special
-
హీరోయిన్ శృతి హాసన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
చాలా కాస్ట్లీ గురూ!పావు కిలో ఉప్పు రూ.7500?!
ఉప్పులేని కూరలను, వంటలను అస్సలు ఊహించలేంకదా. అందుకే అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అలాగే ఇండియాలో కాస్త చవగ్గా దొరికే పదార్థం కూడా ఉప్పే. ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు ఎంత కీలక పాత్ర పోషించిందో మన అందరికీ తెలుసు. అయితే ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్యమనే మనే వార్త ఒకటి ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు. ఒక గ్రాము ధర కొనాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏంటా ఉప్పు? తెలుసు కుందామా!పింక్ సాల్ట్....రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. వీటన్నింటిలో నేను రాజు అంటోందిక కొరియన్ ఉప్పు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. 250 గ్రాముల కొరియన్ ఉప్పు ధర రూ.7,500 ( 100 డాలర్లు) దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురుతో తయారు చేస్తారట. అందుకే దీన్ని కొరియన్ బాంబూ ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు.కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారవుతుంది?పురాతన కాలం నుంచి కొన్ని శతాబ్దాల తరబడి కొరియన్ ఉప్పును వినియోగిస్తున్నారట. ఒక ప్రత్యకమైన పద్ధతుల్లో దీన్ని తయారు చేస్తారు. దీనికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువే. వెదురు బొంగులలలో సాధారణ సముద్రపు ఉప్పు వేసి, వాటిని బంకమట్టితో మూసివేసిన తర్వాత, అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. 800°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉప్పును తొమ్మిది సార్లు కాల్చి, చివరిగా 1,000°C వద్ద రోస్టింగ్ చేస్తారు. ఇందుకు దాదాపుగా 50 రోజులు పడుతుంది. ఉప్పును వేయించిన ప్రతిసారీ, వెదురు లక్షణాలు పూర్తిగా ఉప్పులోకి శోషించబడేలా చల్లబరుస్తారు.అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేయడంతోపాటు, దీని తయారీకి ప్రత్యేక ఫర్నేసులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం. ఎందుకంటే దీనికి చాలా శ్రద్ధ ,అనుభవం కావాలి. అందుకే ఈ ఉప్పు ధర అంత కాస్ట్లీ. సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పుతో ప్రయోజనాలు చాలా మెండు.వెదురు ఉప్పు-ఆరోగ్య ప్రయోజనాలువెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం మెగ్నీషియంతో సహా 70కి పైగా అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: మంటను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు, గొంతు నొప్పి కి ఉపశమనంగా పనిచేస్తుంది.నోటి పూత, వాపు చిగుళ్ళకు చికిత్సలో పనిచేస్తుంది. నోటి పరిశుభ్రతకు చాలామంచిది.శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టాక్సిన్ న్యూట్రలైజర్గా పనిచేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాదు ఒత్తిడిని దూరం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో ఉప్పు ధరఉత్పత్తి పద్ధతులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి కారణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ధరలు మారుతూ ఉంటాయి. ఖరీదైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలు:ఘనాస్విట్జర్లాండ్బెల్జియంసరసమైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలుభారతదేశంపాకిస్తాన్కజకిస్తాన్ఈజిప్ట్భారతదేశం లాంటి దేశాలలో, దాని పొడవైన, విస్తృత తీరప్రాంతం , ప్రభుత్వ రాయితీల కారణంగా ఉప్పు చవగ్గా లభిస్తుంది. అదేవిధంగా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉప్పు గనులు, తీరప్రాంతం ఉన్న కారణంగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి ఎక్కువ.అమెరికాలో ఉప్పు అత్యంత ఖరీదైనది, కిలోకు సుమారు రూ. 300. ఐస్లాండిక్ ఉప్పు మరొక ఖరీదైన రకం. దీన్ని "లగ్జరీ సాల్ట్" అని పిలుస్తారు. ఇది ఐస్లాండ్లోని వాయువ్య ప్రాంతాలలో చేతితో తయారు చేస్తారు. చదవండి: పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
‘మెల్బోర్న్’ జ్ఞాపకాలు షేర్ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్! (ఫొటోలు)
-
Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళా(Maha Kumbh Mela2025) కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులేకాదు, సాధువులు కూ విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అయితే ఈ మహా కుంభమేళాలో రష్యాకు చెందిన "కండరాల బాబా" విశేషంగా నిలుస్తున్నాడు. ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.కాషాయ దుస్తులు ధరించి, కండలుతిరిగిన దేహంతో కనిపిస్తున్న ఈయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. భుజాన పెద్ద బ్యాగ్, మెడలో రుద్రాక్ష మాల, ముఖంలో కాంతివంతమైన తేజస్సు, ఏడు అడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు. కెవిన్బుబ్రిస్కీగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి.కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్(Atma Prem Giri Maharaj) ఈ "కండల బాబా" రష్యాకుచెందిన వాడు. ఇపుడు నేపాల్‌లో నివసిస్తున్నాడు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. తన బోధనా వృత్తిని విడిచి పెట్టి మరీ నేపాల్‌లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారు.ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమ్‌గిరి మహారాజ్ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు. ఆత్మ ప్రేమ్ గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతాడట.కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళాఅంగరంగ వైభవంగా జరుగుతోంది. పవిత్ర గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు, "హర హర మహాదేవ" అనే భక్త కోటి నినాదాలతో మహాకుంభమేళా మార్మోగుతోంది.ఇదీ చదవండి: అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్.. 425 రోజులు అన్లిమిటెడ్..
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రత్యేక న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. అన్ని ఇతర కంపెనీలు గరిష్టంగా 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి బీఎస్ఎన్ఎల్ ప్లాన్లతో పోలిస్తే ఖరీదైనవి. గత సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ఎన్ఎల్ సేవలను పొందేందుకు లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్లను పోర్ట్ చేసుకున్నారు. గత ఏడాది ఇతర కంపెనీలు టారిఫ్‌లు పెంచేయడంతో బీఎస్ఎన్ఎల్ మంచి ఎంపికగా నిలిచింది.Get 2GB/Day Data & Unlimited Calls for 425 Days – all for just ₹2399/-! Hurry, offer valid till 16th Jan 2025 – don’t let this deal slip away! Stay ahead. Stay connected. Stay with BSNL!#BSNLIndia #UnlimitedCalls #2GBData #StayConnected pic.twitter.com/23lkFS3phH— BSNL India (@BSNLCorporate) January 2, 2025 -
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
సంక్రాంతి వస్తోంది! ఈ వేడుకల గురించి తెలుసా?
సంక్రాంతి పండుగ వస్తోందంటే గ్రామాలకు ప్రయాణం మొదలవుతుంది. సొంతూరికి వెళ్లే వాళ్ల ఆనందం అన్నింటికంటే మిన్న. అలాగే హైదరాబాద్‌వాసులు శిల్పారామంలో నిర్వహించే వేడుకలతో ఆనందిస్తారు. గాలిపటాలతో గాల్లో తేలినట్లు సంతోషిస్తారు. ఇది మన తెలుగు సంక్రాంతి. ఇక తమిళులు సంక్రాంతిని దేశానికే తలమానికం అన్నట్లు నిర్వహించుకుంటారు. కళారంగం ఉత్సాహంతో ఉరకలేస్తుంది. దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా సొంత రాష్ట్రానికి వస్తారు. మైలాపోర్ వేడుకల్లో పాల్గొని సంతోషాన్ని మది నిండా నింపుకుని తిరిగి వెళ్తారు. మైలాపోర్ వేడుకలుతెలుగువాళ్లలాగే తమిళనాడుకి సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి వేడుకల వాతావరణం నెలకొంటుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏటా ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. మైలాపోర్లో జరుగుతుంది కాబట్టి దీనికి మైలా΄ోర్ ఫెస్టివల్ అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఏటా సంక్రాంతి ముందు జరిగే ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి. గడచిన 72 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకల్లో 30కి పైగా కళలను ప్రదర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందలకు పైగా కళాకారులు పాల్గొంటారు. నాట్యప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సాము గారడీ నుంచి జానపద కళారూపాల ప్రదర్శనలతో నగరం కళకళలాడుతుంది. అన్నింటిలోకి ముగ్గుల పోటీ ప్రత్యేకం. ముగ్గును కోలామ్ అంటారు. ఇందులో మహిళలతోపాటుబాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇంకా ఏమేమి ఉంటాయి?ప్రాచీన కపాలి ఆలయానికి హెరిటేజ్ వాక్, తె΄్పోత్సవం, మాడవీథుల్లో పర్యటనలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సైక్లింగ్ టూర్లో టీనేజ్ నుంచి యువకులు ఉత్సాహంగా కనిపిస్తారు. బోట్ షికార్, ఫుడ్ వాక్, చిల్డ్రన్ టూర్... ఇలా థీమ్ ప్రకారం వేడుకలు సాగుతాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ మైలాపోర్ ఫెస్టివల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. -
స్టాక్‌మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ వార్షిక ముహూర్త ట్రేడింగ్ సెషన్ శుక్రవారం సాయంత్రం జరుగుతోంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల వరకు ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ హిందూ నూతన సంవత్సరం సంవత్ 2081 ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45కి ప్రారంభమవుతుంది. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే స్థానాలు ఆటోమేటిక్‌గా ముగుస్తాయి. ఈ ప్రత్యేక సెషన్లో ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం.ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ సెషన్ మాత్రమే కాదు. ఇది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం పెట్టుబడిదారులు టోకెన్ పెట్టుబడులు పెట్టే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే.ఇలా ప్రారంభమైంది..ఈ ముహూర్త ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిది. 1957లో బీఎస్ఈ ముహూర్త ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. -
రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఉత్తర రైల్వే పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల గురించిన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆర్సీఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని రైల్వే శాఖ మోహరించింది. స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ప్రతి సంవత్సరం పండుగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అయితే ఈసారి పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
గౌరీ ఖాన్ ఇష్టపడే కేఫ్ ఇదే..! ప్రత్యేకత ఏంటంటే..
ఢిల్లీ అంటేనే ప్రత్యేకమైన ఆహారానికి, కేఫ్‌లుగా ప్రసిద్దిగాంచింది. దొరకని విభిన్న రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉండవు. అలాంటి ఢిల్లీలో గౌరీ ఖాన్ తరుచుగా సందర్శించే కేప్ ఒకటి ఉంది. ఆ కేఫ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అక్కడకు ఎప్పుడు వచ్చినా..కాఫీ, పిజ్జా ఆస్వాదించే వెళ్తారు గౌరీ ఖాన్. ఆ కేఫ్ ఎక్కడుందంటే..ఆ కేఫ్ పేరు ది బ్రౌన్ బాక్స్. ఇది పంచశీల్ పార్క్‌లో ఉంది. పర్ఫెక్ట్ లంచ్ డేట్ కోసం లేదా భాగస్వామితో సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశం. సాయంత్రాల్లో సరదాగా కాసేపు గడపడానికి హాయినిచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం ఆ కేఫ్. అంతేగాదు ఏదైన కంపెనీ సమావేశాల గురించి చర్చించడానికి కూడా అత్యంత అనువైన ప్రదేశం. మంచి వుడ్‌తో కూడిన ఫర్నేచర్ ఆ కేఫ్‌కి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ మంచి సలాడ్లు, పాస్తా, సైడ్లు, బర్గర్లు, కాఫీ, శాండ్విచ్లు, రిసోట్టో, కేక్‌లు వంటి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించొచ్చు. అంతేగాదు బడ్జెట్‌కి అనుగుణంగా ఖర్చుపెట్టాలనుకున్నా ఈ కేఫ్ బెస్ట్ అని చెప్పొచ్చట. గౌరీఖాన్, ఆమె కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇక్కడ ఎక్కువగా పిజ్జా, కాఫీని ఆస్వాదిస్తారట. ఈ బేకరీ కేఫ్‌ని పేస్ట్రీ చెఫ్ ప్రియాంక తివారీ నడుపుతున్నారు. ఆమె తన కేఫ్‌లో సాధారణ మెనులకు విభిన్నంగా ఆహారప్రియులు ఇష్టపడేలా సరికొత్త ఐటెమ్స్‌తో కూడిన మెనూని రూపొందించడం విశేషం. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
నవరాత్రుల్లో ఇండో వెస్ట్రన్ మెరుపుల్లో మగువలు కళ (ఫోటోలు)
-
వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి!
మీరెప్పుడైనా పానీ పూరి తిన్నారా? వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్ రుచి చూశారా?తినే ఉంటారు! మరి.. రసం పూరి?దీన్ని తినాలంటే మాత్రం మీరు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపికి వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడి ‘విప్ర’ ఛాట్ హోమ్‌కు వెళ్లాల్సిందే! జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో రిషభ్ శెట్టిలు ఇటీవల దర్శించుకున్న ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాకుండా.. ఉడుపి టమోటా రసంకు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణ మఠం నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ వంటకం ఓ స్పెషల్ అట్రాక్షన్. దీని రుచి, పరిమళం వేరే లెవల్ అని అంటారు అభిమానులు. ఇంతలా చాలామంది అభిమానం చూరగొన్న వంటకానికి మరింత ప్రచారం కల్పించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ‘విప్ర’ ఛాట్ హోమ్ వారు సాధారణ పానీ పూరి స్థానంలో రసం పూరిని ప్రవేశపెట్టారు. ఉడుపి రసంను పూరీల్లో పోసి ఇస్తారన్నమాట! ఈ సారి మీరేమైనా ఉడుపి వెళితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి! మధుకర్ ఆర్. మయ్యా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఛాట్ వీడియో ఒకటి పోస్ట్ చేశారుಉಡುಪಿ ಸಾರನ್ನು ಚ್ಯಾಟ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಸವಿದಿದ್ದೀರಾ| ವಿಪ್ರ ಚಾಟ್ ಹೋಮ್ ರಸಂ ಪುರಿ | ಕೃಷ್ಣ ಮಠದ ಪಾರ್ಕಿಂಗ್ ಏರಿಯಾದ ಶ್ರೀರಾಮ ಧಾಮ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ | ಉಡುಪಿಯ ಕಂಡೀರಾ pic.twitter.com/h2DPhS5H1p— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) September 2, 2024 -
జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌కు కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తరచూ ఉగ్రదాడులతో అత్యంత ఉద్రిక్తంగా మారిన జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయనను జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా ఎంపికచేసింది. వచ్చే నెల 30న ప్రస్తుత పోలీస్‌బాస్ ఆర్ఆర్ స్వాయిన్ రిటైరైన వెంటనే అక్టోబర్ ఒకటిన ప్రభాత్ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రభాత్ ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసి అద్భుత ప్రతిభ కనబరిచి విశేష అనుభవం గడించారు. మూడు పోలీస్ గ్యాలంట్రీ మెడళ్లు, ఒక పరాక్రమ్ పతకం సాధించారు. 55 ఏళ్ల ప్రభాత్‌కు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన గ్రేహౌండ్స్ దళాలకూ ఆయన సారథ్యం వహించారు. గతంలో సీఆర్పీఎఫ్లో ఐజీగా, కశ్మీర్ ప్రాంతంలో అదనపు డీజీగా సేవలందించారు. -
స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకం.. తెలుగులో చూడాల్సిన దేశభక్తి చిత్రాలివే!
యావత్ భారతదేశం గర్వంగా, దేశభక్తిని చాటి చెప్పేలాఅందరం ఆనందంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి అవుతోంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రత్యేకంగా దేశభక్తిని చాటి చెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూడాల్సిన టాలీవుడ్ దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.స్వాతంత్ర దినోత్సవం రోజు చూడాల్సిన తెలుగు సినిమాలివేఅల్లూరి సీతారామరాజుమన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.ఖడ్గంకృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి.సుభాష్ చంద్రబోస్విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.భారతీయుడుశంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా.. అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.సైరా నరసింహారెడ్డిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు.మహాత్మ2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.పరమ వీర చక్ర2011లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.ఘాజీ1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సర్దార్ పాపారాయుడు1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.బొబ్బిలి పులి1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.గౌతమిపుత్ర శాతకర్ణిబాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను కృష్ణ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో మెప్పించగా.. రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.రాజన్న(2011)నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రాజన్న. 2011లో వచ్చిన ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు.మేజర్అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజర్. ఈ సినిమాను ముంబై ఉగ్రవాద దాడి సమయంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.వీటితో పాటు పల్నాటి యుద్ధం, నేటిభారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్రకేసరి-(1983), మరో ప్రపంచం, మనదేశం(1949) లాంటి దేశ స్వాతంత్ర్య పోరాటాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను తెలుసుకునేందుకు ఈ సినిమాలు చూసేయండి. -
Mahesh Babu Birthday Special Pics: హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. స్పెషల్ ఫోటోలు
-
Friendship Day: ఓ.. మై ఫ్రెండ్ (ఫొటోలు)
-
Happy Friendship Day 2024: పోవే..పోరా..అనుకునే టాలీవుడ్ బెస్ట్‌ఫ్రెండ్స్(ఫోటోలు)
-
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
లేడీ కోహ్లి.. ఆర్సీబీకి టైటిల్ అందించిన క్వీన్ (ఫొటోలు)
-
Rajnath Singh Birthday: ఫిజిక్స్ లెక్చరర్ నుంచి రక్షణ మంత్రి వరకూ..
ఆయన చదువుకునే రోజుల్లో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నేడు దేశ రక్షణమంత్రిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే రాజ్‌నాథ్ సింగ్.దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టినరోజు నేడు. ఆయన 1951 జూలై 10న యూపీలోని చందౌలీలోని చకియాలో జన్మించారు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలలో ఒకనిగా గుర్తింపు పొందారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ అధ్యాపకునిగా తన కెరీర్ ప్రారంభించారనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజ్‌నాథ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంబదన్ సింగ్. తల్లి పేరు గుజరాతీ దేవి. రాజ్‌నాథ్ తన ప్రారంభ విద్యను గ్రామంలోనే అభ్యసించారు. అనంతరం గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు.రాజ్‌నాథ్ సింగ్ తొలుత యూపీలోని మీర్జాపూర్‌లోని కేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫిజిక్స్‌లో లెక్చరర్‌గా చేరారు. మొదటి నుండి చాలా తెలివైన విద్యార్థిగా పేరొందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యనిర్వాహకునిగానూ పనిచేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1977లో యూపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికై 1991లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీలో విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాపీయింగ్ నిరోధక చట్టాన్ని, వేద గణితాన్ని ప్రవేశపెట్టారు.రాజ్‌నాథ్ సింగ్ 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999, నవంబరు 22న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2000, అక్టోబర్ 28న యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2003, మే 24న కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.2005 డిసెంబర్ 31న రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2009 డిసెంబర్ 19 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2009లో ఘజియాబాద్ నార్త్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, మే 26న ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. అనంతరం రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో ఆయన మరోమారు రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
శరవేగంగా పరుగులు తీస్తున్న ఫ్యాషన్ : ఈ రోజు స్పెషల్ ఏంటంటే..!
ఫ్యాషన్ ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. క్రియేటివ్ డిజైన్లు, ఆర్టిస్టిక్ ఫ్యాషన్ సరికొత్త స్టైల్స్ నిరంతరం మారిపోతూనే ఉంటాయి. జూలై 9న ఫ్యాషన్డే గా జరుపుకుంటారని మీకు తెలుసా? పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఫ్యాషన్ ప్రభావాన్ని , ప్రాభవాన్నిఫ్యాషన్ పోకడలను అర్థం చేసుకోవడమే ఫ్యాషన్ డే ఉద్దేశం. ఫ్యాషన్ ఔత్సాహికులు, డిజైనర్లు, ఫ్యాషన్ ప్రియులందరికీ ఇది ఒక గొప్ప అవకాశాల్సి కల్పిస్తుంది. ఫ్యాషన్ సాంస్కృతిక ఔచిత్యంతో పాటు సృజనాత్మకత, సృజనాత్మకత, వాస్తవికతను గుర్తించి, డిజైనర్లు, ఫ్యాషన్ స్టయిల్స్‌ను అభినందించేందుకు ఫ్యాషన్ డే 2024ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పూర్వంనుంచీ మన ధరించే వస్త్రాలు ఒక స్టేటస్ సింబల్. ప్రస్తుతం ఫ్యాషన్ కళాత్మక వ్యక్తీకరణ మారింది. సామాజిక మార్పులతో పాటు ఫ్యాషన్లోకూడా విప్లవాత్మక మార్పు లొచ్చాయి. ఫ్యాషన్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదు. అలంకరణలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రతీది ఫ్యాషనే.ఫ్యాషన్ డే 2024: ధీమ్ఈ ఏడాది పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తూ, నైతిక, ఆలోచనాత్మక వినియోగాన్ని హైలైట్ చేసేలా 'సస్టెయినబుల్ ఎలిగాన్స్' అనే థీమ్‌తో ఫ్యాషన్ డే నిర్వహిస్తున్నారు. సుస్థిరత, ఫ్యాషన్ కలిసి జీవించే దిశగా ఫ్యాషన్ డే 2024ని జరుపుకుంటూ భూమా తరక్షణలో భాగం కావడం. -
చార్ధామ్ యాత్రలో సరికొత్త రికార్డులు
డెహ్రాడూన్: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు.గత ఏడాది ఏప్రిల్ 22న చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి. -
#International Yoga day 2024 స్పెషల్ కాస్ట్యూమ్స్ (ఫొటోలు)
-
డాడీతో సెల్ఫీ.. నడిపించే దైవం నాన్న (ఫొటోలు)
-
నాన్నతో సెల్ఫీ: లవ్యూ డాడీ.. నువ్వే స్ఫూర్తి.. (ఫొటోలు)
-
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
-
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’, ‘‘అమ్మను మించిన దైవమున్నదా..‘‘ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’’ ఇలా ఎలా పాడుకున్నా..అమ్మకు సాటి పోటీ ఏమీ ఉండదు. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు తన చివరి శ్వాసదాకా బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అంతటి ప్రేమమూర్తి అమ్మ. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు అందించే వేళ మీరు మీ అమ్మకు విషెస్ ఇలా చెప్పండి.నిజానికి అమ్మ ప్రేమను ఒకరోజుకో, ఒక్క క్షణానికో పరిమితం చేయడం అసాధ్యం. ప్రతీ రోజూ ప్రతీక్షణం అమ్మను ప్రేమించాలి. మనకు జీవితాన్నిచ్చిన అమ్మకు జీవితాంతం రుణ పడి ఉండాల్సిందే.ఈ మాతృ దినోత్సవం రోజున అమ్మను సర్ ప్రైజ్ చేద్దామాపొద్దున్న లేవగానే హ్యాపీ మదర్స్ డే అంటూ అమ్మకు విషెస్ చెప్పండి. ఆనందంగా ఆలింగనం చేసుకోండి. హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకోండి. మామ్.. నాకు లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ..లవ్యూ అని చెప్పండి. అంతే అపుడు అమ్మ చూపించే మీప్రేమకు మీ కన్నీళ్లు ఆగవు అంతే. అమ్మ ప్రేమ అలాంటిది మరి. అమ్మకిష్టమైన వంటఅమ్మ రోజూ మనకోసం ఎన్నో చేసి పెడుతుంటుంది. స్కూలుకు, కాలేజీకి, పట్టుకెళ్లిన బాక్స్ పూర్తిగా తినలేదని కోప్పడుతుంది కదా. అందుకే మదర్స్ డే రోజు తనకోసం, తన ఇష్టాఇష్టాలను గురించి, అమ్మకోసం మంచి వంటకం చేసి పెట్టండి. అమ్మకోరిక తెలుసుకోండినిరతరం మనకోసం ఆలోచించే అమ్మ తన గురించి, తన కోరికలు గురించి అస్సలు పట్టించుకోదు. అందుకే ఆమెకు ఏది ఇష్టమో బాగా ఆలోచించండి. స్పెషల్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేయండి. మంచి పుస్తకం, చీర, మొక్కలు లాంటివి కొనివ్వండి. లేదంటే వంట ఇంటి పనిలో భాగంగా ఇది ఉంటే బావుండు ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుందో దాని గుర్తించి ఆ వస్తువును ఆమెకు అందుబాటులోకి తీసుకురండి. అమ్మ సంబరం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసు.అమ్మతో బయటికికుటుంబంకోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పక్కన బెట్టే అమ్మను సరదాగా అలా బయటికి తీసుకెళ్లండి. అది మూవీ కావచ్చు, హోటల్‌కి కావచ్చు, మ్యూజిక్ కన్సర్ట్కి కావచ్చు. లేదంటే అమ్మకెంతో ఇష్టమైన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లండి.స్పాకి తీసుకెళ్లండిసంవత్సరమంతా బిడ్డల కోసం కష్టపడే అమ్మను ఆమెను స్పాకి తీసుకెళ్లండి. తల్లికి అలసట నుండి ఉపశమనం కలిగించే ప్రత్యేక స్పా ప్యాకేజీని తీసుకోండి. కొత్త ఉత్సాహం వచ్చేలా ఏదైనా గ్రూమింగ్‌కి ప్లాన్ చేయండి. తన కోసం ఆలోచించే బిడ్డలు ఉన్నారనే తృప్తి మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది. దూరంగా ఉన్నారా..అమ్మకు దూరంగా ఉన్నా పరవాలేదు. అమ్మకు దగ్గరగా లేనని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి. ఎలా ఉన్నావు? అమ్మా అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడండి. ఆమె మనసులో ఏముందో తెలిసుకునే ప్రయత్నం చేయండి. నీను నేను న్నాను అనే భరోసా ఇవ్వండి. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. మీరు చేసే ఏ చిన్నపని అయినా ఆమెకు కొండంత సంతోషాన్నిస్తుంది.అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే! అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే!! -
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
75 ఏళ్ల చరిత్ర ఉన్న పొందూరు ఖాదీని మహాత్మాగాంధీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు అనే గ్రామంలో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. ఆ గ్రామం పేరు మీదుగానే ఈ ఖాదీకి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామం పత్తి వడకడానికి గాంధీ చరఖా స్పిన్నర్లనే ఉపయోగించడం విశేషం. అందువల్లే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ చాటుకుంటున్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్ చీర మళ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ట్రెండ్ అవుతోంది. పొందూరు చీరలనే ఎలా నేస్తారు? వాటి విశేషాలు సవివరంగా తెలుసుకుందామా..!మండుటెండలో ఈ చీర చల్లగా హాయిగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చే పొందికైన చీరలివి. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. దీంతో ఒక్కసారిగా నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు చేనేత వైభవం. ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. చేపముల్లుతో పత్తిని శుద్ది చేసి..?పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. అందుకోసం వారు వాలుగ చేప దవడని ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు వారికి ప్రేమగా ఇస్తారు. ఈ ముల్లును స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటారు. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకంఅక్కినేని, సినారే బ్రాండ్ అంబాసిడర్లుగా..తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. నూరు కౌంట్ అనడానికి రీజన్..ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా ఈ చీరలకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారకి ఈ పొందూరు చీరలనే ఎంతోగానో ఇష్టంగా ధరించేవారట.మోదీకి సైతం బహుకరించేందుకు.. 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పొందూరు నేతన్నలకు ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ 48 వేలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు. (చదవండి: ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!) -
‘పోటీ చేస్తాను.. పోటీ చేస్తూనే ఉంటాను’
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఒక అభ్యర్థి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల్లో గెలవాలని కాకుండా, తన అభిరుచిని నెరవేర్చుకునేందుకే ఇలా అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వస్తున్నారు. అతనే వారిస్ హసన్ లాహిరి. రాష్ట్రీయ నారాయణ్ వికాస్వాది పార్టీ అభ్యర్థి. ఆయన యూపీలోని అమేథీ జిల్లాలోని గౌరీగంజ్‌కు చెందిన వ్యక్తి. హసన్ లాహిరి గతంలో అంటే 2004, 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ప్రస్తుత 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అమేథీ నుంచి పోటీకి దిగారు. అలాగే 2007, 2012, 2017, 2022లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. వారిస్ హసన్ లాహిరి 10వ తరగతి వరకు చదువుకున్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మా మాతృభూమి గౌరీగంజ్ అని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బడా నేతలు సైతం పోటీ పడుతుంటారని తెలిపారు. తనకు ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రజల గొంతు వినిపించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా నిరంతరం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని లాహిరి తెలిపారు. నిరంతరం ప్రజల గౌరవాన్ని కాపాడుతూనే ఉంటానని, విజయం సాధించే వరకూ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని తెలిపారు. -
Ajith Unseen Photos: హీరోలందు తలా అజిత్ వేరయా.. రేర్ ఫొటోలు
-
National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్‌టీ, బ్లాక్ టీ ఇలా రకరకాల టీలు చాయ్ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి. మరి బుబుల్ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్ బబుల్టీ డే అట. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి చూద్దామా..?బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా తైవాన్‌లో బాగా పాపులర్. అధిక ప్రోటీన్‌తో నిండి ఉంటుంది కనుక చైనా ధనవంతుల్లో దీనికి డిమాండ్ ఎక్కువ.బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా, వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ, అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.కేలరీల గని ఈ బబుల్ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్ ట్రీట్‌గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్లను, అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి టాపింగ్స్‌ను వాడుకోవచ్చు. -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
Veena Srivani Latest Photos: వాగ్దేవి వరపుత్రిక శ్రీవాణి శ్రావ్యంగా మీటితే..! (ఫొటోలు)
-
Ugadi 2024 : అదిరిపోయే వంటలు, వేప పువ్వు చారు ఒక్కసారి రుచిచూస్తే..!
పండగొచ్చిందంటే పూజలు వ్రతాలే కాదు. దేవుడికి భక్తితో పెట్టే నైవేద్యాలు. అంతేకాదు ఇష్టమైన వంటలు, మధురమైన స్వీట్లు ఉండాల్సిందే.. ఈ సందర్భంగా మీకోసం స్పెషల్ వంటలు.. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. -
Happy Birthday Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ బర్త్ డే స్పెషల్ ఫొటోలు చూశారా?
-
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
Ram Charan birthday : రామ్ చరణ్ పుట్టినరోజు.. ఈ ఫోటోలు ఎంతో ప్రత్యేకం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ.. పలువురు సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
Alia Bhatt Latest Photos: తల్లయినా తగ్గని అందం.. ఎంతైనా ఆమె రేంజే వేరు (ఫోటోలు)
-
ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులతో సహా ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇవ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించారు. ఆ రాష్ట్రాలు ఏవి? ఎందుకు మినహాయింపునిచ్చారు? మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ (ఐఎల్పీ) అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లకు ఐఎల్పీ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో స్వయంప్రతిపత్తి గల కౌన్సిళ్లుగా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సీఏఏ పరిధి నుంచి తప్పించారు. అసోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూయేతరులు తొలుత తాము ఈ మూడు దేశాలలో ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
‘కజిరంగా’కు ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆయన నేడు యూపీతోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటిస్తున్నారు. అసోంలోని కజిరంగాలోని నేషనల్ పార్క్‌లో సఫారీతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయ్యింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రధాని మోదీ జీప్ సఫారీతో పాటు ఏనుగు సవారీ కూడా చేశారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇది 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. వివిధ జాతులకు చెందిన వెయ్యికి మించిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేకత. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పార్కులో 2200కు పైగా ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అలాగే ఈ పార్క్ 180కు మించిన బెంగాల్ పులులకు నిలయం. #WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp — ANI (@ANI) March 9, 2024 కజిరంగా నేషనల్ పార్క్ నమూనాను నాటి లార్డ్ కర్జన్ భార్య 1904లో రూపొందించారు. 1905, జూన్ ఒకటిన ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటయ్యింది. పార్క్ 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1908లో గోలాఘాట్, నాగావ్ జిల్లాలను ఈ పార్కు కలిపింది. యునెస్కో దీనిని 1985లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది కజిరంగాను 2006లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ పార్క్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మే ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు పార్కును మూసివేస్తారు. ఈ పార్కులో ఏనుగులు 1,940,వైల్డ్ బఫెలోలు 1666, జింకలు 468 ఉన్నాయి. Assam CM Himanta Biswa Sarma shares video of PM Modi's arrival at Kaziranga National Park pic.twitter.com/FlsjC2fwgU — ANI (@ANI) March 8, 2024 -
ఆర్థిక సైబర్ నేరాలకు చెక్
సాక్షి, అమరావతి :‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెప్పిండి’ ఇటీవల కాలంలో మితిమీరి పెరుగుతున్న కాల్స్ ఇవీ. ఆ ఫోన్ కాల్ బ్యాంకు నుంచో లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచే వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే.. బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉపక్రమించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పేరుతో మితిమీరుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటీవల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్’ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక సిరీస్‌తో నంబర్ల కేటాయింపు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు కాల్ చేసే నంబర్లకు ప్రత్యేక సిరీస్ కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాధారణ టెలికాం సంస్థలు వినియోగదారులకు కేటాయిస్తున్న 10 అంకెల సిరీస్ నంబర్లనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. 2023లో అటువంటి మోసాలకు పాల్పడ్డ 1.40 లక్షల ఫోన్ నంబర్లను సైబర్ పోలీసులు గుర్తించి వాటిని బ్లాక్ చేశారు. అంటే ఈ తరహా మోసాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డ్ అప్డేట్ లేదా పాన్ నంబర్ లింక్ చేయాలనో.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలనో రకరకాల పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. అవగాహనలేకో పొరపాటులో ఓటీపీ నంబర్ చెబితే నగదు కాజేస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాధారణ టెలికాం వినియోగదారులకు కేటాయించే సెల్‌ఫోన్ నంబర్ సిరీస్ కేటాయించకూడదని హోం శాఖ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) గతంలోనే సూచించిన విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేకంగా నంబర్ సిరీస్ (140+...)తో ఫోన్ నంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఆ సిరీస్ నంబర్ల నుంచి కాల్ వస్తేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినట్టుగా భావించాలి. సాధారణ ఫోన్ నంబర్ల సిరీస్ నుంచి కాల్చేసి తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేస్తున్నామని చెబితే.. వినియోగదారులు వెంటనే అప్రమత్తమవుతారు. సైబర్ నేరాల ముఠాల పనేనని గుర్తించి ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్త పడతారు. మోసపోయిన సొమ్ము తిరిగి ఇప్పించేలా.. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాన్ని నిర్ణిత వ్యవధిలోనే తిరిగి ఇప్పించే ప్రక్రియను కూడా కేంద్ర హోం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. మోసానికి పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నుంచి బాధితుల సొమ్మును వారి ఖాతాలకు మళ్లించడం అనే ప్రక్రియకు నిర్ణిత గడువును నిర్దేశించాలన్నారు. బాధితులు పదేపదే పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నారు. బ్యాంకులు ని ర్ణిత ఫార్మాట్లో సైబర్ పోలీసులకు సమరి్పంచాల్సిన సమాచారం నమూనాను రూపొందించారు. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్‌కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్‌ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీల అనైక్యతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నించారు. దామోదర్ సింగ్ యాదవ్ ప్రారంభించిన పీడిత్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం ముందుకుసాగాలని కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలిపారు. -
మిస్టర్ పొలిశెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
Sankranti Muggulu: సంక్రాంతి అందమైన ముగ్గులు (ఫొటోలు)
-
Lavanya Tripathi: అందాల రాక్షసిగా అందరికీ నచ్చేసిన మెగా కోడలు (ఫోటోలు)
-
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
పాక్‌లో అది ‘కలల రహదారి’ ఎందుకయ్యింది?
పాకిస్తాన్లో రహదారుల భద్రత, ప్రమాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక నియమనిబంధనలను రూపొందింది. వీటిని జనం అనుసరించేలా పర్యవేక్షిస్తుంటుంది. కొన్ని రోడ్లు పర్యాటక రంగాలలో వృద్ధికి అవకాశాలను అందిస్తున్నాయి. అయితే పాకిస్తాన్లో కలల రహదారి అని పిలిచే ఒక రోడ్డు ఉందనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఆ రోడ్డును అలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాక్‌లోని ఉత్తర హిమాలయ ప్రాంతాలను కలిపే కరకోరం హైవేని ‘హైవే ఆఫ్ డ్రీమ్స్’ అని పిలుస్తారు. ఇది 1300 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. పాకిస్తాన్ రైల్వే నెట్‌వర్క్‌ను ఆనుకొని ఈ మార్గం ఉంటుంది. ఈ రహదారిని బాని ములాకాత్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం చేశారు. ఈ మార్గం హిమాలయాలలోని అత్యున్నత పర్వత శ్రేణిని దాటుతుంది. ఈ మార్గంలోని దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ రహదారిలో ప్రయాణించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు. కరకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటిగా పేరొందింది. ఈ రోడ్డు నిటారుగా ఉన్న రాళ్లపై నిర్మితమయ్యింది. ఇవి బలహీనపడుతున్న కారణంగా తరచూ మరమ్మతులు చేయల్సి వస్తుంటుంది. కారకోరం హైవేలో ప్రయాణం ప్రత్యేక అనుభూతులను అందిస్తుందని అంటారు. ఈ సరిహద్దు రహదారిలో మంచు పర్వతాలు, లోయలు, నదులు, అందమైన సరస్సులు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు! -
‘గాడ్ డిపార్ట్మెంట్’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?
ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. ఇజ్రాయెట్ 21సీ. ఓఆర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్. ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని ‘గాడ్ డిపార్ట్మెంట్’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
Kamal Haasan Rare Photos: కమల్ హాసన్ మీరు ఎప్పుడు చూడని ఫోటోలు..
-
Birthday Special: సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే స్పెషల్
-
Sitara Ghattamaneni: సితార క్యూట్ ఫొటోస్..
-
దీపావళికి కలర్‌పుల్ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!
Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది. దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు, రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, కలర్‌ఫుల్ క్యాండిల్ లైట్స్‌ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది ట్విటర్లో 40 లక్షలకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. Very cool idea!pic.twitter.com/WjGQL49hTq — Figen (@TheFigen_) October 29, 2023 -
Amala Paul Latest Photos: అందంతో అదరగొడుతున్న అమలాపాల్ (ఫోటోలు)
-
Prabhas: రెబెల్ స్టార్ బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలరీ
-
యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?
ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది వినోద ప్రపంచపు రారాజు. ఒకవైపు యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్‌గా మారడం అనేది ఉద్యోగం కంటే ఉత్తమమైన ఆదాయం అందుకోగల వృత్తి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్‌ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్‌కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్‌కున్న క్రేజ్ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు(ఒక బిలియన్ అంటే వంద కోట్లు) పైగా వినియోగదారులు దీనిని సందర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న రాత్రి 8:27 గంటలకు అప్లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అని అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు (ఒక మిలియన్ అంటే పది లక్షలు) పైగా వీక్షణలు దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేదు. ఇది కూడా చదవండి: గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? -
Siri Hanmanth- Shrihan: తొమ్మిదేళ్లుగా లవ్.. పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన సిరి హన్మంత్ (ఫోటోలు)
-
AP at US : వరుసగా నాలుగోసారి రత్నాకర్‌కు కీలక బాధ్యతలు
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ మరోసారి ఎంపిక అయ్యారు. కడప జిల్లా రాజంపేట కు చెందిన వైయస్ఆర్ సీపీ నేత అయిన రత్నాకర్‌ను ఈ పదవిలో నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవి ఆయన్ను వరించడం ఇది వరుసగా నాలుగోసారి. 2019లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన రత్నాకర్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆపై 2021, 2022లో ప్రభుత్వం రత్నాకర్ పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఇపుడు తాజాగా మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు వరుసగా నాలుగోసారి పదవి వరించడంతో రత్నాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న పార్టీలోని కీలక నాయకులకు, సహచర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన రత్నాకర్.. తన పట్ల నమ్మకం ఉంచినందుకు సీఎం YS జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేస్తానని, ప్రవాసాంధ్రులకు అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామని, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. Thank you Jagan anna for extending my role as AP govt special rep to North america ( USA & canada) for 4 th time. I am blessed & honured to work under your leadership & associate with our party .@ysjagan @JaganannaCNCTS pic.twitter.com/q8TxO5woPW — Kadapa Rathnakar (@KadapaRathnakar) October 14, 2023 దశాబ్ద కాలంగా పార్టీతో ప్రయాణం బలిజ/ కాపు సామాజికవర్గానికి చెందిన రత్నాకర్ వైయస్ఆర్ సీపీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వివిధ పదవుల్లో పార్టీకి సేవలందించారు. 2014 ఎన్నికలు, 2017లో జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ కోసం తనవంతుగా కృషిచేశారు. 2017 నుండి 2019 వరకు సాగిన వైయస్ జగన్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో అధినేతతో కలిసి అడుగులు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలు, తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాoగంతో కలిసి అభ్యర్థుల గెలుపుకు పనిచేశారు. 2015 నుండి రత్నాకర్ వైయస్ఆర్ సీపీ అమెరికా విభాగానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో వైయస్ఆర్ సీపీ మద్దతుదారులను ఏకీకృతం చేయడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఏపీలో జరిగే వైయస్ఆర్ సీపీ కార్యక్రమాల్లో ఆయనను చురుగ్గా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ వేలాది వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు రత్నాకర్ చేరువయ్యారు. సమర్థత, విధేయతకు పట్టం కడుతూ వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అమెరికా, కెనడాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ను ఎంపిక చేశారు. అమెరికాలో తెలుగు విద్యార్థులకు తోడుగా ఇటీవల ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులతో కూడిన బృందం అమెరికాలో పర్యటించింది. ఈ పర్యటనను రత్నాకర్ దగ్గరుండి పర్యవేక్షించారు. పర్యటన ఆద్యంతం ఏపీ నుండి వచ్చిన బృందానికి సహాయ సహకారాలు అందించారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వైట్ హౌస్, కొలంబియా యూనివర్సిటీలో ఏపీ విద్యార్థులు "విద్య" పై ప్రసంగించారు. విద్యావ్యవస్థలో సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, నిరుపేదల చదువుల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను గురించి వివరించారు. నిరుపేదలైన విద్యార్థులు ప్రపంచ వేదికలపై అనర్గళంగా మాట్లాడడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో సీఎం వైయస్ జగన్ విద్యావిధానాలను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో రత్నాకర్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. ఇదొక్కటే కాదు, అమెరికా, కెనడాల్లో ప్రవాసాంధ్రులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా తానున్నానంటూ అండగా ఉన్నారు రత్నాకర్. I take immense pleasure to be associated with the contingent of government school students from Andhra Pradesh who are currently in the USA to participate in the UN SDG Summit tomorrow. The world is about to witness the strength of the Andhra Pradesh education system and its… pic.twitter.com/f500iBwqy8 — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 16, 2023 ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఇది సీఎం వైయస్ జగన్ దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడని, నాలుగున్నరేళ్ల పాలనలో పేదల జీవితాలు మార్చేలా అద్భుతాలు సృష్టించిన ఘనత ఆయనదని రత్నాకర్ కొనియాడారు. ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు. 2024 ఎన్నికల్లో YSRCP ప్రభుత్వం మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని.. సీఎం జగన్ 2.0 ప్రభుత్వం కోసం రాష్ట్రప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. 2024 తర్వాత కూడా మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలతో ఏపీని దేశంలోనే నెం 1 రాష్ట్రంగా సీఎం జగన్ నిలబెడతారని రత్నాకర్ పేర్కొన్నారు. మిషన్ 2024 వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు రానున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు సమర్థత, సంక్షేమానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి వేలాది మంది అమెరికాలో ఉన్నారని, వీరందరిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామని, సీఎం జగన్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు, తెలుగు మహా సభల ద్వారా ప్రవాసాంధ్రుల మద్ధతుతో YSRCP ఘనవిజయానికి శాయశక్తులా కృషి చేస్తామని రత్నాకర్ తెలిపారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు ! వాటిని చుట్టాలూగా చేసుకోని , అన్నీ వ్యవస్తలను మేనేజ్ చేస్తూ ప్రత్యర్థులను , సొంత వాళ్లను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నిజ స్వరూపము అందరికీ తెలిసేలా చేసిన అన్నీ వ్యవస్థలకు కృతజ్ఞతలు#CorruptBabuNaidu #EndOfTDP pic.twitter.com/gF3HNZcN9b — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 10, 2023 -
దసరాకు ఆర్టీసీ ‘ స్పెషల్’!
