Arthritis
-
కీళ్లనొప్పులు.. ఆటకు గుడ్‌బై చెబుతా: సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?
ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని, బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకోవడానికి తన ఆరోగ్య పరిస్థితి అస్సలు సహకరించడం లేదని పేర్కొంది. తన మోకాలులోని మృదులాస్థి బాగా దెబ్బతిందని అందువల్ల ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టం. అదీగాక అత్యున్న స్థాయి ఆటగాళ్లను ఎదుర్కోవడానికి రెండు గంటల ప్రాక్టీస్ ఏ మాత్రం సరిపోదని వెల్లడించింది. సైనా వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఆమె రిటైర్మైంట్ గురించి పలు ఊహగానాలు హల్చల్ చేశాయి. నిజానికి సైనా దాని గురించి ఆలోచిసస్తున్నా అనే చెప్పిందే తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఆటగాళ్ల కెరియర్ చిన్నదే అయినా తాను 9 ఏళ్ల వయసులోనే క్రీడాకారిణిగా కెరియర్ ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఐతే ఆమె గతేడాది సింగపూర్ ఓపెన్ తర్వాత బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనలేదు. అసలు ఇలాంటి సమస్యను ఎక్కువగా క్రీడాకారులే ఎందుకు ఎదుర్కొంటారంటే..కీళ్ళలో మార్పులకు కారణమే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎడిన్‌బర్గ్‌లోని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. 2022లో చేసిన అధ్యయనంలో దీన్ని గుర్తించారు. ఈ సమస్యతో దాదాపు 3 వేల మంది రిటైర్డ్ ఒలింపియన్లు బాధపడుతున్నట్లు చెప్పారు. వారంతా మోకాలి, కటి వెన్నుముక, భుజాలు వంటి ప్రాంతాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వేసవి, శీతాకాల ఒలింపిక్ క్రీడలలో రిటైర్ కాబోతున్న ఎలైట్ అథ్లెట్ల కీళ్లలో ఈ సమస్యను గుర్తించామని చెప్పారు. ఆస్టియో ఆర్థైటిస్ అనేది భరించలేని నొప్పిని కలిగిస్తుందని అన్నారు. క్రీడల్లో ఉండే ఒకవిధమైన ఒత్తిడి, అయ్యే గాయలు కారణంగా ఈ సమస్య వస్తుంది. అయితే ఈ గాయాలు పదే పదే పునరావృతమవుతుంటే సమస్య తీవ్రమవుతుందని అన్నారు. అది కాస్త మృదులాస్థి విచ్ఛిన్నానికి దారితీసి భరించలేని నొప్పిని కలుగజేస్తుందని అన్నారు. అలాగే ఒక్కోసారి క్రీడల సమయంలో అయ్యే గాయాల కారణంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. మోకాలు, మడమల వద్ద అయ్యే గాయాలు కారణంగా ఈ ఆస్టియో ఆర్థైటిస్ సమస్య అభివృద్ధి చెందే అవకాశ ఉందని అన్నారు. దీర్థకాలిక కీళ్ల వాపులు కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. కొన్ని క్రీడల్లో వేగవంతమైన కదలిక భుజాలు, మోకాళ్లపై ఒత్తిడి ఏర్పడటంతో ఈ సమస్య వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అసౌకర్యం, నొప్పిని కలుగజేసి వైకల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!) -
సైక్లింగ్‌తో మెకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ప్రమాదాలకు చెక్!
ఆర్థరైటిస్ అనేది కీళ్ళను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పుండ్లు పడడం, కీళ్ళు గట్టిగా మారడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్‌లో 100 కంటే ఎక్కువ స్టేజెస్ ఉంటాయి. ప్రతిది కూడా వేర్వేరు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలు, యువకులనూ కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమస్యలకు సైక్లింగ్ చెక్ పెడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అసలు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ సైక్లింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందనేది ఈ పరిశోధనలో సవివరంగా తెలిపింది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో జీవితంలో కనీసం ఒక్కసారైన సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం 17% తక్కువగా ఉందని, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం 21% తక్కువగా ఉందని వెల్లడయ్యింది. అందుకోసం 60 ఏళ్ల లోపు సుమారు రెండు వేలకు పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి మరీ పేర్కొంది. ఈ పరిశక్షధన మెడిసిన్ అండ్ సైన్స్‌లో ప్రచురితమయ్యింది. స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్లో ఆరుబయట చేసే సైక్లింగ్ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను నివారిస్తుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల ఆధారంగా జీవితాకాలంలో సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడం తోపాటు మెరుగైన మోకాలి ఆరోగ్యం ఉంటుందని, పైగా ఈ ప్రమాదం బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని రుమాటాలజీ చీప్ డాక్టర్ గ్రేస్ అన్నారు. అంతేగాదు ఎక్కువ సమయం సైకిల్‌పై గడిపితే అతడు లేదా ఆమెకు మోకాళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. అలాగే 12 నుంచి 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారి డేటాను ట్రాక్ చేయగా వారిలో సగానికిపైగా మంది సైక్లింగ్ని తమ రోజువారి వ్యాయమంలో భాగం చేసినట్లు తెలిపారు. వారందరిలో క్వాడ్రిస్ప్లు బోలపేతమయ్యాయని అన్నారు. వారంతా సైక్లింగ్ని మానేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు..రన్నింగ్ లేదా జంపింగ్ వంటి అధిక ప్రభావ వ్యాయామాలతో పోలిస్తే సైక్లింగ్ అనేది ప్రభావ చర్య కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. మోగాలి గాయాల ప్రమాదాన్ని తగ్గిండానికి, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స, కండరాలు బలంగా ఉన్నప్పుడు, మోకాలి కీలుకు మెరుగైన మద్దతునిచ్చి, తద్వారా గాయలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.క్రమం తప్పకుండా సైకిల్ నడుపుతున్నప్పుడు కదలికల పరిధిని నిర్వహించడానికి, మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెడలింగ్ సైనోవియల్ ద్రవం ప్రవాహంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల సరళతకు తోడ్పడుతుంది.అలాగే బరువు నిర్వహణలో సహాయపడుతుంది. శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సైక్లింగ్ మంచి మార్గం. అధిక బరువు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల, సైక్లింగ్ ద్వారా మీ బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, మోకాలి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే బరువు తగ్గుతారు! పోషాకాహార నిపుణులు) -
‘మెఫ్తాల్’ ఔషధ రియాక్షన్లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: నెలసరి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సందర్భాల్లో సాధారణంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావా(రియాక్షన్)లను గమనించి, అప్రమత్తమవ్వాలని ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, వ్యాధిగ్రస్తులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన ఒక అడ్వైజరీని జారీ చేసింది. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్మెనోరోయియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్‌ను వినియోగిస్తుంటారు. ఈ పెయిన్ కిల్లర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్(ఐపీసీ) తాజాగా ఔషధ భద్రత హెచ్చరికను జారీ చేసింది. ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా(పీవీపీఐ) వారి డేటాబేస్‌ను ప్రాథమికంగా విశ్లేíÙంచగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ ఔషధాన్ని వినియోగించిన సందర్భాల్లో ఇసినోఫిలియా, సిస్టెమిక్ సింప్టమ్స్(డ్రెస్) సిండ్రోమ్ వంటి డ్రగ్ రియాక్షన్లు కనిపించాయి. పెయిన్ కిల్లర్‌ను వాడిన సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు కనబడితే వెంటనే పీవీపీఐ అధికారిక ఠీఠీఠీ. జీpఛి.జౌఠి.జీn వెబ్సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1800–180–3024ను సంప్రదించవచ్చు. -
వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
మనం కొత్తగా ఏదైన డైట్ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది. మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్ గడియారాన్ని సెట్ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్ పాస్ చేయడంతో ఆటోమెటిక్‌గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు. అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్ రైట్ అయిపోయి లేవాలనే ఫీల్ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో 24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్‌ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం. ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు. అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్‌కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్ పరిశోధకులు. (చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!) -
ఆర్థరైటిస్ వృద్ధులకే వస్తుందనుకోవద్దు! ఇప్పుడు అందరిలోనూ..
చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆర్థరైటిస్. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు. మీదపడే వయస్సుతో మరింత తీవ్రమయ్యే ఈ వ్యాధి, పూర్వం ఎక్కువగా వృద్ధాప్యంలో అంటే 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ముందే వచ్చేస్తోంది. అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12ను ప్రపంచ ఆర్థరైటిస్ డేగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ తేతలి దశరథరామారెడ్డిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. వివరాలు ఆయన మాటల్లోనే.. లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకండి ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. అసాధారణమైన కీళ్ళ వాపు, నొప్పి లేక కీళ్ళు బిగుసుకుపోవడం వంటివి రోజుల తరబడి ఉన్నా, అకస్మాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినా, కీళ్లను తాకడం బాధాకరంగా మారినా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించాలి. 65 ఏళ్ల మహిళలు 70 ఏళ్ల పురుషులు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) పరీక్ష చేయించుకోవాలి. ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి వేర్వేరు చికిత్సలు కూడా ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ (ఓఏ): వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత నడిస్తే కీళ్ళు గట్టిగా అనిపించవచ్చు. అయితే ఒకసారి కదలడం మొదలుపెడితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ): రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను మందులతో, కీళ్ళపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాయామంతో తగ్గించవచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఆర్ఏ లాగే ఇది ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి. సాధారణంగా సోరియాసిస్ ఉన్నవారిలో సంభవిస్తుంది. గౌట్: శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండటం ఈ సమస్యకు కారణం. లూపస్: లూపస్ అనేది చర్మం, అవయవాలు శరీరంలోని అనేక ఇతర ప్రదేశాలలో మంటను కలిగించే దీర్ఘకాలిక వ్యాధి. స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ (వెన్నెముక ఆస్టియో ఆర్థరైటిస్): కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ వెన్నెముక వద్ద నుండే నరాలపై ఒత్తిడి తెచ్చే ’స్పర్స్’ (ఎముక ఎదుగుదల)కు కారణమవు తుంది. దీనివల్ల ఉత్పన్న మయ్యే సమస్యలను స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఎలా నియంత్రించాలి? బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎక్కువ బరువుంటే తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. క్రమం తప్పకుండా నడకవంటి వ్యాయా మం చేయడంవల్ల కీళ్ల ఫ్లెక్సిబిలిటీ (సరళంగా వంగే గుణం) పెరుగుతుంది. ఈత కొట్టాలని, బరువులు ఎత్తడం లాంటి కసరత్తులు చేయాలని కొందరు వైద్యులు సిఫారసు చేస్తారు. పండ్లు, మూలికలు, చేపలు, కూరగాయలతో సహా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తినాలి. ధూమపానం, మద్యపానం మానాలి. ఎముకలు చిట్లకుండా చూసుకోవాలి. (చదవండి: ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..) -
మీకు తెలుసా? ప్రతిరోజూ సున్నం తీసుకుంటే ఇన్ని లాభాలున్నాయా?
మనకు వచ్చే వ్యాధులలో సుమారు 70% వాతం వల్ల వచ్చేవే. మన శరీరంలో వచ్చే నొప్పులు 90% వాతం కారణంగానే వస్తాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? వాతం రాకముందే ఎలా గుర్తించాలి? నివారణకు ఏం చేయాలి?అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే.. ►శరీరంలో కాల్షియం తగ్గితే 50కి పైగా జబ్బులు వస్తాయి. ► మన శరీరంలో40-45 ఏళ్ల వరకే మనం తీసుకునే ఆహరం నుంచి కాల్షియం తయారవుతుంది. ► శరీరంలో కాల్షియం తగ్గితే ఎముకలకి సంబంధించిన నొప్పులు, కఫానికి సంబంధించిన జబ్బులు వస్తాయి. ► కీళ్లనొప్పులు, భ/జాల నొప్పులు, మోకాళ్లు, నడుము నొప్పులు వస్తాయి. ► స్త్రీలకు 45ఏళ్లు పూర్తికాగానే, మోనోపాజ్ దశ మొదలవుతుంది. దీంతో శరీరం కాల్షియంను తీసుకునే సామర్థ్యం కోల్పోతుంది. కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ మధ్యకాలంలో వాత రోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టకపోవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, అరటిపండు, నారింజ, కమలా, బత్తాయి, ద్రాక్ష, మామిడి పండ్లు 45ఏళ్లు నిండిన తర్వాత,పండ్లు తీసుకున్నా శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో బయటి నుంచి కాల్షియంను తీసుకోవాల్సి ఉంటుంది. వాతం..ఇలా గుర్తించండి ► చేతి, కాళ్ల కదలికలు స్టిఫ్ అవుతున్నట్లు, ఏదైనా నొప్పి కలిగిస్తున్నట్లు ఉంటే వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించండి. ► ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్‌గా శరీరం ఉంటే వాతం ఉన్నట్లు గమనించండి. ► ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి వేగంగా తిరిగే ఫ్యాన్ కింద నేరుగా పడుకోవద్దు. ► పలుచటి దుప్పటి కప్పుకొని కాస్త పక్కకు పడుకోవాలి. ► గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. వాతం నివారణకు ఇలా చేయండి. 1. సున్నం తీసుకోండి: 45 ఏళ్లు దాటిన స్త్రీలు, పురుషులు ఎవరైనా తప్పకుండా సున్నం తీసుకోవాలి. సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావల్సిన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. 1.సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు (1 గ్రాము -- గోధుమ గింజంత మోతాదు ) సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. 2.సున్నం + పెరుగు లేక మజ్జిగ . సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకోవాలి. 3. ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం తీసుకోవాలి. గమనిక: శరీరంలో రాళ్లు(కిడ్నీలో స్టోన్స్)ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నంని తీసుకోరాదు. మెంతులు మంచి ఔషధం 1.మెంతులు ఔషధాల గని. ఇవి వాతం, కఫాన్ని తగ్గిస్తాయి. 2.రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే పరగడుపున బాగా నమిలితినాలి. మెంతుల కంటే సున్నం వాతనాశినిగా ఆయుర్వేదంలో చెప్పుకుంటారు. 3.పారిజాత వృక్షం చెట్టు ఆకులు ఎక్కువ క్షౌరగుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆకులను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో వేసి ఆ నీటిని అరగ్లాసు అయ్యేదాకా వేడి చేసి, ఉదయం పరగడుపునే ఆకులతో సహా గుటకగా తాగాలి. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. ఈ కషాయం దీర్ఘకాలిక రోగాలకు మంచి మందులా పనిచేస్తుంది. గమనిక: ఈ కషాయం వాడుతున్నప్పుడు ఎలాంటి ఇతర మందులు వాడరాదు. ఈ కషాయం వల్ల 2-3 నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ♦ యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారు.. నల్ల నువ్వులు,బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. ♦ ఆస్తమా + ఆర్ధరైటీస్ ఉన్నవారు దాల్చిన చెక్క + శొంటి కషాయాన్ని తప్పనిసరిగా తాగాలి. ♦ స్థూలకాయం + ఆర్ధరైటీస్ ఉన్నవారు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు. ♦ పెద్ద వయస్సు వారికి మోకాళ్ల నొప్పులు ఉంటే సున్నం తీసుకుంటే సరిపోతుంది. ♦ భుజాల నొప్పులు, మోచేతి నొప్పులకు నీటిని చిన్నగా గుటకగుటకగా తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ♦ కీళ్ల నొప్పులు ఉన్నారు భోజనం చేసిన వెంటనే వేడినీళ్లు తాగాలి. ♦ ఉపవాస సమయంలో చల్లటి పండ్లరసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు కడుపు ఖాళీగా ఉంటే వాతం పెరిగి కాళ్లు, చేతులు, నడుము నొప్పులు వస్తాయి. వేడినీళ్లు తాగితే ఏ ఇబ్బందీ ఉండదు. మంచినీళ్లు నిలబడి తాగుతున్నారా? ►మంచినీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగాలి. అంతేకాకుండా నీళ్లు ఎప్పుడు తాగినా గుటక గుటకగా తాగాలి. ► నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఎప్పటికీ తగ్గవు. ఏ మందులు వాడినా ఫలితం ఉండదు. ► సైంధవ లవణం ( Rock Salt ),శుద్దమైన వంట నూనె వాతం శాతన్ని పెంచకుండా చేస్తుంది. - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
Health: మడమల నొప్పి వేధిస్తోందా? వెనక్కి నడిచే అలవాటుంటే.. లంగ్స్‌కి!
Walking Backwards- Health Benefits: వెనక్కు నడవడం లెక్కకు తిరోగమన సూచనగా కనిపిస్తుందేమోగానీ... హెల్త్‌కు చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనకలవాటైన నడక కంటే వెనక్కు నడిచే ప్రక్రియ మరింత సవాలుగా మారుతుంది. మెదడుకు మరింత ఎక్కువ పని పడుతుంది. బ్యాలెన్స్ చేయడం, నడిచేప్పుడు కాళ్లు సరిగ్గా పడటం, పక్కలకు సరిగా తిరగడం వంటి వాటి నియంత్రణ మరింత కష్టమవుతుంది. 40 శాతం శక్తి ఎక్కువగా దాంతో దేహానికీ, మెదడుకూ శ్రమ పెరిగి, శారీరక కదలికలు చురుకుగా మారడానికి, మెదడుకు మరింత పదును పెరగడానికి అవకాశముంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. మామూలు నడకతో పోలిస్తే వెనక్కు నడవడంలో 40 శాతం శక్తి ఎక్కువగా వినియోగమవుతుందని, దాంతో అంతే సమయంలో మరింత ఎక్కువ వ్యాయామం సమకూరుతుందనీ, లంగ్స్‌కు ఆక్సిజన్ కూడా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలివే! వెనక్కి నడక వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ నివారితం కావడం, కాలి కండరాల బలం, సామర్థ్యం పెరగడం, కీళ్ల ఆరోగ్యం పెంపొందడం, ప్లాంటార్ ఫేసిౖయెటిస్తో వచ్చే మడమల నొప్పి తగ్గడం, దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడేవారి నొప్పి నుంచి ఉపశమనంతో పాటు వేగంగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే వెనక్కు నడిచే ఆరోగ్య ప్రక్రియకోసం పరిసరాలతో బాగా పరిచయం ఉన్న గదిలోనే (ఇన్‌డోర్‌లో) అలవాటైన చోట నడుస్తూ, మధ్యన ఎలాంటి అంతరాయాలూ లేకుండా చూసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు చెందిన క్లినికల్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అధ్యాపకుడు జాక్మెక్ నమారా. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్‌లో ఈ సమస్యలు.. Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం -
Health Tips: ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! రోజూ ఇలా చేస్తే
Winter Care- Health Tips: చాలామందికి నిద్ర నుంచి లేవగానే నరాలు పట్టేస్తాయి. అవి రిలీఫ్ అయ్యేంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. నరాలు, మెడ, పాదాలు, నడుమునొప్పికి పరిష్కారం ఏముంది? అన్నింటికంటే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మానసికంగా కృంగి పోయినప్పుడు కూడా మెడ నరాలు పట్టేస్తాయి. మానసిక రోగాలు శారీరక రోగాలుగా మారతాయి. అందువల్ల మానసిక అరోగ్యం సాధించండి. ఒక్కోసారి కనిపించే లక్షణాలు 1. కాళ్ళు చేతులు మన ఆధీనములో ఉండవు, చలికి వణికినట్టు కంపిస్తాయి. 2. మెడ నరాలు పట్టినప్పుడు మెడకింద తవ్వ పెట్టుకుని, నేల మీద పడుకుంటే, విశ్రాంతిగా ఉంటుంది. చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. 3. కీళ్ల నొప్పి ఎక్కువ ఉంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. 4. ఆవ నూనె, లేదా యూకలిప్టస్ నూనె వ్రాయండి. తరువాత ,కాపడం పెట్టుకోవాలి. 5. వీలయితే తలను గుండ్రంగా తిప్పండి. కూడా నుండి, ఎడమకు, ఎడమ నుండి కుడికి . 6. సమయానికి భోజనము, విశ్రాంతి, సరైన వేళలలో నిద్ర పోవడము అలవరచుకోవాలి 7. మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి మోకాలు, కీళ్ల నొప్పుల నివారణకు కోసం ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సహజంగానే ఎప్పటికప్పుడు నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే తగ్గడానికి ప్రయత్నించాలి ►అలొవెరా (కలబంద)ను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలొవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. ఇందుకు గాను కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని నేరుగా సంబంధిత ప్రదేశంలో రాయాలి. ►శల్లకి అనే వృక్షానికి చెందిన జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇందులోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని తెలుగులో ధూపము, గుగ్గిల వృక్షం అని పిలుస్తారు. దీని జిగురును నిత్యం 1 గ్రాము మోతాదులో తీసుకోవచ్చు. దీని వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శల్లకి మనకు మార్కెట్లో ట్యాబ్లెట్లు, క్రీముల రూపంలోనూ లభిస్తుంది. ►నీలగిరి ఆకుల తైలాన్ని 15 చుక్కల మోతాదులో తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్ల బాదం నూనె నొప్పిగా ఉన్న దగ్గర మాలిష్ చేయాలి కొంత వరకు రిలీఫ్ అవుతుంది -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల.. Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
Health: థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. అక్టోబరు 12న అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రత్యేక కథనం.- కర్నూలు(హాస్పిటల్) జిల్లాలో ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్లకే కనిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలో 12 నుంచి 15 శాతం మంది వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో వైద్యుల వద్దకు రోజుకు సగటున 600 మంది రోగులు వస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే భవిష్యత్‌లో నడవలేని, కదల్లేని పరిస్థితులు రావచ్చు. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయస్సు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అంటే.. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, కీళ్లు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. సాధారణంగా కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లల్లో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటస్గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ నొప్పి, బిగుతుదనం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు... ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకి యోజింగ్ స్పాండైటిస్, గౌట్, జువైనల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్, ఆర్థరైటిస్ వంటివి ఎక్కువగా మనం చూస్తుంటాము. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా తొలిదశలో ఆకలి తగ్డడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. ఇతర అవయవాలు అంటే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవ డం, నోటిపూత, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, పక్షవాతం, కంటిచూపు తగ్గుట, కళ్లు పొడిబారడం, కండరాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి. జీవనశైలిలో మార్పులే కారణం ►ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే. ►వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనించవచ్చు. ►వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్తి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. ►సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. తీవ్రత తగ్గించేందుకు సూచనలు ►దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు. ►ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ►ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. ►పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ►సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా కీళ్లు మరింత దెబ్బతినకుండా ఉండేలా వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. మందులు ఇచ్చేటప్పుడు వైద్యులు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా చూస్తారు. ఆ మేరకు మందుల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్లు తాత్కాలికంగా ఉపయోగిస్తారు. కానీ వ్యాధి నియంత్రణ ముఖ్యం. అందుకోసం డిసీజ్మాడిఫైయింగ్ యాంటి రుమాటిక్ డ్రగ్స్ (డీఎంఏఆర్డీ), బయోలాజికల్ ఇంజెక్షన్ వంటి కొత్త మందు తీసుకోవాలి. మంచి చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య అదుపులో ఉంటుంది. –డాక్టర్ సి.మంజునాథ్, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు వీరిలో ఎక్కువ! ►థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16- 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ►కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు, కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ►ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థటైటిస్ సోకిందో తెలుసుకోవాలి. ►వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చదవండి: Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
సాధారణ నొప్పులు అనుకోవద్దు.. ఆర్థరైటిస్‌పై అవగాహన అవసరం!
ఆర్థరైటిస్ అంటే కీళ్ల సమస్య (జాయింట్స్ ప్రాబ్లమ్) అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలామందిలో ఉంటుంది. కానీ దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యాలు రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచగలగడం సాధ్యం. ఈ నెల 12న ఆర్థరైటిస్ డే. ఈ సందర్భంగా ఆర్థరైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. ఇందులోనూ దాదాపు 200 రకాల కంటే ఎక్కువ వ్యాధులే ఉంటాయి. మామూలు ప్రజల అవగాహన కోసం వాటన్నింటినీ కలిపి ‘ఆర్థరైటిస్’గా పేర్కొంటారు. సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్’గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండైల్ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్ ఇడియోఫథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి కొన్ని. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల తర్వాతి పరిణామంగా ఆర్థరైటిస్ కనిపిస్తుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో దేహంలోని ఇతర వ్యవస్థలపై కూడా దుష్ప్రభావం పడవచ్చు. అలాగే మరికొందరిలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ కనిపించవచ్చు. నివారణ/తీవ్రత తగ్గించడానికి సూచనలు అసలు జబ్బే లేనప్పుడు లేదా సమస్య తొలిదశలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్)తో దీన్ని నివారించడం అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. వ్యాయామం చాలా కీలకం కాబట్టి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేమిటంటే... అసలే కీళ్లనొప్పులు, కీళ్ల దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వ్యాయామం చేయడం కష్టం కావచ్చు. అయితే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటే కీలు మరింతగా కదలికలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే నొప్పి కలగనంత మేరకు, అలసట కలగనంతవరకు కీళ్లు కదిలిస్తూ క్రమంగా వ్యాయామాన్ని పెంచుకుంటూ పోవడం మేలు. నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. చికిత్స సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా, కీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేలా, వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. అలాగే మందులు ఇచ్చేప్పుడు డాక్టర్లు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా ఉండటంతో పాటు సైడ్ఎఫెక్ట్స్ వీలైనంతగా తక్కువగా ఉండేలా చూస్తారు. ఆ మేరకు డాక్టర్లు మందుల మోతాదులను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా డాక్టర్లు నొప్పి నివారణ మందులైన నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ), డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీఎమ్‌ఏఆర్‌డీ), బయాలజిక్స్ వంటి మందులను వాడుతుంటారు. శస్త్రచికిత్స ఆర్థరైటిస్ సమస్యకు తగిన సమయంలో (సాధారణంగా తొలిదశల్లో) చికిత్స తీసుకోనివారిలో కీళ్లు, ఎముకలు దెబ్బతినడం, ఇతరత్రా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అలాంటివారిలో కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం వల్ల వ్యాధి ముదరకుండా చూసుకోవడంతో పాటు శస్త్రచికిత్స వంటి ఆర్థిక, సామాజిక, కుటుంబ భారాలను కూడా నివారించే అవకాశాలుంటాయి. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ఇవి కొద్దిపాటి తీవ్రత (మైల్డ్) నుంచి తీవ్రమైన (సివియర్) లక్షణాల వరకు ఉండవచ్చు. ఒకే వ్యక్తిలో సైతం కాలానుగుణంగా మారుతుండవచ్చు. ఏళ్ల తరబడి కనిపించడంతో పాటు కాలం గడిచేకొద్దీ తీవ్రత పెరగవచ్చు. తొలిదశలో ఆకలి తగ్గడం, జ్వరం, బాగా నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దశలో సాధారణంగానే కనిపించే సమస్యలు కావడం వల్ల వీటిని తొలిదశలో కనుగొనడం కాస్త కష్టమే. ఈ సమస్య కారణంగా ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ఆర్థరైటిస్‌లో ప్రధానంగా కీళ్లు దెబ్బతినడం జరుగుతుంది. దాని తాలూకు లక్షణాలే బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కీళ్లు ఎర్రగా కమిలినట్లుగా ఉండి, విపరీతమైన నొప్పిరావచ్చు. ఆర్థరైటిస్ గురించి ఎందుకు అప్రమత్తత అవసరమంటే... ఇది కేవలం దేహంలోని ఒక వ్యవస్థకే పరిమితం కాకుండా చాలా వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చికిత్స అందించకపోతే చాలా రకాల దుష్ప్రభావాలు కనిపించే అవకాశముంది. మంచి చికిత్స అందిస్తే చాలావరకు అదుపు లో ఉంటుంది. ఒకవేళ సరైన చికిత్స అందించకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద వీటి ప్రభావం పడి, వాటి పనితీరులలో తీవ్రమైన మార్పు రావచ్చు. ఒక్కోసారి ఈ సమస్య కారణంగా కొందరి లో చూపుపోవడం, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం రావడం జరగవచ్చు. ఫలితంగా జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గిపోతుంది. వ్యాధి నిర్ధారణ ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో పాటు కొన్ని రకాల అడ్వాన్స్డ్ రక్తపరీక్షల సహాయంతో వ్యాధినిర్ధారణ జరుగుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స ఉందా? తొలిదశలోనే ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా జీవననాణ్యతతో పాటు బాధితుల జీవితకాలాన్ని పెంచవచ్చు. -డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్ -
Health Tips: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..
