Tamil Politics
-
హీరో విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
తమిళ రాజకీయాల్లో కలకలం; పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరుతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలో ఆధిపత్యం కోసం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) పోటీ పడటంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలని పళనిస్వామి పట్టుబడుతుండగా.. అలాంటిదేమి కుదరదంటూ పన్నీర్‌సెల్వం అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటాచలపతి ప్యాలెస్‌లో గురువారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ రసాభాసగా ముగిసింది. సమావేశం ముగియడానికి కొద్దిసేపు ముందు పళనిస్వామి వర్గీయులు పన్నీర్‌సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కారు టైర్లలో గాలి తీసేయడంతో మరో వాహనంలో ఓపీఎస్ వెళ్లిపోయారు. ‘సింగిల్ లీడర్షిప్’కు అనుకూలంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు. అయితే కోర్టు తీర్పు కారణంగా దీనిపై ఎటువంటి తీర్మానం చేయలేకపోయారు. 23 తీర్మానాలు తిరస్కరణ ఓపీఎస్ ఆమోదించిన 23 తీర్మానాలను తిరస్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 23 తీర్మానాలను జనరల్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించారని, పార్టీ పగ్గాలు ఒక్కరి చేతిలోనే ఉండాలని వారంతా కోరుకుంటున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ మునుస్వామి తెలిపారు. జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మాజీ మంత్రి జయకుమార్ చెప్పారు. ‘సింగిల్ లీడర్షిప్’ తీర్మానాన్ని తర్వాతి సమావేశంలో ఆమోదింపజేసుకుంటామన్నారు. నాటకీయ పరిణామాలు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరగకుండా చూడాలని పన్నీర్ సెల్వం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఓపీఎస్ మరోసారి కోర్టు తలుపులు తట్టింది. దీనిపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మిగతా అంశాలపై చర్చపై జరగాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ‘సింగిల్ లీడర్షిప్’పై తీర్మానాన్ని ఆమోదించడానికి వీలు లేకుండా పోయింది. దీనంతటికీ కారణమైన పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు కోపంతో రగిలిపోతున్నారు. (క్లిక్: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?) -
తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా
తమిళనాట రాజకీయాల్లో నవ శకం ప్రారంభమైంది. తాజాగా జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ ‘యువ’ మంత్రం జపించింది. అంతేకాదు అతివలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ టైమర్స్, యువత, చదువుకున్న వారిని ప్రోత్సహించడంతో డీఎంకేపార్టీ నూతనోత్సాహంతో తొనికిసలాడుతోంది. విద్యావంతులకు పెద్దపీట డీఎంకే తరపున మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారిలో 30 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ఒక డాక్టర్ కూడా ఉండటం విశేషం. కాంచీపురం మేయర్‌గా ఎన్నికైన మహలక్ష్మి యువరాజ్.. ఇన్ఫోసిస్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదివిన ఎన్. దినేశ్.. తిరుప్పూర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అలాగే చెన్నై మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించిన ప్రియా రాజన్ కూడా ఎంకామ్ చేశారు. తంజావూర్ డిప్యూటీ మేయర్ అంజుగమ్ భూపతి.. ఎంబీబీఎస్, ఎండీ చదివారు. ఆశ్చర్యకర ఎంపిక కోయంబత్తూర్ మేయర్‌గా కల్పనా ఆనందకుమార్, చెన్నై మేయర్‌గా ప్రియా రాజన్‌ను ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ కుటుంబానికి చెందిన 40 ఏళ్ల కల్పన.. కోయంబత్తూర్‌కు తొలి మహిళా మేయర్ అయ్యారు. ఆమె స్థానిక డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, కల్పన భర్త ఆనందకుమార్.. ఈ-సేవ కేంద్రం నిర్వహిస్తూ, మానియాకరంపాళయం ప్రాంత డీఎంకే కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కల్పన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే సమయానికి.. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసేందుకు భర్తతో పాటు ఆమె ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ప్రియా రాజన్ రికార్డు 51 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నై మేయర్ పీఠాన్ని మహిళ అధిష్టించారు. అంతేకాదు అతిచిన్న వయసులో చెన్నై మేయర్‌గా ఎన్నికైన ఘనత కూడా ప్రియా రాజన్(28)కు దక్కింది. చెన్నై నగర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ సామాజిక వర్గానికి మేయర్ కుర్చీ సొంతమైంది. తారా చెరియన్(1958), కామాక్షి జయరామన్(1971) తర్వాత చెన్నైకి మూడవ మహిళా మేయర్‌గా ప్రియా రాజన్ నిలిచారు. డీఎంకే నుంచి మేయర్లుగా ఎన్నికైన 20 మందిలో 11 మంది మహిళలు ఉండటం విశేషం. డీఎంకే మిత్ర ధర్మం నగర పాలక సంస్థల ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగించి 21 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే మిత్రధర్మాన్ని పాటించి కాంగ్రెస్‌కు ఒక స్థానాన్ని కట్టబెట్టింది. కుంభకోణం నగర మేయర్ సీటును కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టింది. అంతేకాదు ఆరు డిప్యూటీ మేయర్ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. దీంతో కమ్యూనిస్ట్, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలకు కూడా పదవులు దక్కాయి. 15 డిప్యూటీ మేయర్ స్థానాలకు డీఎంకే పరిమితమైంది. (క్లిక్: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా) స్థాలిన్ ముందుచూపు యువతకు పెద్దపీట వేయడం ద్వారా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ముందుచూపు ప్రదర్శించారు. 20 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించేలా యువ నాయకులను తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో ఏళ్లకు తరబడి పాతుకుపోయిన నాయకులతో పోలిస్తే కొత్త తరంపై వ్యతిరేకత తక్కువ ఉంటుంది. యువతకు అవకాశం కల్పిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతో స్టాలిన్.. నగర పాలక సంస్థల్లో వారికి పెద్దపీట వేసి అనుకున్న ఫలితాలు సాధించారు. (చదవండి: చెన్నై మేయర్‌గా ప్రియా రాజన్) - సాక్షి, వెబ్ స్పెషల్ -
తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?
చెన్నె: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో దూకుడుతో వచ్చిన సినీ నటీనటులకు మాత్రం ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఒక్క ఉదయనిధి స్టాలిన్ తప్ప అందరూ పరాజయం మూటగట్టుకున్నారు. వారి చరిష్మా వెండితెర వరకే అని ఈ ఎన్నికల తీర్పు చెబుతోంది. తమిళ రాజకీయాలకు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం. కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను సినీ ప్రముఖులు ఏలారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సినీ రంగానికి చెందినవారే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరనట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సినీతారలంతా పరాజయం పాలయ్యారు. గతంలో రాష్ట్రాన్ని శాసించిన సినీనటులు ఇప్పుడు గెలవడమే కష్టంగా మారింది. ఎంజీఆర్ మొదలుకుని జయలలిత, కరుణానిధి వరకు సినీ పరిశ్రమకు చెందిన వారే. రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినీ పరిశ్రమ దూరం కానుందేమో. ముఖ్యంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి బరిలోకి దిగిన కమల్‌హాసన్‌కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. పార్టీ అధినేత, స్టార్ నటుడిగా ఉన్న కమల్ హాసనే గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడిపోయారు. ఎంఎన్ఎం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఇక ఖుష్బూను కూడా తమిళ ప్రజలు ఓడించారు. సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ తన సతీమణి ప్రేమలతను విరుదాచలం నుంచి పోటీ చేయించగా ఆమె పరాజయం పొందారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ఎన్నికల్లో తిరువొత్తియూరు నుంచి ఓడిపోయారు. నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. చెపాక్ నుంచి పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందాడు. ఈ విధంగా తమిళ ఓటర్లు సినీ పరిశ్రమకు చెందినవారిని విశ్వసించలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తానని.. తర్వాత అనారోగ్యంతో దూరమైపోయిన రజనీకాంత్‌కు ఇదే పరిస్థితి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ
చెన్నె: జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ అన్నాడీఎంకే పార్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ తనదేనని.. పార్టీ గుర్తుపై ఇప్పటికే కేసు వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకే గుర్తు రెండాకులు వినియోగిస్తోంది. తాజాగా బుధవారం జయలలిత జయంతి సందర్భంగా శశికళ తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకుంది. ఈ మేరకు అదే హోదాతో ప్రకటన విడుదల కావడం విశేషం. కాగా తమిళనాడులో బుధవారం జయలలిత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరి అమ్మగా పేరుపొందిన జయలలితను అన్ని పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జయలలితకు ఘన నివాళులర్పించారు. అయితే పోయెస్ గార్డెన్లో శశికళ తన స్నేహితురాలు జయలలితకు ఘన నివాళులర్పించింది. టీటీవీ దినకరన్‌తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ తనదేనని శశికళ మరోసారి పునరుద్ఘాటించారు. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు డీఎంకే అని తెలిపారు. ఈ క్రమంలోనే శశికళ నివాసానికి సినీ ప్రముఖులు వరుస కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా శరత్‌కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా శశికళను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వారు శశికళను కలవడం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే సమావేశంలో రాజకీయంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నా.. దీనిపై వారు స్పష్టత ఇచ్చారు. శశికళ అనారోగ్యానికి గురవడం.. జైలు నుంచి రావడంతో ఆమెను పరామర్శించేందుకే వచ్చామని రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చినట్లు వివరణ ఇచ్చారు. అయితే రాధికా శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. -
అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక
చెన్నై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా అగ్ర నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరూ సమావేశమయ్యారు. వీరిద్దరూ శనివారం భేటీ కావడంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కమల్‌హాసన్‌కు రాజకీయంగా సహకరించేందుకు రజనీకాంత్ రాబోతున్నారని తెలుస్తోంది. చెన్నెలోని పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్ నివాసానికి శనివారం మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమలహాసన్ వెళ్లారు. రజనీకాంత్‌తో కొన్ని నిమిషాల పాటు సమావేశమయ్యారు. అయితే వీరి ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో రజనీకాంత్‌ను పరామర్శించేందుకు కమల్ వచ్చాడని అధికారికంగా తెలుస్తోంది. కాకపోతే దానితోపాటు రాజకీయంగా కూడా చర్చించేందుకు కమల్ వచ్చాడని సమాచారం. 2018లో కమల్‌హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి రజనీకాంత్ మద్దతు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీతో కమల్‌కు ఒప్పందం జరిగిందని.. ఇక రజనీకాంత్ మద్దతు ఇస్తే రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు కావొచ్చని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌తో సమావేశమైనట్లు తమిళ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు ఇటీవల జైలు నుంచి వచ్చిన శశికళ రావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా రజనీ, కమల్ భేటితో మరింత ఉత్కంఠగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతోందననే ఆసక్తిగా మారింది. మూడోసారి అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే భావిస్తుండగా.. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని డీఎంకే తీవ్రంగా శ్రమిస్తుండగా.. బీజేపీ మాత్రం తొలిసారిగా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రస్తుత అధికార పార్టీకి అండగా నిలుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడాలి. #MakkalNeedhiMaiam President #Kamalhassan sir visited the residence of #Rajinikanth sir at Poes Garden and had met him. The meeting between them took place for nearly 20 minutes. pic.twitter.com/BSfGMeH73q — Yuvraaj (@proyuvraaj) February 20, 2021 -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్‌సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
