద్దలు కొడతాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27000 పరుగుల మార్కును అందుకునేందుకు సచిన్‌కు 623 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్‌కు 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. విరాట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 593 ఇన్నింగ్స్‌లు ఆడి 26942 పరుగులు చేశాడు. సచిన్ ఓవరాల్‌గా 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే 27000 పరుగుల మార్కును అందుకున్నారు. వీరిలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో విరాట్ మరో 58 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ అవుతాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో విరాట్ మరో 1075 పరుగులు చేస్తే.. సచిన్ తర్వాత రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ -
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్‌కు చోటు లేదుఅయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే!
భారత స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం.. కోహ్లి మరో 58 పరుగులు సాధిస్తే చాలు..!! ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!..వన్డే శతక రారాజుఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం బాదాడు. మొత్తంగా 80 సెంచరీలతో సచిన్ టెండుల్కర్(100 సెంచరీలు) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పటికే వన్డేల్లో సచిన్ సెంచరీల(49) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లో శతకాల రారాజుగా ఆవిర్భవించాడు.27 వేల పరుగుల మైలురాయికి చేరువలోఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఇప్పటికే టెస్టుల్లో 8848, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా తన ఖాతాలో 26,942 పరుగులు జమచేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టులో మరో 58 రన్స్ చేశాడంటే.. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండుల్కర్ వరల్డ్ రికార్డును అతడు బద్దలు కొట్టనున్నాడు.సచిన్ 623 ఇన్నింగ్స్‌లో సాధిస్తేకాగా సచిన్ ఖాతాలో 34,357 పరుగులు ఉన్నాయి. అయితే, ఇందులో 27 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు సచిన్ 623 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. తద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.అదే జరిగితే.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా కోహ్లి పేరుఅయితే, విరాట్ కోహ్లి ఇప్పటికి 591 ఇన్నింగ్స్‌లోనే 26,942 పరుగులు చేశాడు. బంగ్లాతో సెప్టెంబరు 19న మొదలయ్యే తొలి టెస్టులో 58 పరుగులు చేశాడంటే.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్లో 27 వేలు పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్‌ను అధిగమిస్తాడు. కేవలం 592 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసి.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. అదీ సంగతి!కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs BAN: భారత్‌తో టెస్టు సిరీస్.. బంగ్లా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 75.00 సగటుతో 375 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు ఉన్నాయి. లంకతో సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో జో కీలక పాత్ర పోషించాడు. కాగా సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. రూట్‌కు ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..⇥టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ఆటగాళ్లు గ్రాహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ ఆండర్సన్‌ల పేరిట ఉండేది. వీరిముగ్గురూ 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌లగా నిలిచారు. తాజా సిరీస్‌లో ఆరోసారి అవార్డు గెలుచుకున్న రూట్.. ఈ దిగ్గజ త్రయాన్ని అధిగమించాడు.⇥ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను రూట్ అధగమించాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ దిగ్గజ క్రికెటర్లు మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్ధానంలో నిలిచాడు.చదవండి: AUS vs ENG: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం -
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్‌కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్‌ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డులు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులతో సత్తాచాటిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 121 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్‌కు ఇది 34వ టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..→టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ అవతరించాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక శతకాల (33) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కుక్ రికార్డును సమం చేసిన రూట్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ సెంచరీతో అతడిని అధిగమించాడు.→ఈ సెంచరీతో అతడు మరో ముగ్గురు క్రికెటర్ల అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. యూనిస్ ఖాన్, జయవర్దనే, సునీల్ గవాస్కర్, లారా రికార్డును సమం చేశాడు. వీరిందరూ టెస్టుల్లో 34 సెంచరీలు చేశారు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ఈజాబితాలో ఆరో స్ధానంలో ఎగబాకుతాడు. ఇక టెస్టు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు.→ఒకే వేదికలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ లార్డ్స్‌లో ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉండేది. గూచ్ లార్డ్స్‌లో 6 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో గూచ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.→50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు చేసిన 9వ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.డేంజర్లో సచిన్ రికార్డు.. కాగా రూట్ జోరును చూస్తుంటే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 15,921 రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో రూట్ 12377 పరుగులతో 7వ స్ధానంలో కొనసాగుతున్నాడు. కాగా రూట్ సచిన్‌కు కేవలం 3,544 పరుగుల దూరంలోనే ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడి తన కెరీర్‌ను ముగించగా.. రూట్ ఇప్పటివరకు 145 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే 33 ఏళ్ల రూట్ ఫిట్నెస్ పరంగా కూడా మెరుగ్గా ఉండడంతో సచిన్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. -
సచిన్ టెండుల్కర్‌ను కలిసిన మనూ భాకర్ (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు!.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
భారత్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు. బిజినెస్ టైకూన్ కుమారుడుదేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్‌కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్‌గా తొలి అడుగులు వేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.రెండు లక్షల కోట్లకు పైగా సంపదహురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్‌వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.చదవండి: క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు! -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్‌కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్‌కు ఐదో స్థానం.. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్‌కు ఆరో స్థానం.. 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్‌కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు పదో స్థానం దక్కాయి.