Jhanvi Kapoor
-
నాని, ఝాన్వి కలిసి పని చేస్తారా లేక ఇది పుకార్లేనా?!
-
ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్ లుక్..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి, దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల మనుసులను దోచుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ ఆయా సినిమాల ప్రమోషన్లతో డిఫరెంట్ డిజైనర్‌వేర్‌లతో సందడి చేస్తోంది. ఇటీవల ఎన్‌ఎంసీసీలో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న రాజాధిరాజ్ అనే మ్యూజికల్ ప్రీమియర్ కోసం రెడ్‌కార్పెట్‌పై ఎరపు రంగు ఆర్గాంజా చీరతో అబ్బురపరిచింది. కొత్త పెళ్లికూతురు లుక్లా ఉంది ఆమె శారీ డిజైనింగ్ స్టైల్. ఆ చీరకు తగ్గట్లు కాంగ్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ జాన్వీకి మరింత అందాన్ని ఇచ్చింది. ఫ్యాషన్ ఔత్సాహికులందర్నీ జాన్వీ కపూర్ ఎంపిక చేసుకున్న సరోజా రమణి చీరలపై దృష్టిసారించేలా చేసింది. ఇక్కడ జాన్వీ ధరించిన ఆర్గాంజా ఎరుపు రంగు చీరపై చేతిలో చేసిన ఎంబ్రాయిడరీ, పురాతన డబ్కా, మోతీ, సీక్విన్ వర్క్‌లతో అలంకరించి ఉన్నాయి. దీంతోపాటు బాల్డా లేస్ బార్డర్ కూడా ఉంది. జెనీ సిల్క ఆకుపచ్చ బ్లౌజ్ జత చేయడం ఆ ఎరుపు రంగు ఆర్గాంన్జా చీర లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అంతేగాదు ఈ బ్లౌజ్ పూర్తి నిడివి గల స్లీవ్ని కలిగి ఉంది. అలాగే నెక్‌లైన్‌లో ఉండి, క్లిష్టమైన జరీ వర్క్ కలిగి ఉంది. ఈ చీర ఖరీదు రూ. 1.62 లక్షలు. ఈ చీర జాన్వీ దేశీ లుక్‌ని ఓ లెవెల్‌కి కనిపించేలా చేసింది. ఆ చీర తగ్గట్టు చెవిపోగులు, నెక్లెస్‌తో సింపుల్‌గా కనిపించింది. జుట్టుని కూడా వదులుగా వేసి అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా అందంగా కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
-
కాంజీవరం చీరలో జాన్వీ కపూర్..ఏకంగా 1983 ప్రపంచ కప్..!
దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ ఫిట్నెస్కి సంబంధిందిచిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా డిజైనర్ డ్రెస్‌ల ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ప్రసుత్తం జాన్వీ వరుస బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలో మంచి బిజీగా ఉంది. ఆమె తన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ప్రచారం కోసం వారణాసిలో భారతీయ సంప్రదాయ చీరతో తళుక్కుమంది. అందమైన లేత నీలి రంగు చీరలో జాన్వీ లుక్ మిస్మరైజింగ్ ఉంది. ఆమె ధరించిన కంజీవరం చీర జాన్వీ అందాన్ని రెట్టింపు చేసింది. అయితే జాన్వీ ధరించిన చీర క్రికెట్ అభిమానులకు అలానాటి మధుర జ్ఞాపకాలను కళ్ల ముందు కదలాడేలా చేసింది. క్రికెట్‌కి జాన్వీ ధరించిన చీరకు సంబంధం ఏంటా ? అని అనుకోకండి. ఎందకంటే..? ఆమె చీర పల్లుపై నాటి 1983 ప్రపంచకప్ ఫైనల్స్ని చాలా చక్కగా చిత్రీకరించారు. దీన్ని చాలా వివరణాత్మకంగా చేతితో చిత్రించారు. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami)భారతదేశం ట్రోపీని కైవసం చేసుకున్న ఆ టోర్నీని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూస్తే కళ్లు తిప్పుకోలేం. మంచి కళాత్మక స్ట్రోక్‌లతో పూర్తి స్టేడియం నుంచి బ్యాట్స్‌మ్యాన్ సిక్సర్ కొట్టడం దాక చాలా చక్కగా అవగతమయ్యేలా చిత్రీకరించారు. క్రికెట్ థీమ్‌తో ఆలోచనాత్మకంగా చీరను తీర్చిదిద్దాలనుకువడం హైలెట్‌గా నిలిచింది. ఒక పక్క జాన్వీకి సంప్రదాయ బోర్డర్లోతో ఉన్న చీర మంచి లుక్‌ని తీసుకురాగా, దానిలో ఉన్న క్రికెట్ నేపథ్య చిత్రం చూపురులను మరింతగా ఆకట్టుకుంది. అంతేగాదు ఇది జాన్వీ డ్రెస్సింగ్ స్టైల్‌ని, ఆమె డ్రెస్ సెలక్షన్ వేరేలెవెల్ అని అనింపించేలా చేసింది. అలాగే ఆ చీరకు తగ్గట్టు బ్యాకెలెస్ బ్లౌజ్ టై చేసి, పొట్టి చేతులతో కూడిన డిజైన్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అంతకుమునుపు జాన్వీ ఇలాంటి బ్లూ కలర్ సీక్విన్స్‌తో డిజైన్ చేసిన మల్హోత్ర శారీని ధరించింది. దీనిక తగ్గట్టుగా స్లీవ్‌లెస్ కాలర్ బ్లౌజ్‌పై ట్రోఫీ చిత్రంతో కూడిన బటన్లు ఉన్నాయి. ఈ చీరలో జాన్వీ మరింత క్యూట్‌గా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో, పోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..) -
వారికి ఇష్టమైన ఫోటోలతో శ్రీదేవిని గుర్తు చేసుకున్న జాన్వీ,బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన అమ్మగారిని గుర్తు చేసుకుంది. బోనీ కపూర్ తన భార్యతో కలిసి తీసుకున్న పాత ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అక్కడ 'హ్యాపీ బర్త్‌డే' అని తెలుపుతూ హార్ట్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా పలు పాత ఫోటోలను షేర్ చేసి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. పలు లవ్ ఎమోజీలతో పాటు 'హ్యాపీ బర్త్‌డే మామా' అని రాసింది. (ఇదీ చదవండి: భార్య వల్లే ఆ హీరో కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) తాజాగ విడుదలైన 'బవాల్' చిత్రంలో కనిపించిన జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ కథనాలలో తన తండ్రి సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే తన కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా జాన్వీ కపూర్ శ్రీదేవి గురించి మాట్లాడింది. తన తల్లి మరణం తనకు చాలా కఠినమైన సమస్య అని, శ్రీదేవిని రోల్ మోడల్‌గా చూస్తున్నానని చెప్పింది. ఆమె మరణం తర్వాత తన కెరీర్‌ను కూడా శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటున్నానని జాన్వీ తెలిపింది. 40 ఏళ్లపాటు శ్రీదేవి ట్రెండ్ 1963 ఆగస్టు 13న తమిళనాడులో శ్రీదేవి జన్మించారు. శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ అనేది శ్రీదేవి అసలు పేరు. సినిమాల కోసం శ్రీదేవిగా పేరు మార్చుకుని 40 ఏళ్లపాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం,మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 250 సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ చేసిన శ్రీదేవి.. అతిలోక సుందరిగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
తన బర్త్ డే రోజున ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసిన తారక్..
-
డిజాస్టర్ అయినా తగ్గేదేలే అంటున్న అఖిల్
-
గ్లోబల్ మూవీగా NTR 30...ఫుల్ డేట్స్ ఇచ్చిన జాన్వీ
-
ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ ఎంట్రీ?
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ వార్త నిజం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత హీరో ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ద్వారా జాన్వీ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారని సమాచారం. గత వారం జాన్వీ హైదరాబాద్ వచ్చారని తెలిసింది. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఫోటోషూట్‌లో పాల్గొనడానికే భాగ్యనగరంలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టారట. ఇక ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా నటించడం కోసం ఓ బాలీవుడ్ మూవీని కూడా జాన్వీ వదులుకున్నారని టాక్. సో... జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే అని ఊహించవచ్చు. ఈ నెల 24న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కానుందట. మరి ఆ రోజు హీరోయిన్ని ప్రకటిస్తారేమో చూడాలి. -
ముహూర్తం ఫిక్స్?
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించనున్న ఈ 30వ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరిందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిస్తోంది. ఈ నెల 23న ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారట ఎన్టీఆర్, కొరటాల శివ అండ్ కో. అలాగే మార్చి మూడోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ పోర్టు సెట్‌ను కూడా వేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారట కొరటాల శివ. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌లో పెద్ద కూతురు జాన్వీ కపూర్ అనే విషయం తెలిసిందే. శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ తడక్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా.. అనుకున్న స్థాయిలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోలేక పోయింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటించిన కొన్ని మంచి కథా చిత్రాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెతో పాటు అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తన గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ జాన్వీ కపూర్ మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంది. ఇటీవల రూ.70 కోట్లతో కొత్త ఇల్లు కొనుగోలు చేసిందనే ప్రచారం హోరెత్తుతోంది. మరో పక్క ఈ బ్యూటీ దక్షిణాదిలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నా, అలాంటి అవకాశం సెట్ అవ్వడం లేదు. కాగా తాజా ఆమె మాట్లాడుతూ.. వారసత్వ ముద్ర వేయడం తనకు భారంగానే అనిపిస్తోందన్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తనను సినీ వారసురాలనే ప్రచారం చేయడం మనసుకు బాధ కలిగిస్తోందన్నారు. కరణ్ జోహార్ మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్నారని, తన సంస్థ చిత్రాల్లో నటించడం అదృష్టంగా జాన్వీ కపూర్ పేర్కొంది. చదవండి: (Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే..) -
వారసురాళ్ల కలయిక.. సోషల్ మీడియాలో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి. అలాంటి నటి వాసురాలు జాన్వీ కపూర్ కథానాయకిగా రంగప్రవేశం చేశారు. బాలీవుడ్లో యువ కథానాయక రాణిస్తున్న ఈమెను దక్షిణాదిలో పరిచయం చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ యువ నటికి కూడా దక్షిణాది భాషల్లో నటించాలన్న కోరిక ఉన్న అందుకు ఇంకా సమయం రావడం లేదు. ఇక కీర్తి సురేష్ కూడా సినీ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఈమె తల్లి మేనక పలు చిత్రాల్లో కథానాయక నటించారు. తండ్రి సురేష్ మలయాళంలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయికగా పేరుపొందారు. ఈమె ఇంతకుముందే బోనీకపూర్ నిర్మించిన హిందీలో చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలు వల్ల ఆ చిత్రంలో చోటు దక్కలేదు. అయితే అప్పటి నుంచే ఈమెకు నటి జాన్వీకపూర్‌కు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా ప్రస్తుతం జాన్వీకపూర్ నటించిన విలీ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఆమె తండ్రి బోనికపూర్ జీ.స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది మలయాళంలో 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హెలన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో నటి జాన్వీకపూర్ బిజీగా ఉన్నారు. ఆ ప్రచారంలో భాగంగా జాన్వీ కపూర్‌ను కీర్తి సురేష్ ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారో గానీ, ఆ ఫొటోలను కీర్తి సురేష్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నేడు (శుక్రవారం) జాన్వీ స్వామివారి సేవలో పాల్గొంది. విఐపీ తన స్నేహితురాలితో కలిసి మొక్కులు చెల్లించుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా బ్లూ కలర్ లంగాఓణీలో కనిపించి ఆకట్టుకుంది. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! కాగా ప్రత్యేకమైన రోజుల్లో జాన్వీ తరచూ తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించి గుడ్‌లఖ్ జెర్రీ ఓటీటీలో విడుదలైన మంచి విజయం అందుకుంది. ఇక ఆమె నటించిన తాజా చిత్రం బవాల్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌవుతోంది. ఈ క్రమంలో షూటింగ్ విరామం ఇచ్చిన జాన్వీ స్వామి వారి సేవలో పాల్గనేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఆమె మిస్టర్ అండ్ మిస్ మహి అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. -
‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం లైగర్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అయితే లైగర్‌లో ముందుగా తాను వేరు హీరోయిన్ను అనుకున్నట్లు చెప్పాడు. చదవండి: ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు ఈ మేరకు పూరీ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం జాన్వీ కపూర్‌ను కలిశా. ఎందుకంటే కథ అనుకున్నప్పుడే విజయ్‌కి జోడిగా జాన్వీని అనుకున్నాను. నేను శ్రీదేవి విరాభిమాని కావడంతో నా చిత్రం ద్వారానే జాన్వీని తెలుగులో లాంచ్ చేయాలనుకున్నా. అందుకే జాన్వీని కలిసి కథ వినిపించా. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు ఇదే విషయాన్ని కరణ్‌కు చెప్పడంతో ఆయన అనన్య పేరును సూచించారు. దీంతో అనన్యను హీరోయిన్గా ఫైనల్ చేశాం. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఆమె ఎంత మంచి నటి అనేది. ప్రతి సీన్లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చాడు. కాగా పూరీ కనెక్ట్స్-ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్-చార్మీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాన్ని జరపుకున్న ఈ మూవీకి బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 7 అసభ్యకర సన్నివేశాలని ఉన్నాయని, వాటి తొలగించి చిత్రం విడుదల చేయాలని పేర్కొంటూ సెన్సార్ బోర్డు లైగర్‌కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. -
డేటింగ్ అనే కాన్సెప్టే అమ్మానాన్నకు నచ్చదు, కానీ నేను అలా కాదు: జాన్వీ
బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేశి కూతురు జాన్వీ కపూర్ లేటెస్ట్ చిత్రం గుడ్‌లక్ జెర్రీ. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో జాన్వీ వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ప్రేమ, పెళ్లిపై స్పందించింది. అయితే డేటింగ్ కాన్సెప్ట్ అనేది తన తల్లిదండ్రులకు నచ్చదని చెప్పింది. చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే.. ‘‘నాకు నచ్చిన వ్యక్తినే పెళ్లాడానేది అమ్మనాన్న(శ్రీదేవి, బోనీ కపూర్) కోరిక. అలా అని డేటింగ్ అంటే వారికి నచ్చదు. అమ్మ ఎప్పుడు నాతో చెబుతూ ఉండేది. ‘నీకు ఎవరైన నచ్చితే మా దగ్గరికి తీసుకురా. మేం పెళ్లి చేస్తాం’ అన్నట్లు ఉండేవారు. కానీ, నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాలేమని తెలుసు. కానీ లైఫ్‌లో కాస్తా ఎంజాయ్మెంట్ అనేది కూడా ఉండాలి కదా. నేను చిల్లింగ్ టైప్. కానీ చిల్ అనే కాన్సెప్ట్‌ని వారు అర్థం చేసుకోలేరు’’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ అయితే సింగిల్‌గా తన లైఫ్ సంతోషంగానే ఉందని తెలిపింది. ఈ క్రమంలో తన పాస్ట్ రిలేషన్స్‌పై జాన్వీ మాట్లాడుతూ.. ‘ఒకరితో సాన్నిహిత్యంగా ఉండటమంటే అది మన ఇష్టం. మనకు కావాలని కోరుకున్నప్పుడు దాన్ని పొందడం చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ దానికి కట్టుబడి ఉండటానికి చాలా భయపడతారు. అప్పుడు రిలేషన్షిప్ అంటేనే భయమేస్తోంది. అదే సమయంలో ఎవరితోనైనా నిజమైన సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు వారి సౌలభ్యం కోసం ఒకరిని దూరం పెట్టడాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది’ అంటూ సూచించింది. -
‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేశి తనయ జాన్వీ కపూర్ తల్లిని తలుచుకుని ఎమోషనలైంది. తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్రీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్ నేపథ్యంలో జాన్వీ తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా జాన్వీ తల్లితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ అమ్మ లేకుండ జీవించడం చాలా కష్టంగా ఉందంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ ఇంటర్య్వూలో తన తల్లికి, తనకు ఉన్న పోలికను గురించి జాన్వీకి ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడేందుకు జాన్వీ కాస్తా బెరుకు చూపించింది. ‘అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు గర్వం అంటున్నారు. అందుకు తన గురించి మాట్లాడాలంటే భయమేస్తుంది. తను గురించి ఏం చెప్పిన నా తన సినిమాలతో నా మూవీస్‌ను పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెలా ఉండటం కాదు నటనలో కూడా మీ తల్లి పేరు నిలబెట్టు అంటూ కామెంట్స్ చేస్తున్నారు’ అని చెప్పింది. చదవండి: మళ్లీ గ్రామీణ కథ అనగానే.. భయపడ్డా: కార్తీ అయితే ‘అదే ఇప్పుడు అమ్మ ఉండుండే ఈ ప్రశ్నకు చాలా సౌకర్యంగా సమాధానం చెప్పేదాన్ని. తనకు నాకు చాలా విషయాల్లో పోలిక ఉన్నా కూడా ఇప్పుడు వాటి గురించి చెప్పలేకపోతున్నా’ అంటూ జాన్వీ వాపోయింది. కాగా జాన్వీని తెరపై చూడాలన్న తన కోరిక తిరకుండానే శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. జాన్వీ తొలి చిత్రం ‘ధడఖ్’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో 2014లో దుబాయ్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడ శ్రీదేవి మృతి చెందారు. -
‘లేడీ సూపర్‌స్టార్’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తాజాగా నటించిన చిత్రం గుడ్ లక్ జెర్రీ. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన కొలమావు కోకిలకు చిత్రానికి రీమేక్ ఇది. జూలై 29న ఈ మూవీ డస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యిన ఈ చిత్ర పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటుంది. ఇందులో జాన్వీ నటనకు ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు సినీ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల జాన్వీ ఓ చానల్‌తో ముచ్చటింది. ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నయనతార తనపై ప్రశంసలు కురిపించిందంటూ ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య ‘‘గుడ్ లుక్ జెర్రీ ట్రైలర్‌పై నయనతార సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఆమె నా నటనను ప్రశంసించారని చదివా. దీంతో తనకి థ్యాంక్స్ చెప్పాలని నంబర్ తెలుసుకుని మెసేజ్ చేశాను. నా మెసేజ్‌కి వెంటనే ఆమె ఇలా రిప్లై ఇచ్చారు. ‘కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నా. కోకిల నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించావు. గుడ్ లక్ జాన్వీ’ అంటూ మెసేజ్ చేశారు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ‘ఏకంగా లేడీ సూపర్ స్టార్ నన్ను ప్రశంసించడం మంచి అనుభూతిని ఇస్తుంది. తన ప్రశంస నాకు చాలా ప్రత్యేకం’ అంటూ తెగ సంబరపడిపోయింది జాన్వీ. చదవండి: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్ ఫొటోతో రచ్చ -
తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో
Janhvi Kapoor Will Give Entry In South Industry: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో బీటౌన్‌లో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఇప్పటివరకు బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ త్వరలో సౌత్‌లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అది కూడా జాన్వీ ఫేవరెట్ హీరోతో అని టాక్. అతనెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కించే చిత్రంలో విజయ్ దేవరకొండకు పక్కన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించనుందట. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. అయితే 'లైగర్' మూవీలో మందుగా హీరోయిన్గా జాన్వీనే అనుకున్నారట. కానీ కుదర్లేదు. అలాగే జాన్వీని మొదట తెలుగులోనే కథానాయికగా పరిచయం చేయాలనుకున్నారు శ్రీదేవి. ఫైనల్‌గా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది
Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19: బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. జనవరి 10న జాన్వీ కపూర్ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోస్‌తో వారికి కరోనా సోకిందని అనుమానాలు వచ్చాయి. ఈ పోస్ట్‌లో జాన్వీ తన నోట్లో థర్మామీటర్ పెట్టుకుని కనిపించింది. ఆమెతోపాటు ఖుషీ కపూర్ కూడా ఉంది. జాన్వీ ఇన్‌స్టా పోస్ట్ చూసి వారికి కరోనా సోకిందని భావిస్తున్నారు. వీరితో పాటు బోనీ కపూర్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో వారి నివాసాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు (బీఎంసీ) సీల్ వేసి శానిటైజ్ చేసిన విషయం తెలిసిందే. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా అర్జున్, అన్షులా, రియాకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా వారు అధికారికంగా వెల్లడించలేదు. బాలీవుడ్ తారలను కరోనా తెగ ఇబ్బందిపెడుతుంది. ఇప్పటికే జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్, మధుర్ భండార్కర్, ప్రేమ్ చోప్రా, అతని భార్య ఉమా చోప్రా, మృణాల్ ఠాకూర్, స్వరా భాస్కర్లకు కొవిడ్ సోకింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని -
'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు
Janhvi Kapoor Praises Allu Arjun For Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో మించి హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 7న దక్షిణాది భాషల్లో విడుదలైంది పుష్ప చిత్రం. కానీ హిందీలో ఇంకా విడుదల కాలేదు. త్వరలో జనవరి 14న సంక్రాంతి కానుకగా హిందీలో కూడా రిలీజ్ చేయనుంది అమెజాన్. ఇదిలా ఉంటే బాలీవుడ్లో 'పుష్ప' ఫైర్ గట్టిగానే అంటుకుంది. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లతోపాటు హీరోయిన్లు కూడా పుష్ప రాజ్‌కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై రీసెంట్గా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా అల్లు అర్జున్ను, 'పుష్ప' సినిమాను పొగిడాడు. ఆర్య సినిమా నుంచే బన్నీకి ఫ్యాన్ అంటూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చాడు. తాజాగా అర్జున్ చెల్లెలు జాన్వీ కపూర్ సైతం పుష్పరాజ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ప్రపంంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ స్టోరీ పెట్టింది. ఇప్పటికే బీటౌన్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా అల్లు అర్జున్ కూడా బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం 'అబ్బా సాయిరాం' అన్నట్లుగా ఉంది. ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం
Janhvi Kapoor Shares Cryptic Post About She Has Fever: బీటౌన్‌లో కరోనా మహమ్మారి తగ్గేదే లే అంటూ వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడి ఐసోలేట్ అయ్యారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని తనకు కూడా కరోనా వచ్చిందా అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి. జాన్వీ మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకుని ఉన్న ఫొటో తనకు జ్వరం వచ్చినట్లుగా చెబుతోంది. పోస్ట్‌లో 'మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకున్న జాన్వీ ఫొటో, తాను వేసిన పెయింటింగ్, ఫ్రమ్ ది సోల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ రైటర్స్ పుస్తకంలోని ఒక పేజి, తన పెంచుకునే కుక్కపిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో, తన సెల్ఫీ, ఖుషీ కపూర్ పక్కన పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో' ఉన్నాయి. ఈ పోస్ట్‌కు 'మళ్లీ ఆ సంవత్సరపు కాలం' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కాగా ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్', 'మీరు పెయింటింగ్ చాలా బాగా వేశారు. నాకు చాలా నచ్చింది', 'ముందు బ్రష్ వేసుకోండి. తర్వాత ఫొటోలు దిగితే బాగుంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని -
అజిత్ సినిమా కోసం నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్
Valimai Posters Launched Naga Chaitanya Vijay Devarakonda Jhanvi Arjun: తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగులోనూ అనేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటన, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్‌లో అజిత్‌ను చూస్తే సగటు అభిమానికి పూనకం రాకుండా ఉండదు. అజిత్ తాజా చిత్రం 'వలిమై'లో బైక్ చేజింగ్ సీన్స్‌తో తన అభిమానులకు మళ్లీ పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకూ తమిళ పోస్టర్, ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న అజిత్ కుమార్ ‘వాలిమై’ మూవీ ట్రైలర్ తాజాగా బుధవారం (జనవరి 5) తెలుగు టైటిల్‌తో కూడిన విడుదల తేది పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ను టాలీవుడ్ గుడ్‌బాయ్ నాగచైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నేను అజిత్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు చై. 'అజిత్ గారు, మై బ్రదర్ కార్తికేయ, చిత్ర బృందం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అని విజయ్ ట్వీట్ చేశాడు. అలాగే వలిమై హిందీ పోస్టర్లను బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు. My absolute pleasure to launch the Telugu poster of #AjithKumar sir’s #Valimai being a huge fan myself! wishing the team all the very best @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #NiravShah @humasqureshi #ValimaiFromPongal pic.twitter.com/pDUsz6d2oM — chaitanya akkineni (@chay_akkineni) January 4, 2022 Wishing #AjithKumar garu, my Brother @ActorKartikeya and the entire team all the very best! @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa #NiravShah #Valimai in Telugu, Tamil and Hindi. #ValimaiFromJan13 pic.twitter.com/6YHfx5Ycjh — Vijay Deverakonda (@TheDeverakonda) January 4, 2022 ఈ పోస్టర్లలో అజిత్ తుపాకీ పట్టుకుని సీరియస్ కనిపించాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించగా.. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి హీరోయిన్ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: దీపికా బర్త్‌డే.. ప్రభాస్, సమంతల స్వీటెస్ట్ విషెస్ -
లంగా ఓణిలో శ్రీదేవి.. ఎంజాయ్ చేస్తున్న జాన్వీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్దతు తెలిపాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తూ బాలయ్యకు థ్యాంక్స్ చెప్పాడు. లంగా ఓణిలో అదరగొట్టింది శ్రీదేవి విజయకుమర్ ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Satyadev (@actorsatyadev) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
రాశి ముద్దులు.. రేణు నవ్వులు.. జాన్వీ ఎదురుచూపులు
బ్లూ సారీలో నవ్వులు చిందిస్తున్న రేణూదేశాయ్ మే ఒకటో తేది కోసం ఎదురు చూస్తున్నానంటున్న జాన్వీ కపూర్ ప్రేమ అంటే ఇదే అంటూ ఓ చిన్నారికి ముద్దులు పెడుతున్న వీడియోని షేర్ చేసింది రాశీఖన్నా తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని, తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను బాగానే ఉన్నానని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను పెట్టాడు అల్లు అర్జున్ View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
చిల్ అవుతున్న జాన్వీ, ఇది జస్ట్ శాంపిల్ అంటోన్న కీర్తి
♦ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటోన్న కీర్తి సురేశ్ ♦ ఊపిరి పీల్చుకోండని చెప్తోన్న దీప్తి సునయన ♦ అలా చేస్తే కనీసం నీడను కూడా చూడలేరంటోన్న ప్రగ్యా జైస్వాల్ ♦ గ్యాంగ్‌తో కలిసి స్టెప్పులేసిన జాన్వీకపూర్ ♦ మాల్దీవుల్లో చిల్ అవుతున్న పాత ఫొటోను షేర్ చేసిన మంచు లక్ష్మి ♦ పుస్తకం చదవడం పూర్తైందంటున్న శోభిత ధూళిపాల ♦ వైట్ కలర్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతున్న సాయి మంజ్రేకర్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Saiyami Kher (@saiyami) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
‘మిస్ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం
అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి నేడు. ఫిబ్రవరి 24వ తేదీన ఆమె దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె వర్ధంతి సందర్భంగా శ్రీదేవి కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఆమె మరణించిదనే విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. తల్లి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా శ్రీదేవి తనను ఉద్దేశించి స్వయంగా రాసిన ఓ పేపర్‌ను జాన్వీ పంచుకుంది. ‘ఐ లవ్యూ మై లబ్బు.. యువర్ ద బెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్’ అని శ్రీదేవి రాసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా బోనీకపూర్, శ్రీదేవి కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. మిస్ యూ అని జాన్వీ, ఐ లవ్యూ అమ్మ అని ఖుషీ కపూర్ అంటూ పోస్టులు చేశారు. శ్రీదేవీ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెను స్మరించుకున్నారు. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) -
వైరల్: దుమ్మురేపుతోన్న జాన్వీ బెల్లి డ్యాన్స్
ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘దఢక్’ మూవీతో బాలీవుడ్ వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే జాన్వీకి డ్యాన్స్ అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. క్లాసికల్‌తో పాటు వెస్టర్న్ డ్యాన్స్‌తో ఆకట్టుకునే జాన్వీ తాజాగా బెల్లి డ్యాన్స్‌తో కూడా మైమరపించారు. కరీనా కపూర్ నటించిన ‘అశోకా’ చిత్రంలోని పాపులర్ పాటకు బెల్లి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. (చదవండి: ఆ నటి ఇంటి ఖరీదు రూ.39 కోట్లు) ఒకరకంగా చెప్పాలంటే నటి గాబ్రియేలాను తలపించేలా ఉన్న జాన్వీ బెల్లి నృత్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకూ సరదా ఫొటోలు, క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు షేర్ చేసిన ఆమె చాలా రోజుల తర్వాత సడెన్‌గా బెల్లి డ్యాన్స్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. కాగా ప్రస్తుతం ఆమె ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా ‘దోస్తానా 2’లో కూడా నటిస్తున్నారు. -
ఆ కాలంలో ఒకరోజు!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 70ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. ఇదేదో సినిమా కోసం అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే. 1950లలో అమ్మాయిలు ఎలా ఉండేవారు? ఎలాంటి డ్రెస్‌లు వేసుకునేవారు? ఏ విధమైన నగలు పెట్టుకునేవారు? వాళ్ల హెయిర్ స్టయిల్ ఎలా ఉండేది? అనే ఆలోచన జాన్వీకి వచ్చింది. అంతే.. అప్పటి తరం అమ్మాయిలు ఎలా ఉండేవారో కొందరిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఫొటోలు చూశారు. ఆ తర్వాత అప్పటి అమ్మాయిలా దుస్తులు, నగలు ధరించి ముస్తాబయ్యారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘1950వ దశకంలో ఒక రోజు జీవించినట్లు ఉంది. ఆ అనుభూతి భలే ఆనందాన్నిచ్చింది’ అని పేర్కొన్నారు జాన్వీ. లేత ఆకుపచ్చ, బంగారు అంచు ఉన్న చీర, గోధుమ, బంగారు టోన్డ్ బ్రోకెడ్ జాకెట్టు, ముత్యాల సెట్‌తో రెట్రో వైబ్స్‌ను ప్రేరేపించే మేకప్‌లో అందంగా ముస్తాబైన జాన్వీ లుక్స్ వైరల్‌గా మారాయి. ‘మీ లుక్ అదుర్స్’ అని ఆమె అభిమానులు కామెంట్లు షేర్ చేశారు. -
శ్రీదేవి కూతురు
ట్రోలర్స్ మహా కర్కశంగా ఉంటారు. శ్రీదేవి కూతురు కాబట్టి జాహ్నవి కూడా తన ఫస్ట్ మూవీలోనే తల్లి లెవల్లో అద్భుతంగా నటించాలని కోరుకుంటారు. ఒకవేళ అద్భుతం గా నటిస్తే అత్యద్భుతంగా ఏమీ లేదని పెదవి విరుస్తారు. ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా’ చిత్రంతో కొంత శాంతించారు. తల్లితో పోలిక తేలేదు. జాహ్నవి బాగా చేసింది అంటున్నారు. ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా తనేమిటో నిరూపించుకున్న జాహ్నవి, నటిగా తనేమిటో కూడా ఇదే సినిమాతో చూపించింది. తల్లి బతికి ఉంటే జాహ్నవి బుగ్గలు పుణికి ఉండేదే. జాహ్నవికి ఇది రెండో సినిమా. మొదటి చిత్రం ‘ధడక్’. కమర్షియల్ హిట్. అయితే ట్రోలర్స్‌కి అందులో జాహ్నవి నటన నచ్చలేదు. ‘ఈ సినిమాను చూడ్డానికి మీ అమ్మ లేకపోవడం మంచిదయింది’ అని ట్రోల్ చేశారు. అప్పటికి బాధపడేంతగా పెద్దది కాలేదు జాహ్నవి. 21 ఏళ్లు. ఇప్పుడు గుంజన్ సక్సేనాకు వస్తున్న కాంప్లిమెంట్స్ జాహ్నవికి ధడక్ విమర్శలను గుర్తు చేస్తున్నాయి. ‘నన్ను నేను మెరుగుపరచుకోడానికి విమర్శలు ఒక అవకాశం..‘ అంటూ నవ్వుతోంది. ఈ మాట అంటోందీ అంటే పెద్ద పిల్ల అయిందనే! ధడక్ తర్వాత, గుంజన్‌కు ముందు.. మధ్యలో ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘అంగ్రేజీ మీడియం’లలో కనిపించింది జాహ్నవి. మరో రెండు.. ‘రూహీ అఫ్జానా’, ‘దోస్తానా 2’ ప్రస్తుతం మేకింగ్ లో ఉన్నాయి. -
అది నా పర్సనల్: విజయ్ దేవరకొండ
‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా థియేటర్ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్ టైమ్స్ రిలీజ్ చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్-2019’ జాబితాలో విజయ్ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మీ ప్రేమ విషయం గురించి చెప్పండి అన్న ప్రశ్నకు అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ముక్కుసూటిగా జవాబిచ్చాడు. ఒకవేళ తాను ప్రేమలో పడినప్పటికీ ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతానని తెలిపాడు. తన పర్సనల్ విషయం అందరికీ వినోదంగా మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని పేర్కొన్నాడు. కేవలం ఆ సీక్రెట్‌ను తన తల్లిదండ్రులకు, స్నేహితులకు మాత్రమే చెప్తానని చెప్పుకొచ్చాడు. అందరికీ చాటింపు చేయడం నచ్చదని, అది ఎవరి వ్యాపారమూ కాదని రౌడీ ఘాటుగానే జవాబిచ్చాడు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అందరికీ బహిర్గతం చేస్తానన్నాడు. ఇక సినిమాల పరంగా ఎవరితోనైనా నటించేందుకు సిద్ధమేనని, అయితే బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వానీ, జాన్వీ కపూర్లతో నటించాలని ఉందని మనసులో మాట చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. (విజయ్ సినిమాలో విలన్‌గా అనసూయ..!) -
శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్
-
శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్
సాక్షి, తిరుమల: శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరివురు తన స్నేహితురాలితో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాన్వీ 3500 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు జాన్వీ కపూర్‌కి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరించారు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా చీరకట్టులో జాన్వీకపూర్ శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. #JhanviKapoor visits Tirupati to seek blessings of Lord Venkateshwara. She climbed 3,500 steps barefoot and offered prayers to the presiding deity. pic.twitter.com/2hdRtJNHAB — Bollywood Knocks (@BollywoodKnocks) February 10, 2020 -
నన్నెవరో ఆవహించారు!
