Multiplex
-
సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?
సినిమాకు వెళితే పిల్లలు, తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు, తెలిసినవారు, బంధువులు.. ఇలా చాలామందిని గమనించవచ్చు. నిత్యం ఏదో పనుల్లో బిజీగా ఉండేవారికి సినిమాలు ఆటవిడుపుగా మారి వినోదాన్ని అందిస్తుంటాయి. కొన్నేళ్ల కొందట సినిమా నిర్మించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే తరహాలో రాబడి ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. చిత్ర నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఫక్తు వినోదాన్ని అందించాల్సిన సినీ పరిశ్రమలో క్రమంగా వ్యాపార ధోరణి పేరుకుపోతుంది. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్వెల్లో ప్రేక్షకులు పాప్‌కార్న్ కొనుగోలు చేసేంత వరకు వివిధ స్థాయుల్లో వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు: సినిమా ప్రారంభానికి ముందు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులుంటాయి. ఇందులో స్క్రిప్ట్ డెవలప్ మెంట్, లొకేషన్ సెలక్షన్.. వంటి వాటికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది.