YSR Asara Scheme
-
డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు, దు్రష్పచారాన్ని వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల డీబీటీ చెల్లింపులను ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా తదితర పథకాల లబ్దిదారులకు చివరి దశ చెల్లింపులను చంద్రబాబు బృందం అడ్డుకుంది. పేదల పొట్ట కొట్టేలా పోలింగ్‌కు ముందు పచ్చ బ్యాచ్ ఫిర్యాదులు చేయడంతో డీబీటీ చెల్లింపులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసింది. పోలింగ్ ముగిసిన తరువాత చెల్లింపులు చేయాలని, పోలింగ్‌కు ముందు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాలు గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని, కొత్తవి కాదని, లబ్ధిదారులు కూడా పాతవారే తప్ప కొత్తవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ, చంద్రబాబు బృందానికి అనుకూలంగా ఈసీ వ్యవహరించింది. పోలింగ్ ముగియడంతో పేద లబ్దిదారులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పథకాల చెల్లింపులను ప్రారంభించింది. పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందించిన వైఎస్సార్ ఆసరా పథకం నిధులు రూ.1,480 కోట్లను డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే పేద విద్యార్ధులకు ఫూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన కింద డీబీటీ ద్వారా రూ.502 కోట్లు చెల్లించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా పథకాల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది.ముందే అనుమతి కోరినా సాగదీసి.. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న పథకాల లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ కోసం పోలింగ్ తేదీకి చాలా ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. తెరవెనుక చంద్రబాబు అండ్ కో చేసిన మంత్రాంగంతో ఎన్నికల సంఘం ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చకుండా సాగదీసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దంటూ ఉత్తర్వులిచ్చింది. దీని వెనుక పచ్చ బ్యాచ్ ఒత్తిడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఉత్తర్వులను ఈనెల 10వ తేదీన ఒకరోజు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పథకాల డీబీటీ చెల్లింపులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది. ఈసీ తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, 10వ తేదీన సమయం మించిపోవడంతో లబి్ధదారులకు పథకాల మేలు నిలిచిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో పేదలకు నగదు చెల్లింపులను ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నికల కోసం ఈ పథకాలను అమలు చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందనే అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ పథకాల నిధుల విడుదలకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: లబ్దిదారులకు వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినివ్వకపోవడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని గుంటూరు నగరానికి చెందిన కె. వెంకటదుర్గాదేవి, జె. రత్నకుమారి దాఖలు చేశారు. ఆసరా కింద వెంటనే నిధుల విడుదలకు ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు.అలాగే, వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ఈసీ అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి. శివపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీచేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ లంచ్‌మోషన్ రూపంలో బుధవారం అత్యవసరంగా విచారణ జరిపారు. నిధుల పంపిణీ ఆవశ్యకతపై వినతిపత్రాలిచ్చాం.. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాల కింద నిధుల పంపిణీకి ఈసీ అనుమతిని నిరాకరించిందన్నారు. లబి్ధదారుల గుర్తింపు ఎప్పుడో పూర్తయిందని, నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈ రెండు పథకాలు కొత్తవి కావని, నాలుగేళ్లుగా అమలవుతున్నాయని చెప్పారు. నిధుల పంపిణీకి బ్రేక్‌వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధుల పంపిణీ అత్యవసరాన్ని వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు ఇచ్చిందన్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని గురువారం ఉదయం కోర్టు ముందుంచేలా ఈసీని ఆదేశించాలని ఆయన కోరారు. మీ నిర్ణయాన్ని మా ముందుంచండి.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా పథకాల కింద లబి్ధదారులకు నిధుల పంపిణీ విషయంలో అత్యవసరాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకుని, దానిని ప్రొసీడింగ్స్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ఆదేశించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. చేయూత, విద్యాదీవెన నిధుల పంపిణీ నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యాలతో తాజా వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మహిళలు ఇబ్బంది పడతారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నాలుగు విడతల్లో నిధులను విడుదల చేస్తుందన్నారు. ఈ పథకం కింద 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 79.84 లక్షల మంది ఈ నాలుగేళ్లలో రూ.25,570 కోట్ల మేర లబ్దిపొందారన్నారు. ఇప్పటికే మూడు విడతల కింద రూ.4,551 కోట్ల మేర నిధులు పంపిణీ చేశామని, నాల్గవ విడత కింద రూ.1,843 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిని నిరాకరించిందన్నారు. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద రూ.15వేల ఆర్థికసాయం అందిస్తోందన్నారు. మూడు విడతలుగా ఈ మొత్తం చెల్లించారని.. ఇప్పడు మరో విడత మొత్తం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే, ఈబీసీ నేస్తం కింద నిధుల పంపిణీకి కూడా ఈసీ అనుమతిని నిరాకరించిందని తెలిపారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక అవసరాలకు అప్పులుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యంచేసుకుని నిధుల పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని కోరారు. -
నాడు బతుకు భయం..నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. భూమి సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు వారు ఎంతిస్తే అంత తీసుకుని బతుకు గడిచిపోతే చాలనుకున్న స్థితికి చేరుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. కట్టుకునేందుకు సరైన బట్టలే లేని వారికి ఉండే ఇల్లు ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. బతుకుపై మళ్లీ ఆశలు కల్పించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. (ఎ.చంద్రశేఖరరావు, విలేకరి, బూర్జ) అడగకుండానే.. అన్నీఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క నయాపైసా సహాయం అందలేదు. కుటుంబ ఖర్చులకు కూడా నానా అవస్థలు పడేవాళ్లం. చిన్నపాటి అవసరాలకూ అప్పులు చేయాల్సి వచ్చేది. మా ఇద్దరు పిల్లలూ బధిరులే అయినా ఎలాంటి సాయమూ అందలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ నెల పండగే. ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. ఏడు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా దానిని ప్రభుత్వం సాయంతో ఎదుర్కోగలమనే నమ్మకం ఏర్పడింది. మా అబ్బాయి చంద్రశేఖర్‌కు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహంతో కొత్త కుట్టుమెïÙన్ కొన్నాం. బట్టలు కుట్టుకుంటూ వచ్చిన కుట్టుకూలితో ఆనందంగా బతుకు తున్నాం. రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – వారణాసి కుమార స్వామి సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వల్ల నిరుపేదలకు అత్యవసర వేళ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఇంకా ఉన్నత విద్యకోసం విద్యాదీవెన, వసతి దీవెన, నిరుపేదలకు ఇళ్లు వంటివి ఎంతోమందికి అందాయి. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా జరిగి వారిలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీనివల్ల వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం వల్ల పరోక్షంగా రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఎందో ఉపయోగపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ గత ప్రభుత్వ హామీలు నీటిమీద రాతలు 2014లో లెక్కలేనన్ని హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఫలితంగా కమారస్వామి లాంటి వారి ఆశలు అడియాసలయ్యాయి. డ్వాక్రా రుణమాఫీ కాకపోవడం... కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవ డం... మరే ఇతర సౌకర్యాలు అందకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఏనాటికైనా ప్రభుత్వ సహాయం అందకుండా పోతుందా... అని నెలల తరబడి నిరీక్షించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పిల్లల పోషణకు తోడ్పాటు అందక, కుటుంబ అవసరాలు తీర్చే ఆధారం లేక, ఒంటికి కష్టం వస్తే నయం చేయించుకునే శక్తి లేక, పెరిగిన కుటుంబానికి తగినంత ఇల్లు లేక రోజు వారీ బతుకులు భారమై పో యాయి. అప్పుడప్పుడు పస్తులు ఉండాల్సి వచ్చేది. -
మహిళకు భరోసానిస్తోన్న వైఎస్సార్ ఆసరా పథకం
-
జగనన్న చేసే ప్రతి ఆలోచన మహిళా పక్షపాతమే..!
-
వైయస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు..!
-
సీఎం జగన్ మహిళల ఆత్మగౌరవం పెంచారు - డిప్యూటీ సీఎం
-
ఆసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య
-
వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం
-
AP: పేదరికంపై గెలుపు.. మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు
ఉండటానికి ఇల్లు.. తినటానికి తిండి.. కట్టుకోవటానికి బట్ట... ఈ మూడూ లేక ఇబ్బందులు పడేవారే పేదలన్నది ఒకప్పటి ప్రాతిపదిక. కానీ రోజులు మారాయి. ఈ మూడూ ఉండటమే కాదు... అవి నాణ్యంగా ఉండాలి. నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగించటానికి అవసరమైన సదుపాయాలు వారికి అందుబాటులోకి రావాలి. అదిగో... అప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు. స్థూలంగా చెప్పాలంటే వీటన్నిటినీ సాధించడానికి పేదల ఆదాయాలు పెరగాలి. అలా పెరగటంతో పాటు... భవిష్యత్తుపై భరోసా ఉండేలా వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గృహ వసతితో పాటు తాగునీరు, పౌష్టికాహారం అందటం.. మాతా శిశు మరణాలు తగ్గటం... ఇవన్నీ జరిగితేనే పేదరికం తగ్గినట్లని నీతి ఆయోగ్ స్పష్టంచేసింది. నాణ్యమైన విద్య, వైద్యం అందితే పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొంది. విశేషమేమిటంటే... నవరత్నాలతో పేదలకు అండగా నిలిచి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.4.21 లక్షల కోట్లను పేదలకు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఇక్కడ పేదలు గడిచిన నాలుగున్నరేళ్లలో ఏకంగా 1.87 శాతం తగ్గారు. పేదరికం ఇప్పుడు 4.19 శాతానికి మాత్రమే పరిమితమయింది. ఇదీ... కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించిన వాస్తవం. ఇదీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన మార్పు. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పథకాల ద్వారా జాతీయ స్థాయిలో 2019–21లో 14.96 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గించిందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం నవరత్నాలతో 2019–21లో 6.06 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గించిందని కూడా తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో వైఎస్.జగన్ సర్కారు డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా పేదలకు రూ.4.21 లక్షల కోట్లను సాయంగా అందించటంతో ఎక్కడికక్కడ మహిళలు సైతం తమ కాళ్లపై నిలబడి సొంత వ్యాపారాలు చేసుకోవటం... ప్రతి ఒక్కరూ పిల్లల్ని స్కూళ్లకు పంపించటంతో గ్రాస్ ఎన్రోల్మెంట్రేíÙయో ఏకంగా 100 శాతానికి చేరటం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక వివరించింది. 2015–16 సంవత్సరం, 2019–21 సంవత్సరం, 2022–23 సంవత్సరాల్లో దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ పేదరికం ఎలా తగ్గుతూ వస్తోందనే విషయాన్ని నీతి ఆయోగ్ ఈ నివేదికలో వెల్లడించింది. పౌష్టికాహారం అందుతోందా? శిశు మరణాల రేటు ఎలా ఉంది? తల్లుల ఆరోగ్యం మెరుగుపడిందా? పాఠశాలలకు పిల్లల హాజరు శాతం ఎంత? వంటకు ఏ రకమైన ఇంధనం వినియోగిస్తున్నారు? పరిశుభ్రత పరిస్థితులు, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు చెందిన బహుముఖ సూచికల ఆధారంగా పేదరికం శాతాన్ని నీతి ఆయోగ్ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందించటం, పారిశుద్ధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలపై తీసుకుంటున్న చర్యలు కారణంగా పేదరికం శాతం గణనీయంగా తగ్గిందని నివేదికలో వివరించింది. ప్రజల జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. నిబద్ధతతో వేగంగా అడుగులు... రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోంది. దీంతో పేదరికం శాతం కూడా అదే స్థాయిలో తగ్గుతోంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ భారం లేకుండా రుణాలు అందజేయటం... ఇలా పలు కార్యక్రమాలు చేపడుతూ వరుసగా నాలుగేళ్ల పాటు ఫోకస్డ్గా పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అంతే కాకుండా నవరత్నాల్లో ప్రతి పథకాన్నీ పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకు రావటానికే అన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంది. పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపడాన్ని ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తూనే... ఆ స్కూళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని నాణ్యమైన విద్యను అందించటానికి వేల కోట్ల రూపాయల్ని ఖర్చుచేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. చదువు చెప్పే తీరును, చదువుకునే పద్ధతిని ఆధునిక స్థాయిలకు తీసుకెళ్లి సమూలంగా మార్చింది. అలాగే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను, స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. ఇక వైద్య సేవల విషయంలో ఈ రాష్ట్రంలో పేదలకున్న భరోసా మరెక్కడా లేదనే చెప్పాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవల్ని ఏకంగా రూ.25 లక్షల పరిమితి వరకూ అందిస్తోంది. వీటన్నిటితో పాటు నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31.91 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణాలనూ చేపట్టింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి పెద్ద పీట వేస్తూ అత్యధికంగా వ్యయం చేస్తుండటంతో రాష్ట్రంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ‘ఆసరా’ సంకల్పం సాకారమైన వేళ.. ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుకుంటే... కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబ పరిస్థితి మెరుగుపడితే... ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊళ్లన్నీ పురోగమిస్తే రాష్ట్రం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఇదే సిద్ధాంతాన్ని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మహిళలకు ఆసరా కల్పించేందుకు సంకల్పించారు. 2014 ఏప్రిల్ 11వ తేదీనాటికి బ్యాంకుకు బకాయిపడిన మొత్తాన్ని వారు సక్రమంగా చెల్లిస్తే నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా కింద వాపసు చేస్తానని హామీ ఇచ్చారు. దానిని తూచా తప్పకుండా పాటించారు. ఆయన ఆలోచన నిజమైంది. ఆయన సంకల్పం సాకారమైంది. ఇప్పుడు ఆసరా అందించిన తోడ్పాటుతో ఎంతగానో ఎదుగుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన లక్ష్మీదేవి పాడిపశువుల పెంపకం చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు కమలమ్మ ఓ ఇంటినే కొనుగోలు చేశారు. ఏలూరు జిల్లాకు చెందిన సుంకరబుజ్జమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. ఇలాంటి విజయగాథలు చాలవా... జగనన్న సంకల్పం ఎంతగొప్పదో? – సాక్షి, నెట్వర్క్ పాడి వ్యాపారంతో కుటుంబానికి బాసట మాది వైఎస్సార్ జిల్లా ముద్దనూరు. నేను శివ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ఆసరా పథకం కింద అందిస్తున్న డ్వాక్రా రుణమాఫీ సొమ్మును పాడి పశువుల పెంపకానికి వినియోగిస్తున్నాను. ఇప్పటివరకూ ఏడాదికి రూ.18,750లు వంతున మొత్తం రూ.75వేలు వచ్చింది. ఆ సొమ్ముతో పాడిపశువులు కొని పాల వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు నేను కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాను. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – లక్ష్మీదేవి, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ముద్దనూరు వైఎస్సార్ జిల్లా ఇల్లు కొనుగోలుకు సాయపడింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని దోర్నాదులవారి వీధికి చెందిన ఈమె పేరు గూడూరు కమలమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పొదుపు గ్రూపులో సభ్యురాలైన ఈమెకు వైఎస్సార్ఆసరా పథకం కింద ఏడాదికి రూ.16,780 వేల చొప్పున ఇప్పటివరకూ రూ.67,120 నగదు ఆమె వ్యక్తిగత ఖాతాలో జమయింది. ఆ మొత్తంతో తాము అద్దెకు ఉంటున్న ఇంటినే కొనుగోలు చేయగలిగామనీ, పిండిమర ఇంట్లో ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. కేవలం సీఎం జగన్ వల్లే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. – గూడూరు కమలమ్మ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా కూరగాయల వ్యాపారానికి ఆధారం ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఈమె పేరు సుంకర బుజ్జమ్మ. వనిత గ్రూపు సభ్యురాలైన ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ముగ్గురు పిల్లల పోషణభారం ఈమెపై పడింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు రాగా ఆ మొత్తంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. దీనికి మరో రూ.2 లక్షల రుణంతో వ్యాపారం విస్తరించారు. ఇప్పుడు పిల్లలను గౌరవంగా చదివించగలుగుతున్నానన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. – సుంకర బుజ్జమ్మ, మండవల్లి, ఏలూరు జిల్లా బిడ్డల చదువుకు తోడ్పడుతున్నా... ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.60 వేలు వచ్చాయి. వీటితో చిల్లరకొట్టు, కూరగాయల వ్యాపారం చేస్తున్నా. వచ్చిన ఆదాయంతో మా పాప ఇంజినీరింగ్, మా బాబును సివిల్స్ కోచింగ్‌కు పంపాం. వారిద్దరికీ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన వచ్చాయి. సీఎం జగనన్న సాయంతోనే మా కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుంది. – మిర్యాల ఉషారాణి, ఈలప్రోలు, ఎన్టీఆర్ జిల్లా -
ఆలంబనగా.. ఆసరా
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహిళలు తాము పొందిన లబ్దికి కృతజ్ఞతగా అనేకచోట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. చంద్రబాబు మాటలతో తాము ఐదేళ్ల కిందట మోసపోయామని 2019 ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన మాట ప్రకారం నాలుగేళ్లుగా తమకు లబ్ది చేకూరుతోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసరా సొమ్ముతో తమకాళ్లమీద తాము నిలబడేలా వ్యాపారాలు చేస్తున్నామని చెబుతున్నారు. – సాక్షి, నెట్వర్క్ దన్నుగా నిలిచిన ఆసరా సొమ్ము ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు భుక్యా శివమ్మ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం. ఐదేళ్ల క్రితం ఆమె భర్త కోటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యాడు. తీసుకున్న డ్వాక్రా రుణం అప్పు తీర్చలేక, కుటుంబ ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వైఎస్సార్ ఆసరా సొమ్ము రూ.12 వేలు జమయ్యాయి.వాటితో హైవే పక్కనున్న ఇంటి వద్ద హోటల్, టీ స్టాల్ పెట్టుకున్నారు. కుటుంబ ఖర్చులు, ఆమె భర్త వైద్య ఖర్చులు హోటల్ సంపాదనతోనే నెట్టుకొస్తున్నారు. ఆ తర్వాత ఆసరా సొమ్ము రూ.48 వేలు, జమయ్యాయి. అనంతరం వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.50 వేలు మంజూరయ్యాయి. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ ప«థకాలతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది. నాడు చేటు– నేడు ‘స్వీటు’ ఈమె పేరు పి.హైమావతి. అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రం. శ్రీలక్ష్మి వెంకటేశ్వర డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో రూ.32,800 లబి్ధపొందింది. ఆ నిధులతో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి వద్దే తినుబండారాల తయారీ కేంద్రం (స్వీటు షాపు) ఏర్పాటు చేసుకుంది. ఇందులో ప్రతి పైసా వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లాంటి రుణాలు తీసుకుంది. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంది. ఇతరులకూ ఉపాధి కల్పిస్తోంది. పాడిగేదెలు కొన్నాం నాలుగు దఫాలుగా నా అకౌంట్లో పడిన ఆసరా డబ్బులతో మేము పాడి గేదెలు కొన్నాము. ప్రస్తుతం పాల వ్యాపారం చేస్తూ సంతోషంగా బతుకుతున్నాం. వైఎస్సార్ ఆసరా పథకంతో మా కుటుంబానికి ఎంతో ఆసరా వుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏనాడూ డ్వాక్రా మహిళల అభ్యున్నతి గురించి పట్టించుకోలేదు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత పొదుపు సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం ఆసరా నిధులు జమ చేస్తూనే ఉన్నారు. గతలో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితులు లేవు. – గర్నెపూడి ఇమాంజలీ, అంబేడ్కర్‌నగర్ కాలనీ, కారంచేడు, బాపట్ల జిల్లా ఆసరా సొమ్ముతో మేకలు కొన్నాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పొదుపు సంఘాలకు రుణమాఫీ 4 విడతలుగా అందించారు. నాకు 4 విడతలుగా మొత్తం రూ.44,800 నా వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు జమ అయింది. వ్యవసాయ పనులు చేసుకొని జీవనం సాగించే మా కుటుంబం జగనన్న సాయంతో మేకలు కొనుగోలు చేసి జీవిస్తున్నాము. వీటివల్ల ఆదాయం మెరుగైంది. మాట తç³్పకుండా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేలా చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం. – చిట్టేటి పావని, తోటవీధి, ఆత్మకూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆసరా కొండంత అండ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పటివరకు నాకు నాలుగు విడతలుగా ఆసరా మొత్తం జమ అయింది. సంవత్సరానికి రూ. 16 వేలు అందుతున్నాయి. డ్వాక్రా గ్రూపులో పది మంది మహిళలు ఉన్నారు. నేను కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా నిలిచిన జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – పాలెం అరుణ, 48వ డివిజన్, కడప, వైఎస్సార్ జిల్లా -
ఉత్సాహంగా ఆసరా సంబరాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చెప్పినట్లుగానే 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళల పొదుపు సంఘాల్లో వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వం నేరుగా నిధులు జమచేసింది. మహిళల పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తం రూ. 25,570.80 కోట్లను ఆసరా పథకంలో భాగంగా నాలుగు విడతల్లో అందజేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఔదార్యానికి పొదుపు సంఘాల మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నెల 23 నుంచి నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ కార్యక్రమం మొదలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాటికి ఎస్ఎల్బీసీ గణాంకాల ప్రకారం 78,94,169 మంది మహిళల పేరిట రూ. 25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉన్నాయి. దీంతో వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వం 2020 సెపె్టంబరు 11న మొదట విడతగా రూ. 6,318.76 కోట్లు.. 2021 అక్టోబరు 7న రెండో విడతగా రూ.6,439.52 కోట్లు.. 2023 మార్చి 25న మూడో విడతగా రూ.6,417.69 కోట్లుచెల్లించింది. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది జనవరి 23 నుంచి నాలుగో విడత రూ. 6,394.83 కోట్లు మహిళల ఖాతాలో జమ చేస్తోంది. చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా మాఫీ చేయకుండా మోసం చేయడంతో మహిళలు డీలా పడిపోయారు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞలు చెబుతున్నారు. మండలాలు, మున్సిపల్ వార్డుల్లో సమావేశాలు పొదుపు సంఘాల మహిళలు సభలు నిర్వహించుకుని తమకు మంచి చేసే ఈ ప్రభుత్వానికే ఎప్పటికీ కృతజ్ఞలుగానే ఉంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఆసరా నాలుగో విడత పంపిణీని పండుగలా రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్దిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో 62 మండలాలు, 18 మున్సిపాలిటీల పరిధిలో ఆయా స్థానిక ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశాలు జరిగాయి. శనివారం 9 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో ఆయా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళా లబ్దిదారులతో కలిసి వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో డ్వాక్రా మహిళలకు రూ.14.57 కోట్ల విలువ చేసే ఆసరా నాలుగో విడత చెక్కు అందించడాన్ని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీ,నివాసరెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
మా జీవితాలు మారాయి..మళ్లీ జగనన్నకే మా ఓటు
-
ఆసరా వేడుక.. పుట్టింటి కానుక
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు పండుగలా సాగుతున్నాయి. పుట్టింటి నుంచి వచ్చిన కానుకలా భావిస్తూ అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు తీసుకునేటప్పుడు వారి మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. పండుగ వాతావరణవంలో ప్రజాప్రతినిధులు చెక్కుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇంత పెద్ద మనస్సుతో ఆర్థికంగా ఆదుకుంటారని తాము కలలో కూడా ఊహించుకోలేదని మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా నిధులు తమ అకౌంట్లో జమ అవుతుంటే అక్కచెల్లెమ్మల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. – సాక్షి నెట్వర్క్ పండ్ల వ్యాపారం ఫలించింది నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చాలా కాలంగా ఉన్నాను. గతంలో రుణం తీసుకున్నప్పటికీ తిరిగి కట్టడానికి మాత్రమే అవి సరిపోయేది. సీఎం జగన్ దయ వల్ల ఆసరా ద్వారా నాలుగు విడతలుగా, విడతకు రూ.16,200 చొప్పున మొత్తం రూ.64,800 రుణమాఫీ అయ్యింది. వాటితో అప్పటి వరకు చిన్నగా చేస్తున్న పండ్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాను. బ్యాంకు అధికారులు మరో రూ.2 లక్షల రుణం ఇచ్చారు. వ్యాపారం కోసం ఇప్పుడు వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. – ముచ్చర్ల సత్యకుమారి, రేలంగి, ఇరగవరం మండలం, పశ్చిమగోదావరి జిల్లా చీరల వ్యాపారం చేస్తున్నా.. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు రూ.5.68 లక్షలు రుణమాఫీ అయ్యింది. మాకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.14,200 చొప్పున నాలుగేళ్లకు 56,800 వచ్చింది. దీంతో నేను చీరల వ్యాపారం చేస్తున్నా. అప్పులు తెచ్చి వ్యాపారం చేద్దామంటే వడ్డీలకే సరిపోతుంది. కానీ సీఎం వైఎస్ జగన్ పొదుపు సంఘాల్లో ఉన్న మాకు రుణ మాఫీ చేసి నిలబెట్టారు. – ఉప్పర ఉమాదేవి, మద్దికెర, కర్నూలు జిల్లా టైలరింగ్ ద్వారా ఇద్దరికి చేయూత నేను టైలరింగ్ చేస్తాను. నా భర్త కార్పెంటర్. జగనన్న అందించిన ఆసరా ఒకటి రెండు విడతలు డబ్బులతో కుట్టు మిషన్ కొనుగోలు చేశాను. తర్వాత అందించిన డబ్బులతో ఒక ఎలక్ట్రికల్ మిషన్, ఒక జిగ్‌జాగ్ మిషన్ కొనుగోలు చేశాను. మరో ఇద్దరు మహిళలను సహాయకులుగా పెట్టుకుని వారికి కూడా చేయూతనిస్తున్నాను. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలి. – ఎన్.స్వాతి, సింగుపురం, సాయిరాం స్వయం శక్తి సంఘం, శ్రీకాకుళం ‘ఆసరా’ ఆదుకుంది ఈమె పేరు ఏకుల వాణి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని అనంతరాయయేని గిరిజన కాలనీలో ఉంటారు. ఈమెకు ఇద్దరు కుమారులు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందారు. సరస్వతి పొదుపు గ్రూపు సభ్యురాలిగా ఉన్న ఈమెకు గతంలో సక్రమంగా రుణాలు వచ్చేవి కావు. ఈమె గ్రూపునకు 2019లో రూ.3 లక్షల రుణం మంజూరైంది. వాటితో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా నగదును ఆమె ఖాతాలో జమ చేశారు. మొత్తం రూ.32 వేలు ఆమె ఖాతాలో జమైంది. దీంతో ఆమె నిర్వహిస్తున్న బడ్డీకొట్టును ఫ్యాన్సీ దుకాణంగా మార్చుకుని సంతోషంగా వ్యాపారం సాగిస్తోంది. ‘సొంత అన్న’లా ఆదరిస్తున్నాడు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు అంతపు లీల. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం. సరస్వతి డ్వాక్రా గ్రూపు సభ్యురాలిగా ఉంది. ‘వైఎస్సార్ ఆసరా’ పథకంలో భాగంగా డ్వాక్రా రుణ మాఫీ కింద ఈమెకు ఏడాదికి రూ.12,600 ప్రకారం నాలుగేళ్లకు రూ.50,400 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది. అంతేకాకుండా పావలా వడ్డీతో రూ.లక్ష రుణం తీసుకున్న ఈమె కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటోంది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కృషి మరువలేమని, అన్నలా ఆదరిస్తున్న ఆయనకు అండగా ఉంటామని ఆనందంగా చెబుతోంది. ఈ ప్రభుత్వ మేలు మరువలేం ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మాదాసు జమున. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు. ఈమె భర్త నాగబాబు లారీ క్లీనర్. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తొలుత జమున ఓ దుకాణంలో పని చేసేది. ఈమె సభ్యురాలిగా ఉన్న ‘వెలుగు దీపం’ గ్రూపునకు ఆసరా ద్వారా రుణ మాఫీ వర్తించింది. వరుసగా మూడు విడతల్లో సుమారు 40వేలు లబ్ధి చేకూరింది. డ్వాక్రా గ్రూపు ద్వారా రూ.4 లక్షలు రుణ సహయం పొందింది. దీంతో టిఫిన్ బండి పెట్టుకుంది. చిరు వ్యాపారులకు సీఎం జగన్ అందించే రుణ సహయం కూడా తోడైంది. ఇప్పుడు ఆసరా ద్వారా వచ్చే రూ.12 వేలతో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెబుతోంది. -
‘ఆసరా’.. నవ్వే మనసారా
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు బుధవారం అంబరాన్నంటాయి. అక్కచెల్లెళ్ల మోముల్లో నవ్వుల సిరులు కురిశాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెక్కులను అట్టహాసంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సంక్షేమ రేడుకు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. – సాక్షి, నెట్వర్క్ అంచెలంచెలుగా ఎదిగారు ఈ చిత్రంలో ఉన్న ఈమె పేరు వమరవల్లి దుర్గ. ఊరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి గ్రామం. స్వయం శక్తి సంఘం గ్రూపు లీడర్‌గా ఉన్నారు. ఈమె గ్రూపునకు ఆసరా ద్వారా రూ.4.80 లక్షలు మాఫీ వర్తించింది. ఒక్కో సభ్యురాలికి ఒక్కో విడతలో రూ.12 వేలు మాఫీ నిధులు వచ్చాయి. ఏటా వచ్చే ఈ నిధులను వ్యాపారానికి వెచ్చించి దుర్గ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో టీ షాపు పెట్టారు. రెండోసారి నిధులతో బడ్డీకొట్టు పెట్టారు. మూడో సారి నిధులతో ఫినాయిల్ తయారు చేయడం నేర్చుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే రూ.12 వేలతో జిరాక్స్ మిషన్ కొని వ్యాపారం అభివృద్ధి చేసుకుందామని భావిస్తున్నారు. ఆసరా ‘భాగ్య’మయ్యే ఈమె పేరు బట్టా భాగ్యలక్ష్మి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులకు వెళ్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకుంటున్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకు రూ.2,46,507 వచ్చింది. దీంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించి కూలి పనులకు వెళ్లే బాధల నుంచి విముక్తి పొందారు. కా‘పాడి’న జగనన్న ఈమె పేరు పి.ముత్తులక్ష్మి. సూళ్లూరుపేట పట్టణంలోని వట్రపాళెం సమాఖ్య గ్రూపులో సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.3,15,128 ఇప్పటివరకు వచ్చాయి. ఈ డబ్బులతో మూడు గేదెలను కొనుక్కుని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతంలో కూలి పనులకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ తిప్పలు తప్పాయి. ఇదంతా సీఎం జగన్ చలువ వల్లే సాధ్యమైందని ఆమె తెలిపారు. పాన్ షాపు పెట్టుకున్నా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించారు. నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.30 వేలు వచ్చింది. సున్నా వడ్డీ ద్వారా మరో రూ.50 వేలు రుణం మంజూరైంది. ఈ సొమ్ముతో ఊరిలో పాన్‌షాపు పెట్టుకున్నా. జీవనానికి ఇబ్బంది లేదు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. – జనని, డ్వాక్రా మహిళ, బుడతనాపల్లి గ్రామం, విజయనగరం జిల్లా మా గ్రూపునకు రూ.8 లక్షలు మాఫీ అయింది వైఎస్సార్ ఆసరా ద్వారా మా సంఘానికి ఉన్న రూ.8 లక్షల అప్పు మొత్తం తీరిపోయింది. ఒక్కో సభ్యురాలికి రూ.80 వేల వరకు లబ్ధి కలిగింది. రుణమాఫీ, సున్నా వడ్డీ, స్త్రీనిధి, ఉన్నతి తదితర పథకాలతో మహిళలకు ఎంతో మేలు చేశారు. జగనన్నకే మా మద్దతు ఉంటుంది. – వెంకటరమణమ్మ, ప్రశాంతి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా జగనన్నకు రుణపడి ఉంటాం మాది పూజిత పొదుపు సంఘం. మా సంఘంలో 13 మంది సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఒక్కొక్క సభ్యురాలికి రూ.18 వేలు వచ్చింది. ఇప్పటికే గతంలో ప్రభుత్వం జమచేసిన రూ.80 వేల నగదుతో ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్నా. ఇప్పుడు జమచేసిన నగదుతో మరిన్ని సరుకులు తెచ్చుకుని విక్రయించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుంది. సీఎం వైఎస్ జగనన్నకు, ఈ ప్రభుత్వానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. – మాధవి, వికృతమాల, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా -
మళ్లీ జగనే కావాలి..మళ్లీ జగనే రావాలి..
-
YSR ఆసరా పథకం నిధుల విడుదలపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
-
థ్యాంక్యూ సీఎం సార్...వైఎస్ఆర్ ఆసరా అక్క చెల్లెమ్మలు
-
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్‌గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. -
మీరే నా సైన్యం: సీఎం జగన్
ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. జెండాలు జత కట్టడమే టీడీపీ అజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా. మహిళా సాధికారతను బాధ్యతగా భావించాం. అక్కచెల్లెమ్మలపై మమకారంతో 56 నెలల్లో మన ప్రభుత్వం ఒక్క ఆసరా పథకానికే ఏకంగా రూ.25,570 కోట్లు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎక్కడైనా దేశం, రాష్ట్రం బాగుందని చెప్పడానికి అక్కడ అక్కచెల్లెమ్మల బాగోగులు, వాళ్ల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, రాజకీయంగా వాటా.. తదితర అంశాలను పారామీటర్స్‌గా చూడాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటిలో ఎక్కడైతే అక్కచెల్లెమ్మలు ముందంజలో ఉంటారో అప్పుడు ఆ రాష్ట్రం కూడా ముందంజలో ఉంటుంది. ఇవాళ ఈ దిశగా మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటం సంతోషంగా ఉంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అనంతపురం (ఉరవకొండ): ‘ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం బాగుంటుందని మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. మన ప్రభుత్వం అందించిన చేయూత, ఆసరా వల్ల వారంతా సొంత కాళ్లపై నిలబడ్డారు. ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి సుమారు 79 లక్షల మంది పొదుపు మహిళల ఖాతాల్లో రూ.6,394.83 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందన్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశాడని మండిపడ్డారు. 2016 అక్టోబర్ నుంచి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారన్నారు. చంద్రబాబు చర్యలతో అప్పట్లో పొదుపు సంఘాల రుణాలు తడిసి మోపెడయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితి వచి్చందని చెప్పారు. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయని గుర్తు చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పులన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పామని, ఆ మాట మేరకు నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే మూడు దఫాల్లో రూ.19,176 కోట్లు ఇచ్చామని, ఇవాళ నాలుగో విడతగా ఇస్తున్న రూ.6,394.83 కోట్లతో కలిపి రూ.25,570 కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదన్నారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలే ► గత 56 నెలల్లో అక్కచెల్లెమ్మల చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద కోటి ఐదు లక్షల మందికి రూ.4,690 కోట్లు నేరుగా ఇచ్చాం. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా కింద ఇచ్చిన రూ.31 వేల కోట్లతో కలిపి మొత్తంగా రూ.2.53 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. గతంలో ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా లంచాలు పోయేవి. ఈ రోజు మన పారీ్టకి ఓటు వేయకపోయినా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ► అక్కచెల్లెమ్మలపై ఇంత బాధ్యతగా, మమకారం చూపుతున్న ప్రభుత్వం మనదే. అమ్మ ఒడి పథకం కింద రూ.26,067 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 31.27 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు అందజేశాం. మరో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. నిర్మాణం పూర్తయిన ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 25.45 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుస్తూ.. వారి పిల్లలకు విద్యా దీవెన కింద రూ.11,900 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద మరో రూ.4,275 కోట్లు అందించాం. కాపు నేస్తం కింద రూ.2,028 కోట్లు, ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు అందించాం. ► పేదల పింఛన్ 64.30 లక్షల మంది అందుకుంటున్నారు. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా ప్రతి నెలా ఒకటవ తేదీన ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో వలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము చేతుల్లో పెడుతున్నారు. 56 నెలల్లో పింఛన్ల కోసం రూ.84,730 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో రూ.56 వేల కోట్లు కేవలం నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకే ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషపడుతున్నా. ► చిరు వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు రూ.2610 కోట్లు, చేదోడు ద్వారా రూ.404 కోట్లు ఖర్చు చేశాం. ఇవాళ 99 శాతం రుణాల రికవరీ ► రాష్ట్రంలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, వైఎస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమాల ద్వారా ఎంత మంచి జరిగిందని ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు 2014కు ముందు రుణాలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. రుణమాఫీ మాట గాలికి వదిలేశారు. సున్నా వడ్డీని రద్దు చేశారు. అప్పట్లో రూ.14,210 కోట్ల రుణాలు తడిసి మోపెడై వడ్డీలు, చక్రవడ్డీలుగా మారాయి. చంద్రబాబు మోసాలతో పొదుపు సంఘాలు ఏ, బీ గ్రేడ్ నుంచి సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్‌లో 19 శాతానికి పడిపోయాయి. ► ఈ రోజు మీ బిడ్డ పాలనలో అవే సంఘాలు తలెత్తుకుని నిలబడ్డాయి. రుణాల రికవరీ 99 శాతంతో పొదుపు సంఘాలు మెరుగ్గా ఉన్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారతకు మన ప్రభుత్వం ఎంతగా నిలబడిందో గమనించండి. ఎప్పుడూ లేని విధంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేశాం. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసును ఏర్పాటు చేశాం. దిశ యాప్ తీసుకువచ్చాం. కోటి 40 లక్షల మంది అక్కచెల్లెమ్మల సెల్ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ అండగా, రక్షణగా నిలిచింది. గతంలో ఇవన్నీ ఎందుకు లేవు? ► ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎందుకు లేవు? అక్కచెల్లెమ్మలను పట్టించుకున్న నాథుడే లేడు. వారి పిల్లల చదువుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేట్ చూస్తే మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్ తక్కువ. గతంలో దోచుకో.. పంచుకో.. తినుకో.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఎవరూ లంచాలు అడగడం లేదు. ► వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమాన్ని 14 రోజుల పాటు (ఫిబ్రవరి 5 వరకు) పండుగ వాతావరణంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల మధ్య నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గ్రామ సచివాలయాల్లో అక్కచెల్లెమ్మలకు మైక్‌లు ఇచ్చి ఏ రకంగా మహిళా సాధికారత జరిగిందన్న కథలు రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా వినిపించాలి. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం రాష్ట్రంలో మరోసారి జగన్ ప్రభంజనం ఖాయం. మహిళలు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో ఒక ఎస్సీ కుర్రాడికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి టీడీపీ కండువా కప్పుకోవాలని పయ్యావుల కేశవ్ సోదరుడు బలవంతం చేశాడు. మన ప్రభుత్వంలో అలా ఎప్పుడూ జరగలేదు. పచ్చ కండువా వేసుకున్నా, ఎర్ర కండువా వేసుకున్నా అర్హత ఉంటే చాలు పథకాలు ఇస్తున్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వారిలో కొందరిని ప్రలోభపెట్టి పచ్చ కండువా వేసి ఆహా్వనించారు. ఇప్పుడు మేము అదే పని చేసి ఉంటే.. పయ్యావుల కేశవ్‌తో సహా ఒక్క ఎమ్మెల్యే అయినా మీ వెంట ఉండేవారా చంద్రబాబూ? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇన్పుట్ సబ్సిడీపై మాట్లాడగా.. ఆ బకాయి కిరణ్ ప్రభుత్వానిది కాబట్టి ఇచ్చేది లేదని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు. అదే వైఎస్ జగన్రూ.25 వేల కోట్లకు పైగా పొదుపు సంఘాల బకాయిలు చెల్లించడం చరిత్రాత్మకం. – వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పుట్టింటికంటే ఎక్కువ ఇచ్చారు అన్నా.. మీరు ఆడపడుచులకు పుట్టింటి కంటే ఎక్కువ ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా మాకు చాలా సాయం చేసింది. మేం చాలా సంతోíÙస్తున్నాం. మీరు పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం మాకు సాయం చేశారు. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.30 వేలు లబ్ధి పొందాను. ఈ డబ్బుతో ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో మా పొదుపు సంఘాలు అప్పులు కట్టలేక నిలిచిపోయాయి. ఈ రోజు మీ మేలు వల్ల ఏ బ్యాంకైనా వెంటనే పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి. మా ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి స్థలం, నా భర్తకు లక్షల విలువయ్యే వైద్యం.. ఆ తర్వాత విశ్రాంతి సమయంలో కూడా సాయం.. ఇలా ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. మీకు రుణపడి ఉంటాం. – మమత, పొదుపు సంఘం సభ్యురాలు, వజ్రకరూరు, అనంతపురం జిల్లా -
వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటామన్న మహిళలు
-
బటన్ నొక్కిన జగన్ నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!
-
మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాం: సీఎం జగన్
అనంతపురం, సాక్షి: మహిళా సాధికారత సాధన.. సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారాయన. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం. నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం. దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. .. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 56 నెల్లలో ప్రతి అడుగూ మీ బిడ్డ ప్రభుత్వం వేసింది. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. అర్హత కేవలం అదే.. ఈరోజు రూ.6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ ఒక్క పథకానికి(వైఎస్సార్ ఆసరా) సంబంధించి 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పోతోంది. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద 4968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. వాళ్ల కాళ్ల మీద నిలబెట్టడం కోసం వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే 31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ. 6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు. ఎక్కడా ఎవరూ ఎవరికి ఇస్తున్నాం అనేది వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు. ఈరోజు 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి పోతోంది. ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికిచ్చిన సొమ్ము రూ.26.67 వేల కోట్లు. వైయస్సార్ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు. 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5-20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2-3 లక్షల కోట్లు. అవ్వా.. బాగున్నావా? అంటూ.. అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇచ్చినది రూ.4,968 కోట్లు. 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275 కోట్లు ఇచ్చాం. కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2.28 వేల కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. పేదల పెన్షన్ అందుకుంటున్న వారు 66.34 లక్షల మంది. ఇందులో 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా అని అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారంటే ఇది జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశాం. జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, పట్టించుకున్నదిగానీ ఎప్పుడైనా చూశామా?. గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే.అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నా. కారణం ఒక్కటే.గతంలో దోచుకో, పంచుకో, తినుకో. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. దేశం మొత్తం వినిపించాలి.. వచ్చే 14 రోజులపాటు ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6,400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. చంద్రబాబు చేసిన మోసం గుర్తుంది కదా? 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపెడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25500 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో 19 శాతానికి పడిపోయాయి. కానీ, ఇవాళ.. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో సంఘాలు ఉన్నాయి.ఔట్ స్టాండింగ్ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలు ఎన్పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే. సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. నామినేషన్ పనుల్లో ఇచ్చే కాంట్రాక్ట్ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. భద్రత విషయంలోనూ.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ నియమితులయ్యారు. దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే అని సీఎం జగన్ ప్రసంగించారు. ఇదీ చదవండి: రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. బాబుకు ప్రచారం: సీఎం జగన్ ఫైర్ -
గతంలో దోచుకో.. పంచుకో.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్
-
పక్క పార్టీలో బాబుకి స్టార్ క్యాంపెయినర్లు: సీఎం జగన్
అనంతపురం, సాక్షి: ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు. ‘‘ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు’’.. బాబు కోసం లిస్ట్ పెద్దదే.. ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోనూ.. .. వీళ్లుకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అంది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు. టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు. రక రకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే. స్టార్ క్యాంపెయినర్లలో నాది రికార్డు ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ * బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లూ లేరు. కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు. వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు. మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా? కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా.. కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా. వీళ్లే నాకు అండ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైయస్సార్ ఆసరా అందుకున్న నా అక్కచెల్లెమ్మలంతా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. -
డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్
-
ఉరవకొండలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన
-
‘అలా చేస్తే పయ్యావుల కూడా టీడీపీలో మిగలడు’
అనంతపురం, సాక్షి: ఎన్నికలొచ్చినప్పుడే పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఒక్కరైనా ఉండేవారా?.. ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. ..ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు అని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా అని విశ్వేశ్వర్‌రెడ్డి తన ప్రసంగం ముగించారు. -
YSR ఆసరా పథకం ద్వారా 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి
-
నాలుగో విడత వైఎస్సార్ ఆసరా: నిధులు విడుదల చేసిన సీఎం జగన్
వైఎస్సార్ ఆసరా.. సీఎం జగన్ ఉరవకొండ పర్యటన అప్డేట్స్ ►నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. 12:32 AM, జనవరి 23 2023 ఎంతో సంతోషంగా ఉంది: సీఎం జగన్ దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నాం వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్లు జమ చేశాం మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుంది ఎక్కడా లంచాలు ల్లేవ్.. వివక్షకు చోటు లేదు.. వ్యత్యాసాలు ల్లేవ్.. ఇది రికార్డే రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై సంతోష పడుతున్నా గతంలో అంతా లంచాల మయం ఇప్పుడు ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ప్రామాణికంగా లబ్ధి చేకూరుస్తున్నాం పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు చెల్లించాం ఆసరా, సున్నా వడ్డీ కింద రూ.31 వేల కోట్లు అందించాం 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు రూ.2.53 లక్షల కోట్లు అందించాం ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డు జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు అందించాం వైఎస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్ల రుణాలు చెల్లించాం వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు అందించాం గత ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో గతంలో అక్కచెల్లెమ్మలకు ఎందుకు మంచి జరగలేదు? అక్కచెల్లెమ్మల కుటుంబాలను పట్టించుకునే పరిస్థితి గతంలో చూశామా? 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఇళ్లు పూర్తయితే రూ.5 లక్షల విలువైన ఆస్తి వారి చేతుల్లో ఉంటుంది డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేశారు చంద్రబాబు మోసాలతో సంఘాల గ్రేడ్లు పడిపోయాయి అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉంది 12:12 AM, జనవరి 23 2023 మాకు జగనన్న ఉన్నాడనే భరోసా ఉంది మాది నిరుపేద కుటుంబం. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లిద్దరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుతున్నారు. ప్రభుత్వాల నుంచి వాళ్లకు లబ్ధి చేకూరుతోంది. నేను రూ.30 వేల లబ్ధి పొంది చిన్నవ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గతంలో లాగా లేదు ఇప్పుడు.. మీరిచ్చిన ధైర్యం మేం మరిచిపోలేం. ఆరోగ్యశ్రీ ద్వారా బేతారి పని చేసే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగానని భావోద్వేగానికి లోనయ్యారామె. చివర్లో సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నారామె. :::మమత.. వజ్రకరూర్ గ్రామం 12:12 AM, జనవరి 23 2023 సీఎం జగన్ చెప్పాడంతే.. చేస్తాడంతే: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రసంగం సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి కండువా వేసుకుంటేనే పథకం ఇస్తామన్న పాలన టీడీపీది నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే కండువా కప్పుకుంటానంటేనే పథకం ఇస్తానంటే.. మీ పార్టీలో ఎవరూ మిగిలేవారు లేరు మేం ప్రజాస్వామ్యవాదులం మీలా చేస్తే.. పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో ఉండేవాడు కాదు పయ్యావుల ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేం లేదు ఎన్నికలప్పుడు తప్పా ఎప్పుడూ జనాలకు కనిపించడు సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా 11:49 AM, జనవరి 23 2023 వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం ఉరవకొండలో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి హాజరు పూల మాలతో వైఎస్సార్‌కు నివాళి జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ 11:40 AM, జనవరి 23 2023 ఉరవకొండ సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్ సాదర స్వాగతం నడుమ.. ఉరవకొండ సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్ స్థానిక నేతలతో మాటామంతీ అక్కాచెల్లెమ్మల బాగోగులు అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ కాసేపట్లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం 11:01 AM, జనవరి 23 2023 ఉరవకొండకు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్ ఉరవకొండ బైపాస్ రోడ్డు బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభకు భారీగా హాజరైన డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలు నాలుగు విడతల్లో 25571 కోట్ల రూపాయల రుణాలను చెల్లించిన జగన్ ప్రభుత్వం సీఎం జగన్‌కి స్వాగతం పలికిన ఉరవకొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, నేతలు 10:06 AM, జనవరి 23 2023 పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు 09:25 AM, జనవరి 23 2023 ఉరవకొండ బయల్దేరిన సీఎం జగన్ అనంతపురం ఉరవకొండ బయల్దేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించి.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్ 09:15 AM, జనవరి 23 2023 సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా.. తొలుత ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు నేడు వైఎస్సార్ ఆసరా పంపిణీ నేడు రూ.6,394.83 కోట్ల నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కార్ భరోసా 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు ఇందులో మూడు విడతల్లో ఇప్పటికే రూ.19,175.97 కోట్లు చెల్లింపు నేటి నుంచి ఆఖరిదైన నాలుగో విడత మొత్తం జమ అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రెండు వారాలపాటు ఉత్సవంలా కార్యక్రమాలు ప్రజల్లో తనపట్ల ఉన్న విశ్వసనీయత, నమ్మకాన్ని మళ్లీమళ్లీ చాటుకుంటున్న జగన్ చంద్రబాబు నిర్వాకంతో కుదేలైన సంఘాలన్నీ మళ్లీ గాడిలోకి.. సర్కారు చర్యలతో పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుంచి 0.17 శాతానికి తగ్గుదల 56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి.. వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది. ► అంతేకాక.. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి. ► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ► అనంతరం.. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా‘, ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి. ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు.. ఇక వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే.. ► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు. ► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. ► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు. ► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. -
చెప్పింది చెప్పినట్లుగా.. నేడు ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ
సాక్షి, అమరావతి: చెప్పాడంటే చేస్తాడంతే.. అన్న నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల విషయంలో అక్షరాలా నిజం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వారికి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. మాట ఇస్తే తప్పడని ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఆయన తన విశ్వసనీయతను మళ్లీమళ్లీ చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు సంపూర్ణంగా అమలుచేయబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో ఆయన డ్వాక్రా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమచేయగా.. తాజాగా, మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను జమచేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్ పూర్తిస్థాయిలో నెరవేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) గణాంకాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది డ్వాక్రా మహిళల పేరిట రూ.25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ఆయా మహిళల ఖాతాల్లో జమచేశారు. ఇక మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను కూడా నేరుగా వారి ఖాతాల్లో జమచేయబోతోంది. ఈ నేపథ్యంలో.. నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజానికి.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దు.. పొదుపు సంఘాల తరఫున తామే చెల్లిస్తామని 2014లో పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీ ఇచ్చారు. కానీ, దాన్ని అమలుచేయని కారణంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఆ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాటికి తిరిగి ఊపిరిపోశారు. ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు.. ఇక వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే.. ► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు. ► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. ► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు. ► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. నేడు సీఎం జగన్ ఉరవకొండ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23న మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించి, డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు, ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. 56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి.. వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది. ► అంతేకాక.. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి. ► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ► అనంతరం.. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా‘, ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి. -
ఆర్థిక చక్రానికి 'ఆసరా'
‘మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది’ అనే సూత్రంపైనే ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆధారపడి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతగా ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేశారు. నా అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ప్రధాన లక్ష్యమని చెబుతూ మేనిఫెస్టోలో చెప్పినట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మూడు పథకాల ద్వారా అందిన రూ.38,273.95 కోట్ల (తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు) సొమ్ముతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థిక కష్టాల సుడిగుండం నుంచి తమ కుటుంబాలను ఒడ్డున పడేశారు. వెరసి బ్యాంక్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గ్రామీణ ఆర్థిక చక్రం వేగంగా తిరిగింది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. ఎల్లుండి నుంచి ఆఖరి విడత ‘వైఎస్సార్ ఆసరా’ గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570. 80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని ఆఖరి నాలుగో విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి : వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 79 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల జీవితాల్లో సమూల మార్పులకు, వారి ఆత్మగౌరవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా వారి ఆర్థిక కష్టాలు తీర్చింది. అంతటితో ఆగకుండా వారు సొంతంగా వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చేయి పట్టుకుని నడిపించింది. పాడి పశువులు, మేకలు, గొర్రెల పెంపకానికి ఊతం అందించింది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అందిన సహకారంతో అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పరిస్థితి అగమ్యగోచరం. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కారు. దీంతో ఆ సంఘాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. వీరి దుస్థితిని తన పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న రూ.25,570.80 కోట్ల అప్పును మనందరి ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆసరా’ పథకం పేరుతో నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఆ మాట మేరకు ఇప్పటికే మూడు విడతలుగా రూ.19175.97 కోట్ల సొమ్ము చెల్లించారు. దీనికి తోడు చేయూత పథకం కింద రూ.14,129 కోట్లు లబ్ధి చేకూర్చారు. సున్నా వడ్డీ పథకం కింద రూ.4,969 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.38,274 కోట్లు లబ్ధి కలిగించారు. తద్వారా ఇప్పుడు ఆ పేదింటి పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ఆర్థిక వ్యవçస్థకే ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఐదేళ్ల క్రితం బ్యాంకుల వద్ద ఎన్పీఏలుగా ముద్రపడిన లక్షలాది పొదుపు సంఘాలు నేడు బలపడ్డాయి. గత చంద్రబాబు ప్రభుత్వం మ«ధ్యలో ఆపేసిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూ.. సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ డబ్బులను ప్రభుత్వమే ఏ ఏడాదికి ఆ ఏడాదే చెల్లిస్తుండడంతో ఇప్పుడు వందకు 99.83 శాతం పొదుపు మహిళలు అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో పొదుపు సంఘాల మహిళలకు చాలా తక్కువ వడ్డీకే ఎంతైనా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు గత 56 నెలల కాలంలో రూ.1,54,929.92 కోట్లు బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలకు రుణాలుగా అందజేశాయి. 83 శాతం సంఘాలు రూ.ఐదు లక్షలకు పైబడే రుణాలు తీసుకోగలిగాయి. అంటే దాదాపు ప్రతి పొదుపు సంఘం మహిళ గత 56 నెలల కాలంలో ఏడాదికి దాదాపు రూ.50 వేల చొప్పున కొత్త రుణం అందుకోగలిగారు. తీసుకున్న అప్పును కూడా మహిళలు తమ కుటుంబ ఆదాయాలు పెంచుకోవడానికే ఉపయోగించుకుంటున్నారు. పెట్టుబడి పెట్టగలిగేలా ప్రోత్సాహం ప్రపంచంలోనే ఎక్కువ జనాభాకు తోడు పేదరికం కలిగిన మన దేశం ఆర్థికాభివృద్ధిలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవాలంటే ప్రజల్లో పెట్టుబడి పెట్టగలిగే స్థాయి పెరగాలి. అంటే ఆ పెట్టుబడి ఏదో రూపంలో వారికి అందాలి. తద్వారానే దేశ ఆర్థికవృద్ధి చక్రం ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వాల నుంచే ప్రత్యేకించి పేద ప్రజలకు రకరకాల రూపాల్లో డబ్బులు చేరాల్సి ఉంటుంది. ఈ పరంపరలోనే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు. తద్వారా వారు ఆ డబ్బులను పూర్తి స్థాయిలో తమ కుటుంబ ఆదాయం పెంచే మార్గాల్లో తిరిగి పెట్టుబడి పెట్టేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబ స్ధిర ఆదాయాలు పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నారు. వెరసి రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి పెరుగుదలలో భాగస్వాములవుతున్నారు. – ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ 54 శాతం మందికి అదనంగా రూ.60 వేల ఆదాయం పొదుపు సంఘాల మహిళల ఐదేళ్ల క్రితం నాటి మొత్తం అప్పు రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా అందజేçయడంతో పాటు ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. పేద కుటుంబాల్లో టర్నోవర్ పెరిగింది. దీంతో గ్రామాల్లో రూ.వందకు నెలకు రూ.2 లేదా రూ.3 వడ్డీ వ్యాపారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. లక్షల పేద కుటుంబాల్లో ఇటీవల కొత్తగా ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. చాలా కుటుంబాలు అప్పు తీసుకొనే అవసరం లేకుండానే వ్యవసాయ పెట్టుబడులు మ కూర్చుకోగలుగుతున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది మహిళల నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే అదనంగా పెరిగింది. అంటే ఏడాదికి రూ.60 వేలకు పైబడి అదనపు ఆదాయం చేకూరుతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై నిర్వహించిన ఓ సర్వేలోనే ఈ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్ధిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. 31,04,314 మంది పేదింటి పొదుపు మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు. నాడు బాబు హామీ నమ్మి దివాలా 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,203.58 కోట్ల మేర అప్పులున్నాయి. ఆ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచే.. ‘తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణ మాఫీ చేస్తుంది.. బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను ఎవరూ చెల్లించొద్దు.. బ్యాంకుల్లో కుదువ పెట్టిన మీ బంగారాన్ని విడిపించేస్తాం’ అని చంద్రబాబు ఊరూరా ప్రచారం చేశారు. అంతకు ముందు వరకు కిస్తీల రూపంలో సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే అలవాటు ఉన్న లక్షలాది మంది మహిళలు చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకులకు కిస్తీలు చెల్లించడం మానేశారు. మాయ మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీతనే అసెంబ్లీలో తమ (టీడీపీ) ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. దీంతో పొదుపు సంఘాల మహిళలందరూ అప్పట్లో తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. పేద మహిళలందరూ కోలుకోలేనంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాధారణంగా గ్రామాల్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని చెల్లించకపోతే దివాలా తీశారని ప్రచారం చేస్తుంటారు.. అలా, అప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉన్న మహిళలు ప్రతి ఐదుగురిలో ఒకరిని బ్యాంకులు ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – ఒక రకంగా దివాలా) జాబితాలో పెట్టాయి. -
ప్రగతి పథంపై పచ్చ పడగ
గుడ్లగూబ వెలుగును చూడ లేదు. రాక్షస మూకలు మంచిని మెచ్చుకోలేవు. అది వాటి నైజం. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పక్షాలు... ప్రత్యేకించి దుష్ట చతు ష్టయంతో పాటు ఎల్లో జర్న లిజం కల్పిస్తున్న ఆటంకాలూ, అబద్ధాలూ చూస్తుంటే ఈ సంగతి మరింత స్పష్టమవుతోంది. 2020, 2021 సంవత్సరాలలో కరోనా మహమ్మారి మూలాన ప్రపంచ ఆర్థిక పరిస్థితితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితీ కుదేలయ్యింది. అంతేగాక చంద్రబాబు దిగిపోతూ ఖజానాను ఖాళీ చేశారు. అయినప్పటికీ జగన్ తన మేధాసంపత్తితో రాష్ట్ర ఆర్థిక నిర్వహణను అతి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విజనరీని మెచ్చి పారిశ్రామిక వేత్తలు 13 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పరిశ్రమలకు లెసైన్సులను ఏకగవా క్షము ద్వారా అప్పటికప్పుడు మంజూరు చేస్తున్నందున పరిశ్రమలు స్థాపించేదానికి ప్రపంచ ప్రఖ్యాత కంపె నీలు ఆంధ్రప్రదేశ్‌కు వరుస కడుతున్నాయి. అవుకు రెండో చానల్‌ను పూర్తి చేసి త్రాగునీరు, సాగునీటి ప్రాజె క్టును గత నవంబర్‌లో ప్రారంభించారు. పోలవరం పూర్తి చేసేదానికి పనులు చకచకా సాగుతున్నాయి. 4 అతి పెద్ద పోర్టుల నిర్మాణాలు పూర్తి అవుతు న్నాయి. 10 షిప్పింగ్ హార్బర్లు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్, కిడ్నీ వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, చిన్న పిల్లల ఆసు పత్రులు నిర్మిస్తున్నారు. 10 వేలకు పైగా ‘విలేజ్ క్లినిక్’లు, 10 వేల మెగా వాట్లతో కర్నూలులో గ్రీన్కో ప్రాజెక్టు, వెయ్యి మెగా వాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు, కాకి నాడలో ఫార్మాసెజ్. జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,788 ఆర్బీకేలను నిర్మించారు. ఒక్కొక్క ఆర్బీకేకు సుమారు 21 లక్షల రూపాయలతో నిర్మాణాలు జరిగాయి. దీనితో రైతులు విత్తనం నుంచి విక్రయం వరకు ఈ ఆర్బీకేల ద్వారా చేసుకుంటు న్నారు. దీనివల్ల 70 లక్షల మంది రైతులకు లాభ సాటిగా ఉంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో గణనీయ మైన అభివృద్ధి చెందుతూ ఉన్నదనీ, దానికి తార్కాణం భారీగా పెరిగిన 16 లక్షల ఉద్యోగాలనీ కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు గత డిసెంబర్ మాసంలో రాజ్యసభలో తెలిపారు. కొత్త ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ క్రింద జమ అయిన ఫండు ఈ ఉద్యోగాల నియామకం నిజమేననడానికి నిదర్శన మన్నారు. అలాగే 32 లక్షల ఇళ్ళు మహిళల పేరుననే రిజిష్టర్ చేసి వారి సాధాకారతకు కృషి జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రియైన తర్వాత 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 6.32 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చారు. ఇదంతా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనతో వీలయ్యింది. వైద్యరంగంలో దాదాపు 6000 వేల డాక్టర్లు, నర్సులను పారదర్శకంగా నియమించారు. మిగిలిన శాఖల్లోనూ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ అన్ని చర్యల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సకల జనుల ఆర్థికాభివృద్ధి పెరిగింది. గత మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజల డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో రూ 87,877 కోట్లు పెరిగాయి. 2021 మార్చి 31 నాటికే డిపాజిట్లు 3,85,929 కోట్ల రూపా యలు కాగా, 2023 జూన్ 30వ తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లు 4,73,806 కోట్ల రూపాయలకు పెరిగాయని రిజర్వుబ్యాంక్ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్ళుగా మన జగనన్న ప్రభుత్వం ప్రథమ ర్యాంకులో ఉంది. 2019లో చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ది తలసరి ఆదాయంలో 17వ ర్యాంకు కాగా, 2021–22లో అది 9వ ర్యాంకుకు చేరింది. 2019లో వ్యవసాయరంగంలో 27వ ర్యాంకులో ఉన్న ఏపీ, ఇప్పుడు 6వ ర్యాంకును సొంతం చేసుకొంది. 2019లో పారిశ్రామికాభివృద్ధిలో 22వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 63 లక్షల కుటుంబాల వారు ఉన్నారు. వారిలో దాదాపు 85 శాతం కుటుంబాలకు 2.50 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ద్వారా బ్రతుకుదెరువునూ, నైపుణ్యాలనూ మెరుగు పరచుకొంటున్నారు. ‘వైఎస్సార్ ఆసరా’, ‘చేయూత’ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించారు. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు హిందూస్థాన్ లీవర్స్, రిలయన్స్, మహీంద్ర వంటి పెద్ద కంపెనీలు మార్కెటింగ్ చేస్తు న్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో చంద్రబాబు కంటే ఎన్నోరెట్లు ముందుకు దూసుకుపోతోంది. అయినా పచ్చ మీడియా, పచ్చపార్టీ వక్రభాష్యాలు, అబద్ధపు కథనాలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నాయి. ఈ పచ్చ మీడియా, పచ్చ పార్టీని చూస్తే తెలుగులో ఒక పద్యం గుర్తుకు వస్తుంది. ‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.’ గాజులపల్లి రామచంద్రారెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు -
విశ్వసనీయత చాటుకున్నాం
అమరావతి: అవ్వాతాతలకు పెన్షన్ల పెంపుతో పాటు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను అమలు చేస్తూ ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చడం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు అని మరోసారి రుజువు చేసుకుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇదే సందేశాన్ని అవ్వా తాతలతో పాటు ప్రతి లబ్ధిదారుడికీ, ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని అధికార యంత్రాంగానికి సూచించారు. జనవరిలో మూడు కార్యక్రమాలతోపాటు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం కలిపి మొత్తం నాలుగు ప్రధాన కార్యక్రమాలను తలపెట్టామని, వీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా బ్రహ్మాండంగా జరిగేలా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి నిర్దేశించిన విధంగా ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. జనవరి నుంచి 8 వరకు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ రూ.3 వేలకు పెంపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని, రెండో కార్యక్రమంగా జనవరి 19న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, మూడోది జనవరి 23 నుంచి 31 వరకు ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని తలపెట్టగా నాలుగో కార్యక్రమం ‘వైఎస్సార్ చేయూత’ ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టా్మత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. 1 నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3,000 1వతేదీ నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ అవ్వాతాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారు పేరు అని మరోసారి రుజువు చేస్తున్నాం. పెన్షన్ల పెంపు సందర్భంగా జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2019లో మన ప్రభుత్వం రాక ముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 చేశాం. ఇప్పుడు రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తున్నాం. గత సర్కారు హయాంలో పెన్షన్ల కోసం సగటున నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.1,950 కోట్లు వ్యయం చేస్తున్నాం. మనం రాక ముందు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు దాకా పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే కాగా ఇవాళ దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మంచి మార్పు తేగలిగాం ప్రతి అడుగులోనూ అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఎవరూ ఇబ్బందులు పడకూడదని మునుపెన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా ఒకటో తారీఖు రోజు.. అది ఆదివారమైనా, పండుగైనా సరే పొద్దునే వలంటీర్ చిక్కటి చిరునవ్వుతో ఇంటివద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఈ మార్పు ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది. 1.17 లక్షల కొత్త పెన్షన్లు కూడా 1 నుంచే.. అర్హత ఉండీ ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి వారికి కూడా పథకాలను వర్తింపచేసే బై యాన్యువల్ (ఏడాదికి రెండు దఫాలు) కార్యక్రమం జనవరి 5వతేదీన జరుగుతుంది. ఆలోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల కొత్త పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు. దీంతో 66,34,742మందికి సుమారు రూ.1,968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. క్రెడిబిలిటీకి అర్ధం చెబుతూ పని చేస్తోంది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి. అవ్వాతాతలు వేచి చూడకుండా పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేను (సీఎం జగన్) కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో వీటిని నిర్వహించాలి. 8 రోజులపాటు పెంచిన పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జరుగుతాయి. ఏ మండలాల్లో ఏ రోజుల్లో నిర్వహించాలో ముందుగానే షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలి. లబ్ధిదారులకు సీఎం లేఖ, వీడియో సందేశం పెంచిన పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, ఉత్సాహవంతులు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, పార్టీ సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలి. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా పట్టించుకున్న ప్రభుత్వం చరిత్రలో లేదు రాష్ట్ర చరిత్రలో అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో లేదు. పెద్దల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దే పెన్షన్ డబ్బులు అందిస్తున్నాం. వారి కోసం పట్టించుకునే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ లాంటివి గతంలో ఎప్పుడూ లేవు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బులు ఎక్కడా ఇవ్వలేదు. చెప్పిన మాటను నెరవేర్చాలనే కృత నిశ్చయంతో మన ప్రభుత్వం అడుగులు వేసింది. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రతి లబ్ధిదారుడికీ తెలియచేయాలి. ఒక్క పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.23 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలుస్తూ సమర్థంగా దీన్ని నిర్వహిస్తున్నాం. -
విజయ గాథలతో వీడియోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు. పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక స్వావలంబన, సాధికారత క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది. జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. సుస్థిర జీవనోపాధి.. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది. ‘చేయూత’తో రూ.14,129 కోట్లు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. -
ప్రజారోగ్యం పట్ల ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ
-
వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత ద్వారా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి..!
-
మీరు దేశానికే ఆదర్శం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ‘మన అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన పల్లెల నుంచే సాధికారతతో ఆవిర్భవించాలి. అందుకే మహిళా పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనటువంటి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత.. తదితర పథకాల ద్వారా ప్రతి అడుగు అక్క చెల్లెమ్మల కోసమే వేస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి ఐదు లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రూ.1,353.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4,969 కోట్లు లబ్ధి కలిగించామన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా మోసమే. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు 2014 – 2019 మధ్య రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద పడేశాడు. దీనికి తోడు సున్నా వడ్డీ పథకాన్ని సైతం 2016 అక్టోబర్ నుంచి రద్దు చేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏ, బి గ్రేడ్లలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారిపోయాయి. రూ.3,036 కోట్లు ఎదురు వడ్డీ కట్టాల్సి వచ్చింది. మొత్తంగా అప్పులన్నీ తడిసి మోపెడై 2019 ఏప్రిల్ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. బాబు చేసిన మోసానికి 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలలో 18.36 శాతం మొండి బకాయిలుగా తేలాయి. అదీ నారా వారి నారీ వ్యతిరేక చరిత్ర. ఇప్పుడు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడింది. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఫలితంగా ఈ రోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిలు కేవలం 0.3 శాతం మాత్రమే. 99.67 శాతం రికవరీ రేటుతో మన అక్కచెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. తేడా మీరే చూడండి. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చాం మనందరి ప్రభుత్వానికి ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షలు ఉన్నారు. మనపై నమ్మకం పెరగడం వల్ల ఈ రోజు ఆ సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. అంటే 25 లక్షలకుపైగా పెరిగారు. సున్నా వడ్డీతో పాటు రూ.3 లక్షల వరకు రుణం అతి తక్కువ వడ్డీకే ఇప్పిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో 12–14 శాతం వడ్డీ వసూలు చేశారు. మనం దానిని 9.5 నుంచి 8.5 శాతం వరకు తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న రుణాలు రూ.25,571 కోట్లు. ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 పర్యాయాలు రూ.19,178 కోట్లు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వారి చేతుల్లో పెట్టి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాం. పలు విధాలా భరోసా ♦ జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45–65 వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,219 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1257 కోట్లు సాయం అందించాం. ♦ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు సాయం చేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,636 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ♦ పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఈ పథకం కింద డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. సొంత గూడు కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ♦ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాం. ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. అంతటితో ఆగక 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో దాని విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారా రెండు మూడు లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లయింది. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలు.. ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తున్నాం. వీరి కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఇంతవరకు రూ.6,141 కోట్లు వెచ్చించాం. సూర్యోదయానికి ముందే.. ♦ దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి, అవ్వా గుడ్‌మార్నింగ్ అని చెబుతూ పింఛన్ ఇచ్చేలా మనవడు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను. ♦ గతంలో వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తే గొప్ప అనే పరిస్థితి నుంచి మీ బిడ్డ హయాంలో రూ.2,750కి పెంచాం. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం నాలుగేళ్లలో మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.75 వేల కోట్లు. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా రూ.49,845 కోట్లు వెచ్చించాం. ♦ రూపాయి లంచం, వివక్షకు తావు లేకుండా ఈ నాలుగేళ్లలో నేరుగా రూ.2,31,123 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర. ♦ నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభాగం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. వారి భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. దిశ యాప్‌ను 1 కోటి 24 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆపద వేళ పది నిమిషాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా రాష్ట్రంలో 30,369 మందిని కాపాడగలిగాం. అక్కచెల్లెమ్మలతో మాటామంతి సీఎం జగన్ వేదిక వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. అక్కచెల్లెమ్మలతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆ సమయంలో దూరంగా ఉన్న మంత్రి విశ్వరూప్‌ను దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, అందరితో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఎంపీలు పిల్లి సుబాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీ‹Ùకుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ.20 లక్షల రుణం.. రూ.80 వేల వడ్డీ రాయితి అన్నా.. గతంలో మాలాంటి పేదోళ్లకు అప్పు పుట్టేది కాదు. పుట్టినా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలు కట్టేవాళ్లం. మీరు సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ ప«థకం ద్వారా నాలాంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అప్పు వస్తోంది. నేను ఆర్థి కంగా నిలదొక్కుకుని సొంతంగా వ్యాపారం చేసుకునే ధైర్యాన్ని కలిగించావు. నేను రూ.20 లక్షల వరకు రుణం, రూ.80 వేల వరకు వడ్డీ రాయితీ పొందాను. ఈ రోజు నేను జిరాక్స్ సెంటర్, టిఫిన్ సెంటర్‌తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మీ పథకాలతో నాలుగేళ్లలో మా కుటుంబం రూ.3 లక్షలకు పైగా లబ్ధి పొందింది. మీ మేలు ఎప్పటికీ మరువం. – దుర్గా భవాని, ఉప్పలగుప్తం, భీమనపల్లి మండలం మేనమామగా నిరూపించుకున్నారు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నన్నెంతగానో ఆదుకుంది. గతంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్పులతో భయమేసేది. మీ వల్ల నేను ఈ రోజు పాల వ్యాపారం చేస్తూ నెలకు రూ.7వేలు సంపాదిస్తున్నాను. ఇంటికి కొడుకులా, మా బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పిన మీ మాట అక్షరాలా నిజమని నిరూపించారు. విద్యా ప«థకాల ద్వారా నా కుటుంబం రూ.2.40 లక్షల వరకూ లబ్ధి పొందింది. మీరు తెచ్చిన వలంటీర్ల వ్యవస్థ సేవలు మరువలేనివి. – పి.ధనక్ష్మి, బండార్లంక, అమలాపురం రూరల్ మండలం -
గతంలో ఏ ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించలేదు.. జగనన్న ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రోత్సహిస్తుంది
-
వైఎస్సార్,జగన్ గురించి చెప్తూ..కన్నీళ్ళు పెట్టుకున్న పబ్లిక్
-
ప్రభుత్వం ఇచ్చిన పథకాల సాయంతో మెడికల్ & ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకున్నాం
-
మహిళలకు జగన్ ‘ఆసరా’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నయవంచనతో రాష్ట్రంలో కుదేలైన పొదుపు సంఘాల వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి జీవంపోసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి వాటి పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వారికి చెల్లించేలా ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలుచేయడంతో తిరిగి ఆ వ్యవస్థ గాడిలో పడింది. మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో దాదాపు ప్రతి పేదింటి మహిళ ఈ పొదుపు సంఘాల్లో సభ్యురాలైంది. రాష్ట్రంలో ఈ పురోగతిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికీ శ్రీకారం చుట్టింది. మరోవైపు.. వైఎస్ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవడం.. కుటుంబ అవసరాలకు సంఘం సభ్యులు ఉమ్మడిగా బ్యాంకుల నుంచి లోను తీసుకోవడం.. తిరిగి సకాలంలో అవి చెల్లించేవారు. ఈ సమయంలో 2014 ఎన్నికల ముందు, మహిళలెవరూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఈ వి షయాన్ని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. దీంతో అప్పటివరకు దేశా నికి ఆదర్శంగా నిలిచిన ఏపీలో పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని మహిళలు ఆ రుణాలపై వడ్డీ, చక్రవడ్డీలు పెరిగి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారు. చివరకు.. ఒక దశలో వారు తమ రోజువారీ పొదుపు సంఘాల కార్యక్రమాలను దూరంపెట్టారు. సంఘాలకు జగన్ పూర్వవైభవం.. కానీ, వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ‘పొదుపు’ మహిళల పేరిట అప్పటివరకు ఉన్న రూ.25,517 కోట్ల అప్పును వారికే నేరుగా నాలుగు విడతల్లో చెల్లించేందుకు సీఎం హోదాలో ఆయన వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో ఆయన జమచేశారు. మరోవైపు.. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించే పొదుపు మహిళలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే విధానానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దానికి మంగళం పాడింది. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు తిరిగి పొదుపు సంఘాల కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకున్నారు. అలాగే, చంద్రబాబు తీరుతో అప్పట్లో 60 శాతం పైబడి సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోతే.. ఇప్పుడు రాష్ట్రంలో 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు 99.5 శాతం మేర తమ రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. -
మహిళలకు అండగా వైఎస్సార్ ఆసరా
-
కనకదుర్గను ఆదుకున్న వైఎస్సార్ ఆసరా
-
ఆత్మకూరులో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
-
చంద్రబాబును నమ్మితే నట్టేటా మునిగినట్టే..
