KGF Movie
-
తీసిన సీన్స్ మళ్ళీ చేస్తున్న యశ్
-
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్‌లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్‌లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్‌ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్‌గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్‌లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
బుల్లితెర నటి శోభిత సూసైడ్.. కేజీఎఫ్ మూవీలో నటించిందా?
-
Archana Jois: మహాదేవి
హీరోయిన్స్ కెరీర్ తల్లి పాత్రలతో ఎండ్ అవుతుందనే అభిప్రాయం ఉంది సినీఫీల్డ్‌లో! కానీ అర్చనా జోయిస్ సినీ ప్రయాణమే తల్లి పాత్రతో మొదలైంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌కి అమ్మగా నటించి, దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. వరుస సినీ, సిరీస్ అవకాశాలతో అదరగొడుతున్న ఆమె గురించి కొన్ని వివరాలు...అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని రామనాథపురలో. నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ.. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. అర్చనకు క్రమశిక్షణతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు.చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేక నాట్యం వైపు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడింది.మామూలు డిగ్రీలో జాయిన్ అయితే బాల్యం నుంచి ప్రేమించిన నాట్యానికి దూరమవుతానేమో అని భావించి, బెంగళూరు యూనివర్సిటీ, నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది. మూడేళ్ల ఆ డిగ్రీలో పట్టా పొంది, దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చింది.బీఎఫ్ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో ఆమె పాల్గొంది. ఇచ్చిన డైలాగ్స్‌ని తడబడకుండా బ్రహ్మాండమైన ఫీల్‌తో చెప్పి, ఆ సీరియల్లో నటించే చాన్స్‌ని దక్కించుకుంది. అనుకున్నట్టుగానే అది ఆమెకు మంచిపేరే కాదు.. మరెన్నో సీరియల్స్‌లో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. అలా వరుస సీరియల్స్ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ చదివింది.సీరియల్స్ అంటే ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు. ఆ వైవిధ్యం కోసమే సమయం చిక్కినప్పుడల్లా నృత్యప్రదర్శనలిస్తూ, కవర్ సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఆ పర్ఫార్మెన్స్ చూసే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో తల్లి పాత్రను ఆఫర్ చేశాడు. అప్పటికి అర్చన వయసు 21ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ పాత్రలో అలవోకగా నటించి, మెప్పించింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’, ‘మ్యూట్’ చిత్రాలతోనూ తన ప్రతిభ చాటుకుంది. ‘మాన్షన్ 24’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అర్చన నటించిన తాజా చిత్రం ‘యుద్ధ కాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.సినిమాల్లోకి రాకముందే మా దూరపు బంధువు శ్రేయస్‌తో నాకు పెళ్లయింది. నా నాట్యం, నటనకు వైవాహిక జీవితం ఎప్పుడూ అడ్డు కాలేదు. సినిమా, సిరీస్‌ల వల్లే నాకిష్టమైన డా¯Œ ్సకు కాస్త దూరమయ్యాను. అందుకే ఇకపై నాట్యానికి, నటనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎప్పటికీ గర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను!– అర్చనా జోయిస్. -
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు)
-
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్‌ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్‌గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్‌గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
కేజీఎఫ్ 3 లోకి ఎన్టీఆర్, అజిత్.. ?
-
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
కేజీఎఫ్ భామ స్టన్నింగ్ లుక్స్.. ఆ ముక్కుపుడక అందం చూశారా? (ఫొటోలు)
-
కెజియఫ్ 3 లో అజిత్.. కోలీవుడ్ షేక్..
-
పెద్ద ప్లానే వేస్తున్న నీల్...
-
కేజీఎఫ్ హీరో సూపర్ హిట్ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్ మంచి సందేశం ఇచ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
వైఎస్సార్సీపీకే నా మద్ధతు.. 'కేజీఎఫ్' నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, నామినేషన్ల హడావుడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి వాళ్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ మద్ధతు తెలుపుతున్నారు. మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడుతున్నారు. తాజాగా 'కేజీఎఫ్' నటుడు రామచంద్రరాజు అదే చెప్పుకొచ్చారు. వైసీపీకే తన మద్ధతు అని ప్రకటించారు.(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)కన్నడ నటుడు యశ్ దగ్గర పనిచేసిన రామచంద్రరాజు.. 'కేజీఎఫ్' సినిమాలో గరుడ అనే విలన్ పాత్రతో నటుడిగా మారాడు. ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. తాజాగా ఈయన.. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా కనిపించారు. తనకు ఈయన అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. అలానే వైసీపీ పాలనపైనా తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.'నామినేషన్‌కి ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. దాదాపు 20-30 వేల మెజరిటీతో నా స్నేహితుడు ఎన్నికల్లో గెలుస్తారని అనిపిస్తుంది. జగన్ పాలన చూస్తే నాకు ముచ్చటేస్తోంది. వైసీపీకే నా మద్ధతు. విద్య, వైద్య రంగాల్లో చాలా అభివృద్ధి చేశారు. నిస్పక్షపాతంగా ప్రజాసేవ చేస్తున్నారు. దీనికి నేను హ్యాట్సాఫ్ చెబుతాను' అని నటుడు రామచంద్రరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: ఈమె స్టార్ హీరోయిన్‌కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?)Read this article in English : KGF Actor Hails CM Jagan's Rule and AP's Development -
రోడ్డు సైడ్ కిరాణా షాపులో పాన్ ఇండియా హీరో.. ఫొటోలు వైరల్
సినిమా హీరోలు బయట పెద్దగా కనిపించరు. రోడ్ సైడ్ షాప్స్‌లో అయితే వస్తువులు కొనడం, తినడం లాంటివి అస్సలు చేయరు. అలాంటిది పాన్ ఇండియా స్టార్, 'కేజీఎఫ్' హీరో యష్ హఠాత్తుగా ఓ కిరాణా దుకాణంలో ప్రత్యక్ష్యమయ్యాడు. పక్కనే అతడి భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఏం జరిగింది? 'కేజీఎఫ్' ఫేమ్ యశ్.. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఉత్తర కర్ణాటక జిల్లా భత్కల్‌లోని షిరాలీకి వెళ్లారు. అక్కడే చిత్రపుర మఠాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్య రాధిక.. ఐస్ క్యాండీ అడగడంతో దగ్గర్లోనే చిన్న దుకాణానికి వెళ్లారు. ఐస్ క్యాండీతో పాటు కొన్ని చాక్లెట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. యష్ కేరింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా భార్య కోసం ఐస్ క్యాండీ కొనడం చూసి మురిసిపోతున్నారు. ఇకపోతే 'కేజీఎఫ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'ట్యాక్సిక్'లో హీరోగా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?) -
అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు
రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అభిమానులకు సినిమా అందించాలని ఆయన కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యశ్ తనతో పాటు ఉన్న వారిని మాత్రం మరిచిపోలేదని చెప్పవచ్చు. యశ్‌కు దగ్గరైన వ్యక్తుల కుటుంబాల్లో ఏదైన వేడుక జరిగితే ఆయన ఖచ్చింతంగా హాజరవుతారు. ఒక్కోసారి తన సతీమణితో కలిసే వెళ్తారు కూడా.. తాజాగా 'టాక్సిక్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యశ్.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటికి తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. యశ్ దగ్గర చేతన్ అనే వ్యక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా యశ్ సినిమా కెరియర్ నుంచి అతను ఉన్నాడని చెప్పవచ్చు. చేతన్ 2021లో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో కూడా యష్, ఆయన సతీమణి రాధిక పండిట్లు చేతన్ పెళ్లి వేడుక జరిపించిన విషయం తెలిసిందే. (చేతన్ వివాహ సమయంలో.. యశ్, రాధిక పండిట్) చేతన్ దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించాడు. షూటింగ్ పనిలో బిజీగా ఉన్న యశ్ ఈ శుభ సమయంలో చేతన్ ఇంటికి చేరుకున్నాడు. వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దీంతో చేతన్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఆయన సింప్లిసిటీని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Ram Mandir: కేజీఎఫ్ టు అయోధ్య
