Nizamabad District News
-
సాధారణ ప్రసవాలను పెంచాలి
రెంజల్(బోధన్): ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను పెంచాలని ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ జిల్లా పోగ్రాం అధికారి రాజాగౌడ్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆయన ఆస్పత్రిలో ప్రసవాలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మందుల గదిని పరిశీలించారు. అంతకు ముందు తాడ్‌బిలోలి సబ్‌సెంటర్‌ను సందర్శించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారిణి విశాలరాణి, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ రాము, ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రావణ్‌కుమార్, రవీందర్‌తోపాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా బాలికల జట్టు శిక్షణ శిబిరండిచ్పల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(సుద్దపల్లి) క్రీడామైదానంలో స్కూల్ గేమ్స్ అండర్ –17 ఉమ్మడి జిల్లా బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని ప్రిన్సిపల్ తీగుళ్ల నళిని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఆర్మూర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర) ఆర్మూర్ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేశ్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, వ్యాయామ ఉపాధ్యాయులు జోత్స్న, శ్రీలత, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్‌లు మౌనిక, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు లారీ బోల్తా
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలోని గోపాల్పేట నుంచి బంజరకు వెళ్లే రోడ్డులో నిర్మాణదశలో ఉన్న కల్వర్టు వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది. గుంటూరు నుంచి పత్తిలోడ్‌తో మహారాష్ట్రలోని దులియాకు వెళ్తున్న లారీ (ఏపీ 16 టీజే 5839) ప్రమాదవశాత్తు బోల్తాపడగా, లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. నూతన వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతంలో సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో లారీ బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డువిస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాలలో సరైన సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రాయన్పల్లి శివారులో కారు.. ఇందల్వాయి: చంద్రాయన్పల్లి గ్రామ శివారులోని 44వ నంబరు జాతీయ రహదారి పైనుంచి ఓ కారు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
ఇరిగేషన్ ఎస్ఈపై సీఎంకు ఫిర్యాదు
నిజామాబాద్‌నాగారం: ఇరిగేషన్ సూపరింటెండెట్పై ముఖ్యమంత్రి కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. విషయం ఆలస్యంగా వెలుగుచూసినా విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు బాధితులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. నిజామాబాద్ ఈఎన్సీ పరిధిలో ఆర్మూర్, నిజామాబాద్ ఎస్ఈ కార్యాలయాలున్నాయి. అయితే ఆర్మూర్ ఎస్ఈ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎస్ఈ తనను అకారణంగా వేధించడంతోపాటు విధుల్లో నుంచి తొలగించాడని, ఉన్నతాధికారులతోపాటు సీఎం కార్యాలయంలో మే నెలలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో నిజామాబాద్ ఈఎన్సీని డివిజన్ ఎస్ఈకి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి విచారణ మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోందని, ప్రతి నెలా వేతనంలో నుంచి రూ.4వేల చొప్పున ఇవ్వాలని ఎస్ఈ తనను మానసికంగా వేధించాడని బాధితుడు వాపోయాడు. ఈ విషయమై ఇరిగేషన్ ఈఎన్సీ మధుసూదన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. శాఖలో జరిగే విచారణ విషయాలను మీకెందుకు చెప్పాలి. ఎప్పుడు ఫిర్యాదు చేశారని, విచారణ పూర్తయ్యిందని ఓసారి, కాలేదని మరోసారి దాటవేసే ప్రయత్నం చేశారు.ఉద్యోగులు కక్షగట్టి ఫిర్యాదు చేయించారు మా డివిజన్లోని ఉద్యోగులు కావాలనే కక్షగట్టి నాపై ఫిర్యాదు చేయించారు. డ్రైవర్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు. కఠినంగా ఉంటాను కాబట్టే డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించారు. – యశస్విని, ఆర్మూర్ డివిజన్ ఎస్ఈ -
హైవేపై కారు దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి సమీపంలోని ఎన్‌హెచ్ 161 సర్వీస్ రోడ్డుపై సోమవారం ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందని స్థానికులు, ఫైర్ సిబ్బంది తెలిపారు. డోంగ్లీ మండలంలోని మారేపల్లికి చెందిన నలుగురు కారులో సిర్పూర్‌కు వెళ్తుండగా, మద్నూర్ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తమై కారు నిలిపివేసి అందులోని వారిని కిందికి దింపేయడంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కారులో ప్రయాణిస్తున్న వారు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ బంధువులు అని తెలిసింది. ఫాగింగ్మిషన్కు మంటలు ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని ఆరో వార్డు అన్నపూర్ణ కాలనీలో సోమవారం సాయంత్రం మున్సిపాలిటీకి చెందిన ఆటోలో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఫాగింగ్ యంత్రానికి మంటలు అంటుకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై జనావాసాలకు దూరంగా ఆటోను తీసుకెళ్లి వదిలిపెట్టాడు. అనంతరం మంటలను సిబ్బంది ఆర్పివేశారు. -
స్కీం పేరుతో స్కాం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన దేవమ్మ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తన ఇద్దరు మనవళ్లకు ఎంతో కొంత జమ చేయాలనే ఉద్ధేశంతో ఒక స్కీంలో సభ్యురాలిగా చేరి నెలకు రూ.599 చొప్పున 15 నెలల పాటు రూ.8,985 జమ చేసింది. ఇద్దరు మనవళ్ల పేరు మీద ఆమె మొత్తం రూ.17,970 స్కీం నిర్వాహకులకు చెల్లించింది. స్కీం కాల పరిమితి ముగిసినా నిర్వాహకులు దేవమ్మకు బహుమతిని కానీ ఆమె జమ చేసిన డబ్బును కానీ వాస్ చేయడం లేదు. ఇదే గ్రామానికి చెందిన స్వరూప స్కీంలో సభ్యురాలిగా చేరి రూ.8,985 జమ చేసింది. ఆమెకు ఎలాంటి బహుమతిని ఇవ్వలేదు. ఇలా దేవమ్మ, స్వరూపకే కాదు వేలాది మందికి స్కీం నిర్వాహకులు ముఖం చాటేశారు. నిజామాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కీంతో అనేక మంది మోసపోయారు. స్కీం కాల పరిమితి ముగిసి రెండేళ్లు గడిచినా సభ్యులకు బహుమతులు ఇవ్వకుండా, వారి డబ్బులు వాపసు చేయకుండా నిర్వాహకులు సతాయిస్తూనే ఉన్నారు. 4వేల మందికి పైగా రూ.4 కోట్ల వరకు నిర్వాహకులకు చెల్లించారు. నామమాత్రంగానే బహుమతులను ఇచ్చి పెద్ద మొత్తంలో నగదును స్కీం నిర్వాహకులు నొక్కివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కీం నిర్వాహకులలో ఒకరు పోలీసు ఉద్యోగి కొడుకు కావడంతో అతనిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బాధితులు జంకుతున్నారని తెలుస్తోంది. గతంలోనూ దొన్కల్ కేంద్రంగా కొందరు రాజకీయ నాయకులు స్కీంను నిర్వహించి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. ముందస్తు ఎన్నికలకు ముందు తమ పార్టీకి ఎక్కడ ముప్పు వస్తుందో అనే భయంతో కీలకమైన నాయకులు చొరవ తీసుకోవడంతో స్కీం సభ్యులకు సగంసగం డబ్బులను నిర్వాహకులు వాపస్ చేశారు. సామాన్యులకు రూ.4కోట్ల వరకు టోకరా ముఖం చాటేసిన స్కీం నిర్వాహకులు రెండేళ్లు గడిచినా బహుమతులు లేవు.. డబ్బులు వాపస్ ఇవ్వడం లేదు పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు -
తండ్రీకొడుకుల గంజాయి దందా
● తుని నుంచి ఆటోలో తరలింపు ● మహేశ్వరంలో పట్టుబడిన తొర్లికొండకు చెందిన నిందితులు ● 62 కిలోల గంజాయి, ఆటో, సెల్‌ఫోన్, రూ.10 వేల నగదు సీజ్ ● కేసు వివరాలు వెల్లడించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిమహేశ్వరం: ఆంధ్రప్రదేశ్‌లోని తుని నుంచి నిజామాబాద్‌కు ఆటోలో గంజాయి తరలిస్తూ జిల్లాకు చెందిన తండ్రీకొడుకు మహేశ్వరం పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ మౌలానా విశాఖపట్నం జిల్లా చింతపల్లికి చెందిన చిట్టిబాబు నుంచి ఆటోలో గంజాయి తీసుకొచ్చి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన ప్రాణహిత అనే మహిళలకు అధిక ధరకు విక్రయించేవాడు. నవంబర్ 30వ తేదీన సాయంత్రం మౌలానా తన కుమారుడు మహ్మద్ ముస్తాఫాతో కలిసి తుని సమీపంలోని తాళ్లపాలెం వద్ద చిట్టిబాబు నుంచి 62.428 కిలోల(30 ప్యాకెట్ల) గంజాయిని రూ.2.10 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆటో వెనుక భాగంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్రేమ్‌లో గంజాయి ప్యాకెట్లు లోడ్ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రెగ్యులర్ రూట్లో వెళ్తే పోలీసు తనిఖీలుంటాయని మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, మహేశ్వరం గేటు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి, ఓఆర్ఆర్ మీదుగా నిజామాబాద్ వెళ్లాలనుకున్నారు. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో కల్వకుర్తి నుంచి మహేశ్వరం గేటు వైపు ఆటోలో గంజాయి తరలిస్తున్న క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆటోలో తరలిస్తున్న 62.428 కిలోల గంజాయి(30ప్యాకెట్లు), టాటా ఏస్ ఆటో, మొబైల్ ఫోన్, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకుని మౌలానా, ముస్తాఫాను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో విడతా నిరాశే!
● అర్హత ఉన్నా అందని రుణమాఫీ ● రూ. రెండు లక్షల లోపు ఉన్నా మాఫీ కానీ వైనం ● ఆందోళన చెందుతున్న రైతులుమోర్తాడ్(బాల్కొండ)/ఇందల్వాయి: వివిధ కారణాలతో రూ.2 లక్షల లోపు రుణం మాఫీ కాని వారికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి మాఫీ సొమ్మును మహబూబ్‌నగర్ వేదికగా విడుదల చేశారు. అ యితే అనేక మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ జ మకాకపోవడంతో తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలో గతంలో మూడు విడతల్లో 83,061 మంది రైతులకు రూ.626.49 కోట్లను విడుదల చేయగా నాలుగో విడతలో రూ.155.81 కోట్లను 17,551 మంది రైతులకు మంజూరు చేశారు. రుణమాఫీ ఫలాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 2లక్షల మందికి పైగానే ఉంటుందని అంచనా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోను అనేక మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో 39,285 మంది రైతులు రుణమాఫీ కోసం దర ఖాస్తులు అందించారు. ఇదిలా ఉండగా దర ఖాస్తుల్లో ఒకే కుటుంబం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయని, అలాంటి వారిని కలిపితే రెండు లక్షలకు మించి రుణం ఉన్న కేటగిరిలోకి వారు వెళ్లడంతో దరఖాస్తుల సంఖ్యకి లబ్ధిదారుల సంఖ్యకి తేడా ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం మాట తప్పింది రుణమాఫీ విషయంలో ప్ర భుత్వం మాట తప్పింది. గతంలో ఏక కాలంలోనే రూ.2 లక్షల వరకు పంట రుణం మాఫీ అని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకు సంమంజసం. ప్రభుత్వం రైతులను వంచించడం సరికాదు. వెంటనే రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. – ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్ రూ.లక్ష రుణం నేను దుబాయిలో ఉంటాను. పాస్‌బుక్ నా పేరు మీద, పంటరుణం నా భార్య పేరు మీద ఉండేది. కటాఫ్ తేదీ తర్వాతనే పంట రుణం చెల్లించాను. అర్హులమైన మాకు పంట రుణం అందలేదు. ఇకనైనా మాకు న్యాయం చేయాలి. – పత్తిపాకల రాజేందర్, నల్లవెల్లి మోర్తాడ్ మండలం సుంకెట్‌కు చెందిన రైతు ఆరెపల్లి గంగాప్రసాద్‌కు ఎస్బీఐలో రూ.50 వేల పంట రుణం ఉంది. గతంలో రెండు అకౌంట్లు ఒకే పేరు మీద ఉన్నాయనే కారణంతో రుణమాఫీ సొమ్ము సదరు రైతు గంగాప్రసాద్ ఖాతాలో జమ కాలేదు. నాలుగో విడతలో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ఆశించిన గంగాప్రసాద్‌కు నిరాశే మిగిలింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన సాయిరాంకు వేల్పూర్ మండలం రామన్నపేట్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ.2.45 లక్షల పంట రుణం ఉంది. అతనికి రూ.2 లక్షల రుణమాఫీ సొమ్ము జమ కావాల్సి ఉండగా ఎక్కువ రుణం ఉన్నందున మాఫీ సొమ్ము పొందడానికి అర్హత లభించలేదు. ఇలా గంగాప్రసాద్, సాయిరాంల మాదిరిగానే ఎంతో మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సహాయ కలెక్టర్ (యూటీ) సంకేత్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఇన్చార్జి డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డికి విన్నవిస్తూ అర్జీలను అందజేశారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాలు ఇప్పించండి 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు జీవో నంబర్ 81 ప్రకారం ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని, వెంటనే అమలు చేయాలన్నారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి నగరంలోని కాకతీయ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి శివజశ్విత్రెడ్డి మృతిపై విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి అధికారులకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశం 80 ఫిర్యాదులు నమోదు -
అట్టహాసంగా ఆరోగ్య ఉత్సవాలు
నిజామాబాద్‌నాగారం: ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘ ఆరోగ్య ఉత్సవా లు’ కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఆ యా జిల్లాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను, మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లను హైదరాబాద్ నుంచి మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్య ఉత్సవాల కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధా న్యత ఇస్తోందన్నారు. అధికారం చేపట్టిన 48 గంటల వ్యవధిలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఉచిత బస్సు ప్ర యాణం, రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామ న్నారు.రూ. 2 లక్షల లోపు పంట రుణా లను మాఫీ చేశామని, సంక్రాంతి తరువాత రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిల్లాకు కొత్తగా మరో ఎనిమిది 108 అంబులెన్సులు, అదే విధంగా 102 వాహనాలు రానున్నాయన్నారు. కా ర్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటె డ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్లు డాక్టర్ నాగమోహన్, డాక్ట ర్ జలగం తిరుపతిరావు, నాయ కులు నగేష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాకు కొత్తగా మరో ఎనిమిది 108 అంబులెన్సులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి -
రైల్వే అభివృద్ధికి అదనపు కేటాయింపులు
సుభాష్‌నగర్: రాష్ట్రంలో రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో 20 శాతం (సుమారు రూ.1000 కోట్లు) పెంచి కేటాయింపులు చేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధిపై లోక్‌సభలో తన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పై సమాధానం ఇచ్చారని ఎంపీ పేర్కొన్నారు. మోదీ పాలనలో కేంద్ర ప్రభు త్వం దశాబ్దకాలంలో తెలంగాణలో 650 కిలోమీటర్లు కొత్త రైల్వే ట్రాక్ పనులు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో (2009–14 వరకు)లో 87 కిలోమీటర్ల పనులు మాత్రమే ప్రారంభించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీజేపీ హయాంలో 647 శాతం కొత్త రైల్వే ట్రాక్ పనులు ప్రారంభించిందని, మోదీ పాలనలో తెలంగాణ రైల్వేకు మహర్దశ పట్టిందని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రణాళికాబద్ధంగా బోధించాలి ● జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ నిజామాబాద్‌అర్బన్: రానున్న వార్షిక పరీక్షలకు (2024 – 25 విద్యా సంవత్సరం) అధ్యాపకులు మిగిలిన 95 రోజులలో ప్రణాళిక బద్ధంగా బోధన చేసి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నా రు. ఆయన నిజామాబాద్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. అధ్యాపకుల బోధన తీరు పై విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. అధ్యాపకులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగ తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. విద్యార్జనలో వెనుకబడిన బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాలలో పేద, బడుగు బలహీన, మైనారిటీ, విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని, మంచి విద్యా బోధన జరగాలన్నారు. కళాశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్న్సల్యాబ్ల నిర్వహణ కోసం నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. సిలబస్ పూర్తి చేయడంతో పాటు అధ్యాపకులు మరోసారి రివిజన్ చేయాలన్నారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ వహించాలన్నారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఫయిముద్దీన్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు -
గ్రూప్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్ అర్బన్: ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్–2 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓఎంఆర్ ప్యాకింగ్ సంబంధిత వివరాలను వివరించారు. చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ముందస్తుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్ష సెంటర్ల గుర్తింపులో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. సమావేశంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ బి సత్యనారాయణ, వివిధ పరీక్ష కేంద్రాల ఆర్డినేటర్లు, రీజినల్ కోఆర్డినేటర్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందుల్లో మధ్యవర్తులు
స్కీంలో సభ్యులను చేర్పించిన వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. సభ్యులను చేర్పిస్తే ప్రతి నెలా కమీషన్ ఇస్తామని నిర్వాహకులు నమ్మించడంతో చాలా మంది సభ్యులను చేర్పించడంతోపాటు వారే సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశారు. స్కీం బాధితులు ఇప్పుడు తమను సభ్యులుగా చేర్పించిన వారిని పట్టుకున్నారు. దొన్కల్కు చెందిన బాధితులు ఇటీవల భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్‌ను ఆశ్రయించగా.. ఆయన ఏజెంట్లుగా వ్యవహరించిన వారిని పిలిపించి స్కీం డబ్బులు వాపసు చేయాలని ఆదేశించారు. రోజువారి విధుల్లో బిజీగా మారడంతో మళ్లీ పోలీసులు దీనిపై దృష్టి సారించలేదు. కమ్మర్పల్లి కేంద్రంలో ఓ స్కీం నిర్వాహకులు ఇదే విధంగా ప్రజలను మోసం చేయడంతో బాధితులు తమను సభ్యులు చేర్పించిన వ్యక్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై అనిల్‌రెడ్డి చొరవ తీసుకుని కొంత నగదు, కొన్ని టీవీలు, ఫ్రిజ్‌లు ఇప్పించారు. మరి కొంత నగదు, మరికొన్ని వస్తువులు ఇవ్వడానికి స్కీం నిర్వాహకులు గడువు కోరారు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
