Ayushmann Khurrana
-
ఆయుష్మాన్ కు జోడీగా...
హిందీలో ‘మైనే ప్యార్ కియా, హమ్ అప్ కే హై కౌన్, ఊంచాయీ’ వంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసిన ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya) మరో కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) హీరోగా నటించనున్నారు.కాగా ఈ మూవీలో హీరోయిన్గా శార్వరీ(Sharvari)ని తీసుకోవాలనుకుంటున్నారట. సూరజ్ బర్జాత్యా వంటి సీనియర్ దర్శకుడి సినిమా కావడంతో శార్వరీ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్ భోగట్టా. ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బాలీవుడ్లో దూసుకెళ్తున్నా రష్మిక.. 2025లో మూడు సినిమాలు!
హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) కెరీర్లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘వంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. తొలి షెడ్యూల్‌ను ముంబైలో జరిపారు. సెకండ్ షెడ్యూల్‌ను గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభించారు. న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుని, మళ్లీ ఈ వారంలో ‘థామా’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు. ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు ఆయుష్మాన్ ఖురానా. అలాగే న్యూ ఇయర్ వేడుకలను పూర్తి చేసుకున్న రష్మికా మందన్నా కూడా ఢిల్లీలో జరిగే ‘థామా’ షెడ్యూల్లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొననున్నారని బాలీవుడ్ సమాచారం. జనవరి మూడో వారం వరకు ‘థామా’ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ఈ ఢిల్లీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నెక్ట్స్ షెడ్యూల్ ఊటీలో జరగనుందని బీ టౌన్ టాక్. ఇక ‘థామా’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’, విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ చిత్రాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. ‘సికందర్’ సినిమా ఈ ఏడాది ఈద్‌కి, ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నా నటించిన చిత్రాలు ఈ ఏడాది మూడు రిలీజ్ కానున్నాయి. -
బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..
కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అది వారిని సత్ప్రవర్తన వైపుకి మళ్లించకపోగా..చిన్న వయసులోనే తట్టుకోలేని బాధలకు లోనవ్వుతారు. అందరూ ఒకలా తీసుకోరు. ఒక్కో పిల్లవాడి ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. చెడు అలవాట్ల బారిన పడకూడదని కొంతమంది తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చిన్నారులను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. వాళ్లు మంచిగా మారడం అటుంచి ఇంటి నుంచి పారిపోయి.. ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇలా తానుకూడా బాల్యంలో వేధింపులకు గురయ్యానని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. అంతపెద్ద స్టార్ కూడా ఒక్కసారిగా బాల్యం అనగానే వేధింపులే గుర్తుకొచ్చాయి. అంటే అవి నీలి నీడల్లా ఆయన్ను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారుల బాల్యం చేదు జ్ఞాపకంగా మారకూడదంటే..నటుడు ఆయుష్మాన్ ఖురాన్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తండ్రి తనని బెల్టులు, చెప్పులతో దారుణంగా కొట్టేవాడనంటూ.. చిన్నతనంలో తాను అనుభవించిన బాధను చెప్పుకొచ్చారు. చిన్ననాటి ఆ గాయం తానింకా మర్చిపోలేదన్నారు. అయితే తాను మాత్రం తన పిల్లలకు అలాంటి తండ్రిని కానని, చాలా భిన్నంగా ఉంటానని అన్నారు. ఆయుష్మాన్‌కి ఇద్దరు పిల్లలు. తన బాల్యంలా వేధనాభరితంగా గడిచిపోకూడదని వారితో ఫ్రెండ్లీ ఫాదర్‌గా ఉంటానన్నారు. ఇక్కడ ఆయుష్మాన్ తన బాల్యంలో కలిగిన చేదు జ్ఞాపకాలు అతడి మనుసులో చాలా బలంగా నాటుకుపోయాయి. కానీ ఆయన తాను మంచి తండ్రిగా ఉండాలని భావించడం హర్షణీయం. ఎందుకంటే తనలా తన పిల్లలు కాకూదని అనుకోవడమే గాక ఎవరి బాల్యం అలా గాయాలతో నిండిపోకూడదని కోరుకున్నారు ఆయుష్మాన్. ఇలా అందరూ సానుకూలంగా తీసుకునే యత్నం చేయరు.చిన్నారుల సైకాలజీ ప్రకారం..బాల్యంలో జరిగే ప్రతిదీ వారి మనుసులో బలంగా నాటుకుంటుంది. వారు ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే వాతావరణం, పరిచయమై కొత్త వ్యక్తులు అంతా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా చెడు అలవాట్లు లేదా వ్యసనాల బారినపడే అవకాశం ఉంది. దీన్ని తల్లిదండ్రులు ఓ స్నేహితుడి మాదిరిగా దగ్గరకు తీసుకుని వివరించి..వాటి వల్ల ఎదురయ్యే నష్టాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతే తప్ప భయబ్రాంతులకు గురిచేసేలా కొట్టడం, తిట్టడం, లేదా పనిష్మెంట్లు ఇవ్వడం చేయకూడదు. ఇలా ప్రపంచమంతటా బాల్యంలో వేధింపులకు గురైన వారెందరో ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.అలాంటి పిల్లలను వారి సన్నిహితులో, బంధువులో లేక తల్లిదండ్రులో ఎవరో ఒకరైనా దగ్గరకు తీసుకోవాలి. లేదంటే వారు నిరాశ నిస్ప్రుహలకు లోనై ఎందుకు పనికరాని వారుగా లేదా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారని చెబుతున్నారు నిపుణులు. వేధింపులకు గురయ్యే చిన్నారుల తీరు..చదువులో వెనుకబడటంచురుగ్గా లేకపోవడంఆత్మవిశ్వాసం లేకపోవడంవేలు నోట్లో పెట్టుకోవడం లేదా పక్కతడిపే అలవాటు వారి ముఖం ఆందోళన, బాధతో ఉండటంఏకాగ్రత లోపించటంనలుగురితో కలవకపోవడంతదితర లక్షణాలు కనిపంచగానే వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అక్కడ వారికి ఆత్మవిశ్వాసం పెరిగేలే థెరపీలు ఇవ్వడం వంటివి చేస్తారు నిపుణులు. ఇక్కడ చిన్నారులు తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ఎవ్వరి వల్ల అయినా వేధింపులకు గురైతే.. వెంటనే తన తల్లిదండ్రులు లేదా తనను ప్రేమగా చూసేవారి వద్ద మనసు విప్పి మాట్లాడేలా చేయడం తదితర విషయాలను నేర్పించడమే గాక తల్లిదండ్రులతో పిల్లలకు సాన్నిహిత్యం ఏర్పడేలా ఇరువురు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తారు. అలాగే మొండిగా ఉండే పిల్లలను కూడా దారిలో పెట్టాలని కొట్టడం చెయ్యకూడదు. ఓపికతో వ్యవహరించడం లేదా మానసిక నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో పయనించేలా చేయాలి తల్లిదండ్రులు. అంతే తప్ప బాల్యం అంటే భారంగా గడిపిన బాధకరమైన క్షణాలుగా మిగలకూడదని అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!) -
హైదరాబాద్ ఘటనతో సినిమా
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక హత్యాచార ఘటన వెండితెరపైకి రానుందని టాక్. హిందీలో ఈ ఘటన నేపథ్యంలో సినిమా తీయడానికి దర్శకురాలు మేఘనా గుల్జార్ సన్నాహాలు మొదలుపెట్టారట. పోలీసులు బాధితురాలి పేరుని వెల్లడించకుండా ‘దిశ’ అని పేర్కొన్న ఆ ఘటన చాలామందికి గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రానికి ముఖ్య తారలుగా కరీనా కపూర్, ఆయుష్మాన్ ఖురానాలను ఎంపిక చేశారట మేఘన. కరీనా, ఆయుష్ స్క్రిప్ట్ చదివి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘తల్వార్, రాజీ, చపాక్, సామ్ బహదూర్’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు మేఘన. దిశ ఘటనపై ఆమె తెరకెక్కించనున్న చిత్రం గురించి త్వరలో అధికారక ప్రకటన రానుందట. -
ఓటీటీలో 'శర్మాజీ కి బేటీ'.. విడుదల తేదీ వచ్చేసింది
మంచి కామెడీ కంటెంట్ ఉన్న సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకు రానుంది. 'శర్మాజీ కి బేటీ' అని చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుందని ప్రముఖ ఓటీటీ సంస్థ తెలిపింది. తాహిరా కశ్యప్ ఖురానా దర్శకురాలిగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుంది. ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి అని తెలిసిందే. క్యాన్సర్‌పై పోరాడి ఆ మహమ్మారిని జయించిన తాహిరా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో సయామి ఖేర్, దివ్య దత్తా, సాక్షి తన్వర్ ప్రధాన పాత్రలలో నటించారు.గతేడాది జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రీమియర్ షో పడింది. ఆ సమయంలో చాలామంది ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. జూన్ 28 నుంచి 'శర్మాజీ కి బేటీ' స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ సోషల్ మీడియాలో తెలిపింది.తాహిరా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీతో పాటు నాటకీయతతో కూడుకొని ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన స్త్రీలు పట్టణ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. హిళలలు వ్యక్తిగత, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆ మహిళల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ సినిమా చెబుతుంది. తాహిరాకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ గతంలో ఆమె చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసింది. అవన్నీ మంచి గుర్తింపు పొందడంతో.. ఇప్పుడు శర్మాజీ కీ బేటీపై భారీ అంచనాలు ఉన్నాయి. -
సిగరెట్, మందు.. అమ్మో.. మా నాన్న చాలా స్ట్రిక్టు!
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా సరే జనాలు వాటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమందికి ఈ రెండింటిలో ఏదో ఒక అలవాటు ఉండే ఉంటుంది. సరదాకనో, ఒత్తిడిగా ఉందనో సిగరెట్, మందుకు బానిసగా మారుతుంటారు. అయితే నటుడు అపరశక్తి ఖురానా మాత్రం తనకీ అలవాటే లేదంటున్నాడు.పార్టీలు చేసుకోండివీజే సైరస్ బ్రోచా నిర్వహించే 'సైరస్ సేస్' అనే పాడ్‌కాస్ట్‌లో అపరశక్తి ఖురానా మాట్లాడుతూ.. 'మా నాన్న చాలా స్ట్రిక్ట్. తన వల్లే నేను, నా సోదరుడు (ఆయుష్మాన్ ఖురానా) ఇంతవరకు సిగరెట్, మందు జోలికి వెళ్లలేదు. ఆయన ఏం అనేవారంటే.. మీరు బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లండి, పార్టీలు చేసుకోండి. కానీ ఇంటికి మాత్రం తిరిగి రావద్దు. ఎవరో ఒకరి ఇంట్లో తలదాచుకోండి.. కనీసం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరింట్లో ఉన్నారనేది నేను లెక్క చేయను. నాకే సమస్యా లేదు. నా చేతిలో ఉంటది..కానీ.. మీరు సిగరెట్, మందు తాగారని తెలిస్తే మాత్రం నా చేతిలో మీకు మూడినట్లే! అని బెదిరించాడు. అందుకే మేమింతవరకు దాని జోలికే వెళ్లలేదు. పైగా తను జ్యోతిష్యుడు. మేము తాగితే తనకు ఇట్టే తెలిసిపోతుందన్న భయముండేది. ఆ కారణం వల్ల అటువైపు వెళ్లలేదు. అయితే ఓ వయసొచ్చాక వాటి మీద ఆసక్తి కూడా ఉండదు' అని చెప్పుకొచ్చాడు. కాగా అపరశక్తి ఖురానా తండ్రి పి.ఖురానా 2023 మే 19న మరణించాడు.చదవండి: స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి -
Border 2 : పాతికేళ్ల తర్వాత వచ్చేస్తున్న సీక్వెల్
సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘బోర్డర్’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్ సీక్వెల్లోనూ హీరోగా నటిస్తారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో లీడ్ రోల్ చేస్తారు. కాగా ‘బోర్డర్’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్ దత్తా ‘బోర్డర్ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావించిందట. ఇక ఈ సీక్వెల్లో వచ్చే వార్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
క్యాన్సర్‌ని జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఏ మూవీ ఇండస్ట్రీ తీసుకున్నా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా అదరగొట్టేస్తుంటారు. అలా హిందీలో బడా స్టార్స్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా లాంటి యువ కథానాయకులు కూడా హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇతడు పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయాడు. ఇప్పుడు ఈ హీరో.. క్యాన్సర్‌ని జయించిన తన భార్యపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: క్లీంకారకు కేర్ టేకర్‌గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే..) ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో వరస హిట్లు కొడుతున్న ఆయుష్మాన్.. తహిరా కశ్యప్ అనే అమ్మాయిని కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమించాడు. 2008లోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2018లో ఆయుష్మాన్ భార్యకి రొమ్ము క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. సరైన చికిత్స తీసుకోవడంతో ప్రస్తుతం ఆయుష్మాన్ భార్య తహిరా కశ్యప్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇది జరిగి చాలా కాలమైపోయింది. అయితే ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తన భార్య గురించి ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. 'నీ గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా' అని ఆమె క్యాన్సర్ ఎదురించీ గెలిచిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. అలానే ఈమెకు సర్జరీ జరిగిన తర్వాత తీసిన ఓ ఫొటోని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. (ఇదీ చదవండి: 14 ఏళ్ల వయసు.. ఆరోజు జరిగింది ఇప్పటికీ మర్చిపోలేను: హీరోయిన్) View this post on Instagram A post shared by Ayushmann Khurrana (@ayushmannk) -
ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ ఫిలిం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన కామెడీ ఎంటర్టైనర్ డ్రీమ్ గర్ల్ 2. ఇది 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కింది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోందీ మూవీ. అక్టోబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'మీ కలలు నిజం కాబోతున్నాయి. డ్రీమ్ గర్ల్ రెట్టింపు మ్యాజిక్, డబుల్ ఎంటర్టైన్మెంట్తో తిరిగి వస్తోంది.. రేపటి నుంచి డ్రీమ్ గర్ల్ 2 ఓటీటీలో అందుబాటులో ఉంటుంది' అని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఫ్యాన్స్ ఖుషీ.. ఇది చూసిన అభిమానులు.. హమ్మయ్య, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరమ్‌గా ఆయుష్మాన్, పరిగా అనన్య పాండే నటించింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, మంజోత్ సింగ్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్ -
ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు
క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్‌లోకి మారారు. ఇటు సౌత్‌లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్‌లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు... ఆయుష్ఉమన్ ‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్‌లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్‌లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్‌కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్‌గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్. అమ్మాయిగా ఆలోచించాలి ‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్‌ల మేకప్‌తో పోల్చితే ఫీమేల్‌కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్‌కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్‌కి ఇది తొలి చిత్రం. పదిహేనేళ్ల తర్వాత... వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్‌లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్. లేడీ గెటప్ పై ఫోకస్ విశ్వక్ సేన్లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్‌లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!
బాలీవుడ్ నటుడు, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆచార్య పి ఖురానా మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన పంజాబ్‌లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. పి ఖురానా జ్యోతిష్య రంగంలో ప్రావీణ్యం సంపాదించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ఆయన జ్యోతిష్యంపై పలు పుస్తకాలు కూడా రాశాడు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్) కాగా.. ఆయుష్మాన్ ఖురానా హిందీ చిత్రాల్లో నటించారు. సింగర్‌గా బాలీవుడ్లో పలు చిత్రాలకు సాంగ్స్ పాడారు. ఖురానా జాతీయ చలనచిత్ర అవార్డు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. అంతే కాకుండా ఫోర్బ్స్ ఇండియా- 2013, 2019 జాబితాలో సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 2020లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్స్ లిస్ట్‌లో పేరు సంపాదించారు. (ఇది చదవండి: త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్) -
ఆరేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. గత ఆరేళ్లుగా తాను వెర్టిగో (తీవ్రమైన తలనొప్పి) సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భాల్లో ఈ సమస్య తనను ఎంతగా ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ‘ఆరేళ్లుగా నేను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. నా కొత్త మూవీ (ఆన్ యాక్షన్ హీరో) లో ఎత్తైన భవనం నుంచి దూకే సీన్ ఉంటుంది. రక్షణ కోసం హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని అమాంతం భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆన్ యాక్షన్ హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు ఆయుష్మాన్. అనిరుధ్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు డ్రీమ్‌గర్ల్2 సినిమాలో కూడా నటించబోతున్నాడు. ‘వెర్టిగో’ లక్షణాలు ► వెర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది ► తల తిరగడం ► పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్, బ్యాలెన్స్ కోల్పోవడం ► వికారం, వాంతులు ► చెమట ఎక్కువ పడుతుంది -
బాలీవుడ్ తారల దీపావళి సెలబ్రేషన్స్..కొత్త దుస్తుల్లో మెరిసిన స్టార్స్
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం ప్రారంభించారు. దీపాల పండుగ పర్వదినాన్ని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులలో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్ తారలు కూడా మినహాయింపు కాదు. బీటౌన్‌కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు అప్పుడే దీపావళి సంబరాలను ప్రారంభించారు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్‌లు ముంబైలోని తమ నివాసంలో దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్, కృతి సనన్, అనన్య పాండే, తాప్పీ పన్ను హాజరై సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ, ‘ఆదిపురుష్’ సీత కృతి సనన్.. తన ఇంట దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆమె ఇంటికి బాలీవుడ్ నటీనటులు తరలి వచ్చారు. వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ బంగారు రంగు దుస్తుల్లో దీపాలతో పోటీగా వెలిగారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే లెహంగా ధరించి అందరినీ మెప్పించింది. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ బ్లాక్ కుర్తాను ధరించి మెరిశారు. శిల్పాశెట్టి బ్రౌన్ మెరూన్ కలర్ చీరతో అలరించింది. నోరా ఫతేహి తన మెరిసే లెహంగాలో అద్భుతంగా ఉంది. తాప్సీ పన్ను మెరిసే గులాబీ రంగు చీరను ధరించింది. -
'ఒక నిర్మాత బ్లాంక్ చెక్ ఇస్తే.. నాకు అదే ముఖ్యమని చెప్పా'
బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం డాక్టర్ జి. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒక నిర్మాత తనకు బ్లాంక్ చెక్ ఇస్తే తిరస్కరించినట్లు చెప్పారు. 'లక్ష్మీ సే పహలే సరస్వతి ఆతీ హై' (లక్ష్మి కంటే సరస్వతి ముఖ్యం) అని అన్నట్లు తెలిపారు. ఒక సినిమాకు ఒప్పుకున్నాక అదే నాకు ముఖ్యమని ఆయన వెల్లడించారు. ఒక నిర్మాత ఆయనను సంప్రదించి బ్లాంక్ చెక్ ఇచ్చి మూడు సినిమాలు చేయమని అభ్యర్థించారని తెలిపారు. ఆయుష్మాన్ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చి.. ‘ఎంత కావాలంటే అంత తీసుకోండి. మాతో మూడు సినిమాలు చేయండి' అని ఆఫర్ చేశారని అన్నారు. దీనికి వెంటనే నాకు డబ్బుల కంటే స్క్రిప్ట్ చాలా ముఖ్యమని ఆయనతో తేల్చి చెప్పానని వివరించారు. తన హిట్ సినిమాలన్నీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్‌తో చేసినవే అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. మొదటిసారి దర్శకులు చాలా బాగా సహకారంతో ఉంటారని చెప్పుకొచ్చారు. కాబట్టి అలాంటి వారితో పని చేయడం చాలా సులభంగా, సరదాగా ఉంటుందని అన్నారు. -
DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు
ఇష్టం లేని పోస్టింగులు ఉద్యోగులకు ఉన్నట్టే ఇష్టం లేని డిపార్ట్మెంట్లు డాక్టర్లకు ఉంటాయి. కొందరు న్యూరో వద్దనుకుంటారు. కొందరు పిడియాట్రిషియన్ కావడాన్ని బోర్ ఫీలవుతారు. కొందరికి చర్మవ్యాధుల డాక్టర్ అవాలని అస్సలు ఉండదు. కాని వద్దనుకున్న సీటే వస్తే? ఆయుష్మాన్ ఖురానాకి గైనకాలజీలో సీటు వస్తుంది. కాని అతను చేయాలనుకున్నది ఆర్థోపెడిక్స్. గైనకాలజీ అంటే స్త్రీల ప్రపంచం. పేషంట్లకు ఇబ్బంది. ఈ డాక్టరుకు బెరుకు. ఈ సమస్యను స్క్రీన్ మీద నవ్వులు పూయించడానికి అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం చాటడానికి త్వరలో వస్తోంది ‘డాక్టర్ జి’. దీనికి అనురాగ్ కశ్యప్ చెల్లెలు అనుభూతి కశ్యప్ దర్శకురాలు కావడం మరో విశేషం. ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. ‘ముందు నువ్వు అనుకో. నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైనకాలజిస్టువి. నీలోని మేల్ టచ్‌ను వదులుకో’ అంటుందామె కోపంగా. గైనకాలజీ విభాగంలో మహిళా పేషెంట్లకు చికిత్స చేయాలంటే మగవాడైన తను ‘మగ స్పర్శ’ను ఎలా వదులుకోవాలి అనే తిప్పలు వచ్చి పడతాయి ఆయుష్మాన్‌కి. అతను హీరోగా నటిస్తున్న ‘డాక్టర్ జి’ ట్రైలర్‌లోని సంభాషణ ఇది. ఈ సినిమా రెండు వారాల్లో విడుదల కానుంది. డాక్టర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి గతంలో. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రోజుల క్రితమే రాజేష్ ఖన్నా ‘ఆనంద్’లో అమితాబ్ పోషించిన డాక్టర్ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘దిల్ ఏక్ మందిర్’, ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ డాక్టర్ ప్రొఫెషన్‌ను గొప్పగా చూపించాయి. ఇప్పుడు విడుదల కానున్న ‘డాక్టర్ జి’ కూడా ఈ రంగంలోని సాధకబాధకాలను చర్చించనుంది. అయితే కొంత సరదాగా. అది కూడా మగ గైనకాలజిస్ట్ సమస్యను తీసుకుంది. గైనకాలజీ అనగానే గర్భానికి సంబంధించిన విషయాలు, కాన్పులు, గర్భాశయ చికిత్సలు ఉంటాయి. పేషెంట్లు అనివార్యంగా స్త్రీలు కనుక డాక్టర్లు కూడా స్త్రీలే అయితే పరీక్షించడంలో ఇబ్బందులు ఉండవు. గుండె డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఈఎన్టి డాక్టరు మగవాడైనా పర్వాలేదు కాని మహిళా పేషెంట్లకు మగ గైనకాలజిస్టు అయితే ఇబ్బంది పడతారు. వారి కంటే ఎక్కువ ఇబ్బంది ఈ సినిమాలో ఆయుష్మాన్ పడనున్నాడు. కాని శరీరం ఎప్పుడైతే ‘రోగగ్రస్తం’ అవుతుందో ‘చికిత్స కు అవసరమైన స్థితికి’ చేరుకుంటుందో అప్పుడు ఆ శరీరం ‘స్త్రీదా’, ‘పురుషుడిదా’ అనే తేడా లేకుండా పోతుంది. పేషెంట్ కూడా ఆ సమయంలో తన ప్రాణం దక్కితే చాలు– వైద్యం ఎవరు చేసినా పర్వాలేదు అనే స్థితికి వెళుతుంది/వెళతాడు. ఇక్కడ కూడా ఒక అత్యవసర కాన్పు సమయంలో పేషెంట్ డాక్టర్ ఎవరనేది చూడదు. కాన్పు జరిగితే చాలనే అనుకుంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా తనలోని ఆ ఇబ్బందిని పోగొట్టుకుని శరీరాన్ని శరీరంలా చూసే స్థితికి చేరుకోవడమే ఈ కథ. ‘త్రీ ఇడియెట్స్’లో ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు కనిపించని సన్నివేశం ఉంటుంది. అది క్లయిమాక్స్‌లో కొంతమంది ఐఐటి విద్యార్థులు కలిసి కాన్పు కష్టమైన తమ డీన్ కుమార్తెకు పురుడు పోయడం. ఈ సన్నివేశం తీయడం కత్తి సాము మీద నడవడం లాంటిది. ఆ సమయంలో అక్కడ ఉన్నది స్త్రీ కాదు... ఆ కుర్రవాళ్లు పురుషులు కాదు. ఆమె పేషెంట్... వాళ్లు ఆమెకు సాయం చేస్తున్న మనుషులు... అలా చూపించగలగడంలో దర్శకుడు పెద్ద సక్సెస్ సాధిస్తాడు. అందుకే ఆమిర్ ఖాన్ కాన్పు కావాల్సిన స్త్రీ నుంచి బిడ్డ తల బయటకు వచ్చిందో లేదో లోపల తొంగి చూసి చెక్ చేయడం అసభ్యంగా ఉండదు. ఆ సందర్భంలో ప్రేక్షకులతో సహా అందరూ తాము స్త్రీలో పురుషులో అనే సంగతి మరచి మానవులుగా మారతారు. వైద్యంలో వైద్యులు ఇదే సాధన చేస్తారు. ‘డాక్టర్ జి’లో సీనియర్ గైనకాలజిస్ట్‌గా పని చేసిన షెఫాలీ షా పాత్ర ముఖ్యం. ఈ పాత్రే పి.జి. చేస్తున్న ఆయుష్మాన్ ఖురానాకు వైద్యం నేర్పిస్తుంది. స్త్రీ దేహ సమస్యలను మనిషిగా అర్థం చేసుకోవడంలో సాయం చేస్తుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ కనిపిస్తుంది. కథలో ఆమె కూడా మెడిసిన్‌లో పి.జి. చేసే స్టూడెంటే. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. మేనేజ్మెంట్ రంగంలో 8 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభూతి కశ్యప్ చివరకు తాను పని చేయాల్సింది సినిమాల్లోనే అని గ్రహించి మంచి ఉద్యోగాన్ని వదిలేసి అనురాగ్ కశ్యప్ తీస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ తీసింది. ‘డాక్టర్ జి’ ఆమె తొలి పెద్ద సినిమా అని చెప్పవచ్చు. మగ డాక్టర్ దగ్గర చూపించుకోవడం నామోషీ అని భావించే మహిళా పేషెంట్లు, మహిళా పేషెంట్ల విషయంలో కంఫర్ట్ ఫీలవని మగ డాక్టర్లు ఈ సినిమాను ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. -
ఆ బాలీవుడ్ హీరో సరసన యువరాణిలా సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్-2, పుష్ప చిత్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వరుణ్ దావన్తో నటిస్తున్న సమంత తాజాగా మరో ప్రాజెక్ట్‌కి ఓకే చేసినట్లు తెలుస్తుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న నాలుగో హారర్ చిత్రంలో సమంత యువరాణి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. -
బాలీవుడ్లో సమంత భారీ సినిమా.. హీరోగా ఎవరంటే?
‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌తో బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ సమంత. ఆ సిరీస్ తర్వాత బాలీవుడ్లో సమంత చేయబోయే సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనున్నారన్నది ఈ వార్త సారాంశం. దినేష్ విజయ్ ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తయిందని, షూటింగ్ షెడ్యూల్స్ చర్చలు జరుగుతున్నాయన్నది టాక్. సో... హిందీలో సమంత నటించనున్న తొలి సినిమాకు అంతా సిద్ధమైందన్నమాట. అయితే అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. హిందీలో ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్‌కు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. మరోవైపు హీరోయిన్ తాప్సీ నిర్మాణ సంస్థ అవుట్‌సైడర్స్ ఫిలింస్‌లో సమంత ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ..
Anek Trailer: Ayushmann Khurrana Gripped By Hindi Language Row: విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ మూవీకి ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నార్త్ ఈస్ట్ ఇండియా బార్డర్లో నెలకొన్న రాజకీయ సంఘర్షణల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనేక్ మూవీ ట్రైలర్‌ను గురువారం (మే 5) విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఒక మిషన్‌ను జాషవా (ఆయుష్మాన్ ఖురానా) అనే పోలీసు ఎలా చేధించాడో చూపించారు. అంతేకాకుండా ఈ ట్రైలర్లో హిందీ భాష గురించి ప్రస్తావించడం విశేషం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విటర్ వార్ గొడవ కారణంగా హిందీ భాషను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తెలంగాణ పోలీసుగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, జేడి చక్రవర్తి మధ్య వచ్చిన హిందీ భాషకు సంబధించిన చర్చ ఆకట్టుకుంటుంది. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ 'హిందీ భాషను సరళంగా మాట్లాడటం వల్లే నార్త్ ఇండియన్‌గా నిర్ణయిస్తారా ?' అని ఆయుష్మాన్ అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి 'నో' అని చెబుతాడు. దానికి 'కాబట్టి ఇది హిందీ గురించి కాదు' అని ఆయుష్మాన్ బదులిస్తాడు. తర్వాత 'ఒక మనిషిని ఇండియన్‌గా ఎలా డిసైడ్ చేస్తారు' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. హిందీ భాష, నార్త్ ఇండియన్ వంటి అంశాలపై ప్రస్తావించిన 'అనేక్' ట్రైలర్ పై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చండీగఢ్ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ
‘నాకు కొడుకువైనా కూతురివైనా నువ్వే’ అని సాధారణంగా అంటూ ఉంటారు. కాని కొడుకు కూతురిగానో కూతురు కొడుకుగానో నిజంగా మారిపోతే? ‘దేవుడు తప్పు చేశాడు... ఆమె సరిదిద్దుకుంది’ అంటుంది ఈ సినిమాలో డాక్టర్. బాలీవుడ్లో విడుదలైన తాజా సినిమా ‘చండీగఢ్ కరే ఆషికీ’ (చండీగఢ్ ప్రేమ). ఇది ‘ట్రాన్స్ గర్ల్’ లవ్ స్టోరీ. అమ్మాయిగా మారిపోయిన అబ్బాయి తన ప్రేమను గట్టి వ్యక్తిత్వంతో సాధించుకున్న కథ. ఇలాంటి కథకు సాహసం కావాలి. దీనిని చర్చకు పెట్టేందుకు మనసు కావాలి. జనవరి 7న ఓటిటిలో విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్షిప్ పొందిన ఈ సినిమా పరిచయం. దేవుడు నిజంగానే ఒక్కోసారి తప్పు చేస్తాడు. అమ్మాయిని అబ్బాయిగానూ అబ్బాయిని అమ్మాయిగానూ పుట్టిస్తాడు. కాని లోక ఆచారం ప్రకారం ఒక్కసారి అబ్బాయిగా పుట్టాక చచ్చినట్టు అబ్బాయిగా బతకాల్సిందే. అమ్మాయిగా పుట్టాక అమ్మాయిగా జీవించాల్సిందే. ‘మా శరీరాలు తప్పుగా ఉన్నాయి. లోపల మా భావాలు వేరుగా ఉన్నాయి. మమ్మల్ని మాలాగా మేము కోరుకున్నలాగా మారనివ్వండి’ అనంటే సమాజం ఊరుకోదు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాని ట్రాన్స్‌జెండర్స్ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాము కోరుకున్న రూపాలను పొందుతున్నారు. తమ హక్కులను కోర్టులకు వెళ్లి సాధించుకుంటున్నారు. ఇప్పుడు తమ కలలను ఆకాంక్షలను కౌటుంబిక జీవనాన్ని కూడా సాధించే ప్రయత్నాల్లో పడుతున్నారు. అందుకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘చండీగఢ్ కరే ఆషికీ’ ఈ ప్రస్తావన చేస్తోంది. ఆ అంశంతో సినిమా గా ముందుకు వచ్చింది. నిజానికి సినిమా అంటే వ్యాపారం. ‘సెంటిమెంట్’ బెడిసి కొడితే అసలుకే ఎసరు వస్తుంది. కాని ఈ సినిమాలో చాలా సున్నితంగా గౌరవంతో సమస్యను చర్చించారు. అందుకే ప్రేక్షకులు కూడా గౌరవిస్తున్నారు. ఏంటి కథ? చండీగఢ్‌లో ఒక దివాలా తీసిన జిమ్‌ను నడుపుతుంటాడు ఆయుష్మాన్ ఖురానా. తను స్వయంగా బాడీ బిల్డర్ అయినా ప్రతి ఏటా చండీగఢ్‌లో జరిగే ‘బలసంపన్నుల పోటీ’లో ఛాంపియన్‌గా నిలువలేక నంబర్ 2లో వస్తున్నా అతని జిమ్‌కు గిరాకీ ఉండదు. ఆ సమయంలో వాణి కపూర్ ఆ జిమ్‌కు జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా వస్తుంది. ఆమె రాకతో జిమ్‌కు కళ వస్తుంది. అమ్మాయిలు చేరడంతో అబ్బాయిలూ రావడం మొదలెడతారు. క్రమంగా ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ ప్రేమలోనూ ఆ తర్వాత శారీరక సంబంధంలోనూ వెళతారు. ‘ఇక మనం పెళ్లి చేసుకుందాం’ అంటాడు ఆయుష్మాన్. అప్పుడు వాణి కపూర్ అతి కష్టం మీద తానెవరో చెబుతుంది. ‘నేను అబ్బాయిగా పుట్టాను. అమ్మాయిగా మారాను. నేనొక ట్రాన్స్గర్ల్ని’ అంటుంది. ఆయుష్మాన్‌కు చాలా పెద్ద దెబ్బగా ఇది అనిపిస్తుంది. తనను వాణికపూర్ వంచించినట్టుగా భావిస్తాడు. పైగా ‘సంప్రదాయ ఆలోచన’ ల ప్రకారం తాను సృష్టి విరుద్ధ శృంగారంలో పాల్గొన్నట్టుగా భావించి తనను తాను అసహ్యించుకుంటాడు. వాణికపూర్ను అవమానిస్తాడు. అతడిని మిత్రులు అవమానిస్తారు. ఊరు అవమానిస్తుంది. కాని ఆయుష్మాన్‌లో ఆమె పట్ల ప్రేమ పోదు. ఆమెకు అతని పట్ల కూడా. కాని ఇది ఓడిపోయే ప్రేమ కథ. ఇన్నాళ్లు విన్నటువంటి ప్రేమ కథ కూడా కాదు. చివరకు ప్రేమ గెలుస్తుంది. నిజమైన శౌర్యం ఏమిటి? సినిమాలో ఆయుష్మాన్ వెయిట్ లిఫ్టర్. తన శౌర్యం నిరూపించుకోవాలనుకుంటాడు. కాని నిజమైన శౌర్యం ఏమిటి? సమాజానికి వెరవకపోవడం... తన ప్రేమలోని నిజాయితీని స్వీకరించడం... వాణికపూర్ మారిన అస్తిత్వాన్ని గౌరవించడం. ‘నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తొందరగా ఇలాంటివి అర్థం కావు. టైమ్ పడుతుంది’ అంటాడు పశ్చాత్తాపంతో వాణికపూర్‌తో. అతనే కాదు... ట్రాన్స్‌జెండర్స్ విషయంలో కుటుంబాలు ఎంత కఠినంగా ఉంటాయో ఎన్నో ఉదంతాలు ఉంటాయి. సినిమాలో అబ్బాయిగా పుట్టిన వాణి కపూర్ సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారుతుంది. దీనిని తండ్రి అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తాడు కాని తల్లి అస్సలు సహించదు. చండీగఢ్‌లో ఆయుష్మాన్‌తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టాక స్నేహితురాలు ‘నువ్వు ఊరు విడిచి నాలుగురోజులు ఎటైనా పోరాదూ’ అంటుంది. దానికి వాణి కపూర్ ‘నా ఇంట్లో అవమానిస్తున్నారని ఇల్లు వదిలాను. ఊళ్లో అవమానిస్తున్నారని నా ఊరైన అంబాలాను విడిచి పెట్టి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ అవమానిస్తున్నారని ఎక్కడకు వెళ్లాలి’ అంటుంది. ‘నా తప్పు ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి నన్ను నేను అమ్మాయిగా భావించాను. నాకిష్టం వచ్చినట్టు మారాను’ అంటుంది వాణి కపూర్. కుటుంబం, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఈ మానసిక శారీరక అవస్థనే. అందరూ పుట్టినట్టే ట్రాన్స్‌జెండర్స్ కూడా పుడతారు. కాని వారిని హిజ్రాలంటూ గేలి చేసే దుర్మార్గ సంస్కృతి సమాజంలో ఉంది. వారు తాము కోరుకునే అస్థిత్వంతో ప్రేమ, వివాహం, జీవితం సోకాల్డ్ ‘నార్మల్’ వ్యక్తులతో పొందడానికి ఎన్నో అడ్డంకులు. భేషజాలు. అపోహలు. వాటన్నింటిని మెల్లగా దాటాలి అని చెబుతుంది ఈ సినిమా. ‘జెండర్ ఇన్‌క్లూజివిటీ’... అంటే అన్ని జెండర్ల వాళ్లను సమాజం అంతర్భాగం చేసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు. దర్శకుడిదే ఘనత ఈ సినిమా ఇంత సున్నితంగా, ఆలోచనాత్మకంగా, ఒప్పుకోలుగా ఉండటానికి కారణం దర్శకుడు అభిషేక్ కపూర్ తీసిన పద్ధతి. దానికి హీరో హీరోయిన్లు సపోర్ట్ చేసిన పద్ధతి. ఈ సబ్జెక్ట్ చేయడం ఆయుష్మాన్‌కు సాహసం కాదు కాని వాణి కపూర్‌కు సాహసమే. తనను తాను ట్రాన్స్గర్ల్గా బిలీవ్ చేసి ఆ పాత్ర ఆత్మాభిమానం తాలూకు డిగ్నిటీని ప్రదర్శించింది ఆమె. మధ్య మధ్య చెణుకులతో ఈ సినిమా నవ్విస్తుంది. కాని ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకోమంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. -
ముంబైలో ఖరీదైన ఇల్లు కొన్న యంగ్ హీరో!
అమితాబ్ బచ్చన్, సన్నీలియోన్, అజయ్ దేవ్‌గణ్, అర్జున్ కపూర్.. ఇలా పలువురు బాలీవుడ్ తారలు గతేడాది ఖరీదైన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు ఆయుష్మాన్ ఖురానా. తాజా నివేదికల ప్రకారం.. ఆయుష్మాన్ ఖురానా, అతడి సోదరుడు అపరశక్తి ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్స్ కొన్నారు. విండ్సర్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెండు అపార్ట్మెంట్లను వీరు తమ పేరిట రాయించుకున్నారని సమాచారం. లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని విండ్సర్ గ్రాండే రెసిడెన్స్ 20వ ఫ్లోర్లో ఉన్న ఈ రెండు అపార్ట్మెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గతేడాది నవంబర్ 29నే పూర్తి అయినట్లు తెలుస్తోంది. 4,027 చదరపు అడుగుల విస్తీర్ణం, నాలుగు కార్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉన్న ఇంటి కోసం ఆయుష్మాన్ రూ.19.30 కోట్లు చెల్లించాడట! స్టాంప్ డ్యూటీ కింద రూ.96.50 లక్షలు అప్పజెప్పాడట. 1745 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న అపార్ట్మెంట్ కోసం అపరశక్తి రూ.7.25 కోట్లు వెచ్చించాడట. స్టాంప్ డ్యూటీ కింద రూ.36.25 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డిసెంబర్ 7న పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ ఇంట్లో రెండు కార్లు పార్క్ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇదిలా ఉంటే గతేడాది ఆయుష్మాన్, అపరశక్తి ఇద్దరూ కలిసి తమ ఫ్యామిలీ కోసం చండీగఢ్‌లోని పాంచ్‌కులలో రూ.9 కోట్లు విలువ చేసే ఇంటిని కొన్నారు. -
బేబి కోసం పట్టిన పాలను ఆయుష్మాన్ తాగేశాడు: తాహిర్
‘విక్కీ డోనర్’ వంటి విభిన్న కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌కి పరిచయమై మంచి గుర్తింపు పొందిన నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆ తర్వాత కూడా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. అయితే ఆయన భార్య తాహీరా కశ్యప్ తాజాగా ‘ది సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్’ అనే పుస్తకం రాసింది. అందులో భర్త గురించి సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. ‘ఓ సారి మూడు రోజుల ట్రిప్ కోసం నేను, ఆయుష్మాన్ బ్యాంకాక్ వెళ్లాలనుకున్నాం. అప్పటికే మాకు ఏడు నెలల బేబీ ఉండడంతో.. తనని మా తల్లిదండ్రుల సంరక్షణ ఉంచాం. ఆ సమయంలో బేబీకి పట్టడానికి కొన్ని బాటిల్స్‌లో చనుబాలను పట్టిపెట్టాను. అనంతరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాం. చెకింగ్ అవుతున్న సమయంలో మా అమ్మ ఫోన్ చేసింది. బేబీ బాగానే ఉంది. కానీ పాల సీసాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పింది. ఆ బాధలోనే ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాం. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా పాలు వస్తుండడంతో వాటిని బాటిల్లో పెట్టి బయటికి వెళ్లాను. వచ్చి చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది. అప్పుడు అర్థం అయ్యింది పాలను ఆయుష్మాన్ తాగాడని. ఈ విషయాన్ని అడిగితే ఆ పాలు మంచి పోషకాలతో ఉండడంతో తన మిల్క్ షేక్‌లో వేసుకొని తాగేశానని తెలిపాడు. అప్పటి నుంచి అతనికి కనిపించకుండా పాల బాటిల్స్‌ను దాస్తున్నట్లు’ ఈ స్టార్ భార్య తెలిపింది. చదవండి: బోల్డ్ కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని అర్థమైంది: యంగ్ హీరో -
మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్
స్టార్ హీరోలకు, హీరోయిన్లకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్త రకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. దేశంలో భాగ పేరొందిన మోడల్స్‌లో సూపర్-హాట్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఒకటి. దీని ధర 2- 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు అంటే హీరో, హిరోయిన్లు తెగ ఇష్ట పడుతున్నారు. ఇటీవల ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారిలో భాగ పేరొందిన స్టార్ హీరో, హీరోయిన్ల గురుంచి తెలుసుకుందాం. ఈ ఖరీదైన కారును నడుపుతు వారు రహదారిపై కనిపించారు. 1.రామ్ చరణ్ దక్షిణాది అతిపెద్ద హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఈ కారు కోసం అతను చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ.4 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 2.రణవీర్ సింగ్ మిస్టర్ బాజీరావ్ 'మస్తానీ' గత సంవత్సరం జూలైలో ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ కారును కొన్నాడు. భారతదేశంలో ప్రారంభించిన ఒక నెల తరువాత దీనిని కొనుగోలు చేశాడు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత లంబోర్ఘినిని కూడా కొనుగోలు చేశాడు.(చదవండి: ఆపిల్ కొంపముంచిన చిప్స్...!) 3. అర్జున్ కపూర్ 'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే ఇతడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అతడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా పాపులర్ అయ్యాడు. జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ Mercedes-Maybach GLS 600 కారుని ఈ ఏడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేశాడు.(చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!) 4. కృతి సనన్ ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. 5. ఆయుష్మాన్ ఖురానా 2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా ఈ ఏడాది జూలై నెలలో ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును కొన్నారు. -
బోల్డ్ కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని అర్థమైంది: యంగ్ హీరో
Ayushmann Khurrana: 'విక్కీ డోనర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆయుష్మాన్ ఖురానా. తొలి సినిమాతోనే సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. బదాయి హో, బాలా, శుభ్‌మంగళ్ సావధాన్, అంధాధున్ వంటి పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిలీజై నేటికి(సెప్టెంబర్1) నాలుగేళ్లు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. "విక్కీ డోనర్ వంటి బోల్డ్ కంటెంట్‌తో బాలీవుడ్‌కి పరిచయం అయ్యాను. విక్కీ డోనర్, శుభ్‌మంగళ్ సావధాన్ సినిమాలు తన సబ్జెక్టుల ఎంపికపై ఎంతో ప్రభావం చూపాయి. ఆ రెండు సినిమాల విజయంతో బోల్డ్ కంటెంట్‌ని కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారని అర్థమయ్యింది. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టుల ఎంపికే నన్ను నటుడిగా నిలబెట్టింది' అని పోస్టులో పేర్కొన్నారు. ఆ పోస్టులో తన సినిమాల దర్శకులైన సుజిత్ సర్కార్, ఆనంద్ ఎల్. రాయ్, ఆర్.ఎస్.ప్రసన్నలకు హీరో కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఆయుష్మాన్ 2018లో అంధాధున్ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆయన తదుపరి సినిమాలు డాక్టర్ జీ, అనేక్ నిర్మాణ దశలో ఉన్నాయి. -
తండ్రైన నటుడు.. బెస్ట్ ఫీలింగ్ అన్న స్టార్ హీరో
ముంబై: బాలీవుడ్ నటుడు అపర్శక్తి ఖురానా తండ్రయ్యాడు. అతడి భార్య ఆకృతి అహుజా శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అపర్శక్తి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. పాపకు అర్జోయీ ఎ. ఖురానాగా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఖురానా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘చిన్నారి దేవతకు స్వాగతం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక చిన్నారి రాకతో తమ కుటుంబం మరింత పెద్దదైందని, ఇదొక గొప్ప అనుభూతి అని బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనందం వ్యక్తం చేశాడు. కాగా ఆయుష్మాన్ ఖురానా తమ్ముడైన అపర్శక్తి.. ఆమిర్ ఖాన్ దంగల్ మూవీతో బీ-టౌన్లో అడుగుపెట్టాడు. సాత్ ఉచాకే, బద్రీనాథ్ కీ దుల్హనియా, హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ, స్త్రీ, లుకా చుప్పీ, రాజ్మా చావల్ వంటి సినిమాల్లో నటించాడు. బాలా, పతీ పత్నీ ఔర్ వో చిత్రాల్లో సోదరుడితో స్క్రీన్ పంచుకున్నాడు. నటుడు, ఆర్జే, సింగర్, టీవీ హోస్ట్‌గా గుర్తింపు పొందిన అపర్శక్తి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక హర్యానా అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా అతడు వ్యవహరించాడు. చదవండి: Shilpa Shetty: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి! View this post on Instagram A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana) -
ఆ సర్జరీ తర్వాత ‘ప్లాస్టిక్ చోప్రా’ అని వెక్కిరించేవారు
ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ –ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్–టు–బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్ ది కోడ్. భార్య తహీర కష్యప్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్ హుమ్, టికెట్ టు బాలీవుడ్...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం. పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు. ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్మోడరేట్లీ ఫేమస్ సోహా అలీ ఖాన్ పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్ మీడియా కల్చర్‌పై తనదైన శైలిలో రాశారు. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. అమ్మ మియా: ఇషా డియోల్ మాతృత్వం మధురిమపై ఇషా డియోల్ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్ పేరెంటింగ్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్‌కు ఇదొక మంచి గైడ్‌లా ఉపకరిస్తుంది. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే! అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్ఫిన్ఫినిష్డ్’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి. పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే! -
ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు
తండ్రిని తలుచుకుని ఆనందబాష్పాలు రావాలి. అశ్రువులు కాదు. కాని తండ్రి జీవించి ఉంటే ఆనంద బాష్పాలు వచ్చేవే. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2021 ఫంక్షన్లో తండ్రి ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన అవార్డును అతడి తరఫున కుమారుడు బాబిల్ ఖాన్ అందుకుంటూ తండ్రిని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇటీవల ముంబైలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఆ వేడుకలో ఇర్ఫాన్ ఖాన్‌ను మరణానంతర ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రకటించారు. అలాగే ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. దానిని అందుకోవడానికి ఇర్ఫాన్ కుమారుడు బాబిల్‌ను స్టేజ్ మీదకు నటులు ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్ పిలిచారు. ఆ సమయంలో ఆయుష్మాన్ మాట్లాడుతూ ‘ఇర్ఫాన్ ఖాన్ నుంచి మేమందరం ఎంతో నేర్చుకున్నాం’ అన్నాడు. అప్పుడు అవార్డు అందుకున్న బాబిల్ తండ్రిని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అది చూసి రాజ్‌కుమార్ రావ్ కూడా కన్నీరు కార్చాడు. చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేనేమి ప్రత్యేక ఉపన్యాసం తయారు చేసుకుని రాలేదు. నన్ను మీ అందరూ అక్కున చేర్చుకున్నారు. అది చాలు’ అన్నాడు బాబిల్. ఈ ఈవెంట్ ప్రసారం కావాల్సి ఉంది. -
ఆయనతో పని చేయడం హ్యాపీగా ఉంది
‘ఆర్టికల్ 15’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకుడు అనుభవ్ సిన్హా కాంబినేషన్లో ‘అనేక్’ అనే సినిమా ఆరంభమైంది. రాజకీయాల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ‘‘అనుభవ్ సార్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా లుక్ ఇదిగో’’ అంటూ ఈ సినిమాలో తాను చేస్తున్న జోష్వా పాత్ర లుక్‌ను విడుదల చేశారు ఆయుష్మాన్ ఖురానా. వార్తల్లో ఉన్న ప్రకారం అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న తొలి భారీ బడ్టెట్ చిత్రం ఇదేనట. టి. సిరీస్ భూషణ్‌కుమార్, అనుభవ్ సిన్హా కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ayushmann Khurrana (@ayushmannk) -
బాలీవుడ్‌కు రకుల్.. మరో సినిమాకు రెడీ
టాలీవుడ్‌పై ఫోకస్ తగ్గించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో పాగా వేశారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో యారియాన్, అయ్యారే, దేదే ప్యార్ దే వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు. చదవండి: రకుల్ ఫిట్నెస్ మంత్రా : ఫ్యాన్స్ ఫిదా తాజాగా బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ డాక్టర్ ఉదయ్ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సీనియర్‌గా రకుల్ డాక్టర్ ఫాతిమా పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక డాక్టర్ జీ సినిమాపై రకుల్ స్పందించారు. సినిమాలో భాగమవుతున్నందుకు చాలా అసక్తిగా ఉందని తెలిపారు. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. Yayyyyy!!! Soooo excited!! Can’t wait to start shooting 😁😁 https://t.co/Aho0jzznyt — Rakul Singh (@Rakulpreet) February 1, 2021 -
5 స్టార్ బ్రాండ్ బాజా!
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగాలుపడినా.. బాలీవుడ్, క్రికెట్ స్టార్స్‌కు ప్రచారకర్తలుగా డిమాండ్ చెక్కుచెదరలేదు. అంతేకాదు వీరి మార్కెట్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. నటుడు ఆయుష్మాన్ ఖురానా (36) 19 బ్రాండ్లకు ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారి, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు, బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఇవేవీ ఖురానా మార్కెట్‌ను అడ్డుకోలేకపోయాయి. కోల్గేట్ పామోలివ్ తాజాగా ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇక అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ సైతం కరోనా కల్లోలంలో గట్టిగా నిలబడిన స్టార్సే కావడం గమనార్హం. ఇతర స్టార్స్ మార్కెట్ బోసిపోయినా కానీ, అమితాబ్, ఖురానా, అక్షయ్, ధోనీ, కోహ్లీలను తమ ప్రచారకర్తలుగా నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నాయి. అక్షయ్ కుమార్ టాప్ బాలీవుడ్లో వరుస హిట్లతో అదరగొడుతున్న అక్షయ్ కుమార్... ప్రచార కార్యక్రమాల్లోనూ దుమ్మురేపుతున్నారు.‡ గత నెల రోజుల్లోనే అక్షయ్ ఏకంగా నాలుగు నూతన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోధా గ్రూప్, డాలర్ ఇండస్ట్రీస్, బెర్జర్ పెయింట్స్, పాలసీబజార్ కంపెనీలు అక్షయ్‌తో ప్రచార కార్యక్రమాలు రూపొందించుకున్నాయి. టెలివిజన్లపై వచ్చే ప్రచార ప్రకటనల్లో అక్షయ్ తరచుగా కనిపిస్తుండడం చాలా మందికి పరిచయమే. భారత క్రికెట్ జట్టు సార«థి అయిన విరాట్ కోహ్లీ ‘వైజ్’ అనే హెల్త్‌కేర్, శానిటైజర్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఇటీవలే సంతకం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు తక్షణం ముగింపు పలుకుతున్నట్టు మహేంద్రసింగ్ ధోనీ ప్రకటించినా కానీ.. కంపెనీలు ఆయన రూపాన్ని తమ ఉత్పత్తుల విక్రయాలకు అపురూపంగానే భావిస్తున్నాయి. 78 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ పట్ల బ్రాండ్లకు ఆకర్షణ తగ్గడం లేదు. వరుసగా ఒక దాని వెంట ఒక కంపెనీ ఆయనతో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నాయి. బచ్చన్ అంటే నమ్మకం! దేశంలోనే అత్యంత విశ్వసనీయ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ ఇటీవలే నిర్వహించిన సర్వేలో ప్రజలు తేల్చి చెప్పారు. టీఐఏఆర్ఏ రేటింగ్స్ ప్రకారం బచ్చన్ స్కోరు 90 పాయింట్లు. అత్యధికంగా 93.5 పాయింట్లతో అక్షయ్‌కుమార్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానం బచ్చన్‌దే. ఆయుష్మాన్ ఖురానా స్కోరు 88.5 పాయింట్లు. క్రీడాకారుల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ స్కోరు 87 పాయింట్లు. 63.9 పాయింట్లతో కోహ్లీ టాప్ 5లో ఆఖరున ఉన్నారు. కాకపోతే కోహ్లీ (మోస్ట్ హ్యాండ్సమ్) అందగాడుగా సర్వేలో నిలిచారు. దేశవ్యాప్తంగా 23 పట్టణాల నుంచి 60వేల మంది అభిప్రాయాలను ఈ సర్వే కోసం సేకరించారు. ఈ ఐదుగురు స్టార్స్ 2021లోనూ తమ హవా కొనసాగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెలబ్రిటీలకు పరీక్షా కాలం ‘‘సెలబ్రిటీలకు ప్రచార కార్యక్రమాల పరంగా 2020 కష్టమైనది. తొలి 6 నెలలు లాక్‌డౌన్‌తో కరిగిపోయింది. ద్వితీయ భాగంలో రాజ్‌పుత్ కేసు, బాలీవుడ్ డ్రగ్స్ కేసు ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. అమితాబ్ బచ్చన్, కోహ్లీ, ధోనీ, ఖురానా, అక్షయ్‌కుమార్ మాత్రం ఈ పరిస్థితులను సునాయాసంగానే అధిగమించి తమ బ్రాండ్ విలువను గట్టిగానే కాపాడుకున్నారని చెప్పుకోవాలి. వివాదాల్లో లేని స్టార్స్ పట్ల కంపెనీలు ప్రాముఖ్యం చూపిస్తున్నాయి’’ అని నిహిలెంట్ హైపర్ కలెక్టివ్ అంతర్జాతీయ సీఈఓ కేవీ శ్రీధర్ తెలిపారు. హరీష్ బిజూర్ కన్సల్ట్స్ సీఈవో హరీష్ బిజూర్ స్పందిస్తూ.. ‘‘స్టార్స్‌లో ఈ ఐదుగురు మాత్రం మెగాస్టార్స్ కిందకు వస్తారు. వారికి ఉన్న ఆకర్షణ ఏమాత్రం చెక్కుచెదరదు. ఇది ప్రేక్షకులతో వారిని మరింత సన్నిహితం చేస్తోంది. బ్రాండ్లకు కావాల్సింది కూడా ఇదే’’ అని పేర్కొన్నారు. -
పరుగు ప్రారంభం
దుబాయ్‌లో పరుగు ప్రారంభించారు తాప్సీ. యాక్షన్ అనడం ఆలస్యం పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంటున్నారు. తాప్సీ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ నిర్మిస్తున్నారు. ఇందులో రన్నర్‌గా నటిస్తున్నారు తాప్సీ. గుజరాత్లో ఓ మారుమూల గ్రామంలో ఉండే అమ్మాయి రష్మీ. ఆమె వేగాన్ని చూసి అందరూ రాకెట్ అంటుంటారు. మరి ఆ రాకెట్ ఎందాకా వెళ్లగలిగింది అనేది చిత్రకథాంశం. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా దుబాయ్‌లో ప్రారంభం అయింది. ‘మరో కొత్త ప్రయాణం ప్రారంభం అయింది. హసీనా (తన గత చిత్రం ‘హసీనా దిల్రుబా’లో పాత్రను ఉద్దేశించి) నుంచి రాకెట్‌గా మారిపోయాను’’ అన్నారు తాప్సీ. -
ట్రాన్స్జెండర్తొ ప్రేమ
ఆయుష్మాన్ ఖురానా, వాణీ కపూర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘ఛండీఘర్ కరే ఆషికీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదో పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం అని సమాచారం. కానీ ఇందులో ఓ విశేషం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న వాణీ కపూర్ ట్రాన్స్‌జెండర్ పాత్రధారిగా కనిపిస్తారట. ట్రాన్స్‌జెండర్ అయిన వాణీకపూర్కీ, ఆయుష్మాన్‌కి మధ్య నెలకొనే విచిత్రమైన ప్రేమ ఈ సినిమాకి హైలెట్ అని బాలీవుడ్ టాక్. తెలుగులో ‘ఆహా కల్యాణం’ చిత్రంలో కథానాయికగా నటించిన వాణీ కపూర్ ఆ తర్వాత హిందీ చిత్రాలే చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ఆమె చేసిన ‘బెల్ బాటమ్’, రణ్‌బీర్ కపూర్‌తో చేసిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
శుభాకాంక్షలు
ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రలో హర్షవర్ధన్ కులకర్ణి తెరకెక్కించిన చిత్రం ‘బదాయి హో’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘బదాయి దో’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్, భూమి ఫెడ్నేకర్ జంటగా నటించబోతున్నారు. ఈ సీక్వెల్‌ను హర్షవర్థన్ కులకర్ణి డైరెక్ట్ చేస్తారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘శుభాకాంక్షలు. చేయి ఇటు ఇవ్వండి. (శానిటైజ్ చేసుకున్నాకే)’’ అంటూ ఈ సీక్వెల్‌ని ప్రకటించారు రాజ్‌కుమార్ రావ్. -
ప్రధాని మోదీతో పాటు ఈ ‘దాదీ’ కూడా..
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ 2020 ఏడాదిగానూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసిన ‘‘అత్యంత ప్రభావశీల వ్యక్తుల’’ జాబితాను విడుదల చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు షాహిన్‌బాగ్ దాదీగా ప్రాచుర్యం పొందిన బిల్కిస్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. లీడర్స్ కేటగిరీలో ప్రధాని మోదీ, ఐకాన్స్ కేటగిరిలో బిల్కిస్ స్థానం సంపాదించుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత రాణా ఆయుబ్.. ‘‘ఓ చేతిలో జపమాల, మరో చేతిలో జాతీయ జెండాతో బిల్కిస్ భారత్‌లోని అణచివేయబడిన వర్గాల తరఫున గళమెత్తింది. 82 ఏళ్ల వయస్సులో పొద్దున 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరసనల్లో పాల్గొంది’’అంటూ ఈ బామ్మ గురించి టైమ్ మ్యాగజీన్లో పేర్కొన్నారు. (చదవండి: రైతుల ఆర్థిక స్థితి మారుతుంది: మోదీ ) కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరు నిరసనలు తెలియజేస్తూ దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనల్లో భాగమైన 82 ఏళ్ల బిల్కిస్ దాదీ మీడియా దృష్టిని ఆకర్షించారు. ‘‘ఇక్కడ చూడండి. కేవలం ముస్లింలు మాత్రమే నిరసన చేపట్టలేదు. అన్ని మతాల వారు వచ్చి ఇందులో పాలుపంచుకుంటున్నారు. భోజనం పంచుతున్నారు. మాకోసం కొందరు అరటిపళ్లు తీసుకువచ్చారు. మరికొందరు జ్యూస్, బిస్కట్లు తెస్తున్నారు. చూడండి ఇక్కడ అంతా కలిసే ఉన్నారు’’ అంటూ మతసామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి అమూల్యమైన మాటలు చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్లో చోటు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ట్రంప్, కమలా హారిస్ కూడా ఇక పలు సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఆర్టిస్టుల కేటగిరీలో స్థానం సంపాదించుకున్నారు. కాగా టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్య పదవికి పోటీపడుతున్న కమలా హారిస్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులు ఈ లిస్టులో ఉన్నారు.(చదవండి: 244 ఏళ్ల స్వాత్రంత్ర్య చరిత్ర: మహిళకు దక్కని అవకాశం!) -
ఆయుష్మాన్‌పై కంగనా ఫైర్
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి పట్ల సానుభూతి చూపించిన నటుడు ఆయుష్మాన్ ఖురానాపై కంగనా ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో మనుగడ సాగించాలనే స్టార్ కిడ్స్‌కు మద్ధతు ఇస్తున్నాడని ఆరోపించింది. ఆయుష్మాన్‌ను చప్లాస్గా అభివర్ణిస్తూ.. బాలీవుడ్ మాఫియాకు మద్దతిస్తున్నావంటే ఏదో ప్రయోజనం పొందేందుకే అంటూ పేర్కొంది. బాలీవుడ్లో కంగనాకు ఓ వర్గం మద్దతిస్తుంటే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఆయుష్మాన్ ప్రయోజనం పొందేందుకు బాలీవుడ్ మాఫియాకు మద్దతిస్తున్నాడని కంగనా సంచలన ఆరోపణలు చేసింది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే : రియా) బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బీటౌన్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు బాలీవుడ్ ప్రముఖులపై కంగనౌ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆయుష్మాన్.. బాలీవుడ్లో సెలక్టివ్ సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా ఆయుష్మాన్ మాత్రం స్టార్ కిడ్స్‌కే మద్దతిస్తున్నాడంటూ కంగనా ఆరోపించింది. ఇంతకుముందు తాప్సీ పొన్నూపై కూడా బీ- గ్రేడ్ నటి అంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు సుశాంత్‌కి మద్ధతుగా బాలీవుడ్ ప్రముఖులెవరూ మాట్లాడకపోవడంపై అతడి అభిమానులు ప్రముఖులను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సుశాంత్‌కి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గళమెత్తుతున్నారు. (కంగనా వ్యాఖ్యలపై స్పందించిన తాప్సీ) Chaploos outsiders support mafia only for one reason and the reason is their mediocrity, nobody is threatened by them and they take full advantage of conflicts faced by few like Kangana and SSR by openly denying and mocking them .. -KR https://t.co/vqzy0JuihP — Team Kangana Ranaut (@KanganaTeam) August 9, 2020 -
టైడ్ ప్రచారకర్తగా ఆయుష్మాన్ ఖురానా
ముంబై: ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు చెందిన ‘టైడ్’ బ్రాండ్‌కు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. వాషింగ్ మెషిన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టైడ్ ఆల్ట్రా పౌడర్‌కు ఈయన నటించిన తొలి ప్రకటనను ఇప్పటికే పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం జరగక ముందు వరకు టైడ్ అవాక్కయ్యారా ప్రకటనలు చూసి ఇష్టపడిన తాను.. ఇప్పుడు స్వయంగా బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉండడం సంతోషంగా ఉందని ఆయుష్మాన్ అన్నారు. -
స్టార్లతోనే పనిచేస్తాం... నీలాంటి వాళ్లతో కాదు..
‘‘నేను రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలో.. 2007లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో కరణ్ జోహార్‌ను ఇంటర్వ్యూ చేశాను. నటుడు కావాలనుకుంటున్నానని ఆయనతో చెప్పాను. మీ ఫోన్ నంబరు ఇవ్వమని అడిగాను. ఎట్టకేలకు ఆయన తన ఆఫీస్ ల్యాండ్‌లైన్ నంబర్ ఇచ్చారు. ఇక నన్ను ఎవరూ ఆపలేరు. నా దశ తిరిగింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆయుష్మాన్ ఖురానా పరిచయం. అబ్బో ఇలా ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంగా కరణ్ ఇచ్చిన నంబర్‌కు డయల్ చేశా! ఆ సమయంలో తను ఆఫీసులో లేడని చెప్పారు. ఆ మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేశా. కరణ్ బిజీగా ఉన్నాడని చెప్పారు.(ముసుగులు తొలగించండి) అలా ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆఖరికి ఒకరోజు వాళ్లు కుండబద్దలు కొట్టేశారు. ‘‘మేం స్టార్లతో మాత్రమే పనిచేస్తాం. నీలాంటి వాళ్లతో పనిచేయలేం’’ అని కరుకుగా సమాధానం ఇచ్చారు’’ అంటూ బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా 2015లో ప్రచురించిన ‘క్రాకింగ్ ది కోడ్: మై జర్నీ ఇన్ బాలీవుడ్’ బుక్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నటుడు కావాలన్న కోరికను నెరవేర్చుకునే క్రమంలో తనకు ఎదురైన అనుభవాల గురించి భార్య తహీరా కశ్యప్‌తో కలిసి ఈ పుస్తకాన్ని రచించాడు. అవుడ్సైడర్ అయిన తాను బాలీవుడ్లో ప్రవేశించడానికి పడిన కష్టం గురించి ఇందులో వివరించాడు. కాగా యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో.. ఆయుష్మాన్ ఖురానా తన పుస్తకంలో రాసుకున్న విషయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. (సుశాంత్ మరణం; కరణ్‌కు మద్దతుగా వర్మ) నెపోటిజం కారణంగా మానసిక ఒత్తిడిలో కూరుకుపోయిన సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడని.. ఇందుకు బాలీవుడ్ పెద్దలే కారణమంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కిడ్స్ను తెరకు పరిచయం చేయడంలో ముందుండే కరణ్ జోహార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ రాసిన పుస్తకంలోని పంక్తులను ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇప్పటికైనా కరణ్ నిజ స్వరూపం తెలిసిందా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రేడియో జాకీగా ఉన్నపుడు ఆయుష్మాన్‌ను పట్టించుకోని కరణ్.. అతడు హీరోగా ఎదిగిన తర్వాత మాత్రం తన షోకు పిలిచి ప్రతిభ ఉన్న నటుడు అంటూ పొగిడాడు అని కాఫీ విత్ కరణ్ షోను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఆర్జేగా కెరీర్‌గా ఆరంభించిన ఆయుష్మాన్.. విక్కీ డోనర్, అంధాధున్, సర్వమంగళ్ సావధాన్, ఆర్టికల్ 15 వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. This is how Ayushmann khurrana exposed Karanjohar once 👏 #JusticeForSushantSinghRajput#karanjohargang pic.twitter.com/KEMubK0zWK — Brahmin_girl🌸 (@shizuka261) June 16, 2020 -
ఆ మచ్చలు గతాన్ని గుర్తు చేస్తాయి
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీర కశ్యప్ గతేడాది రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ వస్తోంది. తాజాగా "నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే" సందర్భంగా ఓ ఆడియో సందేశాన్ని అభిమానులతో పంచుకుంది. "కొన్ని గాట్లు లోతైనవి, కొన్ని కనిపిస్తాయి, మరికొన్ని కనిపించవు. కానీ ఆ మచ్చలు మీకు గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు బాధ అనుభవించిన క్షణాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ మీ శరీరంపై ఉన్న మచ్చలున్నాయే.. అవి దూరంగా ఉన్న నక్షత్రాల లాగే రహస్యాలను దాచిపెడతాయి. అయితే ఈ రహస్యాలను కంటితో చూడలేరు. ఇందులో ప్రపంచాన్ని విస్మరించే కఠోరమైన అబద్ధం దాగి ఉంటుంది.. (మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య) ఇక ఈ మచ్చలు మనకు ఎన్నో నేర్పుతాయి. పోరాటం, శక్తి సామర్థ్యాలు అన్నీ.. ఆరోగ్య కర్మతో పోరాడే ప్రతి ఒక్కరూ విజేతలే. ఎలాగంటే ఈ పోరాటం మిమ్మల్ని అనుభవజ్ఞులుగానో లేదా యుద్ధానికి సిద్ధమవుతున్నారనో తెలుపుతుంది. అయితే క్యాన్సర్‌తో పోరాటం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఉంటుంది. కొన్ని యుద్ధాలు జయించడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా అవి అంతర్గతమైనపుడు! కానీ ఓ మాట గుర్తుంచుకోండి. మనందరికీ విశ్వమంతటి శక్తి ఉంది. కాబట్టి మీరు మచ్చలను దాచకండి, వాటిని చూపించండి.. మీ ఆత్మగౌరవానికి ఇతరులే ప్రేమలో పడుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి" అని చెప్పుకొచ్చింది. (నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా: హీరో) View this post on Instagram A small something I have written.... #nationalcancersurvivorsday . . Some scars are deep, some within, Some are seen while some are hidden. The thing about scars is , it reminds you of the past, The moments of suffering that you thought would forever last. But there’s more to these Goddamn scars, They are Secrets hidden far away, just like the stars. It’s the Truth which you don’t see with the naked eye, Oblivious to the functioning of the world, a blatant lie. But hear me, there’s more to this scar, It talks also about the fight, the resilience and your invincible power. My love and respect to those who fought, The treacherous battlefield that Few crossed while some got lost. But the thing with this health karma is that everyone is a winner, For it’s the fight that counts whether you an expert or a beginner. The fight with cancer is not just physical but also mental, Some battles are more tough to conquer especially if they are internal. But hear me again, we all have that fighter which has the universe’s might, The indomitable spirit that can’t be crushed by any fright. Hide not your scars my love, Show them, flaunt them, just like your bright smile, soothing to others eyes, And when you do that time and again giving people nowhere to run and hide, they will have to fall in love with your badge of honour, your prize. So hear me one last time, Fall in love with your self, All with dust, scar and grime. For that’s what make you, YOU Faulty, imperfect, blemished but all true! Lensed by @atulkasbekar who captures the soul! Thank you for this ❤️ A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 6, 2020 at 11:27pm PDT -
మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య
విలక్షణ పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానాతో సినిమా చేయాలనుకుంటున్నట్లు భార్య తాహిరా కశ్యప్ వెల్లడించారు. అతనితో కలిసి పనిచేయడం ఎంతో ఇష్టమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా దర్శకత్వం ఆలోచన వాయిదా పడిందని తెలిపారు. కాగా, థియేటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ అయిన తాహిరా టోఫీ, పిన్ని వంటి షార్ట్ ఫిల్మ్‌లతో గుర్తింపు పొందారు. ఇక సినిమా రంగంలో తనకంటే సీనియర్ అయిన ఆయుష్మాన్‌ను అప్పుడే డైరెక్ట్ చేయాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. రెండు, మూడు సినిమాలు చేశాక.. ఆ అర్హత సంపాదిస్తానని వెల్లడించారు. (చదవండి: ‘ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను’) ఆయుష్మాన్ ఓ గొప్ప ఆర్టిస్ట్ అని తాహిర్ భర్తను కొనియాడారు. తాము భార్యభర్తలు కావడంతో అతనితో సినిమా విషయంలో ఒకింత భయం కూడా ఉందని, అయితే దానిని అదిగమిస్తామని తెలిపారు. తన స్క్రిప్ట్‌లు విని ఫీడ్‌బ్యాక్ అందించిన తొలి వ్యక్తి తనేనని తాహిరా తెలిపారు. కాగా, క్యాన్సర్ బారినపడిన తాహిరా దుబాయ్‌లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భార్య జబ్బు బారిన పడటంతో ఉదయం పూట సినిమా షూటింగ్స్, సాయంత్రం పూట భార్య బాగోగులు చూసుకున్న ఆయుష్మాన్... ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ కార్వా చౌత్ (ఉపవాసం) కూడా నిర్వహించారు. ఆ విశేషాలను తాహిరా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. వీరికి 2008లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు. (చదవండి: గులాబో సితాబో డిజిటల్ రిలీజ్) View this post on Instagram Embarrassing you further @ayushmannk Our #karvachauth moment! While I am in Dubai for an event, my certainly better half keeps a fast for me on his set! (p.s I am still popping some pills so couldn’t fast) But how adorable are you Mr A ! Love you so much❤️ #fastinghusbands thank you @shrutiv11 for capturing this moment! A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Oct 17, 2019 at 10:43am PDT -
‘ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను’
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆయుష్మాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తి, వృత్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. అయితే ఆయుష్మాన్ సోమవారం తన తండ్రి పీ ఖురానాకి బర్త్‌డే విషేష్ తెలుపుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘ప్రపంచలోనే గొప్ప తండ్రివి నువ్వు. నీకు హ్యాపీ బర్త్ డే. నీవు నాకు గొప్ప తెలివిని, లక్ష్యాన్ని ఇచ్చావు. ఇష్టమైన రంగంలో ఎప్పడూ కష్టపడి శ్రమించాలని చేతులను ఇచ్చావు. నేను ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పినా ఎవరు నమ్మరు’ అని కామెంట్ జతచేశారు. (అభిమానులకు శుభవార్త చెప్పిన సోనాలి) View this post on Instagram Happy bday to the world’s best father! You gave me the wings, talent and ambition. I won’t tell your age to the world. Coz they won’t believe it. 🤓 Jai jai (that’s what we say when we do charan sparsh) 🙏🏻 A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on May 18, 2020 at 7:27am PDT దీనికంటే ముందు ఆయుష్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రికి సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసి.. ‘హ్యాపీ బర్త్ డే పప్పా. చివరికి నువ్వు 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టావు. ఇదే నీ నిజమైన వయసు’ అంటూ ఆయన కామెంట్ జతచేశారు. ఆయుష్మాన్ తండ్రి పీ ఖురానాకు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు అర్జున్ కపూర్, నుస్రత్ బరుచా, నేహా ధుపియాతో పాటు పలువురు ప్రముఖులు బర్త్‌డే విషేష్ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆయుష్మాన్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గులాబో సితాబో’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12న పేక్షకుల ముందుకు రావల్సింది. కానీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా థియేటర్లు అన్ని మూసి ఉండటంతో ఈ సినిమాను దిగ్గజ అమేజాన్ ప్రైమ్‌లో జూన్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు సూజిత్ సర్కార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. లాక్డౌన్ అమలవుతున్న ఈ సమయంలో ఆయుష్మాన్ ముంబైలో ఇంటికే పరిమితమై కుంటుంబంతో గడుపుతున్నారు. (సల్మాన్‌ను టార్గెట్ చేసిన సింగర్) -
గులాబో సితాబో డిజిటల్ రిలీజ్
అందరూ ఊహిస్తున్నదే మొదలవుతున్నట్టుంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉండి లాక్డౌన్ వల్ల థియేటర్లలో ఇప్పుడప్పుడే ప్రదర్శనకు నోచుకునే వీలు లేని సినిమాలన్నీ తమ విడుదలకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నాయి. బాలీవుడ్లో ఈ ఒరవడికి ‘గులాబో సితాబో’ తెర తీయనుంది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా ప్రసిద్ధ దర్శకుడు సూజిత్ సర్కార్ చేతుల్లో రూపుదిద్దుకుంది. గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇది ఏప్రిల్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్ల, కరోనా అనిశ్చితి వల్ల పూర్వ స్థితి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేనందున డిజిటల్ రిలీజ్‌కు దర్శకుడు సూజిత్ రంగం సిద్ధం చేశాడు. ఓటీటీ దిగ్గజం అమేజాన్ ప్రైమ్‌లో జూన్ 12వ తేదీన ‘గులాబో సితాబో’ విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక ముస్లిం ఇంటి యజమానిగా, ఆయుష్మాన్ ఖురానా అతని దగ్గర హిందూ కిరాయిదారుగా నటించారు. ‘‘సరిహద్దులను చెరిపేసే సరదా కథ ఇది’’ అని అమితాబ్ చెప్పారు. ‘‘సినిమాలో నేను, ఆయుష్మాన్ ఖురానా అనుక్షణం పేచీ పడుతుంటాం. కానీ వాస్తవానికి షూటింగ్లో ఇద్దరం ఎంతో అవగాహనతో పని చేశాం’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘అమితాబ్‌తో నటించాలనే నా రహస్య కోరికను సూజిత్ తీర్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. కామెడీ ప్లస్ డ్రామా కలిసిన ఈ సినిమాను డ్రామెడీ అంటున్నారు. దీని కోసం జూన్ 12 వరకు వేచి చూడక తప్పదు. -
అమెజాన్ ప్రైమ్‌లో అమితాబ్ కొత్త సినిమా
ముంబై : లాక్డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్లు మూతపడడంతో కొత్త సినిమాల విడుదలకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీగా ఉన్న సినిమాల్లో చాలా వరకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్ఎక్స్టీ, ఓటీటీ ద్వారా డైరెక్ట్‌గా టీవీల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాలు నటించిన 'గులాబో సితాబో' సినిమాను అమెజాన్ ఫ్రైమ్ ద్వారా విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో గులాబో అనే వృద్ధుడి పాత్రలో అమితాబ్ నటిస్తుండగా, సితాబో పాత్రలో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న థియోటర్లలోకి రావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. జూన్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షం కానుంది. గులాబో సితాబో సినిమాను రోన్ని లాహిరి, షీల్ కుమార్‌లు నిర్మించగా షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. -
నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా: హీరో
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఓ ఇంటర్యూలో ఖురానా మాట్లాడుతూ.. సినిమా ఛాన్స్‌ల కోసం ఆడిషన్స్ ఇచ్చే సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘సినిమా ఛాన్స్ ఉందని ఓ దర్శకుడు ఆడిషన్స్‌కి పిలిచాడు. ఇక అక్కడికి వెళ్లాక ఆయన నువ్వు నీ ప్రైవేటు భాగాలను చూపిస్తే నీకు సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని చెప్పాడు. ఇక క్షణం ఆలోచించకుండ వెంటనే ఆయన ఆఫర్‌ను సున్నీతంగా తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే ‘‘అప్పటి నుంచి నేను ఎన్నో సార్లు తిరస్కరణలకు గురయ్యాను. ఇక ప్రారంభంలో సోలో టెస్టు తీసుకుంటామని చెప్పి ఒకేసారి 50 మందిని లోపలికి పిలిచేవారు. అయితే దీనిని నేను వ్యతిరేకిస్తే తిరిగి వెళ్లిపోమ్మని చెప్పేవారు. అలా నేను ఎన్నోసార్లు ఆడిషన్స్‌కు వెళ్లి తిరిగి వచ్చేవాడిని’’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభాన్ని గుర్తు చేసుకున్నాడు. (అందుకే తిరస్కరించారు: ప్రియదర్శన్) కాగా ఈ తిరస్కరణల నుంచి ఇప్పుడు నేను మరింత బలవంతుడినయ్యాను అంటూ ఖురానా చెప్పాడు. ‘‘ప్రారంభంలో నేను ఎదుర్కొన్నా వైఫల్యాల వల్ల నాలో ఆత్మస్థైర్యం రెట్టింపు అయ్యింది. ఎంతగా అంటే ప్రస్తుతం అపజయాలను, విజయాలను ఒకేలా స్వీకరించేంతగా. అయితే గత మూడేళ్లలో విడుదలైన నా సినిమాలు అన్ని కూడా విజవంతమైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పాడు. కాగా ఆయుష్మాన్ ఖురానా ‘విక్కీ డోనర్’ సినిమాతో 2012లో బాలీవుడ్లో ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో మెస్ట్ వాంటేడ్ నటుడిగా ఎదిగాడు. ఇటివల ఆయన నటించిన ‘శుభ మంగల్ జయాదా సావ్ధాన్’ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఆయుష్మాన్ స్వలింగ సంపర్కుడిగా నటించాడు. (ఆయుష్మాన్ ఖురానా సినిమాకు తాప్సీ బ్రేక్) -
‘అవుట్ డేటెడ్ దర్శకుడిననే ఒప్పకోలేదు!’
హంగామా-2 కోసం బాలీవుడ్ హీరోలు ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్లను మొదట సంప్రదించగా వారు నిరాకరించినట్లు దర్శకుడు ప్రియదర్శన్ వెల్లడించారు. 2003లో కామెడీ నేపథ్యంలో రూపొందించిన ‘హంగామా’కు సీక్వెల్‌గా ‘హంగామా-2’ను ఆయన తెరకెక్కిస్తున్నారు. కాగా దీనికోసం ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రాలు వంటి పెద్ద హీరోలను సంప్రదించానని చెప్పారు. అయితే వారిలో ఎవరూ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపలేదని కూడా పేర్కొన్నారు. తాను కాలం చెల్లిన దర్శకుడినని భావించే వారు తన ప్రాజెక్టును తిరస్కరించి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఆ వీడియో డిలీట్ చేసిన హీరో..) దీనిపై ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘నేను వారిని నేరుగా కలవలేదు కానీ అయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రా వంటి పెద్ద హీరోలను దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశాను. అయితే వారు ఈ ప్రాజెక్టును తిరస్కరించారు. బహుశా నేను అవుట్ డేటెడ్ డైరెక్టర్‌నని ఒప్పుకుని ఉండరు. ఎందుకంటే గత అయిదేళ్ల నుంచి నేను ఒక్క హిందీ సినిమాను కూడా తెరకెక్కించలేదు’ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా ‘‘నా నమ్మకాన్ని విశ్వసించే నటులతోనే పని చేయడానికి నేను ఇష్టపడతాను. వారికి నాతో పని చేయడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పినప్పటికీ నటులను అభ్యర్థించడం నాకు ఇష్టం ఉండదు. నా మీద నమ్మకం ఉంచి నాతో నటించడానికి వచ్చిన వారితోనే నేను పనిచేస్తాను. ఎప్పుడైన మీరు నటులను నటించమని కోరితే వారికి మీ మీద నమ్మకం లేకపోతే అప్పుడు వారు గౌరవం ఇస్తూనే కాఫీ లేదా టీని అందించి మెల్లిగా మీ నుంచి తప్పించుకుంటారు’’ అని ఆయన చెప్పారు. కాగా హంగామా-2 సినిమా చిత్రీకరణపై ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ప్రణితా సుభాష్‌లు నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం వారిని సంప్రదించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పారు. -
తమిళంలోకి ఆర్టికల్ 15
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్‌లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు. -
ఆయుష్మాన్ భవ!
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సినీ తారలంతా వారికి తోచిన మార్గంలో ప్రచారం చేస్తున్నారు. ఆపదలో, అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరం కరోనా మహమ్మారి కారణంగా నిరాశానిస్పృహలతో విచారంగా ఉంటున్నాం. ఏ క్షణాన ఎవరిని కబళిస్తుందోననే భయం వెంటాడుతూనే ఉంది. ‘ఇటువంటి సమయంలోనే అందరం ఆశావహ దృక్పథంలో ఉండాలి, మంచి మంచి కథలు వినాలి’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఆయుష్మాన్ ఖురానా. ఈ విపత్కర సమయంలో ఈ మహమ్మారిమీద పోరాటం చేస్తున్న ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’ కథలను మనమందరం తప్పకుండా వింటూ ప్రేరణ పొందాలి అంటున్నారు ఆయుష్మాన్. తనవంతుగా, అటువంటి వారిని స్మరిస్తూ వారి మీద ఒక ఓడ్ (ఇంగ్లీషులో ఒక ఛందస్సు) రచించి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా మీద అహర్నిశలూ పోరాడుతూ, మన కోసం, మన కుటుంబాల కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి ఈ పాటను అంకితం చేశారు. ‘వారికి వందనం చేస్తూ, వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను’ అంటున్నారు ఆయుష్మాన్. ‘వీధులను శుభ్రం చేసేవారు, చెత్తను ఎత్తిపారేసేవారు, నిత్యావసరాలను మన ఇళ్లకు తీసుకువచ్చిన తరవాతే వారి ఇళ్లకు వెళ్తున్నవారు అందరికీ నమస్కరిస్తున్నాను. మనం కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వం. వారి నుంచి కరోనా వ్యాధి మన పిల్లలకు వస్తుందేమోనని కనీసం వారిని ముట్టుకోవటానికి కూడా ఇష్టపడం. ఈ సమయంలో మనకు అతి నిరుపేదలు సహాయపడుతున్నారు. ఈ మహమ్మారి కనుమరుగయ్యాక, మనమంతా వారిని గౌరవించుకుందాం. ఏ పనీ చిన్నది కాదని అర్థం చేసుకోవాలి. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు వీరే మనకు ఈ విపత్కర సమయంలో భగవంతుడితో సమానులు. మాలాంటి బాలీవుడ్ హీరోలు కేవలం నామమాత్రులు మాత్రమే’ అంటూ ఈ పాటలో ఆయుష్మాన్ అంటున్నారు. ‘ప్రజలంతా ఇంటి దగ్గరే ఉంటూ, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి సహకరిద్దాం’ అంటూ తన పాటను ముగించారు ఆయుష్మాన్. -
ఆయుష్మాన్ ఖురానా సినిమాకు తాప్సీ బ్రేక్
ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాద సావధాన్’. ఇద్దరబ్బాయిల మధ్య ప్రేమ.. అంటూ కొత్త కాన్సెప్ట్‌తో తరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. దీని ట్రైలర్ విషయానికొస్తే.. హీరోలిద్దరూ ఓ పార్టీలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే, అందులో తప్పేముంది అన్నట్లుగా వాళ్లు ప్రవర్తించే తీరు మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. ఇక ట్రైలర్లోనే నవ్వులు పూయించిన దర్శకుడు హితేశ్ కేవాల్యా సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడంలో సఫలీకృతమయ్యాడు. (రాహు మూవీ రివ్యూ చదివేయండి) ఈ సినిమాలో నీనా గుప్తా, గజరాజ్ రావు, సునీతా రాజ్వార్, మను రిషి చద్దా, మాన్వీ గగ్రూ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైన తొలినాడే రూ.9.55 కోట్ల కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. థియేటర్లలో దూకుడు ప్రదర్శించిన ఈ సినిమా ఆదివారం మూడున్నర కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లతో కలుపుకుని పదిరోజుల్లోనే రూ.50 కోట్ల మైలురాయిని అవలీలగా దాటేసింది. కాగా దీని వసూళ్ల పర్వానికి ఫిబ్రవరి 28న విడుదలైన తాప్సీ ‘థప్పడ్’ చిత్రం అడ్డుకట్ట వేసింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రశంసలు కురిపిస్తుంటే మరో వర్గం మాత్రం విమర్శలు గుప్పిస్తోంది.(థప్పడ్ మూవీ రివ్యూ) ఆయుష్మాన్ ఖురానా సినిమాపై ట్రంప్ ట్వీట్ -
ఆయుష్మాన్ ఖురానా మూవీపై ట్రంప్ ట్వీట్!
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజా చిత్రం ‘శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గే హక్కుల కార్యకర్త పీటర్ టాచెల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘గ్రేట్’ అని పేర్కొన్నారు. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్.. అంధాదున్, బదాయి హో వంటి సినిమాలతో హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న ఈ హీరో.. శుక్రవారం ‘శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హితేశ్ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమాలో అతడు ‘గే’గా నటించాడు. ఇద్దరు అబ్బాయిలు కార్తీక్ సింగ్(ఆయుష్మాన్ ఖురానా), అమన్ త్రిపాఠి(జితేంద్ర కుమార్)ల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశాన్ని కూడా జోడించారు. ఇక ఈ మూవీపై స్పందించిన పీటర్ టాచెల్.. ‘‘ బాలీవుడ్ కొత్త సినిమా. పెద్దల మనసు గెలవడానికి ఓ జంట చేసే ప్రయత్నం. స్వలింగ సంపర్కం అనేది నేరం కాదని నిరూపించేందుకు చేసే ప్రయత్నం. హుర్రే’’ అని ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ట్రంప్... గ్రేట్ అంటూ కామెంట్ చేశారు. కాగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో పాటు ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్, సలహాదారులు ఇవాంకా ట్రంప్, జారేద్ కుష్నర్ సహా ఇతర అధికారులు భారత పర్యటనకు రానున్నారు. Great! https://t.co/eDf8ltInmH — Donald J. Trump (@realDonaldTrump) February 21, 2020 -
గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా!
మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నటి లిసా రే స్పందించారు. స్వామి నారాయణ్ భుజ్ మందిర్‌కు చెందిన కృష్ణస్వరూప్ దాస్జీ.. నెలసరి సమయంలో భర్తలకు వండిపెట్టిన స్త్రీలు వచ్చే జన్మలో కుక్కలై పుడతారని, ఆ వంట తిన్న భర్తలు ఎద్దులై పుడతారంటూ వ్యాఖ్యానించిన వీడియోలు తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి లిసా రే ఓ కుక్క ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘దీని పేరు జిన్ని.. తను గత జన్మలో తను ఓ మహిళ. నెలసరి సమయంలో భర్తకు వండిపెట్టింది. అంతేగాక ఓసారి తన భర్తను కూడా వండి తినేసింది. అందుకే ఈ జన్మలో ఇలా కుక్కలా పుట్టి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక స్త్రీలంతా జిన్నిలా చేసి జీవితాన్ని ఆనందంగా గడపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్‌కు కొంత మంది బాలీవుడ్ నటులు ఫన్నీ మీమ్స్‌తో సమాధానం ఇస్తున్నారు. ఈ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’) This is Ginni. She was a woman in her past life. Ginni used to cook for her husband while she was menstruating. Once she cooked her husband and ate him as well. Now Ginni is born as Kutri and enjoying her life at fullest. Be like Ginni. Via Mamta Jaswal pic.twitter.com/pvtemTl5tQ — Lisa Ray (@Lisaraniray) February 21, 2020 అలాగే హీరో ఆయుష్మాన్ ఖురానా ‘అవునా.. తనని అనుకరించే ముందు ప్రజలు కూడా ఎవరిని అనుకరిస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. అంతేకాదు ప్రస్తుతం మనం అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఉన్నాం. కాలానుగుణంగా మన ఆలోచనలు మారాలి. అయితే ఈ సమాజంలో రెండు రకాలుగా ఆలోచించే మనుషులు ఉన్నారు. కొంతమంది మారుతున్న కాలానుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటుంటే.. మరికొందరు పాత పద్దతులనే ఆచరిస్తూ.. అవే సరైనవని బలంగా నమ్ముతారు. ఏదేమైనా ప్రజలు ప్రస్తుత సమాజాన్ని, మారుతున్న కాలాన్ని బట్టి నడుచుకోవాలన్న విషయాన్ని తప్పక అంగీకరించాల్సిందే’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని తన అనుయాయులకు చెప్పిన వీడియోలు బయటకు రావడంతో ఆయనపై ప్రగతిశీల వాదులు మండిపడుతున్నారు. -
తొలితాప్సీ అనొచ్చు కదా
ఏదైనా రంగంలో రాణించినప్పుడు అందులో బాగా రాణిస్తున్నవారితో పోలుస్తుంటారు. తాప్సీ మాత్రం పోలిక ఎందుకు? అంటున్నారు. ఎవరితోనో పోల్చకుండా వాళ్ల గుర్తింపు వాళ్లకే ఇవ్వొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారామె. ప్రస్తుతం బాలీవుడ్లో తాప్సీ విభిన్నమైన స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ అవార్డు వేడుకలో ‘సాంద్కీ ఆంఖ్’ సినిమాకు అవార్డు గెలుచుకున్నారామె. ఈ సందర్భంగా తాప్సీని అభినందిస్తూ ‘బాలీవుడ్ ఫీమేల్ ఆయుష్మాన్ ఖురానా’ అని ట్వీటర్లో సంబోధించారు. ‘‘అలా అనేకంటే బాలీవుడ్ తొలి తాప్సీ అని పిలవొచ్చు కదా?’’ అని రిప్లై ఇచ్చారు తాప్సీ. ఆ సమాధానానికి సోషల్ మీడి యాలో ప్రశంసలు అందుకుంటున్నారామె. -
‘నలుగురు అబ్బాయిలను ముద్దు పెట్టుకున్నా’
కొత్త కథలతో ముందుకు వచ్చే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాద సావధాన్’. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ అన్నకాన్సెప్ట్తో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పెళ్లి మండపంలో హీరో సహనటుడు జితేంద్ర కుమార్‌ను అందరి ముందే ముద్దాడటం వంటి సీన్లు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఆన్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ వారి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు ఖురానా, జితేంద్ర.(‘గే’ పాత్రలో కనిపించనున్న స్టార్ హీరో!) ఆయుష్మాన్ మాట్లాడుతూ.. ట్రూత్ అండ్ డేర్ ఆట ఆడుతున్న సమయంలో అబ్బాయిని కిస్ చేయాలని టాస్క్ ఇచ్చారన్నాడు. దీంతో ధైర్యంగా ముందుకు వచ్చి తోటివాడిని ముద్దుపెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సహనటుడు జితేంద్ర మాట్లాడుతూ.. కాలేజీలో ర్యాగింగ్ ద్వారా తనకు చేదు అనుభవం జరిగిందన్నాడు. ‘ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఓరోజు నన్ను పిలిచి నలుగురు అబ్బాయిలకు ముద్దు పెట్టాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడంటే ర్యాగింగ్‌పై నిషేధం ఉంది కానీ ఆ సమయంలో ర్యాగింగ్ రక్కసి రాజ్యమేలుతోందని, దీంతో వాళ్లు చెప్పింది చేయక తప్పలేద’ని వాపోయాడు. కాగా కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు) -
నువ్వు గే అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు?
కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్’ పేరుతో హితేశ్ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమాలో గేగా కనిపించనున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కార్తీక్ సింగ్(ఆయుష్మాన్ ఖురానా), అమన్ త్రిపాఠి(జితేంద్ర కుమార్)ల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉందని పేర్కొంది. (మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్) ఇక.. నువ్వు గే అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు అని హీరోను తండ్రి ప్రశ్నించడం, కార్తీక్, అమన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా తరహా ట్రైన్సీన్లు.. అమ్మాయితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని అమన్.. కార్తీక్ కోసం పరిగెత్తుకు రావడం వంటి సీన్లతో ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్.. గతేడాది అంధాదున్, బదాయి హో వంటి సినిమాలతో హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక రెండేళ్ల క్రితం శుభ్‌మంగళ్ సావధాన్ సినిమాలో.. లైంగికపరమైన సమస్యలతో బాధపడే యువకుడిగా నటించిన ఈ హీరో.. ఈసారి అదే తరహా టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో గేగా నటించడం విశేషం. -
మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్
రియాలిటీ షోలతో, రేడియో జాకీగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ‘విక్కీ డోనర్’ నుంచి తాజాగా విడుదలైన బాలా మూవీ వరకు సమకాలీన సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సాగే కథలు ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరొందాడు. గతేడాది బదాయీ హో, అంధాధున్లతో హిట్లు ఖాతాలో వేసుకున్న ఆయుష్మాన్.. తాజాగా బాలాతో 100 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మూవీ యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో బాలా సినిమాలో అతడికి జోడీగా కనిపించిన భూమీ ఫడ్నేకర్ ఆయుష్మాన్‌తో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో భూమి మాట్లాడుతూ.. ‘ తెరపై మా జంట చూడముచ్చటగా ఉంటుందని ఎంతో మంది కితాబిచ్చారు. మా మధ్య మంచి కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అందుకేనేమో మూడు సినిమాల్లో జంటగా కనిపించినా ఇప్పటికీ మాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. తనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో భాగం కావడం మరో విశేషం. వీటి ద్వారా ఎంతోమంది ఎదుర్కొనే సమస్యలను వినోదం కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాం’ అని పేర్కొన్నారు. కాగా భూమి ఫడ్నేకర్ తొలి సినిమా దమ్ లగా కే హైసాలో ఆయుష్మాన్ హీరో అన్న సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శుభ్ మంగళ్ సావధాన్(పురుషుల్లో సంతానలేమి ఇతివృత్తంగా), బాలా (బట్టతల కారణంగా యువకుడు పడే ఆవేదన ప్రధానాంశంగా) సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
రీమేక్‌కి రెడీ
బాలీవుడ్లో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘అంధాధూన్’. ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. తాజాగా ఈ రీమేక్‌ను సుధీర్ వర్మ హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒరిజినల్లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి. -
రూ. 50 కోట్ల క్లబ్లో చేరిన ‘బాలా’
ముంబై: వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. తాజాగా రూ. 50 కోట్ల చేరిపోయింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. వరుసగా నాలుగో రోజుకూడా బాక్సాఫీస్ వద్ద 8 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరిందని ప్రముఖ బాలీవుడ్ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. #Bala crosses ₹ 50 cr... Remarkable hold on Day 4... Trends better than Ayushmann’s last hit #DreamGirl [Day 4: ₹ 7.43 cr]... Holiday on Day 5 [#GuruNanakJayanti] should only boost biz... Fri 10.15 cr, Sat 15.73 cr, Sun 18.07 cr, Mon 8.26 cr. Total: ₹ 52.21 cr. #India biz. — taran adarsh (@taran_adarsh) November 12, 2019 అదే విధంగా ‘బాలా’ మూవీ సౌదీ అరేబియాలో సెన్సార్ పూర్తి చేసుకుందని.. నవంబర్ 14న ఈ చిత్రం సౌదీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కాగా సౌదీలో రిలీజ్ ఆయ్యే అయూష్మాన్ ఖురానా మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా, భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. #Bala clears Saudi Arabia censor... First movie of Ayushmann Khurrana to release in #SaudiArabia on 14 Nov 2019. pic.twitter.com/S6m2D7Yun5 — taran adarsh (@taran_adarsh) November 11, 2019 -
బాక్సాఫీస్ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్
వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బాలా’. భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 7న బాలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి మార్కులే పడ్డాయి. -
బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?
అయుష్మాన్ ఖురానా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ బాలీవుడ్లో గొప్ప పేరు తెచ్చుకున్న క్రేజీ హీరో. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో అమ్మాయి గెటప్‌తో అలరించిన ఆయుష్మాన్.. ఇప్పుడు బట్టతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో సరదాగా చెప్పడానికి ‘బాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో హీరో చూడడానికి బాగానే ఉంటాడు కానీ బట్టతల ఉంటుంది. దీంతో అతన్ని చూసి అంతా నవ్వుతుంటారు. టోపీ పెట్టుకొని తన బట్టతలను కవర్ చేస్తుంటాడు. అయినప్పటికీ అందరి ముందు నవ్వులపాలవుతుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్లో దొరికే ప్రతి ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగడు. ఇంకా ఊడిపోతూనే ఉంటుంది. చివరకు ఆవు పేడను కూడా తలకు రాసుకుంటాడు. అయినా ఎలాంటి పెరుగుదల ఉండదు. దాంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు. అయితే తలలో జుట్టు ఇంజెక్ట్ చేయడానికి అతని శరీరంలో ఎక్కడా అంత జుట్టు లేదని, దాంతో పర్సనల్ పార్ట్స్‌లో వచ్చే వెంట్రుకలతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని డాక్టర్స్ అంటారు. దాంతో ఆయుష్మాన్ భయంతో పారిపోతాడు. ఇందులో యామి గౌతమ్, భూమి పెడ్నేకర్ కథానాయికలుగా నటించారు. హీరో యామిని ఇష్టపడతాడు. ఆమె ముందు విగ్గు పెట్టుకొని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి బట్టతల ఉందన్న విషయాన్ని యామికి తెలిస్తే పరిస్థితేంటి? బట్టతల పోవడానికి అతను ఏన్ని పాట్లు పడ్డాడు? అన్నదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్ గర్ల్’
ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం బాలీవుడ్లో ప్రమోగాత్మక చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘అంధాథూన్’, ‘బదాయి హో’ వంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత హీరోలలో డిఫరెంట్ సినిమాలు చేసే స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత ఆయుష్మాన్ పేరే వినపడుతోంది. తాజాగా ఈ హీరో డిఫరెంట్ రోల్లో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లను వసూలు చేసింది. ఇంత భారీ వసూళ్లు రాబట్టడంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే ఆయుష్మాన్ ఖురానా కరమ్‌గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇందులో కరమ్ స్థానికంగా జరిగే చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు చేస్తుంటాడు. దీంతో అమ్మాయి గొంతుతో ఫేమస్ అయిన కరమ్‌కు ఫ్రెండ్షిప్ అనే కాల్ సెంటర్లో జాబ్ వస్తుంది. కరమ్ పేరు కాస్త పూజాగా మార్చుకుంటాడు. లోన్లీగా ఫీలయి కాల్ సెంటర్‌కు ఫోనే చేసే అమ్మాయి, అబ్యాలతో గొంతు మార్చి సరదాగా మాట్లాడుతూ వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతాడు. -
శుభాకాంక్షలు చెబుతారా?
గత ఏడాది హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బదాయి హో’. అంటే... శుభాకాంక్షలు అని అర్థం. కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిన చిత్రం ఇది. రెండొందల కోట్ల వసూళ్లు సాధించింది. అంతే... ఆయుష్మాన్‌కు బాలీవుడ్ అంతా బదాయిహో చెప్పింది. ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. తమిళంలో ఆయుష్మాన్ పాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించినట్టు సమాచారం. ధనుష్ కూడా సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం ధనుష్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ సినిమా మొదలుపెట్టనున్నారని టాక్. -
మూడు రోజుల్లో రూ.44.57 కోట్ల కలెక్షన్స్
బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి క్రేజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత భిన్నమైన సినిమాలు ఎంచుకోనే నటుడిగా పేరు తేచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లను సాధించి మరోసారి ఈ నటుడికి భారీ ఓపెనింగ్‌ను తెచ్చిపెట్టింది. రాజ్ శాండిల్య తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే రూ. 10.05 కోట్లు కలేక్ట్ చేయగా.. శనివారం నాటికి(రెండవ రోజు)16.42 కోట్లు వసూళ్లు చేసింది. అలాగే విడుదలైన మొదటి ఆదివారం నాటికి బాక్సాఫీస్ వద్ద రూ. 18.1 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా మూడు రోజులకు కలిపి రూ. 44.57 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కాగా పూర్తి వినోదాత్మక నేపథ్యంతో తెరకెక్కించిన డ్రీమ్ గర్ల్‌లో ఆయుష్మాన్ ఖురానా పరమ్ పాత్ర పోషించాడు. నిరుద్యోగి అయిన పరమ్ డబ్బుల కోసం చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా జీవితం సాగిస్తున్న పరమ్‌కు ‘ఫ్రెండ్షిప్’ అనే కాల్ సెంటర్లో ఉద్యోగం వస్తుంది. అందులో లేడి గోంతుతో మాట్లాడుతూ.. అబ్బాయి, అమ్మాయిలతో స్నేహం చేయాలి, దీంతో పరమ్ కాస్తా పూజాగా మారతాడు. నాన్ స్టాప్ పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా, విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రావడంతో విమర్శకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది. -
మరో ప్రయోగం
గత ఏడాది ‘అంధాథూన్’, ‘బదాయి హో’ వంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి బాలీవుడ్లో క్రేజీ హీరోగా మారారు ఆయుష్మాన్ ఖురానా. తాజాగా స్వలింగ సంపర్కం అంశంతో కూడిన సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాతో హితేష్ కేవల్యాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నీనా గుప్తా, గిరి రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ‘ఆర్టికల్ 15’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయుష్మాన్ ‘డ్రీమ్‌గాళ్, బాల, గులాబో సీతాబో’ వంటి చిత్రాల్లో నటించారు. ‘బాల’ నవంబర్‌లో, ‘గులాబో’.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నాయి. -
మరో రీమేక్?
తమిళంలో అజిత్ మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో. అలాంటి హీరో మాస్ ఎలిమెంట్స్ లేని ‘పింక్’ చిత్రం రీమేక్‌లో నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేకై మంచి విజయం సాధించింది. బోనీ కపూర్ నిర్మించారు. ప్రస్తుతం అజిత్ చేస్తున్న 60వ చిత్రాన్ని కూడా బోనీయే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అనుభవ్ సిన్హా రూపొందించిన చిత్రం‘ఆర్టికల్ 15’. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో అజిత్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అజిత్ 59వ సినిమాను నిర్మించి, 60వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించిన బోనీ కపూరే ఈ ‘ఆర్టికల్ 15’ తమిళ రైట్స్ కూడా కొనుగోలు చేశారట. అంటే.. అజిత్‌తో మూడు సినిమాల డీల్‌ని బోనీ కుదుర్చుకుని ఉంటారనుకోవచ్చు. -
మళ్లీ సినిమా చేస్తాం
దర్శకుడు శ్రీరామ్ రాఘవన్, హీరో ఆయుష్మాన్ ఖురానా కాంబినేషన్లో వచ్చిన అంధాధూన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆయుష్మాన్‌కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులు కూడా పొందింది ఈ సినిమా. శ్రీరామ్, ఆయుష్మాన్ కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రానుందట. దానికి సంబంధించిన కథ కూడా తయారు చేశారట శ్రీరామ్ రాఘవన్. ‘స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరపడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు ఆయుష్మాన్. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాక మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది’ అని పేర్కొన్నారు శ్రీరామ్ రాఘవన్. -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
తమ్ముడిలా ఉన్నాడు; హీరో భార్య కౌంటర్!
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత భావాలను స్వేచ్ఛగా పంచుకోవడంతో పాటుగా ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలను అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలను కించపరిచేలా కామెంట్లు చేస్తున్న ఆకతాయిల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో దర్శకురాలు, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ లుక్‌ను విమర్శిస్తూ కొంతమంది ట్రోలింగ్‌కు దిగారు. ఇంతకీ విషయమేమిటంటే... భర్త ఆయుష్మాన్‌తో కలిసి దిగిన ఫొటోలను తహీరా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొంతమంది.. ‘అతడు మీకు భర్తలా కాదు.. తమ్ముడిలా ఉన్నాడు. అసలు మీరు ఎలా ఉన్నారో చూసుకున్నారా. మీరు ఆడో.. మగా అనే విషయం అర్థంకావడం లేదు’ అంటూ విపరీతపు కామెంట్లు చేశారు. ఇందుకు హుందాగా స్పందించిన తహీరా..‘ ఇలాంటి భాయీ భాయీ జోకులు వినీ వినీ.. ఆయుష్మాన్ కలిసిన ప్రతీసారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాట వినిపిస్తోంది. అదేంటో తెలుసా.. తూ మేరా.. తూ మేరా భాయీ నహీ హై! ‘కొంతమంది’ ఏదో అన్నారని వారిని ప్రశ్నించడం లేదు.. ఇదొక స్టేట్మెంట్ మాత్రమే. ఆర్టికల్ 15 సినిమా చూడటానికి నేను మార్స్ నుంచి వచ్చా ను. ఈ సినిమా నాకెంతో నచ్చింది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. కేవలం లుక్ కారణంగా.. మా మధ్య ఉన్న బంధం మీరనుకున్నట్లుగా మారిపోదు కదా అని ఘాటుగా స్పందించారు. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తహీరా.. ప్రస్తుతం కీమో థెరఫీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతటి అనారోగ్యంలో కూడా తన కుటుంబం, కెరీర్ పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన ఆయుష్మాన్ సినిమా ‘ఆర్టికల్ 15’ విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Jeez 🙄 itne bhai bhai jokes sun liye ke Ab jab bhi main @ayushmannk ko milti Hun background main ek hi gaana Chal raha hota hai “tu mera, tu mera , tu mera bhai nai hai!” And unlike the fukre boys song I am not questioning! It’s a goddamn statement! P.s ( case in point , look at our hair partition , haina opposite? Phirrrr!) Just incase you get over the bhai bhai thing and see how much effort I took to land from mars for the #article15 screening and I so love it!! 👚 @sabinahalder in @pausefashion.in @alexanderwangny 💄 @hinaldattani 💇♀️ @artistpoonamsolanki #notabhaibhai #trollsrehnedo #girlswithshorthair #adidas A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 26, 2019 at 11:04pm PDT -
అది బ్రాహ్మణ వ్యతిరేక సినిమా.. ఆపేయండి!
ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుభవ్ సిన్హా.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నిర్మించిన ‘ఆర్టికల్–15’ మూవీపై వివాదం రేగుతోంది. ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించవద్దని, ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని బ్రాహ్మణ సంఘలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ సంఘాలు ఆదివారం ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పలు థియేటర్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సినిమా ప్రదర్శనను వెంటనే ఆపాలంటూ చిత్రయూనిట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినిమాలో బ్రాహ్మణ కులాన్ని కిరాతకంగా చూపించారని, దళితుల పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపినట్లు ఈ సినిమాను తెరకెక్కించారని, ఇది సరికాదని అఖిల భారత బ్రాహ్మణ ఏక్తా పరిషత్ జనరల్ సెక్రటరీ హరి త్రిపాఠీ ఆరోపించారు. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనకు ఇబ్బంది కలుగకుండా ప్రతి థియేటర్‌కు భద్రత కల్పిస్తామని, థియేటర్‌కు ఒక పోలీసు చొప్పున కేటాయిస్తామని స్థానిక పోలీసు అధికారి మనోజ్ గుప్తా తెలిపారు. ఈ సినిమా ప్రదర్శనను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు ఉన్నతాధికారి అనంత్ డియో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకొని మరణించిన యథార్థ సంఘటన ఆధారంగా.. దళితులపై సమాజంలో నెలకొన్న వివక్ష నేపథ్యంతో ‘ఆర్టికల్–15’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని చనిపోగా మరో సోదరి అదృశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించారు. -
నాడు ‘ఆక్రోష్–నేడు ‘ఆర్టికల్–15’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఏ పౌరుడి పట్ల కూడా జాతి, మత, కుల, లింగం, ప్రాంతంపరంగా విపక్ష చూపించకూడదంటూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్–15’ సూచిస్తోంది. అయినప్పటికీ ఇప్పటికీ దేశంలో ఈ పలు రకాల వివక్షలు, వాటి పేరిట దారుణాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి వివక్ష కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని బదాన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్లుకు ఉరిపోసుకొని మరణించిన యదార్థ సంఘటనను ప్రేరణగా తీసుకొని అనుభవ్ సిన్హా బాలీవుడ్లో ‘ఆర్టికల్–15’ టైటిల్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకుని చనిపోగా మరో సోదరి అదశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం జూన్ 28వ తేదీన విడుదలవుతోంది. ‘ఇస్లామోఫోబియా (ఇస్లాం మతస్థులంటే భయం)’ను ఇతివృత్తంగా తీసుకుని అనుభవ్ సిన్హా ఇంతకుముందు తీసిన ‘ముల్క్’ (2018) చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెల్సిందే. వివక్షతో దళితులపై సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి పలువురు దర్శకులు తమదైన శైలిలో చిత్రాలను తీసారు. వాటిలో మరీ వాస్తవానికి దగ్గరగా కనిపించే చిత్రం 1980లో గోవింద్ నిహ్లాని దర్శకత్వం వహించిన ‘ఆక్రోష్’. ఈ చిత్రం కూడా యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్నదే. పత్రికల్లో వచ్చిన ఓ సంఘటన ఆధారంగా విజయ్ టెండూల్కర్ ఓ నాటకం రాయగా, దాన్ని గోవింద్ నిహ్లాని తెరకెక్కించారు. శ్యామ్ బెనగళ్ దగ్గర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన గోవింద్ నిహ్లానికి దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం ఇదే. అమ్రేషిపురి, ఓంపురి, నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ నటించిన ఆక్రోష్ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. సినిమాలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ముఖకవళికతో ప్రేక్షకులను మెప్పించిన ‘ఉత్తమ’ నటుడు ఓంపురి. గుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటే వాటి మంటలు ముఖం మీద ప్రతిఫలించినట్లుగా కోపోద్రిక్తుడుగా అందులో ఓంపురి కనిపిస్తాడు. తాడిత పీడిత జనం మీద తీసిన గతకాలపు సినిమాలు.. పీడితులు తిరుగుబాటు చేసినట్టో, దారుణాలకు తెగబడ్డట్లో చూపుతూ ముగింపు ఇచ్చారు. కానీ ఆక్రోష్లో ఊహించని షాకింగ్ ముగింపు ఉంటుంది. భార్య ఆత్మహత్యకు కారకుడన్న కేసులో నిందితుడైన దళితుడు లాహన్య బీకు (ఓంపురి) తన తండ్రి అంత్యక్రియలకు పోలీసుల కాపలా మధ్య హాజరవుతాడు. అక్కడ తన భార్య ఆత్మహత్యకు కారణమైన అగ్రవర్ణ కామాంధుడు తన చెల్లిలిని కూడా కామం కళ్లతో చూస్తున్నాడని గ్రహించిన ఓంపురి.. అక్కడ ఉన్న గొడ్డలిని తీసుకొని చెల్లిని నరికేస్తాడు. అణచివేతకు గురవుతున్న ఓ దళితుడి కోపం శత్రువుపై కాకుండా తన అశక్త బతుకులపైనే ఉంటుందన్న కోణంలో గోవింద్ నిహ్లాని క్లైమాక్స్‌ను తీశారు. ఆక్రోష్ అంటే ఇక్కడ 1980లో వచ్చిన ‘ఆక్రోష్’నే పరిగణించాలి. 2010లో ప్రియదర్శన్ తీసిన మరో ఆక్రోష్ వచ్చింది. అజయ్ దేవగన్, అక్షయ్ఖన్నా నటించిన ఆ చిత్రాన్ని 1998లో విడుదలైన ‘మిసిసిపీ బర్నింగ్’ స్ఫూర్తితో తీశారు. నిజాయితీకి దగ్గరగా తీసిన ‘ఆర్టికల్–15’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉన్నట్లు ‘ట్రేలర్’ను చూస్తే అర్థం అవుతుంది. -
కోపిష్టి యజమాని
ఇక్కడున్న ఫొటో చూశారుగా. ఫొటోలో ఉన్నది బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌బచ్చన్ అంటే ఆశ్చర్యపోరుగా. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రధారులుగా ‘గులాబో సీతాబో’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని అమితాబ్ బచ్చన్ లుక్ బయటికొచ్చింది. లక్నో నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమాలో కోపిష్టి యజమాని పాత్రలో నటిస్తున్నారట అమితాబ్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. 2015లో వచ్చిన ‘పీకు’ సినిమా కోసం అమితాబ్, సుజీత్ సర్కార్ కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇదే. -
నన్ను క్షమించండి : హీరో భార్య
‘ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉండాలని ఏనాడు అనుకోలేదు. నాకు తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ప్రతీ ఒక్కరి హృదయం ప్రేమ, శాంతి భావనలతో నిండిపోవాలి అంటూ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య, ఫిల్మ్‌మేకర్ తహీరా కశ్యప్ నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. బుద్ధుడిని అగౌరవ పరిచే రీతిలో ఉన్న తన ఫొటోను ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తహీరా.. ప్రస్తుతం కీమో థెరఫీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతటి అనారోగ్యంలో కూడా తన కుటుంబం, కెరీర్ పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తూ తన పిల్లలు, స్నేహితురాలితో పుణె ట్రిప్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా.. బుద్ధుడి విగ్రహంపై కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. వీటిని సోషల్‌మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తన ఫొటోలను డెలీట్ చేసిన తహీరా.. క్షమాపణలు కోరారు. అదేవిధంగా తన పిల్లలు, స్నేహితురాలితో కలిసి ప్రకృతి ఒడిలో సేద తీరానంటూ ట్రిప్ తాలూకు అనుభవాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కాగా 2011లో తన స్నేహితుడు ఆయుష్మాన్ ఖురానాను పెళ్లాడిన తహీరాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇక రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూకుడు మీద ఉన్నాడు. View this post on Instagram I absolutely never want to be a source of hurt and pain for anyone. Sorry for unintentionally agonising few people, wish love and peace for everyone ❤️ Was the most beautiful, relaxing experience at @atmantan Was in sync with nature and it’s blessings! From chilling in night suits, to collecting jamuns and eating them, it was a lovely experience. Also do see the lovely business plan my son has. (He is very concerned about his parents careers) The highlight was the lovely, experienced and courteous staff, the company of my best friend @komal20to77 and her kids and the lovely moments that I shall treasure and have shared here without any filter! #beingtransformed #familywellnesscamp2019 #atmantan #nofilter A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 18, 2019 at 9:46am PDT -
సూపర్ హిట్ రీమేక్‌లో సునీల్!
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌లో.. హీరోగా మారి సక్సెస్ కాలేక తిరిగి కమెడియన్‌గా నటిస్తున్న సునీల్ లీడ్ రోల్లో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. హిందీలో హీరోది అంధుడి పాత్ర, మరి సునీల్ ఆ పాత్రకు ఎంత వరకు సూట్ అవుతాడు అన్నది చూడాలి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తమిళ రీమేక్‌లో నటించేందుకు ధనుష్, సిద్ధార్థ్ లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
చూపు లేని పాత్రపై కన్ను
2018లో బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘అంధాధూన్’ చిత్రం ఒకటి. ఆయుష్మాన్ ఖురానా అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపించారు. ఇక్కడే కాదు, చైనాలోనూ ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసే ఆలోచన ఉందని ధనుష్ పేర్కొన్నారు. ‘‘2009 నుంచి రీమేక్ సినిమాల్లో నటించడం తగ్గించాను. కానీ ‘అంధాదూన్’ చాలా అద్భుతమైన సినిమా. ఆల్రెడీ ఈ రీమేక్ రైట్స్ తీసుకునే ప్రయత్నాల్లో మా టీమ్ ఉంది. ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్స్‌ను తమిళ ప్రేక్షకులకు తప్పకుండా చూపించాలనే ఉద్దేశంతోనే రీమేక్ చేయాలనుకున్నాను’’ అని పేర్కొన్నారు. హిందీ సినిమా చూసినవాళ్లకు ఇందులో హీరో చూపు లేనివాడు అనే విషయం తెలిసే ఉంటుంది. ధనుశ్లో మంచి నటుడు ఉన్నాడు. ఈ పాత్రను అద్భుతంగా చేయగలరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
గే లవ్‌స్టొరీ
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఎంపిక చేసుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. విచిత్రంగానూ ఉంటాయి. ‘విక్కీ డోనర్’లో వీర్యం దానం చేశారు. ‘అంధాధూన్’లో గుడ్డి పియానో ప్లేయర్‌గా అందర్నీ మోసం చేశారు. తాజాగా మరో ఆసక్తికర కథను ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్‌తో రొమాన్స్ చేయకుండా మరో అబ్బాయితో రొమాన్స్ చేస్తారట. ఇదో గే లవ్‌స్టోరీ అని సమాచారం. ఆయుష్మాన్ సూపర్ హిట్ చిత్రం ‘శుభమంగళ్ సావధాన్’కి సీక్వెల్‌గా ‘శుభమంగళ్ జ్యాదా సావధాన్’ ప్రకటించారు. మొదటి భాగంలో శృంగార సమస్యలను చాలా సరదాగా చూపించారు. కొత్త సినిమాలో హోమోసెక్సువాలిటీను (స్వలింగ సంపర్కం) డిస్కస్ చేయబోతున్నారట. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని హితేశ్ కేవాల్య దర్శకత్వం వహిస్తారు. -
స్త్రీ పురుషుడు
కమలహాసన్ గతంలో ‘భామనే సత్యభామనే’ సినిమాలో బామ్మగా నటించడం గుర్తుండే ఉంటుంది. హిందీలో మళ్లీ అలాంటి ఛాయలున్న పాత్రనే ఆయుష్మాన్ ఖురానా చేస్తున్నాడు. ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ సినిమాలతో బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న నటుడుగా పేరు పడ్డ ఆయుష్మాన్ ఖురానా తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే హాస్య చిత్రానికి పని చేస్తున్నాడు. హిందీ టెలివిజన్‌లో ‘కామెడీ సర్కస్’, ‘కపిల్ శర్మ షో’ వంటి షోలకు వందలాది ఎపిసోడ్స్ రాసిన రాజ్ శాండిల్య తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఆయా పరిస్థితులను బట్టి రామాయణంలో సీతలాగా, భారతంలో ద్రౌపదిలాగా, కృష్ణలీలలో రాధలాగా వ్యవహరిస్తాడట. అంటే ఈ పురుషుడు మూడు స్త్రీ పాత్రలను అనుసరించనున్నాడన్న మాట. ఉత్తర ప్రదేశ్‌లోని చిన్న టౌన్లో జరిగే ఈ కథకు అనుగుణంగా హిందీ, హరియాణా యాసలను నేర్చుకునే పనిలో ఉన్నాడట ఆయుష్మాన్ ఖురానా. కొత్త టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి అవకాశం ఇచ్చే ఏక్తా కపూర్ ఈ సినిమాకు ఒక నిర్మాత. సినిమాలో ఈ ‘హీరో–యిన్’కు హీరోయిన్ ఉంది. నుస్రత్ బరూచా ఆ బాధ్యత నిర్వర్తించనుంది. -
ఆమిర్ తర్వాత ఆయుష్!
‘పియానో ప్లేయర్’గా ఆయుష్మాన్ ఖురానా వాయించిన రాగానికి చైనీస్ సినీ జనం ఫిదా అయిపోయారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. కథలో కంటెంట్ ఉంటే స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేదని నిరూపించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్’. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాను ‘పియానో ప్లేయర్’ టైటిల్‌తో చైనాలో రిలీజ్ చేశారు చిత్రబృందం. అక్కడ ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చైనాలో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన భారతీయ చిత్రాల్లో ‘అంథా ధూన్’ చిత్రానిది మూడో స్థానం కావడం విశేషం. బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ (2016), సీక్రెట్ సూపర్‌స్టార్ (2017) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ (2015), ఇర్ఫాన్ ఖాన్ ‘హిందీ మీడియం’ (2017) చిత్రాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇలా పెద్ద హీరోల లిస్ట్ ఉన్న చైనీస్ మూవీ మార్కెట్లోకి కుర్రహీరో ఆయుష్మాన్ ఖురానా చేరడం అభినందనీయం. -
చిన్న సినిమా చైనాలో దుమ్ముదులుపుతోంది
భారతీయ చిత్ర పరిశ్రమకు చైనా ఘన స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చైనాలో భారతీయ సినిమాలు తమ సత్తాను చాటాయి. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయీజాన్ లాంటి చిత్రాలు వందల కోట్లను కొల్లగొట్టాయి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు అక్కడ ఈజీగా వంద కోట్లను వసూలు చేయోచ్చు. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా సినిమాలు చైనాకు క్యూ కట్టాయి. అయితే ఇదే వరుసలో గతేడాది వచ్చిన అంధాదున్ చిత్రం బాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజై.. రికార్డుల మోత మోగించింది. ఇక్కడ సెన్సేషన్ సృష్టించడమే కాకుండా.. చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిని రేకేత్తించేలా ఉంటుంది. అంధుడిగా నటిస్తూ.. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి. -
సౌత్‌లో మరో బాలీవుడ్ సూపర్ హిట్
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన సినిమాలు ఉత్తరాదిలో.. అక్కడ సక్సెస్ అయిన సినిమాలు సౌత్‌లో రీమేక్ అవ్వటం తరుచూ జరుగుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్లు క్వీన్, పింక్ సినిమాలు సౌత్‌లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సూపర్ హిట్ సినిమా చేరింది. గత ఏడాది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘బదాయి హో’. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బదాయి హో ఘన విజయం సాధించటమే కాదు, 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కులు సొంత చేసుకున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దక్షిణాదిలో అన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అమిత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా దక్షిణాదిలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
‘హీరో భార్యగా ఎంతో వేదన అనుభవించా’
ఒక హీరో భార్యగా తాను ఎంతో మానసిక వేదన అనుభవించానంటున్నారు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్. భర్త చుట్టూ అందమైన అమ్మాయిలు ఉంటే ఎవరైనా తనలాగే అభద్రతా భావంతో కుంగిపోతారని.. అయితే ఈ భావాలన్నీ తన మానసిక అపరిపక్వత కారణంగా కలిగినవేనని వ్యాఖ్యానించారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన తహీరా త్వరలోనే ఓ ఫీచర్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త మొదటి సినిమా నాటి అనుభవాల గురించి ప్రస్తావించారు. ‘చండీగఢ్ నుంచి ఆయుష్మాన్‌తో కలిసి ముంబై వచ్చిన కొత్తలో ఫలానా రంగంలో స్థిరపడాలని నేనెప్పుడూ అనుకోలేదు. రేడియో, టీవీ, టీచింగ్, పీఆర్ ఈవెంట్స్ ఇలా అన్నీ చేసాను. కానీ నాకు ఎందులోనూ సంతోషం దొరకలేదు. అయితే మొదటిసారి గర్భవతిని అయిన సందర్భంలో నేను పుట్టింటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయుష్మాన్ విక్కీ డోనర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నాతో కాసేపు మాట్లాడేందుకు కూడా తనకి సమయం ఉండేది కాదు. ఒకానొక సమయంలో తనకు విడాకులు ఇవ్వాలని కూడా అనుకున్నాను. నిజంగా అప్పుడు చాలా వేదన అనుభవించా. అది మా ఇద్దరి జీవితాల్లో అన్నికంటే కఠినమైన దశ అది. నా చేయి పట్టుకుని భయపడాల్సిందేమీ లేదని తను చెప్పినా బాగుండు. కానీ అప్పటికి ఇద్దరం మానసికంగా ఎదగలేదు. అందుకే చిన్న చిన్న తగాదాలు. తనతో బంధం తెంచుకోవాలన్నంత కోపం. కానీ తన గురించి నాకు, నా గురించి తనకి పూర్తిగా తెలుసు.అందుకే ప్రస్తుతం ఇలా ఉన్నాం’ అంటూ క్యాన్సర్‌తో ధీరోచితంగా పోరాడుతున్న తహీరా చెప్పుకొచ్చారు. కాగా రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన అతడి సినిమాలు ‘అంధాధూన్, బదాయి హో’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇక... 2008లో తహీరాను పెళ్లి చేసుకున్న ఈ స్టార్‌కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
‘ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను’
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘ఇవాళ నా రోజు. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ముందు మనం ఈ వ్యాధిపై మనకున్న అపోహలను తొలగించుకోవాలి. అందుకే ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న ఈ కత్తిగాట్లు ఓ గౌరవ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను’ అంటూ తహీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను బాలీవుడ్ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా తెగ లైక్ చేస్తున్నారు. View this post on Instagram Today is my day! Wish you all a happy #worldcancerday and hope each one of us celebrates this day in an embracing way. That we remove any stigma or taboo associated with it. That we spread awareness about it and that we have self love no matter what. I truly embrace all my scars as they are my badges of honour. There is nothing known as perfect. Happiness lies in truly accepting yourself. This was a tough one for me. But this picture was my decision as I want to celebrate not the disease but the spirit with which I endured. To quote my mentor, Diasaku Ikeda, “Leading an undefeated life is eternal victory. Not being defeated, never giving up, is actually a greater victory than winning, not being defeated means having the courage to rise to the challenge. However many times we’re knocked down, the important thing is we keep getting up and taking one step-even a half step- forward” #worldcancerday #breastcancerawareness #breastcancerwarrior #turningkarmaintomission #boddhisatva Thanks @atulkasbekar for this one❤️ A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Feb 3, 2019 at 11:32pm PST మీ మాటలు చాలా మందికి ధైర్యాన్ని ఇస్తాయంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. తహీరా కశ్యప్ తొలిదశ రొమ్ము క్యాన్సర్ (1A)తో బాధపడిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా చాలా సర్జరీలను కూడా చేయించుకున్నారు. ఈ విషయం గురించి తహీరా మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం చాలా కష్టం. ఇక్కడ పర్ఫేక్ట్గా ఏది ఉండదు. మనల్ని మనలా అంగీకరించడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ఈ ఫోటోను నేను పడిన బాధను తెలియజేసే చిహ్నంలా కాక క్యాన్సర్‌పై నా గెలుపుకు గుర్తుగా పోస్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
రీమేక్ ? చేయాలా? వద్దా?
2018 బాలీవుడ్లో మంచి హిట్ సాధించి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్’. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్‌హిట్ చిత్రం సౌత్‌లో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌ను సిద్ధార్థ్‌తో చేయాలనుకున్నారు దర్శక–నిర్మాతలు. బాల్ ఆయన కోర్ట్‌లో ఉంది. వెంటనే సిద్ధార్థ్ ‘‘అంథాధూన్’ లాంటì అద్భుతమైన చిత్రం రీమేక్‌లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్‌గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్లో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురాన కూడా ‘చెయ్ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్‌లో సిద్ధార్థ్ కనిపిస్తారో లేదో చూడాలి. -
ఆయుష్మాన్.. మరో కొత్త కథ
మేగజీన్ కవర్‌పేజీ మీద మోడల్స్ కూడా బయట సాధారణంగానే కనిపిస్తారు. కానీ యువత మాత్రం ఫెయిర్‌నెస్ ధ్యాసలో పడి వృథా ప్రయాసలు పడుతున్నారు. సమాజం కూడా అలానే ట్రీట్ చేస్తుంది. అబ్బాయిల విషయానికి వస్తే.. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకీ బ్యూటీ గురించిన బోధన అంటే.. ఆయుష్మాన్ ఖురానా కొత్త బాలీవుడ్ చిత్రం స్టోరీ లైన్ ఇది. ‘విక్కీ డోనర్’, ‘అంధాథూన్’ వంటి సరికొత్త స్క్రిప్ట్స్ ఎంచుకునే ఆయుష్మాన్ మరో డిఫరెంట్ క£ý కు సంతకం చేశారట.యవ్వనంలోనే బట్టతలతో బాధపడే హీరో, చామనఛాయ రంగులో ఉండి తెల్లతెల్లగా కనిపించాలని ఉవ్విళ్లూరే హీరోయిన్ మధ్య జరిగే కథ ఇది. అమర్ కౌషిక్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘బాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో ఆయుష్మాన్ సరసన భూమీ పెడ్నేకర్ నటించనున్నారు. ప్రస్తుతం ‘డ్రీమ్ గాళ్’ సినిమా చేస్తున్న ఆయుష్ వచ్చే ఏడాది ‘బాలా’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. -
‘డ్రీమ్ గర్ల్’గా యంగ్ హీరో
అంధాధున్, బదాయి హో సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డ్రీమ్ గర్ల్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో ఆయుష్మాన్ టైటిల్ రోల్లో కనిపించనున్నాడు. టైటిల్‌ను బట్టే తెలుస్తోంది ఈ యంగ్ హీరో మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని. రాజ్ శాండిల్య దర్శకత్వంలో ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. టీషర్ట్, చీర, చేతికి గాజులతో ఆయుష్మాన్ లుక్ వినోదాత్మకంగా ఉంది. నుస్రత్ బారుచా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. As whacky as it can get! Here's the first glimpse of my look in and as #DreamGirl. Thoughts?#DreamGirlFirstLook #DreamGirlFilmingBegins @ektaravikapoor @NushratBharucha @RuchikaaKapoor @writerraj @balajimotionpic pic.twitter.com/qyJib4U9Ao — Ayushmann Khurrana (@ayushmannk) 3 December 2018