Sunil Shetty
-
బోర్డర్ సీక్వెల్లో అహన్ శెట్టి.. నాన్న వల్లే ఈ చాన్స్ అంటూ ఎమోషనల్!
బాలీవుడ్ ‘బోర్డర్’ సీక్వెల్ ‘బోర్డర్ 2’లో జాయిన్ అయ్యారు అహన్ శెట్టి. సన్నీ డియోల్ హీరోగా, వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బోర్డర్ 2’. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో అహన్ శెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ‘‘బోర్డర్’ సినిమాతో నా అనుబంధం 29 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. మా నాన్న (బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి) ‘బోర్డర్’ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు మా అమ్మ సెట్స్‌కు వెళ్లేది. అప్పుడు మా అమ్మ గర్భవతి. నేను మా అమ్మ గర్భంలో శిశువుగా ఉన్నాను. ఆ తర్వాత జేపీ దత్తా (‘బోర్డర్’ సినిమా దర్శకుడు, ‘బోర్డర్ 2’ నిర్మాత) అంకుల్ చెప్పే కథలు వింటూ, ఆయన చేయి పట్టుకుని నడిచాను... పెరిగాను. నా జీవితంలోని ఇలాంటి అనుభవాలే నాకు సినిమాల వైపు ఆసక్తి కలిగేలా చేశాయి. ‘‘ఇప్పుడు నేను ‘బోర్డర్ 2’ సినిమాలో ఓ రోల్ చేయనున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సన్నీ డియోల్ సార్‌తో వర్క్ చేయబోతున్నాను. దిల్జీత్గారికి నేను అభిమానిని. వరుణ్ ధావన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారి వల్లే నేను ఇలా ఉండగలిగాను. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను’’ అని పేర్కొన్నారు అహన్ శెట్టి. ‘బోర్డర్ 2’ చిత్రాన్ని 2026 జనవరి 23న రిలీజ్ చేయనున్నారు. ఇక సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ ‘బోర్డర్’ 1997లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు జేపీ దత్తా దర్శకత్వం వహించారు. -
ప్రియురాలికి బ్రేకప్ చెప్పేసిన యంగ్ హీరో!
బాలీవుడ్ స్టార్, నిర్మాత సునీల్ శెట్టి పరిచయం అక్కర్లేని పేరు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అహన్ శెట్టి. 2021లో తడప్(ఆర్ఎక్స్ 100 రీమేక్) అనే ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తారా సుతారియా హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం అహన్ శెట్టి తన ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 11 ఏళ్లపాటు మోడల్ తానియా ష్రాఫ్‌తో రిలేషన్షిప్లో ఉన్న అహాన్ వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ఈ విషయంపై వారి సన్నిహితుడు మాట్లాడుతూ.. 'అహన్‌కు, తానియా చిన్నప్పటి నుంచి తెలుసు. వారిద్దరు ఓకే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పదకొండేళ్ల బంధానికి గత నెలలో ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలో ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని' తెలిపారు. అయితే వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. తానియా ష్రాఫ్ పారిశ్రామికవేత్త జైదేవ్, రొమిలా ష్రాఫ్‌ల కుమార్తె. అయితే గతంలో అహాన్, తానియా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) View this post on Instagram A post shared by Tania Shroff (@tania_shroff) -
యూరేక మూమెంట్ కాస్త.. 'మెటామ్యాన్గా'
'వచ్చిన 'ఐడియా'కు ఒక రూపం ఇచ్చి లాభదాయక కంపెనీగా నిర్మించడం అనేది అంత సులభం కాదు. దారి కనిపించినట్లుగానే ఉంటుంది. గమ్యం చేరడం మాత్రం సులువు కాదు, ఎంటర్ప్రెన్యూర్ కలలు కనే యువతరం తమకు వచ్చిన ఐడియాకు సంబంధించి అన్ని కోణాల్లో హోంవర్క్ చేస్తే సూపర్ సక్సెస్ సాధించవచ్చని నిరూపించింది బెంగళూరుకు చెందిన 'మెటామ్యాన్' స్టార్టప్. 'మన దేశంలో పురుషులకు జువెలరీ బ్రాండ్స్‌కు సంబంధించి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి' అనే మాట బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి నోట విన్న తరువాత అనీల్ షెట్టీ తన స్నేహితుడు హర్ష్ మస్కరతో కలిసి 'మెటా మ్యాన్' పేరుతో డిజైన్-ఓరియెంటెడ్ 'డైరెక్ట్-టు-కన్జ్యూమర్ బ్రాండ్' (డీ2సీ)కి శ్రీకారం చుట్టాడు. ప్రారంభించిన ఆరు నెలలోనే ఈ బ్రాండ్ సూపర్ డూపర్ హిట్ అయింది.' లండన్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ కంపెనీ 'యూరోమానిటర్ ఇంటర్నేషనల్' అంచనా ప్రకారం మెన్ జువెలరీకి సంబంధించి ఇండియా థర్డ్-లార్జెస్ట్ మార్కెట్‌గా ఎదగనుంది. 'మెటామ్యాన్'కు ముందు సునీల్ షెట్టితో కలిసి మాట్లాడాడు అనీల్. ఈ ఆలోచన నచ్చడంతో కంపెనీ ఫౌండింగ్ మెంటర్, ఇన్వెస్టర్‌గా ఉండడానికి ముందుకు వచ్చాడు సునీల్ షెట్టి. హిప్ హప్ జువెలరీ ధరించడం అనేది ఇండియాలో బలపడుతున్న ట్రెండ్ అయినప్పటికీ ఏవో కొన్ని తప్ప తగినన్నీ ఆప్షన్స్ లేవు. ఈ లోటును భర్తీ చేయడానికి 'మెటామ్యాన్'తో ముందుకు వచ్చి సక్సెస్ అయింది. ట్రెండ్‌తో పాటు బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో బ్రాస్ లెట్స్, చైన్స్, రింగ్స్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. సందర్భానికి తగినట్లుగా డైలీ ఆఫీస్ వియర్, క్యాజువల్ వియర్, స్పోర్ట్స్ వియర్, ట్రావెల్ వియర్.. మొదలైన వాటిని డిజైన్ చేయించారు. 'మెటామెన్' పీసెస్లు ఫిల్మ్ ఫేర్, లైఫెస్టైల్ ఏసియాలాంటి మ్యాగజైన్లలో కని పించడంతో వాటికి మరింత ప్రాచుర్యం వచ్చింది. ఈ కంపెనీ ఏంజెల్ ఇన్వెస్టర్ జాబితాలో సునీల్ షెట్టితో పాటు నిఖిల్ కామత్ (జెరోద), కేఎల్ రాహుల్ (ఇండియన్ క్రికెటర్), ఆశిష్ (బుక్ మై షో), ప్రశాంత్ ప్రకాష్ (యాక్సెల్ పాట్నర్స్), సుజిత్ కుమార్ (ఉడాన్), హర్షిల్ మాధుర్, శశాంక్ కుమార్ (రేజర్‌పే) చేరారు. రాబోయే ఆరు నెలల కాలంలో రెండు వందల కొత్త ప్రాడక్ట్స్ డిజైన్ చేయడానికి రెడీ అయింది మెటామ్యాన్. 2024లో దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలలో తమ బ్రాండ్‌ను విస్తరించే పనిలో ఉంది. అనీల్ షెట్టికి ఫ్యాషన్ నుంచి పాలిటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు ఎన్నో రంగాలపై ఆసక్తి ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కల ఉంది. తన కలను నిజం చేసుకునే దారిని వెదుక్కునే క్రమంలో అనీలకు సునీల్ షెట్టి మాటలు దారి చూపించాయి. పురుషుల యాక్సెసరీస్, జువెలరీ మార్కెట్లో గెలుపు జెండా ఎగరేసేలా చేశాయి. 'ఆసియాలోని లీడింగ్ జెన్ జెడ్ జువెలరీ బ్రాండ్‌గా ఎదగాలనేది మా లక్ష్యం అంటున్నాడు 'మెటామ్యాన్' కో-ఫౌండర్ అనీల్ శెట్టి. యూరేక మూమెంట్.. యూరేక మూమెంట్ అనేది ఏ వ్యక్తికి అయినా ఏదో ఒక సమయంలో వస్తుంది. తల్లి నెక్లెస్‌ను మెడలో ధరించిన సునీల్ షెట్టిని చూసిన తరువాత నాకు ఐడియా వచ్చింది. మెన్ జువెలరీ అనేది మన దేశంలో వినూత్న కాన్సెప్ట్. ఐడియా కొత్తగా ఉన్నంత మాత్రాన సక్సెస్ కావాలని లేదు. 360 డిగ్రీ కోణంలో ఆలోచించి మంచి, చెడులపై ఒక అవగాహనకు వచ్చాం.. ఫ్యాషన్ జువెలరీ ధరించాలనే ఆసక్తి పురుషులకు ఉన్నప్పటికీ అట్రాక్టివ్, క్వాలిటీ డిజైన్లు వారికి కనిపించడం లేదు. ఈ లోటును పూరించేలా మా జువెలరీని డిజైన్ చేసి సక్సెస్ సాధించాం. - అనీల్ షెట్టి, మెటామ్యాన్, కో-ఫౌండర్ -
తొమ్మిదేళ్ల ప్రేమ.. నా పేరెంట్స్ కుదరదన్నారు: సునీల్ శెట్టి
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి పుట్టింది సౌత్‌లో అయినా ఎక్కువ సినిమాలు చేసింది మాత్రమే నార్త్‌లోనే. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆయన హిందీలో ఎక్కువ చిత్రాలు చేశాడు. 90స్లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపాడు. విలన్‌గానే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరైన అతడు 1991లో వ్యాపారవేత్త, డిజైనర్ మన శెట్టిని పెళ్లాడాడు. వీరికి అతియా శెట్టి, అహాన్ శెట్టి అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే వీరి పెళ్లి అంత ఈజీగా జరగలేదట! తాజాగా ఓ షోకి హాజరైన సునీల్ శెట్టి తన ప్రేమ, పెళ్లి సంగతులను పంచుకున్నాడు. 'తొలిచూపుకే మనతో ప్రేమలో పడిపోయా. కానీ ఆ సమయానికి నేను గూండాగానే అందరికీ తెలుసు. నా బాడీ, గడ్డం, బైక్‌పై తిరగడం చూసి అందరూ రౌడీ అనే భావించేవారు. అదృష్టం కొద్దీ తను అలా ఫీలవలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ఆరోజు ఉదయం నాలుగు గంటలకే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యేవాడిని. అయినా ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. తన కళ్లలోకి చూస్తే ప్రేమ, కేరింగ్ కనిపించేది. కానీ నా పేరెంట్స్ మా ప్రేమను ఒప్పుకోలేదు. అలా ఒకటీ, రెండు, మూడు.. తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం నన్ను మొదటిరోజు నుంచే ఇష్టపడ్డారు. మా ప్రేమను అంగీకరించారు. కొన్నిసార్లయితే మేమంతా దెబ్బలాడుకునేవాళ్లం కూడా! నన్ను వేరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటే అది అన్యాయం అవుతుందని, ఆ బంధం నిలబడదని ఇంట్లో హెచ్చరించాను. పెళ్లంటూ చేసుకుంటూ మనను మాత్రమే చేసుకుంటానని తెగేసి చెప్పాను. అనవసరంగా మా జీవితాలతో ఆడుకోవద్దన్నాను. మా పేరెంట్స్‌కు కోడలిని కాకుండా కూతురిలాంటి అమ్మాయిని తేవాలనుకున్నాను. ఆ విషయంలో నేను విజయం సాధించాను' అని చెప్పుకొచ్చాడు సునీల్ శెట్టి. -
అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు.. సునీల్ శెట్టి ఏమన్నారంటే..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమజంటకు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ పలు కథనాలు వచ్చాయి. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి రూ.50 కోట్ల ఫ్లాట్, కోహ్లీ, ధోని, సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బహుమతులు అందించారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై అతియా కుటుంబసభ్యులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటి వివరాలు రాసేముందు తమను సంప్రదించాలని సునీశ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్ - అతియా శెట్టి కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈనెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు,కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, విరాట్ కోహ్లీ, ధోనీ.. డైమండ్ హారం, బైక్, కారు బహుకరించినట్లు రాశారు. వీటిని సునీల్ శెట్టి ఖండించడంతో అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. -
అతియా - రాహుల్ పెళ్లి.. వామ్మో అంత ఖరీదైన బహుమతులా..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకకు జరిగింది. ఈ ప్రేమజంట వివాహానికి అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. అ తర్వాత అతియా-రాహుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే సినీ, క్రికెట్ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఐపీఎల్ తర్వాత గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ) అయితే తాజాగా అతియా-రాహుల్ పెళ్లికి వచ్చిన బహుమతులపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఇద్దరూ ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు కావడంతో మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. కొత్త జంటకు వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు అత్యంత ఖరీదైన బహుమతులు ఇచ్చనట్లు తెలుస్తోంది. తన ముద్దుల కూతురికి సునీశ్ శెట్టి రూ.50 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చారు. అతియా-రాహుల్ అందుకున్న ఖరీదైన బహుమతులు సునీల్ శెట్టి - ముంబైలో రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ విరాట్ కోహ్లి రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు సల్మాన్ ఖాన్ - రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారు అర్జున్ కపూర్- రూ. 1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్లెట్ ఎంఎస్ ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్ నటుడు జాకీ ష్రాఫ్ - రూ.30 లక్షల విలువైన వాచ్ అతియా, రాహుల్ లవ్‌స్టోరీ బాలీవుడ్ నటి అతియా, కేఎల్ రాహుల్ పెళ్లికి మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. గతేడాది సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా.. 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’లో అతియా తన నటనను ప్రారంభించింది. 1983 చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ 'హోప్ సోలో'లో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్నారు. -
లెహంగా తయారీకి 10 వేల గంటలా.. ఎందుకంత స్పెషల్?
క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈనెల 23 వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒక్కటైంది ఈ ప్రేమజంట. సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ ఖందాలాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లిరోజు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపైనే బీ టౌన్లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలో అతియా ధరించిన లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అయితే ఆ డ్రెస్ ఎందుకంత స్పెషల్? అందులో ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) పెళ్లిలో అతియా శెట్టి ధరించిన లెహంగా తయారీకి దాదాపు 10,000 గంటల సమయం పట్టిందని ప్రముఖ డ్రెస్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతియా శెట్టి లెహంగా తయారీకి 416 రోజులు, 10 వేల గంటలు పట్టిందని ఆమె తెలిపారు. అతియా శెట్టి వివాహ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. డిజైనర్ మాట్లాడుతూ.. 'అతియా చాలా చక్కగా,అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. అతియాపై ప్రేమతో ఆ వధువు ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని అనామిక చెప్పకొచ్చింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) (ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ) -
మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా అతియాశెట్టిని వివాహమాడారు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నూతన వధూవరులు అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో సునీల్ శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా మిఠాయిలు పంచుతూ కనిపించారు. ఈ జంట తొలిసారి భార్యాభర్తలుగా చాలా అందంగా కనిపించింది. అతియా తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది. మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.' పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ, క్రిెకెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఆలియా భట్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి ఫడ్నేకర్, నవ్యనందా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
చెత్త సినిమాలకు జనాలు డబ్బులు పెట్టరు, అందుకే మానేశా: నటుడు
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి హిందీలో ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించి చాలాకాలమే అయింది. గెస్ట్ రోల్లో లేదంటే ఏదైనా కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడే తప్ప హీరోగా మాత్రం నటించడం లేదు. అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ దక్షిణాదికి దగ్గరయ్యాన్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఎక్కువ నిడివి ఉండే పాత్రలు చేసి చాలాకాలమైంది. దీంతో నాకసలు క్రాఫ్ట్స్ గుర్తున్నాయా? మర్చిపోయానా? నాకంటూ అభిమానులున్నారా? అన్న సందేహాలు వస్తుంటాయి. కానీ ఎక్కడికెళ్లినా ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తుంటారనుకోండి. నా పిల్లలు కూడా మెయిన్ లీడ్‌లో సినిమాలెందుకు చేయట్లేదు? అని అడుగుతుంటారు. నేను గతంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. అయినా సరే ఏం పర్లేదని ఆ చెత్త చూద్దామని ఎవరూ డబ్బులు పెట్టి టికెట్ కొనరు కదా! ప్రేక్షకుల దాకా ఎందుకు? యాక్షన్ సీన్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్లే నా సినిమాను పక్కన పడేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, వర్షంలో డ్యాన్సులు లాంటివి ఉంటేనే సినిమా తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నారు. అందుకే నేను మెయిన్ లీడ్‌లో సినిమాలు చేయడం మానేశా' అని చెప్పుకొచ్చాడు. కాగా 1992లో వచ్చిన బల్వాన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సునీల్ శెట్టి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయన హిందీలో చివరగా ఎ జెంటిల్మెన్(2017) అనే సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాత్రలో నటించారు. ఇటీవలే ధారావి బ్యాంక్ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించాడు. ప్రస్తుతం హిందీలో నాలుగు చిత్రాలు చేస్తున్నాడు చదవండి: వారీసు వర్సెస్ తునివు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? తండ్రి చనిపోయినా సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి -
కేఎల్ రాహుల్, అతియ శెట్టిల వివాహానికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎప్పుడంటే..?
క్రికెట్, సినీ ఫాలోవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జనవరి) 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఖండాలాలోని అతియ తండ్రి సునీల్ శెట్టి నివాసం ఈ వివాహానికి వేదిక కానుంది. క్రికెట్, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివాహ వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరుగుతాయని అతియ తండ్రి సునీల్ శెట్టి తెలిపారు. సినీ రంగం నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్.. క్రికెట్ రంగం నుంచి ధోని, విరాట్ కోహ్లి తదితరులు వివాహ వేడుకకు హాజరవుతారని ఓ ప్రముఖ దిన పత్రిక వెల్లడించింది. కాగా, కేఎల్ రాహుల్ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బిజీగా ఉండగా.. అతియ మాత్రం వివాహా ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తుంది. -
కొందరు కావాలనే చేస్తున్నారు.. అందుకే ఈ దుస్థితి: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ చాలా కష్టాల్లో ఉందన్నారు ఆయన. పలువురు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించాలంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క శాతం మంది వల్లనే బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ అవుతోందన్నారు. కొందరి వల్లే బాలీవుడ్‌కు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. కొందరు కావాలనే బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ ట్రైండ్ చేస్తున్నారని మండిపడ్డారు. (ఇది చదవండి: ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఇండియా నుంచి ఆ రెండు చిత్రాలే) సునీల్ శెట్టి మాట్లాడుతూ..'నేను చాలా ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఇప్పుడు మనం కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను రూపొందించాలి. కొత్తవ్యక్తులకు సృజనాత్మకత ఉన్న వారికి అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇక నుంచి మనమేంటో నిరూపించుకోవాలి. మనల్ని మనం మెరుగు పరచుకోవాలి.' అని అన్నారు. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టేవారు దయచేసి ఆపేయాలని విజ్ఞప్తి చేశారా సునీల్ శెట్టి. -
అతియా శెట్టి- కేఎల్ రాహుల్ వెడ్డింగ్.. డేట్ ఫిక్స్..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మూడేళ్లుగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్గా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా ఈ జంట పెళ్లి తేదీలపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి నెలలోనే వీరు ఒక్కటవబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. ఎప్పుడో సునీల్ శెట్టి చెప్పేశాడుగా..!) అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఓ విలాసవంతమైన వేదికను ఖరారు చేసినట్లు సమాచారం. జనవరి 21,22, 23 తేదీల్లో హల్దీ, మెహెందీ, సంగీత్, గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్ - జహాన్లో దక్షిణ-భారత సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఇరువురి కుటుంబ సభ్యులు డిసెంబర్ చివరి నాటికి వివాహ ఆహ్వానాలను పంపనున్నట్లు సమాచారం. కాగా.. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సూరజ్ పంచోలీతో కలిసి 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. -
బాలీవుడ్ హీరోలపై సునీల్ శెట్టి సంచలన వ్యాఖ్యలు
ఇప్పటి హీరోలు అభద్రతా భావం ఉంటున్నారంటూ బాలీవుడు నటుడు సునీల్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నటించి లేటెస్ట్ వెబ్‌సిరీస్ ధరవి బ్యాంక్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌ల్లో భాగంగా ఇటీవల ఆయన బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందకపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఎదురైంది. చదవండి: అవన్ని పుకార్లే.. మీరే చూడండి అలా ఉన్నానా?: హీరోయిన్ దీనికి ఆయన స్పందిస్తూ ప్రస్తుత హీరోల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి హీరోలకు అభద్రత భావం ఎక్కువైంది. ప్రస్తుతం కెరీర్ ఎంత కాలం ఉంటుందనేది గ్యారంటీ లేదు. అందుకే ఎంత సంపాదించాలా? అని చూస్తున్నారే తప్ప చేసే సినిమా మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్లకు డబ్బు తప్ప మరో ధ్యాస లేదు’ అని విమర్శించాడు. అదే విధంగా ‘తరచూ ప్రేక్షకులను కలుస్తుంటేనే మన లోపాలేంటనేవి తెలుస్తుంటాయి. చదవండి: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేది అవగాహన వస్తుంది. ఇప్పటి హీరోలు ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ అయితే తప్ప బయటకు రావడం లేదు. తమ అభిమన హీరో తరుచూ ఏ రెస్టారెంట్‌కు వెళ్లాడు, ఏ కారు కొన్నాడు అనే విషయాల్ని ప్రేక్షకులు పట్టించుకునే రోజులు పోయాయి. రీల్ హీరోగా కాకుండా రియల్ హీరో అనిపించే వారినే ఇప్పుడు వారు అభిమానిస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఒకప్పుడు బాలీవుడ్లో మల్టీస్టారర్స్ చాలా ఎక్కువగా వచ్చేవని, కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి నటించడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారని సునీల్ శెట్టి వ్యాఖ్యానించాడు. -
బోయపాటి స్కెచ్.. హీరో రామ్‌కు తండ్రిగా ఆ బాలీవుడ్ హీరో?
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించారట. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కి తండ్రిగా ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక హీరో రామ్ కూడా ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది.రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి
ప్రస్తుతం బాలీవుడ్ బాయ్‌కాట్ ట్రెండ్ ప్రధాన సమస్యగా మారింది. బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంగా ఈ బాయ్‌కాట్ సెగ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల స్టార్ హీరో అయిన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా వసూళ్లు పరంగా వెనకపడిపోయింది. ఆయనకు సపోర్ట్ చేసిన అక్షయ్ కుమార్ రక్షాబంధన్, హృతిక్ రోషన్ అప్కమ్మింగ్ మూవీ విక్రమ్ వేదాలకు కూడా దీని సెగ తాకింది. ఈ క్రమంలో తాజాగా బాయ్‌కాట్ ట్రెండ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు ఇటీవల రాయ్‌పూర్ వచ్చిన ఆయను మీడియా బాయ్‌కాట్ ట్రెండ్‌పై ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ సినిమా కథల పట్ల ప్రజలు సంతోషంగా లేరని అనిపిస్తోందన్నారు. ‘మేము ఎన్నో మంచి సినిమాలు చేశాం. కానీ నేటి రోజుల్లో మేం చూపిస్తున్న కథల పట్ల ప్రజలు సంతోషంగా లేనట్టున్నారు. అందుకే మేము(బాలీవుడ్) ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రజలు థియేటర్లకు రావడం లేదు. ఎందుకు ఇలా జరుతుందనే దానిని గురించి నేను కచ్చితంగా చెప్పలేను. దీనికి కారణాలేంటో వేలెత్తి చూపలేను’ అని చెప్పుకొచ్చారు. చదవండి: కేబీసీలో ఆసక్తికర సంఘటన, షర్ట్ విప్పి రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్ అలాగే ‘ఒకప్పుడు ప్రజలకు వినోదం అంటే టీవీ, థియేటర్లే. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వంటి ప్లాట్‌ఫాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మంచి షోలు, మూవీలను చూసే అవకాశం ఏర్పడింది. 4జీ టెక్నాలజీ రావడం, డేటా చార్జీలు దిగి రావడం, ఓటీటీల ట్రెండ్ నడుస్తుండడం, కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది’ అని సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. -
KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆ నటితోనే! ట్విస్ట్ ఏంటంటే!
KL Rahul- Athiya Shetty Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పెళ్లి గురించి వస్తున్న వార్తలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. ఈ విషయాన్ని అతియా తండ్రి, బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి ధ్రువీకరించాడు. అయితే, అందుకు ఇంకాస్త సమయం పడుతుందంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అందుకు గల కారణాన్ని కూడా ఈ వెటరన్ యాక్టర్ వెల్లడించాడు. క్లీన్‌స్వీప్‌తో సరికొత్త ఉత్సాహం! కాగా టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన కేఎల్ రాహుల్.. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనతో తిరిగి జట్టులో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక బ్యాటర్.. రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్‌కు సారథిగా ఎంపికయ్యాడు. శిఖర్ ధావన్ మినహా అంతా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో జింబాబ్వే గడ్డ మీద సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ఈ టూర్‌ను మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు రాహుల్. ఇక జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే ఆసియా కప్-2022 టోర్నీలో పాల్గొనే నిమిత్తం యూఏఈకి పయనమయ్యాడు. బిజీబిజీగా షెడ్యూల్! ఇక ఆగష్టు 27న మొదలు కానున్న ఈ మెగా ఈవెంట్ పూర్తైన తర్వాత రోహిత్ సేన స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబరు 16- నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సిద్ధం కావాల్సి ఉంది. ఇలా వరుసగా మూడు నెలల పాటు టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. అందుకే ఆలస్యం! ఈ నేపథ్యంలో రాహుల్- అతియాల పెళ్లి ఆలస్యమయ్యే అవకాశం ఉందని సునిల్ శెట్టి పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్స్టాంట్ బాలీవుడ్‌తో ముచ్చటించిన సునిల్... ‘‘ఓ తండ్రిగా నా కూతురి పెళ్లి త్వరగా జరగాలని నేను కోరకుంటున్నాను. అయితే.. పిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే అప్పుడే అది జరుగుతుంది. ఆసియా కప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్, వరల్డ్‌కప్ ఇలా రాహుల్‌కు బిజీ షెడ్యూల్ ఉంది. తనకు బ్రేక్ ఉన్నపుడే వెడ్డింగ్ గురించి ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి తంతు అనేది ఒక్కరోజులో హడావుడిగా జరిగిపోయేది కాదు కదా!’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సునిల్ మాటలతో రాహుల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే రాహుల్ భాయ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ మామగారు కన్ఫర్మ్ చేశారంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా రాహుల్- అతియా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ వీళ్లిద్దరూ ఎప్పుడూ ఈ విషయం గురించి ధ్రువీకరించలేదు. అయితే, తాము కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ బంధం గురించి హింట్ ఇస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఇక సునిల్‌తో కూడా రాహుల్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. గతంలో ఓ షోలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘సునిల్ కేవలం క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు! ఆయన ఆటను బాగా అర్థం చేసుకుంటారు. నిజానికి క్రికెట్ అంటే ఆయనకు పిచ్చి అనుకోండి’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా రాహుల్- అతియాల కామన్ ఫ్రెండ్, నటి ఆకాన్ష రంజన్‌కపూర్ వీరిద్దరితో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో ఈ ప్రేమ వ్యవహారం తొలిసారి వెలుగులోకి వచ్చింది. View this post on Instagram A post shared by kanch 🫶 (@akansharanjankapoor) చదవండి: IND Vs PAK: ఇటు బుమ్రా.. అటు షాహిన్; లోటును భర్తీ చేసేది ఎవరు? Asia Cup 2022 IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో విజేత ఎవరు? అఫ్రిది నుంచి ఊహించని ట్విస్ట్ -
అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి
బాలీవుడ్ బ్యూటీ, నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటికే ఇరుకుంటుంబ సభ్యులు కలుసుకుని మాట్లాడుకున్నారని, పెళ్లి ముహుర్తం కూడా ఖారరైందంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ జంట ఫ్యాన్స్‌లో సందేహాలు నెలకొన్నాయి. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమార్స్‌పై అతియా తండ్రి సునీల్ శెట్టి స్పందించాడు. ఇటీవల రేడియో మిర్చికి ఇచ్చిన ఇంటర్య్వూలో కూతురు అతియా-రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చాడు. అతియా, రాహుల్ పెళ్లికి డేట్ ఫిక్సయిందని, కార్డ్స్ కూడా ప్రింట్ అవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయని, ఇందులో నిజమేంత అని సునీల్ శెట్టి ప్రశ్నంచగా.. అలాంటిది ఏం లేదని, ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదంటూ ఆయన రూమర్లకు చెక్ పెట్టాడు. ఇక ఇటీవల ఓ షోలో పాల్గొన్న అతియా సోదరుడు అయాన్ శెట్టికి సైతం ఇదే ప్రశ్న ఎదురవగా.. ‘ఈ వార్తల్లో నిజం లేదు.. మా ఇంటిలో ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు జరగడం లేదు. ఏదైన ఉంటే మేం ముందుగా చెబుతాం కదా’ అన్నాడు. చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్ ఇక పెళ్లి డేట్‌పై రూమార్స్‌పై అడగ్గా.. అసలు పెళ్లే జరగడం లేదు.. ఇక డేట్ ఎలా చెప్పగలనంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉంటే గత మూడేళ్లుగా ప్రేమించుకున్నఅతియా, రాహుల్‌లు మరో మూడు నెలల్లో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని ఈ జంజ సన్నిహితుల నుంచి సమాచారం. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి సునీల్ శెట్టిని కలిశారని, ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని (ముంబై) సందర్శంచారని.. అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని అతియా సన్నిహితవర్గాలు పేర్కొన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
కేఎల్ రాహుల్ పెళ్లి ముహూర్తం ఖరారు..!
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా బాలీవుడ్ నటి అతియా శెట్టితో డేటింగ్లో ఉన్న రాహుల్.. మరో మూడు నెలల్లో పెళ్లి పీఠలెక్కబోతున్నాడని సమాచారం. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి సునీల్ శెట్టిని కలిశారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని (ముంబై) సందర్శంచారని, అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని అతియా సన్నిహితులు తెలిపారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు గాయం బారిన పడిన కన్నూర్ లోకేశ్ రాహుల్ ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ చికిత్స కోసం జర్మనీలో ఉండగా.. ప్రేయసి అతియా కూడా అతనితోనే ఉంది. రాహుల్ గాయం నుంచి కోలుకునేందుకు మరో నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా కూడా రాహుల్‌తోనే ఉంటుందని సమాచారం. అతియా సోదరుడు అహాన్ శెట్టి అరంగేట్ర సినిమా 'తడప్' ప్రీమియర్ సందర్భంగా రాహుల్-అతియాలు తొలిసారి తమ ప్రేమ వ్యవహారాన్ని బహిరంగ పరిచారు. టీమిండియా తదుపరి కెప్టెన్ రేసులో ఉన్న రాహుల్.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు సునీల్ శెట్టి గారాలపట్టి అతియా బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. చదవండి: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న బట్లర్.. మరో సిరీస్ లక్ష్యంగా హిట్‌మ్యాన్ -
KK Singer Death: సింగర్ కేకే మృతిపై అక్షయ్, ఆర్ రెహమాన్ ఆవేదన
ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హాఠాన్మరణం సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన మృతి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేకే మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కెరీర్లో కేకే కూడా ఒక భాగం. నేను చేసిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో పాటలకు స్వరాన్ని అందించారు. Dear KK ..what’s the hurry buddy ..gifted singers and artists like you made this life more bearable..#RIPKK — A.R.Rahman (@arrahman) June 1, 2022 ఆయన ఆలపించిన ‘తూ బోలా జైసే’ పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లానీ తీవ్ర దిగ్భ్రాంతీ వ్యక్తం చేస్తున్నారు. కేకే మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రలకు, సన్నిహితలకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘స్నేహితులకు, మీడియా మిత్రలకు నా విన్నపం ఏంటంటే. కేకే గురించి మాట్లాడమని గాని, స్టేట్మెంట్ ఇవ్వమని గాని నన్ను అడగకండి ప్లీజ్. ఎందుకంటే ప్రస్తుతం ఆయన గురించి నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నాకంత శక్తి కూడా లేదు’ అంటూ రాసుకొచ్చారు. A request to friends from the media. Please don't call me for statements about #KK. I can't speak about him in the past tense, I simply don't have the strength for that. 🙏🏽 — VISHAL DADLANI (@VishalDadlani) June 1, 2022 వీరితో పాటు పలువకు బాలీవుడ్ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా కేకే 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వంటి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. కేకే మృతిని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. So sad to hear about KK’s death. He sang the first song of my first film. A great friend since then. Why so early, KK, why? But you have left behind a treasure of a playlist. Very difficult night. ॐ शांति। Artists like KK never die. pic.twitter.com/MuOdAkEOJv — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022 When beautiful voices are stopped in full flow, the universe loses a lifeline. In shock over the tragic deaths of two singing legends #sidhumoosewala & #KK. Numbed at the unfathomable loss 🙏 #RIPLegends. #RIPKK #RIPLegend #KKPassesAway #KrishnakumarKunnath #SidhuMooseWalaDeath pic.twitter.com/j7POeYmMBq — Suniel Shetty (@SunielVShetty) June 1, 2022 View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
మహేశ్ బాబు సినిమాలో విలన్‌గా స్టార్ హీరో!
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. థర్డ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే మహేశ్‌తో సినిమాను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మహర్షిలో మహేశ్‌తో జోడి కట్టిన పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు విలన్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి బడా స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడట. ఆయన ఎవరో కాదు సునీల్ శెట్టి. ప్రస్తుతం ఈ హిందీ నటుడు టాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. మోసగాళ్లు,గని లాంటి చిత్రాల్లో ఆల్రెడీ నటించేశాడు. ఇప్పుడు మహేష్ కు ప్రతినాయకుడిగా మారుతున్నాడట. -
KL Rahul: హ్యాపీ బర్త్‌డే మై లవ్.. శుభాకాంక్షలు వదినా.. వైరల్
KL Rahul Adorable Wish For Rumoured Girlfriend Athiya Shetty Goes Viral: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ వీటికి మరింత బలం చేకూరుస్తున్నారు వీరు. ఇక నవంబరు 5న అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా కేఎల్ రాహుల్ చేసిన పోస్టు చూసిన నెటిజన్లు.. ‘‘రాహుల్ కన్ఫామ్ చేసేశాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతియాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన రాహుల్.. ‘‘హ్యాపీ బర్త్‌డే మై లవ్’’అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇక ఇందుకు స్పందించిన సెలబ్రిటీలు అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే, పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య, ప్రజెంటర్ సంజనా గణేషన్ హార్ట్ సింబల్‌తో వీరికి విషెస్ తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ, రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంజాగ్ కింగ్స్ ఆటగాడు మన్దీప్ సింగ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు వదినా అంటూ కామెంట్ చేయడం విశేషం. అదే విధంగా అతియా తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి సైతం రాహుల్ పోస్టుపై హర్షం వ్యక్తం చేశాడు. దీంతో వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించిందని.. త్వరలోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ మరోసారి కథనాలు మొదలయ్యాయి. రాహుల్ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ప్రేయసి బర్త్‌డే రోజున స్కాట్లాండ్తో మ్యాచ్‌లో చెలరేగిన రాహుల్.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి తన కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తద్వారా యువరాజ్ సింగ్ సరసన నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: T20 WC: అదొక్కటే దారి.. అలా అయితే భారత్ సెమీస్ చేరడం ఖాయం.. మరి అఫ్గన్ గెలిచినా View this post on Instagram A post shared by KL Rahul👑 (@rahulkl) -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌గా ‘తడప్’.. కథ కొంచెం మారినట్లుందిగా..
మొదటి సినిమాతోనే అజయ్ భూపతికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. కార్తికేయు, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో ఎలాంటి సంచనాలకు దారితీసిందో తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్లో ‘తడప్’గా రీమేక్ అవుతోంది. స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘ఆర్ఎక్స్ 100’ కథకి కొన్ని మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. అయితే హీరో, హీరోయిన్ల నటన మాత్రం అదిరిపోయింది. రఫ్, సాఫ్ట్ వంటి రెండు డిఫరెంట్ లుక్స్‌తో అహాన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్వాలా నిర్మిస్తుండగా.. మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతకుముందు కూడా కొత్త డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. కాగా టాలీవుడ్లో మరో కొత్త డైరెక్టర్ చేసిన ఈ సినిమా రీమేక్ ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి. చదవండి: ‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్ -
ఆర్యన్ ఖాన్ చిన్నపిల్లాడు.. రిపోర్టులు రానివ్వండి
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో ఆర్యన్‌కి మద్దతుగా నిలిచారు. దీనిపై నటుడు సునీల్ శెట్టి సైతం స్పందించారు. ‘ఎక్కడ రైడ్ జరిగిన పలువురు వ్యక్తులు పట్టుబడ్డారని వింటుంటాం. అందులో ఉన్న పిల్లలు డ్రగ్స్ తీసుకున్నట్లు, తప్పు చేసినట్లుగా మనం ముందే నిర్థారణకి వచ్చేస్తాం. ఆర్యన్ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ విచారణ కొనసాగుతోంది కాబట్టి అతని ఊపిరి పిల్చుకునే అవకాశం ఇవ్వండి’ అని నటుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘బాలీవుడ్ లాంటి చిత్ర పరిశ్రమలో ఏం జరిగిన నిశితంగా పరిశీలిస్తూ, ముందే నిర్థారణకి వచ్చేస్తున్నారు. అలా కాకుండా నిజమైన రిపోర్టులు బయటకు వచ్చే వరకూ ఆగాలని’ సునీల్ కోరాడు. కాగా ఆర్యన్‌పై డ్రగ్స్‌కి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద ఎన్సీబీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్యన్ ఖాన్‌తో లీకైన ఫోటో.. క్లారీటీ ఇచ్చిన ఎన్సీబీ #WATCH | When a raid is conducted at a place, many people are taken into custody. We assume that a particular boy must have consumed it (drugs). The process is on. Let's give that child a breather. Let real reports come out: Actor Sunil Shetty on NCB raid at an alleged rave party pic.twitter.com/qYaYSsxkyi — ANI (@ANI) October 3, 2021 -
ఆర్యన్ డ్రగ్స్ వివాదంపై షారుక్‌కి.. మద్దతు తెలిపిన బాలీవుడ్ ప్రముఖులు
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందరికీ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అయితే డ్రగ్స్ కేసు విషయంలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు షారుక్ ఖాన్‌కి మద్దతు ప్రకటించారు. అందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి పూజా భట్ ఒకరు. ‘చాహత్’లో బాద్షాతో కలిసి పని చేసిన ఈ నటి ‘నేను మీకు సపోర్టుగా నిలుస్తున్నాను షారుఖ్. ఇది మీకు అవసరం లేకపోవచ్చు. కానీ నేను చేస్తాను. ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అంతేకాకుండా ‘కభీ హన్ కభీ నా’ మూవీలో షారుక్‌తో కలిసి నటించిన సుచిత్ర కృష్ణమూర్తి సైతం ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పిల్లలు ఇబ్బందులు పడడం చూడడం కంటే పెద్ద కష్టం తల్లిండ్రులకు ఏది ఉండదని నటి తెలిపింది. అంతేకాకుండా..‘ ఇంతకుముందు కూడా ఇలాగే బాలీవుడ్ నటులపై రైడ్స్ జరిగాయి. కానీ అందులో ఏం దొరకలేదు. ఏది ప్రూవ్ కాలేదు. మాతో తమషా చేయడం మామూలు అయిపోయింది కానీ అది మా ఫేమ్‌ని దెబ్బతీస్తుంది’ అని రాసుకొచ్చింది. అయితే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని వినియోగించినందుకు వివిధ సెక్షన్ల కింద ఎన్సీబీ ముగ్గురిపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది. చదవండి: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ? I stand in solidarity with you @iamsrk Not that you need it. But I do. This too, shall pass. 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 3, 2021 For all those targetting #Bollywood remember all the #NCB raids on filmstars? Yes nothing was found and nothing was proved. #Bollywood gawking is a tamasha. Its the price of fame — Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021 Nothing harder for a parent than seeing their child in distress. Prayers to all 🙏 — Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021 -
కంగ్రాట్స్ రాహుల్ బాబా.. థ్యాంక్స్: సునీల్ శెట్టి
KL Rahul 100@ Cricket Mecca: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ(248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్)తో అదరగొట్టాడు. క్రికెట్ మక్కాగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సందర్భంగా రాహుల్‌పై సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేయసి అతియా శెట్టితో పాటు ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారి జాబితాలో ఉన్నారు. View this post on Instagram A post shared by Suniel Shetty (@suniel.shetty) కాగా, రాహుల్ శతకొట్టిన క్లిప్‌ను జోడిస్తూ.. సునీల్ శెట్టి ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. 100@ క్రికెట్ మక్కా.. కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యు బాబా.. నా బర్త్‌డే(ఆగస్ట్ 11)కు నువ్విచ్చిన గిఫ్ట్ చాలా అపురూపమంటూ అతను చేసిన కామెంట్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. సునీల్ శెట్టి.. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలపిన విధానం, రాహుల్‌ను బాబా అని సంబోదిస్తూ ఆశీర్వదించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు అతియా శెట్టి కూడా రాహుల్ సెంచరీపై పోస్ట్ చేసింది. కేఎల్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎరుపు రంగు హార్ట్ ఐకాన్‌ను పోస్ట్ చేసింది. కాగా, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం రాహుల్‌తో పాటు అతియా కూడా ఇంగ్లండ్‌కు వెళ్లింది. రాహుల్ అతియాను తన పార్ట్నర్ అని బీసీసీఐకి చెప్పడం విశేషం. ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అంటూ గతంలో సునీల్ శెట్టి దంపతులు కూడా వీళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ అజేయమైన శతకంతో పాటు రోహిత్ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించడంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(9) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు రహానే(1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 2, రాబిన్సన్కు ఓ వికెట్ దక్కింది. -
అవును.. అతియా ఇంగ్లండ్‌లో ఉంది.. వాళ్లది చక్కని జంట
KL Rahul Athiya Shetty: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పబ్‌లు, పార్టీలకు కలిసి వెళ్తూ వీరు కథనాలకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఇక, కేఎల్ రాహుల్ ప్రస్తుతం టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతియా, ఆమె సోదరుడు అహాన్ కూడా రాహుల్‌తో పాటు అక్కడే ఉన్నట్లు వారి సోషల్ మీడియా అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. కాగా, తమ భార్యలు లేదా భాగస్వాములను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ క్రికెటర్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. రాహుల్ అతియాను తన పార్ట్నర్గా పేర్కొంటూ పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరి బంధానికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని, ఈ జంట ప్రేమ కహానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి తన కూతురు ఇంగ్లండ్‌లో ఉందని కన్ఫాం చేసేశాడు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో మట్లాడుతూ... ‘‘అవును.. అతియా ఇంగ్లండ్‌లోనే ఉంది. అయితే.. తను అహాన్(అతియా సోదరుడు)తో ఉంది. వాళ్లిద్దరూ అక్కడ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా విషయాలు మీకు తెలిసే ఉంటాయి’’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రాహుల్- అతియా జంట గురించి సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ వీరిని అంబాసిడర్లుగా నియమించుకుంది. నిజానికి వాళ్లిద్దరూ చూడక్కని జంట కదా. కాదంటారా? అందుకే యాడ్ అంతబాగా వచ్చింది. ఇక రిలేషన్ గురించి అంటారా వారినే డైరెక్ట్‌గా అడిగితే సరి’’ అంటూ నవ్వులు చిందించాడు. దీంతో.. రాహుల్- అతియా పెళ్లికి సునీల్ సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. కాగా 'నుమి ప్యారిస్' అనే లగ్జరీ గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by NUMI Paris (@numiparis) -
‘మోసగాళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : మోసగాళ్లు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ : ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కథ, నిర్మాత : మంచు విష్ణు దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్ సంగీతం : సామ్ సి.ఎస్ సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్ ఎడిటర్ : గౌతమ్ రాజు విడుదల తేది : మార్చి 19, 2021 స్టార్ హీరో మోహన్ బాబు కుమారుడిగా పరిచయమై మంచు విష్ణు గత కొన్నేళ్లుగా కెరీర్లో సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.దీంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్న విష్ణు.. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'మోసగాళ్లు' అనే పాన్ఇండియా సినిమాతో బరిలోకి దిగాడు. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది.దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మోసగాళ్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మోసగాళ్లు’అందుకున్నారా? ఈ సినిమా మంచు విష్ణుని హిట్ ట్రాక్ ఎక్కించిందా? ఈ ‘మోసగాళ్ల’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ అను(కాజల్), అర్జున్(మంచు విష్ణు) కవల అక్కా తముళ్లు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరుగుతారు. తండ్రి (తనికెళ్ల భరణి) నిజాయతీ వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని ఫీలవుతుంటారు. ఉన్నవాడిని మోసం చేసి రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే విజయ్ (నవదీప్)తో కలిసి ఒక ఫేక్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి మోసాలు చేద్దామని ప్లాన్ వేస్తారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పేరుతో అమెరికన్లకు ఫోన్ చేసి పన్ను బకాయిలు చెల్లించాలని బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించడం మొదలుపెడతారు. అలా దాదాపు రూ.2,600 కోట్లు కొట్టేస్తారు. భారీ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్, భారత ప్రభుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్ (సునీల్ శెట్టి) నియమిస్తుంది. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్ ఎలాంటి ఎత్తులు వేశారు. చివరకు ఈ మోసగాళ్లు ఎలా చిక్కారు? అనేదే మిగతా కథ. నటీనటులు అర్జున్ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్ ఫెలోగా, సీరియస్ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్ శెట్టి నటన బాగుంది. తన అనుభవాన్ని తెరపై చూడొచ్చు. నవీన్ చంద్రా, నవదీప్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి కథను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్‌లనేపథ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్. తర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్లో పనిచేయడం.. దాని ద్వారా అక్రమంగా అమెరికన్ల డేటాను సేకరించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించి బోర్ కొట్టకుండా నడిపించేశాడు. అయితే అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్ చంద్ర, సునీల్ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్‌గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి. మరోవైపు ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణులకి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమాకు ప్రధాన బలం సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘వరుణ్ తేజ్ ‘గని’ కోసం శరీరాకృతి మార్చాలి’
‘‘మోసగాళ్ళు’ టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. తినడం, ప్యాకప్ చెప్పడం, రిహార్సల్స్.. ఇలా ప్రతి ఒక్కటీ అనుకున్న సమయంలో అయిపోయేవి. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పతనం’’ అని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు.ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు సునీల్ శెట్టి. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సునీల్ శెట్టి చెప్పిన విశేషాలు. ► అదిరిపోయే కథ, మంచి దర్శకుడు, హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్.. అన్నీ కలిసి ‘మోసగాళ్ళు’ సినిమాను ఒప్పుకునేలా చేశాయి. అక్కాతమ్ముడు కలిసి ఓ కుంభకోణం చేయడమనే ఈ కథ నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. వాస్తవ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. ► తెలుగు భాష మాట్లాడటం కష్టం కానీ, అర్థం చేసుకోవడం సులభమే. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. ఏం తింటున్నాను.. ఎంత తినాలి? అనేదానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. ప్రతిరోజూ యోగా, వర్కవుట్లు కచ్చితంగా చేస్తాను. విష్ణు కొత్త తరానికి చెందిన నటుడు. ఫిట్నెస్ గురించి మాకంటే తనకే ఇంకా బాగా తెలుస్తాయి. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయ్. ఫైట్స్ చేసేటప్పుడు టైమింగ్‌తో చేయాలి.. లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గని’ చేస్తున్నాను. ఈ సినిమా కోసం మళ్లీ నా శరీరాకృతిని మార్చాలి. -
పిస్తోలు ఫ్యాషన్ కోసమే.. భయపెట్టడానికి నా పేరు చాలు
ముంబైలో జాన్ అబ్రహమ్ డాన్‌గా మారి ఒక రాజకీయ నాయకుడి తమ్ముణ్ణి చంపేశాడు. ఇప్పుడు అతని తలమీద పదికోట్ల బహిరంగ విలువ నిర్థారించబడింది. ఎవరు ఆ తలను తెస్తే వారికి పది కోట్లు. ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ హష్మీ రంగంలోకి దిగాడు. ఈ తాజా మాస్ మసాలా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ‘కాంటె’, ‘జిందా’, ‘షూట్ అవుట్ ఎట్ వడాలా’ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సంజయ్‌గుప్తా దీని నిర్మాత, దర్శకుడు. జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి ప్రధాన తారాగణం. మన కాజల్ అగర్వాల్ మరో ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. ఎనభైలలో జరిగిన ఈ కథను నాటి బాంబే గూండాయిజాన్ని ఈ సినిమాలో కథాంశంగా తీసుకున్నారు. గూండా మామూళ్లను ఎదిరించి గూండాగా మారిన పాత్రలో జాన్ అబ్రహమ్ కనిపిస్తాడు. ‘పిస్తోలు ఊరికే ఫ్యాషన్ కు పెట్టుకుంటాను. భయపెట్టడానికి నా పేరు చాలు’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. చూడాలి ప్రేక్షకులు ఏం తీర్పు చెబుతారో. -
ఆ ఇద్దరి నటన చూసి కన్నీళ్లొచ్చాయి: మోహన్‌బాబు
‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మోసపోతారు. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మోసపోయాను?’ అని నా భార్య (నిర్మల) నాతో చెప్పింది (నవ్వుతూ...). ఆ మాట ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు. ఆమె నన్ను మోసం చేసిందో... నేను ఆమెను మోసం చేశానో లక్ష్మి, విష్ణు, మనోజ్లకే తెలియాలి’’ అని నటుడు మంచు మోహన్‌బాబు సరదాగా అన్నారు. విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘సునీల్ శెట్టి అద్భుతమైన నటుడు. ‘మోసగాళ్ళు’లో కూడా బాగా నటించారు. కాజల్ మంచి నటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఈ చిత్రంలో విష్ణుకి అక్కగా చేసినందుకు కాజల్‌ని అభినందిస్తున్నాను. హీరోయిన్గా ఉన్న నువ్వు అక్క పాత్ర చేయడం గ్రేట్. జానపద గాయని కోమలికి మన తర్వాతి సినిమాలో పాడే అవకాశం ఇద్దామని విష్ణు చెప్పాడు. కచ్చితంగా ఆ అవకాశం ఇస్తాను. రానాని చూస్తే ‘బాహుబలి’ గుర్తొస్తుంది. తను మంచి నటుడు. రానా నిర్మాతగా త్వరలోనే నాతో సినిమా చేస్తున్నాడు. ‘మోసగాళ్ళు’ అద్భుతమైన కథ. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమిది. ధైర్యం చేసి ఈ సినిమా తీశాడు విష్ణు. ఈ చిత్రంలో కాజల్– విష్ణు మధ్య సీన్స్ చూసి కన్నీళ్లొచ్చాయి. ఒళ్లు జలదరించింది. ఫ్యామిలీ, సెంటిమెంట్, అర్థం, పరమార్థం ఉన్న ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని మహిళలు, యూత్‌తో పాటు అందరూ చూడొచ్చు. మార్చి 19న నా పుట్టినరోజు. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాడు విష్ణు’’ అన్నారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారు ఒక నటుడిగా, ఫ్రెండ్‌గా నాకెంతో ఇష్టం. ఆయన ఫ్యామిలీతో నటించడమంటే నా కల నెరవేరినట్టుంది. ‘మోసగాళ్ళు’ కథ అందరి హృదయాలకు బాగా దగ్గరైంది.. అందుకే ఎంతో మనసు పెట్టి చేశాం. ప్రతి రోజూ మధ్నాహ్నం మోహన్‌బాబుగారి ఇంటి నుంచి వచ్చే భోజనం తిని నా బరువు కూడా పెరిగాను. ఆయన శ్రీమతిగారికి థ్యాంక్స్’’ అన్నారు. హీరో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమా చేసిన సునీల్ శెట్టికి, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా ఉంటూ నా అక్క పాత్ర చేసిన కాజల్‌కు, నవదీప్, ఎడిటర్ గౌతమ్రాజుగారితో పాటు సహకరించిన మొత్తం టీమ్‌కి థ్యాంక్స్. సునీల్ శెట్టిగారితో చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారి పుట్టినరోజున ‘మోసగాళ్ళు’ విడుదలవడం నా లక్’’ అన్నారు. ‘‘పెళ్లి తర్వాత విడుదలవుతున్న నా తొలి చిత్రం ‘మోసగాళ్ళు’’ అన్నారు కాజల్. అతిథిగా వచ్చిరానా మాట్లాడుతూ– ‘‘మోహ్రా’ సినిమాలో సునీల్ శెట్టి కండలు చూసి 8వ తరగతిలోనే నేనూ జిమ్‌కి వెళ్లడం మొదలెట్టా. ఈ నెల 19న ఒక ప్రత్యేకమైన వ్యక్తి (మోహన్‌బాబు) పుట్టినరోజు. ఆ రోజు థియేటర్‌కి వెళ్లి ‘మోసగాళ్ళు’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. -
నచ్చినవే చేయాలనుకుంటున్నాను
‘‘ఇన్ని రోజులూ నాకు వచ్చిన రోల్స్ చేయాలా? లేక నచ్చినవి చేయాలా? అనే కన్ ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు నచ్చినవే చేయాలని డిసైడ్ అయ్యాను’’ అన్నారు నవదీప్. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్‌శెట్టి ప్రధాన పాత్రధారులుగా జెఫ్రీ చిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోసగాళ్ళు’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవదీప్ చెప్పిన విశేషాలు. ► ఓ మోస్తరుగా చదువు వచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి కాల్ సెంటర్ ఆధారంగా అమెరికాలో 150 మిలియన్ డాలర్ల స్కామ్‌ను ఎలా చేశారు? అనే అంశంతో ‘మోసగాళ్ళు’ సినిమా ఉంటుంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ చిన్ తో సినిమా చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మంచు విష్ణు సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఆసక్తి అనిపించింది. టెక్నాలజీలోని లోటుపాట్లను వాడుకుని స్కామ్ చేయడమనే అంశం ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ► ఈ సినిమాలో నాది వైట్ కాలర్ క్రిమినల్ జాబ్. మహిళలను తక్కువగా అంచనా వేసే పాత్ర. కథ ప్రకారం మంచు విష్ణు, కాజల్ నన్ను మోసం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్ శెట్టిగారు తప్ప మేమందరం మోసగాళ్ళమే. ► నా స్నేహితుడు పవన్ తో కలిసి ఆరంభించిన ‘సీ స్పేస్’లో దాదాపు 40 మంది రైటర్స్ ఉన్నారు. ఓ పేపర్ కటింగ్ తీసుకువచ్చి మా ‘సీ స్పేస్’లో ఇచ్చి సినిమాకు కథ కావాలంటే చేసిన ఇస్తాం. వెబ్ సిరీస్‌గా డెవలప్ చేయమన్నా చేస్తాం. ఓ ఫ్యాంటసీ లవ్‌స్టోరీలో హీరోగా నటించబోతున్నాను. -
ఆర్ఎక్స్100 రీమేక్‌లో స్టార్ హీరో కొడుకు
తెలుగులో హిట్ అయిన ‘ఆర్ఎక్స్100’ను హిందీలో తన కుమారుడితో రీమేక్ చేస్తున్నాడు నటుడు సునీల్ శెట్టి. సినిమా పేరు ‘తడప్’. అంటే తపన అని అర్థం. అహన్ శెట్టి, తార సుతరియా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు మిలన్ లుత్రియా. ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నటుడు అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు. అక్షయ్, సునీల్‌శెట్టి కలిసి ‘మొహ్రా’ వంటి సూపర్‌హిట్‌లో నటించారు. ఆ తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ కామెడీల్లోను సందడి చేశారు. ఆ స్నేహం కొద్దీ అక్షయ్ కుమార్ ‘తడప్’ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఆర్ఎక్స్ 100 రెగ్యులర్ ప్రేమ కథల వంటిది కాదు. అందులో ప్రేమను స్వార్థానికి ఉపయోగించే కొందరు అమ్మాయిల ధోరణిని కథాంశంగా తీసుకున్నారు. సమాజంలో అది ఉందని ప్రేక్షకులు కన్విన్స్ అవడం వల్లే సినిమాను హిట్ చేశారు. ఇందులో నటించిన పాయల్ రాజ్‌పుత్ మంచి పేరు సంపాదించుకుంది. హీరోగా నటించిన కార్తికేయ ట్రాక్‌లో పడ్డాడు. కనుకనే సునీల్ శెట్టి కూడా తన కుమారుడికి ఈ సినిమా మంచి ప్లాట్‌ఫామ్ కాగలదని ఆశిస్తున్నట్టున్నాడు. అహన్ శెట్టి తండ్రి వలే శారీరక పోషణలో శ్రద్ధ ఉన్నవాడు. ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. ఇతనికి ఒక అక్క ఉంది. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో వస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. -
అందుకే నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టాను
‘‘నా కెరీర్లో పెద్ద బడ్జెట్ సినిమా ‘మోసగాళ్ళు’. నా మార్కెట్ అంత లేదు. కానీ సినిమాపై నమ్మకంతో నా మార్కెట్‌ని మించి ఖర్చు పెట్టా. ఏ సినిమా అయినా నిర్మాతకి రిస్కే. కాకపోతే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిస్క్ తీసుకుంటామని ముందుకెళ్లా’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ‘మోసగాళ్ళు’ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే ట్రైలర్‌ని రిలీజ్ చేసిన చిరంజీవిగారికి, వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్‌గారికి ధన్యవాదాలు. 2015 నుంచి 2017 వరకూ ఓ అక్క, తమ్ముడు కలసి ముంబయ్, గుజరాత్‌లలో ఉండి ఒక సింపుల్ ఐడియాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్ చేశారు. అమెరికాలో జరిగిన ఈ స్కామ్‌ని ఎందుకు సినిమాగా చేయకూడదనిపించింది? ‘మోసగాళ్ళు’ కథని అమెరికాలో ఉండి మూడేళ్లు డెవలప్ చేశాం. హాలీవుడ్‌కి ధీటుగా జెఫ్రీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నా అక్క పాత్ర చేయమని ప్రీతీ జింతాని అడిగితే, ఈ పాత్ర చేస్తే బయట తనకు ఇబ్బందులు వస్తాయని చేయనన్నారు. ఆ తర్వాత కాజల్‌కి కథ చెప్పగానే ఎంతో స్పోర్టివ్‌గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో నేను కాదు.. కాజల్. సునీల్ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు. సునీల్ శెట్టిగారి పాత్రని నేను చేయాల్సింది, కానీ కుదరలేదు. ‘మోసగాళ్ళు’ చూసిన నాన్నగారు (మోహన్ బాబు), డైరెక్టర్ శ్రీను వైట్లగారు ‘నువ్వేంటి విలన్ గా చేశావ్?’ అన్నారు. మా అమ్మ (నిర్మల) మాత్రం బాగా చేశావన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేరోజు, వేర్వేరు టైటిల్స్‌లో మా సినిమా విడుదలవుతుంది.. ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది మరో వారంలో ప్రకటిస్తాం. ‘భక్త కన్నప్ప’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది స్టార్ట్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుంది’’ అన్నారు. -
హ్యాపీ బర్త్‌డే.. పిచ్చి పిల్ల
ముంబై : బాలీవుడ్ నటి అతియా శెట్టి 28వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రియుడు కేఎల్ రాహుల్ ప్రేమపూర్వకంగా విషెస్ తెలియజేశాడు. ఆమె పుట్టినరోజును మరికాస్త స్పెషల్‌గా ఉండేలా ఓ క్యూట్ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే మ్యాడ్‌చైల్డ్ (పిచ్చి పిల్ల) అంటూ రాహుల్ భుజంపై అతియా తల ఆనించి ఉన్న లవ్లీ ఫోటోను షేర్ చేశారు. కాగా అతియా, కేఎల్ రాహుల్ ఏడాది నుంచి డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వారిద్దరి సోషల్‌మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్ అవుతున్నాయి. (వైరల్: ప్రేయసి పోస్టుపై కేఎల్ రాహుల్ కామెంట్..) ఇటీవల రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి’ అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఇద్దరు కలిసి తరచూ డిన్నర్లు, పార్టీలకు హాజరు అవుతున్నారు. అతియా శెట్టి నటుడు సునీల్ శెట్టి-మనశెట్టి కుమార్తె. 2015లో హీరో చిత్రంతో అతియా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చివరిసారిగా నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన ‘మోటిచూర్ చక్నాచూర్’లో కనిపించింది. సంవత్సరం నుంచి రిలేషన్షిప్లో ఉన్న రాహుల్, అతియాలు పెళ్లి చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సునీల్ శెట్టి దంపతులు ఇదివరకే పేర్కొన్నారు. (గర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వని రాహుల్) View this post on Instagram Happy birthday mad child 🖤 A post shared by KL Rahul👑 (@rahulkl) on Nov 5, 2020 at 4:43am PST -
విజయ్ దేవరకొండకి ఫాదర్‌గా బాలీవుడ్ నటుడు?
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఫైటర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. తండ్రి పాత్రను బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి చేయనున్నారని సమాచారం. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో సునీల్ శెట్టి పాత్ర కనిపిస్తుందట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది. -
కొత్త మార్పులొస్తాయి
కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావంతో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత హిందీ చలన చిత్ర పరిశ్రమలో మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ –‘‘కరోనా ప్రభావం తగ్గిన తర్వాత బాలీవుడ్లో కొన్ని కొత్త మార్పులను చూడబోతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో థియేటర్స్ కన్నా ఓటీటీ వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనే సినిమాలు ఎక్కువగా విడుదల కావొచ్చు. ‘పే పర్ వ్యూ’ విధానంలో వినియోగదారులు ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించి తమ స్మార్ట్ టీవీ లేదా స్మార్ట్ ఫోన్లో సినిమాలను వీక్షిస్తారు’’ అని పేర్కొన్నారు సునీల్ శెట్టి. ‘‘నేను చేసే చిత్రాల షూటింగ్స్ ఇండియాలోనే జరిగేలా ప్లాన్ చేసుకుంటాను. తద్వారా మన దేశంలో ఎందరికో ఉపాధి కల్పించే అవకాశం ఉంది’’ అన్నారు సునీల్ శెట్టి. -
అతియా శెట్టి ముద్దుపేరు తెలుసా!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలకు లాక్డౌన్లో కాస్తా విరామ సమయం దొరికింది. ఈ క్రమంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న ఫొటోలను వీడియాలు తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేగాక చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధిచిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి తన కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ల చిన్ననాటి ఫొటోను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతేగాక వారి ముద్దు పేర్లను కూడా ప్రకటించాడు. (వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో!) View this post on Instagram Sadhu aur Shaitaan 🤦🏽 A post shared by Suniel Shetty (@suniel.shetty) on Apr 25, 2020 at 2:20am PDT లాక్డౌన్: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’ ఈ ఫొటోలో ఉన్నది ‘సాధు’ ‘సాతాన్’.. వీరిలో ఒకరూ బాలీవుడ్ స్టార్‌గా కూడా ఎదిగారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక సునీల్ శెట్టి పోస్టు చూసిన అతడి బాలీవుడ్ స్నేహితుడు ఇందులో ఎవరిని సాధు అని పిలిస్తారు.. ఎవరిని సాతాన్ అని పిలుస్తారని అని అడగ్గా.. ‘‘ఆహాన్ ఎప్పుడూ నా సాధునే’’ అంటూ సునీల్ శెట్టి సమాధానం ఇచ్చాడు. ఇక బాలీవుడ్ భామ అతియాను తాను ‘సాతాన్’ అని పిలుస్తానని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ పోస్టుకు అతియా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, ఇండియన్ క్రికెటర్ కెఎల్ రాహుల్ లాఫింగ్ ఎమోజీతో తన స్పందనను తెలపడం గమనార్హం. (గర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వని రాహుల్) -
‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంతో సినిమా షూటింగ్‌కు కొంత గ్యాప్ ఏర్పడటంతో చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. పనిలో పనిగా రష్మికా రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు. సినిమాలో ఈ భామ అటవీశాఖ అధికారిగా కనిపించనున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రాయలసీమ లుక్‌లో కనిపించే బన్నీ స్టైల్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆర్య, ఆర్య-2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. (పుష్ప కోసం రష్మిక ట్రైనింగ్) ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించనున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తిర విషయం తెలిసింది. పుష్పలో నివేదా థామస్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల దర్బార్ సినిమాలో నటించిన నివేదా ఈ సినిమాలో రెండో హీరోయిన్గా నటించనున్నారు. అల్లు అర్జున్ లవర్‌గా ఆమె పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నివేదా పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్‌సాబ్’లో నటిస్తున్నారు. కాగా సునీల్ శెట్టి, నివేదా థామస్ ఇటీవల దర్బార్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. (థాంక్యూ తమన్.. మాట నిలబెట్టుకున్నావ్ : బన్నీ) -
గర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వని రాహుల్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ 28వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి అతనికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. అతియా శెట్టి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌తో కలిసి చిరునవ్వు చిందిస్తోన్న ఫోటోను ఒకటి యాడ్ చేసింది. 'హ్యాప్పీ బర్త్‌డే మై డియర్' అని కామెంటు పెట్టి లవ్ ఎమోజీని యాడ్ చేసింది. అయితే ఇంతకవరకు రాహుల్ ఆమె కామెంట్‌కు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.(‘పాక్ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’) గత సంవత్సరం అతియా శెట్టి బర్త్‌డే సందర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని అంతా అనుకున్నారు. ఆ వాదనలకు బలం చేకూరుస్తూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ శెట్టి నటించిన హేరాపేరి సినిమాలో అత్యంత పాపులర్ అయన టెలిఫోన్ సన్నివేశాన్ని ఇమిటేట్ చేశాడు. రాహుల్ ఫోన్ మాట్లాడుతుండగా అతియా ఫోన్ పక్కన నిలుచొని కాయిన్ వేస్తుంది. అప్పుడు రాహుల్ ఫోన్లో పాపులర్ డైలాగ్ 'హలో దేవీ ప్రసాద్' అంటాడు. అప్పట్లో ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. సంవత్సరం నుంచి రిలేషన్షిప్లో ఉన్న రాహుల్, అతియాల పెళ్లి చేసుకుంటు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సునీల్ శెట్టి దంపతులు ఇదివరకే పేర్కొన్నారు. View this post on Instagram happy birthday, my person 🤍 @rahulkl A post shared by Athiya Shetty (@athiyashetty) on Apr 18, 2020 at 12:59am PDT View this post on Instagram Hello, devi prasad....? A post shared by KL Rahul👑 (@rahulkl) on Dec 27, 2019 at 10:15pm PST -
పుష్పకు విలన్!
‘దర్బార్’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు విలన్‌గా పరిచయమయ్యారు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి. ప్రస్తుతం విష్ణు మంచు నటించి, నిర్మిస్తున్న ‘మోసగాళ్ళు’లో ఓ కీలక పాత్ర చేస్తున్న సునీల్ తాజాగా తెలుగులో మరో సినిమా కమిట్ అయ్యారని సమాచారం. ‘ఆర్య, ఆర్య2’ తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కలసి చేస్తున్న సినిమా ‘పుష్ప’. ఇటీవల ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయిక. ఈ సినిమాలో విలన్ పాత్రకు సునీల్ శెట్టిని సంప్రదించారని తెలిసింది. కథ, పాత్ర నచ్చి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. -
పుష్ప సినిమాకు విలన్ ఖరారు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్కు అభిమానులు ఫిదా అయ్యారు. బన్నీ కళ్లలో ప్రతీకార సెగలు కనిపిస్తున్నాయని కామెంట్లు చేశారు. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తుండగా హీరోయిన్ రష్మికా మందన్నా డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. తాజాగా విలన్ పాత్రకు సంబంధించి ఫిల్మీ దునియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. దీని ప్రకారం.. పుష్ప యూనిట్ బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారు. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడు. (జూన్‌లో మోసగాళ్ళు) కాగా, రజనీకాంత్ దర్బార్ చిత్రంలోనూ విలన్‌గా సునీల్ శెట్టి మెప్పించాడు. తొలుత విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ అగ్ర నటులు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్‌ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించినప్పటికీ సునీల్ శెట్టి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలాను చిత్రబృందం సంప్రదించారంటూ లీకువీరులు దరువేసి మరీ చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. (బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూన్‌లో మోసగాళ్ళు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా హాలీవుడ్–ఇండియన్ సినిమా ‘మోసగాళ్ళు’. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించడంతో చిత్రంలో కీలకమైన ఐటీ ఆఫీస్ సన్నివేశాల చిత్రీకరణ నిలిచిపోయింది. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను జూన్ 5న, ఇంగ్లిష్ వెర్షన్ ను జూలైలో విడుదల చేయనున్నట్లు విష్ణు తెలిపారు. ‘‘ఇటీవల విడుదల చేసిన ‘మోసగాళ్ళు’ ఫస్ట్‌లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లలో అర్జున్ గా విష్ణు, అను పాత్రలో కాజల్ అగర్వాల్, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి కనిపించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో నవదీప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
ఐటీ మోసగాళ్ళు
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్–ఇండియన్ సినిమా ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు, కై్లమ్యాక్స్, యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. యూనిట్ సభ్యుల క్షేమం దృష్ట్యా చిత్రీకరణ నిలిపివేశాం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక తిరిగి చిత్రీకరణ కొనసాగిస్తాం. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ప్రభావితులైన వారు త్వరగా కోలుకోవాలి. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలి. అందరూ సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ క్వారంటైన్ ను పాటించాలి’’ అన్నారు. -
ఏసీపీ కుమార్ రిపోర్టింగ్
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వియామార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విరానికా మంచు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ సినిమాలో పవర్ఫుల్ సిక్కు పోలీసాఫీసర్‌గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఆయన లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఏసీపీ కుమార్ పాత్రలో ఆయన కనపడనున్నారు. అతిపెద్ద ఐటీ కుంభకోణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రేపటినుండి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జరగనుంది. వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
‘మోసగాళ్ళు’లో ఏసీపీ కుమార్‌ను చూశారా?
మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన విష్ణు, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. ‘మోసగాళ్లు’ చిత్రంలోని సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కుమార్ పాత్ర పోషిస్తున్న సునీల్ శెట్టికు సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు దుస్తుల్లో, తలకు టర్బన్ అతడి ఆహార్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ఇండో–హాలీవుడ్ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. COMING SOON #Mosagallu@iVishnuManchu @MsKajalAgarwal @pnavdeep26 @Naveenc212 @TheLeapMan @ruhisingh11 pic.twitter.com/KuAHLshI4b — Suniel Shetty (@SunielVShetty) February 29, 2020 చదవండి: అను ఎలాంటి అమ్మాయి? ‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’ -
అను ఎలాంటి అమ్మాయి?
‘‘మంచి, చెడు అనేది మనం చూసే దృష్టి కోణాన్ని, పరిస్థితిని బట్టి ఉంటుంది. అను మనస్తత్వం ఎలాంటిదో మీరే (ప్రేక్షకులు) ఈ వేసవిలో నిర్ణయించండి’’ అన్నారు కాజల్ అగర్వాల్. ఇంతకీ అను ఎవరంటే ఎవరో కాదు.. ‘మోసగాళ్ళు’ సినిమాలో కాజల్ చేసిన పాత్ర పేరిది. శుక్రవారం అను లుక్‌ని రిలీజ్ చేశారు. మంచు విష్ణు హీరోగా జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో వయామార్ ఎంటర్టైన్మెంట్స్, ఏవీఏ బ్యానర్స్ పతాకాలపై విరోనిక మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి కీలక పాత్రధారి. ‘‘దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మిస్టరీని ఛేదిస్తూ..
అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తున్నారు మంచు విష్ణు. ఆ ప్రయాణంలోనే లాస్ ఏంజెల్స్ కూడా వెళ్లారు. మరి తనకి కావాల్సిన సమాచారం దొరికిందా? వేచి చూడాలి. మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. పది రోజులు సాగే ఈ షెడ్యూల్లో విష్ణుపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇండో–హాలీవుడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందట. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆర్చ... అదరహా
మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ మలయాళ మూవీ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్‌లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్. ఆమె క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్ ఆదరహా అంటోంది మాలీవుడ్. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
దుమ్ము దులపాలి
విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మోసగాళ్ళు’. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. విష్ణు, సునీల్ శెట్టిల మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఫైట్ కోసం విష్ణు మంచు, సునీల్ శెట్టి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘‘మోసగాళ్ళు’ షూటింగ్ మొదలైంది. ఈ వారం షూటింగ్లో దుమ్ము దులపాలి’’ అన్నారు విష్ణు. ‘‘ఇప్పటివరకు తెలుగుతెరపై ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు చూసి ఉండరు. యాక్షన్ లవర్స్‌కు ఈ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటుంది’’ అని చిత్ర బృందం పేర్కొంది. నవదీప్, నవీన్ చంద్ర, రూహీ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచు నిర్మిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ‘మోసగాళ్ళు’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాకు షెల్డన్ చౌ ఛాయాగ్రాహకుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్. ఆర్. -
మోసగాళ్లు
‘మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లకు ఏ ఢోకా లేదు. కావాల్సిందల్లా పక్కా ప్లాన్ మాత్రమే’ అనే ఫిలాసఫీ నమ్మే కుర్రాడు అర్జున్. ఓ పెద్ద ప్లాన్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ చేయగలుగుతాడు. ప్రస్తుతం ఇలాంటి కాన్సెప్ట్‌తో మంచు విష్ణు హీరోగా తెలుగు–ఇంగ్లీష్ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. జెఫ్రీ చిన్ దర్శకుడు. కాజల్, రుహానీ శర్మ, సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘మోసగాళ్లు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఐటీ ఇండస్ట్రీలో జరిగిన స్కామ్ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. నేడు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘అర్జున్’ పాత్రలో కనిపిస్తారు విష్ణు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
బర్త్‌డే సర్ప్రైజ్
తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. టాలీవుడ్–హాలీవుడ్ క్రాస్ఓవర్ (రెండు వేరు వేరు ప్రాంత నటులు కలిసి నటించడాన్ని క్రాస్ఓవర్ అంటారు) ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారట చిత్రబృందం. జెఫ్రీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు, కాజల్, రుహానీ శర్మ, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమాతో తొలిసారి తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు హిందీ నటుడు సునీల్ శెట్టి. మరో విశేషం ఏంటంటే విష్ణు, కాజల్ అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారట. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ ఆర్, ప్రొడక్షన్ డిజైన్: కిరణ్ కుమార్ ఎమ్. -
సంజూభాయ్ సర్ప్రైజ్
విష్ణు మంచు హీరోగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘కాల్‌సెంటర్’. కాజల్ అగర్వాల్, రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుల్ స్పీడ్‌గా జరుగుతోంది. ‘కాల్ సెంటర్’ షూటింగ్ లొకేషన్‌కు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సందర్భంలో తీసిన ఫొటో ఇది. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఓ అతిథి పాత్రలో నటిస్తారని సమాచారం. -
కాల్ సెంటర్లో ఏమైంది?
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్పెరీ చిన్ దర్శకుడు. మంచు విష్ణు నిర్మాణంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణుకి చెల్లెలిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. రుహానీ సింగ్ హీరోయిన్. ఈ సినిమాకు ‘కాల్ సెంటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. కథ కాల్ సెంటర్ చుట్టూ తిరుగుతుందా? వేచి చూడాలి. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ సినిమా ద్వారా సునీల్ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. -
బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు
‘బలం ఉందన ్న అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ అనే డైలాగులతో ప్రారంభమైన ‘పహిల్వాన్’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఈ సినిమాను అదే పేరుతో వారాహి చలన చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. సెప్టెంబర్ 12న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. చిరంజీవిగారు ఇటీవల విడుదల చేసిన ‘పహిల్వాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం విడుదలైన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ‘‘కె.జి.యఫ్’ని తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం అందుకున్న వారాహి చలన చిత్రం సంస్థ ఇప్పుడు ‘పహిల్వాన్’ను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: కరుణాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. దేవరాజ్. -
‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’
సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం పహిల్వాన్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ కుస్తీ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయి బాక్సార్‌గా ఎదిగి నేపథ్యంలో ఎదురైన కష్టాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతమందిస్తున్నాడు. -
బీ టౌన్ రోడ్డుపై ఆర్ఎక్స్ 100
సౌత్ ముంబైలోని ఓ థియేటర్‌కు వెళ్లారు ప్రముఖ బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి. ఇది పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ అహన్ శెట్టి వెళ్లింది సినిమా చూడటానికి కాదు. తన ఫస్ట్ సినిమా షూటింగ్లో జాయిన్ కావడానికి. తెలుగు హిట్ ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నారు అహన్ శెట్టి. ఈ చిత్రానికి మిలప్ లూద్రియా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తొలుత థియేటర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముస్సోరీలో మేజర్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో తారా సుతారియా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘ఒరిజినల్ సినిమా చూశాను. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. -
పహిల్వాన్ వస్తున్నాడు
‘ఈగ’తో ఇబ్బందులు పడి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్. తాజాగా ‘పహిల్వాన్’ అనే చిత్రంలో నటించారాయన. ఇందులో మల్ల యోధుడి పాత్రలో కనిపించనున్నారు. కన్నడంలో రూపొందిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఎస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘ఆల్రెడీ రిలీజయిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని నిర్మాతలు తెలిపారి. ‘కేజిఎఫ్’ను తెలుగులో రిలీజ్ చేసింది వారాహి బ్యానరే కావడం విశేషం. -
‘మీరు సరిగ్గానే చెప్పారు. నేను వృద్ధురాలినే’
‘మీరు సరిగ్గానే చెప్పారు. నేను వృద్ధురాలినే. సమయం కన్నా, నా భర్త కన్నా కూడా. మీరు శారీరకంగా ఎదిగారు గానీ.. మానసికంగా మాత్రం ఎదగలేదు. అయినా తెలివితేటలు కలిగి ఉండటం కూడా ఓ వరమే. క్యాన్సర్‌ను జయించిన నేను.. నా 46వ ఏట పరిపూర్ణ జీవితాన్ని గడుపుతున్నాను. నా ఆత్మ- శరీరం.. భద్రత, సంతోషంతో నిండిపోయాయి. మీకు కూడా ఏదో ఒకరోజు ఇలాంటి అనుభవం రావాలని కోరుకుంటున్నా’ అంటూ మోడల్, బాలీవుడ్ నటి లీసా రే తనను ఎద్దేవా చేసిన వ్యక్తికి ట్విటర్ వేదికగా ఘాటు సమాధానమిచ్చారు. ఇంతకీ విషయమేమిటంటే.. టొరంటోలో తాను దిగిన ఫొటోను లీసారే ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందుకు స్పందనగా హర్షద్ పటేల్ అనే నెటిజన్ ..‘ టూ ఓల్డ్’అంటూ కామెంట్ చేశారు. దీంతో లీసారే పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన హర్షద్ లీసారేను క్షమాపణ కోరాడు. ‘మీరనుకున్నట్లుగా నేను పబ్లిసిటీ కోసం కామెంట్ చేయలేదు. నాకు అనిపించింది చెప్పాను అంతే’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన లీసారే.. .‘ మీ మాటలకు నేను అస్సలు బాధపడలేదు. అయితే టూ ఓల్డ్ అనే పదం స్త్రీపట్ల సమాజపు ఆలోచనా విధానానికి నిదర్శనం. వయసు ఆధారంగా ఒక వ్యక్తిని చూసే దృష్టి మారుతుంది. ఇలాంటి మాటలు మన మానసిక పరిపక్వతను తెలియజేస్తాయి. నేనైతే కౌమార దశలోనే తెలివిగా ఎలా మసలుకోవాలి, ఎదుటి వ్యక్తుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలి అనే విషయాలు నేర్చుకున్నా’ అంటూ మరోసారి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. లీసా రే స్పందించిన తీరుపై సునీల్ శెట్టి, ఇలియానా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కాగా క్యాన్సర్ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత(2012) తన చిరకాల మిత్రుడు జాసన్ డేహ్నిని పెళ్లాడిన లీసా రే గతేడాది సెప్టెంబరులో సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. అదేవిధంగా.. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం కోల్పోయినట్లు కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. You’re right. I’m old. Older than time, my boy. Perhaps you will never grow up in your mind but your body will and it’s a blessing to be wise, a cancer survivor and living my best life at 46. Unshakeably secure and happy in my spirit and body. Hope you can experience that one day https://t.co/cfwuw9yQs1 — Lisa Ray (@Lisaraniray) January 28, 2019 Honestly not hurt, but adding ‘too’ to ‘old’ is a symptom of society’s unrealistic expectations for women. Imp. to embrace age. This dialogue is good to highlight each’s state of mind. When I was young, I was different and craved guidance towards a wider, kinder perspective 🙏🏽 https://t.co/y7dBH368h8 — Lisa Ray (@Lisaraniray) January 29, 2019 -
కుర్రాళ్ల లీగ్‌కు జహీర్, సునీల్ శెట్టి శ్రీకారం
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుర్రాళ్ల కోసం నిర్వహించనున్న కొత్త క్రికెట్ లీగ్‌లో చేయిచేయి కలిపారు. జాతీయ స్థాయిలో ఫెరిట్ క్రికెట్ బాష్ పేరుతో (ఎఫ్‌సీబీ) వీరిద్దరు కలిసి లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 15 ఏళ్లు పైబడిన బాలల కోసం మొత్తం 22 నగరాల్లో ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తారు. రెండు రౌండ్లుగా జరిగే ఈ సెలక్షన్ క్రికెట్ పోటీల ద్వారా చివరకు 224 మందిని ఎంపిక చేస్తారు. వీరికి రూ. లక్ష చొప్పున ఫీజుగా చెల్లిస్తారు. వీరందరిని కలిపి 16 జట్లను తయారు చేస్తారు. ఇలా ఏర్పడిన ఈ 16 జట్లకు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, కోచ్‌లు శిక్షణ ఇస్తారు. చివరకు 15 ఓవర్ల చొప్పున మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో అసాధారణంగా రాణించిన 14 మందిని ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయి క్రికెట్ టోర్నీ ఆడేందుకు అక్కడికి తీసుకెళ్తారు. -
బీఎంసీ స్వపరిపాలన దినోత్సవం నేడు
బరంపురం : బీఎంసీ (బరంపురం మున్సిపల్ కార్పొరేషన్) 151వ స్వపరిపాలనా దినోత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా బీజేడీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహి తెలిపారు. ఈ మేరకు స్థానిక ఐవీ సమావేశ మందిరంలో బీఎంసీ ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ బరంపురం మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. బరంపురం మున్సిపాలిటీ ఏర్పడి 151 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ స్వపరిపాలన దినోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛభారత్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలిమల, పరిశుభ్రతపై నగర ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు వివరించారు. గతేడాది బీఎంసీ 150వ స్వపరిపాలనా దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని, ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నగర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అలాగే బీఎంసీ 151వ స్వపరిపాలనా దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమానికి నేతలు, అధికారులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కళ్లికోట్ కళాశాల మైదానంలో సాయంత్రం జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ నటులు సునీల్‌శెట్టితో పాటు కరీనాఖాన్, పాప్ సింగర్ వినోథ్‌రాథోడ్ పాల్గొని, వీక్షకులకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మేల్యే రమేష్‌చంద్ర చావ్ పట్నాయక్, మాజీ కేంద్రమంత్రి చంద్రశేఖర్ సాహు, మేయర్ కె.మాధవి, డిప్యూటీ మేయర్ జోత్సా్న నాయక్, కమిషనర్ చక్రవర్తి రాథోడ్, బరంపురం అభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్ మహరణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ దొంగనే దోచిన ‘దొంగది’...
కరడుగట్టిన దొంగ మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్‌శెట్టి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుకుల చిక్కాడు. తన 16వ ఏటే చోరీల బాట పట్టిన ఇతగాడు.. 27 ఏళ్లలో 150 చోరీలు చేశాడు. 21 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టకుండానేచాకచక్యంగా దొంగతనాలు చేసి ఆ సొమ్ముతో నచ్చినచోట జల్సాలు చేస్తాడు. డబ్బు అయిపోయాక మళ్లీ చోర బాట పడతాడు. అరెస్టయిన ప్రతిసారీ పూర్తి శిక్ష అనుభవించి జైలు నుంచి వస్తుండడంతో ఇప్పటి దాకా అతడిపై ‘పీడీ’ యాక్ట్ప్రయోగించేందుకు పోలీసులకుఅవకాశం లేకపోయింది. సాక్షి,సిటీబ్యూరో: అసలు పేరు మహ్మద్ సలీం.. మారు పేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 27 ఏళ్ళ నేర ప్రస్థానంలో 150 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 21 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే ఇతను ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి వచ్చాడు. నాలుగు నెలల్లో 13 నేరాలు చేశాడు... చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలు చేయడంతో పాటు హెలీటూరిజంలో షికారు చేస్తాడు. ఈ ఘరానా దొంగను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, 21 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ తెలిపారు. శుక్రవారం అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి తన కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. తరువాత ఇల్లు వదిలి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు మాయం చేయడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. ముషీరాబాద్ జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌తో టైంపాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో రంగంలోకి దిగుతాడు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్ళనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. లోపలకు వెళ్ళాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. కేవలం చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమ, కాలాపత్తర్, కామాటిపుర, హుస్సేనిఆలం, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, బాలాపూర్, పహాడీషరీఫ్, మైలార్‌దేవ్‌పల్లి పరిధుల్లోనే చోరీలు చేశాడు. ఈ దొంగనే దోచిన ‘దొంగది’... ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీ ఖర్చు చేస్తాడు. వ్యభిచారిణుల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్ళాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్ళినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 150 నేరాలు చేసి 21 సార్లు అరెస్టు అయినా శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి రాని నేపథ్యంలో పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యం కాలేదు. గత ఏడాది ఓసారి చిక్కిన సలీం జనవరిలో జైలు నుంచి వచ్చాడు. అప్పటి నుంచి వరుస మూడు కమిషనరేట్లలోని 9 ఠాణాల పరిధిలో 13 నేరాలు చేశాడు. ఇతడి కదలికపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్ వర్మ, జి.వెంకట రామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.21 లక్షల విలువైన 70 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్‌శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి. -
బాడీగార్డ్‌కు సల్మాన్ సాయం
వెండితెర మీద కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్స్‌లు ఇవ్వటంతో పాటు ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలింస్ ద్వారా కొత్త హీరోలను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్యే సూరజ్ పంచోలి, అతియా శెట్టిలను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్, త్వరలోనే అతియా తమ్ముడు అహాన్ శెట్టిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇదే వరుసలో మరోసారి తన పెద్దమనసు చాటుకుంటున్నాడు కండల వీరుడు. చాలా కాలంగా సల్మాన్ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేస్తున్న షేరా కుమారుడు టైగర్‌ను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు సల్మాన్. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నాడట. 22 ఏళ్ల టైగర్‌కు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
సల్మాన్ బ్యానర్లో మరో వారసుడు
బాలీవుడ్ న్యూ జనరేషన్‌కి సల్మాన్ ఖాన్ లాంచ్ ప్యాడ్లా మారుతున్నాడు. స్టార్ హీరోలు తమ వారసులను వెండితెరకు పరిచయం చేయడానికి సల్మాన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వారసులని పరిచయం చేసిన కండల వీరుడు త్వరలోనే మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. 2010లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది శతృఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాదించిన ఈ బ్యూటీ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దీంతో సల్మాన్ ది గోల్డెన్ హ్యాండ్ అని ఫిక్స్ అయ్యారు అంతా. ఇటీవల 'హీరో' సినిమాతో ఆదిత్య పంచౌలి కొడుకు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాలను వెండితెరకు పరిచయం చేశాడు సల్మాన్. ఈ సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా, మంచి వసూళ్లను రాబట్టి ఈ ఇద్దరు వారసులను కమర్షియల్‌గా నిలబెట్టింది. తాజాగా మరో వారసుడిని పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్ ఖాన్. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టిని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ లాంటి విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న అహాన్ త్వరలోనే సల్మాన్ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
'నాన్న పాట రీమేక్ లో స్టెప్పులేస్తా'
న్యూఢిల్లీ : నాన్నతో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనే విషయం చాలా అద్భుతమని బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి చెప్పింది. ఇటీవలే విడుదలైన 'హీరో' మూవీతో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అన్న విషయం అందరికి తెలిసిందే. నాన్నతో కలిసి షూటింగ్ అంటే చాలా భయపడిపోయాను అని చెప్పింది. రీమేక్ లో డాన్స్ చేసే అవకాశం వస్తే మాత్రం నాన్న నటించిన మూవీల్లోని ఓ ఫేమస్ సాంగ్ 'షెహర్ కి లడ్కి'లో స్టెప్పులెయడమంటే తనకు చాలా ఇష్టమన్నది. హీరో మూవీ కూడా 1983లో సుభాష్ గాయ్ తీసిన 'హీరో' మూవీకి రీమేక్. కాంపిటీషన్ అనేది మనల్ని మనం నిరూపించుకునేందుకు ఉపయోగపడుతుందన్నది. నేను బాత్రూమ్ సింగర్ ని.. 'నేను మాత్రం ఇప్పటివరకూ బాత్రూమ్ సింగర్ ని మాత్రమే అంటూ నవ్వేసింది. ఎవరైనా సంప్రదిస్తే కచ్చితంగా మూవీలో సాంగ్ పాడతాను. మూవీలో పాట పాడటం అంటే నాకు చాలా ఇష్టం' అని 'హీరో' ఫేమ్ అతియా శెట్టి చెప్పుకొచ్చింది. -
ఆగస్టు 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునీల్ షెట్టి (నటుడు); జాక్విలిన్ ఫెర్నాండెజ్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. వీరు పుట్టిన తేదీ 11. ఇది ఒక మాస్టర్ నంబర్. ఈ తేదీన పుట్టిన వారికి ఆత్మవిశ్వాసంతోపాటు మంచి సమయస్ఫూర్తి, దైవభక్తి ఉండటం వల్ల జీవితంలో అన్ని అడ్డంకులను అవలీలగా అధిగమిస్తారు. చంద్ర, కుజుల కలయికతో చంద్రమంగళ యోగం ఏర్పడటం వల్ల ఆస్తులు అభివృద్ధి చేసు కుంటారు, విదేశీ ప్రయాణాలు చేయాలనే కోరిక నెరవేర్చుకోవడం లేదా విదేశాలలో ఉన్న బంధుమిత్రుల సాయంతో జీవితంలో నిలదొక్కుకుంటారు. కుజుని ప్రభావం వల్ల ఆవేశానికి గురై, దూకుడుగా ప్రవర్తిస్తారు. అందువల్ల వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండటం, చిన్న చిన్న వ్యవహారాలకు కూడా కోర్టులకు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. మరోటి దొరికే వరకూ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోకుండా ఉండటం మంచిది. రాజకీయ నాయకులు లేదా పలుకుబడి గలవారితో ఏర్పడిన పరిచయాలు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రెడ్ , రోజ్, ఆరంజ్, వైట్, సిల్వర్; సూచనలు: సుబ్రహ్మణ్యారాధన, రోగులకు సాయం చేయడం, రక్తదానం చేయడం లేదా ప్రోత్సహించడం, దుర్గామాతను ఆరాధించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
నా భర్తే నా ఫేవరెట్
టైం దొరికితే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చూస్తానంటున్న మనాశెట్టి.. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే మాత్రం భర్త సునీల్‌శెట్టి పేరు ఠక్కున చెప్పేసింది. సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేసిన సునీల్‌శెట్టి.. రియల్ లైఫ్‌లో ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటాడని చెప్పుకొచ్చింది. నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో బుధవారం జరిగిన అరాయిశ్ ఎగ్జిబిషన్లో ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ను ఏర్పాటు చేసిన మనాశెట్టితో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. అరాయిష్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద పిల్లల చదువు కోసమే వెచ్చిస్తామన్నారు మనాశెట్టి. ‘హైదరాబాద్‌కు రావడం ఇది ఫోర్త్ టైం. ఈసారి స్టాల్‌లోని డిజైనింగ్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాదీలకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ’ని కొనియాడింది. ‘మా అమ్మ 25 ఏళ్ల క్రితం స్థాపించిన ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా’కు విరాళాల కోసమే ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశాన’ని తెలిపింది. టేస్ట్ అదుర్స్.. ‘నగరానికి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి వంటకాల రుచులు చూడందే వెళ్లం. ఇక్కడి స్పైసీ ఫుడ్ టేస్ట్ అదుర్స్. చారిత్రక కట్టడాలను కూడా సందర్శిస్తాన’ని వివరించింది మనా. తన కుమార్తె అతియా శెట్టి హిందీ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పింది. కెరీర్ పరంగా అతియాకు సునీల్ కూడా మంచి గెడైన్స్ ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. రెస్పాన్స్ సూపర్బ్ ‘అరాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి బాగుంది. గతేడాదితో పొల్చుకుంటే ఈసారి డిఫరెంట్ డిజైనర్లు రూపొందించిన లేడీస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి.ఎగ్జిబిషన్‌కు స్థానిక మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. వందలాది మంది రావడం చూస్తుంటే సిటీ లేడీస్ డ్రెస్సింగ్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంతో కనబడుతోంది. సో థ్యాంక్స్ టూ హైదరాబాదీస్’ అంటూచిట్చాట్ ముగించింది. -
జైట్లీ కోసం సునీల్ షెట్టీ ప్రచారం
ఎన్నికల వేళ ఒక వైపు ఓటర్లు రాజకీయనాయకులకు చుక్కలు చూపిస్తారు. నాయకుల కోసం తారలు దిగివస్తాయి. ఒక వైపు తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్న బిజెపి అగ్రనేతకు ఓటర్లు చుక్కలు చూపిస్తుంటే, ఆయనకు మద్దతుగా బాలీవుడ్ హీరో సునీల్ షెట్టి రంగంలోకి దిగారు. కాషాయ కండువాతో కమలనాథుని పక్కనే కూర్చున్నారు కూడా. అమృత్ సర్ లోని ఒక గ్రామంలో జైట్లీ ప్రచారం చేస్తూండగా, సునీల్ షెట్టి నాటకీయంగా స్టేజీ మీదకు వచ్చారు. అంతే కాదు. మైకు లాక్కుని అరుణ్ జైట్లీ మంచి నేత. ఆయన్ని గెలిపిస్తే దేశానికి మేలు జరుగుతుంది. ఆయనకు ఓటేయండి' అని ప్రకటించాడు. అంతేకాదు. నరేంద్ర మోడీకి ఓటేయమని ప్రజలను కోరారు సునీల్ షెట్టి. 'దేశం మార్పు కోరుతోంది. అందుకే అందరూ మోడీని కోరుకుంటున్నారు.' అన్నారు సునీల్ షెట్టి. జైట్లీ పక్కన కాషాయ కండువా వేసుకుని మరీ కూర్చున్నారు సునీల్ షెట్టి. -
తండ్రి తర్వాతే అన్నీ..
సినిమాల్లేవు.. కొత్త ప్రాజెక్టులపై సంతకాలూ చేయలేదు. కనీసం కూతురు తొలిసారిగా సినిమాలో నటిస్తుందన్న ఉత్సాహమూ సునీల్ శెట్టిలో కనిపించడం లేదు. ఎంతగానో ప్రేమించే తండ్రి అనారోగ్యంతో ఉండడమే మనోడి బాధకు కారణం. ఆయనకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ఉద్దేశంతో దక్షిణ ముంబైలోని తన ఇంటినే ఐసీయూగా మార్చా డు. ‘మూడు నెలలుగా సరిగ్గా నిద్రపోవడం లేదు. సంతో షం, బాధ కలగలిసిన సమయమిది. ఒకవైపు తండ్రి ఆరోగ్యం బాగాలేదు. కూతురు ఆథియా సిని మాల్లోనూ నటిస్తుందనే సంతోషం మాత్రం ఉంది’ అని సునీల్ వివరించా డు. సూరజ్ పంచోలీ నాయకుడిగా రాబోతున్న ‘హీరో’ సినిమా షూటింగ్కోసం ఆథియా ప్రస్తుతం మనాలీలో ఉంది. తండ్రి అనారోగ్యం సునీల్‌ను బాగా కుంగదీసింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. దీనికితోడు అఫ్తాబ్ శివ్దాసానితో గొడపడ్డాడంటూ వచ్చిన వార్తలు తనను మరింత బాధపెట్టాయని ఇతడు వాపోయాడు. ‘అఫ్తాబ్ లాంటి సున్నిత, మంచి మనిషితో గొడవలు ఎలా పెట్టుకుంటాను ? అసలే మనోవేదనతో బాధపడుతున్న నాకు ఇలాంటి కథనా లు చదివినప్పుడు మరింత బాధకలుగుతోంది’ అని చెప్పా డు. సినిమాల గురించి మాట్లాడుతూ అవకాశాలు ఎప్పుడైనా వస్తాయని, ప్రస్తుతం తండ్రితో గడపడమే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశాడు. అయితే ఆథియా పరాయి రాష్ట్రంలో ఉన్నా ఆమె గురిం చి తనకు బెంగేమీ లేదని తెలిపాడు. ‘ఆమె పూర్తి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్ యూనిట్ అంతా మా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే. ఆథియా, సూరజ్‌ను వాళ్లు సొంత బిడ్డల్లా చూసుకుంటారు’ అని సునీల్ శెట్టి వివరించాడు. -
టాలీవుడ్- బాలీవుడ్ తారల క్రికెట్