యాదాద్రి: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏటా స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 409 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకం తర్వాత వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుండగా.. రాఖీ సందర్భంగా సత్ఫలితాలు ఇచ్చిన గిఫ్ట్‌ల కార్యక్రమాన్ని ఈ పండుగకు ప్రవేశపెట్టనున్నారు. 10 మందికి రూ.9,900 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. 10 మంది ప్రయాణికులకు గిఫ్ట్‌లు ప్రయాణికుల ఆదరణ పొందడం.. తద్వారా మంచి ఆదాయాన్ని గడించేందుకు వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ ముందుకు వస్తోంది. రాఖీ సందర్భంగా చేపట్టిన బహుమతుల పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ దసరాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం రీజియన్ పరిధిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేయనున్నారు. పండుగకు ముందు ఈనెల 21 నుంచి 23 వరకు, పండుగ తర్వాత 28నుంచి 30వ తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్‌నంబర్ రాసి.. ఆర్టీసీ ఏర్పాటు చేసే బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను నల్ల గొండ, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్తబస్టాండ్, యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, భువనగిరి బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ రోజులను గుర్తించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నల్లగొండ, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లావాసులు ఉద్యోగాలు, ఇతర పనులు, విద్య కోసం రాజధాని హైదరాబాద్‌లోనే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు కావడంతో పెద్దఎత్తున జనం సొంత గ్రామాలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయా డిపోలకు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు, తర్వాత సాధారణ జనం రద్దీ కారణంగా 19నుంచి 22వ తేదీ వరకు.. ఇలా మొత్తంగా ఏడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి ఆయా తేదీల్లో రాజధానికి అదనపు బస్సులు నడపనున్నారు. 409 బస్సులు.. సాధారణ చార్జీలు పండుగ నేపథ్యంలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలో మొత్తం 409 బస్సులతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొదటిరోజు శుక్రవారం ఏడు డిపోల నుంచి 56 బస్సులను నడిపారు. ఇక 14వ తేదీన 36 బస్సులు నడపనున్నారు. 15వ తేదీన 35 బస్సులు తిప్పుతారు. తిరిగి ఈనెల 19న 71 బస్సులు, 20వ తేదీన 56 బస్సులు, 21వ తేదీన 75 బస్సులు, 22వ తేదీన 80 బస్సులు నడపనున్నారు. అయితే గతంలో స్పెషల్ బస్సులను నడిపితే 20 శాతం మేర చార్జీలు అదనంగా వసూలు చేసేవారు. 2022లో బస్ చార్జీలు రెండుసార్లు పెంచడం, చిల్లర సమస్యతో మరోసారి పెంచడంతో గతేడాది దసరా స్పెషల్ బస్సులకు చార్జీలను పెంచలేదు. ఈ సారి కూడా రోజువారీగా వసూలు చేసే చార్జీలనే తీసుకోనున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ రీజియన్ పరిధిలో 409 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు స్పెషల్ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనంగా సర్వీసులు నడుపుతాం. ఈ పండుగకు నగదు బహుమతులు అందిస్తున్నాం. – ఎస్.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
ఇజ్రాయెల్ ఆవుల ప్రత్యేకత ఏమిటి? పాలను ఏ పద్ధతిలో తీస్తారు?
ఇజ్రాయెల్ పలు అంశాలలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. వీటిలో ఒకటి ఆవుల పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ ఆవులు ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాయి. అవి గరిష్టంగా పాలను అందిస్తాయి. ఇందుకోసం ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఒక ఇజ్రాయెల్ ఆవు సంవత్సరానికి 12,000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆవులు హోల్‌స్టెయిన్ జాతికి చెందినవి. ఆవులను ఉత్తమంగా సంరక్షించడంలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందుంది. ఈ దేశంలో పాడి పరిశ్రమ నిర్వహణకు మంచి పేరుంది. రోజువారీ పాల దిగుబడి శాతాన్ని పరిశీలిస్తే, భారతీయ ఆవు 7.1 లీటర్లు, బ్రిటిష్ ఆవు 25.6, అమెరికన్ ఆవు 32.8, ఇజ్రాయెల్ ఆవు 38.7 లీటర్ల మొత్తంలో పాలు ఇస్తుంది. హెర్జ్లియా నగరాన్ని ఇజ్రాయెల్ పాల రాజధాని అని పిలుస్తారు. ఇజ్రాయెల్ అంతటా దాదాపు 1000 డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 2016లో ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్‌లు సుమారు 1,450 మిలియన్ లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేశాయి. పాడి ఆవుల నిర్వహణకు దేశంలో ప్రత్యేక మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇజ్రాయెల్‌లో ఆవు పాలను ఉపయోగించి 1000 కంటే ఎక్కువ విభిన్న పాల ఉత్పత్తులను తయారు చేస్తారు. 'మిక్వే ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ స్కూల్' 1880లో స్థాపితమయ్యింది. దేశంలో హోల్‌స్టెయిన్ జాతి ఆవు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇజ్రాయెలీ పాడి పరిశ్రమ విజయానికి అక్కడి సాంకేతిక పురోగతి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ రైతులు తమ ఆవులను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. భారతదేశం నుండి పలు బృందాలు శిక్షణ కోసం ఇజ్రాయెల్ డెయిరీలకు కూడా వెళ్లాయి. ఇజ్రాయెల్ ప్రభావంతో భారత్‌తోపాటు చైనా, వియత్నాం, కెనడాలలో పాల ఉత్పత్తులు వృద్ధి చెందాయి. ఇజ్రాయెల్ డెయిరీలు చాలా వరకు సహకార సంస్థలు. ఇవి 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందాయి. ఆవుల పాల ఉత్పత్తిలో వాటి పాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ప్రమాణం ప్రకారం ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తాం. ఇజ్రాయెల్‌లోని అన్ని డెయిరీలు ఇజ్రాయెల్ డెయిరీ బోర్డ్ విధానాలను అనుసరిస్తాయి. రోబోటిక్ పద్ధతిలో ఆవుల నుండి పాలను తీస్తారు. ఈ రోబోటిక్ ప్రక్రియ 1999లో ఇక్కడ ప్రారంభమయ్యింది. ఇక్కడి ఆవులను పశువైద్యులు క్రమం తప్పకుండా పరీక్షిస్తుంటారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
Lakshmi Manchu Birthday: టాలీవుడ్ నటి మంచులక్ష్మి అరుదైన ఫోటోలు చూశారా?
-
వేగా శ్రీ రెండో వార్షికోత్సవం గోల్డ్ అండ్ డైమండ్స్ స్పెషల్ కలెక్షన్స్ (ఫోటోలు)
-
అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి బర్త్ డే స్పెషల్ ఫొటోలు
-
విభజనతో చేదు అనుభవాలు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, అనేక చేదు అనుభవాలను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో ఇటు తెలంగాణగానీ, అటు ఏపీగానీ సంబరాలు చేసుకోలేపోయాయని.. విభజన సమయంలో విషపు బీజాలు నాటబడ్డాయని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రసంగించిన మోదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందరి సమ్మతితో కష్టతరమైన పనులనూ పార్లమెంటు పూర్తి చేసింది. ఇదే సభలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా మూడు రాష్ట్రాల విభజన జరిగింది. ఆ రాష్ట్రాల విభజన సమయంలో అన్నిచోట్లా సంబరాలు జరిగాయి. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో దాని మాతృ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సంబరాలు చేసుకుంది. అలాగే ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు సమయంలో మధ్యప్రదేశ్.. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో బిహార్ కూడా సంబరాలు చేసుకున్నాయి. అందరి సమ్మతితో సుహృద్భావ వాతావరణంలో విభజన జరిగింది. కానీ కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. రక్తపుటేర్లు పారాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండూ సంబరాలు చేసుకోలేకపోయాయి. విభజన సమయంలో విష బీజాలు నాటబడ్డాయి. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైన మాదిరిగా అదే ఉత్సాహంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు తెలంగాణ ఒక కొత్త శిఖరానికి చేరుకునేది..’’అని మోదీ పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఫిబ్ర వరి 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విభజన సరిగా జరగలేదని.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన ఏపీని సిగ్గుపడేలా కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ వ్యాఖ్యలు: రేవంత్‌రెడ్డి తెలంగాణ పోరాట స్ఫూర్తిని కించపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపర్చేలా మోదీ మాట్లాడటం ఘోరం. రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. మనం బీజేపీని తరిమికొడదాం’’అని ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమే: రాహుల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే..’’అని మంగళవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు: బీఆర్ఎస్ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు సభలో తిప్పికొట్టారు. బీఆర్ఎస్ తరఫున ప్రసంగించిన నామా... ‘‘తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిలి్చందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణ నేడు దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. తలసరి ఆదాయం, తల సరి విద్యుత్ వినియోగంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ రావాల్సి ఉంది..’’అని పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలే ఉంటే ఇప్పుడు 300కు పైగా ఉన్నారని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని... అదే మాదిరి గా ఇద్దరు ఎంపీలే ఉన్నా తమ పార్టీ కొట్లాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. ఇక నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నామా డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని, హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతని కేసీఆర్ నిరూపించుకున్నారని చెప్పారు. -
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల అయ్యింది. కేంద్రం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్యసభ, లోక్‌సభలు వేర్వేరుగా బులిటెన్లు విడుదల చేశాయి. ఇందులో భాగంగా.. ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నారు. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: 450 మంది పోలీసులకు ప్రధాని విందు -
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నద్ధమౌతోంది. స్పెషల్ మీటింగ్ ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, అనురాగ్ ఠాకూర్లు హాజరయ్యారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కొన్ని రోజులుగా దేశంలో రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్‌లోకి అధికారికంగా మారనున్నారనే మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల17న అఖిలపక్ష భేటీ ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 17న సాయంత్రం 4:30కి నేతలందర్ని మీటింగ్‌కు ఆహ్వానించారు. Ahead of the parliament session from the 18th of this month, an all-party floor leaders meeting has been convened on the 17th at 4.30 PM. The invitation for the same has been sent to concerned leaders through email. Letter to follow ಇದೇ ಸೆಪ್ಟೆಂಬರ್ 18 ರಿಂದ ಆರಂಭವಾಗಲಿರುವ ವಿಶೇಷ… — Pralhad Joshi (@JoshiPralhad) September 13, 2023 ఇప్పటికే ఈ స్పెషల్ సెషన్ ఎజెండా తెలపాలని కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఏ రాజకీయ పార్టీతో చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. ప్రధాన ఉద్ధేశం ఏంటో తెలిపాలని కోరారు. ప్రత్యేక సమావేశాలను వినాయక చవితి రోజున నిర్వహించడంపై శివ సేన (యూబీటీ) నేత సుప్రీయా సూలే కేంద్రంపై మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ రోజున పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని దుయ్యబట్టారు. Just read about the upcoming Special Parliament Session (13th Session of 17th Lok Sabha & 261st Session of Rajya Sabha) happening from Sep 18-22. Whilst we all look forward towards meaningful discussions and dialogue, the dates coincide with the Ganpati Festival, a major… — Supriya Sule (@supriya_sule) August 31, 2023 ఇటీవల జీ20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పిలవడంతో దేశం పేరును మార్చనున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఈ నెల నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లోనే ఈ బిల్లును చర్చకు తీసుకువస్తారని ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. ఇదీ చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే.. -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
సర్టీఫికెట్ల తనిఖీకి ప్రత్యేక సెంటర్!
సాక్షి, హైదరాబాద్: గురుకుల కొలువుల నియామకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పా ట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే అర్హత పరీక్షలన్నీ నిర్వహించిన బోర్డు... మెజార్టీ సబ్జెక్టు లకు సంబంధించి తుది కీలను సైతం విడుదల చేసింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేట గిరీలకు సంబంధించి కోర్టు పరిధిలో కేసులుండటంతో ఆయా పరీక్షల తుది కీలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఫైనల్ కీలు ఖరారు చేసిన సబ్జెక్టులకు సంబంధించి మెరిట్ జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. 9,210 పోస్టుల భర్తీకి.. గురుకుల విద్యా సంస్థల్లో ప్రధానంగా 9 విభాగాల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్ఈఐ ఆర్బీ 9 రకాల ప్రకటనలు జారీ చేసింది. ఇందులో 61 సబ్జెక్టుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేస్తూ మెరిట్ జాబితాలు విడుదల చేస్తారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టీఫికెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ సెంటర్‌కు హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. తొలుత జిల్లాల వారీగా పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం... మరోవైపు రెండు వారాల పాటు పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తుండడంతో హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు. ఈమేరకు పరిశీలన కేంద్రం ఏర్పాటు, నిర్వహణపైన కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో తేదీల ఎంపిక... వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థి ముందుగా టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్తికి అనుకూలంగా ఉన్న ఒక రోజును ఎంపిక చేసుకుని ఆమేరకు పరిశీలనకు హాజరుకావాలి. ఈనెల మూడో వారం నాటికి మెరిట్ జాబితాలు రెడీ చేసేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మెరిట్ జాబితాలు ఖరారైన తదుపరి వారంలోనే పరిశీలన ప్రక్రియ ప్రారంభించనుంది. -
పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్లో మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పార్లమెంట్లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ -
సమావేశాల్లో ఆ 9 అంశాలపై చర్చించండి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అజెండాను ప్రకటించకుండానే ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి సమావేశాల్లో మణిపూర్‌లో హింస, దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు తదితర కీలకాంశాలపై చర్చించాలని డిమాండ్‌చేస్తూ ప్రధాని మోదీకి సోనియా లేఖ రాశారు. ముఖ్యంగా తొమ్మిది అంశాలపై చర్చ జరగాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ‘ మణిపూర్‌లో హింస, పెరిగిన ధరవరలు, రాష్ట్రాలు– కేంద్రం మధ్య క్షీణిస్తున్న సత్సంబంధాలు, చైనాతో సరిహద్దు వెంట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అదానీ గ్రూప్‌లో అవినీతి లావాదేవీల బహిర్గతం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలను చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘ ఇతర రాజకీయ పారీ్టలతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సమావేశాలు జరిగే ఈ మొత్తం ఐదు రోజులూ ప్రభుత్వ ఎజెండాపైనే చర్చ జరగనుందని మాకు సమాచారం వచ్చింది’ అని సోనియా వ్యాఖ్యానించారు. ఇదో చక్కని అవకాశం ‘ఇదో చక్కని అవకాశం. ప్రజాసమస్యలు, ప్రాముఖ్యత దృష్ట్యా ఈసారి సమావేశాల్లో మేం తప్పకుండా పాల్గొంటాం. ఈ అంశాలపై చర్చకు సమయం కేటాయిస్తారనే భావిస్తున్నాను’ అని సోనియా అన్నారు. ‘ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చిస్తారో అనే విషయాన్ని ముందుగా తెలపకుండానే సెషన్‌ను ప్రారంభిస్తుండటం బహూశా ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాంగ్రెస్ మరో నేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాజకీయ పారీ్టలు చేస్తున్న డిమాండ్లకు తగ్గట్లు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని సోనియా కోరారు. ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు సృష్టించిన విలయం, మరి కొన్ని రాష్ట్రాల్లో కరువు కాటకాలు వంటి ఘటనలను చర్చించాలని సోనియా డిమాండ్‌చేశారు. ‘పెరుగుతున్న నిరుద్యోగిత, సమాజంలో అసమానతలు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమస్యల వలయంలో చిక్కుకోవడం వంటి అంశాలనూ చర్చించాలి. రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతాంగం సమస్యలు చర్చకు రావాలి’ అని సోనియా అన్నారు. ‘ఈసారి సమావేశాలను మేం బాయ్‌కాట్ చేయబోం. సభలోనే ఉండి సమస్యలపై పోరాడతాం’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో జైరాం రమేశ్ చెప్పారు. ఆ తొమ్మిది అంశాలు 1. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితితో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎస్ఎంఈలపై దుస్థితి 2. రైతులు, రైతు సంస్థలు లేవనెత్తిన కనీస మద్దతు ధర అంశంతో పాటు వారు లేవనెత్తిన ఇతర డిమాండ్ల పరిస్కారం కోసం మోదీ సర్కార్ చూపే నిబద్ధత 3.అదానీ వ్యాపార సమూహం లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జేపీసీ ఏర్పాటు 4.మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతర వేదన, రాజ్యాంగ వ్యవస్థల విచి్ఛన్నం, అక్కడ నెలకొల్పాల్సిన సామాజిక సామరస్యం 5.హరియాణా వంటి వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం 6.భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని మన సరిహద్దుల్లో దేశ సార్వ¿ౌమాధికారానికి ఎదురైన సవాళ్లు 7.దేశవ్యాప్తంగా కుల గణన 8.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు 9.ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు కారణంగా పెరిగిన కష్టాలు Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 #WATCH | #WATCH | Congress MP Jairam Ramesh says, "Sonia Gandhi in a letter (to PM Modi) mentioned that the session has been called without any discussion with the opposition...Nobody had any information about it...This is for the first time that we do not have any details for… pic.twitter.com/IzEXXJFMEj — ANI (@ANI) September 6, 2023 -
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీలో చర్చిస్తారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సమాచారం. విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
పంజగుట్ట: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం నుంచి సమావేశాలు పూర్తయ్యే 22 వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 3న జాతీయ స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నేతల సమావేశాలు, 4, 5 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించడం, 6న జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 9న అన్ని మండలాల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 18న ఢిల్లీలో మాదిగ ఉద్యోగుల నిరాహార దీక్ష, 19న ఢిల్లీలో మాదిగ మేధావులు, విద్యావంతుల దీక్ష, 20న మాదిగ జర్నలిస్టుల దీక్ష, 21న మాదిగ కళామండలి దీక్ష, 22న మాదిగ లాయర్ల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. -
Actor Vineeth Unseen Photos: ప్రేమదేశం హీరో వినీత్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
భారత విద్యార్థులకు అమెరికా ప్రత్యేక కోర్సులు..
న్యూయార్క్: మన దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమెరికా కూడా భారతీయ విద్యార్థులకు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. 2024 సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారిక విభాగం వెల్లడించింది. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. పనిలో అనుభవం తెచ్చుకోవడంతో పాటు స్టుడెంట్ లోన్స్ పూర్తి చేయడానికి వీలవుతుంది. అమెరికాకు చెందిన 20 యూనివర్సిటీలు 15 ఇండియన్ యూనివర్సిటీలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. భారతదేశం 2020లో కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. అందరికీ అందుబాటులో విద్య, భారత సంస్కృతి రక్షణ, గ్లోబర్ ఛాలెంజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యా విధానాలను రూపొందించారు. ఇదీ చదవండి: Viral: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
19 వేల సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు ఇంకా 19,049 మిగిలాయి. ఆదివారం మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ లెక్క తేలినట్టు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు 3,034 వరకూ ఉన్నాయి. ఈసారి సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ సీట్లను అన్ని కాలేజీలు ముందే భారీగా తగ్గించుకున్నాయి. ఈ బ్రాంచీల్లో మొత్తం 7 వేల సీట్లకు కోత పడింది. ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులే 56,811 ఉన్నాయి. ఈ విధంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెరగడంతో టాప్ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో మాత్రం కంప్యూటర్ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువే (కాలేజీలు తగ్గించుకోవడం వల్ల) ఉన్నప్పటికీ, చివరకు వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలాయి. ఇలా మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. -
Sridevi Birthday Special Pics : దివంగత నటి శ్రీదేవి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
Mahesh Babu Birthday Special Pics: హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. స్పెషల్ ఫోటోలు
-
Devi Sri Prasad : మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే రాక్ స్టార్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
Mrunal Thakur Latest HD Photos: హీరోయిన్గా పనికిరాదన్న చోటే సత్తా చాటిన మృణాల్ ఠాకూర్
-
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
కైకాల సత్యనారాయణ రేర్ పిక్స్
-
'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ రేర్ పిక్స్
-
మీరెప్పుడూ చూడని సితార చిన్నప్పటి ఫోటోలు
-
రాజేంద్రప్రసాద్ అరుదైన ఫోటోలు.. చూశారా?
-
Smriti Mandhana : అందమైన క్రికెటర్ స్మృతి మంధానకు హ్యాపీ బర్త్‌డే (ఫొటోలు)
-
Dil Raju : కుమారుడితో కలిసి దిల్ రాజు దంపతుల అల్లరి (ఫోటోలు)
-
భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అపురూపమైన బహుమతినిచ్చారు. వైట్ హౌస్ లో జరిగిన ఇరుదేశాల పారిశ్రామికవేత్తల సమావేశంలో ఒక టీషర్టును మోదీకి కానుకగా ఇచ్చారు. దాని మీద AI అంటే అమెరికా ఇండియా భవిష్యత్తు అని మోదీ సరికొత్తగా నిర్వచించిన మాటలను ముద్రించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. AI అంటే అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కానివ్వండి అమెరికా ఇండియా కానివ్వండి. భవిష్యత్తు అంతా AI నే.. అని అన్నారు. అనంతరం ఇరుదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒక టీషర్ట్ మీద మోదీ చెప్పిన ఆ మాటలనే ముద్రించి కానుకగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు కానుక ఇచ్చిన ఆ ఫోటోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఐక్యంగా పని చేస్తే ఈ భూమి కంటే గొప్ప ప్రదేశం మరొకటి ఉండదని, అమెరికా భారత్ రెండు AI మాదిరిగానే శక్తివంతంగా తయారవుతున్నాయని రాశారు. ఈ సమావేశంలో అమెరికా పారిశ్రామికవేత్తలు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచ్చై, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒపెన్ AI సీఈవో సామ్ ఆల్ట్ మాన్,ఏఎండి సీఈవో లిసా సు, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ లతో పటు భారత పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, వృందా కపూర్ లు కూడా పాల్గొన్నారు. AI is the future, be it Artificial Intelligence or America-India! Our nations are stronger together, our planet is better when we work in collaboration. pic.twitter.com/wTEPJ5mcbo — Narendra Modi (@narendramodi) June 23, 2023 ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర -
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 వంటకాలు ఇవే!
-
ఇళ్లకే మద్యం పంపిణీ అయ్యేలా గ్రీన్ సిగ్నల్..పెళ్లిళ్లలో కూడా తాగొచ్చు..
సాధారణంగా మద్యం విక్రయించాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు క్లబ్‌లు, స్టార్ హోటల్స్‌కి మాత్రమే మద్యం వినియోగం కోసం లైసెన్స్ ఇచ్చేవారు. ఇక ఇళ్లలోని ఫంక్షన్స్ ఉత్సవాలు, స్టేడియం నుంచి జాతీయ, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల వరకు అన్ని చోట్ల మద్యం సర్వ్ చేయాలన్న లేదా కలిగి ఉండాలన్న లైసెన్స్ ఉండాల్సిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్.ఎల్.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని కూడా ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది. మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది తమిళనాడు ప్రభుత్వం. అందులో భాగంగానే మద్య అమ్మకాలు పెంచేలా ఈ ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకువచ్చింది. దీంతో పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక లైసెన్స్ వివరాలు.. దీన్ని డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్(ఎక్సైజ్) జారీ చేస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ లైసెన్స్ అతిథులు, సందర్శకుల తోపాటు అంతజర్జాతీయ లేదా జాతీయ ఈవెంట్లలో పాల్గొనేవారికి సర్వ్ చేసేందుకు, కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. దీని ఈవెంట్ తేదీ ఏడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆయా ప్రదేశాల్లో మద్యం విక్రయించాలంటే ఈ ప్రత్యేక లైసెన్సు ఉండాలి. అందుకోసం ప్రభుత్వాన్నికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్యపరమైన ఈవెంట్లకు ప్రత్యేక లైసెన్స్ వార్షిక రుసుము కింద మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలటీల్లో రూ. 75వేలు, ఇతర ప్రదేశాల్లో రూ. 50,000 వరకు ఉంటుంది. అదే ఒక్కరోజు ఈవెంట్ నిర్వహణకు అయితే మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 11 వేలు, మున్సిపాలటీల్లో రూ. 7500, ఇతర ప్రదేశాల్లో రూ. 5వేలు వరకు ఉంటుంది. ఇక గృహ వేడుకల సమయంలో నాన్-కమర్షియల్‌గా ఒక్కరోజుకి ఈ ప్రత్యేక లైసెన్స్‌ను రూ. 11,000 (మునిసిపల్ కార్పొరేషన్లలో), రూ. 7,500 (మున్సిపాలిటీలలో) రూ.5 వేలు(ఇతర ప్రదేశాల్లో). (చదవండి: ఆరోగ్య మంత్రి వీడియో చాట్ దుమారం.. బీజేపీ రాజీనామా డిమాండ్) -
రంజాన్ స్పెషల్ స్టోరీ : నాకు కావలసినదల్లా అక్కడుండేది..
అప్పుడు పంతొమ్మిదివందల ఎనభై రోజులు. అపుడు దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ పండగలు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. మా ఇళ్లల్లో జరుపుకునే పండగలు కొన్నయితే, బయట కనపడేవీ మరికొన్ని. మా ఇంటికి ఆనుకునే కమ్యూనిస్ట్ మార్కిస్ట్ పార్టీ ఆఫీస్ ఉండేది. వీలు కుదిరినపుడల్లా నేనస్తమానం అక్కడే ఉండేవాణ్ణి. నాకెప్పుడు చూసినా వీలు కుదిరేది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లో నాకెంతో ఇష్టంగా అనిపించే పుస్తకాలు ఉండేవి, తెలుగులో వచ్చే అన్ని దినపత్రికలు అక్కడ దొరికేవి. సాయంకాలాలు కామ్రేడ్స్ మీటింగులు ఉండేవి. ప్రతి సమావేశం ప్రారంభంలోనూ, ముగింపులోనూ పాటలు ఉండేవి. వారితో కలిసి గొంతు కలపడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేది. కలుపుతుంటే సంతోషంగా ఉండేది. మధ్యాహ్నాలు పార్టీ ఆఫీస్ ఖాళీగా ఉండేది. అక్కడ నీలిమందు రంగు, రెడ్ ఆక్సైడ్ కలిపిన జగ్గులు ఉండేవి, కుంచెలు ఉండేవి, తెల్లని గోడలు ఉండేవి. నేనక్కడే గోడల మీద బొమ్మలు వేసుకుంటూ ఉండేవాణ్ణి. నిద్ర తగిలినపుడు చల్లని ఫ్యాన్ కింద విశాలాంధ్రో, ప్రజాశక్తో, ఆంధ్రప్రభో పేపరు పరుచుకుని నిదుర తీసే కాలం ఉండేది. తరుచుగా సామాజిక స్పృహ కలిగిన సాంఘిక నాటకాల, బుర్ర కథల, విప్లవ గీతాల రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి. నేనన్నిటికీ హాజరయ్యేవాణ్ణి, నాటకాల డైలాగులు, బుర్రకథల భళానంటి భాయి తమ్ముడా మేల్ భళానోయ్ తందానాలన్నీ నాలుక చివర పాఠాల్లా అతుక్కుపోయేవి. మా నూనెపల్లె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మనుష్యుల్లో గొప్ప గుణం ఏమిటంటే చిన్న పిల్లవాడినని, ఏమీ తెలియనివాడిని కదాని నన్నెప్పుడూ దూరం పెట్టేవారు కాదు. నాకు కావలసినదల్లా అక్కడుండేది, నాకు ఆ వాతావరణం నచ్చేది. వారు నాకు అయినవారు అయ్యారు. వారు దేవుడు లేడనేవారు. నేనూ దేవుడు లేడనే అనుకునేవాణ్ణి. లేడని ఎవరితో అనేవాణ్ణి కాదు. దేవుడు ఎవరికి ఉన్నా లేకున్నా టంచనుగా మాత్రం పండగలు వస్తూ ఉండేవి. మేము జరుపుకునే ముస్లిమ్ పండగలు, మేము జరుపుకోకున్నా ఇరుగూ పొరుగులతో జరుపుకున్నంత జరిగే ఇతర పండగలు. అతి ముఖ్యంగా ఆగష్ట్ పదహైదు, జనవరి ఇరవై ఆరు, అక్టోబర్ రెండు, నవంబర్ పద్నాలుగు… మొదలైన జాతీయపండగలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకోడానికి నిద్రలేచేవాళ్లం. అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి. ఇంటి బయట పెద్ద డేగిసా పెట్టి కట్టెల పొయ్యి మీద నీళ్ళు నిరంతరాయంగా కాగుతూనే ఉంటాయి, కాగిన నీళ్ళు కాగినట్లుగా పట్టుకుపోయి జాలాట్లో గంగాళంలో పోస్తూనే ఉంటారు. జనాలు స్నానాలు చేస్తూనే ఉంటారు. మొదట ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పిల్లలు స్నానాలు కానిస్తారు, నమాజులకు వెళ్లాలి కదా. గంగాళంలో ఆ ఉడుకుడుకు నీటిలో ఇత్తడి చెంబు ముంచుకుని స్నానం చేయ్యడమనే అనుభవాన్ని ఆ గోల్డన్ ఓకర్ ఎల్లో రంగుని తలుచుకుంటుంటే గతజన్మ జ్ఞాపకాల్లా అనిపిస్తున్నాయి అవన్నీ. స్నానాలు కాగానే కొత్త బట్టలు తొడుక్కోవాలి కదా! మా మేనత్త భర్త మా కుటుంబానికి ఆస్థాన దర్జి, కాబట్టి మాకెప్పుడూ సమయానికి కొత్త బట్టలు కుట్టి రెడీగాలేవు అనే చింతే రాసిపెట్టి లేదు. ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట ఏమో కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొత్త బట్టలకు పండగా, పుణ్యకార్యాల ప్రాప్తత లేదు. జనం దగ్గర డబ్బులు, అప్పులు ఎక్కువయిపోయి ఎప్పుడు పడితే అప్పుడు అవసరమున్నా, లేకున్నా బట్టలు కొనేయడం, వేసేసుకోడమే. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో! ఇట్లా వచ్చే పండగలకు, మన పుట్టిన రోజు పండగలకు ఆ దగ్గరికాలం రోజుల్లో మన స్కూల్ యూనిఫామ్ కనుక చినగడమో, పొట్టి కావడమో జరగరాదని దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడికి దండం పెట్టుకోవాలి. లేకపోతే దుబారా అవుతుందని ఒక్కోసారి పండగలకు, పుట్టినరోజులకు మనకు స్కూలు డ్రస్సును కొత్తబట్టలుగా కుట్టించడం పెద్దల జాగ్రత్త. పండగనాడు కూడా బడి యూనిఫామ్ ఏమిరా! పైన తెలుపు, కింద ఖాకీ. ఏవయినా రంగులా అవి? స్నానాలు కానించి, కొత్త బట్టలు వేసుకుని, తలకు నూనె పట్టించి, సుబ్బరంగా తల దువ్వుకుని, రెడీ రెడీ అనుకున్నాకా పెద్దలూ పిల్లలూ అందరూ తిక్కస్వామి దర్గా దగ్గర ఈద్గాకు బయలుదేరేవాళ్లం. చక్కగా మడత పెట్టిన దుప్పట్లను మేము పెద్ద పిల్లలం చంకలో పెట్టుకుంటే, మాకంటే చిన్నవాళ్లయిన మా బుల్లి బుల్లి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మా చిన్నాయనగార్లవో, మావో చిటికెనవేళ్ళు పట్టుకుని దారికంతా అత్తరు వాసన అద్దిస్తూ నడిచేవాళ్లం. మామూలుగా ఏ రోజు కూడా అయిదుపైసాలు కూడా పిల్లల చేతిలో పెట్టని మా మాబ్బాషా చిన్నాయన రోజు మా చేతికి, మా జేబుకు నిండుగా రూపాయలు, అర్ధరూపాయల బిళ్లలు నింపేవాడు (అంటే మా చిన్నాయన మూడువందల అరవైనాలుగు రోజుల పిసినారి అని కాదు, డబ్బు పిల్లలను చెడగొడుతుంది అని ఆయన నియమం, అదే అవసరమైన ఖర్చుపెట్టే దగ్గర ఆయనది ధారాళమైన చేయే) ఆ చిల్లర డబ్బులంతా ఎందుకంటే నమాజు ముగిశాకా దారికి రెండు పక్కలా బీదా బిక్కీ జనం ఉంటారు కదా, వారికి ధర్మం చేయడానికి. ఒక్క నాణెం మిగిలిపోకుండా అన్ని బిళ్ళలు అక్కడే పంచి వచ్చేసేవాళ్ళం. అలా నమాజు నడకకు బయలుదేరితే దారి నిండా నమాజులకు వెళ్ళే జనమే. మామూలు రోజుల్లో నిత్యం లుంగీ, కట్ బనీయన్ల మీద కనపడే టీ బంకు లాలూభయ్ గాని, రిక్షా తొక్కే బాషా భయ్ వంటి అనేకం ఆరోజు అమిత శుభ్రంగా, కళకళ్లాడుతూ ముచ్చటగా కొత్తబట్టల్లో కొత్తగా కనపడేవారు. ఈద్గా దగ్గర నా స్కూలు ప్రెండ్స్ కూడా చాలామంది కనపడేవారు. వాడు కనపడగానే వీడు, వీడు అగుపడగానే వాడు పళ్ళికిలించుకోడమే తప్పా, ఆదాబ్ అనో, అస్సలామలైకుం అంటూ లేని గడ్డాన్ని నిమురుకుంటూ గంభీరంగా తెలుగు సినిమా వేషాలు ఏమీ పడేవాళ్లం కాదు. మాకు తెలిసిన అస్సలామలైకుం అల్లా ‘సలాములేకుం సాయబుగారు భలే జోరుగా ఉన్నారు’ అనే గులేబకావళి సినిమా పాట మాత్రమే. ఎక్కువ ఆలస్యం చేయకుండా పండగ నమాజు చేసే ఈద్గాకు త్వరగా చేరుకుంటే స్థలం కోసం అటూ ఇటూ వెదుక్కోకుండా మా దుప్పట్లు పరుచుకునేంత చల్లని నీడని ఏ చెట్టుకిందో చూసుకోవచ్చు. ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. ప్రార్థానానంతర ఉపన్యాసాలు ఉంటాయి కదా, అవి చాలా సమయం తీసుకుంటాయి. అప్పటికీ ఎండ చురుకెక్కుతుంది. ఉదయం ఏమీ తినకుండానే వస్తాము కదా, పిల్లలు బెట్ట పోతారని మా చిన్నాయన దిగులు. అందుకే మంచి చెట్టుకింద జాగాలో మా దుప్పట్లు పరుచుకుంటాం. కాసేపటి తరువాత నమాజు మొదలవుతుంది. కుడివాడు కుడికి తల తిప్పితే కుడికి, ఎడమవాడు ఎడమకు తిప్పితే ఎడమ. ఎదుటివాడు ముందుకు వంగితే మనమూ వంగడమే తప్పా దేనినీ శాస్త్రోక్తంగా నేర్చుకున్నది లేదు. చిన్నపుడు పర్లేదు కానీ కాస్త పెద్దయ్యాక మనం చేసేది దొంగ నమాజు. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ? అందుకని ఆ దొంగ పని ఎందుకని అదీనూ మానేశా. (ఆ తరువాత్తరువాత ఈద్గాలో సామూహిక ప్రార్థన వదిలేసి మునిసిపల్ హైస్కూలు గ్రవుండ్‌లో చాచిన చేతులు అల్లా దువా కోసం కాక ఎర్రని కార్కు బంతిని పట్టడం కోసం విచ్చుకునేవి. మధ్యాహ్నం నమాజులు ముగిసే సమయానికి పది ఓవర్ల మ్యాచు ముగిసి రంజాను నమాజు జనాల గుంపు మధ్య కాళ్ళు దూర్చి ఇల్లు చేరుకునేవాడ్ని. మాసిన బట్టలు, చెరిగిన తల, దోక్కుపోయిన మోచేయి అందాక చేసిన ఘనకార్యం చెబుతున్నా నాయనమ్మ, మేనత్తలు, పిన్నులు ఏమీ అనేవారు కాదు. వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.) నమాజు ముగిశాకా ఈద్గా దగ్గరి నుండి ఇంటికి చేరే వరకు దారిన తగిలిన ప్రతి ఒకరిని మా పెద్దవాళ్ళు ఆలింగనాలు చేసుకుంటూ వచ్చేవారు. ఏమిటీ నడిరోడ్డు మీద కావిలింతల ఆలస్యం అని విసుక్కుంటూ పిల్లలం మేము మాత్రం గబగబా పరిగెత్తుకు ఇంటికి వెళిపోయేవాళ్లం. వచ్చాం కదాని సరాసరి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. గుమ్మం దగ్గర మా పిన్నిగార్లల్లో ఎవరో ఒకరు పళ్ళెంలో ఎర్ర నీళ్ళు పట్టుకు నిలబడితే అందులో అయిదు పైసాలో, పది పపైసాలో బిళ్ళ పడేసేవాళ్లం. పిలల్ల తల చుట్టూ ఆ పళ్ళెం తిప్పి దిష్టి తీసేసేవారు. అప్పుడు కాళ్ళు మొహం శుభ్రంగా కడుక్కుని ఇంటి లోపలికి వస్తే చక్కగా కూచోబెట్టి నోటి నిండా తీపిగ సేమియా పాయసం తినపెట్టేవారు. ఈ హైద్రాబాద్ మహానగరానికి వచ్చాకా పత్రికల భాషలాగా పండగ వంటకాలు కూడా మారిపొయినై! క్యా భాయ్! షీర్ కూర్మా నహీ హైక్యా? హలీం నహి ఖిలాతే? ఇఫ్తార్ విందు ఎప్పుడు ఇస్తాయి హై? వంటి విపరీత ఓవరాక్షన్ మాటలు వినపడేవి. అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా! ప్రాంతం ప్రాంతంకి కల్చర్, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు మారిపోతాయిరా స్వామి. మాకసలు పత్రికా పదకోశ పాకముల వంటి బిరియాని, మిర్చ్ కా సాలన్, షీర్ ఖూర్మా, హలీం, హరీస్ లేనే లేవు. మాదంతా నంద్యాల జిల్లా, నూనెపల్లె ఆత్మకింపుగా వండబడిన సేమియా పాయసం, డబల్ కా మీఠా, బగరా ఖానా, దాల్చా, భాజి బోటి, పెరుగు పచ్చడి. అంతే! చాలు! ఇదే మా పండగల జీవితాదర్శం. ఆ విధంగా పండగ పాయసం మీద వేసిన మేవా మెక్కేసి పాయసం లోపల ఉన్న కిస్మిస్, గోడంబి పలుకులు తినేసి, మెత్తని పాయసం తీగల్ని జుర్రేసేలోగా మా చిన్నాయనలు, మా మేనత్తల భర్తలు వచ్చేసేవాళ్ళు. ఇంటి లోపల అందరికీ చక్కగా పొడగాటి సిరి చాపలు, బొంతలు పరిస్తే ఇంటిల్లపాది కూచుని హాయిగా అన్నాలు తినేవాళ్లం. నాకైతే రంజాన్ నాడు వండే పలావు కన్నా మహత్తరమయిన రుచిగల మరో పండగ పలావు ఉండేది. అది పెద్దలపండగ అని వస్తుంది ఆ రోజున వండే పలావుకు రుచే ప్రత్యేకం. అది ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. సాయంత్రం కాగానే మౌలానాగారు వచ్చి ఫాతెహ్ జరిపిన తరువాత ఇంట్లో ఉన్న చిన్నా పెద్దా అందరూ శుభ్రంగా స్నానాలు కానించి, ఈ కొత్త బట్టలు, నైవేద్యాలు దేవుని గూడు ముందు పెడతాం కదా అక్కడకు చేరి, ఆడవాళ్ళు అయితే నెత్తిన కొంగు కప్పుకుంటారు, పిల్లల నెత్తి మీద ఒక టవల్ వేసి, ఉత్త మోకాళ్ళు కనపడకుండా ప్యాంటో, తువ్వాలో, లుంగీనో కట్టపెట్టి, ఇంట్లో చనిపోయిన వారి పేరుపేరిట జేజినాయనకని, అమ్మకని, చిన్నమ్మకని, చిన్న చిన్నాయనకని వారిని తలుచుకుంటూ నిప్పుల్లో సాంబ్రాణి ధూపం వేయిస్తారు. నేను ఈ హైద్రాబాదు నగరానికి వలస వచ్చిన తరువాత కూడా గత రెండు సంవత్సరాల క్రితం వరకు మా మేనత్త మాబున్ని అమ్మ ప్రతి సంవత్సరం మాకు పెద్దల పండగ రాబోతుందని గుర్తు చేసేది. మా ఆవిడ లావణ్య ఇంట్లో పెద్దలకని బట్టలు కొని తెచ్చేది. సాయంకాలం కమ్మగా ఇంత పలావు, మాంసం కూర, పాయసం వండి పెడితే – మాకు ఆ కల్మాలు, సూరాలు తెలీవుగా! అయినా బుర్ర తక్కువయినా, మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం. మా మేనత్త ఆ మధ్యే పోయారు. ఆవిడతో పాటే ఈ పండగల మంచీ చెడూనూ. సంవత్సరం సంవత్సరం మాతో ఈ పనులు చేయించిన మా మేనత్తకే మా సాంబ్రాణి తాకే ప్రాప్తం లేకపోవడం పెద్ద దుఃఖం. పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. ఇట్లాంటి మాటలు అన్నీ భలే ఉండేవి. అదే చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. ఆ మాటను ఇప్పటికీ అలాగే పుచ్చేసుకున్నా. ఈ రోజుకు మా ఇంటి బాల్కనీలో మొక్కల మీదికి ఒక కందిరీగ వస్తుంది, దానికేసి అలానే గమ్మున చూస్తాను. మా పిల్లవాడు వచ్చి అరే! జేజినాయన వచ్చినాడే! అంటాడు. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది. మీరూ ఎప్పుడయినా వాడి చూడవచ్చు. పెద్దల పండగనాడు మూసిన తలుపుల వెనుక మూయని పళ్ళాల మీది పలావు అన్నం, కూర గిన్నె, దాల్చా పాత్రల్లోకి ఇల్లంతా నిండిన సాంబ్రాణి పొగ కాస్త తగిలి కాస్త, కాస్త ములిగి, కాస్త అల్లుకుని ఆ పదార్థాలన్నీ రుచి అవుతాయి చూడండి, అబ్బా అంత రుచయిన తిండి నా వరకు మళ్ళీ ఏ పండగలోనూ తగలదు! అందుకని నాకు రంజాను అంటే తిండి కన్నా పెద్దలామాశ పండగ తిండే గొప్ప. చిన్నతనాన పిల్లల ప్రాణానికి రంజాను అంటే తిండి పండగ కాదు. ఈనాము డబ్బుల పండగ. మాది అప్పట్లో ఉమ్మడి కుటుంబం. మా జేజెమ్మా-జేజినాయనల మగ సంతానం అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో ఉండేవారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయి బయటికి కాపురానికి వెడతారు కదా. నమాజు ముగిశాకా మా మేనత్తలు, మామలు, వాళ్ల పిల్లలూ అందరూ మా ఇంటి దగ్గరికే వచ్చేవారు. పెద్దవాళ్ళు ఈద్ ముబారక్ ఆలింగనాలూ చేసుకుంటే మా వంటి పిల్లలం వంగి పెద్దల కాళ్లకు దండాలు పెట్టుకుని, లేచి ఈనాము డబ్బులు అడిగేవాళ్ళం. ఈనాము కదా డబ్బులు అంటే, సంపద అంటే, ఆస్తి అంటే. వసూలయిన డబ్బుని వచ్చింది వచ్చినట్లుగా ప్రతిసారీ గలగలమని లెక్కలు పెట్టుకుంటుంటే ఎంత బావుండేది! అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది. రావాలసిన వాళ్ళు అంతా వచ్చేశారు, ఇవ్వవలసినది ఇచ్చేశారు, ఇక రాలేదేం లేదు అనుకున్నాకా అన్నాదమ్ములం, బావా మరుదులం అంతా సినిమాకని టవున్ దారి పట్టేవాళ్లం. మొదటి ఆట అయిపోయేసరికి రంజాను పండగ ముగిసేది. వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు. అన్నిటికీ తొందరే! ఎప్పుడెప్పుడు సాయంత్రమవుతుందని ఉదయం, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందాని సొమవారం, ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దయిపోయి జిప్పున్న ప్యాంట్ తొడుక్కుంటామని త్వరపడిపోయి బాల్యాన్ని విడిచేశాం. మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు. ఇపుడు పెరిగి పెద్దయ్యినాకా ఆఫీసు నుండి ఉదయపు వయసు అలసటతో ఇంటికి వచ్చి సాయంకాలం దీపం వంక చూస్తే దీప జ్యోతిః పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దనః దీపో హారతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే. అని మనసుకు శాంతి అనిపిస్తే జనార్దనుడో, జీససుడో, అల్లా మాలికుడో ఎవరో ఒకరు మనకు ఆయన లేడు అని మనమనుకున్నా మీరంతా నాకు ఉన్నార్రా పిల్లలూ అని దేవుడు దీపంలా తలాడించినట్లు ఉంటుంది. దీపం దేవుడు రంజాను రోజున ఆకాశమెక్కుతుంది. నెలవంకగా మారుతుంది. నా బాల్యంలో ఆకాశంలో కనబడిన రంజాన్ నెలవంకను చూసి వెంటనే కళ్ళు మూసుకుని గోడలు తడుముకుంటూ గొంతెత్తి నా పేరు పిలుస్తూ నా కోసం వచ్చేది మా జేజి. తన చేతుల్లోకి నా మొహన్ని తీసుకుని అప్పుడు కళ్ళు తెరిచి నన్ను చూసేది. నెలవంక తరువాత నా గుండ్రని మొహం. అంతే! నా తరువాతే పండగ. చందమామను, ప్రేమని, పండగని ఎలా అహ్వానించాలో నేర్పిన మొదటి మనిషి మా జేజి, ఆ పై మా మేనత్తలు, పిన్నిగార్లు. ఇప్పుడు పండగ సంవత్సరానికి ఫలానా రోజు వచ్చే ఒక తారీఖు మాత్రమే. ఆ మనుషులూ వాళ్ళ జ్ణాపకాలు, ఆ గోరింట పండే రాత్రుళ్ళు, తెల్లని అరచేతిలో ఉదయించిన ఎర్రని సూరీడు, నెలవంక, నక్షత్రాలు ఆరిపోయాయి. ఇప్పుడు మావాళ్ళు వారు లేని ఊరు జీవితంలోకి ఏ కొత్త చందురుడు వెలగలేడని అర్థం అయ్యింది. జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది. అన్వర్, ఆర్టిస్టు, సాక్షి దినపత్రిక -
తిరిగొస్తున్న ఆది సింహాద్రి..
