AB de Villiers
-
IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై..
భారత స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో తాను కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపర్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా 2021లో రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు సంజూ శాంసన్.కెప్టెన్‌గా హిట్ఆ మరుసటి ఏడాదే అంటే.. 2022లో రాజస్తాన్‌ను ఫైనల్ చేర్చి సత్తా చాటాడు. 2008 తర్వాత ఆ జట్టు మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించడం అదే తొలిసారి. అయితే, 2023లో మాత్రం ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినప్పటికీ ఐదో స్థానంలో నిలపగలిగాడు. ఇక తాజా ఎడిషన్‌లో మాత్రం రాజస్తాన్‌ను మరోమారు ఆఫ్స్‌లో నిలబెట్టాడు సంజూ.అతడి కోసం త్యాగం చేసేందుకు సిద్దంఇలా గత మూడేళ్లుగా రాజస్తాన్‌ను మెరుగైన స్థితిలో నిలపడంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్ కోసం వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంజూ తాజాగా వెల్లడించాడు.నాకు ఇదొక పెద్ద సవాలే.. అయినా‘‘ధ్రువ్ జురెల్ ప్రస్తుతం టెస్టుల్లో సెకండ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తే అతడి అంతర్జాతీయ కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి మేము చర్చలు జరుపుతున్నాం.జురెల్‌తో కలిసి కీపింగ్ బాధ్యతలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నిజానికి.. నేను కేవలం ఓ ఫీల్డర్‌గా ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. కాబట్టి నాకు ఇదొక పెద్ద సవాలే. అయితే.. ధ్రువ్ విధుల పట్ల మాత్రం స్పష్టతతో ఉన్నాను.నాయకుడిగా నా బాధ్యత.. అందుకే ఈ నిర్ణయంనేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ‘‘చూడు ధ్రువ్.. నాయకుడిగా నేను నీ గురించి తప్పక ఆలోచిస్తాను. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లలో కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు’’ అని చెప్పాను. ఏదేమైనా మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత ఎదుగుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాం’’ అని సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు తన ఆలోచినలు, నిర్ణయం గురించి వెల్లడించాడు.రూ. 18 కోట్లకుకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్.. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడితో పాటు యశస్వి జైస్వాల్(రూ. 18 కోట్లు ), రియాన్ పరాగ్(రూ. 14 కోట్లు)ధ్రువ్ జురెల్(రూ. 14 కోట్లు), హెట్‌మైర్(రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(రూ. 4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.ఐపీఎల్ వేలం-2025 తర్వాత రాజస్తాన్ జట్టుయశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, సందీప్‌శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు), వనిందు హసరంగ (రూ.5.25 కోట్లు),మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు), ఫజల్హక్ ఫారూకీ(రూ. 2 కోట్లు), క్వెనా మఫాక (రూ. 1.50 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు), కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు), కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు).చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్..!?
దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వ్యక్తిగత కారణాల రీత్యా డుమిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు డుమినీ తెలియజేశాడు.మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. కాగా అతడి రాజీనామా విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా సైతం ధ్రువీకరించింది.డుమిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. అదే విధంగా అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు వేట మొదలు పెట్టినట్లు సదరు క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీడీ..కాగా దక్షిణాఫ్రికా తదుపరి బ్యాటింగ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సౌతాఫ్రికా క్రికెట్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఏబీడీ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్ -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. సారథులు వీరేనా?అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ అతడే!‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరుఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు. ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
IPL 2025: ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా బాగానే ఉందని.. అయితే వేలంపాటలో అనుసరించే వ్యూహాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి జట్టుతోనే ఉండటం సంతోషకరమన్న ఏబీడీ.. చహల్‌ను కూడా తిరిగి తీసుకువస్తే జట్టు మరింత బలోపేతమవుతుందన్నాడు.కాగా నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పాటిదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(రూ. 5 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రిటెన్షన్ పోగా.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ. 83 కోట్లు మిగిలి ఉన్నాయి.ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుందిఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ వేలంలో ఆర్సీబీ అనుసరించాల్సిన వ్యూహాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనైతే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తాను. యజువేంద్ర చహల్, కగిసో రబడ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్... ఈ నలుగురిని కొనుగోలు చేసిన తర్వాత పర్సులో ఎంత మిగిలిందన్న అంశం ఆధారంగా మిగతా ప్లేయర్లను ప్లాన్ చేసుకోవాలి.ఒకవేళ మీకు రబడను కొనేంత సొమ్ము లేకపోతే.. మహ్మద్ షమీని దక్కించుకోండి’’ అని డివిలియర్స్ ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. కాగా సుదీర్ఘకాలం పాటు తమతో కొనసాగిన భారత మణికట్టు స్పిన్నర్ చహల్‌ను 2022లో ఆర్సీబీ వదిలేసిన విషయం తెలిసిందే.లీడింగ్ వికెట్ టేకర్అయితే, అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ చహల్‌ను కొనుక్కోగా.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 160 మ్యాచ్‌లు ఆడి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(295) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు చహల్.ఈ నేపథ్యంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ తిరిగి జట్టులో చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు
ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు చేర్చింది. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్, భారత దిగ్గజ స్పిన్నర్ నీతూ డేవిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్లుగా ఎంపికయ్యారు.అలిస్టర్ కుక్ (2006-18) ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్లలో ఒకరు. కుక్ తన టెస్ట్ కెరీర్లో 161 టెస్ట్‌లు ఆడి 45.35 సగటున 12,472 పరుగులు చేశాడు. అలాగే 92 వన్డేల్లో 36.40 సగటున 3204 పరగులు చేశాడు. నాలుగు టీ20ల్లో 15.25 సగటున 61 పరుగులు చేశాడు.నీతూ డేవిడ్ (1995-2008).. భారత్ తరఫున ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్. 2023లో డయానా ఎడుల్జి భారత్ తరఫున హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్ భారత్ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ నీతూనే.ICC VIDEO FOR THE HALL OF FAMER - AB DE VILLIERS. 🐐pic.twitter.com/PzUh1MDPHR— Mufaddal Vohra (@mufaddal_vohra) October 16, 2024ఏబీ డివిలియర్స్ (2004-2018) విషయానికొస్తే.. ఏబీడీ సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 ఆడి 20014 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఏబీడీ సగటు 50కి పైగానే ఉంది. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల ఏబీడీకి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా పేరుంది.చదవండి: IND vs NZ 1st Test: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆట రద్దు -
సౌతాఫ్రికా టీ20 లీగ్ అంబాసిడర్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచపు అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్‌వే ఎస్ఏ20కు అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. లీగ్ క్రికెట్లో డీకేకు ఉన్న అనుభవం, భారత్‌లో కార్తీక్‌కు ఉన్న క్రేజ్ తమ లీగ్ వృద్ధికి తోడ్పడుతుందని స్మిత్ అన్నాడు. బెట్‌వే ఎస్ఏ20 లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై డీకే స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టనుండటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సహచర అంబాసిడర్ ఏడీ డివిలియర్స్‌తో కలిసి పని చేస్తాడు.ఎస్ఏ20 లీగ్ గత రెండు సీజన్లుగా విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లోనూ ఐపీఎల్ తరహాలో చాలామంది విదేశీ స్టార్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతుల్లో నడుస్తుంది. ఈ జట్టుకు సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలు ఎస్ఏ20 లీగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఓనర్ల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి.కార్తీక్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభ ఎడిషన్‌ను (2008) నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన డీకే.. ఐపీఎల్ 2024 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే రిటైర్మెంట్ ముందు వరకు ఆర్సీబీకి ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఆర్సీబీ డీకేను తమ మెంటార్‌గా నియమించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో కార్తీక్ 135.66 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు. -
రోహిత్, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్ అతడే: బాబర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కెరీర్ పరంగా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడి సారథ్యంలో పాక్ వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణంగా విఫలమైంది.భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన బాబర్ బృందం.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం సూపర్-8 కూడా చేరలేదు.కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంఫలితంగా బాబర్ మరోసారి కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో తమ ఆటగాళ్లు పూర్తిగా విఫలం కావడంతో పాక్ క్రికెట్ బోర్డు కాస్త కఠినంగానే వ్యవహరించనుందని వార్తలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఆటగాళ్లు ఇతర దేశాల టీ20 లీగ్‌లలో ఆడకుండా పాక్ బోర్డు అడ్డుకట్ట వేస్తోంది. గ్లోబల్ టీ20 కెనడా వంటి లీగ్‌లలో ఆడాలనుకున్న బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడమే ఇందుకు నిదర్శనం.ఫామ్‌లేమితో సతమతమైనపుడుఇదిలా ఉంటే.. తాను ఫామ్‌లేమితో సతమతమైనపుడు వీరి సలహాలే తీసుకుంటానంటూ బాబర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాలు ఉన్నాయని అనిపించినపుడు.. విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్లను సంప్రదిస్తానని బాబర్ ఆజం పేర్కొన్నాడు.సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడుతూ అతడు ఈ విషయం వెల్లడించాడు. అదే విధంగా.. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరు చెప్పాడు.రోహిత్, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్ అతడే: బాబర్ఇక ప్రత్యర్థి జట్టులో తాను చూసిన అత్యుత్తమ బ్యాటర్‌గా బాబర్ ఆజం డివిలియర్స్ పేరు చెప్పడం విశేషం. దీంతో షాకవ్వడం ఏబీడీ వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియో లింక్‌ను ఈ సౌతాఫ్రికా లెజెండ్ తాజాగా షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు తాను ఈ ఇంటర్వ్యూ చేసినట్లు వెల్లడించాడు.ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి పేరు చెబుతాడని భావించామని.. అయితే, బాబర్ ఏబీడీ పేరు చెప్పడం కూడా బాగుంది’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.I interviewed Pakistan's @babarazam258 before the T20 World Cup earlier this year, and l'd shared a bit of it back then. Don't miss out on this chat, and show my friend some love. 🫶🏻🏏Here's the full interview 👇🏻🔗: https://t.co/nTA05h4nZY#CricketTwitter pic.twitter.com/iy02SXZvn2— AB de Villiers (@ABdeVilliers17) July 20, 2024 -
ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: డివిలియర్స్
టీ20 వరల్డ్‌కప్-2024 ఈవెంట్‌కు ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టుపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి క్రికెట్ సౌతాఫ్రికా సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే ఇందులో బ్లాక్ ఆఫ్రికన్ ఆటగాడు కగిసో రబాడకు మాత్రమే సెలక్టర్లు చోటు ఇచ్చారు.క్రికెట్ దక్షిణాఫ్రికా పాలసీ ప్రకారం... దక్షిణాఫ్రికా ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ ప్లెయింగ్ ఎలెవన్‌లో కనీసం ఇద్దరూ నల్లజాతి ఆఫ్రికన్లు ఉండాలి. అదే విధంగా కలర్ ఆఫ్రికన్స్ కనీసం ఆరుగురుఉండాలి. అయితే సెలక్టర్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పాలసీకి విరుద్దంగా కేవలం ఒక్క బ్లాక్ ఆఫ్రికన్(రబాడ)ను మాత్రమే సెలక్ట్ చేశారు. మరో నల్లజాతి ఆటగాడు లుంగీ ఎంగిడీకి ప్రోటీస్ సెలక్టర్లు రిజర్వ్ జాబితాలో చోటిచ్చారు. కేవలం ఒకే బ్లాక్ ఆఫ్రికన్‌కు జట్టులో చోటు ఇవ్వడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. సెలక్టర్ల నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రీడా మంత్రి ఫికిలే మాబులా సైతం తప్పుబట్టాడు."టీ20 వరల్డ్‌కప్-2024కు ప్రోటీస్ టీమ్‌లో కేవలం ఒక్క బ్లాక్ ఆఫ్రికన్ ఆటగాడికి మాత్రమే చోటు దక్కింది. ఇది సరైన నిర్ణయం కాదు. ఇటువంటి నిర్ణయాలు జాతీయ క్రికెట్ జట్టులో చోటు ఆశిస్తున్న ఆటగాళ్లందరికి సరైన న్యాయం దక్కేలా చేయవు" అంటూ మాబులా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.తాజాగా ఇదే విషయంపై ప్రోటీస్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీకి ముందు ఇటువంటి వివాదాలు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బ తీస్తాయని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు."టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఇటువంటి చర్చలు నిజంగా సిగ్గు చేటు. ఇదేమి మనకు కొత్త కాదు. ఇది దేశానికే అవమానం. కానీ ఇటువంటి వివాదాలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తాయి. అదృష్టవశాత్తూ ఈ సారి అక్కడ జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ప్రస్తుతం కేవలం ప్రేక్షకుడిగానే ఉన్నా. గతంలో కూడా ప్రపంచకప్‌కు ముందు ఇటువంటి వివాదాలు తలెత్తాయి. ఇక వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అద్భుతంగా ఉంది. లుంగి ఎంగిడీ విషయంలో సెలక్టర్లు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతడు తన ఫామ్‌ను కోల్పోయాడు.అదే విధంగా గాయాలతో కూడా పోరాడుతున్నారు. అందుకే అతడికి ప్రధాన జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ ఎంగిడీ ప్రధాన జట్టులో ఉండి ఉంటే ఎటువంటి వివాదాలు తలెత్తేవి కావు. కొన్నిసార్లు జట్టు ఎంపికలో ఇలాంటివి జరుగుతాయి. టీమ్ కాంబనేషన్కు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడకూడదని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్ కోచ్‌గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే! -
IPL 2024: యూనివర్సల్ బాస్‌తో కన్నడ బ్యూటీ.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
ఆర్సీబీ వరుస వైఫల్యాలపై ఏబీడీ కామెంట్స్.. కోహ్లి గనుక
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాజా ఎడిషన్‌ను ఆర్సీబీ మరీ చెత్తగా ఏమీ ఆరంభించలేదని.. అలా అని అంతగొప్పగా ఏమీ రాణించడం లేదని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. చెపాక్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి సత్తా చాటింది. కానీ.. ఆ తదుపరి వరుసగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడి విమర్శల పాలైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి తప్ప ఇతర ప్రధాన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడం వల్ల వరుస ఓటములు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ ఆట తీరుపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఆర్సీబీ ప్రదర్శన మరీ చెత్తగానూ.. అంత గొప్పగానూ లేదు. కనీసం ఇంకో రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే వాళ్లు తిరిగి పుంజుకోగలరు. రేసులో ముందుకు వెళ్లగలరు. విరాట్‌కు ఈ సీజన్లో శుభారంభమే లభించింది. అతడు ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నాను. మిడిల్ ఓవర్లలో అతడి అవసరం ఆర్సీబీకి ఎంతగానో ఉంది. మొదటి ఆరు ఓవర్లలో అతడు దంచికొడుతుంటే చూడటం బాగుటుంది. ఫాఫ్ కూడా కాస్త రిస్క్ తీసుకోవాల్సిందే. ఏదేమైనా విరాట్ 6- 15 ఓవర్ల వరకు క్రీజులో ఉంటేనే ఆర్సీబీ అనుకున్న లక్ష్యాలను సాధించగలదు’’ అని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆర్సీబీ ‘స్టార్’ బ్యాటర్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్ ఇంత వరకు బ్యాట్ ఝులిపించలేకపోయారు. ఇక తదుపరి బెంగళూరు జట్టు శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్ వేదికగా ఏప్రిల్ 6న ఈ మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై 📸: 𝙃𝙤𝙡𝙙 𝙩𝙝𝙖𝙩 𝙥𝙤𝙨𝙚 👑 #RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/UW5tZft1lQ — JioCinema (@JioCinema) April 2, 2024 -
'సన్ ఆఫ్ ఢిల్లీ'.. అతడి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా: ఏబీడీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. రోడ్డు ప్రమాదం కారణంగా గత 14 నెలలకు ఆటకు దూరంగా ఉన్న రిషబ్.. తిరిగి ఐపీఎల్-2024తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్లో పాల్గోనేందుకు పంత్‌కు ఏన్సీఏ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. దీంతో అతడి రీ ఎంట్రీకి కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను 'సన్ ఆఫ్ డిల్లీ'గా ఏబీడీ అభివర్ణించాడు. "సన్ ఆఫ్ డిల్లీ(పంత్) పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అతడు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. పంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. పంత్ జెర్సీ నెం 17. నా జెర్సీ నెంబర్ కూడా పదిహేడే. రిషబ్ ఆట అంటే నాకు ఏంతో ఇష్టం. అతడికి ఐపీఎల్లో సెంచరీ కూడా ఉంది. పంత్ రీ ఎంట్రీలో కూడా సత్తాచాటాలని కోరుకుంటున్నానని" తన యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ 360 పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో పంత్ నాయకత్వంలోనే ఢిల్లీ బరిలోకి దిగనుంది. గతేడాది అతడి గైర్హజరీలో ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
'వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం.. అయినా అతడికి ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఇంగ్లండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు నామమాత్రపు ఐదో టెస్టుకు సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు రజిత్ పాటిదార్‌పై వేటు వేయాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు కేవలం 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పాటిదార్‌ను పక్కన పెట్టాలని మెన్జ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాటిదార్‌కు మద్దతుగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిలిచాడు. పాటిదార్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరో అవకాశం ఇవ్వాలని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో రజిత్ పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. తనకు జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయాడు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా ఆడకున్నా ఫలితాలు జట్టుకు అనుకూలంగా వస్తున్నప్పుడు మనం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతడి అటిట్యూడ్ బాగా ఉండి, డ్రెస్సింగ్ రూమ్‌లో అందరికి నచ్చితే కెప్టెన్ రోహిత్ శర్మ మెనెజ్‌మెంట్‌తో మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే పాటిదార్ మాత్రం అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతానికి అతడు పరుగులేమీ చేయకున్నా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి చూడండి తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
కోహ్లీ ఆడక పోవడానికి అసలు కారణం ఇదే..!
-
తూచ్.. అంతా అబద్ధం: కోహ్లి విషయంలో డివిలియర్స్ యూటర్న్
AB de Villiers Apology For Spreading False Information: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట మార్చాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల గురించి తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానంటూ బాంబు పేల్చాడు. కోహ్లి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలు చూపుతూ తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి కుటుంబ సభ్యుల గురించి వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వదంతులు అతడి భార్య అనుష్క గర్భవతి అని.. అందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యానే అతడు ఆటకు దూరమయ్యాడని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, తమ తల్లి సరోజ్ ఆరోగ్యంగానే ఉందని కోహ్లి సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన యూట్యూబ్ చానెల్లో డివిలియర్స్ మాట్లాడుతున్న సందర్భంలో కోహ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘కోహ్లి బాగానే ఉన్నాడు. కోహ్లి దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’’ అని ఏబీడీ తెలిపాడు. దీంతో కోహ్లి- అనుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతా అబద్ధం.. నేనన్న మాటల్లో నిజం లేదు ఏబీ డివిలియర్స్ ఈ వార్తను ధ్రువీకరించాడంటూ పలు వార్తా సంస్థలు కూడా ప్రముఖంగా కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నిజానికి నా యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఆరోజు నేను ఓ పెద్ద తప్పు చేశాను. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా అతడు బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా. ఆట నుంచి తను ఎందుకు విరామం తీసుకున్నాడో తెలియదు. అయితే, మరింత రెట్టించిన ఉత్సాహంతో.. సరికొత్తగా కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టుకు కోహ్లి తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ మొదలుకానుంది. చదవండి: మహా క్రీడా సంబరం: విశాఖలో ఫైనల్ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు! ముగింపు వేడుకలు ఆరోజే -
Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం
ABD- Virat Kohli-Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి గల కారణం వెల్లడైంది. సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్‌మెషీన్‌కు లేదంటూ కింగ్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు ఏబీడీ. మా అమ్మ బాగానే ఉన్నారు కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ.. హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి కోహ్లి వైదొలిగినట్లు తెలిపింది. అయితే, ఇందుకు గల కారణం గురించి స్పష్టతనివ్వకపోవడంతో కోహ్లి కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చెందాయి. గర్భవతి అయిన భార్య కోసం సమయం వెచ్చించేందుకు కోహ్లి బ్రేక్ తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్యం వల్లే సెలవులో ఉన్నాడని ఇంకొందరు.. బీసీసీతో విభేదాల వల్లే ఇలా అని మరికొందరు నెట్టింట ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి.. తమ తల్లి సరోజ్ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఏబీ డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు. అవును.. మళ్లీ తండ్రికాబోతున్నాడు కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. ‘‘తను బాగున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని నేను అనుకుంటున్నా. కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు తను కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది విరాట్.. ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమో. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విరాట్ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దు’’ అని స్పష్టం చేశాడు. Ab De Villiers said - "Virat Kohli and Anushka Sharma expecting their second child, so Virat Kohli is spending his time with his family". (On ABD YT)#viratkohli #anushkasharma pic.twitter.com/XDqx76ZfeX — 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) February 3, 2024 వామికకు తోబుట్టువు రాబోతోంది కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు విరాట్ కోహ్లి. వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించగా.. రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని డివిలియర్స్ వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడేమో అన్న సందిగ్దానికి తెరపడినట్లయింది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు..!
-
అతడి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నా: డివిలియర్స్
వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఊవ్విళ్లరూతోంది. ఇక వైజాగ్ టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో రెండో టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అయితే జడ్డూ స్ధానంలో కుల్దీప్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం కాగా.. రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్, రజిత్ పాటిదార్ ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఛాన్స్ ఇవ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతమైనది. భారత జట్టు తరపున డెబ్యూ చేసేందుకు సర్ఫరాజ్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అతడు 66 ఇన్నింగ్స్‌లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అదే విధంగా 14 సెంచరీలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో సైతం అతడు సత్తచాటుతాడని ఆశిస్తున్నాను. మరోవైపు రజత్ పాటిదార్ కూడా డొమాస్టిక్ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి ఎవరికి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలని" తన యూట్యూబ్ ఛానల్లో ఏబీడీ పేర్కొన్నాడు. -
విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. కాగా 2023లో కోహ్లి వింటేజ్ విరాట్ కోహ్లిని గుర్తుచేస్తూ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాట్ ఝులిపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్లో ఈ వన్‌డౌన్ బ్యాటర్ 11 ఇన్నింగ్స్‌లో కలిపి 765 పరుగులు సాధించాడు. తద్వారా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న వన్డే సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి 2023లోనే బద్దలు కొట్టాడు. ప్రపంచకప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన 50వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి.. వన్డే రారాజుగా అవతరించాడు. సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు కాగా విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మాజీ క్రికెటర్ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు. -
T20 WC: ఈసారి టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: డివిలియర్స్
AB de Villiers Comments on Virat Kohli and Rohit Sharma: అంతర్జాతీయ టీ20లలో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనంపై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్-2024కు ముందు వారిద్దరిని జట్టులోకి రప్పించి మంచి పని చేశారంటూ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఐసీసీ టోర్నీలలో ఇలాంటి సీనియర్ స్టార్లను ఆడించడం వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి రాకతో యువ క్రికెటర్లు మరి కొంతకాలం వేచి చూడక తప్పదని.. అయితే.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని పేర్కొన్నాడు. సెమీస్‌లో నిష్క్రమణ.. అనేక మార్పులు కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యంపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అనేక తర్జనభర్జనల అనంతరం మరోసారి చేతన్ శర్మకే చీఫ్ సెలక్టర్ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లపై అతడి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేటు వేసింది. చర్చోపర్చల అనంతరం భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచే రోహిత్, కోహ్లి దూరం సెలక్టర్ల సంగతి ఇలా ఉంటే.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఈ క్రమంలో 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచకప్-2024కు ముందు భారత్ ఆడనున్న చివరి సిరీస్ ఇదే కావడంతో వీరిద్దరి పునరాగమనం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా ఈవెంట్లో వీళ్లను ఆడించేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాహిత్ ద్వయం రాకను సౌరవ్ గంగూలీ, సునిల్ గావస్కర్ వంటి వారు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాజీలు మాత్రం విమర్శిస్తున్నారు. వీరిద్దరి కారణంగా రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు కరువవుతాయని పేర్కొంటున్నారు. అందుకే వాళ్లను విమర్శిస్తున్నారు ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ‘‘రోహిత్, కోహ్లి విషయంలో విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోగలను. ఏదేమైనా త్వరలోనే క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగబోతోంది. ఒకవేళ కోహ్లి ఆడేందుకు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా అతడిని ఆడించాలి. వయసుతో సంబంధం లేకుండా పాత కోహ్లిని గుర్తుచేస్తూ అతడు ముందుకు సాగుతున్నాడు. 20 ఏళ్ల కుర్ర ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 35 ఏళ్ల వయసులో నాకు ఇలాంటి సపోర్టు ఉంటే రోహిత్, విరాట్ ఉంటే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలుస్తుందని మేనేజ్మెంట్ భావిస్తే కచ్చితంగా వాళ్లను ఆడిస్తుంది. నిజానికి 35 ఏళ్ల వయసులో ఉన్నపుడు నాకు కూడా మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి మద్దతు ఉంటే ఎంతో బాగుండేది. ఈసారి ప్రపంచకప్ టీమిండియాదే ఏదేమైనా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు కోహ్లి, రోహిత్‌లను పిలిపించడం ద్వారా వాళ్లిద్దరు టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ భాగమవుతారని బీసీసీఐ తన ఉద్దేశాన్ని తెలియజేసింది. ఇది సరైన నిర్ణయం. అత్యుత్తమ ప్లేయర్లను ఆడించాలని భావించిన టీమిండియా ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది’’ అని డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జనవరి 11 నుంచి అఫ్గన్‌తో టీమిండియా సిరీస్ ఆరంభం కానుంది. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 4 నుంచి ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 రూపంలో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
నేను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు వీరే: ఆసీస్ స్టార్ స్పిన్నర్
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్‌గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు. కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్మెషీన్దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్‌లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్‌లో 96కు పైగా స్ట్రైక్‌రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు.. టెస్టుల్లో లియోన్‌పై డివిలియర్స్‌ది కూడా పైచేయే! అతడి బౌలింగ్‌లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, టెండుల్కర్‌కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్‌లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు. కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్‌తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్‌లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
వాళ్లిద్దరికి అంత మొత్తమా? ముంబై మాత్రం తెలివిగా రూ. 15 కోట్లకే: ఏబీడీ
ఐపీఎల్ వేలం-2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించాయని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఉన్న వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని ఊహించలేదన్నాడు. కాగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఆక్షన్‌లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయగా.. స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే వీరిద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఏబీ డివిలియర్స్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈసారి వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు స్మార్ట్‌గా వ్యవహరించాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగాలకు తావులేకుండా తెలివిగా కొనుగోళ్లు చేశాయి. నిజానికి కమిన్స్, స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే! అయితే, వాళ్ల కోసం అంత భారీ మొత్తం వెచ్చించాలా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న మాట నిజమే! అందుకే ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ముందుగా చెప్పినట్లు ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నువాన్ తుషార, దిల్షాన్ మధుషాంక అద్భుతమైన క్రికెటర్లు. ఇక మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ధరకే వాళ్లిద్దరు ముంబైకి లభించారు. ముఖ్యంగా.. కొయెట్జీ, మధుషాంక, తుషారలను కలిపి 15 కోట్ల రూపాయలకే సొంతం చేసుకోవడం నాకు నచ్చింది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా పేస్‌త్రయం గెరాల్డ్ కొయెట్జీని రూ. 5 కోట్లు, దిల్షాన్ మధుషాంకను రూ. 4.5 కోట్లు, నువాన్ తుషారను రూ. 4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక నబీ కోసం రూ. 1.5 కోట్లు, గోపాల్ కోసం రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు నామన్ ధిర్‌ను రూ. 20 లక్షలు, అన్షూల్ కాంబోజ్‌ను రూ. 20 లక్షలు, శైవిక్ శర్మను రూ. 20 లక్షలకు ఐపీఎల్-2024 వేలంలో ముంబై కొనుగోలు చేసింది. -
రోహిత్ శర్మను తప్పించడం సరైన నిర్ణయం: డివిలియర్స్
AB de Villiers backs MI's decision: కెప్టెన్ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్ సరైన నిర్ణయం తీసుకుందని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కానీ హార్దిక్ పాండ్యా నియామకం విషయంలో ఎంఐ అభిమానుల నుంచి ఇంతటి నెగిటివిటీని ఊహించలేదన్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఫ్రాంఛైజీ పట్ల విశ్వాసంగా ఉన్న మాట వాస్తమేనన్న డివిలియర్స్.. ఇప్పుడు హార్దిక్ తిరిగి వచ్చినందు వల్ల అతడికి పగ్గాలు అప్పజెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. రోహిత్ శర్మను తప్పిస్తూ ముంబై తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024కు ముందు తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తనకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కి మళ్లీ ఆడేందుకు సిద్ధమైన పాండ్యా ఈసారి కెప్టెన్‌గా అవతారమెత్తనున్నాడు. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు ఇదిలా ఉంటే.. ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని పాండ్యాను సారథి చేయడంతో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లెజెండ్ పట్ల మీరు చూపే గౌరవం ఇదేనా.. "RIP MUMBAI INDIANS" అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐ ఇన్‌స్టా, ఎక్స్ పేజీల ఫాలోవర్లు లక్షల్లో తగ్గిపోయారు. బ్యాటర్‌గా ఆటను ఆస్వాదించాలనే? ఈ విషయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించి ఏబీడీ.. ‘‘ఈ వార్త తెలిసిన తర్వాత కొంతమంది సంతోషపడితే.. మరికొంత మంది బాధపడుతున్నారు. అంతేకాదు కెప్టెన్ మార్పు ప్రకటన తర్వాత ఎంఐ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కోల్పోయిందని చదివాను. రోహిత్ స్థానాన్ని హార్దిక్ భర్తీ చేయడాన్ని చాలా మంది పర్సనల్‌గా తీసుకుని ఉంటారు. అయితే, ముంబై హార్దిక్‌ను కెప్టెన్ చేయడం చెత్త నిర్ణయమని నేను భావించను. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం తను టీమిండియా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి కనీసం ఫ్రాంఛైజీ క్రికెట్లో అయినా.. ఒత్తిడిని తగ్గించుకుని బ్యాటర్‌గా ఆటను ఆస్వాదించాలని భావించి ఉంటాడు. మరో మాట.. సూర్య, బుమ్రా ముంబై పట్ల విశ్వాసంగానే ఉన్నారు. అయితే, ఇప్పుడు హార్దిక్ తిరిగి వచ్చాడు. కాబట్టి తనను కెప్టెన్ చేయడంలో తప్పేముంది? ఈ నిర్ణయాన్ని ఎందుకింత ప్రతికూల దృష్టితో చూస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే.. ఈ ప్రతికూలత తగ్గే అవకాశం ఉందని ఈ సందర్బంగా ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.