-
Andhra Pradesh: మారుమూలైనా నిశ్చింత
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం వైఎస్ జగన్.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింతగా మెరుగు పరిచారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించడమే కాక, సమర్థవంతంగా అమలు చేయిస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ వారికి రక్షగా నిలిచారు. సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా బొబ్బరపాలెంకు చెందిన మాండ్రుమాక రాణి అనే గర్భిణి మార్చి 26వ తేదీన విజయవాడ జీజీహెచ్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. సిజేరియన్ ప్రసవం కావడంతో 150 కిలోమీటర్ల దూరంలోని ఊరికి బస్సు, రైలులో పసికందుతో పాటు ఆమెను తీసుకెళ్లడం కష్టం. ప్రత్యేకంగా ఆటో లేదా ట్యాక్సీ కిరాయికి తీసుకుని వెళితే రూ.నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది. కూలి పని చేసుకుని జీవనం సాగించే ఈమె కుటుంబం అంత మొత్తం వెచ్చించలేదు. ఈ క్రమంలో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సిబ్బంది ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఉచితంగా బాలింతను, బిడ్డను ఇంటికి చేరుస్తుందని తెలిపారు. సిబ్బంది చెప్పినట్టుగానే బుధవారం సాయంత్రం 5.33 గంటలకు రాణి, ఆమె సహాయకులను విజయవాడ జీజీహెచ్‌లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఎక్కించుకుని రాత్రి 9.20 గంటలకు సొంత ఊరిలో వదిలి పెట్టారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ.. ‘108 అంబులెన్స్‌లో ఉచితంగా ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్య సేవలు అందించి ఆస్పత్రిలో కాన్పు చేశారు. డిశ్చార్జి అయిన నన్ను, నా బిడ్డను క్షేమంగా ఇంటి వద్దకు చేర్చారు. ప్రభుత్వం మాలాంటి వారి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంత సాయం అందుతుందని నేను ఊహించలేదు. నిరుపేదలమైన మాపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. రాణి తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు రాష్ట్రంలో వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. రోజుకు సగటున 631 మందికి సాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 183, జిల్లా ఆస్పత్రుల్లో 107, ఏరియా ఆస్పత్రుల్లో 98, సీహెచ్‌సీల్లో 67, పీహెచ్‌సీల్లో 45 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనాలు ఆయా ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతల్లో రోజుకు సగటున 631 మంది చొప్పున ఏడాదిగా క్షేమంగా ఇంటికి చేర్చాయి. ఈ లెక్కన ఏడాదిలో 2,30,505 బాలింతలు సేవలు పొందారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 22,315 మంది లబ్ధి పొందారు. కాకినాడలో 15,881, విశాఖపట్నంలో 13,320, అనంతపురంలో 11,646 మంది బాలింతలు ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి.. గత ఏడాది ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో డిశ్చార్జిలకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. బాలింతలు సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఈ అంశాన్ని గమనించిన ప్రభుత్వం పేదలపై రవాణా ఖర్చుల భారం పడకుండా చర్యలు తీసుకుంది. అప్పటి వరకూ ఉన్న పాత వాహనాలను పూర్తిగా తొలగించి, ఏకంగా 500 ఎయిర్ కండీషన్డ్ బ్రాండ్ కొత్త వాహనాలతో సేవలను విస్తరించింది. సురక్షిత ప్రయాణం గతంలో ఒక్కో వాహనంలో ఇద్దరు, ముగ్గురు బాలింతలు, వారి సహాయకులను తరలించేవారు. దీంతో వాహనంలో స్థలం సరిపోక తీవ్ర అవస్థలు పడేవారు. ప్రస్తుతం ఒక్కో ట్రిప్‌లో ఒకే బాలింతను తరలిస్తున్నారు. 400, 500 కి.మీ సుదూర ప్రాంతాల్లో సొంతూళ్లు ఉన్న బాలింతలను సైతం ఉచితంగా తరలిస్తున్నారు. ఆస్పత్రి నుంచి తల్లీ బిడ్డను ఇంటికి తరలించే సమయంలో భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. ఒక ప్రత్యేక యాప్ సైతం తయారు చేశారు. ఈ యాప్‌లో డ్రైవర్ లాగిన్ అయ్యి, ఆస్పత్రి వద్ద బాలింతను ఎక్కించుకునే సమయంలో, సొంత ఊరిలో దించిన తర్వాత ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డ్రైవర్ డబ్బులు డిమాండ్ చేశాడా? గమ్య స్థానంలోనే వదిలాడా? లేదా? ప్రవర్తన లోపాలపై ఇళ్లకు చేరిన బాలింతలకు ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై వైద్య శాఖ టోల్ ఫ్రీ నంబర్ 104 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. గర్భిణులకు అన్ని విధాలా భరోసా మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకు అన్ని దశల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నెల నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం, పౌష్టికాహారం అందించడం వంటి చర్యలు చేపడుతోంది. నెలలు నిండిన గర్భిణులను ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి కాన్పుకు ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో మార్పులు నాడు (2022 ఏప్రిల్‌కు ముందు వరకు) – 279 వాహనాలు – ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం – ఏసీ సౌకర్యం ఉండదు – ట్రిప్‌కు ఇద్దరు ముగ్గురు బాలింతల తరలింపు నేడు (2022 ఏప్రిల్ తర్వాత) – 500 వాహనాలు – విశాలమైన మారుతీ ఈకో వాహనం – ఏసీ సౌకర్యం ఉంటుంది – ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు క్షేమంగా తీసుకొచ్చి.. తీసుకెళ్తున్నారు గత నెల 22న నాకు పురిటి నొప్పులు వచ్చాయి. ఇంట్లో వాళ్లు 108కు ఫోన్ చేశారు. నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. నన్ను హుఠాహుటిన విజయవాడ ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. అదే రోజు వైద్యులు నాకు కాన్పు చేశారు. బాబు పుట్టాడు. డిశ్చార్జి అయిన నన్ను ప్రత్యేక వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్షేమంగా ఆస్పత్రికి తీసుకుని రావడం.. ఉచితంగా వైద్యం అందించడం.. తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడం గొప్ప విషయం. – వి.తేజస్విని, బాలింత, మాదలవారిగూడెం, కృష్ణా జిల్లా రూ.నాలుగు వేలు ఆదా ఇటీవల గుంటూరు జీజీహెచ్‌లో బిడ్డకు జన్మనిచ్చాను. మా ఊరు గుంటూరు నుంచి 100 కి.మీ పైనే ఉంటుంది. డిశ్చార్జి అయ్యాక ప్రత్యేక వాహనంలో నన్ను, నా వెంట ఉన్న వారిని ఎక్కించుకుని ఇంటికి చేర్చారు. మేం ప్రత్యేక వాహనం మాట్లాడుకుని వెళ్లింటే రూ.నాలుగు వేల వరకు ఖర్చయ్యేది. ఆ మొత్తం మాకు ఆదా అయింది. – వి.సుజాత, బాలింత, మిరియాల, పల్నాడు జిల్లా -
సీఎం జగన్ చిత్రపటానికి మహిళల పాలాభిషేకం
-
పులివెందులలో వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
-
ఘనంగా ‘ఆసరా’ సంబరాలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమాలతో పొదుపు సంఘాల మహిళలు రాష్ట్రమంతటా సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్రమంతటా 83 మండలాల్లో పొదుపు సంఘాల మహిళల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా ప్రాంత పొదపు సంఘ మహిళలకు ప్రభుత్వం మూడో విడతలో అందజేస్తున్న ఆర్థిక మొత్తం చెక్కులను అందజేసి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని వారికి వినిపించారు. మహిళలు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేయగా, కొన్ని చోట్ల ‘థాక్యూ సీఎం సార్’ «‘థాంక్యూ జగనన్నా..’ అని రాసిన మట్టి కుండలను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. మార్చి 25న సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో ‘వైఎస్సార్ ఆసరా’ మూడో విడత పంపిణీని లాంఛనంగా ప్రారంభించగా, ఏప్రిల్ 5వ తేదీ వరకు మహిళలతో ముఖాముకి నిర్వహిస్తూ, వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 346 మండలాల్లో పొదుపు సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశాలు జరిగినట్లు సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
పేదింట వెలుగు నింపిన వైఎస్ఆర్ ఆసరా
-
వైఎస్ఆర్ ఆసరాతో మహిళా జీవితాల్లో వెలుగు
-
ఊరూరా ‘ఆసరా’ ఉత్సవాలు
సాక్షి, అమరావతి: శ్రీరామనవమికి ముందే రాష్ట్రమంతటా ‘వైఎస్సార్ ఆసరా’ ఉత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు ఊరూరా సభలు నిర్వహిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞత చాటుకుంటున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరుతో మహిళల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వమే నేరుగా ఆయా మహిళలకు అందజేసే వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంతకుముందే ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12,758 కోట్ల మొత్తాన్ని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా మూడో విడతగా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,419.89 కోట్లను జమ చేయనుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పైసా కూడా మాఫీ చేయకుండా మోసం చేశారు. చంద్రబాబు మాదిరిగా కాకుండా పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో పొదుపు సంఘాల మహిళలకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ 101 మండలాల్లో లబ్ధిదారులతో సభలు వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీని 10 రోజుల పాటు (ఏప్రిల్ 5 వరకు) రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ముందే ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 76 మండలాల్లో వైఎస్సార్ ఆసరా లబ్ధిదారుల సమావేశాలు జరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ వివరించారు. 25వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 12 మండలాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయని, ఆదివారం మరో 13 మండలాల్లోనూ, సోమవారం జరిగిన 76 మండలాల్లో కలిపి మొత్తం 101 మండలాల్లో ఇప్పటివరకు లబ్ధిదారుల సమావేశాలు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి రాసిన లేఖల ప్రతులను లబ్ధిదారులకు అందజేశారు. -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పొదుపు సంఘాల పని తీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. తద్వారా ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఎన్పీఏలు.. ఓవర్ డ్యూస్గా ఉంటే, ఈ రోజు అది కేవలం 0.45 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. అక్క చెల్లెమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వమని, ఇక్కడికి విచ్చేసిన తన అక్కచెల్లెమ్మలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని, బాగు పడాలని.. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో గత 45 నెలల పాలన సాగిందని చెప్పారు. ఇప్పటిదాకా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ప్రతి మండలంలో జరగబోయే ఆసరా సంబరాల్లో రాష్ట్రంలో 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.6,419 కోట్లు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేవలం 45 నెలల్లోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు, ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోడుగా ఉంటూ వచ్చాను. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ.25,500 కోట్లకు పైగా రుణాల విషయంలో తోడుగా ఉంటామని చెప్పాం. తద్వారా 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభమై.. పది రోజుల పాటు జరిగే ఆసరా పండగ కార్యక్రమంలో మరో రూ.6,419 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. మొత్తంగా రూ.19,178 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం వ్యాపార పరంగా అండగా నిలిచాం ► పొదుపు సంఘాలకు ఇస్తున్న ఆసరా డబ్బు ఎలా ఖర్చు చేసుకోవాలన్నది అక్కచెల్లెమ్మల అభిమతానికి వదిలి పెట్టాం. వీటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంది. ► తోడ్పాటు అందించడానికి వ్యాపార దిగ్గజ సంస్థలైన ఎల్ అండ్ టీ, పీ అండ్ జీ, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందూస్తాన్ యూనీ లీవర్ వంటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని బ్యాంకులకు కూడా అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు వ్యాపార మార్గాలు చూపించేలా అడుగులు వేస్తోంది. ► ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెల ద్వారా పాడి, గొర్రెలు, మేకల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున వీరందరికీ స్వయం ఉపాధి మార్గాలు చూపించింది. ► ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లను అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే, ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున రూ.30 వేల కోట్ల రుణాలు మన ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. వైఎస్సార్ ఆసరా మూడో విడత సాయం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మన పొదుపు సంఘాల వైపు ఇతర రాష్ట్రాల చూపు ► వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. వాటిని చెల్లించే విషయంలో 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. తద్వారా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాల వారు వచ్చి పొదుపు సంఘాల విప్లవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ► ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించింది. ఇంతకు ముందు రూ.3 లక్షల రుణానికి 13 శాతం ఉండే వడ్డీని 7 శాతానికే తగ్గించాం. రూ.5 లక్షల రుణంపై వడ్డీ 13 శాతం ఉంటే 9.5 శాతానికి తగ్గించాం. ఈ వడ్డీ శాతం ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తాం. ► అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆదాయం ఎంత వస్తుంది? ఏ మేరకు వడ్డీ రీజనబుల్? ఎంత శాతం కన్నా వడ్డీ ఎక్కువ ఉండకూడదు.. తదితర విషయాలు చెప్పి, మీ తరఫున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ నాడు రుణ మాఫీ కాదు.. పథకాలే రద్దు ► చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం.. ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలయ్యాక అక్కచెల్లెమ్మలతో పని అయిపోవడంతో ఆ హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబర్ నుంచి వారి తరఫున కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన దుస్థితి చూశాం. ► అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన వడ్డీని చెల్లిస్తున్నాం. 2016 అక్టోబర్‌లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకువచ్చి రూ.3,615 కోట్లు సున్నా వడ్డీ కింద కింద చెల్లించాం. తద్వారా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ► జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518కోట్లు, ఈబీసీనేస్తం ద్వారా మరో 3.94 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. ► వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా ఇంకో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం రూ.9,947 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల వసతి, భోజన సౌకర్యం కోసం రూ.3,363 కోట్లు ఇచ్చాం. ► 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్ల పట్టాలిచ్చాం. వీరిలో 22 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. ఇవన్నీ పూర్తయితే ఈ ఒక్క పథకం ద్వారానే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, తానేటి వనిత, ఉషాశ్రీచరణ్, కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50% ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకు ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. ► అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలని, వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, లేక సెల్‌ఫోను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అండగా నిలిచే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26 వేల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగు పడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడుతోంది. వారి రక్షణ మీద కూడా మనలా దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. బాబు మోసం చేస్తే.. జగన్ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్ సహకారంతో దెందులూరులో రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.85 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, రూ.70 కోట్లతో మంచినీటి పథకం, నూజివీడు – దెందులూరు మధ్య తమ్మిలేరుపై బ్రిడ్జి శంకుస్థాపన, సీహెచ్‌సీ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నాడు చంద్రబాబునాయుడు ఇదే దెందులూరులో హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం జగన్ చెప్పిన మాట మేరకు డ్వాక్రా రుణాల చెల్లింపు దిశగా దెందులూరు వేదికగా మరో అడుగు మందుకు వేయడం ఆనందంగా ఉంది – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే కలకాలం సీఎం చల్లగా ఉండాలి వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా మా గ్రూప్ సభ్యులకు రూ.2.95 లక్షలు వచ్చాయి. నా వాటాగా రూ.27,400 దక్కాయి. గత రెండు విడతల ఆసరా కార్యక్రమం ద్వారా అందిన మొత్తాలతో కుట్టు మిషన్, జిగ్ జాగ్ మిషన్ కొనుగోలు చేసి, టైలరింగ్ ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. జగనన్న ఇచ్చిన ట్యాబ్‌తో బాగా చదివి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచాడు. కలకాలం మీరు (సీఎం) చల్లగా ఉండాలి. – ఎండీ.రుబీనా బేగం, 48వ డివిజన్, ఏలూరు మహిళల జీవితాల్లో వెలుగులు వైఎస్సార్ ఆసరా ద్వారా మా గ్రూపునకు రూ.5 లక్షలు అందింది. ఇందులో నా వాటాకు తోడుగా ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాను. నా భర్తకు రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి పోవడం వల్ల ప్రస్తుతం కుటుంబాన్ని నేనే నడిపిస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ఉచితంగా వైద్యం అందింది. వైఎస్సార్ ఆసరా నా లాంటి మహిళలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇంతలా తపించే సీఎం వైఎస్ జగన్‌కు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. – కలపాల గంగారత్నకుమారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని
సాక్షి, ఏలూరు: వైఎస్సార్ ఆసరా మూడవ విడత కింద మహిళలకు ఆర్ధిక సహాయం అందించేందుకు దెందులూరు కు విచ్చేసి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులు కలిసి తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. దెందులూరు గ్రామానికి చెందిన బర్నాన క్రాంతి ప్రసాద్ (31) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు, ఇప్పటికే రెండుసార్లు మేజర్ ఆపరేషన్లు జరిగాయని, 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యాయని తండ్రి గణపతి ముఖ్యమంత్రి వద్ద వాపోయారు. ఈ మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పెదవేగి మండలం రాట్నాలకుంట కు చెందిన పెనుబోయిన కృపారావు (39) తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి 5 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని, అందుకు ఆర్ధిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా దెందులూరు గ్రామానికి చెందిన వై. మోషేరాజు, ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కోసన అర్జున్ కిడ్నీల వ్యాధితో బాదుతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దాతలు సిద్ధంగా ఉంటె, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా బాధితులకు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌కు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేసారని, తక్షణ వైద్య సహాయం కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్థానని, హామీ ఇచ్చారని, ఆ మేరకు కృపారావు, కోసన అర్జున్, వై. మోషే రాజు లకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను వెంటనే పంపిణీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఉంగుటూరు మండలం గోపరాజుపాడు కు చెందిన కుప్పాల సుధారాణి తన కుమార్తె కె. దేదీప్య (5) కి పుట్టుకతోనే లివర్ సమస్య ఉందని, ఎండోస్కోపీ వైద్యానికి ప్రతీ నెల 30 నుండి 40 వేల రూపాయలు ఖర్చు అవుతోందని, తమ బాధను ముఖ్యమంత్రికి తెలియజేసారని కలెక్టర్ తెలిపారు. తన భర్త దుర్గా రావు కూలి పనికి వెళతారని, వైద్యానికి ఇప్పటివరకు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని చెబుతూ, ప్రస్తుతం వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళుతున్నామని, తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు వైద్య చికిత్సకు సహాయం చేయాలనీ ముఖ్యమంత్రిని కోరారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేదీప్య వైద్య చికిత్స నిమిత్తం వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లికి చెందిన పి . రేవతి తమ కుమార్తె పి . వెంకట లక్ష్మి (8) శాశ్వత వినికిడి లోపం సమస్యతో బాధపడుతున్నాదని, ఇప్పటికే 1.50 లక్షల రూపాయలతో చికిత్స అందించామని, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు 22 లక్షలు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రికి రోగి తల్లి రేవతి తమ బాధను వ్యక్తం చేశారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు అవసరమైన వైద్య సహాయం కోసం చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కును సదరు కుటుంబానికి అందించినట్లు కలెక్టర్ తెలియజేసారు. దెందులూరు గ్రామానికి చెందిన కొంగర ప్రిస్కిల్లా కుమార్తె కె. సెఫిల్ అనోరెక్టల్ మాల్ ఫార్మేషన్ తో బాధపడుతున్నట్లు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేసారని, దీనిపై మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిఎమ్ హెచ్ ఓ తో చర్చించి, ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం ప్రిస్కిల్లా కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లక్ష రూపాయల చెక్కును అందించినట్లు కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం, దెందులూరు గ్రామానికి చెందిన ఈడుపల్లి ప్రసాద్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నానని, మంచంపై నుండి కదలలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారని, వారికి వైద్య చికిత్స నిమిత్తం తక్షణ వైద్య సహాయంగా లక్ష రూపాయలు చెక్కును అందించి, పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన జుత్తిగ హేమలత తన కుమార్తె భవ్యశ్రీ మల్లిక (10 నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాదని , తిరుపతి లోని పద్మావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించామని, పోస్ట్ ఆపరేషన్ వైద్య చికిత్సకు మందులు అందించాలని ముఖ్యమంత్రికి తెలియజేసిన పిమ్మట వారి అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లుగా హామీ ఇచ్చారని , ఆ మేరకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కును అందించినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. ఆర్ధిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, డ్వామా పీడీ డి. రాంబాబు , ప్రభృతులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం (ఫొటోలు)
-
జగనన్న .. నేను చదువు కోలేదు.. నా బిడ్డలు చదువుతున్నారు
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, ప్రతి అక్కచెల్లెమ్మ ఇంత ఆనందంగా ఉందంటే సీఎంగారు తీసుకుంటున్న నిర్ణయాలు, అవి అమలుచేస్తున్న తీరే అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయిందంటే ప్రతి అక్కచెల్లెమ్మ సంతోషమే కారణం, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు -బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మీరే నాకు అన్నయ్య జగనన్నా మీరు పాదయాత్రలో మా ఇబ్బందులు గమనించి మాట ఇచ్చారు, ఇప్పుడు మాకు మూడో విడత వైఎస్సార్ ఆసరా అందజేస్తున్నారు, ఈ పథకం కింద మా గ్రూప్ సభ్యులకు రూ. 2,95,321 వచ్చాయి, అందులో నాకు రూ. 27,400 వచ్చాయి, నేను టైలరింగ్ చేస్తుంటాను, ఈ డబ్బుతో కొత్తగా జిగ్‌జాగ్ మిషన్ తెచ్చుకున్నాను, గతంలో రూ. వంద వచ్చే ఆదాయం ఇప్పుడు రోజుకు రూ. 200 వరకు వస్తున్నాయి, ఈ పథకంలో లబ్ధిపొందిన మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా నిలదొక్కుకుంటున్నారు. ఇదంతా మీ దయ, నేను చదువుకోలేదు, నా తండ్రిని కోల్పోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను కానీ నా బిడ్డలు నాలా కాకూడదని వారికి మంచి చదువులు చెప్పిస్తున్నా, నా పిల్లలు ఇంత బాగా చదవుతున్నారంటే మీరే కారణం అన్నా, నా పెద్ద కొడుకు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు, చిన్నకొడుకు గవర్నమెంట్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నాడు, తనకు మంచి భోజనం ఇస్తున్నారు, నా పిల్లల మేనమామలా మీరు అన్నీ చూసుకుంటున్నారు, నవరత్నాల పథకాలన్నీ లబ్ధిపొందుతున్నాం, ఒక చెల్లికి అన్నలా ఇంతకంటే ఏం చేస్తారు, మీరే నాకు అన్నయ్య, అందరికీ సూర్యుడు వెలుగునిస్తే మా మహిళలకు జగనన్న వెలుగునిస్తున్నారు, రంజాన్ మాసం సందర్భంగా నేను మీరు ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని దువా చేస్తాను అన్నా, మీరు చల్లగా ఉంటే రాష్ట్రమంతా చల్లగా ఉంటుంది, ధ్యాంక్యూ అన్నా. -రుబీనా బేగం, లబ్ధిదారు, ఏలూరు మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అన్నా నమస్కారం, అన్నా మీరు ఎంతోమంది పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం, మీ పాదయాత్రలో మా మహిళల కష్టాలు చూసి చలించిపోయి మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. నాకు రెండు విడతలుగా ఆసరా సాయం అందింది, నాకు చేయూత సాయం కూడా అందింది, నేను ట్రాక్టర్ కొనుక్కున్నాను, మీరు మాకు స్వేచ్చనిచ్చారు మా కుటుంబ ఆదాయం పెరిగేలా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా వినియోగించుకున్నాం, నేను రూ. 10 వేలు ప్రతి నెలా సంపాదిస్తున్నాను, మీరు మా అందరి హృదయాలలో నిలిచిపోయారు, నా భర్తకు ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడింది, ప్రమాదం జరిగినప్పుడు పూర్తి చికిత్స పొందడమే కాక తిరిగి సాయం చేశారు, నేను స్త్రీ నిధి లోన్ కూడా తీసుకున్నాను, మా మహిళలు ఇంతలా ఎదగడానికి మీరే కారణం, ధ్యాంక్యూ జగనన్నా. -కలపాల గంగా రత్నకుమారి, దొరమామిడి గ్రామం, పోలవరం నియోజకవర్గం -
ఏలూరు: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడుత నిధుల విడుదల
-
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది: సీఎం జగన్
మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే....: చెరగని ఆప్యాయతలు, చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు మీ అన్నకు, మీ తమ్ముడికి, మీ బిడ్డకు తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం... దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని దెందులూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపు 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ... మరో పదిరోజుల పాటు జరగబోయే ఆసరా సంబరాల్లో రూ.6,419 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రతిమండలంలోనూ ఒక పండగ వాతావరణం మధ్య ప్రతి అక్కా, ప్రతి చెల్లమ్మా తాను సాధించిన విజయాలు చెబుతుంది. మహిళా సాధికారితకు మీరే నిదర్శనం... మన దెందులూరులో నా స్టేజ్ ఎదురుగా మిమ్నల్ని చూసినప్పుడు మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్కచెల్లెమ్మలు స్టేజ్ మీదే కాకుండా.. నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా కనిపిస్తున్నారు. కేవలం 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోజు వైఎస్సార్ ఆసరాగా మూడో విడతకు సంబంధించిన నిధుల విడుదల ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇంతకముందు చెప్పినట్టుగా పదిరోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు... డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటామని 2019లో నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను... నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నా అక్కచెల్లమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం... ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ. 25,500 కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి పోయి కొట్టుమిట్టాడుతున్నవారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఆ మాట తప్పకుండా వారికి అండగా ఉండే కార్యక్రమం చేశాం. ఈ 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ పదిరోజుల ఆసరా పండగ కార్యక్రమంలో భాగంగా మరో రూ.6419 కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. అసరా ద్వారా రూ.19,178 కోట్లు జమ... ఎక్కడా ఎవ్వడూ లంచాలు అడగడు. ఎవ్వరూ వివక్ష చూపరు. నేరుగా మీ అన్న బటన్ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ రూ.6419 కోట్లు కలుపుకుంటే రూ. 19,178 కోట్లు నేరుగా ఒక్క ఆసరా ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతుంది.ఈ కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. వ్యాపార దిగ్గజాలతో అండ.... వైయస్సార్ ఆసరాగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది నేను మీ అభిమతానికి వదిలిపెట్టాను. ఈ డబ్బులు పెట్టుబడిగా వ్యాపారం, లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్నిరకాలుగా అండదండలు ఇస్తూ... మీకు తోడుగా ఉంటుంది. వారికి తోడ్పాటు ఇస్తూ సలహాలిస్తూ.. అండగా నిలబడి ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్ధలైన ఎల్ అంట్ టీ, పీ అండ్ జి, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్ గుడి, హిందుస్తాన్ యూనీలీవర్ వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని బ్యాంకులను కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మకూ వ్యాపార మార్గాలు చూపించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. స్వయం ఉపాధి దిశగా... ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వలన అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసరసరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేవులు ద్వారా పాడి, గొర్రెలు, మేకలు పెంపకం, పౌల్ట్రీ, పుడ్ ప్రాససింగ్ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీరిందరికీ స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించింది. ఆసరా, చేయూత సున్నావడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4355 కోట్లను వారికి అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వంలో... గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య పొదుపు సంఘాలకు సంబందించి సగటున వారికి బ్యాంకురుణాలు రూ.14వేలు ఇచ్చే కార్యక్రమం జరిగితే.. ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున బ్యాంకు రుణాలు ఏటా రూ.30వేలు అందుతున్నాయి. 99.95 శాతం రుణాల రికవరీ..దేశంలో పొదుపు సంఘాలకు ఏపీ రోల్‌మోడల్ అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి. వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. ఈ రుణాలు చెల్లించడంలో కూడా 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే పొదుపు సంఘాల విషయంలో ఆంధ్రరాష్ట్రం అక్కచెల్లెమ్మలు రోల్‌మోడల్‌గా నిలబడ్డారు. మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. పొదుపు సంఘాలలో జరుగుతున్న విప్లవాన్ని ఎలా జరుగుతుందని ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి.. పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా వేసింది. ఇంతకముందు రూ.3 లక్షల రుణానికి సంబంధించి వడ్డీ 13 శాతం ఉండగా దాన్ని 7 శాతానికే తగ్గించడమైంది. రూ.5లక్షల రుణంపై వడీ 13 శాతం ఉంటే దాన్ని కూడా బ్యాంకులతో మాట్లాడి 9.5 శాతానికి తగ్గించడమైంది. ఈ వడ్డీ శాతంపై కూడా ఇంకా బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఈవడ్డీ శాతం కూడా ఇంకా తగ్గించుకుంటూ పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు ? ఆదాయం ఎంత వస్తుంది ? ఏ మేరకు వడ్డీ రీజనబుల్ ? వడ్డీ ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి మీ తరపున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. చేయూతతో మారిన పొదుపు సంఘాలు... మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో చేయూత వల్ల పొదుపుసంఘాల పనితీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మరలా ఈ రోజు ఊపిరి పోసుకుంది. ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్లగా మార్పు చెందాయి. ఈ సంఘాలు ఇంతకముందు ఎన్పీఏలు. గత ప్రభుత్వ హయాంలో ఎన్పీఏలు ఓవర్ డ్యూస్గా 18 శాతం మేరకు సంఘాలు ఉంటే.. ఈ రోజు ఎన్పీఎలు, ఓవర్ డ్యూలు శాతం 0.45 శాతం మాత్రమే. మనందరి ప్రభుత్వం సాధికారిత, అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా అండగా నిలబడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అక్కచెల్లమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఆ రోజులలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం అంటూ ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కచెల్లెమ్మలతో పనిఅయిపోయింది. అక్కచెల్లెమ్మలకిచ్చిన హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబరు నుంచి వారి తరపున కట్టాల్సిన సున్నావడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన సున్నావడ్డీని మరలా తీసుకొచ్చి దీనికింద రూ.3036 కోట్లు ఇవాళ వడ్డీ రూపంలో తిరిగి చెల్లించడం జరిగింది. 2016 అక్టోబరులో నిలిచిపోయిన సున్నావడ్డీ అనే పథకాన్ని మన ప్రభుత్వం తిరిగి తీసుకునిరావడం వల్ల మన ప్రభుత్వం రూ.3615 కోట్లు సున్నావడ్డీ పథకం కింద చిరునవ్వుతో చెల్లించాం. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఈ 45 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ఏ రకంగా ముందుకు వేసిందో కొన్ని ఉదాహరణలు చెబుతాను. వివిధ పథకాల ద్వారా... జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైయస్సార్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు సాయం అందించాం. వైయస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో 3.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.596 కోట్లు అందించాం. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా మరో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యాదీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువులు కోసం అందించిన సహాయం.. రూ.9947 కోట్లు. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లలు వసతి భోజన సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి రూ.3363 కోట్లు ఇచ్చాం. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్లపట్టాలిచ్చాం. 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తైతే ప్రతి అక్కచెల్లెమ్మచేతిలోనూ ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా కూడా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 30 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న పరిస్థితులు.. ఇవన్నీ పూర్తైతే ఈ ఒక్క పథకం ద్వారా రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్లు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. మహిళా పక్షపాత ప్రభుత్వం.... ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మహిళా పక్షపాత ప్రభుత్వం. నా అక్కచెల్లెమ్మలకు విద్యా, ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతను కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం... వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగుపడాతాయని నమ్మిన ప్రభుత్వం మనది. కాబట్టి.. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడి, వారి రక్షణ మీద దృష్టిపెట్టిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అఢుగులు వేస్తున్నాం. ఆర్ధికంగా తోడుగా ఉండడం, రాజకీయంగా కూడా అక్కచెల్లెమ్మలను పైకి తీసుకురావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం... నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జడ్పీ చైర్మన్ వరకూ, మున్సిపల్ చైర్మన్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకూ గుడి చైర్మన్ నుంచి ఏఎంసీ చైర్మన్ పదవుల వరకూ ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. అక్క చెల్లెమ్మల రక్షణ కోసం... అక్కచెల్లెమ్మల రక్షణ కల్పించే విషయంలో అడుగులు వేగంగా వేసింది. అక్కచెల్లెమ్మలు ఎక్కడికి పోయినా, ఎప్పుడు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలి. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్ రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా ఒక ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా పోన్‌ను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పదినిమిషాల్లో అక్కడికి వచ్చి అక్కా నీకేమైంది అని అడిగే గొప్ప వ్యవస్ధనుతీసుకొచ్చాం. 21 వ శతాబ్ధపు ఆధునిక మహిళ ఏపీ నుంచే.. ఈ రోజు దిశ యాప్ ద్వారా 26వేల మంది అక్కచెల్లెమ్మలకి మంచి జరిగింది. ఇవన్నీ మహిళలు విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్ధికంగా రాజకీయంగా ఎదగాలని, బాగుపడాలని 21వ శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో ఈ 45 నెలల పాలన జరిగింది. ఈ రోజు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు సొమ్ము ఇచ్చాం. ఇంతలా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచించి, మంచి చేసిన పరిస్థితి గతంలో లేదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా తపిస్తున్నాను. దేవుడి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై, ఈ ప్రభుత్వంపై ఉండాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ ఆసరా: సీఎం జగన్ దెందులూరు పర్యటన దృశ్యాలు
-
హామీని నిలబెట్టుకున్నా.. అండగా నిలిచా: సీఎం జగన్
Updates Time: 01:05 PM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని ఆయన విడుదల చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. Time: 12:47 PM ►రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి: సీఎం జగన్ ►ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు : ►ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను ►స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ►అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం ►మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం ►9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ►రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం ►తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు ►చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి ►99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారు ►దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం ►ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం ►చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది ►ఎన్పీఏలు, ఓవర్ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే ►గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం ►రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు ►వారిని నిలువునా ముంచేశారు ►2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు ►రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్కవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ►తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం ►2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం ►చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వం మనది ►ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది ►అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం: ►మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం ►కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది ►ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది ►గుడి ఛైర్మన్, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం ►అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం ►1.17 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నారు ►21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపన పడుతున్నాను Time: 12:25 PM ►మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది: సీఎం జగన్ ►వ్యాపార దిగ్గజాలతో ఒప్పంద చేసుకొని వ్యాపార మార్గాలు చూపాం ►ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచాం. ►పొదుపు సంఘాల మహిళలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు ►పొదుపు సంఘాల పనితీరును ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి ►బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నాం ►78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం ►10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పంపిణీ ఉత్సవాలు ►ప్రతి మండలంలోనూ ఉత్సవంలా వైఎస్సార్ ఆసరా కార్యక్రమం Time: 12:25 PM ►పొదుపు సంఘల మహిళలకు అండగా నిలిచాం: సీఎం జగన్ ►డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించాం ►లంచాలు లేవు.. వివక్ష ఉండదు.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు ►ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం Time: 12:09 PM ►మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: సీఎం జగన్ ►పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా ►డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా ►నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా ►ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నా Time: 12:00 PM ►వైఎస్సార్ ఆసరా నిధులు ఇవ్వడం సంతోషంగా ఉంది: లబ్దిదారులు ►వైఎస్సార్ ఆసరా నిధులతో మా కాళ్ల మీద మేము నిలబడ్డాం ►అండగా విద్యాకానుక, విద్యాదీవెన, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలు. ►మీ పాలనలో మా పిల్లలకు మంచి చదువులు ►నవరత్నాల పథకాలతో మా జీవితాల్లో వెలుగులు నింపారు. Time: 11:45AM ► సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుది: ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ►డ్వాక్రా మహిళలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. ►పొదుపు సంఘాలు చివరికి సీ,డీ గ్రేడ్లకు పడిపోయాయి. ►సున్నావడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మల్లో మళ్లీ ఆనందం తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది ►సీఎం జగన్ పాలనలో పొదుపు సంఘాలు ఏ,బీ గ్రేడ్లకు చేరాయి. Time: 11:31AM ► వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులను పలకరించిన సీఎం జగన్ ► వైఎస్సర్ ఆసరా లబ్ధిదారులతో సీఎం జగన్ ఫోటో సెషన్ Time: 11:15AM ►దెందులూరు సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్నారు. Time: 10:50AM ► దెందులూరుకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా ప్రాంగణానికి బయల్దేరారు. దారిపోడవునా సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. Time: 10:10AM ► ఏలూరు జిల్లా దెందులూరుకు సీఎం జగన్ బయల్దేరారు. కాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. సాక్షి, ఏలూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావారణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు. పథకం ఉద్దేశ్యం ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ పథకం తీసుకురావడం జరిగింది. మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది. మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందూస్తాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా, అజియో రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఆయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి సీఎం బాటలు వేశారు. కార్పొరేట్ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్రవ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లలోనే 98.5 శాతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చంద్రబాబు మాదిరిగా తమది మాటల ప్రభుత్వం కాదని, చెప్పింది చేసి చూపించే చేతల ప్రభుత్వమన్నారు. 2019 ఎన్నికల నాటికి అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తానని మాట ఇచ్చి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. పొదుపు మహిళలకు ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా రాసిన లేఖ సారాంశం ఇదీ... ♦ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో సంవత్సరం కూడా పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఎంతో సంతోషంగా తెలియచేస్తూ అక్క చెల్లెమ్మలందరికి హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నా. మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. మేనిఫెస్టోను పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి హామీల అమలుకు క్యాలెండర్‌ను ముందే ప్రకటించి 98.5 శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మనది. ♦ డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత చంద్రబాబు సర్కారు మోసగించడంతో రుణభారం తడిసి మోపెడై అక్కచెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితుల్లో కూరుకుపోయారు. మహిళా సంఘాలు ఛిన్నాభిన్నమై ‘ఏ’ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు కూడా ‘సి’, ‘డి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి. ♦ స్వయం సహాయక సంఘాల మహిళల ఆ ర్థిక ఇబ్బందులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసి చలించిపోయా. ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారం ఎన్నికల రోజు వరకు 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల మంది పొదుపు అక్కచెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ రూ.25,571 కోట్లను నాలుగు దఫాలుగా నేరుగా చెల్లించాలని నిర్ణయించి నవరత్నాల పథకంలో చేర్చాం. 2016లో రద్దయిన సున్నావడ్డీ పథకాన్ని కూడా పునరుద్ధరించాం. ♦ మీ జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకొచ్చి సుస్థిర ఆదాయం, వ్యాపారం, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును వినియోగించుకుని ఆర్థికంగా ఎదిగి అక్కచెల్లెమ్మలు లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ♦ అక్కచెల్లెమ్మలను సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ప్రోత్సహిస్తూ జీవనోపాధి మెరుగుపరచుకునేలా గతేడాది అమూల్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, అలానా లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని బ్యాంకుల నుంచి తోడ్పాటు అందిస్తున్నాం. ఈ ఏడాది అజియో–రిలయన్స్, గ్రామీణ వికాసకేంద్రం, టేనేజర్, మహేంద్ర–ఖేతి లాంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాల ద్వారా వ్యాపార మార్గాలు చూపించి ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆ ర్థికాభివృద్ధికి బాటలు వేశాం. ♦ 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ సాధికారతతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించేలా ప్రోత్సహిస్తున్నాం. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఆ ర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి కృషి చేస్తున్న మన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీ అండదండలు ఉండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు లభించాలని నిండు మనసుతో కోరుకుంటున్నా. నేడు ఏలూరు జిల్లాకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ ఆసరా ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఎలాంటి షరతులు లేవు.. ఎలా ఉపయోగించుకున్నా సరే అక్కచెల్లెమ్మలకు అందచేస్తున్న ఈ మొత్తాన్ని ఎలా వినియోగించుకుంటారనే అంశంపై ఎలాంటి షరతులు లేవు. మన ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ ఆదాయాలను పెంచుకుని మీరు సంతోషంగా ఉండాలి. మీ కుటుంబ ఆదాయం పెరగటం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్రాభివృద్ధిలో మీరు భాగస్వాములు కాగలుగుతారు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలున్నా భరిస్తూ ఇచ్చిన మాటమేరకు మీ తోబుట్టువుగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నా. జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మీ కోరికను నెరవేర్చే దిశగా నా ప్రతి అడుగు వేస్తున్నా. మీ అందరి ఆశీస్సులు నాతోపాటే ఉంటాయన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అక్షరాలా పాటిస్తూ ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు చెల్లించాం. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. రెండో విడతగా 78.76 లక్షల మందికి మరో రూ.6,439.52 కోట్లు చెల్లించాం. ఇప్పుడు మళ్లీ అక్కచెల్లెమ్మలకు మరో రూ.6,419.89 కోట్లు మూడో విడతగా అందచేయనున్నాం. తద్వారా మూడు విడతలలో మొత్తం రూ.19,178.17 కోట్ల మేర 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుతోంది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ దాకా ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగిన పథకాలను అమలు చేస్తూ మహిళాభివృద్ధి ద్వారానే మన కుటుంబాభివృద్ధి జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. అన్ని నామినేషన్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేశాం. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. -
అతివల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’!
సాక్షి, రాజమహేంద్రవరం: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి రూపకల్పన చేశారు. సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ. 485 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశారు. తాజాగా శనివారం మూడో విడతలో రూ.242.85 కోట్లు రుణమాఫీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీఆర్డీఏ అధికారులు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ఆసరా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్దేశం ఇదీ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో తాను అధికారంలోకి వస్తే దశల వారీగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11, 2019 నాటికి వారు తీసుకున్న రుణాలను ఎంతైతే అప్పు నిల్వ మిగిలి ఉంటుందో వాటిని నాలుగు విడతలుగా ఆయా సంఘాలకు చెల్లించేందుకు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. తూర్పు గోదావరిలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలున్నాయి. తొలి దశలో 27,297 సంఘాలకు రూ.241.98 కోట్లు, రెండో దశలో 27,417 సంఘాలకు రూ.244.04 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా శనివారం మూడో విడత కింద జిల్లాలో 27,413 స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరనుంది. రూ.242.85 కోట్ల నగదు మహిళల ఖాతాల్లో జమ కానుంది. సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి ప్రక్రియ ప్రారంభిస్తారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా జాబితా రూపకల్పన చేశారు. సచివాలయాల వద్ద జాబితాను అందుబాటులో ఉంచారు. సభ్యులు చనిపోయినా నామినీ వివరాలు అధికారులకు అందజేస్తే పరిష్కరించి సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటారు. రేపటి నుంచి వారోత్సవాలు ఆదివారం నుంచి వాడవాడలా ఆసరా సంబరాలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సన్నద్దం చేస్తోంది. గ్రామం, మండల కేంద్రం, పట్టణం, నగరం మెదలు అన్ని ప్రాంతాల్లో ‘గడప గడపకు ఆసరా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రజలకు, మహిళలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు చేస్తున్న ఆర్థిక సాయంపై అవగాహక కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. టీడీపీ హయాంలో మోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో మహిళలు రుణాలు చెల్లించలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన బాబు హామీ ఊసే ఎత్తలేదు. చేసేది లేక మహిళలు చేసిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. అప్పుకోసం బ్యాంకర్ల ద్వారా వేధింపులకు గురయ్యారు. తిరిగి 2019 ఎన్నికల సమంయలో మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు బాబు కొత్త పన్నాగం పన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపూకుంకుమ కింద నగదు అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రహించిన డ్వాక్రా మహిళలు ఎన్నికల్లో బాబును దూరం పెట్టారు. వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు ప్రభుత్వం అంజేస్తున్న ఆసరా సొమ్ముతో మహిళలు స్వయం ఉపాధి దిశగా దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు స్త్రీనిధి ద్వారా వచ్చిన సొమ్మును జమ చేసుకుని పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణం, గుడ్లు విక్రయించడం, టెంట్లు అద్దెకు ఇస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. జీవన ప్రమాణాల మెరుగునకు కృషి మహిళల జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆసరా పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. రుణమాఫీ ద్వారా వచ్చే నగదుతో పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. స్వయం ఉపాధి పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా మహిళలు కుటుంబ పోషణకు భర్తకు చేదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో ఆసరా నిధులు విడుదలయ్యాయి. ఆసరా వారోత్సవాల సందర్భంగా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి గ్రామంలో వివరిస్తాం. –ఎస్.సుభాషిణి, పీడీ డీఆర్డీఏ. -
ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో లాంఛనంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకానికి అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పది రోజులపాటు ఉత్సవాలు కాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు. చదవండి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు! ఇంటింటికీ వెళ్లి.. మరోవైపు ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో వారికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా, 23, 24 తేదీల్లో కూడా కొనసాగనున్నాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కాలంలో సంఘాలన్నీ కుదేలు 2014లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టవద్దని చంద్రబాబు పిలుపునివ్వడంతో మహిళలు ఆ రుణాలు కట్టలేదు. దీంతో వాటి వడ్డీలు కూడా చెల్లించలేనంతగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలు పూర్తి చిన్నాభిన్నమై ‘ఏ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సీ’, ‘డీ’ కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాల రుణాలపై సున్నా వడ్డీ పథకానికి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం నిలిపివేసింది. ఇలాంటి దుస్థితిలో రాష్ట్రంలో తిరిగి పొదుపు సంఘాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో పొదుపు సంఘాలు తిరిగి జీవం పోసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన రాష్ట్రంలో 99.55 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం పొదుపు సంఘాల్లో 91 శాతం ఏ, బీ గ్రేడ్‌ల్లో కొనసాగుతున్నాయి. -
Andhra Pradesh: ‘సంఘ’టితంగా.. కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతితో కాంతులీనుతున్నాయని, మహిళల ఆధ్వర్యంలో పలు వ్యాపారాల నిర్వహణ అద్భుతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పొదుపు సంఘాల మహిళలు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వివిధ వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యత రంగాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేస్తోందని అభినందించింది. ఆరోగ్యం (ఆరోగ్యశ్రీ), విద్య (అమ్మ ఒడి), విద్య (ఫీజు రీయింబర్స్మెంట్), గృహ నిర్మాణం (పేదలందరికీ ఇళ్లు), జీవనోపాధి (వైఎస్సార్ చేయూత – వైఎస్సార్ ఆసరా), సంక్షేమం (పెన్షన్ల పెంపు), వ్యవసాయం (వైఎస్సార్ రైతు భరోసా), సాగునీరు (జలయజ్ఞం), మద్య నియంత్రణను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి అమలు చేస్తూ కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటోందని తెలిపింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తోందని కమిటీ పేర్కొంది. కాగా గత సర్కారు హయాంలో డ్వాక్రా రుణమాఫీ అందక డిఫాల్టర్లుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆదుకున్న విషయం తెలిసిందే. ఎన్పీఏలుగా మారిన డ్వాక్రా సంఘాలు దీంతో పునరుజ్జీవమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 14 పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర రిటైర్డ్ కార్యదర్శితో పాటు తమిళనాడు రిటైర్డ్ సీఎస్ల నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 6వ కామన్ మిషన్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కమిటీ పర్యటించింది. ఫిబ్రవరి 17 – 27 తేదీల మధ్య నలుగురు ప్రతినిధులతో కూడిన బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలను సందర్శించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా పరిశీలించిన అంశాలను విశ్లేషిస్తూ కమిటీ నివేదికను రూపొందించింది. అందులో ముఖ్యాంశాలు ఇవీ. శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆత్మవిశ్వాసం.. టెక్నాలజీ వినియోగం రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల నిర్మాణం దాదాపు సంతృప్త స్థాయిలో ఉంది. అపార సామాజిక మూలధన రూపంలో సభ్యులు ఆత్మ విశ్వాసంతో, శక్తివంతంగా ఉన్నారు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడంతో పాటు సంక్షోభంలో పరస్పరం సాయం చేసుకుంటున్నారు. సంఘాల కార్యకలాపాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. హాజరు నమోదుతో పాటు రుణ వివరాల లాంటి రికార్డుల కోసం మొబైల్ అప్లికేషన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ► రాష్ట్రంలో పొదుపు సంఘాలు కిరాణా, బ్యూటీ పార్లర్, కలంకారీ, చెక్క క్రాఫ్టింగ్, చీపుర్ల తయారీ, వివాహ వస్తువుల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పూల పెంపకం, వ్యవసాయం, పశువులు, మిల్లెట్స్ ఉత్పత్తి, చిన్న వ్యాపారాలు, ఉద్యానవనాలు లాంటి వివిధ రకాల జీవనోపాధి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయి. సేంద్రీయ వ్యవసాయంలోనూ.. పొదుపు సంఘాలు సభ్యులు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు రుణాలు తీసుకుని వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టైలరింగ్, కొవ్వొత్తుల తయారీ, స్వీట్ షాప్ లాంటి వ్యాపారాలను చేస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల రికవరీ రేటు నూటికి నూరు శాతంగా ఉంది. సాధికారత, ఆర్థిక నిర్వహణలో బాగా ప్రావీణ్యం ఉంది. పొదుపు సంఘాలు సేంద్రీయ వ్యవసాయంతో పాటు న్యూట్రి గార్డెన్స్‌లో కూడా పాల్గొంటున్నాయి. మెరుగైన ఆదాయం.. పొదుపు సంఘాల సభ్యులు మెరుగైన ఆదాయ స్థాయి కలిగి ఉన్నారు. ఉదాహరణకు పొదుపు సంఘంలోని ఓ సభ్యురాలు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ పొంది రుణం తీసుకుని టైలరింగ్ దుకాణాన్ని ప్రారంభించింది. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పొదుపు సంఘాల ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెర్ప్ ద్వారా సంఘాలకు తగిన మద్దతు ఇస్తుండటంతో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలు శక్తివంతంగా ఉన్నాయి. సంఘాల సభ్యులకు గ్రామీణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన ఉంది. ► పొదుపు సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకుంటున్నాయి. పల్స్ పోలియో, కోవిడ్ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఉపాధి, మౌలికం.. భేష్ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన బాగుందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. వైవిధ్యమైన సామాజిక సంపదను సృష్టించినట్లు క్షేత్రస్థాయి సందర్శనలో గుర్తించామని తెలిపింది. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ప్రశంసించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనాలు, గ్రామ సచివాలయాల భవనాలు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక సంపద సృష్టించటాన్ని ప్రస్తావించింది. ‘నేషనల్ రూర్బన్ మిషన్’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభావవంతంగా నిర్వహిస్తోందని తెలిపింది. 70 శాతం డిపార్ట్మెంట్ నిధులతో పాటు 30 శాతం క్రిటికల్ గ్యాప్ నిధులను ఏకీకృతం చేసి వాటర్ ట్యాంక్‌లు, అంగన్వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, కాలేజీ భవనాల నిర్మాణం తదితరాలను నిర్దేశిత ప్రణాళికతో అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ► సాధారణంగా ఉపాధి హామీ కింద జాబ్ కార్డులను డిమాండ్ ఆధారంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను నియమించిన తరువాత గ్రామ పంచాయతీ స్థాయిలోనే జాబ్ కార్డులను ఇస్తున్నారు. గతంలో బ్లాక్ స్థాయిలో ఇచ్చేవారు. ఇప్పుడు జాబ్ కార్డుల మంజూరు గణనీయంగా మెరుగుపడింది. ► కోవిడ్, లాక్డౌన్ సమయంలో ముందుగానే జాబ్ కార్డులను జారీ చేశారు. ముఖ్యంగా వలస కూలీలు తిరిగి రాగానే జాబ్ కార్డులిచ్చారు. లబ్ధిదారుల ఫొటోలతో సహా జాబ్ కార్డులను జారీ చేశారు. ► రాష్ట్రంలో ఉపాధి హామీకి సంబంధించి ప్రతి పని వివరాలు ఫైల్ రూపంలో ఉన్నాయి. మెజర్మెంట్ బుక్‌తో సహా రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు. ► కూలీలకు వేతనాలు నూటికి నూరు శాతం డీబీటీ చెల్లింపులు చేస్తున్నారు. పనులను నూరు శాతం జియో ట్యాగింగ్ చేస్తున్నారు. కూలీలకు వేతనాలను సమయానికి ఇస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ బాగుంది యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో బాగా అమలవుతున్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు మంచి మౌలిక సదుపాయాలున్న సంస్ధ ద్వారా రెసిడెన్షియల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. శిక్షణ భవనాలు, తరగతి గదులు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, ఐటీ శిక్షణ ల్యాబ్స్ చాలా బాగున్నాయని, 40 గంటల కాలం పాటు శిక్షణ అందుతోందని కమిటీ పేర్కొంది. అర్హత కలిగిన శిక్షకులు, రిసోర్స్పర్సన్లు అందుబాటులో ఉంటున్నారు. ప్లేస్‌మెంట్స్ 70 – 80 శాతం వరకు ఉన్నాయని తెలిపింది. కొందరు లబ్ధిదారులు రెండు మూడేళ్ల పని అనుభవం తరువాత నెలకు రూ.లక్ష వేతనం ఆర్జిస్తున్నారని, కోవిడ్ సమయంలోనూ శిక్షణ కేంద్రాలను కొనసాగించారని పేర్కొంది. రూ.వేల కోట్లతో పేదలకు ఇళ్లు పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా దశాబ్దాలుగా సొంత గూడు లేని నిరుపేద కుటుంబాలకు గృహాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కమిటీ తెలిపింది. పేదల ఇళ్ల కోసం అందుబాటులో ఉన్న చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఉచితంగా కేటాయించింది. ఇది కాకుండా ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రిజిస్టర్డ్ భూములను సేకరించేందుకు ఏకంగా రూ.23 వేల కోట్లను వ్యయం చేసి పేదలకు ఇళ్ల పట్టాలిస్తోందని కమిటీ పేర్కొంది. వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఉత్తమ విధానాలు ► ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఏపీ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తోంది. ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించి వివిధ వస్తువులను వేరు చేసి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున విక్రయించే ఈ ఎరువులను తోటల సాగుదారులతోపాటు స్థానిక రైతులు కొనుగోలు చేస్తున్నారు. -
జగనన్న సర్కార్ అండతో పెరిగిన పరపతి
ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, ఎవ్వరూ బ్యాంకులకు కంతులు చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మహిళలు మోసపోయారు. అప్పటి వరకు సక్రమంగా కంతులు చెల్లించిన వారు ఒక్కసారిగా డీఫాల్టర్లుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ముందు వరకు బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాలకు సంబంధించిన మొత్తాన్ని ‘వైఎస్సార్ ఆసరా’ కింద విడతల వారీగా సంఘాలకు చెల్లించింది. ప్రభుత్వ చేయూత ద్వారా మహిళలు అప్పులు తీర్చేశారు. బ్యాంకులతో కొత్తగా రుణాలు ఇప్పించడంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. సంఘాల సభ్యులు సక్రమంగా కంతులు చెల్లించడం ద్వారా అగ్రపథంలో నిలిచి పరపతి పెంచుకున్నారు. అనంతపురం అర్బన్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)పై బ్యాంకులకు అపార నమ్మకం. బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో తీరుస్తుండటమే ఇందుకు కారణం. సంఘాలు అడిగిన వెంటనే బ్యాంకులు రూ.కోట్లలో రుణం మంజూరు చేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు జగనన్న సర్కార్ వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన మూడేళ్లలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా బ్యాంకులు రూ.5,423 కోట్ల రుణం మంజూరు చేశాయి. 99.62 శాతం రుణ చెల్లింపు స్వయం సహాయక సంఘాలకు గడిచిన మూడేళ్లలో బ్యాంకులు రూ.5,423 కోట్లు రుణం మంజూరు చేస్తే అందులో సగటున 99.62 శాతం చెల్లింపులు జరిగాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 47,358 సంఘాలకు బ్యాంకులు రూ.1,587 కోట్ల రుణం మంజూరు చేస్తే 99.61 శాతం చెల్లించారు. 2020–21లో 59,849 సంఘాలకు రూ.1,726 కోట్ల రుణం ఇవ్వగా చెల్లింపులు 99.60 శాతం ఉన్నాయి. 2021–22లో 55,221 సంఘాలకు రూ.2,110 కోట్లు రుణం మంజూరు చేస్తే చెల్లింపులు 99.65 శాతం జరిగాయి. రూ.387.01 కోట్ల సున్నా వడ్డీ స్వయం సహాయక సంఘాలు నిర్వహించుకుంటూ ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.137.72 కోట్లు, 2020–21లో రూ.118.35 కోట్లు, 2021–22లో రూ.130.25 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. సీఎంకు రుణపడి ఉంటాం మహిళల అర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాము. మా సంఘం ద్వారా ప్రతిసారి రూ.5 లక్షల రుణం తీసుకుంటున్నాం. సకాలంలో కంతులు కడుతున్నాం. మేము తీసుకున్న రుణానికి వడ్డీని ప్రభుత్వం సున్నావడ్డీ పథకం ద్వారా చెల్లిస్తోంది. ఇదే కాకుండా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎంతో చేస్తున్నారు. – సునీత, సత్యసాయి మహిళా సంఘం, అనంతపురం సక్రమంగా చెల్లిస్తున్నాం మా సంఘంలో పది మంది సభ్యులం ఉన్నాము. ఇటీవలనే బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాం. తొలి నుంచి కంతులు సక్రమంగా చెల్లిస్తుండడంతో అడిగిన వెంటనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తున్నారు. ఈ అప్పు తీరిన వెంటనే రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. సున్నావడ్డీ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. – సుమంగళమ్మ, నైథిలి మహిళా సంఘం, బ్రహ్మసముద్రం రికవరీ సంతృప్తికరం మహిళలు తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో వారు అడిగిన వెంటనే బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. రుణాల రికవరీ 95 నుంచి 99 శాతంతో సంతృప్తికరంగా ఉంది. సంఘాలకు రుణం మంజూరు, చెల్లింపు విషయంలో సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారు. దీంతో చెల్లింపులు బాగుంటున్నాయి. – బి.నాగరాజరెడ్డి, ఎల్డీఎం బాధ్యతగా రుణ చెల్లింపులు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు బాధ్యతగా చెల్లిస్తున్నారు. ఏటా లక్ష్యానికి మించి బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఏదేని సంఘం రుణం సకాలంలో చెల్లించకపోతే అది సున్నావడ్డీ పథకానికి అర్హత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో రుణం మంజూరు చేయించడంతో పాటు వారు సక్రమంగా చెల్లించే విషయంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ బ్యాంకుల సంపూర్ణ సహకారం పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణం మంజూరు చేయడంలో బ్యాంకులు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. రుణం తీసుకున్న సంఘ సభ్యులూ బాధ్యతగా సకాలంలో చెల్లిస్తున్నారు. ఇక నారీశక్తి కింద మహిళలకు యూనియన్ బ్యాంక్ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. – విజయలక్ష్మి, పీడీ, మెప్మా -
వైద్య సేవలపై ఫిర్యాదులకు '104 '
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతూ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఫిర్యాదులను సైతం స్వీకరించేలా ఇప్పటికే విస్తృత ప్రచారం పొందిన 104 టోల్ ఫ్రీ నంబర్ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. తొలుత ఐదు సేవలతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్(ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం.. ఈ ఐదు సేవలకు సంబంధించి తొలుత ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం ఇతర సేవలకు విస్తరించనున్నారు. స్పందనతో అనుసంధానం 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన సేవలు, సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే ప్రజలకు అందిస్తున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో 30 మంది సిబ్బందితో పనిచేసే కాల్‌సెంటర్‌కు నిత్యం వెయ్యి వరకూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఫిర్యాదులు స్వీకరించేందుకు విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటైంది. ఇక్కడ 30 మంది విధుల్లో ఉంటారు. ఫిర్యాదుల కాల్‌సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ ప్రజాసమస్యల పరిష్కార వేదిక డ్యాష్‌బోర్డుకు అనుసంధానించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, పరిష్కారానికి సంబంధించి డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎస్వోపీ రూపకల్పన కాల్ సెంటర్‌కు అందే ఫిర్యాదులను ఎంత సమయంలోగా పరిష్కరించాలి? ఎవరెవరు బాధ్యత వహించాలి? అనే అంశాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించారు. గత మూడేళ్లుగా ఐదు సేవలకు సంబంధించిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించింది. సమస్య తీవ్రత ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని అత్యంత వేగం, వేగం, సాధారణం అని మూడు విభాగాలుగా విభజించారు. అత్యంత వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను గంట లోపు పరిష్కరిస్తారు. వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 24 నుంచి 72 గంటలు, సాధారణ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 7 నుంచి 21 రోజుల్లోగా పరిష్కరించాలని నిర్దేశించారు. దీనిపై కాల్‌సెంటర్ సిబ్బంది, ఆరోగ్యశ్రీ, 104 ఎంఎంయూ, 108 జిల్లా కోఆర్డినేటర్లు, టీమ్‌లీడర్లు తదితరులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే వారం ప్రారంభం ఐదు రకాల సేవలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. ఇబ్బందులు ఎదురైతే 104కు కాల్ చేయవచ్చు. వచ్చే వారం ఫిర్యాదుల స్వీకారం ప్రారంభిస్తాం. అంబులెన్స్‌లు, ఆరోగ్య మిత్ర కియోస్క్‌లపై ఫిర్యాదుల నంబర్ ప్రదర్శించేలా స్టిక్కర్లు సిద్ధం చేశాం. వైద్య సేవలు పొందడంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాం. – వినయ్‌చంద్, ఆరోగ్యశ్రీ సీఈవో ఫిర్యాదులు ఇలా... ► నిర్దేశించిన ఐదు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటే 104కి కాల్ చేసి 1వ నంబర్ నొక్కాలి. ► అనంతరం కాల్ సెంటర్ సిబ్బంది లైన్లోకి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు. ► ఉదాహరణకు ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్య మిత్ర అందుబాటులో లేకుంటే ఈ ఫిర్యాదు అత్యంత వేగంగా స్పందించాల్సిన విభాగం పరిధిలోకి వస్తుంది. ఇది గంటలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్‌కు సమాచారం ఇస్తారు. ఒకవేళ అక్కడ స్పందించడంలో ఆలస్యం అయితే వెంటనే జిల్లా ఆరోగ్యమిత్ర కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌కు ఫిర్యాదు వెళుతుంది. గంటలోగా ఫిర్యాదు పరిష్కారం కాకుంటే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు అధికారుల దృష్టికి వచ్చేలా చర్యలు చేపట్టారు. సకాలంలో ఫిర్యాదు పరిష్కరించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. పలు సమస్యలు – వాటి పరిష్కారం ఇలా ఆరోగ్య శ్రీ అత్యంత వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (గంటలోపు) ► ఆరోగ్యమిత్ర అందుబాటులో లేకపోవడం ► ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్, చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడం వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► హెల్త్ కార్డు డీయాక్టివేషన్‌లో ఉండటం ► అడ్మిషన్, చికిత్స సమయంలో డబ్బు డిమాండ్ చేయడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► పోస్ట్ ఆపరేషన్, ఫాలో అప్‌లో సమస్యలు ► హెల్త్‌కార్డు అందకపోవడం ► కుటుంబసభ్యుడిని కార్డులో చేర్చడం, తొలగించడం ► ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతున్న రోగి మరణించడం, ఇతర ఫిర్యాదులు ఆరోగ్య ఆసరా వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► బ్యాంక్ ఖాతాలో ఆసరా డబ్బు జమకాకపోవడం ► ఆసరాకు దరఖాస్తు చేయడంలో ఆరోగ్యమిత్ర ఆలస్యం చేయడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► మంజూరైన దానికంటే తక్కువ భృతి అందడం, ఇతర ఫిర్యాదులు 104 ఎంఎంయూ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► గ్రామానికి 104 ఎంఎంయూ రాకపోవడం ► ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లిపోవడం ► వైద్యపరీక్షలు చేయకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► వైద్యసేవలు అందించడానికి డబ్బు డిమాండ్ చేయడం ► సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ► పరికరాలు పనిచేయకపోవడం, ఇతర సమస్యలు 108 అంబులెన్స్ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► అంబులెన్స్ ఆలస్యంగా రావడం, సేవలు అందించడానికి తిరస్కరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం ► అంబులెన్స్‌లో ఆక్సిజన్, మందులు, పరిశుభ్రంగా లేకపోవడం ► సిబ్బంది ప్రవర్తన, ఇతర సమస్యలు మహాప్రస్థానం వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► డ్రైవర్ మద్యం తాగి ఉండటం ► వాహనం అందుబాటులో లేకపోవడం, గమ్యస్థానానికి చేర్చడానికి నిరాకరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► సిబ్బంది ప్రవర్తన, డబ్బు డిమాండ్ చేయడం, ఇతర ఫిర్యాదులు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► వాహనాలు అందుబాటులో లేకపోవడం, ఆలస్యం చేయడం, తరలింపునకు నిరాకరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► డబ్బు డిమాండ్ చేయడం, వాహనం పరిశుభ్రంగా లేకపోవడం, ఇతర సమస్యలు -
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
మహిళా సాధికారత అంటే ఇదీ..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారు. పార్టీలు, పైరవీలు, కులమతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగల్గుతున్నారు. నాటి పాలకులు నమ్మించి మోసం చేస్తే నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 1.03 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2019 ముందు వరకు పట్టాలు తప్పిన ఆ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్న రూ.25,517 కోట్లను అప్పును వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేయడానికి ప్రభుత్వం ముందుకొ చ్చింది. ఇప్పటికే రెండు విడతలుగా అందులో 12,758.28 కోట్లను చెల్లించింది. ఈ పథకంలో మహిళలకు ఇచ్చే డబ్బును వారు తిరిగి చెల్లించక్కర్లేదు. వాటిని వారు ఏ అవసరానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు 45–60 ఏళ్ల వయస్సు ఉండే 25 లక్షల మంది మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేల చొప్పున అందజేసేందుకు 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పేరుతో మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరికీ రెండు విడతలుగా రూ.9,179.69 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఇక రాష్ట్రంలో 18 ఏళ్లు, ఆ పైబడి వయస్సు ఉండే మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. వీరిలో ఈ రెండు పథకాల ద్వారా దాదాపు కోటి మంది మహిళలు రూ.24,938 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారు. రుణాల మంజూరు, చెల్లింపుల్లోనూ మనమే టాప్ రాష్ట్రంలో 80 శాతానికి పైగా మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల పేరుతో వీరికి ప్రభుత్వపరంగా ఒకవైపు ఆర్థిక చేయూత అందుతుండగా.. మరోవైపు బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాల పేరుతో వారికి పెద్దఎత్తున రుణాలు అందజేసే ప్రక్రియ ఊపందుకుంది. దీంతో దాదాపు 9 లక్షల పొదుపు సంఘాలకు 2019 మే తర్వాత 33 నెలల కాలంలో రూ.61,106.38 కోట్ల రుణాలు అందాయి. అలాగే, గత ఏడాది ఏప్రిల్ నుంచి 2022 జనవరి మధ్య దాదాపు 45 లక్షల మంది మహిళలు రూ.19,095 కోట్లు రుణాలు పొందారు. దీంతో దేశవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరుతో బ్యాంకులిచ్చే రుణాలలో దాదాపు 30 శాతం మన రాష్ట్రంలోని మహిళలకే అందుతున్నాయని గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. ఇలా రుణాలను ప్రభుత్వం ఇప్పించడంతోపాటు ఆ రుణాలను మహిళలు ఎప్పటికప్పుడు చెల్లించడంలోనూ మన రాష్ట్రమే దేశంలో అగ్రస్థానంలో ఉంది. రూ.2,354 కోట్ల వడ్డీని చెల్లించిన సర్కారు గతంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు 13.50 శాతం వార్షిక వడ్డీకి రుణాలు ఇచ్చేవి. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు వీలైనంత తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఇప్పుడు 9.50 శాతం వడ్డీకే ఇస్తున్నాయి. పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే ఏటా ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఇలా గత రెండేళ్లలో రూ.2,354 కోట్లు చెల్లించింది. ఎంఎన్సీ కంపెనీలతో అదనపు తోడ్పాటు ఇదిలా ఉంటే.. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో పాటు బ్యాంకు రుణాల ద్వారా అందజేసిన డబ్బుతో వారికి శాశ్వత జీవనోపాధి కల్పనకూ ప్ర త్యేక ఏర్పాట్లుచేసింది. మహిళలు వారి గ్రామాల్లో కిరాణా షా పులు వంటి చిరువ్యాపారాలను ప్రారంభించుకోవడానికి ముందుకొస్తే, వారికి హోల్‌సేల్ మార్కెట్లో దొరికే ధర కన్నా తక్కువకే సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ వంటి సంస్థలతో పాటు.. పాడి పశువుల పెంపకం చేçపట్టే వారికి అధిక ధర దక్కేలా అమూల్ సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. అలాగే, పొట్టే ళ్లు, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టే వారికి సైతం అధిక ధర దక్కేలా ప్రపంచ స్థాయిలో మాంసం వ్యాపారం చేసే అలానా సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా 4,77,851 కుటుంబాలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాయి. నాడు విలవిల.. నేడు మిలమిల తెలుగుదేశం హయాంలో నాటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాటి రుణాలపై అమలులో ఉన్న జీరో వడ్డీ పథకానికీ నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రతినెలా కోట్ల రూపాయలను పొదుపు చేసుకునే మహిళలు ఒకానొక దశలో రూ.ఐదారు లక్షలు కూడా దాచుకోలేని పరిస్థితికి దిగజారాయి. 18.36 శాతం సంఘాలు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మిగిలాయి. ఫలితంగా ఏ, బీ గ్రేడ్ల్లోని సంఘాలు సీ, డీ గ్రేడ్‌లోకి పడిపోయాయి. ఈ నేపథ్యంలో.. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసరా పథకంతో పాటు జీరో వడ్డీ పథకానికి ఎప్పటికప్పుడు నిధుల విడుదలతో పొదుపు సంఘాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి. ఎంతలా అంటే.. నిరర్థక ఆస్తులుగా ఉన్న 18.36% సంఘాలు 0.73 శాతానికి పరిమితమయ్యాయి. అంతేకాదు.. 99.27 శాతం మంది సకాలంలో రుణాలు చెల్లించేస్తున్నారు. అలాగే, గతంలో 40శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్లలోను, 60శాతం సంఘాలు సీడీ గ్రేడ్లలోనూ ఉండగా.. ప్రస్తుతం 90శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్ల స్థాయికి ఎదిగాయి. ► గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కారుమూరు సుధాకరమ్మ ఆర్నెల్ల క్రితం వరకు వ్యవసాయ కూలీ. చదివించే స్థోమతలేక ఇంటర్ చదివిన ఒక్కగానొక్క కొడుకును పనిలో పెట్టింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇచ్చిన ఆర్థిక తోడ్పాటుతో పాటు పొదుపు సంఘం పేరిట బ్యాంకు నుంచి వచ్చిన రుణంలో తన వాటాను కలిపి చిల్లరకొట్టు పెట్టుకుంది. దీంతో ఇప్పుడామె రోజూ రూ.రెండు, రెండున్నర వేల వరకు వ్యాపారం చేసుకుంటోంది. తద్వారా నాలుగైదు వందలు ఆదాయం వస్తోంది. అంతకుముందు ఏడాదిలో ఎక్కువ రోజులు డబ్బులకు కటకటలాడే సుధాకరమ్మ ఇప్పుడు మారిన పరిస్థితులతో తన కొడుకును డిగ్రీలో చేర్పించాలనుకుంటోంది. ► ఈమె పేరు ఇప్పిలి కళావతి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామం. ఈమె భర్త మరణించాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు మానసిక దివ్యాంగురాలు. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బే ఈమెకు జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కారు అమలుచేసిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు ఆమె జీవితాన్ని మార్చాయి. ఆసరా పథకం ద్వారా రూ.37,642లు, వైఎస్సార్ చేయూత ద్వారా రెండు విడతల్లో రూ.37,500 జమకావడంతో ఆమె ఊరిలోనే టైలరింగ్ చేసుకుంటూ కిరాణాషాపు పెట్టుకుని గౌరవంగా జీవిస్తోంది. స్త్రీనిధి ద్వారా అదనంగా మరో రూ.50 వేలు మంజూరు కావడంతో వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంటోంది. ఇప్పుడు ప్రతినెలా ఖర్చులు పోను రూ.15 వేలు వరకు ఆదాయం వస్తోంది. ► ఈమె పేరు రేష్మ. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. పొదుపు సంఘంలో సభ్యురాలు కావడంతో ఇంట్లోనే చీరల వ్యాపారం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో భర్త సలీం సహకారంతో శారీ మ్యాచింగ్ సెంటర్‌నూ ప్రారంభించారు. పొదుపు సంఘం ద్వారా రూ.50వేల బ్యాంకు రుణం వచ్చింది. అలాగే, సున్నా వడ్డీ కింద రూ.2వేలు మాఫీ అయ్యింది. అంతేకాక.. పొదుపు రుణ మాఫీ ద్వారా రెండేళ్లలో రూ.30 వేలు మాఫీ అయింది. మరోవైపు టైలరింగ్ చేస్తుండడంతో టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కింద రెండేళ్లలో రూ.20వేలు వచ్చింది. ఇలా.. వైఎస్ జగన్ సర్కారు తోడ్పాటుతో రెండేళ్లలో ఈ కుటుంబానికి రూ.లక్ష వరకు లబ్ధి చేకూరింది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుండడంతో ‘అమ్మఒడి’ కూడా వచ్చింది. -
ఏపీకి ‘స్కోచ్’ అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌కు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో గురువారం ప్రకటించిన అవార్డుల్లో అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్ స్కోచ్ మెడల్స్ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. సంక్షేమ పథకాలకు బంగారు స్కోచ్‌లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్ స్కోచ్‌లు వరించాయి. అదే విధంగా మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్రా’కు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ కేటగిరిలో గోల్డ్ స్కోచ్ దక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలనాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 70 ఆక్వా హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను తీసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా పులివెందులలో ఆక్వాహబ్తో పాటు 100కు పైగా రిటైల్ అవుట్‌లెట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కింది. ఇక గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్ ఫోర్టిఫికేషన్) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ వరించింది. ఐదు విభాగాల్లో సిల్వర్ మెడల్స్ డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్ విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్ యాప్‌తో పాటు పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్ యాప్‌కు సిల్వర్ స్కోచ్ అవార్డులు వరించాయి. ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సిల్వర్ స్కోచ్ దక్కింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్ స్కోచ్ వరించింది. ఇక.. బయోవిలేజ్, నేచురల్ ఫార్మింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ స్కోచ్ దక్కింది. ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
ఆరోగ్యానికి ‘ఆసరా’!
సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు శస్త్ర చికిత్సలు చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని అనేక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. రోజు గడవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితులను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ గుర్తించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేద, మధ్య తరగతి వ్యక్తులకు విశ్రాంతి సమయంలో అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని 2019 డిసెంబర్ 2న ప్రారంభించారు. పథకం కింద శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించే విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా 5వేలు ప్రభుత్వం సాయం చేస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టి నేటికి రెండేళ్లు అవుతోంది. 6.91 లక్షల మందికి ఆసరా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి గత నెల 25వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా శస్త్ర చికిత్సలు చేయించుకున్న 6,91,805 మందికి ప్రభుత్వం రూ.453.96 కోట్లు అందించింది. ఆర్థిక సంవత్సరాల వారీగా పరిశీలించినట్లయితే 2019–20లో 1,07,233 మందికి రూ.79.54 కోట్లు, 2020–21లో 2,77,567 మందికి రూ.194.47 కోట్లు, 2021–22లో 3,07,805 మందికి రూ.180.21 కోట్లు సాయం అందింది. సకాలంలో సాయం అందింది నా భర్త సురేష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. మా రెండేళ్ల పాప గుండె సమస్యతో బాధపడుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఇటీవల విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశారు. పాప విశ్రాంతి సమయానికి ఆసరా నగదు రూ.9,500 అందింది. మమ్మల్ని కుటుంబసభ్యుల్లా భావించి ఆరోగ్య మిత్రలు పనిచేశారు. ఉచితంగా ఆపరేషన్లు చేసి, ఆర్థిక సాయం చేయడం ఎంతో తోడ్పాటును అందిస్తోంది. లేదంటే పాపకు పౌష్టికాహారం, ఇతర సౌకర్యాల కోసం మేము అప్పు చేయాల్సి ఉండేది. – యర్రబోలు విశాల్, విశాఖపట్నం డిశ్చార్జి అయిన రోజునే సాయం ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం ఆరోగ్య ఆసరా కింద సాయం చేస్తోంది. శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి ఆర్థిక సాయం చేస్తున్నాం. రోగి డిశ్చార్జి అయిన రోజునే బ్యాంక్ ఖాతాలో ఆసరా సాయం జమ చేస్తున్నాం. – వినయ్ చంద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ సీఈవో -
ఆసరా ఆర్థిక భరోసా
-
YSR Asara: చివరి రోజూ అదే జోరు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో 79,135 పొదుపు సంఘాలకు రూ.650 కోట్ల మొత్తాన్ని జమచేసింది. గత 12 రోజులుగా (ఈనెల 7 నుంచి) లబ్ధిదారులైన మహిళలు ఎంతో ఉత్సాహంతో ఆసరా సంబరాలు జరుపుకుంటుండగా.. ముగింపు రోజైన సోమవారం 31 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా కొనసాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు నాటికి ఉన్న తమ బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరించి, ఆ డబ్బులను నాలుగు విడతల్లో అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు జరిగిన ప్రతిచోటా వేలాది మంది మహిళలు ముఖ్యమంత్రి బొమ్మతో కూడిన బ్యానర్లను చేతబూని ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జగన్ చిత్రపటాలకు పూలాభిషేకాలు నిర్వహించారు. అదే సమయంలో.. ఆయా చోట్ల జరిగిన సభల్లో చంద్రబాబు చేతిలో తామెలా మోసపోయిందీ ప్రస్తావించారు. సందడి సందడిగా ఆసరా సంబరాలు ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండలో సోమవారం మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ► కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తకోట, గూడూరు గ్రామాల్లో చెక్కులు అందజేశారు. ► చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గ పరిధిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మహిళలకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు 40 గ్రామ సమాఖ్యల నుంచి మహిళలు పెద్దఎత్తున పూర్ణకుంభాలతో వచ్చి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు. ► విజయనగరం జిల్లాలో వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు సోమవారం సందడిగా సాగాయి. పొదుపు మహిళలకు మెగా చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేశారు. డెంకాడ మండలంలో జరిగిన ఆసరా సంబరాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ► విశాఖ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో చెక్కులు పంపిణీ చేశారు. భీమిలి మండలం మజ్జివలసలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ► తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. కాజులూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా.. ► పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పొలమూరులో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ చెక్కులను పంపిణీ చేశారు. ► కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ, విజయవాడ పాయకాపురం పరిధిలోని రాధానగర్‌లో ఆసరా వేడుకలు జరిగాయి. ► గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ► ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువులో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసరా చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. -
సెలవు రోజూ ‘ఆసరా’ సంబరాలు
సాక్షి, అమరావతి: సెలవు రోజు అయినప్పటికీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 41 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్ ఆసరా సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫొటోలతో కూడిన బ్యానర్లను చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నృత్యాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్త పరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పును ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది రెండో విడత డబ్బుల పంపిణీ 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడంతో మహిళలు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పుల నుంచి సీఎం జగన్ కాపాడారని, ఆయన మేలు మరచిపోలేమన్నారు. ఎన్నో పథకాలతో తమకు అండగా నిలిచారని, ఇది పేదల ప్రభుత్వమని కొనియాడారు. నేటితో రెండవ విడత పంపిణీ పూర్తవుతుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు, అయినవిల్లి, సఖినేటిపల్లి, తుని, సామర్లకోట, పెద్దాపురం రంగంపేట మండలాల్లో ఆదివారం వైఎస్సార్ ఆసరా సంబరాలు కొనసాగాయి. తాళ్లరేవులో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, సఖినేటిపల్లిలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, అయినవిల్లిలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, సామర్లకోటలో ఎంపీ వంగా గీత చెక్కులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో లబ్ధిదారులకు ఆసరా చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్, తదితరులు గొల్లపూడిలో ఆనందోత్సాహం ► కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో వైఎస్సార్ ఆసరా సంబరాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 699 స్వయం సహాయక సంఘాలకు రూ.6.92 కోట్ల రుణమాఫీ చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. ► కైకలూరు మండలం పెంచికలమర్రులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్), నందిగామ నియోజకవర్గం గొట్టుముక్కలలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, పామర్రు మండలం కనుమూరులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, విజయవాడ 16వ డివిజన్లో పార్టీ నేత దేవినేని అవినాష్ చెక్కులు అందజేశారు. గుంటూరు, అనంతలో క్షీరాభిషేకం ► గుంటూరు నగరంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుచెక్కులు అందజేశారు. ► అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో, గుడిబండలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో సంబరాలు చేసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే తొగరూరు ఆర్థర్, కౌతాళం మండలం హాల్వి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చెక్కులు పంపిణీ చేశారు. ఇరగవరం మండలంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, కైకరంలో జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజా, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, విస్సాకోడేరులో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెక్కులు పంపిణీ చేశారు. ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు. వజ్రపుకొత్తూరులో మంత్రి సీదిరి అప్పలరాజు, సోంపేటలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ప.గోదావరి జిల్లా తిరుమలంపాలెంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు. చిత్రంలో ఎమ్మెల్యే వెంకట్రావు -
వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్ అవసరం లేదని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం గొల్లపూడిలో ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలు కట్టే అప్పులు, వడ్డీలతోనే బ్యాంకులు నడుస్తున్నాయన్నారు. ‘‘మీ దగ్గర నుంచి వచ్చే వడ్డీలతో పెద్దొళ్లకు రూ.వేల కోట్ల లోన్లు ఇస్తారు. మన ఊర్లో కూడా ఓ ఎంపీకి రూ.7 వేల కోట్లు లోన్ ఇచ్చారు. అప్పులు తీరుస్తామన్న వ్యక్తి గెలిచిన తర్వాత మోసం చేశాడు. సీఎం జగన్ మాత్రం డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచారు’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు. గొల్లపూడి చరిత్రలో మైలురాయి: తలశిల రఘురామ్ 3,648 మందికి పట్టాలు ఇవ్వడం గొల్లపూడి చరిత్రలో మైలురాయి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ అన్నారు. గత ప్రభుత్వం డ్రైనేజ్, తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో గొల్లపూడిలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని.. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టాలని రఘురాం అన్నారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన 'వైఎస్సార్ ఆసరా' కార్యక్రమం సంబరాలకు మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను, వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు. మా ఫోన్లు బ్లాక్‌లో పెట్టేశాడు. దేవినేని ఉమా ఓ చవటదద్దమ్మ. ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టండి. మీకు అండగా మేమున్నాం. చదవండి: (ఈ పాపం టీడీపీదే) చాలా మంది తెలుగుదేశం సన్నాసులకు ఓ విషయం తెలియదు. వైఎస్సార్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అంటే టీడీపీ కంటే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న శక్తివంతమైన పార్టీ. గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్సీపీ జెండానే ఎగురుతుంది' అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: (కుట్రపూరితంగా టీడీపీ దుష్ర్పచారం: మంత్రి బాలినేని) -
‘ఆసరా’ సంబరం.. ఊరూరా అంబరం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ ఆసరా రెండవ విడత సొమ్ము డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో విజయవంతంగా జమ అవుతుండటాన్ని పురస్కరించుకుని అక్కచెల్లెమ్మలు ఊరూరా పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల నాటికి వారి పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి శనివారం వరకు 6,10,262 పొదుపు సంఘాలకు రూ.4,923.33 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రెండో విడతగా జమ చేసింది. శనివారం 1,35,430 సంఘాలకు సంబంధించి రూ.1,108 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుగా ప్రకటించిన ప్రకారం.. సోమవారం మరో 1.45 లక్షల సంఘాలకు రూ.1,176 కోట్లు జమ చేసే అవకాశం ఉంది. దీంతో 12 జిల్లాల పరిధిలో లబ్ధిదారులందరికీ వైఎస్సార్ ఆసరా రెండో విడత డబ్బుల చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. బద్వేలు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్‌తో వైఎస్సార్ జిల్లాలో ఈ చెల్లింపులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. గతంలో చంద్రబాబులా మోసం చేయకుండా.. ఎన్నికల ముందు చెప్పినట్టు గత రెండేళ్లగా తమ పొదుపు సంఘాల అప్పు డబ్బును అందజేస్తున్న ముఖ్యమంత్రి పట్ల మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు చాటుకుంటున్నారు. ఈ సొమ్ము పంపిణీ ప్రారంభమైన 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులు సంబరాలు కొనసాగిస్తున్నారు. శనివారం 12 జిల్లాల పరిధిలో 70 చోట్ల లబ్ధిదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఊరూరా సంబరాలు ► తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, కొత్తపేట మండలం వానపల్లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడ డైరీ ఫారం సెంటర్, తుని మండలం గెడ్లబీడు, శంఖవరం వద్ద జరిగిన కార్యక్రమాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత, అల్లవరంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేశారు. పలుచోట్ల సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. కొవ్వూరు మండలంలో మంత్రి తానేటి వనిత చెక్కులు పంపిణీ చేశారు. ► విశాఖ జిల్లా చోడవరంలో ఎంపీ బీవీ సత్యవతి, పెదబయలులో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడలోని విద్యాధరపురం లేబర్‌కాలనీలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ► అనంతపురం జిల్లా సోమందేపల్లిలో మంత్రి శంకరనారాయణ, చిలమత్తూరులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ► చిత్తూరు జిల్లా మదనపల్లె, పీలేరులో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బంగారుపాళెం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు. ► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో మంత్రి సీదిరి అప్పలరాజు స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. -
అచ్చెన్నాయుడుకు ఆ నైతిక హక్కు లేదు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రెండు విడతల వైఎస్సార్ ఆసరాకు సంబంధించిన రూ.60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్‌లోని 58, 59, 60వ డివిజన్లకు సంబంధించిన వైఎస్సార్ ఆసరా చెక్కులను శనివారం ఎమ్మెల్సీ కరిమున్నీసా, డిప్యూటీ మేయర్ శైలాజా రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మహిళలను మోసం చేశాడు. టీడీపీ నేతలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాల చేస్తున్నారు. సింగపూర్, మలేషియా, పోలవరం యాత్రల పేరుతో చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. గతంలో చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. అమ్మ ఒడి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు లేదు' అని మల్లాది విష్ణు అన్నారు. చదవండి: (తిరుపతి–మదనపల్లె ఫోర్లేన్కు శ్రీకారం)