MP seat
-
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం
సాక్షి ప్రతినిధి, కడప/తిరుపతి సిటీ/పాడేరు/పార్వతీపురం టౌన్: వరుసగా మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికై వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. కడప పార్లమెంటరీ స్థానంలో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ అవినాష్‌రెడ్డికి 5,97,101 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి 5,31,611 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. అవినాష్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి భూపేష్రెడ్డిపై 65,490 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బద్వేలు, పులివెందుల నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భూపేష్ ఆధిక్యత సాధించారు.మాజీ సీఎం నల్లారిపై మిథున్‌రెడ్డి జయకేతనంరాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని మట్టి కరిపించారు. దాదాపు 76,071 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటర్లు మిథున్‌రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్టు కనిపించింది. తొలిసారిగా మిథున్‌రెడ్డి 2014లో 1,74,062 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాటి బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన ఓడించారు. 2019లో మిథున్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజార్టీ సా«ధించారు. ముచ్చటగా మూడోసారి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై విజయబావుటా ఎగురవేశారు.తిరుపతి ఎంపీగా గురుమూర్తితిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. మద్దిల గురుమూర్తికి 6,32,228 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 6,17,659 ఓట్లు పోలయ్యాయి. ఎంపీ మద్దిల గురుమూర్తి 14,569 మెజార్టీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.అరకు ఎంపీగా తనూజారాణిఅరకు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజారాణి విజయకేతనం ఎగురవేశారు. అరకు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు తనూజారాణి స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తనూజారాణికి 4,77,005 ఓట్లు రాగా, కొత్తపల్లి గీతకు 4,26,425 ఓట్లు లభించాయి. -
డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినాయ కత్వం ఊహిస్తున్నట్లే తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపించిందని, ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని, మహిళలు, యువత ఆదరించారని, పట్టణప్రాంతంలోనూ తమ పార్టీకే ఓట్లు పడ్డాయని చెప్పారు. ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబా ద్లో బీజేపీ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు.పట్టణప్రాంతాల్లో పోలింగ్ కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. సోమవారం పోలింగ్ సమయం ముగిశాక పార్టీ కార్యాలయం లోకిషన్రెడ్డి మీడియాతో మాట్లా డారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రెచ్చ గొట్టినా ప్రజలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని, లేకపోతే అగ్గిరగిలేదన్నారు.సికింద్రాబాద్, ఆదిలాబాద్ తదితరచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి గోబెల్స్ ప్రచారం చేసినా బీజేపీని ప్రజ లు ఆదరించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఓటేసిన ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ హామీలపై కార్యాచరణఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల అమలుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని పోరాడుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని నేను చెబితే దానిపైనా ఫిర్యాదుచేశారు. మోదీ పేరు ఎత్తకుండా నిషేధం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.ప్రతిదానికీ మోదీని చాలెంజ్ చేశారు. మోదీపై విమర్శలు గుప్పించడం ద్వారా పెద్దనాయకుడు కాలేరని ఆయన గ్రహించాలి. ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుందామని రాహుల్ అనుకున్నట్టున్నారు. ఆయన ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. ఎవరు ఏమిటనేది జూన్ 4న ఫలితాలతో తేలిపోతుంది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.ఓటర్ల జాబితాల్లో సంస్కరణలు తేవాలి‘ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలి. ఓటరు లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ లిస్టులను తనిఖీ చేసి, చనిపోయినవారి ఓట్లను తొలగించాలి. జూబ్లీహిల్స్‌లో ఒక వర్గం వారివి వేల ఓట్లు తొలగించారు. వేల ఓట్లను డిలీట్ అని పేర్కొన్న జాబితాను ఆదివారం రాత్రే మాకు ఇచ్చారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు ఇచ్చినా ఓట్లు లేవని తిప్పిపంపించారు.మా అబ్బాయి ఓటు ఎక్కడో, నా ఓటు ఎక్కడో ఉంటుంది. దీనిపై కేంద్రమంత్రిగా లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. ఓటర్ల వివరాలతో ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే బాగుండేది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. విమోచన అధికారికం‘ప్రతిఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పసుపుబోర్డు, టెక్స్టైల్ బోర్డు వంటి వాటిని మోదీ తెలంగాణకు ఇచ్చారు. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక త్వరలోనే ఆయన చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఎంపీ సీటు కోసం GVL వదలని పట్టు.. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి..
-
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్‌స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్‌షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఫ్యామిలీకి ఎంపీ సీటు..
-
తెలంగాణ కాంగ్రెస్ లో ఫ్యామిలీ పంచాయతీలు
-
మహిళకు మకుటం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అన్నిటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేశారు. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు తీసుకొచ్చారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే. ఐదేళ్లుగా అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను సాధించారు. గత ఎన్నికల్లో మహిళలకు 19 ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా ఇప్పుడు 24కు పెంచారు. ప్రధాన విపక్ష అభ్యర్థులపై వైఎస్సార్సీపీ నుంచి మహిళలనే పోటీకి దించారు. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై బీసీ మహిళ మురుగుడు లావణ్యకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నుంచి వంగా గీతను పోటీకి దించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్సీపీ తరపున బీసీ మహిళ టి.నారాయణ దీపికను బరిలోకి దించారు. విశాఖ ఎంపీ సీటుకు గత ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులే పోటీ చేయగా సీఎం జగన్ చరిత్రను తిరగరాస్తూ బీసీ మహిళ బొత్స ఝాన్సీలక్ష్మికి వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చారు. చాలాకాలంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కోటీశ్వరులే పోటీలో నిలవగా సీఎం జగన్ సాధారణ కార్యకర్త, బీసీ మహిళ గూడూరి ఉమాబాలను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మిగనూరులో టీడీపీ అగ్రవర్ణాలకు టికెట్ ఇవ్వగా బీసీ మహిళ బుట్టా రేణుక వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మహిళా నేతలకు టికెట్లు.. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థులుగా వి.కళావతి(పాలకొండ), పుష్పశ్రీవాణి (కురుపాం), ఎన్ ధనలక్ష్మి(రంపచోడవరం), విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని తానేటి వనిత(గోపాలపురం), శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పిరియా విజయ, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మీ బరిలో ఉన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కంగాటి శ్రీదేవి(పత్తికొండ), బుట్టా రేణుక (ఎమ్మిగనూరు), హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా జోలదరాసి శాంతి, హిందూపురం, పెనుగొండ అసెంబ్లీ స్థానాల నుంచి టి.నారాయణ దీపిక, కేవీ ఉషశ్రీచరణ్, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, మంగళగిరి, గుంటూరు పశి్చ మ, గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానాల నుంచి మేకతోటి సుచరిత, మురుగుడు లావణ్య, విడదల రజని, షేక్ నూరి ఫాతిమా, కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేలు అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ దాసరి సుధ, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి, గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాల నుంచి ఆర్కే రోజా, కళత్తూరు కృపాలక్ష్మిలు పోటీ చేస్తున్నారు. రాజకీయ సాధికారత.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారి హోంమంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్యం, మహిళా శిశుసంక్షేమం లాంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. 26 జెడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 అంటే 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చారు. మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వాటిలో 45 మంది అంటే 64 శాతం మహిళలే ఛైర్పర్సన్లుగా ఉన్నారు. ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు అంటే 55 శాతం మహిళలకే దక్కాయి. సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే దక్కడం గమనార్హం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించగా వీరిలో 53 శాతం మహిళలే ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారు. -
వరంగల్‌కు అరూరి..
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల ఎంపికతో తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది. ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఆదివారం రాత్రి మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను వరంగల్ నుంచి, తాండ్ర వినోద్‌రావును ఖమ్మం నుంచి బరిలో దించింది. ఖమ్మం నుంచి వినోద్‌రావు పేరు మొదట్లో పరిశీలనకు వచ్చినా, ఆ తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావులలో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగింది. ఆ దిశగా జరిగిన పలు పరిణామాలు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే అనూహ్యంగా తాండ్ర వినోద్‌రావు అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 17 స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాల్లో ఐదు బీసీ, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. అయితే ఎస్సీలకు సంబంధించిన మూడు రిజర్వుడ్ స్థానాలను మాదిగ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ తెలిపింది. ఆయా లోక్‌సభ సెగ్మెంట్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు వీరే.... ఆదిలాబాద్: గోడం నగేష్ (ఎస్టీ గోండు) పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ (ఎస్సీ మాదిగ) కరీంనగర్: బండి సంజయ్ కుమార్ (మున్నూరు కాపు) నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ (మున్నూరు కాపు) జహీరాబాద్: బీబీ పాటిల్ (లింగాయత్) మెదక్ : రఘునందన్‌రావు (వెలమ) మల్కాజ్గిరి: ఈటల రాజేందర్ (ముదిరాజ్) సికింద్రాబాద్: జి.కిషన్‌రెడ్డి (రెడ్డి), హైదరాబాద్: మాధవీలత (బ్రాహ్మణ), చేవెళ్ల: విశ్వేశ్వర్ రెడ్డి (రెడ్డి), మహబూబ్‌నగర్: డీకే అరుణ (రెడ్డి), నాగర్‌కర్నూల్: పి.భరత్ (ఎస్సీ మాదిగ), నల్గొండ: సైదిరెడ్డి (రెడ్డి), భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ (గౌడ్), వరంగల్: అరూరి రమేశ్ (ఎస్సీ మాదిగ), మహబూబాబాద్: సీతారాం నాయక్ (ఎస్టీ లంబాడా), ఖమ్మం: తాండ్ర వినోద్ రావు (వెలమ) -
ధనబలం ఉన్న వారికే ఎంపీ సీట్లు
సాక్షి, అమరావతి : తెలుగుదేశంలో పార్టీలో అనుకున్నదే జరుగుతోంది. ధనస్వామ్యానికే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. డబ్బున్నవారికే సీట్లు కట్టబెడుతున్నారు. తాజాగా.. శుక్రవారం ప్రకటించిన టీడీపీ మూడో జాబితాలో ఈ విషయం తేలిపోయింది. ఉదా.. విజయవాడ, గుంటూరు స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కి ఎంపీ సీట్లు కేటాయించారు. నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇక బీజేపీ కోరుతున్న విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ రెండవ అల్లుడు, లోకేశ్ తోడల్లుడు అయిన మోత్కుమిల్లి భరత్‌కు కట్టబెట్టారు. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. కడప నేతకు ఏలూరు సీటు.. ఏలూరు ఎంపీ సీటును మాత్రం అనూహ్యంగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి కేటాయించారు. కడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ కుమారుడైన మహేష్‌కి ఏలూరు సీటు కట్టబెట్టడంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆ సీటును ఆశించి అక్కడ పనిచేస్తున్న గోపాల్ యాదవ్, మాజీ ఎంపీ మాగంటి బాబులను పక్కనపెట్టి మహేష్‌కి ఇవ్వడమేమిటని అక్కడి నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు.. బాపట్ల ఎంపీ సీటును ఆశ్చర్యకరంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కి ఇవ్వడం విశేషం. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే అవాక్కయ్యాయి. ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి కావడంతోపాటు పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. అలాంటి వ్యక్తికి చంద్రబాబు ఏపీలో సీటు ఇచ్చారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్క చంద్రబాబు చాలారోజులపాటు అన్వేషణ కొనసాగించారు. ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూసినా ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్‌కు బాపట్ల సీటు ఇచ్చారు. నిజానికి.. వరంగల్ ఎంపీ సీటు కోసం బీజేపీ తరఫున పోటీచేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా ఏపీలో సీటు ఇవ్వడం గమనార్హం. సోమిరెడ్డికే సర్వేపల్లి టికెట్.. అలాగే, నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో పలువురి కొత్త నేతల పేర్లు తెరపైకి తెచ్చి హడావుడి చేసినా చివరికి అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్బాబుకే ఆ సీటు కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లిని ఎట్టకేలకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు. ఆ సీట్లో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీలో చేరిన తర్వాత సోమిరెడ్డి స్థానంలో మరొకరికి ఇచ్చేలా రాజకీయం చేశారు. ఒక దశలో సోమిరెడ్డి కాకపోతే ఆయన కుటుంబంలో ఎవరికైనా సీటు ఇవ్వాలని చూశారు. కానీ, చివరికి సోమిరెడ్డికే సీటు ఖరారుచేశారు. ధర్మవరం, హిందూపురం.. గరం గరం.. ఇక ధర్మవరం సీటు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ఓ వైపు పరిటాల శ్రీరాం, మరోవైపు వరదాపురం సూరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో.. హిందూపురం ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంతో ధర్మవరం సీటు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథి పేరు ఖరారు చేయడంతో నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ ఆశలు ఆవిరయ్యాయి. ఎంపీ టికెట్ తనదేనని ప్రచారం చేస్తున్న బీజేపీ నేత పరిపూర్ణానందస్వామి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అలాగే, వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి వాసు కారణంగానే టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకు ఎన్నికల్లో టికెట్ లేదని గతంలో నారా లోకేశ్ ప్రకటించినా నెల్లూరు జిల్లా సర్వేపల్లి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఊరించి ఉసూరుమనిపించారు. దేవినేని ఉమాకు షాక్.. వసంతకే మైలవరం టికెట్ మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివాదంగా మారిన పెనమలూరు, మైలవరం అసెంబ్లీ సీట్లకు బోడె ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ పేర్లను ఖరారుచేశారు. మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు గట్టిగా పోటీపడ్డారు. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు దేవినేని ఉమా గట్టిగా పట్టుబట్టినా ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ ధనబలంతో దాన్ని చేజిక్కించుకున్నట్లు చెబుతున్నారు. మైలవరం టికెట్‌ను ఫిరాయింపు నేతకు ఇస్తున్న నేపథ్యంలో పెనమలూరు సీటుకు దేవినేని ఉమా పేరును పరిగణలోకి తీసుకుని అక్కడికి పంపుతున్నట్లు హడావుడి చేశారు. అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను పక్కనపెడుతున్నట్లు హంగామా చేసినా చివరికి ఆయనకే సీటు ఇచ్చారు. దీనివెనుకా భారీగా డబ్బు దండుకునే వ్యూహం అమలైనట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో చిక్కుకున్న బోడె ప్రసాద్ ఎలాగోలా టీడీపీ పెద్దలను సంతృప్తిపరచడంతో ఆయనకే సీటు ఖరారుచేశారు. దీంతో.. రెండు స్థానాల్లో ఏదీ దక్కక టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఉమాను అన్ని రకాలుగా వాడుకున్న చంద్రబాబు చివరికి కరివేపాకులా పక్కన పడేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఎంపీ సీటు గెలిచి సీఎం జగన్ కు కనుక ఇస్తా
-
నన్ను నమ్మి సీటు ఇచ్చిన సీఎం జగన్ కి మాటిస్తున్న..
-
సీఎం జగన్ సాహసం..|
-
నా గెలుపు ఎవరు ఆపలేరు
-
మెదక్ లోక్‌సభ స్థానంపై వీడని సస్పెన్స్..!
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, బీఆర్ఎస్లు రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బుధవారం బీజేపీ మెదక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్‌ను ప్రకటించాయి. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధికారికంగా గాలి పేరును ప్రకటించారు. ఎంపీ టికెట్‌ను పలువురు ఆశించినప్పటికీ అధిష్టానం అనిల్‌కుమార్ వైపే మొగ్గుచూపింది. లోక్‌సభ పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే కారణంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్‌ను ప్రకటించిన వెంటనే గాలి అనిల్‌కుమార్.. పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. అయితే.. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కు అవకాశం కల్పించింది. ముందుగా ఊహించినట్లుగానే పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించిన 2 వ జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు రఘునందన్ సాక్షి కి తెలిపారు. అలాగే మెదక్ ఎంపీ స్థానానికి గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి.. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. తొలుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు వినిపించినా పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్‌ను నిర్మల కలిసి తనకు టిక్కెట్ ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు! -
వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎట్టకేలకు బీఆర్ఎస్ ‘బీ’ఫామ్ దక్కింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌ను ఈసారికి పోటీ నుంచి తప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎంపీని మార్చడం తథ్యమన్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీ నామా చేయడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం కావ్య పేర్లు ప్రధానంగా వినిపించాయి. అరూరి రమేష్ మొదట ఆసక్తి చూపినా.. ఆ తర్వాత ఎందుకో పార్టీ మారాలనే యోచనలో పడటం పార్టీలో గందరగోళానికి తెరతీసింది. ఇదే సమయంలో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రులను కలవడం.. బుధవారం హనుమకొండలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్లో మాట్లాడేకంటే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లి కేసీఆర్‌ను కలిపించారు. ఉమ్మడి వరంగల్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో సుమారు గంటన్నర పాటు చర్చించిన కేసీఆర్.. కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఉన్నత విద్యాభ్యాసం.. సామాజిక సేవలో సీనియర్ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి పెద్ద కూతురైన కావ్య దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ (పాథాలజీ) పూర్తి చేసి వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశారు. గతంలో వర్ధన్నపేట సామాజిక వైద్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆమె బాలికల విద్యా వ్యాప్తి కి విశేషించి కృషి చేస్తున్నారు. మెనుస్ట్రువల్ హైజీన్‌పై కడియం ఫౌండేషన్ ద్వారా వందలాది చైతన్య కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డాక్టర్ కావ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మానుకోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాంనాయక్.. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ను ప్రకటించారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో అలా చేరారో.. లేదో.. ఇలా టికెట్ తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాంనాయక్ కేయూ ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్‌కు దగ్గరైన ఆయన.. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్థానంలో మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఇవ్వాలని కోరగా.. అదీ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్ టికెట్ రాదని తెలిసి, ఈ నెల 10న బీజేపీలో చేరారు. చేరిన మూడు రోజులకే మానుకోట టికెట్ కేటాయించడం గమనార్హం. ఇవి చదవండి: బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు!
నిజామాబాద్: నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. మాస్ లీడర్‌గా పేరుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. సిరికొండ మండలం చీమన్‌పల్లికి చెందిన ఆయన తొలుత పోలీస్ పటేల్‌గా పనిచేశారు. అనంతరం 1981లో చీమన్‌పల్లి సర్పంచ్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1987లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికై న ఆయన 1992లో సిరికొండ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1993లో రాష్ట్ర ఎస్ఎఫ్సీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్టీసీ చైర్మన్‌గా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో మంచి పేరు ఉంది. ఎంపీ నియోజకవర్గంలో మున్నూరుకాపు ఓట్లు ఎక్కువగా ఉండడం.. ఆయన కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో బీఆర్ఎస్ అధినేత బాజిరెడ్డి వైపు మొగ్గుచూపారు. ఆయనకు టికెట్ కేటాయించడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బాజిరెడ్డి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ‘జహీరాబాద్’ అభ్యర్థిగా అనిల్‌కుమార్.. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. గాలి అనిల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన గాలి అనిల్‌కుమార్ పటాన్చెరు నియోజక వర్గంలో స్థిరపడ్డారు. కాగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవి చదవండి: వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు! -
12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్టుగా తాము అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో తేలిందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించినట్టు సమాచారం. బూత్ కమిటీల పనితీరు లోతుగా సమీక్షించి, అవి ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి లోపాలు, లోటుపాట్లు సరిచేసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అన్ని పోలింగ్‌బూత్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలను కలిసి బీజేపీ, మోదీపాలనపై మద్దతు కూడగట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా పర్యటించేందుకు కార్లు, ఇతర వాహనాలపై ఆధారపడకుండా, ప్రతీరోజు బైక్‌లకు జెండాలు కట్టుకుని ఊరూరా తిరగాలని పిలుపునిచ్చారు. తమ పోలింగ్‌బూత్‌ల పరిధిలో ఇదేవిధంగా పనిచేస్తున్నామని చెప్పారు. వెంటనే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో 50 మందితో ఒక్కో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తాను ఓ కాన్ఫరెన్స్కాల్తోనే మూడులక్షల మందితో సంభాషించి, పోలింగ్‌బూత్ కమిటీలకు దిశానిర్దేశం చేసినట్టు పార్టీ నేతలకు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓ స్టార్హోటల్లో పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్ ప్రభారీలు, కన్వీనర్లు, పార్లమెంట్ పొలిటికల్ ఇన్‌చార్జ్‌లతో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్‌బూత్‌లలో చేపట్టాల్సిన కార్యాచరణ, సిద్ధం చేసుకోవాల్సిన వ్యూహాలపై రాష్ట్రనాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీనేతలు డా.కె.లక్ష్మణ్, డీకే.అరుణ, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ రాబోయే రెండునెలలు అన్ని పనులను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేయాలని చెప్పారు. పార్టీనేతలు మరింత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే 12 సీట్లే కాదు 15 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశా లున్నాయని తెలిపారు. ఇదేస్థాయిలో పనిచేస్తే 2029లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చితీరుతుందని నాయకులకు అమిత్‌షా స్పష్టం చేశారు. అమిత్‌షాతో అరూరి రమేశ్ భేటీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరి, వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ముందుగా రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాలను కలిసి చేరిక తేదీపై నిర్ణయం తీసుకోవాలని అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. త్వరలోనే రమేశ్ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాల సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఓ స్టార్ హోటల్లో అమిత్‌షాను కలిసినట్టు సమాచారం. -
‘చేయి’స్తారా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని సీపీఐ, సీపీఎం అనుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. 17 లోక్‌సభ సెగ్మెంట్లలో చెరో సీటులో పోటీ చేస్తామని స్పష్టం చేశాయి. అయితే పొత్తులపై సీపీఐ, సీపీఎం ప్రకటన చేసినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో కామ్రేడ్లు కాస్తంత గుర్రుగా ఉన్నారు. బీజేపీని నిలువరించాలంటే తమ మద్దతు అవసరమని, కాబట్టి కాంగ్రెస్ త్వరగా తేల్చాలని లెఫ్ట్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులపై దృష్టి సారించిందని, రాష్ట్రంలో కూడా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ముందస్తుగా ప్రచారంలోకి దూసుకెళ్లొచ్చని అంటున్నాయి. సీపీఎం వైఖరిలో మార్పు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ముందస్తుగా బీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించాయి. ఆ పార్టీతో పొత్తు చిత్తవడంతో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని అనుకున్నాయి. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు సీపీఐ ఒక్క సీటుకు ఒప్పుకొని కొత్తగూడెంలో విజయం సాధించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్‌తో రాజీప డక ఒంటరిపోరుకు సిద్ధమై 19 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లోనూ కొన్ని జిల్లాలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని బాహాటంగానే విమర్శించినట్టు సమాచారం. కాంగ్రెస్‌తో వెళ్లి ఉంటే కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేదని చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల, బీఆర్ఎస్కు మరికొన్నిచోట్ల మద్దతు ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు కూడా ఆ పార్టీలో తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కే తమ మద్దతు అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేస్తే, రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం బయటకు ఏదీ నేరుగా చెప్పకుండా అంతర్గతంగా బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చా యి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీపీఎం వైఖరిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్‌తోనే ముందుకు నడవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఓట్లతో బయటపడ్డ వాస్తవాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు అసెంబ్లీ స్థానంలో పరువు దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి పాలేరులో 5,308 ఓట్లు, మిర్యాలగూడలో 3,23 4 ఓట్లు, వైరాలో 4,439 ఓట్లు వచ్చాయి. అంతేకాదు మొదట్లో అడిగిన ఐదింటిలోని భద్రాచ లంలో 5,860 ఓట్లు, మధిరలో 6,575 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 3,948 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం అన్నిచోట్లా కలిపి కేవలం 52,349 ఓట్లే సాధించింది. కనీసం ఎక్కడా డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించినట్టుగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంతోపాటు, రెండు ఎమ్మెల్సీలు తీసుకొని ఉంటే ఎలాగోలా గౌరవం దక్కేదన్న చర్చ కూడా సీపీఎంలో జరుగుతోంది. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో సరాసరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి తమ ఓట్లు గణనీయంగా ఉంటాయని లెఫ్ట్ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని, కాబట్టి ఆ పార్టీకి ఎలాగైనా ఎంపీ సీట్లలో గండిపెట్టాలని వామపక్షాలు భావిస్తున్నాయి. చెరో ఎంపీ సీటు ఇస్తే సరేసరి... లేకుంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనూ ఆ పార్టీలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. మద్దతు ఇచ్చినందుకు చెరో ఎమ్మెల్సీ స్థానం కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా
జడ్చర్ల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం రెండు నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్‌సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డికి తన రాజీనామాను సమర్పించానని, సమయం, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు. శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినపుడే సీఎం రేవంత్‌తో చర్చించానని, ఎంపీ టికెట్‌కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానన్నారు. పదేళ్లుగా అనేక ఫైళ్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పటంతో ఈ బాధ్యతలు స్వీకరించి అనేక శాఖల్లో ఫైళ్లలో కదలిక తీసుకువచ్చానన్నారు. తన రాజీనామాను ఆమోదించే వరకు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. అయితే తనకు టికెట్ రావడంలేదని ప్రచారం జరుగుతున్నందున కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మంద జగన్నాథం, సంపత్‌కుమార్‌లకు తాను వ్యతిరేకం కాదని, వారికి టికెట్ అడిగే హక్కు ఉందని అన్నారు. పార్టీ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, టికెట్ ఇవ్వకూడదని ఏ ఒక్క కారణం చెప్పినా.. సర్వేలు అనుకూలంగా లేవని తేలినా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. -
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. త్వరలోనే ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశమై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన వివిధ పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 17 స్థానాలకు గానూ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితా లోనే ఉండే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఈనెల 16వ తేదీ లోపు ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థులు వీళ్లేనా.. తెలంగాణాలోని కీలక లోక్‌సభ స్థానాలకు ప్రధానంగా కొన్ని పేర్లను చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి, కరీంనగర్‌కు బండి సంజయ్, నిజామాబాద్‌కు ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌కి డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్కాజిగిరి టికెట్‌ను మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కాగా మహబూబాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, మహబూబ్‌బాద్ లలో కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్ లలో బీఆర్ఎస్ నేతలపై కమలం పార్టీ కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్ లలో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిటీదే అని చెబుతున్నారు. ఖమ్మం, నల్గొండలలో కూడా బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. -
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు
-
BRS: మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్‌గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్‌కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్‌గానే ఆలోచన చేస్తోంది. ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది..? -
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఎంపీ అభ్యర్థులు కావలెను
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబువి అన్నీ ఢాంబికాలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే.. రాజధాని ప్రాంతం, మాకు పట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం పార్టీ తలలు పట్టుకుంటోంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఇందుకు కారణం. దీంతో ఎన్ఆర్ఐలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ వరసగా రెండుసార్లు గెలిచినా ఇప్పుడు పోటీచేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడం.. పైగా ఎవరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గల్లా జయదేవ్ 2019లో గెలిచిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గాలేరు. ఆయన గుంటూరులో అడుగుపెట్టి రెండేళ్లు దాటింది. మళ్లీ పోటీచేయబోనని అధిష్టానానికి తెగేసి చెప్పేశారు. దీంతో గుంటూరులో పోటీచేసే అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషిస్తున్నా ఫలితం ఉండడంలేదు. మాజీమంత్రి ఆలపాటి రాజా, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోటీచేయాలని అడిగినా వారు ససేమిరా అంటున్నారు. దీంతో గుంటూరులోని ఒక విద్యాసంస్థల చైర్మన్‌ను పోటీచేయాలని కోరినట్లు కూడా సమాచారం. నిజానికి.. 2019లో పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చినా అధిష్టానం అప్పట్లో ఆయన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చి కొంత మొత్తం డిపాజిట్ చేసినప్పటికీ తాను పోటీచేయబోనంటూ ఆయన తప్పుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్ఆర్ఐల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నరసరావుపేట, బాపట్లకూ ససేమిరా.. ఇదిలా ఉంటే.. నరసరావుపేట లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకూ అభ్యర్థి దొరకలేదు. 2014లో చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరా>వుకు టిక్కెట్ ఇచ్చారు. 2019లో రాయపాటి వద్దంటున్నా బలవంతంగా ఇచ్చారు. ఇప్పుడాయన వయస్సు రీత్యా పోటీకి సిద్ధంగాలేరు. దీంతో ఇక్కడ పోటీచేసేవారి కోసం వెతుకుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఎన్ఆర్ఐ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన కూడా అంత ఆసక్తి చూపడంలేదని సమాచారం. ఇక బాపట్ల ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభ్యర్థి దొరకడం టీడీపీకి తలనొప్పిగా మారింది. 2014, 2019లో పోటీచేసిన మాల్యాద్రి ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోవడం, పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం వెతుకుతోంది. ఇక్కడ నుంచి గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ను పోటీచేయించాలని పార్టీ భావిస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో బాపట్ల ఎంపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ బుర్ర బద్దలుకొట్టుకుంటోంది. రూ.వంద కోట్లు చూపిస్తేనే.. మరోవైపు.. ఒక్కో ఎంపీ అభ్యర్థి పోటీ చేయాలంటే కనీసం రూ.వంద కోట్లు చూపించాలని లోకేశ్ అడుగుతున్నారని, అందుకెవ్వరూ ముందుకు రావడంలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. -
డబుల్ డిజిట్లో ఎంపీ సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సంఖ్య (డబుల్ డిజిట్)లో ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడి మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాం«దీతో సహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభకు సెమీఫైనల్ అన్నార ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని, మధ్యప్రదేశ్‌లో నభూతో నభవిష్యతి అనేలా రికార్డ్ స్థాయిలో బీజేపీకి మెజారిటీ వచ్చిందని ఆయన ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ శ్రేణులు సంసిద్ధం అయ్యేలా గురువారం కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ , పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వినర్లు, ఇంచార్జులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, మోర్చాల జాతీయ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలియజేశారు. సమీక్షల తర్వాతే నియోజకవర్గాల్లో సమావేశాలు ప్రస్తుతం అన్ని జిల్లాల్లో శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సమీక్షల తర్వాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు గానూ రానున్న తొంభై రోజులకు ‘ఎలక్షన్ యాక్షన్ ప్లాన్’రూపొందించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ఆ రోజున ప్రతి హిందువు ఇంట్లో దీపం వెలగాలి జనవరి 22న అయోధ్యలో జరిగే భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవంలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున భాగస్వామ్యం కా వాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 22న దేశంలోని ప్రతీ దేవాలయాన్ని అలంకరించి, గుడుల ముందు స్క్రీన్లు ఏర్పాటు చేసి రామమందిర ప్రారం¿ోత్సవాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పా ట్లు చేయాలని ఆయా మందిరాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ప్రతి హిందువు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కిషన్‌రెడ్డి కోరారు. -
Khammam: ఎంపీ సీటుకు కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ !
సాక్షి, ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీటే దక్కుతోంది. ఒక్కటి మినహా మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం డిమాండ్ బాగా పెరిగింది. మరి కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తామంటున్న ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్న నేతలెవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పది స్థానాల్లో సీపీఐ పోత్తుల్లో భాగంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రేవంత్‌రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా ముగ్గురు మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ లోకసభ ఎన్నికలే..తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక ఎత్తైయితే కీలకమైన లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కూడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో అప్పుడే పోరు మొదలైంది. జిల్లాలోనే కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ మోజార్టీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందున లోక్ సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్‌రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ కేంద్రమంత్రి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం ఎంపీ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టిక్కెట్ విషయంపై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోకసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోటీ ఉండనుంది..అధికార పార్టీ అవడంతో కాంగ్రెస్‌లో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఇదీచదవండి..బీర్లు, లిక్కర్ విక్రయాల్లో పరకాల టాప్ -
TS:మాజీ మంత్రికి పెద్దపల్లి ఎంపీ టికెట్!
