Yusuf Pathan
-
యూసఫ్ పఠాన్ ఊచకోత.. అయినా పాపం?(వీడియో)
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ-2024 విజేతగా సదరన్ సూపర్ స్టార్స్ నిలిచింది. శ్రీనగర్ వేదికగా కోణార్క్ సూర్యస్, సదరన్ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరు సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. కోణార్క్ సూర్యస్పై సూపర్ ఓవర్లో సదరన్ జట్టు విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.సూపర్ స్టార్స్ బ్యాటర్లలో జింబాబ్వే మాజీ కెప్టెన్ హ్యామిల్టన్ మసకద్జ(58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోణార్క్ సూర్యాస్ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, దివేశ్ పఠానియా తలో వికెట్ సాధించారు.యూసఫ్ విరోచిత పోరాటం..అనంతరం లక్ష్యచేధనలో కోణార్క్ సూర్యస్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.కాగా 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సూర్యస్ జట్టును యూసఫ్ పఠాన్ తన విరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో ఉంచాడు. ఈ మ్యాచ్‌లో పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కొణార్క్ జట్టు 13 పరుగులు చేసింది. ఆ తర్వాత సదరన్ జట్టు కేవలం 4 బంతుల్లోనే టార్గెట్‌ను అందుకుంది. సదరన్ స్టార్ బ్యాటర్ గుప్టిల్ వరుసగా రెండు సిక్స్‌లు బాది తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు! Maturity is when you realize Yusuf Pathan can still make into main Indian side.Gem of a knock in the final, 85 of 38 balls 🥶pic.twitter.com/SJmRWLVjUI— Sujeet Suman (@sujeetsuman1991) October 16, 2024 -
దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ పఠాన్ సోదరులు చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ 47 బంతుల్లో 62, యూసఫ్ పఠాన్ 21 బంతుల్లో 43 పరుగులు చేసి కోణార్క్ సూర్యాస్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కోణార్క్ సూర్యాస్ ఇన్నింగ్స్‌లో పఠాన్ బ్రదర్స్‌తో పాటు రిచర్డ్ లెవి మాత్రమే రెండంకెల స్కోర్ (22) చేశాడు. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సదరన్ స్టార్స్ బౌలర్లలో హమిద్, రజాక్, సుబోత్ భాటి, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సదరన్ స్టార్స్.. హమిల్టన్ మసకద్జ (67), పవన్ నేగి (40 నాటౌట్) సత్తా చాటడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. సదరన్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ 4, శ్రీవట్స్ గోస్వామి 23, చిరాగ్ గాంధీ 7 పరుగులు చేశారు. కోణార్క్ సూర్యాస్ బౌలర్లలో దివేశ్ పథానియా, వినయ్ కుమార్, అప్పన్న తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పఠాన్ సోదరులు మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించినా కోణార్క్ సూర్యాస్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సదరన్ స్టార్స్ ఫైనల్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం -
IND VS PAK: రాయుడు, యూసఫ్ విధ్వంసం.. పాక్ చిత్తు! టోర్నీ విజేతగా భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసంఅనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్‌కు వరించింది. -
అన్నపై అసహనం వ్యక్తం చేసిన ఇర్ఫాన్ పఠాన్
రామ లక్షణుల్లా కలిసి మెలిసి ఉండే పఠాన్ సోదరులు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సందర్భంగా మాటా మాటా అనుకున్నారు. రనౌట్ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొద్ది సేపటికే అది సమసిపోయింది. అన్మదమ్ములిద్దరు మ్యాచ్ అనంతరం మైదానంలో కలియతిరిగారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ గెలిచే స్థితిలో ఉండింది. భారత్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి ఉండింది. క్రీజ్‌లో ఇర్ఫాన్ పఠాన్ (34), యూసఫ్ పఠాన్ (36) ఉన్నారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉండగా.. భారత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. A heated moment between Pathan brothers at WCL.India Champions needed 21 runs in the last 12 balls to qualify for Semi Finals. pic.twitter.com/hgIbhCtGFq— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024అయితే 18వ ఓవర్ చివరి బంతికి ఇర్ఫాన్ భారీ షాట్‌కు ప్రయత్నించి, అది విఫలం కావడంతో రెండు పరుగులు తీయాలని ప్రయత్నించాడు. రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో పఠాన్ సోదరుల మధ్య సమన్వయం లోపించడంతో ఇర్ఫాన్ రనౌటయ్యాడు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఇర్ఫాన్.. అన్న యూసఫ్ పఠాన్‌పై అసహనం వ్యక్తం చేసి గట్టిగా అరిచాడు. ఇందుకు యూసఫ్‌కు కూడా ప్రతిగా స్పందించాడు. అన్నదమ్ముల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. స్నైమ్యాన్ (73), రిచర్డ్ లెవి (60) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్బజన్ సింగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. సౌతాఫ్రికా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూసఫ్ పఠాన్ (54 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (35) భారత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచినా సెమీస్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ సెమీస్‌కు చేరింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, భారత్ సెమీస్‌కు చేరగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇంటిబాట పట్టాయి. -
యువరాజ్ మళ్లీ ఫెయిల్.. సెమీఫైనల్లో టీమిండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. యూసఫ్ పఠాన్(44 బంతుల్లో54, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్(21 బంతుల్లో 35, 4 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడనప్పటకి అప్పటికే మ్యాచ్ భారత్ చేదాటిపోయింది. కెప్టెన్ యువరాజ్ సింగ్(5) మరోసారి ఫెయిల్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ రెండు వికెట్లు పడగొట్టగా.. చార్ల్ లాంగెవెల్డ్ట్, తహీర్,స్నైమెన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో స్నైమెన్(73) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివీ(25 బంతుల్లో 60, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి, వినయ్‌కుమార్, యూసఫ్ తలా వికెట్ సాధించారు.సెమీస్‌లో భారత్..ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సెమీఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. పాయింట్ల పట్టకలో నాలుగో స్ధానంలో భారత్ నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పరంగా సమంగా నిలిచాయి. అయితే దక్షిణాఫ్రికా(-1.340) రన్‌రేట్ కంటే భారత్(-1.267)రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో సెమీస్‌కు యువీ సేన ఆర్హత సాధించింది. జూలై 12న నార్తాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ భారత్ తలపడనుంది. -
యువరాజ్ ఫెయిల్..బెంగాల్ ఎంపీ తుపాన్ ఇన్నింగ్స్! వీడియో వైరల్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సోమవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతులు ఎదుర్కొన్న యూసఫ్ పఠాన్ 78 పరుగులు చేశాడు.కానీ ఆఖరిలో ఔట్ కావడంతో జట్టును గెలిపించలేకపోయాడు. యూసఫ్‌తో పాటు అంబటి రాయడు(26) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(19) మరోసారి ఫెయిల్ అయ్యాడు.ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడిల్, కౌల్టర్‌నైల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లాగ్లిన్, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో క్రిస్టియన్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాన్ మార్ష్(41) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కులకర్ణి రెండు, ఆర్పీ సింగ్, అనురీత్, హార్భజన్ సింగ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 10న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై 73 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందాడు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన యూసఫ్.. రాజకీయ దురంధరుడు, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, మూడు ఎంపీ అయిన అధిర్ రంజన్‌పై సంచలన విజయం సాధించడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిర్ రంజన్ ప్రస్తుతం తాను ఓటమి చవిచూసిన బరంపూర్ నుంచే 1999 నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. అధిర్ రంజన్ గత లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తొలి క్రికెటర్‌గా యూసఫ్ అరుదైన ఘనత సాధించాడు. గత లోక్‌సభలో ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే అతను ఈసారి ఎన్నికల్లో పాల్గొనలేదు.కాగా, ఇవాళ (జూన్ 4) వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీఎంసీ 29 స్థానాల్లో జయకేతనం ఎగరేసే దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఈ ఎన్నికల్లో బెంగాల్ నుంచి టీఎంసీ విజయదుందుభి మోగించనుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వచ్చింది. అయితే బీజేపీ మాత్రం కేవలం 12 సీట్లకే పరితమితమయ్యేలా కనిపిస్తుంది.దేశవ్యాప్తంగా వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే.. గతంలో కంటే ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గణనీయంగా సీట్లు తగ్గేలా ఉన్నాయి. ప్రస్తుతమున్న సమాచారం మేరకు 543 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 292 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 300కు పైగా సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అనూహ్య విజయాలు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ కూటమి ప్రస్తుతమున్న సమాచారం మేరకు 236 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
క్రికెటర్‌పై పోటీ.. అభ్యర్థికి మహిళల చందాలు
కోల్‌కతా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గ్రామీణ మహిళలు చందాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పదకొండు మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, 1999 నుండి బెర్హంపూర్ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధిర్ రంజన్ చౌదరికి ఎన్నికల ప్రచారం కోసం రూ.11,000 విరాళంగా అందించారు. అభ్యర్థికి మహిళలు చందాలు ఇస్తున్న వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రణగ్రామ్ గ్రామానికి చెందిన మహిళలు వ్యవసాయ కూలి పనులు, మేకల పెంపకం, రోజువారీ కూలి పనుల ద్వారా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పోగు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థికి విరాళంగా అందించారు. దీంతో ఆ మహిళలకు అధిర్ రంజన్ చౌదరి భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. బెర్హంపూర్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను పోటీకి దించింది. డాక్టర్ నిర్మల్ సాహా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరితో అధిర్ రంజన్ చౌదరి తలపడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. బెర్హంపూర్, మల్దహా దక్షిణ్‌తో సహా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనునన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. మొత్తం 543 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. 42 పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉన్న పశ్చిమ బెంగాల్లో అన్ని దశల్లో పోలింగ్ జరుగుతుంది. #WATCH | Murshidabad, West Bengal: 11 women of Kandi town's Ranagram village handed over a total of Rs 11,000 to Congress' Behrampore Lok Sabha candidate Adhir Ranjan Chowdhury to help him in the Lok Sabha elections. The women collected the money from their household expenses,… pic.twitter.com/5QRnjldaUG — ANI (@ANI) April 7, 2024 -
మొదలైన యూసఫ్ పఠాన్ ప్రచారం: అధీర్ చౌదరి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించిన 42 మంది అభ్యర్థులలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ 'యూసఫ్ పఠాన్' (Yusuf Pathan) పేరు కూడా ఉంది. ఈయన బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ నిలబడటం సర్వత్రా చర్చలకు దారి తీసింది. నిజానికి ఇప్పటికే చౌదరి బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట నుంచి ఇప్పుడు యూసఫ్ పఠాన్ పోటీ చేయనున్నారు. #WATCH | West Bengal: Former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore Yusuf Pathan says, "The field is very different but the expectations of the people remain the same- that I work for them, and carry forward the work done by my team (TMC)... I am as… pic.twitter.com/1XGmyrKhTW — ANI (@ANI) March 21, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూసఫ్ పఠాన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడేటప్పుడు ప్రజల ప్రేమను పొందానని, ఇప్పుడు లోక్‌సభ పోటీదారుగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 'అధీర్ రంజన్ చౌదరి' యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ.. రాజకీయాలు & క్రికెట్ ఒకేలా ఉండవని అన్నారు. అయితే చౌదరిని బెర్హంపూర్ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధికారికంగా నామినేట్ చేయలేదు. బెర్హంపూర్ లోక్‌సభ స్థానానికి మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. #WATCH | Murshidabad, West Bengal: Yusuf Pathan, former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore says, "I am grateful to Mamata Didi (CM Mamata Banerjee) for giving me the opportunity to serve you. I hope that the way you people have given me love for the… pic.twitter.com/N7ihjlPXhU — ANI (@ANI) March 21, 2024 -
కాంగ్రెస్ కంచుకోటలో యూసఫ్ పఠాన్.. టీఎంసీ గెలుపు సాధ్యమేనా?
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. నిజానికి బహరంపూర్ నియోజకవర్గం లోక్‌సభ నాయకుడు 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటికి కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. చౌదరి లోక్‌సభలో ఐదుసార్లు గెలిచిన బహరంపూర్ నుంచి తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి చౌదరికే ఎంపీ సీటు ఖరారు చేసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో అధికారికంగా పొత్తు ఉండదని నిర్దారించుకున్న నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల నిర్ణయంలో సరైన పొత్తు కుదరకపోవడంతోనే మమతా బెనర్జీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు 42 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించింది. -
లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్ బెంగాల్‌లోని బరంపూర్ నియోజకవర్గం నుంచి యూసఫ్ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఇవాళ ఉదయమే తృణమూల్ తీర్దం పుచ్చుకున్న పఠాన్... పార్టీలో చేరిన గంటలోపే ఎంపీ టికెట్ దక్కించుకోవడం ఆసక్తికరం. ప్రస్తుతం బరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా బరంపూర్ స్థానాన్ని టీఎంసీ కాంగ్రెస్‌కు వదిలి పెడుతుందని అంతా అనుకున్నారు. Here's an exclusive image of Yusuf Pathan following his entry into the politics with the All India Trinamool Congress.#YusufPathan pic.twitter.com/UfnrbdvDTy— CricTracker (@Cricketracker) March 10, 2024 అయితే కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ టీఎంసీ రాష్ట్రం మొత్తంలో అభ్యర్దులను నిలబెట్టింది. ఇవాళ ఉదయం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 42 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో విషయంలో కాంగ్రెస్-టీఎంసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని గత కొద్ది రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తాడని సమాచారం. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. అయితే గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. -
యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 11 బంతుల్లోనే
యూఎస్ మాస్టర్ టీ10 లీగ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్ రెండో విజయం నమోదు చేసింది. ఫ్లోరిడా వేదికగా కాలిఫోర్నియా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజెర్సీ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాలిఫోర్నియా బ్యాటర్లలలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3ఫోర్లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. న్యూజెర్సీ బౌలర్లలో ట్రిగో, బార్నవాల్ తలా వికెట్ పడగొట్టారు. యూసుఫ్ పఠాన్ ఊచకోత.. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా మాజీ ఆటగాడు, న్యూజెర్సీ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్ ఓజా(25) పరుగులతో రాణించాడు. మరో మ్యాచ్‌లో అట్లాంటా రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో న్యూయార్క్ వారియర్స్ విజయం సాధించింది. చదవండి: Asia Cup 2023 Team India Squad: అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్! -
యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఫైనల్‌కు చేరుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా క్వాలిఫయర్-1లో తో డర్బన్ క్వాలండర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన జోబర్గ్.. ఫైనల్లో అడుగుపెట్టింది. 141 పరుగుల భారీ లక్ష్యాన్ని 9.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జో బర్గ్ ఛేదించింది.ఇక ఈ మ్యాచ్‌లో జోబర్గ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 80 పరుగులు సాధించిన ఫఠాన్.. ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో జోబర్గ్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. పఠాన్ వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో ఫ్లెచర్(39), ఆసిఫ్ అలీ(32) పరుగులతో రాణించారు. ఇక ఇది ఇలా ఉండగా.. క్వాలిఫయర్-1లో ఓటమి పాలైన డర్బన్ క్వాలండర్స్.. క్వాలిఫయర్-2లో మాత్రం విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో జూలై 29న జరగనున్న ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ , డర్బన్ జట్లు తలపడనున్నాయి. Yusuf Pathan smashed 6, 6, 0, 6, 2, 4 in a single over against Amir. What a beast. 🔥pic.twitter.com/8nCf1H8l8c — Johns. (@CricCrazyJohns) July 28, 2023 -
రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్ సోదరులు
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్ను గెలిపించాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
టీ10 లీగ్‌లో ఆడనున్న రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్
జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా "జిమ్ ఆఫ్రో టీ10" పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. తాజాగా ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేశాయి. కాగా ఈ టీ10 లీగ్‌లో రాబిన్ ఊతప్ప, పార్ధివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్, రాహుల్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ హరారే హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహించనుండగా.. పార్ధివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ కేప్‌టౌన్ సాంప్ ఆర్మీకి, రాహుల్ శర్మ, యూసప్ ఫఠాన్ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్ తరపున ఆడనున్నారు. అదే విధంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హాఫీజ్ కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు. డర్బన్ క్వాలండర్స్: ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, జార్జ్ లిండే, హజ్రతుల్లా జజాయ్, టిమ్ సిఫెర్ట్, సిసంద మగాలా, హిల్టన్ కార్ట్‌రైట్, మీర్జా తాహిర్ బేగ్, తయాబ్ అబ్బాస్, క్రెయిగ్ ఎర్విన్, టెండై చతారా, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, నిక్ వెల్చ్, ఆండ్రీ ఫ్లెచర్ హరారే హరికేన్స్: మహ్మద్ నబీ, ఎవిన్ లూయిస్, రాబిన్ ఉతప్ప, డోనోవాన్ ఫెరైరా, షాజావాజ్ దహానీ, డువాన్ జాన్సెన్, సమిత్ పటేల్, కెవిన్ కొత్తెగోడ, క్రిస్టోఫర్ మ్ఫోఫు, రెగిస్ చకబ్వా, ల్యూక్ జోన్‌వే, బ్రాండన్ మవుతా, తషింగా ముషివా, ఇర్ఫాన్ పఠాన్, యూసప్ ఫఠాన్,శ్రీశాంత్ జోహన్నెస్‌బర్గ్ బఫెలోస్: ముష్ఫికర్ రహీమ్, ఓడియన్ స్మిత్, టామ్ బాంటన్, యూసుఫ్ పఠాన్, విల్ స్మీద్, నూర్ అహ్మద్, రవి బొపారా, ఉస్మాన్ షిన్వారీ, జూనియర్ డలా, బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే, విక్టర్ న్యౌచి, మిల్టన్ శుంబా, మొహమ్మద్ హఫీజ్, రాహుల్ చోప్రా. బులవాయో బ్రేవ్స్: సికిందర్ రజా, తస్కిన్ అహ్మద్, ఆష్టన్ టర్నర్, టైమల్ మిల్స్, తిసారా పెరెరా, బెన్ మెక్‌డెర్మాట్, బ్యూ వెబ్‌స్టర్, పాట్రిక్ డూలీ, కోబ్ హెర్ఫ్, రేయన్ బర్ల్, టిమిసెన్ మరుమా, జాయ్‌లార్డ్ గుంబీ, ఇన్నోసెంట్ కైయా, ఫరాజ్ అక్రమ్ , ముజీబ్ ఉర్ రెహ్మాన్. కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ: రహ్మానుల్లా గుర్బాజ్, షాన్ విలియమ్స్, భానుక రాజపక్స, మహేశ్ తీక్షణ, షెల్డన్ కాట్రెల్, కరీం జనత్, చమికా కరుణరత్నే, పీటర్ హజ్లోగౌ, మాథ్యూ బ్రీట్జ్కే, రిచర్డ్‌వాకా న్గరావా, రిచర్డ్‌వాకా న్గరావా, తద్శ్వాని మారుమణి, తినాషే కమునకేవే, పార్థివ్ పటేల్, మొహమ్మద్ ఇర్ఫాన్, స్టువర్ట్ బిన్నీ చదవండి: Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..! -
ధోని బాగా ఆడాలి.. కానీ ముంబై గెలవాలి! గెలుస్తుంది కూడా! అంతలేదు..
IPL 2023- MI Vs CSK Winner Prediction: గతేడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో భారీ ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నాయి మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై 14కు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక రోహిత్ సేన దారుణ వైఫల్యం సంగతి ఇలా ఉంటే.. ధోని సారథ్యంలో నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సీఎస్కే పరిస్థితి కూడా అంతే చెత్తగా ఉంది. తొలుత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెన్నై పగ్గాలు అప్పగించగా.. వరుస ఓటముల నేపథ్యంలో అతడు మధ్యలోనే తప్పుకొన్నాడు. దీంతో మళ్లీ మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబైలాగే నాలుగు మ్యాచ్‌లే గెలిచినా కాస్త మెరుగైన రన్‌రేటుతో తొమ్మిదో స్థానంలో నిలిచింది సీఎస్కే. పంతం నీదా- నాదా సై అంటున్న ముంబై, సీఎస్కే ఈ క్రమంలో ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన ధోని సేన.. సొంత మైదానం చెపాక్‌లో మాత్రం సత్తా చాటింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ చెన్నై మాదిరే ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించింది. బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ముంబై- సీఎస్కే మధ్య శనివారం(ఏప్రిల్ 8) నాటి పోరు ఆసక్తికరంగా మారింది. ధోని సేన మరో గెలుపు నమోదు చేస్తుందా? లేదంటే ముంబై సొంతగడ్డపై పైచేయి సాధిస్తుందా అన్న విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ధోని బాగా ఆడాలి.. కానీ ముంబై గెలవాలి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ముంబైలో ఉన్న క్రికెట్ అభిమానులు.. ఎంఎస్ ధోని తన అద్భుత ప్రదర్శనతో తమకు వినోదం పంచాలని ఆశిస్తారు. అయితే, అదే సమయంలో ముంబై ఇండియన్స్‌ను విజయం వరించాలని కోరుకుంటారు. ఏదేమైనా సొంతమైదానంలో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం అంత సులువేమీ కాదు. గతంలో వాంఖడేలో సీఎస్కే, ముంబై జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే అందులో ఏడుసార్లు ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబైదే విజయం.. అంతలేదు సీఎస్కేను ఓడించాలంటే గణాంకాలను బట్టి చూస్తే చెన్నైపై ముంబై కచ్చితంగా గెలిచి తీరుందని స్పష్టమవుతోంది. ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరడం ఖాయం’’ అని అంచనా వేశాడు. ఇక యూసఫ్ సోదరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం సొంతమైదానంలో ఆడుతున్నందున రోహిత్ సేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం.. ‘‘సొంతగడ్డపై ముంబై బలం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. కానీ.. ఏ గ్రౌండ్‌లోనైనా సీఎస్కేను ఓడించాలంటే చెమటోడ్చక తప్పదు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్ సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! -
రిచర్డ్ లెవి విధ్వంసం వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలకరత్నే దిల్షన్
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ నింజాస్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నింజాస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛాంప్స్ మరో 9 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (29 బంతుల్లో 71; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలకరత్నే దిల్షన్ (46 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఛాంప్స్ను విజయతీరాలకు చేర్చాడు. దిల్షన్‌కు మరో ఎండ్‌లో గౌరవ్ తోమర్ (50) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో సహకరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతిలోనూ (2/40) చెలరేగిన దిల్షన్.. కీలకమైన రిచర్డ్ లెవి, అభిమన్యు వికెట్లు పడగొట్టాడు. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో గౌహతి అవెంజర్స్- వైజాగ్ టైటాన్స్.. పట్నా వారియర్స్-ఇండోర్ కింగ్స్ తలపడగా అవెంజర్స్, ఇండోర్ నైట్స్ జట్లు విజయం సాధించాయి. అవెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 78 పరుగులకే చాపచుట్టేయగా.. అవెంజర్స్ 7.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేయగా.. ఇండోర్ నైట్స్ మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా సారధ్యం వహిస్తున్న ఇండోర్ నైట్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లు కాగా.. దిల్షన్ మునవీర (53), పర్విందర్ సింగ్ (31) పోరాడి గెలిపించారు. -
యూసఫ్ పఠాన్ వీరబాదుడు.. మరోసారి రెచ్చిపోయిన స్టువర్ట్ బిన్నీ
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నిన్న (మార్చి 25) ఇండోర్ నైట్స్-గౌహతి అవెంజర్స్, వైజాగ్ టైటాన్స్-పట్నా వారియర్స్ జట్లు తలపడ్డాయి. గౌహతితో జరిగిన మ్యాచ్‌లో ఇండోర్ నైట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. పట్నాపై వైజాగ్ టైటాన్స్ 78 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తరంగ, యూసఫ్ వీరబాదుడు.. అయినా ప్రయోజనం లేదు..! ఇండోర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గౌహతి.. ఉపుల్ తరంగ (27 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (23 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆఖర్లో అనురీత్ సింగ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండోర్.. ఫిల్ మస్టర్డ్ (45 బంతుల్లో 80; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ శర్మ (50 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. స్టువర్ట్ బిన్నీ మరోసారి.. పట్నాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ టైటాన్స్.. సన్నీ సింగ్ (45 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ(29 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. వైజాగ్ బౌలర్లు తిసార పెరీరా (2/2), ఆశిష్ నునివాల్ (2/18), ఇషాన్ మల్హోత్రా (2/18), భారత్ అవస్తి (1/14) ధాటికి 17.5 ఓవర్లలో 131 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. పట్నా ఇన్నింగ్స్‌లో బిస్లా (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లోనూ బిన్నీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా యూసుఫ్ పఠాన్..