కెజీఎఫ్: కోలారు జిల్లాలోని కేజీఎఫ్ పట్టణం బంగారు గనులకు, హిట్ సినిమా కథలకే కాదు, మరికొన్ని ఘనతలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎన్ఐఆర్ఎం సంస్థనే అయోధ్యలోని ప్రఖ్యాత రామమందిరం నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్లు, శిలల నాణ్యతను పరిశీలించి విలువైన సూచనలు అందజేసింది. అయోధ్య ఆలయ శిలల నాణ్యతను తనిఖీ చేసే బాధ్యతను నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా కేజీఎఫ్ సిగలో మరో కలికితురాయి చేరింది. 2021లో తనిఖీ బాధ్యతలు రామమందిరం ఎలాంటి లోహాలను, సిమెంటు వంటివి ఉపయోగించకుండా రాతితో నిర్మిస్తుండడం విశేషం. భూకంపాలు, ఉరుములు, మెరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా నిర్మాణం సాగుతోంది. ఇంత పెద్ద ఆలయ నిర్మాణానికి రాళ్లు చాలా ముఖ్యం. వాటి నాణ్యత కూడా బాగుండాలి. దశాబ్దాల తరబడి మన్నిక ఉండాలంటే శాసీ్త్రయంగా పరిశోధించి మంచి రాళ్లను ఎంపిక చేయాలి. అందుకోసం రామజన్మభూమి ట్రస్టు.. దేశంలోని పలు నిర్మాణ రంగ సంస్థలను సంప్రదించి చివరకు కేజీఎఫ్‌లోని ఎన్‌ఐఆర్‌ఎంకు 2021లో బాధ్యతను అప్పగించింది. మూడు రకాల రాళ్లు ఎన్ఐఆర్ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్– హెచ్ఓడి ఎ.రాజన్‌బాబు రాళ్ల పరీక్షలకు నేతృత్వం వహించారు. ఈయన స్వయంగా కేజీఎఫ్ వాస్తవ్యులే కావడం విశేషం. ఎన్ఐఆర్ఎం నిపుణులు రాయ్స్టన్ ఏంజలో విక్టర్, డి ప్రశాంత్ కుమార్‌లు, టెక్నీషియన్లు ఆర్. ప్రభు, బాబు.ఎస్‌లు ఈ బృందంలో ఉన్నారు. మందిరంలో ముఖ్యంగా మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. పునాదికి గ్రానైట్ రకం రాళ్లు, సూపర్ స్ట్రైకర్ రాళ్లను నిలువు, అడ్డు స్తంభాలుగా, డెకోరేటివ్ రాళ్లు అలంకారానికి అని రాజన్‌బాబు తెలిపారు. లక్షకు పైగా రాళ్ల పరీక్ష ► ఎన్ఐఆర్ఎం ఎలాంటి రాళ్లనైనా పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. మందిర నిర్మాణానికి వివిధ రకాల సుమారు లక్షకు పైగా రాళ్లను పరీక్షించారు. ► ఇందుకోసం కేజీఎఫ్‌లోని సంస్థలోను, అలాగే అయోధ్య ఆలయంలో నిపుణులు నిరంతరం పనిచేశారు. ► అంతిమంగా ఎంపిక చేసిన రాళ్లనే ఇంజినీర్లు నిర్మాణంలో ఉపయోగించారు. ► వేయి సంవత్సరాలు నిలిచే నాణ్యత కలిగిన రాళ్లను రామమందిర నిర్మాణానికి సిఫారసు చేయడం జరిగింది. ► ఇందులో గ్రానైట్ రాళ్లను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి సేకరించారు. ► ఈ రాళ్ల పరీక్షల కోసం సుమారు రూ. 8.24 కోట్లను ఖర్చు చేశారు. ► కర్ణాటకలోని సాదహళ్లి, దేవనహళ్లి, చిక్కబళ్లాపురం, తుమకూరు, శిర ప్రాంతాలలోని రాళ్లను పరిశీలించి కట్టడానికి ఆమోదించారు. ► తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఏపీలో ఒంగోలు ప్రాంతాలనుంచి రాళ్ల నమూనాలను కేజీఎఫ్‌కు తెప్పించుకుని వాటిని ఉపయోగించవచ్చని సిఫార్సు చేశారు మా అదృష్టం: రాజన్‌బాబు దేశం గర్వించదగిన ఆధునిక యుగంలో రామమందిర నిర్మాణం అనేది అద్భుత ఘట్టం. రాళ్లను పరీక్షించే మహత్తర కార్యంలో మేము పాల్గొనడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇది మాకు దక్కిన అదృష్టం. పరీక్షా కార్యంలో పాల్గొన్న అధికారుల నుంచి మొదలుకుని కూలి కార్మికుల వరకు అందరూ సిగరెట్, మద్యం వంటివాటికి దూరంగా ఉన్నారు. క్రమశిక్షణ, శ్రద్ధా భక్తులతో పనుల్లో పాల్గొన్నారు. -
హీరో 'యశ్' కోసం వెళ్తూ మరో యువకుడు మృతి
కన్నడ స్టార్ హీరో యశ్‌కు చెందిన మరో అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జనవరి 8న ఆయన పుట్టినరోజు నాడు ఫెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) విద్యుత్ షాక్‌తో మరణించిన విషయం తెలిసిందే.. సమాచారం తెలుసుకున్న యశ్ దిగ్భ్రాంతి చెందాడు. దీంతో హుటాహుటిన ఆయన ప్రత్యేక విమానం ద్వారా గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడకు నిన్న చేరుకున్నారు. (ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. ఆ కుటుంబాల బాధ్యత నాదంటూ కన్నీరు పెట్టుకున్న యశ్) గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి తమ అభిమాన హీరో యశ్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో అప్పటికే అక్కడ 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఆ సమయంలో నిఖిల్ కరూర్ (22) అనే యువకుడు యశ్‌ను చూసేందుకు స్కూటీలో అక్కడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నిఖిల్ కరూర్ అనే యువకుడు కొంత సమయం క్రితం మృతి చెందాడు. బింకడకట్టి గ్రామానికి చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జనవరి 8న సాయంత్రం గడగ్‌లోని తేజ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యువకుడు పోలీసు వాహనాన్ని ఢీకొనడంతో స్కూటీ విడిభాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానుల మృతితో కన్నీళ్లు పెట్టుకున్న హీరో యశ్
పాన్ ఇండియా స్టార్ యశ్ బర్త్ డే సందర్భంగా జనవరి 8న ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. వారందరి కుటుంబాలను హీరో యశ్ సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆపై వారికి ఆయన భరోసా ఇచ్చారు. షూటింగ్ కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్న యశ్ సంఘటన తెలియగానే ప్రత్యేక విమానంలో హుబ్లీకి వచ్చి ఆపై నేరుగా కారులో గదగ్ జిల్లాలోని సురంగి గ్రామానికి చేరుకున్నారు. తన పుట్టినరోజు నాడు చనిపోయిన యువకుల కుటుంబాలను చూసి ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యశ్ రాకతో అక్కడ రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి జనాన్ని అదుపు చేశారు. ఘటనా స్థలంలో ఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు సహా వంద మందికి పైగా పోలీసులు ఉన్నారు. ఆ కుటాంబాలను ఓదార్చిన అనంతరం మీడియాతో యష్ స్పందిస్తూ.. 'ఇలా జరిగే అవకాశం ఉంటుందనే నా పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారంటే నాకు చాలా బాధగా ఉంది. చేతికి వచ్చిన బిడ్డలు ఇక తిరిగిరారని తెలిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ యువకుల కుటుంబానికి ఏది అవసరమో అది నేను చేస్తాను. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారు. కానీ ఆ కుటుంబాల కోసం ఎప్పటికీ నేను అండగా ఉంటాను. వారి కుటుంబాలకు ఏది అవసరమో ఇక నుంచి నేను చేస్తాను. ఆ యువకులను తిరిగి పొందలేము కానీ ఆ కుటుంబాలకు నేను ఖచ్చితంగా కుమారుడి స్థానంలో ఉండి నా బాధ్యతను నెరవేరుస్తాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే మీ జీవితంలో సంతోషంగా ఉండండి, మా గురించి ఆలోచించకండి. తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా.. మరోసారి ఇలాంటి పనులు చేయకండి.. ఇక నుంచైనా ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు వదిలేయండి. ఇంత ప్రమాదకరమైన ప్రేమను తెలపడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా బైక్‌లపై కొందరు యువకులు వెంబడిస్తున్నారు. ఇలాంటి మెచ్చుకోలు నాకు అక్కర్లేదు. అని యశ్ అన్నాడు. ఆ కుటుంబాలను చూసిన యశ్ కంటతడి పెట్టాడు.. కానీ వారందరికీ అండగా ఉంటానని ఆయన మాట ఇచ్చాడు. తన పుట్టినరోజు నాడు ఎలాంటి కటౌట్లు కట్టొద్దని ఆయన గతంలోనే ఫ్యాన్స్‌కు చెప్పాడు. అలాంటి పనులు జరిగే అవకాశం ఉంటుందని గతేడాది తన పుట్టినరోజు నాడే తెలిపాడు యశ్. 'రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే నివేదికల కారణంగా ఈసారి నా పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నేను షూటింగ్ పనిమీద గోవాలో ఉన్నాను. ఈ వార్త వినగానే నేను చాలా బాధపడ్డాను. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది కూడా ఈ ప్రమాదం జరిగింది. నా బర్త్ డే అంటేనే భయమేస్తోంది.' అని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సురంగి గ్రామం నుంచి జిమ్స్ ఆసుపత్రికి యశ్ వెళ్లారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి ఆరోగ్య వివారులు అడిగి ఆయన తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఆయన తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం వారి వైద్య ఖర్చులు పూర్తిగా యశ్ చెల్లించినట్లు సమాచారం. వారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనను వ్యక్తిగతంగా కలవాలని యశ్ సూచించారట. ಕರೆಂಟ್ ಶಾಕ್ ನಿಂದ ಸಾವನ್ನಪ್ಪಿದ ಸುದ್ದಿ ತಿಳಿಯುತ್ತಿದ್ದಂತೆ ಶೂಟಿಂಗ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿ ನಟ ಯಶ್ ಕೂಡ ಗದಗಕ್ಕೆ ತೆರಳಿ ಸಾವನ್ನಪ್ಪಿದ ಮೂವರು ಅಭಿಮಾನಿಗಳ ಮನೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದರು.#yashfansdeath #yashfansgadag #happybirthdayyash #rockingstaryash #yash #starkannada #NammaSuperstars #aslamsuperstars pic.twitter.com/fiZsWED0xi — Namma Superstars (@nammasuperstars) January 8, 2024 -
కేజీఎఫ్ 'యశ్' పుట్టినరోజు.. ముగ్గురు యువకులు మృతి
కర్ణాటకలో ప్రముఖ హీరో యశ్‌కు చెందిన ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేడు (జనవరి 8) 38వ పుట్టినరోజును ఆయన జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఈ వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న లక్ష్మేశ్వర్ ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది సినిమాల పనుల కారణంగా విదేశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ లేఖ రాసి అభిమానులకు తెలియజేశారు. ఈ సంఘటన గురించి యశ్ త్వరలో రియాక్ట్ కానున్నాడని తెలుస్తోంది. 'జనవరి 8.. నాపై మీకున్న ప్రేమను వ్యక్తిగతంగా చెప్పాలనుకునే రోజు.. పుట్టినరోజు మీతో గడపాలని ఉంది. కానీ సినిమా పనులు మాత్రం నన్ను బిజీగా ఉంచాయి. అనివార్యమైన ప్రయాణాల కారణంగా నేను ఈ జనవరి 8న మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మీ ప్రేమ వెలకట్టలేనిది.. నా పుట్టునరోజు నాడు నేను మీతో గడపలేకపోతున్నాననే బాధ నాలో కూడా ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను.. నేను ఎక్కడ ఉన్నా మీరందరూ నాతోనే ఉంటారు. మీ ప్రేమ, అభిమానమే నాకు పుట్టినరోజు కానుక.' అని యష్ నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేశాడు. -
రవి బస్రూర్ పేరు వెనుక కన్నీళ్లు తెప్పించే స్టోరీ
పాన్ ఇండియా రేంజ్లో రవి బస్రూర్ పేరు కేజీఎఫ్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ 'సలార్' సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమా బాలీవుడ్లో కూడా సూపర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులో రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు మాత్రమే కాదు, మాస్ సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని కూడా ఆయన అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా తమ సినిమాల కోసం రవి బస్రూర్ హంటింగ్ బీజీఎమ్ కోసం తహతహలాడుతున్నారు. ఆకలితో జీవనం.. రవి బస్రూర్ నేపథ్యం రవి బస్రూర్ తండ్రి గ్రామంలో కొలిమి నడుపుతున్నాడు. రవి కూడా తండ్రి దగ్గర కొలిమి పని చేస్తూ ఉండేవాడు. కానీ సంగీత రంగంలో ఏదైనా సాధించాలనే అచంచలమైన సంకల్పం అప్పటికే అతనిలో ఉండేది. కానీ ఆర్థిక స్థోమత అడ్డొచ్చి చాలా రోజుల పాటు తండ్రి వద్దే పని చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడిగా అయిన తర్వాత తాజాగా కన్నడ సరిగమప సీజన్ 10కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.ఆ సమయంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. సరిగమప షోలో రవి బస్రూర్ తన జీవితాన్ని మార్చేసిన సంఘటనను వివరించాడు. 'సంగీత ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. అప్పటికే మూడు నాలుగు రోజులు భోజనం చేయలేదు.. నీళ్లు తాగుతూనే గడిపేశాను... కానీ నా జేబులో ఒక లిస్ట్ ఉంది.. ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను సమయానికి వెళ్ళలేదు, నాకు ప్రసాదం లభించదు.' అని ఆ రోజు సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 'దేవుడా, నా పరిస్థితి ఏమిటి..? అని నా మదిలో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. అప్పుడు ఒక పెద్దాయన నన్ను చూశాడు. అతని పేరు కామత్. నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఒక దుకాణానికి తీసుకెళ్లి ఇతను ఇత్తడి, బంగారు వస్తువుల తయారి వంటి అన్ని పనులు చేస్తాడని యజమానికి పరిచయం చేశాడు .కానీ ఇతనికి సంగీతం అంటే పిచ్చి. ఎప్పుడూ చూడే అదే పనిలో ఉంటాడని తెలిపాడు. పనిలో పెట్టుకోమని కామత్ చెప్పడం.. వెంటనే అతను ఓకే చేయడం జరిగిపోయాయి. అతను ముందే చెప్పాడు.. నేను ఈ రేంజ్లో ఉంటానని కానీ నేను ఎలాంటి పని చేయనని చెప్పాను.. అప్పుడు అక్కడ ఉన్న యజమాని నాకు రూ. 5 ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు. అప్పుడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని చెప్పాడు. భవిష్యత్‌లో అతన్ని చూడటానికి 5 నెలలు అపాయింట్మెంట్ కావాలి. అంతలా అతని రేంజ్ పెరిగిపోతుందని చెప్పాడు. కానీ ఆయన మాటలు నాకు నమ్మకంగా లేవు.. ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. నాకు సంగీతం మాత్రమే కావాలని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి మీకు ఏమి కావాలి అని అడిగాడు, నాకు కీబోర్డ్ కావాలి, నాకు డబ్బు ఇస్తావా అని చెప్పాను, అతను ఎంత కావాలి అని అడిగాడు. నేను. 35 వేలు అన్నాను. క్షణం ఆలోచించకుండా వెంటనే ఇచ్చాడు.. ఆయనెవరో నాకు తెలియదు.. ఆ సమయంలో నేను, కామత్ ఇద్దరం షాక్ అయ్యాము. ఈ డబ్బు తిరిగివ్వకు. కీబోర్డ్ తీసుకో.ఈ 35వేలకు పని ఇస్తాను, పని చేసి చెల్లించు అని చెప్పాడు. ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు తొలగించి అతని పేరును నా ఊరు పేరుతో పాటు ఉంచాను. అలా రవి బస్రూర్ వెలుగులోకి వచ్చింది. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అతనే.. అతనికి క్రెడిట్ ఇవ్వడానికే నా పేరును మార్చుకున్నాను. నా అసలు పేరు కిరణ్.. కానీ రవి బస్రూర్ అని పిలుస్తేనే నాకు సంతోషం.' అని ఆయన చెప్పాడు. -
ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
సినిమా తీసే ప్రతివోడు డైరెక్టర్ కాదు! ఎందుకంటే ప్రేక్షకుడి పల్స్ తెలియాలి. ఎక్కడ ఏ సీన్ పడితే టాప్ లేచిపోద్దో తెలిసుండాలి. అయితే ఈ విషయంలో చాలామంది డిగ్రీలు చేస్తే.. మనోడు మాత్రం ఏకంగా పీహెచ్డీ చేసి పడేశాడు. లేకపోతే ఏంటి.. ఊరమాస్ చిత్రాలు తీయడంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇతడు సినిమా అంటే.. ఆయా హీరోల ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే మనోడి రేంజ్ అలాంటిది మరి. మూవీలో హీరోయిన్ ఉన్నాలేకపోయినా సరే బొగ్గు మాత్రం గ్యారంటీగా ఉండాలి. అలా బొగ్గుతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన వ్యక్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతకీ మనోడు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇన్ని హిట్స్ ఎలా కొడుతున్నాడు? డబ్బుల కోసం సినిమాల్లోకి ఎవరైనా సరే పిచ్చితో సినిమాల్లోకి వస్తారు. ప్రశాంత్ నీల్ మాత్రం అనుకోకుండా, అది కూడా డబ్బులు సంపాదిద్దామని డైరెక్షన్ కోర్స్ చేశాడు. ఇందులో డెప్త్ అర్థమయ్యేసరికి.. కొడితే కుంభస్థలం కొట్టాలని ఫిక్సయ్యాడు. డైరెక్టర్ అయిపోయాడు. ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తోళ్లకు ఛాన్సులంటే చాలా కష్టం. దీంతో మాస్టర్ స్కెచ్ వేసి.. అప్పటికే కన్నడలో హీరోగా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న తన బావ శ్రీమురళికి ఓ కథ వినిపించాడు. అనుభవం లేకపోవడం, స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోయేసరికి.. శ్రీమురళి దీన్ని లైట్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: 2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!) దీంతో ప్రశాంత్ నీల్ మనసు మారింది. శ్రీమురళిని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తూ 'ఉగ్రం' అనే మాస్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇది శ్రీమురళికి నచ్చేయడంతో సినిమా మొదలైంది. కట్ చేస్తే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 2014లో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ అంటే ఎవరబ్బా? అని అందరూ మాట్లాడుకునేలా చేసింది. దీనిదెబ్బకు మనోడికి చాలా ఛాన్సులు వచ్చినా సరే యశ్ కోసం 'కేజీఎఫ్' స్క్రిప్ట్ రెడీ చేశాడు. కోలార్ గోల్డ్ గనుల గురించి అందరూ విన్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం దానిపై ఓ సినిమా తీయాలనుకున్నాడు. అలా 'కేజీఎఫ్'కి బీజం పడింది. ఫేట్ మార్చిన 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' మూవీలో మాస్ అనే పదానికి శాంపిల్ చూపించాడు. 'కేజీఎఫ్'లో ఊరమాస్ అంటే ఏంటో డెఫినిషన్ రాసిపడేశాడు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడేవరకు ఎలివేషన్స్ ఎలా ఇవ్వొచ్చో అనే విషయంలో చాలామంది దర్శకులకు మనోడు గురువు అయిపోయాడు. సాధారణంగా మాస్ సినిమాల్లో కథకి పెద్దగా స్పేస్ ఉండదు. ఒకవేళ స్టోరీ ఉంటే ఎలివేషన్స్‌కి ప్లేస్ ఉండదు. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ప్రశాంత్ నీల్ కింగ్ అయిపోయాడు. దీని తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి గానీ 'కేజీఎఫ్'ని, ప్రశాంత్ నీల్ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు. అలానే 'కేజీఎఫ్' దెబ్బకు ప్రశాంత్ నీల్ ఫేటే మారిపోయింది. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) మందు-బొగ్గు కంపల్సరీ ప్రశాంత్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తాడబ్బా అని చాలామందికి డౌట్. అయితే మందు తాగిన తర్వాతే ఈ స్టోరీలన్నీ రాస్తుంటానని గతంలో ఓసారి ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. స్టోరీ రాయడానికి మందు ఎలా ఇంపార్టెంటో.. కథ ఏదైనా సరే బొగ్గు కూడా అంతే ఇంపార్టెంట్. 'ఉగ్రం'లో జస్ట్ శాంపిల్‌గా ఉంటే.. 'కేజీఎఫ్', 'సలార్' మొత్తం బొగ్గే కనిపిస్తుంది. అయితే తనకున్న ఓసీడీ సమస్య వల్లే ఇలా అంతా బ్లాక్ ఉంటుందని చెప్పాడు. అయితే కలర్ఫుల్గా ఉంటేనే సినిమా చూస్తారు అనే దాన్ని కూడా ప్రశాంత్ నీల్.. బొగ్గుపై తనకున్న ఇష్టంతో బ్రేక్ చేసి పడేశాడు. అలానే హీరోని చూపించాల్సిన పనిలేకుండా హీరో పిడికిలి, నీడ లాంటి వాటితోనూ ఎలివేషన్స్ ఇవ్వొచ్చనే ఆలోచన ప్రశాంత్ నీల్‌కి సాధ్యమైందని చెప్పొచ్చు. తెలుగోడు కాబట్టే? ప్రస్తుతం నార్త్-సౌత్ సినిమాల్లో తెలుగోళ్ల హవా కనిపిస్తుంది. అలానే ప్రశాంత్ నీల్ మూలాలు కూడా తెలుగు నేలపైనే ఉన్నాయి. ఉమ్మడి అనంతపురంలో మడకశిర మండలంలోని నీలకంఠాపురం ఇతడి సొంతూరు. కానీ ప్రశాంత్ నీల్ పుట్టకముందే అతడి తల్లిదండ్రులు బెంగళూరులో సెటిలైపోయారు. అలా కన్నడ వ్యక్తి అయ్యాడు. కానీ దాదాపు 25 ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాడు. ఆ ప్రభావమో ఏమో గానీ మనోడి సినిమాల్లో మాస్, ఎలివేషన్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ 'సలార్' కూడా అలాంటి మూవీనే. ఇక ప్రశాంత్ నెక్స్ట్ మూడు సినిమాలు.. ఎన్టీఆర్, ప్రభాస్, యశ్‌తోనే. ఏదేమైనా సరే ఇలా ప్రశాంత్ నీల్ మరిన్ని మాస్ సినిమాలు తీస్తూ.. ఇండియాలో థియేటర్లన్నీ ఊగిపోయేలా చేయాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) -
KGF 3, RRR 2 షాకింగ్ అప్ డేట్స్.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
యాష్ న్యూ మూవీ అప్డేట్స్
-
యష్ కొత్త చిత్రం ప్రకటన.. సాయి పల్లవికే ఛాన్స్.. డైరెక్టర్ ఎవరంటే
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు యష్.. KGF చాప్టర్ 2 విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఆయన నుంచి ఏ సినిమా గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు, కాబట్టి అభిమానులు యష్ 19 గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఈ నటుడి సినిమా కోసం దేశం మొత్తం సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో, నటుడు యష్19 గురించి ఒక అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 09:55 గంటలకు యష్ 19 టైటిల్‌ను ప్రకటించనున్నట్లు రాకింగ్ స్టార్ తెలియజేశాడు. దీని తరువాత, ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, సాంకేతిక నిపుణుల గురించి చర్చ జరుగుతోంది. దీంతో చాలా మంది నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో యష్ హీరోయిన్గా నటి సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి సాయి పల్లవిలో మంత్రముగ్ధులను చేసే డ్యాన్స్‌తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె వెనుదిరిగి చూడలేదు. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల తర్వాత ఇప్పుడు యష్‌తో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సాయి పల్లవి ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం యష్ 19కి సంతకం చేసిందని టాక్. ఆమె ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య రాబోయే చిత్రం తండేల్‌లో నటిస్తోంది. అలాగే, నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో సాయి పల్లవి, యష్ నటిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారని సమాచారం. ఈ వార్తను సాయి పల్లవి నిర్ధారించింది కానీ యష్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యష్ 19వ చిత్రం టైటిల్‌ను ఈ డిసెంబర్ 8, శుక్రవారం ఉదయం 09:55 గంటలకు విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించే అవకాశం ఉంది. గీతు మోహన్ దాస్ హిందీలో అబద్ధాల పాచికలు అనే చిత్రాన్ని 2014లో తెరకెక్కించారు. ఆ చిత్రానికి గాను రెండు జాతీయ అవార్డులు ఆమెకు దక్కాయి. సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు పొందారు. It’s time… 8th December, 9:55 AM. Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY — Yash (@TheNameIsYash) December 4, 2023 -
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్‌లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!
తెలుగు హీరో రవితేజపై 'కేజీఎఫ్' ఫేమ్ యష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ హీరోనే అలా అంటావా అని రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? రవితేజ కామెంట్స్ మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన యాక్టర్. హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ఈ దసరాకు థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం. దీంతో దేశమంతటా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో సౌత్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) యష్-'కేజీఎఫ్'పై కామెంట్స్ రామ్ చరణ్ డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే ఇష్టమని రవితేజ చెప్పాడు. కన్నడ హీరో యశ్ గురించి అడిగితే.. అతడు యాక్ట్ చేసిన 'కేజీఎఫ్' మాత్రమే చూశాను. ఆ సినిమా చేయడం అతడికి చాలా లక్కీ' అని అన్నాడు. దీన్ని తీసుకోలేకపోతున్న యష్ ఫ్యాన్స్.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 'కేజీఎఫ్' తప్పితే యష్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. రవితేజ కూడా అదే ఉద్దేశంతో ఇలా అన్నాడు. యష్ అభిమానులు మాత్రం దీన్ని అపార్థం చేసుకుని గొడవ గొడవ చేస్తున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?) -
KGF ఫ్యాన్స్ బీ రెడీ.. ఛాప్టర్-3 ఎప్పుడంటే
ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. దీంతో 2022లో రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్డేట్ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించి.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. కేజీఎఫ్- ఛాప్టర్ 2 ఎండింగ్లో పార్ట్- 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్‌క్లూజన్ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ను షేర్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) -
సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూవీ రిలీజ్ వాయిదా పడిందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకపోయినా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. సలార్‌పై తాజాగా మరో టాక్ ఊపందుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. కాగా..'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ .. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్'పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. కాగా..ఈ చిత్రంలో శృతి హాసన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సాలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #BreakingNews… PRABHAS: ‘SALAAR’ TO ARRIVE IN NOV… #Salaar is NOT arriving on 28 Sept 2023, it’s OFFICIAL now… The post-production work of this #Prabhas starrer is going on in full swing… #HombaleFilms - the producers - are bringing the film in Nov 2023… New release date… pic.twitter.com/SbOLGSobz5 — taran adarsh (@taran_adarsh) September 2, 2023 -
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్‌ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
'కేజీయఫ్'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా తర్వాత వెనుకబడిపోయింది. (ఇదీ చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శ్రీనిధి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీనిధి శెట్టి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇందులో వారి తప్పేంలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు విషయం వేరే ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో నుదుటిన పాపిట్లో సిందూరంతో బొట్టు పెట్టుకొని కనిపించడమే ఈ ప్రచారానికి బలాన్ని చేకుర్చింది. సాదారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు మాత్రమే నుదుటన పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు కాబట్టి శ్రీనిధి కూడా పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో శ్రీనిధి జన్మించింది. వారి సంప్రదాయం ప్రకారం కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారని తెలుస్తోంది. అందువల్లే శ్రీనిధి శెట్టి కూడా నుదుటన బొట్టు పెట్టుకుందని చెబుతున్నారు. కాబట్టి ఆమె పెళ్లిపై ప్రచారం చేయడం ఇంతటితోనైనా ఆపేయండని ఆమెను అభిమానించేవారు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం శాండల్‌వుడ్‌లో ఇలా టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపంతో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్‌ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రెమ్యునరేషన్ రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే అప్పట్లోనే టాక్ వినిపించేది. (ఇదీ చదవండి: అందరూ వైష్ణవినే తిడుతున్నారు: బేబీ నిర్మాత) -
'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!
'సలార్' టీజర్ అనుకున్నంతగా లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనలో చాలామందికి నచ్చలేదు. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ వాళ్లలో చాలామందికి ఓకే అనిపించింది. ప్రభాస్‌ని వేరే లెవల్లో చూపిస్తారని, ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయని వాళ్లు మెంటల్‌గా ఫిక్సయ్యారు. కానీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. అందరూ టీజర్ నచ్చలేదు, నచ్చలేదు అంటున్నారు కానీ డైరెక్టర్ని మాత్రం ఓ విషయంలో కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. కావాలనే ఇలా? 'సలార్' టీజర్ చూడగానే చాలామందికి ఇది టీజర్లా అస్సలు అనిపించలేదు. ఎందుకంటే హీరో పాత్ర, స్టోరీ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చిన వీడియోలా అనిపించింది. ఇదంతా చూస్తుంటే.. దర్శకనిర్మాతలు కావాలనే ఇలా చేశారేమో అనే డౌట్ వస్తుంది. టీజర్ లేదా ట్రైలర్ లో అన్నీ చూపించేస్తే.. థియేటర్లలోకి వచ్చినవాళ్లు భారీ అంచనాల వల్ల డిసప్పాయింట్ కావొచ్చు. అందుకే టీజర్ తో ఇలా అంచనాలు తగ్గించి, బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి సర్ప్రైజులు ఇవ్వాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) బొగ్గు.. సూపర్‌హిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడే సినిమాలు తీశాడు. అన్నింట్లోనూ యాక్షన్ మాత్రమే నమ్ముకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకులు.. గ్రాఫిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ, అవి-ఇవి అని తెగ హంగామా చేస్తున్నారు. తీరాచూస్తే తుస్సుమనిపిస్తున్నారు. 'ఆదిపురుష్' విషయంలోనూ ఇలానే జరిగింది. వీళ్లందరితో పోలిస్తే ప్రశాంత్ నీల్ మాత్రం.. ఎంచక్కా అందరికీ తెలిసిన కథ, ఎలివేషన్స్ ఇవ్వడానికి ఓ తాత.. హీరో బాడీ మొత్తం బొగ్గు పూసి.. సింపుల్‌గా హిట్స్ కొడుతున్నాడు. కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. 'సలార్'తో ఇది మరోసారి జరగొచ్చు! 'కేజీఎఫ్' రెండు పార్ట్స్ లోనూ గ్రాఫిక్స్ తక్కువే ఉంటుంది కానీ యాక్షన్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. ఇప్పుడు 'సలార్' సినిమా విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సేమ్ ఫార్ములా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడన్ని అంచనాలున్నాయి. టీజర్ లో అంటే ప్రభాస్ ని దాచేశారు. ట్రైలర్ అయితే దాయలేరుగా! ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్ లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి 'సలార్' వస్తుందిగా.. అప్పుడు మాట్లాడుకుందాం! (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) -
సలార్ టీజర్‌తో తేలిపోయింది.. ఇది నిజమేనని
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్' టీజర్‌తో బరిలోకి దిగాడు. 'కేజీయఫ్' సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఏ రేంజ్లో అయితే చూపించాలో ఏ మాత్రం తగ్గకుండా టీజర్లో చూపించాడు. డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలకు కొంచెం కూడా తగ్గకుండా టీజర్‌ను 'ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్' పేరుతో మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఓ రకంగా ఉదయం 5: 12 నుంచి యూట్యూబ్‌లో తుఫాన్ మొదలైంది. టాలీవుడ్లో ప్రభాస్‌కు ఉండేది ఫ్యాన్స్ కాదు... డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి ఈ టీజర్‌ను వారు మినిమమ్ పదిసార్లు అయినా ఇప్పటికే చూసి ఉంటారు. ఈ టీజర్‌లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వారు గుర్తించారు. దీంతో కేజీఎఫ్‌కు సలార్ కొనసాగింపు నిజమేనని తేలిపోయింది. ఇందులో రాఖీ భాయ్ కూడా ఉంటారనేందుకు మరింత బలం కూడా చేకూరింది. (ఇదీ చదవండి; Prabhas Salaar Teaser: లయన్, చీతా, టైగర్ అంటూ వేటకొచ్చిన డైనోసార్) ఇది ప్రభాస్, యష్ మధ్య అతిపెద్ద క్రాసర్ను సూచిస్తుంది. ప్రభాస్ సలార్ టీజర్ చూసిన తర్వాత కేజీఎఫ్-2 కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని తెలుస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది నిజమేనని తెలిపేలా రెండు ఫోటోలను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తించారు. సలార్, KGF-2 కు సంబంధించిన రెండు స్క్రీన్షాట్లను తీసి వైరల్ చేస్తున్నారు. దీంతో కేజీఎఫ్‌తో సలార్‌కు కనెక్షన్ ఉందిని తేలిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఈ సీన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి టీజర్లో చాలా క్లూస్ ఇచ్చాడు ప్రశాంత్. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) వాటి ద్వారా సలార్,కేజీఎఫ్‌కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని చెప్పవచ్చు. ప్రభాస్‌తో పాటు రాఖీ భాయ్ కూడా సలార్‌లో జరిగే వార్‌లో ఉండబోతున్నట్లు ఖాయమేనని తెలుస్తోంది. వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలే.. ఒకరి సినిమా విడుదలైతేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అలాంటిది వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్లు పైగా కలెక్ట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. -
సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
'సలార్' టీజర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. టెన్షన్‌తో ఫ్యాన్స్ ఇప్పటికే మెంటలెక్కిపోతున్నారు. అది వచ్చేలోపు హైప్ తోనే పోయేలా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చింది. కానీ ఘోరంగా ఫెయిలైంది. దీంతో అభిమానుల ఆశలన్నీ 'సలార్'పైనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు ఈ మూవీకి 'కేజీఎఫ్'తో కనెక్షన్ ఉందనే టాక్ ఫుల్ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'స్పై' సినిమా ఎఫెక్ట్.. సారీ చెప్పిన హీరో నిఖిల్) 'కేజీఎఫ్' రెండు పార్డ్స్తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చేస్తున్న మూవీ 'సలార్'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటిదైతే కోరుకుంటున్నారో సరిగ్గా అలానే ఉండబోతుంది. అయితే సలార్ టీజర్ ని జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామనడంపై ఫ్యాన్స్ రకరకాల థియరీలు అల్లేసుకున్నారు. 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో రాకీభాయ్ పై సరిగ్గా ఉదయం 5:12 గంటల సమయంలోనే ఎటాక్ జరిగిందని, అందుకే 'సలార్' టీజర్ ని అదే టైమ్‌కి రిలీజ్ చేస్తున్నారని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయం నిర్మాత కార్తీక్ గౌడ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. 'ఇదంతా చూస్తుంటే మా అందరి ముఖంపై స్మైల్ వస్తోంది' అని రీట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే సలార్-కేజీఎఫ్ కనెక్షన్ నిజమేనని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో? This got a smile on all our faces :) https://t.co/GqyqvS8yRg — Karthik Gowda (@Karthik1423) July 3, 2023 (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన 'ధూమమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) 'కేజీఎఫ్, కాంతార,సలార్' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్‌ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!) 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. -
తలైవా తో కేజీఎఫ్ రాకి భాయ్ అదిరిపోయే కాంబినేషన్
-
కేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..
-
గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు
టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ రీసెంట్గా వచ్చిన 'రామబాణం' గురితప్పింది. దీంతో చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు ఆయన ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రొటీన్ కథలతో వస్తున్నడంతో ఆయనకు ఏదీ సెట్ కాలేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు(జూన్ 12) తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేసి, పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. పోస్టర్లో పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నాడు. పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: Jr NTR: ఒక్క యాడ్ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!) 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్ట్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. #BHIMAA pic.twitter.com/a4R9gQb6mK — Gopichand (@YoursGopichand) June 12, 2023 (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
రష్యా లో పఠాన్ సినిమాకి పెద్ద మిస్టరీ ఉంది అట
-
జపాన్ లో కేజీయఫ్ సిరీస్ రిలీజ్
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. కెజీఎఫ్ కోటలోకి ధనుష్ ఎంట్రీ
-
కేజీయఫ్ 3 వచ్చేస్తుంది.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్
-
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్ పవర్ఫుల్ డైరెక్షన్‌తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్‌వుడ్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్‌పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
గేమ్ ఛేంజర్ అవ్వబోతున్న రాఖీ భాయ్?
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
అలా మాట్లాడటం సరైంది కాదు.. మహా కామెంట్స్‌పై నాని
ఇటీవల దర్శకుడు వెంకటేశ్ మహా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని.. అతను అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. తాజాగా దసరా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని మహా కామెంట్స్‌పై స్పందించారు. నాని మాట్లాడుతూ.. 'ఇటీవల దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని చూశా. వెంకటేశ్ మహా మాట్లాడిన విధానం సరిగా లేదు. థియేటర్లో ఒక సినిమా చూసిన తర్వాత బయటకొచ్చి మన ఫ్రెండ్స్‌తో ఒక విధంగా చెబుతాం. కానీ అదే ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే మరోలా చెబుతాం. అక్కడ చర్చలోనూ అదే జరిగింది. అందుకే అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం'. అని అన్నారు. కాగా.. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్ మహా ఓ డిబేట్లో పాల్గొన్నారు. కేజీఎఫ్‌ను ఉద్దేశించి వెంకటేశ్ మహా మాట్లాడుతూ..'తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. -
ఆ విషయంలో క్షమించండి.. కానీ నా మాటలను వెనక్కి తీసుకోను: వెంకటేశ్ మహా
‘కేరాఫ్ కంచెరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా కేజీయఫ్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. సినిమా పేరు చెప్పకుండా స్టోరీ చెబుతూ సెటైర్లు వేశాడు. దీంతో అతడిపై కామెంట్స్‌పై కేజీయఫ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెంకటేశ్ మహాకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న తీవ్ర నెగిటివిటీ, ట్రోల్స్‌కి వెంకటేశ్ మహా స్పందించాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? క్షమాపణలకు బదులుగా తన కామెంట్స్‌ని సమర్థించుకోవడం గమనార్హం. తన అభిప్రాయం సరైనదే అని అయితే తాను వాడిన భాష కరెక్ట్ కాదన్నాడు. ఇంతకీ వెంకటేశ్ మహా ఈ వీడియో ఏం చెప్పాడంటే.. ‘‘కొంతమందిని ఉద్దేశించే నా అభిప్రాయం చెప్పాను. నాలాగే చాలామంది ఆ సినిమా నచ్చలేదు. నా అభిప్రాయం నచ్చినవాళ్లు ‘మీరు చెప్పింది కరెక్ట్ సార్’ అంటూ నాకు మెసెజ్‌లు పెట్టారు. కాబట్టి వారందరి తరపున నా వాయిస్ వినిపించాను. అయితే ఈ క్రమంలో నేను వాడిన పద భాష కరెక్ట్ కాదు. దానికి నా క్షమాపణలు. కానీ, నేను సినిమాలోని కల్పిత పాత్రను మాత్రమే విమర్శించాను. రియల్ పర్సన్ కాదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ట్రెండింగ్‌లో అల్లు అర్జున్-స్నేహల ఫొటో! స్పెషల్ ఏంటంటే.. అనంతరం మాట్లాడుతూ.. ‘తాను దూషించింది కేవలం ఓ కల్పిత పాత్ర మాత్రమే. కానీ రియల్ పర్సన్ అయినా నన్ను దూషించడం ఎంతవరకు కెరెక్ట్. నాపై తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ అసభ్యంగా దూషిస్తున్నారు. ఇదేం నాకు కొత్త కాదు. చాలా సార్లు ఇలాంటివి ఎదుర్కొన్నాను. అయితే మీరంత అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ మరోసారి వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయలతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వారి సమక్షంలోనే ఈ మూవీ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి వారంత నవ్వడం యశ్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో నందిని రెడ్డిని కొందరు ప్రశ్నించగా ఆమె ట్విటర్ వేదికగా క్షమాపణలు కోరారు. pic.twitter.com/SzJ5mt07ml — Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023 -
కేజీఎఫ్.. వాడంత పిచ్చోడు ఉంటాడా?.. దర్శకుడి తీవ్ర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు బాక్సాఫీస్‌ను గడగడలాడించాయి. కేవలం కన్నడలోనే కాకుండా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా ఓ టాలీవుడ్ దర్శకుడికి అస్సలు నచ్చలేదు. దీంతో సదరు సినిమాపై ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా విమర్శలు గుప్పించాడు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా. కేజీఎఫ్ సినిమా పేరు ప్రస్తావించకుండా కేవలం కథ గురించి చెప్తూ సెటైర్లు వేశాడు. 'ఇప్పుడేవైతే వంద కోట్లు, వెయ్యి కోట్లు, లక్ష కోట్లు సంపాదిస్తున్నాయో అవన్నీ పాప్‌కార్న్ ఫిలింస్. పాప్‌కార్న్ తింటూ సినిమా చూడొచ్చు. ఏదైనా సీన్ మిస్సైనా ఏం పర్లేదు అన్నట్లుగా ఉంటుంది. ఆ సినిమాలు ఓటీటీలో చూడాల్సినవి. మేము తీసినవి అలాంటివి కావు. ఒక సినిమా పేరు చెప్పను కానీ వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఒక తల్లి.. కొడుకుని నువ్వెప్పటికైనా గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. అంటే బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడు అని! తల్లి ఓ పెద్ద వస్తువు కావాలంటుంది. ఈ హీరో వెళ్లి దాన్ని తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. వాడు ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే తనను కలవాలనుంది. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఈయన వ్యాఖ్యలు యశ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. పాన్ ఇండియా లెవల్లో హిట్టయిన సినిమా గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడేంటని మండిపడుతున్నారు అభిమానులు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా మాటలకు పడీపడీ నవ్విన డైరెక్టర్ నందినీరెడ్డి సోషల్ మీడియాలో ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు కోరింది. Every commercial film which has become a success is bec the audience hs loved something in tht effort . The conversation was nvr meant 2deride anyones work but rathr hv a positive debate on what cn diversify the narrative of “commercial cinema”. Apologies fr any offence caused 🙏🏼— Nandini Reddy (@nandureddy4u) March 6, 2023 -
ముందుంది ఎన్నికల సమరం.. బీజేపీలోకి కేజీఎఫ్ నటుడు!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యేగా, పరిషత్ సభ్యుడిగా పనిచేసిన అనంత్ నాగ్, జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అనంత్ నాగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు బీజేపీ మంత్రులు మునిరత్న, డాక్టర్ కే సుధాకర్‌లు అనంత్‌నాగ్‌ను ఒప్పించినట్లు సమాచారం. మరో వైపు రానున్న కర్టాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర నేతలు కర్ణాటకలో భారీగా ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళూరు, ఉడిపి, చక్కమగళూరు హాసన్ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొన్నారు. ప్రధాని కూడా త్వరలో షిమోగాలో పర్యటించి మహా సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. కర్టాటకలో మరో సారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి అతిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.. ఇదేమైనా ఇంగ్లాండా? సీఎం నితీష్ ఆగ్రహం -
కేజీయఫ్ స్ఫూర్తితోనే ఉపేంద్ర ‘కబ్జా’
నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. సుదీప్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహానంతరం నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత చంద్రు, నటి శ్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమని చెప్పారు. కేజీఎఫ్ చిత్రం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ చిత్ర స్ఫూర్తితోనే కబ్జా చిత్ర కథను తయారు చేసినట్లు చెప్పారు. తను ఇంతకుముందు 11 చిత్రాలు రూపొందించానని ఇది తనకు 12వ చిత్రం అని చెప్పారు. నటుడు ఉపేంద్ర అంటే అభిమానమని, ఆయన చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా సుదీప్ పాత్ర చిన్నదైనా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నటి శ్రియ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తమిళనాడు చాలా నచ్చిందని.. చెన్నై అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించడం మంచి అనుభవం అని తెలిపారు. ఆయన నటన, నిరాడంబరత, అందరితో కలిసి మెలిసి నడుచుకునే ప్రవర్తన స్పూర్తిదాయకమన్నారు. లైట్‌మ్యాన్ నుంచి అందరికీ నమస్కారం పెట్టే సంస్కారం రజనీకాంత్దే అన్నారు. అలాంటి వారితో నటించడానికి ఎవరికైనా ఇష్టమేనని తెలిపారు. తానూ మళ్లీ రజనీకాంత్‌కు జోడీగా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇప్పుడు భాష భేదం లేదని.. మంచి కథా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఈ కబ్జా చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుందని, ఇందులో నటించటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
భారీ సినిమాల లైనప్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న KGF హీరో యష్
-
సలార్‌లో కేజీఎఫ్ హీరో యశ్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ ప్లే చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రశాంత్ నీల్.. యశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. -
కేజీఎఫ్ ఫ్రాంచైజీలో యశ్ ఉండడు.. బాంబు పేల్చిన నిర్మాత!
సలాం రాకీభాయ్.. ఈ పాట వింటుంటే యశ్ రూపం కళ్లముందుకు రాకమానదు. కేజీఎఫ్ 1, 2 సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి పాన్ ఇండియా స్టార్‌గా మారాడీ కన్నడ హీరో. కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ ఫ్రాంచైజీల నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అది పూర్తైన తర్వాతే కేజీఎఫ్ 3పై దృష్టి పెట్టనున్నాడు. దాదాపు 2025లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇకపోతే కేజీఎఫ్ పార్ట్ 5 తర్వాతి సీక్వెల్లో రాకీ భాయ్ స్థానంలో యశ్‌కు బదులు మరో హీరో ఉండే అవకాశం ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో ప్రతిసారి హీరోలు మారుతూ ఉన్నట్లు ఇక్కడ కూడా వేరేవారిని తీసుకునే ఛాన్స్ ఉంది' అని పేర్కొన్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. యశ్ స్థానంలో మరొకరిని రాకీ భాయ్‌గా ఊహించుకోగలమా? యశ్‌ను రీప్లేస్ చేసే హీరో అసలు ఉన్నాడా? యశ్ లేకుండా కేజీఎఫ్ సినిమా ఆడుతుందా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించిన విజయ్ కిరంగదూర్ ఇటీవలి కాలంలో కేజీఎఫ్, కాంతార చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. రాబోయే ఐదేళ్ల కాలంలో మూడు వేల కోట్లతో సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించాడు. ఏడాదికి ఐదారు సినిమాలను తమ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నాడు. చదవండి: గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్.. తమ్ముడిని ముద్దాడిన శ్రీముఖి సంక్రాంతి ఫైటింగ్: వారసుడు వాయిదా -
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ కీలక ప్రకటన!
భారీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన సంస్థ హోమ్ బాలే. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి కేజీఎఫ్ పార్ట్– 1, పార్ట్–2, కాంతారా వంటి చిత్రాలు విడుదలై భారీ వసూళ్లతో సంచలన విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్లో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా హొంబాలే ఫిలింస్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ ఓ ప్రకటన చేశారు. చదవండి: వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ అలాగే రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ. 3000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది తమకు సక్సెస్‌ఫుల్‌గా గడిచిందన్నాడు. సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోందన్నారు. సినిమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను, చారిత్రిక విషయాలను చూపిస్తూ వస్తున్నామన్నారు. కాగా ఇలాంటి సినిమా రంగం కోసం తన సంస్థ రానున్న అయిదేళ్లలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యానర్లో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ చిత్రంతో పాటు పృథీరాజ్ హీరోగా టైసప్, ఫాహత్ ఫాజిల్ కథానాయకుడుగా ధూమమ్, దక్షిత శెట్టి దర్శకత్వంలో రిచర్డ్ ఆంటోనీ చిత్రాలను తెరకెక్కుతున్నాయి. On behalf of @HombaleFilms, I wish to extend my heartfelt greetings for the new year and appreciate you all for showering unwavering love and support towards us. #HappyNewYear! - @VKiragandur#HombaleFilms pic.twitter.com/h5vXMsaMWP — Hombale Films (@hombalefilms) January 2, 2023 -
కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్ డేట్.. ఆ సినిమా పూర్తయ్యాకే..!
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్ అధినేత విజయ్ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న ప్రభాస్ మూవీ 'సలార్' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్-3పై అప్డేట్ ఇచ్చారు. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్ చాప్టర్-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేజీఎఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. -
సినిమా రంగంలో భారీ పెట్టుబడి.. అన్ని భాషల్లోనూ ఎంట్రీ..!
కన్నడలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో భారతీయ వినోద పరిశ్రమలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు. అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయ్ కిరగందూర్ మామట్లాడుతూ.. 'భారత్ వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీనివల్ల ఇండియాలో వినోద పరిశ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్నాం.' అని అన్నారు. -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
కె.జి.యఫ్ హోటల్.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
కేజీఎఫ్ హీరో యశ్ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ అంటూ..!
కేజీఎఫ్ హీరో యశ్ టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. శాండల్‌వుడ్‌లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) రాధిక ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్, రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు. కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్‌తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
కేజీఎఫ్ నటుడు కన్నుమూత
కేజీఎఫ్ నటుడు కృష్ణ జి. రావు కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేజీఎఫ్ మొదటి భాగంలో విలన్లను హీరో యశ్ చితక్కొట్టే ఫైట్ సన్నివేశానికి ముందు ఈ తాత అంధుడిగా కనిపిస్తారు. ఆ సన్నివేశంతో రాఖీభాయ్ పవరేంటో అందరికీ తెలిసొస్తుంది. కేజీఎఫ్ సినిమాల్లో ఆయన నిడివి తక్కువే అయినప్పటికీ ఈ మూవీలు సూపర్ హిట్ కావడంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన్ను వెతుక్కుంటూ సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ జి రావు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, కథా రచయితగా.. ఇలా చాలా పనులు చేశారు. ఇలాంటి సమయంలో ప్రొవిజనల్ మేనేజర్ కుమార్.. కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణని కోరారు. కానీ ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండటంతో నటన తనకెందుకులే అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన కేజీఎఫ్ సినిమాకు సెలక్ట్ అయ్యారు. చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్ నన్ను చితక్కొట్టాడు, చంపేందుకు ప్రయత్నించాడు: నటి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ -
‘కేజీయఫ్’ మూవీ బ్యానర్లో నయనతార కొత్త మూవీ!
తమిళ సినిమా: వివాహానంతరం కొత్త చిత్రాలు కమిటవ్వడంలో తగ్గేదేలే అంటోంది నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేయాలంటే దక్షిణాదిలో ఈమె తరువాతే ఎవరైనా అన్నంతగా నయనతార ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు అన్ని విధాలుగా ఆలోచించే పెళ్లయిన తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయినట్లు ఉంది. వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా కొనసాగుతుందని జరిగిన ప్రచారాన్ని తలకిందులు చేసింది. వచ్చిన అవకాశాలను వదులుకునేదేలే అంటోందనిపిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె హీరోయిన్ సెంట్రింగ్ పాత్రలో నటించిన గోల్డ్, కనెక్ట్, హిందీలో షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన జువాన్ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో వరుసగా విడుదలకు సిద్ధవుతున్నాయి. తాజాగా పాన్పు, ఆటో జానీ, జయం రవి సరసన ఇరైవన్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే దర్శకుడు దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. తాజాగా నయనతార నటించిన కొత్త చిత్రం గురించి సమాచారం వెలుగు చూసింది. ఇంతకుముందు కేజీఎఫ్ పార్ట్1, పార్ట్ 2, కాంతార వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రంలో నయనతార నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా నయనతార నటిస్తుందంటే అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రమే అవుతుందని భావించవచ్చు. -
సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. (చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్ అన్నారు. ‘కేజీయఫ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్‌లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు. (చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!) -
బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!
కేజీఎఫ్ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్‌కు ప్రముఖ నిర్మాతలు యశ్‌ను సంప్రదించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్2 కోసం యశ్‌ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది. అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
మొన్న కేజీఎఫ్-2.. నేడు కేజీఎఫ్-1.. కాంతార దెబ్బకు రికార్డులన్నీ ఫట్
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కలెక్షన్లతో మోత మోగిస్తోంది. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. యశ్ నటించిన కేజీఎఫ్-1ను వెనక్కినెట్టింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది. (చదవండి: కాంతార తగ్గేదేలే.. ఆ విషయంలో కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్) అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కర్ణాటకలో పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో కేజీఎఫ్-2 రూ.1207 కోట్ల భారీ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. 2022లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కాంతార కూడా చేరింది. ఆ జాబితాలో కేజీఎఫ్- 2, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్1 , విక్రమ్, బ్రహ్మాస్త్ర -పార్ట్ 1, భూల్ భూలయ్యా -2 చిత్రాల తర్వాత ఏడో స్థానంలో కాంతార నిలిచింది. -
Kantara Movie: KGF, కాంతార మధ్య పోలిక...
-
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు
కేజీఎఫ్ చాప్టర్–1, చాప్టర్–2 చిత్రాలు కన్నడ సినీ చరిత్రను మార్చేశాయని చెప్పవచ్చు. అప్పటి వరకు లో బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన కన్నడ నిర్మాతలు కేజీఎఫ్ చిత్రం తరువాత పాన్ ఇండియాస్థాయిలో చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టారు. ఆ రెండు చిత్రాల విజయాల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం చూపింది. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ హూంబాలే ఫిలిమ్స్ అన్నది తెలిసిందే. కాగా ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా సలార్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సూరరైపోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటనను నిర్మాణ సంస్థ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందని అందులో ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల విడుదలైన వెందు తనిందదు కాడు చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శింబు ప్రస్తుతం పత్తు తల చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. అదే విధంగా దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూరరై పోట్రు చిత్ర హిందీ రీమేక్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించే భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
కేజీఎఫ్ రాకీభాయ్ స్ఫూర్తితో.. శివప్రసాద్ వరుస హత్యలు
కలకలం రేపిన సెక్యూరిటీ గార్డుల వరుస హత్యల ఉదంతాన్ని.. త్వరగతినే చేధించారు మధ్యప్రదేశ్ పోలీసులు. కన్నడ సెన్సేషనల్ చిత్రం కేజీయఫ్ స్ఫూర్తితోనే తాను హత్యలు చేశానని, రాకీ భాయ్లా పేరు సంపాదించుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిందితుడు శివ ప్రసాద్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ వరుస హత్యల ఉదంతంలో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇప్పుడు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పరిధిలో వరుసగా సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురికావడం.. సంచలనం సృష్టించింది. నిద్రిస్తున్న వాళ్లను అతికిరాతకంగా హత్య చేశాడు 19 ఏళ్ల శివ ప్రసాద్. కేజీఎఫ్ చిత్రంలో లీడ్ రోల్ రాకీ భాయ్ తరహాలో ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ హత్యలు చేసినట్లు శివ ప్రసాద్ పోలీసుల ముందు వెల్లడించాడు. ఎలా దొరికాడంటే.. నిక్కరు, షర్టులో ఉన్న హంతకుడు.. ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. మార్పుల్ రాడ్‌తో ముందుగా బాధితుడిపై వేటు వేసి.. చనిపోయాడా? లేదా? నిర్ధారించుకుని.. బతికే ఉండంతో బండ రాయితో బాది మరీ చంపడం ఆ వీడియోలో ఉంది. అయితే అంతకు ముందు చంపిన వాళ్లలో ఒకరి సెల్‌ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు నిందితుడు శివ ప్రసాద్. ఈ తరుణంలో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు శివను ట్రేస్ చేసి.. శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. రాకీభాయ్‌లా ఎదగాలనే.. కేజీఎఫ్ సినిమా స్ఫూర్తితోనే తాను ఈ హత్యలు చేశాడని, అందులో ప్రధాన పాత్ర రాకీ భాయ్లా తాను ఎదిగి.. పేరు తెచ్చుకోవాలనే హత్యలు చేశాడని, ఈ క్రమంలో పోలీసులను తర్వాతి లక్ష్యంగా చేసుకున్నట్లు శివ ప్రసాద్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తరుణ్ నాయక్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాతే పోలీసులను లక్ష్యంగా చేసుకుని తన సత్తా చూపించాలని అనుకున్నాడట. ఇదిలా ఉంటే.. భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ఏరియాలో శివ ప్రసాద్ వరుసగా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను హత్య చేసుకుంటూ పోయాడు. ఆగస్టు 28వ తేదీన సుత్తితో కళ్యాణ్ లోధీ అనే సెక్యూరిటీ గార్డును చంపాడు. ఆ మరుసటి రాత్రి శంభు నారాయణ దూబే అనే కాలేజీ సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి చంపేశాడు. ఆ మరుసటి రాత్రి ఓ ఇంటి వాచ్మెన్ అయిన మంగల్ అహిర్వర్ను చంపేశాడు. ఆపై ఒక్కరోజు గ్యాప్‌తో గురువారం రాత్రి సోను వర్మ అనే సెక్యూరిటీ గార్డును అతను కాపాలా ఉండే మార్బుల్ కంపెనీలోనే దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడం.. బాధితుల సెల్‌ఫోన్ వాడడంతో సిగ్నల్ ఆధారంగా మరుసటి రోజు ఉదయమే భోపాల్‌లో దొరికిపోయాడు శివ ప్రసాద్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk — Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022 గతంలోనూ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను శివ ప్రసాద్ హత్య చేసినట్లు తేలింది. ఈ మే నెలలో ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డును దారుణంగా చంపేసి.. అతని ముఖంపై ఓ బూట్‌ను ఉంచేసి వెళ్లిపోయాడు. అనంతరం జూన్ చివరి వారంలోనూ ఓ హత్య చేశాడు. అప్పటి నుంచి ‘స్టోన్ మ్యాన్’ భయం మొదలైంది. తాజాగా వరుస హత్యల నేపథ్యంలో హోం మంత్రి నరోత్తం మిశ్రా స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసును త్వరగతిన చేధించగలిగారు పోలీసులు. అతని దగ్గర దొరికిన ఆధార్‌కార్డ్ వివరాల ప్రకారం..శివ ప్రసాద్ స్వస్థలం సాగర్ జిల్లా కేస్లీ. తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదు. కాకపోతే ఎనిమిదో తరగతి దాకా చదువుకుని.. గోవాలో కొంతకాలం పని చేశాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. కేజీఎఫ్-2 చిత్రం చూశాక.. ఆ చిత్రంలో రాఖీలా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశాడట. అంతకు ముందు హంతకుడి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.. 30వేల రూపాయల రివార్డు ప్రకటించారు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై మాత్రం నిందితుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: నాన్నా.. వాడు అమ్మను రైలు నుంచి తోసేశాడు -
కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్, మూడేళ్లుగా దాచిపెట్టాడు!
