suspicious
-
అనుమానాస్పద మరణ వాంగ్మూలంతో... నేర నిర్ధారణ తగదు: సుప్రీం
న్యూఢిల్లీ: అనుమానాస్పద మరణవాంగ్మూలం ఆధారంగా నేర నిర్ధారణ సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇతరత్రా గట్టి సాక్ష్యాధారాలు లేనప్పుడు కేవలం అలాంటి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకోజాలమని స్పష్టం చేసింది. భార్యకు నిప్పంటించి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని నిరపరాధిగా తేలు స్తూ న్యాయమూర్తులు సుధాన్షు ధూలియా, ఎ.అమానతుల్లా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అతనికి దిగువ కోర్టు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మరణ వాంగ్మూలం కీలక సాక్ష్యమన్నది నిస్సందేహం. దాని ఆధారణంగా నేర నిర్ధారణ చేయడమూ సబబే. కానీ ఆ వాంగ్మూలమే అనుమానాస్పదమైన సందర్భాల్లో దాని ఆధారంగా నిందితున్ని దోషిగా నిర్ధారించడం సరికాదు. ప్రస్తుత కేసులో భార్య పరస్పరం పూర్తి విరుద్ధమైన వాంగ్మూలాలిచ్చింది. పైగా వరకట్న వేధింపులు జరగలేదని దర్యాప్తులో స్పష్టంగా తేలింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతర సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయానికి రావాలి’’ అని సూచించింది. -
కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఇద్దరు అనుమానాస్పద మృతి
-
South Korea: బ్లాక్‌బాక్స్ సైలెన్స్!!
దక్షిణ కొరియా ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సరిగ్గా నాలుగు నిమిషాల ముందే విమానంలో బ్లాక్ బాక్సు పని చేయకుండా పోయిందని ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు విమానం శకలాల నుంచి బాక్ బాక్స్‌ను సేకరించి అధికారులు విశ్లేషించారు. అయితే అందులో ఎలాంటి సమాచారం లేకపోయేసరికి అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో.. అమెరికాలోని ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ల్యాబోరేటరీకి పంపించారు. యూఎస్ సేఫ్టీ రెగ్యులేటరీ సహకారంతో డాటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.‘‘రక్షణగోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్ బాక్సుల్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం ’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇది అత్యంత అరుదైన ఘటన అని మాజీ అధికారి సిమ్ జై డోంగ్ అంటున్నారు. ఇలా బ్లాక్‌బాక్స్‌లు మూగబోయిన సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయని చెబుతున్నారాయన.ఇటీవల జెజు ఎయిర్ విమానం థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా ముయాన్కు బయలుదేరింది. మరో అయిదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా.. విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి, గోడను ఢీకొట్టి, పేలిపోయింది. విమాన వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.Death toll from the crash of a Jeju Air passenger plane during landing in South Korea has risen to 96▪️ The plane failed to deploy its landing gear on the first attempt and crashed during an emergency landing on the second attempt▪️ The aircraft veered off the runway and… pic.twitter.com/8uDMwRcIpn— Anadolu English (@anadoluagency) December 29, 2024అనుమానాలెన్నో..విమానాన్ని పక్షి ఢీ కొట్టిందనే సమాచారాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే అత్యవసర ల్యాండింగ్‌కు విమానం ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో రెండోసారి సింగిల్ రన్‌వేపై దిగగా ల్యాండింగ్ గేర్ సమస్యతో దూసుకెళ్లి అక్కడున్న గోడను ఢీ కొట్టింది. అయితే విమాన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవై దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే.. లోకలైజర్‌ను రన్‌వే చివర.. అదీ అంతటి గట్టి పదార్థంతో నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. -
అనుమానమొస్తే వెంటనే చెప్పండి: జేకే పోలీసులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా రాష్ట్రంలో అణువణువునా తనిఖీలు చేపడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు రాష్ట్రంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు.ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువు గానీ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.అనుమానాస్పదుల ఎత్తు, వారు ధరించిన దుస్తులు, వారి దగ్గర ఏవైనా ఆయుధాలు కనిపిస్తే ఆ వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని జమ్ము పోలీసు అధికారి అజయ్ శర్మ తెలిపారు. ఇటీవల కొందరు అనుమానాస్పద వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ బాలునికి కనిపించారని, ఈ విషయాన్ని ఆ బాలుడు సమీపంలోని సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియజేశాడన్నారు. అయితే అది ఆ బాలుని ఊహ మాత్రమేనని, నాలుగు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎవరి ఆచూకీ తెలియలేదన్నారు. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
ఆ బాక్సుల నిండా ఫైళ్లు!
పిఠాపురం: మూడు రోజులుగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో నిలిపివేసిన సంధ్యా ఆక్వా కంపెనీకి చెందిన బస్సు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులను విచారించగా బస్సు బ్రేక్ డౌన్ కావడంతో అక్కడ నిలిపి ఉంచినట్లు చెప్పారు. బస్సులోని అట్ట పెట్టెల్లో పలు ఫైళ్ల కట్టలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని, ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తెలియజేస్తామని ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం బస్సును ఆక్వా కంపెనీలోకి తరలించారు. -
పాక్ వెళ్తున్న ఓడ ముంబైలో నిలిపివేత
ముంబై: చైనా నుంచి పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఓ అనుమానాస్పద ఓడను భారత భద్రతా అధికారులు ముంబైలోని నావసేవ పోర్టులో నిలిపివేశారు. అందులో ఉన్న సామగ్రి పాక్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు సైతం ఉపయోగపడు తుందని గుర్తించారు. మాల్టాకు చెందిన సీఎంఏ సీజీఎం అత్తిలా అనే ఓడ పాక్‌లో ని కరాచీ రేవు పట్టణానికి వెళ్తుండగా జనవరి 23వ తేదీన కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. మొత్తం 22 టన్నుల బరువున్న ఈ సామగ్రిలో ఇటలీ తయారీ కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్(సీఎన్సీ)అనే యంత్రం ఉన్నట్లు గుర్తించారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఈ యంత్రాన్ని కంప్యూటర్‌తో ఆపరేట్ చేయొచ్చు. అనంతరం దీనిని పరిశీలించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)అధికారులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. -
ప్రొద్దుటూరులో దారుణం.. ఒకరు మృతి
-
అల్లుడు పక్కా స్కెచ్.. భార్యను ఇంటికి పంపకపోవడంతో..
రంగారెడ్డినగర్(మేడ్చల్ జిల్లా): భార్యను ఇంటికి పంపేందుకు అత్తమామలు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న అల్లుడు తన స్నేహితులతో కలిసి మామను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు తెలిపిన మేరకు.. దుండిగల్ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన షేక్ నాసిర్ (31) అదే ప్రాంతానికి చెందిన రమేష్(37) కుమార్తె మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి ముంబయ్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం తన బంధువుల ఇంట్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో అప్పట్లో దుండిగల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో బెయిల్‌పై విడుదలైన నాసిర్ శిక్ష పడటం ఖాయమని భయపడి బాధితురాలు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువురు చర్చిగాగిల్లాపూర్‌లోని సర్వే నెంబరు 214లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన రెండు నెలల పాటు వీరి సంసారం సజావుగా కొనసాగింది. అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న నాసిర్ తరచూ ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మహాలక్ష్మి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యను ఇంటికి పంపేందుకు నిరాకరించిన మామ రమేష్‌పై కక్షపెంచుకున్న నాసిర్ భార్యతో పాటు మామను సైతం చంపేందుకు పథకం పన్నాడు. తన స్నేహితులు కోటేశ్వరరావు(24), కంచేరి మహేందర్(22)లు మెదక్ జిల్లా గడ్డపోతారం నుండి నాలుగు కత్తులను తెచ్చుకుని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 2022 డిసెంబరు 16న రమేష్ ఇంటికి వచ్చిన నాసిర్ భార్య మహాలక్ష్మిని ఇంటికి పంపాలని అడగగా నిరాకరించడంతో గొడవ పడ్డాడు. చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? ఈ క్రమంలో చర్చిగాగిల్లాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతం నుండి వెళ్తున్న రమేష్‌పై దాడి చేసి ఛాతి, వీపు భాగాల్లో కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న దుండిగల్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, కంచేరి మహేందర్లను సైతం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మూడు కత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు. -
నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు
సాక్షి, బనశంకరి: అనుమానాస్పదంగా కారు నిలిపి నగదు లెక్కిస్తున్న సమయంలో పోలీసులు దాడిచేసి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్జీన ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఇన్నోవా కారును రోడ్డు పక్కన నిలిపి కరెన్సీనోట్లు లెక్కిస్తున్నారు. గస్తీలో ఉన్న పోలీసులు అనుమానంతో ఆరా తీశారు. వారిద్దరూ హుసూ్కరు గ్రామపంచాయతీ బిల్‌కలెక్టర్ మల్లేశ్, నెలమంగల రాజేశ్‌గా తేలింది. లెక్కిస్తున్న నగదుకు సంబంధించి వివరాలు చెప్పాలని పోలీసులు కోరగా నీళ్లు నమిలారు. దీంతో నగదును స్వా«దీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు నగదు అప్పజెప్పారు. (చదవండి: వాళ్లు పుట్టెడు దుఃఖంలో ఉంటే అక్కడకు వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..) -
అయ్యో.. ఏమైందో ఏమో!
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూలి పనికోసం వలస వచ్చిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి పడుకున్న మంచంపైనే తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ధన్వాడ మండ లం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగారం హను మంతు (65), భార్య వెంకటమ్మ(50)తో కలిసిఅబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్పూర్లో సుగుణ అనే మహిళా రైతు వద్ద హార్టీకల్చర్ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం ఇంకా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో సుగుణ వారిని పిలిచేందుకు వెళ్లింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు దంపతులిద్దరూ స్పందించకపోవడంతో అనుమా నం వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో కొంతమంది వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా హనుమంతుదంపతులు మంచంపై విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!) -
నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కిడ్నాప్ కలకలం
-
డ్యూటీకెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికి భార్య అదృశ్యం.. చివరికి..
దుండిగల్(హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చర్చిగాగిల్లాపూర్ చైతన్య కాలనీకి చెందిన సుధాకర్, లక్ష్మిప్రసన్న(23) భార్యాభర్తలు. కాగా ప్రైవేట్ ఉద్యోగి అయిన సుధాకర్ ఈ నెల 10వ తేదీన డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చాడు. చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపించి.. అయితే భార్య ఇంట్లో లేకపోవడంతో చుట్టు పక్కల వారిని వాకబు చేయగా తెలియదని చెప్పారు. ఆందోళన చెందిన అతను లక్ష్మిప్రసన్న సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోడంతో భర్త సుధాకర్ ఆదివారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అయ్యో పాపం.. వర్షిత
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి అపార్టుమెంట్‌లోని నాలుగో అంతస్తుపై నుంచి కింద పడి అసువులు బాసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి, ప్రభావతి దంపతులు. మన్సూరాబాద్‌లోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి ప్రైవేట్ టీచర్. సత్యనారాయణ రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు వర్షిత (12) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చిప్స్ కొనుక్కుంటానని తల్లి వద్ద రూ.20 తీసుకుని బయటకు వెళ్లింది. మన్సూరాబద్ చౌరస్తాకు వచ్చి ఆటో డ్రైవర్‌కు రూ.50 ఇచ్చి ఎల్బీనగర్లోని చంద్రపురి కాలనీలోని రోడ్డు నంబర్–2లో ఉన్న ఓ అపార్టుమెంట్ వద్దకు వచ్చిది. అపార్టుమెంట్ పైకి వెళ్తుండగా అక్కడి వాచ్‌మన్ ఎవరు కావాలని అడగటంతో ‘మా నాన్న ఇక్కడే ఉన్నాడు’ అంటూ నాలుగో అంతస్తుపైకి వెళ్లింది. అప్పటికే అనుమానం వచ్చిన వాచ్‌మన్ చిన్నారి వెనుక అతని కొడుకును లిఫ్ట్‌లో పంపించాడు. పైకి వెళ్లి వెతికినా వర్షిత జాడ కనపించలేదు. కొద్ది సేపటి తర్వాత బాలిక కింద పడిన శబ్దం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఎల్బీనగర్ పోలీసులకు అపార్టుమెంట్ వాచ్‌మన్ సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. చిన్నారి అక్కడికి ఎందుకు వచ్చింది? అపార్టుమెంట్లో ఎవరు ఉన్నారు? నాలుగో అంతస్తుపై నుంచి తానే దూకిందా? వేరే ఎవరైనా బాలికను కిందకు తోశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డీఎస్పీ హత్య.. నిందితుడ్ని గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయం) -
ప్రేమలో గెలిచారు.. జీవితంలో ఓడారు
ఉప్పల్: వారిద్దరూ ఒకనొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రేమను గెలిచారు. కానీ జీవితంలో ఓటమి పాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అసువులు బాశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన కొత్త సాయిగౌడ్ (30), మీర్‌పేటకు చెందిన సందూర్ నవనీత (28)కు మౌలాలిలో ఉన్న సూపర్ మార్కెట్లో పరిచయమైంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సాయిగౌడ్, నవనీత ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుని రామంతాపూర్‌లోని శ్రీనగర్ కాలనీలో అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. నవనీత ప్రైవేట్ కాల్ సెంటర్లో పని చేస్తుండగా సాయిగౌడ్ పెస్ట్ కంట్రోల్ ఉద్యోగం చేసేవాడు. కొంత కాలంగా సాయిగౌడ్ ఉద్యోగం పోయి మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వస్తుండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే విషయాన్ని నవనీత తన తల్లిదండ్రులకు చెబుతుండేది. శుక్రవారం సాయంత్రం నుంచీ నవనీత సోదరుడు నవీన్ ఫోన్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో శనివారం ఉదయం రామంతాపూర్‌లోని సోదరి ఇంటికి వచ్చి చూడగా సాయిగౌడ్, నవనీత విగత జీవులుగా కనిపించారు. నవీన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి వచ్చారు. మొదట నవనీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు, ఆ తర్వాత ఆమె చున్నీతో సాయిగౌడ్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!) -
భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్..
తణుకు(పశ్చిమగోదావరి): పట్టణానికి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పుష్పలత (21) శుక్రవారం మధ్యాహ్నం ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత, విజయవాడకు చెందిన సాయిబాలచందు ఈ ఏడాది జనవరి 9న ప్రేమవివాహం చేసుకున్నారు. చదవండి: నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి.. సోషల్ మీడియా యాప్‌లో పరిచయంతో వీరు వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలచందు అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. పుష్పలత గృహిణి. శుక్రవారం ఉదయం నుంచి భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన బాలచందు మరో గదిలో ఉండగా పడక గదిలో ఆమె ఉరేసుకుంది. అయితే ఘటనా స్థలంలో ఆనవాళ్లు ప్రకారం ఆమె ఉరేసుకున్నట్లుగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కె.గంగాధరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
యూపీని వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశపై నిపుణుల హెచ్చరికల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో అంతుచిక్కని జ్వరం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఏడుగురు వృద్ధులతోపాటు 32 మంది చిన్నారులు ఉండటం మరింత ఆందోళన రేపుతోంది. ఫిరోజాబాద్‌లో 32 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు మరణించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధృవీకరించారు. జిల్లాలో డెంగ్యూలాంటి జ్వరం కారణంగా ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. బాధిత కుటుంబాలను సందర్శించిన సీఎం యోగి వారికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిరోజాబాద్‌లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆగస్టు 18న మొదటి కేసు నమోదైందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వైద్యులు ప్రకటించారు. అనుమానాస్పద వ్యాధితో 102 డిగ్రీల సెల్సియస్ జ్వరంతో బాధితులు బాధపడుతున్నారని, ఈ జ్వరం తగ్గడానికి నాలుగు రోజులు పడుతోందన్నారు వెల్లడించారు. గతవారం నుంచి ఇక్కడ విషజ్వరం పీడితుల సంఖ్య మరింత విజృంభిస్తోంది. గత వారం 40 మంది పిల్లలు ఈ వ్యాధితో మరణించారని ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ప్రకటించారు. అయితే ఈ వాదనను యుపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. థర్డ్ వేవ్ వచ్చేసిందన్న వాదన సరికాదని, భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా, పిల్లలలో మలేరియా, డెంగ్యూ, అధిక జర్వం లాంటి లక్షణాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే తమ ఆరోగ్య బృందం నిర్వహించిన పరీక్షల్లో బాధితులందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మిగిలిన వారి శాంపిల్స్‌ను కూడా లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామన్నారు. మరోవైపు యూపీలోని ఫిరోజాబాద్, మధుర, ఆగ్రా తదితర ప్రదేశాలలో చోటచేసుకుంటున్న మరణాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. फिरोजाबाद, मथुरा, आगरा व उप्र की अन्य जगहों पर बुखार से बच्चों समेत तमाम लोगों की मृत्यु की खबर दुखदाई है। उप्र सरकार को तुरंत प्रभाव से स्वास्थ्य व्यवस्थाओं को चाक-चौबंद कर इस बीमारी के रोकथाम के प्रयास करने चाहिए। बीमारी से प्रभावित लोगों के बेहतर इलाज की भी व्यवस्था की जाए। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 30, 2021 -
శ్రీశైలంలో డ్రోన్ కలకలం
శ్రీశైలం: గుర్తు తెలియని డ్రోన్ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనుకాల నుంచి తక్కువ ఎత్తులోకి రావడంతో గమనించిన భద్రతా సిబ్బంది ఆలయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విషయం తెలియజేశారు. దీంతో దేవస్థాన అధికారులతో పాటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని గమనించి డ్రోన్‌ను నియంత్రిస్తున్న అపరిచిత వ్యక్తి సిగ్నల్స్‌ను ఆపివేశారు. అనంతరం అది కనిపించకుండాపోయింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పరిధిలోని రెండో పవర్‌హౌస్‌లో విద్యుదుత్పాదనను నిరంతరం కొనసాగిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెకండ్ పవర్‌హౌస్ వద్ద పోలీస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది డ్రోన్‌ను వినియోగించి ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఘటనపై శ్రీశైలం సీఐ వెంకటరమణ మాట్లాడుతూ డ్రోన్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలంలోని సత్రాలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. డ్యామ్ వద్ద 40 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
తల్లీకొడుకు అనుమానాస్పద మృతి
బనగానపల్లె రూరల్(కర్నూలు జిల్లా): మండలంలోని నందవరం గ్రామానికి చెందిన తలారి సరస్వతి (30), కుమారుడు మధుశంకర్ (12) అనుమానాస్పద స్థితి మృతి చెందారు. వారి మృతదేహాలు బుధవారం రాళ్లకొత్తూరు సమీపంలోని దెయ్యాలకుంట వద్ద శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్ఆర్బీసీ)లో లభ్యమయ్యాయి. ఇద్దరూ ఉదయమే పొలం వద్దకు వెళ్లారని, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా సమీపంలోని కాలువలో కొట్టుకుపోతూ కని్పంచారని సరస్వతి మామ ఎర్రమద్దయ్య తెలిపాడు. అయితే.. ఆస్తి విషయంలో హత్య చేశారంటూ సరస్వతి తల్లి జి.లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కుమార్తె సరస్వతిని 13 క్రితం నందవరం గ్రామానికి చెందిన ఎర్రమద్దయ్య కుమారుడు మద్దిలేటికి ఇచ్చి వివాహం చేశారు. మద్దిలేటి లారీ క్లీనర్‌గా వెళ్తుంటాడు. వీరికి మధుశంకర్, మణికంఠ అనే ఇద్దరు కుమారులు. మధుశంకర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా.. వివాహం అయినప్పటి నుంచి సరస్వతిని భర్త, మామతో పాటు కొలిమిగుండ్లలో ఉంటున్న ఆడబిడ్డ మహేశ్వరి, ఆమె భర్త వేధింపులకు గురి చేసేవారు. తండ్రి ఎర్ర మద్దయ్య పేరుతో ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో తనకూ వాటా కావాలంటూ మహేశ్వరి గతంలో పలుమార్లు గొడవ పడింది. ఆస్తి ఇస్తేనే పుట్టింటికి వస్తానని తెగేసి చెప్పింది. అయితే.. ఇందుకు సరస్వతి అంగీకరించదనే ఉద్దేశంతో మామ, భర్త కలిసి ఆమెను, కుమారుడు మధుశంకర్‌ను హత్య చేసి కాలువలో పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని లక్ష్మీదేవి ఆరోపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ జీవన్ గంగనాథ్‌బాబు తెలిపారు. చదవండి: చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి ప్రైవేటు ల్యాబ్‌ల దందా: మోసం గురో..! -
శివరాత్రి రోజున విషాదం: తల్లీబిడ్డ మృతి
-
శివరాత్రి రోజున విషాదం: ఏమైందో తెలియదు తల్లీబిడ్డ మృతి
నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): అనుమానాస్పద స్థితిలో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన నరసన్నపేట మేజర్ పంచాయతీలోని హనుమాన్‌నగర్‌లో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్‌ఎన్‌పేట మండలం కొయిలాంకు చెందిన లత(21)కు హనుమాన్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ గోకవలస రమేష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు తనీష్, కుమార్తె లాస్య(1) ఉన్నారు. గురువారం శివరాత్రి సందర్భంగా కుటుంబసభ్యులంతా ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. లత, లాస్యలు నిద్రలోనే ఉండగా కుమారుడు తనీష్, సోదరుడు చిరంజీవి, తల్లి రాముతో కలిసి రమేష్ బయటకువెళ్లా రు.ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి లత, లాస్యలు మృతి చెందినట్లు గుర్తిం చారు. విషయం తెలుసుకున్న లత తల్లి, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రమేష్‌తో పాటు తల్లి, సోదరుడు కలిసి భోజనంలో విషం కలిపి హత్య చేశారని ఆరోపించారు. లత తల్లి మద్ది కంచెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తాడుతో గొంతు నులిమి చంపి.. కడతేరిన ‘ఫేస్బుక్’ ప్రేమ -
భార్యపై అనుమానం.. నిద్రిస్తుండగా దారుణం
భోపాల్: భార్యపై అనుమానం అతడిని రాక్షసుడిగా మార్చింది. విచక్షణ కోల్పోయి కట్టుకున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. గొడ్డలితో ఆమె కాలు, చేయ్యి నరికాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. హోషంగాబాద్‌లోని సియోని మాల్వాకు చెందిన ప్రీతం సింగ్‌కు 2012లో సంగీతతో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. సంగీత ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా.. ప్రీతం సింగ్ కుమారుడితో కలిసి నిష్తాపూర్ ప్రాంతంలోని పరాస్ నగర్లో ఉంటుండేవాడు. దినసరి కూలీగా పని చేస్తుండేవాడు. ఇలా ఏడేళ్లుగా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి అనుమానం అనే రాక్షసి ప్రవేశించింది. దాంతో కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సంగీత సెలవు మీద భోపాల్‌కి వచ్చింది. కుమారుడితో కలిసి సంతోషంగా గడిపింది. ఇక రాత్రి బిడ్డతో కలిసి నిద్ర పోతుండగా.. ప్రీతం సింగ్ గొడ్డలి తీసుకుని సంగీత కుడి చేయి, కాలు నరికాడు. దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రీతం సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని వెల్లడించాడు. సంగీతను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. -
విషాదం: యమపాశమైన చున్నీ
బంజారాహిల్స్(హైదరాబాద్): సరదాగా ఊయల ఊగడానికి మంచానికి కట్టిన చున్నీ ఓ బాలుడి పాలిట యమపాశమైంది. పనిమీద బయటకు వెళ్తూ బాలుడిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లిన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. చున్నీ మెడకు చుట్టుకొని అనుమానాస్పద స్థితిలో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ మండలం ఎల్లసఖి గ్రామానికి చెందిన అంజలి, నర్సింహ దంపతులు టైలర్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ యాదగిరినగర్ చర్చి లేన్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మల్లికార్జున్(7) మూడో తరగతి చదువుతున్నాడు. నిత్యం సరదాగా అల్లరిచేసే మల్లికార్జున్ ఇంట్లో కంటే ఎక్కువగా బయటికి పరుగులు తీస్తుంటాడు. (చదవండి: ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్ చార్జింగ్ వైరుతో..) గురువారం ఉదయం 11 గంటలకు అంజలి, నర్సింహ దంపతులు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో కొడుకులిద్దరినీ ఇంట్లో ఉంచి బయటి నుంచి తాళం వేసి వెళ్లారు. అన్నం తిన్న తరువాత చిన్నకొడుకు నిద్రించాడు. మల్లికార్జున్ మాత్రం మంచానికి, కిటికీ ఊచలకు చున్నీని కట్టి ఊయల ఊగసాగాడు. ప్రమాదవశాత్తు మంచం పైనుంచి జారడంతో చున్నీ మెడకు చుట్టుకుంది. నిద్రిస్తున్న సోదరుడు లేచి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. బయటి నుంచి తాళం వేసి ఉండటంతో కిటికీకి చున్నీతో వేలాడుతున్న మల్లికార్జున్‌ను దింపాల్సిందిగా తమ్ముడికి సైగలు చేశారు. దీంతో మెడకు చుట్టుకున్న చున్నీని విప్పగా మల్లికార్జున్ కిందకు జారిపడ్డాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాలుడిని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఇదిలాఉండగా తన కొడుకు ఐరన్ పైప్‌కు చున్నీతో మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లి సందడిలో మృత్యుఘోష) -
గాంధీ ఆస్పత్రిలో అనుమానితుల 'క్యూ'విడ్
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ అనుమానితులు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు హెల్ప్‌డెస్క్ వద్ద మీటరు దూరంలో నిల్చుంటూ బారులు తీరుతున్నారు. శనివారం 236 మంది అనుమానితులు వచ్చారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి కోవిడ్ లక్షణాలు గల 26 మందిని ఐసోలేషన్ వార్డులో చేర్చుకుని నమూనాలు సేకరించారు. వాటిని నిర్ధారణ పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 13 మంది, ఛాతీ ఆస్పత్రిలో 8 మంది కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. మహేంద్రహిల్స్‌కు చెందిన కోవిడ్ బాధితుడు పూర్తి ఆరోగ్యంతో పది రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. కాగా, గాంధీ హెల్ప్‌డెస్క్‌కు కోవిడ్ అనుమానితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అదనపు వైద్యులను, సిబ్బందిని ఏర్పాటు చేశారు. మైక్ సిస్టం ద్వారానే వైద్యుల మాటలు.. కోవిడ్ అనుమానితులతో వైద్యులు మాట్లాడే క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు హెల్ప్ డెస్క్ వద్ద కొత్తగా మైక్ సిస్టంను శనివారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఐసీయూ, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ బాధితులు ఇతర రుగ్మతల బారినపడితే అవసరమైన శస్త్రచికిత్సలు తక్షణమే చేసేందుకు 6వ అంతస్తులోని జనరల్ సర్జరీ విభాగంలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధ్దం చేశారు. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఆర్థోపెడిక్ విభాగ వార్డులను అక్కడి నుంచి తరలించి కోవిడ్ విభాగానికి కేటాయించినట్లు శ్రవణ్‌కుమార్ చెప్పారు. 8వ అంతస్తులో 72 గదులు, 8 పెద్ద హాళ్లు, 7వ అంతస్తులో మరికొన్ని ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తెచ్చారు. విధుల్లో నర్సింగ్ ట్యూటర్లు.. గాంధీ ఆస్పత్రికి అనుబంధంగా పనిచేస్తున్న గాంధీ నర్సింగ్ స్కూలుకు చెందిన 13 మంది ట్యూటర్లను ఆస్పత్రిలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని వివిధ విభాగాల్లో నియమించారు. కోవిడ్ వైద్యసేవలకు భాషా సమస్య గాంధీలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితులకు వైద్యసేవలు అందించేందుకు భాష సమస్యగా మారింది. ఇండోనేíసియా నుంచి వచ్చిన బాధితుల్లో కొందరికి అరబిక్ తప్ప హిందీ, ఇంగ్లిష్ రావు. బాధితులను సింగిల్ రూమ్స్‌లో పెట్టి వైద్యసేవలు అందిస్తున్న నేపథ్యంలో వైద్యులకు బాధితులకు మధ్య భాష సమస్యగా మారినట్లు తెలిసింది. వైద్యులు సైగల ద్వారా అడిగితే, బాధితులు కూడా సైగల ద్వారానే బదులిస్తున్నట్టు తెలిసింది. ఫీవర్‌లో మరో 3 అనుమానిత కేసులు ఫీవర్ ఆస్పత్రిలో మరో 3 కోవిడ్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. చంపాపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(35), (28), (3) జనవరిలో సింగపూర్‌కు వెళ్లొచ్చారు. అనుమానంతో వీరు శనివారం నిర్ధారణ పరీక్షల కోసం ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. వీరిని ఐసోలేషన్ వార్డులో చేర్చుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. -
వారిని ఏ తుపాకీతో కాల్చారు?
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. తొలుత దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వరకు పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయా రు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు లేకపోవడంపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్‌లను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా.. పెద్ద గన్స్ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్ ఓపెన్ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అన్న విషయాలపై ఎన్హెచ్ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్కౌంటర్లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు. ముగ్గుర్ని తూర్పు వైపు నుంచి.. ఎన్కౌంటర్లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్ఎల్ఆర్ తుపాకులతోనే కాల్చా రు. ఈ ఘటనలో చటాన్‌పల్లి బ్రిడ్జి నుంచి పారిపోతున్న నిందితులను లొంగిపొమ్మని హెచ్చరిస్తూ.. వెంబడించిన పోలీసులు రెండువైపులా చుట్టుముట్టారు. అయినా నిందితులు కాల్పులు ఆపకపోవడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఆరిఫ్, శివ, నవీన్ ముగ్గురిని పోలీసులు తూర్పు వైపు నుంచి కాల్చారు. అందుకే, వారి తలలు పడమర వైపు వాలి ఉన్నాయి. అంటే పోలీసుల తూటాలు వారికి ఎదురుగా వచ్చి తగిలినట్లు తెలుస్తోంది. ఇక చెన్నకేశవులుకు మాత్రం బుల్లెట్లు వెనక నుంచి వచ్చి తగిలినట్లుగా అతని శరీరం పడి ఉన్న తీరు చెబుతోంది. అందుకే, ఇతని ఒక్కడి తల మాత్రం తూర్పు వైపు వాలి ఉంది. గాయం ఆధారంగా చెప్పొచ్చు..! నిందితుల పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు ఏ తుపాకీతో కాల్చింది చెప్పగలరు. తూటా గాయం ఆధారంగా చేసుకుని, శరీరాన్ని తగిలిన చోట, వెలుపలికి వచ్చిన ప్రాంతంలో ఏమేరకు గాయం చేసింది అన్న విషయాలను ఆధారంగా చేసుకుంటారు. సాధారణంగా ఏ బుల్లెటయినా శరీరాన్ని తగి లిన చోట మామూలు వ్యాసార్థంలో.. వెలుపలికి వచ్చినపుడు అందుకు రెట్టింపు వ్యాసార్థం లో గాయాలను ఏర్పరుస్తాయి. అదే సమయం లో గాయంపై ఉన్న గన్‌పౌడర్ రెసిడ్యూ (జీపీఆర్) ఆధారంగా చెప్పగలరు. గాయం తగిలిన విధానాన్ని బట్టి, అది ఏ దిశ నుంచి దూసుకొచ్చింది.. ఎంత దూరం నుంచి వచ్చింది.. కచ్చితంగా చెప్పే పరిజ్ఞానం మన ఫోరెన్సిక్ నిపుణుల వద్ద ఉంది. వీరిని ఫోరెన్సిక్ బాలిస్టిక్ ప్రొఫెసర్లు అని పిలుస్తారు. ఈ ఎన్కౌంటర్లో వీరు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఘటనాస్థలి వద్ద బందోబస్తు.. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 59 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా దిశను దహనం చేసిన చోటు, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే పోలీసులు ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా జాతీయ రహదారి వద్దనే కట్టడి చేస్తున్నారు. ‘ఎన్కౌంటర్’పై సీన్ రీకన్స్ట్రక్షన్ షాద్‌నగర్ : దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్కౌంటర్ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు.. ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.. ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయన్న వాటిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. దీనిని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. -
హైదరాబాద్‌లో టెర్రరిస్టుల కలకలం
సాక్షి హైదరాబాద్: హింసాత్మక ఘటనలే లక్ష్యంగా నగరంలోకి ప్రవేశించిన అగంతకులను ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర రాజధానిలో టెర్రరిస్టుల కలకలం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్‌లో అగంతకులు చొరబడ్డారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆర్మీ అధికారులు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అల్వాల్‌తో పాటు అనుమానం ఉన్న ప్రాంతాలను అధికారులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అదృశ్యం..అనుమానాస్పదం
సాక్షి, బంజారాహిల్స్: రోజులు గడుస్తున్నా అదృశ్యమైన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులు, కుటుంబ సభ్యులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్ షేక్ అబ్దుల్ రహీం(48) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అతడి భార్య ముబీన్‌ఫాతిమా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓవైసీ కాలనీలో ఉంటున్న షేక్ అబ్దుల్ రహీం నాలుగేళ్లుగా ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్గా పని చేస్తున్నారు. మే 1న స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం అతడి భార్య ఫాతిమా ఆయనకు ఫోన్ చేసి లంచ్‌కు వస్తున్నారా అని అడిగింది. పని పూర్తయ్యాక వస్తానని చెప్పాడు. సాయంత్రం అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టింది. వారం రోజుల నుంచి వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా మే 1న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రహీం మలక్‌పేట రైల్వేస్టేషన్లో బైక్ పార్క్ చేసి రైల్లో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. జూన్ 2న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో రూ.40వేలు డ్రా చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రహీం హైదరాబాద్‌లోనే ఉన్నాడని, తన కుటుంబ సభ్యులకు దొరక్కుండా దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతినెలా జీతంమాత్రం డ్రా చేస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. -
ట్రంప్ టవర్‌లో మరోసారి కలకలం
న్యూయార్క్: న్యూయార్క్‌లోని ట్రంప్ ట్రవర్స్‌లో మరోసారి కలకలం రేగింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన మాన్‌హట్టన్‌లోని టవర్‌వద్ద శుక్రవారం కనిపించిన పలు అనుమానాస్పద ప్యాకేజీలు న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెమటలు పట్టించాయి. ప్రాథమికు పరిశీలన అనంతరం ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్లో ప్రకటించింది. ట్రంప్ సొంతమైన 58 అంతస్థుల భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను భద్రతా సిబ్బంది గమనించారు. అనంతరం జరిపినవిస్తృత పరిశోధన మరో రెండు ప్యాకెట్లు లభించడంతో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించి తనిఖీలు చేపట్టారు. భవనంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను గమనించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎన్‌వైపీడీ ప్రజాసమాచార అధికారి సెర్జెంట్ విన్సెంట్ మార్చీజ్ తెలిపారు. The situation at Trump Tower (725 5th Ave, #Manhattan) has been assessed. There is no danger at this time. — NYPD NEWS (@NYPDnews) July 27, 2018 -
మోసపోయిన బాలికకు కౌన్సెలింగ్
విజయనగరం ఫోర్ట్ : మోసపోయిన బాలికకు చైల్డ్‌లైన్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే .. ఆగ్రా, ముంబై వంటి పెద్ద పెద్ద పట్టణాలు చూపిస్తానని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మోసగాడు అదే రాష్ట్రం బాలంగీర్‌కు చెందిన పదహారేళ్ల బాలికను నమ్మించాడు. దీంతో బాలిక ఆయనతో పాటు వెళ్లగా మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం విజయనగరం రైల్వేస్టేషన్‌కు చేరుకునే సరికి సదరు వ్యక్తి లేకపోవడంతో బాలిక స్టేషన్లో దిగిపోయింది. అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో రైల్వే పోలీసులు గుర్తించి చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులకు అప్పగించారు. బాలిక వద్ద ఉన్న ఫోన్ నంబర్ అధారంగా తల్లిదండ్రులకు చైల్డ్‌లైన్ సభ్యులు సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రులు సోమవారం స్థానిక చైల్డ్‌లైన్ కార్యాలయానికి చేరుకోవడంతో బాధితురాలిని బాలల సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ వావిలాల లక్ష్మణ్, ప్రసాద్‌రావు, చైల్డ్‌లైన్ ప్రతి నిధులు వరలక్ష్మి, మధుసూదనరావు, కృష్ణారావు, సతీష్, రమణమ్మ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తండాలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లి గుగులోత్ చావ్లీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామ శివారు జేత్రాం తండాకు చెందిన గుగులోత్ చావ్లీ కుమార్తె అరుణ(27)ను మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్‌తండాకు చెందిన భూక్యా కృష్ణ మహర్షికి ఇచ్చి 9 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచి కృష్ణమహర్షి భార్య అరుణను హింసించేవాడు. అంతేకాకుండా ఆమె మామ లక్పతి, మరిది బ్రహ్మమహర్షి అలియాస్ బన్ను కూడా వేధించేవారు. గతంలో ఈ వేధింపులపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ వారు తమ పద్ధతి మార్చుకోలేదు. వేధింపుల గురించి అరుణ తన తల్లి గుగులోత్ చావ్లీకి పలుమార్లు చెప్పుకుంటూ బాధపడేది. కాగా, ఈ నెల 9వ తేదీ రాత్రి 11.30 గంటలకు భూక్యా అరుణ విషం తీసుకుందని తల్లి చావ్లీకి ఫోన్ ద్వారా ఆమె భర్త సమాచారం అందించాడు. మొదట మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక వైద్యులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అయినప్పటికీ సదరు వ్యక్తులు హైదరాబాద్ తీసుకెళ్లకుండా మానుకోటలోనే అరుణకు వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో 10వ తేదీ ఉదయం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు అరుణ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తన కుమార్తె మృతిపై అనుమానంగా ఉందని, ఆమెకు బలవంతంగా విషం తాగించారని, కుడి కన్నుపై బలమైన గాయం ఉందని, చెవుల నుంచి రక్తం వస్తుందని, మెడ మొత్తం కమిలిపోయి ఉందని తల్లి గుగులోత్ చావ్లీ రోదిస్తూ తెలిపింది. అరుణ మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చావ్లీ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ జబ్బార్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి అరుణ మృతదేహాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు దిగి..
బోధన్ టౌన్(బోధన్) : స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోధన్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్ చౌరస్తాకు చెందిన విశాల్ (21) బీటెక్ పూర్తి చేశాడు. తన మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి బోధన్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో గల స్విమ్మింగ్‌పూల్‌కు గత రెండు నెలల నుంచి వస్తున్నాడు. రోజూ లాగే గురువారం మధ్యాహ్నం సమయంలో తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌కు వచ్చాడు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగిన విశాల్.. ఎంతకూ పైకి రాలేదు. దీంతో మిత్రులు అతడ్ని బయటకు తీసి 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే, 108 వచ్చే సరికే విశాల్ మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి తుకారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి ఈత వచ్చని, ఈత వచ్చిన వ్యక్తి ఎలా మృతి చెందుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడికి మృతికి కారణమైన ఈతకొలను నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాల్ మృతికి గల కారణాలపై సీఐని వివరణ కోరగా.. పోస్టుమార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన బదులిచ్చారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
రామచంద్రపురం: పెళ్లైన వారం రోజులకే యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పట్టణంలోని బ్రాడీపేటలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, రామచంద్రపురం ఎస్సై వంశీధర్ కథనం ప్రకారం.. బ్రాడీపేటకు చెందిన మల్లు మాధురి(18)కి కొమరిపాలేనికి చెందిన మల్లు శివతో ఈ నెల 19న వివాహం జరిగింది. మాధురి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో బ్రాడీపేటలోని అమ్మమ్మ ఇంటివద్దనే పెరిగింది. అయితే ఆమెకు తరచుగా కడుపులో నొప్పి వస్తుంటుందని నొప్పి తాళలేక మాధురి బ్రాడీపేటలోని అమ్మమ్మ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మాధురి బంధువుల పిర్యాధు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వంశీధర్ తెలిపారు. అయితే పెళ్లైన వారం రోజులకే మాధురి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
ఇంటెలిజెన్స్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
గుణదల (విజయవాడ ఈస్ట్) : విధి నిర్వహణలో ఉన్న ఇంటిలిజెన్స్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాపట్ల నగరం నర్సాయపాలెం ప్రాంతానికి చెందిన కట్టా విజయకుమార్ (37) ప్రస్తుతం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబంతో ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతనికి భార్య ఏసువాణి, కుమార్తె థెరిసా ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్‌కు చేరుకున్నారు. సమీపంలో ఉన్న లక్ష్మీదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టిఫిన్ చేస్తూ కుప్పకూలిపోయారు. పరిస్థితి అర్థం కాని స్థానికులు అతనిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ లేవకపోవడంతో మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి గురైనట్లు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఏదైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగానే కేసు నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. కన్నీరుమున్నీరుగా రోదన విజయకుమార్ మృతి చెందారన్న వార్త వినగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య, కుమార్తె, బంధువులు సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. నిన్నటి వరకూ కళ్ల ముందు తిరిగిన వ్యక్తి విగత జీవిగా మారటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విధి నిర్వహణలో మృతి చెందినందుకు ఇంటెలిజెన్స్ పోలీసులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇబ్రహింపట్నానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంకిత భావంతో విధులు రైతువారీ పద్ధతిలో పెరిగిన విజయకుమార్ కష్టపడి చదివి 2005 లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించారు. 2009లో పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మంచి ఉన్నతాధికారిగా ఎదగాలనే కోరిక తీరకుండానే మృతి చెందారు. పోలీస్ లాంఛనాల ప్రకారం మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
అనుమానాస్పదంగా తల్లీ, కుమార్తె మృతి
మందస: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన దుమ్మువాళ్లూరు గ్రామానికి చెందిన పందిరి స్వాతి, ఆమె నాలుగు నెలల కుమార్తె అనుమా నాస్పదంగా మృతి చెందారు. స్వాతికి సోంపేట మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన గేదెల మనోజ్‌కు ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. బీటెక్ పూర్తి చేసిన పందిరి స్వాతిని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గేదెల మనోజ్‌తో 2017వ సంవత్సరంలో వివాహం చేశారు. వృత్తిరీత్యా బెంగళూరులో మనోజ్ ఉండడంతో స్వాతి కూడా బెంగళూరు వెళ్లింది. వీరిద్దరికి నాలుగు నెలల చిన్నారి జశ్విత ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం రాత్రి స్వాతి తన కుమార్తెను గొంతు నులిమి చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ముందుగా చిన్నారి మరణించిందని సమాచారం రావడంతో స్వాతి కుటుం బ సభ్యులు హుటాహుటీన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడకు చేరుకున్న వారికి స్వాతి కూడా మరణించిందని తెలియడంతో వారంతా ఈ సమాచారాన్ని గ్రామంలోని బంధువులకు తెలియజేశారు. స్వాతి అనా రోగ్య కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతర ఏమైనా కారణా లున్నాయా.. తెలియరావడంలేదు. కా గా, స్వాతి ప్రసవం సమయంలో అనా రోగ్యం వెంటాడడంతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. అదే జరిగితే చిన్నారిని ఆమె హత్య చేసిందా.. లేక ఏం జరిగిందన్న విషయాలు పూర్తిస్థాయిలో తెలియడంలేదు. బెంగళూరులోనే మృతదేహాల కు పోస్టుమార్టం జరిగిందని అక్కడకు వెళ్లిన వారు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ సం ఘటన స్థానికంగా విషాదం నింపింది. -
యువకుడి అనుమానాస్పద మృతి
గూడూరు: ఆ ఇంట్లో మరో పది రోజుల్లో వివాహ శుభకార్యం జరుగనుండగా కుటుంబసభ్యులు.. పెళ్లి బట్టలు, ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పెళ్లితో ఓ ఇంటివాడు కాబోతున్న ఆ యువకుడిని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువకుడు అనూహ్య రీతిలో హత్యకు గురికాగా కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. పలువురినీ కంటతడి పెట్టించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట శివారు గుంజేడు రహదారిలో శనివారం రాత్రి జరింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. చిన్నఎల్లాపురం శివారు హాముతండాకు చెందిన జరుపుల పంతులునాయక్–పెంటి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరినాయక్‌కు పెళ్లి కాగా, చిన్న కొడుకు జరుపుల అశోక్ (29) తండాలో ఓ డబ్బాలో కిరాణ దుకాణాన్ని నడుపుతూ తల్లిదండ్రులకు బాసటగా ఉంటున్నాడు. ఇటీవల వీరి ఇంటి పక్కన గల ఓ వ్యక్తితో మధ్య ఇంటి స్థలాల గెట్టు పంచాయితీ మొదలైంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగానే సదరు వ్యక్తి జరుపుల అశోక్, తండ్రి పంతులును చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన అశోక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం అశోక్‌కు వివాహం నిశ్చయమైంది. ఈనెల 28న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి బట్టలు తీసుకునేందుకు శనివారం అశోక్ తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటకు వెళ్లారు. పెళ్లి పత్రికల ముద్రణ ఆలస్యమవడంతో అశోక్ ముందుగా తల్లిదండ్రులను ఇంటికి పంపించాడు. రాత్రి 8 గంటలకు పత్రికలు తయారు కాగా వాటిని తీసుకుని 9 గంటల సమయంలో నర్సంపేట నుంచి ఆటోలో బయలు దేరాడు. భూపతిపేట చెక్‌పోస్టు స్టేజీ వద్ద దిగిన అశోక్ తన సైకిల్ తీసుకుని ఇంటికి బయలుదేరినట్లు ఆటోడ్రైవర్ చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తెల్లవారేసరికి దారి పక్కన శవమై.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో ఓ వ్యవసాయ బావి వద్ద అశోక్ రక్తపు మడుగులో మృతిచెంది పడి ఉండడాన్ని స్థానికులు చూశారు. వెంటనే హాముతండా వాసులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు పంతులు–పెంటి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో మానుకోట డీఎస్పీ నరేష్కుమార్, సీఐ రమేష్‌నాయక్, ఎస్సైలు యాసిన్, రామారావు సిబ్బంది అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి స్థలం గెట్టు విషయంలో కక్ష కట్టి బోడ దేవుసింగ్ కుటుంబ సభ్యులే తన కొడుకును హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు పంతులు, పెంటి ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానితుడి ఇంటిని వెళ్లగా తాళం వేసి ఉంది. ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా, రాత్రి వేములవాడ వెళ్లామని, తిరిగి వస్తున్నామని సమాధానం ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ‘మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినోడివి.. కక్ష గట్టి పాడె ఎక్కించారా’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా తన తమ్ముడి మృతికి పక్కింటి బోడ దేవుసింగ్తో పాటు, వారి కుటుంబ సభ్యులే కారణమంటూ అశోక్ సోదరుడు హరినాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు దేవుసింగ్తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మిస్టరీగా.. గుర్తుతెలియని మహిళ హత్యోదంతం..!
పరువు హత్యా.. ప్రియుడే కాటేశాడా? మిర్యాలగూడ రూరల్ : మండల పరిధిలోని తుంగపహాడ్ శివారులో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. అసలీ హత్యపై ఇప్పటి వరకు ఫిర్యాదు కూడా అందకపోవడంతో కేసు ఛేదన ఖాకీలకు సవాల్‌గా మారింది. గుర్తుతెలియని మహిళగా.. మండల పరిధిలోని తుంగపహాడ్ శివారులోని అడవిదేవులపల్లి రోడ్డులో ఈ నెల 6వ తేదీన గుర్తుతెలియని మహిళను హత్యచేసి ఆపై కాల్చేసిన విషయం తెలిసిందే. హత్యోదంతంపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయకపోవడంతో గుర్తుతెలియని మహిళగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు బృందాలు.. మూడు ప్రాంతాలు సీఐ రమేష్‌బాబు నేతృత్వంలో వాడపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి పోలీస్స్టేషన్ల ఖాకీలు మూడు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. తొలు త రెండు రాష్ట్రాలోని అన్ని పోలీస్స్టేషన్ల వారీగా మిస్సింగ్ కేసులపై దృష్టిపెట్టినా ఇప్పటి వరకు అలాంటి కేసులు తారస పడలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హత్యోదంతం వెలుగులోకి వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించకపోవడంతో ఖాకీలు తలపట్టుకుంటున్నారు. ఏది ఏమైనా కేసును సాధ్యమైనంత త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. సదరు గుర్తుతెలియని మహిళ ఎవరు..? ఏ ప్రాంతానికి చెందింది..? ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కాల్చేశారా..? పోస్టుమార్టం నివేదికలో గర్భిణిగా తేలింది. అయితే, సగం కాలిన మహిళ కు పుస్తెమెట్టెలు లేవు. దీంతో పరువు కోసం కుటుంబ సభ్యులే హత్య చేశారా..? లేక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడే కాటేశాడా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో పోలీసులకు సవాల్‌గా మిగిలాయి. పోస్టుమార్టం నివేదికలో.. సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు అదే రోజు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సౌకర్యాలు లేవని ఇక్కడి వైద్యులు పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను రప్పించి ఈ నెల 8వ తేదీన గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నివేదికలో సదరు మహిళ గర్భిణిగా తేలింది. -
ప్రేమికుడు అరెస్ట్
యలహంక: ఇక్కడి యలహంక రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న ఓ ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...చిక్కబళ్లాపురం జిల్లా చింతామణికి చెందిన అరవింద్, బెంగళూరుకు చెందిన ఓ మైనర్ బాలికతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా దారితీసింది. 15 రోజలు క్రితం ఇద్దరు పారిపోయి గోవా, తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగారు. యువకుడి వద్ద డబ్బులు ఖర్చుకావడంతో గురువారం రాత్రి యలహంక రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్నేహితుడితో డబ్బులు తెప్పించుకోవడానికి వేచి చూస్తున్నాడు. వీరి ప్రవర్తనపై అనుమానించి రైల్వే పోలీసులు ఆరా తీయగా సదరు యువతి తన చెల్లెలను బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. -
పీక కోసుకొని...
సోంపేట: సోంపేట పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన ఆరోగ్యం బాగోలేదని, తనకు ధైయ్యం పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం తెల్లవారుజామున పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రధాన రహదారిలో మసీదుకు ఎదురుగా ఓ యువకుడు రక్తపుమడుగులో పడి ఉన్నాడనే వార్త దావానంలా వ్యాపించడంతో, సంఘటనా స్థలానికి స్థానికులు, పోలీసులు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి సోంపేట పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలం బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి కేశవరావు కుమారుడు సురేష్(30) ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేష్ గతంలో అరబిందో కంపెనీలో విధులు నిర్వహిస్తూ మద్యంకు బానిస కావటంతో కంపెనీవారు ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో సురేష్‌ను అతని చిన్నాన్న, మురపాక గ్రామానికి చెందిన నారాయణరావు రెండు నెలల క్రితం సోంపేట పట్టణంలోని శ్రీలక్ష్మీ గణపతి కనస్ట్రక్షన్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో విధుల్లో చేర్పించారు. ఇక్కడ రెండు నెలల పాటు సురేష్ సక్రమంగానే విధులు నిర్వహించాడు. సంక్రాంతికి ఇంటికి వెళ్లిన సురేష్ రెండు రోజుల క్రితం తిరిగి సోంపేటలో తాను నివసిస్తున్న అద్దె ఇంటికి చేరుకొన్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేష్ తన చిన్నాన్నకు ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని, దెయ్యం పట్టినట్టు అవుతుందని వాపోయాడు. సోంపేటలోనే ఉంటున్న అతని చిన్నాన్న వెంటనే సురేష్ దగ్గరికొచ్చి సముదాయించడానికి ప్రయత్నం చేశాడు. నన్ను పట్టుకొంటే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడంతో నారాయణరావు చేసేదిలేక సురేష్‌ను విడిచిపెట్టాడు. ఇదే విషయాన్ని సురేష్ తండ్రి కేశవరావుకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో మృతుని తండ్రి కేశవరావు అప్పటికప్పుడు అర్ధరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి గురువారం వేకువజామున సోంపేట చేరుకొన్నాడు. అయితే అప్పటికే సురేష్ పీకను కోసుకొని మృతిచెందాడు. తండ్రి కేశవరావు, చిన్నాన్న నారాయణరావు సురేష్ మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకొని రోదించారు. ఎస్పీ త్రివిక్రమవర్మ పరిశీలన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ సోంపేట సామాజిక ఆస్పత్రిలో సురేష్ మృతదేహాన్ని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది ఆత్మహత్యేనని స్పష్టంచేశారు. స్థానిక వైద్యుల శవపంచనామా నివేదిక ఆధారంగా ఇది ఆత్మహత్యగా నిర్ధారించామన్నారు. మృతుని కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నప్పటికీ సోంపేట పట్టణంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోంపేట సీఐ సన్యాసినాయుడు, ఇచ్ఛాపురం సీఐ అవతారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పతివాడపాలెంలో విషాదం
♦ వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి ♦ అనుమానాస్పదస్థితిలో ఒకరు, విద్యుదాఘాతానికి గురై మరొకరు బలి రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. అనుమానాస్పదస్థితిలో రోడ్డు పక్కన ఒకరు ప్రాణాలు కోల్పోగా, విద్యుదాఘాతానికి గురై ఇంకొకరు చనిపోయారు. ఇందులో ఒకరిది ఇదే గ్రామం కాగా, మరొకరు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఇసుకపల్లి నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వివరాలు ఇలావున్నాయి. – రణస్థలం ♦ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి ♦ ముగ్గురు ఆడపిల్లలతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నమృతుని భార్య పతివాడపాలెం గ్రామానికి చెందిన ఎన్ని సూర్యనారాయణ(42) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని తోటలో టేకు చెట్టుకు రొమ్మలు కొడుతుండగా ప్రమాదం సంభవించింది. కోసిన రొమ్మలు పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడ్డాయి. ♦ ఇది గమనించని సూర్యనారాయణ ఆ రొమ్మలు పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడి వారికి కంటతడి పెట్టించింది. అందరితో సరదాగా ఉండే సూర్యనారాయణ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య పెంటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దేవి(13), గౌరి(15), ఈశ్వరమ్మ(16) ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలకు ఇంకా పెళ్లి కాకపోవడంతో మృతుడి భార్య లబోదిబోమంటూ విలపిస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో రోడ్డున పడింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ♦ హత్య... ప్రమాదమా! ♦ అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ఊరు కాని ఊరు వచ్చి బతుకుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడా, లేక ఎవరైనా హత్య చేసి రోడ్డున పక్కన పడేశారా అనేది అంతుపట్టడం లేదు. పతివాడపాలెం గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కోన వీర చక్రరావు(43) సమీపంలోని పైడిపేట వద్ద జాతీయ రహదారి పక్కన మంగళవారం మృతిచెంది ఉండడాన్ని కొందరు వ్యక్తులు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జె.ఆర్.పురం సీఐ, ఎస్సై వై.రామకృష్ణ, ఎస్సై వి.సత్యనారాయణ, పైడిభీమవరం ఎస్సై బి.శ్రీరామూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన కోన వీర చక్రరావు కుటుంబంతో సహా కొన్నేళ్ల కిందట పతివాడపాలెం గ్రామానికి వచ్చి నివసిస్తున్నాడు. మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న మొక్కలకు నీరుపోసి బయటకు వెళ్లాడు. ఈ గ్రామానికి సమీపంలోని పైడిపేట వద్ద జాతీయ రహదారి పక్కన మృతి చెంది పడివున్నాడు. అయితే ఇతడు జాతీయ రహదారి పక్కన ఉన్న క్రాస్ బేరియర్స్ అవతల వైపు ఎలా వెళ్లాడనేది ప్రశ్నగా మారింది. రోడ్డుపై వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉంటే తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెంది ఉండాలి. లేకపోతే వాహనం ఢీకొన్న తర్వాత ఎవరైనా అవతలవైపు పడేశారా అనేది తెలియరావడం లేదు. అయితే వీర చక్రరావుకు గతంలో ఎవరితోనూ తగాదాలు, గొడవలు లేవని బంధువులు చెబుతున్నారు. భార్య, పిల్లలు రెండు రోజుల క్రితమే మృతుడు స్వగ్రామం ఇసుకపల్లి వెళ్లారని తెలిపారు. ఈ సంఘటనపై జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయవాది అనుమానాస్పద మృతి
పంజగుట్ట: నందికొట్కూరుకు చెందిన న్యాయవాది గుంపుల రవికుమార్(33) హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. రవికుమార్ హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో మూడు నెలల క్రితం అద్దెకు దిగాడు. ఇతనికి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఈయన తన భార్యను 10 రోజుల క్రితం పుట్టింటికి పంపించారు. ఈయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం రాత్రి అతను మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించిన పక్కింటి మహిళ స్థానికులకు చెప్పడంతో వారు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వాంతులు, రక్త విరోచనాలు కావడంవల్ల చనిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మృతుడి శరీరం నల్లగా మారిపోగా, కొద్ది దూరంలో థంసప్ బాటిల్ పడి ఉంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
► పొలం గట్టుపై లభించిన మృతదేహం ► గుట్టుగా దహనం చేసేందుకు యత్నం ► అడ్డుకున్న పోలీసులు కాశీబుగ్గ : పలాస మండలం సమస్యాత్మక గ్రామం పెదంచలలో శనివారం అనుమానాస్పద స్థితిలో సంజీవి గురుమూర్తి(38) అనే వ్యక్తి మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని దహనం చేసేందుకు గురుమూర్తి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న కాశీబు గ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్సై కేవీ సురేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు సంజీవి గురుమూర్తి.. భార్యాపిల్లలతో పెదంచల గ్రామంలో నివసిస్తున్నాడు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఖాళీ సమయంలో కులవృత్తిలో భాగంగా గానుగును ఆడిస్తుంటాడు. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన గురుమూర్తి.. ఎంతసేపటికీ ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా.. పొలం గట్టుపై అచేతనంగా పడి ఉండడాన్ని గమనించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. మృతదేహాన్ని ఇంటికి తరలించి, గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆ తతంగాన్ని అడ్డుకున్నారు. గురుమూర్తి మెడపై తువ్వాలుతో గట్టిగా బిగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. తలపై రక్తంతో గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొలం గట్టుపై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో గురుమూర్తి ఏ విధంగా మృతి చెందాడనే విషయాన్ని చెప్పగలమని సీఐ స్థానిక విలేకరులకు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా.. గురుమూర్తి మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం భార్య అరుణతో అతను గొడవ పడినట్లు తెలుస్తోంది. అతను మృతి చెందిన సమయంలో భార్య అరుణ తన కన్న వారింట్లో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం జరిగిన భార్యభర్తల గొడవల్లో గురుమూర్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
* భర్తే హతమార్చారంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు * పోలీసుల అదుపులో భర్త బాపట్ల: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం చెరువుజమ్ములపాలెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెం గ్రామానికి చెందిన రావిపూడి నాగార్జున అనే యువకుడికి కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన జయసుధ (23)తో ఆరునెలల కిందట వివాహమైంది. పదిరోజుల కిందట కుటుంబంలో తలెత్తిన వివాదాలు కారణంగా తన కుమార్తెను అల్లుడు నాగార్జున కొట్టాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఫోన్ ద్వారా తెలియజేసిందని మండ్రు సుధాకర్ ఆలియాస్ డేవిడ్ తెలిపారు. అప్పుడు ఫోన్లో సమాచారం మేరకు జమ్ములపాలెం నుంచి స్వగ్రామమైన ఈపూరుపాలెం తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అల్లుడు శనివారం ఫోన్ చేసి తన భార్యను మంచిగా చూసుకుంటానని నమ్మబలికి తీసుకువెళ్ళాడని చెప్పాడు. ఆదివారం రాత్రి అత్త, భర్త ఇద్దరు కలిసి తన కుమార్తెను విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె ఫోన్లో సమాచారం తెలియజేసినట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం భర్త నాగార్జునరెడ్డి తనకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుందని, పరిస్థితి విషమంగా ఉందని ఫోన్ పెట్టివేసిన్నాడని బోరున విలపించాడు. సోమవారం జమ్ములపాలెం వచ్చి చూసేసరికి వికటజీవిగా పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త, భర్త కలిసి కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చూపుతున్నారని విలపించాడు. పోలీసులు నాగార్జునరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మహేష్, సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
శ్రీ గౌతమి కేసును పట్టించుకోరేం
నరసాపురం : నరసాపురం పట్టణానికి చెందిన యువతి శ్రీగౌతమి మృతి కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. కేసు విచారణ పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసును పునర్విచారణ చేయించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని బుధవారం కలిసి కేసు పూర్వాపరాలను వివరిం చారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ కార్యదర్శి వి.మహేష్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. టీడీపీ నేత సజ్జా బుజ్జి శ్రీగౌతమిని రెండోపెళ్లి చేసుకున్నాడని, ఆయన అధికార పార్టీకి చెందినవాడు కావడంతో కేసును పోలీసులు నీరు గార్చారని ఆరోపించారు. శ్రీగౌతమిని పథకం ప్రకారం హత్య చేసినట్టు ఆమె చెల్లెలు పావని ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండో పెళ్లి విషయంపైనా దర్యాప్తు చేయలేదన్నారు. శ్రీగౌతమి తల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ తన కుమార్తెను అన్యాయంగా చంపేశారని కన్నీటి పర్యంతమైంది. కూతురిని పోగొట్టుకున్న తాను ఆ బాధను తట్టుకుంటూనే, న్యాయం కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నరసాపురం డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ శ్రీగౌతమి కేసు విషయంలో ఆ కుటుంబానికి దారుణమైన అన్యాయం జరిగిందన్నారు. అధికార పార్టీ నేతలు వెనుక ఉండి రాష్ట్ర స్థాయిలో వ్యవహారం నడిపిస్తున్నారని, అందువల్లే పోలీ సులు ఈ కేసును నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. సబ్ కలెక్టర్ సమాధానమిస్తూ ఈ విషయమై డీఎస్పీతో మాట్లాడతానని, అనంతరం కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేవిధంగా తన పరిధిలో అవకాశం ఉన్న చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఈదా జోన్సీ, నక్కా ఆనంద్, తిరుమాని విమల పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఐదుగురు కశ్మీరీలు
విమానాశ్రయం (గన్నవరం): విమానాశ్రయ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరి స్తున్న ఐదుగురు కశ్మీర్ వాసులను పోలీసులు శుక్ర వారం అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని విమానాశ్రయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. విమానాశ్రయం ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు ఎస్కె.అహ్మద్, జావేద్ అక్బర్, జావేద్ అహ్మదార్ సంచరిస్తుండటాన్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమది జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు సమీపంలోని సుపియర్ జిల్లా అని, ఎయిర్‌పోర్టు సమీపంలోని దుర్గాపురంలో ఉన్న మదరసాకు వచ్చామని చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారితోపాటు వచ్చి మసీదులో ప్రార్థన చేస్తున్న షేక్ బషీర్(65), సనవుల్లాబాట్(70)ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బషీర్ కుంకుమపువ్వు వ్యాపారం చేస్తాడని, అతనితోపాటు వచ్చిన నలుగురు యువకుల పిల్లలు చిత్తూరు జిల్లా పుంగనూరులోని మదర్సాల్లో చదువు కుంటున్నారని విచారణలో తేలింది. వీరిని చూసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో దుర్గాపురంలోని మదర్సా గురువు హుస్సేన్‌ను కలిసేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారికి మద్దతుగా ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పారుక్‌షుబ్లీ, హుస్సేన్‌లు స్టేషన్‌కు వచ్చారు. -
హైదరాబాద్‌లో యువతి మిస్టరీ డెత్
-
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: కల్లూరు చెంచు కాలనీకి చెందిన చాకలి మునిశేఖర్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మునిస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మునిశేఖర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి సోమవారం ఉదయం ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. రైల్వే సీఐ మహేశ్వరరెడ్డికి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలతో ఎస్ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతుని యదపై ఎంకే చిన్ని అనే పచ్చబొట్టు ఉంది. ప్రేమ వ్యవహారంలోనే ఎవరైనా హత్యచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక హత్య చేసి తీసుకొచ్చి ట్రాక్‌పై పడవేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుని జేబులో స్టేట్‌బ్యాంకు ఏటీఎం కార్డు లభిచింది. అడ్రస్సు ఆధారంగా తల్లిదండ్రులను పిలిపించి రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతదేహం
లక్ష్మీపురం(పెదవేగి రూరల్) : లక్ష్మీపురం పరిధిలోని పోలవరం కుడికాలువ గట్టుపై అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం మంగళవారం లభ్యమైంది. పెదవేగి ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు కథనం ప్రకారం.. పెదవేగి మండలం లక్ష్మీపురం పరిధిలోని సాయిబాబా మందిర సమీపంలో పోలవరం కుడికాలువ గట్టుపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉందని స్థానిక వీఆర్వో పసుపులేటి విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరావు, ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, ఎస్సై రామకోటేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో చుట్టుపక్కల గాలించారు. ఆమె హత్యకు గురైందా? లేక ఏమై ఉంటుంది అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఫిరంగిపురం: ఓ యువకుడు గాయాలపాలై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఫిరంగిపురం శాంతిపేటకు చెందిన తలకోల క్రీస్తురాజు అలియాస్ మహేష్‌బాబు (26) కారు డ్రై వరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9గంటల వరకు ఇంటి వద్దనే ఉన్నాడు. బజారుకు వెళ్ళి వస్తానని ఇంటిలో చెప్పి బయటకు వచ్చిన మహేష్‌బాబు శనివారం తెల్లవారుజామున మార్నింగ్‌స్టార్ కళాశాల వెనుకవైపున రైలు పట్టాలు పక్కన విగతజీవిగా కనిపించాడు. తలభాగంలో, కుడిభుజంపై పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు గాయాలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం అక్కడకు తీసుకువెళ్ళి మహేష్‌బాబును హతమార్చి ఉంటారని చర్చించుకుంటున్నారు. అటువైపుగా పొలాలకు వెళుతున్న రైతులు గమనించి రైల్వే స్టేషన్లో సమాచారం అందించడంతో జీఆర్పీ పోలీసులు మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఉండి : ఓ వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం వాండ్రం గ్రామానికి చెందిన కొట్టు హనుమంతరావు(22) గ్రామంలో చేపల చెరువుపై పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల ముందు చేపల పట్టుబడి త్వరగా అయిపోవడంతో గ్రామంలో స్నేహితుడైన పర్వతాల రాధాకృష్ణ వద్దకు హనుమంతరావు వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ డీజిల్ దొంగతనం జరగడంతో తనపై నింద వస్తుందనే భయంతో హనుమంతరావు ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కొడుకుది ఆత్మహత్య కాదని, అనుమానంగా ఉందని మృతుడు తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఎం.రవివర్మ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బతుకుదెరువుకు వచ్చి..
* విగతజీవుడిగా మారి * రాజుకాల్వలో అనుమానాస్పద స్థితిలో కలకత్తాకు చెందిన కూలీ మృతి రాజుకాల్వ (రేపల్లె): పొట్టకూటి కోసం పనులకు వచ్చి అనుమానాస్పద స్థితిలో ఒక కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని రాజుకాల్వ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. రేపల్లెలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కలకత్తాకు చెందిన కాంట్రాక్టర్ పాల్ రొయ్యల చెరువుల్లో బోర్లు వేసేందుకు కలకత్తాకు చెందిన మిటూన్, భీమల్, కాజోన్, సామిన్లను ఈ నెల 27వ తేదీన రాజుకాల్వ పిలిపించాడు. వీరు కేశంనేని సాంబశివరావుకు చెందిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన షల్టర్‌లో ఉంటున్నారు. పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం బోర్లు వేసేందుకు వచ్చిన ఆర్డర్లతో పాటు మరికొన్ని ఆర్డర్లు రావటంతో కాంట్రాక్టర్ పాల్ మరికొంత మంది కూలీలను తీసుకువచ్చేందుకు కలకత్తా వెళ్ళాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పాల్ కుమారుడు సోనూ కూలీల బాగోగులు చూసుకునేందుకు రాజుకాల్వలో ఉంటున్న షెల్టర్‌లో చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. బ్యాగులు ఒకదానిపై ఒకటి ఉండడం గమనించి వాటిని సర్దేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని పరదాపట్టా కింద భీమల్(37) మృతదేహం కనిపించడం, మిగిలిన వారి జాడలేకపోవటంతో భయానికి గురై చుట్టుపక్కల వారిని కేకలు వేయగా వారు వచ్చి పరిస్థితిని పోలీసులకు తెలిపారు. రూరల్ సీఐ పెంచలరెడ్డి, చోడాయిపాలెం ఎస్సై పి.శివాజీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల డీఎస్పీ పి.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వారిపైన అనుమానం.. పనులకోసం కలకత్తా నుంచి వచ్చిన నలుగురిలో ఒకరు మృతి చెందటం, ముగ్గురు కనిపించకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు భీమల్తో పాటు వచ్చిన వారే భీమల్ను చంపి ఉంటారా, లేదా ఇతర కారణాలతో మృతి చెందాడా అనే కోణాలలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం, ప్రస్తుతం మృతదేహం ఉన్న పరిస్థితినిబట్టి హత్య జరిగి ఉండవచ్చని, శుక్రవారమే సంఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
రొయ్యల ఫ్యాక్టరీలో కూలీ మృతి
అత్తిలి : తిరుపతిపురంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎస్సై వి.ఎస్.వీరభద్రరావు కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన బైరెత్తి మల్లేష్(30) అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో నిర్మిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేయడానికి వస్తున్నాడు. గురువారం సాయంత్రం మల్లేష్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని తోటి కార్మికులు 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఉపాధ్యాయిని అనుమానాస్పద మృతి
* భర్తే చంపాడని తల్లిదండ్రుల ఆరోపణ * పరారీలో మృతురాలి భర్త వినుకొండ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘటన పట్టణంలోని శాలివాహననగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేటకు చెందిన కాసా హనుమంతరావు, నాగేశ్వరమ్మల కుమార్తె వాసవిని గత ఏడాది డిసెంబర్ 5న కొప్పుకొండకు చెందిన నూలి శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. శ్రీనివాసరావు వినుకొండ పట్టణంలోని ఎస్బీఐ ఎదురుగా మీసేవా కేంద్రం నిర్వహిస్తున్నారు. వాసవి నూజెండ్ల మండలం ఉప్పలపాడు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరు పట్టణ శివారు శాలివాహన నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాసరావు భార్యను తరచూ వేధించేవాడని, అదనపు కట్నం కోసం ఇంట్లో నిత్యం ఘర్షణకు దిగేవారని బంధువులు తెలిపారు. గురువారం వాసవి స్కూల్ నుంచి వచ్చిన తరువాత భార్యాభర్తలు ఘర్షణ పడినట్టు స్థానికులు తెలిపారు. రాత్రి ఆమె ఉరి వేసుకుందంటూ వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తుండగా సమాచారం తెలుసుకున్న బంధువులు బాధితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని తిరిగి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు చేర్చారు. ఒంటిపై గాయాలతో పాటు, మెడకు వైరుతో బిగించిన ఆనవాలు కనిపించడంతో భర్తే అనుమానంతో హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మతురాలి భర్త శ్రీనివాసరావు పరారీలో ఉన్నారు. పట్టణ కాపు సంఘం నాయకులు ఆమెకు నివాళులర్పించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కుక్కునూరు : మండలంలోని భువనగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పెనుబల్లి సత్యనారాయణ (30) పెళ్లయిన నాటి నుంచి అత్తవారిల్లు భువనగిరి వచ్చి నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అపస్మారకస్థితిలో నోటి నుంచి నురగలు కక్కుతూ పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సత్యనారాయణను భద్రాచలం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతికి అతని భార్య, అత్త కారణమని సత్యనారాయణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
జగ్గడిగుంటపాలెం (తెనాలి రూరల్): అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. భర్త, అత్తింటి వారే వేధించి, హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన పొతకనూరి శ్రీను, విజయ దంపతులు తమ రెండో కుమార్తె నీలిమ (20)ను తెనాలి మండలం జగ్గడిగుంటపాలెంకు చెందిన కటికం గోపికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే నీలిమకు మేనమామతో వివాహం కాగా, ఆమెను కొన్నాళ్లకే వదిలి వెళ్లాడు. గోపిని మొదటి భార్య వదిలి వెళ్లింది. గోపి, నీలిమకు మూడేళ్ల క్రితం వివాహమైంది. నీలిమకు తొలికాన్పులో బాబు పుట్టి కొద్దిరోజుల్లోనే చనిపోయాడు. అప్పట్నుంచి మరింత కట్నం తీసుకురావాలంటూ వేధింపులు ప్రారంభమయ్యాయి. అయిదునెలల క్రితం పాప పుట్టింది. పుట్టింటికి కాన్పుకు వెళ్లిన నీలిమ వారం క్రితమే ఇక్కడకు బిడ్డతో వచ్చింది. మూడు రోజులుగా భార్యాభర్తలు వాదులాడుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఇరువురికి గొడవ జరగడంతో నీలిమ బిడ్డతో సహా అక్కడికి దగ్గర్లోని అత్తగారింటికి వెళ్లింది. ఉదయన్నే తాము అద్దెకుండే ఇంటికి వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఇంట్లో ఉరికి వేలాడుతూ ఉందని స్థానికులు తెలిపారు. నీలిమ మెడను వైరుతో బిగించి గోపి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె మెడ కమిలిపోయి ఉందని, ఒంటిపై గాయాలున్నాయని చెబుతున్నారు. మొదట నీలిమ అస్వస్థతతో వైద్యశాలలో ఉందని శనివారం ఉదయం గోపీ ఫోను చేశాడని, రెండు గంటల అనంతరం ఉరి వేసుకుని మృతి చెందిందని ఫోను చేసి చెప్పాడని, అప్పటి నుంచి అతని ఫోన్ ఆఫ్ చేసి ఉందని నీలిమ తండ్రి పోతునూరి శ్రీను చెప్పారు. బంధువులు, తెలిసిన వాళ్ల ద్వారా సంబంధం కుదుర్చుకుని వివాహం చేశామని, పెళ్లినాడు లక్ష రూపాయలు కట్నం, వాచీ, ఉంగరం, అమ్మాయికి బంగారం కూడా పెట్టామని తెలిపాడు. మాచర్ల వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లిన నీలిమ తల్లి విజయ సాయంత్రం జగ్గడిగుంటపాలెంకు చేరుకుంది. కుమార్తె మృతదేహం వద్ద ఆమె విలపించిన తీరు కంటతడి పెట్టించింది. కాగా, నీలిమను భర్త గోపి, పక్క పోర్షనులో ఉండే గోపి అమ్మమ్మ గురమ్మ కలిసి హత్య చేశారని తలిదండ్రులు ఆరోపించారు. అత్త నాగమ్మ, ఆడబిడ్డ, మామ, బావల సహకారం కూడా ఉందనీ ఆరోపణలు చేశారు. విషయం తెలుసుకున్న తాలూకా ఎస్ఐ అనిల్‌కుమార్, ఏఎస్ఐ ప్రసాదరావు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొబ్బరి మొవ్వ కోస్తూ కుప్పకూలి..
దొమ్మేరు (కొవ్వూరు రూరల్) : దొమ్మేరు పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ వ్యక్తి కొబ్బరి చెట్ల మొవ్వ కోస్తూ కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన సోము రాఘవులు (48) కొబ్బరి పువ్వులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దొమ్మేరు పంచాయతీ స్థలంలో తొలగించిన కొబ్బరి చెట్ల మొవ్వ సేకరించేందుకు వచ్చాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న రాఘవులు చెట్ల కొబ్బరి మొవ్వ నుంచి పువ్వు సేకరిస్తున్నాడు. రెండు మొవ్వల నుంచి పువ్వును తీసి మూడో చెట్టు వద్దకు చేరుకోగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకుని రాఘవులను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముదునూరి నాగరాజు పోలీసులకు సమాచారమిచ్చి మృతుడి వివరాలను సేకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై గం గాభవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
నిడదవోలు : పట్టణంలోని పాటిమీద సెంటర్లో ఇండియన్ బ్యాంకు అరుగుపై ఓ వ్యక్తి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన చాపల కొండయ్య (45) తీ¯Œæమార్ బృందంలో డప్పు వాయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. బుధవారం ఆయన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వెళ్లాడు. తిరిగి గ్రామానికి బయలుదేరాడు. ఏమైందో ఏమోగానీ గురువారం పట్టణంలోని బ్యాంకు ముందు మృతిచెంది పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ డి.భగవా¯Œæప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి S భార్య మంగ, ముగ్గురు కుమారులు ఉన్నారు. దళిత సంఘాల రాస్తారోకో కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ముందు దళిత సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పట్టణ ఎస్ఐ డి.భగవాన్‌ప్రసాద్ ఆందోళనకారులతో చర్చించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని సూచించడంతో వారు రాస్తారోకోను విరమించారు. ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. చాపల కొండయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. -
భార్య దత్తత తీసుకుందనీ..
హత్యచేసి పడేసారని కుటుంబ సభ్యుల ఆరోపణ పోలీసుల అదుపులో డాక్టర్, మరో ఇద్దరు? మృతుడిది నరసన్నపేట హడ్కోకాలనీ నరసన్నపేట/ జలుమూరు : నరసన్నపేట హడ్కో కాలనీకి చెందిన యువకుడు మల్లా విజయ్ అలియాస్ గవాస్కర్(24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శ్రీముఖలింగం వద్ద వంశధార నది సమీపంలోని ముళ్ల తుప్పల్లో మృతదేహం లభ్యమైంది. విజయ్ను నరసన్నపేటలో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో నరసన్నపేట, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సంచనలం రేకెత్తించింది. శ్రీముఖలింగం సమీపంలోని ముళ్ల తుప్పల్లో మృతదేహం ఉందని స్థానికులు జలుమూరు పోలీసులకు గురువారం సాయంత్రం సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట సీఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మృతుడు నరసన్నపేటకు చెందిన విజయ్‌గా గుర్తించారు. రెండు రోజుల క్రితమే హత్య! విజయ్ను బుధవారం రాత్రి హత్య చేసి ముళ్ల తుప్పల్లో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో సిబ్బంది శిథిల క్వార్టర్స్‌లో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు, క్లూస్ టీం సభ్యులు తనిఖీలు చేసి సాక్ష్యాలను సేకరించారు. ఈ హత్యోదంతంలో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. యువకుడితో సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతకుముందు హత్యలో పాల్గొన్న నిందితులతో కలసి విజయ్ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. చురుగ్గా కేసు దర్యాప్తు శ్రీముఖలింగం వీఆర్వో జి.విజయ్ బాబు శుక్రవారం జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోలు బంకు ఎదురుగా వంశధార నది ఒడ్డున గుబురు ఔరు మొక్కల మధ్య మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట తరలించారు. ఘటనా స్థ లాన్ని సీఐ చంద్రశేఖర్, జలుమూరు, నరసన్నపేట ఎస్ఐలు పి.నరసింహామూర్తి, లక్ష్మణరావు, క్లూస్‌టీం సభ్యులు పరిశీలించారు. వైద్యునిపై అనుమానాలు..! ఈ ఘటనలో నరసన్నపేట మారుతీ నగర్‌లోని ఓ నర్సింగ్ హోంకు చెందిన వైద్యుడు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్యునికి, విజయ్‌కు కొద్ది నెలలుగా వివాదం జరుగుతోంది. దీంతో ఆయనే స్థానికంగా కొందరిని పురమాయించి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుని భార్య ఈ యువకుడిని ఇటీవల దత్తత తీసుకున్నారు. అందుకు వైద్యుడు వ్యతిరేకించడంతో పాటు విజయ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విజయ్ను పిలిచి రోజూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని ఆదేశించారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇంతలోనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో వైద్యుడు ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువ జామునే వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో జమ్ముకు చెందిన ఇద్దరు వ్యక్తులు, హడ్కో కాలనీకి చెందిన మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని సమాచారం. అయితే సమాచారం బయటకు పొక్కడంతో ఆ ప్రయత్నాన్ని విడిచి పెట్టి పరారయ్యారని తెలుస్తోంది. డాక్టరే హంతకుడు... మమతా నర్సింగ్ హోం నిర్వాహకుడు పొన్నాడ సోమేశ్వరరావే హంతకుడని విజయ్ తల్లిదండ్రులు నాగసాయి,భూలక్ష్మి, అమ్మమ్మ సావిత్రి, మేనత్త విజయలు ఆరోపించారు. వీరంతా కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరిగివస్తుండగా సమాచారం తెలుసుకొని హూటాహుటిన నరసన్నపేటకు చేరుకున్నారు. అనంతరం వీరు విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ భార్యను విజయ్ అమ్మగా భావించాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న తన కుమారుడిని పొట్టన పెట్టుకున్న వైద్యున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడి అమ్మమ్మ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో తన స్నేహిడుతు ఫోన్ చేయడంతో గంటలో వచ్చేస్తానని వెళ్లిన విజయ్ తిరిగి రాలేదని వాపోయింది. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
జిన్నారం మండలం వీరన్నగూడెంలో గోపాల్(40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గోపాల్ (శనివారం) నిన్న పని నిమిత్తం బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు(ఆదివారం) ఉదయం ఎంతసేపైనా నిద్రలేకపోయేసరికి కుటుంబసభ్యులు అనుమానం వచ్చి గమనించగా చనిపోయి ఉన్నాడు. కంటిపై గాయం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
యువకుడి దారుణ హత్య
సత్తెనపల్లి పారిశ్రామికవాడ వద్ద దారుణం మృతుని శరీరంపై పలు చోట్ల గాయాలు సత్తెనపల్లి: యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల జీబీసీ కాలువ సమీపంలోని పత్తి మిల్లుల వద్ద మంగళవారం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని సుమారు 35 ఏళ్ళ యువకుని మృతదేహం రోడ్డు పక్కగా పడి ఉండడం గమనించిన స్థానికులు మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై నిక్కర్, బనియన్ మాత్రమే ఉన్నాయి. శరీరంపై కుడి చేతికి పలు చోట్ల గాయాలున్నాయి. అంతేగాక మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి రెండడుగుల దూరంలో రక్తపు మరకలు, మరి కొంతదూరంలో దుప్పటి పడి ఉన్నాయి. పాతకక్ష్యల నేపథ్యంలో యువకుడిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేసి వెళ్లడమే తప్ప ఇక్కడ హతమార్చే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. గుంటూరు– మాచర్ల ప్రధానరహదారి ఎల్లవేళలా ఎంతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ హత్య చేస్తే సులువుగా గమనించే అవకాశం ఉంటుంది. పోలీసులు కృష్ణా పుష్కరాల విధులలో తలమునకలుగా ఉండడంతో సుమారు 9 గంటల సమయంలో మృతదేహన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. అవనిగడ్డవాసిగా గుర్తింపు.. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తి కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుని జేబులో ఉన్న నాలుగైదు ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మృతుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తుండవచ్చని, లారీ పైన నిద్రపోతుండగా అర్థరాత్రి సమయంలో జారిపడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అలా లారీపై నుంచి పడి ఉంటే స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు గుర్తించే అవకాశం లేకపోలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. -
నాలుగు రోజుల క్రితం వెళ్లి..
శవమై కనిపించిన వైనం బొల్లాపల్లి : నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన గేదెల కాపరి మృతి చెంది ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన చెంచు యువకుడు శీలం వెంకటేశ్వర్లు (30) ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో తూర్పు పొలాల వైపు చెక్క వాగులో ఓ మృతదేహం పడి ఉన్న విషయాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. దీంతో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వెంకటేశ్వర్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లి నాలుగు రోజులుగా తిరిగి రాలేదని వారు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై సాంబశివరావు తెలిపారు. మృతదేహానికి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమారుడు మాధవరావు ఉన్నారు. హనుమాపురంలో గేదెల కాపరిగా జీవనం సాగిస్తుంటాడు. అయితే, అతని మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి కి చెందిన ఎస్.రాజు (30) సివిల్ వర్క్‌లు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం తండ్రి నర్సింహ చనిపోయినప్పటికి నుంచి తాగుడుకు బానిసై పని చేయకుండానే ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పధ మృతిగా కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
రైల్వేకోడూరు రూరల్: రైల్వేకోడూరు పట్టణంలోని పగడాలపల్లెలో నివాసముంటున్న కరమళ్ల అలిషా(25) అనే వివాహిత యువతి ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం మేరకు..పగడాలపల్లెకు చెందిన మస్తాన్‌కు మంటపంపల్లెకు చెందిన గుర్రప్ప, మాబున్నీల కుమార్తె కరమళ్ల అలిషాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల క్రితం మస్తాన్ కువైట్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్లేవాడు. అలిషాకు తోడుగా మస్తాన్ తన అమ్మను ఉంచాడు. కింది ఇంట్లో అలిషా ఉండగా, పై ఇంటిలో మస్తాన్ అన్న, వదినలు ఉంటున్నారు. ఇటీవల కొంత కాలంగా అలీషాకు పిల్లలు లేరని గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కువైట్ నుంచి అలిషాకు ఆమె భర్త ఫోన్ చేసి పరుషంగా మాట్లాడటంతో ఆమె విలపిస్తూ కువైట్‌లోనే ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. అదే రోజు రాత్రి ఆమె ఉరివేసుకుందనే సమాచారం అందిందని మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు. తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శరీరంపై గాయాలు ఉన్నాయని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణ వార్త తెలిసిన వెంటనే కువైట్‌లో ఉన్న మృతురాలి తల్లిదండ్రులు సోమవారం పగడాలపల్లెకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఆమె భర్త మాత్రం కువైట్ నుంచి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎయిర్‌పోర్టులో ఇద్దరు యువకుల అరెస్టు
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ బలగాలు ఇద్దరినీ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. యువకులు టోలిచౌకీకి చెందిన వారిగా చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
♦ కుటుంబీకులే హత్య చేశారని ఆరోపణ ♦ ఆగ్రహంతో ఆమె భర్తపై కత్తితో దాడి చేసిన బంధువులు బంట్వారం: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ మండలం పీలారం గ్రామానికి చెందిన లక్ష్మి(30)ని పదిహేనేళ్ల క్రితం గ్రామానికి చెందిన నర్సింహ్మారెడ్డి వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా దంపతులు కుటుంబ కలహా లతో గొడవపడుతున్నారు. ఈనేపథ్యం లో ఇటీవల లక్ష్మి వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్త పై కేసు పెట్టింది. పెద్దలు జోక్యం చేసుకుని రాజీకుదిర్చా రు. అయినా దంపతులు గొడవపడుతూనే ఉన్నారు.ఇదిలా ఉండగా, లక్ష్మి శుక్రవారం రాత్రి ఇంట్లోఎవరూలే ని సమయంలో అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మి ని కుటుంబీ కులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనిమృతి రాలి తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, ఈశ్వరమ్మ ఆరోపించారు. ఈమేరకు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. లక్ష్మి ఉరి వేసుకుం దని ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. ఇరువర్గాల ఘర్షణ.. లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈక్రమంలో శనివారం కొత్తపల్లిలో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. మృతురాలి భర్త నర్సింహ్మారెడ్డి కత్తిపోట్లకు గురయ్యాడు. మోమిన్‌పేట సీఐ ఏవీ రంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహానికి మర్పల్లి ప్రభు త్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
బంట్వారం: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహారెడ్డికి లక్ష్మీ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. శనివారం ఒంటిమీద గాయాలతో అనుమానాస్పదంగా లక్ష్మి మృతి చెందటంతో.. ఆమె తల్లిదండ్రులు తమ అల్లుడే అదనపు కట్నం కోసం కూతుర్ని కడతేర్చాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు మహిళల అనుమానాస్పద మృతి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, మరో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. చిత్తాపూర్ గ్రామానికి చెందిన వసంత (29) శనివారం రాత్రి మృతి చెందగా ఆదివారం విషయం బయటకు వచ్చింది. భర్త కుటుంబీకులే హత్య చేశారని వసంత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన లలిత (40) శనివారం నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం గ్రామంలోని ఓ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. -
అనుమానాస్పదంగా హమాలీ మృతి
బీబీగూడెం(చివ్వెంల): అనుమానాస్పద స్థితిలో హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బీబీగూడెం గ్రామ శివారులోని విష్ణువందన ఫార్‌బాయిల్డ్ రైస్ మిల్లులో గురువారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మున్యానాయక్‌తండాకు చెందిన ధరావత్ రాజు(45) 20 సంవత్సరాలుగా విష్ణు వందన రైస్ మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే మిల్లులో పని నిమిత్తం వచ్చాడు. కాగా పని కొంచెం ఆలస్యంగా మొదలవుతుందని తెలుసుకుని వెంట తెచ్చుకున్న ఆహారాన్ని మిల్లులోనే అతడితో పాటు మరికొంత మంది హమాలీలు చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. కొద్ది సేపటికే రాజు కుప్పకూలి కింద పడిపోయాడు. గమనించిన తొటి హమాలీలు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించగా అప్పటికే మృతిచెం దినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతిచెందినట్టు భావిస్తున్నారు. మృతదేహాన్ని తిరిగి ట్రాక్టర్లలో మిల్లు వద్దకు తీసుకువచ్చారు. మృతుడి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు మృతదేహంతో మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మిల్లు యాజమాన్యం రూ.1.20 లక్షలు ఇస్తామని అంగికరించడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
హైదరాబాద్‌సిటీ: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన వాటర్ పైప్‌లైన్ కోసం తీసిన గుంతలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా హత్య చేసి గుంతలో పడేశారా లేక ప్రమాదవశాత్తూ పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ వారి పనేనా!
లేహ్: ఇండియా, చైనా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం లేహ్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలకు ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. వాస్తవాదీన రేఖ ప్రాంతంలోని డుర్బక్ గ్రామ సర్పంచ్‌కు ఇటీవల వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను విచారించిన అధికారులు.. అది వెబ్ ఆధారిత కాల్‌గా నిర్థారించారు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు పరిచయం చేసుకొని, ఆర్మీకి సంబంధించిన వివరాలను అడిగాడు. అయితే ఆ సమయంలో ఆర్మీ క్యాంపులోనే ఉన్న సర్పంచ్ ఈ విషయాన్ని సమీపంలోని ఆర్మీ అధికారికి వివరించాడు. దీనిపై విచారణ జరపగా ఆ నంబర్‌కు సంబంధించిన వివరాలేవీ లభించలేదు. దీంతో అది పాకిస్తాన్ లేదా చైనా దేశాలకు చెందిన గూఢచారుల పనిగా అధికారులు భావిస్తున్నారు. బార్డర్ గ్రామాల్లోని కొందరు అమాయక ప్రజలు ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న సందర్భంలో ఆర్మీకి సంబంధించిన వివరాలను వెల్లడించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఆర్మీ మోహరింపుకు సంబంధించిన వివరాలతో పాటు, అక్కడ గల రవాణా సౌకర్యాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్‌పై ఇప్పుడు అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అలాగే సమీప గ్రామాల్లోని ప్రజలకు ఈ వ్యవహారం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
నగరంలోని ఎల్బీనగర్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనపడుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
-
శంషాబాద్ ఆర్జీఐఏ వద్ద ఒకరి అరెస్టు
దేశవ్యాప్తంగా ఉగ్ర కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ)లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం టెర్మినల్ వద్దతిరుగుతున్న పోలీసులు పట్టుకున్నారు. మలక్‌పేటకు చెందిన అతడు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో స్టేషన్‌కు తరలించి, సమాచారం రాబడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
మల్కాజ్గిరి: నిశ్చితార్థ విందుకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శవమై తేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కథనం.. వెంకటేశ్వరనగర్ సత్య అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న సుబ్బారావు కుమారుడు కె. శ్రీనివాస్(36) సాప్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి సుబ్బారావు స్నేహితుడు మీర్జాలగూడకు చెందిన రమేష్ కూతురు నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీనివాస్ పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారుజామున విందు జరిగిన ప్రాంతంలో శ్రీనివాస్ మృతి చెందిపడి ఉన్న సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. మృతుడి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేవు. పోస్ట్‌మార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ద్వారకాతిరుమల(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ద్వారకాతిరుమల ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రవికుమార్‌తో రామసీతకు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉంది. కాగా, దంపతుల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. స్థానిక కుంకుళ్లమ్మ గుడి అర్చకుడు నాగరాజు రామసీతతో వివాహేతర సంబంధం కొన్నాళ్లుగా నడుస్తోంది. నాగరాజుకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని రోజులుగా నాగరాజు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే మంగళవారం రామసీత(28) తన ఇంట్లోనే మృతి చెందిపడి ఉంది. ఆమె ఒంటిపై గాయాలున్నాయి. ఆమె తల్లి సీతారావమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రేగొండ మండలం రంగయ్యగారిపల్లె గ్రామానికి చెందిన వంతెన లక్ష్మి (35) భర్తకు దూరంగా ఉంటోంది. బుధవారం ఉదయం ఆమె తలకు గాయాలైన స్థితుల్లో మృతి చెందగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
విజయనగరం పట్టణంలోని దాసన్నపేట కొత్తవాడలో మంగళవారం ఉదయం ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసిస్తున్న స్వాతికి ఏడాది క్రితం వివాహమైంది. కాగా.. ఈ ఉదయం ఇంట్లో ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. భర్తే స్వాతిని చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని స్వాతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
నెల్లూరు క్రైమ్: నెల్లూరులోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. ప్రాథమిక సమాచారం మేరకు.. జిల్లాలోని ఇందుకూరిపేట మండలం జగదేవిపేటకు చెందిన అత్తులూరి ప్రభాకర్ నాయుడు (55) ఎవరెస్ట్ లాడ్జిలో ఈ నెల 2న ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అయితే, సోమవారం నుంచి అతడుంటున్న గది తలుపు తెరచుకోలేదు. అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది మంగళారం తలుపులు తెరచి చూడగా ప్రభాకర్ నాయుడు మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. -
వ్యవసాయ కూలీ అనుమానాస్పద మృతి
కర్నూలు: ఓ వ్యవసాయ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందవరం మండలం సోమలగూడానికి చెందిన మద్దిలేటి బతుకు దెరువుకోసం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాడు. జిల్లాలోని మందకల్ మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనిచేస్తూ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
తిమ్మాపూర్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి
మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో బుధవారం ఉదయం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన ధర్మమిత్ర (45) గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా తిమ్మాపూరంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం అతని శవం చెట్టుకు వేలాడుతుండగా స్థానికులు గమనించారు. మృతుని శరీరంపై గాయాలు ఉండడంతో దుండగులు కొట్టి చంపి తర్వాత చెట్టుకు వేలాడదీశారని అనుమానిస్తున్నారు. మోర్తాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కలువాయి(నెల్లూరు): విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. చేజర్ల మండలానికి చెందిన వి. మనోహర్‌రెడ్డి(28) ఆర్టీసీలో కాంట్రాక్ట్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే శనివారం ఉదయం తల పగిలి రక్తస్రావమై రోడ్డు మీద పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు హత్య చేశారా లేక రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వేబ్రిడ్జి కింద మహిళ మృతదేహం
గుంటూరు (మంగళగిరి) : అనుమానాస్పద స్థితిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం జరిగింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది తమ పరిధిలోకి రాదని, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఎక్కడైనా హత్య చేసి తెచ్చి ఇక్కడ పడేశారా, లేక ఇక్కడే హతమార్చారా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నా -
బావిలో మృతదేహం
శ్రీకాకుళం : వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని సుభద్రాపురం గ్రామంలోని వ్యవసాయ బావిలో శనివారం వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు పలాస మాజీ ఎంపీపీ నిమ్మన బైరాగి కుమారుడు చిన్నారి(37)గా గుర్తించారు. మృతదేహంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉండటంతో.. హత్య జరిగి ఉంటుందనే అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో గిరిజనుడు మృతి
విజయనగరం (రామభద్రాపురం) : విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం పెదచెలగాం గ్రామంలోని ఓ తోటలో సోమవారం ఒలిసి నర్సింహులు(48) అనే గిరిజనుడు అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఎవరో కావాలని చంపి ఇక్కడ పడేసి ఉంటారని ఆయన సోదరుడు సీతారాం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆదిలాబాద్ (తిర్యానీ) : ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తిర్యానీ మండలంలో మంగళవారం వెలుగుచూసింది. తిర్యానీ అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న ఎస్ఐ మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ బుద్దేస్వామి తెలిపారు. -
తల్లీ, కొడుకు ఆత్మహత్య
సిరిసిల్ల (కరీంనగర్ జిల్లా) : తల్లీ, కుమారుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. కరీంనగర్జిల్లా సిరిసిల్లలోని బీవై నగర్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బీవై నగర్‌కు చెందిన లింగం(40), అతడి తల్లి లక్ష్మి(60) సోమవారం తమ ఇంట్లో విగత జీవులుగా పడి ఉండగా గ్రామస్తులు గమనించారు. వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా లింగం వివాహితుడు. మద్యానికి బానిసై భార్య లావణ్యను హింసిస్తుండడంతో ఆమె తన కుమారుడ్ని తీసుకుని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లోని తల్లిగారింటికి ఆరు నెలల క్రితమే వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
నెల్లూరు: పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటన నెల్లూరు నగరంలోని బోడిగారితోటలో సోమవారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.ప్రమీల (25), ఆటో డ్రైవర్‌గా పనిచేసే విశ్వనాథం నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, స్థానిక బోడివారితోటలో తాము నివాసం ఉండే ఇంట్లో సోమవారం తెల్లవారుజామున ప్రమీల మృతి చెందింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రమీల మృతి చెందిన సమయంలో భర్త విశ్వనాథం కూడా ఇంట్లోనే ఉండడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్తే తమ కూతుర్ని చంపినట్టు ప్రమీల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. -
నవవధువు అనుమానాస్పద మృతి
విజయవాడ : కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... పెడన పట్టణానికి చెందిన ప్రకాశ్‌రావు కూతురు ధనలక్ష్మి(19)కి వివాహం ఈ నెల 11న జరిగింది. అయితే బుధవారం రాత్రి ధనలక్ష్మిగుండెపోటుతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే దనలక్ష్మీ అనుమాస్పద స్థితిలో మరణించినట్టు ఆమె బందువులు ఆరోపించారు. కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (పెనుగంచిప్రోలు) -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనంతపల్లి (నల్లజర్ల రూరల్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి కాలిన గాయూలతో మృతి చెందింది. నల్లజర్ల మండలం అనంతపల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నారుు. గ్రామానికి చెందిన ఆళ్ల దుర్గారావుకు మేనత్త కుమార్తె గోవిందమ్మ (36)తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి డిప్లొమా చదువుతున్న కుమారుడు రాజా అరవింద్, 16 ఏళ్ల మమత ఉన్నారు. భర్త దుర్గారావు ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ గోవిందమ్మ పలుమార్లు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. పెద్దల సమక్షంలో పరిష్కారాలు జరిగాయి. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరిగిందని, భర్త, పిల్లలు భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో గోవిందమ్మ బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందని చెబుతున్నారు. ఎగిసిపడ్డ మంటలకు గోవిందమ్మ అరవడంతో భర్త దుర్గారావు, కొడుకు అరవింద్ మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఆమె ప్రాణాలు వది లిందని సమాచారం. తాడేపల్లిగూడెం సీఐ జి.మధుబాబు, అనంతపల్లి ఎస్సై ఎం.రాంబాబు శనివారం ఉదయం ఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అల్లుడే చంపేశాడు తన కుమార్తె గోవిందమ్మను అల్లుడు దుర్గారావు కిరోసిన్ పోసి, నిప్పంటించి చంపేశాడని మృతురాలి తల్లి నిమ్మకాయల సుబ్బలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో 3 ఎకరాలు అమ్మేశాడని, ఉన్న భూమిని కూడా పాడు చేస్తాడనే భయంతో పెద్దల సమక్షంలో తన కుమార్తె పేర రాయించానని చెప్పింది. బకారుులు ఉన్నాయనే నెపంతో అందులోనూ అర ఎకరం భూమిని అమ్మేశాడని చెప్పింది. మిగతా భూమి కూడా అమ్మడానికి చేస్తున్న ప్రయత్నాలను తన కూతురు అడ్డుకోవడంతో చంపేశాడని ఆరోపించింది. ఆమె కాపురం బాగుండాలనే ఉద్దేశంతో తాను వేరే ఊరికి మకాం మార్చానని, తాను ఊళ్లో లేకపోవడం చూసి కుమార్తెను అల్లుడు మట్టుబెట్టాడని వాపోరుుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సుబ్బలక్ష్మి, మృతురాలి సోదరుడు చెంచురాముడు పోలీసులను కోరారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
సామర్లకోట: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా సామర్లకోటలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సామర్లకోటలోని రజకపేటకు చెందిన ఎమ్.కావమ్మ(23) జయ డార్మటరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూలీ పని చేసి జీవనం సాగించే ఆమె డార్మటరీలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
విజయనగరం క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన మాధవి(24)ని పుత్సలవీధి జగన్నాథపురానికి చెందిన యర్రా శ్రీనివాసరావుకు ఇచ్చి 2009లో వివాహం చేశారు. వీరికి రత్నకాంత్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. మాధవి ఉరఫ్ దేవి భర్త శ్రీనివాసరావు పట్టణంలోని ఓ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వస్తు సామగ్రి అమ్మేవాడు. బాలాజీనగర్ ఉంటున్న భావ సూర్యప్రకాష్ ఇంట్లో సామగ్రిని సైతం అమ్మేశాడు. వైఎస్ఆర్ నగర్లో నివాసముంటున్న శ్రీనివాసరావు పెద్ద చెల్లెలు నూతన గృహ ప్రవేశం మూడు రోజుల కిందట జరిగింది. అక్కడికి మాధవి అత్త రాఘవమ్మ వెళ్లారు. శనివారం ఉదయం భర్త శ్రీనివాసరావు హోటల్‌కు పని నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం నాలుగున్నర సమయానికి ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు కొట్టగా ఆ శబ్ధానికి మూడేళ్ల బాలుడు రత్నాకాంత్ గట్టిగా అరిచాడు. శ్రీనివాసరావు వెంటనే తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లేసరికి మాధవి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరిపోసుకుని ఉంది. ఆమె పక్కనే బాబు కూడా ఉన్నాడు. శ్రీనివాసరావు చుట్టుపక్కల మహిళలకు, బంధువులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఇన్చార్జి సీఐ కె.రామారావు, రెండో పట్టణ ఎస్ఐ శ్రీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మాధవి మెడకు గాటు ఉండటంతో ఆత్మహత్య.. లేదా హత్యా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. మాధవి గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. మృతురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మాధవి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పార్వతి, అన్న సూర్యప్రకాష్ విలేకరులతో పేర్కొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పోలవరం : పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన మాదేపల్లి రామకృష్ణవేణి (29) అనే వివాహిత మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రామకృష్ణవేణిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తుండగా.. భర్త, అత్తింటివారు మాత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టిసీమ గ్రామానికి చెందిన తెలగంశెట్టి రత్నాజీరావు కుమార్తె రామకృష్ణవేణికి పాతపట్టిసీమకు చెందిన మాదేపల్లి ఉపేంద్రకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆ సమయంలో రెండెకరాల భూమిని రామకృష్ణవేణి పేరున ఆమె తండ్రి స్త్రీధనంగా రాశా రు. వీరికి 7, 5 సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, రామకృష్ణవేణి పేరిట ఉన్న రెండెకరాల భూమిని విక్రయిం చేందుకు నిర్ణయించుకున్న భర్త ఉపేంద్ర ఈ విషయమై తరచూ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు రామకృష్ణవేణి అంగీకరించకపోవడంతో భర్త, ఆమె కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురిచేస్తుండేవారని చెప్పారు. మంగళవారం కూడా చిత్రహింసలకు గురిచేసిన భర్త, అతని కుటుంబ సభ్యులు చివరకు తమ కుమార్తెను గొంతునులిమి చంపేశారని ఆరోపించారు. మృతురాలి మెడపై కమిలిన గుర్తులు ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో టీవీ శబ్దాలు పెద్దగా వినిపించాయని, అదే సందర్భంలో మృతురాలి కేకలు కూడా వినిపించాయని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఆ తరువాత అత్తింటి వారు ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించి హడావుడి చేశారని, చుట్టుపక్కల వారు రావడంతో విషయం బయటకు పొక్కిందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి తండ్రి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలవరం ఇన్చార్జి సీఐ ఎం.అంబికాప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై టి.వెంకటసురేష్ కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. -
ఏమైందో ఏమో
- నవదంపతుల అనుమానాస్పద మృతి - పెళ్లయిన 9 నెలలకే నిండిన నూరేళ్లు - కొత్తపట్నం మండలం రాజుపాలెంలో ఘటన.. కొత్తపట్నం : మండలంలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నవదంపతులు గురువారం వేకువ జామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒంగోలు నుంచి బుధవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్న వీరు తెల్లవారేసరికి మృతదేహలై కనపడటంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో కూడా పరిసర ప్రాంతాల వారికి అంతుపట్టడం లేదు. గ్రామానికి చెందిన లింగంగుంట బలరాం (25) ఒంగోలు మంగమూరురోడ్డుకు చెందిన నాగూరి మేరి (22)ని 9 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో ఉండటం లేదు. బలరాం తండ్రి అంజయ్య, తల్లి లక్ష్మీకాంతమ్మలు రాజుపాలెంలోనే ఉంటున్నా వారు వేరుగా ఉంటున్నారు. రాజుపాలెంలో సొంతిల్లు ఉన్నా బేల్దారి పనుల కోసం బలరాం తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. ఆ సమయంలో భార్య మేరిని ఆమె పుట్టింట్లో వదిలి వెళ్తుంటాడు. యథావిధిగా మంగళవారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి భార్య మేరిని తీసుకొని సాయంత్రం 3 గంటలకల్లా స్వగ్రామం రాజుపాలెం చేరుకున్నాడు. బంధువులు, తల్లిదండ్రులతో రాత్రి పడుకునే వరకు కూడా సరదాగానే గడిపారు. మరుసటి రోజు పొద్దుపోయినా బయటకు రాకపోవడంతో కొందరు ఇంట్లోకి తొంగి చూశారు. ఇద్దరూ ఉరేకి వేలాడుతూ కనిపించారు. మృతదేహాలను స్థానికులు కిందకు దించారు. సమాచారం అందుకున్న ఒంగోలు టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ, కొత్తపట్నం ఎస్సై బి.నరసింహారావులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి ఆనవాళ్లను చేరిపే ప్రయత్నం చేస్తున్న బంధువులను అడ్డుకున్నారు. నవ దంపతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీప బంధువులు, స్నేహితుల కథనం ప్రకారం ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. పెళ్లయి 9 నెలలుకావడం.. గ్రామంలో సొంత ఇల్లు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు చనిపోయేంతగా వచ్చాయా.. అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం సమస్యలు, దంపతుల మధ్య మనస్పర్థలు పొడచూపాయా అన్న దానిపైనా పోలీసులు విచారిస్తున్నారు. తహశీల్దార్ కె.రవిబాబు, వీఆర్వో కృష్ణకిషోర్బాబులు వచ్చి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు -
అనంతపురంలో యువతి అనుమానాస్పద మృతి
-
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
కల్హేర్, న్యూస్‌లైన్ : అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని కడ్పల్లో చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి విఠల్ (35) శుక్రవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. శనివారం గ్రామ శివారులోని ఓ వరి పొలంలో విఠల్ శవమై కనిపించాడు. విషయాన్ని స్థానికులు భార్య సిద్దమ్మ, కుటుంబీకులకు చెప్పగా వారు అక్కడికి వెళ్లి విలపించారు. అయితే విఠల్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో హత్య చేసి వరి పొలంలో పడేశారని ఆరోపించారు. సిర్గాపూర్ ఎస్ఐ కోటేశ్వరరావ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో అనుమానాలు తేటతెల్లం అవుతాయని తెలిపారు. మృతుడి భార్య సిద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. -
అనుమానాస్పదంగా ఇద్దరి మృతి
రాయికోడ్, న్యూస్‌లైన్: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృ తి చెందిన సంఘటన రాయికోడ్ మండలంలోని చిమ్నాపూర్‌లో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్, స్థానికు ల కథనం ప్రకారం.. అందోల్ మండ లం డాకూర్‌కు చెందిన పెద్దగొల్ల రాజు (30)కు మండలంలోని జంమ్గి గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ రెండో కూతురు సంధ్యతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా శనివారం రాజు తన భార్య తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆ దివారం ఉదయం స్వగ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. అయితే జంమ్గి నుంచి బయల్దేరిన అతడు చి మ్నాపూర్ వచ్చి మద్యం సేవించాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఓ దాబా పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మధ్యాహ్నం 4.30 గంటలవుతున్నా ఆ వ్యక్తి అక్కడి నుంచి కదలకపోవడంతో స్థానికులు దగ్గరికి వెళ్లి చూడగా నోట్లో నుంచి బురుగులు వచ్చిన ఆనవాళ్లను కనిపించాయి. దీంతో వారు పోలీసుల కు సమాచారం అందించారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే రాజు మృతి చెందాడు. విషయం మృతుడి మామకు తెలియడం తో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించాడు. నా లుగేళ్ల క్రితం తన తన పెద్ద అల్లుడు సై తం మద్యం సేవించి చిమ్నాపూర్‌లోనే చనిపోయాడని రోదిస్తు తెలిపాడు. మృ తుడి తల్లిదండ్రులు వచ్చిన అనంతరం శవాన్ని పోస్టుమార్టంకు తరలిస్తామని ఎస్ఐ చెప్పారు. అయితే సంగారెడ్డిలోని పెట్రోలు బంక్‌లో పని చేస్తాడని, అక్కడి కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చాడోనని మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాగిరెడ్డిగూడెంలో.. జిన్నారం: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిన్నా రం మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ మల్లారెడ్డి కథనం ప్రకారం.. నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల అశోక్ (35) ఎప్పటిలాగే శనివా రం రాత్రి ఇంట్లో నిద్రించాడు. ఉదయం తెల్లవారేసరికి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్ఐ మల్లారెడ్డి సందర్శిం చారు. మృతికిగల కారణాలపై ఆరా తీశారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్ఐ తెలిపారు. అయితే ఈ మృతిపై అశోక్ తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.