CWC
-
సీతమ్మసాగర్ బరాజ్ డిజైన్లు ఓకే !
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే సీతమ్మసాగర్ బరాజ్ డిజైన్లు సరిగ్గానే ఉన్నాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని ప్రాజెక్టుల మదింపు విభాగం సంతృప్తి వ్య్తక్తం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) అనుమతులకు లైన్‌క్లియర్ అయ్యిందని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. సీతమ్మసాగర్ బరాజ్ డిజైన్లను పునఃపరిశీలించిన తర్వాతే అనుమతుల విషయంలో ముందుకెళతామని ఇటీవల జరిగిన టీఏసీ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లను సీడబ్ల్యూసీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను తెలియజేస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ మనోజ్‌కుమార్ మీనా ఈ నెల 4న రాష్ట్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టు బరాజ్ స్థిరత్వాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు విశ్లేషించగా, సరిగ్గానే ఉన్నట్టు తేలిందన్నారు. భూకంపాల విషయంలో డిజైన్ల రూపకల్పనలో అనుసరించిన ప్రమాణాలను సమర్పించలేదని, దీంతో అవి సంభవించిన సందర్భాల్లో బరాజ్ స్థిరత్వాన్ని విశ్లేషించడం సాధ్యం కాలేదని తెలిపారు. బరాజ్ నిర్మిత స్థలంలో భూకంపాల ప్రభావంపై ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయిస్తున్నామని రాష్ట్ర అధికారులు వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. బరాజ్ నుంచి దిగువనకు దూకే వరద ఉధృతితో బరాజ్‌కు ఎలాంటి నష్టం జరగకుండా డిజైన్ల రూపకల్పనలో తగిన ఏర్పాట్లు చేసినట్టు గుర్తించామని తెలిపారు. అయితే, 2డీ మోడల్ స్టడీ నిర్వహించి నీటి ఉధృతిని నిర్ధారించాల్సి ఉందన్నారు.పవర్‌హౌస్ డిజైన్లు సమర్పించలేదుహైడ్రో మెకానికల్ పరికరాలకు సంబంధించిన డిజైన్ లెక్క లతోపాటు బరాజ్ గేట్లు, స్టాప్ లాగ్ గేట్లు, పవర్ హౌస్‌కు సంబంధించిన ఇన్‌టేక్ గేట్లు, డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్‌కు సంబంధించిన డ్రాయింగ్స్‌ను సమర్పించలేదని ఆ లేఖలో సీడబ్ల్యూసీ తెలిపింది. గత నెలలో రాష్ట్ర అధికారులు తమకు బరాజ్ ప్రధా న గేట్లు, స్లూయిజ్ రేడియల్ గేట్లకు సంబంధించిన డ్రాయింగ్స్‌ను సమర్పించగా, అవి కూడా సరైన రీతిలో ఉన్నట్టు నిర్ధా రించామని వెల్లడించింది. పవర్ హౌస్‌కు సంబంధించిన డ్రా యింగ్స్ను టీజీ జెన్కో తయారు చేస్తుందని, అవి తయారైన తర్వాత సమర్పిస్తామని అధికారులు తెలిపారని పేర్కొంది. నవీకరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించండితమకు సమర్పించిన సీతారామ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో కీలక స్ట్రక్చర్లు అయిన ఇన్‌టేక్, వాటర్ కండక్టర్ సిస్టమ్‌కు సంబంధించిన డిజైన్ లెక్కలు, పంప్‌హౌస్ డిజైన్లు, పెన్‌స్టాక్ డిజైన్లు వంటివి లేవని సీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రాజెక్టులో భాగంగా 280 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించనుండగా, వీటికి సంబంధించిన డ్రాయింగ్స్ సైతం సమర్పించలేదని తెలిపింది. జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని, టీజీ జెన్కో వీటికి సంబంధించిన డిజైన్లను రూపొందిస్తుందని అధికారులు తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీపీఆర్‌తో నీటి పంపింగ్/ఎత్తిపోతలతో పాటు విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించలేమని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పొందుపరిచి నవీకరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని కోరింది. -
బట్రెస్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దాని దిగువన బట్రెస్ డ్యామ్ నిర్మించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు దిగువన టోయ్(అడుగు భాగం)లో దీనిని నిర్మించేలా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) ఖరారు చేసిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన దానికి సమాంతరంగా 2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తుతో రీయిన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్‌తో బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించింది. జూలైలోగా బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్దేశించింది. 2016–18 మధ్య ఎగువ కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్ వాల్) నిర్మాణంలో నాటి టీడీపీ సర్కార్ తప్పిదం వల్ల సీపేజీ అధికంగా ఉందని పీవోఈ తేల్చింది. గోదావరి వరదల్లోనూ ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు కొనసాగించాలంటే ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీని నియంత్రించాలని.. అందుకు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన బట్రెస్ డ్యామ్‌ను నిర్మించాలని సూచించింది. దాంతో బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. కాంట్రాక్టు సంస్థ రూపొందించిన డిజైన్‌పై ఈనెల 4న పీవోఈతో సీడబ్ల్యూసీ సీఈ విజయ్ శరణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో పీవోఈ చేసిన సూచనల మేరకు డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఆ మేరకు రూపొందించిన బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది.ఏమిటీ బట్రెస్ డ్యామ్కాంక్రీట్ ఆనకట్ట, కాఫర్ డ్యామ్ సీపేజీ (లీకేజీ) నీటిని నియంత్రించడానికి దాని దిగువన రీయిన్‌ఫోర్స్‌మెంట్ కాంక్రీట్‌తో నిర్మించేదే బట్రెస్ డ్యామ్. ఎగువ కాఫర్ డ్యామ్ పునాదిలో లోపాల వల్ల సీపేజీ అధికంగా ఉంది. దాన్ని నియంత్రించాలంటే దానికి పొడవునా దిగువ భాగంలో మరో చిన్న సైజు (బట్రెస్) డ్యామ్ నిర్మించాలని పీవోఈ సూచించింది. పునాది స్థాయి నుంచి ఇనుప కడ్డీలు, సిమెంట్ కాంక్రీట్‌తో భూఉపరితలానికి 8 మీటర్ల ఎత్తు వరకూ బట్రెస్ డ్యామ్‌ను నిర్మిస్తారు. బంకమట్టి ప్రాంతంలోనూ డీ–వాల్‌కు లైన్ క్లియర్ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలోనూ డయాఫ్రం వాల్ (డీ–వాల్) నిర్మాణానికి సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్న డీ వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ చేసి.. ఇసుక సాంద్రతను పెంచి.. నేలను పటిష్టం చేయాలని పీవోఈ సూచించింది. ఆ తర్వాత డీ–వాల్ పనులు చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. దాంతో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మించనున్న డీ–వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ పనులను కాంట్రాక్టు సంస్థ శుక్రవారం ప్రారంభించింది. -
తుంగభద్ర నీరు తాగలేం..
సాక్షి, అమరావతి: ‘‘తుంగాపానం.. గంగాస్నానం’’ అనేది నానుడి.. అంటే, తాగేందుకు తుంగభద్ర నీరు.. స్నానానికి గంగా నది నీరు అని. కానీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక మాత్రం తుంగభద్ర నది కాలుష్య కాసారంగా మారిందని.. నదీ జలాల్లో హానికర బ్యాక్టీరియా, వ్యర్థాలు ప్రమాదకర స్థాయికి చేరాయని.. ఈ నీటిని శుద్ధి చేయకుండా తాగితే వ్యాధుల బారినపడక తప్పదని హెచ్చరిస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర పరివాహక ప్రాంత నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీటి, పారిశ్రామిక వ్యర్థ జలాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడం.. వ్యర్థాలను పడేయడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీవోడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ, కర్ణాటక పరిధి తుంగభద్ర జలాల్లో బీవోడీ గరిష్ఠంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 6.2 మిల్లీగ్రాములు ఉంది. దీన్నిబట్టే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 2.4 మిల్లీగ్రాములు ఉండగా.. కోలీఫామ్ (బ్యాక్టీరియా) వంద మిల్లీ లీటర్లకు 220 ఉన్నాయి. ఇక ఫీకల్ కోలీఫామ్ (హానికర బ్యాక్టీరియా) వంద మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తంగభద్ర జలాల్లో వంద మిల్లీలీటర్లకు 58 హానికర బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికికర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర ఒకవైపు జన్మిస్తాయి. 147 కిలోమీటర్ల పొడవున తుంగ, 171 కి.మీ.ల పొడవున భద్ర పయనించాక కూడలి వద్ద సంగమిస్తాయి. తుంగభద్రగా మారాక 547 కి.మీ. ప్రవహించి తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర సమీపంలోని గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణాకు ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. అయితే, కర్ణాటక పరిధి పరివాహక ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంతో కాలుష్య కాసారంగా మారింది. నిరుడు నవంబరులో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి.ఈ నివేదిక ప్రకారం.. » కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీవోడీ ఉంది. » కర్ణాటక పరిధి భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకు భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీ గ్రాముల బీవోడీ ఉంది. » తుంగభద్రగా రూపాంతరం చెందే కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకు జలాల్లో లీటర్ నీటికి బీవోడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది. » కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన తుంగభద్ర నదీ జలాలు ఏపీలోకి ప్రవేశించాక.. మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 3 మిల్లీగ్రాములు ఉంది. » తుంగభద్రలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి, మంత్రాలయం–కర్నూలు ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే నదిలోకి వదలాలి. -
గోదారి గుండెల్లో కాలుష్యం గునపాలు
సాక్షి, అమరావతి: జీవ నది గోదావరికి మానవుడే శాపమయ్యాడు. అనేక రకాల వ్యర్థాలు, రసాయనాలను నదిలో కలిపేసి జలాలను కలుషితం చేసేస్తున్నాడు. దీంతో ఒకప్పుడు నదిలోకి దిగి దోసిటలో తీసుకొని తాగే నీరు ఇప్పుడు శుద్ధి చేయకుండా తాగకూడదన్న దశకు చేరుకుంది. గోదావరి జలాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) హెచ్చరిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి గోదావరి జలాలపై అధ్యయనం చేయగా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డర్స్ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకంటే అధికస్థాయిలో కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. పశి్చమ కనుమల్లో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పర్వత శ్రేణుల్లో జన్మించే గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,465 కిమీల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, ప్రవర, మంజీర, మానేరు ప్రధాన ఉప నదులు కలుస్తాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5 శాతం. దేశంలో అతి పెద్ద నదుల్లో గోదావరి రెండో స్థానంలో ఉంది. ఇంత పెద్ద నదినీ మానవుడు కలుషితం చేసేస్తున్నట్లు వెల్లడైంది.పారిశ్రామిక వ్యర్థాలు, క్రిమిసంహారక మందుల వల్లేసీడబ్ల్యూసీ, సీపీసీబీ నివేదిక ప్రకారం.. గోదావరి బేసిన్లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సాగు భూమి విస్తీర్ణమూ ఎక్కువే. పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరి, ఉప నదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు. పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటితో ఈ ఎరువులు, మందులు గోదవరిలో కలిసిపోతున్నాయి. గోదావరి బేసిన్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీటిని శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలేస్తుండటం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవులను నరికివేస్తుండటం వల్ల భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండటం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది. ఇలా మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారింది. నేరుగా తాగితే రోగాలు కొనితెచ్చుకోవడమే బీఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ఫీకల్ కోలీఫామ్ (ప్రమాదకర బ్యాక్టీరియా) ఆనవాళ్లు ఉండకూడదు. కానీ.. గోదావరి జలాల్లో ఫీకల్ కోలీఫామ్ మిల్లీ లీటర్‌కు 4 నుంచి 7 వరకు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) లీటర్ నీటికి 50 లోపు ఉండొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్ నీటికి 93 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘనవ్యర్థాలు (టీడీఎస్) 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 8 గ్రాముల మేర ఘన వ్యర్థాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. అందువల్ల గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు..1. పీహెచ్ (ఆమ్లత్వం) 6.5 నుంచి 8.5 శాతం లోపు 2. డీవో (డిజాల్వ్డ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 4. టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 5. ఫీకల్ కోలీఫామ్ (ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు 6. టీడీఎస్ (టోటల్ డిజాల్‌్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు -
తెలంగాణకు 131 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 27 టీఎంసీలు..
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలు మిగిలి ఉన్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తేల్చింది. వచ్చే జూన్, జూలై నాటికి ఏర్పడే తాగు, సాగునీటి అవసరాలను వాటా జలాలతో తీర్చుకోవడంపై ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.వరలక్ష్మీ ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాశారు.ఏపీ 639.652 టీఎంసీలు వాడుకుంది..ప్రస్తుత ఏడాది సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు జరపాలని గత జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించిన విషయాన్ని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1010.134 టీఎంసీల జలా లు లభ్యతలోకి రాగా.. తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటాలుంటాయని పేర్కొంది. ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది.పోతిరెడ్డిపాడు నుంచి 207 టీఎంసీలు తరలించిన ఏపీగతేడాది నవంబర్ 25న 15.86 టీఎంసీలు, గత జనవరి 31న మరో 18 టీఎంసీలు కలిపి మొత్తం 33.86 టీఎంసీలను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేయాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది. దీనికి తోడు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, హంద్రీ నీవా, ముచ్చుమరి ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలించిందని పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ ఏడాది ఏపీ రికార్డు స్థాయిలో 207.88 టీఎంసీ జలాలను తరలించుకుంది. హంద్రీ నీవా, ముచ్చుమర్రి, తదితర ప్రాజెక్టులు కలిపి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ మొత్తం 236.63 టీఎంసీలను తరలించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు కేవలం 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోగలిగింది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు కలిపి మరో 324.2 టీఎంసీలను ఏపీ వాడుకుంది. 116 టీఎంసీల కోసం తెలంగాణ ఇండెంట్2025 ఫిబ్రవరి –జూలై మధ్యకాలంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీలకు 116 టీఎంసీల విడుదల కోసం తెలంగాణ ఇండెంట్ పెట్టిందని కృష్ణా బోర్డు తెలిపింది.మిగిలింది 97.47 టీఎంసీలే నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 510 అడుగులకి పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకి పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాడుకున్న జలాలతో పాటు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని జలాల వినియోగంపై ప్రణాళికలు సమర్పించాలని కోరింది.ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న కృష్ణా జలాల వివరాలను కృష్ణా బోర్డు లేఖలో పొందుపరిచింది. పాత పంపకాలే కొనసాగుతాయికృష్ణా జలాల్లో ఏపీకి 66% తెలంగాణకు 34% కేటాయింపులో మార్పు ఉండదుగత నెలలో తీసుకున్న నిర్ణయానికి ఉభయ రాష్ట్రాల అంగీకారంతాజాగా సమావేశం మినిట్స్ పంపిన కృష్ణా బోర్డుసాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో అను మతులున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగ ణనలోకి తీసుకుని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్ప త్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు కొన సాగుతాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేదా అపెక్స్ కౌన్సిల్ ఎలాంటి అనుమతులివ్వనందున ఈ తాత్కాలిక సర్దుబాటులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు గతంలో అంగీకరించిన 66:34 నిష్పత్తిలోనే ప్రస్తుత సంవత్సరంలో సైతం కృష్ణా జలాల కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే 66:34 నిష్ప త్తికి విరుద్ధంగా రాష్ట్రాలకు ఏమైనా అవసరా లు ఏర్పడి నిర్దిష్ట కేటాయింపులు కోరితే ఆ మేరకు నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. గత నెల 21న జరిగిన కృష్ణా బోర్డు సమా వేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. తాజాగా రెండు రాష్ట్రాలకు పంపిన సమావేశం మిని ట్స్‌లో వీటిని బోర్డు పొందుపరిచింది. మూడో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు ఏపీ నోఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించేందుకు మొత్తం 27 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, తొలి విడత కింద 18 స్టేషన్లను ఏర్పాటు చేశారు. రెండో దశ కింద 9 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడో దశ కింద మరో 11 టెలిమెట్రీ కేంద్రాలను తెలంగాణ ప్రతిపాదించింది. తెలు గుగంగ, గాలేరీ–నగరి, బనకచర్ల హెడ్‌రెగ్యు లేటరీ, క్రాస్ డిస్ట్రిబ్యూటరీ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి నీళ్లను తరలించుకుంటున్నందున అక్కడ ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును ఉపసంహరించాలని రెండు రాష్ట్రాలు కోరగా, శాంతియుత పరిస్థితులు నెలకొనే వరకు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. -
కాంక్రీట్ మిశ్రమ పరీక్షలు నేటితో పూర్తి
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసే కాంక్రీట్ మిశ్రమం ఆధారంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే మూడు తరహాల కాంక్రీట్ సమ్మేళనాలపై ఐఐటీ(తిరుపతి) ప్రొఫెసర్లు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల ఫలితాలను పోలవరం ప్రాజెక్టు అధికారుల ద్వారా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపారు. నాలుగో తరహా కాంక్రీట్ సమ్మేళనంపై నిర్వహించిన పరీక్ష ఫలితాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కూడా పోలవరం అధికారులు పీపీఏ, సీడబ్ల్యూసీకి పంపనున్నారు. నాలుగు తరహాల కాంక్రీట్ సమ్మేళనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలపై సోమవారం తర్వాత అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యుల అందుబాటును బట్టి.. సీడబ్ల్యూసీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతోపాటు పీపీఏ, సీఎస్ఎంఆర్ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటరీయల్ రీసెర్చ్ స్టేషన్), వ్యాప్కోస్ అధికారులు పాల్గొననున్నారు. గ్యాప్–2లో కొత్తగా నిర్మించే డయాఫ్రం వాల్ డిజైన్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీ సూత్రప్రాయంగా ఆమోదించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసే కాంక్రీట్ మిశ్రమం ఆధారంగా డయాఫ్రం వాల్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. ఆ తర్వాత డయాఫ్రం వాల్ పనులను కాంట్రాక్టు సంస్థ చేపట్టనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నవంబర్ 6–10 మధ్య వర్క్ షాప్ నిర్వహించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించాల్సిన కాంక్రీట్ మిశ్రమాలపై పరీక్షలు చేయాలని సూచించింది. టీ–10 తరహా కాంక్రీట్ సమ్మేళనం ఆధారంగా రూపొందించిన మిశ్రమం పటిష్టతపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీ–11, టీ–12 తరహా కాంక్రీట్ సమ్మేళనాల ఆధారంగా రూపొందించిన నాలుగు రకాల కాంక్రీట్ మిశ్రమాల పటిష్టతపై 14 రోజుల పరీక్ష చేసి, నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఐఐటీ (తిరుపతి) ప్రొఫెసర్లకు సీడబ్ల్యూసీ అప్పగించింది. టీ–11, టీ–12 కాంక్రీట్ సమ్మేళనాల ఆధారంగా రూపొందించిన మూడు రకాల మిశ్రమాన్ని ట్యూబ్లలో పోసి.. 14 రోజుల తర్వాత ఐఐటీ ప్రొఫెసర్లు పరీక్షలు చేసి, వాటి ఫలితాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చారు. నాలుగో తరహా కాంక్రీట్ మిశ్రమంపై 14 రోజుల పరీక్ష ఆదివారంతో పూర్తి కానుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ఇలా..n ప్రధాన డ్యాం గ్యాప్–2లో 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు.. కనిష్టంగా 6 మీటర్లు, గరిష్టంగా 93.5 మీటర్ల లోతున ప్లాస్టిక్ కాంక్రీట్‌తో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలి.n కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం గైడ్ వాల్స్‌పై ఏర్పాటు చేసే ప్లాట్‌ఫామ్ మీద నుంచి గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకు భూగర్భాన్ని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. తవ్వి తీసిన మట్టి స్థానంలో బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతారు. రాతి పొర తగిలాక... అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా మారి గోడలా తయారవుతుంది. n్ఙ్ఙడయాఫ్రం వాల్‌కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్ లోపు ఉండాలి. ప్రధాన గ్యాప్–1లో గత ప్రభుత్వం నిర్మించిన డయా ఫ్రం వాల్లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్ లోపే ఉండటం గమనార్హం. -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్‌కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్‌పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్‌పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్‌పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్‌కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్‌కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్‌పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.45 ఏళ్లలో కొండలా పూడికకృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించారు. 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవసరాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలేశ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటి పారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ సమగ్ర స్వరూపంతొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976గరిష్ట నీటిమట్టం 885 అడుగులుక్యాచ్మెంట్ ఏరియా: 60,350 చ.కి.మీ.గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ. -
3 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్‌లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్‌కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్‌లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్‌ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్‌లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
ఏపీ తీరం...1,027.58 కి.మీ.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎన్ని కిలో మీటర్లు అని అడిగితే... 973.7 కిలో మీటర్లు అని వెంటనే చెప్పేస్తారు. కానీ.. అది గతం.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు అని తేల్చింది. గత అధ్యయనం ప్రకారం దేశ పశ్చిమ, తూర్పు తీర రేఖ పొడవు 7,516.6 కిలో మీటర్లు కాగా.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అది 11,098.81 కిలో మీటర్లుగా తేలింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశంలో తీర ప్రాంతంపై సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసి పలు కీలక విషయాలు వెల్లడించింది. 2,31,831 కిలో మీటర్ల మేర కోత » దేశంలో ఇప్పటికే 2,318,31 కిలో మీటర్ల పొడవునా తీరం కోతకు గురైందని కేంద్ర జలసంఘం తేల్చింది. మరో 1,855.02 కిలో మీటర్ల పొడవునా తీర ప్రాంతం కోతకు గురవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతోంది. తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. » మన రాష్ట్రంలో ఇప్పటికే 272.34 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది. మరో 434.26 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతోంది. 320.98 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురికాకుండా సురక్షితంగా ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతం అధికంగా కోతకు గురైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో తీర రేఖ అధికంగా కోతకు గురైంది. » వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటి మట్టం పెరగడం, అలల ఉద్ధృతి తీవ్రమవడం, తుపానులు, అధిక ఉద్ధృతితో నదులు ప్రవాహించడం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురువుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులను నరికివేయడం, పగడపు దిబ్బలను తవ్వేయడం, సముద్రం నాచును తొలగించడం వల్ల తీర ప్రాంతం భారీ ఎత్తున కోతకు గురికావడానికి దారితీస్తోంది. » తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుండటం వల్ల ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. దీంతో తీర ప్రాంతం ఉప్పు నీటి కయ్యలుగా మారుతోంది. తీరం కోతకు గురవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. » తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉత్పాతాలు తప్పవని, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీడబ్ల్యూసీ హెచ్చరించింది. సీ–వాల్(తీరానికి వెంబడి గోడ) నిర్మించడం, రాళ్లతో రివిట్మెంట్ చేయడం ఇతర రక్షణ చర్యల ద్వారా, తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షించవచ్చని సూచించింది. ఏపీలోని ఉప్పాడ ప్రాంతంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ.. » దేశంలో తీర ప్రాంతం పశి్చమాన గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి ప్రారంభమై... తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని సుందర్ బన్స్ వద్ద ముగుస్తుంది. తీర ప్రాంతం తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లతోపాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ–డామన్, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించింది.» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 15 శాతం తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నంతోపాటు 70 నగరాలు, పట్టణాలు తీర ప్రాంతంలో వెలిశాయి. » తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత అధ్యయనం ప్రకారం గుజరాత్ తీర రేఖ పొడవు 1,214.7 కిలో మీటర్లు కాగా... తాజా అధ్యయనం ప్రకారం 2,340.62 కిలో మీటర్లకు పెరిగింది. » ఇప్పటి వరకు తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండేది. తాజా అధ్యయనం ప్రకారం తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు తీర రేఖ పొడవు 1,068.69 కిలో మీటర్లు. » ప్రస్తుతం తీర రేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 973.7 కిలో మీటర్లు. ప్రస్తుతం అది 1,027.58 కిలో మీటర్లకు పెరిగింది. » రాష్ట్రంలో తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి (189.84 కి.మీ.) మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీకాకుళం (173.12 కి.మీ.), మూడో స్థానంలో నెల్లూరు (172.10 కి.మీ.) ఉన్నాయి. -
పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘంతో చర్చించి డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులను సమాంతరంగా చేపట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి, వెలిగొండ, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులపై మంగళవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని.. ఆ తరువాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టి, పూర్తి చేయడానికి 24 నెలలు పడుతుందని వివరించారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు సమాంతరంగా చేపడితే 2027 జూలై నాటికి.. విడివిడిగా పనులు చేపడితే 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో 0.40 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని.. ప్రస్తుతం సముద్ర మట్టానికి 15.9 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ తగ్గిందని వివరించారు. భూసేకరణకు రూ.7,213 కోట్లు అవసరంపోలవరం ప్రాజెక్టు తొలి దశలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.7,213 కోట్లు అవసరమని.. ఇంకా 16,440 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు సీఎంకు చెప్పారు. 2025 ఏప్రిల్‌కి భూసేకరణ, 2026 ఏప్రిల్ నాటికి ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లాలనే అంశంపైనా సమీక్షలో చర్చించారు. కొత్తగా మరో కాలువ నిర్మించడమా లేదా ఉన్న కాలువను విస్తరించడమా అనే అంశంపై చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అప్పట్లో అనుకున్న విధంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ నెలలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. పనులపై ప్రణాళిక విడుదల చేస్తానని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద 3 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.2,463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా ఆ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.పోలవరంలో నేటి నుంచి వర్క్షాప్అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు, నిర్మాణంపై చర్చ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై ప్రాజెక్టు వద్దే బుధవారం నుంచి 4రోజులపాటు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మేధోమథనం చేయనుంది. డ్యాంల నిర్మాణం, భద్రత, భూ¿ౌగోళిక సాంకేతికత(జియో టెక్నికల్) తదితర అంశాలపై అపార అనుభవం ఉన్న డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్‌లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించి.. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీలకు నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ముగియగానే పనులు ప్రారంభించే ముందు నవంబర్ మొదటి వారంలో పోలవరం వద్ద వర్క్‌షాప్ నిర్వహించి.. డిజైన్లు, నిర్మాణంపై చర్చిద్దామని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం మంగళవారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుంది. 4 రోజులపాటు ప్రాజెక్టు వద్దే అంతర్జాతీయ నిపుణుల బృందం ఉంటుంది. వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆరీ్ప), సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మేఘా తరఫున డిజైన్లు రూపొందిస్తున్న ఆఫ్రి, బావర్ ప్రతిని«దులు, రాష్ట్ర జలవనరుల శాఖ తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ నరసింహమూర్తి ఈ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. -
పోలవరానికి 'చంద్రబాబు కూటమి' ఉరి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.జీవనాడి కాదు జీవచ్ఛవమే..!⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తగ్గించేందుకు తలూపడం వల్లే..పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. -
ట్రిబ్యునల్ అంచనా కంటే అధికంగా వంశధార
వంశధారలో ఏటా సగటున 166 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతంలో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది. వంశధార ట్రిబ్యునల్ 2017లో బేసిన్లో 115 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. ట్రిబ్యునల్ తేల్చిన దానికంటే వంశధారలో లభ్యత 51 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైంది. వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. - సాక్షి, అమరావతిసీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలివీ..వంశధార బేసిన్లో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్లలో సగటున ఏటా 1,342 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 498.02 టీఎంసీలుబేసిన్లోని జలాశయాల్లో ఏటా ఆవిరి నష్టాలు సగటున 1.06 టీఎంసీలుతాగునీరు, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 2022–03లో 0.71 టీఎంసీలు వినియోగించుకున్నారు వంశధార ప్రస్థానం ఇదీ.. జన్మస్థానం: ఒడిశాలో ఉమ్మడి పూల్భణి జిల్లాలో బెలగడ్ వద్ద సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఒడిశాలో ప్రవాహ మార్గం: కంధమాల్, కలహండి, రాయగడ, గజపతి జిల్లాల్లో 125 కి.మీ.ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాహ మార్గం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 96 కి.మీ. సముద్ర సంగమం: కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో వంశధార బేసిన్ పరిధి: మొత్తం 10,504 చదరపు కిలోమీటర్ల వైశాల్యం -
తుంగభద్రలో ఏటా 699.34 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. తుంగభద్ర సబ్ బేసిన్లో 2003–04 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కృష్ణా నదిలో 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ 3,048.37 టీఎంసీల లభ్యత ఉంటుందని ఇటీవల అంచనా వేసింది. ఇందులో గరిష్టంగా తుంగభద్ర సబ్ బేసిన్ నుంచే వస్తుందని లెక్కగట్టింది.తుంగభద్ర సబ్ బేసిన్ ఇదీకర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో గంగమూల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో తుంగ, భద్ర జన్మిస్తాయి. తుంగ 147 కి.మీ., భద్ర 171 కి.మీ, దూరం ప్రయాణించాక కూడలి వద్ద సంగమించి తుంగభద్రగా మారిన అనంతరం 531 కి.మీ. దూరం ప్రవహించి.. తెలంగాణలోని జోగులాంబ జిల్లా గుండిమల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర సబ్ బేసిన్ 70,764 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. కృష్ణా నదికి అతి పెద్ద ఉప నది తుంగభద్ర.అధ్యయనంలో వెల్లడైన అంశాలివి⇒ 2002–03 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్లలో సగటున ఏటా 862.47 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 2,155.58 టీఎంసీలు.⇒ బాష్ఫీభవనం (ఆవిరి) రూపంలో ఏటా 1,633.20 టీఎంసీలు వాతావరణంలో కలుస్తాయి.⇒ సబ్ బేసిన్లో సాగు చేసిన పంటల ద్వారా ఏటా సగటున 190.02 టీఎంసీలు ఆవిరవుతాయి. ⇒ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఏటా సగటున 24.02 టీఎంసీలు ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తాయి.⇒ సాగు, తాగు, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుంది. ⇒ సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్)కి ముమ్మాటికీ చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ‘సాక్షి’గా మరోసారి నిర్ధారణ అయింది. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 2018 నాటికే జెట్ గ్రౌటింగ్ వాల్‌కు 27 చోట్ల భారీ చీలికలు⇒ గోదావరిపై గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్ గ్రౌటింగ్ వాల్‌ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.ఆ చారిత్రక తప్పిదం వల్లే..⇒ పోలవరం వద్ద భూభౌగోళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్‌వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్ కమ్రాక్ ఫిల్ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది.⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. ⇒ కానీ.. 2016 డిసెంబర్లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది.⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.ప్రణాళికాబద్ధంగా పనులు..⇒ నాడు చంద్రబాబు సర్కార్ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్ వాల్ జెట్ గౌటింగ్ వాల్ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ⇒ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.⇒ దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిజాలను ప్రతిబింబించిన నివేదిక..ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.సకాలంలో కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..⇒ ఎగువ కాఫర్ డ్యాం పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ దిగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ కాఫర్ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. -
పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి:పెన్నా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయంటోంది కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ). అధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బేసిన్లో 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనంలో పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఎఆర్‌ఎస్‌సీ) సహకారంతో 2019లో 25 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా పెన్నాలో 395.53 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టింది. అప్పటి కంటే ఇప్పుడు చేసిన అధ్యయనంలో నీటి లభ్యత 27.55 టీఎంసీల తగ్గిందని తేల్చింది. వర్షఛాయ ప్రాంతం (రెయిన్ షాడో ఏరియా)లో పుట్టి, ప్రవాహించే పెన్నాలో ఈ స్థాయిలో నీటి లభ్యత ఉంటుందా? అని జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజినీర్లు, నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్లు, కుండపోత వానలు.. వాటి ప్రభావం వల్ల వచ్చే నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి లభ్యతపై చేసే అధ్యయానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో నంది కొండల్లో పుట్టిన పెన్నా నది కర్ణాటకలోని కోలార్, తుమకూరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా 697 కిమీల దూరం ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళి, కుందేరు.. కుడి వైపు నుంచి చిత్రావతి, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు ప్రధాన ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల (ఆంధ్రప్రదేశ్ 87 శాతం, కర్ణాటక 13 శాతం) పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ప్రధానాంశాలు» పెన్నా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 752.72 మిమీల వర్షపాతం కురిసింది. ఈ వర్షపాతం పరిమాణం 1,459.56 టీఎంసీలు. బేసిన్లో గరిష్టంగా వర్షపాతం 2020–21లో 1,265 మి.మీ.లు కురిసింది. దీని పరిమాణం 2,452.96 టీఎంసీలు.. బేసిన్ కనిష్ట వర్షపాతం 2018–19లో 395 మి.మీ.లు నమోదైంది. దీని పరిమాణం 765.27 టీఎంసీలు.» బేసిన్లో 1996–97లో గరిష్టంగా నీటి లభ్యత 1,067.57 టీఎంసీలు ఉండగా.. 2011–12లో కనిష్టంగా 94.29 టీఎంసీల లభ్యత ఉంది. 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చూస్తే ఏటా సగటున 367.98 టీఎంసీల లభ్యత ఉంది. » 1985–86 నుంచి 2022–23 మధ్య సాగునీటి కోసం ఏటా 212.60 టీఎంసీలను వినియోగించారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఏటా సగటున నీటి ఆవిరి నష్టాలు 17.66 టీఎంసీలు.» 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 17.30 టీఎంసీలు ఉపయోగించారు. -
గోదావరి.. అపార జలసిరి
సాక్షి, అమరావతి: గోదావరిలో జలసిరులు అపారంగా ఉన్నాయని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టంచేసింది. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్ ట్రిబ్యూనల్ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం... ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి బేసిన్ ఇదీ.. దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్‌లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జని్మంచిన గోదావరి... మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ..» గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది. » 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా... 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది. » బేసిన్లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది. » 1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు. » 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది. -ఆలమూరు రామగోపాలరెడ్డి -
పోలవరానికి ఈ ఏడాది ఎంత కావాలి?
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం (41.15 మీటర్ల కాంటూర్) స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు, వాటికి ఎంత ఖర్చవుతుంది, ఎప్పుడు ఎంత విడుదల చేయాలో సమగ్ర ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో చర్చించి ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ ఇటీవల లేఖ రాశారు. - సాక్షి, అమరావతినాడు మోకాలడ్డిన చంద్రబాబువైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు, విభాగాల వారీగా పరిమితి విధించకుండా బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేసేందుకు విభాగాల వారీగా విధించిన పరిమితి ఎత్తేశారు. తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు అంగీకరించారు. తొలి దశ పూర్తికి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో తొలి దశ పనులు పూర్తి, చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ధ్వంసమైన గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. ఈ క్రమంలో పోలవరం తొలి దశ వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జల్ శక్తి శాఖ ఖరారు చేసింది. 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్లు పోనూ రూ.25,706.24 కోట్లు ఇవ్వాలని నిర్ధారించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో రెండో దశ కింద చేపట్టిన పనులకు రూ.1,597.56 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు పోనూ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని తేల్చింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్ ఆగస్టు 28న ఆమోదం తెలిపింది.నిధుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన వైఎస్ జగన్విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో 2016 సెప్టెంబరు 7న సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం మాత్రమే ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించారు. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న ప్రతిపాదనకూ తలూపారు. 2013–14 ధరల ప్రకారం పాజెక్టు వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా లెక్కగట్టి.. 2024 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిజానికి 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లు. ఇందులో భూసేకరణ, పునరవాసానికే నికే రూ.33,168.23 కోట్లు అవసరం. కానీ.. రూ.15,667.9 కోట్లు ఇస్తే చాలు ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో లోగుట్టు కమీషన్లే. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు విధ్వసం చేయడమే కాదు.. నిధుల సంక్షోభంలోకి కూడా నెట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులను పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్వాకాలను కేంద్రానికి వివరించారు. తాజా ధరల ప్రకారం నిధులిస్తేనే పోలవరాన్ని పూర్తి చేయడానికి సాధ్యమవుతుందన్న వైఎస్ జగన్ ప్రతిపాదనతో ప్రధాని మోదీ ఏకీభవించారు. ఇలా తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా నిధుల సంక్షోభం నుంచి పోలవరాన్ని వైఎస్ జగన్ గట్టెక్కించారు.» గతేడాది జూన్ 5నే తొలి దశ, డయాఫ్రం వాల్‌కు రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం» ఈ వివరాలను సమగ్రంగా పీపీఏ ద్వారా పంపండి» అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో చేరిన చంద్రబాబు చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేస్తాం» పోలవరానికి ఆ నిధులిస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని విన్నపం» రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడి» దాంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్» రూ.12,157.53 కోట్లు విడుదలకు మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జలశక్తి శాఖ ప్రతిపాదన» అదే ప్రతిపాదనపై ఆగస్టు 28న ఆమోదం -
కృష్ణాలో 3,048.37 టీఎంసీలా?
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఏటేటా నీటి లభ్యత తగ్గుతోందని.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు అంచనా వేసినంత కూడా రావడంలేదని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతుంటే.. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చెబుతోంది. కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 వరకు 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై తాజాగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ బుధవారం ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం కృష్ణాలో 3,048.37 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ 2,130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీలు ఉన్నట్లు నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్లు నిర్ధారించిన దానికంటే అధికంగా 875 టీఎంసీల లభ్యత ఉన్నట్లుగా సీడబ్ల్యూసీ తాజాగా వెల్లడించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల సమయంలో పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో సీడబ్ల్యూసీ చెప్పినంతగా నీటి లభ్యత ఉండదని తేల్చిచెబుతున్నారు. కేవలం 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనాలకే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ ఇదీ..మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకునే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యంలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఆంధ్రప్రదేశ్‌లో 9.80 శాతం కృష్ణా బేసిన్ విస్తరించి ఉంది. నదిలో కోయినా, వర్ణ, పంచ్‌గంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, బీమా, తుంగభద్ర, కాగ్నా, మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉప నదులు కలుస్తాయి.తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 843.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం ఉంది. ఈ 38 ఏళ్లలో గరిష్టంగా 2005–06లో 1,169.70 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 10,716.60 టీఎంసీల ప్రవాహం ఉంది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 5,207.50 టీఎంసీల ప్రవాహం ఉంది.1985–86 నుంచి 2022–23 మధ్య కృష్ణాలో సగటున 3,048.37 టీఎంసీల లభ్యత ఉంది. 2025–26లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా.. 2018–19లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది.1985–2023 మధ్య బేసిన్లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీలను వినియోగించుకున్నారు.బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటు 96.06 టీఎంసీలు. -
జలవిద్యుదుత్పత్తిలో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: జల విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. శ్రీశైలం కుడిగట్టు, లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు తదితర జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఇప్పటికే 1,610 మెగావాట్లను ఉత్పత్తి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి శరవేగంగా నిర్మిస్తోంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం కూడా పూర్తయితే రాష్ట్రంలో 2,570 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2,596 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అంచనా వేయగా.. అందులో 2,570 మెగావాట్లు(99 శాతం) ఉత్పత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జల విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు సరసన ఆంధ్రప్రదేశ్ చేరిందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. దేశంలో జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు.. ఇప్పటికే పూర్తయిన కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్.. నిర్మాణంలో ఉన్న కేంద్రాలు పూర్తయితే అందుబాటులోకి వచ్చే విద్యుత్ తదితర అంశాలపై సీడబ్ల్యూసీ 2017–23 మధ్య సమగ్ర అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్రానికి ఇటీవల నివేదిక ఇచి్చంది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. సద్వినియోగం చేసుకున్నది 41.95 శాతమే దేశంలో హిమాలయ నదులు, ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపకల్ప నదులు, జలపాతాలపై 1,48,701 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇందులో 25 మెగావాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేసే కేంద్రాల్లోనే 1,33,401.03 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన జల విద్యుత్ కేంద్రాల ద్వారా 42,104.55 మెగావాట్లు (31.56 శాతం) విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 13,867.50 మెగావాట్లు (10.39 శాతం). అంటే.. ఇప్పటివరకు జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల్లో 41.95 శాతం మాత్రమే సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. వివిధ కారణాల వల్ల నిర్మాణ దశలో ఆగిపోయిన కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 1,156 మెగావాట్లు (0.87 శాతం). 76,282 మెగావాట్లు (57.18 శాతం) ఉత్పత్తి చేసే కేంద్రాల నిర్మాణాన్ని ఇప్పటికీ చేపట్టలేదు.అరుణాచల్‌లో అవకాశాలు అపారం హిమాలయ నదులు ప్రవహించే రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు జల విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలం. అరుణాచల్ ప్రదేశ్‌లో 50,394 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పటికి నిర్మాణం పూర్తయిన కేంద్రాల్లో 1,115 మెగావాట్లు (2.21 శాతం) విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. చైనాతో సరిహద్దు సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితులు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. దేశంలో అత్యధిక సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్. ఆ రాష్ట్రంలో 18,305 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంటే.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కేంద్రాల ద్వారా 10,263 మెగావాట్లు (56.07 శాతం) ఉత్పత్తి అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్ తర్వాత అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, కర్ణాటక, జమ్మూకశీ్మర్ నిలిచాయి. -
జాయింట్ సర్వే !
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్ సింగ్ వోరా ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఏర్పడనున్న ముంపుపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించగా, తదుపరిగా క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి డీమార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వోరా ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాని కి సంబంధించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై బుధవారం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులై న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎప్పటికైనా సర్వే చేయాల్సిందే: వోరా పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ ఎప్పటికైనా 150 అడుగులే ఉంటుందని, దీనివల్ల తెలంగాణలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఎప్పుడైనా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే జరగకపోవచ్చని, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ కోరిన మేరకు జాయింట్ సర్వే చేయాల్సిందేనని సూచించారు. జాయింట్ సర్వేను సమన్వయం చేయాలని పీపీఏ ను ఆదేశించారు. 150 అడుగుల నిల్వతో ఏర్పడే ముంపుతో పాటు ప్రాజెక్టు కారణంగా ముర్రెడువాగు, కిన్నెరసాని వాగులకు ఉండే ముంపును గుర్తించి నివేదిక సమర్పిస్తే, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ, తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ కోరి న మేరకు.. పోలవరం ప్రాజెక్టుతో మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుపై జాయింట్ సర్వే విషయంలో మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందా మని చెప్పారు. కాగా పోలవరం ప్రాజెక్టుతో సీడబ్ల్యూసీ సర్వేలో తేలిన దానికి మించి తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉందని ఒడిశా నీటిపారుదల శాఖ సీఈ అశుతోష్ దాస్ పేర్కొన్నారు. ఐఐటీ రూ ర్కెలా అధ్యయన నివేదికలో ఇది తేలిందన్నారు. ఈ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి సమావేశంలో చర్చిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం, పీపీఏ సీఈఓ అతుల్ జైన్, సీఈ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.ఎలాంటి పురోగతి లేదు: తెలంగాణ గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు జాయింట్ సర్వేకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు తెలియజేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కాగితాలకే పరిమితమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై జాయింట్ సర్వే చేయాల్సిందేనని ఆయన కోరారు. మరోవైపు జాయింట్ సర్వేకు తెలంగాణ సహకరించడం లేదని, సర్వే రెండు వాగులకే పరిమితం చేయాల్సి ఉండగా, ఏడు వాగులు సర్వే చేయాలని కోరుతోందని ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరావు చెప్పారు. అయితే ముర్రెడువాగు, కిన్నెరసాని వాగుల జాయింట్ సర్వేకు పూర్తిగా సహకరించిన విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేశారు. -
చెక్‌లిస్టుపై సంతకం కోసం ఒత్తిడి చేశారు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అధిపతిగా ఈఎన్సీ ఉండాలి. సీడీఓ కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్ విభాగాలకు వేర్వేరు సీఈలు పనిచేయాలి. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సీడబ్ల్యూసీకి పంపించడా నికి ముందు హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్‌కి సంబంధించిన నిబంధనలన్నీ అమలు చేసినట్టు ధ్రువీకరిస్తూ చెక్‌లిస్టుపై సీడీఓ ఈఎన్సీ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో సీడీఓ ఈఎన్సీ లేరు. చెక్‌లిస్టుపై సంతకం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ (హైదరాబాద్) హరి రామ్.. నన్ను కోరగా..హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ విభాగాలు నా పరిధిలోకి రానందున సంతకం చేసేందుకు నిరాకరించా. బరాజ్‌ల డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకం ఎందుకు పెట్టడం లేదు? సమస్యేమిటి? అని నాటి సీఎం (కేసీఆర్), ఇరిగేషన్ మంత్రి (హరీశ్‌రావు) ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని సీడీఓ విభాగం రిటైర్డ్ సీఈ డి.నరేందర్‌రెడ్డి.. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు తెలిపారు. హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాలకు పూర్తిగా తనదే బాధ్యత అని అంగీకరిస్తూ హరిరామ్ లేఖ ఇచ్చాకే తాను చెక్‌లిస్టుపై సంతకం చేశానని చెప్పారు. అయితే డిజైన్లు సీడబ్ల్యూసీకి సమర్పించడానికి ముందు ఈ లేఖను తొలగించారని ఇటీవల తనకు తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా కమిషన్ గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో నరేందర్‌రెడ్డికి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన హరిరామ్ లేఖను నరేందర్‌రెడ్డి కమిషన్‌కు ఆధారంగా అందజేశారు. ఎల్ అండ్ టీ ఇచ్చిన డిజైన్లను మక్కికి మక్కీగా కాపీ ఎందుకు చేశారు? మెదడును ఎందుకు వినియోగించలేదు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా స్పందించారు. కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మేడిగడ్డ డిజైన్ల రూపకల్పనలో ఎల్ అండ్ టీ పాత్ర‘మేడిగడ్డ బరాజ్ డిజైన్ల రూపకల్పనతో తమకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. డిజైన్ల ప్రతిదశలో ఎల్ అండ్ టీ పాలుపంచుకుంది. నాటి సీఎం (కేసీఆర్) సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో పనిభారం తీవ్రంగా ఉందనే చర్చ జరగగా, మేడి గడ్డ బరాజ్ డిజైన్లు, డ్రాయింగ్స్కు రూపకల్పన చేస్తామని ఎల్ అండ్ టీ సీఎండీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ సంస్థతో కలిసి సీడీఓ ఇంజనీర్లు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించారు. ఎల్ అండ్ టీ, సీడీఓ మధ్య ఈ–మెయిల్ ద్వారా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలతో రూపొందించిన 600 పేజీల బుక్లెట్ సీడీఓ వద్ద ఆధారంగా ఉంది. (రుజువుగా కొన్ని మెయిల్స్‌తో కూడిన పత్రాలను కమిషన్‌కు అందజేశారు). కాళేశ్వరం నిర్మించాలన్న నిర్ణయం ఎవరిదో తెలియదుకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. సీఎం వద్ద జరిగిన సమావేశాలకు ఎన్నడూ సీడీఓ ఇంజనీర్లను పిలవలేదు. డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకే సీడీఓ పాత్ర పరిమితం. బరాజ్‌ల 3డీ మోడల్ స్టడీస్‌ను సీడీఓ డిజైన్లు ఇచ్చిన తర్వాతే చేయాలి. నాటి ప్రభుత్వం, సీఎం, మంత్రి వెంటబడడంతో సీడీఓ డిజైన్లు ఇవ్వడానికి ముందే 3డీ మోడల్ స్టడీస్‌ను తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్) నిర్వహించింది. 2డీ మోడల్ స్టడీస్ ఫలితాలు మాత్రమే డిజైన్ల తయారీకి ముందు మాకు అందాయి. బరాజ్ నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో బయటికి దూసుకొస్తుందనే అంచనాలతో డిజైన్లను రూపొందించాం. కానీ సెకనుకు 15–16 మీటర్ల వేగంతో ప్రయాణి స్తున్నట్టు నిర్ధారణ జరిగింది.నిర్మాణ, నిర్వహణ లోపంతోనే బరాజ్‌లు విఫలంనిర్మాణంలో నాణ్యతా లోపం, నిర్మాణం పూర్తైన తర్వాత వర్షాలకు ముందు, తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టకపోవడం, గేట్ల నిర్వహణలో కోడ్ పాటించకపోవడం, మేడిగడ్డ బరాజ్‌లో బుంగలు ఏర్పడితే నాలుగేళ్ల పాటు పూడ్చివేయ కపోవడం వంటి కారణాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయి..’ అని నరేందర్‌రెడ్డి చెప్పారు. -
‘కాళేశ్వరం’ నిర్ణయాలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారు?’’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో జరిగాయని మురళీధర్ బదులివ్వగా.. ‘ప్రభుత్వం అంటే ఎవరు?’అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. ‘హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ (ప్రభుత్వ అధినేత)’అని మురళీధర్ బదులివ్వగా.. ప్రభుత్వఅధినేత అంటే ఎవరని కమిషన్ వివరణ కోరింది. దీంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి అని మురళీధర్ బదులిచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. తొలిరోజున రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించింది. నీటి లభ్యతపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహిత ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు మురళీధర్ తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్ల ప్రతిపాదనల ప్రకారమే డీపీఆర్‌లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. పలు అంశాల్లో కిందిస్థాయి ఇంజనీర్లు తప్పు చేశారని పేర్కొన్న మురళీధర్.. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కమిషన్ విచారణ తీరిది.. » బరాజ్‌ల నిర్మాణం పూర్తికాక ముందే కాంట్రాక్టర్లకు సబ్ స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. జారీ చేసిన ఇంజనీర్లది వ్యక్తిగత స్థాయిలో తప్పేనని మురళీధర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా సంతకాలు చేశారని కమిషన్ ఎత్తిచూపగా.. వారు తప్పుచేశారని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణంలో పర్యవేక్షక ఇంజనీర్లతోపాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని కమిషన్ పేర్కొంది. 2016–20 మధ్య బరాజ్‌ల నిర్మాణం జరిగితే.. వరంగల్‌లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు ఒక్కసారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనితో సంబంధిత ఇంజనీర్లది తప్పేనని, పక్షం రోజులకోసారి పనుల్లో నాణ్యత పరీక్షించాల్సి ఉంటుందని మురళీధర్ బదులిచ్చారు. బరాజ్‌ల వైఫల్యానికి ఇది ప్రధాన కారణంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ తెలపగా.. ఒక కారణం కావచ్చని మురళీధర్ అన్నారు. » బరాజ్‌ల కాంక్రీట్ పనులకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే రూ.1,342.72 కోట్ల బిల్లులను ఏ విధంగా చెల్లించారు? బిల్లుల రికార్డుల్లో పాత తేదీలతో ఎంట్రీ ఎందుకు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. సంబంధిత ఇంజనీర్లది తప్పేనని సమాధానమిచ్చారు. »డిజైన్ల ప్రకారం బరాజ్‌ల పునాదుల కింద షీట్‌పైల్స్ నిర్మించాల్సి ఉండగా.. సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? నిర్మాణం ప్రారంభించాక డిజైన్లను మార్చవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. భూగర్భంలో ఇసుకతోపాటు భారీ రాళ్లు ఉండటంతో మార్చాల్సి వచ్చి0దని మురళీధర్ వివరించారు. నిర్మాణ దశలో డిజైన్లలో మార్పులు జరగడం సాధారణమేనని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణం పూర్తయ్యాక లోపాలు బయటపడితే ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మురళీధర్ వివరించారు. » కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం భవి ష్యత్తులో అంచనా వ్యయం పెంచుకోవడానికి వీలు కల్పిం చే రీతిలో డిజైన్లను రూ పొందించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని మురళీధర్ బదులిచ్చారు. కాళేశ్వ రం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపకముందే పనులు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ప్యాకేజీ–4 పనులు ప్రారంభించినట్టు మురళీధర్ అంగీకరించారు. -
మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్ వాల్‌ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ (స్వీడన్) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు తేల్చి చెప్పారు. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.జెట్ గ్రౌటింగ్‌లో లోపం వల్లే లీకేజీలుఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందు జెట్ గ్రౌటింగ్ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి, జెట్ గ్రౌటింగ్ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్ డ్యామ్ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్ హోల్స్ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటనఅంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. రెండు వారాల్లో మధ్యంతర నివేదికపోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు. -
జీవనాడిపై దాడి!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. గరిష్టంగా 194.6 టీఎంసీల సామర్థ్యంతో గోదావరిపై నిర్మిస్తున్న అతి పెద్ద జలాశయం ఇదే. కుడి, ఎడమ కాలువ ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించ వచ్చు. విశాఖ నగరం పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రాజెక్టులో నిర్మించే జలవిద్యుత్కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. పోలవరం పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం. దేశంలో ఈ స్థాయిలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు అవసరాలను తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరొకటి లేదు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన పోలవరాన్ని విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తామే వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న అధికారంలో ఉండగా చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని నమ్మబలికి కేంద్రానికి హామీ ఇచ్చారు. 2014 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం తెగేసి చెబితే దానికీ చంద్రబాబు తలూపారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఖరారు చేసిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను కమీషన్ల దాహంతో తుంగలో తొక్కి పనులు చేపట్టారు. వరదను మళ్లించేలా స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించారు. చివరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయలేక ఇరువైఫులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ఈ నిర్వాకాల కారణంగా 2019 జూన్ తర్వాత గోదావరిలో పోటెత్తిన భారీ వరద కాఫర్ డ్యామ్‌ల ఖాళీల మీదుగా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనులను అత్యంత సంక్లిష్టంగా మార్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను చంద్రబాబు గాలికొదిలేసి డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం. జీవం తీసిన వారే బురద జల్లుతున్నారు తాజాగా పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు జీవనాడి లాంటి ప్రాజెక్టును వైఎస్ జగన్ విధ్వంసం చేశారంటూ నిస్సిగ్గుగా బుకాయించారు. కమీషన్లకు ఆశపడి పోలవరం జీవం తీసిన చంద్రబాబు దీన్ని కప్పిపుచ్చి జీవం పోసిన వైఎస్ జగన్‌పై బురద జల్లే యత్నం చేయడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.అక్రమాలు అరికట్టి కీలక పనులు పూర్తి.. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు నాడు చంద్రబాబు సర్కార్ నామినేషన్‌పై కట్టబెట్టింది. వీటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ.783 కోట్లను ఖజానాకు వైఎస్ జగన్ ఆదా చేశారు. రాత్రిపూట కాఫర్ డ్యామ్ పనులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీస్ను పూర్తి చేశారు. ఎడమ కాలువలో వరాహ నదిపై అత్యంత పొడవైన అక్విడెక్టుతోసహా కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. జలవిద్యుత్కేంద్రం పనులను సైతం కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. ఇక డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లు ఖరారు చేసి పనులు చేపట్టేలా సీడబ్ల్యూసీ ప్రణాళిక రచించింది. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయమే రూ.33,168.23 కోట్లని, అందువల్ల 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రధాని మోదీకి నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలో తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలన్న వైఎస్ జగన్ వినతిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీ–జనసేనకు పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో పోలవరానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే అది ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారుతుందని, అందువల్ల దాన్ని ఆపేయాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇలా అడ్డుపుల్ల వేయడంతో నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. జలవిద్యుత్కేంద్రంపోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి. ఎడమ వైపు ఉన్న కొండను తొలిచి 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వి టర్బైన్లను అమర్చి విద్యుత్కేంద్రాన్ని పూర్తి చేయాలి.2014–19: టీడీపీ హయాంలోజలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో కొండను తొలిచే పనుల్లో కేవలం 25 శాతం మాత్రమే చేసి టీడీపీ సర్కార్ చేతులు దులుపుకొంది.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలవిద్యుత్కేంద్రం పనులు శరవేగంగా సాగాయి. కొండను తొలిచే పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసి 12 ప్రెజర్ టన్నెల్స్‌ను పూర్తి చేసింది. టర్బైన్లను అమర్చడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసింది. టర్బైన్ల తయారీ బాధ్యతను బీహెచ్ఈఎల్కు అప్పగించింది. జలవిద్యుత్కేంద్రం పనులను దాదాపుగా కొలిక్కి తెచి్చంది. పోలవరం జలాశయం పనులు పూర్తయ్యేలోగా విద్యుదుత్పత్తి ప్రారంభించే విధంగా జలవిద్యుత్కేంద్రం పనులను వేగవంతం చేసింది. 2014–19: టీడీపీ హయాంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకముందే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ను 1,396 మీటర్ల పొడవున పూర్తి చేసిన చంద్రబాబు 2018 జూన్ 11న జాతికి అంకితం చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలంటే 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 54 గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈమేరకు సీడబ్ల్యూసీ, పీపీఏకు హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు ప్రారంభించింది. అయితే రూ.484 కోట్లు ఖర్చు చేసి కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మిగతా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసిన చంద్రబాబు సర్కార్ ఆ పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. 2019 జూన్‌లో ప్రారంభమైన గోదావరి వరద ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. దాంతో కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో సగటున 26 మీటర్ల నుంచి 36.5 మీటర్ల లోతు వరకు భారీ అగాధాలు ఏర్పడ్డాయి.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో ఎగువ కాఫర్ డ్యామ్ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే 8,446 కుటుంబాలకు రూ.1,670 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో, దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లతోపాటు 2.1 కి.మీ. పొడవున అప్రోచ్ ఛానల్, 2.92 కి.మీ. పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది.స్పిల్ వేగోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వేను నిర్మించాలి. ప్రాజెక్టు పనుల్లో తొలుత పూర్తి చేయాల్సింది స్పిల్ వేనే. 1,118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించే స్పిల్ వేకు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చాలి. వరద వచి్చనప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్‌లను గేట్లకు అమర్చాలి. ప్రపంచంలో గరిష్టంగా వరద జలాలను దిగువకు విడుదల చేసే అతి పెద్ద స్పిల్ వే పోలవరంలోనే ఉంది.2014–19: టీడీపీ హయాంలో 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 2016 డిసెంబర్ 30న స్పిల్ వే పనులను ప్రారంభించారు. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మే 29 నాటికి స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్ వేలో కేవలం రెండు (39, 40) పియర్స్‌ను 30 మీటర్ల వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకు పెట్టి గేట్ అమర్చినట్లు 2018 డిసెంబర్ 24న చంద్రబాబు ఘనంగా ప్రకటించుకున్నారు.2019–2024: వైఎస్సార్సీపీ పాలనలో2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది జూన్‌లో ప్రారంభమైన వరద ప్రవాహం నవంబర్ వరకూ కొనసాగింది. 2020 మార్చి నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి విరుచుకు పడింది. అయితే గోదావరి వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ రికార్డు సమయంలో స్పిల్ వేను పూర్తి చేశారు. లాక్‌డౌన్‌లోనూ జర్మనీ, జపాన్ నుంచి హైడాల్రిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని స్పిల్ వేకు 48 గేట్లను బిగించారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్ వే మీదుగా విజయవంతంగా మళ్లించారు. -
జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి
సాక్షి, అమరావతి: పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ నిర్మించడం ద్వారా చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్ వాల్⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. ⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి. ⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. ⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విధ్వంసం వల్లే పనుల్లో జాప్యంనాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్ జగన్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్‌లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వేను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ చానల్‌ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్త యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడబ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్ వాల్సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్‌ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2029 నాటికే.. వరదల ప్రభావం వల్ల నవంబర్ వరక⇒ పోలవరం పనులు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్ జగన్ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం. రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు. -
తెలంగాణలో సరైన ఫలితాలు రాలేదు: ఖర్గే అసంతృప్తి
సాక్షి,ఢిల్లీ: పార్టీ పవర్లో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం(జూన్8) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.‘అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మంచి ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. అర్జెంటుగా వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలి. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టుకోవాలి. నిరంకుషత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి’అని ఖర్గే అన్నారు. -
ఆదమరిస్తే జల సంక్షోభమే!
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే ప్రమాదముందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తంచేసింది. గ్రీన్హౌస్ ప్రభావంవల్ల భూతాపం క్రమేణా పెరుగుతుండటం.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంవల్ల రుతుపవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దేశంలో నీటి లభ్యతపై ఇటీవల చేసిన తన అధ్యయనంలో పేర్కొంది. పర్యవసానమే అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులతోపాటు వర్షపాత విరామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తెలిపింది. అతివృíÙ్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వరద జలాలను ఒడిసిపట్టి జలాశయాలు నింపుకోలేకపోవడం.. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టకపోవడంవల్ల నీటి ఎద్దడికి దారితీస్తోందని వెల్లడించింది. ఫలితంగా సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని ఇందుకు ఉదహరిస్తోంది.ఇలాగైతే కష్టమే..! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వచేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టంచేసింది. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేలి్చచెప్పింది. అలాగే, ఏటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగకుంటే ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.తలసరి నీటి లభ్యత తగ్గుముఖం.. ఇక దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడంలేదనే అంశాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయిందని వెల్లడించింది. అలాగే, నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది.సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే..దేశంలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలేమిటంటే.. » దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. » ఈ వర్షపాతంవల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. » ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే.. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. » దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటినిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వచేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. » ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్అండ్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.మేడిగడ్డకు ఇంకా గండమే!» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచనసాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.» 7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్‌పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.» ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి. -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. నాణ్యత పర్యవేక్షణ ఎలా? ‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్)కు రక్షణగా తొలుత షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? ఈ డిజైన్ మార్పులకు అప్రూవల్స్ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్ పైల్స్ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! ‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్ చార్ట్ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ జరిపిన వ్యాప్కోస్ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్ స్టడీస్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఈఎన్సీ(ఓఅండ్ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
కాళేశ్వరం ఇంజనీర్లకు.. క్రాస్ ఎగ్జామినేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది. ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు. డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం.. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు. కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్ ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీలు దూరం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు. -
నాగార్జునసాగర్‌కు ఎన్డీఎస్ఏ బృందం
నాగార్జునసాగర్: ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ బృందం మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించింది. తొలుత విజ యవిహార్ అతిథిగృహంలో తెలంగాణ, ఆంధ్ర ఇంజనీర్లతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు (కేఆర్ఎంబీ) సభ్యులతో ఎన్డీఎస్ఏ అధికారులు సమావేశమయ్యారు. 2009లో వచ్చిన భారీ వరదల నుంచి డ్యామ్‌ను ఏవిధంగా కాపా డారు? వచ్చిన వరదను ఎలా విడుదల చేశారన్న అంశాలపై చర్చించారు. తర్వాత ప్రధాన డ్యామ్ ను, ప్రాజెక్టు లోపలి గ్యాలరీలను, అక్కడి సీపేజీ (జాలు నీరు)లను పరిశీలించారు. సీపేజీ నీటి మళ్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రా జెక్టు స్పిల్‌వేపై ఉన్న వాక్‌వే బ్రిడ్జి మీదుగా వెళ్లి స్పి ల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి, స్పిల్ వేకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ వివ రాలను ఆరా తీశారు. స్పిల్‌వే దిగువన బకెట్ పో ర్షన్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్డీఎస్ఏ బృందంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్వో) సీఈ ప్రమీల, ఇత ర ఇంజనీర్లు ఉన్నారు. ఈ పరిశీలనలో తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ వి.అజయ్‌కుమార్, డ్యామ్ ఎస్ఈ పీవీఎస్ నాగేశ్వర్రావు, ఇతర ఇంజనీర్లు పాల్గొనగా.. ఏపీ నుంచి చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కేంద్రం పరిశీలన ఎన్డీఎస్ఏ బృందం బుధవారం సాగర్ డ్యాం దిగు వన ఉన్న విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనుంది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ని.. తిరిగి జలాశయంలోకి ఎత్తిపోసే సమయంలో నీరేమైనా వృథా అవుతుందా? సీజన్లో బయటికి ఎంతనీరు వెళుతుందనే అంశాలను పరిశీలించనున్నట్టు తెలిసింది. గురువారం కూడా సాగర్ ప్రాజెక్టు పరిధిలో పరిశీలన కొనసాగనుంది. -
‘నీటి’ మీద లెక్కలు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క కట్టింది. సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు. శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్‌డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. -
హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1412.58 టీఎంసీలని లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటి లభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి ఇదీ తేడా.. పెన్నాలో నీటి లభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. కానీ.. బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. అంటే.. 1993తో పోల్చితే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటి రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటి లభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ.. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నంది కొండల్లోని చెన్నకేశవ పర్వత శ్రేణుల్లో పుట్టే పెన్నా నది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి.. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడి వైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
‘సీడబ్ల్యూసీ’కి వెళ్లని సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వెళ్లాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సిన కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు. అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలోనే సాగునీటి శాఖపై రివ్యూ చేశారు. కానీ, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది. విద్యుత్‌పై చర్చ సందర్భంగా వాడీవేడిగా సభ సాగడంతో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోయారు. ఒక దశలో సీఎం జోక్యం చేసుకొని విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన పూర్తయిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళతారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరిగినా, సీఎం ఢిల్లీకి బయలుదేరలేదు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను సీడబ్ల్యూసీకి రాలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌కు చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నారని సమాచారం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కారణమేంటి? సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండు కీలక అంశాలపై ప్రభు త్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఎత్తిపొడిచే అవకాశం వచ్చి ఉండేదని, దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని ప్రభుత్వ, పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కేవలం అసెంబ్లీ సమావేశాలే కాదని, మరో ముఖ్యమైన పనిలో ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీ వెళ్లలేదనే చర్చ కూడా జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో మంత్రి ఉత్తమ్ కూడా రేవంత్‌రెడ్డితో చాలా సేపు అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్లో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ తర్వాతే రేవంత్ తన టూర్ రద్దు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది. -
సాంకేతిక నిపుణుల సూచనలతో పోలవరం పనులు
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దిశానిర్దేశం చేశారు. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని పది రోజుల్లోగా ఖరారు చేసి, పనులకు నిధుల సమస్య లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, గడువులోగా పూర్తి చేయడానికి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులను ఖరారు చేసేందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్యామ్ డిజైర్ రివ్యూ ప్యానల్ (డీడీర్పి) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందర్ సింగ్ వోరా, పీపీఏ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాంతో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. నిపుణుల కమిటీ కోసం పీపీఏ టెండర్లు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చేందుకు చేస్తున్న పనులను వివరించారు. ఒక స్టోన్ కాలమ్ 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 2.30 గంటలు పడుతోందని, దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. స్టోన్ కాలమ్స్ వేయడంలో సహకరించేందుకు, డిజైన్లను రూపొందించేందుకు వేస్తామన్న నిపుణుల కమిటీని ఇప్పటిదాకా నియమించలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్లో జాయింట్లను అతికించడంలో కూడా నిపుణుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్ వేయడంలో దేశంలో నిపుణుల కొరత ఉన్నందున, టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామని పీపీఏ ఛైర్మన్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కమిటీగా ఏర్పడి ఈ టెండర్లో పాల్గొంటారన్నారు. ఆ టెండర్‌ను ఖరారు చేసి నిపుణుల కమిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆలోగా డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సహా హెడ్ వర్క్స్‌లో చేయాల్సిన పరీక్షలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో చేయించి, నివేదిక సిద్ధంగా ఉంచాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ పరీక్షల కోసం స్వీడన్‌కు చెందిన ఆఫ్రిన్ అనే సంస్థతో కాంట్రాక్టు సంస్థ మేఘా ఇప్పటికే ఒప్పందం చేసుకుందని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహాతోనే డయాఫ్రమ్ వాల్ ఆఫ్రిన్ సంస్థ పరీక్షల నివేదిక ఆధారంగా పీపీఏ ఖరారు చేసే నిపుణుల కమిటీ స్టోన్ కాలమ్స్‌ను వేగంగా వేయడంపై సలహాలు ఇస్తుంది. ఆ పరీక్షల నివేదిక ఆధారంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, దానికే మరమ్మతలు చేయాలా లేదంటే సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలా అనే అంశంపై సూచనలు చేయనుంది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లను నిపుణుల కమిటీ రూపొందిస్తుంది. -
పోలవరం తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లుగా ఖరారు చేస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసి సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) చైర్మన్ ఏఎస్ గోయల్ మంగళవారం తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపుతుంది. పీఐబీ ఆమోద ముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలి దశ పనులకు తాజా ధరల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. మూడో సారి సమావేశమైన ఆర్సీసీ తొలి దశ అంచనా వ్యయంపై సీడబ్ల్యూసీ ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. మంగళవారం ఢిల్లీలో మూడోసారి సమావేశమైంది. ఆర్సీసీ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీడబ్ల్యూసీ(పీపీవో) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచా మిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ సీఈ (పీఏవో) యోగేష్ పైతంకర్ పాల్గొన్నారు. పోలవరం సీఈ సుధాకర్‌బాబు ప్రత్యేక ఆహా్వనితుడిగా పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లని, ఇందులో రూ.16,119.56 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని రఘురాం వివరించారు. ఇంకా రూ.15,505.80 కోట్ల విలువైన పనులు మిగిలాయని తెలిపారు. తొలి దశ పనులకు రూ.12,911.15 కోట్లు మంజూరు చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారని ఆ శాఖ ప్రధాన సలహాదారు రిచా మిశ్రా గుర్తు చేశారు. తొలి దశ పనుల పూర్తికి మంత్రి ఆమోదించిన వ్యయంకంటే అదనంగా రూ.2,594.65 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు. తొలి దశ పనులకు 2013–14 ధరల ప్రకారం ఎంత అవసరం, 2017–18 ధరల ప్రకారం ఎంత అవసరమన్నది మరింత విపులంగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరారు. -
'ఆల్ ది బెస్ట్' టీమ్ ఇండియా..!
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు.. -
పోలవరంపై 20న ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి ప్రస్తుత సీజన్ (2023–24)లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్), సవరించిన అంచనా వ్యయం (తొలిదశ పూర్తి) ఖరారే అజెండాగా ఈనెల 20న ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, జల్‌శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొంటారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పీపీఏ సభ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల సీపేజీకి అడ్డుకట్ట వేయడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలా? పాతదానికే మరమ్మతు చేయాలా? వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి వీలుగా ప్రస్తుత సీజన్లో చేపట్టాల్సిన పనులను, అందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.16,119.57 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు రూ.15,505.81 కోట్లు అవసరమని కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)ని నియమించింది. ఆ కమిటీ అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. ఈనెల 20న జరిగే సమావేశంలో తొలిదశ సవరించిన అంచనా వ్యయంపై చర్చించనున్నారు. -
ఏపీలో నీటి యాజమాన్య పద్ధతులు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో నీటి యాజమాన్య పద్ధతులు సత్ఫలితాలిస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్ ఓరా కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న నీటి కొరతపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సులో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన ఐసీఐడీ సదస్సు జరుగుతోన్న విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సులో నీటి ఉత్పాదక పెంపునకు దోహదపడే అంశాలపై సిఫార్సులను ఆహ్వానించినట్లు తెలిపారు. వాతావరణ మార్పు ప్రభావం నీటి పారుదల రంగంపై ఎక్కువగా ఉందని.. దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చ జరుగుతోందన్నారు. ఇటీవల కాలంలో కురిస్తే కుండపోత, లేదంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, గణాంకాల ప్రకారం సగటు వర్షపాతం నమోదవుతున్నా సకాలంలో వానలు కురవకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లు, జల విద్యుత్కేంద్రాలను అకాల వరదలు దెబ్బతీస్తున్నాయని, దీంతో వాటి కట్టడాల పటిష్టత, డిజైన్లపై సమీక్షించాల్ని అవసరం ఉందన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రానున్న రెండు మూడు దశాబ్దాలకు రుతుపవనాలు అనుకూలంగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు వృద్ధి చేయడం, నీటిని పొదుపుగా వాడడం తప్పనిసరైందన్నారు. వాటర్ రీసైక్లింగ్‌పై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డిసాలినేషన్ ప్లాంట్లకు అధిక వ్యయం అవుతోందన్నారు. అందుకే మంచినీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే వీటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఉంటోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటి వ్యయం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
2 గంటలు.. క్షుణ్ణంగా
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మంగళవారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు, అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్, డైరెక్టర్లు కె.శర్మ, తంగమణి, రాహుల్ కె.సింగ్ తదితరులు స్థానిక అధికారులతో కలిసి మధ్యాహ్నం 12.10 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పూర్తిగా పోలీసు దిగ్బంధంలో ఉంది. రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీ పైకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం సభ్యులు కుంగిన బ్యారేజీని, రోడ్డును, బ్యారేజీలో పగుళ్లు ఏర్పడిన 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే బ్లాక్‌లోని 15 నుంచి 22వ పియర్ వరకు, క్రస్ట్ గేట్ల పనితీరును తనిఖీ చేసినట్లు తెలిసింది. బృందం సభ్యులు 20వ పియర్ దగ్గరి నుంచి మహారాష్ట్ర వైపునకు కాలినడకన వెళ్లారు. కొలతలు తీసుకున్నారు. దిగువకు దిగేందుకు ప్రయత్నం చేసినా తేనె తుట్టెలు ఉండడంతో ఆగిపోయినట్లు సమాచారం. బ్యారేజీ వివరాలపై ఇరిగేషన్ అధికారులు, ఎల్అండ్టీ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీ కొనసాగింది. కానీ ఒక్క ఇరిగేషన్ శాఖ ఈఎన్సీతో తప్ప ఇతర అధికారులెవరితోనూ వారు మాట్లాడలేదు. తమ వెంట రానివ్వలేదు. తమ పరిశీలనలో ఏం తేలిందో కూడా వారు వెల్లడించలేదు. కాగా బ్యారేజీ పరిస్థితి, ఇతర వివరాలతో తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి బృందం సభ్యులు సమర్పించన్నారు. ఎల్అండ్టీ గెస్ట్‌హౌస్‌లో భోజనానంతరం ఈ బృందం అక్కడినుంచి వెనుదిరిగింది. కాగా బ్యారేజీ పరిస్థితి, సంబంధిత వివరాలను ఇరిగేషన్ శాఖ, ఎల్అండ్టీ సంస్థ గోప్యంగానే ఉంచుతున్నాయి. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన అధికారులను కూడా వద్దని నిలువరించినట్లు సమాచారం. కేంద్రం బృందం వెంట ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్‌టీ ప్రతినిధులు, స్థానిక ఇరిగేషన్, పోలీసు అధికారులు ఉన్నారు. మళ్లీ కుంగిన వంతెన! జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఈనెల 21న సాయంత్రం భారీ శబ్దంతో ఓ అడుగు మేర కుంగడం కలకలం రేపింది. తెలంగాణతో పాటు పక్కనున్న మహారాష్ట్ర వాసులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల్లో మళ్లీ కొంతమేర వంతెన, పియర్ కుంగినట్లు తెలిసింది. అర మీటరు లోతుకు కుంగినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ నమోదు.. బ్యారేజీ కుంగిన ఘటనపై మహదేవపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పోలీసు స్టేషన్లలో అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో మహదేవపూర్ పోలీసులు 174/2023 యూ/ఎస్ ఐపీసీ 427, సెక్షన్ 3 పీడీపీసీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. జనం ఇబ్బందులు మేడిగడ్డ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి వరకు గోదావరిపై 1.6 కిలోమీటర్ల మేర బ్యారేజీని నిర్మించారు. ప్రస్తుతం వంతెన కొంత కుంగడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వారంతా కాళేశ్వరం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. నిత్యం తెలంగాణ వైపు పత్తి, మిరప తోటలకు వచ్చే కూలీలు కూడా పని లేక ఇబ్బందులు పడుతున్నారు. రబీ పంటకు నీరెట్లా? మేడిగడ్డను ఖాళీ చేస్తుండటంతో రబీ పంటకు నీరెట్లా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మూడు రోజుల క్రితం వరకు బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన మహారాష్ట్ర ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అయితే బ్యారేజీ 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిగా మరమ్మతులు చేసే వరకు ఇందులో నీటిని నిల్వ చేయడం వీలు కాదు. ఈ నేపథ్యంలోనే ఈసారి రబీ సీజన్లో ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దక్షిణాది రాష్ట్రాల్లో నీటికి కటకట
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. నైరుతి రుతువపనాల ప్రభావం వల్ల కృష్ణా, కావేరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వల్ల జలాశయాల్లోకి నీటి నిల్వలు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు) కాగా.. 25.361 బీసీఎం (48 శాతం) నిల్వలే ఉన్నాయని తెలిపింది. గతేడాది ఇదే రోజు నాటికి ఈ జలాశయాల్లో 92 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో సగటున ఆ ప్రాజెక్టుల్లో 74 శాతం నిల్వ ఉండేవని వెల్లడించింది. గత పదేళ్లలో ఈ ఏడాదే జలాశయాల్లో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 11.121 బీసీఎంలు కాగా.. ప్రస్తుతం కేవలం 2.815 బీసీఎంలు (25 శాతం) మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 98 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో ఇదే రోజు నాటికి సగటున 76 శాతం నీరు నిల్వ ఉండేదని సీడబ్ల్యూసీ వెల్లడించింది. నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సాగునీటికి దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, పెన్నా బేసిన్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 150 భారీ ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి నిల్వలను సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఆ 150 ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై శుక్రవారం సీడబ్ల్యూసీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 150 జలాశయాల్లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 257.812 బీసీఎంలు. ఆ ప్రాజెక్టుల లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 178.784 బీసీఎంలు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లో 129.636 బీసీఎంలు(73 శాతం) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 140.280 బీసీఎంలు (81 శాతం) నీరు నిల్వ ఉండేది. గత పదేళ్లలో ఇదే సమయానికి సగటున 160.40 బీసీఎంలు (92 శాతం) నీరు నిల్వ ఉండేది. దేశవ్యాప్తంగా చూసినా గత పదేళ్ల కంటే ఈ ఏడాది జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి లభ్యత మెరుగ్గానే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని జలాశయాల్లో 89 శాతం, తూర్పు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 77 శాతం, పశ్చిమ రాష్ట్రాల్లోని జలాశయాల్లో 88 శాతం, మధ్య భారత రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 83 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి. -
‘పోలవరం’పై మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా ఖరారుచేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ–సవరించిన వ్యయ కమిటీ)ని ఏర్పాటుచేస్తూ గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ (పీపీఓ) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచామిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం సభ్యులుగా ఏర్పాటైన ఆర్సీసీకి సీడబ్ల్యూసీ సీఈ (పీఏఓ) యోగేష్ పైతంకర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీ ఖరారుచేసిన సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి రెండు వారాల్లోగా అంటే నవంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌సీసీని ఆదేశించారు. ఈ నివేదికను ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్‌శక్తి శాఖ పంపనుంది. పీఐబీ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలిదశ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి 2013–14 ధరల ప్రకారం కేవలం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. కానీ, 2013, భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది.. కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లు దండుకోవడమే. 2016, సెప్టెంబరు 7 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబు అదే చేశారు. ఇదే అంశాన్ని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ వివరించి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ సవరించిన వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారుచేస్తూ ఈనెల 13న కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. జాతీయ ప్రాజెక్టుల సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి, పీఐబీకి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, సంబంధిత ప్రాజెక్టును ప్రతిపాదించే శాఖ అధికారులతో ఆర్‌సీసీని ఏర్పాటుచేయాలని 2016, సెప్టెంబరు 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్సీసీ ఇచ్చే నివేదికే అత్యంత కీలకం. దీనిని యథాతథంగా పీఐబీ ఆమోదించనుంది. తొలిదశ పూర్తికాగానే రెండో దశ.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు) స్థాయిలో నీటిని నిల్వచేయాలంటే.. ఇటీవల లైడార్ సర్వేలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే 90 గ్రామాల పరిధిలోని 171 ఆవాసాల్లోని 37,568 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో ఇప్పటికే 12,658 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మరో 24,910 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశ సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ కుటుంబాలకు పునరావాసం కల్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయాలంటే 137గ్రామాల పరిధిలోని 200 ఆవాసాల్లో 64,155 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశలో, రెండో దశలో నీటిని నిల్వచేయాలంటే ముంపునకు గురయ్యే 1,10,879 హెకార్ల భూమిని సేకరించాలి. మరోవైపు.. తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేశాక.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్ల వరకూ 194.6 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం నిల్వచేయనుంది. రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి సవరించిన అంచనా వ్యయాన్ని తొలిదశ పనులు పూర్తయ్యే నాటికి కేంద్రం ఆమోదించనుంది. -
అంచనా ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిస్తున్న చొరవ.. చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాలను.. కమీషన్ల వేటలో నాటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంలో అవలంబించిన అస్తవ్యస్త విధానాలను ఒక్కోటి సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధపట్ల సాగునీటి రంగ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఆమోదించి దాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి శుక్రవారం రాత్రి పంపారు. ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఆమె పంపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాక దానిని కేంద్ర కేబినెట్‌కు నివేదిస్తారు. అంతకుముందు.. తాజా ధరలను పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి నిధులిచ్చి సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో.. సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయం. దీంతో పోలవరానికి నిధుల సమస్య తీరడంతోపాటు ప్రాజెక్టు సత్వర పూర్తికి మార్గం సుగమం అవుతుంది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తూ పోలవరాన్ని పూర్తిచేయడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి ఇది మరో నిదర్శనమని అధికార వర్గాలు కొనియాడుతున్నాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు తొలిదశ పనులు పూర్తయ్యాక రెండో దశ పనుల సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి పంపుతుంది. రూ.15,505.81 కోట్ల పనులు మిగులు.. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో ఇప్పటికే పూర్తయిన పనులకు చేసిన వ్యయం.. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనుల్లో మిగిలిన పనుల వ్యయం.. చంద్రబాబు నిర్వాకంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం వంటి అదనంగా చేపట్టాల్సిన పనులు.. లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాలను పరిగణలోకి తీసుకుని సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. దీని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.38 కోట్లు. ఇందులో రూ.16,119.57 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.15,505.81 కోట్ల పనులు మిగిలాయి. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే నిధుల సమస్య పరిష్కారమవుతుంది. ‘రెండో దశ’ సవరించిన అంచనా వ్యయానికీ ఓకే.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్టు (119.4 టీఎంసీలు) కాగా.. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయ్యాక మొదటి ఏడాది నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు నీటిని నిల్వచేస్తారు. ఆ మరుసటి ఏడాది 2/3వ వంతు.. ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. నీటి నిల్వచేసే సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో నీటినిల్వ చేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక రెండో దశలో 45.72 మీటర్ల వరకూ అంటే.. పూర్తిస్థాయిలో నీటి నిల్వకు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, మిగిలిన పనులకు సంబంధించి సవరించిన వ్యయ ప్రతిపాదనను తొలిదశ పనులు పూర్తయ్యే దశలో పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. పోలవరానికి చంద్రబాబు చేసిన ద్రోహం ఇదీ.. ► నిజానికి.. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ 8 నుంచి కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ► పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూనే 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో.. 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలికపెట్టారు. దీనికీ చంద్రబాబు అప్పట్లో తలఊపారు. ► ఆ తర్వాత.. 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1,981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు సరేనన్నారు. ► అనంతరం.. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టంచేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి నోరుమెదపలేదు. ► అలాగే, 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు. ► ఇక 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన మెమొరాండం ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి నిధులు (రూ.20,398.61 కోట్లు) ఇవ్వాలంటూ 2018, జనవరి 12న చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. నిజానికి.. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది మొత్తం ప్రాజెక్టును రూ.20,398.61 కోట్లకే పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. ► నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నాక.. తొలుత అప్పటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ఆ తర్వాత రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగ, యనమల వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌లకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టారు. మొత్తం మీద.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకున్న చంద్రబాబు పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారు. సీఎం జగన్ కృషి ఫలితమిది.. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న సమయంలో 2013–14 ధరల ప్రకారం పనులు చేస్తామని 2016, సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లే. కానీ.. భూసేకరణ, పునరావాసం కల్పనకే రూ.33,168.23 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో.. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం. ఇదే అంశాన్ని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ పలుమార్లు వివరించారు. తాజా ధరల మేరకు నిధులు సకాలంలో ఇచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఫలితంగానే పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ. -
