chennai floods
-
చెన్నై వరద సాయానికి మోదీ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మిచౌంగ్ తుపాను కారణంగా చోటు చేసుకున్న భారీ వర్షంతో వరదలు చెన్నై సిటీని అతలాకుతలం చేశాయి. అక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై బెసిన్ ప్రాజెక్టులో భాగంగా ‘ఇంటిగ్రేటెట్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్’ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వరద సహాయ కార్యకలపాలకు అవసరమగు రూ.561.29 కోట్ల నిధులకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. Chennai is facing major floods, the third such occurring in the last eight years. We are witnessing more instances of metropolitan cities receiving excessive rainfall, leading to sudden flooding. Guided by a pro-active approach, PM @narendramodi Ji has approved the first urban… — Amit Shah (@AmitShah) December 7, 2023 చెన్నై నగరం తరచుగా భారీ వరదలకు గురవుతోంది. గత ఎనిమిదేళ్లలో మూడు భారీ వరదలతో మూడు సార్లు నీట మునిగింది చెన్నై. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (NDMF)కింద ప్రధాని మోదీ మొదటిసారి చెన్నై నగరానికి వరద సాయం నిధులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం వరదల సాయంగా రూ.500 కోట్లను కలుపుకొని మొత్తం రూ. 561.29కోట్ల నిధులకు ప్రధాని ఆమోదం తెలిపారు. చెన్నై వరదలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పరిశీలించారు. రాజ్‌నాథ్ సింగ్ వరదలపై ఏరియల్ సర్వే తర్వాత మొదటి విడత వరద సాయంగా రూ. 450 కోట్లు విడుదల చేశారు. మిగతా సాయం రెండో విడతగా విడుదల కానునుంది. RSS on ground helping people in Chennai floods And muslims, liberals,seculars Congress claim they are terr0rists. pic.twitter.com/eMKnvFeVLq — ThtKashmiriGuy (@ThtKashmiriGuy) December 7, 2023 ఇంకా.. వరదల్లో చిక్కుకున్న చెన్నై ప్రజలు తీవ్రమైన ఇబ్బందలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారు, వరద కారణగా నిరాశ్రయులేన వారికి ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నారు. On behalf of @BJP4TamilNadu, we extended a warm welcome to our Hon Defence Minister Thiru @rajnathsingh avl on his visit to Chennai to assess the floods & the damage caused by the #Michaungcyclone.@Murugan_MoS pic.twitter.com/XhRtoP6y6U — K.Annamalai (@annamalai_k) December 7, 2023 ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అక్కడి ప్రజలకు తాగునీరు, 12వేల లీటర్ల పాలు, పాల పొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూర్‌ను సీఎం ఎంకే స్టాలిన్ సందర్శించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. Today our @Karthi_Offl Anna Welfare team provided food to the Semmenchery people who are affected by the cyclone and floods ♥️👏👏pic.twitter.com/JoPPyLDBfR — Karthi Fans Club ™ (@Karthi_AIFC) December 7, 2023 Thank You Chennai.. Flood எங்களுக்கு Christmas Gift.. #WhatNonsense_is_this_DMK#பதில்சொல்லுங்க_ஸ்டாலின் ?@mkstalin @AIADMKITWINGOFL @satyenaiadmk pic.twitter.com/mTDKv65ZVe — வெண்ணிலா அஇஅதிமுக (@Vennila_AIADMK) December 6, 2023 Photo of the day .Thanks To Each and Everyone who are in the Rescue works in the Flood Affected Areas. 🙏#ChennaiFlood #ChennaiFloods pic.twitter.com/zOjFU2R90w — MasRainman (@MasRainman) December 7, 2023 Vijay Makkal Iyakkam Helping People - Chennai Floods #Leopic.twitter.com/VUpki7z1jf — MAHI 𝕏 (@MahilMass) December 6, 2023 -
చెన్నైపై మిచౌంగ్ తుపాను దెబ్బ.. స్పందించిన వార్నర్! పోస్ట్ వైరల్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ ద్వారా భారత్‌తో అనుబంధం ఏర్పడింది. చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఆడిన ఈ వెటరన్ ఓపెనర్.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు భారత్ పట్ల అభిమానం చాటుకుంటూ టీమిండియా ఫ్యాన్స్‌కు కూడా చేరువయ్యాడు. తాజాగా చెన్నై వరదల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి ప్రత్యేకతను చాటుకున్నాడు వార్నర్. మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరద ముంచెత్తడంతో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్లు, చెన్నైకి చెందిన దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్ ప్రజలంతా ఇంటికే పరిమితమై సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా.. సహాయక బృందాలు అవసరమైన వాళ్లకు తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీశ పతిరణ సైతం ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సైతం చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు. విపత్కర పరిస్థితుల నుంచి నగరం తొందరగా బయటపడాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘చెన్నైలోని చాలా వరకు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లను చూస్తుంటే బాధ కలుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్లు అవసరమైన వాళ్లకు తప్పక సాయపడండి. ఎక్కడున్నా ఒకరికొకరం మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని తన అభిమానులను ఉద్దేశించి వార్నర్ పోస్ట్ చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లో ఫైనల్లో గెలిచి ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ను ఓడిస్తే.. తుదిపోరులో కంగారూ జట్టు రోహిత్ సేనపై గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ వార్నర్ ఆడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
మిచౌంగ్ బీభత్సం: నా చెన్నై.. సేఫ్‌గా ఉండు: లంక యువ పేసర్
#Cyclone Michaung- #ChennaiFloods: ‘‘నా చెన్నై.. సురక్షితంగా ఉండు’’ అంటూ శ్రీలంక యువ క్రికెటర్ మతీశ పతిరణ తమిళనాడు పట్ల అభిమానం చాటుకున్నాడు. తుపాను ఎంతగా భయపెట్టినా.. తిరిగి కోలుకోగలమనే నమ్మకం కూడా అంతే బలంగా ఉండాలని ధైర్యం చెప్పాడు. కాగా తమిళనాడు రాజధాని చెన్నైని వరద నీరు ముంచెత్తుతోంది. మిచౌంగ్ తుపాను ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. వాన బీభత్సానికి చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి వరద నీరు చేరడంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులను నిలిపివేశారు. అదే విధంగా ఇప్పటికే పదకొండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి అవసరార్థులకు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తుపాను ప్రభావం వల్ల రానున్న 24 గంటల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు చెన్నై ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మిచాంగ్ బీభత్సం.. స్పందించిన డీకే, అశూ టీమిండియా వెటరన్ బ్యాటర్, తమిళనాడు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నా చెన్నై స్నేహితులారా.. సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటూ... పరిస్థితులు చక్కదిద్దుతున్న అధికారులకు సెల్యూట్. ఇలాంటపుడే ప్రతి ఒక్కరం పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరం బతకాలి’’ అని ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం.. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి విజ్ఞప్తి చేశాడు. వీరితో పాటు శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కూడా చెన్నై ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ‘‘సురక్షితంగా ఉండు నా చెన్నై!! తుపాను భయంకరమైనదే కావొచ్చు.. కానీ మన మనోబలం అంతకంటే గొప్పది. పరిస్థితులు తప్పక చక్కబడతాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండిపోండి. ఒకరికొకరు సహాయంగా ఉండండి’’ అని పతిరణ చెన్నై వాసులకు విజ్ఞప్తి చేశాడు. ధోనికి ప్రియమైన బౌలర్ కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్ పేసర్ మతీశ పతిరణ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ ఆటగాడిగా 20 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్ పేరు సంపాదించాడు. ఐపీఎల్-2023 సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఎడిషన్‌కు గానూ.. పతిరణను సీఎస్కే రిటైన్ చేసుకుంది. Stay safe, my Chennai! The storm 🌪️ may be fierce, but our resilience is stronger. Better days are just around the corner. Take care, stay indoors, and look out for one another 💛💛💛 #yellove #ChennaiWeather #StaySafe #ChennaiRains #CycloneMichaung https://t.co/ovbsziy7gv — Matheesha Pathirana (@matheesha_9) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 -
మిచౌంగ్ బీభత్సం: కొట్టుకుపోయిన కార్లు, రన్‌వే పైకి వరద నీరు..
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై కాకావికలమైతోంది. భారీ వర్షాలకు చెన్నైలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావంతో కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. వర్షాల ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Deeply concerned about the impact of the Cyclone Michaung on Chennai city. I wish and pray for safety and well-being of the people. Stay strong, Chennai. We're with you. Prayers🙏🏼 #TakeCareChennai pic.twitter.com/cerOJbIAjf — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2023 చెన్నై నగరంలో భారీ వార్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాలు వరకు నీరు చేరుకుంది. దీంతో రోడ్లపై రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న కార్లు వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి. 🌀 Michaung CYCLONE Police in action. Man fell down in a deep construction site was rescued by police. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/gsqeUUFZXk — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 -
ప్రకృతి చేస్తున్న హెచ్చరిక
‘చెన్నై మహానగరం ఏడాదిలో ఆరునెలలు దాహార్తితో విలవిల్లాడుతుంది. మరో ఆరునెలలు జల దిగ్బంధంలో మృత్యువుకు చేరువవుతుంది’ అంటూ మద్రాస్ హైకోర్టు ఈమధ్య చేసిన వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం. ఊహించని విపత్తులు విరుచుకుపడితే, అందువల్ల ఇబ్బందులు తలెత్తితే నెపం ప్రకృతిపై నెట్టినా జనం సహిస్తారు. కానీ వైపరీత్యాలు రివాజైనప్పుడు, వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకెళ్లే ముందస్తు నియంత్రణ చర్యలు కొరవడినప్పుడు నిస్సందేహంగా పాలకు లదే పాపం అవుతుంది. ఏటా ఈ సీజన్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ, ఇతర తీర ప్రాంతాలకు ఈశాన్య రుతుపవనాలు 50 శాతం వర్షాలను మోసుకొస్తాయి. ఆ సమయంలో అల్పపీడనం, తుపానులు చోటు చేసుకుంటే ఇదింకా పెరుగు తుంది. చెన్నైను ఈస్థాయిలో వరదలు ముంచెత్తడం ఈమధ్యకాలంలో ఇది రెండోసారి. 2015లో ఆ మహానగరం రోజుల తరబడి వరదనీటిలో తేలియాడింది. జనజీవనం స్తంభించిపోయింది. గడప దాటి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ ఎక్కడివారక్కడ చిక్కడిపోయారు. వందల ఇళ్లు కూలిపోగా వేలాది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నాయి. అంతక్రితం పదేళ్లకొక మారు వరదలు ముంచెత్తడం సాధారణం కాగా, ఆ తర్వాత ఇంచుమించు ఏటా ఏదో మేరకు ఆ బాధలు తప్పడం లేదు. చెన్నైలో కొన్ని ప్రాంతాలైనా ప్రతియేటా వరద నీటితో కష్టాలు పడుతున్నాయి. 2015 నాటి వరదల అనుభవం తర్వాత నిపుణుల్ని సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవాలని ఎందరో ప్రముఖులు పాలకుల్ని వేడుకున్నారు. కానీ స్తబ్దుగా ఉండిపోయిన అధికార యంత్రాంగం పుణ్యమా అని మళ్లీ అయిదేళ్ల నాటి దృశ్యాలు పునరావృత మయ్యాయి. చెన్నై నగర పాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి నాలుగేళ్లయింది. ఓటమి భయంతో గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో ఇంతవరకూ చెన్నైకి మేయర్, కార్పొరేటర్లు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా స్థానిక పాలన లేనప్పుడు విపత్తు నివారణ చర్యలు అరకొరగానే ఉంటాయి. అయిదారు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడిన భారీ వర్షాల పర్యవసానంగా 14 మంది చనిపోగా, ఎందరో గాయపడ్డారు. వేలాది ఇళ్లు వరదల్లో చిక్కుకు న్నాయి. నిత్యావసరాలు లభించక, కనీసం తాగడానికి నీరు సైతం కరువై జనం నరకాన్ని చవిచూశారు. నగరంలోని తిరువొట్రియూర్, పెరంబూర్, పట్టాళం వంటి ప్రాంతాల్లో ఆరడుగుల మేర నీరు నిలిచింది. మొన్న ఆరు, ఏడు తేదీల్లో 24 గంటల వ్యవధిలో చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరదనీరు ముంచెత్తడంతో నగరంలో ఏడు సబ్‌వేలు, 23 రోడ్లు మూసేయాల్సి వచ్చింది. ఆ నగరం శుక్రవారం కొద్దిగా తెరిపిన పడింది. ఇది ఒక్క చెన్నై నగరానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. వర్షాకాలంలో దేశంలోని అనేక నగరాలు ఇంచుమించు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణకు అనుసరిం చాల్సిన శాస్త్రీయ విధానాలను బేఖాతరు చేయడం, జనసాంద్రత ఎక్కువైనప్పుడు తలెత్తగల ఇబ్బం దులపై ప్రభుత్వాలకు అంచనాలు లేకపోవడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనం పాలిట శాపాలవుతున్నాయి. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం, మరెక్కడా జీవనోపాధికి అవకాశాలు లేకుండా చేయడం వల్ల గ్రామాలనుంచీ, పట్టణాలనుంచీ నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతమందికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. ఈ క్రమంలో చెరువులు, సరస్సులుగా ఉన్న ప్రాంతాలు బస్తీలుగా మారుతున్నా చూసీచూడనట్టు వదిలే స్తున్నారు. కనీసం నిర్దేశించుకున్న నిబంధనలను పాటిద్దామన్న స్పృహ కూడా లేకుండా ఎడాపెడా నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. డబ్బూ, పలుకుబడి ఉంటే చాలు ఏవైనా సునాయాసంగా లభి స్తాయి. ప్రైవేటు వ్యక్తుల సంగతలావుంచి ప్రభుత్వాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అన్నిచోట్లా కనబడుతుంది. చెన్నైలో ఇప్పుడున్న విమానాశ్రయమైనా, బస్సు టెర్మినల్ అయినా, ఇత రత్రా నిర్మాణాలైనా చిత్తడి నేలల్లో నిర్మించినవేనన్నది నిపుణుల ఆరోపణ. కురిసిన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెరగడానికి తోడ్పడే పథకాలు అమల్లోకి తీసుకురావడం, ఎంత వరదనీరు ముంచెత్తినా క్షణాల్లో అది బయటకుపోయేందుకు అనువైన మార్గాల నిర్మాణం భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూస్తుంది. ఈ దిశగా అసలే చర్యలు తీసుకోలేదని చెప్పలేం. కానీ నిధుల కైంకర్యం తప్ప మరో యావలేని రాజకీయ నాయకుల తీరుతెన్నులవల్ల ఆ చర్యలన్నీ నిరర్థక మవుతున్నాయి. చెన్నై నగరానికి స్మార్ట్ సిటీ ప్రతిపత్తి వచ్చింది. ఆ పథకం కింద నిధులూ అందాయి. అందువల్లే వరద బెడద కాస్త తగ్గిందని మాజీ సీఎం పళనిస్వామి చెబుతున్నారు. కానీ ఖర్చయిన మొత్తంతో పోలిస్తే జరిగిన మేలెంత అన్నది ప్రశ్న. ఇప్పుటికైనా తగిన చర్యలు మొదలె డితే పదేళ్లకల్లా చెన్నై మెరుగుపడుతుందంటున్న పర్యావరణవేత్తల హితవచనం చెవికెక్కాలి. ఇటీవలే విరుచుకుపడిన ఉత్తరాఖండ్ వరద బీభత్సాన్ని, ఇప్పుడు చెన్నై దుస్థితిని చూశాకైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలూ సమానంగా ఎదగడంతో పాటు మహానగరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రకృతిని సంరక్షించుకుంటే ఆపత్సమయాల్లో అది మనను అమ్మలా కాపాడుతుంది. విచ్చలవిడిగా వ్యవహరించి ధ్వంస రచనకు పూనుకుంటే నిర్దాక్షిణ్యంగా కాటేస్తుంది. -
Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి
సాక్షి, చెన్నై: గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉంది. పలు విమాన సర్వీసుల రద్దు వర్షం, ఈదురు గాలులు కారణంగా విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు విమానాలను మళ్లించారు. తమిళనాడు ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి తమిళనాడులో 14 మంది మృతి చెందారు. చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. చదవండి: (తిరుపతి, తిరుమలలో భారీ వర్షం) -
జాక్వలిన్‌కు హృతిక్ కానుక
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలకు నడుం బిగించింది. ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరానికి తనవంతు సాయం అందించడానికి రెడీ అయ్యింది ఈ శ్రీలంక బ్యూటీ. అందులో భాగంగా వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకోసం విరాళాలను సేకరించేందుకు రెడీ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చెన్నై వచ్చిన జాక్వలిన్, ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. జాక్వలిన్ చేస్తున్న కార్యక్రమాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. అందులో భాగంగా తనవంతు సాయంగా జాక్వలిన్‌కు 5 లక్షల రూపాయిల చెక్ పంపించాడు. హృతిక్ సాయంపై స్పందించిన జాక్వలిన్, ఇదే తనకు బెస్ట్ గిఫ్ట్ అంటూ ట్వీట్ చేసింది. తన ఆనందాన్ని తెలపటంతో పాటు హృతిక్ అందించిన చెక్ ఫోటోను కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరి హృతిక్ బాటలో ఇంకెంత మంది నడుస్తారో చూడాలి. This is what I wake up to! Thank you so much @iHrithik the best gift ever #JacquelineBuilds #Chennai @habitatindia pic.twitter.com/bksn4o6vOQ — Jacqueline Fernandez (@Asli_Jacqueline) March 26, 2016 -
చెన్నై వరదలపై సీనియర్ నటి సినిమా
చెన్నై: సీనియర్ నటి, దర్శకురాలు లక్షీ రామకృష్ణన్ మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. గతేడాది సంభవించిన చెన్నై వరదలపై తమిళ సినిమా రూపొందించేందుకు సిద్ధమతున్నారు. ఇప్పటికే ఆమె ప్రిప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశముంది. 'ఈ ఏడాది ఆరంభం నుంచి స్క్రిప్ట్ పై పనిచేస్తున్నా. వరదల గురించి మాత్రమే సినిమాలో చూపించాలనుకోవడం లేదు. చెన్నై మహా నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రజలకు ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలు.. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు స్పందించిన తీరును తెరకెక్కించనున్నామ'ని లక్ష్మీ రామకృష్ణన్ తెలిపారు. ఒక వ్యక్తి లేదా హీరో గురించి ఈ సినిమా ఉండదని, మానవీయ కోణంలో చూపించనున్నామని చెప్పారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ప్రధాన పాత్రల కోసం అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్, నజర్ లను సంప్రదించామని అన్నారు. వర్షాకాలంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. -
వానొస్తే.. గుండె చెరువే!
పబ్లిక్ డిమాండ్ చెన్నై వరదలు ఇటీవల జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. మరి ఇప్పుడు అదే ముప్పు గ్రేటర్ నగరికి పొంచి ఉంది. ఇప్పటికే నగరంలో చిన్న పాటి వర్షం పడినా ఎన్నో కాలనీలు మునిగిపోతున్నాయి. అదే మరి కుంభవృష్టి వర్షం కురిస్తే..? పరిస్థితేమిటి.. అసలు చెన్నై జలవిలయానికి కారణం.. గత 50 ఏళ్లలో అక్కడ దాదాపు 300 చెరువులు, జలాశయాలు కబ్జాకు గురై కనుమరుగరైపోవడమేనని నిపుణులు నిర్ధరించారు. ఇదే తంతు హైదరాబాద్‌లోనూ కొనసాగుతోంది. ఒకప్పుడు నగరం, దాని చుట్టు పక్కల 500లకు పైగా చిన్నా పెద్ద చెరువులుండేవి. గొలుసుకట్టుగా ఒకటి నిండగానే మరొక దాంట్లోకి నీరు వెళ్లేది. కానీ గత 20 ఏళ్లలో గ్రేటర్‌లోని చాలా చెరువులు, జలశయాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా 1995 నుంచి 2004 వరకూ ఆక్రమణలు పెద్ద ఎత్తున సాగాయి. సిటీలో ఇప్పటికి 104 చెరువులు అదృశ్యమయ్యాయని హెచ్ఎండీఏ సర్వేలో తేలింది. 10 హెక్టార్లకు పైగా విస్తీర్ణమున్న చెరువులు కేవలం 169 మాత్రమే మిగిలాయని ఇందులో వెల్లడైంది. ఈ పరిస్థితి భాగ్యనగరిని కలవరపెడుతోంది. ఈ ఆక్రమణల పర్వం ఎన్నాళ్లు..! గ్రేటర్లో చెరువుల్ని పరిరక్షించి.. కబ్జాదారుల భరతం పట్టే నాయకులకే ఓటేస్తామంటున్నారు నగరవాసులు. - సాక్షి, సిటీబ్యూరో, కుత్బుల్లాపూర్ చినుకు పడితే వణుకే.. నగరంలో చిన్న పాటి వర్షం కురిసినా బస్తీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఒకప్పుడు జలదుర్గం, వనదుర్గమని కీర్తి గడించిన భాగ్యనగరం భూబకాసురుల వల్ల అస్తిత్వాన్ని కోల్పోతోంది. చెరువులు, నాలాలు కబ్జాలకు గురవడంతో వరద నీరంతా నగరాన్ని ముంచెత్తుతోంది. ‘సాగర్’ సగం మాయం.. కబ్జా దెబ్బకు హుస్సేన్‌సాగర్ సహజ స్వరూపం కోల్పోయింది. సుమారు 240 చ.కి.మీ పరిధిలోని సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. కూకట్పల్లి, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండితే ఆ నీరు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. కానీ వీటిలో చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వరద నీరు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చేరుతోంది. ప్రముఖులే కబ్జారాయుళ్లు..! ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల జంట జలాశయాల శిఖాన్ని కొందరు రాజకీయ ప్రముఖులు ఆక్రమించి రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. జీవో 111 ప్రకారం వీటి పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఇప్పుడు 80 ఎకరాలకు కుంచించుకుపోయింది. దీని పరిధి మాదాపూర్ పోలీసు స్టేషన్ వరకు ఉండేది. ఇక్కడ బఫర్ జోన్ మాయం చేయడంతో ఆక్రమణలకు అడ్డు లేకుండా పోయింది. ఇక్కడ భారీ భవంతులు నిర్మించిన వారంతా ప్రముఖులే. రాజకీయ ప్రముఖుల అండదండలతోనే రియల్టర్లు రెచ్చిపోతున్నారు. నాయకులకు ముడుపులు అందుతుడడంతో ఆక్రమణలకు వంతపడుతున్నారు. దీంతో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఈ చెరువులేవీ..? హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోని చెరువుల లెక్క తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించగా 73 చెరువులు భౌతికంగా లేవని తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో బతుకమ్మ కుంట(నల్లకుంట), యూసుఫ్‌గూడ(కృష్ణకాంత్ పార్కు), ఆసీఫ్‌నగర్, అఫ్జల్‌గంజ్ చెరువులు సహా మొత్తం 8 చెరువులు మాయమైనట్లు ఈ సర్వేలో తేలింది. రంగారెడ్డి సరూర్‌నగర్ మండలంలోని కనకయ్య కుంట, జాల్ల కుంట, కుత్బుల్లాపూర్ మండలంలోని మొగుళ్ల కుంట, సర్కారీ శిఖం చెరువు, ఇబ్రహీంపట్నం మండలంలోని రెడ్డికుంట, మేలం కుంట, మొయినాబాద్ మండలంలోని కుంట కింది చలక, గొల్లబావి కుంట సహా 40 చెరువులు కనుమరుగయ్యాయి. ఇక నల్గొండలో సుమారు 20 చెరువుల ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు చెరువు, దేవుని చెరువు, పోచంపల్లి మండలంలోని కొత్తకుంట, ఊరకుంట శిఖం, వందమాని చెరువు, భువనగిరి మండలంలోని కొంగల కుంట గల్లంతైన జాబితాలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ కొత్తూరు మండలంలోని తాళ్లకుంట, కౌలుబావికుంట, మల్లెవాని, చెక్కలవాని కుంటలు, చెలివెందులగూడ చెరువులు అదృశ్యమయ్యాయి. నగరంలో కబ్జాకు గురైన చెరువులు.. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో.. కూకట్పల్లి ప్రగతినగర్ చెరువు ఎల్లమ్మ చెరువు కుత్బుల్లాపూర్ కుంట పంతులు చెరువు రంగధాముని చెరువు శేరిలింగంపల్లి పరిధిలో.. గంగారం పెద్దచెరువు మదీనాగూడ బచ్చుకుంట మల్లయ్య కుంట మియాపూర్ పటేల్ చెరువు గోపన్‌పల్లి నల్లకుంట బాలానగర్ పరిధిలో... సున్నం చెరువు కాజాకుంట ఈదుల కుంట భీముని కుంట అలీ తలాబ్ చెరువు నల్లచెరువు బాలానగర్ పరిధిలో... సున్నం చెరువు కాజాకుంట ఈదుల కుంట భీముని కుంట అలీ తలాబ్ చెరువు నల్లచెరువు చట్టం తీసుకురావాలి.. కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను స్వాధీనం చేసుకునే విధంగా చట్టం రూపొందించాలి. నగరంలోని చెరువులు, కుంటలను గుర్తించి మిషన్ కాకతీయ పనులు చేపట్టి అభివృద్ధి చేయాలి. ఇప్పటికే చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయి. కబ్జాలపై పాలకవర్గం కఠినంగా వ్యవహరించాలి. అలాంటి వారికే నా మద్దతు. - విజయ భాస్కర్, బీటెక్ విద్యార్థి, సూరారం ఆగస్టు 2000.. హైదరాబాద్ నగరం.. 24 గంటల్లో 24 సెంటీ మీటర్ల వర్షం.. హుస్సేన్‌సాగర్ నిండిపోయింది. సగం సిటీ నీటిలో చిక్కుకుంది. ఈ రెండూ జలప్రళయాలకు ప్రకృతి ప్రకోపం ఒక్కటే కారణమా..? కాదు.. మానవ తప్పిదమే అసలు కారణం జలాశయాలు, చెరువులు, నాలాలు కబ్జాకు గురవడంతో నీరు వెళ్లే దారి లేక సంభవించిన జలవిలయాలివి.. అవును.. ఇది పర్యావరణ వేత్తలు, నిపుణులు నిర్ధరించిన నిఖార్సైన నిజం.. మరి చెన్నై కుంభవృష్టి మహానగరిలో కురిస్తే పరిస్థితేంటి..? డిసెంబర్ 2015.. చెన్నై నగరం వారం రోజులు ఎడతెరిపి లేని వర్షం.. స్తంభించిన రవాణా.. చెరువైన చెన్నై.. ఫెన్సింగ్ వేయాలి.. పార్కుల చుట్టు ప్రహరీలు నిర్మించినట్టే చెరువులు కబ్జాలకు గురి కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. అప్పుడే కబ్జాలకు అడ్డుకట్ట వేయొచ్చు. వరద నీరు చెరువులు, కుంటల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలి. ఈ దిశగా చర్యలు తీసుకునే వారికే పట్టం కడతాం. - టీవీ రెడ్డి, సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల సెక్రటరీ, మైసమ్మగూడ రూ.50వేలు మించితే పత్రాలు ఉండాల్సిదే: సీవీ ఆనంద్ నగరంలో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సూచించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నగదు అక్రమ తరలింపుపై నిఘా వేశామన్నారు. రూ.50 వేలకు మించి ఉన్న నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోతే ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. - సాక్షి, సిటీబ్యూరో -
అంచనాలకు తగ్గట్లే విప్రో
క్యూ3లో నికర లాభం రూ.2,234 కోట్లు; 2% వృద్ధి ► ఆదాయం 12,310 కోట్లు. 9% అప్ ► రూ. 5 మధ్యంతర డివిడెండ్ బెంగళూరు: చెన్నై వరదలు, సీజనల్ సెలవుల ప్రభావంతో దేశీయంగా మూడో అతి పెద్ద ఐటీ దిగ్గజం విప్రో .. అంచనాలకు అనుగుణమైన పనితీరే కనపర్చింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభ వృద్ధి రెండు శాతానికి పరిమితమై రూ. 2,234 కోట్లుగా నమోదైంది. ఐటీ సర్వీసుల ఆదాయం 9 శాతం పెరిగి రూ. 12,310 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 2,193 కోట్లు కాగా, ఆదాయం రూ. 12,085 కోట్లు. అంతర్జాతీయ ఇన్ఫ్రా సర్వీసులు తదితర విభాగాల్లో భారీ డీల్స్ దక్కించుకోగలిగామని విప్రో సీఈవో టీకే కురియన్ చెప్పారు. వినూత్న డిజిటల్ సామర్థ్యాలతో సమగ్రమైన టెక్నాలజీ సేవలు అందించడంపై తాము దృష్టి పెట్టనున్నట్లు కొత్త సీఈవోగా ఫిబ్రవరి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న ఆబిదాలీ నీముచ్వాలా తెలి పారు. రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కంపెనీ ఆమోదముద్ర వేసింది. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల ఆదాయాలు స్వల్ప వృద్ధితో 1.87-1.91 బిలియన్ డాలర్ల మధ్య ఉండగలవని విప్రో పేర్కొంది. చెన్నై వరదల దెబ్బ.. మూడో త్రైమాసికంలో విప్రో ఐటీ సేవల విభాగం నిర్వహణ మార్జిన్లు 21.8 శాతం నుంచి 20.2 శాతానికి పడిపోయాయి. కంపెనీ సిబ్బందిలో దాదాపు 13 శాతం మంది ఉన్న చెన్నైలో వరదల వల్ల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడటం ఇందుకు కారణం. కాగా, క్యూ3లో కొత్తగా 39 క్లయింట్లను దక్కించుకోగలిగామని, ఏడు భారీ డిజిటల్ డీల్స్ కుదుర్చుకున్నామని కురియన్ చెప్పారు. -
నిరాశలో తయారీ రంగం..!
డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత * ఆర్డర్లు లేకపోవడం, చెన్నై వరదలు కారణం * నికాయ్ ఇండియా పీఎంఐ సర్వే న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో తీవ్ర నిరాశాపూరిత పరిస్థితిలోకి జారిపోయింది. అసలు వృద్దిలేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఈ మేరకు నికాయ్ ఇండియా మేనుఫ్యాక్చరింగ్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) డిసెంబర్‌కు సంబంధించి తన తాజా సర్వే వివరాలను తెలియజేసింది. ముఖ్యాంశాలు చూస్తే... * నవంబర్‌లో పీఎంఐ 50.3 పాయింట్ల వద్ద ఉంటే డిసెంబర్లో 49.1 పాయింట్లకు జారిపోయింది. సూచీ ప్రకారం... 50 పాయింట్ల పైనుంటే వృద్ధి దశగా... కిందకు జారితే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. * సూచీ ఇంత కిందకు పడిపోవడం 2013 మార్చి తరువాత ఇదే తొలిసారి. * కొత్త ఆర్డర్లు లేకపోవడం, చెన్నైలో భారీ వర్షాల వల్ల ఉత్పత్తి భారీగా పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం. అసలే అంతర్జాతీయ డిమాండ్ కొరవడి ఇబ్బంది పడుతున్న రంగానికి చెన్నై వరదలు తీవ్ర ప్రతికూలతను కల్పించాయి. * రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక రేటును దిగువస్థాయిలో కొనసాగించాల్సిన పరిస్థితులను తాజా పరిణామాలు సృష్టిస్తున్నాయి. * ఇక ధరల విషయానికి వస్తే- ముడి పదార్థాలు, మార్కెట్ వ్యయాలు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. * ఫెడ్ ఫండ్స్ రేటు పెంపు నేపథ్యంలో... అమెరికా డాలర్‌పై రూపాయి బలహీనత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాలు. * తయారీ రంగం బలహీనత ఆర్థిక రికవరీ వేగాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను 8.1-8.5 శాతం శ్రేణి నుంచి 7-7.5 శాతం శ్రేణికి తగ్గించింది. తగ్గిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభ ధర ముంబై: ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సంబంధిత ప్రారంభ ధరలు అంతక్రితం రెండేళ్లతో పోలిస్తే 2015లో 4-20 శాతంమేర తగ్గాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ కుష్మన్ అండ్ వాక్‌ఫీల్డ్ పేర్కొంది. కుష్మన్ అండ్ వాక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం.. 2013తో పోలిస్తే ముంబై సబ్ అర్బన్ ప్రాంతంలోని గోరేగావ్‌లో కొత్త ప్రాజెక్ట్స్ సగటు ప్రాధమిక అమ్మకపు ధర అత్యధికంగా 20% క్షీణించింది. దీని తర్వాతి స్థానాల్లో థానే (18%), గుర్గావ్లోని సదరన్ పెరిఫెరల్ రోడ్ (10%) ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణ, పశ్చిమ సబ్ మార్కెట్స్ మినహా బెంగళూరులోని చాలా సబ్ మార్కెట్స్‌లో ప్రారంభ ధరలు స్థిరంగా ఉన్నాయి. దక్షిణ, పశ్చిమ సబ్ మార్కెట్స్‌లో కొత్త ప్రాజెక్ట్స్ సగటు ప్రారంభ ధరలు 2-7% క్షీణించాయి. ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచాలి * ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కార్మిక సంఘాల విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. అలాగే కనీస పింఛను మొత్తాన్ని రూ. 3,000కు, కనీస వేతనాన్ని రూ. 18,000కు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకు 11 కార్మిక సంఘాలు ఈ మేరకు 15 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించాయి. మరోవైపు అసంఘటిత రంగానికీ సామాజిక భద్రత పథకాలను వర్తింపచేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు జైట్లీ తెలిపినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలు ఇవ్వండి * హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు ఎన్‌హెచ్‌బీ ఆదేశాలు న్యూఢిల్లీ: దాదాపు రూ. 25 లక్షలు ఆపైన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి వివరాలను ఇచ్చి,పుచ్చుకోవాలని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్ఎఫ్సీ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఆదేశించింది. తద్వారా వారు మళ్లీ మరో చోట రుణం పొందకుండా చూడొచ్చని పేర్కొంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను కట్టడి చేసేందుకు హెచ్ఎఫ్సీలు కూడా సదరు వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీ) సమర్పించేలా చూడాలంటూ ఆర్బీఐ సలహా, పురి కమిటీ నివేదిక సిఫార్సుల ఆధారంగా ఎన్‌హెచ్‌బీ తాజా ఆదేశాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, గ్యారంటార్ల విషయంలో హెచ్ఎఫ్సీలు అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవచ్చు. -
ఒక్క రూపాయి ఇవ్వండి... ప్లీజ్
చెన్నై : ఎంజీఆర్ ఇంటి కోసం ఒక్కో అభిమాని ఒక్క రూపాయి ఇవ్వండి అంటున్నారు ప్రఖ్యాత నటి సరోజదేవి. దివంగత మహానటులు ఎంజీయార్, శివాజీ గణేశన్‌ల సహకాల నటి ఈమె అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు బహుభాషా అభినయ విశారద సరోజాదేవి. అలాంటి నటి ఎంజీయార్ ఇంటి కోసం ఒక్క రూపాయి ఇమ్మంటున్నారేమిటి అనేగా మీ సందేహం. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న సరోజదేవి ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటి చూద్దాం. ఇటీవల తుపాన్ కారణంగా చెన్నై, పాండిచ్చేరి చాలా బాధింపులకు గురైన విషయం తెలిసి మనసు వేదనకు గురైంది. తమిళనాడు నాకు మెట్టినిల్లు లాంటిది. అందువలన తుపాన్ నివారణకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించాను. ఐదు లక్షల విరాళం: జనవరి ఆరవ తేదీన చెన్నై రానున్నాను. తుపాన్ నివారణ కోసం ఐదు లక్షలు విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను. ఎంజీయార్ ఇల్లు: తుపాన్ కారణంగా చెన్నైలోని ఎంజీయార్ నివసించిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని ఆయన జ్ఞాపకాలుగా వున్న వస్తువులు చాలా వరకు కొట్టుకుపోయాయని, మరికొన్ని పాడైపోయాయని తెలిసి చాలా బాధ అనిపించింది. మనిషిగా వచ్చి దైవంగా పోయిన వ్యక్తి ఎంజీయార్. ఆయన ఇంటిలో కూర్చొని భోజనం చేశాను. ఎంజీయార్ ఇంటిని ఆయన అభిమానులు పరిరక్షించుకోవాలి. ఒక్కో అభిమాని ఒక్క రూపాయి చొప్పు ఇచ్చినా ఎంజీయార్ ఇల్లును సుందరంగా మార్చుకోవచ్చు. శింబు క్షమాపణ చెప్పాల్సింది: ఆ కాలంలో ప్రముఖ కథానాయికలుగా వెలుగొందిన మేము వేలలోనే పారితోషికం తీసుకున్నాం. ఇప్పటి హీరోయిన్లు కోట్లు తీసుకుంటున్నారు. త్వరగా సంపాదించి సొంత ఊళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఇక నటుడు శింబు వివాదం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చూశాను. ఆయన తన తప్పు క్షమాపణ చెప్పి వుండవచ్చు. మనమైనా ఆయన్ను క్షమించి ఉండాల్సింది. శింబు తల్లిదండ్రులు ఆవేదన చూస్తే పాపం అనిపించింది. -
ఇప్పటి వరకు రూ. 161.3 కోట్ల విరాళాలు
చెన్నై : సీఎం వరద నివారణ నిధికి విరాళాల రాక పెరిగింది. సోమవారం నాటికి రూ.161 కోట్ల 30 లక్షల 29 వేల విరాళాలు వచ్చి చేరాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో వరదలు సృష్టించిన పెను విలయం గురించి తెలిసిందే. బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటోంది. నిధుల కొరత వెంటాడుతుండడంతో ఆపన్నహస్తం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సైతం చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిధులు త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం జయలలిత ఓ వైపు విజ్ఞప్తి చేస్తూ వస్తుంటే, మరో వైపు మానవతా హృదయులు, బడా సంస్థలు తాము సైతం అంటూ నష్టంలో , కష్టంలో పాలు పంచుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు తమ నెల జీతాన్ని అందించడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని వరద బాధిత ప్రాంతాలకు మళ్లించే పనిలో పడ్డారు. అనేక ప్రైవేటు రంగ సంస్థలు విరాళాల్ని అందించే పనిలో పడ్డాయి. సోమవారం సుందరం సంస్థ రూ.3 కోట్లు, ైనె వేలి లిగ్నైట్ కార్పొరేషన్ రూ.2.5 కోట్లు, టీవీ అయ్యంగార్ అండ్ సన్స్ రూ.2.5 కోట్లు, యునెటైడ్ ఇండియా రూ.2 కోట్లు, ఆమ్ వే ఇండియా ఎంటర్ ప్రైజస్ రూ.2 కోట్లు, దాల్మియా సిమెంట్స్ రూ.1 కోటి చొప్పున విరాళాలు ప్రకటించాయి. వీటితో పాటుగా మరికొన్ని సంస్థల ప్రతినిధులు ఉదయం సచివాలయంలో సీఎంను కలుసుకుని విరాళాలకు చెక్కులను అందజేశారు. తాజాగా వచ్చిన విరాళాలతో మొత్తంగా ఇప్పటి వరకు 161 కోట్ల 30 లక్షల 29 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలోకి చేరి ఉన్నట్టు సచివాలయం వర్గాలు ప్రకటించాయి. -
ఒక్క రోజే రూ.12 కోట్లు ...
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్ణయించారు. నెల రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మంగళవారం ఒక్క రోజే వరద నివారణ నిధికి రూ.12 కోట్లు వచ్చాయి. చెన్నై : ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్ల్లూరు, కడలూరులు తీవ్ర ప్రభావానికి లోనైన విషయం తెలిసిందే. తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకునేందుక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కదిలాయి. పెద్ద ఎత్తున విరాళాల్ని అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ఎమ్మెల్యేలు తమ నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో అదే బాటలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేకు అసెంబ్లీలో సంఖ్యా పరంగా 150 మందికి పైగా ఉన్నారు. అలాగే, పార్లమెంట్ సభ్యులు 37 మంది, మరి కొంత మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరంతా తమ నెలరోజుల వేతనాన్ని సీఎం రీలీఫ్ ఫండ్‌కు అప్పగించేందుకు నిర్ణయించారు. జయలలిత ఇచ్చిన పిలుపు మేరకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. కోటి చొప్పున కేటాయించేందుకు ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. మంగళవారం కూడా పలు సంస్థలు సీఎం జయలలితను కలిసి విరాళాలు అందజేశాయి. కరూర్ వైశ్యాబ్యాంకు రూ.3 కోట్లు అందజేసింది. -
ఎల్ జీ ఉచిత సర్వీసు క్యాంపు
చెన్నై: వరదలతో అతలాకుతలమైన చెన్నైలో తమ వినియోగదారుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్ జీ ఉచిత సర్వీసు క్యాంపు ప్రారంభించింది. వరదల కారణంగా దెబ్బతిన్న గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఉచితంగా బాగుచేస్తామని, ఎటువంటి రుసుం వసూలు చేయబోమని ఎల్ జీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏవైనా విడిభాగాలు అవసరమైతే 50 శాతం డిస్కౌంట్ తో అందిస్తామని వెల్లడించింది. 'భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నైలో తీవ్ర నష్టం సంభవించింది. బాధితులు త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడపడానికి మా వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉచిత క్యాంపు ఏర్పాటు చేశామ'ని ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ వినియోగదారుల సేవా విభాగం అధిపతి వినోద్ కుమార్ తెలిపారు. వరదలతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వేలాది మంది గృహోపకరణాలతో సర్వం కోల్పోయి రోడ్డుపడ్డారు. -
టీసీఎస్‌కు 'వరద దెబ్బ'.. షేర్లు పతనం!
చెన్నై: దేశంలోనే అతిపెద్ద ఔట్సౌర్సింగ్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు చెన్నై వరద దెబ్బ గట్టిగానే తాకినట్టు కనిపిస్తున్నది. ఇటీవలి వరదబీభత్సం కారణంగా డిసెంబర్ నెలతో ముగిసే త్రైమాసికానికి సంస్థ ఆదాయం తగ్గే అవకాశముందని టీసీఎస్ ప్రకటించింది. దీంతో స్టాక్మార్కెట్లో టీసీఎస్ షేర్లు పతనం బాటా పట్టాయి. సోమవారం నాడే టీసీఎస్ షేర్ విలువ 2.3శాతం పడిపోయింది. టీసీఎస్‌కు చెన్నై అతిపెద్ద డెలివరీ లోకేషన్. ఇక్కడ 65వేల సిబ్బంది పనిచేస్తున్నారు. సంస్థ సిబ్బందిలో వీరు దాదాపు 20శాతం. 'తీవ్ర వాతావరణ పరిస్థితులు, ఆ తర్వాత తలెత్తిన వరదలతో అత్యంత ప్రధానమైన కార్యకలాపాలు మినహాయించి డిసెంబర్ 1 నుంచి నగరంలో మన సంస్థ సాధారణ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 7 నుంచి సంస్థలో వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభించినప్పటికీ సిబ్బంది హాజరు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉంది. దీని ప్రభావం భౌతికంగా కంపెనీ ఆదాయం ఉండనుంది' అని టీసీఎస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నైలో వర్షాలు, వరదల కారణంగా ఐదురోజులపాటు కలిగిన అంతరాయం వల్ల టీసీఎస్ మూడో త్రైమాసికంలో 60 పాయింట్ల వరకు క్వార్టర్ టు క్వార్టర్ ఇంపాక్ట్ ఉంటుందని పరిశీలక సంస్థ నొమురా పేర్కొంది. అదేవిధంగా స్టాక్మార్కెట్లో టీసీఎస్ వాటాల లక్షిత ధరను రూ. 2,670 నుంచి 2,500 లకు తగ్గించింది. -
చెన్నై గుణపాఠం అమరావతికి వద్దా?
వరదలు, తుపానులతో నేడు చెన్నై ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు మనకు ఇస్తున్న సంకేతాలు.. చేస్తున్న హెచ్చరికలు ఏమిటి? ఈ ప్రశ్న సామాజిక కార్యకర్తలను నిద్రపోనివ్వడంలేదు. అలాంటి ముప్పునకు మన ప్రాంతం ఎంతో దూరంలో లేదు. చెన్నై తుపాను గురించి అమెరికాలోని వాతావరణ కేంద్రాలు ముందుగానే హెచ్చరించినప్ప టికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమీ లేవు. సైన్యాన్నీ, జాతీయ విపత్తు నివారణ సహాయక సంస్థలను సంసిద్ధం చేసి, తగిన సదుపాయాలు కల్పించడంలో జరిగిన వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. హుద్‌హుద్ తుపానుకు ముందు ఒడిశా ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. దప్పిక అయినప్పుడు బావులు తవ్వినట్లు, విపత్తు తరువాత తీసుకొనే చర్యలకన్నా, ముందు జాగ్రత్త చర్యల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మన రాష్ట్రంలో నాయుడుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతం నిరంతర వరదలకు, తుపానులకు ఆలవాలమని గుర్తించారు. తరచూ భూకంపాలు ఎదుర్కొనే ప్రాం తంగా కూడా కేంద్ర వాతావరణ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. గత 40 సంవత్సరాలుగా ప్రకంపనాలు రికార్డవుతున్నాయి. ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ 13 జిల్లాలలో శీతోష్ణస్థితి సామాజిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధికి సంబంధించిన అసమానతలు అధ్యయనం చేసిన తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ప్రాంతాలు రాజధానికి అనువైనవి కాదని నివేదిక ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలి. నాయుడుపేట నుంచి ఇచ్ఛా పురం వరకూ ఉన్న తీరప్రాంతాన్ని భూకంప ప్రభావిత ప్రాంతమని ఆ నివేదిక కూడా గుర్తుచేసింది. సముద్ర తీరానికి దూరంగా ఉన్న ఎత్తయిన ప్రాంతం రాజధానికి అనువైనదని కూడా కమిషన్ సూచించింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం లేదా రాయలసీమ జిల్లాలలో ఏ ప్రాంతంలోనైనా రాజధాని నిర్మించుకో వచ్చునని సిఫారసు చేసింది. అభివృద్ధి అంతటిని ఒకేచోట కేంద్రీ కరించవద్దనీ సూచించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణ్ణన్ కమిషన్ ఇచ్చిన అమూల్యమైన సూచనలను, సలహాలను పక్కన పెట్టి ఏకపక్షంగా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టింది. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద భవనాలను తుళ్లూరు ప్రాంతంలో నిర్మించడం ప్రమాదకరం. తుళ్లూరు ప్రాంతంలో నల్లరేగడి భూములు ప్రత్యేకించి దిగువ పరీవాహక ప్రాంతం కావడం, పది అడుగుల లోతులోనే నీటి నిల్వలు ఉండడం, ఆ ప్రాంతంలో 50 శాతం భూమికి కొండవీటి వాగు ప్రాంతంలో అత్యధికంగా కురిసే వర్షం వల్ల ప్రమాదం పొంచి ఉండడం పరిగణనలోనికి తీసుకోవలసిన అంశాలే. ఇంతకీ చంద్రబాబునాయుడు చెన్నై తుపాను ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారా? ఇసుక తవ్వకాల మీద ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు చేసిన హెచ్చరికలనైనా గమనంలోకి తీసుకుంటారా? ఇదే గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి ప్రాంతంలో శాశ్వతమైన కట్టడాలు చేపట్టరాదని ప్రధాని మోదీ రాజధాని శంకుస్థాపనకు రావడానికి ముందే ఇచ్చిన ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు పరిగణనలోనికి తీసుకుంటారా? ఇంతకీ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఆ శాఖ కేంద్ర కార్యాలయం నుండి లభించాయా? పర్యావరణ శాఖ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ అను మతుల కోసం గ్రామసభలు జరిపి, రైతుల ఆమోదం, అంగీకారం తీసుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నదా? ఇవన్నీ చర్చ నీయాంశాలే. అంతేకాదు చెన్నై నగరంలో విపరీతమైన ఆక్రమణలు జరిగిన ఫలితంగా ఏర్పడ్డ పరిస్థితుల నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు చెన్నై తుపాను ప్రభావం ఏ మేరకు ఉన్నదో, పొరుగున ఉన్న మన రాష్ట్రం మీద ఎంత తీవ్రంగా ప్రతికూల పరిస్థితులను రుద్దగలదో గుర్తించాలి. అలాగే హుద్‌హుద్ తుపాను విశాఖ నగ రాన్ని కుదిపేసినప్పుడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన అపారమైన పంటనష్టం, ఇతర పరిణామాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేస్తూ అమరావతి నిర్మాణం గురించి పునరాలోచన చేయడం మంచిది. రైతుల నుంచి లక్షల ఎకరాలు బలవంతంగా సేకరించి రాజధాని నిర్మాణం, పారిశ్రామిక వ్యవస్థల నిర్మాణం సముద్రతీర ప్రాంతాల్లో చేపట్టడం, అక్కడే కేంద్రీకరించడం మానవద్రోహం, జాతిద్రోహం. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. -ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు. మొబైల్: 99899 04389 -
చీపురు పట్టిన సినీ తారలు
చెన్నై : సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోలమే అనిపించుకుంటున్నారు. మన నటీమణులు. ఇటీవల తుపాన్ తమిళ ప్రజలను నిలువనీడ కూడా చేసి కనీవినీ ఎరుగని కష్టనష్టాలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి మన సినీ తారల్ని కలచి వేసింది. ఆదుకోవడానికి మేము సైతం అంటూ ప్రజల ముందుకు వచ్చారు. తుపాన్ నివారణకు విరాళాలను అందిస్తున్నారు. అంతటితో ఆగలేదు వారి చేయూత పలు సహాయ కార్యక్రమాలతో అన్నార్థులను ఆదుకుంటున్నారు. తాజాగా చెన్నై నగరాన్ని శుద్ధి చేయడానికి చీపుర్లు పట్టారు. సింగార చెన్నైగా పేరు గాంచిన చెన్నై నగరాన్ని తుపాన్ దుర్భరంగా మార్చేసింది. చెత్త చెదారంతో దుర్వాసనలతో నిండిపోయింది. అలాంటి నగరాన్ని శుద్ధి చేయడానికి సినీ తారలు చీపుర్లు పట్టడానికి కూడా వెనుకాడలేదు. నెక్ట్స్ స్టెప్ ఫౌండేషన్ సంస్థతో కలిసి నగరంలోని చెత్తా చెదారాన్ని ఊడ్చేయడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చెన్నై ఎగ్మూర్ గంగిరెడ్డి వీధిలోని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఇందులో నడిగర్ సంఘం కోశాధికారి కార్తీతో పాటు నటుడు ఆర్.రితీష్, ఉదయ, నటి వరలక్ష్మి, లలితకుమారి, శ్రీమాన్ మహేంద్రన్, సౌందరరాజన్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. పరిశుభ్ర పరిచిన ప్రాంతాల్లో వైద్యబృందం ప్రజలకు రోగ నివారణ వైద్యసేవలను అందించారు. నగరాన్ని శుద్ధి పరిచే కార్యక్రమంలో 25 మందికి పైగా పాల్గొన్నారు. తదుపరి పుదుపేట ప్రాంతాన్ని శుభ్రపరిచారు. -
చెన్నై బాధితుల కోసం అర్ధికసాయం
-
చెన్నైని తెలుగు చిత్ర పరిశ్రమ ఆదుకుంటుంది
తిరుమల: తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై కేంద్రంగానే ప్రారంభమైందని, వరద విపత్తులో చిక్కుకున్న చెన్నైలోని బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని సినీనటి జయప్రద అన్నారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వరద కారణంగా చెన్నైలో తీవ్రమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, తమవంతు బాధ్యతగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే బాధితులను ఆదుకుంటామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
వైద్యుడి ఆవతారం ఎత్తిన కేంద్ర మాజీ మంత్రి
చెన్నై : పీఎంకే యువజన నేత, ఆ కూటమి సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు చాలా కాలం తర్వాత వైద్యుడి అవతారమెత్తారు. చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని నాడి పట్టి వైద్యుడిగా మందులు, మాత్రుల్ని అందించే పనిలో పడ్డారు. చెన్నైలో తన నేతృత్వంలో పలు చోట్ల స్వయంగా వైద్య శిబిరాల్లో అన్భుమణి మునిగి ఉన్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు స్వతహాగా వైద్యుడే. అందుకే యూపీఏ హయంలో ఆయనకు కేంద్రంలో కేబినెట్ హోదాతో ఆరోగ్య శాఖను కట్టబెట్టారు. స్వతహాగా వైద్యుడైన అన్భుమణి ఆ శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి తదుపరి తమిళనాట సీఎం తానే అన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాకర్షణ పయనంలో బిజీగా ఉన్న అన్భుమణి రాందాసు తాజాగా చాలా కాలం అనంతరం వైద్యుడి అవతారం ఎత్తి ఉన్నారు. తెల్ల కోటు ధరించి, చేతిలో స్టెతస్కోప్‌ను పట్టుకుని, రోగుల నాడి పట్టి వైద్య సేవల్ని అందించే పనిలో పడ్డారు. పీఎంకే యువజన విభాగం నేతృత్వంలో చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల్లో బుధవారం నుంచి వైద్య శిబిరాల ఏర్పాటు మీద దృష్టి పెట్టారు. ఈ శిబిరాల్లో ఇతర వైద్యులతో పాటుగా తాను సైతం అంటూ అన్భుమణి రోగుల్ని పరీక్షించే పనిలో పడ్డారు. వైద్య సలహాలు ఇస్తూ, మందులు, మాత్రల్ని అందించే పనిలో పడటం గమనార్హం. చాలా కాలం తర్వాత నాడి పట్టి వైద్య సేవల్ని అందిస్తున్న అన్భుమణిని మీడియా కదిలించగా, ప్రజల్ని ఆదుకునేందుకు తాము సైతం అంటూ వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. జ్వరం, దగ్గు తీవ్రత ఉంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. బాగా వేడి చేసిన నీటినే తాగాలని, గంజి స్వీకరించాలంటూ వైద్య సలహాలను అందించారు. ప్రభుత్వం బాధితులకు ప్రకటించిన వరద సాయం కంటి తుడుపు చర్యగా పేర్కొన్నారు. రైతులకు ప్రకటించిన నష్టపరిహారం కూలీలకు ఇవ్వడానికే చాలదని వివరించారు. వరికి రూ. 25 వేలు, చెరకు, అరటి పంటకు రూ. 75 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారానే సహాయకాలను బాధితులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ప్రస్తుతం ప్రకటించిన రూ. ఐదు వేలు నష్టపరిహారం మళ్లీ టాస్మాక్లకే చేరడం ఖాయం అన్నారు. బాధితులకు ఇచ్చే ఈ నగదును మందు బాబులు మళ్లీ టాస్మాక్ మద్యం దుకాణాలకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వరద బాధిత ప్రాంతాల్లోని పేద కుటుంబాలు కుదట పడాలంటే తాత్కాలికంగా టాస్మాక్ మద్యం దుకాణాలను మూసి వేయాలని , కనీసం పదిహేను రోజు పాటైనా మూత వేయడంటూ ప్రభుత్వాన్ని విన్నవించారు. -
రూ. 10 లక్షలు కాదు రూ. 10 కోట్లు
చెన్నై: వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 10 కోట్లు ప్రకటించారు. అంతకుముందు ఆయన రూ. 10 లక్షలు ప్రకటించారు. ఆయనకంటే చిన్న హీరోలు సైతం ఎక్కువ మొత్తంలో సహాయం ప్రకటించడంతో రజనీకాంత్ విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతకుముందు ప్రకటించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి రూ. 10 కోట్ల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. కాగా, వరదల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. రోబో 2 సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశారు. హీరో విజయ్ రూ. 5కోట్లు, సూర్య-కార్తీ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, విశాల్ రూ. 10 లక్షలు, ధనుష్ రూ. 5లక్షలు సహాయం ప్రకటించారు. -
ఆలయాలను శుభ్రం చేస్తున్న ముస్లిం యువకులు
చెన్నై: ఆపద సమయంలో అందరూ ఒక్కటే. కులమతాలు రాజకీయ నాయకులకే తప్ప ప్రజలకు గుర్తురావనడానికి చెన్నై నగరాన్ని చుట్టుముట్టిన వరదల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. వర్షం కాస్త తెరిపిచ్చి వరద మట్టాలు తగ్గుముఖం పట్టడంతో ముస్లిం యువకులు నగరంలోని మసీదులతో పాటు హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేశారు. ఇంకా చేస్తున్నారు. మొన్న ఓ ముస్లిం యువకుడు నీటిలో చిక్కుకున్న హిందూ కుటుంబానికి చెందిన ఓ నిండు చూలాలును సకాలంలో ఆస్పత్రికి చేర్చడం, అక్కడ ఆమె బిడ్డను సుఖంగా ప్రసవించడం, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ బిడ్డను యూనస్ అని ఆ ముస్లిం యువకుడి పేరును పెట్టుకోవడం తెల్సిందే. ఆపత్కాలంలో సోషల్ మీడియా కూడా అద్భుత పాత్రను నిర్వహించింది. బాధితుల సమాచారం ప్రభుత్వాధికారులకు చేరవేయడం, సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అన్నార్తులకు ఆశ్రయం కల్పించడం, ఆపదులను ఆదుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగడం తెల్సిందే. అలాగే మసీదులు, ఆలయాలు, చర్చిలు మతాలతో సంబంధం లేకుండా బాధితులందరికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ముస్లిం యువకులు దేవాలయాలను శుభ్రం చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి మంగళవారం చేసిన ‘ట్వీట్’ను సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది. ‘గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ట్వీట్ చేయాల్సిందిపోయి ‘రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ట్వీట్ చేయడంపై ట్విట్టర్లో విమర్శలు వచ్చాయి. ఇది అరుదైన విషయం కాదని, వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా భారతీయులంతా ఒకరికొకరు అండగా నిలుస్తారని, ప్రజలను కులమతాల పేరిట విడదీసేది రాజకీయ నాయకులేనని పలువురు ట్వీట్లు చేశారు. ఇంతకన్నా మంచి ప్రేజ్ దొరకలేదా అంటూ కొందరు, ఇదేమి పైత్యమని మరికొందరు ప్రశ్నించారు. -
రాహుల్ చెప్పులు మోసిన మాజీ మంత్రి!
-
పవన్‌ను ఇరికించిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. మెగా హీరోలకు, పొగుడుతున్నట్టుగా చురకలంటించే వర్మ.. చెన్నై వరదలపై ఇంత వరకు స్పందించని పవన్ కల్యాణ్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ చెన్నైలో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుపై స్పందించలేదు. అయితే సంఘటనపై పవన్ తరపున వర్మ స్పందించాడు. 'పవన్ కల్యాణ్ చెన్నై వరద బాధితులకు 2 కోట్ల రూపాయల సాయం అందించటం ఎంతో ఆనందంగా ఉంది. పవర్ స్టార్ అంటే ఇదే. పవన్ ఇస్తున్న రెండు కోట్లు, రజనీకాంత్ ఇచ్చిన పది కోట్ల కన్నా చాలా ఎక్కువ. రజనీ తన ప్రాంత ప్రజల కోసం చేస్తున్నాడు. పవన్ మాత్రం మానవత్వంతో చేస్తున్నాడు. పవన్ తీసుకున్న నిర్ణయం ఆయన చేగువరా అభిమానిగా ప్రూవ్ చేస్తోంది. దీన్ని బట్టి పవర్ స్టార్‌కు సూపర్ స్టార్ కన్నా 20 రెట్లు ఎక్కువగా జాలీ ఉందని ప్రూవ్ అవుతోంది'. అంటూ ట్వీట్ చేశాడు. కొద్ది రోజులుగా గుజరాత్ షూటింగ్లో ఉన్న పవన్, ఆ తరువాత షూటింగ్ ముగించుకొని హైదరబాద్ వచ్చినా, తమిళనాడులో పరిస్థితులపై మాత్రం స్పందించలేదు. దీంతో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు పవన్ వర్గాన్ని, ఆయన అభిమానులని ఇరకాటంలో పడేశాయి. Extremely happy to hear that P K donated 2 cr to chennai victims..I salute this extraordinary gesture..This is what is the Power of a Star — Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015 P k gvng 2 cr is more than R K giving 10 cr becos R K doing to his people whereas P K is doing to different on humanitarian considerations — Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015 P K giving 2 cr to chennai tragedy is proof his concern is for human tragedy across states which justifies his adulation for Che Guevara — Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015 This just proves that Power Star has 20 times more sympathy towards human tragedy than the Super Star — Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2015 -
రజనీ బాటలో దిలీప్ కుమార్
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. హిందీ సినీ పరిశ్రమలో కురువృద్దుడి దిలీప్ కుమార్ ఈ నెల 11వ తేదీన.. 93వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అయితే చెన్నైలో వర్షాల కారణంగా భారీ విపత్తు సంభవించిన నేపధ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టుగా ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ చెన్నైతో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 12న తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దంటూ ఆయన తన అభిమానులు ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నై వాసులు తీవ్ర దుఖంలో ఉన్న సమయంలో పండుగలు చేసుకోవటం భావ్యం కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రజనీ ప్రకటించారు. ఇక రజనీ కాంత్, దిలీప్ కుమార్ల నిర్ణయాలపై అభిమానుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. I have decided to forego all celebrations on my birthday as I am saddened by the tragedy that has swept the lives of so many in Chennai. — Dilip Kumar (@TheDilipKumar) December 8, 2015 -
రాహుల్ చెప్పులు మోసిన మాజీ మంత్రి!
పుదుచ్చేరి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పుదుచ్చేరిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ కోసం సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీ నారాయణస్వామి చెప్పులు మోస్తూ కనిపించారు. వీ నారాయణస్వామి యూపీఏ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయ మంత్రిగా ఉన్నారు. వరద ప్రాంతాలకు చేరుకున్న తర్వాత రాహుల్ తన బూట్లు విప్పారు. అప్పటివరకు తన చేతుల్లో పట్టుకొని ఉన్న చెప్పులను వీ నారాయణస్వామి రాహుల్ కు అందించారు. ఆయన కూడా మోహమాట పడకుండా వాటిని వేసుకున్నారు. ఈ వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి వీరపూజకు ఈ ఘటన నిదర్శనమంటూ విమర్శలు రాగా.. వాటిని పుదుచ్చేరి ఎంపీ అయిన నారాయణస్వామి తోసిపుచ్చారు. వరద నీళ్లలో రాహుల్ గాంధీ వట్టి పాదాలతో నడిస్తే బాగుందని భావించి.. మర్యాదపూర్వకంగా ఆయనకు తన చెప్పులు ఇచ్చానని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి భజన లేనేలేదని ఆయన చెప్పారు. వరద ప్రాంతాల్లో సందర్శించే సందర్భంగా రాహుల్ తన బూట్లను తానే చేతుల్లో పట్టుకున్నారని, భద్రతా సిబ్బందికి ఇచ్చేందుకు కూడా ఒప్పుకోలేదని చెప్పారు. -
ఒక్క రోజే రూ. 22 కోట్ల విరాళాలు
తమిళనాడును ఆదుకునేందుకు సంఘాలు, సంస్థలతో పాటుగా అన్ని వర్గాల వారు తరలుతున్నారు. తొమ్మిది అతి పెద్ద సంస్థలు తమ విరాళాల్ని ప్రకటించడంతో పాటుగా ఆ మొత్తాన్ని సీఎం జయలలితకు అందించారు. రూ. 22 కోట్ల మేరకు విరాళాలు సచివాలయానికి మంగళవారం ఒక్కరోజే వచ్చి చేరింది. చెన్నై : ప్రకృతి తాండవానికి తమిళనాడు విలవిలలాడుతోంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. తాము అండగా ఉన్నామంటూ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు చెన్నై వైపుగా కదిలివచ్చి సహాయంలో నిమగ్నమయ్యాయి. వరద బాధితులకు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, వస్త్రాలు, ఇంటి సామగ్రి అందించే పనిలో పడ్డాయి. అయితే, ఈ పెను విలయానికి రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట పొలాలు, పంటలు వరద పాలయ్యాయి. ప్రజలకు తీవ్ర నష్టం ఏర్పడడంతో వారిని ఆదుకునేందుకు నష్టపరిహారం ప్రకటించారు. కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉండడంతో తమిళనాడును ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాలు విరాళం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఏకంగా రూ. 25 కోట్లు ప్రకటించి అందరి కన్నా ముందు వరుసలో నిలబడ్డారు. ఓవైపు కేంద్రం రెండు దఫాలుగా ప్రకటించిన రూ. 1940 కోట్లతో సహాయకాలను వేగవంతం చేసి ఉన్న తరుణంలో, రాష్ర్ట ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేందుకు భారీ సంస్థలు,. పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు వస్తున్నాయి. అన్ని వర్గాల వారు విరాళాల్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల రాష్ట్రంలో వరద సహాయ హుండీల్ని చేత బట్టి నిధుల్ని సేకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. విరాళాలు : మంగళవారం తొమ్మిది సంస్థలకు చెందిన యాజమాన్యాలు తమ వంతుగా సహాయాన్ని ప్రకటించాయి. విరాళం మొత్తాల్ని సీఎం జయలలితను కలుసుకుని అందజేశాయి. సచివాలయంలో సీఎంను కలుసుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ ఒక్క రోజు రూ. 22 కోట్ల మేరకు విరాళం వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో టీవీఎస్ గ్రూప్ రూ. 5కోట్లు, మాతా అమృతామయి తరపున రూ. 5కోట్లు, టఫే సంస్థ రూ. 3కోట్లు, జాయ్‌లుకాస్ రూ. 3కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ. ఆకోట్లు, హుండాయ్ రూ. ఆ కోట్లు, స్టేట్ బ్యాంక్ రూ. కోటి, సిటీ యూనియన్ బ్యాంక్ రూ కోటి చొప్పున విరాళాల చెక్కులను సీఎం జయలలితకు అందజేశారు. -
అన్నదాతలకు స్టాలిన్ భరోసా
హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందే! తంజై, నాగై, తిరువారూర్లలో పర్యటన కుప్పులు తెప్పలుగా సహాయకాలు పెద్ద సంఖ్యలో అన్నా అరివాలయంకు లారీల రాక కరుణ పరిశీలన వాళ్లు ఇవ్వరు..ఇంకొక్కర్ని ఇవ్వనివ్వరని మండిపాటు చెన్నై: డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తంజావూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో మంగళవారం పర్యటించారు. అన్నదాతలకు భరోసా ఇస్తూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పార్టీ తరపున వరద బాధితులకు సహాయకాలను అందిస్తూ, బాధితులకు తామున్నామన్న భరోసాతో ముందుకు సాగుతున్నారు. చెన్నై నుంచి తంజావూరు చేరుకున్న ఆయన తొలుత అక్కడి వరద బాధిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. అక్కడి పంట పొలాల్ని సందర్శించి, దెబ్బ తిన్న పంటల్ని పరిశీలించారు. అన్నదాతలకు ఓదార్పు ఇచ్చే విధంగా సహాయకాలను అందజేశారు. రైతులతో సంప్రదింపులు జరిపి, వారికి ఏర్పడ్డ నష్టం తీవ్రతను ఆరా తీశారు. తదుపరి లోతట్టు గ్రామాల్లో పర్యటించి, సహాయకాలను అందించారు. తిరువారూర్‌లో పలు ప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్ రైతులకు అండగా తామున్నామన్న భరోసా ఇచ్చారు. నాగపట్నం చేరకుని జాలర్లు పడుతున్న కష్టాలను పరిశీలించారు. వరదలతో రోడ్డున పడ్డ కుటుంబాలను పరామర్శించి, సహాయకాలను అందజేశారు. ఈసందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా వరద సాయాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే, సాయం అన్నది బాధితులందరికి దరి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏక పక్షంగా వరద సాయం అందించే ప్రయత్నాలు సాగితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నదాతలకు కంటి తుడుపు చర్యగా నష్ట పరిహారం ప్రకటించి ఉన్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక, స్టాలిన్ పర్యటన జోరు వానలో సాగడం విశేషం. అన్నదాతల్ని ఆదుకోవాలంటే హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, బుధవారం కడలూరులో స్టాలిన్ పర్యటించనున్నారు. కుప్పలు తెప్పలుగా : డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ వర్గాలు తీవ్రంగానే స్పందించి ఉన్నారు. లారీలలో టన్నుల కొద్ది సహాయకాలు చెన్నైలోని అన్నా అరివాలయంకు వచ్చి చేరుతున్నాయి. బియ్యం, పప్పుధాన్యాలు, ప్లాస్టిక్ వస్తువులు, దుప్పట్లు, చాపలు, ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండటంతో వాటిని బాధితులకు పంపిణీ చేయడంలో వేగం పెంచి ఉన్నారు. మంగళవారం తంజావూరు, సేలం, మదురై, ధర్మపురిల నుంచి పదిహేను లారీల్లో వస్తువులు వచ్చి చేరాయి. అలాగే, ఎస్ఆర్ఎం తరపున రెండు లారీల వస్తువుల్ని డీఎంకేకు అందజేశారు. ఇక్కడికి వచ్చిన వస్తువుల్ని పరిశీలించిన అధినేత ఎం కరుణానిధి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వీటిని దరి చేర్చాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇక, మీడియాతో మాట్లాడిన కరుణానిధి ప్రభుత్వ తీరుపై పరోక్షంగానే విమర్శిస్తూ, రాజకీయాలకు అతీతంగా డిఎంకే ముందుకు సాగుతున్నారు. కుటుంబానికే కాదు, కుటుంబంలో ఉన్న వాళ్లందరికి సహాయకాలను డిఎంకే దరి చేర్చుతున్నదని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్న వాళ్లను అడ్డుకోవడం హేయమైన చర్యగా పేర్కొంటూ, వాళ్లు పెట్టరు, ఇంకెకొర్ని సాయం చేయనివ్వరని అన్నాడీఎంకే వర్గాల మీద మండి పడ్డారు. -
సవాళ్లను ఎదుర్కొన్నాం!
గతంలో ఎన్నడూ చవిచూడనంతగా సవాళ్లను ఎదుర్కొని బాధితుల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ ఎస్పీ సెల్వన్ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల నుంచి సమష్టి సహకారం అభినందనీయమని, విపత్తుతో ఎదురైన సవాళ్ల నడుమ సహాయక చర్యల్ని విజయవంతం చేశాం. చెన్నై: ప్రకృతి ప్రళయానికి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలు పెను కష్టాల్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఒక్క రాత్రికే కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలే కాదు, మిట్ట ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కాయి. ఈ పరిసరాల్లోకి వచ్చేందుకు కనీసం రోడ్లు కూడా లేదు. ఆకాశ మార్గంలో దిగాలన్నా వాన జోరు తప్పలేదు. రైళ్లు ముందుకు సాగాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమాచారం అందగానే ఎన్డీఆర్ ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. తొలి, రెండో అంతస్తులు వరకు మునిగే స్థాయికి నీళ్లు చేరినా, బాధితుల్ని రక్షించడమే తమ ప్రధాన కర్తవ్యంగా వారం రోజుల పాటుగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరుల్లో ఈ బృందాలు శ్రమించాయి. తమకు రోడ్లు ఎక్కడున్నాయో అన్న రూట్ మ్యాప్ కూడా తొలుత అందక పోవడంతో, ఎన్నో సవాళ్లను అధిగమించక తప్పలేదు. ఎన్ని సవాళ్లను అధిగమించినా లక్ష్య సాధనే తమ కర్తవ్యంగా ముందుకు సాగారు. విజయవంతంగా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అభినందనీయం. ఈ పరిస్థితుల్లో తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ ఆ విభాగం డీఐజీ ఎస్పీ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. తుపాన్ మొదలవుతుందన్న సమాచారంతో సాధారణంగా తాము అలర్ట్ అవుతామన్నారు. ఒక్క రాత్రి కురిసిన కుండ పోత వర్షం తమకు ఓ సవాల్‌గానే మారిందన్నారు. సమాచారం అందగానే, అరక్కోణం చేరుకున్నా, చెన్నై వైపుగా వచ్చేందుకు మార్గాలు లేక సతమతం కావాల్సి వచ్చిందని, రోడ్డు ఎక్కడున్నదో, ఎంత లోతులో నీళ్లు ప్రవహిస్తున్నదో అన్న వివరాలు కూడా తమ చేతిలో లేదని వివరించారు. 50 బృందాలు రంగంలోకి దిగినా, బృందాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం తీవ్ర కష్టంగా మారిందన్నారు. సమాచార వ్యవస్థ స్తంభించి ఉండడంతో ఎలాగైనా తమ లక్ష్యం బాధితుల్ని రక్షించడం, సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం అన్న నిర్ణయంతో ముందుకు సాగామన్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానికులు, సంఘాలు, సంస్థలు, ఆర్మీ, నావికాదళం, ఎయిర్ ఫోర్స్ సంపూర్ణ సహకారం అందించాయన్నారు. ప్రధానంగా తమిళనాడు పోలీసులు అందించిన సహకారం అభినందనీయమని కొనియాడారు. తాము ఎలా వెళ్లాలో అని సతమతమవుతున్న సమయంలో దారి చూపించి తమిళనాడు పోలీసులేనని పేర్కొన్నారు. విపత్తులను, ప్రకృతి విలయాన్ని అడ్డు కోవడం ఎవరి తరం కాదని, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధం కూడా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. తమ బృందాల్లో రెండు పుదుచ్చేరికి, ఒకటి కడలూరుకు పంపించామని, మిగిలిన 47 బృందాలు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులో తమ సేవల్ని విజయవంతంగా అందించాయని, ఆ బృందాల్లోని ప్రతి సభ్యుడ్ని కొనియాడారు. సమష్టి సహకారం, కృషితో పెను ప్రాణ న ష్టం జరగకుండా చేశామన్నారు. తమ సహాయక చర్యలు ఆదివారంతోనే ముగిశాయని, అయితే, కొన్ని చోట్ల మాత్రం బృందాల్ని ఇంకా వెనక్కు తీసుకోలేదన్నారు. చెంగల్పట్టు, మధురాంతకం పరిసరాల్లో, కాంచీపురం పరిధిలో అతి పెద్ద చెరువులు నిండి ఉన్నాయని, ఉబరి నీరు అధికంగా వెళ్తున్న దృష్ట్యా, ముందస్తుగా అక్కడి గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా, ఏదేని ప్రమాదం ఎదురైన పక్షంలో అక్కడి వారిని రక్షించడం లక్ష్యంగా కొన్ని బృందాలు అక్కడక్కడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. -
ఆ హిందూ దంపతుల కూతురి పేరు.. 'యూనుస్'
ఒకవైపు రాజకీయ నాయకులు, కొందరు సెక్యులరిస్టులు అసహనం అంటూ గగ్గోలు పెడుతుంటే.. సామాన్యులు మాత్రం అదేమీ తమకు అక్కర్లేదని, తాము పరమత సహనంతోనే ఉన్నామని చాటి చెబుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే తన రెండు ఫ్లాట్లలో వచ్చి ఎవరైనా ఉండొచ్చని మహ్మద్ యూనుస్ అనే యువకుడు ఇంతకుముందు చెప్పాడు... గుర్తుంది కదూ. అలా అతడి అపార్టుమెంటులో తలదాచుకున్న వారిలో చిత్ర, మోహన్ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు. వీళ్లు నివాసం ఉంటున్న ఉరప్పక్కం అనే ప్రాంతానికి వెళ్లి.. రక్షించేందుకు పడవల వాళ్లు కూడా ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ యూనుస్ ఎలాగోలా వాళ్లను బతిమాలి.. అక్కడకు వెళ్లి జనాన్ని రక్షించి తన అపార్టుమెంటుకు తీసుకొచ్చాడు. అప్పటికి చిత్ర నిండు గర్భిణి. అక్కడ కరెంటు లేదు, చాలామంది జనం చెట్లమీద వేలాడుతున్నారు. ఎలాగోలా పడవ తెచ్చి, ఆ గర్భిణిని, మరికొందరిని పడవ ఎక్కించాడు. నీళ్లలో పడవ వెళ్తూ.. కూలిపోయిన చెట్టును ఢీకొని తిరగబడినంత పనైంది. దాంతో ఆమె భయంతో విలవిల్లాడిపోయింది. తర్వాత చిత్రను ఓ ఆస్పత్రిలో చేర్చగా.. శనివారం నాడు పండంటి ఆడబిడ్డను కంది. తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడినది యూనుస్ కాబట్టి.. అతడి పేరే తమ బిడ్డకు పెట్టుకున్నారా హిందూ దంపతులు. ఈ విషయం గురించి యూనుస్‌కు వాట్సప్ ద్వారా ఓ సందేశం కూడా పంపారు. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వచ్చి కలుస్తామని తెలిపారు. ఇకనుంచి తన జీతంలో సగం మొత్తాన్ని పేదలకు ఇస్తానని కూడా చెప్పారు. -
ఆ వాట్సప్ మెసేజి తప్పు.. నమ్మొద్దు
ఇటీవలే భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన చెన్నై నగరంలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు వస్తాయంటూ నాసా హెచ్చరించిందని వాట్సప్‌లో ఇటీవల ఓ సందేశం విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. హరికేన్ కారణంగా అత్యంత భారీ వర్షపాతం తప్పదని, అది కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువగా.. ఏకంగా 250 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ఆ మెసేజిలో ఉంది. కానీ.. అదంతా తప్పు. దాన్ని ఎవరూ నమ్మొద్దన్నది తాజా కబురు. వాట్సప్‌లో ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ మెసేజ్ దావానలంలా వ్యాపించి, చాలా గ్రూపులలో షేర్ అయ్యింది. దాంతో గత ఆదివారం వరకు సెలవులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మళ్లీ సోమ, మంగళవారాల్లో కూడా సెలవులు పెట్టి ఆఫీసులకు వెళ్లకుండా ఊరుకున్నారు. చెన్నైలో ఉన్న తమ మిత్రులను పరిస్థితి ఎలా ఉంది, రావచ్చా అంటూ అడగడం కూడా కనిపిస్తోంది. తీరాచూస్తే ఇప్పుడు చెన్నై నగరంలో అసలు వర్షం అన్నదే పడటం లేదు. -
సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష!
కడుపు నింపుకోడానికి పడుపు వృత్తి చేస్తున్నా.. తమకూ మనసుందని, అది కూడా స్పందిస్తుందని నిరూపించారు మహారాష్ట్రలోని సెక్స్‌వర్కర్లు. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి తమవంతు సాయంగా.. లక్ష రూపాయలు పంపారు. తాము రోజుకు ఒకపూటే తింటున్నా.. రూపాయి రూపాయి కూడబెట్టి మరీ ఈ సొమ్మును పంపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో స్నేహాలయ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అనిల్ కవాడేకు వాళ్లు అందించారు. చెన్నై వరద పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి వీళ్లకు కంటిమీద కునుకు లేదని.. దాంతో ఎలాగోలా వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకుని తమవంతుగా ఈ సొమ్ము సమకూర్చారని స్నేహాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి చెప్పారు. జిల్లాలో మొత్తం సుమారు 3 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉండగా, వాళ్లలో 2వేల మంది ఈ విరాళాలు ఇచ్చారు. -
చెన్నై ఐటి రంగానికి రూ.400 కోట్ల నష్టం
-
‘అమ్మ’ బొమ్మకు ఒత్తిడి
స్వచ్ఛంద సంస్థలకు నిర్బంధం పలు చోట్ల దాడులు ‘అమ్మ’ బొమ్మకు ఒత్తిడి పాలకుల తీరుపై అసంతృప్తి చెన్నై: మానవత్వంతో బాధితుల సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు అధికార పక్షం ఒత్తిళ్లు తప్పడం లేదు. తాము చెప్పిన ప్రదేశాలకే సహాయకాలను సరఫరా చేయాలంటూ కొందరు, తమ నేతృత్వంలోనే అందించాలంటూ ఇంకొందరు, ఇక అమ్మ బొమ్మ తథ్యం అంటూ మరి కొందరు నిర్బంధిస్తుండడంతో మానవతా హృదయులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పడం లేదు. తాము చెప్పింది వినకుంటే దాడులు తప్పవని హెచ్చరించి ప్రత్యక్షంగా చూపిస్తుండడంతో ఆయా సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఆవేదనకు లోనవుతున్నారు. ఇది చెన్నై పరిధిలో పలు చోట్ల సాగుతున్న అధికార జులుం కావడంతో సర్వత్రా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రళయానికి చెన్నై, శివారులు నరకయాతనను చవిచూస్తున్నాయి. ఇళ్లను, వస్తువులను కోల్పోయి కట్టుబట్టలతో నిలబడ్డ వాళ్లు వేలాది మంది ఉన్నారు. లక్షలాది మంది వరద తాకిడితో ఆపన్న హస్తం కోసం చేతులు చాచక తప్పడం లేదు. ఏ రోడ్డులో చూసినా తమను ఆదుకునేందుకు ఎవరో ఒకరు సహాయకాలతో రాక పోతారా అని ఎదురు చూసే పేద కుటుంబాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై నగరవాసుల్ని ఆదుకునేందుకు తామున్నామంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, మానవతా హృదయం కల్గిన వాళ్లు కదిలారు. అన్నం కోసం, తాగునీటి కోసం అలమటిస్తున్న నగరవాసుల్ని ఆదుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. ఆహార పదార్థాలే కాదు, సర్వం కోల్పోయిన వాళ్లకు అవసరమైన వస్తువుల్ని సైతం అందించేందుకు చెన్నై బాట పట్టారు. వందలాది సంస్థలు, సంఘాలు చె న్నై బాధితుల సేవలో నిమగ్నమయ్యాయి. ఆధునిక యుగంలో ఇంకా మానవత్వం ఎక్కడో ఒక చోట ఉందని నిరూపించుకునే విధంగా సాగుతున్న ఈ సహాయకాలకు అధికార అడ్డంకులు ఎదురవుతున్నాయి. చెన్నై శివారుల్లోనూ లారీల్ని ఆపడం, అమ్మ బొమ్మలను తగిలించ డం వంటి చర్యలకు పాల్పడే అన్నాడీఎంకే వర్గాలు కొందరు అయితే, తాము పెట్టిందే చట్టం, తాము చెప్పినట్టు వినాల్సిందే, తాము చెప్ని చోటే పంచాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే వారు మరి కొందరు. సహాయకాలు రాగానే, తమను పిలిచి , తమ చేతుల మీదుగానే పం పిణీ చేయించాలంటూ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ప్రతినిధులపై మరెందరో అధికార జులుం సాగించే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల కార్పొరేషన్‌కు అప్పగిస్తే, వాళ్లే చూసుకుంటారంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇక నోరు మెదప లేని కొన్ని సంఘాలు వారి ఒత్తిళ్లకు తలొగ్గుతుంటే, మరెందరో మానవతా హృదయులు ఇదేంటంటూ పెదవి విప్పే పనిలో పడ్డారు. మరి కొందరు ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ఇ లాంటి వారిపై ఏకంగా దాడులకు సైతం దిగుతుండడంతో పాలకుల తీరుపై అసంతృప్తి రగులుతోంది. కింది స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల వీరంగాలకు ఉక్కిరి బిక్కిరి అవుతోన్నామంటూ స్వచ్ఛంద సంస్థలకు, సంఘాలకు చెందిన పలువురు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము చెప్పింది వినకుంటే దాడులు సైతం చేస్తామని హెచ్చరించి మరీ, చేసి సైతం చూపించడంతో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి. దాడితో కలవరం: నిర్బంధం, ఒతిళ్లు ఓ వైపు సాగుతుంటే, సోమవారం అన్నానగర్‌లో ఏకంగా దాడి సైతం జరగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. అడయార్, కోట్టూరుపురంలలో పోలీసుల ద్వారా అడ్డుకోవడంతో అధికార జులుంపై విమర్శలు బయలు దేరుతున్నాయి. దాడికి గురైన వాళ్లు తమిళనాడులోని సంస్థలకు చెందిన వాళ్లు కూడా కాదు, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి సేవల్ని అందిస్తున్న బెంగళూరుకు చెందిన మానవతా హృదయులు. బెంగళూరు నుంచి ఓ సంస్థ నేతృత్వంలో పదిహేను బృందాలు చెన్నైలో రెండు రోజులుగా సేవల్ని అందిస్తున్నాయి. ఇక్కడున్న మరో సంస్థ సహకారంతో అక్కడున్న బృందాలు అన్నానగర్‌లోని గంగయమ్మన్ ఆలయం వద్ద అన్నాహారాలు స్వయంగా తయారు చేస్తూ, ఎక్కడెక్కడల్లా బాధితులు ఆకలితో అలమటిస్తున్నారో తమ బృందాల ద్వారా గుర్తించి అక్కడికి సరఫరా చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం అక్కడకు వచ్చిన అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శి తమిళ్‌సెల్వన్ , ఆయన మద్దతుదారుడు రాజాతో కూడిన బృందం ఆ సంస్థ ప్రతినిధుల్ని పిలిపించి ఓ లిస్టు చేతిలో పెట్టారు. ఆ లిస్టు ఆధారంగా ఆహార ప్యాకెట్లను అక్కడున్న తమ వాళ్ల చేతికి ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. తమ బృందాలు తోడుగా వస్తాయని, ఎక్కడెక్కడ సరఫరా చేయాలో తమ వాళ్లే చేస్తారని సూచించారు. ఇందుకు అంగీకరించని తమిళ్‌సెల్వన్ బృందం తమ చేతికి పని పెట్టారు. పత్రికల్లో రాయలేని పదజాలాలతో ఆ మానవతా హృదయుల్ని దూషించారు. ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు బయటకు వెళ్లనీయకుండాఅడ్డుకుంటామంటూ దాడికి సైతం దిగారు. ఆ సంస్థ ప్రతినిధుల్ని తరిమి తరిమి కొట్టడంతో అక్కడున్న జనంలో ఆగ్రహం రేగింది. మానవత్వంతో ఎక్కడి నుంచో వచ్చి రెండు రోజలుగా వర్షంలో తడుస్తూ స్వయంగా తయారు చేసి మరీ వేలాది మందికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న వాళ్లపై ఏమిటీ ఈ జులుం అంటూ ప్రశ్నించడమే కాదు, తిరగబడే యత్నం చేశారు. ప్రజలు తిరగబడడంతో అక్కడి నుంచి తమిళ్‌సెల్వన్ బృందం జారుకుంది. అయితే, ఆ సంస్థ ప్రతినిధులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అయినా, తమ సేవను మాత్రం ఆపలేదు. ఇదే నిజమైన మానవత్వం అంటే అని నిరూపించుకున్నారు. తమిళ్‌సెల్వన్ బృందం వీరంగాన్ని అక్కడున్న యువత రహస్యంగా తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, దానిని ఓ మీడియాకు పంపించడంతో అధికార పార్టీ నాయకుల జులుం ఇలా కూడా ఉంటుందా అని రాష్ట్రానికి తెలిసి వచ్చింది. ఇదే విధంగా అడయార్, కొట్టూరుపురంలలో బాధితులకు దుప్పట్లను పంచుతున్న యువకులపై తిరగబడడమే కాదు, వారేదో నేరం చేసిన వారిలా పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించారు. వారి చేతుల్లో ఉన్న దుప్పట్లను, సహాయకాలను అధికార సేనలు లాక్కెళ్లడం కూడా మరో చానల్లో ప్రత్యక్షం కావడం గమనార్హం. ఎలాంటి స్వలాభం చూసుకోకుండా, జాతి మతం భేదం లేకుండా సేవల్ని అందిస్తున్న సంఘాలపై ఇలాంటి దాడులు సాగడం సిగ్గు చేటు అని పలువురు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరెన్నో చోట్ల నగరంలో సాగుతున్నాయన్న విమర్శలు, ఆరోపణలు బయలు దేరి ఉండడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి సీఎం జయలలిత స్పందిస్తారా.? అన్నది వేచిచూడాల్సిందే. లేని పక్షంలో మరేదైనా విపత్తులు ఎదురైనప్పుడు తమిళనాడు వైపుగా వచ్చేందుకు మానవతా హృదయులు భవిష్యత్తులో ఆలోచించుకోవాల్సి వస్తుందేమో! -
వరద సాయం
బాధిత కుటుంబానికి రూ.5 వేలు గుడిసెకు పది వేలు హెక్టారుకు రూ.13-18 వేలు ప్రకటించిన సీఎం జయలలిత చెన్నై: ఎట్టకేలకు సీఎం జయలలిత వరద సాయాన్ని ప్రకటించారు. గుడిసె వాసులకు రూ.10 వేలు, సొంత ఇళ్లలోని వరద బాధితులకు రూ.5 వేలు చొప్పున సాయం అందించనున్నారు. పంటల్ని కోల్పోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకు అందించనున్నారు. ఈశాన్య రుతు పవనాలు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. లక్షలాది కుటుంబాలు కష్టాల కడలిలో మునిగాయి. ఇతర జిల్లాల్లోనూ వర్షం ప్రభావం ఓ మోస్తరే. తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లోని బాధితులకు ఏ మేరకు సీఎం జయలలిత సాయం ప్రకటిస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అదే సమయంలో వరద సాయంపై ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో విమర్శలు బయల్దేరాయి. ఎట్టకేలకు స్పందించిన సీఎం జయలలిత సోమవారం సచివాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన అనంతరం వర్షాల నుంచి ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని కాంక్షిస్తూ, ఆరోగ్య సూత్రాలతో కూడిన ఓ ప్రకటనను తొలుత వెలువరించారు. తదుపరి వరద సాయం ప్రకటిస్తూ మరో ప్రకటన చేశారు. వరద బాధితుల వివరాలను త్వరితగతిన సేకరించాలని, నష్టం తీవ్రతపై నివేదికను త్వరితగతిన సిద్ధం చేసి సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వరద సాయం: వరదలతో గుడిసెల్ని కోల్పోయిన కుటుంబాలకు రూ.10 వేలు ప్రకటించారు. ఇతర బాధితుల కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున వరద సాయం అందించనున్నారు. ఈ సాయంతో పాటుగా గుడిసెవాసులకు పది కేజీల బియ్యం, ఇతరులకు ఐదు కేజీల బియ్యం, దుప్పటి, చీర, దోవతి అందించనున్నారు. కూవం నదీ తీరం వెంబడి ఉన్న గుడిసెవాసులకు ప్రత్యామ్నాయంగా గృహాల కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. ఒక్కియం తురై పాక్కంలో నిర్మిస్తున్న పది వేల గృహాలను వారికి అప్పగించేందుకు నిర్ణయించారు. వరదలతో కోల్పోయిన కుటుంబ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు, లెసైన్స్‌లు, ఇంటి పట్టాలు తదితర అన్ని రకాల కార్డులు, సర్టిఫికెట్లను మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం ఈ నెల 14వ తేదీ నుంచి రెండు వారాల పాటుగా వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రభుత్వ సేవా కేంద్రాల ద్వారా కూడా నకళ్లను పొందవచ్చని సూచించారు. వరద సాయం బాధితులకు బ్యాంక్ ఖాతాల ద్వారా అందుతున్నాయని ప్రకటించారు. రాత్రనక పగలనక చెన్నైలో పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన కార్మికులకు ప్రత్యేకంగా తలా రూ.2 వేలు ప్రకటించారు. ఇక, అన్నదాతల్ని ఆదుకుంటున్నామంటూ వరదలతో పంట పరిహారం అందజేయనున్నట్టు వివరించారు. సాగుబడులు, భూ సారం ఆధారంగా కొన్ని పంటలకు హెక్టారుకు రూ.7500, మరికొన్ని పంటలకు రూ.13,500, ఇంకొన్ని పంటలకు రూ. 18 వేలు చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. సహకార బ్యాంక్‌ల ద్వారా ఈ రుణాలను అందిస్తామని, అయితే, రైతుల అప్పులతో ఈ రుణాలు జమ చేసిన పక్షంలో తీవ్ర చర్యలు తప్పదని బ్యాంక్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, వరదలతో మరణించిన పశువులకు రూ.30 వేలు, మేకలకు రూ.3 వేలు, కోళ్లకు రూ.100 చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నామన్నారు. మరో ప్రకటనలో వరద సాయం గురించి వివరిస్తూ, 13.80 లక్షల మందిని రక్షించామని తెలిపారు. వారిని యాభై వేల శిబిరాల్లో ఉంచి, సహాయకాలను అందిస్తున్నామని వివరించారు. -
కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్‌స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్.. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్లు తెలుస్తోంది. కాజోల్‌తో కలిసి 'దిల్వాలే' సినిమాలో మళ్లీ నటిస్తున్న షారుక్.. గతంలో దీపికా పదుకొనేతో కలిసి చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోనూ నటించాడు. తాను తమిళనాడు బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు సీఎం జయలలితకు ఓ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. తమిళనాడు వరదల్లో 280 మంది మరనించారు. నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ కోలుకోలేదు. దాంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా పెద్దమనసు చేసుకుని ముందుకొస్తున్నారు. -
పాడైపోయిన పాస్‌పోర్టులు మళ్లీ ఇస్తాం
చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముఖ్యమైన పత్రాలను చాలామంది పోగొట్టుకున్నారు. వాటిలో పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. అలా పాస్‌పోర్టులు పాడైపోయిన వాళ్లకు ఉచితంగా మళ్లీ వాటిని జారీచేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. వరదల్లో పాస్‌పోర్టులు పోయినా, పాడైనా చెన్నై నగరంలో ఉన్న మూడు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఏదో ఒకదానికి వెళ్లాలని, అక్కడ ఉచితంగా కొత్త పాస్‌పోర్టు జారీ చేస్తారని ఆమె ట్వీట్ చేశారు. If your passport is lost or damaged in floods, pl go to any of three PSKs in Chennai. They will issue u fresh passport free of charge. Pl RT — Sushma Swaraj (@SushmaSwaraj) December 7, 2015 -
విమానంలో రెస్టు తీసుకున్న కింగ్ కోబ్రా!
భారీ వర్షాల కారణంగా చెన్నైలో మనుషులకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తలదాచుకోడానికి సురక్షిత ప్రాంతం వెతుక్కుంటూ వెళ్లిన ఓ కింగ్ కోబ్రా.. చివరకు ఎంచక్కా ఓ విమానం ఎక్కేసి అందులో నిద్దురపోయింది. నగరంలోని విమానాశ్రయం కూడా భారీ వర్షాలతో మూతపడిన విషయం తెలిసిందే. అక్కడ పార్క్ చేసిన ఓ విమానం చక్రం కంపార్టుమెంటు లోపల ఈ కింగ్ కోబ్రా విశ్రమించింది. చెన్నై విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవ్వడంతో సిబ్బంది విమాన చక్రాలను శుభ్రం చేస్తుండగా ఈ కింగ్ కోబ్రా కనిపించింది. దాన్ని సురక్షితంగా బయటకు తీసి, విమానాశ్రయానికి దూరంగా ఉన్న ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం ఐదు రోజుల పాటు మూతపడింది. ప్రధాన రన్‌వేతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచిపోవడంతో అక్కడి నుంచి విమానాలను నడిపించలేకపోయారు. ఇప్పుడు కూడా కేవలం స్వదేశీ ప్రయాణాలకు సంబంధించిన విమానాలను మాత్రమే నడుపుతున్నారు తప్ప అంతర్జాతీయ విమానాలను టేకాఫ్ గానీ, ల్యాండింగ్ గానీ చేయడం లేదు. -
తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు?
తిరుమలకు ఇప్పటికే ఉన్న రెండు ఘాట్ రోడ్లకు తోడు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ తలపెట్టింది. దీనిపై సాధ్యాసాథ్యాలను నిర్ణయించాల్సిందిగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో వైద్య సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. పాలక మండలి సమావేశంలో అనేక అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని రూ100 కోట్లతో అభివృద్ధి చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తొలి విడతగా..రూ.20కోట్లు మంజూరు చేయనున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీమ్ లో శ్రీవారి నగలు ఉంచాలని నిర్ణయించారు. వడ్డీ ఎక్కువగా వచ్చే పక్షంలో ఈ పథకం ఉపయోగించుకోవాలని పాలక మండలి భావిస్తోంది. కోటీ ఆరు లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారి పట్టువస్త్రాలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏకాదశి గందరగోళం.. కాగా.. వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి పాలకమండలి సమావేశంలో పాలక మండలి, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకాదశి పాసుల వ్యవహారం ఇరు వర్గాల మధ్య బేదాభిప్రాయాలకు కారణమని తెలుస్తోంది. ఏకాదశికి కోరినన్ని పాసులు ఇవ్వాలని పాలక మండలి సభ్యులు డిమాండ్ చేశారు. కాగా.. దీనిపై అధికారాలు స్పందించలేదు. దీంతో పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. -
దుప్పట్లు, టవల్స్ కావాలి.. పంపండి: శ్రుతి
భారీవర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన చెన్నైలో ఎప్పుడు ఏం కావాలో.. ఎవరెవరి నుంచి సాయం అందుతోందో అనే విషయాలను సెలబ్రిటీలు కూడా బాగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హీరో సిద్దార్థ, హీరోయిన్ శ్రుతిహాసన్ వేర్వేరుగా తమ అభిమానులు, ఇతరుల ద్వారా సేవా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ చెన్నై వాసులను ఆదుకోడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైవాసుల్లో చాలా మందికి దుప్పట్లు, టవల్స్ అవసరమని, వాటితోపాటు పారిశుధ్యానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలు కూడా ఉన్నాయని.. సాయం చేసేవాళ్లు ముందుకు రావాలని శ్రుతిహాసన్ ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరింది. పంజాబీ- కెనడియన్ అమ్మాయి సుఖ్మన్ ఫంగురా, కమల్.. శ్రుతిలకు వీరాభిమాని అయిన శ్రీరామ్ తదితరులు సహాయ కార్యక్రమాల్లో చాలా చాలా సాయం చేస్తున్నారని, అందుకు వాళ్లకు బోలెడంత అభినందనలని చెప్పింది. వీళ్ల కృషితో చాలా మేలు జరిగిందని ప్రశంసించింది. Need of the hour- people need blankets and towels and basic hygiene amenities - please help !! #chennai #support — shruti haasan (@shrutihaasan) December 7, 2015 A big shout out to @SukhmanPhangura and @SriramShruti for helping so so much with the relief work !! You guys have made a big difference — shruti haasan (@shrutihaasan) December 7, 2015 -
ఎంత కష్టం ఎంత నష్టం
-
ఆహార పొట్లాలపై 'అమ్మ' చిత్రాలు!
-
సినీతారలకు చేదు అనుభవం
-
సీనీతారలకు చేదు అనుభవం
-
అభిమానుల అత్యుత్సాహం.. వెనుదిరిగిన సినీతారలు
కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): చెన్నై వరద బాధితులకు అండగా విరాళాలను సేకరించేందుకు ఆదివారం కూకట్పల్లి సుజనా ఫోరం మాల్లో ఏర్పాటు చేసిన సినీతారల కార్యక్రమం రసాభాసగా మారింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో ఫోరం మాల్ కిక్కిరిసిపోయి తొక్కిసలాటకు దారితీసింది. సీనీతారలు కాజల్, రానా, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి, తేజశ్వి తదితరులకు చేదు అనుభవం ఎదురైంది. సభా వేదిక వద్దకు వచ్చిన హీరో, హీరోయిన్లను తాకేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ముందుకు చొచ్చుకురావడం, సెల్ఫోన్లతో చిత్రీకరించేందుకు పోటీపడటంతో పరిస్థితి ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు అభిమానులు కిందపడిపోయారు. కార్యక్రమ నిర్వాహాకులు, పోలీసులు, బౌన్సర్లు అభిమానులను కట్టడి చేసేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సినీతారలు పక్కనే ఉన్న స్టార్‌బక్స్ లోకి వెళ్లి కొద్దిసేపు సేదతీరారు. అనంతరం అక్కడి నుంచి నిష్ర్కమించారు. కాగా, చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సినీ తారలు కాజల్, అల్లరి నరేష్, రానా, మంచులక్ష్మి, తేజస్విలు కోరారు. తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తి చెన్నై నగరం నీటమునిగిందని, అక్కడి ప్రజలలో తెలుగువారు కూడా ఉన్నారని, ప్రజలను ఆదుకునేందుకు మనమంతా సహకారం అందించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. -
మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద హీరో: వర్మ
ముంబై: ట్విట్టర్లో తనదైన మార్కు వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు ఏదో హల్చల్ చేసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మ్యాగీ న్యూడిల్స్‌పై పడ్డారు. చెన్నై వరద బీభత్సానికి సంబంధించి అతిపెద్ద హీరోగా బాధిత మ్యాగీ న్యూడిల్సే నిలిచిందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. చెన్నైలో బాధిత ప్రజలకు సరఫరా అయిన మ్యాగీ న్యూడిల్సే అతిపెద్ద రక్షకురాలిగా నిలిచిందని, ప్రభుత్వం తనను ధ్వంసం చేయాలని చూసినా.. మ్యాగీ న్యూడిల్స్ మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడిందని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మ్యాగీకి జై కొట్టారు. ఉన్నట్టుండి వర్మ మ్యాగీ గురించి వ్యాఖ్యలు చేయడంలో అంతర్థారం లేకపోలేదు. ఇటీవల నిషేధానికి గురైన మ్యాగీ న్యూడిల్స్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై ప్రజలకు ముందుస్తుగా అందజేసిన ఆహార పదార్థాలు, పానీయాల జాబితాలో మ్యాగీ న్యూడిల్సే అగ్రస్థానంలో నిలిచింది. సహాయక చర్యల్లో భాగంగా నెస్ట్లే సంస్థ రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే మ్యాగీ న్యూడిల్స్ ను తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందజేసింది. చెన్నై ప్రజలకు కొరత రాకుండా ప్యాకేజెడ్ ఆహార పదార్థాలు, తాగునీరు బాటిళ్లు అందజేయాలని కేంద్రమంత్రి హర్సిమత్కౌర్ బాదల్ పిలుపునిచ్చారు. దీంతో పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్యాకేజెడ్ ఆహారపదార్థాలు అందజేశాయి. ఈ జాబితాలో 10 మిలియన్ టన్నుల న్యూడిల్స్, 5వేల లీటర్ల టెట్రా ప్యాకేడ్ పాలు, 50వేల కాపీ పొట్లాలతో నెస్ల్టే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఎంటీఆర్, ఐటీసీ సంస్థలు కూడా భారీమొత్తం ఆహార పదార్థాలు అందజేశాయి. -
ఆహార పొట్లాలపై 'అమ్మ' చిత్రాలు!
చెన్నై: ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన విపత్తులోనూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారా? అంటే తమిళనాడులోని పరిస్థితి చూస్తే ఔననే అనిపిస్తున్నది. వర్షాలకు అల్లాడిన చెన్నైలో బాధిత ప్రజలకు అందజేస్తున్న సహాయక సామాగ్రిపై అధికార అన్నాడీఎంకే చెందిన శ్రేణులు బలవంతంగా ముఖ్యమంత్రి జయలలిత చిత్రాలు అతికిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'అన్నాడీఎంకే శ్రేణులు మా వాహనాలను నిలిపివేశారు. మమ్మల్ని బెదిరించి బలవంతంగా బాధితులకు అందజేసేందుకు ఉద్దేశించిన బియ్యం బ్యాగులు, ఆహార పొట్లాలపై స్టిక్కర్లు అతికించారు. ఇది దారుణమైన చర్య. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు' అని సంతోష్ అనే వాలంటీర్ తెలిపారు. ప్రస్తుత విషాద సమయంలోనూ రాజకీయ ప్రయోజనాలకోసం ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటం సరికాదని మరో వాలంటీర్ తెలిపారు. బాధిత ప్రజల కోసం తీసుకెళ్తున్న సహాయక సామగ్రిపై 'అమ్మ'గా పేరొందిన జయలలిత స్టిక్కర్లు ఉండటం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలు మాత్రం ఇది తమ చర్య కాదని అంటున్నారు. పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరో దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై అన్నాడీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేయనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ నేత తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ అనుచరులు మాత్రం అన్నాడీఎంకే శ్రేణుల చర్యలను తప్పుబడుతూ మరిన్ని ఫొటోలు విడుదలచేశారు. -
కోలుకుంటున్న చెన్నై - మళ్లీ వర్షం
- సహాయక చర్యలకు అంతరాయం - పాక్షికంగా నడుస్తున్న రైళ్లు, బస్సులు చెన్నై ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమైన చెన్నై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఆదివారం ఉదయం మరో సారి వర్షం మొదలు కావడంతో.. సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. శనివారం పెద్దగా వర్షం లేక పోవడంతో పలు ప్రాంతాల్లో వరద నీరు తగ్గు ముఖం పట్టింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చారు. కాగా.. బంగాళాఖాతంలో శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు. మరోవైపు వరద తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం రైళ్లు, బస్సుల సేవలు పాక్షికంగా పునరుద్ధరించింది. చెన్నై సెంట్రల్,ఎగ్మూర్ నుంచి పాక్షికంగా రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ - చెన్నై మధ్య ఆదివారం నుంచి రైళ్ల రాక పోకలు ఎప్పటి లాగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై కోయంబేడు నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సేవల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. నగర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఈనెల 8వరకూ ఉచితంగా సేవలు అందిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు.. వరదల కారణంగా పూర్తిగా నీటమునిగిన చెన్నై విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. వాతావరణం సహకరిస్తే... పగటి పూట విమాన సర్వీసులను నడిపిస్తామని పౌరవిమాన యాన సంస్థ ప్రకటించింది. రాత్రిపూట విమానాలను నడిపే అంశంపై త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమానాలను మాత్రమే నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయం పూర్తిస్థాయిలో పునరుద్దరించిన తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ పోర్టులోకి అనుమతిస్తామని తెలియజేశారు. కాగా.. శనివారం వర్షాల నుంచి తెరిపి లభించడంతో.. పలు ప్రాంతాల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే.. ఇంకా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ఆర్మీ, నావికాదళానికి చెందిన బృందాలు నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. లోతట్టు ముంపు ప్రాంతాలకు సైతం వెళ్లి బాధితులకు ఆహార పొట్లాలు అందిస్తున్నాయి. కాగా.. ఆదివారం ఉదయం కురిసిన వర్షం కారణంగా.. పాక్షికంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. వరద నుంచి కోలుకున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించే పనుల్లో అధికారులు తలమునకలుగా ఉన్నారు. యుద్ద ప్రాతిపదికన కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ సేవలు పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి. -
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
-
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
-
చెన్నై త్వరగా కోలుకోవాలంటూ పూజలు
-
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
దాదాపు వారం రోజులకు పైగా విపరీతమైన వర్షాలు, వరదలతో అల్లాడుతున్న చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరం పాక్షికంగా సాధారణ స్థితికి చేరువ అవుతోంది. రోడ్ల మీద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వరుసపెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు సుమారు 245 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, రైలు మార్గాలు పాడవ్వడం, విమానాశ్రయంలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ఆకాశ మార్గం కూడా మూసుకుపోయింది. కొట్టుపురం, ముడిచూర్, పల్లిక్కరనై లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కొరత పట్టి పీడిస్తోంది. అతి కొద్దిసంఖ్యలో మాత్రమే ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరవడంతో.. వాటివద్ద పొడవాటి క్యూలైన్లు కనపడుతున్నాయి. రెండు రోజుల్లో చాలావరకు పెట్రోలు బంకులు తెరుస్తారని, ప్రజలు ఆందోళన చెందవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అయినా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎగ్మూర్ - తాంబరం స్టేషన్ల మధ్య రైళ్లు నడిపిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. దాంతో స్థానికులకు చాలావరకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. తాంబరం సహా చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ ల్యాండ్లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మొబైల్ సేవలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాంతో సహాయ పనులకు ఆటంకం కలిగింది. కూరగాయలు, పాలు మాత్రం ఇంకా కొరతగానే ఉండటంతో వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది. -
ఈ పాప తప్పిపోయింది.. సాయం చేయండి
తమిళనాడు వరదల నేపథ్యంలో కొందరు సినీతారలు బాధ్యత తలకెత్తుకుని సామాజిక స్పృహను అందరికీ గుర్తుచేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్గా ఉన్న శ్రుతిహాసన్ కూడా అదే కోవలో ఉంది. ఇంకా సీసాలో పాలుతాగే వయసున్న ఓ చిన్నారి తప్పిపోవడంతో.. ఆమె ఫొటో తీసి, తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ చిన్నారి చెన్నై వరదల్లో తప్పిపోయిందని, ఆమె తల్లిదండ్రుల వద్దకు ఆమెను చేర్చడంలో సాయం చేయాలని కోరింది. తన ట్వీట్‌ను వీలైనంత ఎక్కువగా షేర్ చేయాలని, దాంతో అందరికీ విషయం తెలిసి, వాళ్ల తల్లిదండ్రులు కనపడే అవకాశం ఉంటుందన్నట్లుగా చెప్పింది. This little girl is lost in Chennai floods pls help her find her parents. Pls share as much as you can pic.twitter.com/XCAq3Qz3cW — shruti haasan (@shrutihaasan) December 4, 2015 -
స్పందించిన బాలీవుడ్
చెన్నై మహానగరాన్ని దుఃఖసాగరంలో ముంచేసిన వరదలపై దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సానుభూతి తెలపటంతో పాటు, సహాయ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టగా, తాజాగా బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ విషాద పరిస్థితులపై స్పందించారు. తమ ట్విట్టర్ పేజ్‌లపై చెన్నై నగరం తిరిగి కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, 'చెన్నై నగరం మునిగిపోయింది, అక్కడి ప్రజలు ఈ ఇబ్బందుల నుంచి సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నా, సాయం అందించటానికి ఇంతమంది ముందుకు రావటం ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. చెన్నై ఎక్స్ ప్రెస్ పేరుతో సినిమా తీసిన షారూక్ కూడా చెన్నై వాసుల కష్టాలపై స్పందించాడు. 'కష్టాల్లో ఉన్న చెన్నై ప్రజలను దేవుడు కాపాడాలి. ప్రకృతి విధ్వంసం నుంచి బయటపడే మానసిక ధైర్యం అక్కడి ప్రజలకు కలగాలి' అంటూ పోస్ట్ చేశాడు. సోనాక్షి సిన్హా, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, పరిణీతి చోప్రా లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా చెన్నై వాసుల కష్టాలపై స్పందించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని, ప్రజలు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. T 2079 - What a beautiful rendition, I came across on Chennai situation : That impalpable thread called (cont) https://t.co/yDbwXTVchy — Amitabh Bachchan (@SrBachchan) December 3, 2015 May God look after all our brothers & sisters in Chennai. Nature’s fury is strong may we all have the strength to fight it. Insha Allah — Shah Rukh Khan (@iamsrk) December 2, 2015 -
సహాయ కార్యక్రమాల్లో సిద్దార్థ్
చెన్నైలో వర్షం కాస్త తగ్గటంతో సహాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితులపై అందరికంటే ముందుగా స్పందించిన హీరో సిద్దార్ధ్, తన సహాయ కార్యక్రమాలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వాడుకుంటున్నాడు. సాయం చేయాలనుకుంటున్న వారు తమను ఎలా సంప్రదించాలి, ఎంతమందికి సాయం చేయగలం లాంటి విషయాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తమ వాలంటీర్లు ఇంటర్నెట్ యాక్సెస్‌తో సిద్ధంగా ఉన్నారంటూ తెలిపిన సిద్దార్థ్, పలు రకాల వాహనాలతో ఈ రోజంతా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ప్రకటించాడు. సోషల్ సైట్స్‌లో కొంతమంది లేనిపోని వదంతులు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపాడు. సరైన సమాచారం లేకుండా అలాంటి విషయాలను పోస్ట్ చేయొద్దని కోరాడు. చాలాప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నందున వాటర్ బాటిల్స్ పంపించాలంటూ కోరాడు. అందుబాటులో వాహనాలు ఉన్నవారు ఆహార పొట్లాలు తీసుకువచ్చి.. పామ్ గ్రోవ్ హోటల్ ఎదురుగా ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ ఆఫీస్‌లో అందజేయాలని, వాళ్ల వద్ద వాహనాలు లేకపోతే.. తనకు సమాచరం అందిస్తే తామే వచ్చి కలెక్ట్ చేసుకుంటామన్నాడు. Back in connectivity. We have trucks and vehicles going out all day today. Please use #ChennaiMicro to reach us. We need more supplies. — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 Only packaged food and snacks today PLEASE. Water bottles priority. Also lots of areas still need blankets. Please help. #ChennaiMicro — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 There is a lot or false information on social networks. Don't post without verification. It's a nuisance. Tweet responsibly. #ChennaiMicro — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 If you have vehicles drop off supplies to big fm office opposite palmgrove hotel. If you don't, we will come and pick up. #ChennaiMicro — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 -
చెన్నై ఛిన్నాభిన్నం
-
చెన్నై వరదల్లో ఆంధ్రప్రదేశ్ వాసి మృతి
చెన్నై: తమిళనాడులో సంభవించిన వరదలలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ వాసి మృతిచెందారు. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన నారాయణ చెన్నైలో నివాసం ఉండేవారు. చెన్నైలో ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వహించేవారు. చెన్నైలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురిసి సంభవించిన వరదలలో ఆయన మృతిచెందారని చెన్నై అధికారులు నారాయణ కుటుంబానికి శుక్రవారం సాయంత్రం సమాచారం అందించారు. తమిళనాడులో వరదల వల్ల సుమారు 325కు పైగా మంది మృతిచెందారు. -
చెన్నై వరదలు: 325కు పెరిగిన మృతుల సంఖ్య
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 325కి పెరిగింది. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. శుక్రవారం చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు పడ్డాయి. విద్యుత్ అంతరాయం, తాగునీరు, ఆహారం కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేలాదిమంది సైనికులు, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. తాగునీరు, ఆహారం, దుప్పట్లు సరఫరా చేస్తున్నారు. వర్షం ఆగితే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలవుతుంది. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. -
మూడు రోజులుగా అక్కడే పడిగాపులు
-
చెన్నై నుంచి విమాన సర్వీసులకు అనుమతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయ అధికారులు కొన్ని విమానాలను నడిపేందుకు నిర్ణయించుకున్నారు. భారీ వర్షాల కారణంగా రద్దయిన విమాన సర్వీసులు నేడు పునరుద్ధరించనున్నట్లు విమానాశ్రయ అధికారులు శుక్రవారం తెలిపారు. ఎయిర్ ఇండియా నుంచి 7 విమానాల సేవలను ప్రారంభిస్తామని, వీలును బట్టి ఇతర ప్రైవేట్ విమానాలను కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. చెన్నై సమీపంలోని అరక్కోణంలోని రాజాలి నవల్ ఎయిర్ స్టేషన్ నుంచి ఈ విమానాలు తమ సర్వీసులు కొనసాగిస్తాయి. ఇదిలాఉండగా, రైలు సర్వీసులను శనివారం వారకు తాత్కాలికంగా రద్దు చేసిన విషయం అందరికీ విదితమే. తమిళనాడులో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే నీటితో నిండిపోవడంతో మంగళవారం నాడు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. -
చెన్నై నుంచి ఇతర ప్రాంతలకు రైళ్లు రద్దు
-
చెన్నైవాసులకు ఊరట కలిగించే వార్త
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో కష్టాలుపడుతున్న చెన్నై వాసులకు ఊరట కలిగించే వార్త. మరో 48 గంటల పాటు చెన్నైలో వర్షాలు పడే సూచన లేదని శుక్రవారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు చెన్నైలో భారీ వర్షాలు పడతాయని ఈ రోజు ఉదయం చేసిన హెచ్చరికను ఉపసంహరించుకున్నట్టు తెలియజేసింది. చెన్నైలో వర్షం కాస్త తగ్గుముఖంపట్టినా చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భారత వైమానిక దళం ఏరియల్ సర్వే నిర్వహించి సహాయక చర్యలు చేపడుతోంది. వర్షం ఇకనైనా ఆగిపోతే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలవుతుంది. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో అపారనష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ జలమయంకాగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
'చెన్నై వాసులకు హేట్సాఫ్'
న్యూఢిల్లీ/చెన్నై: వరద బాధితులను ప్రతిఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. వరదల్లో చిక్కుకున్న తోటివారికి చెన్నై వాసులు తమ వంతు సహాయం చేస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న చెన్నై వాసులకు ట్విటర్ ద్వారా హేట్సాఫ్ చెప్పారు. కాగా వరదల్లో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు చెన్నై వాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఆహారం తయారుచేసి బాధితులకు సరఫరా చేస్తున్నారు. కొంతమంది తాగునీరు అందిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాయం అందిస్తున్నారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా సేవల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అభిమానులను, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తున్నారు. Hats off 2 Chennai ppl 4 d way they r trying 2 help their brethren who r affected in floods.This is d time everyone should help d helpless. — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 4, 2015 -
'చెన్నైలో వరద తగ్గుతోంది'
చెన్నై: భారీవర్షాలతో కుదేలైన తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మెరుగవుతోందని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ ఎఫ్) డీజీ ఓపీ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ మెరుగవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి, రిలీఫ్ కమిషనర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు తాము 9 వేల మందిని కాపాడామని తెలిపారు. పంజాబ్ నుంచి 5 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఈ తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయన్నారు. పుణే, పాట్నా, గువాహటి నుంచి ఐదేసి బృందాలు రానున్నాయని తెలిపారు. -
అడిగింది 5వేల కోట్లు.. ఇచ్చింది వెయ్యి కోట్లు
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ. 5 వేల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. భారీవర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో గురువారం ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మోదీని జయలలిత కలిశారు. భారీవర్షాలతో తమ రాష్ట్రానికి జరిగిన నష్ట్రాన్ని వివరించారు. జాతీయ విపత్తు స్పందన నిధి(ఎన్డీఆర్ ఎఫ్) కింద రూ. 5 వేల కోట్లు సహాయం చేయాలని ఆర్థించారు. జయ విన్నపానికి స్పందించిన మోదీ రూ.1000 కోట్లు ఎన్డీఆర్ ఎఫ్ కింద తక్షణమే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సహాయక కార్యక్రమాలకు అదనంగా 10 ఆర్మీ బలగాలు, 20 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను పంపాలని జయలలిత కోరగా ప్రధాని అంగీకరించారు. -
మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు
-
చెన్నై వరదలపై గ్రౌండ్ రిపోర్ట్
-
'కొన్ని రద్దు, కొన్ని మళ్లింపు'
-
'కొన్ని రద్దు, కొన్ని మళ్లింపు'
చెన్నై వరదల కారణంగా.. చెన్నై మీదుగా వెళ్ల వలసిన కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై - అహ్మదాబాద్ నవజీవన ఎక్స్ ప్రెస్, చెన్నై - తిరుపతి ఎక్స్ ప్రెస్, విశాఖ - సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, తిరుపతి - చెన్నై ఎక్స్ ప్రెస్, గౌహతి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వరదల కారణంగా భారీ ఎత్తున రైల్వే ట్రాక్ పై నీళ్లు వచ్చి చేరడంతో అధికారులు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
తల్లి శవం పక్కనే 20 గంటలు...
చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు కనీవినీ ఎరుగని రీతిలో కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకడం లేదు. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చోటులేకపోవడంతో ప్రజలు బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన తల్లి శవం పక్కనే కూర్చుని దాదాపు 20 గంటలుగా జాగారం చేస్తోంది. తనకు సహాయం చేయాలని సదరు మహిళ స్నేహితులను కోరడం, వారు మీడియాను అభ్యర్థించడంతో ఈ విషయం వెలుగుచూసింది. 'మా అమ్మ డయాలిసిస్ పేషెంట్. నిన్ననే ఆమె చనిపోయింది. కరెంట్ లేకపోవడంతో భౌతికకాయం చీకటిలోనే ఉంది. శవాన్ని శ్మశానానికి తరలించేందుకు దయచేసి ఎవరైనా వాహనం పంపించండి. ఇప్పటికే భౌతికకాయం పాడైపోయ్యే స్థితిలో ఉంది. నాకు సహాయం చేయండి' అని ఆమె వేడుకుంది. దీంతో కరిగిపోయిన ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం అందించారు. కాగా, వరదలు పోటెత్తడంతో చెన్నైకు సంబంధాలు తెగిపోయాయి. సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. సైన్యం, నావికా దళం, వాయుసేన తదితర బలగాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
ఆస్పత్రుల పరిస్థితి దయనీయం
తమిళనాడులో వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం కొద్దిగా తెరిపి ఇవ్వగానే నర్సులు, ఇతర సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. కానీ, వాళ్లు మళ్లీ తిరిగి ఆస్పత్రులకు చేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు గోడలు కూలి, ఇతర కారణాల వల్ల చాలామంది క్షతగాత్రులు ఆస్పత్రులకు వెళ్తున్నా, అక్కడ చికిత్స అందించే పరిస్థితి కనిపించడంలేదు. తాను కష్టమ్మీద ఇంటికి చేరుకునేసరికి ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయని.. దాంతో సర్టిఫికెట్లు తీసుకుని దగ్గర్లో ఉన్న ఓ స్కూల్లో ఆశ్రయం పొందుతున్నానని ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే మారిముత్తు అనే మేల్ నర్సు చెప్పారు. ఆయన భార్య కూడా నర్సుగానే పనిచేస్తున్నారు. ఆమె మాత్రం ఎలాగోలా ఎగ్మోర్‌లో ఉన్న తన ఆస్పత్రికి వెళ్లారు గానీ మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు. ఇక ఆస్పత్రుల్లో కూడా పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్లలోకి డీజిల్ నిల్వలు కూడా అడుగంటిపోవడంతో చాలాచోట్ల లైట్లు కూడా వెలగడం లేదు. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం సిబ్బంది అందరినీ సిద్ధంగా ఉంచారు. కీల్పాక్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోకి నీళ్లు చేరుకున్నాయి. వాటిని మోటార్లతో తోడి బయటకు పంపుతున్నట్లు డీన్ నారాయణ బాబు తెలిపారు. రోడ్లు మొత్తం పాడవ్వడం, అన్నిచోట్లా నీళ్లు ప్రవహిస్తుండటంతో అంబులెన్సు డ్రైవర్లు రోగులను ఆస్పత్రులకు తీసుకురావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 20 నిమిషాల్లో వెళ్లిపోయే దూరానికి కూడా ఇప్పుడు 40 నిమిషాలకు తక్కువ పట్టడం లేదని 108 అంబులెన్సు డ్రైవర్లు వాపోతున్నారు. మీనంబాకం లాంటిచోట్ల ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువగా ఉంది. తాంబరం ప్రాంతానికి అదనంగా 5 అంబులెన్సులను కేటాయించామని, ముందుగా గర్భిణులను తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి ప్రభుదాస్ చెప్పారు. ఈ రెండు మూడు రోజుల్లో సాధారణం కంటే వెయ్యికి పైగా కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు. -
మరిన్ని వర్షాలు.. మరిన్ని కష్టాలు
దాదాపు శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో తమిళనాడు.. ముఖ్యంగా రాజధాని చెన్నై నగరం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఈ వర్షాలు అప్పుడే తగ్గే పరిస్థితి లేదని.. మరిన్ని రోజుల పాటు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పట్లో ఊరట లభించకపోవచ్చని జాతీయ వాతావరణశాఖకు చెందిన లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. భారీ వర్షాలు, గతం నుంచి ఉన్న వరదల కారణంగా ఇప్పటివరకు తమిళనాడులో 197 మంది మరణించగా, చెన్నై నగరంలో గత 24 గంటల్లో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. తాను, తన స్నేహితుడు పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లామని, అక్కడి నుంచి ఆర్మీ ట్రక్కులో కష్టమ్మీద ఇంటికి చేరామని రూపమ్ చౌధురి అనే వైద్యుడు తెలిపారు. ఆయన ఆస్పత్రి చెన్నై నడిబొడ్డున ఉంది. ఇక తన ఆస్పత్రిలో పేషెంట్లకు ఆక్సిజన్ స్టాకు కూడా అయిపోయిందని, జనరేటర్లలో డీజిల్ లేదని చెన్నైలోని ప్రముఖ డయాబెటిస్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ ఎ.రామచంద్రన్ ఫోన్లో తెలిపారు. నగరంలో చాలావరకు సెల్ఫోన్లు పనిచేయడం లేదు. ఆహార పదార్థాల నిల్వలు కూడా అడుగంటాయి. జీతాలు రాకముందే వర్షాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు ఒకటో తారీఖు వస్తే తప్ప చేతిలో డబ్బులుండవు. ఆ తర్వాత మాత్రమే నెలకు సరిపడ సరుకులు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ 30వ తేదీ నుంచే భారీ వర్షాలు పడుతుండటంతో.. ముందుగా సరుకులేవీ తెచ్చుకోలేకపోయారు. చేతికి జీతాలు వచ్చినా ఇప్పుడు సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. దాంతో నెలాఖరుకు నిండుకున్న సరుకులను మళ్లీ నింపుకోడానికి కూడా వీల్లేకుండా పోయింది. -
మేడలు, మిద్దెలు కూడా మునక!
-
సాఫ్ట్వేర్.. కుదేల్
తమిళనాడు రాజధాని చెన్నై నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు కుదేలయ్యాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచి కదిలే పరిస్థితి లేకపోవడం, ఆఫీసులలోకి కూడా నీళ్లు వచ్చేయడంతో చాలా కంపెనీలు ఆదివారం వరకు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి కార్మిక శాఖ ఇప్పటికే రెండు రోజులు సెలవులు ప్రకటించింది. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని చూస్తున్నా, ఎక్కడా విద్యుత్ సరఫరా గానీ, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు గానీ లేకపోవడంతో దానికి కూడా వీలు కుదరట్లేదు. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, టీసీఎస్, ఐబీఎం లాంటి ప్రధాన కంపెనీలన్నింటిపైనా కూడా వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది అయ్యింది. అప్పట్లో చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. నగరం నుంచి బయటకు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోయాయి. విమానాశ్రయం కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడంతో వాయుమార్గం ఆప్షన్ సైతం లేదు. తాత్కాలికంగా నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్‌ను పౌర విమానాశ్రయంగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌బస్ ఎ 320 విమానం ఒకదాన్ని అక్కడ ల్యాండ్ చేసి పరీక్షించారు. అయితే, ఆ ఎయిర్‌బేస్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడివరకు వెళ్లడం కూడా పెద్ద సమస్యగానే ఉంది. మరో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి. -
కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు
చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు పరణిపుత్తూర్లోని వృద్ధులకు, చెన్నైలో ఇరుక్కుపోయిన తెలుగువారి కుటుంబాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పరణిపుత్తూర్ వృద్ధాశ్రమం సగం వరకు మునిగిపోవడంతో 700 మంది వృద్ధుల ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు సమాచారం. గత వారం రోజుల్లో వరదల్లో 22 మంది మృతిచెందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 60 మంది ఉద్యోగులు చెన్నై వరదల్లో చిక్కుకున్నారు. గిండి ప్రాంతంలోని సెంట్రల్ ట్రైనింగ్ స్టేషన్లో వరద నీటిలో ఏపీ ఉద్యోగులు చిక్కుకున్నారు. చెన్నై ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న తిరుపతి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.విద్యార్థుల సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
'ఆ మొసళ్లు కొట్టుకుపోలేదు..'
చెన్నై వరద నీటిలో మొసళ్లు కొట్టుకుపోయినట్టు వచ్చిన వార్తలను మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ తోసిపుచ్చింది. 'మొసళ్లు తప్పించుకోలేదు. ఆ వార్తలను దయచేసి నమ్మకండి. అన్ని మొసళ్లు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం మా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. భద్రతకే తాము తొలి ప్రాధాన్యమిస్తామని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలియజేసింది. క్రొకడైల్ ఫామ్ చుట్టూ భారీ గోడ నిర్మించామని పేర్కొంది. చెన్నై జై పార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్టు వార్తలు రావడంతో మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. కాగా చెన్నై జూ పార్క్‌లోకి తొలిసారి వరద నీరు రావడంతో పాటు పార్క్ ప్రహారీ గోడ దెబ్బతింది. అయితే జూ పార్క్‌లో జంతువులన్నీ క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల చెన్నైలో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి పాములు, చేపలు, కప్పలు వస్తున్నాయి. ఓ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో చేపలు, కప్పలు ఈత కొడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. -
వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
-
కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు
-
వరద నీటిలో చెన్నై ఐటీ కంపెనీలు
చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీటి ప్రభావం చైన్నైలోని పలు ఐటీ కంపెనీలకు తాకింది. అయితే కీలక సేవలకు అంతరాయం లేదని పలు ఐటీ కంపెనీలు తెలిపాయి. ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రేపు కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాకుండా నగరంలో చిక్కుకు పోయిన తమ ఉద్యోగులను రక్షించేపనిలో నిమగ్నమైంది. దీనిపై ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. తమ క్లైంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇతర ప్రాంతాలనుంచి సేవలు అందిస్తున్నామని పేర్కొంది. కీలక సేవలకోసం కాగ్నిజెంట్ సిబ్బంది కార్యాలయాల్లోనే పని చేస్తున్నారు. ముఖ్యమైన సర్వీసులకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కొందరు సీనియర్ ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు కాగ్నిజెంట్ పంపించింది. వరద ముప్పు తమకు లేదని టీసీఎస్ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా తమ కార్యాలయాలను టీసీఎస్ మూసివేసింది. తమ ఉద్యోగులంతా క్షేమమేనని తెలిపింది. -
సహాయ చర్యలకూ వెళ్లలేని స్థాయిలో..
తమిళనాడు రాజధాని చెన్నై నగరం భారీవర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. నగరంలో ఎటు చూసినా నడుంలోతు, పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నా.. వాళ్లు కాలు కదిపేందుకు కూడా వీలు కుదరడం లేదు. దీంతో సహాయక చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరికొన్ని ముఖ్యాంశాలు: రిజర్వాయర్లన్నీ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి దాంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. సహాయ చర్యలకు కూడా వీలుకానంత పరిస్థితి ఏర్పడింది శివార్లలో ఉన్న రిజర్వాయర్లతో పాటు అడయార్ నది కూడా నిండిపోయి, ఆ వరదనీరు చెన్నై నగరంలోకి చేరుకుంది వాహనాలేవీ కదల్లేని పరిస్థితి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది అన్ని రహదారులలో పడవల్లో మాత్రమే తిరగగలిగే అవకాశం ఉంది నడుం లోతు నీళ్లు, పీకల్లోతు నీళ్లలో నగరం మునిగిపోయింది సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వీలు కావట్లేదు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నా, ఎప్పటికప్పుడు వరదనీరు పెరుగుతుండటంతో వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫోన్లు కూడా పనిచేయడం లేదు. ఎప్పుడూ సురక్షితం అనుకునే విమానాశ్రయం వరదనీటితో మునిగిపోయింది మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది ఇప్పటికే 70 వేల మంది సిబ్బంది సహాయపనుల్లో ఉన్నారు అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యం కావట్లేదు అడయార్ నది కూడా పొంగడంతో శివార్లలో ఉన్న 4 లక్షల ఇళ్లు నీటమునిగాయి నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితి నెలకొంది. ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఇళ్లలో ఉండేవాళ్లు మొదటి లేదా రెండో అంతస్థులకు వెళ్లి తలదాచుకుంటున్నారు ఈ పరిస్థితి ఎన్నాళ్లనేది తెలియడం లేదు చెన్నైలోని 24 జోన్ కార్యాలయాలతో పాటు అన్నిచోట్లా బృందాలు సిద్ధంగా ఉన్నాయి కానీ వాళ్ల వాహనాలు కూడా కదిలే పరిస్థితి ఎక్కడా లేదు బోట్లలో వెళ్లాలన్నా కూడా ఇబ్బందిగానే ఉందని సిబ్బంది చెబుతున్నారు సీఎం జయలలితతో ప్రధాని మోదీ చర్చించారు కేంద్ర మంత్రివర్గం కూడా చెన్నై పరిస్థితిని సమీక్షించింది భారీవర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం సాయం చేయడానికి కూడా ఏమాత్రం వీలుండకపోవచ్చన్న భయాందోళనలు నెలకొంటున్నాయి నగరం వదిలి వెళ్లిపోదామన్నా.. ఇంట్లోంచి బయటకు కాలు పెట్టలేకపోతున్నారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది. -
సహాయ చర్యలకూ ఆటంకాలు
-
కారు కంటే బోటే నయం
సాధారణంగా సిటీలో అటూ ఇటూ తిరగాలంటే కారు చేతిలో ఉండాలని అనుకుంటాం. సిటీబస్సుల్లో తిరగలేక.. బైకులయితే కాలుష్యం భరించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే సొంత కారులో అయితే ఎంచక్కా వెళ్లొచ్చని భావిస్తారు. కానీ, ప్రస్తుతం చెన్నై నగరంలో పరిస్థితి తిరగబడింది. ఎక్కడికక్కడ పార్కింగ్ చేసిన కార్లు కూడా మునిగిపోతున్నాయి. దాంతో జనం మొత్తం పడవల్లోనే తిరుగుతున్నారు. బోటులో వెళ్తున్న వాళ్లకు పక్కనే కారు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తుంటే, దాన్ని దాటుకుంటూ ఆ పక్క నుంచే పడవలో వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో కూడా చెన్నైలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ఓలా క్యాబ్స్ లాంటి సంస్థలు క్యాబ్‌లకు బదులు పడవలను నడిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనం కూడా ఇలాంటి సీజన్లో చేతిలో కారుకు బదులు మంచి మోటారు బోటు ఉంటే బాగుండునని భావిస్తున్నారట! -
కారు కంటే బోటే నయం