Agnyaathavaasi
-
పవన్ సినిమాతో చాలా నష్టపోయా, కెరీర్లోనే బిగ్గెస్ట్ డ్యామెజ్ : దిల్‌రాజు
పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాతో చాలా నష్టపోయానని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వారీసు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. 2017లో ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేశాను. నా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అదే ఏడాది మహేశ్‌తో తీసిన స్పైడర్ కూడా ఆడలేదు. రెండు సినిమాలు ఒకేసారి బిగ్గెస్ట్ ఫ్లాప్ కావడంతో చాలా నష్టపోయాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6హిట్స్ కొట్టడంతో నేను నిలబడగలిగాను'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
ఆ ఫ్లాప్ సినిమాకు ఆల్‌టైం రికార్డ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన డిజాస్టర్ సినిమా అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా అజ్ఞాతవాసి భారీ నష్టాలనే మిగిల్చింది. బాక్సాఫీస్ ముందు బోల్తా పడిన ఈ సినిమా తాజా ఆన్లైన్లో మాత్రం ఆల్‌టైం రికార్డ్లను సెట్ చేస్తోంది. అజ్ఞాతవాసి హిందీ డబ్బింగ్ వర్షన్‌ను ఎవడు 3 పేరుతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటింది. అంతేకాదు ఈ ఘనత సాధించి తొలి దక్షిణాది చిత్రంగా రికార్డ్ సృష్టించింది అజ్ఞాతవాసి. -
‘అజ్ఞాతవాసి’పై స్పందించిన ఎన్టీఆర్
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లోతెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసిపై స్పందించాడు. ‘అజ్ఞాతవాసి ప్రభావం అరవింద సమేతపై ఉంటుందని నేను భావించటం లేదు. ప్రతీ సినిమా ఓ సరికొత్త ప్రయాణం. నా కెరీర్లో కూడా ఫ్లాప్స్ వచ్చాయి. ఒక ఫ్లాప్ ప్రభావం ఆ తదుపరి చిత్రం మీద ఉంటుందని నేను నమ్మను. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ సినిమా’ అన్నాడు ఎన్టీఆర్. -
ఫ్లాప్ దర్శకుడితో ఎన్టీఆర్, ఫ్యాన్స్ ఖుషీ
జై లవ కుశ సినిమా తరువాత చిన్న గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి డిజాస్టర్ కావటంతో ఎన్టీఆర్ సినిమాపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలకు ఫుల్స్టాప్ పెడుతూ ఈ నెలాఖరున త్రివిక్రమ్ సినిమాను ప్రారంభిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్‌ను తెర మీదకు తీసుకువచ్చారు. ఓ భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో తరువాతి సినిమా చేసిన ఎన్టీఆర్ ప్రతీసారి ఘనవిజయం సాధించాడు. హార్ట్ ఎటాక్ తో ఫ్లాప్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌తో టెంపర్ సినిమా చేసి సక్సెస్ సాధించాడు ఎన్టీఆర్. తరువాత వన్ నేనొక్కడినే లాంటి డిజాస్టర్ తరువాత సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో చేసి మరో విజయాన్ని అందుకున్నాడు. సర్థార్ గబ్బర్‌సింగ్‌లాంటి భారీ డిజాస్టర్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు అదే తరహాలో అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ఇచ్చిన త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే ఎన్టీఆర్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. -
మహేష్, వెంకీలను కాదని..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి తీవ్రంగా నిరాశపరచటంతో ఎన్టీఆర్ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. అయితే ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ మహేష్ బాబు లేదా వెంకటేష్‌లలో ఒకరితో సినిమా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ యంగ్ హీరో నానితో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే త్రివిక్రమ్ ఇటీవల నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి యంగ్ మరీ నానితో సినిమాను రూపొందిస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. -
త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడా..?
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి రిలీజ్‌కు ముందే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. అదే సమయంలో ఈ సినిమాను అనిరుధ్ సంగీతమందిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అజ్ఞాతవాసి రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. సినిమా ఫెయిల్యూర్‌కు ఆడియో ఆకట్టుకునేలా లేకపోవటం కూడా ఓ కారణం అన్న టాక్ వినిపించింది. దీంతో త్రివిక్రమ్ అండ్ టీం ఆలోచనలో పడ్డారు. ఎన్టీఆర్ సినిమాకు మరో సంగీత దర్శకుడిని తీసుకోవాలని భావిస్తున్నారట. అనిరుధ్‌ను పక్కన పెట్టి తెలుగులో వరుస మ్యూజికల్ హిట్స్ సాధిస్తున్న తమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అదే సమయంలో సంగీత దర్శకుడి విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
అజ్ఞాతవాసికి మరిన్ని కష్టాలు..
సాక్షి, సినిమా : పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర కథ ‘కాపీ వివాదం’ మరో మలుపు తీసుకుంది. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మాతృక చిత్రం లార్గో వించ్(ఫ్రెంచ్) దర్శకుడు జెరోమ్ సల్లే సిద్ధమైపోయారు. ఈ మేరకు తన ట్విటర్లో ఆయన సంకేతాలు అందించారు. ‘‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్ నోటీసులు పంపటం ’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' చిత్రానికి అజ్ఞాతవాసి కాపీ అనే ప్రచారం జరిగిన సమయంలో... ఇండియాలో రీమేక్ హక్కులను దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపటంతో.. చివరకు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఆ వెంటనే తెర పైకి వచ్చిన లార్గొ వించే దర్శకుడు జెరోమ్ సల్లే చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన కథనాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశాడని సినిమా చూశాక సల్లే వ్యాఖ్యానించటం విశేషం. కొద్దిరోజుల క్రితం ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో?’’ అంటూ మరో ట్వీట్ చేసి చర్యలకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ నుంచి స్పందన లేకపోవటంతో ఆయన లీగల్ నోటీసులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నెగటివ్ టాక్‌తో ఇప్పటికే ఈ చిత్రానికి భారీ డ్యామేజ్ కాగా, ఇప్పుడు న్యాయపరమైన చిక్కులతో మరో దెబ్బ తగలబోతోంది. Indian cinema has all the necessary talent and creativity for not having to plagiarize. And the silence from #Agnathavaasi team since one week is deafening. So let’s take action now. #LegalNotice — Jérôme Salle (@Jerome_Salle) 18 January 2018 Mood #LargoWinch #Agnathavasi pic.twitter.com/w2uLnwo9kD — Jérôme Salle (@Jerome_Salle) 17 January 2018 -
యువకుడిని చితకబాదిన పవన్ అభిమానులు
-
అజ్ఞాతవాసి బాలేదన్నందుకు..