షూటింగ్ పూర్తి చేసినప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు. కానీ, ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసి ‘హమ్మయ్య’ అని రిలీఫ్ ఫీలవుతున్నారు జాన్వీ కపూర్. బాలీవుడ్లో రూపొందిన హారర్ అంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్’. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జాన్వీకపూర్ విభాగానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారని తెలిసింది. ‘ఘోస్ట్ స్టోరీస్’లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేసిన జాన్వీ మాట్లాడుతూ –‘‘స్క్రిప్ట్ నన్ను బాగా ఆకట్టుకోవడంతో పాత్రలో బాగా లీనమయ్యాను. కానీ, షూటింగ్ సమయంలో చాలా భయపడ్డాను. మనిషి భావోద్వేగాల్లో భయం కూడా ఒక ముఖ్యమైనదనిపిస్తోంది. నిజం చెప్పాలంటే షూటింగ్ పూర్తయ్యేలోపు మా బృందంలోని పదిమందిలో ఎనిమిది మంది అనారోగ్యం బారినపడ్డారు. షూట్ సమయంలో నన్ను ఎవరో ఆవహించినట్లు, షూట్ తర్వాత వదిలేసిన అనుభూతికి లోనయ్యాను. ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ నన్ను చాలా భయపెట్టింది’’ అని జాన్వీ పేర్కొన్నారు. ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీలో ఓ భాగంలో జాన్వీ, మిగతా భాగాల్లో శోభితా ధూళిపాళ్ల, మృణాల్ ఠాకూర్ నటించారు. న్యూ ఇయర్‌కి ఈ ‘ఘోస్ట్ స్టోరీస్’ వీక్షకుల ముందుకు రానుంది. -
భయపెడతా
వచ్చే ఏడాది 12 గంట కొట్టగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఫుల్ జోష్‌లో ఉంటారందరూ. కానీ ఆ కేరింతల్ని భయంతో, ఊహించని థ్రిల్‌తో వచ్చే అరుపులుగా మార్చబోతున్నాం అంటున్నారు జాన్వీ కపూర్. వచ్చే ఏడాదిని ‘ఘోస్ట్ స్టోరీస్’తో ప్రారంభించబోతున్నారు జాన్వీ కపూర్. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘లస్ట్‌స్టోరీస్’ యాంథాలజీ తరహాలోనే ‘ఘోస్ట్ స్టోరీస్’ రూపొందించబడింది. ‘లస్ట్‌స్టోరీస్’ను తెరకెక్కించిన కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ ఈ యాంథాలజీను డైరెక్ట్ చేశారు. ఇది జనవరి 1వ తారీఖున రాత్రి 12గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేసిన కథలో జాన్వీ నటించారు. -
హాలీవుడ్ నటుడితో పోటీపడుతున్న కఫూర్ ఫ్యామిలీ
ఢిల్లీ : బోనీ కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ పాత్రకు గట్టి పోటీ ఇస్తున్నారట ! అదేంటి.. కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ సినిమాలో నటించడంమేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్తను మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. జార్జ్ క్లూనీ 2009లో తాను నటించిన 'అప్ ఇన్‌ది ఎయిర్' సినిమాలో చివరి వరకు తన ఇంట్లో కన్నా విమాన ప్రయాణాల్లోనే ఎక్కువగా కనిపిస్తాడు. అదే సంఘటన గురువారం కపూర్ ఫ్యామిలీలోనూ చోటుచేసుకుంది. గురువారం కపూర్ ఫ్యామిలీ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమవుతూ విమానంలో ప్రయాణం చేశారు. ఇదే విషయాన్ని తాజాగా అన్షులాకపూర్ వారి కుటుంబసభ్యులు వాట్సప్ గ్రూప్‌లో చేసిన చాట్‌ను స్క్రీన్‌షాట్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో తన ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో ఎవరు ఎక్కడ ఉన్నారని చేసిన సంభాషణను పంచుకున్నారు. ప్రస్తుతం దోస్తానా 2 షూటింగ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్లకు తాను అమృత్‌సర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు మెసేజ్ చేశారు. అదే విధంగా అన్షులా కపూర్ కూడా ' నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరాను' అంటూ మెసేజ్ పెట్టారు. ఇదంతా గమనించిన బోనీ కపూర్ తాను కూడా ఇప్పుడే చెన్నెనుంచి ముంబయికి బయలుదేరడానికి ఎయిర్పోర్ట్ లాంజ్‌లో వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అన్షులా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ' ఓ మైగాడ్ ! ఏంటో ఈరోజు అందరం విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నామా' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. వీరి సంభాషణను స్ర్కీన్ షాట్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'మాకు డాడ్ కిడ్స్ అనే పేరుతో వాట్సప్ గ్రూఫ్ ఒకటి ఉంది. ఆ గ్రూపులో నాతో పాటు అన్షులా, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, మా నాన్న సభ్యులుగా ఉన్నాము. మేము ప్రతీ విషయాన్ని ఒక మొమొరీగా గుర్తుంచుకునేందుకు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటామని' మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ కపూర్ వెల్లడించారు. -
జాన్వీ డౌట్
చదువు, ఆటల్లో తప్ప ఒక మనిషికి ఉండే సున్నితత్వం, మర్యాద, మన్నన వగైరా ఏదీ లేని వ్యక్తిని హీరోగా, హృదయ బద్ధలైన ప్రేమికుడిగా చూపించి హిట్టయి.. అంతే సంచలనం రేపిన తెలుగు, హిందీ సినిమాలు.. అర్జున్‌రెడ్డి, కబీర్ సింగ్! ‘తోచినట్టు’ ఉండడం.. ‘నచ్చింది’ చేయడం.. హీరోయిజంగా తెరమీద చూపిస్తే ఎంత ప్రమాదమో.. ఎంత అనర్థమో చెప్పడానికి ఇటీవల ‘టిక్‌టాక్’ స్టార్ అశ్వని కుమార్ అలియాస్ ‘జానీ దాదా’ చేసిన హత్యే ఉదాహరణ. తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే విషయం తెలిసి ఆగ్రహావేశాలతో ఆ అమ్మాయిని చంపి.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు జానీ. సదరు టిక్‌టాక్ ‘జానీ దాదా’ కబీర్ సింగ్ సినిమా చూసి తీవ్ర ప్రభావం చెందినట్టు పోలీసులు చెప్పడాన్ని బట్టి తెలుస్తోంది. పాపం.. ఈ లేటెస్ట్ న్యూస్ తెలీకో ఏమో మరి జాన్వీ కపూర్ ‘‘మగవాళ్లు ఎలా ఉన్నా హీరోలా చూపిస్తారు.. మరి ఆడవాళ్ల నెత్తినెందుకు మర్యాద, సంప్రదాయం, ఆచారం అంటూ తట్టెడు బరువును నెడతారు? లేడీస్‌ను కూడా లేడీ అర్జున్‌రెడ్డి, లేడీ కబీర్ సింగ్లా ఎందుకు చిత్రీకరించరు?’’ అంటూ ప్రశ్నించింది.. ‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ’ వేదిక మీద. ‘‘బాందిని సినిమాలో నూతన్ పోషించిన పాత్రే అన్నిటి కన్నా బెస్ట్ ఫిమేల్ రోల్’ అని కూడా అంది ఈ యువనటి. -
నా పెళ్లి తిరుపతిలోనే...
పెళ్లికి చాలా టైమ్ ఉంది కానీ పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్ రెడీ అంటున్నారు జాన్వీ కపూర్. శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు జాన్వీ. తొలి చిత్రం ‘ధడక్’లో నటిగా మంచి మార్కులు వేయించుకుని, ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో పవర్ఫుల్ పైలట్‌గా టైటిల్ రోల్ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అందుకే ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. పైగా జాన్వీ వయసు 22. పెళ్లికి చాలా టైమ్ ఉంది. మరి.. ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను జాన్వీ ముందుంచితే – ‘‘నా పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. తిరుపతిలో చేసుకుంటా. హంగూ, ఆర్భాటాల్లాంటివి ఏవీ ఉండవు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా ఆహ్లాదకరంగా పెళ్లి వేడుక జరగాలని ఉంది. పెళ్లికి కంచి పట్టు చీర కట్టుకుంటా. అలాగే విందులో దక్షిణాది వంటకాటు ఉంటాయి. నాకు ఇడ్లీ–సాంబార్, పెరుగన్నం, పాయసం.. వంటివన్నీ ఇష్టం. అవన్నీ విందులో ఉంటాయి’’ అన్నారు. జీవిత భాగస్వామిగా ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? అని అడిగితే – ‘‘ఊహల్లో తిరిగే వ్యక్తి అక్కర్లేదు. చాలా ప్రతిభావంతుడు అయ్యుండాలి. అలాగే తన జాబ్‌ని ఎంతో ఇష్టంగా చేయాలి. అతన్నుంచి నేను ఎంతో కొంత నేర్చుకునేంత ప్రతిభావంతుడు అయ్యుండాలి. చమత్కారంగా ఉండాలి’’ అన్నారు జాన్వీ కపూర్. -
ఆ వార్తల్లో నిజం లేదు : బోనీ కపూర్
ధడక్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్‌కు సౌత్ సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోల పక్కన అవకాశం వచ్చినా.. ఆ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరిస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్న తరుణంలో ఈ రూమర్స్‌పై బోనీ కపూర్ పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తమకు సౌత్ సినిమాలంటే ఇష్టమని.. శ్రీదేవీ అక్కడి నుంచే వచ్చిందని, సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇలా ప్రముఖ హీరోలందరితో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని బోనీ కపూర్ చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబుతో, రామ్‌చరణ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, జాన్వీ వాటికి తిరస్కరించందనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే సౌత్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుందని, సరైన కథ కోసం ఎదురుచూస్తున్నామని బోనీకపూర్ తెలిపాడు. తాజాగా అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘నేర్కొండ పార్వై’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
వైరల్ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్
అందాల తార స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. జాన్వీ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫస్ట్ మూవీ ఫలితం ఎలాగున్నా బీటౌన్‌లో జాన్వీ ఫాలోయింగ్ బాగానే ఉంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతూ ఉంది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో కెమెరా కళ్లకు చిక్కుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు ఊరికే ఉంటారా? లైక్‌లు, కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 3లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్స్
-
రెడీ టు ఓట్!
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే పండుగే. ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఐదేళ్లకోసారి వస్తుంది. అలాంటిది తొలిసారి ఓటు హక్కు వస్తే ఆ కిక్కే వేరబ్బా. యువతలో ఉత్సాహం పొంగిపొరలుతుంది. ఓటుహక్కు వినియోగించుకొని సిరా చుక్క ఉన్న వేలుని చూపిస్తూ సెల్ఫీ దిగితే చాలు.. ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం. ఈ ఉత్సాహానికి సామాన్యులా, సెలబ్రిటీలా అన్న తేడా లేదు. ఓటింగ్ పెంచడానికే ఈసారి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి ఫొటోలు దిగి ప్రచారాన్ని ప్రారంభించారు. మరెందరో బాలీవుడ్ నటీనటులు ఓటు వేయండహో అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. రాజకీయ రంగం మాదిరిగానే బాలీవుడ్‌లోనూ వారసులదే హవా. ఈసారి ఏయే తారల నట వారసులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారంటే.. అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, శ్రీదేవి వెండితెర సామ్రాజ్యాన్ని ఏలినవారు. వీరి వారసులు కూడా అదే స్థాయిలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి కూడా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. తమ స్టైల్‌తో, సెల్ఫీలతో ఆకట్టుకునే ఈ యంగ్ తరంగ్‌లో చాలామంది తొలిసారి ఓటు వేయనున్నారు. ముంబైలో ఈ నెల 29న జరగనున్న పోలింగ్‌లో వీరిలో చాలామంది తొలిసారి తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న బాలీవుడ్ స్టార్ వారసులు వీరే... ఇరా ఖాన్ ఆమిర్‌ఖాన్ మొదటి భార్య రీనా చిన్న కుమార్తె ఇరా ఖాన్. 22 ఏళ్ల ఇరా ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించదు. తండ్రితో బయట కనిపించినప్పుడు మాత్రం వార్తల్లో వారి చిత్రాలు చోటు చేసుకుంటాయి. తొలిసారి ఓటింగ్‌కి ఇరా సిద్ధమవుతోంది. ఆలియా ఫర్నీచర్‌వాలా హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన నటి పూజా బేడీ కూతురు ఆలియా. 21 ఏళ్ల ఆలియా సైబర్ బుల్లీయింగ్‌పై గళం ఎత్తటంతో గత ఏడాది వార్తాల్లోకి ఎక్కింది. ఈమె ఎక్కువ శాతం విదేశాల్లోనే గడుపుతుంటుంది. అయినా ఓటు వేసే అవకాశం ఉంది. ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్, అమృతాసింగ్‌ల కుమారుడు ఇబ్రహీం అలీఖాన్. 18 ఏళ్లు నిండటంతో ఓటు వెయ్యడానికి అర్హత సంపాదించుకున్నాడు. అయితే ఇబ్రహీం ఓటింగ్ తేదీకి నగరంలో ఉంటాడో లేదో స్పష్టత లేదు. నవ్య నవేలి నందా అమితాబ్‌బచ్చన్ మనవరాలు నవ్యకి 22 ఏళ్లు. ఢిల్లీలో నివసించే ఈమె మొదటిసారి తన ఓటుని మే 12న వినియోగించుకోనుంది. అక్కాచెల్లెళ్లు పోలింగ్ కేంద్రానికి వెళతారా? శ్రీదేవి–బోనీకపూర్‌ల పెద్ద కూతురు జాహ్నవికి ఇప్పుడు 22 ఏళ్లు. ‘ధడక్’ హిందీ చిత్రంతో గట్టి ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది తన ఓటు హక్కుని వినియోగించుకోనుంది. ఈమె సోదరి ఖుషీ కపూర్‌కు 19 ఏళ్లు. సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది ఖుషీ. అమ్మ, అక్క బాటలో ఈమె త్వరలో చిత్రరంగంలోకి ప్రవేశించనుంది. అక్కాచెల్లెళ్లిద్దరూ తొలిసారి ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అనన్య పాండే బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు అనన్యకి ఇటీవలే 20 ఏళ్లు రావటం తో ఓటెయ్యడానికి సిద్ధమైం ది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2 చిత్రంతో సినీ ప్రవేశం చేస్తోంది. అన్నాచెల్లెళ్లకి ఆ స్ఫూర్తి ఉందా? ఆర్యన్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుమారుడు. ఈ అబ్బాయి సిటీలోకి వస్తే చాలు పాపారాజీ మొదలు. ఎక్కడికెళ్లినా ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేస్తుంటారు. ఆ పాపారాజీకి చిక్కితే ఆర్యన్ తండ్రితో కలిసి ఓటు వెయ్యటం వైరల్ వీడియోగా మారొచ్చు. అయితే 21 ఏళ్ల జూనియర్ ఖాన్ విదేశాల్లో చదువుతున్నందు వల్ల వచ్చి ఓటేసే అవకాశాలపై అనుమానాలున్నాయి. ఇక షారుక్ కుమార్తె సుహానా ఖాన్.. ఆర్యన్లాగే సుహానా ఒక్క ఫొటో దొరికితే చాలు ఇంటర్నెట్ అంతా హల్చలే. షారుక్, గౌరీ ఖాన్ గారాల పట్టి సుహానాకు నిరుడు 18 ఏళ్లు నిండాయి. ఆమె ఈ ఏడాది తొలిసారి ఓటు వెయ్యవచ్చు. శనాయా కపూర్ బాలీవుడ్ హీరో అనిల్‌కపూర్ తమ్ముడు, హీరో సంజయ్ కపూర్ కూతురు శనాయా కపూర్. ఈమెకి 19 ఏళ్లు. ఈ ఏడాది మొదటిసారి ఓటు హక్కుని వినియోగించుకోనుంది. పెదనాన్న కూతురు సోనమ్ కపూర్ నటనా స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది శనాయా. -
శ్రీదేవిగారి అమ్మాయి
తొలి సినిమా ‘ధడక్’తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రీదేవి ముద్దుల తయన జాన్వీ కపూర్. తన అభిమాన నటుడు రాజ్‌కుమార్‌రావుతో కలిసి ఒక కామెడీ హారర్ సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘సంచార జీవితం అంటే ఇష్టం’ అంటున్న జాన్వీ అంతరంగ తరంగాలు ఇవి.... మనసు పలికే.. చిన్నప్పుడు నేను ఎప్పుడూ నటి కావాలని అనుకోలేదు. మా అమ్మ కూడా నన్ను నటి చేయాలని ఎప్పుడూ ఆనుకోలేదు. ఒక దశలో చరిత్ర మీద బాగా ఆసక్తి కలిగింది. సృజనాత్మక రచనలు చేయాలనుకునేదాన్ని. ఎన్ని చేయాలనుకున్నా మనసు మాత్రం ‘నేను నటిని’ అని ఫిక్సైపోయింది. సీక్రెట్ ఏజెంట్! చిన్నప్పుడు స్కూల్లో కట్టుకథలు బాగా అల్లేదాన్ని.‘‘నేను మీలాంటి స్టూడెంట్‌ని కాను. సీక్రెట్ ఏజెంట్‌ని. ఒక వ్యక్తి మీద నిఘా వేయడానికి ఇక్కడ స్టూడెంట్‌గా నటిస్తున్నాను’’ అని చెప్పేదాన్ని. అదేమిటో...అందరూ నమ్మేవారు. ‘‘ఒక్క సారైతే... నాకు బెల్లీ డ్యాన్స్ నేర్పించడం కోసం షకీరా ముంబై వస్తుంది’’ అని చెప్పాను. నేను చెప్పింది ఫ్రెండ్స్ నమ్మడమే కాకుండా వాళ్ల ఇంట్లో కూడా విషయం చెప్పారు. అంతే...అమ్మకు వాళ్ల పేరెంట్స్ నుంచి ఒకటే ఫోన్లు... ‘‘గుడ్‌న్యూస్ తెలిసింది. మా అమ్మాయిని కూడా పంపమంటారా’’ అని రిక్వెస్ట్‌గా అడిగేవాళ్లు! సంచారమే బాగుంటుంది! నటి కాకపోతే...ప్రపంచాన్ని చుట్టేసేదాన్ని. కొత్తవ్యక్తులను కలుసుకునేదాన్ని. సృజనాత్మక రచనలు చేసేదాన్ని. సంచార జీవితం అంటే నాకు ఇష్టం. ‘ధడక్’ కోసం కథక్ నేర్చుకున్నాను. ఇది ఎంతో అందమైన నృత్యం. అమ్మ డ్యాన్స్ చూసి డ్యాన్స్‌లో చిన్నప్పుడు శిక్షణ తీసుకుందని అందుకే అంతా బాగా చేయగలుతుందని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. డ్యాన్స్‌లో అమ్మ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. డ్యాన్స్మాస్టర్లు చెప్పినట్లు అప్పటికప్పుడు అద్భుతంగా చేసేది...నిజంగా ఇది గొప్ప విషయం. అమ్మ మాట సినిమారంగంలోకి వచ్చిన తరువాత అమ్మ చెప్పిన ముఖ్యమైన మాట...‘మంచి నటి కావడానికి ముందు మంచి వ్యక్తి కావాలి. నిజాయితీ ఉండాలి. అది జరగనప్పుడు మనం ఏ పాత్రకూ న్యాయం చేయలేం’ నటనలో నాదైన ముద్ర కనిపించాలనే ఉద్దేశంతో ‘ఇలా నటించు...అలా నటించు’ అని సలహాలు ఇవ్వలేదు. ఎప్పుడూ సెట్స్‌కు రాలేదు. -
హృదయంలో నువ్వే ఉంటావు!
ఏడాది క్రితం అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. శ్రీదేవి చనిపోయి ఏడాది కావస్తోంది, అభిమానులు, సినీ ప్రముఖులు మరోసారి శ్రీదేవి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ‘‘నా హృదయం ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. కానీ నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే నా హృదయంలో ఉండేది నువ్వు (తల్లి శ్రీదేవి) కాబట్టి’’ అని క్యాప్షన్ చేశారు. -
డాడీ కోసం డేట్స్ లేవ్!
సాధారణంగా ‘హోమ్ బేనర్’ అంటేనే ఏదో స్పెషల్ కిక్ ఉంటుంది ఎవరికైనా. కానీ ఈ కిక్‌ను ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ వద్దనుకుంటున్నారు. తండ్రి బోనీ కపూర్ ఆఫర్ చేసిన సినిమాలో నటించడానికి ‘నో’ చెప్పారు. కూతురు కాదన్నందుకు బోనీ కపూర్ సంబరపడిపోతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి కుమార్తె ఎదిగిందని ఆనందపడుతున్నారాయన. పైగా తండ్రికే డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయినందుకు ఆయన డబుల్ హ్యాపీ. ‘‘మా ఫ్యామిలీతో కరణ్ జోహార్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రస్తుతం జాన్వీకి మంచి గైడ్‌లా ఉన్నారు కరణ్. జాన్వీని కూతురిలా భావిస్తారాయన. నా ప్రమేయం లేకుండానే జాన్వీ నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పెద్ద కూతురితో నేను తీయబోయే సినిమా తీసే టైమ్ వీలైనంత తొందరగా రావాలని కోరుకుంటున్నాను’’ అని బోనీ కపూర్ పేర్కొ న్నారు . అందడీ సంగతి.. జాన్వీ కపూర్ దగ్గర డాడీ సినిమాకు డేట్స్ లేవన్నమాట. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోçహార్ రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమా 2020 లో రిలీజ్ కానుంది. ఇది కాకుండా వేరే ఓ ప్రముఖ బేనర్లో సినిమా చేయడానికి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే తండ్రి సినిమాకి డేట్స్ ఇవ్వ లేకపోయారు. -
ఫస్ట్‌లుక్ 27th August 2018
-
ప్రతిష్టాత్మక చిత్రంలో జాన్వీ కపూర్!
‘ధడక్’ చిత్రంతో జాన్వీ కపూర్ ఆకట్టుకున్నారు. జాన్వీ అందం, అభినయంతో సినీ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత జాన్వీకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సౌత్ సినిమాల్లో కూడా జాన్వీని నటించపజేయాలని బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. బాలీవుడ్లో జాన్వీ నటించబోయే తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. ‘తక్త్’ అనే చారిత్రాత్మక చిత్రంలో జాన్వీ నటిస్తున్నారు. ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, కరీనా కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్, అనిల్ కపూర్లు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ 2020లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. BIG NEWS... Karan Johar's next movie: #Takht... Stars Ranveer Singh, Kareena Kapoor Khan, Alia Bhatt, Vicky Kaushal, Bhumi Pednekar, Janhvi Kapoor and Anil Kapoor... Official announcement: pic.twitter.com/71nXaMIHy3 — taran adarsh (@taran_adarsh) August 9, 2018 -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న: ‘ధడక్’ హిట్ అయింది. శ్రీదేవి నం.2 అనిపించుకోవాలని ట్రై చేసినట్లున్నారు?! జాహ్నవి : మీకు నేను శ్రీదేవి నం.2 గా అనిపించవచ్చు. కానీ అమ్మ నన్ను.. జాహ్నవి నం.1 గా నిలబడాలని కోరుకున్నారు. చనిపోవడానికి ముందే అమ్మ ఈ సినిమాలో నేను నటించిన కొన్ని సన్నివేశాలను చూశారు. బాగుందని చెప్పలేదు. బాగోలేదనీ చెప్పలేదు. ‘మనిద్దర్నీ ప్రేక్షకులు పోల్చి చూసుకోకూడని విధంగా నీ నటన ఉండాలి’ అని అమ్మ నాతో అన్నారు. మంచి నటిగా కన్నా, మంచి మనిషిగా ఎదగాలని మరీ చిన్నప్పుడు అమ్మ నాతో చెబుతుండేవారు. అందరితో విధేయంగా ఉండాలనీ, సమయాన్ని పాటించాలని చెప్పేవారు. ధడక్ షూటింగ్ మొదలైనప్పుడు కూడా అమ్మ ఇదే చెప్పారు. ఎలా నటించాలని మాత్రం చెప్పలేదు. అందుకే నేను జాహ్నవిలా నటించాను తప్ప, అమ్మను ఇమిటేట్ చెయ్యాలని ప్రయత్నించలేదు.‘ధడక్’ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో ఆ సంతోషంలో శ్రీదేవి కూతురు జాహ్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ‘బిహైండ్ ది సీన్’ ఫొటోలలో ఇది ఒకటి. జాహ్నవి మేకప్‌లో లేనప్పుడు తీయించుకున్న ఈ ఫొటో శ్రీదేవి అభిమానులందరికీ విపరీతంగా నచ్చేసింది. -
జాన్వీకి పాడాలనుంది!
ధడక్... ఇప్పుడు నలుగురి కళ్లల్లో మెదులుతున్న సినిమా! ప్రఖ్యాత హిందీ గాయని లతామంగేష్కర్ నోటా ధడక్ మాట వినపడింది. అంతేకాదు.. జాన్వీకి ప్లేబ్యాక్ పాడాలనుంది అని కూడా చెప్పారు. ‘సాధారణంగా నేను సినిమాలు చూడను. జాన్వీ సినిమా ధడక్ చూశా. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది. జాన్వీకి నేపథ్యం పాడాలనుకుంటున్నాను’ అన్నారు. ఈ సందర్భంగానే అనిల్ కపూర్ నటిస్తున్న ‘ఫనే ఖాన్’ ట్రైలర్‌నూ చూశారు లతా. ‘బోనీ, అనిల్... మొదటి నుంచి మా మంగేష్కర్ కుటుంబానికి చాలా దగ్గర. ఇన్ఫాక్ట్ నేనంటే చాలా అభిమానం. అనిల్కైతే మరీను. అనిల్ అంటే మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం. ధడక్ సినిమాతో బోనీ మొహంలో నవ్వు చూశాను. శ్రీదేవి మరణంతో చాలా కుంగిపోయాడు. బోనీ మళ్లీ మామూలు మనిషవుతోంది జాన్వీ వల్లే. ఆ పిల్ల సినిమాతో అతనిలో మళ్లీ కొంత హుషారు కనిపించింది’ అంటూ కపూర్స్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానాన్ని వెలిబుచ్చారు లతామంగేష్కర్. ‘ఫన్నేఖాన్’ సినిమాలో అనిల్‌కపూర్ పాత్ర లతామంగేష్కర్, మహ్మద్‌రఫీ అభిమానిగా ఉంటుంది. ఆ పాత్ర తన కూతురిని లతా మంగేష్కర్‌లా చేయాలని అనుకుంటుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘నా పన్నెండో ఏట సినిమా నేపథ్య గాయనిగా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల్లో సినిమారంగంలో నా పట్ల అదే అభిమానం. అది నా అదృష్టం. ఈ సందర్భంగా దేశంలోని సింగర్స్ అందరికీ నేనొక మాట చెప్పదల్చుకున్నాను.. ఇంకో కిషోర్ కుమార్లాగో.. రఫీలాగో.. లతాలాగో కాకండి.. మీలా మీరుండండి.. మమ్మల్ని ఇమిటేట్ చేయకండి.. మీ స్వరం ప్రత్యేకతను చాటుకోండి’ అని సలహా ఇచ్చారు లతామంగేష్కర్. -
అమ్మపై కోపం వచ్చింది!
ఇప్పుడు అందరి దృష్టి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పైనే. ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘ధడక్’ ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవ్వడమే ఇందుకు కారణం. మరాఠీ చిత్రం ‘సైరాట్’కు రీమేక్ ఇది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ‘ధడక్’ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను జాన్వీ బయటపెట్టారు. తల్లి శ్రీదేవి మీద కోపం వచ్చిన ఓ సంఘటనను ‘ధడక్’ మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా ముందు చెప్పారు. ‘‘నాకు దాదాపు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, కమల్‌హాసన్‌గారు నటించిన ‘సాద్మా’ సినిమాను చూశా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ను అమ్మ గుర్తుపట్టలేక పోయిన సన్నివేశం నన్ను కదలించింది. ‘నువ్వు.. కమల్‌హాసన్‌ను ఎందుకు గుర్తుపట్టలేదు?’ అని అమ్మతో అలిగి రెండు రోజులు మాట్లాడలేదు. అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా అమ్మ ఎమోషనల్‌గా నటించిన సినిమాలను నేను చూడను. ఎందుకంటే ఎక్కవగా ఏడ్చే క్యారెక్టర్స్‌నే అమ్మ చేసింది. కానీ ‘సాద్మా’లో అమ్మ ఇంకొకరిని ఏడిపించారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలు మహేంద్ర దర్శకత్వంతో కమల్‌హాసన్, శ్రీదేవి నటించిన తమిళ చిత్రం ‘మూడ్రామ్ పిరై’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ‘వసంతకో కిల’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్నే హిందీలో ‘సాద్మా’గా తీశారు. ఈ సినిమాలో శ్రీదేవి, కమల్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. -
‘జింగాత్’ను ఖూనీ చేశారు; అభిమానుల ఆగ్రహం
ముంబై: ‘‘ఒరిజినాలిటీలో ఉన్న మహత్తే వేరు’’,.. శ్రీదేవి కూతురు జాన్వీ తెరంగేట్రం చేస్తోన్న ‘ధడక్’ సినిమాలో పాటను విన్నవాళ్లలో కొద్దిమంది అంటున్నమాటిది. ఇంకొందరైతే ‘‘మా ఫేవరెట్ పాటను ఖూనీ చేశారు.. ఈ పాపం ఊరికే పోదు..’’ అని శపిస్తున్నారు! కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ‘ధడక్’ జులై 20న విడుదల కానుంది. ఇది మరాఠీ బ్లాక్ బస్టర్ ‘సైరట్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కాగా, అందరిచేతా ‘వహ్వా!’ అనిపించిన ‘ జింగాత్’ పాటను కూడా ‘ధడక్’లో (భాష మార్చి) యాజిటీజ్‌గా వాడేశారు. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది అజయ్-అతుల్ జోడీనే! తేడా ఏముంది?: మరాఠీలో లిరిక్స్ సందర్భోచితంగా సాగగా.. హిందీలో ఏమాత్రం అదోరకం పదాలు వాడినట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒరిజనల్లో కొరియోగ్రఫీక్ మూమేట్స్ కాకుండా వేడుకల్లో మనం చూసే డాన్స్‌లే కనిపిస్తాయి.. హిందీలో కుప్పిగంతులు వేయించారని మండిపడ్డారు. అలా బుధవారం విడుదలైన ‘ధడక్-జింగాత్’కు డిస్‌లైక్స్ కొడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ‘జింగాత్’ ఫ్యాన్స్. ‘‘కరణ్.. జింగాత్ పాటను పాడు చేసిన తీరు చూస్తే సినిమాను ఇంకెలా చెడగొట్టావో అర్థమవుతోంది..’’ అని ఫైరైపోయారు. అయితే, మరాఠీ వెర్షన్ చూడనివారు మాత్రం ఈ పాటే బాగుందని మెచ్చుకోవడం సహజమే. మీరు కూడా కిందిచ్చిన రెండు పాట(తాజా (హిందీ) జింగాత్ను, ఒరిజినల్ (మరాఠీ) జింగాత్)లను చూసి ఏది బాగుందో చెప్పండి.... (ధడక్) (సైరట్) Zingat from Sairat Zingat from Dhadhak#ZingaatRuined pic.twitter.com/uY8WMdaJmZ — Smoking Skills (@SmokingSkills_) 27 June 2018 Pic 1- Zingaat from Sairaat 😍 Pic 2- Zingaat from Dhadak 😒#ZingaatRuined Who agrees with me? 🙋😜 pic.twitter.com/c7ZPcSCvY5 — 💥 Šheetu ❤ Šhilpu 💥 (@Dil_ka_aitbaar) 27 June 2018 People to Karan Johar after listening to #Zingaat #zingaatRuined pic.twitter.com/RNlKoFwOMb — Ganesh Parmar (@SarcasmSeekar) 27 June 2018 Now I am 100% sure @karanjohar gonna ruined Sairat , #zingaatRuined Zingaat is successfully ruined . — Mrs. Shah Rukh Khan (@SRKkiSoni) 27 June 2018 Listened to this song 3 times after listening to Dhadak’s Zingaat.😭#ZingaatRuined pic.twitter.com/LQ0va5Hdj2 — Nutella ❥ (@Netzz_Rathi) 27 June 2018 Zingat original Vs Zingat remake@karanjohar #ZingaatRuined pic.twitter.com/SCn7F3nNgK — Imran (@imranyh) 27 June 2018 What Karan Johar has done to #Zingaat song...#zingaatRuined pic.twitter.com/Oswn1yMqHi — The (@Chandorkar) 27 June 2018 -
ధడక్ ట్రైలర్ విడుదల
-
జాన్వీ సినిమా: అర్జున్ ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ నటి శ్రీదేవి మరణించిన తర్వాత అర్జున్ కపూర్ తన తండ్రి బోని కపూర్‌తో పాటు చెల్లెలు జాన్వీ, ఖుషీలకు అండగా నిలబడుతూ వస్తున్నారు. అర్జున్ మాత్రమే కాదు అన్షులా కూడా వారితో ప్రేమగా ఉంటున్నారు. జాన్వీ వెండితెరకు పరిచయమవుతున్న ధడక్ మూవీ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. జాన్వీ నటించిన తొలి చిత్రం ట్రైలర్ రిలీజ్ కానున్న కొన్నిగంటల ముందు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనస్సుకు హత్తుకునేలా ఓ పోస్ట్ చేశారు. ‘సోమవారం నీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది.. ఇక నువ్వు ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచిపోతావు. నేను ముంబైలో లేనందుకు సారీ.. కానీ ఎప్పుడు నేను నీ వైపే ఉంటాను. నువ్వు బాగా కష్టపడుతూ, నిజాయితీగా ఉంటూ, ఇతరుల అభిప్రాయాలకు గౌరవిస్తూ, నీకంటూ ప్రత్యేక పంథాను ఏర్పరుచుకుంటే ఈ ఫీల్డ్ నీకు చాలా గొప్పగా ఉంటుంది. ఇది చాలా కష్టమైనది కానీ నువ్వు వీటన్నింటికి సిద్ధంగా ఉన్నావని తెలుసు. అల్ ది బెస్ట్ ధడక్ టీమ్, నా మిత్రులు కరణ్ జోహార్, శశాంక్‌లు నిన్ను, ఇషాన్‌ను మోడ్రన్ రోమియో, జూలియట్లుగా తీర్చిదిద్ది ఉంటారు’ అని చెల్లిపై తన ప్రేమను చాటుకున్నారు అర్జున్ కపూర్. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నారు. -
జాన్వీ కపూర్ ‘ధడక్’ ట్రైలర్ ఎప్పుడంటే?
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ ఖట్టర్, జాన్వీకి జోడిగా నటిస్తున్నాడు. జాన్వీ నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో లుక్ విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మించగా, శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూలై 20న విడుదల కానంది. Trailer launch on Mon [11 June 2018]... Ishaan Khatter and Janhvi Kapoor... New poster of #Dhadak... Remake of Marathi blockbuster #Sairat... Directed by Shashank Khaitan... 20 July 2018 release. pic.twitter.com/PpWdPtIxUF — taran adarsh (@taran_adarsh) June 9, 2018 -
ఆయన నటనంటే చాలా ఇష్టం: జాన్వీ
సాక్షి, చెన్నై: వర్ధమాన హీరోయిన్ జాన్వీ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవి. తమిళం, తెలుగు, హిందీ ఈ మూడు భాషల్లోనూ నంబర్‌వన్ హీరోయిన్గా రాణించింది శ్రీదేవి. ఆమె వారసురాలుగా పెద్ద కూతురు జాన్వీ తెరంగేట్రం చేసింది. శ్రీదేవి కోలీవుడ్‌లో నటనకు శ్రీకారం చుట్టగా, జాన్వీ బాలీవుడ్లో పరిచయం కానుంది. హీరోయిన్ జాన్వీ తనకు ఇష్టమైన హీరో ధనుష్ అని చెప్పింది. భవిష్యత్‌లో దక్షిణాది చిత్రాల్లో నటిస్తుందో? లేదో? వేచి చూడాలి. జాన్వీ నటించిన తొలి హిందీ చిత్రం ‘దడాక్’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందనే చెప్పాలి. అలాంటి ‘దడాక్’ చిత్రం జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో జాన్వీ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ ఒక పత్రిక కోసం జాన్వీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ఆమె పలు విషయాలను పంచుకున్నారు. చివరిగా ఉత్తరాది, దక్షిణాదిలో మీకు నచ్చిన హీరో ఎవరని ప్రశ్న అడిగారు. జాన్వీ మాత్రం టక్కున హీరో ధనుష్ అని చెప్పింది. ధనుష్ చిత్రాలు, ఆయన నటన తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పడం విశేషం. -
నేను సినిమాల్లోకి రావడం అమ్మకు ఇష్టంలేదు
అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తన తొలి చిత్రం ‘ధడక్’తో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. తొలి సినిమా విడుదల కాకముందే భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జులైలో విడుదల కానున్న సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ ‘వోగ్’కు తొలి ఇంటర్వ్యూనిచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ జోహర్ జాన్వీ ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగా జాన్వీ ముఖచిత్రంతో కూడిన కవర్ పేజీ విడుదలైంది. దీనిని జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేస్తూ ‘ఈ ఫొటోను షేర్ చేయడాన్ని ఎంతో ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇది మ్యాగజైన్ కోసం నా తొలి కవర్ ఫొటో. ‘వోగ్ ఇండియా’ నాకు ఇంతటి ప్రత్యేక అనుభూతిని కలిగించినందుకు థ్యాంక్స్’ అని తెలిపారు. ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పిన కబుర్లు... ‘అమ్మ దుబాయ్‌లో జరిగే వివాహానికి హాజరవ్వడం కోసం లగేజ్‌ను ప్యాక్ చేసుకుంటుంది. ఆ సమయంలో నాకు నిద్ర పట్టకపోవడంతో నన్ను నిద్రపుచ్చమని అమ్మను అడిగాను. కానీ తాను పనిలో ఉండటం వల్ల నా దగ్గరకు రాలేదు. తర్వాత అమ్మ వచ్చి చూసేసరికి నేను నిద్రపోతున్నాను. అయినా అమ్మ వచ్చి నా పక్కన కూర్చుని నా తల నిమిరింది. ఖుషీ తన గురించి తాను చూసుకుంటుంది. కానీ నేను అలా కాదు. నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అమ్మే దగ్గరుండి చూసుకునేది.’ అని తెలిపారు. ఇతరులను చూసి ఈర్ష్య పడటం, అనవసరంగా ఇతరుల మీద కోప్పడం వంటివి చేయకూడదని తన తల్లి చెప్పిందని జాన్వీ పేర్కొన్నారు. తన తొలి చిత్రం ‘ధడక్’కు సంబంధించిన ప్రతి విషయాన్ని అమ్మే దగ్గరుండి చూసుకునేదని తెలిపారు. ఈ చిత్రంలోని 25 నిమిషాల నిడివి ఉన్న పుటేజ్‌ను శ్రీదేవి చూసిందన్నారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల గురించి అడగ్గా... ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్ కపూర్, సోదరి అన్షులా కపూర్ తమని చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అయితే తమ జీవితాల్లో అమ్మ లేని లోటు ఎప్పటికి అలానే ఉంటుందన్నారు. నేను ఇంకా చిన్నపిల్లలానే ఉంటాను. కానీ ఖుషీ అలా కాదు. తనను తాను చూసుకోవడమే కాకుండా నన్ను కూడా ఖుషీనే చూసుకుంటుంది. ఇప్పుడు నాకు నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు తనే నన్ను నిద్ర పుచ్చుతుందని తెలిపారు. -
జాన్వీ కపూర్‌ను చూసి అభిమానుల కేరింతలు
-
వైరల్ : జాన్వీని చుట్టుముట్టిన అభిమానులు
ముంబై : ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. హీరోయిన్గా స్టార్ స్టేటస్ రాలేదు. కానీ ఆమె కనబడితే పిల్లలు, కుర్రాళ్లు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమె ఎవరో కాదు జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగానే ఆమె ఇంత ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు. జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరత్’ మూవీ రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ శుక్రవారం జాన్వీకి ఒక సంఘటన ఎదురైంది. బాంద్రా ప్రాంతంలోని షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తూ జాన్వీ కనిపించేసరికి అక్కడి పిల్లలు, యువత ఆమెను పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. పిల్లల్ని చూసిన జాన్వీ సైతం ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది ఆమెతో ఫోటోలు దిగారు. అంతమంది చుట్టుముట్టినా కూడా.. జాన్వీ నవ్వుకుంటూనే వెళ్లి కారెక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. -
అమ్మ పాత్రలో మాధురీ.. జాన్వీ థ్యాంక్స్
సాక్షి, ముంబై: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఓ మూవీని నిర్మిస్తున్నారు. అభిషేక్ వర్మన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీ 'శిద్ధత్'. ఈ మూవీలో ఓ కీలకపాత్ర నటి శ్రీదేవి పోషించాల్సి ఉంది. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటి ఇటీవల చనిపోవడంతో ఆమె స్థానంలో మరో సీనియర్ నటి కోసం అన్వేషించారు. చివరికి శ్రీదేవి ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేస్తారని మాధురీ దీక్షిత్‌ను తీసుకుంది మూవీ యూనిట్. శ్రీదేవి, బోనికపూర్ పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'అభిషేక్ వర్మ తర్వాతి సినిమా స్టోరీ మా అమ్మ హృదయానికి చాలా దగ్గరైంది. అలాంటి సినిమాలో భాగం కానున్న మాధురీదీక్షిత్‌కు నా తరఫున, నాన్న బోనీకపూర్, ఖుషీల తరఫున ధన్యవాదాలు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అమ్మ చేయాల్సిన పాత్రకు మాధురీ న్యాయం చేస్తారని అభిప్రాయపడ్డ జాన్వీ.. అమ్మ చేస్తానని ఒప్పుకున్న సినిమా కావడంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. శ్రీదేవితో మూవీ చేయాలని భావించారు కరణ్. కానీ అంతలోనే అతిలోక సుందరి హఠాన్మరణం చెందడంతో కరణ్ సైతం ఎంతో బాధ పడ్డారని సన్నిహితులు తెలిపారు. మరోవైపు జాన్వీ తొలి సినిమా 'దఢక్' నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. -
శ్రీదేవి కూతురు సినిమా వీడియో లీక్
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం ధడక్. మరాఠీలో సంచలనం సృష్టించిన సైరాట్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జాన్వీ క్యారెక్టర్, లుక్స్ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తప్ప సినిమాలో జాన్వీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. జాన్వీ తొలి చిత్రం కావడం, శ్రీదేవీ వారసురాలు తెరపై ఎలా ఉంటుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమ సినిమా వీడియో లీకవ్వడం బాధాకరమని చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో లీకైన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన యూనిట్ నెట్లో లింకులను తొలగించేశారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌గా మారిన వీడియోను ఎంతో మంది వీక్షించారు. దీంతో చిత్ర బృందం ఒక నిర్ణయానికి వచ్చింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఎవరూ సెల్ఫోన్లు తీసుకురాకూడదని నిబంధనను పెట్టింది. ఇలా నిబంధనలు జారీ చేయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా రామ్‌లీలా, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల విషయాల్లో వీడియోలు, పోస్టర్స్‌లు లీకవ్వడంతో ఇలాంటి రూల్సే పెట్టారు. ఇంత చేస్తున్నారు కానీ, పబ్లిక్ ప్లేస్‌లో షూటింగ్ చేస్తే ఎంతమందిని కంట్రోల్ చేయగలరు మరి? -
కంటతడి పెట్టిన జాన్వీ కపూర్
చెన్నై : ప్రముఖ సినీనటి శ్రీదేవి సంతాప సభ సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కంటతడి పెట్టింది. గత నెల 24వ తేదీన దుబాయిలో హఠాన్మరణం పొందిన శ్రీదేవికి ఆదివారం చెన్నైలో సంతాపసభను నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలోని హోటల్లో నిర్వహించిన ఈ సంతాప సభకు బోనీకపూర్, ఆయన కూతుర్లు జాన్వి,ఖుషీ, శ్రీదేవి సోదరి శ్రీలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అతిలోక సుందరి శ్రీదేవికి మూగబోయిన గొంతుతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మౌనంగానే నివాళులర్పించారు. కాగా ముంబై నుంచి బీఎస్పీ పార్టీ నేత అమర్‌సింగ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటటి సురేష్ బాబు తదితరులు శ్రీదేవి సంతాపసభలో పాల్గొన్నారు. శ్రీదేవి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన సినీ ప్రముఖులు, బంధువులు, ఆప్తులు శ్రీదేవితో తమ అనుభవాలను పంచుకోకుండానే, ఎలాంటి ఉపన్యాసాలు లేకుండా మౌనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీదేవి కుటుంబ సభ్యులను సినీ ప్రముఖులు ఓదార్చారు. ఆ సమయంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కంటతడి పెట్టింది. మరోవైపు ఈ సంతాప సభకు మీడియాను అనుమతించలేదు. మీడియాకు అనుమతి లేదని చెప్పినా, ఎందుకు వచ్చారని శ్రీదేవి కుటుంబీకులు ప్రశ్నించడంతో ఎలక్ట్రానిక్ మీడియా బృందం హోటల్ ముందు భాగంలోని ఉండి సంతాప సభకు వచ్చినవారిని చిత్రీకరించారు. ఇక చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న శ్రీదేవి నివాసానికి ఆదివారం ఉదయం ప్రముఖ హీరో అజిత్, షాలిని దంపతులు వెళ్లి అక్కడ ఆమెచిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీదేవి కుటుంబసభ్యులను ఓదార్చారు. మరోవైపు దక్షిణ భారత నటీనటుల సంఘం నివాళులు అర్పించింది. నిన్న ఉదయం స్థానిక సంఘ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీదేవి చిత్రపటానికి సంఘ నిర్వాహకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు శివకుమార్, నటి అంబిక, కుట్టిపద్మిని, సంఘ కోశాధికారి కార్తీ పాల్గొన్నారు. -
వృద్ధాశ్రమంలో జాన్వీ పుట్టినరోజు వేడుకలు
-
వృద్ధాశ్రమంలో జాన్వీ బర్త్ డే వేడుకలు
శ్రీదేవి మరణించిన బాధనుంచి కపూర్ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మంగళవారం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. తల్లి మరణించిన బాధనుంచి జాన్వీని బయటకు తీసుకొచ్చేందుక కపూర్ కుటుంబం సభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. అందుకోసం జాన్వీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా జాన్వీ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వారితో కొంత సమయం గడిపిన తరువాత కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సెలబ్రేషన్లో పాల్గొంది. బోని కపూర్ మొదటి భార్య పిల్లలతో శ్రీదేవి కూతుళ్లకు సన్నిహిత సంబంధాలు లేవన్న విమర్శలకు చెక్క పెడుతూ అన్షులా కపూర్ కూడా ఈ పార్టీకి హజరైంది. జాన్వీ బర్త్ డేకు సంబంధించిన ఫొటోలను సోనమ్ కపూర్ తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. బోనీ కపూర్ దగ్గరుండి జాన్వీతో కేక్ కట్ చేయించారు. ఈ పార్టీలో జాన్వీ సొంత చెల్లెలు ఖుషీ కపూర్‌తో పాటు కపూర్ ఫ్యామిలీకి చెందిన జహాన్ కపూర్, షనయా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్లు పాల్గొన్నారు. -
నేను నేనే
శ్రీదేవి తరచూ మీడియాతో మాట్లాడేవారు కాదు.. కానీ మాట్లాడినప్పుడల్లా పదే పదే మాట్లాడించాలనిపిస్తుంది. చదివేవాళ్లకూ పదే పదే చదవాలనిపిస్తుంది. అలాంటి కొన్ని ‘సిరిమల్లె పువ్వులు’ మీకోసం... ► ‘రియల్ శ్రీదేవి’ ఎలా ఉంటారు? నేను అందరిలానే సాధారణ మనిషిని. నేనంత ఇంట్రస్టింగ్ కూడా కాదు. ఇంకో తల్లిదండ్రుల బిడ్డను. ‘రియల్ శ్రీదేవి’ అంటే ఏంటో తెలియాలంటే నా ఇంటికి వచ్చి నన్ను చూడాలి. నాకు చాలా సిగ్గు. అంత త్వరగా ఎవరితోనూ కలవలేను. మాట్లాడలేను. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నాకు అన్ ఈజీగా ఉంటుంది. సినిమాల్లో మాట్లాడేలా గలగలా మాట్లాడలేను. తక్కువగా మాట్లాడతా. ► ‘స్టార్డమ్’కి చేరుకున్నాక మీ ఫీలింగ్? చిన్నప్పటి నుంచి నాకేదైనా ఇష్టం అంటే అది నా దగ్గరకు వచ్చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా చీర నచ్చితే దానికోసం నేను షాప్‌కి వెళ్లక్కర్లేదు. అదే నా దగ్గరకు వచ్చేది. కోరుకున్నది మన దగ్గరికే వచ్చినప్పుడు జీవితం గురించి తెలుసుకునే చాన్స్ ఉండదు. ఆ విధంగా ‘స్టార్డమ్’ నాకు జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. ► నటిగా మీకు నచ్చని విషయం ఏంటి? మీరు ఫలానా సినిమాలో అందంగా ఉన్నారని అభినందిస్తే నాకు నచ్చదు. ఆ కాంప్లిమెంట్‌కి రియాక్ట్ అవ్వను. అదే ‘మీరు ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు’ అంటే అప్పుడు చాలా ఆనందపడతా. ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ► మీలా అందంగా, స్లిమ్‌గా కనిపించాలంటే ఏం చేయాలి? అందంగా ఉండటమంటే డైట్ ఫాలో అవ్వడం, జిమ్‌కు వెళ్లడం కాదు. మానసికంగా సంతోషంగా ఉండటం. మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనేది మన లుక్స్ నిర్దేశిస్తాయి. లోపల సంతోషంగా లేనప్పుడు డైట్ ఫాలో అయ్యి, ఎంత జిమ్ చేసినా ఉపయోగం ఉండదు. ► వేరే హీరోయిన్స్‌తో పోటీ? పోటీ అనేది సమఉజ్జీల మధ్య ఉంటుంది. ప్రస్తుతానికి నా సమఉజ్జీ శ్రీదేవీయే. నాకు నేనే పోటీ. ► మీ సినిమాల గురించి జాన్వీ, ఖుషీలు ఏమంటారు? నేను నటించిన పాత సినిమాలను జాన్వీ, ఖుషీ అంతగా చూడలేదు. కానీ ఎప్పుడైనా టీవీల్లో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూస్తారు. ఆ సినిమాల్లో నేను వేసుకున్న డ్రెస్‌లను అబ్జర్వ్ చేస్తారు. నేను కొన్ని సినిమాలకు ట్రెండీ డ్రెస్‌లను వాడాను. అవి బాగున్నాయంటారు. బాగా యాక్ట్ చేశావని కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సినిమాలంటే మీకు చాలా ఇష్టమా? నాలుగేళ్ల వయసు నుంచే నటించడం స్టార్ట్ చేశాను. అందరి అమ్మాయిల్లా నేను పెరగలేదు. నా చిన్నతనంలో స్టూడియోస్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఒకవేళ స్టూడియో వాతావరణాన్ని ఇష్టపడకపోయి ఉంటే ఎప్పుడో సినిమాలు వదిలేసేదాన్నేమో. ఒక సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎంత కష్టాన్నయినా ఇష్టంగా భావిస్తాను. ► మీ భర్త బోనీకపూర్ మిమ్మల్ని ఆటపట్టిస్తారా? నేను క్రమశిక్షణగా ఉంటాను. బోనీజీ ‘నువ్వేమైనా సాధువులా జీవిస్తున్నావా?’ అని ఆటపట్టిస్తారు. కానీ నా ఇష్టాలను ఆయన ఎప్పుడూ కాదనలేదు. ► యంగర్ జనరేషన్‌కి మీరిచ్చే సలహా? సక్సెస్‌నే కాదు ఫెయిల్యూర్‌నూ తట్టుకోగల మైండ్‌సెట్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలి. లైఫ్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కృతజ్ఞతాభావం, మానవత్వం ఉండాలి. మాట్లాడమని బోనీజీ బతిమాలేవారు మీరు స్వతహాగా మితభాషి కదా. ఇంట్లో కూడా అంతేనా? నేను తక్కువగానే మాట్లాడతాను. కానీ నాకు క్లోజ్‌గా ఉన్నవారితో బాగానే మాట్లాడతా. వర్క్ చేసే దగ్గర వర్క్ గురించే మాట్లాడటం ముఖ్యమని భావిస్తా. చెబితే నమ్మరు కానీ కాస్త ఎక్కువగా మాట్లాడమని బోనీజీ మొదట్లో బతిమాలేవారు. ఆ తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మేం ఇద్దరం ఉన్నప్పుడు నేనే ఎక్కువగా మాట్లాడతా. భర్తతో... పిల్లలు నన్ను వదిలి ఉండలేరు ► మీ పిల్లలు, మీరు అమ్మాకూతుళ్లలా కాకుండా అక్కచెల్లెళ్లలా ఉంటారు... మేం సిస్టర్స్లానే బిహేవ్ చేస్తాం. నేనెక్కడికైనా వెళితే చాలు జాన్వీ పదే పదే ఫోన్లు చేస్తుంటుంది. ఖుషీ కూడా అంతే. నన్ను వదిలి ఉండలేరు. వాళ్లు నాతో అలా క్లోజ్‌గా ఉండటం, నా మీద ఆధారపడటం, చిన్న చిన్న విషయాల్లో నన్ను డిస్ట్రబ్ చేయడం నాకెంతో ఫన్నీగా, హ్యాపీగా ఉంటుంది. పిల్లలతో... ► జాన్వీ సినిమాలో నటిస్తోంది కదా.. తనకు మీరిచ్చిన సలహా? మైండ్‌తో కాదు... హార్ట్‌తో వర్క్ చేయమని జాన్వీకి చెప్పాను. ‘నో పెయిన్ నో గెయిన్’ అని కూడా చెప్పాను. అమ్మా... నీ విజయాలకు నేనే సాక్ష్యం డియర్ మామ్.. నీ కీర్తి ప్రతిష్టలు, అంకితభావం, నిజాయితీ, స్ఫూర్తి గురించి వింటూ పెరుగుతున్నాను. నువ్వు సాధించిన విజయాలకు నేనే సాక్ష్యంగా ఉండటం నాకు ఆనందంగా ఉంది. జీవితంలో అన్నీ సాధించావు. నువ్వు సాధించిన ఈ ఘనత నన్ను ఈ ప్రపంచంలోనే గర్వపడే కూతుర్ని చేసింది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను... – నీ కూతురు జాన్వీ ఓ సందర్భంలో శ్రీదేవికి ఓపెన్ లెటర్ రాయమని ఓ పత్రిక ఆమె పెద్ద కుమార్తె జాన్వీని కోరగా ఆమె పై విధంగా రాశారట. తల్లంటే జాన్వీకి ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో అర్థమవుతోంది కదూ. మరణం తర్వాత... మీరు బాధపడే విషయం : మరణం తర్వాత జీవితం ఉండదని మీ విలువైన ఆస్తి : నా ఫ్యామిలీ మీకు బోర్ కొట్టించేది : షూటింగ్లో ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్‌కు పరిగెత్తడం మీ సెక్స్ అపీల్ : నా జీన్స్ (జన్యువులు) మీ బలం : ఏది జరిగితే దాన్ని ఆమోదించడం మీకు నచ్చే మీ ఫేవరెట్ క్వాలిటీ : నా ఎమోషన్స్ మిమ్మల్ని చిరాకు పెట్టించేది : రీ–మేక్ మూవీస్‌లో రీ–టేక్స్ తీసుకోవడం బర్త్‌డే అంటే : ఎడ్జ్‌కు ఇంకొంచెం దగ్గరకి వచ్చేశాం అని గుర్తు చేసే రోజు -
కూతురు జాన్వీతో మధుర క్షణాలు
సాక్షి, సినిమా : తన కూతుళ్లు తన స్థాయికి ఎదిగేలా చేయాలని శ్రీదేవి పడ్డ తపన అంతా ఇంతా కాదు. పెద్ద కూతురు జాన్వీ కోసం పక్కా కెరీర్‌ను ఫ్లాన్ చేసిన ఆమె.. అరంగ్రేటం చూడకుండానే నిష్క్రమించారు. ఇద్దరు కూతుళ్లలో జాన్వీతోనే తనకు సాన్నిహిత్యం ఉండేదని.. చిన్నకూతురు ఖుషీ మాత్రం నాన్న కూచి అని పలు ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు కూడా. ఈ క్రమంలో శ్రీదేవి-జాన్వీ మధ్య మధుర క్షణాలు ఎలా ఉన్నాయో చూడండంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. జాన్వీ బైక్ రైడ్ చేయగా.. వెనకాల శ్రీదేవి కూర్చున్నారు. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘అన్ని రోజులు మనవి కావు’ శ్రీదేవి చివరిసారిగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. జాన్వీతో అప్పుడే మీతో కొందరు పోల్చేయటం ఎంత వరకు సమంజసం అని విలేఖరి ప్రశ్నించగా.. దానికి ఆమె సమాధానం ఇచ్చారు. ‘జాన్వీ సినిమాల్లో నటిస్తా అని చెప్పినప్పుడు అంతా సంతోషించాం. నటించాలని తపన తనలో చాలా ఉంది. ఆ నిర్ణయాన్ని మేమూ సమర్థించాం. కానీ, నాతో పోల్చి చూస్తారనే భయం కలిగింది. అప్పుడే జాన్వీతో నేను చెప్పాం. నేను సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చా. ఈ స్థాయికి ఎదగటానికి నాకు మూడు దశాబ్దాలు పట్టింది. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు నా తల్లి కూడా భయపడింది. కానీ, అనుక్షణం నా వెంటనే ఉండి.. నా ఎదుగుదలకు తోడ్పడింది. ఇప్పుడు నేనూ అంతే. కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకోకూడదు. అన్ని రోజులు మనవి కావు. సొంత టాలెంట్‌తోనే నువ్వు రాణించాల్సి ఉంటుంది. కోట్లాది కళ్లు నీపై ఉంటాయి. అంచనాలు అందుకోవటంలో విఫలమైతే ఇక నీ పని అంతే’ అని జాన్వీని హెచ్చరించినట్లు శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
కూతురు జాన్వీతో శ్రీదేవి మధుర క్షణాలు
-
ఫిట్‌గా ఉండటం కోసమే డైట్
శ్రీదేవి విపరీతంగా డైట్ చేయడంవల్ల ఆమె ఆరోగ్యం పాడైందన్నది ఇప్పుడు కొందరి అభిప్రాయం. నిజానికి తాను విపరీతంగా డైటింగ్ చేయడంతో పాటు సన్నగా ఉండాలని పిల్లలను కూడా సరిగ్గా తిననిచ్చేవారు కాదనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. ఇదే విషయం గురించి గతంలో ఓసారి అడిగినప్పుడు.. జగదేక సుందరి నవ్వేశారు. ‘‘పిల్లల కడుపు మాడ్చే తల్లిని కాదు. ఆ మాటకొస్తే నేను అన్‌హెల్దీ వేలో ఫుడ్ తీసుకోను. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను హెల్త్ క్లబ్‌కి వెళ్లేదాన్ని. ఒకసారి నా పిల్లలు కూడా వస్తానంటే రమ్మన్నాను. అక్కడ నాతో పాటు జాన్వీ, ఖుషీ యోగా చేశారు. దాంతో పిల్లలను కూడా హెల్త్ సెంటర్స్‌కి తీసుకొచ్చి వాళ్లతో విపరీతంగా వర్కవుట్స్ చేయిస్తున్నానని, డైట్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అది నిజం కాదు. నా కూతుళ్లకు కూడా ఫిట్నెస్ మీద మంచి అవగాహన ఉంది. వాళ్లు స్పోర్ట్స్ ఆడతారు. ఫిట్‌గా ఉండాలనుకుంటారు. అందులో తప్పేముంది’’ అన్నారు శ్రీదేవి. భార్య కఠినమైన డైట్ పాటిస్తే భర్త బోనీ కపూర్ మాత్రం డైటింగ్‌కి దూరం. ఆయన భోజనప్రియుడు. ఆయనతో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయించడానికి శ్రీదేవి చాలా ప్రయత్నాలు చేశారట. కానీ పొద్దున్నే నిద్ర లేవగానే ఏదో వంక చెప్పి బోనీ తప్పించుకునేవారట. ‘‘డైట్ విషయంలో శ్రీదేవి చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. తను కంట్రోల్ చేసుకుంటూ నన్ను కంట్రోల్ చేస్తుంటుంది. వాస్తవానికి నేను భోజనప్రియుణ్ణి. హైదరాబాద్, చెన్నై వంటకాలు అంటే చాలా ఇష్టం నాకు. వీలు దొరికినప్పుడు ఫుడ్ లాగించడానికి ట్రై చేస్తాను. అలా చేస్తానని తనకీ తెలుసు. చిన్నగా మందలిస్తుంది. నాకు రెండే రెండు బలహీనతలు. ఫస్ట్ నా కుటుంబం అయితే సెకండ్ నాకు ఇష్టమైన ఫుడ్’’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తెలిపారు. భర్త ఫుడ్ లవర్ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు తినడానికి వీలుగా ఫుడ్ రెడీ చేయించేవారట శ్రీదేవి. -
వెండితెరపై కూతురిని చూడకుండానే..
న్యూఢిల్లీ : బాలీవుడ్ తొలి మహిళా సూపర్‌స్టార్‌గా పేరొందిన శ్రీదేవి తన కూతుళ్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. కూతుళ్లు ఝాన్వీ, ఖుషీ పట్ల ఒక తల్లిగా ఎంతో కేర్ తీసుకున్న శ్రీదేవి.. తన పెద్ద కూతురు సినీ రంగ ప్రవేశం గురించి కూడా ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. ఒక నటిగా, హీరోయిన్గా ఎన్నో దశాబ్దాలు సినీ పరిశ్రమలో కొనసాగిన ఆమె.. తన కూతురి ఆరంగేట్రం విషయంలో ఒకవైపు ఎక్సైట్ అవుతూనే.. మరోవైపు ఒక తల్లిగా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన కూతురు కెరీర్ గురించి కొంత మథనపడ్డారు. కూతురి బాలీవుడ్ ఆరంగేట్రం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘తను (ఝాన్వీ) సినీ రంగాన్ని ఈ వృత్తిగా ఎంచుకుంది. నేను ఎంతోకాలంగా ఈ పరిశ్రమలో ఉన్నాను. తన కన్నా ఎక్కువగా నేనే సంసిద్ధమై ఉన్నాను. తను నన్ను చూస్తూ పెరిగింది. సినీ రంగంలోకి రావడమంటే ఏమిటో తనకు తెలుసు. ఏ వృత్తిలోనైనా ఏది అనుకున్నంత సులువు కాదు. తను చాలా కష్టపడాల్సి ఉంటుంది. తనకు సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి తను సంసిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను’ అని శ్రీదేవి తెలిపింది. విషాదమేమిటంటే.. ఝాన్వీ బాలీవుడ్ ఆరంగేట్రం గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్న శ్రీదేవి.. మరికొద్ది నెలల్లో కూతురు వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతుండగా చూసేందుకు తను లేదు. ఇషాన్ కట్టర్ సరసన ‘ధడక్’ సినిమాతో ఝాన్వీ బాలీవుడ్లో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ, తన బాటలో సాగుతూ సిని పరిశ్రమలో అడుగుపెట్టిన ఝాన్వీ తొలి సినిమాలో ఎలా నటించిందీ చూడటానికి, ఒక తల్లిగా గర్వపడటానికి శ్రీదేవి ఇప్పుడు మనమధ్య లేకపోవడం.. ఆమె కుటుంబానికి, అభిమానులకు తీరని విషాదమే. -
శ్రీదేవి కూతురి కోసం సాహసం..!
దడక్ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్న అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ కోసం ఆ సినిమా హీరో ఇషాన్ కట్టర్ సాహసం చేశాడు. తన కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏకంగా బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు. దడక్ షూటింగ్ సమయంలో ఇషాన్, జాన్వీల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే తన కో స్టార్ ను షూటింగ్ కు తీసుకెళ్లేందుకు స్వయంగా జాన్వీ.. ఇషాన్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో ఇషాన్ జిమ్ లో ఉండటంతో బయటకు రావటం కాస్త ఆలస్యం అయ్యింది. ఈలోగా కారులో జాన్వీ ఉన్న సంగతి అక్కడ ఉన్నవారికి తెలియంటంతో చుట్టూ జనాలు గుమిగూడారు. మీడియా కూడా వచ్చేయటంతో విషయం తెలుసుకున్న ఇషాన్ పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా ఫస్ట్ ఫ్లోర్ బాల్కని నుంచి దూకేశాడు. ఈ లోగా జాన్వీ బాల్కని దగ్గరకు కారు తీసుకురావటంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇషాన్ చేసిన రిస్క్‌ను కొంతమంది ప్రశంసిస్తుంటే మరికొదంరు మాత్రం ఏదైన ప్రమాదం జరిగి ఉంటే షూటింగ్ ఆగిపోయి ఉండేది, హీరోలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయ పడుతున్నారు. -
టెంపర్ రీమేక్‌లో స్టార్ డాటర్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందింన సూపర్ హిట్ సినిమా టెంపర్. నటుడిగా ఎన్టీఆర్ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ స్టార్ వారసురాలు నటించనుందట. సింబా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా అలరించనుంది. తెలుగులో కాజల్ కనిపించిన పాత్రలో జాన్వీ నటించనుంది. అయితే ప్రస్తుతానికి జాన్వీ నటిస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ రీమేక్ ను కరణ్ జోహార్ నిర్మిస్తుండటంతో జాన్వీ నటించటం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జాన్వీపై కోలీవుడ్ కన్ను
తమిళసినిమా: కొత్త తారలను పరిచయం చేయడంలో కోలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అదే విధంగా వర్ధమాన నటీమణులు తమిళ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. అతిలోకసుందరిగా పేరు గడించిన నటి శ్రీదేవి లాంటి వారు కోలీవుడ్‌లో కథానాయకిగా రాణించిన వారే. శ్రీదేవి కోలీవుడ్, టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలిగి ఆ తరువాత బాలీవుడ్లో సెటిల్ అయ్యారు. ఆ మధ్య నటిగా రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లీష్ వింగ్లీష్, మమ్మీ వంటి చిత్రాలతో సత్తా చాటుకున్న శ్రీదేవి తాజాగా తన వారసురాలిగా పెద్ద కూతురు జాన్వీని రెడీ చేశారు. ఇప్పటికే హిందీలో కరణ్ జోహార్ దర్శకత్వంలో దడక్ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఆ చిత్రంలో నాజూగ్గా ఉండడానికి సన్నబడాలన్న దర్శకుడి ఆంక్షల మేరకు జాన్వి అందుకు కసరత్తులు చేసే పనిలో నిమగ్నమైంది. కాగా సెలబ్రిటీస్‌ను ఫొటోల్లో బంధించడానికి విమానాశ్రయాలు, నక్షత్ర హోటళ్లు, జిమ్‌ల వంటి ప్రాంతాల్లో ఫొటోగ్రాఫర్లు తచ్చాడుతుంటారు. అలా శ్రీదేవి వారసురాలు జాన్వీ తాజాగా ఫొటోగ్రాఫర్ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. అందాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా ముంబైలోని ఒక పేరు మోసిన జిమ్‌లో కసరత్తులు చేసి తిరిగెళుతున్న జాన్వీని ఒక ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. టైట్ బన్నియన్, రోస్ కలర్ లెగిగ్స్ ధరించిన జాన్వి తన కారు దగ్గరకు వెళుతూ ఫొటోగ్రాఫర్‌ను చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. అది చాలు ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌కు టక్కున క్లిక్ చేసి జాన్వి అందమైన బొమ్మను తన కెమెరాలో బంధించారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ కథ అలా ఉంచితే జాన్వీని కోలీవుడ్ చిత్రాలలో నటింపజేయడానికి కొందరు ప్రముఖ దర్శకనిర్మాతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం. అయితే శ్రీదేవి తన కూతురిని మొదట కోలీవుడ్‌లోనే పరిచయం చేయాలని భావించారని, ఆ తరువాత మనసు మార్చుకుని బాలీవుడ్‌పై మొగ్గు చూపారని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ఇక జాన్వి కోలీవుడ్కొచ్చేదెప్పుడా అని ఇక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ కాలం ఎప్పుడొస్తుందో ఎదురు చూడాలి. -
అదిరె.. అదిరె స్టైల్!
బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు మీడియాలోనూ వారికి ఫుల్ పాపులారిటీ ఉంది. వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ ఫాలో కావడంలో ముందుంటారు. కెమెరా కంట ఎప్పుడు కనపడినా.. తమ స్టైలిష్ లుక్‌తో అబ్బో అనిపిస్తున్నారు. అలా ఈ నలుగురు సుందరాంగులు తాజాగా కెమెరా కంటికి చిక్కారు. వారి స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. బ్లాక్ డ్రెస్‌లో.. కింగ్ ఖాన్ షారుఖ్ గారాలపట్టి సుహానా ఖాన్. ఇటీవల తల్లి గౌరీఖాన్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో తళుక్కుమంది ఈ సుందరాంగి. బ్లాక్ అసిమెట్రిక్ టాప్, హాట్ప్యాంట్స్ ధరించి.. నడుముకు గోల్డ్లేస్ విస్ట్బ్యాండ్తో ఫ్యాబులస్ లుక్‌తో సుహానా అదరగొట్టింది. ఆహా.. అనన్య..! నటుడు చుంకీ పాండ్యా తనయ అనన్య పాండ్యా గురించి తెలియనివారుండరు. సుహానా ఖాన్ బెస్టీ అయిన అనన్య ఇటీవల తన కజిన్ బర్త్‌డేలో అదిరె లుక్‌తో కనిపించింది. మెటాలిక్ షేడ్ స్లిప్ డ్రెస్‌తో అందరి లుక్స్‌ను తనవైపునకు తిప్పుకుంది. అబ్బో.. అలన్నా..! అనన్య పాండే చిట్టిచెల్లెలు అలన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. మోనిషా జైసింగ్ డిజైన్ చేసిన డ్రెస్‌లో ఈ అమ్మడు అదరగొట్టింది. స్టైలిష్ జాన్వీ..! జాన్వీ ఆ పేరు వింటేనే కుర్రకారు పడిచస్తారు.. ఆమె అందానికి ఫిదా అవుతారు. అతిలోక సుందరి శ్రీదేవి గారాల తనయ అయిన జాన్వీ ఇటీవల జిమ్ సెషన్‌ను ముగించుకొని.. అదిరే స్టైలిష్ డ్రెస్‌లో ఇలా దర్శనమిచ్చింది. -
అట్టా బెదరగొట్టొద్దు సారూ
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరాకు కొత్త కాదు. ఎక్కడికెళ్లినా ‘శ్రీదేవి కూతురు’ అంటూ వెంటాడే కెమెరాలు ఎన్నో. కానీ, కెమెరా ముందు నటనకు ఆమె కొత్త. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ధడక్’. మరాఠి చిత్రం ‘సైరట్’కు ఈ సినిమా రీమేక్. ‘ధడక్’ షూటింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్లో భాగంగా జాన్వీ కపూర్ పై మండిపడ్డారట శశాంక్ కేతన్. అంతేకాదు.. ఎక్కవ టేక్స్ తీసుకోకుండా యాక్ట్ చేయాలని ఇషాన్, జాన్వీలకు వార్నింగ్ ఇచ్చారట ఆయన. ఇన్సెట్లో ఉన్న ఫొటో చూస్తే.. ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇషాన్ దండం పెట్టడం, జాన్వీ బెదురు చూపులు చూస్తే ఎవరైనా ఇలానే అనుకుంటారు. ‘సార్.. కాస్త సుకుమారంగా హ్యాండిల్ చేయండి. పాపం.. పాప బెదిరిపోతోంది’ అని రిక్వెస్ట్ చేస్తున్నారట శ్రీదేవి ఫ్యాన్స్. ఫొటో చూసి శశాంక్ వార్నింగ్ ఇచ్చారని ఊహించుకున్నారేమో కానీ, అక్కడ అలాంటిదేం జరిగి ఉండకపోవచ్చు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సరదాగా ఇషాన్ దండం పెట్టినప్పుడు, జాన్వీ శ్రద్ధగా వింటున్నప్పుడు ఎవరైనా క్లిక్‌మనిపించిన ఫొటో అయ్యుండొచ్చు. -
లబ్ డబ్ కాదు... ధడక్!
అవును. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని చూస్తే కుర్రకారు గుండె వేగంగా కొట్టుకోవడం ఖాయం. ఆ జనరేషన్లో శ్రీదేవి గొప్ప అందగత్తె అయితే ఈ తరంలో ఆమె కుమార్తె జాన్వీ కూడా గొప్ప అందగత్తెల లిస్టులో ఉంటుంది. అందుకే జాన్వీని పరిచయం చేస్తూ, నిర్మించనున్న చిత్రానికి ‘ధడక్’ అని టైటిల్ పెట్టాలని నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారేమో. ధడక్ అంటే హార్ట్ బీట్ అని అర్థం. మరాఠీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘సైరాట్’కి ఇది రీమేక్. ఈ సినిమా గురించి ప్లాన్ జరిగి చానాళ్లయింది. కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దాంతో ‘సైరాట్’ రీమేక్ లేనట్లే అనే వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్లో సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయని, ‘ధడక్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారనే వార్త వచ్చింది. ‘బద్రినాథ్ కీ దుల్హనియా’ ఫేమ్ శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సైరాట్’ మహారాష్ట్ర నేపథ్యంలో ఉంటుంది. హిందీ రీమేక్‌ని మాత్రం హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తీయనున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ప్రముఖ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే జాన్వీ పలు కార్యక్రమాల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చి, కుర్రాళ్ల మతులు పోగొట్టారు. ఇక.. సిల్వర్ స్క్రీన్‌పై ఈ అందాల రాశిని చూశాక.. వాళ్ల గుండె లబ్ డబ్కి బదులు ధడక్ ధడక్... అని కొట్టుకుంటుందేమో! -
సెలబ్రిటీల కూతుళ్లతో స్టార్ డైరెక్టర్.. వైరల్
న్యూఢిల్లీ : బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లతో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల బాలీవుడ్ మూవీ పద్మావతి ట్రైలర్ విడుదల కాగా, సక్సెస్ ను దీపికా పదుకొనేతో కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన సన్నిహితులు శనివారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో దర్శకనిర్మాత కరణ్ జోహర్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఫోజులిస్తూ చాలా సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కరణ్ పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో దూసుకుపోతుంది. పద్మావతి హీరో రణవీర్ సింగ్, జాన్వీ, సారాలతో కలిసి దిగిన మరో ఫొటోలను షేర్ చేయగా అది కూడా వైరల్ అయింది. సైరత్ రీమేక్ లో శ్రీదేవి కూతురు జాన్విని కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. సైఫ్-అమృతాసింగ్ ల ముద్దుల తనయ సారా 'కేదార్నాథ్' తో తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. కానీ ఫస్ట్ సినిమాకు ముందు ఫ్యాషన్ తో పాటు పార్టీలు, ఇతరత్రా కారణాలతో ఈ బ్యూటీ క్వీన్స్ పాపులర్ అయిపోతున్నారు. సారా అలీ ఖాన్(బ్లాక్ టాప్), జాన్వీ కపూర్(పర్పుల్), రణవీర్ సింగ్‌లతో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్(చివర్లో) -
స్టార్ వారసురాలు బైక్ రైడ్.. బౌన్సర్ల రక్షణ !
ఒక స్టార్ హీరోగానీ, హీరోయిన్‌గానీ ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు వారికి రక్షణగా పదిమంది బౌన్సర్లు ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఒకప్పటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి కుమార్తె కూడా ఈ కోవలో చేరారు. ఆమె పెద్ద కూతురు జాన్వీ సినీ రంగప్రవేశం గురించి రకరకాల ప్రచారం జరిగినా చివరకు హిందీ చిత్రం ద్వారా తెరంగేట్రానికి సిద్ధమైంది. బాలీవుడ్లో స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కరణ్‌జోహర్ జాన్వీని హీరోయిన్గా పరిచయం చేయనున్నారు. ఆయన మరాఠీలో మంచి విజయాన్ని సాధించిన సాయ్రద్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. అందులో హీరోయిన్ బైక్ రైడింగ్ చేస్తుందట. దీంతో జాన్వీని బైక్ రైడింగ్ నేర్చుకోవలసిందిగా దర్శకుడు కోరడంతో ఆమెకు ఇద్దరు బౌన్సర్లను నియమించిన శ్రీదేవి బైక్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారట. శిక్షణ పూర్తి అయ్యే వరకూ ఆమెకు రక్షణగా ఉంటారట. అదే విధంగా జాన్వీ డాన్స్‌లోనూ శిక్షణ పొందుతోందని, త్వరలోనే ఆమె చిత్ర రంగ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని సినీ రంగంలో చెప్పుకుంటున్నారు. -
ఆమె వేసుకున్న షూస్ ఖరీదు ఎంతో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సరా అలీఖాన్ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా.. లెటెస్ట్ స్టైల్ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం తీసిపోదు. తాజాగా ఈ టీనేజ్ బ్యూటీ దీపావళి సందర్భంగా ముంబైలో సందడి చేసింది. తన స్నేహితులు ఆహనా పాండే, షనాయ కపూర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. ప్లెయిన్ వైట్ స్లీవ్‌లెస్ టీ, రిపెడ్ జీన్స్ వేసుకున్న ఈ అమ్మడు చూపరుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సుహానా వేసుకున్న స్నీకర్స్ (షూస్) అందరి దృష్టి ఆకర్షించాయి. గ్యిసెప్ జానొట్టి కంపెనీకి చెందిన 'జెన్నిఫర్' వెడ్జ్ స్నీకర్స్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 995 డాలర్లు. అంటే రూ. 64వేలు అన్నమాట. ఈ మొత్తం డబ్బుంటే ఒకసారి హాయిగా థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిరావొచ్చు. -
ఆమె కోసం అంబానీ ఇంటికి తారాలోకం
ముంబై : ఎవరామె? ఆమె బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న సమయంలోనే కన్నతండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అసలే పేదరికం. బతుకు గడవటం కష్టంగా మారిన పరిస్థితుల్లో సొంత ఊరు గోర్కీ(రష్యా)లోనే తల్లి ఓ పండ్ల దుకాణంలో పనిలో కుదిరింది. స్కూల్ నుంచి సరాసరి పండ్లకొట్టుకు వెళ్లి తల్లికి సాయం చేసేదా చిన్నారి. కొన్నేళ్లకి.. స్నేహితుల సహకారంతో తల్లికి సొంత పండ్ల దుకాణాన్ని పెట్టించింది. 15 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఏజెన్సీలో పేరు నమోదు చేయించుకుంది. తొలినాళ్లలో చిన్నాచితకా బ్రాండ్లకు పనిచేసిన ఆమె రెండేళ్ల తర్వాత పారిస్ బాటపట్టింది. వివా మోడల్‌గా కాంట్రాక్టుపై సంతకం చేసిన తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. టాప్ ఫ్యాషన్ షోలన్నింటిలో తనదైన ప్రతిభకనబర్చింది. పేరు తోపాటు భారీగా డబ్బునూ సంపాదించింది. ఆమె మరెవరోకాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మోడల్‌గా ఖ్యాతిపొందిన నటాలియా వొడియనోవా. సంపాదించిన డబ్బులో అధికభాగాన్ని పేదల కోసం ఖర్చుపెడుతూ గొప్ప వితరణశీలిగానూ పేరుతెచ్చుకుందామె. అంబానీ ఇంట్లో గ్రాండ్ పార్టీ : ‘నేకెడ్ హార్ట్’ ఫౌండేషన్ ద్వారా నటాలియా.. పలుదేశాల్లోని నగరాలు, పట్టణాల్లో పేదకుటుంబాలకు చెందిన పిల్లలకు అవసరమైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించే పనిలో ఉంది. ఫౌండేషన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబై వచ్చిన ఆమెను.. ‘రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి (రిలయన్స్ ఫౌండేషన్ చీఫ్) నీతా అంబానీలు ఇంటికి ఆహ్వానించారు. ఆమె గౌరవార్థం శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ముంబై షోషలైట్లతోపాటు బాలీవుడ్ తారాలోకం సైతం పార్టీలో పాలుపంచుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, నీతా అంబానీ, వారి కూతురు ఇషా, కరీనా, కరిష్మా, జాక్వెలిన్, మలైకా, పద్మాలక్ష్మి, శ్రద్ధాకపూర్, కరణ్‌జోహార్, వరుణ్‌ధావన్, మనీశ్ మల్హోత్రా, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్ తదితర స్టార్లు సందడిచేశారు. (ఫొటో స్లైడర్ చూడండి..) -
రా.. కుమారి!
మహరాణుల పిల్లలే కానక్కర్లేదు. తెర మీదకు వస్తే.. మనకు వాళ్లు రాకుమారిలే! చాలా మంచి ఆడియన్స్ మనం. కొత్త టాలెంట్ కనపడితే చప్పట్లకు కరువుండదు. అభినయం ఉన్న అందం అయితే.. గుడులూ తక్కువ ఉండవు. హీరోయిన్లకు ఎర్ర తివాచీలను మన గుండెల దాకా పరుస్తాం. రా.. కుమారి. ► 1 జాహ్నవి కపూర్ (20) కరణ్ జోహార్ నిర్మిస్తున్న మరాఠీ చిత్రం ‘సైరాత్’ రీమేక్‌లో నటిస్తోంది. ► 2 సారా అలీఖాన్ (24) అభిషేక్ కపూర్ ‘కేదార్నాథ్’లో నటిస్తోంది ► 3 తారా సుతారియా (21) కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తోంది ► 4 అన్యా సింగ్ (20) పేరింకా పెట్టని యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రాజెక్టు ► 5 సయేషా సైగల్ (20) అజయ్ దేవగణ్ ‘శివాయ్’ (2016) చిత్రంలో నటించింది ► 6 సాన్యా మల్హోత్రా (23) ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో నటించింది. ► 7 మెహ్రీన్ కౌర్ పిర్జాదా (21) కృష్ణగాడి వీర ప్రేమ గాథ (2016), అనుష్కాశర్మ నిర్మించిన ఫిల్లారీ (2017) లలో నటించింది ► 8 ఫాతిమా సనా షేక్ (25) ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో నటించింది. ► 9 సయామీ ఖేర్ (26) రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మూవీ ‘మీర్జా’ (2016)లో నటించింది. రేయ్ (2015) అనే తెలుగు సినిమాలో నటించింది ► 10 రితిక సింగ్ (22) సాలా ఖడూస్ (2017) చిత్రంలో నటించింది ► 11 నిధి అగర్వాల్ (24) టైగర్ ష్రాఫ్ ‘మున్నా మైఖేల్’ (2017) లో నటించింది ► 12 అనన్యా పాండే (16) కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తోంది ► 13 ఆయేషా కపూర్ (23) శేఖర్ కపూర్ ‘పానీ’ (2017) చిత్రంలో నటించింది ఒక పువ్వు పూసింది! తోటలో సందడి. దేవ దేవ దేవ దేవ.. దేవుడా.. దేవుడా! కుర్ర పక్షుల దేవరాగం.మార్నింగ్ మార్నింగ్ సూర్యా అంకుల్ షాక్. కుంకలు అప్పుడే లేచాయా? పళ్లెప్పుడు తోమాయి? ఒళ్లెప్పుడు రుద్దాయి? ముఖానికి అప్పుడే పౌడర్ అద్దేస్తున్నాయి. అద్దం బద్దలైపోతుంది.. చాలాపండ్రా పిల్ల ‘కావ్’ లూ! ‘బేబీ... యు ఆర్ సో సెక్సీ.. బేబీ యు ఆర్ ఇన్ ద గెలాక్సీ!’ సూర్య అంకుల్ మళ్లీ షాక్ ‘‘నాకు తెలీకుండా గెలాక్సీలో ఎవర్రా ఆ బేబీ?’’ ‘‘యా.. మామా.. నూన్‌షోకి వచ్చేయ్’’. ప్రతి ఇంట్లో పదహారేళ్ల మనసు.. కొత్తల్లో శ్రీదేవి. ప్రతి మనసులో ప్రత్యేకంగా ఒక గది.. కొత్తల్లో జయసుధ. ప్రతి గదిలో ఒక బ్లోఅప్ పోస్టర్.. కొత్తల్లో జయప్రద. ప్రతి పోస్టర్లో ఒక స్వీట్ వెపన్.. కొత్తల్లో విజయశాంతి. స్క్రీన్ మీదకి కొత్తగా ఎవరొచ్చినా... కుండెడు అన్నం మిగిలిపోయేది. కొన్ని గుండెలు రిలీజ్ రోజే పగిలిపోయేవి. యూత్ అన్నమూ నీళ్లు మానేసి.. మైదా అంటించిన వాల్ పోస్టర్లతో కళ్లు, కడుపు నింపుకునేది మరి! నోట్ బుక్‌లో సెంటర్ పేజీలు చింపేసి కొత్త హీరోయిన్ను ఊహించుకుంటూ ప్రియురాలికి ప్రేమలేఖలు రాసేది మరి. ఏ.. అంతకుముందు శారద, వాణీశ్రీ, మంజుల, చంద్రకళ లేరా? ఉన్నారు. అంతకన్నా ముందు సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి లేరా? ఉన్నారు. అంతకన్నా ముందు.. ఉన్నారు.. ఉన్నారు.. అంతకన్నా ముందు కన్నాంబ ఉన్నారు. కాంచనమాలా ఉన్నారు. ఫ్రమ్ దేర్.. టిల్ డేట్.. తమన్నా, కాజల్, శ్రియ, త్రిష, నయనతార, రకుల్, తాప్సీ, పూజా లేటెస్టుగా అర్జున్ రెడ్డి ఆరో ప్రాణం... షాలినీ పాండే వరకు.. పదేళ్లకో పెద్ద పూలతోట తెలుగు ఇండస్ట్రీ. హీరోయిన్ల çపూలతోట. ఆ తోటల్లో వెరైటీ వెరైటీ పూలు. నార్త్ పూలు, సౌత్ పూలు. ఆఖరికి హాలీవుడ్ పూలు కూడా! తెలుగు పూలే కాస్త తక్కువయ్యాయి. కాస్త తక్కువవడం కాదు. కరువైపోయాయనుకోండి. అయినా తెలుగేమిటి? తమిళేమిటి? కన్నడమేంటి? మలయాళమేంటి? హిందీ ఏంటి? ఇంగ్లిష్ ఏంటీ? పూలకు ప్రాంతీయ భేదాలు ఏంటని.. యూత్ ప్రతి హీరోయిన్నీ ఆరాధిస్తోంది. పరిశ్రమ ప్రతి పరదేశీనీ ఆహ్వానిస్తోంది. స్క్రీన్ మీద నూతన పరిచయం అనగానే గాల్లోకి రంగు కాగితాల కాల్పులు. కొత్తమ్మాయ్ అంటే ఆ మాత్రం కాల్పులు జరగవా? హీరోయిన్లు ఎవరి రేంజ్లో వాళ్లు, ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్‌ని రాక్ చేసి, గుండెల మీద వాక్ చేసి వెళ్లిపోయారు. పెద్ద పెద్ద వాళ్లు.. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, శిశుర్వేత్తులు, పశుర్వేత్తులు ‘ఇట్లు.. మీ అభిమాని’ అంటూ అడుగున సంతకం పెట్టి మరీ.. మద్రాస్‌కి ఉత్తరాలు పోస్ట్ చేశారు. రిప్లయ్ వచ్చిందా.. సంతోషం! ‘కలుద్దాం రండి’ అని పిలుపే వచ్చిందా.. ఎస్టానిష్మెంట్! కొన్నిసార్లు హీరోయిన్లే వీళ్లను కలవడానికి వచ్చేవాళ్లు. ఆకాశం కిందికి దిగితే.. భూమి పందిరి వెయ్యకుండా ఉంటుందా? పాదాల కింద హృదయాన్ని పరవకుండా ఉంటుందా? వేశారు. పరిచారు. ఎందుకంత క్రేజ్! హీరోయిన్లు బాబూ.. హీరోయిన్లు. కొత్తవాళ్లు కళ్లు తిప్పుకోనివ్వరు. పాతవాళ్లు పాత మధురిమల్ని వదలనివ్వరు. హీరోలంటే గ్రేట్ అనుకుంటాం కదా. అంత గ్రేట్ హీరోలు కూడా తమతో నటించిన క్యూట్ గర్ల్స్‌తో ప్రేమలో పడ్డవాళ్లే. హీరోయిన్ని ప్రేమించిన దర్శకులు, నిర్మాతలు కూడా తక్కుమందేం లేరు. కొన్ని సక్సెస్. కొన్ని బ్రేకప్స్. అవొద్దులెండి ఇప్పుడు. చూడండి. ఏ తరానికైనా ఒకరిద్దరే హీరోలు. హీరోయిన్లు మాత్రం పదులు, ఇరవైలు. అదికూడా ఇరవైల్లో ఎంట్రీ ఇచ్చినవాళ్లు. హీరోయిన్ని ఇప్పటి వరకు మనం పువ్వు అనుకున్నాం కదా. కె.రాఘవేంద్రరావుకు మాత్రం పండు. అవడానికి డైరెక్టరే. హీరోయిన్ కనబడగానే కెమెరామన్ అయిపోతారు. బత్తాయిలు, జామపండ్లు, ద్రాక్ష గుత్తులు.. పాటలో ఆ కాసేపూ హీరోయిన్ కనిపించదు. మొజాంజాహీ మార్కెట్ కనిపిస్తుంది. డైరెక్టర్ వంశీ కూడా హీరోయిన్లను తిన్నగా ఉండనివ్వడు. హీరోయిన్లను కాదులెండి, ప్రేక్షకుల్ని తిన్నగా కూర్చోనివ్వడు. భానుప్రియ ఒంటినంతా ఆయన ఏదో పాటలో కూరగాయలతో అలంకరించారు. ఈ ప్రయోగాల్ని హీరోలపై చేయడం కుదరదు. కుదిరినా చూడ్డానికి హాల్లో ఎవరూ ఉండరు. దేశవాళీ పండ్లు వద్దనుకుంటే రాఘవేంద్రరావు బయటి నుంచి లోడ్ దింపుకుంటారు. శ్రీదేవి శివకాశి అమ్మాయి. పదహారేళ్ల వయసులోకి ఆమెను తెచ్చేసుకుంది ఆయనే. అప్పటికి ఆయనకు పండంటి ఆలోచన లేదు. సిరిమల్లె పువ్వుతో సరిపెట్టుకున్నాడు. ప్రీతీజింతాను, తాప్సీని దిగుమతి చేసుకుంది కూడా రాఘవేంద్రుడే. ఇక రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వెరీ వెరీ పర్టిక్యులర్. కథ కంటే ముందు వాళ్లు హీరోయిన్ని వెదకడానికి వెళ్లారా అని డౌట్ వస్తుంది.. వాళ్లొక వారం రోజులు హైదరాబాద్‌లో కనిపించకపోతే. ఊర్మిళ టు నథాలియా.. అందరూ వర్మ ఇన్వెషన్సే! నిషా కోఠారీ. ఆంత్రమాలి. మధుశాలిని. పూరి కూడా వేరియేషన్ చూపెడతాడు. అనుష్క ముద్దమ్మాయ్. హన్సిక బొద్దమ్మాయ్. ఆసిన్ తేటగీతి. రక్షిత ఆటవెలది. ఆయేషా, నేహా, ఆదా, రేణు.. అంతా ఫ్లిప్కార్ట్లోనో, ఆమెజాన్లో డెలివరీ అయి వచ్చినట్లుంటారు. పూరి ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఎప్పుడు తెచ్చేస్తాడో తెలీదు. ఇప్పుడు ఇంకో బ్యాచ్ రెడీగా ఉంది. 20–25 మధ్య బ్యాచ్. వీళ్లలో కొందరు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. మిగతావాళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్లో కరణ్ జోహర్.. మన పూరీ లాగే టాలెంట్ల వేటగాడు. ఇప్పటికే అక్కడి సెలబ్రిటీ పిల్లలకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. శ్రీదేవి కూతురు జాహ్నవి, తారా సుతారా అనే పిల్ల, అనన్యా పాండే.. కరణ్ ప్రాజెక్టు కోసం సెట్స్లోంచి బయటికే రావడం లేదు. సారా అలీఖాన్ అనే న్యూ ఫేస్ ‘కేదార్నాథ్’ కోసం కష్టపడుతోంది. అభిషేక్ కపూర్ తీస్తున్నాడు ఆ ఫిల్మ్‌ని. అన్యాసింగ్ అనే అమ్మాయి పేరింకా ఖరారు కాని యశ్‌రాజ్ చిత్రం కోసం ప్రాక్టీస్ చేస్తోంది. వీళ్లతో పాటు మెహ్రీన్ కౌర్ పిర్జాదా, సాన్యా మల్హోత్రా, సనా షేక్, నిధి అగర్వాల్, సయామీ ఖేర్, రితికా సింగ్, సయేషా సైగల్, ఆయేషా కపూర్.. ఒకటీ రెండు సినిమాలతో వెనకేసుకున్న ప్రొఫైల్ పట్టుకుని ఫోకస్‌లోకి వచ్చేస్తున్నారు. మరి మనకేంటి? దీజ్ గాళ్స్.. హిందీ అమ్మాయిలు కదా! మరి మనకేంటి? ఇంకా ఏ ఉడెన్ హౌస్‌లో ఉండిపోయారు బాస్? బిగ్ బ్రదర్ మనదేంటి? బిగ్‌బాస్ మనదేంటి? ముమైత్‌ఖాన్ మనమ్మాయేంటి? దీక్షా పంత్ మన చుట్టాల పిల్లేంటి? ‘గోపాల గోపాల’లో ‘దీక్ష’ను ఏకధ్యానంతో చూడలేదా? ‘పోకిరి’ కేమియోలో.. ‘ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే’ అని పాడుతుంటే ముమైత్‌తో పాటు పరవశించలేదా? పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ.. ‘మాహా మాహా... మాహా మాహా’ అని వినిపిస్తే చార్మీ కౌర్ గుర్తుకురావడంలా?! హీరోలకు మాత్రమే ఆ ఉడ్డూ, ఈ ఉడ్డూ. హీరోయిన్లు యూనివర్శల్. రంభ, అంజలి ఇక్కడే ఉండిపోయారా? రితిక, జాహ్నవీ అక్కడే ఉండిపోడానికి?! మొన్న రిలీజ్ అయిన ‘జై లవ కుశ’లో రాశీఖన్నా హీరోయిన్. రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘స్పైడర్’లో రకుల్ హీరోయిన్. ‘ఒక్కడు మిగిలాడు’లో రెజీనా కసాండ్రా, ‘జవాన్’లో మెహ్రీన్ పిర్జాదా, ‘ఏంజెల్’లో హెబ్బా పటేల్, ‘ఇది నా లవ్ స్టోరీ’లో ఒవియా హెలెన్, ‘గరుడ వేగ’లో సన్నీ లియోన్, ‘స్కెచ్’లో తమన్నా భాటియా, ‘శరభ’లో మిష్తీ చక్రవర్తి హీరోయిన్లు. వీళ్లంతా.. ఏ దివిలో విరిసిన పారిజాతాలైనా.. ఒకసారి మన వెండితెర మీదకు వచ్చాక మనవాళ్లే -
లాస్ ఏంజిల్స్ వీధుల్లో అతిలోక సుందరి..
అతిలోక సుందరి శ్రీదేవి, ఆమె కూతురు జాహ్నవి కపూర్లు లాస్ ఏంజిల్స్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. స్టైలీష్ లుక్లతో ఫోటోలకు పోజులిస్తూ సేద తీరుతున్నారు. శ్రీదేవి షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎంబ్రైడరీ దుస్తులను ఫ్యాషన్ అయ్యేలా తల్లీ కూతుళ్లు ఫోటోలకు పోజులిచ్చారు. బోనీ కపూర్ నిర్మించిన మామ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి.. ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో గడుపుతొంది. గత వారం షారుక్ ఖాన్ ఫ్యామిలీతో శ్రీదేవి ఫ్యామిలీ దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు శ్రీదేవి తన ఫోటోను ఇన్స్ట్రాగ్రమ్లో పోస్టు చేసింది. మామ్ తర్వాతి ప్రాజెక్టును ప్రకటించని శ్రీదేవి మిస్టర్ ఇండియా(1987) సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జానీ కపూర్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉందని, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్తో ఆమె నటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. LA with my baby -
స్టార్ బ్యూటీస్ సర్ప్రైజ్ లుక్!
జాన్వీ కపూర్, సరా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ బాలీవుడ్ సెలబ్రిటీ కిడ్స్‌గా ఇప్పటికే వీరు బోలెడంత ఫేమస్ అయ్యారు. త్వరలోనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు పబ్లిక్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించడంలో వీరికి వీరే సాటి. హైప్రొఫైల్ పార్టీలకు హాజరైనా.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినా స్టిన్నింగ్స్ లుక్స్‌తో అదరగొట్టేస్తుంటారు ఈ యువభామలు. కానీ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఈ అందాల విరిబోణులు సంప్రదాయ వేషధారణలో కనిపించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. శ్రీదేవి-బోనీ కపూర్ తనయ జాన్వీ, సైఫ్-అమృత సింగ్ తనయ సారా.. ఇద్దరూ వైట్ కుర్తాలో ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ట్రెడిషనల్ కుర్తాలోనూ ఈ సుందరీమణులు అదరగొట్టారు.