విశ్రాంతిగా ఉన్నప్పుడు కొయ్యబారినట్లు గట్టిగా ఉంటూ, పగటి పూట శారీరక కదిలికలతో ఎక్కువయ్యే కీళ్ల నొప్పిని ’సంధివాతం’ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్‌గా పిలిచే ఈ వ్యాధిలో ఎముకలు అరిగిపోయి కదిలికలు కష్టమైపోతుంది. వృత్తి రీత్యా చేసే వివిధ రకాల పనులే కాకుండా, వంశపారంపర్యత, జన్మసంబంధ నిర్మాణ లోపాల వంటి ఎన్నోకారణాల వల్ల ఈ తరహా నొప్పి ప్రాప్తిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ‘అతియోగం’. జాయింటును పరిధికి మించి, అవధికి మించి వాడటం. దీనికి చికిత్స రెండు రకాల ప్రయోజనాలను ఆశించి జరుగుతుంది. ఎముక అరుగుదలను పరిరక్షించడం మొదటి ప్రయోజనమైతే నొప్పిని తగ్గించి కదిలికలను తీసుకురావటం రెండో ప్రయోజనం. ఔషధాలు: ప్రవాళ భస్మం, మోతీ భస్మం వంటిని ఎముకల అరుగుదలను నిలువరిస్తే, వాత విధ్వంసినీ రసం వంటి మందులు నొప్పిని తగ్గించడానికి ఉపకరిస్తాయి. జాయింటు నొప్పితో పాటు సాదారణారోగ్యం దెబ్బతింటే దానిని ’ఆమ వాతం’ అంటారు. ‘రుమటాయిడ్ అర్తరైటిస్’ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలతో సరిపోతాయి. ఈ వ్యాధిలో జాయింట్ల అరుగుదల ఉండదుగాని ఆమం ప్రకోపించడం చేత విపరీతమైన నొప్పి అనిపిస్తుంది. శాస్త్రకారుడు ఈ నొప్పి అనే లక్షణాన్ని ’వృశ్చికా దంశం’తో పోలుస్తాడు. తేలు కాటుతో సమానమైన నొప్పి అని దీనర్థం. మగవారిలో కంటే ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్వీయరక్షక వ్యవస్థ వ్యత్యస్థంగా మారడాన్ని (ఆటో ఇమ్యూనిటీ) దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీనిలో వ్యాధి తగ్గినట్లే తగ్గి దానంతట అదే తిరగబడుతూ ఉంటుంది. ఈ వ్యాధిలో ఆయుర్వేద పంచకర్మలతో పాటు ఇతర శమన చికిత్సలు చక్కని ఫలితాలను ఇస్తాయి. ఆయుర్వేదంలో చెప్పిన ఔషధ, ఆహార, విహార చికిత్సలను అన్నిటినీ ఇందులో ప్రయోగించాల్సి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే భుజాలు కూడా ఇన్ ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంది. జలుబు వంటి వైరస్ ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగా జాయింట్లలో వాపునుకలిగించే అవకాశం ఉంది. జర్మన్ మీజిల్స్, మధుమేహం, హైపటైటిస్ వంటి వ్యాధులు సైతం భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే రుమాటిక్ ఫీవర్ లో కూడా భుజం నొప్పి. ఇతర కీళ్ల నొప్పులు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. గనోరియా ఉంటే, దానికి పూర్తి చికిత్స తీసుకోనట్లయితే, సూక్ష్మక్రిములు జాయింట్లను చేతి నొప్పిని కలిగిస్తాయి. జాయింటు పైన చీము గడ్డలు లేచినప్పుడు ఇన్ఫెక్షన్ చర్మం నుంచి లోనికి వ్యాపించి భుజం నొప్పిని కలిగించవచ్చు. ఔషధాలు: క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), లోహాసవం, మహారస్నాదిక్వాథ చూర్ణం, మహాయోగరాజ గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, రాస్నాది క్వాథ చూర్ణం, స్వర్ణ వాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, రాక్షసం, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు, బాహ్య ప్రయోగానికి అమవాత తైలం, ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, కుబ్జ ప్రసారిణి తైలం, మహామాష తైలం, నారాయణ తైలం, ప్రభంజన విమర్దన తైలం, విషముష్టి తైలం అనేవి వాడాలి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
కీళ్ల నొప్పులా.. ఈ పండ్లు తిన్నారంటే
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే...కీళ్లనొప్పులను తగ్గించే పండ్లు నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్ష పండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులని తగ్గిస్తాయి. -
ఆస్టియో ఆర్థరైటిస్
ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం లేదా బలహీనపడటం వల్ల కనిపించే ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మన దేశంలో కనీసం 15 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు... అందునా మరీ ముఖ్యంగా మోకాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇంతమందిని బాధించే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుధీర్‌రెడ్డి చెబుతున్న విషయాలివి... ప్రశ్న : ఆర్థరైటిస్ సమస్యల్లో ఆస్టియో ఆర్థరైటిస్ వేరా? జ: ఎముకలకు సంబంధించిన ఆర్థరైటిస్‌లలో దాదాపు 200 రకాలు ఉంటాయి. అందులో సాధారణంగా వయసు పెరగడం వల్ల అరుగుదల వల్లగానీ లేదా చిన్నవయసులోనే అయితే యాక్సిడెంట్ల కారణంగా ఆస్టియో ఆర్ధరైటిస్ రావచ్చు. ఇదెలా వస్తుందంటే... రెండు ఎముకల మధ్య అంటే కీళ్ల (జాయింట్) దగ్గర ఘర్షణ తగ్గించడానికి ఎముకల చివరన కార్టిలేజ్ అనే మృదువైన పదార్థం ఉంటుంది. దీన్నే చిగురు ఎముక అని కూడా అంటుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ అది అరగడం లేదా ఆటల్లాంటి/ప్రమాదాల్లాంటి ఏవైనా కారణాల వల్ల కార్టిలేజ్ దెబ్బతినడంతో కీళ్లమధ్యలో ఉండే గ్యాప్ తగ్గుతుంది. దాంతో ఎముకలు ఒకదారితో మరొకటి ఒరుసుకుపోతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు అవి బిగుసుకుపోవడం (స్టిఫ్నెస్)తో పేషెంట్ ఎంతగానో బాధకు గురవుతారు. ప్రశ్న : ఆస్టియో ఆర్థరైటిస్‌ను తెచ్చిపెట్టే ముప్పుల్లాంటివి ఏవైనా ఉన్నాయా? జ: నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పెరుగుతున్న వయసే ఆర్థరైటిస్‌కు ప్రధాన రిస్క్‌ఫ్యాక్టర్. పైగా ఇది నివారించలేనిది కూడా. కొందరిలో వంశపారంపర్యంగానూ కనిపిస్తుంది. అంటే కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశాలూ ఎక్కువే. అలాగే బరువు మోసే వృత్తుల్లో ఉన్నవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రశ్న : ఇందుకు కారణాలు ఏమిటి? జ: ∙ఎక్కువ బరువు ఉండటం/స్థూలకాయం ♦కీళ్లకు బలమైన దెబ్బ తగలడం (ట్రామా) ♦వృత్తిపరంగా కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో ♦కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) ♦రుమటాయిడ్ ఆర్థరైటిస్ ∙డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం ♦కొన్ని రకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదాహరణకు కార్టికోస్టెరాయిడ్స్). ప్రశ్న : ఏయే లక్షణాలతో ఆర్థరైటిస్ బయటపడుతుంది? జ: ∙నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువ. కదలికల వల్ల ఈ నొప్పి మరింత పెరుగుతుంది. ♦స్టిఫ్నెస్: కీళ్లు బిగుసుకుపోవడం... దాంతో కీళ్లలో కదలికలు తగ్గడం. ♦కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి కలుక్కుమనే శబ్దాలు వినిపిస్తాయి. ♦వాపు: కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు. ♦వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రశ్న : దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? జ: కీళ్ల భాగాల ‘ఎక్స్–రే’తో ఈ వ్యాధిని తేలిగ్గానే గుర్తించవచ్చు. ప్రశ్న : నివారణ కోసం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? జ: ∙ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. ∙పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. ♦కంటినిండా తగినంత నిద్రపోవడం, నాణ్యమైన నిద్రవల్ల జీవననాణ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు... దీనివల్ల ఎన్నో కీళ్లవాతాలకు కారణమైన ఒత్తిడిని కూడా అధిగమించవచ్చు. ♦సమతులాహారం ఎంతో ముఖ్యం. క్యాల్షియం, విటమిన్– డి పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలతో పాటు ఆకుకూరలు, గుడ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ♦క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోగికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులు వ్యాయామాలను సూచిస్తారు. సాధారణంగా నడక, సైక్లింగ్, ఈత, యోగా వంటివి చేసుకోవచ్చు. అయితే మొదట్లో ఈ వ్యాయామాల కారణంగా బాధ ఎక్కువైనట్లు అనిపించే అవకాశాలున్నప్పటికీ క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా శారీరకంగా చురుకుదనం పెరగడం, పరిస్థితి మెరుగుపడుతుంది. ♦వైద్యుల సలహా మేరకు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ తరహా సమస్యలకు సాధారణంగా వాడే స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ వంటి వాటిని వైద్యుల సలహా లేకుండా ఎవరూ ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వాటివల్ల కిడ్నీల వంటి ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం) ♦విటమిన్–డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం. ప్రశ్న : దీనికి చికిత్స అందుబాటులో ఉందా? జ: నొప్పి కనిపించినప్పుడు తప్పనిసరిగా మెడికల్ స్పెషలిస్టులు / ఆర్థోపెడిక్ నిపుణులకు చూపించాలి. వారు నొప్పిని తగ్గించడానికి ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి సూచిస్తారు. ఇటీవల న్యూట్రాస్యూటికల్స్ అనే కొత్త రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటివల్ల ఆర్థరైటిస్ మరింతగా పెరగడం తగ్గుతుంది లేదా ఆగుతుంది. కొన్ని రకాల ఇంజెక్షన్స్ అంటే హైలురానిక్ యాసిడ్ వంటివి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పీఆర్పీ) వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... అరుగుదల వేగం తగ్గేవిధంగా కొన్ని వ్యాయామాలను సైతం సూచిస్తారు. ఆ సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పరిస్థితి బాగా విషమించి... మోకాలి కీళ్ల వంటివి మరీ ఎక్కువగా అరిగిపోయినప్పుడు పేషెంట్స్‌కు కీళ్ల మార్పిడి (నీ జాయింట్ రీప్లేస్మెంట్) శస్త్రచికిత్స వంటివి అవసరం పడవచ్చు. ఇంటర్వ్యూ డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్ -
వీల్‌చైర్ ట్రావెలర్
‘నా వీల్‌చైరే నా రెక్కల గుర్రం’ అంటుంది పర్విందర్ చావ్లా. ప్రపంచంలో 196 దేశాలు ఉంటే ఇప్పటికి వీల్‌చైర్ మీదే 59 చుట్టేసింది. 15 ఏళ్ల వయసులో ఆర్థ్రయిటీస్ వల్ల వీల్‌చైర్‌కి పరిమితం అయిన చావ్లా జీవితాన్ని ఉత్సాహంగా ఉంచడానికి పర్యటనలను మార్గం చేసింది. తిరగాలన్న పురుగు కుట్టనే కూడదు... ఒక్కసారి కుట్టాక ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగరు అంటున్న చావ్లా అన్నీ సక్రమంగా ఉన్నా లోకాన్ని చూడక కుదేలై ఉండేవారికి చాలా స్ఫూర్తినిస్తోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది అది. ఏదో పెళ్లి ఫంక్షన్. భోజనానికి కూచున్న పర్విందర్ చావ్లా తినడానికి దవడ తెరవలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి వాళ్లందరూ డాన్స్ చేస్తుంటే తానూ డాన్స్ చేయబోయి నడుము వంచలేక కింద పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అన్నారు. ఆ తర్వాత పర్విందర్ చావ్లా జీవితం రెండేళ్ల పాటు నరకంగా మారింది. మంచం మీద పడుకునే ఉండిపోయింది. ఇటు నుంచి అటు కదలాలన్నా విపరీతమైన నొప్పి.ఆ తర్వాత మెల్ల మెల్లగా కోలుకుంది. కాని చేతి వేళ్లతో సహా చాలా శరీర భాగాల్లోని జాయింట్లు దెబ్బతిన్నాయి. 21 ఏట వచ్చే సరికి వీల్ చైర్‌కు పరిమితం కాక తప్పలేదు. కొద్దిగా లేవగలదు. నాలుగు అడుగులు వేయగలదు. కాని మిగిలినదంతా వీల్‌చైర్ పైనే. శరీరాన్ని కదల్చే వీలు లేకుండా చేసి జీవితం తనను ఆపగలిగింది... కాని కదలకుండా ఉండిపోయి జీవితాన్ని గెలవనీకూడదు. దానిని ఓడించాలి అని పర్విందర్ నిశ్చయించుకుంది. వైష్ణోదేవి యాత్ర మొదలు పర్విందర్ చావ్లాది లూధియానా. తండ్రికి హోటల్ బిజినెస్ ఉంది. తల్లి గృహిణి. కూతురి అవస్థ చూసి తండ్రి నీ ఇష్టమైన పని చేసి సంతోషంగా ఉండు అని ప్రోత్సహించాడు. ఆ సమయంలోనే కాలేజీ ఫ్రెండ్స్ కొందరు వైష్ణోదేవిని దర్శించుకోవడానికి జమ్ము కశ్మీర్ వెళుతుంటే పర్విందర్ కూడా వాళ్లతో వెళ్లాలనుకుంది. కాని వీల్‌చైర్‌తో ఆ ప్రయాణం ఏ మాత్రం అనువుగా ఉంటుందో తెలియదు. పర్విందర్ ధైర్యం చేసింది. వైష్ణోదేవి మందిరం చేరుకుంది. లోపలికి వెళ్లడానికి ర్యాంప్ లేదు. నలుగురు భక్తులు కుర్చీతో సహా లేపి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అందాక ఇంట్లో, పరిమిత వీధుల్లో తిరిగిన పర్విందర్కు ఆ హిమాలయాల చెంత, ఆ ప్రకృతి మధ్యన, ఆ ఆధ్యాత్మిక ప్రదేశంలో అమితమైన ఆనందం కలిగింది. ఏమిటి... ప్రయాణాలు చేస్తే ఇంత బాగుంటుందా? అనుకుంది. ‘అప్పుడే నన్ను తిరిగే పురుగు కుట్టింది’ అంటుంది పర్విందర్ నవ్వుతూ. ఒంటరిగానే తిరగాలని... పర్విందర్ ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచే ప్రపంచ దేశాలన్నీ తిరగాలని నిశ్చయించుకుంది. ఆమె అప్పటికే దాదాపు లక్షన్నర రూపాయల విలువైన మంచి నాణ్యత కలిగిన లైట్ వెయిట్ వీల్‌చైర్‌ను ఏర్పాటు చేసుకుంది. దాని మీద కూచుని రోడ్ల మీద హాయిగా తిరగొచ్చు. దానిని సెకన్లలో మడిచి ట్యాక్సీలో ఎక్కించి ఎయిర్పోర్ట్ వెళ్లొచ్చు. సెకన్లలో తెరిచి కూచోవచ్చు. ఎవరో ఒకరు తోడు వస్తే బాగుంటుంది కానీ వారి కదలికలకి తన కదలికలకి చాలా తేడా ఉంటుంది. అందుకే తాను ఒక్కర్తే తిరగాలని నిశ్చయించుకుంది. దుబాయ్‌తో మొదలు ప్రపంచ దేశాలన్నింటిలోకి వీల్‌చైర్ ఫ్రెండ్లీ దేశం దుబాయ్ అని పర్విందర్ తెలుసుకుంది. అందుకే మొదట ఆ దేశానికే ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రయాణం చేసే ముందు తాను దిగబోయే హోటల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది పర్విందర్. అక్కడ ఉన్న మెట్ల గురించి, ర్యాంప్‌ల గురించి, గదిలో టాయిలెట్ల సౌకర్యం గురించి దివ్యాంగులను సపోర్ట్ చేసేలా అక్కడ వ్యవస్థ ఉందో లేదో చూసుకుని వెళుతుంది. ‘మీరు భాష రాని దేశానికి వెళుతున్నట్టయితే గూగుల్ ట్రాన్స్‌లేటర్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి’ అంటుంది పర్విందర్. ఆ తర్వాత ఆమె బాలీ వెళ్లింది. ఆ తర్వాత రోమ్. ఆ తర్వాత అలా అలా ఆమె ప్రయాణాలు సాగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు 53 ఏళ్లు ఆమెకు. 59 దేశాలు చూసింది. ‘ఒక వంతు ప్రపంచం చూశాను. ఇంకా మూడు వంతులు చూడాలి’ అంటుందామె. ఈ ప్రయాణాల వల్లే కాబోలు ఆమె నైరాశ్యం దరి చేరకుండా ఉత్సాహంగా ఉంటుంది. మనుషులే తోడు ఏ దేశం వెళ్లినా మనుషులే తోడుగా సాయం చేయడం ఆమె గమనించింది. ‘మనం మంచిని చూస్తే మంచి చెడును చూస్తే చెడు ఈ లోకంలో కనిపిస్తాయి. ఎందరో ముక్కూ మొహం తెలియని వ్యక్తులు ఈ పర్యటనల్లో నాకు సాయం చేశారు. కొందరు బస్సు ఎక్కిస్తే మరి కొందరు నేను దిగాల్సిన హోటల్ వరకూ వచ్చి దిగబెట్టి వెళ్లారు. ‘మీరు ప్రకృతిని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి. నేను అక్కడకు వెళ్లి నెలల తరబడి ఉంటాను’ అంటుందామె. అమెరికాలో కొన్ని నగరాలు, లండన్ వీల్‌చైర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మన దేశంలో ఆగ్రా పూర్తిగా వీల్‌చైర్ ఫ్రెండ్లీ. ఆ తర్వాత మన దేశంలో ఢిల్లీ అంటుందామె. కాని చైనాలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ‘వాళ్లు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు’ అంటుంది పర్విందర్. ఆమె ప్రయాణాలు ఆమెకు స్వస్థత కలిగిస్తూనే ఉంటాయి. దోహాలో..., ఆస్క్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్లో... -
Arthritis: నడక, సైక్లింగ్, నీళ్లలో ఏరోబిక్స్ చేస్తున్నారా..?
ఎస్ అంటే ‘స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు డాక్టర్లు సూచించిన విధంగా తమకు అనువైన తేలికపాటి వ్యాయామాల్ని ప్రారంభించాలి. అతి మెల్లిగా మొదలు పెట్టి.. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఎమ్ అంటే మాడిఫై యువర్ యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్ : ఆర్థరైటిస్ లక్షణాల్లో ప్రధానమైనది కీళ్లనొప్పి. ఇది తరచూ వస్తూ పోతూ ఉంటుంది. నొప్పి వచ్చి, అది తీవ్రమైనప్పుడు బాధితులు చేసే ఆ వ్యాయామరీతులను వారి లక్షణాలకు తగ్గట్లుగా మార్చుకోవాలి. ఉదాహరణకు తీవ్రత పెరిగినప్పుడు వ్యాయామం చేసే వ్యవధినీ, వ్యాయామ తీవ్రతనూ తగ్గించుకోవాలి. దీనివల్ల నొప్పి మరింతగా పెరగకుండా చూసుకోవచ్చు. ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: బాధితుల వ్యాయామాలు వారి కీళ్లకూ, కండరాలకు మరింత మేలు చేసేలా ఉండాలి. ఉదాహరణకు వ్యాయామాల్లోని తేలికపాటివి... అంటే నడక, సైక్లింగ్, నీళ్లలో చేసేవి బాధితులకు శ్రమ ఎక్కువగా కలిగించవు. పైగా అవన్నీ చాలావరకు స్వాభావికమైనవే. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై పడే శరీర బరువు బాగా తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలు చేసేవిగా (జాయింట్ ఫ్రెండ్లీ)గా ఉంటాయన్నమాట. ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్: ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుబారి ఉంటాయి. అందుకే అవి చిన్నపాటి శ్రమకు కూడా విరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వ్యాయామం చేయడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా అవసరమే. ఉదాహరణకు పార్క్‌లో నడుస్తున్నప్పుడు... అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండటం అవసరం. అలాగే చుట్టుపక్కల పెద్ద బండరాళ్లు ఉన్న ప్రదేశమైతే.. పొరబాటున పడిపోతే తలకు బలమైన గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అలాంటివేవీ లేని సమతల ప్రదేశంలోనే వ్యాయామం చేయాలి. ఒకవేళ కాస్తంత సాయం సమయంలో చీకటిపడ్డప్పుడు వాకింగ్ చేస్తుంటే, అక్కడ తగినంత లైట్ల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : చిన్నవయసు ఆరోగ్యవంతులు కాకుండా... మరెవరు(అంటే కీళ్లనొప్పులు, గుండెజబ్బులు... వంటివి ఉన్నవారు) వ్యాయామాలు ప్రారంభించినా... ముందుగా ఓసారి వ్యాయామ నిపుణుడితోపాటు డాక్టర్ (లైఫ్‌స్టైల్ నిపుణులు లేదా ఆర్థో / గుండె / ఫిజీషియన్)ను సంప్రదించి, తమకు తగిన వ్యాయామాలేమిటో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు మాత్రమే సూచిస్తారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేయండి
మారుతున్న జీవనవిధానం, శారీరక శ్రమ లోపించడం, పోషకాహారలోపం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఒకే భంగిమలో కూర్చుని పనులు చేయడం వంటి వాటి వల్ల గతంలో యాభైలు, అరవైలు దాటిన తర్వాత వచ్చే కీళ్లనొప్పులు ఇటీవలి కాలంలో ముప్ఫైలు, నలభైలలోనే చాలామందిని వేధిస్తున్నాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్ అంటారు. దీన్లో చాలా రకాలున్నాయి. మోకాళ్లలో కార్టిలేజ్ అరగడం వల్ల, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల కీళ్లు రెండూ ఒరుసుకుపోయి నొప్పి, వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. ఏ వ్యాధికైనా కారణాలు తెలుసుకోగలిగితే నివారణ, చికిత్స సులువు అవుతాయి. ఆ తర్వాత ఆహార నియమాలు, చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కీళ్లనొప్పులను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, సరైన వ్యాయామం చేయకపోవడం, వయసు పైబడడం, ఎక్కువగా జాగింగ్ చేయడం, ఎక్కువగా మెట్లు ఎక్కడం, మితిమీరిన వ్యాయామం, పోషకాహార లోపం, క్యాల్షియం లోపం, వైరల్ ఇన్ఫెక్షన్లు, రసాయనాల సమతుల్యత లోపం, హార్మోన్ల ప్రభావం, రోగనిరోధకశక్తి తగ్గడం వల్ల కూడా ఆర్థరైటిస్ సమస్య తలెత్తుతుంది. మోకాలు కదిల్చినప్పుడు మెల్లగా మొదలయ్యే నొప్పి క్రమేపీ నడవలేని స్థితికి చేరుస్తుంది. ఈ ఆహారం తీసుకోవాలి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. కాలానుగుణంగా వచ్చే అన్ని రకాల పండ్లు, క్యారెట్, బీట్రూట్, కాప్సికం, బీన్స్, చిక్కుడు లాంటి రంగు రంగుల కూరగాయల్ని సలాడ్లు, కూరలు లేదా సూప్ రూపంలో రోజూ తీసుకోవాలి. అలాగే క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రొకొలి, ముల్లంగి లాంటివి అధికంగా తీసుకోవాలి. ఇంకా ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మంచిది. తక్కువ కొవ్వు ఉండే కోడి మాంసం, ఒమేగా–3 అధికంగా ఉండే చేప, అవిసె, ఆక్రోట్ ఎక్కువగా తీసుకోవాలి. సరైన ఆహారంతో పాటు చేయగలిగినంత వరకు వ్యాయామం కూడా చేస్తే మంచిది. వీటికి దూరంగా ఉండాలి పాలిష్ చేసిన తెల్ల బియ్యం అన్నం, మైదాతో తయారు చేసిన చిరుతిళ్లు, బేకరీ ఫుడ్స్, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ, కాఫీలు మొదలైనవన్నీ పరిమితంగా తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం తగ్గించాలి. అలాగని పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. మోకాలి నొప్పులుంటే యోగాసనాలు వేయకూడదు అనే అపోహ ఒకటి వ్యాప్తిలో ఉంది. అది తప్పు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేయదగిన, వేయవలసిన ఆసనాలు కొన్ని ఉన్నాయి. వాటితో నొప్పులు తగ్గడంతోపాటు, కీళ్ల కదలికలు మెరుగవుతాయి. వాటిలో ముఖ్యమైనవి వీరాసనం, త్రికోణాసనం. త్రికోణాసనం ఇలా... కాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉండేలా నిలబడాలి. కుడి పాదం కుడి పక్కకు తిప్పాలి. నడుము కదల్చకుండా, నడుము పైభాగాన్ని కుడి వైపుకు వంచి, కుడి చేతిని కుడి పాదం దగ్గర నేలకు ఆనించాలి. ఇలా చేస్తున్నప్పుడే, ఎడమ చేతిని నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి. ముఖాన్ని పైకి లేపిన చేతి వైపు తిప్పాలి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. వీరాసనం ఇలా ... అరికాళ్లు పిరుదులకు ఆనేలా మోకాళ్లను లోపలికి మడిచి నేల మీద కూర్చోవాలి. రెండు అర చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఈ ఆసనంలో 30 – 60 సెకన్ల పాటు ఉండాలి.పైన చెప్పుకున్న ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తుంటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. -
Winter Tips: వేళ్ల నొప్పులు బాధిస్తుంటే.. మనకు మనమే ఇలా చేసుకుంటే..
Health Tips: చలికాలంలో ఎదురయ్యే సమస్యల్లో కీళ్లు పట్టేయడం ఒకటి. అయితే తుంటికీళ్లు, మోకాళ్లు పట్టేసినప్పుడు మాత్రమే కీళ్ల సమస్యగా పరిగణిస్తుంటాం. అంతకంటే ముందే చేతివేళ్లు బిగుసుకుపోయి వేళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా కాలానుగుణంగా జరిగే ప్రక్రియ. ఈ సీజన్లో అరచేతి నుంచి వేళ్ల వరకు ఉండే కనెక్టింగ్ టిష్యూలు మందబారడం, సంకోచించడం వల్ల కదలికలు నెమ్మదిస్తాయి. బలవంతంగా కదిలించే ప్రయత్నం చేసినప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ నొప్పులకు స్వయంగా మనకు మనంగా చేసుకునే ఫిజికల్ థెరపీనే చక్కటి వైద్యం. ►అరచేతిని టేబుల్ మీద కానీ చదునుగా ఉన్న నేల మీద కానీ పెట్టి మెల్లగా వేళ్లను చాచాలి. ►కీళ్ల మీద మరీ ఒత్తిడి కలిగించకుండా అరచేతిని వీలయినంత వెడల్పుగా చేసి వేళ్లను ఒక వేలికి మరొక వేలిని దూరంగా వచ్చేటట్లు చేయాలి. ►ఈ స్థితిలో అరచేయి మొత్తాన్ని నేలకు ఆన్చడానికి ప్రయత్నించగలగాలి. ►నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యం కాదు, కానీ చేయగలిగినంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అరచేతిని నేలకు ఆన్చిన స్థితిలో 30 నుంచి 60 సెకన్ల పాటు అలా ఉంచిన ►తర్వాత చేతిని మెల్లగా పిడికిలి బిగించి వదలాలి. రోజూ నాలుగైదు సార్లు ఇలా చేస్తుంటే వేళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పై ఎక్సర్సైజ్ చేయడానికి సాధ్యం కానప్పుడు గంటకోసారి పిడికిలిని గట్టిగా బిగించి ఒక్కో వేలిని తెరుస్తూ అన్ని వేళ్లనూ తెరవాలి. ►అలాగే ఒక్కో వేలిని ముడుస్తూ పిడికిలి బిగించి వదలాలి. ►మామూలు సీజనల్ నొప్పులతోపాటు డయాబెటిక్ న్యూరోపతి కండిషన్‌కు కూడా ఈ ఎక్సర్సైజ్ ఉపకరిస్తుంది. ►ఒకవేళ వేళ్ల నొప్పులకు కారణం ట్యూమర్లు, ప్రమాదవశాత్తూ గాయపడడం, ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..
సాక్షి, కర్నూలు: ఉదయం లేచిన వెంటనే కదలలేరు, నడవలేరు. కాసేపు కుర్చీలో కూర్చుని మళ్లీ లేవాలంటే నరకం. కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా, కాస్త కష్టమైన పనిచేయాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. దీనినే వైద్యపరిభాషలో రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం) అంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత వేదనకు గురి చేస్తుంది. చలితీవ్రత పెరిగే కొద్దీ ఈ వ్యాధి బాధితుల బాధ వర్ణణాతీతం. జిల్లాలో ఇటీవల కీళ్లవాతం బాధితుల సంఖ్య పెరుగుతోంది. గతంలో జిల్లా జనాభాలో 5 శాతం ఉన్న వారి సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సమస్య బాధితులు ఉండగా.. ఇప్పుడు గ్రామాల్లోనూ పెరిగారు. జీవనశైలిలో మార్పుల కారణంగా జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తినడం, వ్యాయామం చేయకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం అధికంగా వంశపారంపర్యం మరో కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో ఈ సమస్య 40 ఏళ్లు దాటిన వారిలో అధికంగా కనిపించేది. ఇప్పుడు పాతికేళ్ల వయస్సు నుంచే మొదలవుతోంది. చదవండి: పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే... ఇది దీర్ఘకాలిక వ్యాధి. శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి, వాపు, బిగువును కలుగజేస్తుంది. ఒకే సమయంలో శరీరం రెండువైపులా సమంగా కీళ్లనొప్పి కలుగుతుంది. కొన్ని వారాల్లో ఇది వృద్ధి చెంది కీళ్లను నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా చెయ్యి, పాదం, మణికట్టు, మోచేయి, చీలమండలంలోని చిన్న కీళ్లను ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణకు ప్రభావిత కీళ్లకు శారీరక పరీక్ష, ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటి సీసీపీ రక్తపరీక్షలు, ఎక్స్‌రే చేయించాలి. చదవండి: మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్! లక్షణాలు ➡ఒకటి లేదా ఎక్కువ చేయికీళ్లలో మానకుండా ఉన్న వాపు ➡తెల్లవారుజామున 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండే కీళ్ల బిగువు ➡కీళ్లలో మెలిపెడుతున్న నొప్పి ➡పిడికిలి బిగించడంలో ఇబ్బంది ➡అలసట, అలసిన భావన ➡ఈ వ్యాధి వల్ల కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, చర్మం ప్రభావితం అవుతాయి. కారణాలు ➡వంశపారంపర్యం, జీవనశైలిలో లోపాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం ➡గతంలో చికున్‌గున్యా, డెంగీ జ్వరం వచ్చినా దాని తాలూకు వైరస్లు కీళ్లలో ఉండి దీర్ఘకాలం నొప్పులుగా మారి కీళ్లవాతానికి దారి తీస్తుంది. ➡ఇది కీళ్లకు, దాని చుట్టుపక్కల ఉన్న మృదులాస్తికి, సమీప ఎముకలకు హాని కలిగిస్తుంది. చదవండి: గుడ్‌న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే.. కీళ్లను కాపాడుకోవడం ఇలా.. వ్యాయామం.. చలికాలంలో రోజూ వ్యాయామం చేయడం వల్ల నొప్పి తగ్గడం, కీళ్లు, కండరాలు బలంగా తయారు అవుతాయి. దీనివల్ల కీళ్లు చురుకుగా కదులుతాయి. అయితే ఒకేసారి ఎక్కువగా గాకుండా చిన్న చిన్న వ్యాయామాలు వైద్యుల సూచనలతో చేయాలి. కీళ్ల వాతం ఉండేవారు వారు నడిచే మార్గాలు, పనుల వల్ల కీళ్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. వెచ్చగా ఉంచుకోవడం.. శరీరానికి వెచ్చదనం రక్తప్రసరణను మెరుగుపరిచి నొప్పికి కారణమయ్యే కెమికల్‌ను తొలగిస్తుంది. దీంతో పాటు నొప్పి సెన్సిటివిటీని తగ్గించి నొప్పిని తట్టుకునేస్థాయిని పెంచుతుంది. దీనివల్ల కీళ్లు బిగుసుకుపోవడం తగ్గుతుంది. వేడినీటి స్నానం, హీటింగ్ ప్యాడ్స్, గ్లౌజ్‌లు, షూస్, ఉలెన్ డ్రెస్ ధరించడం వల్ల కీళ్లు బిగుసుకోవడాన్ని తగ్గించుకోవవచ్చు. విటమిన్ డి లోపం.. విటమిన్ డి ఎముకలు, కీళ్లు, పళ్లకే గాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు ప్రధానం. విటమిన్ డి లోపం వల్ల కీళ్లనొప్పి అధికం అవుతుంది. కీళ్లు బిగుతుగా అవుతాయి. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది. అది వీలుకాని వారు ప్రతిరోజూ 600 ఐయూ విటమిన్ డి మాత్రను తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కీళ్ల వ్యాధి ఉండేవారికి చలికాలంలో వ్యాధినిరోధకశక్తి బలహీన పడి సులువుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. అధిక బరువు వల్ల చురుకుతనం తగ్గిపోతుంది. వీరిలో అధిక శాతం వ్యాయామంపై నిర్లక్ష్యం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి. నీరు అధికంగా తాగాలి. ముఖ్యంగా గౌట్ రోగులు ఉప్పు తగ్గించాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా నీటి శాతం చేరి కీళ్లు మరీ ఎక్కువగా బిగుసుకుపోతాయి. చలికి బిగుసుకునే కీళ్లు సాధారణంగా చలికాలంలో కీళ్లు కొంచెం బిగుతుగా ఉంటాయి. కీళ్లవాతం వ్యాధిగ్రస్తులలో మరీ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు కీళ్లపై ప్రభావం చూపుతాయి. కీళ్లు వ్యాకోచించడం వల్ల కీళ్లలో ఉండే ద్రవంలో మార్పుల వల్ల, పెయిన్ సెన్సిటివిటివి చలికాలంలో పెరగడం వల్ల 20 శాతం ఎక్కువ నొప్పి తెలుస్తుంది. కీళ్లు ఎక్కువగా బిగుతుగా మారతాయి. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ ఎ. సృజన, రుమటాలజిస్టు, కర్నూలు -
World Arthritis Day 2021: వామ్మో..నొప్పి!
కర్నూలు(హాస్పిటల్): కూర్చుంటే లేయలేరు.. కూసింత దూరంగా కూడా పరుగెత్తలేరు.. వీరంతా వయస్సు మళ్లివారంటే పొరబడినట్లే. మూడు పదులు దాటిన వయస్సులోనే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు. జిల్లాలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో 50 నుంచి 60 ఏళ్ల యవస్సు ఉన్న వారికి ఈ జబ్బు కనిపించేది. ఇప్పుడు 35 ఏళ్ల వారిని కూడా ఈ వ్యాధి వేధిస్తోంది. గత పదేళ్లుగా జిల్లాలో ఆర్థరైటిస్(కీళ్లనొప్పుల) కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. రోజుకు సగటున 560 మందికి పైగా కొత్త రోగులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లా జనాభాలో వ్యాధి పీడితుల సంఖ్య 8 శాతానికి పైగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జీవన శైలి మారడమే ప్రధాన కారణం.. ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులేనని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం..పోటీ ప్రపంచంలో ఒత్తిడి పెరగడం తదితర కారణలతో ఊబకాయం వచ్చి.. ఆర్థరైటిస్ దారితీస్తోంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ అనే కీళ్లజబ్బులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొందరికి జన్యుపరంగా ఇవి వ్యాపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి నివారణకు వ్యాయామం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. 30 ఏళ్ల మనిషి రోజుకు కనీసం 3 కిలోమీటర్లు నడవాలి. అప్పుడు మృదులాస్తి పునరుత్పత్తి జరిగి కీళ్లనొప్పులు రావు. వారానికి కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయాలి. పొగతాగకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీరానికి తగ్గట్టు బరువుండాలి. నిర్లక్ష్యం చేయొద్దు ఆర్థరైటిస్ ఒకసారి వస్తే అంత త్వరగా వదిలిపెట్టవు. దీనిని పూర్తిగా నిర్మూలించలేం. స్టెరాయిడ్స్, నొప్పి నియంత్రణ మందులు వాడటం వల్ల నియంత్రించవచ్చు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోతే పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఫలితంగా గుండెకు చేటు. అలాగేæ శరీర మెటబాలిజం తగ్గి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థరైటిస్ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. చివరిదశలో కాళ్లు వంగిపోయి, ఎముకలు విరిగిపోయే పరిస్థితిలోనే ఆపరేషన్ చేయించుకోవాలి. –డాక్టర్ పి. కిరణ్‌కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, కర్నూలు ఉపశమన చికిత్స ప్రధానం రోగి అనుభవిస్తున్న నొప్పి మొత్తాన్ని తగ్గించడం, కీళ్లకు అదనపు నష్టాన్ని నివారించడం ప్రధానం. కొందరికి తాపన ప్యాడ్లు, ఐస్‌ప్యాక్‌లు ఉపశమనం కలిగిస్తాయి. మరికొందరికి వాకర్స్ వంటి పరికరాలు నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మందులతో కూడిన చికిత్సలు, శస్త్రచికిత్సలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లనొప్పులు ఉన్న వారికి ఈత మంచి వ్యాయామం. –డాక్టర్ జీవీఎస్ రవిబాబు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు మూలికలతో వైద్యం ఆయుర్వేద రస శాస్త్రంలో గుగ్గులుతో కూడిన మూలికా మిశ్రమాలతో కలిగిన ఔషధాలు ఉన్నాయి. ఇందులో కాంచన, త్రిఫల, త్రయోదశాంగ, కైశోర, నవక, పంచతిక్త, అమృతాది, గోక్షురాది, మహారాజ, సింహనాద, రాన్సాది గుగ్గులు ఉన్నాయి. ఇవి కీళ్లవాతం, సంధివాతం, వెన్నుముక సమస్యలు, చర్మరోగాలు, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఆయుర్వేద ఔషధ మూలికల్లో శొంఠిపొడి, నల్లనువ్వులు, ఆముదం చెట్టు బెరడు, గింజలు, వేర్లు, కరక్కాయ, తిప్పతీగ, నల్లేరు, పారిజాతం మొక్క, మెంతాకు, రావి చెక్క, వావిలి, మునగాకు ముఖ్యమైనవి. నియామానుసారం ఆహార, విహార, రుతు నియమాలు పాటిస్తే అనారోగ్యం దరిచేరకుండా చూసుకోవచ్చు. –డాక్టర్ పద్మనాభరెడ్డి, సీనియర్ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు -
ఆర్థరైటిస్ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వద్దు!
కొందరికి కీళ్లలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కాళ్లూ చేతులపై అధికభారం పడ్డప్పుడు ఎక్కువవుతూ ఉంటాయి. సాధారణంగా మోకాళ్లు, మోచేతులు, కాలి వేళ్లు, మణికట్టు. భుజాలు, నడుము, వెన్నెముక భాగాల వాపుతో నొప్పితో పాటు అప్పుడప్పుడూ జ్వరం రావడం, కదల్లేకపోవడం లాంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి కీళ్ల సమస్యను వైద్యపరిభాషలో ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అంటారు. గతంలో పెద్దవయసు వారిలోనే వచ్చే కీళ్ల నొప్పులు ఇటీవల 20 – 40 ఏళ్ల వయసున్న వారిలోనూ కనిపిస్తున్నాయి. ఇదీ కారణం... ఎముకల మధ్య కుషన్‌లా ‘కార్టిలేజ్’ పొర ఉంటుంది. ఇది అరిగిపోయినా లేదా చాలా ఎక్కువగా దెబ్బతిన్నా, ఆ ప్రాంతం లో వాపు వచ్చినా, ఎముకలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నా ఈ కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కండిషన్‌ను ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. పెయిన్‌కిల్లర్స్ వద్దు! ఇలాంటివాళ్లలో కొందరు నొప్పులు రాగానే పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు. అది సరికాదు. అవి వాడినంత సేపు బాగానే ఉంటుంది. వాటి ప్రభావం తగ్గగానే మళ్లీ నొప్పులు మొదలవుతాయి. అవి కిడ్నీలాంటి కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. ఈనొప్పులు వస్తున్నప్పుడు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, ఆయన సలహా మేరకు ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, సీరమ్ యూరిక్ యాసిడ్, సీబీసీ, అర్థరైటిస్ ప్రొఫైల్, ఎక్స్‌రేలాంటి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ ఫలితాల ఆధారంగా చికిత్సలుంటాయి. కొన్నిసార్లు మందులతో పాటు ఫిజియోథెరపీ అవసరం కావచ్చు. కొందరిలో అరుదుగా సర్జరీ కూడా చేయించాల్సి రావచ్చు. చదవండి: పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించాలి... ► స్థూలకాయం లేకుండా చూసుకోవాలి. బరువు అదుపునకు వ్యాయామం చేయాలి ► క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు అంటే తాజా కూరగాయలు, పాలు, గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి ► వంటలలో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి. ► డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలే తప్ప డాక్టర్ సలహా లేకుండా చాలాకాలం పాటు పెయిన్‌కిల్లర్స్ వాడితే అసలు జబ్బు తగ్గకపోగా అదనంగా ఇతరత్రా సమస్యలు రావచ్చు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా.. డాక్టర్ కొల్లా సాకేత్ -కన్సల్టెంట్స్పోర్ట్స్ అండ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్ సర్జన్ -
రెండో కిలోలు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గినట్టే!
ఆరోగ్యం అన్నిరకాలుగా బావుండాలంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు అనేక అనర్థాలకు దారితీస్తుంది. అందువల్ల ఆహార నియమాలు పాటిస్తూ, తేలికపాటి వ్యాయామం చేసి బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే చాలా మంది రకరకాల వ్యాయామాలు ప్రయత్నించి బరువుతగ్గలేదని బాధపడుతుంటారు. ఇలాంటివారు తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం, మితంగా తినడం, క్రమంతప్పని వ్యాయామంతో బరువును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆర్ధరైటిస్‌ను అదుపు చేయవచ్చు. పరిశోధనల ప్రకారం 2 కిలోల బరువు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గుతుంది. అంటే ఒక మోస్తరు బరువు తగ్గినా ఆర్ధరైటిస్ అడ్డుకోవడంలో చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నొప్పులున్నాయి కదా అని శరీరం కదల్చకుండా ఉంచడం తప్పంటున్నారు. వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి ఆర్ధరైటిస్ నొప్పుల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఇలాంటి చర్యలు జాయింట్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. కనీసం వారానికి 150 నిమిషాలు నడవడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం ఆర్ధరైటిస్ నివారణకే కాకుండా కేలరీస్‌ను మధ్యస్థంగా కరిగించడంతో హృదయ కండరాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చదవండి: కాలు కదిపితే కీలు నొప్పి.. ఆర్ధరైటిస్‌ను ఇలా అదుపు చేద్దాం! -
చిన్నవయసులో ఆర్ధరైటిస్.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి
అడుగు కదిలితే నరకం చూపే నొప్పి, ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమై శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది, వయసుతో సంబంధం లేకుండా అందరినీ పీడిస్తుంది.. అదే ఆర్ధరైటిస్ లేదా కీళ్లవాతం! పూర్వం వయసు మళ్లిన వారు మాత్రమే ఈ వ్యాధితో బాధపడేవారు. నేడు చిన్నవయసులో సైతం ఈ వ్యాధి వస్తోంది. వయసు పైబడినవారిలో మోకాళ్లు అరిగిపోయి ఆర్థరైటిస్ వస్తుంది. మరి చిన్నవయసులో ఎందుకు వస్తుందంటే.. అనేక కారణాలున్నాయి. డెంగ్యూ, చికున్ గున్యా, స్వైన్‌ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు సోకితే వచ్చిన కీళ్ల నొప్పులు ఏడాదిపాటు ఉంటున్నాయి. అలా కాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, అనవా సరమైన వ్యర్థాలు పెరగడం, జన్యులోపాల వల్ల వచ్చే కీళ్లవాతం దీర్ఘకాలం ఉంటుంది. ఇవే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జీవక్రియ లోపం, హార్మోన్స్ అసమతుల్యత, థైరాయిడ్ ప్రభావం, సొరియాసిస్, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తి తగ్గడం, సైనోవియల్ అనే ద్రవంలో తేడాలు ఏర్పడటం, అధిక బరువు, ప్రమాదాలు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పులు, గాయాలు తగిలినపుడు లిగమెంట్, కార్టిలేజ్ దెబ్బతినడం, జాయింటుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు,డిస్లొకేషన్, సికిల్ సెల్ డిసీజ్, బోన్ ట్యూమర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివన్నీ కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలవుతాయి. చదవండి: ఇకపై క్యాన్సర్‌తో కాళ్లూ, చేతులు కోల్పోనక్కర్లేదు! పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపించినా, ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కీళ్లవాతం గుర్తించడం తేలికైన పనే. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ జాయింట్ల వద్ద నొప్పులు ఉంటే అది కచ్చితంగా కీళ్లవాతమే అని భావించాలి. జాయింట్ల వద్ద నొప్పులు, వాపులు ఉంటే ఈ లక్షణంగానే గుర్తించాలి. నిద్రలేచిన తరువాత జాయింట్ల వద్ద నొప్పులు, నడవలేని, లేవలేని పరిస్థితి కనిపిస్తుంది. జ్వరం తగ్గిన తరువాత కీళ్లనొప్పులు కొనసాగినే ఆర్ధరైటిస్‌గా అనుమానించాల్సిందే. కీళ్లవాతంలో అనేక రకాలున్నాయి. చదవండి: సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే! గౌట్ ఈ తరహా కీళ్లవాతానికి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ప్రధాన కారణం. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోవడంతో జాయింట్లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను శరీరం బయటకు పంపించలేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కీళ్లవాతం ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపిస్తుంది. చీలమండలు, కీళ్లు, మణికట్లు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో జాయింట్లు వాపు, నొప్పితో ఎర్రగా మారుతాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్ సొరియాసిస్ అనే చర్మ వ్యాధి కారణంగా తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో ప్యాచ్‌ల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. ఈ ప్యాచ్‌లు లేదా మచ్చలు చేతి వేళ్లు, కాలి వేళ్ల దగ్గరకు విస్తరించినపుడు సొరియాటిస్ ఆర్థరైటిస్ ప్రారంభమవుతుంది. రెండు చేతులు, కాళ్లలోని జాయింటులు దీని ప్రభావానికి లోనవుతాయి. చేతి వేళ్లలోనూ, కాలి వేళ్లలోనూ నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో స్పాండిలైటిస్ వస్తుంది. రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ఈ వ్యాధి ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల వస్తుంది. చలి కాలంలో దీని బాధ ఎక్కువ. ఈ వ్యాధి చేతివేళ్లకు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని వల్ల ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరం ఒళ్లు వేడిగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అంకైలోజింగ్ స్పాండిలోసిస్ వెన్నెముకలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. క్రమంగా నొప్పి విస్తరిస్తుంటుంది. కారణం తెలియకపోయినా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అస్టియో ఆర్థరైటిస్ వయసు పెరుగుతున్నకొద్దీ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల అస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి, ఎముకలు రెండూ ఒకదానికొకటి ఒరుసుకుపోయి, ఆ భాగాన నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. దీని వల్ల కూర్చొని లేచినప్పుడు, ఉదయం పూట లేచినప్పుడు జాయింట్లు పట్టినట్టుగా ఉంటాయి. మొదట పది అడుగులు కూడా నడవడానికి వీలుండదు. నడుస్తుంటే కీళ్లలో టకటకమనే శబ్డం వస్తుంది. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మోకాలులో ఈ నొప్పి కనిపిస్తుంది. రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలలో , వయసు మళ్లినవారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కనిపిస్తుంతది. కీళ్ల పైన ఒత్తిడి పెరిగి ఎప్పుడూ నొప్పి, వాపు, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏయే కీళ్ళు దెబ్బతిన్నదన్న విషయాన్ని నిర్ధారణ చేయవచ్చు. చాలామంది కీళ్ళనొప్పులకు ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదం, హోమియోల్లో మంచి చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి విషమిస్తే కృత్రిమ కీళ్లమార్పిడి చేస్తున్నారు. తుంటి ఎముక బాల్, యాంకిల్ జాయింట్, షోల్డర్ జాయింట్, చేతివేళ్ల జాయింట్లకు కూడా చికిత్సలున్నాయి. అంతేకాకుండా ఆరు నుంచి ఏడాదిలోపు ఇంజక్షన్ల ద్వారా ఈ నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి. అయితే ఈ మందులు ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉన్నందున డాక్టరు సలహా మేరకే వాడాలి. వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటించడం వల్ల ఆర్ధరైటిస్‌ను ఆమడ దూరంలో ఉంచవచ్చు. ∙డి. శాయి ప్రమోద్ ఆర్ధరైటిస్‌ను ఇలా అదుపు చేద్దాం! కీళ్లవాతాన్ని అరికట్టడంలో కింద పేర్కొన్న మార్గాలు సత్ఫలితాలిస్తాయి. ► కాల్షియం అధికంగా ఉండే పదార్థాలైన పాలు, పెరుగు, కోడిగుడ్లు, కీర, బొప్పాయి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా వస్తువులు, అధిక బరువును తగ్గించుకోవాలి. ► కాపడుకునేటప్పుడు మోకాళ్ల కింద మెత్తటి దిండు పెట్టుకోవాలి. అధిక బరువులు ఎత్తకూడదు. ► కాపంచదారతో చేసే క్యాండీ, సోడా, ఐస్‌క్రీమ్ వంటి ఆహారాలను తీసుకోకూడదు. ► కాప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల రెడ్ మీట్‌కు దూరంగా ఉంటేనే మంచిది. ► కాగ్లుటెన్ అధికంగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్, రిఫైన్ గ్రెయిన్స్, ప్రిజర్వేటివ్ రసాయనాలు కలిపినవి కూడా తీసుకోకూడదు. ► కామద్యం అలవాటు ఉన్నవారు ఆల్కహాల్‌ను మానేయాలి. లేదంటే వెన్నెముకపై ప్రభావం పడి పెళుసుగా మారుతుంది. -
కీళ్ల నొప్పుల ఇలా చేసి తగ్గించుకోండి
సాక్షి, విజయవాడ : కీళ్ల నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి. వాతం నొప్పులు, అరుగుదల నొప్పులు, పోషకాహారం లోపించడం, ఒత్తిడి వలన నొప్పులు వస్తుంటాయి. వీటిలో కీళ్ల వాతం వలన కలిగే నొప్పులను తొలిదశలో గుర్తించడం ఎంతో అవసరం. నిర్లక్ష్యం చేస్తే, వాటి ప్రభావం ఇతర అవయవాలపై పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అక్టోబరు 12 ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. కారణాలు.. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచే కణాలు(తెల్లరక్తకణాలు) బ్యాక్టీరియా, వైరస్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడినప్పుడు తెల్లరక్తకణాలు మన శరీరంపైనే దాడి చేయడం ప్రారంభిస్తాయి. దీని వలన వచ్చే మార్పులను వాతం లక్షణాలు అంటారు. వీటినే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. వాటిలో కీళ్లవాతం అత్యధికంగా వస్తుంది. ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు రావడానికి జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, పర్యావరణంలో ఏర్పడే మార్పులు కారణం కావచ్చు అని శాస్త్రీయసమాచారం. ఏ వయసులో వచ్చే అవకాశం.. మధ్య వయస్సు వారికి అంటే 30 నుంచి 60 ఏళ్ల స్త్రీలకు ఎక్కువుగా వస్తుంది. చిన్న పిల్లలకి, వృద్ధాప్యంలో వచ్చు వారికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కీళ్లవ్యాధులను నిర్ధారించడం ఎలా ? కీళ్లవాతం తీరు, వాటితో వచ్చే ఇతర లక్షణాలును బట్టి, కొన్ని రకాల రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్ధారించడంతో పాటు, వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయవచ్చు. కీళ్ల వాతం లక్షణాలు ఉన్నప్పటికీ 40 శాతం మందికి రక్తపరీక్షలు నార్మల్‌గా ఉంటాయి. వారిని సెరోనెగిటివ్ ఆర్థరైటీస్గా గుర్తించి వైద్యం చేస్తారు. ఆహార నియమాలు... కీళ్లవాతంతో బాధపడే వారు మంచి పోషక విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ప్రతినిత్యం ఆహారంలో పప్పుదినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టుతీయని తృణ«ధాన్యాలు ఉండేట్లు చూసుకోవాలి. ఆలీవ్ నూనెను వాడుకోవడం ఉత్తమం. పాలు, పెరుగు, గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి ఒమేగా–3 ఫ్యాటీ ఎసిడ్స్ అధికంగా ఉన్న చేపలు, భాదం. సోయా బీన్స్ తీసుకోవడం వలన నొప్పులు అదుపులో ఉంటాయి. కీళ్ల వ్యాధుల్లో రకాలు, వాటి లక్షణాలు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్: చేతులు, కాళ్లకు ఉండే కణుపులు దగ్గర నొప్పులు, వాపులు రావడం దీని ముఖ్యలక్షణం. గౌట్: కాలి బ్రొటనవేలు, మడమ(చీలమండి) దగ్గర నొప్పి, వాపు రావడం దీని ముఖ్యలక్షణం. యాంకోలైసింగ్ స్పాండిలైసిస్: తొంటి, వెన్నుపూస నొప్పి రావడం, బిగుసుకు పోవడం, దీని ముఖ్యలక్షణం సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్ అనే చర్మవ్యాధి .ఉన్న వారిలో వచ్యే కీళ్లవాతం. లూపస్: కీళ్ల నొప్పులతో పాటు, ముఖం మీద సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు రావడం, నోటిపూత, జుట్టురాలిపోవడం ముఖ్యలక్షణం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... మధ్యపానం, ధూమపానం చేయకూడదు. రోజూ 6–8 గంటలు నిద్రపోవాలి యోగా, ధ్యానంతో ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయం. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవాలి. విటమిన్ ‘డి’ లోపం రాకుండా చూసుకోవాలి. పీసీఓడీ సమస్యలు పరిష్కరించుకోవాలి. చిన్న వయస్సులో గర్భసంచి, అండాశయం ఆపరేషన్లు చేయించుకోకూడదు. దంత సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సులువుగా నియంత్రణలోకి తేవచ్చు వైద్య రంగంలో జరిగిన సాంకేతిక అభివృద్ధి వలన గతంతో పోలిస్తే ఇప్పుడు అద్భుతమైన పనితీరు కలిగిన మందులు, బయోలాజిక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడటం ద్వారా ఇంతకు మందు మహమ్మారిగా ఉన్న కీళ్లవాతాన్ని అతి సులువుగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. చాలా మంది కీళ్ల వాతానికి వాడే మందుల వలన దుష్ప్రభావాలు ఉంటాయని భయపడి మందులు వాడక, అంగవైకల్యాన్ని తెచ్చుకుంటారు. – డాక్టర్ కావ్యాదేవి, ఎండీ,డీఎం, రుమటాలజిస్ట్ -
నాకు సంతానభాగ్యం ఉందా?
నా వయసు 33 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పరిష్కారం లభిస్తుందా? సంతానలేమికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. ►స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: ►జన్యుసంబంధిత లోపాలు ►థైరాయిడ్ సమస్యలు ►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ►గర్భాశయంలో సమస్యలు ►ఫెలోపియన్ ట్యూబ్స్‌లో సమస్యలు ►డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో కనిపించే కారణాలు: ►హార్మోన్ సంబంధిత సమస్యలు ►థైరాయిడ్ ►పొగతాగడం ►శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు: ►ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఏర్పడుతుంది. ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం తర్వాత లేదా అబార్షన్ తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటా రు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ వల్ల ►సంభవిస్తుంది. గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. ►చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ ఇరువైపు కీళ్లలో నొప్పి... ఎందుకిలా? నా వయసు 59 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నొప్పి భరించలేకుండా ఉన్నాను. హోమియో చికిత్స ద్వారా తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. హోమియో మందుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
కీళ్లెంచి మేలెంచు
ఆర్థరైటిస్ అంటే కీళ్ల దగ్గర వచ్చే రుగ్మత. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏదో కీళ్లలో నొప్పి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసి పెయిన్‌కిల్లర్ వేసుకుంటే సరిపోదు. చికిత్స తీసుకోకపోతే రోగి ఆయుర్దాయం 10 నుంచి 15 ఏళ్లు తగ్గిపోయే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే... చాలా రకాల కీళ్లవాతాల్లో ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే మొదటి లక్షణం. అవి ఆర్థరైటిస్ లక్షణంతో మొదలై కాలక్రమేణా శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దాంతో కీళ్లవాతాలు పూర్తిగా ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని తేలిగ్గా తీసుకోకూడదు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కూడదు. పైగా వీటి నిర్ధారణ కూడా అంత తేలిక కాకపోవడంతో వీలైనంత త్వరగానూ, జాగ్రత్తగానూ గుర్తించడం కూడా ఎంతో అవసరం. ఈ నెల 12న ‘వరల్డ్ ఆర్థరైటిస్ డే’ సందర్భంగా ఆ రుగ్మతపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. కీళ్ల దగ్గర తీవ్రమైన నొప్పి, విపరీతమైన వాపు, బాగా బిగుసుకుపోయినట్లుగా కావడాన్ని ఆర్థరైటిస్‌గా వ్యవహరిస్తారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే... ఎన్నో రకాల కీళ్లవాతాలను కలుపుకొని ఆర్థరైటిస్ రుగ్మతలుగా వ్యవహరిస్తారు. వీటిల్లో కొన్ని ఎముకల సమస్యలు వయసు పెరుగుతూ పోతున్నకొద్దీ ఏర్పడే అరుగుదల కారణంగా వస్తాయి. ఇక మరికొన్ని మాత్రం మన సొంత వ్యాధి నిరోధక శక్తి మన కణాలనే పరాయివిగా పరిగణించి దాడి చేయడం వల్ల మన దేహంలోని ఎన్నో కీలకమైన కణజాలాలు, వ్యవస్థలు దెబ్బతింటాయి. దాంతో చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశముంది. మనం మన రోజువారీ పనుల్లో ఏది చేయడానికైనా కీళ్లు సరిగా పనిచేయడం అవసరం. అయితే కీళ్లల్లో ఏర్పడే ఈ వ్యాధుల కారణంగా అంగవైకల్యం కూడా రావచ్చు. ఫలితంగా వృత్తులు, ఉపాధులు కోల్పోవడం వంటి సామాజిక పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ సమస్య కారణంగా మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోతారు. అంతేకాదు... కొన్ని రకాల కీళ్లవాతాల కారణంగా అంటువ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులొచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. ఆర్థరైటిస్‌కు కారణాలు... ముందుగా చెప్పినట్లుగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆర్థరైటిస్ అన్న ఓ సమస్య ఒక వయసు దాటాక అనివార్యంగా అందరిలోనూ కనిపించేందుకు అవకాశం ఉంది. ఎముకల్లో అరుగుదల కారణంగా కనిపించే ఇలాంటి సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్‌గా చెబుతారు. ఇది చాలా సాధారణమైన, సాహసమైన సమస్య.అయితే కొందరిలో జన్యులోపాల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ తప్పుదారి పడుతుంది. ముందుగానే చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన తమ సొంతకణాలనే హాని చేయడానికి వచ్చిన పరాయి కణాలుగా పరిగణించి వాటిని తుదముట్టించడానికి మన రోగనిరోధక వ్యవస్థ... శత్రుసంహారం కోసం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. తత్ఫలితంగా... ఆ యాంటీబాడీస్ దాడి కారణంగా... ఆ వ్యక్తి తాలూకు ఎముకలు, కీళ్లు, కండరాలు, ఇక కొన్ని సందర్భాల్లో వివిధ కీలకమైన అవయవాలు సైతం దెబ్బతింటాయి. ఇదే సమయంలో పర్యావరణంలోని హాని చేసే క్రిములు, రసాయనపదార్థాలు, కాలుష్యాలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అప్పటికే ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి తోడు ఒకవేళ ఆ వ్యక్తికి పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే... అవి వ్యాధి తాలూకు దుష్ప్రభావాలను మరింతగా పెంచుతాయి. ఇక కొన్ని రకాల ఆర్థరైటిస్లు వంశపారంపర్యంగా కొనసాగుతుంటాయి. ఆర్థరైటిస్‌లలో ప్రధాన రకాలైన ఆటోఇమ్యూన్ వ్యాధులివి... రకరకాల ఆర్థరైటిస్‌ల కారణంగా రకరకాల కీళ్ల సమస్యలు వస్తాయి. ఇలాంటి కీళ్లవాతాల్లో లూపస్ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్–ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ), గౌట్, షోగ్రన్స్ డిసీజ్, స్కీ›్లరోడర్మా వంటివి ప్రధానమైనవి. అలాగే మయోసైటిస్, వాస్కులైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాసిస్, సార్కాయిడ్ వంటివి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే కీళ్లవాతాలు. ఇవి కూడా ఆర్థరైటిస్లాగే మొదలవుతాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయంటే... ఇలాంటి ఆటోఇమ్యూన్ కీళ్లవాతాలు ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. వారి జీవితంలోని అన్ని దశల్లోనూ తీవ్రమైన ప్రభావం చూపెడతాయి. ఇక యాంకైలోజింగ్ స్పాండలైటిస్, కొన్ని రకాలైన వాస్కులైటిస్ వంటివి పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా... వయసు పెరగడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ మినహా మిగతా రకాల కీళ్లవాతాలు ఏ వయసు వారిలోనైనా కనిపించడానికి అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు ఒక్కో రకమైన కీళ్లవాతానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా వ్యక్తం కాకపోవచ్చు కూడా. వ్యాధి తీరు, తీవ్రత, రోగి వయసు, రోగికి ఉన్న ఇతర వ్యాధులపై ఆధారపడి వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే తీరు మారుతూ ఉంటుంది. తొలిదశలో ఏ రకమైన కీళ్లవాతంలోనైనా లక్షణాలన్నీ సాధారణమైన ఇతర వ్యాధుల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఉదాహరణకు సాయంత్రమయ్యేసరికి జ్వరం రావడం, అలసట, నెమ్మదిగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు ప్రారంభదశలో కనిపిస్తాయి. ఈ సాధారణ లక్షణాలు ఇతర వ్యాధుల్లో సైతం కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. కీళ్ల దగ్గర విపరీతమైన నొప్పి, వాపు వచ్చి... అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేసరికి రోగి పరిస్థితి దిగజారిపోయి సొంతపనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ముఖ్యంగా చిన్న కీళ్ల మీద తన ప్రభావం చూపిస్తే... యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది వెన్నుపూసలు, పెద్దకీళ్లపై ప్రభావం చూపిస్తుంది. కీళ్లవాతం కారణంగా వచ్చే సంక్లిష్ట సమస్యలు ►ఆర్థరైటిస్ కాలక్రమేణా ఎన్నో రకాలైన సంక్లిష్టమైన సమస్యలకు దారితీస్తుంది. ఎముకలను బాగా పెళుసుగా తయారు చేస్తుంది. దాంతో చిన్నపాటి దెబ్బకు సైతం, ఒక్కోసారి ఎలాంటి గాయాలు లేకపోయినా ఎముక విరిగిపోతుంది. ►నరాల మీద ఒత్తిడి కలిగించి, స్పర్శలో మార్పు రావడం, కాళ్లూ–చేతులు పట్టుకోల్పోవడం జరుగుతుంది. ►ఈ సమస్య వచ్చిన కొందరిలో నోరు, కళ్లు విపరీతంగా పొడిబారిపోతాయి. ►గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలూ తలెత్తుతాయి. వ్యాధి నిర్ధారణ... తొలిదశలో వ్యాధి నిర్ధారణ ఒకింత కష్టమైన పనే. అయినప్పటికీ రుమటాలజిస్ట్లు ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు కావడం వల్ల రోగి లక్షణాలనూ, కొన్ని వైద్యపరీక్షల తర్వాత అవసరమైన రక్తపరీక్షలు చేయించి, వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తారు. అయితే ఒక్కోసారి ఈ పరీక్షలలో సానుకూల ఫలితాలు ఉన్నంత మాత్రన కూడా వ్యాధి ఉన్నట్లు కాదు. ఈ పరీక్షలలో ఎన్నో ‘నాన్–రుమటలాజికల్’ జబ్బులు కూడా ‘ఫాల్స్ పాజిటివ్’ ఫలితాలను ఇవ్వవచ్చు. అంటే వ్యాధి లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు రిపోర్టులు రావచ్చు. అలాగే ఒకే జబ్బులో ఎన్నో యాంటీబాడీస్ పాజిటివ్‌గా ఉండవచ్చు. అందువల్లనే రుమటాలజిస్టులు తమ అనుభవంతో అసలైన వ్యాధినీ... వ్యాధిలేకపోయినా ఉన్నట్లుగా కనిపించే ఫాల్స్పాజిటివ్ అంశాలను గుర్తించి, తగిన మందులను సూచిస్తారు. అయితే ఒక్కోసారి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకపోవడం వల్ల వ్యాధి లేనివారికి కూడా ఉన్నట్లు పరిగణించి మందులు వాడితే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో రుమటాలజిస్టులను సంప్రదిస్తే వారు చాలా నిశితంగా (మెటిక్యులస్‌గా) రోగిని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. చికిత్స ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స విధానాలు ఉంటాయి. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దమోతాదులో స్టెరాయిడ్స్ వాడటంతో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ అనేవి మొదలుపెట్టాలి. దాదాపు 10 – 20 శాతం మందిలో ఎన్ని రకాల మందులు వాడుతున్నప్పటికీ ఒక్కోసారి జబ్బుతీవ్రతను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటివారిలో బయలాజిక్స్ అనే మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. బయాలజిక్స్ను సూచించే సమయంలో... వ్యాధి తీవ్రత, దాని కారణంగా ప్రభావితమైన అవయవాలతో పాటు రోగి బరువు, స్త్రీ/పురుషుడు అన్న అంశం, మహిళలైతే గర్భవతా అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ►లక్షణాలు కనిపించడం మొదలైన కొన్ని వారాల నుంచి నెలల వ్యవధిని ‘విండో ఆఫ్ ఆపర్చునిటీ’ అంటారు. ఈ సమయంలో రుమటాలజిస్ట్లను సంప్రదించి, తగిన చికిత్స పొందే వ్యక్తులలో రుమాటిక్ ప్రభావాల కారణంగా కలిగే దీర్ఘకాలిక సమస్యలను అరికట్టవచ్చు. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చికిత్సలో ఒక భాగం. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ►ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా ఉన్న బరువును తగ్గించుకోవాలి. ఒంటి బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ► పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. ►క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ►కీళ్లవాతానికి సంబంధించిన అపోహలను పక్కన పెట్టాలి. ►కీళ్లలో నొప్పి వంటివి కనిపిస్తే... దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, అది ఆర్థరైటిస్‌కు సంబంధించిన వ్యాధేమోనని అనుమానించి రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే తుంచేస్తే... ఎన్నో అనర్థాలు తప్పుతాయనీ, జీవనశైలి, జీవననాణ్యత మెరుగుపడతాయని గుర్తుంచుకోవడం మంచిది. గుర్తించడం ఎలా... ►ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’తో మూడు ‘ఎస్’ల సహాయంతో ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అదెలాగంటే... ►స్వెల్లింగ్ (వాపు) – చిన్న కీళ్లదగ్గర వాపు రావడం. ►స్టిఫ్నెస్ (బిగదీసుకుపోవడం) – ఉదయాన్నే30 నిమిషాలకు పైనే కీళ్లు బిర్రుగా పట్టుకుపోవడం/బిగుసుకుపోవడం. స్క్వీజ్: చేతిని చిన్నగా నొక్కినా (స్క్వీజ్ చేసినా) విపరీతమైన నొప్పి రావడం. పైన పేర్కొన్న మూడు ‘ఎస్’లతో కూడిన లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఆర్థరైటిస్ సమస్య ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు దాన్ని ఆర్థరైటిస్ సమస్య కావచ్చేమోనని అనుమానించాలి. ►చర్మంపై ఎర్రని మచ్చలు, దద్దుర్లు, మాననిపుండ్లు, చర్మం కుళ్లిపోవడం అనేవి లూపస్‌తో పాటు వాస్కులైటిస్ వంటి కీళ్లవాతాలలో ఎక్కువగా జరుగుతుంటుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లో ముక్కుకు ఇరువైపులా బుగ్గల మీద సీతాకోకచిలుక ఆకృతితో ‘బటర్‌ఫ్లై రాష్’ అనే కండిషన్ వచ్చి అక్కడ కందిపోయినట్లుగా కనిపిస్తుంది. ►వైద్యచికిత్స తీసుకోని రుమటాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో చర్మం కింద బొడిపెలు ఏర్పడతాయి. ►మరికొందరిలో చలికాలంలో చల్లటినీళ్లు తగిలినప్పుడు వేళ్లు నీలంగా, ఎర్రగా, తెలుపురంగులోకి మారిపోతాయి. ఇలా కావడాన్ని ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. ఇది అనేక రకాల కీళ్లవాతాల్లో కనిపిస్తుంది. ►లూపస్ అనే సమస్యలో... నోటిలో కురుపులు, పూత రావడం, జుట్టు రాలిపోవడం, మహిళల్లోనైతే తరచూ గర్భస్రావాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి ముదిరినప్పుడు ఊపిరితిత్తులపైన, గుండెపైన ఒక పొర ఏర్పడి, వాటి చుట్టూ నీరు చేరుతుంది. దాంతో ఊపిరితీసుకునే సమయంలో నొప్పి రావడంతో పాటు దగ్గు, ఆయాసం కనిపిస్తాయి. ఇవే లక్షణాలు టీబీలోనూ కనిపించడం వల్ల ఒక్కోసారి రోగి తాలూకు వ్యాధి నిర్ధారణ తప్పుగా జరిగి... టీబీ మందులు వాడటం కూడా సంభవించవచ్చు. టీబీ మందులు ఎంత వాడినా మెరుగుదల కనిపించకపోవడం, రోగి తాలూకు ఇతర లక్షణాలు బయటపడటం జరిగినప్పుడు మాత్రమే కీళ్లవాతం అనే అనుమానం వచ్చి అప్పుడు రుమటాలజిస్ట్ను సంప్రదిస్తారు. అయితే అప్పటికే వ్యాధి తీవ్రరూపం దాల్చి అనేక సమస్యలకు కారణమవుతుంది. ►మరికొందరిలో రక్తకణాలు తగ్గిపోవడం, తరచూ రక్తహీనత కలగడం, కామెర్లు రావడం కూడా జరుగుతాయి. ►చిన్న వయసులోనే కిడ్నీ సమస్య రావడం, అధిక రక్తపోటు వంటివి కూడా కీళ్లవాతం తాలూకు సంకేతాలే. ►కీళ్లవాతం కారణంగా మెదడు, నరాలు ప్రభావితమైనప్పుడు... తరచూ ఫిట్స్ రావడం, అకస్మాత్తుగా చూపుపోవడం, పక్షవాతం రావడం వంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి. ►సాధారణంగా నడుమునొప్పి అనేది వయసు మీద పడ్డాక కనిపించే సమస్య. అలా కాకుండా యుక్తవయసులోనే విపరీతమైన నడుమునొప్పి. మెడ, మడమల నొప్పులతో పాటు నిద్ర లేవగానే నడుము దగ్గర బిర్రుగా పట్టేసినట్లు ఉండటం, తరచూ విరేచనాలు లాంటి లక్షణాలు స్పాండైలోఆర్థరైటిస్లో కనిపిస్తాయి. ►జ్ఞాపకశక్తి మందగించడం, రోజువారీ జీవన కార్యకలాపాలపై ఆ ప్రభావం కనపడటం అన్నది రుమాటిక్ వ్యాధుల్లో కనిపించే ప్రధాన లక్షణం. ►రోగులకు ఇటు శారీరకంగా, అటు మానసికంగా బలహీనపరిచే వ్యాధుల్లో కీళ్లవాతాలు చాలా ముఖ్యమైనవి. చికిత్స కూడా ఒకింత సంక్లిష్టంగానే ఉంటుంది. దాంతో ఈ రోగుల్లో ఆందోళన, నిరాశ, కుంగుబాటు (డిప్రెషన్) కారణంగా ఆత్మహత్యాధోరణులు ఎక్కువగా కనిపిస్తాయి. అపోహలూ – వాస్తవాలు ►విశ్రాంతి వల్ల కీళ్లవాకీళ్ల వాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. ►ఆర్థరైటిస్ ఒక వయసు దాటాకే కనిపిస్తుందని కొందరి అపోహ. అది పూర్తిగా వాస్తవం కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే వయసు పెరిగాక కనిపిస్తుంది. మిగతావి ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. ►పిల్లలకు ఆర్థరైటిస్ రాదని కొందరు అపోహపడుతుంటారు. కానీ కొన్ని ఆర్థరైటిస్ సమస్యలు పిల్లల్లోనూ కనిపించవచ్చు. ►ఆర్థరైటిస్ వచ్చినవారు దుంపకూరలూ, మాంసాహారం తినకూడదని కొందరు భావిస్తారు. అయితే అది వాస్తవం కాదు. పోషకాహారలోపం ఏర్పడకుండా ఉండేందుకు వాటిని తీసుకోవచ్చు. ►దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. కాని ఇది వాస్తవం కాదు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
గ్లూకోసమైన్‌తో గుండెకు మేలు...
కీళ్లనొప్పులను తట్టుకునేందుకు వాడే గ్లూకోసమైన్ గుండెకూ మేలు చేస్తుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బీఎంజే) శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌లోని దాదాపు 4.66 లక్షల మందిపై అధ్యయనం చేయడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు బీఎంజేలో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం తెలిపింది. గుండెజబ్బులేవీ లేని.. 40 – 69 మధ్య వయస్కులపై తమ అధ్యయనం జరిగిందని... వీరందరి ఆరోగ్య.. ఆరోగ్య పరిరక్షణకు వారు తీసుకుంటున్న పదార్థాల వివరాలన్నింటినీ తీసుకున్న తరువాత ఏడేళ్లపాటు వీరి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ అధ్యయనం సాగిందని శాస్త్రవేత్త ‘లుకీ’ తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 90 వేల మంది గ్లూకోసమైన్ను క్రమం తప్పకుండా తీసుకునే వారు ఉన్నారని కీ తెలిపారు. గ్లూకోసమైన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకునే వారికి గుండెజబ్బు వచ్చేందుకు దాదాపు 18 శాతం తక్కువ అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనం చెబుతోందని కీ చెప్పారు. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా కొంచెం తక్కువని అన్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ధూమపానం, గతంలో ఉన్న వ్యాధులు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తాము ఈ లెక్కలు వేశామని చెప్పారు. మరింత విస్తృతమైన పరిశోధన చేసి.. ఫలితాలను నిర్ధారించుకుంటే.. గ్లూకోసమైన్ను గుండెజబ్బుల నివారణకూ వాడేందుకు అవకాశం ఏర్పడుతుందని కీ వివరించారు. -
కీళ్ల నొప్పులు.. టోకెన్ తిప్పలు..!
కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు నిమ్స్‌లో నిలువుకాళ్ల జపం తప్పట్లేదు. ఓపీ టోకెన్ కోసం అర్ధరాత్రి 2 గంటలకే ఆస్పత్రికి చేరుకుని క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. నొప్పుల బాధను దిగమింగుకుని గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా.. తీరా ఓపీ వేళకు నిరాశే మిగులుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు నిమ్స్ ఆస్పత్రికి కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు రోజుకు దాదాపు 150 మందికిపైగా వస్తుంటారు. అయితే 60 మంది రోగులకు మించి వైద్య సేవలు అందించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కీళ్లనొప్పుల బాధితుల కోసం 1994లో ప్రత్యేకంగా రుమటాలజీ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రొఫెసర్ జి.నరసింహులు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. అప్పటివరకు ప్రైవేటులో ఎక్కడా రుమటాలజీ వైద్యుల్లేకపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో 2001లో రుమటాలజీ విభాగం కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మరింత మంది స్పెషలిస్టులను తయారు చేసేందుకు 2005లో డీఎం రుమటాలజీ కోర్సు ఏర్పాటు చేయగా, 2007లో దీనికి గుర్తింపు లభించింది. అనేక పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, అత్యుత్తమ వైద్యవిద్య బోధనతో దేశంలోనే ఓ వెలుగు వెలిచిన రుమటాలజీ విభాగం ప్రస్తుతం కనీస వైద్యసేవలు అందించలేకపోతోంది. ఒక్కొక్కరూ వీడిపోవడంతో ప్రొఫెసర్ నరసింహులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రోగుల నిష్పత్తికి తగ్గట్లు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, నిమ్స్‌తో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేతనాలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో వైద్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రిని వీడారు. ఇప్పటివరకు ఇక్కడ 45 మంది వరకు రుమటాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తిచేయగా, వీరి సేవలను వినియోగించుకోవడంలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉస్మానియా, గాంధీ సహా జిల్లా కేంద్రాల్లోనూ రుమటాలజీ వైద్యుల్లేకపోవడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలు ఖరీదు కావడం, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2011 వరకు ఐదుగురు ఫ్యాకల్టీ వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరికి పడిపోయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ వేళలు కొనసాగుతుండటం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోజుకు సగటున 60 మందికి మించి చూడలేకపోతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఆశతో అర్ధరాత్రి రెండు గంటలకే ఓపీ కౌంటర్‌కు చేరుకుంటున్నారు. తీరా ఉదయం టోకెన్లు దొరక్క తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. కీళ్లవాతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా కింగ్‌జార్జ్, కోల్‌కతా, చండీగఢ్, వేల్లూర్, ముంబై, నిమ్స్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల నుంచి ఏటా 45 మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యులు బయటికి వస్తున్నారు. రుమటాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్ ఉంది. వేతనం కూడా నిమ్స్‌లో కన్నా రెట్టింపు ఉంది. పాలకులు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల నిమ్స్ సహా ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరిపైనే భారం పడుతోంది. –ప్రొఫెసర్ జి.నరసింహులు, విశ్రాంత వైద్యుడు, నిమ్స్ -
అమ్మోకాళ్లు!