-
ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!
ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం పర్యటన ముగిసే సమయానికి తిరు ఎస్ మణికందన్ అనే దివ్యాంగుడిని కలిశారు. అతనితో సమావేశమై ప్రత్యేక సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను 'ప్రత్యేక సెల్ఫీ' పేరుతో మోదీ ట్విట్టర్లో షేర్ చేస్తూ అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అతను సొంతంగా దుకాణాన్ని నడపడమే గాక తన రోజువారి లాభాలలో గణనీయమైన భాగాన్ని బీజేపీకి ఇస్తాడని చెప్పారు. "ఆయన నేను ప్రారంభించిన రోడ్‌కు బూత్ ప్రెసిడెంట్‌గా, కార్యకర్తగా పనిచేయడం మాకెంతో గర్వకారణం. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో నేను కార్యకర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అతని జీవితం స్ఫూర్తిదాయకం, అలాగే మా పార్టీ సిద్ధాంతాల పట్ల అతను కనబర్చిన నిబద్ధత కూడా ఆదర్శవంతంగా ఉంది . అతని భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మోదీ చెన్నైలో రూ. 5వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది ప్రభుత్వ పని సంస్కృతి, దార్శినికతల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు మోదీ. తమ ప్రభుత్వ డెడ్‌లైన్ కంటే ముందే ఫలితాలను సాధిస్తుందన్నారు. తమ ప్రభుత్వం విజయాలను అందుకోవడంలో పని సంస్కృతి, విజన్ అనే రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అంటే ఆలస్యం కానీ ఇప్పుడూ ఆ అర్థం డెలిరీ(తగిన సమయానికి అందించడం). తాము పన్ను చెల్లించే చెల్లింపుదారుల ప్రతి రూపాయికి తాము జవాబుదారిగా పనిచేస్తున్నాం. తాము నిర్థిష్ట గడువులతో పని చేస్తాం, వాటికంటే ముందే ఫలితాలను సాధిస్తాం అని మోదీ ఒక బహిరంగ సభలో అన్నారు. (చదవండి: సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి) -
ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ
చినుకులా మొదలై..సునామీలా చుట్టేస్తున్న ‘చిను కలా’ స్టోరీ వింటే..ఎక్కు తొలి మెట్టు.. కొండని కొట్టు ఢీకొట్టు. గట్టిగా పట్టే నువు పట్టు...గమ్యం చేరేట్టు అన్న సినీ కవి మాటలు గుర్తు రాకమానవు. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే. ఆ కష్టాలు, కడగండ్లే సరికొత్త భవిష్యత్తుకు పునాది. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్‌తో ఒక లగ్జరీ బ్రాండ్‌తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. ప్రసిద్ధ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ యాక్సెసరీస్ డైరెక్టర్ చిను కలా సక్సెస్ స్టోరీ: 1981 అక్టోబర్ 10న రాజస్తాన్‌లో పుట్టిన చిను స్కూల్లో చదువుకుంటున్నపుడే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోంచి పారిపోయింది. ముంబైలోని సెయింట్ అలోసియస్ 10వ తరగతి చదువుతున్నపుడే.. దాదాపు 15 ఏళ్లకే పొట్టకూటికోసం రోడ్డుమీద పడింది. ఇంటి గడపదాటే నాటికి ఆమె వద్ద కేవలం రూ. 300, ఒక బట్టల బ్యాగ్ మాత్రమే ఉన్నాయి. (నిజానికి 13 ఏళ్ల వయస్సప్పుడే తండ్రి ఇంట్లోంచి పొమ్మంటూ అవమానించాడట) ఏం చేయాలో అర్థం కాక ముంబైలోని రైల్వే స్టేషన్లో రెండు రోజులు పడుకుంది. ఒక మూల కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ కంటికి ధారలా ఏడ్చింది. డోర్-టు-డోర్ సేల్ గురించి ఒక మహిళ ద్వారా తెలుసుకుని చివరికి సేల్స్‌గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. (ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్) ముంబై లాంటి మహానగరంలో ఒంటరిగా, అదీ సేల్స్ గర్ల్‌గా ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టు తిరుగుతూ అనేక అవమానాలను ఎదుర్కొంది. అందరూ ఈమె ముఖం మీదే తలుపులు వేసేవారు. వంద ఇళ్లు తిరిగితే ఒకటో రెంటో అమ్మ గలిగేది. దీనికి తోడు అక్కడ పనిచేసేవాళ్లందరికీ ఒకటే హాలు, వంటగదీ లేదు. వాష్ రూం అంతకన్నా లేదు. దుర్భర జీవితం. అయినా ఓడిపోలేదు. ఆరు-ఏడు నెలల తర్వాత లీడర్‌గా మారింది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకే కదిలింది. అలుపెరుగని జీవన పోరాటంలో పట్టు వదలక ఒక్కో మెట్టు ఎక్కుతూ రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీ రూబన్స్ యాక్సెసరీస్ యజమానిగా అవతరించింది. అంతేనా స్నేహితుల ప్రోత్సాహంతో 2007లో, గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా అందాల పోటీలకు ఎంపికైంది. అలా ఫ్యాషన్ ,ఆభరణాల ప్రపంచానికి పరిచయం అయింది. మోడల్‌గా రాణించింది. ఈ ప్రయాణంలో వెయిట్రెస్‌గా పనిచేయడంతోపాటు ఎన్నో రకాల పనులు చేసింది. అలా ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలీమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం రావడం ఆమె జీవితంలో ఒక పెద్ద బ్రేక్ , అక్కడే ఎంబీఏ గ్రాడ్యుయేట్ అమిత్ కలాతో పరిచయం ప్రేమగా కారింది. 2004లో అమిత్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టింది. చిను కలలకు రెక్కలిచ్చిన భర్త భర్తగా,వ్యాపారవేత్తగా అమిత్ చినుకి కొండంతగా అండగా నిలిచాడు. నైపుణ్యాలను మెరుగుపరిచాడు. వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలకు రెక్కలిచ్చాడు. ఫలితంగా 2008లో కార్పోరేట్ మర్చండైజింగ్‌లో నైపుణ్య కంపెనీ ఫాంటే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎదురైన ప్రతి సవాల్‌ను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చిన చిను కలా 2014లో బెంగళూరు మాల్లోని చిన్న కియోస్క్ నుండి రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది. 2021 నాటికి తన బ్రాండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లి పలువురి ప్రశంసలు అందుకుంది. తనలాంటి చాలామంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇపుటు కోట్ల టర్నోవర్‌తో సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్‌గా రాణిస్తోంది. భర్త, కుమార్తతో కలిసి బెంగళూరు, ఫీనిక్స్ మాల్ సమీపంలోని 5వేల చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న చిను గరాజ్లో ఖరీదైన బీఎండబ్ల్యూ-5 కారు కొలువు దీరడంలో ఆశ్చర్యం ఏముంది? పోటీని ఎదుర్కోవాలంటే..రెండడుగులు ముందుండాలి! పోటీని ఓడించాలంటే.. ప్రత్యర్థులకంటే రెండు అడుగులు ముందుండటమే ఏకైక మార్గం అంటారు చిను. అందమైన డిజైన్లుతో ఏడాదికి కనీసం 10-12 కలెక్షన్లను తీసుకొస్తూ రూబన్స్ యాక్సెసరీస్ పాపులర్ అయిందని, మార్కెట్లో భారతీయ ,పాశ్చాత్య డిజైన్లను కలిగి ఉన్న ఏకైక బ్రాండ్ మాదే అంటారామె. ఇటీవీల షార్క్ ట్యాంక్ ఇండియా 2 తాజా ఎపిసోడ్లో, చిను కలా , అమిత్ కలా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ప్రయాణం, డిజైనర్ జ్యువెలరీ బ్రాండ్-రూబన్స్ గురించిన విశేషాలు పంచు కోవడం అందిరినీ ఆకర్షించింది. రోజుకు 15 గంటలుకు మించి పనిచేస్తానంటూ చిను. దేశీయ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్ వాటాలో(రూ. 21000 కోట్లు అంచనా) భవిష్యత్తులో 25 శాతం వాటాను సాధించాలనేదే చిను లక్క్ష్యం. -
valentine's day2023 రొటీన్‌గా టెడ్డీ, రోజ్ కాదు,వెరైటీగా ఇవి ఇస్తే..ఆ థ్రిల్లే వేరు!
సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు సిద్ధమవుతాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా వెరైటీ గిఫ్ట్‌లు, ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు ఇతర ట్రెండీ బహుమతులపై తగ్గింపు ధరతో ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటాయి. మరోవైపు వాలెంటైన్స్ డే చరిత్ర, అర్థం, పరమార్థం, ఈ ఒక్క రోజు ప్రేమ ఉంటే చాలా ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా...రోజుకో డే చొప్పున వారం రోజులు పాటు గిఫ్ట్‌లు, చాక్లెట్లు, టెడ్డీ బేర్స్ , గులాబీలతో పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా తన స్వీటీకి సంతోషం పెట్టేందుకు వాలెంటైన్ తెగ ఆరాటపడతారు. తన కలలరాణికి, లేదా తన రాకుమారుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనేది ఒక సవాలే. ఏ గిఫ్ట్ అయితే తమ డార్లింగ్ ఫిదా అయి పోతుందా అని ఇంటర్నెట్లో, ఆన్లైన్ సైట్లలో తెగ సెర్చ్ చేస్తారు. ఈ నేపథ్యంలో గులాబీలు, టెడ్డీ బేర్లు, చాక్లెట్ల కంటే ఎక్కువ కిక్ ఇచ్చే, మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిల్చే. గిఫ్ట్స్ ఏంటో కొన్ని చూద్దాం. ప్రేమికుల మధ్య ప్రధానంగా ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఎలాంటి అరమరికలు, దాపరికాలు లేకుండా.. మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని మంచిన స్వీట్ మెమొరీ. అంతకుమించిన గొప్ప అనుభూతి ఏముంటుంది. రోజూ వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్లోమాట్లాడుకుంటూనే ఉంటాంగా అనుకోకుండా....స్పెషల్‌గా మాట్లాడుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు సర్ప్రైజ్లకి ఎక్కువ థ్రిల్ అవుతారట. సో.. వాలెంటైన్స్ డే, ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి! మన మనసుకు నచ్చిన నేస్తంతో ఒక రోజు గడపడం, మాట్లాడటం, జోకులు వేసుకోవడం,ఇష్టమైన సినిమా చూడటం, షిట్స్ క్రీక్ (లేదా ఇతర కంఫర్ట్ షోలు) చూడటం, లాంగ్ డ్రైవ్, ఇష్టమైన ఫుడ్, డిన్నర్ డేట్ ఇవన్నీ సంతోషానిచ్చేవే. వీటన్నింటికి మంచి ఒక బిగ్ హగ్, లవ్లీ కిస్ .. ఆ కళ్లలో వెలిగే స్పార్క్.. ఇవన్నీ.. ఫర్ పఫర్ ఎవర్ గుర్తుండిపోయే స్వీట్ నథింగ్స్.. ఇది స్వయంగా లవ్ బర్డ్స్ చెబుతున్న మాట. మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి బుక్స్ చదవడం హాబీ అయితే,అందులోనూ మంచి రచయిత అయితే.. ఒక మంచి పుస్తకాన్న బహమతిగా ఇవ్వండి. వారికి టెడ్డీ బేర్, ఫ్లవర్ బొకే కంటే కూడా పుస్తకం ఇస్తే వచ్చే ఆనందానికి అవధులు ఉంవడట. అదీ సర్ ప్రైజింగ్‌గా ప్రియ నేస్తం ఇంటికి డెలివరీ చేస్తే ఇంకా మంచిది. మధురమైన చాక్లెట్పాటు, మసాజ్ సెషన్ గిఫ్ట్ ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్, చాక్లెట్లు మన శరీరంలో సంతోషకరమైన డోపమైన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ సెరోటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తే, మసాజ్ మనస్సును రిలాక్స్ అయ్యేలా చేసిన కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అందుకే అర్బన్ కంపెనీ లేదా ఇంట్లో సెలూన్ సర్వీస్‌ను అందించే ఇతర సంస్థల ద్వారా మంచి మసాజ్ సెషన్‌ను బుక్ చేస్తున్నారట. సాధారణంగా ఇచ్చే గిఫ్ట్స్ కేక్ గులాబీలు హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ స్పెషల్‌గా డిజైన్ చేససిన కాఫీ కప్స్ స్వీట్లు చాక్లెట్లు టెడ్డీ బేర్స్ హార్ట్ షేప్ కుషన్లు సీసాలో ప్రేమ లేఖలు షాపింగ్ కూపన్లు ఫస్ట్ డేటింగ్ డేట్‌ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్ మాంచి రొమాంటిక్ సాంగ్స్, మ్యూజిక్‌తో స్లైడ్‌షో డేట్ నైట్ ఐడియా కార్డ్‌లు రొమాంటిక్ షోపీస్ గిఫ్ట్ బాక్స్‌లు/గిఫ్ట్ హాంపర్లు క్యూట్ అండ్ రొమాంటిక్ ల్యాంప్స్ బంగారు, డైమండ్ నగలు స్మార్ట్ ఫోన్లు, వాచెస్, ఇతర గాడ్జెస్ట్స్ -
Special Marriage : బ్యాండ్ బాజాలతో ఘనంగా చిలుక పెళ్లి!
పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక గొప్ప వేడుక. పెద్దలు ఈ వేడుకను గొప్ప పవిత్ర కార్యంగా నిర్వహిస్తారు. అలాంటి సంప్రదాయరీతిలో ఇక్కడొక ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్‌లోని కరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఉండే రామ్‌స్వరూప్ పరిహర్ మైనా అనే పక్షిని కన్న కూతురి మాదిరిగా చూసుకుంటున్నాడు. అలాగే బాదల్ లాల్ విశ్వకర్మ చిలుకను కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ తమ పక్షులకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు తమ పక్షులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో జాతకాలు చూసి మరీ భాజ భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పక్షులను రెండింటిని చిన్న కారులో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పెళ్లి అంతటిని రామస్వరూప్ తన ఇంటిలో ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్లికి బాదల్ తరుఫున అతని గ్రామం నుంచి విజయ పటేల్, ఆదిత్య పటేల్, పితమ్ పటేట్, దేవి సింగ్ పటేల్, ఆశోక్ పటేల్, రాజు పటేల్, పురుషోత్తం శివన్య, సునీల్ పటేల్, విమేలేష్ పటేల తదితరులంతా హాజరయ్యారు. ఈ వింత పెళ్లిలో బరాత్ కూడా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు ఈ పెళ్లి గురించే కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. (చదవండి: 17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..) -
స్పెషల్ బ్లూ జాకెట్లో ప్రధాని మోదీ!
