employee
-
కానిస్టేబుల్ రూ.500 కోట్ల అక్రమాస్తులపై రాజకీయ దుమారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రవాణాశాఖ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఏకంగా రూ.500 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. బయటపడింది. గత నెలలో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఉన్న పాడుబడిన వాహనంలో ఏకంగా రూ.11 కోట్ల రూపాయల నగదు, 52 కిలోల బంగారం, ఒక డైరీ బయటపడింది. ఇంతేకాక శర్మ మొత్తంగా రూ.500 కోట్ల ఆస్తులు పోగేసినట్లు లోకాయుక్త పోలీసులు కనుగొన్నారు. శర్మ అవినీతి వ్యవహారం ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత జితూ పట్వారీ ఆరోపిస్తున్నారు. ఈ విషయం సౌరభ్‌శర్మ డైరీ చూస్తే తెలుస్తుందన్నారు. తనకు శర్మ డైరీలోని ఆరు పేజీలు మాత్రమే దొరికాయని పట్వారీ చెప్పారు. ఈ ఆరోపణలపై బీజేపీ ధీటుగా స్పందించింది. గతంలో అధికారంలో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా ఉండేదని కౌంటర్ ఇచ్చారు. అయితే కానిస్టేబుల్ సౌరభ్‌శర్మ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. -
‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’
గాంధీ నగర్ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వరచా మినీ బజార్లో అనభ్ జెమ్స్‌లో మయూర్ తారాపర (32) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్‌కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు. ఈ తరుణంలో మయూర్ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్‌లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు. దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కి కేసును బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం మయూర్ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్ చెప్పినట్లుగా వేదాంత రింగ్ రోడ్, స్నేహితుల ఇళ్లు, మయూర్ ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.తారామార పోలీసుల వివరాల మేరకు.. సింగన్పూర్లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్‌రోడ్డు సమీపంలో తన బైక్‌ను పార్క్ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్‌లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. -
ఉద్యోగులకు రూ.160 కోట్లు చెల్లించిన స్పైస్‌జెట్
ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 160.07 కోట్ల విలువైన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్లు స్పష్టం చేసింది. అనేక సంఘాలను ఎదుర్కొన్న తరువాత కంపెనీ రూ.3000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను ఉపయోగించి అన్ని రకాల పెండింగ్ బిల్లులకు సంస్థ క్లియర్ చేస్తోంది.చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా కంపెనీ చెల్లించడంతో.. సంస్థ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, కార్యకలాపాల నిర్వహణకు ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సందర్భంగా స్పైస్‌జెట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పిఎఫ్ బకాయిల క్లియరెన్స్‌ను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. స్పైస్‌జెట్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు.SpiceJet has settled pending employee provident fund dues of ₹160.07 crore accumulated over the past two years, along with other statutory liabilities such as TDS, GST, and employee salaries. This was made possible through internal cash flows and the ₹3,000 crore raised via a… pic.twitter.com/QFgbBXGmxZ— SpiceJet (@flyspicejet) December 13, 2024 -
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా ?
-
బాస్‌ను తిట్టడానికి.. ఓ కొత్త సర్వీస్
ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్‌కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్‌లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్‌కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్లో సంభాషణ చేస్తాడు.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..ఏజెంట్‌ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. -
'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్
ఒకప్పుడు ఉద్యోగులు సమయంతో పనిలేకుండానే ఆఫీసుకు ముందుగా వచ్చేసి.. పని పూర్తి చేసుకుని లేటుగా కూడా ఇంటికి వెళ్లేవారు. అయితే.. ఇప్పుడున్న ఉద్యోగులలో కొంతమంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసులో లేట్ అయితే.. రేపు డ్యూటీకి లేటుగా వస్తామంటూ బాస్‌కు మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక ఉద్యోగి.. హాయ్ సార్ & మేడమ్ నేను రేపు ఉదయం 11.30 గంటలకు ఆఫీసుకు వస్తాను. ఎందుకంటే నేను రాత్రి 8.30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరాను, అంటూ మెసేజ్ చేశారు.ఉద్యోగి పంపిన మెసేజ్‌ను 'ఆయుషి దోషి' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. నా జూనియర్ నాకు ఇలా మెసేజ్ చేశారు. ఇది నమ్మలేకపోతున్నాను, ఈ కాలం పిల్లలు వేరేలా ఉన్నారు. ఆఫీసు నుంచి లేటుగా వెళ్లాను, కాబట్టి లేటుగా ఆఫీసుకు వస్తాను. ఇది చూసి నాకు మాటలు రావడం లేదు అంటూ.. పేర్కొంది.సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే పనిని ఉద్యోగికి అప్పగించడం జరుగుతుంది. ఇచ్చిన పనిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలలోపు పూర్తి చేయాలి. కానీ.. పని చేయాల్సిన సమయంలో ఉద్యోగి ఫోన్‌పై ద్రుష్టి పెడుతూ పనిని ఆలస్యం చేస్తే.. ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమవుతుందని.. ఆయుషి దోషి మరో ట్వీట్లో వెల్లడించారు.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ మీద నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులను కంపెనీలు దోచుకుంటున్నాయని చెబుతుంటే.. మరికొందరు ఉద్యోగులకు సమయపాలన చాలా అవసరం అని పేర్కొంటున్నారు. ఇంకొందరు ఆ ఉద్యోగి కాన్ఫిడెంట్ నచ్చిందని చెబుతున్నారు.I can’t believe my junior sent me this. Today’s kids are something else. He stayed late, so now he’s going to show up late to the office to "make up" for it. What a move!🫡🫡 i am speechless mahn. pic.twitter.com/iNf629DLwq— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) November 12, 2024 -
విషాదం మిగిల్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం కేసు
సాక్షి, కృష్ణా జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమంత్ అదృశ్యం కేసు చివరికి విషాదాన్ని మిగిల్చింది. అవనిగడ్డ మండలం తుగలవానిపాలెంలో ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. స్నేహితుని వద్దకు వెళ్లి వస్తానని చెప్పి చల్లపల్లికి చెందిన బొడ్డు సుమంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లారు.అయితే, రెండు రోజుల క్రితం పులిగడ్డ-పెనుమూడి వారధి పై సుమంత్ బైక్, ఫోన్, పర్సు లభ్యమయ్యాయి. కృష్ణానదిలో దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమంత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఉద్యోగినికి మెసేజ్.. మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సమయం ఉదయం. ఇంటి నుంచి ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగినికి యాక్సిడెంట్ అయ్యింది. అనంతరం తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని.. రోడ్డు ప్రమాదంలో తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుపుతూ కారు ఫొటో తీసి తన మేనేజర్‌కి మెసేజ్ చేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్లోని సారాశం. ఇలాంటి సందర్భాలతో సాధారణంగా మేనేజర్లు ఎలాంటి సమాధానం ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంస్థ మేనేజర్ ఇచ్చిన రిప్లయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఉద్యోగి,మేనేజర్ సంబంధిత వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.కిరా అనే యూజర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఉద్యోగిని కారు ప్రమాదానికి గురైందని తన మేనేజర్‌కు మెసేజ్ చేసింది. తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదం ఫొటోల్ని జత చేసింది.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 అయితే అనూహ్యంగా కంపెనీ మేనేజర్ సదరు ఉద్యోగిని యోగక్షేమాలు అడగడానికి బదులు.. మీరు ఆఫీస్‌కు ఎప్పుడు వస్తారో సమాచారం ఇవ్వండి అంటూ బదులిచ్చారు. ఆ మేస్జ్కి ఉద్యోగిని రిప్లయి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన మేనేజర్ మరుసటి రోజు మరోసారి మెసేజ్ పంపాడు. అందులో మీరు నా మెసేజ్‌కు రిప్లయి ఎందుకు ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. కానీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణం మినహా ఇతర ఘటనలు జరిగి ఉంటే సంస్థ మీపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు సదరు మేనేజర్.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే మా మేనేజర్ వ్యవహరిస్తే..నేను వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. ఈ తరహా ఉన్న మేనేజర్లు మనల్ని బయపెడుతున్నారు. జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అని మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు. -
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
దయచూపని సీఈఓ.. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే..
అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగిని కంపెనీ బాస్ తొలగించడమే కాకుండా.. మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా వెల్లడించారు. నేను ఎనిమిది నెలలకు పైగా సంస్థలో పనిచేసాను. కంపెనీ నాకు అన్నీ ఇచ్చింది. అయితే క్రమంగా పని భారం పెరిగింది. ఒత్తిడి తీవ్రమైంది. ఒక నెల క్రితం ఫ్యాటీ లివర్ సమస్య వచ్చింది. ఆ తరువాత చికెన్‌పాక్స్ సోకింది.అనారోగ్యంతో బాధపడుతున్న నేను మూడు రోజులు సెలవు కావాలని సీఈఓకు మెయిల్ చేశాను. కానీ సీఈఓ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని వెల్లడించారు. కానీ నేను వర్క్ ఫ్రమ్ చేయలేనని చెప్పాను. ఆరోగ్యం కుదుటపడాలంటే కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి రాజీనామా చేయాలనీ నిర్ణయించున్నాను. ఆ తరువాత నా రాజీనామాను సీఈఓకు అందించాను. ఒక నెల రోజులు ముందుగా రిలీవ్ చేయాలని అభ్యర్థించాను.సీఈఓ నా రాజీనామాను తిరస్కరించమే కాకుండా.. తప్పకుండా కంపెనీలో పనిచేయాలని చెప్పారు. ఉద్యోగంలో కొనసాగుతున్న క్రమంలో నాకు ప్రమాదం జరిగి, చేతికి గాయమైంది. ఆ తరువాత మళ్ళీ ఒకసారి నా రాజీనామా గురించి సీఈఓకు గుర్తుచేశాను. అయినా నా మీద సీఈఓ సానుభూతి చూపలేదు. ఆ తరువాత రెండు రోజులు సెలవు తీసుకున్నాను. అయితే నాకు వారు టెర్మినేషన్ ఇమెయిల్‌ను పంపారు.ఇదీ చదవండి: అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..వారు టెర్మినేషన్ ఇమెయిల్ పంపిన తరువాత.. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV)లో తప్పుగా రిపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే.. మూడు నెలల జీతం డిమాండ్ చేశారని, ఆ వ్యక్తి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగారు. దీనికి చాలామంది స్పందిస్తూ మంచి న్యాయవాదిని సంప్రదించాలని, కార్మిక మంత్రిత్వ శాఖను సంప్రదించమని తమదైన రీతిలో సమాధానాలు ఇస్తూ ఉన్నారు. -
పని ఒత్తిడి పనిపడదాం..!
కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే మహిళ పనిభారం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లే స్వయంగా తన కూతురు మరణానికి పని ఒత్తిడి అంటూ ఆమె పనిచేసే ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీకి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యింది. ఆ ఘటన మరువక ముందే లక్నోలో జరిగిన మరో ఘటన అందర్ని ఉలక్కిపడేలే చేసింది. ప్రైవేట్ బ్యాంకులో మంచి పొజిషన్లో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల నిర్వర్తిస్తూనే కుర్చీలోనే కూలబడింది. ఇటీవలే ఆమెకు ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో మంచి పని వాతావరణం ఉద్యోగులకు కల్పించే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అలాగే పనిచేసే మహిళలు కూడా పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిడిని, ఇంటి బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటిలో తానే బెస్ట్‌గా ఉండాలనే తాపత్రయం పని ఒత్తడికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ పని ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేసి ఆహ్లాదభరితమైన హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చకోవచ్చు అనే దాని గురించి నిపుణుల మాటల్లో సవివరంగా తెలుసుకుందాం. హ్యాపీ వర్క్‌ప్లేస్.. ఇలా!పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు.పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ప్రాధాన్యమున్న పనుల్ని ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదుపది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.ఎంత పనున్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి.పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది.ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని యాజమాన్యం.. కంపెనీపై తీవ్ర విమర్శలు
పూణేకి చెందిన ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’(ఈవై) కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. మరణం తర్వాత ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంస్థ తరుపున ఒక్క ప్రతినిధి కూడా పాల్గొనకపోవడం, రేయింబవళ్లు పని భారం మోపడం వల్లే తన కుమార్తె మరణించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధంఅయితే అన్నా మరణంపై నెటిజన్లు ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ స్పందించారు. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేము హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.. ఇంకెప్పుడూ జరగదు’అని అన్నారు. ఈ సందర్భంగా సామరస్య పూర్వకమైన ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు.ఇదీ చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్సూ లేదు.. సెవెనూ లేదు : వైఎస్ జగన్సంస్థ తీరు దారుణంఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణించారు. పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించినట్లు తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని అగస్టిన్ పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియల తర్వాత, నేను ఆమె నిర్వాహకులను సంప్రదించాను. కానీ నాకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విలువలు,మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు. పని ఒత్తిడి ఆరోపణల్ని ఖండించిన మెమోనీకాగా, ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై రాజీవ్ మెమానీ ఖండించారు. దీంతో మెమానీపై ఈవై మాజీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోయలేని పని భారం కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు కామెంట్లు చేయగా.. లింక్డిన్ పోస్ట్‌లో మెమానీ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రంగంలోకి కేంద్రంఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పనిభారం వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంపై కేంద్రం స్పందించింది. పని వాతావరణంలో అసురక్షిత, శ్రమ దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. -
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్‌బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్‌లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ఏ పనీ లేదు.. రూ.3.10 కోట్లు సంపాదించాను: అమెజాన్ ఉద్యోగి
ఏడాదిన్నర కాలంలో కంపెనీలో ఎలాంటి పనిలేకుండా ఏడాదికి 3.10 కోట్ల రూపాయలు జీతము తీసుకుంటున్నట్లు అమెజాన్ సీనియర్ ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పనిచేయకుండా ఇంత జీతం ఎలా తీసుకుంటున్నారు? అనే అనుమానం చాలామందిలో కలిగింది. మరిన్ని వివరాలు చూసేద్దామా..గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. అమెజాన్‌లో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగంలో చేరారు. ఏడాదిన్నర కాలంలో ఏ పనీ చేయకూండానే 370000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 3.10 కోట్లు) జీతంగా పొందినట్లు వెల్లడిస్తూ.. ఈ అదృష్టం ఎంతకాలమో అని అన్నారు.నిజానికి గూగుల్ కంపెనీ లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ పనీ చేయకుండానే డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే అమెజాన్ కంపెనీలు చేరినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కేవలం ఏడు సపోర్ట్ టికెట్లను పరిష్కరించినట్లు, ఒకే ఆటోమేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించినట్లు చెప్పారు. దాన్ని నిర్మించడానికే మూడు నెలలు సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏఐ ద్వారా దీన్ని కేవలం మూడు రోజుల్లో రూపొందించవచ్చని ఆయనే వెల్లడించారు. రోజులో ఎక్కువ భాగం మీటింగులకే పరిమితమవుతానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.అమెజాన్ ఉద్యోగి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం 'ఎక్స్'లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆ వ్యక్తిని విమర్శిస్తున్నారు. రోజంతా ఏ పని లేకుండా ఇదెలా సాధ్యం? ఇతర ఉన్నతోద్యోగులు ఇలాంటి వారిని గమనించడం లేదా? అని అంటున్నారు.many such cases pic.twitter.com/4o32Qq7JKE— anpaure (@anpaure) August 23, 2024 -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్ఓ రూల్స్..అవేంటో తెలుసా?
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.అయితే ఆ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో పలు ఆర్ధిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు ప్రకటించారు. ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. సేవింగ్ స్కీమ్స్ (ఎన్పీఎస్ అండ్ ఈపీఎఫ్ఓ), ఇన్ కమ్ ట్యాక్స్, ఫాస్టాగ్‌లు ఇలా మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరం అయ్యింది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందజేయడం, సంతకాలు చేసే పనిలేకుండా మ్యాన్యువల్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినపుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్పీఎస్: టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ఏప్రిల్ 1, 2024 నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(pfrda) ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు నెలవారి పెన్షన్‌ను అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (cra) పేరుతో వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్ దారులకోసం పీఎఫ్ఆర్డీఏ ఆథార్ నెంబర్‌తో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల్లో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. 2022 వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగి.. స్పాట్లో రిజైన్! ఎందుకంటే..
Employee Quits Job On Spot: ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ చాలా మంది ఒత్తిడికి ఇదే మూల కారణం. సోషల్ మీడియా ముఖ్యంగా రెడ్డిట్ (Reddit).. ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న బాధలను పంచుకునే కేంద్రంగా మారింది. ఇటీవల CrazieIrish అనే పేరుతో ఉన్న ఒక రెడ్డిట్ యూజర్ తమ టాక్సిక్ బాస్ బూతు మాట అనడంతో స్పాట్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు షేర్ చేశారు. దీని గురించి మరింత వివరణ అడిగినప్పుడు ఆ యాజర్ కామెంట్స్‌లో పూర్తిగా తెలియజేశారు."నేను ఇంటి నుంచి పని చేస్తున్నా. కొత్త కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడానికి సపోర్ట్ కోసం అతనికి (బాస్) కాల్ చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో కంప్యూటర్ను సెటప్ చేయనందుకు కోపంగా ఉన్న అతను బూతు మాట (F*** Off) అన్నాడు. దీంతో స్పాట్లో జాబ్ వదిలేస్తున్నట్లు చెప్పాను" అని రాసుకొచ్చారు. ఈ ఈమెయిల్‌కు తమకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు. ఈ రెడ్డిట్ పోస్ట్ షేర్ చేసిన కేవలం 20 గంటల్లోనే 37,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా మంది ఇంటర్నెట్ యాజర్లు కామెంట్ల రూపంలో స్పందించారు. ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు. So, I Quit My Job byu/CrazieIrish inantiwork -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
‘శాడిస్ట్ బాస్‌కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్‌తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో.. రెస్టారెంట్‌లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్‌కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్‌కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
Survey : గూగుల్ ఉద్యోగులైతే చాలు.. యాపిల్ బంపరాఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు.. గతంలో ఏ కంపెనీలో పని చేశారు. ఒక టెక్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది ఇతర టెక్నాలజీ కంపెనీల్ని ఇష్టపడుతున్నారా? ఇలాంటి ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింక్డిన్ ప్రొఫైల్స్ ఆధారంగా తేలిన సర్వే ప్రకారం.. గూగుల్‌కు నుంచి యాపిల్‌లో చేరిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్‌లో పనిచేస్తున్న సిబ్బంది గతంలో ఇంటెల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లో పని చేసినట్లు సర్వే పేర్కొంది. సర్వే ఎలా చేశారు టెక్కీల గురించి ఏ సంస్థ సర్వే నిర్వహించిందనే విషయాలపై స్పష్టత లేదు. అయితే సర్వే చేసిన ప్రతినిధులు.. ముందుగా గూగుల్,అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, నెట్‌ఫ్లిక్స్, ఎన్విడియా, సేల్స్ ఫోర్స్, అడోబ్, ఇంటెల్, ఊబర్ ఉద్యోగుల లింక్డిన్ ప్రొఫైల్‌ని చెక్ చేశారు. ఆ ప్రొఫైల్స్‌లో టెక్కీలు ప్రస్తుతం, గతంలో ఏ కంపెనీలో పనిచేశారో గుర్తించి.. వారిని పర్సంటేజీల వారీగా పరిగణిస్తే చివరిగా ఏ సంస్థ ఉద్యోగులు ఎవరు, ఎక్కడ పనిచేశారో నిర్ధారించారు. దీన్నిబట్టి యాపిల్ సంస్థ అమెజాన్, అడోబ్, గూగుల్ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు మక్కువ చూపితే.. యాపిల్ ఉద్యోగులు మాత్రం గూగుల్‌లో చేరేందుకు ఇష్టం చూపిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఈ సంస్థ ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్ యాపిల్ సంస్థ..అమెజాన్, అడోబ్, గూగుల్, ఐబీఎం, ఇంటెల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఒరాకిల్, టెస్లా ఈ పది కంపెనీల వర్క్ ఫోర్స్‌ని నియమించుకునేందుకు ప్రాదాన్యం ఇస్తుంది. 2019లో ఇంటెల్ స్మార్ట్ ఫోన్ మోడెమ్ బిజినెస్‌ని యాపిల్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కుపెర్టినో దిగ్గజం (యాపిల్) ఇంటెల్ ఉద్యోగుల్ని నియమించుకుని వారితో తన సొంత రేడియో చిప్‌లను తయారు చేయించుకునేందుకు నిమగ్నమైంది. యాపిల్ ఉద్యోగులు రిజైన్ చేసి మరో టెక్ కంపెనీలో చేరే జాబితాలో గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, సేల్స్‌ఫోర్స్, అడోబ్, ఇంటెల్, ఒరాకిల్‌లు ఉన్నాయి. గూగుల్ మాజీల వైపు యాపిల్ చూపు సర్వే ప్రకారం.. గూగుల్ మాజీ ఉద్యోగుల్ని యాపిల్ హయర్ చేసుకునేందుకు ఇష్టపడుతుంది. గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. గూగుల్‌లో ఉద్యోగం చేసేందుకు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకుంటుండగా.. గతంలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన 12,108 మంది ఉద్యోగుల్ని గూగుల్ ఎంపిక చేసుకుంది. మెటాలో టెక్నాలజీ రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా 26.51శాతంగా ఉంది. గూగుల్‌లో పనిచేసిన ఉద్యోగులు 24.15శాతం, ఐబీఎంలో 2.28 శాతం మంది మెటాలో చేరారు. అలాగే కొత్త అవకాశాల కోసం 3,363 మంది గూగుల్ ఉద్యోగులు మెటాలో చేరినట్లు నివేదిక స్పష్టం చేసింది. -
ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
Reliance First Employee: భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం గురించి మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడిన చాలా మంది సన్నిహితుల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి ఎవరు? ప్రస్తుతం ఆయన జీతం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.. 'దర్శన్ మెహతా' (Darshan Mehta).. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి ఇతడే అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, ఆ సంస్థ ఉన్నతికి పాటుపడిన కొంతమంది వ్యక్తులలో ఈయన ఒకరు కావడం గమనార్హం. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2007లో ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి అయిన దర్శన్ మెహతా 'చార్టర్డ్ అకౌంటెంట్'. చదువు పూర్తయిన తరువాత త్రికాయా గ్రే అడ్వర్టైజింగ్ (Trikaya Grey Advertising)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అడ్వర్టైజింగ్లో కెరీర్ ప్రారంభించాడు. భారతదేశానికి టామీ హిల్ఫిగర్, గాంట్ మరియు నౌటికా వంటి స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్లను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దర్శన్ మెహతా జీతం ప్రతిరోజూ కొత్త శిఖరాలను తాకుతున్న కంపెనీని నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దర్శన్ మెహతా.. ఇషా అంబానీకి సన్నిహిత సహాయకుడు, రైట్ హ్యాండ్ కూడా. 2020-2021లో ఈయన వార్షిక వేతనం రూ. 4.89 కోట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ 2007లో ప్రారంభమైన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' నేతృత్వంలో ఉంది. 125 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ జిమ్మీ చూ, ఎర్మెనెగిల్డో జెగ్నా, బొట్టెగా వెనెటా, జార్జియో అర్మానీ, బర్బెర్రీ, సాల్వటోర్ ఫెర్రాగామో వంటి సుమారు 50 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఈ కంపెనీ ఇప్పటికి వేలసంఖ్యలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్లను కలిగి ఉంది. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో RBL ఏకంగా రూ. 67,634 కోట్ల అమ్మకాలను పొందినట్లు సమాచారం. -
క్రికెట్ బెట్టింగ్.. రూ.40 లక్షలు అప్పు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పల్నాడు: ఆర్థిక బాధలతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీపావళి రోజున నాదెండ్ల మండలం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే, సివిల్ పోలీసులు తెలిపిన వివరాలు.. రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన బద్దూరి గంగిరెడ్డి(33) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఈపూరు మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప ఉంది. గత నెల 23న దసరా పండుగ సెలవులపై భార్య, పాపతో అలవాల చేరుకున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెళ్లేందుకు బయలుదేరగా, నాకు పని ఉంది మీరు వెళ్లడంటూ గ్రామంలోనే ఉండిపోయాడు. తనకు కంపెనీ పని ఉందంటూ నాలుగైదు రోజుల క్రితం నరసరావుపేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దీపావళి పండుగకు ఇంటికి వెళ్లకుండా ఆదివారం ఉదయం 10 గంటలకు ద్విచక్రవాహనంపై సాతులూరు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చాడు. తన సోదరి సంధ్యకు ఫోన్ మెసేజ్ పంపాడు. తాను బతకనని, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ చేశాడు. ఆతర్వాత కొద్దిసేపటికి సాతులూరు రైల్వే స్టేషన్ పట్టాలపై చేరుకున్నాడు. ఆసమయంలో గుంటూరు–గుంతకల్లు వెళ్లే పాసింజర్ కిందపడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే లింగారెడ్డి మృతి చెందాడు. రైల్వే కీమెన్ కోటేశ్వరరావు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. రైల్వే సీఐ పి.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఐ శ్రీనునాయక్, చిలకలూరిపేట రూరల్ సీఐ అశోక్‌కుమార్, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. స్టేషన్ మాస్టర్ కుమారరాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా నష్టపోయి రూ.40 లక్షలు అప్పులపాలుకాగా తండ్రి లింగారెడ్డి తీర్చాడు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభం కావటంతో బెట్టింగ్‌లకు అలవాటు పడి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో కలత చెందిన లింగారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.