indefinite strike
-
TG: నేటి నుంచి జూడాల నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్‌జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్పర్సన్ డాక్టర్ డి.శ్రీనా«థ్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అంతా ఈ సమ్మెలో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో అనేక చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లకు తగిన పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వస్తోందని, తమ సమస్యలు సమగ్రంగా పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రోగులు, సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల తాము చింతిస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. స్టైపెండ్లను సకాలంలో విడుదల చేసేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. -
అంగన్వాడీల్లో సమ్మె సైరన్!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన రిటైర్మెంట్ పాలసీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూనియన్ నేతలు... విధులు బహిష్కరించి ఉద్యమానికి ఉపక్రమిస్తున్నారు. ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె తేదీ కంటే ముందుగానే డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ల చిట్టాను సమర్పించింది. చర్చలకు విరుద్ధంగా రిటైర్మెంట్ పాలసీ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించి పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. 65 ఏళ్ల వయసును రిటైర్మెంట్ ఏజ్‌గా ఖరారు చేసిన ప్రభుత్వం... పదవీ విరమణ పొందిన టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ అయిన వెంటనే టీచర్ లేదా హెల్పర్‌కు ఆసరా పెన్షన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతవారం సంతకం చేయగా... అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్‌కు పూర్తి విరుద్ధంగా ఉందంటూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. హామీలకు.. అమలుకు పొంతన లేదు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లపై గత నెలలో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నేతలు పలు డిమాండ్లు మంత్రి ముందు ఉంచారు. ఈ క్రమంలో చర్చించి కొన్ని హామీలు ఇవ్వగా... ఇటీవల సీఎం సంతకం చేసిన ఫైలులోని అంశాలపై ఏమాత్రం పొంతన లేదంటూ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. మంత్రితో చర్చలు జరిపినప్పుడు టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు అందులో సగానికి కోత పెట్టారంటూ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ... అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.26వేలుగా నిర్ధారించాలి విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలి విరమణ పొందిన టీచర్‌కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ నాటికి తీసుకునే వేతనంలో సగం మేర పెన్షన్‌గా ఇవ్వాలి సీనియారిటీ ఆధారంగా వేతనాలను పెంపుతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి సమాచార నమోదు కోసం కేంద్ర, రాష్ట్రాలు తెచ్చిన యాప్‌ల విషయాన్ని పరిశీలించాలి -
సమ్మె బాటన 20,000 మంది ఉద్యోగులు
బెంగళూర్ : వేతన పెంపుపై యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు చెందిన 20,000 మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణపై యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదని, తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్ఏఎల్కు చెందిన తొమ్మిది కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ వెల్లడించారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా 15 రోజుల కిందటే తాము సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. మరోవైపు సమ్మెను నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారని హెచ్ఏఎల్ పేర్కొంది. కాగా హెచ్ఏఎల్కు చెందిన బెంగళూర్, హైదరాబాద్, కోరాపుట్, లక్నో, నాసిక్‌లోని 5 ప్రొడక్షన్ కాంప్లెక్స్‌ల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా హెచ్ఏఎల్కు 4 పరిశోధన అభివృద్ధి కేంద్రాలున్నాయి. -
విలీనం చేసే వరకు సమ్మె
కవాడిగూడ: ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేసే వరకు టీఎస్‌ఆరీ్టసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ ఆశ్వద్థామరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆశ్వద్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వచ్చిందని తెలిపారు. బస్ రాయితీల రూపంలో ఆరీ్టసీకి ప్రభుత్వం రూ.కోట్లల్లో బకాయి పడిందని, తక్షణమే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు ప్రతి కారి్మకుడు మానసికంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. యూనియన్లకు అతీతంగా హక్కుల కోసం కారి్మకులు ఏకం కావాలన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కారి్మకులకు ప్రజాసంఘాలు, రాజకీయ పారీ్టలు, యూని యన్లు మద్దతు తెలిపాలని కోరారు. సకల జనుల సమ్మె సమయంలో రావాల్సిన జీత భత్యాల సవరణ చేయాలని అన్నారు. -
ఆశా కార్యకర్తల ఆందోళన పట్టదా?
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్) కార్యకర్తలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తం దేశంలో దాదాపు పది లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉండగా వారిలో 93,687 మందితో దేశంలోనే రెండో స్థానంలో బిహార్ ఉంది. వీరంతా 12 డిమాండ్లతో డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. డిసెంబర్ 13, 14 తేదీల్లో ఆశా కార్యకర్తలు జిల్లా ఆస్పత్రులను, సివిల్ సర్జన్ కార్యాలయాలను దిగ్బంధం చేశారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. రాష్ట్రంలోని మూడు ఆశా యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆశా సంయుక్త్ సంఘర్శ్ మంచ్ పిలుపు మేరకు ఆశా కార్యకర్తల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద వారు రాత్రనక, పగలనకా భైఠాయింపు సమ్మె చేస్తున్నారు. వారికి మద్దతుగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. వారు ఆశా కార్యకర్తలకు అన్న పానీయాలను అందించడంతోపాటు రాత్రిపూట చలిని తట్టుకునేందుకు బ్లాంకెట్లు కూడా తెచ్చి ఇస్తున్నారు. తమకు కూడా ప్రభుత్వ హోదా కల్పించి కనీసవేతనంగా 18 వేల రూపాయలు ఇవ్వాలని, పింఛను సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆరోగ్య కార్యకర్తలుగా ప్రభుత్వం పరిగణస్తూ టోకున గౌరవ వేతనం చెల్లిస్తుండగా, ఇక గ్రామీణ ప్రజలేమో ఇప్పటికీ వారిని సామాజిక కార్యకర్తలుగా పరిగణిస్తున్నారు. తమ డిమాండ్లు ఇప్పుడే చేస్తున్న కొత్త డిమాండ్లేవి కావని, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నవేనని ఆశా కార్యకర్తల నాయకులు తెలియజేస్తున్నారు. నెలవారి జీతాలను, పని పరిస్థితులను హేతుబద్ధం చేయడానికి 2015లో ఉన్నత స్థాయి కమిటీని వేశారని, ఆ కమిటీ చేసిన సిఫార్సులను కూడా నేటికి అమలు చేయడం లేదని నాయకులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని తరగతుల వారు, పట్టణ ప్రాంతాల్లో పేద వాళ్లు, దిగువ తరగతి వాళ్లు ఆశాను నమ్ముకొని బతుకుతున్నారు. ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి ఒకరు చొప్పున ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా వారు ప్రతిరోజు 18 గంటలపాటు పనిచేస్తున్నారు. -
చర్చలు విఫలం.. నిరవధిక సమ్మెలో ఓలా, ఊబర్ డ్రైవర్లు
ముంబై : గురువారం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిరవధికంగా సమ్ మెను కొనసాగించాలని క్యాబ్ డ్రైవర్లు నిశ్చయించుకున్నారు. క్యాబ్ సంస్థల యాజమాన్యం డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఓలా, ఉబర్ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్ డ్రైవర్లు గత పదకొండు రోజులుగా సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఓలా, ఊబర్ సంస్థల యాజమాన్యం తమ డిమాండ్లను పట్టించుకోవటంలేదని ‘‘మహారాష్ట్ర రాజ్య రాష్ట్రీయ కమ్గర్ సంఘ్’’(ఎమ్‌ఆర్‌ఆర్‌కేఎస్) ఆరోపించింది. ఎమ్‌ఆర్‌ఆర్‌కేఎస్ అధ్యక్షుడు గోవింద్ మోహితే మాట్లాడుతూ.. ఓలా, ఊబర్ సంస్థల యాజమాన్యం పోలీసు అధికారుల సమక్షంలో తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినా.. చర్చల్లో ఇందుకు భిన్నంగా నడుచుకున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. జీతాలు పెంచుతానని చెప్పి తమని మోసం చేసిన ఓలా, ఊబర్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. చదవండి : మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ స్ట్రైక్ -
ఎలా గెలుస్తారో చూస్తాం...
విజయనగరం మున్సిపాలిటీ: సమస్యలు పరిష్కారమిస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ స్పష్టం చేశారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. స్థానిక వీటీ అగ్రహారం సబ్‌స్టేషన్ వద్ద జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా జేఏసీ నాయకులు బి.గోవిందరావు, సంతోష్‌కుమార్, ఎం.వెంకటఅప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వేదికపై ఉన్న అతిథులంతా చేయి చేయి కలిపి సమరశంఖం పూరించారు. రాష్ట్రంలో 35 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన మేనిఫేస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న తమ గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. మరో వైపు పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తమ సమస్యలపై విన్నవించినా పట్టించుకున్న వారు లేకపోయారన్నారు. చివరికి గత నెల 25 వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా... సమ్మెను వాయిదా వేయాలని... ఈనెల 4లోగా సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇవ్వగా.. ఎటువంటి స్పందన లేదన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ప్రాణాలకు తెగించి వెట్టి చాకిరి చేస్తున్న తమకు పీసు రేటు పెట్టి బానిసలుగా చూస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన కనీస వేతనాలు అమలు చేయలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి మా కుటుంబాలకు చెందిన ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నేడు ప్రభుత్వం వైఖరి చూస్తుంటే వ్యతిరేక ఓటు తప్పనిసరిగా మారిందన్నారు. తక్షణమే పీసు రేటును రద్దు చేయాలని, కాంట్రాక్టు్ట ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 20 నుంచి మరోమారు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బికెవి.ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అప్పలసూరి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.కృష్ణంరాజు తదితరులు మద్దతుగా మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని, ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించేంత వరకు వెన్నంటే ఉంటామంటూ సంఘీభావం తెలిపారు. అధిక సంఖ్యలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు మంగళవారం కలిశారు. మార్చి 3 నుంచి కృష్ణా జిల్లా విజయవాడలో తాము చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతివ్వాలని వైఎస్ జగన్ ను అగ్రిగోల్డ్ బాధితులు కోరారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీ్దకరించాలి
కరీంనగర్‌సిటీ : కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వా, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు నిరవధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్ష సోమవారం 5వ రోజుకు చేరింది. దీక్షాశిబిరాన్ని విశ్వా, డాక్టర్, నగేశ్, జిల్లా మా జీ అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మా జీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సందర్శించి మద్ద తు పలికారు. గతంలో కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌పై హామీ ఇచ్చిన వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశార ని విమర్శించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తామన్న కేసీఆర్ నేడు ముఖం చాటేశారని, కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లు సాధించుకునేంత వరకు ఈ పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్ ఉన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవేందర్, నర్సింహరాజు, నాయకులు రాజమహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆందోళన బాటలో ఎల్పీజీ డీలర్లు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్య వైఖరికి నిరనసగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు భారత ఎల్పీజీ డీలర్ల సమాఖ్య ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సమాఖ్య ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపింది. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే, వినియోగించే వారికి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, రకరకాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కొత్త డిస్ట్రిబ్యూటర్లను నియమించరాదని, కమీషన్ పెంచాలని, పటిష్టమైన లాకింగ్ కలిగిన సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని, 5 కిలోల సిలిండర్లను అందుబాటులోకి తేవాలనే తదితర డిమాండ్లను సమాఖ్య చాలా కాలంగా చేస్తోంది. వీటిని ఆయిల్ కంపెనీలు, పెట్రోలియం శాఖలు పట్టించుకోకపోవడంతో ఆందోళన ప్రణాళిక రూపొందించినటు సమాఖ్య జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రావు, పవన్‌సోని తెలిపారు. నవంబరు 5 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఆరంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను చైతన్య పరిచేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తారు. నవంబరు 22న అర్ధరోజు పాటు డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలు మూసివేస్తారు. నవంబర్ 29, డిసెంబర్ 1న పూర్తిరోజు కార్యాలయాలు మూసివేస్తారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో డిసెంబరు 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతారు. -
ప్రజారోగ్యం పట్టదా?
ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి సిగ్గు రాలేదు దారుణ పరిస్థితులున్నా మంత్రులు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్సీ గేయానంద్ ధ్వజం సర్వజనాస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష అనంతపురం సిటీ : ‘ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా అనంతలో చిన్నపాటి జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించడం లేదు. సర్వజనాస్పత్రిలో 350 పడకల మీద 1,006 మంది రోగులను ఎలా పడుకో బెడతారో అర్థంకావడం లేదు. 50 పడకలున్న చిన్న పిల్లల వార్డులో 200 మంది చేరారు. వారిని ఇక్కడ చేర్చుకోకుండా వైద్యులు బయటకు పంపలేరు కదా! ప్రభుత్వం ప్రతిదానికీ వైద్యులపై పడే బదులు.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఏ సమస్యా ఉండద’ని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సోమవారం స్థానిక ఆస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్సీ.. చిన్న పిల్లల వార్డును తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను వైద్యులు ఏకరువు పెట్టడంతో ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు నేరుగా ఆస్పత్రి ముఖద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు. రాత్రి వర్షంలోనే దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా మొత్తానికి ఏకైక దిక్కయిన సర్వజనాస్పత్రిని ఇంతటి దారుణస్థితిలో ఉంచుతుందా అని ప్రశ్నించారు. పాతికేళ్లకు పైగా సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అనేకమార్లు వచ్చివెళుతున్నా సర్వజనాస్పత్రి సమస్యలు మాత్రం తీర్చడం లేదన్నారు. అనంతపురం బోధనాస్పత్రిలో పడకల పెంపు, 510 ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 124 జీవోను తక్షణం అమలు చేయాలని ఇప్పటికే చాలాసార్లు మంత్రులను కలిసి విన్నవించామన్నారు. అయితే ఎవరూ స్పందించడం లేదన్నారు. విష జ్వరాలతో చిన్న పిల్లలు చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే దాకా నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్షకు వైఎస్సార్సీపీ నేత చవ్వా రాజశేఖరరెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, రచయితలు, మేధావులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు అంజి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేడు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల అనంతపురం సెంట్రల్ : ఈ నెల 25లోగా గొల్లపల్లి రిజర్వాయర్ వరకూ నీటిని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో మంత్రి సునీత కూడా నీటి విడుదలపై ప్రకటన చేశారు.lసీఎం మాట నెగ్గించుకునేందుకు హడావుడిగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా ఫేజ్–2 కాలువకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ జలంధర్ తెలిపారు. ప్రస్తుతం 90 కిలోమీటరు వరకు నీటిని తీసుకుపోతామన్నారు. నెల, రెండు నెలల తర్వాత పనులు పూరై్తతే గొల్లపల్లి రిజర్వాయర్ వరకూ నీటిని తీసుకుపోతామన్నారు. ఓ వైపు హెచ్చెల్సీ సాగులో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు రెండేళ్లుగా పంటల సాగుకు నోచుకోక ఆయకట్టు బీడుగగా మారింది. రూ. కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం జలాశయం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. ఒక్కో టీఎంసీ తీసుకురావడానికి రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత విలువైన జలాలను కాలువల్లో పారించడం కోసమేనా ? అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుంది. కనీసం తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆర్బాటం కోసం మాత్రమే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి చెరువులకు నీరు విడుదల అనంతపురం సెంట్రల్ : మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ కింద ఉన్న చెరువులకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ కెనాల్ కింద దాదాపు 23 చెరువులు ఉన్నాయన్నారు. హంద్రీనీవా నుంచి వచ్చే నీటిని బట్టి హెచ్చెల్సీ సౌత్, నార్త్ ఇతర కాలువ కింద ఆయకట్టుకు నీరు వదలాల వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని వివరించారు. -
‘మహా ప్రభో..మా గోడు వినండి’
- నిరవధిక సమ్మెలో ఏజీ వర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగులు - రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏల ఊసెత్తని ప్రభుత్వం - డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ సాక్షి ప్రతినిధి, తిరుపతి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాల్లో పనిచేసే టైమ్‌స్కేల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన నెల రోజులుగా వీరు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామన్న వర్సిటీ అధికారులు మళ్లీ ఉద్యోగుల ముఖం చూసింది లేదు. దీంతో టైమ్‌స్కేల్ ఉద్యోగులంతా డిమాండ్ల సాధన కోసం రోజుకో పద్దతిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 900 మంది టైమ్‌స్కేల్ ఉద్యోగులున్నారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగాల్లో నియమితులైన వారే. అప్పట్లో మొత్తం 1650 మంది ఉద్యోగాల్లో చేరగా, 2014 నాటికి 900 మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వం వీరికి మూలవేతనం, డీఏలను మాత్రమే చెల్లిస్తోంది. ఇవి రెండూ కలిపి ఒక్కొక్కరికీ నెలకు రూ. 14 వేల వరకూ అందుతున్నాయి. వీరి నియామకాల సమయంలో హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సులపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెంబరు 119 కింద వీరి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా వీరి సమస్యలపై స్పందించనే లేదు. ఇప్పటికి పలు మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు, వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణలను కలిసిన టైమ్‌స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. వారి నుంచి సరైన స్పందన కరువవడంతో గుంటూరులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గుంటూరు,తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, కర్నూలుల్లో వర్సిటీ పరిధిలోని టైమ్‌స్కేల్ ఉద్యోగులు రోజుకో విధంగా నిరసనలు, ఆందోళనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ మురళీ కోరుతున్నారు. -
'చంద్రబాబు నాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు'
కాకినాడ : దీక్ష సమయంలో తనను దారుణంగా హింసించారని కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్ చూపించిందని తెలిపారు. దీక్ష సమయంలో తన భార్య, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని విమర్శించారు. తన చిన్న కుమారుడుని కొట్టుకుంటూ లాక్కెళ్లారని చెప్పారు. పెద్ద కుమారుడుకి ఇటీవలే వెన్నుముక ఆపరేషన్ జరిగిందని... అతడిని కూడా లాక్కెళ్లాలని చూస్తే... ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడని ముద్రగడ తెలిపారు. తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబు సర్కారే కారణమన్నారు. కాపులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర చేసి కేసుల్లో ఇరికించారని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు చేయమంటున్నామని ముద్రగడ స్పష్టం చేశారు. తుని ఘటనపై లోతుగా పరిశీలిస్తామని చెప్పి... మాట తప్పారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. తుని ఘటనపై సీబీఐ విచారణకు పట్టుబట్టొద్దని ప్రభుత్వ పెద్దలే తనని కోరారని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తు చేశారు. తుని ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా... తనతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. తమ ఉద్యమానికి బీసీలు, దళితుల మద్దతు కూడా ఉందని ముద్రగడ తెలిపారు. బీసీలకు నష్టం జరగకుండానే రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తాను మంజునాథ కమిషన్‌పై ఆశావాహ దృక్పథంతోనే ఉన్నానని చెప్పారు. జులై చివరికల్లా సర్వే పూర్తి చేస్తారని భావిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణను జేఏసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తమ జాతికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. -
జూలై 11 నుంచి రైల్వే నిరవధిక సమ్మె నోటీసు
రైల్ నిలయం వద్ద నేడు బహిరంగ సభ హైదరాబాద్: ఏడో వేతన సంఘం సిఫార్సులు రైల్వే కార్మికులకు తీవ్ర నిరాశను కలిగించాయని..ఈ సిఫార్సులకు నిరసనగా జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు రైల్వే సంఘాలు పిలుపునిచ్చినట్లు రైల్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్ మాల్గి తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మజ్దూర్ యూనియన్ సభ్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తూ రైల్వేలోని రెండు గుర్తింపు సంఘాలు నోటీసులు జారీచేశాయన్నారు. రైల్వే ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సాధించుకొనేందుకు ఈ సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. సమ్మె విజయవంతం చేయడానికి సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని అన్ని సంఘాల నాయకులను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గీరం రాంప్రభు, హరిబాబు, పి. మోహన్, ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
త్వరలో దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్
అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రకటన సాక్షి, హైదరాబాద్: మందుల దుకాణాదారులకు నష్టం కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా త్వరలో దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్ చేపడతామని అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రకటించింది. సంఘం అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరుగనుంది. సమావేశం ఎజెండాను సంఘం అధ్యక్షుడు జేఎస్ షిండే, ప్రధాన కార్యదర్శి సురేష్‌గుప్తా, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపతి శనివారం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. బంద్ తేదీని సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేయాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. కేంద్రం 344 అత్యవసర మందులను నిషేధించిందని, అయినా కొందరు స్టే తెచ్చుకొని వాటిని విక్రయిస్తున్నారన్నారు. ఆన్లైన్లో విక్రయాల వల్ల యువత నిద్ర మాత్రలు, మత్తు కలిగించే ఇతరత్రా మందులను కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా నష్టపోతారన్నారు. అందుకే ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలన్నారు. లెసైన్స్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. -
జూలై 11 నుంచి రైళ్లుండవ్..!
న్యూఢిల్లీ : వచ్చే నెల 11 నుంచి పట్టాలపై రైళ్లకు బ్రేక్ పడనున్నాయి. జూలై 11 నుంచి రైల్వేల నిరవధిక సమ్మెకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) పిలుపునిచ్చింది. కొత్త పెన్షన్ స్కీమ్ పై రివ్యూ , ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వంటి పలు డిమాండ్ లతో రైల్వే యూనియన్లు ఈ నిరవధిక బంద్ చేపట్టనున్నాయి. రైల్వే యూనియన్లు గురువారం బంద్ నోటీసును ప్రభుత్వానికి అందజేశాయి. అన్ని జోనల్ రైల్వేస్ జీఎంలకు, ప్రొడక్షన్ యూనిట్లకు నేడు నిరవధిక సమ్మె నోటీసులు అందనున్నాయి. ఈ నోటీసు ప్రకారం జూలై 11 ఉదయం 6గంటలనుంచి 13లక్షల మంది రైల్వే వర్కర్లు సమ్మె పాటించనున్నారని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్(ఏఐఆర్ఎఫ్) జనరల్ సెక్రటరీ ఎస్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఏడవ వేతన సిఫారసు మేరకు కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కు పెంచాలని మిశ్రా డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం అంటే 2015 డిసెంబర్ లో తమ డిమాండ్లను తెలుపుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ పంపామని, అయితే ప్రభుత్వం స్పందించిన తీరు చాలా నిర్లక్ష్యంగా, నిరాశకంగా ఉందని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎమ్.రాఘవయ్య తెలిపారు. ఈ నిరవధిక సమ్మె కాలంలో ఎలాంటి రైల్వేలు పట్టాలపై నడవబోవని ఎన్ఎఫ్ఐఆర్ తెలిపింది. ఎన్ఎఫ్ఆర్ఐ, ఏఐఆర్ఎఫ్ రెండు యూనియన్లు ఈ నిరవధిక సమ్మెకు సంయుక్తంగా మద్దతు తెలుపుతున్నాయని, ఈ రెండు యూనియన్ల డిమాండ్లు ఒకటేనని రాఘవయ్య చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
నేటి నుంచి టి.విద్యుత్ ఉద్యోగుల ఆమరణదీక్ష
సాక్షి, హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నుంచి విద్యుత్‌సౌధలో ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. జేఏసీ నేతలు ఎం.అమర్ సింగ్, షేక్ జహురుల్లా, హరికిషణ్, ఎన్.బాలకృష్ణ, జి.రమేశ్ ఆమరణ దీక్షలో పాల్గొంటారని వెల్లడించింది. -
దీక్ష విరమించిన చలసాని
అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చేపట్టిన దీక్ష బుధవారం విరమించారు. ప్రత్యేక హోదా కోసం ఆదివారం నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర అనారోగ్యం పాలైతే... పోలీసులు ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా ఆయన ప్రత్యేక హోదా కోసం దీక్షను విరమించలేదు. బుధవారం ఆస్పత్రికి చేరుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిమ్మరసం ఇచ్చి చలసాని శ్రీనివాస్ చేపట్టిన దీక్షను విరమింపజేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ మేరకే తాను చేపట్టిన దీక్ష విరమిస్తున్నట్లు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. -
సమర స్ఫూర్తి
రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యం అమర్నాథ్ నిరవధిక దీక్ష {పారంభం పార్టీలు, ప్రజా సంఘాల సంఘీభావం భారీ ర్యాలీలో హోరెత్తిన జోన్ నినాదాలు పాలకుల నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహ జ్వాలలు ఫోన్ చేసి భరోసా ఇచ్చిన వై.ఎస్.జగన్ భానుడి భగభగలను తలదన్నేలా ఉద్యమస్ఫూర్తి రగిలింది.. రైల్వే జోన్ కోసం నేను సైతం.. అంటూ నినదించింది. ఉక్కు సంకల్పం.. సమర దీక్షగా మారింది. పోరాడితే పోయేదేం లేదు.. రైల్వే జోన్ సాధించడం తప్ప.. అన్నట్లు వేల గొంతుకలు ఒక్కటై జోన్ దీక్షకు జై కొట్టాయి. పదం పదం కలిపి ర్యాలీగా అడుగులు కదిపి దీక్షాస్థలికి చేరుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాల దీప్తి.. దివంగత మహానేత వైఎస్ పోరాట స్ఫూర్తి.. సీఎస్ రావులాంటి పెద్దల ఆశీస్సులు తోడుండగా అమర్నాథ్ నిరవధిక దీక్షకు అంకురార్పణ జరిగింది. రాజకీయాలకతీతంగా సంఘీభావం కొండంత అండగా నిలిచింది. విశాఖపట్నం మండుటెండ మంటపెడుతున్నా లెక్క చేయకుండా రైల్వే జోన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విశాఖకు రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం ప్రారంభించిన నిరవధిక దీక్షకు ఉత్తరాంధ్ర నుంచి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంటరాగా అమర్నాథ్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వేలాదిమందితో భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షా వేదికకు చేరుకున్నారు. రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు ఆశీర్వాదం తీసుకుని ఉదయం 11గంటలకు అమర్నాథ్ దీక్ష చేపట్టారు. సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమర్నాథ్కు ఫోన్ చేసి మరీ దీక్షకు పార్టీ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఈ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, వి.కళావతి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి తదితరులు కూడా హాజరై మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. నర్సింగరావు, లోక్‌సత్తా భీశెట్టి బాబ్జీలతోపాటు పలు ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక, జర్నలిస్టు సంఘాలు, ఎన్జీవోలు కూడా ఈ దీక్షకు పూర్తి సంఘీభావం తెలపడం విశేషం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ముప్పేట దాడి విశాఖ రైల్వేజోన్ ప్రకటించకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న టీడీపీ, బీజేపీలపై ఈ దీక్షలో వక్తలు విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి లోపానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంపై ఉన్న శ్రద్ధ సీఎం చంద్రబాబుకు రైల్వేజోన్ సాధన మీద లేదని మండిపడ్డారు. దీక్షకు సంఘీభావం ప్రకటించమని కోరినప్పటికీ టీడీపీ, బీజేపీలు ఎందుకు ముఖం చాటేశాయని పలువురు వక్తలు నిలదీశారు. గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, ఇతర వర్గాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, ఉమాశంకర్ గణేష్, రాష్ట్ర గిడ్డంగులు సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోకు, రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ మహిళా విభాగం ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, వాసు, బోని శివరామకృష్ణ, బదరీనాథ్, రాధ, తిప్పల వంశీ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు, పార్టీ నేతలు రొంగలి జగన్నాథం, అల్ఫా కృష్ణ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, నిర్మలా రెడ్డి, పరదేశీ, హేమంత్కుమార్లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, నగర కార్యదర్శి గంగారామ్, సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్, లోక్‌సత్తా భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియర్ జోనల్ అధ్యక్షుడు చలసాని గాంధీ, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వర్మ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. -
సమ్మె విరమించిన బంగారం వర్తకులు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని బంగారు వర్తకులు నిరవధిక సమ్మెను విరమించారు. బుధవారం నుంచి షాపులు తెరిచి వ్యాపారం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం వరకూ న్యూఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వ్యాపార సంఘ ప్రతినిధులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్‌లు ఢిల్లీ నుంచే ఫోన్ల ద్వారా సమాచారం పంపారు. బుధవారం నుంచి షాపులు తెరవాలని వివిధ జిల్లాల వ్యాపార సంఘ ప్రముఖులకు మెసేజ్‌లు పంపారు. కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుకు నిరసనగా రాష్ట్రంలోని బంగారు వ్యాపారులు మార్చి 29 నుంచి రెండో దశ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న విషయం విదితమే. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 వేల షాపులు మూతపడ్డాయి. రోజుకు రెండున్నర వేల కోట్ల వ్యాపారం నిలిచిపోయింది. కొన్ని పట్టణాల్లో కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు సమ్మెకు కలిసి రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. కొత్త రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మార్చి 29న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించినా వ్యాపారులు ఖాతరు చేయలేదు. ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి వచ్చే వ్యాపారులందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు చేసిన సూచననూ పట్టించుకోలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ ఆఖరుకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. మార్చి నెల ఒకటో తేదీ నుంచి వీటిని చేయించుకోవాల్సి ఉండగా, నెల రోజులు గడిచినా 20 శాతం రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాలేదు. మంగళవారం ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆందోళన చెందిన రాష్ట్రానికి చెందిన వ్యాపార సంఘం ప్రతినిధులు గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
సమరమే..
రైల్వే జోన్ కోసం ఆందోళన ఉధృతం నేడు వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం 14 నుంచి నిరవధిక దీక్షకు ‘గుడివాడ’ సిద్ధం విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అ తిపెద్ద్ద డివిజన్ వాల్తే రు. రైల్వే జోన్ మొత్తమ్మీద వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఈ డివిజన్ నుంచే వస్తోంది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా ద్వారా వాల్తేరు డివిజన్‌కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. ఒక్క సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షలు తెస్తోంది. అయినా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యమే చూపుతోంది. ఏళ్ల తరబడి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వాల్తేరు జోన్ ఏర్పాటు అంశాన్ని పేర్కొనడంతో 2015, 2016 రైల్వే బడ్జెట్లలో ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదు. వాల్తేరు డివిజన్ రైల్వేకి ఆదాయాన్ని తెచ్చే బంగారు బాతుగుడ్డులా మారడంతో దీనిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎంపీలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీలు చిక్కినప్పుడలా జోన్ ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తోందంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు నానా హడావుడీ చేసేస్తున్నారు. చివరికి మొండి చేయే చూపిస్తున్నారు. విశాఖపట్నం డివిజన్‌ను ప్రత్యేక జోన్ చేయడానికి అర్హతలు లేవా? అంటే మిగతా జోన్లకంటే ఎక్కువ అవకాశాలు, అర్హతలు దీనికే ఉన్నాయి. కానీ విశాఖకంటే తక్కువ వనరులు, డివిజన్లున్న ఇతర రాష్ట్రాల్లో రైల్వే జోన్లు ఏర్పాటు చేసేశారు. పైగా ఏ కమిటీలు వేయకుండానే ఆయా రాష్ట్రాల్లో జోన్లు ఏర్పాటవగా, విశాఖ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, బిలాస్పూర్ డివిజన్లున్నాయి. కానీ అక్కడ బిలాస్పూర్ డివిజన్ ఇచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లుండగా హైదరాబాద్ జోన్ ఏర్పాటు చేశారు. కర్నాటకలో హుబ్లి, మైసూర్, బెంగళూరు డివిజన్లతో హుబ్లి జోన్ ఇచ్చారు. ఒడిశాలో సంబల్పూర్, ఖుర్దా డివిజన్లకు భువనేశ్వర్‌లో జోన్ ఏర్పాటు చేశారు. కానీ విశాఖకు విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో కలిపి నాలుగు డివిజన్లున్నా జోన్‌కు నోచుకోవడం లేదు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు 12 వేల కోట్లు. ఇందులో సగానికి పైగా అంటే రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12-14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోర్టు ట్రస్టు, మరొక ప్రయివేటు పోర్టు, అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి ఇక్కడే ఉన్నాయి. ఇన్ని ఉన్నా లేనివల్లా అధికార పార్టీ నేతల్లో చిత్తశుద్ధి.. ఉద్యమస్ఫూర్తి. అర్ధ శతాబ్దం నుంచి... విశాఖపట్నానికి జోన్ ఏర్పాటు డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం తొలిసారిగా పార్లమెంటులో జోన్ డిమాండ్‌ను లేవనెత్తారు. అప్పట్నుంచి జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా అవేమీ కేంద్రం చెవికెక్కడం లేదు. యూపీఏ ప్రభుత్వం 2013 మార్చిలో విశాఖకు రైల్వే జోన్‌పై ఓ కమిటీ వేసింది. ఆ నివేదికపై అతీగతీ లేదు. 2003కి ముందు దేశంలో 9 జోన్లుండేవి. అవి కాలక్రమంలో 17 జోన్లకు పెరిగాయి. కానీ వాటికేమీ కమిటీలు వేయలేదు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో అవి ఏర్పడిపోయాయి. కానీ విశాఖకు జోన్ విషయానికి వచ్చేసరికి ఏటేటా ఏవేవో పితలాటకాలతో వాయిదా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 3, ముంబైలో రెండు జోన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జోన్ కూడా లేదు. అయినా విశాఖకు జోన్ ఇవ్వడం లేదు. జోన్‌తో ప్రయోజనాలివీ.. విశాఖకు జోన్ వస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులూ మంజూరవుతాయి.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) సెంటరు ఏర్పాటవుతుంది. దీనిద్వారా ‘సి’ తరగతి ఉద్యోగాల నియామకాలకు వీలుంటుంది.రైల్వే రిక్రూట్మెంట్ సెంటరు కూడా వస్తుంది. దీంతో నాలుగు తరగతి (సి) నియామకాలు జరుపుకోవచ్చు.జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటవుతుంది. దీంతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్తగా రెండు, మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరుగుతుంది.డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను వేసుకోవచ్చు. దీంతో కొత్త రైళ్ల కోసం బోర్డుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.లోకల్ ట్రైన్లకు కూడా నడుపుకోవచ్చు. విశాఖలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెరుగుతుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పెరుగుతాయి. జోనల్ హాస్పిటల్ ఏర్పాటవుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, అంతకు మించి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. -
34వ రోజుకు జువెలర్స్ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా జువెలర్స్ చేస్తోన్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి 34వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు జువెలరీ అసోసియేషన్స్ సోమవారం కూడా పలు చోట్ల ధర్నాల రూపంలో నిరసనను తెలియజేశాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ తెలిపారు. -
తొమ్మిదో రోజుకు చేరినజువెలర్స్ సమ్మె
పరిశ్రమకు రూ.60వేల కోట్లకు పైగా నష్టం! ముంబై: జువెలర్స్ నిరవధిక సమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో ఇప్పటిదాకా జువెలరీ పరిశ్రమకు రూ.60,000 కోట్లకు పైగా ఆదాయపు నష్టం వచ్చింటుందని అంచనా. తాజా బడ్జెట్లోని ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని జువెలరీ ట్రేడ్ సహా ఇతర అనుబంధ వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 358 అసోసియేషన్స్‌కు చెందిన రిటైలర్లు, హోల్‌సెల్లర్స్, ఆభరణాల తయారీదారులు ఈ నెల 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు పాన్ నిబంధన తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వ చర్యనూ వ్యతిరేకిస్తున్నారు. జెమ్స్ అండ్ జువెలరీ రంగపు రోజూవారీ ఆదాయం రూ.7,000 కోట్లు గా ఉంటుందని, ఈ ప్రతిపాదికన ఇప్పటిదాకా రూ.60,000 కోట్లకుపైగా నష్టం వచ్చింటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ శ్రీధర్ తెలిపారు. -
బంగారు వర్తకుల నిరవధిక సమ్మె
ముంబై: బంగారం వ్యాపారులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. 2016 ఆర్థిక బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై అమ్మకం పన్ను విధించడానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. బంగారు ఆభరణాలపై నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ అమ్మకపు పన్ను విధించడాన్ని వర్తక సంఘం వ్యతిరేకించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగార వినియెగాదారుగా ఉన్న ఇండియాపై దీని ప్రభావం మరింతగా పడనుందని వాదిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు బాగా పెరగడంతో గత రెండు మూడు నెలలుగా డిమాండ్ బాగా తగ్గిందన్నారు. కొనుగోళ్లు పడిపోవడంతో నష్టాలను చవి చూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అమ్మకంపన్ను విధించడంతో తమపై మరింత ప్రభావం పడుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతదేశం బులియన్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి కేతన్ ష్రాఫ్ విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2016 లో బంగారం, వజ్రాల ఆభరణాల 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. -
'ఆమరణ దీక్ష విషయంలో ఎలాంటి మార్పు లేదు'
కాకినాడ: తన చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష విషయంలో ఎలాంటి మార్పు లేదని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమా, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భేటీ ముగిసింది. అనంతరం ముద్రగడ విలేకర్లతో మాట్లాడారు. రేపు ఉదయం 9.00 గంటలకు దీక్షకు కూర్చుంటున్నట్లు ఆయన తెలిపారు. నా ఆమరణ దీక్షకు అడ్డుతగలొద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుని ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనలో అమాయకులపై మాత్రం తప్పుడు కేసులు పెట్టొద్దని ప్రభుత్వాన్ని ముద్రగడ కోరారు. -
'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం'
హైదరాబాద్: హెచ్‌సీయూలో నిరవధిక దీక్ష చేపట్టిన విద్యార్థులను తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్ ను ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు. రోహిత్ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా డిమాండ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు విద్యా వ్యవస్థకే ప్రమాదకరంగా మారిందని వారు ఆరోపించారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డి, సి. రామచంద్రయ్య, శైలజానాథ్ తదితరులు ఉన్నారు. కాగా రోహిత్ కుటుంబానికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు ప్రకటించారు. -
హెచ్‌సీయూలో నాలుగోరోజుకు చేరిన విద్యార్థుల దీక్ష
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కి న్యాయం జరగాలంటూ హెచ్‌సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ హెచ్సీయూకు రానున్నారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు వారు సంఘీభావం తెలపనున్నారు. -
సుభద్రాపురంలో 'ప్రత్యేక' దీక్షలు
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారభించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టారు. దీక్షా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఇన్ ఛార్జ్ గొర్లె కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ కు మద్దతుగా గోరంట్లలో
అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకరనారాయణ తదితర నేతలు పాల్గొన్నారు. -
పెట్రో దడ
గురువారం నుంచి ‘పెట్రో’ నిరవధిక సమ్మె నేపథ్యంలో బుధవారం వాహనదారులకు దడ పట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా బంక్‌ల వద్ద వినియోగదారులు కిక్కిరిసిపోయారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకున్నారు. కొన్నిచోట్ల వాహనదారుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె వంటి నగరాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద ద్విచక్ర వాహనదారులు వందల సంఖ్యలో గుమిగూడారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నెలకొంది. -
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
-
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: నలభై నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఎట్టకేలకు తమ ఆందోళనను విరమించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల, పారిశుధ్య కార్మికుల సంఘం నేతలు, సమ్మెకు మద్దతిస్తున్న వివిధ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల ప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ఈనెల 17నుంచి ప్రారంభం కానున్నందున సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. చర్చల్లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రనాయక్, తెలంగాణ పంచాయతీ ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు కోటిలింగం, ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ, ఐఫ్టీయూ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కమిటీని నియమించాం: కేటీఆర్ ‘అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే. కనీస వేతనం పెంపు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు తదితర డిమాండ్ల పరిష్కారం గురించి అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో పంచాయతీరాజ్, ఆర్థిక, న్యాయ శాఖల అధికారులతో కమిటీని వేశాం. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించాం. కమిటీ నివేదిక అందగానే ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడతాం. పంచాయతీల ఆదాయం నుంచి ఉద్యోగుల వేతనాలను భరించేందుకు ప్రస్తుతం ఉన్న 30శాతం పరిమితిని 50 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నాం. గ్రామాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఉద్దేశంతో చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పారిశుధ్య కార్మికులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. విరమణ తాత్కాలికమే..: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 వేలమంది పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ పంచాయతీ ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు చెప్పారు. మంత్రి హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని, శుక్రవారం నుంచి విధుల్లో చేరతామని చెప్పారు. సమ్మె కాలానికి కూడా వేతనం చెల్లిస్తామన్నారని, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
స్తంభించనున్న సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా స్తంభించనుంది! తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మె చేపట్టనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. లారీల బంద్ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సాధారణ ప్రజలు సతమతమవుతుండగా లారీల సమ్మె వల్ల వాటి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్ను విధానానికి వ్యతిరేకంగా లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడం సహా పెండింగ్‌లో ఉన్న 17 డిమాండ్లను పరిష్కరించాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం, రవాణాశాఖ మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలసి విన్నవించుకున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు అందలేదని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలో సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. టాటా ఏస్‌లు, గూడ్స్ ఆటోలు మినహా ఇతర సరుకు రవాణా వాహనాలు బంద్‌లో పాల్గొంటాయన్నారు. అత్యవసర వస్తువులు రవాణా చేసే వాహనాలు, నీటి ట్యాంకర్లను సమ్మె నుంచి మినహాయించారు. డిమాండ్లు ఇవీ... ⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా పన్నుకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంచెల్లుబాటయ్యేలా తాము చెల్లించిన త్రైమాసిక పన్ను నుంచి ఏపీలోని 13 జిల్లాలకు పన్ను తగ్గించాలి. ⇒ ఇరు రాష్ట్రాల్లో తిరిగేందుకు అనుమతినిస్తూ ఏటా రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను తీసుకొని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలి. ⇒ 15 ఏళ్లు నిండిన కాలం చెల్లిన సరుకు రవాణా లారీలపై నిషేధం విధించే అంశంపై సంప్రదింపులు జరపాలి. ⇒ లారీ యజమానుల నుంచి హమాలీ, గుమాస్తా మామూళ్ల వసూలును నిలిపేయాలి. ⇒ సరుకు లోడింగ్, అన్లోడింగ్ సమయంలో రక్షణ కల్పించాలి.టట్రక్ ఓనర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్) నూతన కమిటీని ఏర్పాటు చేయాలి.టజిల్లా, తాలూకా కేంద్రాల్లో ట్రక్ టర్మినల్స్, ట్రక్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె వాయిదా.. ఏపీలో డీజిల్, పెట్రోలుపై పెంచిన వ్యాట్ రద్దు చేయడంతోపాటు మరో 10 డిమాండ్లు నెరవేర్చాలని పెట్రోల్ బంకులు, లారీల యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం రాత్రి వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఏపీ పెట్రోలియం ట్రేడర్స్ ఫెడరేషన్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, ఏపీ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్ల అసోసియేషన్ ఐక్య కార్యాచరణ సమితితో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జూలై 8లోగా సమస్యల్ని పరిష్కరించడంతోపాటు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీనివ్వడంతో సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. జూలై 8లోగా సమస్యలు పరిష్కరించకపోతే 9 నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ఈశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
రెండు వేలమంది వైద్యుల సమ్మె
న్యూఢిల్లీ: తమ కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నుంచి నిరవధిక ఆందోళనలకు దిగుతున్నట్టు వారు ప్రకటించారు. పని ప్రదేశాల్లో భద్రత, కనీస మౌలిక అవసరాలు, సమయానికి జీతభత్యాల చెల్లింపు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారు పోరాటానికి దిగారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 ఆసుపత్రులకు చెందిన ప్రభుత్వ వైద్యులు సుమారు 2000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సఫ్దర్ జంగ్, మౌలానా అజాద్, రామ్ మనోహర్ లోహియా తదితర ఆసుపత్రులలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో మాత్రమే రోగులకు సేవలందిస్తున్నారు. -
నవంబర్ 23 నుంచి రైల్వేలలో నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: రైల్వేలలో సంస్కరణల పేరిట డాక్టర్ బిబేక్దేబ్ రాయ్ ప్రతిపాదిస్తున్న నివేదికను వ్యతిరేకిస్తూ నవంబర్ 23 నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్, దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. రైల్వేలలో విదేశీ పెట్టుబడులను అమలు చేయబోమని ప్రధాని మోదీ వారణాసి సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కోరారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రైల్వేలను నిర్వీర్యం చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రెండున్నర కోట్ల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న భారత రైల్వేలు 11 వందల మిలియన్ టన్నుల సరుకు రవాణాతో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచాయన్నారు. ఈ తరుణంలో వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే యత్నించడం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలనుకోవడం దారుణమన్నారు. రైల్వేశాఖకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని,దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను,దక్షిణమధ్య రైల్వేలో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూస్, సంయుక్త కార్యదర్శి కె.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెలో 70 వేల మంది హోంగార్డులు
పాట్నా: వేతనం పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ బీహార్ రాష్ట్ర వ్యప్తంగా 70 వేల మంది హోమ్ గార్డులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అరకొరగా ఇస్తోన్న జీతాలు పెంచాలని, సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్లతో సమ్మెచేస్తోన్ననట్లు హోమ్ గార్డ్స్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ఠాకూర్ మీడియాకు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించామని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మే 20 నుంచి సమ్మెను ఉదృతం చేస్తామని, జైల్ భరో ఆందోళనను నిర్వహిస్తామని హెచ్చరించారు. హోమ్ గార్డుల సమ్మెతో బీహార్ లో శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. -
ఆర్టీసీ కార్మికులపై ‘లాఠీ’ ప్రతాపం
హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్రుతంగా సాగింది. కొన్ని చోట్ల పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తంగా మారింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పురుషులు, మహిళలనే విచక్షణ లేకుండా తరిమి తరిమి చితకబాదారు. దీంతో యూనియన్ నేతలతో కలసి కార్మికులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. మరోపక్క లాఠీచార్జ్ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనేలా చేసింది. పలు జిల్లాల్లో బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. సమ్మెకు మద్దతు పలుకుతున్న ప్రజాసంఘాల నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలోనూ పోలీసులు రెచ్చిపోయారు. ఆర్టీసీ కార్మికులను విచ్చలవిడిగా అరెస్ట్ చేశారు. ఫలితంగా రోడ్డు రవాణా సమ్మె.. రాష్ట్రంలో పతాకస్థాయికి చేరింది. మరోపక్క, తాత్కాలిక ప్రాతిపదికన విశాఖపట్నం డిపోలో నియమితుడైన ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. నేడు వంటా వార్పూ..: శనివారం ఏపీ వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ఆవరణల్లోనూ ‘వంటా వార్పూ’ చేపట్టాలని యూని యన్ నే తలు పిలుపునిచ్చారు. కార్మికులపై పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా ఈయూ నేత కె.పద్మాకర్ ఆర్టీసీ డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు. -
మా సమ్మె న్యాయబద్ధమైందే : కార్మికులు
-
15 అర్ధరాత్రి నుంచి కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు ఎన్నాళ్ల నుంచో డిమాండు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18 వేల నుంచి 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నా, తమకు ఉద్యోగ భద్రత మాత్రం లేదని వారు వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేసింది. -
టాక్సీల మెరుపు సమ్మె.. ప్రయాణికులకు కష్టాలు
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో టాక్సీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. చార్జీలు పెంచడంతో పాటు పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని యూనియన్లు పిలుపునివ్వడంతో టాక్సీలన్నీ ఒక్కసారిగా రోడ్లెక్కడం మానేశాయి. ఆగస్టు నుంచి ఇప్పటికి టాక్సీ యూనియన్లు సమ్మెచేయడం ఇది ఎనిమిదోసారి. అసలే టాక్సీలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే, దానికి తోడుగా ఎనిమిది కార్మిక సంఘాలకు చెందిన రవాణా కార్మికులు శుక్రవారం నాడు కోల్‌కతాలో మొత్తం రవాణా సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. టాక్సీలకు మద్దతుగా వాళ్లీ సమ్మె చేస్తున్నారు. టాక్సీలు లేకపోవడంతో ఆటోలు, సైకిల్ రిక్షా స్టాండుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఇక బస్సుల్లోనైతే జనం వేలాడుతూ వెళ్లారు. ఇదే అదనుగా ప్రయాణికుల వద్ద చిన్న చిన్న దూరాలకు కూడా భారీ మొత్తాలు వసూలు చేశారు. ఒకవైపు ఈ దోపిడీ, మరోవైపు ఉక్కపోత కారణంగా చాలామంది ఏసీ బస్సులవైపు మొగ్గుచూపారు. 2012 తర్వాత టాక్సీ మీటర్ ధరలు పెంచలేదని, పెట్రోధరలు మాత్రం అప్పటినుంచి 13 సార్లు పెరిగాయని టాక్సీ యూనియన్ ప్రతినిధులు అంటున్నారు. -
నేటి నుంచి సమ్మె
సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లాలోని శివకాశి బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి నుంచి ఒకప్పుడు దేశ వ్యాప్తంగా బాణసంచా సరఫరా అయ్యేది. పెద్ద పెద్ద పరిశ్రమలతో పాటుగా కుటీర పరిశ్రమల తరహాలో ఇళ్లలోనూ బాణసంచా తయారీ ఇక్కడ సాగుతుందేడి. ప్రతి ఏటా పెరుగుతున్న ప్రమాదాలతో అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించింది. దీంతో కుటీర పరిశ్రమల సంఖ్య తగ్గింది. భారీ పరిశ్రమల్లో ఆధునిక యుగానికి తగ్గట్టుగా బాణసంచా తయారీ సాగుతోది. శివకాశి పరిసరాల్లోని వందలాది గ్రామాల్లోని ప్రజలు ఈ పరిశ్రమలను నమ్ముకుని జీవిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంగా అధికారుల ఆంక్షల కొరడా యాజమాన్యాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి తగ్గడం, బాణసంచా తయారీ ముడి సరకుల ధర పెరగడం వెరసి యాజమాన్యాలను కన్నీటి మడుగులో ముంచుతున్నాయి. దీనికి తోడు గత కొంత కాలంగా చైనా నుంచి బాణసంచా భారీగా దిగుమతి అవుతుండడం యాజమాన్యాలను మరింత ఆవేదనకు గురి చేసింది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలను పన్నుల రూపంలో తాము చెల్లిస్తుంటే, చైనా బాణసంచా మార్కెట్లో హల్చల్ సృష్టిస్తుండటాన్ని యాజమాన్యాలు తీవ్రంగా పరిగణించారుు. సముద్ర మార్గం గుండా తమిళనాడులోకి బాణసంచా చొరబడుతున్నట్టు, దక్షిణాది రాష్ట్రాల్లో చైనా బాణసంచా విక్రయాలు పెరుగుతున్నట్టు గుర్తించిన యూజమాన్యాలు ఆందోళనకు పూనుకున్నారుు. ఆక్రోశం: తమ మీద ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న అధికారులు, చైనా బాణా సంచా విక్రయాన్ని చూసీ చూడనట్టుగా ఉండటం ఏమిటని ఉత్పత్తిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ సమ్మె బాటకు సిద్ధం అయ్యారు. శనివారం శివకాశిలోని సుమారు 500 పరిశ్రమల యాజమాన్యాలు, లారీ ట్రాన్స్పోర్ట్ సంఘాలు సమావేశం అయ్యాయి. తమ మీద ఆంక్షల్ని ఝుళిపిస్తున్న ప్రభుత్వం, చైనా బాణసంచా మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నను లేవ దీశారుు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ , చైనా బాణసంచా అక్రమ రవాణా అడ్డుకట్ట లక్ష్యంగా సమ్మె బాట పట్టేందుకు నిర్ణయించారు. ఆదివారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు. యాజమాన్యాలు సమ్మె బాటకు నిర్ణయించడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. సుమారు 2 లక్షల మంది కార్మికులు ఇక్కడి బాణసంచా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పీస్ రేట్ల రూపంలో, రోజు వారీ, వారాంతపు వేతనాల రూపంలో పనిచేస్తున్న ఈ కార్మికుల్లో సమ్మె భయం వణికిస్తున్నది. ఉత్పత్తి ఆగిన పక్షంలో తాము కడపులు మాడ్చుకోవాల్సి ఉంటుందన్న ఆవేదనను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, తమ యాజమాన్యాల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
చిన్నారులకు పౌష్టికాహారమేదీ?
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందజేసేవారు కరువయ్యారు. పదిహేను రోజులుగా సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహరానికి దూరమవుతున్నారు. జిల్లాలో 13 సమగ్ర సేవ, శిశు సంరక్షణ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 2,524 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాల లోపు 50,000 మంది చిన్నారులకు రోజూ, అలాగే గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. మాతా శిశుమరణాలను తగ్గించి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణులు, బాలింతల కోసం ఉద్దేశించిన పౌష్టికాహారం పథకం సిబ్బంది సమ్మె కారణంగా నిల్చిపోయింది. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు... గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గత నెల 17నుంచి అంగన్వాడీలు సమ్మెకు దిగారు. పన్నెండు రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ఆందోళన బాటపట్టారు. గర్భిణులకు, బాలిం తలకు కూడా ఆరు నెలల వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారానే పౌష్టికాహారం అందజేయాలి. రోజూ మధ్యాహ్నం వారికి అన్నం, పప్పు, ఆకుకూరలతో భోజనంతో పాటు గుడ్డు, పాలు అందించాలి. కాగా, ప్రస్తుతం నెలకు ఒకమారు వారికి పౌష్టికాహార పదార్థాలను ఇంటిదగ్గర వండుకోవడానికి అందజేస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి పదార్థాలను అందజేసినా నిరవధిక సమ్మె కొనసాగుతున్నందున మార్చి మాసానికి పౌష్టికాహారం అందే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రత్నామ్నాయమేది... పదిహేను రోజులుగా అంగన్వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేపట్టడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడి చిన్నారులకు పౌష్టిక భోజనం అందడం లేదు. సమ్మె చేపడతామని నెల రోజుల ముందుగా సిబ్బంది నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించ లేదు. రోజూ అంగన్వాడీకేంద్రాలకు వస్తున్న నిరుపేదల పిల్లలు, మహిళలు తాళాలను చూసి ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సడలని పట్టు
రాయవరం, న్యూస్‌లైన్ :సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం కరుణించలేదు. పనికి తగిన వేతనం ఇవ్వాలంటూ అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేపట్టినా.. సర్కారు మెట్టు దిగలేదు. అంగ న్వాడీ కార్యకర్తలు, ఆయాలు పట్టు వీడకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు మూతపడడంతో కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్ఠికాహారం అందడం లేదు. ఎనిమిది రోజులుగా మూత అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఈ నెల 17 నుంచి సమ్మె చేపట్టారు. సమ్మెకు ముందు ఈ నెల మూడో తేదీన సామూహిక సెలవులు పెట్టి నిరసన తెలిపారు. 10న మండల పరిషత్ కా ర్యాలయాలను ముట్టడించారు. 11న ప్రాజెక్టు కార్యాలయాలను, 17, 18 తేదీల్లో మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఈ నెల 23న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. కనీస వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు. డిమాండ్లు ఇవే.. జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,830 అంగన్వాడీ కేంద్రాలు, 270 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టడంతో అవి మూతపడ్డాయి. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలను రూ.10 వేలు చేయాలని, ఐసీడీఎస్‌లో ఐకేపీ జోక్యాన్ని తగ్గించాలని, ప్రాజెక్టులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛను సౌకర్యం కల్పించాలనే తదితర డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. తొలుత 17 నుంచి 22 వరకు సమ్మె చేయాలని నిర్ణయించినా, తర్వాత దానిని నిరవధిక సమ్మెగా మార్చినట్టు సంఘ నేతలు తెలిపారు. నిలిచిన సేవలు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టడంతో ఆయా కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందే సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 2.57 లక్షల మంది చిన్నారులు నమోదయ్యారు. 2.39 లక్షల మంది చిన్నారులు కేంద్రాలకు వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వీరితో పాటు కేంద్రాల పరిధిలో 45,161 మంది గర్భిణులు ఉండగా, 43,354 మందికి ఫీడింగ్ ఇస్తున్నారు. 45,207 మంది బాలింతల్లో 41,774 మందికి పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. వీరికి పౌష్ఠికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులకు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్ల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, అవి నిలిచిపోయాయి. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్ఠికాహార భోజనం, గుడ్లు, శనగలు ఇవ్వాల్సి ఉండగా కార్యకర్తల, ఆయాల సమ్మెతో నిలిచిపోయింది. అంగన్వాడీ కార్యకర్తల, ఆయాల సమ్మె చేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న అధికారులు అందులో విఫలమయ్యారు. -
‘గ్యాస్’ గలాట
సాక్షి, ఏలూరు : వంట గ్యాస్ పంపిణీకి ఆధార్ అనుసంధానం, నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయటంతో నిన్నామొన్నటి వరకు వినియోగదారులు గగ్గోలు పెడుతూ వచ్చారు. అది ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల డీలర్ల వంతూ అయింది. సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమకాకపోతే తమను నిలదీస్తున్నారని, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానంపై స్పష్టత లేదని డీలర్లు ఆరోపణ. తూకంలో వచ్చే తేడాలను నివారించటానికి సీల్డ్ ప్రూఫ్ సిలిండర్లు సరఫరా చేయాలనేది వారి మరో డిమాండ్. తమ సమస్యల పరిష్కారం కోసం వారు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల డీలర్లు సమ్మెతో తమకు ఇక్కట్లే అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 48 గ్యాస్ ఏజన్సీల కింద సుమారు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల సిలిండర్లు బ్లాక్‌మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయని అంచనా. జిల్లాలో ప్రతి రోజూ గరిష్టంగా 15 వేల సిలిండర్ల వరకు ఏజెన్సీల నుంచి వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1211, వాణిజ్య అవసరాల సిలిండర్ రూ.2వేల 45 ఉంది. డీలర్లు సమ్మె చేస్తే సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని, దీంతో బ్లాక్ మార్కెట్లో ధరలు చుక్కలనంటుతాయని వినియోగాదారుల భయం. ఇప్పటికీ బ్లాక్‌లో సిలిండర్‌కు రూ.300 నుంచి రూ.600 వరకు అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీలర్ల పనితీరుపై ఆరోపణలు గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై పలు ఆరోపణలున్నాయి. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉండటం వల్ల వారు వినియోగదారులకు జవాబుదారీగా ఉండటం లేదనేది ప్రధాన ఆరోపణ. ఏ స్థాయిలో జరుగుతున్నా సిలిండర్లలో గ్యాస్ చౌర్యం సాగుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. బుక్ చేసుకుంటే నిర్ణీణ వ్యవధిలో సిలిండర్ సరఫరా చేయరని మరో ఆరోపణ. చమురు సంస్థల కొత్త విధానాలు ఏజెన్సీలను కట్టడి చేయటానికి చమురు సంస్థలు కొత్త విధానాలను అవలంబిస్తున్నాయి. అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాయి. సంబంధిత చమురు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి డీలర్‌కు రేటింగ్ ఇచ్చే ఏర్పాటు చేశాయి. తక్కువ రేటింగ్ వచ్చిన డీలర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నాయి. పరిమితికి మించి ఉన్న కనెక్షన్లను వేరే డీలర్లకు ఇవ్వాలనేది వారి విధానాల్లో ఉంది. వినియోగదారులు తమ కనెక్షన్‌ను వేరే తమకు నచ్చిన ఏజెన్సీకి బదిలీ చేసుకునే వెసులబాటు కల్పించనున్నారు. ఆధార్‌తో సమస్యలు పెరిగాయంటున్న డీలర్లు గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచేసి సబ్సిడీ సొమ్మును బ్యాంకులో వేస్తామని, దానికి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని ఏజెన్సీల ఆరోపణ. ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులతోపాటు సబ్సిడీ సొమ్ము రాకపోవడంతో డీలర్లను నిలదీస్తున్నారు. సిలిండర్ తూకం తగ్గితే డీలర్లను బాధ్యుల్ని చేసి కేసులు పెడుతున్నారు. ఈ రెండు సమస్యలతో తమకు సంబంధం లేదని, అకారణంగా తమను బలిచేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ఆధార్‌పై స్పష్టత ఇవ్వడంతో పాటు తూనికల్లో లోపాల కేసుల నుంచి డీలర్లను తప్పించేందుకు సిలిండర్ సీలు తీసే వీలు లేకుండా సీల్డ్ప్రూఫ్ సిలిండర్లను బాట్లింగ్ పాయింట్ల నుంచే పంపాలని కోరుతున్నారు. క్రమశిక్షణ పేరుతో తమపై లక్షలాది రూపాయల జరిమానా విధించటాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రేపటి నుంచి సమ్మె షురూ
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడనున్నది. ఎల్పీజీ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధం అయ్యారు. ఈనెల 25 నుంచి అన్ని రకాల సేవలు నిలుపుదల చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్యాస్ ఏజెన్సీలకు డిసిప్లినరీ గైడ్ లైన్స్ -2014ను అమల్లోకి తెచ్చింది. ఇందులో 17రకాల మార్గదర్శకాలు పొందు పరిచారు. వీటి అమల్లో జాప్యం నెలకొన్న పక్షంలో, వినియోగదారుడికి ఇబ్బందులు తలెత్తినా ఏజెన్సీలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎల్పీజీ డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేంద్రం దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో సమ్మెకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోను డీలర్లు ఏకం అయ్యారు. నిరవధిక సమ్మెను జయప్రదం చేయడానికి నిర్ణయించారు. సమ్మెకు రెడీ: రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం కార్యదర్శి దక్షిణామూర్తి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, సమ్మె ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయం కారణంగా డీలర్లు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి తమను తీవ్ర కష్టాలు, నష్టాల పాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. కొత్త మార్గ దర్శకాల మేరకు లక్షలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎంఎస్ విధానం మేరకు గ్యాస్ బుక్ చేసిన 48 గంటల్లో సిలిండర్లు వినియోగదారుడికి చేరకున్నా, తమకు జరిమానా విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డిసిప్లినరీ గైడ్ లైన్స్ విధానాన్ని రద్దు చేయాలని, నగదు బదిలీ అమలు చేయాలా..? నిలిపి వేయాలా..? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ సీలు తీయడానికి వీలు లేని రీతిలో సీల్డ్ ప్రూఫ్ సిలిండర్లు అందజేయాలని, బాట్లింగ్ పాయింట్లో తూనికల్లో తేడా ఉన్న పక్షంలో, దానికి డీలర్లను బాధ్యులు చేయడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నామన్నారు. గ్యాస్ డెలివరీ, బుకింగ్ , కొత్త గ్యాస్‌ల నమోదు తదితర అన్ని రకాల సేవలు నిలుపుదల చేయనున్నామని ప్రకటించారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయాలన్నది తమ అభిమతం కాదని, కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగానే ఈ సమ్మె చేపట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తమ సమ్మెకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డీలర్ల సమ్మె దృష్ట్యా, రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువే. ఈ సమ్మె ఎంత కాలం సాగుతుందో, ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించనుందో వేచి చూడాల్సిందే. -
నారీ భేరి
సీడీపీవోలకు సమ్మె నోటీసులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు పల్స్‌పోలియో విధులకు సైతం దూరం జిల్లాలో 7,400 మంది కార్యకర్తలు, సహాయకులు అంగన్వాడీలు మూతపడితే బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పస్తులే దాదాపు 1.35 లక్షల మందిపై ప్రభావం అమ్మలాంటి మనసు ఆక్రోశిస్తోంది.. అన్నం పెట్టిన చేయి పిడికిలెత్తింది.. చాలీచాలని జీతాలతో కడుపు రగిలి హక్కుల సాధన కోసం సమ్మె బాట పట్టింది.. అంగన్ వాడీల్లో మోగించిన నారీ భేరి ఆదివారం ్చనుంచి ఉధృతం కానుంది. వెరసి జిల్లాలోని 7,400 మంది కార్యకర్తలు, హెల్పర్లు నిరవధిక సమ్మెకు దిగడంతో 3,359 అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలో సుమారు 1.35 లక్షల మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పస్తులు తప్పని పరిస్థితి దాపురిస్తోంది. సాక్షి, మచిలీపట్నం : దాదాపు 37 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం)ని ప్రభుత్వం రెగ్యులర్ శాఖగా గుర్తించకుండా ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడంపై అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు, హెల్పర్లకు అరకొర జీతాలతో జీవనం కష్టంగా మారిందని, మరోవైపు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతహస్తం పథకంతో పని గంటల భారం పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ప్రైవేటీకరణ యత్నాలు నిలుపుదల చేయాలని, తమ జీతాలు పెంచాలని తదితర పది డిమాండ్లతో జిల్లాలో ఈ నెల 17 నుంచి 22 వరకు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆదివారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల (సీడీపీవో)కు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శనివారం సమ్మె నోటీసులతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు.. ఈ నెల 23 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న కార్యకర్తలు, హెల్పర్లు తాము పనిచేసే అంగన్వాడీ కేంద్రాలకు శనివారం నుంచి తాళాలు వేశారు. 7,400 మంది ఆందోళన బాట పట్టడంతో జిల్లాలోని 3,559 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకోకపోతే వీటిపై ఆధారపడిన 32 వేల 119 మంది గర్భిణులు, 32 వేల 560 మంది బాలింతలు, 70 వేల మంది పిల్లలకు పస్తులు తప్పవు. మొత్తం లక్షా 34 వేల 679 మందికి పౌష్టికాహారం అందకుండా పోతోంది. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు తాళాలు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణకుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా గ్రామ సమాఖ్య సభ్యులతో గాని, తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో గాని అంగన్వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పల్స్‌పోలియో విధులకు దూరం.. జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో విధులకు సైతం తాము హాజరయ్యేది లేదంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్స్‌పోలియో కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సహకారం లేకపోవడం ఇబ్బందికరమే. ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంఅండ్‌హెచ్‌వో) సరసిజాక్షిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆదివారం సెలవు రోజు కావడంతో ఉపాధ్యాయులను పల్స్‌పోలియో కార్యక్రమానికి ఉపయోగించుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)ని కోరినట్టు చెప్పారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా జిల్లాలోని నర్సింగ్ విద్యార్థినులు, ఐకేపీ మహిళల సేవలను ఉపయోగించుకుంటామని ఆమె వివరించారు. డిమాండ్లు ఇవీ.. అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు రూ.4,400 వేతనంగా ఇస్తున్నారు. దాన్ని రూ.12,500 కనీస వేతనంగా చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వాలి. పింఛను సౌకర్యం కల్పించాలి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఐటీసీ సంస్థలు జోక్యం చేసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి. ప్రైవేటీకరణ ఆపాలి. ఐకేపీ జోక్యాన్ని నివారించాలి అమృతహస్తం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. దీన్ని నిర్వహిస్తున్న వర్కర్లకు రూ.2 వేలు, హెల్పర్లకు వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇవ్వాలి ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేసి పటిష్టంగా అమలు చేయాలి. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలి బీఎల్ఓ విధుల నుంచి అంగన్వాడీలను మినహాయించాలి పెంచిన అంగన్వాడీ సెంటర్ల అద్దెలు ఎలాంటి షరతులూ లేకుండా అమలు చేయాలి ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి దరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు, కట్టెల బిల్లులను పెంచాలి వంటకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో సరఫరా చేయాలి -
కదం తొక్కిన అంగన్వాడీలు
ఇందూరు/కామారెడ్డి/బోధన్/న్యూస్‌లైన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కదం తొక్కారు. బుధవారం నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ ఆర్డీవో కార్యాలయాల ఎదుట జిల్లాలోని ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు. బోధన్‌లో.. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగించారు. ఇక్కడ నిజామాబాద్, మహారాష్ట్ర, బాన్సువాడ వైపు వెళ్లే ప్రధాన రహదారులను గంట పాటు దిగ్బంధించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి రమాదేవి, సీఐటీయూ డివిజన్ నాయకులు జె. శంకర్‌గౌడ్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డిలో... స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పది మండలాలకు చెందిన అంగన్వాడీకార్యకర్తలు, ఆ యాలు మహా ధర్నా నిర్వహించారు. నిజాం సాగర్ చౌరస్తాలో మానవహారం,రాస్తారోకో, ధ ర్నా నిర్వహించారు.స్థానిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జిల్లాకేంద్రంలో... సమస్యలపై స్పందించకుంటే ఈనెల 21న ఐసీడీఎస్ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వానికి హెచ్చరించారు.సమ్మెలో భాగంగా బుధవారం నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ముందు బైటాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు గోవర్థన్ మాట్లాడుతూ... ప్రభుత్వ వైఖరి కొనసాగితే 21న ఐసీడీఎస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.అనంతరం ఆర్డీవో యాదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ర్యాలీగా కోర్టు వరకు చేరుకుని పొట్టి శ్రీరాములు చౌరస్తాలో భారీ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగ సంఘం నాయకులు సులోచన, హైమావతి, స్వర్ణ, సువర్ణ, సూర్యకళ పాల్గొన్నారు. -
వీధుల్లో నుంచి విధుల్లోకి..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగులు వీధులను వదిలి విధులకు హాజరు కానున్నారు. 15 రోజుల నిరవధిక సమ్మె అనంతరం గురువారం నుంచి యథావిధిగా కార్యాలయాలకు చేరుకోనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ గత ఏడాది ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 66 రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టారు. అటెండర్ నుంచి గజిటెడ్ ఆఫీసర్ వరకు ఉద్యోగులు సమ్మె చేశారు. అదే సమయంలో వీధుల్లోకి వచ్చి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. విద్యార్థులతో కలిసి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వస్తుండటంతో ఉద్యోగులంతా ఢిల్లీ బాట పట్టారు. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు వేలాదిగా ఢిల్లీ చేరుకొని అక్కడ మహా ధర్నా నిర్వహించారు. పార్లమెంటులో ఏకపక్షంగా తెలంగాణ బిల్లును ఆమోదించడంతో ఉద్యోగులు తిరుగుముఖం పట్టారు. రెండోమారు నిర్వహించిన నిరవధిక సమ్మెలో ఏపీఎన్జీఓ అసోసియేషన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కాన్ఫడరేషన్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో గురువారం నుంచి ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. వారి రాకతో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి కళకళలాడనున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు రెండో మారు నిరవధిక సమ్మెకి దిగిన ఉద్యోగులకు ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులుగా తమవంతు పోరాటం నిర్వహించామని, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా అంతే పోరాటాన్ని నిర్వహించి ఉంటే విభజన జరిగేది కాదన్నారు. -
అంగన్వాడీ ఉద్యోగులకు విజయమ్మ భరోసా
అంగన్వాడీ ఉద్యోగుల చేస్తున్న న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు కోరుతూన్న డిమాండ్ న్యాయబద్దంగా ఉన్నాయని తెలిపారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను కలసి విజయమ్మ తన సంఘీభావాన్ని ప్రకటించారు. గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. త్వరలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని విజయమ్మ ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ విజయమ్మతోపాటు ఆ పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావులు అంగన్వాడి ఉద్యోగులను కలసిన వారిలో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ గత నాలుగు రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
అదే సంకల్పం..ఆగలేదు సమరం
కడవరకూ పోరాడదాం సాక్షి, కాకినాడ : ‘కడ వరకు పోరాడదాం... రాష్ర్ట సమైక్యతను కాపాడుకుందాం’ అంటూ ఏపీఎన్జీఓలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌తో సహా వీఆర్వో కార్యాలయం వరకు పరిపాలన పూర్తిగా స్తంభించింది. సమ్మె బాటపట్టిన ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. రెండో రోజు వీరి ఆందోళనలకు పలు చోట్ల ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు. విభజన బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితులు కన్పిస్తుండడంతో సోమవారం నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ట్రెజరీ, హౌసింగ్, సహకార శాఖ సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మె బాటపట్టనున్నారు. మరొక పక్క తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అర్ధరాత్రి నుంచే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పారిశుద్ద్య సిబ్బంది సమ్మె బాట పట్టనుండడంతో మిగిలిన ఉద్యోగులు సోమవారం నుంచి సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మెలోకి రావాలని ఏపీ ఎన్జీఓలు పిలుపునిచ్చారు. వినూత్న నిరసనలు ఏపీఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వే శారు. కలెక్టరేట్ రోడ్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయం, జెడ్పీ, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాలను కూడా దగ్గరుండి మూయించి వేశారు. జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. జెడ్పీ ఉద్యోగిని తెలుగుతల్లి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై జరిగిన ప్రదర్శనలో ‘తెలుగుప్రజలందరం ఒక్కటిగా ఉందాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం అంటూ నినదించారు. విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఏపీ ఎన్జీఓలు, ఏయూ పూర్వవిద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీఓలు నిరసన ప్రదర్శన చేయగా, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ శిబిరాన్ని జేఏసీ నాయకులు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. 10న కేంద్ర కార్యాలయాల ముట్టడి 10వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 12వ తేదీన రహదారులను దిగ్బంధించాలని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపు నిచ్చారు. 10వ తేదీన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట అధ్యక్షుడు పి. అశోక్‌బాబు ముఖ్యఅతిథిగా జరుగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నిరసిస్తూ.. నినదిస్తూ..
ఏలూరు, న్యూస్‌లైన్:తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్జీవోలు నిరవధిక సమ్మెకు దిగటంతో జిల్లాలో గురువారం ప్రభుత్వ కార్యాలయూలు మూతపడ్డాయి. ఏలూరులో కలెక్టరేట్ , అటవీ, వయోజన విద్య, ఆర్‌డబ్ల్యుఎస్, ఎక్సైజ్, జిల్లా పంచాయతీ, సెరీకల్చర్, గ్రౌండ్ వాటర్, వైద్యారోగ్య, దేవాదాయ శాఖ తదితర కార్యాలయూలను ఎన్జీవోలు మూయించివేశారు. మహిళ, శిశు అభివృద్ధిపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్‌ను, కేంద్రీయ విద్యాలయంలో శిక్షణ శిబిరాలను అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌కు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్వీ సాగర్, నాయకులు టి.యోగానందం, ఆర్ఎస్ హరనాథ్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు పి.సోమశేఖర్, నగర ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రమేష్‌కుమార్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాల యం నుంచి కళాజాతాలతో ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడె తాలూకా ఆఫీస్ సెంటర్లో ఎన్జీవోలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. నిడదవోలులో రెవెన్యూ ఉద్యోగులు తహసిల్దార్ కార్యాలయూనికి తాళాలు వేసి విధులను బహిష్కరించారు. పట్టణంలో పాదయూత్ర జరిపారు. కొవ్వూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠారుుంచి ధర్నా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను మూరుుంచివేశారు. పాల కొల్లులో ఎన్జీవోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, పట్టణంలో ప్రదర్శన చేశారు. ఆచంటలో ఉద్యోగులు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూలను మూయించివేసి నిరసన తెలిపారు. తణుకు, భీమవరం పట్టణాల్లో ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలావుండగా ఆర్టీసీ, పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండిపోయూరు. రేపు ఎంపీల ఇళ్లముట్టడి శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంపీలు, కేంద్ర మంత్రుల ముట్టడిని శనివారం నాటికి వారుుదా వేశారు. -
పరిపాలనకు ‘సమైక్య’ బ్రేక్
సాక్షి, కాకినాడ :రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీఓల సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు జిల్లాలో ప్రభుత్వోద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. దీంతో కలెక్టరేట్ సహా దాదాపు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూత పడ్డాయి. కీలకమైన రెవెన్యూ సహా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో జిల్లాలో గురువారం నుంచి పరిపాలన స్తంభించిపోయింది. ఆర్డీఓ, తహశీల్దార్, వీఆర్వో కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. మండల పరిషత్ కార్యాలయాలు తెరుచుకోలేదు. పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, కమర్షియల్, రవాణా, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, పశు సంవర్ధక, విద్య, వైద్య-ఆరోగ్య, గ్రంథాలయ, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. ఎక్సైజ్ మినిస్టీరియల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు సుబ్బారావు కలెక్టరేట్ గేట్లకు తాళాలు వేసి, సిబ్బందితో కలిసి ఆ ప్రాంగణంలో ర్యాలీ చేశారు. పౌర సరఫరాలు, డ్వామా, బీసీ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఈ ర్యాలీలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా కన్వీనర్ మల్లు సత్యనారాయణ మూర్తి, కో కన్వీనర్ కె.రామకృష్ణారావు ఆధ్వర్యంలో మినిస్టీరియల్ సిబ్బంది పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు ప్రదర్శన చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక దీక్షా శిబిరంలో చెవులు, కళ్లు, నోరు మూసుకొని యూపీఏ తీరుపై నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట మానవహారం, ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బూరిగా ఆశీర్వాదం, త్రినాథ్‌లు మాట్లాడుతూ రాష్ర్ట విభజన బిల్లును అసెంబ్లీలో మాదిరిగానే పార్లమెంటులో కూడా తిరస్కరించేలా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కృషి చేయాలన్నారు. విభజన బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించని ఎంపీలు, మంత్రులను నియోజకవర్గాల్లో తిరగనివ్వబోమని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని అన్నారు. విభజన బిల్లును తిరస్కరించడం ద్వారా ఈ నెల 21న కాకినాడలో అశోక్‌బాబు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించుకుందామని చెప్పారు. రాజమండ్రిలో ఏపీఎన్జీఓ కార్యాలయం నుంచి ఉద్యోగులంతా బైక్ ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అమలాపురంలో ఏపీఎన్జీఓలు ప్రదర్శన చేశారు. ఈ నెల 10న జరగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసేందుకు ఎన్జీఓ నేతలు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇంకా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు, మానవ హారాలు నిర్వహించారు. -
సమైక్య సమరం
సాక్షి, గుంటూరు :సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ, రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల పోరు మొదలైంది. గురువారం ఉదయం నుంచి ఎన్జీవోలు సమ్మె బాట పట్టారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు గురువారం విధులకు గైర్హాజరయ్యారు. గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల పట్టణాల్లో ఉద్యోగ సంఘ నాయకులు సంఘటితంగా కదిలి ప్రభుత్వ విభాగాల్లో విధులకు హాజరైన మరికొందరు ఉద్యోగులను బయటకు తీసుకొచ్చారు. దీంతో అధిక మొత్తంలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి ప్రజలకు అందాల్సిన సేవలు నిలిచిపోయాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని ఎన్జీవోలు సమ్మెలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామిరెడ్డి, ప్రభాకరరావుల సూచనల మేరకు జిల్లాలోని 20 యూనిట్ల ఎన్జీవో సంఘ నాయకులు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పనిచేసే ఉద్యోగుల్ని సమ్మె బాటన నడి పించేందుకు కృషి చేశారు. రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ట్రెజరీ, వ్యవసాయ, కార్మిక, ఆర్ అండ్ బీ, తదితర 12 ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులూ గురువారం ఉదయం విధులకు హాజరు కాకుండా తమతమ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్రం తెలంగాణ బిల్లును వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెనాలిలోని ఉద్యోగులందరూ సమైక్యంగా కదిలి ఉద్యమబాట నడిచారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేంద్రం తీరును నిరసించారు. బాపట్ల, మాచర్ల, నర్సరావుపేట, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె, వినుకొండ పట్టణాల్లోనూ ఉద్యోగుల నిరసన ప్రదర్శనలు జరిగాయి. గుంటూరులో... జిల్లా కేంద్రమైన గుంటూరులో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సమైక్య సమ్మె మొదలైంది. ఎన్జీవో సంఘ నాయకులు రామిరెడ్డి, ప్రభాకరరావు, దయానందరాజు ప్రభృతులు ఉదయం 10 గంటల నుంచి కార్యాలయాలను మూయించడం మొదలుపెట్టారు. కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాలకు వెళ్లి ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో సత్యనారాయణలను కలిసి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. విజిలెన్సు ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనేందుకు మద్దతు కోరారు. విధులకు హాజరవుతున్న మహిళా ఉద్యోగులకు సమైక్య సమ్మె ఉద్దేశం వివరించి సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు పలు కార్యాలయాల్లో సమ్మెకు మద్దతు పలకాలని అధికారులను కోరారు. ‘జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. ఆగకుండా హారన్లు మోగించుకుంటూ బైకులపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొని సమైక్యతను చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మె దినాలను క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ జీఓ జారీ కావడంపై రెవెన్యూ అసోషియేషన్ హర్షం వ్యక్తం చేసింది. -
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 66 రోజుల పాటు సమ్మె చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. జిల్లాలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది రోడ్డెక్కనున్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సోమవారం సమావేశమై మెరుపు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె ద్వారా మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు, ట్రాన్స్‌కో, ఆర్టీసీ ఉద్యోగులు మినహా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిపాలన స్తంభించనుంది. సమైక్యవాదాన్ని వినిపించాలి పార్లమెంట్లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు సమైక్యవాదాన్ని వినిపించాలని జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం కాకినాడ ఏపీ ఎన్జీవో హోంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన మేరకు సమ్మెలోకి వెళ్లాలని తీర్మానించారు. ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర సంఘం పిలుపుతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు 15న వెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు అనిల్ జాన్సన్, నాగేశ్వరరావు, జియాఉద్దీన్, పసుపులేటి శ్రీనివాసరావు, సరెళ్ల చంద్రరావు, వై. శ్రీనివాస్, విజయకుమార్, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఆఖరి పోరాటం
ఏలూరు, న్యూస్‌లైన్ :తెలంగాణ బిల్లును పార్లమెం ట్లో వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు సమైక్య రాష్ట్ర పరి రక్షణ వేదిక ప్రకటించింది. వేదిక, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎల్వీ సాగర్ తదితరులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యా య వర్గాలతోపాటు వ్యాపార, విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిరక్షణ కోసం 66 రోజులపాటు అన్నివర్గాలు ఐక్యంగా ఉద్యమించడం వల్లే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌కు తిప్పిపంపగలి గామని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు అన్నివర్గాల ప్రజలు తుది పోరాటాన్ని విజయవంతం చేయూలని కోరారు. ఎన్నికల విధులకు సహకారం అందించేది లేదని స్పష్టం చేశారు. సమ్మెనుంచి 10వ తరగతి విద్యార్థులను మినహాయిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని, వారిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని సాగర్ చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఈనెల 9న జిల్లా వ్యాప్తంగా 3కే రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి 50 వేలమంది సమైక్యవాదులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 10న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగే బహిరంగ సభకు సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివెళ్లాలని కోరారు. 17, 18 తేదీల్లో ఢిల్లీవెళ్లి అన్ని జాతీయ పార్టీలను కలుస్తామని, రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలనే విషయూన్ని వివరిస్తామని తెలిపారు. కావూరి, కనుమూరి బుద్ధిగా వ్యవహరించాలి సమైక్యాంధ్రకు ద్రోహం చేసిన ప్రజాప్రతినిధుల భరతం పడతామని సాగర్ హెచ్చరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీ, టీటీడీ చైర్మన్, కను మూరి బాపిరాజు వ్యవహరించిన తీరు ప్రజలకు అర్థమైందన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే వారి చరిత్ర బయటపడుతుందన్నారు. ప్రజ లు ఎప్పటికీ వారిని క్షమించరని శాపనార్థాలు పెట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ కోనేరు సురేష్‌బాబు, నాయకులు పి.వెంకటేశ్వరరావు, నేరేళ్ల రాజేంద్ర, ఎంబీఎస్ శర్మ, క్రిష్ట్రవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిరవధిక ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డాలని కోరారు. ఈనెల 9 నిర్వహించే సమైక్య 3కే రన్‌కు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఎంబీఎస్ శర్మ వివరించారు. సమావేశంలో ఎన్జీవో నేతలు టి.యోగానందం, ఆర్ఎస్ హరనాథ్, నరసింహమూర్తి, చోడగిరి శ్రీనివాస్, కె.రమేష్‌కుమార్, ప్రమోద్, సతీష్ పాల్గొన్నారు. -
18 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయకపోతే వచ్చే నెల 18 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వర్తించాల్సిన వేతన సవరణ కోసం ఇప్పటికీ కమిటీ వేయకుండా ప్రభుత్వం, యాజమాన్యం జాప్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) మండిపడింది. వెంటనే వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో మంగళవారం వందలాదిమంది ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జె. సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు, కో చైర్మన్ జి.మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. వాస్తవానికి విద్యుత్ సంస్థల్లో వేతన సవరణకు ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పారు. వేతన సవరణను ఆలస్యం చేసేందుకే అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని యాజమాన్యం అంటోందని ఆరోపించారు. వేతన సవరణకు గత నవంబర్లోనే కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.కిరణ్, సంయుక్త కార్యదర్శి ఎంఏ వజీర్, నేతలు చంద్రుడు, భానుప్రకాశ్ తదితరులు తెలిపారు. కాగా, ధర్నా సందర్భంగా తెలుగుతల్లి బొమ్మ ఉన్న సమైక్యాంధ్ర ఫ్లెక్సీని చించేశారని ఇది తెలుగు జాతిని అవమానించడమేనని, ఇందుకు జేఏసీ నాయకత్వం క్షమాపణలు చెప్పాలని జాక్ వైస్ చైర్మన్ గణేష్ డిమాండ్ చేశారు. జేఏసీలో తెలంగాణ ప్రాంతంవారు మాత్రమే ఉన్నారని ఆయన విమర్శించారు. -
రాజధానిలో బ్రేకేసిన ఆటోలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో సమ్మె కారణంగా దాదాపు చాలా వరకు ఆటోలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఆటోల్లో మీటర్ చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాల పెంపు జీవోను రద్దు చేయాలని కోరుతూ... ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టింది. దీంతో హైదరాబాద్‌లో తిరిగే లక్షా 20 వేల ఆటోల్లో 65 శాతం వరకు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అందులో సుమారు 25 వేల స్కూల్ ఆటోలు నిలిచిపోవడంతో... విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు.. మహాత్మాగాంధీ, జూబ్లీ తదితర బస్స్టేషన్ల వద్ద ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. దాంతో శనివారం సిటీ బస్సులు కిక్కిరిసిపోయాయి. అయితే, బీఎంఎస్‌తో పాటు మరికొన్ని ఆటో సంఘాలు సమ్మెకు దూరంగా ఉండడంతో.. పలు ప్రాంతాల్లో ఆటోలు తిరిగాయి. కొందరు ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అందినకాడికి వసూలు చేయడం కనిపించింది. కాగా.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని, ఆదివారం నుంచి మరింత ఉధృతం చేస్తామని ఆటో జేఏసీ ప్రతినిధులు సత్తిరెడ్డి, వెంకటేశం తెలిపారు. సమ్మె ప్రభావం... మొత్తం ఆటోలు : లక్షా 20 వేలు సమ్మెలో పాల్గొన్నవి : 65 శాతం తిరిగిన ఆటోలు : 35 శాతం సమ్మెకు మద్దతునిస్తున్న సంఘాలు : 16 (ఆటో సంఘాల జేఏసీ) దూరంగా ఉన్న సంఘాలు : బీఎంఎస్, ఆటో సంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ -
మీ సేవలు వద్దు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మీ-సేవ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ విధానాన్ని అప్పగించే యోచనను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరులు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు బైఠాయించి ఆందోళనలు జరిపారు. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. కోట్ల రూపాయల ఆస్తి లావాదేవీలకు ఆటంకం కలిగి కక్షిదారులు ఇక్కట్లపాలయ్యారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, కంకిపాడు, నూజివీడుతోపాటు అన్ని సెంటర్లలో డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను బంద్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మూయించారు. గేట్లకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేశారు. విజయవాడ నగరంలో గాంధీనగ ర్, పటమట, గుణదల, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దస్తావేజు లేఖరుల సమ్మెకు మద్దతు తెలిపారు. పటమట కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మల హరికృష్ణ, సంఘం నాయకుడు నారాయణరావు తదితరులు ఆందోళన జరిపారు. -
ఆందోళన బాట
చిత్తూరు (సిటీ), న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని దస్తావేజు లేఖకులు ఆందోళన ఉద్ధృతం చేయనున్నారు. రాష్ర్ట సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇది కార్యరూపం దాల్చితే చిత్తూరు, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, వాటి పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి. దస్తావేజు రిజిస్ట్రేషన్లు, సొసైటీ రెన్యూవల్స్, ఈసీలు, నకళ్లు, 10-1 అడంగళ్ల మంజూరును రిజిస్ట్రారు కార్యాలయం నుంచి మీ-సేవ కార్యాలయాలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో సంబంధిత రిజిస్ట్రారు కార్యాలయాలను నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుబండి లాగిస్తున్న సుమారు 900 మంది దస్తావేజు లేఖకులు ఉపాధి పోనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ లేఖకులు పలుమార్లు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు గురువారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి! దస్తావేజు లేఖకులు సమ్మెలోకి వెళితే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. చిత్తూ రు, తిరుపతి జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు, వాటి పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రోజుకు దాదాపు * 40 లక్షల వరకు ఆదాయం తగ్గిపోనుంది. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి రాబడి పడిపోయింది. ఈ సమయంలో దస్తావేజు లేఖకుల సమ్మె మొదలైతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేయండి జిల్లాలో గురువారం నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని చిత్తూరు రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకరనారాయణ, రవి విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవ ఆమోదం చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో బుధవారం దస్తావేజు లేఖకుల సమావేశం నిర్వహించారు. నిరవధిక సమ్మెపై ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్యులు, దస్తావేలు లేఖకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె సాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 25 మంది దస్తావేజు లేఖకులు, 20 మంది డీటీపీ ఆపరేటర్లు, 10 మంది ఫొటోగ్రాఫర్లు, 20 మంది సహాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ సమ్మెకు సిద్ధం: అశోక్‌బాబు
రాష్ట్ర సమైక్యత కోసం అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమని ఏపీఏన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. జనవరి 16 నుంచి 20వ తేదీలోగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... సీమాంధ్రలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తామని చెప్పారు. విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై పండగ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఏన్జీవో ఎన్నికలను రాజకీయా పార్టీలు ప్రభావితం చేయలేవని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు అశోక్‌బాబు బదులు ఇచ్చారు. -
17 నుంచి మున్సిపల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఈనెల 17 నుంచి నిరవధిక సమ్మె బాటపట్టనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. సమ్మె సన్నాహక రౌండ్‌టేబుల్ సమావేశం ఏపీ మున్సిపల్ వర్కర్స అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జె.రమేష్ అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగింది. సీఐటీయూ, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్యాణం వెంకటేశ్వరరావు, జి.రామయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స ఫెడరేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి తీగల వెంకన్న మాట్లాడుతూ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లోని పర్మనెంట్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలన్నారు. దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈనెల 11న మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు టి.లింగయ్య, టి.విష్ణువర్ధన్, కిషోర్, ఏఐటీయూసీ నాయకులు లకీష్మనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు యాకూబ్‌షావలీ, రామారావు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు జింకల శ్రీను, జల్లి లకీష్మనారాయణ, వెంకటరమణ, జానకమ్మ, బొడ్డు వెంకన్న పాల్గొన్నారు. -
షార్కు తగిలిన షాక్
సాక్షి నెట్వర్క్ : విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది నిరవధిక సమ్మె కారణంగా ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. మంగళవారం రోజూ సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. రాత్రి సమయంలో అక్కడక్కడా విద్యుత్‌ను పునరుద్ధరించినా ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ సరఫరా క్రమంగా షట్‌డౌన్ అయింది. దేశానికే తలమానికమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు సమైక్య ఉద్యమ సెగ తాకింది. విద్యుత్ ఉద్యోగులు మంగళవారం సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్నం 1.20కి మన్నూరు పోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షార్, రైల్వే, పారిశ్రామికవాడకు వెళ్లే లైన్లు ట్రిప్ అయ్యాయి. షార్ కేంద్రంలో ఈ నెల 28న అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం మార్స్‌మిషన్ ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పనికి తీవ్ర ఆటంకం కలిగింది. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఉత్పాదన అందిస్తున్న విజయవాడలోని ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లు నిలిచిపోవడంతో సదరన్ పవర్ గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖలోని కేజీహెచ్, రిమ్స్, కాకినాడ జీజీహెచ్ తదితర ప్రధాన ఆస్పత్రులు, నీటి సరఫరా కేంద్రాలకు అత్యవసర కేటగిరీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. సీలేరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో 240 మెగావాట్లు, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌లో 57మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా లోయర్ సీలేరు ఏపీజెన్కో ప్రాజెక్టు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికీ సమైక్య సెగ తగిలింది. ఉద్యోగుల సమ్మెతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఈపీడీసీఎల్‌కు సుమారు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తెలంగాణకు చెందిన డొంకరాయి జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ కృష్ణయ్య తమ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. అధికారులను గదిలో నిర్బంధించి సమైక్య నినాదాలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీలలో 40శాతం ఉత్పత్తులు పడిపోగా, సున్నం పరిశ్రమలు మూడపడ్డాయి. గుంటూరు, గణపవరం, పేరేచర్ల ప్రాంతాల్లోని పలు స్పిన్నింగ్ మిల్లుల్లో నూలు తయారీకి తీవ్ర ఆటంకం కలిగింది. అయోమయంలో రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై ప్రభావం చూపింది. ఏ రైలు నడపాలి, ఏ రైలును రద్దుచేయాలో తెలియక అధికారులు అయోమయంలో పడిపోయారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే గోదావరి, విశాఖ, గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా నిలిపివేసినట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు ఉదయం ప్రకటించగా, మధ్యాహ్నానికి అత్యవసర సర్వీసులకు విద్యుత్తును పునరుద్ధరించడంతో వాటిని తిరిగి నడిపారు. బుధవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. విశాఖపోర్టులో విద్యుత్ కోత కారణంగా సోమవారం అర్థరాత్రి వచ్చిన నౌకలకు నావిగేషన్ చూపలేకపోవడంతో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. స్టీల్‌ప్లాంట్‌లో మాత్రం కొంచెం పురోగతి కనిపించింది. -
బాబు దీక్ష ఎందుకో..
విభజనకు లేఖ ఇచ్చిన బాబు దీక్ష చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది: దిగ్విజయ్ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాడు ఇచ్చిన లేఖలు మీడియాకు విడుదల సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మరోమారు వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘‘విభజనకు అనుకూలమని బాబు పలు పర్యాయాలు లిఖితపూర్వకంగా లేఖలిచ్చారు. ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. దీక్ష ఎందుకో అర్థం కావట్లేదు. విభజన లేఖ ఇచ్చిన ఆయన దీక్ష చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ‘‘గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించి కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేసిన టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు తమ వైఖరుల్ని మార్చుకోవడం, నిరాహారదీక్షలు చేస్తూ కాంగ్రెస్‌ను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉంది’’ అంటూ దిగ్విజయ్ అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు ఇచ్చిన లేఖను, అదే సమయంలో వైఎస్సార్ సీపీ ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేశారు. సమ్మె విరమించండి: సీమాంధ్రలో ఆందోళనలపై దిగ్విజయ్ స్పందించారు. ‘‘సీమాంధ్రలో జరుగుతున్న బంద్‌తో అక్కడి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నా’’ అని కోరారు. సీమాంధ్రుల సమస్యలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి షిండే ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని పార్టీలు విభజనపై లేఖలిచ్చాకే కాంగ్రెస్ నిర్ణయం చేసిందని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చడం సాధ్యం కాదని తెలిపారు. ఈ నిమిషంలో వెనక్కి తగ్గలేమని స్పష్టం చేశారు. ఇక సీమాంధ్ర ప్రజల అన్ని సమస్యలనూ మంత్రుల బృందం పరిశీలిస్తుందని తెలుపుతూ ఓ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇందులో ‘సీమాంధ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం. సీమాంధ్రలో రక్షణ, విద్య, ఉపాధి అవకాశాలతోపాటు హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. నదీజలాలు, విద్యుత్ పంపిణీ అంశాలపై దృష్టి పెడతామన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు ఆపేసి చర్చలకు రావాలని సూచించారు. చర్చలద్వారా ఇరుప్రాంతాల ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొందామని సూచించారు. సీఎం కిరణ్‌పై మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి చేసిన ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. వీటిని పట్టించుకోనక్కర్లేదని, దినేశ్‌రెడ్డికి దమ్ముంటే సీఎంపై కోర్టులో కేసు దాఖలు చేయాలని సవాలు చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు ప్రారంభం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు స్థానిక కర్నూల్‌రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద సోమవారం రిలే దీక్ష ప్రారంభించారు. కేంద్రం మొండివైఖరి వీడి వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులకు ఉద్యోగులు బాధ్యులు కాదన్నారు. దీక్షకు ఎన్జీఓ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా చైర్మన్ అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం కేంద్రానికి తాకుతుందని, ఇదే విధంగా సమ్మె కొనసాగించాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెను ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారని వివరించారు. ప్రజల ఇబ్బందుకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతన్నారు. విద్యుత్ ఉద్యోగులకు తాము పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు హరిబాబు, పిచ్చయ్య, జయాకరరావు, సాంబశివరావు, ఎన్జీఓ నాయకులు బండి శ్రీను, పి రాజ్యలక్ష్మి, మస్తాన్‌వలి, కృష్ణారెడ్డి, కేఎల్ నరశింహారావు, ప్రభాకర్, శ్రీను, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. టైర్లు కాల్చి విద్యార్థుల నిరసన సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక రామ్‌నగర్‌లోని ఒకటో లైన్ వద్ద భారీ ఎత్తున రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే టీ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు, ఎంపీ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్, వినోద్, విశ్వనాథ్, వనీల్ తదితరులు పాల్గొన్నారు. -
జన జీవనం అస్తవ్యస్తం
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బయల్దేరే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దయ్యాయి. విమానాల రాకపోకల మీద కూడా విద్యుత్ సమ్మె ప్రభావం చూపింది. విశాఖ నగరం సహా జిల్లా మొత్తం తాగునీటి సరఫరా స్తంభించి జనం ఇక్కట్లకు గురయ్యారు. ఐటీ ఉత్పత్తులు కుప్ప కూలాయి. విశాఖ పోర్టుకు కూడా విద్యుత్ సమ్మె తగిలే ప్రమాదం ఏర్పడింది. స్టీల్‌ప్లాంట్‌లో పరిస్థితి ఘోరంగా మారి ఉత్పత్తి హీన దశకు చేరింది. విశాఖ నగరం సహా, పట్టణాలు, పల్లెలన్నీ గాఢాంధకారంలో కొట్టుమిట్టాడాయి. ప్రభుత్వ వైద్య శాలలు సమ్మె దెబ్బకు చీకటిమయమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సాయంత్రం 6 గంటలకే మూత పడగా, నివాస గృహాల్లో కొవ్వొత్తుల వెలుగులు మాత్రమే కనిపించాయి. మంగళవారం నుంచి డొంకరాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగులు కూడా సమ్మె బాట పడుతున్నారు. మన రాష్ర్టంలో జరుగుతున్న సమ్మె దెబ్బకు పొరుగునే ఉన్న మాచ్‌ఖండ్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ట్రిప్ అయ్యాయి. ఎక్కడి రైళ్లక్కడే... : వాల్తేర్ రైల్వే డివిజన్‌కు అవసరమైన విద్యుత్ అందకపోవడంతో విశాఖపట్నం -కోరాపుట్, విశాఖపట్నం - రాయగడ , విశాఖపట్నం- పలాస, విశాఖపట్నం - దుర్గ్, విశాఖపట్నం- రాయ్‌పూర్, విశాఖపట్నం- విజయనగరం, రాజమండ్రి- విశాఖపట్నం, భువనేశ్వర్- విశాఖపట్నం, విశాఖపట్నం- రాజమండ్రి, విశాఖపట్నం- మచిలీపట్నం, విశాఖపట్నం - విజయవాడ, విశాఖపట్నం- కాకినాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లను మంగళవారం కూడా రద్దు చేశారు. భువనేశ్వర్- విశాఖపట్నం రైలు సోం పేట వరకు, పూరి- గున్పూర్ ప్యాసింజర్‌ను రాంభా వరకు మాత్రమే డీజిల్ ఇంజిన్లతో నడిపారు. విశాఖపట్నంలో మధ్యాహ్నం 1-35కు బయల్దేరిన విశాఖ- విజయవాడ రత్నాచల్ రైలు కిలోమీటరు దూరం వెళ్లి సాయంత్రం 4-30 గంటలకు మళ్లీ విశాఖ స్టేషన్‌కు వచ్చింది. ఈ రైలుకు డీజిల్ ఇంజన్ అమర్చడంతో సాయంత్రం 5-20 గంటలకు విజయవాడకు బయల్దేరింది. భువనేశ్వర్- బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు గంటల 40 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. దువ్వాడ వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సుమారు గంట పాటు ఆగిపోయింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వస్తున్న కోణార్స్ ఎక్స్‌ప్రెస్ పాయకరావుపేట రైల్వే గేట్ వద్ద సుమారు గంట పాటు ఆగిపోయింది. హౌరా- యశ్వంత్ పూర్ రైలు విశాఖకు ఉదయం 10.40 గంటలకు రావాల్సి ఉండగా రాత్రి 7 గంటలు దాటినా రాలేదు. యశ్వంత్ పూర్ - హౌరా రైలు మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ రావాల్సి ఉండగా ఆ రైలుది కూడా అదే పరిస్థితి. విశాఖ- తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సి ఉండగా సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరింది. విశాఖపట్నం- నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ కూడా మూడున్నర గంటలు ఆలస్యంగా నడిచింది. విశాఖ- హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి, గరీబ్థ్ రైళ్లను డీజిల్ ఇంజన్లతో నడిపారు. రైళ్ల రద్దు : మంగళవారం విశాఖ- భువనేశ్వర్ మధ్య నడిచే ఇంటర్సిటీ (రెండువైపులది) భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్- పాండిచ్చెరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వే పీఆర్వో జయరాం తెలిపారు. విశాఖ నుంచి బయలు దేరాల్సిన జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, తిరుమల, దక్షిణ్, లింక్, గరీభ్థ్, దురంతో, విశాఖ-నాన్దెడ్, కెఆర్పీయు-విశాఖ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లు మంగళవారం రద్దయినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. -
అంధకారంలో ఆంధ్రప్రదేశ్
-
ఉద్యోగుల మెరుపు సమ్మెతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం!
-
ఉద్యోగుల మెరుపు సమ్మెతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం!
రాష్ట్ర విభజనకు నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టడంతో రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయింది. విద్యుత్ సిబ్బంది మెరుపు సమ్మెతో ఉత్పత్తి సగానికిపైగా నిలిచిపోయింది. సుమారు 7వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తాజా సమాచారం. విద్యుత్ ఉత్పత్తి భారీ స్థాయిలో నిలిచిపోవడంతో హైదరాబాద్‌కు వేయిమెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సంక్షోభ ప్రభావంతో మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో కోతలు ప్రారంభకానుంది. రైల్వేలకు అవసరమైన 1500 మెగావాట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయే ప్రమాదం పొంచిఉంది. ఈ సమస్య ఆదివారం సాయంత్రానికి మరింత విషమంగా మారితే పరిస్థితులు అధ్వాన్నంగా మారుతాయని, రైళ్లను నడపడం తమ వల్లకాదు అని రైల్వే అధికారులు చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో దారుణంగా విద్యుత్ కోతలు ఇప్పటికే విధించారు. అనేక ప్రాంతాలకు కరెంట్ ను నిలిపివేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్య ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యక్షంగా చూపుతోంది. తమిళనాడు, కర్ణాటకల్లో విద్యుత్ కొరత నెలకొంది. గ్రిడ్ విఫలమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ రైల్వే గ్రిడ్ ఫెయిలైతే పునరుద్ధరణకు 5రోజులు సమయం పడుతుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. 30 వేల మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాలుపంచుకుంటున్నారని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విద్యుత్ సంక్షోభంతో విజయవాడ, రేణిగుంట మధ్య పలు పాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. అంతేకాకుండా విజయవాడ-ఒంగోలు, గూడురు-ఒంగోలు, తెనాలి-గూడూరు, తిరుపతి-గూడూరు స్టేషన్ల మధ్య రైళ్లను రద్దు చేశారు. వ్యవసాయ, ఆస్పత్రులకు, నీటి సరఫరా లాంటి అత్యవసర సేవలకు కూడా మినహాయింపులేదు అని జేఏసీ చైర్మన్ సాయిబాబా తెలిపారు. విభజనపై నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు సమ్మె విరమించేది లేదు అని హెచ్చరించారు. -
నేటి నుంచి నిరవధిక సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు
-
విభజనకు అనుకూలంగానే నా దీక్ష: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: అందరితో సంప్రదింపులు జరిపి రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ ఢిల్లీలో సోమవారం నుంచి తాను నిరవధిక దీక్ష తలపెట్టినట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సోమవారం నుంచి దీక్ష చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై తెలంగాణ, సీమాంధ్ర, హైదరాబాద్ నగర నేతలతో విడివిడిగా, ఆ తరువాత సీమాంధ్ర, తెలంగాణ నేతలతో ఉమ్మడిగా ఆయన సమావేశమయ్యారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. తన దీక్ష కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని ఇదే సమావేశంలో పలుమార్లు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ 2008లో తీసుకున్న నిర్ణయం, ప్రణబ్ కమిటీకి రాసిన లేఖ, ప్రధానికి రాసిన లేఖలు, అఖిలపక్షంలో చెప్పిన మాటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు పోనని, ఇప్పటి వరకూ తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, దీక్ష సమయంలో కూడా వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయనని చెప్పారు. విభజనను ఆపాల్సిందిగా తాను కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ చేయబోనని, ఇరు ప్రాంతాల జేఏసీలు, ప్రజా సంఘాల వారిని పిలిపించి చర్చలు జరపటంతో పాటు ఆందోళన చేస్తున్న సీమాంధ్ర వారికి న్యాయం చేయాల్సిందిగా మాత్రమే డిమాండ్ చేస్తానని చెప్పారు. ఈ దీక్షలో సీమాంధ్ర, తె లంగాణ ప్రాంత నేతలందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. సీమాంధ్రలో రెండు నెలల కంటే ఎక్కువ సమయం నుంచి ప్రజలు ఆందోళనలో ఉన్నారని, అలాంటపుడు వారి ఆందోళన గురించి పట్టించుకోకపోతే పార్టీని వారు పట్టించుకునే అవకాశం ఉండదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందిన తెలంగాణ నేతలు ఢిల్లీలో ఆయన చేసే దీక్షలో పాల్గొనేందుకు అంగీకరించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కలిసి చ ంద్రబాబు సోమవారం ఉదయం ఢిల్లీ వెళతారు. దీక్ష ప్రారంభించే ముందు వీలుంటే తాను లేదా పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ర్టపతి, ప్రధానిలను కలిసి ‘రాష్ట్ర విభజన చేయండి, అయితే అందరినీ సంప్రదించండి’ అంటూ వినతిపత్రం అందచేయనున్నారు. జన సమీకరణకు ఏర్పాట్లు... ఢిల్లీలో తాను చేసే దీక్షకు మద్దతుగా భారీ జన సమీకరణ చేయాల్సిందిగా నేతలకు చంద్రబాబు సూచించారు. వారం రోజుల పాటు నేతలందరూ ఢిల్లీలో ఉండేందుకు సిద్ధమై రావాలని, మీ మీ నియోజక వర్గాలు, జిల్లాల నుంచి ఢిల్లీ వెళ్లి నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించి వారు మద్దతు తెలిపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలకు బాధ్యతను అప్పగించారు. ప్రతి జిల్లా నుంచి రైళ్లలో ప్రజలు తరలి వచ్చేలా చూడాలని, ఇందుకు అవసరమైన ప్రత్యేక బోగీల ఏర్పాటును పార్టీ చూసుకుంటుందని చెప్పారు. ఆదివారం ఉదయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు మూడు అదనపు బోగీలు ఏర్పాటు చేయిస్తున్నామని, దీక్ష జరిగే సమయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మూడు ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరం నుంచి జన సమీకరణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక నేతలను ఆదేశించారు. దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు: సోమిరెడ్డి చ ంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష తెలంగాణకు వ్యతిరేకంగా కాదని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నారని, అందులో ఇరు ప్రాంతాల నేతలు పాల్గొంటారని చెప్పారు. -
సీమాంధ్ర బంద్ సంపూర్ణం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా ఏపీఎన్జీవోల పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యాసంస్థలు, వర్తక, వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు, పెట్రోలుబంకులు మూసివేశారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడ జాతీయరహదారులను దిగ్బంధించారు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోర్టు కార్యకలాపాలను అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్ అండ్ బీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య గల చించినాడ బ్రిడ్జిపై జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రాకపోకలు గంటలతరబడి నిలిచిపోయూరుు. కలకత్తా-చెన్నయ్ జాతీయ రహదారిని జిల్లాలో పలుచోట్ల దిగ్బంధించారు. విశాఖనగరంలో ఈపీడీసీఎల్ కార్యాల యంలో చేపట్టే బోర్డు మీటింగ్‌ను విద్యుత్ జేఏసీ, ఆర్టీసీ నేతలు అడ్డుకున్నారు. విజయనగరంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించగా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మహేంద్రతనయ వంతెనపై సమైక్యవాదులు ైటె ర్లు కాల్చి నిరసన తెలిపారు. హౌరా-చెన్నై జాతీయ రహదారిపై అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలోని బంటుమిల్లి రోడ్డు, బందరు వెళ్లే రోడ్డు, గుడివాడ రోడ్డులపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వంటావార్పు చేశారు. విజయవాడలోని గొల్లపూడి, కనకదుర్గమ్మ వారధి, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్ వద్ద ఎన్జీవో నేతలు రోడ్లపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. తిరువూరులో విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిపై కట్టెలేరు వంతెన వద్ద బైఠాయించిన జేఏసీ నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గుంటూరులోని ఆటోనగర్, వీఎస్సార్ కళాశాల, కఠెవరం గ్రామాల వద్ద తెనాలి విజయవాడ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు చర్చి సెంటర్లో క్రైస్తవులు మానవహారం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీరాలలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించారు. ఎనిమిది వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి గండికి పాదయాత్రను చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 24 మంది వికలాంగులు 24 గంటల దీక్ష చేపట్టారు. బంద్ నేపథ్యంలో బెంగళూరు-హైదరాబాద్(44వ), కర్నూలు-చెన్నై(18) జాతీయ రవాహదారులను సమైక్యవాదులు దిగ్బంధించి వాహనల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడలిలో దర్జీలు నడిరోడ్డుపై కుట్టు మిషన్లతో నిరసన తెలిపారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలను పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ సమైక్యాంధ్ర ప్రకటనే ప్రధాన డిమాండ్‌గా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు అక్టోబర్ 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లోని విద్యుత్ ఉద్యోగులతో పాటు హైదరాబాద్ విద్యుత్‌సౌధలోని ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా గర్జన కార్యక్రమానికి హాజరు కావాలని గుంటూరులో జరిగిన రాష్ట్ర విద్యుత్ జేఏసీ సమావేశం నిర్ణయించింది. నేడు అనంత రైతు రంకె అనంతపురం: సమైక్యాంధ్ర వాణిని వినిపించేందుకు బుధవారం అనంతపురంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘అనంత రైతు రంకె’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
20 నుంచి మార్కెటింగ్ శాఖ జేఏసీ నిరవధిక సమ్మె
విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపడుతోంది. శనివారం కృష్ణాజిల్లా గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో 13 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులు, సీఎంఎఫ్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ ఉద్యోగుల సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ రామాంజనేయులు (కడప జేడీ) మాట్లాడుతూ, ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి సమావేశం తీర్మానించిందన్నారు. ఎన్జీఓలు ఎప్పటివరకు బంద్ నిర్వహిస్తారో అప్పటివరకు మార్కెటింగ్ శాఖ జేఏసీ నిరవధిక సమ్మెలో కొనసాగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు, ప్రిన్సిపల్ కార్యదర్శికి నిరవధిక సమ్మె నోటీసులను అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యాలయాలను మూసివేసి, విధులను బహిష్కరిస్తామన్నారు. 26 మందితో జేఏసీ 26 మంది ఉద్యోగులతో ఏర్పడి న జేఏసీ చైర్మన్‌గా కడప జేడీ రామాంజనేయులు, కో- చైర్మన్లుగా ఆర్. లక్ష్మణుడు (వైజాగ్ జేడీ), డెప్యూటీ డెరైక్టర్ సుధాకర్ (వైజాగ్), రామ్మోహన్‌రెడ్డి (అనంతపురం కార్యదర్శి), కె. జయశేఖర్ (విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), కన్వీనర్‌గా డెప్యూటీ డెరైక్టర్ ఎం. దివాకరరావు (విజయవాడ), కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, శ్రీధర్, దాస్, చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, కిశోర్, గోవిందులతోపాటు ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున కార్యవర్గ సభ్యులుంటారు. -
కొనసాగుతున్న వైయస్ జగన్ నిరాహార దీక్ష
-
నంద్యాలలో జగన్ దీక్షపై ప్రజల స్పందన
-
వైఎస్ జగన్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు: జైలు అధికారులు
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని జైలు అధికారులు ధృవీకరించారు. ఈ సాయంత్రం వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని జైలు డాక్టర్లు పరిశీలించారు. వైఎస్ జగన్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు అని జైలు అధికారులు తెలిపారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆలోచింపజేయలేకపోతున్నాయని చాలా బాధగా ఉంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన తీరు పట్ల ఆవేదనగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇంత కీలక సమయంలో వారి ఓట్లు, సీట్ల కోసం మౌనం వహించటం, అవకాశవాద రాజకీయాలు చేస్తుండటం బాధ కలిగిస్తోంది. స్పందించవలసిన ఈ సమయంలో మనం స్పందించకపోతే ఈ రాష్ట్రం ఏడారి అవుతుంది. కాబట్టి రేపటి నుంచి (ఆదివారం) జైలులోనే నేను నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఐదురోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి దీక్ష, విషమంగా ఆరోగ్యం!
రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టినద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆరోగ్యం విషమంగా మారింది. గత ఐదు రోజులుగా వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అవినాశ్ రెడ్డిని వైద్యులు పరీక్షించారు. ఐదు రోజుల దీక్షలో బ్లడ్ షుగర్, సోడియం లెవల్ ఎక్కువ మోతాదులో తగ్గాయని వైద్యులు తెలిపారు. దీక్ష విరమించాలని, లేకపోతే అవినాశ్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమంగా మారే ప్రమాదముంది అని వైద్యులు హెచ్చరించారు. అయితే వైద్యుల, పార్టీ నేతల విజ్క్షప్తిని వైఎస్ అవినాష్ రెడ్డి తిరస్కరించారు. -
3 నుంచి నిరవధిక సమ్మె
* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ప్రకటన * ‘తెలంగాణ’ నిర్ణయాన్ని పునస్సమీక్షించేదాకా కొనసాగిస్తామని స్పష్టీకరణ * సచివాలయంలో కొనసాగిన ఆందోళన.. నలుపురంగు దుస్తులు ధరించి నిరసన * హైదరాబాద్ అందరిదంటూ నినాదాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బుధవారం కలిసి సమ్మె నోటీసు అందజేస్తామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారమూ తమ ఆందోళన కొనసాగించారు. ఉద్యోగులందరూ నలుపురంగు దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచివాలయ ప్రధాన ద్వారం, సీఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. హైదరాబాద్ అందరిదని, రాజధానిని వదిలిపోమని నినదించారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం నేతలు మీడియాతో మాట్లాడారు. 15 రోజులకుపైగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోనందున నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు ప్రకటించారు. సమ్మె విషయంలో వెనక్కితగ్గబోమని, కేంద్రం తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే వరకూ ఎన్ని నెలలైనా సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. ఎస్మాలకు భయపడేది లేదన్నారు. తమ ఉద్యమం వెనుక సీమాంధ్ర నాయకులున్నారన్న ఆరోపణలు అవాస్తవాలని, తామింతవరకూ సీఎంను తప్ప మరే ఇతర సీమాంధ్ర నేతనూ కలవలేదని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులను వలసవాదులని పేర్కొనడం సరికాదన్నారు. రాజధానికి వచ్చిన వారంతా వలసవాదులైతే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తదితర తెలంగాణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చినవారు కూడా వలసవాదులే అవుతారన్నారు. తెలంగాణ ఉద్యోగులతో తమకెలాంటి ఘర్షణ లేదని, తామంతా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నామని, అయితే ఎవరి హక్కులకోసం వారు పోరాడటంలో తప్పులేదని అన్నారు. సమావేశంలో ఫోరం నేతలు కె.వి.కృష్ణయ్య, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉద్యోగుల నిరసన ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు. రాజకీయ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ఉద్యోగులకు సూచించారు. మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్‌లో నేటి నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్టు ఉద్యోగుల సంఘం చైర్మన్ సీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. మంగళవారం జరిగిన సీమాంధ్ర ప్రాంత అధికారులు, సిబ్బంది సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పీ మునిరాజు, జాయింట్ డెరైక్టర్లు ఈవీ స్వర్ణలత, కే శ్యామసుందరి, ఎం.విజయలక్ష్మి, విశాలాక్షి, ఎం.శారద, పీ సోమశంకర్, కే లక్ష్మీదేవి పాల్గొన్నారు. 22 నుంచి ఉపాధ్యాయులు... రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ప్రకటించింది. ఈ మేరకు సమితి ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి సమ్మె నోటీసులు ఇచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు సమ్మె లో పాల్గొంటారని సమితి చైర్మన్ కమలాకరరావు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బచ్చ ల పుల్లయ్య, శ్రీనివాసులునాయుడు ప్రకటించారు. సమ్మెబాటలో ఏపీ వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర విభజన నిరసిస్తూ సమ్మె బాట పట్టనున్నట్టు ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె. ఓబుళపతి తెలిపారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితితో కలిసి సమ్మెలో పాల్గొంటామన్నా రు. 13 జిల్లాలకు చెందిన వైఎస్సార్‌టీఎఫ్ సభ్యులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
నిరవధిక సమ్మె దిశగా సచివాలయ ఉద్యోగులు
ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమాయాత్తమవుతున్నారు. నిరవధిక సమ్మెకు దిగడానికీ వెనకాడకూడదని శనివారం జరిగిన ‘సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం’ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. వారితో కలిసి సమ్మెకు దిగడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో తీర్మానించారు. త్వరలో తేదీలు ఖరారు చేయనున్నారు. కార్యవర్గం భేటీకి ముందు సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి సచివాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఎల్-బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. సీమాంధ్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని, యూపీఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, హైదరాబాద్ అందరిదీ అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్-బ్లాక్ నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శన సీ-బ్లాక్ మీదుకు మళ్లీ ఎల్-బ్లాక్‌కు చేరింది. సీమాంధ్ర ఉద్యోగుల నినాదాలతో సచివాలయం హోరెత్తింది. ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, కోచైర్మన్ మురళీమోహన్, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య, కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కోఆర్డినేటర్ రవీంద్ర, వైస్‌చైర్మన్ బెన్సన్, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించారు.