wimbledon
-
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మారథాన్ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్‌లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
కస్టమ్ వింబుల్డన్ చీర గురించి తెలుసా..!
ఎన్నో రకాల చీరలు గురించి విని ఉంటారు. ఇలాంటి కస్టమ్ వింబుల్డన్ చీర గురించి ఎప్పుడైనా విన్నారా..?. ఇది కస్టమ్ టెన్నిస్ నేపథ్య చీర. దీన్ని వడోదర ఆధారిత కంటెంట్ క్రియేటర్ రిత్వి షా ధరించారు. ఇది తెలుపు, ఆకుపచ్చలతో కూడిన ఆరు గజాల చీర. భారతదేశంలో అంత్యంత క్రేజీ ఆట అయినా వింబుల్డన్ టెన్నిస్ సీజన్ కోసం ప్రత్యేక దుస్తులను ధరించింది రిత్వి షా. దీన్ని భారతీయ కళాకారులు చక్కగా నేశారు. అంతేగాదు ఆ చీరపై సానియా మీర్జా నుంచి నోవాక్ జొకోవిచ్ వరకు వివిధ దిగ్గజ టెన్నిస్ ఛాంపియన్ల పేర్లను బంగారు ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) ఈ చీర మన టెన్నిస్ ఆట సంస్కృతికి సంబంధించిన ప్రధాన అంశాలను వివరిస్తోంది. చీర పల్లు మొత్త వింబుల్డన్ ట్రోఫీతో పెయింట్ చేయబడింది. ఇక చీర మొత్తం చిన్న చిన్న టెన్నిస్ రాకెట్లతో జర్దోజీ ఎంబ్రాయిడీ చేశారు. దీనిపై చేతితే ఎంబ్రాయిడరీ చేసిన స్ట్రాబెర్రీలను కూడా ఆ చీరపై చూడొచ్చు. గుంజరాత్కి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్ రిత్వి షా ధరించిన చీరపైనే అందరి దృష్టి నిలిచింది.సరికొత్త ఫాష్యన్ శైలికి ఈమె ఆటల నేపథ్యంతో ట్రెండ్ సెట్ చేసింది. ఒకరకంగా ఈ చీర క్రీడలు సంస్కృతిని వస్త్రధారణతో ఎలా మిళితం చేయొచ్చో చూపించింది. ఈ చీర డిజైనింగ్..చేతివృత్తుల వారి కృషిని గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Ritvi Shah | Content Creator (@aboutritvi) (చదవండి: ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!) -
క్రెజికోవాకు కిరీటం
లండన్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరులో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది. 1 గంటా 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మూడు సెట్ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పైచేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న క్రెజికోవా కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. వింబుల్డన్‌లో 31వ సీడ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా చివరకు టైటిల్‌తో ముగించింది. ఫైనల్ పోరులో ఆరంభంలో జాస్మిన్‌పై ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో 10 గెలుచుకొని ముందంజ వేసింది. ఆ తర్వాత డబుల్ బ్రేక్‌తో 5–1తో ఆధిక్యంలో నిలిచిన ఆమె సునాయాసంగా సెట్‌ను ముగించింది. ఆమె జోరు చూస్తే రెండో సెట్లోనే మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది. అయితే విరామ సమయంలో పావొలిని ఆట మారింది. చక్కటి గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో దూసుకుపోయి 3–0తో నిలిచి ఇటలీ ప్లేయర్ ప్రత్యర్థి ని కోలుకోనీయకుండా సెట్‌ను ముగించింది. చివరి సెట్లో ఆట ఆసక్తికరంగా సాగింది. క్రెజికోవా 5–3 వద్ద ఉన్న దశలో పావొలిని గేమ్ గెలిచి కొంత పోటీనిచ్చినా...పదో గేమ్‌లో క్రెజికోవా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజేతగా అవతరించింది. క్రెజికోవా ఖాతాలో రెండు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 7 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి. నేడు పురుషుల ఫైనల్ జొకోవిచ్ (సెర్బియా) గీ అల్కరాజ్ (స్పెయిన్) సా.గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
Wimbledon 2024: సరికొత్త చాంపియన్ క్రిచికోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ ప్లేయర్ బార్బరా క్రిచికోవా వింబుల్డన్-2024 టైటిల్ సాధించింది.లండన్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిచికోవా.. ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిపై గెలుపొందింది. 6-2, 2-6, 6-4 తేడాతో జాస్మిన్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిచికోవా.. వరల్డ్ సెవన్త్ ర్యాంకర్ జాస్మిన్‌కు చెమటలు పట్టించింది. అయితే, రెండో సెట్లో మాత్రం క్రిచికోవాను సమర్థవంతంగా ఎదుర్కొంది జాస్మిన్.ఈ క్రమంలో కీలకమైన మూడో సెట్లోనూ దూకుడుగా ఆడిన జాస్మిన్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. తిరిగి కోలుకున్న క్రిచికోవా .. జాస్మిన్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.కాగా 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ట్రోఫీ గెలిచింది. మరోవైపు.. 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియా టెక్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా వింబుల్డన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లోనూ ఆమెకు ఇలా చేదు అనుభవమే ఎదురైంది.The moment a dream became reality ✨#Wimbledon | @BKrejcikova pic.twitter.com/38xPz9pCin— Wimbledon (@Wimbledon) July 13, 2024Showing off the Venus Rosewater Dish to the adoring #Wimbledon fans 🤩 pic.twitter.com/GmMlsOPMWW— Wimbledon (@Wimbledon) July 13, 2024 -
రోహిత్ సూపర్ లుక్.. వింబుల్డన్‌లో హిట్‌మ్యాన్ సందడి (ఫోటోలు)
-
పిచ్చెక్కించే లుక్‌లో రోహిత్ శర్మ.. వింబుల్డన్ మ్యాచ్‌లో ప్రత్యక్షం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ అనంతరం దొరికిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. హిట్‌మ్యాన్ తాజాగా ఓ వింబుల్డన్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. కార్లోస్ అల్కరాజ్, డేనిల్ మెద్వెదెవ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన హిట్‌మ్యాన్ అదిరిపోయే డ్రెస్‌లో తళుక్కున మెరిశాడు. సూటు, బూటు, టై, కళ్ల జోడుతో రాయల్‌గా కనిపించిన రోహిత్.. వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో ప్రత్యక్షమయ్యాడు. WIMBLEDON INSTAGRAM POST FOR INDIAN CAPTAIN ROHIT SHARMA. 🐐 - The Caption is "2024 T20 World Cup Winning Captain in the Royal Box". 🇮🇳 pic.twitter.com/nP5PZfmyC0— Tanuj Singh (@ImTanujSingh) July 12, 2024రోహిత్ రాయల్ లుక్కు సంబంధించిన ఫోటోలను వింబుల్డన్ తమ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. "రాయల్ బాక్స్‌లో టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్" అని ఇందుకు క్యాప్షన్ జోడించింది. పిచ్చెక్కించే లుక్‌లో ఉన్న రోహిత్ ఫోటోలు సోషల్‌మీడియాలో క్షణాల్లో వైరలయ్యాయి. హిట్‌మ్యాన్ అభిమానులు ఈ ఫోటోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. హిట్‌మ్యాన్ బ్యాట్ నుంచి జాలువారే సిక్సర్లలా కామెంట్ల వర్షం కురుస్తుంది.INDIAN CAPTAIN ROHIT SHARMA AT WIMBLEDON.- Frame of the Day. 🐐 pic.twitter.com/HCCc1dJv1s— Tanuj Singh (@ImTanujSingh) July 12, 2024ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో రోహిత్ సేన సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.The Swag and Aura of World Cup Winning Captain Rohit Sharma at Wimbledon. 🐐🔥 pic.twitter.com/SEncdeAwku— Tanuj Singh (@ImTanujSingh) July 12, 2024ప్రస్తుతం భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో మ్యాచ్ జులై 13న జరుగనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. -
వింబుల్డన్ మ్యాచ్‌లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
టాప్ సీడ్ సినెర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 4 గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–7 (7/9), 6–4, 7–6 (7/4), 2–6, 6–3తో సినెర్‌ను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 5–7, 6–4, 6–2, 6–2తో టామీ పాల్ (అమెరికా)ను ఓడించాడు. రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేíÙయా) 5–7, 6–4, 6–1తో లులు సున్ (న్యూజిలాండ్)పై, ఏడో ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) 6–2, 6–1తో 19వ సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరారు. -
వింబుల్డన్‌లో వెల్స్పన్
ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నగరానికి చెందిన వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆకర్షణీయమైన రంగుల్లో సంస్థ రూపొందించిన కాటన్ ఉత్పత్తుల్ని వింబుల్డన్ పోటీల సందర్భంగా క్రీడాకారులు వినియోగిస్తున్నారు. ఐకాన్ మీట్స్ ఐకాన్స్ పేరిట దీనికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్నామని వివరించారు. -
Wimbledon: బాంబ్రీ జోడీ ముందంజ.. తొలి రౌండ్లో ఘన విజయం
వింబుల్డన్ టోర్నీ-2024లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్‌లో బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో డెన్మార్క్ జంట అలెగ్జాండర్ బుబ్లిక్ అలెగ్జాండర్ షెవ్చెంకోలను 6-4, 6-4 వరుస సెట్లలో బాంబ్రీ, ఒలివెట్టి జోడీ జోడించింది.‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో సంచలన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన షాట్లతో బాంబ్రీ ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. భంబ్రీ, ఒలివెట్టి తమ రెండో రౌండీలో జర్మన్ జోడీ కెవిన్ క్రావిట్జ్ టిమ్ పుయెట్జ్‌తో తలపడనున్నారు.మరో భారత టెన్నిస్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జోడీ.. డబుల్స్ మొదటి రౌండ్లో నాల్గవ సీడ్ మార్సెలో అరెవాలో , మేట్ పావిక్ చేతిలో 4-6, 5-7 తేడాతో ఓటమి పాలయ్యారు. -
అరీనా సబలెంకాకు గాయం.. వింబుల్డన్ టోర్నీకి దూరం
వింబుల్డన్ -2024 నుంచి బెలారస్ టెన్నిస్ స్టార్, మూడో సీడ్ అరీనా సబలెంకా వైదొలిగింది. భుజం గాయం కారణంగా సబలెంకా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీకు దూరం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెయిన్ డ్రాలో సబలెంకా స్ధానాన్ని రష్యన్ టెన్నిస్ స్టార్ ఎరికా ఆండ్రీవాతో భర్తీ చేశారు. ఇక ఈ విషయాన్ని అరీనా సబలెంకా సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సబలెంక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. "భుజం గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకున్నాను.ఈ విషయాన్ని మీకు తెలియజేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. కానీ నా భుజం గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నొప్పితో బాధపడుతున్నప్పటకి ప్రతీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఇంతకంటే బలంగా తిరిగి వస్తానని మీకు మాటిస్తానని" ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం తొలి దశ పోటీలు జరుగుతున్నాయి. -
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్‌పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్‌కు ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు. -
జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ పిచ్‌పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సైతం గ్రాండ్‌స్లామ్ విజయానంతరం ఇలాగే చేస్తాడు. View this post on Instagram A post shared by ICC (@icc)జకో.. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ చేసుకున్న జకో స్టయిల్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో జకోవిచ్, రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి.. GOATs eating grass అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.Wimbledon's Facebook post - GOATs eating grass. Rohit Sharma 🤝 Novak Djokovic. pic.twitter.com/jrkCPBi7PX— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2024కాగా, నిన్న జరిగిన వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వరల్డ్‌కప్ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్‌కప్ ఇది. 2011లో భారత్..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్‌కప్ సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌కు అందించాడు.ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..భారత్ 176/7సౌతాఫ్రికా 169/87 పరుగుల తేడాతో భారత్ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ప్లేయర్ ఆఫ్ ద సిరీస్- జస్ప్రీత్ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు) -
వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో సుమిత్ నగాల్..
భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ తన కెరీర్లో తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు నేరుగా అర్హత సాధించాడు.గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రారంభానికి ఆరు వారాల ముందు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–104లో ఉన్న క్రీడాకారులకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభిస్తుంది. సుమిత్ నగాల్ ప్రస్తుతం 94వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2019లో చివరిసారి భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వింబుల్డన్ టోరీ్నలో పాల్గొన్నాడు.ఇవి చదవండి: రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి... -
జొకోవిచ్‌కు షాక్.. వింబుల్డన్ సరికొత్త విజేత అల్కరాజ్ (ఫొటోలు)
-
చాలా సంతోషంగా ఉంది.. అల్కరాజ్కు అభినందనలు: రాఫెల్ నాదల్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను మట్టికరిపించి.. అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 1-6, 7-6, 6-1, 3-6, 6-4 స్కోరుతో నోవాక్ జకోవిచ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు అల్కరాజ్ 2022లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. కాగా వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌ను గెలుచుకున్న మూడో స్పానిష్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. ఇక తొలి వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్న కార్లోస్ అల్కరాజ్ను మరో స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ అభినందించాడు. "ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్కు అభినందనలు. తొలి టైటిల్‌ను గెలుచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్పానిష్ టెన్నిస్‌కు మార్గదర్శకుడు మనోలో సాంటానా మనతో లేకపోయినా నీ విజయాన్ని కచ్చితంగా చూస్తుంటారు. అతని ఆశీర్వాదాలు మనకు ఎప్పటికీ ఉంటాయి. నీ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది ఛాంపియన్" అంటూ నాథల్ ట్వీట్ చేశాడు. మనోలో సాంటానా.. స్పెయిన్ టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరు. ఆయన తన కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు. మనోలో సాంటానా(83) 2021 డిసెంబర్లో తుది శ్వాస విడిచారు. Enhorabuena @carlosalcaraz . Nos has dado una alegría inmensa hoy y seguro que nuestro pionero en el tenis español, Manolo Santana, también ha estado animando allá dónde esté como de Wimbledon al que hoy te has unido. Un abrazo muy fuerte y a disfrutar del momento ¡¡¡Campeón!!!… pic.twitter.com/y0j2GowX3O — Rafa Nadal (@RafaelNadal) July 16, 2023 చదవండి: IND vs WI: 'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్ క్రికెట్‌ను ఏలుతాడు' -
అల్కరాజ్ అద్భుతం
లండన్: వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. 2022లో యూఎస్ ఓపెన్ సాధించిన అల్కరాజ్కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్ మూడో గ్రాండ్‌స్లామ్ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్కరాజ్కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జొకో విచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. హోరాహోరీగా... అంచనాలకు తగినట్లుగా జొకోవిచ్ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. 5–0తో దూసుకుపోయాడు. అదే జోరులో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో హోరాహోరీ సమరం సాగింది. అల్కరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో జొకోవిచ్ కూడా ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సి వచ్చింది. స్కోర్లు 4–4, 5–5, 6–6తో సమమవుతూ వచ్చాయి. టైబ్రేక్‌లో చివరకు బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో పాయింట్ నెగ్గిన అల్కరాజ్ సెట్‌ను గెలుచుకున్నాడు. ఈ సెట్ 85 నిమి షాలు సాగడం విశేషం. ఈ సెట్ నాలుగో గేమ్‌లో 29 షాట్ల ర్యాలీతో స్టేడియం హోరెత్తింది. పట్టు కోల్పోయిన జొకో... రెండో సెట్ గెలిచిన ఉత్సాహంలో అల్కరాజ్ మూడో సెట్లో తన జోరును కొనసాగించాడు. 3–1తో అతను ముందంజ వేశాడు. అయితే ఐదో గేమ్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా సాగింది. 27 నిమిషాల పాటు 13 ‘డ్యూస్’లతో సాగిన ఈ గేమ్‌లో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా పోరాడారు. ఈ గేమ్‌ను గెలుచుకొని 4–1తో ఆధిక్యంలో నిలిచిన అల్కరాజ్కు మరో రెండు గేమ్‌లు గెలుచుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓడితే టైటిల్ కోల్పోయేస్థితిలో నాలుగో సెట్ బరిలోకి దిగిన జొకోవిచ్ తన స్థాయి ఆటను ప్రదర్శించి సెట్ సాధించాడు. నిర్ణాయక చివరి సెట్లో 1–1తో సమంగా నిలిచిన తర్వాత మూడో గేమ్‌లో జొకోవిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. -
వింబుల్డన్‌కు ముందు అన్నీ అడ్డంకులే.. వండర్ వొండ్రుసోవా
అన్‌సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్‌లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్‌సీడెడ్‌గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాది రన్నరప్‌గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది. లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్‌గా ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నలుగురు గ్రాండ్‌స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్హ్యాండ్లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 6–4తో తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్‌లైన్ గేమ్‌తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది. తొమ్మిదో గేమ్‌లో పదే పదే నెట్‌పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది. -
Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర
Wimbledon 2023, Women's Singles Winner Marketa Vondrousova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా సంచలన విజయం సాధించింది. ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఆన్స్ జబర్‌ను ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకుంది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా వొండ్రుసోవా చేతిలో ఓడిన 28 ఏళ్ల జబర్ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా విజేతగా నిలిచింది. కెరీర్లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ గెలిచింది. ప్రైజ్‌మనీ ఎంతంటే అంతకు ముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో వొండ్రుసోవా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది జబర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఆమెను ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీ గెలిచింది. ఇక రన్నరప్ ప్లేయర్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కనుంది. POV: you just become a Wimbledon champion 🏆#Wimbledon pic.twitter.com/kf484DhHUt — Wimbledon (@Wimbledon) July 15, 2023 Marketa's magical moment 🏆 Marketa Vondrousova becomes the third Czech woman to win the ladies' singles title, defeating Ons Jabeur 6-4, 6-4#Wimbledon pic.twitter.com/AAHThI1ZYn — Wimbledon (@Wimbledon) July 15, 2023 Unseeded. Unstoppable.#Wimbledon pic.twitter.com/sgSwIWirDM — Wimbledon (@Wimbledon) July 15, 2023 -
అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’
లండన్: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్... కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్... ఆదివారం జరిగే వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) గంటా 50 నిమిషాల్లో 6–3, 6–3, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 2 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 7–6 (7/4)తో ఆరో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విజయం సాధించారు. జొకోవిచ్ తన కెరీర్లో 35వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... అల్కరాజ్కిది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుంది. అల్కరాజ్ గత ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సినెర్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 17 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొమ్మిదోసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన జొకోవిచ్ ఏడుసార్లు విజేతగా నిలిచాడు. మెద్వెదెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ నాలుగు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 28 సార్లు పాయింట్లు నెగ్గాడు. తన సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ స్పెయిన్ స్టార్ మెద్వెదెవ్ సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా
లండన్: గత ఏడాది అక్టోబర్‌లో పాపకు జన్మనిచ్చి... ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్ పట్టిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా 7–5, 6–7 (5/7), 6–2తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. 2019 తర్వాత మళ్లీ వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వితోలినాకు వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్వియాటెక్‌తో 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పో యి, స్వియాటెక్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు నెగ్గిన స్వితోలినా 25 విన్నర్స్ కొట్టింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి, తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 76వ స్థానంలో ఉన్న స్వితోలినా సెమీఫైనల్ చేరిన క్రమంలో నలుగురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. తొలి రౌండ్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై, రెండో రౌండ్లో సోఫియా కెనిన్ (అమెరికా)పై, నాలుగో రౌండ్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)లపై స్వితోలినా గెలిచింది. సెమీఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన మర్కెటా వొండ్రుసోవాతో స్వితోలినా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 42వ ర్యాంకర్ వొండ్రుసోవా 6–4, 2–6, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 7–5, 4–6, 7–6 (10/7) తో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)–రీస్ స్టాడ్లెర్ (అమెరికా) జంటను ఓడించింది. జూనియర్ బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో మానస్ ధామ్నె (భారత్) 1–6, 4–6తో సియర్లీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. A five-star performance 🌟@ElinaSvitolina defeats the world No.1 Iga Swiatek 7-5, 6-7(5), 6-2 to reach the semi-finals at #Wimbledon once again pic.twitter.com/l6nUu17KHj — Wimbledon (@Wimbledon) July 11, 2023 -
కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో 14వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. కాగా మ్యాచ్‌లో రెండో సెట్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్ సర్వీస్ చేసి డ్రాప్ షాట్ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్ నెట్ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ షాట్ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్ కోల్పోయిన జొకోవిచ్ ఒక్కసారిగా నెట్‌పై పడిపోయాడు. అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్ జొకోవిచ్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్‌కు ఇది వింబుల్డన్‌లో వందో మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. Djokovic went for it 😅 #Wimbledon pic.twitter.com/q05cHyJJBt — SportsCenter (@SportsCenter) July 9, 2023 చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్ #LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ -
జొకోవిచ్‌దే పైచేయి, 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి డిఫెండింగ్ చాంపియన్
లండన్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ఈ సెర్బియా స్టార్ 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్ మ్యాచ్‌ల్లో రెండున్నర గంటల్లోపే విజయాన్ని అందుకున్న జొకోవిచ్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అంత సులువుగా గెలుపు దక్కలేదు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 18 ఏస్‌లు సంధించగా, హుర్కాజ్ 33 ఏస్‌లతో అదరగొట్టాడు. తొలి సెట్లో జొకోవిచ్ మూడుసార్లు సెట్ పాయింట్లను, రెండో సెట్లో రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ 3–6, 7–6 (7/4), 3–6, 6–4, 6–4తో సిట్సిపాస్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–2తో తొలి రెండు సెట్లు గెల్చుకున్నాడు. అనంతరం లెహెస్కా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలడంతో మెద్వెదెవ్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. మూడో రౌండ్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 7–5, 6–3తో జేకబ్ ఫియరెన్లీ–జోనస్ మండే (బ్రిటన్) జోడీపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకుంది. ఓటమి అంచుల నుంచి... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఓటమి అంచుల నుంచి గట్టెక్కి తొలిసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 14వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–7 (4/7), 7–6 (7/2), 6–3తో గెలిచింది. రెండో సెట్లో స్కోరు 5–6 వద్ద స్వియాటెక్ తన సర్విస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేసింది. టైబ్రేక్‌లో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచిన ఆమె మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో బెన్‌చిచ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–4, 7–6 (11/9)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–0తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిíÙయా) 6–0, 6–3తో రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, మాడిసన్ కీస్ 3–6, 7–6 (7/4), 6–2తో మిరా ఆండ్రీవా (రష్యా)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) తొలి సెట్లో 4–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి బీట్రిజ్ హదద్ మయా (బ్రెజిల్) గాయం కారణంగా వైదొలిగింది. -
Wimbledon 2023: మూడో రౌండ్‌కు చేరుకున్న బోపన్న జోడీ
వింబుల్డన్-2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్) చేరుకున్నాడు. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ ద్వయం కేవలం 69 నిమిషాల్లోనే ఇంగ్లీష్ జోడీ, వైల్డ్ కార్ట్ ఎంట్రీ అయిన జాకబ్ ఫియర్న్లీ-జోహన్నస్ జోడీపై వరుస సెట్లలో (7-5, 6-3) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీకి శుభారంభం లభించనప్పటికీ.. ఆతర్వాత బలంగా పుంజుకుంది. ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న ద్వయం.. తదుపరి రౌండ్లో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)-రీస్ స్టాల్డర్ (యూఎస్ఏ) జోడీతో తలపడనుంది. ప్రస్తుతం వింబుల్డన్‌లో భారత్ తరఫున బోపన్న మాత్రమే బరిలో ఉన్నాడు. ఈ టోర్నీలో బోపన్న 2013, 2015లో అత్యుత్తమంగా సెమీస్ వరకు (డబుల్స్) చేరుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. -
Wimbledon 2023: రెండో రౌండ్లో మానస్
వింబుల్డన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ మానస్ ధామ్నే శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన మానస్ ఆదివారం లండన్‌లో జరిగిన తొలి రౌండ్లో 6–2, 6–4తో ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న హేడెన్ జోన్స్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మానస్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు 14 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. రన్నరప్ సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ25 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 4–6, 0–6తో మన చాయ సావంగ్కెయి (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. చదవండి: నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
క్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తన కెరీర్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 7–5, 6–3, 6–7 (6/8), 6–7 (5/7), 6–4తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రుబ్లెవ్ 21 ఏస్‌లు, బుబ్లిక్ 39 ఏస్‌లు సంధించడం విశేషం. మూడో సెట్ టైబ్రేక్‌లో మ్యాచ్ పాయింట్ చేజార్చుకున్న రుబ్లెవ్ చివరకు ఐదో సెట్లో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 26వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–3, 3–6, 1–6, 3–6తో సఫీయులిన్ (రష్యా) చేతిలో ఓడిపోగా... ఎనిమిదో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 7–6 (7/4), 6–4, 6–3తో గలాన్ (కొలంబియా)పై గెలిచాడు. మూడో రౌండ్లో పదో సీడ్ టియాఫో (అమెరికా) 2–6, 3–6, 2–6తో దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ పెగూలా (అమెరికా) 6–1, 6–3తో సురెంకో (ఉక్రెయిన్)పై, వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–4, 6–3తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్లో మిరా ఆండ్రీవా (రష్యా) 6–2, 7–5తో పొటపోవా (రష్యా)పై నెగ్గింది. పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. -
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్‌షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్‌స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్‌హ్యాండ్‌ను, ఇటు బ్యాక్‌హ్యాండ్‌ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్‌కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్‌హ్యాండ్‌కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్‌ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్‌లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్‌హ్యాండ్‌పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్‌కు ‘ఐస్‌బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్‌లో ఆడే అవకాశం బోర్గ్‌కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్‌లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్‌ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో గ్రాస్‌కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్‌స్లామ్ చాంప్‌గా కూడా అవతరించాడు. రోమ్‌లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్‌ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్‌లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్‌కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్‌ను తన కోర్ట్‌లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్‌తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్‌స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్‌ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్‌తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్‌కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్‌కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్‌లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం.. -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, స్వియాటెక్
లండన్: టాప్స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. 11 ఏస్‌లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్‌ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు. స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. బోపన్న జోడీ శుభారంభం భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది. -
అల్కరాజ్ ముందుకు...
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఈ స్పెయిన్ స్టార్ 6–4, 7–6 (7/2), 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఐదు ఏస్‌లు సంధించాడు. 32 విన్నర్స్ కొట్టి, 41 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 29 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు గెలిచాడు. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్‌లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) హోరాహోరీ పోరులో గట్టెక్కి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 2013, 2016 వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో 4 గంటల 40 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ పోరులో సిట్సిపాస్ 7–6 (7/3), 6–7 (2/7), 4–6, 7–6 (7/3), 6–4తో విజయం సాధించాడు. 17 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్ ఏకంగా 90 విన్నర్స్ కొట్టడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–3, 7–6 (7/5)తో మనారినో (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) 6–3, 7–6 (7/3), 6–4తో కార్బాలెస్ బేనా (స్పెయిన్)పై నెగ్గారు. అజరెంకా జోరు మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో అజరెంకా 6–2, 6–4తో 11వ సీడ్ కసత్కినా (రష్యా)ను ఓడించగా... పెగూలా 6–4, 6–0తో కొకియారెటో (ఇటలీ)పై గెలిచింది. సుదీర్ఘ టైబ్రేక్... మహిళల సింగిల్స్‌లో సురెంకో (ఉక్రెయిన్), అనా బొగ్డాన్ (రొమేనియా) మ్యాచ్ చరిత్రకెక్కింది. 3 గంటల 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సురెంకో 4–6, 6–3, 7–6 (20/18)తో బొగ్డాన్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నిర్ణాయక మూడో సెట్లో టైబ్రేక్ ఏకంగా 37 నిమిషాలు సాగింది. తద్వారా మహిళల గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్గా రికార్డు నమోదైంది. 38 పాయింట్ల తర్వాత టైబ్రేక్‌లో ఫలితం తేలడం కూడా రికార్డే. ఈ మ్యాచ్‌లో సురెంకో ఐదుసార్లు, బొగ్డాన్ ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం గమనార్హం. -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది. -
వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా.. -
హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!