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి వెస్టిండీస్ స్టార్ ఆటగాడు రోవ్మాన్ పావెల్ తప్పించింది. అతడి స్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా కెప్టెన్‌గా దుబాయ్ నియమించింది. ఇక ఈ విషయాన్ని దుబాయ్ క్యాపిటల్స్ మెనేజెమెంట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దుబాయ్ క్యాపిటల్స్‌కు యూసుఫ్ పఠాన్ సారథ్యం వహించనున్నాడు. దుబాయ్ క్యాపిటల్స్ ఆదివారం తమ చివరి లీగ్‌మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది" అని దుబాయ్ క్యాపిటల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ టోర్నీలో రోవ్మాన్ పావెల్ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు జట్టును కూడా విజయ పథంలో నడిపించాడు. అయినప్పటికీ పావెల్‌ను జట్టు పగ్గాలు నుంచి దుబాయ్ ఎందుకు తప్పించిందో వెల్లడించలేదు. ఇక యూసుఫ్ పఠాన్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన పఠాన్ కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Team India: యువ క్రికెటర్ల జోరు.. భారత సీనియర్లకు ఇక కష్టకాలమే -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్
అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టి20లో షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్ అయినప్పటికి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రూథర్‌ఫోర్డ్ దెబ్బకు యూసఫ్ పఠాన్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లో యూసఫ్ పఠాన్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు రూథర్‌ఫోర్డ్. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా 90 మీటర్లు, మూడో బంతి లాంగాన్ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్‌ఫుట్ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్ సిక్స్ కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐదో బంతిని స్క్వేర్‌లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓవర్ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్ షాట్‌తో సిక్సర్ తరలించాడు. దీంతో ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రూథర్‌ఫోర్డ్ మరుసటి ఓవర్లో ఆరో సిక్సర్ కొట్టే అవకాశం వచ్చినప్పటికి విఫలమయ్యాడు. ఈ దశలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే బిల్లింగ్స్‌తో ఏర్పడిన సమన్వయలోపంతో రూథర్‌ఫోర్డ్ రనౌట్‌గా వెనుదిరగడంతో అతని విధ్వంసానికి తెరపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.రూథర్‌ఫోర్డ్(23 బంతుల్లో 50, ఆరు సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(48 బంతుల్లో 54 పరుగులు), ముస్తఫా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The maestro, Sherfane Rutherford put up a stunning batting display tonight #DVvDC. 5 back to back 6’s 😯 Big contribution to his teams total with a 23-ball 5️⃣0️⃣ 🔥#DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/OSW8Av4lnh — International League T20 (@ILT20Official) February 2, 2023 చదవండి: ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు -
రిటైరయ్యాక కూడా ఇరగదీశారు.. అప్పుడూ ఇలానే, కానీ..!
ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సత్తా చాటి, రిటైరైనా తగ్గేదేలే అని యువ క్రికెటర్లకు సందేశం పంపిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్లు, సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు ఆ రెండు సిరీస్‌ల్లో తమతమ అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. రోడ్ సేఫ్టీ సిరీస్, లెజెండ్స్ లీగ్‌లు ఒకే సమయంలో షెడ్యూలైనప్పటికీ పఠాన్ సోదరులు రెండిటిలోనూ పాల్గొని తమ జట్లను గెలిపించారు. 13 ఫ్లయిట్లు, 17 మ్యాచ్‌లు, 2 ఫైనళ్లు అంటూ ఇర్ఫాన్ పఠాన్.. తన సోదరుడు యూసఫ్‌ను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ వేదికగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో బిల్వారా కింగ్స్ జట్టు తరఫున ఆడారు. ఈ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను మట్టికరిపించి వరుసగా రెండో సీజన్లోనూ ఛాంపియన్‌గా నిలువగా.. లెజెండ్స్ లీగ్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమిపాలైంది. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 341 పరుగులు చేసి, బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు 30+ స్కోర్లు ఉన్నాయి. ఇక తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ విషయానికొస్తే.. ఇర్ఫాన్ ఈ రెండు టోర్నీల్లో కలిపి 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు 30+ స్కోర్లు ఉన్నాయి. అలాగే ఇర్ఫాన్ బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ 27 సిక్సర్లు, 22 ఫోర్లు బాదగా.. ఇర్ఫాన్ పఠాన్ 11 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, పఠాన్ సోదరులు గతంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనే చేసినప్పటికీ వివిధ కారణాల చేత సరైన అవకాశాలు రాక వారి కెరీర్లు అర్థంతరంగా ముగిశాయి. ఇర్ఫాన్ 27 ఏళ్ల వయసులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. దాదాపు పదేళ్ల పాటు జట్టులో చోటు కోసం నిరీక్షించి చివరకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున హ్యాట్రిక్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన ఇర్ఫాన్ పఠాన్.. 2007 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే తానాడిన చివరి వన్డేలో ఐదు వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్ విషయానికొస్తే ఇతనిది దాదాపు తమ్ముడి పరిస్థితే. కీలక మ్యాచ్‌ల్లో భారీ సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన యూసఫ్‌కు కూడా సరైన అవకాశాలు రాక కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాడు. -
మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ ఇద్దరు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్ అనంతరం యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌లు ఒకరినొకరు క్షమాపణ చెప్పుకున్నారు. అయితే గొడవకు ప్రధాన కారణం యూసఫ్ పఠాన్ మహిళా అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించడమేనని ఫాక్స్ క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్లో పేర్కొంది. బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మ్యాచ్‌కు కిమ్ కాటన్ అంపైరింగ్ విధులు నిర్వహించింది. కాగా మ్యాచ్ సందర్భంగా మిచెల్ జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఒక బంతిని కిమ్ కాటన్ వైడ్ కాల్ ఇవ్వలేదు. దీంతో కాటన్‌ను ఉద్దేశించి యూసఫ్ పఠాన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఫాక్స్ క్రికెట్ వెల్లడించింది. ఇదే విషయమై ఓవర్ తర్వాత ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందని పేర్కొంది. ''మిచెల్‌ది ఏం తప్పు లేదు.. పఠాన్ మహిళా అంపైర్ కిమ్ కాటన్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. అందుకే గొడవ జరిగింది'' అంటూ తెలిపింది. యూసఫ్‌ను తోసేసిన కారణంగా మిచెల్ జాన్సన్‌కు క్రమశిక్షణ చర్యల కింద లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. ఇక యూసఫ్ పఠాన్ మాత్రం జరిమానా నుంచి తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహేజా స్పందించాడు. ''లెజెండ్స్ లీగ్ ద్వారా ఒక సీరియస్, కాంపిటీటివ్ క్రికెట్‌ను మాత్రమే ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఆదివారం మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ బాధాకరం. అయితే గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఉందో తెలుసుకోవడానికి వీడియోను చాలాసార్లు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పెవరిదనేది పక్కనబెడితే మిచెల్ జాన్సన్.. పఠాన్‌ను తోసేసినట్లు క్లియర్‌గా కనిపించడంతో అతనికి జరిమానా విధించాం. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నాం. మళ్లీ రిపీట్ అయితే ఉపేక్షించేది లేదు. సీరియస్ యాక్షన్ కచ్చితంగా ఉంటుంది'' అని పేర్కొన్నాడు. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: యూసఫ్ పఠాన్,మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! -
యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఆదివారం బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ తారాస్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు. అంపైర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు తలదూర్చి వారిని విడదీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బిల్వారా కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు బ్యాటర్ యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.ఇండియా క్యాపిటల్స్ బౌలర్ మిచెన్ జాన్సన్ బౌలింగ్ పఠాన్ బౌండరీలు బాదాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత మిచెల్ జాన్సన్ పఠాన్‌పై నోరు పారేసుకున్నాడు. తాను ఏం తక్కువ తినలేదంటూ యూసఫ్ పఠాన్ కూడా జాన్సన్‌ను తిట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపంతో యూసఫ్ పఠాన్ జాన్సన్ వైపు దూసుకొచ్చాడు. అయితే జాన్సన్ పఠాన్‌ను తోసేశాడు. ఇక గొడవ తారాస్థాయికి చేరిందన్న క్రమంలో అంపైర్ తలదూర్చి జాన్సన్‌ను పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా తగ్గలేదు. ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే 48 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 65 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 59, యూసఫ్ పఠాన్ 48, రాజేష్ బిష్ణోయి 36 నాటౌట్ రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రాస్ టేలర్ 39 బంతుల్లో 84 పరుగులు చేయగా.. చివర్లో ఆష్లే నర్స్ 28 బంతుల్లో 60 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక క్వాలిఫయర్ 1లో ఓడినప్పటికి బిల్వారా కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ జెయింట్స్‌తో బిల్వారా కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 5న ఇండియా క్యాపిటల్స్‌తో ఫైనల్ ఆడనుంది. #ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P — Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022 చదవండి: ఓయ్ చహల్.. ఏంటా పని? 'బౌలింగ్ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్ 23నే' -
యూసఫ్ పఠాన్ మెరుపులు వృథా.. టైగర్స్ చేతిలో కింగ్స్ ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో మణిపాల్ టైగర్స్ తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం కటక్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో మణిపాల్ టైగర్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మణిపాల్ పేసర్ దిల్హార ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అఖరి ఓవర్లో భిల్వారా కింగ్స్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఫెర్నాండో కేవలం 5 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇకతొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మణిపాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టైగర్స్ బ్యాటర్లలో ఓపెనర్లు జెస్సీ రైడర్(35 బంతుల్లో 47), తాటెండ తైబు(30 బంతుల్లో 54) రాణించారు. భిల్వారా బౌలర్లలో బెస్ట్ మూడు వికెట్లు, యూసఫ్ పఠాన్ రెండు, కరియా, ఎడ్వర్డ్స్ తలా వికెట్ సాధించారు. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భిల్వారా కెప్టెన్ యూసప్ ఫఠాన్ 21 బంతుల్లో 42 పరుగుల(2 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు అఖరిలో ఔట్ కావడంతో మ్యాచ్ మణిపాల్ వైపు మలుపు తిరిగింది. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్బజన్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ -
కైఫ్ అర్ధ శతకం వృథా! పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! ఉత్కంఠ పోరులో భిల్వార కింగ్స్ గెలుపు
Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో మ్యాచ్‌లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది. చెలరేగిన ఫిడెల్! ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ! ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్‌ను ఛేదించింది. ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్ T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బీసీసీఐ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో తన్మయ్ శ్రీవాత్సవ, యూసఫ్ పఠాన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. ఇండియా మహారాజాస్ బౌలింగ్‌లో పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, జోగిందర్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులు చేసి నిరాశ పరచగా.. తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. వరల్డ్ జెయింట్స్ బౌలింగ్‌లో టిమ్ బ్రెస్నన్ 3 వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? -
ఇర్ఫాన్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లు.. అయినా!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఇండియా మహారాజాస్ ఇంటిముఖం పట్టింది. ఒమెన్ వేదికగా గురువారం వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ ఐదు పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో వరల్డ్ జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగబోయే ఫైనల్లో ఆసియా లయన్స్‌తో జెయింట్స్ తలపడనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాజాస్.. ఆదిలోనే వసీం జాఫర్, సుబ్రమణ్యం బద్రీనాథ్ వికెట్లను కోల్పోయింది. అనంతరం నమన్ ఓజా (95), యూసుఫ్ పఠాన్ (45) రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించడంతో మహారాజాస్ విజయం లాంఛనమే అంతా భావించారు. యూసుఫ్ పఠాన్ వికెట్ కోల్పోవడంతో మహారాజాస్ వికెట్ల పతనం మొదలైంది. కాగా చివరలో ఇర్ఫాన్ పఠాన్ సిక్సర్ల వర్షం కురిపించడంతో మహారాజాస్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే అఖరి ఓవర్లో 7 పరుగుల కావల్సిన నేపథ్యంలో పఠాన్ ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 20 ఓవర్ వేసిన బ్రెట్‌లీ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి జెయింట్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఇండియా మహారాజాస్ 7 వికెట్లు కోల్పోయి 223 పరుగుల మాత్రమే చేయగల్గింది. ఇర్ఫాన్ పఠాన్ కేవలంలో 21 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో గిబ్స్(89), మస్టర్డ్ (57) పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022 Mega Auction: చెన్నై చేరుకున్న ధోని.. టార్గెట్ అదేనా! -
యూసుఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్ .. కేవలం 40 బంతుల్లో..
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహారాజా జట్టు బోణీ కొట్టింది. గురువారం ఆసియా లయన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6వికెట్ల తేడాతో ఇండియా మహారాజాస్ ఘన విజయం సాధించింది. మహారాజా విజయంలో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించారు. యూసుఫ్ కేవలం 40 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లయన్స్ ఆదిలోనే ఓపెనర్ దిల్షాన్ వికెట్ కోల్పోయింది. అనంతరం తరంగ, ఆక్మల్ లయన్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తరంగ 46 బంతుల్లో 66 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు. చివర్లో కెప్టెన్ మిస్బా ఉల్ హాక్(44) మెరుపులు మెరిపించడంతో లయన్స్ 175 పరుగులు సాధించింది. ఇక మహారాజా బౌలర్లలో మన్ ప్రీత్ గోనీ మూడు వికెట్లు పడగొట్టగా, ఇర్ఫాన్ పఠాన్ రెండు వికెట్లు సాధించారు. ఇక 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజా ఆదిలోనే బద్రీనాథ్, స్టువర్ట్ బిన్నీ వికెట్లను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ మహారాజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. యూసుఫ్ పఠాన్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. వీరిద్దరూ కలిసి 116 పరుగుల బాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. 80 పరుగులు చేసిన యూసుఫ్ అనూహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా కైఫ్ 42 పరుగులతో రాణించాడు. ఇక చివర్లో ఇర్ఫాన్ పఠాన్(21) మెరుపులు మెరిపించడంతో ఇండియా మహారాజా లక్ష్యాన్ని సూనయాసంగా చేధించింది. చదవండి: SA vs IND: కీలక పోరుకు సిద్దమైన టీమిండియా.. సిరీస్ సమం చేస్తారా? -
కోవిడ్ బాధితులకు పఠాన్ సోదరుల సాయం
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముందుకొచ్చాడు. మహమ్మారి వల్ల పూట గడవడం కూడా కష్టమైన దక్షిణ ఢిల్లీ ప్రజలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు పఠాన్ తెలిపాడు. క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ (సీఏపీ) ద్వారా ఈ సేవా కార్యక్రమం జరగనున్నట్లు అతను స్పష్టం చేశాడు. ‘ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం ప్రస్తుతం మన ముందున్న కనీస బాధ్యత. అందుకే సీఏపీ ద్వారా దక్షిణ ఢిల్లీలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్, అతని సోదరుడు యూసుఫ్ పఠాన్ 4 వేల మాస్క్‌లను అందజేశారు. మార్చిలో రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్లో పాల్గొన్న ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తోంది. దీని ప్రభావం క్రీడారంగంపై భారీగా పడింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 టోర్నీలో పాల్గొన్న ఇండియా లెజెండ్స్ జట్టు ఆటగాళ్లు రోజుకొకరు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్ వైరస్ బారిన పడగా... తాజాగా ఈ జాబితాలో మరో ప్లేయర్ చేరాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా సోమవారం ట్విటర్ ద్వారా తెలియజేశాడు. కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.. తన సోదరుడు యూసుఫ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో తాను కూడా పరీక్ష చేయించుకున్నానని ఇర్ఫాన్ వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటానన్నాని ఆయన ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో భారత క్రికెటర్‌కు కరోనా
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న భారత దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తొలుత సచిన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆతరువాత యూసఫ్ పఠాన్, తాజాగా సుబ్రమణ్యం బద్రీనాధ్ వైరస్ పీడిత జాబితాలో చేరారు. బద్రీనాధ్.. వైరస్ బారిన పడ్డ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడంతో టెస్టు చేయించుకున్నాని, కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. తమిళనాడుకు చెందిన బద్రీనాధ్.. భారత్ తరఫున 2008-2011 మధ్యలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో వరుసగా టైటిల్లు సాధించడంలో బద్రీనాధ్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారత లెజెండ్స్ సభ్యుల్లో తీవ్ర కలవరం మొదలైంది. వైరస్ బారిన పడ్డ క్రికటర్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. -
అటు యూసుఫ్... ఇటు వినయ్...
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఒకే రోజు ఆటకు గుడ్‌బై చెప్పారు. 38 ఏళ్ల బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ తన రిటైర్మెంట్ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్ బౌలర్ వినయ్ కుమార్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున ఆడి చాలా కాలమే అయినా... గత సీజన్ వరకు కూడా వీరిద్దరు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగారు. యూసుఫ్ పఠాన్ భారీ హిట్టర్‌గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్‌పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. టి20లకంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా యూసుఫ్ క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో అతను పలు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచిన యూసుఫ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2012, 2014 టైటిల్స్ విజయాల్లో కూడా భాగస్వామి. 2010లో 37 బంతుల్లోనే అప్పటి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన యూసుఫ్... 2014లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో అప్పటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా తన పేరిటే లిఖించాడు. మొత్తంగా 174 ఐపీఎల్ మ్యాచ్‌లలో 142.97 స్ట్రయిక్‌రేట్‌తో 3,204 పరుగులు చేసిన యూసుఫ్ 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ జట్టులోకి తీసుకోలేదు. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడిన ఈ బరోడా స్టార్... 2010లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో (సౌత్‌జోన్‌పై) ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనిది. వెస్ట్‌జోన్ తరఫున ఆడిన యూసుఫ్ 190 బంతుల్లోనే 19 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి అజేయంగా 210 పరుగులు చేయడంతో వెస్ట్ జోన్ జట్టు 536 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం రాని యూసుఫ్ 2012లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వినయ్ కుమార్ రంజీ ట్రోఫీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆటగాళ్లలో వినయ్ కుమార్ కూడా ఒకడు. దావణగెరెకు చెందిన ఈ పేస్ బౌలర్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్ గోయల్ (637), వెంకట్రాఘవన్ (530), సునీల్ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్ ఉండగా... పేస్ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. సుదీర్ఘ కాలం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెరీర్ చివరి ఏడాది అతను పుదుచ్చేరి తరఫున ఆడాడు. కర్ణాటక కెప్టెన్‌గా వినయ్ రికార్డు ఘనంగా ఉంది. 2013–14 సీజన్లో వినయ్ నాయకత్వంలో కర్ణాటక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, విజయ్ హజారే ట్రోఫీ గెలవగా... 2014–15 సీజన్లో కూడా ఇదే ‘ట్రిపుల్’ పునరావృతం కావడం విశేషం. తొలి సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినయ్ ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లలో 105 వికెట్లు తీశాడు. 2014 (కోల్‌కతా), ముంబై (2015, 2017) ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో అతనూ సభ్యుడు. 2018 తర్వాత మళ్లీ అతనికి లీగ్‌లో అవకాశం రాలేదు. భారత్ తరఫున మాత్రం వినయ్ కుమార్ కెరీర్ గొప్పగా సాగలేదు. ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో కొన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా... 2013 తర్వాత అతనికి మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ ట్రోఫీతో... -
ఆటకు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్
ముంబై: టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు శుక్రవారం గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. ‘‘ఈరోజుతో అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పా. ఇంతకాలం నా వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు, స్పేహితులకు, అభిమానులకు, కోచ్‌లకు.. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అంటూ పేర్కొన్నాడు. కాగా పఠాన్ బ్రదర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బరోడా ఆల్‌రౌండర్ 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున 57 వన్డేల్లో 810 పరుగులు.. 22 టీ20ల్లో 232 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు.. 5 అర్థ సెంచరీలు చేసిన యూసఫ్ పఠాన్ మంచి పవర్ హిట్టర్‌గా పేరు పొందాడు. టీమిండియా తరపున ఎక్కువసార్లు ఫినిషర్‌గా ఆడిన యూసఫ్ పఠాన్ 2012 తర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి రాలేకపోయాడు. లేటు వయసులో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూసఫ్ కెరీర్లో కొన్ని మొమరబుల్ ఇన్నింగ్స్ ఉన్నాయి. 2010లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యూసఫ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. 4వ వన్డేలో 129 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో పాటు బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2011 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 70 బంతుల్లోనే 105 పరుగులు చేయడంతో ఆల్‌రౌండర్ కోటాలో 2011 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాధించాడు. టీమిండియా సాధించిన 2007 టీ20, 2011 ప్రపంచకప్‌లో పఠాన్ భాగస్వామ్యం కావడం అతని కెరీర్లో మరిచిపోలేనివిగా చెప్పొచ్చు. అయితే ప్రపంచకప్ తర్వాత పఠాన్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడంతో పాటు.. సెలెక్టర్లు కూడా అతని పేరు పరిగణలోకి తీసుకోకపోవడంతో క్రమంగా జట్టు నుంచి దూరమయ్యాడు. అలా పఠాన్ కెరీర్ టీమిండియాలో ముగిసిందనే చెప్పొచ్చు. ఇక ఐపీఎల్ అరంగేట్రం సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సీజన్లలోనూ యూసఫ్ పఠాన్ కేకేఆర్, పుణే వారియర్స్, సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న యూసఫ్‌ను ఆ తర్వాత సీజన్‌కు వేలంలోకి వచ్చినా ఎవరు అతన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు. తాజాగా ఈ బుధవారం(ఫిబ్రవరి 24న) హైదరాబాద్‌కు వచ్చిన యూసఫ్ పఠాన్ పఠాన్ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు వినయ్ కుమార్ గుడ్‌బై -
అది షేన్ వార్న్కే సాధ్యం: యూసఫ్
న్యూఢిల్లీ: ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్‌పై టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. అతని సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ తరఫున మూడేళ్ల పాటు ఆడిన యూసఫ్ అదొక గొప్ప అవకాశమన్నాడు. కానీ వార్న్ కెప్టెన్సీలో మూడు సీజన్ల కంటే ఎక్కువ ఆడకపోవడం తన దురదృష్టమన్నాడు. ఈ సందర్భంగా వార్న్ నాయకత్వంలో మూడేళ్లు ఆడిన విషయాన్ని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. అతి తక్కువ వనరులతో ఆరంభ టైటిల్‌ను గెలుచుకోవడం వార్న్ నాయకత్వానికి అద్దం పడుతుందన్నాడు. ఏదో కొద్దిపాటి వనరులతో జట్టును ఫైనల్‌కు చేర్చడమే కాకుండా విజేతగా నిలపడం అది వార్న్కే దక్కుతుందన్నాడు. 2008 ఐపీఎల్ ఆరంభమైన ఏడాది రాజస్తాన్ రాయల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) తాజాగా క్రికెట్ ట్రాకర్ లైవ్ సెషన్లో మాట్లాడిన యూసఫ్.. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఐపీఎల్లో వార్న్ నాయకత్వంలో మూడేళ్లు ఆడా. వార్న్‌తో చాలా మధుర స్మృతులు ఉన్నాయి. మమ్మల్ని వార్న్ మార్గ నిర్దేశం చేసిన తీరు అమోఘం, బ్యాట్స్‌మన్‌ను ఎలా పెవిలియన్‌కు పంపాలనే విషయంలో వార్న్ ఎన్నో టెక్నిక్స్ నేర్పాడు. అతనితో సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడకపోవడం నిజంగా నా బ్యాడ్ లక్. ఐపీఎల్ ఆరంభమైన ఏడాదే టైటిల్‌ను సాధించడంలో వార్న్ పాత్ర చాలా ఉంది. ఎక్కువ మంది దేశవాళీ ఆటగాళ్లతో ఉన్న జట్టును విజేతగా నిలిపాడు. అలా టైటిల్ గెలవడం మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు’ అని యూసఫ్ పేర్కొన్నాడు. ఇక భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లను యూసఫ్ కొనియాడాడు. ధోని ఒక తెలివైన క్రికెటర్ అని పేర్కొన్న యూసఫ్.. యువరాజ్‌ను ఒక రాక్‌స్టార్‌గా అభివర్ణించాడు. (ఖవాజా, షాన్ మార్ష్‌లను తప్పించారు..!) -
