telecom sector
-
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యూఈ) ప్రాంతాల అభివృద్ధికి ప్రైవేటు రంగం కూడా భాగస్వామిగా ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సంబంధిత రాష్ట్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు మొదలు అభివృద్ధి పనుల వరకు ప్రైవేటు సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపింది. 2015లో ఇందుకు సంబంధించిన జాతీయ విధానం, కార్యచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల లోక్‌సభలో తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల బెటాలియన్లు, శిక్షణ, రాష్ట్ర పోలీసు దళాల ఆధునీకరణకు నిధులు, పరికరాలు, ఆయుధాలు, నిఘా భాగస్వామ్యం, పోలీస్స్టేషన్ల నిర్మాణంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు ప్రైవేటు రంగాలతో కలసి సహకారం అందిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో 17,589 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, 14,618 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. టెలికాం కనెక్టివిటీ కోసం 10,505 మొబైల్ టవర్లను మంజూరు చేయగా 7,768 టవర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఆమోదం పొందిన 48 పారిశ్రామిక శిక్షణ సంస్థలు, 61 నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్లో 46 ఐటీఐలు, 49 ఎస్డీసీలు పనిచేస్తున్నట్లు వివరించారు. ఆయా జిల్లాల్లో బ్యాంకింగ్ సేవలతో తపాలా శాఖ 5,731 పోస్టాఫీసులను ప్రారంభించినట్లు మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్ లాభాల సిగ్నల్
న్యూఢిల్లీ: టెలికం రంగ ప్రభుత్వ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి సుమారు 17 ఏళ్ల తదుపరి తిరిగి లాభాల్లోకి ప్రవేశించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. ఇది ప్రస్తావించదగ్గ కీలక మలుపు అంటూ వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్ ఇంతక్రితం 2007లో మాత్రమే త్రైమాసికవారీగా లాభాలు ఆర్జించడం గమనార్హం! కంపెనీకిది అతిముఖ్యమైన రోజుగా సింధియా పేర్కొన్నారు. కంపెనీ కొంతకాలంగా సరీ్వసులను విస్తరించడంతోపాటు వినియోగదారులను పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. బీఎస్ఎన్ఎల్ మొబిలిటీ, ఫైబర్ టు హోమ్(ఎఫ్టీటీహెచ్), లీజ్డ్ లైన్ సరీ్వసులలో 14–18 శాతం వృద్ధిని సాధించినట్లు సిందియా తెలిపారు. మరోవైపు సబ్స్క్రయిబర్ల సంఖ్య సైతం 2024 డిసెంబర్లో 9 కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. జూన్‌లో ఈ సంఖ్య 8.4 కోట్లు మాత్రమే. -
ల్యాండ్‌లైన్ యూజర్లకు కొత్త నంబరింగ్ సిస్టం: ట్రాయ్
న్యూఢిల్లీ: వినియోగంలో లేని ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం కొత్త నంబర్ సిస్టం కోడ్ ఇకపై టెలికం సర్కిల్ లేదా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ల్యాండ్‌లైన్ యూజర్లు మరో ల్యాండ్‌లైన్ యూజరుకు కాల్ చేయాలంటే మొత్తం పది అంకెలు డయల్ చేయాల్సి వస్తుంది. ముందుగా సున్నాను, తర్వాత ఎస్టీడీ కోడ్, ఆ తర్వాత ఫోన్ నంబరును డయల్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఎస్డీసీఏలో (షార్ట్ డిస్టెన్స్ చార్జింగ్ ఏరియా) లోకల్ కాల్ చేయాలన్నా ముందగా సున్నాను జోడించి, ఎస్‌డీసీఏ కోడ్, ఆతర్వాత యూజరు నంబరును డయల్ చేయాలి. కొత్త నంబరింగ్ విధానం వల్ల ప్రస్తుత యూజర్ల నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని ట్రాయ్ తెలిపింది. నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు టెలికం ఆపరేటర్లకు 6 నెలల వ్యవధినివ్వాలని టెలికం శాఖకు సూచించింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్ఎన్ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. -
టెలికం పీఎల్ఐ స్కీముతో కోట్లాది పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద టెల్కోలు రూ. 2,419 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తద్వారా 17,753 మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. ఇది దేశీ టెలికం పరిశ్రమ చరిత్రలో కీలక మైలురాయని తెలిపారు. అమెరికాకు చెందిన టెలిట్ సింటెరియోన్ కోసం దేశీ సంస్థ వీవీడీఎన్ .. 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్స్, డేటా కార్డుల తయారు చేయడానికి సంబంధించిన ప్రొడక్షన్ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. సంక్లిష్టమైన మెషిన్లను నిర్వహించడంలో అమ్మాయిలకు కూడా శిక్షణ లభిస్తుండటమనేది మేకిన్ ఇండియా లక్ష్య విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పీఎల్ఐ స్కీము కింద ఎంపికైన కంపెనీల్లో వీవీడీఎన్ కూడా ఒకటి. 2022 అక్టోబర్‌లో ఈ పథకం కోసం కేంద్రం 42 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఆయా సంస్థలు రూ. 4,115 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 44,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. రాజన్‌కు కౌంటర్.. మేకిన్ ఇండియా నినాదాన్ని విమర్శిస్తున్నవారు టెలికం, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ సాధిస్తున్న సామరŠాధ్యల గురించి తెలుసుకునేందుకు వీవీడీఎన్ ప్లాంట్లను సందర్శించాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్‌కు వైష్ణవ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నేడు భారత్‌లో తయారు చేస్తున్న టెలికం పరికరాలు అమెరికా, యూరప్, జపాన్ మొదలైన ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయన్నారు. అత్యంత నాణ్యమైనవిగా భారతీయ ఉత్పత్తులు ఆయా దేశాల ఆమోదయోగ్యత పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో భారత్‌లో అదనంగా ఎంత విలువ జతవుతున్నది ప్రశ్నార్ధకమేనంటూ రాజన్ కొన్నాళ్ల క్రితం సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వైష్ణవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వినియోగ ఉత్పత్తులకు మంచి డిమాండ్
హైదరాబాద్: సాంకేతిక వినియోగ వస్తువుల రంగం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదు చేసినట్టు జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లతో కూడిన టెలికం ఉత్పత్తుల విభాగంలో అమ్మకాల పరిమాణం 4 శాతం తగ్గింది. విలువ పరంగా 12 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో, 2022లోని ఇదే కాలంతో పోలిస్తే కొన్ని రంగాలు గణనీయమైన వృద్ధిని చూశాయి. ‘‘భారత కన్జ్యూమర్ మార్కెట్ మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిణామ క్రమంలో ఉంది. మార్కెట్లో వినూత్నమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొంది. టెక్నికల్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ పరంగా 8 శాతం చక్కని వృద్ధిని ప్రదర్శించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ రంగం (ఆడియో, వీడియో) 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది’’అని జీఎఫ్కే మార్కెట్ నిపుణురాలు సౌమ్య ఛటర్జీ తెలిపారు. జీఎఫ్కే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్‌లైన్ రిటైల్ ట్రాకింగ్ నివేదిక ప్రకారం.. ► స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లు మంచి పనితీరు చూపించాయి. విలువ పరంగా 12 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ విభాగం విలువ పరంగా 14 శాతం, పరిణామం పరంగా 3 శాతం వృద్దిని నమోదు చేసింది. ముఖ్యంగా రూ.30,000కు పైన ఉన్న స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 50 వృద్ధి కనిపించింది. ► ప్రధాన గృహోపకరణాల విభాగం ఆశాజనకమైన పనితీరు చూపించింది. ఎయిర్ కండీషనర్లలో 7 శాతం వృద్ధి కనిపించింది. వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 6 శాతం పెరిగాయి. మైక్రోవేవ్ ఓవెన్లు 4 శాతం అమ్మకాల వృద్ధిని చూశాయి. ► మంచి వినోద అనుభవాన్ని భారత వినియోగదారులు కోరుకుంటున్నారు. దీంతో ఆడియో హోమ్ సిస్టమ్‌ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. పీటీవీ/ఫ్లాట్ టెలివిజన్ల అమ్మకాలు 13 శాతం అధికంగా నమోదయ్యాయి. ► ఐటీ రంగంలో డెస్‌్కటాప్ కంప్యూటర్ల అమ్మకాలు 7 శాతం పెరిగాయి. మొబైల్ పీసీ విక్రయాలు 14 శాతం తగ్గాయి. ► రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 29 శాతం పెరిగాయి. -
టెలికం ఆదాయం అంతంతే.. 5జీ వచ్చినా లాభం లేదు!
న్యూఢిల్లీ: టెలికం రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మోస్తరు ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌లు పెంచే అవకాశాలు కనిపించకపోవడంతో, యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) విస్తరణకు అవకాశాల్లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2023–24 సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి 7–9 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి మూలధన వ్యయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపింది. అలాగే, వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం మీద టెలికం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు వ్యయం చేస్తాయని అంచనా వేసింది. 5జీ సేవల ప్రారంభంతో నెట్వర్క్ సాంద్రత పెరుగుతుందని.. ఫలితంగా సమీప కాలం నుంచి మధ్య కాలానికి మూలధన వ్యయాల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుందని ఇక్రా పేర్కొంది. దీంతో పరిశ్రమ రుణ భారం 2024 మార్చి నాటికి రూ.6.1–6.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 5జీ ఆదాయ వనరుగా మారలేదు.. మూడు టెలికం కంపెనీలు కలసి 75–80 శాతం కస్టమర్లను (80 కోట్లు) 4జీకి అప్ గ్రేడ్ చేసుకున్నాయని, ఇక ఇక్కడ నుంచి మరింత పెరగకపోవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అంకిత్ జైన్ పేర్కొన్నారు. ‘‘5జీ సేవలను ప్రారంభించినప్పటికీ దాన్ని కంపెనీలు ఇంకా ఆదాయ వనరుగా మార్చుకోలేదు. 5జీకి ఉద్దేశించిన ప్రత్యేక ప్లాన్లు లేవు. అదే ఉంటే ఏఆర్‌పీయూకి మరింత బలం వచ్చేది. ఈ అంశాలకుతోడు టారిఫ్‌లు పెంచకపోవడం వల్ల ఏఆర్పీయూ మోస్తరు స్థాయిలోనే ఉంది’’అని జైన్ వివరించారు. -
జియో ఇన్ఫోకామ్‌తో ఐఆర్ఎం ఇండియా ఒప్పందం
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎం) విధానాలను పటిష్టం చేసే దిశగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఆర్ఎం) ఇండియా అఫీలియేట్ వెల్లడించింది. ఈ ఒప్పందం కింద ఈఆర్ఎంపై అవగాహన పెంచేందుకు ఇరు సంస్థలు వెబినార్లు, రౌండ్టేబుల్స్, సమావేశాలు మొదలైనవి నిర్వహించనున్నాయి. 140 పైచిలుకు దేశాల్లో ఈఆర్ఎంకు సంబంధించిన నిపుణుల సమాఖ్యగా ఐఆర్ఎం వ్యవహరిస్తోంది. ఐఆర్ఎం ఇటీవలే సిప్లా, అల్ట్రాటెక్ తదితర సంస్థలతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. -
సర్వీసుల నాణ్యత తక్షణం మెరుగుపర్చండి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆపరేట్లను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అలాగే కాల్ అంతరాయాలు, అవుటేజ్ డేటాను రాష్ట్ర స్థాయిలో కూడా వెల్లడించాలని సూచించింది. ప్రస్తుతం లైసెన్స్ ఏరియా ప్రాతిపదికగా ఈ వివరాలను ఆపరేటర్లు ఇస్తున్నారు. టెల్కోలతో సమావేశం సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా ఈ విషయాలు తెలిపారు. అనధికారిక టెలీమార్కెటర్లు 10 అంకెల మొబైల్ నంబర్లతో పంపించే అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, సందేశాలను గుర్తించేందుకు .. బ్లాక్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాధనాన్ని ఉపయోగించాలని టెల్కోలకు సూచించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సాధనం వచ్చే రెండు నెలల్లో మొత్తం పరిశ్రమ అమలు చేసే అవకాశం ఉంది. దీనితో అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, మెసేజీల బెడద తగ్గుతుందని వాఘేలా చెప్పారు. రాబోయే రోజుల్లో నాణ్యతా ప్రమాణాల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి అనవసర హెడర్లు, మెసేజీ టెంప్లేట్లను తొలగించేలా చర్యలు తీసుకునేందుకు ఆయా రంగాల నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ శాఖలు మొదలైన వాటిని కోరనున్నట్లు వాఘేలా చెప్పారు. -
ఎయిర్టెల్ భారీ ప్లాన్: రూ.28,000 కోట్ల పెట్టుబడి, టార్గెట్ అదే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతి ఎయిర్టెల్ రూ.27–28 వేల కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా 5జీ నెట్వర్క్ విస్తరణ లక్ష్యంగా ఈ పెట్టుబడి ఉంటుంది. మొబైల్ యాంటెన్నాలు, ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైస్ టెక్నాలజీ డేటా సెంటర్స్‌పై ఈ ఖర్చు చేస్తారు. ‘ఎయిర్టెల్ మూలధన వ్యయం గత మూడేళ్లలో ఖర్చు చేసిన దానికి అనుగుణంగా ఉంటుంది. 5జీ వేగవంతమైన రోల్అవుట్ కారణంగా ఇది హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏడాదిలో ఈ వ్యయంలో పెరుగుదలను చూడవచ్చు. క్రమంగా అదే స్థాయిలో కొనసాగవచ్చు’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నవంబర్ 26 నాటికి కంపెనీ 5జీ నెట్వర్క్ కోసం 3,293 బేస్ స్టేషన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ సేవల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారి వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులనుబట్టి ధరల శ్రేణి ఆధారపడి ఉంటుందని అన్నారు. అధిక చార్జీలు ఉండవు.. హరియాణా, ఒడిషాలో కనీస రిచార్జ్ విలువ 28 రోజుల కాలపరిమితి గల ప్యాక్‌పై 57 శాతం ధర పెంచి రూ.155గా కంపెనీ నిర్ణయించింది. ఈ పైలట్ ప్యాక్ కింద అన్లిమిటెడ్ కాలింగ్, 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌పై ఆరు వారాల్లో కంపెనీ ఒక అవగాహనకు రానుంది. తదనుగుణంగా ఇతర టెలికం సర్కిల్స్‌లో ఈ ప్యాక్‌ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో 5జీకి ప్రీమియం చార్జీలు విజయవంతం కాలేదని కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. 2జీ నుంచి 4జీకి మళ్లడం, ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదార్లు బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ వంటివి కొనుగోలు కారణంగా ఒక్కో కస్టమర్ నుంచి సగటు ఆదాయం అధికం అవుతుందన్నారు. జూలై–సెప్టెంబర్‌లో వినియోగదారు నుంచి ఎయిర్‌టెల్‌కు సమకూరిన సగటు ఆదాయం రూ.190. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.153 నమోదైంది. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
వారంలో కొత్త టెలికం బిల్లు: వైష్ణవ్
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు. -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
టెలికం టవర్ల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన కొత్త రైట్ ఆఫ్ వే రూల్స్ ప్రకారం.. ప్రైవేట్ భవనాలు, స్థలాల్లో మొబైల్ టవర్లు, స్తంభాలను అమర్చడం, కేబుల్స్ ఏర్పాటుకు టెలికం కంపెనీలకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. అయితే సంబంధిత అధికారులకు ముందస్తుగా రాతపూర్వకంగా సమాచారం తప్పనిసరి. భవనం, నిర్మాణం వివరాలు, ఎంత మేరకు భద్రంగా ఉన్నదీ స్ట్రక్చరల్ ఇంజనీర్ నుంచి ధ్రువీకరణతో సమాచారాన్ని టెలికం కంపెనీలు అందించాల్సి ఉంటుంది. 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. -
5జీతో దేశంలో 2 కోట్ల కొత్త ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపుతున్న ఐదో తరం సెల్యులార్ నెట్వర్క్ టెక్నాలజీ ‘5జీ’భారత్ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. నూతన 5జీ సాంకేతికత కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ‘టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్’(టీఎస్ఎస్సీ) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా సేవలు అందిస్తున్న సంస్థలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నా లజీ ఆధారిత ఉద్యోగాల కల్పనలో ముందంజలో ఉంది. అదే తరహాలో 5జీ సాంకేతికత ఆధారంగా వచ్చే కొత్త ఉద్యోగాలను ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడేళ్లలో సుమారు లక్ష మందికి 5జీ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమలు, నైపుణ్య సంస్థలను ఒక చోటకు చేర్చి, ‘టెలికాం మంథన్ 2022’పేరిట ఇటీవల చర్చించింది. హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ తెలంగాణలో నైపుణ్య శిక్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో టెలికాం రంగంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థ టీఎస్ఎస్సీ హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ‘టాస్క్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో టీఎస్ఎస్సీ ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 5జీతో పాటు ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల నైపుణ్య శిక్షణపై దృష్టి కేంద్రీకరిస్తుంది. 5జీ టెక్నాలజీ సంబంధిత ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలను టాస్క్ ఏకతాటిపైకి తెస్తే.. శిక్షణ, సర్టిఫికెట్ల జారీ టీఎస్ఎస్సీ ద్వారా జరుగుతుంది. కొత్త టెక్నాలజీలపై ఆసక్తి, నేర్చుకునే ఉత్సాహం కలిగిన యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నందునే హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్ఎస్సీ ప్రకటించింది. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలం 5జీ సాంకేతికతలో శిక్షణకే పరిమితం కాకుండా భారత్‌లో 5జీ వాతావరణం అభివృద్ధితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తేవడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. 5జీ రంగంలో సప్లై చెయిన్ పెరిగినకొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు నానాటికి పెరిగే డిమాండ్‌ను నెరవేర్చడంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కీలకంగా మారనుంది. రెండు, మూడేళ్లలో లక్ష మందికి ‘5జీ శిక్షణ’ ప్రస్తుతం 4జీ సాంకేతికత ఆధారిత మొబైల్ ఫోన్లను దేశంలో 80 శాతం జనాభా ఉపయోగిస్తోంది. 4జీ టెక్నాలజీతో పోలిస్తే కొత్తగా వస్తున్న 5జీ టెక్నాలజీ వంద రెట్ల వేగంతో పనిచేయనుండటంతో, కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల్లో నైపుణ్య శిక్షణ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే పలు సంస్థలు 5జీ టెక్నాలజీతో పాటు ఐఓటీ, ఏఐ, ఎంఎల్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై తమ ఉద్యోగులకు అంతర్గత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చే రెండు, మూడేళ్లలో టీఎస్ఎస్సీ హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా లక్ష మంది యువతకు 5జీ సాంకేతికతపై శిక్షణ ఇస్తారు. -
5000 పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ నూతన అధ్యాయానికి సిద్ధం అవుతోంది. 5జీ సేవలను ఆగస్ట్‌లోనే ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మంగళవారం ప్రకటించారు. ‘5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్వర్క్ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉంది. ఇది సంస్థ చరిత్రలో అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటి. మొబైల్ సేవల చార్జీలు భారత్‌లో అతి తక్కువ. టారిఫ్‌లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోంది. ఇది త్వరలో రూ.200లకు చేరుతుంది. టారిఫ్‌ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుంది’ అని తెలిపారు. 900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 900 మెగాహెట్జ్ ద్వారా.. ‘భారీ మిడ్ బ్యాండ్ 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోటీ సంస్థకు లేదు. ఇది మాకు లేనట్టయితే ఖరీదైన 700 మెగాహెట్జ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ బ్యాండ్‌లో భారీ రేడియో ఉపకరణాలను ఉపయోగించాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవే కాదు, కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తాయి. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ అదనపు కవరేజ్ ఏమీ ఇవ్వదు. స్టాండలోన్ 5జీ నెట్వర్క్స్ కంటే నాన్–స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) 5జీ నెట్వర్క్స్ ప్రయోజనాలు అధికం. అదనపు ఖర్చు లేకుండానే ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీని ఉపయోగించి నూతన సాంకేతికత అందించవచ్చు. అలాగే వేగంగా కాల్ కనెక్ట్ అవుతుంది’ అని వివరించారు. జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అయిదురెట్లకుపైగా పెరిగి రూ.283 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు చేరడం తెలిసిందే. టారిఫ్‌లు పెరగడమే ఈ స్థాయి వృద్ధికి కారణం. రిలయన్స్ జియో సైతం.. టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నూతన సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్‌ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూజర్ భవనం లోపల ఉన్నా కవరేజ్ ఏమాత్రం తగ్గదు అని ఆయన చెప్పారు. ఇతర బ్యాండ్స్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కస్టమర్‌కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు. -
న్యూఎనర్జీలోనూ రిలయన్స్ ముద్ర
న్యూఢిల్లీ: టెలికం రంగంలో మాదిరే న్యూ ఎనర్జీలోనూ (హైడ్రోజన్ తదితర కొత్త తరహా పర్యావరణానుకూల ఇంధనాలు) రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన స్థానం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు 5–7 ఏళ్ల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని అన్ని వ్యాపారాలను మించి వృద్ధిని సాధించే విభాగంగా ఇది అవతరించనుందని చైర్మన్ ముకేశ్ అంబానీ అంచనా వేస్తున్నారు. కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ వృద్ధి ప్రణాళికలను పంచుకున్నారు. న్యూఎనర్జీపై రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆసక్తి చూపిస్తుండడం తెలిసిందే. ‘‘వచ్చే 12 నెలల్లో పర్యావరణానుకూల ఇంధన రంగం (గ్రీన్ ఎనర్జీ) వ్యాల్యూచైన్‌లో కంపెనీ పెట్టుబడులు మొదలవుతాయి. తదుపరి కొన్నేళ్లలో వాటిని పెంచుతాం. వచ్చే 5–7 ఏళ్లలో ఈ నూతన వృద్ధి ఇంజన్ ప్రస్తుతమున్న అన్ని ఇంజన్లను మించి వృద్ధి చూపించనుంది’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. నాలుగు గిగా ఫ్యాక్టరీల పేరుతో మొత్తం గ్రీన్ ఎనర్జీలోని అన్ని విభాగాల్లోనూ చొచ్చుకుపోయే ప్రణాళికలలో రిలయన్స్ ఉంది. తద్వారా అందుబాటు ధరలకే ఇంధనాలను తీసుకురావాలని, భారత్‌ను గ్రీన్ ఎనర్జీ తయారీలో ప్రముఖ దేశంగా మార్చే లక్ష్యంతో ఉంది. సోలార్ విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం ఇలా అన్ని విభాగాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సంప్రదాయ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కంపెనీగా ఉన్న రిలయన్స్‌ను.. రిటైల్, టెలికం వ్యాపారాలతో న్యూఏజ్ కంపెనీగా అంబానీ మార్చడం తెలిసిందే. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీని ఆయన తదుపరి వ్యాపార అస్త్రంగా ఎంచుకున్నారు. అందుబాటు ధరలకే ‘‘ప్రపంచంలో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ ధరలు భారత్‌లోనే తక్కువ. ఈ దశాబ్దంలోనే ప్రపంచంలోనే అత్యంత చౌక గ్రీన్ ఎనర్జీ దేశంగా అవతరిస్తాం. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపులో సాయంగా నిలుస్తాం’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగు గిగా ఫ్యాక్టరీలను ప్రకటించడమే కాకుండా, రూ.5,500 కోట్లతో పలు కంపెనీలను కొనుగోలు చేసింది. 5జీ సేవలకు రెడీ: రిలయన్స్ జియో అతి త్వరలోనే 1,000 పట్టణాల్లో 5జీ సేవలు ఆరంభించనుంది. ఈ పట్టణాల్లో 5జీ ప్రణాళికలను పూర్తి చేసినట్టు, క్షేత్రస్థాయిలో రిలయన్స్ సొంత టెలికం పరికరాలతో పరీక్షించినట్టు అంబానీ ప్రకటించా రు. ఇటీవలే ముగిసిన 5జీ వేలంలో రూ.88 వేల కోట్లతో స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడం తెలిసిందే. రెండో ఏడాది జీతం నిల్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది ఎటువంటి వేతనం తీసుకోలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన 2020–21 సంవత్సరానికి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికీ (2021–22) కూడా అదే విధానాన్ని కొనసాగించినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఇక 2019–20 సంవత్సరానికి అంబానీ రూ.15 కోట్ల వేతనం తీసుకున్నారు. అంతేకాదు 2008–09 నుంచి ఆయన అదే స్థాయిలో వేతనాన్ని తీసుకుంటున్నారు. -
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు టెలికం రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) ఖండించింది. టెక్ కంపెనీలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సొంత అవసరాలకు ఉపయోగించుకునే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు (సీఎన్‌పీఎన్) కావాల్సిన స్పెక్ట్రం కోసం కూడా వేలంలో పాల్గొనాలన్న వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. రెండు వేర్వేరు రకాల సర్వీసులు, పబ్లిక్..ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్వహించే కంపెనీలకు ఒకే తరహాలో సమాన వ్యాపార అవకాశాలు కల్పించాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీఐఎఫ్ పేర్కొంది. టెక్ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు సర్వీసులు అందించేందుకు కాదని స్పష్టం చేసింది. సీఎన్‌పీఎన్‌లకు స్పెక్ట్రం ఇచ్చేందుకు ప్రతిపాదించిన నాలుగు విధానాల్లోనూ టెల్కోల ప్రమేయం ఉంటుందని బీఐఎఫ్ తెలిపింది. వాస్తవానికి ఒక విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే టెల్కోల వైపే ఎక్కువ మొగ్గు కూడా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో టెల్కోలకు దీటుగా తమకే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని బీఐఎఫ్ పేర్కొంది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రంను కేటాయించడం సరికాదంటూ టెల్కోల సమాఖ్య సీవోఏఐ ఆక్షేపించిన నేపథ్యంలో బీఐఎఫ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల కోసం స్పెక్ట్రం కేటాయించడమంటే టెక్ కంపెనీలకు దొడ్డిదారిన టెలికంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుందంటూ సీవోఏఐ ఆరోపించింది. -
టెలికంలోకి అదానీ!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో దిగ్గజాలు అంబానీ, మిట్టల్‌ను ఢీకొనేందుకు అదానీ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో (ముకేష్ అంబానీ), ఎయిర్టెల్ (సునీల్ మిట్టల్), వొడాఫోన్ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూప్ ఇటీవలే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) లైసెన్సులు కూడా తీసుకుంది. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది. గుజరాత్‌కే చెందిన అంబానీ, అదానీ .. భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఒకే రంగంలో పోటీ పడలేదు. అంబానీ ఆయిల్, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్‌లో విస్తరించగా.. అదానీ మాత్రం పోర్టులు, బొగ్గు, ఏవియేషన్ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారుతోంది. పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే దిశగా అదానీ ఇటీవలే ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు. పునరుత్పాదక విద్యుత్ విభాగంలో అంబానీ, అదానీ పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్నారు. -
నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలలో దాదాపు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ఈ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటైజేషన్ వేగం పెరిగిపోవడంతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి భయాలు తగ్గడంతో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం & ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి శాతం మొత్తం ఉద్యోగాలలో దాదాపు 17 శాతం ఉండనుంది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 750 మందికి పైగా యజమానులు/నాయకులను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీజ్ 'ప్రొఫెషనల్ స్టాఫింగ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల ఇండస్ట్రీ విప్లవం అనేది 4.0 దశకు చేరుకున్నది అని కంపెనీ యజమానుల అభిప్రాయం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ అన్నారు. "మొత్తం మీద, ఈ 3 రంగాలు కలిసి సృష్టించే ఉద్యోగ అవకాశాలలో 2527 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ 45,65,000 నుంచి 2026 నాటికి 90,00,000(అంచనా) కంటే ఎక్కువ ఉంటుంది" అని సునీల్ అన్నారు. కన్జర్వేటివ్ అంచనాల ప్రకారం.. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ మార్కెట్ పరిమాణంలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగాలు మొత్తం కలిసి భారతదేశం మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 8.7 శాతం(సుమారు 42 మిలియన్ల మందికి) ఉపాధి కల్పిస్తున్నారు. 2026 నాటికి ఈ సంఖ్య మరో 54 మిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. కాంట్రాక్ట్ సిబ్బంది వాటా మొత్తం ఉపాధిలో 10 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఇది 2026 నాటికి మొత్తం ఉపాధిలో 24 శాతం ఉంటుందని భావిస్తున్నారు. (చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..!) -
స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.6,000 క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న భారతి ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా రూ.12,000 వరకు ధర గల స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.6,000 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. శామ్సంగ్, షావొమీ, వివో, ఒప్పో, రియల్మీ, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, లెనోవో, మోటరోలా బ్రాండ్ల ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 150కిపైగా మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. రూ.249 ఆపైన ధర గల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను 36 నెలలపాటు రిచార్జ్ చేయాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత రూ.2,000, మిగిలిన రూ.4,000లను 36 నెలలు పూర్తి అయ్యాక చెల్లిస్తారు. అలాగే స్క్రీన్ పాడైతే ఒకసారి ఉచితంగా మారుస్తారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ వైపు వినియోగదార్లను అప్‌గ్రేడ్ చేసేందుకే ఈ చొరవ తీసుకున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
టెలికం రాయితీలతో ప్రజలకేం లాభం?
టెలికం రంగ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం మూడు ప్రైవేటు టెలికం కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ప్రకటించిన కేంద్రం, అదే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. విశాఖ ఉక్కు కర్మాగారం అప్పు విషయంలోనూ కేంద్రం ధోరణి అదే. మరి ప్రైవేటు రంగం మీద ఎందుకింత ప్రేమ? అయితే, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్న అవరోధాల వల్ల ఈ సహాయం అవసరమేననే నిపుణుల వాదన కూడా తోసిపుచ్చదగినది కాదు. కానీ ఈ మొత్తం ఉదారత సామాన్యులకు అందే సేవల్లో ఏమేరకు ప్రతిఫలిస్తుంది అన్నదే వేచిచూడాల్సిన అంశం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీల విషయం ఆయా రంగాల్లోని వారికి తప్ప ఇతరులకు పెద్ద ఆసక్తి గొలపలేదు. కానీ టెలికం రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవలం మూడు టెలికం కంపెనీలకు దాదాపు రూ.రెండు లక్షల కోట్ల రాయితీ ఇచ్చి, దేశ టెలికం రంగం బాగుపడిందంటే నమ్మడం ఎలా? ప్రజలకు వీటి వల్ల ఒరిగేదేమిటి? పూర్వరంగం 1994లో ప్రైవేటు టెలికం కంపెనీలకు ఫిక్స్డ్ లైసెన్సు విధానంలో అనుమతి నిచ్చారు. లైసెన్స్‌తో పాటు కొంత స్పెక్ట్రమ్ ఉచితంగా ఇచ్చేవారు. ఫిక్స్డ్ లైసెన్స్ విధానం అంటే, ఏడాదికి కొంత మొత్తం లైసెన్స్‌గా చెల్లించడం. ఏడాదికి కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వాలన్న నిబంధనలు ఉండేవి. అప్పట్లో ఇన్కమింగ్ కాల్స్‌కు కూడా ప్రైవేటు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు ఇవ్వని కారణంగా ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.50వేల కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమకు నష్టాలు వస్తున్నాయని, పెనాల్టీలు రద్దు చేయాలని టెలికం కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో 1999 నూతన టెలికం విధానం వచ్చింది. దీని ప్రకారం టెలికం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ విధానం ప్రకారం కాకుండా, రెవెన్యూపై 8 శాతం లైసెన్స్ ఫీజుగానూ, 3–5 శాతం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగానూ చెల్లించాలి. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన 50 వేల కోట్ల పెనాల్టీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రెవెన్యూ అంటే ఏమిటి అన్న విషయంలో టెలికం కంపెనీలకూ, ప్రభుత్వానికీ వివాదం ఏర్పడింది. నాన్ టెలికం ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలని ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు 2019లో ఈ విషయంలో తీర్పు ఇస్తూ– ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పన్ను చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీని ప్రకారం రూ.1,46,000 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లినా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించే అవసరం లేకుండా రెండేళ్ల మారిటోరియం విధించింది. ప్రైవేటు టెలికం కంపెనీలు చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై పన్నులు చెల్లించేందుకు 10 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. రూ.39 వేల కోట్ల రూపాయలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా, వీఆర్ఎస్ పేరుతో 90 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. కానీ మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు రూ.1,46,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, వారికి 10 ఏళ్ల గడువు ఇమ్మని కోర్టును కేంద్రం కోరడం గమనార్హం. తాజాగా కల్పించిన రాయితీలేమిటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఏమేమి రాయితీలు కల్పించిందో చూద్దాం: 1.అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనాన్ని మార్చి, ప్రైవేటు టెలికం కంపెనీలు కోరుకున్న విధంగా నాన్ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు. అయితే ఈ నిర్ణయం ఇప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుంది. గత కాలపు పన్ను బకాయిలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెల్లించాలి. 2.టెలికం కంపెనీలు చెల్లించాల్సిన చట్టబద్ద పన్నులకు గతంలోని రెండేళ్ల కాలానికి అదనంగా మరో నాలుగేళ్ళ మారటోరియం విధించారు. అంటే అక్టోబర్ 2025 వరకు టెలికం కంపెనీలు కేవలం వడ్డీ చెల్లిస్తే చాలు. 3.డైరెక్ట్ విధానం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100 శాతం అమలు. ఈ నిర్ణయం వల్ల విదేశీ టెలికం కంపెనీలు దేశ టెలికం రంగాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 4.వడ్డీ రేటు గతంలో ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటుకు అదనంగా నాలుగు శాతం ఉండగా, దాన్ని రెండు శాతానికి తగ్గించారు. 5.స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు ఇకపై రద్దు. గతకాలపు స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు నెలవారిగా కాకుండా ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు. 6.లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ చెల్లించకపోతే విధించే అదనపు రుసుం రద్దు. 7.స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇకపై 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ల కాలానికి పొడిగింపు. 8.స్పెక్ట్రమ్ షేరింగ్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్‌పై ఇప్పటివరకు విధించిన రెవెన్యూపై 0.5 శాతం పన్ను రద్దు. 9. బ్యాంకు గ్యారెంటీలు ఇకపై బిజినెస్ సర్కిల్ ప్రకారం కాకుండా యావత్ ఇండియా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల టెలికం కంపెనీలకు 80 శాతం భారం తగ్గుతుంది. 10.ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో స్పెక్ట్రమ్ వేలం. 11. నాలుగేళ్ళ మారటోరియం తర్వాత కూడా టెలికం కంపెనీలు పన్నులు చెల్లించలేకపోతే ఆ మొత్తం ఈక్విటీగా మార్చుకోవచ్చు. 12. స్పెక్ట్రమ్ వాపస్ ఇవ్వాలంటే కనీసం 10 ఏళ్ల తర్వాతనే వీలవుతుంది. ఇలా విధాన పరమైన నిర్ణయాల్లో కేంద్రం మార్పులు చేసింది. ప్రధానంగా ఈ నిర్ణయాల వల్ల దివాలా స్థితిలో ఉన్న వొడాఫోన్–ఐడియా కంపెనీ తాను చెల్లించాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల బకాయిలలో, రూ. 96,000 కోట్ల వెసులుబాటు నాలుగేళ్ళ కాలానికి లభించింది. ప్రజలకు ఏం ఉపయోగం? విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పు 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా కేంద్రం తిరస్కరించింది. మానిటైజేషన్ పేరుతో బీఎస్ఎన్ఎల్కు చెందిన 20,000 టవర్లు అమ్మివేసి, కేబుల్ అమ్మి, భూములు అమ్మి రూ.35,000 కోట్లు ఆర్జించాలని కేంద్రం ప్రకటించింది. కానీ టెలికం కంపెనీలకు ప్రకటించిన రాయితీలు గమనిస్తే ఒక్క వొడాఫోన్–ఐడియాకే రూ.96,000 కోట్ల వెసులుబాటు వచ్చింది. కాగా మొత్తం టెలికం రంగానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారు. 1994 నుండి ఇప్పటి దాకా అనేక పర్యాయాలు టెలికం రంగానికి రాయితీలు లభించాయి. టెలికం రంగ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారం– టెలికం రంగంలో 2జీ నుండి 3జీకి, 3జీ నుండి 4జీకి, 4జీ నుండి 5జీకి ప్రతి నాలుగైదేళ్ల వ్యవధిలో మారాల్సి రావడం, దానికోసం టెక్నాలజీ దిగుమతులు, సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు, టెలికం కంపెనీల మధ్య అనారోగ్య కరమైన పోటీతో ధరల తగ్గుదల లాంటి కారణాల వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయాలు తగ్గి, నష్టాలు వస్తున్నాయి కనుక ఈ వెసులుబాట్లు అవసరం. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొత్తంలో రాయితీ ఇవ్వడం సరి కాదని, ఈ రాయితీలు ప్రజలకు సరాసరి చేరేలా చూసే విధానాన్ని రూపొందిస్తే బాగుండేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రజల ధనంతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆరు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను భారత్ నెట్ కింద నిర్మిస్తూ, అందులో రెండు లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ను అమ్మి రూ.20,000 కోట్లు సమీకరించాలను కోవడం ఏమిటి? మరోవైపు లక్షల కోట్లు రాయితీగా ఇవ్వడం ఏమిటి? బీఎస్ఎన్ఎల్కు ఉన్న 70,000 టవర్లలో 20,000 టవర్లు అమ్మి రూ.15,000 కోట్లు సమీకరించే ఆలోచన ఎందుకు? 4జీ ఇవ్వకుండా, టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయకుండా ప్రభుత్వ డైరెక్టర్లే అడ్డు పడటం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా టెలికం రంగంలో ఒకటి రెండు కంపెనీల గుత్తాధిపత్య నివారణకు ప్రభుత్వం భారీ రాయితీలే ఇచ్చింది. ఈ రాయితీల ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు ప్రైవేటు టెలికం కంపెనీలు అందుబాటులోకి తెస్తాయని; ప్రపంచంలొనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న దేశంగా మనం ఇకపై కూడా కొనసాగేలా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్కు కూడా మరిన్ని వెసులుబాట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుందాం. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు -
సునీల్ మిట్టల్ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్ సమావేశంలో మిట్టల్ తెలిపారు. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: చాలా కాలం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి ఊరట కలిగించే కీలకమైన ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి టెలికామ్ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నేడు జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను టెలికామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుంది అని అన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలపై నేడు హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.(చదవండి: జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!) భవిష్యత్ వేలంలో స్పెక్ట్రం కాలవ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నట్లు తెలిపారు. టెలికాంలో 100 శాతం ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. టెలికాం రంగంలో ఆటగాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. -
రిలయన్స్ జియోకు ఐదేళ్లు.. దిగ్గజాల అభినందనలు
దేశీ టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో.. కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కంపెనీకి పలు దిగ్గజాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 2016 సెప్టెంబర్ 5న దేశీ టెలికం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డేటా వినియోగం 1,300 శాతం ఎగిసింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. జియో చౌకగా డేటాను అందించడంతో వినియోగదారులకు టెక్ సంస్థలు మరింత చేరువయ్యేందుకు వీలయ్యింది. ఈ నేపథ్యంలోనే అవి కంపెనీని అభినందనలతో ముంచెత్తాయి. ‘తలెత్తుకుని జీవించడం మీ నుంచి నేర్చుకోవాలి‘ అని హెచ్డీఎఫ్సీ, ‘స్కోరెంత? అని అడగాల్సిన అవసరం లేకుండా లైవ్‌లోనే చూసే సదుపాయం అందుబాటులోకి తెచి్చంది.. జియోకి చీర్స్‘ అంటూ హాట్‌స్టార్ వ్యాఖ్యానించాయి. ‘బర్త్‌డే కేక్ పంపిస్తున్నాం. దారిలో ఉంది‘ అంటూ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో ట్వీట్ చేసింది. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
ఇక ఎయిర్‌టెల్‌లో గూగుల్ రింగ్!
న్యూఢిల్లీ: బూమింగ్‌లో ఉన్న దేశీ మొబైల్ టెలికం రంగంపై ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కన్నేసింది. గతేడాది రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన గూగుల్ భారతీ ఎయిర్‌టెల్‌పైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎయిర్‌టెల్‌లోనూ భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎయిర్‌టెల్‌తో జరుపుతున్న చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఎయిర్‌టెల్‌లోనూ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలు చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయంగా పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ రెండింటిలోనూ గూగుల్ వాటాలు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను గూగుల్ కైవసం చేసుకుంది. ఇందుకు రూ. 33,737 కోట్లు వెచ్చించింది. గూగుల్‌తో డీల్ కుదిరితే ఎయిర్‌టెల్‌కు నిధుల రీత్యా బూస్ట్ లభిస్తుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
జియో వర్సెస్ ఎయిర్టెల్ ! గూగుల్ షాకింగ్ నిర్ణయం ?
భారత టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇండియాను వేదికగా చేసుకుని వ్యాపార దిగ్గజ సంస్థలు పోటీకి దిగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానమే ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోంది. దీన్ని నిజం చేస్తూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు సైతం వెలువడుతున్నాయి. ఇండియా టెలికాం సెక్టార్‌లోకి గూగుల్? టెక్ దిగ్గజం, నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇండియాలోని టెలికాం సెక్టార్‌పై గురి పెట్టింది, టెలికాం పరంగా ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఇండియాలో పాగా వేసేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌లో రూ. 34,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి 7 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి భారీ దిశగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఎయిర్‌టెల్‌తో చర్చలు టెలికాం సెక్టార్లో జియో నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌లో భారీ స్థాయిలో పెట్టబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని, చాలా అంశాలపై స్పష్టత వచ్చిందని, త్వరలోనే ఈ డీల్ కార్యరూపం దాల్చనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ఈ డీల్ ఇండియాలోనే అతి పెద్ద డీల్ అయ్యే అవకాశం ఉందని కూడా టైమ్స్ పేర్కొంది. గూగుల్ వస్తే.. ఎయిర్టెల్, గూగుల్ల మధ్య ఒప్పందం కుదిరితే టెలికాం రంగంలో మరోసారి ప్రైస్‌వార్ తప్పదని, దాని వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే మొబైల్ నెట్వర్క్ సేవలు అందుతాయనే అంచనాలు నెలకొన్నాయి. గతంలో టాటా డొకోమో రాకతో కాల్ పల్స్ రేట్లు తగ్గిపోగా జియో రాకతో డేటా, కాల్ ఛార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎయిర్టెల్, జియోల మధ్య ఒప్పందం ఫైనల్ అయితే టెలికాం రంగంలో ప్రైస్‌వార్ తప్పదు. టెలికాంలో గట్టిపోటీ అమెరికా, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్ అయిన ఇండియాపై టెక్ దిగ్గజ కంపెనీలు కన్నేశాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్‌దే అగ్రస్థానం. దేశంలో ఉన్న ఫోన్లలో నూటికి డెబ్బై శాతం ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫారమ్ మీదే పని చేస్తున్నాయి. మరోవైపు జియోతో భాగస్వామ్యంలో భాగంగా జియో నెక్ట్స్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను గూగుల్ ఇండియాలో ప్రవేశ పెడుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో కీలక భాగస్వామి కానుంది. చదవండి : Google-Apple Deal: గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం లక్షా పదివేల కోట్లు! అంతకంతకు పెరుగుతూ.. -
టెలికం రంగంలో సంస్కరణలు తేవాలి
న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రానికి టెల్కోలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే సుంకాలు తగ్గించాలని, వేలం వేసిన స్పెక్ట్రం హోల్డింగ్ కాలావధిని రెట్టింపు చేయాలని, స్పెక్ట్రం చెల్లింపులపై 7–10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కోరాయి. టెల్కోల సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ మేరకు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాసింది. అత్యధిక పన్నుల భారం పడే రంగాల్లో టెలికం పరిశ్రమ కూడా ఒకటని అందులో పేర్కొంది. ఆదాయాల్లో 32 శాతం భాగం పన్నులు, సుంకాల రూపంలో కట్టాల్సిన ప్రస్తుత విధానంతో కంపెనీలు మనుగడ సాగించడం కష్టంగా మారిందని వివరించింది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల దగ్గర నిరంతరం మిగులు నిధులు ఉండే పరిస్థితి లేనందున ఇంతటి భారీ స్థాయి పన్నులనేవి పరిశ్రమ వృద్ధికి ప్రతికూలమని సీవోఏఐ తెలిపింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తదితర సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లేఖ కాపీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సీవోఏఐ పంపింది. పలు ప్రతిపాదనలు.. టెలికం రంగాన్ని తిరిగి పటిష్టమైన, నిలకడైన వృద్ధి బాట పట్టించడానికి ప్రాథమిక ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని సీవోఏఐ పేర్కొంది. ఇందులో భాగంగా తీసుకోతగిన విధానపరమైన చర్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. పన్నులు, సుంకాలు తగ్గించడం, స్పెక్ట్రంనకు సంబంధించి ధరను సహేతుకంగా నిర్ణయించడం, చెల్లింపులకు సులభతరమైన నిబంధనలు విధించడం, హోల్డింగ్ వ్యవధిని పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే, సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) నిర్వచనాన్ని పునఃసమీక్షించడం, కనీస ధరను నిర్ణయించడం, ఆర్థిక..పనితీరుపరమైన బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపునివ్వడం వంటి ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. రుణాలు, నష్టాల భారంతో వొడాఫోన్ ఐడియా అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సీవోఏఐ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది గానీ మూతబడితే పరిశ్రమలో రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం రుణభారం రూ. 1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయి రూ. 1,06,010 కోట్లు, ఏజీఆర్ బాకీ రూ. 62,180 కోట్లుగా ఉంది. -
మళ్లీ ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: టెలికం రంగ మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 26,518 కోట్లను తాకింది. తద్వారా మూడు నెలల కాలానికి కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని అందుకుంది. ఇందుకు మొబైల్ టారిఫ్‌లు మెరుగుపడటం, కస్టమర్ల సంఖ్య పుంజుకోవడం వంటి అంశాలు దోహదపడ్డాయి. క్యూ3లో దేశీ బిజినెస్ టర్నోవర్ సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 19,007 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 135 నుంచి రూ. 166కు ఎగసింది. క్యూ3లో ఆఫ్రికా నుంచి ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 7,644 కోట్లను అధిగమించింది. యూజర్లు 45.79 కోట్లకు... కంపెనీ కస్టమర్ల సంఖ్య 9.4 శాతం పెరిగి 45.79 కోట్లకు చేరింది. దేశీయంగా ఈ సంఖ్య 30.87 కోట్ల నుంచి 33.62 కోట్లకు ఎగసింది. ఆఫ్రికాలో వినియోగదారుల సంఖ్య 11% వృద్ధితో 11.89 కోట్లను తాకింది. డిసెంబర్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 1,47,438 కోట్లుగా ఉంది. డిబెంచర్లు, బాండ్లు తదితర మార్గాలలో నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా రూ. 7,500 కోట్లవరకూ సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. అనిశ్చితి ఉన్నా ఏడాది పొడవునా అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ మరోసారి పటిష్ట పనితీరును చూపగలిగినట్లు భారతీ ఎయిర్టెల్ దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియోలోని ప్రతీ విభాగంలోనూ స్థిరమైన వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. పెరిగిన మార్కెట్ వాటా ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు చెప్పారు. క్యూ3లో ప్రధానంగా 13 మిలియన్ల 4జీ కస్టమర్లు కొత్తగా జత కలిసినట్లు పేర్కొన్నారు. తద్వారా ఈ సంఖ్య 165.6 మిలియన్లకు చేరినట్లు తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా హైదరబాద్ నగరంలో ఒక వాణిజ్య నెట్‌వర్క్‌పై 5జీ లైవ్‌ను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 612 వద్ద ముగిసింది. -
స్పెక్ట్రమ్ వేలానికి సై!
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర (బేస్ ప్రైస్) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన జారీ చేస్తామని, బిడ్డింగ్ మార్చిలో నిర్వహిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. కాగా, 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ్రïఫీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులో ఉంటుంది. మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు. బేస్/రిజర్వ్ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్ విలువ రూ.3,92,332.70 కోట్లు’’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రస్తుతానికి 5జీ వేలం లేనట్టే...! 5జీ సేవలకు ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌తో పాటు మొత్తం రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలం ప్రణాళికలకు టెలికం శాఖ (డాట్)కు చెందిన అత్యున్నత సంస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ ఏడాది మే నెలలోనే లైన్ క్లియర్ చేసింది. అయితే, 5జీ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్‌లో 300 మెగాహెట్జ్‌ను నేవీ ఉపయోగించుకుంటోంది, అలాగే భారత అంతరిక్ష విభాగం కూడా ఈ 5జీ స్పెక్ట్రమ్‌లో పెద్దమొత్తాన్ని తమకు కావాలని కోరింది. మరోపక్క, టెలికం పరిశ్రమ కూడా 5జీ స్పెకŠట్రమ్ బేస్ ధరను ప్రభుత్వం తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది. 5జీ సేవల కోసం అవసరమైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి ఒక్కో టెలికం ఆపరేటర్ దాదాపుగా రూ.50,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందనేది కంపెనీల వాదన. అయితే, 5జీ స్పెక్ట్రమ్ వేలం పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమివ్వలేదు. రానున్న వేలంలో కూడా చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం 2016లో నిర్ధేశించిన నిబంధనలనే కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. చైనా టెలికం పరికరాలకు చెక్ చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసేవిధంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. టెలికం మౌలిక వసతుల భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా, ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్ ప్రకటిస్తుంది. ‘‘డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన సోర్స్ అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీ’గా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులతో పాటు టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. నెట్‌వర్క్‌లలో ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని, వాటిని మార్చాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఖజానాకు దండిగా నిధులు... వేలంలో స్పెక్ట్రమ్‌ను దక్కించుకునే టెలికం ఆపరేటర్లు తమ బిడ్ ధరతో పాటు ఏటా ప్రభుత్వానికి తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. వైర్‌లైన్ సేవల ఆదాయాన్ని మినహాయించి ఏజీఆర్‌ను లెక్కగడతారు. ‘‘స్పెక్ట్రమ్‌లో విజయవంతమైన బిడ్డర్లు తమ బిడ్ మొత్తాన్ని ఒకే విడతలో ముందుగానే చెల్లించవచ్చు లేదా కొంత మొత్తాన్ని (700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్లలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు బిడ్ ధరలో 25%; 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్లలో అయితే 50%) ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని గరిష్టంగా 16 సమాన వార్షిక వాయిదాల్లో (రెండేళ్ల మారటోరియం తర్వాత నుంచి) చెల్లించేందుకు వీలుంటుంది’’ అని ప్రభుత్వ అధికార ప్రకటన వివరించింది. చక్కెర పరిశ్రమకు 3,500 కోట్లు్.. చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత 2020–21 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల సబ్సిడీకి కేంద్రంæ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది కూడా వార్షిక డిమాండ్ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
5జీ మొబైల్స్ సందడి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇప్పటికీ టెలికం రంగంలో 4జీ సేవలు విస్తరించలేదు. మరోవైపు 5జీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు దూకుడుగా ఉన్నాయి. 5జీ మోడళ్లతో పోటీకి సై అంటున్నాయి. ఐడీసీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబరులో భారత్‌లో 10 లక్షల పైచిలుకు 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఇది 500 శాతం అధికం. దీనినిబట్టి చూస్తే అటు కస్టమర్లూ నూతన టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 5జీ సేవలు రాకముందే ఈ స్మార్ట్ఫోన్లు పెద్ద ఎత్తున వినియోగదార్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని టెలికం రంగం అంచనా వేస్తోంది. క్వాల్‌కాం, మీడియాటెక్ వంటి చిప్సెట్ తయారీ సంస్థలు నూతన టెక్నాలజీ చిప్సెట్లను ఆఫర్ చేస్తున్నాయి. సేవల కంటే ముందే చిప్సెట్ల ధరలూ దిగొస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి.. యాపిల్, శామ్సంగ్, షావొమీ, వన్‌ప్లస్, ఆసస్, వివో, ఒప్పో, మోటరోలా, రియల్మీ, హువావే ఇప్పటికే భారత 5జీ హ్యాండ్సెట్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. హానర్, సోని, నోకియా, గూగుల్, ఎల్జీ, నూబియా, బ్లాక్‌షార్క్, జడ్‌టీఈ, టీసీఎల్, మీజు, షార్ప్ త్వరలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో 40 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ.24,000 నుంచి ప్రారంభం. త్వరలో 120కి పైగా కొత్త మోడళ్లు రానున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ స్మార్ట్ఫోన్ల ధర పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమని బిగ్–సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఇప్పటికే సగటు స్మార్ట్‌ఫోన్ ధర రూ.14–15 వేలకు వచ్చింది. 5జీ విషయంలో తయారీ సంస్థలు, కస్టమర్లు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే 5జీ టెలికం సేవలు త్వరితంగా అందుబాటులోకి వస్తాయి’ అని అన్నారు. వచ్చే ఏడాది నుంచి.. భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 5జీ మోడళ్ల రాక క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021 ప్రారంభంలో రూ.15,000–25,000 ధరల శ్రేణిలో స్మార్ట్ఫోన్లన్నీ 5జీ టెక్నాలజీతో రానున్నాయని అంచనా. రూ.8–15 వేల ధరల శ్రేణిలో మోడళ్లు వస్తే కొనుగోళ్లు అనూహ్యంగా అధికమవుతాయని సెల్ పాయింట్ ఫౌండర్ మోహన్ ప్రసాద్ పాండే తెలిపారు. సోషల్ మీడియాలో యువత చాలా చురుకుగా ఉంటోంది. 5జీ టెక్నాలజీ వస్తే ఫొటోలు, వీడియోలు వేగంగా అప్లోడ్ చేసుకోవచ్చు, వీక్షించొచ్చు అని అన్నారు. 5జీ హ్యాండ్సెట్స్ కోసం కస్టమర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు. బ్రాండ్స్ దూకుడు చూస్తుంటే 4జీ నుంచి 5జీకి వినియోగదార్లు సులభంగా మళ్లుతారని టెక్ఆర్క్ అనలిస్ట్ ఫైజల్ కవూసా చెప్పారు. 3జీ నుంచి 4జీకి కస్టమర్ల ఆదరణకు నాలుగేళ్లు పట్టింది. 2012లో దేశంలో 4జీ ప్రారంభం అయినప్పుడు ఒక్క బ్రాండ్ నుంచి కూడా స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 5జీ విషయంలో ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఆరేళ్లలో 35 కోట్లకు 5జీ యూజర్లు ► ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల కనెక్షన్లు ► 2026 నాటికి ఎరిక్సన్ అంచనా న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ కనెక్షన్లు 2026 నాటికి 35 కోట్లకు చేరవచ్చని అంతర్జాతీయ టెలికం సంస్థ ఎరిక్సన్ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్స్ సంఖ్య 350 కోట్లకు చేరగలవని ’ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ 2020’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో స్పెక్ట్రం వేలం నిర్వహించిన పక్షంలో 2021లోనే భారత్‌లో తొలి 5జీ కనెక్షన్ అందుబాటులోకి రాగలదని ఎరిక్సన్ నెట్వర్క్ సొల్యూషన్స్ విభాగం హెడ్ (ఆగ్నేయాసియా, భారత్) నితిన్ బన్సల్ తెలిపారు. ‘2026లో ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ కవరేజీ ఉంటుంది. కనెక్షన్ల సంఖ్య 350 కోట్ల దాకా చేరొచ్చని అంచనా. భారత్‌లో 5జీ సబ్స్క్రైబర్స్ సంఖ్య 35 కోట్లు దాటిపోవచ్చు. 2026లో మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో దీని వాటా 27 శాతంగా ఉండవచ్చు‘ అని బన్సల్ పేర్కొన్నారు. టెలికం సేవలకు సంబంధించి భారత్‌లో ప్రస్తుతం ఎల్టీఈ (4జీ) టెక్నాలజీదే ఆధిపత్యం ఉందని, మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో దీని వాటా 63 శాతంగా ఉందని నివేదికలో వెల్లడైంది. 2026 నాటికి దశలవారీగా 3జీ సేవలు నిల్చిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఎల్టీఈ యూజర్ల సంఖ్య 2020లో 71 కోట్లుగా ఉండగా 2026 నాటికి సుమారు 2 శాతం వార్షిక వృద్ధితో 82 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
వొడాఫోన్ కొత్త ‘ఐడియా’
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) ‘వీఐ’ బ్రాండ్‌తో వినియోగదారులను ఇక మీదట పలకరించనుంది. టెలికం మార్కెట్లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్వర్క్ బలోపేతం లక్ష్యాలతో నూతన బ్రాండ్ వీఐను సోమవారం కంపెనీ ఆవిష్కరించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకమీదట వీఐగా పిలవనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ చివరికి 28 కోట్ల చందాదారులు వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ పరిధిలో ఉన్నారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసిన వారం వ్యవధిలోనే వొడాఫోన్ ఐడియా నూతన బ్రాండ్‌తో మార్పు దిశగా అడుగువేసింది. అంతేకాదు, రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే. 100 కోట్ల మందికి 4జీ సేవలు ‘‘రెండేళ్ల క్రితం విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు అతిపెద్ద నెట్‌వర్క్‌లు, ఉద్యోగులు, ప్రక్రియల ఏకీకరణపై దృష్టి పెట్టాము. భవిష్యత్తుపై దృష్టితో కస్టమర్ల కోసం రూపొందించిన బ్రాండ్ వీఐ. రెండు బ్రాండ్ల ఏకీకరణతో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం విలీనం పూర్తయింది. అంతేకాదు 4జీ నెట్‌వర్క్‌పై 100 కోట్ల భారతీయులకు బలమైన డిజిటల్ సేవలు అందించేందుకు, భవిష్యత్తు ప్రయాణానికి వీలుగా కంపెనీ సిద్ధమైంది’’అంటూ వీఐ బ్రాండ్‌ను వర్చువల్‌గా ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ పేర్కొన్నారు. చార్జీలు పెంచాల్సిందే.. గత కాలపు బకాయిల చెల్లింపులకు టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు పదేళ్ల గడువు ఇవ్వడాన్ని సానుకూల పరిణామంగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. పరిశ్రమ మనుగడ సాగించాలంటే మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదనపు టారిఫ్‌లు (చార్జీలు) చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని, గతంలో చెల్లించిన మాదిరే (జియో రాక పూర్వం) ఉండొచ్చని టక్కర్ పేర్కొన్నారు. తొలుత రూ.200కు, అనంతరం రూ.300కు టారిఫ్‌లు పెరగడం తప్పనిసరి అన్నారు. చార్జీలు పెంచేందుకు తాము సంకోచించడం లేదని.. ఇదే సరైన తరుణమని భావిస్తే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్మిట్టల్ సైతం ఇదే విధమైన ప్రకటనను ఇటీవలే చేసిన విషయం గమనార్హం. ఏజీఆర్, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా టెలికం శాఖకు రూ.58,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. పదేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీకి పెద్ద ఉపశమనే లభించినట్టయింది. తాము ఇప్పటికే 10 శాతం చెల్లించేశామని, కనుక తదుపరి చెల్లింపులు 2020 మార్చిలోనే చేయాల్సి ఉంటుందని టక్కర్ స్పష్టం చేశారు. మొత్తానికి కోర్టు తీర్పు పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. రూ.25వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు నిర్ణయం తీసుకోగా.. ఇండస్‌టవర్స్‌లో తనకున్న వాటాను విక్రయించే ప్రణాళికతో ఉంది. ఫైబర్, డేటా సెంటర్ల ఆస్తుల విక్రయంతోనూ నిధులు సమీకరించాలనుకుంటోంది. తదుపరి నిధుల సమీకరణలో ప్రమోటర్ సంస్థ వొడాఫోన్ గ్రూపు కూడా పాల్గొనే ఉద్దేశ్యం ఉందా..? అన్న ప్రశ్నకు.. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టక్కర్ స్పష్టం చేశారు. రుణ పరిమితి రూ. లక్ష కోట్లకు..? రుణాల పరిమితిని రూ.లక్ష కోట్లకు పెంచుకునేందుకు ఈ నెల 30న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. వాస్తవానికి రూ.25,000 కోట్ల రుణ సమీకరణ పరిమితికి 2014 సెప్టెంబర్‌లో అప్పటి ఐడియా సెల్యులర్ వాటాదారులు ఆమోదం తెలిపారు. అనంతరం ఐడియా సెల్యులర్, వొడాఫోన్ ఐడియాతో వీలీనమైన విషయం తెలిసిందే. ఇండస్టవర్స్తో పదేళ్ల మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్‌కు సైతం వాటాదారుల ఆమోదం కోరనుంది. డిజిటల్ ఎకానమీకి తోడ్పాటు... దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లో 120 కోట్ల భారతీయులు వాయిస్, డేటా సేవలను ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లకు పొందుతున్నారు. ‘వీఐ’ బ్రాండ్‌తో భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు కట్టుబడి ఉన్నాము. – వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమారమంగళం బిర్లా రెండు నెట్‌వర్క్‌ల ఏకీకరణ పూర్తయింది. నూతన ప్రయాణం ఆరంభానికి సమయం వచ్చింది. – వొడాఫోన్ గ్రూపు సీఈవో నిక్‌రీడ్ -
చైనాను కాదని మన ‘టెలికామ్’ బతుకుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం రగులుతున్న కొద్దీ ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని, ఆ దేశ కంపెనీలపై నిషేధం విధించాలని రాజకీయ నేతల నుంచి సామాన్య మానవుల వరకు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన వావై, జెడ్‌టీఈ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ భారతీయ టెలికామ్ సంస్థలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదేశించినట్లు ‘ఫైనాన్సియల్ టైమ్స్’ ఆగస్టు 25వ తేదీన ఓ వార్తను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోదీ అంతటి సాహసానికి సిద్ధపడి ఉండవచ్చుగాక, ఆ కంపెనీల ఉత్పత్తులను వినియోగించకుండా భారతీయ టెలికాం సంస్థలు బతకగలవా అని పారిశ్రామిక మార్కెటింగ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భారతీయ టెలికామ్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వైర్లెస్ టెలికామ్ రంగంలో 55 శాతం వాటా కలిగిన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రధానంగా చైనాకు చెందిన ‘వావై’ కంపెనీకి ప్రధాన కస్టమర్లు. అతి చౌక టెలికామ్ పరికరాల కోసం ఈ రెండు భారతీయ కంపెనీలు ‘వావై’ పైనే ఆధార పడ్డాయి. 4జీ నెట్వర్క్ పరికరాల్లో ‘వావై’ కంపెనీకి 40 శాతం లాభాలు భారత్ నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో పని చేస్తోన్న బీఎస్ఎన్ఎల్ ప్రధానంగా చైనాకు చెందిన జెడ్‌టీఈ కంపెనీపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 40 శాతం 3జీ నెట్‌వర్క్‌ను అభివద్ధి చేసింది జెడ్‌టీఈ కంపెనీయే. 2018లో 5జీ నెటవర్క్ ట్రయల్స్‌ను చైనా వావై కంపెనీతో కలిసి ఎయిర్టెల్ నిర్వహించింది. వావై, జెడ్‌టీఈ, ఎరిక్సన్ కంపెనీలతో 5జీ టెక్నాలజీ పరికరాల కోసం ఐడియా వోడాఫోన్ ఒప్పందం కుదుర్చుకుంది. నష్టాల్లో ఉన్న భారతీయ టెలికామ్ సంస్థలు ‘వావై, జెడ్‌టీఈ’ లాంటి చైనా కంపెనీల సహకారంతో బయట పడాలని భావిస్తున్నాయి. అలాంటి సమయంలో వావై, జెడ్‌టీఈ కంపెనీలను దూరం చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ‘కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్’ సంస్థ హెచ్చరిస్తోంది. ముకేశ్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ జియో’ నుంచి ఎయిర్టెల్, వొడాఫోన్ సంస్థలకు గట్టి పోటీ ఎదురవుతుండగా, జూన్ 30వ తేదీ నాటికి వొడాఫోన్ నష్టాలు 25,460 కోట్ల రూపాయలు కాగా, ఎయిర్టెల్ నష్టం 15,933 కోట్ల రూపాయలు. చైనాకు చెందిన వావై, జెడ్‌టీఈ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా దక్షిణ కొరియాకు చెందిన శ్యామ్‌సంగ్, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, ఫిన్లాండ్కు చెందిన నోకియా కంపెనీలు ఉన్నాయి. చైనా కంపెనీలంత నాణ్యతగల పరికరాలను ఈ కంపెనీలు అందజేయక పోవడమే కాకుండా దిగుమతుల భారం ఎక్కువ పడుతోంది. ఈ రెండు చైనా కంపెనీలను నిషేధించాలనే డిమాండ్ అమెరికా, బ్రిటన్‌తోపాటు ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయంలో ఆ దేశ ప్రభుత్వాలు ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నాయి. చదవండి: మావాళ్లకు ఇవ్వొద్దు -
వొడా ఐడియా నష్టాలు రూ. 25,460 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం తొలి త్రైమాసికంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు రూ. 4,874 కోట్లు. మరోవైపు, తాజా క్యూ1లో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పరంగా ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలకు సంబంధించి జూన్ క్వార్టర్లో రూ. 19,440 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ‘ తొలి త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల స్టోర్లు మూతబడి రీచార్జి సదుపాయాలు లేకుండా పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావిత కస్టమర్లు రీచార్జి చేసుకోలేకపోవడం తదితర అంశాల కారణంగా క్యూ1 చాలా గడ్డుకాలంగా గడిచింది‘ అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. -
పన్నుల విధానాన్ని సమీక్షించాలి: సునీల్ మిట్టల్
ముంబై: దేశీయ టెలికాం రంగం పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాలను సమీక్షించాలని మొబైల్ దిగ్గజం భారతి ఏయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ శుక్రవారం తెలిపారు. టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆయన వెబ్ కాన్పరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికాం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలికాం రంగం మూలధన కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. మరోవైపు టెలికాం రంగాన్ని ఆధునికరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు. -
బాకీలు కట్టలేం బాబోయ్..!
న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు తాజాగా ఏజీఆర్ బాకీలు మరింత భారంగా మారాయి. దీంతో ప్రస్తుతం ఏజీఆర్ బకాయిలను కట్టే పరిస్థితుల్లో లేమని కేంద్ర సమాచార శాఖకు కంపెనీ లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న టెలికం రంగంలో కనీస చార్జీ విధానం అమలుకు అనుమతించడంతో పాటు సుంకాలు తగ్గించాలని, విడతలవారీగా బాకీలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరింది. ప్రభుత్వం నుంచి రావల్సిన జీఎస్టీ క్రెడిట్‌ను సర్దుబాటు చేస్తే .. ఏజీఆర్ చెల్లింపులపరంగా కొంత తోడ్పాటు లభించగలదని వివరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కలకు అనుగుణంగా టెలికం శాఖ అంచనాల ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు పైగా కట్టాల్సి ఉంది. ఇందులో ఇప్పటిదాకా 7 శాతం మాత్రమే కట్టింది. సుమారు 30 కోట్ల పైగా యూజర్లు, 10,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్న తమ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ తోడ్పాటు చర్యలు తీసుకోవాలని వొడాఫోన్ ఐడియా కోరింది. మూడేళ్ల మారటోరియం.. కేంద్రం దగ్గరున్న సుమారు రూ. 8,000 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను బాకీల కింద సెటాఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే స్వీయ మదింపు ప్రకారం తాము కట్టాల్సిన మిగతా మొత్తాన్ని చెల్లించగలమని వొడాఫోన్ ఐడియా తెలిపింది. వడ్డీ, పెనాల్టీ చెల్లింపుపై మూడేళ్ల మారటోరియం విధించాలని, మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు 15 ఏళ్ల గడువు ఇవ్వాలని, ఆరు శాతం రేటు చొప్పున వడ్డీ విధించాలని కోరింది. అలాగే లైసెన్సు ఫీజును ప్రస్తుతమున్న ఎనిమిది శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను (ఎస్‌యూసీ) సున్నా స్థాయికి లేదా అన్ని రకాల స్పెక్ట్రంనకు ఒకే విధంగా ఒక్క శాతం రేటును వర్తింపచేయాలని విజ్ఞప్తి చేసింది. డేటా కనీస చార్జీలను రూ. 35కు పెంచాలి.. పోటీ ఎదుర్కొనేందుకు తప్పనిసరై చౌక టారిఫ్‌లు అమలు చేస్తుండటమే తమ ప్రస్తుత దుస్థితికి కారణమని, తక్షణం కనీస చార్జీల విధానాన్ని తక్షణం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది. మొబైల్ డేటా 1 జీబీకి కనీస టారిఫ్ రూ. 35గా నిర్ణయించాలని, అలాగే నెలవారీ కనీస కనెక్షన్ చార్జీలను రూ.50కి పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మొబైల్ డేటా ఖరీదు ప్రతీ జీబీకి రూ. 4–5 శ్రేణిలో ఉంటోంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా విజ్ఞప్తుల అమలు కష్టసాధ్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చార్జీలను 50 శాతం దాకా ఇటీవలే పెంచిన వొడాఫోన్ ఐడియా.. మూడు నెలలు కూడా గడవకముందే మళ్లీ కాల్, ఇంటర్నెట్ రేట్లను పెంచాలంటూ కోరుతుండటం గమనార్హం. సీవోఏఐ కూడా అదే బాటలో.. బాకీల చెల్లింపు విషయంలో నిబంధనలను సడలించాలని, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూడాలని, కనీస చార్జీల విధానాన్ని సత్వరం అమలు చేయాలంటూ సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కూడా కూడా కేంద్రాన్ని కోరింది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని, టెలికం రంగానికి ప్రభుత్వం దన్నుగా ఉంటుందని కేంద్రం భరోసానివ్వాలని విజ్ఞప్తి చేసింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కి సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఈ మేరకు లేఖ రాశారు. లైసెన్సు ఫీజులకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలిచ్చే విధానాన్ని తొలగించాలని, ఒకవేళ వీలు కాని పక్షంలో గ్యారంటీ మొత్తాన్ని.. లైసెన్సు ఫీజులో పావు శాతానికైనా తగ్గించాలని సీవోఏఐ కోరింది. ఏజీఆర్ బాకీల కింద మొత్తం 15 టెల్కోలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. నేడు డీసీసీ సమావేశం.. సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి తోడ్పాటునిచ్చే చర్యలపై చర్చించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) నేడు (శుక్రవారం) సమావేశం కానున్నట్లు సమాచారం. విడతలవారీగా చెల్లించే అవకాశం కల్పించడంతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఇందులో చర్చకు రావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు అదనంగా కట్టే దాన్ని బట్టి ఊరట చర్యలు ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి. -
టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 2020–21 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ‘‘ఏజీఆర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాం. ప్రస్తుతం ఆదాయంలో 8 శాతంగా ఉన్న స్పెక్ట్రమ్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని కోరాం. స్పెక్ట్రమ్ వినియోగ చార్జీని ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని అడిగాం. తగిన వ్యవధిలోపు దీన్ని చేస్తారేమో చూడాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకును ఏర్పాటు చేసి, పన్ను రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించి.. తక్కువ రేటుకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా కోరాం’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో స్పష్టత కోసం వేచి చూస్తున్నామని టెలికం శాఖ తమకు తెలిపినట్టు చెప్పారు. జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బకాయిలు రూ.36,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. ‘‘స్పెక్ట్రమ్, లైసెన్స్ ఫీజుపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. ఎందుకంటే వీటిని సేవలుగా పేర్కొన్నారు. అవి సేవలు కావని వివరించాం’’ అని మాథ్యూస్ తెలిపారు. జీఎస్టీని సులభంగా మార్చాలి: ఆర్థిక వేత్తలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను సులభంగా మార్చాలని, ప్రత్యక్ష పన్నుల కోడ్ (చట్టం)ను అమలు చేయాలని కేంద్రానికి ఆర్థిక వేత్తలు సూచించారు. వృద్ధికి మద్దతుగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, అందుకు అన్ని రంగాల్లోనూ విధానపరమైన పరిష్కారాలు వేగంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే, ద్రవ్య నిర్వ హణ, విద్యుత్ రం గంలోనూ సంస్కరణలు అవసరమని బడ్జెట్ ముందస్తు సమావేశంలో సూచించారు. ‘‘వృద్ధి క్షీణత పరంగా కనిష్ట స్థాయి ముగిసింది. వృద్ధిని 7–7.5 శాతానికి వేగవతం చేయడానికి ఏమి చేయగలమన్నదే ముఖ్యం’’ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మాణి సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. చిన్న వ్యాపారాలకు డీటీసీ అమలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సందేహాత్మక స్థితి నుంచి బయట పడాలి నిర్మలా సీతారామన్ దేశీయ పరిశ్రమలు సందేహాత్మక స్థితి నుంచి బయటకు రావాలని, సహజ ఉత్సాహాన్ని ప్రదర్శించాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బడ్జెట్ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నట్టు ఆమె చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అసోచామ్ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘స్వీయ సందేహాత్మక ధోరణి నుంచి బయటకు రావాలి. మేం ఇది చేయగలమా? భారత్ ఇది చేయగలదా?.. ఎందుకీ ప్రతికూల భావన? ఈ అనుమానాల నుంచి బయటకు రండి. భారత వ్యవస్థను మార్చే విషయమై ప్రభుత్వం తన దృఢత్వాన్ని చూపించింది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిశ్రమల పట్ల స్పందిస్తుందని నమ్మకం కలిగించాం’’ అని చెప్పారు. దేశ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి, ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు, పరిశ్రమల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించడం గమనార్హం. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, స్థూల ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని, ఎఫ్‌డీఐల రాక బలంగా ఉందని, విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్టాల వద్ద ఉన్నాయని వివరించారు. ‘‘దేశ వృద్ధి పథంలో పాల్గొనాలి. తొలి బిడ్ వేయడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. -
టెలికం.. లైన్ కట్ అవుతోంది
న్యూఢిల్లీ: అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఇటు పెట్టుబడులు అటు వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండింటి మధ్య సమతౌల్యం ఉండేలా ట్రాయ్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బడ్జెట్ ముందరి సమావేశాల్లో భాగంగా ఇతర కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సందర్భంగా సునీల్ మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టెలికం కంపెనీల ఏఆర్పీయూ (యూజరుపై సగటు ఆదాయం) క్రమంగా రూ.200 నుంచి రూ.300 దాకా చేరొచ్చని చెప్పారాయన. ‘డేటా, వాయిస్, ఇతర సర్వీసులకు కలిపి నెలకు ఒకో యూజరు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.450–500 దాకా చెల్లించవచ్చని అంచనా. వీటి సగటు సుమారు రూ.300 దాకా ఉండవచ్చు. డాలర్ రూపంలో నెలకు 4 డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత చౌక టారిఫ్‌లు ఇవే. డేటా వినియోగం మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువే‘ అని మిట్టల్ పేర్కొన్నారు. ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీలను (ఐయూసీ) ట్రాయ్ ఏడాది పాటు వాయిదా వేయడం, టెలికం సేవలకు కనీస చార్జీలను నిర్ణయించే అంశంపై దృష్టి సారించడం తదితర అంశాల నేపథ్యంలో సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కర్ణాటకలో 3జీ సేవలకు ఎయిర్టెల్ గుడ్‌బై ఎయిర్టెల్ క్రమంగా 3జీ సేవలను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేసినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ఇకపై అక్కడ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను.. హై స్పీడ్ 4జీ నెట్‌వర్క్‌పై అందిస్తామని తెలిపింది. ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం 2జీ సేవలు యథాప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపింది. -
చౌక కాల్స్, డేటాకు చెల్లు!!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా, మొబైల్ సర్వీసెస్ కనీస చార్జీలను నిర్ణయించడంపైనా సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస చార్జీలు నిర్ణయించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించతగిన విధానాలపైనా అభిప్రాయాలను ఆహా్వనించింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 17 దాకా గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్–కామెంట్స్ సమరి్పంచడానికి జనవరి 31 ఆఖరు తేది. ‘టెలికం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఎకానమీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. టెలికం రంగ సమస్యలు పరిష్కరించేందుకు, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూ టర్న్... టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తాజా ట్రాయ్ చర్చాపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. టారిఫ్‌ల విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన వారం రోజుల్లోగా ట్రాయ్‌కు తెలిపితే సరిపోతుంది. కాబట్టి యూజర్లను ఆకర్షించేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, అత్యంత చౌక ప్లాన్స్ కూడా అందిస్తూ వచ్చాయి. ఒకవేళ కనీస చార్జీల విధానం గానీ అమల్లోకి వస్తే.. ఉచిత సరీ్వసులకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు పరిశీలించతగిన చర్యలంటూ అక్టోబర్‌లో చేసిన సిఫార్సుల్లో ఈ కనీస చార్జీల ప్రతిపాదన కూడా ఉంది. అటు పాత టెల్కోలు కూడా దీన్ని గట్టిగా కోరుతున్నాయి. రిలయన్స్ జియో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండేళ్ల క్రితం టెల్కోలు ఇలాంటి ప్రతిపాదనే చేసినప్పటికీ.. ఇది సాధ్యపడే విషయం కాదని ట్రాయ్ తోసిపుచి్చంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పరిశీలించాలని భావిస్తోంది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టులో ప్రతికూల ఆదేశాలు రావడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సెపె్టంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రికార్డు స్థాయిలో రూ. 50,922 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్లు నష్టాలు ప్రకటించింది. 2021 దాకా ఐయూసీ కొనసాగింపు న్యూఢిల్లీ: టెలికం సంస్థల ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2021 జనవరి 1 దాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ చార్జీలు పూర్తిగా ఎత్తివేసేలా ప్రతిపాదనలు చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కాల్స్ స్వీకరించినందుకు.. టెల్కోలు వసూలు చేసే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. ఈ విధానాన్ని 2020 జనవరి 1 నుంచి ఎత్తివేసే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. దీన్ని 2021 దాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న టెలికం రంగానికి ఇది కాస్త ఊరటనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో 14 పైసలుగా ఉన్న ఐయూసీ చార్జీలను ట్రాయ్ 2017 అక్టోబర్‌లో 6 పైసలకు తగ్గించింది. దీంతో టెలికం సంస్థలు రూ. 11,000 కోట్ల మేర నష్టపోయాయని అంచనా. ఒకవేళ 6 పైసల ఐయూసీని కూడా ఎత్తివేసిన పక్షంలో పరిశ్రమపై మరో రూ. 3,672 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడేది. దీనితో పాటు వినియోగదారుల ప్రయోజనాలు, టెలికం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐయూసీ స్థానంలో కొత్త బీఏకే (బిల్ అండ్ కీప్) విధానం అమలును ఏడాది పాటు వాయిదా వేసినట్లు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఐయూసీని పరిగణనలోకి తీసుకునే టెల్కోలు ఇటీవల చార్జీలను పెంచినందున.. వినియోగదారులపై కొత్తగా దీని ప్రభావమేమీ ఉండబోదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. -
టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు
న్యూఢిల్లీ: స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల మేరకే స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల చెల్లింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం జోక్యం చేసుకోరాదని భావించిన నేపథ్యంలో సీవోఎస్ రద్దు ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని, వాయిస్ కాల్స్.. డేటా టారిఫ్‌లను పెంచడం మొదలైన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని టెలికం సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. టెలికం రంగానికి ఇది మరింత భారమవుతుందని, తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు.. సుప్రీం ఉత్తర్వులపై అదే కోర్టులో రివ్యూ పిటీషన్ కూడా దాఖలు చేశాయి. -
ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం
న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుండా కొనసాగించిన పక్షంలో అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్ జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ నిష్పత్తి దాదాపు సరిసమాన స్థాయిలో ఉందని, ఈ రెండింటి మధ్య భారీ అసమతౌల్యం ఉందన్న కారణంతో ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని జియో డైరెక్టర్ మహేంద్ర నహతా పేర్కొన్నారు. ఐయూసీపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. అటు, వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. ఐయూసీని సున్నా స్థాయికి తగ్గించేయరాదని, దీన్ని పూర్తిగా తొలగించే బిల్ అండ్ కీప్ (బీఏకే) విధానం అమలును మూడేళ్ల దాకా వాయిదా వేయాలని కోరాయి. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను అందుకున్నందుకు గాను ఆపరేటర్లు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. 2020 జనవరి నుంచి దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. కొనసాగించే అంశాన్నీ ట్రాయ్ పరిశీలిస్తోంది. టెలికం రంగంలో తీవ్ర సంక్షోభం గురించి ప్రభుత్వానికి తెలుసనే భావిస్తున్నామని, త్వరలోనే కేంద్రం ఊరట చర్యలేవైనా ప్రకటించవచ్చని ఆశిస్తున్నామని ఇన్వెస్టర్లతో సమావేశంలో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. -
నచ్చని టెల్కోలకు గుడ్‌బై!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4.14 కోట్ల దరఖాస్తులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. 3.78 కోట్ల రిక్వెస్టులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర సర్కిళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఎంఎన్‌పీ కోసం 59.2 లక్షల విన్నపాలు వచ్చాయి. 2010 నవంబరు 25న హరియాణా సర్వీస్ ఏరియాలో తొలుత ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా అన్ని సర్కిళ్లకు ఈ సర్వీసును విస్తరించారు. పెరుగుతున్న ఫిర్యాదులు.. టెలికం రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2జీ తర్వాత 3జీ విస్తరణ కంటే వేగంగా 4జీ సేవలు దూసుకుపోయాయి. ప్రధానంగా రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో పోటీ తీవ్రమైంది. 2019 జూలై నాటికి భారత్‌లో వైర్లెస్ చందాదారులు 97.2 కోట్ల మంది ఉన్నారు. మెరుగైన సేవల కోసం వినియోగదార్లు ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు. మరోవైపు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉత్తమ కవరేజ్, సర్వీసుల కోసం ఏటా అన్ని టెలికం కంపెనీలు ఎంత కాదన్నా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎయిర్టెల్ ప్రాజెక్ట్ లీప్ కింద రూ.10,000 కోట్లు వ్యయం చేస్తోంది. టవర్ల ఏర్పాటును రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు అడ్డుకోరాదన్న సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరోవైపు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ చొరవతో టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను వినియోగించుకునే వెసులుబాటు టెలికం కంపెనీలకు లభించింది. ప్రధాన సమస్యలు ఇవే.. కవరేజ్, డేటా స్పీడ్, కాల్ డ్రాప్, కాల్ కనెక్టివిటీ, కాల్ క్వాలిటీ వంటి నెట్వర్క్ సంబంధ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే బిల్లింగ్ పారదర్శకత, కాల్ సెంటర్‌తో అనుసంధానం, అందుబాటులో ఔట్లెట్ల వంటి సర్వీస్ విషయాలనూ కస్టమర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే కాల్ సెంటర్‌కు లైన్ కలిసే అవకాశమే ఉండడం లేదు. యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని టెల్కోలు చెబుతున్నా అంతిమంగా పరిష్కారం అయ్యే చాన్స్ తక్కువ. వినియోగం కంటే మొబైల్ బిల్లు ఎక్కువగా ఉందని భావించే కస్టమర్లు మెరుగైన ప్యాకేజీ కోసం ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఎంఎన్‌పీ ప్రత్యేకత ఏమంటే వినియోగదారు మరో రాష్ట్రానికి (టెలికం సర్కిల్) మారినా వినియోగిస్తున్న నంబరు మారకపోవడం. ఈ అంశమే కస్టమర్లకు అస్త్రం. టెల్కోను మార్చిన 90 రోజులకు మరో ఆపరేటర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం వినియోగదార్లకు కలిసి వస్తోంది. -
జియో జైత్రయాత్ర
భారత టెలికాం రంగంలో కాలిడిన మూడేళ్లలోనే రిలయన్స్ జియో టాప్‌లోకి దూసుకొచ్చింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఎంట్రీతోనే ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో గుబులు రేపిన జియో వినియోగదారుల ఆదరణతో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 331.3 మిలియన్ల చందాదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. తద్వారా వోడాఫోన్ ఐడియాను వెనక్కి నెట్టేసింది. 2019 జూన్ (మొదటి త్రైమాసికం) నాటికి వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య 320 మిలియన్లకు క్షీణించిందని వోడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాల సందర్భంగా శుక్రవారం నివేదించింది. మార్చి త్రైమాసికంలో 334.1 మిలియన్ల మంది ఖాతాదారులు నమోదయ్యారు. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకారం, అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 2019 జూన్ నాటికి 331.3 మిలియన్ల వినియోగదారులు ఉన్నట్టు ప్రకటించింది. ఈ తాజా లెక్కల ప్రకారం అత్యధిక వినియోగదారులతో అతిపెద్ద సంస్థగా జియో నిలిచింది. టెలికాం రంగ నియంత్రణ మండలి ట్రాయ్ డేటా ప్రకారం..మే నెలలో జియో 32.29 కోట్ల మంది కస్టమర్లు, 27.80 శాతం మార్కెట్ వాటాతో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది. భారతి ఎయిర్టెల్ 32.03 కోట్ల యూజర్లు, 27.6 శాతం మార్కెట్ వాటాతో మూడోస్థానానికి పడిపోయింది. మే నెలలో జియో నెట్‌వర్క్‌లోకి నికరంగా 81.80 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరగా.. వొడాఫోన్ ఐడియా 56.97 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 15.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. కాగా గత ఏడాదిలో వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ వొడాఫోన్ ఐడియా 400 మిలియన్లకు పైగా సభ్యులతో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా కస్టమర్లను కోల్పోతూ వచ్చిన వొడాఫోన తాజాగా రెండో స్థానంతో సరిపెట్టుకోగా, వొడా, ఐడియా విలీనానికి ముందువరకు దిగ్గజ కంపెనీగా కొనసాగిన ఎయిర్టెల్ ప్రస్తుతం మూడో స్థానానికి జారుకుంది. -
మూడో ఏడాదీ టెల్కోల ఆదాయానికి గండి: ఇక్రా
ముంబై: రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయని, వరుసగా మూడో ఏడాది టెలికం కంపెనీల ఆదాయం తగ్గనుందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్వల్ప రికవరీకి అవకాశాలున్నాయని అంచనా వేసింది. ‘‘జియో సేవల ఆరంభం తర్వాత మొదలైన తీవ్ర పోటీ, ధరల ఒత్తిళ్లు కంపెనీల ఆర్థిక పనితీరును తీవ్రంగా కుంగదీసింది. దీంతో వాటి ఆదాయాలు, లాభాలు క్షీణించాయి’’ అని ఇక్రా పేర్కొంది. 2017–18లో టెలికం కంపెనీల ఆదాయం 11 శాతం క్షీణించి రూ.2.1 లక్షల కోట్లుగా ఉండగా, 2018–19లో 7% తగ్గుతాయని ఇక్రా అంచనా వేసింది. 2019–20లో మాత్రం 6% వృద్ధి ఉంటుందని పేర్కొంది. నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21% క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18% తగ్గుదలకే పరిమితం కావచ్చని తెలిపింది. పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ ఇది తక్కువ స్థాయిలోనే ఉండొచ్చంది. 2019–20లో టెల్కోలు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు రుణాలను తగ్గించుకోవచ్చని అంచనా వేసింది. మొత్తం మీద టెలికం రుణ భారం రూ.4.75 లక్షల కోట్ల నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.4.3 లక్షల కోట్లకు తగ్గొచ్చని పేర్కొంది. -
సమీప కాలంలో టెలికంకు సమస్యలే
ముంబై: దేశీయ టెలికం రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమీప కాలంలోనూ ఉపశమనం ఉండబోదని, స్థిరీకరణ వల్ల ప్రయోజనాలు దీర్ఘకాలంలోనే ఉంటాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది. టెలికం రంగంలో స్థిరీకరణతో ధరల పరంగా మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఇది దీర్ఘకాలానికి సానుకూలమని పేర్కొంది. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో టెలికం మార్కెట్లోకి ప్రవేశించడంతో... అప్పటికే ఈ రంగంలో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్కామ్పై తీవ్ర ఒత్తిళ్లు పడ్డాయి. దీంతో స్థిరీకరణ, ఆస్తుల విక్రయాలు, ఉద్యోగాల నష్టం, దివాలా పరిస్థితులూ నెలకొన్నాయి. ఇవన్నీ మూడీస్ తన నివేదికలో గుర్తు చేసింది. ఆదాయం, లాభాలు క్షీణించి, రుణాలు పెరిగిపోవడంతో... వొడాఫోన్, ఐడియాల మధ్య... టెలినార్, ఎయిర్టెల్, టాటా డొకోమోల విలీనాలు చోటు చేసుకున్న విషయం విదితమే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ సేవలు నిలిపివేశాయి. ఎయిర్టెల్ అయితే తన చరిత్రలో తొలిసారి దేశీయ కార్యకలాపాలపై జూన్ క్వార్టర్లో నష్టాలను ప్రకటించింది. సమీప కాలంలో టెలికంలో 60,000 ఉద్యోగాలు తగ్గుతాయని మూడీస్ అంచనా వేసింది. ‘‘మూడు నుంచి నాలుగు సంస్థలతోపాటు ధరల పరంగా మరింత సహేతుక పరిస్థితులు దీర్ఘకాలంలో సాధ్యమవుతాయి. కానీ, సమీప కాలంలో సగటు కస్టమర్‌పై వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగేందుకు అవకాశాల్లేవు’’ అని మూడీస్ తేల్చి చెప్పింది. టెలికం కంపెనీల లాభాల మెరుగుదలకు ఏఆర్పీయూ వృద్ధి చాలా కీలకం. జియో సైతం సెప్టెంబర్ క్వార్టర్లో ఏఆర్పీయూ క్షీణతను ఎదుర్కోవడం గమనార్హం. ఎయిర్‌టెల్‌కు దేశీయంగా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆఫ్రికా కార్యకలాపాలు చేదోడుగా నిలుస్తాయని మూడీస్ పేర్కొంది. -
‘టెలికం’కు ఆర్‌కామ్ గుడ్‌బై...
ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్‌కామ్ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు ఉన్న రూ. 40,000 కోట్ల రుణభారాన్ని పరిష్కరించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ’ టెలికం రంగం భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఇక కొనసాగరాదని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. భవిష్యత్‌లో రిలయన్స్ రియల్టీ ఈ సంస్థకు వృద్ధి చోదకంగా ఉండనుంది’ అని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ముంబై శివార్లలో ఉన్న 133 ఎకరాల ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ) గురించి ప్రస్తావిస్తూ.. ఈ సైట్ ద్వారా దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను సృష్టించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు. అన్న ముకేశ్‌కు థ్యాంక్స్.. కంపెనీ రుణభారానికి మరికొద్ది నెలల్లో తగు పరిష్కార మార్గం లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టెలికం ఇన్ఫ్రా, ఫైబర్ వ్యాపారాలను రిలయన్స్ జియోకి విక్రయించే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఇలాగే ఇతరత్రా విభాగాల విక్రయం తదితర చర్యలతో నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అనిల్ అంబానీ చెప్పారు. స్పెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అప్పట్లో అవిభాజ్య రిలయన్స్ గ్రూప్‌ను టెలికం రంగం వైపు నడిపించడంతో పాటు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్‌కామ్ అసెట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పెద్దన్న ముకేశ్ అంబానీకి అనిల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ’వ్యక్తిగతంగా నాకు, ఆర్‌కామ్‌కు, .. మార్గనిర్దేశనం చేసి, తోడ్పాటు అందించిన నా సోదరుడు ముకేశ్ భాయ్ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది సరైన సమయం’ అని అనిల్ పేర్కొన్నారు. టెలికం రంగంలో సృజనాత్మక విధ్వంసం జరుగుతోందని.. సాముదాయిక గుత్తాధిపత్యానికి దారి తీసిందని అనిల్ చెప్పారు. తర్వాత రోజుల్లో ఇది ద్విదాధిపత్యం (రెండే కంపెనీల ఆధిపత్యం), అటు పైన పూర్తి గుత్తాధిపత్యానికి కూడా దారితీయొచ్చని అనిల్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ సామ్రాజ్యం విభజన అనంతరం టెలికంతో పాటు కొన్ని విభాగాలు అనిల్ అంబానీకి, రిఫైనరీ తదితర వ్యాపార విభాగాలు ముకేశ్ అంబానీకి లభించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ రిలయన్స్ జియోతో.. టెలికం రంగంలోకి ప్రవేశించారు. రిలయన్స్ రియల్టీ.. మొబైల్ వ్యాపార విభాగాన్ని జియోకి విక్రయించేసిన తర్వాత ఆర్‌కామ్ ప్రస్తుతం ఎంటర్ప్రైజ్, డేటా సెంటర్స్, అండర్‌సీ కేబుల్స్ మొదలైన వ్యాపార విభాగాల ద్వారా 35,000 సంస్థలకు సర్వీసులు అందిస్తోందని అనిల్ అంబానీ చెప్పారు. వీటన్నింటి నుంచి వైదొలగడంతో పాటు బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఆర్‌కామ్ కట్టుబడి ఉందని.. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్‌కామ్‌కు అనుబంధ సంస్థగా ఏర్పాటైన రిలయన్స్ రిటైల్.. నవీ ముంబైలోని డీఏకేసీని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కంపెనీకి ముప్పై లక్షల చ.అ.ల బిల్టప్ స్పేస్ ఉందని.. దీన్ని బహుళజాతి సంస్థలకు లీజుకివ్వనున్నామని అనిల్ చెప్పారు. తొలి ఏడాది నుంచే వీటిపై ఆదాయాలు రాగలవన్నారు. ఆర్థికేతర వ్యాపారాల నుంచి రిలయన్స్ క్యాపిటల్ నిష్క్రమణ.. రిలయన్స్ క్యాపిటల్ వచ్చే 12–18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ 32వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ క్యాపిటల్‌కి ప్రస్తుతం అసెట్ మేనేజ్మెంట్, బీమా, గృహ.. వాణిజ్యరుణాలు, ఈక్విటీలు.. కమోడిటీల బ్రోకింగ్ వ్యాపారాలు ఉన్నాయి. తమ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో గణనీయమైన వాటాల కొనుగోలు కోసం వ్యూహాత్మక భాగస్వామితో చర్చలు జరుగుతున్నాయని.. మరికొద్ది నెలల్లో ఈ డీల్ పూర్తి కాగలదని అనిల్ పేర్కొన్నారు. మరోవైపు ఈ త్రైమాసికంలో రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ తెలిపారు. మరోవైపు, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వుల తర్వాత కూడా చెల్లింపులు జరపకుండా ప్రభుత్వ విభాగాలు జాప్యం చేస్తున్నాయంటూ రిలయన్స్ ఇన్ఫ్రా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న అనిల్ అంబానీ ఆరోపించారు. దీనివల్ల తమకు రావాల్సిన దాదాపు రూ. 8,000 కోట్ల బకాయిలు నిల్చిపోయాయని ఆయన పేర్కొన్నారు. -
విలీనం పూర్తి : 2500 మంది ఉద్యోగులకు ఎసరు
న్యూఢిల్లీ : ఐడియా-వొడాఫోన్ కంపెనీల విలీనం పూర్తయింది. ఈ రెండు సంస్థలు కలిసి దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఐడియా-వొడాఫోన్లు తమ హెడ్‌కౌంట్‌ను(ఉద్యోగుల సంఖ్యను) 15వేలకు కుదించాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో 17,500 నుంచి 18వేల మంది ఉద్యోగులున్నారు. అంటే వీరిలో 2500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలని ఐడియా-వొడాఫోన్లు నిర్ణయించాయి. విలీనం సందర్భంగా 10 బిలియన్ డాలర్ల పొదుపు ప్రణాళికను అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులపై వేటు పడుతోంది. కొంతమంది ఉద్యోగులను పేరెంట్ కంపెనీలు వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి తీసుకుని, మిగతా కొంతమందిపై వేటు వేయాలని ఈ విలీన సంస్థ ప్లాన్ చేసింది. అంతేకాక ఉద్యోగులకు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను కూడా ప్రస్తుతం పక్కన పెట్టింది. అయితే ఉద్యోగుల వేటుకు సంబంధించిన వార్తలు మార్కెట్లో చక్కర్లు కొడుతుండటంతో, ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని వొడాఫోన్ ఇండియాకొట్టిపారేసింది. ‘కొంతవరకు హేతుబద్దీకరణ ఉంటుంది. అది సర్వసాధారణం. కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగుల సంఖ్యను 2000 నుంచి 2500 మందిని తగ్గించుకోవాలనుకుంటుంది’ అని ఈ విషయం తెలిసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని కంపెనీ పట్టించుకుంటుందని, సెవరెన్స్ ప్యాకేజీలను అందిస్తుందని, పేరెంట్ గ్రూప్ ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే టెలికాం కంపెనీల్లో ఉద్యోగుల కోత ఇదేమీ కొత్త కాదు. రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, టెలికాం రంగం అస్తవ్యస్తమైంది. ఇక అప్పటి నుంచి టెలికాం కంపెనీలు పోటీని తట్టుకోలేక, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేటు వేయడం ప్రారంభించాయి. వొడాఫోన్ ఇండియా కూడా వాలంటరీ అట్రిక్షన్‌ను ఆఫర్చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గించేస్తుంది. అయితే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులను, ఐడియా సెల్యులార్ ఉద్యోగులను విలీన సంస్థ సమానంగా చూస్తోంది. ఉద్యోగులందరిన్నీ ఎంతో గౌరవంగా చూస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా హెచ్ఆర్ హెడ్ చెప్పారు. -
భారతీ ఇన్ఫ్రాటెల్ నికర లాభం 4% డౌన్
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసిక (క్యూ1, ఏప్రిల్–జూన్) కాలానికి నికర లాభం రూ.638 కోట్లుగా నమోదయింది. 2017–18 ఏడాది ఇదేకాలానికి రూ.664 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన కంపెనీ.. టెలికం రంగంలో కొనసాగుతున్న కన్సాలిడేషన్ నేపథ్యంలో 4 శాతం తగ్గుదలను చూపింది. అయితే, కన్సాలిడేట్ ప్రాతిపదికన ఆదాయం 4 శాతం వృద్ధిని నమోదుచేసింది. రూ.3,674 కోట్లుగా నిలిచింది. (ఇండస్ టవర్స్ వాటాను కలుపుకుని ఈ మొత్తం నమోదు కాగా, సంస్థలో 42 శాతం వాటాను భారతీ ఇన్ఫ్రాటెల్ కలిగిఉంది.) అంతకుముందు ఇదేకాలానికి ఆదాయం రూ.3,524 కోట్లుగా నమోదయింది. ‘ప్రస్తుతం టెలికం రంగం అనుసంధాన దశలో ఉంది. భవిష్యత్ అవకాశాల అందిపుచ్చుకోవడం కోసం ఆపరేటర్లు తమ నెట్వర్కులను, స్పెక్ట్రమ్‌ను ఏకీకృతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.‘ అని చైర్మన్ అఖిల్ గుప్తా వివరించారు. -
ఐటీ డౌన్.. ఆటోమొబైల్ అప్..
సాక్షి, సిటీబ్యూరో : కొలువుల జాతరలో ఐటీ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆటోమొబైల్ రంగం రయ్‌న దూసుకుపోతోంది. పలు మెట్రో నగరాల్లో ఆటోమొబైల్, టెలికాం, నిర్మాణ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల జోరు ఊపందుకున్నట్లు నౌక్రి డాట్‌కామ్ తాజా నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉపాధి, ఉద్యోగ కల్పనలో వృద్ధిరేటు 21శాతంగా నమోదైంది. జూన్ వరకు మెట్రో నగరాల్లో వృద్ధిరేటును పరిశీలిస్తే వివిధ రంగాల్లో ఉపాధి కల్పనలో 38శాతంతో కోల్‌కతా అగ్రభాగాన నిలిచింది. 15శాతం వృద్ధిరేటుతో ఢిల్లీ రెండో స్థానంలో, 14శాతంవృద్ధిరేటుతో ముంబై మూడో స్థానంలో నిలిచాయి. ఇక 13శాతం వృద్ధిరేటుతో హైదరాబాద్, చెన్నై సరిపెట్టుకోవాల్సి వచ్చిందని నౌక్రి డాట్‌కామ్ ఆన్లైన్ జాబ్ పోర్టల్ అర్ధ వార్షిక నివేదికలో స్పష్టమైంది. గ్రేటర్ పరిధిలో ఐటీ రంగంలో కేవలం 2శాతమే వృద్ధి నమోదైంది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ తదితర మాధ్యమాలపై పనిచేసే వారికి కొలువుల అవకాశాలు బాగానే ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో ఐటీ రంగంలో కొలువు జోరు కాస్త మందగించినట్లు ఈ రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా గ్రేటర్ కేంద్రంగా బహుళ జాతి దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 1,000 సాఫ్ట్వేర్ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలు ప్రతి ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం, కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో కొలువుల్లో మందగమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రేటర్లో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా సాకారం కాకపోవడం, దీనికి తాజా బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం కూడా ఐటీ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్ఐపాస్లతో ఐటీ, పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయని... త్వరలో ఆయా రంగాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో కొలువుల జోష్... ♦ దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆటోమొబైల్,టెలికాం, నిర్మాణరంగంతో పాటు పలు ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువుల జోష్ కనిపించినట్లు నివేదిక పేర్కొంది. వివిధ రంగాల వారీగా వృద్ధి ఇలా... ♦ ఐటీ రంగంలో కేవలం 2 శాతమే వృద్ధినమోదైంది. ♦ ఆటోమొబైల్ రంగంలో 31శాతం వృద్ధి నమోదైంది. ♦ నిర్మాణ రంగంలో 21శాతం పురోగతి. ♦ ఫార్మా రంగంలో 18శాతం వృద్ధి. ♦ టెలికాం రంగంలో 25శాతం నమోదు ♦ నిత్యావసరాల అమ్మకం (ఎఫ్ఎంసీజీ) విభాగంలో 21 శాతం. ♦ బిజినెస్‌ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ)లో 18 శాతం వృద్ధి నమోదైంది. ఉద్యోగ కల్పనలో వృద్ధి ఇలా... మెట్రో నగరం వృద్ధిశాతం కోల్‌కతా 38 ఢిల్లీ 15 ముంబై 14 హైదరాబాద్ 13 చెన్నై 13 -
టెలికాం దిగ్గజాలకు భారీ పెనాల్టీకి రంగం సిద్ధం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం ఆపరేటర్లకు షాకిచ్చేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తుది కసరత్తు పూర్తి చేసింది. కాల్‌డ్రాప నిబంధనలు ఉల్లఘించిన కంపెనీలకు భారీ జరిమానా విధించేలా చర్యలు తుది దశకు చేరాయి. తాజా కాల్‌డ్రాప్ నిబంధనల ప్రకారం మార్చి త్రైమాసికంలో ఆపరేటర్లపై జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. కొత్త నిబంధనల అమలులోకి వచ్చిన నాటినుంచి రెండు త్రైమాసిక అంచనాలు పూర్తయ్యాయని ట్రాయ్ వెల్లడించింది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పెనాల్టీ విధించే క్రమంలో చివరి దశలో ఉన్నామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పిటిఐకి తెలిపారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 21 రోజుల్లోగా ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆపరేటర్ల పేర్లను వెల్లడి చేయాలని తాము భావించడం లేదన్నారు. మరోవైపు ట్రాయ్ కొత్త నెట్వర్క్ క్వాలిస్ ఆఫ్ సర్వీస్ (QoS) నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైనవని, పరిశ్రమలో టెలికాం ఆపరేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమల సంస్థ కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో, కొన్ని సర్కిళ్లలో అనేకమంది ఆపరేటర్లపై ఫిర్యాదులు స్వల్పంగా తగ్గాయన్నారు. ప్రధాన ఆపరేటర్లు కొత్త నిబంధనలకనుగుణంగా సేవలను అందిస్తున్నారని నమ్ముతున్నామని మాథ్యూస్ చెప్పారు. కాగా కాల్ డ్రాప్స్ నివారణ కోసం టెలికాం నెట్వర్క్ సంస్థలకు మార్గదర్శకాలను ట్రాయ్ విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి టెలికాం ఆపరేటర్ల సేవా నాణ్యతపై ట్రాయ్ నిబంధనలను కఠినతరం చేసింది. వరుసగా 9నెలల పాటు ట్రాయ్ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని ఆపరేటర్లకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఫైన్ విధిస్తారు. నెట్వర్క్ తీరుకు అనుగుణంగానే లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించనున్నామని ట్రాయ్ వెల్లడించింది. కాల్ కట్ అయినా, అది నమోదు కాకుండా చూసుకునేందుకు టెలికాం ఆపరేటర్లు వినియోగిస్తున్నారని ఆరోపణలున్న రేడియో లింక్అవుట్ టెక్నాలజీ (ఆర్ఎల్టీ)కి ప్రమాణాలు నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
టెలికాం కంపెనీల్లో వారికి కోటి పైగా వేతనం
న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా దేశీయ టెలికాం పరిశ్రమ ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో తెలిసిందే. తమ నష్టాలను తగ్గించుకోవడానికి టెల్కోలు భారీ ఎత్తున్న ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. 2017 రిపోర్టు ప్రకారం దాదాపు లక్షా 50 మంది ఉద్యోగులను టెల్కోలు తీసివేయనున్నాయని నిపుణులు అంచనావేశారు. 2018-19లో తొలి మూడు క్వార్టర్లో మరో 90 వేల మందిపై వేటు పడనుందని కూడా అంచనాలు వచ్చాయి. దీంతో ఈ పరిశ్రమలో భారీ ఎత్తున్న ఉద్యోగులను తీసివేస్తున్నారని ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ ఆందోళన నేపథ్యంలో ఎకనామిక్ టైమ్స్ ఓ కొత్త రిపోర్టు వెల్లడించింది. మూడు అతిపెద్ద టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోలు ఈ ఏడాది చివరి వరకు 2 వేల మంది కంటెంట్ స్పెషలిస్ట్‌ను చేర్చుకోనున్నాయని తాజా రిపోర్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను టెల్కోలను నియమించుకుంటున్నాయని వెల్లడించింది. ఈ నిపుణులను అటు సిలికాన్ వ్యాలీ నుంచైనా.. ఇటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) నుంచైనా చేర్చుకోవాలని చూస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. వీరికి ప్యాకేజీ కూడా భారీ ఎత్తునే ఉండనుంది. కోటికి పైగా ప్యాకేజీలను ఈ దిగ్గజ కంపెనీలు ఆఫర్ చేయబోతున్నాయట. స్పోర్ట్స్, మ్యూజిక్, మూవీస్ వంటి వివిధ రకాల కంటెంట్‌ను సబ్స్క్రైబర్లకు ఆఫర్ చేసే క్రమంలో డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది. వచ్చే నెలల్లో టెల్కోలు, కంటెంట్ లైబ్రరియన్లను, బ్రాడ్‌కాస్టర్ రిలేషన్‌షిప్స్‌ను ఎవరైతే నిర్వహిస్తారో వారిని నియమించుకోనున్నాయని ఏటీ కియర్నీ డిజిటల్ ప్రాక్టిస్, లీడ్ కమ్యూనికేషన్స్ అజయ్ గుప్తా చెప్పారు. యాప్ డిజైనింగ్, యూజర్ ఇంటర్ఫేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్సనలైజేషన్, ఇంజిన్ డిజైన్ రికమండేషన్ వంటి యాప్-సెంట్రిక్ స్కిల్స్ కలిగిన వారిని నియమించుకోవాలని ఎయిర్టెల్ చూస్తోందని తెలుస్తోంది. రిలయన్స్ జియో కూడా.. ఎడ్యుకేషన్, వొకేషన్ ట్రైనింగ్‌కు సబంధించిన మార్కెట్ ప్రొగ్రామ్స్‌ను నియమించుకోవాలని చూస్తోంది. ఇటీవలే వొడాఫోన్ ఇండియా తన కంపెనీలో కంటెంట్ టీమ్ వైస్ ప్రెసిడెంట్‌ను నియమించుకుంది. -
టెలికం నిరుద్యోగులకు ప్రత్యామ్నాయాలు!
ముంబై: టెలికం రంగంలో ఉద్యోగాల కోత... ఈ వార్తను ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఇది ఆందోళనకరమైన అంశమని, ఈ రంగంలో ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించటానికి ప్రయత్నిస్తున్నామని టెలికం శాఖ అత్యున్నత స్థాయి అధికారి ఒకరు చెప్పారు. టెలికంలో ఉద్యోగాల కోత 90,000గా ఉండొచ్చనే అంచనాలున్న నేపథ్యంలో టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ మాట్లాడుతూ... ‘‘ప్రత్యామ్నాయాలు మూడు స్థాయిల్లో ఉంటాయి. రిటైల్ ఔట్లెట్స్ వంటి దిగువ స్థాయిలో ఉన్నవారిపై తొలుత దృష్టి పెడతాం. వారి భవిష్యత్‌కు భరోసానిస్తాం’’ అని చెప్పారామె. శుక్రవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... టెలికం రంగాన్ని స్థిరీకరించడమే తొలి ప్రాధాన్యమని, కొత్త టెలికం పాలసీతో ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ‘భారత్‌నెట్, పబ్లిక్ వై–ఫై తదితరాల ద్వారా నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం. దిగువ స్థాయిలో ఉన్న వారికి కొత్త అవకాశాలను అందిస్తాం’ అని వివరించారు. -
టెలిఫోన్ లేని ప్రపంచం ఊహిద్దామా?