తన అభిమాన హీరోను అభిమానులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి సినిమాలు హిట్ అయినా, ఫట్ అయినా ఫ్యాన్స్‌లో అభిమానం ఏమాత్రం తగ్గదు. అయితే ఒక్కోసారి మాత్రం అభిమానం వెర్రితలలు వేస్తుంది. తమ అభిమాన హీరోను ఒక్క మాట అన్న సహించలేరు. గొడవలకు దిగుతారు. దాడులు, అల్లర్లకు పాల్పడుతారు. తాజా అలాంటి సంఘటనే జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరకుపోయారు. తన నాయకుడు నటించిన ఆఖరి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకున్నారు. కానీ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పవన్ అభిమానులు సైతం బహిరంగానే సినిమాపై తమ అసంతృప్తి వెల్లగక్కారు. సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు పెట్టారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పోస్టు చేశారు. అలాగే ఓ పవన్ కల్యాణ్ అభిమాని కూడా అజ్ఞాతవాసి బాగాలేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో చూసి ఇతర అభిమానులు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వ్యక్తిని వెతికి మరీ పట్టుకొని చితక బాదారు. పవన్ కల్యాణ్ ఫోటోకు మొక్కాలంటూ పిడిగుద్దులు కురిపించారు. పవన్ గురించి ఏమనుకుంటున్నావ్ అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. చొక్కా విప్పించి అర్థనగ్నంగా పవన్ ఫ్లెక్సీ ముందు మోకాళ్లపై కూర్చోపెట్టించారు. రాయలేని విధంగా బూతులు తిడుతూ, పరిసరాల్లో ఈడ్చి, తిప్పి కొట్టారు. ఇంకో సారి ఇలా చేయనని బాధితుడు బ్రతిమాలినా, విడిచిపెట్టమని వేడుకున్నా వదిలిపెట్టలేదు. భవిష్యత్తులో పవన్ కల్యాణ్‌ను ఎవరైనా ఏమైనా అంటే వారికి ఇదే శిక్షపడుతుందంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
టాలీవుడ్లో కలకలం రేపిన ఐటీ దాడులు
-
జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్
సాక్షి, హైదరాబాద్: పలువురు సినీ ప్రముఖుల కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు బుధవారం దాడులు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన జైసింçహా చిత్ర నిర్మాత సి.కల్యాణ్, పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబుతో పాటు మరో నలుగురు సినీ ప్రముఖుల కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తొలుత కృష్ణానగర్‌లోని సి.కల్యాణ్ కార్యాలయంలో ఆరుగురితో కూడిన ఐటీ అధికారుల బృందం దాడి చేసి.. ఐదు గంటల పాటు తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఆయన నివాసంలోనూ సోదాలు చేసింది. జైసింహా చిత్రంతోపాటు త్వరలో వీవీ వినాయక్, సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్లో తలపెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన లెక్కలు, పెట్టుబడుల వివరాలను, ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సేకరించినట్లు సమాచారం. -
మహేష్ బాబు సినిమాపై ‘అజ్ఞాతవాసి’ ఎఫెక్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే కలెక్షన్లు భారీగా పడిపోవటంతో డిస్టిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఈ ఎఫెక్ట్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు చిత్ర వర్గాలు. కథా కథనాలతో సంబంధం లేకుండా కేవలం పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ తోనే భారీ మొత్తాలకు అజ్ఞాతవాసి హక్కులు తీసుకున్నారు. దీంతో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మరోక్రేజీ కాంబినేషన్ ఫిలిం భరత్ అనే నేను. శ్రీమంతుడు లాంటి ఘనవిజయాన్ని అందించిన మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అజ్ఞాతవాసి రిజల్ట్ చూసిన తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి సమయంలో ఈ క్రేజ్ కారణంగా కటెంట్ గురించి పట్టించుకోకుండా సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మరోసారి అదే తప్పు జరగకుండా జాగ్రత్త పడే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. -
అజ్ఞాతవాసి ఇక్కడ ఫట్.. అక్కడ హిట్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి‘. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈచిత్రం అభిమానులను నిరాశపరిచింది. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సీన్లకు కోతపెట్టి, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా కలెక్షన్లు కొంతమేర ఊపు అందుకున్నాయి. అయితే సినిమాకు ఇక్కడ కలెక్షన్లు లేకపోయినా ఓవర్సీస్లో మాత్రం బాగా రాబడుతోంది. టాక్ తో సంబంధం లేకుండా 2మిలియన్ల డాలర్ల మార్క్ చేరుకుంది. ఇందులో 1.5 మిలియన్లు ప్రీమియర్ షోల ద్వారానే వచ్చాయి. ఇప్పటివరకు పవన్ సినిమా ఏది ఇంత కలెక్షన్లు రాబట్టకపోవడం గమనార్హం. అమెరికాలో ఎన్నడూలేని విధంగా ఎక్కువ స్క్రీన్లలో అజ్ఞాతవాసి విడుదల చేయడం వల్లే కలెక్షన్లు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ క్లాస్ అమెరికా ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతోంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన మాస్ కంటెంట్ ఉన్న జైసింహా, గ్యాంగ్ చిత్రాలు పోటీ ఇవ్వలేకపోవడంతో అజ్ఞాతవాసికి కలిసొచ్చింది. -
‘అజ్ఞాతవాసి’ ప్రదర్శన నిలిపేస్తారా..!
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే సినిమాకు నెగెటివ్ టాక్ రావటంతో పాటు కాపీ అన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే స్వయంగా ఈ సినిమా ప్లాట్ తన సినిమా ఫ్లాట్‌కు దగ్గరగా ఉందని కామెంట్ చేశారు. అంతేకాదు అజ్ఞాతవాసి నిర్మాతలు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలపై కూడా సల్లే స్పందించారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదు అంటూ తాను చర్యలకు రెడీ అవుతున్నట్టుగా హింట్ ఇచ్చారు. అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా సల్లే ప్రకటించలేదు. ఒకవేళ కాపీ రైట్ ఉల్లంఘన కింద జెరోమ్ సల్లే చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయాలపై ఫోర్బ్స్ తాజా కథనంలో వివరించింది. చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటే సల్లే ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమా డిస్ట్రిబ్యూషన్, ప్రదర్శనలను నిలిపివేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ అదే జరిగితే దర్శకుడి కెరీర్‌పై ఆ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. గతంలో ఇలాంటి సంఘటనల కారణంగా చాలా మంది చిత్ర ప్రముఖులు తమ విశ్వాసాన్ని, కీర్తిని కోల్పోయారని తెలిపింది. అంతేకాదు ఇది త్రివిక్రమ్ కెరీర్‌ను కష్టాల్లో పడేసే అవకాశం ఉందని తెలిపింది. -
ఒక్క సినిమా కూడా వదలట్లేదు..!
