kapu community
-
పిఠాపురంలో పవన్ ‘జబర్దస్త్’ వేషాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అష్టకష్టాలు పడుతున్నారు. పోటీ చేసే స్థానం మొదలు పెడితే ప్రచారం వరకు కూడా అన్ని విషయాల్లో పవన్‌కు చిక్కులే వచ్చిపడ్డాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత ప్రచారంలో దూసుకుపోతుండగా.. పవన్ మాత్రం కష్టాలు తప్పించుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. భీమవరం ప్రజలు కొట్టిన దెబ్బకు ఏం చేయాలో పాలుపోని పవన్ కల్యాణ్‌కు కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంపై దృష్టిపెట్టారు. కాపు సామాజిక వర్గం ఓట్లను నమ్ముకుని పిఠాపురంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.పిఠాపురం నుంచి పోటీ నుంచి వర్మ రెడీ అయ్యారో లేదో.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పెద్ద షాక్ ఇచ్చారు. అసలు పవన్ ఇక్కడ పోటీ చేయడమేమిటంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. అంతటితో ఆగకుండా టీడీపీ మహిళా నేతలతో బండ బూతులను తిట్టించారు వర్మ. ఇదేం కర్మరా అనుకుంటూ వర్మ ఇంటికెళ్లిన పవన్.. తనకు సహకరించాలంటూ వేడుకున్నారు. తనకు తెలియకుండా పిఠాపురంలో తిరగవద్దన్న వర్మ.. ఎన్నికలు మొత్తం తనకే వదిలేయాలనే కండీషన్ పెట్టారు. అంతేకాదు. ఎలక్షన్ ఫండ్ మొత్తం తనకే ఇవ్వాలని, ఖర్చులన్నీ చూసుకుంటానంటూ హుకుం జారీ చేశారు.పేకాట క్లబుల వర్మ అంటూ గతంలో విమర్శించిన పవనే.. ఇప్పుడు వర్మ క్లబులో చేరాల్సి వచ్చింది. ఇక పిఠాపురంలో తన గెలుపు వర్మ చేతుల్లోనే ఉందని ప్రజలందరి ముందు ఒప్పుకున్నారు పవన్. ప్రజలు తనను నమ్మే పరిస్థితి లేదని భావించిన పవన్.. కుల రాజకీయమే కరెక్ట్ అని భావించారు. అందుకే పిఠాపురం నుంచి పోటీకి సిద్దమయిన ఉదయ్ శ్రీనివాస్‌ను తప్పించి అక్కడనుంచి పోటికి సిద్దమయ్యారు. అందుకోసం ఉదయ్‌కి ఎంపీ సీటు కేటాయించారు పవన్. ఇక కూటమి పేరిట ఎన్ని పార్టీలు కలిసిన పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో జబర్దస్త్ కమెడియన్లను రంగంలోకి దించారు. ఆది, రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో పిఠాపురంలో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.కాపు ఓటర్లపై నమ్మకంతో పిఠాపురం వెళ్లిన పవన్‌ను ఆ సామాజిక వర్గం ఓటర్లు ఏమాత్రం నమ్మడం లేదు. ఇక చేసిందేమీలేక అన్న చిరంజీవి దగ్గరకు వెళ్లి మద్దతు కోరారు. కష్టాల్లో ఉన్నానంటూ ఐదు కోట్లు ఫండింగ్ కూడా తీసుకుని.. చిరంజీవిని ఫ్యాన్స్‌ను తన వైపు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. -
పిఠాపురంలోనూ అదే రిపీట్ అవుతుందా?
కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాన్ని ఏరి కోరి ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లోనూ కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకునే ఆయన బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ మొదట్నుంచీ కాపు వ్యతిరేకి అయిన చంద్రబాబుతో అంటకాగడం వల్లనే కాపు మేథావులు పవన్ కల్యాణ్‌ను దూరం పెడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. కాపుల ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగా హత్య కేసులో అన్ని వేళ్లూ చంద్రబాబు నాయుడివైపే చూపిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఆ చంద్రబాబుతోనే జట్టు కట్టి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం కాపుల రాజకీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై కాపుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తనకు కులాలు మతాలు లేవంటారు పవన్ కల్యాణ్. ఆ వెంటనే నేను రెల్లి కులస్థుడణ్నంటారు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తే.. కాపులకు రిజర్వేషన్లేంటి? కులాల పేరుతో ఉద్యమాలేంటి? అంటూ పోజు కొట్టారు పవన్ కల్యాణ్. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు రిజర్వేషన్లు ఏమయ్యాయంటూ అమాయకంగా అడిగారు ఇదే పవన్. వంగవీటి రంగా అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఒకసారి.. ఓ సారి రంగా మా ఇంటికి వస్తే టీ ఇచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు పవన్. వంగవీటి రంగా దారుణ హత్య వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని రంగా హత్య జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్న కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో కాపు నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా రంగాతో పాటు తనని కూడా హతమార్చడానికి చంద్రబాబు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నరాన్న అభియోగంపై జైలుకెళ్తే పవన్ కల్యాణ్ చాలా బాధ పడ్డారట. రంగా హత్యోదంతం నేపథ్యంలో కాపులు చంద్రబాబును ఏవగించుకుంటున్నారని గమనించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని కాపులు-కమ్మలు కలిసి ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నారు. జగన్మోహన్రెడ్డిని ఓడించాలంటే కాపులు-కమ్మలు చేతులు కలపాల్సిందేనని పవన్ థియరీని విడుదల చేశారు. కాపుల్లో రంగాకి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అటువంటినేతను చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకున్నారన్న కోపం కూడా కాపుల్లో ఉంది. కాపు ఓట్లతోనే గెలవగలను అనుకుంటోన్న పవన్ పిఠాపురం సీటును ఎంచుకున్నది చంద్రబాబు సలహాతోనే అంటున్నారు. అయితే కాపుల్లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని సంక్షోభంలో ఉన్న టీడీపీకి మద్దతు పలికారు పవన్. అయినా ఎన్నికల పొత్తులో కనీసం ఓ 60 సీట్లు కూడా సాధించుకోకుండా ముష్టి 21 సీట్లతో సరిపెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి. అదికూడా చంద్రబాబును సిఎంని చేయడానికి పవన్ పరితపిస్తోన్న తీరు కాపులకు నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడి కోసం కాపులకోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలను సైతం పవన్ దూరం పెట్టేశారు. అంతే కాదు వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. మైక్ పట్టుకుని ఉపన్యాసాలు దంచేటపుడు తాను విశ్వమానవుణ్నని పవన్ చెబుతూ ఉంటారు. కొద్ది నిముషాల్లోనే అది మర్చిపోయి కులాల ప్రస్తావన తెస్తూ ఉంటారు. జగన్ మోహన్‌రెడ్డిపై ద్వేషంతో ఆయన నియోజకవర్గం అయిన పులివెందులను దూషిస్తూ పైశాచికానందాన్ని పొందుతూ ఉంటారు. కాపుల కోసం పవన్ ఏ నాడూ చిత్తశుద్ధిగా పనిచేయలేదు కాబట్టే భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో కాపులు కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. అందుకే ఆయన ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ అదే రిపీట్ అవుతుందంటున్నారు పాలక పక్ష నేతలు. -
కాపు కాయలేం
ఇన్నాళ్లూ ఓ అసమర్థుడి వెంట నడిచామన్న చేదు నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు సిగ్గు పడుతున్నాం. కాపులకు రాజ్యాధికారం అనే ఆశ మళ్లీ చిగురిస్తోందని సంబర పడుతున్న వేళ ఏమిటీ ప్రేలాపనలు? ఇదేం స్ట్రాటజీ? ఇవేం ఎత్తుగడలు? కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఒక బహిరంగ సభలో ఇలా మాట్లాడతారా? ప్యాకేజీ స్టార్ అని వైసీపీ వాళ్లు అంటున్న మాట నిజమేనని ఆయన నోటే చెప్పకనే చెప్పారు. మా ఆశలను కూకటివేళ్లతో సహా పెకిలించేశారు. – సోషల్ మీడియాలో జనసేన అభిమానులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతిని ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది. ఇక ముందు పవన్‌ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. టీజే (తెలుగుదేశం–జనసేన) ఉమ్మడి సభలో పవన్ దిగజారుడుతనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సామాజికవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వృద్ధతరం మేధావులు సోదాహరణంగా వివరిస్తున్నా పవన్ పెడచెవిన పెట్టడం వారికి ఆవేదన కలిగించింది. పైగా ఆ పెద్దల మాటలు చెవి కెక్కించుకోకపోవడం అటుంచి, అటువంటి వారు తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పడాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు సైతం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ యవనికలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచే చంద్రబాబుతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ప్రస్తావన వచ్చిన ప్రారంభంలోనే జనసేన నేతలు, పవన్ అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ఇందుకు చంద్రబాబుతో పవన్‌కు ఎదురైన అనుభవాలను వారందరూ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ లెక్క పెట్టకుండా చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు. వారందరిదీ అదే ఆవేదన గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా కూడా, కాదని కాలదన్నుకోవడం పట్ల జనసేన శ్రేణులు, అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యా బలానికి తగిన రీతిలో గౌరవప్రదమైన స్థానాలు దక్కలేదనే ఆవేదన ఆ సామాజికవర్గం అంతటా నెలకొంది. గోదావరి జిల్లాల్లో అపార రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య మొదటి నుంచీ ముఖ్యమంత్రి పదవితో పవర్ షేరింగ్, కనీసం 50 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని పలుమార్లు లేఖల ద్వారా చెబుతూనే ఉన్నారు. అలాగైతేనే జనసేన శ్రేణుల నుంచి ఓట్ షేరింగ్ ఉంటుందని, లేదంటే పొత్తు ధర్మం చిత్తు అవుతుందని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా గురువారం బహిరంగ లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన ముద్రగడ.. తాజా రాజకీయ పరిణామాలపై తొలిసారి పవన్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. కాపు ఉద్యమం సందర్భంగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు కాపుల పైన, తన కుటుంబం పైన జరిపిన దాషీ్టకాలను సైతం దిగమింగుకుని పవన్‌కు మద్దతుగా నిలవాలని భావించానని చెప్పారు. అంతేకాకుండా ఆయనతో కలసి పని చేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలని కలలుగన్న విషయాన్నీ తన లేఖలో ప్రస్తావించారు. పవన్ అభిమానులు ఆయనను ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటే ఆయన మాత్రం 24 సీట్లకు మాత్రమే అంగీకరించడంపై ముద్రగడ విస్మయం వ్యక్తంచేశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం, ముందుగా రెండేళ్లు సీఎం, 80 అసెంబ్లీ సీట్లు కోరాల్సిందని ముద్రగడ తన మనసులో మాట బయటపెట్టారు. బాబు మాటే పవన్‌కు శాసనం పవన్ తీరుతో మరో చారిత్రక తప్పిదం జరిగిపోయిందని కాపులు అంతర్మ«థనం చెందుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి భరోసా ఇవ్వడం ద్వారా బాబు పరపతి పెరగడానికి పరోక్షంగా పవనే కారకులయ్యారు. కానీ ఆ స్థాయిలో సీట్లు తీసుకు రాలేకపోవడంతో పవన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలై ఆ సామాజికవర్గంలో అంతర్మధనం మొదలైంది. సీట్లు, ఓట్లు బదిలీ, పవర్ షేరింగ్ కోసం అడుగుతున్న వారిపై పవన్ మాటలతో ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితుల్లో ఓటు షేరింగ్ ఎందుకు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ‘గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. ఎలక్షన్ అంటే డబ్బుతో కూడుకున్న పని. అంత సత్తా మనకు ఉందా? కనీసం మనం భోజనాలు పెట్టించలేం..’ అని ప్రశ్నిస్తూ.. పవన్ తనకు తానుగానే పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నిస్సత్తువ ఆవరించే పరిస్థితికి కారకులయ్యారని విశ్లేషిస్తున్నారు. అభిమానులు, ఆ సామాజికవర్గం మునుపటి మాదిరిగా ఉత్సాహంగా తాడేపల్లిగూడెం సభకు వెళ్లిన దాఖలాలు లేకపోవడానికి పవన్ నిర్ణయాలే కారణమని కాపు సామాజికవర్గ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటే పవన్‌కు శాసనమైందని వాపోతున్నారు. కనీసం 50 సీట్లు తీసుకుని ఉండాల్సింది పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 సీట్లకు పరిమితం కావడం నాలాంటి కాపు నాయకులకు ఇబ్బందిగా ఉంది. పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థాయికి తగినట్టుగా కనీసం 50 సీట్లు తీసుకుని ఉండుంటే మాకు సంతృప్తిగా ఉండేది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ప్రయాణిస్తున్న క్రమంలో సీఎం పదవిలో కూడా షేరింగ్ ఉండుంటే మేమందరం ఆనందించే వాళ్లం. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఆవేదన కూడా ఇదే. – కల్వకొలను తాతాజీ, కాపు జేఏసీ నేత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పవన్ నిర్ణయం సరికాదు పవన్ కాపు జాతిని నిరాశ పరిచారు. ఎన్నో ఏళ్లుగా కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ ద్వారా సాధ్యమవుతుందని కలలు కన్నాం. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని కేవలం 24 సీట్లలో పోటీకి సిద్ధమయ్యారు. ఇలాగైతే ఏ విధంగా సీఎం అవుతారు? చంద్రబాబుకు వత్తాసు పలకడానికే పవన్ ఉన్నట్టుంది. పవన్ నిర్ణయం సరికాదు. – కురుమళ్ల చిన్ని, కాపు నాయకుడు, కిర్లంపూడి, కాకినాడ జిల్లా 50–60 సీట్లు తీసుకోవాల్సింది రాష్ట్ర జనాభాలో 22 శాతం కాపులు ఉన్నారు. కాపు వర్గం వారు ఏ రోజైనా సీఎం అవుతారని ఊహించాం. టీడీపీతో పొత్తులో భాగంగా 50–60 సీట్లు వరకు తీసుకుంటారని ఆశించాం. కానీ 24 సీట్లకే పరిమితమవడం నిరుత్సాహానికి గురిచేసింది. – గుండాబత్తుల శ్రీను గోవిందరావు, మామిడికుదురు మండల కాపు నాడు అధ్యక్షుడు, కోనసీమ జిల్లా పవన్‌కు సీఎం పదవి ప్రకటిస్తారని ఆశించాం కోస్తా జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. పవన్ ద్వారా సీఎం పదవి వస్తుందని ఆశించాం. టీడీపీతో పొత్తు పేరిట 24 సీట్లకే పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా పవన్‌కు సీఎం పదవిని ఏడాదో, రెండేళ్లో ప్రకటిస్తారనుకున్నాం. ఆయన ఎందుకు తగ్గి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. – వెలుగుబండి సుబ్బారావు, కాపు నాయకుడు, వాకలపూడి, కాకినాడ జిల్లా -
పవన్ తీరుపై కాపుల్లో కాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తీరుపై కాపు సామాజికవర్గం రగిలిపోతోంది. ముఖ్యంగా.. కోస్తా జిల్లాల్లో ఆ సామాజికవర్గంలో బలమైన ముద్ర కలిగిన కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో పవన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. నిజానికి.. వివిధ కారణాలతో ముద్రగడ కాపు ఉద్యమాన్ని విడిచిపెట్టి చాలాకాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాలపై ఆసక్తి కూడా లేనట్లుగా ఉంటున్నారు. ఈ తరుణంలో పవన్ ఆదేశాలతో ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్యబాబు తదితరులు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. కానీ, వీరి ప్రతిపాదనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. ఇలా ముద్రగడను జనసేన నేతలు రెండు మూడు దఫాలు కలిశారు. ఆ సందర్భంలో ఫిబ్రవరి 15 తరువాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ, రాజమహేంద్రవరం వచ్చినప్పుడు పవన్ నేరుగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు మాట్లాడి వెళ్లాక కోనసీమ ప్రాంతం నుంచి జనసేన నేతలు వరుసగా ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తున్నారు. కావాలనే ముద్రగడకు దూరంగా పవన్!? ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి పవన్‌కళ్యాణ్ విశాఖలో పర్యటించి కొణతాల రామకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడి నుంచి సోమవారం సాయంత్రానికి రాజమహేంద్రవరం వచ్చిన పవన్ ఆ రోజు రాత్రి అక్కడే బసచేశారు. అక్కడ నుంచి మంగళగిరికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. అనంతరం బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లారు. అక్కడ టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి వంటి నేతలను వారి ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశారు. అంతమంది ఇళ్లకు వెళ్లిన పవన్.. అటు విశాఖ, ఇటు రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడంపై ఆయన అనుచరగణం, కాపు సామాజికవర్గం మండిపడుతోంది. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి మధ్య దూరం కేవలం 50 కిలోమీటర్లే. కానీ, ముద్రగడను కావాలనే పవన్ విస్మరించినట్లుగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖం చాటేయడానికి అదే కారణమా? తొలుత ముద్రగడ ఇంటికి వస్తానన్న పవన్.. ఆ తరువాత ముఖం చాటేయడానికి కాపు నేతలకు వచ్చిన ధర్మసందేహమే ఆయనకు కూడా రావడమే కారణమని అంటున్నారు. ముద్రగడను జనసేన నేతలు కలిసినప్పుడు ఆ పార్టీకి అధికారం షేరింగ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం విషయం చర్చకు వచ్చిందని విశ్వసనీయ సమాచారం. చంద్రబాబును నమ్మి రాజకీయంగా ప్రయాణం చేయడమంటే ఆత్మహత్యా సదృశమే అవుతుందనే అభిప్రాయం కాపు సామాజికవర్గంలో బలంగా ఉంది. ముద్రగడ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఆ విషయంలో స్పష్టత కోరుతారేమోనన్న భావనతో పవన్ ముఖం చాటేసి ఉంటారనే చర్చ కాపు సామాజికవర్గంలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి.. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం జరిగిన సమయంలో గోదావరి జిల్లాల్లోని కాపులపై చంద్రబాబు సాగించిన అణచివేతను ఆ సామాజికవర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అటువంటి చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోవడంపై గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. చంద్రబాబు దాష్టీకాన్ని ఉద్యమ సమయంలో స్వయంగా చవిచూసిన ముద్రగడ సైతం.. జనసేన నేతలతో చర్చల సందర్భంగా ఆ రెండు పార్టీల పొత్తుపై సందేహం వ్యక్తంచేయడంతో.. దానికీ సమాధానం చెప్పలేకే పవన్ ముఖం చాటేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, ముద్రగడ ఇంటికి వెళ్లి పవన్ కలవకపోవడానికి తన పార్టనర్ చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడమే కారణమై ఉంటుందని కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ముద్రగడ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. -
సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని తెలిపారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. చంద్రబాబు సభలకు జనం నుంచి స్పందన లేదని అన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేసి అవమానపరిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదని రాజా తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడి పరిపాలనే సాగిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబం అడ్డంగా దోచుకుందని రాజా మండిపడ్డారు. 2014-2019లో మరుగుదోడ్లు నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలను యనమల అనుచరులు దోచేసుకున్నారని విమర్శించారు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
జోగయ్య.. పవన్ చెవిలో జోరీగ ..
చేగొండి హరిరామ జోగయ్య కాస్తా పవన్ చెవిలో జోరీగలా మారారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అయిన ఈ మాజీ మంత్రి, మాజీ ఎంపీ.. పవన్ కళ్యాణ్ పాలిట విలన్ మాదిరి తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ఇమేజిని.. ప్రతిష్టను.. కాపుల్లో ఉన్న విలువ గౌరవాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్నారు. పెద్దాయన రామా.. కృష్ణా.. అని మూల కూర్చోకుండా పవన్‌ను పరుగెత్తిస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్‌ను గత కొద్దిరోజులుగా ఈ వెటరన్ ఎదురుప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్ మొన్నామధ్య జనసేనకు కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసారు. ఆశలు పవన్‌కు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా ఓ పాతిక ఇరవై సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జనసైనికులు భావిస్తున్న తరుణంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొన్న జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమయింది. కాపులు దాదాపు 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు వెళ్లాలని, ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలనీ ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాసారు. అది అలా ఉండగానే ఇప్పుడు మరో బాణం సంధించారు. నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం.. కానీ మీరు అక్కడికి రారు.. ఇక్కడే ఉంటాను అంటారు. ఇలా ఐతే ఎలా అని ప్రశ్నించారు. అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అంటూ మొన్న లోకేష్ సైతం ప్రకటించారు. అలా అయన ప్రకటించాక కూడా మీరు చంద్రబాబు వెంట వెళ్తారా ? అంటూ జోగయ్య ప్రశ్నించారు. చదవండి: ఇంకా యాచించే స్థితేనా?.. బహిరంగ లేఖలో పవన్‌కు హరిరామజోగయ్య ప్రశ్న అంటే మీరు చంద్రబాబుకు తాబేదారుగా ఉంటారా? మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ? మీకు అస్తిత్వం లేదా.. కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలు పవన్‌ను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఈ లేఖలు కాపు సామాజిక వర్గంలో ఒక ఆలోచనను రేకెత్తించాయి. అసలు మన ఓట్లతో చంద్రబాబు గద్దెనెక్కడం ఏమిటి? మనం ఆయన కోసం త్యాగాలు చేసి కూలీ చేయడం ఏమిటనే ఆలోచన మొదలైంది. నిన్ను మా నాయకుడిగా చూడాలని ఆశిస్తుంటే మీరు కాస్తా చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడితే ఎలా? అంటూ అయన ప్రశ్నించారు. --- సిమ్మాదిరప్పన్న -
PK Babu : పవన్ బాబు భేటీ... అన్నీ గుర్తున్నాయ్!
సాక్షి, విశాఖపట్నం: ‘‘మళ్లీ మా ఓట్ల కోసమేనా ఇదంతా?’’.. హైదరాబాద్‌లోని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లడంపై కాపులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లాడని, మళ్లీ అదే తరహాలో పవన్ చంద్రబాబు భేటీ అయ్యాడని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ మోసం చేయడానికే ఈ ఇద్దరూ కలుస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తన అవసరం తీరిన తర్వాత చంద్రబాబు.. తమను ఎలా చిత్రహింసలు పెట్టింది కాపులు ఇంకా మరిచిపోలేదంట. కేసులతో వేధించిన సంగతిని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ఇందుకు ముద్రగడ పద్మనాభం కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఉదాహరించారు. "ముద్రగడను చిత్రహింసలు పెట్టిన సంగతి ఇంకా మా కళ్ల ముందు మెదులాడుతోంది. ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులతో దాడి చేయించారు. కాపు ఉద్యమ సమయంలో యువతపై తప్పుడు కేసులు బనాయించారు. అవన్నీ అంతా సులభంగా మరిచిపోం. తుని రైల్వే దహన సమయంలో.. పనికట్టుకుని వేధింపులకు గురిచేసిన ఘటననూ మర్చిపోలేం. మళ్లీ అధికారం కోసమే కదా ఈ కలయికలు".. అని పవన్-చంద్రబాబు భేటీపై మండిపడ్డారు. "నాడు చంద్రబాబు జరిపిన ఆకృత్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అధికారం కోసం ఇంకా ఈ ఇద్దరు మోసం చేస్తారు?.. ఎన్నికల సమయంలోనే కాపులు గుర్తొస్తారా? అంటూ కాపులు ప్రశ్నిస్తున్నారు. తోటి కాపు సోదరులపై దాడులు జరుగుతుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదంటూ నిలదీస్తున్నారు. అధికారంలో ఉన్న రోజులు చంద్రబాబు కాపు ప్రజాప్రతినిధులను తన గుమ్మం ఎక్కనివ్వలేదని.. ఆయన తనయుడు లోకేష్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదని" గుర్తు చేసుకుంటూ మళ్లీ మోసపోమని ఘంటా పథంగా చెబుతున్నారు. చదవండి: పవన్ ఇంటికి చంద్రబాబు -
కాపునేస్తం నిధులతో వ్యాపారం చేసుకుంటున్నాం: మహిళలు
-
‘పవన్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారు’
సాక్షి, ఏలూరు: పవన్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ పనిచేసేది చంద్రబాబు కోసమేనని మండిపడ్డారు. కాపులు ఏకం కాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు ఏ విధంగా వేధించారో పవన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. కాపులు సీఎం జగన్‌ను నమ్మారు కాబట్టే 60 శాతం కాదు 90 శాతం ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాపులకు సీఎం.. ఉన్నత స్థానం కల్పించి సముచిత స్థానం కల్పించారన్నారు. బాబు ఇచ్చిన 5 శాతం తప్పుడు జీవో కంటే సీఎం జగన్ ఇచ్చిన దాని వల్ల మేలు జరుగుతుందని పవన్‌కు తెలియడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. పవన్ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి పవన్‌కు కనపడట్లేదు.. తనకు కావాల్సిన ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టి బాబు గొప్పోడిలాగా కనపడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: ‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ -
కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం బాసట
సాక్షి,కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా 2016లో కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కాపు ఉద్యమకారుడు చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి కేంద్రంగా కాపు ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో తునిలో రైలు దహనం ఘటన మరునాడు వెంకట రమణమూర్తి కలెక్టరేట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కాపులను ఇబ్బంది పెడుతోందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకట రమణమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లారీ డీజిల్ మెకానిక్‌గా పనిచేసే అతడి ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు రాజే‹Ù, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సహాయ నిధి నుంచి చీకట్ల పార్వతి పేరిట రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదివారం వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రాజేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వెంకట రమణమూర్తి కుటుంబ పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి రూ.5 లక్షల ఆరి్థక సహాయం పంపించి ఆదుకున్నారని చెప్పారు. వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి కాకినాడ 3వ డివిజన్లో వలంటీర్‌గా పని చేస్తోందన్నారు. చదవండి: గోల్డెన్ చాన్స్! సర్కారు బడి పిల్లలకు 'గ్లోబల్ చదువులు' -
‘చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరు’
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారని.. కేసు కొట్టివేయడం చంద్రబాబు, రామోజీ భరించలేకపోతున్నారని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,టీడీపీ హయాంలో కాపులను హింసించారని.. కాపు ఉద్యమంలో కాపు నేతలందరిపై 69 కేసులు చంద్రబాబు పెట్టించారని మండిపడ్డారు. ‘‘ముద్రగడ, దాడిశెట్టి రాజా సహా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారు. కాపులపై అన్యాయంగా పెట్టిన కేసులను కోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్షతోనే చంద్రబాబు కేసులు పెట్టించారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. చంద్రబాబు హయాంలో కాపులపై పెట్టిన అన్ని కేసులను కేవలం ఒకే ఒక్క జీవోతో సీఎం జగన్ ఎత్తివేశారు. కాపులను హింసంచడమే టీడీపీ పని.. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ. కాపుల విషయంలో చంద్రబాబు సైకోలా వ్యవహరించారు’’ అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం: కన్నబాబు ‘‘పవన్ కల్యాణ్ ఒక అజ్ఞాని.. ఆయన చంద్రబాబుతో కలిసినా కాపులు కలవరు. కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యం. పవన్ కల్యాణ్‌కు అసలు చరిత్రే తెలియదు కాపులతో చంద్రబాబు పల్లకీ మోయించాలని పవన్ చూస్తున్నాడు. ప్యాకేజీ తీసుకుని కాపులను బాబుకు తాకట్టు పెట్టాలని పవన్ యత్నం. పవన్ కల్యాణ్ వైఖరి పట్ల కాపులంతా అప్రమత్తంగా ఉండాలి. ఒక పార్టీలో ఉండి వేరే పార్టీవారితో కలవడం పవన్‌కు అలవాటే. కాపులను అణచివేసిన పార్టీ టీడీపీ’’ అని మంత్రి అన్నారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు -
‘బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదు’
అమరావతి: బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయొద్దని తాను చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు రామ్మోహనరావు. కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్మోహనరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ అనేది కాపుల సంక్షేమానికి కంటితుడుపు చర్యే తప్ప.. సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదు. రాజకీయాల వల్ల కాపు అనే కులం డైవర్ట్ అయ్యింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు. తునిలో పెట్టిన బీసీ రిజర్వేషన్ సభతో కాపులను అల్లరి మూకలుగా ముద్ర వేశారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వారు ఏపీ నుంచి ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జిలయ్యారు. వారికేమీ రిజర్వేషన్లు లేవు’ అని వ్యాఖ్యానించారు రామ్మోహనరావు. -
'జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీని చూస్తాడు'
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు కష్టం వచ్చినపుడు కొమ్ము కాసేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీ వైపు చూస్తాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కాకినాడలో మంత్రి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడులు సృష్టించేందుకే పవన్, చంద్రబాబు, లోకేష్‌లు ఏపీకి వస్తున్నారు. ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్‌పై చాలా ఛాలెంజ్‌లు చేశారు. కాపులు ఎవరూ కూడా పవన్‌ని నమ్మే స్థితిలో లేరు. పవన్‌కి ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే అని కాపులకు తెలుసు. తుని ఘటనలో కాపులను అనేక చిత్ర హింసలను గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి మళ్లీ కాపులను తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లా సీఎం జగన్‌కు కుల మతాలతో రాజకీయాలు చేసే అలవాటు లేదు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్ అవ్వాల్సిందే..) -
సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ కారణమని అన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాపు కార్యాలయాన్ని పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాపులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: (రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్) -
బాబు డైరెక్షన్లోనే మంతనాలు : అంబటి
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నేతలు సుజానా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం వెనక అంతర్యమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్లోనే వారు ముగ్గురు రహస్య మంతనాలు జరిపారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చాకే వారిని కలిసినట్టు సుజనా ఎందుకు చెప్పారని నిలదీశారు. 13వ తేదీన భేటీ జరిగితే.. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కలిస్తే తప్పేంటని ప్రశ్నించడం చూస్తుంటే వారు బరితెగించారని అర్థం అవుతుందన్నారు. సుజనా, కామినేనిలు బీజేపీ ముసుగులో అనైతిక పనులు చేస్తున్నారని మండిపడ్డారు.(చదవండి : హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) కాపులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే.. కాపులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అంబటి విమర్శించారు. కాపుల పాలిట చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వం వహించిందని గుర్తుచేశారు. చంద్రబాబు కాపులను అన్ని రకాలుగా వేధించడమే కాకుండా.. వారిపై కేసులు కూడా పెట్టారని అన్నారు. కాపుల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాపులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అనేక పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజా సంపదను దోచుకుందని మండిపడ్డారు. -
కాపు మహిళలకు ఏపీ ప్రభుత్వం అండ
సాక్షి, అమరావతి : పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళల కోసం మరో వినూత్న పథకం ‘వైఎస్సార్ కాపు నేస్తం’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తారు. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుండగా, వారందరికి సుమారు రూ.354 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈనెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కాపు మహిళలకు అండగా నిలించేందుకు కరోనా కాలంలోనూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గడం లేదు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.(చదవండి : 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్: సీఎం జగన్) వైఎస్సార్ కాపు నేస్తం : అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పేదరికంలో ఉన్న కాపు మహిళలకు అండగా నిలుస్తూ వారికి ఏటా రూ.15 వేల చొప్పున, అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల రూపాయలను ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం ద్వారా అందించనుంది. 2019–20కి సంబంధించి ఈనెల 24వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్.. క్యాంప్ కార్యాలయంలో ప్రారంభిస్తారు. ఎవరెవరికి ఈ పథకం?: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం వర్తిస్తుంది. పథకం–అర్హతలు: కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు. ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు. ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్ కూడా పొందరాదు. ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు. పారదర్శకంగా ఎంపిక: పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. సామాజిక తనిఖీ, ఆ తర్వాత గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ.. మళ్లీ సర్వే, తనిఖీల నిర్వహణ. ఈ ప్రక్రియల ద్వారా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం ఎందరు?: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 లబ్ధిదారులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వారందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా, వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.353.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏయే జిల్లాలో ఎంత మంది? : ఈ ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 76,361 మంది లబ్ధిదారులు ఉండగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3726 మంది మాత్రమే ఉన్నారు.ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 46,856, కృష్ణా జిల్లాలో 28,363, గుంటూరు జిల్లాలో 22,538, విశాఖ జిల్లాలో 14,917, చిత్తూరు జిల్లాలో 8400, ప్రకాశం జిల్లాలో 7885, వైయస్సార్ కడప జిల్లాలో 7395, అనంతపురం జిల్లాలో 7085, శ్రీకాకుళం జిల్లాలో 4239, నెల్లూరు జిల్లాలో 4183, కర్నూలు జిల్లాలో 3925 మంది లబ్ధిదారులు ఉన్నారు.(చదవండి : ) -
కాపు నేస్తంతో కాంతులు
సాక్షి, విశాఖపట్నం: సంక్షేమం... అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాలకూ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ప్రభుత్వం చేయూత అందిస్తోంది. తాజాగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు.. కాపు సామాజిక వర్గానికి కొత్త ఊపిరి పోసింది. వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. సుస్థిర అభివృద్ధి దిశగా.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలను ప్రవేశపెడుతూ సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి కేబినెట్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు చూరగొంటోంది. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మోముల్లో సరికొత్త ఆనందాన్ని నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆమోదించిన పథకం వైఎస్సార్ కాపునేస్తం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉప కులాల మహిళల జీవన ప్రమాణాల్ని పెంచేలా.. వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చేలా కాపునేస్తం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధి అవకాశాలు మెరుగు.. కాపునేస్తం పథకం ద్వారా ఆయా సామాజిక వర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది. వారి ఉపాధి అవకాశాల్ని మెరుగు పరిచేందుకు ఈ పథకం ఉపయుక్తమవుతుంది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున చొప్పున ఐదేళ్ల పాటు రూ.75 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. నిబంధనలివీ.. ►గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదా యం నెలకు రూ.10 వేలు ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.12 వేలు ఉన్న వారు అర్హులు ►కారు ఉన్నవారు అనర్హులు ►ట్యాక్సీ, మినీ వ్యాన్ వంటి వాటి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మినహాయింపు ఇచ్చారు. ►కుటుంబంలో వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నా కాపునేస్తం వర్తిస్తుంది. ►2020 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు కాపునేస్తం ద్వారా సాయం అందుతుంది. జగనన్న మేలు మరువలేం మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వరాలు ఇచ్చా రు. ప్రధానంగా మహిళలకు ఆయన చేస్తున్న మేలు ఎన్నటికీ మరువలేం. ఏ ప్రభుత్వం కూడా కాపులను పట్టించుకోలేదు. జగన్ మాత్రమే అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారు. కాపు నేస్తంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆసరా కల్పిస్తున్నారు. – సుంకర రాము, గొట్టివాడ, కోటవురట్ల మండలం అడక్కుండానే సాయం.. కాపునేస్తం పథకంతో మా కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ వెళుతున్నారు. అడక్కుండానే వరాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసింది. మహిళలను నమ్మించి నిలువునా ముంచేసింది. జగన్ మాత్రమే మా బాగోగులు పట్టించుకుంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – బత్తిన చిలకమ్మ, గొట్టివాడ, కోటవురట్ల మండలం 2054 మంది గుర్తింపు.. కాపు నేస్తం పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 2054 మందిని గుర్తించాం.ప్రస్తుతం వైఎస్సార్ నవశకం సర్వే జరుగుతోంది. ఇది పూర్తయితే అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పథకానికి 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలు అర్హులుగా చెబుతున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు నవశకం సర్వేలో సహకారం అందించాలి. – పెంటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్, విశాఖపట్నం -
వైఎస్ జగన్ సీఎం కావడంతో మొక్కు తీర్చుకున్న బలిజ కాపు సంఘాలు
-
ప్రలోభాల వల.. కాపుల విలవిల..
సాక్షి, ద్రాక్షారామ (తూర్పు గోదావరి): నాలుగన్నరేళ్లపాటు ఎన్నికల హామీల ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల జోరు పెంచింది. అయితే ఇందులోనూ మోసానిదే పైచేయిగా నిలుస్తోంది. పథకాలు ప్రకటించడం, అరకొరగా అమలు చేయడం, గొప్పగా అమలు చేసినట్లు ప్రచారం చేసుకోవడం బాబు నైజంగా మారింది. ఇందులో భాగంగానే కాపు రుణాలు భారీగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడమే కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ద్రాక్షారామ డిస్ట్రిక్ట్ కోపరేటివ్ బ్యాంకు పరిధిలో 1200 మంది 2018–19 ఆర్ధిక సంవత్సరంలో కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 150 మందికి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసింది. మిగిలిన వారికి నేటికీ సబ్సిడీ విడుదల కాలేదు. ఈ అంశంలో ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై కాపు సామాజికవర్గంలో అంతర్గతంగా వ్యతిరేకత ఏర్పడడంతో సరిదిద్దుకోలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం సబ్సిడీ విడుదల కాకపోయినా లబ్ధిదారులకు ఫోన్లు చేసి స్టాంపు పేపర్లు తెచ్చుకోవాలని, డాక్యుమెంటేషన్ చేస్తున్నామని తెలపడంతో గురువారం బ్యాంకు వద్ద పోటెత్తారు. దీంతో ఎన్నికల సంఘానికి ‘సీ విజిల్ యాప్’ ద్వారా కాపు కార్పొరేషన్ లబ్ధిదారులను మభ్యపెడుతున్నారని, సొమ్ములు మంజూరు కాకపోయినా డ్యాక్యుమెంటేషన్ పేరుతో త్వరలో లోన్లు వచ్చేస్తాయనే భ్రమ వారికి కలిగేలా చేస్తున్నారని సమాచారం చేరడంతో కాకినాడ కలెక్టర్ కంట్రోల్ రూం నుంచి అందిన ఆదేశాల మేరకు ఫ్లయింగ్‌స్వ్కాడ్ టీం లీడర్ ఆర్.మధుసూదనరావు, ఎంసీసీ టీం లీడర్ పీవీవీ సత్యనారాయణలు తమ సిబ్బందితో బ్యాంకుకు చేరుకుని బ్యాంకు మేనేజర్ వద్ద నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. సబ్బిడీ ఇంకా విడుదల కాని కారణంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఇకపై ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎటువంటి చర్యలు తీసుకోం అంటూ లిఖిత పూర్వక హామీ తీసుకుని ఎన్నికల అధికారులు వెళ్లారు. ఇబ్బందులపాలైన కాపు రుణాల లబ్ధిదారులు.. బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన ఫోన్ల మేరకు డాక్యుమెంటేషన్‌కు కావల్సిన స్టాం పు పేపర్లు తీసుకోవడం, పేపర్లు సిద్ధం చేసుకోవడానికి మూడు రోజులుగా పనుల మానుకుని తిరుగుతున్నామని, మరోవైపు సుమారు రూ.1000 వరకు ఖ ర్చులు అయిపోయాయని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేశా రు. రుణం సబ్బిడీ మంజూరైన తరువాత చేయాల్సిన డ్యాక్యుమెంటేషన్ కోసం సొమ్ములు విడుదల కాకుండానే తిప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను మభ్యపెట్టడమే టీడీపీ లక్ష్యం కాపులకు మేలు చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేని పార్టీ తెలుగుదేశం. అందుకే కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసినట్లు కాగితాల మీద చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తుగా విడుదలైన కాపు రుణాలు టీడీపీ పార్టీ నేతలు పంచుకుని నిజమైన లబ్ధిదారుల వద్దకు వచ్చేసరికి మొండిచేయి చూపించారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు లేకుండా డాక్యుమెంటేషన్ పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. – మాగాపు అమ్మిరాజు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి -
వైఎస్ జగన్‌ను కలిసిన రాజమండ్రి కాపు యువత
-
వైఎస్ఆర్సీపీ చేరిన కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు రామజోగి
-
వైఎస్ జగన్‌కు సన్మానం చేసిన కాపు నేతలు
-
వైఎస్ జగన్‌కు సన్మానం
సాక్షి, గొల్లప్రోలు: తమ సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుష్క వాగ్దానాలు చేయకుండా, నికార్సైన హామీలు ఇచ్చిన రాజన్న తనయుడిని మనసారా అభినందిస్తున్నారు. ‘అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతానంటూ’ జనవాహిని సాక్షిగా ప్రమాణం చేసిన జననేతకు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు కలిశారు. తమ కులానికి జననేత ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి జగన్‌ను సన్మానించారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి. పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితర నాయకురాళ్లు.. జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. తాము అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీలోకి సముద్రాల ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు పలువురు నాయకులు ముందుకు వస్తున్నారు. అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి నాయకులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. తాజాగా విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన టీడీపీ నేత సముద్రాల ప్రసాద్.. నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. -
వైఎస్ జగన్ హామీపై కాపునేతల హర్షం
-
వైఎస్సార్సీపీలోకి కాపు నేతల చేరికలు
-
కాపులంతా జగన్ వెంటే
సాక్షి, తిరుపతి తుడా : కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ కుటుంబా నికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైఎస్సార్ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాపు నాయకులు దుద్దేల బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి కిశోర్ మాట్లాడుతూ కాపు ఉద్యమానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో బలిజలు వైఎస్సార్ సీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టి.రాజేంద్ర, అజయ్‌కుమార్ మాట్లాడుతూ మానవత్వమే వైఎస్సార్సీపీ కులమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. అంతేకాక 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ముద్రగడ స్పష్టం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వంగవీటి రంగా హత్య తర్వాత టీడీపీని కాపులు ఓడించిన విషయాన్ని ముద్రగడ గుర్తు చేశారు. అంతకన్నా ఘోరంగా చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు ప్రస్తుతం కాపులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. 13 జిల్లాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి పవన్ కల్యాణ్‌తో కూడా చర్చిస్తామని, మోసం, దగా చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తామని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. -
కాపు సామాజిక వర్గానికే కమలం కిరీటం!
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్ శాఖకు నూతన అధ్యక్షుడిని నియమించేందుకు ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం సూచనలకు అనుగుణంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మంగళవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పనున్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరును సైతం ఖరారు చేశారని, నేడో రేపో ప్రకటించనున్నారని జాతీయస్థాయిలోని పార్టీ వర్గాలు తెలిపాయి. తుది రేసులో ఆ ముగ్గురు.. కాగా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి తుది రేసులో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు మిగిలినట్టు సమాచారం. సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను అధినాయకత్వం పరిశీలించిందని పార్టీ జాతీయ నాయకుడొకరు తెలిపారు. -
కాపులకు రిజర్వేషన్ కల్పించాలి
సాక్షి, కొత్తపల్లి: కాపులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించకుండా, బీïసీ–ఎఫ్‌లో చేర్చడం, బిల్లు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కొత్తపల్లిలో ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు ఇంటికి శనివారం అల్పాహారానికి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ ప్రభుత్వం అసిస్టెంట్ పోస్టులు 700 లకు మొదటి విడతగా నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని రెండో విడతగా మరో 700 పోస్టులకు నోటిఫికేషన్ రెండు నెలల్లో విడుదల చేయనుందన్నారు. అలాగే పోలీసు శాఖకు సంబంధించిన పలు ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. అయితే కాపు యువతీ, యువకులకు సంబంధించి బీసీ–ఎఫ్‌లో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో జారీ చేసే పోస్టులకు రాష్ట్రపతి సంతకం అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఉద్యోగాలకు మాత్రమే రాష్ట్రపతి సంతకం, పార్లమెంట్ తీర్మానం, కేంద్ర బీసీ కమిషన్ రిపోర్టు కావాలన్నారు. రాష్ట్ర పరిధిలో విడుదల చేసే నోటిఫికేషన్‌కు రాష్ట్రపతి సంతకం లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినేట్లో చర్చించినప్పటికీ రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత లేదన్నారు. కేంద్రానికి పంపుతున్నామనడం ఎంత వరకూ సబబన్నారు. ఇది కేంద్రానికి పంపనవసరం లేదన్నారు. రాష్ట్ర పరిధిలో విడుదల చేసే నోటిషికేషన్‌ను ఆమోదించే సర్వాధికారాలు సీఎంకు ఉన్నాయని, దీనిపైనే ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలని లేఖ రాశానని, ఆయన నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి ఉందన్నారు. మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మండల యువజన అధ్యక్షుడు మారిశెట్టి బుజ్జి, తలిశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
కాపు జనాభాను తగ్గించారా?