ఉపాసన- రామ్ చరణ్ ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో చేరిన మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తమ ముద్దుల కూతురి పేరును క్లీంకారగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో వారసురాలు అడుగు పెట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా ) అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు కీరవాణి బర్త్‌డే సందర్భంగా ఉపాసన వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫోటోను పంచుకున్నారు. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్‌లో టెన్నిస్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆస్కార్ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. (ఇది చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
ఫేవరెట్‌గా జొకోవిచ్
లండన్: అల్కరాజ్ ప్రపంచ నంబర్‌వన్ అయినా... ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో అందరి కళ్లూ జొకోవిచ్‌పైనే ఉన్నాయి. ఈ సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ‘హ్యాట్రిక్’తో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో టైటిల్ చేజిక్కించుకుంటాడనే అంచనాలు పెరిగాయి. మరోవైపు స్పెయిన్ సంచలనం అల్కరాజ్ కూడా టాప్ ర్యాంకు ఉత్సాహంతో వింబుల్డన్ వేటకు సిద్ధమమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఎలీనా రిబాకినా కూడా వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సమరానికి సై అంటోంది. సోమవారం నుంచి వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే సీడింగ్స్, డ్రా విడుదల చేయగా... ఇప్పుడు కోర్టులో టైటిల్ వేటే మిగిలింది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుతో ఉన్న జొకోవిచ్ ఇప్పుడు 24వ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. రెండో సీడ్ సెర్బియన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో పెడ్రొ కచిన్ (అర్జెంటీనా)తో తలపడతాడు. టాప్‌సీడ్ కార్లొస్ అల్కరాజ్... జెరెమి చార్డి (ఫ్రాన్స్)తో జరిగే మొదటి రౌండ్ పోరుతో వింబుల్డన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రిబాకినా వరుసగా రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. గతేడాది ఈ 24 ఏళ్ల కజకిస్తాన్ స్టార్ వింబుల్డన్ ట్రోఫీతో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను తృటిలో కోల్పోయింది. ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆమె రన్నరప్‌గా తృప్తిపడింది. టైటిల్ నిలబెట్టుకునేందుకు తొలి రౌండ్లో అమెరికన్ రోజర్స్‌తో ఆమె తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)... జు లిన్ (చైనా)తో గ్రాండ్‌స్లామ్ ఆటను మొదలుపెట్టనుంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అమెరికన్ వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినాతో పోటీ పడుతుంది. -
అగ్రపీఠంపై అల్కరాజ్.. గ్రాస్ కోర్టుపై తొలి టైటిల్
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నకి సన్నాహకంగా భావించే క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6–4, 6–4తో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గ్రాస్ కోర్టులపై అల్‌కరాజ్‌కిదే తొలి టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా అతని కెరీర్లో ఇది 11వ సింగిల్స్ టైటిల్. ఈ స్పెయిన్ స్టార్‌కు 4,77,795 యూరోల (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో అల్కరాజ్ నేడు విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. దాంతోపాటు వచ్చే నెలలో మొదలయ్యే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. -
రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లకు ఊరట.. నిషేధం ఎత్తివేత
Russia And Belarus Tennis Players: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరీనా సబలెంకా (బెలారస్) వింబుల్డన్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో -
Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే!
Wimbledon 2022 Women's Singles Final- లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అన్స్ జబర్ (ట్యునీషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టిస్తారు. జబర్ గెలిస్తే ఆఫ్రికా ఖండంనుంచి గ్రాండ్‌స్లామ్ సాధించిన తొలి మహిళ అయ్యే అవకాశం ఉండగా...రిబాకినా విజేతగా నిలిస్తే కజకిస్తాన్ తరఫున గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి మహిళగా నిలుస్తుంది. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో మూడో సీడ్ జబర్ 6–2, 3–6, 6–1తో తత్యానా మారియా (జర్మనీ)పై విజయం సాధించింది. దూకుడుగా ఆడిన జబర్ తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. అయితే రెండో సెట్లో 17 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన ఆమె సెట్‌ను కోల్పోయింది. నిర్ణాయక సెట్లో మాత్రం మారియాపై జబర్ పూర్తిగా పైచేయి సాధించింది. మాజీ చాంపియన్‌కు ఓటమి... మరో సెమీస్‌లో 23 ఏళ్ల కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా సత్తా చాటింది. 23 ఏళ్ల రిబాకినా తన రెండో వింబుల్డన్‌లోనే ఫైనల్ చేరింది. 76 నిమిషాల సాగిన సెమీస్‌లో రిబాకినా 6–3, 6–3తో 2019 వింబుల్డన్ విజేత సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. మాస్కోలో పుట్టి 2018 వరకు రష్యాకు ప్రాతినిధ్యం వహించిన రిబాకినా రష్యా ఆటగాళ్లపై వింబుల్డన్‌లో నిషేధం ఉన్న సమయంలో ఫైనల్‌కు చేరడం విశేషం. Rybakina roars onto the biggest stage The 23-year-old defeats Simona Halep 6-3, 6-3 to reach her first Grand Slam final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/u0jfhZlDEA — Wimbledon (@Wimbledon) July 7, 2022 "It's time to enjoy and really have fun on court" Elena Rybakina is excited to face @Ons_Jabeur in a Wimbledon final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/J0o9RlShFJ — Wimbledon (@Wimbledon) July 7, 2022 "I have no idea, I'm The Minister of Happiness" 😀 A very diplomatic answer from our first-time Wimbledon finalist, @Ons_Jabeur pic.twitter.com/ZPGFTE8WIY — Wimbledon (@Wimbledon) July 7, 2022 -
Wimbledon 2022: గెలిచినా నిష్క్రమించిన నాదల్.. ఎందుకంటే!
Rafael Nadal: పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్న స్పానిష్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వింబుల్డన్ సెమీఫైనల్ నుంచి తప్పుకున్నాడు. క్వార్టర్స్‌లో కూడా గాయంతోనే బాధపడుతూ ఆడిన అతనికి కండరాల్లో 7 మిల్లీమీటర్ల చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో సెమీస్ ఆడరాదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో దాంతో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుకు న్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే మరో సెమీస్‌లో జొకోవిచ్ (సెర్బియా)తో నోరీ (బ్రిటన్)తో తలపడతాడు. ఇందులో గెలిచిన ఆటగాడు కిరియోస్తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటాడు. కాగా గతంలో నాదల్ రెండుసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం 25 shots of pure tennis theatre 🎭@RafaelNadal 🤝 @Taylor_Fritz97#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/KwZg3hpOye — Wimbledon (@Wimbledon) July 6, 2022 -
వింబుల్డన్‌కు గుడ్‌బై.. భావోద్వేగ నోట్ షేర్ చేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో ఓడిన సానియా మీర్జా భావోద్వేగంతో ఒక నోట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 2015 మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్‌ను సానియా గెలుచుకుంది. అయితే సానియా తన కెరీర్లో ఇప్పటి వరకు వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక తన టెన్నిస్ కెరీర్లో ఆరు సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా సానియా నిలిచింది. ఇక డబ్ల్యూటీఏ సర్క్యూట్లో తనకిదే చివరి ఏడాది ఇంతకుముందు సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. "క్రీడలు మీ నుంచి చాలా తీసుకుంటాయి. క్రీడలు మనల్ని మానసికంగా, శారీరకంగా అలసటకు గురి చేస్తాయి. గంటల తరబడి కష్టపడి ఓడిపోయిన తర్వాత నిద్రలేని రాత్రులు మిగులుతాయి. కానీ ఇవన్నీ చాలా ప్రతిఫలాన్ని ఇస్తాయి.. ఏ ఇతర ఉద్యోగాలు ఇలాంటివి ఇవ్వలేవు. అందువల్ల నేను ఎప్పటికీ క్రీడలకు కృతజ్ఞరాలునే. కన్నీళ్లు,పోరాటం, ఆనందం నా క్రీడా జీవితంలో భాగం. వింబుల్డన్‌లో ఆడడం ఒక అద్భుతం. ఈసారి వింబుల్డన్‌లో ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. ఇక గత 20 ఏళ్లుగా వింబుల్డన్‌లో ఆడడం గౌవరంగా భావిస్తున్నాను. ఐ విల్ మిస్ యూ ’’ అని సానియా పేర్కొంది. చదవండి: IND-W Vs SL-W: అఖరి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్ View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
Wimbledon 2022: ముగిసిన సానియా పోరాటం.. సెమీస్‌లో నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది.కెరీర్లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఒక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలుకనుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్‌గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వివరాలు.. మిక్స్డ్ డబుల్స్: 2009 ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్: 2015 వింబుల్డన్ 2015 యూఎస్ ఓపెన్ 2016 ఆస్ట్రేలియా ఓపెన్ చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం -
Wimbledon 2022: జకోవిచ్ అద్భుత పోరాటం.. 11వ సారి సెమీస్‌కు అర్హత
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ (సెర్బియా) 3 గంటల 35 నిమిషాల్లో 5–7, 2–6, 6–3, 6–2, 6–2తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల మ్యాచ్‌ల్లో జకోవిచ్ తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4, 6–2, 7–6 (8/6)తో జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్, 34 ఏళ్ల తాత్యానా మరియా (జర్మనీ) 4–6, 6–2, 7–5తో తన దేశానికే చెందిన జూల్ నిమియెర్పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. -
వింబుల్డన్‌లో సంచలనం.. సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ
లండన్: వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో జతకట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతో పాటు పవర్ఫుల్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్‌లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్-నీల్ స్కుప్స్కీ.. ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో-రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనుంది. కెరీర్లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలిసారి సెమీస్‌లోకి ప్రవేశించడంతో కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావిస్తుంది. కాగా, ఈ టోర్నీ మహిళల డబుల్స్‌లోనూ పాల్గొన్న సానియా.. తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్‌లో 13వసారి..! -
ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్‌లో 13వసారి..!
లండన్: వరుసగా నాలుగోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 4–6, 6–1, 6–2తో టిమ్ వాన్ రితోవెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఆరుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్ 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ నిక్ కిరియోస్ 4–6, 6–4, 7–6 (7/2), 3–6, 6–2తో నకషిమా (అమెరికా)పై నెగ్గి 2014 తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–1, 6–4తో కుబ్లెర్ (ఆస్ట్రేలియా)పై, క్రిస్టియన్ గారిన్ (చిలీ) 2–6, 5–7, 7–6 (7/3), 6–4, 7–6 (10–6)తో డిమినార్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తొలిసారి తమ కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందారు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిసియా), రిబాకినా (కజకిస్తాన్), అని సిమోవా (అమెరికా), తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలి యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
క్వార్టర్స్‌లో సానియా జంట
లండన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో రౌండ్లో డోడిగ్ (క్రొయేషియా)–లటీషా చాన్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి సానియా–పావిచ్ (క్రొయేషి యా) జంటకు వాకోవర్‌లభించింది. -
స్వియాటెక్ ముందంజ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ ఇగా స్వియటెక్ (పోలండ్) 6-4, 4-6, 6-3తో లెస్లీ కెర్కోవ్ (నెదర్లాండ్స్)పై గెలుపొందగా, అన్‌సీడెడ్ కెటీ బౌల్టర్ (ఇంగ్లండ్) 3-6, 7-6 (7/4), 6-4తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చింది. నాలుగో సీడ్ పౌలా బడొసా (స్పెయిన్) 6-3, 6-2తో ఇరినా (రొమేనియా)పై, 12వ సీడ్ ఒస్టాపెంకొ (లాత్వియా) 6-2, 6-2తో విక్మయేర్ (బెల్జియం)పై అలవోక విజయం సాధించారు. మరో వైపు పురుషుల విభాగంలో రెండు సార్లు చాంపియన్ (2013, 2016), బ్రిటన్ స్టార్ అండీ ముర్రే ఈ సారి రెండో రౌండ్‌తోనే సరిపెట్టుకున్నాడు. ముర్రే 4-6, 6-7 (4/7), 7-6 (7/3), 4-6తో 20వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6-4, 6-4, 4-6, 3-0తో రికార్డస్ బెరంకిస్ (లిథువేనియా)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-2, 6-3, 7-5తో జోర్డాన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 16వ సీడ్ సిమోన హలెప్ (రొమేనియా) 7-5, 6-4తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై, 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో అన బొగ్దన్ (రొమేనియా)పై గెలుపొందారు. చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం -
పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..!
లండన్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా దిగ్గజం ఏడాది తర్వాత పునరాగమనం చేసిన టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. గత సంవత్సరం జూన్ 29న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన 40 ఏళ్ల సెరెనా ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టలేదు. ఏడాది తర్వాత వింబుల్డన్ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. ప్రపంచ 115వ ర్యాంకర్ హార్మనీ టాన్ (ఫ్రాన్స్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో సెరెనా 5–7, 6–1, 6–7 (7/10)తో ఓడిపోయింది. 3 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ సెరెనా 54 అనవసర తప్పిదాలు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను 17 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఆరుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న హార్మనీ... సెరెనా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక టైబ్రేక్‌లో సంయమనం కోల్పోకుండా ఆడిన హార్మనీ తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించింది. తనకిదే చివరి వింబుల్డన్ టోర్నీనా కాదా అనేది చెప్పలేనని, ఆగస్టు–సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొంటానని సెరెనా వ్యాఖ్యానించింది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో (2018, 2019–వింబుల్డన్; 2018, 2019–యూఎస్ ఓపెన్) ఫైనల్‌కు చేరుకున్నా నాలుగింటిలోనూ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సంచలనాల మోత వింబుల్డన్ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. రెండో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా), తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), పదో సీడ్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. జూలీ నిమియెర్ (జర్మనీ) 6–4, 6–0తో కొంటావీట్‌పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–3తో 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ రాడుకానూపై, గ్రీట్ మినెన్ (బెల్జియం) 6–4, 6–0తో 2017 వింబుల్డన్ విజేత ముగురుజాపై గెలిచి మూడో రౌండ్‌కు చేరారు. రూడ్ అవుట్... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బి యా) 6–1, 6–4, 6–2 తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 2–6, 5–7, 4–6తో హంబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 3 గంటల 13 నిమిషాల్లో 6–4, 3–6, 5–7, 6–0, 6–2తో మునార్ (స్పెయిన్)పై, 22వ సీడ్ బాషిలాష్విలి (జార్జియా) 7–6 (9/7), 0–6, 7–5, 7–6 (7/5)తో క్వెన్టిన్ హెల్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. చదవండి: Malaysia Open 2022: సింధు ముందుకు.. సైనా ఇంటికి -
23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ
23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత, సెవెన్ టైమ్ వింబుల్డన్ ఛాంపియన్ సెరీనా విలియమ్స్‌కు వింబుల్డన్-2022లో ఘోర పరాభవం ఎదురైంది. ప్రపంచ 115 ర్యాంకర్, ఫ్రాన్స్ క్రీడాకారిణి హార్మొనీ టాన్ చేతిలో తొలి రౌండ్లోనే ఆమె ఓటమిపాలైంది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 5-7, 6-1, 6-7 (7)తో ఓటమిపాలై అభిమానులను దారుణంగా నిరాశపర్చింది. అయితే ఓటమి బాధను దిగమింగుతూ ఆమె మైదానంలో ప్రదర్శించిన హావభావాలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి. పరాజయం అనంతరం సెరీనా చిరునవ్వులు చిందిస్తూ గ్రాస్ కోర్టును వీడటం టెన్నిస్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. "She's beaten a legend."After three hours, 10 minutes, Harmony Tan beats Serena Williams in a first round epic#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/IQst8AzXxv— Wimbledon (@Wimbledon) June 28, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తోనే వింబుల్డన్ అరంగేట్రం చేసిన హార్మొనీ టాన్ అద్భుతమై పోరాటపటిమ కనబర్చి దిగ్గజ క్రీడాకారిణిని మట్టికరిపించింది. పవర్ గేమర్పై గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ మ్యాచ్ అనంతరం టాన్ భావోద్వేగానికి లోనైంది. కాగా, సెరీనా గతేడాది వింబుల్డన్‌లోనూ మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా ఆమె వింబుల్డన్ 2021 నుంచి రిటైర్డ్ హార్ట్‌గా వైదొలిగింది. చదవండి: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు
వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్‌కు శుభారంభం లభించింది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్ సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో కనీసం 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి పురుష ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ పురుష ఆటగాడు ఈ ఫీట్‌ను సాధించింది లేదు. కాగా, గతేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (యూఎస్ ఓపెన్ మినహా) సాధించిన జకోవిచ్.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకో.. వింబుల్డన్‌లో వరుసగా నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. జకో రెండో రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన థనాసి కొక్కినాకిస్తో తలపడాల్సి ఉంది. చదవండి: Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్ -
Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్
Novak Djokovic : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రముఖ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ పట్టు వీడడం లేదు. ప్రాణం పోయినా తాను వ్యాక్సిన్ వేసుకునే ప్రసక్తే లేదని మరోసారి తెగేసి చెప్పాడు. ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు వేదిక అయిన యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసిన నేపథ్యంలో జకో ఈ మేరకు స్పందించాడు. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగేందుకైనా సాహసిస్తాను కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోనని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఇష్టం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం సహేతుకం కాదని వివరించాడు. వ్యాక్సిన్ వేయించుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, అలా అని తాను వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ బరిలో ఉన్న జకో.. ఇవాళ (జూన్ 27) తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇదిలా ఉంటే, గతేడాది మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్ సహా) నెగ్గిన జకోవిచ్ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం జకో ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. చదవండి: Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి -
Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ నేడు ప్రారంభంకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సోమవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో కొరియా ప్లేయర్ సూన్‌వూ క్వాన్‌తో ఆడనున్నాడు. ఈ సీజన్లో తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన స్పెయిన్ స్టార్ నాదల్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. అయితే నాదల్కు ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ నుంచి అసలు సవాలు ఎదురుకానుంది ‘డ్రా’ ప్రకారం వీరిద్దరు ఫైనల్లో తలపడే అవకాశముంది. మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత ఈ టోర్నీతో పునరాగమనం చేయనుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే వైదొలిగింది. అనంతరం ఆమె సింగిల్స్ విభాగంలో ఏ టోర్నీలోనూ ఆడలేదు. -
నేను రష్యన్‌ను కాను.. నన్ను వింబుల్డన్ ఆడనివ్వండి..!
Natela Dzalamidze: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో ఓ టెన్నిస్ క్రీడాకారిణి తన కెరీర్ కోసం రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్-2022 పాల్గొనేందుకు రష్యాకు చెందిన నటేల జలమిడ్జే ఏకంగా తన జాతీయతను మార్చుకోవాలని డిసైడైంది. తాను రష్యన్ కాదని.. జార్జియా తరఫున ఆడతానని నటేల వింబుల్డన్ నిర్వాహకులను మొరపెట్టుకుంది. Tennis player Natela Dzalamidze, who was born in Moscow, will be able to get around the ban on Russians at Wimbledon this year Because she now represents the country of Georgia https://t.co/DySjBJtdIz — Bloomberg UK (@BloombergUK) June 20, 2022 రష్యా ఆటగాళ్లెవరూ వింబుల్డన్‌లో పాల్గొనడానికి వీళ్లేదని టోర్నీ నిర్వహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో నటేల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల నటేల అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకుంది. కాగా, ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను, ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సహా తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు ఇదివరకే వెలివేసిన (నిషేధం) విషయం తెలిసిందే. చదవండి: కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..! -
రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం అన్యాయం.. నదాల్, జకో, ముర్రే
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది. కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్‌పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది. చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం.. -
హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. 2014 వింబుల్డన్ లేడీస్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను గోయెంకా ట్విటర్లో రీట్వీట్ చేశారు. ఈ మిలియన్ డాలర్ల వీడియో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. 2014లో జరిగిన వింబుల్డన్ మహిళల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ మ్యాచ్‌లో టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్ ఒక్సానా కలష్నికోవా, ఓల్గా సావ్చుక్తో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి సర్వీస్‌ను ఎదుర్కొనే క్రమంలో వీనస్ వాలీ షాట్‌ను సెరెనా బ్యాలెన్స్ చేస్తూ బేస్లైన్పై పరుగెత్తుతూ పక్కనే ఉన్న ప్రేక్షకులపై పడపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ప్రేక్షకులలో ఒకరు ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్నవారిలో నవ్వులు పూయించింది. అంతేకాదు ‘వావ్.. వాట్ ఏ లక్కీమాన్’అంటూ చమత్కరిస్తున్నారు. అతని టిక్కెట్ ధరకి చాలా విలువ వచ్చింది ఇలాంటి అదృష్టం లక్షల్లో ఒకరికే అంటూ అసూయపడుతున్నారు. కాగా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే గోయెంకా తరచుగా అనేక విషయాలపై స్పందిస్తూ పలు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు Fun clip from Wimbledon. That's why it's said that the front seat is always expensive 🤣😂😅😜. #tennis #wimbledon #fun #moment #cute #humour #smile @hvgoenka pic.twitter.com/k9062DNvBi — Tarana Hussain (@hussain_tarana) August 30, 2021 -
వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
లండన్: వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. విషయంలోకి వస్తే.. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్పద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది. -
వైరల్ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్ బహుమానం..!
లండన్: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వింబుల్డన్ గెలిచిన తరువాత జొకోవిచ్ ఓ చిన్నారి అభిమానికి తన రాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. స్టేడియంలోని చిన్నారి పట్టుకున్న ఓ పోస్టర్లో నోవాక్ జొకోవిచ్ పేరుతో పాటు.. అత్యుత్తమ, విజయవంతమైన, ప్రతిష్టాత్మక ప్రపంచ నెంబర్1 అని రాసి ఉంది. వింబుల్డన్ అధికారిక హ్యాండిల్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. "అందమైన చిన్నారి" అంటూ సోమవారం జొకోవిచ్ షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.2 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అలాగే 2.32 లక్షల మంది లైక్ కొట్టగా.. వేలమంది కామెంట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ అందుకే జొకోవిచ్ వింబుల్డన్ నెం1 ఆటగాడయ్యాడు.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) -
జొకోవిచ్ జైత్రయాత్ర
లండన్: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్–20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్‌లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. తొలి సెట్ కోల్పోయినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న బెరెటిని ఆరంభంలో తడబడ్డాడు. కెరీర్లో 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ నాలుగో గేమ్‌లో బెరెటిని సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే జోరు కొనసాగించి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నెమ్మదిగా తేరుకున్న బెరెటిని వరుసగా మూడు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బెరెటిని పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోయినా అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని బెరెటిని ఆశలను వమ్ము చేశాడు. జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (9): 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 ఫ్రెంచ్ ఓపెన్ (2): 2016, 2021: వింబుల్డన్ (6): 2011, 2014, 2015, 2018, 2019, 2021 యూఎస్ ఓపెన్ (3): 2011, 2015, 2018 -
Wimbledon 2021: తొలిసారి టైటిల్ నెగ్గిన క్రొయేషియన్ జోడీ
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ క్రొయేషియా ద్వయం 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్ గ్రానోల్లర్స్(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై విజయం సాధించింది. దీంతో వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్ జోడీగా మెక్టిక్-పావిక్ జోడీ చరిత్ర సృష్టించింది. కాగా, మెక్టిక్-పావిక్ జంటకు ఈ సీజన్లో ఇది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం. ఇదిలా ఉంటే, 2018 ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్‌ను వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందిన పావిక్‌కు.. మెక్టిక్‌తో కలిసి ఇదే తొలి టైటిల్. మరోవైపు మెక్టిక్కు మాత్రం ఇదే తొలి గ్రాండ్‌స్లామ్. ఈ క్రొయేషియా జోడీ టోక్యో ఒలింపిక్స్‌లోనూ జంటగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు, శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్)-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం) జోడీ 6-3, 5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించి వింబుల్డన్ 2021 మహిళల డబుల్స్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకుని దిగ్గజ ఆటగాళ్లైన రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సరసన నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్.. తుది పోరులో ఏడో సీడ్ ఇటలీ ఆటగాడు మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. -
Wimbledon: బార్టీ క్వీన్...
లండన్: పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్‌కు ముందు బార్టీ తెలిపింది. ‘హౌస్‌ఫుల్’ సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో 25 ఏళ్ల బార్టీ తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించింది. విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బార్టీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్‌గా నిలిచింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. తొలి సెట్లో రెండో గేమ్‌లో, నాలుగో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌లను బ్రేక్ చేసిన బార్టీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బార్టీ దూకుడు... ప్లిస్కోవా పేలవమైన ఆటతీరు చూశాక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఒక్క గేమ్ అయినా గెలుస్తాందా అనే అనుమానం కలిగింది. అయితే ప్లిస్కోవా ఆట నెమ్మదిగా గాడిలో పడటంతో ఐదో గేమ్‌లో ఆమె బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి గేమ్ గెలిచింది. ఆ వెంటనే ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ 5–1తో ముందంజ వేసింది. అదే జోరులో బార్టీ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో ప్లిస్కోవా తన లోపాలను సరిదిద్దుకొని బార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. పలుమార్లు స్కోరు సమమయ్యాక చివరికు సెట్ టైబ్రేక్ వరకు వెళ్లింది. టైబ్రేక్‌లో ప్లిస్కోవా పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్లిస్కోవా కోలుకునే ప్రయత్నం చేసినా బార్టీ దూకుడైన ఆటముందు ఆమె నిలువలేకపోయింది. బార్టీ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో ప్లిస్కోవా కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ నెట్‌కు తగలడంతో బార్టీ విజయం ఖాయమైంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణి బార్టీ. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ఫైనల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ శుక్రవారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కలను మీరు మరింత ప్రత్యేకం చేశారు. –బార్టీ -
Wimbledon 2021: ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ వింబుల్డన్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి, వరల్డ్ నంబర్‌వన్ ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 6-3, 6-7(4/7), 6-3 తేడాతో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇది బార్టీకి తొలి వింబుల్డన్ టైటిల్ కాగా, రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. అంతకుముందు 2019ఫ్రెంచ్ ఓపెన్‌లో బార్టీ విజేతగా అవతరించగా, ఆ తర్వాత ఇదే ఆమెకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పోరులో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన బార్టీ అంచనాలు తగ్గట్టు ఆడుతూ టైటిల్‌ను సాధించింది. తుదిపోరులో తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన బార్టీకి రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండో సెట్‌ను ప్లిస్కోవా దక్కించుకోగా, టైటిల్ నిర్ణయాత్మక మూడో సెట్లో బార్టీ మళ్లీ విజృంభించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా వింబుల్డన్ టైటిల్‌ను గెలవక పోగా, ఆ రికార్డును బార్టీ 41 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. -
చిన్న ఫోటో ఖరీదు రూ.1.3 కోట్లు!