ఇంటింటికీ ఆరు.. కాంగ్రెస్ జోరు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆరు గ్యారంటీ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. సోమవారం సీడబ్ల్యూసీ నేతలు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పక్కాగా ఆరు పథకాలను అమలు చేయనున్నామని చెప్పారు. ఏకంగా పథకాల కార్డులు అందజేసి రసీదులను సైతం తీసుకున్నారు. డివిజన్లవారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రతి రోజు ఇంటింటీకి వెళ్లి ఆరు పథకాలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల గడువుకు మిగిలిన వంద రోజులను సద్వినియోగం చేసుకుంటే అధికారం తమదేనన్న భరోసా కల్పించారు. నేతల ప్రచారం ఇలా.. ప్రచారంలో భాగంగా రాజస్తానన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ ఫైలట్ నాంపల్లిలోని యూసుఫియణ్ దర్గాలో ప్రార్థనలు, దేవీభాగ్‌లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారీఖ్ అన్వర్ అంబర్‌పేటలోని గోల్నాక డివిజనన్ నెహ్రూ నగర్, సుందర్‌నగర్, కృష్ణానగర్‌లలో పర్యటించారు. ముషీరాబాద్‌లో మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ప్రణితి షిండే చిరు వ్యాపారులను కలిసి ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. ఆమె వెంట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌లు ఉన్నారు. యాకుత్‌పురాలో నాగాలాండ్ పీసీసీ అధ్యక్షుడు ఎస్ఎస్ జమీర్, ఖైరతాబాద్‌లో మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితో కలిసి ప్రజలకు ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. కూకట్‌పల్లిలో రాజ్యసభ మాజీ సభ్యుడు పీఎల్ పూనియా, మలక్‌పేటలో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌లు పర్యటించి ఆరు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. -
మౌన ప్రేక్షకుల్లా ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్ల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలు రెట్టింపయ్యాయి. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు మోదీ అంగీకరించరు. తానేం చేస్తున్నారో వెనక్కి తిరిగి చూసుకోరు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దు. నియంతృత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం ఏకమై పోరాడాలి.’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సమస్యల నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోపాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనపెట్టి కాంగ్రెస్ నేతలందరూ అవిశ్రాంతంగా పనిచేయాలని, వ్యక్తిగత విభేదాల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. సామాజికన్యాయం, సంక్షేమమే ధ్యేయంగా ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రజారంజక పాలన అందించామని, ఈ రెండు రాష్ట్రాల మోడల్‌ను దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయని, వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లో కూడా ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాలని ఖర్గే కోరారు. అదే గాంధీకి నిజమైన నివాళి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు ఖర్గే పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన శతాబ్దం పూర్తవుతున్న తరుణంలో ఈ దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను బీజేపీని గద్దె దింపడమే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ నుంచి స్పష్టమైన సందేశం, పునరుత్తేజంతో వెళదాం. తెలంగాణతోపాటు భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలనే కృతనిశ్చయంతో అందరూ హైదరాబాద్ వదిలివెళ్లాలి. బీజేపీ దుష్పరిపాలన కారణంగా ఎదురవుతున్న కష్టాల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగించాలి.’ అని ఖర్గే దిశానిర్దేశం చేశారు. అన్ని కమిటీలు పూర్తయ్యాయా? పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఖర్గే మాట్లాడుతూ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే రాజకీయ ప్రత్యర్థులను ఓడించగలమని చెప్పారు. కలసికట్టుగా ప్రత్యర్థిపై ఐక్య పోరాటాలు చేసినప్పుడు విజయం సాధిస్తామని కర్ణాటక ఫలితాలే చెబుతున్నాయన్నారు. మండల, బ్లాక్, జిల్లాల స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయిందా? స్థానిక నేతలకు కార్యాచరణ ఇస్తున్నామా? గట్టి నాయకులను గుర్తిస్తున్నామా? అనే విషయాల్లో ఆత్మవిమర్శ చేసుకోవాలని పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలకు ఖర్గే సూచించారు. -
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని.. రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పదని, శుష్క వాగ్దానాలు ఇవ్వదని.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చామని గుర్తు చేసింది. దశాబ్దాల తమ నిబద్ధత, ట్రాక్ రికార్డు ఏమిటో తెలంగాణ ప్రజానీకానికి తెలుసని.. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ విజ్ఞప్తి చేసింది. సీడబ్ల్యూసీ విజ్ఞప్తిలో ఏముందంటే..? ‘‘ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం 2014లో తెలంగాణ ఏర్పాటుతో విజయవంతమైంది. అందులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ అన్ని రాజకీయ అవరోధాలను అధి గమించి, అందరితో చర్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ప్రత్యేక రాష్ట్రంలోని వన రులు, నీళ్లు, ఉపాధి ప్రజలందరికీ లభిస్తాయని, నీ ళ్లు–నిధులు–నియామకాలతో భవిష్యత్తు ఉంటుం దని, బంగారు తెలంగాణ ఏర్పడుతుందని అంతా కోరుకున్నారు. కానీ అక్కడ ఢిల్లీలో, ఇక్కడ హైదరా బాద్‌లో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశా యి. ఏ కలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్ర జలు పోరాడారో తొమ్మిదేళ్లయినా ఆ కల నెరవేర లేదు. రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన వనరులన్నింటినీ అధికారంలో ఉన్నవారే అనుభవిస్తున్నారు. నిజాం తరహా పాలనలోకి రాష్ట్రాన్ని నెట్టారు. రాహుల్ యాత్రలో వాస్తవాలు తెలిశాయి భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలోని 8 జిల్లాల మీదుగా 405 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినప్పుడు వేలాది మంది ప్రజలు ఆయన్ను కలిశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు పేద, రైతు, ద ళిత, ఆదివాసీ, ఆదివాసీల ప్రయోజనాలను పణం గా పెట్టి.. తమ వారికే ఎలా లబ్ధి కలిగిస్తున్నాయో తేలింది. తెలంగాణలో రైతాంగం నానాటికీ అప్పు ల్లో కూరుకుపోతున్నారు. ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, ఓబీసీలకు ఇందిరాగాంధీ హయాంలో పంపిణీ చేసిన భూములను ధరణి పోర్టల్ పేరుతో లాగేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఆ భూములను కట్టబెడుతున్నారు. కాళేశ్వ రం వంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ అనుబంధ కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మారాయి. మరోవైపు పబ్లిక్ సెక్టార్ కంపెనీలను మోదీ ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా ప్రైవేటైజేషన్ చేస్తుండటంతో దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలమైన, బహుళ ప్రయోజనకారి అయిన ఆర్థిక వ్యవస్థ కోసం మొదటి నుంచీ పోరాడుతోంది. ఆకాంక్షలను నెరవేర్చుకుందాం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలను ఇప్పటికైనా నెరవేర్చుకునే దిశలో తెలంగాణ ప్రజల పోరాటానికి సీడబ్ల్యూసీ తోడుగా నిలుస్తుంది. భూములపై హక్కులు కల్పించడం, ప్రైవేటు సెక్టార్‌ను ప్రోత్సహిస్తూనే.. బలమైన ప్రభుత్వ రంగ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఉపాధి హామీ పేదలకు అండగా నిలవడంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి కాంగ్రెస్ నిబద్ధత ఏమిటో చెప్తున్నాయి. ప్రజలకు మా ట్రాక్ రికార్డు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పదు. శుష్క వాగ్దానాలు ఇవ్వదు. కర్ణాటక ప్రజలకిచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చిన అక్కడి ప్రభుత్వ పనితీరు దీనిని తెలియజేస్తోంది. తెలంగాణలో కూడా చరిత్ర సృష్టించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వరంగల్ వేదికగా రైతులు, హైదరాబాద్‌లో యువకులు, ఖమ్మంలో వృద్ధులకు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇస్తున్నాం. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాం. బంగారు తెలంగాణ స్వప్నాన్ని మరోమారు గుర్తుచేసుకుంటూ.. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే సమయం ఆసన్నమైంది’’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. -
కూటమిగా... దీటుగా
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. ఈ కూటమిలో కీలకపాత్ర వహించడం ద్వారా దేశ ప్రజానీకానికి బాధ్యతాయుతమైన పారదర్శక ప్రభుత్వాన్ని అందించాలని తీర్మానించింది. ఇండియా కూటమిని సిద్ధాంతపరంగా, ఎన్నికల విజయ సూచికగా నిలబెట్టడం ద్వారా విభజన, విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దేశం అనేక రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, చైనా దురాక్రమణ, కొత్త రాజ్యాంగ రూపకల్పన, జమిలి ఎన్నికలు, భారత్ జోడో యాత్ర, మణిపూర్ హింస, కశ్మీర్లో ఉగ్ర కాల్పులు తదితర 14 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయాలివీ... 1. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఆర్మీ, పోలీసు అధికారులకు సీడబ్ల్యూసీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఇలాంటి విషాద సమయంలో జాతి మొత్తం మౌనం పాటిస్తున్న తరుణంలో బీజేపీ, ప్రధానమంత్రి జీ–20 సమావేశాల విజయవంతం పేరుతో సంబురాలు చేసుకుని వారిని వారే అభినందించుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇది సహించరానిదని, అమర వీరులకు అవమానమని దుయ్యబట్టింది. 2. ఏడాది కాలంగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ అభినందించింది. ఆయన స్ఫూర్తివంతమైన నాయకుడని, సామాజిక న్యాయం కోసం రాజీలేని గొంతుకను వినిపిస్తున్నారని కొనియాడింది. 3. దేశ ప్రజలను ఐక్యం చేసి జాతీయ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా సీడబ్ల్యూసీ హర్షం వ్యక్తం చేసింది. భారత్‌జోడో యాత్ర స్ఫూర్తిని పార్టీలోని అన్ని స్థాయిల్లో కొనసాగించాలని, యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లో కొనసాగించాలని తీర్మానించింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్య అని, మళ్లీ ఆయన సభ్యత్వం పునరుద్ధరణతో న్యాయం, ధర్మం గెలిచాయని పేర్కొంది. 4. మణిపూర్‌లో అధికార యంత్రాంగం కుప్పకూలి హింస కొనసాగడంపై సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మౌనం, నిర్లక్ష్యం, హోంమంత్రి వైఫల్యం, ముఖ్యమంత్రి మొండితనమే ఇంతటి దారుణానికి తెరతీసిందని ధ్వజమెత్తింది. త్వరగా మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలని సూచించింది. 5. కుల, మత, ప్రాంతీయ తత్వాలపై పదేళ్ల మారటోరియం ప్రకటించాలని ప్రధాని తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పినప్పటికీ సమాజంలో ఈ మూడు దురాచారాలు పేట్రేగిపోతున్నాయని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. సహకార సమాఖ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆక్షేపించింది. 6. పంటలకు మద్దతు ధరతోపాటు ఇతర అంశాలపై రైతులు, రైతుసంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానికి సీడబ్ల్యూసీ మరోమారు గుర్తు చేసింది. 7. పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పట్ల సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్లకోసారి చేపట్టే జనగణనను 2021లో నిర్వహించకపోవడం సిగ్గుచేటని పేర్కొంది. కులగణన చేపట్టకుండా ఆ ప్రతిపాదనను తిరస్కరించడం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోందని ఆక్షేపించింది. వెంటనే కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 8. కొత్త రాజ్యాంగ రూపకల్పన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చాలనే ప్రయత్నాన్ని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించింది. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చింది. 9. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు రూపొందించే సమయంలో జరగాల్సిన చర్చ పార్లమెంటు సాక్షిగా కనుమరుగైందని సీడబ్ల్యూసీ మండిపడింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి ఉండాల్సిన స్వయంప్రతిపత్తి కోల్పోయేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్ల నియామక బిల్లు ఉందని మండిపడింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేసింది. 10. ప్రధానికి సన్నిహితుడైన ఆదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 11. ఒకే దేశం–ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) విధానం దేశ సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, విపత్తు సహాయ నిధులివ్వడంలోనూ వివక్ష పాటిస్తోందని ఆక్షేపించింది. 12. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను వెంటనే పరిష్కరించుకోవాలని, దేశ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే ధోరణిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని కేంద్రానికి సూచించింది. 13. మతసామరస్యం, సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించే, యువత ఆకాంక్షలను నెరవేర్చి అంతర్జాతీయ సమాజం గర్వించేలా దేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించింది. కులం–మతం, ధనిక–పేద, యువకులు–వృద్ధులు లాంటి భేదాల్లేని జాతి నిర్మాణానికి కృషి చేస్తామని తీర్మానించింది. 14. ఇండియా కూటమి ఏర్పాటును సీడబ్ల్యూసీ స్వాగతించింది. ఈ కూటమి ఏర్పాటు ప్రధానితోపాటు బీజేపీకి భయాందోళనలు కలిగించిందని ఎద్దేవా చేసింది. ఇండియా కూటమిని ఒక సైద్ధాంతిక, ఎన్నికల విజయంగా తీర్చిదిద్దడం ద్వారా దేశంలో విభజన, విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని పేర్కొంది. సామాజిక అసమానతలను రూపుమాపి న్యాయాన్ని బలోపేతం చేయడంలో కూటమి కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించింది. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి... ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతో తొలిరోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. ఖర్గే అధ్యక్షతన భారత్‌జోడో ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్ చౌదరి, సీడబ్ల్యూసీ సభ్యులు ఏకే ఆంటోని, పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, దిగ్విజయ్‌సింగ్, జైరాంరమేశ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌గహ్లోత్, సిద్ధరామయ్య, భూపేశ్భగేల్తోపాటు సుఖి్వందర్సింగ్ సుఖు, రాజీవ్‌శుక్లా, దామోదర రాజనర్సింహ, రఘువీరారెడ్డి యాదవ్, వంశీచందర్‌రెడ్డి, సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులకు సంబంధించిన నివేదికలను ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో అందజేశారు. ఈ నివేదికలపై ఆదివారం కమిటీ చర్చించనుందని సమాచారం. -
కాంగ్రెస్ CWC మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ
-
హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
-
Hyderabad: తాజ్‌కృష్ణపై డేగకన్ను
హైదరాబాద్: నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణ కేంద్రంగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర కొత్వాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికే పలువురు పోలీసు సిబ్బంది ఈ బాధ్యతలు చేపట్టారు. సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, దారి తీసే మార్గాలనూ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నారు. శుక్రవారం నుంచే ప్రముఖులు వస్తుండటంతో అటు శంషాబాద్ విమానాశ్రయంతో పాటు తాజ్ కృష్ణ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతల విభాగంతో పాటు నగర భద్రత విభాగం, ట్రాఫిక్ వింగ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా పని చేస్తున్నారు. హోటల్లో బస చేసి ఉన్న వారి జాబితాలను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన గలాభా నేపథ్యంలో మరింత అప్రమత్తయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజ్ కృష్ణతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి కేవలం అధీకృత వ్యక్తులనే అనుమతించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ మూడు నాలుగు సార్లు అణువణువూ బాంబు నిర్వీర్యం బృందాలు, స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేయనున్నారు. ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో ఇద్దరు అదనపు డీసీపీలు, నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్–ఇన్స్పెక్టర్లు, 13 మంది ఏఎస్సైలు, 110 మంది కానిస్టేబుళ్ళు, నాలుగు ప్లటూన్ల సాయుధ బలగాలు మూడు షిఫ్టులో విధులు నిర్వర్తిస్తాయి. వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది సైతం అవసరమైన సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీడబ్ల్యూసీకి సిటీ ముస్తాబు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో తరలివస్తున్న అతిరథ మహారథులకు నగరం స్వాగతం పలుకుతోంది. సమావేశాల వేదిక తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లే మార్గాలను సుందరంగా అలంకరించిన పార్టీ నాయకత్వం.. భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తింది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో శని, ఆదివారాల్లో జరగనున్న భేటీకి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, ఖర్గే సహా అధినాయకత్వమంతా హాజరు కానుంది. పార్టీ రథ సారథులు నగరానికి కదిలి వస్తుండటంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాగా.. నగర శివారు తుక్కుగూడ వేదికగా జరిగే విజయభేరి సభకు నగర శివారు ప్రాంతాలు సైతం భారీగా ముస్తాబవుతున్నాయి. విజయభేరి బహిరంగ సభకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు పార్టీ కసరత్తు చేస్తోంది. -
రైవాడ జలాశయాన్ని సందర్శించిన సాంకేతిక బృందం
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్ భగత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్‌టాప్‌తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు. 1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్‌వే గేట్లు అమర్చాలని డ్రిప్ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది. అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్ తదితరులు జలాశయ స్థితిగతులను వివరించారు. -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి సర్వం సిద్ధం
-
హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశానికి సర్వం సిద్ధం
-
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 16, 17 తేదీల్లో హైదరా బాద్ వేదికగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణ కోసం టీపీసీసీ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు 39 మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీని నియమించింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, వంశీచందర్‌రెడ్డిలతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా ఏడుగురితో సోషల్ మీడియా కమిటీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ చైర్మన్‌గా ఏడుగురితో ట్రాన్స్‌పోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఖమ్మం మాజీ ఎంపీ, టీపీపీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి చైర్మన్‌గా, గాలి అనిల్‌కుమార్ కోచైర్మన్‌గా పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ కమిటీ, అజారుద్దీన్ చైర్మన్‌గా జీహెచ్ఎంసీ పబ్లిసిటీ కమిటీ, టీపీసీసీ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావు చైర్మన్‌గా ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 29 మందిని సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల -
రిజర్వాయర్ల నీళ్లు.. పూడిక పాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో.. శ్రీశైలం లైవ్ స్టోరేజీ (వాడుకోదగిన నీళ్లు) సామర్థ్యం 253.058 టీఎంసీల నుంచి 188.71 టీఎంసీలకు.. నాగార్జునసాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీల నుంచి 189.295 టీఎంసీలకు పడిపోయింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వేలలో ఈ అంశం వెల్లడైంది. జలాశయాల్లో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల డేటా ఆధారంగా పరిశీలించి, విశ్లేషించడం పూడిక పరిస్థితిపై నివేదికను సిద్ధం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాలు తాగు, సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 13.182 టీఎంసీలు తగ్గిన సాగర్ సామర్థ్యం నాగార్జునసాగర్ డ్యామ్‌ను 1956–1968 మధ్య నిర్మించారు. అప్పట్లో జలాశయం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీలుకాగా, 1999లో నిర్వహించిన శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సర్వేలో సామర్థ్యం 195.806 టీఎంసీలకు తగ్గిపోయిందని తేలింది. 2001, 2009లలో నిర్వహించిన రిజర్వాయర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేలలో మాత్రం సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం వరుసగా 217.47 టీఎంసీలు, 213.388 టీఎంసీలని తేలింది. తాజాగా శాటిలైట్ డేటాను విశ్లేషించగా.. 2020 నాటికి సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 189.295 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1968–2020 మధ్య 52 ఏళ్లలో 13.182 టీఎంసీల ( 6.511శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. సగటున ఏటా 0.125 శాతం నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతోంది. శ్రీశైలానికి 64.339 టీఎంసీల నష్టం కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయాన్ని 1981లో నిర్మించగా.. 1984 నుంచి నీళ్లను నిల్వ చేస్తున్నారు. 253.058 టీఎంసీల లైవ్ స్టోరేజీ, 55 టీఎంసీల డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) కలిపి మొత్తం 308.06 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. తాజా అధ్యయనంలో శ్రీశైలం లైవ్ స్టోరేజీ 188.71 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1984–2021 మధ్య 37 ఏళ్లలో శ్రీశైలం ఏకంగా 64.339 టీఎంసీల (25.425శాతం)సామర్థ్యాన్ని నష్టపోయిందని, ప్రాజెక్టు ఏటా 0.687 శాతం లైవ్ స్టోరేజీని కోల్పోతోందని వెల్లడైంది. ఇంతకుముందు 1990, 1999లలో నిర్వహించిన రిమోట్ సెన్సింగ్ సర్వేల్లో శ్రీశైలం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 194.437 టీఎంసీలు, 181.95 టీఎంసీలకు తగ్గిపోయినట్టు గుర్తించారు. తాజా సర్వేతో పోల్చితే 1990, 1999 నాటి సర్వేలు ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొన్నా.. అప్పట్లో వాటర్ స్ప్రెడ్ ఏరియాను సరిగ్గా అంచనా వేయక కచ్చితమైన ఫలితం రాలేదని తాజా సర్వేలో సీడబ్ల్యూసీ పేర్కొంది. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని అని.. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. ఈ మేరకు తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. ♦ అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకునేందుకు పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా చెట్లను పెంచాలి. ♦ నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ♦ నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. ♦ వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. ♦ రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. -
హైదరాబాద్‌లో CWC సమావేశాల షేడ్యూల్ విడుదల
-
ఎల్బీ స్టేడియం లేదా ఓఆర్ఆర్ సమీపంలో
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణకు ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో అనుమతి లభించదనే అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయా లను పరిశీలిస్తోంది. పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఈనెల 2వ తేదీనే దరఖాస్తు చేసినప్పటికీ బీజేపీ నేతలు అమిత్‌షా సభ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం లేదంటే ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరి సరాల్లోని ఖాళీ స్థలం ఎంచుకుని అక్కడ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించాలనే వ్యూహంతో పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ, అక్కడ ఇప్పటివరకు అనుమతి లభించని కారణంగా మరో స్థలం వెతికే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. సభ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీకి సిద్ధం మరోవైపు, ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా టీపీసీసీ నిర్ణయించింది. గతంలో తిరుపతిలో నిర్వహించిన ప్లీనరీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు గాను పకడ్బందీగా ముందుకెళుతోంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, రాష్ట్ర నాయకులు మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించేందుకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం చేయనున్నారు. నేడు కీలక భేటీ ఇక, టికెట్ల ఖరారులో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగే కసరత్తుకు నేడు తెరపడనుంది. బుధవారం గాంధీభవన్ వేదికగా పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, మేవానీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. వీరంతా సమావేశమై పీఈసీ సమావేశంలో వచ్చిన నివేదికలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన అభ్యర్థుల తుది జాబితాను ఢిల్లీకి పంపనున్నారు. అయితే, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి ఈనెల 7వ తేదీనే పంపనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సీఈసీ సమావేశమై అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. మొత్తంమీద గత 20 రోజులుగా పార్టీ అభ్యర్థిత్వాల కోసం జరుగుతున్న కాంగ్రెస్ కసరత్తు బుధవారం నాటితో రాష్ట్ర స్థాయిలో ముగియనుంది. మరోవైపు బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమా వేశంలో బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన హామీలను ఖరారు చేయనున్నారు. -
హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ భేటీ?
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న తొలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు ఏఐసీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే హైదరాబాద్ శివార్లలో ఈనెల 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెపుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైందని వారంటున్నారు. వాస్తవానికి, ఈనెల 17వ తేదీన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అనుకుంటోంది. భారీ బహిరంగసభ నిర్వహించి, ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించి.. ఆమె చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఈలోపే సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ అంశం ముందుకు రావడంతో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు నిర్వహించి, ఆ సమయంలోనే కాంగ్రెస్ అతిరథ మహారథుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఖర్గేను సంప్రదించిన రేవంత్, సీడబ్ల్యూసీ సమావేశాలను తామే నిర్వహిస్తామని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై స్పందించిన ఖర్గే.. సీడబ్ల్యూసీ నిర్వహణ అంత ఈజీ కాదని, నిర్వాహకులతో పాటు పార్టీ నేతలు, మీడియా, ఇతరులకు ఇబ్బంది అవుతుందేమో ఆలోచించాలని సూచించినట్టు సమాచారం. కానీ, కచ్చితంగా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని, కావాల్సిన ఏర్పాట్లన్నీ తాము చూసుకుంటామని రేవంత్ భరోసా ఇవ్వడంతో ఖర్గే ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా భారీ సభ కూడా ఏర్పాటు చేయాలని, ఆ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలనే యోచనలో టీపీసీసీ ఉందని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ ‘తొలి సమావేశానికి హైదరాబాద్ వేదిక అవుతుంది. అందుకు పార్టీ కూడా ఓకే చెప్పింది. అయితే, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తేదీలు మారే అవకాశం ఉంది. తేదీలు మారినా సీడబ్ల్యూసీ ఫస్ట్ మీటింగ్ మాత్రం హైదరాబాద్‌లోనే’అని ఆ నాయకుడు స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కు ‘స్క్రీనింగ్’ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ‘స్క్రీనింగ్’ పరీక్ష మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం కత్తి మీద సాములా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 70 నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఆయా చోట్ల గెలవగలిగేవారిని గుర్తించడంపై కీలక నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మంగళవారం జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం కీలకంగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట అభ్యర్థుల ఎంపికకు, తిరస్కరణకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు, ఏ ప్రాతిపదికలను అనుసరిస్తారన్నది రాష్ట్ర కాంగ్రెస్ కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురి చొప్పున ఎంపిక చేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో.. వాటిని వడపోసేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) మంగళవారం సమావేశం అవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను పరిశీలించి.. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను, సమస్యాత్మకంగా ఉన్న చోట్ల గరిష్టంగా ఐదుగురి పేర్లను ఎంపిక చేయనుంది. పీఈసీ సమావేశం ముగిశాక వీలైనంత త్వరగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి.. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు లేదా మూడు పేర్లను ఖరారు చేయనున్నారు. అనంతరం ఆశావహుల జాబితాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపిస్తారు. ఆ కమిటీ సమావేశమై ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి పేరును ఎంపిక చేస్తుంది. ఈ జాబితాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి పంపుతుంది. సీడబ్ల్యూసీ ఆమోదం లభించాక అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తామని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 15–20 రోజుల వరకు ఱసమయం పడుతుందని.. సెప్టెంబర్ మూడో వారానిల్లా తొలి విడత జాబితా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. మరోవైపు అభ్యర్థుల ప్రకటన వచ్చే లోగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అవుతుందని, ఆ తర్వాత అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని చెప్తున్నాయి. నాయకత్వ లేమి ఎఫెక్ట్! అభ్యర్థిత్వం కోసం 10–12 నియోజకవర్గాల్లో గరిష్టంగా రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, మధిర, హుజూర్నగర్, మంథని, సంగారెడ్డి వంటి నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. అంటే పార్టీ కీలక నేతలున్న చోట్ల దరఖాస్తులు పెద్దగా రాలేదు. ఇప్పుడు ఇదే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులకు సవాల్‌గా మారనుంది. భారీగా దరఖాస్తులు వచ్చిన చోట్ల మూడే పేర్లను మాత్రమే సూచించాల్సి ఉంటుంది. వారి నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే మిగతా దరఖాస్తుదారులను ఏ ప్రాతిపదికన తిరస్కరిస్తారు? ఎంపి చేసే ముగ్గురిని ఏ కారణాలతో ఓకే చేస్తారన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీపీసీసీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ ‘‘దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయని, పార్టీలో ప్రజాస్వామ్యం బాగున్నందునే ఇన్ని దరఖాస్తులు వచ్చాయనేది పైకి చెప్పుకునే మాట. కానీ 70 స్థానాల్లో విచ్చలవిడిగా దరఖాస్తులు వచ్చాయంటే.. అక్కడ నాయకత్వ లేమి ఉందని, నియోజకవర్గ స్థాయిలో ప్రభావితం చూపేవారు సరిగా పనిచేయడం లేదని అర్థమవుతోంది. ఈ ప్రతికూల పరిస్థితులను పీఈసీ సమావేశం ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి’’ అని పేర్కొనడం గమనార్హం. అసలు టాస్క్ మొదలు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ సాగిన తీరును పరిశీలిస్తే.. మంగళవారం జరిగే పీఈసీ సమావేశంలో దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ ప్రక్రియ పెద్ద టాస్క్ కానుందని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు జరిగిన దరఖాస్తుల స్వీకరణలో మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 1,016 దరఖాస్తులు వచ్చాయి. వీటిని జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విభజించి చూస్తే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి, నియోజకవర్గ స్థాయిలో స్పష్టతలేని చోట్ల నుంచి, సరైన నాయకత్వం లేనిచోట్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టు తేలింది. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గానికి ఏకంగా 38 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. గోషామహల్లో 19 రాగా.. అశ్వారావుపేట, సనత్‌నగర్, మిర్యాలగూడ, సికింద్రాబాద్ వంటి చోట్ల కూడా ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలు 70 వరకు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
సమర సన్నాహాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీ సొంత గూటిలో సర్దుబాట్లతో సమరానికి సన్నద్ధమవుతున్నట్టుంది. పది నెలల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదివారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. నిరుడు జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే ఆచితూచి వ్యవహరిస్తూ, ఇన్నాళ్ళకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ)ని పునర్వ్యవస్థీకరించారు. సరికొత్త సీడబ్ల్యూసీపై గాంధీ కుటుంబ ముద్ర సుస్పష్టం. అయితే, ఒకపక్క విశ్వాసపాత్రులైన పాత కాపుల్ని కదిలించకుండానే, మరోపక్క కొత్త వారికీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారికీ, వివిధ సామాజిక వర్గాలకూ స్థానం కల్పించారు. ఇలా పార్టీలో నవనవోత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించడం స్వాగతనీయం. సోనియా కుటుంబానికి వీరవిధేయుడైనప్పటికీ, కేవలం డూడూబసవన్నలా ఖర్గే ఉండిపోలేదు. కొత్త కార్యవర్గంలో గాంధీ శిబిరం వారితో పాటు తన సొంత శిబిరం వారికీ చోటిచ్చారు. వివిధ సామాజిక వర్గాలకు చోటిస్తూ సమ తూకం సాధించడంతో ఈ కొత్త కార్యవర్గం రానున్న ఎన్నికల టీమ్ అని అర్థమవుతోంది. సోనియా అధ్యక్ష కాలంలోని 2020 సెప్టెంబర్ తర్వాత సీడబ్ల్యూసీ ప్రక్షాళన మళ్ళీ జరగడం ఇప్పుడే! అనేక విడతల చర్చల తర్వాత కొత్త కమిటీ కొలువు తీరింది. 39 మంది శాశ్వత సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది రాష్ట్ర ఇన్–ఛార్జ్‌లు, నలుగురు సంస్థాగత ఇన్–ఛార్జ్‌లు, మరో 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు – ఇలా మొత్తం 84 మంది సభ్యులతో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద సీడబ్ల్యూసీ ఇది. పాత, కొత్తల మేలు కలయికగా ఏర్పాటైన వర్కింగ్ కమిటీలో ప్రజా స్వామ్య స్ఫూర్తిని పెంచడం హర్షణీయం. రాజస్థాన్‌లో సొంత పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న సచిన్ పైలట్‌కు కార్యవర్గంలో స్థానమివ్వడం, అలాగే నిరుడు పార్టీ అంతర్గత ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి ఖర్గేతో పోటీపడిన శశి థరూర్‌కు సైతం చోటివ్వడం ఆశ్చర్యకరమే. అలాగే, పార్టీకి సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించిన జి–23 బృందంలోని అసమ్మతి నేతల్లో భాగమైన ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్‌లను సైతం కొత్త సభ్యులుగా తీసుకోవడం గమనార్హం. ఇది అవసరమైన రాజకీయ చాణక్యమే. విభిన్న స్వరాలు వినిపించేవారిని సైతం విధాన నిర్ణయాలు తీసుకొనే వేదికలో భాగస్వాముల్ని చేయడం అంతర్గత ప్రజాస్వామ్యానికి సూచిక. 138 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ఒక పార్టీ సమకాలీన చైతన్యశీల ప్రస్థానానికీ, పురోగతికీ దీర్ఘకాలంలో అది కీలకం కూడా! ముఖ్యంగా ఈ ఏడాది చివరి కల్లా మిజోరమ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలున్న వేళ ఆ ప్రాంతాలకూ ప్రాముఖ్యం, ప్రాతినిధ్యం ఇస్తూ ఈ పునర్వ్యవస్థీకరణ సాగడం గమనార్హం. ఎన్నికలున్న రాజస్థాన్‌లో అసమ్మతి నేత సచిన్ పైలట్‌కూ, అలాగే ఛత్తీస్‌గఢ్‌లో బలమైన ఫ్యాక్షన్ నాయకుడూ, ఓబీసీ అయిన మంత్రి తామ్రధ్వజ్ సాహూకూ పార్టీ అత్యున్నత వేదికలో చోటివ్వడం తక్షణ ప్రయోజ నాలకు తప్పక పనికొస్తుంది. అలా చూస్తే, ఆలస్యమైనా ఖర్గే ఆలోచించి పావులు కదిపారనుకోవాలి. గత కమిటీలో ఒక్క ఓబీసీయే ఉంటే, ఈసారి ఆరుగురికి స్థానం దక్కడం, 9 మంది ఎస్సీలకూ, ఒక గిరిజన నేతకూ సీటివ్వడం... ఉదయ్‌పూర్ డిక్లరేషన్కూ, సామాజిక న్యాయానికీ కట్టుబడి ఉన్నామనే భావన కలిగించడానికీ కాంగ్రెస్‌కు ఉపకరిస్తుంది. అయితే, 15 మంది స్త్రీలకు స్థానం కల్పించినా, మహిళా సాధికారత మంత్రం పఠిస్తున్న పార్టీ ఈ సంఖ్యను మరింత పెంచుకోవడం అవసరం. నిజానికి, సీడబ్ల్యూసీలో 50 ఏళ్ళ లోపు వారు 50 శాతమైనా ఉండాలన్నది లక్ష్యమని కాంగ్రెస్ కొంతకాలంగా చెబుతోంది. గత ఏడాది మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయ్‌పూర్‌లో సాగిన పార్టీ ప్లీనరీలో ఆ మేరకు సంకల్పం కూడా చెప్పుకుంది. తాజా పునర్వ్యవస్థీకరణ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. అయితే, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే లాంటి యువ నాయకత్వాన్ని సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నంగా భావించవచ్చు. సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యుల సంఖ్యను 23 నుంచి 35కు పెంచుతామని రాయ్‌పూర్ ప్లీనరీలో చెప్పిన పెద్దలు ఆ అవధిని మరింత పెంచి, 39 మంది శాశ్వత సభ్యులను తీసుకోవడమూ అనేక రాజకీయ అనివార్యతలకు అద్దం పడుతోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరపకుండా, ఖర్గేయే నామినేట్ చేస్తారని నిర్ణయించిన పార్టీ ఇప్పటికి ఈ ఘట్టాన్ని పూర్తి చేసింది. వెరసి, కొత్త కార్యవర్గం కూర్పు కొంత సృజనాత్మక ధోరణిలో, మరికొంత రాజీ మార్గంలో పయనించిందని చెప్పక తప్పదు. శశిథరూర్ పేర్కొన్నట్టు, సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలే ఏ పార్టీకైనా జీవనాడి. వారితో నిండిన పార్టీలు, కార్యవర్గాలే ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో ముందడుగు వేయగలవు. సీడబ్ల్యూసీ కూర్పులో ఆ సంగతి ఖర్గే బాగానే గ్రహించారు. కానీ, సవాళ్ళు ముగిసిపోలేదు. అద్వానీ తర్వాత స్వతంత్ర భారతావనిలో ఏకకాలంలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతి పక్ష నేతగా ఉన్న 81 ఏళ్ళ ఖర్గే ఎన్నికల బరిలోనూ కాంగ్రెస్‌ను తీరానికి చేర్చాలి. ఆ మధ్య దాకా నీరసించిన పార్టీ నిరుడు హిమాచల్‌లో, ఈ ఏడాది కర్ణాటకలో దక్కిన విజయాలతో తెరిపిన పడింది. ఆ విజయ పరంపరను కొనసాగించాలంటే అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలు,‘ఇండియా’ కూటమిలో ఇతర ప్రతిపక్షాలతో సంప్రతింపులు – ఇలా ఖర్గే చేతి నిండా పని ఉంది. సోనియా కుటుంబంతో సమన్వయం చేసుకుంటూనే ఆ పనిని ఆయన ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి. ఒక్కమాటలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది! -
ఆచితూచి..అత్యున్నత హోదా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నేతలకు చోటు కల్పించే విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వనితుడిగా నియమించడం వెనుక పార్టీ హైకమాండ్‌కు భారీ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు, సామాజిక సమతుల్యతలను దృష్టిలో ఉంచుకునే, ఎవరూ ఊహించని విధంగా దామోదరకు స్థానం కల్పించారని, దళిత వర్గాలను ఆకట్టుకోవాలనే ఆలోచనతోనే ఆయనకు అత్యున్నత హోదాను కట్టబెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో నాయకుడు, విద్యార్థి సంఘం నుంచి పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి కూడా పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. చాలాకాలంగా ఆయన ఢిల్లీ కేంద్రంగా పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీ.. పార్టీ పెద్దలకు అనేక అంశాల్లో సహాయకారిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా వంశీ సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఆయనను ప్రత్యేక ఆహ్వనితుడిగా నియమించినట్టు సమాచారం. అయితే, సీడబ్ల్యూసీలో స్థానం కల్పిస్తారంటూ ప్రచారం జరిగిన కొందరికి చోటు దక్కకకపోవడం, పార్టీపరంగా ఏ మాత్రం ప్రభావం లేని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులకు నేరుగా స్థానం కల్పించి, అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలంగాణ నేతలను మాత్రం ఆహ్వనితుల హోదాకు మాత్రమే పరిమితం చేయడంపై రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో స్థానం దక్కవచ్చనే చర్చ గతంలో జరిగింది. మరో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆ రేసులో ఉన్నారని, గిరిజన మహిళ కోటాలో సీతక్కకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అనూహ్యంగా దామోదర, వంశీలకు స్థానం కల్పించడం గమనార్హం. రేవంత్, భట్టి అభినందనలు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి కమిటీ అయిన సీడబ్ల్యూసీలో స్థానం పొందిన తెలంగాణ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు అభినందనలు తెలిపారు. తెలంగాణకు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించినందుకు గాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీకి ఆదివారం వారు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ వర్గంలో కీలకంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కడం పట్ల భట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆశావహుల్లో అసంతృప్తి! ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీలో కచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు నారాజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి కొంతకాలం పాటు అసమ్మతితో ఉన్నా ఆ తర్వాత క్రమంగా సర్దుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆయనను స్టార్ క్యాంపెయినర్ హోదాకు మాత్రమే పరిమితం చేసింది. ఇటీవల నియమించిన స్క్రీనింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కకపోవడంతో అధిష్టానం ఏదైనా మంచి హోదా కల్పిస్తుందనే ఆశతో కోమటిరెడ్డి శిబిరం ఉంది. కానీ సీడబ్ల్యూసీ లోనూ పేరు కనిపించకపోవడంతో కోమటిరెడ్డి అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని భావించిన సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల కూడా హైకమాండ్ తాజా నిర్ణయంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ వర్గాల చర్చలో ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కూడా అవకాశం రాకపోవడం, రాహుల్ దృష్టిలో ఉన్నారని, రేవంత్ కూడా సిఫారసు చేశారని ప్రచారం జరిగి, గిరిజన కోటాలో ఈ సారి చాన్స్ ఉంటుందని భావించిన ఎమ్మెల్యే సీతక్కపేరు కూడా జాబితాలో కనిపించక పోవడంతో వారి మద్దతుదారులు అసంతృప్తిలో మునిగిపోయారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణకు చెందిన మరో ఒకరిద్దరు నేతలకు సీడబ్లూసీలో చోటు కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. -
గోదావరిలో చుక్కనీటినీ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు. జీ–10 సబ్ బేసిన్లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు. -
శ్రీశైలంలో ఆగని విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రలోని కుడిగట్టులో స్వల్పంగా.. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం నీళ్లపై ఆధారపడి ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిపివేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించినా ఖాతరు చేయకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. కాగా, శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.192 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను, ఎడమగట్టు కేంద్రంలో 7.975 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌కు 15,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి గత 4 రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుండడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 119.7828 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. -
కడెం పరిస్థితిపై సీడబ్ల్యూసీ అధ్యయనం
కడెం: భారీగా వరదలు రావడం, గేట్లు సరిగా పనిచేయక ఆందోళన నెలకొనడం నేపథ్యంలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ భద్రత బృందం శుక్రవారం పరిశీలించింది. మొత్తం 24 మంది అధికారులు, సిబ్బంది డ్యామ్ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. వరద గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డు వంటి వాటిని పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులు గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్ (రక్షణ గోడ), స్పిల్‌వేలను సీడబ్ల్యూసీ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్య మాట్లాడారు. కడెం ప్రాజెక్టు భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రమాదం నెలకొని ఉందని, డ్యాం భద్రతకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో హైడ్రాలజిస్ట్ చీఫ్ ఇంజనీర్ రామరాజు, డ్యాం భద్రత నిపుణుడు టి.దేశాయి, జియాలజిస్ట్ ఎం.రాజు, హైడ్రో మెకానికల్ నిపుణులు కె.సత్యనారయణ, యోగీందర్కుమార్శర్మ, సీఈ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ప్రాజెక్ట్ సిబ్బంది ఉన్నారు. శాంతించిన కడెం.. గేట్లకు మరమ్మతులు భారీ వరదతో ప్రాజెక్టును కోతకు గురిచేస్తుందా అన్న ఆందోళన రేపిన కడెం వాగు శాంతించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 1,46,675 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. రాత్రికి 13,550 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఏడు గేట్ల ద్వారా 20,998 క్యూస్కెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 685.150 అడుగులుగా ఉంది. రెండు రోజుల కింద తెరుచుకోకుండా మొరాయించిన 3వ నంబర్ గేటుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా భారీ వరదతో ఎడమ కాల్వపై మైసమ్మ గుడివద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ మరమ్మతులు పూర్తిచేసేదాకా సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీనితో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
గోదావరి నికర జలాల్లో మిగులే లేదు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది నికర జలాల్లో మిగులు లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి న నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఎలా చేపడతారని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖల అధికారులు నిలదీశారు. గోదావరి బేసిన్లో రెండు రాష్ట్రాల్లో పూర్తయిన, నిర్మాణం , ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకే 306 టీఎంసీల మేర నికర జలాల కొరత ఉందని సీడబ్ల్యూసీ తేల్చి న అంశాన్ని ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తరలిస్తే రాష్ట్రాల్లో ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ స్పందిస్తూ.. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేని మాట వాస్తవమేనని అంగీకరించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపడతామని చెప్పడంతో ఛత్తీస్‌గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మా కోటా నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని తేల్చిచెప్పారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 71వ పాలక మండలి సమావేశం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందరసింగ్ వోరా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, సీఈ రమేశ్, అంతర్రాష్ట్ర విభాగం డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుసంధానానికి సిద్ధమన్న ఎన్‌డబ్ల్యూడీఏ గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీ లను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించడానికి రూపొందించిన గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. ఇందులో తెలంగాణకు 45, ఏపీకి 44, తమిళనాడుకు 40, కర్ణాటకకు 9.9, పుదుచ్చేరికి 2.1 టీఎంసీలు ఇస్తామని పేర్కొన్నా రు. దీనిపై ఇప్పటికే నాలుగుసార్లు రాష్ట్రాలతో సంప్రదింపు లు జరిపామని.. అనుసంధానం పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ చెప్పడంతో ఏపీ, తెలంగా ణ, ఛత్తీస్‌గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుసంధానానికి అంగీకరించమన్న ఛత్తీస్‌గఢ్ కోటా నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతున్నామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మీరు ప్రాజెక్టులు కట్టేలోగా మహానది నుంచి గోదావరికి జలాలను తరలిస్తామని.. వాటిని కావేరికి తీసుకెళ్తామని ఛత్తీస్‌గఢ్ అధికారులకు ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ సర్దిచెప్పబోగా ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానది నుంచి గోదావరికి జలాలను తెల్చి నా సరే.. రెండు రాష్ట్రాల అవసరాలు తీర్చాకే కావేరికి గోదావరిని తరలించాలని తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కల్పించేలా చేపట్టే గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు జారీ చేసిన తర్వాతే నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్ సమ్మతి తర్వాతే... అన్ని రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి రాతపూర్వక సమ్మ తి తీసుకున్న తర్వాతే అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని, అనంతరం డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఖరారు చేసి సంబంధిత రాష్ట్రాలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. -
Polavaram Project: కొత్త డయాఫ్రమ్ వాల్!