సాక్షి, అమరావతి: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించడంపై కాపు నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రశ్నిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన అయితే తమకు కనీసం 11 శాతం రిజర్వేషన్లు రావాలని చెబుతున్నారు. కమిషన్ సభ్యులు అభిప్రాయపడినట్టయితే 6 శాతం రావాలంటున్నారు. 5 శాతం ఎవరి ప్రతిపాదన అని వారు ప్రశ్నిస్తున్నారు. బలహీనవర్గాల జాబితాలోని ఇతర సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు తమకూ అలానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బూటకపు లెక్కలు చెప్పారు.. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న 4,81,362 మందికన్నా ఎక్కువ మంది తెలగలు ఉంటారని కాపునేతలు వివరిస్తున్నారు. 1931 జనాభా లెక్కల ప్రకారం తెలగ జనాభా 6.99 లక్షలైనపుడు ఇప్పుడు 4.81 లక్షలే అనడం విడ్డూరంగా ఉందంటున్నారు. కాపులు మొత్తం 38 లక్షలేనని చెప్పడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఏయే జిల్లాల్లో కాపుల లెక్కలు తీశారో చెప్పాలన్నారు. ప్రజాసాధికారిత సర్వే ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. ప్రజాసాధికారిత సర్వే ప్రకారం 38,09,326 మంది కాపులు, 4,81,321 మంది తెలగలు, 7,51,031 మంది బలిజలు, 13,058 మంది ఒంటరి కులస్తులు ఉన్నారు. అయితే ఈ లెక్కలు అసత్యమని, మళ్లీ సర్వే చేయించాలని కాపునేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మిగతా కులాల లెక్కలు కూడా బయటపెట్టాలని కోరుతున్నారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కాపుల్ని లెక్కించినా 50 లక్షలకు దాటతారని పేర్కొన్నారు. ఇంత తక్కువగా కాపులు ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అసలు రిజర్వేషన్ అంశాన్నే పరిగణనలోకి తీసుకునేది కాదని, కాపుల ప్రభావాన్ని తక్కువ చేసి చూపేందుకు ఈ కాకిలెక్కలు చెప్పారని కాపునాడు సీనియర్ నేత ఒకరు తెలిపారు. రిజర్వేషన్లను తగ్గించేందుకే ఈ ఎత్తుగడ... రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు దాదాపు 80 లక్షలు ఉంటారని కాపునేతలు చెబుతున్నారు. వాస్తవ సంఖ్యను చెబితే అన్ని రంగాల్లో ఎక్కువ వాటా అడుగుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుదించి చూపించిందని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశమేనని అంటున్నారు. రిజర్వేషన్లను కుదించి చూపేందుకే ప్రజా సాధికారిత సర్వేను అడ్డం పెట్టుకున్నారని వివరించారు. 5 శాతానికి మించి ఇవ్వకూడదని ప్రభుత్వం ముందే నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా లెక్కలు చూపినట్టుందని విమర్శిస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం తమ కులాలకు కనీసం 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆఖరి పోరాటానికి సిద్ధంకండి
కొత్తపేట: ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీలోపు హామీ నెరవేర్చకపోతే ఆ రోజు ప్రకటించే ఆఖరి పోరాటానికి ప్రతి కాపు కుటుంబం రోడ్డెక్కేందుకు సిద్ధం కావాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇదే ప్రభుత్వానికి హెచ్చరిక అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో ఆ గ్రామ కాపు అభ్యుదయ సంఘం గురువారం నిర్వహించిన కార్తీక వన సమారాధన సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముద్రగడ పాల్గొని ప్రసంగించారు. -
కాపు సంఘం నేత గృహ నిర్బంధం
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడిని పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలోని తన ఇంట్లో నిర్బంధం విధించడంపై వెంకట్రాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జాబ్ లేదు.. కానీ, కొడుక్కి మంత్రి పదవి
కాకినాడ: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఇంటికో జాబ్ సంగతి ఏమోగానీ తన కొడుక్కి మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నారని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేకపోయారని ఆమె అన్నారు. ఇక రిజర్వేషన్ల పేరుతో కాపులను దారుణంగా మోసం చేశారని, పైగా ఉద్యమం చేస్తున్న ముద్రగడను ఇంట్లో నిర్భంధించి వేధిస్తున్నారని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కాపులకు లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. -
‘మంజునాథ’ నివేదిక రాగానే కేంద్రానికి
టీడీపీ కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సాక్షి, అమరావతి: బీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన మంజునాథ కమిషన్ నివేదిక అందగానే మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాలులో జరిగింది. పార్టీ కాపు నాయకులు పాల్గొన్న సభకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి మంజునాథ కమిషన్ నివేదిక అందుతుందని చెప్పారు. అయితే ఈ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఆయన సమావేశానికి రానట్లు తెలుస్తోంది. రీజినల్ హబ్‌గా తిరుపతి తిరుపతి: తిరుపతిని రీజినల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన తిరుపతి పర్యటనలో భాగంగా మొదటిరోజు పలు నూతన భవనాలను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తిరుపతి, వైజాగ్, రాజధాని ప్రాంతాన్ని ప్రాంతీయ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తిరుపతిలో అవినీతి నిరోధకశాఖ ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చిన 1100 కాల్ సెంటర్‌ను అవినీతి నిరోధకశాఖ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
పశ్చిమ గోదావరి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం ఆయన పాదయాత్రకు అనుమతి లేదంటూ వారంపాటు గృహ నిర్భందం చేసింది. ఈ హౌస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతుల ఆందోళనలు చేస్తున్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో సీఎం చంద్రబాబునాయుడు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కిర్లంపూడిలో కంచాలు, గరిటెలతో కాపు నేతలు నిరసనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరెగాయి. తూర్పుగోదావరిలో కొత్తపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాపులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు వెంకట్రాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు కూర్చున్నాడు. దీక్ష చేస్తున్న వెంకట్రాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక ఆకివీడులో రిలే దీక్షలు చేస్తున్న కాపు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నరసాపురం మండలం తూర్పుతాళ్లులో కాపు నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. పాదయాత్ర విషయంలో చంద్రబాబుకో న్యాయం.. కాపులకు మరో న్యాయమా? మనం ఎక్కడికెళ్తున్నాం?. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణ త్యాగానికి అయినా సిద్ధం అని ముద్రగడ తెలిపిన విషయం తెలిసిందే. -
కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కాపుల సామాజిక వర్గంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపుల సామాజిక వర్గం చాలా బలమైందన్న ఆయన.. శాఖలుగా, వర్గాలుగా కాపులు ఉండటంతో వారిలో ఐక్యత లేదన్నారు. వారంతా ఏకమైతే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం అంతగా ఉండదని తెలిపారు. 'ప్రజారాజ్యం ఎలా అయ్యిందో చూసారు కదా! ఒక పార్టీని నడిపించడం అంటే చిన్న విషయం కాదు' వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీలో అడుగు పెట్టాలని చూస్తోందని, అందుకే కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లుందని తెలిపారు. -
అంబటి సహా కాపునేతల హౌస్ అరెస్టు
సాక్షి నెట్వర్క్: గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కాపునేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మూడువేల మందికిపైగా కాపు నాయకులకు నోటీసులు ఇచ్చి పోలీసు స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేశారు. గుంటూరు రూరల్ జిల్లాలో 372 మందిని, 243 మందిని ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. కాపు ముఖ్యనేతలు అంబటిరాంబాబు, కావటి మనోహర్‌నాయుడు, దాసరి రాముతోపాటు మరో ముగ్గురు కాపు ముఖ్యనేతలను హౌస్ అరెస్టులు చేశారు. రాజధాని ప్రాంతంలో సైతం పోలీసులు భారీ ఎత్తున మోహరించి కాపునేతలు ఎవరూ అక్కడికి రాకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్, బస్స్టేషన్లలో డాగ్, బాంబ్ స్క్వాడ్ల తనిఖీలు నిర్వహించారు. బుధవారం రాత్రి కూడా పోలీసు పహారా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాలోనూ కాపులు, కాపు సంఘాల నేతలు, కార్యకర్తలపై పోలీసులు కన్నెర్ర చేశారు. మంగళవారం జిల్లాలోని పలువురు కాపు నేతలకు ఫోన్లలో బెదిరింపులకు పాల్పడిన పోలీసు యంత్రాంగం బుధవారం కొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేయగా పలువురు నాయకులను గృహనిర్భందం చేసింది. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ నేత దుట్టా రామచంద్రరావును అక్కడి పోలీసులు గృహనిర్బంధం చేశారు. నూజివీడులో కాపునాడు నాయకుడు శీలం వెంకటేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వారితోపాటు జిల్లాలోని మరో 48 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లాయర్లు
హైదరాబాద్: కిర్లంపూడిలో ఏపీ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని కాపు న్యాయవాదుల సంఘం ప్రతినిధి వేపకాయల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ముద్రగడ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ 'సాక్షి'తో మాట్లాడుతూ... ప్రభుత్వ వైఖరి చూస్తుంటే పరాయిదేశంలో ఉన్నామన్న భావన కలుగుతోందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సర్కారు కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి మింగుడు పడని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులను స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. బైండేవర్ చేస్తాం, కేసులు పెడతామనని పోలీసులు బెదిరించడం సరికాదన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014లో చంద్రబాబు స్పష్టమైన హామీయిచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని మాత్రమే కాపులు కోరుతున్నారని తెలిపారు. పాదయాత్రకు రెండు నెలల క్రితం అనుమతి కోరారని వెల్లడించారు. ముద్రగను గృహనిర్బంధం చేయడాన్ని ఆయన ఖండించారు. కిర్లంపూడిలో పోలీసు రాజ్యాన్ని సృష్టించి, సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించినట్టు రామకృష్ణ వెల్లడించారు. -
వైఎస్ఆర్ సీపీ కాపు నేతలకు నోటీసులు
అమరావతి: చలో అమరావతి పాదయాత్రను అణచివేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం, మరోవైపు యాత్రను నిర్వహించడానికి ముద్రగడ పద్మనాభం, కాపు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రలో పాల్గొనేవారిపై ఏపీ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కాపు నేతలకు మంగళవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రకు వెళ్లొద్దంటూ ఇళ్లకు వచ్చి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, వెలనాటి మాధవ, కొక్కిరాల సంజీవరావు, నాగిశెట్టి బ్రహ్మయ్యలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ట్రావెల్స్ నిర్వాహకులను కూడా పాదయాత్రకు వాహనాలు సమకూర్చొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో కాపు నేతలుకు నోటీసులు జారీ అయ్యాయి. ముద్రగడ పాదయాత్రలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చిరికలు చేశారు. -
కాపులపై ఆంక్షల కత్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా జిల్లాలోని కాపునేతలందరికి పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పాదయాత్రలో పాల్గొనడానికి బయటకు వస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మరోవైపు వందలాది మంది కాపు నేతలకు ఇప్పటికే నోటీసులు పంపించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. జిల్లాలో ఉన్న పోలీసులకు అదనంగా ఐదు వందల మంది పోలీసులు, రిజర్వు బెటాలియన్లను ఇతర జిల్లాల నుంచి రప్పించారు. ఇప్పటికే జిల్లాలో సెక్షన్ 30తో పాటు సెక్షన్ 144 అమలులో ఉంది. ఎస్పీ రవిప్రకాష్ కొవ్వూరు, దేవరపల్లి, సిద్దాంతం, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియాల్లో పర్యటించి పోలీసులకు బందోబస్తు ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలోని ట్రావెల్స్ యజమానులకు ఫోన్లు చేసి కాపు నాయకులకు వాహనాలు సమకూరిస్తే సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు అన్ని మండలాల్లో కాపు నాయకులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే జిల్లాలో చాలాచోట్ల కాపు నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెనుగొండలో సర్కిల్ ప్రత్యేకాధికారిగా నియమితులైన కృష్ణాజిల్లా తిరువూరు సీఐ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 మంది పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొంగరావిపాలెం, పెనుగొండ, మార్టేరు, తూర్పు విప్పరుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. తణుకు సర్కిల్ పరిధిలోని తణుకు, తణుకు రూరల్, ఉండ్రాజవరం, అత్తిలి పోలీసు స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీసు పికెట్లు, మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కిర్లంపూడిలో ముద్రగడకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్లాలనుకునే వారిని పోలీసులు ఎక్కడికక్కడే నిలువరిస్తున్నారు. పదహారో నెంబరు జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిడదవోలులో 13 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పట్టణంలో గూడెం రైల్వే గేటు, రైల్వేష్టేషన్ సెంటర్, పాటిమీద, బస్టాండ సెంటర్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసారు. నిడదవోలు మండలంలో సమిశ్రగూడెం పురాతన వంతెన సెంటర్, విజ్జేశ్వరంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్లే ప్రతి వాహనాన్ని సమిశ్రగూడెం సెంటర్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. -
కాపు ఉద్యమ నేతలకు నోటీసులు
అమలాపురం డీఎస్పీ ప్రసన్నకుమార్ అమలాపురం టౌన్ : కాపుల పాదయాత్రకు అనుమతి లేదని, పోలీసు ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ హెచ్చరించారు. ఈ నెల 26న నుంచి కిర్లంపూడి నుంచి ప్రారంభించనున్న కాపుల పాదయాత్రకు కోనసీమ నుంచి ముఖ్యంగా కాపు ఉద్యమ నేతలు, రౌడీషీటర్లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పలువురు కాపు ఉద్యమ నేతలకు 149 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చామని చెప్పారు. వివాదాల్లోనూ, ఊరేగింపుల్లో పాల్గొనమని వారి నుంచి అంగీకార పత్రాలు కూడా తీసుకున్నామని చెప్పారు. కోనసీమలోని 275 గ్రామాల్లో ముఖ్యంగా కాపు యువతకు మైత్రి సభలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొంటే ఎదురయ్యే కేసులను వివరించామన్నారు. కోనసీమ చాలామంది కాపు యువత విద్యార్థులు, విద్యావంతులేనని... వారు పోలీసు కేసుల్లో అనవసరంగా ఇరుక్కుంటే ఉద్యోగాలు వస్తే ఇబ్బంది పడతారన్నారు. వారి తల్లిదండ్రులు వీరిని అదుపు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సామాజికంగా ఏ గొడవలైనా.. మూలాలు అమలాపురంతోనే ముడిపడి ఉంటున్నాయని డీఎస్పీ అన్నారు. తుని రైలు ధ్వంసం, గుంటూరులో టోల్గేట్ ధ్వంసం, వాహనం దహనం కేసు, తలుపులమ్మ లోవలో ఘర్షణ కేసుల్లో నిందితులు అమలాపురం వారేనన్నారు. అందుకోసమే శాంతి భద్రత పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. ఇప్పటికే కోనసీమలోని కొందరు రౌడీషీటర్లను పిలిచి కౌన్సెలింగ్ చేశామని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే కొందరు రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలీసు సెక్షన్–30 అమలులో ఉందని, రెండు రోజుల్లో 144 సెక్షన్ కూడా విధిస్తారని చెప్పారు. ఈ రెండు సెక్షన్లు అమలులో ఉంటే రోడ్లపై తిరగడం, ర్యాలీ, పాదయాత్ర చేస్తే ఆ సెక్షన్ల ఉల్లంఘనే అవుతుందని స్పష్టంచేశారు. -
ఇదే ఆఖరి పోరాటం
26న పాదయాత్ర జరిగి తీరుతుంది ఇంటికొకరు కదలిరండి చావో...రేవో తేల్చుకుందాం కాపు ఉద్యమనేత ముద్రగడ పిలుపు పిఠాపురం టౌన్: ఇంటికొచ్చి నిద్రలేపి కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగితే అణిచివేసే కార్యక్రమాలు చేపడతున్నారని, అవమానాలకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కల్యాణ మంటపంలో కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీకి రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చేపట్టి సరిగ్గా రెండేళ్లు కావస్తుందని, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సీఎంకు చీమకుట్టనట్టు నటిస్తున్నారన్నారు. ఈ నెల 26న పాదయాత్ర జరిగి తీరుతుందని ఇదే ఆఖరి పోరాటం, ఆకలి పోరాటం అని ఆయన అన్నారు. కాపులు, బిసీలు, దళితుల మధ్య తగాదాలు సృష్టించి రాజకీయంగా ఎదగాలని చంద్రబాబు చూస్తున్నారని ఈ కుట్ర అందరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో ఎంతో మంది కాపులు ఓట్లు వేసి చంద్రబాబును గెలిపిస్తే ఇప్పుడు కాలుతో తన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడుతున్నా...చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యామన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న కాపు సోదరులను కూడా కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో మన రక్షణ కోసం ఇంటికొకర్ని పంపిస్తున్నారని, అదేవిధంగా కాపు ఉద్యమం కోసం ఇంటికొకర్ని పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాపుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను, క్రీడాకారులను ముద్రగడ చేతులు మీదుగా ఘనంగా సత్కరించారు. రాష్ట్ర కాపు ఐక్యవేదిక సభ్యుడు గుండా వెంకటరమణ, ఆదర్ష్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంటు బుర్రి అనుబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది
- చలో అమరావతికి భారీగా తరలి రండి - కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు అనంతపురం న్యూటౌన్ : కాపులను దారుణంగా అణగదొక్కుతున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న వారు ఆదివారం సాయంత్రం అనంతకు వచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు అధ్యక్షతన స్థానిక శ్రీనివాస నగర్‌లోని బాలాజీ కల్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ కాపు జాతి కోసం నిరంతరం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కాపులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి తుని సభలాగే మరోసారి జూలై 22, 23 తేదీలలో ‘చలో అమరావతి’ కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లా నుంచి భారీగా తరలి రావాలని కోరారు. ముద్రగడ నిజాయితీ కలిగిన నాయకుడని, ఆయనకు చంద్రబాబులా కుట్రలు, కుతంత్రాలు తెలీవని అన్నారు. కాపులు ఎక్కడ సభలు పెట్టుకున్నా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ పోలీసులతో కొట్టిస్తూ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రానున్న ఎన్నికల నాటికి చంద్రబాబు నైజాన్ని అందరికీ తెలియజేస్తామన్నారు. కాపు జేఏసీ జిల్లా నాయకులు గుజరీ వెంకటేష్, కన్వీనర్ భవానీ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ కాపులంతా ముద్రగడ పద్మనాభం బాటలో నడిచేలా ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. అంతకు ముందు కాపు ఉద్యమ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు స్వామి, వెంకటరమణ, చంటి బాబు, సత్తిబాబు, కేటీబీ (కాపు తెలగ, బలిజ, ఒంటరి కులాల) సంక్షేమ సంఘం నాయకులు జంగటి అమరనాథ్, నాగేంద్ర, పగడాల మల్లికార్జున, నాగేంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాపుల సత్యాగ్రహం
జిల్లావ్యాప్తంగా దీక్షలు l వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లాలోని కాపు సత్యాగ్రహ దీక్షలు చేపట్టిన కాపులు.. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తూర్పార పడ్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యమిస్తున్న కాపులను అణగదొక్కేందుకు కుట్ర పన్నారని నాయకులు ఆరోపించారు. కాపు జాతి కోసం ప్రాణాలను ఒడ్డేస్తున్న ముద్రగడ బాటలో అలుపెరుగని పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న కాపు జాతిని అణగతొక్కేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు తిలక్‌రోడ్డులోని నందెపు ప్లాజా ఎదురుగా కాపు యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఆదివారం కాపు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. దీక్షా శిబిరాన్ని విజయలక్ష్మి, పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వైఖరిని మార్చుకోకుంటే 1988 నాటి సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ముద్రగడ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమంతో టీడీపీ భూస్థాపితమవుతుందన్నారు. దుర్గేష్ మాట్లాడుతూ బీసీలకు నష్టం కలుగకుండా గతంలో అమలు చేసిన విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చే ప్రక్రియను పూర్తి చేస్తామని హామీని మూడేళ్లు పూర్తయినా నెరవేర్చలేదన్నారు. మంజునాథ కమిష¯ŒS పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ కాపు యువత భవిష్యత్ కోసమే ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని అణగతొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహ¯ŒSరావు, వంగవీటి రంగ, కాపు జేఏసీ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కార్పొరేటర్ బొంత శ్రీహరి, నాయకులు ఆకుల భాగ్యలక్ష్మి, సుంకర చిన్ని, అడపా రాజు, సూరవరపు రామారావు, నాగిరెడ్డి సుబ్బారావు, గుర్రం గౌతమ్, ఆసూరి సుధాకర్, అనిశెట్టి ఆనంద్, కరుణామయుడు శ్రీను, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్త్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మ ణ్యం, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా ఇవ్వాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : బీసీ సోదరులకు ఎటువంటి నష్టం లేకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భానుగుడి సెంటర్లో కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కాపు ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కాపు సత్యాగ్రహ దీక్ష ఆయన మద్దతు తెలిపారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపులను రిజర్వేషన్లు ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కాపులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వారిని అడ్డుకోవడం బాధకరమన్నారు. కాపులను మభ్యపెట్టేందుకే ఎన్నికల్లో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారన్నారు. కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. కాపు ఉద్యమ జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ ఉద్యమం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిన భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కాకినాడ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, సిదార్ధ మూర్తి, పుల్లా కోటేష్, అప్పనపల్లి పెద్ద, దుర్గాన దొరబాబు, చెక్కపల్లి రాజబాబు, కాపు నాయకులు పాల్గొన్నారు. బీసీల్లో చేర్చేవరకూ పోరు ఆగదు అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరు ఆగదని కాపు నేతలు స్పష్టంచేశారు. గండువీధిలోని దివంగత నల్లా సూర్య సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో కాపు జేఏసీ రాష్ట్ర నేత నల్లా పవన్‌కుమార్ ఆధ్వర్యంలో 120 మంది నేతలు, నాయకురాళ్లు దీక్షలు చేపట్టారు. కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, జేఏసీ రాష్ట్ర నాయకుడు మెండగుదటి మోహ¯ŒS శిబిరాన్ని ప్రారంభించారు. కాపు మహిళా జేఏసీ నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లాటి దుర్గాభాయి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కాపు మహిళలు దీక్షలు చేపట్టారు. సూర్యచంద్రరావు తనయులు, ఇంజినీరింగ్ విద్యార్థులు నల్లా అజయ్, సంజయ్ సైతం దీక్ష చేపట్టారు. ఇదిలాఉండగా, రాష్ట్ర జేఏసీ నాయకుడు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో కూడా దీక్షలు చేపట్టారు. ఇక్కడ సుమారు వంద మందికి పైగా దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాలకు పలు సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలిపారు. నల్లా పవ¯ŒS దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల యాజమానుల సంఘ అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు తదితర ప్రముఖులు మద్దతు తెలిపారు. సాయంత్రం నల్లా పవ¯ŒS దీక్షా శిబిరంలోని దీక్షాపరులకు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, మిండగుదటి మోహన్, కాపు నాయకుడు సూదా గణపతి కోనసీమలోని పలు మండలాల్లో పర్యటించి కాపు దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. -
‘బాబు’కు మంచి బుద్ధి ప్రసాదించుస్వామీ
ఆలయాల్లో ‘కాపు’వర్గీయుల పూజలు సాక్షిప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా మంగళవారం జిల్లాలో కాపు సామాజికవర్గీయులు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేసి వినతిపత్రాలు అందచేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ ఆధ్వర్యంలో పలు దశల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ వారు ప్రార్థించారు. కాకినాడలోని భానుగుడి జంక్ష¯ŒS సమీపాన ఉన్న భానులింగేశ్వరస్వామి దేవాలయంలో కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు ఫ్రూటీకుమార్, కాపు సద్భావనా సంఘం నాయకుడు బసవా ప్రభాకరరావు తదితరులు దేవుడికి వినతిపత్రం అందచేశారు. అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు నల్లా పవన్, మిండగుదిటి మోహన్, కలవకొలను తాతాజీ తదితరులు వెంకటేశ్వరస్వామి ఆలయం, గడియారస్తంభం సెంటర్లో లక్షీ్మగణపతి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటర్లో భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు దోసాలమ్మ ఆలయంలో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ అయ్యప్పస్వామి ఆలయంలో చంద్రబాబుకు జ్ఞాపకశక్తి ప్రసాదించాలని నగర కాపు సంఘ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించారు. కాపు నాయకులు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కడియంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. -
ఒంగోలులో కాపు జేఏసీ వినూత్న నిరసన
-
కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర
గుంటూరు: కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఇప్పటికే మూడుసార్లు అడ్డుకున్నారని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసినపుడు ముద్రగడ కుటుంబ సభ్యులను పోలీసులు దారుణంగా అవమానించారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనం కోసం విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కూడా పోలీసులు అలాగే వ్యవహరించారని తెలిపారు. తుని ఘటన, రాజధాని పొలాల్లో మంటల కేసులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు ఘటనల్లో టీడీపీ నేతలే ఉన్నారని అంబటి ఆరోపించారు. -
కాపు జేఏసీ ప్రత్యేక పూజలు
-
బాబుకు బుద్ధి ప్రసాదించమని కోరండి: ముద్రగడ
కిర్లంపూడి(తూర్పుగోదావరి జిల్లా): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం కాపుజ సోదరులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేర్చి వారి అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని.. ఆయనకు మంచి బుద్ధిప్రసాదించాలని కోరుతూ ఈ నెల 31న కాపు జాతి సోదరులు తమ ఊళ్లలో ఉన్న దేవాలయాలకు వెళ్లి కొబ్బరి కాయలు కొట్టాలని పిలుపునిచ్చారు. తుని ఐక్య గర్జన సభ జరిగి ఈ నెల 30కి సంవత్సరం పూర్తవుతుందని లేఖలో ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. -
పలువురు కాపు నేతల గృహ నిర్బంధం
కాకినాడ రూరల్ : పాదయాత్ర నేపథ్యంలో కాపు ప్రతినిధుల గృహ నిర్బం ధాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసుతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంతం నానాజీని, మరికొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. దాసు ఇంటి పరిసరాల్లోకి ఏ ఒక్కరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒ¯ŒSటౌన్, టూటౌన్, సర్పవరం సీఐలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మేము ఉగ్రవాదులమా.. గృహ నిర్బంధంలో ఉన్న వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ శాంతియుత పోరాటం చేస్తున్న తమను ఉగ్రవాదులుగా చూడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆందోళన చేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలుగజేయడంలేదని అన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వం నిర్వహిస్తున్న అరాచకాలు ఆపకపోతే చంద్రబాబు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కోడిపందేలకు అనుమతిచ్చి, దగ్గరుండి మరీ ఆడించిన పోలీసులు ఇప్పుడు కాపులను గృహనిర్బంధం చేయడంలో అర్ధంలేదని నానాజీ అన్నారు. వారితో పాటు సిద్ధా నూకరాజు, సానా శ్రీను, వాసిరెడ్డి రాజేష్‌తో పాటు పలువురు ఏసుదాసు ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉన్నారు. పిఠాపురంలో జేఏసీ నేత... పిఠాపురం : కాపు జేఏసీ నేత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటరమణను పిఠాపురంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి కిర్లంపూడి వెళ్లే వారిపై పోలీసులు నిఘా పెంచారు. అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాపు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మఫీ్టలో కాపలా కాస్తున్నారు. గోపాలపురంలో ఆకుల రావులపాలెం (కొత్తపేట) : కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణను గృహ నిర్బంధం చేశారు. మంగళవారం ఉదయమే డీఎస్పీ టీఎస్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. ఇంటి బయట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సహా పలువురు నాయకులు చేసిన పాదయాత్రకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముద్రగడ యాత్రకు మాత్రమే ఈ విధంగా ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు. గృహ నిర్బంధాలు తగవు కోరుకొండ (రాజానగరం) : ముద్రగడ పద్మనాభం శాంతియూతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు తమను గృహ నిర్బంధం చేస్తున్నారని వైఎస్సార్ పీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. కోరుకొండ మండలం రాఘవపురంలో మంగళవారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. -