అందరి దృష్టిని ఆకర్షించేలా స్పెషల్ బ్లూ జాకెట్‌ని ధరించి పార్లమెంట్‌కి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ ధరించిన జాకెట్‌ని రీసైకిల్ చేసిన పీఈటీ బాటిళ్లతో తయారుచేసింది. బెంగళూరులో సోమవారం జరిగి ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధాని మోదీకి ఈ స్పెషల్ జాకెట్‌ని బహుకరించింది. ఈ ఎనర్జీ వీక్ అనేది శక్తి పరివర్తన హౌస్‌గా ఎదుగుతున్న భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించేందకు ఉద్దేశించింది. ఈ మేరకు మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నందున బుధవారం పార్లమెంట్లో ఆయన ఈ జాకెట్లో కనిపించారు. కాగా ఇండియా ఆయిల్ ఉద్యోగులు సాయుధ దళాల కోసం ఇలాంటి దుస్తులను తయారు చేసేలా దాదాపు 10 కోట్ల పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేయనున్నారు. అదీగాక ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 19 వేల కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని ప్రారంభించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా, కార్బన్ తీవ్రతను కూడా తగ్గించే దిశగా ఈ మిషన్‌ని ఏర్పాటు చేసింది. అలాగే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ. 35 వేల కోట్లను అందించారు. అంతేగాదు ఆ బడ్జెట్లో దాదాపు ఏడు ప్రాధాన్యతల్లో హరిత వృద్ధికి స్థానం కల్పించారు కూడా. (చదవండి: సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో..ఇద్దరు మృతి) -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గూడ్ న్యూస్.. భారీ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆ మేరకు ఆన్లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. చదవండి: తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు "రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలి. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యం. ముందస్తు రిజర్వేషన్ విధానానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రయాణీకులకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వారు కోరారు. -
రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే
బడ్జెట్‌ను చూడకుండా దాని గురించి మాట్లాడటం తగదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ తరుఫున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని , అందులో నిపుణులైన పార్టీ నేతలే దీని గురించి ముందుగా మట్లాడతారని ఆ తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు. మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో అంతగా చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమి లేదన్నారు ఖర్గే. ఇదిలా ఉండగా, కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు సీతారామన్‌ని రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ఖర్గే కలిశారు. కేంద్ర బడ్జెట్ 2023-24 సమర్పణ పార్లమెంటులో సీతారామన్ ప్రసంగంతో ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌ను అమృత్ కాల్లో మొదటి బడ్జెట్‌గా పేర్కొన్నారు నిర్మలమ్మ. ఈ అమృత్కాల్ బడ్జెట్లో సంపన్నమైన సమ్మిళిత భారతేదేశాన్ని ఊహించాం అన్నారు. సవాళ్ల సమయం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోంది. ఈ మేరకు సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేకి సంబంధించిన ముఖ్యాంశాలు, గణాంక అనుబంధం తోపాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మొదటి రోజైన మంగళవారం ప్రవేశ పెట్టారు. కాగా, ఖర్గే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలను బడ్జెట్ సెషన్లో లేవనెత్తుతామని చెప్పారు. అలాగే కొంతమంది పెట్టుబడిదారులకు ప్రభుత్వ బ్యాంకులు బారీ మొత్తంలో రుణాలు ఇస్తున్న విషయాన్ని కూడా పార్టీ ప్రస్తావిస్తుందని చెప్పారు మల్లికార్జున ఖర్గే. (చదవండి: బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...) -
దటీజ్ సీఎం.. మరోమారు మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ
17 రోజులలో 56 మ్యాచ్‌లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్ గెలవలేని ఖతర్ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్లో హైలైట్‌గా నిలిచాయి. నాకౌట్ పోరులో రెండు మ్యాచ్‌లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్ కీపర్ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే... ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్‌తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్ అల్వారెజ్ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జోరు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్ రూపంలో మరో స్టార్ ఉదయించాడు. టీమ్ తరఫున మూడు గోల్స్ చేసిన రిచర్ల్సన్... రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తమకు ‘9వ నంబర్ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్ అభిమానులు చెబుతున్నారు. యువ ఆటగాళ్ల జోరు... గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్‌లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ డిఫెండర్’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్ క్లబ్‌లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్ కీపర్ డొమినిక్ లివకోవిక్ కూడా పెనాల్టీ సేవింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్‌తో మ్యాచ్‌లో ఇది కనిపించింది. కైల్ ఎంబాపె ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్ సాధించిన అతను 2 గోల్స్‌లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్ ఆటగాడు. మొరాకో మెరుపులు... ప్రపంచకప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తోనే టీమ్ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్ ఇచ్చింది. అదీ సెల్ఫ్ గోల్ మాత్రమే! 2018లో అత్యధిక గోల్స్ చేసిన బెల్జియం, రన్నరప్ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్‌లో 2010 చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్ స్కోర్ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్ కప్‌లో ఒక్క హ్యారీ కేన్ మాత్రమే 6 గోల్స్ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది. పోర్చుగల్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్ మ్యాన్ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్‌పై 6–1తో విజయం వరల్డ్‌కప్ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్ రూపంలో కొత్త స్టార్ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో చేసిన హ్యాట్రిక్‌తో అతను క్లబ్ ఫుట్‌బాల్‌లో ఒక్కసారిగా హాట్ స్టార్‌గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్ టైటిల్ ఆశలు పెంచారు. - సాక్షి క్రీడా విభాగం ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్ ఈ సారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. క్వార్టర్స్ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌లలో కూడా బ్రెజిల్ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్ టిటె నాయకత్వంలో అటాకింగ్నే నమ్ముకొని బ్రెజిల్ ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్ ప్లేయర్ నెమార్, అలెక్ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్‌కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్‌లో ఉన్న బ్రెజిల్‌ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్తో పాటు బ్రొజోవిక్ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది. మరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్ కప్ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది. వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్‌లో డచ్ బృందం 19 మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్ డంఫ్రైస్ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్ 1 గెలిచాయి. మరో మ్యాచ్ డ్రా అయింది. -
Narasaraopeta: చిన్నతురకపాలెం ప్రత్యేకత ఏంటో తెలుసా?
సాక్షి, నరసరావుపేట: పూర్వీకుల ఊరి పేరు అడిగితే ఎవరైనా చెప్పడానికి కాస్త తడుముకుంటారు. కానీ ఆ గ్రామంలో ఇంటి పేరు ముందు ఊరిపేరు పెట్టుకుంటారు. పూర్వీకులను నిత్యం తలచుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని చినతురకపాలెం ప్రత్యేకత ఇది. ఎందుకలా.. ఏమా కథా.. కమామిషు.. అంటే.. వందల ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారంతా కలసి ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చినతురకపాలెం అని పేరు పెట్టుకున్నారు. అందరూ ముస్లింలే. రోజులు గడిచేకొద్దీ పేర్లన్నీ ఒకేలా ఉండడంతో పిలవడంలో గందరగోళం తలెత్తింది. దీంతో ఇంటిపేరు ముందు గానీ, తర్వాత గానీ ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఊరిపేరు చేర్చడం అలవాటు చేశారు అప్పటి పెద్దలు.. ఉదాహరణకు షేక్ సలాముద్దీన్ అనే వ్యక్తి మధిర నుంచి వచ్చినవాడనుకోండి. షేక్ ముందో తర్వాతో మధిర పేరును కలిపారు. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 750 కుటుంబాలు ఉండగా, 550కుపైగా కుటుంబాలు తమ ఇంటిపేరు ముందో తర్వాతో పూర్వీకుల ఊరిపేరు చేర్చుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డుల్లోనూ ఇవే పేర్లను నమోదు చేయిస్తుండడం విశేషం. ఇప్పుడు పుట్టే బిడ్డలకూ ఈ సంప్రదాయం కొనసాగిస్తుండడం గమనార్హం. ఇరవై ఊళ్ల నుంచి వలసలు ఈ గ్రామంలో పొదిలి, చావపాటి, పెట్లూరివారిపాలెం, కూరపాడు, ముప్పాళ్ళ, అనంతవరప్పాడు, గురిజేపల్లి, మధిర, చిరుమామిళ్ళ, తూబాడు వంటి అనేక గ్రామాల నుంచి వలసలు వచ్చిన వారు ఉన్నారు. ఇలా ఇక్కడ ఇరవై ఊళ్ల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. (క్లిక్: జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!) ఆనవాయితీగా వస్తోంది మా పేర్లకు ముందు ఇంటి పేరుతోపాటు పూర్వీకుల గ్రామం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మేమూ కొనసాగిస్తున్నాం. మాకు పుట్టే బిడ్డలకూ అన్ని గుర్తింపు కార్డుల్లోనూ ఇదే తరహాలో నమోదు చేయిస్తున్నాం. – షేక్ పొదిలే ఖాజా మొహిద్దీన్, చిన్న తురకపాలెం గ్రామస్తుడు సౌలభ్యం కోసం... ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండడంతో ఊరుపేర్లతో పిలవడం మొదలెట్టారు. మేమంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారం కావడంతో ఖాజా, సైదా, మస్తాన్‌వలి వంటి పేర్లు ఎక్కువగా పెడుతుంటాం. అందుకే ఇంటి పేరు ముందు పూర్వీకుల ఊరి పేరు పెట్టి పిలవడం మొదలెట్టారు. అదే కొనసాగుతోంది. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా మాకు మాత్రం సౌలభ్యంగా ఉంది. – పెట్లూరివారిపాలెం మహబూబ్ సుభానీ, చిన్నతురకపాలెం గ్రామస్తుడు -
పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వృద్ధుల కోసం అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన ఎవరైనా కానీ 600 రోజుల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.85 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక వృద్ధులు కాకుండా ఇతరులకు 600 రోజుల డిపాజిట్‌పై (ఎప్పుడైనా ఉపసంహరించుకోతగిన) 7 శాతం వడ్డీ రేటు, కాలవ్యవధి వరకు ఉపసంహరణకు వీల్లేని 600 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం వడ్డీని ఇస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది. -
ఒకవైపు విలనిజం మరోవైపు హాస్యం
-
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రులతో కలిసి పిల్లలు క్యాట్ వాక్
-
నయా ట్రెండ్.. తందూరీ ఛాయ్.. భలే టేస్టీ గురూ
టీ.. దీనికి అభిమానులు కోట్లలో ఉన్నారు. పనిఒత్తిడి నుంచి స్వాంతన కోసం టీ తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్ ఔషధం. బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, మిరియాల టీ ఇలా టెస్ట్ చేసి ఉంటారు. మార్కెట్లోకి కొత్త రకం చాయ్ వచ్చింది. అదే తందూరీ టీ.. నెల్లూరులో దీనికి అభిమానులు పెరుగుతున్నారు. నెల్లూరు(మినీబైపాస్): టీ.. ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్‌ల్లో కూర్చొని సరదాగా గడిపేందుకు.. పనిఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. తలనొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామందికి టీ కావాలి. టీ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది. అదే తందూరీ టీ.. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ చాయ్ రుచిని ఇప్పుడు నెల్లూరులో కూడా చూడొచ్చు. నగరంలోని కొందరు వ్యాపారులు టీ అభిమానుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. దీని ఎక్కువేమి కాదు. ధర రూ.20 మాత్రమే.. ఏంటిదీ.. తందూరీ అనే పదం మాంస ప్రియులకు బాగా పరిచయం ఉంటుంది. హోటళ్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి తందూరీగా కస్టమర్లకు అందిస్తారు. ఈ చాయ్‌ని కూడా నిప్పులపైనే చేస్తారు కాబట్టి తందూరీ టీగా పేరొచ్చింది. ఎలా చేస్తారంటే.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమిలా ఏర్పాటు చేస్తారు. ఇందులో బొగ్గులు వేసి మండించి బట్టీల్లో ఇటుకల్లా కాలుస్తారు. పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి టీ తయారు చేసి దానిని జార్లో పోసి కొలిమి వద్దకు తీసుకొస్తారు. కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఇత్తడి పాత్రలో ఉంచుతారు. అందులో చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టి పాత్ర వేడికి పొగలు చిమ్ముతూ నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరీ రుచి.. వాసన వస్తుంది. రుచి.. అదుర్స్ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే.. మరికొన్నింటిని రుచి కోసమే చేస్తున్నారు. ఈ రెండింటికీ డిమాండ్ అధికంగా ఉంది. టీ లవర్స్‌కు వినూత్న రుచిని అందించేందుకు కొందరు వ్యాపారులు తందూరీ టీ స్టాల్స్‌ను ప్రారంభిస్తున్నారు. -
2007 మక్కా మసీదు పేలుళ్లు.. మాసిపోని మరక
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. అది 2007, మే 18వ తేదీ మధ్యాహ్నం. సుమారు 1.15 గం.ల సమయంలో మక్కా మసీదు వజుఖానా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో ఊహించే లోపే అక్కడంతా అల్లకల్లోలంగా మారింది. ఐఈడీ బాంబు పేలుడుతోనే ఈ ఘోరం సంభవించినట్లు పోలీసులు తర్వాత నిర్ధారించారు. మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. పేలుడు సంభవించిన స్థలానికి సమీపంలోనే.. పేలని మరో ఐఈడీ బాంబ్ ని గుర్తించారు పోలీసులు. అరెస్టుల పర్వం ►జూన్ 2010 లో ఈ కేసులో CBI నిందితుల ఛార్జీషీట్ లో సునీల్ జోషి పేరును చేర్చింది. అయితే డిసెంబర్ 29, 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ జోషి హత్యకు గురయ్యాడు. ► ఆపై నవంబర్ 19, 2010న హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) నిందితుడిగా గుర్తించారు. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ► డిసెంబర్ 18, 2010న మక్కా మసీదు పేలుడు కేసులో అసీమానంద అరెస్ట్ అయ్యాడు. ► 2011 డిసెంబర్ 3 న మక్కా మసీదు పేలుడు కేసులో మరో అరెస్ట్ జరిగింది. జరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్ అయ్యాడు. ► ఏప్రిల్ 2011లో ఈ కేసుని సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ కి బదిలీ చేసింది. ► 2013 మార్చి 2న మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ ని పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ► మార్చి 23, 2017న హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అసీమానందకు బెయిల్ మంజూరు అయ్యింది. ► ఏడేళ్ల తర్వాత అసీమానందకు విముక్తి. మార్చి 31, 2017న అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ► ఏప్రిల్ 16, 2018 న ఈ కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చిన నాంపల్లి కోర్టు. ► నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులపై ఉన్న కేసును కొట్టివేసీన నాంపల్లి కోర్టు. -
అమృత అయ్యర్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
రామయ్య!.. ఆ అవతారంతో పాటే నడిసంద్రంలో మునిగిపోయాడా?
సాక్షి, వెబ్‌డెస్క్: రాముని పాదాల దగ్గర ఆయన పరమ భక్తుడు శ్రీ ఆంజనేయుడు కచ్చితంగా ఉండాల్సిందే!. అలాంటిది ఆ ఆలయంలో మాత్రం ఉండడు!. తెలంగాణ మెదక్ జిల్లా గుమ్మడిదలలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని ‘కళ్యాణ రాముడ’ని పిలుస్తారు. సీతారామకళ్యాణ ఘట్టం సమయానికి.. శ్రీ రామాంజనేయులకు పరిచయం లేదు. కాబట్టే ఇక్కడ మారుతి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాలు చెప్తున్నాయి. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇది. 45 ఏళ్ల కిందట ఆలయాన్ని పునరుద్ధరించారు. సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు- ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తిల విగ్రహాలు గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తుంటాడు. అందుకే ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. -------- ► తమిళనాడులోని అతిపెద్ద రామాలయాల్లో ఒకటి తిరువణ్ణమలై జిల్లాలోని నెడుంగుణమ్ శ్రీ రామ టెంపుల్. ఈ గుడిలో రాములోరి చేతిలో బాణం ఉండదు. గుండెపై కుడి చేయి వేసుకుని యోగముద్రతో శాంతమూర్తిగా కనిపిస్తాడు ఇక్కడ. ప్రశాంతతకు నెలవుగా ఈ ఆలయాన్ని భావిస్తారు భక్తులు. హనుమంతుడి విగ్రహం శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూనే.. స్వామి చెబుతున్నది వింటున్నట్లు కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం విల్లు ధరించి ఉంటాడు. ఇక సీతమ్మ కుడిచేతితో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తున్నట్లు ఉంటుంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ విడిది చేశాడని, శుక మహర్షిని దర్శించుకున్నాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయ రాఘవన్’ అని అంటారు. రాముడు యోగముద్రతో కనిపించే ఆలయాలు ఇంకా ఉన్నప్పటికీ.. వాటిల్లో బాగా పేరున్నది ఇదే. -------- ► సాధారణంగా సీతారాముల విగ్రహంలో సీతమ్మ రాముడికి ఎడమ వైపు ఉంటుంది. కానీ, తిరుపతి కోదండ రామాలయంలో మాత్రం కుడివైపున సీతమ్మ విగ్రహం, ఎడమవైపున లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా ఉండాలట!. ఆ ప్రకారమే ఈ విగ్రహం కుడివైపు ఏర్పాటు చేయించినట్లు పండితులు చెబుతున్నారు. ఇలా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతి సిటీ సెంటర్లో ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని స్థల పురాణం. అంతేకాదు సీతను అన్వేషించే క్రమంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది. -------- ► త్రిప్రాయర్ శ్రీ రామస్వామి టెంపుల్.. కేరళలోని త్రిస్సూర్‌లో తీవ్ర నది ఒడ్డున ఉంది. ఎక్కడా కనిపించనట్లుగా ఆ గుడిలో శ్రీరాముడు.. విష్ణుమూర్తి అవతారంతో కనిపిస్తాడు. ‘త్రిప్రా దేవర్’గా ప్రసిద్ధుడైన ఈ శ్రీరాముడికి నాలుగు భుజాలు ఉంటాయి. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో విల్లు, నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతంగా భావిస్తారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందుకే త్రిమూర్తుల స్వరూపమైన ఆలయంగా త్రిప్రాయర్‌ని భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, అవతారం ముగిశాక ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా సముద్రంలో మునిగిపోయిందనీ స్థల పురాణం చెబుతోంది. సముద్రంలో దొరికిన విగ్రహానికి మత్స్యకారులు ప్రతిష్ఠ జరిపారని చెప్తారు. -------- ఫొటోల్లో తప్పించి శ్రీరామ పట్టాభిషేకం తరహా విగ్రహాలు ఏ ఆలయంలో కనిపించవు.. ఒక్క తమిళనాడులో తప్ప. సేలంకు దగ్గర్లోని అయోధ్యాపట్నంలోని శ్రీ కోదండపాణి రామాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని దర్శనమిస్తాడు. ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా, సైన్యం సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చాడట. అయోధ్య పట్టాభిషేక ముహూర్తం ఆలస్యం అవుతుండడంతో.. ఈ ప్రాంతంలో పట్టాభిషేకం జరిపారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ఊరికి అయోధ్యపట్నం అని పేరొచ్చిందని భావిస్తుంటారు. ::శ్రీరామ నవమి సందర్భంగా.. -
శ్రీకాళహస్తి: శివనామస్మరణతో మార్మోగుతున్న దక్షిణ కైలాసం(ఫోటోలు)
-
22/02/2022: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..
సాక్షి, అనంతపురం: క్యాలెండర్లో 365 రోజులున్నా కొన్ని అరుదైన రోజులు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి అరుదైన రోజు మంగళవారం రానే వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ రోజు తేదీ 22. 2వ నెల. 22వ సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.2.22ని సూచిస్తుంది. వికటకవిలా ఎటు నుంచి చూసినా ఒక్కటిగానే కనిపిస్తోంది కదూ! అందుకే ఈ రోజు ప్రత్యేక జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ తేదీకి సంబంధించిన ఫొటోలు, సినిమా పాటలు.. నెట్టింట వైరల్ అవుతుండడం గమనార్హం. -
Republic Day 2022: జిగేల్ మువ్వన్నెల్!
-
మొత్తం నాలుగు రోజుల సెలవులు! అక్కడి ఉద్యోగులకు సర్కార్ బంపరాఫర్
సాధారణంగా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిందే కదా. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు. ఎందుకో తెలుసా?.. అస్సాం(అసోం) ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మనసారా గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అస్సాం సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం.. కూడా సెలవు దినాలే. అంటే మొత్తం వరుసగా నాలుగు సెలవురోజులు వచ్చాయి. ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం(జనవరి 10వ తేదీ) తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో(ఆ రెండురోజులపాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫొటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం అంతేకాదు ఈ హాలీడేస్ ఫొటోల్ని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవులుగా మారిపోతాయి. అంతేకాదు ప్రత్యేక సెలవుల్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి. To uphold ancient Indian values, I urge Assam Govt employees to spend quality time with their parents/in-laws on Jan 6 & 7, 2022 designated as spl leave. I request them to rededicate themselves to the cause of building a New Assam & New India with blessings of their parents. pic.twitter.com/hZ2iwbgKoB — Himanta Biswa Sarma (@himantabiswa) January 2, 2022 టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా.. అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఉద్యోగులు తమ కుటుంబీకులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చదవండి: టెస్లాలో మనోడు.. తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర -
న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ పిటిషన్లో పేర్కొని ఉంది. ఇతర రాష్ట్రల మాదిరి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా ప్యాండమిక్, ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ విన్నవించారు. పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసుల్ని కట్టడి చేయకుండా.. ఇష్టానుసారంగా టీ సర్కార్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న పిటిషనర్.. తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు నమోదయిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ప్రస్తావించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఉత్తర్వులను వెనక్కి తీసుకుని.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఇక పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. రేపు(గురువారం) విచారిస్తామని పిటిషనర్‌కి తెలిపింది. సంబంధిత వార్త: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్ -
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు, యూత్‌కి ఖుష్ ఖబర్ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరిరోజున మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31న ఈ ప్రత్యేక అనుమతులు వర్తిస్తాయి. మద్యం దుకాణాలకు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. అలాగే బార్స్, ఈవెంట్స్, పబ్‌లకు అర్దరాత్రి ఒంటిగంటకు వరకు అనుమతి ఇచ్చింది. ఓవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని చోట్ల ఆంక్షలు విధిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల పేరిట సడలింపులు ఇవ్వడం విశేషం. అదే సమయంలో ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే!. ఒమిక్రాన్ అలర్ట్: తెలంగాణలో మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలే! -
Sai Pallavi Special Story: నిజంగానే సింగిల్ పీస్!!