ఆండీ ముర్రే 2013లో వింబుల్డన్ గెలిచిన క్షణానికి సంబంధించిన ఫోటోను నాన్-ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ)గా సోమవారం వేలంలో $177,777(సుమారు రూ. 1.3 కోట్లు)కు విక్రయించారు. స్కాటిష్ టెన్నిస్ స్టార్ గత నెలలో తన వింబుల్డన్ విజయానికి గుర్తుగా దిగిన ఈ ఫోటోను బ్లాక్ చైన్ ఆధారిత ఎన్ఎఫ్టీ రూపంలో వీన్యూ అనే వేదికపై అమ్మకానికి ఉంచినట్లు ప్రకటించారు. ఎన్ఎఫ్ టి అనేది క్రిప్టోకరెన్సీ లాగా ఒక రకమైన డిజిటల్ ఆస్తి. కొనుగోలుదారుడు మాత్రమే ఆ ఎన్‌ఎఫ్‌టీపై యాజమాన్య హక్కును పొందగలడు. ఆండీ ముర్రే 2013లో గెలిచిన వింబుల్డన్ "క్షణాన్ని" కొనుగోలుదారుడు వీడియో కాపీరైట్ ను కలిగి ఉండడు. కానీ దానిని చూపించడానికి ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ను పొందుతారు. అమెరికన్ డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ మార్చిలో ఒక కళాఖండాన్ని ఎన్ఎఫ్టీ రూపంలో 69.3 మిలియన్ డాలర్లకు(సుమారు రూ. 514 కోట్లు) విక్రయించినప్పుడు తాను మొదటి సారి ఎన్ఎఫ్టీ గురించి తెలుసకున్నట్లు ముర్రే చెప్పారు. బీపుల్ అనే వ్యక్తి వెన్యూ వ్యవస్థాపకుల్లో ఒకరు. "నేను ఇంకా ఎన్ఎఫ్టీల గురించి నేర్చుకుంటున్నాను, కానీ ఇది ఒక ఉత్తేజకరమైన ప్రాంతంగా అనిపిస్తుంది. మరింత మంది అథ్లెట్లు, కంటెంట్ సృష్టికర్తలు దీనిలో పాల్గొంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ముర్రే ఈ-మెయిల్ ద్వారా రాయిటర్స్ కు చెప్పారు. -
39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ఓపెన్ ఎరాలో ఒకే ఒక్కడు
లండన్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ విన్నర్(20), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) అరుదైన రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వయసులో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టోర్నీలో ఇటలీకి చెందిన లోరెంజో సొనేగాపై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆటగాడు ఫెదరర్ మాత్రమే కావడం విశేషం. కాగా, ఈ స్విస్ యోధుడు మరో ఐదు వారాల్లో 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆరవ సీడ్ రోజర్ ఫెదరర్ 7-5, 6-4, 6-2తో లోరెంజో సొనేగా (ఇటలీ)పై అలవోకగా విజయం సాధించాడు. మోకాలి సర్జరీ కారణంగా ఇటీవలి కాలంలో ఫామ్‌ను కోల్పోయిన ఫెడెక్స్.. గ్రాస్ కోర్టుపై మాత్రం చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో అతను వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో 18వ సారి క్వార్టర్స్‌కు చేరాడు. ఫెదరర్ తన తర్వాతి మ్యాచ్‌లో డానియల్ మెద్వెదెవ్ లేదా హుబెర్ట్ హుర్కాజ్తో తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగల్స్ విభాగంలో టాప్ సీడ్ జకోవిచ్, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదోసీడ్ షపొవలోవ్ (కెనడా), కచనోవ్ (రష్యా), ఫుక్సోవిచ్ (హంగేరి) కూడా ప్రీక్వార్టర్స్‌ను అధిగమించారు. ఇక మహిళల విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ, రెండో సీడ్ సబలెంక (బెలారస్), ఆన్స్ జబేర్ (ట్యునీషియా), కెర్బర్ (జర్మనీ), ముచోవా (చెక్), గొల్బిచ్ (స్విట్జర్లాండ్)లు క్వార్టర్స్‌కు చేరారు. -
ప్రిక్వార్టర్స్‌లో సానియా–బోపన్న జంట
లండన్: నాలుగేళ్ల విరామం తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్‌కే చెందిన రోహన్ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 6–3, 6–1తో ఐడన్ మెక్‌హగ్–ఎమిలీ వెబ్లీస్మిత్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీ స్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)లతో సానియా–బోపన్న ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో భార్యాభర్తలైన దివిజ్ శరణ్ (భారత్)–సమంత ముర్రే శరణ్ (బ్రిటన్) జోడీ 6–3, 6–7 (1/7), 3–6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–దరియా జురాక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది. మెద్వెదేవ్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) అద్భుత పోరాటపటిమ కనబరిచి గట్టెక్కాడు. మూడో రౌండ్లో మెద్వెదేవ్ 6–7 (3/7), 3–6, 6–3, 6–3, 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ 3 గంటల 36 నిమిషాల్లో గెలుపొందాడు. తొలి రెండు సెట్లు చేజార్చుకున్నాక మెద్వెదేవ్ కోలుకున్నాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 16 ఏస్‌లు సంధించిన మెద్వెదేవ్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. బార్టీ ముందంజ... మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో బార్టీ 6–3, 7–5తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. గంటా 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మంగళవారం నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల నుంచి వంద శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నట్లు... ఈ మేరకు ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు కేవలం పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లకే వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. -
బూట్లు మరిచిపోయి కోర్టులోకి ఎంట్రీ.. ఆడుకున్న నెటిజన్లు
లండన్: వింబుల్డన్ 2021లో భాగంగా శనివారం జరిగిన ఓ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ ఫెలిక్స్, కెనెడా ఆటగాడు 16వ సీడ్ అగర్ అలియాస్సిమ్ మధ్య జరగాల్సిన మూడో రౌండ్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నిక్ కిర్గియోస్.. తన గ్రాస్ కోర్ట్ బూట్లను లాకర్లో పెట్టి మర్చిపోయి కోర్టులోకి వచ్చేయడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే.. నిక్, తన మూడవ రౌండ్ మ్యాచ్ కోసం అన్నీ సిద్ధం చేసుకుని కోర్టులోకి ఎంటరయ్యాడు. తీరా చూస్తే.. అతను తన గ్రాస్ కోర్ట్ షూస్‌కు బదులు సాధారణ బూట్లతో బరిలోకి దిగాడు. దీంతో వార్మప్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. Special shoe delivery for @NickKyrgios #Wimbledon pic.twitter.com/UUhElrCv4s — Tennis GIFs 🎾🎥 (@tennis_gifs) July 3, 2021 దీనిపై వెంటనే స్పందించిన అతను.. ‘దుస్తులు, రాకెట్లు తనతో పాటు తెచ్చుకుని, బూట్లను మాత్రం లాకర్లో మర్చిపోయాను..’ అంటూ నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళా స్టాఫ్ మెంబర్ నిక్ షూస్ తీసుకుని పరిగెడుతూ అక్కడికి వచ్చింది. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యుద్ధానికి బయల్దేరేముందు కత్తిని మర్చిపోయినట్లు, నిక్ ఆటలో తప్పనిసరిగా తొడుక్కోవాల్సిన షూస్‌ను లాకర్లో మర్చిపోయాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మరికొందరైతే.. ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ కోసం షూస్ స్పెషల్ డెలివరీ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా నిక్ టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. తొలి రౌండ్లో 6-2తో దూసుకొచ్చిన అతను.. ఆతరువాతి రౌండ్‌ను 1-6తో కోల్పోయాడు. ఈ దశలో అతను గాయం బారిన పడటంతో ప్రత్యర్ధికి వాకోవర్ లభించింది. దీంతో అగర్ ప్రీక్వార్టర్స్‌కు ప్రవేశించాడు. -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్
లండన్: ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా ముందడుగు వేస్తున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (9/7)తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటలా 17 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను జొకోవిచ్ అలవోకగానే కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మాత్రం క్వాలిఫయర్ కుడ్లా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఈ సెట్లో తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకున్న కుడ్లా 3–0తో ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే తేరుకున్న జొకోవిచ్ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి... అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 4–4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్ ‘టై బ్రేక్’కు దారి తీసింది. ఇక్కడ కూడా జొకోవిచ్ ఒక దశలో 1–4తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోర్‌ను 4–4 వద్ద సమం చేశాడు. ఇక ఇదే దూకుడులో ‘టై బ్రేక్’ను గెలిచిన జొకోవిచ్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ముగిసిన టియాఫె పోరాటం తొలి రౌండ్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో టియాఫె 3–6, 4–6, 4–6తో కరెన్ కచనోవ్ (రష్యా) చేతిలో ఓడాడు. తొమ్మిదో సీడ్ డియాగో స్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)కు మూడో రౌండ్లో ఊహించని షాక్ తగిలింది. అతను 3–6, 3–6, 7–6 (8/6), 4–6తో అన్‌సీడెడ్ ఆటగాడు మార్టోన్ ఫుక్సోవిక్స్ (హంగేరి) చేతిలో ఓడాడు. మాజీ చాంపియన్ ముగురుజా అవుట్ మహిళల సింగిల్స్‌లో 2017 వింబుల్డన్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)కు చుక్కెదురైంది. మూడో రౌండ్లో ముగురుజా 7–5, 3–6, 2–6తో ఓన్స్ జేబుర్ (ట్యూనీషియా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్), ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్లో సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్లో భారత ద్వయం సానియా మీర్జా– రోహన్ బోపన్న 6–2, 7–6 (7/5)తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్–అంకిత రైనా జంటపై గెలుపొంది రెండో రౌండ్లో ప్రవేశించింది. దివిజ్ శరణ్–సమంత శరణ్ (ఇంగ్లండ్) జోడీ 6–3, 5–7, 6–4 అరియల్ బెహెర్ (ఇజ్రాయెల్)–కలీనా ఒస్కబొయెవా (కజకిస్తాన్) జంటపై నెగ్గింది. -
Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుభారంభం చేసింది. నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. అమెరికా ప్లేయర్ బెతాని మ్యాటెక్ సాండ్స్‌తో కలిసి అద్భుత విజయం సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా- బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో ఆరో సీడ్ అలెక్సా గౌరచి(చిలీ)- డిసారియ క్రాక్జిక్(అమెరికా) జోడీపై వరుస సెట్లలో గెలుపొందింది. గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ అలవోకగా విజయాన్నందుకుంది. సానియా కెరీర్లో ఇది 121 విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో ఆమె ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. సానియా.. వింబుల్డన్‌లో 2017లో చివరిసారిగా బరిలోకి దిగింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఈ మెగా గ్రాండ్‌స్లామ్ టోర్నీ సానియాకు చాలా కీలకంగా మారింది. కెరీర్ చరమాంకంలో ఉన్న 34 ఏళ్ల సానియా.. ఈ వింబుల్డన్‌లో ఎలాగైనా విజయం సాధించి విశ్వక్రీడల బరిలో నిలవాలని ప్లాన్ చేస్తుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించనుంది. ఇదిలా ఉంటే, 2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్గెలిచి సెకండ్ఇన్నింగ్స్ఘనంగా ప్రారంభించిన ఈ పాక్ కోడలు.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. -
జొకోవిచ్ జోరు
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్ 26 అనవసర తప్పిదాలు చేయగా... జొకోవిచ్ ఆరు మాత్రమే చేశాడు. మరోవైపు 11వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 12వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను... జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్‌ను ఓడించారు. సబలెంకా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) రెండో రౌండ్లో... ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్లో సబలెంకా 4–6, 6–3, 6–3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై గెలిచింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్) 6–2, 6–1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్ (స్లొవేనియా) 6–3, 6–3తో బెన్చిచ్పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో మాడిసన్ బ్రెంగల్ (అమెరికా) 6–2, 6–4తో సోఫియా కెనిన్‌ను బోల్తా కొట్టించింది. -
టాప్‌సీడ్‌గా జొకోవిచ్.. ఏడో సీడ్‌గా ఫెడరర్
లండన్: స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్న మెంట్లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఫెడరర్ 8 టైటిల్స్ సాధించాడు. 2019లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ అనంతరం గాయాలతో సతమతమయ్యాడు. దీంతో అతని ఏటీపీ ర్యాంకు పడిపోయింది. కాగా పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ దక్కింది. ప్రపంచ మూడో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ నెల 28 నుంచి వింబుల్డన్ ఓపెన్ జరగనుంది. గతేడాది కరోనా వల్ల ఈ టోర్నీని రద్దు చేశారు. -
నాదల్ బాటలోనే మరో స్టార్ ప్లేయర్
టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదెల్ వింబుల్డన్-2021, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోనని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జపాన్ టెన్నిస్ స్టార్, యువ సంచలనం నయోమి ఒసాకా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడబోనని తెలిపింది. ఈ మేరకు ఒసాకా ఏజెంట్ స్టువర్ట్ డుగుయిడ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె ఆడే అవకాశాలున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. కాగా, వ్యక్తిగత కారణాలతో నయోమి ఒసాకా వింబుల్డన్ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. సన్నిహితులు, కుటుంబంతో కొద్దిరోజులు ఆమె గడపాలనుకుంటోంది. తద్వారా కొత్త ఉత్సహాంతో తర్వాతి టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనే అవకాశాలు కొద్ది రోజుల తర్వాత పరిశీలిస్తాం అంటూ స్టువర్ట్ పేరు మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. చూడండి: జపన్ యువసంచలనం ఫొటోలు ఇదిలా ఉంటే గత నెలలో ఫ్రెంచ్ టోర్నీ నుంచి నాటకీయ పరిణామాల తర్వాత నెంబర్ వన్ ప్లేయర్ నయోమి ఒసాకా వైదొలగిన విషయం తెలిసిందే. మీడియా సమావేశం తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుందని పేర్కొంటూ ప్రెస్ మీట్‌కు ఆమె విముఖత వ్యక్తం చేసింది. ఈ చర్యపై టోర్నీ నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానా విధించడంతో పాటు వేటు హెచ్చరిక చేశారు. అయితే ఈ లోపే 23 ఏళ్ల యువ సంచలనం టోర్నీ నుంచి నిష్క్రమించి టెన్నిస్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఒసాకాకు భారీ ఝలక్ -
క్రికెట్ ప్లేయరా.. టెన్నిస్ ప్లేయరా?
హైదరాబాద్: భారత టెన్నిస్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన హైదరాబాద్ మహిళా స్టార్ ప్లేయర్ సానియా మీర్జా.. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని ప్రజలకు సూచనలు చేస్తూనే సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం లాక్డౌన్ పాటిస్తున్న కొందరు మహిళా సెలబ్రిటీలు వంటలు చేసే ఫోటోలను నెట్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా.. తాజాగా తన ట్వీటర్ అకౌంట్లో కుమారుడు ఇజాన్స్ ఫొటోను పోస్ట్ చేశారు.(జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా) చేతిలో టెన్నిస్ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఇజాన్స్ ఫోటో పెట్టిన సానియా.. ఏమి ఆలోచిస్తున్నాడో కచ్చితంగా చెప్పగలను అంటూ కామెంట్ చేశారు. అయితే దీనికి నెటిజన్లు భిన్నమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ క్రికెటర్ కావడంతో ఇజాన్స్ను ఏమి చేస్తారు అనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. మీ ముద్దుల తనయుడు ఇజాన్స్ను క్రికెటర్ ప్లేయర్ చేస్తారా.. లేక టెన్నిస్ ప్లేయర్ చేస్తారా’ అని ఒక అభిమాని అడగ్గా, మరొక అభిమాని మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎడమ చేతిలో కూడా బ్యాట్ ఉంది’ అని సరదాగా కామెంట్ చేశాడు. ఇక పాకిస్తాన్ పేసర్ వహాబ్ రియాజ్ మాత్రం చాలా క్యూట్‌గా ఉన్నాడని కామెంట్ చేశాడు. సుమారు మూడేళ్ల పాటు సానియా మీర్జా టెన్నిస్‌కు దూరమయ్యారు. ఇజాన్స్కు జన్మనిచ్చే క్రమంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవలే తన రీఎంట్రీ ఇచ్చిన సానియా.. కరోనా వైరస్ కారణంగా మరోసారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలు రద్దు కావడంతో పాటు పలు క్రీడా ఈవెంట్లు కూడా వాయిదాలు పడ్డాయి. I am pretty sure he’s thinking what the fuss is all about ? 😂😏👶🏽🍼 #IzhaanMirzaMalik 🎾 pic.twitter.com/3VSyYLmyj4 — Sania Mirza (@MirzaSania) April 8, 2020 -
‘వింబుల్డన్’కు వెయ్యి కోట్ల బీమా సొమ్ము
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న జూన్‌లో జరగాల్సిన వింబుల్డన్ టెన్నీస్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇందుకుగాను భీమా సౌకర్యం కింద ఈ పోటీలను నిర్వహించే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు 114 మిలియన్ పౌండ్ల (దాదాపు 1,079 కోట్ల రూపాయలు) సొమ్ము అందనుంది. వాస్తవానికి ఆ క్లబ్ పోటీలను నిర్వహించినట్లయితే 250 మిలియన్ డాలర్లు (దాదాపు 23,100 కోట్ల రూపాయలు) వచ్చేవి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలను రద్దు చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాకరమైన ఒలింపిక్స్ పోటీలను కూడా రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్ వచ్చినప్పుడు వింబుల్డన్ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 1.6 మిలియన్ పౌండ్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్నాక 15 ఏళ్ల తర్వాత మొదటి సారి వింబుల్డన్ పోటీలు వాయిదా పడ్డాయి. -
హలెప్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో కొత్త చాంపియన్ అవతరించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్ సిమోనా హలెప్ విజయం సాధించారు. హలెప్ 6-2, 6-2 తేడాతో నల్లకలువ సెరెనా విలియమ్స్‌పై ఏకపక్ష విజయం సాధించి తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడారు. మరొకవైపు రొమేనియా తరఫున తొలి వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న హలెప్.. రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించారు. ఏ దశలోనూ సెరెనాకు అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం దూకుడును ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది హలెప్‌కు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన హలెప్.. ఇప్పుడు తాజాగా వింబుల్డన్‌లో విజేతగా నిలిచారు.దాంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్(24 టైటిల్స్) రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరలేదు. వరుస రెండు సెట్లలో దారుణంగా విఫలమైన సెరెనా విలియమ్స్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. -
వోజ్నియాకీ ఇంటిబాట
లండన్: వింబుల్డన్ టోర్నీలో మాజీ నెం.1, 14వ సీడ్ కరోలిన్ వోజ్నియాకీ(డెన్మార్క్) కథ ముగిసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వోజ్నియాకీ 4–6, 2–6తో ప్రపంచ 50వ ర్యాంకర్ జంగ్(చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 4–6తో షీ వూ హీష్(తైవాన్)పై, ఎనిమిదో సీడ్ ఎలినా స్వితోలినా(ఉక్రెయిన్) 6–3, 6–7(1/7), 6–2తో సక్కరి(గ్రీస్)పై చెమటోడ్చి నెగ్గగా, వరల్డ్ నెం.20 కొంటావీట్(ఎస్తోనియా) 7–6(9/7), 6–3తో ముచుకోవా (చెక్‌రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా) 4–6, 3–6, 6–7(4/7)తో పెల్లా(అర్జెంటీనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మిలాస్ రావోనిక్(కెనడా) 6–7(7/1), 2–6, 1–6తో ఒపెల్కా(అమెరికా)పై, బెన్నెట్ పైర్(ఫ్రాన్స్) 5–7, 7–6(7/5), 6–3, 7–6(7/2)తో వెస్లీ(చెక్‌రిపబ్లిక్)పై చెమటోడ్చి నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. పదో సీడ్ కచనోవ్(రష్యా) 3–6, 6–7(3/7), 1–6తో ప్రపంచ 22వ ర్యాంకర్ బటిస్టా అగట్(స్పెయిన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రిక్వార్టర్స్‌కు దివిజ్ జోడీ పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ జోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దివిజ్(భారత్)–డెమోలైనర్(బ్రెజిల్) ద్వయం 7–6(1) 5–7 7–6(6) 6–4 తో సాండర్ గిల్లీ– జొరాన్ వెలీజెన్(బెల్జియం) జంటపై చెమటోడ్చి నెగ్గింది. కాగా, డబుల్స్‌లో ఇప్పటికే రొహన్ బొపన్న, లియాండర్ పేస్, పురవ్ రాజా, నెడుంజెళియన్ జోడీలు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. -
గాఫ్ సంచలనాల జోరు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ చాంపియన్ షిప్స్‌లో అమెరికా యువ తార కోరి గాఫ్ (అమెరికా) సంచనాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వాలిఫికేషన్ ద్వారా వింబుల్డన్ మెయిన్ డ్రాలో ప్రవేశించి, ఈ రికార్డు సాధించిన తొలి 15 ఏళ్ల అమ్మాయిగా చరిత్ర కెక్కిన గాఫ్... అనంతరం మెయిన్ డ్రాలో ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్, నాలుగు సార్లు రన్నరప్ వీనస్ విలియమ్స్‌ను ఇంటిదారి పట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో రౌండ్లోనూ అదే ఆటతీరును పునరావృతం చేసింది. వరల్డ్ నెం.313 గాఫ్ 6–3, 6–3తో 2017 వింబుల్డన్ సెమీఫైనలిస్టు మగ్దలినా రిబరికోవాపై గెలుపొందింది. తద్వారా 1991 తర్వాత ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్స్‌లో మూడో రౌండ్‌కు చేరిన యువ క్రీడాకారిణిగా మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో తాజా నెం.1, టాప్ సీడ్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) 6–1, 6–3తో వాన్ యుక్వాంత్(బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–0, 6–2తో యఫాన్ వాంగ్(చైనా)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరారు. వోజ్నియాకీ(డెన్మార్క్), హలెప్ (రొమేనియా) కూడా ముందంజ వేశారు. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జకోవిచ్(సెర్బియా), నాలుగో సీడ్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా), జాన్ మిల్మాన్(ఆస్ట్రేలియా) సైతం తదుపరి రౌండ్‌కు చేరారు. -
తొలి సెట్ కోల్పోయినా..
లండన్: సంచలన ఫలితాలతో మొదలైన వింబుల్డన్ రెండో రోజు కూడా అలానే కొనసాగుతుందా అనే రీతిలో సాగింది. 9వ టైటిల్‌పై కన్నేసిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మ్యాచే దీనికి కారణం. తన కెరీర్లోనే మొదటిసారి వింబుల్డన్ ఆడుతోన్న దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల లాయిడ్ హారీస్ చేతిలో కేవలం 28 నిమిషాల్లోనే మొదటి సెట్‌ను ఫెడరర్ కోల్పోయాడు. దీంతో రెండో రోజు కూడా అతి పెద్ద సంచలనం నమోదవుతుందేమోనని అందరూ అనుకున్నారు. అయితే రెండో సెట్ నుంచి తన అసలైన గ్రాస్ కోర్టు ఆటను హారీస్‌కు చూపిస్తూ వరుసగా మూడు సెట్లను గెలిచిన ఫెడరర్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 6–3, 1–6, 2–6, 2–6తో హారిస్‌ను ఓడించాడు. నాదల్ విజయం రెండు సార్లు వింబుల్డన్ విజేత స్పెయిన్ బుల్ నాదల్ 6–3, 6–1, 6–3తో సుగిటా(జపాన్)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకోగా...సెరెనా విలియమ్స్ 6–2, 7–5తో గులియా గుట్టో(ఇటలీ)ను ఓడించి ముందంజ వేసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ తొలి రౌండ్‌తోనే తన కథను ముగించాడు. అమెరికా అన్‌సీడెడ్ ఆటగాడు కొరి చేతిలో 7–6, 6–7, 3–6, 0–6 చేతిలో ఓటమి చెందాడు. మహిళల మొదటి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా(రష్యా) గాయం కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగింది. పౌలిన్ పరమెన్టైర్(ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో ఇరువురు చెరో సెట్‌ను గెలిచారు. నిర్ణయాత్మక మూడో సెట్లో 0–5తో వెనుకబడిన సమయంలో షరపోవా మణికట్టు గాయంతో తప్పుకుంది. బార్టీ అలవోకగా.. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ప్రస్తుత నంబర్ 1 క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్లో 6–4, 6–2తో జెంగ్(చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌లలో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్(జర్మనీ) 6–4, 6–3తో తన దేశానికే చెందిన మరియాపై, 2017 యూఎస్ ఓపెన్ విన్నర్ స్లోన్ స్టీఫెన్(అమెరికా) 6–2, 6–4తో టిమియా బాసిన్స్కీపై గెలుపొందారు. -
వింబుల్డన్: బార్టీ అలవోకగా..
లండన్: ఫ్రెంచ్ ఓపెన్ విజేత, మహిళల సింగిల్స్‌లో తాజా నెం.1 ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో బార్టీ 6–4, 6–2తో జంగ్ (చైనా)పై అలవోకగా గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–2, 6–4తో బిసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) పై, మాజీ నెం.1, ఐదో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–4, 6–3తో మరియ (జర్మనీ)పై, వరల్డ్ నెం.13 బెనిసిచ్ (స్విట్జర్లాండ్) 6–2, 6–3తో పవ్లిచెంకోవా(రష్యా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ నిషికోరి(జపాన్) 6–4, 7–6(7/3), 6–4తో మౌంటెరియో(బ్రెజిల్)పై, నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 7–6(7/4), 3–6, 7–6(12/10), 0–6, 6–1తో తమ దేశానికే చెందిన జె.థాంప్సన్పై చెమటోడ్చి నెగ్గగా, ఐదో సీడ్ డొమెనిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6(7/4), 6–7(1/7), 3–6, 0–6తో అన్ సీడెడ్ క్వెర్రీ(అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. -
జకోవిచ్, హలెప్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ మాజీ నెం.1 సిమోనా హలెప్(రొమేనియా) శుభారంభం చేసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నెం.7 హలెప్ 6–4, 7–5తో సాస్నోవిచ్(బల్గేరియా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను అలవోకగా గెల్చుకున్న హలెప్‌కు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మూడోసీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 6–2, 7–6(7/4)తో జు లాంగ్(చైనా)పై, మాడిసన్ కీస్(అమెరికా) 6–3, 6–2తో ఖుమ్ఖుమ్(థాయ్‌లాండ్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 7–5, 6–0తో గవ్రిలోవా (ఆస్ట్రేలియా)పై గెలిచారు. జకోవిచ్ అలవోకగా.. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.1 నొవాక్ జకోవిచ్ 6–3, 7–5, 6–3తో కొష్లిషెరిబర్ (జర్మనీ)పై అలవోకగా నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. జకోవిచ్‌కు ధాటికి రెండో సెట్లో మినహా ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 6–4, 6–2తో హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై, స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 6–2, 6–2తో బెమెల్మెనాస్ (బెల్జియం)పై గెలుపొందారు. -
15 ఏళ్లకే వింబుల్డన్ బరిలోకి!
లండన్: అమెరికా టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో కొత్త రికార్డు సృష్టించింది. ఓపెన్ శకంలో (1968 నుంచి) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన అతి పిన్న వయస్కురాలిగా (15 ఏళ్ల 122 రోజులు) ఆమె చరిత్ర సృష్టించింది. క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో కోరి గౌఫ్ 6–1, 6–1తో 19వ సీడ్ గ్రీట్ మినెన్ (బెల్జియం)పై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్‌తో కోరి గౌఫ్ తలపడుతుంది. 2009 వింబుల్డన్‌లో బ్రిటన్‌కు చెందిన లారా రాబ్సన్ 15 ఏళ్ల వయసులో మెయిన్ ‘డ్రా’లో ఆడింది. అయితే లారా రాబ్సన్‌కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు ఇచ్చారు. -
ఇక వింబుల్డన్‌లో చివరి సెట్లో టైబ్రేక్‌లు
ఇకపై వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చెల్లుచీటి పడనుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి సెట్లో స్కోరు 12–12 వచ్చాక టైబ్రేక్‌ను ఆడించేందుకు ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ టైబ్రేక్ ఆట మొదలవుతుందని క్లబ్ చైర్మన్ ఫిలిప్ బ్రూక్ వెల్లడించారు. ‘టైబ్రేక్స్ పద్ధతిని ప్రవేశపెట్టే సమయం వచ్చింది. మ్యాచ్‌లకు ఇకపై అసాధారణ ముగింపుల్లేకుండా, నిర్ణీత సమయంలోనే పోటీలు ముగిసేందుకు ఈ టైబ్రేక్స్ దోహదపడతాయి’ అని ఆయన అన్నారు. ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్ జరుగుతుండగా... ఒక్క యూఎస్ ఓపెన్లోనే మ్యాచ్ చివరి సెట్లో టైబ్రేక్స్ను నిర్వహిస్తున్నారు. -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న : బిడ్డతల్లి అయ్యాక మీరు సరిగా ఆడడం లేదు. కాన్పుకోసం తీసుకున్న విరామం తర్వాత మీకన్నీ అపజయాలే. ఇటీవల మరియ షరపోవాతో ఆటను స్కిప్ చేశారు. అక్కడ తప్పించుకున్నా, వింబుల్డన్ ఫైనల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్లు్య.టి.ఎ. శాన్ జోస్ ఈవెంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. షాక్ తిన్నట్లనిపిస్తోందా? సెరెనా విలియమ్స్ : నాకు తెలీదు. నా మదిలో అనేక అలోచనలు ఉంటాయి. ఓడిపోయినందుకు షాక్ తినేంత సమయం నాకు ఉండదు. -
చాంపియన్స్ డ్యాన్స్...
