Namitha
-
చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ కాస్త బిజీ. మరోవైపు భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. వీడియో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టింది. గుడికి వెళ్లిన తనని అడ్డుకున్నారని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్)'అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి.. కుటుంబంతో కలిసి దర్శనం కోసం వెళ్లాను. అయితే నాతో పాటు ఫ్యామిలీని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు. నాతో దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతోనే హిందువును. అలాంటి నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి' అని నమిత చెప్పుకొచ్చారు.దీనిపై ఆలయ సిబ్బంది వెర్షన్ మరోలా ఉంది. పై అధికారులు చెప్పడం వల్లే అలా చేశామని, కొంత సమయం ఎదురుచూడమని చెప్పామని, దురుసుగా ఏం ప్రవర్తించలేదని మర్యాదగానే మాట్లాడమని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. నెటిజన్లు మాత్రం నమితకు మద్ధతుగా నిలుస్తున్నారు. అధికారుల్ని క్షమించమని ఆమెకు రిక్వెస్ట్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) -
పెళ్లయ్యాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. సంతోషం ఎంతోకాలం నిలవలేదు: నమిత
సొంతం సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించింది నమిత. జెమిని, నాయకుడు, బిల్లా.. ఇలా పలుగు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2020లో మాయ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితంలోని విషయాలను పంచుకుంది.ప్రెగ్నెన్సీ..2021లో తొలిసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నేను సూరత్‌లో ఉన్నాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. నాతో పాటు అమ్మానాన్న ఉన్నారు. వెంటనే నాన్న దగ్గరకు వెళ్లి నువ్వు తాత కాబోతున్నావని చెప్పాను. తర్వాత నా భర్తతో సంతోషాన్ని పంచుకున్నాను. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. నాలుగునెలలకే గర్భస్రావం అయింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఏడు నెలలదాకా టెన్షన్మూడు నెలలకే ట్విన్స్ అని తెలిసింది. ఎప్పుడూ బెడ్ మీదే ఉండేదాన్ని. ఎక్కువగా నడవకూడదని, మెట్లు ఎక్కకూడదని మా ఆయన ఆంక్షలు పెట్టేవారు. ఏడు నెలల వరకు పొట్ట కనిపించలేదు. అప్పుడు చాలా భయమేసింది. కానీ ఏడో నెల తర్వాత పొట్ట పెరగడంతో ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా నమిత.. బిజినెస్మెన్ వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లాడింది. వీరికి 2022లో ట్విన్స్ జన్మించారు.చదవండి: సిగరెట్, మందు.. అమ్మో.. మా నాన్న చాలా స్ట్రిక్టు! -
హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.. రీసెంట్ టైంలోనే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ నమిత కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి. వీటిపై ఇప్పుడు స్వయంగా ఆమెనే స్పందించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)గుజరాత్‌కు చెందిన నమిత.. 'సొంతం' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడ సెటిలైపోయింది. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న నమిత.. తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో నమిత స్పందించాల్సి వచ్చింది.'ఈ మధ్యే భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను. ఇప్పుడొచ్చిన దానితో నేను-నా భర్త ఏం బాధపడట్లేదు. ఫుల్లుగా నవ్వుకున్నాం' అని నమిత చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
హీరోయిన్ల జీవితం బయటకు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా సరే చాలామంది బ్యూటీస్ తమ బాధల్ని బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కొత్త సినిమాలు రావేమోనని భయం. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ నమిత.. తనకు కెరీర్లో ఎదురైన దారుణమైన మోసాల్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)'మూవీ పేరు చెప్పను కానీ ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ నిర్మాత నా కాల్షీట్ తీసుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడు. ఆ విషయం నాకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దీని గురించి అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను. అలానే మలయాళంలో పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశా. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతూనే ఆ మూవీ పూర్తి చేశాను' అని నమిత తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.గుజరాత్లో పుట్టి పెరిగిన నమిత.. 'సొంతం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. 2020లో చివరగా ఓ చిత్రంలో నటించిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన గురించి పలు విషయాల్ని బయటపెడుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య) -
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్‌లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్‌మేన్‌ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్‌ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్‌లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్‌లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్‌లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్‌షాప్‌ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
మోసం కేసులో హీరోయిన్ నమిత భర్తకు నోటీసులు
సౌత్ ఇండియా హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది నమిత. తాజాగా ఆమె భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వ్యాపారవేత్తగ కొనసాగుతున్న వీరేంద్ర దాదాపు 41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. (ఇదీ చదవండి: మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు) 2016లో తిరుచ్చిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని అన్నాడీఎంకేలో చేరారు నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని ఆమె పెళ్లి చేసుకున్నారు. జయలలిత మరణానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై 2019లో ఆమె బీజేపీలో చేరారు.పార్టీలో చేరిన 8 నెలల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. అలా ఈ ఏడాదిలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఇప్పుడు నమిత రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ తరపున జోరుగా తమిళనాడులో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ స్థితిలో నమిత భర్త మోసం కేసులో ఇరుక్కున్నాడు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ ( MSME) ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే MSME లో తమిళనాడుకు అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తను కూడా విచారించాలని పోలీసులు భావించారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని నమిత భర్తకు కూడా సమన్లు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతారనే వార్తలు వస్తున్నాయి. -
నా భార్య నమిత డ్రగ్స్ విక్రేతతో వివాహేతర సంబంధం పెట్టుకుంది : సినీ నిర్మాత
తన భార్య మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్ భార్య నమిత, ఆమె స్నేహితుడు లక్ష్మీశ్ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రెండేళ్ల క్రితం చంద్రశేఖర్, నమితను పెళ్లాడారు. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) బనశంకరి సెకండ్ స్టేజీ లో నివాసం ఉంటున్నారు. నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిమాటలు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆమెకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న లక్ష్మీశ్ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటిలో ఇద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ప్రశ్నిస్తే నాపైనే దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఇలా కనిపించేసరికి ఆశ్చర్యపోయిన అభిమాని) తప్పుడు ఆరోపణలన్న భార్య కాగా, భర్త తనపై దాడి చేశాడని భార్య నమితా కూడా ఫిర్యాదు చేసింది. తనకు లక్ష్మీశ్ స్నేహితుడు మాత్రమేనని, భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు నమితా పేర్కొంది. అతని స్నేహితులు అరుణ్, హేమంత్లు తనపై చాకుతో దాడి చేసినట్లు, ఇంటిలో డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నట్లు నమిత ఫిర్యాదులో తెలిపింది. ఇరువైపుల ఫిర్యాదును తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
తమిళ ఉగాది త్వరలోనే రానుంది
ఉగాది పర్వదినం ఎప్పటికీ ప్రత్యేకమే అని సినీనటి నమిత అన్నారు. వివరాలు.. తమిళ ఉగాది పండగను డిశంబర్ 31గా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గతంలో మార్చిన విషయం తెలిసిందే. అయితే చాలామంది ఏప్రిల్ 14వ తేదీనే తమిళ ఉగాదిగా జరుపుకుంటున్నారు. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి కుర్రకారు కలల నటి నమిత కూడా డిశంబర్ 31వ తేది తమిళ ఉగాది కాదు అని పేర్కొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా వెలిగిన ఈమె తమిళంలో నటుడు విజయ్‌కాంత్‌కు జంటగా ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తరువాత సత్యరాజ్, విజయ్, అజిత్, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలతో జత కట్టి పాపులర్ అయ్యారు. అభిమానులను మచ్చాన్ అంటూ ముద్దుగా సంబోధిస్తూ వారి కలల రాణిగా మారారు. 2017లో తన ప్రేమికుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన నమిత అంతకు ముందే రాజకీయరంగ ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈమె మంగళవారం ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో అందరికీ తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అదే విధంగా తమిళ ఉగాది డిశంబర్ 31వ తేదీ కాదనీ, ఏప్రిల్ 14నేనని అన్నారు. తమిళ ఉగాది త్వరలోనే రానుందని, మీరంతా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటి నమిత -
Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్ అడ్రస్
‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాదించిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్ల గురించి... ఫోర్బ్స్ ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్లు చోటు సంపాదించారు. కోవిడ్ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ‘హొనాసా కన్జూమర్’ కో–ఫౌండర్ గజల్ అలఘ్ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్ ఆ తరువాత కాలంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది. కోవిడ్ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్. ‘ఎమ్క్యూర్ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్‌షో ‘అన్కండీషన్ యువర్సెల్ఫ్ విత్ నమితా థాపర్’ నిర్వాహకురాలు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెస్సెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యుర్షిప్’కు మంచి ఆదరణ లభించింది. ‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు. నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్. భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది. -
రాజకీయ ఎంట్రీపై స్పందించిన నమిత
ప్రముఖ సినీనటి నమిత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్నట్లు తెలిపింది. నటి నమిత దంపతులు ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉందని పేర్కొంది. సమయం చూసుకుని రాజకీయాల్లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చింది. కాగా ఈ గుజరాతీ భామ.. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికగా దిగుమతి అయింది. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, మలయాళం వంటి ఇతర భాషా చిత్రాలలోనూ నటించింది. 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న ఆమె ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చింది. చదవండి: సామ్- ఇనయ లవ్ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్ ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్రూమ్లో ఏడ్చేదాన్ని: హీరోయిన్ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నమిత
-
కవల పిల్లలతో దైవ దర్శనం చేసుకున్న నమిత
Namitha Visits Temple With Her Twin Baby Boys: బ్యూటిఫుల్ హీరోయిన్ నమితను చూసినా, ఆమె పేరు విన్న కుర్రకారులో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. కారణం ఆమె వారిని ఎక్కడ చూసినా మచ్చాస్ అంటూ ఫ్లైయింగ్ కిస్ల వర్షం కురిపించడమే. ఇక సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందాల ఆరబోతతో యువతను గిలిగింతలు పెడుతుంది. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికిగా దిగుమతి అయింది ఈ గుజరాతి భామ నమిత. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్గా ఎదిగింది. అదేవిధంగా తెలుగు, మలయాళం వంటి ఇతర చిత్రాలలో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన ఈమె 2017లో వీరేంద్ర చౌదరి అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ఆ మధ్య తను గర్భిణిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి త్వరలో మాతృమూర్తిని కాబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం ఇక ఈ శుక్రవారం (ఆగస్టు 19) అనూహ్యంగా భర్త, ఇద్దరు పురిటి బిడ్డలతో దైవ దర్శనం చేసుకుంటున్న ఫొటోలతో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం అయ్యింది. అందులో తాను చెన్నైలోని రేలా ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఇద్దరూ మగ పిల్లలే అని, క్షేమంగా ఉన్నారనీ తెలిపింది. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన ఆ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈమె ప్రసవం ఎప్పుడు జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిందన్న విషయం తెలిసి ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత..
హీరోయిన్ నమిత గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 'నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నమిత వెంకటేశ్‌తో నటించిన జెమిని సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. 2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన నమిత
‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అంతేకాదు ఇటీవల నమిత సీమంతం కూడా ఘనం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది కూడా. అంతేకాదు భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చిన ఫొటోలను సైతం ఫాలోవర్స్, ఫ్యాన్స్‌తో పంచుకుంది. చదవండి: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు ఇక తాజాగా తన బేబీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అయితే ప్రస్తుతం నమిత 9 నెలల గర్భవతిగా ఉంది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో 9 నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఫొటోషూట్‌ను తాజాగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా షేర్ చేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కమ్మింగ్ సూన్’ అంటూ తన ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది. కాగా 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగింది. చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్ రియాక్షన్ చూశారా! View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
ఘనంగా నమిత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్
‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతోంది. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. భర్తతో కలిసి బేబీ బంప్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా నమితకు సీమంతం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరగ్గా 41 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం. చదవండి: హోటల్లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు కమల్ హాసన్ 'విక్రమ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
కొత్తగా మారిపోయా!
నమిత ఫోన్ మంగళవారం ఫుల్ బిజీ. ఎందుకంటే మంగళవారం (మే 10) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పేందుకు బంధువులు, అభిమానులు ఫోన్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? అయితే ‘హ్యాపీ బర్త్ డే’తో పాటు ‘కంగ్రాట్స్’ చెప్పిన ఫోన్ కాల్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... తాను తల్లి కాబోతున్న విషయాన్ని తన బర్త్ డే సందర్భంగా నమిత ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించి, కొత్త ఫోటోలను షేర్ చేశారు. దాంతో ‘కంగ్రాట్స్...నమిత’ అని ఇటు సినీ సెలబ్రిటీలు అటు అభిమానులు ఆమెకు సందేశాలు పంపడం, ఫోన్‌కాల్స్ చేయడం వంటివి చేశారు. ‘‘నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవగానే నేను మారిపోయాను. నేను నీ కోసం (పుట్టబోయే బిడ్డ గురించి...) ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు నమిత. 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత ‘సొంతం’, ‘జెమిని’, ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. కొత్త ఫీలింగ్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్
ఇటీవల కాలంలో సినీ తారలు తాము తల్లి కాబోతున్నామనే విషయాన్ని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అంతేకాదు బేబి బంప్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్రహీరోయిన్ కాజల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. హీరోయిన్ ప్రణీత, సంజన గల్రాని తాము ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ.. ఫోటోలను షేర్ చేసుకున్నారు. (చదవండి: నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్ బాబు) తాజాగా మరో హీరోయిన్ కూడా తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. తెలుగులో ‘సొంతం’, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించిన నమిత.. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ఈ రోజు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మాతృత్వం.. నా జీవితంతో కొత్త అధ్యాయం మొదలైంది. నాలో ఏదో మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త ఫీలింగ్స్‌ను ఇస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ ఇంతకు ముందెన్నడూ లేని ఫీలింగ్స్ ’అంటూ నమిత రాసుకొచ్చింది. కాగా, 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కావడం గమనార్హం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శరత్‌బాబుతో హీరోయిన్ నమిత పెళ్లి పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన భర్త
Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours: హీరోయిన్ నమితకు తెలుగు, తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'సొంతం' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు..ఒక రాణి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్గా పాపులర్ అయిన నమిత 2017లో వ్యాపారవేత్త, నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే నమితపై గతంలో అనేక రూమార్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరేంద్రతో పెళ్లి ఫిక్సయిన తర్వాత కూడా సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సరిగ్గా మా పెళ్లి సమయంలోనే సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ వార్తలు వచ్చాయి. నా లైఫ్‌లోనే నేను విన్న వరస్ట్ కామెంట్స్ ఇవి. అసలు అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆయన చాలా పెద్దాయన. అలాంటి వ్యక్తితో ఎఫైర్ క్రియేట్ చేయడం చాలా తప్పు. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన పనిలేదు' అంటూ పుకార్లకి చెక్ పెట్టారు. -
బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..