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ ఫార్మాట్ నే మార్చి పారేసిన టాలెంటెడ్ యాక్ట్రెస్..నాట్య మయూరి సాయి పల్లవి. అద్భుతమైన నటన. అంతకుమించిన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్గా సాయి పల్లవి తన ప్రత్యేకను చాటుకుంటోంది. యాక్టింగ్, డాన్సింగ్ కలగలిసిన నటి ఆమె. డాన్స్‌కి తనదైన క్లాసికల్ టచ్..అసలు ఆ పేరు వింటేనే అదో జోష్. అదొక మాగ్నటిక్ పవర్. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలన్నంత అభిమానం.. ప్రేమ. తన కోసమే ఆడియెన్స్‌ను థియేటర్లను రప్పించుకొనేంత పాపులారిటీ. తాజాగా శ్యామ సింగరాయ్ సినిమాతో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెతో డాన్స్ చేయాలనే కోరికను వ్యక్తం చేయడం విశేషం. ఫిదా మూవీలో స్వయంగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి చెప్పినట్టు నిజంగానే ఆమె సింగిల్ పీస్. మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్. సినిమాల ఎంపికలోనే కాదు ఆకట్టుకునే అందం..అంతకుమించిన అద్భుతమైన నటన వీటన్నింటికీ మించి సూపర్ డాన్స్‌తో అందరిని ఫిదా చేస్తుంది. కేరెక్టర్ ఏదైనా ఆ పాత్ర తప్ప, సాయి పల్లవి కనిపించదు ప్రేక్షకులకు. పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పకుంటూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తనకు నచ్చని కథలను రిజెక్ట్ చేయడమే కాదు కోట్లాది రూపాయలు కుమ్మరించే యాడ్స్ వైపు కన్నెత్తి కూడా చూడని మనస్తత్తం ఆమెది. గొప్ప బ్రాండ్స్‌గా భావించే కంపెనీల కమర్షియల్ యాడ్స్‌ను తిరస్కరించి విమర్శకులను సైతం ఫిదా చేసింది సాయి పల్లవి. చిన్నప్పటినుంచీ మంచి డ్యాన్సర్ కావడంతో సాయి పల్లవికి నాట్యం నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అలా మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్'లో తనదైన స్టెప్పులతో ప్రేక్షక జనాన్ని తనవైపు తిప్పుకుంది. ఇక తెలుగులో ‘ఫిదా' మూవీతో భారీ హిట్‌ను సాధిచింది. ఆమె కరియర్లో ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకం. దాదాపు అన్ని సూపర్ డూపర్ హిట్స్. మరికొన్ని బాక్సాఫీసు వద్ద రికార్డులను క్రియేట్ చేశాయి. ఫిదాలోని అన్ని పాటలు హిటే. అలాగే తమిళ స్టార్‌హీరోతో ధనుష్‌తో నటించిన ‘మారి 2'లో రౌడీ బేబీ పాట రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి నటించిన హిట్మూవీ లవ్‌స్టోరీ . ఈ మూవీలోని సారంగధరియా సృష్టించిన హంగామా గురించ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమేలేదు. కేవలం సాయి పల్లవి డ్యాన్స్కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారంటే అతిశయోక్తికాదు. ఆమె డ్యాన్స్‌కు ఫిదా కాని వారు ఉంటారా అసలు. ఈ నేపథ్యంలోనే సినీ దర్శక నిర్మాతలు కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉండేలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా తాజాగా శామ్ సింగరాయ్ ఈ సినిమాలోని ఒక పాట క్లాసికల్ డ్యాన్స్ కోసం పగలు ప్రాక్టీసు, రాత్రి షూటింగ్ ఇలా ఏడు రోజులపాటు చాలా కష్టపడిందట అంతేకాదు పడి పడి లేచే మనసు వసూళ్ల విషయంలో నిరాశపర్చడంతో.. తన రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇచ్చేసిందని ఇండస్ట్రీ టాక్. దటీజ్ సాయి పల్లవి. తెలుగులో ‘ఎంసీఏ', ‘పడి పడి లేచే మనసు' ‘కణం' సూర్యా 36, మూవీలతో ఆకట్టుకుంది. అలాగే ‘అనుకోని అతిథి’ మూవీలో మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్లో సాయి పల్లవి యాక్టింగ్ నభూతో నభవిష్యతి. వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్‌తో పోటీపడి మరీ నటించింది. విలక్షణ నటుడు రానాతో విరాటపర్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ పుట్టిన సాయి పల్లవి దక్షిణాదిన వరస విజయాలతో దూసుకుపోతోంది. -
కార్తీకమాస చివరి సోమవారం.. ఆలయాల్లో పోటెత్తిన భక్త జనం
-
కార్తీక దీపం.. దేదీప్యమానం
-
Singeetham Srinivasarao Birthday Special:అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు
-
గన్నులున్న జేమ్స్‌బాండ్ కారు.. అమ్మకానికి రెడీ !
సీక్రెట్ ఏజెంట్ జేమ్స్‌బాండ్ స్టైలే వేరు. నడిచే తీరు నుంచి నడిపే కారు వరకు ప్రతీది ప్రత్యేకమే. బాండ్ సినిమాల్లో ఎంఐ6 ఏజెంట్ ఉపయోగించే కార్లలను సైతం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలాంటి స్పెషల్ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు బాండ్ వాడే కార్లంటీని ఆస్టోన్ మార్టిన్ సంస్థనే తయారు చేసింది. త్వరలో విడుదల కాబోతున్న నో టైం టూ డై సినిమా కోసం స్పెషల్ ఎడిషన్ కార్లను సిద్ధం చేసింది. డీబీ 5 జూనియర్ పేరుతో ఈ కార్లను తయారు చేస్తోంది. రెగ్యులర్ కార్లతో పోల్చితే జేమ్స్‌బాండ్ కార్లు జమీన్ ఆస్మాన్ ఫరక్ అన్నట్టుగా ఉంటాయి. శత్రువులపై పోరాడేందుకు వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా బాండ్ కార్లలో అధునాతమైన ఆయుధాలు, గ్యాడ్జెట్లు ఉంటాయి. డీబీ 5 జూనియర్లో కూడా ఇలాంటి గ్యాడ్జెట్లు వెపన్స్ పొందు పరిచారు. జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్ డీబీ 5 జూనియర్లో డిజిటల్ నంబర్ ప్లేట్‌ను అమర్చారు. ఇందులో నంబర్లు ఆటోమేటిక్‌గా మారిపోతుంటాయి, అంతేకాదు స్విచ్చ్ నొక్కితే చాలు హెడ్లైట్ల స్థానంలో గన్స్ స్రత్యక్షం అవుతాయి. స్మోక్ స్క్రీన్, హిడ్డెన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Introducing the DB5 Junior NO TIME TO DIE Edition.#AstonMartin #LicenceToThrill #NoTimeToDie — Aston Martin (@astonmartin) September 21, 2021 ఆస్టోన్ మార్టిన్ సంస్థ ఎలక్ట్రిక్ కారుగా డీబీ 5 జూనియర్ని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరని 90,000 డాలర్లుగా నిర్ణయించింది. ఈ కారు కావాల్సిన వారు ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టోన్ మార్టిన్ సంస్థ కేవలం 125 కార్లను మాత్రమే తయారు చేసింది. వీటిని ఆస్టోన్ మార్టిన్ మెంబర్షిప్ ఉన్న వారికే కేటాయించనుంది. అయితే ఈ కార్లను సొంతం చేసుకున్నా ... రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. బాండ్ తరహాలో వెపన్స్, లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నందున వీటికి అనుమతి నిరాకరించారు. స్పెషల్ ఈవెంట్స్, రేస్ట్రాక్లపై నడుపుకోవచ్చు. సెలబ్రిటీలు, బిజినెస్ బ్యాగ్నెట్లు తమ గ్యారేజీలో అదనపు ఆకర్షణగా ఈ కార్లను ఉంచుకునేందుకు ఇష్టపడతారు. Raw and instinctive – Vantage deserves to be driven. Watch @007 put his Aston Martin to the test in NO TIME TO DIE from 30th September.#NoTimeToDie #AstonMartin #LicenceToThrill pic.twitter.com/TIvZ7ArdX1 — Aston Martin (@astonmartin) August 31, 2021 చదవండి : సూపర్ కార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ -
రాధికా ఆప్టే బర్త్‌డే స్పెషల్
-
Varalaxmi Vratham: మహిళల ప్రత్యేక పూజలు
సాక్షి,ఖమ్మం: శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఈరోజు వీలుకాకపోతే వచ్చే శుక్రవారాల్లో కూడా వ్రతాన్ని ఆచరించవచ్చని అర్చకులు చెబుతున్నారు. ఈ మేరకు మహిళలు పూలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు , వ్రత నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళకరం... ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఆచరించే మహిళలు పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అమరుస్తారు. ఆ తర్వాత వ్రతం ఆచరించి చుట్టుపక్కల మహిళలను పిలిచి వాయినాలు ఇస్తారు. ఇళ్లలో కుదరని వారు దేవాలయాల్లో జరిగే సామూహిక వ్రతాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖమ్మం నగరంలోని పలు ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి అని నమ్మిక. ఏ నియమాలు, మడులు అవసరం లేకుండా నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రతతో ఈ వ్రతం ఆచరించొచ్చని అర్చకులు చెబుతున్నారు. సకల శుభాల కోసమే కాకుండా దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని మహిళలు ఈ వ్రతం ఆచరిస్తుంటారు. -
Friend Ship Day 2021: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
ఫ్రెండ్.. అందరికీ ఇష్టమైన పదం. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నట్లు.. బాధలో ఉన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది స్నేహితుడు.. సంతోషాన్ని పంచుకునేందుకు వెంట ఉండేది స్నేహితుడు. జాతి, మతం అన్న తేడాల్లేకుండా ఇద్దరు వ్యక్తులను కలిపిఉంచే బంధం కేవలం స్నేహానిది మాత్రమే. ఏ రక్త బంధంతో నిమిత్తం లేకుండా చివరి వరకు నిలిచేది స్నేహితుడు. ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే అన్న నానుడి కూడా స్వచ్ఛమైన స్నేహం నుంచి జన్మించిందే. ఏ స్వార్థం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత ప్రపంచంలో అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో చాలామంది స్నేహితులు కరోనా సమయంలో అండగా నిలిచారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడారు. కాల పరీక్షకు ఎదురుగా నిలుస్తూ స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంలా కనిపిస్తున్న పలువురిపై స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనాలు.. ఫేస్బుక్ మిత్రుల రూ.1.12లక్షల సాయం సాక్షి, ధర్మపురి(కరీంనగర్): ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద మహిళకు ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచి రూ.1.22లక్షల సాయం అందించారు. ధర్మపురికి చెందిన నరుముల లక్ష్మీ భర్త కొన్నినెలల క్రితం చనిపోయాడు. కొడుకు పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. కూలీపని చేస్తూ.. కూతురును బీఈడీ చదివిస్తోంది. భర్త మరణంతో పోషణ కష్టమైంది. ఇల్లుగడవని పరిస్థితి ఎదురైంది. కూతురు చుదువు మానిపించేద్దామని అనుకుంది. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ లక్ష్మీ కష్టాలను గురించి జూలై 5న ఫేస్బుక్లో పోస్టుచేసి సాయం అందించాలని మిత్రులను కోరాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారై మిత్రులు రూ.1.17లక్షలు, ధర్మపురికి చెందిన కొరెడె కిరణ్‌కుమార్ మిత్రబృందం రూ.5 వేలు సాయం అందించారు. డిపాజిట్ బాండ్లను సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్ చేతుల మీదుగా శనివారం అందించారు. ఆదుకున్న స్నేహితులు కోరుట్ల: తమతో చదువుకున్న స్నేహితుల్లో మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ఏడాది క్రితం అనారో గ్యంతో మరొక రు మృతి చెందడంతో మిత్రులు వారి కుటుంబాలకు అండగా నిలిచారు. కోరుట్లలోని ఆదర్శ విద్యాలయం 1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విడిపోయినా తమ స్నేహ బంధాన్ని వీడలేదు. ఈ మిత్ర బృందంలో గాజెంగి శ్రీధర్ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు పోతుగంటి శ్రీనివాస్, అంబల్ల ఆనంద్, తాళ్ల్లపల్లి శ్రీనివాస్‌లు తమ మిత్రు ల సహకారంతో రూ.1,02,000 శ్రీధర్ కూతురు నిత్య పేరిట డిపాజిట్ చేశారు. మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.1,60,000 ఆర్థికసాయం అందించారు. బడి సోపతికి 37ఏళ్లు బోయినపల్లి(చొప్పదండి): విభిన్నానికి మారుపేరు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్. ఆయనకు స్నేహమంటే ప్రాణం. స్నేహాన్ని మనసుతో చూస్తారు. ఉద్యోగంతో పాటు స్నేహాన్ని సైతం ఓ బాధ్యతగా తీసుకుని 37ఏళ్లుగా అల్లుకుపోతున్నారు. హుస్నాబాద్ 1983–84 ఎస్సెస్సీ బ్యాచ్ ఇతడిది. బడిసోపతులు పేరిట శ్యాంప్రసాద్‌లాల్ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో ఉన్న స్నేహితులను సమన్వయం చేసుకుంటూ, సోపతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ గెట్టు గెదర్ నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి అశోక్, కొండూరి శ్రీనివాస్, ఆశోక్‌కుమార్ కామారపు, అన్నవరం శ్రీనివాస్, బాపిరాజు, రజని, లత, ఉమారెడ్డి కోర్‌కమిటీ సభ్యులతో ముందుకు సాగుతున్నారు. అనుకోకుండా చనిపోయిన ఇద్దరు మిత్రుల కూతుళ్ల వివాహానికి రూ.4 లక్షలు, ఆర్థికంగా లేని స్నేహితుల కూతుర్ల వివాహానికి రూ.2.50 లక్షలు, అనారోగ్యంతో బాధ పడుతున్న మిత్రులకు రూ.2లక్షల చొప్పున సాయం అందించారు. పాతికేళ్ల స్నేహం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లలో నివాసం ఉంటున్న వేముల తిరుపతి, ఎలగొండ రవీందర్ టైలరింగ్ పని మీద తొ లిసారి బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లినపుడు కలుసుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా కలిసే ఉంటున్నారు. రవీందర్ కుటుంబం కరోనా బారిన పడగా.. తిరుపతి అన్ని వి«ధాలుగా అండగా ఉండి మనో«ధైర్యం కలిగించాడు. దైవం కలిపిన బంధం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన హనుమాండ్ల శ్రీకాంత్, మహ్మద్ ఫరీ ద్ ఆరోతరగతి నుంచి స్నేహితులు. గత మే నెలలో శ్రీకాంత్ ఇంట్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు. ఫరీద్ కు ఫోన్ చేశాడు శ్రీకాంత్. రాత్రి గంటలకు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆక్సిజన్ లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పడకలు లేవు. తనకున్న పరిచయాలతో ఆక్సిజన్ బెడ్ తెప్పించాడు. వారంపాటు కంటికి రెప్పలా కాపాడాడు. ‘మొదట్నుంచి అతనే లేకపోతే ఈ రోజు నేనిలా ఉండలేక పోయేవాడిని’ అని శ్రీకాంత్ చెప్పాడు. క్లాస్మేట్స్.. జాబ్మేట్స్ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లికి చెందిన మాడిచెట్టి సాయికిరణ్, వాసాల సంతోశ్, మోగులోజి నరేశ్ ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఒకేపాఠశాల,ఇంటర్, డిగ్రీ కలిసి చదివారు. గ్రామంలో కలిసి సాధనచేసి 2019లో పోలీస్ ఉద్యోగాలు సాధించారు. సాయికిరణ్ ఏఆర్ పీసీగా కరీంనగర్లో, సంతోష్ మంచిర్యాలలో టీఎస్ఎస్పీ పీసీగా, నరేశ్ సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో పీసీగా ఉద్యోగం చేస్తున్నారు. -
పొలిటికల్ కారిడార్ 16 june 2021
-
జిగేలుమంటున్న నందిత శ్వేత ఫోటోలు
-
హీరోయిన్ అంజలా జవేరీ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
పూనమ్ బజ్వా బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
అలియా భట్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
మహిళా దినోత్సవం ప్రత్యేక ఇంటర్వ్యూ- సినిమాల్లో సగమెక్కడ
-
నాని బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
యాదాద్రి ఫోటోలు
-
కోటి పుణ్యాల కార్తీక పున్నమి
కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికంమంటారు. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. అటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.కారీక్త పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానం ఆచరించి శుచియైన వస్త్రం ధరించి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, పార్వతీపరమేశ్వరులకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి. సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 వత్తులను ఆవునేతితోగాని, కొబ్బరినూనెతోగాని, నువ్వులనూనెతో గాని తడిపి దీపాలను వెలిగించాలి. అలాగే బియ్యపిండితో చేసిన దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. పిమ్మట.. శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కంద దుంప, తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి, నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలో వదలాలి. ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమతల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనులకింపుగా వుంటుంది. దీనివల్ల నదీమతల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ దినమంతా ఉపవసించి, సంధ్యాసమయంలో యధావిధిగా తిరిగి స్నానాదులు గావించి, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను ధనం, సౌభాగ్యం, ఆరోగ్యం, యశస్సునిమ్మని ప్రార్థించాలి. ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో, పంచామృతాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనంతరం లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తారు. ధాత్రీపూజను కూడా చేస్తారు. ఉసిరి చెట్టు లభ్యం కాకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తులసి కోటలో వుంచి పూజిస్తే మంచిది. ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకీలోనుంచి ఈ తోరణం నుండి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకీని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచలయి, ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం.కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని నమ్మిక. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాలనుండి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. కార్తీకపౌర్ణమి నాడు కార్తికేయుడు తారాకాసుర సంహారం చేసినట్లు తెలుస్తోంది. అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినాడు తమిళులు నూత్న వధూవరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి, సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు. దీనివలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని, తమ కుమార్తె వలన మరొక గృహం కాంతులీనుతుందని నమ్మకం.అత్యంత ఫలప్రదమైన ఈ కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన సంప్రదాయ విధివిధానాలను ముందు తరాలకు పదిలపరచి లోకక్షేమానికి కృషిచేద్దాం.:::డా. దేవులపల్లి పద్మజ -
అలా చేస్తే వెన్నునొప్పి పెరుగుతుంది.. జాగ్రత్త!
మనమంతా నిటారుగా ఉండటానికి ఉపయోగపడే అత్యంత ప్రభావపూర్వకమైన భాగం వెన్ను. మనిషి పూర్వికులు తమ నాలుగు కాళ్ల నడక నుంచి రెండు కాళ్ల మీదికి మారిన కాలం నుంచి... శరీరం బరువును చాలావరకు తాను తీసుకుంటూ... నేటి ఆధునిక మానవుడి ఆవిర్భావం వరకు వెన్ను తాలూకు భూమిక అత్యంత కీలకం. తాను నిటారుగా మారినందున ఓ కర్రలాగా నిటారుగా మాత్రమే కాకుండా... మనిషికి అనువైన విధంగా అటు ఇటు వంగగలిగేలా, అవసరమైనప్పుడు పక్కలకు తిరగగలిగేలా, మెడను, నడుమును అటు ఇటు తిప్పగలిగేలా కూడా అత్యంత ఫ్లెక్సిబుల్‌గానూ రూపొందిన వెన్ను నిర్మాణం ఓ అత్యద్భుతమని చెప్పవచ్చు. అలాంటి అద్భుత అవయవమైన వెన్ను గురించి తెలుసుకుందాం. ఈ నెల 16న ‘వరల్డ్ స్పైన్ డే’. ఈ సందర్భంగా... వెన్ను గురించి అవగాహన కోసం ఈ కథనం. ఈ ఏడాది ప్రపంచమంతటా విస్తరించిన ‘కరోనా’ ప్యాండమిక్ సందర్భంగా వెన్నుపైనా తీవ్రమైన ఒత్తిడి పడిందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అందుకే వెన్నెముక ఆరోగ్యం, దాని సంరక్షణకు అవసరమైన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన పోష్చర్లు వంటి అనేక అంశాలపై అవగాహన కలిగిచేందుకు ఈ ఏడాది స్పైన్ డే థీమ్‌తో ఇచ్చిన నినాదమే ‘బ్యాక్ టు ట్రాక్’! ఈ సందర్భంగా వెన్ను గురించి, దాని ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యల గురించి తెలుసుకుందాం. వెన్ను నిర్మాణమే ఓ అద్భుతం వెన్నెముకలో మొత్తం 33 చిన్న చిన్న ఎముకలు ఒకదానికొకటి పూసల దండలా అమరి ఉంటాయి. అందుకే ఆ చిన్న చిన్న ఎముకలను వెన్నుపూసలంటారు. వాటి నిర్మాణం... ‘ఎస్’ ఆకృతిలో కాస్తంత ఒంపు... ఇదంతా ఓ నిర్మాణ అద్భుతం. వీటిల్లో... తల కింద... మెడ వెనక భాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఇవి తలను అటూ ఇటూ తిప్పడానికి, తల పైకెత్తడానికి, కిందికి దించడానికి కూడా సహాయపడతాయి. వీటి దిగువనే ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. మన పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. ఈ ఎముకల్లో సమస్యలు తలెత్తడం చాలా అరుదు. వీటికి దిగువ ఉండే ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. మన శరీరం బరువులో చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి. వీటికి దిగువ ఉండే ఐదు ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కుని ఉంటాయి. ఈ భాగాన్నే ‘కాక్సీ’ అంటారు. ఇది ఒకానొక కాలంలో ఆధునిక మానవుల పూర్వీకులకు ఉండే తోక అవశేషంగానూ చెబుతుంటారు. ఓ చిన్నారి పుట్టీ పుట్టగానే వెన్నుభాగం దాదాపు నిటారుగానే ఉంటుంది. కానీ చిన్నారి తన తల పైకెత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే భాగం కాస్త వంపు తిరుగుతుంది. అలాగే... పాపాయి పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే భాగం కొద్దిగా వంపు తిరుగుతుంది.దాంతో వెన్నుకు ‘ఎస్’ అక్షరం లాంటి ఒంపు సమకూరుతుంది. నిజానికి సరళరేఖలా ఉండటం కంటే ఇలా ఒంపు తిరగడం వల్లనే మనిషి అనేక రకాలుగా ఒంగేలా, పనులు చేసుకోగలిగేలా వెన్నుకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఒంపులే వెన్నుకు షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేస్తాయి. కేవలం ఈ ఒంపులు మాత్రమే కాకుండా వెన్నులో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే గనక లేకుంటే, వెన్నుపూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. అవి... వెన్నుపూసల మధ్య కుషన్లాంటిది ఉంటుంది. దానినే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఆ డిస్క్ మధ్యలో జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. ఈ డిస్కే మనిషికి ఎదురయ్యే అనేక కుదుపుల బారి నుంచి వెన్నుపూసలను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఈ డిస్క్ కారణంగానే మనం వెన్నెముకను అటు ఇటు వంచగలం. మన శరీరాన్ని అటు ఇటు తిప్పగలం. పూసల్లోని పాము నుంచి31 జతల నరాలు మనిషిలోని వెన్నుపూసలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టుగా ఉండి... వాటి మధ్యన ఖాళీలతో ఓ సందును ఏర్పరుస్తాయి. ఆ ఖాళీలో తల నుంచి వెన్నుపూసల చివరి వరకు దాదాపు 45 సెంటీమీటర్ల వెన్నుపాము ఉంటుంది. ఈ వెన్నుపాముకూ వెన్నెముక పూసలు రక్షణ కూడా కల్పిస్తుంటాయి. పూసల దండలోని దారంలా... మనిషిలో ఓ తెల్లని వెన్నుపాము ఒక సెంటీమీటరు మందంలో ఉంటుంది. దీనికేమైనా జరగరానిది జరిగితే, మనిషి తన జీవితాంతం అవిటివాడిలా ఉండాల్సిందే. అటు ఇటు వెళ్లాలంటే వీల్‌చైర్ ఉపయోగించక తప్పదు. సున్నితమైన వెన్నుపాముకు వెన్నుపూసలు మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాయి. ఈ వెన్ను పూసల మధ్యనుండే ఖాళీల ద్వారా వెన్నుపాము నుంచి 31 జతల నరాలు దేహమంతా పాకి ఉంటాయి. వీటిలో సగం నరాలు దేహం నుంచి మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగిలినవి మెదడు నుంచి వచ్చే వివిధ ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడుతో ప్రమేయం లేకుండా వెన్నుపామే స్వయంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి తాలూకు చేతికి వేడి తగిలిందనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసి, అక్కణ్నుంచి ఆదేశాలు వచ్చేంత సమయాన్ని వెన్నుపాము వృథా చెయ్యదు. వెంటనే వేడి తగిలిన చెయ్యి వెన్నుకు తీసుకునేలా అసంకల్పిత చర్యలకు ఆదేశాలిస్తుంది. అలా చాలారకాల ప్రమాదాలనుంచి వెన్నుపాము మనల్ని రక్షిస్తుంది. ఇలా రక్షించే వెన్నుపాముకు మన వెన్నుపూసల ద్వారా వెన్నెముక రక్షణ కల్పిస్తుంది. వెన్నుకు నొప్పులూ... కారణాలూ ఎన్నెన్నో ►ఈ ప్రపంచంలోని ప్రతి మనిషికీ ఏదో ఒక దశలోనైనా, కనీసం ఒక్కసారైనా ఏదో ఓ కారణంతో వెన్నునొప్పి వచ్చి తీరుతుంది. దాంతో కాపడం పెట్టించుకోవడమో, మర్దన చేయించుకోవడమో, మందులు వాడటమో చేయనివారంటూ ఎవరూ ఉండరు. అయితే చాలా సందర్భాల్లో వెన్నెముకకు నొప్పి వచ్చిందటే దానికి నేరుగా వెన్నుపూసలే కారణం కాకపోవచ్చు. ఇతరత్రా చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు... మూత్రపిండాల్లో సమస్యలు ఉన్నా, కాలేయం లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా వెన్నుకు నొప్పులు వస్తాయి. ►ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. ఓ వ్యక్తి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు వెన్నుకు అంటిపెట్టుకుని ఉండే కండరాలు తీవ్రంగా బిగుసుకుంటాయి. అలా రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల వెన్నుకు నొప్పులు తప్పవు. అయితే త్వరగా భావోద్వేగాల నుంచి తేరుకుంటే నొప్పులూ తగ్గుతాయి. ►వెన్నెముక ప్రధాన ఉద్దేశం వెన్నుపామును కాపాడటం కాగా... రెండో ప్రధాన ఉద్దేశం మన శరీరాన్ని కుదుపుల నుంచి రక్షించడం, దేహానికి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం. ఈ రెండు పనులనూ డిస్క్‌లు సమర్థంగా చేస్తాయి. ఈ కారణంగా డిస్క్‌ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సహజంగానే వయసు పెరగడంతో పాటు, వాడుతున్న కొద్దీ డిస్క్‌లు కొద్దికొద్దిగా దెబ్బతింటూ వస్తాయి. ఇలా దెబ్బతినడం వల్లనే మనకు నడుమునొప్పి వస్తుంటుంది. అప్పుడప్పుడు బరువులెత్తడం వంటి ఏదైనా కారణం వల్ల డిస్క్ పగలడం (రప్చర్కావడం) జరగవచ్చు. డిస్క్ మధ్యలో ఉన్న జెల్లీ బయటకు వచ్చి నరాన్ని కానీ, నాడిని కానీ నొక్కేయవచ్చు. దీన్నే సయాటికా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అరుదుగా సర్జరీ కూడా అవసరం పడవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే... వెన్నునొప్పి చాలావరకు డిస్క్‌లు అరగడం వల్ల వస్తుంది. ఈ ప్రమాదాని నివారించాలంటే మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ముందుకు ఒంగి ఎక్కువ బరువు లేపకపోవడం, ముందుకు ఒంగి ఎక్కువ పని చేయకపోవడం అవసరం. అంతేకాదు... వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరిగే విధంగా ఫెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. వెన్నెముకకు సపోర్ట్నిచే కండరాల బలాన్ని పెంచే ‘స్పైనల్ స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్’ అనే వ్యాయామాలు చేయాలి. ►రోడ్డు ప్రమాదం వంటి యాక్సిడెంట్స్‌లో తీవ్రంగా గాయపడినప్పుడు వెన్నుపూసల మధ్య డిస్కులు తింటాయి. అలాంటి సందర్భాల్లో వెన్నుపూసలకు పెద్ద దెబ్బ తగిలితే ప్రధానంగా వాటి మధ్య కుషన్‌లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. దాంతో అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వెన్నును అంటిపెట్టుకుని ఉండే కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ►కొందరిలో వెన్నుపూసలు అరిగి రాపిడికి గురై, వెన్నుపూస నుంచి బయటికి వచ్చే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. దేహంలో అత్యంత పొడవైన ఈ సయాటికా నరం అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. దాంతో నొప్పి కూడా నడుము నుంచి అరికాళ్ల వరకు పాకుతుంది. ఒకరకంగా చూస్తే... ఈ నొప్పి జాగ్రత్త వహించాలని చెబుతూ దేహం పంపే సంకేతం అన్నమాట. ►కొందరు సోఫాల్లోనూ, కుర్చీల్లో అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా కూర్చుని తాము హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నామని అనుకుంటారు. కానీ అది వెన్నుపై భారాన్ని మరింత పెంచుతుంది. మరికొందరు నేల మీద ఉన్న బరువులను ఎత్తేటప్పుడు వెన్నును ముందుకు వంచుతారు. దానికి బదులుగా మోకాళ్లు ఒంచి, గొంతుకూర్చొని బరువులు ఎత్తితే వెన్నుపై పెద్ద భారం ఉండదు. ►అరుగుదలతో వెన్నుకు నొప్పులు వస్తాయి. కొందరికి మెడ వద్ద ఉండే వెన్నుపూసల డిస్కులు అరిగి, రాపిడికి గురైనప్పుడు నొప్పి వస్తూ, అది భుజాల్లోకి పాకుతూ చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది. అలాగే మరికొందరిలో నడుము దగ్గరి డిస్కులు అరిగి నడుమునొప్పి వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వయసు పెరగడం అనే ముప్పు. మన వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని ఎముకలూ బలహీనపడుతుంటాయి. అరుగుతుంటాయి. వెన్నులోని ఎముకలూ ఇందుకు మినహాయింపు కాదు. వెన్ను డిస్కులు మెత్తబడిపోతూ, వెన్నుపూసలు సాంద్రత (బోన్ డెన్సిటీ) కోల్పోతుంటాయి. వయసు మరింత పెరిగి వృద్ధాప్యంలో వెన్ను మరింతగా ఒంగిపోయి, మనిషి కిందికి కుంగిపోయినట్లుగా అనిపించడమూ సహజం. అలాంటప్పుడు భారంగా ముందుకు వంగి నడవాల్సి వస్తుంది. ఒళ్లు పెరిగితే...నొప్పులూ పెరుగుతాయి... నడివయసు వారిలో చాలామందిలో వెన్నునొప్పులు కనిపిస్తుంటాయి. అలాంటి నొప్పుల్లో చాలావరకు వెన్నును ఆనుకుని ఉండే కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చేవే. కొందరు చిన్న చిన్న కదలికలతోనే సంతృప్తి చెంది తమ శరీర కదలికల కారణంగా దేహానికి వ్యాయామం సమకూరిందనుకుంటారు. దాంతో తమ వెన్ను పదిలం అని భావిస్తుంటారు. వెన్నును అంటిపెట్టుకుని దాదాపు నాలుగువందలకు పైగా కండరాలు, వెయ్యి లిగమెంట్ల వరకు ఉంటాయి. దాంతో ఎవరైనా ఓ వ్యక్తి బరువు పెరిగినా... లేదా అతడికి పొట్ట పెరిగినా... ఆ భారాన్నంతా వెన్ను మోయాల్సి వస్తుంది. అందుకే ఎత్తుకు తగినంతగానే బరువు ఉండేలా జాగ్రత్త పడుతూ, తమ దేహపు బరువు, పొట్ట పెరగకుండా చూసుకుంటే అది కేవలం శరీర ఆరోగ్యనికే కాదు వెన్ను కూడా ఆరోగ్యానికీ ఉపకరిస్తుంది. చిన్న జాగ్రత్తలతో వెన్ను పదిలం... కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వయసు పెరుగుతన్న క్రమంలోనూ, వెన్నును జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ∙ఎప్పుడూ మీ దేహ భంగిమను (బాడీ పోష్చర్)ను నిటారుగా ఉంచుకోవాలి. నిటారుగా నిలబడటం, వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ∙వెన్నును అంటిపెట్టుకుని ఉండే కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు ప్రతిరోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి ∙వెన్నుకు వచ్చే చాలా సమస్యలు ప్రధానంగా కండరాల బలహీనత వల్లే ఎక్కువగా వస్తుంటాయి. అందుకే, కండరాలను బలోపేతం చేసేందుకు తగిన వ్యాయామాలు చేయాలి ∙కూర్చునే సమయంలోనూ కూలబడినట్లుగా కాకుండా సౌకర్యంగా ఉండేలా, వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి ∙కింది నుంచి బరువులు ఎత్తేటప్పుడు ఒంగి కాకుండా... కూర్చుని ఎత్తాలి. హడావుడిగా కాకుండా నింపాదిగా ఎత్తాలి. -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఈద్ ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి. ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా రూ.786 ప్లాన్ ను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈద్ సందర్భంగా ముస్లింలు పవిత్ర సంఖ్యగా భావించే 786 నంబరుతో ఈ ప్లాన్ తీసుకు రావడం విశేషం. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే. సంస్థ ఆవిష్కరించిన మరో ప్లాన్ ధర 699 రూపాయలు. వీటితో పాటు కంపెనీ ఇప్పటికే ఎస్‌టివి 118, కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్లనుతీసుకొచ్చింది ఈ ప్లాన్లు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకోసం ఇటీవల చాలా ప్రీపెయిడ్ ప్లాన్లతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ .786 ఈద్ స్పెషల్ ప్లాన్ : రూ. 786 టాక్‌టైమ్, మొత్తం 30జీబీ హై స్పీడ్ డేటా లభ్యం. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటులోవుంటుంది. 2020 జూన్ 21 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్: ఈద్ స్పెషల్ ప్లాన్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 500 ఎమ్‌బి డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం, రోజుకు 100ఎస్ఎంఎస్ లు లభ్యం. ఇది 160 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అలాగే స్పెషల్ పెర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్ కూడా వుంది. బీఎస్ఎన్ఎల్ కాంబో 18 డేటా ప్లాన్: కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్ : రెండు రోజులుతో స్వల్పకాలిక ప్రణాళిక. ఈ ప్రణాళిక పుదుచ్చేరి, లక్ష్వదీప్ సహా 22 సర్కిళ్లలో లభిస్తుంది. 30 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇతర నెట్‌వర్క్‌లకు 250 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం. -
ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటు: కేంద్రం
-
లీప్ ఇయర్..సంథింగ్ స్పెషల్ డే
-
ఫ్లిప్‌కా(స్టా)ర్ట్ సేల్, కొత్త ఏడాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అలా 2020 ఏడాదిలో తొలి సేల్‌ను ప్రారంభించింది. జనవరి 1 అర్థరాత్రి ప్రారంభమైన మూడు రోజుల సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రియల్మీ ఎక్స్ 2, రెడ్మి నోట్ 7 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, అదనపు డిస్కౌంట్లను అందించడానికి బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం మినహాయింపుతో పాటు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. స్మార్ట్ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు రియల్ మి5 ఎస్ : ఆఫర్ ప్రైస్ : రూ .9,999 (క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, క్వాడ్ కెమెరా 48 ఎంపీప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపీ సూపర్ మాక్రో లెన్స్ 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ ప్రధాన ఫీచర్లు) రియల్మీ ఎక్స్ 2: ధర రూ .16,999 కు విక్రయిస్తోంది. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్ ప్రాసెసర్, 64 +82+ 2 ఎంపీ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమరా ప్రధాన ఫీచర్లు) రెడ్మి నోట్ 7 ప్రో : రూ. 9,999 లభ్యం. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ + డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 సాక్ డుబుల్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాప్రధాన ఫీచర్లు) ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్లపై కూడా ప్రత్యేక తగ్గింపునిస్తోంది. ఏసర్ స్విఫ్ట్ 3 (ఇంటెల్ కోర్ ఐ 5, 2 జీబీ గ్రాఫిక్స్) ను రూ. 44.990. మార్కెట్ ధర రూ. 50,000. -
బతికి ఉండగానే ‘అంత్యక్రియలు’!!
సియోల్ : జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు దక్షిణ కొరియా హీలింగ్ సెంటర్లు సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’ నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వారు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 2012 నుంచే ఆ దేశంలో అధిక సంఖ్యలో హీలింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. బతికి ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఆశ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైవోన్ అనే హీలింగ్ సెంటర్ మంగళవారం ‘డైయింగ్ వెల్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్ ఫర్నియల్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నాడు. మరో టీనేజర్ తన అనుభవం గురించి వివరిస్తూ... ‘శవ పేటికను చూడగానే ముందు భయం వేసింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు పోటీదార్లే అంటూ ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే చచ్చిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను. మేము 2012నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి ఏడ్చేవాళ్లను కూడా పిలవాలనుకున్నాం. కానీ ఈసారి కుదరలేదు. శవపేటికలో ఉన్నపుడు మన కోసం ఏడ్చేవారి స్వరం విన్నపుడు బలవన్మరణానికి పాల్పడి వారిని ఎంత వేదనకు గురిచేశామో అన్న విషయం అర్థమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
ప్రేమికురాలు మోసం చేస్తే?
‘‘ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుంది. అందుకు కారణమైన వారిని తెలుసుకొని, వారిని మైండ్ రీడర్ ఎలా అంతం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్పెషల్’. విలన్‌గా, సహనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాత్సవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘మైండ్ రీడర్ స్టోరీ ఇది. ఫెంటాస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. ‘గజిని’ టైప్ జోనర్ అయిన మా సినిమాలో లవ్, ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాం. ఇది చిన్న సినిమానేకానీ, మీరందరూ చూసిన తర్వాత పెద్ద సినిమాగా భావిస్తారు’’ అన్నారు. ‘‘చిన్నప్పటి నుంచి థ్రిల్లర్స్ అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో మార్పువచ్చింది. హీరో, హీరోయిన్స్కంటే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పకుండా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరోయిన్ అక్షిత శ్రీనివాస్. -
అరుదైన శునకం ..ఖరీదు రెండు లక్షలా?
సాక్షి, అనంతపురం: కుక్క ధర లక్షలు పలుకుతోంది. ఇదెక్కడో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.... మన అనంతపురంలోనే. అమెరికాలో కనిపించే మేలుజాతి శునకం ఇప్పుడు అనంతపురంలోనూ కనిపిస్తోంది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కుక్క ప్రస్తుతం యజమానికి కాసులను కురిపిస్తోంది. అమెరికాలో సెక్యూరిటీ కోసం బెల్జియం మెల్లాయిస్ జాతికి చెందిన శునకాన్ని అక్కడి పోలీసులు సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. దీంతో ముచ్చటపడ్డ ప్రణీత్ అరుదైన జాతి శునకాన్ని అనంతపురానికి తెచ్చేసుకున్నాడు. అనంతపురంలో రెండో రోడ్డులో నివాసముంటున్న ప్రణీత్‌రెడ్డి బెల్జియం మెల్లాయిస్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ శునకం తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ జాతి కుక్క ఒక్కొక్కటి రూ.3లక్షలు పలుకుతోందని, పిల్లలైతే రూ.2లక్షల దాకా ఉంటుందని ప్రణీత్‌రెడ్డి చెబుతున్నారు. -
ఆ సినిమాలు చెడగొడుతున్నాయి
సహాయ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి, విలన్‌గా, హీరోగా రాణిస్తున్న అజయ్ నటించిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందం శ్రీవాస్తవ్ నిర్మించిన ఈ సినిమాని జూన్ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్‌గా వస్తున్నాయి. టేకింగ్ పరంగా ‘గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్లో వచ్చిన సిక్త్స్ సెన్స్, అన్ బ్రేకబుల్, సైకో’ వంటి సినిమాలను తలపించేలా మా మూవీ ఉంటుంది. ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం బాధపడుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. చిన్నసినిమా బూతు సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమాలు యూత్‌ని చెడగొడుతున్నాయి. వీటికి నాంది ‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలే. ఈ సినిమాల వల్ల నెలకు ఒకటి చొప్పున ఈ తరహావి వస్తున్నాయి. దాసరి నారాయణరావుగారి తర్వాత తెలుగు మోడ్రన్ సినిమాకు గురువు అనిపించుకోవాల్సిన రామ్‌గోపాల్ వర్మగారు ‘జీఎస్టీ’ లాంటి బూతు సినిమాలు తీస్తున్నాడు. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు కృష్ణవంశీగారు, హీరో చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘క్షణం, గూఢచారి’ సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ‘స్పెషల్’ ఉంటుంది. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు మా సినిమాని అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల చేసే అవకాశం ఇచ్చిన వాస్తవ్గారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని బాపిరాజు అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మణ్యం, కెమెరా: బి. అమర్ కుమార్. -
మైండ్ రీడింగ్ సైకో
అజయ్, రంగా, అక్షత ముఖ్య పాత్రల్లో నందమ్ శ్రీవాత్సవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘స్పెషల్’. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ క్రిమినల్ ఒక రకమైన ఇంజెక్షన్‌ను వాడుతూ చాలామందికి హాని తలపెడుతుంటాడు. అసలు ఆ ఇంజెక్షన్ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పోలీస్ అధికారి పాత్రలో నటించాను. నా కెరీర్లో ఇది ప్రత్యేకమైన చిత్రం’’ అని అజయ్ అన్నారు. ‘‘మైండ్ రీడర్‌గా మారిన ఓ సైకో ఏం చేశాడు? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. మైండ్ రీడర్ పాత్రలో రంగా నటించారు. కీలకపాత్రలో అక్షత కనిపిస్తారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నందమ్. ఈ చిత్రానికి విన్.వి.ఎస్. మణ్యం సంగీతం అందించారు. బి. అమరకుమార్ ఛాయాగ్రాహకుడు. -
‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’
సాక్షి, కోహీర్(జహీరాబాద్): దాదాపు ప్రతీ ఊరు పేరు వెనుక ఒక చరిత్ర ఉంటుంది. మండలంలోని బిలాల్పూర్ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. అదే ఒక గజదొంగ పేరిట గ్రామం వెలిసింది. ఆ పేరే సినీ దర్శకులు నాగసాయి, నిర్మాత మహాంకాళి శ్రీనివాస్‌లకు నచ్చింది. ఇంకేముంది, వర్ధమాన నటులు మాగంటి శ్రీనాథ్, మేఘన నటించిన ‘బిలాల్పూర్ పోలిస్టేషన్’ గా రూపుదిద్దుకొని నేడు విడుదలకు సిద్ధమైంది. మండల కేంద్రమైన కోహీర్కు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాల్పూర్ గ్రామానికి చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల క్రితం బిలాలోద్ధీన్ అనే గజదొంగ తన శత్రువుల నుంచి రక్షణకోసం బురుజు నిర్మించుకొని చుట్టూ కందకం ఏర్పరచుకొని తన అనుచరులతో కలిసి నివసించేవాడు. శత్రువుల నుంచి రక్షణ నిమిత్తం తోపులను ఉపయోగించేవారు. ఎల్లప్పుడూ కందకంలో నీరు నింపి ఉంచేవారు.తమ శత్రువులు కందకం దాటి వచ్చేలోపు మట్టుబెట్టేవారు. (ఇప్పటికినీ బురుజును, కందకాన్ని చూడవచ్చు) కొన్నాళ్లకు బిలాలోద్ధీన్ అంకం ముగిసింది. గజదొంగ బిలాలోద్ధీన్ నివాసించడం చేత గ్రామానికి బిలాల్పూర్ లనే పేరు స్థిరమైనది. వందేళ్ల క్రితం బురుజు వద్ద మైసమ్మగుడి కట్టారు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్నారు. అయితే గత సంవత్సరం సినిమా షూటింగ్‌ను యాక్షన్, కామెడీ సినిమాను మండల కేంద్రమైన కోహీర్‌తో పాటు బిలాల్పూర్, బడంపేట, దిగ్వాల్ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు.ఇందులో స్థానికులు శివమూర్తి స్వామి, ప్రభుగారి శుభాష్‌తో పాటు బడంపేట గ్రామస్తులు నటించారు. పోలీసుల జీవన ప్రధానంగా తీసిన చిత్రానికి బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్ అని పేరు పెట్టారు. జహీరాబాద్‌లోని మోహన్ టాకీసులో సినిమాను నేడు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.