దేహం కూడా యంత్రం లాంటిదే. యంత్రం విడిభాగాలు అరిగినట్లే... మన దేహయంత్రంలోని కీళ్లూ అరిగి పోతుంటాయి. ఈ పరిణామం అరుగుదల కారణంగా... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే డీజనరేషన్ కారణంగా జరుగుతుంది కాబట్టి ఇది అనివార్యంగా జరిగిపోతుంది. పాతకాలంలో అరుగుదలతో వచ్చే ఈ నొప్పులను పాతనొప్పులు అనేవాళ్లు. పాతనొప్పులకు మందులేదని ఆ తరంవాళ్లు అనుకునేవాళ్లు. అయితే ఇటీవల వైద్య విజ్ఞానశాస్త్రంలో అభివృద్ధి వల్ల కొత్త మందులు, కొత్త రకం శస్త్రచికిత్సలతో అరిగిన కీళ్లకు వైద్యం చేయడం సాధ్యం కావడంతో పాతనొప్పులనే మాట పాతబడి పాతతరం వారికి మాత్రమే తెలుస్తోంది. అయితే కీళ్ల అరుగుదలతో వచ్చే ఈ నొప్పుల గురించి ఎన్నో అపోహలున్నాయి. ఆ అపోహల గురించి, అసలు వాస్తవాల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. కీళ్ల అరుగుదలా వన్–వే ట్రాఫిక్ లాంటిదే... కాలం ముందుకు జరుగుతున్నట్లు... వయసు రోజురోజుకూ పెరుగుతున్నట్లు... అరుగుదల కూడా ముందుకే కొనసాగుతుంది. అలా అరిగే ప్రక్రియను ఏవిధంగానూ వెనక్కు మళ్లించలేం. ఇదీ వన్–వే ట్రాఫిక్‌లో ప్రయాణించడం లాంటిది. ఆ దారిలో వెనక్కు తిరగడం సాధ్యం కాదు. కాకపోతే ప్రయాణాన్ని నెమ్మదిగా సాగేలా చేసుకోగలం. కీళ్ల అరుగుదల విషయంలోనూ అంతే. అందమైన మన మునుపటి ఫిట్నెస్ను కొనసాగించేందుకు వ్యాయామాల వంటి మంచి జీవనశైలి అలవాట్లతో, మరికొన్ని జాగ్రత్తలతో వాటి అరుగుదల ఆలస్యంగా జరిగేలా మాత్రం చూసుకోగలం. కీలూ – కండర సంబంధం... కృష్ణార్జున బంధం కీళ్ల అరుగుదల తక్కువగా ఉండాలంటే దానికి సంబంధించిన కండరం బలంగా ఉండాలి. అందుకే కీలుకీ–కండరానికీ ఉన్న సంబంధాన్ని ఒకరకంగా కృష్ణార్జున బంధంగా చెప్పవచ్చు. అర్జునుడికి కృష్ణుడి సపోర్ట్ ఉన్నట్లే... మన మోకాలి కీలుకి క్వాడ్రిసెప్స్ అనే తొడ కండరాల సపోర్ట్ ఉంటుంది. యుద్ధంలో అర్జునుడిపై పడబోయిన అనేక దెబ్బలను శ్రీకృష్ణుడే కాచుకుని రక్షించినట్టే, మోకాలి కీళ్లపై పడే భారంలో చాలాభాగాన్ని క్వాడ్రిసెప్స్ కండరాలు తీసుకుంటాయి. అలాగే తుంటి భాగానికి వస్తే... తుంటి కీలు దగ్గర కాలు ఫ్రీగా కదిలేందుకు, కాలు మన శరీరభాగాన్ని అంటి ఉండేందుకు ‘అబ్డక్టార్ మజిల్స్ ఆఫ్ హిప్’ అనే కండరాలు ఉపయోగపడతాయి. ఇదే తరహాలో మెడ కండరాలు, మెడ భాగంలోని వెన్నుపూసలపై పడే భారాన్ని తీసుకుంటాయి. అందుకే సర్వైకల్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు మొదట మెడ కండరాలను బలంగా మార్చే వ్యాయామాలను చేయాల్సిందిగా సూచిస్తుంటారు. ఇలా నడిచేందుకు ఉపయోగపడేది కీలు అయితే... దాన్ని నడిపించేందుకు సహాయపడేది సంబంధిత కండరం అన్నమాట. వ్యాయామంతో కండరాలు ఎంత బలంగా ఉంటే... కీలుపై పడే భారం అంతగా తగ్గుతుంది. ఆ తరంలో ఆ బాధలు లేవెందుకు... అప్పటి తరంలో చాలామందికి వృద్ధాప్యం వచ్చిన చాలా ఏళ్లకు గానీ కీళ్లనొప్పులు వచ్చేవి కావు. అయితే ఇటీవల చాలామందికి నలభై ఏళ్లు దాటకుండానే కీళ్లనొప్పులు వస్తున్నాయెందుకు అని కొందరు అడుగుతుంటారు. ఇందుకు నాలుగు అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అవి 1. కండరాల బలహీనత; 2. ఊబకాయం; 3. శారీరక శ్రమ; 4. సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల కార్టిలేజ్ బలోపేతం అయ్యే ప్రక్రియలో అవరోధం ఏర్పడటం. ఈ నాలుగు అంశాల్లోనూ ప్రధానమైనది శారీరక శ్రమ. మిగతా అన్ని అంశాలతో దీనికి సంబంధం ఉంది. ఆ రోజుల్లో నడక, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. దాంతో కండరాలు త్వరగా బలహీనపడేవి కావు. అలాగే ఆ శ్రమ కారణంగానే ఊబకాయం వచ్చేది కాదు. ఇక మన కీళ్లలో కందెన (ల్యూబ్రికెంట్)లా పనిచేసే సైనోవియల్ ఫ్లుయిడ్ అనే గ్రీజులాంటి పదార్థం మన్నికతో ఎక్కువ రోజులు ఉండటానికీ దోహదపడేది శారీరక శ్రమే. ఇటీవల ప్రజల్లో శారీరక శ్రమ తగ్గడంతో మిగతా మూడు అంశాలూ బలహీనం కావడం వల్లనే ఇటీవలి తరాల్లో కీళ్లనొప్పులు త్వరగా వస్తున్నాయి. ఎంతగా నడిస్తే కీళ్లు అంతగా అరుగుతాయా? నడక వల్ల కీళ్లపై భారం పడి త్వరగా అరిగిపోతాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఎముకకు నేరుగా పోషకాలు అందవు. మన వ్యాయామం, నడక వల్లనే ఎముకకు పోషకాలు అందుతాయి. అలాగే సైనోవియల్ ఫ్లుయిడ్ ఆరోగ్యానికీ నడక అవసరం. అందువల్ల ఎంత నడిస్తే కీళ్లకు అంత ప్రయోజనం. కానీ ఈ నడక ఎలా పడితే అలా ఉండకూడదు. ఏవి పడితే ఆ చెప్పులు తొడుక్కొని, ఇష్టం వచ్చిన ఉపరితలం మీద నడిస్తే ఆ నడక ప్రయోజనం ఇవ్వదు. మెత్తటి అడుగుభాగం (సోల్) ఉన్న షూతో మట్టినేల లేదా గడ్డితో మెత్తగా ఉన్న నేలమీద గానీ ఆ నడక వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఇక మోకాలిపైన బరువు పడేందుకు దోహదపడే మరో అంశం ఇండియన్ స్టైల్ టాయిలెట్ సీట్. ఎత్తుపల్లాలున్న దారుల్లో నడిచినప్పుడు, ఇండియన్ స్టైల్ టాయిలెట్లలో కూర్చున్నప్పుడు కీళ్లమీద మామూలు సమయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ భారం పడుతుంది. అలాగే మోకాళ్లు ముడుచుక్కూర్చోవడం(స్క్వాటింగ్) కూడా మోకాలి నొప్పులకు కారణమవుతుంది. కీళ్లనొప్పులు మొదలైనప్పుడు మినహాయించి, మామూలు ఆరోగ్యంతో ఉన్నవారు ఎంత నడిస్తే అంత మేలు. అలాగే ఇండియన్ టాయెలెట్లలో గొంతుక్కూర్చోకుండా ఉండటమూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మున్ముందు వచ్చే కీళ్లనొప్పులను నివారిస్తుంది. కాల్షియమ్ తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయా? మన ఆహారంలో కాల్షియమ్ తగ్గడం అన్నది కీళ్లనొప్పులకు దారితీస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. నిజానికి కాల్షియమ్కూ, కీళ్లకూ ఎలాంటి సంబంధం లేదు. కాల్షియమ్ లోపం వల్ల ఎముక బలహీనం కావచ్చుగానీ... కీళ్లతో కాల్షియమ్కు నేరుగా సంబంధం ఉండదు. కీళ్లపై కాల్షియమ్ ప్రత్యక్ష ప్రభావమూ ఉండదు. ఆహారానికి... కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా? కొంతమంది ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉందేమోనని కూడా సందేహం వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యక్షంగా ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉండదు. అయితే అతిగా ఆహారం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఊబకాయం వచ్చి... ఒంటి బరువు కీళ్లపై పడి కీళ్ల అరుగుదల వేగవంతం అవుతుంది. ఇక కొన్ని రకాల ఆహారాలు కొంతమందికి సరిపడవు. ఒంటికి సరిపడని ఆహారం కారణంగా అలర్జీలు వచ్చి, ఆ అలర్జీ కీళ్లనొప్పులు, వాపు రూపంలో వ్యక్తం కావచ్చు. ఎవరెవరిలో ఏయే ఆహారాల పట్ల అలర్జీ ఉంటుందో, ఆ అలర్జీ ఏ రూపంలో వ్యక్తమవుతుందన్నది ఆయా వ్యక్తుల దేహ స్వభావాన్ని బట్టి ఉంటుంది. నిజానికి కీళ్లనొప్పి అన్నది ఎముక బలహీనం కావడం కంటే, ఎముక చివరన ఉండే కార్టిలేజ్ అనే భాగం అరగడం వల్ల, అందులోని గ్లూకోజమైన్ అనే జీవరసాయనం తగ్గడం వల్ల వస్తుంది. ఈ కార్టిలేజ్నే వ్యావహారిక భాషలో కొందరు గుజ్జుగా వ్యవహరిస్తుంటారు. ఆ గుజ్జులోని నీటి పరిమాణం తగ్గడం వల్ల కూడా కీళ్లనొప్పులు వస్తుంటాయి. అంతేగానీ ఆహారానికీ, క్యాల్షియమ్కూ... కీళ్లనొప్పులకూ నేరుగా సంబంధం లేదు. ఇంత అకస్మాత్తుగా బయటపడ్డాయేమిటి? ‘నిన్నమొన్నటివరకూ బాగానే నడుస్తున్నాను. ఠక్కున కీళ్లనొప్పులు బయటపడ్డాయేమిటి?... నిన్న లేని నొప్పి ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చింది?’ అని కీళ్లనొప్పులతో బాధపడేవారిలో చాలామంది అడుగుతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం అన్నది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఎవరికీ దీనినుంచి మినహాయింపు ఉండదు. అయితే కీళ్ల అరుగుదల వల్ల కార్టిలేజ్ పూర్తిగా అరిగి, ఎముకకూ, ఎముకకూ ఒరిపిడి జరిగి వచ్చే నొప్పి రెండు రకాలుగా బయటపడుతుంది. కొంతమందిలో అది క్రమంగా పెరుగుతూ పోవచ్చు. మరికొంతమందిలో అకస్మాత్తుగా బయటపడవచ్చు. కాబట్టి అరుగుదల అనేది అందరిలోనూ జరుగుతుంది. నొప్పి వ్యక్తమయ్యే తీరు మాత్రం రెండు రకాలుగా ఉంటుంది. పెద్దవయసు వారిలోఎమ్మార్ స్కాన్ అవసరం లేదుకాస్తంత వయసు పైబడ్డాక కీళ్లనొప్పులతో డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి. పెద్ద వయసు వారిలో కీళ్లు అరిగి నొప్పులు వస్తున్నాయా అని నిర్ధారణగా తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దవయసు వారిలో అరుగుదల అనేది ఎలాగూ జరిగి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా యుక్త వయస్కుల్లోనూ, చాలా చిన్నవయసు వారిలోనూ కీళ్లనొప్పులు కనిపించాయనుకోండి. అలాంటివారిలో సమస్య తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాలి. దీనికి ఓ కారణం ఉంది. మన కీళ్ల భాగంలో నొప్పి రావడానికి మూడు ప్రధానమైన అంశాలు. మొదటిది కార్టిలేజ్, రెండోది మన కీళ్ల మధ్యన షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కస్ అనే భాగం. మూడోవి లిగమెంట్లు. ఈ మూడింటిలో ఏవైనా ఆటల్లో భాగంగా కార్టిలేజ్‌లోని కొంతభాగం దెబ్బతిన్నదా, లేక షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కై (మెనిస్కస్కు బహువచనం) అనే భాగాలు దెబ్బతిన్నాయా, లేక లిగమెంట్లు గాయపడటం, తెగడం జరిగిందా అనేది తెలుసుకోడానికి యువకులు, చిన్నవయసులో ఉన్నవారికే ఎమ్మార్ స్కాన్ తీయించాల్సి ఉంటుంది. అందుబాటులో మందులు కీళ్లనొప్పుల తీవ్రతను 4 దశల్లో చెప్పవచ్చు. ఇందులో మొదటి రెండు దశల్లో నొప్పులను మందులతోనే తగ్గించవచ్చు. మూడో దశలో చాలా వరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే నాలుగోదశలో ఉంటే మాత్రం అది శస్త్రచికిత్సతో మాత్రమే తగ్గుతుంది. ఇలా మొదటి రెండు దశల్లోని కీళ్లనొప్పులకు గతంలో వాడే నొప్పి నివారణ మందులతో పొట్టలో అల్సర్స్ రావడం, కడుపులో రక్తస్రావం కావడం వంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చేవి. కానీ ఇటీవల కాక్స్–2 ఇన్హిబిటర్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి లేజర్ గన్స్‌లా పనిచేసి, కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. అంతేతప్ప ఆరోగ్యకరమైన కణాలను ఎంతమాత్రమూ ముట్టుకోవు. అలాగే గ్లూకోజమైన్ వంటి కాండ్రోప్రొటెక్టివ్ మందులు కూడా నొప్పిని తగ్గిస్తాయి. అయితే అవి కీలులో తగ్గిన గుజ్జును మళ్లీ పుట్టించవు. కాకపోతే గుజ్జు తరిగిపోయే ఒరవడిని మాత్రమే తగ్గిస్తాయి. ఆ ప్రకటనలూ, ప్రచారాలూ నమ్మకండి... ఇటీవల చాలామంది స్టెమ్సెల్స్తోనూ, ప్రోటీన్ రిచ్ ప్లాస్మా థెరపీతోనూ అరిగిపోయిన కార్టిలేజ్‌ను మళ్లీ పెంచగలమని ప్రకటనలు గుప్పిస్తూ, అమాయకులైన ప్రజలను ఆకర్షిస్తున్నారు. సాధారణంగా ఆపరేషన్ అంటే భయపడేవారే ఇలాంటి ప్రకటనలకు తేలిగ్గా ఆకర్షితులవుతుంటారు. నిజానికి నాలుగో దశ దాకా అరిగిన కార్టిలేజ్‌ను (గుజ్జును) మళ్లీ పుట్టించడం, లేదా మళ్లీ పెరిగేలా చేయడం వైద్యప్రక్రియలో లేనేలేదు. వైద్యపరంగా అలాంటి చికిత్సలకు ఎలాంటి హేతుబద్ధతా లేదు. చాలామంది తమ విలువైన డబ్బును, సమయాన్ని వృథా చేసుకొని, మోకాలి కీలుకు శాశ్వతంగా నష్టం చేకూరాకే మళ్లీ అసలైన వైద్యుల దగ్గరికి వస్తుంటారు. అలాగే కొన్నిచోట్ల పల్లెల్లో, చాలా వెనకబడిన గ్రామీణ ప్రాంతాల్లో కాల్చిన జీడి పెట్టడం, వాచిన చోట విపరీతంగా మసాజ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా మోకాలి లోపలి కీలకమైన భాగాలు దెబ్బతిని శాశ్వత వైకల్యం సంభవించవచ్చు. కాబట్టి అలా ఎవరైనా చెప్పినా నమ్మరాదు. శస్త్రచికిత్సే శరణ్యమా? మోకాలు మొదలుకొని అన్నిరకాల కీళ్లనొప్పులలోనూ 80% సందర్భాల్లో మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామంతోనే చాలావరకు తగ్గుతాయి. కేవలం 20% కేసుల్లోనే శస్త్రచికిత్స అవసరం. ముందే చెప్పినట్లుగా కీళ్లనొప్పుల్లో ఉండే తీవ్రత... మూడు నాలుగు దశలకు చేరినప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరమని గుర్తించాలి. కాబట్టి ముందే డాక్టర్‌ను సంప్రదించి శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా కాపాడుకునే జీవనశైలి జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామమే నైవేద్యం మన పక్షాన మన భారం వహించేవాడినే మనం దేవుడు అంటాం కదా. అలాగే మన మోకాలి గర్భగుడిలో ఉండే కీలుదైవం కూడా మన భారాన్ని వహిస్తాడనుకోవచ్చు. మరి ఆ దైవాన్ని ప్రార్థించి, సమర్పించదగిన నైవేద్యం ఏమిటి? వ్యాయామమే మనం మన మోకాలి గర్భగుడిలో వసిస్తూ, మన భారాన్ని తీసుకునే దేవుడికి సమర్పించే నైవేద్యం. ఒక ప్రార్థనలా మనం ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు నడకారాధన నిర్వర్తించి సమర్పించే ఆ పూజా నైవేద్యంతో సంతృప్తి పడే కీలుదేవత మనను ఇతరులపై మన భారం పడకుండా చూస్తాడు. మన కాళ్లపై మనం నిలబడేలా చేస్తాడు. అయితే కొందరిలో అప్పటికే మోకాళ్ల నొప్పులు వచ్చి నడవడం సాధ్యపడకపోవచ్చు. అలాంటి వారు ఒంటిపై ఎలాంటి బరువు పడని ఈత వంటి వ్యాయామాలు చేయవచ్చు. కొందరు మెట్లు ఎక్కడం కూడా మంచి వ్యాయామమే కదా అంటుంటారు. అది గుండెకూ, ఊపిరితిత్తులకూ మంచిదే కానీ... మోకాలికి కాదు. ఎందుకంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలిపైనా, అందులోని షాక్ అబ్జార్బర్స్పైనా చాలా భారం పడుతుంది. కాబట్టి మోకాలితోపాటు, గుండెకూ, ఊపిరితిత్తులకూ అన్నింటికీ ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామాలు చేయడమే మంచిది కదా! గర్భగుడి అంతటి పవిత్రమైనది మోకాలి కీలు మోకాలి కీలు గర్భగుడి అంతటి పవిత్రమైనది. గర్భగుడిలో దేవుడు మాత్రమే ఉంటాడు. ప్రధాన పూజారి మినహాయించి ఎవరికి పడితే వారికి గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. అలాగే మోకాలి కీలు (ఆ మాటకొస్తే అన్ని రకాల కీళ్లు కూడా) దగ్గరికి కూడా ఏ మందులు పడితే ఆ మందులు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించకూడదు. దురదృష్టవశాత్తూ చాలాచోట్ల తెలిసీ తెలియని గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీలు, క్వాక్స్) మోకాలిలో నొప్పి వంటివి వచ్చినప్పుడు నీరు తీయడం, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వంటి అనుచితమైన పనులు చేస్తుంటారు. నిజానికి మోకాలు చెప్పుకోదగ్గంత పరిమాణంలో వాస్తే తప్ప... మోకాలిలోంచి నీరు తీయడం వంటి చర్యలకు పాల్పడకూడదు. అదీ ఒకటి రెండు సార్లు మాత్రమే. అలాగే కొంతమంది హైలూరానిక్ యాసిడ్ వంటి కందెనను ఎక్కిస్తామంటారు. కానీ దానితోనూ పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అలా కందెనను ఎక్కిస్తామనే వైద్యాన్నీ నమ్మడం సరికాదు. వాస్తవానికి... తీవ్రంగా అవసరం ఉంటేనే తప్ప అనుభవజ్ఞులైన వైద్యులు నీరు తీయడం అనే చర్యకు ఉపక్రమించరు. హైలూరానిక్ యాసిడ్ వంటి ద్రవాలను ఎక్కించే నిర్ణయాన్ని తీసుకోరు. అచ్చం... గర్భగుడిలోకి ప్రవేశించే ప్రధాన పూజారులను మినహాయించి ఎవరినీ అనుమతించనట్లే... మనం మోకాలి విషయంలోనూ దాన్ని అంతే పవిత్రంగా ఉంచాలన్నమాట. అయితే ఇలాంటి గుజ్జు ఎక్కించడాలు, స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేయడాలు అనేవి 80 ఏళ్లు దాటిన వారిలోనూ, సర్జరీని తట్టుకో లేనివారిలోనూ డాక్టర్లు ఒక ఉపశమన వైద్యంలా చేస్తుంటారు. వారిని మినహాయించి, ఇలాంటి వైద్యాలు అంతకంటే చిన్నవయసు వారికి తగవు. మహిళల్లో 4 రెట్లు ఎక్కువ సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో నాలుగు రెట్లు ఎక్కువ. దీనికి నిర్దిష్టంగా కారణాలు తెలియవు. అయితే మహిళల్లో బరువు పెరగడం, స్థూలకాయం, హార్మోన్ల తేడాలు, వ్యాయామం అంతగా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణాలని చెప్పవచ్చు. కీళ్లనొప్పుల్లో ముఖ్యమైనది అవాస్క్యులార్ నెక్రోసిస్... భారతదేశంలో చాలామందికి ఒక వయసు దాటాక తుంటిఎముక నొప్పి సాధారణంగా కనిపిస్తుంటుంది. మన తొడ ఎముకపై భాగం ఒక గుండ్రటి బంతిలా ఉండి, అది తుంటి ఎముకలోని గిన్నె వంటి భాగంలో కదులుతూ ఉంటుందన్నది తెలిసిందే. కొంతమందిలో ఈ బంతివంటి భాగానికి రక్తసరఫరా అందదు. దాంతో ‘అవాస్క్యులార్ నెక్రోసిస్’ (ఏవీఎన్) అనే కండిషన్ ఏర్పడి తీవ్రమైన తుంటి నొప్పి వస్తుంది. మిగతా ఎముకలూ, కీళ్ల విషయంలోనూ ఇది జరగవచ్చు. కానీ ప్రధానంగా తుంటి ఎముక దగ్గర నొప్పి రావడమే మన దేశంలో చాలా ఎక్కువ. దీనికి కారణాలేమిటి అన్న విషయం నిర్దిష్టంగా తెలియదు. అయితే ఆల్కహాల్, స్టెరాయిడ్స్ కూడా ఇందుకు కొంతవరకు కారణం కావచ్చని తెలుస్తోంది. కాబట్టి ఎముకలు బలంగా, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్, స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. డాక్టర్ గురవారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ – చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కిడ్నీపై దుష్ప్రభావం పడిందంటున్నారు
నాకు గతంలో లూపస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కొంతకాలం కిందట మూత్రపరీక్ష చేయించినప్పుడు లూపస్ కారణంగా నా కిడ్నీలపై దుష్ప్రభావం పడి, లూపస్ నెఫ్రైటిస్ వచ్చినట్లు చెప్పారు. దయచేసి ఈ వ్యాధి గురించి విపులంగా వివరించి, నాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి అధిక రక్తపోటును నియంత్రించడం, తగినన్ని లవణాలనూ, ఖనిజాలనూ రక్తంలో నిర్వహితమయ్యేలా చూడటం, ఎర్రరక్తకణాలను తయారు చేయడం, ఎముకకు బలాన్ని చేకూర్చడం వంటి అత్యంత కీలకమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. అంతేకాదు... రక్తంలోని విషపూరితమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తాయి. మూత్రపిండాల సాధారణ వడపోత కార్యకలాపాలలో ఎర్రరక్తకణాలుగానీ, ప్రోటీన్లు గానీ బయటకు పోవు. అయితే ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు దెబ్బతింటే ఎర్రరక్తకణాలూ, ప్రోటీన్లు బయటకు పోతూ, హానికరమైన విషపదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా పేర్కొనవలసింది ‘లూపస్ నెఫ్రైటిస్’ లూపస్ నెఫ్రైటిస్ లక్షణాలు అదుపు తప్పిన రోగనిరోధక శక్తి ప్రభావం కిడ్నీల మీద పడినప్పుడు ‘లూపస్ నెఫ్రైటిస్’ వ్యాధి వస్తుంది. లూపస్ లక్షణాలు మొదలైన రెండు లేదా మూడేళ్ల తర్వాత కిడ్నీపై దాని దుష్ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు లూపస్ ప్రారంభదశలోనే నేరుగా కిడ్నీపై ప్రభావం పడవచ్చు కూడా. ఈ వ్యాధి ప్రారంభదశలో పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. తరచూ కాళ్ల వాపు, ముఖంలో వాపు, కనురెప్పలు బరువుగా ఉండటం, మూత్రంలో అధికంగా నురుగు కనిపించడం, కొన్నిసార్లు మూత్రంలో ఎరుపు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటేలూపస్ ఉన్న వ్యక్తుల్లో 60 శాతం మందిలోనూ, చిన్నపిల్లల్లో దాదాపు మూడింట రెండు వంతుల మందిలో దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. దీని తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ. గుర్తించడం ఎలా సాధ్యమైనంత వరకు తొలిదశలోనే గుర్తించడం వల్ల రోగికి ఎంతో మేలు చేకూరేందుకు అవకాశం ఉంది. దీని లక్షణాలు నిర్దుష్టంగా పైకి కనిపించవు కాబట్టి ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే తరచూ మూత్రపరీక్ష చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ప్రోటీన్లు, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూత్రపిండాల బయాప్సీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధి ఏ స్థాయిలో ఉందన్న విషయం బయాప్సీ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైన చికిత్సను రుమటాలజిస్టులు సూచిస్తారు. లూపస్ నెఫ్రైటిస్ వల్ల కలిగే నష్టాలు లూపస్ నెఫ్రైటిస్ రెండు కిడ్నీల మీద కూడా సమానంగా ప్రభావం చూపుతుంది. ఎంత మెరుగైన చికిత్స తీసుకున్నప్పటికీ దాదాపు 10 నుంచి 20 శాతం మందిలో కిడ్నీల పై ఒక పొర ఏర్పడి, కిడ్నీలు శాశ్వతంగా పాడైపోతాయి. దాంతో ఒంట్లో నీరు పేరుకుపోవడం, రక్తహీనత, అధికరక్తపోటు వంటి అనర్థాలు ఏర్పడతాయి. అలాంటివారికి దీర్ఘకాలికంగా డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం. అంతేకాదు... ఈ జబ్బు ఉన్నవారు తేలిగ్గా అంటువ్యాధులకు గురవుతుంటారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే లూపస్ వ్యాధి నిర్ధారణ జరగగానే వెంటనే రుమటాలజిస్టుల పర్యవేక్షణలో కిడ్నీలపై ఆ వ్యాధి ప్రభావాన్ని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చికిత్స విధానాలు ఎస్ఎల్ఈకి శాశ్వతమైన చికిత్స అందుబాటులో లేదు. అయితే జబ్బు ప్రభావం కిడ్నీ మీద పడుతున్నప్పుడు సరైన సమయంలో మందులు మొదలుపెట్టాలి. దానివల్ల సమస్య ముదరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీనికోసం ఇమ్యూనోసప్రసెంట్స్ మందులను వాడాల్సి ఉంటుంది. ఇవి అదుపుతప్పిన రక్షణ వ్యవస్థను సరైన దారిలో పెట్టి కిడ్నీ ఫెయిల్ కాకుండా కాపాడతాయి. కీళ్లవాతానికి మందులు వాడినా ప్రయోజనం లేదు... నా వయసు 45 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా బాధ చాలా తీవ్రంగా ఉంది. నొప్పులు భరించలేకుండా ఉన్నాను. ఈ సమస్యకు మంచి పరిష్కారాలు ఏవైనా ఉంటే వివరంగా చెప్పండి. కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని నిర్లక్ష్యం చేసి, వ్యాధిని ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, పూతమందుల వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్ఆర్డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్‌కి వాడేలాంటివనే అపోహ ఉంది. దాంతో బాధ తీవ్రంగా ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. బయోలజిక్స్ గురించి... సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్క్లీరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన రోగుల్లో... వ్యాధి ముదరడం వల్ల బాధల తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్‌సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరీజు వేసుకొని, సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
ఆర్థరైటిస్.. నడవలేం.. కదల్లేం
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. అందులో ఆర్థరైటిస్ కూడా ఒకటి. అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత పదేళ్లలో ఆర్థరైటిస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50–60 ఏళ్లలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35–40 ఏళ్లలోనే చూస్తున్నాం. దీన్ని ముందుగా గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మున్ముందు నడవలేని, కదల్లేని పరిస్థితులు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒక్కోసారి ఎముకలు గుళ్లబారి విరిగిపోయే ప్రమాదమూ ఉంది. అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినం సందర్భంగా ఈ అంశంపై ‘సాక్షి’ కథనం. – సాక్షి, హైదరాబాద్ ఆర్థరైటిస్ అంటే..? కీళ్ల అరుగుదలనే ఆర్థరైటిస్ అంటాం. కీళ్ల నొప్పులు అధికంగా తుంటి, మోకాలులో వస్తుంటాయి. చేతి, మోచేతిలోనూ కీళ్ల నొప్పులు రావచ్చు. శరీరంలో మోకాలే పెద్ద కీలు. శరీర బరువును సగానికిపైగా మోకాలే మోస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లలో ఉండే కీలకమైన మృదులాస్థి అనే పదార్థం కరిగిపోతుంది. అది నిరంతరం కరుగుతూ మళ్లీ ఏర్పడుతుండటం దాని ప్రత్యేకత. అయితే 40–45 ఏళ్ల మధ్య మృదులాస్థి పునరుత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీంతో కీళ్లవాపు, నొప్పి, నడవలేకపోవడం వంటివి వస్తాయి. ఈ విధంగా జరగడాన్నే కీళ్ల నొప్పి లేదా ఆర్థరైటిస్ అంటారు. జీవనశైలిలో మార్పుల కారణంగా.. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయసు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. గత దశాబ్ద కాలం నుంచి ఆర్థరైటిస్ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరిగినందున డాక్టర్ల వద్దకు వస్తున్నారు. కాబట్టి కేసుల సంఖ్య కూడా అధికంగా కనిపిస్తుంది. గత పదేళ్లలో సాపేక్షికంగా ఆర్థరైటిస్ కేసులు పెరిగాయి. దానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పులే కారణం. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనిస్తున్నాం. వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్థి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. గతంలో 50–60 ఏళ్లకు మాత్రమే మోకాలి నొప్పులు వచ్చేవి. గత 10 ఏళ్లలో 35–40 ఏళ్ల మధ్యలోనూ మోకాలి నొప్పులు చూస్తున్నాం. కింద కూర్చోవడం వల్ల, సాధారణ మరుగుదొడ్లు వాడినా మోకాలి నొప్పులు వస్తాయి. వెస్ట్రన్ కమౌడ్ను వాడకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ముందు నుంచీ కింద కూర్చోవడం, టీనేజీలోనే యోగా వంటి సాధనలు చేస్తే ఇక సరేసరి. లేకుంటే 35 దాటాక కింద కూర్చునే పద్ధతిని కొత్తగా మొదలుపెట్టడం, అదే వయసులో యోగా చేయడంలో భాగం గా కింద కూర్చోవడం వంటివి చేసినా ఈ సమస్య వస్తుంది. మునులు కింద కూర్చొనే ధ్యానం చేసేవారు. వారికి ఎటువంటి సమస్యలు రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ వాళ్లు అలా చేయడం వల్ల శరీరం మొత్తం అందుకు అలవాటు పడుతుంది. ఇతర కీళ్ల నొప్పులు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎంకైలోడింగ్ ఆర్థరైటిస్ అనే 2 రకాలున్నాయి. సాధారణ ఆర్థరైటిస్‌కు ఈ రెండూ భిన్నం. ఈ రెండింటిలో ఉపశాఖలుగా మరో 15 ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఇవి రావడానికి జన్యుపరమైన కారణాలే అధికంగా ఉంటాయి. తల్లిదండ్రులకు లేకపోయినా వారి వంశంలో ఎవరికి ఉన్నా వచ్చే అవకాశం ఎక్కువ. వీరికి మోకాలు, భుజం, తుంటి తదితర చోట్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి రక్త పరీక్షలు చేయాలి. బీపీ, షుగర్ ఎలాగో ఈ 2 రకాల ఆర్థరైటిస్లు వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఒకసారి తగులుకుంటే వదిలిపెట్టవు. పూర్తిగా నిర్మూలించలేం. స్టెరాయిడ్స్ తదితర మందులు వాడటం వల్ల వీటిని నియంత్రించవచ్చు. ఇక సోరియాసిస్ కూడా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. రీటస్ డిసీజ్ అంటే కంటి చూపు మందగించడం ద్వారా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశముంది. ఇలాంటి జబ్బులు వస్తే 20–30 ఏళ్లకే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి వయసుతో సంబంధంలేదు. ఇటీవల 16 ఏళ్ల టీనేజీ బాలుడికి ఆపరేషన్ చేశారు. 30 ఏళ్లు.. 3 కిలోమీటర్లు.. 30 ఏళ్ల మనిషి రోజుకు కనీసం 3 కిలోమీటర్లు నడవాలి.. 8 గంటలు పనిచేయాలి. అప్పుడు మృదులాస్థి పునరుత్పత్తి జరిగి కీళ్ల నొప్పులు రావు. వ్యాయామం వారానికి కనీసం 3 రోజులు చేయాలి. పొగ తాగకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీరానికి తగ్గట్లు బరువుండాలి. ఆర్థరైటిస్‌ను ముందుగా గుర్తించకపోతే పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఫలితంగా గుండెకు చేటు తెస్తుంది. అలాగే మెటబాలిజం తగ్గుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థరైటిస్ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఆర్థరైటిస్ 4 దశల్లో ఉంటుంది. పరీక్షలు చేయించుకుని అది ఏ దశలో ఉందో గుర్తించాలి. నాలుగో దశలోనే ఆపరేషన్ ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కాళ్లు వంగిపోతాయి. బలహీనమై పోతాయి. ఎముకలు విరిగిపోతాయి. ఇలాంటి నాలుగో దశలోనే సాధారణంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వయసు ద్వారా వచ్చే కీళ్ల నొప్పులు సాధారణంగా 50–60 ఏళ్లలో కనిపిస్తుంటాయి. రైతులు, భవన నిర్మాణ కార్మికులు, బాగా కష్టపడి పనిచేసే వాళ్లు నొప్పులు ఓర్చుకోగలరు. కాబట్టి వారికి కీళ్ల నొప్పుల తీవ్రత 60–70 ఏళ్ల తర్వాతే అర్థమవుతుంది. ఆడవారు ఎక్కువగా కింద కూర్చోవడం, పూజలు చేయడం వల్ల వారికి ఎక్కువగా కీళ్ల నొప్పులు వస్తాయి. – డాక్టర్ దశరథరామారెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆస్పత్రి ఆర్థరైటిస్ పెరగకుండా చూసుకోవాలి కీళ్ల అరుగుదలను తగ్గించుకోవాలి. 20 శాతం అరుగుదల ఉంటే, దాన్ని పెరగకుండా చూసుకోవాలి. మృదులాస్థి పెరగడానికి మందులు ఇస్తారు. అవి వాడాలి. సైక్లింగ్, ఈత వంటివి చేయాలి. దీని వల్ల కీళ్లపై ప్రభావం చూపదు. నిర్ణీత మోతాదులో డాక్టర్ల సూచన మేరకు నడవవచ్చు. ఏదైనా సమతుల్యమైన శారీరక శ్రమ, వ్యాయామం అవసరం. ఆర్థరైటిస్ ప్రాథమిక దశలో ఉంటే మందులు మాత్రమే వాడాలి. అది ముదిరిపోయి నాలుగో దశకు వచ్చాకే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ మురళీధర్, ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆస్పత్రి -
కీళ్లవాతం.. కొన్ని నిజాలు
కీళ్లవాతం మనిషికి తెలిసిన జబ్బుల్లో అత్యంత పురాతనమైన, దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ప్రజలు కీళ్లవాతం వ్యాధులతో బాధపడుతున్నారు. ఐయితే చాలామంది తమ బాధల గురించి వైద్యులకు చెప్పరు. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ వచ్చే సమస్యని అంగీకరిస్తారు. మరికొంతమంది ఈ సమస్యకు చికిత్స లేదని భావిస్తారు. ఇవేమీ నిజం కాదు. కీళ్లవాతం అంటే... కీళ్లవాతం అంటే కేవలం కీళ్ల దగ్గర మాత్రమే ఉంటుందనీ శరీరంలో ఏ ఇతర అవయవాల మీద దాని ప్రభావం ఉండదన్నది వాస్తవం కాదు. కీళ్లవాతం అనేది ఒక సాధారణమైన పదం. కానీ కీళ్లవాత సంబంధిత వ్యా«ధుల్లో వందకు పైగా రకాలున్నాయి. సమాజంలో ఈ వ్యాధులపైన పూర్తి అవగాహన లేదు. ఈ వ్యాధులకు పూర్తి స్థాయిలో వైద్యం చేసే అర్హులైన రుమటాలజిస్టులు కూడా దేశంలో చాలా తక్కువమందే ఉన్నారు. ఈ రెండు కారణాలవల్ల ఈ వ్యాధులతో రోగికి ఎంతో నష్టం చేకూరుతోంది. అసలు ఈ జబ్బులు ఎందుకు వస్తాయి? మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ మనలోకి ఇన్ఫెక్షన్ కలగజేసే క్రిములు చొరబడకుండా కాపాడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కంచే చేను మేసినట్లుగా ఈ రోగనిరోధక వ్యవస్థ మన సొంత అవయవాల మీదే దాడికి దిగి శరీరాన్ని నాశనం చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అంటారు. దీనివల్ల శరీరంలోని ఏ భాగంపై ప్రభావం పడుతుందో ఆ అవయవం పనితీరు తగ్గుతుంది. ఈ ప్రక్రియలో సాధారణంగా కీలు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఆటో ఇమ్యూన్ వ్యాధులలో కీళ్లనొప్పి మొదట బయటపడతాయి. కేవలం కీలు మీదే కాకుండా తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు దేనినైనా నాశనం చేసే శక్తి ఈ జబ్బులకు ఉంటుంది. జన్యుప్రవర్తన, పర్యావరణంలో జరిగే మార్పులు, అనేక రకాలైన వైరస్, ఇతర క్రిముల వల్ల ఈ జబ్బులు రావచ్చు. వీటిని గుర్తించడం ఎలా? కీళ్లవాతంలో కీళ్ల దగ్గర వాపు, నొప్పి, దృఢత్వం తగ్గడం అనేవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ జబ్బులు ఏ లక్షణాలతోనైనా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా చాప కింద నీరులా గానీ, అకస్మాత్తుగా గాని ప్రారంభం కావచ్చు. తేలికపాటిగా ఉండటం మొదలుకొని కొన్ని నిమిషాలు లేదా గంటలలోనే తీవ్రరూపం దాల్చేలా కూడా ఉండవచ్చు. దీని తీవ్రత తరచూ మారుతుంటాయి. అలాగే లక్షణాలు కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. అందరిలో ఒకేలా వ్యక్తం కావు. విపరీతమైన అలసట, బరువు తగ్గడం, ఆకలి మందగించడం అనేవి సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత ముదిరే ముందునుంచే ఈ లక్షణాలు ఉంటాయి. యుక్తవయసులో ఉన్నవారికి తరచూ గర్భస్రావం జరగడం, పక్షవాతం రావడం, గుండెపోటు రావడం, దీర్ఘకాలంగా మానని పుండ్లు, చర్మం మీద మచ్చలు, తరచూ విరేచనాలు, నడుమూ, మెడ నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పొర ఏర్పడటం, నోరెండిపోవడం వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. ఈ జబ్బులు ఎవరిలో రావచ్చు? వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవి తీవ్రరూపం దాలుస్తాయి. చిన్నవారిలో, పెద్దవారిలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇవి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. సాధారణ కీళ్లవాతాలు : రుమటాయిడ్ ఆర్థరైటిస్ : ఈ జబ్బులో మన సొంత రోగనిరోధక వ్యవస్థ కీళ్ల మధ్యన ఉండే పొరపై ప్రభావం చూపి, కీళ్లను ధ్వంసం చేస్తుంది. చేతివేళ్లు, కాళ్ల వేళ్లు, మోచేతుల కీళ్లు ప్రభావితమవుతాయి. నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా చెడిపోయి వంకర్లు తిరుగుతాయి. గుండె, శ్వాసవ్యవస్థ, మెదడు, మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకోకపోతే మరణం సంభవించే అవకాశాలు 60% వరకు ఉంటాయి. ఎస్‌ఎల్‌ఈ/లూపస్: ఈ రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి ప్రవర్తిస్తుంది. శరీరంలోని చర్మం, కీళ్లు, కిడ్నీలు, రక్తకణాలు, మెదడుతో పాటు ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. దీన్ని అత్యంత తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువ. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్యసంబంధిత కారణాలతో జీవన నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే వీళ్లలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఇటీవల ఈ వ్యాధి కారణంగా హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. వ్యాధి ఉన్నవారిలో గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం, బరువు తక్కువగా పుట్టడం వంటివి కూడా తరచూ జరుగుతుంటాయి. జాగ్రన్స్ సిండ్రోమ్ : రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలోని తేమని ఉత్పత్తి చేసే గ్రంథుల మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఒంటికి కావలసిన తేమ, లాలాజలం, కన్నీరు ఉత్పత్తి తగ్గి చర్మం, నోరు, కళ్లు ఎండిపోవడం జరుగుతుంది. విపరీతమైన అలసట ఉంటుంది. అలాగే కీళ్ల దగ్గర నొప్పి, వాపు వస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ పైన కూడా ప్రభావం పుడుతుంది. ఈ జబ్బు సాధారణంగా 40, 50 ఏళ్ల వయసులఉన్న మహిళల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి తరచుగా ఇతర రుమాటిక్ వ్యాధులతో కలిసి వ్యక్తమవుతుంటుంది. మయోసైటిస్ : శరీర కదలికల్లో కండరాల భూమిక చాలా ప్రధానం. ఈ మయోసైటిస్ అనే తరహా కీళ్లవాతంలో మన రోగనిరోధక శక్తి కండరాలపై దాడిచేసి కదలకుండా మంచం పట్టేట్టు చేస్తుంది. తొలిదశలో గుర్తించకపోతే ఊపిరి తీసుకోడానికి తోడ్పడే కండరాలపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతుంది. అలాగే చర్మం, కీళు ఊపిరితిత్తుల మీద కూడా ఈ తరహా కీళ్లవాతం ప్రభావం చూపుతుంది. ఇది చిన్నపిల్లల్లోనూ తరచూ కనిపించవచ్చు. సిస్టమిక్ స్క్లిరోసిస్ : పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు నల్లగా మారడం, చర్మం బిగుతుగా మారి పుండ్లు పడటం, చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు వేళ్లు నీలంగా, తెల్లగా మారి కుళ్లిపోవడం వంటివి తరచూ జరుగుతాయి. అలాగే దీని ప్రభావం గుండె, జీర్ణకోశం, ఊపిరితిత్తులు (ఐఎల్‌డి), కండరాలు, కీళ్ల మీద పడుతుంది. స్పాండైలో ఆర్థరైటిస్: మిగతా కీళ్లవాతాలకు భిన్నంగా ఇది పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. దీన్ని యాంకైలోజింగ్ స్పాండలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఐబిడి ఆర్థరైటిస్ అనే రకాలుగా విభజించవచ్చు. యుక్తవయసులోని పురుషుల్లో విపరీతమైన నడుమునొప్పితో, నడుము దగ్గర బిగుతుగా పట్టేసి కదల్లేని స్థితి కలిగిస్తుంది. అశ్రద్ధ చేస్తే కాలక్రమేణా వెన్నెముక వెదురు కర్రలా మారిపోయి జీవననాణ్యత కోల్పోవడం జరుగుతుంది. వీరి చర్మంపై సోరియాటిక్ మచ్చలు, కళ్లలో యువిౖయెటిస్, తరచూ విరేచనాలు కావడం, మడమల్లో విపరీతమైన నొప్పి రావడం కూడా తరచూ జరుగుతంటాయి. పిల్లల్లో కీళ్లవాతం : జువెనైల్ ఆర్థరైటిస్ అనేది పిల్లల్లో తరచూ చూసే ఒక రకం కీళ్లవాతం. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కవ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటిచూపు మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువ. -
వరుసగా గర్భస్రావాలు... సంతానభాగ్యం ఉందా?
ఒకదాని తర్వాత ఒకటిగా మలబద్దకం – విరేచనాలు నా వయసు 37 ఏళ్లు. ఒక్కోసారి తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి .దయచేసి నా సమస్య ఏమిటి? నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – జె. నరేశ్‌కుమార్, నేలకొండపల్లి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ’ మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ పొద్దున్నే కీళ్లు పట్టేస్తున్నాయి... ఎందుకిలా? నా వయసు 37 ఏళ్లు. నేను పదేళ్లగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున్న లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం ఉంటోంది. ఈఎస్ఆర్ పెరిగి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? – కె. రమణి, మదనపల్లె మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో ఒకరక. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ పొరబడి తన సొంత శరీరంపైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్ల మాత్రమే కాకుండా కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది. కారణాలు: ∙శరీరంలోని జీవక్రియల్లో అసమతౌల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. ∙శారీరక, మానసిక ఒత్తిడి పొగతాగడం, మద్యం అలవాటు ఉటంన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ∙ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: ∙నిరాశ, అలసట, ఆకలితగ్గడం, బరువు తగ్గడం ∙మడమ చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ∙ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ∙ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ∙రక్తహీనత, జ్వరం వంటివి. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఎఫ్టీ. చికిత్స: రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ వరుసగా గర్భస్రావాలు... సంతానభాగ్యం ఉందా? నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? – ఒక సోదరి, నెల్లూరు గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ఇవి తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయి...
ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచంలోని 18 శాతం మంది మహిళలు, 9.6 శాతం మంది పురుషులు ఆర్థటైటిస్(కీళ్లనొప్పులు)తో బాధ పడుతున్నట్లు పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. అయితే ఆర్థటైటిస్ సమస్యతో బాధపడేవారికి విముక్తి కలిగించేందుకు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులు పరిష్కారం కనుగొన్నారు. గతంలో చేసిన 68 పరిశోధనలను విశ్లేషించి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు పలు అంశాలు వెల్లడించారు. రోజుకు ఒక గ్రామ్ చేప నూనె(ఫిష్ ఆయిల్) క్యాప్యూల్స్ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు.. హృద్రోగ సమస్యలు కూడా నివారించవచ్చని పేర్కొన్నారు. చేపనూనెలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కీళ్ల వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ విషయాలను రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు.. వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సర్రే యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్గరెట్ రేమాన్ తెలిపారు. విటమిన్- కె సమృద్థిగా ఉంటేనే.. పాలకూర, కొత్తిమీర, క్యాబేజీలలో విటమిన్- కె అధికంగా ఉంటుంది కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా ఇవి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా కీళ్లనొప్పులకు చెక్ పెట్టవచ్చన్నారు. విటమిన్- కె లోపం ఉన్నవారిలో ఎముకల పెరుగుదల మందగిస్తుందని.. అంతేకాకుండా ఇది ఆస్టియో ఆర్థటైటిస్కు దారి తీస్తుందని పేర్కొన్నారు. బరువు తగ్గితేనే.. ఊబకాయం వల్ల కీళ్లపై బరువు పడటంతో పాటు శరీరంలోని వ్యవస్థాపక మార్పులపై ప్రభావం కూడా చూపుతుంది. డైట్ పాటించడంతో పాటు.. ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా శరీర బరువు తగ్గించుకుంటే ఆర్థటైటిస్ను కొద్దిమేర తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. -
పిల్లల చురుకుదనానికి కారణం తెలిసింది..
రోజంతా తెగ ఆడుకున్నా.. ఎన్నిసార్లు ఎగిరి గంతేసినా.. అలసిపోయామన్న మాట మాత్రం పిల్లల నోటి వెంబడిరాదు. ఎందుకిలా? అన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆంథోని బ్లాజోవిచ్కు వచ్చింది. పిల్లల్లో ఉండే ఒకరకమైన కండరాలు నీరసించిపోవడాన్ని అడ్డుకోవడం మాత్రమే కాకుండా.. ఎంత తీవ్ర శ్రమ నుంచైనా ఇట్టే తేరుకోగలవిగా ఉంటాయని ఆంథోనీ చెబుతున్నారు. పెద్దలతోపాటు చిన్నవారు, శిక్షణ పొందిన క్రీడాకారులు.. వ్యాయామం చేసిన తరువాత మళ్లీ తేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో గుర్తించడం ద్వారా వీరు ఒక పరిశోధన చేశారు. పిల్లలు క్రీడాకారులుగా మారేందుకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆంథోని అంటున్నారు. ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయస్కులు కొంతమందిని కొన్ని బృందాలుగా విడదీసి వారిచేత వేర్వేరు వ్యాయామాలు, సైక్లింగ్ వంటి శారీరక శ్రమ చేయించారు. ప్రతి విభాగంలోని పిల్లల శరీరాల్లో శక్తి ఎలా పుడుతోందో (రక్తంలోని ఆక్సిజన్‌ను వాడుకోవడం ఇలా అన్నమాట) గుర్తించారు. దీంతోపాటు గుండె కొట్టుకునే వేగం, ఆక్సిజన్ మోతాదులు, లాక్టేట్ విసర్జితమయ్యే వేగం వంటివాటిని పరిశీలించారు. మొత్తమ్మీద తేలింది ఏమిటంటే.. పిల్లలు గుండె వేగాన్ని చాలా వేగంగా నియంత్రించుకోగలుగుతున్నారని, లాక్టేట్ కూడా వారి శరీరాల్లోంచి వేగంగా బయటకు వెళ్లిపోతోందని ఆంథోని తెలిపారు. ఈ రెండు అంశాల వల్లనే ఎక్కువ శారీరక శ్రమ చేసినా అలసిపోకుండా ఉంటున్నారని, తొందరగా తేరుకోగలుగుతున్నారని వివరించారు. -
వంట సోడా తాగితే మేలే!
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా? అయితే ఇకపై ఒక పద్ధతి ప్రకారం బేకింగ్ సోడాను తీసుకోవడం మొదలుపెట్టండి. ఒక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కాదు.. టైప్–1 మధుమేహంతోపాటు అనేక ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎదుర్కొనేందుకు బేకింగ్ సోడా చక్కగా ఉపయోగపడుతుందని ఆగస్టా యూనివర్సిటీకి చెందిన మెడికల్ కాలేజీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తలు అంటున్నారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇందులో ఉన్న శాస్త్రం ఏమిటో డా.పాల్ ఓ కానర్ అనే శాస్త్రవేత్త వివరించారు. సోడియం బైకార్బొనేట్ అని పిలిచే ఈ బేకింగ్ సోడాను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయని తద్వారా ఆ తరువాత తినే ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయాల్సిన అవసరం లేదంటూ క్లోమగ్రంథిపై ఉన్న కొన్ని ప్రత్యేక కణాలు సందేశాన్ని పంపేలా చేస్తాయి. క్లోమగ్రంథి కూడా రోగ నిరోధక వ్యవస్థలో భాగమన్నది తెలిసిందే. రెండు వారాలపాటు బేకింగ్ సోడా ద్రావణాన్ని తాగిన కొంతమందిని పరిశీలించినప్పుడు మాక్రోఫేగస్ అనే రోగ నిరోధక కణాలు తమ స్థితిని మార్చేసుకుని మంట/వాపు తగ్గించేందుకు ఉపయోగపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజువారీ బేకింగ్ సోడా సేవనం ద్వారా అసిడిటీ తగ్గడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య కూడా మందగిస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
నిద్రలేచిన వెంటనే నడవలేకపోతున్నాను
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. మూడు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటి? తగిన సలహా ఇవ్వండి. – డి. అనసూయమ్మ, సామర్లకోట మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి. ఎముకల్లో రాత్రివేళ నొప్పి... ఎందుకిలా? నా వయసు 48 ఏళ్లు. కొన్ని నెలలుగా కాళ్ల ఎముకల్లో రాత్రి వేళల్లో నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి, యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. కానీ ఎలాంటి ప్రయోజనమూ కనిపించడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – డి. చంద్రశేఖర్‌రావు, విజయవాడ మీకు ఎక్కువగా రాత్రివేళల్లో ఎముక నొప్పి వస్తోందటున్నారు. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీకు ఎముక క్యాన్సర్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. మామూలుగా ఎముక క్యాన్సర్‌ను నొప్పితోగాని, నొప్పి లేకుండా కణుతులతోగాని గుర్తిస్తారు. ఎముకకు సంబంధించిన మృదు కణజాలంలో క్యాన్సర్ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. ఎముకలో గట్టిగా ఉండే భాగంలో క్యాన్సర్ వస్తే మాత్రం నొప్పి, ఆ భాగంలో వాపు ముందుగా కనిపిస్తాయి. ఎముక క్యాన్సర్ రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఎముకకు చుట్టు కొంత భాగం వరకు వాపు ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి ఒక చోటి నుంచి ఇంకో చోటికి వ్యాపించకుండా ఉండటానికి మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీని బయట కొంత భాగం వరకు ఉన్న భాగాన్ని ‘రియాక్టివ్ జోన్’ అంటారు. క్యాన్సర్ వ్యాప్తిని నివారించడానికి ప్రకృతి చేసిన ఏర్పాటిది. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారికి ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి క్యాన్సర్ దుష్ప్రభావాలు, మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ఆ భాగంలో కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడికక్కడే రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలా మంది ఎముకలో నొప్పి, వాపు కనిపించగానే మసాజ్ చేయిస్తుంటారు. అందుకే నొప్పి, వాపు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చిన్న దెబ్బ తగిలినా ఎంతో నొప్పి! నా బరువు 87 కేజీలు. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు. నాకు యూరిక్ యాసిడ్ కాస్త ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులో వచ్చింది. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేనంత నొప్పి వస్తోంది. ఎముకలు చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. నాకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలా రోజులు ఉంటోంది. నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – రాధిక, నల్లగొండ మీరు మీ వయసెంతో మీ లేఖలో చెప్పలేదు. అయితే మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ ఎత్తుకు మీరు చాలా బరువు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మొదట మీరు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. బాడీమాస్ ఇండెక్స్ ప్రకారం మీ ఎత్తుకు సరిపడ బరువు ఉండేలా చూసుకోవాలి. మీరు చాలా బరువు పెరగడం వల్ల ఆ భారమంతా మీ ఎముకలపై పడి అవి నాజూకుగా తయారయ్యాయి. ఆ కారణంగానే మీకు ఇలా నొప్పి వస్తుండవచ్చు. మీరు కొద్దిగా ఆహారనియమాలు పాటిస్తూ, ఉదయం సాయంత్రం వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ మీ అధిక బరువును నియంత్రించుకోండి. అలాగే రోజూ ఉదయం ఒక క్యాల్షియం మాత్ర తీసుకుంటూ ఉండండి. ఇలా మూడు నెలలు చేయండి. దాంతో మీ బరువు నియంత్రణలోకి వచ్చి మీ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కీళ్లనొప్పులకు మెరుగైన చికిత్స!
కీళ్లనొప్పులకు మరింత మెరుగైన చికిత్స కల్పించే లక్ష్యంతో యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కీళ్లలోనే సరికొత్త మృదుకణజాలాన్ని వృద్ధి చేయగల సరికొత్త మందును వీరు కనుక్కోగలిగారు. ఆర్సీజీడీ 423 అని పిలుస్తున్న ఈ సరికొత్త రసాయనాన్ని ఇంజెక్షన్ రూపంలో కీళ్లల్లోకి ఎక్కించుకుంటే చాలు.. ఆ ప్రాంతంలో వాపు/మంట తగ్గడమే కాకుండా కొంతకాలానికి అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణజాలం పుట్టుకొస్తుంది. శరీరంలోని గ్లైకోప్రోటీన్ 130ను ప్రభావితం చేయడం ద్వారా ఇది పనిచేస్తుందని... కణజాలాన్ని అభివృద్ధి చేయాలన్న సందేశాన్ని చేరవేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎవ్సీన్కో చెప్పారు. పరిశోధనశాలలో చేసిన ప్రయోగాల్లో ఆర్సీజీడీ 423ని ఉపయోగించినప్పుడు కీళ్లలోని కణాలు వేగంగా ఎదగడంతోపాటు.. మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, కణజాలం అరిగిపోయిన ఎలుకల్లోకి దీన్ని జొప్పించినప్పడు తక్కువ సమయంలనే సమస్య మాయమైపోయిందని తెలిపారు. ఎముకలు గుల్లబారే సమస్యతోపాటు చిన్న వయస్కుల్లో కనిపించే కీళ్లనొప్పులకూ ఈ కొత్త మందును ప్రయోగించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
కీళ్లనొప్పులకు చెక్ పెట్టండిలా..
శరీరంలో తగినంత విటమిన్ డి ఉంటే.. కీళ్లనొప్పులను నివారించవచ్చునని అంటున్నారు బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అయితే ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తరువాత ఈ విటమిన్‌ను సాధారణ మోతాదులో తీసుకోవడం వల్ల ఫలితం తక్కువని తాము నిర్వహించిన పరిశోధన ద్వారా స్పష్టమైందని ప్రొఫెసర్ మార్టిన్ హ్యూయిసన్ తెలిపారు. వ్యాధి కారణంగా శరీరం విటమిన్ డీకి వ్యతిరేకంగా స్పందించడం దీనికి కారణమని ఆయన తెలిపారు. సాధారణంగా కీళ్లనొప్పులతో బాధపడే వారిలో అత్యధికులకు విటమిన్ డి లోపం ఉంటుందని.. అందువల్ల వీరికి సాధారణం కంటే ఎక్కువ మోతదులో ఈ విటమిన్‌ను ఇవ్వడం ద్వారా వాపును నియంత్రించే అవకాశం ఉంటుందని వివరించారు. లేదంటే ఈ విటమిన్‌ను శరీరం శోషించుకునేందుకు అనువైన చర్యలు చేపట్టాలని చెప్పారు. కీళ్లనొప్పులు ఉన్న వారి నుంచి సేకరించిన రోగనిరోధక కణాలపై తాము పరిశోధనలు చేసినప్పుడు ఈ విషయాలన్ని తెలిశాయని మార్టిన్ తెలిపారు. విటమిన్ డీ లోపంతో కీళ్లల్లో వాపు/మంట ఎందుకు వస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నామని, తద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. -
25 ఏళ్లకే కీళ్ల అరుగుదల
సాక్షి, హైదరాబాద్: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, అశాస్త్రీయ వ్యాయామం అన్నీ కలిపి ఇరవై ఐదేళ్లకే కీళ్లు అరిగిపోతున్నాయి. యాభైల్లో వచ్చే కీళ్ల అరుగుదల ఇప్పుడు యుక్త వయసులోనే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కీళ్ల నొప్పుల పేరుతో వచ్చే కేసుల్లో 20 శాతానికిపైగా అరుగుదల సమస్యతో బాధపడేవారే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మనిషి ఎంతో ఫిట్‌గా ఉన్నా కీళ్ల అరుగుదల పట్టి పీడిస్తుంది. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోందని చెబుతున్నారు. క్రీడలు, అధిక వ్యాయామం, జాగింగ్, అశాస్త్రీయ యోగా తదితరాల పట్ల ఆసక్తి కనిపించే ఇక్కడి వారిలో కీళ్ల అరుగుదల సర్వసాధారణమైందని అంటున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో ఏడాదికి దాదాపు 35 వేల కీళ్ల అరుగుదల కేసులు ఆసుపత్రులకు వస్తున్నాయి. నేడు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా కీళ్ల వ్యాధిపై యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథరామారెడ్డి సహకారంతో ‘సాక్షి ’ప్రత్యేక కథనం. అశాస్త్రీయ యోగా... ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ రుమటాయిడ్, ఇన్ఫ్లమేటరీ, సోరియాటిక్, ఆస్టియో, సెకండరీ అని వివిధ రకాల ఆర్థరైటిస్లున్నాయి. ఇవన్నీ వివిధ కారణాల వల్ల వస్తుంటాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్ల అరుగుదల అని అర్థం. సెకండరీ ఆర్థరైటిస్ చిన్నప్పుడు తగిలిన దెబ్బల వల్ల, జాయింట్లో ఎముకలు విరిగి వంకరగా అతుక్కుపోవడం వల్ల కూడా వస్తుంటుంది. కీళ్లను పట్టిఉంచే లిగమెంట్‌కు గాయమైనప్పుడు, జాయింట్ బాలెన్స్ తప్పినప్పుడు కీలు అరిగిపోతుంది. అంతేకాక ట్రెడ్‌మిల్‌పై జాగింగ్, వాకింగ్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, మెట్లు ఎక్కి దిగడం, ఇతరత్రా ఏరోబిక్ వ్యాయామాల వల్ల కూడా చాలామందికి కీళ్లు అరుగుతాయి. ఎముకలు వంకరగా అతుక్కోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. చాలామంది కనీస శిక్షణ కూడా లేకుండా యోగా చేస్తుంటారు. దీనివల్ల కీళ్లు అరిగిపోతాయి. అధిక వ్యాయామంతో ముప్పు.. అధిక వ్యాయామం కీళ్ల అరుగుదలకు దారితీస్తుంది. 45 నిముషాల కంటే ఎక్కువగా వాకింగ్ చేయవద్దు. సిమెంటు, తారు రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ చేయవద్దు. దీనివల్ల ఫిట్నెస్ వస్తుంది కానీ కీళ్లు అరిగిపోతాయి. స్టెరాయిడ్స్ వాడకం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంటుంది. విటమిన్ ‘డి’లోపంతో ఆస్టియో ఫోరోసిస్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. సాధారణంగా జాయింట్లో కొంచెం నొప్పి లేదా మంట ఉంటే ఆర్థరైటిస్‌గా పరిగణించవచ్చు. మెట్లు ఎక్కి దిగేప్పుడు నొప్పి వస్తుంటుంది. పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి ఉంటే దాన్ని తీవ్రమైన కీళ్ల నొప్పిగా చెప్పవచ్చు. ఊబకాయం, అతిగా క్రీడల్లో పాల్గొనడం వల్ల యువతలో ఆర్థరైటిస్ కనిపిస్తుంటుంది. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండీ నిండకముందే యువతకు కీళ్ల అరుగుదల సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్రంగా ఉంటే ఆపరేషన్.. సాధారణ, మధ్యస్థ స్థాయి కీళ్ల అరుగుదలకు ఫిజియో థెరపీ, బరువు తగ్గడంతో నయం చేయవచ్చు. నొప్పి మాత్రలు వేసుకుంటే చాలు. సాధారణానికి మించి కీళ్లు అరిగిపోతే లూబ్రికేటివ్ ఏజెంట్స్ (గుజ్జు)ను ఇంజక్షన్ లేదా మాత్రల రూపంలో ఇస్తారు. ఇక తీవ్రమైన ఆర్థరైటిస్‌కు ఆపరేషనే పరిష్కారం. ప్రస్తుతం కీళ్ల అరుగుదలపై చైతన్యం పెరిగింది. హైదరాబాద్‌లో రోజుకు 50 వరకు సంబంధిత ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆపరేషన్‌పై అపోహలు వద్దు ఆర్థరైటిస్‌కు చేయించుకునే ఆపరేషన్‌పై అనేక అపోహలు ఉన్నాయి. నడవలేరు, ఖరీదు ఎక్కువని ఆపరేషన్ చేశాక నొప్పి ఉంటుందని అనుకుంటారు. ఇది సరైన ధృక్పథం కాదు. ముందుగా ప్రాథమిక స్థాయిలో మందులు, సరైన వ్యాయామం, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయినా తగ్గకపోతే చివరగా ఆపరేషన్ తప్పనిసరి. కీళ్ల అరుగుదల ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోను మెట్లు ఎక్కకూడదు. –డాక్టర్ టి.దశరథరామారెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆసుపత్రి, సోమాజీగూడ, హైదరాబాద్ -
ఆరోగ్యమే మహాభాగ్యం
చింతాకు, నీరు, ఉప్పు కలిపి కాచి, ఆ నీటితో కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రాత్రి నిద్రించే ముందు వేడి నీటిలో కాసింత తేనె కలిపి ఆ నీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లి... కొలెస్ట్రాల్‌ను కరిగించి స్థూలకాయానికి దూరంగా ఉంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని విరివిగా వాడటం మంచిది.. -
మీ సమస్య రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. నాకు చేతుల్లోని కీళ్లలో విపరీతమైన నొప్పి వస్తోంది. కీళ్లవద్ద ఎర్రబారుతోంది. ఏమిటీ సమస్య? హోమియోలో తగిన పరిష్కారం దొరుకుతుందా? – సత్యనారాయణ, భువనగిరి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాలి. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాదు... డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు. డాక్టర్టి.కిరణ్ కుమార్ డైరక్టర్,పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
చురుకైన కీళ్ల కోసం!
కీళ్లవాతం – ఆహారం ఆర్థరైటిస్ (కీళ్లవాతం) తగ్గడానికి పైటోకెమికల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం పైటోకీన్స్తో పోరాడుతుంది. కొన్ని పదార్థాలు కీళ్లవాతం బాధ పెరగడానికి కారణమవుతుంటాయి. అందుకే కేవలం మందుల మీద ఆధారపడకుండా డైట్‌చార్ట్‌ను మార్చుకోవడం ద్వారా చక్కటి ఉపశమనం పొందవచ్చు. ఏమేమి తినకూడదో చూద్దాం! గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, రెడ్‌మీట్, చక్కెర, తేనె, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలో వేయించిన పదార్థాలు, వేయించి ఉప్పు చల్లిన గింజలు, తీపి కోసం కృత్రిమంగా వాడే ట్యాబ్లెట్లు– లిక్విడ్లు, మైదా, బేకరీ ఉత్పత్తులను మినహాయించాలి. కూరగాయల విషయానికి వస్తే... బంగాళాదుంప, వంకాయ, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వండి చల్లబరిచి నిల్వ చేసిన పదార్థాల (ఫ్రోజన్ ఫుడ్)కు కూడా వాతాన్ని పెంచే గుణం ఉంటుంది. టీ, కాఫీ, ఆల్కహాలు సేవనాన్ని పూర్తిగా మానేయాలి. వీటిని తినవచ్చు! ఏమేమి తినకూడదో తెలియచేసే జాబితా చూశాక ఇక తినడానికి ఏమున్నాయి? అనిపిస్తుంది. కానీ ఆర్థరైటిస్ బాధ నుంచి ఉపశమనాన్నిచ్చే ఆహారం చాలానే ఉంది. అరటి, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, తర్బూజ, బత్తాయి, కమలా వంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. కూరగాయల్లో... ఆకుకూరలు, మామిడికాయ, నిమ్మ, క్యారట్, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, బ్రోకలి, లెటస్, అరటి, చిక్కుడు వంటి కాయగూరలు తీసుకోవచ్చు. అలాగే రోజుకు రెండు కప్పుల గ్రీన్‌టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్‌గ్రాస్, ముడిబియ్యంతో వండిన అన్నం, శనగలు, రాజ్మా వంటి పొట్టు తీయని ధాన్యాలు తీసుకోవాలి. -
తేనెటీగ విషం... ఆ బాధకు విరుగుడు
విషాన్ని తగువిధంగా ఉపయోగిస్తే అది ఔషధం అవుతుందన్న విషయం మరోమారు రుజువైంది. ఇది పూర్తిగా నిర్ధారణ జరిగి, మనుషులకు అందుబాటులోకి వస్తే కోట్లాది ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇది ఆర్థరైటిస్‌తో బాధపడే అనేక మందికి నిజంగా శుభవార్తే. తేనెటీగ కుట్టినప్పుడు అది వెలువరించే విషపదార్థాలు ఆర్థరైటిస్‌ను తగ్గిస్తాయని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు. ఆ విషంలోని పెప్టైడ్ వల్ల ఇది సాధ్యపడుతుందంటున్నారు వారు. ఈ పెప్టైడ్‌లో ‘మెలిటిన్’ అనే పదార్థం ఉంటుంది. అది కీళ్ల మధ్య షాక్ అబ్జార్బర్‌గా పనిచేయడంతో పాటు... ఎముక చివరన ఉండే ‘మృదులాస్థి’ శిథిలం కాకుండా కాపాడుతుందట. ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగాలు చేసి, ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు నిపుణులు. ఇంకా మానవుల్లో ఈ ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇది కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మాత్రమే గాక... ఆటల్లో, ప్రమాదాల్లో గాయపడేవారికీ మేలు చేకూరుస్తుందంటున్నారు పరిశోధకులు. -
వింటర్లో పెరిగే కీళ్లనొప్పులు?
అర్థోపెడిక్ కౌన్సెలింగ్ చలికాలంలో కీళ్లనొప్పులు మరీ పెరిగినట్లుగా అనిపిస్తోంది. నిజంగానే ఎక్కువవుతాయా? - రామకృష్ణ, హైదరాబాద్ ఈ సీజన్లో పెద్దవయసు వారిలో మామూలు కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్) పెరగడమే కాదు... అవి గౌట్, ఆర్థరైటిస్ నొప్పులను మరింతగా పెంచుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండాకాలంలోలా ఈ వింటర్ సీజన్లో సూర్యరశ్మి ఎక్కువగా తగిలే అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిగ్గా ఎముకలకు కావాల్సిన విటమిన్-డి కూడా తగ్గడం లాంటి అనేక కారణాలతో నొప్పి పెరుగుతుంది. అలా ఎందుకంటే... చలికాలంలో బయటి వాతావరణ ప్రభావం వల్ల ఉపరితల భాగాలకు ప్రసరించే రక్తం చలి కారణంగా తన వేడిని కోల్పోతుంది. పైగా చలి కారణంగా అక్కడి రక్తనాళాలు కాస్త కుంచించుకుపోవడంతో కాళ్లూ చేతుల వంటి భాగాలకు, చర్మంపైన ఉండే నాడీకణాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. నరాల చివర్లు (నర్వ్ ఎడింగ్స్) చిన్న విషయానికి అతిగా స్పందించేలా (సెన్సిటివ్‌గా) తయారవుతాయి. అందుకే ఈ సీజన్లో ఏదైనా భాగంలో నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) వచ్చినా లేదా ఆర్థరైటిస్ వంటి జబ్బుల్లో వచ్చే నొప్పులైనా.. తగ్గడానికి టైమ్ పడుతుంది. ఈ సీజన్లో బయటి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండటం వల్ల మన చర్మం కూడా బాగా చల్లగా అయిపోతుంది. సాధారణంగా మన చర్మం సహజంగా ఉండాల్సిన 98.4 డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి ఒక్కోసారిగా 70 ప్లస్ లేదా 80 ప్లస్ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత పడిపోవడంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలు (పెయిన్ సెన్సర్స్) మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ సీజన్లో సహజంగానే చలికి కీళ్లు బిగుసుకుపోతుంటాయి. దాంతో వాటిలో కదలికలు తగ్గుతాయి. కదలికలు తగ్గిన కీళ్లలో వ్యాయామం మందగించిన కారణాన వాటికి పోషకాలు సరిగా అందవు. ఇది కూడా నొప్పులు పెరగడానికి ఒక కారణమే. చాలామందిలో చలికాలంలో నొప్పిని భరించే శక్తి (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే ఎప్పుడూ ఉండే మామూలు నొప్పులు సైతం ఈ కాలంలో మరింత పెరిగినట్లు అనిపిస్తాయి. నొప్పులను తగ్గించుకోవడం ఎలా? ఈ సీజన్లో నొప్పి అనేది వస్తే దాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోడానికి కొన్ని ఉపశమన మార్గాలున్నాయి. అవి... బయట చలిగా ఉన్నప్పుడు శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఇచ్చే దుస్తులను ధరించాలి. చేతులకు గ్లొవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ వేసుకోవడం మంచిది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం శ్రేయస్కరం. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్డోర్ వ్యాయామాలు చేయండి. చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. ఈ సీజన్లో వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామం సమయంలో మనం ఆహ్లాదంగా ఉండటానికి దోహదపడేదీ, మన ఒత్తిడిని గణనీయంగా తగ్గించేది అయిన ఎండార్ఫిన్ అనే స్రావం శరీరంలోకి విడుదల అవుతుంది. ‘ఎండార్ఫిన్’లో నొప్పిని తగ్గించే గుణం చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో వ్యాయామం తప్పనిసరి. పైగా వ్యాయామం కారణంగా ఈ సీజన్లో సహజంగా మందగించే రక్త రసఫరా బాగా మెరుగతుంది. దాంతో ఒంటిపైన ఉండే నొప్పి సెన్సర్స్ కూడా మామూలుగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. నొప్పులు తగ్గడానికి చేయాల్సిన పనులు... శరీరానికి శ్రమ కలిగించకుండానే తేలికపాటి కదలికలతో మనకు మంచి వ్యాయామం కలిగించే యాక్టివిటీస్ ఈ కింద ఉన్నాయి. మీకు వీలైనవాటిని ఎంచుకోండి. ఇండోర్స్‌లో ఎక్కువగా నడవడం. ఇందుకు తేలిక మార్గం ఏమిటంటే ఏదైనా షాపింగ్ మాల్‌ను ఎంచుకొని లోపల చాలాసేపు తిరగడం. అన్ని వస్తువులను పరిశీలిస్తూ అక్కడ వీలైనంత ఎక్కువగా నడుస్తుండండి. ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. పిల్లలతో ఆడటం... ఇందులో కూర్చుని ఆడే ఆటలను మినహాయించాలి. ఇన్డోర్ స్విమ్మింగ్ ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్కు డాన్స్ చేయడం ఆఫీసులో లేదా మీరు వెళ్లిన చోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం. నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలివి... ఈ సీజన్లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్లో చాలా మంచిది. డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
గౌటీ ఆర్థరైటిస్ అంటే...?
కౌన్సెలింగ్ మా నాన్న వయసు 52 ఏళ్లు. అప్పుడప్పుడు కాళ్ల వేళ్లు వాచి నొప్పిగా ఉంటున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే గౌటీ ఆర్థరైటిస్ అన్నారు. దాని గురించి మాకు అవగాహన లేదు. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏమిటో తెలియజేయగలరు. హోమియోలో దానికి పరిష్కారం ఉందా? - శ్రీనివాస్, నెల్లూరు మన శరీరంలో ఉండే కీళ్లలో ఉప్పు లాంటి స్ఫటికాలు తయారై వాచినట్లుగా ఉండి, మంట నొప్పి వంటి లక్షణాలతో బాధిస్తూ ఉంటే ఆ సమస్యను గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఇది చిన్న కీళ్లలో మరీ ముఖ్యంగా కాలి బొటనవేలి వాపుతో ప్రారంభమవుతుంది. దీన్ని అలాగే వదిలేస్తే మిగతా కీళ్లను బాధిస్తుంది. కారణం : మానవుని రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇలా తయారైన యూరిక్ యాసిడ్ ఎక్కువగా స్రవిస్తున్నప్పుడు దాన్ని మూత్రపిండాలు సమర్థంగా బయటకు పంపకపోతే రక్తంలో ఆ పదార్థం పాళ్లు పెరిగి ఈ సమస్యకు దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలతోనూ, మాంసాహారం, మద్యం వంటివి తీసుకునే వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎలా ఏర్పడుతుంది : రక్తంలో ఎక్కువ మోతాదులో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల అది కీళ్లలోని మృదులాస్థిలోకి చేరి అక్కడ పేరుకుపోవడం మొదలవుతుంది. అలా పేరుకున్నది కాస్తా చిన్న చిన్న స్ఫటికాలుగా తయారవుతుంది. ఈ స్ఫటికాలు క్రమేపీ కీలు మధ్య భాగంలో చేరి ఈ సమస్య వస్తుంది. లక్షణాలు: ఈ సమస్య సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది కీలు నొప్పి సాధారణంగా రాత్రిపూట, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది వాపు సూదులు పొడినట్లుగా ఉంటుంది కీలో లోపలి ఆగంలో మండుతున్నట్లుగా ఉంటుంది 12 - 24 గంటల్లో నొప్పి తీవ్రస్థాయికి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మందులు వేసుకున్నా, వేసుకోకపోయినా 4-5 రోజుల్లో నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకో, కొన్ని నెలలకో ఈ సమస్య మళ్లీ మొదలువుతుంది కీలు ఎర్రగా వాచిపోయి కదలికలు కష్టంగా ఉంటాయి వాపు తగ్గుతున్న దశలో చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. నిర్ధారణ: ఇది కూడా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగే నొప్పితో మొదలవుతుంది. కానీ కీళ్లలో వాపు ఉండి ఎక్కువగా నొప్పి రావడం జరుగుతుంది. లక్షణాలతో పాటు రక్తపరీక్ష, ఎక్స్-రే, కీలులోని ద్రవపరీక్ష చేసి సమస్యను నిర్ధారణ చేస్తారు. నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు: చాలా మంది నొప్పి తగ్గగానే ఈ సమస్యను మరచిపోతారు. కానీ దీనికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీ సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉంటుంది. హోమియో చికిత్స: రోగి లక్షణాల ఆధారంగా కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచుతూ పోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!
లాస్ ఏంజెల్స్: అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తానని అంటోంది.. హాలివుడ్ నటి గ్వైనెత్ పాల్త్రోవ్. తాజాగా ఆక్యుపంక్చర్‌లో భాగంగా తేనెటీగలతో డజన్ల సార్లు కుట్టించుకున్నానని చెప్పిందీ భామ. అంతేకాదు తనను తాను గినియా పందితో పోల్చుకున్న ఈ ఆస్కార్ విన్నర్ ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్దంగా ఉంటానంటోంది. తేనెటీగలతో తీసుకునే ఈ చికిత్స వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉందని తెలిపింది. ఎపిథెరపీగా పిలిచే ఈ చికిత్సను చర్మం మీద మచ్చలను తగ్గించుకునేందుకు చేయించుకుంటారని, అయితే.. ఈ చికిత్స చేయించుకోవడానికి చాలా ధైర్యం, నొప్పిని భరించగల శక్తి ఉండాలని చెప్పింది 43 ఏళ్ల పాల్త్రోవ్. కీళ్ల నొప్పులు, వాపు, చర్మం మీద ఎర్రగా కనిపించడం, రక్తప్రసరణను పెంచడానికి ఆక్యుపంక్చర్ బాగా ఉపయోగపడుతుంది. -
శ్వాసకోశ వ్యాధులు ఉన్నా వ్యాయామం చేయాలంటే..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 54. నేను గత కొన్నేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం సూచించగలరు. - డి. హేమలత, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూన్ వ్యవస్థ తన సొంతకణజాలాలతోనో పోరాడినప్పుడు కలిగే వ్యాధి. ఇది మొదట చేతివేళ్లు, కాలివేళ్లు తరువాత మోచేయి, మోకాలు, తుంటికి పాకుతుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియం పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్కు గురయిన ఈ పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి కార్టిలేజ్‌ను కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు వాటి ఆకారం, అమరిక కోల్పోయి, విపరీతమైన నొప్పితో బాటు కీళ్ల కదలికలు కూడా ఇబ్బందికరంగా తయారవుతాయి. ఇది కొందరిలో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, చర్మం మొదలైన వాటిపై కూడా దుష్ర్పభావం చూపిస్తుంది. వ్యాధి కారణాలు: మన శరీరంలో తెల్లరక్తకణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్ తదితర వ్యాధికారక క్రిములతో పోరాడుతూ నిత్యం మనల్ని రక్షిస్తుంటాయి. ఆర్థరైటిస్ రోగులలో తెల్లరక్తకణాలు కీళ్లచుట్టూ ఉండే సైనోవియల్ పొరలోకి వెళ్లి ప్రొటీన్లను విడుదల చేయడం వల్ల అది మందంగా మారిపోయి దెబ్బతినడం ఆరంభమవుతుంది. క్రమేపీ కీళ్లలోపలి ఎముకలు, కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్కు గురవడం వల్ల కీళ్ల అమరికలో ఏర్పడే మార్పు వైకల్యానికి దారితీస్తుంది. లక్షణాలు: కీళ్లవాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం నిద్రలేచేసరికి కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసుకు పోవడం, ఈ లక్షణాల తీవ్రత ఎప్పడూ ఒకేలా కాకుండా రెండువైపులా ఒకకేరకంగా కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటికితోడు రక్తహీనత, ఆకలి సరిగా లేకపోవడం, నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు ఏర్పడవచ్చు. నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్.ఎ.ఫ్యాక్టర్, యాంటిసిపిపి, ఎక్స్‌రే, ఎమ్మారై తదితర పరీక్షలు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఇతర చికిత్సా విధానాల ద్వారా కేవలం ఉపశమనం మాత్రమే లభిస్తే హోమియోకేర్ ఇంటరేనషనల్లోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతిలో వ్యాధిని తగ్గించడం లేదా కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలో మంచి ఫలితాలను సాధించవచ్చు. వ్యాధి తీవ్రత పెరగకుండా చేయవచ్చు. లైఫ్ స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. ఆస్తమా ఉంది. ఈ చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వ్యాయామం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - ఎమ్. సంజీవరావు, వైజాగ్ ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సైతం వ్యాయామం చేయవచ్చు. ఇలాంటి వారికి జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు మంచిది. అయితే వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఉండే మెషిన్స్ వంటి ఉపకరణాల సహాయంతో వ్యాయామం చేయదలచుకున్నవారు ముందుగా ఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. మీ వ్యాయామం శరీరాన్ని తీవ్ర అలసటకు గురిచేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా వంటివీ రావచ్చు. శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, ఏదైనా తినీతినగానే వ్యాయామాలు వద్దు. లైట్‌గా తిన్న తర్వాత 30 నిమషాల వ్యవధి ఇచ్చి వ్యాయామం మొదలుపెట్టండి. ప్రివెంటార్ ఇన్హేలర్స్ పీల్చాక, నెబ్యులైజేషన్ తర్వాత వ్యాయామం మొదలుపెట్టడానికి కనీసం 30 నిమిషాల వ్యవధి ఇవ్వండి. వ్యాయామం మొదలుపెట్టే సమయంలో ముందుగా బ్రీతింగ్ వ్యాయామాలు, వార్మప్ వ్యాయామాలు విధిగా చేయండి. నేరుగా పెద్ద పెద్ద వ్యాయామాల జోలికి వెళ్లవద్దు. వ్యాయామం పూర్తయ్యాక అకస్మాత్తుగా ఎక్సర్సైజ్ను ఆపేయవద్దు. శరీరాన్ని క్రమంగా వ్యాయామం నుంచి ఉపసంహరించే క్రమంలో కూల్‌డౌన్, బ్రీతింగ్ అవుట్ ఎక్సర్సైజులు చేయాలి. మరీ ఎక్కువగా బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. పుషప్స్, సిటప్స్ వంటివి చేయకపోతేనే మంచిది. బరువు ఎత్తే వ్యాయామాలు చేయదలిస్తే అవి ఎత్తే సమయంలో శ్వాస విడుస్తూ ఉండాలి. ఆరుబయట ఉంటే మరీ ఎక్కువ వేడిగానూ లేదా మరీ ఎక్కువగా చల్లగానూ ఉండవచ్చు. అలాంటప్పుడు బయట ఉండే తేమ ఊపిరితిత్తులను తొందరగా అలసటకు గురిచేస్తుంది. అందుకే ఈ సీజన్లో జిమ్‌లో గానీ లేదా ఇన్డోర్స్లోగానీ వ్యాయామం చేయండి. నిటారుగా ఉండే ఎత్తులను ఎక్కకండి. మీకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, జ్వరం ఎక్కువగా ఉందనిపించినప్పుడు వ్యాయామం చేయకండి. వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస అందని పరిస్థితి ఉన్నా లేదా ఆయాసంగా ఉన్నా వ్యాయామం చేయడం ఆపి, డాక్టర్‌ను సంప్రదించండి. గుండెదడగా అనిపిస్తే వ్యాయామాన్ని నిలిపివేయండి. బలహీనంగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించినా, ఛాతీమీద బరువుగా అనిపించినా, భుజం, దవడ, వెన్ను భాగంలో నొప్పి ఉన్నా వ్యాయామం ఆపి డాక్టర్‌ను కలవండి. వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీలోగానీ లేదా శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి వస్తే, దాన్ని విస్మరించి వ్యాయామాన్ని కొనసాగించకండి. ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. మెడనొప్పిగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాను. ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి మెడకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ, కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్పారు. దయచేసి వివరించండి. - సుభానీ, గుంటూరు మీరు మెడనొప్పిని తగ్గించుకోడానికి ఎప్పుడూ మెడను పూర్తిగా రౌండ్‌గా తిప్పకండి. సగం మాత్రమే తిప్పండి. నిద్రపోయే సమయంలో పలచగా ఉన్న తలగడను భుజాలకిందుగా ఉండేలా అమర్చుకోవాలి. మరీ మెత్తటి తలగడను వాడకండి. మీ కంప్యూటర్ మానిటర్, టీవీ చూసే సమయంలో దానిలోకి తొంగిచూస్తున్నట్లుగా మెడను ఉంచకండి. కూర్చున్నప్పుడు, నిలబడ్డ సమయంలో మీ తలను శరీరానికి నిటారుగా ఉంచండి. తలను అటు ఇటు అకస్మాత్తుగా తిప్పకండి. ఫోన్లు మాట్లాడే సమయంలో భుజానికి, తలకు మధ్యన ఫోన్‌ను ఇరికించి, తలను పక్కకు తిప్పి మాట్లాడకండి. భుజాలను ముందుకు ఒంగేలా ఉంచకండి. మీ మెడనొప్పి తగ్గడానికి... మీ భుజాలను షగ్ ్రచేస్తున్నట్లుగా మెడకు దగ్గరగా లాక్కొని ఐదు అంకెలు లెక్కపెట్టి మళ్లీ వదలండి. ఇలా కనీసం ఐదుసార్లు చేయండి. మీ భుజాలను మొదట ఒక ఐదుసార్లు సవ్యదిశలో, ఆ తర్వాత ఐదుసార్లు అపసవ్యదిశలో తిప్పండి. మీ నుదుటిని అరచేతితో పట్టుకొని తలను ఆ అరచేతికేసి నొక్కుతూ ఐదంకెలు లెక్కపెట్టండి. అలాగే రెండు చెంపలకూ అరచేతిని నొక్కుతున్నట్లుగా ఇదేవిధంగా వ్యాయామం చేయండి. ఆ తర్వాత తల వెనక చేతిని పెట్టుకొని కాసేపు తలను వెనకవైపునకు నొక్కుతూ వ్యా యామం చేయండి. మెడ, వెన్ను, భుజం... ఇలా ఏ ప్రాంతంలో నొప్పి ఉందో అక్కడ కాపడం పెట్టండి. చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, పేపర్ చూస్తున్నప్పుడు తలను ఎక్కువగా ఒంచకండి. ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ మానిటర్గానీ మీ కళ్ల లెవల్‌కు సమానంగా ఉండేలా చూసుకోండి. కంటికీ మానిటర్కూ మధ్యన 16 నుంచి 22 అంగుళాల దూరం ఉండాలి. అంతకు తక్కువ, ఎక్కువ ఉండటం సరికాదు. కంప్యూటర్‌పై పనిచేసే సమయంలో మీ మోచేతులను కుర్చీ చేతుల మీద ఆన్చి... వాటికి సపోర్ట్ ఉండేలా చూసుకోండి. -
రాష్ట్రానికి కీళ్లనొప్పులు!
- దాదాపు 20 శాతం మందికి ఆర్థరైటిస్ - రుమటాలజీ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో 20 శాతం.. అంటే సుమారు 70 లక్షల మంది వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఈ బాధితుల్లో దాదాపు 70 శాతం వరకు మహిళలు, 30 శాతం పురుషులు. అంతేకాదు బాధితుల్లో ఎక్కువమంది 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారే. మరి ఈ వ్యాధికి చికిత్స చేయించుకుందామన్నా... రుమటాలజీ నిపుణులు కరువు. 70 లక్షల మంది బాధపడుతున్న చోట ఉన్న నిపుణులు.. కేవలం 20 మంది లోపే. రుమటాలజీ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ విభాగం ఈ విషయాలను వెల్లడించింది. ఈ నెల 12న ప్రపంచ కీళ్ల నొప్పుల (ఆర్థరైటీస్) దినం సందర్భంగా ప్రత్యేక కథనం! హైదరాబాద్‌లో ఎక్కువ.. కీళ్లనొప్పి బాధితులపై రుమటాలజీ ఆర్థరైటిస్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇటీవల ఓ సర్వే చేసింది. దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆర్థరైటిస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. జన్యు సంబంధ కారణాలతో పాటు జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, సంప్రదాయ ూల పేరుతో మహిళలు కుర్చీలు, సోఫాల్లో కాకుండా నేలపై కూర్చుంటుండటం, శరీరానికి ఎండ తగలకుండా పగలంతా ఏసీ గదుల్లోనే గడుపుతుండటం, గర్భ నిరోధక మాత్రల వినియోగం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నట్లు నిర్ధారించింది. చాలా మందికి కీళ్ల నొప్పులపై అవగాహన లేకపోవడం వల్ల నిర్లక్ష్యం చేస్తూ... గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నట్లు పేర్కొంది. వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు సాధారణమేగానీ ఇప్పుడు యువతరాన్ని కూడా కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. బాధితుల్లో హృద్రోగ సమస్యలు కీళ్లనొప్పుల సమస్య పరోక్షంగా గుండె పనితీరుపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్‌ఫూల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ సెంటర్, ఎబి రుమటాలజీ సెంటర్ సంయుక్తంగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ సర్వే చేశాయి. కీళ్లనొప్పులతో బాధపడుతున్న 25 నుంచి 46 ఏళ్లలోపు వారిలో 800 మందిని శాంపిల్‌గా ఎంపిక చేశారు. ఈ బాధితుల్లో 666 మంది మహిళలే. ఇక ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందిని రెండో శాంపిల్‌గా తీసుకున్నారు. వయసు, లింగ నిష్పత్తి, ధూమపాన అలవాటు, నడుం చుట్టుకొలత, హైపర్ టెన్షన్, మధుమేహం, బాడీమాస్ ఇండెక్స్, బీపీ, షుగర్ తదితర అంశాల ఆధారంగా ఈ రెండు గ్రూపులపై పరిశోధన చేశారు. ఆరోగ్యవంతులతో పోలిస్తే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధితుల్లో 2-3 శాతం ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ ఫిర్దౌస్ ఫాతిమా వెల్లడించారు. మహిళల్లోనే ఎక్కువ ‘‘పురుషులతో పోలిస్తే మహిళల్లో కీళ్లనొప్పి బాధితులు ఎక్కువ. రుతుచక్రంలో మార్పులు, ఈస్ట్రోజోన్ ఉత్పత్తి, అతిగా గర్భనిరోధక పిల్స్ వినియోగం, సంప్రదాయాల పేరుతో నేలపైనే కూర్చోవడం, విటమిన్ డి లోపం వల్ల మహిళలు కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు. ’’ - డాక్టర్ లిజా రాజశేఖర్, రుమటాలజీ ప్రొఫెసర్, నిమ్స్ వైద్యుల కొరత ఉంది ‘‘దేశంలో రుమటాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అసలు రుమటాలజీ నిపుణులే లేరు. తెలంగాణ, ఏపీల్లో కలిపి చూసినా ఒక్క హైదరాబాద్ మినహా మరే జిల్లాలోనూ ఈ వైద్యులు లేరు.’’ - డాక్టర్ పి.ఎస్.ఆర్.గుప్త, గుప్తాస్ ఆర్థరైటీస్ అండ్ రుమటిజమ్ సెంటర్ మందులతో తగ్గించవచ్చు.. ‘‘ఇతర వ్యాధులతో పోలిస్తే ఆర్థరైటిస్ కొంత భిన్నమైంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. కీళ్లు, చేతులు, భుజాలు, తుంటి, వెన్నెముకపై ప్రభావం చూపుతుంది. ఎముకల వైద్య నిపుణులు దీనికి శస్త్రచికిత్సలు చేస్తే... రుమటాలజిస్టులు కేవలం మందుల ద్వారానే నయం చేయగలరు.’’ - డాక్టర్ రాజ్‌కిరణ్, రుమటాలజిస్ట్, స్టార్ ఆస్పత్రి కీళ్ల నొప్పులు, వైద్య సౌకర్యాల పరిస్థితి రాష్ట్రంలో బాధితులు: దాదాపు 20 శాతం మంది మహిళల్లో: 60-70 శాతం పురుషుల్లో: 30-40 శాతం ఆస్టియో ఆర్థరైటీస్ (మోకాలి నొప్పి) బాధితులు: 20 శాతం రుమాటాయిడ్ ఆర్థరైటీస్ (చేతి కీళ్ల నొప్పి) బాధితులు: 3-4 శాతం స్పాండిలో ఆర్థరైటీస్ (తుంటి, వెన్ను, భుజం నొప్పి) బాధితులు: 0.8 శాతం లూపస్ ఆర్థరైటీస్ బాధితులు: 1 శాతం పిల్లల్లో వచ్చే కీళ్లనొప్పి బాధితులు :1 శాతం దేశంలో రుమటాలజీ వైద్యులు: 700-1000 మంది హైదరాబాద్‌లో ఉన్నది: 15-20 మంది ఒక్క నిమ్స్ మినహా మరే ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రుమటాలజీ వైద్యులు లేరు -
ఏసీ వల్లనే ఈ సమస్యలా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు! నా వయసు 40 ఏళ్లు. గతంలో మోకాళ్ల నొప్పులు చాలా ఆలస్యంగా వచ్చేవేమోగానీ... నా విషయంలో ఈ వయసులోనే వచ్చాయి. అయితే ఈ నొప్పులను భరించలేక డాక్టర్‌ను కలిశాను. డాక్టర్ తగిన పరీక్షలు నిర్వహించి, కీళ్లమార్పిడి శస్త్రచికిత్స చేయించమన్నారు. ఇంత చిన్న వయసులో ఈ సర్జరీ అవసరమా? నాకు వేరే ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నా విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్‌రావు, కొండాపూర్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే మీరు వర్ణించిన దాని ప్రకారం... ఈ తరహా నొప్పుల్లో 80 శాతం ఆర్థరైటిస్ సమస్యతోనే వస్తుంటాయి. మోకాళ్ల నొప్పులకు మోకాలి చుట్టూ ఉండే క్వాడ్రిసెప్స్ అనే కండరం బలహీనంగా మారడమే ప్రధాన కారణం. మోకాలికి నలువైపులా ఈ క్వాడ్రిసెప్స్ కండరాలు ఒక కూడలిలా ఉంటాయి. తొడ దారుఢ్యం మీదే వీటి మనుగడ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు జీవనం సాగించడానికి చేసే అన్ని రకాల వృత్తుల్లోనూ ఎంతో కొంత శారీరక శ్రమ ఉండేది. అందుకే పాతతరం వాళ్లలో 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు రావడం అన్నది చాలా అరుదు. ఇప్పటికీ ఆ తరం వారిలో మోకాళ్ల నొప్పులు తక్కువే. ఇక శస్త్రచికిత్స విషయానికి వస్తే... మోకాళ్ల నొప్పిగానీ, కీళ్లనొప్పులు గానీ వచ్చిన ప్రతివారికీ డాక్టర్లు శస్త్రచికిత్స సూచిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే. మోకాళ్ల నొప్పుల్లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి రెండు దశల్లో ఉదయం లేవగానే మోకాళ్లు పట్టేసినట్లుగా ఉండటం, మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పిగా ఉండటం, నడుస్తున్నప్పుడు చిన్న శబ్దలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశల్లో వ్యాయామాలు చేయడం, కొన్ని రకాల మందులు వాడితే సరిపోతుంది. చాలామందిలో ఈ దశలోనే ఈ సమస్య పరిష్కారమైపోయి, నొప్పులు తగ్గిపోతాయి. కానీ ఒకవేళ సమస్య అప్పటికే మూడో దశకు చేరుకొని ఉంటే మాత్రం ఈ మందుల వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చేయించుకొమ్మని డాక్టర్లు సూచిస్తారు. కాబట్టి ముందుగా మీరు డాక్టర్‌ను కలిసి మీ మోకాలి నొప్పులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోండి, సరైన వైద్య చికిత్స పొందండి. క్యాన్సర్ కౌన్సెలింగ్ నాకూ రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? నా వయసు 45 ఏళ్లు. మా అక్క తన 53 ఏట రొమ్ముక్యాన్సర్ వల్ల కన్నుమూసింది. ఆమెకు తప్ప మా కుటుంబంలో ఎవరికీ రొమ్ము క్యాన్సర్ ఉన్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) లేదు. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? నేనేమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందా? - సులోచన, రాజమండ్రి కుటుంబంలో ఎవరికీ రొమ్ము క్యాన్సర్ లేని ఫ్యామిలీ చరిత్ర గలవారితో పోలిస్తే కుటుంబంలో ఎవరికో ఒక్కరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉన్నవారి కుటుంబ సభ్యులకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లే. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు సోదరిగానీ, తల్లి గానీ అయితే (పైగా వారికి చిన్న వయసులోనే అంటే 35 ఏళ్లలోపే వస్తే) ఈ కుటుంబసభ్యులకూ రొమ్ముక్యాన్సర్ వచ్చే రిస్క్ రెండు రెట్లు. అంటే కుటుంబసభ్యులకు తప్పనసరిగా క్యాన్సర్ వస్తుందని కాదు. కానీ జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ అని అర్థం. ఇక మిగతా అంశాలు అంటే... జీవనశైలి, ఆహారం లేదా ఇతర అలవాట్లు, వ్యాయామం, స్థూలకాయం, శారీరకంగా కష్టపడకపోవడం వంటివి కూడా క్యాన్సర్‌కు దోహదం చేయవచ్చు. ఒకవేళ మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్న కోవకు చెందుతారని భావిస్తే... దీనికి నివారణగా ముదురాకుపచ్చగా ఉండే ఆకుకూరలు తీసుకుంటూ, శరీర బరువును తగినంతగా ఉండేలా చూసుకుంటూ, నిత్యం వ్యాయామం చేస్తూ, క్రమం తప్పకుండా ఫిజీషియన్ ఫాలోఅప్‌లో ఉండి, వారు సూచించిన స్క్రీనింగ్ పరీక్షలు (మామోగ్రామ్ వంటివి) చేయించుకుంటూ ఉంటే, వ్యాధి వచ్చినా దానికి విజయవంతంగా చికిత్స చేయించుకోవచ్చు. నా కూతురు వయసు 10 ఏళ్లు. ఆమెకు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వేయించే అవకాశం ఉంటుందా? ఈ వ్యాక్సిన్ వల్ల ఆమెకు కలిగే రక్షణ ఏ మేరకు ఉంటుంది. - విజయకుమారి, అమలాపురం మీ పాపకు మీరు హెచ్‌పీవీ అనే వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఇది సర్వైకల్ క్యాన్సర్ అనే క్యాన్సర్‌ను రాకుండా నివారిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి. ఈ వ్యాక్సిన్‌ను పెళ్లికి ముందు వేయిస్తారు. సాధారణంగా 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసులో ఆర్నెల్లకొకసారి చొప్పున మూడు మోతాదులు ఇప్పించడం వల్ల సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నుంచి 90 శాతం రక్షణ లభిస్తుంది. దీని సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్ నుంచి మాత్రమేగాక, పులిపిరులు (వార్ట్స్) నుంచి కూడా రక్షణ ఇస్తుంది. సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ ఉందని తెలిశాక కూడా దీని విస్తృతి ఎక్కువగా ఉందంటే, ఇప్పటికీ చాలామంది మహిళలకు దీనిపట్ల అవగాహన లేకపోవడమే కారణం. దీని గురించి అందరికీ తెలిసిన నాడు అసలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేదే సమాజంలో లేకుండా పోతుంది. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ ఇంత చిన్నపాపకే డయాబెటీసా? మా పాప వయసు ఆరేళ్లు. చక్కెరవ్యాధి వచ్చింది. ఇంత చిన్నవయసులో కూడా పిల్లలకు డయాబెటిస్ వస్తుందా? చిన్నపిల్లల్లో డయాబెటిస్ వస్తే వారు ఎప్పటికీ ఆ వ్యాధితో బాధపడాల్సిందేనా? మా పాప విషయంలో తగిన సలహా ఇవ్వగలరు. - సునంద, ఖమ్మం మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటీస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతమాత్రాన బాధపడాల్సిందేమీ లేదు. వీళ్లలోనూ చక్కెరను అదుపు చేస్తే వీళ్లూ సాధారణమైన పిల్లలందరిలాగానే పెరిగి, పెద్దవారై అన్ని రంగాల్లో తవు ప్రతిభాపాటవాలు చూపగలరు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి కేవలం జన్యుపరమైన కారణాలు మాత్రమే గాక... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం అవుతారుు. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు చేరుుంచడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయుడం కూడా అవసరం. డయాబెటిస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయూలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిస్ ఉన్న పిల్లలరుుతే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణలో లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్హేలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రాబోతున్నారుు. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతారుు. మీరు పీడియూట్రిషియున్ పర్యవేక్షణలో మీ పాపకు చికిత్స తీసుకోవడం తప్పనిసరి. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ ఏసీ వల్లనే ఈ సమస్యలా? నా వయసు 35. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. - సుధీర్, హైదరాబాద్ మీరు చెప్పిట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం: చాలా సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు (గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ) ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం. -
పిల్లల్లో యాంటీబయాటిక్స్‌తో జువెనైల్ ఆర్థరైటిస్ ఎక్కువ!