రజనీకాంత్ ‘ఆగమనం’
రాజకీయ రంగప్రవేశంపై అసంఖ్యాక అభిమానుల్ని ఊరిస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు గురువారం ప్రకటించారు. 2017 డిసెంబర్‌లోనూ, మొన్న మార్చిలోనూ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. ఆ రెండు సందర్భాల్లోనూ ‘రాజకీయాల్లోకొస్తానుగానీ, పోటీ చేయబోన’ని చెప్పారు. ఈసారి మాత్రం వచ్చే జనవరిలో తాను స్థాపించబోయే పార్టీ ఎన్నికల్లో తలపడుతుందన్న అభిప్రాయం కలిగించారు. ఆయన బరిలో వుంటారా లేదా అన్న అంశంలో స్పష్టతనీయలేదు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరగద’ంటూ ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే రజనీకాంత్ పూర్తి స్థాయిలో రాదల్చుకున్నట్టు అర్థమవుతోంది. పార్టీ ఆవిర్భావం తేదీ, ఇతర వివరాలు ఈనెల 31న వెల్లడిస్తారు గనుక అప్పుడు మరింత స్పష్టత వస్తుంది. తమిళనాట రాజకీయ పార్టీలకు కొదవలేదు. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకేలతోపాటు వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నాయకత్వంలోని పీఎంకే, నటుడు విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే, శశికళకు చెందిన ఎంఎంఎంకేవంటి పార్టీలెన్నో వున్నాయి. రెండేళ్లక్రితం ప్రముఖ నటుడు కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పేరిట పార్టీని స్థాపించారు. సీఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వీరంతా ఆ రాష్ట్రంలో వెల్లువెత్తిన ద్రవిడ ఉద్యమ ప్రభావంతో అడుగుపెట్టారు. ఆ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి హేతువాదం, ఆత్మగౌరవం, మహిళల హక్కులు, కులనిర్మూలన తదితర సిద్ధాంతాల ప్రాతిపదికగా దాన్ని నడిపించారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆ ఉద్యమం సాధించుకున్న విజయాలను సుస్థిరం చేసుకోవడానికి ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. అయితే ఆయన ప్రధాన అనుచరుడిగా ఆ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన అన్నాదురై పెరియార్‌తో అనంతరకాలంలో విభేదించి డీఎంకే పార్టీకి అంకురార్పణ చేశారు. 1965లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం హిందీని ఏకైక అధికార భాష చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యమాలు పెల్లుబికినప్పుడు తమిళనాడులో అన్నాదురై దానికి నేతృత్వం వహించారు. ఆ ఉద్యమం కాంగ్రెస్‌ను శాశ్వత సమాధి చేసింది. కాంగ్రెస్ మాత్రమే కాదు... ఏ జాతీయ పార్టీకీ అక్కడ నిలువనీడ లేకుండాపోయింది. ఎన్నికల్లో గెలవాలనుకునే జాతీయ పార్టీ రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలతో జతకట్టక తప్పని స్థితి ఏర్పడింది. తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వం కొన్ని ఒడిదుడుకులతోనే అయినా నిరా టంకంగా సాగుతోంది. ఆ పార్టీ చీలిపోతుందని 2016లో ఆ పార్టీ అధినేత జయలలిత మరణా నంతరం చెప్పినవారు చాలామందే వున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, మాజీ సీఎం ఒ. పన్నీరు సెల్వంల మధ్య కొంతకాలం పార్టీ రెండుగా చీలిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే అదంతా సర్దుకుంది. ముఖ్యమంత్రి కావాలనుకున్న జయలలిత సన్నిహి తురాలు శశికళ చివరి నిమిషంలో అవినీతి కేసులో జైలుపాలయ్యారు. అధికారం వుందన్నమాటే గానీ, అన్నాడీఎంకే అత్యంత బలహీన స్థితిలోవుంది. కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆధ్వర్యంలోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పటిష్టంగానే వున్నా ఆయనకు తన సోదరుడు అళగిరితో వైరం వుంది. పైగా కరుణానిధికున్నంత ప్రజాదరణ స్టాలిన్‌కు వుందో లేదో ఇంకా తేలాల్సివుంది. వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఆవరిం చిందన్న అభిప్రాయం చాలామందిలో వుంది. ఆ అభిప్రాయంతోనే గతంలో కమలహాసన్ రాజ కీయాల్లోకొచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ ఉద్దేశమైనా అదే కావొచ్చు. వర్తమాన రాజకీయ దుస్థితి చూసి ఆగ్రహం కలగడం వల్లే రాజకీయాల్లోకి రావాలనిపించిందని గతంలో రజనీకాంత్ చెప్పారు. నిజాయితీగా, అవినీతిరహితంగా, పారదర్శకంగా, సెక్యులర్ సిద్ధాంతాలతో తన పార్టీ వుంటుందని తాజాగా రజనీకాంత్ ప్రకటించారు. అలాగే ఎన్నికల్లో నెగ్గడానికి ‘ఆధ్యాత్మిక రాజకీయాల’ను పాటి స్తానని కూడా తెలియజేశారు. ఆధ్యాత్మిక రాజకీయాలు అనే మాట ఆయన గతంలోనూ ఉపయో గించారు. అయితే దాని స్వరూపస్వభావాలేమిటో ఇంతవరకూ చెప్పలేదు. డిసెంబర్ 31న జరగ బోయే సమావేశంలోనైనా దాని గురించి అందరికీ స్పష్టత లభించగలదని ఆశించాలి. ‘ఆధ్యాత్మికం’ అనేసరికి రజనీకాంత్ బీజేపీవైపు వెళ్తారన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ కలిగింది. ఇంతవరకూ ఆయన ఏ పార్టీనీ విమర్శించలేదు. ఎవరినీ సమర్థించలేదు. ఆయనెప్పుడూ వివాదాలకు దూరమే. కానీ రాజకీయాల్లోకొచ్చాక అది సాధ్యపడదు. దేశాన్ని, రాష్ట్రాన్ని కలవరపరిచే ప్రతి సమస్యపైనా స్పందించాల్సివస్తుంది. తాను సూచించే ప్రత్యామ్నాయమేమిటో వెల్లడించాలి. సినిమా రంగం ఒక కాల్పనిక జగత్తు. అందులో అగ్రశ్రేణి నటుడుగా రజనీకాంత్‌కు అత్యంత ప్రజా దరణ వుంది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఆయనకు లక్షలాదిమంది అభిమానులున్నారు. తమిళ నాడులో మూలమూలనా ఆయన అభిమాన సంఘాలున్నాయి. ఆ సంఘాలన్నీ రజనీ రాజకీయా ల్లోకి రావాలని దాదాపు పాతికేళ్లుగా కోరుతున్నాయి. ఈ అభిమానం పార్టీని సాధారణ ప్రజానీకానికి చేర్చడంలో మంచి దోహదకారి అవుతుంది. అయితే పార్టీ శాశ్వతంగా వేళ్లూనుకోవాలన్నా, మరిం తగా విస్తరించాలన్నా ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయం చూపాల్సివుంటుంది. సమస్యలపైనా, విధానాలపైనా ఊగిసలాట లేని వైఖరిని ప్రదర్శించాల్సివుంటుంది. బలమైన క్యాడర్‌ను నిర్మించు కోవాల్సివుంటుంది. ఇప్పటికైతే బీజేపీ, అన్నాడీఎంకేలు రెండూ ఆయన తమతో చెలిమి చేస్తారన్న ఆశాభావం ప్రకటించాయి. ఇకపై ప్రజలు ఆయన్ను నిశితంగా గమనిస్తారు. కనుక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికే వస్తున్నారన్న అభిప్రాయం కలగకుండా రజనీకాంత్ జాగ్రత్తపడక తప్పదు. -
సినిమాను ఏలింది చాలు.. రాజకీయాల్లోకి రండి!
చెన్నై : ‘మీరు సినిమాను ఏలింది చాలు– ఇక తమిళనాడును పాలించేందుకు రండి’. నటుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హీరో సూర్య తన అభిమానుల నుంచి ఈరకమైన రాజకీయ ఆహ్వానాన్ని అందుకున్నారు. తమిళనాడులో సినీ, రాజకీయరంగాలకు మధ్య ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యమే. తాజాగా నటుడు సూర్య పైనా రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. సూర్య రాష్ట్ర వ్యాప్తంగా తమ అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో సూర్య రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్ష ఆయన అభిమానుల్లో పెరుగుతోంది. సూర్య నటుడిగా పరిచయమై శనివారానికి 23 ఏళ్లు అవుతుంది. ( మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య ) ఈ సందర్భంగా ‘మీరు సినిమాను ఏలింది చాలు ఇక తమిళనాడును పాలించడానికి రండి’ అనే నినాదంతో సూర్య అభిమానుల పోస్టర్లు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. అందులో విప్లవ నాయకుడు చేగువేరా రూపంలో సూర్య ఫొటోలు పొందుపరిచి పక్కన తమిళనాడు సచివాలయం ఫొటోను ముద్రించారు. ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రాజకీయాల్లో టాప్ హీరో పోస్టర్ల కలకలం
చెన్నై : హీరో విజయ్‌కి సంబంధించిన పోస్టర్లతో తమిళనాడులో మరోసారి రాజకీయ కలకలం చెలరేగుతోంది. రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అని చెప్పవచ్చు. ఈయనకి అభిమానగణం కూడా చాలా ఎక్కువే. అదేవిధంగా రజనీకాంత్ మాదిరిగానే విజయ్‌కు రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉందన్నది ఎవరూ కాదనలేని మాట. ఇకపోతే విజయ్ అభిమానులు ముద్రిస్తున్న పోస్టర్లు చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా అన్నాదురై, పెరియార్లతో విజయ్ ఫొటోలను ముద్రించిన పోస్టర్లను అభిమానులు ఈ సందర్భంగా విడుదల చేశారు. అందులో మీరు రాజకీయాల్లోకి వస్తే అన్నాదురై లేకుంటే పెరియార్ అంటూ పేర్కొన్నారు. (పదేళ్లకు జోడీ కుదిరింది ) తాజాగా నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రాల్లోని ఆయన గెటప్‌లలో విజయ్ ముఖాలను పొందుపరిచిన పోస్టర్లు కాంచీపురంలో హల్చల్ చేస్తున్నాయి. అందులో నాడొడి మన్నన్ మాట్టుక్కార వేలన్, కుడియిరుంద, కోయిల్ చిత్రంలోని ఎంజీ రామచంద్రన్ గెటప్పుల్లో విజయ్ ముఖాన్ని పొందుపరిచారు. ఆ పోస్టర్లో మక్కల్ తిలకంకు మరో రూపమే అంటూ పేర్కొన్నారు. 2021 ప్రథమార్థంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా వీటి గురించి ప్రముఖ చానల్లో చర్చావేదిక కూడా జరగడం విశేషం. (కూతురుతో సహా సినీ నటి అదృశ్యం) -
అవసరమైతే కలిసి పనిచేస్తాం
సాక్షి, చెన్నై: తమిళ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమేనని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల హాసన్, రజనీకాంత్ మంగళవారం వేర్వేరుగా వ్యాఖ్యానించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేసి డిసెంబరుతో ఏడాది కానుంది. అయితే ఆయన ఇంత వరకు పార్టీ ›ప్రకటన చేయలేదు. తన లక్ష్యం 2021 అసెంబ్లీ ఎన్నికలే అని చెబుతూ వస్తున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరో వైపు సమయానుగుణంగా రాజకీయ వ్యాఖ్యలను పేల్చుతూ వస్తున్నారు. అదే సమయంలో రజనీ కన్నా ముందుగా కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 8న కమల్ బర్త్‌డే సందర్భంగా రాజ్‌కమల్ కార్యాలయంలో జరిగిన దివంగత దర్శకుడు బాలచందర్ విగ్రహావిష్కరణకు రజనీ హాజరయ్యారు. తాను కాషాయం వలలో పడనని కమల్‌తో తన బంధం విడదీయరానిదిగా రజనీ వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్‌ను తనను ఎవరూ విడదీయలేరని, తమ మధ్య రహస్య ఒప్పందం ఉందని కమల్ వ్యాఖ్యానించి రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ ఇద్దరు ఏకం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ మొదలైంది. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం రజనీ వ్యాఖ్యలు చేయడం, అందుకు తగ్గట్టుగా కమల్ స్పందించడం ఆ చర్చలకు బలాన్ని చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తమిళనాట చర్చ జోరందుకునేలా చేశాయి. కలిసి పనిచేయడానికి రెడీ రజనీ కాంత్ మంగళవారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తమిళ ప్రజల సంక్షేమం కోసం తప్పని సరి అయినా, అవశ్యమైనా కమల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఒడిశాలో జరిగిన డాక్టరేట్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని చెన్నైకు వచ్చిన కమల్ మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు అభివృద్ధి కాంక్షిస్తూ అవసరం అయితే రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. తమ ఇద్దరు 44 ఏళ్లుగా సినీ రంగంలో కలిసి పనిచేస్తున్నామని, ప్రజాహితం కోసం కలయిక అవశ్యం అయితే సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కాగా, రజనీ, కమల్, విజయ్ వంటి నటులు అందరూ ఏకమై వచ్చినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని.. 2021 ఎన్నికల్లో మళ్లీ అధికారం అన్నాడీఎంకేకు దక్కుతుందని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
నేను కరుణానిధిని కాను.. కానీ...
‘‘నేను కరుణానిధిని కాను. కానీ నా తండ్రిలా మారేందుకు ప్రయత్నించే దమ్ము, ధైర్యం నాకున్నాయి’’ ఇదీ.. డీఎంకే అధిపతి స్టాలిన్ ఉద్వేగ పూరితంగా చేసిన తొలి ప్రసంగం. ఇదే ప్రసంగం... ఎనిమిదేళ్లుగా విజయదాహంతో పరితపిస్తున్న డీఎంకేని ఆయన గెలుపు తీరాలకు చేర్చేలా చేసింది. కరుణానిధి స్థానంలో డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టినప్పడు ఎం.కె.స్టాలిన్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా? అన్న రాజకీయ వర్గాల గుసగుసలకు స్వస్తిపలుకుతూ... పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొనడానికి స్టాలిన్‌కి 2019 సార్వత్రిక ఎన్నికలు మంచి అవకాశాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకొని విజయదుంధుభి మోగించి, తమిళ ప్రజల్లో కలైంజర్ కరుణానిధికి తగ్గ వారసుడన్న ముద్ర వేయటంలో స్టాలిన్ కృతకృత్యులయ్యారు. నిజానికి ప్రారంభంలో స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి సైతం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సోదరులిద్దరినీ విభజించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ తమిళనాట అడుగుపెట్టే ప్రయత్నాలు జోరుగానే చేసింది. ఇదంతా చూసి... అళగిరితో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకొని ద్రవిడ భూమిలో పాదం మోపాలన్న బీజేపీ ప్రయత్నాన్ని స్టాలిన్ చిత్తుచేయగలిగారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను అత్యంత సమర్థవంతంగా భర్తీ చేసిన స్టాలిన్ అతి కొద్దికాలంలోనే తమిళ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. మోదీ గాలికి వ్యతిరేకంగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అతికొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఒక్క లోక్‌సభ సీటు మినహా తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నిటికి అన్నింటినీ కైవసం చేసుకుని, డీఎంకే తన రాజకీయప్రస్థానాన్ని సుస్థిరపరుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీఎంకే విజయం సాధిస్తుందని ఆకాంక్షించినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ గెలవడం డీఎంకే ఉత్సాహాన్ని కొంత నీరుగార్చింది. తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న స్టాలిన్ దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి తమిళనాట చరిత్ర సృష్టించగలిగారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటులో డీఎంకే ఎంపీలు అనుసరించిన వామపక్ష అనుకూల వైఖరి, రాజకీయవర్గాల్లో స్టాలిన్‌పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అది రుజువైంది.. ఒకసారి డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక స్టాలిన్ తనని తాను సమర్థవంతంగా రుజువు చేసుకున్నారని స్టాలిన్ చిరకాల సహచరుడు, రాజ్యసభలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్‌కీ అతని తండ్రి కరుణానిధికీ మధ్య ఉన్న విభేదాల విషయాన్ని చాలా మంది ప్రస్తావనకు తెస్తున్నారు. అయితే ఏ ఇద్దరూ ఒకేరకంగా ఉండరనీ, కశ్మీర్ విషయంలో స్టాలిన్ తీసుకున్న బీజేపీ వ్యతిరేక విధానం, కశ్మీర్లో అరెస్టు చేసిన రాజకీయ నాయకులను విడుదల చేయాలంటూ డీఎంకే ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగడం స్టాలిన్‌కీ, కరుణానిధికీ ఉన్న సారూప్యతకు అద్దం పడుతోందనీ, సరిగ్గా కరుణానిధి ఇలాగే ఉండేవారని ఆయన చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోలేదా? ఏఐడీఎంకేలోని లోపాలను స్టాలిన్ వాడుకోలేకపోయారన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అయితే శత్రువు బలహీనతలను వాడుకొని, వారిని దెబ్బతీసే మనస్తత్వం ఆయనది కాదని కొందరి భావన. 2016లో జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే లో విభేదాలను ఆయన నేర్పుగా ఉపయోగించుకొని ఉండాల్సిందన్న అభిప్రాయం వారిలో ఉంది. అలాగే దాదాపు 34 ఏళ్ళ పాటు డీఎంకే యువజన నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించిన స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి డీఎంకే యువజన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పడం పట్ల సైతం కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల విజయోత్సాహాన్ని చేబూని, నాయకుడిగా తనని తాను నిలబెట్టుకుంటూనే, రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థానాన్ని సుస్థిరపరుచుకునే వైపు స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. దినకరన్, నటుడు కమల్‌హాసన్, డీఎంకేకి పెద్ద ప్రమాదకరం కాదని గత ఎన్నికలు రుజువు చేశాయి. రాబోయే ఎన్నికల్లో సైతం డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే పోటీ ఉండనుంది. అయితే 2021 ఎన్నికల్లో రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. (చదవండి: వారసుడి ప్రజాయాత్ర) -
కుల, జాతి సంఘాల వ్యక్తులపై నిషేధం : రజనీకాంత్
సాక్షి, చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో సరికొత్త పంథాను ఎంచుకున్నారు. రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముందుగానే సభ్యత్వాల నమోదు చేయించాలని రజనీకాంత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే రజనీకి సంబంధించిన పార్టీ సభ్యత్వాల సంఖ్య కోటి దాటిపోవడం విశేషం. అయితే మక్కల్ మండ్రం విధివిధానాలతో కూడిన 32 పేజీల పుస్తకాన్ని రజనీకాంత్ మంగళవారం విడుదల చేశారు. దీనిలో కుల, మత, వారసత్వరాజకీయాలకు చోటులేదని స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి ఒకే పదవి అని మక్కల్ మండ్రం విధివిధానాల్లో పేర్కొన్నారు. ఏదైనా కుల, జాతి సంఘాల్లోని వ్యక్తులకు రజనీ మక్కల్ మండ్రంలో నిషేధం విధించారు. అంతేకాకుండా మక్కల్ మండ్రం జెండాను కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదని ఆంక్షలు విధించారు. కేవలం సమావేశాలున్న సమయాల్లో మాత్రమే వాడాలని సూచించారు. మక్కల్ మండ్రం గురించి పబ్లిక్‌లో ఎవరూ మాట్లాడరాదని ఆంక్షలు విధించారు. -
కరుణానిధితోనే ఇవి సాధ్యమయ్యాయి
దాదాపు యాభై ఏళ్ల క్రితం (1970 ఫిబ్రవరిలో) తిరుచ్చిలో జరిగిన డీఎంకే మహాసభలో ’రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ’ (మానిలాతిలే సుయాచ్చి, మతిఇలేకూటచ్చి)అనే నినాదాన్ని కరుణానిధి మళ్లీ వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. దీనికి అక్కడి ప్రజల నుంచే కాకుండా, వివిధ రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు,నాయకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో నూతన మార్పులు అవసరమన్న పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై తీసుకొచ్చిన ఈ డిమాండ్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా మళ్లీ ఈ నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, హక్కుల విషయంలో కేంద్రం జోక్యాన్ని డీఎంకే ఆధ్వర్యంలో ఆయన గట్టిగా అడ్డుకున్నారు. అన్నాదురై అడుగుజాడల్లోనే ఈ అంశానికి కరుణానిధి అత్యంత ప్రాధాన్యతినిచ్చారు. రాష్ట్రాలకు తగినన్నీ అధికారాలిస్తేనే కేంద్రం ఆదర్శవంతంగా ఉన్నట్టుగా భావిస్తామని, అదే దేశ సమైక్యత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాయన్న అన్నాదురై వాదనను ఆయన మరింత ముందుకు తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్కారియా కమిషన్ కేంద్రరాష్ట్ర సంబంధాలు అధ్యయనం చేయడానికి 14 ఏళ్ల ముందే 1974లోనే రాజమన్నార్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది. సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాష్ట్రాలకు పూర్తి ప్రతిపత్తిని కల్పించేందుకు వీలుగా భారత రాజ్యాంగానికి వెంటనే అవసరమైన మార్పులు చేయాలంటూ ఇందులో కేంద్రాన్ని డిమాండ్‌చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన కాలం నుంచి చూస్తే 1974లో చేసిన ఈ తీర్మానానికి దేశ రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని తమిళరచయిత ఆలి సెంథిలినాథన్ పేర్కొన్నారు. కరుణానిధి సీఎంగా ఉన్న 1970-75 మధ్యకాలం తమిళనాడుకు స్వర్ణయుగంగా పిలవవచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పన అనే ఆలోచనను మళ్లీ చర్చనీయాంశం చేయడం వల్ల అదే తమిళనాడు రాజకీయ సిద్ధాంతంగా మార్పు చెందిందన్నారు. 1970 నుంచే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక పతాకం (జెండా) ఉండాలనే డిమాండ్‌కు కరుణానిధి ప్రాచుర్యం కల్పించారు. 1974 వరకు స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రాల సీఎంలకు జాతీయపతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత సీఎంలకు ఆ హక్కు కల్పించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు అధికారంలో ఉన్న కాంగ్రేసేతర డీఎంకే ప్రభుత్వం ఒక్కటే ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దుచేసింది. డీఎంకే పార్టీ నాయకులు చాలా మంది ఎమర్జెన్సీ ఎత్తేసేవరకు జైళ్లలోనే ఉండాల్సి వచ్చింది. 1980 దశకం చివర్లో దేశంలో సంకీర్ణ రాజకీయాల వ్యూహాకర్తగా కరుణానిధి పేరుగాంచారు. 1983లో శ్రీలంక తమిళుల సమస్యపై కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకున్నారు. వీపీసింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. జాతీయ రాజకీయ క్షేత్రంలో ఓ ప్రాంతీయపార్టీ నేత కీలకపాత్ర పోషించడం గొప్ప విషయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. -
చిన్నమ్మ చిరాకు
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’పై శశికళ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో దినకరన్ తనను తాను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రస్తావించడం, అడయారులోని దినకరన్ ఇంటినే పార్టీ చిరునామాగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టే ఆలోచన లేదని ఈ ఏడాది జనవరి 17వ తేదీన నీలగిరిలో ప్రకటించిన దినకరన్ అకస్మాత్తుగా పార్టీని ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటని చిన్నమ్మ సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ పెట్టడంతో ఎంజీఆర్ సినిమాల్లో విలన్లా అన్నాడీఎంకేను, పార్టీ చిహ్నాన్ని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి దినకరన్ అప్పగించినట్లయిందని శశికళ కోపగించుకున్నట్టు తెలుస్తోంది. దినకరన్ పార్టీ పెట్టడం శశికళ కుటుంబంలోని పలువురు సభ్యులకు కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు దినకరన్ పార్టీలో అప్పుడే అసంతృప్తి చెలరేగింది. ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ శనివారం పార్టీ నుంచి తప్పుకున్నారు. -
దినకరన్‌కు సీనియర్ నేత ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’లో ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ వైదొలిగారు. మరే పార్టీలో చేరనని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటునానని తెలిపారు. నాంజిల్తోపాటు మరికొందరు దినకరన్ అనుచర నేతలు సైతం అదేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే ద్రవిడ సిద్ధాంతాలు, అన్నాదురైకి చోటు లేకుండా కేవలం జయలలిత బొమ్మతో నెగ్గుకురావడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. అమ్మను అవమానిస్తున్నారు: దినకరన్ తన పార్టీ పతాకంలో జయలలిత బొమ్మవేయడాన్ని తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలగడం ద్వారా నాంజిల్ సంపత్ అమ్మను అవమానించాడని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన ఎంతో సీనియర్ డీఎంకే, ఎండీఎంకేల నుంచి అన్నాడీఎంకేలో చేరినవారన్నారు. ఇపుడే తానేదో పచ్చి అబద్ధాలు చెబుతున్నానని చెప్పడాన్ని అంగీకరించనని అన్నారు. పార్టీ ఏర్పాటు, పేరు నిర్ణయాన్ని అందరితోనూ చర్చించలేనని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కొరుకుంటున్నారో అదిమాత్రమే తాను చేయగలనని అన్నారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దికరన్ ప్రకటించారు. -
కమల్.. నాస్తికత్వంతో ఎలా?
సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంపై ఊరిస్తూ వచ్చిన లోకనాయకుడు ‘మక్కళ్ నీది మయ్యం’ పేరిట పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. పార్టీ విధివిధానాల్లో వైవిధ్యత ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ద్రవిడ భావజాలాన్ని తన పార్టీ అనుసరించే తీరుతుందన్న సంకేతాలను ఆయన అందించారు. గతాన్ని ఓసారి పరిశీలిస్తే... ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాది నాస్తికత్వం. మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకం. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షపై పోరాటం దిశగా అవి పుట్టుకొచ్చాయి. అయితే ఆ క్రమంలో పార్టీలు (డీఎంకే తప్ప) తమిళ రాజకీయాల్లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. డీకే(ద్రవిడ కగళమ్)ను ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చూపిస్తుంటారు. డీఎంకే నుంచి అన్నాడీఎంకే ఏర్పడ్డాక ఎంజీఆర్ కొంత ఉదారంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. స్వతహాగా దేవుడ్ని నమ్మే ఆయన.. రహస్యంగా ఆయన దేవాలయాలను సందర్శించేవారన్న వార్త బయటకు పొక్కటం.. ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. పదేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధి శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శించుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో శివాజీ గణేశన్‌కు ఇలాంటి సమస్యే ఎదురైంది. అస్థికుడు అయినప్పటికీ తొలినాళ్లలో ఆయన డీఎంకే మద్ధతుదారుడిగా ఉన్నారు. ఓసారి తిరుమలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకోగా.. డీఎంకే ఆయనను తీవ్రంగా మందలించింది. తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావటం, 1987లో ‘తమిళ మున్నేట్ర మున్నాని’ పార్టీ స్థాపన, ప్రత్యర్థుల దెబ్బకు అది మనుగడ కొనసాగించలేకపోవటం.. ఇలా అస్తికత్వం మూలంగానే ఆయన విఫలం అయ్యారని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక పాలన నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్న రజనీకాంత్ ఎలా రాణిస్తాడో? జయ విషయంలో మాత్రం ... ఇక జయలలిత అయితే మొదటిసారి అధికారం చేపట్టగానే ద్రవిడ సిద్ధాంతాలకు, దాని భావజాలానికి కాస్త దూరంగా ఉన్నారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. అలాగని ఆమె పూర్తిగా ఆ సిద్ధాంతాన్ని విస్మరించలేదు. దీంతో ఆమె ద్వంద్వ వైఖరిపైనా ద్రవిడ భావజాల పార్టీలు విమర్శలు గుప్పించేవి. కానీ, ప్రజలను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న జయలలిత అనేక జనాకర్షక పథకాలు రూపొందించి విజయవంతం అయ్యారు. కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధాంతాల కన్నా.. జనాకర్షణ మీదే ప్రధాన దృష్టి ఆకర్షించాల్సి ఉంటుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపునకు ఎన్ని కారణాలు ఉన్నా.. ప్రజల్లో దినకరన్ పై సానుభూతి ఒకటి నెలకొందన్న విషయం అర్థమైంది. ఆ క్రమంలో నటుడిగా ఛరిష్మా ఉన్న కమల్ రాజకీయాల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. అలాకానీ పక్షంలో రాజకీయ చదరంగంలో మరో ఫెయిల్యూర్ స్టార్‌గా కమల్ మిగిలిపోవాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. -
రేపు కుండబద్దలు కొడతా: అగ్రహీరో
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్ రేపటి నుంచి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. రేపు ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో రేపు అన్ని కుండబద్దలు కొడతానని ఆయన తెలిపారు. ఎవరెవరు తనతో కలిసి వస్తారో పార్టీ ప్రకటించాక చెబుతానని అన్నారు. తమిళ రక్తానికి నా మద్దతు: సీమాన్ నామ్ తమిళర్ నేత సీమాన్ మంగళవారం కమల్‌హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ.. తమిళ రక్తానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కమల్ నటన చూసి అభిమానిగా పెరిగానని, ఆయన కలుస్తానంటే వచ్చికలిసినట్టు చెప్పారు. రజనీకాంత్ కలుస్తానంటే తప్పకుండా కలుస్తానని చెప్పారు. కాగా, కమల్ హాసన్ సోమవారం డీఎండీకే విజయకాంత్‌ను కలిశారు. రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లతో ఆదివారం భేటీ అయ్యారు. -
తమిళనాడులో ఆసక్తికర పరిణామం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ ఆదివారం చర్చలు జరిపారు. రజనీ నివాసానికి వచ్చిన కమల్ చాలాసేపు ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు కమల్‌హాసన్ ప్రకటించిన నేపథ్యంలో వీరద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం ముగిసిన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ... కమల్‌పై ప్రశంసలు కురిపించారు. డబ్బు, పేరు కోసం ఏనాడు కమల్ పాకులాడలేదని.. తమిళ ప్రజల శ్రయేస్సు కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు. కొత్త పార్టీ పెట్టనున్న కమల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు కమల్‌హాసన్ చెప్పారు. రాష్ట్రంలో తన పర్యటన గురించి రజనీకి వివరించినట్టు వెల్లడించారు. రజనీకాంత్ పెట్టబోయే పార్టీతో పొత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు. -
‘మా హీరోకి రాజకీయాలపై ఆసక్తి ఉంది’
తమిళసినిమా: తమిళనాడులో దాదాపు సినీ నటులే ప్రభుత్వాన్ని పాలించారు. తాజాగా నట దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ సొంతంగా రాజకీ య పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని రజనీ ఇప్పటికే వెల్లడించారు. కమలహాసన్ ఈ నెల 21న పార్టీ పేరు, జెండా, అజెండానూ వెల్లడించి భారీ బహిరంగ సమావేశంతో ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మరో పక్క నేను సైతం అన్నట్లు విశాల్ తన చేతలతో రాజకీయ ప్రవేవం చేయనున్నట్టు చెప్పకనే చెబుతున్నారు. వీరందరి కంటే ముందే నటుడు విజయ్ రాజకీయాలపై ఆసక్తి కనబరచారన్నది నిజం. అందుకు తన అభిమాన సంఘాన్ని ప్రజాసంఘంగా మార్చా రు కూడా. తద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తన కొడుకు రాజకీయాల్లో వస్తారని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. విజయ్ నటించిన పలు చిత్రాలు విడుదల సమయంలో రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాయి. అందుకు కారణం విజయ్ను రాజకీయాల్లోకి రానీయకుండా అణగదొక్కలన్నదే అనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల విజయ్ రాజకీయాల మాట ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ, కమల్ అభిమానులు ఎవరి పరిధిలో వారు ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో మునిగిపోయారు. ఈ సెగ విజయ్ అభిమానుల్లోనూ తగిలింది. విజయ్ ప్రజా సంఘం పేరుతో నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి అభిమానులు శ్రీకారం చుట్టారట. దీని గురించి విజయ్ అభిమాన సంఘం నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తాము సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. -
తమిళనాడులో మరో కూటమి
సాక్షి, చెన్నై: తమిళనాడులో మరో రాజకీయ కూటమి ఏర్పాటైంది. సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మదురై విమానాశ్రయంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని, రాష్ట్ర సంక్షేమం కోసం తాము కలిసి పోరాడతామని వారు తెలిపారు. అంశాలవారీగా పోరు కొనసాగిస్తామని ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమలహాసన్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన శరత్‌కుమార్, సీమాన్ చేతులు కలపడం చర్చనీయాంశంగా మారింది. రజనీ-కమల్‌కు వ్యతిరేకంగా వీరు గళం విన్పిస్తున్నారు. మరోవైపు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ కూడా రజనీ-కమల్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. -
అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి అవుట్
-
అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వం
-
అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి అవుట్
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో బహిష్కరణ పర్వల కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా కన్యాకుమారి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నిర్వాహకులపై 93 మందిపై వేటు పడింది. దీనిగురించి ఈపీఎస్, ఓపీఎస్ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే పార్టీ విధానాలకు, లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కారణంగా మాజీ మంత్రి పచ్చైమాల్ సహా 93 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక వైఫల్యం తర్వాత అనేక జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులను ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం మూకుమ్మడిగా పార్టీ నుంచి తొలగిస్తున్నారు. దినకరన్ వర్గానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలతో ఇప్పటికే పలు జిల్లాలకు చెందిన నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు. -
కమల్ హాసన్ ‘నాలై నమదే’
సాక్షి, చెన్నై : విలక్షణ నటుడు కమల్ హాసన్ వచ్చే నెల 21న తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, చిహ్నంతో పాటు విధివిధానాలను ప్రకటించనున్నారు. అలాగే ‘నాలై నమదే’ అనగా.. ‘రేపు మనదే’ పేరుతో ఫిబ్రవరి 21 నుండి తన రాజకీయ పర్యటన ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. గురువారం చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ అదే రోజు పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలు ప్రకటిస్తానని తెలిపారు. పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అదే రోజున నమోదు చేయనున్నట్లు తెలిపారు. తన పర్యటనలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్‌గా నిలుస్తామని చెప్పారు. మనిషి జీవితంలో అన్ని రంగాలు ముఖ్యమే అని, రాజకీయాలు కూడా మంచి రంగమే అని నిరూపిస్తానని కమల్ పేర్కొన్నారు. తమిళ తల్లి గీతానికి గౌరవంగా అందరూ నిలబడాలని ఆయన సూచించారు. కొన్ని సమస్యలకు పరిష్కారంతోనే సమాధానం చెప్పాలని, జాతీయ రాజకీయాల కంటే తాను ప్రాంతీయతకే ప్రాధాన్యత ఇస్తానని కమల్ వెల్లడించారు. రజనీకాంత్, తాను తమిళ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమా అనేది తనకు తెలియదని, అందరూ బాగుండాలన్నదే తనకు ముఖ్యమని అన్నారు. -
ఆరు నెలల్లో ఎన్నికలొచ్చినా.. పోటీకి సై: రజనీ
సాక్షి, చెన్నై: సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు తాను సిద్ధమని సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఎన్నికలకు ఎటువంటి వ్యూహం అవలంభిస్తామనేది వేచి చూడాలని అన్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్ బుధవారం ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ సమాధానాలిచ్చారు. సినిమా రంగంలో సన్నిహిత మిత్రుడైన కమల్‌హాసన్‌తో రాజకీయాల్లోనూ చేతులు కలుపుతారా అని ప్రశ్నించగా.. కాలమే సమాధానం చెబుతుందని జవాబిచ్చారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తే ఏం చేస్తారని అడగ్గా... పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఎన్నికల వ్యూహం గురించి ప్రశ్నించగా.. వేచి చూడాలని సమాధానమిచ్చారు. తమ ప్రణాళికలో భాగంగా ఆఫీస్ బేరర్ల నియామకం జరుగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవలే రజనీకాంత్ ప్రకటించారు. ఫిబ్రవరి 21న పార్టీ పేరు ప్రకటించి, అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆయన శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే.. రజనీకాంత్ పార్టీ.. 16 శాతం ఓట్లతో 33 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇండియా టుడే-కార్వి ఇన్సైట్స్ సర్వేలో వెల్లడైంది. -
నన్ను బెదిరిస్తున్నారు
సాక్షి, చెన్నై: తనను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఐటీ, సీబీఐ దాడుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ బెదిరింపులకు తాను భయ పడనని, త్వరలో అమ్మ జయలలిత ఆశించిన పాలన తమిళనాట రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తనకు అఖండ మెజారిటీ ఇవ్వడాన్ని రాష్ట్రంలోని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తనకు మద్దతుగా ప్రజానీకం, అన్నాడీఎంకే కేడర్, నేతలు కదులుతున్నారని తెలిపారు. తనను చూసి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దినకరన్ వర్గీయులపై మరో వేటు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపునకు కృషి చేసి పార్టీ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వేలూరు, విరుదునగర్, తూత్తుకూడి జిల్లాలకు చెందిన 9 మంది నేతలను అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి మంగళవారం బహిష్కరించారు. మరోవైపు దినకరన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే లక్ష్యంతో నేడు అన్నాడీఎంకే సమావేశం జరగనుంది. -
రజనీ పొలిటికల్ ఎంట్రీపై వర్మ కామెంట్!
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. తలైవా రాజకీయాల్లోకి రావడం ‘ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ’ అని అభివర్ణించిన వర్మ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రజనీని ఆదర్శంగా తీసుకొని అన్నిస్థానాల్లో పోటీచేయాలని తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నాడు. ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన (ఈవెంట్ ఆఫ్‌ది సెంచరీ).. రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పే సందర్భంలో రజనీ స్క్రీన్‌పై కనిపించే సూపర్ స్టార్ కన్నా వెయ్యిరెట్లు ప్రభావితంగా కనిపించారు. తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన తలైవా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పీకే(పవన్ కళ్యాణ్) ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి’ అని వర్మ సూచించాడు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్, వర్క్, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో రజనీ చెప్పారు. -
పార్టీ మూల సూత్రాలు ఇవే..
సాక్షి, చెన్నై: సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఊహాగానాలకు తెరదించారు. తాను స్థాపించబోయే పార్టీ ఎలా ఉంటుందో సూచనప్రాయంగా వెల్లడించారు. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్, వర్క్, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే తాను పాలిటిక్స్‌లోకి వస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితీ, జవాబుదారితనం పెంచాల్సిన అవసరముందన్నారు. మీడియా అంటే భయం రాజకీయాలంటే తనకు భయం లేదని మీడియా అంటేనే భయపడతానని తలైవా అన్నారు. ఈ విషయంలో తాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దీని గురించి చో రామస్వామి గతంలో తనను హెచ్చరించారని, ఆయన లేకపోవడం పూడ్చలేని లోటన్నారు. ఆయన ఉండివుంటే తన కొత్త ప్రయాణంలో అండగా నిలిచేవారని పేర్కొన్నారు. వివాదాల్లో చిక్కుకోవద్దు తాను పార్టీ పెట్టే వరకు అభిమానులు ఎటువంటి రాజకీయ విభేదాల్లో చిక్కుకోవద్దని, పార్టీ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అభిమానులను రజనీకాంత్ కోరారు. సరైన సమయంలో పార్టీని స్థాపిస్తానని, కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగుదామన్నారు. తలైవా ప్రకటనతో ఫ్యాన్స్ హర్షాతిరేకాలు తెలిపారు. తర్వాత అభిమానులతో రజనీకాంత్ ఫొటోలు దిగారు. బండారం బయట పెడతా పార్టీ పేరు, అభ్యర్థులను ప్రకటించాక రజనీకాంత్ బండారం బయటపెడతానని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి అన్నారు. కాగా, రాజకీయాల్లోకి రజనీకాంత్ రావడం వల్ల ఏ పార్టీకి నష్టంలేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందరరాజన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఆయన పోటీ చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
రజనీ ప్రకటనపై కమల్ కామెంట్
సాక్షి, చెన్నై: రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్ స్పందించారు. రాజకీయాల్లోకి రజనీ రాకను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ‘తలైవా’కు అభినందనలు తెలిపారు. తన సోదరుడి సామాజిక చైతన్యాన్ని ప్రశంసించారు. తలైవాకు తిరుగులేదు.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. రాజకీయ వ్యవస్థను రజనీకాంత్ ప్రక్షాళన చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని సీనియర్ నటుడు కబీర్ బేడి ట్వీట్ చేశారు. రాజకీయాల్లో రజనీకాంత్ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తమిళనాడు ప్రజలు రజనీకాంత్ వెంటే ఉంటారని, ఆయనకు తిరుగులేదని దర్శకుడు లింగుస్వామి ట్విటర్లో పేర్కొన్నారు. ‘ప్రజలు 20 ఏళ్లుగా మీ కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పడు వారి కల ఫలించింద’ని నటుడు శివకార్తికేయన్ ట్వీట్ చేశారు. బీజేపీ తమిళనాడు విభాగం ట్విటర్ ద్వారా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ‘తమిళ సినీపరిశ్రమలో రజనీకాంత్ సూపర్‌స్టార్ అనడటంలో ఎటువంటి సందేహం లేదు. దేశ రాజకీయాల్లో మాత్రం తిరుగులేని సూపర్‌స్టార్ నరేంద్ర మోదీ ఒక్కరే. ఈ విషయం తలైవాకు బాగా తెలుసున’ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహారావు ట్వీట్ చేశారు. -
రజనీ క్లారిటీ.. ఉత్కంఠకు తెర
సాక్షి, చెన్నై: తాను రాజకీయాలోకి రావడం ఖాయమని, కాలమే దీన్ని నిర్ణయించిందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు. డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రావడం లేదని.. అవన్నీ తనకు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయావని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయన్నారు. గెలిస్తే విజయం.. లేదంటే మరణం వ్యవస్థను మార్చే సమయం వచ్చిందని, పార్టీ ఏర్పాటులో అభిమానులదే కీలకపాత్ర అని రజనీకాంత్ అన్నారు. తనకు కార్యకర్తలు వద్దని, రక్షకులు కావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, తనకు తమిళ ప్రజల దీవెనలు కావాలని అభ్యర్థించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమిళ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని వాపోయారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాడిని అవుతానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే తనకు భయం లేదని, ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాలు చేయడం అంత సులువు కాదని, ‘గెలిస్తే విజయం.. లేదంటే మరణం’ అని వ్యాఖ్యానించారు. సమయం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన అభిమానుల సంబరాలు రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి, పరస్పరం స్వీట్లు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తలైవా పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. -
శశికళ కుటుంబంలో ‘ఆర్కేనగర్’ చిచ్చు!
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబంలో ఆధిపత్య పోరుకు దారితీసింది. శశికళ సోదరి కుమారుడైన దినకరన్, ఆయన సోదరుడు భాస్కరన్.. శశికళ మేనకోడలు కృష్ణప్రియల మధ్య రాజకీయ వారసత్వం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైనట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాదు, శశికళ కుటుంబంలో సైతం కలకలం రేపాయి. రాజకీయ వారసులు ఎవరనే అంశంలో కలతలు సృష్టించాయి. కుటుంబసభ్యులతో శశికళ భర్త నటరాజన్ ఇటీవల నిర్వహించిన వారసత్వ పంచాయితీ... పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు దినకరన్ సిద్ధపడేవరకు వెళ్లింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ అధిక్యతతో దినకరన్ గెలుపొందిన సమయంలో జయలలిత, శశికళకు తానే అసలైన రాజకీయ వారసుడినని దినకరన్ ప్రకటించడం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. ఆర్కేనగర్లో దినకరన్‌ను గెలిపించడం ద్వారా ప్రజలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకు తామే వారసులమని రుజువైందని దినకరన్ తమ్ముడు భాస్కరన్ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ నడిపించే హక్కు తమకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వద్ద రెండాకుల చిహ్నం మాత్రమే ఉంది, అది వారికి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, అయితే పార్టీ, కార్యకర్తలు తమవైపు ఉన్నారని భాస్కరన్ చేసిన వ్యాఖ్యలు దినకరన్‌కు ఆగ్రహం తెప్పిం చాయి. తమ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవు, నేడు ఈ వాఖ్యానాలు ఏమిటని దినకరన్ ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం ఏదైనా నా మాటే చెల్లుబాటని దినకరన్ చేసిన ప్రకటనను శశికళ కుటుంబ సభ్యులు స్వాగతించడం లేదు. జయలలిత మరణానికి శశికళే కారణమని ప్రజలు ఆరోపించినా ఆమె మౌనంగా భరించారని, అయితే ఎన్నికల కోసం అపోలో దృశ్యాలను విడుదల చేసి జయలలితను దినకరన్ అవమానపరిచారని ఫేస్బుక్, మీడియా వద్ద కృష్ణప్రియ విరుచుకుపడ్డారు. దినకరన్ అనుచరుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తానే శశికళ వారసురాలినని కృష్ణప్రియ ప్రకటించుకోవడం దినకరన్ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించింది. దినకరన్, దివాకరన్, భాస్కరన్, వివేక్, కృష్ణప్రియల మధ్య చోటుచేసుకున్న విభేదాలు విశ్వరూపం దాల్చడంతో చెన్నై అడయారులోని శశికళ భర్త నటరాజన్ ఇంట రెండురోజుల క్రితం పంచాయితీ పెట్టారు. ఈ సమయంలో దినకరన్ మాట్లాడుతూ శశికళనో, మన కుటుంబాన్నో చూసి ఆర్కేనగర్ ప్రజలు ఓటువేయలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, తటస్థ ఓట్లే తనను గెలిపించాయని దినకరన్ వారి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మీరంతా ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే మేమే వారసులమని మీడియా ముందు ప్రకటించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కృష్ణప్రియ సీమంతం నాటి ఫొటోలు (ఫైల్) కృష్ణప్రియకు రాజకీయాల గురించి ఏమి తెలుసు, జయలలిత సమక్షంలో పోయెస్‌గార్డెన్‌లో ఏనాడో జరిగిన తన సీమంతం ఫొటోను కృష్ణప్రియ ఇప్పుడు విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని దినకరన్ రెట్టించి ప్రశ్నించారు. సీమంతం ఫొటో ద్వారా జయలలిత రాజకీయ, కుటుంబ వారసురాలిగా ప్రయత్నిస్తున్నారా అని కృష్ణప్రియను నిలదీశారు. మీడియాతో మాటలు, ఫేస్బుక్లో పోస్టింగులు ఇకనైనా నిలిపివేయాలని వారిని దినకరన్ హెచ్చరించినంత పనిచేశారు. అందరం ఇలా వ్యవహరిస్తే మళ్లీ చిక్కుల్లో ఇరుక్కుంటామని హితవు పలికారు. శశికళ చెబితేనే పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఆమె ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని దినకరన్ కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ఈ దినకరన్ ఎక్కడున్నారు, ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కృష్ణప్రియ వ్యాఖ్యానించడంతో వారసత్వపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. -
అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించింది. ఎస్. వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, వీపీ కళైరాజన్, షోలింగుర్ పార్తీబన్ లను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఆర్కే నగర్లో ఊహించనివిధంగా ఓటమి పాలవడంతో అధికార అన్నాడీఎంకే ఉన్నతస్థాయి నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అమ్మ’ కంచుకోటలో పార్టీ పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓటమికి బాధ్యులైన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేలతో ఈ మధ్యాహ్నం దినకరన్ భేటీకానున్నారు. రేపు బెంగళూరు వెళ్లి శశికళను కలిసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. మూడు నెలల్లో ఈపీఎస్, ఓపీఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని దినకరన్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆర్కే నగర్ తీర్పు: మారుతున్న తమిళ రాజకీయం..!