ప్రముఖ కన్నడ నటుడు హరీశ్ రాయ్ కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా నటించి సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలువురు దక్షిణాది హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్ నాలుగో దశలో ఉంది. తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని హరీశ్ రాయ్ మొదట గుట్టుగా దాచాడు. ఈ విషయం బయటకు చెప్తే తనకు సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో దాన్ని గోప్యంగా ఉంచాడు. కానీ, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాడు. 'కొన్ని పరిస్థితులు మనకు అద్భుతాన్ని అందించవచ్చు, లేదంటే మనదగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టేలా చేయవచ్చు. విధి నుంచి మనం తప్పించుకునే ఛాన్సే లేదు. నేను మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనివల్ల మెడ దగ్గర వాచిపోయింది. నా దగ్గర డబ్బు లేకపోవడంతో శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాను. ఆ సమయంలో కేజీఎఫ్‌లో నటించే అవకాశం రావడంతో పెద్ద గడ్డంతో నా వాపు కనిపించకుండా కవర్ చేసుకున్నాను. నేను నటించిన సినిమాలు రిలీజయ్యేవరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నాను' 'ఇప్పుడు క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఓసారైతే క్లైమాక్స్‌లోని ఓ సీన్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది' అని తన దీనగాథను చెప్పుకొచ్చాడీ నటుడు. ఒకసారి తన చికిత్స కోసం డబ్బులు కావాలని కోరుతూ ఓ వీడియో చేసినప్పటికీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ధైర్యం చాల్లేదన్నాడు హరీశ్. ఇప్పుడతడికి క్యాన్సర్ ఉందన్న విషయం బహిర్గతం కావడంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారట! చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా? రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా? -
కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!
కేజీయఫ్ అనగానే కళ్లముందుకు రాఖీభాయ్ వచ్చేస్తాడు. సలాం రాఖీభాయ్ అనే కటౌట్ కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో హై వోల్డేజ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు భాగాలు వస్తే.. రెండింటినీ సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. కేజీయఫ్2 అయితే ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇదే జోష్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యశ్ మూడో భాగాన్ని తీసుకొస్తారని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కేజీయఫ్ ఫ్యాన్స్. ఈసారి రాఖీ భాయ్ మరింత రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కేజీయఫ్3 లో రాఖీభాయ్ కాకుండా మరో హీరో నటించబోతున్నాడు. పార్ట్ 3లోకి చియాన్ విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా తమిళ దర్శకుడు పా. రంజిత్ తో కొత్త సినిమాను ప్రారభించాడు విక్రమ్. త్రీడీ ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. అది సరే, ఈ సినిమాకు, కేజీయఫ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఇండిపెన్డెన్స్కు ముందు నరాచిలో జరిగిన ఆచారకాలపైనే పా.రంజిత్ దృష్టిపెడుతున్నాడని సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు స్వాతంత్య్రం రాకముందు కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది పా.రంజిత్ చూపించబోతున్నాడట. (చదవండి: పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు) మరోవైపు కేజీయఫ్ 3 పై ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 3తో తిరిగొస్తామని అభిమానులకు మాట ఇచ్చాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత టైగర్ తో ప్లాన్ చేస్తోన్న మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాతే కేజీయఫ్ 3 తీసుకొస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ లోపే విక్రమ్ కేజీయఫ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ పాప్‌కార్న్ నాచోస్కు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ... ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది? అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను. సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్‌లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్‌లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ? అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ? అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను. మీరు స్టార్‌గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు? నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్‌గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా. యష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది? యష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి. ప్రశాంత్ నీల్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు. సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా? నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు ఇటీవల కేఎఫ్‌సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్‌కు ఏ మేరకు తేడా ఉంటుంది? కేఎఫ్‌సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్‌లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు? అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'. కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ? నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి. చాలా ప్రాజెక్ట్‌లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు. ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్‌పోజర్‌ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో మీరు నటించే అవకాశం ఉందా ? పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్‌పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం. -
‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటున్న యశ్ తనయుడు, ఏమైందంటే..
కేజీయఫ్ సీక్వెల్‌తో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు కన్నడ రాక్‌స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీయఫ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 వేయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో యశ్ రాఖీ భాయ్ అనే మైనింగ్ స్మగ్లర్‌గా కనిపించాడు. ఇందులో పలు సన్నివేశాల్లో తనిన తాను బ్యాడ్ బాయ్‌గా యశ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ ఇదిలా ఉంటే తాజాగా ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటూ యశ్ తనయుడు అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యశ్ విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో పిల్లలతో సరదగా గడుపుతున్నాడు. కూతురు ఐరా, కుమారుడు యథర్వ్‌తో కలిసి సరదగా ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలను తరచూ ఆయన భార్య రాధిక పండిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. ఇప్పుడు తాజాగా తనయుడు యథర్వ్ క్యూట్ వీడియో ఒకటి పంచుకుంది. ఇందులో తనయుడిని యశ్ ఏడిపించినట్టుగా ఉన్నాడు. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు యశ్‌ను యథర్వ్ బ్యాడ్ బాయ్ అంటుంటే లేదు గుడ్ బాయ్ అంటూ కొడుకుతో వాదిస్తుంటాడు ‘రాఖీ భాయ్’. అయినా యథర్వ్ డాడీ బ్యాడ్ బాయ్ అంటుంటాడు. లేదు డాడీ గుడ్ అని యశ్ అంటుంటే ‘నో డాడీ బ్యాడ్.. మిమ్మి గుడ్’ అంటూ యథర్వ్ ఏడుస్తూ క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్ట్ నెటిజ్లను రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘యథర్వ్ అమ్మ కొడకు’, ‘యథర్వ్ సో క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కేజీయఫ్ చిత్రంలోని రాఖీ భాయ్ డైలాగ్‌ను ఈ సందర్భంగా ఈ సంఘటనకు ఆపాదిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇక యశ్ ఫ్యాన్స్ ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
Srinidhi Shetty: కేజీయఫ్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేంటి?
హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. కేజీయఫ్ బ్రాండ్ తో శ్రీనిథి శెట్టి కూడా అలానే చేయాలి అనుకుంది. అసలే కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ల ఫ్యాక్టరీలా మారిపోయింది. ఇలానే తను కూడా టాలీవుడ్ కి వచ్చి వెలుగు వెలగాలనిచూసింది. (చదవండి: టార్గెట్ సంక్రాంతి... బాక్సాఫీస్ బరిలో చిరు, పవన్, ప్రభాస్) ఇప్పటికే కన్నడ నుంచి అరడజనుకు పైగా కొత్త తారలు టాలీవుడ్ లో ఊపేస్తున్నారు. సౌందర్య, అనుష్క, ప్రేమ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ లిస్ట్ లో చేరాలని ప్రయత్నం చేసిందిశ్రీనిథి శెట్టి. కాని ఆమె అనుకున్న ఆశలకు ఆమె నిర్ణయమే గండి కొట్టినట్టు తెలుస్తోంది. కేజీయఫ్ సినిమా తరువాత పారితోషికాన్ని భారీగా పెంచింది శ్రీనిధి. కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంత వరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. కేజీయఫ్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేనని శాండల్‌వుడ్ లో టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం తో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్ ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. -
కేజీయఫ్ 3లో హృతిక్ రోషన్!
ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా,యశ్ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నా....వారిద్దరిని మాత్రం కేజీయఫ్ 3 వదలడంలేదు.ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ లేదని తెల్సినా సరే కేజీయఫ్ 3పై రూమర్స్ ఆగడం లేదు.కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడం ఆలస్యం.. చాప్టర్ 3 కి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాకీభాయ్ ఫ్యాన్స్.దాంతో కేజీయఫ్ 3 సోషల్ మీడియాలో కంటిన్యూ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రూమర్స్ కేజీయఫ్3 పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీయఫ్ 2 బాలీవుడ్ స్టార్స్ డామినేషన్ కనిపించింది.రమికా సేన్ పాత్రలో రవీనాటాండన్, అలాగే అధీరా రోల్ ను సంజయ్ దత్ పోషించాడు.వీరిద్దరి కాంబినేషన్, కేజీయఫ్ లో రాకీభాయ్ ఎలివేషన్ ఈ సీక్వెల్ కు నార్త్ లోనే 430 కోట్లను అందించింది.బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన రెండవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీయఫ్2. కేజీయఫ్ సిరీస్ పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు,ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో డైరెక్ట్ గా అక్కడి స్టార్ హీరో హృతిక్ ను రంగంలోకి దింపుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రొడ్యుసర్ విజయ్ కిరంగదూర్ మాత్రం ఈ ఏడాదిలో కేజీయఫ్-3 ఉండదని, ఈ చిత్రంలో హృతిక్ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.'సలార్' సినిమా మేకింగ్‌లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారని.. అటు యష్ కూడా కొత్త ప్రాజెక్ట్‌కు ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తామన్నారు ఈ సంగతి ఇలా ఉంటే,ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం పెంచారని శాండల్ వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా బడ్జెట్ ను 200 కోట్లు అనుకున్నారట. ఇప్పుడు కేజీయఫ్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ,సలార్ లో అంతకు మించి యాక్షన్ ఉండాలని దాదాపు 40 కోట్లు బడ్జెట్ హైక్ చేసాడట డైరెక్టర్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోంది. -
తగ్గేదేలే అంటున్న ‘కేజీయఫ్’ బ్యూటీ, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్?
కేజీయఫ్ సీరిస్తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. మోడల్‌గా రాణిస్తున్న ఆమెకు కేజీయఫ్ చిత్రం ఆఫర్ వచ్చింది. దీంతో తొలి చిత్రమే పాన్ ఇండియా కావడం, అది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో శ్రీనిధి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. దీంతో కేజీయఫ్ 2 తర్వాతా ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. సినిమాలను ఎంచుకోవడంలో ఈ బ్యూటీ ఆచీతూచి అడుగులేస్తుందని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ భామ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఫిలిం దూనియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం సౌత్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల తీసుకునే రెమ్యునరేషన్‌కు సమానంగా శ్రీనిధి రెండు సినిమాలకే డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేజీయఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెను హోస్ట్ మీకు పేరు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నించింది. దీనికి శ్రీనిధి నిర్మోహమాటంగా డబ్బే కావాలి అని టక్కున సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా కేజీయఫ్ 2 అనంతరం శ్రీనిధి రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.