Irrigation project
-
అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు అన్నీ అవరోధాలే..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నాలుగు దశాబ్దాల క్రితం పునాదిరాయి వేసిన ‘లెండి’ ప్రాజెక్టు అసంపూర్తిగానే మిగిలింది. ఇరు రాష్ట్రాల్లోని 60 వేల పైచిలుకు ఎక రాల భూములకు.. సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు భూసేకరణ, నిధుల సమస్యలతో నానుతూ వస్తోంది. ప్రాజెక్టు పనులు పూర్తయితే.. వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద (Bichkunda) మండలాల్లో దాదాపు 22 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంతో ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఏళ్లుగా ఎదురుచూ స్తూనే ఉన్నారు.1984లో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టినపుడు అంచనా వ్యయం రూ.54.55 కోట్లు మాత్రమే. అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులు పలుమార్లు ఆగిపోవడంతో.. ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు.. అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి.6.36 టీఎంసీల సామర్థ్యం..మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకాలోని గోజేగావ్ వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్ర 3.93 టీఎంసీలు, తెలంగాణ 2.43 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించారు. మహారాష్ట్రంలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నీరందిస్తుందని అంచనా వేశారు. కాగా ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984లో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి.కాగా గోజేగావ్ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణం పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ.43.14 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్ పనులు జరిగాయి. కానీ ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి.చదవండి: కంచకు చేరని కథతెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. భూములకు పరిహారంతో పాటు ప్రాజెక్టు పనుల పూర్తికి అంచనా వ్యయం మరింత పెరగవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడైనా పూర్తవుతుందా..ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు.. అసంపూర్తిగా మిగిలిన లెండి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అక్కడి రైతులకు పరిహారం ఇప్పించి పనులు పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది. -
ఔరా.. వైరా..
తడారిన భూములకు ఊపిరి పోస్తోంది. ఎండిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.. లక్షలాది బతుకులకు అన్నం పెడుతోంది. పర్యాటక కేంద్రంగా కూడా వరి్ధల్లుతున్న ఆ జలాశయం వయసు వందేళ్లు.. ఖమ్మం జిల్లాలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరొందిన వైరా జలాశయంపై కథనమిది. వైరా: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన వైరా జలాశయం.. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కల్పతరువుగా నిలుస్తున్న ఈ జలాశయాన్ని స్వాతంత్య్రానికి ముందు నైజాం నవాబు నిర్మించారు. వృథా నీటిని అరికట్టేలా.. తొలినాళ్లలో ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే నిమ్మవాగు, ఏన్కూరు మండలం నుంచి ప్రవహించే గండివాగు, గిన్నెలవాగు, పెద్దవాగుల నుంచి వచ్చే మరో ఏరు.. వైరా సమీపాన కలిసి అతిపెద్ద ప్రవాహంగా తయారై వృ«థాగా పోయేది. ఈ పరిస్థితుల్లో ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని.. నాటి పాలకుడైన నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆలోచన చేశారు. దీంతో సాయిద్ జాదా నవాబ్ అలావత్జంగ్ బçహదూర్ 1923వ సంవత్సరంలో శంకుస్థాపన చేయగా అప్పటి నిజాం ప్రభుత్వ కార్యదర్శి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బçహదూర్ పర్యవేక్షణలో సుమారు రూ.36 లక్షలతో ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. డంగు సున్నం, రాయితో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా.. 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. అలాగే, 130 చదరపు మైళ్ల భూమిని రైతుల నుంచి సేకరించి.. అప్పట్లోనే సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 88 అడుగులు కాగా, పొడవు 5,800 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు 19 మైళ్ల దూరం ప్రవహిస్తూ.. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. కుడి కాల్వ 15 మైళ్ల దూరం ప్రవహించి 29 ఉపకాల్వల ద్వారా 16 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ఐదు మైళ్ల దూరం ప్రవహిస్తూ 22 ఉప కాల్వల ద్వారా తొమ్మిది వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిoది. 1930లో కేవలం 12 వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేలా డిజైన్ చేసినా ప్రస్తుతం రెండింతలుగా సాగవుతుండడం విశేషం. దాహార్తి తీరుస్తూ.. ఖమ్మం జిల్లాలోని వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, వేంసూరు, కొణిజర్ల, చింతకాని, ఏన్కూరు, పెనుబల్లి తదితర 11 మండలాల్లోని 420 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రిజర్వాయర్ నుంచి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ కృషితో మహర్దశ.. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక కృషి వల్ల ఈ జలాశయం రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు అప్పట్లో రూ.51 కోట్లు మంజూరు చేయగా మహర్దశ పట్టింది. జలాశయం ఆధునికీకరణలో భాగంగా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీత, సిమెంట్‌తో లైనింగ్ చేయించి కాల్వలు పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఫలించింది. పర్యాటకంగానూ అభివృద్ధి రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్లు.. అందమైన పూల తోటలు.. చుట్టూ నీరు.. కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరిపింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ.. అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయంసంధ్య వేళల్లో ఇక్కడి దృశ్యాలను తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఈమేరకు పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్క్ నిర్మించి.. పూలతోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ రూ.70 లక్షలు వెచ్చిoచింది. ఇక్కడ పలు టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా జరగడం విశేషం. మత్స్యకారులకు జీవనోపాధి వైరా రిజర్వాయర్‌పై కొణిజర్ల, వైరా, తల్లాడ మండలాలకు చెందిన సుమారు 500 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి.. ముందు నుంచే మత్స్యకారులు చేపలు, రొయ్య పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు. -
నాపై కక్ష సాధించుకోండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తెలంగాణలోనైనా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి పాడి పంటలతో విలసిల్లేలా మా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు.ఆదివారం ఆయన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అక్కడ రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు నారాయణపేట– మక్తల్– కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు కృష్ణా జలాలు పారిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆరేడు దశాబ్దాలుగా వెనుకబడ్డ ఈ ప్రాంతంలో వలసలు ఆపాలని తాను చేస్తున్న అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆరోపణలతో, చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తనపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించుకోవాలని.. అంతేతప్ప ప్రాజెక్టులను, జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. కాళ్లలో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించబోరని హెచ్చరించారు. అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు.. పాలమూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో రెండు వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచి్చనా ఇక్కడి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జీఎమ్మార్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.మాకు అవకాశం వచి్చంది.. అభివృద్ధి చేసుకోవద్దా..?నాడు పాలమూరు జిల్లా ప్రజలు పార్లమెంట్‌కు పంపినా, రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయినా ఈ జిల్లాను పట్టించుకోలేదని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు గుప్పించారు. ‘‘మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్నా మేం ఏనాడూ ఏడవలేదు. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లా ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇచ్చారు. సీఎంగా కూడా అవకాశం ఇచ్చారు.. ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత మాకు లేదా.. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పనిచేస్తున్నా నిరంతరం పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలన్నదే నా ఆకాంక్ష’’అని పేర్కొన్నారు. -
‘సాగునీటి’ అప్పులపై వడ్డీని తగ్గించేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్థికంగా భారంగా మారాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా అప్పులపై వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వరంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అంతర్జాతీయ నీటి వారం సదస్సు– 2024కు ఉత్తమ్ హాజరయ్యారు.రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ సదస్సు 4 రోజులపాటు కొనసాగనుంది. తొలిరోజు కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రా ధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించిందని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.నిధుల రూపంలో సాయం అందించడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరితగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా మంత్రి.. పలు సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన రుణాలపై ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: భట్టి
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయమని.. తమ ప్రాజెక్టులు ప్రజలపరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వైరా సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులు ప్రారంభించాం, తక్కువ ఖర్చుతో ఏం పూర్తి చేశామనే చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా నేను, మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చకు సిద్ధం. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ సిద్ధమా? పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం.. ఏకకాలంలో 15 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన మా ప్రభుత్వానికి పోలిక ఉందా? దేశంలో ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేనట్టుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించాం.సీఎం ఆదేశించిన వెంటనే శుక్రవారం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ అవుతాయి..’’ అని తెలిపారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లకు పునాది వేశారని గుర్తు చేశారు. వైఎస్ హయాంలోనే వీటికి రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు చేశారని.. మరో రూ.1,548 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ వీటిని పక్కనపెట్టి రీడిజైనింగ్ పేరిట సీతారామ ప్రాజెక్టును తెచ్చి దోపిడీ చేసిందని.. వేల కోట్లు దండుకునేందుకు, కమీషన్ల కక్కుర్తి కోసం ఐదేళ్ల ముందే మోటార్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు.బీఆర్ఎస్ అసమర్థత వల్లే ప్రాజెక్టు ఆలస్యం: ఉత్తమ్కుమార్రెడ్డిపదేళ్లలో రూ. 7,500 కోట్లు ఖర్చు చేసినా, బీఆర్ఎస్ ప్రభుత్వ అస మర్థతతో సీతారామ ప్రాజెక్టు పూ ర్తికాలేదని మంత్రి ఉత్తమ్ మండి పడ్డారు. తమ మంత్రుల పర్యవేక్ష ణతోనే ప్రాజెక్టు పనులు ముందు కు సాగాయన్నారు. మరో 15 రో జుల్లో ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.మేమే ప్రారంభించాం.. మేమే పూర్తి చేస్తాం: పొంగులేటిగతంలో కాంగ్రెస్ ప్రారంభించిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే పూర్తి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పా రు. వైఎస్సార్ హయాంలో చేప ట్టిన ప్రాజెక్టుల పనులు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి చుక్కనీరు ఇవ్వకుండా కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీతారామ ప్రాజెక్టు పనులు 39 శాతమే పూర్తయ్యాయని వెల్లడించారు.రైతు రుణం తీర్చుకుంటున్నాం: తుమ్మలరాష్ట్రంలో ఇందిరమ్మ రా జ్యం కోసం ప్రజలు తపించారని, వారి రుణం తీర్చు కుంటున్నామని మంత్రి తు మ్మల చెప్పారు. ‘‘రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి మాట నిలబె ట్టుకున్నాం. కొన్ని పార్టీలు రుణమాఫీ రాలేదంటూ వా ట్సాప్ చేయాలంటున్నాయి. గత పదేళ్లలో చేయని హామీల గురించి వాట్సాప్ చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు.ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతాం: మంత్రి కోమటిరెడ్డికాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. అందులో భాగంగా రైతు రుణమాఫీ చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. -
కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే దానిపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వివరించారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రాణహిత–చేవెళ్ల ఎందుకు కట్టలేదు? ఏదో జరిగిందని మేడిగడ్డ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కాళేశ్వరంతో ఏం చేశారని అడుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. రైతుల దగ్గరకు వెళ్లి అడగాలని సూచించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్భుతం అని మెచ్చుకున్నారని, నేర్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత – చేవెళ్ల ఎందుకు కట్టలేదని నిలదీశారు. మేము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళు ఉన్నచోటకు ప్రాజెక్టును మార్చి కట్టి నీళ్ళు అందించామని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి మేము చేసిన పనుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. అదే సమ యంలో చేసిన పనులను ఆపకుండా పునరుద్ధ రణ పనులు చేపట్టాలని కోరారు. దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని, మీ రు చేసే పనుల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని, దీన్ని ప్రజలు క్షమించరని అన్నా రు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ ఉందనే మేడి గడ్డ బ్యారేజీ టూర్ ప్రోగ్రాం పెట్టారని హరీశ్‌రా వు విమర్శించారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించొద్దంటూ తాము నిద్ర లేపితే వారు లేచారని విమర్శించారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్‌లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్‌కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్‌ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
తప్పు తేలితే తగిన శిక్ష!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అ ధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని ఒక ట్రెండు రోజుల్లో శాసనసభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా? జరిగినట్టు తేలితే బాధ్యులెవరు? అనేది తేలుస్తామని.. వారికి తగిన శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరే ముందు శాసనసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాలే కీలకమని.. కృష్ణాజలాలపై ఇప్పటికే శాసనసభలో చర్చించామని, గోదావరి జలాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్సార్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల విలువైన పనులు కూడా జరిగాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టుకు మార్పులు చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంటూ బ్యారేజీలను కట్టుకుంటూ పోయింది. రూ.38,500 కోట్ల వ్యయ అంచనాతో ప్రాణహిత– చేవెళ్లను రూపొందిస్తే.. కాళేశ్వరం పేరిట రూ.1.47 లక్షల కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.2.5 లక్షల కోట్లు అవుతుందా? ఇంకెంత అవుతుందోనన్న దానిపై స్పష్టత లేదు. పిట్టగూడులా కట్టారా? బాంబులతో పేల్చారా? మ్యాన్ మేడ్ వండర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్టు బీఆర్ ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మేం ఇక్కడ అనడం లేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుంది. మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర్రావు (హరీ శ్‌రావును ఉద్దేశించి)తోపాటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలి. బ్యారేజీకి ఏం జరిగిందో చూసి, తెలంగాణ ప్రజలకు వివరించాలి. బస్సులో ప్రయాణించడానికి కష్టమైతే.. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచాం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారు. అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి అయితే.. ప్రతిపక్షాలే బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ చూడటానికే ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది’’ అని రేవంత్ చెప్పారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో లోపాలున్నట్టుగా విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొనగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుకలో పేకమేడలు కట్టారా? పునాదుల కింద ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గత ప్రభుత్వ నేతలు అంటున్నారు. వాళ్లు ఇసుకలో పేకమేడలు కట్టారా? సభలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టాక.. కాళేశ్వరంపై, కాళేశ్వర్రావుగా పిలుచుకున్న హరీశ్‌రావుపై, ప్రాజెక్టు ఎవరెవరికి ఏటీఎంలా మారిందన్న అంశంపై చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఏమేం ఫైళ్లు మాయమయ్యాయి? ఎవరు మాయం చేశారన్న దానిపై ప్రాథమిక నివేదిక అందింది. -
ఆయకట్టు ఎకరా పెరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్‌ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. -
‘సాగునీటి’లోనూ అక్రమాల ప్రవాహం
సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే ముసుగులో చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ఇంత ఖర్చుచేసినా కొత్త, పాత కలిపి కేవలం 3.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. వీటిని పరిశీలిస్తే.. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారో అర్థంచేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టి, పూర్తికాని 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తిచేయడానికి కేవలం రూ.17,368 కోట్లు మాత్రమే అవసరమని 2014, జూలై 28న నాటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ రూ.68,293.94 కోట్లను ఖర్చుచేసినట్లు చంద్రబాబు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. ఇందులో పోలవరంపై ఖర్చుపెట్టిన రూ.10,860.67 కోట్లు, నీరు–చెట్టు పేరుతో కాజేసిన రూ.12,400.23 కోట్లు.. కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై వ్యయం చేసిన రూ.3,199.92 వెరసి.. రూ.26,460.82 కోట్లను మినహాయిస్తే.. జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే.. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అవసరమైన దానికంటే రూ.24,465.12 కోట్లను అధికంగా వ్యయం చేశారు. పోనీ.. ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేశారా అంటే అదీ లేదు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మాత్రమే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.24 వేల కోట్లను దోచిపెట్టి.. అందులో చాలావరకూ ముడుపుల రూపంలో చంద్రబాబు రాబట్టుకున్నారన్నది బహిరంగ రహస్యం. ‘పోలవరం’తో కేంద్ర ఖజానాను సైతం.. ఇక కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకుని.. కేంద్ర ప్రభుత్వ ఖజానాను దోచేశారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు.. ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142 కోట్ల విలువైన పనులను అప్పటి ఆర్థికమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు కట్టబెట్టి అక్రమాల్లో రికార్డు నెలకొల్పారు. అందుకే చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం ఆరోపించారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
వేగంగా ప్రాజెక్టులు
-
ఆకుపచ్చ హామీ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రాంతంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిండి ఎత్తిపోతల పథ కాన్ని ఒకటిన్నరేళ్లలో పూర్తిచేసి మునుగోడును ఆకుపచ్చగా చేసే బాధ్యత తనదేనని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో వచ్చి గాలిమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తాయిలాలకు తెరలేపార న్నారు. ప్రగతిభవన్, ఫాం హౌస్ దాటని కేసీఆర్.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల కోసం పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీసీరోడ్లకు ప్రతిపాదనలు, మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లు, డిండి లిఫ్టు నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత కార్మికులకు బీమా, పెన్షన్లు వస్తున్నాయని, రోడ్లు, బ్రిడ్జి పనులకు రూ.7 కోట్లు వస్తున్నా యని తెలిపారు. -
‘ఆర్ఆర్ఆర్’ పరిహారం లెక్క చదరపు మీటర్లలో..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్ రింగ్ రోడ్డులో భూసేకరణ పరిహారం చదరపు మీటర్లలో లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం సేకరించి భూములకు సంబంధించిన పరిహారాన్ని ఎకరాల్లో లెక్కించి చెల్లిస్తారు. ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రేటుకు నెగోషియేషన్ చేసి ధర నిర్ణయిస్తారు. కానీ ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఇందుకు భిన్నంగా చదరపు మీటర్లలో లెక్కించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్... ఈ రహదారి భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలైన్‌మెంట్‌పై ప్రైవేట్ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవలే రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం వంటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించి, వెంటనే స్థానిక భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 158.64కి.మీ.ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం సంగారెడ్డి, జోగిపేట్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్‌ను భూసేకరణ అథారిటీగా నియమించిన విషయం విదితమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు విడుదల చేసిన అలైన్మెంట్ ప్రకారం ఆర్డీఓలు 113 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. -
అప్పర్ భద్ర లెక్కలు తప్పు
సాక్షి, అమరావతి : అప్పర్ భద్రకు నీటి కేటాయింపులపై కర్ణాటక చెప్పిన మాయ లెక్కలను నమ్మి, ఆ ప్రాజెక్టుకు అనుమతులిచ్చారని, వాటిని పునఃసమీక్షించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండానే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం అధికారులు అనుమతులిచ్చారని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తుంగభద్ర ఆయకట్టుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు. చుక్క నీరూ కేటాయించకుండానే.. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 నీటి కేటాయింపులు చేయకున్నా, కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నట్లుగా కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కర్ణాటక ప్రభుత్వం నమ్మించింది. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనలను 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. తుంగభద్రలో ఆ మేరకు నీటి లభ్యత లేదని స్పష్టం చేసింది. కానీ.. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25 టీఎంసీలు, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర చానల్స్ ఆధునికకీరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటా నీరు 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని తెలిపింది. అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తామని, భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి.. దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. కానీ, అప్పర్ తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేసింది. అయినా, కర్ణాటక చెప్పిన తప్పుడు లెక్కలనే నమ్మిన సీడబ్ల్యూసీ దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండానే గతేడాది డిసెంబర్ 24న అప్పర్ భద్రకు హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ అనుమతులను చూపిస్తూ కర్ణాటక సర్కారు అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్ల (2018–19 ధరల ప్రకారం)తో పెట్టుబడి అనుమతి ఇవ్వాలని గత మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదన పెట్టింది. దీనికి కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించింది. ఈ అనుమతుల ఆధారంగా.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్రానికి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకపోవడాన్ని ఎత్తిచూపింది. మూడు రాష్ట్రాలకూ నష్టమే తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. కానీ 1976–77 నుంచి 2007–08 వరకూ ఏనాడూ 186.012 టీఎంసీలకు మించి ప్రవాహాలు రాలేదు. దాంతో దామాషా పద్ధతిలో కర్ణాటక, ఏపీ, తెలంగాణలకు తుంగభద్ర బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు వచ్చే ప్రవాహాలు మరింత తగ్గుతాయి. ఇది తుంగభద్ర డ్యామ్తోపాటూ కేసీ కెనాల్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి (వేదవతి)పై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని బీటీపీ (భైరవానితిప్ప ప్రాజెక్టు) మధ్యలో ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టంగా చెప్పింది. కానీ.. ఇప్పుడు అప్పర్ భద్రలో అంతర్భాగంగా ఆ రెండు జలాశయాల మధ్య వేదవతిపై మరో జలాశయం నిర్మిస్తే బీటీపీ ఆయకట్టు ఎడారిగా మారుతుంది. ఈ అంశాలన్నింటినీ విపులీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. -
నీళ్లు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదానా?
సాక్షి, అమరావతి: అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాకముందే ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడాన్ని ఆక్షేపించింది. దీన్ని తక్షణం రద్దు చేయాలని పట్టుబట్టింది. దీంతో రెండు రాష్ట్రాలతో చర్చించాకే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పనపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పష్టం చేశారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పంకజ్‌కుమార్ అధ్యక్షతన హైపవర్ కమిటీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పర్ భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 6.25 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ప్రాజెక్టు చేపట్టామని కర్ణాటక జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అంచనా వ్యయంలో 90 శాతం నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. చదవండి: ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పర్ భద్రకు నీటి కేటాయింపులే లేవని స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం 9 టీఎంసీలే కేటాయించిందని, ఆ తీర్పు ఇప్పటివరకు అమలులోకి రాలేదని గుర్తు చేశారు. అప్పర్ భద్ర వల్ల కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డిజైన్లు ఆమోదించాలి.. పోలవరం పనుల పురోగతిని హైపవర్ కమిటీకి అధికారులు వివరించారు. పెండింగ్ డిజైన్లను తక్షణమే ఆమోదించేలా డీడీఆర్పీ(డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీని ఆదేశించాలని కోరగా కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. ఎప్పటికప్పుడు నిధుల రీయింబర్స్మెంట్ ద్వారా పనులను మరింత వేగంగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్న రాష్ట్ర అధికారుల అభిప్రాయంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకీభవించారు. విభాగాల వారిగా పరిమితులు విధించకుండా అంచనా వ్యయాన్ని గంపగుత్తగా భావించి నిధులు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులు కోరారు. డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించిన సర్వే పూర్తయిందని త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. -
ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే.. చేసిన పనులకు బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇకపై ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)కే అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాంట్రాక్ట్ ఏజెన్సీలు నమ్మడంలేదు. చాలాఏళ్ల కిందట చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. పైగా, ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అధికారమున్నా నిధులు సున్నా రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిలో గేట్లు, జనరేటర్లు, రోప్‌వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపుమొక్కల తొలగింపు, పెయింటింగ్, గ్రీజింగ్, గ్యాంట్రిక్ క్రేన్లు, ఎలక్ట్రీషియన్, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటివన్నీ ఓ అండ్ ఎంలో భాగంగా చేపట్టాలి. వీటి నిర్వహణకు ఏటా రూ.280 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను గ్రీన్‌చానల్‌లో విడుదల చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చింది. అత్యవసర పనులకు వ్యక్తిగత స్థాయిలోనే నిధులు విడుదల చేసే అధికారాన్ని ఈఎన్సీ మొదలు ఈఈల వరకు కట్టబెట్టింది. కోటి వరకు ఈఎన్సీ (జనరల్), రూ.50 లక్షల వరకు సీఈ, రూ.25 లక్షల దాకా ఎస్ఈలకు, రూ.5 లక్షల వరకు ఈఈలకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి విడుదలైన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్ ఎంకు సంబంధించిన బిల్లులు రూ.20 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సైతం... ఈ ఏడాది 19 డివిజన్ల పరిధిలో 613 రకాల ఓ అండ్ ఎం పనులను రూ.65 కోట్లతో చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే చాలాచోట్ల ఇంజనీర్లు టెండర్లు పిలుస్తున్నా స్పందన రావడం లేదు. నాగార్జునసాగర్ పరిధిలో రూ.35 లక్షల సివిల్ పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి టెండర్ పిలిచారు. ఎస్సారెస్పీ పరిధిలో మరమ్మతులు, మట్టి పనులకు రూ.50 లక్షలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లలో ఉలుకూపలుకూలేదు. ఇక జూరాల పరిధిలో మెకానికల్ పనులు, హెడ్‌రెగ్యులేటర్, షట్టర్ల పనులకు రూ.25–30 లక్షలతో మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవో 20 కింద పంప్‌హౌస్‌ల నిర్వహణ నిమిత్తం రూ.100 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసినా, నిధుల విడుదల ఉంటుందా.. ఉండదా.. అనే సంశయం మాత్రం వారిని వెంటాడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్‌తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్‌లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
‘సీతమ్మ’కు రూ.3,426 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాలు తీసుకునేలా ఆమోదించింది. గతంలోనే ఈ ప్రాజెక్టు రుణాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.3,481 కోట్లతో గతేడాది పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకోగా పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అనుమతులు అవసరమున్నా.. తీసుకోవాలని.. ఒకవేళ అనుమతిలేని కారణంగా పనులు నిలిపివేస్తే.. రుణాన్ని బేషరతుగా వెన క్కి తీసుకుంటామని పీఎఫ్సీ తన పేర్కొంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో సీతమ్మసాగర్‌ను అనుమతి లేని ప్రాజెక్టుగా తెలిపింది. ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్సీ ఈ నిబంధనలను పెట్టింది. -
ఫలాలకు దీటుగా పునరావాసం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే ఆయకట్టు రైతులకు దీటుగా త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు కాలనీల్లో నిర్మించిన ఇళ్లల్లో పునరావాసం కల్పిస్తోంది. రక్షిత మంచినీరు, రహదారి, మురుగునీటి కాలువలు, విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో కల్పిస్తోంది. నిర్వాసితులకు చేతివృత్తులతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తూ.. ఉపాధి కల్పిస్తోంది. గతేడాది గండికోట, చిత్రావతి జలాశయాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో 19,688 కుటుంబాలకు రూ.1166.57 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించింది. దేశంలో ఒక ఏడాది ఇంత భారీ ఎత్తున నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది పోలవరం, వెలిగొండలో 22,070 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి రూ.5,452.52 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, సోమశిల, గండికోట, చిత్రావతి, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాళెం రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసింది. పోలవరంలో శరవేగంగా.. వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేసేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం పోలవరాన్ని 2022 నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లో 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు ఓ.ఆనంద్‌ను ప్రభుత్వం అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది 41.15 కాంటూర్ మీటర్ల పరిధిలోని 20,870 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటికే 3,417 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 17,453 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.3,942.97 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పునరావాసం కల్పించడం కోసం 73 కాలనీలను నిర్మిస్తోంది. 27 కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 84,731 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.25,539.18 కోట్లు అవసరం. ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 140 కాలనీలను నిర్మించనుంది. వెలిగొండలో వేగవంతం.. వెలిగొండలో అంతర్భాగంగా 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయంతో ప్రకాశం జిల్లాలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 4,617 నిర్వాసిత కుటుంబాలు, 18 ఏళ్లు నిండిన 2,938 మంది యువతకు ఏకకాల పరిష్కారం కోసం రూ.1510.05 కోట్లు అవసరం. ఇప్పటికే రూ.1411.56 కోట్లను మంజూరు చేశారు. ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. -
రాయలసీమ ప్రాజెక్టుల ఎస్పీవీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ)కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 116293)పై ఆమోదముద్ర వేసింది. దీంతో సంస్థ మొదటి బోర్డు సమావేశాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బ్యాంకులో ఆ సంస్థ పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తొలి విడతగా రూ.ఐదు కోట్లను అందులో జమ చేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ, జాతీయ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరిపి.. తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి, వాటికి బడ్జెట్ ద్వారా కేటాయించే నిధులను జత చేసి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణాలకు ఆర్ధిక సంస్థలు రెడీ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో 30 శాతాన్ని అంటే రూ.11,994 కోట్లను ప్రభుత్వం తన వాటాగా సమకూర్చుతుంది. మిగిలిన 70 శాతం అంటే రూ.27,986 కోట్లను జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమకూర్చుకోనున్నారు. ఆ మేరకు సంప్రదింపుల నేపథ్యంలో.. రుణాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులు కృష్ణా నదికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వరద జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళిక కింద రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులను చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే మూడు ప్యాకేజీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ ఏర్పాటయ్యింది. -
ఈ శాఖలన్ని ఒకే గూటికి
సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన ఎన్నెస్పీ, ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఐడీసీ, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జలవనరుల శాఖగా మార్చేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆయకట్టు, నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రీ ఆర్గనైజేషన్ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయకట్టు, ప్రస్తుతం ఉన్న పోస్టులు, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెప్పించుకొని దాని ఆధారంగా రీ ఆర్గనైజేషన్‌లో తీసుకున్న నియమ నిబంధనల ప్రకారంఅమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆమోదం పొందే విధంగా పనులు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు, ప్రతి నియోజకవర్గాన్ని హద్దుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో ఈఈ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాని పరిధిలో 25వేల ఎకరాల వరకు ఒక డీఈ స్థాయి అధికారిని నియమించే విధంగా రూపకల్పన చేశారు. శాఖలన్నింటినీ ఏకం చేసిన తర్వాత ఇంజనీర్లను కేటాయిస్తారు. ఎన్నెస్పీ, ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టు, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటి పర్యవేక్షణ వారే చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కేంద్రంగా ఒక సీఈ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎస్ఈలు, ఈఈ, డీఈలు, ఏఈలను కేటాయించే విధంగా ప్రతిపాదించినట్లు సమాచారం. తాజాగా రెండు సీఈ పోస్టులను ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా పరిధికి ఒక సీఈ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధికి ఒక సీఈని కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరికొంత ఉంది. ఆ ప్రకారం ఇంజనీర్ పోస్టులను కేటాయించే విధంగా కసరత్తు సాగుతోంది. గతంలో ఉన్న పోస్టులు ఇలా.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ శాఖల పరిధిలో ఒక సీఈ, మూడు ఎస్ఈ, 12 మంది ఈఈలు కొనసాగుతున్నారు. ఇరిగేషన్ శాఖలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఒక సీఈ, ఇద్దరు ఎస్ఈ, ఎన్నెస్పీలో ఒక ఎస్ఈ, ముగ్గురు ఈఈలు, ఐడీసీలో ఒక ఈఈ, మిగిలిన ఈఈలు దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 8 మంది కొనసాగుతున్నారు. ఒకే పరిధిలోకి వస్తే.. ఇరిగేషన్‌లోని అన్ని శాఖలు ఒకే పరిధిలోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోస్టులను కేటాయిస్తారు. రెండు సీఈ, నాలుగు ఎస్ఈ, లక్ష ఎకరాల ఆయకట్టుకు, నియోజకవర్గ పరిధికి ఒక ఈఈ, 25వేల ఎకరాల ఆయకట్టుకు ఒక డీఈని కేటాయించే అవకాశం ఉంది. -
రాయలసీమ ఎత్తిపోతల పాతదే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్ రాసిన లేఖకు జగన్ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు) కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోందని సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు సంబంధించి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్నారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాను అన్నారు. కానీ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్ తెలిపారు. -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్‌తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్‌కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్‌కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్‌కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్‌బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ ఆనందర్‌రావు తదితరులు ఉన్నారు. -
పోల‘వరం’లో తొలి అడుగు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్వాసితులకు స్వర్ణ యుగం వచ్చేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్యాకేజీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి ... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీలను ఒడిసిపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టును సాకారం చేయాలనే చిత్తశుద్ధి ఉండడడంతో సీఎం ముందుగా తమ గోడు పట్టించుకుంటున్నారని నిర్వాసితులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి జలవనరులశాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్నారు. (అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి..సంక్షేమ రథం) కమీషన్ల కోసం బాబు యావ గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిర్వాసితులు మిగిలిపోయారు. వారి బాధలను గాలికొదిలేసి కమీషన్లు వచ్చే పనులను భుజానకెత్తుకున్నారు. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని మొత్తుకున్నా పట్టించుకోలేదు. పునరావాస చర్యలు తీసుకున్న తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్వాసితులు, నిపుణులు కమిటీ సూచించినా చంద్రబాబు అండ్ కో పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఐదేళ్లు మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా బాబు సర్కార్ అనాలోచితంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి గ్రామాలను ముంచేశారు. (కోవిడ్ పట్ల భయాందోళనలు పోవాలి) కాఫర్ డ్యామ్‌తో కొద్దిపాటి వరదకే గతేడాది మూడుసార్లు గిరిజన గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులు మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తేనే దేవీపట్నంతోపాటు విలీన మండలాల్లో ముంపునకు గురవుతాయి. అటువంటిది కాఫర్ డ్యామ్ కారణంగా భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే సరికే ఏజెన్సీ మండలాలు ముంపునకు గురయ్యే పరిస్థితి. ఇంతా చేసి అధికారం కోల్పోయాక తగదునమ్మా అంటూ చంద్రబాబు తనయుడు, లోకేష్ ముంపు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు బాధితుల ఆగ్రహానికి తోకముడిచి వెనుతిరగక తప్పింది కాదు. వైఎస్ హయాంలో... మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముందు ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. హామీ ఇచ్చినట్టే ముంపు బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేవారు. నాడు దేవీపట్నం మండలం వీరవరంలంక, గొందూరు, పరగసానిపాడు, అంగుళూరు, బోడిగూడెం గ్రామాల ప్రజలను ఇందుకూరిపేట–ఫజుల్లాబాద్‌కు మధ్య నిర్మించిన కాలనీలకు తరలించారు. భూమికి, భూమి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాలనీలు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రకంగా వైఎస్ హయాం 2004–2009 మధ్య సుమారు 1500 నిర్వాపిత కుటుంబాలకు మంచి చేశారు. ఆ బాటలోనే తనయుడు గతేడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. అనంతరం మంత్రులు, అ«ధికారులతో సమీక్షించిన సందర్భంలో నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అనాలోచితంగా చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం కోసం ఇటీవలనే రూ.79 కోట్లు విడుదల చేశారు. మహానేత వైఎస్ తరువాత ఇంత కాలానికి మళ్లీ ప్యాకేజీని ప్రకటించి మనసున్న నాయకుడిగా సీఎం నిలిచారని నిర్వాసితులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాఫర్ డ్యామ్‌కు సమీపాన ఉన్న ఆరు గ్రామాలకు పూర్తి స్ధాయి ప్యాకేజీ, ఇళ్ల నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు. శరవేగంగా కాలనీలు... ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తొలివిడతలో దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన కాలనీల నిర్మాణం జరుగుతున్నాయి. గిరిజనేతరులకు గోకవరం మండలం కృష్ణునిపాలెంలోను, గిరిజనులకు దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్‌లోనే వీరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల పాలనలో ఏనాడూ నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ ఆలోచనే వేరు మాజీ ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన రాగానే ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టేవారు. కమీషన్లకే బాబు ప్రాధాన్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసమే పోలవరం పనులు చేపట్టేవారు. ఇందుకు ఉదాహరణ కాఫర్ డ్యాం నిర్మాణం. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని బాధితులు మొత్తుకున్నా అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీని ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. ఈ పాపం ఆయనదే. జగన్‌దీ తండ్రిబాటే... గత ఏడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేసి మాట నిలబెట్టుకుంటున్నారు. ‘బాబు సర్కార్ పట్టించుకోలేదు’ నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించాలనే ఆలోచనే చంద్రబాబు సర్కార్‌కు రాలేదు. గ్రామాల నుంచి తరలించేందుకు అంత ప్యాకేజీ ప్రకటించడాన్ని ఎప్పుడూ పట్టించు కోలేదు. కాఫర్ డ్యామ్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల్లో మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కాళ్లరిగేలా తిరిగాం. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులను అసలు మనుషులుగా కూడా చూడ లేదు. కమీషన్ల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చూసుకున్నారు తప్ప వరదలు వస్తే నిర్వాసితులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని పట్టించుకోలేదు. – పోలిశెట్టి శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు ‘ప్యాకేజీ సంతోషంగా ఉంది’ ఈ ఏడాది వరదలు వచ్చినా నిర్వాసితులు ఎవరు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఏర్పాట్లు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గత వరదలు వలన నిర్వాసితులు అష్ట కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేమంతా బలయ్యాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులను తరలించే ఏర్పాటు చేయడం ఊరటనిస్తోంది. కాలనీలకు తరలించి వరద ముంపు నుంచి తప్పిస్తారని ఎదురుచూస్తున్నాం. – వెంకటరమణ, సీతారామం -
మాంద్యంలోనూ నిధుల వరద!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా తీసుకున్న నీటి పారుదలకు మాత్రం నిధుల కొరత రానివ్వడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తూనే రుణాల రూపేణా సేకరించిన వాటినీ ఖర్చు చేస్తోంది. తొమ్మిది నెలల వ్యవధిలో ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏకంగా రూ.17,285 కోట్ల నిధులు ఖర్చు చేయగా, మరో మూడు నెలల వ్యవధిలో ఐదారు వేల కోట్ల మేర వ్యయం చేయనుంది. నెలకు రూ.1,920 కోట్లు.. 2019–20 ఆర్థిక ఏడాదిలో తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఎక్కడా నిధుల కొరత లేకుండా చూస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 9 నెలల వ్యవధిలో రూ.8,586 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇందులో రుణాల ద్వారా రూ.5,945 కోట్ల మేర ఖర్చు చేయగా, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2,641 కోట్లు ఖర్చు చేశారు. దీంతో మిడ్‌మానేరు వరకు గోదావరి నీటి ఎత్తిపోతల సాధ్యమైంది. మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించే వ్యవస్థ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సైతం రూ.2,021 కోట్లు మేర ఖర్చు చేశారు. ఇందులో మెజార్టీ నిధులు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు వెచ్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది జూన్ నాటికి గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నాటికి తొలి పంప్‌హౌస్, మార్చి నాటికి రెండో పంప్‌హౌస్, మే చివరికి మూడో పంప్‌హౌస్ నిర్మాణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సైతం రుణాల రూపేణా రూ.1,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. వీటితో పాటే దేవాదులకు రూ.800 కోట్ల మేర, వరద కాల్వ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల మేర ఖర్చు చేశారు. చిన్న నీటి పారుదల రంగానికి సైతం పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు రూ.873 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రాష్ట్రం తన బడ్జెట్ నుంచి రూ.7,434 కోట్లు ఖర్చు చేయగా, రుణాల ద్వారా రూ.9,851 కోట్లు ఖర్చు చేసింది. నెలకు రూ.1,920 కోట్లకు తగ్గకుండా 9 నెలల్లో 17,825 కోట్లు ఖర్చు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయినా ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణ పనులు.. పూర్తయిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.10,000 కోట్ల మేర ఉండటం విశేషం. ఆర్థిక ఏడాది ముగిసే నాటికి మూడు నెలల వ్యవధిలో మరో రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్
-
సీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నేలటూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్టు తెలిపారు. దువ్వురు నుంచి బ్రహ్మంసాగర్ నీటి తరలింపుతో తెలుగుగంగా ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని అన్నారు. బ్రహ్మంసాగర్ కింద 90 వేల ఎకరాలను నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. (మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్) సభలో సీఎం ప్రసంగిస్తూ.. ‘బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీ లు పూర్తి సామర్థ్యం వైఎస్సార్ హయాంలో జరిగింది. గతంలో భారీ వరదలు వచ్చినా డ్యాంలు నిండలేదు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు కింద 90 వేల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల కేటాయింపు చేస్తాం. 2008లో వైఎస్సార్ జారీ చేసిన 224 జీవోపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. కుందూ నదిపై చేపట్టిన మూడు ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు మేలు జరుగుతుంది. రూ.2300 కోట్ల తో ఈ పనులు చేపడుతున్నాం. ఈ ఏడాది భారీ వరదలు రావడంతో.. శ్రీశైలం గేట్లు ఎనిమిది సార్లు ఎత్తాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. వరద నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రధాన ప్రాజెక్టు కాలువలను వెడల్పు చేయలేదు. అందుకే వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. రాయలసీమ ఇరిగేషన్ కాలువల సామర్థ్యం చంద్రబాబు పెంచి ఉంటే వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే వాళ్లం. రూ.23000 కోట్ల రూపాయలతో సీమలోని అన్ని సాగునీటి కాలువ సామర్థ్యం పెంచుతున్నాం. మొత్తం 60 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడుతున్నాం. గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్తోంది. కృష్ణ, గోదావరి జలాలతో ఏపీని సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు’ అని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా జోలరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టి.. వరద సమయంలో 8 టీఎంసీ ల నీటిని దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే కేసీ, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2234 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. దీంతో రాయలసీమకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సాగునీటి’ పటిష్టానికి మేధోమథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటిశాఖ పునర్వ్యవస్థీకరణపై మేధోమథనం జరిపేందుకు ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో శనివారం నిర్వహించిన ఒక్కరోజు వర్క్‌షాప్ విజయవంతమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆ శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)పాలసీ తయారు చేయడం, సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ, శాఖ ఆస్తులు, ఇతర సాంకేతిక అంశాల జాబితా రూపకల్పన, శాఖ కార్యకలాపాలను ప్రభావితం చేసే చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం వంటి అంశాలపై సదస్సులో కూలంకషంగా చర్చించారు. కార్యాచరణపై ఇంజనీర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో ఈఎన్సీ స్థాయి నుంచి ఈఈ స్థాయి వరకు 250 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. సదస్సు లక్ష్యాలను, ప్రభుత్వ ఆలోచనను పరిపాలనా విభాగపు ఈఎన్సీ నాగేందర్రావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టులో 75 లక్షల ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాల కిందే ఉందని, రానున్న రోజుల్లో వీటి నిర్వహణ కీలకం కానుందని తెలిపారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఈఎన్సీల మధ్య పని విభజన జరగాలని సీఎం అభిలషించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎత్తిపోతల పథకాల్లో 80కి పైగా పంప్‌హౌస్‌ల నిర్వహణకు దీర్ఘకాలిక దృష్టితో ఒక సమగ్ర ‘ఓఅండ్ఎం’పాలసీని తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి పథకాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పంప్‌హౌస్‌లు, విద్యుత్ పరికరాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్వహణ, షిఫ్ట్ ఇంజనీర్ల బాధ్యతలు, సిబ్బంది అవసరాలు తదితర అంశాలపై వివరించారు. పదోన్నతుల సంగతి సీఎం దృష్టికి తీసుకెళ్లాలి ఈ సందర్భంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి తాము కష్టించి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సదస్సులో పాల్గొన్న ఇంజనీర్లు తెలిపారు. అయితే గత రెండేళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన పదోన్నతులకు హైకోర్టు తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోయినందున వెంటనే పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. దీని తర్వాత జనవరిలో మరో సదస్సును కూడా నిర్వహిస్తామని, అవసరమైతే సీఎం స్థాయిలో మరో విస్తృత స్థాయి సదస్సును నిర్వహిస్తామని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. సదస్సులో ఈఎన్సీలు హరిరాం, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, చీఫ్ ఇంజనీర్లు, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనరావు, బంగారయ్య, వీరయ్య, శంకర్, హమీద్ ఖాన్, నరసింహా, అనంత రెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస రావు, అజయ్ కుమార్, మోహన్ కుమార్, శంకర్ నాయక్, వి.రమేశ్, వి.సుధాకర్, డీసీఈలు అజ్మల్‌ఖాన్, నరహరిబాబులు పాల్గొన్నారు. -
‘సీతారామ’...పూడిక తీసేద్దామా..!