కొత్త పరిశోధన పిల్లల్లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల చిన్నతనంలోనే వాళ్లకు ఆర్థరైటిస్ (ఎముకలు పెళుసుబారి తేలిగ్గా విరిగిపోయే జబ్బు) వస్తుందని తేలింది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్స్ వాడే పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్) చాలా ఎక్కువని తెలిసింది. ‘‘ఒక ఏడాది కాలంలో తరచూ ఏదో ఇన్ఫెక్షన్ల వల్ల యాంటీబయాటిక్స్ చాలాసార్లు వాడిన పిల్లలను పరిశీలించినప్పుడు ఈ వాస్తవం నిరూపితమైంది’’ అంటున్నారు నిపుణులు. అది ఏ యాంటీబయాటిక్ అయినప్పటికీ దాన్ని వాడని పిల్లలతో పోలిస్తే యాంటీబయాటిక్స్ వాడే పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు రెట్టింపు అని తేలింది. సాధారణంగా పిల్లల్లో శ్వాసనాళం ఇన్ఫెక్షన్లు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తుంటారు. ఇలాంటి పిల్లలను పరిశీలించినప్పుడు వారిలో జువెనైల్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువే అని తేలింది. ఇక్కడో మంచి విషయం ఏమిటంటే.. యాంటీఫంగల్ లేదా యాంటివైరల్ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రం వాటి వల్ల జువెనైల్ ఆర్థరైటిస్ పెరిగిన దాఖలాలు కనిపించలేదు. కేవలం యాంటీబయాటిక్స్ వల్లనే జువెనైల్ ఆర్థరైటిస్ అనే అనర్థం రావడం పరిశోధకులు గమనించారు. అందుకే పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడే సమయంలో చాలా విచక్షణతో వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు ఈ పరిశోధనకర్తలు. -
ఈ వయసులోనే మోకాలి కీలు మార్పిడి అక్కర లేదు
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 45. నాకు కుడి మోకాలి లోపలి భాగంలో గత రెండేళ్లుగా నొప్పి వస్తోంది. అది క్రమంగా పెరుగుతూ పోయి, ఐదు నిమిషాల తర్వాత తీవ్రమవుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మోకాలిచిప్ప పూర్తిగా అరిగిపోయిందనీ, మోకాలి కీలు మార్పిడి చేసి కొత్త మోకాలి కీలును అమర్చాలన్నారు. నాకు శస్త్రచికిత్స అంటే భయం. ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? - ఎలిజబెత్, గుంటూరు వృద్ధుల్లో... ఆర్థరైటిస్ వల్ల మోకాలి చిప్ప పూర్తిగా అరిగిపోతే, వాళ్లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. అంతేగానీ మీ వయసు వారికి నీ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అంత మంచి ప్రత్నామ్నాయం కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఈ శస్త్రచికిత్స చేయించుకునేంతగా వయసు పైబడ్డ వారు కాదు. మీ ఒరిజినల్ మోకాలి చిప్పను మార్చకుండానే కొన్ని మామూలు చికిత్స ప్రక్రియల తర్వాత కూడా మీలో నొప్పికి ఉపశమనం కలిగించలేనప్పుడు మాత్రమే చివరి ప్రయత్నంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయాలి. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలకు ప్రత్యామ్నాయంగా ఆస్టెటోమైస్ వంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి. వీటివల్ల మీకు మరో పది, పదిహేనేళ్లు మంచి ఉపశమనం ఉంటుంది. మీలాంటి వారికోసం మరికొన్ని పాక్షిక మార్పిడి శస్త్రచికిత్సలూ ఉన్నాయి. మోకాలి పూర్తి మార్పిడి చేయాల్సిన వారిలో ఈ ప్రక్రియల ద్వారా 20 శాతం మందిలో ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ముందుగా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించండి. నా కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది. శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి, స్క్రూలు బిగించి సరిచేశారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా? - వెంకటేశ్, వరంగల్ మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని తొలగించడమే మేలు. వృద్ధులలో మాత్రమే శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందేమో అనుకున్నప్పుడు వాటిని అలాగే వదిలేస్తాం. ఇక యువకులలో సైతం చేతులలోని పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే తప్ప... కొన్నిసార్లు అలాగే వదిలేయాల్సి వస్తుంటుంది. మీరు ముంజేయి అంటున్నారు కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. లేకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనమై పోయి, తేలిగ్గా విరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆర్థరైటిస్ కౌన్సెలింగ్
ఆర్థరైటిస్ రోగుల వ్యాయామానికి ‘స్మార్ట్’ పద్ధతి! నా వయసు 65 ఏళ్లు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. అయినా వ్యాయామం చేయడం మంచిదని డాక్టర్లు చెప్పారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ కదా! మరి అలాంటప్పుడు మేం ఎక్సర్సైజ్ చేయడం ఎలాగో సూచించండి. - తాయారమ్మ, తుని ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తమ ఎముకలు మరింత కాలం బలంగా ఉండాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే ఇంగ్లిష్ మొదటి అక్షరాలతో రూపొందిన ‘స్మార్ట్’ అనే విధానం పాటిస్తే వారి వ్యాయామ ప్రక్రియ తేలికవుతుంది. సూచనలు గుర్తుంచుకోవడం సులభమవుతుంది. స్మార్ట్లోని ఎస్, ఎమ్, ఏ, ఆర్, టీ... అంటే... ఎస్ అంటే స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తమకు అనువైన తేలికపాటి వ్యాయామాన్ని చాలా మెల్లగా ప్రారంభించాలి. ఉదాహరణకు రోజూ 3-5 నిమిషాలపాటు రోజుకు రెండుసార్లు తేలికపాటి వ్యాయామం చేయాలి. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవడం సురక్షితం అన్నమాట. ఎమ్ అంటే మాడిఫై యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్, ట్రై టు స్టే యాక్టివ్: ఆర్థరైటిస్ లక్షణాలు అంటే ప్రధానంగా కీళ్లలో నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. ఇలా ఆర్థరైటిస్ లక్షణాలు తీవ్రమైనప్పుడు మన వ్యాయామ కార్యకలాపాలను లక్షణాలకు అనుగుణంగా మార్చుకోవాలి. అంటే మనం వ్యాయామం చేసే వ్యవధి, ఎన్నిసార్లు, ఎంత తీవ్రంగా చేస్తామనే అంశాలను మార్చుకుంటూ ఉండాలి. ఇలా మార్పు చేసుకోవడం అన్నది లక్షణాలను తీవ్రతరం కాకుండా చూస్తుంది. ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: అంటే మనం చేసే వ్యాయామాలు మన కీళ్ల ఆరోగ్యానికి మేలు చేసేవై ఉండాలి. ఉదాహరణకు నడక, సైక్లింగ్, నీళ్లలో చేసే తేలికపాటి వ్యాయామాలు. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల మన కీళ్లపై పడే శరీర బరువు తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలన్నమాట. ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్ : ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుగా ఉండటం వల్ల అవి విరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వ్యాయామం చేయడానికి సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీరు మీ లోకల్ పార్క్‌లో నడుస్తుంటే అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. అక్కడ పడిపోయేందుకు అవకాశం ఉండకూడదు. రాత్రివేళ వాకింగ్ చేస్తుంటే తగినంత లైట్ (వెలుగు) ఉండాలి. టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : మీరు వ్యాయామాలు ప్రారంభించడానికి ముందుగా మంచి వ్యాయామ నిపుణుడినీ లేదా డాక్టర్‌ను అందునా ప్రత్యేకంగా జీవనశైలి నిపుణులతో మాట్లాడాలి. వారు మీకు అనువైన వ్యాయామ పద్ధతులను సూచిస్తారు. దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారికి అనువైన మార్గాలనూ, ఏదైనా అంగవైకల్యం ఉన్నవారు చేయాల్సిన వ్యాయామ రీతులను వారు సూచిస్తారు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గౌట్ సమస్యకి పంచకర్మ చికిత్స
‘గౌట్’ అనేది ఒక రకమైన ఆర్థరైటీస్, దీన్నే ఆయుర్వేదంలో ‘వాత రక్తం’ అంటారు. మగవారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో మోనోపాజ్ దశ తర్వాత కనిపిస్తుంది. ఈ గౌట్ ఆర్థరైటీస్ను ఆయుర్వేదంలోని శమన, శోధనతోపాటు పంచకర్మ చికిత్సలతో నివారించవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి.శరీరంలో జరిగే జీవనక్రియల సమతుల్యతలోపం వల్ల ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ రక్తంలో అధిక మోతాదులో చేరటం వల్ల కణజాలం వాపు ఏర్పడుతుంది. వ్యాధి లక్షణాలు: సాధారణంగా కాలి బొటనవేలు గోట్కి గురవుతుంది. దీనివల్ల జాయింట్లు, కణజాలం దెబ్బ తింటాయి. రాత్రి సమయంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి, వాపు, మంట, వేడి, ఎరుపుదనంతో కాలి బొటనవేలు బాధిస్తుంది. మోకాళ్ళు, చీలమండలు, పాదాలు కూడా బాధిస్తాయి. ముట్టుకుంటే భరించలేనంత నొప్పి, వేడిగా ఉండటం, వాపు లక్షణాలు ఉంటాయి. ఇది చేతివేళ్ళు, మణికట్టుకు కూడా వ్యాపిస్తుంది. అలసట, జ్వరం లక్షణాలుగా ఉంటాయి. ఈ వ్యాధి ముదిరితే కీళ్ల దగ్గర చిన్న చిన్న స్ఫటికాలుగా కనిపిస్తుంది. కారణాలు: ఇది కొన్నిసార్లు అనువంశికంగా రావచ్చు. కుటుంబంలో ఒకరికి ఉన్నట్లయితే భావితరాలకు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాలు వాడటం వల్ల, మాంసాహారం అధికంగా తినడం వల్ల, అధిక బరువు, ఆల్కహాలు ఎక్కువగా తాగడం వల్ల, క్షయ నివారణ మందుల వల్ల, కేన్సర్ వ్యాధుల వల్ల యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆయుర్వేదానుసారం వాతరక్తం, ఆద్యవాతం అంటే.. గౌట్ వ్యాధి, వాతదోషం, పిత్తదోషం, రక్తధాతువు మోతాదులో లవణం, ఆమ్లం, క్షార, ఉష్ణపదార్థాలు తీసుకోవటం వల్ల, నిల్వ పదార్థాలు తినడం వల్ల, పుల్లని పెరుగు, మజ్జిగ వాడటం, నిల్వచేసిన చేపలు, మాంసం తినడం వల్ల, ఉలవలు, అనుములు తీసుకోవటం వల్ల వస్తుంది. రకాలు: వాతరక్తం రెండు రకాలు. ‘ఉత్ధాన వాతరక్తం’ అనే వ్యాధి... చర్మం, మాంసధాతువులో వ్యాపిస్తుంది. ‘గంభీర వాతరక్తం’ అనే వ్యాధి... ధాతువుల లోపల ఎక్కువ మోతాదులో వ్యాపిస్తుంది. బుడిపెల మాదిరిగా ఉంటుంది. ఈ వ్యాధిని తేలికగా తీసుకోరాదు. ఔషధాలు తీసుకోకపోతే బి.పి., మధుమేహం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కీళ్ళవాపు, వంకర్లు పోవటం, మూత్రపిండాల పని మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. పంచకర్మ చికిత్సలు: స్వేహపానం, విరేచనం, అభ్యంగనం, స్వేదం, ఎలకిజి, పిబిజిల్, వస్తి, నవరరిజి... చక్కని ఫలితాలను ఇచ్చి వ్యాధిని తగ్గిస్తాయి. ‘రక్తమోక్షణం’ చక్కని ఫలితాలను ఇస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లయితే వాతరక్తం వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. -
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఆర్థరైటిస్‌కు...
సమర్థవంతమైన వైద్యం ప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం ప్రకృతి సహజమైన విధానాలకు విరుద్ధంగా ఉండటం వలన సరైన వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరిత గతిన ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని పదార్థం అరుగుదలకు గురికావడంతో ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. అధిక బరువు, వయస్సు, ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్యం, ఇన్ఫ్లమేటరీ కారణాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్‌లో రకాలు: ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటిన వారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి పెరగడం వలన వస్తుంది. ఈ విధమైన ‘డీజనరేటివ్ ఆర్థరైటిస్’ మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్ళలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కానీ శరీర బరువునంతటినీ మోసే మోకాలులో ఇది అధికంగా కనబడుతుంది. మోకాళ్ళ వాపు నొప్పి, చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించడం, నడిచే సమయంలో కిరకిరమని శబ్దం, నడిచేందుకు ఇబ్బంది పడటం, కింద కూర్చోలేకపోవడం, ఉదయాన్నే నిద్రలేచేసరికి కీళ్ల నొప్పులు అధికమవడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఈ వ్యాధి ప్రధానంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తుంది. ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. జీవనక్రియలలో ఏర్పడే అసమతుల్యత వలన తలెత్తే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ శరీరంలో ఇరువైపులా ఉండే కాళ్ళకు సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్ళ వైకల్యానికి దారి తీస్తోంది. గౌటీ ఆర్థరైటిస్: సాధారణంగా మన రక్తంలో ‘యూరిక్ ఆమ్లం’ అనే ముఖ్య రసాయనం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల మోనో సోడియం సిట్రేట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది. మొదట్లో ఇది కాలి బొటనవేలు వంటి ఏదో ఒకటి రెండు కీళ్శకు పరిమితమై క్రమేపీ ఇతరత్రా జాయింట్లకు వ్యాపిస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సీరో నెగెటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. దీర్ఘకాలికంగా సోరియాసిస్ బాధితులైన వారిలో 30% మంది ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఈ తరహా కీళ్లనొప్పులనే వైద్య పరిభాషలో సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: రక్తం ద్వారా గానీ లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్ఫెక్షన్కు గురి అయినప్పుడు గానీ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఎక్కువగా ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకునేవారిలో కనిపిస్తుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: పైన చెప్పబడిన అన్ని రకాల ఆర్థరైటిస్‌లకు హోమియో వైద్యంలో మెరుగైన చికిత్సలుంటాయి. మిగతా వైద్య ప్రక్రియలతో పోలిస్తే నొప్పిని తగ్గించడంలోనూ కీళ్ళ కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ హోమియోపతిలో చక్కటి పరిష్కారం లభిస్తుంది. జెనెటిక్ కాన్ స్టిట్యూషనల్ విధానం ద్వారా హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో లభించే సమర్థవంతమైన చికిత్సతో ఆర్థరైటిస్ వ్యాధి బాధలను సంపూర్ణంగా నివారింపజేయవచ్చు. వ్యాధి పరిణామాలను పెరగకుండా కాపాడేందుకు కూడా వీలుంది. ఉచిత కన్సల్టేషన్ 955 000 1188 / 99 టోల్ ఫ్రీ 1800 102 2202 www.homeocare.in -
కీళ్ల వాతానికి ఆధునిక వైద్యం
తిరుపతి కార్పొరేషన్: ‘ఒక్కోసారి కీళ్లవాతం సమస్య ఏర్పడితే చక్కని నడకను కోల్పోవడం, ఇతర దీర్ఘకాలిక రోగాలు తలెత్తుతాయి. పైగా వారి దినచర్యలు దెబ్బతింటాయి. తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. అలాంటి వారికి రుమటాలజి కీళ్లవాతానికి అందించే ఆధునిక వైద్య విద్యావిధానంతో కీళ్లు, ఎముకల, కండరాల సమతుల్యం ద్వారా తిరిగి చక్కని నడక, ఆరోగ్యం కల్పించవచ్చు’ అని ప్రముఖ రుమటాలజి వైద్యులు డాక్టర్ పీ.దామోదరం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కీళ్లు, ఎముకలు, కండరాల సమస్యల నివారణకు చక్కటి నడక, రోజూ వ్యాయామం చేయడం వలన కఠినమైన వ్యాధులు దూరం చేయవచ్చని తెలిపారు. చిన్నవయసులో కీళ్లవాతం వస్తే అది వారి చదువుతో పాటు వివాహ సమస్యలు, తీవ్ర మానసిక ఒత్తిడి, కుటుంబ పరంగా పలు సమస్యలకు దారి తీస్తుందన్నారు. కీళ్లవాతంలో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అ న్నారు. ఇది ముఖ్యంగా నడివయస్సు కల్గిన స్త్రీలలో ఎక్కువగా వస్తుంటుం దని, జన్యువులు, హార్మోన్లు, ఇతర అంతుపట్టని కారణాలు ఈ వ్యాధికి కారణమన్నారు. దేశంలో రుమటాల జిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలావరకు కీళ్లవాత రోగులు సరైన వైద్య సేవలు పొందలేక పోతున్నారని అన్నారు. ప్రాథమిక దశలోనే కీళ్లవాతం గుర్తించడం శులభమన్నారు. చేతివేళ్లు, కీళ్లు లేక మోకాళ్ల కీళ్లు, నడుములు, పాదాలు వాయడం లేక నొప్పి, ఉదయం సమయంలో కీళ్లు బిగిసుకుపోవడం వంటి లక్షణా లు కనిపిస్తే తక్షణమే రుమటాలజి వై ద్యుడిని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆయన సూచిం చారు. ఇప్పటికే రాయలసీమలోనే మొదటిగా తిరుపతిలో శుభోదయ రుమటాలజి సెంటర్‌ను ఏర్పాటు చే సి, ఎన్నో జఠిలమైన కీళ్ల సమస్యలు, అరుదైన కీళ్ల వాత జబ్బులను నయం చేస్తున్నామని గుర్తుచేశారు. సెంటర్ ఏర్పాటు చేసి ఈ ఆదివారం నాటికి రెండు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. వందలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించినట్టు తెలి పారు. వ్యాధ్రిగస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
యవ్వనంలోనూ...అరుగుతున్నాయ్ కీళ్లు
నేడు వరల్డ్ ఆర్థరైటీస్ డే పాతికేళ్లకే కీళ్లనొప్పులు.. గ్రేటర్లో పెరుగుతున్న ఆర్థరైటీస్ బాధితులు అధిక బరువు, పోషకాహార లోపమే కారణమంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: కీళ్ల నొప్పులు ఒకప్పుడు ఆరుపదుల వయసు దాటిన వారిలోనే కన్పించేవి. కానీ మారిన జీవన స్థితిగతులు, తీసుకునే ఆహారం దృష్ట్యా ప్రస్తుతం అన్ని వయస్సుల వారిని వేధిస్తోంది. యువతే కాదు పిల్లలు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతుండడం బాధాకరం. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 30 శాతం పురుషులు ఉంటున్నారు. 10-15 శాతం వరకు పిల్లలు కూడా ఉండటం ఆందోళనకరం. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువు, మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహారలోపం, పిల్స్వాడటమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ‘వరల్డ్ ఆర్థరైటీస్ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. రుమటాయిడ్ ఆర్థరైటీస్ బాధితులే అధికం.. నగరంలో వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారిపై కిమ్స్ ఆస్పత్రి రుమాటాలజీ విభాగం ఇటీవల ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో ఆస్పత్రికి వచ్చిన 10 వేల మందిపై పరిశోధన చేయగా, వీరిలో రుమటాయిడ్ ఆర్థరైటీస్ (కీళ్లనొప్పి)తో 29 శాతం, ఆస్టీయో ఆర్థరైటీస్(మోకాలు, మోచేతి కీళ్లలోని గుజ్జు అరిగిపోవడంతో వచ్చే నొప్పి)తో 17 శాతం, సొరియాటిక్ ఆర్థరైటీస్(చర్మం పొడుసుబారిపోవడం)తో 8 శాతం, లూపస్(ముఖంపై సీతాకొక చిలుకలా మచ్చలు ఏర్పడటం)తో 7 శాతం, ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్(వెన్నెముఖ, నడుం వంగిపోవడం)తో 4 శాతం, ఆస్టియో పోరోసిస్(ఎముకల్లో సాంద్రత తగ్గడం వల్ల అవి విరిగిపోవడం)తో 3 శాతం, గౌట్(రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాలిబొటన వేలిపై నొప్పి)తో మరో 3 శాతం మంది బాధపడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని కిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి వెల్లడించారు. ఆర్థరైటీస్ మహిళల్లో హృద్రోగ సమస్యలు.. నగరంలోని ఆర్థరైటీస్తో బాధపడుతున్న 800 మంది వివరాలు సేకరించి, ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందితో వయసు, లింగ, నిష్పత్తి, స్మోకింగ్ , నడుం చుట్టూ కొలత, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ మెల్లటస్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్, ఆధారంగా అధ్యయనం చేయగా ఈ విషయం బయట పడిందని డాక్టర్ శరత్చంద్రమౌలి స్పష్టం చేశారు. 25-46 ఏళ్లలోపు వారిని ఎంపిక చేయగా వీరిలో 666 మంది మహిళలే. రుమటాయిడ్ ఆర్థరైటీస్ రోగులను సాధారణ ప్రజలతో పోలిస్తే వారిలో 2-3 శాతం కార్డియో వాస్క్యులర్ ప్రమాదం ఉన్నట్టు తేలింది. వైట్ కాలర్ ఉద్యోగులే అధికం.. శరీరానికి కనీసం ఎండ కూడా తగలకుండా 24 గంటలు ఏసీల్లో కూర్చోని పని చేస్తున్న వారు ఆర్థరైటీస్ బారినపడుతున్నారు. ఇందులో ఐటీ, అనుబంధ రంగాల్లోని ఉద్యోగులతోపాటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులు ఉన్నారు. అదీగాక కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు సైతం కీళ్ల నొప్పుల బాధితులుగా మారుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. మహిళలు ఎక్కువగా లూపస్ సమస్యను ఎదుర్కొంటుంటే, పురుషులు ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్తో బాధపడుతున్నారు. - డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి, చీఫ్ రుమాటాలజిస్ట్, కిమ్స్ -
ఒత్తిడితో పాటే వచ్చే జబ్బులూ ..
నగర జీవితంలో ఒత్తిడి తప్పదు. ఒత్తిడితో పాటే వచ్చే జబ్బులూ తప్పవు. ‘సిటీ’జనులు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, డయాబెటిస్, ఆర్థరైటిస్, హైపోథైరాయిడిజం, చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. జీవనశైలి కారణంగా కొన్ని, కాలుష్యం కారణంగా మరికొన్ని... ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామంటోంది ‘రెవా’. అమెరికాలో శిక్షణ పొందిన తమ వైద్య బృందం, అత్యంత అధునాతన వైద్య పరీక్షా సౌకర్యాలు ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకైనా ఇట్టే చెక్ పెట్టగలవని ‘రెవా’ నిర్వాహకులు చెబుతున్నారు. ‘రెవా’ 360 డిగ్రీస్ కంప్లీట్ హెల్త్ సొల్యూషన్స ప్రోగ్రామ్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను సమర్థంగా నయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో తిరిగి వ్యాధుల బారిన పడకుండా తమ నిపుణులు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని అంటున్నారు. -
హైబీపీ తగ్గాలంటే...
వ్యాయామం * త్రయంగ్ ముఖైక పశ్చిమోత్తాసనాన్ని సాధన చేస్తే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. *రెండు కాళ్లను చాపి, రెండు చేతులు మోకాళ్లపై ఉంచి, వెన్నెముక నిటారుగా పెట్టి సమస్థితిలో కూర్చోవాలి. *కుడికాలును మోకాలు వద్ద మడిచి కుడి పిరుదు కిందగా కానీ పక్కగా కానీ ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను నిటారుగా పైకి లేపి *పూర్తిగా శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి లాగినట్లు చేయాలి. *శ్వాసను నిదానంగా వదులుతూ ముందుకి వంగి గడ్డాన్ని ఎడమ మోకాలుకు ఆనించి రెండు చేతులతో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు తాకాలి. ఛాతీని కాలిపైన అదిమి ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను వదిలి ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. *ఇదే క్రమాన్ని ఎడమ మోకాలిని వంచి కుడిపాదాన్ని పట్టుకొని కూడా చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. * ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల హైబీపీ అదుపులోకి రావడంతోపాటు అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం పోతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, పార్శ్వపు నొప్పిని నివారించవచ్చు. సూచన: మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్న వాళ్లు, వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. మడమల సమస్య ఉంటే నిపుణుల సలహాతో జాగ్రత్తగా చేయాలి. -
వేళ్లు చిటపటమనడం ఆర్థరైటిస్ రావడానికి చిహ్నమా?
ఓ గంట ఏకబిగిన పని చేస్తే వేళ్లు పట్టేసినట్లుంటాయి. రెండు చేతులను వేళ్లను ఇంటర్‌లాక్ చేసి వెనక్కి విరిస్తే టపటపమని చిరు టపాకాయల్లా పేలుతాయి. దాంతో కీళ్లు హాయిగా అనిపించి మళ్లీ పనిలో పడుతుంటాం. అయితే ఇలా కీళ్ల దగ్గర పట్టేయడం, విరిస్తే పటపటమనడం వంటి లక్షణాలు ఆర్థరైటిస్ వ్యాధికి సూచనలు అని కొందరు భయపడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వేళ్ల కణుపుల దగ్గర సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. వేళ్లను లాగినప్పుడు ఈ ఫ్లూయిడ్ కీళ్ల మధ్య సరిగ్గా విస్తరిస్తుంది, ఈ ఫ్లూయిడ్తోపాటుగా కణుపుల దగ్గర నైట్రోజెన్ వాయువుతో నిండిన చిన్నచిన్న బుడగలు ఉంటాయి. వేళ్లను విరిచినప్పుడు ఆ బుడగలు పేలినట్లవుతాయి. మనం వినే శబ్దం ఆ బుడగలు పేలినప్పుడు వచ్చేదే. ఇది ఆర్థరైటిస్‌కు దారి తీసే పరిణామం ఎంత మాత్రమూ కాదు. -
వయసు పైబడినవారు ఆరోగ్యం కాపాడుకోవాలంటే...
నా వయసు 40. ప్రస్తుతం నాకేమీ ఆరోగ్య సమస్యలు లేవు. సాధారణంగా వయసు పైబడినవారికి... అంటే 50 ఏళ్లు దాటిన వారికి ముడుకుల నొప్పులు, ఇతర కీళ్లనొప్పులు వస్తుంటాయి కదా. వాటికి నివారణ మార్గాలున్నాయా? దయచేసి ఆయుర్వేద సూత్రాలు తెలియజేయండి. - వి. అవధాని, విశాఖపట్నం మీ ప్రశ్నను బట్టి మీకు ఆరోగ్యరక్షణకు సంబంధించి అవగాహన, సమస్యల నివారణ పట్ల ఆసక్తి, శ్రద్ధ, ముందుజాగ్రత్త ఉన్నాయని అర్థమవుతోంది. ఇలాంటి స్పృహ సమాజంలో అందరు పౌరులకు ఉంటే ఎంతో బాగుంటుంది. వయసురీత్యా ‘శైశవ, కౌమార, యౌవన, వార్థక్య’ దశలను ఆయుర్వేదం విపులీకరించింది. ‘జారా’ అంటే ముసలితనం అని అర్థం. వార్థక్యం ఒక రోగం కాదనీ, ఇది కేవలం ధాతు శైథిల్యం కలిగే ఒక అవస్థ మాత్రమేననీ, అప్పటి ఆరోగ్యం కాపాడుకోవటానికి ఆహార, విహార, రసాయన ఔషధాలను వివరిస్తూ ‘జరాచికిత్స’ను ప్రత్యేక విభాగంగా పేర్కొంది. మీరు ప్రస్తావించిన కీళ్లనొప్పులను ‘సంధివాతం’గా అభివర్ణించింది ఆయుర్వేదం. రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు సప్తధాతువులు. వీటిలో ఏది క్షీణించినా వాతప్రకోపం జరుగుతుంది. కీళ్లనొప్పులు ‘అస్థి’ (ఎముకలు) ధాతు క్షయానికి సంబంధించింది. వాస్తవానికి వార్థక్యంలో ఆరోగ్యం బాగుండాలంటే చిన్ననాటి నుంచి కూడా ఆహార, విహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమశిక్షణను ఏ వయసులో ప్రారంభించినప్పటికీ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వయస్థాపకం, ఆయుఃవృద్ధి సిద్ధిస్తాయి. ఓజస్సు, క్షమత్వం పెరుగుతాయి. చక్కటి స్వరం, మేధాశక్తి సమకూరుతాయి. పంచజ్ఞానేంద్రియాలూ సమర్థంగా పనిచేస్తాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆహారం ‘మితాహారం’ ఆయుర్వేద సూత్రాలలో అగ్రస్థానం వహిస్తుంది. దీనికి ప్రత్యేక పరిమాణాలుండవు. వయసునుబట్టి, జీర్ణశక్తిని బట్టి, రుతువును బట్టి, వృత్తిని బట్టి ఈ ప్రమాణం వ్యక్తి వ్యక్తికీ మారుతుంటుంది. తగురీతిలో వ్యాయామం చేయటమనేది, మితాహారంతో చెప్పిన మరో సమాంతర సూత్రం. షడ్రసాలలోనూ ‘లవణం’ (ఉప్పు) చాలా తక్కువగా వాడాలని ఆయుర్వేదం ప్రస్తావించింది. మొలకలు, తృణధాన్యాలు తింటే ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ముడిబియ్యం, గోధుమ శరీరానికి బలం కలిగించే పౌష్ఠికాహారం. శాకాహారం, సాత్వికాహారం ఆయుఃవర్థకం. నువ్వులపప్పులో లభించే కాల్షియం, అంతర్లీనంగా ఉండే తిలతైలం అమూల్యమైనవని గ్రహించాలి. శుష్కఫలాలు తక్కువ పరిమాణంలో తినటం ఉత్తమం. అరటిదూట, బూడిదగుమ్మడి, తియ్యగుమ్మడి శాకాలు మంచివి. తాజాఫలాలలో జామ, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి శ్రేష్ఠం. తగినంత ద్రవాహారం సేవించాలి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. పులుపు, కారం తగ్గించి, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. విహారం: ప్రతినిత్యం నియమితవేళల్లో వ్యాయామం చేయాలి. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర (విశ్రాంతి) అవసరం. రెండుపూటలా ప్రాణాయామం, ధ్యానం చేస్తే మానసిక ఆరోగ్యం బాగా వృద్ధి చెంది ఒత్తిడి, ఆందోళన దరిచేరవు. మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లను దూరంగా ఉంచాలి. ఆశావహ దృక్పథం, ఆత్మస్థైర్యం అలవరచుకోవాలి. ఉదయం పూట పదినిమిషాలు ఎండలో నిలబడండి. జరాచికిత్సలో ఉత్తమ రసాయనాలు: త్రిఫలాచూర్ణం : రోజూ రాత్రి ఒక చెంచా చూర్ణాన్ని నీళ్లతో సేవించాలి. ఇది మృదు విరేచనకారి. కంటికి, గుండెకు, ఊపిరితిత్తులకు క్రియాసామర్థ్యాన్ని పెంచుతుంది. సప్తధాతువులకు హితకారి, సర్వరోగ నివారకం. అశ్వగంధారిష్ట: నాలుగు చెంచాలు (నీళ్లతో) రెండుపూటలా; నరాల బలహీనత పోగొట్టి, మానసిక ఒత్తిడిని జయిస్తుంది. కీళ్లనొప్పులను దూరం చేస్తుంది. దీనితో బాటు ‘సారస్వతారిష్ట’ కూడా కలిపితే చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం): ఒక్కొక్క చెంచా, రెండుపూటలా; ధాతుపుష్టికరమే కాకుండా, ప్రత్యేకించి ఊపిరితిత్తుల వ్యాధులకు దివ్యౌషధం. చంద్రప్రభావటి (మాత్రలు): ఉదయం - 2, రాత్రి - 2; మూత్రవహ సంస్థాన సంబంధిత రోగాలన్నింటినీ జయిస్తుంది. ‘బలాతైలం’తో శరీర మర్దన, కీళ్లకు మర్దన చేసుకుంటే శరీర సౌష్ఠవం పెరుగుతుంది. గమనిక: ప్రస్తుతం విస్తరిస్తున్న అవ్యవస్థ జీవనశైలి; పప్పులు, నూనెలు, పండ్లు, పాలవంటి ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీ, వాతావరణ కాలుష్యం అందరి ఆరోగ్యానికి విచ్ఛిన్నకారకమని గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంతావశ్యకం. నా వయసు 76. మలబద్దకానికి ‘త్రిఫల చూర్ణం’ వాడవచ్చా? దయచేసి తెలపండి. - అంజయ్య, మెదక్ కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను కలిసి ‘త్రిఫలాలు’ అంటారు. వాటిని ఎండబెట్టి, విడివిడిగా పొడిచేసి, సమానంగా కలుపుకుంటే చక్కటి ‘త్రిఫలచూర్ణం’ తయారవుతుంది. ప్రతిరోజూ రాత్రి ఒక చెంచాచూర్ణాన్ని నీటితో తాగండి. కేవలం మలబద్దకానికే కాదు... గుండెకు, కంటికి, చర్మానికి, మెదడుకు, మూత్రపిండాలకు... ఇలా అన్ని భాగాలకూ చక్కటి రసాయనంగా పనిచేసి, పుష్టినిస్తుంది. ఈ చూర్ణాన్ని ఎంతకాలమైనా వాడుకోవచ్చు. నా వయసు 30. నాకు హైడ్రోసిల్ ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆయుర్వేద మందులు వాడితే ఇది తగ్గిపోతుందా? తెలియజేయగలరు. ఆర్. జానకిరామ్, హైదరాబాద్ ఇది పరిమాణంలో పెద్దగా అయిన పక్షంలో మందులు పనిచేయవు. సుశ్రుతాచార్యులు కూడా ఇలాంటి సందర్భాల్లో శస్త్రకర్మ (సర్జరీ)నే సూచించారు. అయితే నాటు వెద్యుల మాటలకు మోసపోవద్దు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
రుమటాయిడ్ ఆర్థరైటిస్
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో జీవక్రియల మార్పుల వలన, జన్యుపరమైన మార్పుల వలన వ చ్చే కీళ్ళజబ్బులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ప్రపంచంలో 0.5 శాతం నుండి 1 శాతం వరకు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. 15 సం॥వయసు గల వారిలో ఈ జబ్బు రావడం చాలా అరుదు. 20 సం॥నుండి 80 సం॥మధ్య వయసు వారిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పురుషులలో కంటే స్త్రీలలో మూడింతలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు: శరీరంలోని జీవక్రియల అసమతుల్యత వలన, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వలన జబ్బు వస్తుంది. దీనితోపాటు శారీరక, మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం. మానసిక ఒత్తిడి వలన జన్యుపరమైన మార్పులు సంభవించి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆరోగ్య పద్ధతులు పాటించనివారు, ధూమపానం, మద్యపానం చేసేవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. లక్షణాలు: ఈ కీళ్ళ జబ్బు వలన కీళ్లలో సైనవియల్ మెంబ్రేన్ దెబ్బతింటుంది. కీళ్ళలో అనవసరమైన ఫైబ్రస్ టిష్యూ పేరుకుపోతుంది. దానిని ఫ్యానస్ అంటారు. ఈ ప్యానస్ అనే చెడు పదార్థం వలన కీళ్ళలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. కీళ్లలో వాపులు తరచు వస్తూ పోతూ ఉంటాయి. ఈ జబ్బుతో లక్షణాలు కొన్నిసార్లు అధికం అవడం, కొన్నిసార్లు తాత్కాలికంగా ఉపశమనం లభించడం జరుగుతుంటుంది. లక్షణాలు అధికం అయినపుడు జ్వరం, కీళ్లలో వాపులు, కీళ్ళు ఎరుపెక్కడం, కీళ్ళు బిగుసుకు పోవడం, తీవ్రమైన నొప్పితో కదలికలు తగ్గిపోతాయి. ఆకలి తగ్గినపుడు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ చేతి మణికట్టుకీళ్ళు, చేతివేళ్ళు మోచేతికీళ్ళు, మోకాళ్ళు, ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ కేవలం కీళ్ళు దెబ్బతినడమే కాకుండా, శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులలోని పైపొర, గుండె పైపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా ఊపిరితిత్తులలో నెమ్ము కారణంగా తుమ్ములు రావడం, దగ్గురావడం జరుగుతుంది. రక్తకణాల సంఖ్య పడిపోయి అనీమియాకి కారణం అవుతుంది. ప్లీహం వాపు వస్తుంది. కళ్లు, నోరు పొడిబారిపోతాయి. చర్మం కిందిభాగంలో గుళికల్లాంటి ఆకారాలు ఏర్పడతాయి. వీటిని రుమటాయిడ్ నాడ్యుల్స్ అంటారు. వ్యాధి నిర్ధారణ: రక్తంలోని యాంటీబాడిస్ కనుగొనే పరీక్ష రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే యాంటీ సీసీపీ యాంటి సిట్రులినేటెడ్, ఫెస్టైడ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చును. ఏఎన్ఏ పరీక్ష ద్వారా కూడా నిర్ధారించవచ్చును. కీళ్ళని ఎక్స్‌రే తీయించి, ఎముకలలో ఎరోషన్స్ గుర్తించి నిర్ధారించవచ్చును. సాధారణ పరీక్షలు సీబీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ పరీక్షలు కూడా వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడతాయి. జాగ్రత్తలు: ఇలాంటి కీళ్ళజబ్బుల బారిన పడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిళ్లని తగ్గించుకోవడానికి ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయాలి. హోమియో వైద్యం రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి హోమియోవైద్యం ఇవ్వడం జరుగుతుంది. లెడంపాల్, బ్రయోనియా, రస్టాక్స్, డల్కెమరా, కాల్సికమ్, బెంజోయిక్ ఆసిడ్, కాలిమూర్, పల్సటిల్లా తదితర మందులు ఉపకరిస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హనుమకొండ-వరంగల్, కర్ణాటక ఫోన్: 7416 107 107 / 7416 102 102 www.starhomeo.com E-mail: info@starhomeopathy.com -
మోకాళ్ల నొప్పులను నివారించడం ఎలా...?
నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు కాస్తంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఫ్రెండ్స్‌ని అడిగితే ఇవి పాత నొప్పులనీ, భవిష్యత్తులో మరింత పెరుగుతాయని అంటున్నారు. వీటికి ఆపరేషన్ అవసరమా? ఇవి మరింత పెరగకుండా నివారణ చర్యలను సూచించండి. - వెంకటేశ్వరావు, ఆదోని మోకాళ్లలో నొప్పి మొదట్లో కొద్దిగా కనిపించగానే, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వారు తమ జీవనశైలిని తప్పక మార్చుకోవాలి. సమతులాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవనం గడపడంతో పాటు ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయాలి. పాదాలకు సౌకర్యంగా ఉండే పాదరక్షలనే ఎంచుకోవాలి. బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు. లావెటరీ విషయంలోనూ వెస్ట్రన్ ఉపయోగించడం మేలు. ఇక కొందరు మోకాళ్ల నొప్పులు కనిపించగానే మసాజ్ చేయిస్తుంటారు. ఇది అంత మంచి పరిష్కారం కాదు. మరికొందరు మోకాళ్ల నొప్పులనగానే నీ-రీప్లేస్మెంట్ సర్జరీ గురించి ఆలోచిస్తారు. కానీ అది ఖరీదైన ప్రక్రియ. పైగా చివరి ఆప్షన్‌గా మాత్రమే దాన్ని ఆలోచించాలి. ఈలోపు జీవనశైలిలో మార్పులతోనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి. నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా అని అదేపనిగా నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్) వాడకూడదు. భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులను రాకుండా చేయడానికి లేదా వీలైనంత ఆలస్యం చేయడానికి సైక్లింగ్, ఈత వంటి ఎక్సర్సైజ్లు, బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒకేచోట కుదురుగా కూర్చోడాన్ని నివారించడం చేస్తుండాలి. కూర్చున్న చోటే చేసే వ్యాయామంలాగా... కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక కాలిని రోజూ 20-30 సార్లు ముందుకు చాపడం చేస్తూ ఉండాలి. రెండో కాలి విషయంలోనూ అదే వ్యాయామాన్ని చేయాలి. ఇలాంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
సమకోణాసనం
ఈ ఆసనం వేసినప్పుడు దేహం సమానమైన కోణాకృతిలో ఉంటుంది. ఎలా చేయాలంటే..? రెండు కాళ్లు బారజాపి వెన్నెముకను నిటారుగా ఉంచి రెండు అరచేతులు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు రెండుకాళ్లను రెండవ ఫొటోలో ఉన్నట్లు ఇరువైపులా పక్కలకు చాపాలి. మోకాళ్లను వంచకూడదు. ఇప్పుడు మూడవ ఫొటోలో ఉన్నట్లు రెండు అరచేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ స్థితిలో వెన్నెముక నిటారు గా ఉండాలి. దృష్టి ఎదురుగా ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఏకాగ్రత శ్వాస మీద లేదా ఆసన స్థితి మీద ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తరవాత యథాస్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రోజు కు మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి. ఈ ఆసనాన్ని ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు. ఉపయోగాలు సుఖప్రసవం కావడానికి దోహదపడే ఈ ఆసనాన్ని గర్భం ధరించిన నాటి నుంచి తొమ్మిది నెలలు నిండేవరకు కూడా సాధన చేయవచ్చు. రుతుక్రమ సంబంధమైన సమస్యలు, రజస్వల సమస్యలు తొలగిపోతాయి. పురుషులలో స్వప్న దోషాలు, మూత్రదోషాలు పోతాయి. వీర్యశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చిత్తం స్థిరంగా ఉంటుంది. కాళ్లకు రక్తప్రసరణ కావలసినంత జరుగుతుంది. మోకాళ్ల నొప్పులు తొలగిపోతాయి. తొడలలోని కొవ్వు కరుగుతుంది. వెన్నెముక సరళరతమవుతుంది. నిగ్రహశక్తి పెరుగుతుంది. కటిప్రదేశంలోని కండరాలు, భాగాలు బలంగా ఉంటాయి. జాగ్రత్తలు! మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు కాళ్లను మరీ ఎక్కువ ఒత్తిడి చేయకుండా సౌకర్యంగా ఉన్నంత వరకే చాపి సాధన చేయాలి. మోడల్ : ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్ ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్ -
నడుమునొప్పికి హోమియోకేర్ పరిష్కారం
నడుమునొప్పి అంటేనే భయం... ఏకాస్త వంగాలన్నా, కదలాలన్నా భయం. సగటున సుమారు 40 నుండి 50 శాతం జనాభాలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నడుమునొప్పి వస్తుంది. కాని ప్రస్తుత జీవనవిధానాల వలన ఇది 80 శాతం జనాభాను ప్రభావితం చేస్తోంది. సాధారణంగా ఇది 20 నుండి 40 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువ శాతం మొదలవుతుంది. ఒక్కసారి నడుమునొప్పి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు సాధారణంగా ఒకే పొజిషన్లో ఎక్కువగా కూర్చోవడం ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించడం వెన్నుకు దెబ్బ తగలటం వెన్నుకు సంబంధించిన ఎముకలు, కండరాలు, డిస్క్, నరాల సమస్యల వలన నడుమునొప్పి రావచ్చు వెన్నుపూస క్షయ, osteomyelitis కు గురికావడం గర్భాశయ వ్యాధుల వలన, అండాశయ వ్యాధుల వలన నడుమునొప్పి రావచ్చు గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది నడుమునొప్పికి సంబంధించిన వెన్ను మరియు డిస్క్ సమస్యలు యాంగ్యులర్ టియర్: వయస్సు పైబడే కొద్ది మరియు వెన్ను మీద అధిక ఒత్తిడి పడినప్పుడు వెన్నుపూస (వర్టిబ్రా) మధ్య ఉండే ఇంటర్ వర్టిబ్రల్. డిస్క్‌లోని ఒక భాగం చిరగటాన్ని ఆన్యూలర్ టియర్ అంటారు. ఇలా చిరిగిన ఆన్యూలర్ వాపునకు గురై నడుమునొప్పికి దారి తీస్తుంది. దీనినే డిస్క్ ‘డీజనరేటివ్ డిసీజ్’ అంటాము. హెర్నియేటెడ్ డిస్క్: దీనినే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. బలహీనపడిన డిస్క్ అంచు చిరిగి, దాని మధ్యభాగంలో ఉండే మెత్తని న్యూక్లియస్ బయటకు తోసుకొని రావడాన్ని Herniation అంటారు. ఇలా Herniate అయిన డిస్క్ వెన్ను నుండి బయటకు వచ్చే నరాలను నొక్కినప్పుడు వచ్చే లక్షణాలను ‘సయాటికా’ (Sciatica) అంటారు. స్పాండిలోలిస్థిసిస్: ఇందులో వెన్నులోని ఎముకలు పరిమితికి మివంచి ముందుకు కాని వెనకకు కాని జారటాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటారు. ఇది వెన్నులోని ఎముకలు (వర్టిబ్రా) ను పట్టి ఉంచె లిగమెంట్లు సాగటం మరియు వర్టిబ్రాలోని ఒక భాగం విరగటం వలన వస్తుంది. స్పాండిలోలిస్థిసిస్ తీవ్రంగా ఉంటే నరాఉల మెలికపడటం మరియు నరాల పై వర్టిబ్రా వత్తిడి వలన తీవ్రమైన నడుము నొప్పికి, ఇతర లక్షణాలకు దారితీస్తుంది. స్పైనల్ స్టీనోసిస్: వెన్నులోపల ఉండే స్పైనల్ కానల్ అనే నాళం ఇరుకుగా మారటం లేదా మూసుకుపోవటాన్ని స్పైనల్‌స్టీనోసిస్ అని అంటాము. ఇది తీవ్రంగా ఉంటే నాళంలో ఉండే వెన్నుపాము వత్తిడికి గురై తీవ్రమైన వెన్నునొప్పితోపాటు, కాళ్ళు పడిపోవడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారటం, మలమూత్రాల విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాంకిలోసింగ్ స్పాండిలోసిస్ Ankylosing spondilitis ఇది వెన్నుపూస దీర్ఘకాలిక వాపునకు గురి కావడం వలన వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డీసీజ్. ఇది ఎక్కువగా తుంటి కీలు (sacro ilian joint), వెన్నుపూసను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా యుక్తవయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి వెన్నుపూసలోని ఎముకలు బిగుసుకు పోయి నడుము కదలికలు కష్టతరం అవుతాయి. దీనినే "Bamboo spine' అని అంటారు. వర్టిబ్రా (Fracture): వెన్నుకు దెబ్బ తగలటం లేదా దీర్ఘకాలికంగా Osteoporosis వలన వత్తిడికి గురి అయినప్పుడు వెన్నులోని వర్టిబ్రా విరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివలన తీవ్రమైన వెన్నునొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు వస్తాయి. లక్షణాలు సాధారణం నుండి తీవ్రమైన నడుము నొప్పి నడుము పట్టేయడము. వెన్నులోని ఎముకలతో పాటు నరాలు కూడా వ్యాధి బారినపడితే నొప్పి నడుములో ప్రారంభమై పిరుదుల్లోకి, అక్కడినుండి తొడల్లోకి, కాళ్ళు, పాదాల వరకు వ్యాపిస్తుంది. కాళ్ళలో తిమ్మిర్లు, పాదాలలో మంటలు రావడం, మొద్దుబారటం వంటి లక్షణాలు ఉంటాయి. నడుమునొప్పి దీర్ఘకాలికంగా ఉండి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్షయ, కాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సీబీపీ, ఆర్ ఫ్యాక్టర్ ఎక్స్‌రే సిటీస్కాన్ ఎమ్మారై స్కాన్ హెచ్ఎల్ఏ-బీ27 ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చేయటం వలన వ్యాధి తీవ్రత ఇతర తీవ్రమైన వ్యాధులను గుర్తించవచ్చు. నడుము నొప్పికి గల కారణాన్ని గుర్తించి సరయిన చికిత్స తీసుకోవడమే కాకుండా రోజువారి వ్యాయామం, Strech Excersices, చేయడం, కూర్చునే, నిద్రపోయే పొజిషన్‌ను తగిన విధంగా మార్చుకొని సరిచేసుకోవడం వలన నడుము నొప్పిని అదుపు చేయవచ్చు. హోమియోకేర్ వైద్యం హోమియోకేర్ ఇంటర్ నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా వెన్నునొప్పి, సయాటికా, కాళ్ళతిమ్మిర్లు, పాదాల మంటలనే కాకుండా మూల కారణాన్ని గుర్తించి వైద్యం చేయడం ద్వారా వెన్నుపూసను దృఢంగా చేసి మరల నడుము సమస్యలు రాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
బద్ధ్ద కోణాసనం
బద్ధ కోణాసనాన్నే జాను భూతాడాసనం...బటర్‌ఫ్లై ఆసనం అని కూడా అంటారు నిర్వచనం: జాను అంటే మోకాలు. రెండు మోకాళ్లు భూమికి దగ్గరగా ఉంచడం వల్ల దీనిని జాను భూతాడాసనం అంటారు. మరొక విధంగా ఈ ఆసనం బటర్‌ఫ్లై (సీతాకోక చిలుక) ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి బటర్ ఫ్లై ఆసనం అంటారు. చేసే విధానం ముందుగా రెండు కాళ్లు చాపి, వెన్నెముక నిటారుగా ఉంచుకొని, రెండు అరచేతులు తొడల మీద ఉంచుకొని సమస్థితిలో కూర్చోవాలి. (ఫోటో 1) తర్వాత రెండు కాళ్లు మోకాళ్ల వద్ద మడిచి, రెండు అరి పాదాలను ఒక దానికి ఒకటి తాకిస్తూ రెండు చేతులను రెండు మోకాళ్ల మీద ఉంచాలి. (ఫోటో 2) ఇప్పుడు రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసి (వేళ్లలోకి వేళ్లు చొప్పించి), రెండు పాదాలను కలిపి పట్టుకొని వీలైనంత దగ్గరకు తీసుకురావాలి. ఆసన చివరిస్థితిలో వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు మోకాళ్లు వీలైనంతగా నేలకి దగ్గరగా ఉండాలి. (ఫోటో 3) ఈ ఆసన స్థితిలో శ్వాసను సాధారణంగా తీసుకుంటూ ఉండాలి. ఈ ఆసన పూర్తి స్థితిలోకి వెళ్లడానికి ముందు కొద్దిసేపు రెండు మోకాళ్లను పైకి క్రిందికి వేగంగా ఆడించాలి. ఆ సమయంలో రెండు చేతులతో పాదాలు పట్టుకొని ఉండాలి. చివరగా ఆసన స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ 3 నుండి 5 సార్లు చేయాలి. ఈ ఆసనం ఎప్పుడైనా వేయవచ్చు. ఉపయోగాలు గర్భిణుల సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. గర్భం ధరించిన దగ్గర నుండి తొమ్మిదో నెల వరకు చేయవచ్చు. ఋతుకాలంలో వచ్చే సమస్యలను తొలగిస్తుంది. పురుషులలో హెర్నియాను తొలగిస్తుంది. మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. తొడకి, నడుముకి మధ్య భాగంలోని కీళ్లు తేలికగా కదులుతాయి. చేయకూడని వాళ్ళు మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు గురువు పర్యవేక్షణలో చేయాలి. మోడల్ ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్ ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్ -
ఆర్థరైటిస్ హోమియో చికిత్స
ప్రస్తుత పరిస్థితిలో మానవుడి జీవిత విధానం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధ్దంగా ఉండడం వలన సరైన వ్యాయమం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన త్వరితగతిన మానవుడు ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నాడు. అందుకే జనాభాలో 50 శాతం మంది 40 సం॥దాటినవారు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి గణనీయంగా పెరుగుతుందని వైద్యనిపుణుల అంచనా. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని రబ్బరుపదార్థం అరుగుదలకు గురి అవడం వలన ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్ఫ్లమేషన్కు దారి తీయడం. కారణాలు: అధికబరువు, వయస్సు, ఇన్ఫెక్షన్స్, వంశ పారంపార్యం, ఇన్ఫ్లమేటరీ కారణాలు, ప్రమాదాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆస్టియో ఆర్థరైటిస్: ఇది ఎక్కువగా 40 సం॥వయస్సు దాటినవారిలో కార్టిలేజ్ అరుగుదల వలన ఎముకల మధ్య రాపిడి వలన వస్తుంది. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ మగవారితో పోలిస్తే ఆడవారిలో (ఆస్టియో ఆర్థరైటిస్) ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన ఆడవారిలో 70 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఏ కీళ్లలోనైనా ఏర్పడే అవకాశం ఉంది. కాని శరీర బరువునంతటినీ మోసే మోకాలులో అధికంగా కనబడుతుంది. లక్షణాలు: మోకాళ్లనొప్పి వాపు, చేతితో స్పర్శించినప్పుడు వేడిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కిరకిరమని శబ్దం రావడం (క్రిస్ట్) కీళ్లు వాపుకు గురై కదలికలు తగ్గడం వలన నడవడానికి చాలా ఇబ్బంది పడటం, అధిక బరువు ఉన్న రోగిలో మోకాళ్లు అరుగుదలకు గురి అయి నడకలో మార్పు వచ్చి కుంటినట్లుగా నడవడం, కింద కూర్చోవడం.. ఇలా.. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రోగి ఉదయం నిద్రలేచి నడవడం అంటే చాలా బాధతో కూడుకున్నటు వంటి పని అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవనక్రియల్లో ఏర్పడే అసమతుల్యత వలన వస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇది ఎక్కువగా 12 నుండి 45 సం॥వయస్సు వారిలో కనబడుతుంది. ఈ వ్యాధి ప్రధానంగా చిన్నకీళ్లైన మణికట్టు, చేతివేలు (మెటటార్సో ఫాలేంజియల్ జాయింట్స్), ఇంటర్ ఫాలెంజియల్ జాయింట్స్, మడిమ మెకార్సో ఫాలెంజియల్ జాయింట్స్‌లో ముందుగా ప్రభావితం అయి పెద్ద జాయింట్లకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి శరీరంలో ఇరువైపులా ఉండే కీళ్ళకు సమాంతరంగా వ్యాఫ్తి చెందుతుంది. (బై లేటరల్ సిమెట్రికల్) కీళ్ళు వాపునకు గురి అయి కదలికలు పూర్తిగా స్తంభించి కీళ్ళు వైకల్యానికి దారి తీస్తాయి. ఇది ఎక్కువగా శీతాకాలం లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళ కదలికలు పూర్తిగా స్తంభించి చాలా నొప్పిని కలిగిస్తాయి. గౌటి ఆర్థరైటిస్: ఇదొక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది జీవక్రియలో ఏర్పడి, ఉప ఉత్పన్నమైన యూరిక్ ఆసిడ్ అధిక మోతాదులో రక్తంలో చేరి సోడియంతో కలసి మోనో సోడియం సిట్రైట్ అనే స్ఫటికాలు ఏర్పడి కీళ్ళలో చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఇది కాలి బొటనవేలులో ఎక్కువగా కనిపిస్తుంది. కీలు వాపుకు గురి అయి తీవ్రమైన నొప్పిని, మంటను కలుగజేస్తుంది. ఈ వ్యాధి ఆల్కహాల్, డ్రైఫ్య్రూట్స్ అధిక మాంసకృత్తులు తీసుకుంటే వ్యాధి తీవ్రత అధికమవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది సిరినెగిటివ్ ఇన్ఫ్లమేటరి ఆర్థరైటిస్. సోరియాసిస్ ఉన్నవారిలో 30 శాతం మందికి సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడతారు. ఇందులో ముఖ్యంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా కీళ్ళలో వ్యాప్తి చెందుతాయి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: దీనినే సపోర్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. రక్తం ద్వారా లేదా కీళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఇన్ఫెక్షన్కి గురి అయినప్పుడు, ఇన్ఫెక్షన్ సైనోవియల్ కుంబ్రేన్లో చేరడం వలన ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఇది ఎక్కువగా ఆర్టిఫిషియల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకునే వారిలో కనిపిస్తుంది. వీటన్నింటికీ హోమియోలో శాశ్వతమైన చికిత్సావిధానాలున్నాయి. హోమియో ట్రీట్మెంట్ పైన తెలిపిన అన్ని రకాల ఆర్థరైటిస్‌కు హోమియో వైద్యంలో చాలా మెరుగైన చికిత్స ఉంటుంది. మిగతా వైద్యవిధానాలతో పోలిస్తే నొప్పి తగ్గించడంలోనూ, కీళ్ళ కదలికను సురక్షితంగా ఉంచడంలోను హోమియో వైద్య విధానంలో మంచి చికిత్స ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా జాయింట్ కదలికలను సురక్షితంగా ఉంచడం ద్వారా రోగికి మెరుగైన ఫలితాలు వస్తాయి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించడం, రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండటం వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. 1. సంధివాతం - Oesteo arthritis 2. ఆమవాతం - Rheumatoid arthritis 3. వాతరక్తం - Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్న ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), కొద్దిపాటి జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints). వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. డాక్టర్ డి.హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో... 1. నిదాన పరివర్జనం 2. ఔషధ సేవన 3. ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. 1. నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. 3. ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం
మానసికమైన ఒత్తిడి, మనోవ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికీ విదితమే. అయితే వీటి వలన కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్ని రకాల సైకో-పామటిక్ డిసార్డర్స్ మాత్రమే కాదు, సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాము. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (R.A). ఈ వ్యాధి బారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ-పురుషులలో యాభై ఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి, ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో అర్థరైటిస్’’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలలో ఉండే చిన్న చిన్న కీళ్ళలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిన్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లోను కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్ఫ్డిసీజ్’ అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో కండరాల్లో నొప్పులు, కీళ్ళను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా కీళ్ళనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా ద్విపార్శకంగా చేతులలో, కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం, పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మోచేతులపైన, తొడలపైన వచ్చే చిన్న చిన్న గడ్డలను ‘రుమటాయిడ్ నాడ్యుల్స్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. వ్యాధి లక్షణాలను బట్టి, రక్తంలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే పరీక్ష పాజిటివ్‌గా రావడం, ్ఠ-రేస్‌లో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని, డిఫార్మటీస్ని పరిశీలించి వ్యాధిని నిర్ధారిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రతను, వాడే మందుల ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి ఇ.ఎన్.ఆర్, సి.ఆర్.పి. వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్ వలన, స్టిరాయిడల్ మందుల వలన నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అసలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మటీస్ని నివారించలేము. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. ...పాజిటివ్ హోమియోపతి డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com -
కీళ్ళవ్యాధులు (Arthritis) శాశ్వత విముక్తి
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళవ్యాధులు చాలా రకాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలి కీళ్ళలో కనిపిస్తుంది. కారణాలు: అధికబరువు, నలైభైఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: కీళ్ళలో నొప్పి... కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి. జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ - డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్నకీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ (Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది. సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్నవేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళు ఇన్ఫెక్షన్కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. (SLE) (సిస్టిమిక్టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబెడుతుంది. పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
‘ఆర్థరైటిస్’కు సంప్రదాయ విజ్ఞానం అవసరం
విజయవాడ, న్యూస్‌లైన్ :ఆర్థరైటిస్ వ్యాధుల్లో సంప్రదాయ విజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు అన్నారు. మస్కులోస్కేలిటల్ సొసైటీ ఆధ్వర్యంలో బృందావనకాలనీలోని ఏ కన్వెన్షన్ హాలులో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సును శనివారం డాక్టర్ నరేంధ్రనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్లో డాక్టర్ కాకర్ల మాట్లాడుతూ వైద్యరంగంలో ఉన్న వారు మానవీయకోణంలో సేవలందించాలని సూచించారు. అవసరం మేరకు మాత్రమే పరీక్షలు చేయాలన్నారు. సదస్సు నిర్వాహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ జీవీ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల పరిణామాలతో రాబోయే రోజుల్లో నగరం ప్రాముఖ్యత మరింత పెరగనుందన్నారు. దేశ స్థాయిలో గుర్తింపు పొందిన రేడియాలజీ సంఘం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నగరంలోనే ఉందన్నారు. ముంబాయ్, డిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాలకు ధీటుగా నగరంలో జరుగుతున్న సదస్సుకు దేశ విదేశాల నుంచి 650 మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. టెక్నికల్ సెషన్స్‌లో కీలక ప్రసంగాలు... సదస్సు నిర్వాహణ కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎన్వీ వరప్రసాద్ పల్స్ సీక్వెన్స్ ఫర్ ఆప్టిమల్ అన్న అంశంపై ప్రసంగించారు. డాక్టర్ వీరేంధ్రమోహన్(జమ్ము-తావి) రేడియాలజీలో వచ్చిన మార్పులు, శరీర భాగాల్లో ఎముకలకు దెబ్బలు తగిలినప్పుడు రేడియోగ్రాఫ్ ద్వారా తదితర చికిత్సా పద్ధతులను వివరించారు. కెనడాకు చెందిన డాక్టర్ హేమనళిని చాదుర్ ఇమేజింగ్ ఇన్ట్రామ, మిస్ట్ అకల్ట్ ఆన్ రేడియోగ్రాఫ్పై, ప్రొఫెసర్ వీరేంధ్రమోహన్ స్ల్కిలిరోజింగ్ డిస్ప్లేసియో అనే అంశంపై ప్రసంగించారు. మస్కులోస్కేలిటల్ ఇమేజింగ్‌లో వ్యాధుల నిర్ధారణ, చికిత్స విధానాలపై యూకేకు చెందిన డాక్టర్ బేతపూడి శరత్, టెండాన్స్ లిగమెంట్స్ నరాల వ్యాధుల్లో ప్రధానంగా అనుసరించాల్సిన పద్ధతులను డాక్టర్ హేమనళిని వివరించారు. ఎంఆర్ఐ సాప్ట్ టిష్యూ ట్యూమర్‌పై అమెరికాకు చెందిన డాక్టర్ మురళీ సుందరం ప్రసంగించారు. మణికట్లు నిర్మాణం, చికిత్స ఎంఆర్ఐ స్కానింగ్లపై అమెరికాకు చెందిన టి.మధుసూదనరావు, ఎల్బోకు సంబంధించి వ్యాధి నిర్ధారణపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఈశ్వర్‌చంద్ర, ఎల్బో లిగమెంట్లు ఎన్ఆర్ఐ స్కానింగ్ విధానంపై పూనేకు చెందిన డాక్టర్ అభిమన్కుకేల్కర్, భజం ఇమేజింగ్- సర్జన్ల దృష్టికోణంపై డాక్టర్ పీఎన్ఎన్ ప్రసాద్( యూకే) రొటేటర్ కఫ్ ఇమేజింగ్, ఇంపింజ్‌మెంట్ సిండ్రోమ్స్‌పై డాక్టర్ భవన్ జంఖారియా (ముంబాయి) ప్రసంగించారు. అరుదైన కేసుల ఫిల్మ్‌ల ప్రదర్శన... అరుదైన వ్యాధులకు సంబంధించిన సీటీ, ఎంఆర్ఐ, ఎక్స్‌రే ఫిల్మ్‌లతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన పోస్టుగ్యాడ్యుయేషన్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ కాకర్ల పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని వ్యాధులకు సంబంధించిన ఇమేజ్‌లు టీవీలో చూపించి వ్యాధి నిర్ధారణపై క్విజ్ పోటీలు నిర్వహించారు. -
కీళ్ళవ్యాధులు (Arthritis)
కీళ్ళు శరీర కదలికలకు ఉపయోగపడతాయి. కీళ్ళ వ్యాధులు చాలా రకాలుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్: కీళ్ళలో అరుగుదల మూలంగా వచ్చే వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మోకాలు కీళ్ళలో కన్పిస్తుంది. కారణాలు:అధికబరువు, నలైభై ఏళ్ళు దాటినవారు, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. కీళ్ళపై దెబ్బ తగలడం, కీళ్ళను ఎక్కువగా ఉపయోగించడం, మెటబాలిక్ సంబంధించిన వ్యాధులు కలవారిలో (హీమోక్రోమటాసిస్, విల్సన్వ్యాధి), రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలవారిలో, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: కీళ్ళలో నొప్పి కదలికల వలన ఎక్కువగా ఉండటం, స్టిఫ్నెస్ కలిగి ఉండటం, కీళ్ళలో కదలికలు జరిగినప్పుడు శబ్దాలు (Crepitus) రావడం జరుగుతాయి. జాగ్రత్తలు: క్యాల్షియం కలిగి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం, విటమిన్ డి కోసం ఉదయం సూర్యరశ్మిలో కాసేపు గడపడం, బరువుతగ్గడం, సరియైన వ్యాయామం చేయడం, ఎక్కువ బాధగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్: వ్యాధినిరోధకశక్తి (Immune Energy) తిరగబడటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్న కీళ్ళ నుంచి పెద్దకీళ్ళ వరకు ముఖ్యంగా చేతివేళ్ళు, మణికట్టు, మోకాలు, కాళ్ళవేళ్ళలో ఉంటుంది. నడివయస్సులో ఉన్నవారికి, స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: కీళ్ళలో వాపు, నొప్పి, ఉదయం స్టిఫ్నెస్ ఉండటం, ఈ వ్యాధి శరీరానికి ఇరుపక్కల ఒకే రకమైన కీళ్ళలో ఒకేసారి రావడం (Symmetrical arthritis) జరుగుతుంది. ఇతర అవయవాలైన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, నరాలు, చర్మం మీద ప్రభావం ఉంటుంది. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండి క్రిస్టల్ డిపాజిట్ అవడం వలన గౌట్ -(Gout) అనే కీళ్ళవ్యాధి వస్తుంది. ఇది చిన్న కీళ్ళలో ముఖ్యంగా కాలివేళ్లు, బొటనవేళ్ళ వాపు, నొప్పి, ఎర్రగా మారడం జరుగుతుంది. సోరియాసిన్ అనే చర్మవ్యాధి వలన కూడా చిన్న వేళ్ళలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. దీనిని సొరియాటిస్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ ఇన్ఫెక్షన్కు గురి అవడం వలన కూడా కీళ్ళలో నొప్పి రావడం జరుగుతుంది. దీని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. (SLE) (సిస్టిమిక్టాపస్ ఎరిటిమెటస్) అనే వ్యాధి వలన కూడా కీళ్ళలో నొప్పి, వాపు వస్తుంది. దీనిలో వ్యాధినిరోధకశక్తి తిరగబడుతుంది. పరీక్షలు: X-ray, RA, Factor, DBP, ESR, ASO tile, CRP, ANA, సీరమ్ యూరిక్ ఆసిడ్ వంటి రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. హోమియో వైద్యంలో రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని సారూప్య ఔషధం వాడటం వలన కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీళ్ళవ్యాధి నుండి శాశ్వత విముక్తి పొందవచ్చును. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 955001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో చక్కని పరిష్కారం
మానసికమైన ఒత్తిడి, మనోవ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికి విదితమే. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఖ.అ). ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ-పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలోక్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్ల్లో కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్ళను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్ళనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా ద్విపార్శకంగా చేతులో, కాళ్ళలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. దీనివలన శారీరకంగా, మానసికంగా రోగి కృంగిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి భుజాలు, మోకాళ్లు, వెన్నుపూసలలోని కీళ్ళు ఇలా ఏ జాయింట్లోనైనా లక్షణాలు కనిపించవచ్చు. గుండె, ఊపిరితిత్తుల పైన ఉండే పొరపైన, రక్తం పైన వ్యాధి ప్రభావం చూపుతుంది. రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన శరీరం పైన చిన్న చిన్న గాయాల మాదిరిగా ఏర్పడతాయి. కంటిలోని పొరలు, నోరు ప్రభావితమైనప్పుడు పొడిబారిపోవడం, ఎరుపెక్కి మంట రావడం జరుగుతుంది. దీనిని ‘జోగ్రెన్స్ సిండ్రోమ్’ గా పరిగణిస్తారు. రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వలన అనీమియా స్ల్పీన్ అనే ఉదర భాగంలోని అవయవం వాచినప్పుడు దీనిని ‘ఫెల్టీస్ సిండ్రోమ్’ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మోచేతుల పైన, తొడల పైన వచ్చే చిన్న చిన్న గడ్డలను ‘రుమటాయిడ్ నాడ్యుల్స్’ అంటారు. వ్యాధి నిర్ధారణలో వీటిని కూడా పరిగణిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. వ్యాధి లక్షణాలను బట్టి, రక్తంలో రుమటాయిడ్ ఫాక్టర్ అనే పరీక్ష పాజిటివ్‌గా రావడం X - రేస్‌లో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని, డిఫార్మటిస్ని పరిశీలించి వ్యాధిని నిర్థారిస్తారు. రుమటాయిడ్ ఫాక్టర్ నెగటివ్‌గా ఉన్న వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం, అనేక ఇతర వ్యాధులలో రుమటాయిడ్ ఫాక్టర్ పాజిటివ్‌గా రావడం వలన కేవలం ఈ పరీక్ష ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ చెయ్యలేము. రుమటాయిడ్ ఫాక్టర్ అనే ఆటోయాంటీ బాడీ సిస్టమ్ స్ల్కీరోసిన్, ఎస్.ఎల్.ఇ. మొదలగు ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులలో కూడా పాజిట్‌గా వస్తుందని తెలుసుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతను, వాడే మందుల యొక్క ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి ఇ.ఎస్.ఆర్ సి.ఆర్.పి. వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్ వలన, స్టిరాయిడల్ మందుల వలన నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. కీళ్ళనొప్పులు అంటే ఇంత నరకమా? నాపేరు రాజగోపాల్. నేను రిటైర్డ్ ఆఫీసర్ని. నేను సర్వీస్‌లో ఉండగా నాకు ఎటువంటి నొప్పులు ఉండేవి కావు. ఆ తర్వాతే నాకు ఈ కీళ్లనొప్పులు మొదలయ్యాయి. కీళ్ళనొప్పులంటే ఇంత నరకమా? అనిపించింది. సరిగా నడవలేక, కూర్చోలేక, ఎక్కడికీ వెళ్ళలేక చాలా ఇబ్బందిపడేవాడిని. ఎన్నోరకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. అప్పుడు పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్మెంట్ వలన, సలహాల వలన నాకు ఇప్పుడు ఏ బాధా లేదు. నాకు ఇంతటి రిలీఫ్‌ను ఇచ్చిన పాజిటివ్ హోమియోపతి డాక్టర్లకు చాలా థాంక్స్... డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
కీళ్ళనొప్పులు వాటి కారణాలు ఆధునిక హోమియో చికిత్స
నేటి ఆధునిక జీవనం కీళ్ళ పైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికీ తోడు కొన్నిరకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. నడవడమే కష్టం... ఎందుకంటే? కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలి నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేం. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది. ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితమైనా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన చోట కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
కీళ్ళనొప్పులు వాటి కారణాలు - హోమియో చికిత్స
నేటి ఆధునిక జీవనం కీళ్ళపైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికి తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. నడవడమే కష్టం... ఎందుకంటే? కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేము. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది. ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
కీళ్ళనొప్పులు వాటి కారణాలు ఆధునిక
నేటి ఆధునిక జీవనం కీళ్ళపైన మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్ళ జబ్బులను పెంచుతాయి. వీటన్నింటికి తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది. నడవడమే కష్టం... ఎందుకంటే? కీళ్ళలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగం విపరీతమైన నొప్పి, వాపు బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తరువాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్నిరకాల పనులు చేయలేము. కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది. ఎందుకా వాపు - కీళ్ళలో జరిగే మార్పులు కీళ్ళు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్ళసమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ళ కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోఫైట్స్ కీళ్ళను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డలుగా తయారవుతుంది. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురుపదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
పాలీ ఆర్థరైటిస్ నుంచి విముక్తి సులభమే...
కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం ఆర్థరైటిస్. సాధారణంగా ఎముకలు అరిగిపోవడం వల్ల కీళ్లనొప్పులు రావడం చాలామందిలో చూస్తుంటాం. ఈ సమస్య మోకాళ్లు, భుజాలు, మడమలు, మణికట్టు వంటి ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఎక్కువ. ఐదు కంటే ఎక్కువ కీళ్లకు వచ్చే సమస్యను పాలీ ఆర్థరైటిస్ అంటారు. కారణాలు : రుమటాయిడ్ ఆర్థరైటిస్ సొరియాటిక్ ఆర్థరైటిస్ సిస్టమిక్ ల్యుపస్ అరిథమిటోసిస్ (ఎస్‌ఎఈ) పాలీ మయాల్జియా రుమాటికా ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ అతి మూత్రవ్యాధి లేదా డయాబెటిస్ లక్షణాలు: నొప్పి వాపు సమస్య ఉన్న ప్రదేశంలో ఎర్రబారడం కదలికలు కష్టంగా ఉండటం ఎముకలు వంకర్లుపోవడం కీళ్లు పట్టేసినట్లుగా ఉండటం నిర్ధారణ పరీక్షలు : ఆర్ఏ ఫ్యాక్టర్ ఏఎస్ఓ టైటర్ కీళ్ల జాయింట్ల ఎక్స్-రే సీబీపీ, ఈఎస్ఆర్ ఎఫ్బీఎస్, ఆర్బీఎస్, పిఎల్‌బిఎస్ ఏఎన్ఏ - సీరమ్ క్యాల్షియమ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికబరువు తగ్గించుకోవాలి, ఓ మోస్తరు బరువు ఉన్నవారు మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సరైన ఫిజియోథెరపిస్టును సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి వ్యాయామాలు చేయడం మంచిదే కాని కీళ్లు అతిగా కదలడానికి ఆస్కారం ఉన్నవి, కీళ్లకు శ్రమ కలిగించే వ్యాయామాలు చేయకూడదు. సులభంగా చేయదగినవి మాత్రమే చేయాలి. చికిత్స: పాలీ ఆర్థరైటిస్ సమస్యకు హోమియోలో బ్రయోనియా, కాల్చికమ్, లెడమ్పాల్, రస్టాక్స్, లైకో, మెర్క్‌సాల్, ఫైఫాస్, కాల్కేరియా ఫాస్ మందులు వాడాల్సి ఉంటుంది. బ్రయోనియా : సన్నగా, దృఢంగా ఉండి తొందరగా చిరాకుపడేవారికి ఇది మంచి మందు. ఎప్పుడూ తాము చేసే వృత్తి గురించి మాట్లాడుతుంటారు. తొందరగా ఇంటికి వెళ్లాలనుకుంటారు. కీళ్లు పట్టేసినట్లు ఉండి, గుచ్చినట్లుగా నొప్పులు వస్తాయి. విశ్రాంతికి తగ్గుతాయి. దాహం ఎక్కువ, మలబద్దకం, వేడిని భరించలేకపోవడం వంటి లక్షణాలకు బ్రయోనియా ఉపయోగించాలి. కాల్చికమ్: గౌట్‌కు మంచి మందు. నీరసం, శరీరం లోపల చల్లగా ఉండటం, కీళ్లవాపు, నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, తిమ్మిర్లు, నొప్పి, ఒక కీలు నుంచి మరొక కీలుకు మారుతూ ఉండటం, కాళ్ల్లు చేతులు చల్లబడటం వంటి లక్షణాలకు కాల్చికమ్ బాగా పని చేస్తుంది. లెడమ్పాల్: పదునైన వస్తువుల వల్ల అయిన గాయాలకు ఇది మంచిమందు, శరీరంలో వేడి తగ్గడం, నొప్పి శరీరం కింది నుంచి పైకి పాకడం, కీళ్లవాపు, వేడి, కీలు కదిలినప్పుడు చప్పుడు రావడం వంటి లక్షణాలతో పాటు చల్లటి నీళ్లలో కాళ్లు పెడితే కొంత ఉపశమనం కలిగినప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది. రస్టాక్స్: ఒకచోట కుదురుగా కూర్చోలేరు. ఉత్సాహంగా ఉండరు. ఆత్మహత్య గురించి ఆలోచనలు, రాత్రిపూట భయం, గుండెదడ, అధికశ్రమ, బరువులు మోయడం వల్ల వచ్చిన సమస్య, కీళ్లనొప్పులు, వాపులు, చేతులు కాళ్లు పట్టినట్లుగా ఉంటాయి. చల్లటిగాలిని భరించలేరు. తిమ్మిర్లు, సయాటికా వంటి సమస్యలు ఉంటాయి. కీళ్లను కదలిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. లైకోపోడియమ్: దిగులు, ఒంటరిగా ఉండాలంటే భయం, కొత్త పనులు చేయడానికి ఇష్టపడరు. భయం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, మతిమరపు, తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడటం, కీళ్లనొప్పి, వాపు, కాళ్లూ, చేతులు బరువుగా ఉండటం, కీళ్ల దగ్గర చిరిగినట్లుగా నొప్పి, పాదాల నొప్పి, కాలివేళ్లు, పిక్కలు రాత్రివేళ కొంకర్లు పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సమస్య కుడిపక్క, వేడివాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. మెర్క్‌సాల్: వీరు అధిక వేడిని లేదా చల్లదనాన్ని భరించలేరు. జవాబు త్వరగా ఇవ్వరు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తమకు ఏదో దూరమవుతోందని భావిస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారికి మెర్క్‌సాల్ మంచి ఔషధం. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్