Tamil Bigg Boss Seanson 5 Namitha Marimuthu Heart Touching Story: బిగ్‌బాస్.. ఈ రియాలిటీ షోను జెన్యూన్‌గా ఆదరించే వాళ్ల శాతం తక్కువే కావొచ్చు. చాలామందికి ఈ రియాలిటీ షో మీద సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. సెలబ్రిటీలు-నాన్ సెలబ్రిటీలను ఓ హౌజ్‌లో టాస్క్‌లు-గేమ్‌ల పేరుతో చేసే గారడీ అని, వాళ్లు పంచేవి ఫేక్ ఎమోషన్స్ అని ఫీలవుతుంటారు. ఇలా ఎవరి అభిప్రాయలు వాళ్లవి. కానీ, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5లో గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 5.. 18 మంది కంటెస్టెంట్లతో అక్టోబర్ 3న ప్రారంభమైంది. సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కంటెస్టెంట్లో ట్రాన్స్‌జెండర్ నమిత మారిముత్తు పాల్గొంటోంది. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 విన్నర్, మోడల్ కమ్ నటి అయిన నమిత.. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం. ఇక ‘ఒరు కథై సొల్లాటుమా’ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పుకుంటూ వచ్చారు. తన వంతు వచ్చేసరికి భావోద్వేగంగా నమిత చెప్పిన కథ తోటి హౌజ్ మేట్స్‌నే కాదు.. షోను తిలకించిన వాళ్లెందరినో కదిలించింది. కొందరి వల్ల సొసైటీలో తనలాంటి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. సమాజం తమను అంగీకరించకపోవడం గురించి ఒక ప్రతినిధిగా దాదాపు అర్థగంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నమిత. #NamithaMarimuthu 😟😟 Paavam la 😐 First time... BB la oru life story paarthu tears😪 Life is not easy for them😔 Hope this society atleast give comfortable space for them to live like us 💫❤#BBTamilSeason5 #BiggBossTamil5 — Yuna ᴹᴵ (@Yuna_Chillz) October 7, 2021 ఇది కదా చర్చించాల్సింది! సొసైటీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాల్నే కథగా అల్లిన నమిత.. ఆ కథను ఆద్యంతం భావోద్వేగాలతో చెబుతూ పోయారు. ‘మన సమాజం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఇదే సమాజంలో మా స్థానం ఎక్కడ? మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్ల మీద అడుక్కుని బతకాల్సి వస్తోంది. Thalaivar Kalaignar Karunanidhi will be Remembered Forever for such Works.. Proud 😍🔥#KalaignarForever #NamithaMarimuthu #BiggBoss5Tamil pic.twitter.com/An4Du5FGXu — நிதன் சிற்றரசு (@Srinileaks) October 8, 2021 మమ్మల్ని మనుషుల్లాగే చూడడం లేదంటూ.. కన్నీళ్లతో మాట్లాడింది నమిత. అంతేకాదు కొందరి వల్ల తనలాంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తోందని, అలాంటి ప్రచారం చేసేవాళ్లతో సహా సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పు రావాలంటూ, తనలా అందరూ రాణిస్తే సంతోషిస్తానని చివర్లో కోరుకుందామె. ఇక స్టార్ విజయ్ ఛానెల్ వాళ్లు కూడా సింగిల్ కట్ లేకుండా, ఎడిట్ చేయకుండా!, బీప్ లేకుండా ఆ అరగంట సీక్వెన్స్‌ను టెలికాస్ట్ చేయడం విశేషం!. అంతకు ముందు ఇదే హౌజ్‌లో ఇసయ్వాణి, చిన్నపొన్నులు సైతం పేదరికంలో తాము పడ్డ కష్టాల్ని పంచుకోగా.. ఆ రియల్ ఎమోషన్స్ సైతం చాలామందిని కదిలించాయి. ట్విటర్లో నమిత.. బిగ్‌బాస్ హౌజ్ వేదికగా కోట్ల మందికి తన గా(వ్య)థను పంచిన నమితను అభినందించని వాళ్లంటూ లేరు. అందుకే రాత్రి నుంచే ఆమెకు మద్దతుగా #NamithaMarimuthu హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో కడదాకా ఉంటుందో లేదో తెలియదుగానీ నమిత కథ మాత్రం.. ఓ బర్నింగ్ ఇష్యూను ఓ బుల్లితెర పాపులర్ షో ద్వారా సాధారణ ప్రజల ముందుకు తీసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్లోనూ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఇదే తరహా ఎమోషన్స్‌ను పంచిన విషయం తెలిసిందే. కంటెంట్ తక్కువతో కలర్ఫుల్గా షోలను నడిపించేవాళ్లు.. తమిళ, తెలుగు బిగ్‌బాస్ హౌజ్‌ల నుంచి చాలా నేర్చుకోవాలనే సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పడు. The pain in #NamithaMarimuthu’s story.💔 Not an ordinary struggle mentally and physically. Jus to hear only was so #exhausing. Can’t imagine what she must have gone through. More power to her and many more achievers from #LGBTQ.#BiggBossTamil #BiggBossTamil5 pic.twitter.com/FaZqJpgRrd — Ajay Ashok🅰️🅰️ (@AjayAsho) October 7, 2021 Her story says how we failed as a society 😭😭 #NamithaMarimuthu #BiggBossTamil5 pic.twitter.com/BY8pGKRxkm — Charan (@Charan_Soz) October 7, 2021 #BiggBossTamil5 She won 17❤️ from #BiggBoss house Million ❤️❤️❤️ from outside the house 🏠#NamithaMarimuthu pic.twitter.com/VQ6gcHzndE — Stay Positive37 (@helothamizha) October 7, 2021 Nameetha Marimuththu She is an icon to showcase the world -People Themselves are more beautiful - She spoke louder her inner feelings and respect @vijaytelevision for not editing her speech ♥️ She is the way beautiful - She is #NamithaMarimuthu #transgenderpride pic.twitter.com/M3NPwIaokl — Bigg Boss Tamil Season 5 (@biggbosstamil_5) October 7, 2021 చదవండి: తెలుగు బిగ్‌బాస్.. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ -
తమిళ బిగ్‌బాస్: బరిలో ట్రాన్స్‌జెండర్, ఫేమస్ యాంకర్, సింగర్స్
తమిళంలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తాజాగా ఐదో సీజన్లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ బిగ్‌బాస్ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. బుల్లితెరతో పాటు వెండితెర స్టార్లను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెల్కమ్ చెప్పాడు. అక్టోబర్ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో సింగర్లు, నటులు, కళాకారులు, యాంకర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. మరి వారెవరో చదివేద్దాం... అక్షర రెడ్డి: నటి, మోడల్ అక్షర రెడ్డి మిస్ గ్లోబ్ 2019 అవార్డు అందుకుంది . ఇంతకుముందు విల్లా టు విలేజ్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను బయటపెడుతూ.. మలేషియన్ మూవీ కసు మెలా కసు చిత్రంలో తొలిసారి నటించింది. అభినయ్ వాడి: లెజెండరీ నటుడు జెమిని గణేశన్- సావిత్రి గణేశన్‌ల మనవడే అభినయ్. ఇతడు జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. ప్రస్తుతం అతడు యువతరానికి టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే పేదరైతులకు ఏదైనా సాయం చేయాలన్నది ఆయన అభిలాష. ఇక అభినయ్ రామానుజన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అభినయ్ ఫ్యాషన్ డిజైనర్ అపర్ణను వివాహం చేసుకోగా వీరికి స్వస్తిక అనే కూతురు ఉంది. మధుమిత రఘునాధన్: శ్రీలంకన్ తమిళ ఫ్యామిలీకి చెందిన మధుమిత రంఘునాధన్ జెర్మనీలో సెటిల్ అయింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు పూర్తి చేసిన మధుమితకు మోడలింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఎలాగైనా సినీరంగంలో రాణించాలని కలలు కంటోంది మధుమిత. బిగ్‌బాస్ ద్వారా తన కలను నిజం చేసుకోవాలని ఆశపడుతోందీ మోడల్. రాజు జయమోహన్: తిరునల్వేలికి చెందిన రాజు నటుడు మాత్రమే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా! ఇతడు ప్రముఖ డైరెక్టర్ కె.భాగ్యరాజ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. కనా కానుమ్ కలంగళ్ సీరియల్‌తో నటనా రంగంలోకి ప్రవేశించిన అతడు తర్వాత పలు షోలలోనూ పాల్గొన్నాడు. బుల్లితెరపై సత్తా చూపిన ఇతడు నట్పున ఎన్నాను తెరియుమా అనే చిత్రంతో వెండితెరపైనా లక్ పరీక్షించుకున్నాడు. చిన్న పొన్ను: చిన్న పొన్ను ప్లేబ్యాక్ సింగర్. 13 ఏళ్లకే తన గాత్రంతో మ్యాజిక్ చేయడం మొదలు పెట్టింది చిన్న పొన్ను. ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్, హీరోయిన్లు జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమాలో తొలిసారి పాట పాడింది. ఫోక్ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోవడానికి చిన్న పొన్నులాంటి ఫోక్ ఆర్టిస్ట్‌లే కారణం. పావని రెడ్డి: మొదట్లో మోడలింగ్ చేసిన పావని రెడ్డి తర్వాత యాక్టింగ్‌నే తన కెరీర్‌గా స్థిరపరుచుకుంది. రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.చిన్న తంబి, రసంతి సీరియల్స్ ద్వారా అభిమానులకు ఆమె మరింత దగ్గరైంది. పలు భాషల్లోని సినిమాల్లోనూ పావని నటించి మెప్పించింది. ఇమ్మన్ అన్నాచి: ఇమ్మాని అన్నాచి నటుడు మాత్రమే కాదు పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరికొన్ని షోలకు జడ్జిగానూ పని చేశాడు. సొలుంగన్నే సొల్లుంగ, గల్లపెట్టి వంటి పలు షోలు అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తనకున్న పాపులారిటీతో రాజకీయాల్లోకి సైతం ప్రవేశించాడు. చెన్నై కాదల్ చిత్రంతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇసాయివాణి: ఈమె పూర్తి పేరు గానా ఇసాయివాణి. 2020వ సంవత్సరంలో ఆమె బీబీ 100 ఉమెన్ అవార్డు అందుకుంది. ఆరేళ్లకే పాటలు పాడటం మొదలు పెట్టిన ఆమె 10వేలకు పైగా షోలలో పాల్గొని తన గాత్రంతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసింది. అభిషేక్ రాజా: నటుడు, రచయిత, వీడియో జాకీ, క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అభిషేక్ రాజా సోషల్ మీడియా సెన్సేషన్ కూడా! సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో దిట్ట అయిన అభిషేక్ ఇమైక్కా నొడిగల్ అనే సినిమాలోనూ ఓ పాత్రలో నటించాడు. సిబీ భువన్ చంద్రన్: ఇతడు నటుడు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భువన చంద్రన్ రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశాడు. కానీ సినిమాలపై ఉన్న మోజుతో భారత్‌కు తిరిగి వచ్చేశాడు. వంజాగర్ ఉలగం చిత్రంలో తొలిసారి నటించాడు. మాస్టర్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నమిత మరిముతు: ట్రాన్స్‌జెండర్ నమిత మరిముతు పాపులర్ మోడల్. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 పేజెంట్ అవార్డు అందుకున్న నమిత నటిగానూ రాణిస్తోంది. వరుణ్ ఇషారి కమలకన్నన్: ప్రముఖ నటుడు ఇషారి వేలన్ మనవడే వరుణ్ ఇషారి. ఇతడు నిర్మాత ఇషారి గణేశ్‌కు బంధువు కూడా అవుతాడు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు పార్కర్ స్పోర్స్ట్లోనూ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. థలైవా సినిమాలో అతడు పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ప్రియాంక దేశ్‌పాండే: తమిళ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్లలో ప్రియాంక దేశ్‌పాండే ఒకరు. కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, స్టార్ట్ మ్యూజిక్, సూపర్ సింగర్ 4,5,6,7,8 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించింది. కలక్క పోవద్దు యారు షోకు సహజడ్జిగానూ పనిచేసింది. సురుతి: ఇంజనీరింగ్ అభ్యసించిన సురుతి మోడలింగ్ అంటే ఇంట్రస్ట్. దీంతో మోడలింగ్‌లో అడుగు పెట్టిన ఆమె నాలుగేళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈమె జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కూడా! లిక్కీ బెర్రీ: లిక్కీ బెర్రీ సింగర్, డాక్టర్, పాటల రచయిత, కాస్మొటాలజిస్ట్. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె ర్యాపర్‌గా రాణిస్తోంది. తమరై సెల్వి: తమరై సెల్వి జానపద కళాకారిణి. ఈమె వందలాది షోలలో పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. నదియా చాంగ్: నదియా చాంగ్ ఫేమస్ మోడల్. మలేషియన్ ఇండియన్ మోడల్ పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. మిసెస్ మలేషియా వరల్డ్ 2016 బ్యూటీ పేజెంట్ ఫైనలిస్టుగానూ సత్తా చాటింది. నిరూప్ నందకుమార్: ఇతడు ఎంటర్ప్రెన్యూర్. బెంగళూరులో స్వంతంగా వ్యాపారం నడుపుతున్న నిరూప్‌కు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. బిగ్‌బాస్ షో ద్వారానైనా నటుడిగా ఛాన్స్ వస్తే బాగుండనుకుంటున్నాడు నిరూప్. -
శ్రీవారిని దర్శించుకున్న నమిత దంపతులు
సాక్షి, చిత్తూరు: హీరోయిన్ నమిత దంపతులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. తను నటించిన బౌబౌ సినిమా విడుదలకు సిద్దంగా వుందన్నారు. థీయేటర్లలో రిలీజ్ చేయాలా లేదా ఓటిటిలో చేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వుందని తెలిపారు. త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. నమితా థియేటర్ పేరుతో ఓటిటి, నమిత ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. -
సోషల్ హల్చల్ : చాలా మిస్ అయ్యానన్న బన్నీ.. బాధ పడొద్దన్న నమిత
అల్లు అర్జున్‌కి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పిల్లలను చాలా మిస్ అయ్యానంటూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. మీకు కరోనా లక్షణాలున్నాయా.. బాధపడొద్దు.. ఉచితంగా సలహాలు తీసుకోవచ్చునంటూ ఓ వీడియోని షేర్ చేసింది హీరోయిన్ నమిత ప్రీ ఆక్సిజన్ అంటూ పర్వతాలపై దిగిన ఓ ఫోటోని షేర్ చేశాడు బిగ్‌బాస్ ఫేమ్, హీరో అభిజిత్ లాక్డౌన్ ఫేస్ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది లావణ్య త్రిపాఠి ప్రకృతితో ఒక్క మూలన జీవించడం నా కొరిక అంటూ పచ్చని పార్క్‌లో దిగిన ఓ ఫోటోని పంచుకుంది హీరోయిన్ మీరా చోప్రా Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much 🖤 pic.twitter.com/ubrBGI2mER — Allu Arjun (@alluarjun) May 12, 2021 View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
HBD Namitha: బొద్దుగుమ్మ కోసం గుడి, ఎక్కడుందంటే?