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ చాంపియన్స్‌కు అధికారికంగా నిర్వహించిన విందు కార్యక్రమంలో కలిసి నృత్యం చేస్తున్న పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు నొవాక్ జొకోవిచ్, ఎంజెలిక్ కెర్బర్. -
‘ఆ సమయంలో నా భార్యను చూసి..’
లండన్: గతేడాది తన బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సెరెనా విలియమ్స్ చనిపోతుందేమోనని భయపడ్డానని ఆమె భర్త అలెక్సిస్ ఒహానియన్ తెలిపారు. ‘నా బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేయించుకునేందుకు వెళ్తున్న నా భార్య సెరెనాకు ముద్దిచ్చి గుడ్‌బై చెప్పాను. అప్పుడామె ప్రాణాలతో తిరిగొస్తుందో లేదో మాకెవరికీ తెలియదు. ఆమె బతకాలని కోరుకున్నాం. ఆ తర్వాత 10 నెలలకే ఆమె వింబుల్డన్ ఫైనల్ చేరింది. సెరెనా విలియమ్స్ త్వరలోనే ట్రోఫీ అందుకుంటుంది. ఒక గొప్ప ఘనతను మళ్లీ ఆమె ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకుంటోంది’ అని ఒహానియన్ ట్వీట్ చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో రక్తం గడ్డకట్టకుండా సెరెనా శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సమయంలో సెరెనా ఆరోగ్యంపై తీవ్రంగా కలత చెందిన విషయాన్ని తాజాగా ఒహానియన్ స్పష్టం చేశారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్‌లో సెరెనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎంజెలిక్ కెర్బర్తో జరిగిన తుదిపోరులో సెరెనా ఓటమి చెందింది. -
నాదల్కు జొకోవిచ్ షాక్
ఇద్దరు మాజీ చాంపియన్స్ మధ్య సుదీర్ఘంగా సాగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పైచేయి సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో 12వ సీడ్ జొకోవిచ్ 6–4, 3–6, 7–6 (11/9), 3–6, 10–8తో గెలుపొందాడు. 5 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 23 ఏస్‌లు సంధించి, నాదల్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో జొకోవిచ్ తలపడతాడు. 2011, 2014, 2015లలో జొకోవిచ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలువగా... అండర్సన్ తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. శుక్రవారమే నాదల్, జొకోవిచ్ సెమీఫైనల్ ముగియాల్సింది. అయితే అండర్సన్, జాన్ ఇస్నెర్ (అమెరికా) మధ్య తొలి సెమీఫైనల్ 6 గంటల 36 నిమిషాలపాటు సాగడంతో నాదల్, జొకోవిచ్ రెండో సెమీఫైనల్ ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు రాత్రి 11 తర్వాత ఆటను నిలిపివేయాలని వింబుల్డన్ టోర్నీ నిబంధనలు చెబుతున్నాయి. అప్పటికి జొకోవిచ్ 6–4, 3–6, 7–6 (11/9)తో ఆధిక్యంలో ఉండటం... ఫలితం రాకపోవడంతో మ్యాచ్‌ను శనివారం కొనసాగించారు. -
వింబుల్డన్ ‘క్వీన్’ కెర్బర్
ఒకవైపు టాప్–10 సీడెడ్ క్రీడాకారిణులు క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిదారి పట్టగా... మరోవైపు తొలి రౌండ్ నుంచి నిలకడగా ఆడిన మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ టైటిల్ పోరులోనూ అదరగొట్టింది. 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో కెర్బర్ 65 నిమిషాల్లోనే విజయగర్జన చేసింది. తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని దక్కించుకుంది. లండన్: రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది. 11వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ అద్భుత ఆటతీరుతో సెరెనా ఆట కట్టించింది. శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కెర్బర్ 6–3, 6–3తో 36 ఏళ్ల సెరెనాను ఓడించింది. ఈ క్రమంలో స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన కెర్బర్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్ సెరెనాకు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోయిన కెర్బర్ అంతిమ పోరులో మాత్రం ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా స్కోరును 2–2తో సమం చేసింది. కానీ కెర్బర్ మళ్లీ పుంజుకొని ఏడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ కెర్బర్ తన జోరు కొనసాగించగా... సెరెనా డీలా పడిపోయింది. విశేషాలు కెర్బర్ సెరెనా 1 ఏస్‌లు 4 1 డబుల్ ఫాల్ట్‌లు 2 2/6 నెట్ పాయింట్లు 12/24 4/7 బ్రేక్ పాయింట్లు 1/1 11 విన్నర్స్ 23 5 అనవసర తప్పిదాలు 24 56 మొత్తం పాయింట్లు 45 -
6 గంటల 35 నిమిషాలు...
లండన్: కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని జాన్ ఇస్నెర్ (అమెరికా)... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)... ఈ నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. చివరకు అండర్సన్ గెలుపొందగా... ఓడినా జాన్ ఇస్నెర్ తన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. 6 గంటల 35 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ అండర్సన్ 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో తొమ్మిదో సీడ్ ఇస్నెర్‌పై గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అండర్సన్ తలపడతాడు. మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణం నుంచి చివరి క్షణం వరకూ ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు, ప్రతీ గేమ్‌కు కొదమ సింహాల్లా పోరాడారు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు క్లెమెంట్ (ఫ్రాన్స్), సాంతోరో (ఫ్రాన్స్) పేరిట (ఫ్రెంచ్ ఓపెన్–2004 తొలి రౌండ్; 6 గంటల 33 నిమిషాలు) ఉంది. ఇక టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ కూడా వింబుల్డన్‌లోనే నమోదైంది. 2010 టోర్నీలో జాన్ ఇస్నెర్, మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఏకంగా 11 గంటల 5 నిమిషాలు సాగింది. ఆ మ్యాచ్‌లో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో గెలిచాడు. ప్రస్తుత సెమీస్‌లో ఇద్దరూ చెరో రెండో సెట్లు గెలిచాక నిర్ణాయక ఐదో సెట్లో ఎవరూ వెనక్కి తగ్గకుండా ఆడటంతో ఎలాంటి బ్రేక్ పాయింట్లు లేకుండా సెట్ సాగుతూపోయింది. చివరకు 49వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించి, తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని గెలిచాడు. -
‘రాజు’ కూలె పచ్చికపై...
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. వింబుల్డన్ పచ్చిక కోర్టులపై అద్వితీయ రికార్డు కలిగిన ఈ డిఫెండింగ్ చాంపియన్ ప్రస్థానం ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఎనిమిదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ 6–2, 7–6 (7/5), 5–7, 4–6, 11–13తో ఓడిపోయాడు. 4 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 8 అంగుళాల పొడవు, 92 కేజీల బరువున్న అండర్సన్ 28 ఏస్‌లు సంధించి, 65 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు తొలి రెండు సెట్లు గెలిచి... మూడో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి... అండర్సన్ సర్వీస్‌లో మ్యాచ్ పాయింట్ సంపాదించిన ఫెడరర్ బ్యాక్‌హ్యాండ్ షాట్ బయటకు కొట్టి విజయం సాధించే సువర్ణావకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత అండర్సన్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. అనంతరం ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని మూడో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్లో ఒకసారి ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అండర్సన్ అదే జోరులో ఈ సెట్‌నూ దక్కించుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌కూ హోరాహోరీగా పోరాడారు. చివరకు ఫెడరర్ సర్వీస్ చేసిన 23వ గేమ్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించాడు. అనంతరం తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని సంచలన విజయం దక్కించుకున్నాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్ మ్యాచ్ పాయింట్ సంపాదించాక ఓడిపోవడం ఇదే తొలిసారి. కెవిన్ కరెన్ (1983లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. జొకోవిచ్ జోరు... మరో క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 3–6, 6–2, 6–2తో నిషికోరి (జపాన్)పై గెలిచి 2015 తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
శ్రమించి గెలిచిన సెరెనా
లండన్: అమ్మ హోదా వచ్చాక ఆడుతున్న రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్ సెరెనా 3–6, 6–3, 6–4తో కామిలా గియోర్గి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్ కోల్పోయినా... వెంటనే తేరుకొని ప్రత్యర్థి ఆట కట్టించింది. ఏడు ఏస్‌లు సంధించిన ఆమె కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసింది. గ్రాస్‌కోర్టులపై 100వ విజయం సాధించిన 36 ఏళ్ల సెరెనా వింబుల్డన్ టోర్నీలో 11వసారి సెమీఫైనల్‌కు చేరింది. ‘నేను ఏ దశలోనూ మ్యాచ్ ఓడిపోతానని ఆందోళన చెందలేదు. తొలి సెట్ కోల్పోయినపుడు కూడా నా ప్రత్యర్థి బాగా ఆడుతోందని అనుకున్నాను. చాలా ఏళ్లుగా పరిస్థితులు ఎలా ఉన్నా పోరాటం కొనసాగించడం నాకు అలవాటుగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ అదే చేశాను. నా కూతురికి కూడా ఈ సూత్రం చెప్పాలని అనుకుంటున్నాను’ అని మ్యాచ్ అనంతరం సెరెనా వ్యాఖ్యానించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జర్మనీ ప్లేయర్, 13వ సీడ్ జూలియా జార్జెస్‌తో సెరెనా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో జూలియా 3–6, 7–5, 6–1తో 20వ సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 7–5, 6–4తో సిబుల్కోవా (స్లొవేకియా)పై నెగ్గగా... మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–3, 7–5తో దరియా కసత్కినా (రష్యా)పై విజయం సాధించి ఒస్టాపెంకోతో సెమీస్ పోరుకు సిద్ధమైంది. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శరన్–సితాక్ ద్వయం 6–7 (4/7), 6–7 (5/7), 7–6 (7/3), 4–6తో ఏడో సీడ్ మైక్ బ్రయాన్–జాక్ సోక్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో నిషికోరి (జపాన్); రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో డెల్‌పొట్రో (అర్జెంటీనా); అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్); మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో జాన్ ఇస్నెర్ (అమెరికా) తలపడతారు. ►సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఫెడరర్
టెన్నిస్, క్రికెట్ అభిమానులకు మంగళవారం(జులై10) గుర్తుండిపోయే రోజు. క్రీడా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్ ఫన్నీగా ఉండటంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అడ్రియన్ మనారినో(ఫ్రాన్స్)తో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తలపడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా ఫెడరర్ డిఫెన్స్ షాట్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను వింబుల్డన్ అధికారిక ట్విటర్లో రేటింగ్ ఇవ్వండంటూ ఐసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. స్పందించిన ఐసీసీ.. ఫెడరర్ ఆడిన డిఫెన్స్ షాట్‌కు ఫిదా అయిన ఐసీసీ రీట్వీట్ చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అంటూ అభివర్ణించింది. అంతే కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫెడరర్‌ల స్పైడర్‌మ్యాన్ మెమె క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీంతో టెన్నిస్‌కు, వింబుల్డన్‌కు ఐసీసీ ఇచ్చిన గౌరవం పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఫెడరర్ అభిమాని సచిన్ కూడా డిఫెన్స్ షాట్‌పై స్పందించాడు. తన అభిమాన ఆటగాడు తొమ్మిదో వింబుల్డన్ టైటిల్ గెలవాలని సచిన్ ఆకాంక్షించాడు. *sigh* ok... 👇 pic.twitter.com/KXnhaznxL8 — ICC (@ICC) July 9, 2018 When greatness recognises greatness 👌 pic.twitter.com/UB2hJli5gw — ICC (@ICC) July 9, 2018 As always, great hand-eye co-ordination. @rogerfederer, let’s exchange notes on cricket and tennis after you win your 9th @Wimbledon title 😜👍 https://t.co/2TNUHGn1zK — Sachin Tendulkar (@sachin_rt) July 10, 2018 -
‘మా ఫైనల్ మ్యాచ్ సమయాన్ని మార్చేది లేదు’
లండన్: వచ్చే ఆదివారం జరుగనున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయీస్ స్పష్టం చేశారు. ఆ సింగిల్స్ ఫైనల్ లండన్‌లో ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు మొదలుకానుంది. అయితే అదేరోజు సాయంత్రం 4 గంటలకు (యూకే సమయం ప్రకారం) ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఒకవేళ బుధవారంనాటి సెమీస్‌లో క్రొయేషియాపై ఇంగ్లండ్ గెలిచి తుదిపోరుకు చేరితే.. ఆదివారం నాడు అటు ప్రపంచ కప్ ఫైనల్.. ఇటు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ సమాంతరంగా జరుగుతాయి. దాంతో.. రెండు మ్యాచ్‌లను తిలకించడం ఎలా అన్న వాదనను క్రీడా ప్రేమికులు, ఫుట్‌బాల్ అభిమానులు లేవనెత్తుతున్నారు. ఈనేపథ్యంలో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సమయాన్ని మార్చాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ రిచర్డ్ మాత్రం ‘సంప్రదాయం ప్రకారం రెండు గంటలకే ఫైనల్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఆ టైమ్‌కే నిర్వహిస్తాం’ అని కుండబద్దలుకొట్టారు. -
వైరల్: వింబుల్డన్‌లో క్రికెట్!
లండన్ : వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ కదా.. క్రికెట్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? లేక వింబుల్డన్ పేరిట క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారా? అని అనుకుంటున్నారా? ఇలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది టెన్నిస్ కోర్టు మైదానంలో జరిగిందే. అవును రికార్డుస్థాయిలో ఎనిమిది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరరే కోర్టులో టెన్సిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్ షాట్ ఆడాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ సంధర్బంగా ఫెడరెర్ డిఫెన్స్ షాట్స్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అభిమానులే కాదు వింబుల్డన్ అధికారిక ట్విటర్లో ఐసీసీని ట్యాగ్ చేస్తూ అధికారులు ట్వీట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అడ్రియన్ మనారినోపై అలవోకగా గెలిచాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు. Ratings for @rogerfederer's forward defence, @ICC?#Wimbledon pic.twitter.com/VVAt2wHPa4 — Wimbledon (@Wimbledon) July 9, 2018 -
టెన్నిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్
-
ఎదురులేని ఫెడరర్
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అలవోకగా గెలిచాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 36 ఏళ్ల ఫెడరర్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 20 అనవసర తప్పిదాలు చేసిన అతను 44 విన్నర్స్ కొట్టాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు. నాదల్ కూడా... మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6–3, 6–3, 6–4తోజిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్) 4–6, 7–6 (7/5), 7–6 (12/10), 6–1తో గుల్బిస్ (లాత్వియా)పై, జాన్ ఇస్నెర్ (అమెరికా) 6–4, 7–6 (10/8), 7–6 (7/4)తో సిట్సిపాస్ (గ్రీస్)పై, రావ్‌నిచ్ (కెనడా) 6–3, 6–4, 6–7 (5/7), 6–2తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (7/4), 7–6 (7/2), 5–7, 7–6 (7/3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. సెరెనా సునాయాసంగా... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) సునాయాస విజయంతో 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6–2, 6–2తో రొడీనా (రష్యా)ను ఓడించింది. మరోవైపు ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–7 (1/7)తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలైంది. ప్లిస్కోవా ఓటమితో మహిళల సింగిల్స్‌లో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణిలందరూ క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కెర్బర్ (జర్మనీ) 6–3, 7–6 (7/5)తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 7–6 (7/4), 6–0తో సస్నోవిచ్ (బెలారస్)పై, జూలియా జార్జెస్ (జర్మనీ) 6–3, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, కామిలా గియోర్గి (ఇటలీ) 6–3, 6–4తో మకరోవా (రష్యా)పై, సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–1తో సె సు–వె (చైనీస్ తైపీ)పై, దరియా కసత్కినా (రష్యా) 6–7 (6/8), 6–3, 6–2తో అలీసన్ వాన్ ఉత్వానక్ (బెల్జియం)పై గెలిచారు. మంగళవారం జరిగే క్వార్టర్స్‌లో సిబుల్కో వాతో ఒస్టాపెంకో; కసత్కినాతో కెర్బర్; బెర్టెన్స్తో జూలియా; కామిలాతో సెరెనా తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో శరణ్ జంట పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్) –ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) ద్వయం అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మూడో రౌండ్లో శరణ్–సితాక్ జంట 1–6, 6–7 (3/7), 6–4, 6–4, 6–4తో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–మట్కోవ్‌స్కీ (పోలాండ్) జోడీపై గెలిచింది. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన శరణ్ జంట ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం సాధించడం విశేషం. -
అయ్యో... హలెప్
లండన్: ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సీడెడ్ క్రీడాకారిణులకు ఏమాత్రం కలిసి రావడంలేదు. తాజాగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) కూడా ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ సె సు–వె (చైనీస్ తైపీ) 3–6, 6–4, 7–5తో హలెప్‌పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన హలెప్ ఈ మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయింది. నిర్ణాయక మూడో సెట్లో ఒకదశలో 5–2తో ఆధిక్యంలో నిలిచి... మ్యాచ్ పాయింట్ కూడా సంపాదించిన ఆమె ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అనంతరం వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. హలెప్ ఓటమితో మహిళల సింగిల్స్ ‘డ్రా’లో టాప్–10లో ఒక్కఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మాత్రమే మిగిలి ఉంది. టాప్–32 సీడింగ్స్‌లో ఏడుగురు మాత్రమే బరిలో ఉండటం గమనార్హం. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–4తో 18వ సీడ్ ఒసాకా (జపాన్)పై, 12వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 6–0, 6–4తో దియత్‌చెంకో (రష్యా) పై, 14వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–3తో 17వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. నాదల్ ముందుకు... జ్వెరెవ్ ఔట్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6–1, 6–2, 6–4తో డెమినౌర్ (ఆస్ట్రేలియా)పై, ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 7–6 (7/4), 6–3తో పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (2/7), 6–4, 7–5, 3–6, 0–6తో గుల్బిస్ (లాత్వియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ రెండో రౌండ్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (2/7), 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో మెక్లాచ్లెన్ (జపాన్) –స్ట్రఫ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. దివిజ్ శరణ్ (భారత్)–సితాక్ (న్యూజిలాండ్) జోడీ 6–7 (5/7), 4–6, 6–3, 7–6 (7/5), 6–4తో పెరాల్టా (చిలీ)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయంపై గెలిచింది. -
ముగురుజా నిష్క్రమించె...
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణుల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) ఇంటిముఖం పట్టగా... ఈ ఐదుగురి సరసన మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) చేరడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా 7–5, 2–6, 1–6తో ప్రపంచ 47వ ర్యాంకర్ అలీసన్ వాన్ ఉత్వానక్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఉత్వానక్ తన కెరీర్లో తొలిసారి టాప్–10లోపు క్రీడాకారిణిపై గెలిచింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–5, 7–6 (7/2)తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆమె సోదరి వీనస్ 2–6, 7–6 (7/5), 6–8తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఎవగెనియా రొడినా (రష్యా) 7–5, 5–7, 6–4తో పదో సీడ్ మాడిసన్ కీస్పై సంచలన విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగం మూడో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–3, 7–5, 6–2తో స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అన్‌సీడెడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 5–7, 6–4, 6–4, 6–2తో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలుపొందాడు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట పరాజయం పాలైంది. ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్)–సాలిస్బరీ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం 4–6, 6–7 (4/7)తో తొలి రెండు సెట్లను కోల్పోయి... మూడో సెట్లో 1–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. -
వెక్కి వెక్కి ఏడ్చిన బాల్ గర్ల్
లండన్: టెన్నిస్ టోర్నీల్లో బాల్ బాయ్స్, బాల్‌గర్ల్స్ కీలకంగా వ్యవహారిస్తుంటారు. టెన్నిస్ ఆటగాళ్లు కొట్టిన సర్వ్‌లకు బంతి బయటకు వెళ్లినా.. కోర్టులో పడినా పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టిన బంతులు తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సంఘటనే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో బుధవారం చోటు చేసుకుంది. ఉబ్బెకిస్తాన్ ప్లేయర్ ఇస్టోమిన్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ ఒక బాల్‌గర్ల్‌కు తగిలింది. 217 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి తగలడంతో నొప్పి తట్టుకోలేకపోయిన ఆ బాల్ గర్ల్ వెక్కి వెక్కి ఏడ్చింది. దాంతో, ఇస్టోమిన్‌తో పాటు కిర్గియోస్ ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చారు. ‘ బంతి తగిలిన శబ్ధాన్ని నేను విన్నాను. అయితే స్కోరు బోర్డును తాకిందని అనుకున్నా. ఆ తర్వాత ఆమె చేతికి తగిలిందనే విషయం అర్ధమైంది. దాంతో ఆమె ఏడ్చేసింది. నాకు తగిలినా ఏడ్చేసేవాడిని. ఇది చాలా బాధాకరం. ఆమె ఒక చాంపియన్. త్వరగా ఆమె కోలుకుని ఎప్పటిలాగే విధులకు హాజరవుతుందని ఆశిస్తున్నా’ అని మ్యాచ్ తర్వాత కిర్గియోస్ పేర్కొన్నాడు. -
కిర్గియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ..
-
డిఫెండింగ్ చాంపియన్‌కు చుక్కెదురు
లండన్: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజాకు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ముగురుజా 7-5, 2-6, 1-6 తేడాతో బెల్జియంకు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి వాన్ వుయ్‌త్వాంక్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్‌ను గెలిచిన ముగురుజా.. ఆపై రెండు సెట్లలో దారుణంగా వైఫల్యం చెందడంతో ఓటమి తప్పలేదు. మరొకవైపు సంచలన విజయాన్ని నమోదు చేసిన వుయ్‌త్వాంక్... తన కెరీర్లోనే తొలిసారి టాప్-10 ప్రత్యర్థిపై గెలిచిన ఘనతను సైతం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వుయ్‌త్వాంక్ నాలుగు ఏస్‌లు సంధించగా, ముగురుజా మూడు ఏస్‌లకు మాత్రమే పరిమితమైంది. మరొకవైపు ముగురుజా 3 డబుల్ ఫాల్ట్స్ చేయగా,, వుయ్త్వాంక్లు రెండు చేసింది. ఇక ఏడు బ్రేక్ పాయింట్లను వుయ్‌త్వాంక్ గెలవగా, నాలుగు బ్రేక్ పాయింట్లను ముగురుజా గెలిచింది. మొత్తంగా 91 పాయింట్లను వుయ్‌త్వాంక్ గెలిస్తే, ముగురుజా 75 పాయింట్లను మాత్రమే సాధించి ఓటమి పాలైంది. -
వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సిలిచ్ నిష్క్రమణ
-
సిలిచ్ నిష్క్రమణ
లండన్: గతేడాది రన్నరప్, క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రెండోరౌండ్లోనే చుక్కెదురైంది. ఇది మినహా నాలుగో రోజు మిగతా సీడెడ్ ఆటగాళ్లంతా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ స్టార్ రాఫెల్ నాదల్, సెర్బియన్ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్, ఎంజెలిక్ కెర్బర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. భారత ఆటగాళ్లలో దివిజ్ శరణ్ జోడీ శుభారంభం చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనలిస్ట్ సిలిచ్ ఈ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. మూడో సీడ్ క్రొయేషియా ఆటగాడు 6–3, 6–1, 4–6, 6–7 (3/7), 5–7తో గుయిడో పెల్లా (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. 3 గంటల 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సిలిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన పెల్లా చివరకు అతన్ని ఇంటిదారి పట్టించాడు. రెండో సీడ్ నాదల్, జొకోవిచ్‌లు అలవోక విజయాలతో ముందంజ వేశారు. రెండో రౌండ్లో నాదల్ 6–4, 6–3, 6–4తో మిఖాయిల్ కుకుష్కిన్ (కజకిస్తాన్)పై, 12వ సీడ్ జోకొవిచ్ 6–1, 6–2, 6–3తో జెబల్లొస్ (అర్జెంటీనా)పై గెలిచారు. 9వ సీడ్ ఇస్నర్ (అమెరికా) 6–1, 6–4, 6–7 (6/8), 6–7 (3/7), 7–5తో బెమెల్మన్స్ (బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–7 (7/9), 3–6, 6–7 (6/8) థామస్ ఫెబియానో (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ హలెప్ (రుమేనియా) 7–5, 6–0తో ససై జెంగ్ (చైనా)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 3–6, 6–2, 6–4తో క్లెయిర్ లియూ (అమెరికా)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో దివిజ్ శరణ్–అర్టెమ్ సిటక్ (న్యూజిలాండ్) జోడీ 7–6 (7/4), 6–7 (8/10), 6–3, 6–2తో అల్బొట్ (మాల్డొవా)–మలెక్ జజిరి (ట్యూనిషియా) ద్వయంపై గెలిచింది. విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 7–6 (7/5), 6–4, 7–6 (7/4)తో డానియెల్ (న్యూజిలాండ్)– వెస్లీ కూల్హోఫ్ (నెదర్లాండ్స్) జోడీపై గెలుపొందగా, జీవన్ నెడున్‌జెళియన్ (భారత్)–క్రాజిసెక్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 6–7 (3/7), 6–7 (2/7)తో అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఫెడరర్ ఫటాఫట్
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 89 నిమిషాల్లో 6–4, 6–4, 6–1తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచాడు. వరుసగా 20వ వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్ ఈ మ్యాచ్‌లో 48 విన్నర్స్తోపాటు 16 ఏస్‌లు సంధించాడు. శుక్రవారం జరిగే మూడో రౌండ్లో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో ఫెడరర్ ఆడతాడు. ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో స్ట్రఫ్ 6–7 (3/7), 3–6, 7–6 (7/4), 7–6 (7/4), 13–11తో గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో కార్లోవిచ్ ఏకంగా 61 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (7/4), 6–3, 6–3తో స్తకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 7–6 (7/4), 7–6 (7/4), 7–6 (7/4)తో మిల్మాన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. షరపోవా ఓటమి మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్లో, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), మాజీ రన్నరప్ రద్వాన్‌స్కా (పోలాండ్) రెండో రౌండ్లో ఇంటిదారి పట్టారు. దియాత్‌చెంకో (రష్యా) 6–7 (3/7), 7–6 (7/3), 6–4తో షరపోవాను ఓడించగా... మకరోవా (రష్యా) 6–4, 1–6, 7–5తో వొజ్నియాకిపై, ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో అజరెంకాపై, సఫరోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో రద్వాన్స్కాపై నెగ్గారు. మరోవైపు ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సెరెనా 6–1, 6–4తో విక్టోరియా తొమోవా (బల్గేరియా)పై, వీనస్ 4–6, 6–0, 6–1తో అలెగ్జాండ్రా డల్గెరూ (రొమేనియా)పై విజయం సాధించారు. పురవ్ రాజా జంట పరాజయం పురుషుల డబుల్స్‌లో పురవ్ రాజా (భారత్)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట తొలి రౌండ్లో పోరాడి ఓడింది. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పురవ్ రాజా–మార్టిన్ ద్వయం 2–6, 4–6, 7–6 (7/5), 6–4, 9–11తో మీర్జా బేసిక్ (బోస్నియా హెర్జెగోవినా)–లాజోవిక్ (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. -
తొలి రౌండ్లో అంకిత రైనా విజయం
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా శుభారంభం చేసింది. లండన్‌లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో అంకిత 6–2, 6–1తో మయా లమ్స్‌డెన్ (బ్రిటన్)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో ప్రపంచ 134వ ర్యాంకర్ వితాలియా దియాత్‌చెంకో (రష్యా)తో అంకిత ఆడుతుంది. పురుషుల డబుల్స్‌లో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్), జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీలు మరో మ్యాచ్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాయి. -
వింబుల్డన్ ఆడతానో... లేదో: సెరెనా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి గాయంతో వైదొలిగిన అమెరికన్ పవర్‌స్టార్ సెరెనా విలియమ్స్ ‘వింబుల్డన్’పై ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కుడి భుజం కండరాల గాయంతో బాధపడుతున్న ఆమె... షరపొవాతో మ్యాచ్‌కు కొన్ని క్షణాల ముందు వైదొలగుతున్నట్లు ప్రకటించింది. కనీసం 60 శాతం ఫిట్నెస్ లేనిదే బరిలోకి దిగనని అమెరికన్ స్టార్ చెప్పింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన సెరెనా... తల్లి అయ్యాక బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే. కానీ గాయంతో వైదొలగడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పింది. ‘వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్ వేటలో ఉంటానో లేదో ఇప్పుడే చెప్పలేను. ఈ వారం ఇక్కడే ఉండి వైద్యులను సంప్రదించాకే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. ముందుగా ఎఆర్ఐ స్కాన్ తీయిస్తా. ఆ తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్లతో పరీక్షలు చేయించుకున్న తర్వాత వారి సూచన మేరకే తదుపరి గ్రాండ్‌స్లామ్ ఆడేది లేనిది చెబుతా’నని 36 ఏళ్ల సెరెనా వెల్లడించింది. -
మళ్లీ బరిలోకి ఫెడరర్
క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉన్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ వచ్చే నెలలో మళ్లీ కోర్టులోకి దిగనున్నాడు. జూన్‌లో స్టట్‌గార్ట్‌లో జరిగే మెర్సిడెస్ కప్ గ్రాస్ కోర్టు టోర్నీలో అతను ఆడతాడని ఏటీపీ ప్రకటించింది. ఫ్రెంచ్ ఓపెన్ సహా తనకు అచ్చి రాని క్లే కోర్టు టోర్నీల నుంచి తప్పుకోవడం, తను ఎంతో ఇష్టపడే గ్రాస్ పైనే మళ్లీ బరిలోకి దిగే విషయంలో సరిగ్గా 2017 తరహా ప్రణాళికలనే ఈ సారి కూడా ఫెడరర్ అమలు చేస్తున్నాడు. గత ఏడాది కూడా స్టట్గార్ట్తోనే మొదలు పెట్టి ఫెడెక్స్ అదే జోరులో తన ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. -
...ఈసారి అలా కుదరదు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఆడేందుకు రావడం... గాయపడ్డామంటూ తొలి రౌండ్లోనే వైదొలగడం... ఇలా పరిపాటైన ఆటగాళ్లకు వింబుల్డన్ నిర్వాహకులు గట్టిషాకే ఇచ్చారు. అలా వచ్చి ఇలా వెనుదిరిగితే పూర్తి ప్రైజ్‌మనీ ఇవ్వమని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ (వింబుల్డన్) స్పష్టం చేసింది. ఈసారి కొత్తగా ‘ఫిఫ్టీ– ఫిఫ్టీ’ నిబంధనను తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొందరు ప్లేయర్లు ముందస్తు గాయాలతోనే ఆడేందుకు వస్తారు. గాయమైందని అర్ధాంతరంగా నిష్క్రమిస్తారు. ప్రతిష్టాత్మక విం బుల్డన్లో తొలిరౌండ్లో పోరాడి ఓడినా... ఆడక ఓడినా పెద్ద మొత్తం (రూ. 33 లక్షలు)లోనే ప్రైజ్‌మనీ వస్తుంది. దీన్ని చేజిక్కించుకునేందుకు జిమ్మిక్కులతో వచ్చే ప్లేయర్లకు ఫిఫ్టీ–ఫిఫ్టీ నిబంధనతో ఇక బ్రేక్ పడనుంది. అలాంటి వారికి కేవలం సగం సొమ్మే ఇస్తారు. గతేడాది ఏకంగా 7 తొలిరౌండ్ మ్యాచ్‌లు అనుచిత గాయాల కారణంతో అర్ధాంతరంగానే ఆగిపోయాయి. దీనిపై స్టార్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. -
‘‘ఫెడెక్స్’’
విశ్లేషణ జీవన కాలమ్ ఆట అయ్యాక ఓడిన, అలిసిన చిలిచ్ భోరుమన్నాడు. గెలిచిన, చరిత్ర కారుడు ఫెడరర్ కూడా భోరుమన్నాడు. అలౌకికమైన ఆనందానికీ, అనిర్వచనీయమైన విషాదానికీ విముక్తి– కన్నీరే! జీనియస్‌ల సౌందర్యం వర్ణనాతీతం. అది శరీరా నిది కాదు. అది ఒక తేజస్సు. అది శరీరానికి లొంగదు. ఆల్బర్ట్ ఐన్ స్టీన్‌ని, చార్లెస్ డార్విన్‌ని చూస్తున్నప్పుడు వారి శారీ రక సౌందర్యం మనకి కని పించదు. మానవాళికి వారి మేధస్సు చేసిన ఉపకారం మన కళ్లను మిరుమిట్లు గొలుపుతుంది. ఏ విధంగా చూసినా సెరీనా విలి యమ్స్ అందగత్తె కాదు. కానీ 22 సార్లు ఈ ప్రపం చాన్ని దిగ్భ్రాంతుల్ని చేసిన ఆమె అఖండ ప్రతిభ ఆమెను అలౌకికమైన సౌందర్యరాశిగా మలుస్తాయి. శ్రీశ్రీ, విశ్వనాథ అందగాళ్లుకాదు. కానీ మహా ప్రస్థానం, కల్పవృక్షం నేపథ్యం వారిని అఖండ తేజ స్వుల్ని చేస్తాయి. నిజానికి తెలుగు సాహిత్యానికి– నాకు తెలిసి –ఇద్దరే అందమైన రచయితలు. తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ మాట అంటూనే ఆవంత్స సోమసుందర్ని రన్నర్ అప్‌గా నిలుపుతు న్నాను. ఇవి సరదాగా చెప్పే మాటలు. నిన్నటి వింబుల్డన్ పురుషుల ఫైనల్స్ ఒక చరిత్ర. ఒక విధంగా జాలిగొలిపే చరిత్ర. ఒక పక్క ప్రపంచంలో రికార్డ్ నెలకొలిపే చాంపియన్ నిలు వగా– ఎదురుగా ఎన్నో అవరోధాల్ని దాటి వచ్చిన 28 ఏళ్ల ఆటగాడు– మారిన్ చిలిచ్. ఒకపక్క ఒక చాంపియన్ దూసుకు వెళ్లడం తెలుస్తోంది. మరొక పక్క ఓ యువకుడు– అభిమన్యుడిలాగ నిస్సహా యంగా కూలిపోవడం తెలుస్తోంది. నాకు ఆట కాదు. చివర ఫెడరర్ అన్న మాట పతాక స్థాయిలో నిలుస్తుందనిపించింది: ‘‘ఒకొక్క ప్పుడు ఇది క్రూరమైన విషయం. మారిన్ హీరో లాగా పోరాడాడు. మారిన్! నువ్వు గర్వపడే సమ యమిది. ఇది అపూర్వమైన టోర్నమెంటు. ఒకొక్క ప్పుడు ఫైనల్లో అధిగమించలేకపోవచ్చు’’ ఇది గెలి చిన చాంపియన్ ఓడిన కుర్రాడికి ఇచ్చిన కితాబు. ఆ రోజుల్లో బోర్గ్ వరుసగా ఐదేళ్లు గెలి చినప్పుడు– ఇంగ్లండు ఒక నానుడిని మార్చుకుంది. ‘‘అసాధ్యమైన విషయాన్ని చెప్పడానికి ‘ఇది బియాండ్ బోర్గ్’ అని’ (బోర్గ్కే అసాధ్యమని చెప్పడం. అంటే ఎవరికీ సాధ్యం కాదని). తర్వాత చరిత్రలో క్రూరమైన శస్త్రచికిత్స చేసే ఆటగాడు– పీట్ శాంప్రాస్ వచ్చాడు. తర్వాత కనుబొమ్మలనయినా ఎగరేయకుండా దూసుకుపోయే ఫెడరర్ వచ్చాడు– చరిత్రను తిరగరాయడానికి. ఎనిమిదిసార్లు కప్పు గెలుచుకున్నాడు. నేను వింబుల్డన్ సెంట్రల్ కోర్ట్ చూశాను. ఫెడ రర్ నడిచిన కారిడార్‌లో నడిచాను. అదొక మైకం. 18 కోట్ల 53 లక్షల డబ్బుని సొంతం చేసుకున్న ఫెడరర్– గత రెండువారాలలో– ఒక్క సెట్ కూడా ఓడిపోని 36 ఏళ్ల ఆటగాడికి వింబుల్డన్ ప్రసారాలు శుభాకాంక్షలు తెలుపుతూ– టీవీ స్క్రీన్ అంతా కని పించేలాగ ఒక పదాన్ని వేశాయి. ‘బిలీవ్’. అంతే కాదు. బిలీవ్లో ఎల్, ఐ ల స్థానంలో 19 అంకెను వేశాయి. ఇప్పటికి ఫెడరర్ 19 గ్రాండ్ స్లామ్ టైటి ళ్లను దక్కించుకున్నాడు. బిలీవ్. ఒకే మాట– తను సాధించగలననే ‘ఆత్మ విశ్వాసం’. అదీ చాంపియన్‌కి పెట్టుబడి. ఫెడరర్ పిల్లలు– నలుగురినీ చూపిస్తూ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి అడిగింది: ‘‘మీ పిల్లలు ఈ విజయాలకి ఏమంటారు?’’ అని. ఫెడరర్ నవ్వాడు. ‘‘వాళ్లు చిన్నపిల్లలు. వాళ్లకి ఇదేమీ తెలి యదు. నాన్న ఓ ఆట ఆడుతున్నాడనుకుంటారు. పెద్దయ్యాక అర్థమౌతుంది’’ అన్నాడు. ఆట అయ్యాక ఓడిన, అలిసిన చిలిచ్ భోరు మన్నాడు. గెలిచిన, చరిత్రకారుడు ఫెడరర్ కూడా భోరుమన్నాడు. అలౌకికమైన ఆనందానికీ, అనిర్వ చనీయమైన విషాదానికీ విముక్తి– కన్నీరే! కామెం టరీ చెప్తున్న బోరిస్ బెకర్ ఓ మాట అన్నాడు: ‘‘మారిన్ చిలిచ్ కృంగిపోనక్కరలేదు. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచిన ఓ గొప్ప ఆటగాడి ముందు– ప్రపంచంలోకెల్లా గొప్ప టెన్నిస్ కోర్టులో ఈనాటి అపజయం కూడా విజయమే’’.ఫెడరర్ వింబుల్డన్ కప్పుని అందుకోవడానికి వెళ్తున్నప్పుడు– కామెంటరీ చెప్పే వ్యక్తి అన్నాడు: ‘‘ఈ క్షణంలో ఫెడరర్ కాళ్లు నేలని తాకుతున్నాయో లేదో చూడాలని మీకూ అనిపిస్తుంది’’. వింబుల్డన్ చాంపియన్‌షిప్ ఆఖరి పాయింట్ గెలవగానే నేలమీద కూలబడి దొర్లడం చూశాం. అది అనూహ్యమైన ఆనందానికి సంకేతం. నరాలు తెగి పోయే ఉత్కంఠకి విముక్తి. ఫెడరర్ లోగడ ఇలా ఆనందించడం చూశాం. కానీ ఈసారి ఫెడరర్ ఆ పని చెయ్యలేదు. చెయ్యాలనుకోలేదా? ఎందుకని? మొదటి బ్రేక్ పాయింట్‌కే ‘విశ్వాసం’ సడలి భోరు మన్న కుర్రాడిని, కాలి చర్మం చిట్లి 1974 నాటి కెన్ రోజ్‌వాల్ లాగ ఆట మధ్యలోనే నిష్క్రమించకుండా ధైర్యంగా మూడు సెట్లూ ఆడి ఓడిన కుర్రాడి సమ క్షంలో విజయం– విర్రవీగేది కాదు. సంయమనంతో అందుకునేది. ఈ ప్రపంచ స్థాయి క్రీడల్లో నాకు కొట్టొచ్చినట్టు కనిపించేది–ఆటలో నైపుణ్యం పక్కన ఉంచగా– ఓడి పోయిన ఆటగాడి డిగ్నిటీ, గెలిచిన ఆటగాడి ఉదా త్తత. విజయం ఆ స్థాయిలో ఒక సంకేతం. వ్యక్తిత్వం ఆ క్షణాన్ని చిరస్మరణీయం చేస్తుంది. గొల్లపూడి మారుతీరావు -
40 ఏళ్ల వరకు ఆడతా!
ఫెడరర్ ఆత్మవిశ్వాసం లండన్: వింబుల్డన్ విజయానందంలో ఉన్న స్టార్ ఆటగాడు రోజర్ ఫెడరర్ తన ప్రత్యర్థులకు మరో సవాల్ విసిరాడు. వచ్చే నెల 8న 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ దిగ్గజం తనలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని స్పష్టం చేశాడు. అంతా అనుకూలిస్తే తాను 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా టెన్నిస్‌లో కొనసాగుతానని ఉత్సాహంగా చెప్పాడు. ‘నాకూ అదే ఆలోచన ఉంది. ఆరోగ్యం సహకరించడంతో పాటు అన్నీ బాగుండాలి. నేను ఆరు నెలల విరామం తీసుకున్నప్పుడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ గెలవగలనా అని నా సన్నిహితులు, కోచింగ్ సిబ్బందిని అడిగాను. నేను 100 శాతం ఫిట్‌గా ఉంటే అది సాధ్యమేనని వాళ్లు చెప్పారు. గత ఏడాది విశ్రాంతి నేను మళ్లీ చురుగ్గా ఆడేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం నన్ను నేను చూసుకుంటే 40 ఏళ్ల వయసులో కూడా నేను ఆడుతూనే ఉంటానేమో’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. రాక్‌స్టార్‌లా వేడుకలు... మరోవైపు వింబుల్డన్ గెలుపు తర్వాత ఆ రాత్రంతా తాను ‘రాక్‌స్టార్’లా వేడుకలు జరుపుకున్నానని ఫెడరర్ చెప్పాడు. ‘అధికారిక విందు తర్వాత నేను బార్‌కు వెళ్లాను. 30–40 మంది మిత్రులతో సమయం అద్భుతంగా గడిచింది. అసలు ఏమేం చేశానో కూడా సరిగ్గా గుర్తు లేదు. వేర్వేరు రకాల మద్యం చాలా ఎక్కువగా తాగానని మాత్రం చెప్పగలను. ఉదయం ఐదు గంటలకు గానీ బెడ్ పైకి వెళ్లలేదు’ అని అతను చెప్పాడు. 20వ గ్రాండ్‌స్లామ్ గురించి తాను ఇప్పుడే ఆలోచించడం లేదని, ప్రస్తుతానికి వింబుల్డన్ విజయానందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు ఫెడెక్స్ స్పష్టం చేశాడు. మూడో ర్యాంక్‌కు.. వింబుల్డన్ విజయంతో సోమవారం ప్రకటించిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో రోజర్ ఫెడరర్ (6,545 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. 15 ఆగస్టు, 2016 తర్వాత మొదటి సారి రోజర్ టాప్–3లోకి ప్రవేశించాడు. తాజా ప్రదర్శనతో ఫెడరర్ నవంబర్‌లో లండన్‌లో జరిగే ఏటీపీ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. అతను ఈ టోర్నీకి 15వ సారి క్వాలిఫై కావడం విశేషం. -
వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఫెడరర్
-
వీనస్ (Vs) ముగురుజా
వింబుల్డన్‌లో మహిళల పోరు చివరి అంకానికి చేరింది. అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజా టైటిల్ పోరుకు అర్హత పొందారు. ఇప్పటికే ఐదు సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ తన ఆరో టైటిల్ కోసం తహతహలాడుతుండగా, జోరుమీదున్న స్పెయిన్ స్టార్ ముగురుజా వింబుల్డన్ వేదికపై కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు సిద్ధమైంది. లండన్: మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్, స్పానిష్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా అమీతుమీకి సిద్ధమయ్యారు. వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో వీరిద్దరు మహిళల టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 14వ సీడ్ ముగురుజా వరుస సెట్లలో 6–1, 6–1తో మగ్దలినా రిబరికోవా (స్లోవేకియా)పై అలవోక విజయం సాధించగా, పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–4, 6–2తో ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)ను కంగుతినిపించింది. వీనస్, ముగురుజాల మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. రెండోసారి ఫైనల్‌కు... ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్, ప్రపంచ 15వ ర్యాంకర్ ముగురుజా రెండోసారి వింబుల్డన్ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2015లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆమె ఇప్పుడు మాత్రం టైటిల్ సాధించాలన్న పట్టుదలను తన మ్యాచ్‌ల్లో చూపింది. సెమీస్‌లో అన్‌సీడెడ్ ప్రత్యర్థిని కేవలం గంట 5 నిమిషాల్లోనే మట్టికరిపించింది. ఆమె ధాటికి రిబరికోవా నిలువలేకపోయింది. రెండు సెట్లలోనూ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలి సెట్లో 8 విన్నర్స్‌ను కొట్టిన ముగురుజా రెండో సెట్లో తన జోరు పెంచింది. దీంతో ఏకంగా 14 విన్నర్స్‌ను సాధించింది. ఇద్దరు చెరో 3 ఏస్‌లు సంధించారు. ముగురుజా 11 అనవసర తప్పిదాలు చేసింది. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. రిబరికోవా కూడా 11 అనవసర తప్పిదాలు చేసింది. కానీ కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. ముగురుజా ఫోర్‌హ్యాండ్ షాట్లకు బదులివ్వలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 87వ ర్యాంకులో ఉన్న రిబరికోవా ఒక్క వింబుల్డన్ ఓపెన్ మినహా మరే గ్రాండ్‌స్లామ్‌లోనూ మూడో రౌండ్ దాటలేదు. కానీ ఈ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో మాత్రం ఆమె 2014లో సెమీఫైనల్స్ చేరింది. ఈసారీ ఆమె పోరాటం సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. వీనస్ జోరు తన సుదీర్ఘ కెరీర్లో 7 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన వీనస్‌కు గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బ్రిటన్ క్రీడాకారిణి జొహానా కొంటా తొలి సెట్లో గట్టిపోటీనిచ్చింది. అనుభవజ్ఞురాలైన వీనస్‌కు ఏస్‌లతో బదులిచ్చింది. ఏస్‌ల్లో వీనస్ పూర్తిగా వెనుకబడగా... జొహానా మాత్రం 7 ఏస్‌లను సంధించింది. విన్నర్స్లోనూ బ్రిటన్ ప్లేయర్‌దే పైచేయి అయింది. జొహానా కొంటా 14 విన్నర్స్ కొడితే వీనస్ ఐదే కొట్టగలిగింది. అయితే పదే పదే అనవసర తప్పిదాలతో పాటు డబుల్ ఫాల్ట్‌లతో జొహానా మూల్యం చెల్లించుకుంది. 13 అనవసర తప్పిదాలు, 4 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మ్యాచ్ మొత్తం మీద ఒకే ఒక్క ఏస్ సంధించిన వీనస్ 4 బ్రేక్ పాయింట్లతో పోరులో నిలిచింది. రెండో సెట్లో జోరు పెంచిన వీనస్ 11 విన్నర్స్ సాధించగా... ప్రత్యర్థి జొహానా 6 విన్నర్స్ కొట్టింది. దీంతో తొలిసెట్లో చెమటోడ్చినప్పటికీ రెండో సెట్‌ను త్వరగానే ముగించింది. గంటా 13 నిమిషాల్లో ప్రత్యర్థి ఆట కట్టించి ఫైనల్లోకి ప్రవేశించింది. ►మార్టినా నవ్రతిలోవా (1994) తర్వాత ఏ గ్రాండ్స్లామ్లోనైనా ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కురాలు (37 ఏళ్లు) వీనస్. ► వింబుల్డన్‌లో అత్యధిక విజయాలు సాధించిన మహిళల జాబితాలో మూడో స్థానానికి చేరిన వీనస్ (87)... ఈ క్రమంలో సోదరి సెరెనా (86)నుఅధిగమించింది. నవ్రతిలోవా (120), క్రిస్ ఎవర్ట్ (96) ఈ జాబితాలో ముందున్నారు. ►వింబుల్డన్‌లో వీనస్ ఫైనల్ చేరడం ఇది 9వ సారి. 2009లో ఆఖరిసారిగా ఫైనల్ చేరి సెరెనా చేతిలో ఓడింది. -
వింబుల్డన్‌లో మరో సంచలనం
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో మరో సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్ లో ఎంజెలిక్ కెర్బర్ తో సహా నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఇప్పటికే ఇంటిదారిపట్టగా, తాజాగా పురుషుల సింగిల్స్ లో నాల్గో సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఇటీవల పదో ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న నాదల్.. వింబుల్డన్ ఓపెన్ లో మాత్రం ప్రిక్వార్టర్స్ లోనే తన పోరాటాన్ని ముగించాడు.పురుషుల సింగిల్స్ లో భాగంగా ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 3-6, 4-6, 6-3, 6-4, 13-15 తేడాతో గైల్స్ ముల్లర్(లగ్జెంబర్గ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ముల్లర్ చివరకు పైచేయి సాధించి క్వార్టర్స్ కు అర్హత సాధించాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్.. ఆపై పోరాడి వరుసగా రెండు సెట్లను దక్కించుకున్నాడు. దాంతో ఐదో సెట్ అనివార్యమైంది. ఆ నిర్ణయాత్మకమైన ఐదో సెట్ లో ముల్లర్ పదునైన ఏస్‌లతో చెలరేగిపోయాడు. చివరి సెట్ లో నాదల్ పోరాడినప్పటికీ ముల్లర్ ధాటికి తలవంచకతప్పలేదు. ఈ మ్యాచ్ లో నాదల్ చేసిన 17 అనవసర తప్పిదాలు(అన్ ఫోర్స్డ్ ఎర్రర్స్) ఫలితంపై ప్రభావం చూపాయి. వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరకుండా నాదల్ వెనుదిరగడం ఐదోసారి. గతంలో 2013లో తొలిరౌండ్ లో నిష్క్రమించిన నాదల్.. 2012, 15లో రెండో రౌండ్ లో వెనుదిరిగాడు. ఇక 2014, 17ల్లో నాల్గో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు. ఇప్పటివరకూ 15 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన నాదల్.. రెండుసార్లు వింబుల్డన్((2008, 10) దక్కించుకున్నాడు.మరొకవైపు ముల్లర్ క్వార్టర్స్ కు చేరడం 2008 యూఎస్ ఓపెన్ తరువాత ఇదే తొలిసారి. -
ఫెడరర్... మరో రికార్డు
అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా గుర్తింపు వింబుల్డన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి నేడు దిమిత్రోవ్‌తో పోరు సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం లండన్: తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వేదికగా స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో రికార్డు తిరగరాశాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ 7–6 (7/3), 6–4, 6–4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. ఈ క్రమంలో అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. సెరెనా విలియమ్స్ (అమెరికా–316 విజయాలు) పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ అధిగమించాడు. మార్టినా నవ్రతిలోవా (అమెరికా–306), క్రిస్ ఎవర్ట్ (అమెరికా–296), స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ–280), వీనస్ విలియమ్స్ (అమెరికా–254), జొకోవిచ్ (సెర్బియా–236), జిమ్మీ కానర్స్ (అమెరికా–233), అగస్సీ (అమెరికా–224), ఇవాన్ లెండిల్ (చెకోస్లొవేకియా/అమెరికా–222 విజయాలు) టాప్–10లో ఉన్నారు. వింబుల్డన్ టోర్నీలో వరుసగా 19వ ఏడాది ఆడుతోన్న ఫెడరర్ ఈ టోర్నీలో మొత్తం 98 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడి 87 విజయాలు సాధించాడు. అంతేకాకుండా 15వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం పురుషుల, మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 5–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన రెండో రౌండ్లో సానియా–డోడిగ్ ద్వయం 7–6 (7/5), 6–2తో యుసుకె వటానుకి–మకోటో నినోమియా (జపాన్) జోడీపై విజయం సాధించింది. -
సిబుల్కోవా అవుట్
పురుషుల డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు ∙వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)... పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) మూడో రౌండ్లో ఇంటిదారి పట్టారు. సిబుల్కోవా 6–7 (3/7), 6–3, 4–6తో 27వ సీడ్ అనా కొంజూ (క్రొయేషియా) చేతిలో... నిషికోరి 4–6, 6–7 (3/7), 6–3, 3–6తో 18వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. ప్రిక్వార్టర్స్‌లో నాదల్ పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో నాదల్ 6–1, 6–4, 7–6 (7/3)తో 30వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై, సిలిచ్ 6–4, 7–6 (7/3), 6–4తో 26వ సీడ్ జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. గురువారం ఆలస్యంగా ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/0), 6–3, 6–2తో లాజోవిక్ (సెర్బియా)పై గెలిచాడు. హలెప్ ముందంజ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–4, 7–6 (9/7)తో షుయె పెంగ్ (చైనా)పై, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 7–5తో వితోయిఫ్ట్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–4, 6–1తో సకారి (గ్రీస్)పై, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 13వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 7–5, 7–5తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 3–6, 6–1, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శరణ్ జంట పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా ద్వయం 3 గంటల 31 నిమిషాల్లో 3–6, 4–6, 6–4, 7–6 (8/6), 8–10తో ఏడో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6–7 (6/8), 3–6, 7–6 (7/5), 3–6తో కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–యిఫాన్ జు (చైనా) జోడీ 7–5, 3–6, 2–6తో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–రలూకా ఒలారూ (రొమేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
చిన్నోడి టవల్‌ను పెద్దాయన ‘కొట్టేశాడు’
వింబుల్డన్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయానందంలో ఉన్న ఆటగాళ్లు తమకు సంబంధించిన ఒక వస్తువును సాధారణంగా ప్రేక్షకుల్లోకి విసరడం తరచుగా జరుగుతుంటుంది. అభిమానులు కూడా దానిని అంతే అపురూపంగా దాచుకోవడం సహజం. అమెరికాకు చెందిన జాక్ సాక్ తొలి రౌండ్లో క్రిస్టియన్ గారిన్ను ఓడించాడు. అనంతరం అతను తన చెయిర్ వద్దకు వస్తున్న సమయంలో ఒక చిన్నారి తన టవల్‌ను ఇవ్వాల్సిందిగా కోరాడు. దాంతో సాక్ వెంటనే స్పందిస్తూ టవల్‌ను ఆ అబ్బాయి వైపు విసిరేశాడు. దానికి ఆ కుర్రాడికంటే ముందు వరుసలో కూర్చొన్న ఒక ‘పెద్దాయన’ అతనికి అందకుండా దానిని బలవంతంగా లాగేసుకున్నాడు. దీన్ని సాక్ కూడా ముందుగా గుర్తించలేదు. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టికి ఈ ఘటన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఆ ముసలాడిని పరుష పదజాలంతో తిట్టి పోశారు. ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే తల్లి జూడీ అయితే అతనికి సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అనంతరం జాక్ సాక్ ఆ అబ్బాయి ఎవరో గుర్తించి వివరాలు ఇవ్వండి, మరో టవల్ ఇస్తానంటూ ప్రకటించాడు. సోషల్ మీడియా ప్రచారంతో ఒకరోజు తర్వాత ఆ కుర్రాడిని గుర్తించారు. అయితే అతను స్వస్థలం ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడని తెలిసింది. -
వింబుల్డన్ కు ఫెడరర్ సిద్ధం
లండన్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సిద్ధమయ్యాడు. జూలై 3 వ తేదీ నుంచి ఆరంభమయ్యే వింబుల్డన్ టోర్నీకి ఫెడరర్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ గెలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్.. ఆపై ఫ్రెంచ్ ఓపెన్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. గ్రాస్ కోర్టు, హార్డ్ కోర్టులపై మరింత దృష్టిపెట్టాలనే ఉద్దేశంతోనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఫెడరర్ తప్పుకున్నాడు. దీనిలో భాగంగా మరో వింబుల్డన్ టైటిల్ పై గురి పెట్టాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్.. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ పై దృష్టి పెట్టిన ఫెడరర్.. ఈ టోర్నీకి సిద్ధం కావడాన్ని సమర్ధించుకున్నాడు. గ్రాస్ కోర్టులో మెరుగైన రికార్డు ఉండటంతో ఫ్రెష్ గా వింబుల్డన్ లో పాల్గొనబోతున్నట్లు తెలిపాడు. -
‘వింబుల్డన్’ విధులకు శివకుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐటీఎఫ్ సర్టిఫైడ్ హోల్డర్ జె. శివకుమార్ రెడ్డి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో లైన్మెన్ అఫీషియల్‌గా విధులు నిర్వర్తించేందుకు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఐటీఎఫ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ వైట్ బ్యాడ్జ్ కలిగిన ఏకైక అఫీషియల్ శివకుమార్ కావడం విశేషం. ఈయన ఇప్పటికే కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ ఇస్లామిక్ గేమ్స్, డేవిస్‌కప్, ఫెడ్ కప్, ఆఫ్రో ఆసియా క్రీడలు, హాప్‌మన్ కప్, ఏటీపీ, డబ్ల్యూటీఏ వరల్డ్ టూర్ ఈవెంట్లు, ఏటీపీ చాలెంజర్, ఐటీఎఫ్ సీనియర్, జూనియర్స్ వంటి పలు టోర్నీలలో విధులు నిర్వహించారు. తాజాగా ప్రఖ్యాత వింబుల్డన్ టోర్నీకి ఎంపికవడంతో శివకుమార్‌ను శాట్స్ ఎండీ దినకర్‌బాబు, రాష్ట్ర టెన్నిస్ సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ బుధవారం అభినందించారు. -
తల్లి కాబోతున్న టెన్నిస్ బ్యూటీ!
బెలారస్ టెన్నిస్ బ్యూటీ, ప్రపంచ ఆరో ర్యాంకు క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా గుర్తుంది కదా.. 2012, 2013 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుపొందిన ఈ సుందరి మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో పాల్గొనలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈ సుందరికి వైద్యులు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ప్రియుడితో సహాజీవనం చేస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని అజరెంకా తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. ‘రోలాండ్ గ్యారోస్‌లో అయిన మోకాలి గాయం నుంచి ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మా వైద్యుడు ఓ వార్త తెలిపారు. నేను- నా బాయ్ప్రెంఢ్ త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాం’ అని అజరెంకా తెలిపింది. ఈ నేపథ్యంలో తానే ఎంతగానో ప్రేమించే టెన్నిస్‌కు కొంతకాలం దూరమయ్యే అవకాశముందని పేర్కొంది. అయితే, గతంలో ఎంతోమంది మహిళా ఆథ్లెట్లు పిల్లల్ని కన్న తర్వాత మళ్లీ క్రీడల్లోకి ప్రవేశించి సత్తా చాటారని, వారి నుంచి స్ఫూర్తి పొంది తాను అదే చేయాలనుకుంటున్నానని అజరెంక తెలిపింది. -
'టాప్'పై ముర్రే గురి!
లండన్: గత రెండు రోజుల క్రితం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల టైటిల్ ను గెలిచిన బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే టాప్ ర్యాంకింగ్ పై దృష్టి పెట్టాడు. ఈ టోర్నీలో సెర్బయా స్టార్ ,ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్ లోనే నిష్క్రమించడంతో పాటు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్లో ఓడిపోవడంతో టైటిల్ ను ముర్రే సునాయాసంగా గెలిచాడు. దాంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లలో మరింత పైకి ఎగబాకాడు. వింబుల్డన్ టోర్నీ ద్వారా 1280 పాయింట్లను ముర్రే తన ఖాతాలో వేసుకోగా, జొకోవిచ్ మాత్రం 1910 పాయింట్లను కోల్పోయాడు. టోర్నీ ఆరంభానికి ముందు వింబుల్డన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జొకోవిచ్ ఖాతాలో 16, 950 ఏటీపీ పాయింట్లు ఉండగా, ముర్రే ఖాతాలో 8, 915 పాయింట్లు ఉన్నాయి. అయితే టోర్నీ ముగిసే నాటికి ముర్రే 10, 195 పాయింట్లకు ఎగబాకగా, జోకర్ 15, 040 పాయింట్లకు పడిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య వ్యత్యాసం 4,845 పాయింట్లకు చేరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసాన్ని తదుపరి టోర్నీల్లో మరింత తగ్గిస్తానని ముర్రే అంటున్నాడు. 'నాకు నంబర్ ర్యాంకును ఆస్వాదించడమంటే ఇష్టం. దానిపైనే దృష్టిపెట్టా. ఇక నుంచి ప్రతీ ఈవెంట్ లోనూ మెరుగ్గా రాణించి దాన్ని కైవసం చేసుకునేందుకు యత్నిస్తా. అదే నా గోల్. వింబుల్డన్ అనేది నా జీవితంలో చాలా గొప్ప టోర్నమెంట్. దాన్ని రెండుసార్లు సాధించినందుకు గర్వపడుతున్నా. రాబోయే మరిన్ని గ్రాండ్ స్లామ్ లో విజయం సాధించినట్లైతే మరింతగా రాటుదేలతా. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఓటమి పాలైన జొకోవిచ్ మరింత బలంగా తిరిగివస్తాడు' అని ముర్రే తెలిపాడు. -
సెరెనాపై స్టెఫీగ్రాఫ్ ప్రశంసలు
లండన్: గత రెండు రోజుల క్రితం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌పై మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ ప్రశంసల వర్షం కురిపించింది. ఓపెన్ శకంలో 22 గ్రాండ్ స్లామ్ల సాధించి తన రికార్డును సమం చేసిన సెరెనా ప్రదర్శన ఆద్యంతం అద్భుతమని స్టెఫీగ్రాఫ్ కొనియాడింది. 'వింబుల్డన్‌లో సెరెనా అసాధారణ ఆటతో అదరగొట్టింది. ఈ తాజా విజయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నఅన్నిరకాల అభిమానులకూ సెరెనా అపూరమైన కానుక ఇచ్చింది' అని స్టెఫీగ్రాఫ్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఫైనల్లో సెరెనా చేతిలో ఓటమి పాలైన తన దేశానికి చెందిన కెర్బర్ ప్రదర్శనను కూడా స్టెఫీగ్రాఫ్ ప్రశంసించింది. ఆమె పోరాట తీరుకు జర్మనీ గర్వపడుతుందని తెలిపింది. శనివారం జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో సెరెనా జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. తుది పోరులో కెర్బర్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సాధించింది. దీంతో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న సెరెనా.. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో స్టెఫీ గ్రాఫ్ సరసన నిలిచింది. -
హిట్... హిట్... ముర్రే
-
హిట్... హిట్... ముర్రే
ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మరోసారి ఆనందంతో హోరెత్తింది... మూడేళ్ల వ్యవధిలో మళ్లీ ఆ వేదిక పండగ చేసుకొంది... తమ ఇంటి బిడ్డ వింబుల్డన్ విజయంతో పులకించిపోయింది. సొంతగడ్డపై బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సగర్వంగా రెండోసారి ట్రోఫీని అందుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ కరవు తీర్చుకుంటూ మూడో టైటిల్‌తో మురిశాడు. సెమీస్‌లో ఫెడరర్ని పడగొట్టిన రోనిచ్ తుది పోరులో మాత్రం ఆండీకి తలవంచాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రోనిచ్‌ను ఓడించి ముర్రే తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. జొకోవిచ్ ప్రమాదం ముందే తప్పింది... ఫెడరర్‌తో కూడా తలపడాల్సిన అవసరం రాలేదు... ఇలాంటి బంగారంలాంటి అవకాశాన్ని ముర్రే ఒడిసి పట్టుకున్నాడు. తాను ఆడిన గత మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ ఓడిన తర్వాత దక్కిన ఈ విజయం ముర్రేకు కొత్త ఊపిరి పోసింది. చిన్న పిల్లాడికి ఆట వస్తువు దొరికినట్లుగా వింబుల్డన్ ట్రోఫీని గట్టిగా గుండెలకు హత్తుకోవడం, మ్యాచ్ గెలిచిన తర్వాత భావోద్వేగాలు ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేయడం చూస్తే అతను ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశాడో అర్థమవుతుంది. ≈ రెండోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం ≈ ఫైనల్లో మిలోస్ రోనిచ్‌పై ఘన విజయం ≈ రూ. 17 కోట్ల 39 లక్షల ప్రైజ్‌మనీ సొంతం లండన్: వింబుల్డన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ముర్రే 6-4, 7-6 (7/3), 7-6 (7/2)తో మిలోస్ రోనిచ్ (కెనడా)పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ముర్రే పూర్తి ఆధిక్యం కనబర్చాడు. రెండు, మూడు సెట్లు రోనిచ్ పోరాటంతో టైబ్రేక్‌కు చేరినా, అక్కడ ముర్రేకు అనాయాస విజయం దక్కింది. 2013లో తొలిసారి వింబుల్డన్ నెగ్గిన ముర్రే ఇక్కడ టైటిల్ సాధించడం రెండోసారి. తద్వారా బ్రిటన్ తరఫున ఫ్రెడ్ పెర్రీ (3 సార్లు) తర్వాత కనీసం రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో ఆటగాడిగా అతను తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. పెర్రీ గెలిచిన 80 ఏళ్ల తర్వాత ముర్రేకు మరో ట్రోఫీ దక్కింది. అతని కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో అతను యూఎస్ ఓపెన్ నెగ్గాడు. విజేతగా నిలిచిన ఆండీ ముర్రేకు 20 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 39 లక్షలు)... రన్నరప్ రోనిచ్కు 10 లక్షల పౌండ్లు (రూ. 8 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పోటాపోటీగా... తన 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముర్రే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి సెట్ ఆరంభంలో ముర్రే, రోనిచ్లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. ఫలితంగా స్కోరు 3-3తో నిలిచింది. అనంతరం ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. దీనిని కొనసాగించిన అతను, పదో గేమ్‌ను ఫోర్‌హ్యాండ్ వాలీ విన్నర్‌తో ముగించి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్లో కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇద్దరు ఆటగాళ్లూ సర్వీస్‌లు కాపాడుకోగా ఒక దశలో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో చెలరేగిన ఆండీ సెట్‌ను కొల్లగొట్టాడు. ముర్రే జోరు... చివరి సెట్ కూడా పోటాపోటీగానే సాగింది. ఎనిమిది గేమ్‌లలో ఇద్దరు ఆటగాళ్లూ నువ్వా నేనా అనే రీతిలో ఆడారు. దీంతో 4-4 వరకు స్కోర్ సాగింది. ఈ దశలో తొమ్మిదో గేమ్‌లో వరుసగా రెండు ఏస్‌లు కొట్టి ముర్రే తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. రోనిచ్ కూడా తగ్గకపోవడంతో 6-6 స్కోరుతో మూడో సెట్ కూడా టైబ్రేక్ వరకు వెళ్లింది. ఈ దశలో వరుస పాయింట్లతో 5-0తో ముందంజ వేసిన బ్రిటన్ స్టార్ వేగంగా విజయం వైపు దూసుకుపోయాడు. రోనిచ్ కొట్టిన బ్యాక్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తాకడంతో ముర్రే విజయం ఖరారైంది. రోనిచ్ చేతులారా... ఈ ఏడాది వింబుల్డన్‌లో ఫైనల్‌కు ముందు రోనిచ్ ఏకంగా 137 ఏస్‌లు కొట్టాడు. అయితే ఫైనల్లో మాత్రం కేవలం 4 ఏస్‌లకే పరిమితమయ్యాడు. చివరకు వింబుల్డన్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సర్వ్ (గంటకు 147 మైళ్ల వేగం) కూడా అతడికి పాయింట్ తీసుకురాలేకపోవడం విశేషం. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అతనిలో కనిపించింది. పాయింట్లు సాధించే అవకాశం లభించిన చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఆడి దానిని కాలదన్నుకున్నాడు. ముర్రే మాత్రం ఎక్కడా తడబాటుకు లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. చక్కటి రిటర్న్‌లతో ప్రత్యర్థికి సమాధానమిచ్చాడు. ముర్రే చేసిన 6 తప్పులతో పోలిస్తే రోనిచ్ ఏకంగా 21 అనవసర తప్పిదాలు చేయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. మ్యాచ్ మొత్తంలో ఒకే సారి రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. గత పది ఫైనల్స్‌లో ఫెడరర్, జొకోవిచ్లతోనే తలపడిన ముర్రే, ఈసారి కొత్త ఆటగాడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ‘నాకు సంబంధించి ప్రతీ ఏడాది ఈ టోర్నమెంట్ ప్రత్యేకమే. ఇక్కడ కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. బాధించే ఓటములూ ఉన్నాయి. బహుశా ఆ పరాజయాల వల్లే కావచ్చు వింబుల్డన్ టైటిల్ గెలుపు మరింత గొప్పగా కనిపిస్తోంది. ఈ ట్రోఫీని మళ్లీ చేతుల్లోకి తీసుకోవడం గర్వంగా ఉంది. క్రితంసారి గెలిచినప్పుడు అప్పటి ఒత్తిడి వల్ల నా విజయాన్ని ఆస్వాదించలేకపోయాను. ఈ సారి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. నా కోసం వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. వింబుల్డన్ ఫైనల్ ఆడగలిగాను కానీ దేశ ప్రధానిని కావాలనే కోరిక మాత్రం నాకు లేదు. అది చాలా పెద్ద బాధ్యత’ - ఆండీ ముర్రే -
సెరెనా ‘డబుల్’
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన కొన్ని గంటలకే అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. తన అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి సెరెనా మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సెరెనావీనస్ ద్వయం 6-3, 6-4తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై గెలిచింది. సెరెనా-వీనస్ జంటకిది 14వ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. సెరెనా ఒకే ఏడాది వింబుల్డన్‌లో సింగిల్స్‌తోపాటు డబుల్స్ టైటిల్‌ను నెగ్గడం ఇది నాలుగోసారి (2002, 2009, 2012, 2016). * మార్టినా నవ్రతిలోవా-పామ్ ష్రైవర్ జంట (20 టైటిల్స్) తర్వాత ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జోడీగా సెరెనా-వీనస్ గుర్తింపు పొందింది. * తమ కెరీర్లో డబుల్స్ విభాగంలో 23 సార్లు ఫైనల్‌కు చేరుకున్న సెరెనా-వీనస్ జంట 22 సార్లు టైటిల్‌ను సాధించింది. ఈ జంటకు 1999 శాన్‌డియాగో ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఏకైకసారి పరాజయం ఎదురైంది. -
ముర్రేదే వింబుల్డన్
లండన్: బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే సొంత గడ్డపై రెచ్చిపోయాడు. ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా 2012లో రికార్డు సృష్టించిన ముర్రే .. రెండోసారి వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కెనడా ఆటగాడు ఏడోసీడ్ మిలోస్ రోనిచ్‌పై 6-4, 7-6, 7-6తో విజయం సాధించాడు. ఈ ఏడాది ఇంతకుముందు జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్‌కు చేరినా జొకోవిచ్ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ రెండోసీడ్ ఆటగాడు ఈ సారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. కెరీర్లో ముర్రేకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో యూఎస్ ఓపెన్ నెగ్గిన ముర్రే.. 2013లో వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత మళ్లీ మూడేళ్లకు మరోసారి వింబుల్డన్ ద్వారానే తన గ్రాండ్‌స్లామ్ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న రోనిచ్ చివరికి రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఇద్దరు ఆటగాళ్లు మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే సెట్లో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్‌ను నెగ్గాడు. ఇక రెండోసెట్ కూడా హోరాహోరీగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లను నిలుపుకోవడంతో సమానంగా పాయింట్లు సాధిస్తూ వెళ్లారు. దాంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో ముర్రే తన జోరు ప్రదర్శించాడు. ఏకంగా రెండుసార్లు రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-3తో సెట్‌ను నెగ్గాడు. మరోవైపు మూడోసెట్‌ను కూడా టైబ్రేకర్ ద్వారా నెగ్గిన ముర్రే వింబుల్డన్ విజేతగా నిలిచాడు. -
సెరెనా విలియమ్స్ ఆందోళన
లండన్: అమెరికాలో నల్ల జాతీయులపై కాల్పులు జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆ దేశ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పేర్కొంది. ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమన్న సెరెనా.. కాల్పులకు కాల్పులు ప్రతీకారం కాదని హితవు పలికింది. 'డల్లాస్‌లో జరిగిన కాల్పులు నన్ను తీవ్రంగా బాధించాయి. ఏ ఒక్కరూ వారి జీవితాల్ని కోల్పోవాలని అనుకోరు. అసలు వర్ణాల్లో తేడా అనేది సమస్య కాకూడదు. నల్ల జాతీయులు ఎక్కడ నుంచి వచ్చినా మనమంతా ముందు మనుషులం. ప్రస్తుత హింసాత్మక వాతావరణంలో మా కుటుంబానికి భద్రత లేదేమో అనిపిస్తుంది. దేనికైనా హింస అనేది జవాబు కాదు. అమెరికాలో ఏదైతే జరిగిందో అది తీరిగి పూడ్చలేనిది. 2003, సెప్టెంబర్‌లో కాంప్టాన్ లో జరిగిన కాల్పుల్లో మా అక్క యెతుందె ప్రైజ్ మరణించింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి మా అక్క కారులో ఉన్న సమయంలో కాల్పులు జరగడంతో మా అక్క అక్కడే చనిపోగా, అతను మాత్రం బయటపడ్డాడు. మనిషిని మరొక మనిషి ప్రేమిస్తేనే మనుగడ ఉంటుంది' అని సెరెనా తెలిపింది. శనివారం వింబుల్డన్ టైటిల్ ను గెలిచిన సెరెనా.. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
విలియమ్స్ సిస్టర్స్‌దే డబుల్స్ టైటిల్
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ జోడి కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో శనివారం రాత్రి జరిగిన తుది పోరులో సెరెనా సిస్టర్స్ 6-3, 6-4 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)- యారోస్లావా ష్వెదోవా(కజికిస్తాన్)పై గెలిచి టైటిల్‌ను సాధించింది. అంతకుముందు సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం సెంటర్ కోర్టులో జరిగిన మహిళల డబుల్స్‌లో సెరెనా-వీనస్ జోడి ఆద్యంతం ఆకట్టుకుని ఆరోసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది.దాంతో పాటు ఓవరాల్ గా 14వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ ను ఈ జోడి చేజిక్కించుకుంది. దీంతో సెరెనా-వీనస్ ద్వయం తమ గ్రాండ్ స్లామ్ ఫైనల్ రికార్డును 14-0తో మరింత మెరుగుపరుచుకున్నారు. -
స్టెఫీ సరసన సెరెనా
నిరీక్షణ ముగిసింది. సెరెనా సాధించింది. పది నెలల నుంచి అందినట్టే అంది చేజారిపోతోన్న అరుదైన రికార్డును ఈ నల్లకలువ వింబుల్డన్ వేదికగా అందుకుంది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేసింది. గతేడాది వింబుల్డన్ టైటిల్ సాధించాక... యూఎస్ ఓపెన్ సెమీస్‌లో నిష్ర్కమించడం... ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలువడంతో సెరెనాకు ఈ ఘనత సాధించడం కాస్త ఆలస్యమైంది. ♦ 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన అమెరికా స్టార్ ♦ స్టెఫీ గ్రాఫ్ రికార్డు సమం ♦ ఏడోసారి వింబుల్డన్ ట్రోఫీ కైవసం ♦ ఫైనల్లో కెర్బర్‌పై విజయం ♦ రూ. 17 కోట్ల 39 లక్షల ప్రైజ్‌మనీ సొంతం లండన్: ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో తడబడిన సెరెనా... ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజేతగా నిలిచింది. తన కెరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. సెంటర్ కోర్టులో శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా (అమెరికా) 7-5, 6-3తో నాలుగో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఓడించింది. ఈ క్రమంలో ఏడోసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతోపాటు 20 లక్షల పౌండ్లను (రూ. 17 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంది. రన్నరప్ కెర్బర్‌కు 10 లక్షల పౌండ్ల (రూ. 8 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. 1995 నుంచి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతోన్న సెరెనా కెరీర్లో ఓవరాల్‌గా ఇది 71వ సింగిల్స్ టైటిల్. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో సెరెనా ఐదో స్థానంలో ఉంది. మార్టినా నవ్రతిలోవా (167 టైటిల్స్), క్రిస్ ఎవర్ట్ (154), స్టెఫీ గ్రాఫ్ (107), మార్గరెట్ కోర్ట్ (92) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. బదులు తీర్చుకుంది ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో కెర్బర్ చేతిలో ఓడిపోయిన సెరెనా వింబుల్డన్‌లో మాత్రం ఈ జర్మనీ క్రీడాకారిణిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 81 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సెరెనాకు కెర్బర్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో ఇద్దరూ పోటీపడి పాయింట్లు గెలిచారు. అయితే కీలకదశలో మాత్రం సెరెనా తన పవర్ఫుల్ ఆటతీరుతో కెర్బర్‌పై పైచేయి సాధించింది. తొలి సెట్ 12వ గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెరెనా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ఎనిమిదో గేమ్‌లో మరోసారి కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా... తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సెరెనా కళ్లు చెదిరేరీతిలో సర్వీస్ చేసింది. ఆమె ఏకంగా 13 ఏస్‌లు సంధించింది. మరోవైపు కెర్బర్ ఒక్క ఏస్‌ను కూడా కొట్టలేకపోయింది. ఓపెన్ శకంలో మహిళల గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా (34 ఏళ్ల 283 రోజులు) నిలిచింది. గతేడాది వింబుల్డన్‌లో 33 ఏళ్ల 285 రోజుల వయస్సులో టైటిల్ నెగ్గిన సెరెనా ఈసారీ విజేతగా నిలిచి తన పేరిటే ఉన్న రికార్డును సవరించింది. ⇒ మరో రెండు టైటిల్స్ సెరెనా సాధిస్తే... మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా-24 టైటిల్స్) రికార్డును సమం చేస్తుంది. ⇒ అత్యధికసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణుల జాబితాలో సెరెనా సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది. సెరెనాతోపాటు స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ), డోరెతి లాంబర్ట్ చాంబర్స్ (బ్రిటన్) ఏడుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించారు. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా (9 సార్లు), హెలెన్ విల్స్ మూడీ (8 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ⇒ సెరెనా 1999లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గినప్పటి నుంచి ఇప్పటివరకు 20 మంది వేర్వేరు క్రీడాకారిణులు కూడా గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌గా నిలిచారు. ‘‘ముందుగా దేవుడికి కృతజ్ఞతలు. ఆయన కరుణ లేకుంటే నేనీ ఘనత సాధించకపోయేదాన్ని. నా విజయంలో కుటుంబసభ్యులు, సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. వింబుల్డన్ సెంటర్ కోర్టు నాకు ఇల్లు లాంటిది. 22 సంఖ్య అద్వితీయ అనుభూతినిస్తోంది. కెర్బర్తో ఆడితే నాలోని అత్యుత్తమ ఆటతీరు బయటకొస్తుంది. గ్రాఫ్ రికార్డును సమం చేసినందుకు గొప్పగా అనిపిస్తోంది.’’ - సెరెనా సెరెనా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్(22) ⇒ ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2003, 2005, 2007, 2009, 2010, 2015 ⇒ {ఫెంచ్ ఓపెన్ (3): 2002, 2013, 2015 ⇒ వింబుల్డన్ (7): 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016 ⇒ యూఎస్ ఓపెన్ (6): 1999, 2002, 2008, 2012, 2013, 2014 ≈ సెరెనా సాధించిన 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో తొమ్మిది ఆమెకు 30 ఏళ్ల వయసు దాటాకే రావడం విశేషం. ≈ సెరెనా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గేందుకు 346 మ్యాచ్‌లు ఆడింది. స్టెఫీ గ్రాఫ్ 303 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించింది. ≈ ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు (304) నెగ్గిన రెండో క్రీడాకారిణి సెరెనా. మార్టినా నవ్రతిలోవా (306 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉంది. -
వింబుల్డన్ విజేత సెరెనా
లండన్ : సెరెనా విలియమ్స్.. ఈ ఏడాది ఎట్టకేలకు తొలి గ్రాండ్ స్లామ్ సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో.. వరుస రెండు సెట్లలో పోరును ముగించి వింబుల్డన్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ 7-5, 6-3 తేడాతో ఎంజెలిక్ కెర్బర్(జర్మనీ)పై గెలిచి వింబుల్డన్ టైటిల్‌ను సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా ఆద్యంత ఆకట్టుకుని ఏడోసారి వింబుల్డన్ టైటిల్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్ రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో కెర్బర్ చేతిలో ఓటమికి సెరెనా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. తొలి సెట్ ఆరో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ తరువాత తన సర్వీస్‌ను కాపాడుకుని ఆ సెట్‌ను దక్కించుకుంది. ఇక రెండో సెట్లో కెర్బర్ నుంచి సెరెనా కాస్త పోటీ ఎదుర్కొంది. రెండో సెట్ లో సెరెనా 2 -1 తో ఆధిక్యంలో ఉన్న దశలో కెర్బర్ పుంజుకుంది. తన సర్వీసును కాపాడుకోవడంతో పాటు, సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో స్కోరు 3-3తో సమం చేసింది కాగా, ఆ తరువాత నాల్గో గేమ్‌లో తన సర్వీసును కాపాడుకున్న సెరెనా.. ఐదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ ద్వారా ఆధిక్యం సాధించింది. ఇక ఆరో గేమ్‌ను సెరెనా సునాయాసంగా గెలిచి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు స్టెఫీగ్రాఫ్ తర్వాత వింబుల్డన్ సాధించిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా నిలవాలనుకున్న కెర్బర్ రన్నరప్ గా సరిపెట్టుకుంది. -
రోనిచ్ సంచలనం
* సెమీస్‌లో ఫెడరర్‌పై విజయం * తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి లండన్: కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే కల ఫెడరర్‌కు కలగానే మిగిలిపోతుందేమో! కొన్నేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన నొవాక్ జొకోవిచ్ అడ్డు లేకపోయినా... ఈ స్విట్జర్లాండ్ స్టార్ వింబుల్డన్‌లో తడబడ్డాడు. కెనడా యువ కెరటం మిలోస్ రోనిచ్తో జరిగిన ఐదు సెట్ల పోరాటంలో ఈ మాజీ చాంపియన్ చేతులెత్తేశాడు. కీలక సమయంలో కళ్లు చెదిరే షాట్లు, తిరుగులేని సర్వీస్‌లతో హడలెత్తించిన రోనిచ్ తన కెరీర్లో చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెనడా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. సెంటర్ కోర్టులో శుక్రవారం 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఆరో సీడ్ రోనిచ్ 6-3, 6-7 (3/7), 4-6, 7-5, 6-3 మూడో సీడ్ ఫెడరర్‌ను ఓడించాడు. ఇప్పటిదాకా వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన 10 సార్లూ ఫెడరర్‌కు ఓటమి ఎదురుకాలేదు. కానీ ఈ స్విస్ స్టార్ జైత్రయాత్రకు రోనిచ్ తెరదించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న రోనిచ్ తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో ఫెడరర్ పుంజుకున్నాడు. కచ్చితమైన సర్వీస్‌లకు తోడు బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. 5-4తో ఆధిక్యంలో ఉన్న దశలో రోనిచ్ సర్వీస్‌లో ఫెడరర్‌కు మూడు సెట్ పాయింట్లు వచ్చాయి. అయితే రోనిచ్ నాలుగుసార్లు సెట్ పాయింట్ కాపాడుకొని గేమ్ గెలిచి స్కోరును 5-5తో సమం చేశాడు. కానీ టైబ్రేక్‌లో ఫెడరర్ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్లో ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. అయితే 12వ గేమ్‌లో ఫెడరర్ పేలవమైన సర్వీస్‌లకు తోడు రోనిచ్ అద్భుత ఆటతీరు కారణంగా ఈ కెనడా ప్లేయర్ బ్రేక్ సాధించి సెట్‌ను 7-5తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో రోనిచ్ మరింత దూకుడుగా ఆడగా... అలసిపోయిన ఫెడరర్ ఎదురునిలువలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రోనిచ్ 25 ఏస్‌లు.. ఫెడరర్ 16 సంధించారు. రోనిచ్ 11 డబుల్ ఫాల్ట్‌లు చేయగా... ఫెడరర్ ఐదుకే పరిమితమయ్యాడు. రోనిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం రాగా ఫెడరర్ ఒకసారి మాత్రమే సఫలమయ్యాడు. మరోవైపు ఫెడరర్ సర్వీస్‌ను రోనిచ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. రోనిచ్ 75 విన్నర్స్ కొట్టగా... ఫెడరర్ 49 విన్నర్స్‌తో సరిపెట్టుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ముగిసిన భారత్ పోరు ఈసారి వింబుల్డన్ టోర్నీలో భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మూడో రౌండ్లో నిష్ర్కమించింది. గురువారం రాత్రి ఆలస్యంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్-హింగిస్ జంట 6-3, 3-6, 2-6తో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గతేడాది హింగిస్‌తో కలిసి సానియా మహిళల డబుల్స్ విభాగంలో, పేస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్స్ సాధించారు. సెరెనా X కెర్బర్ నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే పట్టుదలతో సెరెనా... స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందాలనే తపనతో ఎంజెలిక్ కెర్బర్... శనివారం జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిన సెరెనా వింబుల్డన్‌లో విజృంభిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి సంచలనం సృష్టించిన కెర్బర్ అదే ఫలితాన్ని వింబుల్డన్‌లో పునరావృతం చేస్తుందో లేదో..? సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
ఫెడరర్‌కు షాక్
లండన్: నాలుగేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ప్రపంచ నం. 1 నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోనే వెనుదిరగడంతో ఈసారి జరుగుతున్న వింబుల్డన్ కచ్చితంగా నెగ్గుతాడని భావించిన ఫెడరర్ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మూడోసీడ్‌గా వింబుల్డన్ బరిలో ఉన్న ఫెడరర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ ఆటగాడు మిలోస్ రౌనిక్ (కెనడా) చేతిలో 3–6, 7–6, 6–4, 5–7, 3–6తో పరాజయం పాలయ్యాడు. 2010 నుంచి గ్రాండ్‌స్లామ్‌లు ఆడుతున్న రౌనిక్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఓడిపోయిన ఫెడరర్ రెండోసెట్లో పుంజుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌ను నెగ్గిన ఫెడరర్ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. మూడోసెట్లో 7వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో ఆధిక్యం సంపాదించాడు. నాలుగోసెట్ హోరాహోరీగా జరగగా.. ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రౌనిక్ మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక ఐదోసెట్ను అలవోకగా నెగ్గిన రౌనిక్ ఫైనల్లో అడుగుపెట్టాడు. -
సెమీస్‌లో ముర్రే
లండన్: బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే.. ఏడోసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ ముర్రే 7-6 (12/10), 6-1, 3-6, 4-6, 6-1తో 12వ సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)పై నెగ్గాడు. 2013లో టైటిల్ సాధించిన ముర్రే... శుక్రవారం జరిగే సెమీస్‌లో బెర్డిచ్ (చెక్)తో తలపడతాడు. సోంగాతో తలపడిన 15 మ్యాచ్‌ల్లో 13సార్లు గెలిచిన ముర్రే కెరీర్లో ఇది 100వ విజయం. -
సానియా, పేస్ జోడీలకు చుక్కెదురు
లండన్: డిఫెండింగ్ చాంపియన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వింబుల్డన్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 2-6, 4-6తో ఐదోసీడ్ టిమియా బాబోస్ (హంగేరి)-ష్వెదోవా (కజకిస్తాన్)ల చేతిలో పరాజయం చవిచూశారు. 68 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడి అంచనాలకు అనుగుణంగా రాణించలేదు. తొలిసెట్లో మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను చేజార్చుకుని సెట్‌ను కోల్పోయారు. ఇక రెండోసెట్‌లోనూ ఒకటి, నాలుగు గేమ్‌ల్లో సర్వీస్ కోల్పోవడంతో బాబోస్-ష్వెదోవా 5-1 ఆధిక్యంలోకి వెళ్లారు. అయితే ఏడు, తొమ్మిదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సానియా జంట ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించింది. కానీ పదో గేమ్‌లో ష్వెదోవా-బాబోస్ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో సానియా-హింగిస్‌లకు ఓటమి తప్పలేదు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో లియాండర్ పేస్-హింగిస్ జోడి 6-3, 3-6, 2-6తో కాంటినెన్ (ఫిన్లాండ్)-వాట్సన్ (బ్రిటన్) చేతిలో ఓడింది. -
సూపర్ సెరెనా
వింబుల్డన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెమీస్‌లో వెస్నినాపై గెలుపు కెర్బర్ చేతిలో వీనస్‌కు చుక్కెదురు లండన్: ప్రత్యర్థి అనుభవరాహిత్యాన్ని ఆసరాగా చేసుకున్న అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్... వింబుల్డన్‌లో దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ... తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-2, 6-0తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఎలెనా వెస్నినా (రష్యా)పై గెలిచింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటికి ఆరుసార్లు విజేతగా నిలిచిన అమెరికన్ ఏడో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. కేవలం 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా... పదునైన సర్వీస్‌లు... తిరుగులేని ఏస్‌లు... బలమైన బేస్‌లైన్ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కెరీర్లో 32వ గ్రాండ్‌స్లామ్ సెమీస్ మ్యాచ్ ఆడిన సెరెనా... 11 ఏస్‌లు, 28 విన్నర్లతో చెలరేగిపోయింది. ఏడు అనవసర తప్పిదాలు చేసినా... ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెరెనా కెరీర్లో ఇది 28వ స్లామ్ ఫైనల్. తొలిసెట్లో సెరెనా సర్వీస్‌లో వెస్నినా కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించగా, రెండో సెట్లో ఒక్కటీ నెగ్గలేదు. రష్యా ప్లేయర్ సెమీస్‌కు చేరడం ఇదే మొదటిసారి కావడంతో బ్యాక్ హ్యాండ్ షాట్లతో కోర్టులో చురుకుగా కదిలిన సెరెనా.. 28 నిమిషాల్లోనే తొలిసెట్‌ను ముగించింది. రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసి, రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకోవడంతో 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు, ఏడు గేమ్‌ల్లో వెస్నినా సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... ఆరు, ఎనిమిది గేమ్‌లను సెరెనా సర్వీస్‌తో దక్కించుకుంది. ఇక రెండో సెట్లో ఒకటి, మూడు, ఐదు గేమ్‌ల్లో వెస్నినా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు మూడుసార్లు తన సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. వీనస్ ఆశలు ఆవిరి ఐదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్.. వింబుల్డన్‌లో నిరాశపర్చింది. ఏడేళ్ల తర్వాత టైటిల్ గెలవాలన్న ఆశలకు అడుగు దూరంలోనే నిలిచిపోయింది. రెండో సెమీస్‌లో ఎనిమిదోసీడ్ వీనస్ (అమెరికా) 6-4, 6-4తో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) చేతిలో ఓడింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... వీనస్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మూడు ఏస్‌లు, 24 విన్నర్లు సంధించిన ఈ అమెరికన్.. కీలక సమయంలో సర్వీస్‌లను చేజార్చుకుంది. మరోవైపు కెర్బర్ రెండు ఏస్‌లు, 17 విన్నర్లు సాధించింది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... యూఎస్ ఓపెన్ (2010) తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగే ఫైనల్లో సెరెనా.... కెర్బర్తో తలపడనుంది. -
సానియా జోడికి షాక్
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడికి ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి 2-6, 4-6 తేడాతో ఐదో సీడ్ తిమియా బాబోస్(హంగేరి)-ష్వెదోవా(రష్యా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన 'సాన్టీనా' జోడి భారంగా ఇంటి ముఖం పట్టింది. అనవసర తప్పిదాలతో సానియా జోడి తగిన మూల్యం చెల్లించుకుంది. మరోవైపు బాబోస్ జంట అంచనాలు మించి రాణించడంతో పోరు ఆద్యంతం ఏకపక్షంగా సాగింది. -
సెరెనా అలవోకగా..
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ అలవోకగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో సెరెనా 6-2, 6-0 తేడాతో ఎలెనా ఎస్నినాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఏకపక్ష పోరులో రెండు సెట్లను అవలీలగా గెలిచిన సెరెనా తన సత్తాను చాటుకుంటూ టైటిల్ వేటకు అడుగుదూరంలో నిలిచింది. గతేడాది వింబుల్డ్ను గెలిచిన సెరెనా.. ఆ తరువాత వరుసగా మూడు గ్రాండ్ స్లామ్‌ల్లో ఓటమి పాలైంది. 2015లో యూఎస్ ఓపెన్ లో రన్నరప్‌గా సరిపెట్టుకున్న నల్లకలువ.. 2016లో ఇప్పటివరకూ వరుసగా జరిగిన ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్‌లను సాధించడంలో విఫలమైంది. వింబుల్డన్ లో చివరి అడ్డంకిని సెరెనా అధిగమిస్తే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకూ సెరెనా 303 గ్రాండ్ స్లామ్ విజయాలను సాధించగా, వింబుల్డన్ లో 9వ సారి ఫైనల్ కు చేరింది. ఇందులో ఆరు సార్లు టైటిల్ ను సాధించడంలో సెరెనా సఫలమైంది. సెరెనా విలియమ్స్ తన తుదిపోరులో కెర్బర్తో కానీ, అక్క వీనస్ విలియమ్స్‌తో కానీ తలపడనుంది. వీరి మధ్య మహిళల రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
యోధుడు నిలిచాడు
♦ వింబుల్డన్ సెమీస్‌లో ఫెడరర్ ♦ ఉత్కంఠ పోరులో సిలిచ్‌పై గెలుపు ♦ రావోనిక్, బెర్డిచ్ కూడా ముందుకు నాలుగేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పోరాటం చేస్తున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్... వింబుల్డన్‌లో తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. రెండు సెట్లు వెనుకబడి... నాలుగో సెట్లో మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని ఓ యోధుడిలా పోరాడాడు. దీంతో ఉత్కంఠ రేకెత్తించిన క్వార్టర్స్ పోరులో చివరి వరకు సిలిచ్‌ను సింహంలా వేటాడి గెలిచి నిలిచాడు. లండన్: ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైనా... తనదైన శైలిలో చెలరేగిన ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెడరర్... వింబుల్డన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో మూడోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-7 (4/7), 4-6, 6-3, 7-6 (11/9), 6-3తో తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. వింబుల్డన్‌లో ఫెడరర్ సెమీస్‌కు చేరడం ఇది 11వసారి కాగా, మేజర్ టోర్నీల్లో 40వది. వింబుల్డన్‌లో 84వ గెలుపుతో జిమ్మీ కానర్స్ రికార్డును సమం చేసిన ఫెడరర్... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 307 విజయాలతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఎనిమిదోసారి వింబుల్డన్ టోర్నీ కోసం బరిలోకి దిగిన ఫెడరర్.... మ్యాచ్‌లో రెండు సెట్లు వెనుకబడి గెలవడం కెరీర్లో పదోసారి. కెన్ రోస్వాల్ (1974) తర్వాత సెమీస్‌కు చేరిన ఎక్కువ వయసు క్రీడాకారుడిగా కూడా ఫెడరర్ (39 ఏళ్లు) రికార్డులకెక్కాడు. సెంటర్ కోర్టులో మూడు గంటలా 17 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్, సిలిచ్లు కొదమ సింహాల్లా తలపడ్డారు. స్విస్ స్టార్ 27 ఏస్‌లు, 67 విన్నర్లు సంధించి... 2014 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సిలిచ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే తొలిసెట్ ఐదో గేమ్‌లో కేవలం బ్రేక్ పాయింట్లను మాత్రమే కాచుకున్న ఫెడరర్.. టైబ్రేక్‌లో వెనుబడ్డాడు. 5-0 ఆధిక్యంలో ఉన్నప్పుడు సిలిచ్ నాలుగుసార్లు సెట్ పాయింట్లను చేజార్చుకున్నా చివరకు ఫలితాన్ని సాధించాడు. ఇక రెండో సెట్లోనూ క్రొయేషియన్ జోరు చూపెట్టడంతో ఫెడరర్ ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే మూడో సెట్ ఏడో గేమ్‌లో మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని ఫెడరర్ మ్యాచ్‌లో నిలిచాడు. ఇక దాదాపు గంటపాటు సాగిన నాలుగో సెట్లో సర్వీస్‌లతో చెలరేగిన సిలిచ్ ఓ దశలో 5-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పదో గేమ్‌లో ఫెడరర్ మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోవడంతో గేమ్ మలుపు తిరిగింది. తర్వాత ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లో రెండు సెట్ పాయింట్లను చేజార్చుకున్న స్విస్ స్టార్... సిలిచ్ తన సర్వీస్‌లో కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తగలడంతో మూడో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఉత్కంఠగా సాగిన పోరులో మరో రెండుసార్లు ఫెడరర్ సెట్ పాయింట్లను కోల్పోయాడు. కానీ సిలిచ్ కొట్టిన షాట్స్ కూడా పదేపదే నెట్‌కు తాకడంతో సెట్ ఫెడరర్ సొంతమైంది. ఇక ఐదో సెట్లో తన అనుభవాన్ని రంగరించిన ఫెడరర్... బలమైన బేస్‌లైన్ ఆటతో సిలిచ్ ఆట కట్టించాడు. రావోనిక్ కూడా.. ఇతర క్వార్టర్స్ పోరులో ఆరోసీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా) 6-4, 7-5, 5-7, 6-4తో 28వ సీడ్ స్యామ్ క్వెరీ (అమెరికా)పై; 10వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్) 7-6 (7/4), 6-3, 6-2తో 32వ సీడ్ లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)పై నెగ్గారు. శుక్రవారం జరిగే సెమీస్‌లో ఫెడరర్.. రావోనిక్తో తలపడతాడు. -
సిస్టర్స్ సులభంగా...
* వింబుల్డన్ సెమీస్‌లో సెరెనా, వీనస్ * కెర్బర్, వెస్నినా కూడా... లండన్: డిఫెండింగ్ చాంపియన్ హోదాను కొనసాగిస్తూ చెల్లెలు... ఏడేళ్ల తర్వాత సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటూ అక్క... వింబుల్డన్‌లో అమెరికా సిస్టర్స్ సెరెనా, వీనస్‌లు చెలరేగిపోయారు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ఆధిపత్యం కొనసాగిస్తూ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-4, 6-4తో 21వ సీడ్ అనస్థాసియా పావులుచెంకోవా (రష్యా)పై; 8వ సీడ్ వీనస్ 7-6 (7/5), 6-2తో యారోస్లోవా ష్వెదోవా (కజకిస్తాన్)పై నెగ్గి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. పావులుంచెకోవాతో గంటా 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా వ్యూహాత్మకంగా ఆడింది. భారీ సర్వీస్‌లతో కాకుండా తెలివిగా చిన్న చిన్న షాట్స్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. తొలిసెట్లో ఇరువురు చెరో నాలుగు గేమ్‌ల్లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. కానీ తొమ్మిదో గేమ్‌లో పావులుచెంకోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ వెంటనే సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ను నిలబెట్టుకుంది. రెండోసెట్‌లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేసి సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మార్టినా నవ్రోతిలోవా (1994లో) తర్వాత వింబుల్డన్ సెమీస్‌కు చేరిన ఎక్కువ వయసు మహిళగా రికార్డులకెక్కిన 36 ఏళ్ల వీనస్... క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... 2010 యూఎస్ ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ష్వెదోవాతో గంటా 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో వీనస్ వరుసగా సర్వీస్‌లను కాపాడుకుంటూ సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండోసెట్లో ఒకసారి సర్వీస్‌ను కోల్పోయిన వీనస్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 7-6 (7/2)తో ఐదోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై; ఎలెనా వెస్నినా (రష్యా) 6-2, 6-2తో 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. సెమీస్‌లో సెరెనా... వెస్నినాతో; వీనస్... కెర్బర్తో తలపడతారు. సానియా జోడీకి చుక్కెదురు మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-ఇవాన్ డుడిగ్ (క్రొయేషియా) జోడికి చుక్కెదురైంది. రెండోరౌండ్లో టాప్‌సీడ్ సానియా-డుడిగ్ 6-4, 3-6, 5-7తో బ్రిటన్ జంట నీల్ స్కుపిస్కీ-అనా స్మిత్‌ల చేతిలో ఓడారు. దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు చెరో సెట్‌ను సాధించాయి. మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో తొలిసెట్‌ను చేజిక్కించుకున్న సానియా ద్వయం... రెండోసెట్లో వరుసగా సర్వీస్‌లను చేజార్చుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఓ దశలో సానియా-డుడిగ్ 5-3 ఆధిక్యంలో నిలిచారు. అయితే కీలకమైన తొమ్మిదో గేమ్‌లో స్కోరు 40-30 వద్ద మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటన్ జోడి భారీ సర్వీస్‌లతో చెలరేగిపోయింది. మరోసారి మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ప్రత్యర్థి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించారు. తర్వాత సర్వీస్‌ను కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచారు. ఇక 11వ గేమ్‌లో సానియా జోడి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు 12వ గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. బాలికల రెండోరౌండ్లో కర్మన్ కౌర్ (భారత్) 6-4, 2-6, 2-6తో బోల్క్వెడ్జ్ (జార్జియా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-రొడినోవా (ఆస్ట్రేలియా) జంటకు ఓటమి ఎదురైంది. కొలంబియా ద్వయం కాబెల్-మారినో 7-6 (7/5), 6-3తో బోపన్న జోడిపై నెగ్గింది. -
రద్వాన్‌స్కా అవుట్
సిబుల్కోవా సంచలనం * వింబుల్డన్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశం * సెరెనా కూడా ముందుకు లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం నమోదయింది. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రద్వాన్‌స్కా ప్రి క్వార్టర్స్‌లో ఓడిపోయింది. 2 గంటల 59 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 5-7, 9-7తో రద్వాన్‌స్కా (పోలాండ్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. రెండో సెట్లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ఊపిరి పీల్చుకున్న రద్వాన్‌స్కా... మూడోసెట్లో రెండు ఏస్‌లు సంధించింది. మూడో సెట్లో ఐదుసార్లు సర్వీస్ బ్రేక్‌లు జరిగాయి. 12వ గేమ్‌తో ఆధిక్యంలోకి వచ్చిన సిబుల్కోవా... ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. సిబుల్కోవా వింబుల్డన్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఇది రెండోసారి. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7-5, 6-0తో కుజ్ నెత్సోవా(రష్యా)పై, ఐదో సీడ్ హలెప్ (రొమేనియా) 6-7 (5), 6-4, 6-3తో మాడిసన్ కీస్ (అమెరికా)పై, నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 6-1తో మిసాకి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. -
క్వార్టర్స్‌లో సానియా జోడి
వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి క్వార్టర్స్‌కు చేరింది. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సానియా జోడి 6-1, 6-0తో మెక్‌హేల్(అమెరికా)-ఒస్టాపెన్కో (లాత్వియా) జోడిపై అలవోకగా నెగ్గింది. సానియా, హింగిస్ల ధాటికి ప్రత్యర్థులు కేవలం 46 నిమిషాల్లో చేతులెత్తేశారు. తొలిసెట్లో రెండుసార్లు, రెండో సెట్లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసిన ‘సాన్టీనా’ మ్యాచ్ మొత్తం మీద కేవలం ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో భారత ఆటగాడు బోపన్న-మార్గియా (రొమేనియా) జోడి 6-2, 3-6, 4-6, 7-6(6), 6-8తో హెన్రి కొంటినెన్(ఫిన్లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్ కు సానియా జోడి
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడి క్వార్టర్స్‌కు చేరింది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడి 6-1, 6-0 తేడాతో మెక్ హేల్-ఓస్టాపెన్కోపై గెలిచి క్వార్టర్స్ కు చేరింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా జోడి ఆద్యంతం ఆకట్టుకుంది. తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక పాయింట్ మాత్రమే కోల్పోయిన సానియా జోడి.. రెండో సెట్లో మాత్రం దుమ్మురేపింది. మరోవైపు పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా(రోమేనియా) 6-2, 3-6, 6-4, 7-6, 6-8 తేడాతో కాంటినెన్-పీర్స్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. -
రద్వాన్‌స్కా ఇంటికి
లండన్: సీజన్ మూడో గ్రాండ్ స్లామ్ వింబుల్డన్‌లో సంచనల ఫలితాల పరంపర కొనసాగుతోంది. మూడో సీడ్ రద్వాన్ స్కా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో పోలండ్ క్రీడాకారిణి రద్వాన్ స్కా 3-6, 7-5, 7-9 తేడాతో 19వ సీడ్ సిబుల్కోవా (స్లోవేకియా)చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను కోల్పోయిన పొలండ్ భామ.. ఆ తరువాత రెండో సెట్లో తేరుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో సిబుల్ కోవా దాటికి రద్వాన్ స్కా తలవంచక తప్పలేదు. దీంతో సంచలనాలకు మారుపేరైన సిబుల్కోవా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. 2012లో వింబుల్డన్ లో ఫైనల్ రౌండ్ కు వెళ్లిన రద్వాన్..ఆపై కనీసం క్వార్టర్స్ అడ్డంకిని కూడా దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టగా, పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లో నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల సింగిల్స్ లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ కు చేరాడు. నాల్గో రౌండ్ పోరులో 6-2, 6-3, 7-5 తేడాతో స్టీవ్ జాన్సన్ పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. -
సెరెనా @ 300
* వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ * సోంగా, గ్యాస్కెట్, బెర్డిచ్ కూడా... లండన్: ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్... వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్‌సీడ్ సెరెనా 6-3, 6-0తో అన్‌సీడెడ్ అన్నికా బేక్ (జర్మనీ)పై గెలిచింది. దీంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓపెన్ ఎరాలో మార్టినా నవ్రోతిలోవా (అమెరికా) 306 విజయాలతో ‘టాప్’లో కొనసాగుతోంది. 34 ఏళ్ల సెరెనాకు వింబుల్డన్‌లో ఇది 82వ విజయం కాగా, ఏడో టైటిల్ కోసం బరిలోకి దిగిన ఆమె... స్టెఫీ గ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది. బెక్‌తో 51 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... అమెరికా స్టార్ పదునైన సర్వీస్‌లు.. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. దాదాపు 198 కేఎంపీహెచ్ వేగంతో సంధించిన ఏడు ఏస్‌లకు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోయింది. మ్యాచ్ మొత్తంలో 25 విన్నర్లు సాధించింది. మరోవైపు 22 ఏళ్ల బేక్.. వింబుల్డన్‌లో మూడోరౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి. ఇతర మ్యాచ్‌ల్లో 13వ సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 6-7 (1), 6-2, 8-6తో 18వ సీడ్ సోలెనీ (అమెరికా)పై; 21వ సీడ్ పావులెంచుకోవా (రష్యా) 6-3, 6-2తో 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై; 27వ సీడ్ వాండ్వాగె (అమెరికా) 6-3, 6-4తో ఆరోసీడ్ విన్సీ (ఇటలీ)పై; మకరోవా (రష్యా) 6-4, 6-2తో 24వ సీడ్ స్ట్రయికోవా (చెక్)పై; వెస్నినా (రష్యా) 7-5, 7-5తో బొసెరుప్ (అమెరికా)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరారు. డెల్పోట్రోకు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో డెల్‌పోట్రో (అర్జెంటీనా)కు చుక్కెదురైంది. మూడోరౌండ్లో 32వ సీడ్ లుకాస్ ఫౌలి (ఫ్రాన్స్) 6-7 (4), 7-6 (6), 7-5, 6-1తో డెల్పోట్రోపై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఏడోసీడ్ గ్యాస్కెట్ (ఫ్రాన్స్) 2-6, 7-6 (5), 6-2, 6-3తో వినోలాస్ (స్పెయిన్)పై; 10వ సీడ్ బెర్డిచ్ (చెక్) 6-3, 6-4, 4-6, 6-1తో జ్వరేవ్ (జర్మనీ)పై; 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-7 (3), 3-6, 7-6 (5), 6-2, 19-17తో 18వ సీడ్ ఇస్నేర్ (అమెరికా)పై; 15వ సీడ్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 6-3, 6-7 (2), 6-3, 6-4తో 22వ సీడ్ లోపెజ్ (స్పెయిన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి మహిళల డబుల్స్ రెండోరౌండ్లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి 6-3, 6-1తో ఎరి హౌజుమి-మియు కాటో (జపాన్)జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. 52 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... సానియా ద్వయం ఎనిమిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదింటిని సద్వినియోగం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో రెండో రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)- మార్సిన్మత్కోవాస్కీ (పోలాండ్) జోడి 3-6, 2-6తో 10వ సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. తొలిసెట్లో వచ్చిన మూడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో పేస్ ద్వయం ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోలేదు. మ్యాచ్ మొత్తంలో మూడుసార్లు సర్వీస్‌ను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. నాలుగోసారి.. వర్షం కారణంగా ఈసారి వింబుల్డన్‌లో ఆదివారం కూడా మ్యాచ్‌లు నిర్వహించారు. ఇలా చేయడం టోర్నీ చరిత్రలో ఇది నాలుగోసారి కాగా, 2004 తర్వాత మొదటిసారి. -
సెరెనా అరుదైన మైలురాయి
లండన్: గతేడాది క్యాలెండర్ గ్రాండ్ స్లామ్‌ను సాధించడంలో తృటిలో కోల్పోయిన టాప్ సీడ్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ తాజాగా అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో రౌండ్లో విజయం సాధించి మూడు వందల గ్రాండ్ స్లామ్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ జాబితాలో అత్యధిక విజయాలు సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. దీంతో ఓపెన్ ఎరాలో అత్యధిక విజయాలతో తొలిస్థానంలో ఉన్న మార్టినా నవ్రతిలోవా(306)ను చేరేందుకు కొద్ది దూరంలో నిలిచింది ఇదిలా ఉండగా తాజా విజయంతో 82 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ విజయాలను సెరెనా ఖాతాలో వేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం వింబుల్డన్ గెలిచాక తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 21కు పెంచుకున్న సెరెనా.. మరో టైటిల్ గెలిస్తే ఆల్‌టైమ్ రికార్డు స్టెఫీగ్రాఫ్‌ను సమం చేస్తుంది. ఈరోజు జరిగిన మూడో రౌండ్లో సెరెనా 6-3, 6-0 తేడాతో అన్నికా బెక్(జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. ఆద్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సెరెనా ఏడు ఏస్‌లు సంధించింది. ఈ పోరును కేవలం 51 నిమిషాల్లో ముగించిన సెరెనా.. తన తదుపరి పోరులో 13వ సీడ్ స్వెత్లెనా కుజ్నెత్సోవా (రష్యా)తో తలపడనుంది. గతేడాది వరుసగా ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ లను గెలిచిన సెరెనా, యూఎస్ ఓపెన్ లో చతికిలబడింది. దీంతో క్యాలండర్ గ్రాండ్ స్లామ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్ స్లామ్ ల్లో సెరెనా ఆకట్టుకున్నా, టైటిల్ సాధించడంలో విఫలమైంది. -