నాకు నమ్మశక్యంగా లేదు
న్యూఢిల్లీ: ఒక మెగా టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉంటే ఆ ఆనందమే వేరు. తుది జట్టులో లేకపోయినా రిజర్వ్ ఆటగాళ్లలో ఉండి ఒక గొప్ప విజయంలో భాగమైతే దాన్ని కూడా బాగానే ఆస్వాదిస్తాం. 2011లో టీమిండియా రెండో సారి వరల్డ్‌కప్‌ను గెలిచి నిన్నటి(ఏప్రిల్ 2))కి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ క్షణాల్ని ఆ జట్టులో సభ్యులైన ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఆ ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా అపూర్వ విజయం తర్వాత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను తోటి ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం అంతా ఊరేగారు. అందులో యూసఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. (ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ గెలవలేదు!) తమ పెద్ద సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ తుది జట్టులో ఆడితే, యూసఫ్ రిజర్వ్ బెంచ్‌లో ఉన్నాడు. కాకపోతే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సచిన్‌ను భుజాలపై ఎత్తుకుంది మాత్రం యూసప్ పఠాన్. దీన్ని తాజాగా షేర్ చేసుకున్నాడు యూసఫ్. ‘ఆ అరుదైన సందర్భం జరిగి అప్పుడే ఇన్ని ఏళ్లు అయ్యిందా.. నాకు నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. అదొక స్పెషల్ నైట్. అది ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ చారిత్రక ఘట్టంలో భాగమైనందకు చాలా గర్వంగా ఉంది’ అని యూసఫ్ ట్వీట్ చేశాడు. దీనికి సచిన్‌ను ఎత్తుకున్న ఫొటోను కూడా జత చేశాడు.(మమ్మల్ని ఎందుకు మరిచావ్?: యువీ) శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. లంకేయులు నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్ ఛేదనలో భాగంగా సచిన్ టెండూల్కర్(18), వీరేంద్ర సెహ్వాగ్(0)లు నిరాశపరిచినా, గౌతం గంభీర్(97) తృటిలో సెంచరీ కోల్పోగా, ఎంఎస్ ధోని(91 నాటౌట్)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషిస్తే, విరాట్ కోహ్లి(35), యువరాజ్(21 నాటౌట్)లు తమ వంతు పాత్ర పోషించారు. 9 years to the historic World Cup win and it seems like it happened just yesterday. That special night was unforgettable. Grateful to be a part of Indian cricket's historic moment. #memories pic.twitter.com/vJGMVngXDS — Yusuf Pathan (@iamyusufpathan) April 2, 2020 -
‘ఔట్ కాదు.. నేను వెళ్లను’
ముంబై: గత కొంతకాలంగా క్రికెట్లో అంపైరింగ్ ప్రమాణాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. పదేపదే తప్పుడు నిర్ణయాలతో అటు ఆటగాళ్లకు.. ఇటు అభిమానులకు విసుగు తెప్పిస్తున్నారు. తాజాగా రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో మ్యాచ్ సందర్భంగా బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ముంబై నిర్దేశించిన 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఈ క్రమంలో దీపక్ హుడాతో కలిసి పఠాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ 48 ఓవర్లో ముంబై స్పిన్నర్ శశాంక్ వేసిన బంతిని పఠాన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో పఠాన్ ఛాతికి తగిలి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జయ్ బిస్తా చేతుల్లో పడింది. దీంతో ముంబై ఫీల్డర్లు బ్యాట్‌కు తగిలిందనుకోని అప్పీల్ చేశారు. అయితే అంపైర్ కాసేపు సంకోచించి అనూహ్యంగా పఠాన్ అవుటని ప్రకటించాడు. దీంతో ముంబై క్రికెటర్లు సంబరాల్లో మునిగితేలగా.. పఠాన్ షాక్‌కు గురయ్యాడు. అంతేకాకుండా క్రీజు వదిలి పోవడానికి నిరాకరించాడు. అంపైర్ల వైపు అసంతృప్తితో చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే పఠాన్ దగ్గరికి వచ్చి అది ఔటని సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో చేసేదేమిలేక పఠాన్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబైపై బరోడా 309 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనే ముంబై ఆటగాడు పృథ్వీ షా డబుల్ సెంచరీతో సాధించాడు. -
‘ఔట్ కాదు.. నేను వెళ్లను’
-
వాటే స్టన్నింగ్ క్యాచ్
విశాఖ: యూసఫ్ పఠాన్ అనూహ్యంగా భారత్ జట్టులోకి దూసుకొచ్చి అంతే వేగంగా దూరమైన పోయిన క్రికెటర్. 2012లో చివరిసారి భారత్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్.. ఇంకా దేశవాళీ మ్యాచ్‌లు మాత్రం ఆడుతూనే ఉన్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో భాగంగా యూసఫ్ పఠాన్ అద్భుతమైన క్యాచ్ పట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. బరోడా తరఫున ఆడుతున్న యూసఫ్.. శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో అలరించాడు. గోవా కెప్టెన్ దర్శన్ మిశాల్ కవర్స్ మీదుగా షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న యూసఫ్ ఒక్కసారిగా గాల్లోకి డైవ్ కొట్టి క్యాచ్ అందుకున్నాడు. గోవా ఇన్నింగ్స్ 19 ఓవర్‌ను అరోథి వేయగా దర్శన్ భారీ షాట్ కొట్టబోయాడు. అది కవర్స్ మీదుగా గాల్లోకి లేచిన సమయంలో యూసఫ్ మెరుపు ఫీల్డింగ్‌తో అతన్ని పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గోవా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బరోడా నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను గోవా 19.4 ఓవర్లలో ఛేదించింది. కాగా, యూసఫ్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. రెండు బంతులు ఆడి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. తన సోదరుడు క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇర్ఫాన్ పఠాన్ ట్వీటర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అదొక అద్భుతమైన క్యాచ్ అంటూ కొనియాడాడు. Is it a bird ? No this is @yusuf_pathan Great catch today lala.All ur hard work in pre season is paying off #hardwork @BCCI @StarSportsIndia pic.twitter.com/bcpO5pvuZI — Irfan Pathan (@IrfanPathan) November 8, 2019 -
వేణుమాధవ్ మృతి.. టీమిండియా క్రికెటర్ ట్వీట్
హాస్య నటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసఫ్ పఠాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వేణుమాధవ్ మరణించారన్న వార్త తనను షాకింగ్‌కు గురిచేసిందన్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై తాను చూసిన అద్భుత హాస్యనటుల్లో అతను ఒకరని పఠాన్ తెలిపాడు. వేణుమాధవ్ లాంటి హాస్య నటుడిని ఇంకెవరూ భర్తీ చేయలేరన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే క్రికెటర్ యూసఫ్ పఠాన్ వేణు మాధవ్‌కు సంతాపం తెలుపుతున్న సందేశానికి వేణుమాధవ్ ఫోటోను జతచేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. గుజరాత్‌కు చెందిన పఠాన్‌కు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తీసిన వేణుమాధవ్ గురించి ఎలా తెలుసని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సై, ఛత్రపతి వంటి చిత్రాలు హిందీ వర్షన్లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల్లో వేణుమాధవ్ తన విలక్షణ కామెడీతో అందరినీ తెగ నవ్వించాడు. దీంతో పఠాన్ వేణు మాధవ్‌కు ఫ్యాన్ అయ్యాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సన్‌రైజర్స్ తరుపున పఠాన్ ఆడుతుండటంతో వేణుమాధవ్ గురించి తెలిసుంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా, అనారోగ్యంతో మృతిచెందిన వేణుమాధవ్ అంత్యక్రియలు గురువారం అభిమానుల అశ్రనయనాల మధ్య ముగిశాయి. వేణమాధవ్ మృతిపై టాలీవుడ్ లోకం దిగ్భ్రంతిని వ్యక్తం చేసింది. Shocking to hear the demise of Venu Madhav. He was one of the irreplaceable and finest comedians I've seen on the silver screen. Deep condolences to his family and friends. pic.twitter.com/qxPl63WpwH — Yusuf Pathan (@iamyusufpathan) September 26, 2019 -
మాకు ఆశ్చర్యం కల్గించలేదు: యూసఫ్ పఠాన్
కోల్‌కతా: ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద ఆటగాడు రషీద్ ఖాన్ బ్యాట్‌తో చెలరేగడం ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే రషీద్ ఖాన్ బ్యాట్‌ను ఝుళిపించడం సన్‌రైజర్స్ శిబిరాన్ని ఎంతమాత్రం ఆశ్చర్యపరచలేదని అంటున్నాడు వెటరన్ క్రికెటర్ యూసఫ్ పఠాన్. ‘రషీద్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం మమ్మల్ని ఆశ్చర్య పరచలేదు. అతను చాలా సందర్భాల్లో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ప్రధానంగా బిగ్‌బాష్ లీగ్‌తో పాటు మిగతా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు కూడా రషీద్ బ్యాట్ అలరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతని సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతన్ని ఒక స్థానం ముందుకు ప్రమోట్ చేశాం. సన్‌రైజర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని రషీద్ నిలబెట్టాడు. రేపు రెండు అత్యుత్తమ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇందులో ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారిదే విజయం’ అని యూసఫ్ పేర్కొన్నాడు. -
క్యాచ్ పట్టావా? మామిడి పండు తెంపావా?
సాక్షి, హైదరాబాద్ : తమకున్న బౌలింగ్ బలంతోనే తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ ఐపీఎల్-11 సీజన్ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సోమవారం ఉప్పల్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు యూసఫ్ పఠాన్ పట్టిన ఓ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ క్యాచ్ ఎవరిదో కాదు.. అప్పటికే జోరుమీద ఉన్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిది. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో కోహ్లి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి అనూహ్యంగా థర్డ్‌మ్యాన్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న యూసఫ్ పఠాన్ వైపు దూసుకొచ్చింది. అంతే వేగంతో పఠాన్ గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్‌తో మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. కోహ్లి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అయింది ఆ వెంటనే డివిలియర్స్, మొయిన్ అలీల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ చివరకి ఓటమి చవిచూసింది. అన్న క్యాచ్‌పై తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‘‘ క్యాచ్ పట్టినవా.. చెట్టు మీదున్న మామిడి పండు తెంపినవా’’ అంటూ ట్విటర్లో చమత్కరించాడు. ఈ ట్వీట్‌కు ‘అది పఠాన్ చేయి.. అందులో నుంచి జారిపోవడం చాలా కష్టం’ అని సన్‌రైజర్స్ సంచలనం రషీద్ ఖాన్ బదులిచ్చాడు. Ye Pathan k hath hai bohat mushkil se catch chot jata hai 🖐🏻🖐🏻 — Rashid Khan (@rashidkhan_19) 8 May 2018 -
ఆ క్యాచ్..మ్యాచ్ టర్నింగ్ పాయింట్!