'సింహం అంటి చిన్నోడే వేటకొచ్చాడే..' అంటూ బాలకృష్ణతో సమానంగా స్టెప్పులేసింది నమిత. ఒక్క బాలయ్యతోనేనా విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజ రవితేజతో సహా పలు హీరోలతోనూ నటించి మెప్పించింది. కానీ తెలుగులో కన్నా కూడా తమిళంలోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. అక్కడ నమితను ఎంతలా ఆరాధిస్తారు అంటే ఏకంగా గుడి కట్టి పూజించేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.. నేడు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. నమిత 1980 మే 10న గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో జన్మించింది. 1998లో మిస్ సూరత్ కిరీటాన్ని దక్కించుకున్న ఆమె 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 'సొంతం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్ సరసన 'జెమినీ' మూవీలో నటించి మరింత పాపులర్ అయ్యింది. 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి', 'నాయకుడు' వంటి పలు చిత్రాల్లో నటించింది నమిత. కానీ ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో సినిమాల్లో కనిపించనేలేదు. అయితే సడన్‌గా బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి. కొంతకాలం బ్రేక్ తర్వాత నమిత ప్రభాస్ 'బిల్లా' సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇక్కడ సక్సెస్‌కు దూరమైన నమిత తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్గా సత్తా చాటింది. దీంతో నమిత కోసం ఆమె అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేశారు. ఇది తమిళనాడులోని తిరునల్వేలిలో ఉంది. ఓసారి తమిళనాడులో నమితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో అభిమాని. ఆమెను ఫంక్షన్‌కు తీసుకువెళ్లాల్సిన కారు డ్రైవర్‌ను తానే అని చెప్పడంతో గుడ్డిగా నమ్మేసిన నమిత అతడి కారెక్కింది. కానీ నిజమైన కారు డ్రైవర్ ఈ విషయాన్ని ఫంక్షన్ నిర్వాహకులకు చెప్పడంతో అతడి కారును చేజ్ చేసి పట్టుకున్నారు. తీరా పోలీసులు నిలదీస్తే తాను నమిత అభిమానినంటూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. 2017లో వీరేంద్ర చౌదరిని లవ్ మ్యారేజ్ చేసుకుని వైవాహిక జీవితానికి ఆరంభం పలికింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భౌవౌ అనే సినిమా చేస్తోంది. మరోవైపు 2019 నుంచి ఆమె బీజేపీలో కొనసాగుతోంది. చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్న నటి నమిత -
నా బరువుకు కారణం అదే.. పుకార్లు నమ్మొద్దు
‘జెమిని’, ‘సొంతం’ సినిమాల్లో సన్నగా నాజుకు నడుముతో కుర్రాళ్లను కట్టిపేడేశారు హీరోయిన్ నమిత. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమె కొంతకాలం గ్యాప్ తర్వాత ‘సింహా’, ‘బిల్లా’ మూవీల్లో మెరిసారు. అయితే ఈ మూవీస్‌లో ఆమె బోద్దుగా కనిపించడంతో రానురాను నమితకు సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో 2017లో తెలుగు అబ్బాయి వీరేంద్ర చౌదరిని ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయిపోయారు. కాగా ఇప్పుడు నమిత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారని, ఇందుకోసం ఆమె లావు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె బరువు పెరగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెతున్నాయి. గతంలో నమిత విపరితంగా మద్యం సేవించడం వల్లే అంత బరువు పెరిగారని నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. (చదవండి: భర్తతో విడాకులు..అది బ్రేకప్‌లా ఉంది : నటి) దీంతో తాజాగా నమిత తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు... థైరాయిడ్, పీసీఓడీ అరోగ్య సమస్యల వల్లే అధిక బరువు పెరిగానన్నారు. అంతేగాని మద్యం సేవించడం వల్ల కాదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న పుకార్లను నమ్మెద్దని కూడా ఆమె తెలిపారు. ‘ఒకప్పుడు నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోయాననే భావన కలిగింది. మానసిక ప్రశాంత కరువైంది. దానికి తోడు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు, వీటి వల్లే అధిక బరువు పెరిగాను. అయితే ఆ సమమంలో యోగా, ఫిజికల్ ఆక్టివిటీస్‌తో తిరిగి ప్రశాంతతను పొందగలిగాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తను 90 కిలోల బరువు ఉన్నానని, అందులో దాపరికం ఏం లేదన్నారు. (చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక) -
దిల్ సే
-
అలాంటివి చూసి బోర్ కొట్టేసింది!
సినిమా: రొమాన్స్ చిత్రాలు చూసి చూసి బోర్ కొట్టేసిందని నటి నమిత పేర్కొంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీజీ.ముత్తయ్య, ఎం.దీప కలిసి పీజీ.మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కాక్టైల్. నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఇందులో ఆయనకు మిత్రులుగా రమేష్, మిథున్, విజయ్ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్ బాలా, ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు షియాజీ షిండే, మనోబాలా, మైమ్‌గోపి నటించారు. నవ దర్శకుడు ఆర్. విజయ్‌మురుగన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్జే.రవిన్ ఛాయాగ్రహణం, ఎస్.సాయిభాస్కర్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రంలో ఆస్ట్రేలియాకు చెందిన కాక్టైల్ అనే పక్షి ప్రధాన పాత్రలో నటించిందని, అలా ఒక పక్షి ప్రధాన పాత్రలో నటించడం ఇదే ప్రప్రథం అని నిర్మాతలు పేర్కొన్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ఒక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నమిత మాట్లాడుతూ రొమాన్స్ చిత్రాలు చూసి చూసి బోర్ కొట్టేసిందని పేర్కొంది. కాక్టైల్ లాంటి కామెడీ చిత్రాలను చూడడమే ఇష్టమని చెప్పింది. ఈ చిత్రాన్ని తాను థియేటర్‌కు వెళ్లి చూస్తానని నమిత చెప్పింది. మరో అతిథి ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. అయితే మనకు మంచి జరగుతుందంటే అది ఏ రోజు అయినా మంచిదేనని అన్నారు. చిత్ర నిర్మాత పీజీ.ముత్తయ్య మాట్లాడుతూ సినిమా గురించి ఏమీ తెలియకుండానే చెన్నైకి వచ్చానన్నారు. ఎస్ఆర్ఎం కళాశాలలో చదువుతున్న సమయంలోనే సినిమా గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో నటుడు అశోక్‌సెల్వన్ పాల్గొన్నారు. -
బీజేపీలోకి నమిత, రాధారవి
సాక్షి, చెన్నై: సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. శనివారం చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు కాషాయం కండువా కప్పుకున్నారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్ అభినందనలు తెలియజేశారు. అయితే సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు. -
బీజేపీలో చేరిన బిల్లా ఫేమ్
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి నమిత బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మరింత కొంత మంది కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా నమిత దక్షిణాదిన పలు భాషల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. గతకొంత కాలంగా సినిమాల్లో అవకాశం లేకపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసింది. తమిళనాడులో బీజేపీ తరఫున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. -
ఏమి జరిగిందంటే..
పెరంబూరు: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు గుంజుకోవడానికి రాజకీయ నాయకులు బయలుదేరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారులు డబ్బును అక్రమంగా తరలిస్తున్న వాహనాలను తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. వారు ఇప్పటికే సరైన ఆధారాలు లేని కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా నటి నమిత ఫ్లయింగ్ స్క్వాడ్‌తో వాగ్వాదానికి దిగినట్లు, వారితో గొడవ పడినట్లు గరువారం ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. దీంతో నటి నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటనను మీడియా పర్సన్ ద్వారా విడుదల చేశారు.అందులో తాము షూటింగ్లో పాల్గొనడానికి 8 గంటల పాటు కారులో ప్రయాణం చేస్తున్నామన్నారు. నమిత ప్రయాణ బడలికతో కారు వెనుక సీటులో నిద్రిస్తోందని చెప్పారు. అప్పటికే దారిలో రెండు మూడు చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారును తనిఖీ చేశారన్నారు. అలా సేలం జిల్లా, ఆర్కాడు ప్రధాన కూడలిలో మరోసారి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తమ కారు ఆపారని చెప్పారు. అయినా తాము తనిఖీకి సహకరించామని తెలిపారు. అయితే వెనుక సీటులో నమిత నిద్రపోతుండడంతో అవసరం అయితే తానే ఆమెను లేపుతానని చెప్పానన్నారు. అయితే వారు తన మాటను వినిపించుకోకుండా కారు డోర్‌ను టక్కున ఒపెన్ చేశారని, దీంతో పడుకున్న నమిత సడన్‌గా కిందకు పడిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయినా వారు నమిత బ్యాగ్‌ను పరిశీలించాలని అన్నారని,, దీంతో నిరాకరించిన నమిత మహిళా పోలీస్‌నే తన బ్యాగ్ చెక్ చేయాలని చెప్పిందన్నారు. అప్పుడు మహిళా పోలీస్ వచ్చి నమిత బ్యాగ్‌ను చెక్ చేసిందని తెలిపారు. అసౌకర్యమైన పరిస్థితుల్లో మహిళా పోలీస్‌ను తనిఖీకి కోరడం ప్రతి మహిళా హక్కు అని నమిత భర్త వీరేంద్ర అన్నారు. జరిగింది ఇదయితే మీడియా వేరే విధంగా వక్రీకరించిందని ఆయన అన్నారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నమిత వాగ్వాదం
పెరంబూరు: ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను దింపారు. వారు 24 గంటలు అనుమానం కలిగిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, నగలను కలిగిన వారి నుంచి తగిన ఆధారాలు లేకుంటే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అలా కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాగా సేలం జిల్లాలో 33 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరో 33 ప్రత్యేక పోలీస్ బృందాలను ఎన్నికల బృందం తనిఖీలకు నియమించింది. వారు ఆ జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి తనిఖీలు చేపట్టారు. వారు ఇప్పటి వరకూ రూ.50 కోట్ల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆనంద్ విజయ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్‌స్క్వాడ్ ఆమె కారుని పంపేశారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నమిత వాగ్వాదం..