సాక్షి, పెద్దపల్లి: ఆ మాజీ మంత్రి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏడోసారి ఓడిపోయారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేశారట ఆ మాజీ మంత్రి. మరి గులాబీ బాస్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారా? మాజీ మంత్రికి కాదంటే పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అసలు అక్కడ నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు? పెద్దపెల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీటు కచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నాట్లు చెబుతున్నారు. ధర్మపురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమిపాలైన ఈశ్వర్ ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేశ్ నేతకాని ఉండగా.. చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమిపాలైన బాల్కసుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, వీరిద్దరి కంటే కూడా బెస్ట్ ఛాయిస్ గా గులాబీ బాస్ మాత్రం కొప్పుల ఈశ్వర్ అయితేనే బెటరని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్దఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం... ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్ కు పట్టుండటంతో పాటు.. ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచి ఏడోసారి ఓటమిపాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని పార్టీ అగ్ర నాయకులంతా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈశ్వర్‌ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్ఠానం యోచిస్తుంటే... యవనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు.. వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే, బీజేపీ నుంచి ఈసారి కొత్త ముఖాన్ని పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలూ లేకపోలేదని..ఇప్పటికే ఎస్. కుమార్‌ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిపినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు కాశిపేట లింగయ్య వంటివారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన్ను కమలం పార్టీ అధిష్ఠానం యాక్సెప్ట్ చేస్తుందో, లేదోనన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా బలమైన నేత వస్తే తప్ప.. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ గనుక బరిలోకి దిగితే.. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కు తెర లేవనుంది. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. పొల్టీషియన్స్ అంతా ఎవరి ప్లాన్లల్లో వారు పడ్డారు. అలాగే పార్టీలు కూడా ఏ అభ్యర్థైతే బెటర్.. ఎవరైతే ప్లస్.. ఎవరైతే మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కలిసికట్టుగా ముందుకుసాగుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేలా పోరాడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచినా మరింత గట్టిగా పోరాడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే పట్టుదలతో కృషి ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని, 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు. పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ప్రేంసింగ్‌రాథోడ్, చింతా సాంబమూర్తి, ప్రకాష్‌రెడ్డి తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓడిన స్థానాలపై జాతీయస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి వచ్చే లోక్‌సభ ఎన్నికలకల్లా లోటుపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. లోక్‌సభకు ఓటేస్తామన్నారు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్లినప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మద్దతు తెలిపే ఓటర్లు తాము అసెంబ్లీకి ఎవరికి ఓటేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే అయినా, 80 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పారు. క్రియాశీల ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలి పారు. అధికార బీఆర్ఎస్పై ఐదేళ్లుగా బీజేపీ సాగించిన పోరు వల్ల కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లాభం పొందిందన్నా రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీపై పడి ఏడ్చి బురదచల్లిన వారు ఈ రోజు ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. అక్కడ కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్‌గఢ్, రా జస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకుందని, మధ్యప్రదేశ్‌లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించిందని చెప్పారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి అని చెబుతున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించి రికార్డు సృష్టించారన్నారు. ఇలాంటి రికార్డు దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదన్నారు. పార్టీ పోటీచేసిన స్థానాల్లో ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకుంటామని, ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల సరళి, ప్రభావం చూపిన అంశాలు, తదితర విషయాలపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు, రాబో యే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడం, తెలంగాణ ఎన్నికల తీరుతెన్నులపై సవివరంగా తెలియజేస్తామన్నారు. తమ పార్టీ వారే తనను ఓడించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా, ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొట్టారు: కిషన్‌రెడ్డి రాజాసింగ్ నివాసానికి వెళ్లి అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల అధినేతలు కేసీఆర్, అసదుద్దీన్ ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యే రాజాసింగ్ బలమైన విశ్వాసం, ధైర్యంతో తిప్పికొట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా మజ్లిస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ, ప్రజల ఆశీస్సులతో రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని అన్నారు. అధికార దురి్వనియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా గోషామహల్లో ధర్మం, జాతీయ భావజాలమే గెలిచింద ని పేర్కొన్నారు. సోమవారం గోషామహల్లో రాజా సింగ్ నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనను అభినందించారు. తప్పుడు ప్రచారాలతో అనేక శక్తులు పన్ని న కుట్రలను ఎదుర్కొని బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ను గెలిపించిన గోషామహల్ ప్రజలకు, ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్నరోజుల్లో పార్టీ మరింత విస్తరణకు రాజాసింగ్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. -
పార్లమెంట్ ఎన్నికల బరిలో షకీబ్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. త్వరలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అతను పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున అతను బరిలోకి దిగుతాడు. తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గానికి సంబంధించి షకీబ్‌కు టికెట్ ఖరారైంది. జనవరి 7న బంగ్లాలో ఎన్నికలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో వేలికి గాయమైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షకీబ్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో ఇంటా, బయటా జరిగే వరుస సిరీస్‌లకు అతను అందుబాటులో ఉంటాడా అనేది చెప్పలేదు. షకీబ్‌కు ముందు అతని సహచర ఆటగాడు, మాజీ కెపె్టన్ మష్రఫ్ మొర్తజా గత ఎన్నికల్లో నరైల్ స్థానంనుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ సారి కూడా అతను మళ్లీ బరిలో నిలిచాడు. మూడు ఫార్మాట్లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్‌లు ఆడిన 14,406 పరుగులు చేయడంతో పాటు 690 వికెట్లు తీసిన షకీబ్ ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: సత్యమేవ జయతే అని చెప్పడానికి రాహుల్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి విజ్ఞప్తి చేశారు. ఓం బిర్లాను ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. ఈ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు రాహుల్‌ను అనుమతించాలని శుక్రవారం లోక్‌సభలో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ను అధిర్ రంజన్ కోరారు. ఈ విషయంలో స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని రాజేంద్ర అగర్వాల్ బదులిచ్చారు. -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?
Abhishek Bachchan Politics: సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు దగ్గర సంబంధముంది. ఎంతలా అంటే నటీనటులుగా పేరు తెచ్చుకున్న చాలామంది.. పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ నుంచి త్వరలో పార్టీ పెట్టబోతున్న దళపతి విజయ్ వరకు ఈ లిస్ట్ పెద్దదే.ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ పేరు చెప్పగానే చాలామంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. 50 ఏళ్ల నుంచి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ఈయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా పలు సినిమాలు చేశాడు గానీ ఎందుకో తండ్రిలా హిట్స్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయని అభిషేక్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. (ఇదీ చదవండి: ఆడిషన్స్‌కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి) ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీలోనే అభిషేక్ చేరబోతున్నాడట. అలానే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, 1984లో కాంగ్రెస్ తరఫున ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు కొడుకు అదే స్థానంలో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అమితాబ్ భార్య, అభిషేక్ కి తల్లి అయిన జయా బచ్చన్.. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరి తల్లిదండ్రుల వారసత్వంగా అభిషేక్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలానే సినిమాల్లో రాణించలేకపోయిన అభిషేక్.. మరి పాలిటిక్స్ లో ఏం చేస్తారో చూడాలి. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
ఈ వార్తలకి, చర్చలకు ఫుల్స్టాప్ పెట్టండి: చిరంజీవి
-
ఈ వార్తలకి, చర్చలకు ఫుల్స్టాప్ పెట్టండి: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలను ఖండించిన చిరంజీవి అవన్ని ఒట్టి పుకార్లు అని సోషల్ మీడియా వేదికగా తేల్చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి, చట్ట సభల్లోకి రావడం జరగదని స్పష్టం చేశారు. దయచేసి ఊహాగానాలను వార్తలుగా ప్రసారం చేయొద్దని కోరారు. ఈ వార్తలకు, చర్చలకు ఇప్పటితో ఫుల్స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 'తెలుగు సినీ పరిశ్రమ కోసం, థియేటర్ల మనుగడ కోసం ఏపీ సీఎం జగన్‌ను కలిశాను. ఆ చర్చలను పక్కదోవ పట్టించే విధంగా రాజకీయ రంగు పులుముతున్నారు. వైఎస్సార్సీపీ నాకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం.' అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్లో పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు.దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.#GiveNewsNotViews — Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2022 ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు కలిసిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించానని చెప్పారు. ఇదీ చదవండి: అందుబాటులో వినోదం -
రెండింటిలో.. అంతా ఓకేనా..!
సాక్షి, వరంగల్ : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎదురులేదని.. ప్రజల్లో పూర్తిగా సానుకూల వాతావరణం ఉన్నందున మజ్లిస్ పార్టీతో కలిపి రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన ముఖ్యనేతలతోనూ కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ఇటీవల జిల్లాల పర్యటన తర్వాత ఢిల్లీలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని అర్థమవుతోందని.. తప్పక మరోసారి ఆశీర్వదిస్తారని చెప్పారని సమాచారం. ఈ మేరకు విజయం ఖరారైనందున మెజార్టీపైనే కేడర్ దృష్టి పెట్టాలని ఆయన నేతలకు సూచించారు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి దయాకర్‌రావు లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండగా.. వరంగల్ స్థానానికి గ్యాదరి బాలమల్లు, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. పసునూరి దయాకర్, మాలోతు కవిత గెలుపు కోసం భారీ సభలు నిర్వహించిన కేసీఆర్... ఎప్పటికప్పుడు వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల తీరుపైనా ఆరా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మార్చి 17 నుంచి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలే కీలకమని ప్రకటించారు. శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో ఎమ్మెల్యేలదే పూర్తిగా బాధ్యతని.. మంత్రులు సమన్వయం మాత్రమే చేస్తారని తెలిపారు. శాసనసభ్యులను కాదని మంత్రులు, ఎంపీ అభ్యర్థులు ఏ పని చేయొద్దని కూడా సూచించారు. గతంలో ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ మంత్రి ఎంపీని పొగుడుతుంటే.. అది నచ్చక ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశం కాగా, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని సూచించిన కేసీఆర్... అంతిమంగా పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని స్పష్టం చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వరంగల్ పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ), వర్దన్నపేట(ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పినపాక, భద్రాచలం ఉన్నాయి. వరంగల్ స్థానం పరిధిలో 16,53,474 మంది, మహబూబాబాద్ పరిధిలో 14,23,351 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తెలంగాణలో రికార్డు స్థాయి మెజార్టీ ఈ రెండు స్థానాల్లో రావాలని అధి నేత కేసీఆర్ పదే పదే సూచిస్తున్నారు. విధేయతే ప్రామాణికంగా గెలిచే అభ్యర్థులను నిలబెడతామని చెప్పి టికెట్లు ప్రకటించిన గులాబీ బాస్... బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారన్న కోణంలో కూడా ఆరా తీస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
కేంద్రంలో చక్రం తిప్పేందుకే..
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పేందుకే లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలో కీలకంగా మారితే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావచ్చనే లక్ష్యంతోనే 16 స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఆదివారం ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులతో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో వార్‌వన్‌సైడే ఉందికానీ మెజార్టీ కోసమే పాటుపడుతున్నామన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డీలా పడిపోయిందని మళ్లీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పరిస్థితి చూసి చెందిన డీకే అరుణ, ఆనందభాస్కర్ లాంటి నాయకులు పార్టీని వీడారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కార్యకర్త ఇంటికి వెళ్లి కూడా ఓటు అడుగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ దేనికి కూడా పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కన్పించడంలేదన్నారు. దేశంలో ఎక్కవ లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 4న సీఎం సభ.. వచ్చేనెల 4న మానుకోట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మానుకోట నియోజకవర్గం నుంచే 50వేల మందికి పైగా రావాలన్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన మండలం, గ్రామాలను దత్తత తీసుకుంటామని తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని సీఎం చెప్పారని బాధపడొద్దని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ నిధుల కోసమే సీఎం తాపత్రయపడుతున్నారని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. మానుకోట జిల్లా రూపురేఖలు మారుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలను కీలకంగా తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్కు పోటీ లేదని మెజార్టీ కోసం కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేయాలని కోరారు. ఆడబిడ్డగా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. మానుకోట నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, ఎం.రమేష్, నెహూర్రెడ్డి, మురళి, శ్రీకాంత్‌రెడ్డి, ఫరీద్, డోలి లింగుబాబు, డాక్టర్ నెహ్రూనాయక్, ముత్యం వెంకన్న, కెఎస్‌ఎన్‌రెడ్డి, ఎం రంగారావు ఖాసీం, చిట్యాల జనార్దన్, గడ్డం అశోక్, రఘు, బాలాజీ నాయక్, తేళ్ల శ్రీను, ఆవుల వెంకన్న పాల్గొన్నారు. 16 సీట్లు టీఆర్ఎస్వే .. దామెర: 16 సీట్లు..కారు..కేసీఆర్‌వే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పరకాల నియోజకవర్గ స్థాయి ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం మండలకేంద్రం సమీపంలోని సైలానా బాబా దర్గ ఎదురుగా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని తదనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 16 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారి కేసీఆర్ ప్రధాని అవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీలో నిలిచిన పసునూరి దయాకర్ కు పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ చేయని అభివృద్ధి ఐదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిందన్నారు. రైతుల గురించి ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఆలోచించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా పరకాల నియోజక వర్గానికి నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ 16 సీట్లు గెలిచి కేంద్రంలో కీలకంగా మారి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను, ఖాజీపేట్ రైల్వే డివిజన్‌ను, టెక్స్టైల్ పార్కుకు నిధులను సాధించుకోవచ్చునని పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కేసీఆర్ పాలన ఆందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ మాట్లాడుతూ మొదటిసారిగా గెలిచిన తాను కొంత వరకు పనులు చేయడం జరిగిందని, కేసీఆర్ తనపై నమ్మకంతో రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగిందని అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని తనను భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొంపెల్లి ధర్మరాజు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పులి సారంగపాణి, జాకీర్ అలీ, పోలీస్‌ధర్మారావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సదానందం, నాగిరెడ్డి, దామెరుప్పుల శంకర్, కృపాకర్ రెడ్డి, రాజ్‌కుమార్, రమణారెడ్డి,గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు.. కాంగ్రెస్ పార్టీ జెడ్పీఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న పలువురు సర్పంచ్‌లు సుష్మా , వెంకన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త పాత అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నారు. కాని పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని మెజారిటీ కోసమే పాటుపడాలని పిలుపునిచ్చారు. -
పాలమూరులో టీఆర్ఎస్ శంఖారావం
సాక్షి ,మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జిల్లాకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వనపర్తి జిల్లా నాగవరంలో సాయంత్రం 4గంటలకు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అదే రోజు సాయంత్రం 5:30కు మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లక్ష మందికి మించకుండా జనాన్ని తరలించే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డికి బదులు మన్నే శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం.. ఇప్పటి వరకు గెలుచుకోని నాగర్‌కర్నూల్‌పైనా గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఉన్న టీఆర్ఎస్ ప్రచార వ్యూహాలకు పదునుపెడుతోంది. -
పాలమూరులో కమల..వ్యూహం
సాక్షి, మహబూబ్‌నగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహం రచిస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ ఎలాగైనా వారిని గెలిపించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఈ నెల 29న మహబూబ్‌నగర్‌లోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ఉన్న 50ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి లక్ష మంది చొప్పున రెండు లక్షల మంది జనాన్ని తరలించాలని పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు రెండు సెగ్మెంట్లలో తిరిగి జనసమీకరణ చేయనున్నారు. 29న బహిరంగసభ ముగిసిన మరుసటి రోజు నుండే రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రచారం మొదలు ప్రారంభించే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా నాయకులు రెండు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ శ్రేణులు ఉన్నారు. పాలమూరులో పాగా వేయాలి.. మహబూబ్‌నగర్ స్థానం నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌లో మాత్రం బీజేపీ ఇంత వరకు ఖాతా తెరవలేదు. దీంతో కనీసం ఈ సారైనా తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న కాషాయ పార్టీ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరుకున్న డీకే అరుణకు మహబూబ్‌నగర్ టికెట్ ఖరారు చేసిన బీజేపీ, కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ తనయ బంగారు శ్రుతికి నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించింది. అయితే పాలమూరు నుంచి పోటీ చేస్తోన్న డీకే అరుణ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వ్యక్తిగత ఇమేజ్ ఉన్న అరుణకు, బీజేపీ బలం కూడా తోడవడంతో ఈసారి మహబూబ్‌నగర్‌లో పాగా వేయగలుగుతామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. అరుణ పార్టీ చేరికకు ముందు వరకు పాలమూరు బీజేపీ అభ్యర్థిగా భావించిన రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ నాలుగేళ్ల నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో దాదాపు సఫలీకృతమయ్యారు. ప్రస్తుతం తనకు టికెట్ రాలేదనే అసంతృప్తి శాంతకుమార్‌కు లేదు. ఇదే క్రమంలో శాంతకుమార్ తన క్యాడర్‌తో కలిసి అరుణ గెలుపు కోసం సహకరిస్తానని మీడియా ముందు స్పష్టం చేయడం, బీజేపీ గెలుపుపై పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తాయి. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయనున్న బంగారు శ్రుతికి ఆ ప్రాంతం కొత్త కావడం.. ఆమె తొలిసారిగా పోటీకి దిగుతుండడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహం రచిస్తుందో అనే చర్చ మొదలైంది. -
‘నామా’నే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎట్టకేలకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. నామా పేరును గురువారం అధికారికంగా ప్రకటించడంతోపాటు బీఫాం అందజేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాజకీయ చతురతను ప్రదర్శించి టికెట్ దక్కించుకున్నారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చివరి నిమిషంలోనైనా టికెట్ లభిస్తుందని ఆయన అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పది రోజులుగా ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎవరు దక్కించుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపీ పొంగులేటికి టికెట్ లభించని పక్షంలో టీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన ఎవరివైపు మొగ్గు చూపుతుందనే అంశంపై చివరి నిమిషం వరకు స్పష్టత రాని పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పరాజయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వాన్ని మారుస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేర్లు అధిష్టానం పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. అయితే నాలుగు రోజులుగా అనూహ్యంగా టీఆర్ఎస్ రాజకీయ తెరపైకి నామా నాగేశ్వరరావు ప్రత్యక్షం కావడం.. ఆయన సీఎంను కలిసి పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో నామాకు లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారమైంది. దీనికి అనుగుణంగా నామా మంగళవారం టీడీపీకి, పదవులకు రాజీనామా చేయడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైందనే ప్రచారం ఊపందుకుంది. అధికారికంగా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నామా.. కొద్దిగంటల్లోనే పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నామా పేరును అధికారికంగా ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. నామా అభ్యర్థిత్వం ఖరారైనట్లు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. ఇప్పటికి మూడుసార్లు లోక్‌సభకు, ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసిన నామా నాలుగోసారి ఖమ్మం ఎంపీగా పోటీ చేయనున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు పోటీ చేసిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. సన్నిహితులతో సంప్రదింపులు నామాకు టికెట్ ఖరారు కావడంతో ఎన్నికల్లో తన గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలు, సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ రాకపోవడంపై పార్టీలోని ఆయన అనుచరులు, అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పొంగులేటిపై ఆయన అభిమానులు, అనుచరుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారేది లేదని, టీఆర్ఎస్లోనే కొనసాగుతాననే సంకేతాలను పొంగులేటి ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక కొత్తగా టీఆర్ఎస్లో చేరిన ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా రాజకీయ మిత్రులు, రాజకీయ ప్రత్యర్థులు సైతం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి గెలుపును టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకోసం అధినాయకత్వం ఎటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుంది? అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుందనే అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి పార్టీలో కొనసాగుతున్న ఉద్యమకారులను సమన్వయం చేసుకుని తన విజయానికి తోడ్పడేలా కృషి చేయాల్సిన బాధ్యత పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుపై పడింది. దీంతో ఆయన ఇప్పటికే తన విజయానికి సహకరించాలని, పార్టీ అభివృద్ధి కోసం, కేసీఆర్ లక్ష్య సాధన కోసం ఏకతాటిపై నిలవాల్సిన అవసరంపై ఆయన వారిని వ్యక్తిగతంగా కలిసి సహకారం కోరినట్లు తెలుస్తోంది. నామా అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్లోని పలువురు నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ పార్టీ అధినేత సూచన మేరకు పనిచేయక తప్పదనే భావన వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థిగా నామా ఈనెల 22న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి.. 25న అధికారికంగా మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామా 22న ఖమ్మం చేరుకోలేకపోతే ఆయన తరఫున పార్టీ వర్గాలు నామినేషన్ వేసే అవకాశం ఉంది. జిల్లాలోని టీఆర్ఎస్ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యర్థి విజయానికి కృషి చేసేలా సమన్వయపరిచే బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై పెట్టినట్లు సమాచారం. నామా టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నామాతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మహిళా ఆర్థిక సంస్థ మాజీ చైర్మన్ మద్దినేని బేబి స్వర్ణకుమారి, మాధవరావు, ఇతర జిల్లాలకు చెందిన నేతలున్నారు. నామా బయోడేటా పేరు : నామా నాగేశ్వరరావు తల్లిదండ్రులు : వరలక్ష్మి–ముత్తయ్య పుట్టిన తేదీ : 15–3–1958 పుట్టిన స్థలం : కొక్కిరేణి గ్రామం, తిరుమలాయపాలెం మండలం భార్య : చిన్నమ్మ సంతానం : ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విద్యార్హతలు : ఇంటర్మీడియట్ వృత్తి : పారిశ్రామికవేత్త రాజకీయ రంగప్రవేశం : 2004లో టీడీపీలో చేరారు. ఆ సంవత్సరంలోనే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసిన నామా గురువారం టీఆర్ఎస్లో చేరారు. -
ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా రమేశ్‌రాథోడ్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్‌ను ప్రకటించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ నగేశ్‌కే స్థానం దక్కనుంది. పెద్దపల్లిలో ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉండడంతో వివేక్‌కు స్థానం దక్కుతుందా.. లేదా.. అన్న సందిగ్ధం నెలకొంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీయే ఇప్పటికీ తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించలేదు. ఆదిలాబాద్ స్థానం కోసం సోయం బాపూరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అసమ్మతికి ఆజ్యం పోసింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడు నరేశ్‌జాదవ్ రాజీనామా చేశారు. సాక్షి, మంచిర్యాల: లోకసభలో బరిలో తలపడే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి వెలువరిచిన తొలి జాబితాలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సామాజిక సమీకరణలే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లోకసభ అభ్యర్థిగా రమేష్ రాథోడ్, పెద్దపల్లి స్థానానికి ఎ.చంద్రశేఖర్‌ల అభ్యర్థిత్వాలకు పార్టీ ఓకే చెప్పింది. ఈ రెండు స్థానా లకు అభ్యర్థుల ప్రకటనతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆదిలాబాద్ టికెట్‌ను ఆశించిన నరేశ్‌జాదవ్ కాంగ్రెస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. అదేబాటలో సోయం బాపురావులు పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి అంతగా పరిచయం లేని చంద్రశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రమేష్ రాథోడ్‌కే ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన విపరీత జాప్యం కూడా ఓటమికి కారణమని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్ పార్టీ, లోకసభ ఎన్నికల్లో ఆ పొరపాటుకు తావివ్వకుండా ముందుగానే అభ్యర్థులను వెల్లడించింది. రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది మందితో కూడిన జాబితాను వెల్లడించగా, అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలు ఉండడం విశేషం. ఆదిలాబా ద్ నియోజకవర్గం నుంచి రమేష్ రాథోడ్‌కు పార్టీ టికెట్ దక్కింది. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నుంచి సోయం బాపురావు, లంబాడ నుంచి రమేష్ రాథోడ్, నరేష్ జాదవ్‌లు పోటీపడ్డారు. రాష్ట్రవ్యా ప్త సమీకరణలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ను బేరీజు వేసుకొని లంబాడ తెగకు చెందిన రమేష్‌రాథోడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఉట్నూరుకు చెందిన రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి 1995లో నార్నూర్ జెడ్పీటీసీగా ఎన్నిక, 1999 నుంచి 2004 వరకు ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2006 నుంచి 2009 వరకు ఆదిలాబా ద్ జెడ్పీ చైర్మన్‌గా, 2009 నుంచి 2014 వరకు ఆది లాబాద్ ఎంపీగా ఉన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. 2018లో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మ న్గా గెలిచినా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖానా పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోకసభ స్థానం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎవరీ చంద్రశేఖర్..? పెద్దపల్లి నియోజకవర్గానికి అసలు పరిచయం లేని చంద్రశేఖర్‌కు పార్టీ టికెట్ ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్‌కు టికెట్ ఇచ్చారని మీడియాలో చూసిన ఆ పార్టీ శ్రేణులే... ఎవరీ చంద్రశేఖర్ అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. ముఖ్యనేతలకు తప్ప, ముఖపరిచయం కూడా లే ని చంద్రశేఖర్‌కు ఎలా టికెట్ ఇస్తారంటూ మండిపడుతున్నారు. ఈ స్థానం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ విప్ ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఊట్ల వరప్రసాద్ టికెట్ ఆశించారు. వీరిని కాద ని వికారాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌కు ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌లో ముసలం అధికార టీఆర్ఎస్ కన్నా ముందే లోకసభకు అభ్యర్థులను ప్రకటించామన్న ఉత్సాహం కాంగ్రెస్‌కు మిగలడంలేదు. టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో ముసలం పుట్టింది. ఆదిలాబాద్ స్థానం నుంచి టికెట్ ఆశించిన నరేష్ జాదవ్, సోయం బాపూరావులు పార్టీపై తిరుగుబాటు చేశారు. రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నరేష్ జాదవ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తీవ్ర అసంతృప్తితో ఉన్న సోయం బాపూరావు ఎట్టిపరిస్థితుల్లోనూ లోకసభకు పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి బరిలోకి దిగే అంశాన్ని కూడా ఆయన అనుచరులు కొట్టిపారేయడం లేదు. ఇక పెద్దపల్లి స్థానంలో చంద్రశేఖర్‌కు ఇవ్వడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉండనున్న క్రమంలో, ఎక్కడో వికారాబాద్ నుంచి తీసుకొచ్చిన నాయకుడిని పోటీకి పెట్టడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. టికెట్ ఆశించిన ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్‌లో నెలకొన్న ముసలం సమసిపోతుందో, ఎన్నికల్లో పుట్టి ముంచుతుందో వేచిచూడాలి. -
‘హస్త’వాసి ఎవరిదో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడం.. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో ఎటూ తేల్చడం లేదు. ఆశావహులు మాత్రం ఢిల్లీస్థాయిలో తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఢిల్లీలోనే మకాం వేసి తమకున్న పరిచయాల ద్వారా సర్వశక్తులు ఒడ్డుతుండగా.. మరికొందరు తమకున్న మార్గాల ద్వారా టికెట్ ఖరారు చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో సహా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలిచిన జిల్లాగా ఖమ్మంకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్, సుస్థిరత లభిస్తుందనే అంచనాలతో పలువురు సీనియర్లు ఈ సీటుపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకున్న సమయానికి.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న పలువురు నేతలు ఖమ్మం ఎంపీగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను అధిష్టానానికి పంపించినా.. ఎవరిని ఖరారు చేయాలనే అంశంపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో రోజుకో పేరు చేరుతుండడం విశేషం. పలువురి దరఖాస్తు.. ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా రేణుకాచౌదరి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఆ సమయంలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ తరఫున 2009లో పోటీ చేసిన సిట్టింగ్ అభ్యర్థిని తానే అయినందున మరోసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని రేణుకాచౌదరి ఇప్పటికే పలుమార్లు కోరారు. అయితే ఆమె టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును సైతం ఎంపీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవిచంద్రకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని శనివారం పార్టీ వర్గాల్లో ప్రచారం జరగడం, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో ఏం జరుగుతోందనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగినా.. నామా ఇంతవరకు అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఈసారి ఖమ్మం టికెట్‌ను పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తనకు ప్రతి ఎన్నికల్లో అన్యాయమే జరుగుతోందని, ఈసారి నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీనియార్టీ దృష్ట్యా తనకు అవకాశం ఇవ్వాలని వీహెచ్ అధిష్టానానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆశావహులు ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల్లోనూ... ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన రాజకీయ పక్షమైన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో రోజుకో పేరు వినిపిస్తోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ లభిస్తుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లను పార్టీ పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా శనివారం అదే సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు దాదాపు కనుమరుగు కావడం.. ఆయన టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే రీతిలో బీజేపీ, వామపక్షాల నేతలు సైతం అభ్యర్థుల ఖరారులో తలమునకలైనట్లు ప్రచారం జరుగుతోంది. -
వీడని ఉత్కంఠ!
సాక్షి, నాగర్‌కర్నూల్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్యను ఖరారు చేస్తారా లేదా ఇతరులకు కేటాయిస్తారా అనే విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై కాంగ్రెస్ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పి.రాములుకు కేటాయిస్తారనే చర్చ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణకు కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆ లోగానే అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థులు ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా రాములు? శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఆరు నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుని ఉత్సాహంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కీలకంగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17ఎంపీ స్థానాలలో 16 స్థానా లు గెలవాలని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈనెల 9వ తేదీన వనపర్తిలో జరిగిన సన్నాహక సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దే శం చేశారు. ఎలాగైనా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గత మూడు పర్యాయాలుగా నాగర్‌కర్నూల్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేదు. కానీ ఈసారి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొల్లాపూర్ మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించడం, అన్ని చోట్లా టీఆర్ఎస్ భారీ మెజార్టీ ఉండటం వంటి కారణాల నేపథ్యంలో ఈసారి నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానం తమదేనన్న ధీమా ఆ పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాజీ మంత్రి పి. రాములు పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం, గాయకుడు సాయిచంద్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత శ్రీశైలం కూడా తమకు ఎంపీ టికెట్ కేటాయించా లని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు నాగర్‌కర్నూల్ స్థానంలో అత్యధిక సార్లు గెలిచిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లోనూ సరైన అభ్యర్థిని బరిలో ఉం చాలని కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం వద్ద జాబితా సిద్ధంగా ఉంద ని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యకు అధిష్టానం మొగ్గుచూపుతోందని, ఒకవేళ ఆయన బరిలో లేకుంటే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సతీష్ మాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు, రేపు స్పష్టత కాంగ్రెస్ అభ్యర్థులను అధిష్టానం శనివారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా సంప్రదించి లోక్‌సభ అభ్యర్థులు ఎవరు ఉండాలనే అంశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈనేపథ్యంలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పి.రాములు పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది -
నేడో రేపో..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై రాజకీయ పార్టీల కసరత్తు తుది దశకు చేరింది. ఒకటి, రెండు రోజుల్లో బరిలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటికి నామినేషన్ వేసే విధంగా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ అన్ని పార్టీల్లో క్లైమాక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరంగల్, మహబూబాబాద్ స్థానాల నుంచి ధీటైన అభ్యర్థులనే బరిలో దింపే ప్రయత్నం చేస్తుండగా.. రాష్ట్రంలో నాలుగు స్థానాలను ఎంపిక చేసుకున్న సీపీఐ, సీపీఎం మహబూబాబాద్ నుంచి అభ్యర్థిని పోటీలో దింపనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించాయి. పసునూరి దయాకర్, సీతక్కల పేర్లు ఫైనల్ వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కసరత్తు తుది దశకు చేరింది. ఇక అధికారిక ప్రకటనే తరువాయిగా మారింది. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి టీఆర్ఎస్కు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీరా సీతారాంనాయక్ ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఇందులో దయాకర్‌కు దాదాపు టికెట్ ఖరారైనట్లే. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి శాసనమండలి చైర్మన్‌గా అవకాశం ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సీతారాంనాయక్ విషయంలో అధిష్టానం ఇంకా ఆలోచన చేస్తున్నా.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి, రామచంద్రునాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితలలో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుందని ఖాయంగా చెప్తున్నారు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే... ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఖాయమంటున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు టీపీసీసీ నుంచి సమాచారం అందుకున్నారు. ఢిల్లీ పెద్దలతోనూ ఆమె మాట్లాడినట్లు అనుచురులు చెప్తున్నారు. ఇదిలా వుంటే అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, పార్టీ సీనియర్ నేత బెల్లయ్యనాయక్ తదితరులు సీరియస్‌గానే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ సీటు కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, సింగాపురం ఇందిర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో అద్దంకి దయాకర్, మంద కృష్ణ, ఇందిర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఓంటేరు జయపాల్, సినీనటుడు బాబుమోహన్‌తో పాటు ఏడుగురు వరంగల్ నుంచి ఆ పార్టీ టికెట్ కోరుతున్నారు. మహబూబాబాద్ నుంచి హుస్సేన్‌నాయక్, యాప సీతయ్యలతో పాటు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు, రాష్ట్రపార్టీ ఎన్నికల కమిటీ, కోర్ కమిటీ ఇటీవల సమావేశమై ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహుల పేర్లతో ఈ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల ప్రకటన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా పార్టీలు 16, 17 తేదీల్లో అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. టీఆర్ఎస్ తరఫున లోక్‌సభకు పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికలో శాసనసభ్యులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా టికెట్ల ఖరారుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులుగా కసరత్తు చేసి ఫైనల్‌కు వచ్చారు. డీసీసీ, టీపీసీసీ పరిశీలన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా మూడు రోజుల కిందటే ఢిల్లీకి చేరింది. ఆ జాబితాపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తయినట్లు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ శనివారం జాబితాను పరిశీలించే అవకాశం ఉండగా... అదే రోజు సాయంత్రం గాని, ఆ మరుసటి రోజు గాని ప్రకటించవచ్చంటున్నారు. 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై 25 వరకు సాగనుంది. దీంతో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్లు వేసేందుకు వీలుగా అధికారిక ప్రకటన చేస్తారని ఆశావహులు భావిస్తున్నారు. -
ఉద్దండుల కోట.. నరసరావుపేట
సాక్షి,నరసరావుపేట: నరసరావుపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు మొదటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉద్దండులనే అందించాయనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. పలనాడు ముఖద్వారంగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు–ప్రకాశం జిల్లాలతో పాటు కలిసి కొన్నేళ్లపాటు కొనసాగిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచి విలక్షమైనవే. ఈ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నల్లపాటి వెంకటరామయ్యచౌదరి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర తొలిస్పీకర్‌గా 1953 నుంచి 1955 వరకు బాధ్యతలను నిర్వహించిచారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు కొనసాగారు. కాసు కృష్ణారెడ్డి సైతం మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవులను చేపట్టారు. డాక్టర్ కోడెల అత్యధికంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వరుసుగా ఐదుమార్లు విజయం సాధించి, 12ఏళ్ల పాటు మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించారు. పార్లమెంట్ సీటు రూటే సెపరేటు.. 1952లో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా సీఆర్ చౌదరి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 1967, 71 ఎన్నికల్లో మద్ది సుదర్శనం రెండుసార్లు గెలుపొందగా, 1977, 1980లో కాసు బ్రహ్మానందరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోంశాఖమంత్రిగా అత్యున్నత పదవిని చేపట్టారు. ఆయనతో పాటు కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం రెండుసార్లు ఎంపీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1999లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి, 1998లో మరో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2009లో మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2014లో రాయపాటి శంభశివరావు ఎంపీలుగా ఇక్కడి నుంచి గెలిచినవారే. -
16న విడుదల..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఈ నెల 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. వచ్చే నెల 14న పోలింగ్ జరగనుండడంతో ఆ పార్టీ అధిష్టానం సాధ్యమైనంత త్వరలో అభ్యర్థులను ప్రకటించాలనే యోచనతో ఉంది. ఈ మేరకు టీపీసీసీ నుంచి ఇప్పటికే అందిన ఎంపీ ఆశావహుల జాబితాపై కసరత్తు చేస్తోన్న ఆలిండియా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మంగళవారం రాత్రి ఢిల్లీలో భేటీ అయింది. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీలో ఆశావహుల నడవడిక, వారి పనితీరు ఇతరాత్ర వివరాలను పరిగణలోకి తీసుకుని స్క్రూట్నీ పూర్తి చేసింది. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున పేర్లు ఖరారు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) చేతికి అందజేసింది. ఈ నెల 16న భేటీ కానున్న సీఈసీ .. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన జాబితాపై కసరత్తు చేసి అదేరోజు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోననే చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఇప్పటికే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డితో పాటు పలువురు ఆశావహులు హస్తినాకు చేరుకున్నారు. అసెంబ్లీ ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి తెలంగాణలోని 17స్థానాల్లోనూ పాగా వే సేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే అధికార టీఆర్ఎస్ కంటే ముందే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించినా.. స్థానిక సమస్యలు, డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న డీసీసీ, టీపీసీసీ వచ్చిన దరఖాస్తులను వడబోసేందుకు జాప్యమైంది. గతనెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను డీసీసీ స్వీకరించింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి నుంచి పదకొండు దరఖాస్తులు రాగా ఆరుగురిని, నాగర్‌కర్నూల్ నుంచి 36 దరఖాస్తులు రాగా ఐదుగురిని ఎంపిక చేసింది. గందరగోళం సృష్టించిన ఆ ‘లేఖ’.. అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే క్రమంలో టీపీసీసీ నుంచి ఏఐసీసీకి ఆశావహుల జాబితా వెళ్లిన తర్వాత పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఏఐసీసీకి లేఖ రాశారని.. అందులో మహబూబ్‌నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, నాగర్‌కర్నూల్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండడంతో ఉమ్మడి జిల్లాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. పార్టీ అధిష్టానం మాత్రం టీపీసీసీ, డీసీసీ నుంచి వచ్చిన దరఖాస్తులనే ప్రామాణికంగా చేసుకుని ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధిగా వంశీచందర్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్ నుంచి స్థానికుడికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుండడంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యకు ఈ సారి టికెట్ దక్కకపోవచ్చని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో అలంపూర్ మాజీ ఎ మ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవిలలో ఒకరి పేరు ఖరారు అవుతుందని సమాచారం. -
సిట్టింగ్ ఎంపీల్లో.. కొందరికి కోతే
కొన్ని కారణాలతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను బరిలోకి దించలేదు. అయితే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉండొద్దు. బీ–ఫారం ఇవ్వకపోయినా పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ గెలిచేందుకు సహకరించాలి. ఈ ముగ్గురి గెలుపు కోసం సహకారం అందించాలి. ఇచ్చిన మాట ప్రకారం ఎగ్గె మల్లేశానికి అవకాశం ఇచ్చా. యాదవ సభలో మల్లేశానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని ప్రకటిస్తే జైపాల్‌యాదవ్ అలిగారు. నోముల నర్సింహయ్య మంత్రి జగదీశ్‌రెడ్డిని కొట్టినంత పని చేశారు. జైపాల్, నర్సింహయ్యకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఇద్దరూ గెలిచారు. మల్లేశం ఎమ్మెల్సీ అవుతున్నారు. శేరి సుభాష్‌రెడ్డికి ఆలస్యంగా అవకాశం వచ్చింది. సుభాష్‌రెడ్డి ఎప్పుడో ఎమ్మెల్సీ కావాల్సి ఉండె. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే ఘనవిజయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. ఈ దిశగా ఎమ్మెల్యేలు పూర్తిగా దృష్టిపెట్టి పని చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినవారి విషయంలో కఠినంగా ఉంటామన్నారు. మజ్లిస్‌తో కలిసి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తున్నామని సీఎం చెప్పారు. మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. మంగళవారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలపైనా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మార్చి 17 నుంచి ప్రచారం ‘లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే ఆదరిస్తారు. మనం కచ్చితంగా గెలుస్తాం. అయితే అన్ని సీట్లలో భారీ మెజారిటీతో గెలవాలి. శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం. ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదు. మంత్రులు, ఎంపీలు వారితో సమన్వయం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేసి టీఆర్ఎస్ ఎంపీలను భారీ మెజారిటీతో గెలిపించాలి. మార్చి 17 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాను. కరీంనగర్ నుంచి మొదలుపెడతాం. మార్చి 19న నిజామాబాద్‌లో ప్రచారం సభకు వస్తాను. అన్ని సెగ్మెంట్లలో వరుసగా సభలు నిర్వహించేందుకు త్వరలోనే షెడ్యూల్ ఇస్తాం. జనసమీకరణ, ఇతర ఏర్పాట్లు చేయాలి. ఈసారి ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌లకు అవకాశం కల్పించలేకపోతున్నాం. ముగ్గురు, నలుగురు ఎంపీల విషయంపై ఆలోచిస్తున్నాం. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎంపీలుగా అవకాశం ఇవ్వని వారు ఆందోళనపడొద్దు. ఇన్నాళ్లు పదవిలో ఉండి ఒక్కసారిగా అవకాశం రాకపోతే కొంత ఇబ్బంది ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలలో అవకాశం రాని వారికి రాష్ట్ర స్థాయిలో అవకాశాలు ఇస్తా. అభ్యర్థులు ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరే విషయంలో ముందుగా వద్దనుకున్నాం. అయితే వాళ్లంతట వారే టీఆర్ఎస్లో చేరుతున్నారు. వచ్చే వారిని చేర్చుకుంటున్నాం. మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితోనూ మాట్లాడాలి’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ ఐదు మనవే! శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం తమదేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ తీరు ఎలా ఉండాలనే దానిపై సీఎం కేసీఆర్ సూక్ష్మస్థాయిలో వివరించారు. జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహమ్మద్ మహమూద్‌అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డిలను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ‘ఇచ్చిన మాట ప్రకారం ఎగ్గె మల్లేశంకు అవకాశం ఇచ్చాను. యాదవసభ సభలో మల్లేశంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని ప్రకటిస్తే జైపాల్‌యాదవ్ నాపై అలిగారు. నోముల నర్సింహయ్య ఏకంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని కొట్టినంత పని చేశారు. జైపాల్‌యాదవ్, నోముల నర్సింహయ్యకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మల్లేశం ఎమ్మెల్సీ అవుతున్నారు. శేరి సుభాష్‌రెడ్డికి ఆలస్యంగా అవకాశం వచ్చింది. సుభాష్‌రెడ్డి ఎప్పుడో ఎమ్మెల్సీ కావాల్సి ఉండె. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు అభ్యర్థులను పోటీకి దింపే ముందు సమగ్రంగా అంచనా వేసుకున్నాం. మన ప్రభుత్వ పనితీరు నచ్చి ప్రజలకు మనకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. మనకు ఉన్న బలంతోనే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ వద్దని అన్నాను. ఆ పార్టీ నేతలు వినకుండా పోటీ పెట్టారు. టీఆర్ఎస్ నుంచే ఇద్దరు తమకు మద్దతిస్తారని కాంగ్రెస్ నేతలన్నారు. దీంతో అన్ని స్థానాలకు పోటీ పెట్టాలని నిర్ణయించాం. ఇప్పుడు అన్ని స్థానాల్లో మన అభ్యర్థులే గెలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేయాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. ‘కొన్ని కారణాలతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ తరుపున అభ్యర్థులను బరిలో దించలేకపోయాం. అయితే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉండవద్దు. బీ–ఫారం ఇవ్వలేకపోయినా పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ గెలిచేందుకు మీరు సహకరించాలి. ఈ ముగ్గురి గెలుపు కోసం మీ నియోజకవర్గాల పరిధిలో సహాయ సహకారాలు అందించాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు. రెండుసార్లు మాక్ పోలింగ్ శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అందరు ఎమ్మెల్యేలతో ఓటు వేయించారు. ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల వారీగా ఎమ్మెల్యేలను విభజించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విషయంలో ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఆదేశించిన ప్రకారం మాక్‌పోలింగ్ నిర్వహించారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ మాక్‌పోలింగ్ రెండుసార్లు నిర్వహించారు. దీంతో మాక్‌పోలింగ్‌లో వోటు వేసే విషయంలో ఎవరైనా పొరపాటు చేశారా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. ఎమ్మెల్యేలకు మాత్రమే! టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రతిసారి ఇలాగే జరిగేది. సోమవారం నిర్వహించిన సమావేశానికి మాత్రం కేవలం ఎమ్మెల్యేలనే అనుమతించారు. భేటీ సమయంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే ఎంపీలకు అనుమతి లేకపోవడంతో సమావేశం గదిలోకి వెళ్లలేదు. -
రండి బాబూ..రండి! టీడీపీలో ఎంపీ అభ్యర్థులు కరువు..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు బిగ్ షాట్స్ ఎవరూ దొరక్క ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు. సరైన అభ్యర్థిని నిలబెట్టలేకపోతే ఈ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై పడుతుందని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార పార్టీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. పార్టీ ఎంపీ టికెటట్ను బలంగా డిమాండ్ చేసే నేతలే లేకపోవటంతో మీరు పోటీకి ఆసక్తిగా ఉన్నారా? అంటూ పలువురు బడా పారిశ్రామిక వేత్తలకు ఆఫర్లు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమీకరణాలు. బలాబలాలను బేరీజు వేసుకొని గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఎవరూ సాహించని పరిస్థితి కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు పార్లమెంట్ టికెట్ అవకాశం ఇస్తామంటూ పార్టీ ముఖ్యులు వారిని కొత్తగా మభ్య పెడుతున్నారు. గతంలో నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి వైఎస్సార్సీపీ తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్నప్పటికి పార్టీలో తగ్గిన ప్రాధాన్యం, గౌరవం లేదని నెల్లూరు రూరల్‌కే పరిమితం అయ్యారు. మళ్లీ ఎన్నికలు రావడంతో జనవరి నుంచి వేగంగా రాజకీయ సమీకరణాలు మొదలు కావటంతో ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. అయితే తాజాగా టికెట్ల కేటాయింపుల విషయం వచ్చే సరికి నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానానికే ఆయన పరిమితమయ్యారు. పార్టీ టికెట్ ఆశించిన నేతలు అసమ్మతి గళం వినిపించిన క్రమంలో పార్టీ అధినేత నిర్ణయం మేరకు రూరల్ నుంచి పోటీ చేయాల్సి వస్తుందని చెప్పి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో నెల్లూరు పార్లమెంట్‌కు అభ్యర్థి లేకుండా పోయారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీలో కావలి అసెంబ్లీ సీటు ఇస్తే తాను పోటీకి సుముఖంగా ఉన్నానని, మంతనాలు నిర్వహించడానికి వచ్చిన మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు సృష్టం చేశారు. అయితే కావలి సీటును మాజీ ఎమ్మెల్యే బీద మస్తానరావుకు కేటాయించటంతో కావలి సీటు ఆశలు గల్లంతయ్యాయి. జిల్లాకు చెందిన ఒక బడా పారిశ్రామిక వేత్త కుమారుడిని రంగంలోకి దించాలని సీఎం పేషి అధికారులు భావించి ఆ మేరకు వారికి సమాచారం ఇచ్చారు. సదరు పారిశ్రామికవేత్త సర్వే నిర్వహించుకోని తమకు సీటు, రాజకీయాలు వద్దని సున్నితంగా తిరస్కరించారు. ఎంపీ టికెట్ ఇప్పిస్తామని స్థానిక నేతలు అయితే హామీలు ఇచ్చారు కానీ పార్టీ పెద్దల నుంచి పిలుపు రాకపోవటంతో కాటంరెడ్డి మౌనంగా ఉండిపోయారు. అసలు ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయడానికి సుముఖంగా లేరనే ప్రచారం కూడా బలంగా సాగుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు టికెట్ల ఆశించి భంగపడిన డీసీసీబీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తనకు అవకాశం ఇస్తే పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పార్టీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశానికి ఆహ్వానించి, మళ్లీ తర్వాత కలవమని మెట్టుకూరుకు చెప్పినట్లు సమాచారం. కోవూరు టికెట్ ఆశించి భంగపడిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిలో నియమించారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం అని ప్రకటించుకుని తన అభ్యర్థిత్వం పరిశీలించాల్సిదిగా జిల్లా ముఖ్యుల ద్వారా లాబీయింగ్ నడుపుతున్నారు. ఈ క్రమంలో 9న వచ్చి కలవాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో జెడ్పీ చైర్మన్‌గా గెలుపొంది ఇటీవలే పార్టీ నుంచి జంప్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా తనకు పార్లమెంట్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అందరూ పార్లమెంట్ టికెట్ అడుగుతుండటంతో ఏమీ తేల్చుకోలేని స్థితిలో పార్టీ నేతలు పడటం గమనార్హం. -
‘కంచర్ల’కా.. ‘తేరా’నా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంటు స్థానానికి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఎవరికి టికెట్ దక్కనుంది..? పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మదిలో ఎవరున్నారు..? కనీసం నలుగురు దాకా నాయకులు టికెట్ రేసులో ఉండగా.. ఆశావహుల సంఖ్యను వడబోత ఎలా చేశారు..? ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గుత్తా తిరిగి పోటీచేసే అవకాశాలు దాదాపు లేవా..? ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది..? ఇవీ.. ప్రస్తుతం ఎంపీ టికెట్ల కేటాయింపునకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్న ముచ్చట్లు..! ఈ వారంలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఆయా పార్టీలూ పోరుకు తయారవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోని తాజా పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన నాయకత్వం నల్లగొండ ఎంపీ స్థానాన్ని కీలకంగా భావిస్తోంది. భువనగిరి నుంచి ఎలాంటి మార్పు లేకుండా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూర నర్స య్య గౌడ్‌కే మళ్లీ టికెట్ ఖాయం చేసినట్లు చెబుతున్నారు. అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే భువనగిరి స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెం ట్లలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, సిట్టింగ్ ఎంపీ, జిల్లా మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం ప్ర టత్యేకంగా భేటీ ఆయ్యారు. ఆ నియోజకవర్గం లోని తాజా రాజకీయ పరిస్థితి సమీక్షించారు. ఇక్క డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్టేనని, మార్పు ఉండకపోవచ్చని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ నల్లగొండ ఎంపీ స్థానంపై పడింది. ‘కంచర్ల’కా... ‘తేరా’నా..? నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పార్టీ టికెట్ సంపాదించి పోటీ చేయాలని నలుగురైదుగురు నాయకులు ఆశించారు. పార్టీ నాయకత్వం ఓ ఇద్దరు నేతల పేర్లపై సర్వే కూడా నిర్వహించినట్లు సమాచారం. ముందునుంచీ టికెట్ ఆశిస్తున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి ప్రస్తుతం అధినేత వద్ద పరిశీలనలో ఉన్న పేర్లని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో జరగనున్న నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ నేతల సమావేశంలో దాదాపుగా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఊరించిన నల్లగొండ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ గెలుపులో, తన సోదరుడిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో కంచర్ల కృష్ణారెడ్డి కీలకంగా పనిచేశారని పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతోందని చెబుతున్నారు. అంతేకాకుండా, పార్టీలో చేరిన సమయంలో భూపాల్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసిన సందర్భంలో కూడా లోక్‌సభ స్థానంలో కృష్ణారెడ్డి పోటీపై చర్చ జరిగిందంటున్నారు. దీంతో ఈసారి ఎంపీ టికెట్ ఆయనకే దక్కుతుందన్న ఆశాభావాన్ని కంచర్ల సోదరుల అనుచరవర్గం వ్యక్తం చేస్తోంది. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన తేరా చిన్నపరెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరి స్థానిక సంస్థల ఎ మ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయారు. మరోసారి ఆయన నల్లగొండ ఎంపీ స్థానంనుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని, అధిష్టానం ప రిశీలనలో ఆయన పేరు కూడా ఉందంటున్నారు. అన్ని బాధ్యతలూ.. మంత్రి జగదీశ్‌కే! రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్‌రెడ్డికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని బాధ్యతలనూ అధినాయకత్వం అప్పజెప్పిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల విజయాన్ని ఆయన సవాల్‌గా తీసుకున్నారని అంటున్నారు. భువనగిరిలో ఎలాగూ సిట్టింగ్ అభ్యర్థే కావడంతో నల్లగొండపై ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం. కంచర్ల సోదరులను టీడీపీనుంచి టీఆర్ఎస్లోకి తీసుకురావడంలో మంత్రి జగదీశ్‌రెడ్డిదే ప్రధాన పాత్ర. తేరా చిన్నపరెడ్డిని ఎమ్మెల్సీగా పోటీ చేయిం చిన సందర్భంలోనూ ఆయన గెలుపు కోసం మం త్రి చేసిన కృషిని ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పుడు కంచర్ల కృష్ణారెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు ఎంపీ అభ్యర్థులుగా అధినేత పరిశీలనలో ఉన్నాయని, వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కినా, మంత్రి జగదీశ్ మనుషులకు దక్కినట్టేనని విశ్లేషిస్తున్నారు. ఈనెల 17న నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నల్లగొండలో జరగనుంది. సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈలోగానే ఈ నియోజకవర్గ ఆశావహులు, ఎమ్మెల్యేలు, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇన్చార్జులతో అధినేత కేసీఆర్ వద్ద ప్రత్యేక భేటీ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
కొత్త ముఖాలు!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలెవరూ ముందు కు రాకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఈసారి ఇక్కడి నుంచి పోటీకి సుముఖత చూప డం లేదు. దీంతో అధిష్టానం అభ్యర్థి విషయంలో అన్వేషణలో పడింది. ఇందులో భాగంగా మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రదేశ్ ఎన్నికల కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. నిజామాబాద్ స్థానం అంశం చర్చకొచ్చిన సందర్భంగా అజారుద్దీన్ పేరును మధుయాష్కి ప్రస్తావించారు. దీనిపై జిల్లా నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానికేతరుల పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు రెండుసార్లు విజయం సా«ధించారు.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారు.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేతులెత్తేస్తే ఎలా..?’’ అని మధుయాష్కిపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అజారుద్దీన్‌తో పాటు మరో మైనారిటీ నేత పేరు కూడా అధిష్టానం పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నిజామాబాద్ ఒకటి. ఇక్కడ మైనారిటీ ఓట్లు భారీగానే ఉంటాయి. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని ఆ పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. చేతులెత్తేసిన మధుయాష్కి.? మాజీ ఎంపీ మధుయాష్కి నిజామాబాద్ నుంచి బరిలో నిలిచే అంశంపై దాదాపు చేతులెత్తేశారు. ఈ మేరకు ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటీవల అరెస్టయిన పసుపు, ఎర్రజొన్న రైతులను పరామర్శించేందుకు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా, ఆయన సమాధానాన్ని దాటవేశారు. మళ్లీ మాట్లాడుదామంటూ సమాధానమిచ్చారు. కాగా నాలుగు నెలల క్రితం వరకూ తానే నిజామాబాద్ ఎంపీ బరిలో ఉంటానని మధుయాష్కి ఖరాకండీగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ కీలక బాధ్యతలు కూడా ఉన్నాయనే అంశాన్ని ప్రైవేటు సంభాషణల్లో ప్రస్తావిస్తుండటం గమనార్హం. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకునేలా కనిపించడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
చేవెళ్ల టికెట్ ఎవరికో..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ ఉద్ధండులు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఈ సీటుపై దృష్టిసారించారు. మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పట్నం’కు దక్కేనా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన.. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్ఎస్ నుంచి పటిష్ట క్యాడర్ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్ పేరు తెరమీదకు రావడంతో టికెట్ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్ కేటాయింపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చేవెళ్ల టికెట్ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. -
ఎంపీ టికెట్ ఎవరికో!
సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందని భావించిందో ఏమో.. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ముందుగానే కసరత్తు మొదలెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోసం త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఆశావహుల నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీల ద్వారా టీపీసీసీ ఎన్నికల సంఘం దరఖాస్తులను స్వీకరించింది. చాలా మంది డీసీసీలకే దరఖాస్తు చేసుకోగా... కొందరు నేరుగా టీపీసీసీ, ఏఐసీసీలకు 20వ తేదీ వరకు తమ అభ్యర్థనలను పంపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 77కు చేరింది. కాగా అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు వచ్చిన దరఖాస్తులపై మంగళవారం టీపీసీసీ ఎన్నికల సంఘం హైదరాబాద్ గాంధీభవన్‌లో మూడు గంటలకు పైగా కసరత్తు చేసింది. ఒక్కో నియోజకరానికి రెండు నుంచి ఐదు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపిన టీపీసీసీ ఎన్నికల సంఘం... వరంగల్ నుంచి ముగ్గురు, మహబూబాబాద్ నుంచి ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. హైకమాండ్‌కు ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లు.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు డీసీసీల నుంచి అందిన జాబితాలను కూడా కీలకంగా భావించారు. ఈ మేరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు. ఈ కమిటీల ద్వారా వరంగల్ లోక్‌సభ స్థానం కోసం వచ్చిన 34 దరఖాస్తులు, మహబూబాబాద్ కోసం వచ్చిన 43 దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరామ్‌నాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారం.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత తొందరలో ఏఐసీసీ ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇందుకోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరుల ఎన్నికల కమిటీ మంగళవారం సుమారు మూడు గంటలకు పైగా కసరత్తు చేసిందన్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాల కోసం 77 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ... వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి ఇద్దరు పేర్లను ఈ కమిటీ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. ఈ జాబితాపైనా మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల ప్రకటనపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరులో గాని, మార్చి మొదటి వారంలో గాని అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీనియర్లకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. -
ఒకే ఒక్కటి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. టీపీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం ప్రారంభించింది. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టికెట్ కోసం నేతల్లో స్పందన కరువైంది. కేవలం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అది కూడా ఓ సామాన్య కార్యకర్త మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితి ఆ పార్టీలో నిస్తేజానికి నిదర్శమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో ఘెర పరాజయం పాలైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలోనూ చతికిల పడటంతో ఆ పార్టీ శ్రేణులతో నిస్తేజం ఆవహించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ముఖ్య నేతలెవరూ ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరించగా, ఒక్కో స్థానానికి 20 నుంచి 30 మంది వరకు నేతలు దర ఖాస్తు లు చేసుకున్నారు. 17 స్థానాలకు ఏకంగా 380 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్థానం విషయానికి వస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఒకే ఒక్క దరఖాస్తు రావడం గమనార్హం. కాగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో నెలకొన్న ఈ పరిస్థితులు నిస్తేజం కాదని, వ్యూహాత్మకమని హస్తం నేతలు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కల్వకుంట కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలకు అందనంత స్థాయిలో వ్యూహాన్ని అమలు చేసి రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్వి ఏవైనా కీలక నిర్ణయాలుండే అవకాశాలుండటంతో అందుకు అనుగుణంగానే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఒకరిద్దరు కాంగ్రెస్ జిల్లా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. కేవలం ఒకే దరఖాస్తు వచ్చిందని బయటకు చెబుతున్నప్పటికీ, పోటీకి ముగ్గురు నలుగురు గట్టి నేతలు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు వినిపించగా, తాజాగా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత కూడా తాను పోటీకి సిద్ధమని టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మధుయాష్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందిన ఆయన, 2014 ఎన్నికల్లో పరాజయం పాలుకాగా, ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇతర ముఖ్యనేతల నుంచి దరఖాస్తులు రాలేదని చెప్పుకొస్తున్నారు. 25 తర్వాత స్పష్టత వచ్చేఅవకాశాలు.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈనెల 15న హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకత్వం సమీక్ష జరిపింది. ఈసారి కూడా మధుయాష్కి పోటీ చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటన ఆలస్యం చేయవద్దనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న ఐదుగురు నేతల జాబితాను ఈనెల 25లోపు పంపాలని, జిల్లా కాంగ్రెస్ కమిటీకి రాష్ట్ర నాయకత్వం సూచించింది. డీసీసీ పంపనున్న జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే అంశం ఈనెల 25 తర్వాత తేలనుంది. -
ఎంపీ టికెట్ ఎవరికో..?
సాక్షి, జనగామ : త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా ఆశావహులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ టికెట్ దక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఆచితూచి వ్యహరిస్తుండగా ఆశావహులు మాత్రం టికెట్ల కోసం నేతలను కలుస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం వడబోత ప్రారంభించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంపీ టికెట్ ఆశించే అభ్యర్థుల నుంచి ఏకంగా దరఖాస్తులను స్వీకరించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని ఆశావహులు టికెట్లను దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు. హస్తం టికెట్ కోసం డాక్టర్ రాజమౌళి.. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం జనగామకు చెందిన ప్రముఖ వైద్యులు చంద్రగిరి రాజమౌళి దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ పార్లమెంటు (ఎస్సీ) స్థానం నుంచి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. పట్టణానికి చెందిన దళిత సంఘ నాయకుడిగా, వైద్యుడిగా రాజమౌళి రాణిస్తున్నారు. 2009లో చిరంజీవి ప్రారంభించిన పీఆర్పీ పార్టీలో చేరి వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి రాజమౌళి బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. కొన్ని రోజులకే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో తటస్థంగా ఉన్నారు. దళిత, ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 2015లో జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుగుణాకర్‌రాజు.. టీఆర్ఎస్ పార్టీలో కొత్త వారికే చాన్స్ ఇస్తామని అధినేత కేసీఆర్ సంకేతాలు ఇస్తుండడంతో జనగామకు చెందిన డాక్టర్ పడిగిపాటి సుగుణాకర్‌రాజు వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు. వైద్యవృత్తిలో రాణిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. రెండు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉన్న సుగుణాకర్‌రాజు 2015లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో వరంగల్ టికెట్‌ను తీవ్రంగా ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో సాగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఈ సారి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన బయోడేటాను పార్టీ నేతలకు అందించారు. వరంగల్, హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ కీలక నేతలను కలుస్తున్నారు. మహబూబాబాద్ టికెట్ కోసం లక్ష్మీనారాయణ నాయక్.. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం జనగామకు చెందిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నా యక్ వైద్యుడిగా జిల్లా కేంద్రంలో రాణిస్తున్నారు. గ తంలో లక్ష్మీనారాయణనాయక్ సతీమణి ధన్వంతి వ రంగల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యహరించారు. కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్న నాయకుడిగా కొనసాగుతున్న డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. జిల్లా ఉద్యమ జే ఏసీ నాయకుడిగా ఉన్న లక్షీనారాయణ నాయక్‌కు ప్రజల్లో మంచి పట్టు ఉంది. రాబోయే పార్లమెంటు ఎ న్నికల్లో ఎస్టీకి రిజర్వుడ్ అయిన మహబూబాబాద్ స్థా నం నుంచి పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు డాక్టర్లు వరంగల్, మహబూబాబాద్ స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. బీజేపీలో కన్పించని సందడి.. ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ టికెట్ల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగుతుండగా బీజేపీలో మాత్రం సందడి కనిపించడం లేదు. జనగా మ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండగా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ని యోజకవర్గాలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. శాసన సభ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం దక్కలేదు. అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేదు. ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో ఆశావహులు ముందుకు రావడం లేదు. -
ఎంపీ టికెట్ కోసం పోటాపోటీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు లాబీయింగ్ చేయడంలో నిమగ్నమైన ఆశావహ నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. మొదట ఈ నెల 14 వరకే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించిన అధిష్టానం ఆదివారం సాయంత్రం వరకూ ఆశావహ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి అభ్యర్థులను గెలిపించే వ్యూహాలపై కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలు హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వరకు భేటీ అయ్యారు. పెద్దపల్లి, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌కృష్ణన్, టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు. అయితే పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అశావహ నేతలపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులకు సూచించినట్లు తెలిసింది. ఆఫీస్ బేరర్లు, ముఖ్య నేతలు కూడా తమ అభిప్రాయాలు ఇవ్వవచ్చని సూచించారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం మరోమారు ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలోని నేతలతో సమావేశం కానున్నారు. కరీంనగర్ తెరపైకి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి.. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే వ్యక్తుల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. శుక్రవారం రాత్రి వరకు హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించిన ప్రవీణ్‌రెడ్డి పొత్తులో భాగంగా ప్రజాకూటమి సీటును అభ్యర్థి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డికి కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2014 వరకు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూటమి అభ్యర్థికి వెళ్లగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డిని కరీంనగర్ నుంచి బరిలో దింపితే బాగుంటుందని కొందరు సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కరీంనగర్ టికెట్ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రముఖంగా వినిపిస్తుండగా, డీసీసీ చైర్మన్ కటకం మృత్యుంజయం, నేరెళ్ల శారద, రేగులపాటి రమ్యారావు, ప్యాట రమేష్, ఆమ ఆనంద్, జువ్వాడి నిఖిల్ చక్రవర్తి తదితరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు తెరమీదకు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి ఎంపీ కోసం పోటాపోటీ.. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుంచి మళ్లీ మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం విదితమే. కాంగ్రెస్‌ను వీడిన వివేక్ ఈసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయనుండగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు 15 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గుమ్మడి కుమారస్వామి, గోమాస శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, గజ్జెల కాంతంతో పాటు సుమారు పదిహేను మంది ఈ స్థానంపై కన్నేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు గెలుపొందగా, రామగుండంలో ఇండిపెండెంట్ గెలిచారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్కు గతం కంటే మెజార్టీ తగ్గగా, ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ నాలుగు వందల స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోనూ కాంగ్రెస్ పరిస్థితి ఫరవాలేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు పెద్దపల్లి సీటు కోసం ‘క్యూ’ కడుతున్నట్లు చెప్తున్నారు. ఈ సీటు విషయంలో మాజీ మంత్రి శ్రీ«ధర్‌బాబు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రానుందని అంటున్నారు. -
తెరపైకి కొత్త ముఖాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పార్లమెంటు ఎన్నికలకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాజకీయ పార్టీల్లో కూడా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల విషయంలో అధికార టీఆర్ఎస్లో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన బాల్క సుమన్ ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావులకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధిష్టానం కూడా గెలుపు గుర్రాలు, వివాదరహితులైన మేధావుల కోసం పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కాగా, పెద్దపల్లి ఎస్సీకి కేటాయించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు స్థానాలపైనే కేంద్రీకృతమైంది. పెద్దపల్లిలో వివేక్‌పై ఎమ్మెల్యేల వ్యతిరేకత మాజీ ఎంపీ గడ్డం వివేకానంద కోసమే పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ను చెన్నూరుకు పంపించినట్లు టీఆర్ఎస్లో సాగిన ప్రచారం. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగే వివేక్ 2013లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి, 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ తరువాత 2017లో మళ్లీ టీఆర్ఎస్లోకి వస్తూ, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు.అందుకు అనుగుణంగానే చెన్నూరు సీటును బాల్క సుమన్‌కు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు వివేక్‌కు ఆటంకంగా మారుతున్నాయి. చెన్నూరు అసెంబ్లీ సీటును ఆశించిన వివేక్ సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌కుమార్ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా వివేక్ బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా తన యంత్రాంగాన్ని మోహరించారు. అలాగే చెన్నూరు, మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక పెద్దపల్లి జిల్లా ధర్మపురిలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వర్గం బాహాటంగానే వివేక్‌పై విమర్శలు చేశారు. మంథని, రామగుండంలో టీఆర్ఎస్ ఓడిపోగా, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుకు ఆర్థిక సాయం అందించారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ పంచాయతీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకు వెళ్లగా, సుమన్, కొప్పుల ఈశ్వర్, వివేక్లతో సమావేశం ఏర్పాటు చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కోరుకంటి చందర్ కూడా వివేక్‌ను వ్యతిరేకిస్తున్నారు. వివేక్ తప్ప ఎవరికి సీటిచ్చినా గెలిపించుకు వస్తామని చెపుతున్నారు. ఆదిలాబాద్‌లోనూ అదే తీరా..? ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగుసార్లు గెలిచిన గోడం నగేశ్ 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు వెళ్లారు. అయితే బోథ్ నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని భావించిన నగేశ్ గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో పావులు కదిపారు. బోథ్ టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించి విఫలమైన నగేశ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు సహకరించలేదు. ఆయన వర్గం కూడా దూరంగానే ఉంది. దీంతో స్వల్ప మెజారిటీతో బాపూరావు గెలిచారు. ఆదిలాబాద్ ఎంపీగా తమ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో గానీ, కేంద్ర నిధులు తీసుకురావడంలో గానీ నగేశ్ ఏమాత్రం ప్రయత్నించలేదని మిగతా ఎమ్మెల్యేల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ టికెట్టు మార్చాలని రాథోడ్ బాపూరావుతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. ఇందులో ఓ మాజీ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ సీటును మారుస్తారనే ఊహాగానాలు లోక్‌సభ నియోజకవర్గంలో జోరందుకున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థిత్వం కోసం కోవ లక్ష్మి ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 సీట్లలో టీఆర్ఎస్ 9 గెలుచుకోగా, అనూహ్యంగా ఆసిఫాబాద్‌లో మాత్రం స్వల్ప తేడా తో ఓడిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. ఓడిపోయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కోవ లక్ష్మి తన బలాన్ని చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయాలనే యోచనలో లక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి భీంరావు కూతురైన కోవ లక్ష్మి సర్పంచి స్థాయి నుంచి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా ఎదిగిన క్రమంలో ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఓ ఆదివాసీని తొలిసారి పార్లమెంటుకు పంపే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా లక్ష్మి అభ్యర్థిత్వం పట్ల ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగానే ఉన్నట్లు ఆమె అనుయాయులు చెపుతున్నారు. పెద్దపల్లి ఆశావహులు ఎక్కువే! పెద్దపల్లిలో మాజీ ఎంపీ వివేక్‌ను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండడంతో అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. ఎమ్మెల్యేలను కాదని ఎంపీ టికెట్టు ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్నదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో బెల్లంపల్లి టికెట్టు ఆశించి భంగపడ్డ ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే తనకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరగా, చెన్నూరు సిట్టింగ్ సీటు నుంచి వైదొలిగిన మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కూడా కేసీఆర్ ఆశీస్సులు కోరారు. కుల సమీకరణల్లో మాదిగ వర్గానికి టికెట్టు ఇవ్వాలని పార్టీ యోచిస్తే తనకు సీటు ఖాయమని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం దళిత మేధావులుగా గుర్తింపు పొందిన వారిని పెద్దపల్లి నుంచి బరిలోకి దింపాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్యల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
టికెట్ ప్లీజ్ !
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇటీవల వరుసగా జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీల ఎన్నికల్లో తలమునకలైన ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తాజాగా లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇంకా మూడు నెలల పాటు సిట్టింగ్ ఎంపీల పదవీ కాలం ఉన్నా.. అభ్యర్థుల ఎంపికపై వివిధ పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. దీంతో షెడ్యూల్ కూడా రాకముందే టికెట్ల కోసం ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది. దరఖాస్తుల ఆహ్వానం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈనెల 16వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించగా.. పలువురు ఇప్పటికే తమ వివరాలను డీసీసీ, పీసీసీ అధ్యక్షులకు అందజేశారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జోరుగా పర్యటనలు సాగిస్తున్నారు. పార్టీ శ్రేణులను కలుస్తూ సమావేశాల్లో పాల్గొంటూ తామే అభ్యర్థులుగా పోటీకి దిగనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈనెల 11వ తేదీన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం సాగించాల్సిన తీరు.. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి... మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ తరఫున ఏపీ.జితేందర్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మా దిరిగానే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. త ద్వారా ఈ స్థానం మళ్లీ జితేందర్‌రెడ్డికి ఖాయమైనట్లేనని చె బుతున్నారు. బీజేపీ నుంచి జిల్లా మాజీ అధ్యక్షుడు రతంగ్ పాం డురెడ్డి టికెట్ ఆశించినా బీసీ వర్గానికి(మున్నూరు కాపు) చెం దిన ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి బి.శాంతికుమార్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాగా కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానం కోసం ఆశావహులు పెద్దసంఖ్యలో ఉండడంతో పోటీ నెలకొంది. ఈ మేరకు పలువురు డీసీసీ, టీపీసీసీకి దరఖాస్తులు అందజేయగా.. కొందరు ఢిల్లీ స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి చుట్టూ పార్లమెంట్ రాజకీయాలు సాగినా.. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఊహకందని రీతిలో ఫలితాలు వచ్చాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్కు భా రీ మెజార్టీతో దక్కడం.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తారన్న నేప«థ్యంలో జైపాల్‌రెడ్డి స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ స్థానం నుంచి మాజీ మంత్రి డీకే.అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, డా క్టర్ వంశీచంద్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తూ ఢిల్లీలో తమ వం™ è ు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురికీ ఏఐసీసీ నేతలతో సత్సంబంధాలు ఉండడంతో వారిలోనే ఒకరికి ఎంపీ టికెట్ వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి.... నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.రాములు, బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జా తీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతికి టి కెట్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అచ్చంపేటకు చెందిన జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ, మాజీ మంత్రి శంకర్రావు, రాష్ట్ర నాయకులు సతీశ్ మాదిగ, మానవతారాయ్ టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
మెదక్ ఎంపీ’ పోటీలో కానరాని కాంగ్రెస్ జోరు
మెదక్ పార్లమెంట్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నేతల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ టికెట్ కోరుతున్న నేతల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు ఎవరూ లోక్‌సభ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపడం లేదు. ఈ నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పోటీ చేసే ఆశావహుల నుంచి పీసీసీ వర్గాలు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మెదక్ స్థానానికి ఇప్పటి వరకు కేవలం మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈనెల 20వ తేదీ వరకు పీసీసీ చీఫ్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సాక్షి,మెదక్: దరఖాస్తులను 20వ తేదీ తర్వాత పీసీసీ వర్గాలు ఏఐసీసీకి పంపనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ నెలాఖరున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా మెదక్ ఎంపీ స స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తారని ముందుగా ప్రచారం సాగింది. అయితే ఆమెకూడా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలోని మరోస్థానం నుంచి ఆమె పోటీలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కూడా పోటీచేస్తారని భావించినప్పటికీ ఆమె కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎవరూ పోటీచేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. అయితే జిల్లాకు చెందిన కొందరు నేతలు మాత్రం ఎంపీగా పోటీచేస్తామని ముందుకు వస్తున్నారు. అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రవణ్ కుమార్‌రెడ్డి సోమవారం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుడు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, తన భార్య మద్దుల ఉమాదేవికి టిక్కెట్ ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. అలాగే యువజన కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలారెడ్డిని మెదక్ ఎంపీ బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇస్తే ఎంపీగా గెలిపిస్తానని చెబుతున్నారు. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇప్పించేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పటాన్చెరువు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎం.ఏ. ఫయీం సైతం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం జిల్లా నేతలకు టిక్కెట్ ఇస్తుందా? బయటి నేతలకు టికెట్ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై కసరత్తు జరుగుతుంది. ఇటీవల మెదక్ అసెంబ్లీనుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రాజయ్య ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన మినహా నాయకులు ఎవరూ పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
ఎంపీ టికెట్ కావాలి!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ నెల 10 నుంచి ఆశావహ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. గురువారం (14వ తేదీన) ఈ తతంగం ముగియనుంది. 15 నుంచి 17 వ తేదీ వరకు లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం అందించారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జి శ్రీనివాసకృష్ణన్ ఈ రెండు నియోజకవర్గాల నేతలతోనే 15న హైదరాబాద్ గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. కరీంనగర్ ఎంపీ సీటు కోçసం పోటాపోటీ.. కరీంనగర్ లోక్‌సభ సీటును సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌కే మరోసారి టికెట్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి ప్రకటించగా.. ఈ స్థానం నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మందే ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతున్నా.. ఆశావహులు చాలా మంది దరఖాస్తు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయంశంగా మారింది. ఈ నెల 10 నుంచి మంగళవారం వరకు పలువురు హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, ఆ పార్టీ సీనియర్ పల్కల రాఘవరెడ్డిలతో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14కు పొడిగించడంతో మరికొందరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయ చైతన్యం కలిగిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై మాత్రం అభ్యర్థి ఎంపికలో అధిష్టానం సీరియస్‌గానే యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న జిల్లా కమిటీల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జిలతో ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జి శ్రీనివాస్‌కృష్ణన్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లికి పెరిగిన దరఖాస్తులు.. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రిజర్వుడ్ స్థానమైన పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కోసం అధిక డిమాండ్ కనిపిస్తోంది. మంగళవారం నాటికే పది మందికి పైగా పెద్దపల్లి సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో స్థానికుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగగా, పెద్దపల్లి లోకసభ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. మంథనిలో ఏకంగా కాంగ్రెస్ విజయం సాధించగా, ధర్మపురిలో అతిస్వల్ప తేడాతో ఓటమి చెందింది. పెద్దపల్లిలోనూ తక్కువ మెజార్టీతో వెనుకబడగా, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చింది. దీంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నంతగా టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అలాగే సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో సహజంగానే పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, రాష్ట్ర నాయకుడు అద్దెంకి దయాకర్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఊట్ల వరప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, గోమాస శ్రీనివాస్, మన్నె క్రిశాంక్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండడంతో మరింత మంది పెద్దపల్లికి పోటీపడే అవకాశం ఉంది. -
బుట్టా.. పయనమెట్టా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు రాజకీయం కాస్తా జిల్లాలో నేతల బుర్రలను హీటెక్కిస్తోంది. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొత్తు కుదిరితే కర్నూలు ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మళ్లీ ఎంపీగానే బరిలో ఉండాలని కలలు కంటున్న సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు సీటు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అప్పుడామె పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. సీటు రాకుండా చేసే యత్నాలు కర్నూలు నగర పాలక సంస్థలో జరుగుతున్న పనుల విషయంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో బుట్టా రేణుక ఢీ కొంటున్నారు. తనకు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే మండిపడిన బుట్టా రేణుక.. కార్పొరేషన్‌లోఅవినీతి వ్యవహారాలపైనా దృష్టి పెట్టారు. వాటిపై విచారణ జరపాలంటూ ఏకంగా విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు కూడా ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుట్టా వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా మండిపడుతున్నారు. వీరు ఏకంగా ఆమెకు సీటు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఉంటారని ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేస్తోంది. అయితే..అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా లేరు. అయినప్పటికీ బుట్టాకు ఎంపీ సీటు రాదని, ఎమ్మెల్యేగానే బరిలో ఉంటారని ఎస్వీ వర్గం భారీఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారం కూడా ఇరు వర్గాల మధ్య మరింత అగ్గి రాజేస్తోంది. ఇప్పుడేమంటారో! వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తును టీడీపీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి వారు ఒక అడుగు ముందుకేసి.. కాంగ్రెస్ దరిద్రం తమకెందుకని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే డోన్ అసెంబ్లీ సీటును తాము వదులుకోవాల్సి వస్తుందనే భావనలో కేఈ వర్గం ఉంది. అంతేకాకుండా మొదటి నుంచి ఇరు వర్గాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. ఇప్పుడు కలిసి పనిచేద్దామంటే పైస్థాయిలో అంగీకరించినప్పటికీ కింది స్థాయి కేడర్ మాత్రం మండిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీడీపీతో పొత్తును కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా అంగీకరించడం లేదు. ఇదిలా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవడంతో పాటు ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని ప్రకటించారు. టీడీపీతో పొత్తు కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మున్ముందు కూడా కొనసాగుతుందని వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. అంటే రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోంది. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ, కోట్ల ఏమంటారో వేచిచూడాల్సిందే! -
బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి
ఎదులాపురం (ఆదిలాబాద్): బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీల రాజకీయ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 21 రోజులు పూర్తి చేసుకుని 22వ రోజు ఆదిలాబాద్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. దేశంలో 56 శాతం, రాష్ట్రంలో 65 శాతం మంది బీసీలు ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 2కోట్ల మంది బీసీలను ఏకం చేయడానికి 36 రోజులు, 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉండగా, ఈ రోజు 24 సీట్లు కేటాయించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బీసీల ఓటు బీసీలకే సీటు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాటా బీసీలకే అనే నినాదంతో తాను రాజకీయ బస్సు యాత్ర ప్రారంభించానన్నారు. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న బీసీలు పార్లమెంటు స్థానాల్లోచివరి వరుసలో ఉన్నారన్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అగ్రవర్ణాలను అధికారం కట్టబెట్టి ఏమైనా కావాలంటే వినతులు సమర్పించి వారిని ఆర్తించాల్సి వస్తోందన్నారు. రాయితీలతో రాజీపడకుండా రాజ్యధికారం సాధించడమే ధ్యేయంగా బీసీలు ఏకం కావాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. జనాభా ప్రకారం బీసీ రాజ్యాధికారం సొంత చేసుకుంటే వినతులు సమర్పించే చేతులతో రేపు వినతులు స్వీకరించే రోజులు వస్తాయన్నారు. డప్పు, చెప్పు తప్ప మిగిలిన అన్ని వృత్తులు బీసీలే చేస్తున్నారని, బీసీలు లేకుంటే ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారిథి, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు దాటర్ల కిష్టు, బీసీ సంఘాల జిల్లా నాయకులు నర్సాగౌడ్, చిక్కాల దత్తు, సామల ప్రశాంత్, ప్రమోద్ ఖత్రి, మంచికట్ల ఆశమ్మ, పసుపుల ప్రతాప్, పి.కిషన్, శ్రీపాద శ్రీనివాస్, అనసూయ, జక్కుల శ్రీనివాస్, వెండి బద్రేశ్వర్‌రావు, శ్రీనివాస్, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ మిత్రపక్షం నుంచి అమర్ సింగ్‌కు ఆహ్వానం
వారణాసి : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృ నేత అమర్ సింగ్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ మిత్రపక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) తెలిపింది. ఆయనకు ఇష్టమైతే 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో పర్యటించిన సందర్భంగా అమర్ సింగ్‌కు అనుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమర్ సింగ్ స్పందిస్తూ ప్రధాని మోదీ, సీఎం యోగి అదిత్యనాథ్‌లకే తాను ఒటేస్తానని చెప్పడంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా ఎస్బీఎస్పీ కూడా అమర్ సింగ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానం పలకడం చూస్తుంటే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో నిలువనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌బార్ మంగళవారం వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ.. అమర్ సింగ్ ఒక పెద్ద నాయకుడు. ఒకవేళ ఆయనకు ఇష్టమైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అజాంఘడ్ లోక్‌సభ స్థానం(పొత్తులో భాగంగా తమ పార్టీకి వస్తే) నుంచి పోటీ చేయవచ్చన్నారు. అమర్‌సింగ్ వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అజాంఘడ్ ఎంపీగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఉన్నారు. మోదీ, యోగిలకే నా మద్దతు: అమర్‌సింగ్ -
నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్య నేత రాక?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ నాయకత్వం నల్లగొండపై పట్టు సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుంది. కాగా, కాంగ్రెస్ ఐదు స్థానాలతోపాటు, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక స్థానం వెరసి ఆరు స్థానాలు గెలిచాయి. ఇందులో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌రావు, దేవరకొండనుంచి సీపీఐ తరఫున గెలిచిన రవీంద్రకుమార్.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలం ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మందికి చేరింది. ఇక, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ప్రధాన పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆ మాత్రం సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అయితే, ఈసారి అలాంటి ఫలితాలు రాకుండా నల్లగొండలో పూర్తిస్థాయిలో పాగా వేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నల్లగొండ కొత్త జిల్లా పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకునే వ్యూహానికి పదును పెడుతోంది. దీంతో ఆ పార్టీ ఇప్పటినుంచే తమ చేతిలో లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రధానంగా సీఎల్పీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, సీఎల్పీ ఉపనేత ఉన్న నల్లగొండ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిం చారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ డిప్యూటీ లీడర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచా రు. మరోవైపు సీఎల్పీ నేత జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలకు చెక్‌పెట్టేందుకు అ ధికార టీఆర్ఎస్ అధినేత పక్కా స్కెచ్ తయా రు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ..మూడు నియోజకవర్గాల్లో బలోపేతంపై దృష్టి కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు చెక్ పెట్టేందుకు వారి నియోజకవర్గాల్లో తమ బలంగా ఇంకా పెంచుకోవడమే లక్ష్యంగా వలసలను భారీగా ప్రోత్సహిస్తున్నారు. ఏ ఎన్నికల్లోనైనా కీలక పాత్ర పోషించే స్థానిక ప్రజాప్రతినిధులను కాంగ్రెస్‌నుంచి లాగేసుకుంటున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నా యకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చని వలసలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల కింద నాగార్జునసాగర్ నియోజకర్గంలో జానారెడ్డికి దగ్గరి అనుచరులు అనదగిన వారిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల వంటి స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు వారి ముఖ్య అనుచరులను కూడా భారీగానే చేర్చుకోవడం ద్వారా బలం పెచుకుంటున్నారు. నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్యనేత రాక? ఈసారి ఎన్నికల్లో నల్లగొండలో కాంగ్రెస్‌ను పూర్తిగా మట్టికరిపించేందుకు టీఆర్ఎస్ వేస్తున్న మరో ఎత్తుగడ నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత బరిలోకి దింపడమని చెబుతున్నారు. ఫలితంగా నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజ యం తేలికవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే తక్కువ స్థానాలు గెలుచుకుంది. ఈసారి అలా జరగకుండా మెజారిటీ స్థానాలు పొందేందుకు నల్లగొండ ఎంపీగా ఒక ముఖ్యనేతను బరిలోకి దింపడం ఖాయమంటున్నారు. ఉద్యమ సమయంలో కూడా బలహీనపడుతున్నామనుకున్న సందర్భాల్లో టీఆ ర్ఎస్ అధినేత నియోజకవర్గాలు మార్చి పోటీచేసిన ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ గతంలో కరీంనగర్, ఆ తర్వాత మహబూబ్‌నగర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడతోపాటు వాటి పరిధిలోని అసెంబ్లీ సీట్లలోనూ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచేలా చేశారు. ఈ సారి కూడా నల్లగొండ ఎంపీ సీటు నుంచి అదే తరహాలో ఒక ముఖ్య నేతను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
మనసులో మాట బయటపెట్టిన యనమల
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు. అవకాశం లభిస్తే రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు వెళ్లేందుకు సిద్దమని అన్నారు. తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. అది కావాలి... ఇది కావాలి అని తానెప్పుడూ పార్టీ అధిష్టానాన్ని అడగలేదని అన్నారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన తనది సుదీర్ఘ అనుభవమని చెప్పారు. నా అవసరం ఎక్కడ ఉంటుందన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. -
ఎంపీ పదవికి కడియం రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పార్లమెంట్ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో ఈ విషయాన్ని ప్రకటించారు. మంగళవారం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్ర్రారంభంకాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. కడియం రాజీనామాను ఆమోదించినట్టు ప్రకటించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. కడియంను తన కేబినెట్లోకి తీసుకుని ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దీంతో కడియం లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. -
వస్తుందో... రాదో!
అటువైపు గవర్నర్ గిరి కనిపిస్తోంది...అయితే, అదెప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని సందిగ్ధ పరిస్థితి. ఇటువైపు ఎంపీ సీటు ఇస్తామని కబురు చేస్తున్నారు... తీరా వెళ్లాక ఇస్తారో లేదోనని బెంగ...ఓ మాజీ మంత్రివర్యులు ఈ సంగతిని ఎటూ తేల్చుకోలేక తెగ సతమతమవుతున్నారు. టీడీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఒంటికాలితో లేచిన వీర టీడీపీ తెలంగాణ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. కానీ, నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం కేసులో టీడీపీ ఇరుకునపడటం ఈ మాజీ మంత్రికి మింగుడుపడటం లేదు. ఈ వ్యవహారం తెలంగాణలో పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ఆయన సన్నిహితులతో వాపోయారు. ఇదే మాటను టీఆర్ఎస్లో ఉన్న ఓ నేతతో కూడా పంచుకున్నారు. ఆ నోటా ఈ నోటా ఇది బయటకు పొక్కింది. సదరు మాజీ మంత్రి పార్టీలో చేరితే ఎంపీ సీటు ఇస్తామంటూ టీఆర్ఎస్ నుంచి ఫీలర్లు కూడా వచ్చాయి. మరి గవర్నర్ గిరి వస్తుంటే ఎంపీ ఎందుకు...అన్నది సదరు నేత ఆలోచన. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో చంద్రబాబు మాట చెల్లుబాటు అవుతుందా...గవర్నర్ గిరికి ప్రధాని ఒప్పుకుంటారా అన్న పునరాలోచన కూడా చేస్తున్నారు. ఈ మధ్యలోనే టీఆర్ఎస్ తీర్థం అన్న వార్తలు వ్యాప్తి చెందాయి...గవర్నర్ గిరి...ఎంపీ టికెట్ ఏది మంచిదో...ఏది చెడ్డదో...ఏ పరిణామాలు ఎటు దారితీస్తాయో అంటూ ఆయన మథనపడుతూనే ఉన్నారు. -
టికెట్ ఖరారైంది... చిచ్చు రగిలింది
-
విజయవాడ ఎంపీ సీటు ఎవిరికో..?
-
ఎరక్క‘పోయి’.. ఇరుక్కుపోయారు
సాక్షి, ఏలూరు :‘ఎరక్కపోయి వచ్చాం.. ఇరుక్కుపోయాం’ అన్నట్టుంది తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లిన నాయకుల పరిస్థితి. ‘ఎవరొచ్చినా చేర్చుకుంటాం.. కోరింది ఇస్తాం’ అంటూ ఆశలు కల్పించడంతో క్యూ కట్టిన నాయకులంతా.. ప్యాకేజీల ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలుసుకుని తలలు పట్టుకుంటున్నారు. అన్నీ ఇచ్చిన పార్టీని కాదని టీడీపీలో చేరినందుకు ఇదా ఫలితమని అనుచర గణం వద్ద వాపోతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి రాజకీయూలే చేస్తారని తెలిసినా.. ఆయనను నమ్మడం తమ తప్పేనని మదనపడుతున్నారు. అవకాశవాద రాజకీయాలు, వెన్నుపోటు మంత్రాంగాలను వంట బట్టిం చుకున్న అధినేత ఎత్తుల్ని గ్రహించకుండా ఆ పార్టీలో కొనసాగుతున్న వారు.. కొత్తగా చేరుతున్న వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జెడ్పీ నుంచి.. ఎమ్మెల్యే సీటు వరకు... జెడ్పీ చైర్మన్ పీఠం దగ్గర్నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల వరకూ ప్రతి ఒక్కరికీ హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు అందరినీ ఊరిస్తూ చివరి నిమిషంలో సంతృప్తికర ప్యాకేజీ ముట్టచెప్పిన వారికే సీటు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సీటును ఎప్పటినుంచో ఆశి స్తున్న ముళ్లపూడి బాపిరాజుకు బాబు రిక్త‘హస్తం’ చూపించారు. ఆ స్థానాన్ని ఎరగా వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మె ల్యే ఈలి నానిలను టీడీపీలో చేర్చుకున్నారు. అదే సందర్భంలో బాపిరాజుకు జెడ్పీ చైర్మన్ గిరీని కట్టబెడతానని బుజ్జగించారు. శాంతించిన ఆయన తాడేపల్లిగూడెం నుంచి జెడ్పీటీసీ పదవికి పోటీచేస్తూ చైర్మన్ తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. అయి తే, చాగల్లు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేస్తున్న అల్లూరి విక్రమాదిత్యకు కూడా బాబు ఇలాంటి హామీయే ఇచ్చారు. దీంతో వీరిద్దరిలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది వారికే తెలియకుండా పోయింది. బాబు మాత్రం ‘మనోళ్లని గెలిపించండి.. మీ సంగతి వదిలేయండి. నేను చూసుకుంటా’నంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఎమ్మెల్యే సీట్ల వ్యవహారంలోనూ బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనపైనా ఓ పాచిక విసిరారు. పితాని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గం సీటును గుబ్బల తమ్మయ్య కట్టబెడతానని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే సీటును ఆశిస్తూ టీడీపీ పంచన చేరబోతున్న పితానికి ఆ అవకాశం కల్పిస్తారా.. ఒకవేళ ఇస్తే తమ్మయ్య పరి స్థితి ఏంటనే చర్చ ఆచంట నియోజకవర్గంలో విసృ్తత జరుగుతోంది. పితానికి బలమైన హామీ లభించడంతోనే టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. అదేవిధంగా తణుకు నియోజకవర్గం సీటును ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావుకు టీడీపీ గాలమేస్తోంది. ఆయన ఆ గాలానికి పడితే తణుకు సీటు ఆశించడం సహజం. అప్పుడు రాధాకృష్ణ సంగతేంటనేది పార్టీ శ్రేణులకు అవగతం కావ డం లేదు. దెందులూరు నియోజకవర్గం అభ్యర్థి విషయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాను వేరే నియోజకవర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని, అంతవరకూ వస్తే పార్టీని వీడిపోతానని బెదిరించడంతో అధినేత పునరాలోచనలో పడ్డారు. భీమవరంలో సీనియర్ నేతలు మెంటే పార్థసారధి, గాది రాజు బాబు టీడీపీ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరూ ఎప్పటినుంచో పార్టీలో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. ఈ ముగ్గురిలో సీటు ఎవరికిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నరసాపురం సీటును ఆశించి పొత్తూరి రామరాజు, సురేష్ కొండేటి, బండారు మాధవనాయుడు, పులపర్తి వెంకటేశ్వరావు, కోటిపల్లి సురేష్ ఆ పార్టీలోకి వెళ్లారు. అయితే ఇటీవల పార్టీ తీర్ధం పుచ్చుకున్న చెరుకువాడ రంగనాథరాజు లేదా పితాని సత్యనారాయణకు ఇక్కడి సీటు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అదే జరిగితే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇళ్లకే పరిమితంకాక తప్పదు. పాలకొల్లు సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి), నిమ్మల రామానాయుడులకు ఆశలు కల్పిస్తున్నారు. చివరికి ఎవరికిస్తారో బాబుకే తెలియాలి. చింతలపూడి సీటును డాక్టర్ కర్రా రాజారావు, కొక్కిరిగడ్డ జయరాజుకు ఇస్తామంటున్నారు. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకు కారుపాటి వివేకానందతో పొగపెడుతున్నారు. గోపాల పురం సీటు మీదంటే మీదేనని ముప్పిడి వెంకటేశ్వరావు, దాలయ్య, పీతల సుజాతలను మభ్యపెడుతున్నారు. చివరకు సీటు దక్కేదెవరికో తెలియని గందరగోళంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.