మానవచరిత్రలో మార్చి 10, 1876 ఒక మైలురాయి. ఆరోజు అలెగ్జాండర్ గ్రాహంబెల్ తాను రూపొందించిన టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తొలి మాటలు కమ్ హియర్ వాట్సాన్, ఐ వాంట్ యూ!. యూరోపియిన్ కమిషన్ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శాతం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలిఫోన్ల రంగంపై ఆధారపడి ఉంది. ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ 2006 సంవత్సరానికి ప్రమోటింగ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీని లక్ష్యంగా ఎంచుకున్నది. గ్లోబల్ టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ సుమారు 220 దేశాల్లో నిరాటంకంగా పనిచేస్తోంది. ఇప్పుడు భూమి మీదే కాకుండా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సముద్రం లోపల కూడా విస్తరించింది. టెలిగ్రాఫ్, టెలెక్స్ టెలిఫోన్, టెలివిజన్ మొదలైన ప్రత్యేక వ్యవస్థలు ప్రత్యేక కేబుల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఒకప్పుడు తీగెల ఆధారంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేది. నేడు వైర్లెస్, సెల్‌ఫోన్ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. నేడు సెల్‌ఫోన్ లేని వ్యక్తి లేడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నవారితో క్షణాల్లో సెల్ఫోన్లో మాట్లాడటం, ఛాటింగులు చేయడం, వీడియో కాల్ చేయడం, వీడియోలు పంపడం సులభతరంగా మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అన్ని రకాల సెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. కొండలు, గుట్టలపైన కూడా సెల్ఫోన్లు పనిచేస్తున్నాయి. సెల్ఫోన్ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవసరం మేరకే ఫోన్లను వాడితే మంచిది. అనవసర కబుర్లను ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడుకోవడమే మేలు. (నేడు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం సందర్భంగా) -కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
ఉద్యోగాలు 40 లక్షలు .. పెట్టుబడులు 100 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనతో పాటు భారీగా పెట్టుబడులను రప్పించటమే లక్ష్యంగా కొత్త టెలికం విధానం (ఎన్టీపీ) ముసాయిదా రూపొందింది. 2022 నాటికల్లా ఈ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పించాలని, 5జీ సర్వీసులు ప్రవేశపెట్టడంతో పాటు 50 ఎంబీపీఎస్ వేగంతో అందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ ఇందులో ప్రతిపాదించింది. అలాగే నియంత్రణపరమైన సంస్కరణలతో డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 2022 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్దేశించుకుంది. ‘జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం 2018’ పేరిట ఆవిష్కరించిన ముసాయిదా పాలసీలో ఈ మేరకు పలు ప్రతిపాదనలున్నాయి. దాదాపు రూ. 7.8 లక్షల కోట్ల రుణభారంతో కుంగుతున్న టెల్కోలకు ఊరటనిచ్చే దిశగా స్పెక్ట్రం చార్జీలు సహా పలు లెవీలను క్రమబద్ధీకరించేలా హామీలున్నాయి. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీ మొదలైన వాటన్నింటినీ సమీక్షించేలా పాలసీలో ప్రతిపాదించారు. దీని ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతంగా ఉన్న టెలికం రంగం వాటాను 8 శాతానికి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. నియంత్రణపరమైన ప్రతిబంధకాల తొలగింపు.. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడుల రాకకు, కొత్త ఆవిష్కరణలకు నియంత్రణపరమైన ప్రతిబంధకాలను తొలగించేలా టెలికం విధానం ముసాయిదాలో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా తీసుకోనున్న చర్యలను ప్రస్తావిస్తూ.. ‘డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో సముచిత పోటీ ఉండేలా చూడటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు నియంత్రణ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉండాలన్న విషయం దృష్టిలో ఉంచుకుని పాలసీ రూపొందించడం జరిగింది. ఈ రంగంలో పెట్టుబడులు భారీగా అవసరమవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకునే దీర్ఘకాలికమైన, మెరుగైన, నిలకడగా కొనసాగే పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు ఉండాలన్నది పాలసీ లక్ష్యం’ అని టెలికం విధానం ముసాయిదాలో పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ పరికరాలు, ఇన్ఫ్రా, సర్వీసులపై విధిస్తున్న పన్నులు, సుంకాలను క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను నిర్మించే క్రమంలో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీపీ సత్వర అమలు కీలకం: సీవోఏఐ ఎన్టీపీలో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించాలంటే.. సుంకాలను 10%కన్నా తక్కువకి తగ్గించడంతో పాటు ప్రతిపాదిత విధానాన్ని వేగవంతంగా అమల్లోకి తేవాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) అభిప్రాయపడింది. ‘ప్రస్తుతం మొత్తం పన్నులు, సుంకాలు కలిపి సుమారు 30% దాకా ఉంటున్నాయి. ముసాయిదా విధానంలో నిర్దేశించుకున్న పెట్టుబడుల లక్ష్యాలను సాధించాలంటే వీటిని పది శాతం కన్నా తక్కువకి పరిమితం చేయడం కీలకం’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పేర్కొన్నారు. జులై ఆఖరు నాటికల్లా టెలికం విధానం పూర్తిగా ఖరారై, అమల్లోకి రావాలని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికం పరిశ్రమ కోరుకుంటోందని ఆయన చెప్పారు. ఎన్టీపీ ముసాయిదాకు మొబైల్ పరిశ్రమ నుంచి పూర్తి మద్దతు ఉందన్నారు. ల్యాండ్‌లైన్ పోర్టబిలిటీ.. దాదాపు 50 శాతం కుటుంబాలకు ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవాలని, ల్యాండ్‌లైన్ పోర్టబిలిటీ సేవలు కూడా ప్రవేశపెట్టాలని టెలికం శాఖ ఎన్టీపీలో ప్రతిపాదించింది. 2020 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు 1 జీబీపీఎస్ స్పీడ్‌తోనూ, 2022 నాటికి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించాలని పాలసీలో సిఫార్సులు ఉన్నాయి. టెలికం సంస్థలు.. కమ్యూనికేషన్స్ సేవలను చౌకగా, నిలకడగా అందించేందుకు వెసులుబాటు కల్పించేలా స్పెక్ట్రం ధరలను సముచిత స్థాయిలో ఉండే విధానాన్ని అమలు చేయాలని టెలికం శాఖ భావిస్తోంది. -
భారత్‌లో సర్వర్ల ఏర్పాటు తప్పనిసరి
న్యూఢిల్లీ: భారతీయుల డేటాకు మరింత భద్రత కల్పించే దిశగా డేటా హోస్టింగ్ సంస్థలన్నీ దేశీయం గా సర్వర్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం చర్యలు తీసుకోనుంది. దీనికోసం 2022 దాకా గడువిస్తూ మే 1న ప్రకటించే కొత్త టెలికం విధానం ముసాయిదాలో నిబంధనలు పొందుపర్చనుంది. ఇందులో దేశీ యూజర్లకు సంబంధించిన మెసేజ్‌లు, ఈమెయిల్స్ మొదలైన వివరాలన్నీ దేశీయంగానే ఉండేలా... సర్వర్లను ఇక్కడే ఏర్పాటు చేయాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్స్‌కు ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యం మొదలైనవి అందరికీ సులభతరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డేటా ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగానే ఈ మేరకు సూచనలు చేయొచ్చని పేర్కొన్నారు. డేటా భద్రతకు లోకలైజేషన్ కీలకం: పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి దేశంలో డిజిటల్ పేమెంట్ సర్వీసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కన్సూమర్ డేటా గోప్యతకు, భద్రతకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లందరూ డేటా లోకలైజేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని, దీనిపై ఇన్వెస్ట్ చేయాలని పేటీఎం పేర్కొంది. ‘‘భారతదేశపు పేమెంట్ వ్యవస్థల భద్రతకు డేటా లోకలైజేషన్ కీలకం. దేశంలో కస్టమర్లకు పేమెంట్ సేవలను అందించాలనుకుంటున్న ప్రతి సంస్థ ఈ నిబంధనను కచ్చితంగా అనుసరించాలి’’ అని పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు -
బ్రాడ్‌బాండ్ నేలపై కొత్త వార్!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచనాలకు తెరతీసిన రిలయన్స్ జియో ఇప్పుడు చౌక ధర 4జీ స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐవోటీ, బ్రాడ్‌బాండ్, క్రిప్టోకరెన్సీ వంటి పలు రకాల ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. వీటిలో ప్రస్తుతం బ్రాడ్‌బాండ్ సర్వీసులకు అధిక ప్రాధాన్యమిస్తూ... ఫైబర్–టు–హోమ్ ద్వారా దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. జియో ఈ ఏడాది చివరిలో ఫైబర్–టు–హోమ్ వాణిజ్య సేవలను ప్రారంభించవచ్చన్నది కంపెనీ వర్గాల సమాచారం. ‘జియో దృష్టంతా ఫైబర్–టు–హోమ్‌పైనే ఉంది. తక్కువ కాలంలోనే 16.8 కోట్ల వైర్లెస్ సబ్స్క్రైబర్లను దక్కించుకుని... ఇపుడు గృహాలకు వైర్డ్ ఇంటర్నెట్ సేవలు అందించడంపై ఫోకస్ పెట్టింది. ఈ సర్వీసుల ఆవిష్కరణకి సంబంధించి డిసెంబర్ 28న అధికారిక ప్రకటన వెలువడొచ్చు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ట్రయల్స్ మొదలు... రిలయన్స్ జియో.. వైర్డ్ బ్రాడ్‌బాండ్ సర్వీసులకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్‌ను ప్రారంభించింది. న్యూఢిల్లీ, ముంబైలలో బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తోంది. రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్ను ఆఫర్ చేస్తోంది. ‘వైర్డ్ బ్రాడ్‌బాండ్ సేవల కోణంలో చూస్తే మనం వెనుకబడి ఉన్నాం. కనీసం 20 కోట్ల గృహాల్లో ఈ సేవలుండాలని మేం కోరుకుంటున్నాం’ అని రిలయన్స్ జియో గ్లోబల్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ డెవలప్మెంట్, నెట్వర్క్ ప్రెసిడెంట్ మథ్యూ ఊమ్మెన్ చెప్పారు. బ్రాడ్‌బాండ్‌తో ఆదాయం మెరుగు... బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తే రిలయన్స్ జియో స్థూల ఆదాయం మూడేళ్లలో రూ.4,000 కోట్లు పెరగొచ్చని బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ ఇండియా అంచనా వేసింది. ఇక్కడ వైర్డ్ ఇంటర్నెట్ సర్వీసుల వ్యాప్తి చాలా తక్కువగా ఉండటం జియోకి కలిసొచ్చే అంశం. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి ఇండియాలో 2.12 కోట్ల వైర్డ్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లున్నారు. అదే వైర్లెస్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య 42.46 కోట్లుగా ఉంది. వైర్డ్ ఇంటర్నెట్ విభాగంలో భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) 93.8 లక్షల యూజర్లతో 52.53 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీని తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్టెల్ (10.12 శాతం వాటా), అట్రియ కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (ఏసీటీ) (6.02 శాతం) ఉన్నాయి. డేటా వినియోగం పెరుగుతోంది.. దేశంలో గత ఏడాది కాలంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. 2017 అక్టోబర్–డిసెంబర్లో ఒక నెలలో ఒక సబ్‌స్క్రైబర్ సగటు డేటా వినియోగం 1,945 ఎంబీగా ఉంది. అదే 2016 అక్టోబర్–డిసెంబర్‌కు వచ్చేసరికి ఇది 878 ఎంబీ మాత్రమే. డేటా వినియోగం పెరుగుతుండటంతో దీన్ని అందిపుచ్చుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. అందుకే తన డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ జియో మ్యూజిక్కు మ్యూజిక్ యాప్ సావన్‌ను అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసింది. కంటెంట్‌కు డిమాండ్.. ఫైబర్ బెటర్ కంటెంట్‌కు అధిక డిమాండ్ ఉండటంతో వైర్లెస్ కన్నా ఫైబర్ మెరుగైనదని కన్సల్టింగ్ సంస్థ కమ్‌ఫస్ట్ ఇండియా డైరెక్టర్ మహేశ్ ఉప్పల్ చెప్పారు. ఫైబర్ సామర్థ్యాన్ని సులభంగా విస్తరించుకోవచ్చంటూనే... ఫైబర్ వ్యాపారం కష్టతరమైందని అభిప్రాయపడ్డారు. ‘ఫైబర్ విధానంలో ప్రతి లొకేషన్‌కు భౌతికంగా వెళ్లాలి. అండర్ గ్రౌండ్ ఫైబర్ ఏర్పాటు సవాళ్లతో కూడుకున్నది. అనుమతులు కావాలి. ఖర్చులెక్కువ. ఆలస్యం కూడా కావచ్చు’’ అన్నారాయన. అయితే ఒక్కసారి విజయవంతమైతే.. మార్కెట్ నుంచి అధిక రివార్డులను ఆశించొచ్చని తెలిపారు. చిన్న పట్టణాలపై డెన్ నెట్వర్క్స్ దృష్టి పెద్ద కంపెనీలు మెట్రో నగరాల్లో మార్కెట్‌ను దక్కించుకుంటుండటంతో కేబుల్ టీవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డెన్ నెట్వర్క్స్ తన దృష్టిని చిన్న పట్టణాలకు మరల్చింది. వచ్చే మూడేళ్లలో టైర్–2, టైర్–3 పట్టణాల్లో బ్రాడ్‌బాండ్ సేవలందించాలని చూస్తోంది. దీనికోసం స్థానిక కేబుల్ ఆపరేటర్లతో జతకడుతోంది. ట్రాయ్ ప్రకారం.. దేశంలో డిసెంబర్ చివరి నాటికి 156 మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లున్నారు. వైర్డ్ ఇంటర్నెట్ విభాగంలో వాణిజ్య సేవలు అందించనప్పటికీ మొత్తం ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల విషయంలో జియో 35.9 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించింది. దీని తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్టెల్ (22.12 శాతం) ఉంది. స్పీడ్ పెంచిన ఎయిర్టెల్ జియో ప్రత్యర్థి ఎయిర్టెల్ 89 పట్టణాల్లో 21 లక్షల మంది యూజర్లకు 100 ఎంబీపీఎస్ వరకు స్పీడ్‌తో వైర్డ్ బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తోంది. డిసెంబర్ చివరి నాటికి ఎయిర్టెల్ తన హోమ్స్ సర్వీసెస్ విభాగం ద్వారా ఒక యూజర్ నుంచి సగటున రూ.948 ఆదాయం పొందింది. తన హోమ్ సర్వీసెస్ విభాగంలో బ్రాడ్‌బాండ్ కస్టమర్లది 93.5 శాతం వాటా. దీంతో ఎక్కడి నుంచైతే మంచి ఆదాయం వస్తుందో.. ఆ ప్రాంతాల్లోనే ఇది అధిక దృష్టి పెట్టింది. గతవారం సరికొత్త సూపర్‌ఫాస్ట్ హోమ్ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 300 ఎంబీపీఎస్ వరకు స్పీడ్‌తో నెలకు రూ.2,990 ధరతో 1,200 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఎయిర్టెల్ ఓటీటీ యాప్స్, వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ ఉచిత సబ్స్క్రిప్షన్ ఉంది. -
ఆశలు చిగురించాయి : కోటికి పైగా ఉద్యోగాలు
కన్సాలిడేషన్ ప్రక్రియతో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్న టెలికాం ఇండస్ట్రిలో ఆశలు చిగురిస్తున్నాయి. టెలికాం ఇండస్ట్రీ వచ్చే ఐదేళ్లలో కోటికి పైగా ఉద్యోగవకాశాలను కల్పించనుందని ఈ రంగానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ బాడీ పేర్కొంది. టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం 40 లక్షల మంది ఉద్యోగాలు పొందుతున్నారని, వచ్చే ఐదేళ్లలో టెలికాం, టెలికాం తయారీలో 1.4 కోట్ల మంది ఉద్యోగవకాశాలు పొందనున్నారని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈవో ఎస్ పీ కొచ్చర్ తెలిపారు. అయితే గతేడాది టెలికాం రంగం భారీగా 40వేల ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలలు ఇదే ట్రెండ్ కొనసాగి, మొత్తంగా 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని సీఐఈఎల్ హెచ్ఆర్ రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్టుల నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో టెలికాం రంగం భారీగా ఉద్యోగవకాశాలు కల్పించనుందని తెలియడం నిరుద్యోగులకు గుడ్‌న్యూసేనని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. వచ్చే ఐదేళ్లలో క్రియేట్ కాబోయే ఉద్యోగాల్లో ఎక్కువగా డిమాండ్ మిషన్ టూ మిషన్ కమ్యూనికేషన్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలో ఉండనుంది. అనంతరం టెలికాం తయారీ, మౌలిక సదుపాయాలు, సర్వీసెస్ కంపెనీల్లో డిమాండ్ ఎక్కువగా ఉండనున్నట్టు కొచ్చర్ చెప్పారు. ఎక్కువ తయారీ ప్రక్రియ భారత్‌కు వచ్చే సూచనలు ఉన్నాయని, దీంతో టెలికాం రంగం ఎక్కువ అవకాశాలను సృష్టించనుందని తెలిపారు. ట్రైనింగ్ అనంతరం కల్పించే ఉద్యోగవకాశాల్లో ప్రభుత్వం తన విధానం మార్చుకోవాలని టెలికాం సెక్టార్ స్కిల్ బాడీ ప్రతిపాదించింది. ఒకవేళ వర్క్‌ఫోర్స్ ఎక్కువ స్కిల్‌తో ఉంటే, టెలికాం సెక్టార్ అట్రిక్షన్ విషయంలో భయపడాల్సి ఉంటుందని కొచ్చర్ అన్నారు. ఆ భయాందోళనలను తగ్గించడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
ఐదేళ్లలో టెలికం రంగంలో కోటి ఉద్యోగాలు
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమలో ఇటీవలి కాలంలో జియో రాక తర్వాత భారీ స్థిరీకరణతో ఉద్యోగాలకు నష్టం ఏర్పడగా, వచ్చే ఐదేళ్లలో మాత్రం ఏకంగా కోటి ఉద్యోగాల కల్పన జరుగుతుందని టెలికం రంగ నైపుణ్య మండలి అంటోంది. ‘‘టెలికం రంగంలో 40 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. ఐదేళ్ల తర్వాత టెలికంలో, టెలికం రంగ తయారీలోనూ కలిపి ఉపాధి పొందే వారి సంఖ్య 1.43 కోట్లు ఉంటుంది’’ అని టెలికం రంగ నైపుణ్య మండలి (టీఎస్ఎస్సీ) సీఈవో ఎస్పి కొచర్ తెలిపారు. జాతీయ నైపుణ్య శిక్షణ కార్పొరేషన్ పరిధిలో టీఎస్ఎస్సీ పనిచేస్తోంది. మెషిన్ నుంచి మెషిన్ మధ్య సమాచారం, టెలికం తయారీ, మౌలిక సదుపాయలు, సేవల విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని తాము అంచనా వేస్తున్నట్టు కొచర్ చెప్పారు. తయారీ రంగ అవకాశాలు భారత్‌కు వస్తున్నాయని, దీంతో టెలికం రంగంలో ఉపాధి అవకాశాలపై ఎక్కువ ఆశాభావంతో ఉన్నట్టు పేర్కొన్నారు. -
చాలా వేగంగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ
మొబైల్ నెంబర్‌ను పోర్టబులిటీ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి ఈ ప్రక్రియ చాలా తేలికగా, వేగంగా అయిపోనుందని తెలుస్తోంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ మెకానిజాన్ని(ఎంఎన్‌పీ) సమీక్షించాలని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. ఎంఎన్‌పీ కింద ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారడానికి సమయాన్ని తగ్గించేందుకు ట్రాయ్ ఓ కన్సల్టేషన్ పేపర్ కూడా రూపొందిస్తోంది. ఇది మొత్తం ప్రక్రియను సులభతరం చేయనుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, ఈ సమయాన్ని తగ్గించడంతో పాటు, మొత్తం ప్రక్రియను మార్చాలని కన్సల్టేషన్ పేపర్ లక్ష్యంగా పెట్టుకుందని శర్మ అన్నారు. ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నామని, ఈ నెలాఖరి వరకు ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. అంతకముందే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఛార్జీలను ట్రాయ్ 79 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అంతకముందు 19 రూపాయలుగా ఉన్న ఎంఎన్‌పీ ఛార్జీలను ప్రస్తుతం గరిష్టంగా 4 రూపాయలు ఉండేలా నిర్ణయించింది. దీనిపై ఇండస్ట్రి అభిప్రాయాలను కూడా ట్రాయ్ స్వీకరిస్తోంది. మొత్తం ఎంఎన్‌పీ ప్రక్రియ ఎలా సులభతరంగా, వేగంగా చేయాలో కూడా ట్రాయ్ ఇండస్ట్రి అభిప్రాయాలను కోరుతోంది. ప్రస్తుతం ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారడానికి ఏడు రోజుల సమయం పడుతోంది. కానీ గ్లోబల్‌గా ఈ ప్రక్రియకు కేవలం గంటల వ్యవధి మాత్రమే సమయం పడుతుందని ట్రాయ్ అధికారులు చెప్పారు. ఎంఎన్‌పీ కింద నెంబర్‌ను మార్చుకోవాల్సినవసరం లేకుండా ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు పోర్టబులిటీ పెట్టుకోవచ్చు. గత కొన్ని నెలలుగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, ఎయిర్‌సెల్ ఆపరేటర్ల సబ్స్క్రైబర్లు తమ నెంబర్లను పోర్టబులిటీ పెట్టుకోవడానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. -
ప్రజలు సబ్సిడీకి బానిసలయ్యారు
సాక్షి, అమరావతి: ప్రజలు సబ్సిడీలకు(రాయితీలకు) బానిసలయ్యారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీ వంటి వాటికి అలవాటు పడిపోయారని చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాల్లో ఈ–ప్రగతి–ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. టెలికం రంగంలోకి రావాలని ధీరూబాయ్ అంబానీకి చెప్పింది తానేనన్నారు. అప్పట్లో తన నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సుల వల్లే దేశంలో టెలికం సంస్కరణలు అమల్లోకి వచ్చాయన్నారు. దానివల్లే ప్రస్తుతం ప్రజలకు ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామిక విప్లవం రావడంలోనూ తన కృషి ఉందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో మొదలైన స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం తన ఆలోచనేనని చెప్పుకొచ్చారు. వారికి నేనే వడ్డించా.. : ఒరిజినల్ ఐఎస్బీ సర్టిఫికెట్ పొందడం చాలా కష్టమని, కానీ ఇక్కడ సులభంగా డిగ్రీ పొందారని సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన అధికారులను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. ఐఎస్బీ క్యాంపస్‌ను ముంబయి, చెన్నై, బెంగళూరులో పెట్టాలనుకుంటే తాను చాలా కష్టపడి హైదరాబాద్‌కు తీసుకొచ్చానని తెలిపారు. ఆ సమయంలో మెకంజీ వాళ్లను కాఫీకి పిలిచానని, సర్వర్లను కూడా వెళ్లిపొమ్మని, తానే వారికి అన్నీ వడ్డించానని, చివరికి హైదరాబాద్‌లో ఐఎస్బీ పెట్టేందుకు ఒప్పించానని చెప్పారు. హోదా, హామీలు.. మన హక్కులు: చాలా కష్టాలున్నాయని, కేంద్రం డబ్బులివ్వడం లేదని బాబు వెల్లడించారు. ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలన్నీ మన హక్కులని తెలిపారు. వీటికోసం పోరాడుతూనే లక్ష్యం ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 96 మంది అధికారులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. -
భారత్‌లో టెలికం వ్యాపారం కష్టం
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార నిర్వహణ సులభంగా ఉండటం) పరిస్థితులు లేవని సెల్యులర్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలు కిందిస్థాయిల్లో అమలు కావడం లేదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. పురపాలక సంఘాలు, పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అనుసరించడంలేదని, టెలికం నెట్వర్క్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ‘బెంగళూరులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు ఒక ప్రాంతాన్ని తవ్వాలనుకున్నాం. మార్కెట్ ధరకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపాం. కానీ వారు చాలా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయడం ఎలా సాధ్యమౌతుంది’ అని ప్రశ్నించారు. ‘కొన్ని రాష్ట్రాలు టెలికం నెట్వర్క్స్ ఏర్పాటుకు అనువుగా ఉండే పాలసీలు కలిగి ఉన్నాయి. వీటితో సమస్య లేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో సమస్య ఉంది’ అని తెలిపారు. టెలికం విభాగం నోటిఫై చేసిన నిబంధనలను ఒడిశా, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు కూడా త్వరలో ఈ జాబితాలో చేరొచ్చన్నారు. కాల్ డ్రాప్స్ కట్టడికి టెలికం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాల్ డ్రాప్స్‌కి టెలికం నెట్వర్క్స్ మాత్రమే కారణం కాదని, ఇతర అంశాల ప్రభావం కూడా ఉంటుందన్నారు. అయితే నిబంధనలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. 2జీ, 3జీ టెక్నాలజీలో కన్నా వీవోఎల్టీఈ వంటి డేటా ఆధారిత నెట్‌వర్క్స్‌లో కాల్ డ్రాప్స్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. -
రూ.500కే స్మార్ట్ఫోన్లు, అసలు భారమెంత?
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం ఆపరేటర్లు రూ.500 కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో లాంచ్‌చేసిన జియోఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఈ కసరత్తు చేస్తున్నాయని తెలిసింది. కానీ 500 రూపాయలకే స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్న ఈ కంపెనీలకు, అసలెంత భారం పడుతుందో వివరిస్తూ.. టెలికాం ఇండస్ట్రీ అంచనాలు విడుదల చేసింది. ఈ అంచనాల్లో కంపెనీ భరించబోయే భారం చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తేలింది. ఎంట్రీ-లెవల్ 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి సగటును 3వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఈ డివైజ్‌లకు కనుక ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేస్తే.. దీని ఖర్చు 2700 రూపాయలకు తగ్గవచ్చు. కానీ దీని కంటే ఐదింతల తక్కువ రేటుకు అంటే 500 రూపాయలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్ చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఇలా 500 రూపాయలకే స్మార్ట్ఫోన్లను అందించడం వల్ల టెలికాం కంపెనీలు దాదాపు 26వేల కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన టెలికాం పరిశ్రమకు, ఈ సబ్సిడీ అదనపు భారమని, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక రుణాలు కూడా మరో రూ.5 లక్షల కోట్లకు పెరుగుతాయని పేర్కొంటున్నారు. నెలకు 60 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో ఈ డివైజ్‌లను టెలికాం కంపెనీలు ప్రవేశపెట్టబోతున్నాయి. అంటే ఏడాదికి 117 మిలియన్ యూజర్ల నుంచి రూ.8,424 కోట్లను టెలికాం కంపెనీలు రికవరీ చేసుకోవచ్చు. దీని ప్రకారం కంపెనీలు ఆఫర్ చేసిన మొత్తం సబ్సిడీని రికవరీ చేసుకోవాలంటే దాదాపు మూడేళ్లకు పైగానే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదీ కూడా కస్టమర్ ఒకే ఆపరేటర్‌ను వాడితే తప్ప, ఆ రికవరీ సాధ్యం కాదు. మరోవైపు భారీగా పెరుగుతున్న పోటీతర వాతావరణ నేపథ్యంలో, రికవరీ కాలం మరింత పెరిగినా ఆశ్చర్యం పోక్కర్లేదని తెలుస్తోంది. మొత్తం 1.2 బిలియన్ మంది వైర్లెస్ సబ్‌స్క్రైబర్లుండగా.. 780 మిలియన్ల మంది ఫీచర్ ఫోన్ వాడుతున్నారు. దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ వాడకం తక్కువగా ఉందని, ఇంటర్నెట్ ఎనాబుల్డ్ ఫోన్లను ఎక్కువగా ప్రజలకు ఆఫర్ చేయాల్సినవసరం ఉందని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనాలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. -
ఏడాదిలో 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ సంవత్సరాంతానికి 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి వస్తాయని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ చెప్పారు. ప్రతి గ్రామానికీ వైఫై హాట్‌స్పాట్ సదుపాయం ఉంటుందని చెప్పుకొచ్చారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో వెనుకబడిన భారత్ ఈ ఏడాది అద్భుత పురోగతి సాధిస్తుందన్నారు. 4జీ నెట్‌వర్క్‌కు వేగంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు టెలికాం కంపెనీలతో కసరత్తు సాగిస్తున్నామన్నారు. ఆప్టిక్ ఫైబర్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత గ్రామాలకూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా భారత్ నెట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. కాల్ డ్రాప్స్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టెలికాం సేవల్లో నాణ్యత పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపడతామన్నారు. -
మన్మోహన్ మౌనాన్ని ప్రశ్నించిన రాజా
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి టెలికం పాలసీని సమర్థించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ ఉద్దేశపూర్వక మౌనం వహించడాన్ని టెలికం మాజీ మంత్రి ఏ.రాజా ప్రశ్నించారు. 2జీ కుంభకోణం వాస్తవాల పేరిట ఆయన రాసిన పుసక్తం ‘2జీ సాగా అన్పోల్డ్స్’లో పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. కేసు విచారణ సమయంలో రాసిన ఈ పుసక్తంలో అప్పటి కాగ్ వినోద్ రాయ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ పుసక్తం విడుదల కావాల్సి ఉంది. స్పెక్ట్రం కేటాయింపులపై సీబీఐ దాడులకు సంబంధించి మన్మోహన్‌కు కూడా ఎలాంటి సమాచారం లేదని రాజా తెలిపారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం వినోద్ రాయ్‌తో రాజీపడి పనిచేసిందని, స్పెక్ట్రం కేటాయింపుల ఖాతాల తనిఖీ సందర్భంగా వేరే ఉద్దేశాలు పెట్టుకుని రాజ్యాంగ విధుల నిర్వహణలో రాయ్ అతిగా వ్యవహరించారని రాజా ఆరోపించారు. కొత్త వారికి లైసెన్స్‌లివ్వడం టెలికం లాబీలకు ఇష్టం లేదని తెలిపారు. -
90వేల మంది ఉద్యోగాలు గోవింద
-
తీవ్ర పోటీ : 90వేల మంది ఉద్యోగాలు గోవింద
టెలికాం మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ప్రవేశం అనంతరం టెలికాం కంపెనీలు తీవ్ర అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ రెవెన్యూలను కాపాడుకోలేక సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో కూడా భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని తాజా రిపోర్టు వెల్లడించింది. దాదాపు 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పోటీ వాతావరణం పెరుగడంతో పాటు, మార్జిన్లు తగ్గడంతో, కంపెనీలకు లాభాలు పడిపోయాయని, దీంతో భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ రిపోర్టు పేర్కొంది. ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుందని పేర్కొంది. 65 టెల్కోల, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టెలికాం కంపెనీల వరకు సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టింది. గతేడాది 40వేల మంది టెలికాం రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, ఈ ట్రెండ్ వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు కొనసాగుతుందని, దీంతో 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని పేర్కొంది. వచ్చే రెండు నుంచి మూడు క్వార్టర్ల వరకు అట్రిక్షన్ రేటు ఎక్కువగానే ఉంటుందని బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు తమ కెరీర్ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. లోన్ సర్వీసింగ్‌లో ఎక్కువ వ్యయాలు, మార్కెట్ షేరులో తీవ్ర పోటీ, విలీనాలతో అనిశ్చితకర పరిస్థితులు వంటివి ఉద్యోగాల కోతపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇతర రంగాలతో పోలిస్తే, ఈ రంగంలో వేతనాల పెంపు అంతంతమాత్రంగానే ఉందని కూడా రిపోర్టు పేర్కొంది. ఈ రంగంలో ఉద్యోగాలతో అనిశ్చిత పరిస్థితులతో ఉద్యోగులు వేరే రంగాలపై మొగ్గుచూపుతున్నారని తెలిపింది. -
మొబైల్ సేవలు మరింత ప్రియం?
న్యూఢిల్లీ: టెలికం టవర్లకు పన్ను ప్రయోజనాలు లభించకపోవడం వల్ల సర్వీసులు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని టవర్, మౌలిక సదుపాయాల కల్పన సంస్థల సమాఖ్య టైపా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,000 పైచిలుకు టవర్లు ఏర్పాటు కానుండగా, ఒక్కో దానిపై పన్నుల కింద రూ. 1–1.5 లక్షలు కట్టాల్సి రానుందని తెలిపింది. ఫలితంగా టెలికం సర్వీసుల వ్యయాలు కూడా సుమారు 10 శాతం పెరుగుతాయని కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు చైర్పర్సన్ వనజా ఎన్ సర్నాకి రాసిన లేఖలో టైపా డైరెక్టర్ జనరల్ తిలక్ రాజ్ దువా తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికంయేతర ఇన్ఫ్రా సంస్థలకు ఇస్తున్న కొన్ని పన్ను ప్రయోజనాలను తమకూ వర్తింపచేయాలని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించేలా జీఎస్టీలో తగు సవరణలు చేయాలని కోరారు. భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ టవర్స్, ఏటీసీ మొదలైన వాటికి టైపాలో సభ్యత్వం ఉంది. మొబైల్ టవర్ కంపెనీలు దేశవ్యాప్తంగా 4.5 లక్షల పైగా టవర్ల ఏర్పాటుపై రూ. 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాయని.. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కింద ఏటా రూ. 5,000 కోట్లు చెల్లిస్తున్నాయని దువా తెలిపారు. స్పెక్ట్రం హోల్డింగ్ పరిమితి పెంపునకు కమిషన్ మొగ్గు! రుణాల్లో కూరుకున్న టెల్కోలు వైదొలిగేందుకు వెసులుబాటు కల్పించే దిశగా.. ఆపరేటర్ల స్పెక్ట్రం హోల్డింగ్ పరిమితిని పెంచాలన్న ట్రాయ్ సిఫార్సులపై టెలికం కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టెలికం కమిషన్ ముసాయిదా ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి ఈ వారంలో పంపే అవకాశాలు ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఏరియాలో ఏ ఆపరేటరుకూ 25 శాతానికి మించి స్పెక్ట్రం ఉండటానికి వీల్లేదు. అయితే, నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లో దీన్ని 50 శాతానికి పెంచాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. -
రేపటి నుంచి మొబైల్ సర్వీసులు బంద్?
కొత్త ఏడాది సంబురం ఇంకా పూర్తిగా తీరనేలేదు. అప్పుడే ప్రజల్లో కలవరపెట్టే మెసేజ్‌లు. టెలికాం సబ్స్క్రైబర్లను టార్గెట్‌గా చేస్తూ... ఎస్ఎంఎస్ల వెల్లువ కొనసాగుతోంది. ఈ మెసేజస్‌లోని సందేశం.. జనవరి 7 నుంచి మీ నెంబర్‌పై వాయిస్ సర్వీసులు ఆగిపోనున్నాయని. ఇతర నెట్‌వర్క్‌లోకి మీ నెంబర్‌ను మార్చుకుంటేనే పనిచేస్తాయంటూ ఆందోళనకర మెసేజ్‌లు వస్తున్నాయి. అన్ని టెలికాం ఆపరేటర్లకు ఈ మెసేజ్‌లు వెళ్తున్నాయి. దీంతో వెంటనే కస్టమర్లు ట్విట్టర్ వేదికగా టెలికాం కంపెనీలకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. అయితే ఈ మెసేజ్‌లను టెలికాం కంపెనీలు పంపడం లేదట. యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు, అది తప్పుడు మెసేజ్‌లను అని, యూజర్లు ఆ మెసేజ్‌ను పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాయి. వాటిని తాము పంపడం లేదని కూడా పేర్కొన్నాయి. ఎయిర్టెల్ ప్రతినిధి ఆ మెసేజ్‌ను ఓ స్పామ్‌గా ధృవీకరించారు. టాటా డొకోమో, బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లకు కూడా ఈ మెసేజ్‌లు వస్తున్నట్టు తెలిసింది. ఆశ్చర్యకరంగా యూపీసీను జనరేట్ చేసి నెంబర్‌ను వేరే నెట్‌వర్క్‌కు పోర్టు పెట్టుకోవాలంటూ యూజర్లను ఆదేశిస్తున్నాయి. అయితే ఏ ఆపరేటర్‌కు పోర్టు పెట్టుకోవాలో చెప్పడం లేదు. ఒక్క ఆపరేటర్ సబ్‌స్క్రైబర్‌కు మాత్రమే కాక, ప్రతి ఆపరేటర్ యూజర్లకు ఈ మేరకు ఎస్ఎంఎస్లు వస్తుండటం సబ్స్క్రైబర్లను ఆందోళనలో పడేసింది. జనవరి 7 ఫేక్ డెడ్‌లైన్ అని, ఆధార్‌తో మొబైల్ నెంబర్‌ను వెరిఫికేషన్ చేసుకునే ప్రక్రియకు డెడ్‌లైన్ 2018 మార్చి 31 వరకు ఉందని కంపెనీ పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆధార్ లేనివారికైతే, మార్చి 31 డెడ్‌లైన్ కాగ, ఇప్పటికే ఆధార్ కలిగి ఉన్న వారికి సిమ్ వెరిఫికేషన్‌కు ఆఖరి తేది ఫిబ్రవరి 6. ఐవీఆర్ ద్వారా ఆధార్-మొబైల్ నెంబర్ సిమ్ రీ-వెరిఫికేషన్ చేపట్టుకోవచ్చని టెల్కోలు చెప్పాయి. @JioCare received following SMS from IM-INFOKB and HP-INFORM "Dear Customer, Voice services shall stop from 07/01/2018. Continue to use your number you can generate UPC to port in any other Network." Pl advise. — santhosh nair (@nair_san) January 5, 2018 Please ignore and don't believe on such fake messages. We are always here to give you authentic updates - Devendra — JioCare (@JioCare) January 5, 2018 Got a msg on my @VodafoneIN mobile - Dear Customer, Voice services shall stop from 07/01/2018. Continue to use your number you can generate UPC to port in any other Network. Any authenticity in this? — KRD Pravin (@krdpravin) January 5, 2018 This is a spam msg and has not been sent by Vodafone. We request you to ignore this msg & we assure you of continued uninterrupted services. - Harsha — Vodafone India (@VodafoneIN) January 5, 2018 @idea_cares Received sms from IM-INFOKB that "Dear Customer, Voice services shall stop from 07/01/2018. Continue to use your number you can generate UPC to port in any other Network. and IM stands for I-Idea and M-Mumbai. Is idea shutting voice service in mumbai — Kailas Dingankar (@KailasDingankar) January 5, 2018 Sorry for trouble caused to you,We request you to please kindly ignore the message. We have launched new postpaid plans (Nirvana) for our valuable customers.Write us back for further clarification. Regards, Simran.D — Idea Customercare (@idea_cares) January 5, 2018 -
టెల్కోల ఆదాయం 7 శాతం డౌన్
న్యూఢిల్లీ: టెలికం సర్వీస్ ప్రొవైడర్ల స్థూల ఆదాయం 2017 జూలై–సెప్టెంబర్ మధ్యకాలంలో దాదాపు 7% క్షీణతతో రూ.66,361 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో వీటి ఆదాయం రూ.71,379 కోట్లుగా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. వీటి సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) ఏకంగా 17.55% క్షీణతతో రూ.50,539 కోట్ల నుంచి రూ.41,669 కోట్లకు పడింది. త్రైమాసికం పరంగా చూస్తే.. టెల్కోల స్థూల ఆదాయం జూలై–సెప్టెంబర్‌లో పెరిగింది. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వీటి స్థూల ఆదాయం రూ.64,889 కోట్లుగా నమోదయ్యింది. టెల్కోల స్థూల ఆదాయంలో వృద్ధి ప్రకటించడం ఇది వరుసగా రెండో త్రైమాసికం. -
అమ్మో... టెలికం!!
కొందరేమో 2జీని... కుంభకోణాల ముత్తాతగా పిలుస్తారు. కాకపోతే టెలికం కంపెనీలు బిచాణా ఎత్తేయటం వెనకున్న కారణాలన్నిటికీ ఇదే ముత్తాత అని కూడా చెప్పొచ్చు. కొన్నేళ్లుగా మన టెలికం రంగంలో కంపెనీలకు ఘోరమైన దెబ్బలు తగిలాయి. అవెంత తీవ్రమైనవంటే... కొన్ని దివాలా స్థాయికి పోయాయి కూడా. సొంతగా... కొన్ని విదేశీ సంస్థలతో జతకట్టి... వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన సంస్థలు... చివరకు పెట్టుబడి కోల్పోవటమే కాక అప్పులుæ మిగుల్చుకున్నాయి. దేశీ టెలికం రంగం రూ.4.5 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోందంటేనే పరిస్థితి ఈజీగా అర్థమయిపోతుంది. దేశంలో దిగ్గజ సంస్థలైన యూనినార్.. వీడియో కాన్, ఖైతాన్ వంటివి టెలికామ్‌లో మాత్రం అన్నీ రాంగ్ కాల్సే చేశాయి. ఇక విదేశీ దిగ్గజాలకైతే లెక్కలేదు. నార్వే దిగ్గజం టెలినార్. హాంకాంగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ హచ్. రష్యా సంస్థ సిస్టెమా టెలీ (ఎంటీఎస్), మలేసియా నంబర్–1 మ్యాక్సిస్... జపాన్ అగ్రగామి డొకోమో.. ఎమిరేట్స్‌లో జెండా ఎగరేసిన ఎటిసలాట్.. ఇవి భారతీయ మొబైల్ యూజర్‌కు చేసిన కాల్స్ కనెక్టే కాలేదు. ఫలితం... వేల కోట్ల నష్టాలు. అప్పుల కుప్పలు. ఆ కథేంటో వివరించేదే ఈ కథనం.. (సాక్షి, బిజినెస్ విభాగం) : టెలినార్ కథ ఎనిమిదేళ్లలో కంచికి చేరిపోయింది. 13 దేశాల్లో నెట్వర్క్లుండి, 29 దేశాల్లో కార్యకలాపాలున్న ఈ బహుళజాతి ప్రభుత్వ సంస్థ... యూనిటెక్‌తో జట్టుకట్టడమే కలిసిరాలేదని కొందరంటారు. 2008లో 22 సర్కిళ్లకు లైసెన్స్‌లు దక్కించుకున్న యూనిటెక్ వైర్లెస్లో 67.25 శాతం వాటాను రూ.6,500 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయటం ద్వారా దేశంలోకి ప్రవేశించిందీ సంస్థ. రెండేళ్లు తిరక్కుండానే 3 కోట్ల సబ్స్క్రైబర్లు, 13 సర్కిళ్లకు విస్తరించింది. కాకపోతే 2జీ స్కామే దీన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు పలు సర్కిళ్లలో లైసెన్సుల్ని రద్దు చేసినా... మిగతా సంస్థల్లా వెనుదిరిగి వెళ్లిపోకుండా నిలబడింది యూనినార్. కాకపోతే లైసెన్సుల రద్దుతో వచ్చిన నష్టానికి గాను యూనిటెక్కు నోటీసులివ్వటం... ఇద్దరూ కోర్టుకెక్కటం కలిసిరాలేదనే చెప్పాలి. ఫలితం... నామమాత్రపు ధరకు వాటా వదిలేసి యూనిటెక్ వెళ్లిపోయింది. సొంతగా రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి మరిన్ని వేల కోట్లు ఖర్చు చేసినా... వినియోగదారులు మాత్రం పెరగలేదు. రెండో ఇన్నింగ్స్ తొలి 9 నెలల్లోనే రూ.5,825 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఇక జియో ఎంట్రీతో మనుగడ సైతం కష్టమయింది. చివరకు తన నెట్‌వర్క్‌ను భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించేసి... కథ ముగించింది. ఈ డీల్ ద్వారా రూ.2వేల కోట్లవరకూ టెలినార్‌కు దక్కినట్లు తెలుస్తోంది. రూ.23,000 కోట్లకు రూ.420 కోట్లు.. రష్యాకు చెందిన ఎంటీఎస్ కూడా ఇండియాలో సీడీఎంఏ టెక్నాలజీనే ఎంచుకుంది. దేశవ్యాప్త నెట్‌వర్క్‌కు రూ.22,750 కోట్లు ఖర్చుచేసింది. దేశమంతా సర్వీసులు ఆరంభించినా... ఎక్కడా ప్రభావవంతమైన పనితీరు కనబరచలేకపోయింది. నష్టాలు పెరగటంతో చివరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో విలీనమైంది. అది కూడా... ఆర్‌కామ్ తన సంస్థలో 10 శాతం వాటా ఇచ్చింది తప్ప నగదేమీ ఇవ్వలేదు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.470 కోట్లు. హచ్... లాభాలతోనే వైదొలిగింది! హాంకాంగ్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం హచిసన్... దేశంలో ఉక్కు దిగ్గజం ఎస్సార్తో జతకట్టడం ద్వారా టెలికంలోకి దిగింది. వచ్చీ రావటంతోనే భారీ ప్రచార వ్యూహానికి తెర తీసింది. త్వరగానే పలు సర్కిళ్లలో పాగా వేసింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కావటంవల్లో ఏమో!! వచ్చినంత వేగంగానే తన వాటాను 2007లో ఏకంగా 11 బిలియన్ డాలర్లకు యూకే దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించి వైదొలిగింది. 2011లో ఎస్సార్కున్న 33% వాటాను కూడా 5 బిలియన్ డాలర్లు చెల్లించి వొడాఫోన్ కొనుగోలు చేసింది. హచ్–ఎస్సార్... రెండిటిదీ సరైన ఎగ్జిట్గానే చెబుతారు నిపుణులు. మాక్సిస్ దారి ఎటు..? మలేసియా దిగ్గజం మ్యాక్సిస్ది అయోమయ పరిస్థితి. దీనికి ఎయిర్‌సెల్‌లో 74% వాటా ఉంది. భారత్‌లో ఇప్పటిదాకా రూ.47,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. జియో ప్రవేశంతో రాబడులు దారుణంగా పడిపోవటంతో భారత్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఆర్‌కామ్‌తో డీల్ చేసుకున్నా... దానికి నియంత్రణ సంస్థలు మోకాలడ్డాయి. ఇప్పటికీ రూ.15,500 కోట్లకుపైగా రుణభారం మోస్తున్న ఈ సంస్థకు భవిష్యత్ అయోమయంగానే కనిపిస్తోంది. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే సేవలు నిలిపేసింది కూడా. బాటెల్కో.. తొలి బకరా? ఎస్ టెల్లో తనకున్న 42.7% వాటాను బహ్రైన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (బాటెల్కో) ఎంత ధరకు కొన్నదో అంతే ధరకు 17.5 కోట్ల డాలర్లకు విక్రయించింది. ఈ పెట్టుబడులపై వడ్డీని మాత్రమే బాటెల్కో నష్టపోయింది. భారత్ నుంచి మొదట వైదొలగిన విదేశీ కంపెనీ ఇదే. 35 లక్షల మంది వినియోగదారులతో ఆరు టెలికం సర్కిళ్లలో సేవలందించిన ఈ కంపెనీని... శివశంకరన్‌కు చెందిన శివ గ్రూప్ నిర్వహించేది. 1997–98లో ఎయిర్‌సెల్‌ను ప్రారంభించిన శివ... దీన్ని మలేషియాకు చెందిన మాక్సిస్ గ్రూప్‌కు భారీ ధరకు విక్రయించటం ద్వారా వెలుగులోకి వచ్చారు. సుప్రీంకోర్టు 2జీ లైసెన్సుల్ని రద్దు చేసిన వెంటనే బాటెల్కో తన వాటాను విక్రయించేసుకుని బయటపడింది. రెండో వికెట్... ఎటిసలాట్ ఎటిసలాట్ డీబీ.. భారత్ నుంచి నిష్క్రమించిన రెండో విదేశీ కంపెనీ. దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్‌తో కలిసి ఎటిసలాట్–డీబీని ఏర్పాటు చేసింది. 2జీ కేసులో సుప్రీం రద్దు చేసిన 122 లైసెన్సుల్లో ఈ కంపెనీ లైసెన్స్‌లూ ఉండటంతో ఎటిసలాట్ దుకాణం కట్టేసింది. 16.7 లక్షల మంది కస్టమర్లను... 82 కోట్ల డాలర్ల విలువైన భారత టెలికం కార్యకలాపాలను వదిలేసుకుని వెళ్లిపోయింది. లూప్ మొబైల్... కేసులు మిగిలాయి.. భారత్‌లో తొలి మొబైల్ ఆపరేటర్ లూప్. 1995లో బీపీఎల్ మొబైల్ కమ్యూనికేషన్స్ పేరిట రంగంలోకి దిగింది. దీన్లో 99% వాటాను రూ.700 కోట్లకు ఖైతాన్ గ్రూప్ 2005లో కొనుగోలు చేసింది. 2009లో కంపెనీ పేరు లూప్మొబైల్గా మారింది. 2014లో దీన్ని రూ.700 కోట్లకు కొనటానికి ఎయిర్టెల్ డీల్ కుదురినా.. అమల్లోకి రాకముందే రద్దయిపోయింది. దీం తో 2014లో కార్యకలాపాలు నిలిపేసింది. భారతీయ టెలికం రంగంలో మూలధనంపై రాబడి 1 శాతంగా ఉంది. కంపెనీలు వాటి డబ్బుల్ని ఇక్కడి టెలికం రంగంలో ఇన్వెస్ట్ చేయటం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవటం ఉత్తమం. – గోపాల్ విట్టల్ (ఎయిర్టెల్ సీఈఓ) -
మాట నుంచి డేటా దాకా!!
హలో...!! ట్రంక్‌కాల్ బుక్ చేసి.. ఫోన్ కోసం వేచి చూసి... కాల్ దొరక్క, దొరికినా మాట సరిగా వినపడక మామూలు తంటాలా అవి. మరిపుడు!! నడుస్తూ... పరిగెడుతూ... ప్రయాణంలో సైతం ఎంచక్కా నేరుగా విదేశాల్లోని బంధుమిత్రులతోనూ క్షణాల్లో మాట్లాడేస్తున్నాం. మరి ఆ వెయిటింగ్ దశ నుంచి ఈ చాటింగ్ దశకు రావటానికి మధ్య టెలికాం రంగం ఎన్ని కుదుపులకు గురైందో.. ఎన్ని ఎగుడుదిగుళ్లు చూసిందో తెలుసా? ‘హలో... మేమొచ్చేశాం’ అంటూ ఎన్ని కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు తెచ్చి గుమ్మరించాయో... అంతే వేగంగా ఎన్ని చాప చుట్టేశాయో...! విదేశాల్లో దిగ్గజ సంస్థలుగా మీసం మెలేసి... ఇండియాలో మాత్రం చేతులెత్తేసినవి ఒకటీ రెండూ కావు. ముకేశ్ అంబానీ ముచ్చటగా ఆరంభించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. తమ్ముడి చేతికొచ్చేసరికి అగ్రస్థానంలోనే ఉంది. కానీ ఇపుడు...! పాతాళానికి పడిపోయింది. ఎందుకని? ఉప్పు నుంచి విమానాల వరకూ తమ చేతిలో ఉన్నాయని మురిసిపోయే టాటాలకు టెలికం మాత్రం కొరుకుడుపడలేదు. చివరికి కంపెనీని ఉచితంగా ఎయిర్‌టెల్‌కు అప్పగించేశారు. తప్పెక్కడ జరిగింది? రియల్టీ దిగ్గజంగా ఉన్న యూనిటెక్ గానీ, గృహోపకరణాల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన వీడియోకాన్ గానీ, చమురు దిగ్గజం ఎస్సార్ గానీ... ఇలా ఏవీ టెలికామ్‌లో రాణించలేకపోయాయి. విదేశాల్లో జెండా ఎగరేసిన హచిసన్, మ్యాక్సిస్, ఎంటీఎస్, సిస్టెమా శ్యామ్, ఎయిర్‌సెల్, టెలినార్... ఇండియాలో మాత్రం పాగా వేయలేకపోయాయి. చివరకు మళ్లీ ముకేశ్ అంబానీ సొంతగా ఆరంభించిన జియో... ఎన్నో ఒడి దుడుకులను తట్టుకున్న ఎయిర్టెల్, మార్పులకు చిరునామా అయిన ఐడియా, హచ్‌ను సొంతం చేసుకున్న వొడాఫోన్ మాత్రమే ప్రైవేటు రంగంలో మిగిలాయి. ఐడియా– వొడాఫోన్ విలీనమవుతున్న తరుణంలో ముచ్చటగా మిగులుతున్నవి మూడే. అంటే... ఏ రేసులోనైనా ఎంతమంది పాల్గొన్నా చివరకు 1–2–3 స్థానాలనే గుర్తించిన చందంగా మన టెలికం తయారైందన్న మాట. -
లేటెస్ట్ వార్ : ప్లాన్స్ అప్‌గ్రేడ్
టెలికాం ఆపరేటర్ల మధ్య కొత్త రకం ధరల యుద్ధం ప్రారంభమైంది. కంపెనీలన్నీ తమ ప్యాక్‌లను అప్‌గ్రేడ్ చేయడం ప్రారంభించాయి. ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగా రోజుకు కంపెనీలు అందించే డేటాను పెంచడం మొదలు పెట్టాయి. తాజాగా వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.348 ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్యాక్‌పై రోజుకు అందిస్తున్న 1జీబీ డేటాను 2జీబీకి పెంచింది. దీంతో 28 రోజుల పాటు మొత్తం 56జీబీ డేటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్ అవుట్గోయింగ్ కాల్స్‌ను అందించనుంది. అయితే ఉచిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకనుకు 1పైసా ఛార్జీ విధించనుంది. రూ.348 ప్లాన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. వొడాఫోన్‌కు చెందిన ఈ ప్యాక్, ఎయిర్టెల్ రూ.349 ప్యాక్‌కు డైరెక్ట్ పోటీగా నిలుస్తోంది. ఎయిర్టెల్ కూడా రూ.349 ప్యాక్ కింద రోజుకు 2జీబీ 4జీ డేటాను అందిస్తోంది. వొడాఫోన్ ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేసిన రూ.348 ప్యాక్‌ను ఈ కంపెనీ ఆగస్టులో లాంచ్ చేసింది. అత్యంత చౌకైన నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.176ను వొడాఫోన్ లాంచ్ చుసింది. ఈ ప్లాన్ కింద ఉచిత కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ 2జీ డేటాను అందిస్తోంది. -
నెట్వర్క్ టెస్టింగ్‌కు 90 రోజుల వ్యవధి
న్యూఢిల్లీ: కొత్త టెలికం ఆపరేటర్లు పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ముం దుగా నిర్వహించే నెట్వర్క్ టెస్టింగ్ తదితర అంశాలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ పలు సిఫార్సులు చేసింది. టెస్టింగ్ అవసరాల కోసం ఆపరేటరు సబ్‌స్క్రయిబర్స్‌ను నమోదు చేసుకోవచ్చని.. అయితే ఆయా సర్వీసు ఏరియాల్లో యూజర్ల సంఖ్య పైనా, టెస్టింగ్ కాలంపైనా పరిమితులు ఉండాలని పేర్కొంది. ప్రయోగాత్మక పరీక్షలకు 90 రోజుల దాకా వ్యవధి ఉండాలని ట్రాయ్ సూచించింది, ఒకవేళ ఆ వ్యవధి లోగా నెట్వర్క్ టెస్టింగ్ పూర్తి కాకపోతే అందుకు సహేతుకమైన కారణాలు చూపగలిగితే సందర్భాన్ని బట్టి గడువు మరికొంత కాలం పొడిగించవచ్చని పేర్కొంది. పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుగా టెస్టింగ్ దశలోనే రిలయన్స్ జియో ఏకంగా 15 లక్షల మంది పైగా యూజర్లను నమోదు చేసుకోవడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ట్రయల్ లాంచ్ పేరిట జియో ఉచిత ఆఫర్లతో పూర్తి స్థాయి మొబైల్ కనెక్షన్ సేవలు అందిస్తోందంటూ అప్పట్లో మిగతా టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు ఎంతకాలం పాటు నెట్వర్క్ టెస్టింగ్ నిర్వహించవచ్చన్న అంశంపై నిర్ధిష్ట పరిమితులేమీ లేవు. ఈ నేపథ్యంలోనే ట్రయల్ సర్వీసులపై ట్రాయ్ తాజా సిఫార్సులు ప్రకటించింది. వీటిలో మరికొన్ని కీలకమైన అంశాలు .. ♦ ఒక సర్వీస్ ఏరియాలో (టెలికం సర్కిల్) టెస్ట్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య.. స్థాపిత నెట్వర్క్ సామర్ధ్యంలో 5% మించకూడదు. టెస్టింగ్‌కి యూజర్లను నమోదు చేసుకోవడానికి 15 రోజుల ముందుగానే నెట్వర్క్ సామర్థ్యాలు తదితర వివరాలను టెలికం శాఖ, ట్రాయ్‌కి తెలియజేయాల్సి ఉంటుంది. ♦ టెస్టింగ్ దశలో నంబర్ పోర్టింగ్ సదుపాయం కల్పించడానికి లేదు. అందజేసే సర్వీసులు, నెట్వర్క్ పనితీరు ఓ మోస్తరుగా ఉండే విషయాన్ని గురించి యూజర్లకు తెలియజేయాలి. అలాగే పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ఎప్పట్నుంచీ మొదలుపెట్టేది, టెస్ట్ దశలో చార్జీల మినహాయింపు మొదలైనవి కూడా తెలపాలి. ♦ పరీక్షల దశలో కూడా గోప్యత, భద్రత, కాల్ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ తదితర నిబంధనలను కచ్చితంగా పాటించాలి. -
కష్టకాలంలో టెలికాం ఉద్యోగులు : 30వేల జాబ్స్ కట్
బెంగళూరు : టెలికాం రంగం మరింత కష్టకాంలో పడబోతుంది. ఈ రంగంలో చోటుచేసుకున్న కన్సాల్డిషన్ ప్రభావంతో ఉద్యోగాలు పోయే సంఖ్య అంతకంతకు పెరుగనుందని ప్లేస్మెంట్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. వచ్చే ఏడాదికి ఈ ప్రక్రియ మరింత విస్తరించనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. అన్ని కేటగిరీల్లోని స్థానాలు కూడా ఈ జాబ్ లాస్కి ప్రభావితం కానున్నాయని ప్లేస్మెంట్ సంస్థలు తెలిపాయి. వీరికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలున్నప్పటికీ, ఉద్యోగులు తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని, అయినప్పటికీ తక్కువ వేతనాలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఓ వైపు రిలయన్స్ కమ్యూనికేషన్ తన వైర్లెస్ వ్యాపారాలను మూసివేయాలని నిర్ణయించింది. మరోవైపు టాటా గ్రూప్, తన మొబైల్ వ్యాపారాలను భారతీ ఎయిర్‌టెల్‌కు అమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే 12 నెలల కాలంలో 20 వేల నుంచి 30 వేల వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్, మాన్పవర్ గ్రూప్ సర్వీసెస్, ఏబీసీ కన్సల్టెంట్స్, ర్యాండ్‌స్టాడ్ ఇండియా, కార్న్ ఫెర్రీ సంస్థలు అంచనావేస్తున్నాయి. కంపెనీల్లో మౌలిక సదుపాయాలు, నెట్వర్కింగ్ ఇంజనీరింగ్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్, టెలికాం ఇంజనీరింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, కాల్ సెంటర్, ఇతర సపోర్టు బాధ్యతలు నిర్వర్తించే వారు ప్రమాదంలో పడనున్నట్టు విశ్లేషకులు చెప్పారు. వీరిలో కూడా ఎక్కువగా ఇన్‌ఫ్రాక్ట్ర్చర్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్ విభాగం వారికే ఉంటుందని తెలిపారు. మధ్య, కింద స్థాయి ఉద్యోగులను తీసివేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే టెలికాం రంగం రూ.8 లక్షల కోట్ల రుణాలతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు రిలయన్స్ జియో దెబ్బకు, కంపెనీలన్నీ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాయి. -
టాటా టెలీ కథ కంచికి!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో గడ్డు పరిస్థితుల నేపథ్యంలో మరో కంపెనీ కథ కంచికి చేరనుంది. టాటా టెలీ సర్వీసెస్ ప్రయాణం త్వరలోనే ముగిసిపోనున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా కార్యకలాపాలను టాటా టెలీ సర్వీసెస్ మూసివేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే 6,000 ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయి. టాటా టెలీ బ్యాంకులకు 28,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. దీంతో ఆస్తులను నిలువునా అమ్మేసి అప్పులు తీర్చే అవకాశం ఉందని అంచనా. ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా టాటాలు టెలికం విభాగం కోసం రూ.50,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా ఆస్తుల విక్రయంతో వచ్చేది కొంతే. టాటా గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ లేఖ ఆధారంగా చూస్తే టాటా టెలీ సర్వీసెస్‌ను అర్ధంతరంగా మూసేస్తే గ్రూపునకు వాటిల్లే నష్టం రూ.32,000 కోట్లు. దీంతో పాటు భాగస్వామ్యం నుంచి వైదొలగినందుకు డొకోమోకు చెల్లించిన రూ.7,600 కోట్లు కూడా నష్టం కిందకే వస్తుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో టాటా టెలీసర్వీసెస్ ఏకంగా రూ.4,517 కోట్ల నష్టాలను చవిచూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టం రూ.2,023 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది. టర్నోవర్ రూ.9,419 కోట్లుగా ఉంది. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ఈ కంపెనీ వాటా 3.5 శాతంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టాటా టెలి తనకున్న స్పెక్ట్రమ్‌ను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని ద్వారా కంపెనీకి రూ.10,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అలాగే టవర్ల వ్యాపారం ఏటీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మిగిలి ఉన్న 32 శాతం వాటాను ఏటీసీకి విక్రయించడం వల్ల రూ.6,700 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కంపెనీకి దేశవ్యాప్తంగా 1,25,000 కిలోమీటర్ల మేర ఉన్న ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్‌ను విక్రయించినట్టయితే మరో రూ.5,000–7,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఐసీసీయూలో టెలికం రంగం!
ముంబై: తీవ్రమైన పోటీ, రుణభారంతో కుంగుతున్న టెలికం రంగం ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) దాటి ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీసీయూ)లోకి చేరిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు రుణదాతలకు కూడా భారీ రిస్కు తప్పదని హెచ్చరించారు. మరోవైపు గుత్తాధిపత్య ధోరణుల దిశగా మార్కెట్ సాగుతోందని అనిల్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాలు చెప్పారు. ‘ఏ కోణం నుంచి చూసినా వైర్లెస్ రంగం.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా కాదు .. ఆ పరిస్థితినీ దాటేసి ఏకంగా ఐసీసీయూలోకి చేరింది. ఇటు ఆదాయాల పరంగా ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి వ్యవస్థాగత ముప్పుగా మారింది. ఇది సృజనాత్మకంగా ఒక రంగాన్ని సర్వనాశనం చేయడంగా భావిస్తున్నాను‘ అని అనిల్ పేర్కొన్నారు. రంగానికి నిధుల కటకట.. ఏప్రిల్‌లో ఆర్బీఐ అప్రమత్తం చేసినప్పట్నుంచీ టెలికం రంగానికి బ్యాంకుల నుంచి నిధులు రావడం పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. ఒకప్పుడు డజను పైగా కంపెనీలుండగా.. ప్రస్తుతం ఆరుకి తగ్గిపోయాయని, దాదాపు అంతర్జాతీయ సంస్థలన్నీ వెళ్లిపోయాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లో క్రమంగా పోటీ తగ్గిపోయి, గుత్తాధిపత్య ధోరణి నెలకొనే ముప్పు పొంచి ఉందని అనిల్ వ్యాఖ్యానించారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో చౌక ఆఫర్లతో టెలికం రంగాన్ని కుదిపేసిన నేపథ్యంలో అనిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రుణభారం పేరుకుపోయినప్పటికీ.. రుణదాతలంతా తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో తమ కంపెనీ మార్చి నాటికల్లా సమస్యల నుంచి గట్టెక్కగలదని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. కష్టాల నుంచి గట్టెక్కడానికి తమ సంస్థకి ప్రత్యేక సాయం అవసరం లేదన్నారు. ఆ విధంగా కోరే ’అర్హత’ తమకు లేదని, అలాంటిది కావాలని కోరుకోవడం లేదన్నారు. బ్లాక్ మెయిలర్లను అనుమతించకూడదు .. న్యాయస్థానాలు, నియంత్రణ సంస్థలపరమైన జోక్యాలతో అవరోధాలు ఉంటున్నాయని, అయితే ఆర్‌కామ్ వాటిని గౌరవిస్తుందని చెప్పారు. నీ వల్లే ఎయిర్‌సెల్ విలీన ప్రణాళిక అమలు కావడానికి ఏడాది జాప్యం జరిగిందంటూ ఒక షేర్‌హోల్డరు వైపు చూసి అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ‘బ్లాక్మెయిలర్లను’ ఈ తరహా సమావేశాల్లోకి అనుమతించకుండా చూడాలని నియంత్రణ సంస్థలకు కంపెనీ రాయనున్నట్లు చెప్పారు. -
గతవారం బిజినెస్
121 కోట్లు దాటిన టెలికం సబ్స్క్రైబర్లు దేశంలో టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య జూన్ నెల చివరకు 121 కోట్ల మార్క్‌ను అధిగమించింది. మే నెల చివరిలో 120.49 కోట్లుగా ఉన్న టెలికం యూ జర్ల సంఖ్య జూన్ చివరకు 121.08 కోట్లకు పెరిగింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఈ విషయాలను వెల్లడించింది. మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య నికరంగా 60 లక్షలకుపైగా పెరుగుదలతో 118.6 కోట్లకు చేరింది. వీరిలో 102.27 కోట్ల మంది యాక్టివ్‌గా ఉన్నా రు. ఇక ల్యాండ్‌లైన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2.4 కోట్లకు క్షీణించింది. రిలయన్స్, బీపీకి 1,700 కోట్ల జరిమానా గత ఆర్థిక సంవత్సరం కేజీడీ–6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్ డాలర్లకి (దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది. బంగారం ఎగుమతులపై కేంద్రం నిషేధం కేంద్రం 22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను నిషే ధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రి ప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్లు నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకే అనుమతులున్నాయి. కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి దేశంలోని మొత్తం 24 జీవిత బీమా కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయంలో జూలై నెలలో 47.4% వృద్ధి నమోదయ్యింది. ఇది రూ.20,428 కోట్లకు చేరింది. కాగా గతేడాది ఇదే కాలంలో సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,854 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం 51% వృద్ధితో రూ.10,738 కోట్ల నుంచి రూ.16,255 కోట్లకు పెరిగింది. ఇక మిగిలిన 23 ప్రైవేట్ సంస్థల ప్రీమియం ఆదాయం 34% వృద్ధితో రూ.3,117 కోట్ల నుంచి రూ.4,173 కోట్లకు ఎగిసింది. త్వరలో కొత్త రూ.50 నోట్లు ఆర్బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను తీసుకురానుంది. ఇవి నీలి (ఫ్లోరోసెంట్ బ్లూ) రంగులో ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. ఉద్దేశపూర్వక ఎగవేతలు 92,000 కోట్లు ప్రభుత్వ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రు ణ ఎగవేతలు 20% పెరిగిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం చివరికి 9,000 మంది రూ.92,376 కోట్ల మేర బ్యాంకులకు ఎగ్గొట్టారు. 2016 మార్చి నాటికి ఇలా ఉద్దేశ పూర్వకంగా చెల్లించని రుణాల మొత్తం రూ.76,685 కోట్లుగానే ఉంది. ఇక ఉద్దేశపూర్వక ఎగవేత కేసులు ఈ ఏడాది మార్చి నాటికి 8,915కు పెరిగాయి. కాల్డ్రాప్స్ ఉదంతాల్లో కఠిన చర్యలు కాల్డ్రాప్స్ సమస్య పరిష్కారంపై ట్రాయ్ మరింతగా దృష్టి సారించింది. వరుసగా మూడు త్రైమాసికాలు ఆపరేటర్లు గానీ ప్రమాణాలు పాటించకపోతే రూ. 10 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కఠినతరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. -
చైనాకు చెక్ పెట్టేందుకు...
సాక్షి, న్యూఢిల్లీ : కీలక రంగాల్లో చైనా కంపెనీల ప్రవేశానికి చెక్ పెట్టేందుకు విద్యుత్, టెలికం నిబంధనలను భారత్ కఠినతరం చేయనుంది. వైరస్‌లను వ్యాప్తి చేసే మాల్వేర్కు అడ్డుకట్ట వేసేందుకూ ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. దేశీయ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్లు వెల్లువెత్తిన క్రమంలో స్మార్ట్ ఫోన్ తయారీదారులను భద్రతా ప్రమాణాలు, ఆర్కిటెక్చర్ ఫ్రేమ్ వర్క్‌లపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వం కోరింది. కీలక రంగాల్లో చైనా ఉత్పత్తుల దూకుడుకు కళ్లెం వేయాలని పరిశ్రమ వర్గాలూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. విద్యుత్ పంపిణీ నిర్వహణ, పరికరాల సరఫరాలో పలు చైనా కంపెనీలు సేవలందింస్తుండగా, భారత కంపెనీలను చైనాలో ఈ తరహా వ్యాపారానికి అనుమతించడం లేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.దీంతో స్థానిక కంపెనీలకు ప్రాదాన్యత ఇచ్చేలా విద్యుత్ సరఫరా, పంపిణీ కాంట్రాక్టుల బిడ్డింగ్‌కు నూతన నిబంధనలను సూచిస్తూ సెంట్రల్ విద్యుత్ అథారిటీ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా?
న్యూఢిల్లీ : కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే వచ్చే ఏడాది 30 లక్షల ఉద్యోగవకాశాలు మీ ముందుకు రానున్నాయి. 4జీ టెక్నాలజీ ఆవిష్కరణ, డేటా వాడకం పెరుగుదల, కొత్త ఆపరేటర్లు మార్కెట్లోకి ఎంట్రీ, డిజిటల్ వాలెట్ల ప్రవేశం, స్మార్ట్‌ఫోన్‌కు రోజురోజుకు పాపులారిటీ పెరగడం, టెక్నాలజీకి మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడటం... టెలికాం రంగంలో కొత్తకొత్త ఉద్యోగవకాశాలకు నాంది పలుకుతోంది. వచ్చే ఏడాది కల్లా ఈ రంగంలో 30 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీలు 5జీ, ఎం2ఎం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలలో పరిణామాలు కూడా ఈ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు కల్పించనున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనం తెలిపింది. 2021 నాటికి వీటిలో కూడా 8,70,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఈ సంయుక్త అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు సంఖ్యాపరంగా, అప్‌కమింగ్ డిమాండ్ తగ్గ నాణ్యత పరంగా సరిపోరని చెప్పింది. దీంతో ఉద్యోగవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. నైపుణ్యాల పరంగా ఉన్న లోటును పూరించడానికి, ఇన్ఫ్రా, సైబర్ సెక్యరిటీ నిపుణులు, అప్లికేషన్ డెవలపర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ టెక్నిషియన్స్, హ్యాండ్సెట్ టెక్నిషియన్స్ వంటి విభాగాల్లో నైపుణ్యాలున్న ఉద్యోగులను గుర్తించాలని అంతేకాక, ప్రస్తుత టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగులను, రాబోయే అవసరాలతో నవీకరించాల్సి ఉందని అసోచామ్-కేపీఎంజీ అధ్యయనం తెలిపింది. టెలికాం రంగంలో అవసరమయ్యే నైపుణ్యాలు, డిమాండ్ కోసం టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నియమింపబడింది. సబ్‌స్క్రైబర్ విషయాన్ని తీసుకుంటే సమ్మేళన వార్షిక వృద్ధి రేటులో టెలికాం రంగం 19.6 శాతం వృద్ధిని నమోదుచేసింది. రెవెన్యూ పరంగా గత కొన్నేళ్లలో ఈ వృద్ధి 7.07 శాతంగా ఉంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కూడా తమ నెట్‌వర్క్‌లలో కొనసాగింపుగా పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. -
అంబానీకి భారీ ఊరట
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను కెనడా ఆధారిత బ్రూక్ ఫీల్డ్ కంపెనీ విక్రయానికి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదం లభించింది. దీంతోపాటు ఎయిర్‌సెల్ విలీనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతి ఇన్ ఫ్రాటెల్, ఎరిక్సన్, జీటీఎల్ అభ్యంతరాలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. దీంతో అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్‌కాంకు భారీ ఊరట లభించింది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్‌మార్కెట్ లోఆర్కాం కౌంటర్ 17శాతం ఎగిసింది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనుంది. ఈ డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. ఎయిర్ సెల్ ఆర్‌కాం విలీనానాకి రెగ్యులేటరీ సంస్థల ఆమోదం ఇప్పటికే లభించింది. -
ఫ్రీ డేటా, వాయిస్ ఆఫర్లకు ఇక రాం రాం?
న్యూఢిల్లీ: టెలికాం సెక్టార్లో ఎదురవుతున్న ఆర్థిక ఒత్తడి, నష్టాల నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఒకవైపు జియో చెక్ చెప్పడంతోపాటు, కష్టాల గట్టెక్కేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీస ధరలను ఫిక్స్ చేయాల్సిందిగా టెలికం ఆపరేటర్లు మార్కెట్ రెగ్యులేటరీని ఆశ్రయించాయి. డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను ఆశ్రయించాయి. దీంతో ట్రాయ్ జూలై 21 న 'కనీస ఫ్లోర్ ధర' అంశంపై అన్ని సర్వీసు ప్రొవైడర్ల అభిప్రాయాలు, వాదనలు కోరనుంది. దీంతో ఉచితడేటా, వాయిస్ సేవలకు త్వరలోనే ముగింపు పడనుందా అనే ఊహాగానాలు పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి. పరిశ్రమ ఆర్థిక నష్టాలను, పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిడిని నొక్కి చెప్పిన ఐడియా గత నెలలో రెగ్యులేటర్ ఇండస్ట్రీ పరిశ్రమలు, అంతర్ మంత్రిత్వ గ్రూపు (ఐఎంజీ) భేటీ సందర్భంగా ఫ్లోర్ ధర నిర్ణయం డిమాండ్‌ను ప్రస్తావించింది. కాగా టెలికాం సెక్టార్ లోకి రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన మొత్తం ఆర్థిక పరిస్థితినే మార్చి వేసింది. ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చని ఇతర దిగ్గజ కంపెనీలను పలు ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వాటి లాభాలను, ఆదాయాలను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు ఆయా కంపెనీల మొత్తం టారిఫ్ ప్లాన్లలో పెను మార్పులకు నాంది పలికింది. ప్రధానంగా టెలికాం మేజర్‌ను భారతీఎయిర్‌టెల్‌ను బాగా దెబ్బ కొట్టింది. ఐడియా, వోడాఫోన్, ఆర్‌కామ్ ఇదే వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. -
టెలికంకు 'టాటా'?
భారతీ ఎయిర్‌టెల్‌తో విలీనానికి సన్నాహాలు! ♦ టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్‌తో పాటు డీటీహెచ్ వ్యాపారాన్ని కూడా కలిపేసే అవకాశం ♦ చర్చలు జరుపుతున్న ఇరు గ్రూప్‌లు... ♦ విలీనం ఇరు సంస్థలకు లాభమేనంటున్న విశ్లేషకులు ♦ ఇదే జరిగితే ఇక మిగిలేవి నాలుగైదు టెలికం సంస్థలే! (సాక్షి, బిజినెస్ విభాగం) దేశీ టెలికం రంగంలో మరో మెగా విలీన పర్వానికి తెరలేచింది. భారత కార్పొరేట్ ప్రపంచంలో పేరొందిన టాటా గ్రూప్, భారతీ గ్రూప్‌ల మధ్య భాగస్వామ్యానికి రంగం సిద్ధమవుతున్నట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. టాటా గ్రూప్‌లోని టెలికం కంపెనీలన్నింటినీ భారతీ ఎయిర్ టెల్లో విలీనం చేయొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ భారీ విలీనానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, ఇతరత్రా అంశాలపై ఇరు వర్గాలు ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇది సాకారమైతే టెలికం వ్యాపారంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టాటాలు.. ఈ రంగం నుంచి పూర్తిగా వైదొలగడానికి ఇది మంచి అవకాశమేనన్నది విశ్లేషకుల మాట. మరోపక్క, రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతీ ఎయిర్‌టెల్‌కు కూడా ఈ డీల్ కలిసొస్తుందనేది వారి అభిప్రాయం. ఈ వార్తల నేపథ్యంలో టాటా టెలీ షేరు దూసుకుపోయింది. శుక్రవారం బీఎస్ఈలో దాదాపు 19 శాతం ఎగబాకింది. చివరకు 17 శాతం లాభంతో రూ.8.56 వద్ద ముగిసింది. ఇక భారతీ ఎయిర్టెల్ షేరు 1 శాతం మేర లాభపడి రూ.385 వద్ద స్థిరపడింది. ‘టాటా’ ఎందుకు... ప్రస్తుతం టాటా గ్రూప్ టెలికం వ్యాపారంలో టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ ప్రధాన కంపెనీలుగా ఉన్నాయి. టాటా టెలీ సర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీ (మహారాష్ట్ర) లిమిటెడ్ (టీటీఎస్ఎంఎల్)æలు అనేవి టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా.. టాటా కమ్యూనికేషన్స్ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ, టెలికంలో ఎంటర్ప్రైజ్ సేవలను అందిస్తోంది. టాటా స్కై పేరిట డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) వ్యాపారాన్ని కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. బ్రిటిష్ టెలికం సంస్థ ‘స్కై’ భాగస్వామ్యంతో టాటాలు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు కూడా భారత్‌లో అతిపెద్ద టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు ఎయిర్టెల్ డీ2హెచ్ పేరుతో డీటీహెచ్ కంపెనీ ఉంది. ఇరు గ్రూప్‌లకూ టెలికంలో దాదాపు ఒకే విధమైన సేవల విభాగాలు ఉండటంతో ప్రతిపాదిత విలీనం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోపక్క, గత కొన్నేళ్లుగా టాటా టెలీ యూజర్ల సంఖ్య ఘోరంగా పడిపోతూ వస్తోంది. ట్రాయ్ గణంకాల ప్రకారం గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ఈ రెండు టాటా టెల్కోలకు చెందిన కోటి మందికిపైగా యూజర్లు ఇతర టెల్కోలకు మారిపోయినట్లు లెక్కతేలుతోంది. మరోపక్క, జపాన్ కంపెనీ డొకోమో భాగస్వామ్యంతో టాటా డొకోమో పేరిట దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న టాటాలకు ఆ కంపెనీతో తలెత్తిన విభేదాలు సద్దుమణిగాయి. టాటా డొకోమో జేవీ నుంచి వైదొలగడానికి డొకోమో చేస్తున్న న్యాయ పోరాటం కొలిక్కివచ్చింది. దీంతో డొకోమో ఇక భారత్‌కు గుడ్‌బై చెప్పేయనుంది. ఈ నేపథ్యంలో తమకు అంతగా కలిసిరాని టెలికం వ్యాపారాన్ని వదిలించుకోడంపై టాటాలు దృష్టిపెట్టినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇక టాటా టెలీ ఆదాయం వార్షికంగా రూ.9,500 కోట్లు కాగా, రూ.30 వేల కోట్ల మేర రుణ భారం ఉంది. ఏటా రూ.2,500 కోట్లను వడ్డీగా చెల్లించాల్సివస్తోంది. ఎయిర్‌టెల్‌కు కలిసొస్తుందా? ప్రస్తుతం భారత్‌లో దాదాపు 30 కోట్ల మంది టెలికం యూజర్లతో భారతీ ఎయిర్టెల్ అతిపెద్ద నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. అయితే, తాజాగా రిలయన్స్ జియో అరంగేట్రం, అది ప్రవేశపెట్టిన చౌక టారిఫ్‌లు, ఉచిత వాయిస్ కాలింగ్‌తో ఇతర టెల్కోల మాదిరిగానే ఎయిర్టెల్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో టారిఫ్‌లను తగ్గించుకోవాల్సి వచ్చింది. కంపెనీ మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశమిది. దీనికితోడు ఐడియా సెల్యులార్తో బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా విలీనం కారణంగా దేశంలో నంబర్ వన్ టెలికం ఆపరేటర్ స్థానాన్ని కూడా కోల్పోయేందుకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో టాటా టెలికం వ్యాపారాన్ని విలీనం చేసుకోవడం ఎయిర్‌టెల్‌కు వ్యూహాత్మకంగా సానుకూలాంశమని భావిస్తున్నారు. ప్రధానంగా టాటా కమ్యూనికేషన్స్‌కు ఉన్న విదేశీ కేబుల్ బిజినెస్, ఎంటర్ప్రైజ్ సేవలు ఆసరాతో ఎయిర్టెల్ తన ఎంటర్ప్రైజ్ విభాగాన్ని అత్యంత పటిష్టం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సబ్‌మెరైన్ (సముద్రగర్భ) ఫైబర్ఆప్టిక్ నెట్వర్క్ టాటా కమ్యూనికేషన్స్ సొంతం. ప్రపంచంలోని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లలో 70 శాతం దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇదేకాకుండా డీటీహెచ్ విభాగంలో దేశంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించేందుకు టాటా స్కై, ఎయిర్టెల్ డీ2హెచ్ విలీనం వీలుకల్పిస్తుంది. వీడియోకాన్ డీ2హెచ్‌ను విలీనం చేసుకున్న డిష్ టీవీ ప్రస్తుతం 45 శాతం మేర వాటాతో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. అంతేకాకుండా టాటా స్కైలో విదేశీ ఇన్వెస్టర్లయిన ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్, టెమాసెక్ హోల్డింగ్స్ కూడా ఈ విలీనంద్వారా అవసరమైతే తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇదీ టెలికం ముఖచిత్రం... ⇔ ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌కు దాదాపు 27 కోట్ల మంది టెలికం యూజర్లు ఉన్నారు. ఆదాయం, సబ్స్క్రయిబర్ల ప రంగా 33 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ⇔ వొడాఫోన్ ఇండియా మార్కెట్ వాటా 18.5 శాతంగా అంచనా. కస్టమర్ల సంఖ్య దాదాపు 20.5 కోట్లు. దేశంలో నంబర్–2 టెలికం కంపెనీగా కొనసాగుతోంది. ⇔ ఐడియా సెల్యులార్ 17% మార్కెట్ వాటా, 19 కోట్లకుపైగా యూజర్లతో మూడో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ⇔ అయితే, ప్రతిపాదిత ఐడియా–వొడాఫోన్ విలీనం ద్వారా ఆవిర్భవించే కంపెనీ... 40 కోట్ల మేర యూజర్లతో ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా ఆవిర్భవిస్తుంది. అంతేకాకుండా ఈ విలీన సంస్థ రూ.80 వేల కోట్ల ఆదాయంతో 43% మార్కెట్ వాటాను దక్కించుకుంటుందని అంచనా. ⇔ ఆదాయపరంగా మార్కెట్ వాటాను కోల్పోకూడదనే ఎయిర్టెల్.. టాటా టెలీ విలీనానికి ముందుకొస్తోంది. ⇔ టాటా టెలీ, ఎయిర్టెల్ విలీనంతో పాటు రిలయన్స్ జియోతో ఆర్‌కామ్ కూడా విలీనమైతే ప్రైవేటు రంగంలో మూడు, ప్రభుత్వ రంగంలో ఒక (బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్) టెల్కోయే మిగిలే అవకాశం ఉందని లండన్‌కు చెందిన సీసీఎస్ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ⇔ అప్పటికి మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు ఒక్కొక్కటి 30 కోట్లకుపైగా యూజర్లను కలిగి ఉంటాయని, ఇక ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్‌లకు 10 కోట్ల మేర యూజర్లు ఉంటారని లెక్కగట్టింది. మిగిలేవి నాలుగైదే... ⇔ దేశీ టెలికంలో విలీనాలు–కొనుగోళ్లకు ప్రధానంగా ఆజ్యం పోసింది రిలయన్స్ జియో రంగప్రవేశమే. ఇక భారత్‌లో నియంత్రణపరమైన ఇబ్బందులు, కోర్టు కేసులు (స్పెక్ట్రం కుంభకోణం ఇతరత్రా) కారణంగా విదేశీ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా గుడ్‌బై చెబుతూ వస్తున్నాయి. ⇔ తొలుత అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత దేశీ సంస్థ ఎయిర్‌సెల్‌తో తన టెలికం వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ⇔ వొడాఫోన్ కూడా పన్ను సంబంధ కేసుల నేపథ్యంలో భారత్ నుంచి వైదొలగాలని ఎప్పటినుంచో భావిస్తోంది. ఐడియాతో విలీనాన్ని ప్రకటించడం ద్వారా వొడాఫోన్ ఎగ్జిట్ రూట్‌ను ఆశ్రయించింది. ⇔ ఇదిలా ఉండగా... భారతీ ఎయిర్టెల్ కూడా ఈ రేసులో తానూ ఉన్నానని రంగంలోకి దూకింది. నార్వేకు చెందిన టెలినార్ భారత్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా టెలినార్ భారత్ నుంచి వైదొలగుతోంది. ⇔ టాటాడొకోమో నుంచి జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమో కూడా బయటికి వెళ్లిపోయేందుకు తాజాగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. టాటాలతో విభేధాలకు తెరపడటంతో డొకోమో భారత్‌కు గుడ్‌బై చెప్పనుంది. ⇔ మొత్తంమీద.. ఇక భారత్‌లో విదేశీ టెలికం కంపెనీలన్నీ ప్రత్యక్ష కార్యకలాపాల నుంచి తప్పుకున్నట్టే లెక్క. ⇔ భారత్‌కు నాలుగైదు పెద్ద టెలికం కంపెనీలు ఉంటే చాలని అటు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ విలీనాలు–కొనుగోళ్లు వేగం పుంజుకోవడం విశేషం. ⇔ తాజా పరిణామాలు కొలిక్కివస్తే.. దేశంలో రానున్న రెండుమూడేళ్లలో నిజంగానే టెలికం కంపెనీలు నాలుగైదుకే (ఐడియా, రిలయన్స్ జియో, ఆర్‌కామ్–ఎయిర్‌సెల్, భారతీ ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్) పరిమితం అయిపోయేందుకు దారితీస్తుంది. -
టెలికం వృద్ధికి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడం
టెలికం మంత్రి మనోజ్ సిన్హా న్యూఢిల్లీ: టెలికం రంగ వృద్ధి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సంకోచించదని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. తీవ్రమైన రుణ భారంతో సతమతమౌతోన్న టెలికం పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంజీ) తన నివేదిక రెండు వారాల్లోగా సమర్పించే అవకాశముందని చెప్పారు. ఈయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం మా వద్ద ఉంది. కేవలం ఒక వైపు అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం. ఐఎంజీ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. దేశంలో టెలికం పరిశ్రమకి సంబంధించిన విజయగాథ ఉంది. దీన్ని అలాగే కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం’ అని వివరించారు. అంతర మంత్రిత్వ శాఖ బృందం సిఫార్సులపై వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా టెలికం రంగ రుణం భారం రూ.4.6 లక్షల కోట్లను తాకిన విషయం తెలిసిందే. ఇక రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం కంపెనీల ఆదాయం, లాభదాయకతపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది. -
టెల్కోల ఆదాయం 15% డౌన్
ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు సర్వీసుల నుంచి పొందే ఆదాయం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 15 శాతం తగ్గుదలతో రూ.40,831 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.48,379 కోట్లుగా ఉంది. ఈ విషయాలను టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) వరుసగా 7.35 శాతం, 15.60 శాతం క్షీణించాయి. కంపెనీకి అన్ని విభాగాల నుంచి వచ్చిన ఆదాయాన్ని స్ధూల ఆదాయం అని, కేవలం టెలికం సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు స్థూల ఆదాయం అని పేర్కొంటాం. -
అంబానీ బ్రదర్స్ మధ్య జియో చిచ్చు
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టింది. జియో పై ఆర్‌కాం సంచలన ఆరోపణలు గుప్పింది. ముకేష్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాలపాలైందని, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆరోపించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు, మార్కెట్ షేర్ పెంచుకునేందుకు జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది. దేశీయ టెలికాం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్‌కాం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆరోపించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్‌కాం జియోపై పలు ఆరోపణలు గుప్పించింది. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో కారణంగానే టెలికాం కంపెనీలో భారీగా నష్టపోయాయని ఆర్‌కాం ఆరోపించింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా టెలికాం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా, టెలికాం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది. -
టెలికం రంగ వృద్ధికి చర్యలపై కేంద్రం హామీ
న్యూఢిల్లీ: రుణభారంతో కుంగుతున్న టెలికం రంగ వృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని టెల్కోలకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు. టెలికం పరిస్థితిపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం (ఐఎం జీ) నివేదిక త్వరలో రానున్నట్లు తెలిపారు. వివిధ టెల్కోల అధిపతులతో గురువారం సమావేశమైన సందర్భంగా మంత్రి వారికి ఈ విషయాలు వివరించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ, ఐడియా ఎండీ హిమాంశు కపానియా, టాటా సన్స్ డైరెక్టర్ ఇషాత్ హుస్సేన్, రిలయన్స్ ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తదితరులు ఇందులో పాల్గొన్నారు. టెలికం రంగం ఆర్థిక సమస్యలు, పరిష్కార మార్గాలపై ఐఎంజీ ఇటీవల టెల్కోలతో భేటీ అయిన నేపథ్యంలో తా జా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షి బిజినెస్ వెబ్సైట్లో... ⇔ ర్యాలీకి రెడీగా ఉన్న టాప్ 10 షేర్లు ⇔ బోధ్ ట్రీని కొనేవారు లేరు ⇔ ప్లైవుడ్, లామినేషన్ షేర్లలో ర్యాలీ ⇔ చైనా పాల నిషేధంతో మురి‘పాలు’ ⇔ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్.. WWW.SAKSHIBUSINESS.COM -
టెలికంపై జీఎస్టీ రేటు తగ్గించండి
ఆర్థిక శాఖకు సీవోఏఐ లేఖ న్యూఢిల్లీ: సెల్యులర్ ఆపరేటింగ్ సంస్థలు టెలికం సర్వీసులపై నిర్ణయించిన 18 శాతం జీఎస్టీ రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అధిక పన్ను రేటుకు ఇన్పుట్ క్రెడిట్ ప్రయోజనం సరిపోదని అభిప్రాయపడ్డాయి. సెల్యులార్ ఆపరేటర్లను సభ్యులుగా కలిగిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తాజాగా రెవెన్యూ సెక్రటరీకి ఒక లేఖ రాసింది. టెలికం పరిశ్రమ ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో సతమతమౌతోందని, ఇలాంటి సందర్భాల్లో అధిక జీఎస్టీ రేటు సమంజసం కాదని, అందుకే రేటును తగ్గించాలని పేర్కొంది. మూడు శాతం పన్ను రేటు పెంపు ముందు ఇన్పుట్ ట్యాక్స్ ప్రయోజనం స్వల్పమని తెలిపింది. కాగా టెలికం సర్వీసులపై జీఎస్టీ పన్ను రేటు 18 శాతంగా ఉండబోతోంది. అయితే ప్రస్తుతం టెలికం సేవలపై పన్ను 15 శాతంగా ఉంది. -
టెలికాంలో భారీగా ఉద్యోగాల కోత
తీవ్రమైన పోటీ నెలకొనడంతో టెలికాం సెక్టార్ గతేడాది 10వేల ఉద్యోగాలను తీసివేయాల్సి వచ్చిందని ఆర్ కామ్ చెప్పింది. ఈ పోటీ మరింత పెరిగే అవకాశముందని రేటింగ్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయని, దీంతో ఈ ఏడాది కూడా 40వేల కంటే ఎక్కువగా ఉద్యోగాల కోత ఉంటుందని పేర్కొంది. భారీ రుణభారంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూరుకుపోయిందనే ఆందోళన నేపథ్యంలో ఆర్ కామ్ నేడు ఓ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కంపెనీ రుణ భారం తగ్గించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పింది. పన్నులతో టెలికాం సెక్టార్ తీవ్రభారాన్ని భరించాల్సి వస్తుందని, దీంతో ఈ రంగ రుణాలు రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్టు వివరించింది. ప్రస్తుతమున్న పన్ను రేట్లను మరింత పెంచుతూ టెలికాం రంగాన్ని 18 శాత పన్నుశ్లాబులోకి తీసుకురావడంపై ఆందోళనవ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెలికాం రంగానికి మూడేళ్ల మానిటోరియం అందించాలని కోరింది. డేటా రేట్లు కూడా భారీగా దిగిరావడంతో రెవెన్యూలు కోల్పోతున్నామని చెప్పింది. కంపెనీ పురోగతిపై నెలాఖరున జరుగబోయే వచ్చే మీటింగ్ లో వివరించనున్నామని పేర్కొంది.. -
ఆ సెక్టార్ '8 లక్షల కోట్ల' టైమ్ బాంబు
ముంబై : టెలికాం సెక్టార్ పై బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భారీ ఎత్తున్న రుణాలు పొందిన టెలికాం రంగ వైఫల్యం పరిశ్రమలో డిఫాల్టర్ గా మారబోతుందంటూ ప్రభుత్వానికి టాప్ భారతీయ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. టెలికాం పరిశ్రమ రుణాలు 8 లక్షల కోట్లగా ఉన్నాయని, ఇవి ఓ టైమ్ బాంబుగా బ్యాంకులు అభివర్ణించాయి. ఈ రంగానికి బ్యాంకులు ప్రత్యక్షంగా రూ.2.63 లక్షల కోట్లను ఇవ్వగా, రూ.3.09 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ పేమెంట్లను టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించకుండా వాయిదా వేసినట్టు బ్యాంకులు పేర్కొన్నాయి. ఆపరేటర్స్ కాంట్రాక్ట్స్ పై ఆధారపడిన థర్డ్ పార్టీ రుణాలు సుమారు రూ. 1.8 లక్షల కోట్లగా ఉన్నట్టు బ్యాంకులు టెలికాం సెక్రటరీకి నివేదించాయి. దీనికి అదనంగా వార్షిక మూలధన ఖర్చులు రూ.35వేల కోట్లూ ఉన్నాయి. ఇన్ని కోట్ల రుణాలు కలిగిన టెలికాం సెక్టార్ వృద్ధి మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదని బ్యాంకులు పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి టెలికాం సెక్టార్ వార్షిక వృద్ధి మొత్తంగా 25 శాతం తగ్గి రూ.1,31,000 కోట్లను నమోదుచేయనుందని బ్యాంకులు అంచనావేస్తున్నాయి. 20 శాతం ఆపరేటింగ్ మార్జిన్లతో సర్వీసులు అందజేయడానికి సరియైన ఫండ్స్ ను బ్యాంకులు పొందలేవని బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే బ్యాంకులకు పేమెంట్లు చెల్లించడంలో డిఫాల్టర్స్ గా మారుతున్నాయని టెలికాం కార్యదర్శికి ఇచ్చిన ప్రజెంటేషన్ లో బ్యాంకులు పేర్కొన్నాయి. టెలికాం కంపెనీలు తమ రుణ సమస్యను భరించడానికి, ఈ సెక్టార్ కు కొంత పన్ను రిలీఫ్ ను అందించాలని బ్యాంకులు ప్రతిపాదిస్తున్నాయి. విలీనాలు, కొనుగోళ్లలో ప్రభుత్వాల నిబంధనలు సరళతరంగా ఉండాలని కూడా కోరాయి. తక్కువ స్పెక్ట్రమ్ వాడక ఛార్జీలు, లైసెన్సు ఫీజులు, పన్నులను ప్రభుత్వాలు తక్కువగా ఉంచాలని కూడా పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ లను సెక్యురిటీ కింద కంపెనీలు వాడితే, బ్యాంకులు రుణాలను అందించగలవని తేల్చిచెప్పాయి. -
టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద
ముంబై : టెలికాం టవర్ సంస్థల ఉద్యోగాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ సంస్థల్లో రెవెన్యూల దెబ్బ, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అద్దెలు రాకపోవడం టవర్ సంస్థల్లో ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. దాదాపు 6000 ఉద్యోగాలకు గండి కొట్టనున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో టెలికాం టవర్ కంపెనీల్లో పనిచేసే 10 శాతం మందికి ఉద్యోగాలు పోతాయని రిక్రూట్మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికాం టవర్ సంస్థలు 60వేల మంది ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. వీరిలో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. టెలికాం ఇండస్ట్రీతో సంబంధమున్న సేల్స్, మార్కెటింగ్, కార్పొరేట్ ఆఫీసు ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. కొత్త వ్యక్తుల నియామకాలు కూడా 50 శాతం మేర తగ్గినట్టు తెలిసింది. అయితే స్వల్పకాలంగా టెలికాం టవర్ ఇండస్ట్రి ఒత్తిడిలో కొనసాగినా.. దీర్ఘకాలంలో ఇది మరింత స్ట్రాంగ్ అవుతుందని ఎగ్జిక్యూటివ్ లు పేర్కొంటున్నారు. కంపెనీల విలీనం ప్రస్తుతం ఇండస్ట్రీ ఉద్యోగులను ఆందోళనలో పడేస్తుందని తెలుపుతున్నారు. -
జియోకు పోటీగా ఎయిర్టెల్ బంపర్ ఆఫర్?
ప్రస్తుతం టెలికం రంగంలో టారిఫ్ వార్ జోరుగా నడుస్తోంది. ఒకవైపు రిలయన్స్ జియో అన్లిమిటెడ్ కాల్స్, బోలెడంత డేటా అని ఊదరగొడుతుంటే మరోవైపు దానికి పోటీగా ఎయిర్టెల్ కూడా బరిలోకి దూకుతోంది. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాన్ని ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్వీట్ చేశారు. కొత్త ప్లాన్ ప్రకారం రూ. 399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా వస్తుంది, దాంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇదంతా 4జీ సిమ్ కార్డుతో పాటు 4జీ సదుపాయం ఉన్న ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. దాంతోపాటు జియో ఇటీవల ప్రకటించిన ధన్ ధనాధన్ ఆఫర్‌కు పోటీగా రోజుకు 1జీబీ, 2జీబీ డేటా లిమిట్‌తో వేర్వేరు ప్లాన్లు ప్రకటించాలని కూడా ఎయిర్టెల్ యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నుంచి ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు గానీ, టెలికం రంగానికి సంబంధించి కచ్చితమైన లీకులు ఇవ్వడంలో బఫ్నాకు మంచి రికార్డు ఉంది. దాంతో ఈ కొత్త ప్లాన్ల విషయంలో కూడా ఆయన చెప్పింది కరెక్టే కావచ్చని అంటున్నారు. -
'జియో ధరలతో ఇండస్ట్రీ అతలాకుతలమే'
ముంబై : ప్రైమ్ ఆఫర్ మరో 15 రోజులు, రూ.303తో మరో మూడు నెలలు ఉచిత ఆఫర్లంటూ రిలయన్స్ జియో అనూహ్య ఆఫర్లు ప్రకటించడంపై మళ్లీ ఇండస్ట్రిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జియో ప్రస్తుతం అందిస్తున్న ఛార్జీలు ఇండస్ట్రీని కంటిన్యూగా అంతలాకుతలం చేస్తాయని సెల్యులార్ ఆపరేటర్ బాడీ కోయ్ ఆందోళన వ్యక్తంచేసింది. టెలికాం ఇండస్ట్రీలో అసోసియేట్ అయ్యే బ్యాంకులపై, ఇతరులపై ఈ ప్రమాద ప్రభావం ఎక్కువగా పొంచి ఉన్నదని పేర్కొంది. అయితే తక్కువ ధరలతో సర్వీసులు అందించడం కస్టమర్లకు మంచిదే, కానీ అవి టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోననేదే అతిపెద్ద ప్రశ్నగా మారిందని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని కోర్టులు, టెలికాం ట్రిబ్యునలే తేల్చాల్సి ఉందన్నారు. టెలికాం ఇండస్ట్రి రూ.4.60 లక్షల కోట్లు వివిధ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు, బ్యాంకులకు రుణపడి ఉంది. జియో ప్రస్తుతం అందిస్తున్న ఈ ధరలు కంటిన్యూగా ఇండస్ట్రీని దెబ్బతీయనున్నాయని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ పేమెంట్లు, బ్యాంకుల రుణాల విషయంలో ప్రమాదం పొంచి ఉన్నాయని కోయ్ డైరెక్టర్ రాజన్ మ్యాథ్యూ చెప్పారు. కానీ ప్రత్యేకంగా రిలయన్స్ జియో టారిఫ్స్ పై స్పందించడానికి ఆయన తిరస్కరించారు. జియో మరింత కొంతమంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముందస్తుగా ప్రకటించిన ప్రైమ్ ఆఫర్ ను మరో 15 పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ 15 రోజుల లోపట ప్రైమ్ ఆఫర్ తో పాటు రూ.303తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ఉచితంగా సేవలందించనున్నట్టు జియో ప్రకటించింది. -
వొడాఫోన్, ఐడియాలకు స్పెషల్ ట్రీట్మెంటా?
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థకు ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. రెవెన్యూ క్యాప్, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రస్తుత నిబంధలకే విలీన సంస్థ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. టెలికాం రంగ ఆర్థిక సంపదను, వినియోగదారుల ప్రయోజనాలను సమతూకం చేస్తూ పాలసీలను అమలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ తో కలిసి మంత్రిత్వశాఖ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ను వెనక్కి నెట్టేసి, వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థ ఆ చోటును దక్కించుకోబోతుంది. ఒకవేళ విలీన సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, వారికి టెలికాం రంగంలో కొనసాగే అనుమతే లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా వారు నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. టెలికాం రంగంలో మెగా మెర్జర్ నిలువబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీనానికి ఏమన్న స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదన్నారు. ఐదు మార్కెట్లలో విలీన సంస్థ రెవెన్యూ మార్కెట్ షేరును, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ ను ఉల్లంఘించే అవకాశాలున్నాయని టెలికాం విశ్లేషకులు సందేహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. విలీనాలతో, కొనుగోళ్లతో టెలికాం రంగంపై ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. రెవెన్యూ క్యాపిటల్, సబ్ స్క్రైబర్ క్యాప్,స్పెక్ట్రమ్ క్యాప్ విషయంలో గైడ్ లైన్స్ ఉన్నాయని, వాటిని ఫాలో అవుతూ సమృద్ధికరమైన పోటీ వాతావరణం పొందాల్సిందేనన్నారు. దీనికోసం తాము అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వీఎన్‌వో వ్యాపారంపై డేటావిండ్ కన్ను
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన మొబైల్ ఉపకరణాల తయారీ కంపెనీ డేటావిండ్ తాజాగా టెలికం సర్వీసెస్ బిజినెస్‌లో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. లైసెన్స్ పొందిన తొలి ఆరు నెలల కాలంలోనే ఈ పెట్టుబడులు ఉంటాయని కంపెనీ పేర్కొంది. సంవత్సరానికి రూ.200లతో డేటా సర్వీసులను అందిస్తామని తెలిపింది. చౌక ధరలకే ట్యాబ్లెట్స్, స్మార్ట్ఫోన్లను విక్రయించే డేటావిండ్ కంపెనీ ఇదివరకే వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. కంపెనీకి ఒకవేళ లైసెన్స్ లభిస్తే.. ప్రస్తుత టెలికం ఆపరేటర్ భాగస్వామ్యంతో మొబైల్ టెలిఫోనీ, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్ చేస్తుంది. ‘ఒక నెలలో లైసెన్స్ రావచ్చు. తర్వాత డేటా సర్వీసులే లక్ష్యంగా ఆరు నెలల కాలంలో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం’ అని డేటావిండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తులి తెలిపారు. నెలకు రూ.20 లేదా అంతకన్నా తక్కువ ధరల్లో డేటా ప్లాన్లను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. అంటే సంవత్సరానికి రూ.200లకే డేటా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా కంపెనీ తాజాగా రూ.3,999 ధరతో విద్యాట్యాబ్–పంజాబి ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. -
మార్కెట్లో దూసుకెళ్తున్న టెలికాం దిగ్గజాలు
టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్‌లు గురువారం ట్రేడింగ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. మార్నింగ్ ట్రేడింగ్‌లో టెలికాం సర్వీసు ప్రొవైడర్ షేర్లు 11 శాతం మేర పైకి దూసుకెళ్లాయి. పోస్టు టెలినార్ డీల్ అనంతరం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ గా పేరున్న భారతీ ఎయిర్ టెల్ 52 వారాల గరిష్టంలో 11 శాతం పైకి ఎగిసి, రూ.397 వద్ద ట్రేడైంది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో ఏడు సర్కిళ్లలో టెలికాం ఇండియా ఆపరేషన్లు ఇక ఎయిర్ టెల్ సొంతం కానున్నాయి. 1800 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో అదనంగా 43.4 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ దీనికి లభించనుంది. ఉదయం 9.35 సమయంలో 7 శాతం పైకి ట్రేడయిన ఎయిర్ టెల్, తొలి 25 నిమిషాల్లో 11.28 మిలియన్ షేర్లు చేతులు మారడంతో మరింత పైకి ఎగిసింది. అదేవిధంగా ఐడియా సెల్యులార్ కూడా 6 శాతం పైకి జంప్ చేసి, రూ.120 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 5.31 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది.. -
జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్
-
టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్!: ఇండ్–రా
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20 శాతంమేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. అలాగే తీవ్రమైన పోటీ కారణంగా పరిశ్రమ 2017–18 అంచనాలను ప్రతికూల స్థితికి సవరించింది. కాగా ఈ అంచనాలు 2016–17కి మధ్యస్థం–ప్రతికూలంగా ఉన్నాయి. -
జియో ఎఫెక్ట్ : ఇండస్ట్రీ రెవెన్యూలు ఢమాల్
న్యూఢిల్లీ : ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ అంటూ ఉచిత ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల టెలికాం ఇండస్ట్రీకి రెవెన్యూలు గండికొడుతున్నాయట. దేశీయ టెలికాం ఇండస్ట్రీ తన రెవెన్యూలో ఐదోవంతును కోల్పోతుందని, దానికి గల కారణం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందించే ఉచిత సర్వీసులేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. 2017-18 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన అవుట్ లుక్ ను సమీక్షించిన ఈ సంస్థ, టెలికాం సెక్టార్ అవుట్ లుక్ స్టేబుల్ నుంచి నెగిటివ్‌లోకి(స్థిరం నుంచి ప్రతికూలం) వచ్చినట్టు చెప్పింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఈ రిపోర్టును గురువారం విడుదల చేసింది. ఇటీవల ఇండస్ట్రీ దిగ్గజాలు విడుదల చేసిన ఫలితాల్లోనూ అవి భారీగా కుప్పకూలాయి. ప్రస్తుతం మార్కెట్లో టెల్కోల మార్కెట్ షేరు పడిపోతుండగా.. రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ బేస్ చాలా త్వరగా పైకి ఎగుస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. 2017 జనవరిలో 72 మిలియన్ సబ్ స్క్రైబర్లుంటే, 2017 మార్చికి 100 మిలియన్లను క్రాస్ చేసినట్టు రిపోర్టు తెలిపింది. ధర విషయంలోనూ, అనుభూతి పరంగా మార్కెట్ షేరును ఆకట్టుకోవడంలో జియోకి సామర్థ్యమున్నట్టు పేర్కొంది. కస్టమర్ బేస్ ను నిలబెట్టుకోవడం ప్రస్తుతం టెల్కోల ముందున్న సవాళ్లని, వారి సామర్థ్యం, స్పీడ్, వర్చ్యువల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్స్ తో కస్టమర్లను కాపాడుకుంటూ ఉండాలని సూచించింది. ఐడియా, వొడాఫోన్ల విలీనంతో టెలికాం ఇండస్ట్రీలో స్పెక్ట్రమ్, ఇన్ఫ్రాక్ట్ర్చర్ల వృథా ఖర్చులు తగ్గుతాయని రిపోర్టు పేర్కొంది. -
ప్రస్తుత టెలికం యూజర్లకూ ఆధార్..
ధృవీకరణ కోసం డాట్‌కు ట్రాయ్ సిఫార్సు న్యూఢిల్లీ: నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకున్న ఉదంతాలు అనేకం బైటపడుతున్న నేపథ్యంలో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానం ద్వారా టెలికం సంస్థలు ప్రస్తుత మొబైల్ యూజర్లు కూడా ధృవీకరించవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ విధానం అమలు దిశగా ఆయా ఆపరేటర్లు టాక్ టైమ్ లేదా డేటాను యూజ ర్లకు ఉచితంగా అందించవచ్చని పేర్కొంది. టెలికం శాఖ (డాట్)కు పంపిన సిఫార్సుల్లో ట్రాయ్ ఈ అంశాలు ప్రస్తావించింది. ’కొత్త సబ్‌స్క్రయిబర్స్ మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న యూజర్లను కూడా దశలవారీగా ఈ–కేవైసీ విధానం ద్వారా ధృవీకరించాల్సిన అవసరం ఉంది’ అని ట్రాయ్ పేర్కొంది. అయితే, ఇటు సర్వీస్ ప్రొవైడర్లకు అటు యూజర్లకు ఇది ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని సూచించింది. నకిలీ పత్రాలతో పొందిన వందలాది సిమ్ కార్డులు చలామణీ అవుతున్న కేసులు అనేకం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. పేపర్ ఆధారిత కేవైసీతో పోలిస్తే ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానం చాలా పటిష్టమైనదిగా పేర్కొంది. -
2017లో 20 లక్షల ఉద్యోగాలు!
-
నిరుద్యోగులకు శుభవార్త
-
2017లో 20 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. డీమానిటైజేషన్ కారణంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు లభిస్తున్న ప్రోత్సాహం లాంటి ఇతర కారణాలల మూలంగా టెలికాం రంగంలో నిపుణుల అవసరం బాగా పెరగనుందని , దీంతో ఈ ఏడాది సుమారు 20 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం డేటా వ్యాప్తి, కొత్త సర్వీసు ప్రొవైడర్ల ప్రవేశంకారణంగా రెండు మిలియన్ల ఉద్యోగాలు ఈ ఏడాది పెరిగనున్నాయి. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలని నివేదిక భావించింది. డీమానిటైజేషన్ , మొబైల్ ధరలు తగ్గడం, నెట్ వర్క్ విస్తరణకు ఆయా కంపెనీల పెట్టుబడులు,ఇంటర్నెట్ వినియోగం , డిజిటల్ లావాదేవీలు పెరగడం, ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు కలిసి రానున్నాయని పేర్కొంది. టెలికాం రంగ నైపుణ్య కౌన్సిల్ (టీఎస్ఎస్సీ)తో కలిసి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఈ విభాగంలో 2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) లభిస్తాయని తెలిపింది. 2021 నాటికిటెలికాం రంగంలో మొత్తం 87 లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుంతుందని అంచనా వేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐఓటీ), మొబిలిటీ సొల్యూషన్స్, టెలికాం మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ నిర్మాణాలు, విక్రయాలు తదితర విభాగాలకు నిపుణులు అవసరమని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షులు నీతి శర్మ అన్నారు. మొబైల్ తయారీ సంస్థలకు 17.60 లక్షల (1.76 మిలియన్) మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల (0.37 మిలియన్)మంది ఉద్యోగుల అవసరమున్నట్లు తన నివేదికలో పేర్కొంది. నెట్వర్క్ ఇంజినీర్లు, సైబర్ భద్రతా నిపుణులు, సేవల నిపుణులు, యాప్ డెవలపర్లు, సిస్టమ్ ఇంజినీర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మొబైల్ తయారీ నిపుణులు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ , ఐ-డీఏఎస్ ఇంజనీర్లు ఉన్నాయి, బ్యాక్ ఆఫీస్ & ఎడ్మినిస్ట్రేషన్ లాంటి కీలక ప్రొఫైల్స్ లో 2017 నాటికి డిమాండ్ బాగా ఉంటుందని తెలిపింది. -
20 లక్షల ఉద్యోగాలకు ఈ ఏడాది రెడ్ కార్పెట్
కొత్త కొత్త సర్వీసు ప్రొవేడర్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణానికి తెరలేపుతున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి టెలికాం కంపెనీలు కొత్త ఉద్యోగవకాశాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో 2017లో టెలికాం రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త సర్వీసులు ప్రొవేడర్ల ఎంట్రీ, ప్రభుత్వ 'మేకిన్ ఇండియా' లాంటి కార్యక్రమాలు ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే నియామకాలు భారీగా పెరుగుతాయని, హ్యాండ్సెట్ తయారీదారులు 1.76 మిలియన్లు, సర్వీసు ప్రొవేడర్లు 0.37 మిలియన్ల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందని టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో కలిసి టీమ్‌లీజ్ రిపోర్టు చేసింది. 5జీ టెక్నాలజీతో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ రంగంలోనూ దీర్ఘకాలంలో మరిన్ని ఉద్యోగవాకాశాలు వస్తాయని పేర్కొంది. 2020-21లో ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ 0.92 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపింది. మొత్తంగా 2021 నాటికి 8.7 మిలియన్లకు పైగా ఉద్యోగవాకాశాలకు గ్యారెంటీ అని రిపోర్టు పేర్కొంటోంది. హ్యాండ్సెట్ ధరలు తగ్గడం, నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడం కోసం ఆపరేటర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ వ్యాలెట్ల వాడకం పెంపు వంటివన్నీ ఈ రంగంలో కొత్త ఉద్యోగవకాశాలకు దోహదం చేస్తాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీతి శర్మ చెప్పారు. నెట్వర్క్ ఇంజనీర్స్, ఇన్ఫ్రా, సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్, అప్లికేషన్ డెవలపర్స్, సిస్టమ్ ఇంజనీర్స్, ఐ-డీఏఎస్ ఇంజనీర్స్, ఇన్ షాప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, హ్యాండ్సెట్ మ్యానుఫాక్చరింగ్ టెక్నిషియన్స్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాక్ ఆఫీసు అండ్ అడ్మినిస్ట్రేషన్, రిపైర్ ఎగ్జిక్యూటివ్‌లకు 2017లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందని రిపోర్టు పేర్కొంది. -
జనవరిలో కాల్ డ్రాప్స్‌పై డ్రైవ్ టెస్ట్: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మళ్లీ కాల్ డ్రాప్స్‌పై డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఇది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశముంది. ట్రాయ్.. ఈ డ్రైవ్ టెస్ట్‌లో భాగంగా రిలయన్స్ జియోతోపాటు వివిధ టెలికం కంపెనీలకు సంబంధించిన పలు నెట్వర్క్ అంశాలతోపాటు కాల్ డ్రాప్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటుంది. ‘డ్రైవ్ టెస్ట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీన్ని నిర్వహించి ఉండాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. డ్రైవ్ టెస్ట్‌ను జనవరిలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహిస్తాం’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. కాగా ట్రాయ్ ఇదివరకు 12 పట్టణాల్లో డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహించింది. ఈసారి డ్రైవ్ టెస్ట్‌లో ఈ ప్రాంతాలతోపాటు హైవేలను, ఇతర ఏరియాలను కవర్ చేసే అవకాశముందని చెప్పారు. -
వొడాఫోన్.. ఉచిత కాలింగ్ ఆఫర్
ముంబై: దేశంలో రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అరుున ‘వొడాఫోన్’ తాజాగా ప్రి-పెరుుడ్ కస్టమర్లకు ఉచిత కాలింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు కొత్త ప్యాక్‌లను ఆవిష్కరించింది. 28 రోజుల వాలిడిటీతో కూడిన ఈ ప్లాన్లు 2జీ, 3జీ, 4జీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ప్లాన్ ధరలు ఒక్కొక్క సర్కిల్లో ఒక్కో రకంగా ఉంటారుు. ఆ రెండు ప్లాన్ల వివరాలు... ⇔ రూ.144-149 ప్లాన్: ఈ ప్లాన్‌లో కస్టమర్లు వొడాఫోన్ కనెక్షన్లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అదే 4జీ హ్యాండ్సెట్ యూజర్లు అరుుతే 300 ఎంబీ డేటాను పొందొచ్చు. ఇక నేషనల్ రోమింగ్‌లో ఇన్కమింగ్ ఫ్రీ. ⇔ రూ.344-349 ప్లాన్: ఈ ప్లాన్ యూజర్లు ఏ నెట్‌వర్క్‌కై నా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 50 ఎంబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అదే 4జీ హ్యాండ్సెట్ యూజర్లు అరుుతే 1 జీబీ డేటాను పొందొచ్చు. నేషనల్ రోమింగ్‌లో ఇన్కమింగ్ ఫ్రీ. -
ఆగస్టులో తగ్గిన టెలికం యూజర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య ఆగస్టులో సుమారు అర శాతం క్షీణించి 105.34 కోట్లకు తగ్గింది. అంతకు ముందు నెలలో (జులై) ఇది 105.88 కోట్లుగా ఉంది. ప్రధానంగా 4జీ టెక్నాలజీ రాకతో రిలయన్స కమ్యూనికేషన్స 2జీ కస్టమర్లను కోల్పోవడం దీనికి కారణమైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం రిలయన్స కమ్యూనికేషన్స సీడీఎంఏ టెక్నాలజీ నుంచి ఎల్టీఈ (4జీ) టెక్నాలజీకి మారడంతో సీడీఎంఏ సబ్స్క్రరుుబర్స్ సంఖ్య 1.8 కోట్ల మేర ఆగస్టులో తగ్గింది. జులైలో కూడా ఆర్‌కామ్ 32 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోరుుంది. మొత్తం మీద జూన్-ఆగస్టు మధ్య కాలంలో ఆర్‌కామ్ ఆరో స్థానానికి పడిపోరుుంది. మరోవైపు, కొత్త కస్టమర్లను దక్కించుకోవడంలో బీఎస్ఎన్ఎల్ ముందువరుసలో నిల్చింది. మొత్తం మీద 9.23 కోట్ల కనెక్షన్లతో నాలుగో స్థానంలో ఉంది. -
కాల్స్ డ్రాప్స్‌పై చేతులెత్తేసిన ప్రభుత్వం
కాల్స్ డ్రాప్స్ సమస్యతో ఓవైపు కస్టమర్లు సతమతమవుతుంటే, ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించలేమని కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొనే సమస్యగా పేర్కొన్న కేంద్రం టెలికాం నెట్‌వర్క్‌లో కాల్‌డ్రాప్స్‌పై పూర్తిగా పరిష్కరించలేమంటూ శుక్రవారం వెల్లడించింది. బలహీనమైన రేడియో కవరేజ్, రేడియో ఇంటర్ఫియరెన్స్, అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ లోడింగ్, ట్రాఫిక్ తీరులో మార్పులు, పవర్ ఫెయిల్యూర్స్‌తో సైట్లు మూత వంటి వివిధ కారణాల చేత కాల్డ్రాప్స్ ఏర్పడతాయని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభ్యకు శుక్రవారం తెలిపారు. ఈ కారణాలచే ప్రతి వైర్లెస్ నెట్‌వర్క్‌ల్లో కాల్ డ్రాప్స్ సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని, టెలికాం ఆపరేటర్లు కాల్ డ్రాప్ సమస్యను గుర్తించి, వారి పరిమిత స్థాయిలో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. కానీ పూర్తిగా మాత్రం నిర్మూలించలేమని చెప్పారు. -
కాల్డ్రాప్స్ పై ఫీడ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్: మనోజ్ సిన్హా
అవసరమైతే టెల్కోలపై కఠిన చర్యలు న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ విషయంలో అవసరమైతే టెలికం ఆపరేటర్లపై చర్యలు తీసకుంటామని, జరిమానా సైతం విధిస్తామని ఆ శాఖ మంత్రి మనోజ్‌సిన్హా హెచ్చరించారు. కాల్స్ ఫెయిల్ అవడంపై వినియోగదారులు నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు నెలరోజుల్లోపు ఓ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చే కాల్స్ కోసం తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు సమకూర్చనందున భారీగా కాల్డ్రాప్స్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాల నుంచి రూ.3,050 కోట్ల భారీ జరిమానా వసూలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే టెలికం శాఖకు సూచించిన విషయం తెలిసిందే. ట్రాయ్ సిఫారసులు తమకు చేరాయని, నిబంధనల ప్రకారం తాము ఎవరికైనా లెసైన్స్ జారీ చేస్తే వారు సేవలు అందిస్తారని, అలా అందేలా తాము చూస్తామని సిన్హా చెప్పారు. నియంత్రణపరమైన కార్యాచరణకు లోబడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు టెలికం ఆపరేటర్లతో మంగళవారం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో చెప్పారు. ఆపరేటర్ల మధ్య వివాదంతో వినియోగదారులు సమస్యలు ఎదుర్కోరాదన్నారు. దేశంలో కాల్ డ్రాప్స్ సమస్య అనేదే ఉండరాదన్నారు. ఈ విషయంలో జరిమానా మాత్రమే కాదని, అవసరమైతే ఇతర చర్యలు కూడా తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కాల్ డ్రాప్ సమస్య గణనీయంగా తగ్గింది..
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించే దిశగా టెలికాం కంపెనీల ప్రయత్నాలు ఫలించినట్టు తెలుస్తోంది. 100 రోజుల కాల్ డ్రాప్ ప్రణాళిక అను అనేక టెలికాంలు విజయవంతంగా అమలు చేశాయి. అనేక టెలికం సర్వీసు ప్రొవైడర్లు కాల్ అమలుచేసిన 100 డేస్ ప్లాన్ సానుకూల ఫలితాలు సాధించినట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ)డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ సోమవారం తెలిపారు. కాల్ డ్రాప్ సమస్య వివాదంలో గణనీయమైన వృద్ధిని సాధించినట్టు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా కాల్ డ్రాప్ సమస్య ఉందన్నారు. ప్రభుత్వం టెలికాం కంపెనీలకు కాల్ డ్రాప్ సమస్యను మెరుగుపరిచేందుకు జూన్ లో 100 రోజుల రోడ్ మ్యాప్ ఇచ్చింది. దీంతో కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు టెలికాం సెక్రటరీ జెఎస్ దీపక్ తెలిపారు. గత జూన్ లో సర్వీస్ ప్రొడైవర్ల సమావేశం నిర్వహించామని, ఆ సందర్భంగా వారు ఈ వందరోజుల ప్లాన్ అమలుకు అంగీకరించినట్టు చెప్పారు. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19శాతానికి మాత్రమే తగ్గినట్టు వివరించారు. మొదటి 45 రోజుల్లో 48,000 లకు అదనంగా దేశం అంతటా 100 రోజుల్లో 60,000 బీటీఎస్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను)జోడించనున్నట్టు జులై 25న మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. ఈ నేపథ్యంలో12 వందల కోట్ల పెట్టుబడితో 60,000 బీటీఎస్ లను ఇన్ స్టాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా .ఇదేసమస్యపై టెలికాం కంపెనీల సీఈవోలతో కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా రేపు(నవంబర్ 1) సమావేశం కానున్నారు. -
టెల్కోలపై రూ.11 కోట్ల జరిమానా
మొబైల్ టవర్ల రేడియేషన్ నిబంధనలు ఉల్లఘించినందుకు గాను టెలికాం ఆపరేటర్లపై ప్రభుత్వం జరిమానా విధించింది. రూ.10.8 కోట్ల జరిమానా విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జరిమానా నేపథ్యంలో రేడియేషన్ ప్రభావం వల్ల ప్రజారోగ్యంపై ఏర్పడే ప్రభావిత అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. 2016 జూలై 31 వరకు టెలికాం డిపార్ట్మెంట్ మొత్తం 3.19 లక్షల బేస్ స్టేషన్లలో పరీక్షలు నిర్వహించింది.ఈ పరీక్షల్లో కొన్ని బేస్స్టేషన్లలో టెలికాం కంపెనీలు మొబైల్ టవర్ల రేడియేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. దీంతో టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం 10.8 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పార్లమెంట్లో మంగళవారం నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్‌లో టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రేడియేషన్ నిబంధనలను 90శాతం కఠినతరంగా అమలుచేస్తున్నట్టు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 25-30 ఏళ్లలో మొత్తంలో 25వేల సర్వేలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిందని, ఏ అధ్యయనంలోనూ ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ సమావేశ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఉద్గార ప్రభావాలపై ప్రశ్నలు సంధించారు. దేశంలో ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్ మొబైల్ టవర్ల నుంచి వస్తున్న రేడియేషన్ ఉద్గారాలు, ప్రపంచ నిబంధనల కంటే ఎనిమిది రెట్లు అధికంగా ఉన్నాయని తేలినట్టు ఎంపీ రవీంద్ర కుమార్ జెనా ఆరోపించారు.మొబైల్‌ను అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే పదేళ్లలో బ్రెయిన్ ట్యూమర్ బారినపడే అవకాశముందని యూరోపియన్ అధ్యయనాన్ని,ఇదేమాదిరి స్వీడన్ రిపోర్టును ఆయన ప్రస్తావించారు. జెనా ఆందోళనలపై తాము విచారణ చేస్తామని టెలికాం మంత్రి హామి ఇచ్చారు. ఎవరైనా ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు రేడియేషన్‌లో కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే, వారిపై కఠిన తప్పవని టెలికాం మంత్రి హెచ్చరించారు. టెలికాం మంత్రి, జెనాలతో పాటు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఆర్‌కామ్ టవర్ల వ్యాపారంలో బ్రూక్‌ఫీల్డ్‌కు 51% వాటా
డీల్ విలువ రూ.11,000 కోట్లు న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనున్నది. డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. టవర్ల వ్యాపారంలో ఆర్‌కామ్‌కు ఇంకా 49 శాతం వాటా ఉందని, భవిష్యత్తులో ఈ వాటాను విక్రయించే ఆలోచన ఆర్‌కామ్‌కు ఉందని సంబంధిత వర్గాలంటున్నాయి. రెండేళ్లలో టవర్ల అద్దెల్లో మంచి వృద్ది ఉంటుందని, ఫలితంగా తమ వాటాకు మరింత విలువ వస్తుందని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలిక మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్(ఎంఎస్ఏ) ప్రకారం తమ టెలికం వ్యాపారం కోసం ఈ టవర్ ఆస్తుల్లో యాంకర్ టెనంట్గా కొనసాగుతామని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ టవర్ల వ్యాపారంలో వాటా విక్రయం, ఎయిర్‌సెల్ విలీనం కారణంగా ఆర్‌కామ్ రుణ భారం రూ.42,000 కోట్ల నుంచి దాదాపు 60% వరకూ తగ్గి రూ.17,000 కోట్లకు దిగివస్తుందని అంచనా. కాగా రియల్ ఎస్టేట్ వ్యాపార విక్రయం ద్వారా మరో రూ.5,000 కోట్లు సమీకరించాలని ఆర్‌కామ్ భావిస్తోంది. దీంతో కంపెనీ రుణ భారం రూ.12,000 కోట్లకు తగ్గొచ్చని అంచనాలున్నాయి. -
టెలికం ఆపరేటర్లపై రింగో ఆరోపణలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ సేవల యాప్ ‘రింగో’ తన నెట్‌వర్క్‌కు టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్ ఇంటర్కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసింది. దీనిపై ఆపరేటర్లకు లేఖలు రాయగా ఎలాంటి స్పందన లేదని, ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేశామని రింగో సీఈవో భవీన్ తురాఖియా చెప్పారు. బీఎస్ఎన్ఎల్ మినహా మిగిలిన ఆపరేటర్లు ఇంటర్ కనెక్షన్‌కు అవకాశం కల్పించడం లేదన్నారు. విమొబి అనే తమ సబ్సిడరీ ద్వారా ఫిబ్రవరిలో యూనిఫైడ్ లెసైన్స్ తీసుకున్నామని, అయితే ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు ప్రారంభించకుండా ఉంటేనే మా నెట్‌వర్క్‌కు ఇంటర్ కనెక్షన్ కల్పిస్తామని ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు చెప్పాయని వివరించారు. నిమిషానికి 20పైసలే: ప్రస్తుతం వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసల నుంచి రూపాయిన్నర వరకు కంపెనీలు వసూలు చేస్తున్నాయని, తాము 20 నుంచి 35 పైసలకే అందిస్తామన్నారు. లేవాస్తవానికి రింగో తన చౌక యాప్ కాలింగ్ సేవలను 2015 నవంబర్లోనే ప్రారంభించింది. 90 శాతం చౌకగా కాల్స్ అందిస్తుండడంతో టెలికం ఆపరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ట్రాయ్ సూచన మేరకు రింగో తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. రింగో మొబైల్ యాప్ యాప్ 3జీ, 4జీ నెట్‌వర్క్‌లపై, వైఫై మోడ్‌లోనూ పనిచేస్తుంది. ఈ యాప్ కస్టమర్లను వారి మొబైల్ నంబర్ ఆధారంగా నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తుంది. దీంతో దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్‌కు అయినా కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : దేశీయ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం ముగింపులో స్వల్పలాభాల్లో గట్టెక్కిన సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 242.45 పాయింట్ల లాభంలో 28,108 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ 82.9 పాయింట్లు ఎగిసి కీలకమార్కు 8700కు దగ్గర్లో 8694గా కొనసాగుతోంది. మారుతీ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, టాటామోటార్స్ లాభాల్లో నడుస్తుండగా.. ఓఎన్జీసీ, విప్రో, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్లు నష్టాలను గడిస్తున్నాయి. పండుగ సీజన్ కు ముందే సెప్టెంబర్ నెలలో కార్ల కంపెనీలన్నీ దాదాపు మంచి వృద్ధిని నమోదుచేసినట్టు ప్రకటించాయి. దేశీయ దిగ్గజం మారుతీ అమ్మకాల్లో దూసుకుపోగా, ఎమ్ అండ్ ఎమ్, ఐషర్ మోటార్స్ సైతం అంచనాలకు అనుగుణంగా విక్రయాలు జరిపాయి. దీంతో నేటి మార్కెట్లో ఆటో రంగ షేర్లపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశముంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం జరుగుతున్న నేపథ్యంలో టెలికాం స్టాక్స్‌పై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. నేచురల్ గ్యాస్ ధరలను తగ్గడంతో కొన్ని ఆయిల్ కంపెనీలు ఒత్తిడికి గురయ్యే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్యాస్ ధరల తగ్గింపు ఇటు ఫెర్టిలైజర్స్ స్టాక్స్‌కు పూర్తి మద్దతు ఇవ్వనుంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడింది.శుక్రవారం ముగింపుకు 7 పైసలు బలపడి 66.54గా ప్రారంభమైంది. -
4జీతో ఈ-కామర్స్‌కు రెక్కలు!
• చౌక డేటాతో మరింత మంది ఆన్‌లైన్‌లోకి • తక్కువ ధరలోనే 4జీ ఫోన్లు • ఇవన్నీ లాభిస్తాయంటున్న ఈ-కామర్స్ పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు... ఇటు టెలికం వినియోగదారులతో పాటు అటు ఈ-కామర్స్ విక్రయాల పెరుగుదలకూ దోహదం చేస్తాయనే అంచనాలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలతో అత్యాధునిక 4జీ స్మార్ట్ఫోన్లు సైతం రూ.3 వేల నుంచే లభించటం మొదలెట్టాయి. ఒకవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు చౌక 4జీ... ఈ రెండూ కలసి నెటిజన్లు ఎక్కువసేపు బ్రౌజింగ్ చేయటానికి ఉపకరిస్తాయని, దీంతో తమ అమ్మకాలు కూడా పెరుగుతాయని ఈ-కామర్స్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ కస్టమర్లలో 10 శాతం మందే ఇంటర్నెట్ను విస్తృతంగా వాడుతున్నారు. ఇంటర్నెట్ ఉపయోగాలు వీరికి బాగా తెలుసు. డేటా చార్జీలు ఎక్కువగా ఉండడం, కనెక్టివిటీ సమస్యలతో మరో 30 శాతం మంది పరిమితంగా వాడుతున్నారు. మిగిలిన వారు నెట్ బ్రౌజింగ్‌కు ఇంకా అలవాటు పడాల్సి ఉందని ‘షాప్‌క్లూస్ డాట్‌కామ్’ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు సగటున నెలకు 320 ఎంబీ డేటా వినియోగిస్తున్నారు. జియో రాకతో కొద్ది రోజుల్లో ఇది 1జీబీ దాటుతుందని ఇండస్ ఓఎస్ కంపెనీ చెబుతోంది. 90 రోజులపాటు ఉచితంగా డేటా, వాయిస్ కాల్స్‌ను జియో అందిస్తున్న సంగతి తెలిసిందే. జియోకు ధీటుగా ఇప్పటికే మిగిలిన టె లికం కంపెనీలు డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. ఈ పరిణామంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగి కస్టమర్లు ఎక్కువ సమయం సర్ఫింగ్‌కు కేటాయిస్తారని, తద్వారా ఈ-కామర్స్ కంపెనీల అమ్మకాలు పెరగడం ఖాయమని అమెజాన్ కేటగిరీ మేనేజ్మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. స్మార్ట్ఫోన్ల ధరలు కూడా దిగిరావడం కలసివచ్చే పరిణామమని చెప్పారాయన. అమెజాన్ ద్వారా జరుగుతున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 80 శాతం 4జీ మోడళ్లేనని తెలియజేశారు. సింహభాగం మొబైల్ నుంచే.. ఈ-కామర్స్ కంపెనీలకు 70 శాతానికి పైగా ట్రాఫిక్ మొబైల్స్ నుంచే సమకూరుతోంది. అంటే మొబైల్ నుంచే ఉత్పత్తులకు ఆర్డర్లిస్తున్నారు. వాస్తవానికి ప్రధాన ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకొక్కటీ ఎంతకాదన్నా 6-10 కోట్ల ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. అందుకే కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. కస్టమర్లు సర్చ్ చేస్తున్నప్పుడు టాప్ సెల్లింగ్ ఉత్పత్తులను సూచించడం ఈ కోవలోకే వస్తుంది. అలాగే కావాల్సిన ఉత్పాదనను సులువుగా ఎంచుకునేలా, ఆర్డరు ఇచ్చేందుకు వీలుగా యాప్స్‌ను అప్డేట్ చేస్తున్నాయి. ఉత్పత్తులను విభజించి కేటగిరీల వారీగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇక మొబైల్ తయారీ కంపెనీలు సైతం ఇన్‌బిల్ట్‌గా టాప్ ఈ-కామర్స్ సైట్ల యాప్స్‌ను జోడిస్తున్నాయని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలియజేశారు. ఇదీ ఈ-కామర్స్ మార్కెట్.. మొబైల్ ఇంటర్నెట్పై కస్టమర్లు చేస్తున్న వ్యయం 2014లో 54 శాతం, 2015లో 64 శాతం వృద్ధి చెందింది. దేశంలో ప్రస్తుతం 33 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు. వీరిలో 6 కోట్ల మంది ఆన్ లైన్ కొనుగోలుదారులు. 2013లో ఆన్లైన్ వినియోగదారులు 1.5 కోట్లలోపే. ఇక 2019-20 నాటికి ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 11 కోట్లకు చేరుతుందని బ్రోకరేజ్ కంపెనీ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. తద్వారా ఈ-టైలింగ్ పరిమాణం 28 బిలియన్ డాలర్లకు ఎగుస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ-టైలింగ్ పరిమాణం 15 బిలియన్ డాలర్లుంది. ఆన్లైన్ షాపింగ్ 2014లో 14 శాతం వృద్ధి చెందితే, 2016లో 27 శాతం అధికమయింది. -
జతకట్టిన ఆటో, టెలి దిగ్గజాలు
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. మొన్నమొన్ననే వచ్చిన 3జీ సేవలకు కాలం చెల్లిపోయింది.. 4జీ సర్వీసులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 4జీ కంటే వేగవంతమైన సర్వీసులు 5జీలను అభివృద్ధి చేసేందుకు టెక్నాలజీ సంస్థలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించేశాయి.. దీంతో 4జీలకు డిమాండ్ పడిపోయి, వచ్చే కాలమంతా 5జీ సర్వీసులు మార్కెట్‌ను మరింత ఊపేయనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే కాలంలో మొబైల్ కమ్యూనికేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెల్లాయించనున్న 5జీ సేవలపై ముందస్తుగా ఇటు టెలికమ్యూనికేషన్ దిగ్గజాలు, అటు ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ చేతులు కలిపాయి. ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ, డైమ్లర్, ఎరిసన్, హ్యువాయ్, ఇంటెల్, నోకియా, క్వాల్కామ్ సంస్థలు ఒకటిగా ఏర్పడి '5జీ ఆటోమోటివ్ అసోసియేషన్'ను ఏర్పాటుచేసుకున్నాయి. వచ్చే దశాబ్దంలో మార్కెట్‌కు సవాలుగా నిలువనున్న 5జీ సేవలు డిజిటలైజేషన్‌కు, స్వయంచోధక డ్రైవింగ్‌కు ఉపయోగపడేలా ఈ అసోసియేషన్ పనిచేయనుంది. టెక్నికల్, రెగ్యులేటరీ సమస్యలను ఈ అసోసియేషన్ గుర్తిస్తూ, తదుపరి తరం మొబైల్ నెట్వర్స్ కనెక్షన్, రహదారి భద్రతా కొరకు సమాచార పరిష్కారాలను ఈ అసోసియేషన్ అభివృద్ధి చేయనుంది. సాంకేతిక అవసరాలు, అమలు చేసే వ్యూహాలపై ఈ అసోసియేషన్ పనిచేయనుంది. ప్రతి వాహనానికి అవసరమయ్యే వైర్లెస్ కనెక్టివిటీ, సెక్యురిటీ, భద్రత, క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ వంటి సాంకేతిక అవసరాలను ఈ అసోసియేషన్ గుర్తించనుంది. . -
ముకేశ్ రీఎంట్రీపై టెల్కోల్లో గుబులు!
• రిలయన్స్ జియో లక్ష ్యం..10 కోట్ల మంది యూజర్లు! • ఇప్పటికే అనధికారికంగా సేవలు షురూ... • 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ సేవలతో గాలం... • దీంతో మార్కెట్ వాటాపై పాత టెల్కోల్లో కలవరం... ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ టెలికం రంగంలోకి రీఎంట్రీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే చర్యలను వేగవంతం చేయడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా, వీలైనంత త్వరగా 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది ముకేశ్ మెగా ప్రణాళికగా పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీటా(ప్రయోగాత్మక) సేవల పేరుతో ఎటువంటి మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నా... 90 రోజుల ఉచిత అన్లిమిటెడ్ డేటా, వాయిస్ సేవలు అంటూ యూజర్లకు రిలయన్స్ జియో ఇప్పటికే ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ జోరుతో ప్రస్తుత టెల్కోల్లో కలవరం మొదలైంది. ఇది స్పెక్ట్రం వాడక నిబంధనలకు విరుద్ధమని, పరీక్షల పేరుతో రిలయన్స్ జియో పూర్తిస్థాయి సేవలను ఇస్తోందంటూ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సర్కారు ఖజానాకు కూడా గండికొడుతోందని ఆరోపణలు గుప్పించింది. మార్కెట్ వాటా కోసమే... రిలయన్స్ జియో రాక నేపథ్యంలో ఇప్పటికే మొబైల్ డేటా విభాగంలో టెల్కోలు పోటాపోటీగా టారిఫ్‌ల తగ్గింపు, పరిమితి పెంపు వంటి చర్యలతో ధరల పోరుకు తెరతీశాయి. ప్రస్తుతం దేశీ టెలికం పరిశ్రమ మార్కెట్ వాటాలో ఐదింట మూడొంతులు దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ చేతిలోనే ఉంది. జియో పూర్తిస్థాయి అరంగేట్రానికి ముందే డేటా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేచర్యల్లో భాగంగా ఈ మూడు టెల్కోలు టారిఫ్‌లను తప్పనిసరిగా తగ్గించుకునేలా చేస్తోంది. ఇది ఆయా కంపెనీల వాటాదారులపైనా ప్రభావం చూపుతోంది. జియో 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకునే పరిస్థితే ఉంటే ఎక్కడ యూజర్లను కోల్పోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో టెల్కోలు ఉన్నాయి. మార్కెట్ వాటాను చేజార్చుకుంటే మళ్లీ దక్కించుకోవడం కష్టసాధ్యమన్నది ఆయా కంపెనీల కలవరపాటుకు ప్రధాన కారణం. జియో ఎదురుదాడి... మరోపక్క, రిలయన్స్ జియో కూడా తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు ఎదురుదాడి మొదలుపెట్టింది. తమ బీటా సేవల్లో వినియోగదారులు ఇతర టెల్కోలకు సంబంధించిన నెట్‌వర్క్‌కు కాల్ చేసినప్పుడు తగిన ఇంటర్కనెక్షన్ సేవలను అందించకుండా ప్రస్తుత టెల్కోలు తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయంటూ రిలయన్స్ జియో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విదితమే. మొత్తంమీద సీఓఏఐ, జియోల మధ్య నెలకొన్న ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం కూడా గందగోళంలో పడినట్లు కనిపిస్తోంది. దాదాపు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న అదిపెద్ద స్పెక్ట్రం వేలాన్ని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడం దీనికి నిదర్శనం. అప్పుల కుప్పలు... వాస్తవానికి నెట్వర్క్ విస్తరణపై ఇప్పటికే వేల కోట్ల రూపాయిలు కుమ్మరిస్తున్నా ఆ స్థాయిలో ఇంకా డేటా వినియోగం మరింతగా పుంజుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐడియా వార్షిక స్థూల లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5.7 రెట్లు కాగా, భారతీ ఎయిర్టెల్ విషయానికొస్తే.. 3.3 రెట్లుగా ఉంది. ఇక రిలయన్స్ జియో కూడా దేశవ్యాప్త 4జీ సేవల కోసం ఇప్పటికే 20 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. అయితే, టెలికం విస్తరణ కోసం మరింతగా రుణం సమరించే ప్రణాళికలపై ప్రస్తుత టెల్కోలకు చెందిన మైనారిటీ వాటాదారులు వ్యతిరేక గళం వినిపిస్తుండటం గమనార్హం. మరోపక్క, పెట్రోలియం-రిఫైనింగ్ వ్యాపారంలో లాభాల పంట పండుతుండటంతో ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో మాత్రం తన ప్రతిష్టాత్మక ప్రణాళికల విషయంలో ఏమాత్రం తగ్గకుండా పెట్టుబడులను కుమ్మరిస్తోంది. ముకేశ్ లక్ష్యంగా పెట్టుకున్న 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్ల మార్కుపైనే దృష్టిపెట్టి ముందుకెళ్తోంది. పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ యూజర్లకూ జియో ఉచిత సేవలు... న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు తాజాగా టెలికం సర్వీసెస్ ప్రొవైడర్ రిలయన్స్ జియోతో జతకట్టాయి. దీంతో పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను కొనుగోలు చేసిన వారు జియో 90 రోజులపాటు ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను పొందొచ్చు. జియోతో ఇప్పటికే ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు జతకట్టాయి. ‘మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసినవారు వారి హ్యాండ్‌సెట్‌తోపాటు జియో సిమ్‌ను పొందొచ్చు. ఈ సిమ్ ద్వారా 3 నెలలపాటు అపరిమిత హెచ్డీ వాయిస్, వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా సేవలను పొందొచ్చు’ అని మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుభజిత్ సేన్ తెలిపారు. అలాగే యూ స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు కూడా ఈ సేవలను పొందొచ్చని పేర్కొన్నారు. తమ 4జీ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులు కూడా జియో ప్రివ్యూ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబిలిటీ డివిజన్) పంకజ్ రాణా తెలిపారు. -
పీవీ గొప్ప సంస్కరణవేత్త కాదు
- తప్పనిసరి పరిస్థితుల వల్లే సంస్కరణలు తెచ్చారు: జైట్లీ - పీవీ ప్రధాని అయినపుడు దేశం దివాలా తీసే పరిస్థితి ఉంది ముంబై : మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గొప్ప సంస్కరణవేత్తో, పెద్ద సరళీకరణవేత్తో కాదని, నెహ్రూ తరహా ఆర్థిక విధానాలు విఫలమవటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పీవీ సంస్కరణలను ప్రారంభించారని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉండగా 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. జైట్లీ శనివారం ముంబైలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పీవీ మీద రాసిన పుస్తకం (హాఫ్ లయన్: హౌ పి.వి.నరసింహారావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా)లో ప్రస్తావించిన ఒక ఘటనను ఉటంకిస్తూ.. ‘‘పీవీ ఏపీలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నపుడు ప్రైవేటు కాలేజీలన్నిటినీ రద్దుచేయాలని, ప్రభుత్వమే కాలేజీలు నడపాలన్నది ఆయన తొలి నిర్ణయం. కానీ ఆయన ప్రధాని అయినపుడు దేశ ఖజానాలో విదేశీ మారకద్రవ్య నిల్వలు లేవని ఆయన గుర్తించారు. దేశం దివాలా దిశగా పోతోంది. తప్పనిసరి స్థితి కారణంగా సంస్కరణలు తెచ్చారు.’ అని అన్నారు. తీవ్ర విమర్శల పాలైన ‘హిందూ వృద్ధి రేటు’ (ఆర్థిక సంస్కరణలకు పూర్వం 1950 - 1980ల మధ్య దేశంలో వృద్ధి రేటు)కు నెహ్రూ ఆర్థికవిధానాలే కారణమన్నారు. ‘‘1950, 60లలో మనకు పరిమిత వనరులు ఉన్నాయి. 70లు, 80లలో వృథా అయ్యాయి. అప్పుడు కొన్ని పనులు తామే చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. టెలికం రంగం ఇందుకు ఉదాహరణ. 1947-95 వరకూ ఫోన్ కనెక్షన్ ఇవ్వడం తమ పనేనని ప్రభుత్వాలు భావించాయి. తొలి 50 సంవత్సరాల్లో భారతీయుల్లో ఒక శాతం కన్నా తక్కువ మందికే టెలిఫోన్లు ఉన్నాయి. కానీ టెలికాం రంగంలోకి ప్రైవేటు రంగం ప్రవేశించాక కనెక్షన్ల సంఖ్య 20 ఏళ్లలో 80 శాతానికి పెరిగాయి. తప్పనిసరి పరిస్థితితో నెహ్రూ తరహా ఆలోచనా విధానం నుంచి బయటకు వచ్చాం’’ అని అన్నారు. -
జీఎస్టీ వద్దంటూ అప్పుడే లాబీయింగ్
పార్లమెంట్ ఇటీవలే ఆమోదించిన ప్రతిష్ఠాత్మకమైన బిల్లు జీఎస్టీపై భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ పన్ను మినహాయింపును ఎంజాయ్ చేసిన కొన్ని రంగాలు జీఎస్టీ రాకతో తమపై పడే భారాన్ని లెక్కలేసుకుంటున్నాయి. ఈ పన్ను నుంచి తమను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అప్పుడే లాబీయింగ్ కూడా మొదలు పెట్టేశాయట. ఈ లాబీయింగ్‌లో ఎక్కువగా పరికరాలను దిగుమతి చేసుకునే పునరుత్పాదక ఇంధన రంగం ముందంజలో ఉంది. ఇప్పటివరకు జీరో కస్టమ్ డ్యూటీని ఎంజాయ్ చేసిన సౌర విద్యుత్ పరికరాల సంస్థలు.. జీఎస్టీ రాకతో దిగుమతిచేసుకోబోయే సోలార్ ప్యానళ్లపై 18 శాతం పన్నులను భరించాల్సి ఉంటుంది. దీంతో సౌర విద్యుత్ ధర కూడా యూనిట్‌కు రూపాయి వరకు పెరగనున్నట్టు రీన్యూ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రవి సేత్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదనను ఉంచినట్టు తెలిపారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుచేశాక దీనిపై ఆ కౌన్సిలే నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సీఈవో సునీల్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ రంగానికి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల నుంచి మినహాయింపు ఉంది. జీఎస్టీ రాకతో పన్నులన్నింటిలో మార్పులు సంభవించి, టారిఫ్ కనీసం 10 శాతం ఎగిసే అవకాశాలున్నట్టు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా టెలికాం రంగం సైతం జీఎస్టీ నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వాన్ని కాకా పడుతోందట. జీఎస్టీ విధింపుతో వినియోగదారులు చార్జీల భారం భరించాల్సి ఉన్నట్టు ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ విధింపుతో పెట్రో ఉత్పత్తులు, విద్యుత్ చార్జీలు పెరిగి.. వీటిని బాగా వాడుకునే టెలికాం టవర్లపై ప్రభావం చూపగలవని అంచనా వేస్తున్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ తప్పనిసరిగా తమ భయాందోళనలు అర్థంచేసుకుని నిర్ణయం ప్రకటిస్తుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగం సైతం జీఎస్టీ నుంచి మినహాయింపును డిమాండ్‌ను చేస్తోంది. ఎయిర్ లైన్ సెక్టార్లో 5.6 శాతం నుంచి 9 శాతంగా ఉన్న సర్వీసు టాక్స్ రేంజ్ జీఎస్టీ రాకతో మరింత పెరగనుంది. -
సరళీకృత ఆర్థిక విధానాలే శ్రీరామరక్ష
- జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ - తైవాన్, జపాన్, సింగపూర్ల ఎదుగుదలకు కారణమిదే - అప్పట్లో వాజ్‌పేయీ సాహస నిర్ణయాలు దేశగతినే మార్చాయి - పెట్టుబడుల తరలింపుతో ఆర్థిక రంగానికి మేలు సాక్షి, హైదరాబాద్ : ‘టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యం సాగిన నాలుగు దశాబ్దాల కాలంలో దేశ జనాభాలో 0.8 శాతం మందికే టెలిఫోన్ వసతి సమకూరింది. అదే ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించిన రెండు దశాబ్దాల్లో అది 80 శాతంగా నమోదైంది. ప్రైవేటు సంస్థల ఆగమనానికి తలుపులు తెరిస్తే ప్రభుత్వరంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందేవారు గుర్తించాల్సిన విషయమిది. దేశ ప్రగతి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఓ దేశం వేగంగా ఆర్థిక పురోగతి సాధించాలంటే సరళీకృత ఆర్థిక విధానాలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోక తప్పదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జస్టిస్ కొండా మాధవరెడ్డి సంస్మరణ సభలో ఆయన కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసం చేశారు. ‘న్యాయవ్యవస్థ-ఆర్థిక రంగం’ అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1991కి ముందు- 1991కి తర్వాత అన్నట్టుగా ఉందన్న జైట్లీ... అప్పటి వరకు మనదైన సంప్రదాయ పద్ధతిలో దేశ ఆర్థిక రంగం ముందుకు సాగగా ఆ తర్వాత సంస్కరణలతో కొత్త పుంతలు తొక్కిందన్నారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు లోతైన చర్చతో సంస్కరణలకు ఓ రూపం తెచ్చినప్పటికీ, వాటి అమలులో కొంత తటపటాయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ బాధ్యతలు తీసుకున్నాక దేశ ఆర్థికరంగం రూపురేఖలే మారిపోయాయన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలకు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే కారణమని కొనియాడారు. పెట్టుబడులు వస్తేనే ప్రగతి ఓచోట నుంచి పెట్టుబడులు మరోచోటకి, అక్కడి నుంచి మరో రంగానికి ఇలా పెట్టుబడుల తరలింపు ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు వస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. న్యాయవ్యవస్థ-ఆర్థిక వ్యవస్థ మధ్య సన్నటి విభజన రేఖ ఉందని, తాను దాన్ని సంక్లిష్ట విషయంగా భావిస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ విలువైన సూచనలు, సలహాలతో ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టేం దుకు సహకరిస్తున్నారన్నారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కంపెనీల చట్టానికి సవరణలు కోరుతూ పత్రిపాదించానని, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఆర్థిక, న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాంటి వాటిని ఉపయోగించుకోవాలన్నారు. కొండా శైలి స్ఫూర్తిదాయకం ఆసియాఖండంలోనే భాగంగా ఉన్న తైవాన్, జపాన్, సింగపూర్, కొరియాలు సరళీకృత ఆర్థిక విధానాలతో ముందుగా ప్రగతిబాటపట్టగా, ఆ తర్వాత చైనా అనుసరించిందన్నారు. తాను యువ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన సమయంలో అనుభవజ్ఞుడైన న్యాయవాదిగా కొండా మాధవరెడ్డి వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించేవాడినని అరుణ్‌జైట్లీ గుర్తుచేసుకున్నారు.అంతకుముందు ప్రతిభావంతులుగా అంతర్జాతీయస్థాయి ఖ్యాతి పొందుతున్న స్థానిక క్రీడాకారులు, చదువులో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల్‌రెడ్డి, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి, జస్టిస్ కొండా మాధవరెడ్డి తనయుడు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెలికంలోనూ ఇక అంబుడ్స్‌మన్!
♦ త్వరలో ట్రాయ్ నిర్ణయం ♦ ప్రస్తుత ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగ్గాలేదన్న ట్రాయ్ చైర్మన్ శర్మ న్యూఢిల్లీ : టెలికం సేవల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో పరిష్కారం కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం తెలుసుకున్న అనంతరం తగిన నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతమున్న ఫిర్యాదుల పరిష్కార విధానం ప్రభావవంతంగా లేదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ అన్నారు. ఇందుకు సంబంధించి సంస్థాగత ఏర్పాటుపై రెండు వారాల్లో సంప్రదింపుల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని సైతం తెలుసుకుంటామన్నారు. ఆటోమేటెడ్ విధానం లేదా టెక్నాలజీ ఆధారిత వేదిక ఏర్పాటు చేయాలా అన్నది పరిశీలించాల్సి ఉందని, దీనిపై సలహా తీసుకుంటామని శర్మ చెప్పారు. పరిస్థితి ఇదీ...: టెలికం వినియోగదారుల సంఖ్య 100 కోట్లుగా ఉండడంతో ఫిర్యాదుల సంఖ్య భారీగా ఉంటోంది. ఎక్కువ శాతం ఫిర్యాదులు బిల్లులు, విలు వ ఆధారిత సేవలను యాక్టివేట్ చేయడం, టారిఫ్‌ను మార్చడంపైనే ఉంటున్నాయి. అనవసర వ్యయం ఎందుకన్న భావనలో ఎవరూ కోర్టుల వరకు వెళ్లడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల వల్ల వినియోగదారుల ఫోరం టెలికం ఫిర్యాదులను స్వీకరించడం లేదు. దీంతో ప్రస్తుతం వినియోగదారులు ట్రాయ్, టెలికం శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని ఆయా విభాగాలు సంబంధిత ఆపరేటర్‌కు పంపించి ఊరుకుంటున్నాయి. దీంతో పరిష్కారం లభించడం లేదు. -
ప్రతి పైసా వసూలు చేస్తాం
కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర మంత్రుల ధ్వజం న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న టెలికం స్కాం యూపీఏ పాలనకు సంబంధించిందని, ఆ పాపాన్ని కడిగే పనిని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని కొత్త టెలికం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని శుక్రవారం చెప్పారు. 2006-10 మధ్య ప్రభుత్వాన్ని ఎవరు నడిపారో అందరికీ తెలుసని, ఈ పాపం వారిదేనన్నారు. టెలికం రంగంలో రూ. 46 వేల కోట్ల స్కాం జరిగిందని, మోదీ ప్రభుత్వం ఆరు టెలికం కంపెనీలను రక్షించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. ఈ ఆరోపణల్ని టెలికం మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఎవరినో కాపాడే పనిలో కేంద్ర ప్రభుత్వం లేదన్నారు. కాంగ్రెస్ చెబుతున్న 46 వేల కోట్లు నిజానికి టెలికం కంపెనీలు తక్కువగా చూపించిన ఆదాయ వివరాలని, నివేదికలో కాగ్ ఆ విషయాన్ని పేర్కొందన్నారు. -
భారీగా పతనమైన టెలికాం షేర్లు
ముంబై : టెలికాం స్కాం ఎఫెక్ట్ తో మొబైల్ ఆపరేటర్ల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. టెలికాం శాఖ త్వరలో ఆరుగురు టెలికాం ఆపరేటర్లకు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీచేయనుందని నేపథ్యంలో నాలుగు మేజర్ టెలికాం షేర్లు శుక్రవారం ట్రేడింగ్ లో భారీగా పతనమయ్యాయి. ఐడియా సెల్యులార్ 2.86 శాతం నష్టంతో రూ.101.90 వద్ద, భారతీ ఎయిర్ టెల్ షేర్లు 2.3శాతం నష్టంతో రూ.355 వద్ద, రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు 3.15 శాతం నష్టంతో రూ.50.80 వద్ద, టాటా టెలి సర్వీసు షేర్లు 3.75 శాతం నష్టంతో రూ.6.93 వద్ద ముగిశాయి. ఈ షేర్ల పతనంతో సెన్సెక్స్ 0.3శాతం కిందకు నమోదైంది. కేంద్రంలో రూ.45వేల కోట్లకు పైగా టెలికాం కుంభకోణం చోటు చేసుకుందని.. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న ఆరు ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తెరవెనుక చర్యలు చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘తాజా భారీ టెలికాం కుంభకోణం విలువ రూ. 45,000 కోట్లకు పై మాటే. దానిని మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది’’ అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. భారతి ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్‌సెల్ టెలికాం సంస్థలు ఈ స్కాంకు పాల్పడినట్టు ఆరోపణలు గుప్పించారు. దానివల్ల.. ప్రభుత్వానికి రావాల్సిన రూ.12,488.93 కోట్ల మొత్తం రాలేదని కాగ్ పేర్కొనట్టు తెలిపారు. దీనికి జరిమానాలు, ఇతర చార్జీలు అదనం. ఆయా టెలికాం సంస్థల వ్యాపారం, వినియోగదారుల పరిధి, ఆదాయం గణనీయంగా పెరిగినా కూడా - కాగ్ లెక్కించిన ప్రాతిపదికనే ఆయా సంస్థల నిర్వాకం వల్ల 2010-11 నుంచి 2015-16 వరకూ ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని లెక్కిస్తే.. ఆ మొత్తం రూ. 45,000 కోట్లకు పైగా ఉంటుందని ఆరోపించారు. మరోవైపు 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు. -
రూ. 45 వేల కోట్ల టెలికాం స్కాం
* కాగ్ బయటపెట్టినా మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది: కాంగ్రెస్ * ఆరు ప్రముఖ సంస్థలను కాపాడేందుకు కేంద్రం సాయం చేస్తోంది న్యూఢిల్లీ: కేంద్రంలో రూ.45వేల కోట్లకు పైగా టెలికాం కుంభకోణం చోటు చేసుకుందని.. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న ఆరు ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తెరవెనుక చర్యలు చేపడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘తాజా భారీ టెలికాం కుంభకోణం విలువ రూ. 45,000 కోట్లకు పై మాటే. దానిని మోదీ సర్కారు చాప కింద దాచేస్తోంది’’ అని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ‘‘భారతి ఎయిర్టెల్, ఒడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్‌సెల్ టెలికాం సంస్థలు ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన చార్జీలను ఎగవేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆమోదించనిదే ఇది జరగదన్నారు. కాగ్ నివేదికలో బయటపెట్టింది: గత యూపీఏ ప్రభుత్వం ఆదేశాలతో కాగ్.. ఆరు టెలికాం సంస్థల 2006-07 నుంచి 2009-10 వరకూ లావాదేవీలపై ఆడిట్ ప్రారంభించిందని సూర్జేవాలా పేర్కొన్నారు. కాగ్ ఈ ఏడాది సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ ఆయన చేసిన ఆరోపణల్లోని ముఖ్యాంశాలివీ... ఆదాయాన్ని తక్కువ చేసి చూపటం, ఖాతాల నిర్వహణలో ఏకరూపత లేకపోవటం.. ఫలితంగా లెసైన్సుల ఫీజు మొత్తాన్ని, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలను చెల్లించాల్సిన బాధ్యత లేకపోవటం వంటి అంశాలపై కాగ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆరు టెలికాం సంస్థలు నాలుగేళ్లలో రూ. 46,045.75 కోట్ల మేర ఆదాయాన్ని తక్కువగా చూపాయని గుర్తించింది. దానివల్ల.. ప్రభుత్వానికి రావాల్సిన రూ.12,488.93 కోట్ల మొత్తం రాలేదని కాగ్ పేర్కొంది. దీనికి జరిమానాలు, ఇతర చార్జీలు అదనం. ఆయా టెలికాం సంస్థల వ్యాపారం, వినియోగదారుల పరిధి, ఆదాయం గణనీయంగా పెరిగినా కూడా - కాగ్ లెక్కించిన ప్రాతిపదికనే ఆయా సంస్థల నిర్వాకం వల్ల 2010-11 నుంచి 2015-16 వరకూ ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని లెక్కిస్తే.. ఆ మొత్తం రూ. 45,000 కోట్లకు పైగా ఉంటుంది. ఆ సంస్థలను కాపాడే చర్యలా: ఖజానాకు భారీ నష్టం జరుగుతున్న దిగ్భాంతికర వాస్తవాలను బయటపెట్టిన కాగ్ నివేదిక ఆధారంగా తక్ష ణం చర్యలు చేపట్టాల్సింది పోయి.. మోదీ ప్రభుత్వం ఆ సంస్థలను కాపాడే చర్యలు చేపట్టిందని సూర్జేవాలా ఆరోపించారు. -
ఆరు టెల్కోలకు షాక్!
♦ త్వరలో డాట్ రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్! ♦ 2006-10 మధ్య ఆదాయాలు ♦ తక్కువగా చూపాయన్న కాగ్ నివేదిక న్యూఢిల్లీ: టెలికం శాఖ (డీఓటీ-డాట్) త్వరలో ఆరు టెలికం ఆపరేటర్స్‌కు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీ చేయనుంది. 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు. వీటిలో ఆర్‌కామ్, టాటా టెలీ, ఒడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు ఉన్నాయి. మార్చిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.46,045.75 కోట్ల తమ ఆదాయాలను దాచిపెట్టినట్లు ఈ నివేదిక పేర్కొంది. కాగ్ పత్రాలు జూన్‌లో టెలికం శాఖకు అందడంతో కంపెనీలకు నోటీసుల జారీకి రంగం సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆదాయాన్ని వదులుకునే ప్రశ్నేలేదని కూడా ఆయన పేర్కొన్నారు. వడ్డీ, జరిమానాలు కూడా... తక్కువ చూపించిన ఆదాయం రూ.12,488.93 కోట్లుకాగా దీనికి టెలికం శాఖ వడ్డీ, జరిమానాలు కూడా జత చేయనున్నట్లు సమాచారం. అయితే కాగ్ నివేదికపై టెలికం ఆపరేటర్లు ఒక సంయుక్త ప్రకటనలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆదాయాల లెక్కింపు జరిగిందని వివరించాయి. నివేదిక వల్ల ఏదైనా అదనపు భారం పరిస్థితి ఎదురయితే... ఈ సమస్యను పరస్పర చర్చల ద్వారా కానీ లేక, కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకుంటామని కూడా పేర్కొన్నాయి. కాగ్ పేర్కొన్నట్లు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ తక్కువ లెక్కలను కంపెనీల వారీగా చూసి నోటీసుల భారాన్ని పరిశీలిస్తే- రూ.3,728.54 కోట్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసలో మొదట ఉంది. తరువాత వరుసలో టాటా టెలిసర్వీసెస్ (రూ.3,215.39 కోట్లు), ఎయిర్టెల్ (రూ.2,651.89 కోట్లు), ఒడాఫోన్ (రూ.1,665.39 కోట్లు), ఐడియా (రూ.964.89 కోట్లు), ఎయిర్‌సెల్ (రూ.262.83 కోట్లు) ఉన్నాయి. -
ఏటీసీ చేతికి వయోమ్
కొనుగోలు ప్రక్రియ పూర్తి డీల్ విలువ రూ. 7,635 ముంబై: నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు రావడంతో టెలికం టవర్ల నిర్వహణ సంస్థ వయోమ్ నెట్వర్క్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) గురువారం వెల్లడించింది. దాదాపు రూ. 7,635 కోట్లకు వ్యోమ్‌లో 51 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు గతేడాది అక్టోబర్ 21న ఏటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వ్యోమ్ విలువ సుమారు రూ. 22,000 కోట్లు. ఏటీసీకి ప్రపంచవ్యాప్తంగా 1,42,000 పైచిలుకు టెలికం టవర్లు ఉన్నాయి. వ్యోమ్‌కు 2011-12 నాటికి 40,000 పైచిలుకు టవర్లు ఉన్నాయి. 50 టవర్లతో 2005లో క్విపో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మొదలైన సంస్థ, టాటా టెలీసర్వీసెస్‌లో విలీనంతో వయోమ్గా రూపాంతరం చెందింది. దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర టెలికం టవర్ కంపెనీగా ఎదిగింది. వయోమ్ డీల్‌తో ఏటీసీకి భారత్‌లో మొత్తం 57,000 పైగా టవర్లు ఉంటాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్‌తో పాటు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తదితర ఇన్వెస్టర్ల నుంచి వాటాల కొనుగోలు ద్వారా వయోమ్ను ఏటీసీ దక్కించుకుంది. వయోమ్కు రూ. 5,100 కోట్ల రుణ భారం ఉంది. -
ముడి చమురు దిగుమతిలో స్వేచ్ఛ
♦ 1979 నాటి విధానం మార్పు ♦ లాభం చూసుకునే ఇక కంపెనీల దిగుమతి ♦ నీటి సమర్థ నిర్వహణకు ప్రాజెక్టు ♦ టెలికం టవర్ కంపెనీలో వాటా విక్రయం ♦ ఇక రైల్వేలకు స్వీడన్ టెక్నాలజీ ♦ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: భూగర్భ జల వనరుల్ని మదించటం నుంచి రిజర్వాయర్లు, వరద సమస్య దాకా అన్నిటికీ పరిష్కారంగా జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టుకు (ఎన్హెచ్పీ) కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్... దీంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో రైల్వేల్లో విదేశీ సాంకేతిక సహకారం, ముడి చమురును కంపెనీలు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవటం, టెలికం టవర్ సంస్థ వినోమ్లో వాటా విక్రయం వంటి కీలకాంశాలున్నాయి. రూ.3,680 కోట్లతో ఎన్హెచ్పీ జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్ట్ మొత్తం కేటాయింపులు రూ.3,680 కోట్లు. జాతీయ జల సమాచార కేంద్రం ద్వారా డేటా సేకరణ, మార్పిడి, విశ్లేషణ, పంపిణీ జరుగుతుంది. వరద ముప్పును 3 రోజుల ముందే అంచనావేయటం, వరద బాధిత ప్రాంతాల గుర్తింపు, భూగర్భ, ఉపరితల జలవనరుల విశ్లేషణ.. వంటివి దీని పరిధిలో ఉంటాయి.తొలిదశలో 13 రాష్ట్రాలకు వర్తించే ఎన్హెచ్పీ కార్యకలాపాలు... క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తాయి. రైల్వేలో సాంకేతిక అభివృద్ధి రైల్వేలను టెక్నాలజీ పరంగా మరింత మెరుగుపరచటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేలా భారత్-స్వీడన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి (ఎంఓయూ) కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రైల్వేల్లో సాంకేతిక సహకారం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలు ఈ ఎంఓయూ పరిధిలో ఉన్నాయి. సరుకు రవాణా, నిల్వ, సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో కూడా రెండు దేశాలూ సహకరించుకుంటాయి. క్రూడ్ ఆయిల్ సేకరణలో ప్రతిపత్తి... ముడి చమురు దిగుమతికి సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానాన్ని సవరించడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సవరించిన విధానం ప్రకారం... ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇకపై ముడి చమురును దిగుమతి చేసుకోవటానికి తమకు అనువైన పాలసీని తామే రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం ముడి చమురు దిగుమతికి ఉన్న విధానం 1979లో అమల్లోకి వచ్చింది. 2001లో నాటి కేబినెట్ కొన్ని సవరణలు చేసింది. మార్కెట్లో పోటీ పడేలా కొనుగోలు విధానం ఉండాల్సిన ఈ తరుణంలో... ప్రస్తుత విధానంలో కొన్ని పరిమితులు, ఆంక్షలు ఉన్నాయని, అందుకే సవరించామని ప్రభుత్వం తెలిపింది. ‘ఆండ్రూ యూల్’లో డిజిన్వెస్ట్మెంట్కు ఓకే... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఆండ్రూ యూల్ సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ రూ.29.91 కోట్లను ఈక్విటీ షేర్ల రూపంలోకి మార్చడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడు నెలల్లో ఈ కంపెనీ నుంచి పెట్టుబడుల ఉపసంహరించుకోవటానికి ఈ చర్య మార్గం సుగమం చేయనుంది. కర్ణాటకలో భారీ హైవే ప్రాజెక్టు... తన ప్రధాన రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు- ఎన్‌హెచ్‌డీపీ కింద కర్ణాటకలో రూ.1,622 కోట్లతో హైవే ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం దాదాపు 95 కిలోమీటర్ల పొడవున... హోస్పేట్-బళ్లారి-కర్ణాటక/ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సెక్షన్ నేషనల్ హైవే-63 నాలుగు లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుంది. వినోమ్ వాటా అమ్మకానికి ఓకే... దేశీయ టెలికం టవర్ సంస్థ వినోమ్ నెట్‌వర్క్‌లో 51 శాతం వాటాను అమెరికా టవర్ కార్పొరేషన్ కొనుగోలు చేయడానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ వాటా విక్రయ విలువ దాదాపు రూ.5,856 కోట్లు. స్పెక్ట్రమ్ విధానంలో మార్పునకు ఓకే న్యూఢిల్లీ: వేలం ద్వారా ధర నిర్ణయం కాని చోట పాలనపరంగా కేటాయించిన స్పెక్ట్రమ్ సరళీకరణకు కేబినెట్ అనుమతినిచ్చింది. దీనివల్ల టెలికం ఆపరేటర్లు తమ స్పెక్ట్రమ్‌ను ఇతర ఆపరేటర్లతో షేర్ చేసుకోవటం, క్రయవిక్రయాలు చేయటం, వినియోగానికి సంబంధించి కొత్త టెక్నాలజీలు వాడటం వంటివి వీలవుతాయి. ట్రాయ్ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలు చేయటం వల్ల దాదాపు రూ.1,300 కోట్లు సమకూరుతాయి. దీని ప్రకారం... వేలంలో ధర నిర్ణయం కాని చోట ట్రాయ్ తాజాగా ఏ ధరను సిఫారసు చేస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వేలం పూర్తయ్యాక నిర్ణీత ధరకు దానికి మధ్యనున్న తేడాను సర్దుబాటు చేస్తారు. తాజా నిర్ణయంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ 800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో పంచుకోవటానికి వీలవుతుంది. -
ఆధార్ @100 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డును తీసుకున్నవారి సంఖ్య మరి కొన్ని రోజుల్లో 100 కోట్లు దాటబోతోంది. ప్రస్తుతం 99.91 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఈ వివరాలు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయలేదు. సోమవారం దీనిపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేయబోతున్నారు. -
డేటా ప్యాక్ @ రూ.2
టెలికం రంగంలో టెలినార్ సంచలనం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పల్లెలో అయినా సరే చాయ్ తాగాలంటే కనీసం రూ.5 వెచ్చించాలి. కానీ అంత కంటే తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను ఊహించగలమా? టెలికం రంగంలో సంచలనానికి తెరలేపుతూ టెలినార్ ఫుల్ పైసా వసూల్ పేరుతో రూ.2లకే డేటా వోచర్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఒక రాత్రి కాల పరిమితితో 50 ఎంబీ డేటాను అందిస్తోంది. ఇంత తక్కువ ధరలో డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేవడం భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. దీనితోపాటు రూ.5 మొదలుకుని రూ.146 వరకు నూతన డేటా ప్యాక్స్‌ను 30 ఎంబీ - 2 జీబీ ప్రయోజనాలతో ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 200 ఎంబీ డేటా ఉచితంగా ఇస్తోంది. అందుబాటు ధరలో వినూత్న ప్యాక్‌లతో వినియోగదార్ల ప్రాధాన్య ఆపరేటర్‌గా నిలవాలన్నది తమ లక్ష్యమని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ ఈ సందర్భంగా తెలిపారు. -
2020 నాటికి 600 కోట్లకు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ యూజర్లు!