సాక్షి, అమరావతి: పోలవరం ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఆవశ్యకతపై నివేదిక సమర్పించడమే అజెండాగా కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా వరద ప్రవాహాన్ని దిగువకు పంపే స్పిల్ వేను గోదావరి కుడి గట్టుకు అవతల రాతి నేలపై.. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను మూడు భాగాలుగా (గ్యాప్–1లో 564, గ్యాప్–2లో 1,750, గ్యాప్–3లో 140 మీటర్లు) గోదావరి గర్భంలో ఇసుక తిన్నెలపై నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను రూపొందించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించారు. గ్యాప్–1, గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ పేర్కొంది. కమీషన్ల కోసం చంద్రబాబు ఘోర తప్పిదం.. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టాలి. వాటి మధ్యన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ చంద్రబాబు కమీషన్ల దాహంతో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికి పూర్తి చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఇరువైపులా 800 మీటర్ల పొడవున ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గోదావరికి 2019 అక్టోబర్‌లో భారీ వరద వచ్చింది. 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో 800 మీటర్లకు కుచించుకుపోయింది. దీంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నిర్వాకాల కారణంగా పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఆ తప్పిదాలను సరిదిద్దేందుకు రూ.2,020 కోట్లకుపైగా వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశారు. గోదావరి వరదను మళ్లించాక ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1లో 393 మీటర్ల పొడవుతో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. వరద ఉద్ధృతికి గ్యాప్–1లో డయాఫ్రమ్ వాల్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. ► వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో జి.కొండ కుడివైపున 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకూ 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్ గత సర్కారు నిర్వాకాలతో దెబ్బతింది. ► దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించి 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకూ 185 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనట్లు తేల్చారు. ► 480 నుంచి 510 మీటర్ల మధ్య 30 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 950 – 1,020 మధ్య 70 మీటర్ల మేర దెబ్బతినగా 1,170 నుంచి 1,370 మీటర్ల వరకూ 200 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు తేల్చారు. అంటే 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో 485 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ► 363 మీటర్ల నుంచి 1,035 మీటర్ల వరకూ 672 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పైభాగంలో ఐదు మీటర్ల మేర దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. డ్యామ్ భద్రత దృష్ట్యా.. దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని తొలుత సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ప్రతిపాదించారు. అయితే ఈ పనులు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేయలేదు. అంతిమంగా ఇది డ్యామ్ భద్రతకే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈనెల 3న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం కంటే డ్యామ్ భద్రత దృష్ట్యా 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మొగ్గు చూపారు. దీనిపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వాలని జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించడంతో నేడు ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పోలవరం వద్ద 498.07 టీఎంసీల లభ్యత పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో 75 శాతం (నికర జలాలు) లభ్యత ఆధారంగా ఏటా సగటున 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం తాజాగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.7 టీఎంసీలను వినియోగించుకోవడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. అంటే ట్రిబ్యునల్ అనుమతించిన దాని కంటే పోలవరం వద్ద గోదావరిలో నికర జలాల లభ్యత 13.37 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో సబ్ బేసిన్ల వారీగా గోదావరిలో నీటి లభ్యతను తేల్చాకే రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో గోదావరి బోర్డు ఆ బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించింది. పోలవరానికి సగటున 1,198.35 టీఎంసీలు తెలుగు రాష్ట్రాల పరిధిలో పెన్‌గంగా (జీ–7), ప్రాణహిత (జీ–9), దిగువ గోదావరి (జీ–10), ఇంద్రావతి(జీ–11), శబరి (జీ–12) పరీవాహక ప్రాంతాలలో 1971–72 నుంచి 2011–12 మధ్య 41 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో ఏటా 1,435 టీఎంసీల నికర జలాల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం వద్దకు ఏటా సగటున 1,198.35 టీఎంసీల ప్రవాహం వస్తుందని అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల మధ్య ఏటా సగటున 778.39 టీఎంసీల ప్రవాహం ఉంటుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 45.83 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. -
గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత
సాక్షి, హైదరాబాద్: గోదావరి జల వివాదాల (బచావత్) ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే నాటికి గోదావరిలో మొత్తం 4,535.1 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా అంచనా వేసింది. ఇక 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత ఉందని తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల లభ్యత ఉందని 2004లో వ్యాప్కోస్ తేల్చగా.. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,435 టీఎంసీల లభ్యత ఉందని తేల్చింది. వ్యాప్కోస్ అంచనా వేసిన దానికంటే ఐదు టీఎంసీలు అధికంగా ఉన్నట్లు తేల్చింది. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో 1941–42 నుంచి 1979–80 వరకూ వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై తాజాగా సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. గోదావరిలో ఉప నదీ పరీవాహక ప్రాంతాల(సబ్ బేసిన్) వారీగా నీటి లభ్యత, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం ఉమ్మడి మధ్యప్రదేశ్‌కు 679.6, మహారాష్ట్రకు 951, కర్ణాటకకు 37.8, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435, ఒడిశాకు 293.6 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినట్లు అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సీడబ్ల్యూసీ ఇటీవల సమర్పించింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను జీఆర్ఎంబీ కోరింది. తాజా అధ్యయన నేపథ్యం ఇదీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోని గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల (70 టీఎంసీల పునరుత్పత్తి జలాలు) 2004లో వ్యాప్కోస్ తేల్చింది. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,238.46 టీఎంసీలు (902.46 నికర, 336 మిగులు) అవసరమని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేక సందర్భా లలో స్పష్టం చేసింది. ఇక తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రా జెక్టులకు 1,767 టీఎంసీలు (967 నికర, 800 మిగులు) అవసరమని తెలిపింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే 3,005.46 టీఎంసీలు అవసరం. ఈ నేపథ్యంలో.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేశాకే.. కొత్త ప్రాజెక్టులకు అనుమతివ్వాలని జనవరి 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో గోదావరి బోర్డును రెండు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతను తేల్చకుండానే.. అప్పట్లో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ జలాలను పంపిణీ చేసింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చా లని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అటు కేంద్ర జల్ శక్తి శాఖను.. ఇటు గోదావరి బోర్డును కోరుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే నాటికి గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. నివేది క ఇవ్వాలని గత జనవరి 19న సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు లేఖ రాసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా.. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద పురుడుపోసుకునే గోదావరి 1,465 కిలోమీటర్ల పొడవున ప్రవహించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో 3,12,150 చ.కి. మీ. పరిధిలో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. గోదావరి జలాలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 1980, జూ లై 7న బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి నివేదిక ఇచ్చి ంది. అదే ఏడాది ఆ అవార్డును కేంద్రం అమల్లోకి తెచ్చి ంది. ఈ నేపథ్యంలో 1941–42 నుంచి 1979–80 వరకూ అంటే 40 ఏళ్లు గోదావరి బేసిన్లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తాజాగా అధ్యయనం చేసింది. -
గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి : గోదావరి జల వివాదాల (బచావత్) ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే నాటికి ప్రతి ఏటా గోదావరిలో మొత్తం 4,535.1 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా 3,396.9 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో 1941–42 నుంచి 1979–80 వరకు వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడ బ్ల్యూసీ ఈ అధ్యయనం చేసింది. గోదావరిలో సబ్ బేసిన్ వారీగా నీటి లభ్యత, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల లభ్యత ఉందని 2004లో వ్యాప్కోస్ లెక్కేయగా, సీడబ్ల్యూసీ తాజా అధ్య యనంలో 1,435 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. వ్యాప్కోస్ అంచ నా కంటే సీడబ్ల్యూసీ అధ్యయనంలో 5 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు స్ప ష్టమవుతోంది. ఈ అధ్యయనం ప్రకారం ఉమ్మడి మధ్యప్రదేశ్‌కు 679.6 టీఎంసీలు, మహారాష్ట్రకు 951, కర్ణాటకకు 37.8, ఉమ్మడి ఏపీకి 1,435, ఒడిశాకు 293.6 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినట్లు అంచనా వేస్తూ సీడబ్ల్యూసీ ఇటీవల గోదావరి బోర్డుకు నివేదిక స మర్పించింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను గో దావరి బోర్డు కోరింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గోదావరి జ లాలపై 7 అధ్యయనాలు జరగ్గా సీడబ్ల్యూసీ చేసిన తాజా అధ్యయనం ఎనిమిదోది. తాజా అధ్యయనం నేపథ్యం ఇదీ ఏపీలో ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రా జెక్టులకు 1,238.46 టీఎంసీలు (902.46 నికర, 336 మిగులు) అవసరమని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. తెలంగాణ కూడా ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవి ష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,767 టీఎంసీలు (967 నికర, 800 మిగులు) అవసరమని బోర్డుకు తెలిపింది. 2 రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే 3,005.46 టీఎంసీలు అవసరం. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేశాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతివ్వాలని జనవరి 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో 2 రాష్ట్రాలు బోర్డును కోరాయి. గోదా వరిలో సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతను తేల్చకుండానే అప్పట్లో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ జలాలను పంపిణీ చేసింది. ఇదే అంశాన్ని వివరిస్తూ గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే నాటికి గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జనవరి 19న సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు లేఖ రాసింది. బోర్డు ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద పురుడుపోసుకునే గోదావరి 1,465 కి.మీ పొడవున ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళా ఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. గోదావరి జలాలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 1980 జూలై 7న బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అదే ఏడాది ఆ అవార్డును కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో 1941–42 నుంచి 1979–80 వరకు అంటే 40 ఏళ్లు గోదావరి బేసిన్లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తాజాగా అధ్యయనం చేసింది. -
డిజైన్‌కు తగ్గట్టుగానే పోలవరం గైడ్ బండ్ నిర్మాణం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌కు తగ్గట్టుగా, నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్‌ను నాణ్యంగా నిర్మించినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిపుణుల కమిటీ తేల్చింది. కానీ.. గైడ్ బండ్ కొంత భాగం కాస్త జారిందని, ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విషయంపై మేధోమథనం జరిపింది. మట్టి పరీక్షల నివేదికలను పరిశీలిం చింది. గైడ్ బండ్ జారిన ప్రాంతానికి తాత్కాలిక మరమ్మతులపై నాలుగు రోజుల్లోగా ప్రతిపాదన ఇస్తే.. దాన్ని సరిచూసి సీడబ్ల్యూసీకి నివేదిస్తామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తక్షణం మరమ్మతుల చేయాలని, ఆ తర్వాత గైడ్ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎస్కే సిబాల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) డైరెక్టర్ చిత్ర, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్ సభ్యులుగా సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ మేఘా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. స్పిల్ వే, గేట్లు, స్పిల్ చానల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. గైడ్ బండ్‌ను సమగ్రంగా పరిశీలించింది. పరిమితికి లోబడే ఎగువ కాఫర్ డ్యామ్ లీకేజీలు గతేడాది గోదావరికి భారీ స్థాయిలో వచ్చిన వరదలను దీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచింది. దీన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీలను రీచ్‌లవారీగా ఎప్పటికప్పుడు అధునాతన హైడాల్రిక్ డాప్లర్ టూల్‌తో కొలుస్తున్నామని రాష్ట్ర అధికారులు కమిటీకి వివరించారు. హైడ్రాలిక్ డాప్లర్ టూల్లో రికార్డయిన గణాంకాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని పేర్కొంది. వరదల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ కాఫర్ డ్యామ్ భద్రతను పర్యవేక్షించాలని సూచించింది. యథాస్థితికి తెచ్చే పనులపై సంతృప్తి గత ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసిన దిగువ కాఫర్ డ్యామ్ నాణ్యతపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్ వద్ద వరద ఉధృతికి ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులను పరిశీలించింది. ఈ పనులు పూర్తయ్యాక డయాఫ్రం వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రం వాల్ వేసే పనులు చేపడతామని రాష్ట్ర అధికారులు వివరించారు. శుక్రవారం నిపుణుల కమిటీ మరో సారి రాష్ట్ర అధికారులతో సమావేశమై.. సాంకేతిక అంశాలపై చర్చించనుంది. క్షేత్ర స్థాయి పర్యటన.. అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. -
పోలవరం చకచకా..
గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీలు వదిలేశారు. ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి కీలకమైన డయాఫ్రమ్ వాల్ దారుణంగా దెబ్బతింది. దీని వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడమే కాదు.. వాటిని చక్కదిద్దడం కోసం రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఎల్లో మీడియాకు కనిపించలేదు. ఎందుకంటే.. అప్పట్లో ఆ పనులను రామోజీరావు బంధువులకే నామినేషన్ పద్ధతిలో అప్పగించారు కాబట్టి. ఆ తప్పిదాలన్నింటినీ సరిదిద్దుతూ.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. టీడీపీ సర్కార్ హయాంలో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల గోదావరి వరదల ఉధృతికి ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక తిన్నెలు కోతకు గురై ఏర్పడిన అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తయితే.. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వాటి మధ్య గోదావరి వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ (ప్రధాన) డ్యామ్ పనులు చేపట్టి.. గడువులోగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుందని సూచించారు. మంగళవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.. 9.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ దిగి నేరుగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్దకు చేరుకున్నారు. మండుటెండలో కలియతిరుగుతూ.. మండుటెండలో తీవ్రమైన ఉక్కపోత మధ్య సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను ఒక గంటా 40 నిమిషాలపాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గైడ్ వాల్లను పరిశీలిస్తూ.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గత సీజన్లో వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచిన పనులను పరిశీలించారు. టీడీపీ సర్కార్ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్‌లో రెండు వైపులా 800 మీటర్లు ఖాళీ వదిలేసి, అరకొరగా చేసిన పనులను.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 44 మీటర్ల ఎత్తుతో పూర్తయిన ఎగువ కాఫర్ డ్యామ్ పనులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అగాధాలను ఇసుకతో నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను పరిశీలించారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులను పరిశీలిస్తూ.. దిగువ కాఫర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గోదావరి వదరల ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాన్ని పూడ్చి.. 31.5 మీటర్ల ఎత్తుతో ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసిన ఆ డ్యామ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలలో ఇసుకను నింపి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చే పనులను నిశితంగా పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడంపై అధికారులతో చర్చించారు. సీఎం చొరవ వల్లే నిధులు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్దే మీటింగ్ హాల్లో జల వనరుల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశను పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం జారీ చేసిందని జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపంతో చేపట్టిన పనుల వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి యథా స్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాల కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. బిల్లుల చెల్లింపులో కాంపొంనెంట్(విభాగాల) వారీ విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని అధికారులు వివరించారు. మీ (సీఎం) చొరవ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు గైడ్ వాల్లో ఏర్పడిన చిన్న సమస్యను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్లతోనే గైడ్ వాల్ పనులు చేశామని చెప్పారు. ప్రస్తుత సమస్యను కూడా సీడబ్ల్యూసీకి నివేదించామన్నారు. గైడ్ వాల్లో ఉత్పన్నమైన సమస్యను సరిదిద్దడం పెద్ద విషయం కాదని.. సీడబ్ల్యూసీ అధికారులు పరిశీలించాక.. వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని వివరించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్య మీడియా మన రాష్ట్రంలో ఉందని ఎత్తిచూపారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్ వాల్లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుని సరిదిద్దే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి పినిపే విశ్వరూప్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కీలక పనుల్లో గణనీయమైన ప్రగతి పోలవరం ప్రాజెక్టులోని కీలక పనుల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు పూర్తి చేశామని.. 48 రేడియల్ గేట్లను పూర్తి స్థాయిలో అమర్చామని.. రివర్ స్లూయిస్ గేట్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ పూర్తయిందని చెప్పారు. జల విద్యుత్కేంద్రంలో సొరంగాల తవ్వకం పూర్తయిందని.. అప్రోచ్ ఛానల్ తవ్వకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాన్ని ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు పూర్తయ్యాయన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను నింపడానికి అవసరమైన ఇసుకను వంద శాతం ఆ ప్రాంతానికి తరలించామని చెప్పారు. ఆ ఇసుకను అగాధాలలో నింపే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1 పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్యాప్–2లో యధాస్థితికి తెచ్చే పనులను త్వరగా పూర్తి చేసి.. వీలైనంత తొందరగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్నారు. ఈ పనులు పూర్తయితే.. గ్యాప్–2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి.. వరదల్లోనూ నిర్విఘ్నంగా కొనసాగించడం ద్వారా గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో అగాధాల పూడ్చివేత, కొత్త డయాఫ్రమ్ వాల్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. పునరావాసం కల్పనపై ప్రత్యేక దృష్టి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 నిర్వాసిత కుటుంబాలకుగాను 12,658 కుటుంబాలకు పునరావాసం కల్పించామని చెప్పారు. మరో 8,288 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగంగా చేస్తున్నామన్నారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్‌లోకి 36 గ్రామాలు వస్తాయని తేలిందని, ఆ గ్రామాల్లోని 16,642 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని చెప్పారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక.. షెడ్యూలు ప్రకారం నిర్వాసితులను అక్కడికి తరలించాలని సూచించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకట్టుకునేలా బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. పర్యాటకుల కోసం అధునాతన సదుపాయాలతో హోటల్ ఏర్పాటు చేయాలన్నారు. -
2025 జూన్‌కు పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, 2025 జూన్‌కు ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించి, రైతులకు ఫలాలను అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, సలహాదారు వెదిరె శ్రీరాంలతో కలిసి మంత్రి షెకావత్ సమీక్షించారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి (ఇన్చార్జి) శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి షెకావత్‌కు ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని చెప్పారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యధాస్థితికి తెస్తున్నామన్నారు. మళ్లీ వరదలు వచ్చేలోగా ఈ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తామన్నారు. ఈలోగా గ్యాప్–1లో ప్రధాన డ్యామ్ పనులు చేపడతామన్నారు. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా నిర్మించే వాల్ డిజైన్‌ను తక్షణమే ఖరారు చేయాలని సీడబ్ల్యూసీని కేంద్ర మంత్రి ఆదేశించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల స్థానంలో లక్ష క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను పూడ్చి, వైబ్రోకాంపాక్షన్ చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దశలవారీగా నీటి నిల్వ ప్రాజెక్టులో మూడు దశల్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ఈఎన్సీ చెప్పారు. తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. ఈ స్థాయిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని వివరించారు. గతేడాది నిర్వహించిన లైడార్ సర్వేలో మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలు 45.72 మీటర్ల పరిధిలోకే వస్తాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక రెండో, మూడో ఏడాది 45.72 మీటర్ల పరిధిలోని మొత్తం 1,00,006 కుటుంబాలకు పునవాసం కల్పించి.. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునవాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. తొలి దశ పూర్తికి రూ.17,144 కోట్లు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు పూర్తి చేసి, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి.. ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే రూ.17,144 కోట్లు అవసరమని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు. సమగ్రంగా 45.72 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందని, ఆ మేరకు నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందిస్తూ.. తొలి దశ పూర్తికి రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనను పరిశీలించి, నిధులు ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు. ఆ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదం తీసుకోవడం ద్వారా పోలవరానికి నిధుల సమస్య లేకుండా చేస్తామని, తద్వారా షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పారు. బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు సమస్యపై సంయుక్త అధ్యయనానికి ఒడిశా సహాయ నిరాకరణ చేయడంపై తాము చర్చిస్తామని మంత్రి షెకావత్ చెప్పారు. అనుమతి లేని ప్రాజెక్టులపై గోదావరి బోర్డులో చర్చ పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు అనుమతి లేకుండా చేపట్టారని, వాటి డీపీఆర్‌లు పంపి, ఆమోదం తీసుకోవాలని రాష్ట అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ... తెలంగాణ కూడా అనుమతి లేకుండా కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మసాగర్ తదితర ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ విషయాన్ని గోదావరి బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలికమైనవేనని, పోలవరం పూర్తయితే ఆ రెండు ఎత్తిపోతలను మూసేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టామన్నారు. అప్పట్లోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. దాంతో.. అనుమతి లేని ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్లో చర్చిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. -
ఆగిన ‘సీతమ్మ సాగర్’ పనులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిపై చేపట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సీతమ్మ సాగర్ నిర్మాణ పనులకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తుతూ కొందరు వేసిన పిటిషన్‌పై గ్రీన్ ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా పనులు జరుగుతున్నాయా? లేదా ? అనే అంశాలను ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పని ప్రదేశం నుంచి కొంత మిషనరీ, కార్మికులను వెనక్కి రప్పించింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయనుంది. బాధితుల ఫిర్యాదుతో.. గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీడబ్ల్యూసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి పొందేందుకు తుది డీపీఆర్‌ను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన వేసవికాలం వృధా కాకూడదనే ఉద్దేశంతో బ్యారేజీ అనుబం«ధ పనులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బాధితులు మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పనులకు సంబంధించి కొన్ని ఫొటోలను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి బోర్డులో ఎస్ఈ ర్యాంక్‌కు తక్కువ కాని వారు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత కమిటీ జూన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. జూలై 12లోగా ఈ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది. ఆ ముద్ర పడకూడదని.. తెలంగాణాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సీతారామ’డిజైన్ల విషయంలో కోర్రీల మీద కొర్రీలు వేస్తూ వస్తోంది. ఈ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ముద్ర పడటం మంచిది కాదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే బ్యారేజీ, కరకట్టల దగ్గర జరుగుతున్న పనులు ఆపేయాలంటూ నిర్మాణ సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం సీతారామ ఇంజనీర్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్‌లో స్టే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. మరోవైపు నష్టపరిహారం సైతం తగు మొత్తం చెల్లించడం లేదంటూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు బాధితుల్లో కొందరు సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రీన్ ట్రిబ్యునల్ పనులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
రూ.21 వేల కోట్లతో సీతారామ–సీతమ్మసాగర్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల– సీతమ్మసాగర్ ఉమ్మడి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కొత్తగా ఇల్లందు కాల్వను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అనుమతుల కోసం తాజాగా ఢిల్లీలో కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించింది. రూ.13,700 కోట్ల అంచనాలతో సీతారామ ఎత్తిపోతల పథకం, రూ.5,200 కోట్ల అంచనాలతో సీతమ్మసాగర్ బ్యారేజీ, రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు కాల్వ కలిపి మొత్తం రూ.21,100 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు డీపీఆర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 1.13 లక్షల కొత్త ఆయకట్టు సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందని ఎగువ ప్రాంతాల్లోని 1.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడానికి ఇల్లందు కాల్వను నిర్మించనున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి అధిక ప్రయోజనం కలగనుండగా, మధిర, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతలను నిర్మిస్తుండగా, కొత్తగా ప్రతిపాదించిన ఇల్లందు కాల్వతో సీతారామ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 7.84 లక్షల ఎకరాలకు పెరగనుంది. సీడబ్ల్యూసీకి రెండో సవరణ డీపీఆర్ విద్యుదుత్పత్తి అవసరాలకు 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన సీతమ్మ బ్యారేజీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 70.4 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పనులు సైతం 55 శాతం వరకు పూర్తయ్యాయి. దీనికి దాదాపుగా అన్ని రకాల అనుమతులను ఇప్పటికే సీడబ్ల్యూసీ ఇచ్చేయగా, అపెక్స్ కౌన్సిల్ తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచే సీతారామ ఎత్తిపోతలకు నీళ్లను తరలిస్తున్న నేపథ్యంలో బ్యారేజీని సైతం సీతారామ ఎత్తిపోతల పథకంలో కలిపేసి ఒకే ప్రాజెక్టుగా అనుమతులు పొందాలని గతంలో సీడబ్ల్యూసీ సూచించింది. పర్యావరణ అనుమతుల కోసం రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా కేంద్ర పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీకి వేర్వేరు ప్రాజెక్టులుగా ప్రతిపాదించడం పట్ల అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా ప్రతిపాదిస్తూ మళ్లీ సీడబ్ల్యూసీకి నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీపీఆర్‌ను సమర్పించింది. తాజాగా ఇల్లందు కాల్వ నిర్మాణం పనులను సైతం డీపీఆర్‌లో చేర్చి సవరించిన డీపీఆర్‌ను మరోసారి సీడబ్ల్యూసీకి ఇచ్చింది. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని, మరో నెల రోజుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ముందుకు డీపీఆర్ వెళ్లే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. గోదావరిలో సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు నీటి లభ్యతతోపాటు పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఇటీవల గోదావరి బోర్డు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించిన నేపథ్యంలో గోదావరి బోర్డు లేఖతో ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
తాగు, సాగు నీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంలో సాగు, తాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా ఖరారు చేసింది. నీటి సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు జలాశయంలో కనీస నీటి మట్టానికి ఎగువన నీటి నిల్వ ఉండేలా చూడాలని నిర్దేశించింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికంటే 75 శాతం లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను వాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు, తాగు నీటి అవసరాలను దెబ్బతీసేలా ఇతర అవసరాలకు అంటే విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ (నిర్వహణ నియమావళి)లో ఈ విషయాలను స్పష్టంగా చెబుతూ కృష్ణా బోర్డుకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్‌పైనా సీడబ్ల్యూసీ ముసాయిదా నివేదిక ఇచ్చింది. వీటిపై రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)లో చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. మరోసారి ఆర్ఎంసీలో చర్చ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తికి నియమావళి, రెండు ప్రాజెక్టుల రూల్ కరవ్స్, మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా వద్దా అనే అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు గతేడాది మే 10న కృష్ణా బోర్డు ఆర్ఎంసీని ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు అప్పటి సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు ఇందులో సభ్యులు. ఆర్ఎంసీ ఆరు సార్లు సమావేశమై.. గతేడాది డిసెంబర్ 8న కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించి, అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. నివేదికపై సంతకం చేసేందుకు మాత్రం నిరాకరించారు. ఈ అంశంపై ఈనెల 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించి, ఆర్ఎంసీని పునరుద్ధరించారు. రూల్ కరŠవ్స్, విద్యుదుత్పత్తికి నియమావళి, వరద జలాల మళ్లింపుపై మరోసారి చర్చించి నెలలోగా నివేదిక ఇవ్వాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ ఆర్ఎంసీని ఆదేశించారు. వివాదాలకు చరమగీతం పాడటానికే కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపే. ఆర్ఎంసీ నివేదికను బోర్డు సమావేశంలో మరో మారు చర్చించి 2023–24లో అమలు చేయడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ నిర్ణయించారు. గతంలో తరహాలోనే ఆర్ఎంసీ నివేదికపై ఈసారీ తెలంగాణ అధికారులు సంతకాలు చేయడానికి నిరాకరిస్తే.. కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. -
వార్ధా ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ‘వార్ధా’ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్లు ఉండనుందని గతేడాది రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, తాజాగా రూ.4,550.73 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్(వ్యాప్కోస్) ఈ డీపీఆర్‌ను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగాకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించనున్నారు. నాలుగేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్ధా బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు నివారణకు వరద రక్షణ గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. మొదట అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద కాదని.. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16.4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. రూ.1919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని, 6.5 కి.మీల పొడవున ఉండనున్న ఈ బ్యారేజీకి 107 గేట్లను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ నిర్మాణంలో మహారాష్ట్రలో 1852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నదీ గర్భంలో 3771 ఎకరాలు కలిపి మొత్తం 6149 ఎకరాల ముంపు ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టింది. దీనికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యమృగాల అభయారణ్యం ఉండడంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి అనుమతులు రావని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంది. మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వార్ధా నదిపై 36 గేట్లతో బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుందని, దీనికి రూ.650 కోట్ల ఖర్చు కానుందని గతేడాది జనవరిలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయంలో తవ్వి వదిలేసిన కాల్వలతో అనుసంధానం చేయడానికి అదనంగా తవ్వాల్సిన కాల్వకు మరో రూ.100 కోట్ల కానుందని, మొత్తం రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని లెక్కలు వేసింది. కానీ తాజాగా అంచనా వ్యయం రూ.4550 కోట్లకు పెరిగిపోయింది. వరద రక్షణ గోడల నిర్మాణానికి రూ.1000 కోట్లను అంచనాల్లో ప్రతిపాదించారు. వార్ధా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఈ ప్రాజెక్టు కింద 1,34,880 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, మరో 5868 ఎకరాల స్థిరీకరణ జరగనుందని, ఏటా రూ.1224.18 కోట్ల ఆదాయాన్ని సృష్టించనుందని డీపీఆర్‌లో వ్యాప్కోస్ అంచనా వేసింది. 11.5 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు వాడుకోనుండగా, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.96 టీఎంసీలు ఉండనుంది. 142.5 మీటర్ల ఎత్తులో బ్యారేజీకి 22 గేట్లను ప్రతిపాదించారు. తెలంగాణలో 3076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉండనుంది. -
‘సీతారామ’పై సందేహాలు.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి యాజమాన్య బోర్డు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల ఉమ్మడి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలకు నష్టం జరగదని నిర్ధారించాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరింది. ప్రధానంగా 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఖరారు చేసిన మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద 561 టీఎంసీల లభ్యతకు రక్షణ కల్పించాలని సూచించింది. ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ గతంలో డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు పంపించింది. బోర్డు ఏమందంటే.. ఏపీ, తెలంగాణ మధ్య సమ్మతి లేదు.. రాష్ట్రాలు, ప్రాజెక్టుల వారీగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నీటి కేటాయింపులు జరపలేదు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన గోదావరి జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చివరకు ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల లభ్యత, ప్రాజెక్టుల ద్వారా వినియోగం లెక్కలపై సైతం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తేల్చాలి.. ఇప్పటికే ఉన్న, నిర్మాణంలోని, నిర్మాణం ప్రారంభం కాని తమ ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ చెబుతున్నాయి. అయితే గోదావరిలో 1,743 టీఎంసీల మేరకు నీటి లభ్యత లేదని ఆయా రాష్ట్రాలే అంగీకరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం 1,486.155 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని తెలంగాణ అంటోంది. 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం కేవలం 1,360 టీఎంసీల లభ్యతే ఉందని, అలాగే 70 టీఎంసీల ఊట నీళ్ల లభ్యత ఉందని ఏపీ పేర్కొంటోంది. అయితే ఊట నీళ్లను పరిగణనలోకి తీసుకోరాదని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పేర్కొంటోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000–2020 మధ్యకాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంటోంది. ఈ అంశాల నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధ్యయనం జరగాలి. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా సీతారామ వద్ద గోదావరిలో 347.06 టీఎంసీల లభ్యత ఉందని ప్రాజెక్టు డీపీఆర్ పేర్కొంటోంది. దీనిపై అధ్యయనానంతరం సీడబ్ల్యూసీ నిర్ధారిత లెక్కలు పంపించాలి. గోదావరి జలాలను కృష్ణాకు ఎలా తరలిస్తారు? సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల ద్వారా 10.109 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించనున్నట్టు డీపీఆర్‌లో ప్రతిపాదించారు. అయితే తరలింపును సమర్థిస్తూ డీపీఆర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
చెరువుల్లో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1,13,425 చెరువులుంటే.. అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నాయి. అత్యధిక కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ్ బెంగాల్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు వంటి జలసంరక్షణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. చిన్న నీటివనరుల కింద దేశంలో 14,75,29,626.21 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇందులో అత్యధిక ఆయకట్టు ఉన్న రాష్ట్రాల్లో 1,19,95,473 హెక్టార్ల ఆయకట్టుతో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో రాజస్థాన్(54,28,765.19 హెక్టార్లు), మూడో స్థానంలో తెలంగాణ (49,71,121.4 హెక్టార్లు) నిలవగా.. 13,37,841 హెక్టార్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో జలవనరుల మొదటి గణన, చిన్న నీటివనరుల ఆరో గణనను కలిపి జలవనరుల గణన పేరుతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించింది. వాటి ఫలితాలను కేంద్ర జల్‌శక్తి శాఖ ఇటీవల విడుదల చేసింది. అందులోని ప్రధానాంశాలివీ.. రాష్ట్రంలో 1,90,777 జలవనరులు.. ► దేశంలో 24,24,540 జలవనరులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 23,55,055 (97.1 శాతం) ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 69,485 (2.9 శాతం) ఉన్నాయి. ఇందులో 14,42,993 (59.5 శాతం) కుంటలు, 3,81,805 చెరువులు (15.7 శాతం), రిజర్వాయర్లు 2,92,280 (12.1 శాతం), ఊటకుంటలు, చెక్ డ్యామ్‌లు 2,26,217 (9.3 శాతం), సరస్సులు 22,361 (0.9 శాతం), 58,885 ఇతరాలు (2.5 శాతం) ఉన్నాయి. ► ఈ జలవనరులలో మానవ నిర్మితమైనవి 18,90,463 (78 శాతం). సహజసిద్ధంగా ఏర్పడినవి 5,34,077 (22 శాతం). ► 20,30,400 జలవనరులు (83.7 శాతం) వినియోగంలో ఉండగా.. 3,94,500 జలవనరులు (16.3 శాతం) ఎండిపోయాయి. ► 7,47,480 (30.8 శాతం) జలవనరులతో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో నిలిచింది. 2,45,087 (10.1 శాతం) జలవనరులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 1,90,777 (7.9 శాతం) జలవనరులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. 1,81,837 (7.5 శాతం) జలవనరులతో నాలుగో స్థానంలో ఒడిశా, 1,72,492 (7.1 శాతం) జలవనరులతో ఐదో స్థానంలో అస్సోం నిలిచాయి. ► జలవనరులను అత్యధికంగా చేపల పెంపకం, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఉపయోగంలో 1,49,279 జలవనరులు.. ► ఆంధ్రప్రదేశ్‌లో 14,132 కుంటలు.. 1,13,425 చెరువులు, 62 సరస్సులు, 703 రిజర్వాయర్లు, 57,492 ఊటకుంటలు, చెక్ డ్యామ్‌లు, 4,963 ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో కుంటలు 8,475, చెరువులు 1,03,952, సరస్సులు 60, రిజర్వాయర్లు 667, ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు 32,011, ఇతరాలు 4,114 వెరసి మొత్తం 1,49,279 ఉపయోగంలో ఉన్నాయి. ►రాష్ట్రంలో 37,257 జలవనరులను సాగునీటి కోసం ఉపయోగించుకుంటుండగా.. 680 వనరులు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగమవుతున్నాయి. చేపల పెంపకం కోసం అత్యధికంగా 69,510 జలవనరులను వినియోగించుకుంటుండగా. తాగునీరు, గృహావసరాల కోసం 1,945 వనరులను వాడుకుంటున్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు 38,460 వనరులు దోహదపడుతున్నాయి. -
ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడం లేదనే అంశాన్ని స్పష్టంచేసింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోవడాన్ని గుర్తు చేసింది. నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే.. 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఇలాగైతే.. కష్టమే! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వ చేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చనని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టం చేసింది. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేల్చింది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే ♦ దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ♦ వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ♦ ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ♦ దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. అన్ని జిల్లాల్లో కలిపి 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
పోలవరం పనులు భేష్..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధికారులను అభినందించారు. షెడ్యూల్ ప్రకారం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలెట్ ఛానల్ పూర్తి చేసి గోదావరి వరదను సమర్ధంగా మళ్లించారని రాష్ట్ర జలవనరుల అధికారులను, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని అభినందించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య పడిన అగాధాలను మళ్లీ వరద వచ్చేలోగా పూడ్చివేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా ‘యు’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానించాలని చెప్పారు. తద్వారా వరదల్లోనూ ప్రధాన (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్) డ్యామ్ పనులను పూర్తి చేయొచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ముంపు ప్రభావంపై సోమవారం ఢిల్లీలో పంకజ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, పీపీఏ సీఈవో శివనందన్ కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్యూసీ) చైర్మన్ కుష్వీందర్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పీపీఏ, రాష్ట్ర జల వనరులు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సవరించిన అంచనాలకు సానుకూలం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సీడబ్యూసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్ల వరకు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో 8 మండలాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని 2017–18 సవరించిన అంచనాల్లో పేర్కొన్నామని చెప్పారు. కానీ మరో 36 గ్రామాలు కూడా ముంపు పరిధిలోకి వస్తాయని, ఆ గ్రామాల్లో నిర్వాసితులకూ పునరావాసం కల్పించాలని కోరారు. దీనిపై పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో లైడార్ సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు వినతి పత్రాలు ఇచ్చారన్నారు. తొలుత 41.15 మీటర్ల వరకు, ఆ తరువాత 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంతెంత నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్యూసీ చైర్మన్ వోరాను ఆదేశించారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి అడ్‌హాక్‌గా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నిధులు ఎంత అవసరమో తేల్చడానికి పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నాలుగు రోజుల్లో సీడబ్యూసీ చైర్మన్ వోరా సమావేశం కానున్నారు. బ్యాక్ వాటర్ ప్రభావం ఉండదు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో భూమి ముంపునకు గురవుతోందని సుప్రీం కోర్టులో తెలంగాణ, ఒడిశా, చతీస్‌గఢ్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో సీడబ్యూసీ సర్వే చేసిందని, అందులో బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మాత్రం ఉండదని వెల్లడైందని అధికారులు వివరించారు. సుప్రీం కోర్టు నియమించిన గోపాలకృష్షన్ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు. సీడబ్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ సుప్రీం కోర్టుకు కేంద్రం తరపున చెప్పాల్సిన అంశాలను స్పష్టం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం వస్తారని వెదిరె శ్రీరాం చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో నీటి పారుదల విభాగం వ్యయం మొత్తాన్ని భరించాల్సిన బాధ్యత కేం‘ద్రానిదేనని పునరుద్ఘాటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. -
పోలవరం ముంపుపై 10న సమావేశం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ మట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే ఉండనున్న ముంపు ప్రభావాన్ని సూచించే ఎఫ్ఆర్ఎల్ సర్వే రాళ్లను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పీపీఏను ఆదేశించింది. ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేపట్టిన అధ్యయనాలు, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారుల సందేహాలు నివృత్తి కాకుంటే ఎఫ్ఆర్ఎల్ రాళ్లు గుర్తించడానికి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తే లేదని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. గోదావరి నదికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. 50 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుందని అధ్యయనం ద్వారా అంచనా వేసినట్లు గుర్తుచేసింది. సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన అన్ని రాష్ట్రాలతో సోమవారం మూడో సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారదుల శాఖ ఈఎన్సీ నాగేంద్రరావు, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తెలంగాణ ఇంటర్ స్టేట్ బోర్డు గోదావరి డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సైతం ముంపు ప్రభావంపై గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పాయి. కొత్తగా అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సమావేశంలో తెలంగాణ వాదనలు ఇవీ.. ► ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ముంపును గుర్తించాలి. ► డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల ఏర్పడే ప్రభావాలతోపాటు జూలై 2022లో వచ్చిన వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలి. ► మణుగూరు భార జల కేంద్రం, భద్రాచలం ఆలయ రక్షణకు చర్యలు చేపట్టాలి. ► కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. భ్రదాచలం పట్టణంలో 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్ల స్థాయిలను ధ్రువీకరించాలి. ► కిన్నెరసాని, ముర్రేడువాగుల్లోని వరద ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్‌వాటర్ అడ్డుపడడంతో స్థానికంగా ఏర్పడుతున్న ముంపు ప్రభావంపై ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు సర్వే జరపాలి. వీటితో పాటు మరో ఏడు ఇతర పెద్దవాగులపై సర్వే చేయాలి. ► ఛత్తీస్‌గఢ్ తరహాలో ఏదైనా ఏజెన్సీతో పీపీఏ జాయింట్ సర్వేను తక్షణమే చేపట్టాలి. పూడిక ప్రభావం సహా నది క్రాస్–సెక్షన్లను కొత్తగా తీసుకొని ఉమ్మడి సర్వే చేసి ముంపును అంచనా వేయాలి. ► పోలవరం ప్రాజెక్టు కారణంగా 2022 జూలైలో తెలంగాణలో సంభవించిన వరదల ప్రభావాన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఆపరేషన్ షెడ్యూల్ నిబంధనలకు కట్టుబడి ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ ప్రభావం ఉండదని వాదిస్తోంది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో వరద ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే తర్వాత పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్, ఇతర నిపుణులతో వీలైనంత త్వరగా సంబంధిత మోడల్ అధ్యయనాలను చేయించాలి. ► ఆలోగా పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, నిర్వహించడం చేపట్టకూడదు. -
మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ?