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో తమిళనాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ అనూహ్యంగా 40వేలకుపైగా మెజారిటీ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత వారసులం తామేనంటున్న అధికార అన్నాడీఎంకే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జయ మృతి తర్వాత నాటకీయ పరిణామాలతో ఇరుకునపడిన శశికళ వర్గం కూడా ఈ ఎన్నికను చావో-రేవో అన్నట్టుగా తీసుకొని బరిలోకి దిగింది. ఈ క్రమంలో శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. రాజకీయ పరిశీలకులు సైతం ఊహించనిరీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకేగానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేగానీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి. ఈ విజయం శశికళ వర్గంలో కొత్త ఉత్తేజం నింపిందని చెప్పవచ్చు. జయ సొంత నియోజకవర్గం ఆర్కే నగర్లో పాగా వేయడంతో శశి వర్గం ఆనంద డొలికల్లో తేలియాడుతోంది. అమ్మ వారసురాలం తామేనని చెప్పుకోవడానికి ఈ విజయం ఉపకరిస్తుందని ఆ వర్గం భావిస్తోంది. ఈ విజయంతో సంబరాలు చేసుకుంటున్న శశి వర్గం కార్యకర్తలు.. అన్నాడీఎంకే అధ్యక్షుడు దినకరనే అంటూ నినాదాలు చేశారు. అటు దినకరన్ కూడా అన్నాడీఎంకే సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. నిజానికి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎప్పుడో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పళనిస్వామి (ఈపీఎస్), పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇంతవరకు అసెంబ్లీలో చేపట్టలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకివచ్చే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విజయం నేపథ్యంలో ఎమ్మెల్యే వట్రివేలు, ఎంపీ సెంగుట్టువన్ దినకరన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. మరింతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్‌కు అండగా నిలబడితే.. పళనిస్వామి సర్కారు ఇబ్బందులు పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
ఇంత దారుణమా.. నేను షాక్ తిన్నాను!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై ప్రముఖ నటుడు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ‘నిన్న ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్‌ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారు? నాపట్ల ఈసీ వ్యవహరించిన తీరును చూసి షాక్ తిన్నాను’ అని విశాల్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. తన నామినేషన్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్ ఆరోపించారు. ఉద్దేశపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారని అన్నారు. నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, నాయ్యం జరిగేవరకు వదిలిపెట్టబోనని విశాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి విశాల్ లేఖ..! ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను తిరస్కరించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నటుడు విశాల్ లేఖ రాశారు. తన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపారు ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. -
రాజకీయ ప్రవేశంపై రజనీ ప్రకటన
-
రాజకీయ ప్రవేశంపై రజనీ సంచలన ప్రకటన
సాక్షి, చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు చేదువార్త అందించారు. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని బుధవారం ప్రకటించారు. తన తాజా చిత్రం ‘2.ఓ’ విడుదలైన తర్వాత మరోసారి అభిమానులతో సమావేశమవుతానని తెలిపారు. తాను ఏ రంగంలోకి దిగడం లేదని స్పష్టం చేశారు. రజనీకాంత్ ప్రకటనతో ఆయన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహగానాలకు తెర దించినట్టైంది. సినిమాల్లో అగ్రహీరోగా కొనసాగుతున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అభిమానులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించడం దీనికి బలం చేకూర్చింది. రజనీ రాజకీయాల్లోని ఖాయమని ఆయన సోదరుడు, సన్నిహితులు వెల్లడించడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊహగానాలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ తాజా ప్రకటనతో రజనీ ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ‘2.ఓ’ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకానున్న నేపథ్యంలో మంగళవారం ఆయన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. మరుసటి రోజే రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించడం విశేషం. -
‘రంగు’ మారింది అందుకేనా?
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తూ పళనిస్వామి సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టింది. అయితే ఈ బ్యానర్లు కాషాయ రంగులో ఉండటం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు అన్నాడీఎంకే ఏ ప్రచార కార్యక్రమం చేపట్టినా ఆకుపచ్చ రంగులోనే బ్యానర్లు ఉండేవి. దీనికి భిన్నంగా కాషాయ రంగు వినియోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీకి అన్నాడీఎంకే దగ్గరవుతుందనడానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు అంటున్నాయి. బీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయిందని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అయితే తాము వాడింది కాషాయం కాదని ఎరుపు వర్ణమని మంత్రి జయకుమార్ వివరణ ఇచ్చారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, చూడగానే ఆకట్టుకునేందుకు ఎరుపు రంగులో బ్యానర్లు రూపొందించినట్టు వెల్లడించారు. ఇదిలావుంటే, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ అంశాలు ప్రధానితో చర్చించలేదని తెలిపారు. డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు అవసరమైన సాయం చేస్తామని, తమిళనాడుకు వైద్య బృందాన్ని పంపుతామని ప్రధాని హామీయిచ్చారని పన్నీర్ సెల్వం వెల్లడించారు. అయితే ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఎన్డీఏతో అన్నాడీఎంకే జట్టు కట్టడం ఖాయమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
స్లీపర్ సెల్స్.. పని ఆరంభం!
సాక్షి, చెన్నై: సహకార మంత్రి సెల్లూరు కే రాజు వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో ఆదివారం రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ జపం అందుకుంటూ, ఆమె దయే ఈ ప్రభుత్వం, ఈ పదవీ అని వ్యాఖ్యానించి సీఎం పళని స్వామికి షాక్ ఇచ్చారు. దీంతో స్లీపర్ సెల్స్ తమ పని మొదలెట్టారంటూ దినకరన్ శిబిరం దూకుడు పెంచే పనిలో పడడం గమనార్హం. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగుర వేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. 18 మందిపై వేటు వేసినా, ప్రభుత్వంలో ఉన్న స్లీపర్ సెల్ మంత్రులు, ఎమ్మెల్యే మరికొందరు తమ పని ఏదో ఒకరోజు మొదలెట్టడం ఖాయం అని దినకరన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అందరూ తమ వాళ్లేనని, అయితే, వారిని భయ పెట్టి, బెదిరించి దారిలోకి తెచ్చుకుని ఉన్నట్టు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సహకార మంత్రి సెల్లూరు రాజు తన మదిలో మాటను బయట పెట్టడం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలకు షాక్ తగిలేలా చేసింది. చిన్నమ్మ జపం అందుకోవడంతో పాటు అన్నీ ఆమె దయే అని సెల్లూరు రాజు వ్యాఖ్యల్ని అందుకోవడం చర్చకు దారితీశాయి. అన్నీ చిన్నమ్మే సహకార మంత్రి సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ, చిన్నమ్మ శశికళ ప్రస్తావనను తీసుకొచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనుక చిన్నమ్మ కృషి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రస్తుతం ఈ ప్రభుత్వం మనుగడలో ఉందంటే, అందుకు కారణం కూడా ఆమే అని స్పందించారు. చిన్నమ్మ లేకుండా ఉండి ఉంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది కాదేమోననంటూ, సీఎం పళని స్వామి గానీయండి, తాను గానీయండి ఈ పదవిలో ఉన్నామంటే అందుకు చిన్నమ్మ కారణం అని, ఇందులో ఎలాంటి మార్పు అన్నది లేదని సెల్లూరు రాజు స్పందించడం సీఎం పళని, డిప్యూటీ పన్నీరు శిబిరానికి షాక్ తగిలేలా చేసింది. ఈ వ్యవహారం కాస్త చర్చకు దారితీసినా, మంత్రి మాత్రం వెనక్కు తగ్గకపోవడం గమనార్హం. అదే సమయంలో మరో మంత్రి వెల్లమండి నటరాజన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ జయలలితకు అందిన చికిత్స, నటరాజన్‌కు అందుతున్న చికిత్స గురించి ప్రస్తావిస్తూ, అది వేరు, ఇది వేరు అని, చిన్నమ్మ శశికళను ఎవరూ కలవబోరని వ్యాఖ్యానించారు. కాగా, చిన్నమ్మ రాకతో మంత్రులు ఆమె పేరును ఏదో ఒక సందర్భంగా స్మరించే రీతిలో వ్యాఖ్యల్ని అందుకోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దినకరన్ శిబిరం వర్గాలు మాత్రం దూకుడుగా స్పందించే పనిలో పడ్డారు. స్లీపర్ సెల్స్ ఒకొక్కకరుగా బయటకు వస్తున్నారని, అన్నీ చిన్నమ్మకు అనుకూలంగానే పరిణామాలు ఉంటాయని, పళని, పన్నీరులకు మున్ముందుకు షాక్‌ల మీద షాక్‌లు ఎదురు కాబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంగా దినకరన్ శిబిరానికి చెందిన మహిళా నేత సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, స్లీపర్ సెల్స్ ఆట ఆరంభం అని వ్యాఖ్యానించడం గమనించాల్సిందే. -
రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ స్పందించారు. పళనిస్వామి సర్కారు బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలోకి పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్‌ను కోరారు. చెన్నై రాజ్‌భవన్‌లో శనివారం కొత్త గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ‘గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడింది. ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ప్రజలను, రాష్ట్రాన్ని మోసపుచ్చుతూ పాలకులు కాలక్షేపం చేస్తున్నారు. డెంగీ జ్వరాల విశ్వరూపం, శాంతి భద్రతల సమస్య, అన్నదాతల ఆవేదనలు, రేషన్ దుకాణాల్లో సరుకుల కొరత వంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన అధికార పార్టీ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా వ్యవహరిస్తారని గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేపుడు మీరు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం సమర్పిస్తూ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామ’ని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం అని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ సందర్భంగా కలిసిన మీడియాతో విజయకాంత్ చెప్పారు. -
కొత్త పొత్తు పొడిచేనా: రజనీ, కమల్ చేతులు కలిపితే..
సాక్షి, చెన్నై: తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ-కమల్ కలిసి రంగంలోకి దిగుతారా? ఈ ఇద్దరి మధ్య పొత్తు పొడిచే అవకాశముందా? అంటే ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ, రజనీ, కమల్ కలిసి పోటీచేస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని సీనియర్ జర్నలిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించడానికి డబ్బు, పేరు ప్రఖ్యాతలు సరిపోవని తాజాగా రజనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట నారాయణ్ స్పందిస్తూ 'రజనీ వ్యంగ్యంగా చేసిన ప్రకటన అది. కానీ రజనీ, కమల్ ఇద్దరూ తమ ప్రకటనల ద్వారా క్రియాశీలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తామని విస్పష్టంగా చెప్పకపోయినా.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉందని ఈ ప్రకటనల ద్వారా చెప్పకనే చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇద్దరు చేతులు కలిపితే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చాలామంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది' అని విశ్లేషించారు. రాజకీయాల్లో రాణించాలంటే.. డబ్బు, పేరు ప్రఖ్యాతలు మాత్రమే సరిపోవని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ముందుండి నడిపించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. -
తమిళ రాజకీయాలు: తొలగని సస్పెన్స్
-
తొలగని సస్పెన్స్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సందిగ్ధం కొనసాగుతోంది. బలపరీక్ష, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మద్రాసు హైకోర్టు ఎటూ తేల్చకపోవడంతో ఉత్కంఠకు తెర పడలేదు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు ఊరటనిచ్చేలా ఉన్నత న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు బలపరీక్ష నిర్వహించొద్దని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు 18 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించొద్దని పేర్కొంది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత విచారణను అక్టోబర్ 4కు కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు ఆ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించొద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పును దినకరన్ వర్గం స్వాగతించింది. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అయితే స్పీకర్ చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి తప్పుచేయలేదని ఆయన తరపున వాదించిన న్యాయవాది ఆర్యమన్ సుందరం.. కోర్టుకు తెలిపారు. డిఎంకే తరపున కపిల్ సిబల్ వాదనలు విన్పిస్తూ.. బలపరీక్ష నిర్వహించకుండా కావాలనే గవర్నర్ కాలయాపన చేశారని పేర్కొన్నారు. -
స్టాలిన్ కొత్త వ్యూహం!