సాక్షి, హైదరాబాద్ : పూర్వ ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి పూడికమట్టి సమస్య వెన్నాడుతోంది. ఈ ఎత్తిపోతలకు అవసరమయ్యే నీటిని తీసుకునే దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో భారీగా మట్టి, ఇసుక మేటలు వేయడంతో అది పంప్‌హౌస్‌లోకి చేరి, పంపులు, మోటార్లకు సమస్యలు తెచ్చే అవకాశం ఏర్పడనుంది. దీన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ డ్రెడ్జింగ్ ద్వారా పూడికతీత తీయాలని నిర్ణయించింది. కేవలం 50 రోజుల వ్యవధిలో సుమారు 35వేల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక క్యూబిక్ మీటర్ పూడికను తీసేందుకు రూ.800 ఖర్చు కానుంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఫిబ్రవరి రెండో వారానికి మొదటి పంప్‌హౌస్‌లో 3 మోటార్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. -
ఘనపూర్ ప్రాజెక్ట్ మారని రూపురేఖలు
మెతుకుసీమ జీవన వాహిని.. జిల్లాలో ఉన్న ఏకైక మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్ట్ ఘనపూర్. ఎన్నో ఏళ్లుగా జిల్లాలోని సుమారు 21,625 ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. రైతుల కల్పతరువుగా మారిన ఈ ఆనకట్ట కీర్తి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చుక్క నీరు లేని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆనకట్ట ఎత్తు పనులు భూసేకరణలో అవరోధాలతో నిలిచిపోయాయి. దీని పరిధిలోని రెండు కాల్వలకు సంబంధించి సిమెంట్ లైనింగ్ పనులు 2005లో మొదలు కాగా.. ఇప్పటివరకు పూర్తి కాలేదు. సాక్షి, మెదక్: జిల్లా రైతాంగానికి పెద్దదిక్కుగా నిలుస్తోన్న ఘనపురం ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు ఏళ్లకేళ్లుగా కొనసా.. గుతూనే ఉన్నాయి. ప్రస్తు తం చుక్క నీరు లేని పరిస్థితుల్లో మంజీర పరవళ్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. సుమారు 14 సంవత్సరాలుగా ఆయకట్టు రైతులను వెక్కిరిస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించింది. నిధులు సైతం కేటాయించినప్పటికీ.. ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు మంజీరా నదిపై కొల్చారం–పాపన్నపేట మం డలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో 1905 లో ఘనపూర్ మధ్య తరహా ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 2,337 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. దీని పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్‌నహర్, ఫతేనహర్) ఉండగా.. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు. మహబూబ్‌నహర్ (ఎంఎన్) కెనాల్ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా.. దీని ద్వారా కొల్చారం, మెదక్, హవేళిఘనపూర్ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్ (ఎఫ్ఎన్) కెనాల్ పొడవు 12.80 కి.మీ కాగా.. పాపన్నపేట మండలంలోని 11 గ్రామా ల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ‘తెలంగాణ’లో నిధుల వరద ఘనపూర్ కాల్వల ఆధునికీకరణ కోసం 2005లో అప్పటి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జైకా పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు వినియోగించకపోవడంతో వెనక్కిమళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వయంగా 2014 డిసెంబర్ 17న ఘనపూర్ ప్రాజెక్ట్ బాట పట్టారు. సందర్శించిన సమయంలోనే ప్రాజెక్ట్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి కృషి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో వెనక్కి మళ్లిన జైకా నిధులు తిరిగివచ్చాయి. సీఎం హామీ మేరకు ఓసారి రూ.21.64 కోట్లు, ఆ తర్వాత రూ.43.64 కోట్లతోపాటు మరో రూ.1.64 కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునికీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపు, భూసేకరణకు ఈ నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఇటీవల బడ్జెట్లో ఘనపూర్ ప్రాజెక్ట్‌కు రూ.34 కోట్లు కేటాయించారు. సా..గుతున్న పనులు మహబూబ్‌నహర్, ఫతేనహర్ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా సిమెంట్ లైనింగ్ పనులు చివరి వరకు కాలేదు. ఫతేనహర్ కెనాల్ పొడవు 12.80 కిలో మీటర్లు కాగా.. దౌలాపూర్ వరకు.. మహబూబ్‌నహర్ కాల్వ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా మత్తాయిపల్లి వరకు (32 కి.మీలు) మాత్రమే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నహర్ కెనాల్ కింద శాలిపేట నుంచి జక్కన్నపేట వరకు.. ఫతేనహర్ కెనాల్ కింద 11 కి.మీల మేర పాపన్నపేట వరకు బ్రాంచ్ కాల్వ పనులు, గైడ్ వాల్ నిర్మించాల్సి ఉంది. ఫతేనహర్ కెనాల్ కింద గాంధారిపల్లి, జయపురం, లక్ష్మీనగర్, అబలపూర్, అన్నారం, యూసుఫ్పేట్, కుర్తివాడ, మిన్పూర్, పాపన్నపేట, నాగ్సానిపల్లి, పొడిచంపల్లిలో సీసీ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. ఇలా ఏళ్లకేళ్లుగా పనులు కొనసాగుతుండగా.. మొదట చేసినవి శిథిలావస్థకు చేరాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. భూసేకరణలో అవరోధాలు ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పలు ప్రాంతాల్లో భూసేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గత బడ్జెట్లో మంజూరైన వాటిలో సుమారు రూ.13 కోట్లు భూసేకరణకు కేటాయించగా.. అవి అలానే ఉన్నట్లు సమచారం. మొత్తం 290 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటివరకు 230 ఎకరాలను క్లియర్ చేసినట్లు అధికారిక సమాచారం. 60 ఎకరాలకు సంబంధించి ఆర్డీఓ తదితరులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిన్న ఘనపూర్, సంగాయిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ బడ్జెట్లో భూసేకరణకు నిధులు కేటాయించడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. చుక్క నీరు లేదు.. ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్ట్‌లో చుక్క నీరు లేదు. మంజీర నది ప్రవాహం లేకపోవడం.. సింగూరు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఉంచకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. గత ఏడాది సింగూరు నుంచి 15 టీఎంసీల నీళ్లను ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నిజామాబాద్ జిల్లా అవసరాలకు తరలించడంతో ప్రస్తుతం ఎకరా కూడా సాగు చేయని దుస్థితి నెలకొందని స్థానిక రైతులు వాపోతున్నారు. ఆ నీళ్లు ఉంటే కనీసం ఒక్క పంటయినా వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. భూసేకరణ కొనసాగుతోంది.. ఘనపూర్ ప్రాజెక్ట్ సామర్థ్యం 0.2 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 0.135కి తగ్గింది. మిషన్ కాకతీయలో పలు చోట్ల పూడిక తీశాం. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు చేరుకుంటుంది. మరో సుమారు ఆరు వేల ఎకరాల వరకు నీరందుతుంది. ఒక్కసారి నిండితే ఆయకట్టు రైతులు సులువుగా రెండు పంటలు తీయొచ్చు. ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో కేయించిన నిధులను భూసేకరణ, గేట్ల బిగింపు, ఇతర ఆధునికీకరణ పనులకు వినియోగిస్తాం. – ఏసయ్య, నీటి పారుదల శాఖ ఈఈ -
బంజరు భూములను బంగారు చేద్దాం
-
రుణాలతోనే గట్టెక్కేది?
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు మరోమారు అగ్రతాంబూలం దక్కనుంది. గతంలో మాదిరే ఈ ఏడాది నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కలిపి రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిన నీటిపారుదల శాఖ రూ.26 వేల కోట్లతో అంచనాలు వేసింది. ఇందులో ఇప్పటికే కార్పొరేషన్ల ద్వారా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసేలా అంచనాలు సిద్ధమైనట్లు సమాచారం. రుణాలే ఆధారం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ఆరు నెలల కాలానికి రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. పనులకు సంబంధించి మరో రూ.5వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఈ నెలలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా రూ.25 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముగింపు దశకొచ్చిన నేపథ్యంలో కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం పాలమూరు–రంగారెడ్డికి దక్క నుంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు అనుమతి రాగా ఇందులో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లమేర ఖర్చు చేసేలా కేటాయింపులు చేసే చాన్సుంది. ఇక కాళేశ్వరానికి రూ.6వేల కోట్ల మేర కేటాయింపులతో అంచనాలు వేయగా, ఇందులో రుణాల ద్వారానే అధిక ఖర్చు చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ. 6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇక పూర్వ మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించనున్నారు. -
పోటెత్తుతున వరదలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్ :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. నాలుగురోజుల పాటు ఉగ్రరూపం ధరించిన గోదావరి గురువారం శాంతించినట్లు కనిపించి మళ్లీ ఉధృతమైంది. శ్రీశైలంలోనూ అంతకంతకూ వరదపోటు పెరిగిపోతుండడంతో శుక్రవారం జలాశయంలోని పలు గేట్లను ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు కొంత శాంతించాయి. ఇక్కడ గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లను ఎత్తివేశారు. గోదావరి మళ్లీ ఉగ్రరూపం కాగా, నదీ పరివాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో గురువారం మధ్యాహ్నానికి గోదావరి ఒక్కసారిగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 44.20 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరింది. కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 28.15 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గురువారం ఉదయం ఆరు గంటలకు 9,96,503 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు ఆ ప్రవాహం 13,62,041 క్యూసెక్కులకు చేరింది. ఇక్కడ నీటి మట్టం 14.25 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. రాత్రి 7 గంటలకు 14.30 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా, వరద పోటుతో దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కోనసీమలోని వైనతేయ గోదావరి నదీతీరంలోని లంక గ్రామాలను వరద మళ్లీ ముంచెత్తింది. రాజోలు నియోజకవర్గంలో వరద తగ్గుతున్నట్టే తగ్గి మళ్లీ పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నంలో వరదనీరు మరోసారి పెరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెనపై నాలుగు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి గట్టును ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శాంతించిన వంశధార, నాగావళి ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు గురువారం కొంత శాంతించాయి. గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లు ఎత్తేశారు. బ్యారేజీలోకి ఉదయం 1,12,210 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేసి అంతేస్థాయిలో ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టి రాత్రి 8 గంటలకు 70 వేల క్యూసెక్కులకు చేరింది. వరదల కారణంగా గార మండలంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జిల్లాలో మొత్తం 8.600 హెక్టార్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. 12మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రేపు శ్రీశైలంలో పలు గేట్లు ఎత్తివేత? కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం జలాశయంలోకి గురువారం రాత్రి ఏడు గంటలకు 3,71,014 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ల ద్వారా 96,401 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 877 అడుగుల్లో 173.06 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే.. శనివారం శ్రీశైలం జలాశయంలోని నాలుగు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అలాగే, సాగర్‌లో ప్రస్తుతం 514.2 అడుగుల్లో 138.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది పూర్తిస్థాయిలో నిండాలంటే.. ఇంకా 174 టీఎంసీలు అసవరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ జలాశయం నిండే అవకాశం ఉంది. -
అడ్డగోలు దోపిడీ..!
గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది. ముఖ్యంగా హంద్రీ–నీవా కాలువ పనుల్లో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగింది. అధిక అంచనాలతో టెండర్లు నిర్వహించి దోచుకున్నారు. అధికారి అనుకూలంగా లేకపోవడంతో పనులను వేరే సర్కిల్‌కి బదిలీ చేసి తమకు అనుకూలంగా చేసుకున్నారు. ఈ దోపిడీపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీ ద్వారా విచారణ చేపట్టనుంది. తద్వారా హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో గత ప్రభుత్వం సాగించిన లీలలు వెలుగులోకి రానున్నాయి. సాక్షి, బి.కొత్తకోట : 2014లో అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా రెండో దశ పనులను టీడీపీ నేతలు వారి సంస్థలకే దక్కేలా చక్రం తిప్పారు. 60సీ నిబంధనను ప్రయోగించి పాత కాంట్రాక్టుల నుంచి పనులు తొలగించారు. అతి తక్కువ విలువ కలిగిన పనులను కోట్లకు పెంచుకొని దోపిడీ సాగించారు. ఈ వ్యవహారంలో అడ్డం తిరిగిన ఓ అధికారిపై కక్షగట్టి ఆయన పరిధిలోని ప్యాకేజీలను తొలగించారు. అనుకూలమైన అధికారులతో ఆడింది ఆటలా అంచనాలు పెంచుకుని అయినవారికే పనులు కట్టబెట్టారు. మాట వినలేదని ప్యాకేజీల మార్పు.. హంద్రీ–నీవా ప్రాజెక్టు 2వ దశకు చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె సర్కిల్–3 పరిధిలోని 14 ప్యాకేజీలను ఒక్కసారిగా తప్పిస్తూ 2015 జూలై 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటి నుంచి మదనపల్లె సర్కిల్ పరిధిలోని పనులను అనంతపురం జిల్లాలోని సర్కిల్‌కు మార్పు చేసింది. 2014 డిసెంబర్లో మదనపల్లె ఎస్ఈగా మురళీనాథరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పటిదాక పడకేసిన పనుల్లో కదలిక తెచ్చారు. అనంతపురం జిల్లా పరిధిలోని 6, 8, 9, 10, 11, 14, 15, 16, 18, 24, 25, 26, 52, 53 ప్యాకేజీ పనులు మదనపల్లె సర్కిల్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లోని పనులను రద్దు చేయించి, అధిక అంచనాలతో కొత్తగా టెండర్లు నిర్వహించాలని టీడీపీ ముఖ్యనేతలు ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. దీనికి అంగీకరించని ఆయన, పనుల్లో పురోగతి ఉందని, రద్దువల్ల ప్రభుత్వానికి నష్టమని సలహా ఇస్తే.. వారి ఆగ్రహానికి గురయ్యారు. అప్పటీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి 14 ప్యాకేజీలను అనంతపురం జిల్లాలోని సర్కిల్–2 పరిధిలోకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఆమోదం లేకున్నా చెల్లింపులు.. 2014, 2015 మధ్యలో మదనపల్లె సర్కిల్ నుంచి తొలగించిన, అనంతపురం జిల్లా పరిధిలోని రెండోదశకు చెందిన 15 ప్యాకేజీల పనుల్లో కొంత భాగం రద్దు చేశారు. ఈ ప్యాకేజీల్లో రూ.292.52 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగా, అందులో కొంత మేర పని రద్దుచేసి పనులకు కొత్తగా 2బీ, 3బీ, 4బీ, 5బీ, 6బీ, 7బీ, 10బీ, 13బీ, 14బీ, 15బీ, 17బీ, 25బీ, 26బీ, 54బీ, 57బీ ప్యాకేజీలుగా మార్చి రూ.779.61కోట్లకు అంచనాతో టెండర్లు నిర్వహించారు. పనుల తొలగింపు, రద్దు, రీటెండర్లు పద్ధతి ప్రకారం సాగలేదని గత ప్రభుత్వమే వీటికి ఆమోదం తెలపలేదు. దీన్ని పట్టించుకోని ఉన్నతాధికారుల చర్యలు ముందుకే సాగాయి. ఈ టెండర్ల నిర్వహణలో అత్యధిక ప్యాకేజీలు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకే దక్కాయి. ఈ సంస్థ 2 నుంచి 5శాతం వరకు అదనంగా టెండర్లు వేసినా.. పనులు ఆ సంస్థకే అప్పగించారు. ఎక్సెస్ కారణంగా పనుల విలువ రూ.800 కోట్లు దాటింది. అలాగే 11, 14, 56 ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ సొమ్మును స్వాధీనం చేసుని పనులు రద్దు చేశారు. ఇలావుండగా గత ప్రభుత్వ ఆమోదం లేకున్నా రీటెండర్లతో జరిగిన పనులకు కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకా పనులు, పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ విషయమై అనంతపురం ఎస్ఈ వెంకటరమణ వివరణ కోరగా, రీటెండర్ల నిర్వహణకు గత ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం ఇచ్చిందని చెప్పారు. చిత్తూరు రీటెండర్లకు ఆమోదం.. అనంతపురం జిల్లాలో సాగిన రీటెండర్ల వ్యవహారానికి గత ప్రభుత్వం ఆమోదించలేదని తెలుస్తుండగా, చిత్తూరు జిల్లాలో జరిగిన రీటెండర్లు, పనుల రద్దుకు గత ప్రభుత్వం 2018 జూలై 5న ఆమోదించి జీఓ నంబర్ 473 జారీ చేసింది. తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన 21, 22, 27, 28, 29, 62, 63, 64 ప్యాకేజీల్లో ఆగిపోయిన పనుల్లో కొంతభాగం పనులకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. ఈ ప్యాకేజీ పనులకు రూ.760.410 కోట్లతో అనుమతి ఇవ్వగా, రూ.521.390 కోట్లతో పనులు చేసేందుకు కాంట్రాకర్లతో ఒప్పందం జరిగింది. ఇందులో రూ.504.290 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.17.100కోట్ల పనులు అసంపూర్తి కావడంతో వాటికి రూ.95.920 కోట్లకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. దీనిపై అప్పటి మదనపల్లె ఎస్ఈ మురళీనాథరెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్యాకేజీ అంచనాలకు లోబడి ఉండటం, అదనపు భారం లేనందున ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే పద్ధతిని అనంతపురం ఉన్నతాధికారులు పాటించకపోవడంతోనే ఆమోదం ఇవ్వలేదని జలనవరులశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా దీనిపై అనంతపురం జిల్లా ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వం నియమించిన కమిటీకి సంబంధిత వివరాలను అందిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కమిటీ సభ్యులను కలిసి వివరాలను అందించారని సమాచారం. ప్యాకేజీ పనుల రద్దు, వాటి అంచనాల పెంపు, ఆమోదం, దానికి సంబంధించిన చర్యలను సమర్థిచుకునేందుకు రికార్డులను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. -
ఒకే సంస్థకు అన్ని పనులా!
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో 60–సీ నిబంధన కింద 268 పనుల నుంచి పాత కాంట్రాక్టర్లను తొలగించటం.. వాటి అంచనా వ్యయం పెంచాక రూ.1,600 కోట్ల విలువైన పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఒకే సంస్థకు అన్ని పనులు ఎలా అప్పగించారని హంద్రీ–నీవా, గాలేరు–నగరి అధికారులను ప్రశ్నించింది. గురువారం హంద్రీ–నీవా పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. శుక్రవారం, శనివారం విజయవాడలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథి గృహంలో సమావేశమైంది. పోలవరం కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాల పనులను పర్యవేక్షించే ఎస్ఈలు, ఈఈలు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అధిక శాతం పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి 60–సీ నిబంధన కింద తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని పెంచేసి ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడాన్ని నిపుణుల కమిటీ గుర్తించింది. హంద్రీ–నీవాలో పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని నిలదీసింది. పోలవరం కుడి కాలువ పనుల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. శుక్రవారం, శనివారం విజయవాడలో నిర్వహించే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని ప్రాజెక్టుల అధికారులను కమిటీ ఆదేశించింది. -
అవినీతిపై రాజీలేని పోరు
ప్రథమ ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి.ఆ తర్వాత పట్టణ నిరుపేదల ఇళ్లు, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వంశధార ప్రాజెక్టుల పనులపై విచారించండి. అనంతరం ప్రాధాన్యతల వారీగా వివిధ రంగాల్లో చోటు చేసుకున్న కుంభకోణాలపై విచారణ చేయండి. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెండర్లపై ఎవరైనా ఆరోపణలు చేసినా, అసత్య కథనాలు ప్రచురించినా పరువు నష్టం దావా వేస్తాం. జ్యుడిషియల్ కమిషన్‌కు సాంకేతిక సలహాలు అందించడం కోసం నిపుణుల కమిటి సేవలు వినియోగించుకుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి మీతో భేటీ అవుతా. విచారణ పురోగతిని సమీక్షించి ఏవైనా సమస్యలుంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తా. వంద రూపాయల వస్తువు రూ.80కే వస్తుందంటే.. రూ.80కే కొంటామా? లేక రూ.వందకు కొంటామా? కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ మాత్రం రూ.వందకే కొనుగోలు చేసింది. రాజధానిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు చేశారు. ఇటీవల మరమ్మతుల కోసం గోడలను పరిశీలిస్తే ఒక్క ఇటుక కూడా కనిపించ లేదు. ఫ్లైవుడ్‌తో గోడలు కట్టారు. – నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు వ్యవస్థీకృతం చేసిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత అవినీతి దేశంలో మరెక్కడా ఉండదని ఢిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని, ఆయన తీరు వల్లే జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా కళ్లు మూసుకుంటే రాష్ట్రం భవిష్యత్ అధోగతిపాలవుతుందన్నారు. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చే వరకు విశ్రమించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఈనెల 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కమిటీ సభ్యులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి సమావేశమయ్యారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్రమార్జన కోసం అవినీతిని వ్యవస్థీకృతం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేయడం.. మిగిలిపోయిన పని అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు కుదిరితే నామినేషన్ పద్దతిలో కట్టబెట్టడం, కుదరకపోతే టైలర్ మేడ్ నిబంధనలతో టెండర్ నిర్వహించి అప్పగించడం.. అవసరం లేకపోయినా జీవో 22, జీవో 63 ద్వారా అదనపు నిధులు దోచిపెట్టడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున దోచుకున్నారని, ఈ దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానా అతలాకుతలమైందని వివరించారు. ప్రజా ధనాన్ని మిగిల్చే అధికారులకు సన్మానం చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తాను సిద్ధమైతే, అవినీతిని పట్టించుకోకుండా కళ్లు మూసుకోవాలని కొందరు తనకు ఉచిత సలహాలు ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని, అందుకే అత్యంత పారదర్శకత కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. అంచనా వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేస్తే అధికారులు ఏం చేస్తారు.. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి అంచనా వ్యయాన్ని పెంచేశారు.. ప్రజాధనాన్ని ఒకరు దోచేస్తే ఆ తప్పు అధికారులపై పడుతోంది’ అని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న వారు నిజాయితీగా ఉంటే దిగువ స్థాయిలో ఉన్న వారు కూడా అలాగే ఉంటారని అభిప్రాయపడ్డారు. అవినీతిని నిర్మూలించడం కోసం తాము కృత నిశ్చయంతో పని చేస్తున్నామని, ఇదే అంశాన్ని కార్యదర్శుల నుంచి విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) వరకూ స్పష్టం చేశానని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలూ తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఒత్తిడి వల్ల అంచనా వ్యయం పెంచేసి.. ఖజానాకు జరిగిన నష్టాన్ని బయటపెట్టి.. ప్రజాధనాన్ని మిగిల్చే అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లు.. చెవులూ మీరే.. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం కోసం అనేక తర్జనభర్జనలు పడ్డామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ‘విభిన్న రంగాల్లో అత్యంత నిష్ణాతులు, నిజాయితీపరులు, నిబద్ధత కలిగిన వారైన మీ ఏడుగురిని నిపుణుల కమిటీకి ఎంపిక చేశాం. మా ప్రభుత్వ కళ్లూ, చెవులూ మీరే. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ చేయండి. ఏ ప్రాజెక్టులు అవసరమో.. ఏవి అనవసరమో తేల్చి చెప్పండి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించాల్సిన ప్రాజెక్టులు ఏవో సూచించండి.. విచారణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు.. ఇతరత్రా అన్ని వసతులు సమకూర్చుతాం’ అంటూ నిపుణుల కమిటీకి దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రధానమైన ప్రాజెక్టులకు విచారణ పేరుతో ఆటంకం కలిగించకూడదన్నారు. సాగునీటి ప్రాజెక్టులే కాదు.. పీఏంఏవై పథకం కింద పట్టణ పేదలకు నిర్మిస్తున్న ఇళ్లు మొదలు.. రాజధాని వరకు చంద్రబాబు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరించారు. పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.1.50 లక్షలు.. వెరసి రూ.మూడు లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని చెప్పారు. ఇసుక, భూమి ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో చదరపు అడుగు రూ.1,100కే నిర్మించి ఇవ్వవచ్చని, అయితే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు చదరపు అడుగు రూ.2,200 చొప్పున పనులు కట్టబెట్టడం వల్ల పేదలపై భారం పడిందన్నారు. ఉచితంగా రావాల్సిన ఇంటికి ఒక్కో లబ్ధిదారుడు నెలనెలా రూ.మూడు వేల చొప్పున బ్యాంకుకు కిస్తులు కట్టాల్సిన దుస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించేందుకు నమూనా టెండర్ డాక్యుమెంట్‌ను రూపొందించి ఇవ్వాలని కోరారు. జ్యుడిషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు విచారణ అనంతరం రివర్స్ టెండరింగ్ చేయాల్సిన ప్రాజెక్టులను సూచిస్తే, వాటి అంచనా వ్యయాన్ని అలానే ఉంచి.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీని వల్ల ప్రజాధనం ఎంత ఆదా అయిందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందుకు కారణమైన నిపుణులు, అధికారులకు ప్రజల సమక్షంలో సన్మానం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా భారీ ఎత్తున ప్రాజెక్టులు.. మౌలిక సదుపాయాల కల్పన పనులు తదితరాలు చేపడతామని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రసారమాధ్యమాలు లేనిపోని ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో నిర్వీర్యమైన టెండర్ల వ్యవస్థకు జీవం పోసేందుకు జ్యుడిషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి ఇందుకోసం జడ్జిని కేటాయించాలని కోరామని గుర్తు చేశారు. రూ.వంద కోట్ల కంటే ఎక్కువ విలువైన పనుల టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిషియల్ కమిషన్‌కు పంపుతామని.. దాన్ని ఏడు రోజులపాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని.. ప్రజలు చేసే సూచనల ఆధారంగా టెండర్ డాక్యుమెంట్లో జ్యుడిషియల్ కమిషన్ మార్పులు చేర్పులు చేసి ఎనిమిది రోజుల్లోగా సర్కార్‌కు అందిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్ కమిషన్ ఖరారు చేసిన డాక్యుమెంట్‌తోనే టెండర్లు నిర్వహిస్తామని, దీని వల్ల అక్రమాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు రిటైర్డు ఈఎన్సీలు ఎల్.నారాయణరెడ్డి, అబ్దుల్ బషీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఎన్సీ సుబ్బరాయశర్మ (రహదారులు, భవనాల శాఖ), రిటైర్డు ఈఎన్సీ ఎఫ్‌సీఎస్ పీటర్ (రహదారులు, భవనాల శాఖ), ఏపీ జెన్కో రిటైర్డ్ డైరెక్టర్ ఆదిశేషు, సీడీవో రిటైర్డు సీఈ ఐఎస్ఎన్ రాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ
కాళేశ్వరం: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కీలక ఘట్టం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం. మేడిగడ్డ (కన్నెపల్లి) పంపుహౌస్‌లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి జలాలు 1.053 కిలో మీటర్ ప్రెషర్ మేయిన్స్ ద్వారా ప్రయాణించి డెలివరీ సిస్టర్న్ ద్వారా కాలువలోకి విడుదలయ్యింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. పుడమి తల్లిని పులకరింపజేసింది. బీడువారిన తెంగాణ భూములను పచ్చని పంటలతో బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు పంపుహౌస్ నుంచి నీళ్లు పరుగు తీశాయి. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అందులోనూ మేడిగడ్డ నీళ్లు అన్నారం వైపు పరుగులు తీసే తొలి దృశ్యం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం కాళేశ్వరం పథకం ప్రారంభంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) సంస్థ నిర్మించిన మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి మూడు మెషీన్ల ద్వారా గోదావరి నీళ్లు ఉరకలేశాయి. ఈ కార్యక్రమంలో ఇఎన్సి వెంకటేశ్వర్లు, ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేఘా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ బి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మేడిగడ్డ పంప్ హౌస్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్దదైన ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకోగా అందులో మేడిగడ్డకు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా అందులో మేడిగడ్డ మొదటిది కావటం విశేషం. మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఉండగా, ఒక్కో మెషీన్ 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసి 60 క్యుమెక్స్ నీటిని డెలివరీ సిస్ట్రన్ ద్వారా గురుత్వాకర్షణ కాలువలోకి (13.5 కిలోమీటర్స్) నీటిని విడుదల చేస్తుంది. అంతకుముందు పంప్ నుంచి (ప్రెషర్ మెయిన్) 1.53 కిలోమీటర్ల డెలివరీ మెయిన్ ద్వారా ప్రయాణించి కాలువలోకి చేరిన నీరు అన్నారం బ్యారేజ్‌లోకి చేరుతుంది. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో 17 కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మిస్తున్నది. మొదటి దశ కింద లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్-2 లోని ప్రపంచంలోని అతిపెద్దదైన భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8 నుంచి రోజుకు 2 టిఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధం చేసింది. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో ఒక్కొక్క యూనిట్ 40 మెగావాట్ల సామర్థ్యంతో 60 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించారు. 91 మీటర్ల ఎత్తున గోదావరికి ఆనుకుని నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 660 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోయానేది లక్ష్యం. ఇందులో మొదటిదశ కింద 11 యూనిట్లతో 440 మెగావాట్ల పంపింగ్ కేంద్రం పనిచేస్తుంటుంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో అతిపెద్దదయిన ఈ ఎత్తిపోతల కేంద్రాన్ని నిర్మించడంలో ఎలక్ట్రోమెకానికల్ పనులతో పాటు సివిల్ పనులకు ప్రత్యేకత ఉంది. అప్రోచ్ కాలువ 9.75 లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతోనూ, వీటి గోడలు 51వేల ఘనపు మీటర్లతోనూ, పంప్‌హౌస్ ముందుభాగం 45.73 లక్షల ఘనపు మీటర్లతోను నిర్మించారు. ఇంత తక్కువ కాలంలో వీటిని నిర్మించడం ఎంఈఐఎల్కు మాత్రమే సాధ్యమైంది. ప్రెషర్ మెయిన్‌కు 10.56, డెలివరీ సిస్టర్న్‌కు 10.50, మొత్తం అన్నీ కలిపి 77.07 లక్షల ఘనపు మీటర్ల పనిని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని మళ్లీ అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలోకి చేర్చడానికి అవసరమైన భారీ కాలువను కోటి యాభై లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతో పూర్తి చేసింది. గోదావరి నీటిని ఎత్తిపోయడం మేడిగడ్డ నుంచే మొదవుతుంది. పైగా భూ ఉపరితంపైన ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా భారీ ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద నిర్మితమై పాక్షికంగా వినియోగంలోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద అత్యధిక సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా భూ ఉపరితంపైన అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది. ఇప్పటికే లింక్-1లోని దాదాపుగా అన్ని యూనిట్లను ఎంఇఐఎల్ పంపింగ్ కు సిద్ధం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 4627 మెగావాట్ల సామర్థ్యంతో 120 పంపింగ్ యూనిట్లు ఏర్పాటవుతుండగా అందులో 105 యూనిట్లను ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. దీనిని బట్టి కాళేశ్వరంలో ప్రధాన పాత్రను ఎంఈఐఎల్ నిర్వహిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలమ్ లాంటి ఎలక్ట్రోమెకానికల్ సంస్థలు సమకూరుస్తున్నాయి. అయితే నిర్మాణ పని మొత్తం ఎంఈఐఎల్ చేస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో ఒకేచోట 17 మెషీన్లతో పంపింగ్ కేంద్రం ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హంద్రీనీవా ఒక్కటే అతిపెద్దది కాగా, నిర్మాణంలో వున్న దేవాదుల కూడా పెద్దదే. కాగా, వాటిలో ఏ పంపింగ్ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో మొదటిదశ ఇప్పుడు వినియోగంలోకి రాగా, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 మెషీన్ల ద్వారా 868 మెగావాట్ల పంపింగ్ సామర్ధ్యం వుండటం మరో ప్రత్యేకత. మెషీన్ల సంఖ్య రీతా.. ఇంతపెద్ద పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా ఏర్పాటు కాలేదు. ఎంఈఐఎల్ ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కాళేశ్వరం సమీపంలో కన్నెపల్లి గ్రామం వద్ద నిర్మించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పరిగణించే కొలరాడో (అమెరికా), గ్రేట్ మ్యాన్‌మేడ్ వండర్ (లిబియా) పథకాలతో పాటు దేశంలోని హంద్రీ-నీవా, కల్వకుర్తి, ఏఎమ్ఆర్పీ, దేవాదుల మొదలైన పథకాలు పూర్తి కావడానికి ఏళ్ళు పట్టింది. కొన్ని పథకాలైతే రెండు, మూడు దశాబ్దాల సమయం పట్టింది. కానీ మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కేవలం ఏడాదిన్నర సమయంలోపే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. భారీ విద్యుత్ వ్యవస్థ: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రోజుకు 3 టిఎంసీ నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్ అవసరం. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైన్లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. తాగు, సాగునీటి అవసరా కోసం ఇంత పెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. -
జలవనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
జలవనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరాతి : వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల విభాగం పనితీరుపై మరోసారి సమీక్ష నిర్వహించారు. గతవారం కూడా జలవనరుల విభాగం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టులతో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక, వివరాలతో మరోసారి రావాలని ఆధికారులను ఆదేశించడంతో గురువారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో మరోసారి సమావేశమయ్యారు. సాగు నీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ విచారణ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే కొన్ని ప్రాజెక్టులలో రీటెండరింగ్‌కు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్టుల మంజూరు, ఖర్చులపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సభ్యులుగా నీటిపారుదలరంగ, సాంకేతిక నిపుణులు ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అవినీతి ఉండకూడదని, రైతులకు ప్రయోజనాలే ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి కె.ధనంజయ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
సాగు నీరు.. నిధుల జోరు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించే క్రమంలో భాగంగా వచ్చే బడ్జెట్లోనూ భారీగా నిధులు పారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గ్గట్టే నిధుల కేటాయింపు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు, మూడు బడ్జెట్ల్లో కేటాయించిన మాదిరే ఈసారి కూడా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా కేటాయింపులు చేసి సాగునీటికి అగ్రపీఠం కట్టబెట్టాలని, అందుకు తగ్గట్లే పనులు చేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూ.26,452 కోట్లతో ఇప్పటికే ప్రాథమిక బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వ పరిశీలనకు పంపిన అనంతరం రూ.25 వేల కోట్లకు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. రుణాలతో గట్టెక్కారు... 2018–19 ఆర్థిక ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.18,450 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.5,535 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.24 కోట్ల మేర పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.10,476 కోట్ల రుణాలు తీసుకొని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్ఎఫ్సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,439 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన పద్దు నుంచి కేవలం రూ.5,535కోట్లు కేటాయించింది. మొత్తంగా రుణాల ద్వారానే ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులన్నీ గట్టెక్కాయి. మొదటి ప్రాధాన్యత కాళేశ్వరానికే... సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తంగా రూ.26,452 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో మళ్లీ తొలి ప్రాధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కనుంది. ప్రాజెక్టుకు గత ఏడాది రూ.6,157 కోట్ల మేర నిధులు కేటాయించారు. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌లతో పాటు ఎల్లంపల్లి దిగువన మల్లన్నసాగర్ వరకు ఉన్న అన్ని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీని కోసం వచ్చే బడ్జెట్లో ఏకంగా రూ. 9,205 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.3,214 కోట్లు కేటాయించాలని కోరారు. దేవాదుల పరిధిలో లింగంపల్లి బ్యారేజీతో పాటు ఇతర పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున ఇక్కడ రూ.2,052 కోట్లు, ఖమ్మం జిల్లాలోని సీతారామ సహా ఇతర చిన్న తరహా ప్రాజెక్టులకు కలిపి రూ.1,346 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసేందుకు రూ.1,346 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్ కాకతీయకు రూ.2,727 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. సీతారామ, పాలమూరుపై ఫోకస్.. ఇక కొత్త ఏడాదిలో జనవరి నుంచి పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టే ఆర్థిక వనరులను సమకూర్చేలా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి సుమారు రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా నిధుల కొరత లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.17వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు నిర్ణయం జరగ్గా, చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్చలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్ నుంచి పనులను వేగిరం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇక సీతారామ ఎత్తిపోతలకు రుణాల ప్రక్రియ కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టును వేగిరం చేసే దిశగా కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరికొన్ని రోజుల్లో స్వయంగా ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ప్రతిపాదనలు ఇలా..(రూ.కోట్లలో) ప్రాజెక్టు బడ్జెట్ ప్రతిపాదన కాళేశ్వరం 9,205 పాలమూరు–రంగారెడ్డి 3,214 కంతనపల్లి 845 ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు 1,346 ఆదిలాబాద్ ప్రాజెక్టులు 922 వరద కాల్వ, ఎల్లంపల్లి 1,121 దేవాదుల 2,052 నల్లగొండ ప్రాజెక్టులు 1,621 ఎస్సారెస్పీ 338 మైనర్ ఇరిగేషన్ 2,727 -
భూమాయలో ఎన్నెన్ని సిత్రాలో!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను మాయం చేయడంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా బరితెగించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను వినియో గించుకుంటే, అవి తమవేనని నకిలీ పత్రాలు సృష్టించి, నష్టపరిహారం కాజేస్తున్నారు. అసైన్మెంట్ కమిటీలతో నిమిత్తం లేకుండా అసైన్డ్ పట్టాలు సృష్టించి సర్కారు భూములను మింగేస్తున్న వారు కొందరైతే వాటిని వంశపారంపర్యంగా సంక్రమించిన ప్రైవేటు జిరాయితీ పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి, అమ్మేసుకుంటున్న మాయగాళ్లు ఇంకెందరో! నిబంధనలతో, సర్కారు ఉత్తర్వులతో ఎలాంటి సంబంధం లేకుండా ముడుపులిస్తే చాలు రాత్రికి రాత్రే అసైన్మెంట్ పట్టాలు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. అసైన్మెంట్ రిజిస్టర్లే మారిపోతున్నాయి. ఖాళీగా ఉన్న బంజరుకు ఎన్ని పట్టాలో... గతంలో అసైన్మెంట్ పట్టాలు తీసుకుని సాగు చేయకుండా బంజరుగానే ఉంచిన భూములు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇలాంటి భూములకు ప్రస్తుత అధికారులు, రిటైర్డు అధికారులు కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ఇతరులకు మళ్లీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకే భూమికి ఇద్దరు ముగ్గురి చేతుల్లో అసైన్డ్ పట్టాలు ఉంటున్నాయి. ఒక సర్వే నంబరు (కంపార్టుమెంట్)లో 50 ఎకరాల భూమి ఉంటే సబ్ డివిజన్ చేయకుండానే 130 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సబ్ డివిజన్ చేయకుండా రెవెన్యూ కార్యాలయాల్లోని పుస్తకాల్లో నమోదు చేయకుండా రిటైర్డు అధికారులు నకిలీ పట్టాలు ఇవ్వడంవల్లే ఈ సమస్య ఏర్పడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, కాసులకు కక్కుర్తిపడి ఇలా చేస్తున్నారని ఒక జిల్లా కలెక్టర్ చెప్పారు. పట్టాలిప్పించే ముఠాల హల్చల్ డబ్బులు తీసుకుని అసైన్మెంట్ పట్టాలు సృష్టించి ఇచ్చే ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇలాంటి ముఠాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులతోపాటు కొందరు రిటైర్డు అధికారులు కీలక భూమిక పోషిస్తున్నారు. వారి వద్ద ఖాళీ పట్టాదారు పాసుపుస్తకాలు, భూయాజమాన్య హక్కు పత్రాలు, రెవెన్యూ కార్యాలయ స్టాంపులు ఉన్నాయి. నకిలీ పట్టాలు, రికార్డులు సృష్టించే ఈ ముఠాలకు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు దక్కుతున్నాయి. అధికార టీడీపీ నాయకులు అడిగిన పనులు చేసిపెడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. సర్కారు భూములపై నకిలీ హక్కు పత్రాలు ఇచ్చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతోపాటు భూ అనుభవపత్రం (అడంగల్), భూ యాజమాన్యపత్రం (1బి)లో కూడా పేర్లు చేర్పిస్తున్నారు. వీటి జిరాక్స్ పత్రాలతో మీ–సేవలో, వ్యక్తిగతంగానూ తహసీల్దార్లకు దరఖాస్తు చేసి అన్ని రికార్డులు పక్కాగా ఉన్నాయంటూ మ్యుటేషన్ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు) చేయిస్తున్నారు. చాలామంది తహసీల్దార్లకు ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తెలిసినా వారికి ముట్టాల్సింది ముడుతున్నందున రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆన్లైన్ చేస్తున్నారు. జిరాయితీ జాబితాలో అసైన్డ్ భూములు అసైన్మెంట్ కమిటీల ఆమోదం లేకుండానే అసైన్మెంట్ (డీకేటీ) పట్టాలు ఇవ్వడమే కాదు, కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఈ డీకేటీ భూములను జిరాయితీ పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన జిరాయితీ పట్టా భూములని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. అసైన్డ్ భూములకు అనుభవ హక్కులు తప్ప విక్రయ హక్కులు ఉండవు. అందువల్ల అధికార పార్టీ నాయకులు అసైన్డ్ భూములను వంశపారంపర్యంగా సంక్రమించిన పట్టా భూములుగా మ్యుటేషన్ పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుంటున్నారు. బినామీ పేర్లతో ఇలా కొట్టేసిన భూములను అమ్మేసి చోటా నాయకులు సైతం రూ.లక్షలు దండుకుంటున్నారు. ఫోర్జరీ పత్రాలతో నష్టపరిహారం స్వాహా వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు బయటపడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బుక్కపట్నం మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు చెక్కా పెద్ద ఓబుళరాజు, చెక్కా ఓబుళమ్మ, చెక్కా రత్నమ్మ, చెక్కా కాంతమ్మ, దాసరి జయలక్ష్మి( ఓబుళరాజు బంధువులు) పేర్లతో ప్రభుత్వ భూమికి నకిలీ డీకేటీ పట్టాలు సృష్టించారు. తమకే చెందిన ఈ భూములు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యాయంటూ ప్రభుత్వం నుంచి రూ.27.78 లక్షల నష్టపరిహారం కొట్టేశారు. నాలుగు రోజుల క్రితమే వారిపై ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఆ రికార్డులన్నీ బోగస్ వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం కామకుంటలో డీవీ పార్థసారథి, చిలకపాటి రత్నకుమారికి స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద 19.50 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. వీరికి పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఇవే భూములకు అవే సర్వే నంబర్లతో దేవర్ల శివశంకర్‌రెడ్డి, కుంబాల భాస్కర్‌రెడ్డి, గాజులపల్లె చెన్నకేశవరెడ్డి, వర్ధిరెడ్డి శ్రీనివాసులు పేరిట స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద మళ్లీ పట్టాలు ఇచ్చారు. పైగా స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద పట్టాలు పొందిన వారెవరూ ఉన్న దాఖలాలు కూడా లేవు. దీన్నిబట్టి అప్పట్లోనే ఈ పట్టాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని తేటతెల్లమవుతోంది. మాజీ సైనికులకు ఇచ్చిన పట్టాలైతే పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చనే వెసులుబాటు ఉంది. అందువల్లే ఇలా సృష్టించారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట జారీ చేసిన రికార్డులన్నీ బోగసేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. (బాక్స్‌లో పెట్టుకోవాలి) + నెల్లూరు జిల్లాలో ఒకే భూమిని తమ పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఇద్దరు ముగ్గురు అసైన్మెంట్ పట్టాలు తీసుకొచ్చి అర్జీలు పెడుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియని తహసీల్దారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడు 100 ఎకరాల భూమికి బినామీ పేర్లతో అసైన్మెంట్ పట్టాలు పొందాడు. + విజయనగరం జిల్లాకు చెందిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన డి పట్టా భూమి తనదంటూ మరో మాజీ సైనికుడు అధికారులను ఆశ్రయించాడు. + విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ సైనికులకు చెందిన భూమిని అధికార పార్టీ నాయకులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. + కృష్ణా జిల్లాలో ఒక మాజీ సైనికుడికి ఇచ్చిన పట్టా భూమికే తనకూ పట్టా ఉందంటూ ఒకరు వీలునామా రాయించారు. + వైఎస్సార్ జిల్లాలో ఒక వ్యక్తి సాగు చేసుకుంటున్న భూమి తనదంటూ మరొకరు పట్టాదారు పాసుపుస్తకం, భూమి హక్కు యాజమాన్య పత్రం అధికారుల వద్దకు తీసుకెళ్లాడు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి బాగోతాలు చోటుచేసుకుంటున్నాయి. -
‘పులకుర్తి’ మరోసారి ప్రారంభం
కర్నూలు సిటీ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రయోజనాల కంటే ప్రచారార్భాటానికే తెలుగు దేశం పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఏ పనైనా పూర్తయిన తరువాత ప్రారంభోత్సవం చేస్తుంటారు. అయితే టీడీపీ మాత్రం తమ ప్రచార అవసరాల కోసం పూర్తికాని పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రెండు సార్లు జాతికి అంకితం చేసి ఔరా అనిపించింది. గతంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఇదే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన సమయంలో ఏ ఒక్క రోజు కూడా సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. ప్ర‘జల’ కష్టాలు తెలుసుకున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి..సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన హయాంలో తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదని గుర్తించి, తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పులకుర్తి ఎత్తిపోతల పథకానికి అనుమతులు జారీ చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన చేశారు. ఈ రెండు పథకాల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రోజూ అలోచించ లేదు. అయితే అంతా తానే చేసినట్లు..పూర్తికాని ప్రాజెక్టులను రెండు సార్లు ప్రారంభోత్సవం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జనవరి 1వ తేదీన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోయినా ఒక మోటర్తోనే ప్రారంభోత్సవం చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 7వ తేదీన రెండో సారి రెండో మోటర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని గత నెల 23వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు ప్రారంభించారు. మళ్లీ శుక్రవారం.. శ్రీశైలం దగ్గర సీఎం చంద్రబాబు చేత ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం ప్రారంభింపజేశారు. సాగునీటి విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి కరువు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ మొదటి నుంచి నిర్లక్ష్యమే చేస్తోంది. కేసీ కెనాల్ వాటాగా టీబీ డ్యాంలో నిల్వ ఉన్న 5 టీఎంసీల నీటిని 2004 జనవరి 21వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. పెన్నా అహోబిలం రిజర్వాయర్‌కు మళ్లించారు. కేసీ ఆయకట్టు రైతులను పట్టించుకోలేదు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్..కేసీ ఆయకట్టు రైతుల ఇబ్బందులు గమనించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు 2008లో శంకుస్థాపన చేశారు. మొదట్లో వేగంగానే పనులు జరిగినా మహానేత మరణం తరువాత మందగించాయి. పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండానే చంద్రబాబు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది. ఎల్లెల్సీ చివరి ఆయకట్టు అయిన కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలోని 9,830 ఎకరాలకు నీరు అందడం లేదని వైఎస్సార్ దృష్టికి వచ్చింది. దీంతో పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు మహానేత ఉత్తర్వులు ఇచ్చారు. 2014లోనే పూర్తి కావాల్సిన ఈ స్కీమ్‌ను టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో నేటికి పూర్తి స్థాయిలో çపనులు కాలేదు. అంసపూర్తి పనులతోనే ప్రారంభించిన పది రోజులకే లీకేజీలు, మోటర్లలోని సాంకేతిక సమస్యలతో నిలిచి పోయింది. నిలిచి పోయిన స్కీమ్‌ను, ఇప్పటికే మంత్రుల చేత ప్రారంభోత్సవం అయిన స్కీమ్‌ను సీఎం మరో సారి ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది. -
జూరాల నుంచే ‘గట్టు’ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించగా, ప్రస్తుతం నేరుగా జూరాల నుంచే తీసుకునే దిశగా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునేలా అధికారులు కొత్త ప్రతిపాదన రూపొందించారు. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం రూ.553.98 కోట్ల నుంచి రూ.1,597 కోట్లకు చేరుతోంది. 4 టీఎంసీలతో రిజర్వాయర్.. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు ఈ ఏడాది జూన్ 29న సీఎం ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత రూ.459.05 కోట్లు, రెండో విడతను రూ.94.93 కోట్లకు ప్రతిపాదించారు. అయితే, గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే, 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం జూరాల నుంచే నేరుగా నీటిని తీసుకునేలా ప్రతిపాదించారు. దీనికోసం కొత్తగా 4 టీఎంసీల సామర్థ్యంతో గట్టు రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. జూరాల నుంచి నేరుగా 50 రోజులపాటు 926 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా పథకాన్ని రూపొందించారు. కొత్తగా నిర్మించే రిజర్వాయర్ పొడవు 8 కిలోమీటర్లు ఉండనుంది.ఈ మట్టికట్ట నిర్మాణానికి రూ.396.60 కోట్లు ఖర్చు కానుంది. రెండు పంపులను ఉపయోగించి జూరాల నుంచి గట్టు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి మరో రూ.90 కోట్లు అవసరమవుతుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మొత్తం 3,825 ఎకరాల మేర ముంపునకు గురికానుంది. ఎకరాకు రూ.6 లక్షల పరిహారం చొప్పున లెక్కగట్టగా భూసేకరణకే రూ.231 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ పథకానికి రూ.1,597 కోట్లతో తుది అంచనాలు సిద్ధమయ్యాయి. ఇక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
2 కోట్ల ఎకరాలకు నీళ్లందించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించకోవడం ద్వారా రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలాశయాలు, చెరువులతో పాటు భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని.. చెరువులు, భూగర్భ జలాలు ఇతర వనరులతో కలిపి మొత్తం 867 టీఎంసీలు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఈ జలాలను వినియోగించుకుని రెండు కోట్ల ఎకరాలకు నీరు అందించడంపై లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 57.41 శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇప్పటి వరకూ లక్ష మంది సందర్శించారన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ ప్రాజెక్ట్ ఇంజినీర్లను ప్రశంసించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బచ్పన్ విద్యార్థులకు సీఎం అభినందనలు గుంటూరులోని బచ్పన్ ప్లేస్కూల్ విద్యార్థులు గ్రీవెన్స్ భవనంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని ఇతర ప్లేస్కూళ్ల కంటే తమ స్కూల్ ముందువరుసలో ఉందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు సీఎంకు చెప్పారు. చిన్నప్పటినుంచే అన్ని విషయాల్లో బాలబాలికలకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్య పరిష్కరించాలి గ్రామ కంఠాల సమస్యను పరిష్కరించకపోవడం వలన పిల్లలకు చదువులు, పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నామని, ఆర్థికంగా చితికిపోతున్నామని రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రీవెన్స్ భవన్‌కు వచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. రాజధాని నిర్మాణానికి తామంతా కోట్లాది రూపాయల ఖరీదు చేసే వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని, అయితే ప్రభుత్వం తమ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని వాపోయారు. వారి నుంచి వినతి పత్రం స్వీకరించిన సీఎం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ.45,035 కోట్లు ఖర్చు: దేవినేని రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులను రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ. 45,035 కోట్లు ఖర్చు చేశామని, రూ. 10,884 కోట్లు ఉపాధి హామీ, జలసంరక్షణ, చెక్ డ్యామ్‌లకు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫారెస్టు డిపార్టుమెంట్లో రూ. 139 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. -
కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ . రఘురామిరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జురెడ్డిలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కెనాల్‌కు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాలు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, రైతులు నష్టాలపాలయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధిస్తోందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలో 870 అడుగుల నీటిమట్టం ఉందని, అంటే సుమారు 150 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరిస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు పది రోజుల క్రితం రాజోలి స్లూయిస్ వద్దకు వెళ్లి ఆర్భాటంగా నీటిని వదిలారన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని రైతులు నారుమళ్లు వేసుకున్నారని, కుందూ పరివాహక ప్రాంతంలో నాట్లు నాటేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈలోపే ఉన్నట్టుండి నీరు ఆపేశారన్నారు. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్ వరకు వదలాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్నూలు సీఈకి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్నారు. పైర్లు ఎండిపోయాక నిర్ణయం తీసుకొని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వదలకపోవడం సరికాదన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో 40వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారని, నికర జలాలు కలిగిన కేసీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ పరిస్థితి వస్తుందనే 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2.95 టీఎంసీ సామర్థ్యంతో రాజోలి, 0.95టీఎంసీల సామర్థ్యంతో జొలదరాసి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు నుంచి 0–18 కీ.మీ వరకు కాలువలు సరిగా లేవని, ఆ పనులు పూర్తి చేస్తే తెలుగుగంగకు నీరు ఇవ్వచ్చన్నారు. దీనిపై తాము కర్నూలు ఐఓబీ సమావేశంలో చెప్పినా, అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కడుపు కాలిన రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి సీఎంతో మాట్లాడి కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కులు, వెలుగోడు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాలేరు నగరి, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాళెం రిజర్వాయర్లకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు. వర్షాకాలం ఇంకా చాలా ఉందని, సాగునీటికి నీటిని వదలకుండా విద్యుత్ ఉత్పత్తికి తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. పదివేల క్యూసెక్కులు విడుదల చేస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తాయన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎస్ .రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్ కె. సురేష్‌బాబు కోరారు. సోమవారం సాయంత్రం వారు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అలాగే జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంపగుత్తగా తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని వారు కోరారు. ఈ విషయాలపై కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన అ««ధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేస్తానని, ఓట్ల తొలగింపుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి హరీశ్‌రావుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. అది గన్‌పార్కు అయినా, ప్రెస్‌క్లబ్ అయినా తాను రెడీ అని, తమ వాదన తప్పని హరీశ్ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన ప్రకటించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హరీశ్‌కు నిజాయితీ ఉంటే నీళ్లు–నిజాలపై చర్చకు రావాలని సవాల్ చేశారు. నీళ్లను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల అంచనాతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించి రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పేరు, డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో వేల కోట్లకు అంచనాలను పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అల్లుడు ఆణిముత్యంలా మామ స్వాతిముత్యంలా కేసీఆర్, హరీశ్‌లు నిత్యం పొగుడుకుంటున్నారని, కేసీఆర్ ప్రారంభించిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు పేరేంటో హరీశ్ చెప్పగలరా అని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వనందుకు ఎస్సెల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు నిలిపివేశారని ఆరోపించారు. -
పెరిగిన అంచనాలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న సీతారామ ఎత్తిపోతల, ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ)ల అంచనా వ్యయాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రీ డిజైనింగ్ జరిగిన నేపథ్యంలో మార్పులు జరగడంతో సీతారామ అంచనా వ్యయం రూ.7,926.14 కోట్ల నుంచి రూ.13,057 కోట్లకు పెరగ్గా, ఎఫ్ఎఫ్సీ అంచనా వ్యయం రూ.4,729.26 కోట్ల నుంచి రూ.9,886.27 కోట్లకు పెరిగింది. ఈ పెరిగిన అంచనా వ్యయాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్పులకు తగ్గట్టే పెరిగిన వ్యయాలు శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సీతారామ, ఎఫ్ఎఫ్సీ పరిధిలో జరిగిన మార్పులు, పెరిగిన వ్యయాలపై చర్చించింది. సీతారామ ఎత్తిపోతలతో మొదట 50 టీఎంసీల గోదావరి నీటితో 5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని భావించారు. దీనికోసం రూ.7,926.41 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. అనంతరం సీతారామ ద్వారా 9.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. తొలి దశలో 70 టీఎంసీల నీటిని తీసుకుని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. దీంతో మార్పులు అనివార్యమయ్యాయి. ప్రధాన కాల్వ ద్వారా తొలుత 4,545 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలని భావించగా, దాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో భూసేకరణ అవసరం 5,800 హెక్టార్ల నుంచి 7,402 హెక్టార్లకు పెరిగింది. భూసేకరణకు రూ.1,342 కోట్లు లెక్కించగా, అది ప్రస్తుతం రూ.2,011 కోట్లకు పెరిగింది. కాల్వ వ్యవస్థలో మార్పులకు అదనంగా మరో రూ.1,615 కోట్ల వ్యయం పెరుగుతోంది. నీటిసామర్థ్యం పెంచడంతో గతంలో 380 మెగావాట్ల విద్యుత్ అవసరాలను లెక్కించగా ప్రస్తుతం 715 మెగావాట్లుగా లెక్కించారు. దీంతో ఈ విద్యుత్ సరఫరా అవసరాల వ్యయం రూ.1,298 కోట్ల నుంచి రూ.3,264 కోట్ల మేర పెరుగుతోంది. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.13,057 కోట్లకు చేరగా దీన్ని శుక్రవారం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు. 51 ప్యాకేజీలకు గడువు పొడిగింపు ఇక ఎఫ్ఎఫ్సీ వరద కాల్వను రూ.4,729.26 కోట్లతో చేపట్టగా, రీ ఇంజనీరింగ్‌లో దీని పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 నుంచి 1 టీఎంసీ సామర్థ్యానికి పెంచారు. ఆయకట్టు సైతం 2.20 లక్షల ఎకరాలు ఉండగా మరో 32 వేల ఎకరాలకు పెంచారు. దీంతో వ్యయం రూ.9,886.27 కోట్లకు పెరగ్గా, దీనికి కేబినెట్ ఓకే చేసింది. దీంతో పాటే మిడ్‌మానేరు పరిధిలోని మన్వాడ గ్రామాన్ని పునరావాస గ్రామంగా గుర్తించేందుకు అనుమతించింది. ఇక వీటితో పాటే జీవో 146 కింద ఎస్కలేషన్ ఇచ్చిన 51 ప్యాకేజీల పనులు భూసేకరణతో పూర్తి కాకపోవడంతో వాటి గడువును మరింత కాలం పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. -
వంచనపై 30న అనంతలో నిరసన దీక్ష
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ముమ్మాటికీ బీజేపీతో కలిసి లాలూచీ రాజకీయాలు నడుపుతోందని, ఆ పార్టీ కనుసన్నల్లోనే చంద్రబాబు నడుస్తున్నారనడంలో సందేహం లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన బుధవారం విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధానితో వ్యవహరించిన తీరు తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ఆ సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కనీసం నిరసన తెలియజేయలేదని, అక్కడ ఏం మాట్లాడారో మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజలను సీఎం మరోసారి వంచించినట్టేనన్నారు. చంద్రబాబు వంచనలకు నిరసనగా, విభజన చట్టంలో హామీల అమలు కోరుతూ ఈ నెల 30న అనంతపురంలో వంచనపై నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ దీక్షకు పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్సీపీ ఎంపీలు సహా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవుతారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల అప్పులు పెరిగాయని, తలసరి ఆదాయంకంటే అప్పులే ఎక్కువయ్యాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండానే వాటిని తాకట్టు పెట్టి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సీఎంకు బీసీలంటే చులకనని, నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానని, గతంలో మత్స్యకారుల తోలుతీస్తానని నోరు పారేసుకోవడం ఇందుకు తార్కాణమని చెప్పారు. 15 రోజుల్లో పదవి ముగుస్తుందనగా పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం పెద్ద డ్రామాగా అభివర్ణించారు. ఎన్డీయే నుంచి టీడీపీ మార్చిలో బయటకు రాగా ఇన్నాళ్లూ పరకాల ఎందుకు ఆ పదవిలో కొనసాగారని ప్రశ్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయం ఆయన్నే అడగండని బదులిచ్చారు. విశాఖ భూకుంభకోణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, దీనిపై వేసిన సిట్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు: వరప్రసాద్
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలు నెరవేర్చ మని అడుగుతున్న బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు దూషణ లకు దిగుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధిచెబు తారని హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం వరప్రసాద్ హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు అధికారంతో దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బాబు బీసీలు, ఎస్సీ, ఇతర వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారే ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలని కోరిన మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని, తాజాగా కనీస వేతనాలు అడిగిన నాయీబ్రాహ్మణులను బెదిరించారని, దీన్ని బట్టి ఆయనకు ఎంత అహంకారమో స్పష్టమవుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెడతారా? రాష్ట్రంలోని పది సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకులకు తనఖా పెట్టడానికి వీలుగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన ప్రశ్నించారు. -
24న గట్టు ఎత్తిపోతలకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలను ఆధారం చేసుకుని గద్వాల జిల్లాలో చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 24 న శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న పైలాన్‌ను ఆవిష్కరించి, బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ కొత్తగా ఈ పథకాన్ని చేపట్టనున్నారు. రూ.553.98 కోట్లతో గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా చేపట్టే ఈ పథకాన్ని తొలి విడతలో రూ.459.05 కోట్లతో, రెండో విడతలో రూ.94.93 కోట్లతో చేపట్టనున్నారు. -
ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే
‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఆయన చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు లష్కర్‌లా గేట్లు ఎత్తుతూ తానే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం దగాకోరుతనానికి నిదర్శనం. ఈ విషయంలో టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవ’ని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. మంగళవారం శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1,200 మంది మహిళలతో గంగమ్మకు బోనాలు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ నేతలు మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముందుగా వారికి వారు శుద్ధి చేసుకోవాలని హితవు చెప్పారు. వారికి దమ్మూ ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున గొలుపొందాలని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ఆత్మకూరు: కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలను ఆదుకునే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్ఘాటించారు. మంగళవారం ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తి పోతల పథకం దగ్గర నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గంగాహారతి కార్యక్రమం పండుగలా సాగింది. గంగమ్మకు పూజలు చేసి.. మహానేతను మనసారా స్మరించుకుంటూ.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన అధికార పార్టీ పాలకులను తూర్పారబట్టారు. తరలివచ్చిన నేతలు వైఎస్ఆర్ గంగా హారతి కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సిద్ధాపురం చెరువు ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్చార్జీలు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మురళీకృష్ణా, నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, శిల్పా కార్తీక్‌రెడ్డి, డాక్టర్ మధు సూదన్, ప్రదీప్‌రెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉదయభాస్కర్, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, నాగరాజుయాదవ్, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పోలూరు భాస్కరరెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, ఆయుష్మాన్ హాస్పిటల్ అధినేత సంజీవరావు, కరుణాకరరెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, జాకీర్, హబీబుల్లా, ఇషాక్, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పలుచని బాలిరెడ్డి, ధనుంజయాచారి, డీకే రాజశేఖర్ పాల్గొన్నారు. -
‘ఎత్తిపోతల’కు ఊరట కొంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరలపై స్వల్ప ఊరటే లభించింది. యూనిట్ ధరను రూ.6.40 నుంచి రూ.4.88కి తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా... విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 60 పైసలు మాత్రమే తగ్గించి, యూనిట్ ధరను రూ.5.80గా నిర్ణయించింది. దాంతో ఎత్తిపోతల పథకాల విద్యుత్ ఖర్చులో కేవలం రూ.146.77 కోట్లకు మాత్రమే ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి భారీగా వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వ కుర్తి వంటి మొత్తం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వాటికి ప్రస్తుతం ఏటా 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. యూనిట్‌కు రూ.6.40 చొప్పున లెక్కిస్తే.. ఏటా వీటికి రూ.1,565.57 కోట్ల మేర ఖర్చవుతోంది. తాజాగా ధర రూ.5.80కు తగ్గించడంతో ఖర్చు 1,418.80 కోట్లకు తగ్గనుంది. అంటే రూ.146.77 కోట్ల మేర మాత్రమే భారం తగ్గుతోంది. అదే డిస్కంలు కోరిన మేర రూ.4.88కి తగ్గిస్తే.. భారం ఏకంగా రూ.371.82 కోట్లు తగ్గేదని అంచనా. ఇక ఈ ఏడాది జూన్–జూలై నాటికి మరిన్ని ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తుండడంతో.. విద్యుత్ అవసరం 3,331 మెగావాట్లకు పెరుగుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. యూనిట్ ధర రూ.4.88కి తగ్గించి ఉంటే.. భారం ఏకంగా రూ.911.36 కోట్ల మేర తగ్గేదని అంచనా. -
సాగు ప్రాజెక్టులకు ‘దివాలా’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: భారీగా రుణాలు తీసు కుని తిరిగి చెల్లించని కంపెనీలకు షాకిచ్చేలా కేంద్రం తీసుకొచ్చిన దివాలా చట్టం.. రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు అలాంటి కంపెనీలను దివా లా కోర్టు ముందుకు తేనున్నాయి. ఈ జాబితాలో రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ ఐవీఆర్సీఎల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పనులపై పడే ప్రభావాన్ని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఈ మేర కు ఐవీఆర్సీఎల్ కంపెనీ స్వయంగా, ఇతర కంపెనీలతో కలిసి చేస్తున్న పనుల జాబితాను సిద్ధం చేసింది. 4 ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో రూ.759 కోట్ల విలువైన పనులపై ప్రభావం పడొచ్చని తెలుస్తోంది. ఏయే పనులపై ప్రభావం? ఇప్పటివరకు అధికారులు సిద్ధం చేసిన నివేదిక ఆధారంగా పరిశీలిస్తే.. ఐవీఆర్సీఎల్ కంపెనీ ఇందిరమ్మ వరద కాల్వ ప్యాకేజీ–5 పరిధిలో రూ.290.73 కోట్ల విలువైన పనులు చేస్తుండగా.. ఇంకా రూ.57.51 కోట్ల విలువైన పనులు చేయాలి. ఇదే ప్యాకేజీ పరిధిలో రీఇంజనీరింగ్‌లో భాగంగా కొత్తగా రూ.288.65 కోట్ల పనులు చేయాలి. ఎల్లంపల్లి స్టేజ్–2 కింద ఫేజ్–1లో రూ.41.63 కోట్ల పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–20లో రూ.365.62 కోట్ల పనులు, నిజాంసాగర్ ఆధునీకరణ ప్రాజెక్టులో రూ.6 కోట్ల పనులు.. మొత్తంగా రూ.759 కోట్ల పనులు చేయాలని గుర్తించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ దివాలా తీస్తే.. ప్రభుత్వాల నుంచి వాటికి రావాల్సిన నిధు లు నేరుగా బ్యాంకులకు వెళతాయి. దీనివల్ల ఆ కంపెనీతో కలసి పనిచేస్తున్న కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని.. పనులన్నీ ఆగిపోయే ప్రమాదముందని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘పాలమూరు’కు నికరజలాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేశంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న పాలమూరు–రంగారెడ్డికి త్వరలోనే నికరజలాలు రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని త్వరలో కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా అవార్డు పాస్‌కానుందని, తీర్పు రాష్ట్రానికి అనుకూలంగా వస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికరజలాలు లభించనున్నాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘సాగునీటి సాధన సభ’లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. ప్రస్తుతం వరద జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉంటుందన్నారు. అప్పుడు నీటి పంపింగ్ ప్రక్రియ 60 రోజుల నుంచి 120 రోజులకు పెరుగుతుందన్నారు. అయితే కోర్టులో కేసు ఉన్నందున బహిరంగంగా అన్ని విషయాలు చెప్పలేమన్నారు. కృష్ణాలో లభ్యమయ్యే నీటి ద్వారా ప్రప్రథమంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. అలాగే గోదావరి జలాల ద్వారా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మెజార్టీ భాగానికి నీరందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని హరీశ్‌రావు వివరించారు. ఉత్తమ్ క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరి వ్వడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తూ అడ్డు పడుతున్నారని, అందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల అటవీప్రాంతం దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్‌ట్రిబ్యునల్ లో కేసు వేశారని, ప్రాజెక్టు కింద భూములను సేకరించవద్దంటూ మరో కాంగ్రెస్ నేత హైకోర్టులో కేసు వేశారన్నారు. వీరి వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కేసును ఉపసంహరించుకుంటే కేవలం 3 నెలల్లోనే లైనింగ్‌కాల్వల పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ నేతలకు రైతులపై ప్రేమ ఉంటే కేసును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. -
సాగునీటికి రూ.9 వేల కోట్ల రుణం!
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు వచ్చే రాష్ట్ర బడ్జెట్లో నిధు ల కేటాయింపుపై ఆర్థికశాఖ కొంత స్పష్టతనిచ్చింది. సాగునీటి కోసం రూ.29 వేల కోట్లు కేటాయించేందుకు సుముఖత తెలిపింది. బడ్జెట్ నుంచి రూ.20 వేల కోట్ల కేటా యింపుకు సూచనప్రాయంగా అంగీకరించింది. మిగతా రూ.9 వేల కోట్లను బడ్జెటేతర నిధుల నుంచి సమకూర్చుకోవాలని, రుణా ల ద్వారా తీసుకోవాలని పేర్కొంది. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు నేతృత్వంలో నీటి పారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ తరఫున ఈఎన్సీ మురళీధర్, వివిధ∙ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తమ శాఖ అవసరాలను ఆర్థిక శాఖ ముందుంచారు. రూ.29,208 కోట్ల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదించిన రూ.9 వేల కోట్లను మొత్తం బడ్జె ట్ ప్రతిపాదన నుంచి వేరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. రూ.20 వేల కోట్లను బడ్జెట్ నుంచి కేటాయిస్తామని, మిగ తా వాటిని బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలని సూచించగా నీటి పారుదల శాఖ ఓకే అన్నట్లు తెలిసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఫిబ్రవరి 10న 15వ ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించనున్నారు. సంఘం సభ్యులు శక్తికాంతదాస్, అనూప్‌సింగ్, రమేశ్ చంద్, అశోక్ లహిరి ప్రాజెక్టు పరిధిలో పర్యటించే అవకాశముంది. -
మన వాడే రూ.13.27 కోట్లు ఇచ్చేయ్..!
సాక్షి, అమరావతి: చిన్న పనే చేయలేక చేతులెత్తేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థకు పెద్ద పనిని అప్పగించడం ద్వారా అక్రమాలకు తెరలేపిన సర్కారు.. అధికారులపై ఒత్తిడి తెచ్చి చేయని పనులకు రూ. 11.67 కోట్లను అక్రమంగా బిల్లులు చెల్లించింది. ఈ అక్రమాలకు వెలిగొండ ప్రాజెక్టు వేదికగా మారింది. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించకుండానే రూ.91.52 కోట్ల విలువైన పనులను సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను గతేడాది ఆగస్టు 9న శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా సంస్థకు ఖరారు చేశారు. అయితే హంద్రీ–నీవాలో మూడు మీటర్ల వ్యాసార్థంతో కూడిన చిన్న సొరంగం పనులే చేయలేని సంస్థకు వెలిగొండ ప్రాజెక్టులో 9.2 మీటర్ల వ్యాసార్థంతో భారీ సొరంగం తవ్వకం పనులను అప్పగించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ హైపవర్ కమిటీ సమావేశంలో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలంటూ సర్కార్‌కు ప్రతిపాదించడం అప్పట్లో సంచలనం రేపింది. అయినా సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ఒత్తిళ్లతో ఆ పనులు శ్రీనివాసరెడ్డికే దక్కాయి. సొరంగం తవ్వకుండానే బిల్లులు: వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్ మీదుగా పడవపై కొల్లంవాగుకు చేరుకోవాలి. యంత్ర సామాగ్రిని అక్కడికి తరలించాలంటే భారీ పడవలు అవసరం. కానీ.. భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా మాయాజాలం చేశారు. సొరంగాల తవ్వకం, హెడ్ రెగ్యులేటర్ పనుల పునాదుల కోసం 31,312 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,87,645 క్యూబిక్ మీటర్ల రాతి తవ్వకం పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.11.67 కోట్లను చెల్లించేశారు. కానీ.. వీటిని ఎం–బుక్‌లో రికార్డు చేయలేదు. సొరంగం పనులు ఎన్ని మీటర్లు, ఎంత ఎత్తులో చేశారన్న లెక్కలు కూడా తీయలేదు. ఎం–బుక్‌లో రికార్డు చేయకుండా పీఏవో(పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్) బిల్లులు చెల్లించరు. కానీ.. ఉన్నతస్థాయి ఒత్తిడి రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పీఏవో బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. కోటరీ కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదుతో.. శ్రీనివాసరెడ్డి సంస్థకు కట్టబెట్టిన పనుల కోసం సీఎం కోటరీలోని ఎంపీకి చెందిన కాంట్రాక్టు సంస్థ పోటీ పడింది. కానీ సీఎం సూచనల మేరకు ఆ తర్వాత వెనక్కు తగ్గింది. వెలిగొండ సొరంగాల పనుల కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. మిగిలిన పనులకు తాజాగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనులపై కన్నేసిన ఎంపీ సంస్థ ప్రతినిధులు ఇటీవల వెలిగొండ సీఈ జబ్బార్‌తో సమావేశమైనట్లు తెలిసింది. ఆ తర్వాత శ్రీశైలం జలాశయం మీదుగా కొల్లంవాగు వద్దకు వెళ్లి సొరంగాలను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి సంస్థకు పనులు అప్పగించి ఆర్నెళ్లయినా పనులు ప్రారంభించలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన సీఈ జబ్బార్ అధికారులను ఆరా తీయగా రూ.11.67 కోట్ల విలువైన పనులను చేసినట్లు ఈఈ వివరించారు. ఆ సంస్థ పనులే ప్రారంభించలేదు కదా.. బిల్లులు ఎలా చెల్లిస్తారని సీఈ జబ్బార్ నిలదీయడంతో అసలు విషయం బయటపడిందని అధికారవర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ నుంచి సాంకేతిక అనుమతి లేకుండా ప్రారంభించిన సన్నాహక పనులకు మరో రూ.13.27 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇంతలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రంగంలో దిగడంతో విచారణ అటకెక్కినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై వెలిగొండ ఎస్ఈ రెడ్డెయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బిల్లులు చెల్లించామని చెప్పారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించామన్నారు. పనులకు సీడీవో సీఈ నుంచి అనుమతి రానిమాట వాస్తవమేనని వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తామేమీ నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలిపారు. -
గోడు వినరు.. గూడు కట్టరు!
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నిర్వాసితుల వెతలు మాత్రం తీరడం లేదు! ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లయినా ఇంకా సాగుతూనే ఉంది. మిడ్ మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నా... పునరావాస ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. నిధుల కేటాయింపు, పట్టాల పంపిణీ, గృహ వసతి కల్పన, ఇప్పటికే నిర్మించిన పునరావాస కాలనీల్లో వసతుల లేమి.. ఇలా ఒక్కటేమిటీ అన్నింటా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇళ్లు కట్టేది ఇంకెప్పుడు? పద్నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 65 గ్రామాలు పూర్తిగా, 19 పాక్షికంగా కలిపి మొత్తంగా 84 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలలో 44,794 మంది నిర్వాసితులవుతున్నారు. వీరందరికీ పునరావాస (ఆర్అండ్ఆర్) కేంద్రాలు ఏర్పాటు చేసి.. గృహాల నిర్మాణం, రోడ్లు, తాగునీరు, కరెంట్ కనెక్షన్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే ఇప్పటివరకు 84 ముంపు గ్రామాలకుగానూ 77 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే (ఎస్ఈఎస్) పూర్తయింది. 44వేల పైచిలుకు మందిలో 24,891 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 16,859 నివాస గృహాలను నిర్మించారు. ఇంకా 18,526 గృహాలు, ఇతర వసతుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.1,262 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాజెక్టుల కింద అన్నీ సమస్యలే.. రానున్న జూన్ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు కీలకం. ఇక్కడి భీమా ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, మొత్తంగా 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. అయితే ఇందులో 3,500 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది. మౌలిక వసతుల పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్‌గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో నిర్వాసితులకు గృహాల నిర్మాణం వేగిరం చేయాల్సి ఉంది. సంగంబండలో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నెట్టెంపాడు కింద ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్‌పాడ్ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి రోడ్లు, నీరు, విద్యుత్ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. కాలనీల్లో వసతులేవీ..? రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మిస్తుండగా, బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతలఠాణా, వేములవాడ రూరల్ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. వీరందరికి పునరావాసం కోసం సుమారు రూ.100 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లో సుమారు మూడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే ప్రాజెక్టు కింద కొదురుపాక, నీలోజిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించారు. అయితే సీసీ రహదారులు నిర్మించాక పైప్లైన్లు వేయడానికి కందకాలు తవ్వారు. కొన్ని చోట్ల రోడ్లు బ్లాస్ట్ చే«శారు. దీంతో పలు సీసీ రహదారులు పగుళ్లు బారాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అనాలోచిత చర్యతో శాభాష్‌పల్లి వాగులో నీటి వసతి కోసం మంచినీటి బావులు తవ్వించారు. అయితే వాగులో నీరు చేరడంతో బావులు మునిగిపోయాయి. రోడ్డు నిర్మాణంలో పైప్‌లైన్ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దీంతో పునరావాస కాలనీల్లో నీరు దొరక్క నిర్వాసితులు పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు పునరావాస కాలనీల్లో నిర్వాసితులకు ఇళ్లను అప్పగించడంలో తీవ్ర జాప్యం వల్ల మురుగు కాలువలు మట్టి, పిచ్చి చెట్లతో పూడుకు పోయాయి. పలుచోట్ల విద్యుత్ సదుపాయం లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. అరిగోస పడుతున్నారు మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి నీరు చేరిందని.. పునరావాస కాలనీలకు తరలాలని అధికారులు ఆదేశించడంతో కట్టు బట్టలతో ఊళ్లు వదిలి ఆర్అండ్ఆర్ కాలనీలకు చేరాము. ఇక్కడ నీటి వసతి లేదు. వాగులో బావులు తవ్వితే మునిగి పోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు బారాయి. మౌలిక వసతులు లేక నిర్వాసితులు అరిగోస పడుతున్నారు. – కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఇళ్ల బిల్లులు చెల్లించలేదు సంగంబండ ఆర్ఆర్ సెంటర్లో ఇళ్లు కట్టుకోవాలంటే బిల్లులు ఇవ్వడంలేదు. జీవో విడుదల చేసి సంవత్సరాలు గడిచినా కొంతమందికి ప్లాట్లు రాలేదు. సర్వం కోల్పోయిన తమను ఆదుకుంటామని చెప్పడం తప్ప సమస్యలు పరిష్కరించడంలేదు. – అనంతరెడ్డి, సంగంబండ, బీమా ప్రాజెక్టు నిర్వాసితుడు ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి ఆర్అండ్ఆర్ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు విడుదల చేయాలి. – ఆడెపు రాజు, వరదవెల్లి, మిడ్‌మానేరు నిర్వాసితుడు -
పెద్దల కోసం సర్దుబాటు రూ.4,000 కోట్లు!
-
సరదాగా కాసేపు..
సాక్షి, సిద్దిపేట: కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మహా యజ్ఞం మాదిరి చేపట్టామని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను రెండో రోజు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి బైక్‌పై ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం నుంచి నీటిని తరలించే విధానం, పంపులు పనిచేయడం, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు నింపడం మొదలైన అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకొన్నారు. ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అందరి కష్టం, శ్రమ అంతా కరువును తరమి కొట్టాలన్నదే అని మంత్రి వివరించారు. అదేవిధంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో కట్టను మంత్రి పరిశీలించి నీటి సామర్థ్యం తట్టుకునేందుకు చేపట్టిన అధునాతన పద్దతులు, నల్లమట్టి, ఇసుకతో నిర్మాణలతో ఉపయాగాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. -
‘పెద్దల’ కోసం సర్దుబాటు రూ. 4,000 కోట్లు!!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, రైతుల పొలాల్లోకి నీరు ఎప్పుడు పారుతుందో తెలియదు గానీ, ప్రభుత్వ పెద్ద ల జేబుల్లోకి కమీషన్ల ప్రవాహం మాత్రం ఆగ డం లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినంత మింగేస్తున్నా రు. ఇందుకోసం కొత్తకొత్త వ్యూహాలను తెరపై కి తెస్తున్నారు. 2014 తర్వాత దక్కించుకున్న ప్రాజెక్టుల పనులు చేయకుండా మొండి కేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సి న ప్రభుత్వం అందుకు భిన్నంగా అంతులేని మమకారం ప్రదర్శిస్తోంది. ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అక్రమం ఇక సక్రమం తాజాగా చేపట్టిన పనులకు ‘ధరల సర్దుబాటు’ నిబంధనలను వర్తింపజేసి, కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేయాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. 2013 ఏప్రిల్ 1కి ముందు చేపట్టిన పనులకు మాత్రమే ధరల సర్దుబాటును వర్తింపజేస్తామని.. ఆ తర్వాత చేపట్టిన పనులకు అమలు చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. దాంతో బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ)ను రంగంలోకి దించి, తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా చక్రం తిప్పారు. బీవోసీఈ నివేదికను అమలు చేయడానికి వీలుగా శనివారం (20వ తేదీ) నిర్వహించే కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కేబినెట్ తీర్మానం ద్వారా అక్రమాన్ని సక్రమం చేసుకుని, కాంట్రాక్టర్లతో కలిసి రూ.4 వేల కోట్లకు పైగా లబ్ధి పొందడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ రెండు జీవోలతో భారమే ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో స్టీల్, సిమెంట్, డీజిల్‌తోపాటు లేబర్, మెటీరియల్‌కు ధరల సర్దుబాటును వర్తింపజేస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 7న జారీ చేసిన జీవో 13ను గవర్నర్ నరసింహన్ తాత్కాలికంగా నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జలవనరులు, ఆర్థిక శాఖల అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన సూచనలను తుంగలో తొక్కుతూ ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెడుతూ 2015 మార్చి 22న జీవో 22ను జారీ చేశారు. అంతటితో ఆగకుండా... పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించేలా 2015 జూన్ 12న జీవో 63ను జారీ చేశారు. ఈ రెండు జీవోల వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.20 వేల కోట్లకు పైగా భారం పడింది. ఆ సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్ల పాలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటరీ కాంట్రాక్టర్లతో ప్రతిపాదన ధరల సర్దుబాటు నిబంధనలు 2013 ఏప్రిల్ 1కి ముందు చేపట్టిన పనులకే వర్తిస్తాయి. రాష్ట్రంలో 2014 జూన్ 8 తర్వాత చేపట్టిన పనులకు వర్తించవు. తాజా ధరల ప్రకారం చేపట్టిన పనులను పూర్తి చేయలేకపోతే ఈపీసీ లేదా ఎల్ఎస్–ఓపెన్ విధానాల్లోని నిబంధనల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్‌కు జరిమానా విధించవచ్చు. కానీ, తాజాగా చేపట్టిన పనులకు కూడా ధరల సర్దుబాటు నిబంధనలను వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. హంద్రీ–నీవా రెండో దశలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్లో చేసిన పనులకు అదనంగా రూ.169.71 కోట్లు ఇవ్వాలని కోరాయి. 2015–16 ధరల ఆధారంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు టెండర్లు పిలిచామని, వాటికి జీవో 22, జీవో 63లను వర్తింపజేయలేమని రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) పలుమార్లు తేల్చిచెప్పింది. చంద్రబాబు ఒత్తిళ్లకు ఎస్ఎల్ఎస్సీ లొంగకపోవడంతో వ్యూహం మార్చారు. తాజాగా చేపట్టిన పనులకూ ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేసే ప్రతిపాదనపై నివేదిక ఇవ్వాలంటూ బీవోసీఈని ఆదేశించారు. ఒత్తిళ్లకు తలొగ్గిన బీవోసీఈ.. 2013 ఏప్రిల్ 1 తర్వాత ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో చేపట్టిన పనుల్లో.. అంతర్గత అంచనా విలువ(ఐబీఎం) కంటే 25 శాతం ఎక్కువ పనులు చేసి ఉంటే ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేయవచ్చని 2017 నవంబర్ 29న నివేదిక ఇచ్చింది. ఐబీఎంలో పేర్కొన్న మట్టి లేదా కాంక్రీట్ పనుల కంటే 50 శాతం ఎక్కువ చేసి ఉన్నా అదనపు నిధులు ఇవ్వొచ్చని ఆ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు నెల రోజులుగా ఒత్తిడి తెస్తున్నారని జలవనరుల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్లో ఆమోద ముద్ర తాజా ధరలతో చేపట్టిన పనులకు ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేయలేమని జలవనరులు, ఆర్థిక శాఖల అధికారులు తేల్చి చెప్పారు. 2015–16, 2016–17, 2017–18 ధరల్లో పెద్దగా మార్పు లేదని చెప్పిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు మండిపడినట్లు తెలిసింది. బీవోసీఈ నివేదికను అమలు చేసేలా ఈ నెల 20న నిర్వహించే కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. యథావిధిగా ఆ నివేదికపై కేబినెట్లో ఆమోదముద్ర వేసి.. కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 2014 జూన్ 8 తర్వాత చేపట్టిన పనులకు జీవో 22, జీవో 63లను వర్తింపజేస్తే ఖజానాపై రూ.4 వేల కోట్లకుపైగా భారం పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సింహభాగం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు భాగస్వామిగా ఉన్న హెచ్‌ఈఎస్–పీఎస్కే, నవయుగ వంటి సంస్థలకే దక్కనుంది. అ‘ధనం’ ఇవ్వాల్సిందేనట! టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వంశధార, చింతలపూడి తదితర ప్రాజెక్టుల్లో పాత కాంట్రాక్టర్లపై వేటు వేశారు. ఆ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. టెండర్ నిబంధనలను అడ్డం పెట్టుకుని కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించారు. తాజాగా ఆ పనులకే ధరల సర్దుబాటును వర్తింపజేసి అదనపు నిధులు కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నారు. హంద్రీ–నీవా రెండో దశలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల అంచనా విలువ తొలుత రూ.207 కోట్లే. కానీ, అంచనా వ్యయాన్ని పెంచి.. రూ.430.26 కోట్లకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల సంస్థలకు కట్టబెట్టారు. ఒప్పందం ప్రకారం తొమ్మిది నెలల్లోగా ఈ పనులు పూర్తి కావాలి. కానీ, కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు పెంచాలంటూ కాంట్రాక్టర్లు పంపిన ప్రతిపాదనపై ఉన్నతస్థాయి ఒత్తిడి మేరకు ఎస్ఎస్ఎల్సీ ఆమోదముద్ర వేసింది. తాజాగా పెంచిన గడువు కూడా పూర్తయింది. మట్టి పనులు పూర్తయ్యాయి. కానీ 66,139 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మిగిలిపోయాయి. ఒప్పందంలో పేర్కొన్న దాని కంటే అధికంగా పనులు చేశామని, రూ.169.71 కోట్లు అదనంగా ఇవ్వాలని వారు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో 87 ప్యాకేజీ పనులు చేస్తున్న సీఎం రమేశ్, 88 ప్యాకేజీ పనులు చేస్తున్న చంద్రబాబు కోటరీలోని సంస్థ ఇప్పటికే అదనపు నిధులు ఇవ్వాలంటూ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించాయి. హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను 2016–17 ధరలతో చేపట్టారు. గతేడాది చేపట్టిన ఈ పనులకు సైతం ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలంటూ సీఎం రమేశ్, చంద్రబాబు కోటరీలోని కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు పంపారు. గడువులోగా పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం..నిబంధనలకు విరుద్ధంగా భారీగా ప్రయోజనం చేకూర్చడానికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. -
‘గవ్వలసరి’ అయ్యేనా..?
పొగిళ్ల..చందంపేట మండలంలోని ఓ మారుమూల పల్లె. అక్కడ అంతా గిరిజనులే. భూమి ఉంది..పక్కనే కృష్ణానది జల సవ్వడులు. కానీ సాగునీరు లేదు. తాగేందుకూ దొరకని పరిస్థితి. దీనిని అధిగమించేందుకు బ్యాక్‌వాటర్‌నుంచి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టే గవ్వలసరి. కానీ ఇది ప్రతిపాదనలకే పరిమితం కావడంతో గిరిజనులు వలసబాట పడుతున్నారు. – చందంపేట చందంపేట (దేవరకొండ) : చుట్టూ ఆకుపచ్చని వర్ణం... పక్కనే కృష్ణమ్మ పరవళ్లు... గిరిజన సంస్కృతి... ఇవన్నీ గవ్వలసరి గ్రామం సొంతం... కానీ ఈ ప్రాంతంలో వలసలు తప్పడం లేదు... ఉన్న ఇళ్లు, పొలా లను వదులుకొని ఇతర ప్రాంతాలకు గిరిజనులు వలసపోతున్నారు. ఇందుకు కారణం సాగు, తాగునీరు అందకపోవడమే. జిల్లాలోనే మారుమూల గిరిజన ప్రాంతం చందంపేట. సు మారు 90 శాతం మంది గిరిజనులే ఉన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులంతా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తుం టారు. వ్యవసాయ సాగుకు నీరు లేకపోవడం, వర్షాలు సంవృద్ధిగా కురువకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మళ్లీ అప్పులు చేయలేక పొట్ట చేతపట్టుకొని వలసబాటపడుతున్నారు. నాగార్జునసాగర్ వెనుక జలాలను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో సాగు, తాగు నీరు అందకపోవడంతో ఒక్కో రైతు సుమారు పదికి పైగా బోర్లు వేసి నీరు పడకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయ మార్గమైన గవ్వలసరి ప్రాజెక్టును నిర్మిస్తే మూడు వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నా రు. గత ఏడాది ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పొగి ళ్ల స రిహద్దుల్లోని నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మరబోటులో ప్ర యాణించి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. గవ్వలసరియే ప్రత్యామ్నాయం పొగిళ్ల గ్రామ సమీపంలోని లోతట్టు ప్రాంతంలో గవ్వలసరి వద్ద కృష్ణా బ్యాక్ వాటర్ ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే గవ్వలసరి ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనలుఉన్నాయి. గవ్వలసరి ప్రాజెక్టు నుంచి పొగిళ్ల, రేకులవలయం, ఉస్మాన్‌కుంట, కంబాలపల్లి, గువ్వలగుట్ట, మంగళితండా, సర్కిల్‌తండా, చౌటుట్ల, చాపలగేటు, యల్మలమంద, దేవరచర్ల, యాపలపాయతండా, రేకులగడ్డ, నేరుట్ల, మంగళితండా, పెద్దమ్మగడ్డతం డా, బిల్డింగ్‌తండా, కాచరాజుపల్లి గ్రామాల్లోని ఆయా చెరువులకు నీటిని అందించి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న కరువును పారదోలేందుకు గవ్వలసరి ప్రాజెక్టు ఒక్కటే ప్రత్యామ్నాయం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావన ఇదే విషయమై గత శీతాకాల సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరిశ్‌రావు దృష్టికి కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. వారు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారని పలు సభల్లో, సమావేశల్లో కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది గవ్వలసరి ప్రాజెక్టు కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీటికి ఇబ్బందులు తీరతాయి. వ్యవసాయన్నే నమ్మకున్న రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రభుత్వం కూడా గవ్వలసరి ప్రాజెక్టు పట్ల సానుకూలంగా ఉంది. – రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే -
పాత ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం నాకు దక్కింది: సీఎం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని 27 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇంటింటా నీటి వినియోగంపై ఆడిట్ జరగాల్సిన అవసరముందన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. డెల్టాకు ఇవ్వాల్సిన శ్రీశైలం నీటిని హంద్రీ–నీవాతో పాటు సిద్ధాపురానికి ఇస్తున్నామని చెప్పారు. ఈ నెలలో సూర్యారాధన అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఇదిలాఉండగా, సమయం దాటిన తర్వాత అనధికార వ్యక్తులు దుర్గమ్మ గుడిలోకి వెళ్లినట్టు రుజువయ్యిందని సీఎం చెప్పారు. అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. అయితే తాంత్రిక పూజలపై మాత్రం నోరుమెదపలేదు. ఫొటోల కోసం నిలదీయడం అలవాటైంది..: శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించి.. కొనుగోలు చేయాలని సభకు హాజరైన రైతులు డిమాండ్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోల కోసం నిలదీయడం అలవాటైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై సీఎం తన అక్కసు వెళ్లగక్కారు. ఎవరైనా ప్రశ్నించగానే.. ఫొటోలు తీసి వేస్తోందంటూ నోరుపారేసుకున్నారు. -
ప్రభుత్వ అసమర్థతే ప్రాజెక్టులకు గండం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై నిందలు మోపుతోందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పునరావాస ప్యాకేజీలు లేకుండా, నిర్వాసితులను ఆదుకోకుండా ప్రాజె క్టులను పూర్తి చేయాలనుకుంటే ఎవరూ హర్షించరన్నారు. ప్రాజెక్టులు పూర్తికాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయ ని అధికార టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు సరికాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకి అని, ఆ ప్రాజెక్టుకు ఏ ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ప్రశ్నించారు. సాగర్ వరదకాల్వ, ఎస్సారెస్పీ ఫేజ్ టూ పనులకూ అరకొర నిధులు కేటాయించడం వల్లే పనులు పూర్తికావడం లేదన్నారు. -
మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతాం
తుని: 2018–19కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశపెట్టనున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ ముసాయిదా రూపకల్పన కోసం త్వరలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలకు నిధులు కేటాయిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చి, 13 జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. -
మాటలే మిగిలాయి..
సాలూరురూరల్ (పాచిపెంట): సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తాం.. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నాయకులు ఆచరణలో చేసి చూపించలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో నిర్మించిన ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. మూడు కాలాల్లోనూ పంటలు పండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అప్పట్లో జలయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించి 2006లో ప్రారంభించారు. సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వాయర్ నిర్మించి కుడి కాలువ ద్వారా 8500 ఎకరాలకు, కర్రివలస ఆనకట్ట ద్వారా 3500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్లుగా ప్రాజెక్ట్ నిర్వహణను పట్టించుకోకపోవడంతో సమస్యలు మొదలయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖాలాలు లేవని వాపోతున్నారు. అందని మెయింటినెన్స్ బిల్లులు టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ నిధులు మంజూరు కావడం లేదు. అయినప్పటికీ అటు అధికారులు గాని ఇటు పాలకులు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రాజెక్ట్ పరిధిలో లష్కర్ల కొరత ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 9 మంది లష్కర్లను నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారితోనే కాలం నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతమున్న వారికంటే రెట్టింపు సంఖ్యలో లష్కర్లు ఉండాలి. కాని ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించకపోవడంతో ఉన్నవారు ప్రాజెక్ట్ నిర్వహణను పక్కాగా చేపట్టలేకపోతున్నారు. షట్టర్లు పాడవుతున్నా మరమ్మతులు సకాలంలో చేయడం లేదు. ముఖ్యంగా పెద్దగెడ్డలో రెండు గేట్లు పాడవ్వడంతో మాన్యువల్ పద్ధతిలో పైకి లేపుతున్నారు. షట్టర్ అడుగున రబ్బర్ ఫిట్ చేయకపోవడంతో అడుగు నుంచి నీరు లీకవుతోంది. గురునాయుడుపేట ప్రాంత సమీపంలో ఉన్న 7ఎల్ లైన్ షట్టర్ పోయింది. ఇక్కడ కూడా నీరు వృథాగా పోతోంది. స్పందించాలి ప్రాజెక్ట్ అధికారులు, పాలకులు స్పందించి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామాలకు వస్తున్న ప్రతిసారీ రైతుల గురించే ఆలోచిస్తున్నామని చెబుతున్న నాయకులకు నీటి వృథా కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
హవ్వ.. జనం నవ్వరా!?
తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు - ఎన్నికలప్పుడు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడమే ఆయన ఘనత - సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డే సాక్షి, అమరావతి: రాయలసీమను సస్యశ్యామలం చేసింది తానేనని, హంద్రీ–నీవాను పూర్తి చేసిందీ తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై సాగు నీటి రంగం నిపుణులు, రైతులు, రాజకీయ పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు గేట్లు ఎత్తుతూ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత తనదేనంటుండటంపై టీడీపీ నేతలు సైతం నోరెళ్లబెడుతున్నారు. వాస్తవానికి దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న డిమాండ్‌తో దివంగత సీఎం, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం 1985లో ఉద్యమాలు చేసింది. పాదయాత్ర నిర్వహించింది. ఆ ఫలితంగా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులను 1989 నుంచి 94 వరకు అప్పటి ప్రభుత్వం కొనసాగించింది. 1995లో ఎన్.టి.రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు.. సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేశారు. ఎన్నికలప్పుడే బాబు శంకుస్థాపనలు అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద హంద్రీ – నీవా సుజల స్రవంతి పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పనులు చేపట్ట్టకుండా అటకెక్కించారు. 1999 సాధారణ ఎన్నికలకు ముందు హంద్రీ – నీవా ప్రాజెక్టును కేవలం ఐదు టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి ప్రాజెక్టుగా మార్చి.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి వద్ద రెండో సారి పునాదిరాయి వేశారు. జనం నమ్మరనే భావనతో పునాదిరాయి అటు వైపు.. ఇటు వైపు మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు. ఎన్నికలు ముగియగానే ఆ ప్రాజెక్టునూ అటకెక్కించారు. గాలేరు – నగరి ప్రాజెక్టు పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలప్పుడు వామికొండ రిజర్వాయర్ వద్ద.. 1999 ఎన్నికల సమయంలో గండికోట రిజర్వాయర్ వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శరవేగంగా పూర్తి చేసిన వైఎస్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హంద్రీ–నీవా, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పనులను పూర్తి చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే శ్రీశైలం నుంచి 40 టీఎంసీలను తరలించి 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు.. 33 లక్షల మందికి తాగునీళ్లు అందించేందుకు రూ.6,850 కోట్లతో హంద్రీ – నీవా తొలి దశను పూర్తి చేశారు. రెండో దశ పనుల్లో కూడా 50 శాతం పనులను పూర్తి చేశారు. అప్పట్లో ఎకరానికి నీళ్లందించేందుకు రూ.16,750 వృథాగా ఖర్చు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యతిరేకించడం గమనార్హం. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీల ను తరలించి ప్రస్తుత వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీళ్లందించడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తొలి దశ అంచనా వ్యయం రూ.2,155.45 కోట్లు. ఇందులో దాదాపు రూ.రెండు వేల కోట్ల విలువైన పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. రెండో దశ పనులనూ ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 19 టీఎంసీలను తరలించి శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) కింద కర్నూలు జిల్లాలో 1.90 లక్షల ఎకరాలకు సాగు నీళ్లందించే పనులనూ చేపట్టి.. శరవేగంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. నాడు తీవ్రంగా వ్యతిరేకించిన బాబు రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లందించడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పనులను ప్రారంభిస్తే.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సభాపతి కోడెల శివప్రసాదరావు తదితర టీడీపీ నాయకులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం గమనార్హం. -
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?
-
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాల పెంపు, అక్రమాలు, ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై బహిరంగ చర్చకు సిద్ధమేనా.. అని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు, ప్రగతిభవన్‌కు పలువురు నేతలను పిలిపించుకొని కేసీఆర్ పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు పూర్తి, రైతాంగానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో ఇచ్చినా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్లేకుండా ఉంటున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరంకుశ, గఢీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు. -
పైప్‌లైన్ భారం 1,100 కోట్లు
- కాళేశ్వరం ప్యాకేజీ–21లో కాల్వలకు బదులు మళ్లీ పైప్లైన్లే - రూ. 2,243 కోట్లకు పెరగనున్న ప్యాకేజీ–21 అంచనా సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వ్యయం పెరుగుతుందన్న భయంతో పక్కనపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–21లోని పైప్‌లైన్ వ్యవస్థ ప్రతిపాదనను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వల స్థానంలో పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవలి ‘జల్ మంథన్’లో కేంద్ర జలవనరులశాఖ నిర్ణయించడంతో దానివైపే సర్కారు మొగ్గుతోంది. అయితే పైప్‌లైన్ వ్యవస్థ వల్ల సర్కారుపై రూ.1,100 కోట్ల అదనపు భారం పడనుంది. మొదట పక్కన పెట్టి... వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల్లో కాల్వల నిర్మాణానికి ఎకరాకు ఖర్చు రూ. 25 వేల వరకు ఉంటే, పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా ఖర్చు ఎకరాకు రూ. 23,500 ఉంటుంది. అలాగే కాల్వల ద్వారా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్‌లైన్ వ్యవస్థలో 20 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. నీటి వృథా సైతం గణనీయంగా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే పైలట్ ప్రాజెక్టు కింద కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో ఈ విధానాన్ని సర్కారు అమల్లోకి తేవాలనుకుంది. రూ. 1,143.78 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్యాకేజీ–21 కింద నష్టపోతున్న భూమి ధర ఎకరాకు రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య పలుకుతోంది. ఈ లెక్కన భూసేకరణకే రూ. 320 కోట్లు అవసరం. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదు. ఈ ఏడాది మార్చిలో దీనిపై చర్చించిన కేబినెట్ పెట్టుబడి వ్యయం అధికంగా ఉంటుందన్న కారణంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది. కేంద్రం నిర్ణయంతో మారిన ఆలోచన.. అయితే నీటి వృథాను అరికట్టడంతోపాటు పలు ప్రయోజనాలున్న పైప్‌లైన్ డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధాన కాలువ స్థానంలో పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం సాధ్యం కా>నందున డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వల స్థానంలో దీన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పలు పథకాల కింద రాష్ట్రాల్లో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీంతో మళ్తీ పాత ప్రతిపాదనకు నీటిపారుదల శాఖ తెరపైకి తెచ్చింది. పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని తేల్చింది. అయితే ఈ మేరకు ఆయకట్టు లేకపోవడంతో కొండం చెరువు, మంచిప్ప చెరువును కలిపి రిజర్వాయర్లుగా మార్చి అదనంగా లక్ష ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంతా పైప్లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనికి మొత్తం రూ. 2,242.60 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. పాత అంచనా రూ. 1,143.78 కోట్లతో పోలిస్తే రూ.1,098.82 కోట్ల మేర అదనంగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందేందుకు నీటిపారుదలశాఖ కసరత్తు చేపట్టింది. -
ప్రాజెక్టుల పాత పనులకు వ్యాటే!
జూలై నుంచి జరిగిన కొత్త పనులకే 18 శాతం జీఎస్టీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు మినహాయించింది. జూలై ఒకటో తేదీకి ముందు జరిగిన పనులు, వాటికి చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ పాత వ్యాట్ అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత చేపట్టి న కొత్త పనులకు మాత్రమే జీఎస్టీ వర్తింప జేసేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖ చేసిన సిఫార్సుల మేరకు వాణిజ్య పన్నుల శాఖ ఈ వెసులుబాటును ఇచ్చింది. దీంతో సాగునీటి కాంట్రాక్టర్లకు భారీగానే లాభం చేకూరనుంది. సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో ఉపయోగించే సిమెంటు, ఇనుము, భారీ పైపులు, యంత్ర సామగ్రిపై గతంలో 5 శాతం వరకు వ్యాట్ ఉండేది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించేది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ పన్నులన్నీ విలీనమై అవన్నీ 18 శాతం శ్లాబులోకి వచ్చి చేరాయి. నిర్మాణ రంగంలో వినియోగించే సామగ్రిపై జీఎస్టీ విధిం చడంతో ప్రాజెక్టుల అంచనా వ్యయం కూడా పెరిగిపోనుంది. గతంలో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే 13 శాతం అదనంగా పన్ను భారం పడటంతో కాంట్రాక్టర్లలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఇటీవల సమీక్షించిన నీటి పారుదల శాఖ జూలై ఒకటికి ముందు ఒప్పందాలు జరిగిన ప్రాజెక్టు పనులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది. ఈ సిఫారసులను పరిశీలించిన వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందాలతో సంబంధం లేకుండా జూలై ఒకటి వరకు జరిగిన పనులు, చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ గతంలో ఉన్న వ్యాట్ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు ఆరు నెలలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రస్తుత వెసులుబాటు ఈ బిల్లులన్నీ చెల్లించేంత వరకు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం కాంట్రాక్టు ఏజెన్సీలకు కలిసొచ్చే అంశమేననే అభిప్రాయాలున్నాయి. జీఎస్టీ కౌన్సిల్లో మరోసారి చర్చకు... మరోవైపు సాగునీటి ప్రాజెక్టులకు జీఎస్టీ మిన హాయించాలని శనివారం ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ వాదనను వినిపించనుంది. అందులో ఈ అంశం చర్చకు రానుందని, కేంద్రం సైతం వర్క్స్ అండ్ కాంట్రాక్టు పను లకు 18 శాతం నుంచి 12 శాతానికి శ్లాబ్ తగ్గించే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. -
ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు
సాక్షి, అమరావతి: మూడేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో రూ.పదివేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పోలవరంతోసహా ఏడు ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం విజయవాడలోని ఎ కన్వెన్షన్ హాలులో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సదస్సు ముగింపులో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీకల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చరిత్ర తిరగరాసిన వారమవుతామని.. ప్రపంచంలో అలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని అన్నారు. ఎండిపోయిన కృష్ణా డెల్టాకు నీరిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా గోదావరి నీటిని డెల్టాకిస్తామని, రైతులు నారుమళ్లు పోసుకోవాలని కోరారు. కృష్ణా డెల్టాకు కృష్ణానది నుంచి ఇచ్చేనీటిని పులిచింతల వద్ద నిల్వ చేస్తామన్నారు. మొబైల్ లిఫ్టుల ద్వారా రాష్ట్రంలోని చెరువులకు నీరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేరే దేశాలు, రాష్ట్రాలతో పోటీపడి గతంలో పనిచేశానని, అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి సాధించానని చెప్పుకొచ్చారు. తనకు ఏ కోరికా లేదని, ఆశ కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని తనకిచ్చారని, అదే తాను ఇంకా కోరుకుంటున్నానని చెప్పారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారు.. కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేసినట్లు పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాజకీయలబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అప్పుడు అధికారంలో ఉండి దెబ్బకొట్టారని, ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికొచ్చే ఆదాయంలో 32 శాతం వ్యవసాయం నుంచే వస్తుందని, అలాంటి వ్యవసాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆస్పత్రుల్లో చనిపోయినవారిని వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లేందుకు త్వరలో మహాప్రస్థానం వాహనాల్ని ప్రవేశపెడుతున్నామని సీఎం చెప్పారు. చనిపోయిన వారిని ఈ వాహనాల్లో వారింటికి తీసుకెళ్లడంతోపాటు కుటుంబానికి రూ.30 వేలు చొప్పున ఇస్తామన్నారు. -
ఎస్కలేషన్ జీవో–146లో మార్పులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇదివరకే వెలువరించిన జీవో–146లో పలు మార్పులు చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా సోమవారం ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి జీవో–146లోని కొన్ని అంశాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల మేరకు, ప్రాజెక్టుల్లో ఐబీఎంలో వేసిన అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మా ణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్ పనులు చేరితే ఆ పనులకనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. ఇక 2013 ఏప్రిల్ తర్వాత నిర్మాణ మవుతున్న, అయిన ప్రాజెక్టులన్నింటికీ ఐబీఎంలో వేసిన దానికన్నా ఎస్కలేషన్ ఎంత ఎక్కువ అవుతుందన్నది అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిజైన్ సమయంలో.. ప్రస్తుత మార్పుల తర్వాత పెరిగే వ్యయాన్నీ అంచనా వేయాలి. 60(సి) నిబంధన కింద ఎవరైనా కాంట్రాక్టర్‌ను తొలగిస్తే వారికి చెల్లించాల్సినవి చెల్లించాలని వివరించారు. నెట్టెంపాడు, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పనుల్లోని ప్యాకేజీల్లో కొన్ని అంశాలను విస్మరించారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
28 ప్రాజెక్టులకు ‘క్యాడ్‌వామ్’ నిధులు
- కేంద్ర జలవనరులశాఖ నిర్ణయం - మూడు నెలల్లో డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశం - ‘పీఎంకేఎస్‌వై’ కింద ఇప్పటికే 11 ప్రాజెక్టులకు రూ. 943 కోట్లు ఇచ్చేందుకు ఓకే సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద వాస్తవ ఆయకట్టు, నీరందుతున్న ఆయకట్టుకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఉద్దేశించిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం (క్యాడ్‌వామ్) కింద పలు రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో చేర్చిన 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 943 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించిన కేంద్ర జల వనరులశాఖ... కొత్తగా రాష్ట్రం నుంచి మరో 28 ప్రాజెక్టుల పరిధిలో నీరందని ఆయ కట్టుకు నిధులిచ్చేందుకు రెండ్రోజుల కిందట సానుకూలత తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో చాలా చోట్ల కాల్వలు పూడుకుపోవడం, ఫీల్డ్ చానల్స్ దెబ్బతినడం, కాల్వలకు లైనింగ్ వ్యవస్థలేని కారణంగా నీటి వృథా అవుతుండటంతో చివరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. నీటి లభ్యత, ప్రాజెక్టు వ్యయం సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టును నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రతి ప్రాజెక్టు పరిధిలో నీరందని ఆయకట్టు 25 శాతం మేర ఉంటోంది. ప్రస్తుతం భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నిర్ణీత ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలుండగా, నీరందుతున్న ఆయకట్టు 18.91 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే నీరందని ఆయకట్టు 5.77 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 28 ప్రాజె క్టులకు క్యాడ్‌వామ్ పథకం కింద 60 శాతం నిధులు ఇవ్వనుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీరందని ఆయకట్టుకుగల కారణాలు, అవసరమయ్యే నిధుల వివ రాలను మూడు నెలల్లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘క్యాడ్‌వామ్’ కింద రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టులివే... జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్‌నహర్, కోటిపల్లి వాగు, నల్లవాగు, ఘన్పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్ నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు ప్రాజెక్టులు. -
డిండి ఎత్తిపోతలకు విద్యాసాగర్ పేరు!
జలసౌధలో కాంస్య విగ్రహం... ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సేవలకు గుర్తింపుగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటే ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడనుందని నీటి పారుదల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యాసాగర్‌రావు విశేష సేవలందించారు. ఇందులో భాగంగానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకా లను చేపట్టడంలో ఆయన విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత నెల 29న విద్యాసాగర్‌రావు మరణం తర్వాత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై శనివారం జరగనున్న ఆయన సంస్మరణ సభలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో అలీ నవాబ్ జంగ్ బహదూర్ పక్కన ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించినట్లుగా సమాచారం. -
రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దు
కాంగ్రెస్‌పై మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో రైతుల సంక్షే మాన్ని అమలు చేస్తున్నాం. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ రైతుల సంక్షేమంలో భాగమే. ప్రాజెక్టులు పూర్తయితే తమకు భవిష్యత్ ఉండదనే దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెబెట్టేట్టు వ్యవహరిస్తున్నారు..’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం సహచర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. కాంగ్రెస్, టీడీపీల ప్రభుత్వాలు రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. స్వల్ప కాలంలోనే కోతల్లేని నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతుల మన్ననలు పొందామని తెలిపారు. అదే ఉత్సాహంతో సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల కోసం వినూత్న పథకాలతో ముందుకు వెళుతోందని పోచారం అన్నారు. తమ ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కాళ్ల కింద భూమి కదలుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా భూమి – మా పంట ’పేరిట భూములపై త్వరలో సమగ్ర సర్వే చేయనున్నామని చెప్పారు. -
ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అసెంబ్లీలో కాంగ్రెస్ నాటకాలు ఆడిందని మండిపడ్డారు. విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన మాట్లాడారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవర్తించిందని విమర్శిం చారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని అడ్డుకో వడం కాంగ్రెస్ నేతల వల్ల కాదని, రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పుట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పారిపోయింది: శ్రీనివాస్ గౌడ్, బాలరాజు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కరెంటు, విత్తనాలు, ఎరువుల పరిస్థితిని మెరుగు పర్చడం రైతు సంక్షేమం కాదా అని నిలదీశారు. మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి మాట్లాడారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పారిపోయిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఒకరు రాజీనామా చేసి గెలవాలని, గెలిస్తే దేనికైనా తాము సిద్ధమే అని సవాలు విసిరారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను అడ్డుకోవడమంటే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమేనని ఆయన చెప్పారు. -
ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య
నాలుగు నెలలుగా నిలిచిన ప్రక్రియ ఇంకా కావాల్సిన భూమి 90 వేల ఎకరాల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకింద భూసేకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ పనులకు తీవ్ర ఆటకం కలుగుతోంది. భూసమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 123ని తెరపైకి తెచ్చినా దానికి నిర్వాసితులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకతకు తోడు హైకోర్టు సైతం స్టే ఇవ్వడంతో నాలుగు నెలలుగా భూసేకరణ ప్రక్రియ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఇంకా వివిధ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 90వేల ఎకరాల మేర భూసేకరణ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపనున్న భూసేకరణ సవరణ చట్టంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీనికి సంబంధించిన బిల్లు చట్టంగా మారితేనే మిగిలిన భూసేకరణ సాధ్యంకానుంది. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు మొత్తంగా 3,67,218.03 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు మొత్తంగా 2,77,409.23 ఎకరాలు సేకరించారు. మరో 89,808.80 ఎకరాలు సేకరించాల్సిఉంది. ప్రధాన ప్రాజెక్టులకు ఎంత?... ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 35,729 ఎకరాలు, పాలమూరు కింద 12,445 ఎకరాలు, ప్రాణహిత కింద 4,505 ఎకరాలు, దేవాదుల కింద 5,642 ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. అయితే 2013–కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే మార్కెట్ విలువ నిర్ణయించడం, గ్రామసభల ఆమోదం తీసుకోవడం, ప్రభావితం అయ్యే కుటుంబాలకు రూ.5లక్షల వరకు పరిహారం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఏకమొత్తంగా పరిహారం ఇవ్వాల్సి రావడం.., ఈ మొత్తం అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సుమారు 6 నుంచి 8 నెలల సమయం పట్టనుండటంతో ప్రభుత్వం జీవో 123తో సేకరణ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరిలో జీవో 123పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర భూసేకరణ బిల్లును తెచ్చినా, కేంద్రం మరిన్ని సవరణలు సూచించడంతో అది తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న సవరణలతో కూడిన బిల్లును రాష్ట్ర శాసనభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారాకే మిగతా భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయి. -
పులిచింతలపై నిలదీద్దాం
♦ పరిహారంపై ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన తెలంగాణ ♦ ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులపై గరంగరం ♦ పురుషోత్తపట్నం, శివభాష్యం సాగర్‌పై బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు ♦ మున్నేరు బ్యారేజీపైనా అభ్యంతరం ♦ తాజాగా పులిచింతలను తెరపైకి తెస్తున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం, బోర్డుల వద్ద అడ్డుపుల్లలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే ఏపీ గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, కృష్ణా నదిపై చేపట్టిన శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ... తాజాగా పులిచింతల పరిహారం అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ఏటా పులిచింతల పరిహారంపై ప్రశ్నిస్తున్నా స్పందన లేకపోవడంతో దీనిపై ఏపీని గట్టిగా నిలదీయాలన్న పట్టుదలతో ఉంది. వరుసగా అస్త్రాలు.. తెలంగాణ చేపడుతున్న అనేక ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోక్యం పెరిగింది. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల మేరకు నీటి వినియోగం చేస్తున్నామని చెబుతున్నా... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జల సంఘం, బోర్డుల వద్ద ఫిర్యాదులు చేస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ.. పోలవరం ఎడమకాల్వపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై గోదావరి బోర్డుకు ఫిర్యా దు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు జిల్లాలో చేపడుతున్న శివభాష్యం సాగర్‌పైనా ఇటీవలే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిం ది. కృష్ణా జిల్లాలో చేపట్టిన మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై కూడా అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం లో ముంపు ఉంటుందని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇప్పుడు పులిచింతలపై దృష్టి సారించింది. అసంపూర్ణ పునరావాసంతో ఏటా పులిచింతల కింద తెలంగాణ గ్రామాలు ముంపు బారిన పడుతున్నా ఏపీ స్పందన సరిగా లేదని తెలంగాణ గుర్రుగా ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ నీటితో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ గ్రామాల పునరావాసానికి పరిహా రం కింద రూ.381 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. ఓ దశలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో పరిహార చెల్లింపులకు ఓకే చెప్పిన ఏపీ.. రూ.53 కోట్లు ఒకమారు, రూ.75 కోట్లు ఇంకోమారు విడుదల చేసింది. ఇవిపోను ఇంకా భూసేకరణకు రూ.20 కోట్లు, దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.50 కోట్లు, ఇతర వసతులకు మొత్తంగా రూ.115 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని గతేడాది అక్టోబర్‌లో ఏపీకి విన్నవించింది. రూ.49 కోట్లు మాత్రమే ఇచ్చిన ఏపీ రాష్ట్రం విన్నవించిన ఆరు నెలలకు స్పందించిన ఏపీ.. పులిచింతల జలాశయంలో ముంపునకు గురైన నాలుగు ఎత్తిపోతల పథకాలను మరోచోటుకు తరలించడానికి రూ.49 కోట్ల పరిహారాన్ని గత నెల చివరి వారంలో విడుదల చేసింది. మిగతా రూ.66 కోట్లపై పేచీ పెడుతోంది. భూనిర్వాసితులు, సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇప్పటికే చెల్లించామని, తెలంగాణకు బకాయిలేమీ లేమని చెబుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించకుంటే బోర్డులోనే తేల్చుకోవాలని భావిస్తోంది. -
తూర్పుగోదావరిలా పాలమూరు
18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం: కేసీఆర్ - పాలమూరు ఎత్తిపోతల కట్టితీరుతాం - ఖరీఫ్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం - ముఖ్యమంత్రిని కలసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో వలసల జిల్లాగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు కొత్త, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరందించడం ద్వారా మహబూబ్‌నగర్ పాత జిల్లాను తూర్పుగోదావరి జిల్లాకు ధీటు గా తయారు చేస్తామని చెప్పారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఆ జిల్లా ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యేలు డి.కె.అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీ చంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తదితరులు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు జిల్లాకు చెందిన ఇతర సమస్యలపై చర్చించారు. పాలమూరు జిల్లా కున్న నీటి వనరులు, ప్రాజెక్టుల డిజైన్ తదితర అంశాలను సీఎం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరిం చారు. రాజకీయాలకతీతంగా పాలమూరు జిల్లాను కాపాడటమే తమ అభిమతమని అన్నారు. ‘‘గోదావరిలో 3000, కృష్ణాలో 1200 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటిని సద్విని యోగం చేసుకుంటే చాలు. రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరానికి నీరివ్వొచ్చు. పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెప్పాను. పాలమూరు జిల్లాకు నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశాం. ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టినా అపెక్స్ కమిటీ సమావేశంలో వారి అనుమానాలు నివృత్తి చేశాం. పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తవు తాయి. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిలా ్లకు కూడా నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. శ్రీశైలం వద్ద వంద టీఎంసీల లభ్యత ఉంది. అక్కణ్నుంచి ఏడాది పొడవునా నీరు తోడుకోవచ్చు. అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ఇన్‌టేక్ ప్లాన్ చేశాం. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మా ణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధా న్యమిచ్చింది. తుమ్మిళ్ల, గట్టు లిఫ్టు పనులు త్వరగా పూర్తయ్యే ట్లు చూస్తాం..’’ అని సీఎం చెప్పారు. గద్వాల–మాచర్ల రైల్వే లైన్ అత్యవసరం ‘‘గద్వాల–మాచర్ల రైల్వే లైన్ పనులు చేపట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తాను. ఈ లైన్ అత్యవసరం. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికోసం హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గద్వాల íపీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తాం. మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేస్తాం..’’ అని సీఎం వెల్లడించారు. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కలసి రావాలని నేతలను కోరారు. -
నిర్లక్ష్యపు జాడ్యం.. ప్రాజెక్టులకు శాపం!
♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన కాగ్ ♦ ఆదిలాబాద్‌లోని ఐదు మధ్యతరహా ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం ♦ 52 వేల ఎకరాల లక్ష్యంలో 13,900 ఎకరాలకే నీళ్లు ఇచ్చారు ♦ తప్పుడు నిర్ణయాలతో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి ♦ దేవాదుల మూడో దశలో కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.4.74 కోట్లు సాక్షి, హైదరాబాద్: పలు సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అనుమతుల విషయంలో తీవ్ర జాప్యంతో.. వాటి నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని కంప్ట్రోల ర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తి చూపిం ది. నీటి లభ్యతను, గ్రామాల వారీ ఆయకట్టు ప్రణాళికను సరిగా అంచనా వేయకపోవడం.. డిజైన్ల రూపకల్పన, వాటి ఆమోదం, పునరా వాస ప్రక్రియ, అటవీ అనుమతులు పొంద డంతో చేసిన జాప్యం వంటివన్నీ దీనికి కారణ మని తేల్చి చెప్పింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఆదిలాబాద్ జిల్లాలోని గొల్లవాగు, మత్తడి వాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ పెద్దవాగు, ర్యాలివాగు ప్రాజెక్టులు ఇంకా పూర్తికావడం లేదని, అనుకున్న ఆయకట్టుకు నీరందించ లేకపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఐదు ప్రాజెక్టుల పరిధిలో 52 వేల ఎకరాలకు నీరి వ్వాల్సి ఉన్నా.. 13,900 ఎకరాలకు మాత్రమే ఇచ్చారని పేర్కొంది. సోమవారం శాసనసభకు సమర్పించిన నివేదికలో దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది. 2004–05 నుంచి 2015–16 వరకు ఈ ఐదు ప్రాజెక్టులకు కలిపి రూ.948.15 కోట్లు కేటాయించినా.. రూ.319 కోట్ల మేర ఖర్చు చేయలేకపోయారని కాగ్ పేర్కొంది. 2010–11 వరకు ఈ ప్రాజెక్టులకు కేంద్రం పరిధిలోని ఏఐబీపీ కింద రూ.228.63 కోట్ల సాయం అందినా.. కేవలం మత్తడివాగు, ర్యాలివాగులను మాత్రమే పూర్తి చేయగారని తెలిపింది. ఇక 11 ఏళ్లు గడిచినా గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులు పూర్తికాలేదని మండిపడింది. కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి! ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో హెచ్చు తగ్గులను కాంట్రాక్టు సంస్థే భరించాల్సి ఉన్నా వారికి అనుచిత లబ్ధి కలిగేలా నీటిపారుదల శాఖ వ్యవహరించిందని కాగ్ ఎత్తిచూపింది. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులో ఆనకట్ట పనికి అంచనాను రూ.65.69 కోట్లుగా నిర్ధారించినా, రూ.62.83 కోట్లుగా అంచనా వేశారని.. కానీ ఒప్పంద విలువను అందుకు అనుగుణంగా సర్దుబాటు చేయకపోవడంతో రూ.2.82 కోట్లు అనుచిత లబ్ధి చేకూరిందని తెలిపింది. మత్తడి వాగు కింద నిర్మించిన ఓ వంతెన విషయం లోనూ కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.32.55 లక్షలు వసూలు చేయలేదని... గొల్లవాగు ప్రాజెక్టులో సైతం కాంట్రాక్టర్ ఒప్పంద విలువలో రూ.2.25 కోట్లు తగ్గించాల్సి ఉన్నా.. ఆ పని చేయలేదని తెలిపింది. మత్తడివాగు ప్రాజెక్టులో ఎలాంటి అవసరం లేకుండానే రూ.36.76 లక్షలతో సాగునీటి శాఖ కొన్ని క్వార్టర్లను నిర్మించి వృథాగా వదిలేసిందని పేర్కొంది. ఈ దృష్ట్యా ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే పునరావాస కార్యకలాపాలను పూర్తి చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సాగులోకి తెచ్చే వాస్తవ ఆయకట్టును లెక్కించేందుకు నిర్దిష్టమైన గడువులోగా రెవెన్యూ శాఖతో కలిసి ఉమ్మడి తనిఖీ చేపట్టాలని పేర్కొంది. ఇక దేవాదుల మూడో దశ ప్యాకేజీ–4లో ఇంధన, కందెన ధరల్లో సర్దుబాటు పేరుతో అదనంగా రూ.4.74 కోట్లు చెల్లించినట్లుగా కాగ్ ఎత్తిచూపింది. కొత్త ‘దారులు’ చూపుతున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రోడ్ల పనుల విషయంలో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయాచిత లబ్ధి చేకూర్చిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. కంది–షాద్‌నగర్ రోడ్డులో కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయనం దున ఒప్పందం రద్దు చేసుకోవాలని ఆ పనిని పర్యవేక్షించే సలహాదారు, రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయినప్పటికీ ఒప్పందంలో లేని విధంగా అదనపు పూచీకత్తుతో గడువు పొడిగిం చినట్లుగా కాగ్ బట్టబయలు చేసింది. 2015 మార్చి నాటికి ఈ పని పూర్తి కావాల్సి ఉండగా.. సకాలంలో పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ అభ్యర్థన మేరకు సెప్టెంబర్ వరకు గడువును పొడిగించింది. రూ.10 కోట్ల అదనపు పూచీకత్తు తీసుకుని 2017 మే వరకు ప్రభుత్వం ఆ కాంట్రాక్టరుకు గడువు పొడిగించిందని కాగ్ స్పష్టం చేసింది. సకాలంలో పనులు చేయకుంటే 10 శాతం పరిహారం విధించాలన్న నిబంధన ఉన్నా.. దాన్ని అమలు చేయలేదని పేర్కొంది. అలా కాంట్రాక్టరుకు రూ.19.23 కోట్ల అయాచిత లబ్ధి కలిగిందని తేటతెల్లం చేసింది. కంది–చేవెళ్ల మార్గంలో కూడా సకాలంలో పనులు చేయనందున ఒప్పందం రద్దు చేసుకోవాలని ప్రభుత్వానికి సలహాదారు సిఫారసు చేశారు. రద్దు చేసుకోకపోగా శంకరపల్లి నుంచి చేవెళ్ల వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ బాధ్యతను రూ.29.28 కోట్ల అంచనా వ్యయంతో అదే కాంట్రాక్టరుకు ప్రభుత్వం అప్పగించిందని కాగ్ పేర్కొంది. ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఏజెంటుతో జరిగిన ఒప్పందంలో సంస్థ రూ.52.40 లక్షలు నష్టపోయిందని కాగ్ తెలిపింది. బస్సుల సంఖ్యను తక్కువగా చూపటం వల్ల ఈ నష్టం జరిగినట్టు కాగ్ తేల్చింది. -
‘సాగునీటి’ టెండర్లలో భారీ అక్రమాలు
విచారణకు సభాసంఘం ఏర్పాటు చేయాలి: ఉత్తమ్ ⇒ కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ ⇒ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేస్తున్నారు ⇒ వృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు ⇒ వాయిదాల్లో రుణమాఫీతో రైతులకు అందని రుణాలు సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, వాటికి కేటాయింపులు చూస్తుంటే కాంట్రాక్టర్ల కోసమే వాటిని చేపడుతున్నారా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానిం చింది. సోమవారం శాసనసభలో ద్యవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. వాటర్‌గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలపై సభాసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల తెలంగాణ చేస్తున్నారు రాష్ట్రం ఏర్పాటయ్యాక కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నారని.. మూడేళ్లలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటాయని ఉత్తమ్ పేర్కొ న్నారు. ఇవేగాక కార్పొరేషన్ల పేరిట చేస్తున్న అప్పులు రూ.31 వేల కోట్లు, డిస్కంల అప్పు రూ.9 వేల కోట్లు అదనమని.. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని అభివర్ణించారు. గత బడ్జెట్లో రూ.4,404 కోట్లు మిగులు చూపించారని, వాస్తవానికి రూ.238 కోట్లు లోటు ఉందని పేర్కొన్నారు. జీఎస్డీపీ వృద్ధిని కూడా ఎక్కువ చేసి చూపించారని విమర్శించారు. ఆవేదనలో రాష్ట్ర రైతులు రుణమాఫీని వాయిదాల రూపంలో చెల్లిం చడంతో రైతులకు బ్యాంకులు తక్కువగా రుణాలు ఇచ్చాయని.. వడ్డీ భారాన్ని ప్రభుత్వం రైతులపైనే వేసిందని ఉత్తమ్ విమర్శించారు. కేంద్రం నుంచి ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు పైసా ఇవ్వలే దన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 2013–14లో 107 లక్షల టన్నులుంటే.. 2015–16 నాటికి 51 లక్షల టన్నులకు పడిపోయిందని గుర్తు చేశారు. పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు అదనంగా వరికి రూ.200, జొన్నకు రూ.200, కందికి రూ.450 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కనీసం నష్టం అంచనా కూడా వేయలేదని మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, మహిళా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 2,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. హామీలన్నీ గాల్లోనే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు గాల్లోనే ఉన్నాయని, అమలు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేజీ టు పీజీ విద్య కలగానే మిగిలిపోయిందని, దళితులకు ఒక్క ఎకరా భూమిని కూడా పంపిణీ చేయలేదని.. దళిత పారిశ్రామిక వేత్తలకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని మండిపడ్డారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందన్నారు. మహదేవ్‌పూర్‌లో వన్యప్రాణుల చట్టాన్ని అతి క్రమించిన వారిలో మంత్రుల కుమారులు న్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ లైన్లతోనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదంటూ వ్యంగ్యంగా విమర్శించారు. అసహన ధోరణి మంచిదికాదు బడ్జెట్ అంచనాలను, సవరించిన అంచనాలను పరిశీలిస్తే సంక్షేమానికి భారీగా కోత పడుతోందన్న ఎమ్మెల్యే సంపత్‌ను సీఎంతప్పుపట్టారని, ఇంత అసహన ధోరణితో మాట్లాడటం సరికాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, సీఎం సమాధానం అనంతరం సంపత్ మాట్లాడుతూ.. సంక్షేమంపై ప్రభుత్వ లెక్కలను తప్పుపట్టారు. దీనికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టం చేసిన తరువాత ఖర్చు చేయకపోవడం ఉండదని పేర్కొన్నారు. ఈ దశలో ఉత్తమ్ జోక్యం చేసుకుని ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, అందరూ భజన సంఘంగా ఉండరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
ఇతర రాష్ట్రాల ఐక్యత ఇక్కడేది?
విపక్షాలపై మంత్రి కేటీఆర్ విమర్శ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై విపక్షాలకు చిత్తశుద్ధి లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకమై నీళ్ల కోసం కొట్లాడుతుంటే, మన రాష్ట్రంలో అడ్డుకుంటున్నారన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. కేసులు వేస్తున్న విషయాన్ని సభలోనే సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒప్పుకున్నారన్నారు. కోర్టు కేసులు, ఇతర అవాంతరాల కారణంగా ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయన్నారు. అయినప్పటికీ వీలైనన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఆ జిల్లా విపక్ష ఎమ్మెల్యేలు సంతోషించాల్సింది పోయి విమర్శి స్తున్నా రన్నారు. విపక్షాలు అడిగిన వాటికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పం దిస్తున్నారని, ఆయనకున్న ఔదార్యం ప్రతిపక్ష సభ్యులకు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏదైనా మంచి జరిగితే దానిని గురించి సీఎం ప్రస్తావిస్తున్నారని, ప్రతిపక్షాలు మాత్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని అంగీకరించేందుకు సిద్ధపడడం లేదన్నారు. -
ప్రాజెక్టుల రద్దుపై రగడ
మండలిలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం ⇒ ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారు: కాంగ్రెస్ ⇒ రాష్ట్ర ప్రయోజనానికి భంగం వాటిల్లే ప్రాజెక్టులనే రద్దు చేశామన్న హరీశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రాజెక్టులనే రద్దు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజన కరమైన ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. ప్రాజెక్టులకు దేశం కోసం ప్రాణాల ర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెడితే, రీడిజైన్ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఆ పేర్లను తొలగించడాన్ని తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపే అవకాశ మివ్వాలని కోరినప్పటికీ చైర్మన్ అంగీకరించక పోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదుల నుంచి 225 టీఎంసీల నీటిని రాయలసీమకు తీసుకెళ్లేందుకు అప్పటి ప్రభుత్వం దుమ్ముగూడెం టేల్ పాండ్ ప్రాజె క్టును ప్రారంభించిదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఆ ప్రాజెక్టును రద్దు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అధ్యయనం చేసిన తర్వాతే ఇందిరా, రాజీవ్ సాగర్ లను రీడిజైన్ చేయాలని నిర్ణయించామని వివరించారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైల్డ్‌లైఫ్ అనుమతిని తీసుకురాలేకపోయిందని, ఇందిరా సాగర్ ప్రాజెక్టు వల్ల అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున.. వాటిని ప్రీ క్లోజర్ చేసి భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. పాలు కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్ హైదరాబాద్‌లో పాలను కల్తీ చేసే వారిపై ఆహార భద్రతా చట్టం మేరకు కేసులు నమోదు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానంగా చెప్పారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. కల్తీదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో వచ్చే రెండు నెలల్లోగా కిడ్నీ రోగుల కోసం 34 కొత్త డయాలసిస్ యూనిట్లను పీపీపీ పద్ధతిన ఏర్పాటు చేస్తు న్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్ తదితరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సివిల్ వివాదాల్లో తలదూర్చిన పోలీసులపై చర్యలు: నాయిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగు లేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఉన్నతాధి కారులకు, ప్రభుత్వ పెద్దలకు ఉన్నతాధి కారులపై అవినీతి ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమ మండలిలో నమోదైన భవన నిర్మాణ కార్మికుడు అకస్మాత్తుగా మరణిస్తే రూ.6 లక్షలు, పూర్తి వైకల్యం పొందితే రూ.5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. -
ప్రాజెక్టులు ఆపడమే వారి లక్ష్యం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే వాటిని ఆపడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల వీరేశం ఆరోపించారు. శుక్ర వారం అసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ... ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులుండవనే కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్ నేతల్లో సీఎం కావాలనే కోరికతో ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సర్కారు రైతుల పక్షాన ఉంటుందని బాలరాజు చెప్పారు. -
ప్రాజెక్టులు పెండింగే..
⇒ రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ⇒ కోటి ఎకరాలకు నీరందిస్తామని ప్రచారం.. ⇒ ప్రస్తుతం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కావాలంటే ఇంకా రూ.60 వేల కోట్లు కావాలి సాక్షి, అమరావతి: సాగునీటి రంగానికి తాజా బడ్జెట్లో కేవలం రూ.12,770.26 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేస్తున్న నిధులే రూ.7,665.30 కోట్లు ఉన్నాయి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల్లో కేవలం రూ.5,104.96 కోట్లను మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇక మిగిలింది ఒక్క బడ్జెట్ (2018–19) మాత్రమే. ఈ లెక్కన ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో, కోటి ఎకరాలకు నీళ్లు అందేది ఎప్పుడో. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో, ప్రభుత్వ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఎలా ఉండదో బడ్జెట్ కేటాయింపుల్ని చూస్తే అర్థమవుతుంది. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తోంది. అరకొర కేటాయింపులతో కానీ నేటికీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని దుస్థితి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని.. వాటిని సత్వరమే పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్లందిస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాలుగు బడ్జెట్లు (2014–15, 2015–16, 2016–17, 2017–18) ప్రవేశపెట్టారు. గత మూడు బడ్జెట్లలో కలిపి రూ.19,468.76 కోట్లు కేటాయించారు. మరోవైపు కమీషన్ల కోసం పనులు అస్మదీయులకు అప్పగించి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. దీంతో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా సుమారు రూ.60 వేల కోట్లు అవసరమని అంచనా. నాబార్డు నుంచి అన్ని నిధులు అనుమానమే.. ప్రాజెక్టులకు 2017–18 బడ్జెట్లో 2016–17తో పోల్చితే 60 శాతం అధికంగా కేటాయించినట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. వాస్తవంగా చూస్తే ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేసిన నిధులు రూ.7,665.30 కోట్లు. అయితే దేశంలోని పోలవరం సహా వంద ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన) కింద పూర్తి చేసేందుకు నాబార్డు నుంచి రుణం మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. పీఎంకేఎస్వైకి రుణం మంజూరు చేసేందుకు వీలుగా ఎల్‌టీఐఎఫ్ (దీర్ఘకాలిక నీటిపారుదల నిధి) కింద రూ.40 వేల కోట్లను నాబార్డుకు మంజూరు చేస్తామని 2017–18 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఈ రూ.40 వేల కోట్లలో ఒక్క మన రాష్ట్రానికే రూ.7,665.30 కోట్ల రుణాన్ని నాబార్డు మంజూరు చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల నుంచి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,931.54 కోట్లను విడుదల చేస్తే.. ఇందులో గతేడాది డిసెంబర్ 26న నాబార్డు ఇచ్చిన రుణం రూ.1,981.54 కోట్లు కావడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే నాబార్డు నుంచి రూ.7,665.30 కోట్ల రుణం మంజూరయ్యే అవకాశాలు తక్కువేనని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు ఇవ్వకుంటే అంతే.. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద గుండ్లకమ్మ, తాడిపూడి, పుష్కర, తారకరామతీర్థ సాగరం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, మద్దిగెడ్డ తోటపల్లి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల్లో అధికశాతం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. గతేడాది ఏఐబీపీని కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో పీఎంకేఎస్‌వై పథకాన్ని ప్రారంభించింది. 2017–18లో ఆ ఎనిమిది ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అమాంతంగా పెంచేసింది. ఎనిమిది ప్రాజెక్టులకు కేంద్రం వాటా కింద రూ.785.30 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇప్పటిదాకా ఆమోదముద్ర వేయలేదు. కానీ ప్రభుత్వం ఆ ఎనిమిది ప్రాజెక్టులకు నాబార్డు రుణం పేరిట నిధులు కేటాయించింది. ఒకవేళ నాబార్డు రుణం ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. కేవలం రూ.154 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి.. ఆరు లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉండేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పనా? ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేసేందుకు రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టినట్లు సర్కార్ ప్రకటించింది. తొమ్మిది నెలల్లోగా ఈ ఎత్తిపోతలను పూర్తి చేసి పోలవరం ఎడమ కాలువ కింద 2.15 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. హంద్రీ–నీవా, గాలేరు–నగరి తొలి దశ, గుండ్లకమ్మ, వంశధార రెండో దశ, పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి 2017 ఖరీఫ్‌లో 8.86 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని బడ్జెట్లో పేర్కొంది. కానీ ఆ మేరకు నిధులు కేటాయించలేదు. కమీషన్ల కోసం హంద్రీ–నీవా అంచనా వ్యయం రూ.6,850 కోట్ల నుంచి రూ.11,722 కోట్లకు పెంచేసిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,900 కోట్లకుపైగా అవసరం. కానీ.. బడ్జెట్లో కేవలం రూ.479.20 కోట్లను కేటాయించారు. గాలేరు–నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), వెలిగొండ, సోమశిల, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి. ఎన్నికల హామీ: డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ హామీని పక్కన పెట్టారు. ప్రతి మహిళకు పది వేల చొప్పున మూడు విడతలుగా పెట్టుబడి నిధిగా ఇస్తామన్నారు. ⇒ డ్వాక్రా రుణమాఫీకి చేయడానికి 14,204 కోట్లు కేటాయించాల్సి ఉంది. ⇒ రూ. 14,360 కోట్లు మేర సంఘాల జీరో వడ్డీ డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. -
అప్పుల్లోనూ గొప్పే!
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఏకంగా రూ. 69 వేల కోట్ల అప్పులతో తెలంగాణను దేశంలోనే అత్యధిక రుణభారంగల రాష్ట్రంగా మార్చి ‘రికార్డు’సృష్టించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అవాస్తవికంగా, అబద్ధపు అంకెలతో గారడీ చేసేలా ఉందని విమర్శించారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం ప్రమాదకరబాటలో పయనిస్తోందని మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సోమవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే నాటికి 70 వేల కోట్ల అప్పులుండగా ఈ రెండున్నరేళ్లలోనే అవి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. వీటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న కార్పొరేషన్ల రుణాలు కూడా కలిపితే అప్పులు రూ. 1.85 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. అప్పులను పెంచడం ద్వారా సర్కారు భావితరాలనూ తాకట్టుపెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఓవైపు అప్పులు తెస్తూ మరోవైపు కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకే నిధులు కేటాయించిందని ఆరోపించారు. పథకాలకు నిధులేవీ...? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, దళిత, గిరిజన, పేదలకు మూడెకరాల భూపంపిణీ వంటి పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఉత్తమ్ ఆరోపించారు. కమీషన్లు రావనే కారణంతోనే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సర్కారు తప్పుడు లెక్కలు చూపుతోందని మండిపడ్డారు. ఫీజు బకాయిలు రూ. 3,500 కోట్లకు చేరాయన్నారు. 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశామన్న ప్రభుత్వం కేవలం 1,400 ఇళ్లు కట్టడం దారుణమన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులను ప్రభుత్వం తగ్గించిందని, రైతు రుణమాఫీ అమల్లో మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డుల జారీపై ప్రభుత్వం ఇంకా మోసం చేస్తూనే ఉందన్నారు. ప్రభుత్వోద్యోగులకు హెల్త్‌కార్డులు ఇస్తున్నా అవి పనిచేయట్లేదని, ప్రైవేటు ఆసుపత్రులు వారికి వైద్యాన్ని అందించట్లేదని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లను కుంటిసాకులతో వాయిదా వేస్తున్నారని విమర్శించారు. -
బడ్జెట్‌కు తగ్గట్లే.. ఖరీఫ్ టార్గెట్!
►17 ప్రాజెక్టుల కింద 8.73 లక్షల ఆయకట్టు లక్ష్యం ►ఈ ఖరీఫ్‌లోనే 12 ప్రాజెక్టులు పూర్తిగా.. మరో ఐదు పాక్షికంగా పూర్తి ►వీటికి రూ.11 వేల కోట్ల కేటాయింపులు జరిపిన ప్రభుత్వం హైదరాబాద్: కోటి ఎకరాల తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా ఉన్నాయో.. ఆ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టు లక్ష్యాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 12 ప్రాజెక్టులను 100 శాతం పూర్తి చేయడం, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 8.73 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు పూర్తిస్థాయి సాగు నీరివ్వడం నీటి పారుదల శాఖకు కత్తిమీద సాము కానుంది. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి నీటిని అందించేందుకు 2004–05లో రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను చేపట్టారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, భక్తరామదాస ప్రాజెక్టులను చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాలని సంకల్పించగా ఇప్పటివరకు కొత్తగా 11,36,108 ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 5,21,211 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించగలిగారు. కల్వకుర్తి కింద 1.60 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, భీమాలో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. దేవాదుల కింద కూడా 60 వేల ఎకరాల నుంచి 1,22,670 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. సింగూరు కింద 40 వేల ఎకరాలకు నీరందించారు. మరోవైపు ఈ ఏడాది జూన్, జూలై నాటికి కొత్తగా మరో 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. ఇందులో 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఎస్సారెస్పీ స్టేజ్–2, ఎల్లంపల్లి, లోయర్ పెన్‌గంగ, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఈ 17 ప్రాజెక్టులకే బడ్జెట్లో రూ.11,022 కోట్ల మేర కేటాయింపులు చేసింది. -
సామాజిక ఒత్తిడి పెరగాలి
⇒ ప్రాజెక్టులకు అడ్డుపడే శక్తులపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య ⇒ మిషన్ కాకతీయతో మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడి ⇒ ‘జల సంరక్షణ –సామాజిక బాధ్యత’ అంశంపై సెమినార్ సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలో కొన్ని చట్టాలతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ చట్టాలను అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ శక్తులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి. ప్రాజెక్టులు ఆలస్యమైతే వాటి నిర్మాణ భారం పెరుగుతోందని, అంతిమంగా ఆ భారం ప్రజలపైనే పడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరిగి నిర్దేశించిన ఫలితాలు ఆలస్యమై ప్రజలకు అందాల్సిన ఫలాలు వేగంగా దక్కడం లేదు. ఈ దృష్ట్యా రాజకీయ కారణాలతో నీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న శక్తులపై సామాజిక ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి’ అని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయ పడ్డారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట్ లోని హరిత ప్లాజాలో ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ ఆధ్వర్యంలో ‘జల సంరక్షణ–సామాజిక బాధ్యత’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌కు మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర సాగునీటి పారుదల అభివృధ్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీపాటిల్, నీటి పారుదల రంగ నిపుణులు హాజరయ్యారు. కాకతీయతో 15.80 లక్షల ఎకరాలు సాగులోకి.. హరీశ్ మాట్లాడుతూ ‘మన నిర్లక్ష్యం వల్లే నీటి కష్టాలు, తాగునీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు సముద్రంపాలు కాకుండా భద్ర పరుచుకోవలసిన బాధ్యతను గుర్తించే ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టింది. మిషన్ కాకతీయతో 15.80 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. మొన్నటి వర్షాల వల్ల చాలా చెరువుల్లో నీళ్లు ఉన్నందున ఈసారి ఫీడర్ల మీద దృష్టి పెడుతున్నాం’ అని వివరించారు. సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఆటవీ ప్రాంతాన్ని 30% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని కోసం 200 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ఇక రాష్ట్రంలో అవసరానికి మించి వరి పండుతోందని, కిలో బియ్యానికి 4 వేల లీటర్ల నీళ్లు అవసరం అవుతున్నాయని చెప్పారు. కూలీల అవసరం తక్కువ కాబట్టి చాలా మంది వరి పండిస్తున్నారని, దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో కూరగాయలు, ఇతర పంటలు పండించే అవకాశం ఉందని, ఈ విషయంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. -
మీ ఆదేశాల మేరకే జీవో 38 తెచ్చాం
మధ్యంతర ఉత్తర్వులను సవరించండి ధర్మాసనాన్ని కోరిన ఏజీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూములమ్మిన వారికిగాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 చట్ట నిబంధనల ప్రకారం జీవో 38 జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు జీవో 123 వర్తింపచేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇందుకు సంబం«ధించి తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరపాలని విన్నవించింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనమే ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 38 జారీ నేపథ్యంలో జనవరి 5న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. ఉభయ పక్షాల న్యాయవాదుల సమ్మతితో జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఈ వ్యాజ్యాలన్నీ విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తమ అనుబంధ పిటిషన్‌ను ప్రస్తావించారు. జీవో 38 జారీ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరారు. తుది విచారణ వల్ల జాప్యం జరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ అనుబంధ పిటిషన్‌పై వాదనలు వినాలన్నారు. ఈ సమయంలో అటు పిటిషనర్లు, ఇటు ఏజీ మధ్య కొద్దిసేపు తీవ్ర వాదనలు జరిగాయి. అనుబంధ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనమే విచారిస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. -
వారిది బానిస మనస్తత్వం
కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీష్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్ర యాజ మాన్యాలు ఇచ్చే బీ–ఫారాలు, మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు మోకరిల్లారని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ కాలంలో కలసి రాకపోయినా, ఇప్పుడు కూడా సొంత రాష్ట్రంలో పిల్లిమొగ్గలు వెయ్యడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ బానిస మనస్తత్వంతో ఉన్నారని, తెలంగాణలో దానికి భిన్నంగా ప్రజలే యజ మానులుగా ప్రభుత్వం నడుస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడడం లేదని ధ్వజమెత్తారు. ఆ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, విపక్షాల కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డం కులు సృష్టించినాసరే నీటి ప్రాజెక్టులు కట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులు అనేకం పూర్తి కాలేదని, ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రతి పక్షాలు ప్రభుత్వంతో కలసి రావాలని సూచించారు. పుట్టగతులుండవనే... పలు ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు 29 పిటిషన్లు వేశాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అనుచరుల పేరుతో హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నా రన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే విపక్షాలకు పుట్టగతులు ఉండవనే ప్రాజెక్టుల ను అడ్డుకుంటున్నారన్నారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీల నేతలు సీఎం కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలు తున్నారన్నారు. ఇలాంటి విమర్శలు చేస్తే ఇప్పుడున్న నేతల్లో ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని, కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. నిజానికి కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఓ దొంగల ముఠాగా వ్యవహరి స్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు అబద్దాల మీద అబద్దా లు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రజారంజక పాలన మీద తెలంగాణ ప్రజలు సంతృప్తిక రంగా ఉన్నారని, అందుకే రాష్ట్ర ప్రజలు మెదక్ ఉప ఎన్నికల నుంచి పాలేరు ఉపఎన్నికల వరకు టీఆర్ఎస్కు నీరాజనం పలికారన్నారు. -
ప్రాజెక్టుల వేగం పెంచండి
⇒ మధ్యతరహా ప్రాజెక్టులపై హరీశ్ ⇒ జూలై కల్లా పూర్తి చేసి ఖరీఫ్‌కు సాగు నీరందించాలి సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ జూలై కల్లా పూర్తిచేసి ఖరీఫ్‌కు సాగు నీరందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. చనాఖా–కొరటా ప్రాజెక్టు పనులు వేగవం తం చేయాలని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని రికార్డు సమయంలో సదర్మాట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి శనివారం నాడు సుదీర్ఘంగా సమీక్షించారు. జలసౌధలో జరిగిన సమీక్షలో ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు విద్యాసాగరరావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర రావు, ఆదిలాబాద్, ఎస్ఆర్ఎస్పీ సీఈలు భగవంతరావు, శంకర్, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, పలువురు ఎస్ఈలు, ఈఈలు, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. చనాకా– కొరటా ప్రాజెక్టు పనులను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌజ్ లు, ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు ఏక కాలంలో పూర్తి చేయాలన్నారు. చనాఖా–కొరటా, సాత్నాల, తమ్మిడి హెట్టి, సదర్ మాట్, కడెం కెనాల్స్, బాసర చెక్ డ్యాం తో పాటు కొమురం భీం, జగన్నాధపూర్, పీపీ రావు, స్వర్ణ, చలిమెల వాగు, గడ్డన్న వాగు, మత్తడి వాగు, ర్యాలివాగు, గొల్లవాగు, నీల్వాయి వంటి మీడియం ఇరిగేషన్ పథకాల పురోగతిని సమీక్షించిన మంత్రి వాటిపనుల్లో వేగం పెంచాలని కోరారు. గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు పథకాలను జూన్ చివరిలోగా పూర్తి చేసి వందశాతం ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. మత్తడి వాగు పథకం ఈ మార్చి చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కొమ్రంభీం, జగన్నాథపూర్ పథకాలను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా మంత్రి టైమ్ లైన్ ఖరారు చేశారు. -
కేసీఆర్‌కు పేరొస్తదనే.. అడ్డుకుంటున్నరు
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ హుస్నాబాద్/సిద్దిపేట జోన్: ప్రాజెక్టులను పూర్తి చేసి పంట పొలాలకు నీరందిస్తే సీఎం కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తదోనని కొన్ని పార్టీలు కోర్టుకెళ్లి ప్రాజెక్టులను అడ్డుకుంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అడ్డుకున్నా ఫర్వాలేదు, కొంత ఆలస్యం అవుతుందే తప్పా చివరకు ప్రభుత్వమే గెలుస్తుందన్నారు. బుధవారం బహిరంగ మలమూత్రరహిత గ్రామంగా ప్రకటించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించామని హరీశ్‌రావు చెప్పారు. -
సాగునీటి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారు
విపక్షాలపై ఎంపీ బాల్క ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు లపై విపక్షాలు విషం కక్కుతున్నాయని టీఆర్ఎస్ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ప్రాజెక్టులు ముందుకు కదలకుండా ప్రతిపక్షాలు, కొందరు తెలంగాణ ద్రోహులు సాగిస్తున్న కుట్రలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల మీద అడ్డగోలుగా న్యాయ స్థానాల్లో పిటిషన్లు వేస్తున్నది ప్రతిపక్ష నాయకులు కాదా అని ప్రశ్నించారు. భక్త రామదాసు ప్రాజెక్టు తమ హయాంలోనే మొదలై తక్కువ వ్యవధిలో పూర్తయ్యిందని, తమ చిత్తశుద్ధిని నిరూపించడానికి ఇదొక్కటి చాలని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఆరిపోయిన దీపమని, మళ్లీ వెలిగే ప్రసక్తే లేదన్నారు. నీచమైన విద్యలు రేవంత్‌కు, చంద్రబాబుకే ఎక్కువ తెలుసన్నారు. -
సోది... అబద్ధాలు... ప్రచారయావ!
♦ చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్ ♦ కమీషన్ల కోసమే పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలిక ప్రాజెక్టులు ♦ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు సాక్షి ప్రతినిధి, కడప: ‘‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రచారంలో ఉన్న యావ పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లేదు. తక్షణమే మనుగడలోకి వచ్చే ప్రాజెక్టులను సైతం విస్మరిస్తున్నారు. అవకాశం ఉన్నా నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి. కమీషన్లు వచ్చే పనులు మినహా శాశ్వత ప్రయోజనం చేకూరే పనులకు ప్రాధాన్యత దక్కడం లేదు. ఏనాడో తుది దశకు వచ్చిన ప్రాజెక్టులను సైతం తానే చేపట్టినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సోది... అబద్ధాలు... దుర్మార్గమే కన్పిస్తోంది’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని పైడిపాలెం ప్రాజెక్టును సందర్శించి, పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పైడిపాలెం ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.668 కోట్లు ఖర్చు పెట్టగా.. చంద్రబాబు మూడేళ్లలో రూ.24కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తయితే ఇప్పుడు లస్కర్‌లా గేట్లెత్తి మొత్తం తానే చేసినట్లు చెప్పుకున్నారని దుయ్య బట్టా రు.జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... మూడేళ్లుగా పూర్తికాని పెండింగ్ పనులు పైడిపాలెం రిజర్వాయర్ సామర్థ్యం ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 0.67టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 0.2 టీఎంసీ డెడ్‌స్టోరేజీ. దీంతో 0.5 టీఎంసీ లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. గాలేరి– నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భా గమైన గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన వరద కాలువ 80 శాతం పనులు పూర్తయ్యాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు 80% పూర్తయ్యాయి. మిగిలిన 20% పనులను చంద్రబాబు మూడేళ్లుగా పూర్తి చేయలేకపోయారు. దీంతో నీరు డ్రా చేసుకోలేని పరిస్థితి. గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసి ఉంటే పైడిపాలెంకు ఆరు టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు, సర్వరాయసాగర్‌లో 3.2 టీఎంసీలు, వామికొండలో 1.6 టీఎంసీలు నిల్వ చేసి ఉండవచ్చు. మైలవరం ప్రాజెక్టు సైతం స్థిరీకరించి ఉండవచ్చు. కానీ చంద్రబాబు మిగిలిపోయిన 20 శాతం పనులు పూర్తి చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం చేసుకోవడం మినహా ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు. రాయలసీమ కోసమే పట్టిసీమ నిర్మించానని చంద్రబాబు డబ్బాలు కొడుతున్నారు. పట్టిసీమ నుంచి 45 టీఎంసీల నీరు తీసుకొచ్చామని చెబుతున్నారు. పట్టిసీమ నుంచి 45 టీఎంసీలు వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 55 టీఎంసీలు సముద్రంలో కలవడం కనిపించడం లేదా? పోలవరం పూర్తయి ఉంటే ఆ నీరు అందులో నిల్వ చేసుకునేవాళ్లం. కానీ పోలవరాన్ని కాదని కమీషన్ల కోసమే పట్టిసీమ కట్టారు. నీళ్లు లేక రాయలసీమ అంతా ఎండిపోతోంది. చంద్రబాబు కొందరు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే జీఓలు జారీ చేస్తున్నారు. కమీషన్ల కోసమే...: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే నీరు నిల్వ ఉంటుందని తెలిసినా కమీషన్లకోసం చంద్రబాబు తాత్కాలిక ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తున్నారు. టెండరు మొత్తం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పట్టిసీమ , పురుషోత్తపట్నం ఎత్తిపోతలను కమీషన్ల కోసమే చేపట్టారు. దీనికి సీబీఐ విచారణ అవసరం లేదు... సింగిల్ పోలీసు విచారణ చేపట్టినా లంచాల కోసం ఏ విధంగా చంద్రబాబు వ్యవహరించారో తెలుస్తుంది. రైతులకు ఉపయోగపడే పనులను చేస్తే హర్షిస్తాం... కమీషన్ల కోసం కక్కుర్తిపడే పనులను వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్న తీరును తప్పు పడుతున్నాం. చంద్రన్న బీమా పచ్చి దగా ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన పేరుపై చంద్రన్న బీమా పథకం ప్రవేశ పెట్టారు. ఆ పథకం గురించి పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు పెట్టి భారీగా ప్రచారం చేశారు. కానీ ప్రయోజనం శూన్యం. చంద్రన్న బీమా పథకం పచ్చి మోసం... ప్రయోజనం శూన్యం. 40 రోజుల వుతున్నా బాధితులను ఆదుకోలేదు’’ అని జగన్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్సు ఢీకొని తొండూరు మండలం కోరవానిపల్లెకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు, 150 గొర్రెలు చనిపోతే పరిహారం అందించలేదని చెప్పారు. ప్రమాదవశాత్తు ప్రభుత్వ సంపులో పడి మరణించిన ఇద్దరు మహిళలకూ చంద్రన్న బీమా వర్తింపచేయలేదని విమర్శించారు. గొర్రెల కాపరుల కుటుంబాలను శనివారం పరామర్శించిన జగన్ కోరవానిపల్లెలో మీడియాతో మాట్లాడారు. -
సమగ్ర నివేదికలు పంపితేనే ప్రాజెక్టులకు నిధులు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందాలంటే ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను(డీపీఆర్) కేంద్రానికి పంపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, మిషన్ భగీరథకు కేంద్రం నుంచి నిధులు విడుదలవ్వా లంటే డీపీఆర్‌లు సమర్పించా లన్నారు. ఈ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం సంతోషకరమని అన్నారు. మిషన్ భగీరథకు రూ. 25 వేల కోట్లు ఇవ్వా ల్సిందిగా నీతి ఆయోగ్ కేంద్రానికి ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఆర్థిక శాఖ వద్ద ప్రస్తావించగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలు అందాకే నిధులు విడుదల చేస్తామని ఆయా వర్గాలు పేర్కొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు పంపితే నిధులు విడుదల చేయించడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం పాల్గొన్నారు. -
బాబువి ఉత్తర కుమార ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తూ.. అవన్నీ తానే చేసినట్లుగా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ప్రాజెక్టులు తన కల అని చెప్పుకుంటున్న చంద్రబాబు గతంలో 9 ఏళ్ల పాలనలో ఎందుకు కలలు కనలేదని సూటిగా ప్రశ్నించారు. చివరకు ప్రజలతో ప్రమాణాలు కూడా చేయించుకుంటూ పొగడ్తల భిక్ష అడుక్కునే భిక్షగాడిలా తయారయ్యాడని దుయ్యబట్టారు. తన కాళ్లకు తానే మొక్కుకుంటున్నారు ‘‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్ధాంతరంగా మరణించారు కనుకనే ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటికే ప్రారంభోత్సవాలు చేస్తున్న చంద్రబాబు తన కాళ్లకు తానే మొక్కుకొని ఆశీర్వదించుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉత్తర కుమారుడు కౌరవుల కుచ్చిళ్లు కత్తిరించినట్లుగా ప్రాజెక్టుల రిబ్బన్లు కత్తిరిస్తున్న సీఎం తన పేరును ఉత్తర చంద్రబాబు నాయుడుగా మార్చుకోవాలి’’ అని భూమన మండిపడ్డారు. అంతా కుతంత్రాలు ‘‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని భౌతికంగా లేకుండా చేసే కుట్రలు పన్నగలిగిన చరిత్ర చంద్రబాబుదే. జగన్‌ను జైలుకు పంపుతామని చెబుతూ చంద్రబాబు తన సన్నిహితుల వద్ద కుతంత్రాలు చేస్తున్నారు. ఎవరు రౌడీలు? ఎవరు ఫ్యాక్షనిస్టులు? వైఎస్ తండ్రి వైఎస్ రాజారెడ్డిని హత్య చేయించింది మీరు (చంద్రబాబు) కాదా? ’’అని కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. చౌడప్పలను ఉసిగొల్పుతారా? ‘‘బాబు ఎక్కడ ప్రారంభోత్సవానికి వెళ్లినా జగన్‌ను తిట్టించడానికి కవి చౌడప్పలను మించిన బూతులు మాట్లాడేవారిని చంకన పెట్టుకుని వెళుతున్నారు. వారిని సభలకు పిలిపించి మరీ కులాలను రెచ్చగొడుతున్నారు. ‘తోలుబొమ్మ తైతక్కల తిక్కల రెడ్డి’లను ఉసిగొల్పుతుండడం చూస్తుంటే చంద్రబాబుకు జగన్ అంటే ఎంత భయంగా ఉందో అర్థమవుతోంది. అని భూమన మండి పడ్డారు. -
సూక్ష్మసేద్యం.. ఏదీ నిధులకు మోక్షం!
- రూ. 190 కోట్లకు ఒక్క పైసా విడుదల చేయని సర్కారు - కేంద్ర వాటా రూ. 112 కోట్లు... ఇచ్చింది రూ. 22 కోట్లే - సబ్సిడీ తగ్గించాలని ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యం పథకానికి నిధుల మోక్షం కలగడంలేదు. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు చెబుతున్నా ఆచరణ మాత్రం అధ్వానంగా ఉంది. నిధులు విడుదల చేయడంలేదు. కేంద్ర వాటా సొమ్ముపైనే ఆధారపడి రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. 2016–17 రాష్ట్ర బడ్జెట్లో సూక్ష్మసేద్యం కోసం ప్రభుత్వం రూ.302.50 కోట్లు కేటాయించింది. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.112 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.190.50 కోట్లు కేటాయించింది. కేంద్రం తన వాటాలో కేవలం రూ.22.31 కోట్లు మాత్రమే విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క పైసా విడుదల చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యానశాఖ అధికారులు రూ. 22.31 కోట్లు చెల్లించి రూ.164.06 కోట్ల విలువైన సూక్ష్మసేద్యం పరికరాలను కంపెనీల నుంచి తీసుకువచ్చి రైతుల భూముల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన సొమ్ము కంపెనీలకు బకాయి పడింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ ఏడాది బడ్జెట్లో రూ. 308 కోట్లు కేటాయించారు. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 92.75 కోట్లు కాగా... రాష్ట్ర ప్రభుత్వం రూ. 215.25 కోట్లు కేటాయించింది. కేంద్రం తన వాటాలో రూ. 90.33 కోట్లు విడుదల చేయగా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం కంపెనీలకు రూ. 273.73 కోట్లు బకాయి పడింది. దీంతో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీకి కోత? ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మసేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వాహక సమావేశం రాయితీని తగ్గిస్తూ సిఫారసు చేసింది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా (100 శాతం బదులు 90 శాతం సబ్సిడీతోనే సూక్ష్మసేద్యం అందించాలని నిర్ణయించింది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు నష్టపోతారు. -
ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధేదీ?
► 80% ప్రాజెక్టు పనులు వైఎస్సార్ పూర్తి చేశారు.. ► పులివెందుల ధర్నాలో చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ ధ్వజం ► టెంకాయలు కొట్టడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదు ► పట్టిసీమ నీళ్లు సీమకిచ్చారా? జీవో ఏదీ? ► ప్రకాశం బ్యారేజీకి 48 టీఎంసీలు వస్తే... 58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి ► రబీ రుణ లక్ష్యం రూ.34వేల కోట్లు కాగా... బ్యాంకులిచ్చింది రూ.4,500 కోట్లు ► రైతులకు లక్ష్యంలో 13 శాతం రుణాలు అందిస్తే ఆయన తృప్తిపడ్డారట ► ఇదీ రైతుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి సాక్షి ప్రతినిధి, కడప: ‘‘సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు. నాడు ఎన్నికలకు ముందు టెంకాయలు కొట్టి తర్వాత విస్మరించేవారు. ఇప్పుడు గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారు. రాయలసీమ కోసమే పట్టిసీమగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులేవి.? కృష్ణా జలాలు రాయలసీమకు తెచ్చుకునే అవకాశమున్నా ఇవ్వలేకపోయారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు, అగచాట్లు ఆయనకెన్నటికీ పట్టవు’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు మహా ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వతీరుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. ప్రసంగం పూర్తి పాఠం ఆయన మాటల్లోనే.... కృష్ణా జలాలు పారించాలని వైఎస్సార్ తపన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు మినహా సాగునీటి ప్రాజెక్టుల్లో చిత్తశుద్ధి లేదు. నాడు ఎన్నికలకు ముందు ప్రాజెక్టుల కోసం టెంకాయలు కొట్టడం మినహా నిధులివ్వలేదు, పనులు చేపట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో ముష్టి వేసినట్లు జీఎన్ఎస్ఎస్ కోసం రూ.13కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ కోసం రూ.17కోట్లు ఖర్చు చేశారు. కానీ దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కృష్ణా జలాలను పులివెందుల గడ్డపై పారించాలనే తపన ఉండేది. తుంగభద్ర నీరు మనకు సరిపోవడంలేదు కాబట్టి కృష్ణా జలాలను తీసుకొచ్చి గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలు నిల్వ చేయాలని తపించారు. గండికోటలో 26 టీఎంసీలుంటే పైడిపాళెం ప్రాజెక్టులో ఆరు టీఎంసీలు, చిత్రావతికి ఎనిమిది టీఎంసీలు, సర్వరాయసాగర్‌కు 3.2 టీఎంసీలు, వామికొండలో 1.6 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. అందుకే కరువు సీమ దశ దిశ మార్చేందుకు జీఎన్ఎస్ఎస్కు రూ.4వేల కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్కు రూ.4వేల కోట్లు చొప్పున వెచ్చించారు. 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. మిగతా 20 శాతం పనులు చేయించడంలో ఆ తర్వాతి ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆ పనులే పూర్తయ్యి ఉంటే రాయలసీమ సస్యశ్యామలమయ్యేది. దివంగత ముఖ్యమంత్రి కలలు సాకారమయ్యేవి. చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలే.... పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకువచ్చామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. పట్టిసీమ వల్లనే రాయలసీమకు నీరు ఇచ్చామని చెబుతున్నారు. మీకేమైనా కన్పించాయా? రాయలసీమకు ఎక్కడ నీళ్లు తీసుకువచ్చారని అడుగుతున్నా. పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు. దాని ద్వారా 48 టీఎంసీలు తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీలో పోశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. పట్టిసీమ నుంచి తెచ్చిన నీరు నిల్వ చేసుకునే స్టోరేజీ ట్యాంకులే లేవు. దీంతో ఆ నీరు సముద్రంలో కలిసింది. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు ఇస్తున్నా, రాయలసీమకు శ్రీశైలం నీరు వాడుకోవచ్చునని జీఓ ఎందుకు ఇవ్వరని చంద్రబాబును అడుగుతున్నా. రూ.1,600 కోట్లతో పట్టిసీమ నిర్మించారు. అందులో రూ.1,200 కోట్లు ఖర్చు చేసుంటే జీఎన్ఎస్ఎస్ ఫేజ్ –1 పనులు పూర్తి అయ్యేవి. తద్వారా గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసుంటే జిల్లా సస్యశ్యామలం అయ్యేది. గండికోట ముంపు వాసులకు ఆర్అండ్ఆర్ ఏదీ? చంద్రబాబు ముఖ్యమంత్రయి మూడేళ్లవుతున్నా... గండికోట ప్రాజెక్టు పరిధిలో 22 ముంపుగ్రామాల ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూపాయి కూడా ఇవ్వలేదు. గాలేరు–నగరి పనులు పూర్తి చేసుంటే శ్రీశైలం నుంచి రోజుకు 22వేల క్యూసెక్కులు గండికోటకు వచ్చేవి. గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసుకుంటే... చిత్రావతి, పైడిపాళెం, సర్వరాయసాగర్, వామికొండ, మైలవరం జలాశయాలకు నీళ్లిచ్చే అవకాశం ఉండేది. 2012లోనే అప్పటి కలెక్టర్ గండికోటకు మూడు టీఎంసీల నీరు తెచ్చారు. కాలువ కెపాసిటీ 22వేల క్యూసెక్కులు ఉంటే, అప్పట్లో 600 క్యూసెక్కులు తెచ్చారు. ఇప్పటికీ 1000 క్యూసెక్కులకు మించి తీసుకురాని పరిస్థితి. 22వేల క్యూసెక్కుల కెపాసిటీతో గండికోటకు 26 టీఎంసీలు తీసుకురావాలి. పెండింగ్‌లో ఉన్న ప్రతిపనిని పూర్తిచేసి గండికోట నుంచి చిత్రావతికి నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆమేరకు ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ చెల్లించాలని కోరుతున్నాం. చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం ప్రేమలేదు చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం ప్రేమలేదు. కేబినెట్ మీటింగ్‌లో రైతుల పరిస్థితి గురించి మాట్లాడరు. రైతుల భూములు ఎలా లాక్కోవాలి, ఎలా పెద్దలకు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఎస్ఎల్బీసీ మీటింగ్‌లో చంద్రబాబునాయుడు సంతృప్తిపడ్డారని ఈనాడు పేపర్లో చదివా. రూ.24వేల కోట్ల రబీ పంట రుణాలు, రూ.10వేల కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ రూ.4500 కోట్లు మాత్రమే రబీ రుణాలు ఇచ్చి చేతులు దులుపుకొంటుంటే, చంద్రబాబు సంతృప్తి పడ్డారట. ఈ పెద్దమనిషికి బుద్ధి, జ్ఞానం ఉందా? రబీలో 24 లక్షల హెక్టార్లల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా, కేవలం తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. రైతులపట్ల చంద్రబాబుకు ప్రేమలేదు... ఏమి జరుగుతోందనే అవగాహన లేదు... డబ్బు డబ్బు అనే పిచ్చి మాత్రమే ఉంది. రైతులు పడుతున్న అగచాట్లు చూసైనా ఆయనకు బుద్ధి వస్తుందని ఆశిస్తున్నాం. నీళ్ల కోసం రైతులు చేపట్టిన ఈ ధర్నాను చూసైనా ఆయనకు జ్ఞానోదయమై చిత్రావతికి నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చిత్రావతికి వెంటనే నీరివ్వండి చిత్రావతి రిజర్వాయర్‌కు తక్షణమే నీరు విడుదల చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘ఇవాళ చిత్రావతిలో, శ్రీశైలంలో నీరున్నా రైతులకు వదలని పరిస్థితి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) సామర్థ్యం 10 టీఎంసీలు కాగా కేవలం 3.2 టీఎంసీలు కేటాయించారు. అందులో తొలివిడతగా ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 7 వరకూ 1.8 టీఎంసీలు మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేయగా, సీబీఆర్‌లోకి కేవలం 0.675 టీఎంసీలు చేరాయి. మొదటి విడతలో విడుదల చేసిన నీటిలో 63 శాతం లాస్ (ఆవిరి నష్టాలు) అయ్యా యి. రెండోవిడతగా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకూ 1.4 టీఎంసీల నీరు విడుదల చేయగా కేవలం 0.66 టీఎంసీలు చేరాయి. అంటే రెండోవిడతలో 53 శాతం నీటినష్టం జరిగింది. ఆ తర్వాత చిత్రావతికి నీరు రాని పరిస్థితి. ప్రస్తుతం చిత్రావతిలో 1.15 టీఎంసీల నీరు ఉంది. చిత్రావతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్ హెడ్ 0.9 టీఎంసీలు ఉండాలి. ప్రస్తుతం 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి సాగునీరు కాస్తోకూస్తో అందించవచ్చు. కానీ ప్రభుత్వం డిసెంబర్ 22 తర్వాత హఠాత్తుగా చిత్రావతికి నీళ్లందించడం మానేసింది. డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి నీరు పంపిస్తే పులివెందుల పరిధి లోని చెరువులు, స్టోరేజీ ట్యాంకులు నింపుకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం చిత్రావతి ద్వారా 40 క్యూసెక్కులు పులివెందుల, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాలకు తాగునీరు కోసం ఖర్చుచేస్తున్నారు. డ్రైవింగ్ హెడ్ తగ్గిపోయూక నీరు ఇస్తే డ్రైవింగ్ హెడ్ పెంచుకునేందుకు ఉపయోగపడడం తప్ప, కాలువలకు నీరు విడుదల సాధ్యం కాదు’’ అని జగన్ దుయ్యబట్టారు. అందుకే తక్షణమే చిత్రావతికి నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఖరీఫ్‌కు 8 లక్షల ఎకరాలు
- ‘పాలమూరు’ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు ఆదేశం - యాసంగిలో ఆరుతడి పంటలకే నీరు - సాగునీటి పథకాలపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద వచ్చే ఖరీఫ్ కల్లా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులను నీటిపారు దల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద సాగునీటి పథకాల పురోగతిని మంగళవారం ఆయన జలసాధలో సమీక్షించారు. ప్రాజెక్టు లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వ లక్ష్యం ప్రకారం భూసేకరణ జరపాలని ఆదేశించారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సమ న్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువు లోగా పూర్తి చేయాలని కోరారు. యాసంగిలో ఆరుతడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వాలన్నారు. వరి పంటల విషయంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎప్పటి కప్పుడు వాట్సప్ గ్రూప్ ద్వారా తనకు సమాచారం అందిం చాలన్నారు. పాల మూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని... నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని హరీశ్ గుర్తుచేశారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్‌ను తనిఖీ చేసి కాలువల్లోని అడ్డంకులు తొలగించాలని, భూసేకరణ పనుల పురోగతిని ప్రతి వారం సమీక్షించాలన్నారు. నాలుగు ప్రాజెక్టుల పథకాల కోసం ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తయితే 7 లక్షల 93 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు , ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
185 ప్రాజెక్టులకు రూ. 45 వేల కోట్లు
• పూర్తి చేసేందుకు ఇవ్వాలని కేంద్రానికి పీఎంకేఎస్‌వై కమిటీ ప్రతిపాదన • పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమీక్ష • హాజరైన కమిటీ చైర్మన్ బ్రిజ్ మోహన్, సభ్యుడు హరీశ్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న 185 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.45 వేల కోట్లతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కృషి సించారుు యోజన (పీఎంకేఎస్‌వై) కమిటీ సిఫారసు చేసింది. పీఎంకేఎస్‌వై కింద కేంద్రం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్యల వంటి అంశాలపై చర్చించడానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థారుు సమా వేశం జరిగింది. దీనికి పీఎంకేఎస్‌వై అమలు కమిటీ చైర్మన్, ఛత్తీస్‌గఢ్ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్, కమిటీ సభుడైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఇతర రాష్ట్రల మంత్రులు పాల్గొన్నారు. దేశంలో ఇప్పటి వరకు పూర్తెన ప్రాజెక్టుల్లో చాలా వరకు నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడం లేదని కమిటీ గుర్తించినట్టు సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం, వినియోగం మధ్య చాలా వ్యత్యాసం ఉటోందని గుర్తించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి, భూసేకరణ చేసిన తరువాత కూడా చివరి ఆయకట్టు వరకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రాజెక్టుల్లోని నీటిని చివరి ఆయకట్టు వరకు అందించడానికి కోసం.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి రూ. 45 వేల కోట్లతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలని కమిటీ తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ పథకం కింద దేశంలో దాదాపు 185 ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు. ఈ విషయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయలను కూడా కోరినట్టు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం-వినియోగం మధ్య వ్యత్యాసం తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, అలాగే విద్యుదుత్పాదన, స్ప్రింక్లర్లు, డిప్‌లను కూడా ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని కమిటీ నిర్ణరుుంచినట్టు తెలిపారు. అదేవిధంగా నగరాల నుంచి బయటకు వచ్చే నీటిని(డొమెస్టిక్ వాటర్) శుద్ధి చేసి వ్యవసాయానికి వినియోగిం చుకునేలా ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. ఏ రాష్ట్రాలు త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాయో, ఏ రాష్ట్రాలు ఎక్కువ ఆయకట్టును సాధిస్తాయో వాటికి 20 శాతం నిధులు అదనంగా ఇచ్చేలా ప్రతి పాదనలు చేశామన్నారు. ఈ ప్రతిపాదన లన్నింటినీ కేంద్రానికి పంపి వచ్చే బడ్జెట్లోపు ఆమోదించాలని కోరినట్టు చెప్పారు. కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయండి తెలంగాణలో జిల్లాల పునర్విభజన తరువాత 31 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాకు ఒకటి చొప్పునా.. 31 కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. పీఎంకేఎస్‌వై సమీక్ష తరవాత ఆయన రాధామోహన్‌ను కలిశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఉల్లిగడ్డల కొనుగోలుకు సహకారం ఇవ్వాలని, పప్పు దినుసులకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతోందని, దీనికి కేంద్ర సాయంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ. 400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. హరీశ్ వెంట పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, పసునూరి దయాకర్, కొత్తా ప్రభాకర్, బూర నరసయ్య గౌడ్, పొడులేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పక్కన పెట్టండి.. ప్రాజెక్టుల పూర్తికి నాబార్డ్ ద్వారా రుణాల ను మంజూరు చేస్తామని కేంద్రం చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రాల ఎఫ్ఆర్బీఎం పరి మితిని పక్కన పెట్టి రుణాలు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు హరీశ్ తెలిపారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు కలుగుతు న్నాయని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని తొలగించి రుణాన్ని అందించాలని కమిటీ తీర్మానం చేసిందన్నారు. లేదంటే రాష్ట్రాల్లోని కార్పొరేషన్లకు నాబార్డు ద్వారా నేరుగా రుణాలు ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తాయని ప్రతిపాదించామన్నారు. -
ప్రాజెక్టులను అడ్డుకుంటే పాతరేయండి
- నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు - కాంగ్రెస్, టీడీపీలే అడ్డుకుంటున్నాయని ఆరోపణ - మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి తీరుతాం సాక్షి, మెదక్: సాగునీటి ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే వారిని కాల్వల్లో పాతర వేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ పట్ట ణం, నిజాంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామాయంపేట మండలం నిజాంపే టలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలపై తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేసేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్నసాగర్, కాళేశ్వ రం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ నుంచి మెదక్ జిల్లాకు సాగునీరు తీసుకువచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. మూడవ విడత మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల పనులు చేపట్టను న్నట్లు చెప్పారు. అలాగే చెరువుల కట్టకా ల్వలను ఆధునీకరిస్తామని వివరించారు. రైతులు కరెంటోళ్లకు ఒక్క రూపారుు కూడా లంచం ఇవ్వద్దని కోరారు. సీఎం కేసీఆర్ కరెంటు కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్సఫార్మర్లను రైతులు కోరిన చోట ఉచితంగా బిగించనున్నట్లు చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల కాపర్ల కోసం ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గొర్రెల కాపర్లు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏడాది గొర్రెల కాపర్ల సంక్షేమం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. -
పథకాల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ఏయే రంగానికి ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తమ పాల నలో సంక్షేమానికి చేసిన ఖర్చు ఎంత, అందులో ప్రజలకు ఎంత చేరిందో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యులతో సహా ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని, అందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుకుని చేప పిల్లల పెంపకం వరకు కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడడంతో చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు రూ.49 కోట్లు కేటాయించారని, టెండర్లో ఒక్కో చేప పిల్లకు రూ.1.25 పేర్కొనగా, పార్టీ నాయకుల సహకారంతో దానిని 60-70 పైసలకే టెండర్లు దక్కించుకున్నారని చెప్పారు. అయితే ఒక్కో చెరువులో లక్ష చేప పిల్లలను వదలాల్సి ఉండగా, కేవలం 20 వేలే వదిలి చేతులు దులుపుకున్నారన్నారు. టీఆర్ఎస్ చెబుతున్న బంగారు తెలంగాణ ఏమో కాని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలోని ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. -
సాగు ప్రాజెక్టులకన్నా వాటర్‌షెడ్లే మిన్న
- మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసంలో మాజీ ఈఎన్సీ హన్మంతరావు - తక్కువ ఖర్చుతో అధిక లాభాలు - నాలుగు నీటి సూత్రాలతో ఏటా మూడు పంటల సాగు సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులంటూ ప్రభుత్వాలు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, వాటికి బదులుగా వాటర్షెడ్ల కార్యక్రమాన్ని విస్తృతపరిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయని నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ టి. హన్మంతరావు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వాలు ఆర్భాటాలు చేస్తూ వాటర్‌షెడ్ పథకాలపై శీతకన్ను ప్రదర్శిస్తున్నాయని, దీంతో రైతులకు సత్వర ఫలాలు అందడం లేదని హన్మంతరావు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో తాను రూపొందించిన 4 సూత్రాల ప్రణాళిక ప్రకా రం వాటర్షెడ్లు ఏర్పాటు చేసుకుంటే రైతులు ఏడాదిలో మూడు పంటలు పండించుకోవచ్చని, రెండు వరుస పంటలతోపాటు మరో మెట్ట పంటను సాగు చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లా గొట్టిగారి పల్లి ఇందుకు నిదర్శనమన్నారు. రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతాల్లోనూ ఇది విజయవంతమైందన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏడాదిలో కేవలం ఒక పంటకే నీరు అందుతుందని, కానీ వాటర్షెడ్లతో ఏడాది కాలంలో నీరు పుష్కలంగా లభిస్తుందని వివరించారు. ఇందుకు ఎకరాకు రూ. 5 వేలు మాత్రమే ఖర్చు వస్తుందని, 550 మిల్లీమీటర్ల వర్షపాతమున్న అన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి విజయం సాధిస్తుందన్నారు. నాలుగు సూత్రాల వాటర్‌షెడ్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు కృషి చేస్తుందని ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.17 కోట్ల విలువైన పని అంచనా వ్యయం పెంపు
- బినామీలకు రూ.224 కోట్లు కట్టబెట్టేందుకు సిద్ధం - పోలవరం ఎడమ కాలువ పనుల్లో అంతులేని అక్రమాలు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. అడ్డగోలుగా అంచనాలు పెంచేయడం.. పెంచిన నిధులను పంచుకుతినడం.. ఇదీ సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో సాగుతోన్న అవినీతి దందా! పోలవరం ఎడమ కాలువ పనుల్లోనూ ఇదే జరుగుతోంది. వరాహ నదిపై వయాడెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 13 రెట్లు పెంచేశారు. రూ.17 కోట్ల నుంచి రూ.224 కోట్లకు పెంచడంపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తంచేసినా బేఖాతరు చేశారు. కీలక మంత్రి అండతో కాంట్రాక్టరుకు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 181.50 కి.మీల పొడవున 85.50 మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల లోతుతో 17,561 క్యూసెక్కులను తరలించేలా ఎడమ కాలువ తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇందులో 136 కి.మీ నుంచి 162.409 కి.మీ వరకూ రూ.175 కోట్ల విలువైన 26.40 కిలోమీటర్ల కాలువ తవ్వకం పనులను బాబు బినామీలకు కట్టబెట్టారు. ఏడో ప్యాకేజీ కింద ఈ పనులను దక్కించుకున్న కేసీఎల్-జేసీసీజీ(జాయింట్ వెంచర్) ఇప్పటివరకూ రూ.65 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. కానీ విశాఖపట్నం జిల్లా యల మంచిలి మండలంలో 138.75 కి.మీ.వద్ద వరాహ నదిపై 1.214 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన నిర్మాణం పనులు ఇప్పటిదాకా ప్రారంభించలేదు. -
కాంగ్రెస్‌కు జలగండం తప్పదు
ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు సైంధవుల్లా అడ్డుతగులుతున్నారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని రైతుల వెంట పడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నదీజలాలను వినియోగించుకోవడానికి ఇప్పటిదాకా సరైన ప్రణాళికలే లేవని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలో పులిచింతల ప్రాజె క్టు కింద 28 గ్రామాలు ముంపునకు గురైనా ఆయన బాధితులకు చేసిన న్యాయం ఏమీ లేదన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడితే కాంగ్రెస్‌కు జలగండం తప్పదని ఆయన హెచ్చరించారు. అవినీతికి అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి రహిత టీఆర్ఎస్ పాలన చూసి ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. -
‘మహా’ ఒప్పందం రద్దు చేయాలి
జలసౌధ వద్ద టీడీపీ ధర్నా సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని టీటీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ‘చలో జలసౌధ’కు పిలుపునిచ్చింది. ఈ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని, వీటి వల్ల ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆరోపిం చింది. ఎన్టీఆర్ భవన్ నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరి జలసౌధ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహారాష్ర్టతో ఒప్పందం బూటకమని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రమణ అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో చేపట్టిన పాదయాత్ర వల్లే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ధర్నాలో రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమర్నాథ్ బాబు, బండ్రు శోభారాణి, సీతక్క, నన్నూరి నర్సిరెడ్డి, తూళ్ల వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎం, సీఎంలవి అవాస్తవాలు: పొన్నాల
విద్యుత్ అమరులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్: నాటి విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసినవారికి ఆదివారం బషీర్‌బాగ్‌లోని అమరుల స్మారక స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యుత్‌చార్జీల విషయమై ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌లు ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ నెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ యూనిట్ రూ.1.10 కే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ప్రకటించారని, అదే నిజమైతే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో యూనిట్‌కు రూ.6 ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు దొరకని యాదాద్రిలో థర్మల్ విద్యుత్‌ప్లాంట్ పెట్టి ఉత్పత్తి ధరను పెంచే ప్రయత్నం వెనుక ఆంతర్యమేమిటన్నారు. శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో డీపీఆర్‌లను తయారు చేయకుండానే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌లను ఎలా కడుతోం దని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించి డీపీఆర్‌లను తయారు చేయలేదని చెప్పి న మంత్రి హరీశ్‌రావును అభినందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి మాట్లాడుతూ ఎవరు జైలుకు వెళ్లాలో 2019లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు ‘మహా’ స్వాగతం!
మహారాష్ట్ర నుంచి నేడు తిరిగి రానున్న రాష్ట్ర బృందం సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి వస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర బృందానికి ఘన స్వాగతం పలకనున్నారు.బుధవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి సీఎం చేరుకొంటారు. విమానాశ్రయం వద్ద భారీగా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశా రు.దీనికి దాదాపు లక్ష మంది జనాన్ని సమీకరించనున్నారు. వేదికపై సీఎం ప్రసంగించిన అనంతరం భారీ ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ స్వాగత కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ నెల 20నే 14 ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతలను టీఎస్ఎండీసీ చైర్మన్ సుభాష్‌రెడ్డికి అప్పగించారు. వేదిక తదితర ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పర్యవేక్షిస్తున్నారు. అపూర్వంగా స్వాగతం తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు అపూర్వంగా స్వాగతం పలుకుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన అనంతరం ఆయన ముంబై నుంచి ఫోన్ ద్వారా మాట్లాడారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బుధవారం బేగంపేట విమానాశ్రయంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
‘మహా’ ఒప్పందంపై నిరసనకు కాంగ్రెస్ కసరత్తు
గాంధీభవన్‌లో ముఖ్య నేతల భేటీ సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోతోన్న ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈనెల 23న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమై నిరసన కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతో పాటు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రతో చేసుకోబోయే ఒప్పందాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోనుందని, ఈ విషయాన్ని ఇప్పటికే వాస్తవ జలదృశ్యం పేరుతో కాంగ్రెస్ వివరించిందని నేతలు పేర్కొన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని తీర్మానించారు. గ్రామీణ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా ఏర్పాటు చేయాలని పార్టీ కేడర్‌ను ఆదేశించారు. -
మార్కెట్ ధరలు సవరించేలా చూడండి
ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో వట్టెం రైతుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు భూములు సేకరిస్తున్న ప్రభుత్వం బాధిత రైతులకు ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న నెపంతో మూడేళ్లుగా భూముల మార్కెట్ విలువను పెంచలేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ విలువను సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రైతులు శ్రీనివాసగౌడ్, మరో ముగ్గురు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోందని పిటిషనర్లు తెలిపారు. తమ గ్రామాలు కూడా భూ సేకరణ పరిధిలో ఉన్నాయన్నారు. తమ మండలంలో ప్రస్తుతం ఎకరా భూమి ధర బహిరంగ మార్కెట్లో రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉందన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర మాత్రం రూ.60 వేలు మాత్రమే చూపుతోందన్నారు. పక్క గ్రామం పోతిరెడ్డిపాడులో ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందిన బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ఎకరా రూ.5 లక్షల చొప్పున 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందన్నారు. మార్కెట్ ధరలను సవరిస్తే 2013 భూ సేకరణ చట్టం కింద తమవంటి బాధిత రైతులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో ప్రభుత్వం మార్కెట్ ధరలను సవరించడం లేదన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు కోర్టును కోరారు. -
నీటి విడుదలపై ఉమ్మడి పర్యవేక్షణ
- కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి మంత్రి హరీశ్ ప్రతిపాదన - సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్ : పోతిరెడ్డిపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర కీలక ప్రదేశాల్లో నీటి విడుదలకు సంబంధించి తెలంగాణ, ఏపీ సం యుక్తంగా పర్యవేక్షించే వెసులుబాటు ఉండాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రతి పాదించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పురోగతిపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కృష్ణానదీ యాజ మాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చర్చించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసే వరకు ఉమ్మడి రాష్ట్రాల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలపై సాగర్ ఆయకట్టు పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆదివారం నల్లగొండలో సమావేశం జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకుగాను ఇప్పటికే ఖాళీగా ఉన్న 31 పోస్టులతోపాటు కొత్తగా మంజూరైన 143 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులను టీఎస్పీఎస్పీ ద్వారా భర్తీ చేయాలన్నారు. నేడు నల్లగొండలో సమావేశం ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని హరీశ్‌రావు గడువు నిర్దేశించారు. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా చేపడుతున్న కాళేశ్వరం, తమ్మిడిహెట్టి, తుపాకులగూడెంతోపాటు దేవాదుల, మిడ్మానరు, చనాఖా కొరాటా, లోయర్ పెన్‌గంగ, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. తమ్మిడిహెట్టి, తుపాకుల గూడెం బ్యారేజీ పనులను అక్టోబర్‌లో ప్రారంభించాలని, చనాఖా కొరాటా బ్యారేజీ, లోయ ర్ పెన్‌గంగ కాలువల నిర్మాణాన్ని 2018 కల్లా పూర్తి చేయాలని హరీశ్ సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, చీఫ్ ఇంజనీర్లు ఎన్.వెంకటేశ్వర్లు, భగవంతరావు, సునీల్, అనిల్, బి.వెంకటేశ్వర్లు, సుధాకర్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు. -
పెంచి..పోషించి
అడ్డదారిలో గడువు పొడిగింపులు.. ‘లిక్విడేట్ డ్యామేజ్’ నిబంధనను అతిక్రమించి కోట్లకు కోట్లు చెల్లింపులు.. మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుని ఎనిమిదేళ్లు దాటినా పూర్తి చేయని నిర్లక్ష్యం...పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ‘కాగ్’కు కనిపించిన అక్రమాలు..అవినీతి ఊటలు ఇవి..! సాక్షి ప్రతినిధి, అమరావతి : పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువును ఇప్పటి వరకు 13 సార్లు పొడిగించడం పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని కోరినా.. సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వడానికి సాగునీటి శాఖ పాట్లు పడుతోంది. ప్రాజెక్టు పనులను దక్కించుకున్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ 2004 అక్టోబర్‌లో ఒప్పందం మీద సంతకాలు పెట్టింది. ఒప్పందం కుదిరిన తేదీ నుంచి 36 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. 36 నెలల గడువు ముగిసి 8 సంవత్సరాల 8 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఇంకా 90 శాతం పనులే పూర్తయ్యాయి. కనీసం పనుల ప్రగతి నివేదికను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను అడగడం లేదని ఆక్షేపిం చింది. ఈమేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), సాగునీటి శాఖ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. గడువు పొడిగిస్తే.. చెల్లింపులకు అవకాశం లేదు.. గడువు పొడిగిస్తే.. కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని నిబంధనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. గడువు పొడిగించిన వెంటనే కాంట్రాక్టర్‌కు ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలి. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధిస్తే.. ధరల సర్దుబాటు కింద అదనపు చెల్లింపులు అడిగే అర్హతను కాంట్రాక్టర్ కోల్పోతారు. అయితే ధరల సర్దుబాటు కింద ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.170 కోట్లు అదనంగా చెల్లించారు. అడ్డదారిలో గడువు పొడిగింపు గడువు పొడిగింపు ప్రతిపాదన క్షేత్రస్థాయి నుంచి రావాలి. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల వల్ల సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడితే.. గడువు పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదన వస్తుంది. పొడిగింపు ప్రతిపాదనపై హెడ్ డ్రాఫ్ట్్సమెన్, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) సంతకాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను ప్రభుత్వ పెద్దలు పక్కనబెట్టారు. ‘లిక్విడేట్ డ్యామేజ్’ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిపాదనపై రాస్తే.. కాంట్రాక్టర్ రూ. వందల కోట్లు కోల్పోవాల్సి ఉంటుందని, కమీషన్లు కూడా రావనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు అలా చేస్తున్నారని సాగు నీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు. పులిచింతల ముఖం చూడని ముఖ్యమంత్రి .... ప్రాజెక్టు వద్ద నిద్రపోతానని, ఇంజనీర్ల గుండెల్లో నిద్రపోతానని ప్రతి సమీక్షాసమావేశంలో రెండేళ్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా పులిచింతల ప్రాజెక్టును సందర్శించకపోవడం గమనార్హం. ప్రాజెక్టు భద్రత లేమి, పనులు చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..ప్రస్తావనకు వస్తే.. కాంట్రాక్టర్‌కు అదనంగా కోట్లాదిరూపాయలు చెల్లించడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే సీఎం.. ప్రాజెక్టును సందర్శించలేదని ఇంజనీర్లు అంటున్నారు. నాలుగు డివిజన్లకు స్థాన చలనం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ కోసం ఐదు డివిజన్లు, ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పని పూర్తి కాకుండానే నాలుగు డివిజన్లను పులిచింతల నుంచి తరలించారు. దీంతో ఒక డివిజన్లో ఉన్న సిబ్బంది పనుల పర్యవేక్షణకు సరిపోవడం లేదని, సిబ్బంది మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘పాలమూరు’ పనుల్లో వేగం పెంచండి
మహబూబ్‌నగర్ జిల్లా అధికారులకు హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం మొత్తం 96,485 ఎకరాలను సేకరించాల్సి ఉండగా 86,956 ఎకరాలను సేకరించినట్లు పాలమూరు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. మరో 600 ఎకరాలను సేకరిస్తే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని వివరించారు. ప్రాజెక్టులను నిర్ణీత గడువు లోపలే పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావుకు సూచించారు. -
కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సాక్షి, విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా-పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిలో నిల్వలు పెరిగితే ఆ నీటిని కృష్ణా నదికి తీసుకువస్తామని, కృష్ణా నీటిని శ్రీశైలం వద్ద నిల్వచేసి రాయలసీమకు పంపుతామని వివరించారు. శనివారం విజయవాడలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో సమగ్ర జలవనరుల నిర్వహణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కాడా టెక్నాలజీ ద్వారా 13 జిల్లాల్లోని నీటిపారుదల ప్రధాన ప్రాజెక్టులతో అనుసంధానం చేసిన వీడియో కాన్ఫరెన్స్ థియేటర్‌ను బాబు ఆవిష్కరించారు. రోడ్డుపై గొయ్యి ఉంటే ఇంజనీర్‌పై వేటే రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడ గోతులు కనిపించినా ఊరుకునేది లేదని, సంబంధించి ఇంజనీర్‌ను పిలిచి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటానని సీఎం శనివారం జరిగిన ఆర్అండ్బీ సమీక్షలో హెచ్చరించారు. వాహనంలో ప్రయాణించే వారి మొబైల్ ఆధారంగా ఆ వాహన వేగాన్ని కనుగొనే విధానాన్ని గూగుల్ సంస్థ తమకు అందిస్తోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష తెలంగాణలో అనుమతి లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిం చాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమా, సుప్రీంకోర్టు న్యాయవాది గంగూలీ, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కృష్ణా రివర్ బోర్డు వ్యవహారం, ఏపీలో చేపట్టే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. -
ఏపీ ఆడించినట్లు ఆడుతోంది!
- కృష్ణా బోర్డుపై గవర్నర్, దత్తాత్రేయలకు హరీశ్ ఫిర్యాదు - బోర్డును నియంత్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి - రేపు ఢిల్లీకి హరీశ్‌రావు... ఉమా భారతితో భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై నియంత్రణ అంశం లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ఆడించినట్లుగా ఆడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్‌లకు మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల నియంత్రణ జోలికి వెళ్లరాదని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులను నోటిఫై చేయాలని కేంద్రానికి బోర్డు సిఫార్సు చేసిందని వారి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించి.. కృష్ణా బోర్డు తీరును నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌లతో కలసి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రాజెక్టుల నియంత్రణ విషయంలో ఇటీవలి పరిణామాలు, చట్టంలో పేర్కొన్న అంశాలను, బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులను వారికి వివరించారు. విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక.. కృష్ణా బోర్డు కేవలం వాటి నిర్వహణను మాత్రమే చూడాలని స్పష్టంగా ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికి తలొగ్గిన బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు తొందర పడుతోందని వివరించారు. విభజన చట్టంలోని 87(1), 85(8) సబ్ సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి ఏపీలో అరవై ఏళ్లుగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే అన్యాయం చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, గవర్నర్ల దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించ కుండా కేంద్ర పెద్దలతో మాట్లాడాలని కోరారు. రేపు ఢిల్లీకి హరీశ్‌రావు: కృష్ణా బోర్డు తీరుపై సీఎం కేసీఆర్ సూచనల మేరకు హరీశ్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో భేటీ కానున్నారు. ఆయన శనివారమే ఢిల్లీ వెళ్లాలని భావించినా.. శని, ఆదివారాల్లో కేంద్ర మంత్రి అందుబాటులో లేని దృష్ట్యా సోమవారం వెళ్లనున్నారు. మంత్రితో పాటు పలువురు ఎంపీలు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు ఢిల్లీ వెళ్లి బోర్డు అంశాన్ని వివరించనున్నారు. -
ఆగస్టు దాకా అంతేనా..!
రాష్ట్రంలో ఎండిన ప్రాజెక్టులు.. 528 టీఎంసీల నీటి లోటు - ప్రస్తుతం లభ్యత జలాలు 152.8 టీఎంసీలు..ఇందులో గరిష్టంగా వాడుకోదగ్గ నీరు 5 టీఎంసీలే - జూన్ నుంచే మెరుగైన వర్షాలు కురిసినా ఆగస్టు వరకు సాగునీటిపై చెప్పలేని పరిస్థితి - మంచి వర్షాలు రాకుంటే 20 లక్షల ఎకరాలపై ప్రభావం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటల సాగు కష్టతరమే కానుంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఎండిపోయి ఖాళీ కావడం ఖరీఫ్ సాగుకు గుదిబండగా మారనుంది. జూన్ నుంచే మంచి వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లో నీరు చేరేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనన్న సంకేతాలు రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడం, అక్కడి నుంచి దిగువకు నీరొచ్చే అవకాశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం సాగును మరింత క్లిష్టతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి సుమారు 15 లక్షల ఎకరాలపై నేరుగా, మరో 5 లక్షల ఎకరాలపై పరోక్షంగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగుపై ఎలాంటి ప్రణాళికను సిధ్దం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత అంతటి లోటు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. 2002-03లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులన్నీ ఎండిపోగా మళ్లీ ఇప్పుడు అంతటి లోటు ఏర్పడిందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 152.81టీఎంసీల మేర మాత్రమే నిల్వలు న్నాయి. ఈ సమయానికి ఉండాల్సినదానికన్నా 528 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిలోనూ వాడుకోదగినవి కేవలం 5 టీఎంసీలే. జూన్‌లో సకాలంలో వర్షాలు కురిసినా ముందుగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రాజెక్టులు నిండాల్సి ఉంటుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి చేరే నీటిలో సుమారు 90 నుంచి 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన కూడా ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 20 లక్షల ఎకరాలపై ప్రభావం.. సాగునీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితిల్లో ఆ ప్రభావం మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే అవకాశం ఉంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండగా, జూరాల కింద లక్ష ఎకరాలు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కింద మరో లక్ష ఎకరాలకు సకాలంలో నీరివ్వడం కష్టంగా మారుతుంది. దీనికి తోడు ఈ ఏడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, కల్వకుర్తి, దేవాదుల కింద కొత్తగా ఈ ఖరీఫ్‌లో 6.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించారు. ఒకవేళ సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరకుంటే గడ్డు పరిస్థితులు తప్పవు. మరో పక్క ప్రాజెక్టుల ద్వారా చెరువులు నిండని పక్షంలో మరో 5 లక్షల ఎకరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. -
పీఎంకేఎస్వైలో 11 రాష్ట్ర ప్రాజెక్టులు
సమన్వయ కమిటీ ప్రతిపాదనల్లో చేర్చాం: హరీశ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు పలు ప్రతిపాదనలను రూపొందించిందని.. త్వరలోనే వాటిని కేంద్ర మంత్రి మండలికి అందజేయనుందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో పీఎంకేఎస్‌వై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీఎంకేఎస్వైలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు చేర్చాలని సిఫారసుల్లో చేర్చాం. మొత్తంగా ప్రాజెక్టులపై రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఎంవోయూ జరిగిన వారంలోనే నిధులు విడుదల చేయాలి, ప్రాజెక్టు వ్యయంలో 60% గ్రాంటుగా ఇవ్వాలి, ఆపైన నాబార్డు నుంచి కేంద్రం హామీదారుగా ఉంటూ రుణం ఇప్పించాలి, ఆ రుణంపై వడ్డీని 4.5 శాతానికి తగ్గించాలి, సకాలంలో పూర్తయిన ప్రాజెక్టుల రుణంపై వడ్డీని కేంద్రమే భరించాలి, అంచనా వ్యయం 200% పెరిగిన ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ పునఃపరిశీలించాలని ప్రతిపాదించాం. వాటి ని కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించి నిధులు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం..’’ అని హరీశ్ తెలిపారు. సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో భేటీ తమ్మిడిహట్టి, మేడిగడ్డతోపాటు పలు ఇతర ప్రాజెక్టులకు సహకరించాలని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీలతో కలసి హన్స్‌రాజ్ అహిర్‌తో హరీశ్‌రావు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే మంచిది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిర్మించే నీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, మంత్రులతో చర్చించాం. సముద్రంలో వృథాగా కలిసే నీరు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు. -
జగన్ దీక్ష చేస్తానంటే బాబుకు గుర్తొచ్చిందా?
తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ సక్రమమైనవే: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఏపీకి చెందిన నేతలు అక్రమమంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షలు చేస్తాననే సరికి, ఏపీ సీఎం చంద్రబాబుకు గుర్తొచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. అందుకే ఆగమేఘాల మీద కేబినెట్లో చర్చించి, కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఇరువురు నేతలు ఏపీలో ఆధిపత్యం కోసం తెలంగాణపై విషం చిమ్ముతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. సచివాలయంలో మంత్రి తలసాని మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోలీసుల పహారా పెట్టి పోతిరెడ్డిపాడు, పులిచింతల ద్వారా అక్రమంగా నీటిని తరలించారన్నారు. తాము వారిలా కాకుండా తెలంగాణకు కేటాయించిన వాటా మేరకే వాడుకుంటున్నట్లు వివరించారు. ఏపీలోనే అనుమతి లేకుండా.. అక్రమంగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారన్నారు. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కొత్తవి కాదని, ఉమ్మడి రాష్ట్రంలో జీవోలు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఆలోచన మేరకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నాలుగు నెలలు గడిచిన తర్వాత చంద్రబాబు ఇప్పుడు మేల్కొన్నట్లుందని ఎద్దేవా చేశారు. -
సాగునీరందించడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తి రూరల్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సాగునీ రందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శు క్రవారం మండల పరిధిలోని కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాలో రెండోవిడత మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. సా గునీటి ప్రాజెక్టులకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నార ని అన్నారు. ఆయన ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పా రు. అంతకుముందు కడుకుంట్లలోని చింతల్‌చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.30లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. పెద్దగూడెం తొక్కుడు చెరువులోనూ ఈ పనులను ప్రారంభించారు. ఈపనులకు ప్రభుత్వం నుంచి రూ.36లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ అవినీ తికి ఆస్కారం లేకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం మండ ల పరిధిలోని మెంటెపల్లి గ్రామం నుంచి 44వ జాతీయ రహదారి వరకు చేపట్టనున్న బీటీరోడ్డు పనులను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ వెంకటయ్యయాద వ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీలు నర్సిం హ, మనెమ్మ, సర్పంచ్ జానకి, వనపర్తి మున్సిపల్‌చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, నాయకులు మాణిక్యం, యోగానందరె డ్డి, వాకిటి శ్రీధర్, బుచ్చన్న, తిరుపతయ్య, ధర్మారెడ్డి, రాము, బాల్యనాయ క్, ఐబీ అధికారులు పాల్గొన్నారు. -
ఆనాడు అడగలేదేం..
♦ఎస్సారెస్పీ కాలువను పొడిగిస్తే ఎందుకు ఊరుకున్నారు... ♦ ఎక్కడా లేని విధంగా ఎస్సెల్బీసీ టన్నెల్ రూపొందిస్తే మాట్లాడలేదేం.. ♦ అప్పులు తెచ్చిన పార్టీల్లోనే మీరు పనిచేయలేదా.. ♦ జానా, ఉత్తమ్, సుఖేందర్, కోమటిరెడ్డి అప్పుడేం చేశారు.. ♦ కాంగ్రెస్ దిగ్గజాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సాగునీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో సీఎం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ వినకుండా.. దొంగల్లా పారిపోయిన కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారని, 30 ఏళ్ల పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన ఘనత కలిగిన ఈ నేతలు సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు జరిగిన అన్యా యం గురించి ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నాడు పదవుల కోసం, బీ ఫారాల కోసం పెద్ద బానిసలుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో తెలంగాణను బాగు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి మాట్లాడారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలపై ఫైర్ అయ్యారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాడు నల్లగొండకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సీఎం అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై జిల్లా కాంగ్రెస్ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని, అసలు వారు మాట్లాడేది వాళ్లకు అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. తామేమీ అసెంబ్లీలో వారి నోట్లో గుడ్డలు పెట్టలేదని, కళ్లకు గంతలు కట్టలేదని, తెలంగాణ ప్రజలకు నీళ్లెలా తాపాలో చెప్పామన్నారు. అయినా.. కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఓట్లేసిన ప్రజలు నిలదీస్తారనే అక్కసుతోనే చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారన్నారు. అందుకే ఓ నాయకుడు ప్రాజెక్టుల్లో కుంభకోణం జరుగుతుందంటే... మరో నేత తాను ప్రిపేర్ అయి రాలేదని, ఇంకో నాయకుడు అప్పులివ్వద్దని లేఖలు రాస్తున్నామని అంటున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని గొప్పలకు పోతున్న కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తాము కాంగ్రెస్ నాయకుల్లా డప్పాలు కొట్టలేమని.. చేసిన పనిని చూసిన తర్వాతే ఓట్లేయమని ప్రజలను అడుగుతామని.. అదే టీఆర్ఎస్, కేసీఆర్ నైజమని అన్నారు. ఆ ఆలోచన ఎందుకు రాలేదు... జిల్లా కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలను ఎందుకు మాట్లాడలేకపో5యారని, ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యలు తెలంగాణ ప్రాజెక్ట్‌లకే ఎందుకు వస్తాయని, అన్ని సమస్యలూ తెలంగాణ చుట్టూనే ఎందుకు తిరుగుతాయనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎందుకు రాలేదని మంత్రి జగదీశ్ నిలదీశారు. ‘నీటి సామర్థ్యంతో సంబంధం లేకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలను హనుమంతుడి తోకలా పెంచుకుంటూ పోతుంటే ప్రశ్నించే దమ్ము ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు లేదు.. ఎందుకు దద్దమ్మల్లా కూర్చున్నారు.. 10 టీఎంసీల నీటిని 16లక్షల ఎకరాలకు పారిస్తామని చెప్పి ప్రాణహిత - చేవెళ్ల ప్రారంభించినప్పుడు ఎందుకు సంకలు గుద్దుకుని కొ బ్బరికాయలు కొట్టి వచ్చారు.. ఆనాడు ఏ క్షణమైనా ఆలోచించారా.. ప్రపంచం లో ఎవరికీ అర్థం కాని విధంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) సొ రం గం డిజైన్ రూపొందించినప్పుడు ఏం చేశారు.. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఏం చేశారు..’ అని ప్రశ్నించారు. తామేదో అప్పులు తెస్తున్నామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని... అప్పులు తేవడం నేర్పిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఎంపీ సుఖేందర్‌రెడ్డి పనిచేయలేదా అని అడిగారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నేతలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అబ్బగోని రమేశ్‌గౌడ్, బకరం వెంకన్న పాల్గొన్నారు. -
రీ డిజైన్ పనుల కేటాయింపుపై కసరత్తు
సాగునీటి ప్రాజెక్టులపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: రీడిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యయ అంచనా పెరిగిన నేపథ్యం లో పనులను పాత కాంట్రాక్టర్లకు అప్పగించా లా, వద్దా.. అని తర్జనభర్జన పడుతోంది. అదనపు పనులను యథావిధిగా పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలన్న ఇదివరకటి నిర్ణయంపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం మరోమారు సమీక్షించనుంది.కాళేశ్వరం, ప్రాణహిత, దేవాదుల ఫేజ్-3, తుపాకులగూడెం ప్రాజెక్టుల అంచనాల్లో మార్పులు, పెరుగుతున్న వ్యయ భారాలు, ఇప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (ఎస్ఎస్ఆర్)పై చర్చించనుంది. నాలుగు ప్రాజెక్టులే కీలకం... ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భా గంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల అంచనా వ్యయం రూ.38,500 కోట్ల నుంచి ఏకంగా రూ.83 వేల కోట్లకు చేరింది. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3 పనుల పాత అంచనా రూ.531 కోట్లు ఉండగా సవరణతో రూ.1349 కోట్లకు చేరింది. తుపాకులగూడెం బ్యారేజీకి రూ.3155 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యా యి. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరదకాల్వలోకి మార్చనున్నారు. వరదకాల్వ కిందకు తెస్తున్న ఆయకట్టుకు నీరిచ్చేందుకు కొత్తగా టన్నెల్, కాల్వలను తవ్వడానికి సుమారు రూ.2,563 కోట్ల మేర అదనంగా అవసరం అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తేల్చారు. -
ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ముఖం చాటేసిన కాంగ్రెస్ నేతలు.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావుతో కలసి శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై అన్ని వర్గాల నుంచి అభినందనలు లభిస్తుండగా.. కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవగాహన మాత్రమే కుదిరిందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో రూ. 8 వేల కోట్ల మేర కాంగ్రెస్ నాయకులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
ప్రాజెక్టులపై సీఎం ప్రజెంటేషన్ ఆకట్టుకుంది
♦ డబుల్ బెడ్రూం ఇళ్లు, ముస్లిం, ♦ గిరిజనులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు ♦ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ టూ టౌన్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై అసెం బ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ బాగుందని, రైతుల గురించి ఆలోచించే వ్యక్తిగా తనను ఆకట్టుకుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరముందని, వీటి నిర్మాణాల్లో అభ్యంతరాలుంటే ఉండవచ్చని, కానీ, రీ డిజైనింగ్ చేయడంలో తప్పులేదన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చిన విధానం బాగుందని కితాబిచ్చారు. అయితే, కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రాణహిత - చేవెళ్లపై అసెం బ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఓ కాంగ్రెస్ నేత తాను ప్రిపేర్ అయి రాలేదని చెప్పాడని, ఇది సరైంది కాదన్నారు. సాధ్యంకానివి.. కావు అని చెప్పండి టీఆర్ఎస్తో పాటు సీఎం కేసీఆర్ చెబుతున్న విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, గిరిజనులకు, ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు సాధ్యమయ్యే పని కాదని కోమటిరెడ్డి అన్నారు. సాధ్యం కాని పనులను.. కావు అని సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. అయితే గ్రామానికి 50 చొప్పున, హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని తానే ప్రజలను కోరుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తాను పోటీ చేయకపోయినా టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. ఎస్సెల్బీసీ టన్నెల్‌ను మూడేళ్లలో, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
గైర్హాజరీ వల్ల లాభమా.. నష్టమా?
సభలో సీఎం ప్రజెంటేషన్‌కు డుమ్మాపై కాంగ్రెస్ అంతర్గత మథనం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, ప్రభుత్వ జల విధానంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాల చివరిరోజునాడు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. శాసనసభలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, చర్చకు అవకాశం లేకుండా సీఎం ఏకపక్షంగా చెప్పుకుంటూ పోతే సాధారణ ప్రేక్షకునిగా ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నించింది. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం సభ్యులందరికీ ఇవ్వాలనీ, సభలో కాకుండా మరెక్కడైనా నిర్వహించాలని స్పీకర్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. అయితే ఈ ప్రతిపాదనలు, అభ్యంతరాలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితి, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుసరించిన విధానం, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్మించిన బ్యారేజీలు, వాటివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం, ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైను మినహా ప్రత్యామ్నాయం లేదనే విధంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌పై పదునైన విమర్శలూ చేశారు. ఈ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ సీనియర్ సభ్యుల్లో పార్టీ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభలో పార్టీ వాదన సమర్థవంతంగా వినిపించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతుంటే, హాజరైతే టీఆర్ఎస్ను భవిష్యత్తులో ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామని మరికొందరు వాదిస్తున్నారు. పార్టీ వాదన లేకుండా పోయింది... సీఎం శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నా, దోషిగా నిలబెట్టినా... సభకు హాజరు కాకపోవడం వల్ల వాటిని తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయిందని ఓ సీనియర్ సభ్యుడు వ్యాఖ్యానించారు. శాసనసభ నిబంధనలు, ఆడియో, వీడియో డిస్ప్లే వంటివాటిని సామాన్య ప్రజలు ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కాంగ్రెస్‌కి అవినాభావ సంబంధముందని, అత్యంత కీలకమైన అంశంలో పార్టీని దోషిగా నిలబెట్టేలా సాగిన ప్రసంగం వల్ల దీర్ఘ కాలంలో పార్టీకి నష్టం కాదా అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. తెలంగాణ వద్దని సంతకాలు పెట్టిన సీపీఎం, మజ్లిస్ వంటి పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వినిపించాయని మరొక సభ్యుడు వాపోయారు. సభలో పాల్గొని చర్చకు పెట్టి, సాగు నీటి రంగంలో కాంగ్రెస్ చేసిందేమిటో, సీఎం కేసీఆర్ మార్చిన డిజైన్ వల్ల నష్టం ఏమిటో వివరించి ఉంటే బాగుండేదన్నారు. భవిష్యత్తులో ఇదే లాభం... కేసీఆర్ ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని కొందరు సీనియరు సభ్యులు వాదిస్తున్నారు. ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప నిర్దిష్టంగా ఏ కార్యక్రమాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయిందంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, జల విధానంలో లోపాల వల్ల ఆచరణలో చాలా సమస్యలు వస్తాయంటున్నారు. శాసనసభలో మాట్లాడిన కేసీఆర్ మాటలు అమలుచేయించేలా, లోపాలపై నిర్దిష్టంగా ఎత్తిచూపే విధంగా భవిష్యత్తులో మాట్లాడే అవకాశం వచ్చిందనేది సీనియర్ల అభిప్రాయం. ఒకవేళ సభకు హాజరైనా అధికార పక్షం మినహా ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కి ఉండేది కాదని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. హాజరై ఉంటే కేసీఆర్ ప్రసంగానికి ఆమోదం తెలిపినట్టు అయ్యేదని మరో సభ్యుడు అంటున్నారు. హాజరు కాకపోవడం వల్ల నిర్మాణాత్మక విమర్శలకు అవకాశం సజీవంగా ఉంటుందంటున్నారు. -
కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చరిత్రాత్మకం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చరిత్రాత్మకమని రాష్ట్ర ఇంధన, దళిత అభివృద్ధి, సహకార శాఖల మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తన అద్భుత ప్రెజెంటేషన్‌తో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన ముఖ్యమంత్రి అభినందనీయుడని తెలిపారు. సీఎం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తయిన అనంతరం ఆయన గురువారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ జిల్లాలో విస్తరించిన ఫోర్లిన్ పాపానికి ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారకులు. పరిష్కార మార్గాలున్నా ఇంతకాలం పాలించి పరిష్కరించకుండా, ఫ్లోరిన్ బాధితుల పాపాన్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు మూట కట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో చేసిన పాపం బయటపడుతుందనే సభ కు రాకుండా మొహం చాటేశారు.’ అని ఆ ప్రకటనలో ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో అధికారం అనుభవించిన జి ల్లాకు చెందిన జానారెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు పొందిన దామోదర్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ఆంధ్ర పాలకులకు వంత పాడి పదవులు దక్కించుకున్నారని, దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరిన్ విస్తరించడానికి వారే కారకులని ఆ ప్రకటనలో ఆయన ఆరోపించారు. ఎస్సెల్బీసీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నాటి పాలకులపై ఒత్తిడి చేయలేని జిల్లా నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికే ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ను వ్యతిరేకించడం, మిషన్ భగీరథకు మోకాలడ్డేలా ఉత్తరాలు రా యడం ద్వారా కొత్త కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే తమకు పదవులు రా వని, ఎమ్మెల్యేలు, ఎం పీలుగా గెలవలేరనే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రాజకీయాలు గమనించి అపరభగీరథుడిలా శ్రమిస్తున్న కేసీఆర్‌కు ప్రజలుఅండగా నిలవాలని ఆయన కోరారు. -
భారత్‌కు రూ.14,250 కోట్ల జపాన్ రుణం
న్యూఢిల్లీ: దేశంలోని ఐదు మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలకు సంబంధించి మొత్తం రూ. 14,250 కోట్ల రుణాలు ఇవ్వడానికి జపాన్ అంగీకరించింది. అధికారిక అభివృద్ధి సహాయం కింద(ఓడీఏ) ఈ రుణాలను ఇవ్వనుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో ప్రసార వ్యవస్థ అభివృద్ధికి (911.55 కోట్ల రూపాయలు), ఒడిశా సమీకృత పారిశుధ్య వ్యవస్థ పురోగతి ప్రాజెక్టుకు (1,516 కోట్లు), మొదటి దశ ప్రత్యేక రవాణా కారిడార్ ప్రాజెక్టుకు (రూ. 6,170 కోట్లు), అలాగే తూర్పు ఉత్తర రోడ్డు వ్యవస్థ అనుసంధాన ప్రాజెక్టుకు(రూ.3,959 కోట్లు), జార్ఖండ్ హార్టికల్చర్ మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు (రూ.274 కోట్లు) వెచ్చించనున్నారు. ఈ రుణాలన్నీ జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ద్వారా ఇస్తారు. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సెల్వ కుమార్, భారత్‌లో జపాన్ రాయబారి కెంజి హిరమత్తులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ప్రాజెక్టుల భూసేకరణ పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ : నీటి పారుదల ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం జనగామ డివిజన్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, నష్కల్, చెన్నూర్, పాలకుర్తి, గండి రామారం, అశ్వరావుప ల్లి రిజర్వాయర్ల నుంచి సాగునీ టి కాల్వల నిర్మాణానికి కావల్సిన భూ సేకరణ పనుల పురోగతిపై సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 3,920 ఎకరాల భూమిని నెగోషియేషన్ చేయడం జరిగిందని, వీఆర్ఓలు ఏప్రిల్ 6వ తేదీ నాటికి లోకల్ ఎంక్వయిరీ పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ భూమిని వినియోగించుకోవాలనుకుంటారో అక్కడ గ్రామసభ ఏర్పాటు చేసి సర్పంచ్‌ను, భూ యజమానులను పిలిపించి ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించాలన్నారు. తహసీలార్ల సేవలను వినియోగించుకోవాలి.. వీఆర్ఓలు పూర్తి నివేదిక అందజేసిన తర్వాత ఆర్ఐ, డి ప్యూటీ తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారపి కలెక్టర్ చెప్పారు. గ్రామాలు, మండలాల వారీగా ఎంత భూమి లభ్యంగా ఉందో ఎంపిక చేసుకోవాలని, ఇందు కు అనుభవజ్ఞులైన తహసీల్దార్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన 3,269 ఎకరాలు నెగోషియేషన్ కాగా.. ఆ మేరకు ఫారం-2 క్లెయిమ్ కా లేదని, ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జేసీ ప్రశాం త్ జీవన్‌పాటిల్, స్పెషల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓలు వెంకటమాధవరావు, వెంకటరెడ్డి, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలకు అవకాశం లేకుంటే సభలో ఎందుకు..?
♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రెజెంటేషన్‌కు వ్యతిరేకత ♦ సభలో సమయం ఇవ్వకుంటే జనంలోకి వెళ్తామంటున్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రభుత్వం ఇవ్వదలిచిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌పై కాంగ్రెస్‌పార్టీలో చర్చ తీవ్రం అవుతోంది. భావితరాలపై కీలకప్రభావం చూపించే సాగునీటి ప్రాజెక్టులపై నిర్ణయాలను తీసుకోవడానికి ముందు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు చర్చకు పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదని కాంగ్రెస్‌పార్టీ వాదిస్తోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలపై ప్రభావం చూపించే ప్రాణహిత డిజైన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించ తలపెట్టిన ప్రాణహితను 148 మీటర్లకు తగ్గించడం వల్ల తెలంగాణకు భవిష్యత్తులో తీవ్ర నష్టమని, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తును 4 మీటర్ల మేర తగ్గిస్తూ మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని సమర్థించుకోవడానికి శాసనసభను వేదికగా చేసుకోవాలనే వ్యూహంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ప్రాణహిత ఎత్తును తగ్గిస్తూ తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ తాకట్టుపెట్టారనే ప్రచారం క్రమంగా ప్రజల్లోకి వెళుతున్నదని.. దీనికి భయపడిన ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దాన్ని అడ్డుకోవాలని అనుకుంటుందని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. ప్రజెంటేషన్‌పై చర్చకు ఒత్తిడి అధికారపక్షమే ఏకపక్షంగా తన వాదనను శాసనసభలో వినిపించి, ప్రతిపక్షాల వాదనలను వినిపించకుండా గొంతునొక్కే కుట్రలకు దిగుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనిని అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, అవసరమైతే శాసనసభలో మిగిలిన పార్టీలతో సమన్వయం చేసుకుని ఈ అంశంపై చర్చకు ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ‘ఒక్క అధికారపక్ష వాదనకే పరిమితమై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటే కమిటీ హాలులోనూ, పార్టీ కార్యాలయంలోనూ చేసుకోవచ్చు. శాసనసభలోనే మాట్లాడాలనుకుంటే సభలోని అన్ని పక్షాలకు సమానమైన అవకాశం, సమయం ఇవ్వాలి. 152 మీటర్లున్న ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు ఎందుకు తగ్గించిందో? తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశముంది. అలా కాకుండా గోదావరిపై కిందభాగంలో తక్కువ ఎత్తు ప్రాజెక్టులను నిర్మించడం వల్ల శాశ్వతంగా లిఫ్టుల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. సహజంగా నీటి పారుదలను కాదని, లిఫ్టులను నిర్మించడం, వాటికి శాశ్వతంగా నిర్వహణ వ్యయం వంటి పెనుభారాలను రాష్ట్ర ప్రజలపై మోపాల్సిన అవసరం ఏమిటి? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా 152 మీటర్ల ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ 148 మీటర్లకు అంగీకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వమే మహారాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలోనూ జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎత్తిపోతలకోసం లిఫ్టులను నిర్మించాలని ప్రతిపాదించింది. దీనివల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని శాసనసభలో మాట్లాడే విధంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామంటే శాసనసభలో అధికారపక్షం చేస్తున్న ప్రతిపాదనను అంగీకరిస్తాం. లేకుంటే అడ్డుకోవడానికి అన్ని మార్గాలను అనుసరిస్తాం. అవసరమైతే జనంలోకి వెళ్తాం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడొకరు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాల అభిప్రాయాలను పట్టించుకోకుండా, అధికారపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తే ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతామని చెప్పారు. -
భూసేకరణకు రైతులు సహకరించాలి
ముకరంపుర : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, రైతులతో భూముల ధరల నిర్ణయంపై సమావేశం నిర్వహించారు. 123 జీవో ప్రకారం రైతులకు నష్టం జరగకుండా రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని ధర నిర్ణయిస్తామన్నారు. నిర్ణయించిన ధరకు రైతులు భూములిచ్చి సహకరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దనే అధికారులు చెక్కులు అందజేస్తారన్నారు. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్, వేములవాడ, కరీంనగర్ మండలం ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల గ్రామాల్లోని భూములకు ధర నిర్ణయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం గ్రామంలో పెండింగ్‌లో ఉన్న కట్టడాలకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్, జూలై వరకు ప్రాజెక్టుల్లో నీరు నిలుస్తుందని, పరిహారం చెల్లిస్తే నిర్వాసితులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటారని తెలిపారు. రుద్రారం పునరావాస కాలనీలో త్రీ ఫేజ్లైన్ ఏర్పాటు చేయాలని, పునరావాస కాలనీలలో మిగిలి ఉన్న ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, చింతల్‌ఠాణా నిర్వాసితులకు పునరావాస కాలనీలో ప్లాట్లు కేటాయించి, కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు. స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రిజిస్ట్రార్ రమణారావు, కరీంనగర్, సిరిసిల్ల, ఆర్డీవోలు చంద్రశేఖర్, భిక్షానాయక్, నారాయణరెడ్డి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్, శంకర్, నటరాజ్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో విపులంగా చర్చించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి జల విధానానికి రూపకల్పన చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అధికారపార్టీ బలం పెరిగిందని, అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నామనే అహంభావపూరిత ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెరిగిందన్నారు. చర్చ లేకుండా తడికెపల్లి, పాములపర్తి వద్ద రిజర్వాయర్ల సామర్థాన్ని ఆగమేఘాల మీద 20, 50 టీఎంసీలకు పెంచడమేంటని ప్రశ్నించారు. -
నిరాశే!
పాలమూరు -రంగారెడ్డికి భారీగా కేటాయింపులు డిండికి అత్తెసరు నిధులు.. ఇక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టులయిన లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులకు కొత్త కేటాయింపులు చేయలేదు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్న 199 గ్రామాలకు తాగునీటిని అందించే బాధ్యతను జలమండలికి అప్పగించారు. ఇది సంక్షేమ బడ్జెట్.. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమానికి, పారిశ్రామిక అభివృద్ధికి దిక్సూచి. సంక్షేమానికి రూ.13,412 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ. 4,815 కోట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనం. పారిశ్రామిక, సాగునీటి పారుదల రంగాలకు మంచి కేటాయింపులు జరిగాయి. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి మెరుగుపడుతుంది. - మహేందర్ రెడ్డి, మంత్రి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏదీ..? రైతులకు రూ.7 వేల కోట్లు కేటాయించలేదంటే ప్రభుత్వానికి అన్నదాతలపై ఉన్న చిత్తశుద్ధి ఇట్టే అర్థమవుతుంది. డబుల్బెడ్రూం ఇళ్ల హామీతో ఓట్లు వేయించుకుని గెలిచిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం మొండిచేయి చూపింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలలో జిల్లాకు నీరందించే ప్రాంతంలో చేపట్టే పనులకు ఎలాంటి టెండర్లూ పిలవలేదు. - రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు నిరాశే మిగిలింది. పాలమూరు- రంగారెడ్డికి భారీగా నిధులు కేటాయించిన సర్కారు.. డిండి నుంచి ఇబ్రహీంపట్నంకు కృష్ణాజలాలను తర లింపునకు అత్తెసరు నిధులు విదిల్చింది. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి కృష్ణాజలాలను తీసుకురావడం ద్వారా నై విచ్చుకున్న జిల్లాలను నేలలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసింది. రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ (7లక్షల ఎకరాలు), రంగారెడ్డి (2.70 లక్షలు), నల్లగొండ (30 వేలు) ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పాలమూరు -రంగారెడ్డికి రూ.7,860.88 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల 18 ప్యాకేజీలకు టెండర్లను ఖరారు చేసిన ప్రభుత్వం.. దీంట్లో మన జిల్లాకు సంబంధించి ఒక్క ప్యాకేజీని కూడా పొందుపరచలేదు. మహబూబ్‌నగర్ జిల్లా కేపీ లక్ష్మిదేవుపల్లి నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందించేలా ప్రాజెక్టుకు డిజైన్ చేసిన సర్కారు.. ఈ ప్యాకేజీలకు సంబంధించి సర్వే ప్రక్రియ కూడా మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో తాజా కేటాయింపులు కూడా పొరుగు జిల్లాకే పరిమితం కానున్నాయి. తాజా బడ్జెట్ కేటాయింపులను విశ్లేషిస్తే పాలమూరు దాటి జిల్లా దరికి కృష్ణమ్మ చేరాలంటే మరికొన్నాళ్లు వే చిచూడాల్సిందే! డిండికి రూ.780 కోట్లు! కరువు నేలల్లో హరితసిరులు పండించేందుకు దోహదపడుతుందని భావించిన డిండి ప్రాజెక్టుకు బడ్జెట్లో మోస్తరు నిధులు కేటాయించారు. ఎదుల రిజ ర్వాయర్ నుంచి 22.47 టీఎంసీల సామర్థ్యం కృష్ణాజలాలను దేవరకొండ, క ల్వకుర్తి, మునుగోడు మీదుగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు తరలించాలని నిర్ణయించింది. మార్గమధ్యంలో రిజర్వాయర్లు, పైప్లన్లు, కాల్వల నిర్మాణానికిగాను రూ.7వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల కు 5 టీఎంసీలను తరలించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. మరో నాలుగువారాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఖరారు చేసి టెండర్లు పిలుస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే చేసింది. కేవలం రూ.780 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంది. ఈ కేటాయింపులను పరిశీలిస్తే చివరి ఆయకట్టు ప్రాంతమైన మన జిల్లాకు నీరు రావాలంటే కనీసం ఆరేళ్లయినా పట్టే అవకాశంలేకపోలేదు. ఇక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టులయిన లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులకు కొత్త కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. ఇక కోట్‌పల్లికి రూ.2.30 కోట్లు కేటాయించారు. మిషన్ కాకతీయకు పెద్దపీట మిషన్ కాకతీయకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రెండో దశ కింద చెరువుల పునరుద్ధర ణకు దాదాపు రూ.300 కోట్లు నిర్ధేశించింది. తద్వారా జిల్లావ్యాప్తంగా 560 చెరువులను బాగు చేయనుంది. కూరగాయల సాగు, ఉద్యానవనాల పెంపకాన్ని ప్రోత్సహించాలని భావించిన ప్రభుత్వం... సూక్ష్మ, బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల కల్టివేషన్‌కు సబ్సిడీ పరిమితి పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. జలమండలిలోకి ఔటర్ గ్రామాలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు ఇక జలమండలి తాగు నీటిని సరఫరా చేయనుంది. 199 గ్రామాలకు తాగునీటిని అందించే బాధ్యతను జలమండలికి అప్పగిస్తూ బడ్జెట్లో పొందుపరిచింది. పారిశ్రామిక విస్తర ణ, ఐటీ సంస్థల తాకిడిని ప్రత్యేకంగా ప్రస్తావించిన విత్తమంత్రి ఫార్మాసిటీ రాకతో రంగారెడ్డి జిల్లా దశ మారనుందని వ్యాఖ్యానించారు. -
శరవేగంగా చెరువుల పూడికతీత
♦ మొదటి విడతలో 885 పూర్తి ♦ చెరువులు నిండితే లక్ష ఎకరాలకు సాగునీరు ♦ రెండో విడతలో 1,741 చెరువుల లక్ష్యం ♦ ‘మిషన్ కాకతీయ’కు ఏడాది మొదటి విడత ఇలా..జిల్లాలోని మొత్తం చెరువులు వీటి కింద ఉన్న ఆయకట్టు 2.52 లక్షల ఎకరాలు మిషన్ కాకతీయ-1 లక్ష్యం 1,869 చెరువులు ఆయకట్టు లక్ష్యం 1.04 లక్షల ఎకరాలు కేటాయించిన నిధులు రూ.362.96 కోట్లు ప్రతిపాదనలు పంపిన చెరువులు పూడికతీతకు ప్రభుత్వ అనుమతి పనులు ప్రారంభమైనవి పనులు పూర్తి అయినవి సాక్షి, సంగారెడ్డి: భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేని మెతుకుసీమకు చెరువులు, కుంటలే ఆధారం. జిల్లా సాగునీటి రంగానికి గుండెకాయలాంటి ఇవి దశాబ్దాలుగా నిరాదరణకు గురయ్యాయి. ఫలితంగా వీటిలో పూడిక పెరిగి ఆయకట్టు క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా కార్యాచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటలకు పూర్వవైభవం తెచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా చెరువులు, కుంటల్లో పూడికతీతలు, మత్తడి మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావటం, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మిషన్ కాకతీయలో జిల్లాకు పెద్దపీట లభించింది. జిల్లాలో మొదటి విడతలో 1,693 చెరువుల పనులకు 885 పూర్తికాగా, ఏప్రిల్ నెలాఖరుకు మిగతా పనులు పూర్తి కానున్నాయి. రెండో విడతలో 1,741 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యం. ఇరిగేషన్‌శాఖ అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 885 చెరువుల పూడికతీత పనులు పూర్తయినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. చెరువులు నిండిన పక్షంలో జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. 1,693 చెరువుల పూడిక తీత మిషన్ కాకతీయతో చెరువు, చేను.. రెండింటికీ మేలు జరుగుతోంది. చెరువులో పూడిక తొలగిపోగా, పూడికమట్టిని రైతులు స్వచ్ఛందంగా పొలాల్లోకి తరలించారు. చెరువుపై ఆధారపడిన మత్స్య కార్మికులు సైతం మిషన్ కాకతీయ పనులతో సంతోషపడుతున్నారు. జిల్లాలో మొత్తం 7,972 చెరువులున్నాయి. వీటి కింద 2.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ మొదటి విడతలో 1.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రూ.362.96 కోట్లతో 1869 చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 1812 చెరువుల పూడికతీతకు ప్రతిపాదనలు పంపగా.. 1693 వాటికి ప్రభుత్వం అనుమతించింది. వీటిలో 885 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. మిగతా చెరువుల పనులు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రెండో విడతలో.. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా జిల్లాలో రూ.200 కోట్లతో 1741 చెరువుల పూడికతీత పనులు చేపట్టనున్నారు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. మంత్రి హరీశ్‌రావు గజ్వేల్, సిద్దిపేటలో రెండో విడత మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నారాయణఖేడ్‌లో ఇరిగేషన్ పనులపై సమీక్ష జరిపిన మంత్రి.. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల వారిని కలుపుకుని రెండో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
తోటపల్లి ప్రధాన కాలువకు లైనింగ్ ?
* రూ. 300 కోట్లు అవసరం * నిధుల మంజూరుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం * ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు విజయనగరం కంటోన్మెంట్ : ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన తోటపల్లిని ప్రారంభిద్దామన్న ధ్యాసే తప్ప ఇతర బాగోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోయినా కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా సాగునీటి రంగానికి కేటాయించే నిధులకు సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసింది. ఏమేం అభివృద్ధి పనులు చేయొచ్చో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరడంతో ఇరిగేషన్ అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ను 1200 క్యూసెక్కుల నీటి సామర్థ్యంగా 2003లో డి జైన్ చేశారు. అయితే అప్పట్లో పూసపాటి రేగ, గుర్ల, గరివిడి, గజపతినగరం, తదితర అదనపు ఆయకట్టు ప్రతిపాదనలు లేవు. ఆ తర్వాత నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో ఈ అదనపు ప్రాంతాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే అదనపు ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు పూర్తి స్థాయిలో జోరుగా అందాలంటే కాలువ ఆసాంతం లైనింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ అంతా మట్టి, తుప్పలు, పెద్ద రెల్లు గడ్డితో నిండి ఉంది. మొత్తం 118 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ పరిస్థితి అంతా ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేని సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పనుల కోసం సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలించే అవకాశం ఉంది. నిధులు మంజూరు చేస్తే ఈ ఏడాదే పనులు ప్రారంభించే అవకాశముంది. లైనింగ్ ఎందుకంటే..? కాలువలో పిచ్చిమొక్కలు, పూడికలు పేరుకుపోవడంతో శివారు ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. ఇలా కాకుండా వాటన్నింటినీ తొలగించి కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తే సాగునీటి ప్రవాహం జోరందుకుని అంతటా ఒకేలా నీరందుతుంది. అలాగే లైనింగ్ చేయడం వల్ల కాలువ గట్లు కూడా బలంగా తయూరవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతిపాదనలు సమర్పిస్తాం తోటపల్లి కాలువ లైనింగ్ ప్రతిపాదనలు ఏప్రిల్ మొదటి వారంలో పంపిస్తాం. ప్రస్తుతం ప్రతిపాదనల తయూరీపై దృష్టి సారించాం - డోల తిరుమల రావు, పర్యవేక్షక ఇంజినీరు, తోటపల్లి -
అరకొర విదిలింపు
ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ సారీ మొండిచేయే తాండవకు రూ.3.05 కోట్లు రైవాడకు రూ.6.10 లక్షలు కోనాంకు రూ.5.60 లక్షలు సాగునీటి ప్రాజెక్టులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ కేటాయింపులు అద్దం పడుతున్నాయి. ఆధునికీకరణ కాదు..కనీసం హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు కూడా ఈ నిధులు ఏమూలకూ సరిపోవని సాగునీటి రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం: జిల్లా సాగునీటి ప్రాజెక్టులు నాలుగేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏటా రివైజ్డ్ ఎస్టిమేట్స్‌తో ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం.. బడ్జెట్లో అరకొర కేటాయింపులు జరపడం అనవాయితీగా మారిపోయింది. ఏటా మాదిరి గానే ఈ ఏడాది కూడా బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాకు విదిల్చిన నిధులు చూసి రైతులు బిత్తరపోతున్నారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి మిగిలిన 28 కిలోమీటర్ల పనుల కోసం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్లో రూ.1.50 కోట్లు కేటాయించారు. మళ్లీ ఈఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్‌లోరూ.3.05కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు పెంచినప్పటికీ ఆధునికీకరణ పనులకు ఏమూలకు సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కేవలం డ్యామ్, హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు మాత్రమే ఈ నిధులు సరిపోతాయని చెబుతున్నారు. మరో పక్క ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కేవలం రూ.2 కోట్లు విదిల్చారు. రూ.7,200 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ ప్రాజెక్టు ఇంకా బతికే ఉందన్నట్టు బడ్జెట్లో రూ.2 కోట్లు విదిల్చడం విడ్డూరంగా ఉందని నిపుణులంటున్నారు. ఈ నిధులు కనీసం సర్వే కూడా సరిపోవని చెబుతున్నారు. రైవాడ రిజర్వాయర్ ఆధునికీకరణ కోసం రూ. 60 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్లో రూ.52.50 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.67 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్లో కేవలం రూ.6.10 లక్షలు విదిల్చారు. గతేడాదే అరకొరనిధులు కేటాయించగా ఈ ఏడాది కనీసం పాతిక కోట్లయినా కేటాయిస్తారని ఆశించినా కంటితుడుపుగా కేవలం రూ. 6లక్షలకు సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని రైవాడ ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. పెద్దేరు జలాశయం ఆధునికీకరణ కోసం ఐదేళ్లుగా మిగిలి ఉన్న 25 శాతం పనుల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపగా. 2015-16లో కేవలం రూ.11 లక్షలు కేటాయించారు. దీంతో ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ మళ్లీ రూ.8.50 కోట్లకు పంపగా 5 లక్షలు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించి నిధులు డ్యామ్ నిర్వహణకు కూడా సరిపోలేదు. ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5 లక్షలు ఇచ్చారు. కోనాం రిజర్వాయర్ ఆధునికీకరణలో భాగంగా మిగిలి ఉన్న మూడు కిలో మీటర్ల పనులు పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు ఇస్తే సరిపోతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షలు విదిల్చిన సర్కార్ ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5.60 లక్షలు కేటాయిం చింది. ఈ నిధులు డామ్ నిర్వహణకు కూడా సరిపోవు. సర్వేకు కూడా సరిపోవు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు కేటాయించడ మే నిదర్శనం. ఈ ప్రాజెక్టు సర్వేకు కూడా ఈ నిధులు సరిపోవు. మిగిలిన ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు మరీ తక్కువగా ఉన్నాయి. ఇవి ఆయా ప్రాజెక్టుల మెయింటినెన్స్‌కు కూడా సరిపోవు -ఎస్.సత్యనారాయణ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ -
ఇరిగేషన్‌కు సాంకేతిక సహకారం
* బిట్స్, ఐఐటీ, నాబార్డ్‌లతో నీటిపారుదల శాఖ ఎంఓయూ * మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పనుల్లో పురోగతికి తోడ్పాటు * మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంతకాలు సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల్లో ఇరిగేషన్ శాఖకు సాంకేతిక సహకారం అందించేందుకు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్), ఐఐటీ హైదరాబాద్, నాబార్డ్‌లు ముందుకొచ్చాయి. ఈ 3 సంస్థలు గురువారం నీటిపారుదల శాఖతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్కే జోషి సమక్షంలో సాంకేతిక సహకారం విషయమై ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ దేశాయి, బిట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఎస్‌రావు, నాబార్డ్ డెరైక్టర్ సీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 3 సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఇరిగేషన్ శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందని, ఐఐటీ, బిట్స్, నాబార్డ్ సేవలను వినియోగించుకొని దేశానికి మరింత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని, ఈ క్రమంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ అవసరం ఉంటుందని, దీనిద్వారా లోటుపాట్లుంటే తెలిసిపోతుందన్నారు. నాబార్డ్‌కు అనుసంధానంగా ఉన్న నాప్కాస్ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాలను ఎంచుకొని మిషన్ కాకతీయ ఫలితాలను విశ్లేషిస్తుందని, ఐఐటీ, బిట్స్‌లు పైలట్ ప్రాజెక్టులను ఎంచుకొని ఇరిగేషన్ శాఖ లో జరుగుతున్న పనులపై వారి విద్యార్థులు, అధ్యాపకులతో అధ్యయనం చేయించాలని సూచించారు. శాఖ పరిధిలోని ఇంజనీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి, ప్రాజెక్టుల సమగ్ర వివరాలతో డేటాబేస్‌ను రూపొం దించడానికి సంస్థలు కృషి చేయాలన్నారు. ఆ సంస్థల డెరైక్టర్లు దేశాయి, వీఎస్‌రావు, సత్యనారాయణలు మాట్లాడుతూ.. సాగునీటిరంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ముఖ్యకార్యదర్శి జోషి మాట్లాడుతూ, మూడు సంస్థలతో ఒక్కరోజే ఎంఓయూ కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని అన్నారు. -
ప్రాజెక్టుల ప్రగతి ఎంత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర పథకాల నుంచి అందిన నిధులతో సాధించిన ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించనున్నారు. ముఖ్యంగా సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం(ఏఐబీపీ), ప్రధాన మంత్రి సహాయ ప్యాకేజీ(పీఎంఆర్ఎఫ్) కింద రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సాగునీటి పథకాలు, వాటి కింద ఖర్చు చేసిన నిధులు, అదనపు అవసరాలు, సాగులోకి తెచ్చిన ఆయకట్టు తదితరాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్రగతి నివేదికలతో సిద్ధం కావాలని, ఈ నెల 27న ప్రధాని వాటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో).. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమాచారం పంపింది. దీంతో నీటి పారుదల శాఖ ఇప్పటివరకు చేపట్టిన పనులు, పలు ప్రాజెక్టుల పరిధిలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు తదితరాలపై సమగ్ర వివరాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమైంది. 10 లక్షల ఎకరాల ఆయకట్టు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో 50 శాతం కన్నా ఎక్కువగా పనులు జరిగి ఉంటేనే కేంద్ర జల సంఘం ఆ ప్రాజెక్టును ఏఐబీపీ పథకం కింద చేరుస్తుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయని పక్షంలో గడువును కేవలం రెండుమార్లు మాత్రమే పొడగించి, ఆ తర్వాత జాప్యం చేస్తే నిధుల విడుదలను నిలిపేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏఐబీపీ, పీఎంఆర్ఎఫ్ కింద 1996-97 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 16 ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టుల కింద ఖర్చయ్యే నిధులను కేంద్రం, రాష్ట్రం 1:3 నిష్పత్తిలో పంచుకుంటాయి. 16 ప్రాజెక్టులకు మొత్తంగా రూ.18,179 కోట్లు అంచనా వేయగా అందులో గతేడాది వరకు రూ.13,793 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఇందులో ఏఐబీపీ కింద రూ.3,886 కోట్లు కేంద్రం అందించగా.. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. ఇప్పటిదాకా వెచ్చించిన నిధులతో 4.04 లక్షల హెక్టార్లు (సుమారు 10 లక్షల ఎకరాలు) సాగులోకి వచ్చినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం ప్రధానికి నివేదించనుంది. బకాయిలు, అదనపు ప్రాజెక్టులపై ఏఐబీపీ కింద చేర్చిన దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,626 కోట్ల సాయం రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.1,204.58 కోట్ల మేర సాయం అందగా మరో రూ.422 కోట్లు అందాల్సి ఉంది. 2012-13 నుంచి ఈ బకాయిలు విడుదల కావాల్సి ఉన్నా కేంద్రం ఆలస్యం చేస్తోంది. వీటిని త్వరగా విడుదల చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వీటితోపాటు నిజాంసాగర్ ఆధునీకరణ, ఎస్సారెస్పీ వరద కాల్వ, మోదికుంట వాగు వంటి ప్రాజెక్టులను కొత్తగా ఏఐబీపీలో చేర్చాలని విన్నవించనుంది. ఇందులో నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.978 కోట్లు, మోదికుంటవాగుకు రూ.456 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనుంది. వీటితోపాటే ఇందిరమ్మ వరద కాల్వకు సంబంధించి సవరించిన అంచనా(రూ.5,887 కోట్లు)ను ఆమోదించాలని కోరనుంది. వీటితోపాటు కేంద్రం కొత్తగా చేపడుతున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో.. రాష్ట్రం రూపొందించిన సమగ్ర సాగునీటి ప్రణాళిక ప్రగతిపై ప్రధాని ఆరా తీసే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. -
ప్రాజెక్టుల పనుల్లో ఐఐటీ, బిట్స్ సేవలు
♦ సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఈ సంస్థల నుంచి సాయం ♦ అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఐఐటీ హైదరాబాద్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్) సేవలను వినియోగించుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీనిపై ఆయా సంస్థల అధికారులతో చర్చలు జర పనుంది. ఈ మేరకు ఆదివారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, బిట్స్ అధికారులతో చర్చల బాధ్యతను శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషికి కట్టబెట్టారు. ఇక మిషన్ కాకతీయ మొదటి దశలో చేపట్టిన పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో పూర్తి చేసిన పనులకు ముగింపు నివేదిక ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో క్వాలిటీకంట్రోల్ విభాగంతో పాటు సీఈ నుంచి డీఈ వరకు తనిఖీలు చేయాలన్నారు. మిగిలిపోయిన పనులు ఉంటే వాటిని పూర్తి చేయించిన తర్వాతనే తుది బిల్లులు చెల్లించాలన్నారు. పనులు పూర్తయిన చెరువుల పరిరక్షణ, నిర్వహణపై గ్రామస్థాయిలో కమిటీలు వేయాలని అన్నారు. రెండో విడత పనులు ఆరంభమవుతున్నందున జిల్లా సమన్వయ కమిటీలను పునర్వ్యవస్థీకరించుకోవాలని, నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. పనులు ఆరంభించే చెరువుల్లో ముందుగానే మట్టి పరీక్షలు నిర్వహించేలా చూడాలని, పూడికమట్టిని రైతులు తీసుకువెళ్లడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారుల సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న ఏజెన్సీల పట్ల కఠినంగా వ్యవహరించాలని, పనిచేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, పురోగతి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు. పనుల్లో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఖాళీల భ ర్తీకి ఆదేశం.. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టులను భర్తీ చేయాలని, జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, ఏటూరు నాగారం డివిజన్లకు ఈఈలను వెంటనే నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ క మిషన్ ద్వారా ఏఈఈల నియామకాలు జరుగబోతున్నాయని, వారి కి స్వల్పకాలిక శిక్షణనిచ్చి పనుల్లోకి దించాలని మంత్రి సూచించారు. -
సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.25వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతిఏటా ఇంతేమొత్తం కేటాయించి వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నివారించడానికి బడ్జెట్ కేటాయింపులను సులభతరం చేస్తామన్నారు. విధివిధానాలను రూపొం దించేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ ప్రక్రియ దాదాపు పూర్తయినందున పనుల్లో వేగం పెంచాలని, లైడార్ సర్వే నివేదిక వచ్చినందున తగిన కార్యాచరణతో సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మా ణం నత్తనడకకు మారుపేరుగా మారిందని, ఈ పరిస్థితిని మార్చేందుకు సరళ పద్ధతులు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న భూసేకరణ, బిల్లుల చెల్లింపును సులభతరం చేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములు కొనుగోలు చేస్తున్నామని, దీంతో భూసేకరణలో జరిగే జాప్యాన్ని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ నెల 24న ఎంసీహెచ్ఆర్డీలో వాటర్‌గ్రిడ్‌పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈమేరకు సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేటాయింపులన్నీ ఒకే పద్దు కిందకు! రాష్ట్రంలో ప్రస్తుతం 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితోపాటే కొత్తగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదనంగా 46 వేల చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు పూనుకుంది. వీటికోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పాలమూరు, ప్రాణహిత, డిండి ప్రాజెక్టులకే ఏకంగా రూ.10 వేల కోట్ల కేటాయింపులు జరిపేందుకు ప్రణాళికలు వేస్తోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కొత్త ప్రాజెక్టుల నుంచి పాక్షికంగా అయినా నీరివ్వాలని భావిస్తోంది. అయితే లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆర్థికశాఖ సహకారం ఎంతైనా అవసరం. పరిపాలనా అనుమతుల మంజూరు, విడుదలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలి. ఇందుకనుగుణం గా కొన్ని మార్పులు చేయాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ప్రాజెక్టులవారీగా ప్రత్యే క పద్దులుండటం వల్ల, పనులు కొనసాగని ప్రాజెక్టులకు కేటాయించిన పద్దుల నుంచి ఇతర ప్రాజెక్టులకు నిధులను మళ్లించడం కష్టసాధ్యమవుతోంది. ఈ దృష్ట్యా అన్ని ప్రాజెక్టుల కేటాయింపులను ఒకే పద్దు కింద పెట్టి, పనులను బట్టి నిధులు విడుదల చేసే విధానాన్ని తేవాలని కోరింది. అలాగే ఎప్పటికప్పుడు నిధుల విడుదల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కోరుతోంది. -
తుమ్మిడిహెట్టి ఎత్తుపై నేడు మహారాష్ట్రతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో తెలంగాణ అధికారులు సోమవారం మరోమారు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో మహారాష్ట్ర వెల్లడించే అభిప్రాయాల మేరకు బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయానికి రానున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తుపై చర్చలకు రావాలని కోరుతూ ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంత చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చవాన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మహారాష్ట్ర అధికారులు సోమవారం రాష్ట్రానికి వస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల మేర ఉంటే తమ భూభాగంలో 1,850 ఎకరాల వరకు ముంపు ఉన్న దృష్ట్యా దాన్ని తగ్గించాలని మహారాష్ట్ర కోరుతోంది. ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని అంటోంది. దీంతో చేసేది లేక రాష్ట్రం తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా నిర్ణీత నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచి తీసుకునే అంశమై పరిశీలనలు జరుపుతోంది. అయితే ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాల నిమిత్తం తుమ్మిడిహెట్టి బ్యారేజీని తక్కువ ఎత్తులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్ధ్యం ఏమాత్రం అన్నదానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభిప్రాయాలను అధికారికంగా తెలుసుకున్నాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. నెలాఖరుతో మూసుకోనున్న బాబ్లీ గేట్లు.. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల 29 నుంచి మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గేట్లు తెరిచి ఉంచేందుకు విధించిన గడువు ఈ నెల 28తో ముగియనున్న నేపథ్యంలో మరుసటి రోజు గేట్లు మూసి నీటిని నిల్వ చేసుకునేందుకు మహారాష్ట్ర సమాయత్తం అవుతోంది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 7లక్షల ఎకరాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలరాకను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు మహారాష్ట్ర జూలై ఒకటిన ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీరు దిగువకు వచ్చే ఏర్పాట్లు చేసింది. అయితే గోదావరి బేసిన్లో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరాంసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు రాలేదు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో గేట్ల మూసివేతపైనా చర్చించే అవకాశాలున్నాయి. -
పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి
* 25 ప్రాజెక్టు పనుల వేగవంతంపై సర్కారు కసరత్తు * వాటి ఆయకట్టు లక్ష్యం 31లక్షల ఎకరాలు.. చేరుకుంది 7లక్షల ఎకరాలే * ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యల పరిష్కారంపై దృష్టి * నేడు ప్రాజెక్టులపై ప్రభుత్వం ‘మారథాన్’ సమీక్ష * ఎస్కలేషన్ జీవో, భూసేకరణ గైడ్‌లైన్స్‌పై అధికారులకు అవగాహన సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు లక్ష్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులకు ఏటా నిధుల వరద పారుతున్నా... అనుకున్న స్థాయిలో ఆయకట్టుకు నీరు అందడం లేదు. దీంతో తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యమిచ్చి.. వాటిల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంపై కసరత్తు చేస్తోంది. భూసేకరణ, పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై ఓ స్పష్టత వచ్చినందున పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టుల వారీగా ‘మారథాన్’ సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వ్యయంతో.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు భారీగా నిధులు ఖర్చు చేశారు. 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కోసం 2004 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.32 వేల వరకు ఖర్చు చేశారు. వీటిలో 29.19 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్న 13 భారీ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. కానీ ఇంతవరకు అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 6.51 లక్షల ఎకరాలే. మరో 23 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాల్సి ఉంది. ఇక 1.62 లక్షల ఆయకట్టు లక్ష్యంగా ఉన్న 12 మధ్యతరహా ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.1,528 కోట్లు ఖర్చు చేసినా 35వేల ఎకరాలకే నీరివ్వగలిగారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ, దేవాదుల వంటి ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని కూడా విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నుంచి వచ్చే ఖరీఫ్ సీజన్లో నీటిని ఇవ్వడానికి అవకాశముంది. అయితే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యలు, పరిహారంలో జాప్యం, ఎస్కలేషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై తేల్చడంలో జాప్యం ఆయకట్టు లక్ష్యాన్ని నీరుగార్చాయి. నేడు సమీక్ష ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈ, ఈఈ, డీఈలతో మంత్రి హరీశ్‌రావు గురువారం సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. వరంగల్‌లోని దేవాదుల, మహబూబ్‌నగర్‌లోని భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో రైల్వే క్రాసింగ్, జాతీయ రహదారుల(ఎన్‌హెచ్)కు సంబంధించిన సమస్యలున్నాయి. వీటిని పూర్తి చేసుకోగలిగితే వచ్చే జూలై నాటికి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 21 రైల్వే, 6 ఎన్‌హెచ్ క్రాసింగ్లకు సంబంధించిన సమస్యలున్నాయని అధికారులు తేల్చారు. వీటితో పాటు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ, పరిహారం సమస్యలున్నాయి. వీటన్నింటిపై గురువారం నాటి సమావేశంలో విడివిడిగా సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. -
కాంట్రాక్టర్లకు అ‘ధనం’ పండుగ
25 ప్రాజెక్టుల్లోని 111 ప్యాకేజీలకు అదనపు చెల్లింపులు.. జీవో జారీ 2013 ఏప్రిల్ 1 నుంచి ఎస్కలేషన్ వర్తింపు తాజా నిర్ణయంతో ఖజానాపై రూ.2,712 కోట్ల భారం మూడు దశల్లో బకాయిల చెల్లింపు హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి వీలుగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు(జీవో-146) జారీ చేసింది. స్టీలు, సిమెంట్, ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి ఇప్పటికే అవకాశం ఉంది. తాజాగా కార్మికుల వ్యయం, యంత్ర పరికరాల ధరలు, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్స్ ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు చేయడానికి ఈ జీవోతో అవకాశం కల్పించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, కంట్రోల్ బ్లాస్టింగ్, డీ వాటరింగ్ తదితర పనులకు అదనపు చెల్లింపులు వర్తించేలా అవకాశం కల్పించారు. ఈ చెల్లింపులన్నీ 2013, ఏప్రిల్ 1 నుంచి చేసిన పనులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులోని 111 ప్యాకేజీలకు ఎస్కలేషన్‌ను వర్తింపజేస్తే ప్రభుత్వంపై రూ.2,712 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్కలేషన్ పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 2న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే వివాదం రేగడం, రాష్ర్ట విభజనతో అమల్లోకి రాలేదు. తర్వాత ఎస్కలేషన్‌పై ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎస్కలేషన్‌కు ఓకే చెప్పడంతో తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. జాప్యానికి ప్రభుత్వం కారణమైతేనే.. నిర్మాణ పనుల్లో జాప్యానికి ప్రభుత్వం కారణమైన పక్షంలో మాత్రమే అదనపు చెల్లింపులు పొందడానికి కాంట్రాక్టర్‌కు అవకాశం ఉంటుంది. భూసేకరణ, అటవీ అనుమతుల్లో ప్రభుత్వం జాప్యం చేసిందనే విషయాన్ని నిర్ధారిస్తూ ప్రాజెక్టు సీఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంటేనే అదనపు చెల్లింపుల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటారు. ఇవీ మార్గదర్శకాలు.. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణ ధరను సాగు విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.10,500 చొప్పున చెల్లించాలని ఉండగా, దాన్ని రూ.15,000కు పెంచుతూ గతంలో ఇచ్చిన మెమోను జీవోలో ప్రస్తావించారు. ఇసుక విధానంలో మార్పులు వచ్చిన కారణంగా పెరిగిన వ్యయం, రవాణా అదనపు ఖర్చులను పెరుగుదలలో చేర్చవచ్చు. ఏఎంఆర్పీ-ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టుల్లో విదేశీ యంత్రాలతో పాటు విదేశీ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన జీతభత్యాలు డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చెల్లింపులు చేయవచ్చు. భూసేకరణ, రీ ఇంజనీరింగ్, చట్టపరమైన అనుమతులు వంటి సహేతుక కారణాలతో కాంట్రాక్టర్ ఎవరైనా ప్యాకేజీల నుంచి తప్పుకోవాలని భావిస్తే అందుకు ప్రభుత్వం అంగీకరించాలి.అదనపు పనులు చేయాల్సిన అవసరం ఉంటే ఈపీసీ నిబంధనల మేరకు అదనపు నిర్మాణాలకు అనుమతివ్వాలి. అనుమతించిన పరిమితులకు మించి కంట్రోల్ బాస్టింగ్స్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. నిర్మాణ అవసరాల మేరకు కాలువల్లో నీటి నిలుపుదల విషయంలోనూ ఈ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. బ్యాంకు గ్యారంటీ కమీషన్లు, బీమా చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీవోకు అనుబంధంగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు... రాష్ట్రస్థాయి కమిటీ, అంతర్గత ప్రమాణాల కమిటీ అన్ని పనులకు సంబంధించిన సిఫారసులను చేస్తుంది. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన పనులకు సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ అనుమతి తప్పనిసరి. మిగతా పనులకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అనుమతి ఇస్తుంది.కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను మూడు దశల్లో చెల్లిస్తారు. 40 శాతం బకాయిలు ముందుగా, పనుల పురోగతిని బట్టి మరో 40 శాతం, పనులు పూర్తయిన అనంతరం మరో 20 శాతం చెల్లిస్తారు. -
రూ.లక్షన్నర కోట్లకు పైగా!
వచ్చే ఏడాది బడ్జెట్‌పై ముందస్తు కసరత్తు రికార్డు స్థాయిలో పెంచే సంకేతాలు ముందుగానే ఆరా తీసిన ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు డబుల్ బెడ్రూం ఇళ్లు, వాటర్‌గ్రిడ్‌కు భారీ కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ లక్షన్నర కోట్లు దాటిపోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ ఏడాది ఎంత ఖర్చు చేస్తాం, వచ్చే ఏడాది ఎంత బడ్జెట్ ప్రవేశపెడదామని సీఎం ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న తెలంగాణ జల వినియోగ విధానంపై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్ కేటాయింపులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల చొప్పున సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఎంచుకున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు, గ్రామజ్యోతి, సంక్షేమ పథకాలన్నింటికీ భారీ మొత్తంలో నిధుల అవసరం ఉంది. ఈ ఏడాది డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలని ఇటీవలి కేబినేట్లోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ కేటాయింపులు, ఖర్చులకు అనుగుణంగా ఆర్థిక అవసరాలు, అంచనాలెలా ఉన్నాయని కేసీఆర్ ఆరా తీయడంతో పాటు బడ్జెట్ ప్రస్తావన లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరుసటి రోజున క్యాంపు కార్యాలయంలో తనను కలసి సమస్యలను విన్నవించేందుకు వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులతోనూ సీఎం ఆర్థిక పరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూ.1.58 లక్షల కోట్లకు చేరుతుందని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. దీంతో వచ్చే బడ్జెట్ రికార్డు స్థాయి లో పెరిగిపోనుంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాది పది నెలల కాలానికి రూ. లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వరుసగా అదే పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,637 కోట్లు. ఈ ఏడాది మార్చిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. -
పోలవరంపై కేంద్రం రాష్ట్రాన్ని చివాట్లు పెడుతూ లేఖ రాస్తే మాట్లాడకూడదట..
ఎక్కడైనా కరువు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వేర్వేరుగా ఉంటాయా? 1,500 అడుగులు బోర్లు వేస్తే నీళ్లు పడని పరిస్థితి. అయినా, అర్ధగంట కూడా కరువు చర్చ జరగనివ్వరు. 25నిమిషాలు మాట్లాడితే ఒక గంట పదిహేను నిమిషాలు అవరోధాలు కల్పిస్తారు. పోలవరంపై ఆ ప్రాజెక్టు అథారిటీ సీఈవో దినేష్‌కుమార్ ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని చివా ట్లు పెడుతూ లెటర్ రాశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కేవలం రెండు శాతం మట్టి పని మాత్రమే చేశారని, ప్రాజెక్టు పనులు పూర్తి చేసే చిత్తశుద్ధి కాంట్రాక్టు సంస్థకు లేదని లేఖ రాస్తే, కాంట్రాక్టరు.. తరం కానివాడు, అన్యాయస్తుడు అని తెలిసినా చంద్రబాబు కమీషన్లు తీసుకుని రూ.290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. ఇంతవరకు కాంట్రాక్టరు రూ.220 కోట్లు పనిచేశారు. రూ.5వేల కోట్ల పనులు ఏడాదికి చేస్తే తప్పించి మూడేళ్లలో పోలవరం పూర్తి కాదు. అయినా, దీనిపై అసెంబ్లీలో మాట్లాడకూడదట. టాపిక్ తేవద్దట.. ఇదీ ప్రభుత్వ వైఖరి. పట్టిసీమపై పార్టీ వైఖరి ఎప్పుడో చెప్పాం ‘‘చంద్రబాబు నేను సభలో లేనప్పుడు పట్టిసీమ ప్రాజెక్టుపై మాట్లాడారు. మా వైఖరి ఏమిటో బాగా ఆలోచించుకుని చెప్పమని వెటకారంగా మాట్లాడారట. గత అసెంబ్లీలోనే రెండు రోజులు పట్టిసీమపై చర్చ జరిగినప్పుడే వ్యతిరేకమని స్పష్టం చేశాం. పట్టిసీమపై మా పార్టీ వైఖరి సుదీర్ఘంగా, సవివరంగా చెప్పాం. ఎందుకంటే నీటిని స్టోరేజీ చేసే అవకాశం లేనందున పట్టిసీమపై పెట్టే ఖర్చు వృథా. పోలవరం పూర్తయితే దీనికి వెచ్చించిన రూ.1,600 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. ఇదే డబ్బును గాలేరు-నగరిలో పెట్టినా.. హంద్రీనీవాలో పెట్టినా.. పులిచింతలలో పెట్టినా.. వెలిగొండలో పెట్టినా ప్రాజెక్టులు పూర్తవుతాయి. పట్టిసీమ టెండర్లలో విపరీతమై గోల్మాల్ జరిగింది. టెండర్లలో పాల్గొన్నది కేవలం ఇద్దరే. ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేనట్లు ఇద్దరే ఇద్దరు పాల్గొన్నారు. వారికి 16.9 శాతం బోనస్ ఇచ్చారు. సంవత్సరంలోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి టెండర్లు పిలిచారు. మరి అదే సంవత్సరంలో పూర్తి చేస్తే బోనస్ ఎందుకు? బోనస్ క్లాజ్ అన్నా టెండర్లు పిలిచేటప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లు ఉందా అంటే అదీ లేదు. టెండర్లు కోట్ చేసిన తర్వాత ఎక్సెస్ అమౌంట్ 21.9 శాతం కోట్ చేస్తే 5 శాతం పర్మిసబుల్ లిమిట్ అని చెప్పి 16.9 శాతం బోనస్‌గా ఇచ్చారు. ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు. 30 పంపులు.. 15 పైప్లైన్లు ఉంటే, 24 పైపులు.. 12 పైప్లైన్లకు తగ్గించారు. స్టీల్, అల్యూమిని యం ధరలూ తగ్గాయి. దీనివల్ల రూ.250 కోట్లు తగ్గాలి. డిజైన్లు మార్చడం వల్ల రేటు పెరిగింది అని కాంట్రాక్టర్ ప్రతిపాదన ఇవ్వడం.. దీన్ని చంద్రబాబు అనుమతించ డం.. దోచుకోవడానికే’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను దారుణంగా కోల్పోతాం.. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ 7(ఇ) ఏం చెబుతుందంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో సంబంధం లేకుండా కేంద్ర జలవనరుల సంఘం అనుమతి ఇచ్చిన వెంటనే 80 టీఎంసీలలో 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాటా తీసుకుంటాయి. మనకు రావాల్సిన కృష్ణా జలాల్లో ఎగువనే ఈ నీటిని తీసుకుంటాయి. మిగిలిన 45 టీఎంసీలలో తెలంగాణ వాటా కోరితే కొత్త వివాదం వస్తుంది. 7(ఎఫ్) ఏం చెబుతుందంటే.. 80 టీఎంసీలకు మించి గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిలోనూ ఇదే దామాషాలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఎగువ రాష్ట్రాలకు తాను చెబితే తప్ప తెలియదని చంద్రబాబు అంటారు. గోదావరి ట్రిబ్యునల్ రూల్స్ వారికి తెలియవా? కృష్ణా, గోదావరి బోర్డుల దగ్గరకు పోయినప్పుడు ఈ అంశం చర్చకు రాదా? ప్రాజెక్టు వివాదంలోకి పోదా? సంజీవని లాంటి పోలవరం వల్లనే రాయలసీమకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాయలసీమపై ప్రేమ కాదు.. నాటకాలు.... ‘రాయలసీమ మీద ప్రేమ ఉందా’ అని చంద్రబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పట్టిసీమ కట్టేటప్పుడు చెప్పా. ‘జీవో నెంబరు 1లో రాయలసీమకు నీళ్లిస్తానని, కృష్ణా ఆయకట్టుకు నీళ్లిస్తానని రాశారా?.. కేపిటల్ సిటీకి డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్’ అని పేర్కొన్నారు. . పోలవరం ముద్దు.. పట్టిసీమ వద్దు అని చెప్పడానికి ఇన్ని కారణాలు చెప్పాం’’ అని జగన్ పునరుద్ఘాటించారు. -
అసెంబ్లీయే అఖిలపక్షం!
సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు చేస్తున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాసనసభ సమావేశాలను వేదికగా మార్చుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. ఈనెల 23 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈసారి సమావేశాలు ఆరు రోజుల పాటు జరిపే అవకాశం ఉంద ంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ (రీ డిజైనింగ్)కు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం, దేవాదుల రీడిజైనింగ్ వంటి అంశాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వివరించడం కంటే... అసెంబ్లీ సమావేశాలు వేదికగా ఆయా ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదులపై జరిగిన జల దోపిడీ మొదలు ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ఆవశ్యకత వరకు నేరుగా అసెంబ్లీలో వివరించడానికి కసరత్తు మొదలుపెట్టారు. -
లక్ష్యం రూ. లక్ష కోట్లు!
సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ అవసరాలు రూ.1,03,051 కోట్లు ♦ ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ♦ 2018-19కి రూ. 55,931 కోట్లు అవసరం ♦ తర్వాతి మూడేళ్లలో రూ.47,120 కోట్లు కావాలి ♦ 2021-2022కి పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండనున్నాయో వెల్లడైంది. ప్రాధాన్యతా క్రమంలో ఏయే ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేసేది, వాటికి అవసరమైన నిధులు ఏ రీతిన ఖర్చు చేయనున్నది ప్రభుత్వం ఇటీవల ప్రపంచ బ్యాంకు ముందు పెట్టిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి రూ. 1.03 లక్షల కోట్లు అవసరమని నివేదికలో తెలిపిన ప్రభుత్వం... తమ ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసేనాటికి (అంటే 2018-19 ఆర్థికసంవత్సరం నాటికి) సుమారు రూ. 55,931 కోట్లు అవసరమని, మిగతా రూ. 47,120 కోట్లు తర్వాతి మూడేళ్లకు వెచ్చించాల్సి ఉంటుందని వివరించింది. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు రుణాలు మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకుకు అర్జీ పెట్టుకుంది. ప్రభుత్వ గడువు ముగిసే నాటికి ‘పాలమూరు’ పూర్తి మూడో వంతే... రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో 12 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు కొత్తగా చేపడుతున్న పాలమరు-రంగారెడ్డి, నక్కలగండి, మార్పులతో చేపట్టనున్న ప్రాణహిత-చేవెళ్ల, నాగార్జునసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ, మిషన్ కాకతీయ, ఇతర పథకాలకు కలిపి మొత్తంగా రూ.1,03,051 కోట్ల అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో నిర్మాణంలో ఉన్న 25 ప్రాజెక్టులకు రూ. 9,849 కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేయగా.. కొత్త ప్రాజెక్టులకే రూ. 93,202 కోట్లు అవసరమని లెక్కకట్టింది. ఇందులో ప్రధానంగా పాల మూరు ఎత్తిపోతలకు రూ. 35,200 కోట్లు, ప్రాణహిత-చేవెళ్లకు రూ. 35,000 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 10,430 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఇందులో పాలమూరు, ప్రాణహిత-చేవెళ్ల పథకాలను 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ప్రపంచ బ్యాంకుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం వివరించింది. ఇందులో ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి పాలమూరుకు రూ.13,400 కోట్లు, తర్వాతి మూడేళ్లలో 2021-22 నాటికి మరో రూ. 21,800 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంటే ఆ సమయానికి పాలమూరులో మూడోవంతు పనులే పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్లలో సైతం ఆ గడువు ముగిసేనాటికి రూ. 17 వేల కోట్లు, ఆ తర్వాత మిగతా రూ. 18 వేల కోట్ల పనులు జరిగే అవకాశం ఉంది. నక్కలగండిని మాత్రం 85% పనులు పూర్తి చేసేలా నిధుల కేటాయింపులను నివేదికలో ప్రభుత్వం చూపింది.సాగుకు మున్ముందు భారీ బడ్జెట్! సాగునీటిపారుదల రంగానికి మున్ముందు భారీ బడ్జెట్లు ఉండనున్నట్లు ప్రభుత్వ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు పెట్టిన 2 బడ్జెట్లలో ఒకసారి రూ. 6,500 కోట్లు, రెండోసారి రూ. 8,675 కోట్లు కేటాయించగా 2016-17 నుంచి 17-18, 18-19 బడ్జెట్లకు వరుసగా రూ. 13,931 కోట్లు, రూ. 17,674 కోట్లు, రూ. 15,651 కోట్లు ఉండనున్నట్లు తెలిపింది. ఇక మిషన్ కాకతీయకు 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తంగా రూ.8 వేల కోట్ల మేర ఖర్చు చేయనుం డగా బడ్జెట్లో ఏటా రూ. రెండువేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి. -
సాగుతూ..ఆగుతూ..
ఆశించిన స్థాయిలో పడని వరినాట్లు జలాశయాల పరిధిలో 20శాతమే ఆందోళన కలిగిస్తున్న ఖరీఫ్ అధికారుల లెక్కలు మాత్రం వేరు విశాఖపట్నం: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి మట్టాలు లేకపోవడంతో వాటి పరిధిలోని ఆయకట్టులో వరినాట్లు ముందుకుసాగడంలేదు. పరీవాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. నీటిపారుదలశాఖ అధికారుల లెక్కల ప్రకారం 20శాతానికి మించలేదు. వర్షాధార ప్రాంతంలో మాత్రం 90 శాతం మేర నాట్లు పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సీజన్ ముగుస్తున్నా..నాట్లు పూర్తికాకపోవడంతో ఈ ప్రభావం దిగుబడిపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వరిసాగు లక్ష్యం 2.65లక్షల ఎకరాలు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 75,762 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 2.86లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 1.25లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టాలి. వర్షాధారంగా 65,233 ఎకరాల్లో నాట్లు వేశారు. తాండవప్రాజక్టు పరిధిలో ప్రస్తుతం 6.60 టీఎంసీల నీరు ఉంది. 496 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 32,689 ఎకరాల ఆయకట్టు ఉండగా..నీరు విడుదల చేయకముందే వర్షాధారంగా సుమారు రెండువేలఎకరాల్లో నాట్లు వేశారు. రైవాడ, కోనాం, పెద్దేరు పరిధిలో 42,873 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 22,420 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇక మైనర్ ఇరిగేషన్ పరిధిలో 2,86,538 ఎకరాల ఆయకట్టుకు కేవలం 57,605 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇప్పటి వరకు 80 శాతం విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖాధికారులు చెబుతుంటే..60 శాతం మేర మాత్రమే నాట్లుపడ్డాయని క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించే ముఖ్యప్రణాళికావిభాగం అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులు, సాగునీటి వనరుల పరిధిలో కేవలం 20శాతం విస్తీర్ణంలోనే నాట్లు పడ్డాయని ఇరిగేషన్ అధికారులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. ఎవరి లెక్కలు వాస్తవమో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. -
చురుగ్గా సాగునీటి ప్రాజెక్టుల పనులు
భీమడోలు : రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి వెళుతూ శనివారం భీమడోలులోని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇంటి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 491 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వదిలేశామన్నారు. రాష్ర్టంలో 47.8 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించున్నామని చెప్పారు. సగటున రోజుకు 2 నుంచి 3 టీఎంసీల గోదావరి నీరు వృథాగా పోతోందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలనేది పోలవరం, పట్టిసీమ ప్రొజెక్టుల నిర్మాణం ప్రధాన ఉద్దేశమన్నారు. గోదావరి వరద నీటిని కృష్ణా ఆయకుట్టుకు మళ్లించి, ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే కృష్ణా వరదనీటిని శ్రీశైలం, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రొజెక్టుల ద్వారా రాయలసీమకు మళ్లిస్తామన్నారు. దీనిద్వారా కొంతమేరైనా సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు పూర్తి స్థాయిలో తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తర్వాతే కృష్ణా ఆయుకట్టుకు నీటిని మళ్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు, కంట్రాక్టర్ల సమన్వయంతో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ కె.భాస్కర్, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు. ఆయిల్ పైపులైన్ నిర్మాణం పరిశీలన దేవరపల్లి(గోపాలపురం): గోపాలపురం మండలం భీమోలు వద్ద జరుగుతున్న గెయిల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ పైపులైన్ నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పరిశీలించారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు సుమారు 15 ఏళ్ల క్రితం ఆయిల్ పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయిల్‌ను పంపింగ్ చేస్తున్నారు. పైపులైన్ పోలవరం కాలువ తవ్వకానికి అడ్డుగా ఉండటం వల్ల ఇటీవల తొలగించి కాలువ అడుగుభాగం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భీమోలు నుంచి గోపాలపురం వరకు సుమారు 3 కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.