నవీపేట: భార్య కాపురానికి రావడం లేదని మండలంలోని కోస్లీ గ్రామానికి చెందిన మిణుగురు శివ(28) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. ఎత్తొండ గ్రామానికి చెందిన లావణ్యతో ఆరేళ్ల కిందట శివకు వివాహం కాగా, కుటుంబ కలహాల కారణంగా గత ఏడు నెలల క్రితం లావణ్య పుట్టింటికి వెళ్లిందన్నారు. ఆమె తిరిగిరాకపోవడంతో మనస్తాపానికి గురైన శివ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మద్యానికి బానిసై.. నిజామాబాద్ రూరల్: మద్యానికి బానిసై రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూపన్‌పల్లికి చెందిన గంగాధర్(32) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. ఇటీవల గంగాధర్ తీవ్రంగా మద్యం సేవించడంతో తల్లిదండ్రులు గంగాధర్‌ను మందలించారు. దీంతో గంగాధర్ గడ్డిమందు సేవించగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు తన తల్లిదండ్రులతోపాటు భార్యను పొలానికి పంపించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
నిజామాబాద్
మంగళవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2024తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయగా, ఇందూరు జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అయినప్పటికీ పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించుకుని వెళ్లేందుకు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ అర్వింద్ ఇందూరులోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించేందుకు ఢిల్లీలో పట్టు వదలకుండా కృషి చేస్తున్నారు.న్యూస్‌రీల్ -
పరిస్థితి విషమించి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేపూర్ సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హార్వెస్టర్ డ్రైవర్ గంగారాం సోమవారం మృతి చెందాడు. కరీంనగర్ నుంచి ఆర్మూర్వైపు వస్తున్న పాడి లారీ హార్వెస్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో హార్వెస్టర్ డ్రైవర్ గంగారాం, దానిపై ఉన్న విశాల్, జీత్ బసర్తోపాటు లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. నలుగురిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి గంగారాం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.పేకాటస్థావరంపై దాడిఆర్మూర్టౌన్: పట్టణంలోని పెర్కిట్‌లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారని, వారి నుంచి రూ.47,700 నగదుతోపాటు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పీఎంపీపై కలెక్టర్‌కు ఫిర్యాదుఎల్లారెడ్డి: సరైన పరిజ్ఞానం లేకుండా పీఎంపీ రవీందర్ ప్రజలకు వైద్యం చేస్తున్నాడని పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన కరణం స్వర్ణలత కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు సోమవారం ఫిర్యాదు చేసింది. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న తనకు పీఎంపీ పెయిన్ కిల్లర్లు ఇచ్చాడని, అవి వాడడంతో శరీరమంతా బొబ్బలు ఏర్పాడి ప్రాణాపాయ స్థితికి చేరానని తెలిపారు. పీఎంపీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత కామారెడ్డి రూరల్: పట్టణంలోని ముదాంగల్లీలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముదాంగల్లీకి చెందిన లావణ్య ఇంట్లో తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల బియ్యం పట్టుబడిందన్నారు. 6ఏ కేసు నమోదు చేశామన్నారు. ముగ్గురిపై చీటింగ్ కేసు సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్ గ్రామానికి చెందిన మద్దికుంట అక్షిత్, మల్లవ్వ, అజయ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. గ్రామానికి చెందిన జంగిలి గంగాధర్ కూతురు స్నేహను అక్షిత్ ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా స్నేహకు చెప్పకుండా అక్షిత్ వారం రోజుల క్రితం గల్ఫ్‌కు వెళ్లిపోయాడు. అక్షిత్ పారిపోవడానికి అతడి తల్లి మల్లవ్వ, అన్న అజయ్ సహకరించారని స్నేహ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఖలీల్‌వాడి: మద్యం సేవించి అంబులెన్స్ నడిపించిన డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి దేవి టాకీస్ చౌరస్తా వరకు సైరన్ ఆన్ చేసి డ్రైవర్ ఇసాక్ అంబులెన్స్‌ను వేగంగా నడిపించాడు. అంబులెన్స్ లో పేషెంట్ లేకున్న వేగంగా వెళ్లడంతో అనుమానం వచ్చి ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్సై సంజీవ్ వెంబడించి పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మున్సిపాలిటీల్లోకి 68 మంది కొత్త ఉద్యోగులు
నిజామాబాద్ సిటీ: జిల్లాలోని మున్సిపాలిటీల్లోకి 68 మంది కొత్త ఉద్యోగులు రానున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించనున్నారు. వీరంతా గ్రూప్–4 పరీక్షలో ఎంపికయ్యారు. సోమవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ దిలీప్‌కుమార్‌కు రిపోర్టు చేశారు. వీరికి ఉద్యోగ బాధ్యతలు, విధి విధానాలు తదితర అంశాలపై కమిషనర్ దిలీప్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. 58 మంది మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లుగా, మరో 8 మంది జూనియర్ అకౌంటెంట్లుగా జాయిన్ కానున్నారు. అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రం ఇవ్వనున్నట్లు తెలిసింది. అడవుల నరికివేత ఆపాలి ● ఎఫ్ఆర్వో రాధిక మోపాల్: అడవుల నరికివేతను ఆపి, సంరక్షణలో భాగస్వాములు కావాలని నిజామాబాద్ సౌత్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాధిక సూచించారు. సోమవారం ముదక్పల్లి సెక్షన్ పరిధిలోని సిర్పూర్ గ్రామపంచాయతీలో అడవికి నిప్పు – నివారణా చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రాధిక మాట్లాడుతూ అటవీ ప్రాంతాలకు నిప్పు పెడితే పర్యావరణానికి తీరని నష్టం చేకూర్చినవారవుతారని అన్నారు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణం కలుషితమై ఆక్సిజన్ దొరకడం లేదన్నారు. అనంతరం సిర్పూర్ కోటను వారు సందర్శించారు. కోట చరిత్ర, పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సదస్సులో సెక్షన్ ఆఫీసర్ బాసిత్, బీట్ ఆఫీసర్ సంయుక్త, అటవీ సిబ్బంది ఉదయ్, నాయకులు కెతడి నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఆర్ఎం ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎంగా జోత్స్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె సంగారెడ్డి నుంచి పదోన్నతిపై వచ్చారు. జోత్స్నకు సిబ్బంది పుష్ప గుచ్ఛం అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోత్స్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఎం) శంకర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఓ) ఎన్ సరస్వతి ఉన్నారు. కార్యాలయంలో ఆర్ఎం పరిధిలోని డిపో మేనేజర్లు ఆర్ఎం జోత్స్నను సన్మానించారు. -
బోర్డు కోసం..
● ఇందూరులోనే ఏర్పాటు చేయించేందుకు ఢిల్లీలో ఎంపీ అర్వింద్ పట్టువదలని కృషి ● ఇప్పటికే ప్రధాని అధికారిక ప్రకటన ● బోర్డును తరలించుకుపోయేందుకు మహారాష్ట్రకు చెందిన సీనియర్ కేంద్రమంత్రుల ప్రయత్నాలు ● బోర్డు డైరక్టర్ల నియామకానికి ఇప్పటికే కేంద్రం కసరత్తు ● పసుపు బోర్డు వస్తే జిల్లా నుంచే అంతర్జాతీయ ఎగుమతులు ● జిల్లాకు పసుపు శుద్ధి, కర్క్యుమిన్, ఆయిల్ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు బోర్డు విష యంలో పట్టిన పట్టు విడువకుండా గట్టిగా కృషి చేసి చరిత్ర సృష్టించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ మరిన్ని అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు పసు పు బోర్డు ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రకటన చేయించారు. కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ సైతం విడుదల చేసింది. తర్వాత కేంద్రంలో నంబర్‌టూ గా ఉన్న హోంమంత్రి అమిత్‌షాతో ఇందూరు జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయించారు. దేశంలో ఇప్పటివరకు స్పైసెస్ బోర్డు పరిధిలో ఒక పంటగా ఉన్న పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయించే విషయంలో అర్వింద్ ప్రత్యేకమైన ఘనత సాధించారు. అయితే పసుపు పంటకు సంబంధించి నిజామాబాద్ మార్కెట్‌తో పాటు సరిహద్దునే ఉన్న మహారాష్ట్రలో పేరెన్నిక గన్న సాంగ్లి మార్కెట్ సైతం అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి, సాంగ్లి, షోలాపూర్, కొల్హాపూర్ తదితర ప్రాంతాల్లో పసుపు పంటను బాగానే పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించుకుని వెళ్లేందుకు గాను మహారాష్ట్రకే చెందిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎంపీ అర్వింద్ ఏమా త్రం అవకాశమివ్వకుండా ఢిల్లీలో పట్టు వదలకుండా ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృతనిశ్చయంతో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ విషయమై ఇటీవలి కాలం వరకు సైలెంట్‌గా ఉన్న అర్వింద్ ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర కృషి చేస్తున్నారు. చైర్మన్‌గా సీనియర్ నేత ? పసుపు బోర్డు డైరక్టర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. సీనియర్ నేతను చైర్మన్‌గా నియమించేందుకు ఆలోచన చేస్తున్నారు. డైరక్టర్లుగా ఐదుగురు సీనియర్ ఐ ఏఎస్ అధికారులు, రైతులు, వ్యవసా య శాస్త్రవేత్తలు, ట్రేడర్లను నియమించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. వ్యవసాయం, వాణి జ్యం, పరిశ్రమల శాఖలు, ఆయుష్, ఫా ర్మాసూటికల్స్ విభాగాల నుంచి రొటేషన్ విధానంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను, పరిశోధనల్లో భాగసామ్యమయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులను సభ్యులు గా నియమించనున్నారు. పసుపు బోర్డు కార్యదర్శి ని కేంద్ర వాణిజ్య శాఖ నియామకం చేయనుంది. ● మహారాష్ట్రలోని సాంగ్లి, తమిళనాడులోని ఈరోడ్ లలో పెద్ద పసుపు మార్కెట్లు ఉన్నప్పటికీ నిజా మాబాద్ పసుపు మార్కెట్ ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే సాంగ్లి మార్కెట్ నుంచి గట్టి పోటీ ఉండడంతో పాటు అక్క డి సీనియర్ కేంద్ర మంత్రులు బోర్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంపీఅర్వింద్ పట్టువదలడం లేదు. నిజామాబాద్‌లోనే 40 శాతం.. వివిధ రాష్ట్రాల ద్వారా 11.61 లక్షల ట న్నుల పసుపు దిగుబడి వస్తోంది. 2022– 23 సీజన్లో నిజామాబాద్ మార్కెట్‌కు 75 వేల టన్నుల పసుపు వచ్చింది. 2023–24 సీజన్లో నిజామాబాద్ మార్కెట్‌కు 70 వేల టన్నుల పసుపు వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం పసుపు సాగులో 40 శాతం నిజామాబాద్ జిల్లాలోనే కావడం గమనార్హం. తరువాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్..భారతీయ రైతులు పండించిన పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలో భారత్ నుంచి ప్రతి ఏటా రూ.1,600 కోట్ల మేర పసుపు ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ పసుపు వాణిజ్యంలో భారత్ వాటా ప్రస్తుతం 62 శాతం ఉంది. అయితే ఈ పసుపు ఎగుమతుల వాణిజ్యాన్ని రూ.8,400 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది. దీనికి పసుపు బోర్డు ఎంతగానో ఉపయోగపడనుంది. బోర్డు ఏర్పాటైతే రాష్ట్రంలో ఏటేటా తగ్గుతూ వస్తున్న పసుపు పంట విస్తీర్ణం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. బోర్డు ఏర్పాటైతే జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు, కర్క్యుమిన్ యూనిట్లు, కర్క్యుమిన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఎగుమతి యూనిట్లు, వివిధ పసుపు అథారిత పరిశ్రమలు తరలివస్తాయి. అమెరికా, యూఏఈ, బంగ్లాదేశ్, మలేసియా దేశాల్లో భారత పసుపునకు డిమాండ్ ఉంది. బోర్డు ద్వారా భారతదేశం నుంచి అంతర్జాతీయ పసుపు వాణిజ్యం మరింత విస్తృతం అవుతుంది. -