సాక్షి, చెన్నై : తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైకి రావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కబురు పంపారు. అన్నాడీఎంకే సర్కారును గద్దె దించడం లక్ష్యంగా అందివచ్చే అవకాశాలన్నింటినీ స్టాలిన్ ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, 18మంది ఎమ్మెల్యేలపై వేటు వేసి బలపరీక్షలో నెగ్గాలన్న సీఎం పళనిస్వామి వ్యూహ రచనతో స్టాలిన్ అప్రమత్తం అయ్యారు. ఆగమేఘాలపై తన ఎమ్మెల్యేలను చెన్నైకి రావాలని వర్తమానం పంపారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అన్నా అరివాలయంలో భేటీకి నిర్ణయించారు. పళని సర్కారుపై ప్రజల్లోనూ అసంతృప్తి బయలుదేరి ఉన్న దృష్ట్యా మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుగాను డీఎంకే ఎమ్మెల్యేలు 89 మందితోపాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిదిమందితో మూకుమ్మడిగా రాజీనామా చేయిస్తే రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా సాగేందుకు వీలుందన్న పథకంతో ఈ అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. దొడ్డిదారిన బల పరీక్షలో పళని నెగ్గిన పక్షంలో మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశాలున్నాయి. అందుకే బలపరీక్షకు ఆస్కారం లేని రీతిలో తామే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లే విధంగా ముందడుగు వేయవచ్చన్న ప్రచారం తమిళనాట ఊపందుకుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తమదే అన్న ధీమా డీఎంకేలో పెరగడమే ఇందుకు నిదర్శనంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం పార్టీ న్యాయవాద విభాగం కార్యదర్శి ఆర్ఎస్ భారతి, సీనియర్ న్యాయవాది షణ్ముగ సుందరం తదితరులతో స్టాలిన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము తీసుకునే నిర్ణయానికి ఏమైనా న్యాయ, చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయా అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. -
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు
-
విద్యాసాగర్‌రావుపై స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
చెన్నై: తమిళనాడు గవర్నర్, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు తలెత్తిన రాజకీయ సంక్షోభం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. విపక్ష పార్టీలతో పాటు ఆయన బుధవారం గవర్నర్‌ను కలిశారు. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని గవర్నర్ కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భాగస్వామ్య పార్టీలతో పాటు రేపు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వం చర్య తీసుకోకుంటే, కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు రాజ్‌భవన్ చుట్టూ తిరిగిన తమిళ రాజకీయం ఇప్పుడు హస్తిన చేరనుంది. మరోవైపు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం తమపై తప్పుడు ప్రచారం చేసేందుకేకేంద్ర మంత్రులను కలుస్తున్నారని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఆరోపించారు. -
'తమిళనాడులో త్వరలో కొత్త ప్రభుత్వం'
-
'తమిళనాడులో త్వరలో కొత్త ప్రభుత్వం'
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, దినకరన్ వర్గాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. 'తమిళనాడుకు గొప్ప ఎదురుదెబ్బ తగలనుంది. స్టాలిన్, దినకరన్ కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నార'ని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి పడగొట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు ఆదివారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత దురై మురుగన్ నేతృత్వంలో ఓ బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. డీఎంకే ఎంపీలు కనిమొళి, ఆర్ఎస్ భారతి, ఓ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ థరణి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అబూబక్కర్లు 15 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. స్టాలిన్ తరపున వినతి పత్రాన్ని సమర్పించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో దురై మురుగన్ మాట్లాడారు. బల పరీక్షకు ఆదేశాలివ్వాలని ఇప్పటికే లేఖలు రాశామని, ప్రస్తుతం స్వయంగా గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. మరి కొద్ది రోజులు చెన్నైలో గవర్నర్ రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైలోనే ఉండనున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఓ వైపు, డీఎంకే, కాంగ్రెస్ శాసనసభా పక్షాలు మరోవైపు సీఎం పళని స్వామి విశ్వాస పరీక్ష కోసం విజ్ఞప్తులు చేసిన దృష్ట్యా అందుకు తగ్గ కసరత్తుల్ని గవర్నర్ మొదలెట్టినట్టు సమాచారం. -
పార్టీ పదవి నుంచి సీఎంకు ఉద్వాసన
చెన్నై: అన్నాడీఎంకే పార్టీపై తన పట్టు సాధించేందుకు శశికళ మేనల్లుడు దినకరన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామితో నేరుగా తలపడిన ఆయన ఆదివారం మరో సంచలనానికి తెర తీశారు. పార్టీ పదవి నుంచి పళనిస్వామిని తప్పిస్తున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగించినట్టు తెలిపారు. తన దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్‌ను కూడా పార్టీ పదవి నుంచి శనివారం దినకరన్ తప్పించారు. రాజేంద్రన్ స్థానంలో పి ముతుయాన్‌ను నియమించినట్టు వెల్లడించారు. శాసనసభలో బలం నిరూపించుకునేలా పళనిస్వామిని ఆదేశించాలని కోరుతూ ఆగస్టు 22న దినకరన్ దగ్గరనున్న 19 మంది ఎమ్మెల్యేలు.. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి కోరారు. పళనిస్వామిని సీఎం పీఠం నుంచి దించాలన్న లక్ష్యంతో గత కొద్దిరోజులు పార్టీ పదవుల నుంచి ఆయన వర్గీయులను దినకరన్ తొలగిస్తున్నారు. ఇంతకుముందు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించి, తన అనుచరులను నియమించారు. మరోవైపు దినకరన్ దాడి నుంచి గట్టెక్కేందుకు ఈపీఎస్ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. -
మెగా టీంకు డీఎంకే కసరత్తు
తమిళనాడులో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యం సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాదం మోపకుండా అడ్డుకునేందుకు డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటుకాబోతోంది. ఇందుకు తగ్గట్టుగా డీఎంకేతో దోస్తీకి ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలు కసరత్తు మొదలుపెట్టాయి. గత కొన్నేళ్లుగా డీఎంకేకి వామపక్షాలు దూరంగా ఉంటూ వస్తున్నాయి. డీఎంకే చీఫ్ కరుణానిధికి నమ్మిన బంటుగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ సైతం 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం హ్యాండిచ్చారు. మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, డీఎండికేలు కూటమిగా ఏర్పడి డీఎంకే ఓటమిలో కీలకపాత్ర పోషిం చాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై బీజేపీ పెత్తనం రోజురోజుకూ పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రం లో క్రియాశీలపాత్ర పోషించేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తుండటంతో ఆ పార్టీని అడ్డుకునేందుకు డీఎంకే సిద్ధం అవుతోంది. డీఎంకే నిర్వహించే ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ, వీసీకేలు పాల్గొనేందుకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
తమిళ పాలి'ట్రిక్స్': మళ్లీ ట్విస్ట్
-
తమిళ పాలి'ట్రిక్స్': మళ్లీ ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారిక అన్నాడీఎంకే పార్టీలో తలెత్తిన విభేదాలు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. పన్నీర్ సెల్వం వర్గం విలీనం కావడంతో అన్నాడీఎంకేలో మరోసారి సంక్షోభం నెలకొంది. శశికళ వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో పళనిస్వామి సర్కారు మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. మంగళవారం ఆయన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణమే శాసనసభలో బలం నిరూపించుకునేలా ఆదేశించాలని లేఖలో కోరారు. పళనిస్వామి సర్కారును ప్రజాస్వామ్యయుతంగా సాగనంపుతామని స్టాలిన్ ఇంతకుముందే ప్రకటించారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ వర్గం చర్యలు చేపట్టింది. తమ దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. తమకు ప్రభుత్వం కంటే పార్టీ ముఖ్యమని శశికళ వర్గం ఎమ్మెల్యే పి వెట్రివేల్ అన్నారు. పార్టీని కాపాడుకునేందుకే పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కాగా, శశికళను పార్టీ నుంచి తప్పించాలన్న అన్నాడీఎంకే ఎంపీ వైద్యలింగంను దినకరన్ తొలగించారు. మరోవైపు ప్రభుత్వానికి కాపాడుకునేందుకు ఈపీఎస్-ఓపీఎస్ ప్రయత్నిస్తోంది. శశికళ వర్గం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
వాళ్లిద్దరూ వచ్చినా భయంలేదు: విజయ్‌కాంత్
పెరంబూరు(తమిళనాడు): రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లోకొచ్చినా తమకేం భయం లేదని డీఎండీకే అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ అన్నారు. కమల్‌హాసన్ ఒక్కరే ధైర్యంగా రాష్ట్ర నాయకుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారని మెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతోపాటు, ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అన్నాడీఎంకే నేతల అవినీతిపై కమల్‌హాసన్ విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో తమిళనాడు భవిష్యత్ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. పుదుగై జిల్లా నెడువాసల్ గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు చేయరాదంటూ గత ఏప్రిల్ 12వ తేదీ నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీ నేత విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు పరచడానికి అధికారులతో మంత్రులు గ్రామంలోకి అడుగు పెడితే ప్రాణాలొడ్డి అయినా వారిని అడ్డుకుంటామని అన్నారు. సోమవారం ఆ గ్రామంలో హైడ్రో కార్బన్ పథకాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్ ఈ పధకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాలను ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు. -
పన్నీరు సెల్వంకు గట్టి షాక్
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పురచ్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వంకు కౌండం పాళయం ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి షాక్ ఇచ్చారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం నాయకత్వంలోని పురత్చి తలైవి శిబిరాన్ని వీడి సీఎం పళనిస్వామి నేతృత్వంలోని శిబిరంలో ఆదివారం చేరారు. తన మద్దతుదారులతో కలిసి ‘చిన్నమ్మ’ శిబిరంలో చేరిపోయారు. శశికళ శిబిరంలో 122 మంది, పురచ్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుకుట్టి వెళ్లిపోవడంతో పన్నీరు సెల్వం శిబిరంలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం సీఎం పళనిస్వామికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పెరుగుతుండడం, తమిళ మంత్రులకు కేంద్ర మంత్రులు ప్రాధాన్యతనిస్తుండటంతో పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ఆలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనకు హ్యాండిచ్చి అమ్మ శిబిరం వైపు కదిలే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. పన్నీరు శిబిరం నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో అమ్మ శిబిరంలోకి రాబోతున్నారని ఆరుకుట్టి ప్రకటించారు. పోతే పోనీ: పన్నీరు ఆరుకుట్టి తమ శిబిరాన్ని వీడి వెళ్లడంపై పన్నీరు సెల్వం స్పందిస్తూ...‘తనంత తానుగా వచ్చారు.. ఆయనే వెళ్లారు.. పోతే పోనీ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్న వాళ్లనైనా దక్కించుకునే ప్రయత్నాల్లో పడి పార్టీ వర్గాలతో ఆదివారం మంతనాలు జరిపారు. ఈ మంతనాల్లో మెజారిటీ సభ్యులు పళని వర్గంతో మళ్లీ విలీన చర్చల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని ప్రకటించిన సమయంలో ఈ శిబిరంలోకి అడుగు పెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. దీంతో జంప్‌జిలానీల సంఖ్య పెరగడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. -
రజనీకాంత్ మరో అడుగు
చెన్నై: రాజకీయ ప్రవేశం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో ఆయన రాజకీయాల్లో కి రావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా రజనీ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన రైతులతో భేటీ అయ్యారు. ఆదివారం అన్నదాతలను కలిశారు. కోటి రూపాయల సహాయం అందిస్తానని వారికి హామీయిచ్చారు. ఇటీవల అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకునే సన్నాహాల్లో భాగంగానే రజనీకాంత్ ఇవన్ని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహిత మిత్రుడు చేసిన ప్రకటనతో రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమన్న ప్రచారం పతాకస్థాయికి చేరింది. రజనీకాంత్ తన జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని రజనీ నిర్ణయించుకున్నారని, అభిమానులతో మరోసారి సమావేశమైన తరువాత డిసెంబర్ 12వ తేదీన బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన మీడియాకు తెలిపారు. -
తమిళ రాజకీయాల్లో కలకలం
రజనీ వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చూపు చెన్నై(తమిళసినిమా): అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చూపు రజనీపై పడుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తే అందులో చేరడానికి ఐదుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు రెడీగా ఉన్నారనే మీడియా ప్రచారం కలకలం రేపుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం ‘కాలా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఇటీవల తన అభిమానులను కలవడం, సమయం వచ్చినప్పుడు పోరుకు సిద్ధం కండని వారికి పిలుపు నివ్వడం వంటివి తమిళనాడులో ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల గాంధీ ప్రజా సంఘం అధ్యక్షుడు దమిళరువి మణియన్ రజనీకాంత్‌ను కలిసి అనంతరం ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం తథ్యం అని రజనీకి తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల రజనీకాంత్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు రజనీ పార్టీ పెడితే అందులో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజా ప్రచారం. అదే విధంగా పన్నీర్‌సెల్వం, ముఖ్యమంతి ఎడపాడి పళనిస్వామి వర్గాలకు చెందిన పలువురు కార్య నిర్వాహకులు రజనీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రజనీతో సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాలా షూటింగ్ కోసం ముంబైలో మకాం పెట్టిన రజనీకాంత్ వీరెవరినీ కలవడానికి సుముఖం వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నవారు తనతో రావొద్దని రజనీకాంత్ బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. -
రజనీ.. రాజకీయాలకు సరిపోడు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు ఏమాత్రం సరిపోడని, ఆయన నటనారంగానికి మాత్రమే పరిమితం అయితే సరిపోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మండిపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితికి రజనీ ఏమాత్రం సరిపోడని, ఆయనకు అసలు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు లేదా మరే విషయం గురించి అసలు ఐడియా లేదని అన్నారు. రజనీ డైలాగులు బాగా చెప్పి జనాన్ని ఆనందింపజేస్తారని, అందువల్ల ఆయన సినిమాలకు పరిమితం అయితే బాగుంటుందని స్వామి చెప్పారు. అసలు సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎందుకని, ఇప్పటికే తమిళ రాజకీయాల్లోకి వచ్చిన సినిమావాళ్లు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. కామరాజ్ నాడార్ హయాంలో జరిగిన అభివృద్ధి మొత్తాన్ని సినిమావాళ్లు వచ్చి పాడుచేశారని, అందుకే తాను సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్వామి తెలిపారు. తలైవా బీజేపీలో చేరబోతున్నారని, అందుకే పలువురు పార్టీ పెద్దలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని వచ్చిన కథనాలను ప్రస్తావించగా, ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఆయన ఏ పార్టీలోనూ చేరుతున్నట్లు చెప్పలేమన్నారు. -
రజనీకాంత్ లేట్‌గానైనా లేటెస్ట్గా వస్తారా?
‘నేను ఎప్పుడు, ఎలా వస్తానో ఎవరికి తెలియదు. కానీ సరైన సమయంలోనే వస్తాను’. ఇది 1995లో వచ్చిన ‘ముత్తు’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. రాజకీయాల్లోకి ఎప్పుడు.. ఎలా రావాలో అన్న ఆయన సందిగ్ధావస్థకు కూడా ఈ డైలాగే సమాధానం. ఆయన గత 21 ఏళ్లలో అనేకసార్లు తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు వదిలారు. కానీ రాలేకపోయారు. ఆయన సంకేతాలు ఇచ్చినప్పుడల్లా మీడియా వాటికి విస్తృత ప్రచారాన్ని కల్పించడం, తమిళనాడు రాజకీయాలు కూడా కాస్త వేడెక్కడం, ఆ తర్వాత చప్పున చల్లారడం షరా మామూలుగా జరుగుతూ వచ్చింది. చెన్నైలో గురువారం జరిగిన తన అభిమానుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ తాను రాజకీయల్లోకి వస్తానన్న సంకేతాలిచ్చారు. రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోతున్నాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఆ దేవుడు శాసిస్తే తాను రాజకీయల్లోకి వస్తానని చెప్పారు. ‘యుద్ధం కోసం నిరీక్షిస్తూ మీ విధులు మీరు నిర్వర్తిస్తూ వెళ్లండి’ అని కూడా అభిమానులకు పిలుపునిచ్చారు. అందులో యుద్ధమంటే ఎన్నికలని భావించవచ్చు. 67వ ఏట ఈసారి ఇచ్చిన ఈ సంకేతం నిజమయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులే అందుకు కారణం. జయలలిత ప్రాతినిధ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీలుగా, వర్గాలుగా చీలిపోవడమే అందుకు కారణం. డీఎంకే కురువృద్ధ నాయకుడు ఎం.కరుణానిధి కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం కూడా రజనీ సొంత పార్టీ ఏర్పాటుకు కలిసొచ్చే అవకాశం. 1995లోనే ఆ ఆలోచన వచ్చిందా? నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉంటున్న ‘పోయెస్ గార్డెన్’ నివాసానికి సమీపంలోనే రజనీకాంత్ ఇల్లు ఉంది. ఓ రోజు జయలలిత వస్తున్నారని ఆ రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దాదాపు గంటసేపు కారులోనే కూర్చుండిపోయిన రజనీకాంత్ చివరకు అసహనంతో కారు దిగి నడక ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా అన్నట్లు ఎంతోమంది ప్రజలు కూడా ఆయన వెన్నంటి నడిచారు. అప్పుడే ఆయన కు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదటిసారి వచ్చిందేమో! ఆ తర్వాత కొన్ని నెలలకు ప్రముఖ దక్షిణాది దర్శకుడు మణిరత్నం ఇంటిపై దాడి జరిగింది (ఆయన బాంబే సినిమా విడులైన కొత్తలో). ఈ విషయమై రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై మండిపడ్డ అన్నాడీఎంకే ఆయన్ని విమర్శస్తూ పోస్టర్లు వేసింది. ఈ నేపథ్యంలో 1996 ఎన్నికల్లో జయలలితను గెలిపిస్తే తమిళనాడును ఇక ఎవరూ రక్షించలేరని విమర్శించారు. ప్రతిపక్షాన్ని ఏకం చేసిందీ ఆయనే జయలలితను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో కరణానిధి నాయకత్వంలోని డీఎంకే, జీకే మూపనార్ నాయకత్వంలోని తమిళ్ మానిల కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదర్చడంలో రజనీకాంత్ కీలకపాత్ర పోషించారు. అప్పుడు డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. తాను పోటీచేసిన బర్గూర్ నియోజకవర్గంలో కూడా జయలలిత ఓడిపోయారు. అప్పటి డీఎంకే విజయానికి రజనీకాంత్ కారణమనే పేరు కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఓసారి స్వయంగా రజనీకాంత్ కూడా చెప్పుకున్నారు. 1996లోనే సీఎం అయ్యే అవకాశం వచ్చింది 1996 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి జయలలితపై పోటీ చేయాలని రజనీకాంత్‌ను టీఎంసీ నాయకుడు మూపనార్ కోరారట. ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారట. ఈ విషయాన్ని రజనీకాంత్ గానీ, మూపనార్ గానీ బయటకు చెప్పలేదు. 1996లోనే ముఖ్యమంత్రి అయ్యే గొప్ప అవకాశాన్ని రజనీకాంత్ వదులుకున్నారని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఓ మీడియా ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అప్పట్లో మూపనార్‌కు చిదంబరం అత్యంత సన్నిహితుడు కనుక ఆయనకు మూపనార్ ఆఫర్ గురించి తెలిసే ఉంటుంది. రాజకీయ నేతలపై తరచూ విమర్శలు 1996 ఎన్నికల తర్వాత నుంచి రజనీకాంత్ తరచు రాజకీయాల గురించి మాట్లాడేవారు. రాజకీయ నేతలను విమర్శించేవారు. సినిమాల్లో రజనీకాంత్ ఎక్కువగా సిగరెట్లను తాగడాన్ని విమర్శించినందుకు పట్టల్ మక్కల్ కచ్చి నాయకుడు ఎస్ రామదాస్‌పై 2004లో రజనీ మండిపడ్డారు. పీఎంకేకు వ్యతిరేకంగా తన అభిమానులతోని ప్రచారం చేయిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లోకి రానంటూ ఆయన ఎప్పుడూ చెప్పలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ కూడా ఆయన్ని కలుసుకున్నప్పుడు కూడా రజనీ త్వరలోనే రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రజనీ మద్దతిచ్చారంటూ ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని రజనీ ఖండించారు. సినిమా ప్రమోషన్ల కోసమేనా? రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలివ్వడం, రాకపోవడం ఆయన సినిమాల ప్రమోషన్ల కోసమేనన్న విమర్శలు రజనీ కాంత్పైనా ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన సినిమా విడుదలవడానికి ముందు సంకేతాలివ్వడం, సినిమా విడుదలయ్యాక రాజకీయాల ఊసెత్తకపోవడమే. రజనీకాంత్‌కు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా నిశ్చితాభిప్రాయాలు లేవు. 1996లో ప్రతిపక్షాలను గెలిపించినదీ తానేనన్న ఆయన ఆ తర్వాత అదొక రాజకీయ యాక్సిడెంట్ అని వ్యాఖ్యానించారు. 2009లో శ్రీలంకలోని ‘ముళ్లైవైకల్’ ఊచకోత సంఘటనపై కూడా ఆయన నోరు విప్పకపోవడాన్ని తమిళ ప్రజలు తీవ్రంగా విమర్శించారు. కమల్ హాసన్ లాంటి వారు ఆ ఊచకోతను తీవ్రంగా ఖండించారు. కావేరీ జలాలపై కూడా ఆయనకు నిశ్చితాభిప్రాయం లేదు. కానీ తమిళ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు దీక్ష చేశారు. ఎంతైనా మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగినవాడు కదా! లేటెస్ట్గా వస్తారా.... ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలకు రజనీకాంత్ లాంటి ఫ్యాన్‌ఫేర్ కలిగిన నాయకుడు కావాలి. జయలలిత మహాభినిష్క్రమణ, కరుణానిధి తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అసలు వారిద్దరితోనే రాజకీయాల్లో సినిమా తారల తరానికి తెరపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. రజనీ రాకతో ఆ సంప్రదాయం అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావాలు కలిగినందున రజనీ బీజేపీలో చేరుతారనే ప్రచారమూ ఉంది. తమిళ రాజకీయాల్లో రాణించాలంటే సొంత పార్టీని పెట్టుకోవడమే ఉత్తమమైన మార్గం. ఆ తాను ముక్కలాగా బీజేపీకి అంటకాగుతూ తోకపార్టీలాగా ఇంట గెలవచ్చు. ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు’ అన్నది రజనీ అభిమానుల నమ్మకం. -
రజనీ.. రాజకీయాల్లోకి రావద్దు!
-
రజనీ.. రాజకీయాల్లోకి రావద్దు!
'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడాన్ని ఒక పొలిటికల్ జోక్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి అభివర్ణించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని సలహా ఇచ్చారు. రజనీకాంత్‌కు స్పష్టమైన సిద్ధాంతం లేదని, ఆయన గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారు తప్ప అందులో సిద్ధాంతాలు పాటించలేదని, ఆయన తరచు నిర్ణయాలు మార్చుకుంటారని స్వామి అన్నారు. అయితే.. ఒకవైపు స్వామి ఇలా చెబుతున్నా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్.గురుమూర్తి తదితరులు మాత్రం రజనీకాంత్‌తో టచ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో చేరచ్చు అన్న రజనీ వ్యాఖ్యలను గురుమూర్తి స్వాగతించారు. రజనీ బాగా ఆలోచించి మాత్రమే మాట్లాడుతున్నారని, ఆయన అచ్చం మోదీలాగే చెబుతున్నారని కూడా అన్నారు. అయితే సుబ్రమణ్యం స్వామికి మాత్రం ఎందుకో రజనీ కామెంట్లు పెద్దగా నచ్చినట్లు లేవు. అసలు గట్టిగా మాట్లాడితే రజనీకాంత్ తమిళుడే కాదని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ వ్యక్తి అని స్వామి వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌కు అభిమానులు ఉన్నారంటే వాళ్లు ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవాళ్లు కారని, ఓ గుంపులా ఆయనను ఆరాధిస్తున్నారని అన్నారు. ప్రకటనలు చేయడంలో సినిమావాళ్లు దిట్టలని, ఎందుకంటే వాళ్లకు డైలాగులు వేరే ఎవరో రాసిస్తారని స్వామి మండిపడ్డారు. -
తొలి విజయం సాధించాం: పన్నీర్ సెల్వం
-
తొలి విజయం సాధించాం: పన్నీర్ సెల్వం
చెన్నై: ధర్మయుద్ధంలో మొదటి విజయం సాధించామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం(ఓపీస్) ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబ సభ్యులను వెళ్లగొట్టడాన్ని తొలి విజయంగా ఆయన వర్ణించారు. కుటుంబ పాలనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింసూచబోమని పునరుద్ఘాటించారు. తన మద్దతుదారులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చివరకు న్యాయం గెలిచిందన్నారు. అన్నాడీఎంకే విలీనమవుతామని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. పార్టీ ఒక్కటిగా ఉండాలన్న లక్షలాది కార్యకర్తల అభీష్టం నెరవేందుకు రెండు వర్గాలు చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు. అమ్మ’ ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశిస్తే విలీనమవడానికి సిద్ధమని ప్రకటించారు. 11 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, సీనియర్ నాయకులతో అంతకుముందు పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై మంతనాలు సాగించారు. -
ఎమ్మెల్యేలతో దినకరన్ కీలక భేటీ
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. పార్టీ, ప్రభుత్వం నుంచి తనకు ఉద్వాసనకు పలుకుతూ పళనిస్వామి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వెనక్కి తగ్గలేదు. పార్టీపై తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. దినకరన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయనకు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. -
దినకరన్ సంచలన నిర్ణయం!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కొత్త ప్రతిపాదన చేశారు. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. శశికళను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని కోరినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం వర్గాన్ని తమతో కలుపుకునేందుకు ఆయన అంగీకరించారు. విలీన చర్చలను ఆయన స్వాగతించారు. బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన దినకరన్ తో అన్నాడీఎంకే సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పార్టీ ఒక్కటిగా ఉండాలని అందరం కోరుకుంటున్నామని, త్వరలో ఒక తాటిపైకి వస్తామని మంత్రి సెంగొట్టయన్ తెలిపారు. శశికళ కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెడితే విలీనానికి సిద్ధమని పన్నీర్ సెల్వం షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి సాగనంపేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దినకరన్ దిగివచ్చినట్టు తెలుస్తోంది. -
విలీనానికి ఓపీఎస్ ఓకే
చెన్నై: శశికళ వర్గంలోని అధికార అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్) సూచనప్రాయంగా ప్రకటించారు. విలీనంపై చర్చలు జరిపేందుకు శశికళ వర్గం కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పళనిస్వామి వర్గం కూడా ధ్రువీకరించింది. సీనియర్ మంత్రులతో కూడిన కమిటీ రెండు వర్గాల విలీనంపై చర్చలు జరుపుతుందని మంత్రి సెల్లూర్ రాజు తెలిపారు. రెండాకుల గుర్తును రెండు వర్గాలు కోరుకుంటున్నాయని, పార్టీ గుర్తును దక్కించుకోవాలంటే ఇరువర్గాలు కలిసి పనిచేయాల్సివుంటుందని పేర్కొన్నారు. ‘మేమంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల లాంటి వాళ్లం. రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశముందని నిన్న పన్నీర్ సెల్వం వెల్లడించారు. దీనికనుగుణంగా మేమంతా కూర్చుని, చర్చించుకుని విభేదాలు పరిష్కరించుకుంటామ’ని సెల్లూర్ రాజు చెప్పారు. పన్నీర్ సెల్వం వర్గం తమ వర్గంలో విలీనమవుతుండడం పట్ల అటవీశాఖ మంత్రి సి. శ్రీనివాసన్ సంతోషం వ్యక్తం చేశారు. తన వర్గాన్ని విలీనం చేసేందుకు పళనిస్వామి ప్రభుత్వానికి ఓపీఎస్ రాజీ ఫార్ములా ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెట్టాలని ఆయన షరతు విధించినట్టు తెలుస్తోంది. -
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు!
-
మళ్లీ తెరపైకి హీరో అజిత్ పేరు!
-
మళ్లీ తెరపైకి హీరో అజిత్ పేరు!
చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నేపథ్యంలో హీరో అజిత్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తి నెలకొంది. ఆయన రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. అజిత్ రాజకీయ ప్రవేశానికి అనుకూలంగా చెన్నైలో పోస్టర్లు వెలిశాయి. పుట్టినరోజు(మే 1) నాడు తన నిర్ణయం వెలువరించాలని కోరుతూ అభిమానులు పోస్టర్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తన రాజకీయ ప్రవేశంపై అజిత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా అజిత్ పై మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. జయలలిత మరణించినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారన్న చర్చ ఆసక్తికరంగా సాగింది. విదేశాల నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి ఆయన నివాళులు అర్పించి ‘అమ్మ’పై తన అభిమానాన్ని చాటుకున్నారు. జయలలిత తనను కొడుకులా చూసుకునేవారని గతంలో చెప్పిన అజిత్... ‘అమ్మ’ మృతి తర్వాత రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినా ఆయన స్పందించలేదు. రాజకీయాల జోలికిపోకుండా సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అజిత్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. జయలలితకు నిజమైన వారసుడు అజిత్ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. -
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు!
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరిగాయి. అధికార అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు ఏకమయ్యే దిశగా కదులుతున్నాయి. ఓ పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ రోజు దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లాయడంతో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పన్నీర్ సెల్వం తన వర్గీయులతో సొంతగూటికి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓపీఎస్ వర్గాన్ని చేర్చుకునేందుకు సీఎం పళనిస్వామి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. శశికళ వర్గీయులపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఓపీఎస్ వర్గాన్ని తమలో విలీనం చేసుకునేందుకు అధికార వర్గం ముందుకు వచ్చినట్టు విశ్వనీయవర్గాల సమాచారం. రెండాకుల గుర్తు కోసం దినకరన్ రూ. 50 కోట్లు ఇవ్వచూపినట్టు ఆరోపణలు రావడంతో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వంతో శశికళ వర్గం అప్రదిష్టపాలైంది. మరోవైపు బెంగళూరు జైలులో ఉన్న శశికళను ఈరోజు దినకరన్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు త్వరలో తన శిబిరంలోకి వచ్చి తీరుతారన్న ఆశల పల్లకిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఉన్నారు. శశికళ కుటుంబ జోక్యం కారణంగానే అన్నాడీఎంకేలో చీలిక అనివార్యం అయిందని సమర్థించుకున్నారు. అమ్మ మరణంలో మిస్టరీపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడే ఉన్నట్టు చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టించి బయటకు వచ్చిన నేత పన్నీరుసెల్వం. అధి కారం దూరమైనా, పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోవడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో పార్టీవర్గాల దృష్టిని తన వైపు తిప్పుకుని బలాన్ని చాటుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారబిజీలో ఉన్న మాజీ సీఎం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ శిబిరం నేత ఓ.పన్నీరుసెల్వం మీడియాకు ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ మేరకు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఆశాభావాల్ని, ధీమా వ్యక్తం చేస్తూ, తాను గతంలో చేసిన వాఖ్యలకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. 122 మంది వస్తారు అసెంబ్లీ వేదికగా బలపరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, బలవంతంగా బంధించి మద్దతు కూడగట్టుకున్నారని ఆరోపించారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఏ మేరకు వ్యతిరేకిస్తున్నారో అన్న విషయం ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాల నాటికి తేలుతుందన్నారు. ఎన్నికల అనంతరం ఆ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదికగా అన్నాడీఎంకే మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తాత్కాలికమేనని జోస్యం చెప్పారు. ఆ కుటుంబ జోక్యంతో చీలిక దివంగత సీఎం ఎంజీఆర్ ఎన్నడూ పార్టీలో తన కుటుంబీకుల జోక్యానికి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. అమ్మ జయలలిత కూడా అదే తరహాలో ముందుకు సాగారని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు అమ్మ వ్యతిరేకం అని, అమ్మ మరణంతో శశికళ కుటుంబం జోక్యం పెరగడంతోనే చీలిక అనివార్యం అయిందని చెప్పారు. ఆ కుటుంబ జోక్యాన్ని ఎన్నడూ అమ్మ అనుమతించలేదని, అమ్మ లేని దృష్ట్యా, ఇష్టారాజ్యంగా ఆ కుటుంబం వ్యవహరిస్తూ పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ఆ కుటుంబ జోక్యం లేకుండా ఉండి ఉంటే, అందరం ఒకే వేదికగా కలిసి ఉండే వాళ్లమని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని సాగనంపి, మళ్లీ అందరూ ఒకే వేదికగా ముందుకు సాగే సమయం తప్పకుండా వస్తుందన్న నమ్మకం తనలో ఉందన్నారు. ఇందుకు ప్రజలు అండగా నిలబడాలని, ప్రజా మద్దతుతో అన్నాడీఎంకే వైభవాన్ని చాటుతామని, కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని మళ్లీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కట్టుబడే ఉన్నా అమ్మ మరణంలో అనుమానాలు తేలాలంటే విచారణ కమిషన్‌ను నియమించాల్సిందేనని పన్నీరుసెల్వం డిమాండ్ చేశారు. తాను ఇందుకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. అమ్మను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అధికారులు కొందరు ఆమెతో భేటీ అయ్యారని వివరించారు. కావేరి జలాల సమస్యపై సాగిన ఈ భేటికి తాను వెళ్లలేదని చెప్పారు. ఆ సమావేశానికి వెళ్లిన అధికారులతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. అమ్మ స్వయంగా కావేరి నివేదిక విషయంగా పలు మార్పులు చేర్పులు, సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే, ఆ మరుసటి రోజే అమ్మ అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రకటించడంతోనే అనుమానాలు కలిగాయని చెప్పారు. అందుకే అనుమానాల నివృత్తి లక్ష్యంగా విచారణ కమిషన్‌కు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. -
రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు
-
రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే అసెంబ్లీ నియోజక వర్గానికి ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. అన్నాడీఎంకే నుంచి శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు, డీఎంకే, దీప పేరవై, బీజేపీ, డీఎండీకే, సీపీఎం, నామ్ తమిళర్ కచ్చి తదితర పార్టీలు పోటీకి దిగాయి. ఇప్పటివరకు 24 నామినేషన్లు దాఖలైయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్ మంగళవారం రజనీకాంత్ ను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. వీరిద్దరూ కలిసిన ఫొటోలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అమరన్ కు రజనీకాంత్ మద్దతు ఇస్తారన్న ప్రచారం మొదలైంది. దీంతో రజనీకాంత్ స్వయంగా వివరణయిచ్చారు. ఆర్కే నగర్ లో ఉప ఎన్నికలో నామినేషన్ల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. -
మొన్న రజనీ... నిన్న కమల్
తమిళ సినిమా(చెన్నై): తమిళనాడులో రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో 90 శాతం సినిమాకు చెందిన వారేనన్నది జగమెరిగిన సత్యం. జయలలిత మరణానంతరం సినిమా పరిశ్రమకు సంబంధంలేని ముఖ్యమంత్రి చేతిలోకి ప్రభుత్వం వెళ్లింది. దీన్ని తమిళనాడులోని అత్యధిక శాతం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నటుడు కమలహాసన్ ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా తన భావాలను ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చడం ప్రజలను ఆకర్షించింది. కమల్ బహిరంగంగానే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించి, పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కమల్ ఆదివారం రాష్ట్రంలోని నలుమూల అభిమానుల ప్రతినిధులను, తన సంఘానికి చెందిన న్యాయవాదులను కలవడంతో రాజకీయవర్గాల్లో అలజడి మొదలైంది. అయితే సమావేశంలో రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. కమల్ అభిమానులకు ఈ సమావేశం ఏమాత్రం రుచించలేదు. వారు తన అభిమాన నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారు. కమల్‌పై ఒత్తిడి తీసుకొస్తామని, ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని అభిమానులు అంటున్నారు. కాగా మొన్నటి వరకూ ఇలాంటి రాజకీయ సెగ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కమలహాసన్‌కు ఎదురవుతోందన్నది పరిశీలకుల మాట. -
తమిళ పాలిటిక్స్ పై విజయశాంతి కామెంట్
హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ముఖ్యమంత్రి ఎడప్పాడు పళనిస్వామికి సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అభినందనలు తెలిపారు. పన్నీర్ సెల్వంతో పాటు దుష్టశక్తులు సమస్యలు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. శశికళ ఒంటరి పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టకుండా పార్టీని రక్షణ కవచంగా చేసుకుని 'చిన్నమ్మ' ఒకవైపు నిలబడ్డారని, దుష్టశక్తులతో కలిసి పన్నీర్ సెల్వం మరోవైపు నిలిచారని అన్నారు. తాను వ్యక్తిగతంగా వీకే శశికళకు మద్దతునిస్తానని విజయశాంతి అంతకుముందు పేర్కొన్నారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య శనివారం తమిళనాడు శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకుంది. దీంతో పన్నీర్ సెల్వం వర్గంపై శశిశళ శిబిరం పైచేయి సాధించింది. -
ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే
మద్దతు ఏ వర్గానికో ? టీనగర్: తమిళనాడులో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. మరికొద్ది గంటల్లో అసెంబ్లీలో బల పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు కూడా ప్రాధాన్యతను సంతరించకుంది. గంధర్వకోట్టై అన్నాడీఎంకే ఎమ్మెల్యే నార్ధామలై ఆర్ముగం అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఏ వర్గానికి మద్దతు తెలుపుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్ముగం కొన్ని నెలలుగా పేగు జారడంతో బాధపడుతూ వచ్చారు. ఈ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొద్ది రోజుల క్రితం చెన్నై రాజీవ్‌గాం ధీ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయనకు హెర్నియా శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలావుండగా ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే గృహ నిర్బంధంలో ఉంచినందున ఆర్ముగం కూడా కనిపించడం లేదంటూ కొన్ని రోజుల క్రితం నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా ఆయన త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన తన మద్దతు ఎడపాడి పళనిస్వామికా? లేదా పన్నీర్ సెల్వంకా? అనేది ప్రకటించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కనిపించడం లేదు: పోస్టర్‌తో సంచలనం: కృష్ణగిరి జిల్లా, బర్గూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలియడంతో సంచలనం ఏర్పడింది. ఈయన శశికళ వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి కనిపించడం లేదంటూ బర్గూరు నియోజకవర్గంలో అనేక చోట్ల పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ చివరిలో ఇట్లు, బర్గూరు నియోజకవర్గ ప్రజలు అని, సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 94432 68844 అంటూ పేర్కొనబడింది. దీంతో ఈ పోస్టర్లు ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించాయి. ఎమ్మెల్యేపై మోసం కేసు: పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శరవణన్‌పై మోసపు ఫిర్యాదు నమోదైంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిస్థితిలో ఓ.పన్నీర్ సెల్వంకు 10 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇందులో మదురై దక్షిణ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణన్ ఒకరు. శశికళ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్న శిబిరం నుంచి మారువేషంలో తప్పించుకుని వచ్చి పన్నీర్ సెల్వం శిబిరంలో చేరిన విషయం తెలిసిందే. మదురై మదిచ్చియం ప్రాంతానికి చెందిన న్యాయవాది జయరాం మదురై పోలీసు కమిషనర్‌కు ఒక ఫిర్యాదు పత్రం అందజేశారు. అందులో మదురై దక్షిణ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు ఎస్ఎస్ శరవణన్ ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం తన వద్ద రెండు లక్షల నగదు కోరగా 8 మే, 2016లో అందజేశానని, రెండు నెలల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిన అతను నగదు ఇవ్వకుండా మోసం చేశాడని తెలిపారు. అందువల్ల అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిగురించి ఎమ్మెల్యే శరవణన్ మాట్లాడుతూ ఇది అబద్ధపు ఫిర్యాదని, దీనిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. -
తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్ష డీఎంకే ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు అసెంబ్లీ హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 89 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎంకే స్టాలిన్ తెలిపారు. బలపరీక్షకు హాజరుకాబోమని ఈ ఉదయం డీఎంకే ప్రకటించింది. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. డీఎంకే తాజా ప్రకటనపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. డీఎం నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉండే అవకాశముందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. డీఎం వ్యూహంతో తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మరోవైపు బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఓడించేందుకు పన్నీర్ సెల్వం తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే శశికళ శిబిరం నుంచి 10 ఎమ్మెల్యేలు ఆయన వైపు రావాల్సి ఉంటుంది. -
'శశికళను మేమే బహిష్కరిస్తున్నాం'
చెన్నై: తమపై చర్యలు తీసుకునే అధికారం శశికళ నటరాజన్ కు లేదని అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నాయకుడు మధుసూదనన్ అన్నారు. శశికళను తామే పార్టీ బహిష్కస్తున్నామని చెప్పారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి పదవికి త్వరలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎవరో కేడర్ తేలుస్తుందని పేర్కొన్నారు. పొయేస్ గార్డెన్ లోని 'అమ్మ' వేద నిలయం ప్రజల ఆస్తి అని చెప్పారు. వేద నిలయంలో తిష్టవేసిన వారిని వెళ్లగొట్టేందుకు 2 రోజుల్లో అక్కడకు వెళ్లనున్నట్టు మధుసూదన్ వెల్లడించారు. పన్నీర్ సెల్వం గూటికి చేరిన మధుసూదన్ ను ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు శశికళ అంతకుముందు ప్రకటించారు. -
పన్నీర్ శిబిరంలో ఆనందోత్సాహాలు!
చెన్నై: అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో తమిళ రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. శశికళ నటరాజన్ తో సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం క్రమంగా బలం పుంజుకుంటున్నారు. ఆయనకు అన్నీ కలిసొస్తున్నట్టు కనబడుతోంది. శశికళకు సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయన్న ప్రచారంతో పన్నీర్ సెల్వం శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అక్రమ ఆస్తుల కేసులో సోమవారం శశికళ కోర్టుకు హాజరవుతారని ప్రచారం జరగడంతో పన్నీర్ సెల్వం మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని సంబరాలు జరుపుకున్నారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెం.2గా ఉన్న శశికళ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముందని గురువారం వార్తలు వచ్చాయి. 2016 జూన్ నెలలోనే విచారణ పూర్తి కాగా అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఒకేవేళ ఈ కేసులో శశికళను దోషిగా నిర్ణయిస్తే ఆమె సీఎం పదవి కోల్పోవడమే కాదు.. కొంత కాలం పాటు ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా వీలు లేకుండా నిషేధం పడుతుంది. సంబంధిత కథనాలు చదవండి.. శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు! అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా? (మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!) గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. -
ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు!
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమనే ఆహ్వానిస్తారని శశికళ నటరాజన్ మద్దతుదారులు విశ్వాసంతో ఉన్నారు. గవర్నర్ నుంచి తమకు ఏ సమయంలోనైనా పిలుపు రావొచ్చని, అందుకే తామంతా ఒకేచోట ఉన్నామన్నా శశికళ మద్దతుదారుడు రత్నస్వామి తెలిపారు. తాము ఎమ్మెల్యేలను బంధించలేదని ఆయన చెప్పారు. మహబలిపురంలో వద్ద గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలను ఉంచారు. రిసార్ట్ లో 130 ఎమ్మెల్యేలు లేరని శశి అనుయాయులు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎవరి స్థావరాల్లో వారు ఉన్నారని చెబుతున్నారు. పన్నీరు సెల్వం వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలను బంధించారని ఆరోపిస్తున్నారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్ వద్ద కాపాల ఉన్న బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. లోపలకు వెళ్లకుండా మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. లోపలకు ఎవరినీ అనుమతించబోమని తెగేసి చెప్పారు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.