ఓ రెండేళ్ల కిందటి ఫోటో ప్రచురించి తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కొట్టేశారంటూ రాసిన ‘ఈనాడు’... ఆ తరువాతి రోజు అది తప్పని ఒప్పుకుంది. కాకపోతే కొట్టారని రాసిన కథ.. మొదటి పేజీలో బ్యానర్. పొరపాటైపోయిందంటూ వేసిన సవరణ... కనీకనిపించని విధంగా లోపలి పేజీల్లో ఓ సింగిల్ కాలమ్!!. పోలవరం వ్యవహారంలోనూ అంతే. ప్రపంచంలో ఎవ్వరూ కక్కుర్తిపడని రీతిలో కమీషన్ల కోసం చేయాల్సిన పనులన్నీ వెనక్కి నెట్టేసి...చేయకూడని పనులన్నిటినీ ముందుకు తెచ్చింది చంద్రబాబు నాయుడు. పైపెచ్చు ఆ పనుల్ని కూడా రామోజీ వియ్యంకుడు, యనమల బావమరిది... ఇలా బంధుగణానికి నామినేషన్ పద్ధతిలో సంతర్పణ చేసేశారన్నదీ నిజం. చంద్రబాబు అనుసరించిన ఈ డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) విధానం వల్ల పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే అన్నారంటే వీళ్లు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని.. పోలవరం ప్రాజెక్టు యావత్తూ వెనక్కెళ్లిపోయింది. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ జాప్యానికి మానవ తప్పిదమే కారణమని ఎన్‌హెచ్‌పీసీ, డీడీఆర్పీ, నిపుణులు, అధికారులు పదేపదే చెప్పారు. ఆ మానవుడు చంద్రబాబేనని కూడా అందరికీ తెలుసు. కానీ రామోజీరావు ఒక్క ముక్క రాస్తే ఒట్టు!!. పైపెచ్చు తప్పంతా వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నట్టుగా రాతలు? చంద్రబాబు పాపాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ పోలవరాన్ని పూర్తి చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను... పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్న ‘ఈనాడు’ కథనాల్లోని డొల్లతనం ఇదిగో... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం బహుళార్ధకసాధక ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో నాడు చంద్రబాబు చేసిన పాపాల ఫలితం... ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రణాళికాయుతంగా పూర్తి చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని, ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల్లోంచి ఖర్చు చేసిన రూ.2,948.04 కోట్లను రీయింబర్స్ చేయడంలో కేంద్రం అలవికాని జాప్యం చేస్తోంది. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత ఇబ్బంది కలిగించేదే అయినప్పటికీ... వీలైనంతగా రాష్ట్ర ఖజానా నుంచే పోలవరానికి నిధులు విడుదల చేస్తూ ముందుకెళుతున్నారు. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పాల్పడిన పాపాల వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. దీని వల్లే పోలవరం పనులు ముందుకెళ్లకుండా ఆగిపోయాయి. లేదంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసేవారనేది జలవనరుల శాఖ అధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్న మాట. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని యథాపూర్వ స్థితికి తెచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నిపుణులతో గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వారంతా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కాకపోతే ఆదివారం నాడు ఈ సమస్యకు డీడీఆర్పీ పరిష్కార మార్గం చూపించింది. దీంతో డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్ది, కోతకు గురైన ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాపూర్వ స్థితికి తెచ్చి... సత్వరమే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. 31 నెలలు తట్టెడు మట్టి కూడా పోయని టీడీపీ సర్కార్ ► పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వంద శాతం వ్యయాన్ని భరించి.. అన్ని అనుమతులు తెచ్చి తామే పూర్తి చేస్తామని కేంద్రం పార్లమెంటులో హామీనిచ్చింది. విభజన చట్టంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పోలవరం ప్రాజెక్టు అథారిటీని (పీపీఏ) 2014, మే 28న ఏర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని నాటి టీడీపీ సర్కార్‌ను కోరుతూ వచ్చింది. ► కేంద్రమే నేరుగా ప్రాజెక్టు కడితే జనానికి ప్రాజెక్టు వస్తుంది తప్ప తనకేమొస్తుందని భావించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాను గనక తనకు నచ్చిన వారికి కాంట్రాక్టుకు ఇస్తే కావాల్సినంత కమీషన్లు వస్తాయని భావించారు. అందుకే పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ► చివరకు పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. అలా గనక చేస్తే... తాను కేంద్రం వద్ద ప్రత్యేక హోదా మాట ఎత్తనని లోపాయికారీగా హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టేయడంతో... 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ► ఆ వెంటనే పోలవరం జలాశయం పనుల్లో రూ.3,302 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థకు నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టేశారు చంద్రబాబు నాయుడు. అంతేకాక మరో రూ.150 కోట్ల విలువైన ఎడమ కాలువలోని పనులను నాటి ఆర్థిక మంత్రి యనమల బావమరిది పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్‌పై ఇచ్చేశారు. ఇలా పందేరాలు జరిగిపోయాక... 2016, సెప్టెంబరు 30న పనులు చేపట్టారు. అంటే అధికారం చేపట్టినప్పటి నుంచి 31 నెలలపాటు పోలవరంలో తట్టెడు మట్టి కూడా టీడీపీ సర్కార్ ఎత్తలేదన్న మాట. ► చంద్రబాబు నాయుడు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ప్రధానికి లేఖ రాయటం. నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్ఠాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికీ అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. ► కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారు? ఎందుకంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు. అన్నిటికీ ఒప్పేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు కనక... కావలసినంత పిండుకోవచ్చన్నది ఆయన ఆలోచనల పిండితార్థం. ► ఇక అస్మదీయులకు పనులు అప్పగించటంలోనూ బాబు తన చేతివాటాన్ని చూపించారు. ప్రాధాన్య పనులు పక్కనబెట్టేసి... అధికంగా లాభాలు వచ్చే మట్టి తవ్వకం, స్పిల్ వేలో కాంక్రీట్ పోయడం వంటి పనులు ముందుగా చేపట్టారు. భారీగా కమీషన్లు దండుకున్నారు. ప్రణాళికా రాహిత్యం వల్లే డయాఫ్రమ్‌వాల్‌కు దెబ్బ ► గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ పనులు పూర్తి చేసి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టాలి. ఈలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఆ తర్వాతే ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్–ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ.. చంద్రబాబు మాత్రం వరదను మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్ వాల్‌ను 2018 నాటికే చంద్రబాబు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టి... వాటిని పూర్తి చేయలేక... ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. దాంతో 2400 మీటర్లు వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలు 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. ► ఎక్కువ నీరు తక్కువ ఖాళీ లోంచి ప్రవహించాల్సి వచ్చినపుడు ఏం జరుగుతుంది? ఉద్ధృతి పెరుగుతుంది కదా!. ► ఇదిగో... 2019, అక్టోబర్ 1న గోదావరికి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అది ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించాల్సి వచ్చింది. సెకనుకు 13 మీటర్ల వేగంతో వరద ఉద్ధృతంగా రావటంతో డయాఫ్రమ్ వాల్ ఘోరంగా దెబ్బతింది. ► ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి, స్పిల్ వే మీదుగా వరద నీటిని మళ్లించి ఉంటే.. అసలు డయాఫ్రమ్ వాల్ మీదికి అంత వరద వచ్చి ఉండేదే కాదు. అది దెబ్బతినే పరిస్థితే వచ్చేది కాదు. ► గోదావరి వరద ఉద్ధృతి వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం 23 మీటర్ల నుంచి –12.00 మీ. వరకు అంటే దాదాపు 35 మీటర్ల మందంతో కోతకు గురైంది. గ్యాప్–2లో + 8 మీటర్ల నుంచి –12 మీటర్ల వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందంతో, దిగువ కాఫర్ డ్యాంలో 36.5 మీటర్ల మందంతో గోదావరి గర్భం కోతకు గురైంది. గోదావరి వరద ఉద్ధృతికి స్పిల్ ఛానల్ లోని కాంక్రీటు బ్లాకులు(దిమ్మెలు) కొట్టుకుపోయాయి. ► నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావు కనక చంద్రబాబు వారిని పట్టించుకుంటే ఒట్టు. ఐదేళ్లలో పునరావాసానికి బాబు సర్కారు కేవలం రూ.484 కోట్లు ఖర్చు పెట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడంతో ... 2019లో కాఫర్ డ్యామ్ వల్ల గోదావరి వరద ఎగదన్నడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు తప్పులు సరిదిద్దుతూ.. ► చంద్రబాబు పాపాల ఫలితాన్ని సరిదిదిద్దుతూ పోలవరాన్ని ప్రణాళికాయుతంగా పూర్తి చేయడానికి సీఎం వైఎస్ జగన్ యాక్షన్ ప్లాన్ రచించి.. అమలు చేస్తున్నారు. ► కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. 48 గేట్లతో సహా స్పిల్ వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్లను పూర్తి చేసి.. 2021, జూలై 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించి చరిత్ర సృష్టించారు. ► కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనుల వల్ల దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. 2022, ఏప్రిల్‌లో విధానాన్ని ఖరారు చేయడంతో.. దాని ప్రకారం 2022, జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. వరదలు తగ్గాక పనులు చేపట్టి ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. కాబట్టి ఇక గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా నిశ్చింతగా ప్రధాన డ్యామ్ పనులను చేపట్టవచ్చు. ► ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని పంపులతో తోడివేస్తూ.. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి, యథాస్థితికి తెచ్చే పనులను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ► టీడీపీ సర్కార్ ప్రణాళికారాహిత్యం, అవినీతితో చేపట్టిన పనుల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను ఎలా సరిచేయాలనే అంశంపై 15 నెలలుగా డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ, ఐఐటీ(తిరుపతి, చెన్నై, ఢిల్లీ) ప్రొఫెసర్లు, ఎన్‌హెచ్‌పీసీతో రాష్ట్ర ప్రభుత్వం మేధోమధనం చేస్తోంది. సీడబ్ల్యూసీ సూచన మేరకు డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ఎన్హెచ్పీసీకి ప్రభుత్వం అప్పగించింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నాలుగు రకాల పరీక్షలు చేసిన ఎన్‌హెచ్‌పీసీ.. కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ ఎడమ వైపున 188, కుడి వైపున 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని తేల్చింది. మరో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకూ దెబ్బతిందని పేర్కొంది. ► ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా శనివారం క్షేత్ర స్థాయిలో డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించిన డీడీఆర్పీ.. ఆదివారం దిద్దుబాటుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా నిర్మించి, పాత దానితో కలపడం... మిగతా చోట్ల ఐదు మీటర్ల లోతు నుంచి డయాఫ్రమ్ వాల్‌కు ఇరువైపులా బంకమట్టిని కూర్చి.. దానిపై ప్రధాన డ్యామ్ నిర్మించాలని మార్గనిర్దేశం చేసింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తేవాలని సూచించింది. ► డీడీఆర్పీ సూచించిన మేరకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌ను పటిష్ఠవంతం చేయడం, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను పూడ్చి.. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసి.. పోలవరం ఫలాలను రైతులకు అందించే దిశగా సీఎం వైఎస్ జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడేళ్లలోనే రూ.1677 కోట్లు ఖర్చు పెట్టి 8446 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. రానున్న రెండు మూడు నెలల్లో రూ.525 కోట్లతో మిగిలిన పునరావాసం పనులు పూర్తి చేసి, 9390 కుటుంబాలకు పునరావాసం కల్పించేలా అడుగులు వేస్తున్నారు. తద్వారా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తారు. ఇదీ... బాబు చేసిన ద్రోహం ► పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూనే 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో.. 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలిక పెట్టారు. దానికి నాడు చంద్రబాబు అంగీకరించారు. ► 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు అంగీకరించారు. ► 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు నోరుమెదపలేదు. ► 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు. ► 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులు ఇవ్వాలంటూ 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. ► 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,610 కోట్లు. ఇందులో ఇప్పటివరకూ చేసిన ఖర్చు రూ.20,702 కోట్లు మినహాయిస్తే ఇంక కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ.9,908 కోట్లు మాత్రమే. ► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ప్రతి మూడేళ్లకు ఒక సారి సవరించాలి. కానీ.. చంద్రబాబు వాటికి విరుద్ధంగా 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. ► 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించింది. ఇందులో భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పన వ్యయమే రూ. 33,168.23 కోట్లు. కానీ.. 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. 2013–14 ధరల ప్రకారం చూస్తే ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ ఇంక రావాల్సింది కేవలం రూ. 9,908 కోట్లే. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందన్నది చంద్రబాబుకే తెలియాలి. ► బాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోంది. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని గత 45 నెలలుగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం జగన్ కోరుతూ వస్తున్నారు. -
పోలవరం డయాఫ్రమ్‌వాల్‌పై 28లోగా నివేదిక
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ పాపాల వల్ల.. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్‌వాల్ (పునాది) భవితవ్యాన్ని తేల్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు గతనెల 26 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల బృందం హైరిజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సీస్మిక్ టోమోగ్రఫీ విధానాలలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. ఈనెల 28లోగా రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లకు ఆ బృందం నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) బృందం పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్‌వాల్‌ను మార్చి 4న క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యం బాగున్నట్లు ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఇస్తే.. ప్రధాన డ్యామ్ పనులకు డీడీఆర్పీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చితే.. దాన్ని సరిదిద్దాలా? లేదంటే పాతదానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలా? అనే అంశాలపై సీడబ్ల్యూసీ, ఐఐటీ(ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్) ప్రొఫెసర్లతో మార్చి 5న డీడీఆర్పీ బృందం మేధోమథనం జరుపుతుంది. ఇందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చుతుంది. -
అధికారం ఖర్గేకు
నవా రాయ్‌పూర్: కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నిక నిర్వహించరాదని పారీ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేయాలని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. ఈ అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ ఇందుకు వేదికగా నిలిచింది. సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక/ఎన్నిక విధానంపై మూడు రోజుల సదస్సులో తొలి రోజు స్టీరింగ్ కమిటీ విస్తృతంగా చర్చించిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. వారిని అధ్యక్షుడే నామినేట్ చేయాలని 45 మంది సభ్యుల్లో దాదాపు అందరూ అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్లీనరీలో ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులందరికీ ఇకపై సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం ఉండనుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పక్ష నేతలు సీడబ్ల్యూసీ సభ్యులుగా కూడా వ్యవహరిస్తారు. అంతేగాక సీడబ్ల్యూసీ స్థానాల్లో 50 శాతం ఇకపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, యువతకు చెందుతాయి. వీటితో పాటు పార్టీ నియమావళికి ప్రతిపాదించిన 16 సవరణలకు స్టీరింగ్ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు జైరాం ప్రకటించారు. సీడబ్ల్యూసీలో 25 మంది సభ్యులుంటారు. పార్టీ చీఫ్, పార్లమెంటరీ పార్టీ నేత పోను మిగతా 23 మందిలో 12 మందిని ఎన్నుకుంటారు. 11 మంది నామినేట్ అవుతారు. ఈ ప్రక్రియను ఏకగ్రీవంగా నిర్వహించడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ. అందుకు వీలుగా నిర్ణయాధికారాన్ని అధ్యక్షునికి స్టీరింగ్ కమిటీ కట్టబెడుతూ ఉంటుంది. సంక్షోభంలో వ్యవస్థలు: ఖర్గే కాంగ్రెస్ 85వ ప్లీనరీ రాయ్‌పూర్‌లో అట్టహాసంగా మొదలైంది. అధ్యక్షుని హోదాలో ఖర్గే ప్రారం¿ోపన్యాసం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పెను ప్రమాదంలో పడ్డాయంటూ ఆందోళన వెలిబుచ్చారు. పార్లమెంటరీ వ్యవస్థలన్నీ సంక్షోభంలో చిక్కడమే గాక రాజకీయ పార్టీల కార్యకలాపాలన్నింటిపైనా రాక్షస నిఘా పెరిగిపోయిందంటూ మండిపడ్డారు. ‘‘ఇలాంటి తరుణంలో పార్టీ ప్లీనరీ జరుపుకుంటున్నాం. గత ప్లీనరీలు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు, మైలురాళ్లకు వేదికలయ్యాయి. ఈ ప్లీనరీని కూడా అలా పార్టీ చరిత్రలోనే చిరస్మరణీయంగా మలచుకుందాం’’ అంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘భారత్ జోడో యాత్ర ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్దాం. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మనకు పెద్ద సవాలు. గొప్ప అవకాశం కూడా’’ అన్నారు. అంతకుముందు ఖర్గే సారథ్యంలో స్టీరింగ్ కమిటీ భేటీలో మూడు రోజుల సమావేశాల అజెండాను ఖరారు చేశారు. తొలి రోజు సమావేశాలకు సోనియాగాందీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రా గైర్హాజరయ్యారు. సోనియా, రాహుల్ శుక్రవారం సాయంత్రానికి రాయ్‌పూర్ చేరుకున్నారు. నాలుగు అంశాలపై నిర్ణయాలు ప్లీనరీ అజెండా ఖరారుతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు ఎంపిక విధానాన్ని, పార్టీ నియమావళికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తూ తొలి రోజు నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో ఆరు కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేయడంపైనా ప్లీనరీలో నిర్ణయం జరగనుంది. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఆమోదించిన ముఖ్య సవరణలు... ► మండలం నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని పార్టీ కమిటీల్లోనూ 50 ఏళ్ల లోపువారికి 50 శాతం రిజర్వేషన్. ► ఏఐసీసీలోని అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, మైనారిటీ, యువతకు 50 శాతం రిజర్వేషన్. -
రెండు రెట్లు కడలి పాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి కోసం వినియోగిస్తున్న నదీ జలాల కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా కడలి పాలవుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నదీ జలాలను మళ్లించకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దేశంలో సగటు వర్షపాతం, నదుల్లో ప్రవాహం, ఉపయోగించుకోదగిన జలాలు, ప్రస్తుతం వాడుకుంటున్న నీరు, భవిష్యత్ అవసరాలపై సీడబ్ల్యూసీ సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► దేశంలో ఏటా సగటున 1,298.6 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. వర్షపాతం రూపంలో 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ► వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం. అంటే ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. ► దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. ► ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ► దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలాశయాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ► నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చ కుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది. ► దేశంలో ప్రజల రోజువారీ అవసరాలు, తాగునీటి కోసం తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (వెయ్యి లీటర్లు ఒక క్యూబిక్ మీటర్‌కు సమానం) ఉంది. 2011 నాటికి 1,545 క్యూబిక్ మీటర్లకు, 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయింది. నదీ జలాలను మళ్లించకుంటే తలసరి నీటి లభ్యత 2031 నాటికి 1367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1228 క్యూబిక్ మీటర్లకు తగ్గుపోతుంది. తాగు, రోజువారీ అవసరాల కోసం నీటి కొరత తీవ్రమవుతుంది. -
పోలవరం బ్యాక్‌వాటర్‌పై సమావేశం
సాక్షి, హైదరాబాద్: పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై బుధవారం కేంద్ర జలశక్తి శాఖ..ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై గతేడాది సెప్టెంబర్ 29న కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలపై ముంపు ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపుల కోసం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాయగా, సీడబ్ల్యూసీ నుంచి బదులు వచ్చింది. ఈ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 20లోగా పంపించాలని ఆయా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ కోరింది. ఫిబ్రవరి 15న పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో 25న నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యత ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలకు రక్షణతో పాటు బాధిత రైతులకు పరిహారం, పునరావాసం కల్పించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. -
ముందు వాటాలు తేల్చండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ తరలింపు పనులపై ఏపీ ప్రభుత్వం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాల్లో వాటాలు తేలే వరకు లేదా నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయరాదని డిమాండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను తరలించే పనులకు 2018 జూన్ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నీటి వాటాలు తేలేదాకా ఆ అనుమతులను పునఃసమీక్షించడంతో పాటు మూడో టీఎంసీ పనులకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. వాటాలు తేలకుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ)ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది. డీపీఆర్‌ల పరిశీలనకు సుప్రీం అనుమతి నేపథ్యంలో లేఖ... కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపు పనులకు పర్యావరణ అనుమతి లేకపోవడంతో గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను గోదావరి బోర్డు ఆపేసింది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. -
నీటి లభ్యత తేల్చాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయ అధ్యయనం చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇవ్వడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. వాటి అనుమతిని పునఃసమీక్షించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. దీనిపై గోదావరి బోర్డు చైర్మన్ ఎమ్కే సిన్హా స్పందిస్తూ.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తామన్నారు. ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను నమోదు చేసి సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఎమ్కే సిన్హా అధ్యక్షతన గోదావరి బోర్డు 14వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కడెం–గూడెం ఎత్తిపోతల, మోదులకుంటవాగు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కడెం–గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లోనే కడెం వాగులో 17 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొందని.. అలాంటప్పుడు గోదావరి నుంచి 11.5 టీఎంసీలను ఎత్తిపోయాల్సిన అవసరం ఏముంటుందని నిలదీసింది. నీటి లభ్యత, వాటా తేల్చే దాకా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారు చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కనీసం తమను సంప్రదించకుండా సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఎలా అనుమతి ఇస్తుందని ఏపీ అధికారులు నిలదీశారు. దీనిపై వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న సీడబ్ల్యూసీ (హైడ్రాలజీ విభాగం) డైరెక్టర్ నిత్యానందరాయ్ స్పందిస్తూ.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఆ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో 1,430 నుంచి 1,480 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. గత ఐదేళ్లలో సగటున 1,600 టీఎంసీల లభ్యత ఉందని.. వాటి ఆధారంగానే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామన్నారు. దీనిపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరగని నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. దీనిపై నిత్యానందరాయ్ స్పందిస్తూ.. ఇకపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ పేచీ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం పరిసర ప్రాంతాలు భారీ ఎత్తున ముంపునకు గురవుతున్నాయని.. దీనిపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని చర్చించడానికి గోదావరి బోర్డు సరైన వేదిక కాదన్న ఏపీ అభిప్రాయంతో ఎమ్కే సిన్హా ఏకీభవించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు. బ్యాక్‌వాటర్ ప్రభావం అంశాన్ని పీపీఏలోనే చర్చించాలని తేల్చిచెప్పడంతో తెలంగాణ కూడా అంగీకరించింది. కాగా ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆధునికీకరణకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆయకట్టు ఆధారంగా ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఏపీ 85 శాతం, తెలంగాణ 15 శాతం భరించనున్నాయి. అలాగే గోదావరి ప్రాజెక్టులపై 23 చోట్ల టెలీమీటర్లను ఏర్పాటు చేసి నీటి వినియోగాన్ని లెక్కించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు నిర్వహణకు 2023–24లో చెరో రూ.ఐదు కోట్ల చొప్పున విడుదల చేయడానికి కూడా సమ్మతించాయి. -
గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నీటి లభ్యతపై స్పష్టత లేనందున కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)తో అధ్యయనం జరిపించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిర్ణయించింది. ఇందుకు సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపించనుంది. గోదావరి బోర్డు చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా అధ్యక్షతన మంగళవారం జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్(హైడ్రాలజీ) నిత్యానంద రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మళ్లీ అధ్యయనం అనవసరం: సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో 2020–21 నాటి వరకు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం జరిపించగా, గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 1430–1480 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేలిందని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల మూవింగ్ యావరేజీ ప్రకారం1,430–1,600 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యయనం జరపాల్సిన అవసరం లేదని హైడ్రాలజీ డైరెక్టర్‌గా తన అభిప్రాయమని స్పష్టం చేశారు. ఏపీ అధికారులు ఢిల్లీకి వస్తే అధ్యయన నివేదికలు చూపిస్తామన్నారు. మళ్లీ అధ్యయనం జరపాలని ప్రతిపాదనలు పంపితే సీడబ్ల్యూసీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోలవరంతో సహా ఏపీ ప్రాజెక్టులకు 484.5 టీఎంసీల జలాలు అవసరమని, ఈ మేరకు ఏపీలోని అన్ని ప్రాజెక్టుల అవసరాలను పరిరక్షిస్తూనే తెలంగాణలోని ఒక్కో ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీ ముందుకు వెళ్తుందన్నారు. ఈ విషయంలో ఏపీకి ఆందోళన అవసరం లేదన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఢోకా లేదన్నారు. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా గోదావరిలో మిగులు జలాలు లేవని తేలిందన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం జరిపించే అధికారం, పరిధి గోదావరి బోర్డుకు లేదని, సీడబ్ల్యూసీతో అధ్యయనం జరిపిస్తే తమకు అభ్యంతరం ఉండదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి లభ్యతపై మాత్రమే కాకుండా గోదావరి పరీవాహకంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యతపై సైతం అధ్యయనం చేస్తేనే సరైన ఫలితం ఉంటుందని ఆయన సూచించారు. అయితే కేవలం తెలంగాణ, ఏపీకి లభ్యతపైనే అధ్యయనం జరపాలని ఏపీ ఈఎన్సీ కోరారు. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఏపీ ఈఎన్సీ ‘ఏ విషయాల్లో మా అభిప్రాయాలు అడగడం లేదు. అడిగినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మేము లేవనెత్తిన అంశాలను తేల్చకుండానే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తున్నారు. సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఎంసీ) ఇటీవల సమావేశమై తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సమావేశానికి ఏపీని అహ్వానించలేదు. ఇకపై టీఏసీ సమావేశాలకు ఏపీని పిలవాలి. మేము లేవనెత్తిన ప్రతి అంశాన్ని తేల్చిన తర్వాతే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి’అని ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ లేవనెత్తిన అంశాలపై సాంకేతికంగా గోదావ రి బోర్డు చైర్మన్ అధ్యయనం జరపాలని, ఆ తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేయగా, గోదావరి బోర్డు చైర్మన్ అంగీకరించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను మదింపు చేయడం వరకే తన బాధ్యత అని ఆయన బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలేనన్న తెలంగాణ ఈఎన్సీ ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలనూ సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుందని, ప్రతి అంశాన్ని తేల్చిందని, ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకున్న తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇచ్చిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలే అని కొట్టిపారేశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు క్లియరెన్స్‌ల జారీలో జాప్యం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం 20–25 శాతం పెరిగిందని రజత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు జీ–5 సబ్ బేసిన్‌తో ఏపీకి సంబంధం లేదు.. రాష్ట్రంలోని కడెం–గూడెం, మొడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏపీ, తెలంగాణ అభిప్రాయాలతో సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ కోసం పంపించాలని ఈ సమావేశంలో గోదావరి బోర్డు నిర్ణయం తీసుకుంది. కడెం ప్రాజెక్టుకు 14.75 టీఎంసీలు అవసరం కాగా 15 టీఎంసీల లభ్యత ఉన్నందున గూడెం ఎత్తిపోతల అవసరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అంతకు ముందు జరిగిన చర్చలో అభ్యంతరం తెలిపారు. గోదావరిలోని జీ–5 సబ్ బేసిన్ పరిధిలో కడెం ప్రాజె క్టు వస్తుందని, ఏపీలోని ప్రాజెక్టులకు జీ–5 సబ్ బేసిన్ నుంచి నీళ్లు వెళ్లవని, తెలంగాణ అవసరాలకే సరిపోతాయని .. కడెం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బదులిచ్చారు. జీ–1 నుంచి జీ–6 సబ్ బేసిన్ల నీళ్లు ఏపీకి పోవని, జీ–7 నుంచి జీ–12 సబ్ బేసిన్ల నీళ్లను ఆధారంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ అభ్యంతరాలకు విలువ లేదని కొట్టిపారేశారు. అయినా, కడెం–గూడెం ఎత్తిపోతలకు అంగీకరించమని ఏపీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో 5 టెలిమెట్రీ స్టేషన్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు తక్షణ మరమ్మతులు చేపట్టడానికి రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో అంగీకరించాయి. గోదావరిపై 23 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు పెట్టాలని ప్రతిపాదనలు రాగా, తొలుత ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని పెద్దవాగు, పెద్దవాగు ఎడమ కాల్వ, పెద్దవాగు కుడి కాల్వ, కిన్నెరసానితో పాటు మరో వాగుపై మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ సూచన మేరకు ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పెట్టాలని ఏపీ కోరింది. టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను నమోదు చేస్తారు. -
ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా ఈనెల 3న గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడేందుకు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్ ఆశ్రయించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ సహాయ నిరాకరణ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెళ్లలోగా కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ జారీ రోజు నుంచి ఆర్నెళ్లలోగా అనుమతి పొందాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. బోర్డుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి 60 రోజుల్లోగా ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా బోర్డుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుతామని రెండు రాష్ట్రాలు బోర్డులకు స్పష్టం చేశాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఈ క్రమంలో తన భూభాగంలో శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం సాధ్యమేనా..? బోర్డుల నోటిఫికేషన్ అమలుకు తొలుత కేంద్రం నిర్దేశించిన గడువు గతేడాది జనవరి 15తో పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గడువును మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి(పాతది), నెట్టెంపాడు(పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా గత జూలై 15తోనే పూర్తయింది. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు సంబంధించి ఆర్ఎంసీ(రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ) రూపొందించిన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ ఆమోదించగా తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించేందుకు బోర్డులు సిద్ధమయ్యాయి. -
KRMB: అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నిర్వహణ విధానాల్లో (రూల్ కర్వ్స్) స్వల్ప మార్పులకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు అంగీకరించిన తెలంగాణ.. తుది నివేదికపై సంతకం పెట్టే సమయంలో అడ్డం తిరిగింది. హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, జెన్కో సీఈ సుజయ్‌కుమార్ హాజరైనా.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం గైర్హాజరయ్యారు. దాంతో తుది నివేదికపై ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై, బోర్డు సభ్యుడు (విద్యుత్) మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ, జెన్కో సీఈ సంతకాలు చేశారు. తొలుత అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. ఆ తర్వాత సంతకాలు చేయడానికి గైర్హాజరైనట్లు పేర్కొంటూ ఆర్ఎంసీ కన్వీనర్ పిళ్లై కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు తుది నివేదికను అందజేశారు. ఈ నివేదికపై కృష్ణా బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీ. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఆర్ఎంసీ సమావేశంలో శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు తాము సమ్మతించకపోయినా, అంగీకరించినట్లుగా కన్వీనర్ పిళ్లై తప్పుగా చిత్రీకరించారంటూ కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీకి తాము అంగీకరించబోమని, 50:50 నిష్పత్తిలో పంపిణీ చేయాలంటూ ఆ లేఖలో పాత పల్లవి అందుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా శ్రీశైలం, సాగర్ల రూల్‌కర్వ్స్ ముసాయిదా, విద్యుత్ ఉత్పత్తి, మళ్లించిన వరద జలాలను కోటాలో కలాపాలా వద్దా అనే అంశాలపై చర్చించడానికి నాలుగుసార్లు ఆర్ఎంసీ సమావేశాలు నిర్వహించారు. ఒకట్రెండు సమావేశాలకు మాత్రమే తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శనివారం జరిగిన ఐదో సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు ఇరు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. సాగర్ రూల్‌కర్వ్స్‌పై సీడబ్ల్యూసీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. చదవండి: (ఏబీఎన్ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ) శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉంచాలన్న సీడబ్ల్యూసీ ప్రతిపాదనకు అంగీకరించారు. శ్రీశైలంలో 50 : 50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి చేయాలని, సాగు, తాగునీటికి బోర్డు కేటాయించిన నీటితోనే విద్యుదుత్పత్తి చేయడానికి సమ్మతించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కడలిలో వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటాలో కలపకూడదన్న ఏపీ ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే, ఇదే అంశాలతో కూడిన తుది నివేదికపై సంతకం చేయడానికి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఇదీ నివేదిక శ్రీశైలం రూల్ కర్వ్స్‌లో స్వల్ప మార్పులు, 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి, మళ్లించిన వరద జలాలను లెక్కించినా కోటాలో కలపకూడదంటూ పేర్కొన్న తుది నివేదికపై తెలంగాణ మినహా ఆర్ఎంసీ సభ్యులు సంతకాలు చేశారు. శ్రీశైలం, సాగర్ల నిర్వహణకు శాశ్వత జలాశయాల నిర్వహణ కమిటీ (పీఆర్‌ఎంసీ)ని ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కృష్ణా బోర్డు కేటాయించిన నీటి వినియోగంపై ప్రతి పది రోజులకు ఒక సారి పీఆర్‌ఎంసీ సమావేశమై, లోటుపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి బోర్డుకు సూచనలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. -
శ్రీశైలంపై ఉమ్మడి సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విభేదాలు పక్కనపెట్టి ఏకాభిప్రాయానికి వచ్చాయి. జలాశయం నిర్వహణ విధివిధానాల (రూల్‌కర్వ్)కు స్వల్పమార్పులతో ఉమ్మడిగా సమ్మతి తెలిపాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలోని రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) శనివారమిక్కడ జలసౌధలో నిర్వహించిన చివరి సమావేశంలో ఈ మేరకు కీలక ముందడుగు పడింది. అయితే, నాగార్జునసాగర్ జలాశయం రూల్‌కర్వ్‌పై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. తదుపరి మార్పుల కోసం తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలని ఆర్ఎంసీ సూచించింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం వచ్చినా చర్చలు సంపూర్ణం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం తుది నిర్ణయం తీసుకుని రెండు రాష్ట్రాల సంతకాలతో సిఫార్సులను కృష్ణా బోర్డుకు సమర్పిస్తామని ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై విలేకరులకు తెలిపారు. జలాశయాలకు ఇక పర్మినెంట్ కమిటీ సోమవారం భేటీ తర్వాత ఆర్ఎంసీ తదుపరి సమావేశాలు ఉండవు. ఆపై ఈ కమిటీ ఉనికిలోనే ఉండదు. జలాశయాల నిర్వహణ, విద్యుదుత్పత్తిపై పర్యవేక్షణకు రెండు రాష్ట్రాల నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతో పర్మినెంట్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డుకు సిఫారసు చేయాలని ఆర్ఎంసీ నిర్ణయించింది. జల విద్యుత్‌పై తొలగిన పేచీ శ్రీశైలం జలాశయం నిల్వల వినియోగం విషయంలో తొలుత తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ అవసరాలకు నష్టం కలగకుండా జలవిద్యుదుత్పత్తి జరపాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలంలో నిల్వలు 854 అడుగులకు పడిపోయిన సందర్భంలో తాగు, సాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలు తీరిన తర్వాతే విద్యుదుత్పత్తి జరపాలి. ఇక శ్రీశైలంలో 50:50 నిష్పత్తిలో సమంగా జలవిద్యుదుత్పత్తి జరపాలని రూల్‌కర్వ్‌లోని నిబంధనలకు రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ నిబంధనలను రెండు రాష్ట్రాలు అనుసరిస్తే భవిష్యత్తులో వివాదాలు, ఇబ్బందులు ఉండవని రవికుమార్ పిళ్లై పేర్కొన్నారు. శ్రీశైలంలో 200 టీఎంసీలు కావాలి శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసేందుకు 512 టీఎంసీలు లభ్యతగా ఉండగా, 312 టీఎంసీలను నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు వీలుంది. మిగిలిన 200 టీఎంసీలను శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్‌లోని తమ ప్రాజెక్టుల అవసరాలకు వాడుకోవడానికి అవకాశం కల్పించాలని తెలంగాణ కోరినట్టు తెలిసింది. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా రెండు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్టు రవికుమార్ పిళ్లై తెలిపారు. మిగుల జలాలను గుర్తించి లెక్కించే మెకానిజాన్ని ఆర్ఎంసీ రూపకల్పన చేసింది. తెలంగాణ సరిహద్దులోకి వచ్చే ప్రతి చుక్కనూ లెక్కించనున్నారు. వరదలు ఉన్నప్పుడు ఎంత జలాలు(మిగులు) వచ్చాయి? లేనప్పుడు(డిపెండబుల్) ఎంత జలాలు వచ్చాయి? అని గుర్తించి కచ్చిత లెక్కలను నమోదు చేయనున్నారు. వరద (మిగులు) జలాల వినియోగాన్ని కోటా కింద పరిగణించరు. ఎవరికైనా అవసరముంటే వాడుకుంటాం: సి.మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదల శాఖ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వల నిర్వహణ, శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ విషయంలో ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయానికి వచ్చాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోవాలన్న షరతుతో మేము సమ్మతి తెలిపాం. 50:50 నిష్పత్తిలో జలవిద్యుదుత్పత్తి చేయాలని గతంలోనే ఒప్పుకున్నాం. ఎవరికైనా ఎక్కువ అవసరాలుంటే వాడుకుంటాం. మిగులు జలాల వాడకం లెక్కలోకి రాదు: సి.నారాయణ రెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ శ్రీశైలం జలాల్లో తొలుత తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే విద్యుత్ ఉత్పత్తి జరపాలని నిర్ణయించాం. మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలి. కోటా కింద పరిగణించరాదు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు నిండిన తర్వాత వృథాగా వెళ్లే జలాలనే మిగులు జలాలుగా పరిగణిస్తారు. వీటిని సాధ్యమైనంత ఎక్కువ వాడుకోవాలని నిర్ణయించాం. రూల్‌కర్వ్ అంటే...? రిజర్వాయర్ల నిర్వహణకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ప్రామాణిక పద్ధతి)గా రూపొందించిందే రూల్‌కర్వ్. జలాశయాల్లో లభ్యత మారుతూ అన్నిసార్లు మన అవసరాలు తీరడానికి అవకాశం ఉండదు. ఎంత వ్యత్యాసం ఉంటే అందుకు తగ్గట్లు మన అవసరాలను ఎంత మేరకు కుదించుకుని నీళ్లను వాడుకోవాలి అన్న విషయం రూల్‌కర్వ్‌లో ఉంటుందని రవికుమార్ పిళ్లై తెలిపారు. జలాశయాల నిర్వహణతోపాటు భద్రతకు ఇవి చాలా అవసరమన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ముసాయిదా రూల్‌కర్వ్‌ను సీడబ్ల్యూసీ రూపొందించి రెండు రాష్ట్రాలకు పంపిందని తెలిపారు. వీటిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపగా, వాటిపై చర్చించి తుదిరూపం ఇవ్వడానికి ఆర్ఎంసీ ప్రయత్నిస్తోందన్నారు. -
ముగింపా? కొనసాగింపా?
సాక్షి, అమరావతి: కృష్ణా నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచుగా వివాదాలకు దారితీస్తున్న సమస్యల పరిష్కారానికి రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) వచ్చే నెల 3న నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతోనైనా జల వివాదాలకు తెరపడుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ నియమావళి, విద్యుదుత్పత్తి, మళ్లించిన వరదజలాలను కోటాలో కలపడం ప్రధానమైన మూడు సమస్యలని మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సర్వ సభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. సమస్య –1: రూల్ కర్వ్‌పై తలో మాట బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియమావళి (రూల్ కర్వ్) ముసాయిదాను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. ఈ రూల్ కర్వ్‌పై ఆర్ఎంసీ చర్చించింది. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 114 టీఎంసీలు (చెన్నైకి తాగునీరు, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు– నగరి) బచాత్ ట్రిబ్యునల్, విభజన చట్టం కేటాయింపులు చేశాయని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదననే సమర్థిస్తోంది. సమస్య–2: విద్యుదుత్పత్తిపై తకరారు సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడు, కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్ నీటి కేటాయింపుల మేరకు 64% వాటా తమకు రావాలని ఏపీ స్పష్టం చేస్తుండగా.. తెలంగాణ మాత్రం తమకు 76% వాటా కావాలని ప్రతిపాదిస్తోంది. సమస్య–3: వరద జలాల మళ్లింపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండి, దిగువకు విడుదల చేస్తున్నప్పుడు.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కడలిలో జలాలు కలుస్తున్నప్పుడు.. అంటే వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏ మేరకు జలాలు మళ్లించినా వాటిని కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. -
‘కృష్ణా’లో నీటి లభ్యత 2,048 టీఎంసీలే
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 3,144.41 టీఎంసీలు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇందులో వాడుకోదగినవి 2,048.25 టీఎంసీలు మాత్రమేనని తేల్చింది. ‘కృష్ణా’లో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు (పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు)గా 1976లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చింది. బచావత్ ట్రిబ్యునల్ లెక్కగట్టిన దానికంటే ప్రస్తుతం ‘కృష్ణా’లో వాడుకోదగినవిగా సీడబ్ల్యూసీ తేల్చిన జలాలు 12 టీఎంసీలు తక్కువగా ఉండటం గమనార్హం. కృష్ణా నదిలో వరద రోజులు తగ్గడం.. వరద వచ్చినప్పుడు ఒకేసారి గరిష్టంగా రావడం.. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టి మళ్లించే సదుపాయాలు లేకపోవడంవల్ల కడలిలో కలిసే జలాల పరిమాణం అధికంగా ఉందని.. అందువల్లే ‘కృష్ణా’లో వాడుకోదగిన జలాల పరిమాణం తగ్గుతోందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని నదులలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే.. వాడుకోడానికి అవకాశం ఉన్నది 34.51 శాతమే ► దేశంలోని నీటి లభ్యతలో గంగా నది మొదటి స్థానంలో నిలిస్తే. గోదావరి రెండో స్థానంలో ఉంది. ‘కృష్ణా’ మూడో స్థానంలోనూ.. మహానది, నర్మద నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. పెన్నా నది 15వ స్థానంలో నిలిచింది. ► హిమాలయ నదులు, ద్వీపకల్ప నదుల్లో ఏడాదికి సగటున 70,601.08 టీఎంసీల లభ్యత సామర్థ్యం ఉంది. ఇందులో వినియోగించుకోవడానికి అవకాశమున్నది 24,367.12 టీఎంసీలే(34.51 శాతం). వరదలను ఒడిసిపట్టి, మళ్లించే సామర్థ్యం లేకపోవడంవల్ల 65.49 శాతం (46,233.96 టీఎంసీలు) జలాలు కడలిలో కలుస్తున్నాయి. ► గంగా నది పరివాహక ప్రాంతం (బేసిన్) 8,38,803 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగాలో నీటి లభ్యత సామర్థ్యం ఏటా 17,993.53 టీఎంసీలు ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 8,828.66 టీఎంసీలు. ► అలాగే, గోదావరి బేసిన్ 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో నీటి లభ్యత సామర్థ్యం ఏడాదికి సగటున 4,157.94 టీఎంసీలు. ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 2,694.5 టీఎంసీలే. పెన్నాలో జలరాశులు అపారం ఇక పెన్నా నది వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతమైన కర్ణాటకలోని నందిదుర్గం కొండల్లో పురుడుపోసుకుని.. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల మీదుగా ప్రవహించి 597 కి.మీల దూరం ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దేశంలో అతిపెద్ద నదుల్లో పెన్నాది 15వ స్థానం. ఈ నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 389.16 టీఎంసీలని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో వాడుకోదగిన జలాలు 243.67 టీఎంసీలని తేల్చింది. గత నాలుగేళ్లుగా పెన్నా బేసిన్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటం వల్ల నీటి లభ్యత పెరిగిందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
కాంగ్రెస్‌లో ఖర్గే మార్క్.. సీడబ్ల్యూసీ కనుమరుగు!
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. తొలి రోజే తన మార్క్‌ను చూపించేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అంతర్గత మార్పులకు నాంది పలుకుతూ.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సహా మొత్తం 47 మందితో స్టీరింగ్ కమిటీని నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో ఈ స్టీరింగ్ కమిటీ పని చేయనుంది. బుధవారం ఉదయమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రాజీనామా చేశారు. ‘సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీలు, ఇంఛార్జులు తమ రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందించారు.’ అని తెలిపారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్. ప్లీనరీ సెషన్ నిర్వహించే వరకు స్టీరింగ్ కమిటీ కొనసాగనుందని, తదుపరి ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సెషన్లో వర్కింగ్ కమిటీ కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కాంగ్రెస్ కొత్త సారథిగా ఖర్గే.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సోనియా.. -
పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకునేలోగా తొలిదశ కింద ఇంకా పునరావాసం కల్పించాల్సిన తొమ్మిది వేల కుటుం బాల నిర్వాసితులకు నిధులను వేగంగా రీయింబర్స్ చేస్తామని తెలిపింది. కోతకు గురైన ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్‌ను 30.5 మీటర్ల స్థాయికి పూర్తి చేసి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో నీటిని తోడి డయాఫ్రమ్ వాల్ పటిష్టతను తేల్చడం, అగాధాల పూడ్చివేత పరీక్షలు పూర్తి చేయాలని సూచించింది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్‌పై, అగాధాల పూడ్చివేత విధానంపై సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. ఆ మేరకు డయాఫ్రమ్ వాల్‌ను చక్కదిద్ది అగాధాలను పూడ్చి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని పేర్కొంది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. జల్ శక్తి శాఖ నిధులను త్వరితగతిన విడుదల చేసి డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తే పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుందని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు. తొలిదశ పూర్తికి రూ.10,911 కోట్లు అవసరం.. పోలవరం తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధులపై జలవనరుల శాఖ అధికారులతో చర్చించి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 6న జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలి దశ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు జల్ శక్తి శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం జగన్ కృషితో కదలిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని మోదీతో జరిగిన ప్రతి సమావేశంలోనూ 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులివ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఈ క్రమంలో జనవరి 3న ప్రధాని మోదీతో ఢిల్లీలో సీఎం జగన్ సమావేశమై విభజన సమస్యలు పరిష్కరించడంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నియమించే కమిటీతో చర్చించేందుకు కేంద్ర కమిటీని ఏర్పాటు చేయాలని పీఎంవోని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ క్రమంలో జనవరి 24న కమిటీల సమావేశంలో వెల్లడైన అంశాలను ఆగస్టు 22న జరిగిన భేటీలో ప్రధానికి సీఎం జగన్ వివరించారు. విభజన సమస్యలను పరిష్కరించడంతోపాటు పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు విడుదల చేయాలని వి/æ్ఞప్తి చేశారు. అనంతరం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పీఎంవో కమిటీ పోలవరానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను విడుదల చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను పీఎంవో ఆదేశించింది. -
కాళేశ్వరం మనుగడ సాగిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కీలక ప్రశ్నలను సంధించింది. ప్రాజెక్టు పూర్తయిన నాటి నుంచి ఇప్పటివరకు నిర్వహణ, మరమ్మతుల వ్యయ గణాంకాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన మేరకు యూనిట్‌కు రూ.3కు చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల వార్షిక సగటు ఎంత? అన్న విషయాలపైనా ఆరా తీసింది. విద్యుత్ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకు ని భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ప్రాజెక్టు సుస్థిర మనుగడకు అవసరమైన ఆదాయ మార్గాలను విశ్లేషించాలని.. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన వాస్తవ వ్యయం, బ్యాంకు రుణాలు, వడ్డీరేట్ల వివరాలు ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు అనుమతికోసం రాష్ట్ర ప్రభుత్వం జూలైలో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించింది. అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ పలు కీలక వివరాలు కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. పంపుహౌజ్‌లు ఎందుకు మునిగాయి? రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా.. తర్వాత ఆయకట్టు స్థిరీకరణ పేరుతో అదనపు టీఎంసీ పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొత్తం 3 టీఎంసీల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్మాణాల (కాంపోనెంట్ల) డిజైన్లను సమర్పించాలని సీడబ్ల్యూసీ రాష్ట్ర నీటి పారుదలశాఖను కోరింది. ఇక ‘ప్రాజెక్టులోని పంపుహౌజ్‌లు ఎందుకు నీటమునిగాయి? ప్రాజెక్టు డిజైన్లు ఎలా ఉన్నాయి? పంపుహౌజ్‌లు, సర్వీస్బే ఎత్తు ఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత?’వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర పరిశీలన జరపాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను సమర్పించాలని ఆదేశించింది. ‘ఏ పంపుహౌజ్ ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లను తరలించారు? ఎంత ఆయకట్టుకు నీరందించారు?’అన్న విషయంలో వార్షిక గణాంకాలను అందించాలని సీడబ్ల్యూసీ కోరింది. పంపుల సంఖ్య, వాటి సామర్థ్యం, వ్యయం, తయారు చేసిన కంపెనీ వివరాలూ ఇవ్వాలని సూచించింది. కాస్ట్ బెనిఫిట్ రేషియోపై అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలపై సీడబ్ల్యూసీ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, ఉత్పాదక విలువ మధ్య నిష్పత్తిని కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు. కాళేశ్వరం ఉత్పాదక వ్యయం కన్నా నిర్వహణ వ్యయమే అధికమని.. అదనపు పనులతో అదనపు ఆయకట్టు లేకున్నా, ప్రాజెక్టు వ్యయం పెరిగినా కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎలా మెరుగైందని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనుల విలువెంత? కాంట్రాక్టర్లకు కాళేశ్వరం పనుల అప్పగింతపైనా సీడబ్ల్యూసీ ప్రశ్నలు సంధించింది. టెండర్ల ద్వారా అన్ని రకాల కాంపోనెంట్ల పనులను ఏ తేదీకి అప్పగించారు? పనుల విలువ, పరిమాణం ఎంత? వంటి వివరాలను అందజేయాలని కోరింది. దూరంలో పెద్ద రిజర్వాయర్లు ఎందుకు? గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వంటి చిన్న రిజర్వాయర్లను నిర్మించి నదిలేని చోట మల్లన్నసాగర్ వంటి భారీ రిజర్వాయర్లను నిర్మించడాన్ని సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. ‘వేర్వేరు ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు గోదావరిపైనే భారీ జలాశయాలను ఎందుకు ప్లాన్ చేయలేదు? అధిక వ్యయం, భూసేకరణకు దారితీసేలా మేడిగడ్డ బ్యారేజీకి సుదూరంలో మల్లన్నసాగర్, బస్వాపురం వంటి జలాశయాలను ఎందుకు ప్లాన్ చేశారు?’అన్న విషయాలపై వివరణ కోరింది. -
‘నేను అధ్యక్షునిగా నెగ్గితే సీడబ్ల్యూసీకి ఎన్నికలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైతే పార్టీని సంస్కరణల బాట పట్టిస్తానని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రకటించారు. ‘పార్టీ నియమావళిలోని ప్రతి నిబంధననూ అమలుచేస్తా. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహిస్తా. పాతికేళ్లకుపైగా చేష్టలుడిగిన పార్లమెంటరీ బోర్డ్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తా. నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరిస్తా. పార్టీకి క్షేత్రస్థాయిలో మూలస్తంభాలైన పధాధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడతా. ఉదయ్‌పూర్ తీర్మానాలను అమల్లోకి తెస్తా’ అని బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను సంస్కరణవాదిని. పార్టీని నడిపే విధానంలో వైవిధ్యం చూపిస్తా. 2024లో బీజేపీని ఢీకొట్టి ఓడించేలా కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తా’ అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ -
పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై.. మళ్లీ అధ్యయనం కుదరదు
సాక్షి, అమరావతి: గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–హైదరాబాద్, 58 లక్షల క్కూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ అధ్యయనంలో వెల్లడైందని.. వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఈఎన్సీలు చేసిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా తోసిపుచ్చారు. గరిష్ట వరదలవల్ల బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపు ఉంటుందన్న మూడు రాష్ట్రాల వాదనను కొట్టిపారేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే డిజైన్‌ను ఆమోదించామని.. ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్), ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసే గరిష్ట వరద ప్రవాహం (స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఫ్లండ్–ఎస్పీఎఫ్)లను పరిగణలోకి తీసుకుని బ్యాక్‌వాటర్ ప్రభావంపై ఆదిలోనే అధ్యయనం చేశామని గుర్తుచేశారు. తాము నిర్వహించిన అధ్యయనాల్లో బ్యాక్‌వాటర్ ప్రభావం ఉంటే ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించామని.. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి సిద్ధమైందని వివరించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. ముంపు ప్రాంతాలను గుర్తించడానికి ఏపీతో కలిసి సంయుక్త సర్వేకు సిద్ధమవ్వాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీలను ఆదేశించారు. శబరి, సీలేరు నదులౖపై కరకట్టలు నిర్మించడానికి వీలుగా.. ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావంపై అనుమానాలను నివృత్తి చేయడానికి గత నెల 29న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాలు నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి.. ముంపు, బ్యాక్‌వాటర్‌పై అనుమానాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేయడానికి నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశాన్ని నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తాను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆ సమావేశంలో ఆదేశించారు. దీంతో శుక్రవారం ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని సాంకేతిక బృందాలు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని సాంకేతిక నిపుణులతో ఆర్కే గుప్తా సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల్లా మాట్లాడితే ఎలా? పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలకూ.. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలవల్ల జరిగిన ముంపునకూ క్షేత్రస్థాయిలో పొంతన కుదరడంలేదని.. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీలు ఆర్కే గుప్తాను కోరారు. గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరదే వస్తుందన్న అంచనాతో తాము ఏకీభవిస్తున్నామని.. కానీ, దాన్ని పరిగణలోకి తీసుకుని పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సరిపోవడంలేదని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. జూలైలో వచ్చిన వరదలవల్ల భద్రాచలం సహా ఏడు మండలాల పరిధిలోని 103 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని.. 11 వేల మందిపై ప్రభావం పడిందని.. 150 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల భూమి ముంపునకు గురైందని ఫొటోలు చూపుతూ వివరించారు. దీనిపై గుప్తా స్పందిస్తూ.. ఇంజనీర్లైన మీరు రాజకీయ నాయకుల్లా మాట్లాడటం తగదని చురకలంటించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాజెక్టులకు చేసిన తరహాలోనే పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేశామని.. ఎక్కడా తమ అధ్యయనంపై ఎవరూ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవన్నారు. బ్యాక్‌వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. గోదావరికి వరద వచ్చినప్పుడు.. ఏ ప్రాంతంలో నీటి మట్టం ఎంత పెరిగిందన్న వివరాలను ఈనెల 19లోగా రాతపూర్వకంగా అందిస్తే.. వాటిని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పుడు రెండన్నారు.. ఇప్పుడు 35? ఇక పోలవరం ప్రాజెక్టు వెనుక భాగంలో గోదావరిలో కిన్నెరసాని, ముర్రేడువాగు సహా 35 వాగులు కలుస్తాయని.. బ్యాక్‌వాటర్ ఈ వాగుల్లోకి ఎగదన్నడంతో ముంపునకు దారితీస్తోందని.. దీనిపై అధ్యయనం చేయాలని.. ముంపు ముప్పు తప్పించడానికి కరకట్టలు నిర్మించాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వివరిస్తుండగా.. ఆర్కే గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదిలో కేవలం కిన్నెరసాని, ముర్రేడువాగుల ద్వారా బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేస్తే చాలని కోరారని.. ఇప్పుడేమో 35 వాగులపై అధ్యయనం చేయాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి జోక్యంచేసుకుని.. కిన్నెరసాని, ముర్రేడువాగులపై అధ్యయనం చేశామని.. చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని తేలిందని.. ఆ అంశాలను తెలంగాణకు అందజేశామన్నారు. సంయుక్త సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా నో మరోవైపు.. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని, కరకట్టల నిర్మించడానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా ఆదేశాలను అమలుచేస్తామని ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీ అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే 150 అడుగుల కాంటూర్ పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించామని.. 175 అడుగుల కాంటూర్ పరిధిలో కూడా గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని కోరారు. కానీ.. ఒడిశా ఈఎన్సీ ఇందుకు సహకరించబోమన్నారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు లోబడే ప్రాజెక్టును నిర్మిస్తున్నామనే అంశాన్ని గుర్తించాలని.. ఆ అవార్డు ప్రకారమే తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని స్పష్టంచేశారు. -
పోలవరం బ్యాక్ వాటర్ వివాదం పై CWC కీలక నిర్ణయం
-
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం నిర్మాణం
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (జీడబ్ల్యూడీటీ) ప్రకారమే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. జీడబ్ల్యూడీటీ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు వెనుక భాగంలో వరద నీటి మట్టం ఎంత ఉంటుందో, ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతే ఉంటుందని తేల్చి చెప్పింది. బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేశాకే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసింది. ముంపు ప్రభావంపై సాంకేతికంగా వాస్తవాలను వివరించి, ప్రభావిత రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈనెల 7న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి నివేదిక ఇవ్వాలని ఈనెల 6న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తా వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ అధికారి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల అధికారులు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల ఒప్పందం మేరకే.. పోలవరం నిర్మాణానికి అంగీకరిస్తూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని, దీనిని జీడబ్ల్యూడీటీ ఆమోదించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. దాని ప్రకారమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. గోదావరికి వందేళ్లలో గరిష్టంగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అదే స్థాయిలో పోలవరం స్పిల్ వే నిర్మిస్తే సరిపోతుందన్నారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు వదిలేసేలా స్పిల్ వే డిజైన్‌ను సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించిందన్నారు. ఆ డిజైన్ ప్రకారమే కేంద్రం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను 2009 నాటికే ఇచ్చిందని.. ఆ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ముంపు నివారణకు సీలేరు, శబరి నదులకు కరకట్టల నిర్మాణానికి ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వందల సార్లు ఆ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అయినా స్పందన లేదని చెప్పారు. ఈ కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ అధ్యయనమే ప్రామాణికం పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారిన నేపథ్యంలో పర్యావరణ అనుమతిని పునఃసమీక్షించే వరకు పనులు నిలిపివేయాలని ఒడిశా, చత్తీస్‌గఢ్ కోరడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిజైన్ ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ చేసిన అధ్యయనంలో భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగరం, భద్రాద్రి విద్యుత్కేంద్రం, గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ అని, అది చేసిన బ్యాక్ వాటర్ సర్వేనే ప్రామాణికమని స్పష్టంచేశారు. బ్యాక్ వాటర్‌తో ముంపు ఉండదని సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేల్చిందని చెప్పారు. గోదావరికి గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్ట్ పార్టీతో అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరగా, ఆ స్థాయిలో గోదావరికి వరద వచ్చే అవకాశమే లేదని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఈ ఏడాది నీటిని నిల్వ చేయడం వల్ల శబరి, సీలేరు ద్వారా వరద ఎగదన్ని తమ ప్రాంతం ముంపునకు గురైందన్న ఒడిశా వాదనను పీపీఏ సీఈవో కొట్టిపారేశారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటినే నిల్వ చేయలేదని, అందువల్ల వరద ఎగదన్నిందని చెప్పడం సబబు కాదని అన్నారు. ఈ ఏడాది వరదలకు తమ రాష్ట్రాంలోనూ గిరిజన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చత్తీస్‌గఢ్ అధికారులు చెప్పగా.. ఇంద్రావతి వరదల వల్లే ఆ ప్రాంతం ముంపునకు గురైందని సీడబ్ల్యూసీ అధికారులు తేల్చిచెప్పారు. -
బ్యాక్ వాటర్ ముప్పు ఒట్టిదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపు ముప్పు ఉంటుదన్నది ఒట్టి అపోహేనని ఆదిలోనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఐఐటీతో తెలంగాణ ప్రభుత్వం.. రూర్కీ ఐఐటీతో ఒడిశా సర్కార్ చేయించిన అధ్యయనాలలోనూ ఇదే అంశం స్పష్టమైంది. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు.. కట్టాక, ప్రాజెక్టులోకి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా వెనుక భాగంలో వరద నీటి మట్టం పది సెంటీమీటర్లు అంటే 1/3 అడుగు మేర మాత్రమే పెరుగుతుందని హైదరాబాద్ ఐఐటీ, రూర్కీ ఐఐటీ అధ్యయనాలలో వెల్లడైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్(ఏపీఈఆర్‌ఎల్), 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీకో సంస్థ చేసిన అధ్యయనాలలోనూ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం పరిగణించదగ్గ స్థాయిలో ఉండదని స్పష్టమైంది. ఇదే అంశాన్ని ఈనెల 29న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో నిర్వహించే సమావేశంలో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం ఇసుమంత కూడా ఉండదనే అంశాన్ని ఈ సమావేశంలో మరో మారు స్పష్టం చేయాలని సీడబ్ల్యూసీ కూడా నిర్ణయించింది. పెద్దగా తేడా ఉండదు.. ► గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తోందని.. దీని వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒడిశా, ఛత్తీస్గడ్ సర్కార్లు వేర్వేరుగా ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్)లు దాఖలు చేశాయి. ► వీటిపై విచారించిన సుప్రీంకోర్టు 2011 ఏప్రిల్ 11న సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ అధికారులు, నిపుణులతో ముంపు ప్రభావాన్ని తేల్చడానికి కమిటీ వేసింది. ఈ కమిటీ 2011 మే 23, 24న పోలవరంలో పర్యటించి.. సమగ్రంగా అధ్యయనం చేసి, 2011 జూన్ 14న సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని.. ఈ ప్రాజెక్టు కట్టినా, కట్టకపోయినా వెనుక జలాల్లో పెద్దగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ► పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్వహణే అత్యంత కీలకమని.. సమర్థవంతంగా నిర్వహిస్తే ఎలాంటి ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ నిపుణులు తెగేసి చెప్పారు. ప్రపంచంలో అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్ విధానంలో గేట్ల నిర్వహణను చేపట్టిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ముప్పు ఉండదని అభిప్రాయపడ్డారు. ► గోదావరికి 50 లక్షలు, 40 లక్షలు, 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు కుంట, శబరి లాస్ట్ క్రాస్ వద్ద ఏ స్థాయిలో నీటి మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు కట్టాక కూడా అదే స్థాయిలో నీటి మట్టం ఉంటుందని ఐఐటీ–రూర్కీ తేల్చింది. ► పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 150 అడుగుల గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్త సర్వే చేయాలి. ఇందుకు ఏపీ పలుమార్లు లేఖ రాసినా ఒడిశా స్పందించడం లేదు. ► శబరి, సీలేరులకు కరకట్టలు కట్టినా కట్టకున్నా పెద్దగా మార్పు ఏమీ ఉండదని సీకో అధ్యయనం తేల్చిచెప్పింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు లోబడే.. ► గోదావరిపై పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 150 అడుగుల (45.72 మీటర్లు) సామర్థ్యంతో నిర్మించుకోవడానికి ఆమోదం తెలుపుతూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ► ప్రాజెక్టులో 140 అడుగుల్లో (42.672 మీటర్లు) నీటి మట్టం ఉన్నప్పుడు గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించాలని పేర్కొంది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. పోలవరం ప్రాజెక్టు వెనుక భాగాన ఎలాంటి ముంపు ప్రభావం ఉండకూడదనే లక్ష్యంతో ఆ మేరకు నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) డిజైన్లు ఆమోదించింది. ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోంది. తద్వారా ఎగువ నుంచి భారీ వరద వచ్చినా బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలపై ఏమాత్రం పడదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశం ► పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలు అన్నింటితో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని ఈనెల 6న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ఈనెల 29న కేంద్రం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులతోపాటు ఏవైనా రాష్ట్రాలతో సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ నేపథ్యంలో ఈనెల 29న నిర్వహించే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై వేర్వేరు అధ్యయనాలలో వెల్లడైన అంశాలను వివరించి ఆ రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. -
పోలవరం తొలిదశతో 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు
సాక్షి, అమరావతి: పోలవరం తొలి దశ పూర్తైతే కుడి కాలువ కింద 1.57 లక్షల ఎకరాలు(తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టు), ఎడమ కాలువ కింద 1.14 లక్షల (పుష్కర ఎత్తిపోతల) ఎకరాలతో కలిపి మొత్తం 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వాటర్ ప్లానింగ్, పాజెక్టుల విభాగం సభ్యుడు కె.వోహ్రాకు ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు వివరించారు. గోదావరి డెల్టాలో 10.13 లక్షలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు వెరసి రూ.23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్నారు. తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.10,911 కోట్లు అవసరమని తెలిపారు. దీంతో ఏకీభవించిన వోహ్రా.. తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధుల మంజూరుకు నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి ఎం.రఘురాంను ఆదేశించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,587.87 కోట్లను ఆమోదించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ.పది వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని ఇటీవల ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని ఆదేశాల మేరకు పోలవరంతోపాటు సీఎం జగన్ ప్రస్తావించిన ఇతర అంశాల పరిష్కారంపై పీఎంవో నియమించిన కేంద్ర కమిటీ గత నెల 25న ఢిల్లీలో రాష్ట్ర అధికారుల కమిటీతో సమావేశమైంది. ఈ సమావేశంలో పోలవరానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర కమిటీ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.వోహ్రా మంగళవారం వర్చువల్ విధానంలో పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, సహాయ పునరావాస విభాగం కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తదితరులతో సమావేశమయ్యారు. రెండోదశలో... పోలవరం రెండో దశ పూర్తైతే ఆయకట్టులో మిగిలిన 4.02 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని, ఇందుకు మరో రూ.21 వేల కోట్లకుపైగా అవసరమని పోలవరం సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ప్రభావం పోలవరం తొలిదశపై ఏమాత్రం ఉండదని వోహ్రాకు వివరించారు. పోలవరం పూర్తయితే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతలతోపాటు పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలను మూసేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల వరద జలాలపై ఆధారపడి చేపట్టామని చెప్పారు. వెంకటనగరం పంపింగ్ స్కీం ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీంతో పోలవరం తొలి దశ పూర్తికి నిధులపై నివేదిక పంపాలని పీపీఏ సభ్య కార్యదర్శిని వోహ్రా ఆదేశించారు. పీపీఏ నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేస్తామని చెప్పారు. -
..రాహుల్‌ను మించినోళ్లు లేరు: ఖర్గే
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే పూర్తి అర్హతలు దేశం మొత్తమ్మీద రాహుల్ గాంధీకి మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగేలా ఆయనను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్‌దాకా దేశమంతటా పార్టీకి అధ్యక్షుడిగా సమ్మతి సంపాదించే ఏకైక వ్యక్తి రాహులే. ఆయన చరిష్మాతో సరిపోలే వ్యక్తి మరొకరు లేరు. ఇంకెవరైనా ఉన్నారేమో మీరే చెప్పండి’ అన్నారు. ‘‘పార్టీ కోసం, ఆర్ఎస్ఎస్–బీజేపీపై పోరాటం కోసం, దేశ సమైక్యత కోసం అధ్యక్ష పదవికి రాహుల్‌ను ఒప్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ తేదీలను ఆదివారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీలో ఖరారుచేయనున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి ఆ బాధ్యతలను తాత్కాలిక హోదాలో సోనియాగాంధీ నిర్వర్తిస్తున్నారు. తేదీలు ఖరారుకు నేడు సీడబ్ల్యూసీ భేటీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడానికి సీడబ్ల్యూసీ సోమవారం సమావేశం కానుంది. ఆజాద్ రాజీనామా, రాహుల్‌పై ఆయన తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సభ్యులంతా విశ్వాసం ప్రకటించే అవకాశముంది. భేటీలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. వైద్య పరీక్షల సోనియా అమెరికా వెళ్లడం తెలిసిందే. రాహుల్, ప్రియాంక కూడా ఆమె వెంట వెళ్లారు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొద్ది వారాలు ఆలస్యమవుతుందని, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయి అధ్యక్షుడు పగ్గాలు చేపడతరాని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మొదలు కానుండడంతో అధ్యక్ష ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరుగుతాయని ఆ వర్గాలు వివరించాయి. ఆజాద్‌వి తప్పుడు వ్యాఖ్యలు: పైలట్ న్యూఢిల్లీ: సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరస పరాజయాలకు రాహుల్ గాంధీ ఒక్కడినే బాధ్యున్ని చేయడం సరికాదని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ అన్నారు. పార్టీని వీడుతూ, రాహుల్‌పై ఈ మేరకు గులాం నబీ ఆజాద్ చేసిన విమర్శలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆజాద్ లేఖను వ్యక్తిగత దూషణాస్త్రంగా అభివర్ణించారు. ‘‘బీజేపీ దుష్పాలనపై ‘భారత్‌జోడో యాత్ర’ పేరిట కాంగ్రెస్ పోరుబాట పడుతున్న తరుణంలో సొంత పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆజాద్ లేఖ రాయడం అత్యంత విచారకరం’’ అని శనివారం వ్యాఖ్యానించారు. ‘ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఆజాద్ వేర్వేరు హోదాలను అనుభవించి, పార్టీకి అవసరమైన కీలక సమయంలో నిష్క్రమించడం, నిందించడం దారుణం’ అన్నారు. -
ఏదినిజం?: గోబెల్స్‌ను మించిన రామోజీ!
పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం నాడు చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తే రామోజీ పట్టించుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు తనవాడు కాబట్టి... తన కుమారుడు కిరణ్ వియ్యంకుడికి చెందిన నవయుగకు అక్రమంగా రూ.6,522.2 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు కాబట్టి.. చంద్రబాబు, వియ్యంకుడితో కలిసి దోచుకో.. పంచుకో.. తినుకో(డీపీటీ) విధానంలో అందినంత దోచుకున్నారు కాబట్టి. కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి పోలవరంలో పనుల్లో జాప్యానికి చంద్రబాబు కారణమైతే దాన్ని ‘రామోజీ’ కప్పెట్టే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాన్ని పదే పదే అచ్చేస్తే నమ్ముతారనేది ‘ఈనాడు’ మార్కు పాత్రికేయం.అస్మదీయుడు చేసిన తప్పును తస్మదీయుడిపైకి నెట్టేలా పదే పదే విషపురాతలు రాస్తుండటమే అందుకు తార్కాణం. పోలవరానికి సంబంధించి కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏలు రాష్ట్ర జలవనరుల శాఖతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడం సాధారణం. ఈ క్రమంలో పీపీఏ రాసిన ఓ లేఖను పట్టుకుని.. ‘ఈ పాపం మీదే’ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లుతూ బుధవారం ‘ఈనాడు’లో రామోజీ ఓ కథనాన్ని అచ్చేశారు. అందులో నిజమెంతంటే నేతి బీరకాయలో నెయ్యంత..!! ఇదిగో చూద్దాం.. సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. అనుమతులు, డిజైన్లతోసహా అన్నీ తామే తెచ్చి వంద శాతం వ్యయాన్ని భరించి ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. కేంద్రమే పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014 జూన్ 8 నుంచే నాడు చంద్రబాబు అడుగుతూ వచ్చారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధపడటంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను గత సర్కారుకు కేంద్రం అప్పగించింది. జల్ శక్తి శాఖ, జలసంఘం(సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ సమన్వయంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలి. రాష్ట్ర జలవనరుల శాఖతో కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అడిగిన సమాచారాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ అందజేస్తుంది. ఈ క్రమంలో 2024 జూన్‌కు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్యాచరణ ప్రణాళికను పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ అందజేసింది. దీన్ని పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించాయి. ఆ గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని జూలై 22న పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఆ లేఖలో పీపీఏ ప్రస్తావించిన అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సమాధానం ఇస్తారు. జాప్యం పాపం బాబుదే.. ► చంద్రబాబు కమీషన్ల దాహం ఫలితంగా దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరులో సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. జెట్ గ్రౌటింగ్ చేసి జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుక నింపి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలని.. 30 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ వేసి.. 30.5 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యామ్ నిర్మించాలని సూచించింది. జూలై 31 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని పేర్కొంది. ► కోతకు గురైన ప్రాంతంలో జెట్ గ్రౌటింగ్ వేస్తుంటే ఇసుక పొరలు జారిపోయి పీయూ(పాలీయురిథేన్) గ్రౌటింగ్ చేయాల్సి వచ్చింది. ఇది అధిక శ్రమ, సమయంతో కూడిన పని. ► ప్రపంచవ్యాప్తంగా జియో మెంబ్రేన్ బ్యాగ్‌ల వినియోగం అతి తక్కువగా ఉంటుంది. వాటి లభ్యత కూడా తక్కువే. దాంతో 2.30 లక్షల జియో మెంబ్రేన్ బ్యాగ్‌ల తయారీకి గుజరాత్, అస్సోం సంస్థలకు అప్పగించి వాటిలో ఇసుక నింపి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చారు. ఆ తర్వాత 30 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ వేసి దానిపై దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. ► 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్ జూలై 9 నాటికి పూర్తయింది. గోదావరికి జూలైలో ఎన్నడూ భారీ వరద వచ్చిన దాఖలా లేదు. ఈ ఏడాది జూలై 10న ఎగువ నుంచి భారీ వరద రావడంతో దిగువ కాఫర్ డ్యామ్‌ను వరద ముంచెత్తింది. పనులకు ఆటంకం కలిగింది. లేదంటే జూలై 31 నాటికే దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది. ఇదే అంశాన్ని పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ వివరించనుంది. వరదల్లో పరీక్షలు సాధ్యమా? ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి 11 రకాల పరీక్షలు చేసి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాలని మే 17న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు. ఆ మేరకు చేపట్టిన పరీక్షలు తుది దశకు చేరుకుంటున్న దశలో దిగువ కాఫర్ డ్యామ్ మీదుగా గోదావరి వరద ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలోకి చేరింది. వరదల్లో పరీక్షలు నిర్వహించడం అసాధ్యం. ఇదే అంశాన్ని పీపీఏకు వివరిస్తూ వరదలు తగ్గాక పరీక్షలు నిర్వహించి నివేదిక అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి లేఖ రాయనున్నారు. ఇటీవల లోక్‌సభలో పోలవరంపై జరిగిన చర్చలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని రీతిలో ఈ ఏడాది గోదావరికి జూలై రెండో వారంలోనే భారీ వరద వచ్చిందని.. దిగువ కాఫర్ డ్యామ్ పనులకు ఆటంకం కలిగిందని తెలిపారు. వరదలు తగ్గాక దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి 2024 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రణాళిక రచించామని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టిందని వివరించారు. ఇదంతా ‘ఈనాడు’ అధిపతికి తెలిసినా చంద్రబాబు చేసిన తప్పిదాలను సీఎం జగన్‌పై నెడుతూ విషప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కమీషన్ల దాహం వల్లే.. ► నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే నిర్మించి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక,స్పిల్ వే మీదుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్ డ్యామ్ పూర్తి చేశాక.. ప్రధాన డ్యామ్ పునాది వేయాలి. ప్రపంచవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ► చంద్రబాబు సర్కారు 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకూ అంటే అధికారంలోకి వచ్చిన తొలి 31 నెలల్లో పోలవరంలో తట్టెడు మట్టెత్తలేదు. టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. కమీషన్లు వచ్చే పనులకు చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. స్పిల్ వే పూర్తి చేయకుండా.. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టకుండా.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయా ఫ్రమ్వాల్ను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ► ఆ తర్వాత 2018 ఫిబ్రవరి 27న ట్రాన్స్ట్రాయ్పై 60సీ నిబంధన కింద వేటు వేసి మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టేశారు. స్పిల్ వేను పూర్తి చేయకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించి 2019 ఫిబ్రవరిలో మధ్యలోనే వదిలేశారు. ► నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక.. ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఇరు వైపులా 750 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ కుడి వైపున 600 మీటర్లు ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. చంద్రబాబు ఈ పాపాలకు పాల్పడకపోయి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాపం టీడీపీ సర్కార్‌దే.. ► 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ రెండో వారంలోనే గోదావరికి వరదలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లోనే 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 115 గ్రామాలకు చెందిన 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించడం.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయడం ఎలా సా«ధ్యమో రామోజీకే తెలియాలి. చంద్రబాబు ఐదేళ్లలో చేయలేని పనిని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం 15 రోజుల్లోనే ఎలా చేయగలదో ఆయనే చెప్పాలి. ► 2019లో ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా కేవలం 750 మీటర్లకే కుచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. దాంతో వరద ఉద్ధృతి అధికమై ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురి కావడంతో 12 నుంచి 22 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 600 మీటర్ల వరకూ కోతకు గురైన పెద్ద అగాధం ఏర్పడింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది పోలవరం పనుల్లో జాప్యానికి దారితీసింది. వీటిని పరిశీలిస్తే.. ఈ పాపమంతా చంద్రబాబుదేనన్నది స్పష్టమవుతోంది. వియ్యంకుడిపై వేటు వేశారని.. పోలవరంలో చంద్రబాబు సర్కారు పాల్పడిన అక్రమాలపై సీఎం వైఎస్ జగన్ నిపుణుల కమిటీతో విచారణ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.3,302 కోట్ల విలువైన పోలవరం జలాశయం పనులను నామినేషన్ పద్ధతిలోనూ, రూ.3,220.2 కోట్ల విలువైన విద్యుత్కేంద్రం పనులు అక్రమంగా నవయుగకు కట్టబెట్టారని, వాటిని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ సూచించింది. దీంతో వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. నవయుగకు అప్పగించిన మొత్తం కంటే రూ.845 కోట్లు తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థకు ప్రభుత్వం పనులు అప్పగించింది. వియ్యంకుడికి చెందిన నవయుగపై వేటు వేశారనే అక్కసుతోనే ‘ఈనాడు’ రామోజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతూ విషపురాతలు రాస్తున్నారు. ప్రణాళికాయుతంగా పోలవరం పనులు చేపట్టి పూర్తి చేసే దిశగా సీఎం జగన్ చిత్తశుద్ధితో వడి వడిగా అడుగులు వేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
సాగు, తాగునీటి అవసరాలకే శ్రీశైలం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న జలాల వినియోగంలో సాగు, తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డు రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)కి ఆంధ్రప్రదేశ్ తేల్చి చెప్పింది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని స్పష్టంచేసింది. శ్రీశైలం జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టు అని, కనీస నీటిమట్టం 834 అడుగులేనని తెలంగాణ చెప్పింది. తెలంగాణ వాదనను ఆర్ఎంసీ కన్వీనర్, కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై తోసిపుచ్చారు. శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించిందని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్కే పిళ్లై అధ్యక్షతన ఆర్ఎంసీ సమావేశమైంది. బోర్డు సభ్యులు ముయన్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ నియమావళి (రూల్ కర్వ్), జలవిద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించగలమని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పారు. జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ కాకుండా.. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకూ 854 అడుగుల్లో నీరు ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఈ లెక్కన శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 66 శాతం, సాగర్ విద్యుత్‌లో 50 శాతం ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉత్పత్తయ్యే విద్యుత్ చెరి సగం పంచుకునేలా ఆదిలోనే అంగీకారం కుదిరిందన్నారు. దీనికి అంగీకరించే ప్రశ్నే లేదని, తాము కోరిన వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ ఈఎన్సీ పట్టుబట్టారు. శ్రీశైలానికి దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు ఎవరి వాటా జలాలను వారు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. వరద జలాలపై ఏకాభిప్రాయం జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు అన్ని ప్రాజెక్టులు నిండి, సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్న సమయంలో మళ్లించే వరద జలాలను వాటా (నికర జలాలు)లో కలపకూడదని ఏపీ ఈఎన్సీ కోరారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ మాట్లాడుతూ.. మళ్లించిన వరద జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఏపీకి ఎక్కువగా ఉన్నందున, వాటిలో వాటా ఇవ్వాలని కోరారు. ముంపు ముప్పును నివారించడానికే వరద జలాలను మళ్లిస్తున్నామని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వరద జలాలను వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉందని ఏపీ ఈఎన్సీ స్పష్టం చేశారు. ఆర్కే పిళ్లై జోక్యం చేసుకుంటూ.. మళ్లించే వరద జలాలను లెక్కిస్తామని, కానీ వాటిని వాటాలో కలపబోమని స్పష్టం చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈనెల మూడో వారంలో మళ్లీ ఆర్ఎంసీ సమావేశం నిర్వహిస్తామని పిళ్లై చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన అంశాలపై బోర్డుకు నివేదిక ఇస్తామన్నారు. -
కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తతో చేపట్టిన ఈ రక్షణ చర్యలను మంగళవారం సీడబ్ల్యూసీ (డిజైన్స్ విభాగం) సీఈ డీసీ భట్ ప్రశంసించారు. నిజానికి.. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికే సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ చేసింది. ఆ మేరకే పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. కానీ, గోదావరి బేసిన్లో ఈనెల 13 నుంచి కురిసిన భారీ వర్షాలవల్ల పోలవరం వద్దకు 28.50 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. కానీ, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌ను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈనెల 14న జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకూ రివిట్మెంట్పైన కోర్ (నల్లరేగడి మట్టి) వేసి, దానిపై ఇసుక బస్తాలను వేశారు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటర్ ఎత్తుతో మట్టి, రాళ్లువేసి కాఫర్ డ్యామ్ ఎత్తును 43 నుంచి 44 మీటర్లకు పాక్షికంగా పెంచే పనులను 48గంటల రికార్డు సమయంలోనే అధికారులు పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ అనుమతి కోరిన అధికారులు సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. ఇలా గరిష్టంగా వరద వచ్చినా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్‌ను పటిష్టంచేసే పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో మరింత పటిష్టపర్చడం.. పూర్తిస్థాయిలో 44 మీటర్ల ఎత్తుకు పెంచే పనులు చేపట్టడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ అనుమతిని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. దీనిపై సీడబ్ల్యూసీ సీఈ (డిజైన్స్) డీసీ భట్ అధ్యక్షతన మంగళవారం కేంద్రం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ (డిజైన్స్) రాజేష్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీడబ్ల్యూసీ, పీపీఏ అభినందించాయి. ఎత్తు పెంపు పనులకు శ్రీకారం.. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో 2,454 మీటర్ల పొడవున నిర్మించారు. 40.5 మీటర్ల వరకూ కాఫర్ డ్యామ్ మధ్యలో అడుగుభాగాన గరిష్టంగా 237 మీటర్లు (మధ్యలో 16.2 మీటర్లు వెడల్పుతో కోర్).. పైభాగానికి వచ్చేసరికి కనిష్టంగా 9 మీటర్ల (మూడు మీటర్ల వెడల్పుతో కోర్) వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. నీటి లీకేజీలను అడ్డుకునేందుకు కోర్ వేసిన మట్టం అంటే 40.5 మీటర్ల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పైభాగాన 2.5 మీటర్లు రాళ్లు, మట్టితో పనులు చేశారు. 40.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నీటిమట్టం పెరిగితే.. లీకేజీలవల్ల కాఫర్ డ్యామ్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటీవల గరిష్టంగా 26.9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరంలో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 38.76 మీటర్లు నమోదైంది. కానీ, గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌కు నష్టం కలగకుండా ఉండాలంటే 43 మీటర్ల వరకూ 3 మీటర్ల వెడల్పుతో కోర్‌వేసి.. పాక్షికంగా రెండు మీటర్ల వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచిన పనులకు తోడుగా మిగతా ఏడు మీటర్లు వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనపై సీడబ్ల్యూసీ సీఈ డీసీ భట్ ఆమోదముద్ర వేశారు. కోర్‌ను పొరలు పొరలుగా వేసి.. రోలింగ్ చేస్తూ.. పటిష్టతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పనులుచేయాలని సూచించారు. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. -
బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు
సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వారి పాపాలు ప్రాజెక్టును ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యానికి కారణమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన స్పిల్ వే పూర్తి చేసి, గేట్లు బిగించారు. ఈ చర్యల కారణంగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గోదావరికి జూలై రెండో వారంలో రికార్డు స్థాయిలో భారీ వరద వచ్చినా, స్పిల్ వే ద్వారా సులభంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 25 అడుగులకు చేరడంతో కోతకు గురైన ప్రాంతం మీదుగా ప్రవహిస్తోంది. దాంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్ద అప్పట్లో ఏర్పడ్డ అగాధాలను పూడ్చే పనులకు ఆటంకం కలిగింది. వీటిని పూడ్చే విధానాన్ని ఖరారు చేసేందుకు 11 రకాల పరీక్షలను జూలైలోగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. ప్రస్తుతం ఆ పరీక్షలు చేస్తున్నారు. కానీ.. వరద నీరు చేరడంతో అవి పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అగాధాలను పూడ్చే విధానాన్ని సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుంది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం పరీక్షలకూ ఆటంకం 2019, 2020లలో వరదల ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గత నెల 28, 29న ఎన్‌హెచ్‌పీసీ బృందం డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించింది. సామర్థ్యం తేల్చే పరీక్షలకు సిద్ధమని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని నిర్ధారించే పరీక్షలు చేయడానికి ఇప్పుడు వచ్చిన వరద ఆటంకంగా మారింది. వరద పూర్తి స్థాయిలో తగ్గి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రాంతంలో చేరిన వరద నీటిని తోడివేస్తేగానీ డయాఫ్రమ్ వాల్ సామర్థ్య పరీక్షలు, అగాధాల పరీక్షలు పూర్తి చేయలేరు. ఆ తర్వాతే పాత దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదా దెబ్బతిన్న భాగానికి సమాంతరంగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలా అన్నది సీడబ్ల్యూసీ తేల్చదు. దీంతో పోలవరం పనుల్లో మరింత జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘చంద్ర’శాపమే టీడీపీ సర్కారు అవగాహన రాహిత్యం, కమీషన్ల కక్కుర్తి వల్ల గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను పూర్తి చేయకుండానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించేసింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టింది. దీనిపై నిర్వాసితులు 2019 ఫిబ్రవరిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు ఫిర్యాదు చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే 2019 మే నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయాలని పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో కుడి, ఎడమ వైపున ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. 2019, 2020లో ఈ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్ 218 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకూ కోతకు గురైంది. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్న జగన్ సర్కారు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. 50 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా ప్రపంచంలో అతి భారీ సామర్థ్యం కలిగిన స్పిల్ వే (చైనాలోని త్రీగోర్జెస్ స్పిల్ వే వరద విడుదల సామర్థ్యం 41 లక్షల క్యూసెక్కులే), ఎగువ కాఫర్ డ్యామ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావసం కల్పించారు. గతేడాది స్పిల్ వేకు 42 గేట్లను బిగించారు. గోదావరి ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కిలోమీటర్ల దూరం మళ్లించి సహజ ప్రవాహ మార్గంలో కలిపారు. ఈ ఏడాది మిగతా 6 గేట్లను బిగించి, వాటికి హైడ్రాలిక్ సిలిండర్లు, హోయిస్ట్లను ఏర్పాటు చేసి.. పవర్ ప్యాక్‌లతో అనుసంధానం చేశారు. అత్యాధునికమైన హైడ్రాలిక్ పద్ధతిలో గేట్లను నిర్వహిస్తున్నారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుకు డ్యామ్ పనులను చేపట్టారు. సీడబ్ల్యూసీ డిజైన్ల ఆమోదంలో జాప్యం, జియోమెంబ్రేన్ బ్యాగ్‌ల కొరతతో 20.5 మీటర్ల ఎత్తు వరకు పనులు పూర్తి చేశారు. ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు జూలై రెండో వారంలోనే గోదావరికి రికార్డుస్థాయిలో వరద వచ్చింది. ఆకస్మికంగా వచ్చిన 15 లక్షల క్యూసెక్కుల వరదను పోలవరం స్పిల్ వే 48 గేట్లను ఎత్తి విజయవంతంగా దిగువకు విడుదల చేస్తున్నారు. టీడీపీ సర్కార్ ప్రణాళిక మేరకు పనులు చేపట్టి ఉంటే.. ఈ పాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు 13.5 టీఎంసీలు
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను.. మొత్తం 15.65 టీఎంసీలను కేటాయించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. రాయ్‌పురే కన్వీనర్‌గా ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. గతేడాది తమ కోటాలోని 47.719 టీఎంసీలను శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు తరలించామని, వాటిని ఈ ఏడాది వాడుకొంటామని తెలంగాణ ఈఎన్సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్సీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పునే సమర్ధించిందని, క్యారీ ఓవర్ జలాల్లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం వాటా ఉంటుందని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో క్యారీ ఓవర్ జలాల్లో సాగర్ కుడి కాలువకు 10, ఎడమ కాలువకు 3.5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనను రాయ్‌పురే అంగీకరించారు. సాగర్‌లో తాగునీటి అవసరాలకు 5.75 టీఎంసీలు, ఎడమ కాలువకు 7.5 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను విడుదల చేయాలన్న తెలంగాణ ఈఎన్సీ ప్రతిపాదనకు రాయ్‌పురే అంగీకరించారు. శ్రీశైలంలో జూన్ 1 నుంచి గురువారం వరకు ఏపీ 10.884 టీఎంసీలు, తెలంగాణ 3.504 టీఎంసీలు వాడుకున్నట్లు లెక్క చెప్పారు. జూలై ఆఖరులో మరోసారి కమిటీ సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. ఈసారైనా తెలంగాణ అధికారులు వస్తారా? కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరగనుంది. తొలి రెండు సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరుకాలేదు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మూడో సమావేశానికైనా వస్తారా.. రారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. మే 6న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఆర్ఎంసీ ఏర్పాటైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తికి నిబంధనలు, ఆయకట్టుకు నీటి విడుదల (రూల్ కర్వ్) నియమావళి, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటాలో కలపాలా? వద్దా? అనే అంశాలపై చర్చించి, నివేదిక ఇచ్చేందకు కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, ముయాన్తంగ్, ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. జలవిద్యుదుత్పత్తి నియమావళి నివేదికను 15 రోజుల్లోగా, మిగతా రెండు అంశాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం మే 20న, 30న జరిగిన తొలి రెండు సమావేశాలకు తెలంగాణ అధికారులు రాకపోవడంతో ఆర్ఎంసీ మూడో భేటీని ఏర్పాటు చేసింది. -
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేలుస్తాం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను రెండురోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షించిన నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం.. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమేనని తెలిపింది. ఇందుకు మూడు పద్ధతులను ప్రతిపాదించింది. వాటిపై 15 రోజుల్లోగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ)లకు నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎల్.కపిల్ తెలిపారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ఎంపికచేసిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించి నివేదిక ఇస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం రెండునెలలు పడుతుందని చెప్పారు. తీస్తా జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ఇదేరీతిలో డయాఫ్రమ్ వాల్ కోతకు గురవడంతో దానికి మరమ్మతులు చేసి, పూర్వస్థితికి తెచ్చామని పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చాలని ఎన్హెచ్పీసీకి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. దీంతో ఎన్‌హెచ్‌పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్ నేతృత్వంలో నిపుణులు విపుల్సాగర్, ఎ.కె.భారతిలతో కూడిన బృందం మంగళవారం పోలవరం చేరుకుని డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించింది. బుధవారం కూడా మరోసారి డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సామర్థ్యం తేల్చేందుకు సమగ్రంగా పరీక్షలు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున 1.5 మీటర్ల వెడల్పు, గరిష్టంగా 90 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశాల ద్వా రా అధిక ఉద్ధృతితో వరద ప్రవహించి 400 నుంచి 1,100 మీటర్ల వరకు మినహా కుడి, ఎడమ వైపున డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతంతోపాటు కోతకు గురికాని ప్రాంతంలోను డయాఫ్రమ్ వాల్‌ను ఎన్‌హెచ్‌పీసీ బృందం పరి శీలించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చడానికి మూడురకాల పద్ధతులను ప్రతిపాదించింది. ఎన్‌హెచ్‌పీసీ బృందం ప్రతిపాదించిన మూడు పద్ధతులు ► మొదటి పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి మీటర్‌కు డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఒకటిన్నర అడుగుల లోతు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ► రెండో పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి 40 మీటర్లకు ఒకచోట డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఆరుమీటర్ల వరకు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బావర్–ఎల్అండ్టీ సంస్థ అనుమతి తీసుకోవాలి. ► మూడో పద్ధతి: డయాఫ్రమ్ వాల్‌కు ఒక మీటర్ ఎగువన, ఒక మీటర్ దిగువన ప్రతి 40 మీటర్లకు ఒకచోట జిగ్‌జాగ్ విధానంలో 90 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వి, వాటిలోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలపై ఎన్హెచ్పీసీకి మినహా ఏ సంస్థకు అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై పరీక్షలు చేసి ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదికే కీలకం. ఆ నివేదిక ఆధారంగానే డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే కోతకు గురైన ప్రాంతంలో మాత్రమే కొత్తగా నిర్మించి, ఇప్పుడున్న దానికి అనుసంధానం చేయాలా? అన్నది తేల్చనుంది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనుంది. ఎన్‌హెచ్‌పీసీ బృందం వెంట పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, ఐఐటీ నిపుణుడు సందీప్ తదితరులున్నారు. -
గడువు దాటొద్దు!
సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించిన గడువులోగా పోలవరాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖకు కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) సభ్యులు కుశ్వీందర్ వోహ్రా నేతృత్వంలో 11 మంది సభ్యులతో కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ రెండో రోజు ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్(జలాశయం) పనులను మరోసారి పరిశీలించింది. కుడి కాలువను జలాశయంతో అనుసంధానించే టన్నెల్, హెడ్ రెగ్యులేటర్‌ను తనిఖీ చేసింది. అనంతరం కుడి కాలువను పరిశీలించింది. నిర్వాసితుల కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో రెండు రోజుల పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో గత నెల 18న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన గడువు మేరకు పోలవరం పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. పరీక్షలు వేగవంతం.. ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి ఏర్పడిన గోతులను పూడ్చేందుకు 11 రకాల పరీక్షలను వేగంగా పూర్తి చేయాలని నిపుణుల కమిటీ ఆదేశించింది. జూలై 15లోగా పరీక్షల నివేదికను సీడబ్ల్యూసీకి అందజేయాలని సూచించింది. సెప్టెంబర్‌లోగా గోతులను పూడ్చే విధానాన్ని సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందని, వాటి ఆధారంగా అక్టోబర్ 1 నుంచి పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్‌ను జూలై నాటికి రక్షిత స్థాయికి పూర్తి చేయాలని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్) నిపుణులతో అధ్యయన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా పాత దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న భాగంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది నిర్ణయిస్తామని పేర్కొంది. స్పష్టత రాగానే డయాఫ్రమ్ వాల్ పనులకు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ చేపట్టి గడువులోగా పూర్తి చేయవచ్చని పేర్కొంది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి.. పోలవరం నిర్వాసితులకు దశలవారీగా తొలుత 41.15 మీటర్లు, ఆ తర్వాత 45.72 మీటర్ల వరకూ పునరావాసం కల్పించాలని కేంద్ర నిపుణుల కమిటీ సూచించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 8,277 కుటుంబాలకు పునరావాసం కల్పించామని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వివరించారు. మిగతావారికి ఆగస్టులోగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రీయింబర్స్ ప్రక్రియలో జాప్యం జరగడం పనుల పురోగతిపై ప్రభావం చూపుతోందని పేర్కొనగా దీనిపై కేంద్రానికి నివేదిస్తామని కమిటీ పేర్కొంది. కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లనుంది. వారంలో జల్ శక్తి శాఖకు నివేదిక రెండు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలో పరిశీలించిన అంశాలు, అధికారులతో సమీక్షలో వెల్లడైన అశాలను బేరీజు వేసి పోలవరాన్ని గడువులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు కేంద్ర నిపుణుల కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై పీపీఏ, జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేయనుంది. -
శ్రీశైలం నీటిని తోడేస్తున్న తెలంగాణ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కార్ ఉల్లంఘనలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలను మళ్లీ యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. గతేడాది అవసరం లేకున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో నీటినిల్వ కనీస మట్టం కంటే దిగువన ఉన్నప్పుడే ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేసి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా కడలిపాలు చేసింది. ఈ ఏడాది కూడా అదే రీతిలో నీటి దోపిడీ చేస్తోంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేసిన తెలంగాణ సర్కార్.. ఏఎమ్మార్పీ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది. ఈ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి.. ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ శ్రీనివాసరెడ్డిలు ఫిర్యాదు చేశారు. వరద వస్తున్నా పెరగని నీటిమట్టం శ్రీశైలంలో సాగు, విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయించింది. కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ దాన్ని ఆమోదించింది. నీటి సంవత్సరం ప్రారంభమైన రోజునే అంటే ఈనెల 1న స్థానికంగా కురిసిన వర్షాలవల్ల శ్రీశైలంలోకి 862 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటి నిల్వ 816.8 అడుగుల్లో 38.63 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ► కృష్ణా బోర్డు నుంచి కనీసం అనుమతి తీసుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ ఈనెల 1న 800 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 2న 561 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 483 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 9న శ్రీశైలంలోకి 4,618 క్యూసెక్కులు చేరితే.. 339 క్యూసెక్కులను.. ► ఈ నెల 10న 2,798 క్యూసెక్కులు చేరితే 1,300 క్యూసెక్కులను.. 11న 4,157 క్యూసెక్కులు చేరితే.. 1,266 క్యూసెక్కులను తెలంగాణ తరలించింది. ► తెలంగాణ దోపిడీతో శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతున్నా నీటి మట్టం పెరగడంలేదు. సాగర్ కుడి కాలువ నీరు నిలిపివేత ఇక నాగార్జునసాగర్‌లో సాగునీటికి కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం 534.9 అడుగుల్లో 177.87 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువపైనే అవి ఆధారపడతాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లా సీఈ శ్రీనివాసరెడ్డి కృష్ణా బోర్డుకు, సాగర్ సీఈకి లేఖ రాశారు. కానీ.. ఈనెల 1 నుంచి కుడి కాలువకు నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. మరోవైపు.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఈనెల 1న 2,000, 2న 2,000, 3న 218, 6న 218, 7న 500, 8న 500, 9న 854, 10న 1,000, 11న 1,000 క్యూసెక్కుల చొప్పున ఏఎమ్మార్పీ నుంచి తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తోంది. ఈ అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని కర్నూల్ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరామని తెలిపారు. -
ఆ నాలుగూ అనుమతి ఉన్నవే
సాక్షి, అమరావతి: తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు ఉన్నాయని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)లో ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా వర్గీకరిస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కృష్ణా బోర్డుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది. అనుమతి ఉన్న ఆ నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనుంది. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ ఆరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న వీటిని పూర్తి చేసేందుకు విభజన చట్టం ద్వారా కేంద్రం అనుమతించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లోనే తప్పిదం.. ఏదైనా అనుమతించిన ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసినా, నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచినా మళ్లీ అనుమతి తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధన. విభజన తర్వాత వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల డిజైన్లను గానీ సామర్థ్యాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అంటే ఈ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు కల్వకుర్తి (25 నుంచి 40 టీఎంసీలకు), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల డిజైన్లను మార్చడంతోపాటు సామర్థ్యాన్ని కూడా తెలంగాణ సర్కార్ పెంచింది. అయితే కేంద్ర జల్ శక్తి శాఖ మాత్రం కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను గతేడాది జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించింది. వాటికి ఏడాదిలోగా అనుమతి పొందాలని, లేదంటే నీటి వినియోగానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిజైన్లు మార్చకున్నా, సామర్థ్యం పెంచకున్నా వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. కేంద్ర జల్‌శక్తి శాఖ విధించిన గడువు సమీపిస్తుండటంతో అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతోంది. వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలకు అనుమతి తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశాన్ని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నాలుగు ప్రాజెక్టులను అనుమతి ఉన్న వాటిగా విభజన చట్టం గుర్తించిందన్నారు. ఇప్పుడు వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని బోర్డుకు, జల్‌శక్తి శాఖకు స్పష్టం చేస్తామని తెలిపారు. -
శ్రీశైలంలో 854 అడుగుల్లో నీరు నిల్వ ఉండాలి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీట్టిమట్టం 854 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆర్ఎంసీ (రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ)కి ఏపీ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి కోరారు. కనీస నీటిమట్టానికంటే దిగువ నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఆర్ఎంసీ భేటీ జరిగింది. కన్వీనర్ ఆర్కే పిళ్లై, బోర్డు సభ్యులు ఎల్బీ ముయన్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ, జెన్కో డైరెక్టర్ వరుసగా రెండో సమావేశానికీ గైర్హాజరయ్యారు. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను నారాయణరెడ్డి కమిటీకి వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులని.. అంతకంటే దిగువ స్థాయి నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించవచ్చునని తేల్చిచెప్పారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు.. కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు సాంకేతిక అనుమతిచ్చిన సమయంలో కేంద్ర జలసంఘం ఆమోదించిన ప్రకారం కృష్ణా డెల్టాకు, సాగర్ ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేయాలని ఆర్ఎంసీని ఈఎన్సీ నారాయణరెడ్డి కోరారు. అదే రీతిలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీలకు హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో.. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం వరద జలాలను మళ్లించినా.. వాటిని నికర జలాల్లో (కోటా) కలపకూడదని పునరుద్ఘాటించారు. ఆ అధికారం ట్రిబ్యునల్‌దే.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో సాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించిందని ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై గుర్తుచేశారు. వాటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామంటూ ఆయన చేసిన ప్రతిపాదనపై నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ అంశం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని.. దానిపై నిర్ణయాధికారం ట్రిబ్యునల్‌దేనన్నారు. ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను విన్నాక పిళ్లై స్పందిస్తూ.. 6న మూడో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దానికి తెలంగాణ అధికారులు గైర్హాజరైతే.. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ దృష్టికి తీసుకెళ్లి.. తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
పోలవరానికి నిధులపై కేంద్రం సానుకూలం
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ నిధుల మంజూరుకు సిఫార్సు చేస్తూ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపుతామని బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయం మేరకు నిధులిస్తామని వెల్లడించారు. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలోని అధికారుల బృందం ఈనెల 22న ప్రాజెక్టును పరిశీలించి తొలి దశ, రెండో దశ పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నిర్ధారిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే గుప్తా, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అదనపు పనులకు ఓకే ఇసుక నాణ్యతతో సహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా నివేదిక ఇస్తే ఏ విధానంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలో తేలుస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని హైడ్రాలిక్ శాండ్ ఫిల్లింగ్‌తో పూడ్చాలా లేక డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను పోస్తూ పూడ్చాలా అన్నది తేలుస్తామన్నారు. వీటి డిజైన్లను సెప్టెంబర్‌లోగా ఖరారు చేసి అక్టోబర్ 1 నుంచి పూడ్చివేత ప్రారంభిస్తామన్నారు. ఈలోగా డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. కొత్తగా మరో వాల్ నిర్మించాలా లేక దెబ్బతిన్న ప్రాంతం వరకు కొత్తది నిర్మించి, ప్రస్తుత వాల్‌తో అనుసంధానం చేయాలా అన్నది తేలుస్తామన్నారు. ఆ పనులకు అదనపు నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని మార్చి 4న సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఈఎన్సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. దాంతో అదనపు నిధుల మంజూరుపై కూడా పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)ను పూర్తి చేస్తామని, ఆయకట్టుకు నీళ్లందించేలా ప్రణాళిక రూపొందించామని పీపీఏ, రాష్ట్ర అధికారులు వివరించారు. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తి ప్రాజెక్టు పూర్తయినా ఒకేసారి నీటిని నిల్వ చేయడం సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు విరుద్ధం. డ్యామ్ భద్రత దృష్ట్యా తొలి ఏడాది 41.15 మీటర్లలో, ఆ తర్వాత ఏటా 30 శాతం చొప్పున నీటి నిల్వను పెంచుతూ చివరకు 194.6 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఆలోగా 45.72 మీటర్ల పరిధిలో పునరావాసం కల్పిస్తారు. పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ రూ.55,656.87 కోట్లుగా ఆమోదిస్తే.. ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) రూ.47,727.87 కోట్లుగా ఖరారు చేసింది. అదనపు పనులతో ఆ వ్యయం మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే అదనపు పనులతో సహా రెండు దశల పనులు పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో వెదిరె శ్రీరాం నేతృత్వంలోని బృందం నివేదిక ఇస్తుందని పంకజ్‌కుమార్ తెలిపారు. -
కోతకు గురైన ప్రాంతం పూడ్చటంపై స్పష్టత
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ దాదాపుగా ఖరారు చేసింది. ఇసుక నాణ్యతతోసహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) నివేదిక ఇస్తే.. జూలై 31లోగా హైడ్రాలిక్ శాండ్ ఫిల్లింగ్ (కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ వైబ్రో కాంపాక్షన్ చేయడం) లేదా డ్రెడ్జింగ్ (ఇసుకను తవ్వుతూ కోతకు గురైన ప్రాంతంలోకి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా పోసి.. వైబ్రో కాంపాక్షన్ చేయడం) ద్వారా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలా అన్నది నిర్ణయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. దానికి అనుగుణంగా ఆగస్టులోగా డిజైన్లు ఇస్తే.. సెప్టెంబర్‌లోగా ఆమోదిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పునాది డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై పూర్తిస్థాయిలో పరీక్షలు చేశాక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేక దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదనంగా చేపట్టాల్సిన ఈ పనులకు అయ్యే వ్యయాన్ని మంజూరు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో చర్చిస్తానని, బుధవారం నిర్వహించే సమావేశంలో దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈనెల 22న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అడ్డంకులను అధిగమించే మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు. డీవాటరింగ్‌కు నో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన నిల్వ ఉన్న నీటిని తోడివేసి (డీవాటరింగ్).. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో(–12 మీటర్ల నుంచి +15 మీటర్ల వరకు) ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానంలో పనులు చేయాలంటే రూ.3,200 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఆ విధానం ప్రకారం పనులు చేయడం కష్టమని సమావేశం నిర్ణయించింది. నిల్వ ఉన్న నీటిలోనే.. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్ చేయడం(హైడ్రాలిక్ ఫిల్లింగ్), పురుషోత్తపట్నం వద్ద డ్రెజ్జింగ్ చేస్తూ అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైన్ ద్వారా కోతకు గురైన ప్రాంతంలో పోసి, వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా పూడ్చే విధానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇసుక నాణ్యతసహా 11 రకాల పరీక్షలు చేశాక.. అందులో ఏ విధానంపై పనులు చేయాలన్నది తేల్చాలని సమావేశం నిర్ణయించింది. డయాఫ్రమ్ వాల్‌పై ఎలా? ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను సగటున –30 మీటర్ల నుంచి –90 మీటర్ల లోతు నుంచి నిర్మించారు. గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతింది? ఏ మేరకు పటిష్ఠంగా ఉంది? అన్నది తేల్చడానికి శాస్త్రీయమైన పరీక్ష ఏదీలేదని నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే డిజైన్ల తయారీకి రెండునెలల సమయం ఉందని, ఆలోగా డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వెదిరె శ్రీరాం అధికారులను ఆదేశించారు. ఆ అధ్యయనం ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? ఇప్పుడున్న డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్.కె.గుప్తా, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏ, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్‌ఆర్‌ఎంస్ అధికారులు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. నిధుల మంజూరుపై నేడు సమావేశం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయడానికి, అదనంగా చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుపై బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిధుల మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కృష్ణా జల వివాదాలకు ముగింపు!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తిని నియంత్రణ, నిర్వహణ నియమావళి ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తే జల వివాదాలకు తావే ఉండదని కృష్ణా బోర్డు భావిస్తోంది. మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై కన్వీనర్‌గా, ఎల్బీ ముయన్తంగ్, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)ని నియమించింది. ఈ కమిటీ ఈనెల 20న హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సమావేశమవుతోంది. బచావత్ ట్రిబ్యునలే ప్రామాణికంగా బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. వాటిని ప్రామాణికంగా తీసుకున్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలో విధి విధానాల ముసాయిదా (రూల్ కర్వ్ డ్రాఫ్ట్)ను రూపొందించింది. దీనిపై అధ్యయనం చేసి మార్పులు ఉంటే చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని బోర్డు ఆదేశించింది. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి జలాలు కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశంపైన కూడా అధ్యయనం చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించింది. ఆర్ఎంసీ నివేదికను బోర్డులో చర్చించి.. అమలు చేయడం ద్వారా జల వివాదాలకు చరమగీతం పాడాలని నిర్ణయించింది. విద్యుదుత్పత్తి నియంత్రణే కీలకం గతేడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నా, ఎగువ నుంచి వరద రాకున్నా.. బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. విద్యుదుత్పత్తి చేయొద్దని బోర్డు జారీ చేసిన ఆదేశాలనూ తుంగలో తొక్కింది. ఇష్టారాజ్యంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ ద్వారా వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీనిపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణ తీరుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. 2022–23 నీటి సంవత్సరంలో కూడా ఈ పరిస్థితి పునరావృతం కాకుండా బోర్డు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తికి 15 రోజుల్లోగా నియమావళిని రూపొందించాలని ఆర్ఎంసీని కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ఆదేశించారు. -
పోలవరంపై కీలక భేటీలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లు, నిధుల మంజూరుపై ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో కేంద్ర జల్‌శక్తి శాఖ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు ఆరు కిలోమీటర్ల దిగువన పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక తిన్నెల డ్రెడ్జింగ్ చేస్తూ.. అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైను ద్వారా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైనచోట పోసి.. వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా పూర్వస్థితికి తెచ్చే విధానాన్ని ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ వి.ఎస్.రాజు, ప్రొఫెసర్ రమణ ప్రతిపాదించారు. దీనిపై ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది. ఖయ్యూం అహ్మద్ బృందం నివేదిక ఆధారంగా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంపై వెదిరె శ్రీరాం నేతృత్వంలో జరిగే సమావేశం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి నిధుల మంజూరుపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా తొలిదశ పనుల పూర్తికి ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్‌లో భారీ సంస్కరణలు!
న్యూఢిల్లీ: అంతర్గతంగా బలోపేతం కావాలంటే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ సంస్కరణలు తప్పనిసరి అని సీనియర్ నేతల్లో అత్యధికులు భావిస్తున్నారు. అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మొదలుకుని ఏఐసీసీ, పీసీసీ నుంచి బ్లాక్ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా బాగా పెరగాలని అభిప్రాయపడుతున్నారు. దాన్ని ఇప్పుడున్న 20 శాతం నుంచి కనీసం 50 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వచ్చే వారం రాజస్తాన్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనల ముసాయిదాల తయారీకి ఏర్పాటైన ఏఐసీసీ ప్యానళ్లు ఇదే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చాలంటే ఏఐసీసీ ప్యానళ్లతో పాటు సీడబ్ల్యూసీ, చింతన్ శిబిర్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. చింతన్ శిబిర్ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగే సీడబ్ల్యూసీ భేటీలో వీటిని సమర్పించనున్నారు. పదవులనూ తగ్గించాలి ఏఐసీసీలోనూ, పీసీసీల్లోనూ అన్ని విభాగాల్లో పదవులను కనీస స్థాయికి తగ్గించాలని సంస్థాగత వ్యవహారాల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంఖ్యపై గరిష్ట పరిమితి విధించాలని పేర్కొన్నట్టు చెప్తున్నారు. ‘‘ఉదాహరణకు ఏఐసీసీలో 100 మందికి పైగా కార్యదర్శులున్నారు. ఈ సంఖ్యను 30కి తగ్గిస్తే మేలు. పీసీసీల్లోనూ ఈ పరిమితిని పాటించాలి’’ అని ప్యానల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ముకుల్ వాస్నిక్ సారథ్యంలోని సంస్థాగత వ్యవహారాల కమిటీలో రమేశ్ చెన్నితాల, తారిఖ్ అన్వర్, అజయ్ మాకెన్ తదితరులున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులను ఢిల్లీ నుంచి ఏఐసీసీ స్థాయిలో నామినేట్ చేసే పోకడకు స్వస్తి పలికి పీసీసీ నాయకత్వమే నియమించుకునేలా చూడాలన్న ప్రతిపాదన కూడా ఉంది. -
నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా.. 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకోవడానికి కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వడంలో, జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర జల్ శక్తి శాఖ వ్యవహరించిన తీరును దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో లేవనెత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని వివరించనున్నాయి. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే అనుమతి తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే తేల్చింది. కానీ.. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగానూ దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు వెరసి.. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక ప్రతిపాదించింది. అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలి. కానీ.. ఈ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్ 24న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికకీరణ వల్ల నీళ్లు మిగల్లేదని.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇస్తారని ఏపీ, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. అప్పర్ భద్రను 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనపై ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులే.. అప్పర్ భద్ర పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టుతోపాటు కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. -
మళ్లించిన వరద నీటినీ కోటాలో కలిపేస్తారా?
సాక్షి, అమరావతి: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలనూ రాష్ట్ర కోటా (నికర జలాలు)లో కృష్ణా బోర్డు కలపడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ కూడా వరద నీటిని ఏ రాష్ట్రం మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో.. మళ్లించిన వరద నీటిని రాష్ట్ర కోటాలో కలపడమంటే బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు, ఆరో పేరా ప్రకారం.. కృష్ణా, గోదావరి వరదలను నియంత్రించడం, విపత్తు నివారణ చర్యలు చేపట్టడం రెండు రాష్ట్రాలపై ఉందని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కడలిలో వరద జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద నీటిని మళ్లించినా.. దాన్ని విపత్తు నివారణ చర్య కింద పరిగణించాలేగానీ కోటా కింద లెక్కించకూడదని పునరుద్ఘాటించారు. దుర్భిక్ష ప్రాంతాలకు వరద జలాల మళ్లింపు నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. దీంతో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. కోటా కింద లెక్కించొద్దు : సీడబ్ల్యూసీ కమిటీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును గతంలోనే కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి 2020, మార్చి 3న సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ ఏర్పాటుచేసింది. 2020 మేలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ కమిటీ అడిగిన వివరాలన్నీ ఏపీ ఇచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. దీంతో.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించాలా? వద్దా? అని 2020, అక్టోబర్ 7న కృష్ణా బోర్డు కోరింది. దీనిపై సాంకేతిక కమిటీ 2020, అక్టోబర్ 20న స్పందిస్తూ.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించకూడదని స్పష్టంచేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29 టీఎంసీలు, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులపాటు వరద ప్రవాహం సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ నివేదిక వచ్చేవరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. దీనిపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తంచేసినా.. వాటిని తోసిపుచ్చింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2021–22లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. -
పోలవరం తొలిదశకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను పూర్తిచేస్తే.. ఖరీఫ్‌లో కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీపై 2.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఏకీభవించింది. కుడి కాలువ ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును ఖరీఫ్‌లో స్థిరీకరించవచ్చని.. రబీలో గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చునని తేల్చింది. ఎడమ కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి 23.44 టీఎంసీలను తరలించడం ద్వారా విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చవచ్చునని పేర్కొంది. ముందస్తుగా ఈ ఫలాలు పొందడానికి వీలుగా తొలిదశ పనుల పూర్తికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా చెప్పారు. ఈ పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయోనన్న నివేదికతో ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయానికి ఒక అధికారిని రెండ్రోజుల్లోగా పంపాలని ఆయన సూచించారు. ఇందుకు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు అంగీకరించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ (41.15 మీటర్ల కాంటూర్), తుది దశ (45.72 మీటర్ల కాంటూర్) పూర్తిచేస్తే తక్షణం ఒనగూరే ప్రయోజనాలు, పనుల పూర్తికి అవసరమైన నిధులపై వోహ్రా ఫిబ్రవరి 22న సమీక్షించారు. ఆ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై మంగళవారం వర్చువల్ పద్ధతిలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలిదశలో పనుల పూర్తికి అవసరమైన నిధులపై వోహ్రా సమీక్షించారు. నిధులివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా పూర్తిచేయాల్సిన పనులు.. 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించడం.. ఆయకట్టుకు నీళ్లందించేందుకు డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం రూ.10,911.15 కోట్లు అవసరమని గతంలో నివేదిక ఇచ్చామని వోహ్రాకు అధికారులు వివరించారు. వరద ఉధృతివల్ల ప్రధాన డ్యామ్ ప్రాంతం, డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన నేపథ్యంలో అదనంగా పనులు చేయాల్సి వస్తున్నందున వ్యయం పెరుగుతుందన్నారు. దీనిపై వోహ్రా స్పందిస్తూ.. తొలిదశ పనులకు తొలుత ప్రతిపాదించిన రూ.10,911.15 కోట్లతోపాటు.. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికయ్యే అదనపు వ్యయం, రెండోసారి సవరించిన అంచనా వ్యయం ప్రకారం అయ్యే వ్యయాలపై నివేదిక రూపొందించి.. రెండ్రోజుల్లోగా ఢిల్లీకి అధికారిని పంపాలని సూచించారు. వీటిని మదింపు చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారు. రైతులకు ముందస్తు ఫలాలు అందించడమే లక్ష్యం ఇక తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేస్తే.. ఎడమ కాలువలో 93.7 కి.మీ. వరకూ పుష్కర ఎత్తిపోతల ఆయకట్టు ద్వారా 1.41 లక్షల ఎకరాలకు.. కుడి కాలువలో 75.45 కిమీ వరకూ తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టులోని 1.57 లక్షల ఎకరాలకు వెరసి 2.98 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందించవచ్చునని అధికారులు ఇచ్చిన వివరణకు వోహ్రా సానుకూలంగా స్పందించారు. 45.72 మీటర్ల వరకూ పూర్తిచేశాక ఎడమ కాలువలో మిగిలిన 2.59, కుడి కాలువలో మిగిలిన 1.63 వెరసి 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చునని.. తద్వారా పోలవరం కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చునని చెప్పారు. అలాగే, తొలిదశలో కుడి కాలువ ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు, ఎడమ కాలువ ద్వారా విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చవచ్చని.. గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమర్థంగా నీళ్లందించవచ్చని రాష్ట్ర అధికారుల ప్రతిపాదనతోనూ సీడబ్ల్యూసీ సభ్యులు వోహ్రా ఏకీభవించారు. పోలవరాన్ని 2023 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రైతులకు ముందస్తుగా ఫలాలను అందించేలా తొలిదశను పూర్తిచేయడానికి నిధులు మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు వోహ్రా సానుకూలంగా స్పందించారు. ‘పోలవరం’ ఇన్స్ట్రుమెంటేషన్ పనుల పరిశీలన మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పనులను సీడబ్ల్యూ పీఆర్ఎస్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. వీరిలో శాస్త్రవేత్త హనుమంతప్ప, అసిస్టెంట్ రీసెర్చ్ అధికారి షామిలి పాశ్వాన్, విష్ణు మీనా పనులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గ్యాలరీలో ఇన్స్ట్రుమెంటేషన్ బిగింపు ప్రక్రియ జరుగుతున్న తీరు, డిజైన్ ప్రకారం జరుగుతోందా లేదా అనే విషయాలను పరిశీలించారు. వీరికి పనుల వివరాలను ఈఈ పి.ఆదిరెడ్డి, డీఈ లక్ష్మణరావు, మేఘ ఏజెన్సీ డీజీఎం రాజేష్ వివరించారు. -
పరవళ్లు.. పరుగులు
గడువులోగా పోలవరం.. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, జూలై 31 నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే విధానంపై ఏప్రిల్ 1న ఢిల్లీలో జరిగే సమావేశంలో కొలిక్కి వస్తుందని, మిగతా డిజైన్లు కూడా వీలైనంత త్వరగా ఖరారవుతాయన్నారు. సీడబ్ల్యూసీ అధికారుల వెంటపడి మరీ డిజైన్లకు అనుమతులు సాధించి గడువులోగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అధికారుల వెంటబడి మరీ ఆమోదించుకోవడం ద్వారా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరంతో సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ పూర్తైన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. నగదు బదిలీ రూపంలో పరిహారం పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పునరావాసం కల్పిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత కింద ముంపు గ్రామాల నుంచి తరలించే నిర్వాసితులకు ఆగస్టు నాటికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఇందులో 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 7,962 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. 3,228 నిర్వాసిత కుటుంబాలు ఓటీఎస్(వన్‌టైమ్ సెటిల్మెంట్)కు దరఖాస్తు చేసుకున్నాయని, మిగతా 9,756 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టుకు అవుకు టన్నెల్–2 సిద్ధం నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని చెప్పారు. దీనిపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన 77.5 మీటర్ల పనులను 120 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి లైనింగ్‌తో సహా టన్నెల్‌ను పూర్తి చేసి ప్రస్తుత సామర్థ్యం మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉదయగిరి, బద్వేలుకు వెలిగొండ జలాలు.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. నెలకు 400 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని మరింత పెంచి నెలకు 500 మీటర్ల వరకూ టన్నెల్ తవ్వకం పనులు చేపడతామని తెలిపారు. వెలిగొండ టన్నెల్–1 ద్వారా సెప్టెంబర్‌లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించి తొలిదశ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2023 నాటికి టన్నెల్ –2 సహా అన్ని రకాల పనులను పూర్తిచేసి రెండు టన్నెళ్ల ద్వారా శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించే పనులకు టెండర్లు పిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. నేరడి బ్యారేజీతో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం వంశధార – నాగావళి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్టోబరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వంశధారపై గొట్టా బ్యారేజి ఎగువ నుంచి హిర మండలం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని దాదాపుగా ఆంధ్రప్రదేశే భరిస్తోందని.. బ్యారేజీని నిర్మిస్తే ఒడిశా కూడా సగం నీటిని వాడుకునే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.ఇరు రాష్ట్రాలకూ నేరడి బ్యారేజీ ప్రయోజనకరమన్నారు. వీలైనంత త్వరగా నేరడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ► తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► తారకరామ తీర్థసాగరంలో రిజర్వాయర్ పనులు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాలని సీఎం సూచించారు. సారిపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ► మహేంద్ర తనయ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మిగిలిన పనులకు ఆర్ధికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలని సూచించారు. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రధాన కాలువ తవ్వడానికి అవసరమైన భూమిని వేగంగా సేకరించి పనులు వేగవంతం చేయాలన్నారు. ► సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై రేపు భేటీ
సాక్షి, అమరావతి : పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించేందుకు శుక్రవారం(25న) రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని నిపుణుల కమిటీ భేటీ కానుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై ఏర్పడిన గొయ్యిలను ఎలా పూడ్చాలి? గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్‌ను ఎలా నిర్మించాలనే అంశాలపై చర్చిస్తారు. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సూచనల మేరకు ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఢిల్లీ–ఐఐటీలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ వీఎస్ రాజు, జర్మనీకి చెందిన బావర్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర జలసంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులకు పంపారు. ఈ వివరాల ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గొయ్యిలను పూడ్చే విధానం, గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలపై 25న నిర్వహించే వర్చువల్ సమావేశంలో చర్చించి, డిజైన్లను కొలిక్కి తేనున్నారు. కొలిక్కి తెచ్చిన ఈ డిజైన్లపై ఈ నెల 28 లేదా 29న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నిపుణుల కమిటీ రూపొందించిన విధానాల్లో మెరుగైన పద్ధతిని ఖరారు చేసి.. దాని ప్రకారం గొయ్యిలను పూడ్చటం, ప్రధాన డ్యామ్‌ను నిర్మించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
కృష్ణా బోర్డు తీరు సరికాదు!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలను కృష్ణా బోర్డు ఏపీ కోటాలో కలపడంపై సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. ఈ నేపథ్యంలో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. రెండేళ్లయినా నివేదిక ఇవ్వని సీడబ్ల్యూసీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. దాంతో.. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్‌లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. కానీ, 2020 మేలో రెండు రాష్ట్రాల జలనవరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత దీనిపై సీడబ్ల్యూసీ దృష్టిసారించకపోవడమేకాక.. నివేదిక కూడా ఇవ్వలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులు వరద ప్రవాహం వృథాగా సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ నివేదిక వచ్చే వరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2020–21లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. మళ్లించకపోతే వరద ముప్పే నిజానికి.. శ్రీశైలం నుంచి కృష్ణా వరదను మళ్లించకపోతే దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర ముప్పు తప్పదు. అందుకే విభజన చట్టంలో సెక్షన్–85 (7) ప్రకారం విపత్తు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అప్పగించింది. ఆ చట్టం ప్రకారం వరద ముప్పును తప్పించడానికి ఏపీ సర్కార్ మళ్లించిన వరద జలాలను నికర జలాల కోటాలో కలపడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీ నివేదిక ఇవ్వలేదనే సాకుచూపి.. ఏపీ ప్రయోజనాలను పరిరక్షించకపోవడం సరికాదంటున్నారు. -
పోలవరం డిజైన్లలో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం డిజైన్ల ఆమోద ప్రక్రియలో ముందడుగు పడింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చివేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధించిన డిజైన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. పోలవరం పెండింగ్ డిజైన్లపై బుధవారం ఢిల్లీలో షెకావత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్లతోపాటు గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, స్పిల్ చానల్ ఎడమ గట్టును పటిష్టం చేయడంపై ఢిల్లీ ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో నిపుణులతో చర్చించి ఈనెల 25లోగా డిజైన్లను కొలిక్కి తేవాలని షెకావత్ ఆదేశించారు. ఈనెల 28న లేదా 29న మళ్లీ సమావేశం నిర్వహించి ఆ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులకు మార్గం సుగమం.. దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 నుంచి 660 మీటర్ల వరకూ 220 మీటర్ల పొడవున గోదావరి వరద ఉధృతికి 36 మీటర్ల లోతున కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లు వేసి పూడ్చేలా రూపొందించిన డిజైన్‌పై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఇటీవల నిర్వహించిన సమావేశంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, పీపీఏ, సీడబ్ల్యూసీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వెదిరె శ్రీరాం ఇదే అంశాన్ని షెకావత్‌కు వివరించడంతో డిజైన్‌ను ఆమోదించాలని సీడబ్ల్యూసీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సీడబ్ల్యూసీ అధికారులు అక్కడికక్కడే ఆమోదించారు. దీంతో దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఈసీఆర్ఎఫ్ డిజైన్లు కొలిక్కి.. పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా గోదావరికి అడ్డంగా ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మించాలి. గ్యాప్–3లో 153.5 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌ను ఇప్పటికే నిర్మించారు. గ్యాప్–1లో 5505 మీటర్లు, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవుతో ఈసీఆర్ఎఫ్ నిర్మించాలి. గోదావరి వరద ఉధృతితో గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. గ్యాప్–1, గ్యాప్–2 ఈసీఆర్ఎఫ్ డిజైన్లతోపాటు కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై షెకావత్ సమీక్షించారు. స్పిల్ వే ఎడమ గట్టును పటిష్టం చేసే డిజైన్‌ను కొలిక్కి తేవాలని ఆదేశించారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన షెకావత్ జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఈనెల 4న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 తదితర డిజైన్ల ఆమోదంలో పీపీఏ, సీడబ్ల్యూసీ జాప్యం వల్ల పనులకు అంతరాయం కలుగుతోందని షెకావత్ దృష్టికి సీఎం తెచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున మూడు నెలల పాటు సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు దోహదం చేస్తుందని సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనకు షెకావత్ అంగీకరించారు. ఈ క్రమంలో పెండింగ్ డిజైన్లపై ఈనెల 10న వెదిరె శ్రీరాం సమీక్ష నిర్వహించి షెకావత్‌కు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే షెకావత్ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
గాంధీలు స్వచ్ఛందంగా తప్పుకుంటేనే కాంగ్రెస్‌కి మనుగడ!
న్యూఢిల్లీ: గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహింని విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రలోనూ సరియైన మెజార్టీతో గెలవలేకపోయింది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత ఆదివారం ఐదు గంటల పాటు పెద్ద సమావేశాన్ని నిర్వహించింది. కానీ ఈ సమావేశంలో పార్టీ సభ్యులు సోనియా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించడంతో యథాతథ స్థితి నుంచి వైదొలగకూడదని నిర్ణయించుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. గాంధీలు నాయకత్వ పదవుల నుంచి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గాంధీలు స్వచ్ఛందంగా వెళ్లిపోతేనే మంచిది ఎందుకంటే వారు నామినేట్ చేసిన పార్టీ సభ్యులు అధికార పగ్గాలను కొనసాగించకూడదని వారికి ఎప్పటికీ చెప్పలేరు అని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు కాకపోయినప్పటికీ వాస్తవ అధ్యక్షుడిలా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. " అంతేకాదు రాహుల్ గాంధీ పంజాబ్ వెళ్లి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. అతను ఏ హోదాలో ఈ పని చేశారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటారు. ఆయన ఇప్పటికే వాస్తవ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలని అడగడం అర్థం లేని విషయంగా అభివర్ణించారు. తాను ఘర్ కీ కాంగ్రెస్"కి విరుద్ధంగా "సబ్ కీ కాంగ్రెస్"ని కోరుకుంటున్నట్లు చెప్పారు. పైగా ఆయన తన చివరి శ్వాస వరకు ‘సబ్ కీ కాంగ్రెస్’ కోసం పోరాడతానని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లోని చాలామంది నేతు సీడబ్ల్యూసీకి విరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. సీడబ్ల్యూసీ వెలుపల కాంగ్రెస్ ఉందని దయచేసి మీరు వారి అభిప్రాయాలను వినండి అని విజ్ఞప్తి చేశారు. 2020లో 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీలో పెద్ద మార్పులు చేయాలని సోనియా గాంధీకి రాసిన లేఖపై కపిల్ సిబల్ కూడా సంతకం చేశారు. (చదవండి: నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్ హీరోని) -
దిగువ కాఫర్ డ్యామ్‌కు ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ (పునాది)లో కోతకు గురైన కొంత భాగంలో డయాఫ్రమ్ వాల్, ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన కొంత భాగాన్ని, పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)లను పటిష్టం చేసే డిజైన్లను కొలిక్కి తెచ్చేందుకు వారంలోగా మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈనెల 4న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిజైన్లను పీపీఏ, సీడబ్ల్యూసీ సకాలంలో ఆమోదించకపోవడంతో పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్.. పక్షం రోజుల్లోగా పెండింగ్ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. పెండింగ్ డిజైన్లను కొలిక్కితేవడమే అజెండాగా గురువారం ఢిల్లీలో వెదిరె శ్రీరాం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ సర్కార్ గోదావరి వరదను మళ్లించేలా పోలవరం స్పిల్ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్ఎఫ్ డయాఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది. 2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. ఆ వరద ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 మీటర్ల నుంచి 660 మీటర్ల వరకు 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు మేర కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతాన్ని డయాఫ్రమ్ వాల్ నిర్మించి, ఇసుకతో నింపి, డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) చేస్తూ పూడుస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి ప్రతిపాదించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతోపాటు ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలని డీడీఆర్పీ చైర్మన్, సభ్యులు చేసిన ప్రతిపాదనకు సలహాదారు వెదిరె శ్రీరాం ఆమోదం తెలిపారు. -
4న పోలవరానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను ఈనెల 4న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడి అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని షెకావత్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017–18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను యుద్ధప్రాతిపదికన ఆమోదించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి షెకావత్ ఈనెల 3న ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. విజయవాడ నుంచి 4న ఉదయం హెలీకాప్టర్‌లో సీఎం జగన్‌తో కలిసి షెకావత్ పోలవరానికి చేరుకుని.. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. -
పోలవరం తొలి దశ పూర్తిచేస్తే.. 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పూర్తిచేస్తే.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద 2.98 లక్షల ఎకరాలకు కాలువల (గ్రావిటీ) ద్వారా నీటిని సరఫరా చేయవచ్చునని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షలు కలిపి మొత్తం 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రజలకు వేసవిలోనూ సమృద్ధిగా తాగునీటిని అందించవచ్చని చెప్పారు. ఈ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరమని.. తక్షణమే విడుదల చేస్తే గడువులోగా తొలిదశను పూర్తిచేస్తామన్నారు. దీనిపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు కుశ్వీందర్ వోహ్రా స్పందిస్తూ.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఇప్పటికే డిస్ట్రిబ్యూటరీలను అభివృద్ధి చేసిన నేపథ్యంలో వాటి వ్యయాన్ని మినహాయించి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేయడానికి అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. దీని ఆధారంగా పోలవరం తొలిదశ పనులను పూర్తిచేయడానికి నిధుల మంజూరు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇస్తామని కుశ్వీందర్ వోహ్రా తెలిపారు. ఈ నివేదికను బుధవారం సీడబ్ల్యూసీకి పంపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి చెప్పారు. పోలవరం పనులు వేగవంతం పోలవరం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి పనులను వేగవంతం చేశామని 41.15 మీటర్ల కాంటూర్ వరకూ (తొలిదశ) పనులు పూర్తిచేయడానికి తక్షణం రూ.10,911 కోట్లు, 45.72 మీటర్ల వరకూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూ.21 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్వామినాథన్.. పోలవరం తొలిదశ పనులను పూర్తిచేయడానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయి? వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తేల్చి నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, పీపీఏ సీఈ ఏకే ప్రధాన్ తదితరులతో వర్చువల్ విధానంలో సమీక్ష జరిపారు. పుష్కర కింద 1.41లక్షలు, తాడిపూడి కింద 1.57 లక్షల ఎకరాలు.. పోలవరం ప్రాజెక్టును తొలిదశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పూర్తిచేస్తే.. కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీపై నీటిని సరఫరా చేయవచ్చునని సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు వివరించారు. కుడి కాలువ ద్వారా తాడిపూడి ఎత్తిపోతల కింద 1.57 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా పుష్కర ఎత్తిపోతల కింద 1.41 లక్షల ఎకరాలు వెరసి 2.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు గ్రావిటీపై నీటిని సరఫరా చేయవచ్చునని చెప్పారు. అలాగే, కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాలువ ద్వారా గ్రావిటీపై నీటిని మళ్లించి.. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునన్నారు. ఇక హెడ్ వర్క్స్ (జలాశయం)లో కుడి, ఎడమ కాలువ పనుల్లో మిగిలిన వాటిని పూర్తిచేయడానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి తొలి దశలో రూ.10,911 కోట్లు విడుదల చేయాలని కోరారు. రెండో దశలో రూ.21 వేల కోట్లు ఇక పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకూ పూర్తిచేస్తేనే 194.6 టీఎంసీలను నిల్వచేయవచ్చునని.. అప్పుడే ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుతాయని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. 45.72 మీటర్ల వరకూ ముంపునకు గురయ్యే భూమి సేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.21 వేల కోట్లు అవసరమవుతాయని.. వాటిని కూడా తొలిదశ పనులకు ఇచ్చే నిధులకు సమాంతరంగా విడుదల చేయాలంటూ చేసిన ప్రతిపాదనలపై వోహ్రా సానుకూలంగా స్పందించారు. రెండో దశ పనులు పూర్తిచేయడానికి అవసరమైన నిధులపై కూడా కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇస్తామని చెప్పారు. -
23న డీడీఆర్పీ సమావేశం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) ఈనెల 23న సమావేశమవుతోంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో పెండింగ్ డిజైన్లను సమీక్షించనుంది. క్షేత్రస్థాయి పర్యటన, సమీక్షల్లో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్లపై సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా డిజైన్ల ఆమోదంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. 2018, 2019లలో గోదావరి వరద ఉధృతి వల్ల దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించే ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. వీటిని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై డీడీఆర్పీ భేటీలో చర్చిస్తారు. అత్యంత కీలకమైన ఈ రెండు డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తే.. పోలవరం జలాశయం పనులు మరింత వేగవంతమవుతాయి. -
అధ్యయనం తర్వాతే అనుసంధానం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే గోదావరి – కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)లతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరికి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనం చేయిస్తామని తెలిపింది. గోదావరి– కావేరి అనుసంధానంపై శుక్రవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు. మిగులు జలాలపై పూర్తి హక్కు ఏపీదే ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల నీరు ఉందని, అందులో 247 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా మళ్లిస్తామన్న కేంద్రం ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణ అభ్యంతరం తెలిపాయి. గోదావరిలో మిగులు జలాలు అంత లేవని ఏపీ స్పష్టంచేసింది. మిగులు జలాలపై పూర్తి హక్కును ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేసింది. తమ అవసరాలను కేంద్రం తక్కువగా అంచనా వేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి వద్ద ఉన్న జలాలన్నీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న ప్రాజెక్టులకే సరిపోతాయని తెలంగాణ తెలిపింది. ఉభయ రాష్ట్రాల అవసరాలు పోను మిగిలి ఉన్న జలాలను మాత్రమే తరలించాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలతో సంయుక్తంగా అధ్యయనం చేస్తామని తెలిపింది. చదవండి: (ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం) ఛత్తీస్‌గఢ్ నుంచి 147 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లిస్తామన్న 247 టీఎంసీలలో 147 టీఎంసీలు చత్తీస్‌గఢ్ నుంచి, మరో 100 టీఎంసీలు తెలంగాణ నుంచి తీసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ పరిధిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేసింది. దాంతో.. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 147 టీఎంసీలను తొలి దశలో మళ్లిద్దామని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలకు పంకజ్‌కుమార్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నీటిలో ఏ రాష్ట్రాలు ఎంత వాడుకోవాలన్నది చర్చించి నిర్ణయిద్దామని జల్ శక్తి శాఖ సూచించింది. మళ్లించే జలాల్లో రాష్ట్రాలకు కేటాయించిన నీటిపై కర్ణాటక అభ్యంతరాలు తెలిపింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే మళ్లింపు జలాల్లో కర్ణాటకకు వాటా ఉంటుందని చెప్పింది. కృష్ణా నుంచి కావేరికి నీటిని తరలించే 84 టీఎంసీల్లోనూ కర్ణాటకకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కావేరికి మళ్లించే గోదావరి జలాల్లో కేటాయింపులు పెంచాలని తమిళనాడు కోరింది. కెన్–బెత్వా తరహాలోనే నిధులు గోదావరి–కావేరి అనుసంధానం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. కెన్–బెత్వా అనుసంధానానికి ఇస్తున్న తరహాలోనే 90 శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని, మిగతా పది శాతం తాము భరిస్తామని అన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. పోలవరం నుంచే కావేరికి గోదావరి మిగులు జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా) – సోమశిల (పెన్నా) – కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడంపై ఏపీ అభ్యంతరం చెప్పింది. నాగార్జున సాగర్, సోమశిల రిజర్వాయర్లలోని జలాలు వాటి కింద ఆయకట్టుకే సరిపోవడంలేదని చెప్పింది. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా కావేరికి గోదావరిని తరలించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. చెన్నైకి తాగు నీటి కోసం ఎగువ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నీటిని వరద సమయంలో ఇచ్చేశామని ఆ రాష్ట్రాలు చెబుతున్నాయని, దాంతో శ్రీశైలంలో ఉన్న తమ రాష్ట్రం కోటా నీటినే చెన్నైకి ఇవ్వాల్సి వస్తోందని కేంద్రానికి ఏపీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి జలాలను బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించి.. చెన్నైకి సరఫరా చేస్తున్న మార్గంలోనే కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. పోలవరం దిగువ నుంచి వెళ్లే నీరంతా వృధాగా సముద్రంలోకి కలుస్తుంది కాబట్టి ఆ నీటిని మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ అలైన్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంది. -
కేంద్ర జలసంఘం తీరుపై నీటిపారుదల రంగ నిపుణుల విస్మయం
సాక్షి, అమరావతి: తుంగభద్రలో 29.90 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకునేలా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు హైడ్రలాజికల్, టెక్నికల్ (సాంకేతిక) అనుమతివ్వడంలో సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వ్యవహరించిన తీరును నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతివ్వడంపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ‘బచావత్ ట్రిబ్యునల్’ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయింపుల ఆధారంగానే అప్పర్ భద్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సీడబ్ల్యూసీ సమర్థించుకోవడాన్ని చూసి నివ్వెరపోతున్నారు. తుంగభద్రలో నీటి లభ్యతలేదని చెబుతూ అప్పర్ భద్రకు అనుమతిచ్చేందుకు బచావత్ ట్రిబ్యునల్ నిరాకరించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–9 (బీ) ప్రకారం.. తుంగభద్రలో 295 టీఎంసీలకు మించి వాడుకోకూడదని నియంత్రణ పెట్టినా.. కర్ణాటక 1980–81 నాటికే ఏటా 319.558 టీఎంసీలను వాడుకుందని.. ఆ తర్వాత నీటి వినియోగం మరింత పెరిగిందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) స్పష్టంచేయడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల ఉత్తర్వులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాన్ని పాటించాల్సిన సీడబ్ల్యూసీనే.. ఆ చట్టాన్ని తుంగలో తొక్కడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కార్లు నిర్ణయించాయి. అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రాలాజికల్, టెక్నికల్ అనుమతులను పునఃసమీక్షించి.. దిగువ పరీవాహక రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేయనున్నాయి. తప్పును సమర్థించుకునేందుకు మరో తప్పు 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పది టీఎంసీలను మాత్రమే కేటాయించింది. కానీ, ఈ తీర్పును కేంద్రం ఇప్పటికీ అమలుచేయలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం అమలుచేసే వరకూ.. కృష్ణా బేసిన్ (పరీవాహక ప్రాంతం)లో ఏ ప్రాజెక్టును చేపట్టినా దానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కేటాయింపుల ఆధారంగానే సీడబ్ల్యూసీ అనుమతివ్వాల్సి ఉంటుంది. ‘కృష్ణా’.. అంతర్రాష్ట్ర నది అయిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ ఏ ప్రాజెక్టుకు అనుమతివ్వాలన్నా బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, కర్ణాటక సర్కార్ తుంగభద్రలో 29.90 టీఎంసీలను వాడుకోవడానికి చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చే సమయంలో నిబంధనలను తుంగలో తొక్కింది. ఇదే తప్పును ఏపీ సర్కార్ ఇటీవల ఎత్తిచూపుతూ.. అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతిని పునఃసమీక్షించాలని కోరింది. ఈ అనుమతిని సమర్థించుకునే క్రమంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే ఇచ్చామని తప్పులో కాలేసింది. బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు అనుమతిని నిరాకరించడాన్ని సీడబ్ల్యూసీ విస్మరించడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. తీర్పు అమల్లోకి రాకముందే అదనపు వినియోగానికి ఓకే అప్పర్ భద్ర ద్వారా తరలించే 29.90 టీఎంసీల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన పది టీఎంసీలు కూడా ఉన్నాయని డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లో కర్ణాటక స్పష్టంచేసింది. కానీ, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుపై కేంద్రం ఇంకా ఉత్తర్వులు జారీచేయలేదు. అయినా ఆ ట్రిబ్యునల్ కేటాయించిన పది టీఎంసీలను వాడుకోవడానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు చట్టవిరుద్ధమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్రలో కేటాయించిన నీటి కంటే అధికంగా కర్ణాటక వాడుకుంటోందని.. అప్పర్ భద్ర పూర్తయితే.. ఆ వినియోగం మరింత పెరుగుతుందని.. ఇది తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ (కర్నూల్–కడప కాలువ), ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీలపై ఆధారపడ్డ ఆయకట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
'అప్ప'నంగా.. ఇదేందప్పా?
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులే లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అవాస్తవాలను వల్లె వేస్తోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గత నెల 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఇప్పటిదాకా నోటిఫై చేయని నేపథ్యంలో అప్పర్ భద్రకు సాంకేతిక, పెట్టుబడి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అప్పర్ భద్రను నిలుపుదల చేసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకుండా, కర్ణాటకను సమర్థిస్తూ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్(సౌత్) విభాగం డైరెక్టర్ ఎన్.ముఖర్జీ ఈనెల 12న జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నెల 25న దీన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి జల్ శక్తి శాఖ పంపింది. ఈ నేపథ్యంలో మరోసారి లేఖ రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అసలు ఏపీ అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ వివరణ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం... ► ఏపీ సర్కార్ అభ్యంతరం–1: విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీల నీటి వినియోగం తగ్గిందని కర్ణాటక చెబుతున్న లెక్కలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే కొట్టిపారేసింది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్ ట్రిబ్యునల్ 9 టీఎంసీలు కేటాయించినా ఆ తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. అప్పర్ భద్ర హైడ్రాలజీపై పునఃసమీక్షించాలి. ► సీడబ్ల్యూసీ సమాధానం: బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగానే అప్పర్ భద్రకు సాంకేతిక అనుమతి ఇచ్చాం. ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం అంశాన్ని సాంకేతిక అనుమతి ఇచ్చేటప్పుడు పరిశీలించాం. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్‌ను కర్ణాటక సర్కార్ కోరింది. తుంగభద్రలో నీటి లభ్యత లేనందున అప్పర్ భద్రకు నీటిని కేటాయించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. విజయనగర చానళ్లు, భద్ర, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని ట్రిబ్యునలే తేల్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రలాజికల్ క్లియరెన్స్ తప్పు. దాన్ని పునఃసమీక్షించాలి. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–2: మాస్టర్ ప్లాన్ తయారీకి కర్ణాటక సర్కార్ 2002లో నియమించిన కమిటీ తుంగభద్రలో ఆరు టీఎంసీలు మిగులు ఉందని తేల్చింది. కానీ ఆ ఆరు టీఎంసీలను అటు బచావత్గానీ ఇటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌గానీ కర్ణాటకకు కేటాయించలేదు. ► సీడబ్ల్యూసీ: ఆరు టీఎంసీలు మిగులు జలాలు కాదు. కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో భాగమే. కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో ఉపయోగించుకోని ఆరు టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించామని కర్ణాటక సర్కార్ పేర్కొంది. ► ఏపీ సర్కార్: కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో నీటి వినియోగం తగ్గిందన్న కర్ణాటక వాదనపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? అక్కడ నీటి వినియోగం పెరిగిందేగానీ తగ్గలేదు. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–3: బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేటాయించింది. కానీ తుంగభద్ర డ్యామ్‌కు 1976–77 నుంచి 2007–08 వరకూ ఏటా సగటున 186.012 టీఎంసీలే వచ్చాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు ప్రవాహం మరింత తగ్గిపోతుంది. ఇది కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుంది. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ► సీడబ్ల్యూసీ: కర్ణాటక సర్కార్ 2019 నవంబర్ 27న జారీ చేసిన జీవో 176 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 21.50 టీఎంసీలు, గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం వచ్చే అదనపు నీటిలో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 సబ్ బేసిన్లలో మిగిలిన ఆరు టీఎంసీలు వెరసి 29.90 టీఎంసీలతో అప్పర్ భద్రను చేపట్టినందున దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు ఒక్క చుక్క కూడా కేటాయించలేదు. అలాంటప్పుడు 21.5 టీఎంసీలు ఎక్కడ నుంచి వచ్చాయి? సబ్ బేసిన్లలో ఆరు టీఎంసీల మిగులు లేదు. కర్ణాటక కట్టుకథలనే సీడబ్ల్యూసీ వల్లె వేయడం ధర్మం కాదు. ► ఏపీ అభ్యంతరం–4: వేదవతిపై వాణీవిలాసాగర్, బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్టు)ల మధ్య కొత్తగా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీన్ని తుంగలో తొక్కుతూ అప్పర్ భద్రలో అంతర్భాగంగా పరశురాంపుర వద్ద బ్యారేజీని కర్ణాటక నిర్మిస్తోంది. ► సీడబ్ల్యూసీ: 2020 డిసెంబర్ 24న నిర్వహించిన సాంకేతిక సలహా మండలి సమావేశం దృష్టికి పరశురాంపుర బ్యారేజీ నిర్మాణం రాలేదు. అప్పర్ భద్ర డీపీఆర్‌లో కూడా ఆ బ్యారేజీ విషయం లేదు. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్ర ప్రాజెక్టులో అంతర్భాగంగా పరశురాంపుర బ్యారేజీ నిర్మిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ టెండర్లు పిలిచింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ► ఏపీ అభ్యంతరం–5: అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయం కచ్చితంగా తీసుకోవాలి. అప్పర్ భద్ర డీపీఆర్‌లను మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు పంపకుండానే అనుమతి ఇచ్చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? ► సీడబ్ల్యూసీ: బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు చుక్క నీటిని కూడా కేటాయించలేదు. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం నిబంధనలను తుంగలో తొక్కడం కాదా? ► ఏపీ అభ్యంతరం–6: అప్పర్ భద్రకు జాతీయ హోదా ప్రతిపాదనపై చర్చించేందుకు డిసెంబర్ 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నీటి వాటాలు, హైడ్రాలజీ గురించి వెల్లడించారు. అంతర్రాష్ట్ర వివాదాలతో ముడిపడిన ఈ ప్రాజెక్టు విషయంలో పరివాహక రాష్ట్రాలకు ముందే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ► సీడబ్ల్యూసీ: హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశం మినిట్స్ ఇంకా రావాల్సి ఉంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగానే అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చాం. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను తోసిపుచ్చిన నేపథ్యంలో ఆ ట్రిబ్యునల్ తీర్పును పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చామనడం విడ్డూరం. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాల్సిందే. ఇదీ అప్పర్ భద్ర ప్రాజెక్టు.. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. అయితే మాస్టర్ ప్లాన్, ఆధునికీకరణ, కృష్ణా డెల్టాకు పోలవరం మళ్లింపు జలాల్లో వాటా, పునరుత్పత్తి జలాలు, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు తదితరాల రూపంలో తమకు 30.4 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని ప్రకటించింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. ► ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి 2019 వరకూ రూ.4,830 కోట్లను ఖర్చు చేసిన కర్ణాటక సర్కార్ అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపింది. ► 2020 డిసెంబర్ 24న ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో (2018–19 ధరల ప్రకారం) పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు గతేడాది మార్చి 25న జల్‌శక్తి శాఖ ఆమోదముద్ర వేసింది. ► ఈ రెండు అనుమతుల ఆధారంగా దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై గత డిసెంబర్ 6న జల్ శక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. -
కదిలే కాసారాలు.. ఎక్కడ, ఎంత ప్రమాదకరం?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నదీ జలాల్లో విషపూరిత లోహ ధాతువులు ప్రమాదకర స్థాయికి చేరినట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో హెచ్చరించింది. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే వదిలేయడం, పంటలకు వాడే క్రిమిసంహారక మందుల అవశేషాలు వర్షపు నీటి ద్వారా చేరడం, విచ్చలవిడిగా గనుల తవ్వకాలు, మురుగు నీటిని నదుల్లోకి వదిలేస్తుండటం దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఆర్సినిక్, నికెల్, లెడ్, కాడ్మియం, కాపర్, క్రోమియం, ఐరన్ లాంటి లోహ ధాతువులు నదీ జలాల్లో కలిసిపోవడం మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారుతోంది. ఇవి రక్తప్రసరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయడంతోపాటు హృద్రోగాలు, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులు చుట్టుముడుతున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని అల్జీమర్స్ లాంటి రుగ్మతలు, చర్మ క్యాన్సర్లకు దారి తీస్తోంది. నదీ జలాలు విషతుల్యం కావడం మనుషులతోపాటు జంతువులు, పక్షులు, జలచరాల మనుగడపై కూడా తీవ్ర ప్రభావంచూపుతోంది. కాలుష్యంలో పోటాపోటీ.. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదుల నీటి నాణ్యతపై 2018 నుంచి సీడబ్ల్యూసీ అధ్యయనం నిర్వహించింది. గంగా నుంచి కుందూ వరకూ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో 688 నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షించింది. కాలుష్యంలో నదుల మధ్య పెద్దగా తేడా లేనట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కడ, ఎంత ప్రమాదకరం? ఆర్సినిక్: ఇది అత్యంత విషపూరితమైన లోహం. ఆర్సినిక్ ధాతువులు లీటర్ నీటిలో 10 మైక్రో గ్రాములు (0.01 మిల్లీ గ్రాములు) వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో అన్ని నదుల్లోనూ 2,834 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది ప్రాంతాల్లో ఆర్సినిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ► భద్రాచలం వద్ద గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 10.17 మైక్రో గ్రాముల ఆర్సినిక్ను గుర్తించారు. ► తమిళనాడులో కావేరి ఉప నది అరసలర్ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 13.33 మైక్రో గ్రాముల ఆర్సినిక్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. లెడ్: ఆర్సినిక్ స్థాయిలోనే అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో పది మైక్రో గ్రాముల లెడ్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 3,111 చోట్ల నమూనాలు పరీక్షించగా 34 ప్రాంతాల్లో లెడ్ ధాతువులు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సోన్ నదీ జలాల్లో అత్యధికంగా లీటర్ నీటిలో 67.5 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. కాడ్మియం: ఆర్సినిక్, లెడ్ తర్వాత కాడ్మియం అత్యంత విషపూరితమైన లోహం. లీటర్ నీటిలో మూడు మైక్రో గ్రాముల వరకూ ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలోని నదుల్లో 3,113 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 11 చోట్ల అత్యంత ప్రమాదకర స్థాయిలో కాడ్మియం ధాతువులున్నాయి. ► బద్రాచలం వద్ద గోదావరిలో లీటర్ నీటిలో 4.08 మైక్రో గ్రాముల కాడ్మియం ధాతువులున్నాయి. ►ఉత్తరప్రదేశ్‌లో సుకేత నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 12.57 మైక్రో గ్రాముల కాడ్మియం ఉన్నట్లు తేలింది. నికెల్: ఇది మరో విషపూరిత లోహం. లీటర్ నీటిలో 20 మైక్రో గ్రాముల వరకూ నికెల్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,099 చోట్ల నీటి నమూనాలు పరీక్షించగా 199 చోట్ల ప్రమాదకర స్థాయిలో గుర్తించారు. ► కీసర వద్ద మున్నేరు జలాల్లో లీటర్ నీటికి 33.84 మైక్రో గ్రాములు, వైరా జలాల్లో మధిర వద్ద లీటర్ నీటిలో 71.73 మైక్రో గ్రాములు, విజయవాడ వద్ద కృష్ణా జలాల్లో లీటర్‌కు 56.71 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. సింగవరం వద్ద చిత్రావతి జలాల్లో లీటర్ నీటిలో 56.58 మైక్రో గ్రాములు, తుంగభద్ర జలాల్లో లీటర్ నీటిలో బావపురం వద్ద 24.78, మంత్రాలయం వద్ద 25.53 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 45.79, పోలవరం వద్ద 61.48 మైక్రో గ్రాములు నికెల్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► తమిళనాడు ఎల్నుతిమంగలం వద్ద నొయ్యల్ నదీ జలాల్లో లీటర్ నీటిలో గరిష్టంగా 242.90 మైక్రో గ్రాముల నికెల్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. క్రోమియం: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల వరకూ క్రోమియం ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. 3,106 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 50 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ► రాష్ట్రంలో అల్లాదుపల్లి వద్ద కుందూ జలాల్లో లీటర్‌కు 56.04 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులున్నాయి. తుంగభద్ర జలాల్లో హర్లహళ్లి వద్ద లీటర్ నీటిలో 92.72 మైక్రో గ్రాముల క్రోమియం ఉంది. ► గోదావరి జలాల్లో మంచిర్యాల వద్ద లీటర్ నీటిలో 51.63 మైక్రో గ్రాములు, కిన్నెరసాని జలాల్లో లీటర్‌కు 60.44 మైక్రో గ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు తేలింది. ► ఛత్తీస్‌గఢ్ హస్డియో నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 180.47 మైక్రోగ్రాముల క్రోమియం ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. కాపర్: లీటర్ నీటిలో 50 మైక్రో గ్రాముల లోపు మాత్రమే కాపర్ ధాతువులు ఉండాలి. ► దేశంలో 3,107 ప్రాంతాల్లో నీటి నమూనాలు పరీక్షించగా 17 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ► మహారాష్ట్రలోని ఉల్హాస్ నదీ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 132.64 మైక్రో గ్రాముల కాపర్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ఐరన్: లీటర్‌కు 300 మైక్రో గ్రాములు (0.3 మిల్లీ గ్రాములు) వరకూ ఐరన్ ధాతువులు ఉంటే ఇబ్బంది ఉండదు. దేశంలో 414 చోట్ల ప్రమాదకర స్థాయిలో ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► గోదావరి జలాల్లో లీటర్ నీటికి భద్రాచలం వద్ద 0.69, పోలవరం వద్ద 4.75 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు తేలింది. ► లీటర్ నీటికి మున్నేరు జలాల్లో 1.86, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల్లో 0.91 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు వెల్లడైంది. ► నాగావళిలో శ్రీకాకుళం వద్ద లీటర్ నీటిలో 1.30 మిల్లీ గ్రాములు, మెళియపుట్టి వద్ద వంశధార జలాల్లో 1.09 మిల్లీ గ్రాములు, నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి జలాల్లో 0.49 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులు ఉన్నట్లు గుర్తించారు. ► బెంగాల్లో పరక్కా ఫీడర్ చానల్ జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 11.24 మిల్లీ గ్రాముల ఐరన్ ధాతువులున్నాయి. -
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాతోపాటు ఇతర అంశాల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం) ఏర్పాటు చేసిన కేంద్ర బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పీఎంవోకు కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 3న తనతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సోమవారం కేంద్ర బృందంతో సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మరోసారి చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ భేటీ అవుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులకు వి/æ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ► రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ► 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ► విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. సానుకూలంగా స్పందించిన ప్రధాని సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పీఎంవో అధికారులను ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ స్వామినాథన్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందంతో చర్చించేందుకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బృందం అజయ్ సేథ్, ఆర్థిక శాఖ(ఆర్థిక వ్యవహారాల విభాగం) కార్యదర్శి, పంకజ్‌కుమార్, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, దేబాశిస్ పాండా, కేంద్ర ఆర్థిక శాఖ (ఆర్థిక సేవల విభాగం), సుధాన్షు పాండే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి. రాష్ట్ర బృందం ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేఎస్ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, షంషేర్‌సింగ్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజా శంకర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్. -
డిజైన్ల ఆమోదంలో జాప్యమే కారణం
సాక్షి, అమరావతి: డిజైన్ల ఆమోదంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేస్తున్న జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజైన్లను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరం, సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్) పనుల పురోగతిని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గురువారం వర్చువల్ విధానంలో సమీక్షించారు. పోలవరం పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను ఆదేశించారు. డిజైన్లను వేగంగా ఆమోదిస్తే ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని జవహర్‌రెడ్డి చెప్పగా.. తక్షణమే డీడీఆర్పీ సభ్యులు పనులను పరిశీలించి, డిజైన్లను ఖరారు చేసేలా చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఈనెల 7న డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య పోలవరం పనులను పరిశీలించారని ఈఎన్సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వర్చువల్ విధానంలో డీడీఆర్పీ సమావేశం నిర్వహించి డిజైన్లను ఆమోదిస్తే ఈ సీజన్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. ఇందుకు పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే డీడీఆర్పీ సమావేశం నిర్వహించి.. డిజైన్ల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఆదేశించారు. ప్రాజెక్టుకు ఇటీవల విడుదల చేసిన రూ.320 కోట్లకు యూసీలు (వినియోగ ధ్రువీకరణ పత్రాలు) పంపామని, రీయింబర్స్ చేయాల్సిన మిగతా నిధులను మంజూరు చేయాలని జవహర్‌రెడ్డి చేసిన వి/æ్ఞప్తిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై మరో సమావేశంలో చర్చిద్దామని పంకజ్‌కుమార్ చెప్పారు. ఏఐబీపీ, కాడ్వామ్ కింద చేపట్టిన గుండ్లకమ్మ, తోటపల్లి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసి.. పూర్తి ఆయకట్టుకు నీళ్లందించాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఉన్నందువల్ల మిగిలిన పనులను పూర్తి చేయలేకపోతున్నట్లు రాష్ట్ర అధికారులు వివరించారు. వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించుకుని.. గడువులోగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. -
శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చాలా సమర్ధవంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సారీ్ప) ప్రశంసించింది. ప్రాజెక్టు అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖను అభినందించింది. ప్రాజెక్టు ఆధునికీకరణకు డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) కింద రుణం మంజూరుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్యానల్ చైర్మన్ ఏబీ పాండ్య తెలిపారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన పాండ్య నేతృత్వంలోని డీఎస్సార్పీ.. మంగళవారం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ, ఈఈ తదితరులతో సమావేశమైంది. ప్రాజెక్టు స్థితిగతులు, ఆధునికీకరణపై సమీక్షించింది. ప్రాజెక్టు ప్లంజ్ పూల్‌కు 2002 నుంచి 2004 మధ్య వేసిన కాంక్రీట్ ఆ తర్వాత వచ్చిన వరదల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు డీఎస్సార్పీ గుర్తించింది. భారీ కాంక్రీట్ దిమ్మెలను ప్లంజ్ పూల్‌లో వేసి, వాటిపై అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పోయడం ద్వారా గొయ్యిని పూడుస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ డిజైన్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు పంపాలని ప్యానల్ చైర్మన్ సూచించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారమే ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. కొండ చరియలు విరిగి పడకుండా.. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన, దిగువన కొండచరియలు విరిగి పడి ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు పడకుండా మెస్, షార్ట్ క్రీటింగ్ కాంక్రీట్‌తో అడ్డుకట్ట వేస్తున్న తరహాలోనే.. శ్రీశైలంలోనూ చేస్తామని అధికారులు చేసిన ప్రతిపాదనకు డీఎస్సార్పీ ఆమోదం తెలిపింది. గ్యాలరీలో సీపేజ్‌కు అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేపట్టాలని ఆదేశించింది. రివర్ స్లూయిజ్ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, ఆప్రాన్‌కు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించింది. అధునాతన వరద పర్యవేక్షణ కార్యాలయం ప్రాజెక్టు వద్ద వరద పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఎస్సార్పీ సూచించింది. ప్రాజెక్టు అధికారులకు 40 ఎకరాల్లో గతంలో నిర్మించిన క్వార్టర్స్‌ను (ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి) కూల్చివేసి, కొత్తవి నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ, క్వార్టర్స్ నిర్మాణానికి డ్రిప్ కింద రుణమివ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని డీఎస్సార్పీ తెలిపింది. ఈ పనులకు రూ.780 నుంచి రూ.1,000 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని పాండ్య తెలిపారు. -
శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన డీఎస్సార్పీ
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సార్పీ) సోమవారం తనిఖీ చేసింది. ఆ తర్వాత తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ కె.శ్రీనివాస్ తదితరులతో ప్రాజెక్టు వద్దే సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రాజెక్టు భద్రతకు ఎటువంటి ఢోకా లేదని చెప్పింది. మంగళవారం రాష్ట్ర జలవరులశాఖ అధికారులతో మరోసారి సమావేశమై.. ప్రాజెక్టు భద్రతకు తక్షణం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రపంచబ్యాంకు రుణంతో కేంద్రం చేపట్టిన డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద శ్రీశైలం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపడతారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రపంచబ్యాంకు రుణంతో కేంద్రం డ్రిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే తొలిదశ పూర్తవగా రెండోదశను ప్రారంభించింది. ఈ రెండోదశలో శ్రీశైలం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు కృష్ణానదికి 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ కాస్త దెబ్బతింది. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీలో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రౌటింగ్ (బోరు వేసి.. అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని భూగర్భంలోకి పంపి.. చీలికలను కాంక్రీట్‌తో నింపడం ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడం) చేయడం, ఫ్లంజ్ పూల్‌కు, గేట్లకు మరమ్మతులు చేయడం, ఆఫ్రాన్‌ను పటిష్టం చేయడం, క్యాంపు కాలనీ నిర్మించడం వంటి పనులు చేపట్టడానికి రూ.780 కోట్లతో సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసి.. భద్రతకు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో రిటైర్డ్ సీఈ ఈశ్వర్ ఎస్.చౌదరి, రిటైర్డ్ ఈఎన్సీలు బి.ఎస్.ఎన్.రెడ్డి, పి.రామరాజు, రిటైర్డ్ సీఈలు రౌతు సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జీఎస్ఐ రిటైర్డ్ డీజీ ఎం.రాజు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ స్కేప్ ఎక్స్పర్ట్ ఎండీ యాసిన్ సభ్యులుగా డీఎస్సార్పీని కేంద్రం నియమించింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, గేట్లు, గ్యాలరీ, ఫ్లంజ్ పూల్, ఆఫ్రాన్లను పరిశీలించిన డీఎస్సార్పీ.. జలవనరులశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించింది. మంగళవారం మరోసారి అధికారులతో సమావేశం కానుంది. ఈ బృందం ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇస్తుందని సీఈ మురళీనాథ్‌రెడ్డి మీడియాతో చెప్పారు. -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్‌డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్‌పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్‌డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
కోతకు గురైన నదీ గర్భం అభివృద్ధి.. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉధృతికి పోలవరం ప్రాజెక్టులో గ్యాప్–1, గ్యాప్–2 ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌ల నిర్మాణ ప్రదేశానికి ఎగువన నదీ గర్భంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పటిష్టపర్చాలనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాకే తేల్చాలని డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) నిర్ణయించింది. డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్)–2 కింద ఆధునీకరణకు ఎంపికైన ధవళేశ్వరం బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టులను పరిశీలించేందుకు జనవరి 7న డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య రాష్ట్రానికి వస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించిన రోజునే పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి.. అపరిష్కృత డిజైన్లకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు. వర్చువల్ విధానంలో డీడీఆర్పీ భేటీ మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పన కోసం సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం ఏర్పాటుచేసిన డీడీఆర్పీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు, సీడబ్ల్యూసీ అధికారులతోపాటు సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్తలు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–చెన్నై ప్రొఫెసర్లు పాల్గొన్నారు. స్పిల్ వే నిర్మించకుండా వరద ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభిం చి.. మధ్యలోనే వాటిని వదిలేయడంవల్ల వరద ఉధృతికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 కు ఎగువన ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. వాటిని ఇసుకతో నింపడం, వైబ్రో కాంపక్షన్ పద్ధతిలో ఇసుక తిన్నెలను పటిష్టపర్చడం.. డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) ద్వారా ఇసుక తిన్నెలను అ త్యంత పటిష్టంగా తీర్చిదిద్దడం, స్టోన్ కాలమ్స్ విదానంలో అభివృద్ధి చేసే విధానాలను డీడీఆర్పీకి అధికారులు వివరించారు. పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఏ విధానం ప్రకారం చేస్తే కోతకు గురైన ఇసుక తిన్నెలను అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దవచ్చో అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పాండ్య చెప్పారు. గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపునకు మళ్లించేందుకు నది వద్ద 450 మీటర్లు వెడల్పు.. ఆ తర్వాత ప్రతి వంద మీటర్లకూ 50 మీటర్ల వెడల్పును పెంచుతూపోయి.. స్పిల్ వే వద్దకు వచ్చేసరికి 1,100 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ చానల్ తవ్వేలా డిజైన్‌ను 17వ డీడీఆర్పీ సమావేశంలోనే ఆమోదించారు. కానీ, నది వద్ద ప్రారంభంలో అప్రోచ్ చానల్ వెడల్పును 450 మీటర్లతో కాకుండా 550 మీటర్లకు పెంచే అంశంపై డీడీఆర్పీ చర్చించింది. ప్రారంభంలో అప్రోచ్ ఛానల్ వెడల్పును పెంచడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తేల్చారు. పోలవరం స్పిల్ వే సహా హెడ్ వర్క్స్‌లో అన్ని పనుల పటిష్టతను పరీక్షించే పనిని చెన్నైకి చెందిన సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీ సంస్థకు అప్పగించేందుకు డీడీఆర్పీ అంగీకరించింది. -
డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్‌ల పరిశీలనల పేరిట అనవసర కాలయాపన చేస్తోందని గోదావరి బోర్డు తీరును తప్పుపట్టింది. పరిధికి మించి వ్యవహరిం చడం మాని డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి పంపాలని కోరింది. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని, ట్రిబ్యునల్లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు. -
తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జలాలను వినియోగించుకోవడానికి చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పిస్తూ తెలంగాణ సర్కార్ పేర్కొన్న నీటి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని స్పష్టంచేసింది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా జలాలను కొత్త ట్రిబ్యునల్ పంపిణీ చేసే వరకూ తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించవద్దంటూ ఏపీ సర్కార్ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ, గోదావరి బోర్డులకు లేఖ రాసింది. అలాగే, గత నెల 30న సీతారామ ఎత్తిపోతల పథకం తొలిదశ డీపీఆర్‌పై కూడా అభ్యంతరం వ్యక్తంచేస్తూ లేఖ రాసింది. మిగతా ఐదింటిపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్‌శక్తి శాఖకు, గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత ఏదీ? ► మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గోదావరి పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఉన్నాయి. తెలంగాణకు ఎగువనున్న రాష్ట్రాల నుంచే 11 ఉప నదులు ప్రవహించి గోదావరిలో కలుస్తున్నాయి. ఒక్క శబరి మాత్రమే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుంది. ఇక భౌగోళికంగా ఏపీకి ఎగువనున్న తెలంగాణ ఏడాది పొడవునా గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉంది. ► 2016, జనవరి 21న జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా కొత్త ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారే కోరింది. ► అనంతరం.. అదే ఏడాది నవంబర్ 16న జరిగిన బోర్డు నాలుగో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఏపీ వాటా 775.9.. తెలంగాణ వాటా 649.8 టీఎంసీలు. ఇక 2004లో వ్యాప్కోస్ చేసిన అధ్యయనం ప్రకారం 2 రాష్ట్రాల పరిధిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. ► రెండు రాష్ట్రాలు కలిపి ఇప్పటికే 1425.7 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు నీటి లభ్యతలేదు. మిగులు జలాలు ఏపీవే.. ► గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. జీ–1 నుంచి జీ–11 సబ్ బేసిన్ల వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలతోపాటూ మిగులు జలాలు ఏపీకే దక్కుతాయి. ► గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ 320 టీఎంసీలు.. తెలంగాణ 450.3 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు చేపట్టాయి. దీంతో ఏపీ ప్రాజెక్టులకు 1,095.9, తెలంగాణ ప్రాజెక్టులకు 1,100.1 టీఎంసీలు కలిపి మొత్తం 2,196 టీఎంసీల అవసరం ఉంది. కానీ, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ కొత్తవే. వీటితోపాటూ కాళేశ్వరం సామర్థ్యాన్ని అదనంగా 225 టీఎంసీలకు.. సీతారామ సామర్థ్యాన్ని మరో 30 టీఎంసీలకు పెంచే ప్రాజెక్టులూ కొత్తవే. ► కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతలపై 2018లోనే అభ్యంతరాలు వ్యక్తంచేశాం. కానీ, సీడబ్ల్యూసీలో కొన్ని విభాగాలు అనుమతులిచ్చాయి. వాటిని తక్షణమే పునఃసమీక్షించాలి. ► ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా ఆయకట్టు దెబ్బతింటాయని.. వాటిని అడ్డుకుని దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని 2020, జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు తొమ్మిదో భేటీలో కోరాం. ► 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో 2 రాష్ట్రాలకు గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని ఆదేశించారు. ► ఏపీ హక్కులను దెబ్బతీసేలా.. అనుమతిలేకుండా తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని షెకావత్‌కు అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం జగన్ లేఖ ఇచ్చారు. ట్రిబ్యునల్‌కు విరుద్ధంగా నీటి మళ్లింపు ► గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ నీటిని మళ్లిస్తోంది. జీ–10 సబ్ బేసిన్లో ఎగువనున్న ప్రాజెక్టుల వినియోగానికి 301.34 టీఎంసీలను మినహాయించుకుని.. పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ లెక్కగట్టి అనుమతిచ్చింది. ► దీంతో జీ–10 సబ్ బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కేటాయించిన 20 టీఎంసీలుపోనూ.. మిగిలిన 281.34 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం తెలంగాణకు ఉంటుంది. ► ఇక ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి గోదావరి జలాలను మళ్లించకూడదని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ అవార్డును పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని మళ్లిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దు. తెలంగాణ సర్కార్ కొత్త ప్రాజెక్టులు ఇవే.. ► పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి (తుపాలకులగూడెం బ్యారేజీ) ► సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ ► ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం ూ చనాకా–కొరటా బ్యారేజీ ► చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం ూ మొడికుంట వాగు ప్రాజెక్టు కేంద్రం, గోదావరి బోర్డుకు వాస్తవాలను చెప్పాం గోదావరి జలాల వినియోగంలో వాస్తవాలను కేంద్రానికి, గోదావరి బోర్డుకు వివరించాం. తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులను చేపట్టింది. వీటి డీపీఆర్‌లను పరిశీలించవద్దని.. ఆమోదించవద్దని కోరాం. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కూ లేఖ రాశాం. తెలంగాణ డీపీఆర్లన్నింటినీ అధ్యయనం చేసి.. వాటిపైనా లేఖలు రాస్తాం. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరుతాం. – జె. శ్యామలరావు, కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ -
డిండి ఎత్తిపోతలపై ఎన్జీటీకి
సాక్షి, అమరావతి: పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టువల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేసింది. పర్యావరణ అనుమతిలేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదని పేర్కొంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్ ఆమోదంలేకుండా చేపట్టిన ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డులను కోరినా ఫలితం లేకపోయిందని ఎన్జీటీకి వివరించింది. ఈ రిట్ పిటిషన్లో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చింది. తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయించి.. ఏపీ హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రజల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీలో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు పేర్కొన్న ప్రధానాంశాలు ఇవీ.. ► ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా)–2006 నోటిఫికేషన్ ప్రకారం పది వేల ఎకరాల కంటే ఎక్కువగా కొత్త ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు ముందస్తుగా పర్యావరణ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం.. కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ► కానీ.. తెలంగాణ సర్కార్ అవేమీ లేకుండానే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి.. 3,60,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిండి పనులను 2015, జూన్ 11న చేపట్టింది. ► దీనిపై పలుమార్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశాం. ఈ పనులవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పాం. డిండి ఎత్తిపోతల పనులు చేసే ప్రదేశం పులుల అభయారణ్యంలో ఉండటంవల్ల.. వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, ఎలాంటి స్పందన కన్పించలేదు. ► ఈ ఎత్తిపోతలవల్ల ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. వాటిపైనా ఎలాంటి స్పందనలేదు. ► ఈ పథకం పూర్తయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగు, సాగునీటి కొరతకు.. వాతావరణ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తుంది. -
‘సీతారామ’ డీపీఆర్‌ను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై అంచనా వేసి, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా ట్రిబ్యునల్ పంపిణీ చేసేవరకు తెలంగాణ సర్కార్ సమర్పించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించవద్దని కేంద్రం, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గోదావరి జలాల విషయంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లకు గురువారం రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చినప్పుడు నీటిలభ్యతను అధికంగా చూపించారని, దానిపై తమ అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం, గోదావరి డెల్టాకు నీటిలభ్యత తగ్గుతుందని, ఆ ప్రాజెక్టును ఆమోదిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందని స్పష్టం చేశారు. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిన గోదావరి బోర్డు.. అక్టోబర్ 6లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై అభిప్రాయాలను చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో కొన్ని ప్రధానాంశాలు.. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావరిలో 991.19 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో వ్యాప్కోస్ లెక్కగట్టింది. పోలవరం వద్ద 460.36 టీఎంసీల మిగులు ఉంటుందని తేల్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వద్ద 315.54 టీఎంసీలే మిగులు ఉంటుంది. ► పోలవరం వద్దకు సగటున 561 టీఎంసీల ప్రవాహం వస్తుందని లెక్కకట్టిన సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు 2006 సెప్టెంబర్ 12న హైడ్రాలాజి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ పోలవరం వద్ద నీటిలభ్యత 460.36 టీఎంసీలే ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో ఉండటంపై 2018లోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. 2018లో 32 టీఎంసీల సామర్థ్యంతో డీపీఆర్ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పోలవరం, గోదావరి డెల్టాలకు తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది. ► పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా అవసరాలు 554.81 టీఎంఎసీలు. పోలవరం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిన సమయంలో పోలవరం ప్రాజెక్టులో 34.92 టీఎంసీల ఆవిరి నష్టాలు ఉంటాయని తేల్చింది. పోలవరం కుడి, ఎడమ కాలువల అదనపు అవసరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, ముసురుమిల్లి, వెంకటనగరం, భూపతిపాలెం, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, మాచ్‌ఖండ్ తదితర ప్రాజెక్టుల అవసరాలు లెక్కిస్తే.. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత కింద రాష్ట్ర వాటా 775 టీఎంసీలు. ► ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరి 15న కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణమే గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అంచనా వేయించాలి. ఎగువ రాష్ట్రాలు పూర్తిచేసిన, నిర్మాణంలో ఉన్న, చేపట్టనున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులు చేయాలి. ఆ తర్వాతే డీపీఆర్‌లను ఆమోదించాలి. -
పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలపై ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. జలాశయం ముంపు నుంచి తప్పించడానికి శబరి, సీలేరు నదులకు కరకట్టలు నిర్మించడానికి వీలుగా యుద్ధప్రాతిపదికన ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఏ మేరకు ఉంటుందో తేల్చడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖల అధికారులు సభ్యులుగా జాయింట్ కమిటీని ఏర్పాటుచేస్తామని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ చేసేవరకు పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను (స్టాప్ వర్క్ ఆర్డర్) తాత్కాలిక నిలుపుదల (అభయన్స్)లో పెట్టకుండా.. పూర్తిగా ఎత్తేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్‌ప్రసాద్ గుప్తాల నేతృత్వంలో సోమవారం వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దార్, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జలవనరులశాఖల కార్యదర్శులు జె.శ్యామలరావు, అనూగార్గ్, ఎన్.కె.అశ్వల్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరకట్టల నిర్మాణానికి సిద్ధం పోలవరంను 2022 నాటికి పూర్తి చేసేందుకు పనుల్ని వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీలేరు, శబరి నదుల్లో బ్యాక్ వాటర్ వల్ల ముంపు సమస్య ఏర్పడకుండా ఒడిశాలో రూ.378.696 కోట్లతో 30.2 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.332.3 కోట్లతో 29.12 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను కోరుతూ 31 మార్లు ఏపీ ప్రభుత్వం, తాము లేఖలు రాశామని తెలిపారు. డిజైన్‌పై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ గోదావరిలో 500 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ నివేదిక ఇచ్చిందని, కానీ 50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మించారని ఒడిశా జలవనరులశాఖ కార్యదర్శి అనూగార్గ్ చెప్పారు. దీనివల్ల గరిష్ట వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు నుంచి సీలేరు, శబరిల్లోకి వరద ఎగదన్ని ఒడిశాలో అధికభాగం ముంపునకు గురవుతుందన్నారు. 58 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణనలోకి తీసుకుని ముంపు ప్రభావంపై అధ్యయనం చేసేవరకు ప్రాజెక్టు పనులను ఆపేయాలని కోరారు. దీనికి సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్.కె.హల్దార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం భద్రత దృష్ట్యా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్గదర్శకాల ప్రకారం 50 లక్షల క్యూసెక్కుల వరదనైనా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం సిల్ప్ వే డిజైన్‌ను ఆమోదించామని చెప్పారు. ఈ అంశంలో సీడబ్యూసీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలన్న అనూగార్గ్ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ తోసిపుచ్చారు. జాయింట్ కమిటీతో అధ్యయనం పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాది ఏ మేరకు నీటిని నిల్వ చేస్తారు.. దానివల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ఉంటుందా? అని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అధికారులు ప్రశ్నించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం 2022లో 41.15 మీటర్ల మేర ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తామని, దీనివల్ల బ్యాక్ వాటర్ ముంపు ఉండదని చెప్పారు. అనంతరం కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ మాట్లాడుతూ గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు జాయింట్ కమిటీతో సర్వే చేయిస్తామని చెప్పారు. సీడబ్ల్యూసీ నేతృత్వంలో పీపీఏ, మూడు రాష్ట్రాల జవనరులశాఖల అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు జాయింట్ సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈలోగా ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ప్రజాభిప్రాయ సేకరణచేసి ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను ఆదేశించారు. ఇందుకు ఆ రెండు రాష్ట్రాలు సమ్మతించాయి.