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ వృద్ధి కారణంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగ నున్నది. అంతర్జాతీయంగా 2020 నాటికి వీరి సంఖ్య 600 కోట్లకు పైగా చేరుతుందని చైనా వెబ్ సర్వీసెస్ సంస్థ బైదు తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం.. స్మార్ట్‌ఫోన్స్‌ను 60% మంది కమ్యూనికేషన్ కోసం, 23% మంది వారి తోడు కోసం, 8% సామాజిక మాధ్యమాల వినియోగం కోసం, 9% ఎంటర్టైన్మెంట్ కోసం వినియోగిస్తున్నారు. 20 ఏళ్లు, అంతకు దిగువ వయసు వారు స్మార్ట్‌ఫోన్స్‌ను మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. -
డేటా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
టెల్కోలకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరిక న్యూఢిల్లీ: వెబ్‌సైట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చే యకూడదన్న నిబంధనలతో టెలికం ఆపరేటర్లు దారికి రాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తప్పవని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరించారు. ‘కావాలంటే జరిమానా కట్టుకుంటూ పోతాం .. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తాం అంటే కుదరదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీసుకునే ఇతర చర్యలు కూడా నిబంధనల్లో పొందుపర్చడం జరిగిందని శర్మ తెలిపారు. నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్.. డేటా సర్వీసులకు కంటెం ట్ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం కుదరదని, అలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని నిబంధనలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీలు జరిమానాలు కట్టుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా తమ వ్యాపారాలను యథాప్రకారం కొనసాగించే ప్రమాదం ఉందం టూ ఆందోళనలు వ్యక్తం కావడంతో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్ రూపొందిస్తే దాన్ని కచ్చితంగా ట్రాయ్‌కు అందించాలని, అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే జరిమానాలు విధిస్తామని శర్మ చెప్పారు. గుత్తాధిపత్యం కుదరదు: ఇంటర్నెట్పై కొన్ని సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తామంటే ఊరుకోబోమని, ఇలాంటి ధోరణులను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ కావొచ్చు మరొకటి కావొచ్చు ఇటువంటి పథకాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనవి కావన్నారు. ట్రాయ్ తాజా నిబంధనలతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల్లో భారత ప్రతిష్ట పెరిగిందని మంత్రి చెప్పారు. ట్రాయ్ ఆదేశాలు నిరాశపర్చాయి: జుకర్‌బర్గ్ నెట్ న్యూట్రాలిటికీ మద్దతుగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. కొన్ని డేటా సర్వీసులను ఉచితంగా అందించే తమ వంటి సంస్థల పథకాలకు ఈ నిబంధనల వల్ల ఆంక్షలు, అడ్డంకులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చే దాకా కృషి కొనసాగిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. -
టెలికం సేవలపై స్వచ్ఛ భారత్ పన్ను వద్దు: సీఓఏఐ
న్యూఢిల్లీ: టెలికం సేవలపై స్వచ్ఛ భారత్ సుంకం (ఎస్బీసీ) విధించవద్దని జీఎస్ఎం ఇండస్ట్రీ వేదిక సీఓఏఐ (సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. లెసైన్స్ ఫీజు వంటి పలు ఇతర సుంకాల భారంతో ఉన్న టెలికం పరిశ్రమపై ఎస్బీసీ తగదని తెలిపింది. ఇది పరిశ్రమతో పాటు కస్టమర్లపై సైతం భారం పెరగడానికి దారితీసే అంశమని వివరించింది. ఇప్పటికే పన్ను పరిధిలోఉన్న సేవలు అన్నింటిపై అదనంగా అరశాతం ఎస్‌బీసీని కేంద్రం నవంబర్ 15 నుంచీ విధించిన నేపథ్యంలో సీఓఏఐ తాజా ప్రకటన చేసింది. -
కాల్ డ్రాప్స్‌కి పరిహారం ఇవ్వాల్సిందే..
టెల్కోలకు స్పష్టం చేసిన ట్రాయ్ న్యూఢిల్లీ: మొబైల్ కాల్ డ్రాప్ అయితే జనవరి 1 నుంచి కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. టెల్కోలకు స్పష్టం చేసింది. ఇందుకు తగ్గట్లుగా తమ సిస్టమ్స్‌ను సంసిద్ధం చేసుకోవాలని సూచించింది. టెలికం కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ విషయాలు తెలిపారు. పరిహారం నిబంధనను సవరించడం గానీ, రద్దు చేయడం గానీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కనుక ఆపరేటర్లు దీన్ని అమలు చేయడానికి సిద్ధం కావాల్సిందేనన్నారు. నెట్వర్క్ లోపాల మూలంగా కాల్కి అంత రాయం (కాల్ డ్రాప్) కలిగిన పక్షంలో.. కాల్ చేసిన కస్టమరుకు సదరు టెల్కో రూ. 1 పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారాన్ని రోజుకు రూ. 3కి పరిమితం చేసింది. అయితే, దీని వల్ల తాము భారీగా నష్టపోవాల్సి ఉంటుందంటూ టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాంకేతిక సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే పరిహారం నిబంధనను రూపొందించారన్న ఆరోపణలు అవాస్తవమని శర్మ చెప్పారు. ట్రాయ్ అన్ని కోణాలూ అధ్యయనం చేసిన తర్వాతే దీన్ని ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనను సమీక్షించాలంటూ టెలికం కంపెనీలు కోరుతున్నందున చట్టపరమైన అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోగలమని, రెండు వారాల్లో టెల్కోలకు ఏ విషయమూ తెలియజేస్తామని శర్మ పేర్కొన్నారు. టెల్కోలను విమర్శించడమే తమ పని కాదని, అవి సర్వీసులు మెరుగుపర్చుకోవడానికి కావాల్సిన తోడ్పాటునివ్వడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు, కాల్ డ్రాప్స్ సమస్యను టెస్ట్ చేయడానికి ట్రాయ్ ఎంచుకున్న ప్రాంతాలపై టెల్కోలు కొన్ని సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో తాజాపరీక్షల కోసం మరో అయిదు నగరాలను (అహ్మదాబాద్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోల్‌కతా) జోడించేందుకు అంగీకరించినట్లు శర్మ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లోనే ఈ 5 నగరాల్లోని కొన్ని రూట్లలో పరీక్షలు నిర్వహించినట్లు, దీనికి సంబంధించిన నివేదిక సిద్ధమైందని ఆయన చెప్పారు. దీన్ని ముందుగా టెల్కోలకు ఇచ్చి, వారి వాదనలను తెలుసుకున్నాక.. బహిర్గతం చేయనున్నట్లు శర్మ తెలిపారు. -
వయామ్ నెట్వర్క్స్.. అమెరికా టవర్ కార్ప్ పరం
డీల్ విలువ రూ.7,600 కోట్లు న్యూయార్క్: భారత్‌లో టెలికాం టవర్లను నిర్వహిస్తున్న వయామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటాను అమెరికాకు చెందిన అమెరికన్ టవర్ కార్పొ(ఏటీసీ) రూ.7,600 కోట్లకు కొనుగోలు చేయనున్నది. టాటా టెలిసర్వీసెస్, శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థల నుంచి ఎక్కువ వాటాలను, ఇతర సంస్థల నుంచి కొంత మొత్తంలో వాటాలను ఏటీసీ కొనుగోలు చేస్తోంది. డీల్ మొత్తం నగదులోనే జరుగుతుందని సమాచారం. భారత టెలికాం రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. వయామ్ కంపెనీ 42,200 మొబైల్ టవర్లను నిర్వహిస్తోంది. 1,000 మొబైల్ ఫోన్ మాస్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఏటీసీ నిర్వహిస్తున్న 14,000 టెలికాం మొబైల్ మాస్ట్స్ను కూడా వయామ్ మాస్ట్స్‌తో విలీనం చేయనున్నారు. వయామ్ నెట్‌వర్క్స్‌లో టాటా టెలి సర్వీసెస్‌కు 54 శాతం వాటా, కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్ కనోరియా కుటుంబానికి 19 శాతం చొప్పున వాటాలున్నాయి. శ్రేయి గ్రూప్ నుంచి మొత్తం వాటాను, టాటా టెలిసర్వీసెస్ నుంచి 20 శాతం వాటాను, ఇంకా ఇతర వాటాదారుల నుంచి కూడా కలుపుకొని, మొత్తం మీద 51 శాతం వాటాను ఏటీసీ కొనుగోలు చేయనున్నది. ఈ క్యూ1లో వయామ్ కంపెనీ రూ.5,000 కోట్ల అద్దె, నిర్వహణ ఆదాయాలను ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి ఈ కంపెనీ రుణభారం రూ.5,800 కోట్లుగా ఉంది. టాటా టెలిసర్వీసెస్ మొబైల్ టవర్ల విభాగం, శ్రేయి గ్రూప్‌కు చెందిన క్విప్పో టెలికాం సంస్థలు విలీనమై 2009లో వయామ్ నెట్వర్క్స్ ఏర్పడింది. -
ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి పరిహారం
ముంబై: సెల్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. 'కాల్ డ్రాప్స్'కు పరిహారం చెల్లించాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి చొప్పున చెల్లించాలని.. ఇది 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోజులో మూడుసార్లు మాత్రమే ఈ పరిహారం అందుతుందని తెలిపింది. ఫోన్ లో మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయితే నాలుగు గంటల్లోగా పరిహారం అందించాలని సూచించింది. పరిహారం అందించిన విషయాన్ని వినియోగదారుడి ఎస్ఎంఎస్ లేదా యూఎస్ఎస్డీ ద్వారా వినియోగదారులకు తెలపాలని ఆదేశించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తర్వాత నెల బిల్లులో వివరాలు పేర్కొనాలని సలహాయిచ్చింది. తాము వెలువరించిన ఆదేశాలను టెలికం ఆపరేటర్లు ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటామని తెలిపింది. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం అయ్యేందుకు సర్వీసు ప్రొవైడర్లు ప్రయత్నించాలని సూచించింది. దీనిపై ఆరునెలల తర్వాత సమీక్ష నిర్వహిస్తామని ట్రాయ్ తెలిపింది. -
'కాల్ డ్రాప్‌కు రూపాయి పరిహారం ఇవ్వాల్సిందే'
న్యూఢిల్లీ: ఊహించినట్టే కాల్ డ్రాప్స్ విషయంలో భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆపరేటర్లకు గట్టి ఆదేశాలు ఇచ్చింది. కాల్స్ డ్రాప్‌కు ఒక రూపాయి చొప్పున పరిహారం వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది. రోజుకు మూడు కాల్స్ డ్రాప్స్‌కు మించి పరిహారం ఇవ్వకూడదని ట్రాయ్ సూచించిందని, ఇది త్వరలోనే అమల్లోకి రానుందని ఓ ఆంగ్ల చానెల్ తెలిపింది. టెలికం ఆపరేటర్లు కచ్చితంగా దీనిని అమలుచేసేవిధంగా ట్రాయ్ ఓ రెగ్యులేషన్‌ను జారీచేయనుంది. కాల్ డ్రాప్ చర్యలకు పాల్పడే టెలికం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబైలలో ఇటీవల ఆడిటింగ్ నిర్వహించిన ట్రాయ్.. కాల్ డ్రాప్ విషయంలో ప్రముఖ ఆపరేటర్ల సేవలు ఏమాత్రం నాణ్యంగా లేవని గుర్తించింది. ముంబై, ఢిల్లీలలో కాల్ డ్రాప్స్ తీరు మరింత పెరిగిందని పేర్కొంది. ముంబైలో ఏ ఆపరేటర్ కూడా ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించడం లేదని, ఢిల్లీలో ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, వోడాఫోన్ ఈ విషయంలో ఎంతో వెనుకబడ్డాయని ట్రాయ్ పేర్కొన్నట్టు విశ్వనీయ వర్గాలు తెలిపాయి. -
రిలయన్స్ జియోతో ఆర్‌కామ్ జట్టు
* స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్‌కు ఒప్పందంపై కసరత్తు * ఆర్‌కామ్ ఏజీఎంలో చైర్మన్ అనిల్ అంబానీ ముంబై: టెలికం రంగంలో అంబానీ బ్రదర్స్ కంపెనీలు చేతులు కలుపుతున్నాయి. పెద్దన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థతో తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్‌కు ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశల్లో ఉన్నాయని ఆర్‌కామ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ఆర్‌జియో, ఆర్‌కామ్ మధ్య వ్యూహాత్మక సహకారం, భాగస్వామ్యం.. టెలికం రంగంలో కన్సాలిడేషన్‌కి సంకేతమని ఆయన పేర్కొన్నారు. టెలికం రంగంలో ఈ డీల్ విప్లవాత్మక మార్పులు తేగలదని, ఆ ప్రయోజనాలు రానున్న రోజుల్లో కనిపించగలవని అనిల్ అంబానీ తెలిపారు. ఇరు సంస్థలు సంయుక్తంగా అత్యుత్తమ ప్రమాణాలతో సర్వీసులు అందించగలవన్నారు. ఈ ఒప్పందంతో ఆర్‌కామ్ కస్టమర్లకు ఆర్‌జియోకి చెందిన 4జీ నెట్వర్క్ అందుబాటులోకి రాగలదని, అలాగే ఆర్‌కామ్‌కి ఉన్న 800-850 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను ఆర్‌జియో ఉపయోగించుకుంటుందని అనిల్ అంబానీ చెప్పారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణానంతరం విభేదాలు తలెత్తడంతో 2005లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని ముకేశ్, అనిల్ పంచుకున్నారు. అయితే, వ్యాపార ప్రయోజనాల రీత్యా.. కొన్నాళ్ల కిందటి నుంచి రెండు గ్రూప్‌లు మళ్లీ దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. టెలికం రంగంలో సంస్థల సంఖ్య తగ్గాల్సిన అవసరం ఉందని అనిల్ అంబానీ చెప్పారు. ఎస్ఎస్టీఎల్..ఎంటీఎస్ భారత కార్యకలాపాలను విలీనం చేసుకోవడంపై ఆర్‌కామ్ చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. డీల్ పూర్తయితే ఎనిమిది సర్కిల్స్‌లో తమకు ప్రయోజనం చేకూరుతుందని, మరింత స్పెక్ట్రం చేతికి వస్తుందని ఆయన చెప్పారు. వాటాల అమ్మకాలపైనే దృష్టి.. రోజు పొడవునా గ్రూప్‌లోని వివిధ సంస్థల ఏజీఎంలలో పాల్గొన్న అనిల్ అంబానీ .. ప్రధానంగా మూడు కంపెనీల్లో వాటాల విక్రయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్‌కామ్ ఏజీఎంలో పాల్గొన్నప్పుడు.. టవర్ల విభాగం రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో వాటాలను విక్రయిస్తున్నట్లు, నెలా .. రెండు నెలల్లో డీల్ పూర్తి కాగలదని ఆయన చెప్పారు. మరోవైపు, ఇండొనేషియాలోని మూడు బొగ్గు గనుల విక్రయాన్ని రిలయన్స్ పవర్ ఏజీఎంలో అనిల్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ క్యాపిటల్ ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా.. రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ అసెట్ మేనేజ్మెంట్లో మరిన్ని వాటాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. పెరగనున్న నిప్పన్ లైఫ్ వాటా... రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో జపాన్‌కు చెందిన నిప్పన్ లైఫ్ తన వాటాను మరింతగా పెంచుకోనున్న అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఆర్బీఐ అనుమతిస్తే జపాన్‌కు చెందిన సుమిటొమొ మిత్సుయ్ ట్రస్ట్ బ్యాంక్‌తో కలసి భారత్‌లో కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాన్నగారుంటే సంతోషించేవారు.. ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా పెద్దన్న ముకేశ్ అంబానీని అనిల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన తనకు అడుగడుగునా ఎనలేని సహకారం అందించారని, మార్గనిర్దేశనం చేశారని అనిల్ పేర్కొన్నారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ గానీ ఉండి ఉంటే ఇరు సంస్థలు చేతులు కలుపుతున్న సందర్భాన్ని చూసి ఎంతో సంతోషించేవారన్నారు. ‘పెద్దన్నయ్య ముకేశ్ భాయ్ అడుగడుగున అందించిన తోడ్పాటుకు, చేసిన దిశానిర్దేశానికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాన్నగారు ధీరుభాయ్ గానీ ఇప్పుడు ఉండి ఉంటే రెండు సంస్థల భాగస్వామ్యాన్ని చూసి చాలా సంతోషించేవారు’ అని అనిల్ అంబానీ చెప్పారు. -
కాల్‌డ్రాప్ పరిష్కారానికి చర్యలు చేపట్టండి
టెల్కోల అధిపతులను కోరిన డాట్ న్యూఢిల్లీ: కాల్‌డ్రాప్ సమస్య తీవ్రతరం కావడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఆ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా డాట్ కాల్‌డ్రాప్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలను చేపట్టాలని టెల్కోల అధిపతులను కోరింది. టెలికం కార్యదర్శి రాకేశ్ జార్జ్ ఈ విషయమై భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్‌కు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రమోటర్ అనిల్ అంబానీకి, ఐడియా ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లాకు, వోడాఫోన్ గ్లోబల్ సీఈవో విట్టోరియోకు ఫోన్ చేసి.. సర్వీసుల నాణ్యతను పెంచాలని, లేనిపక్షంలో లెసైన్స్ నిబంధనల కింద జరిమానా విధిస్తామని తెలిపిన ట్లు సమాచారం. కాల్‌డ్రాప్‌కు సంబంధించి టెల్కోలు వినియోగదారులకు పరిహారం చెల్లించే అంశంపై అక్టోబర్ 10-15 సమయంలో అంతిమ ప్రతిపాదనలను రూపొందిస్తామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. టవర్ల ఏర్పాటును అనుమతించండి: వెంకయ్య నాయుడు కాగా కాల్‌డ్రాప్ సమస్యను ఎదుర్కొనడంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రభుత్వ భవనాలపై సెల్‌ఫోన్ టవర్ల ఏర్పాటుకు అనుమతులను ఇవ్వాలని తన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
‘కాల్ డ్రాప్స్’ టెల్కోలపై జరిమానా యోచన
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ కష్టాలు తగ్గే అవకాశాలు కనిపించకపోతుండటంతో.. టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ సమస్య మీద ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై టెల్కోల ప్రమోటర్లకు వ్యక్తిగత లేఖలు పంపాలని యోచిస్తోంది. ఒకవేళ సేవల నాణ్యత మెరుగుపడకపోయిన పక్షంలో లెసైన్సు నిబంధనల ప్రకారం పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆపరేటర్లకు తెలియజేస్తామని టెలికం శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కాల్ డ్రాప్స్ సమస్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వర్గాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే దీనిపై ప్రధాని ప్రస్తావించిన సమస్యలను టెల్కోలకు తెలియజేయాలంటూ టెలికం శాఖ కార్యదర్శి రాకేశ్ గర్గ్‌కు ప్రసాద్ సూచించినట్లు సమాచారం. ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవడానికి తగినంత పెట్టుబడులు పెట్టడం లేదని ప్రసాద్ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కాల్ డ్రాప్స్ కష్టాలను తగ్గించే దిశగా నెట్వర్క్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు 30-45 రోజుల సమయం కావాలని టెలికం కంపెనీలు కోరినట్లు వివరించాయి. ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందిస్తుందని, ఆపరేటర్లు కూడా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అనంతరం ప్రసాద్ తెలిపారు. ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోతుండటాన్ని కాల్ డ్రాప్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల సేవలు మెరుగుపర్చలేకపోతున్నామంటూ టెల్కోలు ఆరోపిస్తుండగా.. టెలికం కంపెనీలు తగినంతగా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది. -
టెల్కోల ‘డేటా’ మంత్రం..!
ఆఫర్లతో కస్టమర్లకు వల.. పోటాపోటీగా అదనపు ప్రయోజనాలు డేటా ఆదాయం పెంచుకోవడమే లక్ష ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్.. మాధ్యమం ఏదైతేనేం ఇప్పుడు భారత్‌లో స్మార్ట్ఫోన్ల విప్లవం నడుస్తోంది. సెకనుకు పైసా, అన్లిమిటెడ్ వంటి వాయిస్ ప్యాక్‌ల నుంచి టెలికం కంపెనీలు డేటా వైపు మళ్లుతున్నాయి. డేటా వినియోగం ఊహించని స్థాయిలో అధికమవుతుండడంతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో టెల్కోలు నిమగ్నమయ్యాయి. వాయిస్ ప్యాక్‌ల మాదిరిగానే డేటాకు సైతం రూ.10 లోపే రీచార్జ్ వోచర్లను కంపెనీలు ఇప్పటికే తీసుకొచ్చాయి. తాజాగా మరో అడుగు ముందుకేసిన సంస్థలు రెండింతల డేటా, అన్లిమిటెడ్ వంటి ఆఫర్లు ఇస్తున్నాయి. చార్జీల తగ్గింపు, వినియోగించని డేటాను తదుపరి నెలకు క్యారీ ఫార్వార్డ్ సౌకర్యాన్నీ తీసుకొచ్చాయి. రిలయన్స్ జియో రంగంలోకి దిగితే టెలికం రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఉన్న కంపెనీలు తమ వాటాను సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాయి. కస్టమర్లను పెంచుకోవడానికి: మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చాయి. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్కాన్ వంటి దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు రూ.2 వేల నుంచి స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాయి. అటు ఇ-కామర్స్ భారత్‌లో జోరు మీద ఉంది. వెబ్ వెర్షన్లకు బదులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఇ-కామర్స్ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. కస్టమర్లు తమ షాపింగ్‌ను మొబైల్ ఫోన్లలోనూ చేసేస్తున్నారు. ఇదంతా టెలికం కంపెనీలకు కలిసి వస్తోంది. పాత చందాదారులు కొనసాగడమేగాక కొత్తవారిని ఆకట్టుకోవడానికి ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లలో ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య భారత్‌లో సుమారు 21 కోట్లుంది. వీరిలో 20 శాతం మంది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సైతం తీసుకున్నట్టు అంచనా. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా 10 కోట్లు ఉన్నాయి. పోటా పోటీగా ఆఫర్లు టెలికం రంగ దిగ్గజం ఎయిర్టెల్ కొత్త కస్టమర్లకు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ధర 30 శాతం వరకు తగ్గించింది. అలాగే ఎయిర్టెల్ సర్ప్రైసెస్ పేరుతో పాత కస్టమర్లకు ప్లాన్ ధరలో మార్పు లేకుండా అధిక స్పీడ్, డేటాను అందిస్తోంది. 3జీ ధరలోనే 4జీని అందించడం మరో విశేషం. వొడాఫోన్ ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటి ంచింది. 2జీ, 3జీ కస్టమర్లు రెండింతల విలువను అన్ని డేటా రీచార్జ్ ప్యాక్‌లపై పొందవచ్చు. 121 నంబరు, వొడాఫోన్ వెబ్సైట్, మై వొడాఫోన్ యాప్ ద్వారా డేటా రిచార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ఒక నెలలో వాడకుండా మిగిలిన 2జీ, 3జీ డేటాను తర్వాతి రీచార్జ్‌లో క్యారీ ఫార్వార్డ్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించింది. ఐడియా సెల్యులార్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు 3జీ బ్యాలెన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఆర్‌కాం అన్లిమిటెడ్ డేటా ప్యాక్‌లను ఆవిష్కరించింది. డేటా రీచార్జ్‌పై ఉచిత కాల్స్‌ను ఎయిర్‌సెల్ ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ ఫేస్బుక్, వాట్సాప్ ప్యాక్‌లను యునినార్ అందిస్తోంది. -
కాల్ డేటా సమర్పించిన టెలికాం ప్రొవైడర్లు
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నాలుగు టెలికాం సంస్థల ప్రొవైడర్లు కృష్ణా జిల్లా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉపయోగించిన 25 నంబర్ల కాల్ డేటాలను కోర్టుకు అందజేశారు. కాల్ డేటాల వివరాలను సీల్డ్ కవర్లలో ఎయిర్టెల్, ఐడియా, డొకోమో, వొడాఫోన్ ప్రతినిధులు కోర్టుకు హాజరై వివరాలను సమర్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షణలో ఉండటంతో సెప్టెంబర్ 11కు కేసు వాయిదా వేశారు. -
వోడాఫోన్ టవర్‌పై గ్రెనేడ్లతో దాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు శుక్రవారం మరోసారి టెలికాం సంస్థలపై గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. శ్రీనగర్‌లోని వోడాఫోన్ టవర్ పై గ్రెనైడ్లు విసిరారు. ఎయిర్ సెల్ షో రూంను ధ్వంసం చేశారు. టెలికాం సంస్థలను టార్గెట్ చేసిన మిలిటెంట్లు కమ్యూనికేషన్ వ్యవస్థను స్థంభింప చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో టెలికాం సేవలు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కూడా జమ్ము కశ్మీర్లో లష్కరే తోయిబా మిలిటెంట్లు టెలికాం సంస్థలపై దాడి చేశారు. దాదాపు 50 టవర్లను కూల్చి వేశారు. ఒక వ్యక్తిని హతమార్చారు. టెలికాం సంస్థలను మూసివేయాలని, కార్యక్రమాలను మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పోస్టర్లు కూడా విడుదల చేశారు. సైనికులకు సహకరిస్తున్న కశ్మీర్ లోయలోని ప్రజలను నిరోధించడానికే మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారని సైనిక అధికారులు చెబుతున్నారు. -
‘తటస్థత’కు తూట్లు
ఇంటర్నెట్ తటస్థత విషయంలో మన దేశం నిర్దిష్టంగా, ఖచ్చితంగా వ్యవహరించ కపోవచ్చునని కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలే నిజమయ్యేలా ఉన్నాయి. టెలికాం విభాగం నియమించిన నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. నిపుణుల కమిటీ నివేదికను ఇంకా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) పరిశీలించి కేంద్రానికి సిఫార్సులు చేయాల్సి ఉంది. దానిపై చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని పక్కనబెడితే కమిటీ సిఫార్సు ల్లోని హేతుబద్ధతను ఒకసారి చూడాల్సి ఉంది. ఇంటర్నెట్ తటస్థతను సమర్థిం చినట్టు కనబడుతూనే కమిటీ దానికి విరుద్ధమైన ప్రతిపాదనలు చేసింది. కమిటీ చేసిన కొన్ని సూచనలను గమనిస్తే ఆ అనుకూలతలో దాగున్న ప్రమాదకర ధోరణు లు కనిపిస్తాయి. ఇప్పుడు అమల్లో ఉన్న విధానం పారదర్శకమైనది. వినియో గదారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేది. టెలికాం సంస్థలకు నిర్దిష్టమైన రుసుం చెల్లించి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులే అందులో ఏ వెబ్సైట్ చూడాలో నిర్ణయించుకుంటారు. ఆయా వెబ్సైట్లు సమకూర్చే డేటాను అవి విధించే నిబంధ నలకు లోబడి డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు అనుసరిస్తున్న ఈ విధానంలో ఎయిర్‌టెల్‌లాంటి కొన్ని టెలికాం సంస్థలు మార్పులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఆయా వెబ్సైట్లు వినియోగించుకునే బ్యాండ్ విడ్త్ ఆధారంగా వాటి నుంచి చార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. ఉదాహరణకు యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్సైట్లు ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుం టాయి గనుక వాటినుంచి అధిక చార్జీలను వసూలు చేస్తారు. అంతిమంగా ఆ చార్జీల భారాన్ని ఆయా సంస్థలు వినియోగదారులపైనే మోపుతాయి. ఫలితంగా అప్పటికే ఇంటర్నెట్ కోసం డబ్బు చె ల్లించే వినియోగదారులు అదనంగా ఆయా వెబ్సైట్లు డిమాండ్‌చేసే అదనపు మొత్తాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టెలికాం సంస్థల విధానాన్ని వెబ్సైట్లు వ్యతిరేకిస్తే అవి వినియోగదారులకు అందుబాటులోకి రాకుండాపోతాయి. అలా చూసినా చివరకు నష్టపోయేది ఇంటర్నెట్ వినియోగదారులే. ఇంటర్నెట్లో ప్రవహించే సమాచారాన్ని ఇలా అంతరాల దొంతరలో చిక్కుకు నేలా చేయడం...ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో అందుబాటులోకొచ్చే ప్రస్తుత విధానం స్థానంలో డబ్బు నిర్ణయాత్మక శక్తిగా మారడం ఆందోళన కలిగించే అంశం. ఏ డేటా తమకు ముఖ్యమైనదో నిర్ణయించుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండే ప్రస్తుత విధానానికి బదులు ఎవరు డబ్బు ఎక్కువిచ్చారో వారికి సంబంధించిన డేటాయే పెనువేగంతో వినియోగదారులకు చేరుతుంది. వారు అవసరమనుకునే సమాచారం మాత్రం సుదీర్ఘ సమయం వేచిచూసినా అందుబాటులోకి రాదు. ఈ విషయంలో ఫేస్బుక్ అనుసరించిన విధానాన్ని నిశితంగా విమర్శించిన కమిటీ... అదే ఫలితాన్నిచ్చే జీరో రేటింగ్ పద్ధతిని మాత్రం అంగీకరించింది. ఎయిర్టెల్ రూపొందించిన ఈ పద్ధతి ప్రకారం కొన్ని వెబ్సైట్లు ఉచితంగా అందుబాటులో కొస్తాయి. ఈ ప్లాట్‌ఫాంలో భాగం కాదల్చుకున్న వెబ్సైట్లు అందుకు కొంత మొత్తాన్ని ఎయిర్‌టెల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో తప్పేం లేదన్న అభిప్రా యంలో కమిటీ ఉంది. వాస్తవానికి ఫేస్బుక్, ఎయిర్టెల్ అనుసరించే విధానాలు వేరు తప్ప ఫలితం ఒకటేనని ఎవరికైనా అర్థమవుతుంది. ఫోన్ టారిఫ్‌లను నిర్ణ యించే ప్రస్తుత విధానం తరహాలోనే జీరో రేటింగ్‌కు సంబంధించికూడా అందులో ఏ వెబ్‌సైట్‌కు చోటిస్తున్నారు...దాన్నుంచి ఎంత వసూలు చేస్తున్నారనేది ట్రాయ్ సమీక్షించాలని, ఇంటర్నెట్ తటస్థతకు దెబ్బతగిలే అవకాశం ఉన్న కేసుల్లో అనుమ తిని నిరాకరించే విధానాన్ని అనుసరిస్తే సరిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. ఆచరణలో ఇది తటస్థతను దెబ్బతీస్తుంది. వివక్షకు బాటలు పరుస్తుంది. ఇప్పు డున్న విధానంలో దండిగా డబ్బును వెదజల్లే పెద్ద సంస్థకూ, అంతంతమాత్రం పెట్టుబడితో వచ్చిన వ్యక్తికి సమానావకాశాలున్నాయి. సంస్థ స్థోమతనుబట్టి కాక...ఎవరి అప్లికేషన్వల్ల అధిక ప్రయోజనమో, దేనిలో సృజనాత్మకత ఎక్కువగా ఉందో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. ఆ అప్లికేషన్‌ను అందించే సంస్థ వైపు మొగ్గుచూపుతారు. జీరో రేటింగ్ ప్లాట్‌ఫాంలు ఈ సమానతను దెబ్బ తీస్తాయి. వినియోగదారుల ఎంపికకు పరిమితులు విధిస్తాయి. అన్నిటికీ మించి వాట్సప్, స్కైప్, వైబర్వంటి ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్ల విషయంలో నిపుణుల అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. ఈ అప్లికేషన్ల ఆధారంగా విదేశాలకు పంపే డేటా విషయంలోగానీ, ఫోన్ కాల్స్ విషయంలోగానీ అభ్యం తరం లేదన్న కమిటీ...దేశీయంగా మాత్రం నియంత్రణలు విధించడం అవసరమని సూచించింది. ఒకే విధానాన్ని విదేశాలకు సంబంధించి ఒకవిధంగా, దేశీయంగా వినియోగిస్తే మరో విధంగా పరిగణించడం అన్యాయం, వివక్షాపూరితమవుతుం దని వేరే చెప్పనవసరం లేదు. ఈ అప్లికేషన్లు వాడుకలోకొచ్చాక ఫోన్ కాల్స్ వినియోగం తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం ఫొటోలు, వీడియోలు వేగంగా చేరే యడానికి ఉపయోగపడుతున్న వాట్సప్ ద్వారా త్వరలో సంభాషించుకునే వీలు కూడా కలుగుతుందని చెబుతున్నారు. అది అందుబాటులోకొస్తే టెలికాం సంస్థలకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతోనే కమిటీ ఈ మాదిరి సిఫార్సు చేసిందంటున్నారు. టెలికాం సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఒక విధానాన్ని నిరుత్సా హపర్చడం, దానికి ఖరీదుకట్టి అందుబాటులోకి రాకుండా చేయడం అన్యాయం అనిపించుకుంటుంది. టెలికాం సంస్థలు నిలదొక్కుకోవాలంటే తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడం, అనుబంధ సేవలను అందించడం వగైరా మార్గాలను అనుసరించాలి తప్ప ప్రపంచమంతటా అందుబాటులోకొచ్చిన విధానం ఇక్కడ ఎవరికీ దక్కకుండా చేయాలనుకోవడం సరికాదు. ఇంటర్నెట్ తటస్థతపై నాలుగు నెలలనుంచి నెటిజన్లలో ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇంటర్నెట్ తటస్థత విషయంలో రెండో మాటకు తావులేద నే చెప్పింది. ఇప్పుడు నిపుణుల కమిటీ ఇంటర్నెట్ తటస్థతను నిర్ద్వంద్వంగా సమ ర్థిస్తున్నామని అంటూనే దాన్ని దెబ్బతీసే సిఫార్సులు చేసింది. ఈ నివేదిక విషయం లో ట్రాయ్ సక్రమంగా వ్యవహరించి కేంద్రానికి సహేతుకమైన సూచనలు అందిం చాలి. ట్రాయ్ ఏం చెప్పినా ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్నెట్ తటస్థతకు విఘాతం కలగకుండా చూడాలి. -
కేంద్ర మాజీమంత్రిని ప్రశ్నించిన సీబీఐ
టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌ను సీబీఐ బుధవారం ప్రశ్నించింది. చెన్నైలోని తన ఇంట్లోనే ఏకంగా 300 హై డేటా కెపాసిటీ ఉన్న బీఎస్ఎన్ఎల్ టెలికం లైన్లతో ఓ భారీ ఎక్స్ఛేంజి పెట్టుకున్న కేసులో ఆయనను సీబీఐ విచారించింది. బుధవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన హాజరయ్యారు. సీబీఐ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మారన్‌ను విచారించారు. వాస్తవానికి సోమవారమే మారన్ రావాల్సి ఉన్నా, ఆయన రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ బెయిల్ మంగళవారం వచ్చింది. ఇంతకుముందు ఇదే కేసులో సీబీఐ అరెస్టుచేసిన ముగ్గురు సన్ టీవీ అధికారులకు కూడా మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పేరుతో ఏకంగా 323 రెసిడెన్షియల్ లైన్లను మారన్ టెలికం మంత్రిగా ఉన్న సమయంలో తన ఇంట్లో పెట్టుకుని, వాటిని సన్ టీవీ కోసం వాడుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఇవన్నీ కూడా ఐఎస్‌డీఎన్ లైన్లని.. అంటే టీవీ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి కావల్సిన సామర్థ్యం వాటికి ఉంటుందని తెలిపింది. -
16 గంటల పాటు కొనసాగిన సిట్ విచారణ
-
16 గంటల పాటు కొనసాగిన సిట్ విచారణ
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ పై ఏపీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజుల పాటు చేపట్టిన విచారణ ముగిసింది. మొత్తం 8 మంది టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులను విచారించారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు విచారణ కొనసాగింది. ఈరోజు మూడు టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులను ప్రశ్నించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు విచారణ కొనసాగింది. న్యాయనిపుణులతో కలిసి టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. దాదాపు 16 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ ముగిసిన తర్వాత టెలికం సంస్థల ప్రతినిధులు ఎవరితోనూ మాట్లాడలేదు. -
’సిట్’కి చుక్కెదురు..?
-
‘సిట్’ కు స్థానబలిమికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణపై కౌంటర్ ఎటాక్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజయవాడ కేంద్రంగా పని చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సూచనల మేరకు సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 12 మంది టెలికం సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని... భవానీపురం పోలీసుస్టేషన్లో హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణకు చెందిన ప్రముఖులు, అధికారుల్ని టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న ఈ దర్యాప్తును ఆ భూభాగంలో కంటే స్థానబలిమిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ట్యాపింగ్ పై ఆధారాల కోసమే పాట్లు! తెలంగాణలో జరిగిన నేరానికి సంబంధించిన ఆరోపణలపై ఏపీలోని వివిధ పోలీసుస్టేషన్లలో నమోదై, సిట్‌కు బదిలీ అయిన కేసుల్లో పస లేదనే అభిప్రాయాన్ని ఇప్పటికే న్యాయ నిపుణులు ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. అయినప్పటికీ ‘నోటీసులకు నోటీసులు’ అనే ధోరణిలో ముందుకు వెళ్తున్న ప్రభుత్వ పెద్దలు మాత్రం దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సిట్‌కు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ ఢిల్లీ వరకు వె ళ్లినా ఆశించిన స్పందన రాలేదు. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రభుత్వం తొలుత ‘ట్యాపింగ్‌ను నిరూపించడం’ పైనే దృష్టి పెట్టాల్సిందిగా సిట్‌కు స్పష్టం చేశారు. మొత్తం 147 నంబర్ల ట్యాపింగ్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని, పూర్తి వివరాలు అందించాలని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించిన సిట్ సోమవారం విజయవాడలో విచారించనుంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) బదిలీ అయిన ‘మత్తయ్య కేసు’ దర్యాప్తును డీజీపీ జాస్తి వెంకట రాముడు ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటికి పూర్తయితే సీఐడీ పోలీసులూ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. -
పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్ల రాకపోకల్లో అవాంతరం
గొల్లప్రోలు (తూర్పు గోదావరి) : భారీ వర్షాలు, ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేహట్ కుప్పకూలిపోయింది. దీంతో సిగ్నల్, టెలికం వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్లరాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మాన్యువల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో ఆ స్టేషన్ల మధ్య రైళ్లు నెమ్మదిగా ప్రయాణించాయి. రైల్వే డివిజనల్ ఇంజనీర్ దీనదయాళ్ నేతృత్వంలో విజయవాడ, రాజమండ్రి, తుని, సామర్లకోట స్టేషన్లకు చెందిన రైల్వే సిబ్బంది శనివారం ఉదయం నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా సిగ్నల్హట్ను తీసుకువచ్చి బోర్డుకు అమర్చి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని డీఈ చెప్పారు.