rayala telangana
-
ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి ప్యాకేజీలే గతి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక హోదా కోరుకోవడంలో తప్పేమీ లేదని, అయితే కేంద్రం మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదని జేసీ సోమవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను... రాయల తెలంగాణ కోరితే ఎవరు మద్దతు ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ నిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
కావూరి మూడు షరతులు
-
పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి
తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తేనే తాము ఆమోదిస్తామని, లేని పక్షంలో మళ్లీ వెల్‌లోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండు చేశారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు కూడా భాగం ఇవ్వాలని కావూరి అడిగారు. ఈ సవరణలకు అంగీకరించని పక్షంలో తాము మరింతగా ఆందోళన చేయడం ఖాయమని ఆయన చెప్పారు. -
రాయల తెలంగాణకు కావూరి మొగ్గు!
-
కర్నూలు, అనంత జిల్లాలను తెలంగాణలోనే ఉంచండి
ఏలూరు: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వెంటాడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఏలూరులో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇటీవల చింతలపూడిలో జరిగిన కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. దాంతో కావూరి పర్యటనకు పోలీసులు భారీగా మోహరించారు. తానెప్పటికీ సమైక్యవాదినే అంటూ కావూరి ...మరోసారి సమైక్యవాదులను తన మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసుండాలనే కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తప్పనిసరై రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భద్రాచలంను ఆంధ్రాలో కలపాలని కావూరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పర్యవేక్షణలో హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ బిల్లులో కచ్చితంగా మార్పులుంటాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి వస్తే అందులో తాను భాగస్వామిని కాలేనని కావూరి చెప్పారు. రాజీనామా చేయటమా? గైర్హాజరు కావటమా అనేది అప్పుడే నిర్ణయించుకుంటానని కావూరి తెలిపారు. -
అసెంబ్లీలో రాయలతెలంగాణపై కూడా చర్చ
హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) చర్చకు రానున్న నేపధ్యంలో రాయల తెలంగాణ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. హొటల్ సెంట్రల్ కోర్టులో ఈ సాయంత్రం రాయలసీమ కాంగ్రెస్ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రి సి.రామచంద్రయ్య రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. ఈ సమావేశంలో రాయలతెలంగాణపై చర్చిస్తారు. -
నేడు YSR కాంగ్రెస్ శాసనసభ పక్షం భేటీ
-
తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి:జైపాల్ రెడ్డి
ఢిల్లీ: దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బిల్లు శీతాకాల సమావేశాల్లోపే పార్లమెంట్ ముందకు వస్తుందని జైపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ అనేది అక్కడి ప్రజలకు, ఇక్కడి ప్రజలకు మంచిది కాదని గతంలో వ్యాఖ్యానించిన జైపాల్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనంతపురం, కర్నూలు జిల్లాలకు నదీజలాల విషయంలో అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. -
జైరాం రమేష్ వెకిలి నవ్వు
-
ఎక్కడా తెరుచుకోని దుకాణాలు
-
తెలంగాణ బంద్ సంపూర్ణం
బోసిపోయిన పది జిల్లాలు.. హోరెత్తిన నిరసనలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాలన్నీ తెలంగాణవాదుల ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంకులు, సినిమాహాళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లు కూడా బంద్ పాటించడంతో ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపించాయి. రైల్వేస్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ తగ్గింది. టీజేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, విద్యార్థి, ప్రజా, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. బొగ్గు గనుల్లో కార్మికులు విధులకు గైర్హాజరవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ వైద్యుల జేఏసీ నిరసనలతో ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్లో సోనియా ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేయగా, తెలంగాణవాదులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జహంగీర్ పీర్ దర్గాలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యేకప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గన్‌పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడంతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. -
బంద్ సక్సెస్
ఖమ్మం, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ జేఏసీ పిలుపులో బాగంగా గురువారం తలపెట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు సంతకాలు చేసి బయటకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, అనుబంధ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, వైరా, మధిరతోపాటు అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మానవహారాలు చేపట్టారు. కళాకారులు ఆటాపాటలతో ప్రదర్శనలు చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌తో నిత్యం జనసందోహంతో ఉండే ప్రధాన వీధులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంక్‌లు, బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తెల్లవారుజామున 4 గంటలకే బస్‌డిపోల వద్దకు చేరుకున్న ఉద్యమకారులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఒక్క బస్సుకూడా రోడ్డెక్కలేదు. బస్ డిపోలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఖమ్మంలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని షాపులు, వ్యాపార కూడళ్లను మూయించి బంద్‌ను జయప్రదం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ డిపోకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు, బ్యాంక్‌లు తెరుచుకోలేదు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ప్రరద్శన నిర్వహించి జడ్పీసెంటర్‌లో భారీ మానవహారం నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎస్కె.ఖాజామియా, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. కొణిజర్లలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయించారు. మండల అధికారులు బంద్‌కు మద్దతు పలికారు. జూలూరుపాడులో టీఆర్ఎస్ కార్యకర్తలు అరగుండుతో నిరసన తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో టీజేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్, బైక్ ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురంలో వీకేడీవీఎస్ఆర్ కళాశాల బస్సును యువకులు అడ్డుకున్నారు. దమ్మపేటలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు బంద్ పాటించారు. కుక్కునూరు, ముల్కలపల్లి, వేలేరుపాడు, చండ్రుగొండ మండలాల్లో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా భద్రాచలంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. దుమ్ముగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి ప్రత్యేక తెలంగాణా ఇప్పించాలంటూ పర్ణశాల రాముడి వద్ద వినతిపత్రం ఉంచారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. సినిమాహాళ్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పెట్రోల్‌బంక్‌లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొత్తగూడెంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సూపర్‌బజార్ సెంటర్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో సింగరేణి గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. పాల్వంచలో ఏపీ జెన్కో, జేఏసీ ఆధ్వర్యంలో కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మధిర నియోకవర్గంలోని మధిర, బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. మధిరలో రాయల తెలంగాణను నిరసిస్తూ టీఆర్ఎస్, బీజెపీ, ఎమ్మార్పీఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు మూసివేయించారు. పాలేరు నియోజకవర్గంలో బంద్ సందర్భంగా గురువారం తెలంగాణావాదులు రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో టీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేట చౌరస్తాలో టీజేఏసీ, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నాయకన్‌గూడెంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నేలకొండపల్లిలో బీజేపీ,టీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఇల్లెందులో హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు మూసివేశారు. టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, టీఆర్ఎల్డీ, పీడీఎస్‌యూ, ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టీఆర్ఎస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఇతర జేఏసీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. అనంతరం మండలంలోని సారపాక, బూర్గంపాడులలో ధర్నా రాస్తారోకో చేశారు. -
రాయల రగడతో ఆగిన గుండెలు
కరీంనగర్ జిల్లాలో ఇద్దరి మృతి హుస్నాబాద్/ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో మనస్తాపం చెంది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సారయ్య(40), ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన పైతరి రామయ్య(58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. సారయ్య బుధవారం రాత్రి తన ఇంట్లో టీవీల్లో వస్తున్న రాయల తెలంగాణ వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాజయ్య సైతం ఇదే తరహా తుదిశ్వాస విడిచాడు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించేవారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంద్ సక్సెస్
-
సీడబ్ల్యూసీ తీర్మానానికే కట్టుబడండి
ప్రధానిని కోరిన టీ కాంగ్రెస్ ఎంపీలు పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నాం: టి. జేఏసీతో సుష్మా సాక్షి, న్యూఢిల్లీ: మంత్రుల బృందం(జీవోఎం) రాయల తెలంగాణకు సిఫార్సు చేసిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేష్ శెట్కార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి ఓ మెమొరాండాన్ని సమర్పించారు. రాయల తెలంగాణ వల్ల పార్టీకి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందన్న వాదన సరికాదని చెప్పినట్లుగా సమాచారం. సీడబ్ల్యూసీ తీర్మానానికి కట్టుబడి పదిజిల్లాల తెలంగాణకే కేబినెట్లో ఆమోదం తెలపాలని ప్రధానికి విన్నవించారు. తమ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఎంపీలు తెలిపారు. అంతకుముందు వారు అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నం చేసినా వీలుపడకపోవడంతో దూరం నుంచే ఆమెకు నమస్కరించి వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు ఒప్పుకోం సుష్మా రాయల తెలంగాణకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణ జేఏసీ నేతలకు స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు. గురువారం జేఏసీ నేతలు కోదండరాం, దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, అమిద్ మహ్మద్ ఖాన్లు పార్లమెంట్‌లోని బీజేపీ కార్యాలయంలో సుష్మాను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆమెను కోరారు. ప్రజలు కోరుకున్న తెలంగాణకే తమ మద్దతు ఉంటుందని సుష్మా చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆమె స్పష్టం చేసినట్లు జేఏసీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగానే కొందరు నేతలు ఆమెను తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నపుడు.. బీజేపీ గెలుస్తుందంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా, పరిశీలిస్తాం అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు జేఏసీ నేతలు చెప్పారు. అనంతరం టీ జేఏసీ నేతలు కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. గాంధీ విగ్రహం వద్ద వివేక్, వినోద్ బైఠాయింపు రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎంపీ వివేక్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. సుమారు అరగంటపాటు అక్కడ కూర్చుని రాయల తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
బంద్ ఉద్రిక్తం.. సంపూర్ణం
కరీంనగర్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణను తెరపైకి తేవడానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీజేఏసీ, తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజాఫ్రంట్తోపాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, బార్ అసోసియేషన్లు బంద్‌కు మద్ద తు తెలిపాయి. ఆర్టీసీ కార్మికులు బంద్‌కు జైకొట్టడం తో జిల్లాలోని 11 డిపోల్లో 950 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించాయి. జిల్లా కోర్టు వద్ద ప్రధాన గేట్లుమూసి తాళాలు వేసి న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి కార్మికులు బంద్‌లో పాల్గొనడంతో కొంతమేర ఓపెన్కాస్టులతోపాటు భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్ తదితరులు బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. నగరంలో ర్యాలీగా తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఓవైపు బంద్ జరుగుతుంటే.. మరోవైపు కరీంనగర్ సింగిల్‌విండో చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకున్న గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు నేతలు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగి ఎన్నికలను వాయిదా వేయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణచౌక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసిన సోనియాగాంధీ గుడిని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీజేపీ నాయకులు కన్నం అంజయ్య, నారాయణరావు, మహిళా నాయకులు సుజాతారెడ్డి, గాజుల స్వప్న, న్యూడెమోక్రసీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్ తదితరులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు తెలంగాణవాదులకు వాగ్వివాదం, తోపులాట జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీజేపీ నాయకులు కన్నం ఆంజయ్య, నారాయణరావు, మహిళ నేతలు గాజుల స్వప్న, ప్రసన్న, సుజాతరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌తోపాటు మరో 20 మంది ఆదుపులోకి తీసుకొని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరిలించారు. ఆరెస్టు చేసిన బీజేపీ, సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ టుటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ, సీపీఐ, జేఏసీ చైర్మన్ వెంకట మల్లయ్య, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సోనియాగాంధీ గుడిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కన్న కృష్ణ, సునీల్‌రావు, డి.శంకర్లతోపాటు కార్యకర్తలు తెలంగాణ చౌక్‌కు చేరుకొని బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ నాయకుడు ఎడ్లవెల్లి విజేందర్‌రెడ్డి తన కార్యకర్తలతో బైక్ ర్యాలీగా రావడంతో ఒక్కరిపై ఒక్కరు నినాదాలు చేసుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సోనియా గుడిని ధ్వంసం చేయడంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుతుండగా అటుగా బండి సంజయ్ బైక్ ర్యాలీగా రావడంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ ఉన్న పోలీసులు వారిని పంపించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ప్రధానకూడళ్లలతోపాటు బస్టాండ్ చౌరస్తాలోని శ్రీపాద విగ్రహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌లతోపాటు పలు కులసంఘాల నాయకులు ర్యాలీలతో హోరెత్తించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కేంద్రప్రభుత్వం, జీఓఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ రాష్ర్ట నేతలు ఎస్.కుమార్, బల్మూరి వనిత, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, కోరుకంటి చందర్, హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ ఇన్చార్జి ఒడితెల సతీష్‌బాబు, కర్ర శ్రీహరి, పన్యాల రమణారెడ్డి, మానకొండూరు టీఆర్ఎస్ ఇన్చార్జి ఓరుగంటి ఆనంద్, జీవీ.రామకృష్ణారావు, శరత్‌రావు, పెద్దపల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి, చొప్పదండిలో బొడిగె శోభ, జగిత్యాలలో ఓరుగంటి రమణారావు, జితేందర్‌రావు, మంథనిలో చందుపట్ల రాంరెడ్డి, సునీల్‌రెడ్డి పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు. -
‘రాయల’ తెలంగాణ అంటే యుద్ధమే
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ అంటే టీఆర్ఎస్ మరో యుద్ధం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బంద్‌లో భాగంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో తెల్లవారు జామున 5 గంటలకే జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ముందు బైఠాయించి, బస్సులను బయటికి రాకుండా ధర్నా చేశారు. ఆ తర్వాత పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీయే విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్రుల దోపిడీని శాశ్వతంగా కొనసాగించేందుకు రాయల ప్రతిపాదనను కాంగ్రెస్ చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు, భూములను కాపాడుకోవడానికి సీమాంధ్రులు ఎంతకైనా తెగిస్తున్నారని, అందులో భాగమే రాయల తెలంగాణ అని అన్నారు. నీటి దోపిడీని సాగించేందుకు కేంద్రంపై సీమాంధ్రులు వత్తిళ్లు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కేంద్ర రాయల తెలంగాణ ప్రకటిస్తే టీఆర్ఎస్ మరో మహోద్యం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాయల తెలంగాణతో కేంద్ర ముందుకు వస్తే టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పి కొట్టాలని, అందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలను తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు పి.చంద్రశేఖర్, సయ్యద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటి దోపిడీని చట్టబద్ధం చేసేందుకే రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బంద్ విజయవంతమైందని, బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బెక్కం జనార్దన్, మహబూబ్, గుండా మనోహర్, నాగరాజు, కృష్ణముదిరాజ్, మోసిన్‌ఖాన్, మిట్టేనర్సింహ్మ, గౌతంశ్రీను, కిరణ్ పాల్గొన్నారు. -
బంద్ స్వచ్ఛందం
పాలమూరు, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం జిల్లాలో బంద్ స్వచ్ఛందం, సంపూర్ణంగా కొనసాగింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, టీజేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు కొనసాగాయి. ముందస్తుగా బంద్ పాటించాలని నిర్ణయించిన మేరకు అన్ని విద్యాసంస్థలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోలు బంక్‌లు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తెల్లవారుజామున టీఆర్ఎస్ శ్రేణులు మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు రాకుండా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ముందుండి నడిపించారు. రాయల తెలంగాణ అంటూ ప్రజాస్వామ్యానికి కేంద్రం సంకెళ్లు వేసిందని ఏబీవీపీ నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అలాగే బంద్‌లో భాగంగా పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జాగృతి, టీసీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఓవైసీకి సెగ..! ఎంఐఎం ముఖ్య నాయకుడు చంద్రాయన్‌గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ సెగ తగిలింది. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేకప్రార్థనలు చేసిన ఆయన దర్గా నుంచి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా తెలంగాణవాదులు భారీసంఖ్యలో ఆయనను చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. దూస్కల్ మీదుగా బైపాస్ రోడ్డుకు చేర్చడంతో హైదారాబాద్‌కు చేరుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కొడంగల్, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌లో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, బీజేపీ, జేఏసీ, సీపీఐ, ఎంఎస్ఎఫ్ నాయకులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముఖ్యకూడలిలో మానవహారం నిర్వహించారు. వనపర్తి పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, టీజేఏసీ ప్రతినిధులు ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. అలాగే జడ్చర్లలో వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, కార్యాలయాలు, పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఉదయం ఎనిమిది బస్సులను అడ్డుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు పట్టణంలో మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఎక్కడి బస్సులు అక్కడే మహబూబ్‌నగర్ అర్బన్ : తెలంగాణ బంద్‌లో భాగంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుతో జిల్లాలో ఆర్టీసీ బస్సులకు బ్రేకులు పడ్డాయి. గురువారం జిల్లాలోని ఎనిమిది డిపోల్లో సుమారు 800 బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజు రూ.70లక్షల నష్టం వాటిల్లింది. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు, సభ్యులు సంతకాలు కూడా చేయకుండా రాయల తెలంగాణ పట్ల తీవ్ర నిరసన తెలిపారు. కాగా తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు మాత్రం విధులకు హాజరైనట్లు సంతకాలు చేసినా బస్సులను బయటికి రాకుండా ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారంతా డిపోలోనే గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణికులు, బస్సులు రాకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు, తెలంగాణ విద్యార్థి , ప్రజాసంఘాలు తెల్లవారుఝామునే డిపో ఎదుట బైటాయింపు చేశారు. -
పది జిల్లాల తెలంగాణాకే కేబినెట్ ఆమోదం
10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు... కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఆర్టికల్ 3కింద బిల్లు ఆమోదం పొందింది కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి వెళ్తుంది 10ఏళ్ల ఉమ్మడి రాజధానిగా జీ హెచ్ఎంసీ 371(డి) రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది ఉన్నత విద్య అడ్మిషన్లలో ఇప్పుడున్న విధానమే.. 10ఏళ్లపాటు కొనసాగుతుంది పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే గవర్నర్ చేతిలో జీ హెచ్ఎంసీ శాంతిభద్రతలు రాష్ట్ర విభజన అంశంపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర కేబినెట్ సమావేశం రాత్రి 8 గంటలకు ముగిసింది. కేంద్ర కేబినెట్ సమావేశంపై హోమంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. సుధీర్ఘంగా సాగిన సమావేశంలో కేంద్రం కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. షిండే మాట్లల్లో.. ''కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రవిభజనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ కేబినెట్ నిర్ణయం మేరకు 10 జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలిపింది. జీవోఎం, 18 వేల ఈమెయిల్స్, అన్ని పార్టీలను ఆహ్వానించాం. అన్ని మంత్రవర్గ కార్యదర్శిలతో మేం చర్చించాం. ముఖ్యమంత్రి, డిప్యూటి సీఎం, రాష్ట్ర మంత్రులతో మంత్రులతో భేటి నిర్వహించాం. అన్ని అంశాలను చర్చించాకే జీవోఎం సిఫారసుల మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును జీవోఎం సిఫారసు మేరకు కేంద్రం ఆమోదించింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటుందని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉమ్మడి రాజధాని ఉంటుంది. ప్రజల భద్రతకు తెలంగాణ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలుంటాయి. ఆర్టికల్ 3 కింద బిల్లు ఆమోదం పొందుతుంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పిస్తాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యతను కేంద్రం స్వీకరిస్తుంది. 371 డి రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. రెండు రాష్రాల అభివృధ్దికి కేంద్ర సహాయం అందిస్తుంది'' అని షిండే కిక్కిరిసిన మీడియా సమావేశంలో అన్నారు. -
'రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుంది'
హైదరాబాద్ : కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని తెలంగాణవాదులు గ్రహించాలని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇప్పుడు విభజన జరగకపోతే మరెప్పటికీ జరగదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు లేక కర్నూలు, అనంతపురం నష్టపోతామనే ఆవేదనతోనే రాయల తెలంగాణ అంటున్నామని మధుసూదన్ గుప్తా అన్నారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పడితే శ్రీశైలం ప్రాజెక్ట్ సమస్యాత్మకం అవుతుందన్నారు. రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుందని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం కోసం పోరాడే పరిస్థితులు వస్తాయని మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు సమైక్యవాద పార్టీలకే పట్టం కడతారని ఆయన అన్నారు. -
'మీరు12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తాం'
న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం చిదంబరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాయల తెలంగాణా? అదెక్కడుంది? అని ప్రశ్నించారు. పది జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోదం తెలిపిందని.... అయితే మీరు 12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తామని ఆయన మీడియాపై ఎదురుదాడికి దిగారు. రాయాల తెలంగాణపై మీడియాలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో దిగ్విజయ్ సింగ్.... జీవోఎం సభ్యుడు జైరాం రమేష్, నారాయణ స్వామితో భేటీ అయ్యారు. -
'రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ నైజం'
రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ... రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఆయన పేర్కొన్నారు. ఓ రోజు తెలంగాణ, మరో రోజు రాయల తెలంగాణ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగనాటకాలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
ఓయూలో తీవ్ర ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు
రాయలతెలంగాణ ప్రతిపాదనకు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్శిటీ ప్రాంగణంలో గురువారం కదం తొక్కారు. అందులోభాగంగా యూనివర్శిటీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఎన్సీసీ గేట్ వద్ద ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆగ్రహంతో ఉగిపోయారు. ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. దాంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్న దశలో పోలీసులు రెండు సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం కూడా ఉస్మానియా విద్యార్థులు ఓయూలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో వారిని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఓయూలో భారీగా పోలీసులు,భద్రత బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. -
రాయల తెలంగాణపై ఆజాద్ వెనకడుగు!
న్యూఢిల్లీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనలు వెల్లువెత్తటంతో పది జిల్లాల తెలంగాణ వైపే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జీవోఎం సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణపై వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడే పది జిల్లాల తెలంగాణకే సిపార్సు చేయాలని ఆయన... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి ప్రతిపాదించారు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న ఆజాద్ ఈమేరకు ఫోన్లో షిండేతో మాట్లాడినట్లు తెలుస్తుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రత్యామ్నాయంగానే చూడాలని ఆయన షిండేకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తే రాయల తెలంగాణకు మొగ్గు చూపవచ్చని చెప్పినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్‌కు నిన్న జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్‌గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే ఈరోజే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. -
తెలంగాణ అంతటా బస్సుల బంద్
-
స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండమే: హరీష్‌రావు
నేటి సాయంత్రంలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖుత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ ఓ రోజు బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో హరీష్‌రావు మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయలతెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేస్తామని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ పుటకోమాటమారుస్తుండటం పట్ల హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాని ఇతర ప్రాంతాలను తెలంగాణలో కలిపితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. -
తెలంగాణ మాత్రమే కావాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రాయల తెలంగాణ మాకొద్దు... తెలంగాణ మా త్రమే కావాలి’ అంటూ జిల్లా ప్రజానీకం నినదించింది. ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తా రా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెదక్‌లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. డైట్ కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, నర్సాపూర్ తదితర మండల కేంద్రాల్లో విద్యార్థులు ర్యాలీలు తీశారు. పటాన్చెరులో జరిగిన ర్యాలీలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. జహీరాబాద్‌లో తొమ్మిదో నంబరు జాతీయ ర హదారిపై, నారాయణఖేడ్‌లో రాజీవ్ చౌక్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. జోగిపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్ ప్రధాన వీధుల్లో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. చేగుంటలో జరిగిన నిరసన ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. బంద్‌కు సన్నాహాలు పార్టీ పిలుపు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగే బంద్‌ను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం జరిగే బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం జరిగే బంద్ టీజేఏసీ భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ వెల్లడించారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పాల్గొనాల్సిందిగా సీపీఐ పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తు సెలవు ప్రకటించాయి. మరోవైపు బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
‘రాయల’తో ఫ్యాక్షన్ విజృంభిస్తుంది
పటాన్చెరు, న్యూస్‌లైన్: ‘రాయల తెలంగాణ ఏర్పడితే ఫ్యాక్షన్ విజృంభిస్తుంది. హైదరాబాద్‌లో ఫ్యాక్షనిస్టులు పెరిగిపోయి ఫ్యాక్షన్‌కు వేదికవుతుంది. ఇప్పటికే చంచల్‌గూడ జైలు వారితోనే నిండిపోయింది. నాకు తెలిసి ఆ జైల్లో ఈ ప్రాంతం వారెవరూ లేరు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం ఆయన పటాన్చెరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ అధ్వర్యంలో జరిగిన మెదక్ జిల్లా వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి తెలంగాణపై నాటకాలాడుతోందన్నారు. తాము హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాయలసీమ ప్రాంతంలోని రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామంటున్నారనీ, ఒకవేళ అదే జరిగితే తాము అధికారంలోకి రాగానే ఆ రెండు జిల్లాలను తొలగించి ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్నారు. అదే సమయంలో రాయలసీమ ఆత్మగౌరవం కోసం కూడా పరిష్కారం చూపుతామన్నారు. రాయల తెలంగాణ అంటున్న కాంగ్రెస్‌ది కమ్యూనల్ ఎజెండాగా ఉందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ రాయల తెలంగాణ నాటకానికి తెరతీసిందన్నారు. మజ్లీస్‌ను దేశవ్యాప్త కార్యకర్తలుగా వాడుకునేందుకు ఓ వర్గం ఓట్ల కోసమే రాయల తెలంగాణ ఏర్పాటును యోచిస్తున్నారన్నారు. పది జిల్లాల తెలంగాణతో పాటు రాయలసీమలోని ఆ రెండు జిల్లాలను కలిపితే ముస్లిం ఓట్లు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ‘రాయల’ ప్రతిపాదన చేస్తున్నారన్నారు. నెహ్రూ అనుసరించిన విధానాన్నే ఇప్పటికీ కాంగ్రెస్ అవలంభిస్తోందన్నారు. నిజాంతో ఆనాటి నెహ్రూ స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్(యథాతథ స్థితి) చేసుకున్నట్లే మజ్లిస్‌తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనల్ ఎజెండాతో పోతుందని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పడితే ఆర్టీసీ మూతపడుతుందనీ, ఆ సమయంలో బస్సులు తిప్పి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆలోచనతోనే జేసీ దివాకర్‌రెడ్డిలాంటి వారు ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నారన్నారు. -
రాయల గీయల జాన్తానై
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ప్రజాసంఘాలు, రాజకీయ జేఏసీ తీ వ్రంగా ధ్వజమెత్తాయి. జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా శాఖ పిలుపునిచ్చిన గురువారం బంద్‌ను విజయవంతం చేయాలని ఆయాసంఘాలు మద్దతు పలికాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, థియేటర్ల యజమానులు, పెట్రోల్‌బంకులు, మార్కెట్ల యజమాన్యం బంద్‌కు సహకరించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. జిల్లాబంద్‌కు రాజకీయ జేఏసీ, వివిధ సంఘాలు, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, రైతు, లెక్చరర్ల సంఘాలు బంద్‌లో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ సంఘాలు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జిల్లా బంద్‌కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. రగిలిన ఇందూరు.. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన ప్రదర్శనలు, ఆందోనళలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, మానవహారాలు కొనసాగాయి. నిజాంసాగర్ మండలం హాసన్‌పల్లిలో పీజీడీసీఏ విద్యార్థి మొకిరె రాములు సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని కోరుతూ సోనియాకు లేఖ రాసి ఆత్మహాత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు, తెలంగాణవాదులు ధర్నా, రాస్తారోకో, నిరసన ర్యాలీ చేపట్టి, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మృతుడు రాములు ఆత్మహత్యకు ముందు అమ్మనాన్నలకు , కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పుతూ రాసిన లేఖ తెలంగాణవాదులను తీవ్రంగా కదిలిం చింది. జిల్లాలో న్యాయవాదులు రెండోరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో కూడిన శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. ఎల్లారెడ్డిలో మూడువేల మంది విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు, దిష్టిబొమ్మల ను దహనం చేశారు. బాన్సువాడ, కామారెడ్డిల్లో జరిగి న నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్‌రావు పాల్గొన్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మె ల్యే గంపగోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ యూనివర్శిటీలో విద్యార్థులు రాయల తెలంగాణకు వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. -
రాయల‘టీ’ రాజకీయమే!
ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినపడకుండా నిరో ధించేందుకు కూడా రాయల తెలంగాణ అస్త్రం ఉపకరిస్తుందని అధిష్ఠానం నమ్మకం. రాయల తెలంగాణ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు హోంశాఖ వర్గాలే చెప్పడం ఈ వాదనలకు బలం కలిగిస్తోంది. రాయల తెలంగాణ ప్రతిపాదన గత కొంతకాలం కిం దటే రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ నేతలు తీసుకురాగా సీమ ప్రజానీకం ఆ ప్రతిపాద నను అప్పుడే ఒక జోక్ కింద కొట్టిపారేసింది. కొందరు నిర్ద్వందంగా ఖండించారు. మరికొందరైతే ఆ నేతలపై దుమ్మెత్తిపోశారు. అంతటితో సద్దుమణగవలసిన ఆ ప్రస్తా వన ఇటీవల తరుచూ తెరపైకి రావడం రాయలసీమ చరి త్రను అధ్యయనం చేసినవారికి మింగుడు పడటం లేదు. రాయలసీమ అస్థిత్వానికే ముప్పుగా పరిణమించే ఈ ప్రతి పాదనను సీమవాసులతోపాటు ఏ రాజకీయ పార్టీ కూడా స్వాగతించలేదు. రాయల తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కాలమే తెర వెనక్కి నెట్టివేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాను రూపొందించేం దుకు ఏర్పాటైన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్) 11 అం శాలను రూపొందించి వాటిపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. తెలుగుదేశం మినహా మిగతా పార్టీలన్నీ జీఓఎం ముందు హాజరై తమ అభిప్రా యాలను వివరించాయి. మజ్లిస్ పార్టీ రాయలసీమ మొత్తం కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్ర మే తెలంగాణలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవల సిందిగా కోరటం గమనార్హం! ఇది ఆ రెండు జిల్లాలకు చెం దిన కొందరు అధికార పక్ష నేతలు చేస్తున్న ప్రతిపాదనకు నకలే. గతంలోనూ ఒకసారి మజ్లిస్ రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చింది. కానీ ఇప్పటిలా సీమ భూభాగాన్ని విభజించి రెండు జిల్లాలనే తెలంగాణలో కలపాలని చెప్ప లేదు. ఈ మార్పు మాట ఎలా ఉన్నా మజ్లిస్ మొత్తంగా చూస్తే రాష్ర్ట సమైక్యతనే కోరుకుంటోంది. హైదరాబాద్‌ను యూటీని చేస్తే ముస్లిం మైనారిటీలకు సమస్యలు తలెత్తు తాయనీ, అందువల్లే యూటీ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని నాయకులు చెప్పారు. రాయలసీమలోని ఈ రెండు జిల్లాలలో ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్నారని ఈ జిల్లాలను తెలంగాణలో కలిపితే మైనారిటీల పరిస్థితి మెరుగ్గా ఉంటుందని జీఓఎంకు మజ్లిస్ విశదీకరించింది. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక వారి వ్యాపార లావాదేవీల వ్యవహారాలు ఉన్నా, స్థానిక నేతలు కొందరు ఆ అంశం భుజానికి ఎత్తుకోవడానికి అదొక్కటే కారణం కాదు. కాంగ్రెస్ అధిష్టానం కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు బిల్లుకు మెజారిటీ సాధించుకునేందుకు కేంద్రం ఈ వ్యూహం అనుసరిస్తోంది. రాయల తెలంగాణ పేరుతో సీమ ప్రాంతంలోని సగం మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టడమే దాని పరమా వధి. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినపడకుండా నిరో ధించేందుకు కూడా రాయల తెలంగాణ అస్త్రం ఉపకరి స్తుందని అధిష్ఠానం నమ్మకం. రాయల తెలంగాణ ప్రతి పాదన పరిశీలనలో ఉన్నట్లు హోంశాఖ వర్గాలే చెప్పడం ఈ వాదనలకు బలం కలిగిస్తోంది. అందుకే ఆ రెండు జిల్లాల కాంగ్రెస్ నేతలు తమ ప్రతిపాదన సార్వజనీన మైనదని నమ్మబలుకుతున్నారు. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపించడం వల్ల సాగు నీటి సమస్యల సుడిగుండంలో అనంతపురం, కర్నూలు జిల్లాలు చిక్కుకోకూడదన్న ఉద్దేశంతోనే రాయల తెలం గాణ ప్రతిపాదన తెచ్చినట్లు ఆ ప్రాంత అధికార పక్షనేతలు చెబుతున్నారు. ఇది సహేతుకం కాదు. రాయలసీమకు సాగునీరు తుంగభద్ర, కృష్ణల నుంచే అందాలి. వేరే దారి లేదు. ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ రెండు జిల్లాలకు మాత్రమే సంబంధించినవి కావు. అన్నీ కూడా తెలంగా ణతో పాటు సీమ ప్రాంతం మొత్తానికి ప్రతిపాదించినవే! రాయల తెలంగాణలో భాగమైనంత మాత్రాన అనంత పురం, కర్నూలు జిల్లాలకే ఈ ప్రాజెక్టుల నీరు పరిమితం కాదు. ఒకవేళ తెలంగాణ వారి సహకారంతో ఆ ప్రాజెక్టుల సాగు నీరు ఆ రెండు జిల్లాలకే పరిమితం చేసుకోవచ్చని భావిస్తే అది అజ్ఞానమే. ప్రతిపాదిత జిల్లాలకు కాని సీమ మొత్తం ప్రాంతానికి గాని ఈ ప్రాజెక్టుల నుంచి సాగునీరు సవ్యంగా అందాలంటే అది సమైక్య రాష్ట్రంలోనే సాధ్యం. రాయలసీమ అస్తిత్వానికీ శతాబ్దాలుగా దాని సమగ్ర విశిష్ట చరిత్రకూ హాని తలపెట్టిన కేంద్రం కుయుక్తులను తిప్పికొట్టాలి. రాయల తెలంగాణను ప్రతిపాదించి, మద్దతి స్తున్న నేతలు భ్రమల నుంచి బయటకు రావాలి. మజ్లిస్ పార్టీ కూడా తన అనుమానాలను వీడాలి. సీమ ప్రాంత నాలుగు జిల్లాలు మొదట సమైక్యతను కోరాలి. అది వీలు కాని పక్షంలో శ్రీభాగ్ ఒడంబడిక అమలుకు ఒత్తిడి తేవాలి. - లెక్కల వెంకటరెడ్డి రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు -
బంద్‌ను విజయవంతం చేయాలి : జేఏసీ
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తూ రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేయడానికి కుట్ర చేస్తుందని జేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పది జిల్లాల తెలంగాణ కోసం గురువారం జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని బుధవారం నల్లగొండ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన హైదరాబాద్‌తో కూడిన ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సీడబ్ల్యూసీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మరోసారి మోసానికి దిగవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రతిపాదనలైనా అడ్డుకుంటామని అన్నారు. బంద్‌లో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్చంధంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, చకిలం అనిల్‌కుమార్, కూతురు లక్ష్మారెడ్డి, బోనగిరి దేవేందర్, ఎం.రమేష్, టి.కృష్ణ, విజయ్‌కుమార్, ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, ఫరీద్, శ్రీనివాస్, జమాల్‌ఖాద్రీ, రవీందర్, ఎన్.సంతోష్‌రెడ్డి, దూసరి కిరణ్, మాలె శరణ్యారెడ్డి, బి.నాగార్జున, సంతపురి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి కోసం రాయల తెలంగానం!?
తెలంగాణ బంద్‌కు వెల్లువెత్తిన సంఘీభావం సాక్షి, హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసం పాకులాడకుండా పదిజిల్లాల సంపూర్ణ తెలంగాణ మాత్రమే ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనలపై వారు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు అన్నివర్గాల వరకూ పెద్దఎత్తన సంఘీభావం ప్రకటించారు. టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికేనా?: సీపీఐ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎంఐఎంను సంతృప్తిపరిచి మైనారిటీ ఓట్లు రాబ ట్టడానికా లేక టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికా? అని సీపీఐ ప్రశ్నించింది. ఈ ప్రతిపాదన ఎవరి మనసులో పుట్టిందో చెప్పాలని డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుండా మల్లేష్, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎవర్నీ సంతృప్తి పరచని రాయల తెలంగాణ ప్రతిపాదనతోనే ముందుకు వెళితే కాంగ్రెస్ వేళ్లు తెగడం ఖాయమన్నారు. కాగా, టీఆర్ఎస్, టీజేఏసీ గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఎంఐఎం అడిగిందని ప్రజల ఆకాంక్షను బలిపెడతారా?: బీజేపీ ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాల మద్దతు తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పిలుపు మేరకు.. గురువారం తెలంగాణ బంద్ పాటిస్తున్నట్టు పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.హర్షవర్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము కూడా బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, తెలంగాణ రీజనల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ‘రాయల’ వెనుక కుట్ర: పొన్నం, సారయ్య సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తామంతా వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అడగని రాయల తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి తెస్తామని, మిగతా రాజకీయ పార్టీలు సైతం ముందుకొచ్చి దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమను విడదీయకూడదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నామో రాయలసీమను విడదీయకూడదని కూడా అంతే బలంగా కోరుకుంటున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో.. తెలంగాణ ప్రాంతీయ సమస్య కాదని, సామాజిక ఉద్యమ ఫలితమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గురువారం బంద్‌కు విప్లవ రచయితల సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందని వరవరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, అల్లం నారాయణ, ర చయిత జూలూరి గౌరీశంకర్, వేదకుమార్, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేస్తాం: ఆమోస్ రాయల తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని.. అందుకే టీఆర్ఎస్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అవసరంలేదని, పది జిల్లాల తెలంగాణే తమకు కావాలని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మరో సమావేశంలో పేర్కొన్నారు. -
‘రాయల’పై లడాయి
రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనపై నిరసనలు హోరెత్తాయి. రాయలను ఎవరూ కోరుకోవడం లేదని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్నే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యార్థులు మానవహారాలు నిర్వహించి పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఆమోదయోగ్యమని చాటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీలు తీశారు. - సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్ :కేంద్రమంత్రుల బృందం రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడాన్ని నిరసిస్తూ జిల్లా అంతటా ఆందోళనలు జరిగాయి. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, అసంఘటిత కార్మికులు, టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, ఆర్టీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రధాన చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఓసీపీ-3 ఏరియా వర్క్‌షాప్ తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులు, టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. మెట్పల్లిలో బీజేవైఎం నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపా రు. రాయల తెలంగాణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ జగిత్యాల ఏరియా ఆస్పత్రి వైద్యులు మండిపడ్డారు. ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అల్గునూర్ చౌరస్తాలో మానవహా రం నిర్వహించారు. సిరిసిల్లలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. బంద్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు రాయల తెలంగాణ ప్రతిపాదనను విరమించుకోవాలనే డిమాండ్‌తో జేఏసీ, టీఆర్ఎస్ గురువారం పిలుపునిచ్చిన బంద్‌కు విసృ్తత మద్దతు లభిస్తోంది. బీజేపీ, సీపీఐలు మద్దతు ప్రకటించాయి. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వృత్తి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని టీఎన్జీవోస్ నాయకులు నిర్ణయించారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ గురువారం నాడు సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది. బంద్‌ను విజయవంతం చేసే దిశగా టీఆర్ఎస్, జేఏసీలు సన్నాహాలు చేస్తున్నాయి. సంపూర్ణ బంద్‌తో ప్రజల ఆకాంక్షను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
బస్సులకు ‘టీ’బ్రేక్
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్ఎస్ తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో అటువైపు వెళ్లే బస్సులకు బ్రేక్ పడింది. ఆర్టీసీ అధికారులు ముందుజాగ్రత్తగా దాదాపు 185 సర్వీసులను నిలుపుదల చేసేందుకు నిర్ణయించారు. దీంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టార్‌లోని గద్వాల, అలంపూర్, మహబూబ్‌నగర్, ఐజ, శాంతినగర్, కోదాడ, రాజోలి, కొత్తకోట, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ వెల్లడించారు. అదేవిధంగా బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ సర్వీసులు, లారీలు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేయడం.. లేదా కర్నూలు నుంచి వెనక్కు పంపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ కారణంగా రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు మీదుగా రాజధానికి చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. మరీ అత్యవసరం కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతి రోజు దాదాపు 600 మందికి పైగా ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు బస్సు సర్వీసుల నిలుపుదల కారణంగా డబ్బును వెనక్కి ఇవ్వనున్నట్లు ఆర్ఎం తెలిపారు. గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినా.. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. వీటి ద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టార్‌లోని ఆయా ప్రాంతాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
‘రాయల’ రగడ..
తెలంగాణ జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ జిల్లాల్లో బుధవారం పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. టీఆర్ఎస్ పిలుపు మేరకు పది జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు జరిగారుు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీల నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. వరంగల్ జిల్లా మానుకోటలో తెలంగాణవాదులు రైలు పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలో ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్, హుస్నాబాద్, గోదావరిఖని, హుస్నాబాద్, సిరిసిల్లలో కళాశాలల విద్యార్థులతో టీఆర్ఎస్ భారీర్యాలీ నిర్వహించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో నిరసనలు హోరెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాల్కొండ, బాన్సువాడ, డిచ్పల్లి, జుక్కల్‌తోపాటు 36 మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పిలుపు మేరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ర్యాలీలు నిర్వహించి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేయగా, కోర్టు ఎదుట న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హైవేపై రాస్తారోకో చేశారు. పీడీఎస్‌యూ (విజృంభణ) ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చేవెళ్లలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ ఆందోళనలో పాల్గొన్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
సీమ పౌరుషాన్ని చూపిస్తాం
రాయల తెలంగాణపై సచివాలయ రాయలసీమ ఉద్యోగుల నిరసన ర్యాలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్టు ముక్కలు చేయడానికి సోనియాకు హక్కు ఎవరిచ్చారని సచివాలయ రాయలసీమ ఉద్యోగుల సంఘం మండిపడింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. సీమను విభజిస్తే రాయలసీమ వాసులు పౌరుషమేంటో సోనియాకు రుచిచూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ మిత్రులను తాము పల్లెత్తు మాట అనలేదని, కానీ బుధవారం కొంతమంది హెచ్చరించే ధోరణిలో వ్యవహరించడం బాధాకరమని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. సీమ వాసులపై వీహెచ్ వ్యాఖ్యల్ని క్రిష్ణయ్య ఆక్షేపించారు. రాయల తెలంగాణ దుర్మార్గమైన నిర్ణయం: రాయల తెలంగాణ నిర్ణయం దుర్మార్గమైన విషయమని తెలంగాణ ప్రజలు కోరుతున్నది పది జిల్లాల తెలంగాణను మాత్రమే అని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సచివాలయ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆరోపించాయి. ఆయా సంఘాల అధ్యక్షులు నరేందర్‌రావు, శ్రావణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో వేర్వేరుగా రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. -
‘రాయల తెలంగాణ’తో కలతచెంది ఇద్దరి మృతి
విద్యార్థి ఆత్మహత్య... గీత కార్మికునికి గుండెపోటు నిజాంసాగర్, న్యూస్‌లైన్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలంటూ ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తిచేసిన విద్యార్థి ప్రాణత్యాగం చేశాడు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామానికి చెందిన మొకిరె దుర్గయ్య-దేవవ్వ దంపతుల పెద్ద కుమారుడు రాములు (23) రాయల తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకుందనే వార్తలతో కలత చెందాడు. బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. ఉదయం ఎంతకూ నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు. పది జిల్లాలతో కూడిన తెలంగాణతోపాటు, ఎలాంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేసేలా సోనియాగాంధీ చూడాలని రాములు సూసైట్ నోటులో పేర్కొన్నాడు. ‘రాయల తెలంగాణ’తో గుండె ఆగి... కమాన్‌పూర్ : రాయల తెలంగాణ ప్రకటిస్తున్నారనే వార్తలను టీవీలో చూస్తూ మనస్తాపం చెందిన కరీంనగర్జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన బుర్ర శంకరయ్యగౌడ్(46) అనే గీత కార్మికుడు మంగళవారం రాత్రి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. -
నేడు తెలంగాణ బంద్
* మద్దతు ప్రకటించిన పలు జేఏసీలు * బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్ * అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు.. * విజయవంతం చేయాలన్న కోదండరాం * ఏ కార్యాచరణకైనా సిద్ధపడాలని పిలుపు * రాయల వద్దు.. సంపూర్ణ తెలంగాణే లక్ష్యం * తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి తెలియాలి సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్ జరుగనుంది. పది తెలంగాణ జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయకుండా రాయలసీమలోని రెండు జిల్లాలను అదనంగా కలపాలన్న ప్రతిపాదనలను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు పలు తెలంగాణ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ బంద్‌లో పాల్గొంటామని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు బంద్ ఏర్పాట్లను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ బుధవారం సమీక్షించారు. మండల స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సముదాయాలు, పాఠశాలలను బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాయల తెలంగాణకు నిరసనగా, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలనే డిమాండ్‌తో బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఆంక్షలు ఢిల్లీకి తెలిసేలా బంద్‌ను విజయంతం చేయాలని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం కోరారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా ప్రజలు మెలకువగా ఉండాలన్నారు. సంపూర్ణ తెలంగాణ బిల్లులో ఏ తేడా వచ్చినా తేడా వస్తే అందుకు బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలది, రాష్ట్ర, కేంద్ర మంత్రులదేనన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం టీజేఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ వద్దని, సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదం పొందాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘రెండు రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపితే ప్రజలు కోరుకున్న రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం కాదు. గవర్నర్‌కు అధికారాలివ్వడం, హైదరాబాద్‌పై తెలంగాణకుండే హక్కును నీరుగార్చే ప్రయత్నాలను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. సంపూర్ణ తెలంగాణలో ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర పరిణామాలకు జేఏసీ పిలుపునిస్తుంది. అవసరమైతే మళ్లీ చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. భావి కార్యచరణపై హైదరాబాద్ వెళ్లాక నిర్ణయం తీసుకుంటాం. ఏ కార్యచరణకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి’’ అని కోరారు. 371డి, యూటీ, గవర్నర్ పాలన వంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణిచివేసే ఎత్తుగడలను నిరసిస్తున్నట్టు టీజేఏసీ నేత దేవీప్రసాద్ చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనకు ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణపై రాబందుల్లా కన్నేసి, రాయల తెలంగాణ అంటూ ఉద్యమాన్ని నీరుగార్చజూస్తున్న వారికి చెంపపెట్టులా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె వంటి ఆందోళనలకు వంద రెట్లు భారీగా ఉద్యమం చేపట్టి పార్టీలను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. భేటీలో తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, న్యాయవాదుల జేఏసీ నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలపై జేఏసీ చర్చ రాయల తెలంగాణ ప్రచారంలో ఉన్నా బిల్లు మాత్రం స్పష్టంగా తెలంగాణ ఏర్పాటుపైనే ఉంటుందని జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాయల తెలంగాణ, నిరసన కార్యక్రమాలపై ఢిల్లీలో కమిటీ చర్చించింది. తెలంగాణకు సానుకూల వాతావరణమే ఉందని, రాయల తెలంగాణ ఉండకపోవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ అధ్యక్షులు శరద్‌యాదవ్, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలను ఇప్పటికే జేఏసీ నేతలు కలిశారు. లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను గురువారం కలవనున్నారు. బీఎస్సీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తదితరులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. భేటీలో మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, కె.రఘు, పిట్టల రవీందర్ పాల్గొన్నారు. -
టీ ముద్దు.. రాయల వద్దు: టీ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేయాలని, రాయల తెలంగాణ వద్దని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ అంటూ జాప్యం చేయడానికి ప్రయత్నించడమంటే ఇక తెలంగాణ రాదన్న అనుమానం వెలిబుచ్చారు. పది జిల్లాల తెలంగాణ మాత్ర మే కావాలంటూ ఈ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ నేతల తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ బుధవారం జీవోఎంకు లేఖ రాశారని, జీవోఎం సభ్యుల్ని కలవడానికి స్వయంగా ఢిల్లీకి వెళ్లారని టీ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారం వారు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కాకుండా మరే ప్రతిపాదన తెచ్చినా తమకు ఆమోద యోగ్యం కాదన్నారు. రాయలసీమకు, తెలంగాణకు ముందు నుంచి ఎలాంటి సంబంధం లేదని, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రాత్మక నేపథ్యం అంతా వేరని, మద్రాస్ నుంచి విడివడినప్పుడు వారు ఆంధ్రాతో ఉన్నారని వివరించారు. ఉమ్మడి రాజధానికి అంగీకరించాక ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంశాన్ని తేవటం మంచిది కాదని జీవోఎంకు ఇదివరకే స్పష్టం చేశామని, ఈరోజు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హోంమంత్రి షిండేతో మాట్లాడి తమ వాదనను వినిపించారన్నారు. రాయల తెలంగాణను ప్రకటిస్తే అప్పుడు పరిస్థితుల ఆధారంగా కార్యాచరణ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. నేటి బంద్‌కు మా మద్దతు లేదు రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్‌కు తమ మద్దతు లేదని, ప్రజలు ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయాలని మంత్రులు కోరారు. బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు మాకేమైనా చెప్పి ఇచ్చారా? అని జానారెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. జీవోఎంకు దామోదర రాసిన లేఖ.. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రభుత్వం ప్రకటించాక కృతజ్ఞతగా టీ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు జీవోఎం రాయల తెలంగాణ గురించి తీవ్రంగా ఆలోచిస్తోందని, ఆ మేరకు నివేదిక, ముసాయిదా రూపొందించినట్టు పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు తెలంగాణ ప్రజల్ని తీవ్ర ఆందోళనపరుస్తున్నాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే ఈ ప్రాంత ప్రజలు అంగీకరిస్తారని గతంలో పలుమార్లు మీకు తెలిపాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగానూ ఆమోదించారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్నిగాక మరోవిధంగా ఎలాంటి నివేదిక ఇచ్చినా, బిల్లు తెచ్చినా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినట్లే. -
తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే!
* కసరత్తు ముగించి బిల్లు సిద్ధం చేసిన జీవోఎం * నివేదిక, నోట్లతో పాటు నేడు కేబినెట్‌కు సమర్పణ * జీవోఎం సిఫార్సు ఏమిటన్న దానిపై ఇంకా గోప్యతే * సాయంత్రం ఐదింటికి కేబినెట్ సమావేశంలో చర్చ * ‘రాయల’, తెలంగాణపై భేటీలోనే తుది నిర్ణయం * బిల్లును ఆమోదిస్తే ఆ వెంటనే రాష్ట్రపతికి సిఫార్సుపై పెదవి విప్పని షిండే, సభ్యులు * ఫక్తు రాజకీయ కోణంలో చూస్తున్న కాంగ్రెస్ * చివరి క్షణం దాకా లాభనష్టాల బేరీజే లక్ష్యం? * రాయల తెలంగాణ, తెలంగాణ ఆప్షన్లు రెండూ ఇచ్చిన మంత్రుల బృందం! సాక్షి, న్యూఢిల్లీ: విభజన పర్వంలో ఓ అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్‌కు బుధవారం జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. గురువారం సాయంత్రం ఐదింటికి జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్‌గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే గురువారమే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. గంట పాటు జరిగిన జీవోఎం భేటీ అనంతరం బుధవారం రాత్రి షిండే మీడియా ముందుకొచ్చి క్లుప్తంగా మాట్లాడారు. ‘‘జీవోఎంను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ మాకిచ్చిన బాధ్యతను నేటితో పూర్తిచేశాం. మేం సిఫార్సులు చేశాం. వాటిపై గురువారం కేబినెట్ చర్చిస్తుంది’’ అని చెప్పడంతో సరిపెట్టారు. తెలంగాణ, రాయల తెలంగాణల్లో దేనికి సిఫార్సు చేశారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బదులూ ఇవ్వకుండానే వెనుదిరిగారు. జీవోఎం సిఫార్సు ఏమిటన్నది మరో 24 గంటల్లోపే తేటతెల్లమయ్యేదేనని తెలిసి కూడా ఇంతగా గోప్యత పాటించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రెండు ఆప్షన్లలో దేనితో తనకు రాజకీయంగా కొద్దో గొప్పో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న కోణంలో లాభనష్టాల బేరీజులో, తుది విడత మల్లగుల్లాల్లో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలుగా ఉన్నట్టు సమాచారం. అందుకే, ఈ అంశంపై అస్పష్టతను గురువారం సాయంత్రం దాకా కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలకాంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఫక్తు రాజకీయ ప్రయోజన కోణంలోనే చూస్తోందన్నది తాజా వైఖరితో మరోసారి స్పష్టమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి 12 జిల్లాలతో కూడిన ‘రాయల తెలంగాణ’ ఏర్పాటుకు జీవోఎం ఆమోదముద్ర వేసినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణఅంటూ రెండు ఆప్షన్లనూ నివేదికలో జీవోఎం పొందుపరిచిందని, అంతిమ నిర్ణయాన్ని కేబినెట్‌కు విడిచిపెట్టిందని మరికొన్ని వర్గాల కథనం. దాంతో విభజన ఎలా ఉండాలనే విషయమై జీవోఎం కచ్చితంగా చేసిన సిఫార్సు ఏమిటనే దానిపై సందిగ్ధత నెలకొంది. నదీ జలాల పర్యవేక్షణ మండళ్లకు సంబంధించి కృష్ణా, గోదావరితో పాటు పెన్నా నదిని కూడా చేర్చినట్టు సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సరిగ్గా ముందురోజు జీవోఎం తన కసరత్తును ముగించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతారా, లేదా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక, ‘‘317డి అధికరణాన్ని రెండు రాష్ట్రాలకూ వర్తింపజేయాలని కూడా జీవోఎం సిఫార్సు చేసింది. రాజ్యాంగ సవరణ ఆవశ్యకత తలెత్తకుండా ఉండేందుకు గాను బిల్లు పేరును కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అని కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బిల్లుగా మార్చాలని కూడా సిఫార్సు చేసింది’’ అని పీటీఐ తెలిపింది. ఆస్తులు-అప్పులు, జల వనరుల పంపకం, రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం, ప్రభుత్వాధికారుల క్యాడర్ల విభజన తదితర అంశాలకు కూడా జీవోఎం తుది మెరుగులు దిద్దినట్టు పేర్కొంది. కేబినెట్ నుంచి వెంటనే రాష్ట్రపతికి: జైరాం రాష్ట్ర విభజన ప్రతిపాదనను అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదించి ఏర్పాటుచేసిన జీవోఎం ఇప్పటివరకూ పలు సమావేశాలు నిర్వహించి, ఇదిగో అదిగో నివేదికను ఖరారు చేస్తున్నామంటూ చెబుతూ వచ్చిన విషయం విదితమే. మంగళవారం రాత్రి జరిగిన అసంపూర్ణ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి షిండే చెప్పిన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో జీవోఎం ‘చిట్టచివరి భేటీ’ నిర్వహించింది. షిండే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణసామి పాల్గొనగా, గులాం నబీ ఆజాద్ గైర్హాజరయ్యారు. షిండే, జైరాం, నారాయణసామి ఒకే వాహనంలో భేటీకి రావడం విశేషం. అంతకుముందు వారు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి నివేదిక అంశాలపై చివరిసారిగా చర్చించారని, ఆమె సమ్మతి తర్వాత నేరుగా నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారని తెలుస్తోంది. జీవోఎం సమావేశం గంటలోపే ముగిసింది. ఆ తర్వాత కూడా షిండే, జైరాం దాదాపు గంటపాటు లోపలే గడిపారు. సభ్యులంతా ఆమోదించిన సిఫార్సులకు తుది మెరుగులు దిద్ది తుది నివేదికను, బిల్లును సిద్ధం చేశారు. అన్ని నిర్ణయాలూ తీసుకున్నామని, తుది సమావేశం పూర్తయిందని భేటీ అనంతరం ఆంటోనీ కార్యాలయం లోపల మీడియాకు చెప్పారు. ఒక బిల్లు, ఒక నివేదిక సిద్ధమయ్యాయని కార్యాలయం బయట మొయిలీ విలేకరులకు తెలిపారు. అయితే నివేదిక, ముసాయిదా బిల్లు స్వరూపంపై మీడియా ఎంతగా ప్రశ్నించినా సభ్యులెవరూ స్పందించలేదు. చివరగా బయటికొచ్చిన జైరాం కూడా తెలంగాణ, రాయల తెలంగాణలపై ఏమీ చెప్పలేదు. నివేదిక, బిల్లు వెంటనే కేబినెట్‌కు వెళ్తాయని, ఆ వెంటనే వాటిని రాష్ట్రపతికి పంపుతారని మాత్రమే చెప్పారు. అయితే బిల్లును పరిశీలించేందుకు, అసెంబ్లీకి పంపేందుకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారో చెప్పడానికి జీవోఎం సభ్యులతో పాటు హోం శాఖ వర్గాలు కూడా నిరాకరించాయి. వీలైనంత త్వరగా అసెంబ్లీకి పంపవచ్చన్నది కాంగ్రెస్, ప్రభుత్వ వర్గాల అంచనా. -
రాయల తెలంగాణ వద్దే వద్దు
తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ వద్దే వద్దు...పది జిల్లాల తెలంగాణే ముద్దు అంటూ విద్యార్థులు నినదించారు. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, దాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానంలో రాయల తెలంగాణ ప్రస్తావనే లేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందని దుయ్యబట్టారు. వెయ్యిమందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించింది పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కోసమేనని అన్నారు. ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి తెలంగాణ ఇస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా సలహాదారు రంగారావు మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు అయూబ్‌ఖాన్, నాయకులు మహేందర్, వీరమణి, నబీ, వెంకటేశ్‌చారి, మోయిజ్, వెంకట్, రఘు పాల్గొన్నారు. రాయల తెలంగాణకు ఒప్పుకోం శంకర్పల్లి: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహారెడ్డి, నర్సింహ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణ విషయంలో రోజుకో ప్రతిపాదన ముందుకు తెస్తూ ప్రజల్లో అందోళన రేకెత్తిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై జరుగుతున్న జాప్యానికి నిరసనగా గురువారం చేపట్టిన బంద్‌ను తెలంగాణవాదులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి పండిత్రావు, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నర్సింహారెడ్డి, బస్వరాజ్, కొండ మాణయ్య పాల్గొన్నారు. -
రాయల తెలంగాణను అంగీకరించం
చేవెళ్ల, న్యూస్‌లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గురువారం నిర్వహిస్తున్న బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, అది తప్ప ఏ ప్రతిపాదననూ ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు. రాయల తెలంగాణను ఎవరూ అడగలేదని, రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు. భద్రాచలం, మునగాలలను వదులుకునే ప్రసక్తేలేదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆంకాంక్షకు విరుద్ధంగా రాయల తెలంగాణను ఏర్పాటుచేస్తే మరోమారు ఉద్యమం తప్పదన్నారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ పునరావృతం అవుతాయన్నారు. నేటి బంద్‌కు వ్యాపార, విద్యాసంస్థల యాజమానులు సహకరించాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రౌతు కనకయ్య, ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి డి.ఆంజనేయులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పాండు, శర్వలింగం, నర్సింహులు పాల్గొన్నారు. హోరెత్తిన నినాదాలు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్య తిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. స్థానిక హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి జేఏసీ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, ఫయాజ్, నరేందర్ ర్యాలీకి ప్రాతినిథ్యం వహించారు. -
'కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరు'
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడీ సరికొత్త రాగమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.రాజేశ్వరరావు, అరుణా జ్యోతి, బండారు దత్తాత్రేయ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి ఉన్న రాయలసీమ సెంటిమెంటును దెబ్బతీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రేకులు, లీకులతో ప్రజలను గందరగోళపరుస్తారా? కబడ్దార్’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరన్నారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, కర్నూలుకు చెందిన డీ భీమలింగేశ్వరరావు నాయకత్వంలో పలువురు బీజేపీలో చేరారు. ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్ పోటీలో పసిడి పతకాన్ని సాధించిన హైదరాబాద్ యువకుడు అనూప్ కుమార్ యామాను నేతలు ఘనంగా సత్కరించారు. -
'తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణను అంగీకరించరు'
తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించరని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి తెలంగాణ మంత్రుల తరపున ఆయన ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింట్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాయల తెలంగాణ ప్రతిపాదన సరికాదని తప్పుపట్టారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు వివరించామని, ఈ మేరకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతు సభలు నిర్వహించామని లేఖలో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయల ప్రతిపాదన విరమించుకుని వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని రాజనరసింహ కోరారు. -
రాష్ట్ర విభజనకే వ్యతిరేకం... రాయలతెలంగాణకు ఎలా...
రాయలతెలంగాణ ప్రతిపాదనను రాయలసీమ ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి శ్రీకాంత్రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజననే తాము వ్యతిరేకిస్తున్నామని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటప్పుడు రాయలతెలంగాణ ఏలా ఒప్పుకుంటామని వారు ప్రశ్నించారు. అయితే ఈ నెల 12న హైదరాబాద్‌లో తమ పార్టీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగణ ప్రాంతంలోని 10 జిల్లాలను కలపి రాయలతెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆటు సీమ ప్రాంతంలో, ఇటు తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
'రాయలతెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు'
రాయల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్‌కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత 59 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్న సంగతి మరువరాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సుముఖుత వ్యక్తం చేసింది. అయితే రాయలసీమలోని రెండు జిల్లాలతోపాటు తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలు కలపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించే అవకాశం ఉందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాయల తెలంగాణ ఏర్పాటు వద్దని టి.జేఏసీ నేతలు ఇప్పటికే న్యూఢిల్లీలో ముమ్మరం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
-
'సీమ అస్తిత్వానికి...తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ'
హైదరాబాద్ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బుధవారం గన్‌పార్క్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రాయల తెలంగాణ పాపం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలదేనని మండిపడ్డారు. దీనికి తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో కదలిక వచ్చేవిధంగా గురువారం తెలంగాణ బంద్ జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి... పార్లమెంట్ సాక్షిగా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తారని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే లేదని, పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణకే మద్దతు ఇస్తామన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా తమ నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. రాయల తెలంగాణతో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీమ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌవరాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. -
10 జిల్లాలతో కూడిన తెలంగాణానే కావాలి: కోదండరాం
-
రాయల తెలంగాణ వ్యతిరేకంగా టిఆర్ఎస్ ధర్నా
-
10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని టి.జేఏసీ కన్వీనర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని రెండు జిల్లాలను విడగొడితే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టి.జేఏసీ స్టీరింగ్ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, రాయల తెలంగాణ అంశంపై చర్చించింది. ఆ కమిటీ భేటీ అనంతరం కోదండరాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...తమకు 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక జిల్లా ఎక్కువా వద్దు, ఒక జిల్లా తక్కువా వద్దని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ... రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు టీజేఏసీ నేత కోదండరాం ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
'రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర'
వరంగల్ : రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ కావాలని ఏ రాజకీయ పార్టీ కోరలేదని ఎర్రబెల్లి అన్నారు. వేరే జిల్లాలను కలుపుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు టీడీపీ వ్యతిరేకమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. త్వరలో ఢిల్లీ వెళతామని, తమ వాదనను వినిపిస్తామని ఆయన తెలిపారు. -
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
-
రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు
-
మళ్లీ భగ్గుమన్న తెలంగాణవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాయల తెలంగాణ ప్రక్రియ ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రుల కమిటీ(జీఓఎం) భేటీ, ఆ తదుపరి పరిణామాలు మళ్లీ తెలంగాణ ‘లడాయి’కి సంకేతాలు ఇస్తున్నాయి. దాదాపుగా రాష్ట్ర విభజన పూర్తయిందని భావించిన తరుణంలో ‘రాయల తెలంగాణ’ తెరపైకి రావడం వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, మంత్రుల కమిటీ వైఖరిలో 24 గంటల వ్యవధిలో జరిగిన మార్పులు తెలంగాణవాదులను రగిలిస్తున్నాయి. హైదరాబాద్‌పై ఆంక్షలు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని భావించిన తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదన జోరందుకోవడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో 5న తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం నుంచి నిరసనలు, ధర్నాలకు పిలువునివ్వడంతో మళ్లీ తెలంగాణ భగ్గుమననుంది. నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్ర మంత్రుల కమిటీ భేటీ ఏమీ తేల్చకుండా సమావేశం వాయిదా పడటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించిన నేపథ్యంలో జిల్లాలో మళ్లీ ఉద్యమ కార్యాచరణలో ఆ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రాయల తెలంగాణకు నిరసనగా ఆందోళనలు మంగళవారం ఉధృతంగా సాగాయి. పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించిన న్యాయవాదులు రాయల తెలంగాణ వద్దని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించగా, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. న్యూడెమోక్రసీ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకో, ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. లక్సెట్టిపేటలో జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకు మొగ్గుచూపితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిల పక్షం అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ పలువురు ఆరోపించారు. 5న బంద్‌కు పిలుపునివ్వడ ంతోపాటు 6న టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నందున జిల్లాలో మళ్లీ ‘ప్రత్యేక’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడనుంది. బంద్‌ను విజయవంతం చేద్దాం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలు తేవడం కుట్ర. ఈ విషయంలో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అందుకే తెలంగాణలో మరోసారి ఉద్యమించేందుకు అధినేత కేసీఆర్ 5న తెలంగాణ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్ సక్సెస్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, రాజకీయ, న్యాయవాద, డాక్టర్ జేఏసీలతోపాటు తెలంగాణవాదులు బుధవారం నుంచి నిర్వహించే నిరసనలు, ఆందోళనలకు కదిలిరావాలని కోరుతున్నాము. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 4, 5 తేదీలలో కుంటాల, సారంగపూర్ మండలాల్లో జరిగే టీఆర్ఎస్ శిక్షణ తరగతులను వాయిదా వేశాము. -
కార్టూన్
చూడు... వాళ్లు నాలాగే వ్యతిరేకించడంలేదు! -
రాయల తెలంగాణ అంటే యుద్ధమే
* రేపు బంద్‌కు కేసీఆర్ పిలుపు * తల తెగిపడ్డా.. అందుకు అంగీకరించనని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్య * మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు * 6న పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం * సీడబ్ల్యూసీ, కేబినెట్లు నిర్ణయించింది 10 జిల్లాల తెలంగాణనే * తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ వారి కోసమా? లేక * అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారి కోసమా? * దీనిపై నేను పార్లమెంటుకు హాజరై నిరసన గళం వినిపిస్తా సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే యుద్ధం తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ వాదుల తరఫున కరాఖండిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తాజా ప్రతిపాదనకు నిరసనగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజైన ఈనెల 5వ తేదీ (గురువారం) తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ‘రాయల తెలంగాణ వద్దు - సంపూర్ణ తెలంగాణ ముద్దు’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ చర్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసనలు తెలపాలని సూచించారు. కేసీఆర్ మంగళవారం తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ నేతలు కె.కేశవరావు, మందా జగన్నాథం, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎస్.మధుసూదనాచారి, కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినయ్... ‘‘ఏం జరుగుతుందో తెలియనపుడు మాట్లాడుడు మంచిదికాదని ఇప్పటివరకు ఆగినం. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉందని నాకు ఢిల్లీలోని వర్గాల నుంచి ఫోన్లు వచ్చినయ్. సరైన సమయంలో స్పందించడం నా విధ్యుక్త ధర్మంగా భావించి ఇప్పుడు మాట్లాడుతున్న. ఇది తెలంగాణ ప్రజల ఆశ, భాష. తెలంగాణ ప్రజల ఆశను సరైన సమయంలో తెలుపకపోతే నాది తప్పు అయితది. అందుకే ప్రధానమంత్రికి, సోనియాగాంధీకి, జీవోఎంకు తెలుపుతున్నం. ప్రాణాలు పోయినా, ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా రాయల తెలంగాణకు అంగీకరించం. అట్లాంటిదే జరిగితే మరో ఉద్యమానికి తెరతీస్తం’’ అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజల తరఫున నిరసనలు తెలిపేందుకు మేం కార్యాచరణ రూపొందించినం. బుధవారం విద్యార్థులు, యువకులు రాయల తెలంగాణ వ్యతిరేక నిరసన ర్యాలీని గ్రామం నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు చేపట్టాలె. టీఆర్ఎస్ తరఫున గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నం. తెలంగాణకు ఇది పరీక్షా సమయం. ఈ బంద్ వేరే ఎవరి కోసమో కాదు కాబట్టి ఇందులో వ్యాపారస్తులు మొదలుకొని విద్యా సంస్థల దాకా అంతా స్వచ్ఛందంగా వంద శాతం పాల్గొనాలె. బంద్‌లో పాల్గొనాలని ఎవ్వరూ ఒత్తిడి చేయరు. స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్‌లో పాల్గొని కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలె. అందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ కావాలి. ఉద్యోగులు విధులను బిహ ష్కరించాలి, ఆర్టీసీ వారు, పరిశ్రమలు, ఐటీ వారు అందరూ ఇందుకు సహకరించాలె’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆరో తేదీన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని.. కేంద్ర కేబినెట్లో తెలంగాణ బిల్లును బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ శిక్షణా కార్యక్రమలను మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. బలిదానాలు సంపూర్ణ తెలంగాణ కోసమే ‘‘13 ఏళ్ల తర్జనభర్జనల తర్వాత సీడబ్ల్యూసీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించింది. దాన్నే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇపుడు దాన్ని అటు ఇటు తిప్పడం, వేరే ఏవో చేర్చడం అనేది సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఖండించటమే. ఇతర ప్రాంతాల వారితో కలిసేందుకే మా పిల్లలు బలిదానం చేసుకున్నారా? ఇవాళ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి. ఆయన అమరుడు అయింది రాయల తెలంగాణ కోసమేనా? తెలంగాణ కోసం ప్రాణత్యాగ ం చేసుకున్న వారంతా హైదరాబాద్ రాజ ధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలనే. అదే కొందరు లేఖల రూపంలోనూ తెలిపారు. ఇవన్నీ జీవోఎంకు సుమారు గంటన్నర పాటు వివరించినయన్ని అరణ్యరోదనే అయితయ? తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణవారి కోసమా లేదా అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారికోసమా? అని జీవోఎం భేటీలో మేం ప్రశ్నించినం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై ఆంక్షలు విధిస్తారా ‘‘రాష్ట్రం విడిపోతే గతంలో తెలంగాణతో కలిసి లేని సీమాంధ్రులు తిరిగి వారి ప్రాంతానికి హ్యాపీగా వెళ్లిపోతరు. మాక్కుడా కొద్దో గొప్పో రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగంలో ఎక్కడా కామన్ కాపిటల్ అనే పదం లేకున్నా.. సీమాంధ్రులను తెల్లారే తరుముడు తెలివి తక్కువ తనం అయితదని ఒప్పుకున్నదాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాద్‌పై, శాంతిభద్రతలు ఇతర అంశాలపై ఆంక్షలు విధిస్తర? ఇట్లాంటి చర్యలు మమ్మల్ని అవమానించుడే అయితది. మద్రాసు నుంచి విడిపోయినపుడు తెలుగువారికి రాని సమస్యలు ఇపుడు తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు కలుగుతయి అనడం వితండవాదమె. కేంద్రం కట్టడి చేయడం అనే చర్య మొదలుపెడితే దేశంలో ఏ పెద్ద నగరాల్లోకి ఇతరులను రానివ్వరు. ఇప్పటికే ఉన్న 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు ఏర్పడ బోయే తెలంగాణకు మాత్రమే ఎందుకు విధిస్తరు?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టీ ఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవటం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదనలు చేస్తున్నారంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘సొల్లుగాళ్ల మాటలకు నేను జవాబివ్వాలా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అంగీకరించిన తర్వాతే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిందనే అభిప్రాయాలను విలేకరులు పేర్కొనగా.. ‘‘కేసీఆర్ రాయల తెలంగాణకు ఒప్పుకుంటడ? నా జీవితంలో ఏనాడైనా ఆ మాట అడిగినన?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రాయల తెలంగాణ నష్టాలను రోజుల తరబడి చె ప్పుకోవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి 1.5 లక్షల మంది బంగారు బతుకులు నాశనం అయినయి. రాయల తెలంగాణ ప్రకటించిన తర్వాత పది రోజుల పాటు ఉద్యమించి ఊరుకుంటారని కొందరు సన్నాసులే భావిస్తరు. కేసీఆర్ అట్ల ఊరుకుంటడ? నా తల తెగిపడ్డా అందుకు అంగీకరించను. ఇన్నాళ్ల ఉద్యమంలో మధ్యలో ఎందరో బుడ్డర్‌ఖాన్‌లు వచ్చిపోయారు తప్ప కేసీఆర్ ఒక్కడే పోరాడుతున్నడు. ఎవరి గొంతెమ్మ కోరికల కోసమో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి మా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి బిడ్డలను చంపుకోవాల్నా? ఆ రెండు జిల్లాలను కలిపి అక్కడి గాలేరు-నగరి వంటి అక్రమ ప్రాజెక్టులను ఓకే చేసుకోవాల్నా? దీనికి ఏ తెలంగాణ బిడ్డనైనా ఒప్పుకుంటడ? అసలు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకొచ్చిందో అది బయటపెట్టిన వారే చెప్పాలి. కాకి లెక్కలు చెప్పి సీమ జిల్లాలు కలుపుకుంటే కరెంటు కష్టాలుండవని చెప్తే వినేందుకు మేం పిచ్చోళ్లమా? నీటి ఆధారంగా జరిగే విద్యుత్ ఉత్పత్తి ఎల్లకాలం ఉండదు. బొగ్గుతో తయారయ్యేదే ఎప్పటికీ శాశ్వతం. ఆ బొగ్గు మా తెలంగాణలో పుష్కలంగా ఉంది. దానితో కరెంటు తయారు చేసుకుంటం’’ అని పేర్కొన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తే యుద్ధం గ్యారంటీ అని కేసీఆర్ హెచ్చరించారు. ‘‘సంపూర్ణ తెలంగాణ ప్రకటించేదాకా యుద్ధం కొనసాగిస్తం. పార్లమెంటు సమావేశాలకు తప్పక హాజరవుత. రాయల తెలంగాణ ఏర్పాటు లేదా ఇతర ఆంక్షలేమైనా ఉంటే తప్పక నిరసన తెలుపుత. తెలపకుండా నేనెట్ల ఊరుకుంటా? ఈ సారి ఇంగ్లిష్‌లో కాదు హిందిలో మాట్లాడుత’’ అని చెప్పారు. బంద్‌కు టీజేఎఫ్, ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న చేపట్టిన తెలంగాణ బంద్‌కు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్), తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. -
రాయల ‘టీ’ని అంగీకరించం: వెంకయ్యనాయుడు
పది జిల్లాల తెలంగాణకే మా ఓటు : వెంకయ్య సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించబోమని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. కాంగ్రెస్ తీరు తమాషాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగితే రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తారా? సరికొత్త రాయల తెలంగాణ ప్రతిపాదన వెనకున్న సహేతుక కారణాలేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెంకయ్య మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణకు సరైన కారణాలు చెప్తే అప్పుడు తమ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు చర్చిస్తాయని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ వాళ్లు సజావుగా జరగనిస్తారనేది అనుమానమేనన్నారు. రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయాల్సిందేనని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. -
..ఇంకా ఉంది
* అసంపూర్తిగా ముగిసిన జీవోఎం భేటీ * నేటి రాత్రి 8 గంటలకు మళ్లీ మంత్రుల బృందం సమావేశం * రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదంటూ లీకులు * పరిణామాలను అంచనా వేసేందుకే?.. రేపు కేంద్ర మంత్రివర్గ భేటీ * అప్పటిదాకా నాన్చి, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం * 371డీ పై చర్చ, ఇరు రాష్ట్రాలకూ వర్తింపజేసే దిశగా యోచన? * రాయల తెలంగాణ గురించి తెలియదన్న షిండే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సమావేశం మంగళవారం అసంపూర్ణంగా ముగిసింది. కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించే ముందు ఇదే చివరి భేటీ అని భావించినప్పటికీ ఆ నివేదిక తుది రూపు సంతరించుకోనందున బుధవారం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదన తాలూకు పరిణామాలను అంచనా వేసేందుకు, గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగేదాకా విషయాన్ని నాన్చడానికే జీవోఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సమావేశానంతరం విలేకరులకు వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటలకు జీవోఎం మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. అదే ఆఖరు సమావేశం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం కసరత్తు చేస్తోంది. అయితే ఆలోగా పరిష్కరించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి’’ అని చెప్పారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం... బిల్లు ముసాయిదా సిద్ధమైందని, చట్టపరమైన అడ్డంకులు రాకుండా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు. విభజన ప్రక్రియలో కీలకమైన అంకంగా అంతా భావిస్తున్న 371డీ అధికరణను రెండు రాష్ట్రాలకూ వర్తింపజేసే మార్గాంతరాలపై భేటీలో లోతుగా చర్చ జరిగిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అందుకు వీలుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు’ను ‘ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిల్లు’గా మార్చాలని, అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం కూడా ఉండదని భావిస్తున్నట్టు కూడా తెలిపింది. ‘‘హైదరాబాద్ శాంతిభద్రతలు, రెవెన్యూ అంశాలను కేంద్రంచేతికి అప్పగించడంపై కూడా మల్లగుల్లాలు పడ్డారు. బిల్లు, జీవోఎం నివేదిక కలిపి 70 పేజీల దాకా ఉంటాయని జీవోఎం వర్గాలు తెలిపాయి’’ అని వివరించింది. మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో షిండే అధ్యక్షతన జరిగిన జీవోఎం భేటీలో సభ్యులు పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. జీవోఎం ఏర్పాటయ్యాక ఇలా మొత్తం సభ్యులు సమావేశం కావడం ఇదే తొలిసారి! జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా భేటీలో పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణలతో పాటు జీవోఎం సిఫార్సులను ముసాయిదా బిల్లులో ఎలా చేర్చాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై స్పందనను బట్టి పరిణామాలను అంచనా వేయడానికి వీలుగా నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకున్నట్టు సమాచారం. అంతిమంగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాల అమలును ఖరారు చేయడానికే జీవోఎం పరిమితమవుతుందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు సాగించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానించిన తెలంగాణ, తాజాగా తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణల్లో దేనిపైనా తుది నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం వరకు నాన్చి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని జీవోఎం సభ్యులు భావిస్తున్నారు. రెండు ప్రతిపాదనలనూ కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి అక్కడ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ముగించకుండా, విరామమిచ్చి జనవరి వరకు పొడిగించడానికి సమాయాత్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాగే సాగతీత ధోరణి కొనసాగిస్తే తెలంగాణ బిల్లును 2014లోనే పార్లమెంటు ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే రాయల తెలంగాణపైనా హడావుడిగా ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం దాకా సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరి సాంబశివరావు తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాటలను బట్టి చూస్తుంటే రాయల తెలంగాణపై జీవోఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ మేరకే ముసాయిదా బిల్లు తయారవుతోందని కూడా చెబుతున్నారు. జీవోఎం నివేదిక కూర్పుపై కసరత్తు సిఫార్సులను ముసాయిదా బిల్లులో పొందుపరచడంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జీవోఎం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రత, జన వనరుల పంపిణీ పర్యవేక్షణకు బోర్డులు, శాంతిభద్రతల సమస్య, మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఉమ్మడి కార్యాచరణ తదితరాలు ముసాయిదాలో ఎలా ఉండాలనే దానిపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటిపై సభ్యుల సూచనల మేరకు జైరాం సాంకేతిక కసరత్తు చేస్తున్నారు. సాయంత్ర 6.20కి జీవోఎం భేటీ ముగిశాక కూడా ముసాయిదా బిల్లు రూపకల్పన కసరత్తులో షిండే, జైరాం తనమునకలుగా గడిపారు. ఈ కసరత్తు భేటీ తర్వాత రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు బిల్లు ముసాయిదా ప్రతిలో పొందుపరిచిన భాష, వాక్య నిర్మాణం సముచితంగా లేవని చిదంబరం అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అంతకుముందు విభజన అనంతరం తెలంగాణ శాంతిభద్రతల అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులతో ఉదయం 11 గంటలకు షిండే సమీక్ష జరిపారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారి శశిధర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతో పాటు నక్సలిజం పెరిగే అవకాశాలు, మతపరమైన ఘర్షణలకు సంబంధించిన అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం జైరాంతో గంట పాటు షిండే భేటీ అయ్యారు. నివేదికకు తుదిరూపు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడ్డారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు, న్యాయపరమైన చిక్కులను దాటడం, జల వనరుల బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించారు. అనంతరం న్యాయ, జలవనరుల శాఖల అధికారులను జైరాం పిలిపించుకుని మాట్లాడారు. 371డి, 371ఇ అధికరణాలపై కూడా చర్చ జరిపారు. 371ను ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాయల తెలంగాణ గురించి తనకు తెలియదని జైరాంతో భేటీ అనంతరం షిండే విలేకరులతో అన్నారు. ‘విభజనపై ఇదే చివరి భేటీ. ఈ రోజు జీవోఎం నివేదికను ఆమోదిస్తాం. 5న కేబినెట్ సమావేశం ఉంటుంది. నివేదికను కేబినెట్‌కు అందించాక అంతా ప్రధానే చూసుకుంటారు’ అంటూ వెళ్లిపోయారు. సీమాంధ్ర మంత్రుల ‘యూటీ’ యత్నాలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్‌పై తాము కోరుతున్న మేరకు ఆంక్షలు విధించేలా చేసేందుకు తుది ప్రయత్నాలు చేశారు. జీవోఎం సమావేశానికి ముందు షిండేను కేంద్ర మంత్రి చిరంజీవి ఆయన కార్యాలయంలో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను శాశ్వత యూటీ చేయాలని మరోసారి ప్రతిపాదించారు. మరో మంత్రి జేడీ శీలం కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్‌ను కలిసి, హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్‌ను పరిగణించాలని కోరినట్టు తెలిసింది. కానీ వారి విజ్ఞప్తికి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ‘యూటీతో ఏ ప్రాంతానికీ పెద్దగా లాభం ఉండకపోవచ్చు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అప్పగించే కసరత్తు చేస్తున్నాం’ అని షిండే, సిబల్ చెప్పారంటున్నారు. ఇక జీవోఎం భేటీ అనంతరం షిండే, జైరాంలతో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, శీలం సమావేశమై, ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరారు. అనంతరం బయటికొచ్చిన కావూరి, మీడియాతో మాట్లాడేందుకు ఆస్తకి చూపలేదు. కేంద్రం రాయల తెలంగాణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందంటూ వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని శీలం అన్నారు. -
రాయల తెలంగాణపై ఎవరేమన్నారంటే...
కాంగ్రెస్ పార్టీకి నష్టమే : వీహెచ్ నార్కట్‌పల్లి న్యూస్‌లైన్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ కాకుండా, రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టం కాకుండా, ఒకవేళ రాయల తెలంగాణ ఇస్తే తిరిగి ఉద్యమిస్తామని చెప్పారు. మేం పూర్తిగా వ్యతిరేకం : సీహెచ్. విద్యాసాగర్‌రావు నల్లగొండ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుందన్నారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ 12 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ ప్రతిపాదన ఓ బలవంతపు పెళ్లి : దాసోజు శ్రవణ్‌కుమార్ కనగల్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ నిర్ణయం బలవంతపు పెళ్లి లాంటిదని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం కనగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు 1956లో ఆంధ్రకు, తెలంగాణకు బలవంతంగా పెళ్లి చేసి వేలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు అదే తరహాలో రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణతో కలపాలని చూస్తుందని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను తాము ఒప్పుకోమన్నారు. మరో మహోద్యమం తప్పదు : సీపీఐ ఎమ్మెల్యే మల్లేష్ బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : కేంద్రం రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మరో మహోద్యమం చేపడతామని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ రాష్ట్రం కావాలని అనంతపురం, కర్నూలు ప్రాంతాల ప్రజలు ఏనాడూ కోరలేదన్నారు. అయినా, స్వార్థపూరితంగా కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్లో రాయల తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకొని తీరుతామన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విజయయాత్ర రెండో రోజైన మంగళవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప రాయల తెలంగాణ వద్దన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు ఇప్పుడు సమైక్యాంధ్రనడం సిగ్గు చేటన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ 2004లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవెందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రాన్ని అడ్డుకోవాలంటే మద్దతు ఉపసంహరించాలి
హైదరాబాద్: అడ్డగోలు విభజనతో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న యూపీఏ ప్రభుత్వ తీరును అడ్డుకోవాలంటే సీమాంధ్ర ఎంపీలంతా తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈ దిశగా ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు వారి ఇళ్ల ముందు ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మంగళవారం ఇక్కడ సమావేశానంతరం పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త వి.ల క్ష్మణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు సీమ ఎమ్మెల్యేల మద్దతుతో ఆమోదం తెచ్చుకునే కుట్రలో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. 1,700 గ్రామపంచాయతీలు రాయల తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినట్టుగా బోగస్ వివరాలను అధికారులు కేంద్రం ముందుంచారని, ఆయా గ్రామ పంచాయితీల మినిట్స్ పుస్తకాలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో విభజన అంశంపై చర్చ రోజున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని, డిసెంబరు 9న విద్రోహ దినంగా పాటిస్తున్నామని తెలిపారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ అందించిన రహస్య నివేదికను బహిర్గం చేయాలని, మీడియాలో వచ్చిన అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు సీమాంధ్ర ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్యాకేజీలకు అమ్ముడుపోయి మోసం చేస్తున్న సీమాంధ్ర నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ ఎ.వి.పటేల్ అన్నారు. సీమాంధ్రులు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే ప్రెస్‌క్లబ్ కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు. సీమాంధ్రకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, దివాకరరెడ్డి లాంటి నేతలు పదవీ కాంక్షతో రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనకేసుకొస్తున్నారని, వీరికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అండ ఉందని సమైక్యాంధ్ర ఐటీ జేఏసీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని, దీన్ని నిరోధించటం ఎవరితరం కాదని న్యాయవాది రామకృష్ణ పేర్కొన్నారు. -
రాయలతెలంగాణపైనే తర్జనభర్జన
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా రాయలతెలంగాణపై తర్జన భర్జనపడుతోంది. ఈ రోజు సాయంత్రం జరిగిందే జిఓఎం తుది సమావేశం అనుకున్నారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారధ్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యారు. జిఓఎం సభ్యులు చిదంబరం, ఎకె ఆంటోని,వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి, జైరాం రమేశ్లతోపాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరాలు, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది. ఎక్కువగా రాయల తెలంగాణపైనే చర్చ జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపుగానీ, ఎల్లుండి గానీ మళ్లీ జిఓఎం సమావేశం జరిగే అవకాశం ఉంది. జిఓఎం ప్రతిపాదించిన అంశాలు: రాయల తెలంగాణకే మొగ్గు - ఇరురాష్ట్రాలకూ సమానంగా 21 చొప్పున లోక్‌సభ స్థానాలు - 147 చొప్పున శాసనసభ స్థానాలు - ఉమ్మడి రాధానిగా హైదరాబాద్ - జిహెచ్ఎంసి పరిధి వరకూ ఉమ్మడి రాజధాని - గవర్నర్ చేతికి శాంతి భద్రతల వ్యవహారం - రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా - ఇరురాష్ట్రాలకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) వర్తింపు- రాజ్యాంగ సవరణలేకుండానే విభజన - తెలంగాణకే భద్రాచలం - కృష్ణా జలాపంపిణీకి నీటి నిర్వహణ బోర్డు - పీపీఏల నుంచి తెలంగాణకు విద్యుత్ - కొన్నొళ్ల పాటు ఉమ్మడి సర్వీసుల విధానం అమలు. ఒకే సంస్కృతి, సంప్రదాయాలు గల రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విడదీయాలనుకోవడం బాధాకరం. సీమ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరుచేసి రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆ ప్రాంత నాయులు ఎవరూ అంగీకరించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసంమే కాంగ్రెస్ అధిష్టానం ఈ దారుణానికి పాల్పడుతోందని స్పష్టపోయింది. పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణను ఒప్పుకోమని తెలంగాణవాదులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ జెఏసి నేతలు ఈరోజు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిశారు. తాము రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్‌నాథ్ సింగ్ వారికి చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాయలతెలంగాణకు ఒప్పుకునేదిలేదని తెగేసి చెప్పారు. అలా చేస్తే మరో యుద్ధమేనని హెచ్చరించారు.ఈ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్‌కు కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుగా పేర్కొన్న తెలంగాణ బిల్లు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ ముందుకు వస్తుందని సమాచారం. జిఓఎం నివేదిక, బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రి మండలి చర్చించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటునుంచి అసెంబ్లీకి పంపుతారు. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి పది రోజుల గడువు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలన్న బిజెపి డిమాండ్ - అఖిలపక్ష సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపధ్యంలో ఈ నెల 5 ప్రారంభమయ్యే సమావేశాలను 20వ తేదీ వరకు కొనసాగిస్తారు. ఒక వారం విరామం తరువాత ఈ నెల 27న తిరిగి ప్రారంభించేయోచనలో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అధిష్టానం సూచనల మేరకే ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం తరువాత, పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించేవిధంగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎటూ సమావేశాల కాలాన్ని పొడిగిస్తారు. 2009 డిసెంబర్ నెల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా నిలిచిందో, రాష్ట్ర విభజన ప్రక్రియలో ఈ డిసెంబర్ నెల అంతే అత్యంత కీలకం కానుంది. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
-
ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
-
'రాయల'కు నిరసనగా 5న తెలంగాణ బంద్: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటుపై వార్తలు మీడియాలో వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు తెర తీస్తోంది. పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కోసం బుధవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎలాంటి అంక్షలు లేని తెలంగాణ కోసం డిసెంబర్ 5 తేదిన బంద్ కు పిలుపునిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలతోపాటు ఇతర సంస్థలు బంద్ కు సహకరించాలని ఆయన అన్నారు. ఇది తెలంగాణలో ప్రతి ఇంటికి సంబంధించిన విషయమని కేసీఆర్ వ్యాఖ్యాలు చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై తమకు విశ్వసనీయమైన సమాచారం ఉంది అని.. అందుకే నిరసన తెలుపుతున్నామని కేసీఆర్ అన్నారు. రాయల తెలంగాణను ఎవరు అడిగారు అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తామని కేసీఆర్ హెచ్చరించారు. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తాం అని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయల తెలంగాణ నిర్ణయానికి ఒప్పుకోమని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని.. మా పిల్లల చేసిన త్యాగాలు రాయల తెలంగాణ కాదు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది అని, ఆ నిర్ణయాన్ని కేబినెట్ కూడా అంగీకరించింన విషయాన్ని ఆయన తెలిపారు. అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయమతుందన్నారు. అలాగే షరతులతో కూడిన తెలంగాణకు అంగీకరించం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల శ్రమ అని, ప్రాణ త్యాగాలకు పాల్పడింది రాయల తెలంగాణ కోసం కాదని కేసీఆర్ అన్నారు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా జీవోఎం చర్చిస్తుందని తాము మంత్రుల బృందాన్ని ప్రశ్నించామన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, పోరాటం జరిగింది అని, తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరామని కేసీఆర్ తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నామని.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రమవుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన 28 రాష్ట్రాలకు వర్తించే విధంగానే తెలంగాణకు కూడా అవే నిబంధనలు, విధానాలు ఉండాలి అని జీవోఎం సభ్యులకు తెలిపాను అని మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత రాజ్యంగంలో ఏముందో తమకు తెలుసు అని.. ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనే విషయం తమకు తెలుసు అని ఆయన అన్నారు. ఉన్నపళంగా వారిని వెళ్లమని కోరితే బాగుండదనే విషయం కారణంగా ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామన్నారు. గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వెలువడుతున్నా.. తాము అడ్డదిడ్డంగా మాట్లాడటం ఇష్టం లేక టీఆర్ఎస్ స్పందించలేదని తెలిపారు. రాయల తెలంగాణ అంటే మరో యుద్దం తప్పదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
మంత్రులు బృందం (జీవోఎం) తుది సమావేశంగా భావించిన భేటిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నార్త్ బ్లాక్ లో ముగిసింది. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలా లేదా 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ప్రకటించాలా అనే అంశంపై తర్జన భర్జన పడిన సభ్యులు ఎటూ తేల్చకుండానే మరోసారి రేపు కలిసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. గంటకు పైగా జీవోఎం భేటి అనంతరం ఆజాద్ మాట్లాడుతూ.. ఇదే చివరి భేటి కాదు. రేపు ఉదయం మళ్లీ సమావేశమవుతామని ఆజాద్ తెలిపారు. మంగళవారం సమావేశానికి కొనసాగింపుగా మరో భేటి ఉంటుంది అని ఆజాద్ అన్నారు. కేబినెట్ సమావేశానికి ముందు మరోసారి జీవోఎం నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సభ్యులు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులందరూ మంగళవారం సాయంత్రం సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ సమావేశానికి చిదంబరం, ఆంటోని, మొయిలీ, నారాయణ స్వామి, షిండే, జైరాం రమేశ్ లు పాల్గోన్నారు. జీవోఎం భేటికి కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. -
జీవోఎం చివరి సమావేశం ప్రారంభం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి జీవోఎం సభ్యుల చివరి సమావేశం ప్రారంభమైంది. ఈ సభకు కేంద్ర మంత్రుల బృందం పూర్తి స్తాయిలో హాజరైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్ర జరుగుతున్న ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై కేంద్ర జీఓఎంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
'రాయల తెలంగాణతో విభజన సమతూకం'
-
రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ: కోదండరాం
రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చిందని టి.జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం ఆరోపించారు. నాలుగు జిల్లాలతో ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని విభజించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమను విభజించడం వల్ల సీమవాసులకు మేలు జరగదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో మహాత్ముని స్మృతివనమైన రాజ్‌ఘాట్‌లో తెలంగాణ నేతలు చేపట్టిన మౌన దీక్ష ముగిసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనేది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే విభజించాలని ఆయన పేర్కొన్నారు. జులై 30వ తేదీన తెలంగాణపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్నే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని జాతీయ పార్టీ నేతలను కలసి రాయల తెలంగాణను వ్యతిరేకించాలని కోరతామని చెప్పారు.10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కేంద్రానికి హితవు పలికారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ తీసుకురావలసిన బాధ్యత టి.కాంగ్రెస్ నేతలదే ఆయన వ్యాఖ్యానించారు. అలాకాకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రొ.కోదండరాం ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. -
'రాయల తెలంగాణతో విభజన సమతూకం'
హైదరాబాద్ : రాయల తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అంగీకరించారని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన సంతోషకరమన్నారు. రాయల తెలంగాణ అంశంలో కరుణించిన సోనియాకు.... సహకరించిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు జేసీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. రాయల తెలంగాణతో రాష్ట్ర విభజన సమతూకంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతను నివారించడానికి కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం ఉపయోగకరమని జేసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బళ్లారి కలిసినప్పుడే రాయలసీమ విడిపోయిందని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు గతంలో నిజాం పాలనలో ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కత్తులు, కటార్ల సంస్కృతి కర్నూలు...అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు తరలిందని జేసీ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని తనతో చెప్పిన తెలంగాణ ప్రాంత నేతలు బాహాటంగా అంగీకరించకపోవటం దురదృష్టకరమని ఆయన అన్నారు. కాగా ఈ సందర్భంగా అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ .... రాయల తెలంగాణ కాదని... రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరండని జేసీకి సూచించారు. -
పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్న కేసీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. రాయల తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల తెలంగాణ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేతలు కేసీఆర్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రాయల తెలంగాణను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రాయల తెలంగాణ చేస్తామని అనుకుంటే మీ ఖర్మ. మేమైతే ఆ ప్రతిపాదనకు సహకరించపోగా వ్యతిరేకంగానే ఉండాల్సి ఉంటుంది’ అని కేసీఆర్... కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను పంపారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదన అధికారికంగా వస్తే ఉద్యమించడానికి సిద్ధం కావాలని పార్టీశ్రేణులను కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్యులతో ఆయన నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణ అనేది పుకార్లు మాత్రమే కావచ్చని అన్నారు. -
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వం: బీజేపీ
కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతో తెలివిగా ప్రయోగించానని భావిస్తున్న రాయల తెలంగాణ అస్త్రం కాస్తా బూమెరాంగ్ అవుతోంది. అన్ని వర్గాల వాళ్లూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ రాజకీయ క్రీడలను చూసి మండిపడుతోంది. కేవలం ఎంఐఎం కోసమే రాయల తెలంగాణ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తీసుకొస్తోందని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఇలాగైతే తాము పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదుట వైద్య జేఏసీ ధర్నా చేసింది. రాయల తెలంగాణ అంశాన్ని వైద్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకే సీమాంధ్ర నేతలు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రమన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కాదని, రాయల తెలంగాణ సిఫార్సును జీవోఎం చేయడం నిబంధనలను వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణకు ముడిపెట్టడమంటే జోన్ 4ను విభజించడమేనని, అప్పుడు 371 (డి) ఆర్టికల్‌ను సవరించాల్సి వస్తుందని, అలా సవరించకపోతే విభజన ప్రక్రియ కోర్టులో నిలవదని జీవన్ రెడ్డి చెప్పారు. -
రాయల తెలంగాణ గురించి నాకు తెలియదు: షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే .... రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏమీ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని... జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది. -
రాయలతెలంగాణ గురించి నాకు తెలుయదు:షిండే
-
'కర్నూలు వదిలించుకునేందుకే రాయల తెలంగాణ'
న్యూఢిల్లీ : రాయల తెలంగాణకు ప్రతిపాదనకు తెలంగాణ జేఏసీ వ్యతిరేకమని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ 12 జిల్లాల తెలంగాణ తమకు ఆమోదం కాదన్నారు. కర్నూలు వదిలించుకునేందుకే కొందరు సీమాంధ్ర నేతలు ఈ ప్రతిపాదన చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్ వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకునేందుకే కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. కేంద్ర కేబినెట్ ముందుకు రాయల తెలంగాణ బిల్లును వస్తే.. ఆ బిల్లు పార్లమెంట్‌లోకి రాకముందే తెలంగాణలో సకలజనుల సమ్మెను మించిన ఉద్యమాన్ని ఉద్యోగులు చేపడతారని హెచ్చరించారు. -
రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ
-
రాయల ఒప్పుకోం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 125వరోజూ సోమవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. తిరుపతిలో సమైక్యవాదులు తలలపై కుర్చీలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలి పారు. మదనపల్లెలో జేఏసీ నేతలు సదస్సు నిర్వహించి విభజన వల్ల రాయలసీమకు జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో విద్యార్థులు ‘వుయ్ హేట్ టీ బిల్’ అక్షరాకృతిలో కూర్చుని కేంద్రప్రభుత్వ తీరుపై నిరసనృవ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ పాలకొల్లు, నరసాపురం, మార్టేరు పట్టణాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. కృష్ణాజిల్లా కలిదిండిలో కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. అవనిగడ్డలో దీక్షలు 100వ రోజుకు చేరిన సందర్భంగా 100మంది విద్యార్ధులు ఒకరోజు దీక్ష చేపట్టారు. -
సర్దుబాటు అంటే సమరమే..
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఓ వైపు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సర్దుబాటు చేసుకోవాలనడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్‌రావు అన్నారు. సర్దుబాటు చేసుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటని, తెలంగాణ ప్రజలు మి మ్మల్ని వచ్చే ఎన్నికల్లో సర్దిపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆంక్షలు లేని హైదరాబాద్, భద్రాచలం, మునగాలతో పది జిల్లాల తెలంగాణ సాధించుకుంటామన్నారు. టీఆర్‌ఎసీవీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జెడ్పీ మైదానంలో పాలమూర్ విద్యార్థి పోరుగర్జన బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆర్డీఎస్ తూములను బాంబులతో బద్దలుకొట్టిన సీమ నాయకులను తెలంగాణలో ఎలా కలుపుకుంటామన్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితే నీటి దోపిడీకి తావుండదనే రాయల తెలంగాణ అంటున్నారని విమర్శించారు. ఈ మోసాలను పసిగట్టకుండా టి.కాంగ్రెస్ నాయకులు సర్దుకుపోవాలంటే విద్యార్థులు వారిపై పోరాటం చేస్తారని హెచ్చరించారు. రాయల తెలంగాణ అంటే వెనకబడిన పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు. సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూకు రూ.ఏడువేల కోట్లు దోచిపెడుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ మంత్రులను హరీష్‌రావు ప్రశ్నించారు. సీఎంకు మద్దతు తెలిపితే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ కేసీఆర్ ఆమరణదీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని టి.హరీష్‌రావు చెప్పారు. 1200 మంది బలిదానాలు చేసింది 13 ఏళ్ల పోరాటం చేసింది ఆంక్షల తెలంగాణ కోసం కాదన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలోని నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ పది జిల్లాల్లో కేవలం రెండు కాలేజీలు ఉన్నాయన్నారు. తెలంగాణ సమాజం కలలు గన్న తెలంగాణ రాష్ట్రం రావాలంటే టీఆర్ఎస్ను బలపర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంపై టీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. ఈ ప్రాంతం దోపిడీకి గురికావడానికి వారే కారకులన్నారు. ఇక్కడి విద్యార్థులు, యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలన్నారు. రాయల అంటే మరో యుద్ధమే.. రాయల తెలంగాణ అంటే మరో యుద్ధం తప్పదని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పొలిట్‌బ్యూరోసభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, ఇబ్రహీం హెచ్చరించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని పలికిన చంద్రబాబుకు తెలంగాణలో 1200 మంది బలిదానాలపై ఎందుకు చలించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకుంటుంటే సిగ్గు, రోషం లేకుండా ఆ పార్టీలో ఎలా ఉంటారని టీటీపీపీ నాయకులు నిలదీశారు. టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్‌లో కలువదన్నారు. కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా కుమ్మకైయ్యారని, ఆంక్షలతో కూడిన తెలంగాణ ప్రకటించే టి.కాంగ్రెస్ నాయకులను బట్టలూడదీసి తరిమికొడతామని టీఆర్‌ఎసీవీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ప్రాణాలు అర్పించింది.. వంద కేసులకు బెదరకుండా పోరాటం చేసింది ఆంక్షల తెలంగాణ కోసమేనా? అని ప్రశ్నిం చారు. టీ కాంగ్రెస్ నేతలు ఎటువైపు నిలబడతారో తేల్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు గౌతం శ్రీను, కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, ఆల వెంకటేశ్వరెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ రెండు జిల్లాలను కలిపినా అది తెలంగాణే
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపినా కూడా.. తెలంగాణ తెలంగాణగానే ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాయల తెలంగాణపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయాన్ని తాను ఖండించదలచుకోలేదని బదులిచ్చారు. ‘సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.. కానీ సీమలోని రెండు జిల్లాలు అనంతపురం, కర్నూలులను కూడా తెలంగాణతో కలిపితే అది రాయల తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లవుతుంది కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘ముందు జీవోఎం నివేదికలో ఏముందో బహిర్గతం కానివ్వండి. దాని సిఫారసుల కోసం వేచిచూద్దాం’’ అని ఆయన బదులిచ్చారు. జీవోఎం సిఫారసుల ఆధారంగా ముసాయిదా బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారని, ఆ తర్వాతే దీనిపై తాను స్పందిస్తానని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము జరుపుతున్న ప్రైవేటు చర్చల వివరాలను బహిరంగపరచలేమన్నారు. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే అభిప్రాయం కోరుతూ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందన్నారు. -
రాయల కలకలం
* కొత్త చిచ్చు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం * మొదటి నుంచీ 10 జిల్లాల తెలంగాణ అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ * ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంటూ జోరుగా ప్రచారం * దీనికి మన్మోహన్, సోనియా ఓకే చెప్పారంటూ వార్తలు * ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్న మెజారిటీ పార్టీలు * రాజకీయ లాభం కోసమే ‘రాయల టీ’ ఎత్తుగడ? * జీవోఎం సిఫార్సులపై నేడో రేపో కేంద్ర కేబినెట్ తుది నిర్ణయం * అసెంబ్లీ సమావేశాలపై నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. రాయల తెలంగాణకు ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారన్న ప్రచారం నేతల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాయల తెలంగాణ కేంద్రంగానే కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విభజన తుది నిర్ణయం కావచ్చన్న అభిప్రాయమూ కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది. మెజారిటీ ప్రజలు, పార్టీలు వ్యతిరేకిస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెరముందుకు తేవడం వెనుక ఆంతర్యంపై పలురకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనే ప్రచ్ఛన్న ఎజెండాను కాంగ్రెస్ ఇప్పుడు ముందుకు తె చ్చిందని అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచీ 10 జిల్లాల తెలంగాణ అని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే. సీడబ్ల్యూసీ తీర్మానం ఆధారంగా కేంద్ర హోం శాఖ కేబినెట్‌కు అందించిన నోట్లో కూడా పది జిల్లాల తెలంగాణను మాత్రమే ప్రతిపాదించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే కేంద్ర హోం శాఖ పదకొండు అంశాలను జీవోఎం పరిశీలనకు పంపింది. మంత్రుల బృందం కూడా గత కొద్దిరోజులుగా ఈ దిశగానే కసరత్తు సాగించింది. మధ్యలో రాయల తెలంగాణ గురించి ఒకరిద్దరు నేతలు ప్రస్తావన తెచ్చినా దానికి అంతప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. ఈ ప్రతిపాదనలకు ఆదిలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి విముఖత వచ్చింది. సీమాంధ్ర నేతలు, ప్రజలు తాము రాష్ట్ర సమైక్యాన్నే కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. రాయలసీమను విభజిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆప్రాంత ప్రజలు తీవ్రంగానే స్పందించారు. ఇక తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు రాయల తెలంగాణను అంగీకరించేది లేదని కరాఖండీగా ప్రకటించారు. టీఆర్ఎస్, బీజేపీ ఈ ప్రతిపాదన ను ఆమోదించబోమని, పార్లమెంటులో, అసెంబ్లీలో దీన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంచేశాయి. ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ ప్రాతిపాదననే కాంగ్రెస్, కేంద్రం ఇప్పుడు తెరపైకి తేవడం వేరే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. నేడు కేబినెట్ భేటీ ఉంటుందా? పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నందున మూడో తేదీనే ప్రత్యేక కేబినెట్ భేటీని నిర్వహించాలని కేంద్రం పెద్దలు ఇదివరకు భావించారు. జీవోఎం అదే రోజు తుది నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుండడం, కీలక నేతలు దానిపై దృష్టి సారించాల్సి ఉండడంతో మంగళవారం కేబినెట్ భేటీ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇది బుధవారానికి వాయిదా పడవచ్చంటున్నారు. రాజకీయ ప్రయోజనానికేనా.. సొంత ప్రయోజనాలతో పాటు రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కర్నూలు, అనంతపురంలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇరురాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు 147 చొప్పున, లోక్‌సభ స్థానాలు 21 చొప్పున సరిసమానంగా ఉంటాయి. పైగా కృష్ణా జలాలకు సంబంధించి కీలక సమస్యగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధిష్టానం పెద్దలు పైకి చెబుతున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపడమన్న కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. నిజానికి ఆ వాదనలో బలం లేదని అన్ని పార్టీల నేతలూ చెబుతున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమన్న టార్గెట్‌తోనే అధిష్టానం ముందుకు పోతోందని చెబుతున్నారు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ.. రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. రాష్ట్ర విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేయనుండటం, కేంద్ర కేబినెట్ దానికి ఆమోదముద్ర వేయనున్నట్లు వస్తున్న వార ్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక, రాయల తెలంగాణ, అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రధాన చర్చ సాగవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉండడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కొందరు రాష్ట్ర మంత్రులు సోమవారం నాటి తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. -
నేడు జీవోఎం తుది భేటీ
* నివేదిక, టీ ముసాయిదా బిల్లుకు లాంఛనంగా ఆమోదం * రేపు లేదా ఎల్లుండి కేబినెట్ పరిశీలన? * జీవోఎం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ * ‘రాయల’కు మొగ్గితే బిల్లుకు ఆమోదం కష్టమేనంటున్న కాంగ్రెస్ ముఖ్యులు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం. గత వారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల మేరకు.. నివేదిక, బిల్లులో చేయాల్సిన చివరి మార్పుచేర్పులు పూర్తిచేసి జీవోఎం సభ్యులు వాటిని లాంఛనంగా ఆమోదిస్తారని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌కు సమర్పించాల్సిన విభజన నివేదికపై సభ్యులందరూ సంతకాలు చేయటంతో జీవోఎంకు అప్పగించిన పని పూర్తవుతుందని, ఆ తర్వాత ఈ నివేదిక కేబినెట్ ముందుకు వెళ్తుందని వారు చెప్పారు. సిఫారసులు ఎలా ఉంటాయో..! జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జీవోఎం లాంఛనంగా ఆమోదించేవరకు నివేదికలోని ఏ అంశాన్నయినా ఫైనల్ అని పేర్కొనటం కుదరదని, రాజకీయ నిర్ణయం ప్రకారం ఆఖరి క్షణాల్లో ఏ మార్పులైనా జరగవచ్చని హోంశాఖ వర్గాలు సోమవారం ‘సాక్షి’కి వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో మొత్తం 69 పేజీలుంటాయని ప్రచారం జరుగుతోంది. చివరి క్షణాల్లో జరిగే మార్పులతో ఈ బిల్లు స్వరూపం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. రేపు లేదా ఎల్లుండి కేబినెట్? జీవోఎం ఆమోదముద్రతో విభజన నివేదిక, బిల్లును కేంద్ర కేబినెట్ బుధ లేదా గురువారం జరిపే సమావేశంలో పరిశీలించవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీ 4వ తేదీన బుధవారం ఉంటుందని షిండే కొద్ది రోజుల కింద చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం బుధవారం కేబినెట్ సమావేశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రతివారం ఆనవాయితీగా గురువారం కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఈసారి కూడా 5వ తేదీ గురువారమే కేబినెట్‌ను సమావేశపరుస్తారని చెప్తున్నారు. ఏ రోజున కేబినెట్ భేటీ జరిగినా తప్పకుండా జీవోఎం నివేదిక, విభజనపై ముసాయిదా బిల్లును అందులో చర్చించి ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలూ గట్టిగా చెప్తున్నాయి. కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటు నుంచి రాష్ట్ర శాసనసభకు వెళ్తుంది. ‘రాయల’కు మొగ్గితే ఆమోదమెలా? విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రకారం రాయల తెలంగాణ ఏర్పాటుకు జీవోఎం సిఫారసు చేస్తుందా? లేదా తెలంగాణ, రాయల తెలంగాణ రెండు ప్రతిపాదనలనూ కేబినెట్ ముందుంచి చేతులు దులుపుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. జీవోఎం ఒకటి కాకుండా రెండు ప్రతిపాదనలతో నివేదిక సమర్పించిన పక్షంలో కేబినెట్ సమావేశంలో గరంగరం చర్చ తప్పదని తెలుస్తోంది. కేబినెట్ హోదా మంత్రుల్లో జైపాల్‌రెడ్డి, కిశోర్‌చంద్రదేవ్‌లు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. యూపీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన మంత్రులు కూడా రాయల తెలంగాణకు అనుకూలంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రాయల తెలంగాణవైపే మొగ్గితే పార్లమెంటులో విభజన బిల్లుకు ఆమోదం సాధించడం ఎలాగన్నది కాంగ్రెస్ వ్యూహకర్తలకు తలనొప్పిగా మారింది. యూపీఏ నుంచి అనేక పార్టీలు, మరీ ముఖ్యంగా డీఎంకే నిష్ర్కమించిన దరిమిలా పార్లమెంటు ఉభయసభల్లో ప్రభుత్వానికి మెజారిటీ కొరవడి ఎలాగో నెట్టుకొస్తున్న తరుణంలో విభజన బిల్లు వంటి అతి ముఖ్యమైన బిల్లుకు, అందునా ఇతర పక్షాలు వ్యతిరేకించే అంశాలతో ఉన్న బిల్లుకు ఆమోదం పొందటం తేలిక కాదన్నది వారి అంతరంగంగా ఉన్నట్లు ఏఐసీసీ కీలక నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకే ఆమోదం కష్టమనుకుంటున్న తరుణంలో రాయల తెలంగాణగా మారిస్తే ఉభయసభల సమ్మతి సంపాదించడం గగనమేనని, ఈ బిల్లు కూడా పెండింగ్ జాబితాలో చేరిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. -
రాయల తెలంగాణకు ఒప్పుకోం: విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే రాయల తెలంగాణ ప్రతిపాదన అని, దీన్ని తాము ఒప్పుకోబోమని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుటిల నీతికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. నాటి కేంద్రప్రభుత్వం-నిజాంనవాబు, రజాకార్లతో యథాతథ స్థితి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టే నేడు సోనియా, మజ్లిస్‌తో ఒప్పందానికి వచ్చారన్నారు. మేం కోరుతున్నది తెలంగాణ మాత్రమే: గండ్ర స్వయంపాలన కోసమే తామంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామే తప్ప రాయల తెలంగాణ కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుతుంటే రాయల తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మూడు రోజుల గడువు ఇచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దురుద్దేశాలతోనే రాయల తెలంగాణ : ఈటెల గోదావరిఖని, న్యూస్‌లైన్: దురుద్దేశాలతోనే రాయల తెలంగాణను కాంగ్రెస్‌పార్టీ తెరమీదకు తెచ్చిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సోమవారం టీబీజీకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. బిల్లు పెట్టకుండా, కాలయాపన చేస్తుండడం వల్లే రాయల తెలంగాణ వంటి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కేసీఆర్ వల్లే ‘రాయల’ ప్రతిపాదన: ఎంపీ రాథోడ్ మంచిర్యాల, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ వల్లే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రకటించి జాప్యం చేయడవం వల్లనే కాంగ్రెస్ రాజకీయ లబ్దికోసం కోసం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాయల పేరుతో కాంగ్రెస్ కుట్ర: ఎర్రబెల్లి పాలకుర్తి, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకురావడంలో కుట్ర దాగి ఉందన్నారు. ‘రాయల’ ఆమోదిస్తే ఉద్యమం: టీజేఎఫ్ హైదరాబాద్,న్యూస్‌లైన్: రాయలతెలంగాణ ప్రతిపాదన చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సోమవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 4న జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాయల తెలంగాణ అంటే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు. 5న విద్యాసంస్థల బంద్: శ్రీనివాస్ మాదిగ సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న తెలంగాణ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. తెలంగాణ కోసం 6న టీసీఎంజీ చలోఢిల్లీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నిర్ణయించింది. ఈనెల 6న ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు అక్కడే మకాం వేయాలని తీర్మానించింది. సోమవారం రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ నివాసంలో సారథ్య బృందం నాయకులు జి.నిరంజన్, బి.కమలాకరరావు, నర్సింహారెడ్డి, శ్యాంమోహన్, డాక్టర్ శంకర్, బొల్లు కిషన్ తదితరులు సమావేశమై యాత్ర గురించి చర్చించారు. -
రాయల తెలంగాణ చేస్తామంటే మీ ఖర్మ
సాక్షి, హైదరాబాద్: ‘రాయల తెలంగాణ చేస్తామని అనుకుంటే మీ ఖర్మ. మేమైతే ఆ ప్రతిపాదనకు సహకరించపోగా వ్యతిరేకంగానే ఉండాల్సి ఉంటుంది’ అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను పంపారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ‘హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షల్లేకుండా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని అడుగుతున్నాం. అంతకుమించి మరే ప్రతిపాదనా మాకు అంగీకారయోగ్యం కాదు. తెలంగాణకు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని మేం కోరుకోవడం లేదు. అలా చేస్తే రాష్ట్రాన్ని విభజించినట్టుగానే ఉంటుంది తప్ప తెలంగాణ వచ్చిందనే భావన తెలంగాణవాదులకు రాదు. తెలంగాణ కోసం రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఆలోచన కూడా మాకు లేదు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయంగా మన్ననలు పొందాల్సిన మీరు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని కేసీఆర్ అభిప్రాయాన్ని పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ‘రాయల’పై రణంకు సిద్ధం కండి: శ్రేణులకు కేసీఆర్ ఆదేశాలు రాయల తెలంగాణ ప్రతిపాదన అధికారికంగా వస్తే ఉద్యమించడానికి సిద్ధం కావాలని పార్టీశ్రేణులను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్యులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. రాయల తెలంగాణ అనేది పుకార్లు మాత్రమే కావచ్చునని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, సంపూర్ణ తెలంగాణ ఏర్పాటులో ఏమాత్రం తేడా వచ్చినా మరో ఉద్యమానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తెలిపారు. -
‘రాయల’ను గట్టిగా వ్యతిరేకించండి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తాము సమ్మతిస్తామని, రాయల తెలంగాణ పేరుతో కొత్త నాటకాలను తాము అంగీకరించబోమని తెలంగాణ జేఏసీ నేతలు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఏ రూపంలో వచ్చినా గట్టిగా వ్యతిరేకించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు జాతీయ పార్టీల మద్దతుకూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చిన జేఏసీ నేతలు కోదండరాం, దేవీ ప్రసాద్, రాజేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌లు జైపాల్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. విభజన అంశం సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ కొత్తగా రాయల అంశాన్ని తెరపైకి తేవడంపై వారంతా జైపాల్ వద్ద అసహనాన్ని వ్యక్తంచేశారు. రాజకీయ లభ్ధిని ఆశించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమేనని వారు అన్నట్లు తెలిసింది. దీనిపై జైపాల్ స్పందిస్తూ, ఈ విషయమై తాను ప్రధాని మన్మోహన్ సహా ఇతర ముఖ్య నేతలతో చర్చిస్తున్నానని, రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించానని చె ప్పారు. నేడు రాజ్‌ఘాట్ వద్ద మౌన దీక్ష రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు మౌన దీక్ష పాటించనున్నట్టు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సీమను విభజించే హక్కెవరిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తెరమీదకు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. ప్రజలకిది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘రాయల తెలంగాణ కావాలని ఎవరడిగారు? ఎంతో చరిత్ర , ఒక ప్రత్యేకత ఉన్న రాయలసీమను విభజించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారు? రాజకీయ లబ్ధి కోసం రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విభజించాల్సిందిగా ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ వంటి వారు కోరితే చీల్చేస్తారా? రాయలసీమ అంటే లెక్కలేకుండా పోయిందా!’’ అని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ మాదిరిగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, తమ పార్టీ ఈ చర్యను ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేసి గె లిపించిన పాపానికి వారితో చెలగాటం ఆడుతోందని, అన్నీ చూస్తూ ఏమీ చేయలేక జనం నిస్సహాయులుగా మిగిలిపోయారని అన్నారు. కుట్రలో భాగమే.. సమైక్యవాద ఉద్యమానికి ద్రోహం చేసే కుట్రలో భాగంగానే తాజా ప్రతిపాదన చేస్తున్నారని శోభ దుయ్యబట్టారు. అసలు రాయలసీమను తమతో కలపవద్దని తెలంగాణలోని అన్ని రాజకీయపక్షాలు, టీజేఏసీలు చెబుతుంటే ఈ ప్రాంత నేతలు మాత్రం తమను కలుపుకోమని ఎందుకు దేబిరిస్తున్నట్లు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో కోరుతుంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని నేతలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదం చేస్తున్నారని ఆమె తప్పు పట్టారు. చిరంజీవి హైదరాబాద్‌ను యూటీ చేయాలంటారు, పురందేశ్వరి విశాఖపట్టణాన్ని రాజధాని చేయమంటారు, కొందరు కేంద్ర మంత్రులేమో ప్యాకేజీలు ఇస్తే చాలంటారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించుకోండి అంటూ బ్లాంక్ చెక్‌లాగా లేఖను ఇచ్చేస్తారు.. అంటూ శోభ మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ వీరంతా ఒకేమాట చెబితే నేడు ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు.. తాము సమైక్యవాదులమని బయటికి చెబుతూ లోపలికి పోయి అధిష్టానంతో ఏమి చెప్పి వస్తున్నారో కానీ కేంద్రం విభజనకు సిద్ధం అవుతోందన్నారు. సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీ నేత గట్టు రామచంద్రరావు చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీనియర్ సన్నాసివి నువ్వే తుమ్మలా: గట్టు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టుల మీద చూపిన నిర్లక్ష్యంపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యంలేకే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనపై అసంబద్ధమైన విమర్శలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో సాగునీటిశాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పే యత్నం చేయకుండా ‘సన్నాసి’ అంటూ విమర్శించారన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల తనను సన్నాసి అన్నారంటే ఆయన సీనియర్ సన్నాసి అవుతారని పేర్కొన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిం ది9వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, అసలు బడ్జెటే కేటాయించకుండా ప్రాజెక్టులు కట్టామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. ఒకప్పుడు సామాన్య రైతుగా ఉన్నతుమ్మల ఈరోజు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని, తన ఆస్తులు, ఆయన ఆస్తులపై ఖమ్మంలో చర్చిం చడానికి సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. -
‘రాయల-టీ’అంటే కాంగ్రెస్ ఖతమే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు నుంచి క్రమంగా రాయల తెలంగాణ దిశగా శరవేగంగా కదులుతుండటం.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో కలవరం రేపుతోంది. రాయల తెలంగాణకు ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి రాజకీయ ఆమోదం లభించిందన్న వార్తలు వారిని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పక్కదారి పట్టిస్తే.. తెలంగాణలో పార్టీని కూడా ప్రజలు పక్కన పెట్టేస్తారని ఆందోళనలో ఉన్న టీ-కాంగ్రెస్ నేతలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాయల తెలంగాణ ప్రతిపాదనతో విభేదిస్తూ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపగా.. సోమవారం పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు సైతం తమవంతుగా అధిష్టానంతో చర్చలు జరిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను పక్కనపెట్టాలని జైపాల్ ఏకంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సహా ఇతర ముఖ్య నేతలను కోరగా.. డీఎస్ జీవోఎం సభ్యుడు ఎ.కె.ఆంటోనీని కలిసి ఇదే అంశమై చర్చించారు. పార్టీ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకుంటూ రాయల తెలంగాణకు ఆమోదం తెలిపితే రాజకీయంగా టీఆర్ఎస్కు కొత్త ఆయుధాన్ని ఇచ్చినట్లవుతుందని వారు పెద్దలకు తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు తెలంగాణలో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. రాయల ముసుగు ఎందుకన్న జైపాల్! రాజకీయ లబ్ధి, నదీ జలాల వివాద పరిష్కారం సాకుతో.. రాష్ట్ర విభజనకు రాయల ముసుగు తొడగడం ఎందుకంటూ జైపాల్‌రెడ్డి గట్టిగా వ్యతిరేస్తున్నారు. పది జిల్లాల సెంటిమెంట్ ప్రజల్లో ఉంటే పన్నెండు జిల్లాలను ఇస్తామనడం పక్కలో బల్లెం ఉంచటమేనని ఆయన చెప్తున్నారు. ఇదే విషయమై ఆయన ఇప్పటికే ప్రధాని సహా, పార్టీలోని ఇతర కీలక నేతలతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ‘తెలంగాణ, రాయలసీమ సంస్కృతులు పూర్తిగా భిన్నం. వేష, భాషల్లోనూ ఇరు ప్రాంతాల మధ్య వైరుధ్యం ఉంది. తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీ జలాల మణిహారంతో సహజసిద్ధమైన సరిహద్దులున్నాయి. వాటిని కాదని సరిహద్దులు మార్చడం మంచిది కాదు’ అని ఆయన స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. రాజకీయ ప్రయోజనాలపై ఆయన వివరిస్తూ ‘తెలంగాణ నిర్ణయంపై అక్కడి ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉంది. దాన్ని పక్కదారి పట్టిస్తే టీఆర్ఎస్కు మరో ఆయుధాన్ని ఇచ్చినట్లే. అనంత, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉంది. వాటిని కలిపితే తెలంగాణలో తిరిగి ఈ పార్టీకి ప్రవేశం కల్పించినట్లే. చంద్రునికో మచ్చలా ఆ రెండు జిల్లాలను కలపడం దేనికి?’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జైపాల్ అభిప్రాయంపై పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందీ తెలియరాలేదు. కేడర్ యూటర్న్ ఖాయమన్న డీఎస్ రాయల తెలంగాణపై తీవ్ర చర్చజరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీకిచేరుకున్న డీఎస్ సోమవారం ఆంటోనీ సహా, పలువురు ఇతర నేతలను కలుసుకున్నారు. రాయల ప్రతిపాదనపై తన మనోగతాన్ని వారి ముందుంచారు. ‘తెలంగాణ నిర్ణయంతో క్షేత్ర స్థాయిలో కేడర్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇప్పుడు రాయల తెలంగాణ అంటే కేడర్ అంతా యూటర్న్ తీసుకోవడం ఖాయం. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా కాంగ్రెస్ ఖతమే’ అని ఆయన స్పష్టంచేసినట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్లో బిల్లు, జీవోఎం సిఫారసులు తదితర అంశాలపైనా డీఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అంతకుముందు జైపాల్రెడ్డితోనూ ఆయన సుదీర్ఘంగా సమావేశమై రాయల తెలంగాణను అడ్డుకునే విషయమై చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ శెట్కార్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సమావేశమై ఈ విషయమై చర్చించారు. ‘రాయల’ ప్రతిపాదన తెస్తుందనుకోను తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నాక మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తుందని తాను భావించటం లేదని.. ఆంటోనీతో భేటీ అనంతరం డీఎస్ మీడియాతో పేర్కొన్నారు. అయితే రాయల తెలంగాణ కావాలని కొందరు జీవోఎంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. వారి ఒత్తిళ్లకు తలొగ్గే పరిస్థితి ఉండదని, సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే విభజన ఉంటుందని చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందో, రాదో తాను చెప్పలేనన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాలు ఏర్పడటం తథ్యమని పేర్కొన్నారు. -
కేసీఆర్ పెద్ద సమైక్యవాది: మంత్రి టీజీ
తిరుమల: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలో పెద్ద సమైక్యవాది అని మంత్రి టీజీ.వెంకటేష్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయన సోమవారం రాత్రి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పేరుతో కేసీఆర్ సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్నార న్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదు, కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చే తెలంగాణ కు ఆయన అంగీకరించరని అన్నారు. కేసీఆర్ వైఖరే సమైక్యవాదానికి అనుకూలంగా ఉంటోందని, ఇలాంటి తరుణంలో అశోక్‌బాబు, ఇతర సమైక్యవాదుల నాయకత్వం అవసరం లేదని ఆయన అన్నారు. కర్నూలును రాజధాని కానివ్వకుండా ఉండేందుకే కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. -
చంద్రబాబు దాగుడుమూతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయటం ద్వారా కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చిన చంద్రబాబు... తాజాగా రాయల తెలంగాణ పేరుతో రాయలసీమను నిట్టనిలువునా చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలపై నోరు మెదపడంలేదు. సీమవాసులు, తెలంగాణ వాదులు రాయల తెలంగాణ ప్రతిపాదనలను బహిరంగంగానే వ్యతిరేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతున్నప్పటికీ టీడీపీ అధినేత స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేదో ఉందన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్న అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి రావడానికి ముందు కాంగ్రెస్ పెద్దలు పలువురు చంద్రబాబుతో మాట్లాడినట్లు అప్పట్లో జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటు చేసి మూడు నెలలుగా రకరకాల కసరత్తులను చేస్తూ రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి ప్రతిపాదనలు కూడా తీసుకుంది. జీవోఎం ముందు అన్నిపార్టీలు హాజరైనప్పటికీ టీడీపీ వెళ్లలేదు. పది జిల్లాలతో తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా చంద్రబాబు మౌనం పాటించడంపై సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నిర్ణయాలన్నింటికీ ఆయన ఆమోదముద్ర వేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. తెలంగాణ, రాయల తెలంగాణ వంటి కీలకాంశాల నుంచి తప్పించుకోవడానికో లేదా పక్కదారి పట్టించడానికో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం గతంలో తెలంగాణ ప్రకటన చేసిన తరువాత తామే అడ్డుకున్నామనే అపవాదుతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని, ఇపుడు ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళుతుంటే ప్రస్తుతం రాయల తెలంగాణ అంశంపై అధినేత మౌనంగా ఉండటం దేనికి సంకేతమో తమకు అర్థం కావటం లేదని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా పది నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లు మినహా టీడీపీకి రావని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రాయల తెలంగాణను ఏర్పా టు చే స్తే ఫలితాలు కొంచెమైనా తమకు అనుకూలిస్తాయన్న నమ్మకంతో అధినేత ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లుందని టీటీడీపీ నేత వ్యాఖ్యానించారు. -
'తెలంగాణను డిస్టర్బ్ చేయడం మంచిదికాదు'
న్యూఢిల్లీ: వ్యక్తిగతంగా రాయలతెలంగాణకు తాను వ్యతిరేకమని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు గాని, కర్నూలు- అనంతపురం జిల్లాల ప్రజలకుగానీ మంచిది కాదన్నారు. అన్ని స్థాయిల్లోనూ తాను దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చానని వెల్లడించారు. చాలారోజులనుంచి ఈ ప్రతిపాదన వస్తూనే ఉందన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానంలోగాని, కేబినెట్ నోట్లోగాని రాయల తెలంగాణ అంశం లేదని తెలిపారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయమే కొలబద్దకావాలన్నారు. లేదంటే విభజన ప్రక్రియకు అంతరాయం కలిగించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణ, రాయలసీమ ప్రజలు ఆవేశానికి లోనయ్యే అవకాశముందన్నారు. 10 జిల్లాల తెలంగాణను డిస్టర్బ్ చేయడం మంచిదికాదన్నారు. తనకు తెలిసిన ఏ కాంగ్రెస్ నేతా రాయల తెలంగాణకు అనుకూలంగాలేరని జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవాల్సిన అవసరంలేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు నదీజలాల విషయంలో అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని, ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీమ ప్రజలు అంగీకరించరు : మంత్రి కాసు
హైదరాబాద్: రాయలసీమను విభజించి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తామంటే పౌరుషం గల సీమ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరని సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం కాసు విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట విభజన జరగదని గట్టిగా విశ్వస్తున్నానని, పరిణామాలన్నీ అలాగే జరుగుతున్నాయని కాసు అన్నారు. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని ఆయన అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు. -
రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: పొన్నం ప్రభాకర్
ఢిల్లీ: రాయల తెలంగాణకు తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకుండా రాయల తెలంగాణను ఏర్పాటు చేయడం తగదని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే అంగీకరిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఇష్టం లేకుండా రాయలసీమను విభజన చేయొద్దన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వరం పెంచారు. ఇప్పటికే 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణకే మాత్రమే అంగీకరిస్తామని బీజేపీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. -
10 జిల్లాలతో కూడిన తెలంగాణకే కట్టుబడి ఉన్నాం:కిషన్ రెడ్డి
హైదరాబాద్:రాయల తెలంగాణకు అంగీకరించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గతం నుంచి 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే కట్టుబడి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై సీమాంధ్రులకు పలు అనుమానాలు, భయాలున్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కిషన్ రెడ్డి సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు డా. రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఎంతో మంది బలిదానాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమేనన్న విషయం కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే..కాంగ్రెస్ మాత్రం రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలతో నాటకాలాడుతుందని రాజేశ్వరరావు మండిపడ్డారు. -
'రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం'
హైదరాబాద్: రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు డా. రాజేశ్వరరావు తెలిపారు. ఎంతో మంది బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం కోసమేనన్న విషయం కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే..కాంగ్రెస్ మాత్రం రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలతో నాటకాలాడుతుందని రాజేశ్వరరావు మండిపడ్డారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడ్ని ప్రజల నిలదీయాలిన ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు సంకేతాలు రావడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగిస్తే.. రాయల తెలంగాణ అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం సరికాదని తెలంగాణ బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. -
'సీమ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించరా?'
హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ పాట పాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే ఈ కొత్తవాదాన్ని తెరమీదకు తెచ్చిందని ఆమె సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రజలు ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ఉనికి, వ్యాపారాల కోసమే కొందరు నేతలు రాయలసీమను విడగొట్టే కుట్రచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వాళ్లు వ్యతిరేకిస్తున్నా..... వారితోనే కలపండంటూ రాయలసీమ కాంగ్రెస్ నేతలు బతిమాలుతూ రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారని శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమను చీల్చే హక్కు ఎవరిచ్చారని.... ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించారా అని శోభా సూటిగా ప్రశ్నించారు. సమైక్యంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందని, విడదీస్తే శాశ్వతంగా నష్టపోతామన్నారు. తెలంగాణ నేతలు కలపొద్దంటే... సీమ నేతలు కలపాలనడం దారుణమన్నారు. సీఎం, బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనకు సహకరించటం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి సమైక్యం కోసం పోరాడాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బ తీయడానికే ఈ విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆమె పేర్కొన్నారు. -
'రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం'
-
రాయల తెలంగాణ దిశగా కేంద్రం!
ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం లభించినట్టు ఎన్డీ టీవీ కధనాన్ని నడుపుతోంది. ఇక సీడబ్ల్యూసీ నిర్ణయానుసారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ కాకుండా రాయల తెలంగాణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సిన కీలక అంశాలు, తెలంగాణ బిల్లు వంటి అంశాలపై వివిధ పార్టీల నేతలతో కమల్‌నాథ్ చర్చించే అవకాశముంది. మరోవైపు పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ హస్తినలోనే మకాం వేశారు. డీఎస్ అధినేత్రి సోనియా గాంధీ, జీవోఎం సభ్యులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జీవోఎం నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఇక రాయల తెలంగాణ ప్రతిపాదనపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరే దానికి అంగీకరించేలేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించకుండా కిరికిరి పెడితే ఊరుకోమని ఆపార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. -
'రాయల తెలంగాణ ప్రతిపాదన సీమాంధ్ర నేతలదే'
న్యూఢిల్లీ : సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం 'సాక్షి' ప్రతినిధితో మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను సీమాంధ్ర నేతలు జీవోఎంపై గట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ వద్ద ఉండే అవకాశం ఉందని డీఎస్ అన్నారు. తాత్కాలిక సర్ధుబాటే కాబట్టి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. భద్రాచలం సమస్య సాంకేతికమైందని అన్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదన అసలు లేదని డీఎస్ పేర్కొన్నారు. కాగా ఈరోజు ఉదయం ఆయన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. జీవోఎం నివేదిక, రాయల తెలంగాణ ...తదితర అంశాలపై వారిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. -
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
-
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. జీవోఎం నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని, కేబినెట్ ఆమోదించాక అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని దిగ్విజయ్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాయల తెలంగాణ అంశంపై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. వ్యక్తిగత సంభాషణల వివరాలు మీడియాకు చెప్పలేనని, రాయల తెలంగాణ అంశాన్ని తాను ఖండించదలుచుకోలేదని దిగ్విజయ్ అన్నారు. -
డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇక రాయల తెలంగాణ అంశంపై అధిష్టానం పిలుపు మేరకు రెండు రోజుల క్రితం హస్తిన వెళ్లిన దామోదర ఆ మేరకు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం దామోదర మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కాగా ఆయన పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని దామోదర స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ కల సాకారం కాబోతుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ నేతలకు, రాయల తెలంగాణ ప్రతిపాదన కలవరం కలిగిస్తోంది. రాయల తెలంగాణ కేవలం మీడియా ప్రచారం మాత్రమేనని ఒకవైపు ఖండిస్తూనే, మరోవైపు కలవరపడుతున్నారు. -
రాజకీయంగా దెబ్బతీసేందుకేనా?
సాక్షి, హైదరాబాద్: ‘రాయల తెలంగాణ’ను తెరపైకి తేవడం తెలంగాణ రాష్ర్ట సమితిని రాజకీయంగా దెబ్బతీసే వ్యూహంలో భాగమేనని ఆ పార్టీ నాయకత్వం అనుమానిస్తోంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో టీఆర్ఎస్ అధిపత్యానికి గండి కొట్టడానికే రాయల తెలంగాణ చర్చను ప్రారంభించారని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. రాయల తెలంగాణ అనే ప్రతిపాదన ముందు పెట్టి హైదరాబాద్‌పై ఆంక్షలకు తెలంగాణ నేతలను ఒప్పించే ఎత్తుగడ కూడా ఇందులో ఉండొచ్చునని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం, సీమాంధ్ర రాజధాని, జలాల పంపకం వంటి సమస్యలన్నీ తెలంగాణ 10 జిల్లాలతో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం వల్ల పరిష్కారమవుతాయనే వాదనలున్నాయి. రాయల తెలంగాణ ఏర్పాటుకు సాంకేతిక కారణాలంటూ బయటకు ఏం చెప్పినా ఈ ప్రతిపాదన వెనుక రాజకీయ కారణాలే బలంగా ఉన్నాయని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ 10 జిల్లాల్లో జరిగిన సర్వేల్లో మాకు(టీఆర్ఎస్) ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు వస్తాయని తేలింది. తెలంగాణలో వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ను విలీనం చేయమని కాంగ్రెస్ కోరితే.. టీఆర్ఎస్కు గౌరవప్రదమైన స్థానమే ఇవ్వాల్సి ఉంటుంది. విలీనం కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటది. ఇలాంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికే కాంగ్రెస్ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నట్టుంది’ అని కేసీఆర్ సన్నిహితుడొకరు విశ్లేషించారు. ‘హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడైతే టీఆర్ఎస్ పాత్ర పరిమితమే. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో బలం సగానికే ఉంది. అంటే తెలంగాణలో దాదాపు సగం జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా లేదు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సంకేతాలు కిందిస్థాయికి వెళ్తే ఆ పరిస్థితి మారుతుంది. అన్ని జిల్లాల్లో పార్టీ పుంజుకుంటది. కాని టీఆర్ఎస్ను వ్యతిరేకించే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులొస్తయి. ఇప్పటికే 3 జిల్లాల్లో బలం లేకపోగా, పూర్తి వ్యతిరేకంగా ఉన్న మరో 2 జిల్లాలు కలిస్తే టీఆర్ఎస్ నామమాత్రం అవుతుంది, పార్టీ అధికారంలోకి రాదు అని తేలితే ఆ బలం కూడా తగ్గిపోతది. ఇవన్నీ పరిశీలిస్తే టీఆర్ఎస్ను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకువస్తున్నారు’ అని కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మరో నేత అభిప్రాయపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకిస్తారని తెలిసినా ‘రాయల’ ప్రతిపాదనను తేవడం రాజకీయ కారణాలతోనే అని పేర్కొన్నారు. ‘రాయల తెలంగాణ అయితేనే అసెం బ్లీలో తీర్మానం నెగ్గే అవకాశముంది. లేదంటే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, ఆదాయం వంటివాటిపై అధికారాలను సీమాం ధ్రులు కోరుతున్నారు. వీటిలో ఏదో ఒకటి అయితే తప్ప మెజారిటీ సభ్యులు అంగీకరించే పరిస్థితి లేదు. అసెంబ్లీ తీర్మానం లేకుండా సాంప్రదాయాలను పట్టించుకోవడం లేదనే విమర్శలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి. అందుకని ఏదో ఒకదానికి ఒప్పుకోవాలంటూ మెలికలు పెట్టే కుట్ర కూడా లేకపోలేదు’ అని మరో నేత పేర్కొన్నారు. -
సీమ ప్రజలు రాయల తెలంగాణ కోరుకోవట్లేదు: కేఈ
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణను రాయలసీమ వాసులు ఎవరూ కోరుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్‌నే కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేలా కాంగ్రెస్ రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘రాయలసీమ వాసులు మమ్మల్ని దోచుకున్నారు’’ అని ఆరోపించిన వారితో తామెలా కలిసి ఉంటామని ప్రశ్నించారు. రాయల తెలంగాణ తమకు అక్కర్లేద ని స్పష్టంచేశారు. -
దిగ్విజయ్‌తో డీఎస్ భేటీ
* ‘రాయల తెలంగాణ’కు టీ-నేతలు ఒప్పుకోవాలన్న దిగ్విజయ్ * రాహుల్ పిలుపుతో నేడు మళ్లీ హస్తినకు డిప్యూటీ సీఎం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం నుంచి అందిన పిలుపుతో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. హస్తినలో దిగిన వెంటనే ఆయన ఆదివారం రాత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. సుమారు 35 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాయల తెలంగాణ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సానుకూల వాతావరణం కోసం సాగించే ప్రక్రియలో భాగంగానే రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా డీఎస్‌కు దిగ్విజయ్ స్పష్టంచేసినట్లు సమాచారం. నదీ జలాల అంశం సహా రాజకీయ లబ్ధిని ఆలోచించే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నామని.. దీనికి తెలంగాణ నేతలు ఒప్పుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు తనతో సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారెవరూ అంగీకరించబోరని దిగ్విజయ్‌కు డీఎస్ స్పష్టంచేసినట్లు సమాచారం. తెలంగాణ సంస్కృతికి, సీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల సంస్కృతికి 200 ఏళ్ల వైరుధ్యం ఉందని ఆయన వివరించినట్లు చెప్తున్నారు. డీఎస్ సోమవారం ఉదయం మరికొందరు అధిష్టానం పెద్దలను కలిసి, రాయల తెలంగాణ అంశమై చర్చించనున్నారు. ఇదిలావుంటే.. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా మళ్లీ సోమవారం ఉదయం ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినందునే ఆయన హస్తిన వెళుతున్నట్లు తెలుస్తోంది. బిల్లు సాఫీగా సాగేందుకే ‘రాయల’ ఎత్తుగడ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు సాఫీగా సాగేందుకే రాయల తెలంగాణ అంశాన్ని హైకమాండ్ పెద్దలు తెరపైకి తెచ్చి ఉంటారని ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వాళ్లు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం పట్టుపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యం కావాలని నినదిస్తున్నారే తప్ప రాయల తెలంగాణ ఎవరూ కోరుకోవటం లేదు. ప్రత్యేక సంస్కృతి కలిగిన రాయలసీమ ప్రజలు కూడా రాయల తెలంగాణ కోరుకోవటం లేదు. అసెంబ్లీలో విభజన బిల్లు సాఫీగా సాగేందుకే హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: శ్రవణ్
హైదరాబాద్: రాయల తెలంగాణ అంటే మరోసారి యుద్దం తప్పదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇటు తెలంగాణకు అటు రాయలసీమకు ఇష్టంలేకపోయినా ఎందుకు బలవంతంగా కలపాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్డీఎస్ను బద్దలు కొట్టినవారితో, మానవబాంబులం అయితామని, లాబీయింగ్‌లతో అడ్డుకుంటామని, తొండలు గుడ్లు పెట్టని భూములను అభివృద్ధి చేశామని హెచ్చరికలు చేసినవారితో ఎలా కలిసి ఉంటామని అడిగారు. పన్నుల్లేకుండా ట్రాన్స్‌పోర్టు కారిడార్ ఏర్పాటుచేయడానికి రాయల తెలంగాణ అంటున్నారా అని శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో భూము కబ్జాలకోసం ప్రయత్నిస్తున్నారా అని అడిగారు. లేకుంటే కొన్ని రాజకీయపార్టీల ప్రాబల్యం పెంచుకోవడానికి రాయల తెలంగాణ అంటున్నారా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. రామేశ్వరం పోయినా శనీశ్వరుడు పోలేదన్నట్టు 13 ఏళ్లు పోరాటం చేసినా అదే పెత్తనం ఎందుకన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలది తెలంగాణవాదమా, రాయల వాదమా అని శ్రవణ్ నిలదీశారు. తెలంగాణపై ఎలాంటి మెలికలు పెట్టినా తెలంగాణ కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. -
విభజించు.. పాలించు
రాయల తెలంగాణ దిశగా కాంగ్రెస్ అడుగులు అలాగైతే మరికొన్ని ఓట్లు, సీట్లు వస్తాయనే ఆశ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడ్డగోలుతనం తెలంగాణ ముఖ్యులను ఒప్పించే యత్నాలు అసెంబ్లీ అభిప్రాయాన్ని బూచిగా చూపుతున్న వైనం కాంగ్రెస్, టీడీపీ నేతలకు దిగ్విజయ్ ఫోన్లు దామోదరను పిలిపించుకొని మాట్లాడిన జైరాం భేటీలో కొప్పుల రాజు, హోం శాఖాధికారులు సోనియాతో ఆజాద్ భేటీ, రాయలపైనే చర్చ 7 లేదా 8 తేదీల్లో అసెంబ్లీకి బిల్లు: దామోదర సాక్షి, న్యూఢిల్లీ: ఓ నాలుగు ఓట్ల కోసం, మరో నాలుగు సీట్ల కోసం ఏం చేసేందుకైనా తాను వెనకాడబోనని ‘రాయల తెలంగాణ’ ప్రహసనం ద్వారా కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంటోంది. బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని రాష్ట్రంపై పదేపదే ప్రయోగిస్తోంది. కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను కూడా చీల్చేందుకు తాజాగా రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో రానున్న సాధారణ ఎన్నికల్లో తనకు ఎన్నో కొన్ని ఓట్లు, కాసిన్ని సీట్లు ఎక్కువగా వస్తాయేమోనన్న ఆశే కాంగ్రెస్‌ను ఇందుకు పురిగొల్పుతోందన్నది సుస్పష్టం. అనంతపురం, కర్నూలు జిల్లాలను రాయలసీమ నుంచి విడదీసి, తెలంగాణ నేతలను ఎలాగోలా ఒప్పించి ఆ ప్రాంతంతో కలిపే దిశగా కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అడుగులు వేస్తోంది. కానీ ఆ క్రమంలో రాయలసీమ వాసుల మనోభావాలు గానీ, శతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న సీమ సమైక్య సంస్కృతి ఏమవుతుందన్నది గానీ ఆ పార్టీకి ఇసుమంతైనా పట్టడం లేదు. అసెంబ్లీ అభిప్రాయాన్ని బూచిగా చూపి తెలంగాణ నేతలను ఎలాగోలా ‘రాయల’కు ఒప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రస్తుతం త్రీవంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇందుకు సహకరించేలా ఆ ప్రాంత నేతలందరినీ ఒప్పించే పనిలో పడ్డారు. ఇందుకోసం పార్టీ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్రం తరఫున జీవోఎం కీలక సభ్యుడు జైరాం రమేశ్ రంగంలోకి దిగారు. అసెంబ్లీ అభిప్రాయం విభజనకు అడ్డంకేమీ కాకపోయినా, అది విభజనకు వ్యతిరేకంగా వస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందంటూ నేతలను వారు బుజ్జగిస్తున్నారు. అదే జరిగితే విభజనకు రాష్ట్రపతి కూడా అభ్యంతరం తెలిపే ఆస్కారమూ లేకపోలేదని చెబుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపే పక్షంలో రాయల తెలంగాణ, సీమాంధ్రల్లో 147 చొప్పున సమాన సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలుంటాయి. ‘‘16 మందిపై అనర్హత వేటుతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలను తీసేయగా సీమాంధ్రలో నికరంగా 131 మంది ఎమ్మెల్యేలే ఉంటారు. ఇక రాయల తెలంగాణలోని 147 మందిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, సమైక్యాంధ్రకే మద్దతిస్తారని భావించే మరికొందరిని తీసేసినా విభజనకు సానుకూలంగా ఉండేవారి సంఖ్య ఎలాగూ 131 కంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ ఘట్టాన్ని విజయవతంగా గట్టెక్కవచ్చు’’ అని తెలంగాణ నేతలతో కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ నేతలతో దిగ్విజయ్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతుండగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో జైరాం ఢిల్లీలో ఇదే విషయమై శనివారం మంతనాలు జరిపారు. రాయల తెలంగాణకు మొదటి నుంచీ మద్దతిస్తున్న జీవోఎం సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ కూడా శనివారం సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో ఈ విషయమై చాలాసేపు చర్చించినట్టు తెలుస్తోంది. తోసిపుచ్చిన దామోదర రాయల తెలంగాణకు టీ కాంగ్రెస్ నేతలను ఒప్పించడంలో భాగంగా దామోదరను జైరాం శనివారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించుకొని 45 నిమిషాల పాటు చర్చించారు. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, మరో ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి, భద్రాచలం అంశాలపైనా చర్చ జరిగింది. మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయల తెలంగాణ ను ప్రతిపాదిస్తున్నట్టు జైరాం, రాజీవ్ శర్మ తెలిపినట్టు సమాచారం. ‘‘విభజన బిల్లును అసెంబ్లీకి పంపితే ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ. బిల్లు సందర్భంగా రాజకీయ అనిశ్చితి నెలకొనేలా ఏం జరిగినా జాతీయంగా కాాంగ్రెస్కు చెడ్డపేరు తప్పదు. బిల్లు ప్రక్రియ సజావుగా సాగాలంటే కనీసం సీమలోని రెండు జిల్లాల ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం. ఇక ఇరు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల అంశం పరిష్కారానికి రాయల తెలంగాణ ఉత్తమ పరిష్కారం. కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న మైనారిటీ, ఎస్సీ ఓట్లు ఆ రెండు జిల్లాలో ఎక్కువ. ఇది కాంగ్రెస్‌కు అనుకూలించే అంశం’’ అని వారు వివరించినట్టు చెబుతున్నారు. కానీ వారి ప్రతిపాదనను దామోదర తోసిపుచ్చినట్టు తెలిసింది. అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపితే మళ్లీ ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం చెలాయిస్తుందని, అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విలువే లేదని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం డివిజన్లో ముంపుకు గురయ్యే గ్రామాలను సీమాంధ్రలో కలుపుతారని మొదటినుంచీ చర్చ జరిగినా, అలా ఏ గ్రామాన్నీ కలిపే ఉద్దేశం లేదని జైరాం చెప్పినట్టు తెలుస్తోంది. విభజన ముసాయిదా బిల్లును డిసెంబర్ 3న జీవోఎం మోదిస్తుందని, 4న కేంద్ర కేబినెట్లో ప్రవేశపెడతామని, ఆ వెంటనే రాష్ట్రపతికి, అటునుంచి 7 లేదా 8న అసెంబ్లీకి పంపిస్తామని దామోదరకు జైరాం స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అనంతరం జీవోఎం సభ్యుడు, రక్షన మంత్రి ఏకే ఆంటోనీని కూడా దామోదర కలిశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలతో దిగ్గీ మంతనాలు... రాయల తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు సహా టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలతో కూడా దిగ్విజయ్ మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అనివార్య పరిస్థితుల్లో రాయల తెలంగాణ వైపు అడుగులు వేయాల్సి వస్తోందని, దీనికి అంతా సహకరించాలని వారిని కోరుతున్నట్టు సమాచారం. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులకు దిగ్విజయ్ స్వయంగా ఫోన్లు చేసి రాయల తెలంగాణను ప్రస్తావించి మద్దతు కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూడా ఆజాద్ శనివారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యారు. రాయల తెలంగాణకు సానుకూలంగా వాదించారనిచెబుతున్నారు. రాయలపైనా చర్చించాం: దామోదర జైరాంతో బేటీ అనంతరం దామోదర మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు ప్యాకేజీ, భద్రాచలం, పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితరాలపై చర్చించాం. రాయల తెలంగాణ కూడా చర్చకు వచ్చింది. అయితే దానిపై కేవలం చర్చలే జరుగుతున్నాయి తప్ప తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. మేం మాత్రం పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ బిల్లు డిసెంబర్ 7న లేదా 8న అసెంబ్లీకి వస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం లభిస్తుంది’ అన్నారు. -
‘రాయల’ పేరిట మాయలొద్దు
ఇది విభజన ఇష్టంలేని ఆంధ్ర నేతల కుట్ర : కోదండరాం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ హెచ్చరిక తెలంగాణ మంత్రులూ విముఖం సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటుదిశలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోందని వస్తున్న వార్తలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దీనికి తాము ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోబోమని తెగేసి చెబుతున్నారు. ‘రాయల’ పేరిట మాయలకు, మోసానికి పాల్పడితే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణే తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ అంటే మరోసారి పోరాటాలకు దిగుతామని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాయల తెలంగాణ ఏర్పాటుకు సాహసిస్తే ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విభజన ఇష్టంలేని వ్యా పారులు, ఆంధ్రా నాయకులు పన్నుతున్న కుట్రలో భాగ మే రాయల తెలంగాణ అంశమని టీ-ఏజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన ముంబైలో మా ట్లాడుతూ, ఇప్పటివరకు అనేక రకాలుగా విభజనను అడ్డుకునేం దుకు ప్రయత్నించినా ఫలితం దక్కనందున రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాల తెలంగాణే తమకు సమ్మతమని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణ ఎవరికోసం?: టీ జేఏసీ ‘రాయల తెలంగాణను ఎవరు అడిగారు?, ఎవరికోసం రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు?’ అని తెలంగాణ జేఏసీ ప్రశ్నించింది. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తదితరులు శనివారం జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వనరులను, ఉద్యోగాలను, నీటి హక్కులను కొల్లగొట్టడంలో రాయలసీమకు చెందిన నేతల పాత్రే ఎక్కువ అని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణకోసం మరోసారి ఉద్యమాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై కట్టిన అక్రమ ప్రాజెక్టులకు చట్టబద్దమైన నీటి కేటాయింపులకోసమే రాయల తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారని అద్దంకి దయాకర్ విమర్శించారు. రాయల తెలంగాణ అంటే మరో పోరు : హరీష్‌రావు కోహీర్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వకపోతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో ఆయన మాట్లాడుతూ, రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అంటూ మరో ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారని, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీరు సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారన్నారు. మాయల తెలంగాణ వద్దు : కేటీఆర్ ఎల్లారెడ్డిపేట/నిజామాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునే కుట్రలో భాగంగానే రాయల తెలంగాణను తెరపైకి తెస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆరోపించారు. రాయల తెలంగాణ పేరుతో మాయ చేయాలని చూస్తే ప్రజలు మరోసారి ఉద్యమ తీవ్రతను రుచిచూపిస్తారని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన హెచ్చరించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. అవసరమైతే మరోసారి ఉద్యమానికి దిగుతామన్నారు. రాయల తెలంగాణ కుట్ర: వినోద్‌కుమార్ వరంగల్ : హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ ఒప్పుకునే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. హన్మకొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాయలసీమను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని అన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేయడం కన్నా తెలంగాణను ఇవ్వకపోవడమే నయమని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎల్డీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు: పొన్నాల రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ వంటి వార్తలు తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాంటి ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణే వస్తుందని మంత్రి వి.సునీతారెడ్డి మెదక్‌జిల్లా హత్నూరులో స్పష్టం చేశారు. -
'రాయల తెలంగాణ అంశంపై సమాచారం లేదు'
హైదరాబాద్: రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తనకు సమాచారం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటు అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలనేదే ప్రజల ఆకాంక్షని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ఒప్పుకోమని ఆయన తెలిపారు. అసెంబ్లీ ప్రోరోగ్ ఫైల్ తన వద్ద ఉందని, రాజకీయంగా దానికి అంత ప్రాధాన్యత లేదన్నారు. ప్రోరోగ్ అనేది సాంకేతిక అంశమన్నారు. రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతకముందు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం దామోదర విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. -
రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదు
-
'రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదు'
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం దామోదర విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ .... పోలవరం, భద్రాచలం అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లు ఏవిధంగా వస్తుందనే దానిపై చర్చ జరిపినట్లు దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అనంతరం ఆయన ఏకే ఆంటోనీతో సమావేశం అయ్యారు. నిన్న, మొన్నటి వరకూ పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపిన దామోదర.. తాజగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని, కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఈ అంశాన్ని తెరమీదుకు తెచ్చినా దామోదర ఖండించకపోవడంతో ఆయన కూడా రాయల తెలంగాణకు మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రోజుకో లీకు, గంటకో బ్రేకుతో రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం చివరకు ఏ స్టాండ్ తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తికరమే. -
రాయల తెలంగాణపై చురుగ్గా కేంద్రం పరిశీలన
-
జైరాం రమేష్‌తో డిప్యూటీ సీఎం భేటీ
-
జైరాం రమేష్‌తో డిప్యూటీ సీఎం భేటీ
న్యూఢిల్లీ : ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందిజ. రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) తన పూర్తిస్థాయి సమావేశాల అనంతరం రాయల తెలంగాణకు ఆస్కారం లేదని సంకేతాలు పంపినా, నిన్నటి పరిణామాలు మాత్రం ఆ దిశగా అధిష్టానం ఆలోచనలు ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశంపై నానా రకాలుగా ప్రజలను గందరగోళ పరుస్తున్న జీవోఎం, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు తాజాగా రాయలసీమను విభజించే ఆలోచనకు పదును పెట్టారు. శుక్రవారం దామోదర రాజనర్సింహ నేరుగా దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాయల తెలంగాణపై తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను మరోమారు ఆయన ముందుంచారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, సీడబ్ల్యూసీ తీర్మానానికి రాయల తెలంగాణ పూర్తిగా విరుద్ధం. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరకపోగా నష్టమే ఉంటుందని ఆయన విలేకర్లకు వివరించారు. -
మళ్లీ రాయల తెలంగాణ !
-
మళ్లీ రాయల తెలంగాణ !
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెస్తోంది. రా్రష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) తన పూర్తిస్థాయి సమావేశాల అనంతరం రాయల తెలంగాణకు ఆస్కారం లేదని సంకేతాలు పంపినా, శుక్రవారం నాటి పరిణామాలు మాత్రం ఆ దిశగా అధిష్టానం ఆలోచనలు ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నారుు. కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశంపై నానా రకాలుగా ప్రజలను గందరగోళ పరుస్తున్న జీవోఎం, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు తాజాగా రాయలసీమను విభజించే ఆలోచనకు పదును పెట్టారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్ మంత్రులు మినహా రాయల తెలంగాణ ఎవరూ కోరుకోవడం లేదు. పైగా గడిచిన నాలుగు నెలలుగా కసరత్తు చేస్తున్న జీవోఎంకు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ వేలాదిగా వినతులు అందాయి. ఒకదశలో రాయల తెలంగాణ లేదని లీకులివ్వడమే కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయానికి అనుగుణంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఖాయమంటూ చెప్పుకొచ్చారు. ఆ మేరకు జీవోఎం ప్రతిపాదనలు కూడా పూర్తయ్యాయనీ రెండు మూడురోజుల్లో కేబినెట్ ముందుకు వెళుతుందని చెబుతున్న ఈ చివరి నిమిషంలో మళ్లీ రాయల తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విభజన బిల్లు శాసనసభకు వెళ్లినప్పుడు మెజారిటీ అభిప్రాయం విభజనకు అనుకూలంగా ఉందని చెప్పే ఎత్తుగడలో భాగంగానే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర విభజనను కొబ్బరికాయను కొట్టినట్టు రెండు సమాన భాగాలుగా పగలగొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూత్రీకరించారు. ఆ మార్గంలోనే కృష్ణా జలాల వివాదం పేరిట లోక్‌సభ, శాసనసభ సీట్లను సమంగా పంచాలన్న ఆలోచనను కాంగ్రెస్ మరోసారి తెరమీదకు తెస్తోందని ఆ మేరకు సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. శుక్రవారం జీవోఎం సభ్యుడు జైరామ్ రమేశ్ రా్రష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యూరు. భవిష్యత్తులో కృష్ణా నదీ జలాల వివాదం తలెత్తకుండా ఉండాలంటే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని సూచించారు. అదే సమయంలో ఇరు ప్రాంతాలకు సమానంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఉంటాయని వివరించారు. దీనిపై తెలంగాణ నేతల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని కోరారు. జైరామ్ సమక్షంలోనే దిగ్విజయ్ ఢిల్లీలోనే ఉన్న డిప్యూటీ సీఎం దామోదరకు ఫోన్ చేశారు. రాయల తెలంగాణపై దామోదర స్పందిస్తూ.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, సీడబ్ల్యూసీ తీర్మానానికి రాయల తెలంగాణ పూర్తిగా విరుద్ధం. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరకపోగా నష్టమే ఉంటుంది’ అని వారితో అన్నారు. తర్వాత సాయంత్రం డిప్యూటీ సీఎం నేరుగా దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాయల తెలంగాణపై తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను మరోమారు ఆయన ముందుంచారు. పది జిల్లాల తెలంగాణే కావాలి: దామోదర దిగ్విజయ్‌తో భేటీ అనంతరం దామోదర మీడియాతో మాట్లాడుతూ ‘తాము పది జిల్లాల తెలంగాణే కోరుకుంటున్నామని తెలిపారు. రెండు జిల్లాలను కలుపుతారనే వార్తలు వస్తున్నాయనగా,‘వారు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి’ అంటూ క్లుప్తంగా మాట్లాడారు. ఇలావుండగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్‌లు సైతం కీలకమైన కోర్‌కమిటీ సమావేశానికి ముందు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై రాయల తెలంగాణపై తమ అభిప్రాయాన్ని ఆమె ముందుంచినట్లుగా తెలిసింది. అరుుతే నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక అస్థిత్వం ఉందని, కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ అస్థిత్వాన్ని దెబ్బతీయాలను చూడటమేంటని ఆ ప్రాంత నేతలు మండిపడుతున్నారు. -
కోర్ కమిటీ భేటీ ప్రారంభం.. రాయల తెలంగాణపై చర్చ
తెలంగాణ అంశంపై నిమిషానికో మాటతో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయమై మరింత స్పష్టత కోసం కోర్ కమిటీలో చర్చలు మొదలుపెట్టింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి కమల్‌నాథ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాయల తెలంగాణ, హైదరాబాద్ అంశాలపైనే చర్చ ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన ఏమాత్రం లేదని చెబుతున్నా, ఈ నగరం విషయంలో ఏం చేయాలన్న నిర్ణయం మాత్రం ఇంతవరకు తీసుకోలేకపోయారు. అందుకే దీని గురించి ఈ భేటీలో ముమ్మరంగా చర్చిస్తున్నారు. ఇక విభజన గురించి ప్రభుత్వపరంగా నియమించిన కేంద్ర మంత్రివర్గం (జీవోఎం) రూపొందించిన నివేదికకు కూడా కోర్ కమిటీ రాజకీయ పరంగా క్లియరెన్స్ ఇవ్వనుంది. వీటితో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న విషయంపై కూడా ఈ కోర్ కమిటీ భేటీలోనే చర్చించబోతున్నారు. -
స్పీడందుకున్న విభజన రాజకీయం
-
కేంద్రం పరిశీలనలో రాయల తెలంగాణ అంశం: దామోదర
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పట్నుంచి రాష్ట్ర ప్రజలకు ఏదో తెలియని ఆందోళన. అసలు రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏరకంగా ముందుకు వెళుతుందనే అంశం మాత్రం ఎవ్వరికీ అర్ధం కాకుండానే ఉంది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుపై సుముఖంగా ఉన్నట్లు ప్రకటించిన గతంలో ప్రకటించిన కేంద్రం..ఇప్పుడు రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదుకు తెచ్చింది. ఈ అంశాన్ని ప్రస్తుతం చాలా సీరియస్‌గానే పరిశీలిస్తోంది. ఈ రోజు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్‌లతో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ భేటీలో కూడా ఇదే విషయాన్ని చర్చించారు. నిన్న, మొన్నటి వరకూ పది జిల్లాలతో కలిపి హైదరాబాద్ రాజధానిగా తమకు ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపిన దామోదర.. తాజగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని, కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఈ అంశాన్ని తెరమీదుకు తెచ్చినా దామోదర ఖండించకపోవడంతో ఆయన కూడా రాయల తెలంగాణకు మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రోజుకో లీకు, గంటకో బ్రేకుతో రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం చివరకు ఏ స్టాండ్ తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తికరమే. -
రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం: విద్యాసాగర్‌రావు
హుస్నాబాద్, న్యూస్‌లైన్: రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు స్పష్టంచేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర డిపాజిట్లను బ్యాంకుల్లో భద్రపరచుకుని తెలంగాణపై జాయింట్ చెక్‌పవర్ కావాలంటున్నారని విమర్శించారు. తెలంగాణ భూములు.. నీళ్లపై గవర్నర్, సీమాంధ్రుల పెత్తనం వద్దని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అన్నారు. హైదరాబాద్‌లోని భూములపై గవర్నర్‌కు అధికారం ఇవ్వాలని కొందరు కోరుతున్నారని, సీమాంధ్రులు ఆక్రమించుకున్న భూములను చట్టపరంగా పేదలకు పంపిణీ చేయాలంటే ఎవరి పెత్తనమూ ఉండకూడదని పేర్కొన్నారు. తెలంగాణపై ఇతరులు పెత్తనం చెలాయిస్తే ఉద్యమాలు, త్యాగాలు ఎందుకని ప్రశ్నించారు. 1948 నుంచి భూములపై ఆంక్షలున్నా సీమాంధ్రులు వాటిని ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. -
'రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం'
హుస్నాబాద్: తెలంగాణ భూములు.. నీళ్లపై గవర్నర్, సీమాంధ్రుల పెత్తనం వద్దని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని భూములపై గవర్నర్‌కు అధికారం ఇవ్వాలని కొందరు కోరుతున్నారని, సీమాంధ్రులు అక్రమించుకున్న భూములు చట్టపరంగా పేదలకు పంపిణీ జరగాలంటే ఎవరి పెత్తనమూ ఉండవద్దని అన్నారు. తెలంగాణపై ఇతరులు పెత్తనం చెలాయిస్తే ఉద్యమాలు, త్యాగాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు అమరుల త్యాగాలను అవమానపరచడమేనని అన్నారు. 1948 నుంచి భూములపై అంక్షలు ఉన్నా సీమాంధ్రులు వాటిని ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 85 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు సామాజికన్యాయం జరగాలంటే ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పడాలన్నారు. రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఇవ్వాలన్నారు. సీమాంధ్ర డిపాజిట్లను బ్యాంకుల్లో భద్రపరుచుకుని తెలంగాణపై జాయింట్ చెక్‌పవర్ కావాలంటున్నారని ఆయన విమర్శించారు. -
ఆర్టి.. యూటీలొద్దు.. జనోద్యమం @ 119
సాక్షి నెట్వర్క్: రాయల్ తెలంగాణ (ఆర్టి)... హైదరాబాద్ యూటీ... ఇటువంటి ప్రతిపాదనలేమీ వద్దని సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రజ నినదిస్తోంది. అడ్డగోలు ప్రతిపాదనలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెబుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 119వ రోజైన మంగళవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు 119 సంఖ్య ఆకారంలో కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. తిరుపతిలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. నగరంలో యువకులు భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల విధానాలు, తీరుతెన్నులపై కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద నడిరోడ్డుపై నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు మంత్రులు, స్పీకర్, రాష్ట్ర ఎంపీల ముఖచిత్రాల మాస్క్‌లు ధరించి రాష్ర్ట విభజన వద్దంటూ తీర్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు రాస్తారోకో చేసి మానవహారం నిర్మించారు. సీమాంధ్ర ప్రజల సమైక్య డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో సీడబ్ల్యూసీ, జీఓఎమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల ఉద్యమపథం సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అవిరళ కృషిని వివరిస్తున్నారు. -
మళ్లీ తెరపైకి రాయలతెలంగాణ
విభజించడానికి తెగబడిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగానైనా, ఎన్ని భాగాలగానైనా చిల్చివేస్తుంది. కాంగ్రెస్ అధిష్టానానికి కావలసింది సీట్లు, ఓట్లేగానీ ప్రజాప్రయోజనాలు కాదని తేలిపోయింది. ప్రాతిపదిక ఏమీ లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడింది. ఇప్పుడు ఆ చీలికలో రాయలసీమను చేర్చింది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ప్రారంభించిన విభజన ప్రక్రియను మరింత ప్రహసనంగా మార్చేసింది. రాయల తెలంగాణ కావాలని ప్రజలు ఎన్నకూ కోరలేదు. ఎప్పుడూ ఉద్యమించలేదు. మంత్రి శైలజానాథ్ వంటి వారు అసలు రాయల తెలంగాణ ఎవరు అడిగారని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమను రెండుగా చీల్చడానికి అక్కడి ప్రజలు అంగీకరించరని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి అన్నారు. ఒకే సంస్కృతి గల రాయలసీమను చీల్చడం భావ్యంకాదన్నారు. అయినా రాయల తెలంగాణా అంశాన్ని పరిశీలిస్తోంది. ఒక వేళ అదే జరిగితే ఏమౌతుంది? సమస్యలు తీరిపోతాయా? మరింత పెరుగుతాయా? ఎన్నడైనా ఆలోచించారా? తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను శరవేగంగా సాగిస్తున్న కేంద్రం చివరి నిమిషంలో మళ్లీ తెరపైకి రాయలతెలంగాణ అంశాన్ని తీసుకొచ్చింది. సమస్యను సృష్టించి, జనాన్ని రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులైన హస్తం పెద్దలే ఇప్పుడీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక్కసారి కూడా రాయలతెలంగాణ డిమాండ్ వినిపించలేదు. కానీ ఇప్పుడు యుపీఏ విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్య ఉద్యమాన్ని చీల్చడానికి కొత్త నాటకానికి తెరతీసింది. అనంతపురం, కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలే ఇందులో ప్రధాన పాత్రదారులు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను ప్రస్తుతానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కేంద్రం మాత్రం సీరియస్‌గానే ఆలోచిస్తోంది. ప్రజాభిప్రాయం, రాజకీయ అభిప్రాయంతో సంబంధంలేకుండా కేంద్రం ఆలోచనకు పదును పెట్టింది.అయితే ఈ ప్రతిపాదన పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. విభజన వలన కాంగ్రెస్‌కు కలిసొచ్చే రాజకీయ ప్రయోజనాలెలా ఉన్నా తెలుగు ప్రజల ప్రయోజనాలు మాత్రం సమిధ కానున్నాయి. ఇప్పటికీ నదీ జలాల పంపిణీ చిక్కువీడని పీటముడిగా మారింది. ఇప్పుడు పది జిల్లాల తెలంగాణతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపితే నీటి యుద్ధాలు మరింత తీవ్రం కానున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజ్, పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్, ఇలా అన్నింటినీ తెలంగాణ ప్రాంతంలో కలిపితే కిందున్న రాష్ట్రం సాగునీటి కోసం అల్లాడిపోక తప్పదు. తరతరాలుగా అన్నదమ్ముల్లా ఒకే సంస్కృతితో మెలిగిన రాయలసీమ నాలుగు జిల్లాల మధ్య దారుణమైన ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరందించే వనరులన్నీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే ఉన్నాయి. కెసి కెనాల్, తుంగభద్ర కెనాల్, తెలుగుగంగల నుంచి దిగువన ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలోని ఐదు లక్షల మందికి తాగు నీరు, లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలిగోడు ప్రాజెక్టు కూడా ప్రశ్నార్థకం కానుంది. రాయలతెలంగాణ వలన కర్నూలు, అనంతరం జిల్లాల్లోని కృష్ణా మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపనుంది. మిగులు జలాల ఆధారంగానే 225 టిఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఈ మిగులు జలాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అధోగతి పాలవుతాయి. దిగువకు కృష్ణా జలాలు రావడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ప్రస్తుతం రాయలసీమలో నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టుల నీటి విడుదల భవిష్యత్‌లో కర్నూలు, అనంతపురం, కడపతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల మధ్య తీవ్రమైన అగాధాన్ని పెంచనున్నాయి. గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ, వెలిగోడు, కండలేరు, చిత్రావతి, లింగాల, సోమశిల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశార్థకంగా మారుతుంది. వీటి రిజర్వాయర్లు, ఆయకట్టులు, ముంపు ప్రాంతాలు అన్నీ చీలిపోయి అస్తవ్యస్తంగా మారతాయి. ఇక ఉద్యోగుల విభజన, భవిష్యత్ లో ప్రభుత్వ ఉద్యోగాల విషయం కూడా చాలా వివాదంగా మారుతుంది. ఇప్పటికే 371(డి) కేంద్రానికి పెద్ద సవాల్‌గా మారింది. రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థను రద్దు చేయాలా? లేదా? కొత్త రాష్ట్రాల్లో ఎలా ఉండాలన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పుడు రాయలసీమను విభజిస్తే ఈ సమస్య మరింత జటిలమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాయలసీమలోని నాలుగు జిల్లాలు జోన్ 4 లో అంతర్భాగం. ఇందులో రెండు జిల్లాలను తెలంగాణ, మరో రెండింటినీ ఆంధ్రాలో కలపాలంటే చాలా సమస్యలు వచ్చిపడతాయి. అంతేకాదు భవిష్యత్‌లో తెలంగాణలోని రెండు జోన్ల విద్యార్థులు, సీమాంధ్రలోని రెండు జిల్లాల అభ్యర్థులు రెండు రాష్ట్రాల్లోనూ అన్యాయమైపోతారు. రాజకీయ ప్రయోజనాలు కానీ, యూనివర్సిటీలు, విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ వీరి వాయిస్ బలహీనపడుతుంది. జోన్ ఛిన్నాభిన్నమైపోతే అక్కడి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు తీవ్రంగా నష్టపోతారు. ఇది భవిష్యత్ రాయలసీమ విద్యార్థుల ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక విద్యుత్ సమస్య రాయలతెలంగాణ వలన మరింత తీవ్రతరం కాబోతుంది. ఇప్పటికే 10 జిల్లాల తెలంగాణలోనే విద్యుత్ డిమాండ్ 52 శాతం ఉంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు చేరితే అది 56 శాతం అవుతుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలో లేదు. ప్రస్తుతం ఏపీ జెన్కో ఆధీనంలో థర్మల్, హైడల్ కలిపి 8,921.9 మోగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లున్నాయి. ఇందులో థర్మల్ ప్లాంట్ల ద్వారా 5,092.5 మెగావాట్లు, జలకేంద్రాల ద్వారా 3,829.4 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 2282.5 మెగావాట్ల థర్మల్, 2541.8 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తయ్యే ప్లాంట్లున్నాయి. కర్నూలు , అనంతపురం కలపడం వలన మరో 770 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యం మాత్రమే పెరుగుతుంది. సీమాంధ్రలో 2,810 మెగావాట్ల థర్మల్, 517.6 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. అంటే మొత్తం ఉత్పత్తిలో 5,594 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణలోను, 3329 మెగావాట్ల ప్లాంట్లు సీమాంధ్రలో ఉన్నాయి. కానీ గ్యాస్ ప్లాంట్లు, ప్రైవేటు ఒప్పందాలు, కేంద్ర కేటాయింపులతో సీమాంధ్రకు విద్యుత్ సమృద్ధిగా ఉంటుంది కానీ రాయలతెలంగాణకు మాత్రం తీవ్రమైన కొరత ఉంటుంది. ఫలితంగా విద్యుత్ నిర్వహణ కష్టమై తెలంగాణ రైతాంగానికి, పరిశ్రమలకు, హైదరాబాద్ నగరవాసులకు తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి. అలాగే ఉచిత విద్యుత్ బోర్లు ఇప్పటికే 18 లక్షలుండగా మరో రెండు లక్షలు అదనంగా చేరి సబ్సిడీ భారాన్ని, విద్యుత్ డిమాండ్‌ను కూడా పెంచనున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాయలతెలంగాణలో తలకుమించిన భారం కానుంది. ప్రతిపాదిత తెలంగాణ ప్రాజెక్టులకు 67,433 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంటే 66 శాతం నిధులు అవసరం. ఇవికాకుండా తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలకు 2017-18 నాటికి 6,489 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడానికి 38,937 కోట్ల రూపాయలు అవసరం. అంటే రాష్ట్ర విభజన జరిగాక ప్రాజెక్టుల కోసం సీమాంధ్ర ప్రభుత్వంపై 34 వేల కోట్ల భారం పడితే , తెలంగాణ రాష్ట్రానికి 1,06,370 కోట్ల రూపా్యల నిధులు అవసరం. దీనికితోడు ఇప్పుడు కర్నూలు, అనంతపురం వలన మరో 3,500 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. రాష్ట్ర విభజన జరిగాక రాయలతెలంగాణా అయినా సరే ఇరు ప్రాంతాలకు తేరుకోలేని దెబ్బ తగలకతప్పదు. -
రాయల తెలంగాణకు సీపీఐ వ్యతిరేకం: సురవరం
హైదరాబాద్ : రాయలసీమను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడానికి సీపీఐ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తో కూడిన పదిజిల్లాల భౌగోళిక తెలంగాణకు మాత్రమే తమ విధానం అని, ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాసవుతందన్న నమ్మకం ఉందని ఆయన మంగళవారమిక్కడ వెల్లడించారు. విధివిధానాలను అధికారికంగా హోంమంత్రిత్వ శాఖ కానీ, జీవోఎమ్ కానీ ప్రకటిస్తేనే వాటికి విలువ ఉంటుందని అప్పటి వరకు వచ్చే వార్తలకు విలువ లేదన్నారు -
రాయల తెలంగాణ ప్రక్రియ మంచిది కాదు
-
'రాయల తెలంగాణ ప్రతిపాదన మంచిదికాదు'
అనంతపురం: రాయల తెలంగాణ ప్రతిపాదన మంచిది కాదని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. అధిష్టానం విప్ జారీ చేసినా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎంపీఆర్ డ్యాం నుంచి 150 కోట్లతో మంచినీటి పథకానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని శైలజానాథ్ తెలిపారు. -
‘రాయల తెలంగాణ’పై.. భిన్న వాదనలు!
‘రాయల్’గా ఉంటాం కర్నూలు, అనంతపూర్ జిల్లాలతో ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం సహేతుకం. నదీ జలాలు, విద్యుత్ తదితర సమస్యలు కూడా ఈ జిల్లాల కలయికతో సర్దుకుంటాయి. ఇటు బొగ్గు, అటు ఇనుము వంటి సహాజ వనరులు ఉండడం వల్ల రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి అసమానతలు తొలిగిపోతాయి. మొదట్నుంచి నేను వాదిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు సమంగా ఉంటాయి. రాయల తెలంగాణతో రాజకీయంగా కూడా కాంగ్రెస్‌కు కలిసివస్తుంది. - కేఎల్లార్, మేడ్చల్ ఎమ్మెల్యే కిరికిరి చేస్తే ఊరుకోం పది జిల్లాలతో కూడిన తెలంగాణకే నా మద్దతు. పూట కో పేచీతో తెలంగాణకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం. రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాయలసీమను కలపాలని ప్రయత్నం మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం కిరికిరిలు పెడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. - పి.మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మళ్లీ దగా పడతాం సంపూర్ణ తెలంగాణకే మా మద్దతు. సీమలోని రెండు జిల్లాలను కలిపితే తెలంగాణకు న్యాయం జరగదు. ఫ్యాక్షనిస్టుల దోపిడీతో మరోసారి మోసం పోతాం. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలి. - కేఎస్ రత్నం, చేవెళ్ల ఎమ్మెల్యే ఇది సరైన సమయం కాదు రాష్ట్ర విభజన విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మొదట్నుంచి చెబుతూ వస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రకటనపై గ్రేటర్ ఎమ్మెల్యేల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేయలేదు. కొత్త రాష్ట్రాన్ని ప్రకటించి.. చివరి నిమిషంలో ఇప్పుడు మా అభిప్రాయాన్ని కోరడం అర్ధరహితం. - దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సంపూర్ణ తెలంగాణ 57 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడుతున్న తెలంగాణను అడ్డుకునే ప్రయత్నమే రాయల తెలంగాణ ప్రతిపాదన. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడే తెలంగాణకే మా మద్దతు. రాయలసీమను విచ్ఛిన్నం చేసి.. తెలంగాణలో కలపాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదు. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే -
‘నిఘా’ లోగుట్టేమిటో?, ప్రజాప్రతినిధులకు ఫోన్లపై సర్వత్రా చర్చ
ప్రజాప్రతినిధులకు ఫోన్లపై సర్వత్రా చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నేరుగా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. జీవోఎం నివేదిక తయారీ కసరత్తు కూడా తుది దశకు చేరుకున్న సమయంలో రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు నిఘా వర్గాల ఫోన్లు పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టడానికేనన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తం 294 మంది ఎమ్మెల్యేల నుంచీ సమాచారం సేకరించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిఘా వర్గాల పేరుతో రెండు రోజులుగా పలువురు ప్రజాప్రతినిధులకు ఫోన్లు వచ్చాయి. తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తనకిలాంటి ఫోన్ రాగా, అవతలివైపు నుంచి మాట్లాడుతున్నది ఎవరో అడిగే ప్రయత్నం కూడా చేయకుండానే తన అభిప్రాయం చెప్పారు. జేఏసీ ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలకూ ఫోన్లు వచ్చాయంటున్నా వారిలో పలువురు వాటిని ఖండించారు. తాజాగా కొందరు టీడీపీ నేతలు తమకూ నిఘా వర్గాల నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పారు. వారు చెప్పిన మేరకు... తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, ఉమా మాధవరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, జి. విజయ రమణారావు తదితరులకు నిఘా అధికారులు ఫోన్ చేశారు. ‘రాయల తెలంగాణ మీకు సమ్మతమేనా? సమ్మతం కాకపోతే ఎందుకు? ప్రత్యేక తెలంగాణ ను ఎందుకు కోరుకుంటున్నారు?’ అంటూ ప్రశ్నించి సమాధానాలను నమోదు చేసుకున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా నిఘా ఫోన్ వచ్చింది. ఇదంతా తాము నిత్యం చేసే అభిప్రాయ సేకరణలో భాగమే తప్ప రాయల తెలంగాణపై పార్టీల అభిప్రాయాలు సేకరించాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తమకెలాంటి ఆదేశాలూ రాలేదని నిఘా అధికారులు చెబుతున్నారు. ఐబీ అధికారులు మాత్రం ఏ అభిప్రాయ సేకరణైనా తాము నేరుగా చేస్తాం తప్ప మరో విభాగానికి అప్పజెప్పబోమంటున్నారు. -
అంతా అమ్మ చేతుల్లోనే: జేసీ
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించడంపై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి హర్షం ప్రకటించారు. కర్నూలు, అనంతపురంను కొత్త రాష్ట్రంలో కలిపే విషయమై తెలంగాణ ప్రాంత నేతలెవరికీ అభ్యంతరం లేదన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజనను అడ్డుకోవడం ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదని.. ఒక్క అమ్మ (కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ) చేతుల్లోనే ఉందన్నారు. ‘అమ్మ ఎస్ అంటే ఎస్. నో అంటే నో’ అని వ్యాఖ్యానించారు. -
రాయల తెలంగాణను ఒప్పుకోం: కోదండరాం
నల్లగొండ, న్యూస్‌లైన్: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు ఎక్కడా పొంతన కుదరదని తెలిపారు. రాయల తెలంగాణతో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుందని చెప్పారు. మునగాల, భద్రాచలం సరిహద్దుల నిర్ణయం, పాలకుల కోసం కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలని కోరారు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం ఎలాంటి కిరికిరి పెట్టినా మరోసారి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. -
మాకెవ్వరూ ఫోన్ చేయలేదు : నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ వ్యవహారమై నిఘావర్గాల అధికారులెవ్వరూ తమకు ఫోన్ చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా తాను ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నా, ఫోన్‌కు అందుబాటులోనే ఉన్నానని, తమ ఎమ్మెల్యేలకూ ఫోన్లు వచ్చిన సమాచారం లేదని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను వదిలి ఎమ్మెల్యేలకు ఎలా ఫోన్లు చేస్తారని ప్రశ్నించారు. -
రాయల తెలంగాణకు ఒప్పుకోం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని బీజేపీ స్పష్టం చేసింది. తమ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని పునరుద్ఘాటించింది. గుజ రాత్లో నిర్మించనున్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ ఏర్పాట్లపై సోమవారం ఇక్కడ వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గుజ రాత్ న్యాయశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా, పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, సీహెచ్ విద్యాసాగరరావు, డాక్టర్ మల్లారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణపై తమకు ఏ అధికారీ ఫోన్ చేయలేదని, ఈ అంశంలో తమ వైఖరి మారబోదని అన్నారు. జీవోఎంకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబా ద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నామన్నా రు. గుజరాత్లో నిర్మించనున్న సమైక్యతా చిహ్నం- సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా చెప్పారు. గుజరాత్లో పని చేస్తున్న తెలుగు ఐఎఎస్, ఐపీఎస్‌లు ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో పర్యటించి అవగాహన సదస్సుల్లో పాల్గొంటారన్నారు. -
రాయల తెలంగాణకు కావాలని కోరతాం: జేసీ
హైదరాబాద్ : రాయల తెలంగాణపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అభిప్రాయాలు తెలుసుకోవడాన్ని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్వాగతించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తనతో మాట్లాడినప్పుడు రాయల తెలంగాణకు అంగీకరిస్తున్నామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే అదే విషయాన్ని వారు బయటకు చెప్పటం లేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు రాయల తెలంగాణ కావాలని కోరతామని జేసీ తెలిపారు. కాగా తెలంగాణ ముసాయిదా బిల్లు, విభజన అంశంపై జీవోఎం నివేదిక కేంద్ర మంత్రిమండలి ముందుకు రానున్న నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాజకీయ పార్టీల నేతలకు ఫోన్లు చేసి పలు అంశాలపై ఆరా తీసిన విషయం తెలిసిందే. -
ఐబీ తప్పుడు నివేదిక పంపే అవకాశం: దామోదర్ రెడ్డి
హైదరాబాద్ : రాయల తెలంగాణ అంశంపై కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు .....పార్టీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవడం సరైంది కాదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... ఇది తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నమేనన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలంతా మొదటినుంచి పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపే అవకాశం ఉందని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ అంశాన్ని హైకమాండ్ గేమ్ ప్లాన్‌లో భాగమని అనుకోవటం లేదన్నారు. అదే అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతోపాటు, కేంద్ర కేబినెట్ నిర్ణయంలోనూ రాయల తెలంగాణ ప్రస్తావన ఎందుకు ఉందని ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలని జీవోఎంను కోరేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. -
రాయలసీమ విచ్ఛిన్నాన్ని అడ్డుకుంటాం: బైరెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగినట్టేనని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. రాయలసీమ విచ్ఛిన్నాన్ని కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామన్నారు. సీమ విచ్ఛిన్న మవుతుంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విభజన అనివార్యమైతే ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
రాయల తెలంగాణ?
-
రాయల తెలంగాణతో నష్టం ఏమిటి?
-
రాయల తెలంగాణతో నష్టం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ ముసాయిదా బిల్లు, విభజన అంశంపై జీవోఎం నివేదిక కేంద్ర మంత్రిమండలి ముందుకు రానున్న నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాజకీయ పార్టీల నేతలకు ఫోన్లు చేసి పలు అంశాలపై ఆరా తీశాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన తర్వాత విభజన ప్రక్రియపై కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ వర్గాలు రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, ఈ విషయంలో మీకున్న అభ్యంతరాలేమిటంటూ ఆరా తీయడం గమనార్హం. విభజన ప్రక్రియలో కేంద్రం తొలినుంచీ గందరగోళ పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఆదివారం టీఆర్ఎస్ ముఖ్యులకు, తెలంగాణ జేఏసీ నేతలకు ఫోన్లు చేసిన నిఘా వర్గాలు.. పది జిల్లాల తెలంగాణకు అనంతపురం, కర్నూలు జిల్లాలను అదనంగా కలపడం వల్ల వచ్చే నష్టమేంటని ఆరా తీశాయి. రెండు జిల్లాలను అదనంగా కలపడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? తెలంగాణ ప్రజలకు జరిగే నష్టం ఏమిటి? రాయల తెలంగాణకు అంగీకరించకుంటే అసెంబ్లీలో తీర్మానం నెగ్గదు కదా? హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే అభ్యంతరాలేమిటి? ఎలాంటి ఆంక్షలు మీకు ఆమోదయోగ్యం కాదు? తదితర ప్రశ్నలు సంధించినట్టు జేఏసీ నేతలు వివరించారు. ఎలాంటి ఆంక్షలూ లేని హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని నిఘా అధికారులకు స్పష్టం చేసినట్లు జేఏసీ, టీఆర్ఎస్ నేతలు తెలిపారు. -
హైదరాబాద్ ఉమ్మడి రాజధానితో ఒరిగేదేమి లేదు: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని జేసీ దివాకర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే విభజన జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో నిర్ణయం తీసుకునేది సోనియా మాత్రమే అని ఆయన స్ఫష్టం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్ నుంచి సీమాంధ్రలో పాలన సాగించలేమని జోస్యం చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే సీమాంధ్రకు ఒరిగేదేమి లేదని అభిప్రాయపడ్డారు. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వధికారులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందేనని తెలిపారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సోనియాతో చర్చించేందుకు, ఆమె అపాయింట్ కోరినట్లు జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. -
రాయల తెలంగాణ.. ఓ మూర్ఖపు ఆలోచన
అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని కొందరు రాజకీయ నేతలు ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన తీసుకురావడం ఓ మూర్ఖపు ఆలోచన అని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ జిల్లా కన్వీనర్ కొత్త విశ్వనాథరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన నగర ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే ‘రాయల తెలంగాణ’ను ఎందుకు కోరుతున్నారో జేసీ దివాకర్‌రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌గుప్తా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్, ఆల్విన్ వాచ్ కంపెనీ తదితర ఎన్నో ఫ్యాక్టరీలు మూత పడినప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పాలన్నారు. శాసనసభకు తెలంగాణ బిల్లుకు వచ్చినప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారో ప్రజలకు తెలియజేయాలన్నారు. న్యాయవాదుల జేఏసీ నాయకులు రాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు 32 టీఎంసీలు నికర జలాలు రావాల్సి ఉండగా కనీసం 14 టీఎంసీలను కూడా అందుబాటులోకి తీసుకురాకపోవడంలో పాలకులు పూర్తిగా విఫలమౌతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే మరింత నష్టపోతామన్నారు. విద్యుత్ జేఏసీ జిల్లా నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే శ్రీశైలంతో పాటు పీఏబీఆర్, సుంకేసుల ప్రాజెక్ట్‌లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే అంది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందన్నారు. రాయల తెలంగాణ అంశం కేవలం తెలంగాణవారికే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. రాయల తెలంగాణ అంశాన్ని రాజకీయ నాయకులు వారి పదవుల కోసం, ఆస్తుల కోసమే అడుగుతున్నారని, ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో రెవెన్యూ జేఏసీ నాయకులు జయరామప్ప, వాణిజ్యపన్నులశాఖ జేఏసీ నాయకులు సుభాష్, యూత్ జేఏసీ నాయకులు మల్లిరెడ్డి పాల్గొన్నారు. -
జీవోఎం సభ్యులను ఇక కలవను: కోట్ల
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జీవోఎం సభ్యుల తీరును రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎం సభ్యులు తమను అడుగడుగునా అవమానిస్తున్నారని, ఇకపై వారు పిలిచినా వెళ్లదల్చుకోలేదని చెప్పారు. ‘‘సీమాంధ్ర కేంద్ర మంత్రులుగా మేం ఏమడిగినా తమకు సంబంధం లేదంటున్నారు. పవర్స్ లేవంటున్నారు. ఏమైనా అంటే మమ్మల్ని అవమానిస్తున్నారు. ఏం చెప్పినా వినడం లేదు’’అని కోట్ల వాపోయారు. జీవోఎం సభ్యులుగా వారికి అసలు బాధ్యతే లేదన్నారు. రాయల తెలంగాణ ఇస్తారా? తెలంగాణ ఇస్తారా? అనేది వాళ్లే తేల్చుకుంటారని, అయితే రాయలసీమను చీల్చాలనుకోవడం మంచిది కాదన్నారు. జీవోఎం తీరు బాధాకరంగా ఉన్నా తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో,.. నేను ఓడితే ఓడిపోవచ్చు. కానీ పార్టీని వీడను’’అని చెప్పారు. సోనియాగాంధీని అపాయింట్మెంట్ అడిగిన మాట నిజమేనని, పిలిస్తే ఆమెకు వాస్తవాలు చెబుతానని కోట్ల అన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకున్నా ఆగబోదన్నారు. -
కోట్లకు షాకిచ్చిన కేంద్రం
రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సందర్భంలో సీమాంధ్రపై కొన్ని డిమాండ్లతో కేంద్రానికి నివేదించేందుకు వెళ్లిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి ఢిల్లీలో చుక్కెదురైంది. తన డిమాండ్లను గురువారం జీవోఎంకు నివేదించారు. అయితే ఆ డిమాండ్లేవీ నెరవేర్చలేమని కోట్లకు కేంద్రం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఆయన అలిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి నివేదించిన ముఖ్య డిమాండ్లలో ఒకటి కర్నూలు, అనంతపురం కలిపి రాయల తెలంగాణ చేయాలి. రెండవది సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలి, మూడవది ప్రత్యేక రాయలసీమ. ఈ డిమాండ్లకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన జీవోఎం ఎదుట సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాయల తెలంగాణ అంశం పక్కన పెట్టాలని, విభజన తర్వాత దానిపై ఆలోచిద్దామని కేంద్రం చెప్పడంతో ఆయన తీవ్ర అసంతప్తికి లోనయినట్లు తెలిసింది. తన డిమాండ్లలో ఏ ఒక్క దానికి పరిష్కారం చూపకపోవడంతో తిరుగు ప్రయాణం అయినట్లు మంత్రి కోట్ల వర్గీయులు తెలిపారు. -
అసెంబ్లీని రద్దు చేయాలని సీఎంకు చెప్పా: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీ రద్దు అయితే విభజన బిల్లుపై చర్చ ఉండదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతోపాటు, ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు టీజీ తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ముసాయిదా బిల్లులో రాయల తెలంగాణపై అభిప్రాయం కోరే అంశం ఉంటుందని ..... దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచ్‌లతో చర్చలు జరుపుతామన్నారు. ఆ తర్వాతే అంతిమ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. విభజన జరిగితే కొత్తపార్టీకి అవకాశం ఉండదని టీజీ పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోల ఛలో ఢిల్లీకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. -
భద్రాచలం, రాయల తెలంగాణపై సస్పెన్స్
-
సోనియా అపాయింట్మెంట్ కోరిన సీమ నేతలు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నేపధ్యంలో రాయలసీమ కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలు, సమస్యలు వినిపించేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమ నేతలు ....రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతూ ఆవైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కర్నూలు, అనంతపురం కాంగ్రెస్ నేతలు మంగళవారం ఎంపీ సాయి ప్రతాప్ నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి ఈ విషయమై త్వరలో సోనియా గాంధీని కలవనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. -
సీమ నేతల రాయల తెలంగాణ ఉద్యమం?
హైదరాబాద్ : కర్నూలు, అనంతపురం జిల్లా నేతలు రాయల తెలంగాణ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై కేంద్రంతో చర్చించడానికి మంత్రి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఢిల్లీ వెళనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కృష్ణదేవరాయ, రాయలసీమ విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధులు సోమవారం రఘువీరారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని రాయల తెలంగాణపై పోరాడేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి రఘువీరా తెలిపారు. కాగా రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకు తాము సిద్ధమంటూ సీమా నేతలు ఇప్పటికే తమ మనసులో మాటను బయటపెట్టారు. -
రాయల తెలంగాణ కోసం ఉద్యమం: జేసీ
అనంతపురం: రాష్ట్ర విభజన జరిగిపోతోందని, ఈ పరిస్థితుల్లో వెనుకబడిన అనంతపురం జిల్లాను దృష్టిలో పెట్టుకుని ‘రాయల తెలంగాణ’ సాధించుకునే దిశగా ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ దివాకరరెడ్డి తెలిపారు. ఇందు కోసం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం అహంకార ధోరణి అవలంబిసోందన్నారు. ‘మన అనంతపురం జిల్లాను పరిరక్షించుకుందాం’ (సేవ్ అనంతపురం) పేరుతో ఆదివారం అనంతపురం నగరంలో సమావేశం నిర్వహించారు. ఇందులో జేసీతో పాటు డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్ గుప్తా, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు, కొన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విభజన తరువాత సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు విషయంలో కర్నూలు కావాలని తాము పట్టుబడతామన్నారు. ఆంధ్ర-సీమ ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్లో సారూప్యత ఉండదని, సీమాంధ్ర ప్రాంతం ఎప్పటికీ కలిసి ఉంటుందనే నమ్మకం తనకు లేదని చెప్పారు. ఈ నెల 21న ‘రాయల తెలంగాణ’ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కాగా...ఈ ప్రతిపాదన విభజన నిర్ణయం వెలువడిన వెంటనే చేసి వుంటే బాగుండేదని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. మరికొందరు మాత్రం తమ అధి నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంకొందరు ఈ ప్రతిపాదన మంచిదేనంటూ మద్దతు ప్రకటించారు. -
సమైక్య ద్రోహం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సమైక్య జనోద్యమాన్ని నీరు గార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర చేస్తోంది. ఆ బాధ్యతను మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భుజాన వేసి ‘రాయల తెలంగాణ’ జపం చేయిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఇది సీమాంధ్రకు వ్యాపించి మహోద్యమంగా రూపాంతరం చెందింది. 109 రోజులుగా అనంతపురం జిల్లాలో ఉద్యమం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని నీరుగారిస్తే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవచ్చని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీమను చీల్చి అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలనుకుంది. ఈ డిమాండ్ ప్రజల నుంచి వచ్చేలా చేసే బాధ్యతను అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డికి, కర్నూలు జిల్లాలో రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి అప్పగించింది. దీంతో రాయల తెలంగాణకు మద్దతుగా మన జిల్లాకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సంతకాలు సేకరించేందుకు తొలుత జేసీ పూనుకున్నారు. అయితే ఆయనకు ఎవరూ సహకరించలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కర్నూలు నుంచి నరుక్కొచ్చింది. ఈ క్రమంలోనే రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామిలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మన్మోహన్సింగ్, ఆంటోని కమిటీ, సోనియాగాంధీ ముందు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలోని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ‘రాయల తెలంగానం’ చేశారు. అనంతరం కోట్ల తరహాలోనే రాయల తెలంగాణకు మద్దతు సమీకరించాలని జేసీ దివాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి పెంచింది. అనంతరం డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మద్దతు పొందిన జేసీ దివాకర్‌రెడ్డి ‘రాయల తెలంగానం’ మరింత వాడిగా విన్పించడానికి సిద్ధమయ్యారు. రాయల తెలంగాణ డిమాండ్‌తో అనంతపురంలో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సభ నిర్వహిస్తే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని గుర్తించిన జేసీ వెనక్కు తగ్గారు. బహిరంగసభ కాకుండా.. రాయల తెలంగాణ డిమాండ్‌తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను డీసీసీ అధ్యక్షుడు కొట్రికెకు అప్పగించారు. జేసీ సూచనల మేరకు శనివారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ‘సేవ్ అనంతపురం’ సభ నిర్వహిస్తున్నట్లు కొట్రికెవెల్లడించగా సమైక్యవాదులు భగ్గుమన్నారు. కొట్రికెను అడ్డుకున్నారు. చివరకు పోలీసుల సహకారంతో సమైక్యవాదుల బారి నుంచి తప్పించుకున్న కొట్రికె.. ఆదివారం సమావేశం నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ‘సేవ్ అనంతపురం’ పేరుతో సభ నిర్వహిస్తే పర్వాలేదు.. రాయల తెలంగాణ పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తే అడ్డుకుని తీరుతామ’ని సమైక్యవాదులు హెచ్చరించారు. కాగా రాయల తెలంగాణ నినాదంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే మండిపడుతున్నారు. మంత్రులు రఘువీరా, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే సుధాకర్ రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండటం గమనార్హం. సమైక్యవాదుల హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించే ‘సేవ్ అనంతపురం’ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాజకీయ లబ్ధి కోసమే రాజకీయ లబ్ధి కోసమే కొందరు రాయల తెలంగాణ నినాదం అందుకున్నారు. పదవులు.. ఆస్తుల రక్షణ కోసమే రాయల తెలంగాణ డిమాండ్‌ను కొందరు తెరపైకి తెచ్చారన్న అంశం జిల్లాలో అందరికీ తెలుసు. రాయల తెలంగాణ డిమాండ్‌ను ఎన్జీవోలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మన జిల్లాకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే రాయల తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి సమైక్యాంధ్రకు కట్టుబడాలి. లేదంటే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. -దేవరాజ్, జిల్లా అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో సంఘం, అనంతపురం సమైక్యాంధ్రే మా లక్ష్యం సమైక్యాంధ్రప్రదేశే మా లక్ష్యం. దీనికోసమే మేం పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తొలినుంచి స్పష్టీకరిస్తున్నాం. ఇప్పుడు కొందరు రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడంలో ఇది భాగమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించం. ప్రతిఘటిస్తాం. - సంపత్‌కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చెర్మైన్ -
రాయల తెలంగాణ అంటే ఉద్యమ బాటే..
రాయల తెలంగాణలో ఇబ్బందే... ‘విధులను పక్కన పెట్టాం... జీతాల కోసం ఆలోచించలేదు. ఎమర్జెన్సీ పనులు ఆపలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో మా ఉద్యోగులు ముందున్నారు. అత్యంత ఎమర్జెన్సీ శాఖ అ యినప్పటికీ... తెలంగాణ ఉద్యమంలో సత్తా చాటాం. వి ద్యుత్ రంగంలో మేం తయారు చేసిన నివేదికలే ఈరోజు జీఎంఓ చర్చల్లో ఉన్నాయి. మేం ఇచ్చిన రిపోర్టులే అన్ని పా ర్టీలకు ఆధారమవుతున్నాయి. ఇప్పుడు రాయల తెలంగాణ అంటే విద్యుత్ వినియోగంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కర్నూల్, అనంతపూర్‌లో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు లేదు. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్లో ఉత్పత్తి చేస్తున్నా... అది కేవలం కొన్ని రోజులకే పరిమితం. ఒక్క ప్రాజెక్టు కూడా లేని రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అంటే ఒప్పుకోం. తెలంగాణలో విద్యుత్ లోటే ఉండదు... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ లోటు ఉంటుందని కట్టుకథలు చెబుతున్నారు. వాస్తవంగా తెలంగాణలో ఉన్న అన్ని రకాల వనరులతో 13 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చాలు. ప్రస్తుతం 8,300 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాం. దీనిలో 2,500 నుంచి 3,000 ఎంయూల లోటు ఉంటోంది. కానీ... రామగుండంలో అల్ట్రా సూపర్ ప్రాజెక్టు నిర్మిస్తే... 4000 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. అదే విధంగా భూపాలపల్లి, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావచ్చు. వీటిని నిర్మిస్తే... ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను విక్రయించవచ్చు. ఏటా వినియోగిస్తున్న విద్యుత్‌కు మరో ఏటా 8 నుంచి 10 శాతం ఎక్కువ వాడుకుంటాం. అలా వాడుకున్నా... లోటు అనేది ఉండదు. వ్యవసాయానికి ఢోకా లేదు... ప్రస్తుతం ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ 6 నుంచి రూ 18 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ... ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఇప్పటి వరకు ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేస్తే... సరిపడా విద్యుత్ ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి ధరలను బట్టి బిల్లులు తగ్గే అవకాశాలుంటాయి. ఇక వ్యవసాయ రంగానికి నిరంతరా యంగా విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంది. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరంగా వ్యవసాయానికి విద్యుత్ సప్లై చేయవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా అవకాశాలున్నాయి. సరిపడా భూములున్నాయి. కేంద్రం తన వంతు సాయం చేస్తే చాలు.’ -
'విభజన అనివార్యం అందుకే రాయల తెలంగాణ'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైనదని గుత్తి ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా సష్టం చేశారు. అందుకే రాయల్ తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ఇంకా సమైక్యం అంటూ ఉంటే మనమే నష్టపోతామని మధుసూధన్ గుప్తా వ్యాఖ్యానించారు. శుక్రవారం అనంతపురం వచ్చిన మధుసూధన గుప్తాను బీసీ సంఘాలు అడ్డుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలోని ఉవ్వెత్తున్న ఎగసిన సమైక్య ఉద్యమాన్ని నీరుగారస్తున్నారంటూ ఆయా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధుసూధన గుప్తా పైవిధంగా స్పందించారు. -
రాయల తెలంగాణ ప్రతిపాదన దౌర్భాగ్యం
వైఎస్సార్సీపీ నేతలు శోభానాగిరెడ్డి, కేతిరెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారు? ఎంఐఎం తిరిగి సమైక్యం వైపు రావాలని కోరుతున్నాం యూపీఏ సర్కారు సమైక్య ఉద్యమాన్ని ఎగతాళి చేస్తోంది సీఎం కిరణ్ సోనియా ఆలోచనలను అమలు చేస్తున్నారు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విడగొట్టి తెలంగాణలో కలిపి ‘రాయల-తెలంగాణ’ చేయాలని కాంగ్రెస్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌లతో పాటు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న ప్రతిపాదనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ‘రాయల-తెలంగాణ’ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. రాయలసీమ పౌరుషం అని చెప్పుకునే నాయకులు ఈరోజు ఓట్లు, సీట్ల కోసం దౌర్భాగ్యకరంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజల అభిప్రాయం, ఆలోచనలు తెలుసుకోకుండా రాయలసీమ అస్థిత్వం కోల్పోయే విధంగా జీవోఎంకు ప్రతిపాదనలు పంపే హక్కు వీళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘ఎంఐఎం రాయల-తెలంగాణ అనడం బాధాకరం. వారు తిరిగి సమైక్యం వైపు రావాలని కోరుతున్నాం’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జేసీ, టీజీ వారి వ్యాపారాల కోసం, ట్రాన్స్‌పోర్ట్‌లను నడిపించుకోవడం కోసం రాయలసీమను విడగొట్టాలంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు జిల్లాలనే ఎందుకు? మొత్తం 13 జిల్లాలను కలుపుకొని తెలంగాణ అని పేరు పెట్టుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచలేరు? అని కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. ‘‘కేవలం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక కాంగ్రెస్, టీడీపీ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయి. అందుకే కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతూ బాబు విభజన లేఖ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోవడంలేదు. కాంగ్రెస్‌కు చెందిన కర్నూలు, అనంతపురం నేతలు తాము గెలవలేమని, జగన్‌ను ఢీ కొనలేమని వారి ఉనికి కోసం రాయలసీమను చీల్చమనడం దౌర్భాగ్యకరం. ఏదో వ్యాపారం మాదిరి ఈ ఫ్లాట్ మీకు, ఆ ఫ్లాట్ మాకు అంటూ రెండుగా చీల్చాలనటం సిగ్గుచేటు’’ అని ధ్వజమెత్తారు. ఒక సమస్యకు పరిష్కారం చేయమని కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తే దాన్ని పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, జిల్లాల వారీగా ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి రాష్ట్రంలో అశాంతి, అభద్రతా భావాన్ని కల్పిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ సొంతప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజల ఆలోచన మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దోహదపడాలని హితవు పలికారు. విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీ అధినేత జగన్ త్వరలోనే జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టనున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఒకవైపు న్యాయస్థానాల్లో పోరాడుతూనే, మరోవైపు రాజకీయ మద్దతు కూడగడుతున్నట్లు వివరించారు. రహదారుల దిగ్బంధం విజయవంతం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ జగన్ పిలుపు మేరకు రహదారుల దిగ్బంధాన్ని పార్టీశ్రేణులు, సమైక్యవాదులు కలిసికట్టుగా విజయవంతం చేశారని శోభానాగిరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వంద రోజులుగా స్వాతంత్రోద్యమాన్ని తలపించే విధంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడంలేదని దుయ్యబట్టారు. ప్రజా ఉద్యమాలను గౌరవించకపోగా మరింత అవమానపరిచే విధంగా యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సమైక్య ఉద్యమాన్ని ఎగతాళి చేసే విధంగా వందవ రోజునే జీవోఎం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శోభ చెప్పారు. సీఎం కిరణ్ సమైక్య ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా సోనియా ఆలోచనలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.