పెరంబూరు: ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను దింపారు. వారు 24 గంటలు అనుమానం కలిగిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, నగలను కలిగిన వారి నుంచి తగిన ఆధారాలు లేకుంటే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అలా కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాగా సేలం జిల్లాలో 33 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరో 33 ప్రత్యేక పోలీస్ బృందాలను ఎన్నికల బృందం తనిఖీలకు నియమించింది. వారు ఆ జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి తనిఖీలు చేపట్టారు. వారు ఇప్పటి వరకూ రూ.50 కోట్ల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆనంద్ విజయ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్‌స్క్వాడ్ ఆమె కారుని పంపేశారు. -
గిరిజన యువతి కథ
‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, నమిత, ఇనియా, ఊర్వశి, షకీలా ప్రధాన తారాగణంగా వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొట్టు’. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఎస్.ఎస్ సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి. కుమార్ బాబు ‘బొట్టు’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘బొట్టు అనే పేరు గల ఓ గిరిజన యువతి కథే ఈ సినిమా. ‘కాంచన, గంగ’ చిత్రాల తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వస్తోన్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. కథాకథనాలు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ ఇబ్బందుల వల్ల చాలా రోజులుగా సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు రివైజింగ్ కమిటీ ద్వారా విడుదలకు సర్టిఫికెట్ పొందాం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్. -
మీటూపై స్పందించిన నమిత
మహిళల ఫిర్యాదులను ముందు వినాలని నటి, ఒకప్పటి యువత కలల రాణి నమిత అంటోంది. మీటూ సినీ పరిశ్రమలో కలకలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొందరిపై మీటూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకూ ప్రైమ్ టైమ్‌లో లేని నటి నమిత తాజాగా మళ్లీ హెడ్‌లైన్స్‌కు ఎక్కుతోంది. తన చిరకాల ప్రేమికుడు వీరేంద్రను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన నమిత ఇప్పుడు నటిగా అహంభావం అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ అమ్మడు మాట్లాడుతూ ఇంతకుముందులా గ్లామరస్ పాత్రల్లో నటించడం ఇష్టం లేదని పేర్కొంది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనేనని తాజాగా నటిస్తున్న అహంభావం చిత్రంలో పాత్రికేయురాలిగా బలమైన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రంపై చాలా నమ్మకం ఉందని పేర్కొంది. గ్లామర్‌గా నటించనంటున్న నమిత తన అభిమానులకు పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఎందుకంటే ఆమె అందాలకు గులాం అయ్యే చాలా మంది యువత అభిమానులైపోయారన్నది వాస్తవం. మరి ఇప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే మీటూపై స్పందించిన నమిత అందరూ మీటూ గురించి అడుగుతున్నారని, మీటూ పేరుతో మహిళలు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారని, అలా తమకు జరిగిన అక్రమాల గురించి చెప్పడానికి ధైర్యం కావాలని అంది. ముందు వారు చేసే ఫిర్యాదులను వినాలని అంది. ఆ తరువాత నిజానిజాల గురించి విచారించాలని పేర్కొంది. అయితే మీటూను తప్పుగా ఉపయోగించకూడదంది నమిత. -
పవర్ఫుల్ జర్నలిస్ట్
పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తున్నారు నమిత. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు సైన్ చేశారు. శ్రీమగేశ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘అగమ్పావమ్’ చిత్రంలో పవర్ఫుల్ జర్నలిస్ట్‌గా కనిపిస్తారట నమిత. ఈ సినిమా గురించి నమిత మాట్లాడుతూ– ‘‘పొలిటీషియన్‌కు, జర్నలిస్ట్‌కు మధ్య జరిగే కథ ఇది. నేను పవర్ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో అసలు గ్లామర్ ఉండదు. కొన్ని రోజులుగా నా బాడీ లాంగ్వేజ్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఇందులో డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో 30 పేజీల డైలాగ్స్ ఉండే భారీ సన్నివేశం ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలతోనే షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం’’ అని పేర్కొన్నారు నమిత. -
లేడీ డాన్
పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు నమిత. 2016లో మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘పులి మురుగన్’నే సిల్వర్ స్క్రీన్‌పై నమిత లాస్ట్ సినిమా. లేటెస్ట్గా తమిళ దర్శకుడు టి.రాజేందర్ డైరెక్షన్లో ఓ మూవీలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ‘ఇండ్రయ కాదల్ డా’ (ఇవాళ్టి ప్రేమ రా అని అర్థం) అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామాలో నమిత లేడీ డాన్‌లా కనిపించనున్నారు. పదకొండేళ్ల తర్వాత టి.రాజేందర్ మెగాఫోన్ çపడుతున్న ఈ చిత్రం యూత్‌ని టార్గెట్ చేసే విధంగా ఉండబోతోందట. త్రి భాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటులు కనిపించనున్నారని దర్శకుడు టి.రాజేందర్ పేర్కొన్నారు. -
లేడీ డాన్‌గా నమిత
తమిళసినిమా: టీ.రాజేంద్రన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఇంతకు ముందు ఒరు తాయిన్ శపథం, ఎన్ తంగై కల్యాణి, సంసార సంగీతం, ఇంగవీట్టు వేలన్, మోనీషా ఎన్మోనాలిసా, సొన్నాల్దాన్ కాదలా, తన కొడుకు శింబును హీరోగా పరిచయం చేస్తూ కాదల్ అళివదిల్లై వీరాస్వామి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శింబు సినీ ఆర్ట్స్ సంస్థ ద్వారా టీ.రాజేందర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రానికి ఇన్రైయ కాదల్ డా అనే పేరును నిర్ణయించారు. దీనికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టీఆర్‌నే నిర్వహించనున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇందులో నటి నమిత లేడీడాన్‌గా నటించడానికి సమ్మతించారని చెప్పారు. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారన్నారు. పలువురు కొత్తవారిని పరిచయం చేయనున్నట్లు చెప్పారు. వారితో పాటు రాధారవి, ఇళవరసన్, వీటీవీ గణేశ్, వెన్నిరాడై మూర్తి, పాండు, రోబో శంకర్, మదన్‌బాబు, కవన్ జగన్ నటించనున్నారని తెలిపారు. ఇది పూర్తిగా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఉంటుందని, నేటి తరానికి తగ్గట్టుగా ప్రేమ,ప్రేమ,ప్రేమ మినిహా వేరేమీ ఉండదని టీఆర్.పేర్కొన్నారు. మరి ఇలాంటి లవబుల్ కథలో లేడీ డాన్‌గా నమిత పాత్ర ఏమిటో అన్న ఆసక్తి కలుగుతోందా? ఆ వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు. -
రీ–ఎంట్రీకి రెడీ
‘సినిమాలు మానేసే ఆలోచన అస్సలు లేదు’... వీరేంద్రని పెళ్లాడినప్పుడు నమిత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గతేడాది నవంబర్‌లో నమిత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మంచి కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ తన ఆలోచనలకు తగ్గట్టుగా ఓ సినిమా కుదిరిందట. ప్రముఖ తమిళ దర్శకుడు–నటుడు టి. రాజేందర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారట. విశేషం ఏంటంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత టి.రాజేందర్ దర్శకత్వం వహించనున్న చిత్రమిది. ఇటీవల నమితను కలసి కథ చెప్పారట. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. నిజానికి తమిళంలో ఫేమస్ అయ్యే ముందు నమిత తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ అంటే అభిమానం. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తే చేయాలనుందనీ, ముఖ్యంగా చాలెంజింగ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నానని నమిత పేర్కొన్నారు. అన్నట్లు.. నమిత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లయింది. 2016లో చేసిన ‘పులి మురుగన్’ ఆమె చివరి సినిమా. -
వివాహానంతరం తొలి చిత్రం
చెన్నై: సాధారణంగా అందరి జీవితాలు పెళ్లికి ముందు, ఆ తరువాత అన్నట్టుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇందుకు సినిమా వారు అతీతులు కాదు. ముఖ్యంగా కథానాయికల జీవితాల్లో ఈ మార్పు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి అయితే ఇక కథానాయకిగా పనికిరారు అనే పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతోంది. హీరోయిన్ సమంత లాంటి అతి కొద్దిమందే దీన్ని బ్రేక్ చేస్తున్నారు. ఇక నమిత విషయానికి వస్తే ఇంతకుముందు యువకుల డ్రీమ్ గర్ల్. అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే నమిత గత ఏడాది తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొత్త చిత్రమేదీ చేయలేదు. అయితే అంతకు ముందు నటించిన పొట్టు చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. తాజాగా మరో సంచలన చిత్రంలో నటించే అవకాశం నమితను వరించిందనే ప్రచారం జరుగుతోంది. దర్శక నిర్మాత టి.రాజేందర్ సుమారు 11 ఏళ్ల తరువాత చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుందని, ఇందులో నమిత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. నటుడు రాధారవి ప్రముఖ నటులు కొందరు నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ఇతర హీరోలతో కలిసి అన్న, మామ వంటి పాత్రలను చేస్తున్న టి.రాజేందర్ చాలా కాలం తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇక నమిత విషయానికి వస్తే వివాహానంతరం నటించడానికి అంగీకరించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ఈ చిత్రం ఆమె రీఎంట్రీ నట జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది వేచి చూడాలి. -
ఆ దేవుడు నా మాట విన్నాడు : నమిత
తూర్పు పడమరలు ఆపోజిట్. ఈ తూర్పూ పడమరలు అఫెక్షనేట్! సూరత్ అమ్మాయి నమిత.. శ్రీకాకుళం అబ్బాయి వీర.. ఇరు దిక్కుల తమ బాంధవ్యానికినలుదిక్కుల నుంచి ఆశీర్వచనాలు కోరుకుంటున్నారు. ‘నేను సినిమా హీరోయిన్ని.. పెళ్లవుతుందా?’ అని ఆలోచించిన రోజులేమైనా? చాలా ఆలోచించేదాన్ని. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉండేది. మంచి లైఫ్ పార్టనర్ రావాలని కోరుకునేదాన్ని. మాకు బోలెడంత మంది పిల్లలు ఉండాలనుకునే దాన్ని. ఓ అమ్మాయికి ఉండే ‘జెన్యూన్’ ఫీలింగ్స్ ఇవి. నా ఆలోచనల్లో నిజాయితీ ఉంది కాబట్టే ‘వీర’ లాంటి జెన్యూన్ పర్సన్‌ని భర్తగా పొందే అర్హత నాకు ఉందనిపించింది. బోలెడంత మంది పిల్లలు కావాలనే కోరిక ఉందన్నారు. మరి మమ్మీగా ఎప్పుడు ప్రమోషన్? ఆల్రెడీ నా అన్న కూతురికి నేను అమ్మనే. ఇంట్లో ఉన్న పెట్స్‌కి మమ్మీనే. అయితే ఫిజికల్‌గా బర్త్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకని కొంచెం టైమ్ తీసుకోవాలనుకుంటున్నాను. ‘మిస్’ నమిత నుంచి ‘మిసెస్’ నమిత అయ్యాక జీవితం ఎలా ఉంది? చాలా కలర్ఫుల్గా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక మంచి స్పేస్‌లో ఉన్నాననే భరోసా ఏర్పడింది. వీర మీకు మంచి జీవిత భాగస్వామి అవుతారని మీకు ఎప్పుడు అనిపించింది? ఒక అబ్బాయి గురించి ఆలోచించినప్పుడు ‘ఇతను మంచి భర్త మాత్రమే కాదు.. మంచి తండ్రి కూడా అవుతాడు’ అనే ఫీలింగ్ కలిగిందంటే.. అతను మంచి జీవిత భాగస్వామి అవుతాడని నా నమ్మకం. వీరతో పరిచయం నాకా ఫీలింగ్‌ని కలిగించింది. ఏదైనా స్ట్రయిట్ ఫ్రమ్ హార్ట్ మాట్లాడతాడు. డ్రామా యాడ్ చేయడు. చాలా జెన్యూన్ పర్సన్. తన సమక్షంలో ఉన్నప్పుడు ఓ ‘ప్రొటెక్టివ్’ ఫీల్ కలుగుతుంది. ఏ భయమూ లేకుండా మిగతా జీవితాన్ని గడిపేయొచ్చనే నమ్మకం ఏర్పడింది. మా ఇద్దరిదీ ‘సోల్ కనెక్షన్’ అనిపించింది. అందుకే తను ప్రపోజ్ చేయగానే పెళ్లికి ఒప్పుకున్నాను. శ్రీకాకుళం అబ్బాయితో సూరత్ అమ్మాయి పెళ్లి! ఇంట్లోవాళ్లు ఏమీ అనలేదా? జనరల్‌గా కొంతమంది పేరెంట్స్ సినిమాల్లోకి వెళతానంటే ఒప్పుకోరు. కానీ నా పేరెంట్స్ నేనేం చేసినా కాదనలేదు. సినిమాల్లోకి వెళ్తానంటే సపోర్ట్ చేశారు. పెళ్లి గురించి చెప్పినప్పుడూ సపోర్ట్ చేశారు. తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఏడాదికి రెండుసార్లయినా నేను తిరుపతి వెళతాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు బలమైన నమ్మకం. ఆ దేవుడు నా మాటలు వింటాడని నమ్ముతాను. నాకు బెటర్ లైఫ్ ఇస్తాడని నమ్మాను. నిజంగానే అదే జరిగింది. అందుకే ఆ దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వీర కూడా ఓకే అన్నాడు. హీరోయిన్స్‌ని ఆరాధిస్తారు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తారు. సమాజం ఇలా ఉన్నప్పుడు వీర మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం ఎలా అనిపించింది? మీరన్నది కరెక్టే. అయితే అందరూ అలా ఉండరు. వీరలాంటి వాళ్లు కూడా ఉంటారనడానికి మా పెళ్లి ఓ ఎగ్జాంపుల్. అయినా చేసే ప్రొఫెషన్ని బట్టి ఎవరినీ జడ్జ్ చేయకూడదు. వీర, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న ప్పుడు చాలా ఆలోచించాం. ఎందుకంటే జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్లం. ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని తను ప్రపోజ్ చేసినప్పుడు నా కల నిజమైంది అనిపించింది. ‘నో’ చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఎందుకంటే పరిచయమైన ఏడాదికి తను నాకు ప్రపోజ్ చేశాడు. అంటే.. నన్ను అర్థం చేసుకున్నాడనే కదా. ప్రేమ అంటే మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించడమే. మీరు బొద్దుగా ఉంటారు కాబట్టి బరువు తగ్గమని వీర సజెస్ట్ చేశారా? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నదానికన్నా ఓ పది కిలోలు తక్కువగా ఉండేదాన్ని. నాకు నోస్ అలర్జీ ఉండేది. ఎప్పటినుంచో ఉన్నప్పటికీ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పెళ్లికి రెండు నెలల ముందు సీరియస్ అయింది. దాంతో నేను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. వర్కవుట్స్ చేయడానికి కుదిరేది కాదు. వెయిట్ చాలా పెరిగాను. ‘ఇలా అయిపోతున్నాను’ అంటే ‘ఏం ఫర్వాలేదు. పెళ్లి తర్వాత వర్కవుట్స్ చేసి, తగ్గుదువుగాని. లేకపోయినా ఓకే’ అని వీర అన్నాడు. మ్యారేజ్ అయ్యాక వర్కవుట్స్ మొదలుపెట్టాను. నాలుగు కిలోలు తగ్గాను. హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి కాబట్టి నా అంతట నేనే తగ్గడం మొదలుపెట్టాను. మీకు గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ ఉంది. ఇకముందు కూడా ఆ ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తారా? అసలు సినిమాలు కంటిన్యూ చేస్తారా? సినిమాలు మానేయడం ఎందుకండి? పెళ్లయితే జాబ్ మానేయాలని రూలేం లేదు కదా. అలాగే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా ఏ మార్పూ ఉండదు. వీర నన్ను సినిమాలు మానేయమని చెప్పలేదు. క్యారెక్టర్ గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేస్తే నో ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీ ‘సూసైడ్ స్క్వాడ్’లో మార్గెట్ రాబీ చేసిన క్యారెక్టర్ని తీసుకుంటే చాలా గ్లామరస్‌గా ఉంటుంది. సేమ్ టైమ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. మీ అత్తమామల్ని ఏమని పిలుస్తున్నారు.. వీరాగారికి అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఉన్నారా? అత్తయ్యగారూ, మామయ్యగారూ అని పిలుస్తున్నాను. వీరాకి ఒక చెల్లెలు ఉంది. తను నాకు ‘ఆడొపచు’.. ఏంటో సరిగ్గా నోరు తిరగడంలేదు. చిన్నమ్మాయి. పాతికేళ్లు కూడా లేవు. వదినా అంటూ నాతో బాగుంటుంది. ‘ఎఐఎడిఎంకె’ పార్టీలో ఉన్నారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ, తమిళనాడు రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. మీరేమైనా పార్టీ మారాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఎఐఎడిఎంకేలో ఉన్నాను. భవిష్యత్తులో వేరే పార్టీకి మారతానా.. అనేది ఇప్పుడు చెప్పలేను. తమిళనాడులో రాజకీయాల పరిస్థితి అయోమయంగా ఉంది. చూడాలి. మంచి మార్పు రావాలి. ప్రజలకు మేలు జరగాలి. రజనీకాంత్‌గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సీఎం అయితే న్యాయం చేస్తారనుకుంటున్నారా? రజనీకాంత్‌గారు సూపర్ స్టార్. ప్రజల గుండెల్లో బోలెడంత స్థానం సంపాదించుకున్నారు. కానీ, ఆయన రాజకీయాల్లోకి వస్తే న్యాయం చేస్తారా? ఏం చేస్తారు? అనేది ఇప్పుడే చెప్పలేను. జడ్జ్ చేయలేం. ఆడొపచు కాదు.. ఆడపడుచు అంటారు. ఓహ్.. ఆడపడుచు.. ప్రాక్టీస్ చేస్తా. (నవ్వుతూ) మాది ఆత్మబంధం : వీర బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి, నమితకు లవ్ ప్రపోజ్ చేశారట.. ఐడియా బాగుంది! థ్యాంక్స్ అండీ.. 2016 సెప్టెంబర్ 6న మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా నమితకు, నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం. అప్పుడు నమిత ఆలోచనలు, అభిరుచులు తెలిశాయి. ఇలా ప్రపోజ్ చేస్తే తనకు నచ్చుతుందని గ్రహించాను. బేసిక్‌గా నేను రైటర్ని. పొయెటిక్‌గా నా లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నా. కోవలమ్ బీచ్ బెస్ట్ అనిపించింది. ఫస్ట్ టైమ్ లవ్ ప్రపోజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత విపరీతమైన గాలి! దాంతో కుదరలేదు. సెకండ్ టైమ్ వర్షం వచ్చింది. ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. థర్డ్ టైమ్ ప్రకృతి సహకరించింది (నవ్వుతూ). పైగా ఆ రోజు ఫుల్ మూన్ డే. పండు వెన్నెల సాక్షిగా నమితకు ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. 2017 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నాం. నమితగారిలో మీకు నచ్చిన విషయాలేంటి? నేనేదైనా ఓపెన్‌గా మాట్లాడతాను. తనూ అంతే. ఇద్దరి ఆలోచనలూ చాలా క్లియర్‌గా ఉంటాయి. కొన్ని థాట్స్ కలిశాయి. కలిసి జీవించడానికి ఇది చాలనిపించింది. బేసిక్‌గా తను చాలా మంచి అమ్మాయి. మీ ఇద్దరూ లవ్‌లో పడక ముందు వేరేవాళ్లతో లవ్, బ్రేకప్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటి గురించి ఓపెన్‌గా మాట్లాడుకున్నారా? ఓ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆ బ్రేకప్ మీకు నేర్పించిందా? యస్. నేనూ ఒక అమ్మాయిని ప్రేమించాను. విడిపోయాను. నమిత లైఫ్‌లో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్ ఉంది. వాటి గురించి మేం మాట్లాడుకున్నాం. గతం గతః అనుకున్నాం. భవిష్యత్తులో కలిసి నడవాలనుకున్నాం. ఓ బ్రేకప్ మంచి లెసన్ అవుతుంది. ఆ లెసన్ ఇప్పటి బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే క్లారిటీ ఇచ్చింది. జనరల్‌గా గ్లామరస్ ఫీల్డ్‌లో ఉన్న అమ్మాయిలను ఆరాధిస్తారు కానీ ‘మంచి’గా ఆలోచించే మనసు చాలామందికి ఉండదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కూడా... మా ఇంట్లో నా ఇష్టాలను కాదనరు. క్లారిటీతో ఉంటాననే నమ్మకం వాళ్లకు ఉంది. మీరన్నట్లు హీరోయిన్లను అందరూ ఆరాధిస్తారు. కానీ పెళ్లి చేసుకోమంటే ఆ ఆరాధించేవాళ్లే ముందుకు రారు. ‘వాళ్లు అలా అట.. ఇలా అట’ అని ఊహించుకుంటారు. అబ్బాయిల గురించి కూడా అలాగే అనుకుంటారు. కానీ నేనేంటో నమితకు తెలుసు. తనేంటో నాకు తెలుసు. మాది ‘ఆత్మబంధం’. మీరు శ్రీకాకుళం (ఈస్ట్) అబ్బాయి. నమిత వెస్ట్ (సూరత్) అమ్మాయి. ఉంటున్నదేమో చెన్నైలో. మరి.. ఒకరి సంప్రదాయాలకు ఒకరు అలవాటయ్యారా? నమిత ఇప్పుడు సౌత్ అమ్మాయి. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటోంది కాబట్టి, ఇక్కడి సంప్రదాయాలు బాగా తెలుసు. నాకు వాళ్ల ట్రెడిషన్స్ తెలియదు. వాళ్ల సంప్రదాయాలు ఎలా ఉంటాయో పెళ్లప్పుడు కొంచెం తెలిసింది. ఈస్ట్, వెస్ట్.. అండర్ వన్ రూఫ్. మనసులు కలిస్తే చాలండి. భాష, ప్రాంతం అడ్డుకావు. కొత్త అల్లుణ్ణి ఇంటికి పిలుస్తుంటారు అత్తింటివాళ్లు. మిమ్మల్ని పిలిచారా? సూరత్ రమ్మని మా అత్తయ్య, మావయ్య పిలిచారు. కానీ మేం వెళ్లలేదు. బేసిక్‌గా నేనలా ఫార్మాలిటీస్ ఎక్స్పెక్ట్ చేసే అల్లుణ్ణి కాదు (నవ్వుతూ). చెన్నైలో చాలా పనులు ఉండటంవల్ల ఇంకోసారి వెళ్దామనుకున్నాం. మీ అయిష్టాన్ని నమితగారి కోసం ఇష్టంగా మార్చుకున్నది ఏదైనా? నమితకు పిజా, చాక్లెట్స్ ఇష్టం. నాకు అవంటే ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఇష్టంగా మార్చుకున్నాను. చాక్లెట్స్ తింటున్నాను. మీ బ్యాగ్రౌండ్ ఏంటి? మా నాన్నగారు, అంకుల్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండేవారు. నేను ఆర్టిస్ట్‌ని, ప్రొడ్యూసర్ని, రైటర్ని. ఇప్పుడు నేను, నమిత కలిసి ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. మంచి కథలతో వచ్చే కొత్త డైరెక్టర్స్‌కి చాన్స్ ఇవ్వాలనుకుం టున్నాం. అలాగే, డబ్బుండి కూడా సినిమాలు ఎలా తీయాలో తెలియని ప్రొడ్యూసర్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. వాళ్లు ఏ మాత్రం నష్టపోని విధంగా ఓ కాన్సెప్ట్ డిజైన్ చేశాం. సో.. నిర్మాతలను కూడా ఎంకరేజ్ చేద్దామనుకుం టున్నాం. నమిత అండ్ వీరని ట్రస్ట్ చేస్తే చాలు. టాలెంట్ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎలా కలవాలో తెలియకపోతే veera.official∙అనేది నా ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్. దాని ద్వారా సంప్రదించవచ్చు. నమితగారితో కలిసి మీరు యాక్ట్ చేశారా? మేమిద్దరం కలిసి ‘మియా’ అనే మలయాళ సినిమాలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశాం. నేను విడిగా తమిళ్, మలయాళ సినిమాల్లో నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు, నమితగారు కలిసి నటిస్తారా? తప్పకుండా చేయాలని ఉంది. ఓ కాన్సెప్ట్ తయారు చేయించాం. (భర్త వీరతో నమిత ) ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
మలయాళం మాట్లాడతా
సిద్ధార్థ్ తమిళ్ పయ్యన్ (అబ్బాయి). అయితే తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఈజీగా నేర్చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఈ తమిళ కుర్రాడు మలయాళం నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కమ్మార సంభవం’ అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు సిద్ధార్థ్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన సిద్ధూకి మలయాళంలో ఇది మొదటి సినిమా. అందుకని చిత్రదర్శకుడు రితీష్ అంబాతి సిద్ధూ పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారట. కానీ, సిద్ధూ సొంత గొంతు వినిపించడానికి రెడీ అయి, మలయాళం నేర్చుకున్నారు. రితీష్ అంబాతి దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్థ్, నమిత, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘సినిమాలో సిద్ధార్థ్ పోర్షన్ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. బాగా నటించారాయన. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు రితీష్. -
తెలుగు ‘పొట్టు’కు రూ.కోటి
తమిళసినిమా: సినిమా వ్యాపారం, వసూళ్ల గురించి ఇవాళ భిన్న ప్రచారాలు చూస్తున్నాం. స్టార్స్ చిత్రాల వసూళ్లు వంద, రెండొందల కోట్ల క్లబ్లో అంటూ భారీ ప్రచారాలతో ఒక పక్క ఊదరగొడుతుంటే, మరో పక్క చిన్న చిత్రాలకు వ్యాపారం లేదు, డెఫిసిట్ అనే మాట వింటున్నాం. ఏటేటా చిత్రపరిశ్రమ స్లంప్‌ను ఎదుర్కొంటుందనే మాటే అధికంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిత్రం పూర్తిగా వ్యాపారం జరుపుకోవడం అంటే అది వరమే అవుతుంది. పొట్టు చిత్రం ఈ కోవకే చెందుతుందని ఆ చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. షాలోం స్డూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్, జోన్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం పొట్టు. కాగా చిత్రం వివరాలను నిర్మాతలు తెలుపుతూ మనుషుల సాహసాల కంటే దెయ్యాల సాహసాలకే ప్రేక్షకుల నుంచి ఆదరణ అధికంగా ఉంటుందన్నారు. అలాంటి హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపిందిన చిత్రం పొట్టు అని చెప్పారు. ఈ చిత్ర తెలుగు హక్కులను ఎన్కేఆర్ ఫిలింస్ అధినేతలు రూ.కోటికి కొనుగోలు చేశారని తెలిపారు. అక్కడ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఏక కాలంలో అన్ని భాషలలోనూ విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. భరత్ హీరోగా నటించిన ఇందులో ఆయనకు జంటగా నమిత, ఇనియ, సృష్టిడాంగే హీరోయిన్లుగా నటించారు. తంబి రామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్రాం, శాయాజీషిండే, మన్సూర్‌అలీఖాన్, ఆర్యన్, స్వామినాధన్, పావాలక్ష్మణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అమ్రేష్ సంగీతాన్ని, ఇనియన్ హరీష్ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడివుడైయాన్ నిర్వర్తించారు. -
వెంకన్న సేవలో నమిత దంపతులు
-
వెంకన్న సేవలో నమిత దంపతులు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శుక్రవారం తిరుపతిలోని ఇస్కాన్ దేవాలయంలో నమిత, వీరేంద్ర వివాహం ఘనంగా జరిగింది. నమిత దంపతులను చూడటానికి భక్తులు పోటీపడ్డారు. -
శ్రీరస్తు శుభమస్తు
శుక్రవారం ఉదయం సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు నమిత. వేద మంత్రాల సాక్షిగా స్నేహితుడు, ప్రియుడు వీరేంద్ర చౌదరితో ఏడడుగులు వేశారు. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో ఉదయం 5.30 గంటలకు వివాహం జరిగింది. జన్మతః గుజరాతి అయిన నమిత, తమిళ–మలయాళ చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వీరేంద్రలు తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు నటి రాధికా శరత్‌కుమార్ దంపతులు, పలువురు తెలుగు–తమిళ చలన చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. త్వరలో చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారమ్!! -
ఘనంగా హీరోయిన్ నమిత వివాహం
సాక్షి, తిరుపతి : హీరోయిన్ నమిత - వీరేంద్ర చౌదరి వివాహం ఘనంగా జరిగింది. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. తెలుగు సంప్రదాయంలో ఈ వివాహాం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన పలువురు సినీ నటులు హాజరు అయ్యారు. రాధిక, శరత్‌కుమార్ ...వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కాగా గతరాత్రి వీరి సంగీత్ కార్యక్రమం ఓ ప్రయివేట్ హోటల్లో జరిగింది. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్ వీరు... పెళ్లి చేసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితం నమిత ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. నమిత 2002లో ఆర్యన్ రాజేశ్ హీరోగా తెరకెక్కిన ‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నటించింది. తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి, అక్కడ టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్ నమిత- వీరేంద్ర చౌదరి పెళ్ళి చిత్రాలు
-
నమిత పెళ్లి సందడి మొదలైంది!
సాక్షి, సినిమా: దక్షిణాది నటి నమిత ఇంట్లో పెళ్లి వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నెల 24న నమిత, వీరేంద్ర చౌదరీల వివాహం తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల ముందు నమితకు మెహందీ ఫంక్షన్ ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నమిత చేతులకు మెహందీ పెట్టించుకుంటూ దిగిన ఫొటోలకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. మెహందీ ఏర్పాట్లకు ముందు కుటుంబసభ్యులతో కలిసి నమిత డ్యాన్స్ చేసిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. చేతులకు మెహందీ పూర్తయిన తర్వాత నమిత ఆ ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఇటీవల నాకోసం ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోయా..! కానీ మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే కావటం, ఇద్దరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం మమ్మల్ని దగ్గర చేసింది. అంతేకాదు ఇద్దరికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఇద్దరం జంతువులను ప్రేమిస్తాం. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావటంతో నేను నో చెప్పలేకపోయానంటూ' నటుడు, నిర్మాత వీరేంద్రతో తన ప్రేమకథను నటి నమిత అందరికీ వివరించారు. -
నమిత, వీర్ ల ప్రేమకథ
దక్షిణాది నటి నమిత తన సహనటుడు వీర్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న వీరి పెళ్లి వేడుక తిరుపతిలో జరగనుంది. తన పెళ్లి శుభలేఖతో పాటు తన ప్రేమకథను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. 'అందరికీ హాయ్, నేను, వీర్ పెళ్లి చేసుకోబోతున్న విషయం మీ అందరికీ తెలుసనుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ శశిధర్ బాబు ద్వారా గత ఏడాది వీర్ నాకు పరిచయం అయ్యాడు.తరువాత మేం కూడా మంచి స్నేహితులమయ్యాం. సెప్టెంబర్ 6, 2017న ప్రత్యేకంగా నాకోసం ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోయా..! కానీ మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే కావటం, ఇద్దరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం మమ్మల్ని దగ్గర చేసింది. అంతేకాదు ఇద్దరికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఇద్దరం జంతువులను ప్రేమిస్తాం. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావటంతో నేను నో చెప్పలేకపోయా. గత మూడు నెలలుగా వీర్ ను మరింతగా అర్థం చేసుకున్నా. తనతో కలిసుండటం అధృష్టంగా భావిస్తున్నా. మాకు మద్ధతుగా నిలిచి వారందరికీ కృతజ్ఞతలు'. అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది నమిత. -
పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లండీ!
ఆల్రెడీ మీరు విన్నారనుకుంటున్నా! తిరుపతిలో ఈ నెల 24న వీర (వీరేంద్ర), నేను ఏడడుగులు వేయబోతున్నాం. వీర ఎవరు? అంటే... హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ సోల్‌మేట్. అతనేం చేస్తాడు? అంటే... నిర్మాత. నటుడు కూడా. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లండీ’’ అని నమిత చెప్పారు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ తదితర చిత్రాల ద్వారా సుపరిచితురాలైన ఈ సూరత్ సుందరి ఆ తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా తన పెళ్లి తేదీ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. మరిన్ని విశేషాలను నమిత చెబుతూ – ‘‘గతేడాది సెప్టెంబర్‌లో మా ఇద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ అయిన శశిధర్‌బాబు మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేశాడు. మెల్లగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ ఏడాది సెప్టెంబర్ 6న నన్నొక బీచ్‌కి తీసుకెళ్లాడు వీర. అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎరేంజ్ చేశాడు. మాటల మధ్యలో చాలా రొమాంటిక్‌గా పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. నేను అసలు ఊహించలేదు. ఫుల్ ఫిదా. వెంటనే ‘యస్’ చెప్పేశా. వీర ప్రేమను అంగీకరించడానికి కారణం మా ఇద్దరి ఆలోచనలూ కలవడమే. మా ఇద్దరికీ దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. మా జీవిత లక్ష్యాలు ఇంచుమించు ఒక్కటే. ట్రావెలింగ్... ముఖ్యంగా ట్రెక్కింగ్ అండ్ నేచర్ అంటే ఇద్దరికీ ప్రేమ. ఇద్దరికీ మూగజీవాలంటే ఇష్టం. లైఫ్ అంటే ఎంతో ప్రేమ. నేనే సర్వస్వం అనుకునే వ్యక్తి లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. మూడు నెలలుగా అతణ్ణి (వీర) మరింత అర్థం చేసుకున్నా. అప్పుడు నేనింకా లక్కీ అనుకున్నా. వీర నాపై చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యం, నాకిస్తున్న మద్దతు, అతని హుందాతనం మగవారిపై నా నమ్మకాన్ని మళ్లీ పెంచాయి. మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ’’ అన్నారు. -
ఆయన ఎవరో కూడా తెలియదు..!
సీనియర్ నటుడు శరత్ బాబు, ప్రముఖ నటి నమిత పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మధ్య వదంతులు గుప్పుమన్న సంగతి తెలిసిందే. శరత్‌బాబు-నమిత సహజీవనం చేస్తున్నారంటూ చెలరేగిన రూమర్లు కలకలం రేపాయి. ఇప్పటికే శరత్‌బాబు ఈ రూమర్‌ను కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా నమిత కూడా ఇది వదంతి అని తేల్చేశారు. తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న అనంతరం స్వరాష్ట్రం గుజరాత్ వెళ్లిపోయిన ఆమె.. తాజాగా శరత్‌బాబుతో పెళ్లి రూమర్లపై స్పందించినట్టు తెలుస్తోంది. 'శరత్ బాబు ఎవరో నాకు సరిగ్గా తెలియదు. రూమర్లు వచ్చిన తర్వాత ఆయన గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. నాకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని నేనెలా పెళ్లి చేసుకుంటాను. ఈ వార్త పూర్తి అబద్ధం. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు' అని నమిత పేర్కొన్నట్టు సమాచారం. నమితతో శరత్‌బాబు పెళ్లి అంటూ ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇది నిజమా?’ అని శరత్‌బాబుకి గతంలో ‘సాక్షి’ ఫోన్ చేస్తే, గట్టిగా నవ్వేశారు. రెండు మూడేళ్ల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ‘పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెబుతా’ అన్నారు అంటే, ‘ఆ మాటే ఇప్పుడూ అంటున్నా. తప్పకుండా చెబుతా’ అన్నారు. మరి.. నమితతో ప్రేమ, పెళ్లి అనే వార్త గురించి ఏమంటారు? అని శరత్‌బాబుని అడిగితే.. ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే అదంత పెద్ద టాపిక్ కాదు... ఎందుకంటే రావణాసురుడు అలానే చేస్తాడని ఓ క్లారిటీ ఉంది. రాముడు శూర్పణఖను ఎత్తుకుపోయాడంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. రాముడికి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, ‘అలా చేసాడా’ అని వింతగా చెప్పుకుంటారు. ఎప్పుడైనాసరే క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ల గురించి ఏదైనా కథ అల్లి చెబితే, దానికి వచ్చే క్రేజే వేరే. ఇప్పుడు అలానే జరిగింది. రాసిందెవరో కానీ, ఆ వ్యక్తి అంటే నాకే మాత్రం కోపం లేదు. ఒకవేళ రాసింది మేల్ జర్నలిస్ట్ అయితే, అతనికి పెళ్లయ్యుంటే భార్యాపిల్లలను పోషించుకోవడం కోసం ఏదో వార్త రాసాడని సరిపెట్టుకుంటా. ఆ విధంగా అతనికి ఉపయోగపడినందుకు ఆనందపడుతున్నా. ఒకవేళ ఫీమేల్ జర్నలిస్ట్ అయితే, నా వార్త రాసి, లాభపడినందుకు ‘ఐయామ్ హ్యాపీ’. నిజంగా సెలబ్రిటీలు గ్రేట్ అండి. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇలా ఏదేదో ఊహించేసి, రాసుకోవడానికి ఉపయోగపడతారు’’ అంటూ శరత్‌బాబు గతంలో ఈ పుకారుకు ఫుల్స్టాప్ పెట్టేశారు. -
శరత్‌బాబుతో నమిత పెళ్లి?
ఎల్లా! నమితతో శరత్‌బాబు పెళ్లా? అని శుక్రవారం ఒకటే చర్చ. ఇద్దరూ లవ్‌లో ఉన్నారట అని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన వార్త కాసేపు బాగానే షికారు చేసింది. కలిసి పని చేస్తున్న ఓ హీరో–హీరోయిన్ మధ్య ఎఫైర్ ఉందనే వార్త వస్తే... అందులో ఎంతో కొంత నిజం ఉంటుందనే అనుమానం రాక మానదు. నమిత ఉంటున్నది చెన్నైలో. శరత్‌బాబు ఇటు హైదరాబాద్ అటు చెన్నై.. బెంగళూరుల్లో ఉంటుంటారు. అఫ్కోర్స్ షూటింగ్స్ ఉన్నప్పుడు వేరే ప్లేసులకు కూడా వెళతారనుకోండి. ఆ సంగతి పక్కన పెట్టి ‘పెళ్లి న్యూస్’కి వచ్చేద్దాం. ‘ ఇది నిజమా?’ అని శరత్‌బాబుకి ‘సాక్షి’ ఫోన్ చేస్తే, గట్టిగా నవ్వేశారు. రెండు మూడేళ్ల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ‘పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెబుతా’ అన్నారు అంటే, ‘ఆ మాటే ఇప్పుడూ అంటున్నా. తప్పకుండా చెబుతా’ అన్నారు. మరి.. నమితతో ప్రేమ, పెళ్లి అనే వార్త గురించి ఏమంటారు? అని శరత్‌బాబుని అడిగితే – ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే అదంత పెద్ద టాపిక్ కాదు... ఎందుకంటే రావణాసురుడు అలానే చేస్తాడని ఓ క్లారిటీ ఉంది. రాముడు శూర్పణఖను ఎత్తుకుపోయాడంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. రాముడికి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, ‘అలా చేసాడా’ అని వింతగా చెప్పుకుంటారు. ఎప్పుడైనాసరే క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ల గురించి ఏదైనా కథ అల్లి చెబితే, దానికి వచ్చే క్రేజే వేరే. ఇప్పుడు అలానే జరిగింది. రాసిందెవరో కానీ, ఆ వ్యక్తి అంటే నాకే మాత్రం కోపం లేదు. ఒకవేళ రాసింది మేల్ జర్నలిస్ట్ అయితే, అతనికి పెళ్లయ్యుంటే భార్యాపిల్లలను పోషించుకోవడం కోసం ఏదో వార్త రాసాడని సరిపెట్టుకుంటా. ఆ విధంగా అతనికి ఉపయోగపడినందుకు ఆనందపడుతున్నా. ఒకవేళ ఫీమేల్ జర్నలిస్ట్ అయితే, నా వార్త రాసి, లాభపడినందుకు ‘ఐయామ్ హ్యాపీ’. నిజంగా సెలబ్రిటీలు గ్రేట్ అండి. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇలా ఏదేదో ఊహించేసి, రాసుకోవడానికి ఉపయోగపడతారు’’ అన్నారు శరత్‌బాబు. సో.. ఈ పుకారు షికారుకి ఫుల్స్టాప్ పడిపోతుంది కదూ. నమితని చూసి ఎనిమిదేళ్లయింది ‘‘నమితను చూసి, దగ్గర దగ్గర ఎనిమిదేళ్లయింది. అప్పుడెప్పుడో ఓ తమిళ సినిమాలో మేమిద్దరం నటించాం. పేరు కూడా సరిగ్గా గుర్తు లేదు. ఇప్పుడు తనెక్కడ ఉందో కూడా తెలియదు. సడన్‌గా మా గురించి ఇలాంటి ఓ ప్రచారం మొదలు కాగానే నా ఫ్రెండ్స్ అంతా ‘యు స్టిల్ క్యారీ ది రొమాంటిక్ ఇమేజ్’ అని నవ్వారు. నేనూ హాయిగా నవ్వుకున్నా. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... శుక్రవారం నా గురించి వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అది నూటికి నూరు పాళ్లు అబద్ధం’’ అన్నారు శరత్‌బాబు. -
దెయ్యం ఇంట్లో చిక్కుకున్న నటి !
మచ్చాన్ అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే అందాల భామ నమిత చాలా గ్యాప్ తరువాత కథానాయకిగా నటించిన చిత్రం మియా. ఈ స్టూడియో పతాకంపై మిన్రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాథ్యూ, ఆర్ఎన్.రవి ద్వయం దర్శకత్వం వహించారు. ఈ దర్శక ద్వయం స్పీడ్ అనే మలయాళ చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందారన్నది గమనార్హం. ఈ మియా చిత్రంలో నమితతో పాటు నటి సోనియా అగర్వాల్, వీరా, బేబి ఇలా ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి రెజమోన్ సంగీతాన్ని, రవిస్వామి ఛాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శక ద్వయం తెలుపుతూ ఇది హర్రర్ ఇతి వృత్తంతో తెరకిక్కించిన కథా చిత్రం అని తెలిపారు. అయితే ఇందులో దెయ్యం భయపెట్టడంగానీ, బాధించడంగానీ జరగదన్నారు. ఇందులో భార్యాభర్తల మధ్య మనస్పర్థలే ప్రధాన ఇతివృత్తం అన్నారు. కథానాయకి నమితకు ఆమె భర్తకు మధ్య భేదాబిప్రాయాలు ఏర్పడతాయన్నారు. అలాంటి సమయంలో ఒక దెయ్యం ఇంట్లో చిక్కుకున్న నమిత ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన మియా చిత్ర షూటింగ్‌ను కేరళ, తిరువనంతపురం, థాయిల్యాండ్‌లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆటోరాణితో కలలరాణి సెల్ఫీ
చెన్నై: ఆటోరాణితో కలలరాణి సెల్ఫీ ఫోటో మీడియాలో హల్చల్ చేస్తోంది. యువత కలలరాణి నటి నమిత అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అన్న సామెత ఉంది. అదే విధంగా నమిత ఇప్పుడు అధికంగా తెరపై కనిపించకపోయినా సినీ జనాలేకాదు, సాధారణ ప్రజల్లోనూ ఆమె క్రేజే వేరు. ఇప్పటికీ ఏ నూతన షాపు ప్రారంభోత్సవానికి వెళ్లినా నమిత చుట్టూ జనం తొక్కిసలాట జరగాల్సిందే. అందుకు తగ్గట్టుగానే ఆ ముద్దుగుమ్మ ప్రవర్తన ఉంటుంది. అందుకు గురువారం జరిగిన ఒక సంఘటనను ఒక చిన్న ఉదాహరణగా పేర్కొనవచ్చు. విషయం ఏమిటంటే నమిత గురువారం స్థానిక నెల్సన్‌మాణిక్యం రోడ్డులో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో అటుగా ఒక మహిళ ఆటో నడుపుకుంటూ రావడం నమిత కంటపడింది. అంతే వెంటనే తన కారు ఆపి కిందకు దిగి ఆ మహిళా ఆటోడ్రైవర్‌ను కలిసి ఆమెతో టక్కున సెల్ఫీలు దిగారు. ఈ ఊహించని పరిణామానికి ఆ మహిళా ఆటోడ్రైవర్ విస్మయానికి గురైంది. ఆనక తెరుకుని, మీరు తనతో ఫోటో దిగడం అన్నది నిజమా?కలా? అని నమితను అడిగింది. జీవితంలో నమ్మశక్యం కానిదేదీ లేదనీ, నమ్మకమే ప్రదానం అని నమిత ఆమెతో జీవిత సత్యాన్ని వివరించారు. ఆ మహిళ పేరు ధనలక్ష్మీ అని తెలుసుకుని కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న నీకు సెల్యూట్ అంటూ ఆమెకు బూస్ట్ తాగితే కలిగేంత శక్తిని ఉత్సాహాన్ని కలిగించి అక్కడ నుంచి బయలు దేరారు. నటి నమితా మజాకా! -
పొంబళ... అంటే ఏంటి?