లైబ్రరీలో సౌకర్యాల పరిశీలన
వేల్పూర్: మండల కేంద్రంలోని లైబ్రరీని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆదివారం సందర్శించారు. లైబ్రరీలో సౌకర్యాలను పరిశీలించిన ఆయన నిరుద్యోగులు, విద్యార్థులతోపాటు అన్ని వ ర్గాలవారు చదువుకోడానికి అవసరమైన పు స్తకాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని తెలుసుకున్నారు. అంతిరెడ్డి వేల్పూర్‌కు మొదటిసారి రావడంతో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు సన్మానించా రు. మండల కాంగ్రెస్ అధ్యక్షు డు గడ్డం న ర్సారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లే శ్, నా యకులు గౌరాయి నరేందర్, రమణ, రాజేందర్, మల్లయ్య, మోహన్, రాజేశ్వర్, వినోద్, ప్రవీన్, చిన్నయ్య, రహీం పాల్గొన్నారు. హిందువులు సంఘటితంగా ముందుకెళ్లాలి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హిందువులు మరింత సంఘటితంగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత పెరుగుతోందని విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి ధాత్రిక రమేశ్ పేర్కొన్నారు. ఆర్మూర్ రోడ్డులోని కంఠేశ్వర్ ఇస్కాన్ మందిరంలో అధ్యక్షుడు రామానందరాయ్ గౌరదాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆరాధన, భజనలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధాత్రిక రమేశ్.. మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనలను చూసి ప్రతి భారతీయుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. బంగ్లాదేశ్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఇస్కాన్ సంస్థ బాధ్యులపై అక్కడి ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోందన్నారు. బంగ్లా హిందువులపై విచ్చలవిడిగా దాడులు చోటుచేసుకుంటున్నాయన్నారు. సనాతన ధర్మంపై అంతర్జాతీయ కుట్రలు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో భారత్‌లో హిందువులు మరింత ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు నరేశ్, బలరాందాస్ తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ చెక్‌పోస్ట్ తనిఖీ రుద్రూర్: పోతంగల్ శివారులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఆదివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది అ ప్రమత్తంగా ఉండాలని, సూచించారు. ఇసుక అక్రమ రవాణకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దన్నారు. పకడ్బందీగా వి ధులు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు హంగర్గా గ్రామ శివారులోని మంజీరా వద్ద ఉన్న ఇసుక క్వారీని పరిశీలించారు. ఇసుక తరలింపులో నిబంధనలు పాటిస్తున్నారా.. ఎంత మేరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారనిగమనించారు. తహ సీల్దార్ మల్లయ్య, మండల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
అసంపూర్తిగానే రైతు రుణమాఫీ
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అసంపూర్తిగా చేసిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రూ.40వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అమలు చేసే పరిస్థితి వచ్చేసరికి 24 లక్షల మంది రైతులకు కేవలం రూ.20వేల కోట్ల రూపాయలను మాత్రమే మాఫీ చేసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 3,79,520 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా నాలుగు విడతల్లో 2,01,967 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,77,553 వేల మంది రైతులకు రుణమాఫీ అవ్వా ల్సి ఉందన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన రుణమాఫీతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చాలా తక్కువ అని అన్నారు. కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఎక్కువే రుణమాఫీ చేశారన్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయించారని, దీంతో చాలా మంది రైతులు బోనస్ అందుకోలేకపోయారన్నారు. అమ్ముకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఆలస్యంగా కొనుగోలు చేయడం వల్ల బోనస్ తప్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్ ట న్నుల దిగుబడి వస్తే ప్రభుత్వం ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. జిల్లా రైతులకు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.90 కోట్లు మాత్రమే చెల్లించారని విమర్శించారు. ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించిన రైతులకు సైతం ఎకరానికి 24 క్వింటాళ్ల చొ ప్పున దిగుబడిని లెక్కగట్టి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. రైతుబంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే ప్రజలు తిరగబడతారని అన్నారు. రైతులను నిండాముంచి రైతుపండుగ చేసుకోవడం బాగోలేదన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి -
జీతం రాకున్నా ఇక్కడే ఉంటా..
నిజామాబాద్ నాగారం: వైద్యారోగ్య శాఖలో డిప్యు టేషన్లు రద్దు చేసినా ఓ అధికారి మాత్రం ఇప్పటికీ తన సొంతశాఖకు రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. వైద్యారోగ్యశాఖ ఉద్యోగి సోలోమాన్ డిప్యుటేషన్‌పై వెళ్లి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాహనాల ఇన్చార్జి, డాగ్ స్క్వాడ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. డిప్యుటేషన్లు రద్దయిన నేపథ్యంలో వెనక్కి వచ్చేయాలని డీఎంహెచ్‌వో చెప్పి నా ఆయన పెడచెవిన పెట్టడం గమనార్హం. తనకు వేతనం రాకున్నా ఇక్కడే పని చేస్తానని తోటి ఉద్యో గులతో ఆయన పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒక్కనెల వేతనం ఆలస్యమైతేనే తాము ఇబ్బందులు పడతామని, ఈయన మాత్రం ఐదు నెలలుగా వేతనం రాకున్నా ఇక్కడే కొనసాగుతున్నాడని చర్చించుకుంటున్నారు. ఐదేళ్లుగా కార్పొరేషన్లోనే.. డీఎంహెచ్‌వో నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సోలోమాన్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు ఐదేళ్లుగా శానిటేషన్ ఇన్స్పెక్టర్గా, డంపింగ్‌యార్డు ఇన్‌చార్జీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ డిప్యుటేషన్లను ఫిబ్రవరిలో రద్దు చేయగా, అందరూ సొంతశాఖకు వెళ్లిపోయారు. అయితే సోలోమాన్తోపాటు నటరాజ్‌గౌడ్ అనే ఉద్యోగి వెనక్కి వెళ్లలేదు. వైద్యారోగ్య శాఖాధికారులు వేతనాలను నిలిపి మున్సిపల్ కార్యాలయానికి నోటీసు పంపించడంతో గత నెల 22న నటరాజ్‌గౌడ్ సొంతశాఖకు వెళ్లిపోయారు. డిప్యుటేషన్ రద్దయినప్పటికీ ఉద్యోగి వెనక్కి రాకపోవడంతో నోటీసులు ఇచ్చామని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దైనా మున్సిపాలిటీని వీడని ఉద్యోగి సొంత శాఖకు వెళ్లేందుకు విముఖత నోటీసు పంపిన డీఎంహెచ్‌వో -
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
నిజామాబాద్ సిటీ: పదేళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలన అందిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిపై ఎవరితోనైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని, విపక్షాల తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని సూచించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ది పథంలో నడిపిస్తున్నారన్నారు. ఎన్నికల హామీ మేరకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలబీమా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ వంటివి అమలు చేశామన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని మానాల తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 3 కోట్ల 26 లక్షల మంది లబ్ధి పొందారని, గృహజ్యోతి ద్వారా 2.47 కోట్ల కుటుంబాలకు జీరో బిల్లులు వస్తున్నట్లు వివరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉత్తర తెలంగాణ రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వాస్తవాలు గ్రహించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, నాయకులు జావేద్ అక్రం, రత్నాకర్, వేణురాజ్, రాజనరేందర్‌గౌడ్, సంతోష్, బోర్గాం శ్రీనివాస్, అఖిల్, శశికుమార్, సాయికిరణ్ పాల్గొన్నారు. విపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో ఆదివారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మూడో రాష్ట్ర వి ద్యా మహాసభలు ప్రారంభమయ్యాయి. షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం తనను సలహాదారుగా నియమించిందన్నారు. అంబేడ్కర్, పూలే ఆశయాలను కొనసాగించడానికి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కు నాణ్యమైన విధ్యను అందించి భవిష్యత్ తరా లకు బంగారు బాటలు వేయాలని కోరారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా తొమ్మిదేళ్లు కాలయాపన చేసిందని విస్మరించారు. తమ ప్రభు త్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నారు. రాష్ట్రంలో 90 శా తం కులగణన సర్వే పూర్తయ్యిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ఆ సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. మహాసభల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్, రాష్ట్ర కోశాధికారి సంగయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 90 శాతం కుల గణన సర్వే పూర్తి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం -
వేముల వర్సెస్ మానాల
బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి వెంటనే ప్రతివిమర్శలు చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై వెంటవెంటనే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు కేబినెట్ బెర్త్ కేటాయించడంలో ఆలస్యమవుతోంది. సీనియర్ నేత పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమైనప్పటికీ అధిష్టానం నుంచి మంత్రివర్గ విస్తరణపై గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉన్న మానాల మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడి హోదాలో బీఆర్ఎస్ విమర్శలను బలంగా తిప్పికొడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి అంశంపై మానాల సైతం లెక్కలతో సహా సమాధానాలు ఇస్తున్నారు. నువ్వా? నేనా? అనే స్థాయిలో మానాల దూకుడుగా వ్యవహిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి ఇద్దరూ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వాళ్లే కావడంతో వీరిద్దరి విమర్శలు, ప్రతివిమర్శలు ఆసక్తి రేపుతున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి విఫలమైన మానాల మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సైతం సన్నిహితుడిగా ఉన్నారు. టిక్కెట్ దక్కకపోవడంతో ముఖ్యమంత్రి కోటాలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, సుంకేట అన్వేష్‌రెడ్డి సైతం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల పదవులు దక్కించుకున్నారు. అయితే నియోజకవర్గంపై ఫోకస్ మాత్రం మానాల మోహన్‌రెడ్డి మాత్రమే చేశా రు. జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూనే బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల బరిలోకి నిలిచేందుకు మానాల మోహన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన కానున్న నేపథ్యంలో అనువైన స్థానం నుంచి బరిలోకి దిగేందుకు మానాల ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేముల వర్సెస్ మానాల అన్నవిధంగా పరిస్థితి తయారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు, ప్రతివిమర్శలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి కేంద్రంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని నిలువరించేందుకు అదేస్థాయిలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాటలదాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రశాంత్‌రెడ్డి ప్రకటించగా, ఏడాదికాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని మానాల మోహన్‌రెడ్డి ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వర్సెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అనేలా మాటల దాడి, ప్రతిదాడి వ్యవహారం నడు స్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడా ది గడిచింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై గత కొన్ని నెలలుగా విమర్శల దాడిని పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, బాల్కొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. రైతు రుణమాఫీ, బోనస్ చెల్లింపులు, ఆరు గ్యారంటీల విషయమై ప్రశాంత్‌రెడ్డి టాప్ గేర్‌లో విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంతోపాటు రెగ్యులర్‌గా జిల్లా కేంద్రంలో పర్యటిస్తూ పార్టీ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విమర్శల దాడిని మరింత పెంచారు. అన్నీతానై ప్రశాంత్‌రెడ్డి జిల్లా పార్టీకి సంబంధించి బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ప్రతి అంశంపై గణాంకాలతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరును ఉధృతం చేయనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. విమర్శకు ప్రతివిమర్శ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే విమర్శల దాడి అదేస్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఇద్దరూ బాల్కొండ నియోజకవర్గం వారే కావడంతో ఆసక్తికరంగా రాజకీయం -
లక్ష్యానికి దూరంగా..
● సేకరించిన ధాన్యం 4.60 లక్షల మెట్రిక్ టన్నులే.. ● నిర్దేశించింది 8 లక్షల మెట్రిక్ టన్నులు ● 150కి పైగా కొనుగోలు కేంద్రాల మూసివేత.. ● రూ.850 కోట్లకుపైనే రైతుల ఖాతాల్లో జమ ● రూ.100 కోట్ల వరకు బోనస్ చెల్లింపు..సుభాష్‌నగర్ : ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలే కపోయింది. 90 శాతానికిపైగా సేకరణ పూర్తి కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.4.60 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. మరోవారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రా లు సేయనున్నారు. సుమారు 52 వేల మంది రైతులకు రూ.850 కోట్ల వరకు ధాన్యం డబ్బులు చెల్లించగా, 26,861 మంది రైతులకు రూ.99.51 కోట్ల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేశారు. ● జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 676 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. ఈ సీజన్లో ప్రభు త్వం బోనస్ ప్రకటించడంతో సన్నరకాలు, దొడ్డు రకాలకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 673 కేంద్రాలను ప్రారంభించగా, 65,425 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. 2.98 లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకాలు, దొడ్డు రకాలు 1.62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ధాన్యం సేకరణ పూర్తి కావస్తుండటంతో ఇప్పటికే సుమారు 150 పైగా సెంటర్లను మూసేశారు. 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా డౌటే.. వానాకాలం సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 4.60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. కేంద్రాలు మూసేసే నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా చేరుకోకపోవచ్చని భావిస్తున్నారు. వర్ని, మోస్రా, చందూర్, రుద్రూర్, ఎడపల్లి, మోపాల్ తదితర మండలాల్లో రైతులు పచ్చి ధాన్యాన్ని అమ్మేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, నల్గొండ, సూర్యాపేట్తో పాటు జిల్లాలోని రైస్‌మిల్లర్లు, వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించినప్పటికీ ఇస్తుందో.. లేదోనన్న సందేహంతో చాలామంది రైతులు వ్యాపారులకు అమ్ముకున్నారు. తీరా ప్రభుత్వం బోనస్ జమ చేస్తుండటంతో ఆ రైతులంతా నష్టపోయారు. మరోవైపు పౌరసరఫరాశాఖ అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోలేకపోయారు. 52వేల మంది రైతులకు చెల్లింపులు రైతులు ధాన్యం విక్రయించి, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించిన వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అధికారులు, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. 65,425 మంది రైతుల నుంచి 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పటికే 52 వేల మంది రైతులకు సుమారు రూ.850 కోట్ల వరకు చెల్లింపులు పూర్తి చేశారు. ట్యాబ్ ఎంట్రీ ఈసారి కొంత కఠినతరం చేయడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.26,861 మందికి బోనస్..ప్రభుత్వం సన్నరకాలకు బోనస్ ప్రకటించిన ప్రకారం రైతులకు రూ.500 జమ చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 26,861 మంది రైతులకు రూ.99.51కోట్ల బోనస్ డబ్బులు జమ చేసింది. ధాన్యం మద్దతు ధర డబ్బులతో కాకుండా బోనస్ డబ్బులు వేరుగా జమ చేస్తున్నారు. వారం రోజుల్లో కేంద్రాలు మూసేస్తాం.. జిల్లాలో 90 శాతానికిపైగా ధాన్యం సేకరణ పూ ర్తయినట్లే. చివరి గింజ వరకు ధాన్యం సేకరించి మరో వారం, పదిరోజుల్లో కొనుగోలు కేంద్రాలను మూసేస్తాం. నిర్దేశించిన లక్ష్యం మేరకు సేకరించకపోయినా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సేకరించాం. కడ్తా, తరుగు అనే పదాలకు తావివ్వకుండా రైస్‌మిల్లర్లు ధాన్యం దించుకున్నారు. – అరవింద్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
పంటలపై చలి ప్రభావం
● మారిన వాతావరణం ● అధిక చలితో తెగుళ్లబారిన పంటలు ● ఎదుగుదల లోపించిన నారుమడులుడొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులకు ఆదిలోనే సవాళ్లు ఎదురవుతున్నా యి. ప్రతికూల వాతావరణంతో పంటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. అధిక చలి కారణంగా పోసిన నారుమడులు సక్రమంగా ఎదగడం లేదు. తెగుళ్లతో రంగుమారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మందుల కోసం పురుగుల మందు దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కువ డబ్బు లు వెచ్చించి మందులు కొనుగోలు చేసి నారుమడులకు చల్లుతున్నారు. జిల్లాలో 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేసేందుకు నారుమ డులను సిద్ధం చేస్తున్న తరుణంలో తెగుళ్లు ఆశిస్తున్నాయి. చలి ప్రభావం తగ్గే వరకు వేచి చూద్దామనే ఆలోచనలో కొంతమంది రైతులున్నారు. ఇటు మొక్క దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న పంటలను సైతం తెగుళ్లు ఆశిస్తున్నాయి. అయితే నారుమడిని రక్షించుకోవడానికి పగటి పూట వెచ్చటి నీటిని అందించాలని, మంచు పడకుండా తాటిపత్రులు కప్పి ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సే న్ రైతులకు సూచిస్తున్నారు. అలాగే నారు ఆరోగ్యంగా పెరిగేందుకు యూరియాకు 2గ్రాముల కార్బండిజమ్తోపాటు మాంకోజెడ్ మిశ్రమాన్ని కలిపి చిరికారీ చేయాలన్నారు. ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడితే జింకు సల్పేట్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, కాండం తొలుచు పురుగు నుంచి కాపాడుకోవడానికి కార్బోప్యూరాన్ 3జీ గులికలు ఎకరానికి సరిపడే నారుమడికి కిలో చొప్పున చల్లాలని సూచించారు. తుపాను ప్రభావం... కల్లాల్లో వడ్లు జిల్లాలో డొంకేశ్వర్తోపాటు పలు మండలాల్లో వరికోతలు ఇంకా అక్కడడక్కడా పూర్తికాలేదు. ఇటు కోసిన పంట కూడా కొంత మేర కల్లాల్లోనే ఉంది. అల్పపీడనం కారణంగా జిల్లాలో సైతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు మండలాల్లో చిరు జల్లులు సైతం కురిశాయి. దీంతో కల్లాల్లో ధాన్యం ఉంచిన రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షం ముప్పు ఉండడంతో ధాన్యం కుప్పలు, సంచులపై టార్పాలిన్లు కప్పి ఉంచారు.దత్తాపూర్ శివారులో ఎదుగుదల లేని నారుమడి