కాపు నాయకుల హౌస్ అరెస్ట్
పి.గన్నవరం: కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఉద్యమం ముందుకు సాగకుండా కాపు నాయకులపై గృహ నిర్బంధం అమలు చేస్తున్నారు. ఈ మేరకు కాపు జేఏసీ నాయకులు బాజి, కొమ్మూరి మల్లిబాబులను మంగళవారం పి.గన్నవరంలో హౌస్ అరెస్టు చేశారు. -
కాపు సత్యాగ్రహ యాత్ర సాగి తీరుతుంది
-
వ్యూహ ప్రతివ్యూహాలు
ఆరు నూరైనా సత్యాగ్రహ యాత్ర చేపడతామంటున్న కాపు నేతలు అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు ఇప్పటికే షాడో పార్టీలతో నిఘా నేటి నుంచి రంగంలోకి దిగనున్న పోలీసు బలగాలు తాయిలాల పేరుతో కాపుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వ యత్నం అమలాపురం టౌన్ : కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన ఈ నెల 25 నుంచి కోనసీమలో జరపతలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను అడ్డుకునేందుకు.. ప్రభుత్వం గతం మాదిరిగానే ప్రయత్నాలు ఆరంభించింది. గత నవంబర్ 16న జరగాల్సిన ఈ యాత్రను భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపి.. కాపు నేతలను గృహ నిర్బంధం చేసి, ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వాయిదా పడిన ఈ యాత్రను ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించాలని కాపు జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ యాత్రను ఆరు నూరైనా ఈసారి నిర్వహించి తీరతామని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క అనుమతి లేదన్న సాకుతో ఈ యాత్రను అడ్డుకుంటామని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు కాపు నేతలు, అటు పోలీసుల వ్యూహప్రతివ్యూహాల నడుమ పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన అటు కాపుల్లోనూ.. ఇటు పోలీసు వర్గాలు, అధికార పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. ఎవరి వ్యూహం వారిది యాత్ర కోసం ఇప్పటికే కాపు నేతలు కోనసీమలో గ్రామగ్రామానా పర్యటించి, సమావేశాలు ఏర్పాటు చేసి కాపులను సమాయత్తం చేస్తున్నారు. యాత్రను ఎలా అడ్డుకోవాలనే దానిపై జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కాకినాడలో శనివారం జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వ్యూహాన్ని వివరించారు. మరోపక్క కాపు కార్పొరేష¯ŒS కాపులకు ఇస్తున్న రుణాలపై ప్రభుత్వం జిల్లాలో పలుచోట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాయితీలను, తాయిలాలను వివరిస్తూ, కాపుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS రామానుజయను జిల్లాలోనే ఉంచి ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉద్యమ సారథి ముద్రగడపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ యాత్ర వల్ల ప్రయోజనం లేదని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. సిద్ధమైన యాక్ష¯ŒS ప్లా¯ŒS పాదయాత్రను అడ్డుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మూడు అంశాల ప్రాతిపదిక న యాక్ష¯ŒS ప్లా¯ŒS సిద్ధం చేసుకున్నట్లు తెలి సింది. యాత్ర అనివార్యమైతే.. యాత్ర కు అనుమతి తీసుకోకపోతే.. అనుమ తి తీసుకుంటే.. ఇలా మూడు కోణా ల్లో ఏది జరిగినా అందుకు అనుగుణంగా పోలీసు బందోబస్తు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమలోని ఒక్కో మండలాన్ని యూనిట్‌గా చేసుకుని ప్రతిచోటా ఒక్కో జిల్లా పోలీసు బలగాలను నియమించేం దుకు కసరత్తు చేస్తున్నారు. అటు మెట్టకు, ఇటు కోనసీమకు ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను సోమవారం దింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రో¯ŒS కెమెరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. కాపు నేతల వెన్నంటి నీడలా.. ఇప్పటికే కాపు ఉద్యమ నేతల కదలికలపై పోలీసులు కన్ను వేశారు. వారివద్ద మఫ్టీలో ఉన్న పోలీసులను షాడో పార్టీలుగా నియమించారు. షాడో పార్టీ కానిస్టేబుళ్లు కాపు నేతల వెన్నంటే ఉంటున్నారు. నేతలు ఎక్కడికి వెళితే వారూ అక్కడకు వెళుతున్నారు. కార్లలో కూడా వారిని అనుసరిస్తున్నారు. కోనసీమలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒSల వెంట ప్రస్తుతం షాడో పార్టీల నిఘా కొనసాగుతోంది. ఫిబ్రవరి 10 వరకూ జిల్లాలో 144 సెక్ష¯ŒS : కలెక్టర్ కాకినాడ సిటీ : శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఫిబ్రవరి 10వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా 144 సెక్ష¯ŒS విధిస్తూ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరి 31న తునిలో జరిగిన కాపు ఐక్యగర్జన, ఫిబ్రవరిలో కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, జూ¯ŒSలో ఆందోళన ఘటనల సందర్భంగా అవాంఛనీయ, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దీని ప్రకారం జిల్లాలో ఐదుగురు, ఆపైన వ్యక్తులు ఒకేచోట గుమిగూడరాదని తెలిపారు. అలాగే శాంతియుత వాతావరణానికి, ప్రశాంత పౌర జీవనానికి భంగం కలిగించే సమావేశాలు, ధర్నాలు చేయరాదని, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉపన్యసించరాదని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా నిరసన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను నిషేధించారు. నిషేధాజ్ఞల కాలంలో సెల్ఫో¯ŒS, ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేయాలని మొబైల్ నెట్వర్క్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. జిల్లా ప్రజలు ఈ ఉత్తర్వులను పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అధికార, పోలీసు యంత్రాగాలకు అన్నివిధాలా సహకరించాలని కలెక్టర్ కోరారు. ముద్రగడ కదలికలపై నిఘా నేడు కిర్లంపూడి రానున్న పోలీసు బలగాలు జగ్గంపేట : కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కాకినాడలో ఆదివారం జరిగిన కాపు జేఏసీ సమావేశానికి వెళ్లిన ముద్రగడను పోలీసులు వెంబడించినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాపులకు రిజర్వేషన్లను సాధించేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఉద్యమబాట పట్టిన ఆయనను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. యాత్రకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కిర్లంపూడిలోని ఆయన నివాసం ముందు మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పోలీసు సిబ్బందిని కిర్లంపూడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న కల్యాణ మండపాన్ని సిబ్బంది కోసం సిద్ధం చేశారు. ముద్రగడ యాత్ర ప్రకటన నేపథ్యంలో గత నవంబరులో సుమారు 6 వేల మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి బందోబస్తు కోసం జిల్లాకు వచ్చారు. ఈసారి కూడా అదే స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ముద్రగడ యాత్ర నేపథ్యంలో కిర్లంపూడికి పోలీసు బలగాలు వస్తున్నాయని జగ్గంపేట సీఐ కాశీ విశ్వనాథం చెప్పారు. అయితే ఎంతమంది వస్తారనేది ఇంకా చెప్పలేమన్నారు. -
దేశం ‘కాపు’లకే కార్పొరేషన్ రుణాలు
జక్కంపూడి రాజా ధ్వజం కొత్తపేట : కాపు కార్పొరేష¯ŒS రుణాలు తెలుగుదేశం పార్టీ ‘కాపు’లకే మంజూరు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రజా బ్యాలెట్ పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుతో పాటు జక్కంపూడి రాజా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తుంటే ఆయనను తమ పార్టీ నేతలతో తిట్టిస్తున్నారన్నారు. కాపు కార్పొరేష¯ŒS ఏర్పాటు చేసి రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెపుకుంటున్న నేతలు అర్హులైన పేదలకు కాకుండా తమ పార్టీ కాపులకే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై జగ్గిరెడ్డి స్పందనకు ఆయన గెలుపే గొప్ప నిదర్శనమన్నారు. రాబోయే కాలంలో జగ¯ŒSను సీఎం చేయడానికి మరోసారి జగ్గిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ప్రతినిధి దాతలు ఇచ్చిన భూములు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. అంతేగా నీరు చెట్టు పథకం మట్టిని పేదల ఇళ్ల స్థలాలు కోసం కాకుండా కాజేసిన లేఅవుట్ స్థలాల మెరకకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వెంట నడిచిన కాపులపై కేసులు పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
అనాదిగా కాపులకు అన్యాయం
కమిషన్లతో కాలయాపన ఈసారి అమీతుమీ దిశగా ఉద్యమం 25 నుంచి సత్యాగ్రహ పాదయాత్ర కాపు జేఏసీ నాయకులు కొత్తపేట : కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై అనాదిగా వివిధ ప్రభుత్వాలు కమిషన్లతో కాలయాపన చేసి మోసం చేశాయని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి బుధవారం కొత్తపేటలో కాపునాడు నాయకుడు చీకట్ల ప్రసాద్ గృహంలో సమావేశమయ్యారు. నెల 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ నిర్వహించే పాదయాత్రపై పలువురు నాయకులు, సభ్యులతో సమీక్షించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ కాపులకు బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణకు గతంలో పలు ప్రభుత్వాలు కమిషన్లు వేసి చేతులు దులుపుకొన్న మాదిరిగానే ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు పాదయాత్రలోనూ, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయడానికీ హామీ ఇచ్చి గాలికొదిలేసారని విమర్శించారు. ఆ హామీని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే వివిధ రూపాల్లో ఉద్యమం చేపట్టాం తప్ప తాము ఏ కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు. బీసీల ఆందోళన, అనుమానాలపై ముద్రగడ వివరణ ఇచ్చి, సందేహాలను నివృత్తి చేయడంతో వారు సంతృప్తి చెందారన్నారు. అనుమతి లేని పాదయాత్రను అడ్డుకుంటామని హోంమంత్రి రాజప్ప చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన పలు పాదయాత్రలకు, టీడీపీ జనచైతన్య యాత్రలకు అనుమతులున్నాయా? అని ప్రశ్నించారు. ఉంటే వాటి నకళ్లు చూపితే తాము కూడా పర్మిష¯ŒS కోరే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. ఈ నెల 25న గాంధీజీ చిత్రపటంతో శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాపుల వల్లే అధికారంలోకి వచ్చామని చెప్పిన చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని కోరారు. ఈ సారి అమీతుమీ తేల్చుకునే దిశగా ఉద్యమం చేపడతామని చెప్పారు. సమావేశంలో కాపు మహిళా విభాగం నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి, నాయకులు ముత్యాల వీరభద్రరావు, పప్పుల వెంకటరామదొర, బొరుసు సత్తిబాబు, చీకట్ల ప్రసాద్, సలాది చిన్ని, సలాది బ్రహ్మాజీ, పెదపూడి త్రిమూర్తి శ్రీనివాస్, పేపకాయల బ్రహ్మానందం, దుప్పలపూడి మాధవరావు, తోరాటి శ్రీనివాసరావు, అన్యం సత్తిరాజు, యర్రంశెట్టి నాయుడు, ముద్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వాడవాడలా కొవ్వొత్తులతో నిరసన
కాపుల ప్రదర్శనల హోరు బోట్‌క్లబ్ (కాకినాడ) : కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మూడేళ్లు గడుస్తున్నా రిజర్వేషన్ల విషయం పట్టించుకోవడం లేదని, కాపులు రోడ్డెక్కే çపరిస్థితి తీసుకొచ్చారని కాపు జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా సోమవారం రాత్రి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకూ ఈ ఉద్యమం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పి గన్నవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పి.గన్నవరంలో మూడు రోడ్లు సెంటర్లో జరి గిన కొవ్వొత్తుల ర్యాలీ, సుమారు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగాయి. కాపు యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కాపులకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు కల్పించాలి
కొత్తపేట : బీసీలకు ఏవిదమైన నష్టం కలగకుండా కాపులకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపు ఉద్యమ ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన కొత్తపేటలో రాష్ట్ర బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్)ను కలసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు కాపునాడు నాయకుడు చీకట్ల ప్రసాద్ స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు ఏవిధంగానూ నష్టం కలగకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక కేటగిరీలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని, బీసీ రిజర్వేషన్ల శాతం పెంచమని మీరు డిమాండ్ చేస్తే దానికి తామూ మద్దతు ఇస్తామని ముద్రగడ ఆర్ఎస్తో అన్నారు. సీఎం కాపులు, బీసీలను సమావేశపరచి బీసీలకు నష్టం కలగని ఫార్ములాతో వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తమకు అభ్యంతరం ఉండదని ఆర్ఎస్ అన్నారు. దానికి ముద్రగడ మద్దతు పలికారు. అదే విధంగా మంజునాథ కమిషన్ సర్వే సందర్భంగా ఒక రోజు బీసీలు, మరో రోజు కాపుల అభిప్రాయాలను సేకరించాలని ఆర్ఎస్ అనడంతో తమదీ అదే అభిప్రాయమని ముద్రగడ తెలిపారు. ముద్రగడ వెంట కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, కాపు నాయకులు మిండగుదిటి మోహన్, పాలూరి సత్యానందం, బండారు రాజా, ముత్యాల వీరభద్రరావు, సూధా గణపతి తదితరులు ఉన్నారు. కాపు రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రస్తావిస్తా : ఎంపీ రవీంద్రబాబు కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల అంశం పార్లమెంటులో ప్రస్తావిస్తానని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు జేఏసీ ప్రతినిధులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులతో కలసి సోమవారం ఎంపీ రవీంద్రబాబును రమణయ్య పేటలోని ఆయన స్వగృహంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఆ సందర్భంగా రవీంద్రబాబు పైమేరకు వారికి హామీ ఇచ్చారు. -
కులాల మధ్య చిచ్చు
కాపుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలి కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కాపు జేఏసీ నేతల వినతిపత్రం గోపాలపురం (రావులపాలెం) : కాపులను బీసీల్లో కలుపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శుక్రవారం ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు చేపట్టిన కాపు రిజర్వేష¯ŒS సాధన ఉద్యమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కాపు ఉద్యమానికి మద్ధతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పీఠం కోసం ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్లు తదితర 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేడు వాటిని గాలికి వదిలేశారన్నారు. బీసీలకు నష్టం లేకుండా తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపులు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే అన్నారు. వారి ఉద్యమానికి పూర్తి సహకారాన్ని అందజేస్తానన్నారు. వారి ఆకాంక్షలను తమ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాపు కార్పొరేష¯ŒS రుణాలను కేవలం పచ్చ చొక్కాలకే ఇస్తున్న వైనంపై నియోజకవర్గంలో మొదటిసారి ప్రశ్నించింది తానే అన్నారు. అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమనేతల పట్ల ప్రభుత్వం గౌరవం కలిగిఉండాలని, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ నాయకుడి పట్ల ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నానన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందన్నారు. ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తమ డిమాండ్ అన్నారు. తొలుత ఆకుల రామకృష్ణ ఇంటి వద్ద నుండి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇంటి వరకూ కాపు నేతలు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు ఆర్వీ సుబ్బారావు, సాధనాల శ్రీనివాస్, చల్లా ప్రభాకరరావు, ముత్యాల వీరభద్రరావు. చీకట్ల ప్రసాద్, బండారు శ్రీనివాస్, ఆకుల భీమేశ్వరరావు, ఎంపీటీసీ జవ్వాది రవిబాబు, పాలూరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు. -
'ప్రభుత్వం మాట తప్పితే పతనమే'
అనంతపురం: కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లయినా పట్టనట్టుండడం దారుణమని కాపు నాయకులు విమర్శించారు. కాపుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆదివారం బలిజ సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కంచంపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం మాట తప్పితే పతనం తప్పదని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
13 జిల్లాల్లోనూ పాదయాత్రలు
కాపు ఉద్యమనేత ముద్రగడ వెల్లడి అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో దశల వారీగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పాదయాత్రలు నిర్వహిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ముందస్తు కార్యాచరణ ప్రకారం ఈ నెల 18 నుంచి దశల వారీ పోరాటాలు చేస్తూ 2017 జనవరి 25 న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమలాపురంలోని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నల్లా విష్ణుమూర్తి స్వగృహంలో శుక్రవారం కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా పవన్‌కుమార్, మిండగుదటి మోహన్, ఆర్వీ సుబ్బారావులతో కలిసి ముద్రగడ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. -
సెక్షన్ 30 కాపుల ఉద్యమానికేనా?
సర్కారుకు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి ప్రశ్న రిజర్వేషన్ల కోసం దశలవారీ ఉద్యమం కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దేశంలో ఎక్కడా లేనట్టు రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి అమలు చేస్తున్న సెక్షన్ 30 కేవలం కాపుల కోసమేనా అని జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభించారన్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలు ఇప్పటి వరకూ చీకట్లోనే ఉన్నాయని, రిజర్వేషన్ ఫలితం పొందడం లేదని చెప్పారు. కాపు ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని అధికారం, పోలీసు బలగంతో అణచివేయాలని చూస్తోందని నిరసించారు. రిజర్వేషన్ల కోసం దశల వారీగా ఉద్యమించనున్నట్టు తెలిపారు. 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో తమ వర్గీయులు ఐక్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ప్రధాన కూడళ్లలో మూతికి నల్లగడ్డలు కట్టుకుని ఆకలి కేక పేరుతో కంచం మీద గరిటె వాయింపు, 30న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేత, జనవరి 9న సాయంత్రం అన్ని ప్రధాన కూడళ్లల్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన, 30న రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేదికి సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాత్రకు అనుమతి ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలు, చైతన్య యాత్రలకు ఎవరూ అనుమతి తీసుకోలేదన్నారు. మిగిలిన వారికి లేని అనుమతి తమ యాత్రకు అవసరం లేదని చెప్పారు. అయితే అనుమతి కోసం దరఖాస్తు చేస్తామన్నారు. జేఏసీ నేతలు గన్నాబత్తుల మహేష్, ఆకుల లక్ష్మి, కొత్తపేట రాజా, సందీప్, వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, బొరుసు శ్రీను, కొల్లిమళ్ళ రఘు, వడ్డి మురళీకృష్ణ, అడపా భాస్కర్ పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు
చిలమత్తూరు : తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ చిలమత్తూరు పంచాయతీ కాపుచెన్నంపల్లి గ్రామస్తులు మంగళవారం బస్టాండ్ సమీపంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 40 రోజుల్లో గ్రామస్తులు నీటికోసం మూడుసార్లు నిరసన తెలిపడం గమనార్హం. గ్రామంలోని రెండుబోర్లు పని చేయకపోవడంతో పాటు మోటార్లు పాడు కావడంతో తాగునీటి సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారులకు వివరించినా ఫలితం శూన్యమన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించారు. అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ సుబ్రమణ్యం, ఇన్చార్జ్ ఎంపీడీఓ శకుంతలతో వాగ్వాదానికి దిగారు. నూతనంగా బోరు ఏర్పాటు చేసే వరకు ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
ఓట్లు కోసం చంద్రబాబు పాదయాత్ర చేయలేదా ?
కాపు ఉద్యమ నేత ముద్రగడ ఉత్సాహంగా కాపు కార్తిక వనసమారాధన బోట్‌క్లబ్ (కాకినాడ) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో ఓట్లకోసం పాదయాత్ర చేశారని అప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడపద్మనాభం డిమాండ్ చేశారు. కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సిఎల్ రోడ్డులోని కాపు కల్యాణమండపంలో ఆదివారం కాపు కార్తిక వనసమారాధనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఆ సంగతే పట్టించుకోవడం లేదన్నారు. రిజర్వేషన్లు అడుగుతుంటే పాకిస్థానీలు , తాలిబన్లలా చూస్తున్నారన్నారు. సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహిస్తుంటే పదివేల మంది పోలీసులను ఎందుకు దింపాల్సి వచ్చిందన్నారు. ఉద్యమ నాయకుల గృహనిర్బంధం దారుణమన్నారు. కాపులను ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారన్నారు. గతంలో కాపులకు ఉన్న రిజర్వేషన్లు మాత్రమే తాము అడుగుతున్నామన్నారు. కాపు ఉద్యమం శాంతియుతంగానే నిర్వహిస్తామన్నారు. కార్తిక మాసంలో వన సమారాధనలు చేయడం శుభసూచకమన్నారు. ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభమైన కాపు కార్తిక సమారాధన, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది. ఈ సందర్భంగా ముద్రగడ కాపు సద్భావ సంఘం వ్యవస్థాపకులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, జ్యోతుల నెహ్రూ , వరుపుల సుబ్బారావు, తోట త్రిమూర్తులు, ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వంగా గీత, పంతం గాంధీమోహ¯ŒS తదతరులు పాల్గొన్నారు. కాపు నాయకులతో కిటకిటలాడిన ముద్రగడ స్వగృహం కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ సినీ హీరో మంచు మోహ¯ŒSబాబు ఆదివారం రావడంతో జిల్లా నుంచే కాక విశాఖ పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కాపు నాయకులు, జేఏసీ నాయకులు, ఆయన అభిమానులు ఉదయాన్నే ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. మోహ¯ŒSబాబును చూసేందుకు అభిమానులు ఎక్కువగా చేరుకున్నారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న మోహ¯ŒSబాబు దంపతులకు ముద్రగడ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముద్రగడ జేఏసీ నాయకులను, అభిమానులను మోహన్‌బాబుకు పరిచయం చేశారు. ముద్రగడను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, అద్దేపల్లి శ్రీధర్, విశాఖ జిల్లా నాయకులు తోట రాజు, మాజీ ఎంపీ గురజాల వెంకటస్వామి నాయుడు , జేఏసీ నాయకులు జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్,గోపు చంటిబాబు, గౌతు స్వామి, గొల్లపల్లి కాశీ విశ్వనాథం, గోపు చంటిబాబు, మలకల చంటిబాబు, నరిసే శివాజీ, నరిసే సోమేశ్వరరావు, తోట బాబు, విశాఖ రూరల్ వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత, గౌతు సుబ్రహ్మణ్యం, రాజానగరం నియోజకవర్గం నుంచి భారీగా కాపు యువకులు ముద్రగడను కలిశారు. -
గృహ నిర్బంధంలోనే కాపు నేతలు
జిల్లాలో సీఎం పర్యటనకు పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు అమలాపురం టౌన్ : కాపుల పాదయాత్ర ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం... యాత్ర వాయిదా ప్రకటన వెలవడిన తర్వాత కూడా అమలాపురం కాపు నేతలను శనివారం కూడా గృహ నిర్బంధాలకే పరిమతం చేశారు. జిల్లాలో శనివరం ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎటువంటి హడావుడి సృష్టించకుండా కాపు నేతలను, కార్యకర్తలను గృహ నిర్బంధంలోనే ఉంచారు. వాస్తవానికి పాతయాత్రపై ముద్రగడ శుక్రవారం రాత్రి కిర్లంపూడిలో స్పష్టత ఇచ్చిన క్రమంలో పోలీసులను కాపు నేతల ఇళ్ల నుంచి ఆ రాత్రి నుంచే ఉప సంహరించాల్సి ఉంది. శనివారం సీఎం పర్యటనతో ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్, కోనసీమ తెలగ, బలిజ, కాపు అధ్యక్షుడు కల్వకొలను తాతాజీలను పోలీసులు శనివారం రాత్రి వరకూ కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. కాగా ఆదివారం ఉదయం నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నట్లు తెలిసింది. -
కాపు నేతలకు విశ్వరూప్ సంఘీభావం
అమలాపురం టౌన్ : మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అమలాపురానికి చెందిన రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా వపన్కుమార్ను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసు బందోబస్తు నడుమ పవన్ ఇంట్లోనే నిర్బంధించారు. ఇప్పటికే పవన్ తండ్రి, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తిని గురువారం నుంచి హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమలాపురంలో కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కూడా మూడు రోజులుగా హౌస్ అరెస్ట్‌లోనే ఉన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ఈ ముగ్గురు కాపు నేతలను వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ వారి ఇళ్లకు వెళ్లి కాపు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కల్వకొలను బాబి, వాకపల్లి శ్రీను, రంకిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఉన్నా రు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు కూడా ఆ నేతలను కలిసి మద్దతు తెలిపారు. పోలీసుల అనుమతితో కిర్లంపూడికి... గృహ నిర్బంధంలో ఉన్న నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, రావులపాలెం నుంచి కాపు నేత ఆకుల రామకృష్ణ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శుక్రవారం సాయంత్రం కిర్లంపూడికి వెళ్లారు. కాపు ఉద్యమ నేత ముద్రగడతో వాయిదా పడ్డ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు వెళుతున్నట్టు వారు తెలిపారు. -
ముద్రగడ సత్యాగ్రహ యాత్ర ఆగదు
-
జిల్లా కాపు నేతలు రామకృష్ణ, తాతాజీ అరెస్టు
రావులపాలెం : ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణను మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేష¯ŒSకు తరలించారు. ముద్రగడ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆకుల యాత్రకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సాయంత్రానికి ఆయనను, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసును పోలీసులు అరెస్టు చేసి స్టేష¯ŒSకు తరలించారు. కొంత సేపు అక్కడ ఉంచిన అనంతరం వారిని పోలీస్ వాహనంలో వారిని తరలించారు. ఎక్కడకి తరలిస్తున్నారన్నదానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అయితే కాకినాడ తరలించినట్టు తెలిసింది. అమలాపురం టౌ¯ŒS : కోనసీమ బలిజ తెలగ కాపు (టీబీకే) అధ్యక్షుడు కల్వకొలను తాతాజీని అమలాపురం పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేష¯ŒSలో ఉంచారు. ఒక దశలో తాతాజీని అమలాపురం స్టేష ¯ŒS నుంచి కాకినాడకు తరలిం చేం దుకు పోలీసులు ప్రయత్నించగా కాపు యువకులు స్టేష¯ŒSకు చేరుకుని అడ్డుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ స్టేష¯ŒS ఎదుట ధర్నా చేశారు. పట్టణానికి చెందిన కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి నాయకులు నల్లా విష్ణుమూర్తి, ఆయన కుమారుడు నల్లా పవ¯ŒSకుమార్ కోసం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తూనే ఉన్నారు. ముద్రగడ పాదయాత్రకు చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాస్, తివిక్రమవర్మ, విజయకుమార్, బ్రహ్మారెడ్డి రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు ప్రాంతాల్లో పోలీ సు అధికారులతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. ముద్రగడతో సహ పలువురు కీలక కాపు నేతలు హౌస్ అరెస్ట్‌లతో ఎదురవుతున్న పరిణామాలను ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజా ఆగ్రహానికి గురైతే పతనం తప్పదు కిర్లంపూడి : ప్రజా ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని కాపు జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం సాయంత్రం కాపు ఉద్యమనేత ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, అద్దేపల్లి శ్రీధర్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాపులకు ఇచ్చిన హామీల సాధన కోసం మాజీ ఎంపీ, కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం గాంధేయ మార్గంలో నిర్వహించ తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పౌరహక్కులను కాలరాసి ఎమెర్జెన్సీని తలపిస్తుందన్నారు. కాపు సత్యాగ్రహ యాత్ర వలన ముద్రగడకు ఎనలేని ప్రజా స్పందన వస్తుందనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్, గణేశుల రాంబాబు, తోట బాబు, మలకల చంటిబాబు, గౌతు స్వామి తదితరులు ఉన్నారు. -
పోలీసు దిగ్బంధంలో కోనసీమ
అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి కోనసీమలో నిర్వహించనున్న కాపుల పాదయాత్రకు పోలీసు బలగాలను భారీగా మోహరిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి 500 మంది పోలీసులను ఇక్కడికి రప్పించిన జిల్లా పోలీసు శాఖ ఆది, సోమవారాల్లో మరో రెండు వేల మందిని రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది. కాపుల పాదయాత్రకు శనివారం వరకూ అనుమతులు లేని దృష్ట్యా పోలీసులు కూడా యాత్రను నియంత్రించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కాపుల పాదయాత్ర బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన స్థానిక పోలీసు కంప్యూటర్స్ భవనంలో డీఎస్పీ లంక అంకయ్యతో పాటు జిల్లాలోని ఇతర పోలీసు అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. పాదయాత్రకు కాపు జేఏసీ రూపొందించిన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో ఉండాలి, ఏయే రూట్లతో పోలీసులను మోహరించాలనే అంశంపై చర్చించారు. ఇదే సమయంలో అమలాపురంలో కాపు రాష్ట్ర జేఏసీ నాయకులు పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించుకున్న సమావేశంలోని నేతల ప్రసంగాల సారాంశంపై కూడా ఆయన సమీక్షించారు. పాదయాత్రకు అనుమతి లభిస్తే బందోబస్తు ఏ రకంగా ఉండాలి, అనుమతి లేకుండా యాత్ర అనివార్యమైతే బందోబస్తు ఏ స్థాయిలో ఉండాలన్న విషయాలపై సమీక్షించారు. యాత్ర సమయంలో కోనసీమను పోలీసు వలయంతో దిగ్బంధనం చేసేలా బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. -
ఎవరికీ లేని ఆంక్షలు కాపులకేనా?
∙కాపు ఉద్యమాల సమయంలోనే 144, 30 సెక్షన్లు అమలు ∙రాష్ట్ర కాపు జేఏసీ నేతల ధ్వజం ∙పాదయాత్ర జరిపి తీరుతామని స్పష్టీకరణ అమలాపురం టౌన్ : రాష్ట్రంలో ఎవరైనా పాద యాత్రలు, సైకిల్ యాత్రలు, చైతన్య యాత్రలు వంటివి నిర్వహించినప్పుడు లేని ఆంక్షలు కాపులు ఏదైనా ఉద్యమాలు, యాత్రలు ఏర్పాటు చేస్తే మాత్రం ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తోందని రాష్ట్ర కాపు జేఏసీ నేతల ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాలు, యాత్రల సమయంలోనే ప్రభుత్వం 144 సెక్షన్, 30 సెక్షన్ తూ.చ.తప్పకుండా అమలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని కొల్లూరి వారి సత్రంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో ఈ నెల 16 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న పాదయాత్ర సన్నాహాలపై చర్చించారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, జిల్లా కాపునాడు పరిశీలకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు కోట శ్రీనివాస్, నల్లా పవన్, మెండుగుదటి మోహన్, కల్వకొలను తాతాజీ, ముత్యాల రామదాసు తదితరులు ముద్రగడ పాదయాత్ర రూట్ మ్యాప్, ఏర్పాట్లపై చర్చించారు. యాత్రకు దరఖాస్తు చేసుకుని, గొడవలు జరగవని హామీ ఇస్తే అనుమతి ఇస్తామని డీజీపీ చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుతో పాటు రాజకీయ ప్రముఖులు చేస్తున్న యాత్రలకు అనుమతులు ఉంటున్నాయాని వారు ప్రశ్నించారు. తుని కాపు గర్జన సభకు బస్సులు కూడా ఏర్పాటు చేసుకోనివ్వకుండా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఐక్యతతో పాదయాత్రను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాపు నాయకులు బసవా ప్రభాకర్, ఆర్వీ నాయుడు, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, మోటూరి సాయి, సుంకర సుధ, నల్లా శివాజీ, బద్రి బాబ్జీ, అరిగెల నాని, కురసాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
7న కాపు జేఏసీ సమావేశం
కిర్లంపూడి: ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సిఎల్ రోడ్డులో ఉన్న కాపు కల్యాణ మండపంలో నిర్వహించే తూర్పు గోదావరి జిల్లా కాపు జేఏసీ సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు పిలుపునిచ్చారు. శనివారం కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16న మాజీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న కాపు సత్యాగ్రహ యాత్రను దిగ్విజయం చేయడానికి చర్చించే నిమిత్తం 7న జేఏసీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని కాపు నాయకులు, జేఏసీ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు గొల్లపల్లి కాశీవిశ్వనాధం, గౌతు స్వామి, కుంపట్ల సత్యన్నారాయణ చల్లా సత్యన్నారాయణ, దాడి సూరిబాబు, దోమాల తమ్మిరాజు పాల్గొన్నారు. -
దిగ్విజయ్ వ్యాఖ్యలు అనైతికం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు సత్తెనపల్లి: కాపులను బీసీల్లో చేర్చే అoశంపై చంద్రబాబును తాము బలపరుస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెప్పడం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనని, అలాంటి వ్యాఖ్యలు అనైతికమని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మండిపడ్డారు. శనివారం పట్టణంలోని నాగన్నకుంటలో నియోజకవర్గ అధ్యక్షుడు ఆలా అనంతరామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శంకరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాపుల ఆధ్వర్యంలో బయటపడాలని చూస్తే భంగపడుతుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తీసుకునే బీసీ వ్యతిరేఖ వైఖరి తమ పార్టీని తామే శాశ్వత సమాధి చేసుకునేలా ఉందని హెచ్చరించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ రాయలసీమలో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించిన తీరు బీసీలకు నష్టం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. అనంతరం శంకరరావును సంఘ నాయకులు సత్కరించారు. -
కాపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సర్టిఫికెట్ల పరిశీలన
ఏలూరు (మెట్రో) జిల్లాలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 54 గ్రూపులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 గ్రూపులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు ధృవీకరించారు. పరిశీలన పూర్తి చేసుకున్న గ్రూపుల అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత తెలిపారు. ఎంపికైన గ్రూపులకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు రూ. 10 లక్షల బ్యాంకు రుణం, రూ. 10 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ అందించనున్నట్లు ఆమె చెప్పారు. -
కాపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సర్టిఫికెట్ల పరిశీలన
ఏలూరు (మెట్రో) జిల్లాలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 54 గ్రూపులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 గ్రూపులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు ధృవీకరించారు. పరిశీలన పూర్తి చేసుకున్న గ్రూపుల అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత తెలిపారు. ఎంపికైన గ్రూపులకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు రూ. 10 లక్షల బ్యాంకు రుణం, రూ. 10 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ అందించనున్నట్లు ఆమె చెప్పారు. -
6 రోజులు...125 కిలోమీటర్లు
ముద్రగడ పాదయాత్ర కోసం జేఏసీ నేతల సన్నాహాలు అమలాపురం : నవంబర్ 16 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ చేపట్టనున్న కాపు సత్యాగ్రహ పాదయాత్ర ఆరు రోజుల పాటు 125 కిలోమీటర్ల మేర సాగేలా కాపు జేఏసీ నాయకులు ప్రణాళిక రూపొందించారు.కాపు రాష్ట్ర జేఏసీ జాయింట్ కన్వీనర్ ఆకుల రామకృష్ణ, రాష్ట్ర కాపు రిజర్వేష పోరాటసమితి కన్వీనర్ నల్లా విష్ణుమూర్తి, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, నల్లా కుమార్ తదితరులు అమలాపురంలో శనివారం సమావేశమై పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. పాదయాత్ర విజయవంతానికి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కాపులతో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. నవంబర్ రెండో తేదీ నుంచి నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిల్లో జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి పాదయాత్రకు సమాయత్తం చేయనున్నట్టు నల్లా విష్ణుమూర్తి వెల్లడించారు. నవంబర్ 7న కాకినాడ లోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించే జిల్లా కాపు జేఏసీ సమావేశానికి జిల్లాలోని కాపులంతా హాజరు కావాలని నల్లా కుమార్ కోరారు. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై కూడా కాపు నాయకులు చర్చించారు. కాపు నాయకులు యేడిద దొరబాబు, పెద్దిరెడ్డి రాంబాబు, అరిగెల నాని, సలాది నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కాపు జాబ్‌మేళా ప్రారంభం
- పాల్గొన్న మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర అమరావతి: రాష్ట్రంలోని కాపు విద్యార్థులకు కాపు కార్పొరేషన్ బుధవారం జాబ్‌మేళా నిర్వహించింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్లైన్లో తొమ్మిది వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా జాబ్‌మేళాకు బుధవారం సుమారు ఐదు వేల మంది వరకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినురాజప్ప మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చేందుకు బీసీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. కమిషన్‌ను నియమించిన చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ జాబ్‌మేళాను ప్రతి నిరుద్యోగి ఉపయోగించుకోవాలన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందనే మాట నిజం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనాన్నరు. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ మాట్లాడుతూ కాపులను ఆర్థికంగా బలవంతులను చేయడమే కాకుండా చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. జాబ్‌మేళా కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగునుంది. మొదటి రోజు విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు సమయం కేటాయించారు. గురువారం ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యేందుకు పలువురు నిపుణులు శిక్షణ ఇస్తారు. శుక్రవారం ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తారు. -
జీఓ 30 సాధించిన ఘనత ముద్రగడదే
కిర్లంపూడి : కాపు జాతి రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేస్తున్న పాదయాత్రలో ఆయన వెంట నడిచేందుకు కాపు జాతి యావత్తూ సిద్ధంగా ఉందని కాపు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గుండా వెంకటరమణ, సంగిశెట్టి అశోక్, నల్లా విష్ణు తదితరులు మాట్లాడుతూ జాతి కోసం 1994లో ముద్రగడ తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కుటుంబంతో సహా ప్రాణాలు పణంగా పెట్టి జీఓ నంబర్ 30 సాధించారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధన కోసం మరోసారి ఉద్యమం చేపట్టి కాపుజాతిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ముద్రగడ మళ్లీ ఉద్యమం మొద లు పెట్టారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలోని 28వ పేజీలో కాపుజాతి పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లు, బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక హామీల అమలు పరిచిపోయారన్నారు. ముద్రగడ సా ధించిన జీఓ నంబర్ 30 వల్ల 14 కులాల్లో 9 కు లాలకు రిజర్వేషన్లు దక్కాయన్నారు. కాపు జాతి లోని ఐదు కులాలకు దక్కలేదన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు తోట రాజీవ్, గౌతు స్వామి, గోపు చంటిబాబు, చందు జనార్ధన్, అడపా నాగేంద్ర, గొల్లపల్లి కాశీ, నల్లా విష్ణు, తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
'బావమరిది కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్నావు'
కాకినాడ : నావి దొంగ దీక్షలని విమర్శిస్తున్నారు... మరి అధికారంలో లేనప్పుడు మీరు చేసిన దీక్షలను ఏమనాలో చెప్పాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ముద్రగడ విడుదల చేశారు. దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయండి అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మీతోపాటు నేను కూడా దీక్షలో పాల్గొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. మీరే దీక్ష తేదీ నిర్ణయించండి... ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు. బావమరిది బాలకృష్ణ కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కాళ్లు పట్టుకుని వేడుకున్నావని ఈ సందర్భంగా చంద్రబాబుకు ముద్రగడ గుర్తు చేశారు. మీ స్ఫూర్తి వల్లే కాపు ఉద్యమం పుట్టింది... దీనికి మూలకారకులు మీరే అని ముద్రగడ పేర్కొన్నారు. మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయన్నారు. మహా అయితే ఆఖరి అస్త్రంగా పోలీసుల చేత.. నా బట్టలు ఊడదీయించి బూటు కాళ్లతో తన్నిస్తారన్నారు. నన్ను ఏమైనా చేసుకోండి.. కానీ మా జాతికిచ్చిన హామీని అమలు చేయాల్సిందే అని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. -
‘కేసీఆర్, చంద్రబాబు చేస్తున్నది ఒక్కటే’
-
‘కేసీఆర్, చంద్రబాబు చేస్తున్నది ఒక్కటే’
గుంటూరు: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వునైతికంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు వర్తిస్తుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. న్యాయస్థానం ఆదేశానుసారం మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరులో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను నైతికంగా అమలు చేయాలని అన్నారు. ఏపీలో పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు చేస్తున్నది ఒక్కటేనని అంబటి పేర్కొన్నారు. ఇద్దరూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో తాము కూడా హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా, కాపులకు వ్యతిరేకంగా బీసీలను ఏపీ సీఎం చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అంబటి ఆరోపించారు. మంజునాథ కమిషన్ ఎక్కడికి వెళితే అక్కడ టీడీపీ నేతలు గొడవలు చేస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. పనిగట్టుకుని బీసీల్లోని టీడీపీ నాయకులకు ఎగదోస్తున్నారని ఆరోపించారు. కాపులకు, బీసీలకు మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేర్చాలి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
రేపు ముద్రగడతో భేటీ కానున్న దాసరి
హైదరాబాద్ : కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో టాలీవుడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు భేటీ కానున్నారు. అందుకోసం శుక్రవారం దాసరి నారాయణరావు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుంటారు. అక్కడ ముద్రగడతో దాసరి నారాయణ రావు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కాపు ఉద్యమం... తదుపరి కార్యచరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాపు రిజర్వేషన్లపై పవన్ నోరువిప్పలేదేం?
కాకినాడలో నిర్వహించిన సభలో జనసేన చీఫ్, సినీనటుడు పవన్ కల్యాణ్ కాపుల రిజర్వేషన్ అంశంపై నోరు విప్పకపోవడాన్ని కాపునాడు రాష్ట్ర కమిటీ తప్పుపట్టింది. రాష్ట్ర జనాభాలో 27 శాతంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తుల సమస్యలు పవన్‌కు పట్టవా? అని ప్రశ్నించింది. ఈ మేరకు కాపునాడు కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక సమస్యలను ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొన్నేళ్లుగా పోరాడుతున్న కాపు రిజర్వేషన్లను మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టింది. తమ ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని, పవన్ మద్దతు ఇచ్చిన తెలుగు దేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. జనసేన పార్టీ అధ్యక్షునిగా పవన్‌కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై తమ వైఖరేమిటో ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగే కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ జేఏసీల సమావేశంలో ఈ విషయాన్నీ చర్చిస్తామని పేర్కొంది. -
కాపు నేతల భేటీకి దాసరి, చిరంజీవి
శ్రీకాకుళం : ఈనెల 11న రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి కాపు నేతలు సమావేశమవుతారని జేఏసీ నేతలు తెలిపారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కళ్యాణమండపంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం మంగళవారం జరిగింది. జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ 11న జరిగే భేటీకి కాపు ప్రముఖ నేతలు దాసరి నారాయణరావు, చిరంజీవి, పలువురు ఐఏఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలని కోరుతూ 70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ కులాలన్నీ బీసీలుగా పరిగణిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఓసీలుగా గుర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాలను బీసీల్లో చేర్పించేందుకు గత కొన్నేళ్లుగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్నారన్నారు. ఆయన దీక్షను విరమింపచేసేందుకు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, ఆ హామీల కోసం గడువు కూడా కోరిందన్నారు. ఆగస్ట్ నెలతో గడువు ముగిసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకు కృషి చేయకపోవడం దారుణమన్నారు. -
కాపుల పాలిట రూథర్ ఫర్డ్
చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమన కరుణాకర్‌రెడ్డి సాక్షి, గుంటూరు: కాపు కులం పట్ల చంద్రబాబు రూథర్‌ఫర్డ్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. మన్యంలో గిరిజనులను బ్రిటిష్ అధికారి రూథర్‌ఫర్డ్ పిట్టలను కాల్చినట్లు కాల్చి ఆ ఉద్యమాన్ని అణచివేసే రీతిలోనే.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా కాపుకులాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో తుని ఘటన కేసులో మంగళవారం విచారణకు హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తుని ఘటనతో ఏవిధమైన సంబంధం లేని తనను కుట్రపూరితంగా ఇరికించి, వై.ఎస్.జగన్‌ను బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తుని ఘటనకు సంబంధించి నోటీసు ద్వారా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయానికి పిలిపించారు. 6గంటలపాటు విచారణ జరిపారు. -
రేపు కాపు జేఏసీ ఏర్పాటు
అనంతపురం న్యూటౌన్ : కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో ఉద్యమానికి సన్నద్ధులు కావడానికి జేఏసీలు ఏర్పాటు చేస్తున్నట్టు కేటీబీ రాష్ట్ర నాయకులు జంగటి అమర్నాథ్ తెలిపారు. స్థానిక కేటీబీ(కాపు,తెలగ, బలిజ) సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్, రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షులు వెంకట్రాముడు మాట్లాడారు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో జిల్లా జేఏసీ ఏర్పాటవుతుందని, మహిళలు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, ఉపాధ్యాయులు..ఇలా ప్రతి వర్గానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అలాగే గ్రామగ్రామాన జేఏసీలను విస్తరింపజేస్తామన్నారు. విశ్రాంత డీజీపీ ఎంవీ.కృష్ణారావు, విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీరావు, ఆర్టీఐ కమీషనర్ విజయబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి మార్గదర్శనం చేస్తారన్నారు. ముఖ్యంగా ఈ ఏడు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఆచార్య విజయకృష్ణమనాయుడు, సూర్యనారాయణను ఘనంగా సత్కరిస్తామన్నారు. బలిజలంతా జేఏసీల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో కేటీబీ నాయకులు భవానీ రవికుమార్, హర్ష, చంద్రమౌళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల సాధనకు సిద్ధంకండి
జిల్లా కాపు ఏజేసీ కాకినాడ రూరల్ : కాపులను బీసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన కాలపరిమితి దగ్గర పడుతున్నందున బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రతి కాపు సిద్ధం కావాలని జిల్లా కాపు ఏజేసీ పిలుపునిచ్చింది. శుక్రవారం సాయంత్రం శశికాంత్‌నగర్‌లోని కాపు కల్యాణమండపంలో జిల్లా కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా కాపు జేఏసీ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. పోరాటం ద్వారానే కాపులు ప్రత్యేక కార్పొరేషన్‌ను సాధించుకోగలిగామన్నారు. బీసీ రిజర్వేషన్లపై వేసిన మంజునాథన్ కమిటీ రిపోర్టు ఆగస్టు 31నాటికి ఇవ్వాల్సిన్నా నేటి వరకు మంజునాథన్ కమిటీ ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదన్నారు. జిల్లాల్లోని కాపులందరినీ సమాయత్తం చేస్తూ ఇప్పటికే 11 జిల్లాల్లో కాపు జేఏసీలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరాల్లో జేఏసీలు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇవి కూడా ఈ నెలాఖరునాటికి పూర్తి చేసి 13 జిల్లాల జేఏసీల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న రాజమండ్రిలో ప్రత్యేక కాపు గర్జన నిర్వహిస్తున్నట్టు జేఏసీ ప్రతినిధుల సమావేశం ప్రకటించింది. కాపు ఉద్యమనేతపై చంద్రబాబు తమ మంత్రులను కావాలనే ఉద్దేశపూర్వకంగా అవాకులు, చవాకులతో విమర్శలు చేయిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. కాపులను రెచ్చగొట్టేధోరణిలో మంత్రుల తీరు ఉందని, శాంతిభద్రతలే ముఖ్యమని ప్రకటిస్తున్న మంత్రులు గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్పలే ప్రత్యేక కారణమన్నారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమించే సమయంలో జరిగిన చిన్న పొరబాటును బూతద్దంలో చూపించి 300 మంది కాపు ప్రతినిధులను ఇప్పటికీ వేధిస్తున్నారు. 13 జిల్లాల్లో తాము సేకరించిన బీసీ రిజర్వేషన్ల వివరాలను మంజునాథన్ కమిటీకి సమర్పిస్తామన్నారు. సమావేశంలో జిల్లా కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ, గుంటూరు నుంచి చందు జనార్దన్, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆరేటి ప్రకాష్, కాపు నాయకులు సంగిశెట్టి అశోక్, రావూరి వెంకటేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ, బసవా ప్రభాకరరావు, పసుపులేటి చంద్రశేఖర్, ఉండా వెంకటరమణ, గొల్లపల్లి బాబులు, రంబాల వెంకటేశ్వరరావులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది కాపు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
29 నుంచి కాపు ప్రముఖులతో ముద్రగడ భేటీ
మూడు రోజులపాటు హైదరాబాద్ పర్యటన సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఆయన అనుచరులతో కలిసి ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రిజర్వేషన్ల ప్రకటనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన గడువు ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆయన జరిపే ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడ నిరవధిక దీక్ష చేస్తున్నప్పుడు పలువురు కాపు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలు దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పళ్లంరాజు, అద్దేపల్లి శ్రీధర్ వంటి ప్రముఖులు హాజరై కాపుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ముద్రగడ 29, 30 తేదీల్లో వరుస భేటీలను ఏర్పాటు చేశారు. -
కాపు ఉద్యమానికి ప్రత్యేక కమిటీలు
కాకినాడ రూరల్ : కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దిశగా ప్రత్యేక కమిటీలు వేయనున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి సహకరించేందుకు ఆరుగురితో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాౖటెందన్నారు. దీని ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 30 మందికి తగ్గకుండా నియోజకవర్గ జేఏసీలను ఏర్పాటు చేయనున్నట్టు ఏసుదాసు వివరించారు. ఇప్పటికే కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ కమిటీల నియామకం జరిగిందన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియమించిన మంజునాథ కమిషన్ ఇప్పటి వరకూ ఎక్కడా పర్యటించలేదన్నారు. ఈ కమిషన్ ఏడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని, ఇప్పటికే ఆరు నెలలు పూర్తయిందని చెప్పారు. దీనికి నెల రోజులు మాత్రమే వ్యవధి ఉన్నందున కాపు జేఏసీల ఆధ్వర్యాన గ్రామ గ్రామానా తిరిగి కాపుల స్థితిగతులను సేకరించి కమిష¯Œæకు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈ జేఏసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏసుదాసు వివరించారు. కమిషన్ నివేదిక వేగవంతంగా ఇవ్వాలని, కాపులను బీసీల్లో చేర్చే చర్యలు చేపట్టాలని కోరుతూ నియోజకవర్గ జేఏసీల ఆధ్వర్యాన కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. సమావేశంలో కాపు నాయకులు తొగరు మూర్తి, యాళ్ల అయ్యన్న, బస్వా ప్రభాకరరావు పాల్గొన్నారు. -
ఆగస్టు తర్వాత ఆందోళనే
అనంతపురం న్యూటౌన్ : ‘కాపులను బీసీలో చేరుస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టే అడుగుతున్నాం..ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరోసారి ఉద్యమ బాట తప్పదు..ఆగస్టులోపు కాపు రిజర్వేషన్లకు ఓ రూపం ఇస్తామన్నారు..అందువల్లే ఇన్నాళ్లు శాంతంగా ఉన్నా.. కానీ ఆగస్టు తర్వాత మాత్రం ఆందోళన తప్పదు’ అని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లు సాధించుకునే గురువారం అనంతపురంలోని రాయల్ ఫంక్షన్ హాలులో ప్రముఖ కవి ఏలూరు ఎంగన్న అధ్యక్షతన బలిజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభలో కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణతో పాటు నల్ల విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు, తోట రాజీవ్, నెల్లూరు రాఘవయ్య, జంగటి అమర్నాథ్, రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షులు బళ్లారి వెంకట్రాముడు తదితరులు మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టగా, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు ఆయన వద్దకే వచ్చి డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత హామీలన్నింటిని తుంగలో తొక్కారని విమర్శించారు. తుని ఘటనలో బలిజల ప్రమేయం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా, తర్వాతి కాలంలో ఎంతో మంది యువకులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం కుట్రలు పన్ని తమను అరాచకవాదులుగా చూసే ప్రయత్నం చేస్తోందన్నారు. తాము బీసీలకు వ్యతిరేకం కాదనీ, వారి రిజర్వేషన్లకు అడ్డు కాకుండా కాపులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మంజునాథ కమిషన్‌కు తగిన సమాచారం ఇవ్వడానికి అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ ఐక్యతే లక్ష్యంగా కాపు జేఏసీలు ఏర్పడుతున్నాయన్నారు. అనంతపురం జిల్లా జేఏసీని ఆగస్టు 6న ముద్రగడ పద్మనాభం సమక్షంలో ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో కేటీబీ నాయకులు పగడాల మల్లికార్జున, బాబూరావు, మల్లేశ్వరయ్య, బీజేపీ నాయకులు లలిత్‌కుమార్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు అక్కిశెట్టి జయరామ్, కేటీబీ జిల్లా ప్రచార కార్యదర్శి పసులేటి శివానంద, చలపతి, యువజన సంఘం నాయకులు హర్ష తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాటలకు..చేతలకు పొంతన లేదు
-
అన్ని జిల్లాల్లో కాపు జేఏసీలు
కిర్లంపూడి : ప్రతి జిల్లాలోను కాపు జేఏసీలను నియమిస్తున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం పలువురు కాపు నాయకులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. తొలివిడతగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గానికి పది మంది చొప్పున కాపు జేఏసీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రెండో విడతలో ఈ నెల 26న కడప, 27న కర్నూలు, 28న అనంతపురం, 29న కృష్ణా జిల్లాల్లో పర్యటించి, కాపు జేఏసీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో రెండు విడతల్లో అన్ని జిల్లాల్లో కాపు జేఏసీల ఏర్పాటు పూర్తిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనలకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, గోపు చంటిబాబు, గౌతు స్వామి, గౌతు సుబ్రహ్మణ్యం, సానా బోసు, చిడిపిరెడ్డి సత్తిబాబు, సూరత్ సత్యన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టులు మొదలెడితే మరోసారి ఉద్యమిస్తాం
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మాకు లేదా? రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా అమలాపురం రూరల్: కాపు నాయకులపై పోలీసులు మరోసారి అరెస్టుల పర్వం కొనసాగిస్తే మళ్లీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాపు జేఏసీ ప్రతినిధి, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు సంఘీభావంగా కాపు యువకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి ఇప్పుడు పోలీసు స్టేషన్లలో బాండ్లు తీసుకుని కోర్టులో హాజరు కావాలని నోటీసులు పంపిస్తున్నారన్నారు. కాపు యువకులు ప్రభుత్వ ఆస్తులను ఏమైనా ధ్వంసం చేశారా? మరెందుకీ వేధింపులని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమాన్ని అణిచి వేయటానికి తప్పులు కేసులు పెడుతోందని ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, అరెస్టులు మొదలు పెడితే మరోసారి రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు చేయాలంటూ ఆందోళనలకు దిగితే తప్పేమిటని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కాపు నాయకులతో సమావేశమై జిల్లా, మండల జేఏసీలు ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఈ వారంలో పర్యటించనున్నామన్నారు. కాపు నాయకులు నల్లా పవన్‌కుమార్, వంటెద్దు బాబి, బండారు రామమోహనరావు, నల్లా అజయ్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, అరెగిల నాని, అడపా మాచరరావు, సుంకర చిన్నా, యేడిద దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
కాపు ఉద్యోగులపై ఇంత కక్షా?
కాపు సంఘాల విమర్శ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యోగులపై వ్యతిరేక చర్యలు మానుకోవాలని కాపు జాగృతి చైర్మన్ చందూ జనార్ధన్, కాపునాడు రాష్ట్ర నాయకుడు గాళ్ల సుబ్రమణ్యం ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. కొందరు కాపు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆరోపించారు. కోస్తా జిల్లాల్లోని కాపు ఉద్యోగులు ముద్రగడ దీక్షకు మద్దతు పలికారన్న అక్కసుతో పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ విభాగాల్లోని కొందర్ని సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. నిజాయితీ పరుడైన విజయనగరం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్యముర ళికి తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కాపు ఉద్యోగుల్ని వేధిస్తే సహించం
ప్రభుత్వానికి కాపునాడు హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేసిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారన్న సాకుతో ప్రభుత్వ శాఖల్లోని కాపు ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని కాపునాడు ఆరోపించింది. కాపునాడు రాష్ట్ర సంఘం నేతలు కఠారి అప్పారావు, అద్దేపల్లి శ్రీధర్ తదితరులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాపు కులానికి చెందిన ఉద్యోగులను బదిలీ చేయడమో, రిజర్వ్ పోస్టుల్లో ఉంచడమో చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అధికారిగా ఉన్న చైతన్య మురళీని ముద్రగడ దీక్ష విరమించిన రోజే బదిలీ చేశారని, అయితే పోస్టింగ్ ఇవ్వకుండా రిజర్వ్‌లో ఉంచారని విమర్శించారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలువురు కాపు, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ఉద్యోగుల్ని అకారణంగా బదిలీ చేశారన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం కాపునాడు కార్యవర్గం భేటీ అవుతుందని తెలిపారు. -
నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ
కిర్లంపూడి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు గురువారం సమావేశం కానున్నారు. ముద్రగడ నివాసంలో జరిగే ఈ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. తుని ఘటనలో కేసులు, కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేసినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయబోనని, ప్రాణం ఉన్నంత వరకూ ఉద్యమిస్తానని 14 రోజుల దీక్ష విరమించిన అనంతరం బుధవారం ముద్రగడ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం కక్షకట్టి వేధింపులకు గురిచేసిందని, తనను ప్రపంచ ఉగ్రవాదిలా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
కక్ష సాధింపా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కాపు నాయకులపైనే కాదు కాపు సామాజిక వర్గ అధికారులపైనా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గ అధికారులను అకారణంగా బదిలీ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. కాపు ఉద్యమానికి అంతర్గతంగా మద్దతిస్తున్నారని, ఆ నేతలతో సత్సంబంధాలు నెరుపుతున్నారని ప్రభుత్వానికి కన్ను కుట్టినట్టు ఉంది. తమ చేతిలో ఉన్న బదిలీ అస్త్రాన్ని ప్రయోగించి అక్కసు వెళ్లగక్కుతోంది. ఇందుకు ఎక్సైజ్ శాఖ విజయనగరం డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి బదిలీనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడికొచ్చిన ఎనిమిది నెలల్లోనే అర్ధంతరంగా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసేసింది. విజయనగరం డిప్యూటీ కమిషనర్‌గా ఇక్కడకు వచ్చిన దగ్గరనుంచి ఆదర్శంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ సైకిల్‌పైనే కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారు. తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. తన కార్యాలయంలో ఏసీలు వినియోగించరు. అదే కాకుండా జాతీయ నాయకుల జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు. సారా నియంత్రణ కోసం నిర్వహిస్తున్న నవోదయం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇంతవరకు ఆయనపై ఎటువంటి ఏసీబీ కేసుల్లేవు. శాఖా పరమైన చర్యలు కూడా లేవు. కానీ కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. అందువల్లే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆయనకు బదిలీ ఉత్తర్వులొచ్చేశాయి. ప్రభుత్వానికి రిపోర్టు కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తననెందుకు బదిలీచేశారో తెలీదని, తనపై ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ఇప్పటికే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాననీ, ఇంతలోనే బదిలీ విషయం తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పారు. -
జైలు వద్ద కాపు నేతల బైఠాయింపు!
రాజమహేంద్రవరం: తుని ఘటనలో అరెస్టైన ముగ్గురు కాపు నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి వారు నేరుగా కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు యత్నించారు. ఇంతలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కాపు నేతలు జైలు వద్ద బైఠాయించినట్టు సమాచారం. కాకినాడ నాలుగో అదనపు జిల్లా జడ్జి, పిఠాపురం ఇన్చార్జి అదనపు జిల్లా జడ్జి బి.గాయత్రి సోమవారం ఈ ముగ్గురు కాపు నేతలకు బెయిల్ మంజూరు చేయగా, సాంకేతిక కారణాలవల్ల వారు ఈ రోజు విడుదల అయ్యారు. తుని ఘటనలో అరెస్టైన వారిలో మొత్తం 13 మంది బెయిల్ పై విడుదలయ్యారు. కాగా, తుని ఘటనల్లో అరెస్టు చేసిన 13 మందినీ విడుదల చేయాలన్న డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం 13వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. -
పద్మనాభాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టాలి
- అక్రమ కేసులు ఎత్తివేయాలి - కాపునాడు జేఏసీ కన్వీనర్ కొప్పుల వెంకట్ విజయవాడ (గాంధీనగర్) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొందని, ఆయనకు ఏదైనా జరిగితే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిస్థితులు రాష్ర్టంలో తలెత్తుతాయని కాపునాడు జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కాపునాడు జేఏసీ ప్రతినిధులు సోమవారం మీడియాతో మాట్లాడారు. జేఏసీ కన్వీనర్ కొప్పుల వెంకట్ మాట్లాడుతూ కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు వారిని అణిచివేయాలని ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. కాపులపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గోదావరి జిల్లాల కాపులు సౌమ్యులని చెప్పిన చంద్రబాబు కాపు యువకులపై అక్రమ కేసులు బనాయించి ఎందుకు అరెస్ట్‌లు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాపులకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతున్నందువల్లే ముద్రగడ ఉద్యమం చేపట్టారన్నారు. ఆయన్ను తక్షణమే మీడియా ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తుని ఘటనకు బాధ్యులంటూ అరెస్ట్ చేసిన వారిలో మిగిలిన ముగ్గుర్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు. నిన్నటివరకు ముద్రగడపై కాపు మంత్రులను ఉసిగొల్పిన చంద్రబాబు తన సామాజికవర్గం మంత్రులతో మాట్లాడిస్తున్నారన్నారు. ఇది సరికాదన్నారు. కాపు నాయకులపై పెట్టిన కేసులు, నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతను జేఏసీ ఖండించింది. ఈ సమావేశంలో సర్వకాపు సమ్మేళనం కన్వీనర్ మల్లెమూడి పిచ్చయ్యనాయుడు, జేఏసీ నాయకులు ఎన్.ఎస్.రాజు, వై.చలపతిరావు, బి.ప్రభాకర్, విక్రమ్నాగేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, నవనీతం సాంబశివరావు, గంగాధర్ పాల్గొన్నారు. -
'దాసరి, చిరంజీవితో అందుకే కలిశాం'
హైదరాబాద్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. నా శవాన్ని తీసుకెళ్లండని ముద్రగడ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తోందో ఈ మాటలను బట్టే అర్థమవుతోందన్నారు. ముద్రగడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతోనే ప్రకటనలకు పరిమితం అయ్యామని చెప్పారు. తాము సంయమనం పాటిస్తుంటే, చంద్రబాబు సర్కారు రెచ్చగొడుతోందని ఆరోపించారు. కాపులకు ఇచ్చిన నెరవేర్చకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కులతత్వం కోసమే చిరంజీవి, దాసరి నారాయణరావుతో కలిశారన్న ఆరోపణలను అంబటి రాంబాబు తోసిపుచ్చారు. మా కులాన్ని అణగతొక్కుతుంటే ప్రతిఘటించే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. తన కులానికి అపాయం కలిగినప్పుడు సహాయం చేయలేని వాడు పక్క కులానికి ఏం చేస్తాడని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముద్రగడ దీక్ష విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
'ముద్రగడకు ఏమైనా జరిగితే ఊరుకోం'
తెనాలి రూరల్: రాష్ట్రంలో హిట్లర్, మావో పాలన సాగుతోందని.. ప్రభుత్వ పెద్దల కళ్లు, చెవులు మూసుకుపోయాయని కాపు జాగృతి నేత హరిదాసు గౌరీశంకర్ దుయ్యబట్టారు. కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2019లో టీడీపీని ఏపీలో ఖాళీ చేయించేందుకు కాపులంతా ఐక్యంగా పోరాడతారని చెప్పారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాపు జాగృతి నేతలు అన్నారు. రాష్ట్ర కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది జల్లా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కాపులను ఇళ్ల నుంచి బయటకు రానీయని పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమ తదితర టీడీపీ నాయకులు కాపు కుల ద్రోహులని విమర్శించారు. ముద్రగడ కుటుంబంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాకినాడ ఏఎస్పీ దామోదర్, డీఎస్పీ పల్లంరాజులను వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించడం దారుణమన్నారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు దంతాల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వానపడిన చందంగా వ్యహరిస్తోందని విమర్శించారు. -
ఒక్కరు తగ్గినా దీక్ష విరమించను
- ఆ 13 మందీ విడుదల కావలసిందే.. - తేల్చి చెప్పిన ముద్రగడ పద్మనాభం - మరింత క్షీణించిన కాపునేత ఆరోగ్యం సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘లెక్కకు ఒక్కరు తగ్గినా దీక్ష విరమించేది లేదు. ఎన్నిరోజులైనా దీక్ష చేస్తా. ప్రాణాల కంటే ఇచ్చిన మాటే ముఖ్యం. నా మానాన నన్ను ఇలా వదిలేయండి. అందరినీ విడుదల చేసి తీసుకువచ్చి చూపించినప్పుడు మాత్రమే దీక్ష విరమిస్తా. అంతవరకు నన్ను బలవంత పెట్టొద్దు..’ అని ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం స్పష్టం చేశారు. తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆయన ఆమరణ దీక్ష చేపట్టి శుక్రవారం నాటికి తొమ్మిది రోజులైంది. ముద్రగడతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు అదే ఆస్పత్రిలో దీక్షలో ఉన్నారు. ముద్రగడ ఆరోగ్యం శుక్రవారం చాలా విషమంగా మారింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ముద్రగడతోపాటు కుటుంబ సభ్యులందరి మూత్రపిండాల్లో కీటోన్స్ 4+గా నమోదైందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేశ్కిశోర్ తెలిపారు. ఈ స్థితిలో రాజమహేంద్రవరంలోనే ఉంచి వైద్యం చేసినా ప్రాణాపాయమని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడతో దీక్ష విరమింపజేసి ఆయన ప్రాణాలు దక్కించుకోవాలని కాపు జేఏసీ నేతలు, బంధువులు రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బెయిలొచ్చిందని ఒప్పించేయత్నం.. తుని ఘటనలో ప్రభుత్వం అరెస్టు చేసిన 13 మందిలో శుక్రవారం 10 మందికి బెయిల్ మంజూరైంది. ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించిన నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వి.వై.దాసుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యూయి. 10 మందికి బెయిల్ మంజూరైందని, శనివారం మిగిలిన వారికి బెయిల్ లభిస్తుందని తెలిపి ముద్రగడను ఏదోరకంగా ఒప్పించి దీక్ష విరమింపచేయాలని కాపు జేఏసీ నేతలు, కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ 13 మందిలో ఒక్కరు తగ్గినా కుదరదని, వారు వచ్చాకే విరమిస్తానని చెప్పి ముద్రగడ ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. సాయంత్రం కలెక్టర్ అరుణ్‌కుమార్ సహా అధికారులు వచ్చి దీక్ష విరమణపై చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. బంధువుల ఆందోళన : ఫ్లూయిడ్స్ పెడుతున్నా ముద్రగడ ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడతో పాటు కోడలు సిరి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉంది. ఆమె నోట మాట రావడంలేదని ముద్రగడ వియ్యంకుడు సోమేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
మంత్రులు ఏం మాట్లాడినా చంద్రబాబుదే బాధ్యత
హైదరాబాద్: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు విమర్శించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో కాపు ప్రముఖులు సమావేశమై ముద్రగడ దీక్ష, అనంతరం చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ తాము నిగ్రహం పాటిస్తుంటే ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు రెచ్చగొడుతున్నారని అన్నారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని దాసరి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రులు ఏం మాట్లాడినా చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. మంత్రులే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. అవసరమైతే తామందరం రాజమండ్రికి వెళ్లి ముద్రగడను కలుస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు హామీ ఇవ్వడంతో ఆయన ఒక బాటిల్ సెలైన్ ఎక్కించుకున్నారని, దాంతో ఇక ఆయన దీక్ష విరమించేసినట్లేనని హోం మంత్రి ప్రకటించారని.. అంతేకాక, ఆరు రోజులు దీక్ష చేసినా వైద్య పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఎలా ఉన్నాయోనంటూ వెటకారంగా మాట్లాడారని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముద్రగడ నిజాయితీని, జాతి నిజాయితీని అవమానించడమే అవుతుందన్నారు. ఈ విమర్శలు మంత్రులు చేసినవా.. వాళ్ల వెనక ఉండి ముఖ్యమంత్రి చేయించినవా అని ప్రశ్నించారు. మంత్రుల మీద చర్యలేవీ తీసుకోలేదంటే ఆ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. సీఎం ఒకవైపు శాంతిభద్రతలు కావాలంటారు, మరోవైపు మంత్రులతో ప్రకటనలు ఇప్పించి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తారని విమర్శించారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ఏ మంత్రి ఎలాంటి ప్రకటన ఇచ్చినా దానికి బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా మీడియాపై ఇంతలా నియంత్రణ విధించలేదని దాసరి విమర్శించారు. కీలకమైన అంశంపై తామంతా సమావేశమై విషయం చెబుతుంటే.. కొన్ని చానళ్లలో అర నిమిషం కూడా రాలేదని, వాళ్ల బాధలేంటో తనకు తెలుసని దాసరి అన్నారు. మీడియాపై ప్రభుత్వం కత్తిపెట్టిన విషయం తమకు తెలుసునని పేర్కొన్నారు. ముద్రగడ దీక్ష గురించి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని దాసరి చెప్పారు. ఈ సమావేశంలో దాసరితో పాటు చిరంజీవి, సీ రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, జీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
తుని ఘటనలో కేసులు ఎత్తేయం
విజయవాడ: తుని ఘటనలో కేసులను ఎత్తేయడం సాధ్యంకాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సీఐడీ విచారణ ఆపుతామని ప్రభుత్వం తరపున ప్రకటన చేయలేదని, సీఐడీ విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ల అమలుకు సాంకేతిక ఇబ్బందులున్నాయని ఆయన చెప్పారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టడం దుందుడుకు చర్యని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కాపుల పాలిట దగాస్టార్ అని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సభ సందర్భంగా జరిగిన అల్లర్లపై సీఐడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తుని ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి, కేసులు ఎత్తివేయాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. -
సాయంత్రం పల్లంరాజు నివాసంలో కాపు నేతల భేటీ
హైదరాబాద్ : భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రముఖ కాపు నేతలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో సమావేశం కానున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు కాపు నేతలతో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు భేటీ అయ్యారు. కాపులను వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఇక ముద్రగడ దీక్షపై కడపలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపు, బలిజ, అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురాంరెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ముద్రగడ దీక్షను వెనకుండి నడిపిస్తున్నారంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడకిచ్చిన హామీలు అధికారులు చెప్పినవే అని, లోకేశ్ చెప్పినవి కాదని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గంటా తెలిపారు. -
కాపులపై విషం చిమ్ముతున్న ముఖ్యమంత్రి
♦ దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల మండిపాటు ♦ కాపు మంత్రులతో పూటకో మాట మాట్లాడిస్తున్నారని ధ్వజం ♦ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాపు వర్గీయుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షను కూడా తప్పుదారి పట్టించే రీతిలో మంత్రుల చేత తప్పుడు విమర్శలు, ఆరోపణలు, విభిన్న ప్రకటనలు చేయిస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రముఖులు దాసరి నారాయణరావు, కొణిదల చిరంజీవి, ఎం.పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, అంబటి రాంబాబు, కె.కన్నబాబు, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటన లో ఖండించారు. ముద్రగడకు ఇచ్చిన హామీ ల విషయంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన వివరణకు భిన్నంగా ముగ్గురు కాపు మంత్రులు చేసిన ప్రకటనల పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు మాట్లాడక ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారని, ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, డీఐజీల వివరణకు భిన్నంగా ప్రకటనలు చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఇంతగా అవమానిస్తారా..: ముద్రగడ కుటుంబీకులను ముఖ్యంగా కుమారుడిని పైశాచికంగా తరిమి కొట్టిన విధానాన్ని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలుగాని పరుష పదజాలం ఉపయోగించి ఆ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఈ అవమానం ఆయన కుటుంబానికి జరిగినది కాదని, మొత్తం కాపు జాతికి జరిగిందిగా భావిస్తున్నామన్నారు. గతంలో దీక్ష విరమింప చేయడానికి కిర్లంపూడిలో మధ్యవర్తులైన మంత్రులు ఇచ్చిన హామీలను, అమలు పరచకుండా మోసం చేసినట్టుగానే ఇప్పుడూ మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముద్రగడ సమక్షంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాగా, ముద్రగడ దీక్షను సమర్థిస్తూ ఈ నెల 13న కాపు ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించి, దీక్షను విరమించే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి ముద్రగడ ప్రాణాలు కాపాడాలని చేసిన డిమాండ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ప్రభుత్వం స్పందించిందన్నారు. తామంతా ముద్రగడ దీక్షపై చర్చించేందుకు గురువారం విజయవాడ వెళ్లాల్సి ఉండిందని, అయితే బుధవారం రాత్రి దీక్షపై కలెక్టర్, డీఐజీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పర్యటనను విరమించుకున్నామన్నారు. -
'అందులో చంద్రబాబు విషం ఉంది'
హైదరాబాద్: ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని పలువురు కాపు నేతలు అన్నారు. గురువారం ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి ప్రముఖ దర్శకుడు దాసరి నారయణరావు ఇంట్లో కాపు నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రకటన తర్వాత మంత్రులు మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. కాపు మంత్రుల ప్రకటన వెనుక చంద్రబాబు విషపూరిత చర్య ఉందని అనుమానం కలుగుతోందన్నారు. గతంలో మాదిరిగా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముద్రగడ కుటుంబానికి జరిగిన అవమానం మొత్తం కాపు జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని చెప్పారు. -
పి.గన్నవరంలో కాపు నేతల ర్యాలీ, ధర్నా
పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం పట్టణంలో గురువారం ఉదయం కాపు నేతలు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మూడు రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. కాపు నాయకుడు ముద్రగడ చేస్తున్న దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వారిని విడుదల చేస్తేనే విరమణ
- అరెస్టయిన 13 మందిని విడుదల చేయాల్సిందే - అలా కాకుంటే 30 రోజులైనా దీక్షను కొనసాగిస్తా - కాపు ఉద్యమ నేత ముద్రగడ స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘నాకు హామీలు కాదు.. చెప్పిన మాటలు ఆచరణలో పెట్టండి.. నాకేమైనా ఫర్వాలేదు.. ఆ 13 మందిని బయటకు తీసుకొచ్చి అప్పగించండి.. అలా కాకుంటే మూడ్రోజులు కాదు.. జాతికోసం 30 రోజులైనా ఆమరణ దీక్ష చేస్తా..’ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాటలివి. బుధవారం చర్చల సందర్భంగా మాట్లాడుతూనే మగతలోకి వెళ్లిపోతున్న ముద్రగడను చేతులతో పట్టుకుని పైకిలేపి కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిని చూసి కాపు జేఏసీ నేతలు తీవ్రంగా చలించిపోయి కంటతడి పెట్టారు. వైద్య పరీక్షలు చేరుుంచుకోవాలని పదేపదే బతిమలాడడంతో తొలుత రక్త పరీక్షలకు ముద్రగడ అంగీకరించారు.దీంతో సెలైన్ కూడా పెట్టారు. అయినా ఆమరణ దీక్షను మాత్రం విరమించేది లేదని, ఆయన తేల్చి చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. తుని ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన 13 మందిని విడుదలచేసి తన వద్దకు తీసుకువచ్చిన తరువాతే దీక్ష విరమిస్తానని ముద్రగడ స్పష్టం చేయడంతో ప్రభుత్వం నుంచి చర్చలకు వచ్చిన డీఐజీ శ్రీకాంత్, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ రవిప్రకాశ్, జేసీ సత్యనారాయణ సానుకూలత వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జేఏసీ నేతలు, ముద్రగడ తనయుడు బాలు బుధవారం రాత్రి వేర్వేరుగా విలేకర్ల సమావేశాల్లో ధ్రువీకరించారు. రిమాండ్‌లో ఉన్న వారిని రప్పించి.. ముద్రగడ దీక్ష బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. మంగళవారం ప్రారంభమైన చర్చల ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగింది. వైద్యానికి సహకరించాలన్న అధికారుల ప్రతిపాదనకు ముద్రగడ ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న కాపు ఉద్యమనేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వీవై దాసు, గణేషుల రాంబాబును ఆస్పత్రికి తీసుకువచ్చి దీక్ష విరమింపచేసేలా ముద్రగడతో మాట్లాడించారని సమాచారం. కానీ డీఐజీ, ఇతర పోలీసు అధికారులు మాత్రం రిమాండ్‌లో ఉన్నవారికి వైద్యం కోసమే ఆస్పత్రికి తెచ్చామని చెప్పుకొచ్చారు. చర్చల్లో ఉత్కంఠ..:కేసులు ఎత్తివేయడమనే అంశంపై చర్చల్లో కొన్ని గంటలపాటు ప్రతిష్టంభన కొనసాగింది. కాపు జేఏసీ నేతలు అడపా నాగేంద్ర, మిండగుదిటి మోహన్, గుండా వెంకటరమణ, చినమిల్లి వెంకటరాయుడు, యాళ్ల దొరబాబు, ఆరేటి ప్రకాష్ తదితరులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంట్లో సమావేశమై అరెస్టు చేసిన వారి విడుదల, ఇక ముందు అరెస్టులు జరపకూడదనే డిమాండ్లు ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయించారు. వీటికి అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. తుని ఘటనలో లోతైన విచారణ నిర్వహించాక తదనంతర చర్యలు, అరెస్టయిన 13 మందిని ఒకటి, రెండు రోజుల్లో బెయిల్‌పై విడుదల చేయిస్తామని డీఐజీ శ్రీకాంత్ హామీ ఇచ్చి చర్చలను కొలిక్కి తెచ్చారు. -
కాపు నేతల రాస్తారోకో
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.తెల్లపూడి గ్రామంలో కాపునేతలు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. ముద్రగడకు మద్దతుగా కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు రాస్తారోకో చేశారు. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరో వైపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కాపు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా కొవ్వూరులో కాపు నేతలు రిలే దీక్షలకు కూర్చున్నారు. -
రేపు కాపు నేతల అత్యవసర సమావేశం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాపు నేతలు మరోసారి గురువారం సమావేశం కానున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన రెండు రోజుల గడువు ముగిసినా సర్కార్ స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గురువారం విజయవాడ లేదా రాజమండ్రిలో భేటీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే ముద్రగడ చేస్తున్న ఆమరణ దీక్ష ఏడో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలిసిందే. -
రామచంద్రయ్యను అడ్డుకున్న పోలీసులు
రాజమండ్రి : ఉద్యమాన్ని అణచివేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు సి.రామచంద్రయ్య వచ్చారు. అయితే ముద్రగడను పరామర్శించేందుకు అనుమతి లేదంటూ ఆయన్ని ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సి.రామచంద్రయ్య మండిపడ్డారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. -
కాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లండి
వైఎస్ జగన్‌కు కాపు సంఘం నేతల విజ్ఞప్తి సాక్షి, విజయవాడ: ‘కాపు ఉద్యమాన్ని మీకున్న విస్తృత రాజకీయ పరిచయాలతో జాతీయ స్థాయికి తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించండి..’ అని కాపు జాయింట్ యాక్షన్ కమిటీ, కాపు సంఘం నేతలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం విజయవాడలో వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు సంఘం నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కొద్దిసేపు సమస్యలపై చర్చించారు. కాపు జాతి కోసం ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు రోజులుగా ముద్రగడ కుటుంబం ఆమరణదీక్ష చేస్తున్న క్రమంలో ఉద్యమం ఉద్ధృతమైందని, దీనికి రాష్ట్ర స్థాయిలో ఇతర పార్టీలతో పాటు వైఎస్సార్సీపీ క్యాడర్‌ను సమాయత్తం చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ కాపులకు ఇప్పటికే మద్దతు తెలిపి సహకరించానని చెప్పారు. కాపునాడు నేత గోళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటికే కాపు ఉద్యమం తీవ్రమైందని, కాపుల కోసం జగన్ ఒకరోజు దీక్ష చేసి సంఘీభావం ప్రకటించాలని కోరారు. -
వైద్యం చేయకుంటే ముద్రగడ పరిస్థితి ప్రమాదకరం
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడకు వెంటనే వైద్యం అందించాలని, లేకుంటే ఆయన పరిస్థితి విషమిస్తుందని వైద్యులు సూచించారు. ముద్రగడ అనుచరులు, సహచర నాయకులతో ప్రభుత్వం మంతనాలు సాగిస్తోంది. ఆకుల రామకృష్ణ సహా ముద్రగడ అనుచరులు ఏడుగురితో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన ముగ్గురు కాపు నాయకులను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముద్రగడ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఏంటి, ఎవరు చర్చల్లో పాల్గొంటారన్న విషయంపై స్పష్టత రాలేదు. -
హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు జాగృతి
హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగిస్తున్న ప్రాంతం, అక్కడి పరిస్థితులపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు. ముద్రగడ దీక్ష సాగిస్తున్న రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో కఠిన ఆంక్షలు విధించి అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జాగృతి నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసు యంత్రాంగం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మంగళవారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. జైల్లో ఉన్న కాపు జేఏసీ నేతలను ఆస్పత్రికి తరలించగా, కలెక్టర్ అక్కడే వారితో చర్చలు జరిపారు. ముద్రగడ వైద్యానికి సహకరించేలా కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని, తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది. -
ముద్రగడ ఆరోగ్యం క్షీణించింది : బంధువులు
రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని ఆయన బంధువులు తెలిపారు. సోమవారం కిర్లంపూడి నుంచి వచ్చిన 30 మంది విడతల వారీగా ముద్రగడను పరామర్శించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ముద్రగడ కనీసం లేవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన సతీమణి, కోడలు వాంతులు చేసుకుంటున్నారని చెప్పారు. నిలకడగా ముద్రగడ ఆరోగ్యం: వైద్యులు ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం తెలిపింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన ఆరోగ్య సమాచారాన్ని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తాము ప్రతి రెండు గంటలకోసారి ముద్రగడను పర్యవేక్షిస్తున్నామని, తాము వెళ్లిన ప్రతిసారీ అభివాదం చేయడం, కూర్చోవడం చేస్తున్నారని తెలిపారు. వైద్య పరీక్షలు చేయిచుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారని, మంచినీరు తీసుకుంటున్నారని తెలిపారు. పైకి మాత్రం ఆరోగ్యంగా కనిపిస్తున్నా వైద్య పరీక్షలు చేయందే ఏమీ చెప్పలేమన్నారు. ముద్రగడ సతీమణి ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమెకు ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నామన్నారు. కోడలు, చిన్నకుమారుడుకి కూడా ప్లూయిడ్స్ పెట్టామని వివరించారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ కార్యదర్శి మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నామని జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, వైద్య సేవల సమన్వయాధికారి టి.రమేష్ కిశోర్ తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. -
రంగాను పోగొట్టుకున్నాం.. ముద్రగడను పోగొట్టుకోలేం
► ఏపీలో ఉన్నామా, పాక్‌లో ఉన్నామా అనిపిస్తోంది ► ప్రభుత్వం దీన్ని ఉగ్రవాద సమస్యలా చూస్తోంది ► కాపు మంత్రులతో బురద చల్లిస్తే.. మా దగ్గరా అస్త్రాలున్నాయి ► ఏపీ ప్రభుత్వంపై మండిపడిన దాసరి నారాయణరావు హైదరాబాద్ ఒకప్పుడు వంగవీటి మోహన రంగాను పోగొట్టుకున్నామని, ఇపుడు ముద్రగడ పద్మనాభాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతోనే తామంతా సమావేశమయ్యామని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల చూపుతున్న వివక్ష బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్క్ హయత్ హోటల్లో కాపు ప్రముఖులు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఒక సామాజిక సమస్య అని.. అయితే దాన్ని ఒక ఉగ్రవాద సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమని అన్నారు. ఈ విషయాలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేసేస్తున్నారని, కాపు సోదర సోదరీమణులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో పెట్టడం, అక్కడ కూడా జామర్లు పెట్టడం, ముద్రగడను చేర్పించిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో కూడా జామర్లు పెట్టి ఆయనతో ఎవరినీ మాట్లాడనివ్వకపోవడం.. ఎక్కడా ఇంతవరకు జరగలేదని దాసరి మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే అసలు మనం ఏపీలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే వాతావరణం తూర్పుగోదావరిలో కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని, ముద్రగడ కూడా చర్చలకు సిద్ధమన్నారు కాబట్టి.. ప్రభుత్వం త్వరగా స్పందించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ఆయన వెనక తామున్నామని, జాతి వెనక తామంతా ఉన్నామని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఈ ఉద్యమాన్ని సమర్థించే వాళ్లపై బురద చల్లించాలని కాపు మంత్రులతో ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని దాసరి నారాయణరావు అన్నారు. అలాంటి బురదజల్లే కార్యక్రమాలు మీరు మొదలుపెడితే, దానికి తమ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించారు. -
తీవ్ర పరిణామాలు తప్పవు: చిరంజీవి
కాపు రిజర్వేషన్ల అంశంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ నాయకుడు, సినీనటుడు చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం, ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కాపు ప్రముఖులు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, లేదంటే రెండు రోజుల తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత పది రోజులుగా ఏపీలో చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, ఇది చాలా అప్రజాస్వామికమని చిరంజీవి అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే తలుపులు పగలగొట్టి, ఆయనను నిర్బంధించి అయోమయ పరిస్థితి కల్పించారని, ఆయన కోడలు, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. దీన్ని తామంతా కలిసికట్టుగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఆయన అడగకూడనిది ఏమీ అడగలేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినవి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించినవే అడిగారని గుర్తు చేశారు. తుని ఘటనను తామెవరూ సమర్థించబోమని, అయితే ప్రభుత్వ ప్రతినిధులే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని.. పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు. అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన తామందరికీ ఉందని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశామని, వాటిని మీడియాకు అందిస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. -
హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు నేతలు
దీక్షలో ఉన్న తమనేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అన్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసులు ఆవలంభించిన తీరుపై విచారణ జరిపించాలని కోరారు. -
'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం'
విశాఖ: కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను ఏకాకిని చేస్తే ఊరుకోమని.. కాపు నేతలు తోట రాజీవ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ కాపు నేతలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సోమవారం విశాఖలో వీజేఎఫ్‌లో జిల్లా, నగర కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు పరాకాష్టకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. కాపులు పోరాటం చేస్తుంటే మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. కాపులు ఉద్యమిస్తారనే భయంతో ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. -
కాపు నేతలను వెంటనే విడుదల చేయాలి
మామిళ్లగూడెం : ఏపీలో అరెస్టు చేసిన తెలంగాణ కాపు నేతలను వెంటనే విడుదల చేయాలని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఇక్కడి నాయకులను అరెస్టు చేయడం సరైందికాదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.విజయ్‌కుమార్, నాయకులు గాంధీ, శెట్టి రంగారావు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో
మామిళ్లగూడెం: తెలంగాణలో అన్ని కులాలను కలుపుకుని పాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేయడం నేర్చుకోవాలని తెలంగాణ కాపు ఫోరం రాష్ట్ర నాయకుడు లక్కినేని సుధీర్ హితవు పలికారు. ఆదివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల సమస్యల పరిష్కారం కోసం, కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు ఏపీలో దీక్ష చేపట్టిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభానికి తెలంగాణ కాపు సంఘం సంపూర్ణ మద్దతు పలుకుతోందని తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే కాపు, మున్నూరుకాపు, శెట్టిబలిజ తదితర కులాలను బీసీ కేటగిరిలో చేర్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. ఫలితంగానే ఏపీలో కాపులు రోడ్డెక్కాల్సిన దుస్థితి తలెత్తిందని తెలిపారు. శాంతి యుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడతోపాటు కుటుంబీకులను పోలీసులు విచక్షణా రహితంగా ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించడం హేయమైన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా తన స్థాయిని మరిచి చిరంజీవిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చిరంజీవి దయతో ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు నోరుమెదపకపోవడం శోచనీయమన్నారు. నిజంగా ఆయన కాపు బిడ్డ అయితే ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాపులకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ కాపు ఫోరం రాష్ట్ర నాయకులు కొమ్మినేని అంజయ్య, రంగయ్య, పెద్దబోయిన శ్రీనివాసరావు, పాపినేని నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, నరసింహారావు, రామకృష్ణ, బయ్యవరపు నరేందర్, హరి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలెట్లా రగులుతున్నయంటే...
సాక్షి, రాజమహేంద్రవరం : ముద్రగడ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడంతో నాలుగు రోజులుగా జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయూరైంది. సెక్షన్ 144, 30 అమలు చేస్తూ వేలాదిమంది పోలీసులు మోహరించడం, రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, శాంతిభద్రతల పేరుతో కాపు నేతల, ముద్రగడ అభిమానుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలు అధికమవడంతో కాపులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని తమ నేత అడుగుతున్నారని, ఇందులో తప్పేంటని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో ఆందోళనకు దిగుతున్న నేతలు, యువకులను అరెస్టు చేసి, కేసుల పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో గ్రామాల్లో కాపు నేతలు, సాధారణ ప్రజలు, మహిళలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోడ్లపైకి వస్తున్న మహిళలు, ప్రజలు... పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెం మహిళలు ఆదివారం తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నా సుమారు 1000 మంది మహిళలు తమ పిల్లలతో కలసి కంచాలపై చెంబులతో శబ్దం చేస్తూ పి.గన్నవరం మూడు రోడ్ల కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. లాఠీఛార్జి చేయడంతో పలువురు మహిళలు గాయపడ్డారు. దీంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని సత్యవాడ, కొడుపూరు, ఊడిమూడి, సుందరపల్లి, పామర్రు గ్రామాల్లో ప్రజలు దీక్షలు చేశారు. కె.గంగవరంలో బంద్ నిర్వహించారు. ద్రాక్షారామలో ఆందోళన చేస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. చప్పిడివారి సావరంలో కాపు యువత నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపింది. రాజోలు నియోజకవర్గం మణికిపురం సెంటర్లో వందలాది మంది మానవహారం నిర్వంచారు. అనంతరం పోలీసు స్టేషన్ ముట్టడించారు. కాపులందరినీ అరె స్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల మనసు మారాలని పలువురు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి, భద్రవరం గ్రామాల్లో మహిళలు ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. పెద్దాపురం మండలం పులిమేరులో 20 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. రాజానగరంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. ధవళేశ్వరంలో కంచాలు, గ్లాసులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బొమ్మూరులో కాపు యువత నిర్వహించిన శాంతి ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. గొల్లప్రోలులో 200 మంది కాపునేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. గోకవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న అరెస్టులు... వైఎస్సార్సీపీ పిఠాపురం కో ఆర్టినేటర్ పెండెం దొరబాబును, ముద్రగడ అనుచరుడు వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎం.అమ్మిరాజును, మండపేటలో కాపు సంఘం నాయకుడు కామన ప్రభాకరరావును అదుపులోకి తీసుకున్నారు. ఆగిన గుండెలు... ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళనతో ఆదివారం జిల్లాలో ఇద్దరు మర ణించారు. కిర్లంపూడిలో ముద్రగడ బంధువు దూము మామియలు(62) గుండెపోటుతో చనిపోయారు. యు.కొత్తపల్లిలో ముద్రగడకు మద్దతుగా భవిష్య కార్యాచరణపై చర్చ జరుగుతుండగా మేడిశెట్టి నూకరాజు(40)కు గుండెపోటుతో మరణిచారు. -
'ప్రభుత్వం మా కుటుంబాన్ని హింసిస్తోంది'
విశాఖ: ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని హింసిస్తోందని కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాలు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ముద్రగడ దీక్షను విరమించేదిలేదని స్పష్టం చేశారు. ముద్రగడకు బలవంతంగా వైద్యం చేసినా తర్వాత దీక్ష కొనసాగుతోందని వెల్లడించారు. ఏదైనా మాట్లాడాలంటే కాపు జేఏసీని సంప్రదించాలని ఆయన అన్నారు. తుని ఘటనకు సంబంధించి అరెస్టులపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిదని ముద్రగడ తనయుడు బాలు చెప్పారు. కాగా, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది. -
ముద్రడగకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
రాజమండ్రి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం కాపునేతలు భారీగా ర్యాలీలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రాజోలులో కాపు నేతలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ముద్రగడను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన కాపులకు రిజర్వేషన్ల హామీను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెంలో మహిళలు ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. విశాఖలోని మున్సిపల్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం వద్ద ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ భేటీని పోలీసులు అడ్డుకుని కాపు నేతలను అరెస్ట్ చేశారు. రాజమండ్రి ఆస్పత్రిలో ముద్రగడ నాలుగో రోజు కూడా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. కాఆయనకు వైద్యానికి నిరాకరిస్తున్నారు. -
ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం క్షీణించింది
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భార్య, కోడలు ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ముద్రగడ అనుమతితో ఆయన భార్య, కోడలికి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు ఆదివారం ఉదయం వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ పద్మనాభం సహకరించడంలేదని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
కాపు ఉద్యమానికి మద్దతుగా నిరసనలు
కవాడిగూడ: కాపుల రిజర్వేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శనివారం జరగనున్న ఏపీ బంద్‌కు ఆలిండియా కాపు జేఏసీ తెలంగాణ కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కాపులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కాపు నేత ముద్రగడ చేస్తున్న దీక్షలను భగ్నం చేసిన ఏపీ ప్రభుత్వం అమానుషంగా అరెస్టు చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. లోయర్ ట్యాంక్‌బండ్ అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం కార్యాలయంలో పలు కాపు సంఘాలు శుక్రవారం రాత్రి ప్రత్యేక సమావేశం అయ్యాయి. కార్యక్రమంలో ఆలిండియా కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్, కన్వీనర్ కటారి అప్పారావు, అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం అధ్యక్షులు ఎంహెచ్ రావు, ప్రధాన కార్యదర్శి అద్దెపల్లి శ్రీధర్ పాల్గొన్నారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శనివారం నుంచి రిలే నిరాహర దీక్షలు చేయాలని భావించావుని, దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారని జనార్దన్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు బయటవ్యక్తులు రావద్దంటూ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో కాపు జాగృతి నాయకులు గాళ్ల సతీష్ రిట్ వేసినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నగరంలో నిర్వహిస్తామన్నారు. శనివారం ఉదయం ట్యాంక్‌బండ్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
'ముద్రగడ కుమారుడిని కొట్టారు'
హైదరాబాద్: 'పెడతామంటే వచ్చిన వాళ్లు కొడతామంటే ఒప్పుకోరని' ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, వాగ్దానాన్ని నిలుపుకోమని మాత్రమే కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నిలుపుకోకుండా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ముద్రగడ కుమారుడిని పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని, ముద్రగడ సతీమణి పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా వ్యవహరించడం ధర్మమేనా అని నిలదీశారు. అధికార దుర్వినియోగంతో ఎంఎస్ ఓలను బెదిరించి సాక్షి, ఇతర చానళ్ల ప్రసారాలు నిలిపివేయించారని అన్నారు. ఎంఎస్ ఓలకు ఎస్పీలు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపించారు. అంతకుముందు ముద్రగడ దీక్ష చేస్తే మంత్రులు ఆయనకు వద్దకు వచ్చి చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కాపులకు బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తుని ఘటన జరిగినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు శాంతికాముకులని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి వచ్చినవారే తునిలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోజు చంద్రబాబు, టీడీపీ మంత్రులు ఆరోపిస్తూ వైఎస్ జగన్ పై నెట్టివేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు గోదావరి జిల్లాల్లోని వారిని అరెస్ట్ చేస్తున్నారని సూటిగా నిలదీశారు. కాపుల్లో బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముద్రగడ అరెస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని అంబటి రాంబాబు అన్నారు. -
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ
రాజమండ్రి: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిన్న కాపు ఉద్యమ నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ముద్రడగ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో శుక్రవారం తన దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యులు ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. బీపీ 150/100, షుగర్ లెవల్స్ 242 ఉన్నాయి. ప్రస్తుతానికి ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దీక్షపై దాడి
* నిరసనపై చెలరేగిన నిరంకుశత్వం * కాపు ఉద్యమ నేత ముద్రగడ బలవంతంగా అరెస్టు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, హక్కుల పీకనొక్కి నిరంకుశంగా వ్యవహరించింది. శాంతియుతంగా దీక్ష చేపట్టిన ముద్రగడ అసలు ఎక్కడున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారనే విషయం కొన్ని గంటలపాటు ప్రజలకు తెలియకుండా చేసింది. ముద్రగడ ఆమరణ దీక్ష, అనంతర పరిణామాలు ప్రజలకు తెలియకుండా సాక్షి టీవీలో ప్రసారాలను నిలిపివేయించింది. సెల్ఫోన్ల నుంచి సందేశాలు వెళ్లకుండా అడ్డుకుంది. దీక్ష కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది. గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఒకరకంగా యుద్ధ వాతావారణాన్ని సృష్టించింది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయించింది. సర్కారు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ముద్రగడ పురుగుల మందు తాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాజమహేంద్రవరం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. కుటుంబ సమేతంగా దీక్ష కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. అప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పోలీసు బలగాలు ముద్రగడ ఇంటి చుట్టూ మోహరించాయి. దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కాపు నాయకులు అడ్డుకున్నారు. తుని ఘటనలో అరెస్టయిన వారిలో వెఎస్సార్సీపీ నేతలు ఉన్నారని చెబుతున్నారని, అమలాపురంలో అరెస్టయిన వారిలో టీడీపీ క్రియాశీలక కార్యకర్త దూడల మణి ఉన్నారంటూ అందుకు సంబంధించిన టీడీపీ సభ్యత్వ కరపత్రాన్ని ప్రదర్శించారు. ఈలోగా పోలీసు అధికారులు ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి వె ళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. ‘మీరు ఏదైనా మాట్లాడదలచుకుంటే ముద్రగడ కిటికీ వద్దకు వస్తారు. అక్కడే మాట్లాడండి’ అని కాపు నేతలు తేల్చిచెప్పారు. ఆత్మహత్య చేసుకుంటా.. ఇదే సమయంలో పోలీసులు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఒకేసారి ముద్రగడ ఇంటి వరండాలోకి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. గదిలో తాను కూర్చున్న సోఫాలోంచి లేచి పురుగుల మందు డబ్బా పట్టుకొని కిటికీ వద్దకు వచ్చారు. ‘అడిషనల్ ఎస్పీగారూ! ఏమనుకుంటున్నారు? ఈ చుట్టుపక్కల పోలీసులు ఎవరైనా కనిపిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ‘మీకు సంబంధం లేదన్నారు కదా.. వెళ్లిపోండి. సీబీసీఐడీని రప్పించండి’ అని చెప్పి తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నారు. 69 కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు చూపాలి అనంతరం రాజమహేంద్రవరం నుంచి సీఐడీ డీఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం ముద్రగడ ఇంటికి చేరుకుంది. ముద్రగడను ఏ కారణంతో అరెస్టు చేయడానికి వచ్చారో చెప్పాలని కాపు నాయకులు పోలీసులను నిలదీశారు. ముద్రగడపై 69 కేసులు ఉన్నాయని హోంమంత్రి చినరాజప్ప చెబుతున్నారని, వాటి ఎఫ్ఐఆర్ కాపీలను తమకు అందజేస్తే అప్పుడు ముద్రగడ అరెస్టవుతార ని తెలిపారు. తుని ఘటనలో నమోదైన కేసుల్లో రెండింటిలో దర్యాప్తు పూర్తయిందని, దానిపైనే అరెస్ట్ చేస్తామని సీఐడీ డీఎస్పీ హరికృష్ణ చెప్పారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తే అరెస్ట్‌కు ముద్రగడ సిద్ధమని కాపు నేతలు స్పష్టం చేశారు. సాంకేతికంగా కాపీలు ఇవ్వలేమని, లొంగిపోతే విచారణ సందర్భంగా అన్ని వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పడంతో కాపు నాయకులు నిరాకరించారు. చర్చలు లేవని, వెళ్లిపోవాలని పోలీసులకు చెప్పారు. మరోవైపు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీసులను ప్రతిఘటించిన నేతలు, అనుచరులు దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైద్యబృందం గదిలోకి వెళ్లేం దుకు విఫలయత్నం చేసి, వెనుదిరిగింది. సాయంత్రం 4.20కి వందలాదిగా పోలీసులు మూకుమ్మడిగా ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాపు నాయకులు, ముద్రగడ అనుచరులు పోలీసులను ప్రతిఘటించారు. దీంతో పోలీ సులు లాఠీలకు పనిచెప్పారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. దాదాపు 60 మందిని అరెస్ట్ చేసి కాకినాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్ష చేస్తున్న గది నుంచి మరో గదిలోకి వెళ్లి అప్పటికే తన వద్ద ఉంచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు తలుపులను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిం చారు. ముద్రగడను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకొస్తుండగా ఆయన రెండో కుమారుడు గిరి అడ్డుకున్నారు. పోలీసులు ముద్రగడను బలవంతంగా అరెస్టు చేసి, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరిలను మరో వాహనంలో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముద్రగడ రాజమండ్రి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన రక్త నమునాలను వైద్యుల బృందం సేకరించి పరీక్షలు నిర్వహించింది. మెటాబాలిక్ డెఫిషియన్సీ 160 ఉన్నట్టు, ఆయన పురుగుల మందు తాగి నట్టు ఈ పరీక్షలో నిర్ధారణైంది. ముద్రగడ రక్తంలో చక్కెర స్థారుు 240 ఉందని, బీపీ 160/100 ఉందని.. వెంటనే ఆయనకు చికిత్స చేయకపోతే ఆరోగ్యం విషమించ వచ్చని వైద్యులు తెలపగా.. అందుకు ముద్రగడ ససేమిరా అంటున్నారు. -
అప్రమత్తం
కాపు నేతలపై పోలీసు నిఘా ముద్రగడ అరెస్టుతో కాపుల్లో కలవరం విజయవాడ : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో గురువారం కాపు నేతలపై పోలీసులు నిఘా పెంచారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లాలో ఉన్న ముఖ్య నేతల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కిర్లంపూడిలో ముద్రగడ అరెస్ట్, తుని ఘటనలో కొందరిని అరెస్ట్ చేయడంతో మళ్లీ కాపుల్లో కలవరం రేగుతోంది. ఈక్రమంలో ముద్రగడకు సంఘీభావంగా కాపునేతలు కార్యక్రమాలు నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాపు నేతల కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు. కాపునేతలు, సంఘాల నాయకుల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా కృష్ణలంక, గాంధీనగర్, బీసెంట్ రోడ్డు, భవానీపురం తదితర కాపు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలలో కీలక నేతలుగా ఉన్న కాపు నేతలు, వారి అనుచరగణంపైనా నిఘా ఉంచారు. విజయవాడ రాజధాని నగరం కావడంతో నగరంలో సీఎం క్యాంపు కార్యాలయం ఉండడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని పరిస్థితిపై పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అధికారులతో చర్చించారు. మరోవైపు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలు ప్రభుత్వ చర్యలను సమర్థించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో వారి కార్యాలయాల వద్ద ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతోంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల వద్ద నిరంతర నిఘా కొనసాగుతోంది. అలాగే జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్‌జంక్షన్, గన్నవరం, జగ్గయ్యపేట ప్రాంతాలలో కూడా కాపు నేతల కదలికలపై నిఘా ఉంచినట్లు సమాచారం. -
ముద్రగడ కొడుకును తరిమికొట్టిన పోలీసులు!
కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నిరాహార దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా ఆయన కొడుకును పోలీసులు తరిమికొట్టారు. ఆయన తనయుడిపై పోలీసులు లాఠీ ఝళిపిస్తున్న తాజా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు వెళ్లగా.. ఆయన తలుపులు వేసుకుని, లోపల పురుగుల మందు డబ్బా పట్టుకుని, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తర్వాత పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను అరెస్టుచేశారు. -
ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా గోదావరి జిల్లాల బంద్
కిర్లంపూడి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అరెస్ట్‌కు నిరసనగా కాపు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చేబ్రోలు వద్ద రోడ్డుపై నేతలు బైఠాయించడంతో కత్తిపూడి-కాకినాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా రేపు తూర్పుగోదావరి, శనివారం పశ్చిమగోదావరి జిల్లా బంద్‌కు కాపు సంఘాలు పిలుపునిచ్చాయి. తాజా పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా కాపు సంఘాలు అత్యవసర సమావేశాన్ని చేపట్టాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ లోని కాపు కార్యాలయంలో ఆల్ ఇండియా కాపు జేఏసీ నేతలు భేటీయ్యారు. ముద్రగడ అరెస్ట్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై కాపు నేతలు చర్చించారు. బేషరుతుగా ముద్రగడను విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ముద్రగడను విడుదల చేయకపోతే శనివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని ఆల్ ఇండియా కాపు జేఏసీ ప్రకటించింది. -
‘ముద్రగడకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత’
ముద్రగడ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నగర కాపునాడు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రంగాను కోల్పోయాం.. ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేం.. ఆయనకు ఏమైనా అయితే.. సహించేదిలేద’ని హెచ్చారించారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా విజయవాడలోని పలు జంక్షన్లలో రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
తలుపులు బద్దలు కొట్టి ముద్రగడ అరెస్ట్
కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అరెస్ట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాపు నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంబులెన్స్ లో ఆయనను తరలించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగం పెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బుధవారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించారు. చంద్రబాబు సర్కారు స్పందిచకపోవడంతో ఆయన దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సుమారు ఐదువేల మంది పోలీసులను రంగంలోకి దింపింది. ముద్రగడ నివాసంలోకి మీడియాను కూడా అనుమతించలేదు. -
'జైల్లో దీక్ష చేస్తాను.. బెయిల్ తీసుకోను'
కాకినాడ: తనను అరెస్ట్ చేస్తే జైల్లో దీక్ష కొనసాగిస్తాను తప్ప బెయిల్ తీసుకోననని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనకు మూల కారకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. ముద్రగడ బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేవరకూ తానూ దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. రేపు(గురువారం) ఉదయం 9 గంటల నుంచి కిర్లంపూడిలో నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. కాపులను ముక్కలు చేసి తనను ఒంటిరి చేయాలన్నది చంద్రబాబు కుట్ర' అని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తిప్పి కొడతామని సాక్షితో ముద్రగడ చెప్పారు. అయితే రేపటి నుంచి నిరవధిక దీక్షకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో కిర్లంపూడిలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన ప్రధాన అనుచరులను హౌస్ అరెస్ట్‌కు పోలీసులు యత్నిస్తున్నారు. మీడియాపైనా కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. లైవ్ వెహికల్స్‌ను ముద్రగడ ఇంటి ఆవరణలోపెట్టొదని పోలీసులు హుకుం జారీ చేశారు. -
ముద్రగడను కూడా అరెస్ట్ చేస్తాం : బోండా ఉమ
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...ముద్రగడపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే ముద్రగడ రాజకీయ ముసుగు తొలగిపోతుందన్నారు. తుని ఘటనలో దర్యాప్తులో అన్ని ఆధారాలు సేకరించాకే అరెస్ట్‌లు చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఇంకా ఎక్కువ అరెస్ట్‌లు ఉంటాయని బోండా చెప్పారు. ఇప్పటికే హోంమంత్రి చినరాజప్ప తుని ఘటనలో అరెస్టైన వారిని రౌడీలని అనడంపై కాపు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజా బోండా వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచే విధంగా మారాయి. -
'కాపులను రౌడీలుగా చిత్రీకరించడం దారుణం'
కిర్లంపూడి: కాపులను రౌడీలుగా చిత్రీకరించడం దారుణమని కాపు నేతలు అన్నారు. తుని ఘటనలో అరెస్టైన వారంతా రౌడీలేనన్న హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యలు సరికాదని నేతలు తీవ్రంగా ఖండించారు. కిర్లంపూడిలో మంగళవారం మధ్యాహ్నం కాపునేతలు మాట్లాడుతూ..తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కోరితే అరెస్ట్‌లు చేస్తారా..?? అని ప్రశ్నించారు. అమాయకులను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని కాపు నేతలు హెచ్చరించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసే వరకు పోలీస్ వ్యాన్ లోనే ఉంటానని బలవంతంగా దించాలని చూస్తే ఇక్కడే దీక్షకు కూర్చుంటానని కాపు నాయకుడు ముద్రగడ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కాకినాడ, అమలాపురం సహా అన్ని పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. -
అమలాపురంలో 14 పోలీసు పికెట్లు
అమలాపురం టౌన్ : తునిలో కాపు ఐక్య గర్జన సంద ర్భంగా జరిగిన పరిణామాలపై బాధ్యుల ని భావిస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సీబీ సీఐడీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న కోనసీమలో ముఖ్యంగా అమలాపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి అమలాపురానికి మూడు ఏఎన్ఎస్ పార్టీలు, ఇతర బలగాలు వచ్చాయి. పట్టణంలో కాపులు ఎక్కువ గా నివసించే ప్రాంతాల్లో 14 చోట్ల పోలీ సు పికెట్లను ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా కాపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కాపు నాయకులు, కార్యకర్తలు, యువకుల్లో సీబీసీఐడీ కదలికలతో ఆందోళనకు గురయ్యారు. జిల్లా ఏఎస్పీ దామోదర్‌ను అమలాపురం డివిజన్‌కు ప్రత్యేక అధికారిగా నియమించటంతో ఆయన సోమవారం రాత్రే అమలాపురం వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలో కాపులు అధికంగా నివసించే కొంకాపల్లి, కల్వకొలను వీధి, మహిపాల వీధి, నల్లా వీధి, గారపాటి వీధి తదితర వీధుల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. రహస్య సీసీ కెమెరాలు కూడా అమర్చారు. పోలీసు అధికారులు ట్యాబ్‌లతో ప్రతి కదలికను ఫోటోలు తీస్తున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కోనసీమపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. -
'పదవి కోసం అడగని హామీలు కూడా ఇచ్చారు'
ద్వారకాతిరుమల: కాపులకు రుణాలిచ్చామని ఆర్భాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన వారికి ఎందరికి రుణాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం నిర్వహించిన కాపునాడు కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గడపగడపకూ వెళ్లి కాపులకు హామీలు ఇచ్చింది చంద్రబాబేనన్నారు. సీఎం పదవి కోసం కాపులకు అడగని హామీలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్లు దాటినా ఆ హామీల్ని నెరవేర్చకపోగా ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణంగానే కాపులంతా ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై డిసెంబర్ నెలాఖరు నాటికి స్పష్టత ఇవ్వాలని, లేదంటే కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇతర కులాలకు చెందిన అధికారులను ఎందుకు తీసుకురాలేదని ముద్రగడ నిలదీశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన అధికారుల పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. -
సోము వీర్రాజుతో ముద్రగడ భేటీ
రాజమండ్రి : కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ సాధించే వరకూ తాను చేపట్టిన ఉద్యమం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ముద్రగడ విలేకర్లలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబుగారే మమ్మల్ని రోడ్డెక్కించారని ఆరోపించారు. తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే లాంటి సర్వే నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అయితే ఈ సర్వే ఆలస్యం కాకుండా చూడాలన్నారు. త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వానికి ముద్రగడ సూచించారు. -
'హామీలు నెరవేర్చమంటే మంత్రులకు కోపం'
సికింద్రాబాద్: కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్‌లో కాపు నేతల ఆత్మీయ సభకు ముద్రగడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కాపులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే ఆఖరి పోరాటమన్నారు. హామీలను సాధించుకునే విషయంలో తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ముద్రగడ స్పష్టం చేశారు. -
కాపు భవనాలకు మీ పేరేంటి? : ముద్రగడ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో కాపు భవనాలకు సీఎం చంద్రబాబు పేరు పెట్టడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయనిక్కడ చంద్రబాబుకు మరోసారి లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కాపు భవనాలకు పెట్టిన చందన్న పేరును తక్షణమే తొలగించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపు సంక్షేమ నిధికి ఎవరైనా నిధులు ఇవ్వొచ్చంటున్న బాబు.. పన్నుల రూపంలో కాపులు రూ.కోట్లు చెల్లించడం లేదా అని ప్రశ్నించారు. ఆ నిధుల నుంచి ఖర్చు చేయకుండా..చివరకు కాపులను అడుక్కునే వారిగా చూపడం ఎంతవరకు న్యాయమన్నారు. చంద్రబాబు వరాలు గాల్లోనే ఉంచి..ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలన్నారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సంతోషిస్తామని ముద్రగడ లేఖలో తెలిపారు. -
రూటు మార్చిన ‘చంద్రన్న’
- కాపు భవనాలు, పథకాలకు చంద్రన్న పేరుపై బాబును కలిసిన నేతలు - వ్యతిరేకత పెరుగుతోందని మాట మార్చిన ఏపీ సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల కోసం ప్రకటించిన పథకాలు, నిర్మించనున్న భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు రూటు మార్చారు. ఈ వ్యవహారంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని ఆదివారం సీఎంను కలిసిన కాపు నేతలు స్పష్టం చేయగా తనకు తెలియకుండా జరిగిందని సర్దిచెప్పారు. ఈ నేపధ్యంలోనే ఇకపై పథకాలకు పేర్లు పెట్టేటప్పుడు తన కార్యాలయం అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సీఎంవో మీడియా విభాగం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు కాపు నేతలు పిళ్లా వెంకటేశ్వరరావు, బేతు రామ్మోహనరావు తదితరులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసి కాపు భవనాలకు చంద్రన్న భవన్, పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమ సామాజికవర్గంలో పెల్లుబికుతున్న ఆందోళనను వారు చంద్రబాబుకు వివరించారు. కాపుల పథకాలు, భవనాలకు కాపు నేతలైన శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా తదితరుల పేర్లు పెట్టాలని నేతలు కోరారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, మార్పిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వెనువెంటనే సీఎంవో నుంచి ఇప్పటివరకూ పలు పథకాలకు తన పేర్లు పెట్టడాన్ని తప్పుపడుతూ ప్రకటన జారీ చేయించారు. మొదటి నుంచి వివిధ పథకాలకు పలువురు మంత్రులు అత్యుత్సాహంతో చంద్రన్న పేరు పెడుతున్నా ముఖ్యమంత్రి వారించకుండా పరోక్షంగా ప్రోత్సహించారు. చివరికి కాపుల కోసం నిర్మిస్తున్న భవనాలకు, పథకాలకు చంద్రన్న పేరు పెట్టారు. మొదట్లో దీనిపైనా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అయితే ఆ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత పెరగడంతో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. రెండేళ్ల నుంచి చంద్రన్న పేర్ల తంతు నడుస్తున్నా ఇప్పుడు అభ్యంతరాలు రావడంతో తనకు తెలియకుండా పథకాలకు పేర్లు పెట్టొద్దని ప్రకటన విడుదల చేయడం విశేషం. పథకాలకు చంద్రన్న పేర్లు పెట్టే విషయం ఇప్పుడే బయటకు వచ్చినట్లు నటిస్తూ ఇప్పటివరకూ పెట్టినవి తనకు తెలియకుండా జరిగాయనే కలరింగ్ ఇచ్చుకోవడం విశేషం. -
చంద్రబాబుకు షాకిచ్చిన కాపు నేతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కాపు పథకాలకు సీఎం చంద్రబాబునాయుడు పేరు పెట్టడంపై కాపు నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడలో ఆదివారం ఉదయం కాపు నేతలు చంద్రబాబుతో భేటీయ్యారు. ఈ భేటీలో కాపులకు ఇస్తున్న ఉపకార వేతనాలు, విదేశీ విద్య, రుణాల వంటి ప్రభుత్వ పథకాలతో పాటు కాపు సంక్షేమ భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాపు భవనాలకు జిల్లాలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన నాయకుల పేర్లు పెట్టాలని నేతలు సూచించారు. కాపు పథకాలకు చంద్రన్న పేరు పెట్టడం వల్ల రాష్ట్రంలో కాపులు టీడీపీకి దూరమౌతారని హెచ్చరించినట్లు సమాచారం. కాపు నేతల హెచ్చరికతో బాబు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆగమేఘాల మీద సీఎంవో అనుమతి లేకుండా ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టొద్దని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎంవో అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వ పథకాలపై ముందుకెళ్లాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అవాక్కయిన 'తమ్ముళ్లు'
‘మీలో కాపు సామాజికవర్గీయులెవరు?.. ఒకసారి చేతులెత్తండి’.. నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇచ్చిన ఈ పిలుపు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు కుతకుతలాడుతున్నారు. స్కూల్లో పిల్లల్ని ఆదేశించినట్లు తమను చేతులెత్తమనడమేంటి?.. అయినా పాతికేళ్ల నుంచి పార్టీలో ఉన్నాం. ఎవరు.. ఏ సామాజికవర్గానికి చెందినవారో నగర అధ్యక్షుడికి ఇంతవరకు తెలియకపోవడమేంటని మథనపడుతున్నారు. ► వాసుపల్లి ప్రశ్నతో గతుక్కుమన్న టీడీపీ కాపు నేతలు ► 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా గురించి చెప్పుకోవాలా? ► ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కుతున్న ఆ వర్గీయులు ► దసపల్లా హిల్స్ కబ్జాపై టీడీపీ దొంగాట ► కబ్జా చేస్తూ ఆ కొండ తమదేనని బుకాయింపు విశాఖపట్నం: ఒక సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకుందామంటూనే.. టీడీపీ నగర శాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అనాలోచితంగా అన్న మాటలు ఆ ప్రయత్నానికే గండికొట్టేలా పరిణమించాయి. శుక్రవారం జరిగిన పార్టీ నగర శాఖ సమావేశంలో వాసుపల్లి మాట్లాడుతూ కాపు సామాజికవర్గం పార్టీకి దూరం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీయే ఆ వర్గానికి న్యాయం చేస్తుందన్న వాదనను వినిపించడానికి ఈ నెల 25న ఓ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తటస్థులుగా ఉన్న కాపు వర్గీయులు కూడా ఆ సమావేశానికి వచ్చేట్లు చూడాలి అన్నారు. అంతా చెప్పిన తరువాత ‘ఇంతకీ ఈ సమావేశానికి వచ్చిన వారిలో కాపు కులస్తులు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి’ అని వాసుపల్లి అన్నారు. దాంతో సమావేశంలో పాల్గొన్న కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు బిత్తరపోయారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి పాతర్లగడ్డ రంగబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విల్లా రామకృష్ణ, ఆరిలోవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మోది అప్పారావు, మాజీ కార్పొరేటర్ బండారు శ్రీనివాసరావు తదితర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పాతికేళ్లుగా వారంతా టీడీపీలో ఉన్నారు. వాస్తవానికి వాసుపల్లి కంటే ఎంతో సీనియర్లు. కానీ వాసుపల్లి వ్యాఖ్యలతో పార్టీ సమావేశంలో తాము కాపు సామాజికవర్గానికి చెందినవారమని చేతులు పెకైత్తి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందా? అని ఆవేదన చెందారు. పాతికేళ్లుగా పార్టీలో ఉన్న తాము ఎవరిమో కూడా నగర పార్టీ అధ్యక్షుడికి తెలియదా?.. ఇప్పుడు మేము చేతులు పెకైత్తి మా పేరు, సామాజికవర్గం గురించి కొత్తగా చెప్పుకోవాలా?.. అని లోలోన మథనపడ్డారు. దసపల్లా హిల్స్ కబ్జాపై కథలు చెప్పండి కాగా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి నగర నడిబొడ్డున దసపల్లా హిల్స్ ప్రాంతంలో రెవెన్యూ పోరంబోకు కొండను కబ్జా చేస్తున్న వ్యవహారంపై వాసుపల్లి మల్లగుల్లాలు పడ్డారు. లోకేష్ కనుసన్నల్లో రూ.60 కోట్ల విలువైన కొండను కబ్జా చేస్తూ పార్టీ కార్యాలయం నిర్మించనున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలపై చర్చించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామనే వాదనను వినిపించమని వాసుపల్లి గణేష్ పార్టీ నేతలను ఆదేశించారు. కానీ వాస్తవానికి టీడీపీకి 1999-2004 మధ్య కేవలం 2వేల చదరపు గజాలు మాత్రమే కేటాయించారు. అందులో అప్పట్లోనే కార్యాలయం నిర్మించారు. ప్రస్తుతం దాదాపు రెండు ఎకరాల కొండను తొలిచేసి భారీ కార్యాలయాన్ని నిర్మంచనున్నారు. దీనిపై ప్రజలకు ఎలా కట్టకథలు చెప్పాలని అని టీడీపీ నేతలే విస్మయం చెందుతున్నారు. -
కాపు రుణాలు కొందరికే!
అడిగిన వారందరికీ రుణాలిస్తామన్న ప్రభుత్వం ఒక్కశాతం మందికే రుణాలు రాష్ట్రవ్యాప్తంగా రుణం కోసం వచ్చిన దరఖాస్తులు 3,53,479 ఎంపికయినవారు 30,822 మంది మంజూరు చేసింది 27,789 మందికి సబ్సిడీ ఇచ్చింది 10,955 మందికే సాక్షి, చిత్తూరు: కాపు కార్పొరేషన్ ద్వారా అడిగిన కాపులందరికీ రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రుణాల కోసం 3,53,479 మంది కాపులు దరఖాస్తులు చేసుకోగా 1,05,000 మందికి మాత్రమే రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చిన దరఖాస్తుల్లో 30,822 మంది రుణాలకు అర్హులంటూ తేల్చింది. చివరకు 27,789 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేసింది. వారిలో కేవలం 10,955 మందికి మాత్రమే ఒక్కొక్కరికి రూ. 35వేల చొప్పున సబ్సిడీ విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లాలో 4,970 మంది దరఖాస్తు చేసుకోగా 266 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 15 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. విజయనగరంలో 5,409 మంది దరఖాస్తుచేసుకోగా 389 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 24 మందికి, విశాఖపట్నంలో 19,763 మందికిగాను 412 మందికి రుణాలు మంజూరు చేసి 56 మందికి సబ్సిడీ ఇచ్చింది. కాపులు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి 1,00,759 మంది దరఖాస్తు చేసుకోగా 3,124 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 399 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అర్హులైన కాపులందరికీ రుణాలివ్వాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష సందర్భంగా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది. అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. దీంతో ఎంతో ఆశతో కాపులు ఆన్లైన్లో రుణాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. చివరకు ఒక్కశాతం మందికి కూడా రుణాలు అందలేదు. వచ్చిందికూడా సబ్సిడీ మాత్రమే. ‘టీడీపీ’ కమిటీలతో అర్హులకు ఎసరు... లబ్ధిదారుల ఎంపిక టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలు చేపట్టడంతో ఆదిలోనే కాపు రుణాలు వివాదాస్పదంగా మారాయి. అర్హులందరికీ కాకుండా ఆ పార్టీవారు సిఫారసు చేసిన వారికే రుణాలు అందాయి. వాస్తవంగా పేరుకు లబ్ధిదారుల ఎంపిక మండలస్థాయిలో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతిపాదించిన ముగ్గురు సోషల్ వర్కర్లు, బ్యాంకు మేనేజర్, కాపు కార్పొరేషన్, డీఆర్డీఏ, మండల మహిళా సమాఖ్య నుంచి ఒక్కొక్క సభ్యుడితో కూడిన కమిటీ ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, బీసీ కార్పొరేషన్ ఈడీ, అగ్రికల్చర్, పశుసంవర్థక శాఖ జేడీలు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం, ఆర్టీఓ, డ్వామా పీడీ, ఎల్డీఎం, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కాపు కార్పొరేషన్ సభ్యులతో కూడిన జిల్లా ఉన్నతాధికారుల బృందం రుణాల మంజూరును పర్యవేక్షించాల్సి ఉంది. కానీ జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అధికారులు తమకేమీపట్టనట్లు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో కాపు రుణాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి మొండిచేయి చూపారని అవగతమవుతోంది. కాపులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
'పవన్ కల్యాణ్‌ను కోరలేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు దిగజారి మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాపులకు న్యాయం చేసేవారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపులకు ఏటా రూ. 1000 కోట్లు ఇస్తామన్నారు... ఆ హామీలు నెరవేర్చనందునే తాము ఉద్యమబాట పట్టినట్లు ఆయన వివరించారు. కాపు ఉద్యమానికి సహకరించమని తాను జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని కోరలేదని చెప్పారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని... రాజకీయాలకు దూరం అని ఆయన వెల్లడించారు. తన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నది అవాస్తవమన్నారు. జూన్‌లో ఉద్యమ కార్యాచారణ ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యమం చేసినప్పుడు... తన వెనుక చంద్రబాబు ఉన్నారనుకోవాలా అని తనపై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు. కాపు ఉద్యమం అణచి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. కాపులు బానిసలు, సంఘ విద్రోహ శక్తులు కాదని ఆయన స్పష్టం చేశారు. తుని కేసులో కాపులను పోలీసులు వేధిస్తున్నారంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. -
బాబు హామీని నిలబెట్టుకోవాలి : ముద్రగడ
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ...కాపు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికను త్వరగా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తుది శ్వాస వరకు కాపు జాతి కోసం పోరాడుతానని... కాపుల్లో ఉన్న పేదలకు ఫలాలు అందించడమే తన ధ్యేయమని ముద్రగడ అన్నారు. -
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
♦ బందరులోని నిజాంపేటలో గుర్తుతెలియని వ్యక్తుల చర్య ♦ దోషులను శిక్షించాలని కాపు సంఘం నేతల రాస్తారోకో మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నిజాంపేటలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న కాపు సంఘం నాయకులు దోషులను శిక్షించాలంటూ రేవతి సెంటర్లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్కడే ఉన్న రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, రంగా విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును పరిష్కరించాలని కోరారు. రంగా విగ్రహం ధ్వంసం సంఘటన ఉద్రిక్తతకు దారితీయటంతో నిజాంపేటలో 144 సెక్షన్ అమలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, తహసీల్దార్ పి.నారదముని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.