‘అనామిక’, ‘మాయ’ తర్వాత నయనతార నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘దొర’. ఇది కాకుండా కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో చిత్రంలో నటిస్తున్నారామె. తాజాగా మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘పొంబళ’ పేరుతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు బాలకుమార్ తెరకెక్కించనున్నారట. ఇందులో ఓ కీలక పాత్రను నమిత చేయనున్నారని సమాచారం. 2007లో రూపొందిన తమిళ ‘బిల్లా’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ‘పొంబళ’లో కలసి నటించనున్నారన్న మాట. అవునూ.. ఇంతకీ ‘పొంబళ’ అంటే ఏంటో తెలుసా? ‘మహిళ’ అని అర్థం. -
శ్రీవారి సేవలో నటి నమిత
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తమిళ, తెలుగు నటి, అన్నాడీఎంకే నాయకురాలు నమిత తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, ఇస్రో డెరైక్టర్ వి.జయరామన్, డీఐజీ ప్రభాకర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
తమిళనాట అమ్మే గెలుస్తుంది : నమిత
సాక్షి,తిరుమల: తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ అమ్మ (జయలలిత) గె లుస్తుందని నటి నమిత ఆకాంక్షించారు. మంగళవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మ గెలవాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. కచ్చితంగా అమ్మే గెలుస్తుందని విజయానికి సంకేతంగా తన వేళ్లను నవ్వుతూ చూపిస్తూ స్పష్టం చేశారు. -
అమ్మకు నమిత లేఖ
అన్నాడీఎంకేలో నమిత జయలలితకు లేఖ చెన్నై : తమిళనాడు చట్టసభ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి.పోలింగ్‌కు మరో మూడు వారాలు మాత్రమే ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పంచమేఖ పోటీ జరగనుంది. ఈ సారి ఎన్నికల ఉత్కంఠ భరితంగా సాగనుందని చెప్పవచ్చు. గెలుపెవరిదన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే అందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలతో పోరుకు సిద్ధమయ్యాయి. ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ అవకాశాన్ని సినీ తారలు సద్వినియోగం చేసుకోవడానికి శ్రాయశక్తుల ప్రయత్నిస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకు వారు తమ సినీగ్లామర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అవకాశం ఉన్న పార్టీల్లో చేరి తమ రాజకీయ భవిష్యత్‌కు పునాదులు వేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారని చెప్పవచ్చు. సరిగ్గా నటి నమిత ఇప్పుడు అలాంటి ప్రయత్నానికే శ్రీకారం చుట్టారు. ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ సూరజ్ బ్యూటీ ఆ తరువాత మహానడిగర్, ఏయ్, చాణక్య చిత్రాల్లో నటించారు. తమిళంతో పాటు తెలుగు,కన్నడం వంటి ఇతర భాషల్లోనూ నటించిన నమిత అభిమానుల కలల రాణిగా పేరు తెచ్చుకున్నారు. అభిమానుల్ని మచ్చా(బావ) అంటూ ముద్దు ముద్దుగా పలకరిస్తూ వారి గుండెల్ని గుల్ల చేసే నమితకు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. త్వరలో రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రకటించిన ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు అన్నంత పని చేయడానికి సిద్ధమయ్యారు. తన రాజకీయ తెరంగేట్రానికి ఇదే సరైన సమయం అని భావించిన నమిత అన్నాడీఎంకే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అమ్మకు లేఖ ఈ మేరకు నమిత అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఒక లేఖ రాశారు.అందులో ఆమె పేర్కొంటూ నమితనైన నేను తమిళ చిత్రపరిశ్రమలో నటిగా కొనసాగుతున్నాను.మీ రాజకీయ దక్షత, నిర్వాహణ, పార్టీ విధివిధానాలు తమిళనాడును భారతదేశ చిత్రపటంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. గొప్ప రాజకీయనాయకురాలిగా రాణిస్తున్న మీ సారథ్యంలో చేరి నా వంతు సేవ చేయాలని ఆశపడుతున్నాను. మీ నేతృత్వంలో నన్ను సభ్యురాలిగా చేర్చుకోవాలని కోరుకుంటున్నాను అని నమిత తన మనోభావాన్ని వ్యక్తం చేశారు.మరి అమ్మ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
లేడీ అఘోరా!
వెండితెరపై నమిత కనిపించి దాదాపు నాలుగైదేళ్లు అయిపోయింది. ఈ బ్రేక్‌కి కారణం నమిత బరువు అని చెప్పొచ్చు. బొద్దుగా ఉన్నప్పుడు నమిత బాగానే ఉన్నా.. ఆ బొద్దు హద్దు దాటడంతో అవకాశాలు తగ్గాయి. అందుకే నమిత తగ్గారు. వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుని, తగ్గిన నమిత ఆ మధ్య ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈవిడగార్ని చూసినవాళ్లందరూ ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని కితాబులిచ్చేశారు. ఇప్పుడు నమితకు అవకాశాలు కూడా మొదలయ్యాయి. ఇన్నేళ్ల విరామం తర్వాత ఆమె అంగీకరించిన మొదటి చిత్రం ‘పొట్టు’. ఇప్పటి వరకూ నమితను గ్లామరస్‌గా చూశాం. ఈ తమిళ చిత్రంలో ‘లేడీ అఘోరా’గా ఆమెను చూడనున్నాం. ఇది హారర్ మూవీ. వడివుడయన్ దర్శకత్వంలో నమిత, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, ఇనియా కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ, పాత్ర నచ్చి నమిత అంగీకరించారు. ఇందులో నమిత చుట్ట తాగుతారట. ‘‘నిజజీవితంలో నేను చుట్ట తాగను. అందుకని, ఈ సినిమాలో నేను వాడే సిగార్‌లో బొగ్గు పొడి నింపారు. దాన్నే కాలుస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను’’ అని నమిత పేర్కొన్నారు. ఈ అందాల అఘోరా పాత్ర కోసం నమిత బ్లాక్ మేకప్ వేసుకుంటున్నారు. సో.. ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో తెల్లని నమితను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు బ్లాక్ బ్యూటీని చూడనున్నారన్నమాట. -
ప్రేమ చాలు పెళ్లొద్దు
ప్రేమ చాలు.పెళ్లి అవసరం లేదు అంటున్నారు నటి నమిత. 2003లో ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్లోకి దిగుమతి అయిన సూరజ్ బ్యూటీ నమిత. 13 ఏళ్లుగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, గుజరాతీ, ఆంగ్లం మొదలగు ఆరు భాషల్లో నటిస్తూ అశేష ప్రేక్షకులను తన అందచందాలతో అలరిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ 45 చిత్రాల్లో నటించిన నమిత అన్నిటిలోనూ అధికంగా అందాలనే ప్రదర్శిస్తూ అభిమానుల కలల రాణిగా వారిని గిలిగింతలు పెట్టించారు. చిన్న గ్యాప్ తరువాత కొత్త అందాలతో వినూత్న కథాపాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. పొట్టు అనే చిత్రంలో అఘోరిగా నటిస్తున్నారు. భరత్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.ఈ సందర్భంగా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఈ తరం కథానాయికలతో పోటీగా తయారైన నమిత ఏమన్నారో చూద్దాం. 13 ఏళ్లుగా నా మచ్చాన్గళ్( అభిమానులు) నా గ్లామర్‌ను ఆస్వాదిస్తూ వస్తున్నారు.అయితే తినగ తినగ గారెలు చేదైనట్లు ఎప్పుడూ బిరియానీ తిన్నా మొఖంమొత్తడం ఖాయం.అందుకే విభిన్న పాత్రలు పోషించాలని కోరుకున్నాను. అలాంటి పాత్రను పొట్టు చిత్రంలో పోషించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నా శరీర చాయను నల్లగా మార్చుకుని నటించనున్నాను. ఇందుకోసం దుబాయ్ వెళ్లి ఒంటి రంగును మార్చుకోనున్నాను. అది మూడు నెలల వరకూ ఉంటుంది. ఆ తరువాత మళ్లీ అసలు రంగు వచ్చేస్తుంది.నేను కష్టపడాల్సిన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో తరసు చుట్టలు తాగాల్సి ఉంది.నా అభిమానులతో తరచూ ట్విట్టర్లో మాట్లాడుతూ ఉంటాను. వారిలో చాలా మంది నన్ను పేమిస్తున్నానని అంటుంటారు. అలా వారి ప్రేమ చాలు.పెళ్లి అవసరం లేదు. జీవితాంతం నటిగానే కొనసాగాలను కుంటున్నాను.అందుకే 86 కేజీల బరువు పెరిగిన నేను ఇప్పుడు 73 కేజీలకు తగ్గాను. ఇంకా ఎనిమిది కేజీలు తగ్గుతాను. సాధారణంగా నాకు దెయ్యాలంటే భయం లేదు. దెయ్యం ఇతి వృత్తంతో కూడిన పొట్టు చిత్రంలో నటించనుండడం థ్రిల్లింగ్‌గా ఉంది. -
ఎన్నో చేశా... వర్కవుట్ కాలేదు!
నమిత ఎక్కడ? కొన్ని నెలలుగా చెన్నయ్‌లో జరిగిన చర్చ ఇది. బాగా లావయ్యారు కాబట్టి, సినిమా అవకాశాలు లేక సొంత ఊరు సూరత్ వెళ్లిపోయారని చాలామంది ఊహించారు. ఆ ఊహలకు ఫుల్స్టాప్ పెడుతూ, నమిత హఠాత్తుగా మీడియా ముందుకొచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా బాగా సన్నబడిపోయారు. మూడు నెలల్లో 18 కిలోలు బరువు తగ్గానని తెలిపారు. అంతకు ముందు బరువు పెరగడానికి కారణం డిప్రెషన్లోకి వెళ్లడమే అని స్పష్టం చేశారు. కానీ, డిప్రెషన్‌కి ఎందుకు గురయ్యారో చెప్పలేదు. ఆ డిప్రెషన్ కారణంగా బాగా తినేదాన్ననీ, అందుకే లావయ్యాననీ తెలిపారు. సన్నబడడానికి ఎన్నో చేశాననీ, వర్కవుట్ కాలేదనీ వివరించారు. ‘సాక్షి వెల్నెస్’ అనే క్లినిక్ వారి సహాయంతో ఇలా సన్నబడ్డానని నమిత పేర్కొన్నారు. ఇక, సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా? అని ఓ విలేకరి అడిగితే... పలు రాజకీయ పార్టీలు ఆహ్వానించాయనీ, పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యే ఉద్దేశం ఉందనీ తెలిపారు. -
స్థూలకాయంతో బాధపడ్డా!
స్థూలకాయంతో చాలా చింతించాను. అవకాశాలకు దూరం అయ్యాను. బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా ప్రయోజనం లేకపోయింది. చాలా మనస్తాపానికి గురయ్యాను. అలాంటిది 90 కేజీల వరకు బరువు కలిగిన నేను ఇప్పుడు 20 కేజీలు తగ్గాను అన్నారు నటి నమిత. ఈ బ్యూటీకి యూత్‌లో ఉన్నత క్రేజ్ ఏ హీరోయిన్‌కు ఉండదనడం అతిశయోక్తి కాదు. మచ్చాన్ (బావలు) అని ఒక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు కుర్రకారు గుండెలు గుల్లలైపోతాయి. అలాంటి నమిత వెండితెరకు దూరం అయి చాలా కాలమే అయ్యింది. కారణం విపరీతంగా పెరిగిన ఆమె బరువే. అయితే తాజాగా నమిత అభిమానులకు శుభవార్త ఏమిటంటే నాటి నమితలా నాజుగ్గా తయారై తెరపైకి త్వరలోనే రానున్నారు. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ స్థూలకాయంతో చాలా అవస్థలు పడ్డాను. తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. అలా విసిగి వేసారి పోయిన తరుణంలో సాక్షి వెల్నస్ గురించి నిర్మాత సురేష్ కామాక్షి తెలుసుకున్నా. నమ్మకం లేకపోయినా బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా పెద్ద పోరాటమే చేశాను. మరోసారి ప్రయత్నిస్తే పోయేదేముందని సాక్షి వెల్నెస్కు వెళ్లాను. అక్కడ తొలి ప్రయత్నంగా కిలోన్నర బరువు తగ్గాను. కాస్త నమ్మకం కలిగింది. వారి శిక్షణ కారణంగా ఇప్పుడు 20 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాను. మళ్లీ నటిస్తారా? అని అడుగుతున్నారు. నటించడానికే ఇంత నాజుగ్గా తయారైంది ప్రస్తుతం కథలు వింటున్నాను. త్వరలోనే కొత్త చిత్రం గురించి వెల్లడిస్తాను. యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది. అలాగే రాజకీయరంగ ప్రవేశం గురించిన ఆలోచన ఉంది. చాలా పార్టీల వారు ఆహ్వానిస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు చెప్పలేనని నమిత పేర్కొన్నారు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన
హైదరాబాద్ : తమపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ - జవహర్కాలనీలో నివాసముంటున్న మొనాలిసా అనే హిజ్రా బోనాల పండుగ రోజున మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. తనపై నమిత అనే మరో హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చిందని మొనాలిసా భావించింది. ఆ క్రమంలో నమితపై మోనాలిసా గురువారం రాత్రి రౌడీలతో దాడి చేయించింది. ఈ దాడిలో నమిత చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయంపై గత మూడు రోజులుగా ముగ్గురు హిజ్రాలను రౌడీలు కిడ్నాప్ చేసి బాలానగర్‌లో ఓ గదిలో ఉంచి తీవ్రంగా హింసించారు. ఈ నేపథ్యంలో హిజ్రాలు బంజారాహిల్స్ పీఎస్‌కు చేరుకుని మొనాలిసాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వినాయకుని సన్నిధిలో నమిత
ఐరాల: సినీనటి నమిత గురువారం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ ఆలయ ఏఈవో చిట్టెమ్మ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. సూపరింటెండెంట్ రవీంద్ర, ఇన్స్పెక్టర్లు మునిరత్నం, చిట్టిబాబు పాల్గొన్నారు. -
నన్నే టార్గెట్ చేస్తున్నారు
విజయాలుంటేనే ఫామ్‌లో ఉండే హీరోయిన్లు కొందరు, అసలు అవకాశాలు లేకపోయినా క్రేజ్‌లో ఉంటారు అతి కొద్దిమంది నాయికలు. ఈ రెండో కోవకు చెందిన నటి నమిత. ఇంతకుముం దు ఆ బాలగోపాలాన్ని ఉర్రూత లూగించిన ఈ బ్యూ టీ ఆ మధ్య తెలుగు చిత్రం సింహాతో కూడా అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అంటూ బాలకృష్ణతో స్టెప్స్‌వేసి యువత గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రస్తుతం అవకాశాలు అంతగా లేకపోయినా ఏ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు. ఆమెకంత క్రేజ్ మరి. అలాంటి నమితను మీడియా టార్గెట్ చేస్తోందని ఆమె వాదన. ఇటీవల అవకాశాలు తగ్గితే వివాహానికి సిద్ధమని నమిత అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే సమాజ సేవకు పాటు పడాలనుకుంటున్నానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా సూరత్‌లో జరగనున్న ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి నమిత అంగీకరించినట్లు అందుకు ఆమె డాన్స్ రిహార్సిల్స్ కూడా చేసుకున్నట్లు, సూరత్‌కు పయనమయ్యే సమయంలో పారితోషికం తీసుకు రావలసిన మేనేజర్ ఆ డబ్బుతో పరారై నట్లు ప్రచారం మొదలైంది. అయితే ఈ అంశాన్ని నమిత ఖండించింది. తానెలాంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించలేదని తనపై ప్రచారంలో ఉన్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. ఇలా తననే టార్గెట్ చేసి ఇలా అసత్య ప్రచారం ఎవరు? ఎందుకు? చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్లామర్ క్వీన్ నమిత వాపోతున్నారు. -
సీబీఐ ఆఫీసర్‌గా...
