first test
-
ఆస్ట్రేలియా X శ్రీలంక
గాలె: ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకున్న ఆ్రస్టేలియా జట్టు బుధవారం నుంచి శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు శ్రీలంకతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా... స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డుపడే అవకాశాలుండగా... ఆస్ట్రేలియా జట్టు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ట్రావిస్ హెడ్‌ను ఓపెనర్‌గా దింపాలని యోచిస్తోంది. ‘ట్రావిస్ టాపార్డర్‌లో బరిలోకి దిగుతాడు. భారత్‌లో అతడు ఓపెనర్‌గా రాణించిన అంశాన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. కొత్త బంతితో హెడ్ వేగంగా పరుగులు రాబట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయగలడు. లంకలోనూ అదే చేస్తాడనే నమ్మకముంది’ అని స్మిత్ పేర్కొన్నాడు. హెడ్ ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకుంటే... టీమిండియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో చక్కటి ప్రదర్శన కనబర్చిన 19 ఏళ్ల యువ ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌కు జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఇక చాన్నాళ్లుగా ఆసీస్ తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తున్న జోష్ ఇంగ్లిస్ ఈ సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు స్మిత్ సూచనలిచ్చాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించాలని ఆసీస్ భావించినా... వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తామని స్మిత్ వెల్లడించాడు. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన శ్రీలంక... సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేసి కంగారూల విజయయాత్రకు చెక్ పెట్టాలని భావిస్తోంది.కాగా... గాయం కారణంగా తొలి టెస్టు నుంచి లంక ఓపెనర్ నిసాంక దూరమయ్యాడు. అతడి స్థానంలో ఒషాడా ఫెర్నాండో జట్టులోకి రానున్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైనప్పటికీ... ఈ సిరీస్‌ను 2–0తో గెలుచుకుంటే పట్టికలో మూడో స్థానంలో నిలిచే అవకాశం మా జట్టుకు ఉంది. అది మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది’ అని శ్రీలంక సారథి ధనంజయ డిసిల్వా అన్నాడు. -
PAK vs WI: తిప్పేసిన పాకిస్తాన్
ముల్తాన్: సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పూర్తిగా స్పిన్‌కు సహకరించేలా రూపొందించిన పిచ్‌పై... సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, నోమాన్ అలీ కలిసి ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడం విశేషం.ఓవర్‌నైట్ స్కోరు 109/3తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు 46.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకం సాధించగా... మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (5), సౌద్ షకీల్ (2), మొహమ్మద్ రిజ్వాన్ (2), ఆఘా సల్మాన్ (14) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాటపట్టారు. కరీబియన్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వారికన్ 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 93 పరుగులతో కలుపుకొని వెస్టిండీస్ ముందు 251 పరుగుల లక్ష్యం నిలిచింది. బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనాజె (68 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఒక్కడే హాఫ్‌సెంచరీ చేయగా... మిగిలిన వాళ్లు నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ సాజిద్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన సాజిద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి ముల్తాన్‌లోనే రెండో టెస్టు ప్రారంభంకానుంది. -
నేటి నుంచి పాక్, విండీస్ తొలి టెస్టు
ముల్తాన్: పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ముల్తాన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. స్పిన్ ట్రాక్‌పై కరీబియన్‌ను ఎదుర్కోనేందుకు ఆతిథ్య జట్టు కసరత్తు చేస్తోంది. ఇంగ్లండ్‌తో గత అక్టోబర్‌లో వాడిన స్పిన్ పిచ్‌నే ఈ మ్యాచ్‌కు సిద్ధం చేశారు. అప్పుడు సాజిద్ ఖాన్, నోమన్ అలీ తిప్పేశారు. ఈ తాజా సిరీస్‌లోనూ వాళ్లిద్దరిపై పాకిస్తాన్ గంపెడాశలు పెట్టుకుంది. సొంతగడ్డ అనుకూలతలతో వెస్టిండీస్‌తో తలపడతామని పాక్ కెప్టెన్ షాన్ మసూద్ చెప్పాడు. స్వదేశంలో 2–1తో ఇంగ్లండ్‌ను ఓడించిన పాక్... దక్షిణాఫ్రికా పర్యటనలో 0–2తో ఓడిపోయింది. అయితే మరోవైపు వెస్టిండీస్ ఈ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండేళ్ల సైకిల్లో అసలు ఒక్క సిరీస్ కూడా గెలుపొందలేకపోయింది. భారత్ సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన విండీస్... గట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 1–1తో డ్రాతో నిలువరించింది. కానీ బంగ్లాదేశ్‌తో కూడా 1–1తో సిరీస్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో డబ్ల్యూటీసీలో కరీబియన్ జట్టు అట్టడుగున నిలిచింది. అయితే గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌ను విజయంతో ముగించేందుకే పాకిస్తాన్ పర్యటనకు వచ్చినట్లు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చెప్పాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన వేదికలైన కరాచీ, లాహోర్లలో నవీకరణ పనులు జరుగుతుండటంతో రెండో టెస్టు కూడా ముల్తాన్‌లోనే ఈ నెల 25 నుంచి జరుగుతుంది. -
దక్షిణాఫ్రికా లక్ష్యం 148
సెంచూరియన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘బాక్సింగ్ డే’ తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపుబాటలో 121 పరుగుల దూరంలో ఉంది. అయితే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల సఫారీకి నాలుగో రోజు ఛేజింగ్ అంత సులభంగా అయితే లేదు. అంతకుముందు శనివారం 88/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 59.4 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు బాబర్ ఆజమ్ (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరి జోడి నిలబడినంతవరకు బాగానే ఉన్నా... బాబర్ ఫిఫ్టీ తర్వాత నిష్క్రమించడంతో కథ మొదటికొచ్చిoది. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద బాబర్‌ను జాన్సెన్ అవుట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగియగా, తర్వాత వచ్చిన రిజ్వాన్ (3), సల్మాన్ ఆఘా (1)లను జాన్సెన్ పెవిలియన్ చేర్చడంతో 176 స్కోరు వద్ద ఆరో వికెట్ పడింది. సఫారీ బౌలర్లు ఇదే జోరు సాగిచండంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మార్కో జాన్సెన్ 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. తొలిఇన్నింగ్స్‌లో సఫారీకి 90 పరుగుల ఆధిక్యం దక్కడం వల్ల 148 పరుగుల లక్ష్యమే ఎదురైంది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. -
‘క్రో–థోర్ప్’ ట్రోఫీ కోసం న్యూజిలాండ్, ఇంగ్లండ్ పోరు
లండన్: భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల జట్ల మధ్య ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ దివంగత దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లండ్ దివంగత లెజెండ్ గ్రాహం థోర్ప్ల పేరిట ఈ ఏడాది నుంచి ద్వైపాక్షిక సిరీస్ అంకురార్పణ జరగనుంది. విజేతకు బహూకరించే ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల బ్యాట్లను ఉపయోగించి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ని రూపొందించారు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ డేవిడ్ ఎన్గవాటి ఈ కలప (బ్యాట్) ట్రోఫీని తయారు చేశారు. ప్రపంచ శ్రేణి కళాకృతులను, వినియోగదారుల అభిరుచులకు తగ్గ ఆకృతులను (కస్టమ్ డిజైన్) తయారు చేయడంలో ‘మహు క్రియేటివ్’ సంస్థకు మంచి పేరుంది. డేవిడ్‌కు చెందిన ఈ సంస్థే గతంలో కివీస్, సఫారీల మధ్య జరిగిన టోర్నీ కోసం ‘తంగివాయ్ షీల్డ్’ను రూపొందించింది. దిగ్గజ క్రికెటర్ల విషయానికొస్తే అసలైన క్రికెట్ ఫార్మాట్ (టెస్టు)లో అటు మారి్టన్ క్రో... ఇటు గ్రాహం థోర్ప్ అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. తన కెరీర్లో 77 టెస్టులాడిన క్రో 45.36 సగటుతో 5444 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 18 అర్ధసెంచరీలున్నాయి. 143 వన్డేల్లో 38.55 సగటుతో 4704 పరుగులు సాధించాడు. 4 శతకాలు, 34 అర్ధశతకాలు బాదాడు. థోర్ప్ సరిగ్గా 100 టెస్టులాడాడు. 44.66 సగటుతో 6744 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 39 ఫిఫ్టీలున్నాయి. వన్డే కెరీర్లో 82 మ్యాచ్‌ల్లో 37.18 సగటుతో 2380 పరుగులు చేశాడు. 21 అర్ధసెంచరీలున్నాయి. సాధారణంగా క్రికెట్ ట్రోఫీలన్నీ లోహం (మెటల్)తోనే తయారవుతాయి. కానీ ‘కో–థోర్ప్ ట్రోఫీ’ మాత్రం భిన్నమైంది. ఇరు దిగ్గజ క్రికెటర్ల కుటుంబాలు బ్యాట్లు ఇవ్వడంతో డేవిడ్ తన నైపుణ్యంతో కలప ‘టోఫీ’గా మలిచాడు. దీన్ని మారి్టన్ సోదరి డెబ్ క్రో, మాజీ ఇంగ్లండ్ సారథి మైకేల్ అథర్టన్ కలిసి గురువారం క్రైస్ట్‌చర్చ్‌లో మొదలయ్యే తొలి టెస్టు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు. -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. మెక్‌స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్‌పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్‌తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో జైస్వాల్ సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్‌కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్‌పై మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్‌తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్‌వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
పెర్త్‌లో బౌన్సీ పిచ్
పెర్త్: అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా... బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని... సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్‌లోని ‘వాకా’ పిచ్ అసాధారణ పేస్, అస్థిర బౌన్స్‌కు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నాడు. ‘ఇది సంప్రదాయ పెర్త్ టెస్టు పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల ఒక రోజంతా వృథా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి పేస్‌కు అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్‌ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్‌పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే. పిచ్‌పై ఉన్న పచ్చిక పేసర్లను ఊరిస్తుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది’ అని ఐజాక్ వివరించాడు. ‘వాకా’ పిచ్‌పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్‌పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా... అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
36 ఏళ్ల తర్వాత...
అంచనాలు తప్పలేదు... అద్భుతాలు జరగలేదు! బుమ్రా ఆరంభ మెరుపులు తప్ప మన బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను నిలువరించడంలో విఫలమయ్యారు. ఫలితంగా తొలి టెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి... ఆ తర్వాత అసమాన పోరాటంతో పోటీలోకి వచ్చిన టీమిండియా చివరి రోజు మ్యాజిక్ కొనసాగించలేకపోయింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 36 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు విజయం నమోదు చేసుకుంది. బెంగళూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. వర్షం అంతరాయం మధ్య సాగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌కు 36 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ముందంజ వేసింది. 107 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 0/0తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. విల్ యంగ్ (76 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (46 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి పుణెలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఆడుతూ పాడుతూ! తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడ్డ చోట... నాలుగో ఇన్నింగ్స్‌లో చేధన అంత సులువు కాదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే ఇన్నింగ్స్ ఐదో బంతికే టామ్ లాథమ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా భారత శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ సంబరాలు ఎక్కువసేపు సాగలేదు. బుమ్రా, సిరాజ్ కట్టుదిట్టమైన బంతులు సంధించినా... న్యూజిలాండ్ బ్యాటర్లు సంయమనం కోల్పోలేదు. ఈ క్రమంలో కాన్వే (17) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిరాగానే రచిన్ రవీంద్ర ఎదురుదాడి ప్రారంభించాడు. మరో ఎండ్ నుంచి యంగ్ కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం సులువైపోయింది. మూడో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోగా... అదనపు పేసర్ ఆకాశ్‌దీప్ లోటు స్పష్టంగా కనిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తిరిగి వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోతే బాగుండు అని సగటు భారత క్రీడాభిమాని ఆశించినా అది సాధ్యపడలేదు. క్లిష్టమైన బంతులను కాచుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రచిన్, యంగ్ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్ 462; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) బుమ్రా 0; కాన్వే (ఎల్బీ) బుమ్రా 17; యంగ్ (నాటౌట్) 48; రచిన్ రవీంద్ర (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (27.4 ఓవర్లలో 2 వికెట్లకు ) 110. వికెట్ల పతనం: 1–0, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–29–2; సిరాజ్ 7–3–16–0; జడేజా 7.4–1–28–0; కుల్దీప్ 3–0–26–0, అశ్విన్ 2–0–6–0. ఈ మ్యాచ్ తొలి మూడు గంటలు తప్ప మేం మంచి ప్రదర్శనే చేశాం. అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తుంటాయి. వాటిని దాటి ముందకు వెళ్లాలి. ఈ ఒక్క పరాజయాన్ని బట్టి ప్లేయర్ల సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ బాగా సాగలేదు. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని సరిదిద్దుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా చాలా పాఠాలు నేర్చుకున్నాం. శుబ్‌మన్ గిల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ బాధ్యత తీసుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జట్టుకు శుభసూచకం. ఇంగ్లండ్‌పై ఇలాగే తొలి టెస్టు ఓడిన తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గాం. ఒక మ్యాచ్ ఫలితంతోనో ఒక సిరీస్ ఫలితంతోనో జట్టు దృక్పథం మారదు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 36 సంవత్సరాల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. రెండో టెస్టులో టీమిండియా నుంచి గట్టి పోటీ ఎదురువుతుందని మాకు తెలుసు. రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి తీసుకున్న తర్వాతే తిరిగి పోటీలోకి వచ్చాం. మా పేసర్లు చక్కటి బంతులతో టీమిండియాను కట్టడి చేయడంతో ఛేదన సులువైంది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ మధ్య భాగస్వామ్యమే జట్టును గెలిపించింది. –టామ్ లాథమ్, న్యూజిలాండ్ కెప్టెన్ -
ఎదురీత!
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్‌కు అనువుగా మారిన బెంగళూరు పిచ్‌పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న సర్ఫరాజ్‌తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రచిన్‌కు అండగా నిలిచాడు. చివరి బంతికి కోహ్లి అవుట్... తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మరోసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఆ భాగస్వామ్యం లేకుంటే... భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 4 టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1. -
పాకిస్తాన్‌కు పరీక్ష
ముల్తాన్: స్వదేశంలో పాకిస్తాన్ జట్టు మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ నేటి నుంచి ఇంగ్లండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... అతడి స్థానంలో ఒలీ పోప్ ఇంగ్లండ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఇటీవల శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా స్టోక్స్ అందుబాటులో లేకపోగా... పోప్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు సిరీస్ గెలుచుకుంది. రెండేళ్ల క్రితం పాకిస్తాన్లో పర్యటించిన ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. విపరీతమైన వేడి ఉండే ముల్తాన్‌లో స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉండటంతో జాక్ లీచ్, షోయబ్ బషీర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు కలి్పంచింది. పేస్ బౌలింగ్‌లో మాత్రం అనుభవరాహిత్యం కనిపిస్తోంది. పేస్ బౌలర్ బ్రైడన్ కార్స్ టెస్టు అరంగేట్రం చేయనుండగా.. అతడితో పాటు అట్కిన్సన్, వోక్స్, బ్రూక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.మరోవైపు గత నాలుగేళ్లుగా స్వదేశంలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన పాకిస్తాన్ ఈసారి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. టెస్టు కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించలేకపోయిన పాక్ సారథి షాన్ మసూద్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వికెట్ కీపర్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్ షకీల్, సల్మాన్ సమష్టిగా సత్తా చాటాలని పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, కీలకం కానున్నారు. అబ్రార్, సల్మాన్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. -
280 పరుగుల తేడాతో...
సొంతగడ్డపై రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ బృందం ముందు బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అందులో సగం పరుగులైనా చేయకముందే ఆలౌటైంది. ఈ విజయంతో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి గెలుపోటముల నిష్పత్తిలో పరాజయాల కన్నా ఎక్కువ విజయాలు నమోదు చేసుకుంది. చెన్నై: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 158/4తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరకు 62.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (127 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐదో వికెట్‌కు షకీబ్ అల్ హసన్ (25)తో కలిసి నజు్మల్ 48 పరుగులు జోడించాడు. ఈ దశలో అశ్విన్ బంతి అందుకోవడంతో పరిస్థితి తలకిందులైంది. ‘లోకల్ బాయ్’ చక్కటి బంతితో షకీబ్‌ను ఔట్ చేయగా... లిటన్ దాస్ (1)ను జడేజా బుట్టలో వేసుకున్నాడు. మిరాజ్ (8) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చేతిలో ఆరు వికెట్లతో నాలుగో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ లంచ్ విరామానికి ముందే ఆలౌటైంది. ఈ ఆరు వికెట్లలో అశ్విన్ , జడేజా చెరో 3 పంచుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149; భారత్ రెండో ఇన్నింగ్స్: 287/4 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (సి) బుమ్రా (బి) జడేజా 82; మోమినుల్ హక్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13; షకీబ్ (సి) యశస్వి (బి) అశ్విన్ 25; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) జడేజా 1; మిరాజ్ (సి) జడేజా (బి) అశ్విన్ 8; తస్కీన్ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 5; హసన్ మహమూద్ (బి) జడేజా 7; నాహిద్ రాణా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్) 234. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146, 5–194, 6–205, 7–222, 8–222, 9–228, 10–234. బౌలింగ్: బుమ్రా 10–2–24–1; సిరాజ్ 10–5–32–0; ఆకాశ్‌దీప్ 6–0–20–0; అశ్విన్ 21–0–88–6; జడేజా 15.1–2–58–3. -
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్‌మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్‌కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్‌ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్‌లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
రెండో రోజు మనదే జోరు
భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ప్రతీ విదేశీ జట్టుకూ సవాలే... బంగ్లాదేశ్‌కు కూడా అది తొలి టెస్టు తొలి రోజే చాలా వరకు అర్థమైంది. రెండో రోజుకు వచ్చేసరికి బంగ్లా పూర్తిగా చేతులెత్తేసింది. తొలి రోజు ఆట ఆరంభంలో పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టిన బంగ్లా ఆ తర్వాత టీమిండియా జోరుకు తలవంచింది. శుక్రవారం కూడా భారత్ చివరి నాలుగు వికెట్లను త్వరగా తీసిన ఆనందం ముగియక ముందే మన పేసర్ల దెబ్బకు జట్టు కుప్పకూలింది. బంగ్లా పతనంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఫాలో ఆన్ ఆడించకుండా మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ బృందం ఆధిక్యం ఇప్పటికే 300 దాటింది... మ్యాచ్ తీరు చూస్తే మూడో రోజే ముగిసినా ఆశ్చర్యం లేదు...రెండో రోజు ఆటలో ఇరు జట్లు కలిపి మొత్తం 17 వికెట్లు కోల్పోవడం చెప్పుకోదగ్గ అంశం. చెన్నై: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుపై భారత్ రెండో రోజే పట్టు బిగించింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 32; 5 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో ప్రధాన పాత్ర పోషించగా...జడేజా, ఆకాశ్‌దీప్, సిరాజ్ తలా 2 వికెట్లతో అండగా నిలిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఏకంగా 227 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే ఫాలో ఆన్ ఇవ్వడంకంటే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకే రోహిత్ మొగ్గు చూపించాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు సాధించింది. శుబ్‌మన్ గిల్ (64 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు), రిషభ్ పంత్ (12 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 339/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 11.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన జట్టు మరో 37 పరుగులు జోడించగలిగింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్న టీమిండియా ప్రస్తుతం తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 308 పరుగులకు పెంచుకుంది. బౌలర్ల జోరు... బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని ఆడలేక వదిలేసిన షాద్మన్ ఇస్లామ్ (2) క్లీన్»ౌల్డయ్యాడు. అలా మొదలైన బంగ్లా పతనం వేగంగా సాగింది. ఆకాశ్ దీప్ తన రెండో ఓవర్లో తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లతో బంగ్లా పని పట్టాడు. ఆకాశ్ బంతికి జాకీర్ హసన్ (3) స్టంప్ ముక్కలవగా...తర్వాతి బంతికే మోమినుల్ హక్ (0) ప్యాడ్లకు తాకుతా వెళ్లిన బంతి వికెట్లను పడగొట్టింది. బౌల్డ్ కాకపోయినా మోమిన్ ఎల్బీగానైనా వెనుదిరిగేవాడే! రెండో సెషన్లో కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సెషన్లో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (20)ను సిరాజ్...ముషి్ఫకర్ రహీమ్ (8)ను బుమ్రా అవుట్ చేయడంతో స్కోరు 40/5 వద్ద నిలిచింది. ఈ దశలో షకీబ్, లిటన్ దాస్ (22) కొద్ది సేపు ప్రతిఘటించారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే జడేజా వరుస ఓవర్లలో స్వయంకృతంతో వీరిద్దరు పరుగు తేడాతో వెనుదిరగడం బంగ్లా ఆశలు కోల్పోయేలా చేసింది. అనవసరపు భారీ షాట్‌కు ప్రయత్నించి దాస్ అవుట్ కాగా, రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి షకీబ్ వికెట్ ఇచ్చేశాడు. ఆ తర్వాత హసన్ (9) వికెట్ బుమ్రా ఖాతాలో చేరింది. టీ విరామం తర్వాత మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. కోహ్లి దురదృష్టవశాత్తూ... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వి (10) పది పరుగులు రాబట్టగా...రోహిత్ శర్మ (5) తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టాడు. అయితే వీరిద్దరు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరో వైపు గిల్ కొన్ని చక్కటి షాట్లు ఆడి క్రీజ్‌లో పాతుకుపోయాడు. రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు మిరాజ్ బౌలింగ్‌లో ఫ్లిక్ చేయబోయి విరాట్ కోహ్లి (17) వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్‌తో మాట్లాడిన అనంతరం కోహ్లి రివ్యూ చేయకుండానే వెళ్లిపోయాడు. తర్వాత రీప్లేలో బంతి ప్యాడ్‌కు తగలక ముందే బ్యాట్‌కు తాకినట్లు తేలింది. రివ్యూ చేసి ఉంటే కోహ్లి నాటౌట్ అయ్యేవాడు. ఆ తర్వాత మరో 3.4 ఓవర్ల పాటు గిల్, పంత్ వికెట్ పడకుండా ఆటను ముగించారు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజ్ముల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (సి) దాస్ (బి) తస్కీన్ 86; అశి్వన్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 113; ఆకాశ్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 17; బుమ్రా (సి) జాకీర్ (బి) హసన్ 7; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (91.2 ఓవర్లలో ఆలౌట్) 376. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144, 7–343, 8–367, 9–374, 10–376. బౌలింగ్: తస్కీన్ 21–4–55–3, హసన్ మహమూద్ 22.2–4– 83–5, నాహిద్ రాణా 18–2– 82–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్మన్ (బి) బుమ్రా 2; జాకీర్ (బి) ఆకాశ్ 3; నజు్మల్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 20; మోమినుల్ (బి) ఆకాశ్ 0; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) బుమ్రా 8; షకీబ్ (సి) పంత్ (బి) జడేజా 32; లిటన్ దాస్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 22; మిరాజ్ (నాటౌట్) 27; హసన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; తస్కీన్ (బి) బుమ్రా 11; నాహిద్ (బి) సిరాజ్ 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–2, 2–22, 3–22, 4–36, 5–40, 6–91, 7–92, 8–112, 9–130, 10–149. బౌలింగ్: బుమ్రా 11–1–50–4, సిరాజ్ 10.1–1–30–2, ఆకాశ్ దీప్ 5–0–19–2, అశ్విన్ 13–4–29–0, జడేజా 8–2–19–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (బ్యాటింగ్) 33; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (బ్యాటింగ్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (23 ఓవర్లలో 3 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67. బౌలింగ్: తస్కీన్ 3–0–17–1, హసన్ మహమూద్ 5–1–12–0, నాహిద్ 3–0–12–1, షకీబ్ 6–0–20–0, మిరాజ్ 6–0–16–1. -
టెస్టు సమరానికి సై
సొంతగడ్డపై గత 12 ఏళ్లలో ఒక్క టెస్టు సిరీస్ కూడా చేజార్చుకోని రికార్డు... 51 టెస్టులు ఆడితే 40 విజయాలు, 4 ఓటములు మాత్రమే... ఇదీ భారత జట్టు స్థాయి. మరోవైపు భారత్‌పై ఆడిన 13 టెస్టుల్లో ఒక్క గెలుపు లేకపోగా 11 ఓటములే... వాటిలో భారత గడ్డపై ఆడిన మూడింటిలోనూ చిత్తుగా ఓడిన వైనం... బంగ్లాదేశ్ రికార్డు ఇది! ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే మరో మాటకు తావు లేకుండా భారత్‌దే పైచేయి కాగా... ఇటీవల పాకిస్తాన్‌పై సాధించిన గెలుపుతో బంగ్లాదేశ్ ప్రదర్శన కాస్త ఆసక్తి రేపుతోంది. మన స్థాయికి తగినట్లుగా టీమిండియా ప్రత్యర్థిపై చెలరేగుతుందా... లేక బంగ్లాదేశ్ కాస్త పోటీ ఇస్తుందా అనేదే ఆసక్తికరం. చెన్నై: భారత జట్టు ఈ ఏడాది మార్చిలో తమ చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎంఎ చిదంబరం స్టేడియంలో నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. రాబోయే రెండున్నర నెలల వ్యవధిలో టీమిండియా ఆడబోయే 10 టెస్టుల్లో ఇది మొదటిది. తమతో పోలిస్తే బలహీన ప్రత్యర్థితో తలపడుతున్న రోహిత్ శర్మ బృందం సత్తా చాటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత పొందేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు పాకిస్తాన్లో జరిగిన తరహాలోనే బంగ్లాదేశ్ కూడా ఏ మూలో సంచలనాన్ని ఆశిస్తోంది. పంత్ చాలా కాలం తర్వాత... భారత్ తుది జట్టు ఎంపికకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేదు. ఇంగ్లండ్‌పై ధర్మశాలలో టీమిండియా తమ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ జట్టులో మూడు మార్పులతో ఈసారి టీమ్ బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడని కోహ్లి జట్టులోకి వచ్చాడు. నాటి మ్యాచ్ ఆడిన పడిక్కల్‌కు ఇప్పుడు చోటు లేదు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురేల్ స్థానంలో రిషభ్ పంత్, మిడిలార్డర్లో సర్ఫరాజ్‌కు బదులుగా కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం. 2022లో బంగ్లాదేశ్పైనే పంత్ తన ఆఖరి టెస్టు ఆడాడు. ఆ తర్వాత కారు ప్రమాదం, ఆపై కోలుకున్న తర్వాత టి20లు వన్డేల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతనికి ఇదే మొదటి టెస్టు. ఇటీవల దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆడిన పంత్ 125.4 ఓవర్ల పాటు కీపింగ్ చేసి తన ఫిట్నెస్ను కూడా నిరూపించుకున్నాడు. టెస్టు బ్యాటర్‌గా రాహుల్ ప్రతిభపై సందేహం లేదు. ఈ ఏడాది జనవరి (దక్షిణాఫ్రికాపై) తర్వాత టెస్టు ఆడబోతున్నా... కోహ్లి స్థాయి ప్లేయర్‌గా ఫామ్ అందుకోవడం పెద్ద సమస్య కాదు. టాప్–3లో కూడా రోహిత్, యశస్వి, గిల్‌లతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సాధారణంగా సొంతగడ్డపై భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. ఈసారీ అదే చేస్తే బుమ్రా, సిరాజ్ పేసర్లుగా దిగుతారు. జడేజా, కుల్దీప్లతో పాటు తన సొంత మైదానంలో సీనియర్ ప్లేయర్ అశ్విన్ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. సీనియర్లను నమ్ముకొని... పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఇటీవల 2–0తో క్లీన్‌స్వీప్ చేసి ఉండవచ్చు. కానీ భారత్‌తో పోలిస్తే టెస్టుల్లో పాక్ చాలా బలహీనమైన జట్టు కాబట్టి ఈ సిరీస్‌తో పోలిక అనవసరం. భారత్‌పై బంగ్లా ఏనాడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. అయితే ఆ జట్టు కోణంలో చూస్తే పాక్‌పై విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని కాస్త పెంచిందనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, ముషి్ఫకర్ జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంతో మెరుగైన లిటన్ దాస్ కూడా జట్టుకు కీలకం కానున్నాడు. కెప్టెన్ నజ్ముల్ ఫామ్‌లో లేకపోగా... అనుభవం లేని షాద్మన్, జాకీర్ ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్‌లో మాత్రం బంగ్లా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బంగ్లా కూడా ముగ్గురు స్పిన్నర్లు షకీబ్, మిరాజ్, తైజుల్లతో బరిలోకి దిగడం ఖాయం. ఇటీవల మిరాజ్ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. బంగ్లాదేశ్ జట్టులో ప్రతిభావంతులైన, సీనియర్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వారి స్పిన్ కూడా పటిష్టంగా ఉంది. అయినా సరే వారిని ఎదుర్కోగల బ్యాటింగ్ మా సొంతం. మొదటి బంతి నుంచే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాం. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయం. ప్రస్తుత మా బౌలింగ్ బృందం పట్ల చాలా గర్వంగా ఉన్నా. నాతో కలిసి ఆడిన ప్లేయర్లే ఇప్పుడు సీనియర్లుగా ఉన్నారు. వారితో మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం. కోచింగ్ బృందంలో ఎవరున్నా పరిస్థితులను బట్టి జట్టు ఆట శైలి మారడం ముఖ్యం. లేదంటే ఆ జట్టు అక్కడే ఆగిపోతుంది. పిచ్‌పై చర్చ అనవసరం. ఇక్కడికి వచ్చే జట్లు స్పిన్‌ను ఎలా ఆడాలో నేర్చుకోవాలి తప్ప పిచ్ గురించి మాట్లాడవద్దు. సర్ఫరాజ్, జురేల్ గత సిరీస్‌లో బాగా ఆడినా కొన్ని సార్లు పక్కకు తప్పుకొని తమ అవకాశం కోసం వేచి ఉండక తప్పదు. – గౌతమ్ గంభీర్, భారత కోచ్ పిచ్, వాతావరణంఎర్రమట్టితో తయారు చేసిన పిచ్‌పై మ్యాచ్ జరగనుంది. దాంతో టెస్టు ఆరంభంలో మంచి బౌన్స్ ఉంటుంది. అయితే చెన్నైలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మ్యాచ్ సాగిన కొద్దీ పిచ్‌పై పగుళ్లు ఖాయం. దాంతో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవడం ఖాయం.తుది జట్ల వివరాలు (అంచనా)భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, కోహ్లి, రాహుల్, జడేజా, పంత్, అశి్వన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), షాద్మన్, జాకీర్, మోమినుల్, ముష్ఫికర్, దాస్, షకీబ్, మిరాజ్, తస్కీన్, హసన్, తైజుల్. -
India vs Bangladesh: చెన్నైలో జోరుగా సాధన
చెన్నై: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇటీవల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ నేపథ్యంలో... ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుబ్‌మన్‌గిల్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో చెమటోడ్చగా... హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. పలువురు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ తగు సూచనలు చేయగా... సహాయక కోచ్‌లు ర్యాన్ టెన్ డస్కటే, అభిõÙక్ నాయర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్‌పై గంభీర్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2022 డిసెంబర్లో మిర్పూర్లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్ తర్వాత పంత్ టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. చెన్నై పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. అందుకే నెట్స్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం కనిపించింది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో గత రెండు వారాలుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్లేయర్లు ఎర్రమట్టి పిచ్‌తో పాటు నల్లమట్టి పిచ్‌పై ప్రాక్టీస్ సాగిస్తున్నారు. -
‘ప్రతీ టెస్టు మ్యాచ్ కీలకమే’
చెన్నై: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా...భారత క్రికెట్ జట్టు వచ్చే 15 వారాల వ్యవధిలో ఈ మూడు జట్లతో కలిపి 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పరంగా ఇప్పటికే అగ్ర స్థానంలో ఉండి ఫైనల్‌కు చేరువగా ఉన్న టీమిండియా తుది పోరుకు తమ స్థానాన్ని ఖాయం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సుదీర్ఘ సీజన్ నేపథ్యంలో అన్ని మ్యాచ్‌లు ఆడించకుండా కొందరు కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లకు మధ్య మధ్యలో విరామం ఇవ్వాల్సి ఉంటుందని భారత కెపె్టన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు జరగనున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడాడు. నెల రోజులకు పైగా విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగబోతున్నారు. ‘సుదీర్ఘ సీజన్లో కొందరికి అప్పుడప్పుడు విశ్రాంతినివ్వక తప్పదు. మీ అత్యుత్తమ ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఆడాలని అంతా కోరుకుంటారు. కానీ వాస్తవికంగా చూస్తే అది సాధ్యం కాదు. టెస్టులు మాత్రమే కాదు, మరో వైపు టి20 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇంత ఎక్కువ క్రికెట్ సాగుతుంటే మనం అన్నీ అర్థం చేసుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా బౌలర్ల విషయంలో మరీ కష్టం. వీరి పని భారాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై మాకూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మ్యాచ్‌ల మధ్యలో వారి ఫిట్నెస్ ఎలా ఉంటోంది. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పరిస్థితి ఏమిటి. ఫిజియో ఇచ్చే నివేదికను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏ సమయంలో విశ్రాంతినివ్వాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్టుపై కూడా ఇది చేయగలిగాం. ఆ సిరీస్‌లో ఒక టెస్టులో బుమ్రాకు, మరో టెస్టులో సిరాజ్‌కు విశ్రాంతినిచ్చాం’ అని రోహిత్ గుర్తు చేశాడు. పేసర్ల కొరత లేదు... దేశవాళీ క్రికెట్లో పెద్ద సంఖ్యలో పేస్ బౌలర్లు వెలుగులోకి వస్తుండటం మంచి పరిణామమని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో కీలకం అయ్యే అవకాశం ఉందని సెలక్టర్లు భావించడంతో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాళ్ను కూడా బంగ్లాతో సిరీస్‌కు జట్టులోకి తీసుకొని అతడిని సానపెడుతున్నారు. ‘మనకు చాలా మంది బౌలర్లు అందుబాటులో ఉన్నారు. దులీప్ ట్రోఫీలో కూడా చాలా మందిని నేను చూశాను. అసలు కొత్తగా బౌలర్ల కోసం ఆందోళన చెందాల్సిన అవసరమే లేని పరిస్థితి మనకు ఉంది. ఇది చాలా సానుకూలాశం’ అని కెపె్టన్ అన్నాడు. అందరితో కలిసి పని చేశాను... కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు తొలిసారిగా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతోంది. నెల రోజుల క్రితం ఇదే బృందం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా టీమ్‌తో కలిసి పని చేసింది. అయితే పేరుకు వారంతా కొత్తే అయినా తనకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని రోహిత్ అన్నాడు. ద్రవిడ్ తదితరులతో కూడిన కోచింగ్ స్టాఫ్‌తో పోలిస్తే పనితీరు భిన్నమే అయినా...ఎలాంటి సమస్య లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘కోచింగ్ బృందం కొత్తదే కావచ్చు. కానీ నాకు గంభీర్, అభిõÙక్ నాయర్ బాగా తెలుసు. వీరిద్దరితో ఇప్పటికే శ్రీలంకతో కలిసి పని చేశాను. మోర్కెల్, డస్కటేలకు ప్రత్యరి్థగా ఆడాను. వారిద్దరితో ఎక్కువగా మాట్లాడలేదు కానీ వారు మా జట్టు గురించి బాగా అర్థం చేసుకోగలగడం నేను గుర్తించాను. ద్రవిడ్, రాథోడ్, మాంబ్రేలతో పోలిస్తే వీరి శైలి భిన్నం. పనితీరులో ఎవరి పద్ధతి వారికుంటుంది. అది పెద్ద సమస్య కాదు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటగాళ్లందరూ పరిస్థితికి తగినట్లుగా కోచింగ్ బృందంతో సరిగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. అది మేం చేయగలం’ అని రోహిత్ వివరించాడు. రిహార్సల్స్ సిరీస్ కాదు... రాబోయే ఆస్ట్రేలియా వంటి కీలక పర్యటనకు సన్నాహకంగా బంగ్లాదేశ్ సిరీస్‌ను చూడటం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంటుందని, ప్రత్యర్థి బలం గురించి కాకుండా తాము ఏం చేయగలం అనేది చూస్తామని అతను చెప్పాడు. ‘సిరీస్ ఏదైనా దేశం తరఫున ఆడుతున్నామనేది మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడేమీ రిహార్సల్స్ జరగడం లేదు. ప్రతీ టెస్టుకు ప్రాధాన్యత ఉంది. డబ్ల్యూటీసీ కోణంలో చూస్తే ఉదాసీనతకు అవకాశం లేదు. ఎక్కడ ఆడతామనేది విషయం కాదు. గెలవడమే అన్నింటికంటే ప్రధానం. మ్యాచ్‌కు వారం రోజుల ముందే ఇక్కడకు వచ్చాం. సన్నాహకాలు చాలా బాగా సాగాయి. దొరికిన కాస్త సమయాన్ని బాగా వాడుకున్నాం. మేమందరం టెస్టు సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’ అని రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా, భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరలవుతుంది. ఈ పోస్ట్ ప్రకారం భారత తుది జట్టులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆరో స్థానంలో రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.భారత పూర్తి జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్ఇదిలా ఉంటే, భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 19న మొదలువుతుంది. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్.. సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 6, 7, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! -
రెండో రోజూ అదే పరిస్థితి
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
బంగ్లా చేతిలో పాక్ ‘పిండి’
రావల్పిండి: సొంతగడ్డపై టెస్టు మ్యాచ్... అటువైపు తమతో పోలిస్తే బలహీన ప్రత్యర్థి... బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై నాలుగు రోజుల ఆటలో పరుగుల వరద పారింది... ఇక చివరి రోజు ఆట ఇలాగే సాగి మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే అనిపించింది. కానీ బంగ్లాదేశ్ అద్భుతం చేసి చూపించింది... తమ స్పిన్ బలగంతో పాకిస్తాన్‌ను పడగొట్టింది... అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.. సంచలన ప్రదర్శన ఫలితంగా బంగ్లాదేశ్ తమ టెస్టు చరిత్రలోనే తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన పాక్ చివరకు పరాజయం పాలైంది. విదేశీ గడ్డపై తొలిసారి జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన నజు్మల్ హసన్ షంటో తన పుట్టిన రోజున అరుదైన విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 23/1తో ఐదో రోజు ఆట కొనసాగించిన పాక్ బ్యాటర్లు బంగ్లా బౌలింగ్ ముందు తేలిపోయారు.ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 146 పరుగులకే ఆలౌటైంది. మొహమ్మద్ రిజ్వాన్ (80 బంతుల్లో 51; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (86 బంతుల్లో 37; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. తొలి 3 వికెట్లు పేసర్ల ఖాతాలోకి వెళ్లగా... ఆ తర్వాత ఆఫ్‌స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 4, లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించిన బంగ్లా ముందు కేవలం 30 పరుగుల లక్ష్యం నిలిచింది. వికెట్ కోల్పోకుండా 6.3 ఓవర్లలో అర గంటలోపే దీనిని అందుకొని బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌ను పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా... బంగ్లాదేశ్ 565 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 191 పరుగులు చేసిన ముషి్ఫకర్ రహీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో టెస్టు ఇదే మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతుంది. -
ఇన్నింగ్స్ విజయం దిశగా ఇంగ్లండ్
లండన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. మ్యాచ్ రెండో రోజు 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. అండర్సన్, అట్కిన్సన్, స్టోక్స్ రెండు వికెట్ల చొప్పున తీశారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 189/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 90 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (68; 7 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్), తొలి టెస్టు ఆడుతున్న జేమీ స్మిత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. విండీస్ బౌలర్లలో జీడెన్ సీల్స్ 4 వికెట్లు పడగొట్టగా... హోల్డర్, గుడకేశ్ మోతీ 2 వికెట్లు చొప్పున తీశారు. -
గెలుపు దిశగా శ్రీలంక
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 119/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 110.4 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ధనంజయ డిసిల్వా (108; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (164; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాది చరిత్ర పుటల్లోకి ఎక్కారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో 1974లో న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా బ్యాటర్లు ఇయాన్ చాపెల్ (145, 121), గ్రెగ్ చాపెల్ (247 నాటౌట్, 133)...2014లో అబుదాబిలో ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు మిస్బా ఉల్ హక్ (101, 101 నాటౌట్), అజహర్ అలీ (109, 100 నాటౌట్) ఈ ఘనత సాధించారు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్‌ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్‌కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్‌నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్‌కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
Ind vs Eng 1st Test Hyd: మొదటి టెస్టు మన చేతుల్లోకి...
భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఊహించిన దిశలోనే సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన టీమిండియా రెండో రోజు తమ బ్యాటింగ్ సత్తా చూపించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చక్కటి అర్ధసెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ సమయోచిత సహకారం జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాయి. శుక్రవారం 3.47 రన్‌రేట్‌తో 87 ఓవర్లలోనే 302 పరుగులు సాధించిన టీమిండియాకు టెస్టుపై పట్టు చిక్కింది. పేలవ బౌలింగ్‌తో భారత్‌ను నిలువరించడంలో విఫలమైన ఇంగ్లండ్ ఇప్పటికే దాదాపుగా చేతులెత్తేసింది. రెండో రోజు ఒక రనౌట్‌ను మినహాయిస్తే ఆ జట్టు ఐదు వికెట్లే తీయగలిగింది. మరో మూడు వికెట్లతో భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉండగా... ఇంగ్లండ్ ఎంతవరకు పోరాడుతుందనేది చూడాలి. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ బలంతో భారత జట్టు ఇంగ్లండ్‌పై తొలి టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (155 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... కోన శ్రీకర్ భరత్ (81 బంతుల్లో 41; 3 ఫోర్లు), అక్షర్ పటేల్ (62 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇప్పటికే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉండగా... క్రీజ్‌లో ఉన్న జడేజా, అక్షర్ ఎనిమిదో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా... మూడింటిలో జడేజా ఉన్నాడు. భారత్ టాప్–5 బ్యాటర్లంతా దూకుడుగా ఆడబోయి అటాకింగ్ షాట్లకే వెనుదిరగడం విశేషం. సమష్టి బ్యాటింగ్‌తో... ఓవర్‌నైట్ స్కోరు 119/1తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు ఇబ్బందిగానే కనిపించిన శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే రాహుల్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. శ్రేయస్ భారీ స్కోరు చేయడంలో విఫలం కాగా... 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. వుడ్ ఓవర్లో అతను కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. రేహన్ ఓవర్లో రాహు ల్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే అతను సెంచరీ చాన్స్‌ను పోగొట్టుకున్నాడు. రాహుల్ పెవిలియన్‌కు చేరిన సమయంలో భారత్ 42 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. దాంతో చివరి వికెట్ల తీయగల మని ఇంగ్లండ్‌కు ఆశ కలిగింది. కానీ జడేజా వాటిని వమ్ము చేశాడు. ముందుగా భరత్‌తో, ఆ తర్వాత అక్షర్ పటేల్‌తో అతను రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆంధ్ర ఆటగాడు భరత్ పెద్ద స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ చేశాడు. జడేజాతో సమన్వయలోపంతో అశ్విన్ (1) రనౌట్ కావడం ఒక్కటే కాస్త నిరాశపర్చింది. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ అక్షర్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు. హార్లీ వేసిన చివరి ఓవర్లో అక్షర్ వరుసగా 4, 6, 4 బాది రోజును ముగించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) రూట్ 80; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (సి) డకెట్ (బి) హార్లీ 23; రాహుల్ (సి) రేహన్ (బి) హార్లీ 86; శ్రేయస్ (సి) హార్లీ (బి) రేహన్ 35; జడేజా (బ్యాటింగ్) 81; భరత్ (ఎల్బీ) (బి) రూట్ 41; అశ్విన్ (రనౌట్) 1; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 421. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–159, 4–223, 5–288, 6–356, 7–358. బౌలింగ్: వుడ్ 13–0–43–0, హార్లీ 25–0–131–2, లీచ్ 25–6–54–1, రేహన్ 23–3–105–1, రూట్ 24–2–77–2. -
IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఆ జట్టు తొలిసారి ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఏకైక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగింది. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడినే బరిలోకి దించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మ్యాచ్‌లో వుడ్‌ను బరిలోకి దించినా, తొలి రోజు ఆటలో అతనిచే కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించింది. తొలి రోజు ఇంగ్లండ్ మొత్తంగా 23 ఓవర్లు వేయగా.. అందులో 21 ఓవర్లు స్పిన్నర్లు టామ్ హార్ట్లీ (9), జాక్ లీచ్ (9), రెహాన్ అహ్మద్‌లే (3) షేర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇలా ముగ్గురు స్పిన్నర్లతో టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగడం కూడా చాలా అరుదు. హైదరాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఆటను బట్టి చూస్తే ఇంగ్లండ్ అంచనా కరెక్టే అయినప్పటికీ.. భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన స్టోక్స్ వికెట్ సహా రెండు వికెట్లు తీయడం విశేషం. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న (జనవరి 25) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టోక్స్ (70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 20, బెన్ డకెట్ 35, ఓలీ పోప్ 1, జో రూట్ 29, బెయిర్‌స్టో 37, ఫోక్స్ 4, రెహాన్ అహ్మద్ 13, టామ్ హార్ట్లీ 23, మార్క్ వుడ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
భారత్‌ను ఇంగ్లండ్ ఆపతరమా!
సొంతగడ్డపై భారత జట్టు 2012లో చివరిసారిగా, అదీ ఇంగ్లండ్ చేతిలో ఓడింది... అయితే ఆ తర్వాత ఏ ఒక్క టీమ్ కూడా మన జట్టుతో తలపడి పైచేయి సాధించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే టీమిండియా వరుసగా 16 సిరీస్‌లలో విజయం సాధించగా ఇందులో 7 క్లీన్‌స్వీప్‌లు ఉన్నాయి. రెండుసార్లు ఆస్ట్రేలియా మాత్రమే సిరీస్‌ను ‘డ్రా’ చేసేందుకు కాస్త చేరువగా రాగలిగింది. నాటినుంచి ఇక్కడ ఆడిన 44 టెస్టుల్లో భారత్ మూడింటిలో మాత్రమే ఓడిందంటే మన బలం, బలగం ఏమిటో అర్థమవుతుంది. ఇంగ్లండ్ కూడా ఇక్కడ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లలో భారత్ చేతిలో 0–4, 1–3తో చిత్తుగా ఓడింది... ఇలాంటి స్థితిలో భారత జట్టు మరోసారి ప్రత్యర్థిని పడగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మన మేనేజ్మెంట్ వ్యాఖ్యలు చూస్తే పూర్తి స్థాయిలో స్పిన్ పిచ్లే తయారు కావడం ఖాయం. మరోవైపు గత కొంతకాలంగా దూకుడైన ఆటతో ‘బజ్‌బాల్’ అంటూ సిద్ధమైన ఇంగ్లండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల భారీ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. గత దశాబ్దకాలంలో మా జట్టుకు ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉన్నది వాస్తవమే అయినా అది ఈ సిరీస్ విజయానికి పనికి రాదు. పరిస్థితులకు తగినట్లుగా అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే. ఆఖరిసారిగా ఇంగ్లండే మమ్మల్ని ఇక్కడ ఓడించింది. మేం అజేయులం ఏమీ కాదు. అలాంటి భ్రమలేవీ లేవు. కాబట్టి ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా ఓటమి ఎదురవుతుంది. ఎదుటివారి బలబలాలకంటే మన జట్టు వ్యూహం గురించి స్పష్టత ఉండాలి. దానిని అమలు చేయాలి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మేమందరం ఆడాం కాబట్టి ఎలా ఆడాలో సొంత ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలి. టెస్టుల్లో ఒత్తిడిని అధిగమించడమే పెద్ద సవాల్. బరిలోకి దిగి పూర్తి సత్తాను ప్రదర్శించాలి. ఎప్పటికీ సీనియర్లపైనే ఆధారపడలేం కదా. కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. లేదంటే వారు ఎప్పుడు ఆడతారు. అందుకే పటిదార్‌ను ఎంచుకున్నాం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సాక్షి, హైదరాబాద్: భారత గడ్డపై మరో పెద్ద జట్టుతో టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టెస్టులో ఇరు జట్లు తలపడతాయి. బలాబలాలు, రికార్డుపరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ శర్మ జట్టుదే పైచేయిగా కనిపిస్తుండగా... గత కొంతకాలంగా మార్పులతో కనిపిస్తూ వచ్చిన ఇంగ్లండ్‌ను పూర్తిగా తక్కువ చేయలేం. ఏ జట్టు గెలిచినా సిరీస్‌లో శుభారంభం చేస్తే ఆపై దాని ప్రభావం కనిపించడం ఖాయం. కోహ్లి లేకుండా... భారత్‌కు సంబంధించి తుది జట్టు విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆడిన టీమ్ నుంచి సహజంగానే స్వదేశంలో మార్పులు ఖాయం. బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్ల స్థానాల్లో ఇద్దరు స్పిన్నర్లు వస్తున్నారు. సీనియర్ ఆటగాడు అఅశ్విన్ న్ బరిలోకి దిగడం ఖాయం. అఅశ్విన్ న్–జడేజాల స్పిన్ జోడీ చెలరేగితే ఇంగ్లండ్ ఏమాత్రం నిలబడగలదనేది ఆసక్తికరం. గత దశాబ్దకాలంలో వీరిద్దరు సొంతగడ్డపై ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉంది. కెప్టెన్ రోహిత్ కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా బ్యాటింగ్‌ను దృష్టిలో పెట్టుకునే అక్షర్‌కే ప్రాధాన్యత ఉంది. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటారు. కెరీర్లో 23 టెస్టులు ఆడిన సిరాజ్‌కు తన సొంత మైదానంలో ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఆరంభంలో వీరిద్దరు ప్రభావం చూపించగలరు. స్టార్ బ్యాటర్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరం కావడం అభిమానులను నిరాశపర్చేదే. అయితే అతను లేకపోవడం వల్ల బ్యాటింగ్‌లో ఎంపిక సమస్య లేకుండా పోయింది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతారు. శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కోహ్లి స్థానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ (కేఎస్) భరత్ జట్టులోకి వస్తాడు. రజత్ పటిదార్‌ను ఎంపిక చేసినా... తుది జట్టులో చోటు కష్టమే. మన బ్యాటర్లు భారీ స్కోరు అందిస్తే ఇంగ్లండ్ పని పట్టడం బౌలర్లకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో... మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. స్పిన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ముగ్గురు స్పిన్నర్లకు అవకాశమిచ్చి ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతోంది. నాణ్యమైన స్పిన్నర్లు కాకపోయినా... అందుబాటులో ఉన్నవారి నుంచే ఎంచుకోక తప్పలేదు. 35 టెస్టుల అనుభవం ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు. కానీ లెగ్‌స్పిన్నర్ రేహన్ ఒకే ఒక టెస్టు ఆడగా, మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్లీకి ఇదే తొలి టెస్టు కానుంది. అదనంగా జో రూట్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. ఇంగ్లండ్ స్పిన్నర్లు మన బ్యాటింగ్‌ను ఏమాత్రం నిలువరించగలరనేది సందేహమే అయినా... స్పిన్‌తో కనీసం ప్రయత్నమైనా చేసేందుకు ఆ జట్టు సిద్ధమైంది. సీనియర్ అండర్సన్‌ను కాకుండా మార్క్ వుడ్ రూపంలో ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా ఎంచుకుంది. బ్యాటింగ్‌లో రూట్, బెయిర్‌స్టోలపై ప్రధానంగా ఆ జట్టు ఆధారపడుతోంది. ఓలీ పోప్ కూడా మెరుగైన బ్యాటరే అయినా... క్రాలీ, డకెట్ ఎలాంటి ఆరంభం ఇస్తారో చూడాలి. స్టోక్స్ బ్యాటింగ్‌లో ధాటిని ప్రదర్శించాలని జట్టు కోరుకుంటోంది. ముఖ్యంగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడైన తరహా శైలితోనే టీమ్ సఫలమైంది. అయితే పూర్తి భిన్నమైన భారత పిచ్‌లపై అలాంటి మంత్రం ఎలా పని చేస్తుందో చూడాలి. ఈ జోరులో జట్టు కుప్పకూలిపోయే ప్రమాదమూ ఉంది. పిచ్, వాతావరణం ఉప్పల్ పిచ్ పొడిగా కనిపిస్తోంది. మరో మాటకు తావు లేకుండా స్పిన్‌కు అనుకూలించడం ఖాయం. అయితే అది ఎంత తొందరగా మొదలవుతుందనేదే ఆసక్తికరం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది. తుది జట్లు భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి, గిల్, శ్రేయస్, కేఎల్ రాహుల్, జడేజా, భరత్, అఅశ్విన్ న్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, వుడ్, రేహన్, హార్లీ, లీచ్. 4 ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు 5 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించింది. షోయబ్ బషీర్‌కు వీసా మంజూరు లండన్: భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు. ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు సర్వం సిద్దం..ఇరు జట్ల ప్రాక్టీస్
భాగ్యనగరం వాకిట్లో క్రికెట్ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆటతీరుతో కనువిందు చేయడానికి ‘సై’ అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు టెస్టుల్లో గెలుపొంది, ఒక టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిద్దాం. కోహ్లి లేడు.. వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరం కావడం తెలుగు క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో... జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వాడివేడి పేస్‌తో..అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ టి20 తరహా దూకుడైన ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై అదే జోరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్ బృందంలో బెన్ స్టోక్స్, జో రూట్, బెయిర్‌స్టో, ఒలీ పాప్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. లోకల్ స్టార్ సిరాజ్ రె‘ఢీ’.. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ‘లోకల్ స్టార్’ మొహమ్మద్ సిరాజ్ సొంత మైదానంలో తొలి టెస్టు ఆడటం ఖాయమైంది. ఇప్పటి వరకు సిరాజ్ 23 టెస్టులు ఆడాడు. ఇందులో 6 టెస్టులు (చెన్నై, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, ఇండోర్) భారత గడ్డపై, మిగతా 17 టెస్టులు విదేశాల్లో ఆడాడు. వ్యూహ రచనలో జడేజా, అశ్విన్.. టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరిద్దరు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో మడతపట్టేందుకు వీరిద్దరూ కఠోరంగా సాధన చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం.. భారత్‌ను స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా తెలుసు. అందుకే వారు మూడు రోజుల ముందుగానే తొలి టెస్ట్ వేదిక అయిన హైదరాబాద్‌కు చేరుకుని కఠోరంగా సాధన చేస్తున్నారు. అనుభవమే ఆయుధంగా.. భారత్‌పై ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న వెటరన్ పేసర్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియాను ఇబ్బంది పెట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆండర్సనే అని చెప్పాలి. అతని అనుభవం ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడతారో లేక ఆండర్సన్ కెరీర్‌కు చేదు అనుభవంతో ముగింపు పలుకుతారో వేచి చూడాలి. నాడు ప్లేయర్‌గా... నేడు కోచ్‌గా.. 2010లో ఉప్పల్ స్టేడియంలోనే భారత్‌తో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ జట్టు తరఫున ‘డబుల్ సెంచరీ’ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా మళ్లీ హైదరాబాద్‌కు రావడం విశేషం. -
కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ చేయడు: రాహుల్ ద్రవిడ్
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్‌కీపింగ్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. రాహుల్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అందులో భాగంగానే జట్టులో అదనంగా ఇద్దరు వికెట్కీపర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఇటీవలికాలంలో రాహుల్ ఫార్మాట్లకతీతంగా వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మాత్రం ప్రయోగాలు చేయలేమని అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున బ్యాటింగ్ పరంగానే రాహుల్‌పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే అతనిపై వికెట్‌కీపింగ్ భారాన్ని మోపే సాహసం చేయలేమని వివరణ ఇచ్చాడు. వికెట్‌కీపింగ్ బ్యాటర్ స్థానం కోసం కేఎస్ భరత్, దృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొందని, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తామని తెలిపాడు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదని అన్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత సెలక్టర్లు రాహుల్‌తో కలిపి ముగ్గురు వికెట్కీపర్లను ఎంపిక చేశారు. రాహుల్‌పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు కేఎస్ భరత్, దృవ్ జురెల్ స్టాండ్ బై కీపర్లుగా ఎంపిక చేశారు. కాగా, ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్‌లకు దూరం కాగా.. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల చేత సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. -
IND VS ENG 1st Test: అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. త్వరలో (జనవరి 25 నుంచి) ఇంగ్లండ్‌తో జరుగనున్న తొలి టెస్ట్‌లో (హైదరాబాద్) అశ్విన్ మరో 10 వికెట్లు తీస్తే, టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. హైదరాబాద్ టెస్ట్‌లో యాష్ ఈ ఘనతను సాధిస్తే అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున 500 వికెట్లు మార్కును తాకిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్ మరో 10 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అశ్విన్‌కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథన్ లయోన్ (512) టెస్ట్‌ల్లో 500 వికెట్ల ఘనత సాధించారు. హైదరాబాద్ టెస్ట్ విషయానికొస్తే.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌ను మిస్ కానున్నాడు. వ్యక్తిగత కారణాల చేత విరాట్ తొలి టెస్ట్‌తో పాటు రెండో టెస్ట్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. తొలి టెస్ట్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. బాల రాముడి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం కోసం అశ్విన్, రవీంద్ర జడేజా అయోధ్య నగరికి వెళ్లారు. వీరిద్దరూ రేపటి లోగా జట్టుతో చేరతారు. ఈ సిరీస్‌లో భారత్.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. విరాట్ కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది. తొలి టెస్ట్‌కు ముందు మ్యాచ్‌కు వేదిక అయిన హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, భారత అప్‌కమింగ్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌లకు అవార్డులు దక్కనున్నాయని తెలుస్తుంది. శాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. గిల్‌కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కనున్నాయని సమాచారం. వీరితో పాటు ముంబై ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు కూడా అవార్డు దక్కనున్నట్లు తెలుస్తుంది. -
భారత్, ఇంగ్లండ్ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి..
హైదరాబాద్‌లో ఈనెల 25 నుంచి జరగనున్న భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మొత్తం 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భారత జట్టు శనివారమే నగరానికి చేరుకోగా, ఇంగ్లండ్ నేడు అడుగు పెడుతుంది. -
AUS Vs WI: హాజిల్‌వుడ్ విజృంభణ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
టెస్ట్‌ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్.. తాజాగా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌ల్లో (తొలి) విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్‌వుడ్ (9/79), ట్రవిస్ హెడ్ (119) విజృంభించడంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్‌పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (50), 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. విండీస్ ఆరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ (5/94) ఆసీస్‌ను దెబ్బతీశాడు. 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆడుతూపాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్ స్మిత్ 11, లబూషేన్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. -
AUS VS WI 1st Test: సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి సంచలన పేసర్‌గా..!
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టెస్ట్ కెరీర్లో మొదటి బంతికే వికెట్ (స్టీవ్ స్మిత్) తీసిన షమార్.. టైరెల్ జాన్సన్ (1939లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 23వ బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, లబూషేన్, కెమరూన్ గ్రీన్ లాంటి హేమాహేమీ బ్యాటర్లు సహా ఐదు వికెట్ల ఘనత సాధించిన షమార్.. టెస్ట్ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన 11వ విండీస్ బౌలర్‌గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో 11వ నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు ఎంతో అవసరమైన 36 పరుగులు చేసిన షమార్.. విండీస్ తరఫున టెస్ట్‌ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన 11వ నంబర్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రదర్శనలతో షమార్ మరిన్ని ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విండీస్ బౌలర్‌గా.. ఆస్ట్రేలియాలో టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన పదో పర్యాటక బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, షమార్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/94) విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (119) సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంతకుముందు హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (50), షమార్ జోసఫ్ (36) మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ (4/18) మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ధాటికి విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. విండీస్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి.. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేసిన షమార్ జోసఫ్.. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తన జీవనాధారమైన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. కరీబియన్ దీవుల్లోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన షమార్.. టెస్ట్ అరంగేట్రానికి ముందు కేవలం ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 24 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ అయిన షమార్ అంతర్జాతీయ అరంగేట్రంలో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుని పలు రికార్డులు కొల్లగొట్టాడు. -
Aus vs WI : శతక్కొట్టిన ట్రావిస్ హెడ్..