విభిన్న చిత్రాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం అమెరికాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న కిరాక్ పార్టీ లో నటిస్తున్న నిఖిల్, షూటింగ్‌కు గ్యాప్ రావటంతో ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు. అక్కడ ఈ యంగ్ హీరో రిలీజ్ అయిన ప్రతీ సినిమా చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల అజ్ఞాతవాసి సినిమా చూసిన నిఖిల్, ‘ ప్రస్తుతం న్యూజెర్సీ 8కె సినిమాస్‌లో.. రచ్చ ఎంట్రీ, పండుగ సమయం’ అంటూ ట్వీట్ చేశాడు. రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన బాలయ్య జై సింహా సినిమాను కూడా ఫిలడల్ఫియాలో ప్రీమియర్ షో చూశాడు నిఖిల్. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు ఈజ్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పండుగ రోజు రిలీజ్ అవుతున్న రంగుల రాట్నంపై నిఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. New Jersey 8k cinemas ... right now. Raccha entry... #PowerStarMass #Agnyathavasi Celebration time 😁😀🤣😃😄 pic.twitter.com/MRQi6Ud9qn — Nikhil Siddhartha (@actor_Nikhil) 10 January 2018 East or West Balayya Babu is the Best... Watching #JaiSimha premiere show #Philadelphia pic.twitter.com/hA1za2I1hS — Nikhil Siddhartha (@actor_Nikhil) 12 January 2018 -
గురూ.. నాకు కొంచెం తిక్కుంది
-
గురూ.. నాకు కొంచెం తిక్కుంది
సాక్షి, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో అగ్ర నటుడు వెంకటేష్ ఓ అతిథి పాత్రలో మెరవబోతున్నాడన్న వార్త అప్పట్లో బాగా వినిపించింది. టైటిల్ కార్డ్స్ లో కూడా వెంకీకి స్పెషల్ థ్యాంక్స్ ఉండటంతో రోల్ ఉంటుందని అంతా భావించారు. కానీ, చిత్రంలో మాత్రం ఆ మెరుపులు లేకుండా పోయాయి. దీంతో ఆ సీన్‌ను కలిపేందుకు అజ్ఞాతవాసి మేకర్లు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వెంకీ-పవన్ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్ చెప్పటం ఆ వీడియోలో ఉంది. పవన్.. గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.. అని వెంకీ చెప్పటం... ‘నాకు కొంచెం తిక్కుంది’ అని పవన్ అంటే... ‘దానికో లెక్కుంది’ అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది. సంక్రాంతి నుంచి ఆ సీన్ చిత్రానికి యాడ్ చేస్తున్నారు. -
సినిమాకు వెళ్తే ప్రాణం పోయింది
సాక్షి, బళ్లారి : స్నేహితులతో కలిసి కొత్త సినిమాకు వెళ్తే ఏకంగా ప్రాణమే పోయిందంటూ మృతుడి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా శాసవాసపురకు చెందిన రాము (25) అనే యువకుడు టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం విడుదల సందర్భంగా మిత్రులతో కలిసి విందు జరుపుకున్నాడు. బళ్లారి నగరానికి వచ్చి ఓ థియేటర్లో అజ్ఞాతవాసి సినిమాకు బుధవారం రాత్రి షోకు వెళ్లాడు. సినిమా మధ్యలో బాత్రూమ్కు వెళ్లాడు. అక్కడ ఫినాయిల్ ఉన్న బాటిల్‌ను కూల్‌డ్రింక్‌గా భావించి సేవించాడు. బాత్రూమ్లోనే అస్వస్థతకు గురయ్యాడు. థియేటర్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై బ్రూస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
‘అజ్ఞాతవాసి’ అక్కడే లెక్క తప్పిందా..!
బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. త్రివిక్రమ్, పవన్‌ల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు నిరాశగా వెనుతిరిగారు. ఎప్పుడు అర్థవంతమైన సంభాషణలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించే త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయటంపై అభిమానులు పెదవి విరిచారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, ఆ సీన్స్‌లో పవన్ నటన, కొడకా కోటేశ్వరరావు పాటలోని పవన్ చేసిన స్టెప్స్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో గుడుంబా శంకర్, సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి సినిమాల్లోనూ ను పవన్ ఇలాంటి కామెడీ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. పవన్ ఒత్తిడి వల్లే అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ తన స్టైల్‌కు పవన్ ఆలోచనలు జోడించి ఇలాంటి కామెడీ సీన్స్ చేసి ఉంటారంటున్నారు అభిమానులు. -
'అజ్ఞాతవాసి'ని ఇంకా ఏమంటారు : తరణ్ ఆదర్శ్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అజ్ఞాతవాసి, ఓవర్ సీస్ లో మాత్రం భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అమెరికాలో హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటీపడి తెలుగు సినిమా టాప్ స్థానంలో నిలిచిందని, తొలిరోజు కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 'అజ్ఞాతవాసి సినిమా అమెరికాలో భారీ వసూళ్లతో మొదలయింది. వీకెండ్ మధ్యలో విడుదలైనా కానీ.. ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(9 కోట్ల 65 లక్షల రూపాయలు)కు పైగానే కలెక్ట్ చేసింది.. ఈ కనెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..?. అమెరికాలో కేవలం ప్రీమియర్ల ద్వారానే 1.5మిలియన్ డాలర్లను అజ్ఞాతవాసి సినిమా దాటేసింది. వర్కింగ్ డే అయినా కూడా.. ఈ రేంజ్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రాన్ని అద్భుతం కాకుండా ఇంకా ఏమంటారు?’ అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. Call it a STORM... Or call it a TSUNAMI or a TYPHOON... Fact is, a Telugu stands TALL at USA Boxoffice along with Hollywood giants... Yes, #Agnyaathavaasi takes an EARTH-SHATTERING start, despite midweek release [Tue] in USA... Data follows... — taran adarsh (@taran_adarsh) 10 January 2018 Telugu film #Agnyaathavaasi takes a FANTABULOUS START in USA... Tue previews $ 1,513,540 [₹ 9.65 cr]... Yes, you read it right: $ 1.5 million on a working day... If this is not AWESOME, what is? @Rentrak — taran adarsh (@taran_adarsh) 10 January 2018 -
అజ్ఞాతవాసికి మరిన్ని చిక్కులు తప్పవా?
సాక్షి, సినిమా : ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై మరో ట్వీట్ చేశారు. టీ సిరీస్ సంస్థతో అజ్ఞాతవాసి మేకర్లు చేసుకున్న సెటిల్ మెంట్ సరిపోలేదేమోనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కదా! అంటూ తన ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన్న హక్కులు కొనుకున్న మరికొన్ని సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అజ్ఞాతవాసి నిర్మాతలకు సల్లే సూచిస్తున్నారు. కాగా, అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్‌కు కాపీ అన్న వార్తలు రావటంతో ఇండియాలో ఆ చిత్ర హక్కులు కొన్న టీ సిరీస్ వారు న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన నిర్మాత టీ సిరీస్ వారితో సెటిల్మెంట్ చేసుకున్నాడు. మీడియాలో ఆ వార్త జోరుగా చక్కర్లు కొట్టినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ.. చిత్ర మేకర్లు గానీ అస్సలు స్పందించలేదు. ఇప్పుడు చిత్రం విడుదలయ్యాక లార్గో వించ్‌కు కేవలం ప్రేరణ మాత్రమే కాదని.. కథ... అందులోని సన్నివేశాలను యాజ్ ఇట్ ఈజ్‌గా దర్శకుడు త్రివిక్రమ్ దించేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని మాతృక చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే కూడా దృవీకరించటం గమనార్హం. I’m afraid a settlement with T-series will not be enough. It’s not only about India. The movie #Agnyaathavaasi has been released worldwide yesterday. https://t.co/FUXkNSZ2fO — Jérôme Salle (@Jerome_Salle) January 10, 2018 -
అజ్ఞాతవాసిపై వర్మ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించాడు. పవన్ కెరీర్లోనే అత్యంత డిజాస్టర్ చిత్రమైన ‘పులి’ ని చూసినట్లుందని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతేకాకుండా సినీ విమర్శకుడు మహేశ్ కత్తి రివ్యూ బాగుందంటూ కితాబిచ్చాడు. ‘నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. I Just saw PULI — Ram Gopal Varma (@RGVzoomin) 10 January 2018 I never saw a PULI who is so tooth less and so claw less and I am simply stunned at how it’s stripes keeps changing and the the most shocking is instead of jumping this PULI just crawls — Ram Gopal Varma (@RGVzoomin) 10 January 2018 పవన్ కన్నా కత్తి చాలా అందగాడు.! సినీ విమర్శకుడు మహేశ్ కత్తి రివ్యూపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఇప్పుడే కత్తి రివ్యూ వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ కన్నా కత్తి చాలా అందంగా కనిపించాడు’అని ట్వీట్ చేశాడు. దీనికి మహేశ్ కత్తి థ్యాంక్స్ చెప్పగా.. జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆది మాత్రం ‘అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది విరిద్దర్నీ చూస్తే.....!!!!!’ అని కామెంట్ చేశాడు. కొద్దిరోజులుగా మహేశ్ కత్తి, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ కత్తిని వర్మ పొగడటం పవన్ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో వర్మ ట్వీట్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
రిస్క్ చేసి చూస్తే మీ ఇష్టం : మహేశ్ కత్తి
సాక్షి, హైదరాబాద్ : భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా బుధవారం విడుదలైంది. తొలిఆట నుంచే సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో పవన్ సినిమాపై క్రిటిక్ మహేశ్ కత్తి.. ఏం రివ్యూ ఇస్తారనేదానిపై ఆసక్తినెలకొంది. ఆమేరకు కత్తి రివ్యూ రాసిన వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కత్తి ఏమన్నారంటే..: ‘‘ సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో)’’ సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో). — Kathi Mahesh (@kathimahesh) January 10, 2018 సాధారణంగా సాధ్యమైనన్ని ఎక్కువ కోణాల్లో సినిమాలను విశ్లేషించే కత్తి మహేశ్.. ‘అజ్ఞాతవాసి’ విషయంలో మాత్రం రెండుముక్కల్లో పనికానిచ్చేశారు. ఇది ఓ ఫ్రెంచ్ సినిమాకు కాపీ అనే విషయంలోనూ గతంలో మహేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సలే.. ‘అజ్ఞాతవాసి’ని చూసి.. ‘నా సినిమాను పోలి ఉంద’ని ట్వీట్ చేయడం గమనార్హం. Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi pic.twitter.com/RwFWAyeUPz — Jérôme Salle (@Jerome_Salle) 9 January 2018 -
అజ్ఞాతవాసి : అది పబ్లిసిటీ స్టంటేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో రిలీజ్ ముందే ఓ ప్రచారం చాలా బలంగా జరిగింది. సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నాడని ఆయన పాత్రే కథను మలుపు తిప్పుతుందన్న టాక్ వినిపించింది. చిత్రయూనిట్ కూడా ఈ ప్రచారాన్ని ఏ దశలోనూ ఖండించలేదు. అధికారికంగా వెంకటేష్ అతిథి పాత్ర చేస్తున్నట్టుగా ప్రకటించకపోయినా, రూమర్ ఖండిచకపోయే సరికి పవన్ వెంకీల జోడి మరోసారి తెర మీద సందడి చేయటం ఫిక్స్ అని భావించారు ఫ్యాన్స్. అయితే సినిమాలో వెంకటేష్ కనిపించలేదు. దీంతో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడన్న రూమర్ పబ్లిసిటీ కోసం చేసుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు వెంకీ కనిపించే సీన్స్ కొద్ది రోజుల తరువాత యాడ్ చేస్తారని కొత్త ప్రచారం మొదలైంది. -
‘అజ్ఞాతవాసి’ గురించి మహేశ్ కత్తి చెప్పిందే నిజమైందా?
సాక్షి, హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఫిలిం క్రిటిక్ మహేశ్ కత్తి చెప్పింది చెప్పినట్లే జరిగిందా? ‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి ప్రొడక్షన్ హౌస్ బలైపోయింద’న్న కత్తి వ్యాఖ్యలు మరోసారి నిజమయ్యాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైన ‘అజ్ఞాతవాసి’... ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ కు ఇన్సిపిరేషన్ కాదు.. మక్కీకి మక్కీ కాపీనే అనే అభిప్రాయం వెల్లడైంది. ఏకంగా ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సలే.. ‘అజ్ఞాతవాసి’ షో చూశాక ‘కాపీ’ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయా దేశాల కాపీరైట్ చట్టాలను అనుసరించి జెరోమ్.. ‘అజ్ఞాతవాసి’ దర్శకనిర్మాతలపై కేసు వేస్తారా, లేదా తెలియాల్సిఉంది. ‘అజ్ఞాతవాసి’పై ఇటీవలే పోస్టు పెట్టిన మహేశ్ కత్తి.. అందులో.. ‘‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’’ అని రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ సినిమా ఫ్రెంచ్ సినిమాను పోలి ఉంటుందనే అభిప్రాయం వెల్లడైనప్పటికీ.. దర్శకనిర్మాతలు స్పందిచలేదు. ఇప్పుడది కాపీనే అని రూఢీఅయిన దరిమిలా వివరణ ఇస్తారో, లేదో వేచిచూడాలి! ‘లార్గో వించ్’ డైరెక్టర్ జెరోమ్ సలే ట్వీట్.. Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi pic.twitter.com/RwFWAyeUPz — Jérôme Salle (@Jerome_Salle) 9 January 2018 -
‘అత్యాశ’వాసి
యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌కల్యాణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే.. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. సర్దార్ గబ్బర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లయితే నష్టాలను భర్తీ చేయాలని ఏకంగా హైదరాబాద్‌లో ధర్నా కూడా చేశారు. మరోవైపు ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీచేయని, సంస్థాగత నిర్మాణం లేని పార్టీ అధినేతగా పవన్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల తొత్తుగా మారి ‘భ’జనసేనగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్లో కూరుకుపోయాడు. ఇక సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోజుకో ట్వీట్‌తో పవన్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇమేజ్ తగ్గలేదని చాటేందుకు అజ్ఞాతవాసి హిట్ చేయడం తప్పనిసరి.. అంతేకాదు.. ఏకంగా బాహుబలి కలెక్షన్లనే పవన్ టార్గెట్‌గా పెట్టుకున్నాడన్న వాదనలు ఉన్నాయి. సరే.. సినిమాలో విషయం ఉండి జనాలకు ఎక్కితే ఎవ్వరూ ఆపలేరు. కానీ ఇష్టారాజ్యంగా ప్రీమియర్ షోల పేరిట దోపిడీ పర్వానికి తెరతీయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా అజ్ఞాతవాసికి రోజుకు ఏకధాటిగా ఏడు షోలు.. అదీ ఒక్క రిలీజ్ రోజుకే కాకుండా రిలీజ్ నుంచి వారం పాటు 24 గంటలూ షోలకు సర్కారు అనుమతినివ్వడం వివాదాస్పదమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ వరుస చిత్రాలతో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కుదేలయ్యారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్‌కు ఒక్క హిట్ సినిమా పడలేదు. ‘ప్రత్యేక దేవుడు’ పాత్ర పోషించిన గోపాల గోపాల, గబ్బర్‌సింగ్ మేనియాతో హిట్టవుతుందని తీసిన సర్దార్ గబ్బర్ సింగ్, రీమేక్‌ను నమ్ముకుని తీసిన కాటమరాయుడు.. ఈ మూడు సినిమాలు బయ్యర్లకు చుక్కలు చూపించాయి. నగరంలో ఓ సినిమా థియేటర్ యజమాని పవన్ మూడు చిత్రాల కలెక్షన్లపై యదార్థంగా చెప్పిన లెక్కలు ఓసారి చూద్దాం. గోపాల గోపాల సినిమాను తన థియేటర్లో ఆడించేందుకు రూ.12 లక్షలకు కొనుగోలు చేస్తే రూ.10 లక్షలు వచ్చింది. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు రూ. 15లక్షలు పెడితే డిజాస్టర్ అయిన ఆ సినిమాకు కేవలం రూ. 6 లక్షల కలెక్షన్లే వచ్చాయి. అంటే రూ.9లక్షలు పోయాయి. ఇక కాటమరాయుడు సినిమాను రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే.. అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాకు రూ.5 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే ఏకంగా పది లక్షలు పోయాయన్నమాట. ఇదంతా ఒక థియేటర్ కలెక్షన్ మాత్రమే. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద ఆ మూడు సినిమాల వల్ల ఎన్ని రూ.కోట్లు పోయాయో అర్థం చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకు సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా నష్టాలను భర్తీ చేసే క్రమంలో కాటమరాయుడు సినిమా హక్కులు ఇస్తే అది మరింతగా నష్టాల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో సర్దార్ గబ్బర్‌సింగ్, కామటరాయుడు సినిమాలను కొనుగోలు చేసిన సంస్థ ఏకంగా రూ. 7కోట్ల నుంచి రూ.8 కోట్ల నష్టాల్లో మునిగినట్టు తెలిసింది. ఇక ఆ తర్వాత సదరు సినీపంపిణీ సంస్థ ఇప్పటివరకు మరే సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయలేని పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. అజ్ఞాతవాసితో దండుకోవాలని.. యాధృచ్ఛికమో.. ఇతరత్రా కారణాలేవైనా కావొచ్చు గానీ.. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఈ నాలుగేళ్లలో రిలీజ్ అయిన పవన్ సినిమాలన్నీ వరుసగా దెబ్బతిన్నా అజ్ఞాతవాసికి హైప్ ఏర్పడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేదిల ట్రాక్ రికార్డు నేపథ్యంలో బయ్యర్లు అజ్ఞాతవాసిపై ఎగబడ్డారు. ఇదే అదనుగా ఇంచుమించు బాహుబలి–2 రేట్లకు సినిమాను విక్రయించారు. వాస్తవానికి జిల్లాలో బాహుబలి–1 రూ. 7కోట్లకు కొనుగోలు చేయగా రూ. 10 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి–2 సినిమా రూ. 14 కోట్లకు కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 18 కోట్ల వరకు వసూలు చేసిందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇదే రికార్డు. ఇప్పుడు పవన్ అజ్ఞాతవాసి సినిమాను ఏవీ సినిమాస్ అనే సంస్థ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. అంటే ఆ వసూళ్లు రావాలంటే సినిమా బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాలి. ఇక్కడే పవన్‌కల్యాణ్ సినిమా నిర్మాతలు అడ్డగోలు వసూళ్లకు తెరలేపారన్న వాదనలు బలంగా ఉన్నాయి. అప్పుడు బాహుబలుడు.. ఇప్పుడు అజ్ఞాతవాసీ .. అల్లుడు గారే అజ్ఞాతవాసి సినిమా విశాఖ జిల్లా హక్కులను రూ.11.50కోట్లకు ఏవీ సినిమాస్ కొనుగోలు చేసింది. వాస్తవానికి ఆ సంస్థలో ప్రధాన వాటా మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు(అంజిబాబు) కుమారుడు ప్రశాంత్‌దేనని తెలుస్తోంది. జిల్లాలో బాహుబలి–2 కూడా ఇదే సంస్థ పంపిణీ చేసింది. రోజంతా సినిమానే.. ఇంతముందెన్నడూ ఏడు షోలకు అనుమతించిన పరిస్థితి లేదు. బాహుబలి సినిమాకు ఐదు షోలకు అనుమతిస్తేనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు రాత్రీపగలు తేడా లేకుండా థియేటర్లలో అదే పనిగా సినిమా ఆడించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలివ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ లెక్కన థియేటర్లను క్లీన్ చేయడానికి కూడా సమయం ఉండదేమోనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారంరోజుల పాటు ఒక్క ఐనాక్స్ (బాల్కనీ రూ.175) మినహా ఏ థియేటర్లోనైనా బాల్కనీ టికెట్ రేటు రూ.200కు పెంచేయడం దోపిడీ కాక మరేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో బాహుబలి విడుదల సమస్యలోనూ టికెట్ రేట్ లు పెంచటం విమర్శలకు తావిచ్చింది. అలాగే నగరంలోని ప్రతి థియేటర్ వద్ద రాత్రి వేళల్లో బందోబస్తుకు ఓ ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమించనున్నామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. -
అజ్ఞాతవాసికి ప్రత్యేక ప్యాకేజీ...
-
అజ్ఞాతవాసికి ఏపీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ
సాక్షి, అమరావతి : అవసర సమయాల్లో ‘అజ్ఞాతవాసి’ గా ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడి ఆదుకునే పవన్‌కల్యాణ్ నటించిన సినిమాకు రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి రూపంలో సంక్రాంతి కానుక బహూ కరించారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా బుధవారం రిలీజ్ కానుంది. ఈ కమర్షియల్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిచ్చింది. పదో తేదీ నుంచి 17 వ తేదీ వరకూ అజ్ఞాతవాసి సినిమాకు రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనల అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. పలు సందేశాత్మక, చారిత్రాత్మక, సాంఘిక సినిమాలు వస్తున్నా పట్టించుకోని చంద్రబాబు తనకు అప్పుడప్పుడు ఆపద్బాంధవుడిలా మారుతుండే పవన్ కళ్యాణ్ కమర్షియల్ సినిమాకు ఈ రాయితీ ఇవ్వడంపై సినీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అదనంగా ఒక్క షో వేసుకునేందుకు మాత్రమే అనుమతినిచ్చినట్లు సమాచారం. అస్మదీయులకే రాయితీలు... సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలను ప్రోత్సహించేందుకు అప్పుడప్పుడూ రాయితీలు ప్రకటించడం ఆనవాయితీ. అలాగే మన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే వాటికి, చిన్నపిల్లల సినిమాలకు కూడా ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తుంటుంది. కమర్షియల్ సినిమాలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఆనవాయితీలను దాదాపు పక్కనపెట్టేసి తనకు కావాల్సిన వారి సినిమాలకు మాత్రమే రాయితీలు ఇస్తుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. తన బావమరిది, సినీ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దానికంటే ముందు విడుదలైన చారిత్రక సినిమా రుద్రమదేవికి మాత్రం ఎటువంటి పన్ను మినహాయింపులుగానీ, రాయితీలు గానీ ఇవ్వలేదు. భారీ బడ్జెట్‌తో బహుభాషల్లో నిర్మించిన బాహుబలి సినిమాకు కూడా అజ్ఞాతవాసికి ఇచ్చిన తరహాలో అవకాశం ఇవ్వలేదని సినీవర్గాలు అంటున్నాయి. గతంలో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్–150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు విజయవాడలో అనుమతినివ్వకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం పవన్ సినిమాలకు మాత్రం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతివ్వడంపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. నంది అవార్డుల విషయంలో పక్షపాతంపై నటుడు పోసాని కృష్ణమురళి ప్రభుత్వంపై విరుచుకుపడి తనకు వచ్చిన అవార్డు వద్దని తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోల పేరిట విచ్చలవిడిగా రేట్లు అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ షోల టికెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకూ ప్రత్యేక అనుమతి ఉండడంతో అదనంగా మూడు షోలతో కలిసి మొత్తం ఏడు షోలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. తొమ్మిదో తేదీ అర్ధరాత్రి ఒంటి గంటనుంచి మొదలయ్యే ప్రీమియర్ షోలకు డిస్ట్రిబ్యూటర్లు ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచి అమ్మేసుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఒక్కో టికెట్‌ను రూ.800 నుంచి వెయ్యి, రూ.2 వేల వరకూ అమ్ముతున్నారు. దీంతో సాధారణ అభిమానులకు టికెట్లు దొరక్క విజయవాడ ఐనాక్స్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి ఒంటి గంట నుంచే అనుమతివ్వడంతో ఆ సమయంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. లేదంటే భద్రతాపరమైన ఇబ్బందులతోపాటు అల్లర్లకూ అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక కమర్షియల్ సినిమాకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అధికార దుర్వినియోగమేననే వాదన వినిపిస్తోంది. ఫ్రెంచ్ సినిమాకు కాపీ? పవన్ సినిమా టీజర్ లార్గోవించ్ (ప్రెంచ్ సినిమా)తో పోలి ఉండటంతో సినిమా ప్లాట్ కూడా అలానే పోలి ఉంటుందనే అనుమానం వచ్చింది. ఈ సినిమా రైట్స్ టీ సీరిస్ దగ్గర ఉన్నాయి. సినిమా విడుదలయ్యే వరకు ఆగి తరువాత చూసుకుందామని సినిమా రైట్స్ కలిగిన వారు అనుకుంటున్నారని సమాచారం. ఈలోపు చిత్ర బృందం టీ సీరిస్తో రూ.20 కోట్ల బేరం కుదుర్చుకుందనే సమాచారం కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ కూడా వాయిదా వేశారా అనే అనుమానాలున్నాయి. ‘అజ్ఞాతవాసి’కి ఐదు షోలు ♦ ఉదయం 8 గంటలకు స్పెషల్ షో.. 17వ తేదీ వరకు హోంశాఖ అనుమతి సాక్షి, హైదరాబాద్: పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాను రోజూ ఐదు షోలు వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏ సినిమా అయినా రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 వరకు నాలుగు షోలు నడుస్తుంటాయి. అజ్ఞాతవాసి యూనిట్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం 8 గంటలకు స్పెషల్ షో వేసుకునేలా అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు. అయితే పవన్‌కల్యాణ్ ఇటీవల సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. స్పెషల్ షోకు అనుమతి నేపథ్యంలో సీఎంతో పవన్ భేటీ దీని కోసమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
‘అజ్ఞాతవాసి’లోకి అన్నయ్య.. తేజు కొత్త ప్రొఫైల్ పిక్!
హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ’అజ్ఞాతవాసి’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అభిమానులు ఇదే అంశంపై పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్‌తోపాటు చిరంజీవి కూడా దర్శనమివ్వడం గమనార్హం. అయితే, ఇది ఒరిజినల్ పోస్టర్ కాదని తెలుస్తోంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలోని చిరు పోజును.. అజ్ఞాతవాసి పోస్టర్లో అభిమానులే ఫొటోషాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు ఈ పోస్టర్‌ను ట్విట్టర్లో పంచుకోగా.. తాజాగా మెగాహీరో, చిరంజీవి, పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. న్యూప్రొఫైల్ పిక్ అంటూ ఈ పోస్టర్‌ను తేజు ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. #NewProfilePic pic.twitter.com/7UcKWVU7xB — Sai Dharam Tej (@IamSaiDharamTej) January 9, 2018 -
‘అజ్ఞాతవాసి’పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: విడుదలకు ముందురోజు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’పై విజయవాడలో ఫిర్యాదు నమోదైంది. ఈ సినిమాలో ఒక పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోటేశ్వరరావు అనే న్యాయవాది మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘కొడకా కోటేశ్వరరావు ఖరుసైపోతవురో..’ పాట కోటేశ్వరరావు అనే పేరు గల వ్యక్తులను కించపర్చేవిధంగా ఉన్నదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని ఆయన కోరారు. కాగా, తమపై విమర్శలు చేస్తున్న కత్తి మహేశ్‌ను తిడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పాటకు స్పూఫ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ‘అజ్ఞాతవాసి’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలంగాణలో ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ అర్ధరాత్రి నుంచి ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ షోలు మొదలవుతాయి. అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షోలు వేసేందుకు ఏపీ సర్కారు అనుమతిచ్చింది. ప్రత్యేక ప్రదర్శనలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ధియేటర్ల యాజమాన్యాలు వెనక్కు తగ్గాయి. స్పెషల్ షోలు వేయడం లేదని, ప్రత్యేక ప్రదర్శనల పేరుతో ఎవరైనా టిక్కెట్లు అమ్మితే కొనొద్దని అభిమానులకు సూచించాయి. ఈమేరకు హైదరాబాద్‌లోని భ్రమరాంబ, మల్లికార్జున ధియేటర్ల యాజమాన్యం ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. -
‘అజ్ఞాతవాసి’కి అనుమతి నిరాకరణ
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ రోజు అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేసేందుకు అనుమతి నిరాకరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక షో వేసేందుకు అనుమతించిన నేపథ్యంలో తెలంగాణాలోనూ ప్రీమియర్ షోలకు అనుమతి లభిస్తుందని భావించారు. అయితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించారు. ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి ప్రత్యేక షోలు వేసేందుకు భ్రమరాంభ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లలో ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించటంతో రేపు ఉదయం (10-01-2018) ఎనిమిది గంటలకు తొలి షో పడనుంది. -
‘పవన్ ప్రత్యేకమైన వ్యక్తి’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ బుధవారం అజ్ఞాతవాసిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. అందుకు తగ్గట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో షోస్ వేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది అజ్ఞాతవాసి. చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది హీరోయిన్ అను ఇమ్మాన్యూల్. పవన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్న అను.. ఎంతో క్రేజ్ ఉన్న ఆయన సాధారణంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. షూటింగ్ లేకపోతే విదేశాల్లో రిలాక్స్ అవుతారని ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువని, ఆయనతో కలిసి పని చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. -
పవన్.. మళ్లీ సైకిల్ ఎక్కుతాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి ట్రైలర్ ఎట్టకేలకు వచ్చింది. గత సాయంత్రం నుంచి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఎదురు చూసేలా చేసిన నిర్మాతలు ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే... ఓ కుర్చీని తయారు కావటానికి ఓ చెట్టు పడే నొప్పిని వివరిస్తూ.. జీవితంలో కోరుకునే ప్రతీ సౌకర్యం వెనుక ఓ మినీ యుద్ధం ఉంటుందన్న పవన్ డైలాగ్ ఆకట్టుకుంది. మరో నటుడు ఆది పినిశెట్టిని కూడా ఇందులో స్పష్టంగా చూపించారు. ఆపై ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ కలర్ ఫుల్‌గా ముందుకు సాగింది. చివర్లో వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడా? అని మురళీ శర్మ అంటే.. ఏది ఎక్కినా ఫర్వాలేదుగానీ మనల్ని ఎక్కకుంటే చాలూ అని రావు రమేష్ బదులివ్వటం... వీడి చర్యలు ఊహాతీతం డైలాగు ఆకట్టుకున్నాయి. మొత్తానికి టీజర్లో అత్తారింటికి దారేది ఛాయలున్నాయన్న విమర్శలకు ట్రైలర్ కాస్త చెక్ పెట్టిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. -
‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ రెడీ కానీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్ తాజా చిత్రం అజ్ఞాతవాసికి సంబంధించి ప్రతి విషయంలో అభిమానులకు నిరీక్షణ తప్పటం లేదు. ఫస్ట్ లుక్, టైటిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. తరువాత టీజర్, ఆడియోలను వెంట వెంటనే రిలీజ్ చేసినా.. ప్రస్తుతం ట్రైలర్ కోసం మరోసారి నిరీక్షణ తప్పటం లేదు. రిలీజ్ కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ట్రైలర్ ను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ ఇప్పటికే రెడీ అయినా.. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాని కారణంగా విడుదల చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. సెన్సార్ అధికారి మారటంతో ఆలస్యమైందంటున్నారు. దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం కూడా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ శుక్రవారం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ చిత్రయూనిట్ మాత్రం రిలీజ్ పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొలిసారిగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. -
చిన్నారి నేస్తం.. ఖుషీ అయిన పవన్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి పోలెండ్ చిన్నారి జిబిగ్జ్(బుజ్జి) గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కష్టమైనప్పటికీ.. తెలుగు మీద అభిమానంతో తెలుగు పాటలు పాడటం, డైలాగ్‌లను చెప్పటం.. వాటిని పోస్టు చేయటం ద్వారా వార్తల్లో నిలవటం చూస్తున్నాం. తాజాగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలోని కొడకా కోటేశ్వర రావు పాటను పాడిన ఈ చిన్నారి.. మరోసారి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పిల్లాడి పాట ట్రెండ్ కావటంతో పవర్ స్టార్ అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. చివరకు అతగాడు పవన్‌ను కూడా ఫిదా చేసి పడేశాడు. చిన్నారి పాట పాడిన విధానానికి ఇంప్రెస్ అయిన పవన్ .. ‘‘చిన్నారి నేస్తం.. నీ పాట నాకు చేరింది. నువ్వు ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకకు కృతజ్ఞతలు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక జిజిగ్జ్ అయితే పాటతో కూడిన ఫోటోనే ట్విట్టర్లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవటం విశేషం. గతంలో అఖిల్ హలో చిత్రంలోని పాటను కూడా పాడి నాగ్‌ను ఆకట్టుకున్న విషయం విదితమే. Hey POWER STAR... What an ELECTRIFYING song you sang. KODAKAA KOTESHWAR RAO is at its best. My gift to you in 2018 is my rendition. If this tweet reaches you, please let me know your impressions. This is ZBIGS from poland.@PawanKalyan #HBDLEADERPAWANKALYAN pic.twitter.com/kw8qnUi2K4 — zbigniew ( Bujji) (@ZbigsBujji) 1 January 2018 Dear zbigsbujji, My dear little friend Thankyou for your New Year gift. Your message has reached me.May God bless you! - Pawan Kalyan https://t.co/G2ZZZhjGo1 — PK Creative Works (@PKCreativeWorks) 4 January 2018 -
ప్రవాసాభిమానులకు పవన్ సందేశం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. గతంలో మరే భారతీయ సినిమా రిలీజ్ చేయనంత భారీగా అజ్ఞాతవాసి సినిమాను ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకుల కోసం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు పవన్. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన పవర్ స్టార్, వారి అండగా ఇక్కడ కోట్లమంది ప్రజలు ఉన్నారని భరోసా ఇచ్చారు. ‘పద్దెనిమిదేళ్ల క్రితం బద్రి సినిమా కొన్ని సెంటర్లలో రిలీజ్ అయితేనే అది పెద్ద విజయంగా భావించాం. ఇప్పుడు అజ్ఞాతవాసి ఇంత భారీగా రిలీజ్ అవ్వటం ఆనందంగా ఉంద’న్నారు పవన్. ప్రవాసాభిమానులకు పవన్ సందేశం -
స్టార్ హీరో సరసన మరో ఛాన్స్
టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సంక్రాంతి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి సినిమాతో పాటు కోలీవుడ్‌లో సూర్య సరసన నటించిన గ్యాంగ్ సినిమాలు సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరోసారి కోలీవుడ్ టాప్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తిసురేష్. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'అజ్ఞాతవాసి' వర్కింగ్ స్టిల్స్
-
చిక్కుల్లో 'అజ్ఞాతవాసి'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోయింది. ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. ‘అజ్ఞాతవాసి’ కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. 2008లో వచ్చిన ‘లార్గో వించ్’ కు ‘అజ్ఞాతవాసి’ కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన 'లార్గో వించ్' సూపర్ హిట్ అయింది. దీంతో హిందీలో రీమేక్ చేయడానికి టీ సిరీస్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్ రావడంతో అలెర్ట్ అయిన టీ సిరీస్ సంస్థ ‘అజ్ఞాతవాసి’ దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న ‘అజ్ఞాతవాసి’ కి తాజావివాదం కలం కలం రేపుతోంది. -
చిరు కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో!
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో లైన్ క్లియర్ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఒక్కరోజు ముందే అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్ షో పడిపోనుంది. అయితే మెగా ఫ్యామిలీ కోసం రెండు రోజుల ముందుగానే 'అజ్ఞాతవాసి' స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్టు సమచారం. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్‌లో ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పవన్ కెరీర్లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
విషస్ చెప్పడానికా? ప్రీమియర్ల పర్మిషన్ కా?
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తనదైన శైలిలో స్పందించారు. వరుస పోస్టులతో విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ‘ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్...అబ్బా!!! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేదా వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది. దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ !’ అని సెటైర్ వేశారు. "తెలంగాణాలో నా బలం నాకుంది" - పవన్ కళ్యాణ్ నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అంత బలం ఉంది. ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్!!! అని మహేశ్ కత్తి ఆరోపించారు. అవసరం, కాలం రాజకీయనాయకులను ఎంతటికైనా మారుస్తుందనడానికి కేసీఆర్-పవన్ భేటీ నిదర్శనమని దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అజ్ఞాతవాసి.. ఓ పనైపోయింది
సాక్షి, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మొత్తానికి సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్రం లైన్ క్లియర్ క్లియర్ చేసుకుంది. జనవరి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో.. అంతకు ముందు రోజు అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్ షో పడిపోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. Power Star Pawan Kalyan’s #Agnyaathavaasi censored with ‘UA’ Directed by #TrivikramSrinivas Produced by S. Radha Krishna (chinababu) under @haarikahassine Creations Grand Release on 10th January (US Premieres 9th Jan)#AgnyaathavaasiOnJan10 pic.twitter.com/bJcKvQC0wU — BARaju (@baraju_SuperHit) 1 January 2018 -
పవన్‌తోపాటే అనిరుధ్ కూడా!
సాక్షి, సినిమా : కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో తన డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఏకంగా పవన్ 25వ చిత్రానికే ట్యూన్లు అందించే బంపరాఫర్‌ను కొట్టేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెలోడియస్ పాటలతో అజ్ఞాతవాసి ఆల్బమ్‌ను అందంగా తీర్చి దిద్దాడు కూడా. అయితే అజ్ఞాతవాసికి సంగీతం అందించటంతోపాటు మరో అవకాశం కూడా అనిరుధ్ కొట్టేశాడంట. నిన్న సాయంత్రం విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది పవర్ స్టార్ పాడిన కొడకా కోటేశ్వర రావు సాంగ్. అందులో పవన్‌తోపాటు అనిరుధ్ కూడా స్టెప్పులేయబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలోని ఆ పాట చివర్లో కొద్ది సెకన్లపాటు అనిరుధ్ కూడా కనిపించబోతున్నాడంట. అనిరుధ్‌కి ఇలా స్టార్ల సినిమాల్లో కనిపించటం కొత్తేం కాదు. గతంలో ధనుష్ నటించిన ఓ చిత్రం కోసం అనిరుధ్ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అలరించాడు కూడా. ఇక అజ్ఞాతవాసి విషయానికొస్తే.. టీజర్లతోనే పవన్ రికార్డులు బద్ధలు కొడుతుండగా... ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని పీకే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. https://t.co/KjgFD3MHk0 — PK Creative Works (@PKCreativeWorks) 31 December 2017 -
'అజ్ఞాతవాసి' మూవీ స్టిల్స్
-
‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ రిలీజ్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. తొలిసారిగా అనిరుధ్ స్వరాలందించిన ఆడియోను ఇటీవల అభిమానుల సమక్షంలో ఘనంగా విడువల చేశారు. అయితే ఆడియో రిలీజ్ రోజే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారని భావించినా.. అలా చేయలేదు. సినిమా రిలీజ్ కు మరికొద్ది రోజులు టైం ఉండటంతో ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అభిమానులకు న్యూ ఇయర్ వేడుకలు కాస్త ముందుగానే తీసుకువచ్చేందుకు డిసెంబర్ 26న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది. -
పవన్‌కి సినిమాల మీద క్లారిటీ పోయిందా?
పవన్ కళ్యాణ్ పై కత్తి మహేశ్ మరోసారి గురిపెట్టారు. పవన్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో విడుదల తర్వాత కత్తి మహేశ్ మరోసారి తనదైన రీతిలో సోషల్ మీడియాలో పవన్‌పై విరుచుకుపడ్డారు. ‘పాలిటిక్స్ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ కూడా పోయినట్లు ఉందే.. ఆడియో ఫంక్షన్ అయిపోయింది. సినిమా బాగా అమ్ముడుపోయింది. రిలీజ్‌కి ఇంకా నెల టైముంది. ఇకనైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడదామా..! కనీసం నెలైనా!!!’ అని మహేశ్ కత్తి తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` సినిమా గురించి కూడా విమర్శలు ఎక్కుపెట్టాడు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. -
‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంచ్
-
అప్పుడు నాకు అండగా ఉన్నది మీరు.. త్రివిక్రమ్
‘‘నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే అందర్నీ గుండెల్లో పెట్టుకోవాలనుంటుంది. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని అనుకోలేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అనిరు«ద్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఎన్ని సినిమాలు చేస్తావంటే 10 లేక 12 అనుకున్నా. ‘ఖుషి’ తర్వాత వెళ్లిపోదామనుకున్నా. మీ (అభిమానులు) ప్రేమ నన్ను పాతిక సినిమాల వరకూ తీసుకొచ్చింది. జీవితంలో ఓటమికి భయపడలేదు.. గెలుపుకి పొంగిపోలేదు. ‘జానీ’ ఫెయిలయ్యాక నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు నాకు అండగా నిలవకున్నా నన్నింకా సినిమాల్లో ఉండనిచ్చింది మీరే . భారతీయ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ జెండా, దేశం కోసం నేను రాజకీయాల్లోకి వెళ్లానే కానీ వేరే ఏదీ కాదు. నేను నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు స్నేహితులు, హితులు నాకు చేయూతగా నిలబడలేదు. ‘గోకులంలో సీత’ చిత్రంలో ఓ రచయితగా పని చేసిన త్రివిక్రమ్, మీరు నాకు తోడుగా ఉన్నారు. దర్శకుడిగా ‘జల్సా’ సినిమాతో నాకు హిట్ ఇచ్చారు. అందరూ అంటుంటారు. త్రివిక్రమ్ మీకు బ్యాక్ సపోర్ట్ అట కదా? అని. నేను, త్రివిక్రమ్ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే. నా రక్తం పంచుకుని పుట్టినవారిపై నేనెప్పుడూ కోప్పడలేదు. కానీ, త్రివిక్రమ్‌ని కోప్పడగలను. అంత చనువు ఉంది. ‘జల్సా’ టైమ్‌లో నేను దుఃఖంలోనే ఉన్నా. ‘నా దేశం నా ప్రజలు’ పుస్తకం తెచ్చి ఇచ్చారు త్రివిక్రమ్. అది నాలో స్ఫూర్తి నింపింది. నా మీద తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు నిర్మాతలు. కానీ, రాధాకృష్ణగారు సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. మైఖేల్ జాక్సన్ తర్వాత నాకిష్టమైన సంగీత దర్శకుడు అనిరు«ద్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను రూపాయి సరిపోతుందంటే రూపాయిన్నర ఖర్చు పెడదామంటారు రాధాకృష్ణగారు. పీడీ ప్రసాద్‌గారు, నాగవంశీ ఈ సినిమాకి రథ చక్రాల్లా పనిచేశారు. పవన్‌గారు ఇటలీలో ఉన్నప్పుడు ఈ కథని ఫోనులో రెండు నిమిషాలు చెప్పా. ‘చాలా బాగుంది.. చేస్తున్నాం’ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ కథ అడగలేదు. నేను చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. కల్యాణ్‌గారి నట విశ్వరూపం చూస్తారు. ఆయనతో పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రావాలి. మీరందరూ కోరుకుంటున్న ఆ స్థాయికి ఆయన ఎదగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, నిర్మాతలు ఏయం రత్నం, భగవాన్, పుల్లారావు, ‘దిల్’ రాజు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ టీజర్ : తెలుగులో టాప్, సౌత్‌లో సెకండ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తోంది. ఇప్పటికే తెలుగుతో అతి తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా, అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా అజ్ఞాతవాసి రికార్డ్ సృష్టించింది. తాజాగా దక్షిణాదిలోనూ పవన్ సినిమా టీజర్ జోరు కనిపిస్తోంది. ఈ టీజర్ సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. విజయ్ హీరోగా నటించిన మెర్సల్ టీజర్ కు అత్యధికంగా ఏడు లక్షల నలబై వేలకు పైగా లైక్ లు రాగా అజ్ఞాతవాసి టీజర్ నాలుగు లక్షలకుపైగా లైకుల వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇదే రికార్డ్ కాగా.. దక్షిణాదిలో మాత్రం సెకండ్ ప్లేస్ సాధించింది. అజ్ఞాతవాసి తరువాతి స్థానాల్లో సూర్య తాన సేరంద కూటం, అజిత్ వివేగం, రజనీ కబాలి టీజర్లు ఉన్నాయి. -
అంతర్జాతీయ స్థాయిలో పవన్ మానియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. పవన్ గత రెండు చిత్రాలు నిరాశపరచటంతో అభిమానులు కూడా అజ్ఞాతవాసిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పవన్ గత చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండా పవర్ స్టార్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అంతర్జాతీయ బ్రాండ్ లు పోటి పడుతున్నాయి. గతంలో ఏ దక్షిణాది సినిమాకు చేయని విధంగా అజ్ఞాతవాసి సినిమాను 7 అంతర్జాతీయ బ్రాండ్ లు ఈ సినిమాను ఆడియో ఈవెంట్‌ను స్పాన్సర్ చేస్తుండటం విశేషం. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. -
'అజ్ఞాతవాసి' మూవీ స్టిల్స్
-
అజ్ఞాతవాసి : రికార్డుల వేట మొదలైంది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కట్స్ తో రూపొందించిన ఈ టీజర్ పవన్ అభిమానులు అలరిస్తోంది. చాలా రోజులుగా టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్ రికార్డ్స్ కు తెర తీశారు. కేవలం 30 నిమిషాల్లో పది లక్షలకు పైగా వ్యూస్ తో పాటు లక్షకు పైగా లైక్స్ సాధించి సంచలనం సృష్టించింది ఈ టీజర్. ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతున్న ఈ టీజర్ తెలుగులో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్ గా రికార్డ్ సృష్టించింది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ స్వరాలందించారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా జనవరి 10న పేక్షకుల ముందుకు రానుంది. -
అమెరికాలో అజ్ఞాతవాసి రికార్డు
సాక్షి, హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. విడుదలకు మందే ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు సృస్టించిన అజ్ఞాతవాసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని స్క్రీన్లలో విడుదల కాబోతోంది. ఏకంగా 209 ప్రాంతాల్లో విడుదల కానుంది. మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సోషల్ మీడియా ఫేస్బుక్లో వెల్లడించింది. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్, హీరోయిన్లుగా నట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే హీరోయిన్లు కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయేల్‌లు తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. -
వారణాసి ఒడ్డున పవిత్ర గంగానదిలో..