-
రైజర్స్ ‘టాప్’ గేర్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ గర్జించింది. ఉప్పల్ మైదానంలో నాలుగో విజయంతో, ఓవరాల్‌గా ఏడో గెలుపుతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపొందింది. మొదట బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జోరును కట్టడి చేసిన సన్‌రైజర్స్... ఓపెనర్లు హేల్స్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ధావన్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)ల శుభారంభంతో విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. పృథ్వీ షా (36 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి గెలిచింది. చివర్లో పఠాన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి. మెరిసిన పృథ్వీషా అద్భుత బౌలింగ్ దళమున్న సన్‌రైజర్స్‌తో ఛేదన కష్టమనుకున్న డేర్‌డెవిల్స్ కెప్టెన్ అయ్యర్ టాస్ నెగ్గిన వెంటనే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన యువ బ్యాట్స్‌మన్ పృథ్వీషా ధాటైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కానీ రెండో ఓవర్లోనే దురదృష్టంకొద్దీ మ్యాక్స్‌వెల్ (2) రనౌటయ్యాడు. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి పృథ్వీ లాంగాన్‌లో సిక్సర్ బాదాడు. అదే ఊపుతో స్ట్రయిట్ డ్రైవ్‌కు ప్రయత్నించగా... బౌలర్ సందీప్ చేతిని తాకుతూ వెళ్లిన బంతి నేరుగా వికెట్లను తగిలింది. దీంతో నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో గీతదాటిన మ్యాక్స్‌వెల్ నిరాశగా రనౌటై వెనుదిరిగాడు. తర్వాత పృథ్వీకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జతయ్యాడు. సిద్ధార్థ్ కౌల్ వేసిన తొలి ఓవర్లో పృథ్వీషా చెలరేగాడు. మూడో బంతిని సిక్స్ కొట్టిన ఢిల్లీ ఓపెనర్ తర్వాత మూడు బంతుల్ని బౌండరీలకు తరలించాడు. దీంతో ఆ ఓవర్లో ఢిల్లీకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ 7వ ఓవర్లోనే పృథ్వీ 25 బంతుల్లోనే (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. కానీ తర్వాతి ఓవర్ తొలి బంతికే పృథ్వీషాను రషీద్‌ఖాన్ ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 86 పరుగుల‡భాగస్వామ్యానికి తెరపడింది. ఢిల్లీ జోరు కూడా మందగించింది. సిద్ధార్థ్, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న శ్రేయస్‌ను సిద్ధార్థ్ ఔట్ చేయగా... రిషభ్ పంత్ (19 బంతుల్లో 18; 1 ఫోర్) రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన నమన్ ఓజా (1) రనౌటయ్యాడు. దీంతో 9 పరుగుల వ్యవధిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. చివర్లో విజయ్ శంకర్ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝళిపించడంతో ఢిల్లీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఓపెనర్ల శుభారంభం కష్టసాధ్యం కానీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్ చక్కని ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మ్యాచ్‌కే హైలైట్. అవేశ్‌ఖాన్ వేసిన ఈ ఓవర్లో ధావన్ ఒక సిక్స్ కొట్టగా, హేల్స్ మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో 27 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు 34/0గా ఉన్న స్కోరు కాస్త 6 బంతుల వ్యవధిలోనే 61/0 కి చేరింది. తొలి వికెట్‌కు 76 పరుగులు జతయ్యాక తొమ్మిదో ఓవర్ చివరి బంతికి అమిత్ మిశ్రా తన గింగిర్లు తిప్పే బంతితో హేల్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అలాగే ధావన్‌ను కూడా మిశ్రా తన తర్వాతి ఓవర్ (ఇన్నింగ్స్ 11వ)లోనూ చివరి బంతికే బౌల్డ్ చేశాడు. 86 పరుగులకు 2 వికెట్లు కోల్పోగా... మనీశ్ పాండే (17 బంతుల్లో 21; 2 ఫోర్లు) కెప్టెన్ విలియమ్సన్తో కలిసి వేగంగా పరుగులు జోడించాడు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్‌కు 46 జోడించాక పాండేను ప్లంకెట్ ఔట్ చేశాడు. అనంతరం విలియమ్సన్ (30 బంతుల్లో 32 నాటౌట్; 1 సిక్స్)కు జతకలిసిన యూసుఫ్ పఠాన్ జట్టు విజయంలో మెరుపుపాత్ర పోషించాడు. ఖాతా తెరవకముందే యూసుఫ్ పఠాన్ ఇచ్చిన క్యాచ్‌ను విజయ్ శంకర్ జారవిడువడంతో బతికిపోయిన అతను భారీ సిక్సర్లతో జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా... పఠాన్ వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టడంతో విజయం ఖాయమైంది. -
సన్‌రైజర్స్ చెత్త రికార్డు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కేన్ విలియమ్సన్(29), యూసఫ్ పఠాన్(29) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమైంది. దాంతో సన్‌రైజర్స్ 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ముంబైకి నిర్దేశించింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగంలో శిఖర్ ధావన్(5) నిరాశపరచగా, వృద్దిమాన్ సాహా పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. వీరిద్దరూ బంతి వ్యవధిలో వికెట్లు సమర్పించుకోవడంతో సన్‌రైజర్స్ 20 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై విలియమ్సన్-మనీష్ పాండే జోడి కాసేపు మరమ్మత్తులు చేసింది. అయితే సన్‌రైజర్స్‌కు మరోసారి షాకిచ్చింది ముంబై ఇండియన్స్. మనీష్(16), షకిబుల్ హసన్(2)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడే యత్నం చేసినప్పటికీ ఎంతో సేపో క్రీజ్‌లో నిలవలేదు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద విలియమ్సన్ ఐదో వికెట్ పెవిలియన్ బాటపట్టాడు. ఇక చివరి వరుస ఆటగాళ్లలో మహ్మద్ నబీ(14) బ్యాట్ ఝుళిపించే క్రమంలో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. రషీద్ ఖాన్(6), బాసిల్ థంపి(3), సిద్దార్ధ్ కౌల్(2)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరొకవైపు ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ముంబై బౌలరల్లో మెక్లీన్గన్, హార్దిక్ పాండ్యా, మయాంక్ మార్కండే తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, ముస్తాఫిజుర్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్లో చరిత్రలో 13వ ఆటగాడిగా...
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యూసఫ్ పఠాన్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేల పరుగుల మార్కును దాటిన 13వ ఆటగాడిగా యూసఫ్ నిలిచాడు. ముంబై బౌలర్ ముస్తాఫిజుర్ వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా యూసఫ్ మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. తన కెరీర్లో 155వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న యూసఫ్ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను నమోదు చేశాడు. తద్వారా దినేశ్ కార్తీక్ తర్వాత స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో సురేశ్ రైనా(4,658)అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి(4,649), రోహిత్ శర్మ(4, 345), గౌతం గంభీర్(4,217), డేవిడ్ వార్నర్(4,014), ఉతప్ప(3,940), క్రిస్ గేల్(3,855), ధోని(3,700), ధావన్(3,696), ఏబీ డివిలియర్స్(3,685), రహానే(3,217), దినేశ్ కార్తీక్(3,097)లు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు. -
యూసుఫ్ పఠాన్ కేసు పెండింగ్‌లో ఉంది: వాడా
ముంబై: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రొటోకాల్ ప్రకారం ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ కేసు పెండింగ్‌లో ఉందని ‘వాడా’ మేనేజర్ మాగి డ్యురండ్ వెల్లడించారు. అనుకోకుండా నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో పఠాన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టు 15 నుంచే అమలైన ఈ సస్పెన్షన్ ఈ నెల 14తో ముగియనుంది. వాడా సంస్థ మీడియా రిలేషన్స్, కమ్యూనికేషన్స్ మేనేజర్ మాగి డ్యురండ్ మాట్లాడుతూ ‘ఇది పెండింగ్ కేసు. ఇప్పుడు దీనిపై వ్యాఖ్యానించబోం’ అని అన్నారు. అయితే వాడా డోపింగ్ కోడ్–2015 ప్రకారం తొలిసారి డోపీలకు కేసు తీవ్రతను బట్టి గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. -
యూసుఫ్ పఠాన్ డోపీ
న్యూఢిల్లీ: క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడటం... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు నెలల నిషేధం విధించడం... మరో ఐదు రోజుల్లో ఆ నిషేధం ముగియనుండటం... అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా అతనిపై బీసీసీఐ విధించిన సస్పెన్షన్ ఈ నెల 14తో ముగియనుంది. క్రికెటర్‌కు నిర్వహించిన డోప్ టెస్టుల నుంచి ఫలితాల నిర్ధారణ తదనంతర విచారణ, చర్య దాకా అంతా గోప్యత పాటించింది బీసీసీఐ. గత మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. అయితే ఈ ఎపిసోడ్లో ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు కాస్త మెతక వైఖరిని అవలంబించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ స్వల్పకాలిక నిషేధంతో సరిపెట్టింది. మొత్తంమీద ఐపీఎల్ వేలానికి ముందు యూసుఫ్ పఠాన్‌కు ఇది సాంత్వన చేకూర్చే అంశం. ఎందుకంటే అతను 2012 నుంచి జాతీయ జట్టులో లేడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు. దీంతో అతని ఐపీఎల్ ప్రయోజనానికి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందిలేదు. మరి ఎప్పట్నించి ఈ నిషేధం? టి20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) గెలిచిన భారత జట్టులో సభ్యుడైన యూసుఫ్‌కు విధించిన 5 నెలల సస్పెన్షన్ ఐదు రోజుల్లో (ఈ నెల 14) ముగుస్తుంది సరే కానీ... ఎప్పుడు మొదలైందనేది అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే అతను అక్టోబర్‌లో బరోడా తరఫున మధ్యప్రదేశ్, ఆంధ్ర జట్లతో జరిగిన రంజీ పోటీల్లో ఆడాడు. ఈ లెక్కన ఐదు నెలల నిషేధం సరిపోదు. అయితే టెస్టు ఫలితాలు నిజానికి గత ఆగస్టు లోపే రావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలరీత్యా అవి రాలేదు. దీంతో ఫలితాల ఆలస్యాన్ని క్రికెటర్‌కు అపాదించకూడదనే ఉద్దేశంతో పాటు... క్రికెటర్ కావాలని తీసుకున్న ఉత్ప్రేరకం కాదు కాబట్టి బోర్డు నిషేధ కాలాన్ని సడలించింది. అతనిపై అక్టోబర్ 28 నుంచి నిషేధాన్ని విధించినప్పటికీ ఈ కాలాన్ని ఫలితాలు రావాల్సిన ఆగస్టు 15 నుంచి పరిగణించింది. బోర్డు విచక్షణాధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ►2 డోపింగ్‌లో పట్టుబడిన రెండో భారతీయ క్రికెటర్ యూసుఫ్ పఠాన్. గతంలో ఢిల్లీ పేస్ బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ 2013 ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతూ డోపింగ్ పరీక్షల్లో దొరికి 18 నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. కోహ్లి సారథ్యంలో 2008లో అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ప్రదీప్ సాంగ్వాన్ సభ్యుడిగా ఉన్నాడు. -
మ్యాచ్ ఫినిష్ చేయకపోవడం నేరమే!
కోల్‌కతా: మ్యాచ్‌ను ముగించలేకపోవడం నేరంగా భావిస్తానని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ అన్నాడు. రానున్న మ్యాచ్‌లలో కూడా లక్ష్యఛేదనను విజయవంతంగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇటీవల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో 39 బంతుల్లో 59 పరుగులు చేసి యూసుఫ్ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన యూసుఫ్.. మనీష్ పాండేతో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. దీంతో కోల్‌కతా అలవోకగా విజయతీరాలకు చేరింది. ‘కొత్త బ్యాట్స్‌మన్ కుదురుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి బాగా ఆడుతున్న బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి. ప్రస్తుత మ్యాచ్‌లో నేను బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఔటవ్వడం బాధించింది. మ్యాచ్ ఫినిష్ చేయకుండా ఔటవ్వడం నా దృష్టిలో నేరమే. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటా’ అని యూసుఫ్ అన్నాడు. కోల్‌కతా జట్టుకు విజయానికి 38 పరుగుల దూరంలో ఉన్నప్పుడు యూసుఫ్ క్రిస్ మోరిస్ బౌలింగ్ యూసుఫ్ ఔటైన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడే తన శైలిని మార్చుకోకుండానే ఎక్కువసేపు మైదానంలో ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నానని అతను చెప్పాడు. -
నాకు పోటీ ఎవరూ లేరు: యూసఫ్ పఠాన్
కోల్‌కతా: "నేను ప్రత్యేకం నాకు ఎవరూ పోటీ లేరని' కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ అభిప్రాయ పడ్డాడు. ఎప్పుడూ భయపడనని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాజ సిద్దమైన ఆటనే ఆడటానికే ఇష్ట పడుతానని వ్యాఖ్యానించాడు. బుధవారం భారత జట్టుకు ఎంపికవుతారనే ఆశ ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించాడు. "ఇది పెద్ద విషయం కాదు, నాకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎవరికి నేను పోటి కాదు, నాకెవరు పోటీ లేరని యూసఫ్ తెలిపాడు. నేను ఫాంలోకి వచ్చాను, ఇలానే నా ఆటను కొనసాగిస్తే అవకాశం రావొచ్చు. ఇప్పుడు భారత జట్టులో లేక పోయిన రేపటి రోజయిన అవకాశం రాకుండా ఉండదని పేర్కొన్నాడు. నేను ఇతరులను పట్టించుకోనని, మంచి క్రికెట్ ఆడటమే నా కర్తవ్యమన్నాడు'. తనకు మంచి రోజులు మొదలయ్యాయని త్వరలోనే భారత జట్టుకు ఎంపికైతనని యూసఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహజ సిద్దమైన ఆటనే ప్రదర్శిస్తానని, ఢిల్లీ మ్యాచ్ లో అలానే ఆడానని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యచ్ లో చాలా ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ కు వెళ్లానన్నాడు. తొలి బంతి అయినా, 40 వ బంతైనా నా షాట్ లో మార్పు ఉండదని యూసఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో యూసఫ్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఢిల్లీపై కోల్‌కతా అద్భుత విజయం
-
కోల్‌కతా కుమ్ముడు
►ఢిల్లీపై అద్భుత విజయం ►నాలుగో విజయంతో అగ్రస్థానానికి గంభీర్‌సేన ►మెరిసిన మనీశ్, యూసుఫ్ న్యూఢిల్లీ: ఐపీఎల్ పదో సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ దూకుడు కొనసాగుతోంది. 169 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఈ జట్టు 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో మనీష్ పాండే (49 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మరో బంతి మిగిలి ఉండగా నాలుగు వికెట్లతో నెగ్గింది. పఠాన్, పాండే మధ్య నాలుగో వికెట్‌కు 110 పరుగులు జత చేరాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 168 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (25 బంతుల్లో 39; 7 ఫోర్లు), రిషబ్ పంత్ (16 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. కౌల్టర్ నైల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి నెగ్గింది. జహీర్, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనీష్ పాండేకు దక్కింది. మనీష్, యూసుఫ్ సమయోచిత బ్యాటింగ్.. భారీ స్కోరు కాకపోయినా ఆరంభంలోనే కోల్‌కతా తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే, యూసుఫ్ అద్భుతంగా ఆదుకున్నారు. ఈసారి ఓపెనర్‌గా నరైన్ స్థానంలో వచ్చిన హ్యాండ్స్కోంబ్ (1) ఐదో బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న రాబిన్ ఉతప్ప (4), కెప్టెన్ గంభీర్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు) కూడా వెనుదిరగడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. రెండు వికెట్లు తీసిన జహీర్ పవర్‌ప్లేలో 50 వికెట్లు తీసిన తొలి ఐపీఎల్ బౌలర్ అయ్యాడు. అయితే జట్టు ఇన్నింగ్స్‌ను యూసుఫ్, మనీష్ పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. ప్రణాళికాబద్ధంగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను సిక్సర్లు, బౌండరీలుగా మలుస్తూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో 34 బంతుల్లో పఠాన్ ఓ భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 15వ ఓవర్లో తనను మోరిస్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. అయితే అప్పటికే నాలుగో వికెట్‌కు 110 పరుగులు చేరాయి. అటు మనీష్ కూడా 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. కానీ చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో తొలి రెండు బంతులు పరుగులేమీ లేకుండా వికెట్ పడడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా పాండే ఓ సిక్సర్‌తో ఒత్తిడి తగ్గించి విజయం అందించాడు. సంజూ, రిషబ్ జోరు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టులోకి షాబాజ్ నదీమ్ స్థానంలో షమీ, అండర్సన్ స్థానంలో ఏంజెలో మాథ్యూస్ వచ్చారు. తొలి ఓవర్లోనే సంజూ వరుసగా రెండు ఫోర్లతో తన ఉనికి చాటుకోగా మూడో ఓవర్లో మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఢిల్లీ 53 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత వరుస ఓవర్లలో మరో ఓపెనర్ బిల్లింగ్స్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో పాటు సామ్సన్ కూడా పెవిలియన్ చేరారు. కొద్దిసేపు శ్రేయస్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), కరుణ్నాయర్ (27 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 17వ ఓవర్లో తొలి బంతిని మినహాయించి వరుసగా 6,4,6,6,4తో విరుచుకుపడడంతో జట్టుకు 26 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో కౌల్టర్‌నైల్ అతడిని బౌల్డ్ చేయగా అదే ఓవర్లో మోరిస్ (9 బంతుల్లో 16; 3 ఫోర్లు) ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోల్‌కతా ఫీల్డర్లు పట్టలేకపోయారు. ► 25 పరుగుల్లోపే మూడు వికెట్లు కోల్పోయి నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. -
పెద్ద గ్రౌండ్లు అయితే.. ఫోర్లు, సిక్సర్లు బాదేస్తా
న్యూఢిల్లీ: సాధారణంగా చిన్న గ్రౌండ్లలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే భారీ స్కోర్లు నమోదు అవుతాయి. ఇక టి-20 ఫార్మాట్ అయితే బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోతారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌కు మాత్రం చిన్న మైదానాల్లో మ్యాచ్‌లు ఆడటం ఇబ్బందికరంగా ఉంటుందట. పెద్ద గ్రౌండ్లలో అయితే బంతి బౌండరీ లైన్ దాటాలంటే ఎలా కొట్టాలో తనకు తెలుసునని యూసుఫ్ అన్నాడు. టి-20 క్రికెట్లో తన పాత్రను కొద్దిగా మారిందని చెప్పాడు. ప్రస్తుతం కొందరు ఆటగాళ్లు సులభంగా ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నారని, అవసరమైతే తాను సహజశైలిలో దూకుడుగా ఆడగలనని, అలాగే 20 ఓవర్లూ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా సిద్ధపడతానని యూసుఫ్ అన్నాడు. 2007 జరిగిన తొలి టి-20 ప్రపంచ్ కప్‌లో యూసుఫ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో వెలుగులోకి వచ్చాడు. 2010 సీజన్లో రాజస్థాన్ తరపున ఆడిన యూసుఫ్ 37 బంతుల్లో మెరుపు సెంచరీ చేశాడు. ప్రస్తుతం కోల్‌కతా తరఫున ఆడుతున్నాడు. -
యూసుఫ్ పఠాన్ నిర్ణయంపై వెనక్కి
హాంకాంగ్ టి20 లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఉపసంహరణ ముంబై: విదేశీ టి20 లీగ్‌లలో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందే అవకాశం యూసుఫ్ పఠాన్ చేజారింది. మార్చి 8 నుంచి 12 వరకు హాంకాంగ్‌లో జరిగే టి20 లీగ్‌లో పాల్గొనేందుకు యూసుఫ్ పఠాన్‌కు గతవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అతనికి నిరభ్యంతర పత్రం కూడా జారీ చేసింది. దాంతో ఈ లీగ్‌లో కౌలూన్ కాంటోన్స్ జట్టు యూసుఫ్ పఠాన్‌తో ఒప్పందం చేసుకుంది. యూసుఫ్ పఠాన్‌కు పచ్చ జెండా ఊపిన తర్వాత భారత్‌కే చెందిన ఇతర క్రికెటర్లు కూడా హాంకాంగ్ టి20 లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐని కోరారు. ఒకేసారి చాలామంది క్రికెటర్లు ఇలా అనుమతి కోరడంతో పునరాలోచనలో పడిన బీసీసీఐ యూసుఫ్ పఠాన్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అతనితోపాటు ఇతర క్రికెటర్లు కూడా విదేశీ టి20 లీగ్‌లలో ఆడొద్దని ఆదేశించింది. ఇటీవలే దినేశ్ కార్తీక్ కరీబియన్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి దరఖాస్తు చేసుకోగా దానిని తిరస్కరించింది. ఇప్పటివరకు భారత్ నుంచి ఏ క్రికెటర్ కూడా విదేశీ టి20 లీగ్‌లలో ఆడలేదు. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన మాత్రం ఇటీవలే ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ టి20 లీగ్‌లో ఆడినా... కొన్ని మ్యాచ్‌ల తర్వాత బీసీసీఐ వీరిద్దరినీ వెనక్కి పిలిచింది. -
తొలి భారత క్రికెటర్‌గా యూసఫ్ !
వడోదరా:ఒక విదేశీ లీగ్ లో ట్వంటీ 20 లీగ్ లో ఆడేందుకు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఒప్పందం చేసుకున్నాడు. తద్వారా ఒక విదేశీ లీగ్ లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసఫ్..తన ఫామ్ ను మరింత మెరుగుపరుచునే క్రమంలో విదేశీ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే నెల 8 వ తేదీన ఆరంభమయ్యే ఈ లీగ్ లో తాను పాల్గొనబోతున్న విషయాన్ని యూసఫ్ స్వయంగా వెల్లడించాడు. 'హాంకాంగ్ ట్వంటీ 20 లో పాల్గొనేందుకు సంతకం చేశా. ఆ లీగ్ లో చాలా మంది ప్రముఖ క్రీడాకారులు ఆడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. దాంతో ఆ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వెళ్లా. ఇలా ఒక విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ఐపీఎల్లే ప్రధాన కారణం. ఐపీఎల్ కు మంచి ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకున్నా' అని యూసఫ్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఈ లీగ్ లో పాల్గొనడం తన దేశవాళీ కెరీర్ పై ఎటువంటి ప్రభావం చూపదని యూసఫ్ పేర్కొన్నాడు. దాదాపు ఐదేళ్ల క్రితం భారత తరపున యూసఫ్ ఆడాడు. 2012లో చివరిసారి భారత్ కు యూసఫ్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయిన యూసఫ్..కేవలం దేశవాళీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు. -
అవకాశం ఇచ్చిన వారిద్దరికీ థ్యాంక్స్
బెంగళూరు: చాలా రోజుల తర్వాత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్.. టీమ్ హెడ్ కోచ్ జాక్వెస్ కలిస్, అసిస్టెంట్ కోచ్ సిమోన్ కటిచ్లకు ధన్యవాదాలు చెబుతున్నాడు. తనపై విశ్వాసం ఉంచి, మధ్య ఓవర్లలో ఆడే అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడంలో యూసుఫ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. యూసుఫ్ 29 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలవడంతో కోల్‌కతా మరో ఐదు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లతో గెలుపొందింది. ఈ విజయం గురించి యూసుఫ్ మాట్లాడుతూ.. 'ఇన్నింగ్స్‌లో మరో రెండు లేదా మూడు ఓవర్లు మిగిలివున్నపుడు వెళ్లి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రతి బంతికి భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. నిలకడగా ఆడే పరిస్థితి ఉండదు. బెంగళూరుతో మ్యాచ్‌లో ఇంకా పది ఓవర్లు ఉన్నప్పుడు నన్ను బ్యాటింగ్‌కు పంపారు. నాపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చిన కలిస్, కటిచ్లకు కృతజ్ఞతలు' అని చెప్పాడు. కోల్‌కతా కెప్టెన్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. అతను మంచి కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గంభీర్ ఆటగాళ్లకు అండగా ఉంటూ, ప్రోత్సహిస్తాడని చెప్పాడు. -
అతను చాలా ప్రమాదకరమైన క్రికెటర్!
యంగ్‌స్టర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దూకుడు మీద ఉండటం.. ధోనీ సేన మీద చాలా ఆశలు రేపుతోందని అంటున్నాడు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్. మరోసారి పొట్టికప్పును ధోనీ సేన కైవసం చేసుకొని చరిత్ర తిరగరాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలోఈ ఆల్‌రౌండర్ కూడా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ సేన ఫామ్, యువత, అనుభజ్ఞులతో జట్టు మంచి సమతుల్యంతో ఉందని, దీనికితోడు స్వదేశంలో వరల్డ్ కప్ ఆడుతుండటం టీమిండియాకు కలిసొచ్చే విషయమని యూసఫ్ పఠాన్ విశ్లేషించాడు. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్‌లలో, ఆసియా కప్‌లో భారత్ అద్భుతమైన ఆటతీరు కనబర్చిందని కొనియాడాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో నిస్సందేహంగా ఇండియానే ఫేవరెట్ జట్టు అని, ఈ మెగా టోర్నమెంటులో డాషింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుకు స్టార్ ఫర్ఫార్మెర్లుగా నిలువనున్నారని పేర్కొన్నాడు. 'టీ20 ఫార్మెట్లో కోహ్లి చాలా ప్రమాదకరమైన క్రికెటర్. అతని ఆటతీరు చూడటం నిజంగా కనులకు పండుగే. రోహిత్, కోహ్లి ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లే. తమదైన శైలిలో ఆడుతూ.. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు' అని పఠాన్ పేర్కొన్నాడు. 33 ఏళ్ల యూసఫ్ పఠాన్ ప్రస్తుతం జట్టులో లేకపోవడం నిరాశ కలిగిస్తున్నదని చెప్పాడు. భవిష్యత్తులో జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. -
టీమిండియా క్రికెటర్ ఇంట్లో హీరోయిన్ సందడి!
వడోదర: బాలీవుడ్ నటి సుందరి శిల్పాశెట్టి టీమిండియా క్రికెటర్ ఇంట్లో సందడి చేసింది. శిల్ప గుజరాత్ లోని వడోదరకు ఆదివారం వెళ్లింది. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్ మన్ యూసఫ్ పఠాన్ ను కలుసుకుంది. మిత్రుడు పఠాన్ ఇంటికి వెళ్లాను అని స్నేహితుడితో ఓ ఫొటో అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. యూసఫ్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడిపింది. గతంలోనూ యూసప్ కుటుంబసభ్యులను పలుమార్లు ఆమె కలుసుకుంది. స్నేహితుడి తల్లి ఎంతో అప్యాయతతో తనకు భోజనం పెట్టిందని.. ఆమె ఎంతగానో ప్రేమతో వడ్డిస్తుంటే కాదనలేక అంతా తినేశానని పొడుగుకాళ్ల సుందరి చెప్పింది. యూసఫ్ పఠాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఓ జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్ లు ఆడాడు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ జట్టుకు సహ యజమానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో శిల్పాశెట్టి ఆ క్రికెటర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జట్టుపై రెండేళ్లపాటు నిషేధం ఉంది. -
అభిమాని చెంప చెళ్లుమనిపించిన యూసుఫ్ పఠాన్
వడోదర: పేలవ ఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్.. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన ఓ క్రికెట్ అభిమానికి చెంపదెబ్బలు కొట్టాడు. జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. క్రికెట్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. రంజీ ట్రోఫీలో బరోడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూసుఫ్.. తెలుగుతేజం అంబటి రాయుడుతో కలసి బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఓ క్రికెట్ అభిమాని పరుష వ్యాఖ్యలు చేశాడు. యూసుఫ్‌తో పాటు ఇతర జట్టు సభ్యులను దూషించాడు. దీంతో సహనం కోల్పోయిన యూసుఫ్ అనంతరం.. ఆ ప్రేక్షకుడిని డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిచి రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యూసుఫ్ సోదరుడు, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ చేరుకుని వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకుడి కుటుంబ సభ్యులు వచ్చి యూసుఫ్ కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మ్యాచ్ రిఫరీ బీసీసీఐకి నివేదిక పంపాడు. -
‘నా కష్టం వారికేం తెలుసు’
కోల్‌కతా: రెండేళ్లుగా కొనసాగుతున్న వైఫల్యాలకు ఒక్క ఇన్నింగ్స్‌తో జవాబు చెప్పాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించి యూసుఫ్ మళ్లీ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి గాడిలో పడేందుకు తాను ఎంతగా శ్రమిస్తున్నానన్నది తనపై విమర్శలు చేసే వారికి తెలియదని యూసుఫ్ అన్నాడు. విమర్శలు చేస్తేనే వారికి ఫీజు లభిస్తుందని, ఆడినందుకు తనకు లభిస్తుందని, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నామని తెలిపాడు. ‘ఎవరేం మాట్లాడినా... నా పనేంటో, సామర్థ్యమేంటో నాకు తెలుసు. నెట్స్‌లోనూ, మ్యాచ్‌లు లేని ఖాళీ సమయాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇతరులు మాట్లాడే వాటి గురించి పట్టించుకోను’ అని యూసుఫ్ అన్నాడు. -
దేవధర్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్
42 పరుగుల తేడాతో సెంట్రల్‌పై గెలుపు రాణించిన యూసుఫ్, పుజారా విశాఖపట్నం, న్యూస్‌లైన్: బ్యాటింగ్‌లో యూసుఫ్ పఠాన్ (57 బంతుల్లో 70; 9 ఫోర్లు, సిక్స్), చతేశ్వర్ పుజారా (96 బంతుల్లో 60; 4 ఫోర్లు)... బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి (4/39) రాణించడంతో దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో వెస్ట్‌జోన్ 42 పరుగుల ఆధిక్యంతో సెంట్రల్ జోన్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. పీయూష్ చావ్లా 4, కరణ్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌జోన్ 44.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. శలభ్ శ్రీవాస్తవ (115 బంతుల్లో 65; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. పీయూష్ చావ్లా (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. లోయర్ ఆర్డర్లో ఉమేశ్ యాదవ్ (27 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడినా.. సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో సెంట్రల్ చివరి ఐదు వికెట్లను 55 పరుగుల తేడాతో చేజార్చుకుంది. అర్పిత్ 3, జైదేవ్ ఉనాద్కట్ 2 వికెట్లు పడగొట్టారు. గురువారం జరిగే ఫైనల్లో నార్త్‌జోన్, వెస్ట్‌జోన్ తలపడతాయి. -
భారత క్రికెటర్లకు చిత్రమైన పరిస్థితి
గంభీర్‌కు ఐదు కోట్లు... జడేజాకు నాలుగు కోట్లు... యూసుఫ్ పఠాన్‌కు నాలుగు కోట్లు.... ఇవన్నీ వీళ్లకు ఏదో ఒక జట్టు చెల్లిస్తున్న మొత్తం కాదు. డాలర్ రేటు పెరగడంతో వీళ్లు నష్టపోతున్న మొత్తం! డాలర్ రేటు రూ.66కి పెరిగినా... ఐపీఎల్ ఒప్పందం ప్రకారం భారత క్రికెటర్లకు రూ. 46 ప్రకారమే ఫ్రాంఛైజీలు డబ్బు చెల్లిస్తున్నాయి. సాక్షి క్రీడావిభాగం ఐపీఎల్ 2010 వేలంలో మూడేళ్ల కాలానికి గాను గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 2.4 మిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అప్పటి డాలర్ రేటు రూ. 46. దాని ప్రకారం గంభీర్‌కు ఏడాదికి కోల్‌కతా జట్టు రూ. 11.04 కోట్లు చెల్లించాలి. ఇప్పుడు డాలర్ రేట్ అనూహ్యంగా రూ.66కి పెరిగింది. దీని ప్రకారం గంభీర్‌కు రూ. 15.84 కోట్లు రావాలి. అంటే డాలర్ రేటు పెరగడం వల్ల గంభీర్‌కు వచ్చే లాభం... 4.8 కోట్లు. కానీ... వేలం డాలర్లలో జరిగినా గంభీర్‌కు ఆ రూపంలో మాత్రం ఇవ్వరు. రూపాయల్లోనే చెల్లిస్తారు. అది కూడా పాత రేటు రూ.46 ప్రకారమే. ఐపీఎల్ ఒప్పందం ప్రకారం భారత క్రికెటర్లకు మారకం రేటుతో సంబంధం లేకుండా అప్పటిరేటు ఒక్క డాలరుకు రూ. 46 మాత్రమే చెల్లిస్తారు. కాబట్టి ఇప్పుడు రేటు రూ. 66 ఉన్నా గంభీర్‌కు మాత్రం రూ. 11.04 కోట్లు మాత్రమే వస్తాయి. మొత్తం భారత క్రికెటర్లందరిదీ ఇదే పరిస్థితి. అయితే ఈ విషయంలో విదేశీ ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టారనే అనుకోవాలి. వారికి డాలర్లు చెల్లించాలనే ఒప్పందం ఉంది. అంటే వీరికి రూ. 46 అనే కండిషన్ లేదు. కాబట్టి ఇప్పటి రేటు ప్రకారమే చెల్లింపులు జరుపుతారు. ఉదాహరణకు ముంబై జట్టు ఆటగాడు మ్యాక్స్‌వెల్ వేలం ధర మిలియన్ డాలర్లు. భారత ఆటగాళ్లకు ఉన్న షరతులే ఉంటే... మ్యాక్స్‌వెల్‌కు రూ. 4.6 కోట్లు దక్కేవి. కానీ డాలర్లలో అతడికి డబ్బు వస్తుంది. కాబట్టి తనకు ఇప్పుడు రూ.6.6 కోట్లు వస్తున్నాయి. అంటే మారక రేటులో మార్పుల వల్ల మ్యాక్స్‌వెల్ ఏకంగా రూ. 2 కోట్లు అదనంగా పొందుతున్నాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ జడేజా రేటు 2 మిలియన్ డాలర్లు. అంటే అతడికి చెల్లించేది రూ. 9.2 కోట్లు. మ్యాక్స్‌వెల్ రేటు జడేజాలో సగమే. కానీ మ్యాక్స్‌వెల్‌కు వస్తోంది 6.6 కోట్లు. అంటే తేడా కేవలం రూ. 2.6 కోట్లు మాత్రమే అంటే వేలంలో రెట్టింపు ధర పలికినా... వాస్తవంలో మాత్రం తక్కువే వస్తుంది. మొత్తం మీద డాలర్ రేటు మారినా పాత రేటు ప్రకారం భారత క్రికెటర్లు చెల్లింపులు పొందుతున్నారు. దీనివల్ల సుమారు 40 శాతం అదనంగా రావలసిన మొత్తాన్ని కోల్పోతున్నారు. ఇదే సమయంలో విదేశీ ఆటగాళ్లకు సుమారు 40 శాతం అదనపు ప్రతిఫలం దక్కుతోంది. ఫ్రాంఛైజీల పరిస్థితి? భారత ఆటగాళ్ల విషయంలో డాలర్ రేటు వర్తించకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నా... ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు విదేశీ ఆటగాళ్ల చెల్లింపులు, విదేశీ మద్దతు సిబ్బంది చెల్లింపుల విషయంలో మాత్రం తలనొప్పి తప్పడం లేదు. డాలర్‌కు రూపాయి విలువ ఒక్క రూపాయి పెరిగితే ఒక్కో ఫ్రాంఛైజీ ఖర్చు సగటున 15 లక్షల రూపాయలు పెరుగుతుంది. కానీ ఇందులో కాస్త ఊరట ఏమిటంటే.. చెల్లింపులన్నీ ఒకే సమయంలో ఉండకపోవడం. నిబంధనల ప్రకారం... ప్రతి సీజన్లో ఫ్రాంఛైజీలు ఆటగాళ్లకు ఐపీఎల్ ఆరంభానికి ముందు 15 శాతం, మే 1 నాటికి మరో 50 శాతం చెల్లించాలి. మిగిలిన 35 శాతం నవంబర్ 1 లోగా చెల్లించాలి. అంటే ఒకరంగా మే 1 నాటికి 65 శాతం చెల్లించిన వారు డాలర్‌కు రూ.54 చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత రేటులో చెల్లిస్తారు. ఆటగాళ్లకు చెల్లింపులను ఆలస్యం చేసిన బెంగళూరు లాంటి ఫ్రాంఛైజీలకు ఇది మరింత తలనొప్పి. ఇకపై వేలం రూపాయల్లోనే... ఈ దెబ్బను తట్టుకోలేక వచ్చే సీజన్ వేలాన్ని ఐపీఎల్ రూపాయల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఈ మారక రేటు గొడవ లేకుండా ఆటగాళ్లకు వాళ్లకు రావలసిన పూర్తి మొత్తం వస్తుంది. మరోవైపు ఫ్రాంఛైజీల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినకుండా ఉంటాయి. భారత క్రికెటర్లు కూడా ఇదే కోరుకుంటున్నారు. ‘రేటులో మార్పు వల్ల మేం నష్టపోతున్న మాట వాస్తవమే. అయితే ఐపీఎల్ ద్వారా భారీ మొత్తం వస్తున్నందున ఎవరిలోనూ పెద్దగా ఈ విషయంపై అసంతృప్తి లేదు. ఏమైనా వేలం రూపాయల్లో జరగడాన్ని మేం స్వాగతిస్తున్నాం’ అని ఒక భారత క్రికెటర్ అన్నాడు.