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 95 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ట్రావిస్ హెడ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై సెంచరీ తర్వాత హెడ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో 15వ పరుగుతో హెడ్ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు. ఉస్మాన్ ఖ్వాజా (45), నాథన్ లయోన్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టీవ్ స్మిత్ 12, లబూషేన్ 10, కెమరూన్ గ్రీన్ 14, మిచెల్ మార్ష్ 5, అలెక్స్ క్యారీ 15, మిచెల్ స్టార్క్ 10, పాట్ కమిన్స్ 12 స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేయగా.. కీమర్ రోచ్, మరో అరంగ్రేటం బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ తలో రెండు వికెట్లు, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. మూడో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి, కష్టాల్లో చిక్కుకుంది. ఇంకా ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 88 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్‌నరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ డకౌట్లు కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఒక్క పరుగులు చేసి ఔటయ్యారు. కిర్క్ మెక్కెంజీ (5), కవెమ్ హాడ్జ్ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్ దారుణంగా దెబ్బతీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్ కోల్పోయిన మూడు వికెట్లు హాజిల్వుడే తీశాడు. అంతకుముందు విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లోనూ హాజిల్వుడే (4/44) దెబ్బకొట్టాడు. హాజిల్, కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. -
విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఆసీస్ తుది జట్టు ఇదే.. స్మిత్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ తుది జట్ల వివరాలను వెల్లడించాయి. ఈ మ్యాచ్‌తో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. స్మిత్ ఓపెనర్ అవతారమెత్తడంతో మరో ఓపెనర్ మ్యాట్ రెన్షా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ కూడా చోటు దక్కించుకున్నాడు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఆసీస్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. మరోవైపు ఈ మ్యాచ్‌తో ముగ్గురు విండీస్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నారు. కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్‌లు సుదీర్ఘ ఫార్మాట్లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, నాథన్ లయోన్, జోష్ హాజిల్‌వుడ్ వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్‌కీపర్), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్ -
టీమిండియా బోల్తా
‘బాక్సింగ్ డే’ టెస్టులో మన జట్టు మూడే రోజుల్లో మునిగింది. రోజు రోజుకూ ప్రత్యర్థి జట్టే పట్టు బిగించడం... మూడో రోజైతే ఏకంగా అటు బ్యాటింగ్‌లో ప్రతాపం... ఇటు బౌలింగ్‌లో పట్టుదల చూపిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విజయం సాధించింది. దీంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సఫారీ బౌలింగ్ ముందు ఎదురు నిలువలేకపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్ మరోసారి పర్యటించాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచూరియన్: టీమిండియా ఈ పర్యటనలో టి20లను సమం చేసుకున్నా... వన్డే సిరీస్‌ను వశం చేసుకున్నా... అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాట్‌కు వచ్చేసరికి సఫారీలో సవారీ అంత సులభం కానేకాదని తొలిటెస్టు మూడు రోజుల్లోనే తెలుసుకుంది. ‘బాక్సింగ్ డే’ పోరులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 256/5తో గురువారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 108.4 ఓవర్లలో 408 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 185; 28 ఫోర్లు), మార్కొ జానెŠస్న్ (147 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీస్కోరుకు బాటవేశారు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. కోహ్లి (82 బంతుల్లో 76; 12 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ పరుగులే చేయలేదు. రెండు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. అప్పుడు రాహుల్... ఇప్పుడు కోహ్లి ఈ టెస్టులో సఫారీ పేసర్లు భారత బ్యాటర్ల పాలిట గన్ గురిపెట్టునట్లుగా... బంతుల స్థానంలో బుల్లెట్లు సంధించారేమో! ఎందుకంటే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటర్లు తేలిగ్గా వికెట్లను సమర్పించుకున్నారు. ముఖ్యంగా మూడో రోజైతే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలాన్ని, బౌలింగ్ అ్రస్తాల్ని ప్రయోగించిన తీరుకు భారత్ భీతిల్లిపోయింది. ప్రత్యర్థి తొలిసెషన్‌కు పైగా ఆడింది. 42.4 ఓవర్లలో మిగిలున్న 5 వికెట్లతోనే 152 పరుగులు చేసింది. కానీ 10 మంది భారత బ్యాటర్లు కనీసం 35 ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయారు. రబడ (2/32), బర్గర్ (4/33), జాన్సెన్ (3/36) ముప్పేట దాడికి దిగడంతో అనుభవజు్ఞడైన కెపె్టన్ రోహిత్ (0) ఖాతా తెరువలేకపోయాడు. యశస్వి (5), అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), అశ్విన్ (0), శార్దుల్ (2) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. కోహ్లి అర్ధసెంచరీతో పోరాడగా, శుబ్‌మన్ గిల్ (26) కాస్త మెరుగనిపించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 245 ఆలౌట్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 185; టోని జార్జి (సి) జైస్వాల్ (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి) రాహుల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 4; జాన్సెన్ నాటౌట్ 84; కొయెట్జీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 19; రబడ (బి) బుమ్రా 1; బర్గర్ (బి) బుమ్రా 0; బవుమా (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (108.4 ఓవర్లలో ఆలౌట్) 408. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249, 6–360, 7–391, 8–392, 9–408. బౌలింగ్: బుమ్రా 26.4–5–69–4, సిరాజ్ 24–1–91–2, శార్దుల్ 19–2–101–1, ప్రసిధ్ కృష్ణ 20–2–93–1, అశ్విన్ 19–6–41–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి)బర్గర్ 5; రోహిత్ (బి) రబడ 0; గిల్ (బి) జాన్సెన్ 26; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; అయ్యర్ (బి) జాన్సెన్ 6; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) బర్గర్ 4; అశ్విన్ (సి) బెడింగ్హమ్ (బి) బర్గర్ 0; శార్దుల్ (సి) బెడింగ్హమ్ (బి) రబడ 2; బుమ్రా రనౌట్ 0; సిరాజ్ (సి) వెరిన్ (బి) బర్గర్ 4; ప్రసిద్‌కృష్ణ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (34.1 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–5, 2–13, 3–52, 4–72, 5–96, 6–96, 7–105, 8–113, 9–121, 10–131. బౌలింగ్: రబడ 12–3–32–2, బర్గర్ 10–3–33–4, జాన్సెన్ 7.1–1–36–3, కొయెట్జీ 5–0–28–0. -
రాహుల్ పోరాటం
‘బాక్సింగ్ డే’ టెస్టు సవాళ్లతో మొదలైంది. బంతి ఒక బుల్లెట్‌గా బ్యాటర్లను అదేపనిగా ఢీకొట్టింది. పేసర్లు గర్జిస్తుంటే... ప్రధాన బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు. అడుగడుగునా కఠిన సవాళ్లు ఎదురవుతున్న సెంచూరియన్ పిచ్‌పై మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం చేశాడు. అజేయ అర్ధ సెంచరీతో భారత్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. సెంచూరియన్: సఫారీ పేస్ దళానికి భారత బ్యాటింగ్ బలగమంతా వణికితే ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్ మాత్రం పెను సవాలుకు తన బ్యాటింగ్ సత్తాతో ఎదురు నిలిచాడు. తొలిటెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ వర్షం కారణంగా ఆట నిలిచి సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (105 బంతుల్లో 70 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ మొదటిరోజే ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డాడు. అజేయ అర్ధసెంచరీతో ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. రబడ ఐదు వికెట్లతో (5/44) చెలరేగాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ సీమర్ ప్రసిధ్ కృష్ణ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రోహిత్ 5, గిల్ 2 టాస్ నెగ్గిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. సీమర్లు తమ కెప్టెన్ నిర్ణయం సరైందనిపించడానికి ఎంతో సేపు పట్టలేదు. కెపె్టన్ రోహిత్ శర్మ (5)ను రబడ అవుట్ చేయగా, కాసేపటికే బర్గర్ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్ (17), శుబ్‌మన్ గిల్ (2)లను పెవిలియన్ చేర్చాడు. 24 పరుగులకే టీమిండియా విలువైన వికెట్లు కూలాయి. ఈ దశలో అనుభవజు్ఞడైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (64 బంతుల్లో 38; 5 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను కనిపెట్టుకున్నారు. తొలిసెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుకున్నారు. భారత్ 91/3 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రబడ దెబ్బకు మళ్లీ... అదేంటో ఏమో మ్యాచ్ మొదలైనపుడు కష్టాల్లో పడ్డట్లే... రెండో సెషన్ మొదలైనపుడు కూడా భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కలిసొచ్చిన పిచ్... పనికొచ్చిన ఎక్స్ట్రా బౌన్స్‌తో వైవిధ్యమైన బంతులు వేసిన రబడ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా నియంత్రణలోకి తెచ్చాడు. సెషన్ ఆరంభమైన ఓవర్లోనే అయ్యర్, జట్టు స్కోరు వంద పూర్తయ్యాక కోహ్లి, అశ్విన్ (8)లను రబడ పెవిలియన్ చేర్చాడు. ఓ దశలో 121/6 స్కోరు వద్ద భారత్ ఆలౌట్‌కు దాదాపు చేరువైంది. ఎందుకంటే ఒక్క రాహుల్ మినహా ప్రధాన బ్యాటర్లెవరూ మిగల్లేదు! వీరోచిత పోరాటం కష్టమైన పిచ్... నిప్పులు చెరుగుతున్న బౌలర్లు... భారత్‌కు అన్నీ కష్టాలే! ఇలాంటి పరిస్థితిలో రాహుల్ అద్వితీయ పోరాటం చేశాడు. కీలక బ్యాటర్లెవరూ లేకపోయినా... టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (33 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో రెండో సెషన్‌ను నడిపించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో శార్దుల్ వికెట్‌ను పారేసుకున్నాడు. బుమ్రా క్రీజులోకి రాగా... టీమిండియా 176/7 వద్ద టీ బ్రేక్‌కు వెళ్లింది. విరామనంతరం రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికే బుమ్రా (1)ను జాన్సెన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ (0 బ్యాటింగ్) క్రీజులోకి రాగా... రాహుల్ కష్టపడి జట్టు స్కోరును 200 దాటించాడు. బ్యాడ్‌లైట్, వర్షం వల్ల ఫైనల్ సెషన్ ఎక్కువసేపు సాగలేదు. 208/8 స్కోరు వద్ద వాన రావడంతో తొలిరోజు ఆట అక్కడితోనే ఆగిపోయింది. మ్యాచ్ ఆరంభం కూడా ఆలస్యం కావడంతో మొదటి రోజు కేవలం 59 ఓవర్ల ఆటే సాధ్యమైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; గిల్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బ్యాటింగ్) 70; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 208. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191. బౌలింగ్: రబడ 17–3–44–5, మార్కొ జాన్సెన్ 15–1–52–1, బర్గర్ 15–4–50–2, కొయెట్జీ 12–1–53–0. -
AUS VS PAK 1st Test: 500 వికెట్ల క్లబ్లో చేరిన లియోన్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను మట్టికరిపించారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్లో చేరిన వారిలో ఉన్నారు. FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ — cricket.com.au (@cricketcomau) December 17, 2023 సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ లెజెండరీ క్లబ్లో చేరాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్‌కు ముందు వార్న్, మెక్‌గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్ల క్లబ్లో చేరారు. లియోన్ తన 500 వికెట్ డీఆర్ఎస్కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2) సాధించిన లియోన్ ఆసీస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg — Johns. (@CricCrazyJohns) December 17, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. -
26వ టెస్ట్ శతకం.. డేవిడ్ వార్నర్ ఖాతాలో పలు రికార్డు
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 14) మొదలైన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. డేవిడ్ వార్నర్ 26వ టెస్ట్ శతకంతో (211 బంతుల్లో 164; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ శతకానికి ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు తోడవ్వడంతో ఆసీస్ తొలి రోజే భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (16) ఒక్కడే కాస్త నిరాశపరిచాడు. ఆట ముగిసే సమయానికి మిచెల్ మార్ష్ (15), అలెక్స్ క్యారీ (14) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆమిర్ జమాల్ 2 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఖుర్రమ్ షెహజాద్, ఫహీప్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. రికార్డు శతకం.. తన కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన వార్నర్.. తన కెరీర్ చరమాంకంలో రికార్డు శతకంతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్ ఆరంభంలో టీ20 తరహాలో చెలరేగిన వార్నీ.. ఆతర్వాత కాస్త నెమ్మిదించి డబుల్ సెంచరీ దిశగా సాగాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్కు క్యాచ్ ఇచ్చి 164 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్‌గా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి (80) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా.. ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ స్వదేశంలో పాకిస్తాన్‌తో ఆడిన గత 14 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడు సెంచరీలు చేసి సొంతగడ్డపై పాకిస్తాన్ పాలిట ఎంతటి ప్రమాదకారో నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్లు.. డేవిడ్ వార్నర్ (49) సచిన్ టెండూల్కర్ (45) క్రిస్ గేల్ (42) సనత్ జయసూర్య (41) మాథ్యూ హేడెన్ (40) రోహిత్ శర్మ (40) ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు.. విరాట్ కోహ్లి (574 ఇన్నింగ్స్‌ల్లో 80 సెంచరీలు) డేవిడ్ వార్నర్ (458 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు) జో రూట్ (437 ఇన్నింగ్స్‌ల్లో 46) రోహిత్ శర్మ (482 ఇన్నింగ్స్‌ల్లో 45) స్టీవ్ స్మిత్ (374 ఇన్నింగ్స్‌ల్లో 44) కేన్ విలియమ్సన్ (410 ఇన్నింగ్స్‌ల్లో 42) బాబర్ ఆజమ్ (300 ఇన్నింగ్స్‌ల్లో 31) ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. రికీ పాంటింగ్ 13378 అలెన్ బోర్డర్ 11174 స్టీవ్ వా 10927 స్టీవ్ స్మిత్ 9351 డేవిడ్ వార్నర్ 8651 మైఖేల్ క్లార్క్ 8643 -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. పాక్ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాక్‌కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్ అహ్మద్వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్‌లను కొనసాగించిన పాక్ మేనేజ్మెంట్.. వన్ డౌన్లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. 🚨 Playing XI for first Test 🚨 Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023 ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్‌ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్‌కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా మసూద్‌కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. -
వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్రకు షాక్
వన్డే వరల్డ్‌కప్ 2023లో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు) నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో ఇవాల్టి నుంచి (నవంబర్ 28) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో రచిన్‌కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కలేదు. రచిన్ భీకర ఫామ్‌లో ఉన్నప్పటికీ న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కకు పెట్టడం విశేషం. బ్యాటర్‌గానే కాకుండా బౌలింగ్‌లోనూ (స్పిన్నర్‌గా) రాణించే సత్తా ఉన్న రచిన్‌ను న్యూజిలాండ్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియలేదు. న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అజాజ్ పటేల్, ఐష్ సోధి, పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా గ్లెన్ ఫిలిప్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టిమ్ సౌథీ నేతృత్వంలో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్సన్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, కైల్ జేమీసన్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టును నజ్ముల్ హసన్ షాంటో ముందుండి నడిపిస్తున్నాడు. మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాహదత్ హుస్సేన్, నూరుల్ హసన్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, షోరీఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. జకీర్ హసన్ (12), షాంటో (37) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (42), మోమినుల్ హక్ (3) క్రీజ్‌లో ఉన్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్‌కు తలో వికెట్ దక్కింది. -
డొమినికా టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 421/5 డిక్లేర్డ్
-
150 పరుగులు పూర్తి చేసిన యశస్వి.. తొలి భారత క్రికెటర్‌గా..!
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పూర్తి ఆధిక్యం దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే ఓవర్‌నైట్ బ్యాటర్ యశస్వి 150 పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలో అతను టెస్ట్ డెబ్యూలో 150 పరుగుల మార్కును అందుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా, అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును దాటగా.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా పాక్ మాజీ క్రికెటర్ జావిద్ మియాందాద్ కొనసాగుతున్నాడు. మియాందాద్.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్‌లో 150 పరుగుల మార్కును దాటాడు. అతని తర్వాత ఆసీస్ ఆర్కీ జాక్సన్ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్ డౌగ్ వాల్టర్స్ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) వరుసలో ఉన్నారు. వీరి తర్వాత అత్యంత పిన్న వయసులో 150 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా యశస్వి రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, మూడో రోజు ఆట ప్రారంభం కాగానే జేసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో బౌండరీ, సింగల్ బాది యశస్వి 150 పరుగుల మార్కును అందుకున్నాడు. 359 బంతుల్లో అతను 150 మార్కును దాటాడు. 121 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 330/2గా ఉంది. యశస్వి (156)కి జతగా విరాట్ కోహ్లి (41) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (5/60), జడేజా (3/26) విండీస్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతక్కొట్టగా.. శుభ్‌మన్ గిల్ (6) విఫలమయ్యాడు. -
భారత బౌలర్ల జోరు
రోసీయూ (డొమినికా): వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ పైచేయి సాధించింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి రోజు టీ విరామ సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెరీర్లో మొదటి టెస్టు ఆడుతున్న అలిక్ అతనజ్ (99 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. టాస్ గెలిచి విండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్‌కు 31 పరుగులు జత చేసి ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (12) కుదురుకున్నట్లుగా అనిపించారు. అయితే 7 పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అశ్విన్ అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. శార్దుల్ తన తొలి ఓవర్లోనే రీఫర్ (2)ను వెనక్కి పంపగా, సిరాజ్ చక్కటి క్యాచ్‌కు బ్లాక్‌వుడ్ (14) అవుట్ కావడంతో లంచ్ సమయానికే స్కోరు 68/4కు చేరింది. మరో ఎండ్‌లో అలిక్ మాత్రమే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. సొంత మైదానంలో అతను కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. రెండో సెషన్లో భారత్ మరో 3 వికెట్లు తీయడంలో సఫలమైంది. డి సిల్వ (2) ప్రభావం చూపలేకపోగా, హోల్డర్ (18) వికెట్ సిరాజ్ ఖాతాలో చేరింది. ఐదు పరుగుల వ్యవధిలో జోసెఫ్ (4), అలిక్లను అశ్విన్ అవుట్ చేశాడు. జోసెఫ్ వికెట్‌తో అశ్విన్ అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 700కు చేరడం విశేషం. యశస్వి, ఇషాన్ అరంగేట్రం తొలి టెస్టులో భారత జట్టు ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం క ల్పించింది. ఊహించిన విధంగానే యశస్వి జైస్వాల్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభించగా... వికెట్ కీపర్‌గా ఇప్పటికే 14 వన్డేలు, 27 టి20లు ఆడిన ఇషాన్ కిషన్ తొలిసారి టెస్టు క్రికెట్ బరిలోకి దిగాడు. భారత్ తరఫున టెస్టులు ఆడిన 306వ, 307వ ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు. భారత్ ఆడిన గత ఐదు టెస్టుల్లో కీపర్‌గా ఉన్న ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ స్థానంలో ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఇషాన్‌కు తుది జట్టులో చోటు ఇచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇషాన్ 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 38.76 సగటుతో 2985 పరుగులు చేశాడు. ముంబై ఆటగాడు యశస్వి గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లో మెరుపులు, దేశవాళీ వన్డేల్లో మెరుపు బ్యాటింగ్ మాత్రమే కాకుండా 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 9 సెంచరీలతో 80.21 సగటుతో 1845 పరుగులు సాధించడం అతనికి అవకాశం క ల్పించింది. -
IND VS WI 1st Test: టీమిండియా స్టార్ బౌలర్ ముంగిట అత్యంత అరుదైన రికార్డు
విండీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. డొమినిక వేదికగా రేపటి నుంచి (జులై 12) ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో అశ్విన్ మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో 16వ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అశ్విన్‌కు ముందు భారత స్పిన్నర్లు అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (711) మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అధిగమించారు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 270 మ్యాచ్‌ల్లో (92 టెస్ట్‌లు, 113 వన్డేలు, 65 టీ20లు) 697 వికెట్లు (టెస్ట్‌ల్లో 474, వన్డేల్లో 151, టీ20ల్లో 72) ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో టీమిండియాకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. గత రెండు దశాబ్దాల రికార్డును చూస్తే విండీస్‌పై టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఈ సిరీస్‌లో రోహిత్ సేననే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో పోలిస్తే విండీస్ గడ్డపై అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. కరీబియన్ గడ్డపై అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశాడు. ఇక్కడే కాకుండా ఓవరాల్‌గా చూసినా అశ్విన్‌కు విండీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో యాష్, 4 సెంచరీల సాయంతో 552 పరుగులు చేసి, 60 వికెట్లు పడగొట్టాడు. విండీస్ గడ్డపై ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతను 2 సెంచరీల సాయంతో 58.75 సగటున పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. చదవండి: టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు -
విండీస్‌తో తొలి టెస్ట్.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల అరంగేట్రం..!
విండీస్‌లో భారత పర్యటన జులై 12న మొదలయ్యే తొలి టెస్ట్ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను దూరదర్శన్ ఛానల్‌తో పాటు జియో సినిమా ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ తర్వాత దాదాపు నెల పాటు విరామం తీసుకున్న టీమిండియా.. విండీస్‌తో టెస్ట్ సిరీస్ ద్వారా తిరిగి బరిలోకి దిగనుంది. డబ్ల్యూటీసీ 20223-25 సైకిల్లో భారత్‌కు ఇది తొలి మ్యాచ్ కావడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువకులు, అనుభవజ్ఞులు జట్టులో ఉండటంతో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై పలు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. విండీస్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. వెబ్సైట్లలో కథనాల విషయాన్ని పక్కన పెడితే.. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు విండీస్‌తో తొలి టెస్ట్ ద్వారా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్ తొలిసారి భారత టెస్ట్ జెర్సీల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ ముగ్గురు తుది జట్టులో ఉండటం ఖాయమని.. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్, రుతరాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, ఉనద్కత్, నవ్‌దీప్ సైనీలకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతారని, యశస్వి జైస్వాల్.. పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని సమాచారం. ఆతర్వాత విరాట్ కోహ్లి, అజింక్య రహానే బరిలోకి దిగుతారని, ఇషాన్ కిషన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తోంది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్లు తుది జట్టులో ఉంటారని, స్పెషలిస్ట్ పేసర్‌గా మహ్మద్ సిరాజ్‌తో పాటు ముకేశ్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని సమాచారం. -
ENG VS AUS Ashes 1st Test: ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ నివేదిక ప్రకారం.. ఇవాళ ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సమాచారం. అయితే మ్యాచ్ ఆరంభ సమయానికి వరుణుడు శాంతివచ్చని అధికారులు నివేదికలో పొందుపర్చారు. తిరిగి 11 గంటల సమయంలో వర్షం పడేందుకు 84 శాతం అవకాశాలు ఉన్నాయని.. అది మధ్యాహ్న సమయానికి 50-40 శాతానికి పడిపోవచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే కీలకమైన చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించక మానడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ తొండాట ఆడాడు. నాలుగో రోజు ఆటలో షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతను.. క్యాచ్ పట్టలేదని తెలిసినా సంబరాలు చేసుకుని ఇంగ్లండ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 55వ ఓవర్లో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. Whi this Not out . The way labuschagne was celebrating, it shows the great sportsmanship of Aussies 😂. @ShubmanGill pic.twitter.com/PgYdwIyase — niraj kumar (@nirajku1234) June 19, 2023 రాబిన్సన్ రివ్యూకి వెళ్లగా బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వడంతో ఫ్యాన్స్ లబూషేన్‌ను ఏకిపారేస్తున్నారు. ఇలా ప్రవర్తించడం క్రీడా స్పూర్తికి వ్యతిరేకమని చురకలంటిస్తున్నారు. తొండాటకు ఆసీస్ ఆటగాళ్లు కేరాఫ్ అడ్రస్ అని విరుచుకుపడుతున్నారు. Marnus Labuschagne really grassed the ball and dragged it on the ground before picking it up and throwing it in the air to celebrate a catch. Whatever happened to shame, Labushame?#ENGvsAUS #Ashes2023 — AJ (@UtdBrunoJr) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. Im afraid I've got no choice but to respect Marnus Labuschagne blatantly cheating in front of a stadium full of cameras and expecting to get away with it. — Jack (@JackInPogForm) June 19, 2023 ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
స్టీవ్ స్మిత్‌ను దారుణంగా అవమానించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్-2023 తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూ రాక్షసానందం పొందారు. 2018 బాల్ టాంపరింగ్ ఇష్యూ తదనంతరం జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ గేలి చేశారు. Atmosphere 💀pic.twitter.com/Oxt4mQ860k — Shivani (@meme_ki_diwani) June 19, 2023 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్మిత్ మీడియా ముందు ఏడుస్తూ తప్పు ఒప్పుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ పాట ద్వారా టీజ్ చేశారు. We Saw You Crying On Telly (నువ్వు టీవీలో ఏడుస్తుంటే మేము చూశాం) అంటూ స్టేడియం మొత్తం ముక్తకంఠంతో పాట పాడుతూ స్మిత్ మనసు గాయపడేలా ప్రవర్తించారు. Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz — cricket.com.au (@cricketcomau) March 29, 2018 స్టేడియంలో ప్రేక్షకులు ఇలా చేస్తుంటే స్మిత్ తెగ ఇబ్బంది పడ్డాడు. పైకి నవ్వుతూ ఇంకా పాడండి అంటున్నట్లు తల ఊపినప్పటికీ.. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. నెటిజన్లు ఇంగ్లండ్ ప్రేక్షకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. ఎలాంటి వ్యక్తినైనా ఈ తరహాలో ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. Steve Smith heads over to the Hollies for the first time this series….#Ashes pic.twitter.com/Hs1cRB56Lb — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
Ashes 1st Test: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో (టెస్ట్‌లతో కలుపుకుని) 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో జిమ్మీ ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2002లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆండర్సన్.. కేవలం 289 మ్యాచ్‌ల్లోనే 1100 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 54 సార్లు 5 వికెట్ల ఘనత (ఇన్నింగ్స్‌లో), 6 సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్‌లో) సాధించాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 7/19గా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్ల ఘనత ఇంగ్లండ్‌కే చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్ పేరిట ఉంది. అతను 1110 మ్యాచ్‌ల్లో ఏకంగా 4204 వికెట్లు పడగొట్టాడు. విల్ఫ్రెడ్ తర్వాత టిచ్ ఫ్రీమన్ (592 మ్యాచ్‌ల్లో 3776 వికెట్లు), చార్లీ పార్కర్ (635 మ్యాచ్‌ల్లో 3278 వికెట్లు) ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2003లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన ఆండర్సన్.. 180 మ్యాచ్‌ల్లో 686 వికెట్లు పడగొట్టి, ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆండర్సన్ టెస్ట్‌ల్లో 32 సార్లు 5 వికెట్ల ఘనత, 3 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. అతని అత్యుత్తమ టెస్ట్ గణాంకాలు 7/42గా ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ముత్తయ్య మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు కేవలం 32.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసి, 35 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్ చేయగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. -
Ashes 1st Test: స్టీవ్ స్మిత్‌కు అలా.. ఉస్మాన్ ఖ్వాజాకు ఇలా..!
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా బయటపెట్డాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన స్టోక్స్.. ఫీల్డింగ్ మొహరింపు విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తొలుత స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు నాలుగు స్లిప్‌లు, రెండు లెగ్ స్లిప్‌లు మొహరించిన స్టోక్స్.. ఆట మూడో రోజు (ఇవాళ, జూన్ 18) ఉస్మాన్ ఖ్వాజాపై ఒత్తిడి తెచ్చేందుకు క్వార్టర్ సర్కిల్లో ఆరుగురు ఫీల్డర్లను మొహరించాడు. స్టోక్స్ ఫీల్డ్ సెట్టింగ్ వల్ల ఒత్తిడికి లోనైన ఖ్వాజా.. వారిపై నుంచి భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి రాబిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా వైవిధ్యభరితమైన ఫీల్డ్ సెటింగ్ ద్వారా.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి ఔటయ్యేలా చేశాడు స్టోక్స్. SIX catchers in and the plan works 👏 Khawaja gone for 141.COME ON ENGLAND! 🏴 #EnglandCricket | #Ashes pic.twitter.com/6MLJcQxzCX— England Cricket (@englandcricket) June 18, 2023 కాగా, 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి 386 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాదాపుగా చేరుకునేలా చేశాడు. ఖ్వాజాతో పాటు ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (34) పోరాడటంతో ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం మాత్రమే దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
ENG VS AUS Ashes 1st Test: బజ్‌బాల్ బెడిసికొట్టింది..!
బజ్‌బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ క్రికెట్ ఉనికిని చెరిపే ప్రయత్నం చేస్తున్న ఇంగ్లండ్ జట్టుకు తిక్క కుదిరింది. వారు నమ్ముకున్న బజ్‌బాల్ ఫార్ములా తొలిసారి బెడిసికొట్టింది. ఆసీస్ లాంటి జట్టు ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు బజ్‌బాల్, గిజ్బాల్ అంటూ ఓవరాక్షన్లు చేయకూడదని ఇంగ్లండ్‌కు తెలిసొచ్చింది. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ పరిస్థితి ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా మారింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తిక్క కుదిర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (38) సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఆసీస్ దాదాపుగా చేరుకున్నంత పని చేసింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటై, 7 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే అలెక్స్ క్యారీ వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత ఖ్వాజా.. కమిన్స్ సాయంతో ఆసీస్ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆఖర్లో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 386 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
Ashes 1st Test: ఉస్మాన్ ఖ్వాజా శతకం.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పోరాడుతుంది. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన ఆ జట్టును ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) సెంచరీతో ఆదుకున్నాడు. ట్రవిస్ హెడ్ (50) సాయంతో అతను ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టెస్ట్‌ల్లో ఖ్వాజాకు ఇది 15వ శతకం. 2022 నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఖ్వాజా ఈ మధ్యకాలంలో ప్రపంచ క్రికెట్లో అందరు బ్యాటర్ల కంటే అధికంగా 7 శతకాలు బాదాడు. 2022 నుంచి ఖ్వాజా, జో రూట్ మాత్రమే టెస్ట్‌ల్లో 7 సెంచరీలు చేశారు. వీరి తర్వాత జానీ బెయిర్‌స్టో 6 సెంచరీలు చేశాడు. Diet Cokes all round! Well batted, @Uz_Khawaja #Ashes pic.twitter.com/UVKJATCsBz— cricket.com.au (@cricketcomau) June 17, 2023 కాగా, ఉస్మాన్ ఖ్వాజా సెంచరీతో ఆదుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ జట్టు 70 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 163 పరుగులు వెనుకపడి ఉంది. ఖ్వాజాకు జతగా అలెక్స్ క్యారీ (3) క్రీజ్‌లో ఉన్నాడు. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), హెడ్ (50), గ్రీన్ (38) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీలకు తలో 2 వికెట్లు, స్టోక్స్‌కు ఓ వికెట్ (స్మిత్) దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్ ఖాతాలో వికెట్ -
Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..?
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ (టెస్ట్‌ల్లో) బజ్ బాల్ అంటూ తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అప్రోచ్‌తో ఆ జట్టు చాలా మ్యాచ్‌ల్లో గెలుపొంది, భారీ సక్సెస్ సాధించింది. తాజాగా ఆ జట్టు యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లోనూ బజ్‌బాల్ ఫార్ములానే ఉపయోగించి, తొలి ఇన్నింగ్స్‌ను తొలి రోజే డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం ఇంగ్లండ్‌కు మరో విజయం సాధించి పెడుతుందో, లేక ఆ జట్టు కొంపముంచుతుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. లంచ్ విరామం సమయానికి (78/3) ఆట ఇంగ్లండ్ వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ మరికొద్ది గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. లంచ్ తర్వాత ఆసీస్ గేర్ మార్చి వేగంగా పరుగులు సాధిస్తుండటంతో మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 148 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఉస్మాన్ ఖ్వాజా (66), ట్రవిస్ హెడ్ (50) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 245 పరుగులు వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. రెండో రోజు ఆట తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, స్టోక్స్ చెలరేగి.. వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ -
Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఆసీస్ స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ఆటగాడు స్టీవ్ స్మిత్ భరతం పట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న స్మిత్ (16)ను స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. స్టోక్స్ సంధించిన అద్భుతమైన ఇన్ స్వింగర్‌ను మిస్ అయిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్.. రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎత్తు విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. రీప్లేలో బంతి వికెట్ల టాప్ ఎడ్జ్ తగులుతుందని తేలింది. దీంతో స్మిత్ వెనుదిరగక తప్పలేదు. Ben Stokes delivers a HUGE wicket - Steve Smith lbw for 16!#ENGvAUS | #Ashes pic.twitter.com/whxBbi3x8s — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 స్టోక్స్ గర్జిస్తూ సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ బౌలింగ్‌కు దిగి కీలకమైన స్మిత్ వికెట్‌ను పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఉన్న ట్రాక్ రికార్డు చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణిపోయారు. అతను ఇక్కడ ఆడిన గత 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే స్మిత్ తన భీకర ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కొనసాగించలేకపోయాడు. స్టోక్స్ వ్యూహంలో చిక్కుకుని ఔటయ్యాడు. కాగా, స్మిత్ ఔటయ్యే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి, కష్టాల్లో పడింది. తొలుత స్టువర్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి (392/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. అతి భారీ విజయం
స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. 2004లో జింబాబ్వేపై ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో సాధించిన విజయమే ఈ మ్యాచ్‌కు ముందు వరకు శ్రీలంకకు అతి భారీ విజయంగా ఉండింది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అతి భారీ విజయం రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1938లో ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 579 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పసికూనపై చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌ను 591/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), కుశాల్ మెండిస్ (140), దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం ప్రభాత్ జయసూర్య విజృంభించడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన చేసి 168 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 3 వికెట్లు పడగొట్టగా.. రమేశ్ మెండిస్ 4, విశ్వ ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నారు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ ఏప్రిల్ 24 నుంచి ఇదే వేదికగా జరుగుతుంది. జయసూర్యకు 10.. 6 మ్యాచ్‌ల్లో 5 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 10 వికెట్లు తొలి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ప్రభాత్ జయసూర్య.. తన 6 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో రెండోసారి 10 వికెట్లు పడగొట్టాడు. 6 మ్యాచ్‌ల్లో మొత్తం 43 వికెట్లు సాధించిన జయసూర్య.. ఐదు సార్లు 5 వికెట్ల ఘనత కూడా సాధించాడు. రమేశ్ మెండిస్ రికార్డు.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన రమేశ్ మెండిస్.. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు (మ్యాచ్‌లు (11), ఇన్నింగ్స్ (21) పరంగా) పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
కరుణరత్నే, కుశాల్ భారీ శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (140) భారీ శతకాలతో విరుచుకుపడ్డారు. టెస్ట్‌ల్లో కరుణరత్నేకు ఇది 15వ సెంచరీ కాగా.. మెండిస్‌కు 8వది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దినేశ్ చండీమాల్ (18), ప్రభాత్ జయసూర్య (12) క్రీజ్‌లో ఉన్నారు. నిషాన్ మదుష్క (29), ఏంజెలో మాథ్యూస్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, కర్టిస్ క్యాంపర్, జార్జ్ డాక్రెల్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా కరుణరత్నే.. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య, స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్ కెరీర్లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్టేక్ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు (15) చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. -
లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్.. వరుస సెంచరీలు
BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్కొల్లమ్ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. -
శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్
డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్ సెంచరీ సాధించిన కేన్ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. India have qualified for the World Test Championship final! They'll take on Australia at The Oval for the #WTC23 mace! More: https://t.co/75Ojgct97X pic.twitter.com/ghOOL4oVZB — ICC (@ICC) March 13, 2023 ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, తన జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. New Zealand scurry to a famous Test win running a bye off the final ball! Sri Lanka's push for a spot in the #WTC23 final falls agonisingly short!#NZvSL Scorecard: https://t.co/p873rNARKS pic.twitter.com/CnFWN8xBti — ICC (@ICC) March 13, 2023 మరోపక్క ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లడంతో, న్యూజిలాండ్-శ్రీలంక తొలి టెస్ట్ ఫలితంపై డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఆధారపడి ఉండింది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ శ్రీలంక గెలిచి ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది. Test century No.27 for Kane Williamson! Has he done enough to guide New Zealand to a Test victory at Hagley Oval? Watch the #NZvSL series live with a Black Caps Pass on https://t.co/CPDKNxpgZ3 📺 pic.twitter.com/hNYkPKh8bt — ICC (@ICC) March 13, 2023 అయితే, తొలి టెస్ట్‌లోనే లంక ఓటమిపాలుకావడంతో ఆసీస్‌తో నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. A thriller in Christchurch. #NZvSL pic.twitter.com/7hv2j4bEjJ — BLACKCAPS (@BLACKCAPS) March 13, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక నిర్ధేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (121 నాటౌట్), డారిల్ మిచెల్ (81) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆఖరి బంతికి విజయాన్ని ఖరారు చేసుకుంది. ముఖ్యంగా కేన్ మామ అన్నీ తానై వ్యవహరించి, చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్‌కు విన్నింగ్ రన్ ఎక్స్ట్రా (బై) రూపంలో రావడం విశేషం. స్కోర్ వివరాలు.. శ్రీలంక: 355 & 302 న్యూజిలాండ్: 373 & 285/8 ఫలితం: 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం -
వెటోరీని అధిగమించిన సౌథీ.. రెండో స్థానానికి ఎగబాకిన కివీస్ కెప్టెన్
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ సారధి టిమ్ సౌథీ ఓ రేర్ ఫీట్‌ను సాధించాడు. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 3 వికెట్లు పడగొట్టిన సౌథీ ( తొలి రోజు ఆటలో).. న్యూజిలాండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2nd on the list! Tim Southee (362 wickets) becomes the second highest wicket-taker in Tests for New Zealand. Southee (706) now has the most international wickets for a New Zealander 🏏 #StatChat #NZvSL pic.twitter.com/2oXxxKw5ty — BLACKCAPS (@BLACKCAPS) March 9, 2023 93 టెస్ట్‌ల్లో 362 వికెట్లు పడగొట్టిన సౌథీ.. డేనియల్ వెటోరీని (112 టెస్ట్‌ల్లో 361) అధిగమించి, రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సౌథీ న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు (మూడు ఫార్మాట్లతో కలిపి) పడగొట్టిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్‌లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్ (578), కెయిన్స్ (419), మిల్స్ (327), మోరిసన్ (286), చాట్‌ఫీల్డ్ (263), బాండ్ (259), వాగ్నర్ (258) టాప్-10లో ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన ఏంజెలో మాథ్యూస్
శ్రీలంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఆ దేశ క్రికెట్‌కు సంబంధించి ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 47 పరుగులు చేసిన మాథ్యూస్.. శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో 7000 పరుగుల మార్కును అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. Angelo Mathews goes past Sanath Jayasuriya and become the 3rd Sri Lankan player to reach 7️⃣0️⃣0️⃣0️⃣ Test runs 🙌 #NZvSL pic.twitter.com/Y56YdYctaj — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 9, 2023 ఈ క్రమంలో అతను ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు. జయసూర్య 110 టెస్ట్‌ల్లో 6973 పరుగులు చేస్తే.. మాథ్యూస్ 101 టెస్ట్‌ల్లోనే 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. లంక తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్ధనే (149 టెస్ట్‌ల్లో 11814 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. A landmark achievement 👏 🇱🇰 Angelo Mathews becomes the third after @KumarSanga2 and @MahelaJay to 7000 Test runs for Sri Lanka pic.twitter.com/LYWnxSceVd — ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2023 లంక తరఫున టెస్ట్‌ల్లో 6000 అంతకంటే ఎక్కువ పరుగులు (ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో) చేసిన ఆటగాళ్లలో మాథ్యూస్ తర్వాత దిముత్ కరుణరత్నే (83 టెస్ట్‌ల్లో 6073) మాత్రమే ఉన్నాడు. ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటంగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన ఉండటంతో శ్రీలంక ఈ మ్యాచ్‌ను డూ ఆర్ డై అన్నట్లుగా తీసుకుంది. ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొంది. Who will join the Aussies in the World Test Championship 2023 final? 🤔 India🇮🇳 or Sri Lanka 🇱🇰? pic.twitter.com/KqBQQgYWRG — CricTracker (@Cricketracker) March 8, 2023 భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. -
ఇరగదీసిన లంక బ్యాటర్లు.. టీమిండియా కొంపముంచుతారా ఏందీ..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొన్న విషయం విధితమే. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ ఆసక్తికర పరిస్థితుల నడుమ కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, టీమిండియా అభిమానులకు భయం పుట్టిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో భారత అభిమానుల్లో కలవరం మొదలైంది. ఒకవేళ లంక ఆటగాళ్లు ఇదే జోరును కొనసాగించి రెండో టెస్ట్‌ల్లో గెలిస్తే టీమిండియా ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయని కొందరు అభిమానులు బెంగపెట్టుకున్నారు. ఆసీస్‌పై నాలుగో టెస్ట్‌లో టీమిండియా గెలిస్తే ఈ సమస్య ఉండదు కాబట్టి, అహ్మదాబాద్ టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. ఒక్క రోజే 16 వికెట్లు
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలడం, ఈ వికెట్లన్నీ ఇరు జట్ల పేసర్ల ఖాతాలోకే వెళ్లడంతో ఆట మరింత రసపట్టుగా మారింది. 314/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిధ్య సౌతాఫ్రికా మరో 28 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. ] సఫారీల ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (115) సెంచరీతో కదం తొక్కగా.. డీన్ ఎల్గర్ (71) హాఫ్ సెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 5 వికెట్లు నేలకూల్చగా.. రోచ్, మేయర్స్, గాబ్రియెల్, హోల్డర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. నోర్జే (5/36), రబాడ (2/44), కోయెట్జీ (2/45), జన్సెన్ (1/64) ధాటికి 212 పరుగులకే ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో రీఫర్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 130 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ టీమ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మార్క్రమ్ (35 నాటౌట్) నిలకడగా ఆడుతుండగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, రోచ్, హోల్డర్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 179 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. -
మార్క్రమ్ సెంచరీ: దక్షిణాఫ్రికా 314/8
వెస్టిండీస్ జట్టుతో సెంచూరియన్‌లో మంగళవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు సాధించింది. ఓపెనర్లలో మార్క్రమ్ (174 బంతుల్లో 115; 18 ఫోర్లు) సెంచరీ సాధించగా... డీన్ ఎల్గర్ (118 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించారు. మార్కో జాన్సెన్ (17 బ్యాటింగ్; 3 ఫోర్లు), కోట్జీ (11 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జారి జోసెఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. -
ENG Vs NZ: గర్జించిన వెటరన్ సింహాలు.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్
బజ్‌బాల్ విధానాన్ని అవలంభించి ఇంగ్లండ్ జట్టు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై ఆడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టును 267 పరుగుల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్లు ఆండర్సన్, బ్రాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ 7 వికెట్లతో విజృంభించగా.. బ్రాడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా ఈ వెటరన్ పేస్ ద్వయం రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగారు. బ్రాడ్ 4, ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాశించారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లు కావడం మరో ఆసక్తికర విషయం. ఇంగ్లండ్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆండర్సన్, బ్రాడ్ ధాటికి 126 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అటాకింగ్ ఫార్ములాను అమలు చేసిన ఇంగ్లండ్ మరోసారి సక్సెస్ సాధించింది. ఆండర్సన్, బ్రాడ్‌తో పాటు ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా.. టామ్ లాథమ్ (15), బ్రేస్‌వెల్ (25) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులకు ఆలౌటైంది. 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 374 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 126 పరుగులకే ఆలౌటై 267 పరుగుల తేడతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ బ్లండెల్ (138) సెంచరీతో, కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశారు. అనంతరం ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో న్యూజిలాండ్ బౌలర్లు వాగ్నర్ 6, టిక్నర్ 4, కుగ్గెలిన్ 4, బ్రేస్‌వెల్ 3, సౌథీ 2 పడగొట్టగా.. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 7, బ్రాడ్ 5, రాబిన్సన్ 5, జాక్ లీచ్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగనుంది. -
ENG VS NZ 1s Test: నిప్పులు చెరిగిన బ్రాడ్.. ఓటమి దిశగా కివీస్
2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో (డే అండ్ నైట్) విజయం దిశగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (10-5-21-4) నిప్పులు చెరగడంతో మూడో రోజు ఆఖరి సెషన్లో కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. క్రీజ్‌లో డారిల్ మిచెల్ (13),ర మైఖేల్బ్రేస్వెల్ (25) ఉన్నారు. బ్రాడ్ 4 వికెట్లతో విజృంభించగా.. రాబిన్సన్ ఓ వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో లాథమ్ (15), డెవాన్ కాన్వే (2), విలియమ్సన్ (0), హెన్రీ నికోల్స్ (7), టామ్ బ్లండెల్ (1) దారుణంగా విఫలమయ్యారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌటైంది. రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. ఓలీ పోప్ (49), స్టోక్స్ (31), రాబిన్సన్ (39), జాక్ క్రాలే (28), బెన్ డక్కెట్ (25) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్, బ్రేస్‌వెల్ చరో 3 వికెట్లు తీయగా.. వాగ్నర్, కెగ్గెలిన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 325 పరగుల స్కోర్‌కు న్యూజిలాండ్ ధీటుగానే బదులిచ్చింది. టామ్ బ్లండెల్ (138) సెంచరీతో కదం తొక్కగా.. కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 4, ఆండర్సన్ 3, బ్రాడ్, జాక్ లీచ్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలిన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. మరో వికెట్ ఉండగానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. -
అలా చేయకపోయుంటే కోహ్లి హవాలో రోహిత్ కొట్టుకుపోయేవాడు..!
Rohit Sharma-Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆస్ట్రేలియా మాజీ సారధి ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిడ్ డే కాలమ్‌కు రాసిన ఓ ఆర్టికల్‌లో ఛాపెల్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా మాజీ సారధి, రన్ మెషీన్ విరాట్ కోహ్లి పేరునూ ప్రస్తావిస్తూ.. రోహిత్ శర్మను టెస్ట్‌ల్లో ఓపెనింగ్ స్థానంలో పంపడం వల్ల టీమిండియా మేనేజ్మెంట్ అతని కెరీర్‌ను కాపాడిందని, కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం హిట్‌మ్యాన్ కెరీర్లో నిలదొక్కుకోవడానికి దోహదపడిందని బోల్డ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ మిడిలార్డర్ బ్యాటింగ్ దిగి తన అపార నైపుణ్యాన్ని వృధా చేసుకుంటున్నాడని ఓ దశలో అనిపించిందని, అప్పుడే రోహిత్ టెస్ట్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని భావించానని ఛాపెల్ తన కథనంలో పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందే విషయంలో రోహిత్ టీమిండియా మేనేజ్మెంట్ను ఒప్పించడంలో సఫలం అయ్యాడని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా స్థిరపడ్డాడని అన్నాడు. ఇలా జరుగకపోయి, మిడిలార్డర్లో, అదీ కోహ్లి తర్వాత బరిలోకి దిగుతూ వచ్చి ఉంటే.. రోహిత్ ఎప్పుడో కోహ్లి హవాలో కొట్టుకుపోయి ఉండేవాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్ తీరు చాలా మెరుగుపడిందని, ఓ రకంగా చెప్పాలంటే కెప్టెన్సీ రోహిత్ కెరీర్‌ను కాపాడిందని అన్నాడు. ఇదే కాలమ్‌లో ఛాపెల్.. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఆకాశానికెత్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో రోహత్ పెద్దన్న పాత్ర పోషించాడని, ఉపఖండపు పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో రోహిత్ ఇరు జట్ల ఆటగాళ్లకు బోధపడేలా చేశాడని తెలిపాడు. తొలి టెస్ట్‌లో రోహిత్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడని, మెలికలు తిరిగే పిచ్‌పై రోహిత్ సెంచరీ చేయడం అద్వితీయమని కొనియాడాడు. రోహిత్ కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేస్తుండటం చూసి ఆసీస్ బౌలర్లు విసిగిపోయారని, ఇదీ రోహిత్ కెపాసిటీ అని ప్రశంసలు కురిపించాడు. -
ప్రాక్టీస్ చేయనీకుండా అడ్డుకున్నారు.. ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటడంతో ప్రపంచ నంబర్ వన్ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (120).. జడేజా (5/47, 70, 2/34), అశ్విన్ (3/42, 23, 5/37) అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేయగా, ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఘన విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్న ఆసీస్ మాజీ ఆటగాళ్లు పిచ్‌పై విషప్రచారం చేస్తూ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. మ్యాచ్ పూర్తై నేటికి రెండ్రోజులవుతన్నా ఆసీస్ మాజీల వాగుడకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఆసీస్ ఓటమిని ఆ దేశ మీడియా సైతం అంగీకరించినప్పటికీ కొందరు మాత్రం ఇంకా పేలుతూనే ఉన్నారు. తాజాగా ఆ దేశ దిగ్గజ వికెట్‌కీపర్ ఇయాన్ హీలీ నాగ్‌పూర్ పిచ్‌పై, అక్కడి గ్రౌండ్ సిబ్బందిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లను ప్రాక్టీస్ చేయనీకుండా గ్రౌండ్ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పించాడు. సిబ్బంది పిచ్‌పై అసందర్భంగా నీళ్లు చల్లి, ప్రాక్టీస్ చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. తద్వారా తమ ప్లాన్లపై, విజయావకాశాలపై నాగ్‌పూర్ గ్రౌండ్ సిబ్బంది నీళ్లు చల్లారని వాపోయాడు. తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకుంటామని అడిగినప్పుడే స్టాఫ్ ఇలా చేశారని పేర్కొన్నాడు. ఇది మంచి సంప్రదాయం కాదని, ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని కోరాడు. హీలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. -
తొలి టెస్ట్‌లో భారత్ చేతిలో ఓటమి.. ఆసీస్ టీమ్‌పై దుమ్మెత్తిపోస్తున్న మీడియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, చారిత్రక విజయం సాధించగా.. ఆసీస్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైండ్‌గేమ్ (అశ్విన్ డూప్‌తో నెట్స్‌లో సాధన) అంటూ ఓవరాక్షన్ చేసిన ఆసీస్ టీమ్.. తుది జట్టు ఎంపిక (భీకర ఫామ్‌లో ఉన్న ట్రవిస్ హెడ్ స్థానంలో వార్నర్ ఎంపిక), బ్యాటింగ్ (మ్యాచ్ మొత్తంలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడం), బౌలింగ్ (రోహిత్ సెంచరీ కాకుండా టెయిలెండర్ల సాయంతో భారత్ 400 పరుగులు చేయడం), ఫీల్డింగ్ (పలు క్యాచ్‌లు జారవిడచడం).. ఇలా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ పరాభవాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆసీస్ మాజీలు కొందరు పిచ్‌పై నెపం మోపడం భారత అభిమానులతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో కొందరు ఆస్ట్రేలియన్లు చేస్తున్న విషప్రచారాన్ని ఆ దేశ మీడియా కూడా ఖండించింది. ఒకవేళ నిజంగా పిచ్‌లో లోపాలు ఉండివుంటే టీమిండియా 400 పరుగులు ఎలా సాధించగలిగిందని ప్రముఖ ఆసీస్ దినపత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, సిడ్నీ టెయిలీ టెలిగ్రాఫ్ ప్రశ్నించాయి. ప్రపంచ నంబర్ వన్ జట్టు అని బీరాలు పలికే ఆసీస్ టీమ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో (177, 91) కలిపి ముగ్గురు భారత ఆటగాళ్లు (రోహిత్ 120, అక్షర్ 84, జడేజా 70) సాధించిన స్కోర్ కూడా సాధించలేకపోవడంపై సదరు పత్రికలు మండిపడ్డాయి. తొలి టెస్ట్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైందని, ఇకనైనా వాస్తవాలను గ్రహించి, తప్పులను సరిదిద్దుకోకపోతే 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాయి. భారత స్టార్ స్పిన్ ద్వయం అశ్విన్ (23, 3/42, 5/37), జడేజా (70, 5/47, 2/34), బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పోటీపడి మరీ సత్తా చాటితే, వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లుగా చెప్పుకునే వార్నర్, స్మిత్, లబూషేన్‌లు కనీసం హాఫ్‌సెంచరీ కూడా సాధించలేకపోయారని దుమ్మెత్తిపోశాయి. మెలికలు తిరిగే పిచ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే జట్టు మొత్తం కలిసి సెకెండ్ ఇన్నింగ్స్‌లో(91) అతను చేసిన స్కోర్ కూడా చేయలేకపోయిందని తూర్పారబెట్టాయి. భారత స్పిన్ ద్వయం తమ ప్రదర్శనతో మీరు నిజంగా అగ్రస్థానానికి అర్హులేనా అన్న రీతిలో ప్రశ్నించాయని తమ కథనాల్లో పేర్కొన్నాయి. ట్రవిస్ హెడ్‌ను ఆడించకపోవడం తొలి రోజు సిల్లీగా అనిపించిందని, మూడో రోజు ఘోర తప్పిదంగా తేలిందని విశ్లేషించాయి. ప్రపంచ టాప్ జట్టు ర్యాంకింగ్స్‌లో తమ కంటే ఓ స్థానం కింద ఉన్న జట్టు చేతిలో ఘోరంగా ఓటమిపాలైనందుకు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశాయి. జట్టులో సమూల మార్పులకు సమయం ఆసన్నమైందని, రెండో టెస్ట్ కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టాలని సూచించాయి. కాగా, తొలి టెస్ట్‌లో విజయంతో భారత్ 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీ వేదికగా జరుగనుంది. -
IND VS AUS 1st Test: డేవిడ్ వార్నర్‌పై పగపట్టిన అశ్విన్
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పగపట్టాడా..? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే, టెస్ట్‌ల్లో వార్నర్‌ను అత్యధికంగా ఔట్ చేసిన బౌలర్లలో యాష్ రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్‌ను అశ్విన్ టెస్ట్‌ల్లో 11 సార్లు ఔట్ చేశాడు. వార్నర్‌ను ఇంతలా ఇబ్బంది పెట్టిన బౌలర్లలో ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్ (14 సార్లు), జిమ్మీ ఆండర్సన్ (10) ఒకటి, మూడు స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ అత్యధికంగా ఇబ్బంది పెట్టిన బ్యాటర్లలో కూడా వార్నర్ తొలి స్థానంలో నిలిచాడు. అశ్విన్.. తన టెస్ట్ కెరీర్ మొత్తంలో వార్నర్‌ను అత్యధికంగా 11 సార్లు ఔట్ చేయగా.. అన్నే సార్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను (11 సార్లు) కూడా పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరి తర్వాత అశ్విన్ ధాటికి ఎక్కువ సార్లు బలైన బ్యాటర్లలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సర్ అలిస్టర్ కుక్ ఉన్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో కుక్ 9 సార్లు ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో ఓ భారత బౌలర్ అత్యధిక సార్లు ఒకే బ్యాటర్‌ను ఔట్ చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్.. పాకిస్తాన్ ఆటగాడు ముదస్సర్ నాజర్‌ను అత్యధికంగా 12 సార్లు ఔట్ చేశాడు. ఈ జాబితాలో కపిల్ తర్వాత రెండు స్థానాల్లో అశ్వినే ఉన్నాడు. యాష్.. వార్నర్, స్టోక్స్‌లను టెస్ట్‌ల్లో 11 సార్లు ఔట్ చేశాడు. అశ్విన్‌కు ముందు కుక్కు అత్యధికంగా ఇబ్బంది పెట్టిన బౌలర్లలో టీమిండియా మాజీ పేసర్ ఇషాంత్ శర్మ ఉన్నాడు. ఇషాంత్.. కుక్‌ను టెస్ట్‌ల్లో 11 సార్లు పెవిలియన్‌కు సాగనంపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ తన బాధితుల జాబితాలో స్టోక్స్‌కు సమానంగా వార్నర్‌కు ప్లేస్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ.. వార్నర్‌ను (1) క్లీన్ బౌల్డ్ చేయగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన వార్నర్‌ను యాష్ ఎల్బీడబ్యూగా ఔట్ చేశాడు. కాగా, తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. -
పిచ్‌పై నిందలేల.. అశ్విన్ డూప్‌ను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు కదా..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలుపులో భారత స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. రవీంద్ర జడేజా (5/47, 2/34), రవిచంద్రన్ అశ్విన్ (3/42, 5/37) పోటీపడి మరీ సత్తా చాటారు. జడేజా అయితే బ్యాట్‌తోనూ (70) రాణించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ స్పిన్నర్లు మొత్తంగా 16 వికెట్లు (జడేజా 7, అశ్విన్ 8, అక్షర్ 1) పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాశించారు. టీమిండియా కోల్పోయిన 10 వికెట్లలో సైతం ప్రత్యర్ధి స్పిన్నర్లే ప్రధానంగా దక్కించుకున్నారు. అరంగేట్రం స్పిన్నర్ టాడ్ మర్ఫీ 7 వికెట్లతో చెలరేగగా, వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే నాగ్‌పూర్ టెస్ట్‌లో స్పిన్నర్ల హవా నడిచిందన్న విషయం స్పష్టమవుతుంది. ఆ జట్టు, ఈ జట్టు అన్న తేడా లేకుండా ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు సింహభాగం వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో నేలకూలిన 30 వికెట్లలో 24 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి వెళ్లగా.. పేసర్లు షమీ 3, కమిన్స్ 2, సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఘన విజయాన్ని ఓర్వలేకపోతున్న ఆసీస్ మీడియా, అభిమానులు, ఆ దేశ మాజీలు విషప్రచారం మొదలుపెట్టారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. దీనికి కౌంటర్‌గా భారత అభిమానులు, మాజీలు కూడా స్పందిస్తున్నారు. ఆసీస్ చేసే విషప్రచారాన్ని టీమిండియా ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ఒక్క జట్టుకు మాత్రమే సహకరించే పిచ్‌లను తయారు చేసుకోవడం ఎలా సాధ్యపడుతుంది, ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్‌కు కూడా చిప్ దొబ్బినట్లుందని మండిపడుతున్నారు. How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they've only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j — cricket.com.au (@cricketcomau) February 3, 2023 ఇదే జరిగి ఉంటే ఆసీస్ స్పిన్నర్లు 8 వికెట్లు ఎలా తీస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఆసీస్ అభిమానులు ఓటమిని ఒప్పుకుంటే హుందాగా ఉంటుందని, ఇలాంటి చౌకబారు ప్రచారం మానుకోకపోతే టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి బుద్ధి చెబుతుందని చురకలంటిస్తున్నారు. కొందరు హార్డ్‌కోర్ ఇండియన్ ఫ్యాన్స్ అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ ఆటగాళ్లు చేసిన హడావుడిని ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తున్నారు. అచ్చం అశ్విన్‌లా బౌలింగ్ చేసే డూప్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు కదా అని పంచ్‌లు వేస్తున్నారు. నెట్స్‌లో అతని బౌలింగ్‌లో ఇరగదీసిన వారికి మ్యాచ్‌లో ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కాగా, తొలి టెస్ట్‌కు ముందు ఆసీస్ క్రికెటర్లు బరోడా స్పిన్నర్, అచ్చం అశ్విన్‌లా బౌలింగ్ చేసే మహేశ్ పితియాను నెట్స్‌లోకి ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ ప్రాక్టీస్ వెలగబెట్టారు. నెట్స్‌లో మహేశ్ ఆసీస్ బ్యాటర్లకు బాగానే ఉపయోగపడ్డాడు. దీని వల్లే ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌లో లోపాలను ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా మహేశ్ స్వయంగా ప్రస్తావించాడు. Australia picked Ravi Ashwin's action, but not his brain 🧠#INDvAUS | @ashwinravi99 | #BGT2023 pic.twitter.com/WnkBJRFkrr — CricTracker (@Cricketracker) February 11, 2023 స్టీవ్ స్మిత్‌ను నెట్స్‌లో ఐదారు సార్లు ఔట్ చేసినట్లు మహేశ్ చెప్పాడు. ఇక్కడ మరో ఆసక్తికర అంశమేమింటంటే.. తన ఆరాధ్య ఆటగాడు అశ్విన్ ఎదురుపడిన సందర్భంగా మహేశ్ అతని పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు. ఆ సందర్భంలో కోహ్లి సైతం మహేశ్‌ను పలకరించాడు. ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తున్న 21 ఏళ్ల మహేశ్.. అశ్విన్‌ను ఆరాధ్య దైవంగా కొలుస్తూ.. అతన్నే ఆదర్శంగా తీసుకున్నాడు. -
టీమిండియా ఘనమైన రికార్డు.. 43 టెస్ట్‌ల్లో రెండింటిలో మాత్రమే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్ శర్మ (120) సెంచరీతో, అశ్విన్ (3/42, 5/37) 8 వికెట్లతో, అక్షర్ పటేల్ (84) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజృంభించారు. టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్-జడేజా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే టపా కట్టేసింది. తద్వారా ఆసీస్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. No matter what way you spin it, it was a collapse of horrendous proportions 😬 MORE 👉 https://t.co/SkN6XrjNdJ pic.twitter.com/na0M84J2mk — Fox Cricket (@FoxCricket) February 11, 2023 కమిన్స్ సేన భారత్‌పై భారత్‌లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 2003లో వాంఖడేలో 93 పరుగులకే ఆలౌటైన ఆసీస్.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే చాపచుట్టేసి 20 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్‌పై స్వదేశంలో కాని భారత్‌తో కాని ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. 1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్‌లో ఆసీస్ 83 పరుగులకే ఆలౌటై భారత్‌పై అత్యల్ప స్కోర్‌ను రికార్డు చేసింది. India has won 35 matches in the last 43 Tests at home by losing just 2. — Johns. (@CricCrazyJohns) February 11, 2023 ఈ మ్యాచ్‌లో 91 పరుగులకే ఆలౌట్ కావడం ద్వారా ఆసీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంటే.. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్‌పై విజయంతో.. స్వదేశంలో టీమిండియా విజయాల సంఖ్య 35కు చేరుకుంది. సొంతగడ్డపై తిరుగులేని జట్టుగా పేరొందిన భారత్.. చివరిగా ఆడిన 43 మ్యాచ్‌ల్లో 35 విజయాలు సాధించి, కేవలం రెండింటిలో మాత్రమే ఓడింది. మిగిలిన 6 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. -
చరిత్ర సృష్టించిన నాథన్ లయోన్.. నో బాల్ వేయకుండా 30,000 బంతులు
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ ఈ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో లయోన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇంతకీ లయోన్ సాధించిన ఆ రికార్డు ఏంటంటే.. 1877లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క బౌలర్ (కనీసం 100 టెస్ట్‌లు ఆడిన క్రికెటర్) టెస్ట్‌ల్లో కనీసం ఒక్క నో బాల్ కూడా వేయకుండా 30,000 బంతులను బౌల్ చేశాడు. ఆ మహానుభావుడే నాథన్ లయోన్. 2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన లయోన్.. ఇప్పటివరకు 115 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 460 వికెట్లను పడగొట్టాడు. Nathan Lyon today bowled his 30,000th delivery in Test cricket without ever overstepping. Not a single line no-ball in entire career. — Mazher Arshad (@MazherArshad) February 11, 2023 12 ఏళ్ల కెరీర్లో 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లయోన్ ఒక్కసారి కూడా క్రీజ్ దాటకపోవడమనేది సాధారణ విషయం కాదు. సుదీర్ఘ కెరీర్లో ఇంత పద్ధతిగా, క్రమశిక్షణగా, స్థిరంగా బౌలింగ్ చేయడమనేది నేటి జనరేషన్లో అస్సలు ఊహించలేము. పొట్టి ఫార్మాట్లో ఇటీవలికాలంలో మన టీమిండియా బౌలర్ ఒకరు ఒకే ఓవర్ ఏకంగా ఐదు సార్లు క్రీజ్ దాటి బౌలింగ్ చేసిన ఘటన కళ్లముందు మెదులుతూనే ఉంది. టెస్ట్ క్రికెట్లో ఏ బౌలర్‌కు సాధ్యంకాని ఈ రికార్డును 35 ఏళ్ల లయోన్ నమోదు చేసినట్లు ప్రముఖ గణాంకవేత్త మజర్ అర్షద్ వెలుగులోకి తెచ్చాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా లయోన్ ఈ రేర్ ఫీట్‌ను సాధించినట్లు మజర్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్ శర్మ (120) సెంచరీతో, అశ్విన్ (3/42, 5/37) 8 వికెట్లతో, అక్షర్ పటేల్ (84) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజృంభించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే చాపచుట్టేయగా.. టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లతో విజృంభించగా.. కమిన్స్ 2, లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అశ్విన్, జడేజా, షమీ (2/13), అక్షర్ పటేల్ (1/6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ కేవలం 91 పరుగులకే టపా కట్టేసి ఇన్నింగ్స్ ఓటమిని ఎదుర్కొంది. -
కోహ్లి, కేఎల్ రాహుల్‌లను అధిగమించిన షమీ
Mohammed Shami: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్ శర్మ (120) సెంచరీతో, అశ్విన్ (3/42, 5/37) 8 వికెట్లతో అక్షర్ పటేల్ (84) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో విజృంభించారు. భారత ఇన్నింగ్స్ చివర్లో మహ్మద్ షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ స్పిన్నర్లపై విరుచుకుపడిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. Great shot by @MdShami11 🥵💪#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MohammedShami #Jadeja #INDvsAUSTest #BGT2023 pic.twitter.com/gg71Agzp05 — Rajat Singh (@SinghRajat00) February 11, 2023 ఈ ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదుర్కొన్న షమీ.. 3 భారీ సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ క్రమంలో షమీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓ విషయంలో అధిగమించాడు. అదేంటంటే.. కోహ్లి తన 104 మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో 24 సిక్సర్లు బాదగా.. షమీ కేవలం 60 టెస్ట్‌ల్లోనే పాతిక సిక్సర్లు బాది కోహ్లిని దాటేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (107) పేరిట ఉండగా.. భారత్ తరఫున ఈ రికార్డు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట నమోదై ఉంది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో 66 టెస్ట్ సిక్సర్లు ఉన్నాయి. 🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted. 👏 A splendid knock from @MdShami11! 📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu — The Bharat Army (@thebharatarmy) February 11, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. జడేజా, అశ్విన్‌లతో పాటు షమీ (1/18), సిరాజ్ (1/30) కూడా తలో చేయి వేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కు చాపచుట్టేసింది. అనంతరం రోహిత్ సూపర్ సెంచరీతో, అక్షర్, జడేజా బాధ్యతాయుతమైన హాఫ్‌సెంచరీలతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లతో విజృంభించగా.. కమిన్స్ 2, లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అశ్విన్, జడేజా, షమీ (2/13), అక్షర్ పటేల్ (1/6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ కేవలం 91 పరుగులకే టపా కట్టేసి ఇన్నింగ్స్ ఓటమిని ఎదుర్కొంది. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (25 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్‌లో ఇరగదీసిన అక్షర్ పటేల్
Axar Patel: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా అప్‌కమింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ బంతితో విఫలమైనా, కీలక తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధసెంచరీతో మెరిశాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా సహకారంతో జట్టుకు కీలక పరుగులు సమకూర్చిన అక్షర్.. కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు 94 బంతులు ఆడిన అక్షర్ 8 ఫోర్లు బాదాడు. జట్టు స్కోర్ 240 వద్ద నుండగా తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్.. బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు అత్యంత కీలకమై లీడ్‌ను అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన అక్షర్ బ్యాట్‌తో మెరుగ్గా రాణిస్తూ.. జట్టు బ్యాటింగ్ డెప్త్ ప్రత్యర్ధికి తెలిసేలా చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 321/7గా ఉంది. అక్షర్ (52), రవీంద్ర జడేజా (66) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (120) సెంచరీ సాధించి స్కోర్‌కు బలమైన పునాది వేయగా.. జడేజా, అక్షర్ జోడీ అజేయమైన 81 పరుగులు జోడించి, టీమిండియా ఆధిక్యాన్ని 144 పరుగులకు చేర్చారు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (20), అశ్విన్ (23) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. పుజారా (7), కోహ్లి (12), సూర్యకుమార్ యాదవ్ (8), కేఎస్ భరత్ (8) దారుణంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 5 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లయోన్, పాట్ కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. జడేజా (5/47), అశ్విన్ (3/42) ఆసీస్ పతనాన్ని శాశించారు. సిరాజ్, షమీ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
రీ ఎంట్రీలో దుమ్మురేపుతున్న రవీంద్ర జడేజా.. ఐదేయడంతో పాటు..!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. గాయం కారణంగా గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్.. వచ్చీ రాగానే టెస్ట్‌ల్లో తన ప్రతాపం చూపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నిన్న బంతితో (5/68) మ్యాజిక్ చేసిన జడేజా.. ఇవాళ (ఫిబ్రవరి 10) బ్యాట్‌తో (53 నాటౌట్) రెచ్చిపోయాడు. ఈ సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో చెలరేగిన జడేజా.. తమిళనాడుపై ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్.. పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. టెస్ట్‌ల్లో జడేజా గత 10 ఇన్నింగ్స్‌లను ఓ సారి పరిశీలిస్తే.. గతేడాది జడ్డూ చివరిగా ఆడిన టెస్ట్ మ్యాచ్‌లోనూ శతకంతో మెరిశాడు. Five-wicket haul ✅ Half-century ✅ A comeback to remember for Ravindra Jadeja!#WTC23 | #INDvAUS | 📝: https://t.co/rzMJy0hUFm pic.twitter.com/73wVkN1xKI — ICC (@ICC) February 10, 2023 జూన్ 1 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. దానికి ముందు మార్చి 4న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన జడేజా.. ఏకంగా 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బంతితోనూ మ్యాజిక్ చేసిన జడ్డూ భాయ్.. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. దీనికి ముందు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ చేసి 5 వికెట్లు పడగొట్టిన జడేజా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇటీవలికాలంలో ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా రాటుదేలిన జడేజా.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన మార్కు ప్రభావం చూపుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత రోహిత్ సహకారంతో చెలరేగిన (బ్యాటింగ్) జడేజా.. ఆతర్వాత సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుతున్నా తాను మాత్రం ఏకాగ్రతతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 99 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 281/7గా ఉంది. జడేజాకు తోడుగా మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (22) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్ 105 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Rohit Sharma: భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యంకాని ఓ అత్యంత అరుదైన రికార్డును టీమిండియా సారధి రోహిత్ శర్మ నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో సెంచరీ సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉండేది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆతర్వాత సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. రోహిత్ తన కెరీర్లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ సాధించిన తొలి సెంచరీ ఇదే. తాజా సెంచరీతో హిట్‌మ్యాన్ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోని, కోహ్లిలకు సాధ్యంకాని అత్యంత అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో రెండేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ కెరీర్లో 9వ టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్ 43వ శతకాన్ని పూర్తి చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ ఓ పక్క వికెట్లు పేకమేడలా కూలుతున్నా.. మొక్కవోని మనోధైర్యంతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేశాడు. సహచరులు పుజారా (7), కోహ్లి (12), సూర్యకుమార్ యాదవ్ (8) ఆసీస్ స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయినా రోహిత్ మాత్రం వారిపై ఎదురుదాడికి దిగి సెంచరీ తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను (181 బంతుల్లో 105; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) కొనసాగిస్తున్నాడు. హిట్‌మ్యాన్‌కు జతగా జడేజా (22) క్రీజ్‌లో ఉన్నాడు. 71 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 201/5గా ఉంది. ప్రస్తుతానికి టీమిండియా 24 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) ఆసీస్ పతనాన్ని శాసించారు. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), హ్యాండ్స్కోంబ్ (31), అలెక్స్ క్యారీ (36)లకు మంచి ఆరంభాలే లభించిన వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమయ్యారు. -
IND VS AUS 1st Test Day 2: నిరాశపరిచిన కోహ్లి.. తొలి బంతికే..!
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా సాగుతుంది. రెండో రోజు లంచ్ సమయానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 151గా ఉండింది. అయితే లంచ్ విరామం తర్వాత తొలి బంతికే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. లంచ్ తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఔటయ్యాడు. కోహ్లి వికెట్ కూడా ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఖాతాలోకే వెళ్లింది. టీమిండియా కోల్పోయిన నాలుగు వికెట్లు ఈ యువ స్పిన్నరే పడగొట్టడం విశేషం. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని గ్లాన్స్ చేసే క్రమంలో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు కోహ్లి. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి ఏ మెరుపులు లేకుండా ఔట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లి సెంచరీ చేస్తాడని ప్లకార్డులు, బ్యానర్లు రెడీ చేసుకున్న అభిమానులు అతను ఔట్ కాగానే వాటిని దాచేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా కింగ్ సెంచరీ చేయకపోడా అన్న ఆశతో వారు కనిపించారు. మరోపక్క కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కో పరుగూ చేస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 57 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 163/4గా ఉంది. రోహిత్‌కు (89) జతగా సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) ఆసీస్ పతనాన్ని శాసించారు. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), హ్యాండ్స్కోంబ్ (31), అలెక్స్ క్యారీ (36)లకు మంచి ఆరంభాలే లభించినా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమయ్యారు. ఈ నలుగురు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఇంకెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. -
BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఇషాన్ కిషన్..!
Ravi Shastri Prediction: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను(భారత్) ప్రకటించాడు. ఐసీసీ రివ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి టెస్ట్‌లో భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తన అంచనాను వెల్లడించాడు. రవిశాస్త్రి పిక్ చేసిన 11 మందిలో రెండు అనూహ్య ప్రతిపాదనలు ఉన్నాయి. వికెట్‌కీపర్‌గా శ్రీకర్ భరత్ బదులు ఇషాన్‌కిషన్‌ను ఎంచుకున్న అతను.. అక్షర్ పటేల్‌ను కాదని కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపాడు. ఓపెనింగ్ స్థానం కోసం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేశాడు. అఖరి నిమిషంలో కెప్టెన్, కోచ్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. గిల్ రాహుల్ మధ్య పోటీ ఉంటుందని చెప్పిన రవిశాస్త్రి ఐదో స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్‌కు కన్ఫర్మ్ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పై పేర్కొన్న ప్రతిపాదనలు మినహాయించి అందరూ ఊహించినట్లుగానే జట్టును ఎంచుకున్నాడు. ఇదే సందర్భంగా రవిశాస్త్రి మరో ప్రిడిక్షన్ కూడా చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తుందని చెప్పాడు. కీలకమైన ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా సిరీస్‌ను క్లీన్ చేయడం సులువవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. తమతమ శిక్షణా శిబిరాల్లో భారత్, ఆసీస్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్, ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. రవిశాస్త్రి అంచనా వేసిన తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమర్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
అబ్బాయిలకు Bతో స్టార్ట్ అయ్యేదే కావాలన్న ఓ అమ్మాయి.. అశ్విన్ ఏమన్నాడంటే..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసందే. ప్రతిష్టాత్మక ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా అయితే టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్‌ను మొదలుపెట్టేసింది. ఇంత బిజీ షెడ్యూల్లోనూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఆసక్తికర సంభాషణలో (సోషల్‌మీడియా) పాల్గొన్నాడు. మహిమా అనే ఓ ట్విటర్ యూజర్ చేసిన కామెంట్‌కు యాష్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అబ్బాయిలకు ఒక్కటే కావాలి, అది B అనే ఇంగ్లీష్ పదంతో స్టార్ట్ అవుతుందని మహిమ ట్వీట్ చేయగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటూ అశ్విన్ సమాధానం చెప్పాడు. మహిమ ఉద్దేశంలో ఇది కరెక్టో కాదో తెలీదు కానీ అశ్విన్ ఇచ్చిన సమాధానం మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. క్రికెట్ పట్ల అశ్విన్‌కు ఉన్న పిచ్చిని చూసి నెటిజన్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. యాష్.. BGT 2023ని చాలా సిరీయస్‌గా తీసుకుంటున్నాడని, ఓ బాధ్యతాయుతమైన దేశ క్రికెటర్‌కు ఇది చాలా అవసరమని టీమిండియా ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కొందరైతే అశ్విన్‌కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని అంటున్నారు. మరోవైపు మహిమ చేసిన కామెంట్‌పై కూడా చాలామంది స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సమాధానలు చెబుతున్నారు. కొందరేమో బహిరంగంగా వాడకూడని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి BGT 2023లో తొలి టెస్ట్‌కు ముందు ఓ సరదా సంభాషణతో అశ్విన్ టీమిండియా అభిమానులను అలరించారు. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. భారత్-ఆసీస్‌ల మధ్య ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరిగినా అశ్విన్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఈ సిరీస్‌లోనూ యాష్ ప్రధాన పాత్ర పోషిస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై అశ్విన్ బంతితో పాటు బ్యాట్‌తో ఏరకంగా రెచ్చిపోతాడో గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ విభాగాన్ని లీడ్ చేసే అశ్విన్‌కు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషేన్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్ మరో వికెట్ తీస్తే.. టెస్ట్‌ల్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. -
BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్.. అక్షర్, సూర్యకుమార్‌లకు నో ఛాన్స్..!
Wasim Jaffer Playing XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో జాఫర్ రెండు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ ఊహించిన విధంగానే తొమ్మిది మందిని ఎంపిక చేసిన జాఫర్.. ఎన్నో అంచనాలను మోస్తున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, టెస్ట్ అరంగేట్రంకు సిద్ధంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేశాడు. My India XI for First Test: 1. Rohit (c) 2. KL 3. Pujara 4. Virat 5. Shubman 6. Bharat (wk) 7. Jadeja 8. Ashwin 9. Kuldeep 10. Shami 11. Siraj Hard to leave out Axar but Kuldeep brings variety as a wrist spinner. What's your XI? #INDvAUS #BorderGavaskarTrophy — Wasim Jaffer (@WasimJaffer14) February 6, 2023 అక్షర్‌ను బెంచ్‌పై కూర్చొబెట్టడం కాస్త ఇబ్బందిగానే ఉందని కామెంట్ చేసిన జాఫర్.. సూర్యకుమార్ విషయాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్షర్‌కు బదులుగా తాను ఎంపిక చేసుకున్న కుల్దీప్ రిస్ట్ స్పిన్నర్‌గా వైవిధ్యాన్ని ప్రదర్శించగలడని జాఫర్ తన ఎంపికను సమర్ధించుకున్నాడు. బ్యాటింగ్ లైనప్ విషయంలోనూ జాఫర్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానం కోసం ఎంపిక చేసుకున్నాడు. స్పెషలిస్ట్ వికెట్‌కీపర్ అవసరమని భావించిన జాఫర్.. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్‌కు తన ఓటు వేశాడు. భరత్‌కు స్థానం కల్పించడంతో సూర్యకుమార్‌ను తప్పించి ఉంటాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కాగా, గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్‌ను మొదలుపెట్టింది. సీఏ చేసిన 39 ఆలౌట్ వ్యాఖ్యలకు వసీం జాఫర్ తనదైన శైలీలో రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. భారత్-ఆసీస్‌ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
తేజ్‌నారాయణ్, బ్రాత్‌వైట్ అజేయ సెంచరీలు
వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టును వర్షం వెంటాడుతోంది. తొలి రోజు 51 ఓవర్ల ఆట సాధ్యమైతే... రెండో రోజు 38 ఓవర్లు మాత్రమే పడ్డాయి. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు కూడా జింబాబ్వే బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 112/0తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 బ్యాటింగ్; 7 ఫోర్లు)... తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (291 బంతుల్లో 101 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన తేజ్‌నారాయణ్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... క్రెయిగ్ బ్రాత్వైట్కిది 12వ శతకం. 1999లో న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఓపెనర్లు అడ్రియన్ గ్రిఫిత్ (114), షెర్విన్ క్యాంప్‌బెల్ (170) సెంచరీలు చేసిన తర్వాత... మళ్లీ విండీస్ ఓపెనర్లు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు చేయడం విశేషం. -
అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్న అశ్విన్
BGT 2023: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 88 మ్యాచ్‌ల్లో 449 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌లో ఒక్క వికెట్ తీస్తే 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రవికి ముందు ముత్తయ్య మురళీథరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (675), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (566), మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519), నాథన్ లయోన్ (460) ఈ ఘనత సాధించారు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో అశ్విన్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా స్పిన్నర్లు కూడా పలు మైలురాళ్లకు అత్యంత చేరువలో ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో 8 వికెట్లు తీస్తే 250 వికెట్ల మైలురాయిని, మరో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అక్షర్ పటేల్ మరో 3 వికెట్లు తీస్తే 50 వికెట్ల క్లబ్లో చేరతారు. జడ్డూ ఇప్పటివరకు ఆడిన 60 టెస్ట్‌ల్లో 242 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 47 వికెట్లు తీశాడు. ఇకపోతే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మియా కూడా మరో 3 వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. సిరాజ్ 15 టెస్ట్‌ల్లో 46 వికెట్లు నేలకూల్చాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. జట్టు నిండా టాలెంటెడ్ ఆటగాళ్లు ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాల్లో అర్ధం కాక మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, పుజారా, అశ్విన్, షమీ అలాగే యువ సంచలనం శుభ్‌మన్ గిల్ స్థానాలకు ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. మిగతా 5 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొని ఉంది. వికెట్‌కీపర్ కోటాలో శ్రీకర్ భరత్‌కు అవకాశం ఇవ్వాలా లేక కేఎల్ రాహుల్‌కే ఆ బాధ్యతలు అప్పజెప్పాలా అన్న సమస్య ఒకటైతే, స్పిన్నర్లలో (జడేజా, కుల్దీప్, అక్షర్) ఎవరిని ఆడించాలి, అలాగే పేసర్లలో (సిరాజ్, ఉమేశ్, ఉనద్కత్) ఎవరికి అవకాశం ఇవ్వాలి, సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలా లేదా అన్న విషయాల్లో జట్టు యాజమాన్యం తర్ఝనభర్జన పడుతుంది. -
PAK vs NZ, 1st Test day 4: విలియమ్సన్ డబుల్ సెంచరీ
కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (200 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో పర్యాటక జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 440/6తో గురువారం నాలుగో రోజు ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 194.5 ఓవర్లలో 612/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు విలియమ్సన్, ఇష్ సోధి (65; 11 ఫోర్లు) ఏడో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇష్ అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత 595 స్కోరు వద్ద ఇష్ సోధి నిష్క్రమించడంతో రెండు పరుగుల వ్యవధిలో సౌతీ (0), వాగ్నెర్ (0) వికెట్లను కోల్పోయింది. ఎజాజ్ పటేల్ (0 నాటౌట్) అండతో విలియమ్సన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగానే కివీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అబ్రార్ అహ్మద్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (17), షాన్ మసూద్ (10) నిష్క్రమించగా... ఇమామ్ (45 బ్యాటింగ్), నౌమన్ అలీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరు రోజు కాగా... పాకిస్తాన్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. కివీస్ బౌలర్లు చకచకా వికెట్లు తీయగలిగితే మ్యాచ్ చేతిలోకి వస్తుంది. విలియమ్సన్ కెరీర్లో ఇది ఐదో డబుల్ సెంచరీ. న్యూజిలాండ్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా బ్రెండన్ మెకల్లమ్ (4) పేరిట ఉన్న రికార్డును విలియమ్సన్ బద్దలు కొట్టాడు. -
బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు
Virat Kohli: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్ క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య 291కి చేరింది. మూడు ఫార్మాట్లలో 482 మ్యాచ్‌ల్లో 572 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన కోహ్లి ఈ ఫిగర్‌ను చేరుకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే (768 ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (364), న్యూజిలాండ్ మాజీ సారధి రాస్ టేలర్ (351), సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (338), ద వాల్ రాహుల్ ద్రవిడ్ (334), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (306), సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (292)లు కోహ్లి కంటే ముందున్నారు. కోహ్లి ఈ ఫీట్ సాధించడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. రన్‌మెషీన్, కింగ్ కోహ్లి, క్యాచింగ్‌లోనూ కింగే అంటూ సంకలు గుద్దుకుంటున్నారు. -
బంగ్లాపై విజయం.. రోహిత్‌కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంతోని టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, బంగ్లాపై విజయం సాధించడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్.. విదేశాల్లో మూడో ఫార్మాట్లలో టీమిండియాను గెలిపించిన ఐదో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అజింక్య రహానే మాత్రమే టీ20, వన్డే, టెస్ట్‌ల్లో విదేశీ గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని ఈ రికార్డును రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్ గెలిచిన రాహుల్, ఆసియా కప్ 2022లో ఆఫ్ఘాన్‌పై టీ20 విజయం సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో విజయం సాధించడంతో విదేశాల్లో మూడు ఫార్మాట్లలో టీమిండియాను గెలిపించిన దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు విదేశాల్లో ఒక్క టెస్ట్ మ్యాచ్‌కు కూడా సారధ్యం వహించలేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టూర్లో, ఆతర్వాత ఇంగ్లండ్ టూర్లో ఐదో టెస్టు మ్యాచ్‌కు రోహిత్ గాయాల కారణంగా దూరంగా ఉన్నాడు. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. -
బంగ్లాతో తొలి టెస్ట్.. విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా
IND VS BAN 1st Test Day 4: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 513 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసి, విజయానికి 241 పరుగుల దూరంలో ఉంది. ఓపెనర్ జకీర్ హసన్ (100) సెంచరీతో కదం తొక్కగా.. మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ షాంటె (67) అర్ధసెంచరీతో రాణించాడు. యాసిర్ అలీ (5), లిటన్ దాస్ (19), ముష్ఫికర్ రహీం (23), నురుల్ హసన్ (3) నిరాశ పరిచారు. ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో రాణించగా.. ఉమేశ్, అశ్విన్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (110), పుజారా (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. -
IND VS BAN 1st Test: విరాట్ కోహ్లిని కాపాడిన రిషబ్ పంత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ను 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్.. ప్రత్యర్ధి ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బంగ్లాదేశ్ అద్భుతంగా పోరాడుతోంది. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ జాకిర్ హసన్ (100) అద్భుతమైన శతకంతో అజేయంగా కొనసాగుతుండగా.. మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (67) అర్ధసెంచరీతో రాణించాడు. యాసిర్ అలీ (5), లిటన్ దాస్ (19) నిరాశ పరిచారు. జకీర్ హసన్‌కు జతగా ముష్ఫికర్ రహీం (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లా ఇన్నింగ్స్ 47వ ఓవర్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ నాలుగో రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో నజ్ముల్ షాంటో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్ ఉన్న విరాట్ చేతుల్లో పడ్డాక వదిలి పెట్టగా.. అప్పటికే అలర్ట్‌గా ఉన్న పంత్ చాకచక్యంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 124 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. విరాట్‌ను పంత్ కాపాడాడంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. Brilliant Catch From Rishabh Pant! 🫡 Virat Kohli dropped this🫠#BANvIND #INDvsBAN #RishabhPant pic.twitter.com/KtecqzFZE2 — Divyansh khanna (@meme_lord2663) December 17, 2022 కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (110), పుజారా (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. -
అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్.. మరో 11 పరుగులు చేస్తే..!
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హాఫ్ సెంచరీ (58) సాధించిన అశ్విన్.. ఇదే ఇన్నింగ్స్‌లో మరో 11 పరుగులు చేసి ఉంటే, టెస్ట్ క్రికెట్లో 3000 పరుగులు, 400 వికెట్లు తీసిన ఆరో ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. ప్రస్తుతం అశ్విన్ 87 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 27.17 సగటున 2989 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యాష్ ఖాతాలో 442 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. అశ్విన్‌కు ముందు టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 400 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు), షాన్ పొలాక్ (3781, 421), స్టువర్ట్ బ్రాడ్ (3550, 566), షేన్ వార్న్ (3154, 708), రిచర్డ్ హ్యాడ్లీ (3124, 431) ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 8వ స్థానంలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాను (12) అధిగమించి, కపిల్ దేవ్ (27) తర్వాతి స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో కోహ్లి (8075), పుజారా (6882), రోహిత్ శర్మ (3137) తర్వాత అశ్విన్వే అత్యధిక టెస్ట్ పరుగులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి బంగ్లా ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 271 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌటైంది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
నిప్పులు చెరిగిన సిరాజ్, తిప్పేసిన కుల్దీప్.. పేక మేడలా కూలిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండు రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 271 పరుగుల వెనుకంజలో ఉంది. మెహిది హసన్ (16), ఎబాదత్ హొస్సేన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి బంగ్లా ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి బంతికే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. 102 పరుగుల వద్ద ఆ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోగా.. మెహిది హసన్, ఎబాదత్ హొస్సేన్ 9వ వికెట్‌కు 21 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు భారత్.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌటైంది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో 4 వికెట్లు.. ఎబాదత్ హొస్సేన్, ఖలీద్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ మరో 3 రోజులు మిగిలి ఉండటంతో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
ఉమేశ్ యాదవ్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. 278/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 126 పరుగులు జోడించి 404 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్.. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్.. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 291 పరుగులు వెనుకపడి ఉంది. మెహిది హసన్ (8), ఎబాదత్ హొస్సేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. pic.twitter.com/3B2z3bqfBA — Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022 కాగా, పుజరా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 393/9 స్కోర్ వద్ద అశ్విన్ ఔటయ్యాక బరిలోకి దిగిన ఉమేశ్.. మెహిది హసన్ బౌలింగ్‌లో 101 మీటర్ల రెండు భారీ సిక్సర్లు బాదాడు. pic.twitter.com/nv1fuGd4Wh — Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022 దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. ఉమేశ్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2019 అక్టోబర్‌లో కూడా ఉమేశ్ ఇదే తరహాలో బ్యాట్‌తో రెచ్చిపోయాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లో 31 పరుగులు పిండుకున్నాడు. -
అశ్విన్ హాఫ్ సెంచరీ.. కేఎల్ రాహుల్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అంటున్న ఫ్యాన్స్
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. పుజరా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. 278/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 126 పరుగులు జోడించి ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 4 పరుగులు మాత్రమే జోడించి ఔట్ కాగా.. టెయిలెండర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్ (40) బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా అశ్విన్.. స్పెషలిస్ట్ బ్యాటర్లా షాట్లు ఆడి కెరీర్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అశ్విన్-కుల్దీప్లు ఎనిమిదో వికెట్‌కు 92 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కాగా, అశ్విన్ హాఫ్ సెంచరీతో రాణించిన అనంతరం సోషల్‌మీడియా వేదికగా భారత క్రికెట్ అభిమానులు అతన్ని అభినందిస్తున్నారు. అశ్విన్.. స్పెషలిస్ట్ బ్యాటర్ల కంటే మెరుగ్గా ఆడాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అశ్విన్ ఆటతీరు కేఎల్ రాహుల్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు. లోయర్ ఆర్డర్లో అశ్విన్ లాంటి ఆటగాడు ఉండటం టీమిండియాకు అదనపు బలమని అంటున్నారు. ఇటీవలి కాలంలో తరుచూ విఫలమవుతున్న రాహుల్‌ను టార్గెట్ చేసుకుని వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. అశ్విన్‌ను చూసైనా రాహుల్ సిగ్గు తెచ్చుకోవాలని పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇదిలా ఉంటే, కెరీర్లో 87వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ బౌలింగ్‌తో పాటు అవపరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ కీలక సమయాల్లో విలువైన పరుగులు సమకూరుస్తున్నాడు. అశ్విన్ టెస్ట్‌ల్లో 27.17 సగటున 2989 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే లోయర్ ఆర్డర్లో అతనెంత విలువైన ఆటగాడో అర్ధమవుతుంది. 8వ స్థానంలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (13) తర్వాత అశ్వినే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో కోహ్లి (8075), పుజారా (6882), రోహిత్ శర్మ (3137) తర్వాత అశ్విన్వే అత్యధిక టెస్ట్ పరుగులు కావడం విశేషం. -
అదృష్టం అంటే శ్రేయస్‌దే.. ఈ వీడియో చూడండి, ఏం జరిగిందో తెలుస్తుంది..!
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. An incredible sequence of play in the #BANvIND Test match as @ShreyasIyer15 is bowled by Ebadot Hossain but the 𝗯𝗮𝗶𝗹𝘀 𝗷𝘂𝘀𝘁 𝗿𝗲𝗳𝘂𝘀𝗲 𝘁𝗼 𝗳𝗮𝗹𝗹 🤯 Your reaction on this close 'escape' ❓🤔#SonySportsNetwork #ShreyasIyer pic.twitter.com/q6BXBScVUz — Sony Sports Network (@SonySportsNetwk) December 14, 2022 కాగా, తొలి రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ సన్నివేశం మైదానంలో ఉండే వారితో పాటు వీక్షకులనందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నింగ్స్ 84వ ఓవర్లో ఎబాదత్ హొసేన్ వేసిన ఓ బంతి వికెట్లకు తాకినా బెయిల్స్ కింద పడకపోవడంతో శ్రేయస్ అయ్యర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ బంతి వికెట్లను తాకాక బెయిల్ గాల్లోకి లేచినప్పటికీ తిరిగి వికెట్లపైనే పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన అభిమానులు లక్ అంటే శ్రేయస్‌దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తొలి రోజు శ్రేయస్‌కు ఎబాదత్ హొసేన్ రూపంలోనే మరో అదృష్టం కలిసి వచ్చింది. శ్రేయస్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను ఎబాదత్ నేల పాలు చేశాడు. రెండు లైఫ్‌లు లభించడంతో శ్రేయస్ శతకం దిశగా సాగుతున్నాడు. -
పుజారాను చూసి నేర్చుకోండి.. రోహిత్, పంత్ సిగ్గుపడాలి..!
Cheteshwar Pujara: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఘనంగా పునరాగమనం చేశాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 90 పరుగులు చేసిన నయా వాల్.. పూర్వవైభవాన్ని చాటుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 203 బంతులను ఎదుర్కొన్న పుజారా.. 11 ఫోర్ల సాయంతో భారీ అర్ధ సెంచరీ సాధించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాని పుజారా.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. పుజారాకు తోడుగా శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, బంగ్లాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పుజారా.. మునుపటి కంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. జట్టులో స్థానం కోల్పోయానని బాధ పడకుండా దేశవాలీ టోర్నీలు, కౌంటీలు ఆడిన పుజారా.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. ఫామ్‌లోకి రావడమే కాకుండా మునుపటి కంటే చాలా మెరుగయ్యాడు. గతంలో పుజారాపై టెస్ట్ ప్లేయర్, నిదానంగా ఆడతాడు అనే ముద్ర ఉండేది. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన లండన్ వన్డే కప్ తర్వాత పుజారాపై ఆ ముద్ర తొలిగిపోయింది. ఆ టోర్నీలో అతను స్టైల్‌కు భిన్నంగా వేగంగా, భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టీమిండియాలో చోటు కోల్పోయానన్న కసితో తనలోని కొత్త యాంగిల్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ సీజన్లో అతను ఏకంగా 3 సెంచరీలు బాదాడు. అందులో ఒకటి 73 బంతుల్లో శతకం కాగా మరొకటి 75 బంతుల సెంచరీ. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పుజారా.. ఆ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాలో చోటు కోల్పోయానన్న కసితో ఉగ్రరూపం దాల్చిన పుజారా.. తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి పరుగుల వరద పారించాడు. తద్వార భారత సెలెక్టర్లకు మరో ఛాన్స్ లేకుండా చేసి జట్టులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతి విలువైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను ఆదుకున్నాడు. ఆటగాళ్లెవరైనా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైతే తనలా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని మెసేజ్ పాస్ చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే క్రమంలో పుజారా ప్రస్తానాన్ని గమనించిన అభిమానులు.. ఫామ్ కోల్పోయినప్పుడు దేశవాలీ టోర్నీలు ఆడకుండా ఇంట్లోనే కూర్చొనే ఆటగాళ్లకు చురకలంటిస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న పంత్, రోహిత్ శర్మ.. పుజారాను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఫామ్‌లో లేనప్పుడు స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకుని దేశవాలీ టోర్నీలు ఆడాలని గడ్డి పెడుతున్నారు. ఈ విషయంలో పుజారాలోని కసిని చూసి సిగ్గు పడాలని కామెంట్స్ చేస్తున్నారు. -
IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. పర్వాలేదనిపించిన పంత్
IND VS BAN 1st Test Day 1: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 14) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. భారత్: శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ బంగ్లాదేశ్: జాకీర్ హసన్, నజీముల్ హొస్సేన్ షాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్ -
Virat Kohli: మూడేళ్లయినా తీరని 'ఆ' ముచ్చట..!
టెస్ట్ క్రికెట్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 14) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 5 బంతులు ఎదుర్కొన్న కింగ్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గత 33 ఇన్నింగ్స్‌లుగా మూడంకెల ముచ్చట తీరని కోహ్లికి ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది. టీ20ల్లో, వన్డేల్లో ఫామ్‌ను అందుకున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో సైతం చెలరేగుతాడని అంతా భావించారు. అయితే అతను పట్టుమని 10 బంతులు కూడా ఆడకుండా తస్సుమనిపించాడు. టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీ చేసి మూడేళ్లు పూర్తి అయిపోయింది. ఈ ఫార్మాట్లో అతను చివరిసారిగా 2019 నవంబర్‌లో సెంచరీ చేశాడు. కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్‌లో కోహ్లి 136 పరుగులు సాధించాడు. నాటి నుంచి 33 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. 26.45 సగటున కేవలం 873 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్ 79. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. నయా వాల్ చతేశ్వర్ పుజారా (203 బంతుల్లో 90; 11 ఫోర్లు) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా పుజారా, శ్రేయస్ భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిరాశపర్చగా.. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔట్ కావడంతో ఆటకు తెరపడింది. శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. టీమిండియా ఇదే..!
IND VS BAN 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయే ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఆతిధ్య బంగ్లాదేశ్ ఉరకలేస్తుండగా.. టెస్ట్ సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా పరిస్థితి మ్యాచ్ సమయానికి ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తుది జట్టులో తప్పక ఉంటాడనుకున్న ఉనద్కత్ ఇండియాలోనే ఇరుక్కుపోవడం, వికెట్‌కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధత టీమిండియా యాజమాన్యాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సరైన జట్టు ఎంపిక జరగక టీమిండియా ఓడితే, అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపుతుందని మేనేజ్మెంట్ ఆందోళన చెందుతుంది. జట్టులో ఏడు స్థానాలు ఖరారు కాగా.. మిగిలిన 4 స్థానాలపై సందిగ్ధత నెలకొంది. వికెట్‌కీపర్ స్థానం కోసం పంత్, శ్రీకర్ భరత్ మధ్య పోటీ ఉండగా, ఆల్‌రౌండర్ల బెర్త్‌కు అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ పోటీ పడుతున్నారు. స్పిన్నర్లుగా అశ్విన్, కుల్దీప్ స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. పేసర్ల విభాగంలో ఉమేశ్, సిరాజ్, సైనీ మధ్య పోటీ ఉంది. భారత తుది జట్టు (అంచనా): ఓపెనర్లుగా కెప్టెన్ కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వన్ డౌన్లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లి, ఐదో ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్ పేర్లు ఖరారు కాగా, పంత్/ శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్/సౌరభ్ కుమార్/ శార్ధూల్ ఠాకూర్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, సిరాజ్/ సైనీ భారత్: శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
బంగ్లాతో తొలి టెస్ట్.. విరాట్ కోహ్లిని ఊరిస్తున్న అరుదైన రికార్డు
భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టు సారధిగా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ సిరీస్ నుంచి వైదొలగడంతో జట్టులో మూడు మార్పులు జరిగాయి. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రాగా.. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరారు. ఈ మార్పులతో పాటు ముందుంగా ప్రకటించిన జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్ బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పంత్ స్థానంలో చతేశ్వర్ పుజారాను ఎంపిక చేసింది. చట్టోగ్రామ్ వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 9 గంటల నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధిస్తే, ఓ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే టీ20 (ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్పై), వన్డేల్లో (మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై)సెంచరీలు బాదిన కోహ్లి.. రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. మహేళ జయవర్ధనే (2010), సురేశ్ రైనా (2010), తిలకరత్నే దిల్షాన్ (2011), అహ్మద్ షెహజాద్ (2014), తమీమ్ ఇక్బాల్ (2016), కేఎల్ రాహుల్ (2016), రోహిత్ శర్మ (2017), డేవిడ్ వార్నర్ (2019), బాబర్ ఆజమ్ (2022) సరసన చేరతాడు. బంగ్లాపై తొలి టెస్ట్‌లో సెంచరీ చేస్తే కోహ్లి తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 73కు పెంచుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి (72) ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
పాకిస్తాన్‌కు విషమ పరీక్ష.. ఆదిలోనే దెబ్బేసిన ఇంగ్లండ్
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్తాన్ విషమ పరీక్ష ఎదుర్కొంటుంది. ధాటిగా ఆడి రెండో ఇన్నింగ్స్‌ను 264/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. పాక్ ముందు 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితంపై ఇరు జట్ల అభిమానులకు ఆశలు చిగురించాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 5 పరుగుల వ్యవధిలో (20 పరుగుల వద్ద) తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు అబ్దుల్లా షఫీక్ (6), బాబర్ ఆజమ్ (4) ఔటయ్యారు. రాబిన్సన్.. అబ్దుల్లాను బోల్తా కొట్టించగా, స్టోక్స్.. బాబర్‌ను పెవిలియన్‌కు సాగనంపాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో అజహార్ అలీ (0) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హాక్ (43), సౌద్ షకీల్ (24) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే ఆఖరి రోజు 263 పరుగులు (90 ఓవర్లు) చేయాల్సి ఉంటుంది. అదే ఇంగ్లండ్ గెలవాలంటే మరో 8 వికెట్లు పడగొడితే సరిపోతుంది. కాగా, 499/7 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 80 పరుగులు జోడించి 579 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జాక్ క్రాలే (50), రూట్ (73), హ్యారీ బ్రూక్ (87) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 264/7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇదిలా ఉంటే, బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులకు ఆలౌట్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలతో చెలరేగడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. -
అశ్విన్‌ను వెనక్కునెట్టిన ఆసీస్ స్పిన్నర్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8వ బౌలర్‌గా..!
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయోన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పెర్త్ వేదికగా వెస్డిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్లు (2/61, 6/128) పడగొట్టిన లయోన్.. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను (86 టెస్ట్‌ల్లో 442 వికెట్లు) అధిగమించాడు. కెరీర్లో 111 టెస్ట్‌లు ఆడిన లయోన్ ఖాతాలో ప్రస్తుతం 446 వికెట్లు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ (133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ (145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు), ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (178 మ్యాచ్‌ల్లో 668 వికెట్లు), భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు), ఇంగ్లండ్ స్టువర్ట్ బ్రాడ్ (159 మ్యాచ్‌ల్లో 566 వికెట్లు), ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), విండీస్ గ్రేట్ వాల్ష్ (132 టెస్ట్‌ల్లో 519 వికెట్లు) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో మార్నస్ లబూషేన్ (204, 104 నాటౌట్), స్టీవ్ స్మిత్ (200 నాటౌట్, 20 నాటౌట్), నాథన్ లయోన్ (2/61, 6/128) చెలరేగడంతో ఆతిధ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (65) అర్ధసెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్ (99) పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. మిచెల్ స్టార్క్ (3/51), పాట్ కమిన్స్ (3/34), లయోన్ (2/61) ధాటికి 283 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (64), టగెనరైన్ చంద్రపాల్ (51) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ మరోసారి సెంచరీతో రెచ్చిపోవడంతో ఆ జట్టు 182/2 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 498 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో లయోన్ తిప్పేయడంతో విండీస్ 333 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 164 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (110) శతకంతో రాణించగా, రోస్టన్ ఛేజ్ (55) అర్ధసెంచరీతో పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తదుపరి మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం
పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ పలు ప్రపంచ రికార్డులకు వేదికైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇంగ్లండ్ టీమ్ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. వీటన్నిటికీ మించి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు (657) ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. కాగా, ఇదే టెస్ట్ మ్యాచ్‌లో పై పేర్కొన్న రికార్డులతో పాటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఓపెనర్లు (బెన్ డకెట్, జాక్ క్రాలే, అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్) తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం ఇదే తొలిసారి. అలాగే ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు రెండు డబుల్ హండ్రెడ్ పార్ట్నర్షిప్లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. 1948లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు ఓపెనర్లు సెంచరీలు సాధించారు. అయితే, ఆ నలుగురు ఓపెనర్లలో ఒకరు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించారు. -
శతక్కొట్టుడులో బాబర్ ఆజమే టాప్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో రికార్డు సాధించాడు. రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్).. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (7) చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో (6) అధిగమించిన బాబర్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 259 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 27 శతకాలు సాధించిన బాబర్.. ఈ ఒక్క ఏడాదే 7 సెంచరీలు సాధించడం విశేషం. ఇంగ్లండ్‌పై ఇవాళ (డిసెంబర్ 3) చేసిన సెంచరీ బాబర్ టెస్ట్ కెరీర్లో 8వ శతకం. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన భారీ స్కోర్‌కు ధీటుగా జవాభిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నలుగురు బ్యాటర్లు సెంచరీలతో (బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్)) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తామేమీ తక్కువ కాదు అన్నట్లు రెచ్చిపోయి ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా కెప్టెన్ బాబర్ ఆజమ్ శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. అఘా సల్మాన్ (10), జహీద్ మహమూద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 158 పరుగులు వెనుకపడి ఉంది. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. విండీస్ కెప్టెన్ వీరోచిత పోరాటం
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు ఓటమి నుంచి గట్టెక్కేందుకు అష్టకష్టాలు పడుతుంది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 498 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (166 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) వీరోచితంగా పోరడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది. బ్రాత్‌వైట్ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. యువ ఓపెనర్, విండీస్ దిగ్గజ బ్యాటర్ తనయుడు టగెనరైన్ చంద్రపాల్ (45) ఒక్కడు కాసేపు నిలకడగా ఆడగా.. షమ్రా బ్రూక్స్ (11), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (24) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బ్రాత్వైట్కు జతగా కైల్ మేయర్స్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు 306 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదే ఆసీస్ గెలవాలంటే.. ఏడుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేస్తే సరిపోతుంది. అంతకుముందు మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 182/2 (37 ఓవర్లు) స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (6) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా, వార్నర్ (48) పర్వాలేదనిపించాడు. స్టీవ్ స్మిత్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో.. ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (64), టగెనరైన్ చంద్రపాల్ (51) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌటైంది. స్టార్క్ (3/51), కమిన్స్ (3/34) విండీస్ పతనాన్ని శాసించారు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలి రోజే 506 (4 వికెట్ల నష్టానికి) పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910 డిసెంబర్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 494 పరుగులు నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్‌గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్ తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. World Record Day!#ENGvPAK pic.twitter.com/1WqQzmhNpC — RVCJ Media (@RVCJ_FB) December 1, 2022 ఈ రికార్డుతో పాటు తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్ తొలి సెషన్లో 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి సెషన్లో 158 పరుగులు స్కోర్ చేసింది. తాజాగా ఇంగ్లండ్.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది. Stumps in Rawalpindi 🏏 England rewrite record books on their historic return to Pakistan 🙌 #WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/WPDooIc2ee — ICC (@ICC) December 1, 2022 ఇవే కాక, ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఈ మ్యాచ్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు 75 ఓవర్లలో 6.75 రన్‌రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. -
టెస్ట్ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్.. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ సాధించింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగుల అత్యంత భారీ స్కోర్ నమోదు చేసింది. తొలి రోజు 75 ఓవర్ల పాటు ఆట సాగగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు 6.75 రన్‌రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం ధాటికి విలవిలలాడిపోయిన పాక్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమతమయ్యారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. సెంచరీకి ముందు హ్యారీ బ్రూక్.. సౌద్ షకీల్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్లో 6 బౌండరీలు బాదగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన వారికి కచ్చితంగా టీ20 మ్యాచ్ చూసిన అనుభూతే కలిగి ఉంటుంది. పాక్ బౌలర్లలో మహ్మద్ అలీ (5.6) మినహా అందరూ 6కు పైగా ఎకనామీతో పరుగులు సమర్పించుకున్నారు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లను ఆపడం పాక్ బౌలర్లకు సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి. -
లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలు.. పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న హెడ్
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో, ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్.. తన కెరీర్లో నాలుగో సారి ఈ ఫీట్‌ను నమోదు చేయగా, లబూషేన్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. మరోవైపు ట్రవిస్ హెడ్.. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన హెడ్.. పరుగు తేడాతో తన 5వ టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. హెడ్ ఔట్ కావడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ద్వారా విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన టగెనరైన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. -
లబూషేన్ ద్విశతకం.. బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన స్టీవ్ స్మిత్
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌కు ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ చుక్కలు చూపించారు. పెర్త్ వేదికగా నిన్న (నవంబర్ 30) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో లబూషేన్ ద్విశతకంతో (204), స్మిత్ అజేయమైన భారీ శతకంతో (189*) చెలరేగి విండీస్ బౌలర్లతో ఆటాడుకున్నారు. మ్యాచ్ తొలి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న లబూషేన్ రెండో రోజు (డిసెంబర్ 1) మరింత జోరు పెంచి కెరీర్లో రెండో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88 టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. 29 x 💯 Steve Smith showing no signs of slowing down! #MilestoneMoments#AUSvWI | @nrmainsurance pic.twitter.com/ebkgO2j8n5 — cricket.com.au (@cricketcomau) December 1, 2022 ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉండగా, సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. లబూషేన్ ద్విశతకానికి తోడు స్మిత్ అజేయమైన భారీ శతకం, ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (65), ట్రవిస్ హెడ్ (80 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో 148 ఓవర్లలో 568/3 స్కోర్ వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. -
పాకిస్తాన్‌తో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు సిరీస్ ప్రారంభానికి ముందే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరమాయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అధికారికంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సందర్భంగా తుంటి గాయం బారిన పడిన వుడ్.. ఇంకా కోలుకోలేదని, రెండో టెస్ట్లోగా అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని మెక్కల్లమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్లు మధ్య తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 9 నుంచి రెండో టెస్ట్ (ముల్తాన్), 17 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ (కరాచీ) జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ క్రాలే, జో రూట్, కీటన్ జెన్నింగ్స్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ ఓవర్టన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్ పాకిస్తాన్ జట్టు.. బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అజార్ అలీ, షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హాక్, అఘా సల్మాన్, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, మహ్మద్ నవాజ్, నౌమాన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, అబ్రర్ అహ్మద్, నసీం షా, మహ్మద్ అలీ, జహీద్ మహమూద్, హరీస్ రౌఫ్ -
నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్ బ్యాటర్లు
లండన్: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్‌తో పాటు కెప్టెన్ స్టోక్స్ (20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్‌కు జతగా బ్రాడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. నిప్పులు చెరిగిన పేసర్లు.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. టాస్ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అలెక్స్ లీస్ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ (8)ను మార్కో జన్సెన్.. బెయిర్‌స్టో (0), బెన్ ఫోక్స్ (6), స్టోక్స్ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను నోర్జే క్లీన్ బౌల్డ్ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. Anrich Arno Nortje -
షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం
శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) అజేయమైన శతకంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోని వెళ్లింది. లంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 222/3 స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. అబ్దుల్లా షఫిక్ (406 బంతుల్లో 160; 7 ఫోర్లు, సిక్సర్).. మహ్మద్ నవాజ్ (34 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్) సహకారంతో పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ (76) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు, నసీమ్ షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీ (119) సహకారంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసి ఆలౌటైంది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్‌కు దారుణంగా దెబ్బకొట్టాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (94 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) 6 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం కలుపుకుని లంక మొత్తంగా 342 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో పాక్ మొదట్లో తడబడినప్పటికీ షఫీక్, కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) ఆదుకున్నారు. వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (40) కూడా జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరూ ఔటైనా షఫీక్ టెయింలెండర్ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య (4/135) రాణించాడు. చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
జయసూర్య మాయాజాలం.. టెస్ట్ క్రికెట్లో అరుదైన ఫీట్
టెస్ట్ క్రికెట్లో శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించడం ద్వారా అతను టెస్ట్ క్రికెట్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పాక్‌పై తొలి ఇన్నింగ్స్‌లో (రెండో రోజు లంచ్ సమయానికి 5/41) ఇదేసిన జయసూర్య.. అంతకుముందు ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు (6/118, 6/59) పడగొట్టాడు. ప్రస్తుతానికి జయసూర్య ఖాతాలో 3 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 17 వికెట్లు ఉన్నాయి. A five-for each in his first three Test innings 🤯 Take a bow, Prabath Jayasuriya 🙌 Watch #SLvPAK LIVE on https://t.co/CPDKNxoJ9v with a Test Series Pass (in select regions) 📺#WTC23 | 📝 Scorecard: https://t.co/Zjbsh8Hg2c pic.twitter.com/3U65ou7lyn — ICC (@ICC) July 17, 2022 ఇదిలా ఉంటే, గాలే వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో పాక్ బౌలర్ల ధాటికి 222 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. రెండో రోజు బౌలింగ్‌లో చెలరేగిపోయారు. 24/2 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌ను.. జయసూర్య, కసున్ రజిత (1/21), రమేశ్ మెండిస్ (1/11) దారుణంగా దెబ్బతీశారు. వీరి ధాటికి పాక్ లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (34)కు జతగా యాసిర్ షా (12) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాక్ ఇటీవలే లంకలో అడుగుపెట్టింది. జులై 24 నుంచి రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. 10 wicket haul on a debut ✔️ Best figures by a Sri Lankan on a debut ✔️ Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 చదవండి: మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్ -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక
శ్రీలంక, పాకిస్తాన్ మధ్య గాలేలో శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 66.1 ఓవర్లలో 222 పరుగులకే కుప్పకూలింది. దినేశ్ చండిమాల్ (115 బంతుల్లో 76; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మహీశ్ తీక్షణ (38), ఒషాదా ఫెర్నాండో (35) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు తీశారు. అయితే వెంటనే కోలుకున్న లంక ప్రత్యర్థిని దెబ్బ తీసింది. ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. షఫీఖ్ (13), ఇమామ్ (2) వెనుదిరగ్గా... ప్రస్తుతం అజహర్ అలీ (3), బాబర్ ఆజమ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
ఐదేసిన లయన్.. లంకను కట్టడి చేసిన ఆసీస్
Nathan Lyon: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 212 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (5/90) లంక పతనాన్ని శాశించగా, స్వెప్సన్ (3/55), స్టార్క్ (1/31), కమిన్స్ (1/25) తలో చేయి వేశారు. లంక ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లా (58) అర్ధసెంచరీతో రాణించగా మిగతా ఆటగాళ్లంతా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు కరుణరత్నే (28), నిస్సంక (23), మాథ్యూస్ (39), ఆర్ మెండిస్ (22), ధనంజయ డిసిల్వా (14) రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు..డేవిడ్ వార్నర్ (25), ఉస్మాన్ ఖ్వాజా (47 నాటౌట్) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాక వార్నర్ మెండిస్ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. వార్నర్ పెవిలియన్‌కు చేరాక ఆసీస్ స్వల్ప వ్యవధిలో లబూషేన్ (13), స్టీవ్ స్మిత్ (6)ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఖ్వాజా, ట్రవిస్ హెడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 2 వికెట్లు పడగొట్టగా, స్టీవ్ స్మిత్ రనౌటయ్యాడు. కాగా, లంక పర్యటనలో ఆసీస్ టీ20 సిరీస్‌ను (2-1) కైవసం చేసుకుని వన్డే సిరీస్‌ను (2-3) చేజార్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ ఎవరంటే..!? -
ENG vs NZ 2022: విజయానికి 61 పరుగుల దూరంలో ఇంగ్లండ్
లండన్: న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపుపై కన్నేసింది. 277 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ మరో 61 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (110 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (203 బంతుల్లో 108; 12 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, టామ్ బ్లన్‌డెల్ (198 బంతుల్లో 96; 12 ఫోర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. శనివారం కివీస్ 49 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లు చేజార్చుకుంది. పాట్స్, బ్రాడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
డబుల్ చేజార్చుకున్న లంక క్రికెటర్.. టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022 సీజన్ రంజుగా సాగుతున్న వేళ టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య చట్టోగ్రామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజలో మాథ్యూస్ ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 153 ఓవర్లలో 397 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (54), దినేశ్ చండీమాల్ (66) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఏంజలో మాథ్యూస్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 397 బంతులను ఎదుర్కొన్న మాథ్యూస్.. 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 199 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. నయీమ్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడిన మాథ్యూస్ తృటిలో కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న 12వ ఆటగాడిగా, మూడో లంక క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1984లో పాక్ ఆటగాడు ముదస్సర్ నాజర్ భారత్‌పై, 1986లో మహ్మద్ అజహారుద్దీన్ శ్రీలంకపై, 1997లో మాథ్యూ ఇలియట్ (ఆసీస్) ఇంగ్లండ్‌పై, అదే ఏడాది సనత్ జయసూర్య భారత్‌పై, 1999లో స్టీవ్ వా వెస్టిండీస్‌పై, 2006లో యూనిస్ ఖాన్ భారత్‌పై, 2008లో ఇయాన్ బెల్ సౌతాఫ్రికాపై, 2015లో స్టీవ్ స్మిత్ వెస్టిండీస్‌పై, 2016లో కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌పై, 2017లో డీన్ ఎల్గర్ బంగ్లాదేశ్‌పై, 2020లో డెప్లెసిస్ శ్రీలంకపై డబుల్ చేసే అవకాశాన్ని పరుగు తేడాతో కోల్పోయారు. అంతకుముందు మాథ్యూస్ 2009లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ, డబుల్ సెంచరీని పరుగు తేడాతో మిస్ ఏకైక క్రికెటర్‌గా మాథ్యూస్ రికార్డు సాధించాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. హసన్ రాయ్ (31), తమీమ్ ఇక్బాల్ (35) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకు ఆలౌటైంది. నయీమ్ 6 వికెట్లతో సత్తా చాటగా, వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఇంగ్లండ్ పర్యటనకు రహానే దూరం -
SA Vs Ban: బంగ్లాదేశ్ ఘోర పరాజయం
డర్బన్: లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (7/32) తన అద్భుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాకు భారీ విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం ముగిసిన తొలి టెస్టులో సఫారీ టీమ్ 220 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలింది. నజ్ముల్ హొసేన్ (26) టాప్ స్కోరర్ కాగా...నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 11/3తో చివరి రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 13 ఓవర్లు మాత్రమే ఆడి 42 పరుగులు జోడించగలిగింది. బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు మాత్రమే వేసి 7 వికెట్లు తీసిన మహరాజ్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా...ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారంనుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. 7️⃣ wickets at Keshav Maharaj's home ground💚 🇿🇦 #SAvBAN #BetwayTestSeries #BePartOfIt | @Betway_za pic.twitter.com/cIcqpKD50Q — Cricket South Africa (@OfficialCSA) April 4, 2022 -
శతకం చేజార్చుకున్న ఉస్మాన్ ఖ్వాజా.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్
రావల్పిండి: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తుంది. పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేయగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (159 బంతుల్లో 97; 15 ఫోర్లు) 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా, మరో ఓపెనర్ వార్నర్ (114 బంతుల్లో 68; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ లబూషేన్ (117 బంతుల్లో 69; 9 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (55 బంతుల్లో 24; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. అంతకుముందు ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. షఫీఖ్ (44), బాబార్ ఆజమ్ (36) ఓ మోస్తరుగా రాణించగా, మహ్మద్ రిజ్వాన్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (13) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, కమిన్స్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టగా, బాబర్ రనౌటయ్యాడు. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. చదవండి: ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్ -
జడేజా ‘కత్తి’ దూశాడు!
రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్‌కు శ్రీలంక కకావికలమైంది. గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన అతను తొలి మ్యాచ్‌లోనే తన విలువేంటో చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా మెరుపు ప్రదర్శనతో శతకం బాదడంతో పాటు బౌలింగ్‌లో కీలక వికెట్ తీసి రెండో రోజే మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. అశ్విన్ కూడా ఇదే తరహా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పని పట్టాడు. అటు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసిన లంక బ్యాటింగ్‌లోనూ తడబడి అప్పుడే నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. లంకను ఎక్కువ ఓవర్లు ఆడించే క్రమంలో జడేజా డబుల్ సెంచరీకి అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడమే రెండో రోజు ఆటలో కాస్త చర్చనీయాంశం! మొహాలి: శ్రీలంకతో తొలి టెస్టులో రెండో రోజే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 357/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్లో అత్యుత్తమ స్కోరు సాధించగా, అశ్విన్ (82 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 130 పరుగులు జత చేశారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 466 పరుగులు వెనుకబడి ఉంది. భారీ భాగస్వామ్యం... తొలి రోజు అజేయంగా నిలిచిన జడేజా, అశ్విన్ ద్వయం శనివారం అదే జోరును కొనసాగిస్తూ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో ఓవర్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు అశ్విన్ అండగా నిలిచాడు. వీరిద్దరూ వన్డే తరహాలో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఫెర్నాండో ఓవర్లో జడేజా రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు 400 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. తొలి సెషన్లో అశ్విన్ వికెట్ కోల్పోయినా... 27 ఓవర్లలో భారత్ ఏకంగా 111 పరుగులు నమోదు చేసింది. ఎంబుల్డెనియా బౌలింగ్‌లో సింగిల్ తీసి 160 బంతుల్లో జడేజా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే జయంత్ యాదవ్ (2) వెనుదిరిగాడు. ఈ స్థితిలో జడేజా స్కోరు 104 పరుగులు. ఆ తర్వాత జడేజా మరింత చెలరేగిపోయాడు. 60 బంతుల్లోనే తర్వాతి 71 పరుగులు సాధించాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం ఎంబుల్డెనియా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. డిసిల్వా బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో అతను 150 పరుగులకు చేరుకున్నాడు. షమీ (20 నాటౌట్) అతనికి చక్కగా సహకరించాడు. వీరిద్దరు 94 బంతుల్లోనే 103 పరుగులు జోడించగా జడేజానే 71 పరుగులు చేశాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అనూహ్యంగా భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నె 18 ఓవర్ల పాటు భారత బౌలర్లను నిరోధించారు. అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో తిరిమన్నె వికెట్ల ముందు దొరికిపోవడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత కరుణరత్నేను జడేజా... మాథ్యూస్ (22)ను బుమ్రా... ధనంజయ డిసిల్వా (1)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించారు. హ్యాడ్లీని దాటిన అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్ హ్యాడ్లీ (431)ను అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం 432 వికెట్లతో అతను ఓవరాల్‌గా 11వ స్థానానికి చేరుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్ (434)ను అశ్విన్ దాటుతాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 33; రోహిత్ (సి) లక్మల్ (బి) కుమార 29; విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్డెనియా 45; పంత్ (బి) లక్మల్ 96; శ్రేయస్ (ఎల్బీ) (బి) డిసిల్వా 27; జడేజా (నాటౌట్) 175; అశ్విన్ (సి) డిక్వెలా (బి) లక్మల్ 61; జయంత్ (సి) తిరిమన్నె (బి) ఫెర్నాండో 2; షమీ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (129.2 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 574. వికెట్ల పతనం: 1–52, 2–80, 3–170, 4–175, 5–228, 6–332, 7–462, 8–471. బౌలింగ్: లక్మల్ 25–1–90–2, ఫెర్నాండో 26–1–135–2, కుమార 10.5–1–52–1, ఎంబుల్డెనియా 46–3–188–2, డిసిల్వా 18.2–1–79–1, అసలంక 3.1–0–14–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే (ఎల్బీ) (బి) జడేజా 28; తిరిమన్నె (ఎల్బీ) (బి) అశ్విన్ 17; నిసాంక (బ్యాటింగ్) 26; మాథ్యూస్ (ఎల్బీ) (బి) బుమ్రా 22; డిసిల్వా (ఎల్బీ) (బి) అశ్విన్ 1; అసలంక (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–48, 2–59, 3–96, 4–103. బౌలింగ్: 7–3–17–0, బుమ్రా 9–2–20–1, అశ్విన్ 13–6–21–2, జయంత్ 5–2–14–0, జడేజా 9–3–30–1. -
PAK Vs AUS: డబుల్ చేజార్చుకున్న అజహర్ అలీ.. పాక్ భారీ స్కోర్
రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆతిధ్య పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి (షఫీఖ్ (44)) 245 పరుగులు చేసిన బాబర్ సేన.. రెండో రోజు కూడా దూకుడు కొనసాగించి 476/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు సెంచరీ హీరో ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓవర్‌నైట్ స్కోర్‌కు 25 పరుగులు జోడించి ఔట్ కాగా, వన్‌డౌన్ ఆటగాడు అజహర్ అలీ (185) రెండో రోజు భారీ శతకాన్ని బాదాడు. కెప్టెన్ బాబార్ ఆజమ్ (36) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ కాగా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి మహ్మద్ రిజ్వాన్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, కమిన్స్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టగా, బాబర్ రనౌటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. చదవండి: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..? -
Ganguly: కోహ్లి వందో టెస్ట్‌లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్ చూసేందుకు నేను కూడా వస్తా..!
గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం గంగూలీ-కోహ్లిల మధ్య కెప్టెన్సీ విషయంలో మొదలైన వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. ఈనెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తాను కూడా హాజరవుతానని గంగూలీ స్వయంగా ప్రకటించాడు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన గంగూలీ.. బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. కోహ్లితో విభేదాల గురించి మీడియా ప్రశ్నించగా.. దాదా వాటిని కొట్టిపారేశాడు. వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం ప్రస్తుత తరంలో అంత సులువు కాదని, భారత క్రికెట్లో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారని పేర్కొన్నాడు. 100 టెస్ట్‌ల మైలురాయిని అందుకోవాలంటే సదరు వ్యక్తి గొప్ప ప్లేయర్ అయి ఉండాలని, కోహ్లి ఆ కోవలోకే వస్తాడని పరుగుల యంత్రాన్ని ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా కోహ్లి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, మొహాలీ టెస్ట్‌లో కోహ్లి శతక దాహాన్ని తప్పక తీర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా కోహ్లి ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడని, ఆ తర్వాత కొద్ది రోజులకే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడని గుర్తు చేశాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా 2002-2005 మధ్య గడ్డుకాలం ఎదుర్కున్నాడని,ఆ తర్వాత అతను కూడా తిరిగి పుంజుకున్నాడని, గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇవన్నీ సహజమేనని చెప్పుకొచ్చాడు. కాగా, కోహ్లి వందో టెస్ట్‌ను ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించేందుకు తొలుత ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. ఆ తర్వాత అభిమానుల నిరసనలతో దిగొచ్చింది. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులకు అనుమతివ్వాలని నిర్ణయించింది. చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ -
IND Vs SL:లంక క్రికెటర్లు ప్రయాణించిన బస్సులో బుల్లెట్ల కలకలం
భారత్-శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్‌కు ముందు ఓ షాకింగ్ వార్త అందరిని కలవరపెడుతుంది. టీ20 జట్టులో లేని లంక ఆటగాళ్లు ప్రయాణించిన వాహనంలో రెండు బుల్లెట్ షెల్స్ బయటపడటంతో లంక శిబిరంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. లంక క్రికెటర్లు ఓ ప్రైవేట్ బస్సులో తాము బస చేస్తున్న లలిత్ హోటల్ నుంచి టెస్ట్ మ్యాచ్ వేదిక అయిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియానికి వెళ్తుండగా, మార్గ మధ్యంలో జరిగిన సాధారణ పోలీసు తనిఖీల్లో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి. మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేస్తుండగా బస్సు లగేజ్ కాంపార్ట్‌మెంట్‌లో బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. లంక ప్లేయర్ల కోసం బస్సును అద్దెకి తీసుకోవడానికి ముందు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కోసం వాడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. చండీఘర్‌లోని తారా బ్రదర్స్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి బస్సు అద్దెకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మొహాలీలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి వందో టెస్ట్ కావడంతో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. పంజాబ్‌లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ఈ మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించబోమని పీసీఏ వెల్లడించింది. చదవండి: కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..! -
తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. భారత్ ఘన విజయం
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలుచుకునే లక్ష్యంతో అడుగు పెట్టిన భారత జట్టు తొలి అడ్డంకిని ఘనంగా అధిగమించింది... సఫారీలకు కోటలాంటి సెంచూరియన్‌ను బద్దలు కొట్టి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది...చివరి రోజు ఆరు వికెట్లు తీసే క్రమంలో అటు దక్షిణాఫ్రికా బ్యాటర్లతో పాటు ఇటు వర్షంతో కూడా పోటీ పడాల్సిన స్థితిలో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి ప్రమాదం లేకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. మన పేసర్ల పదునైన బౌలింగ్ ముందు బ్యాటర్లు నిలబడలేకపోగా... మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశం ఉండగా, అంతకు ముందే కోహ్లి సేన వేగంగా ఆటను ముగించింది. వచ్చే వారం మలి మజిలీ జొహన్నెస్బర్గ్నూ జయిస్తే భారత టెస్టు చరిత్రలో మరో చిరస్మరణీయ ఘనత నమోదవుతుంది. సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో 94/4నుంచి చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. గురువారం ఆటలో 97 పరుగులే జోడించిన సఫారీ జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (156 బంతుల్లో 77; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు తీయగా...అశ్విన్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. జనవరి 3 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు జరుగుతుంది. 27.1 ఓవర్లలో... చివరి రోజు ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఎల్గర్, బవుమా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ చకచకా పరుగులు సాధించారు. అయితే అది ఎంతో సేపు సాగలేదు. ఎల్గర్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరికించుకోవడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. దూకుడుగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన డి కాక్ (21)ను సిరాజ్ అవుట్ చేయడంతో జట్టు ఆశలు సన్నగిల్లాయి. తర్వాతి ఓవర్లోనే ముల్డర్ (1) వెనుదిరగడంతో ‘డ్రా’కు ప్రయత్నించే అవకాశం కూడా కనిపించలేదు. లంచ్ సమయానికి స్కోరు 182/7 వద్ద నిలిచింది. ఒక వైపు తెంబా బవుమా (35 నాటౌట్) పోరాడినా... రెండో సెషన్లో దక్షిణాఫ్రికా ఆట ముగించేందుకు రెండు ఓవర్లు సరిపోయాయి. అశ్విన్ వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీసి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 327, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్:197, భారత్ రెండో ఇన్నింగ్స్: 174, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) షమీ 1; ఎల్గర్ (ఎల్బీ) (బి) బుమ్రా 77; పీటర్సన్ (సి) పంత్ (బి) సిరాజ్ 17; వాన్ డర్ డసెన్ (బి) బుమ్రా 11; కేశవ్ (బి) బుమ్రా 8; బవుమా (నాటౌట్) 35; డి కాక్ (బి) సిరాజ్ 21; ముల్డర్ (సి) పంత్ (బి) షమీ 1; జాన్సెన్ (సి) పంత్ (బి) షమీ 13; రబడ (సి) షమీ (బి) అశ్విన్ 0; ఎన్గిడి (సి) పుజారా (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (68 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–1, 2–34, 3–74, 4–94, 5–130, 6–161, 7–164, 8–190, 9–191, 10–191. బౌలింగ్: బుమ్రా 19–4–50–3, షమీ 17–3–63–3, సిరాజ్ 18–5–47–2, శార్దుల్ 5–0–11–0, అశ్విన్ 9–2–18–2. -
షమీ చేతిలో సఫారీ సఫా.. 197 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం
సెంచూరియన్: పేసర్ మొహమ్మద్ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్ వైఫల్యంతో సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తెంబా బవుమా (52; 10 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బుమ్రా, శార్దుల్ చెరో 2 వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 272/3తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (260 బంతుల్లో 123; 17 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎన్గిడి (6/71) భారత్‌ను దెబ్బ తీశాడు. మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ (4) వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రాహుల్ (5), శార్దుల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. (చదవండి: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు) 69 బంతుల్లో 7 వికెట్లు... ఒకరోజు విరామం తర్వాత అనుకూల వాతావరణంలో ఆట మొదలు కాగా... భారత బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్ చేరారు. తొలి రోజు జోరును కొనసాగించలేక టీమిండియా 55 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యవధిలో రాహుల్, రహానే (48; 9 ఫోర్లు) వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. పంత్ (8), అశ్విన్ (4), శార్దుల్ (4) విఫలం కావడంతో భారత్ ఆశించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. 2018 సిరీస్ తరహాలో సెంచూరియన్‌లోనే ఎన్గిడి భారత్‌పై మళ్లీ ఆరు వికెట్లతో చెలరేగటం విశేషం. షమీ జోరు... భారత్ పేసర్ల ముందు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తేలిపోయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఎల్గర్ (1)ను అవుట్ చేసిన బుమ్రా... ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే పీటర్సన్ (15)ను బౌల్డ్ చేసిన షమీ, కొద్ది సేపటికే మార్క్రమ్ (13)ను కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే డసెన్ (3)ను వెనక్కి పంపి సిరాజ్ కూడా వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ దశలో స్కోరు 32/4 వద్ద నిలవగా... బవుమా, డి కాక్ (34; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ప్రతిఘటించారు. సిరాజ్ బౌలింగ్‌లో తొలి బంతికే రాహుల్ క్యాచ్ వదిలేయడం డి కాక్కు కలిసొచ్చింది. ఆ తర్వాత చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ చక్కటి బంతితో డి కాక్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం శార్దుల్ ఓవర్లో బవుమా కొట్టిన మూడు ఫోర్లతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ను తప్పించుకుంది. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే బవుమా అవుట్ కాగా, చివర్లో రబడ (25) కొంత పోరాడగలిగాడు. షమీ తన కెరీర్లో ఆరో సారి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు. (చదవండి: బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) డికాక్ (బి) రబడ 123; మయాంక్ (ఎల్బీ) (బి) ఎన్గిడి 60; పుజారా (సి) పీటర్సన్ (బి) ఎన్గిడి 0; కోహ్లి (సి) ముల్డర్ (బి) ఎన్గిడి 35; రహానే (సి) డికాక్ (బి) ఎన్గిడి 48; పంత్ (సి) డసెన్ (బి) ఎన్గిడి 8; అశ్విన్ (సి) మహరాజ్ (బి) రబడ 4; శార్దుల్ (సి) డికాక్ (బి) రబడ 4; షమీ (సి) డికాక్ (బి) ఎన్గిడి 8; బుమ్రా (సి) ముల్డర్ (బి) జాన్సెన్ 14; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (105.3 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–117, 2–117, 3–199, 4–278, 5–291, 6–296, 7–296, 8–304, 9–308, 10–327. బౌలింగ్: రబడ 26–5–72–3, ఎన్గిడి 24–5–71–6, మార్కో జాన్సెన్ 18.3–4–69–1, ముల్డర్ 19–4–49–0, మహరాజ్ 18–2–58–0. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) బుమ్రా 1; మార్క్రమ్ (బి) షమీ 13; కీగన్ పీటర్సన్ (బి) షమీ 15; డసెన్ (సి) రహానే (బి) సిరాజ్ 3; బవుమా (సి) పంత్ (బి) షమీ 52; డికాక్ (బి) శార్దుల్ 34; ముల్డర్ (సి) పంత్ (బి) షమీ 12; జాన్సెన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 19; రబడ (సి) పంత్ (బి) షమీ 25; కేశవ్ మహరాజ్ (సి) అజింక్య రహానే (బి) బుమ్రా 12, ఎన్గిడి (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (62.3 ఓవర్లలో ఆలౌట్) 197. వికెట్ల పతనం: 1–2, 2–25, 3–30, 4–32, 5–104, 6–133, 7–144, 8–181, 9–193, 10–197. బౌలింగ్: బుమ్రా 7.2–2–16–2, సిరాజ్ 15.1–3–45–1, షమీ 16–5–44–5, శార్దుల్ 11–1–51–2, అశ్విన్ 13–2–37–0. -
పిచ్‌ను చూసి షాక్‌కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్
సెంచూరియన్: మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా.. తొలి టెస్ట్ వేదిక అయిన సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో అడుగుపెట్టింది. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. పిచ్ పరిశీలిన నిమిత్తం మైదానంలోకి వెళ్లిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పిచ్‌పై ఉన్న పచ్చికను చూసి షాక్‌కు గురయ్యానంటూ వ్యాఖ్యానించాడు. పిచ్‌పై చాలా గడ్డి ఉందని, ఇలాంటి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం బ్యాటర్‌కు సవాలుగా ఉంటుందని పేర్కొన్నాడు. #TeamIndia had an intense nets session 💪🏻 at SuperSport Park 🏟️ in the build up to the first #SAvIND Test. Here's @28anand taking you closer to all the action from Centurion. 👍 👍 Watch this special feature 🎥 🔽https://t.co/Dm6hVDz71w pic.twitter.com/qjxnBszmDa — BCCI (@BCCI) December 20, 2021 ఈ విషయమై సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను సంప్రదించగా.. అతను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిపాడు. వికెట్ చాలా తడిగా ఉందని, ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చాలా కష్టమవుతుందని ఇషాంత్ అభిప్రాయపడినట్లు వెల్లడించాడు. వికెట్‌ను పరిశీలించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. పచ్చికను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు. ప్రత్యర్థి జట్టులో రబాడ, నోర్జే లాంటి భీకరమైన ఫాస్ట్ బౌలర్లున్నారని, ఇలాంటి వికెట్‌పై వారిని ఎదుర్కోవాలంటే కఠోరమైన ప్రాక్టీస్ చేయడమే పరిష్కారమని అభిప్రాయపడ్డాడు. కాగా, సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. A new day and a fresh new start 👍🏻 We're back at it 💪🏻#TeamIndia 🇮🇳 | #SAvIND pic.twitter.com/xceSqZ8z6v — BCCI (@BCCI) December 20, 2021 చదవండి: తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి -
Ashes 1st Test: ఆసీస్ బౌలర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
Nathan Lyon: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ పలు అరుదైన ఘనతలను సాధించాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన లియోన్.. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ఏషియన్ ఆఫ్ స్పిన్నర్‌గా, రెండో నాన్ ఏషియన్ స్పిన్ బౌలర్‌గా(షేన్ వార్న్(708)), మూడో ఆసీస్ బౌలర్‌గా(వార్న్, మెక్‌గ్రాత్(563)), ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన17వ బౌలర్‌గా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 34 ఏళ్ల నాథన్ లియోన్ ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా 101 టెస్ట్‌ల్లో 403 వికెట్లు సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మరో విశేషం కూడా ఉంది. లియోన్ గతేడాది జనవరిలో ఇదే వేదికపై తన 399వ వికెట్ సాధించాడు. నాటి నుంచి దాదాపు ఏడాదిపాటు ఒక్క వికెట్ కోసం ఎదురు చూసిన లియోన్.. ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్.. పర్యాటక ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు బోర్డు: ఇంగ్లండ్ 147 & 297 ఆస్ట్రేలియా 425 & 20/1 చదవండి: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. -
Ashes 1st Test: ఆసీస్ చేతిలో భంగపడ్డ రూట్ సేనకు మరో భారీ షాక్..
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆసీస్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్(5 ఓవర్లు) కారణంగా 5 డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడటంతో పాటు జట్టు మ్యాచ్ ఫీజు మొత్తాన్ని(100 శాతం) కోల్పోయింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ మ్యాచ్ అనంతరం ఈ మేరకు వెల్లడించాడు. మరోవైపు, ఇదే మ్యాచ్‌లో సూపర్ శతకంతో చెలరేగిన ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్‌కు కూడా జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ బూన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను పరుష పదజాలంతో దూషించినందుకు గాను హెడ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు మూకుమ్మడిగా రాణించింది. ఫలితంగా ఈ మ్యాచ్ కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోయి చేధించింది. అంతకముందు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట తొలి సెషన్లో తేలిపోయింది. 297 పరుగుల చేసి ఆలౌటైంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మలాన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆ జట్టు చివరి 74 పరుగుల చేసే క్రమంలో 8 వికెట్లు చేజార్చుకుంది. రూట్ 89 పరుగులు చేయగా.. మిగతా వారు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 4, కామెరాన్ గ్రీన్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలగా.. ట్రావిస్ హెడ్(152 పరుగులు) శతక్కొటడంతో పాటు వార్నర్(94), లబుషేన్(74) రాణించడంతో ఆసీస్ 425 పరుగుల భారీ స్కోరు చేసింది. చదవండి: సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ -
Ashes 1st Test: ట్రావిస్ హెడ్ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్
Travis Head Century Puts Australia In Command Against England In Ashes 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆతిధ ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆటలో వార్నర్(94), లబూషేన్(74) అర్థ శతకాలకు ట్రావిస్ హెడ్(95 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సుడిగాలి శతకం తోడవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆసీస్ పేసర్లు కమిన్స్(5/83), హేజిల్‌వుడ్(2/42), స్టార్క్(2/35), గ్రీన్(1/6) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్(39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో మూడు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్ట్‌లో ఆసీస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: Rohit Sharma: అచ్చొచ్చిన డిసెంబర్.. మరో ఘనత కూడా ఇదే నెలలోనే..! -
మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ
టెస్టుల్లో సొంతగడ్డపై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ అంటే భారత్‌కు తిరుగులేదనేది వాస్తవం...అయితే గ్రీన్ పార్క్‌లో మందకొడిగా ఉన్న పిచ్, తక్కువ ఎత్తులో వస్తున్న బంతితో టీమిండియా కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయింది... జేమీసన్ పదునైన బౌలింగ్‌తో ఒక దశలో బ్యాటింగ్‌లో కొంత తడబాటు కూడా కనిపించింది...అయితే మూడో సెషన్లో చక్కటి ఆటతో మొదటి రోజును భారత్ మెరుగైన స్థితిలో ముగించింది. గిల్, జడేజాలతో పాటు అరంగేట్రంలోనే అయ్యర్ సాధించిన అర్ధ సెంచరీతో న్యూజిలాండ్‌పై తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. కివీస్ ముగ్గురు స్పిన్నర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. భారత్ సాధించిన పరుగులు చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా... పరిస్థితులను బట్టి చూస్తే దీనిని మొదటి రోజు సురక్షిత స్కోరుగానే పరిగణించవచ్చు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కొత్త ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (136 బంతుల్లో 75 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (93 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (100 బంతుల్లో 50 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి సీమర్ కైల్ జేమీసన్ (3/47) భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. శుబ్‌మన్ అర్ధ శతకం భారత్ బ్యాటింగ్ మొదలయ్యాక ఎనిమిదో ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ (13) అవుటయ్యాడు. జేమీసన్ నుంచి దూసుకొచ్చిన బంతి మయాంక్ బ్యాట్‌కు తాకీతాకనట్లుగా కీపర్ బ్లండెల్ చేతుల్లో పడింది. అనంతరం చతేశ్వర్ పుజారా (88 బంతుల్లో 26; 2 ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో మరో వికెట్ కోసం కివీస్ బౌలర్ల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. పుజారా నెమ్మదిగా ఆడితే... గిల్ మాత్రం చూడచక్కని బౌండరీలతో స్కోరుబోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే అతను 81 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా 82/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. గిల్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్బీకి అవకాశం ఉన్నా... కివీస్ అప్పీల్ కూడా చేయలేదు. రీప్లేలో అది కచ్చితంగా అవుట్ అయ్యేదని తేలింది. బెదరగొట్టిన జేమీసన్ ఈ సెషన్లో ఆట రూటు మారింది. అప్పటి దాకా పరుగుల బాట పట్టగా... సీమర్ జేమీసన్ బౌలింగ్‌తో కీలకవికెట్లను కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత మొదలైన తొలి ఓవర్లోనే క్లీన్‌బౌల్డ్ చేసి గిల్ ఆటను జెమీసన్ ముగించాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటిన కాసేపటికే భారత్‌ను సౌతీ మరో దెబ్బ తీశాడు. క్రీజులో పాతుకుపోయిన పుజారాను కీపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో రహానేకు అయ్యర్ జతయ్యాడు. రహానే బౌండరీలతో అలరించినా, అతని ఆట ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 145 పరుగుల వద్ద అతన్ని జేమీసన్ బౌల్డ్ చేశాడు. అలా నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయిన భారత్ ఆత్మరక్షణలో పడింది. 154/4 వద్ద టీ బ్రేక్ తీసుకున్నారు. ఆదుకున్న అయ్యర్, జడేజా శ్రేయస్, జడేజా ఇద్దరు ప్రత్యర్థి పేస్, స్పిన్ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోవడంతో మూడో సెషన్ బ్యాటింగ్ వైపు మళ్లింది. శ్రేయస్ అయ్యర్ ఆదుకునే టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. నిలబడిన తీరు, ఎంచుకున్న ప్లేస్‌మెంట్స్, కచ్చితమైన షాట్లు అతన్ని, జట్టును నిలబెట్టాయి. ఈ క్రమంలోనే 94 బంతుల్లో (6 ఫోర్లు) అయ్యర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. న్యూజిలాండ్ కొత్త బంతి తీసుకున్నా... క్రీజులో పాగా వేసిన ఈ జోడీని ఏమీ చేయలేకపోయింది. స్పిన్నర్లు ఎజాజ్ పటేల్, సొమర్విల్లే బౌలింగ్‌లో అయ్యర్ భారీ సిక్సర్లు బాదాడు. వేగం పెరగడంతో 82వ ఓవర్లో భారత్ స్కోరు 250కి చేరింది. మరోవైపు జడేజా కూడా 99 బంతుల్లో (6 ఫోర్లు) టెస్టుల్లో 17వ అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) బ్లండెల్ (బి) జేమీసన్ 13; గిల్ (బి) జేమీసన్ 52; పుజారా (సి) బ్లండెల్ (బి) సౌతీ 26; రహానే (బి) జేమీసన్ 35; శ్రేయస్ (బ్యాటింగ్) 75; జడేజా (బ్యాటింగ్) 50; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–21, 2–82, 3–106, 4–145. బౌలింగ్: సౌతీ 16.4–3–43–1, జేమీసన్ 15.2–6–47–3, ఎజాజ్ 21–6–78–0, సొమర్విల్లే 24–2–60–0, రచిన్ రవీంద్ర 7–1–28–0. శ్రేయస్ అయ్యర్ @ 303 భారత్ తరఫున 22 వన్డేలు, 32 టి20లు ఆడిన తర్వాత ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం దక్కింది. కాన్పూర్ టెస్టుతో అరంగేట్రం చేసిన అయ్యర్ ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 303వ ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 52.18 సగటుతో పాటు ఏకంగా 81.53 స్ట్రైక్‌రేట్‌తో 4592 పరుగులు చేసిన ఘనత శ్రేయస్ సొంతం. ప్రస్తుత క్రికెటర్లలో 50కు పైగా సగటుతో కనీసం 4 వేలకు పైగా పరుగులు సాధించినవారిలో 80కి పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు అయ్యర్ ఒక్కడే కావడం విశేషం. -
Ind Vs Nz Test Series:‘చాంపియన్’తో సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై తమ సొంతగడ్డలో బదులు తీర్చుకునేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌లో తమకు టైటిల్ అందకుండా చేసిన జట్టును కసితీరా ఓడించేందుకు టీమిండియా ఎప్పటిలాగే స్పిన్ అస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు కివీస్ కూడా టి20లో ఎదురైన క్లీన్‌స్వీప్ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాన్పూర్: భారత్‌తో జరిగిన గత మూడు టెస్టుల్లో న్యూజిలాండ్‌దే విజయం. ఇందులో రెండు మ్యాచ్‌లో కివీస్ సొంతగడ్డపై ఆడగా...మరో మ్యాచ్ తటస్థ వేదికపై (డబ్ల్యూటీసీ ఫైనల్) జరిగింది. అయితే భారత్‌లో భారత్‌ను టెస్టుల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం కివీస్‌కు బాగా తెలుసు. 2016 సిరీస్‌లో ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గత మూడు పరాజయాలకు బదులు తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత్ ఉంది. పైగా సొంతగడ్డపై ఆడే అనుకూలత కూడా టీమిండియాకు కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరుజట్ల మధ్య మొదలయ్యే తొలి టెస్టు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగే అవకాశముంది. భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కాగా... టి20ల నుంచి విశ్రాంతి తీసుకున్న కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టెస్టు పరీక్షకు అందుబాటులో ఉండటం ప్రత్యర్థి జట్టుకు బలం. ఆత్మవిశ్వాసంతో టీమిండియా పొట్టి మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న భారత్ టెస్టు సిరీస్‌నూ విజయవంతంగా ముగించాలనే లక్ష్యంతో ఉంది. మయాంక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. టెస్టుల్లో స్పెషలిస్ట్ ఓపెనర్లయిన వీరిద్దరు శుభారంభం అందించగలరు కాబట్టి లోకేశ్ రాహుల్ లేని లోటైతే కనిపించదు. కోహ్లి విశ్రాంతి జట్టుకు ఇబ్బందికరమైనప్పటికీ నాలుగో స్థానంలో తాత్కాలిక సారథి రహానే ఫామ్‌లోకి వస్తే అంతా సర్దుకుంటుంది. వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు నీరసించక తప్పదు. శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రం చేస్తాడని ఒక రోజు ముందుగానే రహానే ప్రకటించాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం! భారత్‌లో స్పిన్నే ప్రధాన ఆయుధం... ఈ నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌తో పాటు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఖాయంగా ఆడతారు. పేసర్లలో ఇషాంత్ శర్మతో హైదరాబాదీ సీమర్ సిరాజ్ లేదంటే ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. కోహ్లి, రోహిత్, బుమ్రా, షమీ, పంత్‌లాంటి ప్లేయర్లు లేకపోయినా స్వదేశంలో తిరుగు లేని జట్టయిన భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే టెస్టు విజయం కష్టం కాబోదు. విలియమ్సన్ అండతో... రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేని జట్టు మూడు టి20ల్లోనూ చిత్తుగా ఓడింది. కానీ టెస్టులకు కొండంత అండ కేన్ హాజరుతో లభించింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కూడా అందుబాటులోకి రావడం జట్టును పటిష్టంగా మార్చింది. అయితే భారత్‌లో న్యూజిలాండ్ రికార్డే అత్యంత పేలవంగా ఉంది. ఇప్పటివరకు 34 టెస్టులు ఆడితే కేవలం 2 టెస్టులే గెలవగలిగింది. అప్పుడెప్పుడో 1988లో చివరిసారిగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ విజయానికి చేరువగా రాలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్ హోదాతో భారత్‌కు వచ్చింది. ప్రధాన బౌలర్లలో ఒకడైన ట్రెంట్ బౌల్ట్ విశ్రాంతితో స్వదేశం చేరాడు. ఈ నేపథ్యంలో పేస్ భారమంతా సీనియర్ సీమర్ సౌతీపైనే ఉంది. భారత్‌లోని స్పిన్ పిచ్‌ల దృష్ట్యా ఎజాజ్ పటేల్, సొమర్విల్లేలను తీసుకొచ్చినా... వీళ్లు ఏమాత్రం ప్రభావం చూపుతారో మైదానంలోనే చూడాలి. -
IND Vs ENG: నన్ను ఎందుకు ఆడించలేదంటే...
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు నలుగురు పేసర్లతో ఆడింది. రెండో టెస్టుకు వచ్చే సరికి శార్దుల్ గాయపడగా, అతని స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చని అంతా భావించారు. కానీ ఈ సారి కూడా అదే నలుగురు పేసర్లు వ్యూహాన్ని టీమిండియా అనుసరించింది. అయితే అశ్విన్‌ను ఆడించేందుకు టీమ్ మేనేజ్మెంట్ దాదాపుగా సిద్ధపడగా...ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అశ్విన్ స్వయంగా వెల్లడించాడు. టీమ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌తో అతను దీనిని పంచుకున్నాడు. ‘మ్యాచ్ జరిగే రోజుల్లో ముందస్తు వాతావరణ సూచన చూస్తే బాగా ఎండ కాస్తుందని, వేడి గాలులు వీస్తాయని ఉంది. మ్యాచ్ ఆడేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని నాతో టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది కూడా. అయితే మ్యాచ్ రోజు మేం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా చల్లగా మారిపోయి చినుకులు కురుస్తున్నాయి. దాంతో నాకు చోటు దక్కలేదు. వాతావరణం మన చేతుల్లో లేదు కదా’ అని అశ్విన్ వెల్లడించాడు. -
నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్‌తో విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ
జమైకా: పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిధ్య విండీస్ జట్టు నరాలు తెగే ఉత్కంఠత నడుమ అద్భుత విజయం సాధించింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. పాక్ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ తన జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ప్రారంభం కానుంది. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 160/5తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ (5/55) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో విండీస్ తరఫున 5 వికెట్ల ఘనత సాధించి అత్యంత పిన్న వయస్కుడిగా(19 ఏళ్లు) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం పాక్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. రోస్టన్ ఛేజ్ (22), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (55), హోల్డర్(16), జాషువా డిసిల్వా(13), కీమర్ రోచ్(30 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. హసన్ అలీ(3/37), షాహీన్ ఆఫ్రిది(4/50), ఫహీమ్ అష్రాఫ్(2/29) విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. ఓ దశలో కరేబియన్ల ఓటమి దాదాపు ఖరారైంది. ఈ సమయంలో కీమర్ రోచ్ సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 8 వికెట్లతో రాణించిన జేడెన్ సీల్స్కు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరగులు చేయగా.. విండీస్ 253 రన్స్‌కు ఆలౌటైంది. చదవండి: Afghanisthan: క్రికెటర్ల పరిస్థితి.. ఐపీఎల్లో ఆడతారా? -
రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతున్న పాక్.. ఆదుకున్న కెప్టెన్
జమైకా: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటై 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (97; 12 ఫోర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. హోల్డర్ (58; 10 ఫోర్లు)తో కలసి బ్రాత్‌వైట్ ఐదో వికెట్‌కు 96 పరుగులు జతచేశాడు. పాక్ బౌలరల్లో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు, మహ్మద్ అబ్బాస్ 3, ఫహీమ్ అష్రాఫ్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 36 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ మరోసారి తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్(54 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమ్రాన్ బట్, ఫవాద్ ఆలం డకౌట్ కాగా, ఆబిద్ అలీ(34), అజార్ అలీ(23), మహ్మద్ రిజ్వాన్(30) రెండంకెల స్కోర్ చేయగలిగారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో రెండు వికెట్లు, హోల్డర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆ జట్టు 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: కోహ్లీ సేనపై మైఖేల్ వాన్ వెటకారం
నాటింగ్హమ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కడం ఆపడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా డ్రా ముగిసిన నేపథ్యంలో.. తనకు మాత్రమే చేతనైన వెటకారపు ట్వీట్‌ను చేశాడు. కోహ్లీ సేనను రక్షించేందుకే వర్షం కురిస్తుందంటూ వ్యంగ్యమైన ట్వీట్‌ను సంధించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత అభిమానులు వాన్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఆఖరి రోజు ఆటలో 98 ఓవర్లకు ఆస్కారముండగా టీమిండియా చేతిలో 9 వికెట్లు మిగిలున్నాయి. ఇంత పటిష్ట స్థితిలో భారత జట్టు ఉంటే.. వాన్ ఇలాంటి చెత్త ట్వీట్లు చేయడమేంటని భారతీయులు మండిపడుతున్నారు. Looks like Rain may be saving Indian here … 😜 #ENGvIND — Michael Vaughan (@MichaelVaughan) August 8, 2021 ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్ నెగ్గి శుభారంభం చేయాల్సిన టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు నాలుగో రోజు ఆఖరి సెషన్లో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్ విజయ జయభేరి మోగించేదే. ఇలాంటి తరుణంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు ఆఖరి రోజు ఆటను రద్దు చేస్తూ.. మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/64), శార్ధూల్ ఠాకూర్(2/37), సిరాజ్(2/84), షమీ(1/72) రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియా గెలుపుకు వరుణుడి ఆటంకం..?
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభంకావాల్సిన సమయానికి వర్షం కురుస్తుండటంతో ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ సేన నాలుగో రోజు వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట చివర్లో ధాటిగా ఆడిన కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా.. రోహిత్ శర్మ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్ విజయ జయభేరి మోగిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపును వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రూట్ శతక్కొట్టిన తర్వాత ఔట్ చేసిన బుమ్రా (5/64) మిగతా టాపార్డర్‌ను కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్ సిబ్లీ (28; 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో క్రాలీ (6) సహా లోయర్ ఆర్డర్లో స్యామ్ కరన్ (45 బంతుల్లో 32; 4 ఫోర్లు), బ్రాడ్ (0)లను బుమ్రా ఔట్ చేశాడు. మరోవైపు శార్దుల్... లారెన్స్ (25), బట్లర్ (17) వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ 2, షమీ ఓ వికెట్ పడగొట్టారు. -
జడేజా చక్కటి ఇన్నింగ్స్.. భారత్‌కు ఆధిక్యం
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (214 బంతుల్లో 84; 12 ఫోర్లు) తొలి సెషన్లో నిలబడగా... తర్వాత రవీంద్ర జడేజా (86 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లు పడగొట్టగా, అండర్సన్‌కు 4 వికెట్లు లభించాయి. అయితే వాన మ్యాచ్‌కు పదేపదే అంతరాయం కలిగించడంతో మూడో రోజు కూడా 49.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (11 బ్యాటింగ్), డామ్ సిబ్లీ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జడేజా ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 125/4 శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండు ఓవర్లు ఆడిందో లేదో వర్షం తరుముకొచ్చింది. మళ్లీ ఆట మొదలవగా... ఓపెనర్ రాహుల్ ఇంగ్లండ్ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. టెస్టుల్లో వన్డే ఇన్నింగ్స్ ఆడిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్)ను రాబిన్సన్ ఔట్ చేశాడు. జడేజా క్రీజులోకి రాగా 191/5 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది. అనంతరం ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత సెంచరీ చేస్తాడనుకున్న రాహుల్ నిష్క్రమించాడు. ఈ దశలో జడేజా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక జడేజా కూడా వికెట్‌ను పారేసుకోగా... టెయిలెండర్లలో బుమ్రా (34 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడాడు. దీంతో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆధిక్యం లభించింది. Sir Ravindra Jadeja celebrating in his own style! Well played #Jadeja!👏👏👏👏 Come on #TeamIndia get us some wickets!#ENGvIND #ENGvsIND #IndvsEng #INDvENG #Cricketpic.twitter.com/9gRy7JlPjP — BlueCap 🇮🇳 (@IndianzCricket) August 6, 2021 కుంబ్లేను అధిగమించిన అండర్సన్ ఇంగ్లండ్ సీనియర్ సీమర్ జేమ్స్ అండర్సన్ భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే వికెట్ల మైలురాయి (619)ని అధిగమించాడు. గురువారం కోహ్లి (0)ని ఔట్ చేయడం ద్వారా 619 వికెట్లతో కుంబ్లే సరసన నిలిచిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ శుక్రవారం ఓపెనర్ కె.ఎల్.రాహుల్ (84) వికెట్‌తో కుంబ్లేను దాటేశాడు. ఇప్పుడు టెస్టుల్లో మురళీధరన్ (శ్రీలంక; 800), షేన్‌వార్న్ (ఆసీస్; 708), తర్వాత స్థానం అండర్సన్‌దే. అతని ఖాతాలో 621 వికెట్లున్నాయి. కుంబ్లే (619) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ టాప్–4 అండర్సన్ మినహా ముగ్గురు ఎప్పుడో రిటైరయ్యారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 183; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్యామ్ కరన్ (బి) రాబిన్సన్ 36; రాహుల్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 84; పుజారా (సి) బట్లర్ (బి) అండర్సన్ 4; కోహ్లి (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; రహానే (రనౌట్) 5; పంత్ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్ 25; జడేజా (సి) బ్రాడ్ (బి) రాబిన్సన్ 56; శార్దుల్ (సి) రూట్ (బి) అండర్సన్ 0; షమీ (బి) రాబిన్సన్ 13; బుమ్రా (సి) బ్రాడ్ (బి) రాబిన్సన్ 28; సిరాజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (84.5 ఓవర్లలో ఆలౌట్) 278. వికెట్ల పతనం: 1–97, 2–104, 3–104, 4–112, 5–145, 6–205, 7–205, 8–232, 9–245, 10–278. బౌలింగ్: అండర్సన్ 23–8–54–4, బ్రాడ్ 20–3–70–0, రాబిన్సన్ 26.5–6–85–5, స్యామ్ కరన్ 15–2–57–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 11; సిబ్లీ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 25. బౌలింగ్: బుమ్రా 3–0–6–0, సిరాజ్ 5.1–2–10–0, షమీ 3–1–9–0. -
రూట్ డబుల్ సెంచరీ
గాలె (శ్రీలంక): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు 286 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 320/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 421 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 228; 18 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అంతేకాకుండా ఈ మైదానంలో ద్విశతకాన్ని సాధించిన నాలుగో విదేశీ ప్లేయర్‌గా ఘనత వహించాడు. అతని కన్నా ముందు క్రిస్ గేల్ (333; వెస్టిండీస్), వీరేంద్ర సెహ్వాగ్ (201 నాటౌట్; భారత్), ముష్ఫికర్ రహీమ్ (200; బంగ్లాదేశ్) ఇదే మైదానంలో డబుల్ సెంచరీలు బాదారు. శనివారం ఆటలో లంక బౌలర్లు దిల్రువాన్ పెరీరా (4/109), ఆషిత ఫెర్నాండో (2/44) రాణించడంతో ఇంగ్లండ్ లంచ్ సమయానికే మిగిలిన 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు జోడించగలిగింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ రూట్ 291 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. బట్లర్ (30; 3 ఫోర్లు) రాణించాడు. లసిత్ ఎంబుల్డేనియాకు 3 వికెట్లు దక్కాయి. 286 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక శనివారం ఆట ముగిసే సమయానికి 61 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 130 పరుగులు వెనుకబడి ఉంది. లంకకు ఓపెనర్లు కుశాల్ పెరీరా (62; 5 ఫోర్లు, 1 సిక్స్), లహిరు తిరిమన్నె (76 బ్యాటింగ్; 6 ఫోర్లు) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 101 పరుగుల్ని జోడించారు. కుశాల్ మెండిస్ (15) ఔటైనా... తిరిమన్నెతో కలిసి లసిత్ ఎంబుల్డేనియా (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్యామ్ కరన్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు. -
‘గులాబీ’ గుచ్చుకుంది..
పింక్ పోరులో టీమిండియా తడబడింది... ఓపెనర్ల వైఫల్యం తర్వాత సీనియర్ల ఆటతో దారిలో పడిన ఇన్నింగ్స్... సూర్యాస్తమయానికి ముందు మళ్లీ గతి తప్పింది... ఫలితంగా అడిలైడ్‌లో తొలి రోజు ఆట చివరకు ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. కోహ్లి అర్ధ సెంచరీకి తోడు పుజారా, రహానేల ప్రదర్శన టీమిండియాను ఆదుకుంది. మిగిలిన నాలుగు వికెట్లతో మన జట్టు మరికొన్ని అదనపు పరుగులు జోడిస్తే రెండో రోజు భారత బౌలర్లు శాసించవచ్చు. అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత బ్యాటింగ్, చతేశ్వర్ పుజారా అడ్డుగోడ, అజింక్యా రహానే నిలకడ వెరసి టీమిండియా మొదటి రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించింది. గురువారం టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టార్క్ 2 వికెట్లు తీయగా... హాజల్‌వుడ్, కమిన్స్, లయన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్), అశ్విన్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనింగ్ బౌల్డ్ ఆట ఆరంభం కాగానే భారత ఓపెనింగ్ క్లీన్ బౌల్డయ్యింది. యువ ఓపెనర్ పృథ్వీ షా(0)ను స్టార్క్ ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డ్ చేశాడు. అతని స్టాన్స్, బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య అతని నిర్లక్ష్యంపై టీవీ వ్యాఖ్యాతల్లో ఒకరైన పాంటింగ్ స్పందించాడు. అతని టెక్నిక్‌లో లోపాలున్నాయని... తేలిగ్గానే క్లీన్‌బౌల్డ్ చేయొచ్చని వ్యాఖ్యానించాడు. రికీ కామెంట్ ముగిసిందో లేదో అన్నట్లుగానే అతని వికెట్ పడింది. ఐపీఎల్లో పృథ్వీ ఉన్న ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించాడు. అలా పరుగు రాకమునుపే భారత్ వికెట్‌ను సమర్పించుకుంది. తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (40 బంతుల్లో 17; 2 ఫోర్లు)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. దీంతో 32 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. కొత్త బంతి మెరుగును ఆసీస్ పేసర్లు అందిపుచ్చుకున్నారు. రహానేను అవుట్ చేసిన క్షణాన స్టార్క్... పుజారా నిలబడి... భారత్‌కు ఇది రెండో డేనైట్ టెస్టు. విదేశాల్లో మొదటిది. పరిస్థితులకు అనుగుణంగా పుజారా ఆడకపోయివుంటే భారత్ తొలి రోజే ఆలౌటయ్యేది. సంప్రదాయ క్రికెట్ ఆడే అర్హతలన్నీ పుష్కలంగా వున్న పుజారా ముఖ్యంగా పింక్ టెస్టును ఎలా ఆడాలో తన ఆటతీరుతో చాటిచెప్పాడు. మొదట్లో బ్యాట్స్‌మెన్‌కు ఎదురయ్యే ప్రతికూలతలకు ఎదురీదాడు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవించాడు. అతను బౌండరీ బాదేందుకు పట్టిన బంతుల్ని చూస్తే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. వంద బంతులాడినా ఫోర్ కొట్టని పుజారా 147వ బంతిని బౌండరీకి తరలించాడు. మరుసటి బంతిని అక్కడికే పంపాడు. కెప్టెన్ కోహ్లి క్రీజులో ఉండటం, అతను బాధ్యతగా ఆడటం వల్ల తొలి సెషన్లో మరో వికెట్ తీయడం ఆసీస్ తరం కాలేకపోయింది. కోహ్లి అర్ధసెంచరీ కెప్టెన్ కోహ్లి, పుజారా ఆడిన తీరు తొలిసెషన్ నష్టాన్ని పూడ్చింది. రెండో సెషన్‌ను కూడా దాదాపు కాపాడింది. అందుకే జట్టు స్కోరు 100 పరుగుల దాకా మరో వికెట్ కోల్పోకుండా వీరి భాగస్వామ్యం సాగింది. ఆసీస్ కెప్టెన్ పైన్ అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించాడు. ఆఖరి సెషన్‌కు కాస్త ముందు... ఇన్నింగ్స్ 50వ ఓవర్ వేసిన లయన్ పుజారాను ఔట్ చేశాడు. నిజానికి పుజారాకు ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. బ్యాట్, ప్యాడ్లను తాకుతూ వెళ్లిన బంతి ని లెగ్ గల్లీలో ఉన్న లబ్‌షేన్ అందుకున్నాడు. పెద్దగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ అన్నాడు. కానీ ఈ లోపే పుజారా ప్చ్... అని నిట్టూరుస్తూ నిష్క్రమించేందుకు సిద్ధమయ్యాడు. అంపైర్ నిర్ణయంతో మళ్లీ నిలబడ్డాడు. దీన్ని గమనించిన ఆసీస్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లి ఫలితం పొందారు.దీంతో 68 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. రహానే జతయ్యాక 107/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. తర్వాత వీళ్లిద్దరు కూడా కుదురుకోవడంతో ఆసీస్ బౌలర్లకు మళ్లీ అలసట తప్పలేదు. ముఖ్యంగా కోహ్లి పోరాటం తొలిరోజు ఆటకు ప్రాణం పోసింది. 123 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో భారత కెప్టెన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్లో కొత్త బంతి భారత్‌ను దెబ్బ తీసింది. తొలి ఓవర్లోనే స్టార్క్ క్రీజులో పాతుకుపోయిన రహానేను ఎల్బీడబ్ల్యూగా పంపించాడు. రహానే రివ్యూ కోరినా లాభం లేకపోయింది. కాసేపటికే హనుమ విహారి (16)ని హాజల్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అవుటా..నాటౌటా! కోహ్లిని 16 పరుగుల వద్ద అవుట్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా వృథా చేసుకుంది. లయన్ బౌలింగ్‌లో కోహ్లి లెగ్‌సైడ్ ఆడగా బంతి కీపర్ పైన్ చేతుల్లో పడింది. క్యాచ్ అప్పీల్‌కు అంపైర్ స్పందించలేదు. రివ్యూ కోరేందుకు పైన్ ఆసక్తి చూపించినా...లయన్ సహా సహచరులెవరూ మద్దతు ఇవ్వలేదు. దాంతో పైన్ రివ్యూకు వెళ్లలేదు. అయితే రీప్లేలో అది అవుటయ్యే అవకాశం ఉందని తేలింది. హాట్‌స్పాట్‌లో బంతి కోహ్లి గ్లవ్‌ను అలా తాకుతూ వెళ్లటం నమోదైంది. పూర్తి స్పష్టత లేకపోయినా డీఆర్ఎస్ను వాడుకుంటే ఆసీస్‌కు మేలు జరిగేది. సరైందా, కాదా తర్వాతి సంగతి... మూడు రివ్యూలు అందుబాటులో ఉండగా, కోహ్లి కోసం దానిని వాడకపోవడం పైన్ నాయకత్వ వైఫల్యాన్ని చూపిస్తోంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) స్టార్క్ 0; మయాంక్ (బి) కమిన్స్ 17; పుజారా (సి) లబ్‌షేన్ (బి) లయన్ 43; కోహ్లి రనౌట్ 74; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 42; విహారి (ఎల్బీడబ్ల్యూ) (బి) హజల్‌వుడ్ 16; సాహా బ్యాటింగ్ 9; అశ్విన్ బ్యాటింగ్ 15; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (89 ఓవర్లలో 6 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–0, 2–32, 3–100, 4–188, 5–196, 6–206. బౌలింగ్: స్టార్క్ 19–4–49–2; హజల్‌వుడ్ 20–6–47–1, కమిన్స్ 19–7–42–1, గ్రీన్ 9–2–15–0, లయన్ 21–2–68–1, లబ్‌షేన్ 1–0–3–0. తొలి సెషన్ ఓవర్లు: 25, పరుగులు: 41, వికెట్లు: 2 రెండో సెషన్ ఓవర్లు: 30, పరుగులు: 66, వికెట్లు: 1 మూడో సెషన్ ఓవర్లు: 34, పరుగులు: 126, వికెట్లు: 3 అదే మలుపు... కోహ్లి, రహానే మధ్య 88 పరుగుల భాగస్వామ్యం అనూహ్యంగా రనౌట్‌తో ముగిసింది. లయన్ బౌలింగ్‌లో మిడాఫ్ వైపు ఆడిన రహానే పరుగు కోసం కాస్త ముందుకు వచ్చాడు. మరో వైపునుంచి కోహ్లి మాత్రం వేగంగా దూసుకుపోయాడు. బంతి ఫీల్డర్ వద్దకు చేరడంతో పరిస్థితి చూసిన రహానే వెనక్కి తగ్గినా... కోహ్లి అప్పటికే చాలా ముందుకు వచ్చేశాడు. దాంతో లయన్ సునాయాసంగా రనౌట్ చేసేశాడు. ఒక దశలో మేం ప్రత్యర్థిపై ఆధిపత్యంలో ఉన్నామనేది వాస్తవం. అయితే కోహ్లి, రహానే అవుట్ కావడంతో వారిది కాస్త పైచేయిగా మారింది. ఈ రెండూ ఎంతో కీలకమైన వికెట్లు. అయినా సరే మ్యాచ్‌లో ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితి సమానంగానే ఉందనేది నా అభిప్రాయం. సాహా, అశ్విన్‌లు బ్యాటింగ్ చేయగలరు కాబట్టి కనీసం 300 పరుగుల స్కోరు రావచ్చు. లోయర్ ఆర్డర్ కూడా చెలరేగితే 350 కూడా కావచ్చేమో ఎవరు చెప్పగలరు! ఆరంభంలో పరుగులు రాకపోవడం, బాగా నెమ్మదిగా ఆడాల్సి రావడంలో తప్పేమీ లేదు. బంతి బాగా స్వింగ్ అవుతున్న ఆ సమయంలో వేగంగా పరుగులు రాబట్టాలనే వ్యూహం గురించి ఎవరూ ఆలోచించరు. చేతిలో వికెట్లు ఉంటే ఆ తర్వాత ఎలాగైనా పరుగులు సాధించవచ్చు. బౌలర్లకు ఈ రోజు పిచ్ బాగా అనుకూలించింది. వారిని గౌరవిస్తూ ఆడటం ఎంతో ముఖ్యం. రెండు సెషన్లలోనే వికెట్లు కోల్పోతే తొలి రోజే ఆలౌట్ అయ్యే ప్రమాదం ఉండేది కదా’ –చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్ ఇంకా ఎన్ని పరుగులు? మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 250/9... ఈ స్కోరు కాస్త తేడాగా కనిపిస్తోందా! రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇదే అడిలైడ్ మైదానంలో మొదటి రోజు టీమిండియా సాధించిన స్కోరు ఇది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించగా... చివరకు టెస్టును 31 పరుగులతో గెలిచిన కోహ్లి సేన సిరీస్‌లో శుభారంభం చేసింది. నాటి ప్రదర్శనలు సరిగ్గా పునరావృతం కాకపోవచ్చు కానీ ఆ మ్యాచ్ ప్రదర్శనతో పోల్చి చూస్తే నేటి 233/6 మెరుగైన స్కోరుగానే చెప్పవచ్చు. విదేశీ గడ్డపై తొలి ‘పింక్ బాల్’ టెస్టు ఆడుతున్న భారత్ పూర్తిగా కుప్పకూలిపోకుండా ఇక్కడి వరకు రాగలిగింది. ఆరంభంలో పుజారా కనబర్చిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. గత సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడిని నిరోధించడం ఎంత కష్టమో ఆసీస్‌కు ఈపాటికే అర్థమై ఉంటుంది. ముగ్గురు పేసర్లు చక్కటి క్రమశిక్షణతో, అద్భుతమైన బంతులతో పుజారాను ఎంతగా ఇబ్బంది పెట్టినా అతను సహనం కోల్పోలేదు. ఏకాగ్రత చెదరకుండా సుమారు మూడున్నర గంటల పాటు క్రీజ్‌లో నిలిచి వికెట్ విలువేమిటో చూపించాడు. ఆ పునాదిపైనే కోహ్లి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. మరి కొద్దిసేపు కోహ్లి ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. రహానే కూడా ఆత్మవిశ్వాసంతో చూడచక్కటి షాట్లు ఆడాడు. అయితే కోహ్లి రనౌట్‌కు కారణమైన అపరాధ భావం వల్ల కావచ్చు రహానే వెంటనే తడబడ్డాడు. డే అండ్ నైట్ టెస్టుకు సంబంధించి సాయంత్రం సమయంలో కొత్త గులాబీ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది కావచ్చంటూ చర్చ సాగగా, ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. రహానే, విహారి అదే సమయంలో వికెట్ల ముందు దొరికిపోయారు. అయితే మరికొంత పట్టుదల కనబరిస్తే ఆ గండం దాటవచ్చని సాహా, అశ్విన్ 43 బంతులు ఆడి నిరూపించారు. వీరిద్దరికి బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఇటీవల అశ్విన్ బ్యాటింగ్ కూడా ఎంతో మెరుగైంది. రెండో రోజు వీరు నిలబడితే భారత్ కనీసం 275–300 మధ్య స్కోరు సాధించగలదు. సాధారణంగా పింక్ టెస్టుల్లో బౌలర్లు ఆధిపత్యం సాగిస్తున్న చోట పరుగుల వరద పారకపోయినా ఇది చెప్పుకోదగ్గ స్కోరు. అడిలైడ్ పిచ్ కూడా కాస్త భిన్నంగా కనిపిస్తోంది. కొంత బౌన్స్ ఉన్నా వేగం కూడా మరీ ఎక్కువేమీ లేదు. చాలా బంతులు బ్యాట్‌ను తాకి స్లిప్స్‌లో ఫీల్డర్ల ముందు పడ్డాయి. బుమ్రా, షమీ రూపంలో అత్యుత్తమ బౌలర్లు మన జట్టులో ఉన్నారు. పైగా ఆఫ్‌స్టంప్‌పై కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తూ కీపర్, స్లిప్స్‌లో క్యాచ్‌లు ఆశించే ఆసీస్ పేసర్లతో పోలిస్తే నేరుగా స్టంప్స్‌పైనే ఎక్కువగా దాడి చేసే మన బౌలర్ల శైలికి ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. అడిలైడ్‌లో నాలుగు డే అండ్ నైట్ టెస్టులు గెలిచిన రికార్డు ఉన్నా... నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రతీసారి తడబడ్డారనే విషయం గమనార్హం. ఇక లయన్ బంతిని తిప్పిన తీరు చూస్తుంటే సీనియర్ స్పిన్నర్‡ అశ్విన్‌ను ఎదుర్కోవడం ఆసీస్‌కు అంత సులువు కాదు! -
అడిలైడ్‌లో ఆసీస్‌తో భారత్ డేనైట్ టెస్టు
కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తొలి టెస్టును అడిలైడ్ వేదికగా డేనైట్‌లో ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని క్రికె ట్ ఆస్ట్రేలియా (సీఏ) తమకు పంపిందని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్‌తో భారత్ మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడుతుంది. తొలి టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడుతుంది. అడిలైడ్‌లో ఈ పింక్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు. ‘దాదా’ ఐసీసీ చైర్మన్ రేసులో నుంచి తప్పుకున్నాడా? గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే! భారత బోర్డు నుంచి ఐసీసీకి నామినేషన్లే రాలేదని తెలిసింది. భారత్‌కే చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం నామినేషన్లను ఈ నెల 18లోపే దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆదివారంతో గడువు ముగిసినా బీసీసీఐ నుంచి నామినేషన్లు రాలేదని ఐసీసీ తెలిపింది. నామినేషన్ల స్క్రూటిని అనంతరం డిసెంబర్లో ఎన్నిక జరుగనుంది. -
పాకిస్తాన్ 139/2
మాంచెస్టర్: ఇంగ్లండ్ టూర్‌ను పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం మొదలైన తొలి టెస్టులో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్, షాన్ మసూద్ ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను ముందుగానే నిలిపేయడంతో తొలిరోజు కనీసం 50 ఓవర్లయినా సాగలేదు. బాబర్ (100 బంతుల్లో 69 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో నిలిచాడు. ఓపెనర్ షాన్ మసూద్ (152 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు) రాణించడంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. అబిద్ అలీ (16)ని ఆర్చర్ క్లీన్‌బౌల్డ్ చేయగా... కెప్టెన్ అజార్ అలీ (0)ని వోక్స్ డకౌట్‌గా పంపాడు. దీంతో మసూద్, బాబర్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: షాన్ మసూద్ బ్యాటింగ్ 46; అబిద్ అలీ (బి) ఆర్చర్ 16; అజార్ అలీ ఎల్బీడబ్ల్యూ (బి) వోక్స్ 0; బాబర్ బ్యాటింగ్ 69; ఎక్స్‌ట్రాలు 69; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 139/2. వికెట్ల పతనం: 1–36, 2–43. బౌలింగ్: అండర్సన్ 8–2–32–0; బ్రాడ్ 11–4–24–0, వోక్స్ 8–2–14–1, ఆర్చర్ 10–3–23–1, బెస్ 9–1–30–0, రూట్ 3–0–9–0. -
రాస్ టేలర్ ‘ట్రిపుల్’ సెంచరీ
వెల్లింగ్టన్: భారత్‌తో జరిగే తొలి టెస్టుతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. ఇది అతని కెరీర్లో 100వ టెస్టు కావడం విశేషం. తద్వారా ఏ జట్టు తరఫు నుంచైనా మూడు ఫార్మాట్లలోనూ కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా అతను రికార్డులకెక్కుతున్నాడు. 36 ఏళ్ల టేలర్ ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్ తరఫున డానియల్ వెటోరి (112), స్టీఫెన్ ఫ్లెమింగ్ (111), బ్రెండన్ మెకల్లమ్ (101) తర్వాత వంద టెస్టులు ఆడనున్న నాలుగో ఆటగాడిగా టేలర్ నిలిచాడు. -
సెంచరీతో చెలరేగిన హనుమ విహారి
0, 1, 0... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు ఇవి. నిజానికి కివీస్ ఎలెవన్‌తో ఈ మ్యాచ్‌ను ఓపెనర్ల సామర్థ్యానికి పరీక్షగా భావించగా... కాస్త పచ్చిక ఉన్న పిచ్‌పై ముగ్గురూ అందులో విఫలమయ్యారు. అసలు టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనే సందేహమున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి మాత్రం సెంచరీతో సత్తా చాటాడు. విహారికి తోడుగా సీనియర్ పుజారా కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ కోహ్లి మాత్రం బ్యాటింగ్‌కు దూరంగా ఉండిపోవడమే శుక్రవారం ఆటలో విశేషం. హామిల్టన్: పిచ్‌పై కాస్త బౌన్స్, మరికాస్త స్వింగ్ కలగలిస్తే భారత బ్యాట్స్‌మెన్ తడబడతారనేది గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు వాటికి అతీతమని, ఎక్కడైనా రాణించగలదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై మాత్రం పెను సవాల్ ఎదురు కానుందని ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే తేలిపోయింది. కివీస్ ద్వితీయ శ్రేణి బౌలర్లను కూడా సమర్థంగా మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78.5 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోగా... ఇతర బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా దాటలేకపోయారు. విహారి, పుజారా ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. టపటపా... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కుగ్లీన్ వేసిన తొలి ఓవర్లోనే అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక పృథ్వీ షా (0) షార్ట్‌లెగ్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత కుగ్లీన్ బౌలింగ్‌లోనే ఆఫ్‌స్టంప్‌పై దూసుకొచ్చిన బంతిని ఆడి మయాంక్ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటిని జాగ్రత్తగా ఆడాలంటూ వ్యాఖ్యానించిన శుబ్‌మన్ గిల్ (0) ఈ ఇన్నింగ్స్‌లో షార్ట్ పిచ్ బంతినే ఆడలేక గల్లీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనుభవజ్ఞుడైన రహానే (18) కూడా నీషమ్ వేసిన స్వింగ్ బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. భారీ భాగస్వామ్యం... భారత్ స్కోరు 38/4గా నిలిచిన దశలో పుజారా, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. తాను ఆడిన తొలి 80 బంతుల్లో పుజారా ఒకే ఫోర్ కొట్టాడు. పిచ్ సాధారణంగా మారిపోయిన తర్వాత ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో విహారి కొట్టిన మూడు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అర్ధసెంచరీ చేసేందుకు పుజారాకు 153 బంతులు, విహారికి 132 బంతులు పట్టాయి. అయితే ఆ తర్వాత సెంచరీ అందుకునేందుకు విహారి మరో 48 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. మరో వైపు పుజారా మాత్రం సెంచరీకి చేరువలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... శతకం పూర్తి కాగానే విహారి రిటైర్డ్ అవుట్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు మిగిలిన సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ప్రయత్నంలో భారత బ్యాట్స్‌మన్ వెంటవెంటనే అవుటయ్యారు. 18 పరుగుల వ్యవధిలో చివరి నలుగురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్లీన్ 0; మయాంక్ (సి) క్లీవర్ (బి) కుగ్లీన్ 1; పుజారా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 93; గిల్ (సి) సీఫెర్ట్ (బి) కుగ్లీన్ 0; రహానే (సి) బ్రూస్ (బి) నీషమ్ 18; విహారి (రిటైర్డ్ అవుట్) 101; పంత్ (సి) కుగ్లీన్ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 0; అశ్విన్ (ఎల్బీ) (బి) సోధి 0; ఉమేశ్ (నాటౌట్) 9; జడేజా (సి) అలెన్ (బి) సోధి 8; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (78.5 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–0; 2–5; 3–5; 4–38; 5–233; 6–245; 7–246; 8–246; 9–250; 10–263. బౌలింగ్: కుగ్లీన్ 14–2–40–3; టిక్నర్ 15–3–37–0; మిషెల్ 7–1–15–0; నీషమ్ 13–3–29–1; గిబ్సన్ 10–1–26–2; సోధి 14.5–0–72–3; రవీంద్ర 5–1–30–0. ఓపెనింగ్ చేసేందుకు సిద్ధం! హామిల్టన్: విహారి కెరీర్ 7 టెస్టు మ్యాచ్‌లే కావచ్చు. కానీ తనకు టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు అవకాశం ఇచ్చినా దానిని వృథా చేయలేదు. ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఆడగలనని ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ నిరూపించాడు. ఏడాది క్రితం మెల్బోర్న్ టెస్టులో అనూహ్యంగా అతడిని ఓపెనర్‌గా పంపారు. 8, 13 పరుగులే చేసినా... తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 80 నిమిషాల పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం జట్టుకు పనికొచ్చింది. అతని ఈ ప్రదర్శనను కెప్టెన్ కోహ్లి స్వయంగా ప్రశంసించాడు. ఇప్పుడు అలాంటిదే మరో అవకాశం అతని కోసం ఎదురు చూస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ముగ్గురు ఓపెనర్లూ విఫలం కాగా, ఓపెనర్లకు ఉండే సమర్థవంతమైన టెక్నిక్‌తో విహారి సెంచరీ చేయడం అతనికి కొత్త అవకాశాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన విహారి ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సన్నద్ధమయ్యాను. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు. ఎవరూ మాట్లాడలేదు. అయితే గతంలో చెప్పినట్లు జట్టు అవసరాల దృష్ట్యా ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. కొన్ని సార్లు జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల బాధ పడకూడదు. స్వదేశంలో ఆడినప్పుడు మన జట్టు ఐదుగురు బౌలర్లతో దిగుతుంది కాబట్టి ఒక బ్యాట్స్‌మన్‌ను తప్పించాల్సిందే. నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి అదే కారణమని భావిస్తున్నా’ అని శుక్రవారం మీడియా సమావేశంలో విహారి వ్యాఖ్యానించాడు. -
శాసించే స్థితిలో ఆస్ట్రేలియా
పెర్త్: స్వదేశంలో ఏడో డే నైట్ టెస్టులో విజయం దిశగా ఆస్ట్రేలియా జట్టు సాగుతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇక్కడ డే నైట్‌గా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా శాసించే స్థితికి చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్‌గా తమ ఆధిక్యాన్ని 417 పరుగులకు పెంచుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 109/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... ఆసీస్ బౌలర్ల విజృంభణకు 166 పరుగులకే కుప్పకూలింది. రాస్ టేలర్ (134 బంతుల్లో 80; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్ లయన్‌కు రెండు వికెట్లు లభించాయి. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. బర్న్స్ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), లబ్‌షేన్ (81 బంతుల్లో 50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వేడ్ (8 బ్యాటింగ్), కమిన్స్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌతీ నాలుగు వికెట్లు తీశాడు. -
అందుకే విహారి జట్టులోకి వచ్చాడు: కోహ్లి
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ 318 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ తొలి రోజు తుది జట్టు ఎంపికపై పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై జట్టు కెప్టెన్ కోహ్లి మ్యాచ్ ముగిసిన తర్వాత వివరణ ఇచ్చాడు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు ప్రయోజనాల కోసమేనన్న కెప్టెన్... టెస్టులో సహచరుల ఆటపై ప్రశంసలు కురిపించాడు. ‘తుది జట్టు విషయంలో మేమందరం కలిసి ముందుగా చర్చించుకొని ఆ తర్వాత టీమ్‌కు ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఆడే 11 మంది విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమేనని అందరూ అర్థం చేసుకుంటారు’ అని కోహ్లి స్పష్టం చేశాడు. రోహిత్ శర్మను కాదని హనుమ విహారిని ఎంచుకున్న నిర్ణయాన్ని కెప్టెన్ సమర్థించుకున్నాడు. ‘కాంబినేషన్ కీలకం కాబట్టి విహారి జట్టులోకి వచ్చాడు. అతను నాణ్యమైన పార్ట్‌టైమ్ బౌలర్. ఓవర్‌రేట్ పెరిగిపోతోందని అనిపించిన సమయంలో విహారి పనికొస్తాడు’ అని విరాట్ చెప్పాడు. తాను అనుకున్న వ్యూహాలను సహచరులందరూ సమర్థంగా అమలు చేయడం ఆనందంగా ఉందని కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇక ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి త్రుటిలో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 93 పరుగులతో ఆకట్టుకున్న అతను ఇకపై తన ఆఫ్‌స్పిన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించాడు. 1: విదేశీ గడ్డపై భారత్‌కు ఇదే (318 పరుగులు) అతి పెద్ద విజయం. 2017లో శ్రీలంకను (గాలే) భారత్ 304 పరుగులతో ఓడించింది. 27: కోహ్లి కెప్టెన్సీలో భారత్‌కు ఇది 27వ టెస్టు విజయం. అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా ధోని (27) రికార్డును కోహ్లి సమం చేశాడు. 12: కోహ్లి కెప్టెన్సీలో విదేశాల్లో భారత్ 12 టెస్టులు గెలిచింది. ఈ క్రమంలో విదేశీ గడ్డపై అత్యధిక విజయాల భారత కెప్టెన్‌గా గంగూలీ (11) ఘనతను విరాట్ అధిగమించాడు. 100: అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) కెప్టెన్‌గా కోహ్లికిది వందో విజయం. అతనికంటే ముందు భారత్ తరఫున ధోని (178), అజహర్ (104) వందకంటే ఎక్కువ విజయాలు సాధించారు. 100: భారత్‌పై విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2006లో ఆ జట్టు 103 పరుగులు చేసింది. -
బూమ్ బూమ్ బ్లాస్ట్!
‘ప్రపంచంలో ఎవరు వేగంగా పరుగెత్తగలరో చూద్దాం అంటూ చిరుత, శునకాల మధ్య పందెంకు రంగం సిద్ధమైంది... పోటీ ప్రారంభమైనా చిరుత మాత్రం ఒక్క అడుగు కదపకుండా తన స్థానంలోనే ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులు ఏమైందంటూ నిర్వాహకులను అడిగారు. ‘అందరికంటే అత్యుత్తమమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కూడా కొన్నిసార్లు పరువు తక్కువగా భావించాలి’... సరిగ్గా వారం క్రితం జస్ప్రీత్ బుమ్రా ఈ ట్వీట్ చేశాడు. బుమ్రా ఆంతర్యం ఏమిటో స్పష్టంగా అంతు పట్టకపోయినా... కొత్తగా దూసుకొచ్చిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ఆకాశానికెత్తడం, అతడితో తనను పోలుస్తుండటంపైనే ఈ ట్వీట్ అని క్రికెట్ ప్రపంచం అర్థాన్ని అన్వయించుకుంది. ఈ ట్వీట్‌తో ‘బుల్స్ ఐ’ ఇమోజీ కూడా జత చేసిన బుమ్రా ఆదివారం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాడు. భారత అభిమానులతో సహా అంతా యాషెస్ ఉత్కంఠను అనుభవిస్తున్న సమయంలో తన సత్తా చూపిస్తూ అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. నార్త్ సౌండ్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్... ఈ నాలుగు దేశాల్లోనే బుమ్రా టెస్టులు ఆడాడు. కానీ నాటి ఇమ్రాన్ ఖాన్ నుంచి నేటి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఆసియా దిగ్గజ బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతను అతను అందుకున్నాడు. ఈ నాలుగు దేశాల్లోనూ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును బుమ్రా నెలకొల్పాడు. ఇవన్నీ తన తొలి పర్యటనలే కావడం విశేషం. దీనిని అందుకునేందుకు అతనికి 11 టెస్టులే సరిపోయాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ అతని విలువేమిటో మరోసారి చూపించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 75 పరుగుల ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం భారత్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... సొంతగడ్డపై కొంతయినా పోరాడగలదని అంతా భావించారు. కానీ మరీ ఘోరంగా ఒక సెషన్ లోపు కేవలం 26.5 ఓవర్లు మాత్రమే ఆడి 100 పరుగులకే జట్టు కుప్పకూలింది. ఇదంతా బుమ్రా చలవే! టెస్టుల్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కొన్న విండీస్ బ్యాట్స్‌మెన్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కథ ముగిసిపోయింది. బుమ్రా ‘మ్యాజిక్ బంతులు’ తమను దెబ్బ తీశాయంటూ ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ వాపోయాడు. అవుట్ స్వింగర్లతో... బంతి విసిరేందుకు తీసుకునే రనప్ చిన్నదే కావచ్చు... స్పీడ్‌గన్‌లో లెక్క కడితే బంతి వేగం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ బుమ్రా వేసే బంతులు అంకెలకు మించి ప్రమాదకరమైనవి. ఒకనాటి అసలు సిసలు ఫాస్ట్ బౌలర్ల ఆలోచనా ధోరణి అతనిలో కనిపిస్తుంది. తాజా టెస్టులో అతను తన బౌలింగ్ దూకుడును చూపించాడు. చాలా మంది తరహాలో ఆఫ్ స్టంప్ బయటకు వేస్తూ కీపర్ లేదా స్లిప్ వైపు క్యాచ్ వచ్చే అవకాశం సృష్టించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఆఫ్ స్టంప్స్ లక్ష్యంగానే బంతులు విసిరాడు. అతని ఐదు వికెట్లలో నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయంటేనే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో పెద్దగా వాడని ‘అవుట్ స్వింగర్’ను బుమ్రా ప్రయోగించాడు. వరల్డ్ కప్ తర్వాత ఈ సిరీస్‌కు ముందు లభించిన విరామంలో అతను దీనిపై ప్రత్యేక సాధన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసారకర్త ‘సోనీ’ అంకెల ప్రకారం కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా వేసిన ప్రతీ పది బంతుల్లో ఏడు అవుట్ స్వింగర్లే ఉన్నాయి! వెన్నునొప్పితో తొలి ఇన్నింగ్స్‌లో పూర్తి వేగంతో బౌలింగ్ చేయలేకపోయిన జస్ప్రీత్... రెండో ఇన్నింగ్స్‌లో స్వింగ్‌కు కొంత అనుకూలంగా కనిపించిన వాతావరణాన్ని పూర్తిగా వాడుకున్నాడు. 8–4–7–5 బుమ్రా వేసిన 48 బంతులు విండీస్ బ్యాట్స్‌మెన్ పాలిట బుల్లెట్లలా మారాయి. అతని తొలి ఓవర్ మూడో బంతిని వెంటాడి బ్రాత్‌వైట్ ఔట్ కావడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా తర్వాతి ఓవర్లో దూసుకొచ్చిన బంతి క్యాంప్‌బెల్ స్టంప్స్‌ను పడగొట్టింది. మరుసటి ఓవర్లో స్లిప్‌లో కోహ్లి క్యాచ్ వదిలేయకపోతే మరో వికెట్ అప్పుడే దక్కేది. కానీ అతని నాలుగో ఓవర్లో హైలైట్ బంతి వచ్చింది. అద్భుతమైన స్వింగ్‌కు బ్రేవో ఆఫ్ స్టంప్ ఎగిరి ‘బండి చక్రం’లా గిరగిరా తిరిగింది! తొలి ఐదు ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్ చచ్చీ చెడి ఏడు సింగిల్స్ తీయగలిగారు. కానీ కథ అంతటితో ముగియలేదు. బుమ్రా ఆరో ఓవర్ తొలి బంతికి హోప్ స్టంప్ బద్దలైంది. ఎంతో కొంత పోరాడగలడని భావించిన హోల్డర్‌కు కూడా బుమ్రా బంతి అర్థం కాలేదు. ఫలితం మరో సారి ఆఫ్‌స్టంప్‌పై ఎర్రబంతి దాడి! ఇక విరామం అంటూ కోహ్లి 8 ఓవర్ల స్పెల్ తర్వాత ఆపడంతో ఈ తుఫాన్ ఆగింది. మరో అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఫాస్ట్ బౌలర్ల గడ్డపై తొలి టెస్టును సంతృప్తిగా ముగించాడు. 5/7ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత్ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 1990లో వెంకటపతిరాజు 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. 4 బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది నాలుగోసారి కాగా నాలుగు వేర్వేరు జట్లపైనే సాధించాడు. గతంలో ఇన్స్వింగర్లు ఎక్కువగా వేసేవాడిని. అయితే అనుభవం వస్తున్న కొద్దీ అవుట్ స్వింగర్లు కూడా బాగా వేయగలననే విశ్వాసం పెరిగింది. తాజా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి బంతుల కోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటంతో ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని మా పేసర్లు అందరం భావించాం. స్వింగ్‌కు పరిస్థితి కొంత అనుకూలంగా ఉందనిపించడంతో అలా ప్రయత్నించాం –జస్ప్రీత్ బుమ్రా, భారత బౌలర్ -
కోహ్లి, రహానే చేతుల్లో...
మొత్తానికి ఆధిక్యమైతే దక్కింది! కానీ అది కొంతే! వెస్టిండీస్ మరీ ఏమీ వెనుకబడి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించి తొలి టెస్టులో టీమిండియాను పైమెట్టులో నిలిపే బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలపై పడింది. వీరికితోడు విహారి, పంత్ కొన్ని పరుగులు జోడిస్తే మిగిలిన పనిని బౌలర్లు చూసుకునే వీలుంటుంది. నార్త్ సౌండ్ (అంటిగ్వా): సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/43) ప్రతాపం చూపాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తొలి టెస్టులో వెస్టిండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) ఆ జట్టు టాప్ స్కోరర్. కెప్టెన్ హోల్డర్ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. షమీ (2/48), జడేజా (2/64)లకు రెండేసి వికెట్లు దక్కాయి. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (16), కేఎల్ రాహుల్ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కోహ్లి సేన 173 పరుగుల ఆధిక్యంలో ఉంది. హోల్డర్, కమిన్స్ విసిగించారు... భారత లోయరార్డర్లో జడేజా–ఇషాంత్ తరహాలోనే విండీస్ లోయరార్డర్లో హోల్డర్, మిగుయెల్ కమిన్స్ (45 బంతుల్లో 0) బౌలర్లను విసిగించారు. ఓవర్‌నైట్ స్కోరు 189/8 శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు ఆలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, హోల్డర్, కమిన్స్ పట్టుదల చూపారు. 17 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. 9వ వికెట్‌కు 41 పరుగులు జత చేశారు. హోల్డర్‌ను ఔట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శుక్రవారం టీ సెషన్ అనంతరం భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి తడబడింది. ప్రతి బ్యాట్స్‌మెన్ అన్నోఇన్నో పరుగులు చేయడంతో ఓ దశలో 130/4తో కాస్త మెరుగ్గానే కనిపించింది. అయితే, ఇషాంత్ విజృంభించి... కీలకమైన చేజ్, హోప్ (24), హెట్మైర్ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో రోచ్ (0) పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
మనదే పైచేయి
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): వెస్టిండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (112 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ సాయంతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 96.4 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై గౌరవప్రద స్కోరు చేసిన భారత్... అనంతరం ప్రత్యర్థి టాపార్డర్‌ను పడగొట్టింది. టీ విరామ సమయానికి ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (14); క్యాంప్‌బెల్ (23)తో పాటు అరంగేట్ర బ్యాట్స్‌మన్ షమారా బ్రూక్స్ (11) వికెట్లు కోల్పోయిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 82 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లుండగా ఆ జట్టు మరో 215 పరుగులు వెనుకబడి ఉంది. షమీ, ఇషాంత్, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రహానే (81; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గురువారం ఆంధ్ర క్రికెటర్ విహారి (32; 5 ఫోర్లు)తో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలిపిన అతడు సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. ఐదో వికెట్‌కు వీరు 82 పరుగులు జత చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 68.5 ఓవర్ల వద్దే ముగించారు. ఓవర్‌నైట్ స్కోరు 203/6తో శుక్రవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... పంత్ (24) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. 207/7తో ఉన్న ఈ దశలో జట్టు 250 దాటడమే గగనం అనిపించింది. కానీ, జడేజా, ఇషాంత్ (62 బంతుల్లో 19) 8వ వికెట్‌కు 60 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు: భారత తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) హోప్ (బి) చేజ్ 44; మయాంక్ (సి) హోప్ (బి) రోచ్ 5; పుజారా (సి) హోప్ (బి) రోచ్ 2; కోహ్లి (సి) బ్రూక్స్ (బి) గాబ్రియెల్ 9; రహానే (బి) గాబ్రియెల్ 81; విహారి (సి) హోప్ (బి) రోచ్ 32; పంత్ (సి) హోల్డర్ (బి) రోచ్ 24; జడేజా (సి) హోప్ (బి) హోల్డర్ 58; ఇషాంత్ (బి) గాబ్రియెల్ 19; షమీ (సి అండ్ బి) చేజ్ 0; బుమ్రా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (96.4 ఓవర్లలో ఆలౌట్) 297. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–25, 4–93, 5–175, 6–189, 7–207, 8–267, 9–268, 10–297. బౌలింగ్: రోచ్ 25–6–66–4; గాబ్రియెల్ 22–5–71–3; హోల్డర్ 20.4–11–36–1; కమిన్స్ 13–1–49–0; చేజ్ 16–3–58–2.