జొకోకు షాక్
మూడోరౌండ్లోనే వెనుదిరిగిన నంబర్‌వన్ క్యాలెండర్ స్లామ్ ఆశలు ఆవిరి సామ్ క్వెరీ చేతిలో ఓటమి ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, ముర్రే లండన్: వింబుల్డన్‌లో ఆరో రోజు అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు అనూహ్యమైన షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగినా... ఓ తక్కువ ర్యాంక్ ఆటగాడి చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు. శనివారం ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 7-6 (8/6), 6-1, 3-6, 7-6 (7/5)తో టాప్‌సీడ్ జొకోవిచ్పై సంచనల విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 2008లో మారన్ చేతిలో రెండో రౌండ్లోనే ఓడిన జొకోవిచ్.. ఆ తర్వాత జరిగిన ప్రతి టోర్నీలో కనీసం క్వార్టర్స్‌కైనా చేరుకున్నాడు. కానీ ఈసారి మూడోరౌండ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2009 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఇంత తొందరగా జొకోవిచ్ వెనుదిరగడం ఇదే మొదటిసారి. మొత్తానికి 1969 (రాడ్ లేవర్) తర్వాత ‘క్యాలెండర్ స్లామ్’ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలన్న కల నెరవేరలేదు. అలాగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 30 వరుస విజయాలకూ బ్రేక్ పడింది. క్వెరీతో రెండు గంటలా 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కొన్నిసార్లు అనూహ్యంగా వెనుకబడ్డాడు. శుక్రవారం మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా శనివారానికి వాయిదా పడింది. అయితే అప్పటికే తొలిరెండు సెట్లు కోల్పోయిన జొకోవిచ్ మూడోసెట్లో మాత్రం బాగా పుంజుకున్నాడు. తన ఫామ్‌ను చూపెడుతూ 5-0 ఆధిక్యంతో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ ఆరంభంలో అద్భుతంగా ఆడిన సెర్బియన్ 5-4 ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఈ దశలో సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. దీంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లినా.. చకచకా పాయింట్లతో ముందంజ వేశాడు. కానీ చివర్లో చేసిన ఫోర్‌హ్యాండ్ తప్పిదానికి అతి పెద్ద మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో క్వెరీ 31 ఏస్‌లు, 56 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ ముర్రే (బ్రిటన్) 6-3, 7-5, 6-2తో జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై; మూడోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-2, 6-2తో ఇవాన్స్ (బ్రిటన్)పై; ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-3, 7-5తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-4తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో కెర్బర్: మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-6 (11), 6-1తో విటోఫ్ట్ (జర్మనీ)పై; ఐదోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై; సఫరోవా (చెక్) 4-6, 6-1, 12-10తో సెపలోవా (స్లొవేకియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. అయితే పదోసీడ్ క్విటోవా (చెక్) మాత్రం రెండోరౌండ్లోనే ఓడింది. -
ప్రిక్వార్టర్స్ కు హాలెప్
లండన్:ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో రొమేనియా క్రీడాకారిణి, ఐదో సీడ్ సిమోన్ హాలెప్ నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఆలస్యంగా జరిగిన మూడో రౌండ్లో హాలెప్ 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) పై గెలిచి ప్రిక్వార్టర్స్ లో కి దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోని హాలెప్ మాత్రం ఆద్యంత ఆకట్టుకుంది. తొలి రెండు సెట్లలో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన హాలెప్ మరో అడుగు ముందుకేసింది. గత ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే కెర్బర్‌ను ఓడించడంతో పాటు సెమీస్ చేరిన కికి బెరటెన్స్ .. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఎటువంటి ప్రతిఘటన లేకుండా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
ముగురుజాకు షాక్
* వింబుల్డన్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం * అన్‌సీడెడ్ సెపలోవా చేతిలో ఓటమి * మూడోరౌండ్లో ముర్రే, నిషికోరి, రావోనిక్ లండన్: గత మూడు రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్‌లో నాలుగో రోజు పెను సంచలనం నమోదైంది. ఫ్రెంచ్ ఓపెన్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 127వ ర్యాంకర్ జానా సెపలోవా (స్లొవేకియా) 6-3, 6-2తో రెండోసీడ్ ముగురుజాపై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెపలోవా సర్వీస్‌లో చెలరేగిపోయింది. బలమైన ఫోర్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో స్పెయిన్ ప్లేయర్ ఆట కట్టించింది. తొలిసెట్ రెండో గేమ్‌లోనే సర్వీస్‌ను కోల్పోవడం ముగురుజాపై ప్రభావం చూపింది. నాలుగు, ఏడు, ఎనిమిది గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. ఇక రెండో సెట్లో సెపలోవా మరింత జోరు చూపెట్టింది. రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నాలుగు గేమ్‌ల్లో ముగురుజా రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్నా... ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఓవరాల్‌గా ముగురుజా మ్యాచ్ మొత్తంలో 22సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-1, 6-4తో లెప్చెంకో (అమెరికా)పై; 5వ సీడ్ హలెప్ (రొమేనియా) 6-1, 6-1తో షియావోన్ (ఇటలీ)పై; 8వ సీడ్ వీనస్ (అమెరికా) 7-5, 4-6, 6-3తో మరియా సక్కారి (గ్రీక్)పై; 9వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-4, 4-6, 6-3తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై; 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో కుమ్కుమ్ (థాయ్‌లాండ్)పై; 12వ సీడ్ నవారో (స్విట్జర్లాండ్) 3-6, 6-2, 6-1తో అలెర్టోవా (చెక్)పై; లిసికి (జర్మనీ) 6-4, 6-2తో 14వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. బొసెరుప్ (అమెరికా) 6-4, 1-0 ఉన్న దశలో ఏడోసీడ్ బెనిసిచ్ (స్విట్జర్లాండ్) మ్యాచ్ నుంచి వైదొలిగింది. ముర్రే జోరు... పురుషుల సింగిల్స్‌లో రెండోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) జోరు కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్లో 6-3, 6-2, 6-1తో యెన్ సున్ లూ (తైపీ)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-4, 6-4, 6-2తో బెన్నెట్ (ఫ్రాన్స్)పై; 6వ సీడ్ రావోనిక్ (కెనడా) 7-6 (5), 6-4, 6-2తో సెప్పీ (ఇటలీ)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-7 (6), 6-4, 6-4తో స్టాకోవోస్కీ (ఉక్రెయిన్)పై; 11వ సీడ్ గోఫిన్ (బెల్జియం) 6-4, 6-0, 6-3తో రోజెర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై; మహుట్ (ఫ్రాన్స్) 6-1, 6-4, 6-3తో 13వ సీడ్ ఫెరర్ (స్పెయిన్)పై; దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 7-6 (1), 4-6, 6-4తో 16వ సీడ్ సిమోన్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 14వ సీడ్ అగుట్ (స్పెయిన్)కు... కుష్కిన్ (కజకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. -
ఫెదరర్ శుభారంభం
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా తొలి రౌండ్ పోరులో ఫెదరర్ 7-6(7/5), 7-6(7/3), 6-3 తేడాతో గుడో పెల్లా(అర్జెంటీనా)ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.తొలి రెండు సెట్లు టై బ్రేక్ దారి తీసినా ఫెదరర్ ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పెల్లాను నిలువరించాడు. ఆ తరువాత మూడో సెట్లో ఫెదరర్ పదునైన సర్వీసులతో ఆ సెట్‌ను గెలుచుకని తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్ కు చేరింది. తొలి రౌండ్ లో సెరెనా 6-2, 6-4 తేడాతో అమ్రా సాద్వికోవిక్ పై గెలిచి శుభారంభం చేసింది. -
రెండో రౌండ్‌కు జొకోవిచ్
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 6-0, 7-6(7/3), 6-4 తేడాతో జేమ్స్ వార్డ్(బ్రిటన్)పై విజయం సాధించి శుభారంభం చేశాడు. రెండు గంటల మూడు నిమిషాల పాటు జరిగిన పోరులో జొకోవిచ్ వరుస సెట్లు గెలిచి తొలి రౌండ్‌ను దిగ్విజయంగా అధిగమించాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన జొకోవిచ్‌కు, రెండో సెట్లో మాత్రం వార్డ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. టై బ్రేక్‌కు దారి తీసిన ఆ సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుచుకున్నాడు. అనంతరం మూడో సెట్లో ఆది నుంచి జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచాడు. ప్రత్యేకంగా జేమ్స్ వార్డ్ సర్వీసులకు అడ్డుగోడల నిలబడిన జొకోవిచ్.. ఆ సెట్‌ను కైవసం చేసుకుని తదుపరి రౌండ్ కు అర్హత సాధించాడు. -
పేస్ వర్సెస్ బోపన్న!
లండన్: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో భారత నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న పురుషుల టెన్నిస్ డబుల్స్ జోడి రోహన్ బోపన్న-లియాండర్ పేస్లు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో ఒకరికొకరు ప్రి-క్వార్టర్స్ లోఎదురుపడే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వింబుల్డన్ డ్రా ప్రకారం ఇరు జోడీలు ఆదిలోనే అమీతుమీ తేల్చుకోనే అవకాశం ఉంది. ఈ టోర్నీలో బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా(రోమేనియా)తో జత కడుతుండగా, పేస్-మార్కిన్ మాత్కోస్కి(పోలెండ్)తో జోడి కడుతున్నాడు. అయితే పేస్-మార్కిన్ మాత్కోస్కి ద్వయం తొలి పోరులో యెన్ సున్ లూ(తైపీ)-తిప్సిర్వెక్(సెర్బియా) తలపడుతుండగా, బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా జంట మారిన్ డ్రాగాంజా-నికోలా మెక్టిక్(క్రొయేషియా)తో ఆడనునన్నారు. ఈ రౌండ్‌ను అధిగమిస్తే తదుపరి పోరులో ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు ముఖాముఖి పోరులో తలపడనున్నారు. భారత నుంచి పురుషుల విభాగంలో రోహన్- పేస్ లు మాత్రమే వింబుల్డన్ కు అర్హత సాధించగా, మహిళ విభాగంలో సానియా మీర్జా పాల్గొంటుంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల జోడి తొలి పోరులో అన్నా లీనా-లౌరా సిగ్మండ్ (జర్మనీ) జంటతో తలపడనుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
జొకోవిచ్‌కు చెక్ పెడతా: ఫెదరర్
లండన్: గత కొంతకాలంగా గ్రాండ్ స్లామ్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఎదురవుతున్న పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంటునంటున్నాడు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. గతంలో తన సర్వీస్‌తోపాటు, రిటర్న్ షాట్లు ఆడటంలో కొంతవరకూ ఇబ్బంది ఉన్నా, ప్రస్తుతం దాన్ని అధిగమించి వింబుల్డన్‌కు సిద్ధమైనట్లు ఫెదరర్ పేర్కొన్నాడు. మరికొద్ది రోజుల్లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈసారి జొకోవిచ్‌ను ఓడిస్తారా? అన్న ప్రశ్నకు ఫెదరర్ స్పందించాడు. తన 100 శాతం ఆటను ప్రదర్శిస్తే జొకోవిచ్‌ను ఓడించడం కష్టమేమి కాదని స్పష్టం చేశాడు. గతేడాది మూడు టోర్నీల్లో జొకోవిచ్పై విజయం సాధించిన సంగతిని ఫెదరర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా, 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ తుది పోరులో జొకోవిచ్ చేతిలో ఫెదరర్ ఓటమి పాలై రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్లు గెలిచి మంచి ఊపుమీద ఉన్న జొకోవిచ్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై కన్నేశాడు. అయితే తనకు మాత్రం ఒకే ఏడాది మూడు గ్రాండ్ స్లామ్‌లు సాధించాల్సిన అవసరం లేదని ఫెదరర్ పేర్కొనడం గమనార్హం. చివరిసారిగా 2012 లో వింబుల్టన్ ను గెలిచిన ఫెదరర్.. ఆ తరువాత పురుషుల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ ను చేజక్కించుకోలేదు. 1998లో అంతర్జాతీయ టెన్నిస్ లో అడుగుపెట్టిన ఫెదరర్.. 2002లో తొలిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. ఆ తరువాత గ్రాండ్ స్లామ్ ఎరాలో ఎన్నో టైటిల్స్ ను ముద్దాడినప్పటికీ ఇటీవల కాలంలో ఫైనల్ పోరులో తడబడుతున్నాడు. ఫెదరర్ ఖాతాలో 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటే.. అందులో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి. ఇదిలా ఉంచితే.. 29 ఏళ్ల జొకొవిచ్ మాత్రం కచ్చితమైన షాట్లతో అలరిస్తూ వరుస గ్రాండ్ స్లామ్ లను సాధిస్తున్నాడు. ఏ మాత్రం ఆందోళన చెందకుండా టెన్ని స్ రారాజు ఫెదరర్ కు చుక్కులు చూపిస్తున్నాడు. తొలిసారి 2007వ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్ లో ఫెదరర్ కు చెక్ పెట్టి టైటిల్ ను జొకోవిచ్.. ఆ తరువాత 2008, 2011 సంవత్సరాలలో కూడా ఫెదరర్ ను అదే టోర్నీలో ఓడించాడు. 2015లో ఫెదరర్ ను ఓడించి వింబుల్డన్ గెలిచిన జొకోవిచ్.. అదే ఏడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో కూడా ఫెదరర్‌పై విజయం సాధించి ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ ఇద్దరి ముఖాముఖి పోరులో జొకోవిచ్ 23-22తో ముందంజలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, జూన్ 27వ తేదీ నుంచి ఆరంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో జొకోవిచ్ కు టాప్ సీడింగ్ దక్కగా, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేకు రెండో సీడింగ్, ఫెదరర్ కు మూడో సీడింగ్ దక్కింది. -
ఆండ్రీ ముర్రే 'రికార్డు' షో
లండన్:ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు, బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ ముర్రే క్వీన్స్ క్లబ్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముర్రే 6-7(5/7), 6-4, 6-3 తేడాతో మిలాస్ రాయనిక్(కెనడా)పై గెలిచి ఐదోసారి టైటిల్‌ను సాధించాడు. టై బ్రేక్ కు దారి తీసిన తొలి సెట్ ను కోల్పోయిన ముర్రే.. ఆ తరువాత రెండు సెట్లలో విజృంభించాడు. రెండు గంటల 13 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో రాయనిక్ను ముర్రే మట్టికరిపించాడు. తద్వారా ఐదోసారి క్వీన్స్ క్లబ్ టైటిల్‌ను సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఈ టైటిల్‌ను జాన్ మెక్ ఎన్రో, బోరిస్ బేకర్, ఆండీ రాడిక్, హెవిట్లను నాలుగు సార్లు మాత్రమే దక్కించుకున్నారు. మరోవైపు దాదాపు 10 సంవత్సరాల తరువాత డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2005లో రాడిక్ ఒక్కడే ఆ ఘనతను అందుకున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌కు వార్మప్ గా జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ముర్రే 37వ ఏటీపీ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
వింబుల్డన్‌లో ఇండియన్స్‌కి మూడు టైటిల్స్
-
అటు నేనే... ఇటు నేనే..!
మార్టినా హింగిస్ టెన్నిస్‌కు, భారత అభిమానులకు కూడా కొత్తేం కాదు. ఒకప్పుడు సింగిల్స్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ స్విస్ తార అందరికీ సుపరిచితమే. అయితే ఈసారి వింబుల్డన్‌లో భారత్‌కు లభించిన రెండు టైటిల్స్‌లోనూ తన పాత్ర ఉంది. సానియాతో జతగా డబుల్స్, పేస్ జోడీగా మిక్స్డ్ డబుల్స్ నెగ్గింది. మనోళ్లతో హింగిస్‌కు ఎలా జోడీ కుదిరింది. ఒకప్పుడు ప్రపంచ సింగిల్స్ నంబర్‌వన్ ఇప్పుడు డబుల్స్ మాత్రమే ఎందుకు ఆడుతోంది? వింబుల్డన్‌లో భారత్ గర్వించదగ్గ రెండు విజయాల్లోనూ స్విట్జర్లాండ్ స్టార్ హింగిస్ పాత్ర ఉంది. భారత క్రీడాకారులతో జతకట్టి రెండు టైటిల్స్ సాధించిన హింగిస్.. తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. అమెరికాలో టీమ్ టెన్నిస్ పోటీల సందర్భంగా పేస్, హింగిస్ల జోడీ కుదిరింది. పేస్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని చెప్పిన ఈ స్విస్ స్టార్... ఈ ఏడాది రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ రెండింటిలోనూ పేస్‌తో కలిసి కప్‌ను ముద్దాడింది. ఇక సానియా గత ఏడాది వరకు కారా బ్లాక్‌తో కలిసి డబుల్స్ ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో కొత్త భాగస్వామిని ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇదే సమయంలో హింగిస్ కూడా తగిన డబుల్స్ భాగస్వామి లేక ఇబ్బంది పడుతోంది. గత ఏడాది ఐపీటీఎల్ సందర్భంగా ఏర్పడిన సాన్నిహిత్యంతో ఈ ఇద్దరి కామన్ స్నేహితుడు ఒకరు కలిసి ఆడమని సూచించారు. దీంతో ఈ ఇద్దరూ మార్చిలో జతకట్టారు. అప్పటి నుంచి ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. హింగిస్ కెరీర్ ఆసక్తికరం అవిభాజ్య చెకోస్లొవేకియాలో 1980, సెప్టెంబరు 30న జన్మించిన హింగిస్ ఏడేళ్ల వయసులో స్విట్జర్లాండ్‌కు వలస వెళ్లింది. తల్లి మెలానీ శిక్షణలో రాటుదేలి 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారింది. ఏడాదిన్నర తిరిగేలోపు ‘గ్రాండ్‌స్లామ్ చాంపియన్’గా అవతరించింది. 1996లో 15 ఏళ్ల 9 నెలల వయసులో హెలెనా సుకోవాతో కలిసి వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన హింగిస్... 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకొని పెను సంచలనం సృష్టించింది. 1998లో ఒకే సీజన్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో డబుల్స్ టైటిల్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో పిన్న వయస్సులో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 2001లో తన కోచ్‌గా ఉన్న తల్లి మెలానీతో విడిపోవడం... కుడి చీలమండ గాయం కారణంగా హింగిస్ ఆటతీరు లయ తప్పింది. అదే ఏడాది కాప్రియాటికి నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన హింగిస్, 2003లో ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెండేళ్ల తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హింగిస్ మళ్లీ రాకెట్ పట్టింది. అయితే ఆమెలో మునుపటి జోరు కనిపించలేదు. నాలుగేళ్లపాటు ఆడిన ఆమె ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ మాత్రం చేరలేదు. 2007లో డోపింగ్‌లో పట్టుబడిన హింగిస్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత ఇన్విటేషన్, లెజెండ్స్లాంటి విభాగాలలో సరదాగా టెన్నిస్ ఆడిన హింగిస్ 2013లో మళ్లీ కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. అయితే ఈసారి సింగిల్స్‌ను వదులుకొని డబుల్స్‌కే పరిమితమైంది. పలువురు క్రీడాకారిణులతో జతకట్టిన హింగిస్ గొప్ప విజయాన్ని రుచి చూడలేకపోయింది. అయితే 2015లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో భాగస్వామ్యం హింగిస్ కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. మూడు పదుల వయసు దాటినా అపార అనుభవానికి నైపుణ్యం జతకలవడంతో హింగిస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, పదునైన రిటర్న్‌లు చేయడంలో తిరుగులేని హింగిస్‌కు ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా రూపంలో మరో మంచి భాగస్వామి లభించింది. సానియా సర్వీస్‌లో నిలకడ, శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద హింగిస్ అప్రమత్తతతో ఈ జోడీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు 34 ఏళ్ల హింగిస్ లక్ష్యం వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం. -
ఫిట్... ఫిట్... హుర్రే!
ఈసారి వింబుల్డన్‌లో సెరెనా, జొకోవిచ్ ఇద్దరూ పవర్ గేమ్‌తో టైటిల్స్ సాధించారు. సెరెనా మీద గెలవాలంటే జొకోవిచ్ ఆడాలేమో అనే స్థాయిలో ఈ అమెరికా నల్లకలువ చెలరేగితే... జొకోవిచ్‌కు పోటీ ఇవ్వగల వారు ఉన్నారా అనే సందేహం ఈ సెర్బియా స్టార్ కలిగించాడు. మొత్తం మీద ప్రస్తుత టెన్నిస్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే ఇద్దరు క్రీడాకారులు టైటిల్స్ గెలిచి ఫిట్నెస్ పవర్ చూపించారు. సాక్షి క్రీడావిభాగం: టెన్నిస్ మ్యాచ్‌లో ఫలితం కోసం చివరి సెట్ ఆడాల్సి వస్తే... ఆ మ్యాచ్ ఆడేది జొకోవిచ్గానీ, సెరెనా గానీ అయితే ఫలితం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. సాధారణంగా చివరి సెట్లో గెలవాలంటే అద్భుతమైన ఫిట్నెస్ ఉండాలి. తొలి సెట్లో తొలి సర్వీస్‌కు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చివరి సెట్లోనూ అలా ఆడగలగాలి. ప్రస్తుత టెన్నిస్‌లో వీళ్లిద్దరూ అలాంటి సమర్థులు. అందుకే తమ పవర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ఫిట్నెస్ కోసం సెరెనా నృత్యం ఆధునిక శకంలో అత్యంత పెద్ద వయసులో టైటిల్ గెలిచిన మహిళగా సెరెనా విలియమ్స్ ఈసారి రికార్డు సృష్టించింది. 33 ఏళ్ల 289 రోజుల వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం అంటే ఎంత ఫిట్నెస్ కావాలి? మరి సెరెనా ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంది? తాజాగా ఆమె ఓ కొత్త విషయం చెప్పింది. ఒక వినూత్నమైన డ్యాన్స్‌తో తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటోంది. దీనిని ఆమె ‘సెరెనా ప్లాన్’గా అభివర్ణించింది. ‘దానిని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. డ్యాన్స్ చేస్తాను. అందులో ఏ మాత్రం వేగం ఉండదు. అలా అని మరీ నెమ్మదిగానూ ఉండదు. అందులో చాలా మూవ్మెంట్స్ ఉంటాయి. ఫ్లోర్ మీద కూడా కొంత డ్యాన్స్ ఉంటుంది’ అని సెరెనా చెప్పింది. అథ్లెట్లు ఫిట్నెస్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మారుతున్న టెక్నాలజీని వినియోగించుకుని కొత్త వర్కవుట్స్ చేయాలి. గతంతో పోలిస్తే తాను ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నానని, ఏమాత్రం వయసు తెలియడం లేదని సెరెనా చెబుతోంది. ‘నాకు కూడా కొన్ని నొప్పులు, గాయాలు ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను. ఫిట్నెస్ కోసం 10, 12 ఏళ్ల క్రితం ఏం చేశానో దానికంటే ఇప్పుడు మరింత ఎక్కువ కష్టపడుతున్నాను. టెన్నిస్ లాంటి క్రీడ విషయంలో ఫిట్నెస్ ఆవశ్యకత గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది’ అని సెరెనా పేర్కొంది. రాజీ పడని సెర్బియా స్టార్ పురుషుల విభాగం ఫైనల్ చూసిన ఎవరికైనా జొకోవిచ్ ఫిట్నెస్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమై ఉంటుంది. కోర్టులో బంతి ఏ మూల పడ్డా దానిని చేరుకున్నాడు. తొలి సెట్ టైబ్రేక్‌లోని తొలి పాయింట్ కోసం నెట్ దగ్గర బంతిని అందుకోవడానికి అమాంతం పరిగెత్తి దానిని ఫెడరర్‌కు అందకుండా పంపిన తీరు అమోఘం. చిన్నప్పటి నుంచి కూడా జొకోవిచ్ ఏంతిన్నా పెద్దగా లావు అయ్యేవాడు కాద ట. సీరియస్‌గా టెన్నిస్ ఆడటం ప్రారంభించాక ఫిట్నెస్ మీ ద శ్రద్ధ పెట్టినా... ఇప్పటికీ ఏవైనా తినాలని అనిపిస్తే వదలడట. జొకోవిచ్ ట్రైనింగ్‌లో ఎక్కువ శాతం అప్పర్ బాడీ మీద శ్రద్ధ పెడతాడు. బెసైప్స్, చెస్ట్, షోల్డర్స్ మీద ఎక్కువ వర్కవుట్స్ చేస్తాడు. ఇక తిండి విషయంలో మిగిలిన వాళ్ల తరహాలో బాగా స్ట్రిక్ట్‌గా ఉండడు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా పళ్లు, గుడ్లు వాడతాడు. లంచ్‌లో హామ్బర్గర్కే టాప్ ప్రయారిటీ. డిన్నర్లో బ్రౌన్ రైస్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాడు. జొకోవిచ్ మెనూలో చీజ్, ఆయిల్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయినా తను మాత్రం ఫిట్‌గానే ఉంటాడు. దీనికి కారణం ప్రణాళిక ప్రకారం వర్కవుట్స్ చేయడం. ‘మనం ఫిట్‌గా ఉండటం ఎంత అవసరమో కోరికలు చంపుకోకుండా తినడం కూడా అంతే ముఖ్యం. అయితే మనం ఏం తింటున్నాం? ఎన్ని కేలరీలు వస్తున్నాయి? వాటిని ఎలా ఖ ర్చు చేయాలి అనే విషయంలో అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ విషయంలో నా టీమ్ బాగా సహాయం చేస్తుం టుంది’ అని జొకోవిచ్ తెలిపాడు. పార్టీలో డ్యాన్స్ ఆదివారం జొకోవిచ్ వివాహ వార్షికోత్సవం. వింబుల్డన్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత రాత్రికి భార్య జెలెనాతో పాటు కోచ్ బోరిస్ బెకర్ ఇతర సిబ్బందితో సహా పార్టీకి వెళ్లాడు. పొడవాటి క్రీమ్ కలర్ గౌన్ ధరించిన సెరెనా తన బాయ్‌ఫ్రెండ్, కోచ్ ప్యాట్రిక్‌తో కలిసి పార్టీకి వచ్చింది. వింబుల్డన్ విజేతల కోసం ఏర్పాటు చేసే ఈ పార్టీలో ఈసారి జొకోవిచ్, సెరెనా కలిసి డ్యాన్స్ చేశారు. -
సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
లండన్: డేవిడ్ బెక్ హామ్ బంతిని క్యాచ్ పట్టాడు. అయితే పట్టుకున్నది ఫుట్ బాల్ కాదు, టెన్నిస్ బంతి. ఈ ఇంగ్లీషు ఫుల్ బాట్ సూపర్ స్టార్ వింబుల్డన్ లో బాల్ బాయ్ అవతారమెత్తాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బెక్ హామ్ ఈ ఫీట్ చేశాడు. జమీ ముర్రే- జాన్ పీర్స్, జొనాథన్ ఎర్లిచ్-ఫిలిప్ మధ్య జరిగిన మ్యాచ్ ను రాయల్ బాక్స్ లో కూర్చుని బెక్ హామ్ వీక్షించాడు. ఈ సందర్భంగా తనవైపు దూసుకొచ్చిన టెన్నిస్ బంతిని చాకచక్యంగా అందుకుని అందరినీ సంభ్యమాశ్చరాల్లో ముంచెత్తాడు. మెరుపు క్యాచ్ అందుకుని సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. స్పెషల్ క్యాచ్ పట్టిన మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ప్లేయర్ వీక్షకులు, ఆటగాళ్లు ప్రశంసలతో ముంచెత్తారు. 'మా బంతిని మాకు తిరిగిచ్చేస్తారా' అంటూ వింబుల్డన్ ట్విటర్ లో పేజీలో సరదాగా పోస్ట్ చేశారు.