కొంత విరామం తర్వాత మళ్లీ నమిత తెలుగు తెరపై కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఘని’ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిత్ర ఉపశీర్షిక ‘గాడ్సే కాదు’. టైటిల్ రోల్ పోషిస్తూ అదీబ్ నజీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నమిత శక్తిమంతమైన సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశంతో, దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కొన్ని యథార్థ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. నమిత పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. షఫీ, వైభవ్ సూర్య, మనీషా పిళ్లే, నంద హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీఐ పాత్రను బెనర్జీ పోషిస్తున్నారు. -
సున్నితంగా తిరస్కరించింది!!
-
కచేరీకి నమిత డుమ్మా
నటి నమిత సినిమాకు దూరం అయినా ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమా లు ఆమెను స్వాగతిస్తూనే ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు నమిత క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ మధ్య ఒక నాటక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్లి అభిమానుల అత్యుత్సాహం తో ఆ రంగస్థలమే కూలిపోవడంతో భయపడిన నమిత అభిమానులను నిరాశపరచి అటు నుంచి అటే ఇంటిముఖం పట్టారు. తాజాగా నామక్కల్‌లో నమితతో ఆటపాట మీలో ఎవరు లారెన్స్ అనే పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు కార్యక్రమం మొదలైంది. వేలమంది తిలకించడానికి హాజరయ్యారు. రాత్రి 10 గంటలకు మిమిక్రీ ఆర్టిస్ట్ మదురై ముత్తు స్టేజిమీద కొచ్చి నటి నమిత అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని తెలిపారు. దీంతో నమితతో ఆడాలని ఆశగా టికెట్ కొన్న వారితో పాటు అభిమానులు ఆవేశంతో వీరంగం సృష్టించారు. స్టేజ్‌పై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు అక్కడికి వచ్చి లాఠీ చార్జ్ చేశారు. దీంతో నమిత పేరు చెప్పి తమను మోసం చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నటి నమితకు తప్పిన ప్రమాదం
నటి నమిత నామక్కల్ సమీపంలో జరిగిన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి గ్రామంలోని భగవతి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నామక్కల్ యువ నాటక సంఘం ఆధ్వర్యంలో మణ వాళ్కై అనే నాటకాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ నాటకాన్ని ప్రారంభించడానికి చెన్నై నుంచి నటి నమిత, దర్శక నటుడు కె.భాగ్యరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి నమిత వస్తున్నారని తెలియడంతో ఆ గ్రామ ప్రజలతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది. సరిగ్గా రాత్రి 9.30 గంటలకు నటి నమిత నాటకాన్ని ప్రారంభించడానికి స్టేజ్‌పైకి వచ్చారు. జనాల కేరింతలతో స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జనం తోపులాటతో స్టేజ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే నిర్వాహకులు నటి నమితను స్టేజీపై నుంచి సురక్షితంగా కిందికి దించి పక్కనున్న ఇంటికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌ల హడావుడి: నటి నమిత ప్రమాదంలో గాయపడ్డారన్న ప్రచారంతో నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న మూడు అంబులెన్స్‌లు హుటాహుటిన భగవతి ఆలయం వద్దకు చేరుకున్నాయి. నటి నమితను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పోటీపడ్డాయి. అయితే నమిత తనకెలాంటి గాయాలు అవ్వలేదని చెప్పడంతో అంబులెన్స్‌లు తిరిగి వెళ్లిపోయాయి. జనం మాత్రం నమితను చూడడానికి గుమికూడారు. అనంతరం భగవతి ఆలయం ముందు కొత్తగా మరో స్టేజ్‌ను ఏర్పాటు చేసి నాటకాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులు నమితను కోరగా ఆమె నిరాకరించారు. చివరికి దర్శకుడు కె.భాగ్యరాజ్ నాటకాన్ని ప్రారంభించారు. మంగళవారం వేకువ జామున నమిత, భాగ్యరాజ్ కారులో చెన్నైకి చేరుకున్నారు. -
నమిత నటనకు స్వస్తి చెప్పాలి
నటి నమిత చిత్రరంగానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పి వెళ్లిపోవాలంటూ బహిరంగ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు వర్దమాన నటి నిత్య. త్వరలో తాను రాజకీయ ప్రవేశం చేయనున్నానని, మూడు పార్టీల నుంచి ఆహ్వానం అం దిందంటూ నమిత ఇటీవల పేర్కొన్న విషయం తెలి సిందే. ఎన్నికల బరిలోకి అనేక మంది తారలు వెంటనే దిగినప్పటికీ నమిత మాత్రం తాను ఏ పార్టీలో చేరనున్నదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘సాయిందాడు సాయిం దాడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు నటి నిత్య. పుదుక్కోట్టైలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారు. అక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ నమిత నటనకు స్వస్తి చెప్పాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెబుతున్న ఆమె ఇంకా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీరు ఈ విధంగా మాట్లాడడం నమితకు తెలిస్తే కోప్పడుతుందిగా అంటూ మీడియా రెచ్చగొట్టగా, తనను ఒకసారి నేరుగా చూస్తే ఆమెకు కోపం రాదని, ఎందుకంటే తనను అందరూ ‘చిన్న నమిత’ అంటూ ముద్దు గా పిలుస్తున్నారని తెలిపారు. చివరిగా నమితను నేరుగా చూడాలన్న ఆసక్తితో ఉన్నానంటూ సమాధానమిచ్చారు. -
నమితానందం
సంతోషాలు వెల్లివిరిసే పర్వదినం సంక్రాంతి. ప్రతి లోగిలి రంగవళ్లులతో కళకళలాడుతుంది. ప్రతి కుటుంబం తప్పనిసరిగా జరుపుకుని ఆనందానుభూతుల్ని పొం దే పండుగ సంక్రాంతి. తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) పండుగను అత్యంత విశేషంగా జరుపుకుంటారు. అలాంటి వేడుకల్లో అందాల తార నమిత మెరిస్తే ఇక ఆ ఆనందానికి అంతు ఉంటుం దా?. సరిగ్గా అలాంటి సంతోషాలు విరబూసిన కార్యక్రమం చెన్నై ఓల్డ్ మహా బలిపురం రోడ్డులోని ఎస్ఎంకే ఫామ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు నిర్వహించిన సంక్రాంతి వేడుకలు కనువిందు చేశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగిన ఈ వేడుకలకు అందాల భామ నమిత స్టార్ ఆఫ్ ఈవెంట్‌గా మారారు. దరితో కలిసి పొంగలి వండి, విద్యార్థులతో గొంతు కలిపి తమిళ సంప్రదాయంతో మమేకమయ్యారు. వారు వండిన పొంగల్‌ను ఆరగించి ఆహా ఏమిరుచి అంటూ అభినందించారు. అనంతరం జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలో తాను సైతం అంటూ స్టెప్పులు వేసి కళాకారులను ఉత్సాహపరిచారు. తమిళులకే ప్రత్యేకమైన కరగాట్టం ఆడి తమిళ కళలపై తనకున్న మక్కువను చాటుకున్నారు. అనంతరం ఆ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన నిధిని పలు రూపాలలో పేదలకు నమిత చేతుల మీదుగా సంక్రాంతి కానుకగా అందించి వారిని సంతోషపరిచారు. సంగీత కార్యక్రమాలలో గాయకులతో నమిత గొంతు కలపడంతో ఆ ప్రాంగణమంతా సంతోష సాగరంగా మారింది. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విద్యార్థులను నమిత అభినందించారు. -
నేనలా అనలేదు
నేను అలా అనలేదని, నా మాటలను వక్రీకరించారని అంటున్నారు భారీ అందాల భామ నమిత. నటిగా దక్షిణాదిన సంచలనం రేపిన ఈ బ్యూటీ ఇకపై రాజకీయాల్లో కలకలం పుట్టించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మే స్వయంగా ప్రకటించి రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించారు. త్వరలోనే తన రాజకీయ అరంగేట్రం ఉంటుందని వెల్లడించారు. అంతటితో ఆగకుండా నటుడు శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా? అని ప్రకటన ఇచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే తాను అలా అనలేదని తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆమె ఇలా పేర్కొన్నారు. నేను ఇటీవల తిరుచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలో పత్రికలవారు రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్నించారు. అందుకు నేను రాజకీయాలపై ఆసక్తి ఉందని బదులిచ్చాను. ఏ పార్టీలో చేరబోతున్నారన్న ప్రశ్నకు ఈ నెలాఖరు వరకు వేచి చూడండి అని చెప్పాను. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయం సాధించడంపై స్పందన ఏంటి అని అడిగారు. ఆమ్ఆద్మీ అంటే సాధారణ ప్రజలు అని అర్థం. సాధారణ ప్రజలు రాజకీయాల్లోకి రావచ్చు అని నిరూపించారు. వారికి నా శుభాకాంక్షలు అన్నాను. అంతేగానీ నేను ఆమ్ఆద్మీ పార్టీలో చేరుతానని అనలేదు. ఒక విలేకరి శరత్‌కుమార్‌తో కలుస్తారా? అని అడిగారు. అందుకు నేను మంచి విజయవంతమైన కూటమిలో చేరుతానన్నాను. నేనడిగింది రాజకీయ కూటమి గురించేనని స్పష్టం చేశారు. అయితే నటుడు శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా? అంటూ నేను ప్రశ్నించి నట్లు నా మాటలను వక్రీకరించారు. నేను చిత్ర రంగం లో చాలా కాలంగా ఉంటున్నాను. శరత్‌కుమార్ నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంఘాన్ని ఒక కుటుంబంలాగా తీర్చిదిద్దారు. నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగానే ఉన్నాను. అలాంటిది శరత్‌కుమార్ పార్టీ నడుపుతున్నారా లేదా అనే విషయం కూడా తెలియకుండా ఉన్నానా? అంటూ నమిత ప్రశ్నించారు. -
గ్లామర్ బాట వీడి.. ఖాకీ దుస్తుల్లో నమిత
ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో దర్శనమిచ్చే దక్షిణాది నటి నమిత ఈ సారి రూట్ మార్చారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఓ సినిమాలో తొలిసారి ఖాకీ దుస్తుల్లో కనిపించనున్నారు. ఐటం సాంగ్స్‌లోనూ చిందులేసిన నమిత తాజా చిత్రంలో ఫైట్లు కూడా చేస్తున్నారు. 'ఇలామై ఓంజాల్' అనే సినిమాలో పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందని నమిత సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటించే తనకు సుదీర్ఘ కాలం తర్వాత విభిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చిందని చెప్పారు. 'ఈ సినిమాలో తొలుత ఓ హీరోయిన్ పాత్రను ఆఫర్ చేశారు. అయితే సత్తా ఉన్న పాత్రలో నటించాలనే ఉద్దేశంతో తిరస్కరించా. దీంతో ఖాకీ దుస్తులు ధరించే అవకాశం వచ్చింది. ఇక మీదట గ్లామర్ పాత్రల్లో నటించాలని భావించడం లేదు. మంచి పాత్రల కోసం అన్వేషిస్తున్నా' అని నమిత చెప్పారు. -
కొత్త అందాలతో రీ ఎంట్రీ
అడవిలాంటి అందాల్నే ఆక్రమించాడే అంటూ తెలుగు చిత్రం సింహాలో యువతను గిలిగింతలు పెట్టిన గ్లామర్ క్వీన్ నమిత. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ భామకు కోలీవుడ్‌లో క్రేజ్ అంతా ఇంతా కాదు. నమిత ప్రస్తుతం కాస్త బరువు తగ్గి కొత్త అందాలతో రీఎంట్రీ కానుం ది.ఆమె మాట్లాడుతూ ఇప్ప టి వరకు అందాలారబోతతో బోర్ కొట్టిందని తెలిపింది. ఇకపై లేడి అమితాబ్ విజయశాంతిలా నటించాలనుందని పేర్కొంది. మరో విజయశాంతిలా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇదిలావుండగా ప్రస్తుతం ఈ బ్యూటీ త్రిభాషా చిత్రం (తమిళం, తెలుగు, కన్నడం) ఇళమై ఊంజల్లో పోలీసు అధికారిగా పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది. మృగాళ్ల అకృత్యాలకు బలయ్యే అబలను రక్షించే ధైర్యసాహసాలు గల యువతిగా నమిత ఈ చిత్రంలో కనిపించ నుంది. హరిరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. నిజానికి ఈ చిత్రంలో నమితను ఆయన మరోపాత్రల్లో నటింపజేయాలనుకున్నారట. అయితే యాక్షన్‌పై మనసుపడ్డ నమిత పోలీసు అధికారి పాత్రనే ఎంచుకుందట. చిత్రంలోని నమిత యాక్షన్ సన్నివేశాలు చూసి స్టంట్ దర్శకుడు ఎంతగానో అభినందించారట. రీ ఎంట్రీలో నమిత ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే. -
రాజకీయాల్లోకి నమిత
ఎప్పటి నుండో తారలు రాజకీయ రంగంలో తలుక్కుమంటూనే ఉంటున్నారు. తాజాగా సినీ నటి నమిత రాజకీయాలపై మనసు పారేసుకుంది. త్వరలో ఓ మంచి రాజకీయ పార్టీలో చేరుతానని ఈ బొద్దుగుమ్మ తన మనసులోని కోరికను వెల్లడించింది. మచ్చాన్ (బావ) అంటూ అందరినీ ప్రేమతో పలుకరించే నమిత అభిమానుల కలల రాణి. ఈ బ్యూటీ ఒక దశలో క్రేజీ హీరోయిన్గా వెలుగొందింది. కాస్త బరువెక్కడంతో అవకాశాలు తగ్గాయి. ఇతర వ్యాపారాలతో బిజీగా ఉన్న నమిత ప్రస్తుతం తన దృష్టిని సామాజిక సేవలపై సారిస్తోంది. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు సేవలందిస్తోంది. పలు సంక్షేమ సంఘాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా పాల్గొంటున్నా ఆమె ఈ మధ్య కాలంలో చెన్నైలో నిర్వహించిన ఓ నేత్రదాన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. అంతే కాకుండా రాయపేటలో ఒక మహిళా మరుగుదొడ్డిని కట్టించి ప్రారంభించింది కూడా. విదేశాల్లో వీధికొక్క మరుగుదొడ్డి ఉంటే మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితిలేదని... అదే విధంగా చెన్నై నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా... అందుకు తనకు చేయూతనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని నమిత వాపోయింది. అయితే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికే ముందు జాగ్రత్తగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది ఆమె. ఇప్పటికే తమిళనాట ఒకప్పటి అందాల నటి కుష్బూ కూడా డీఎంకేలో చురుకైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే నమిత ఏ పార్టీలో చేరుతుందనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఇంతకి నమిత ఏ రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు?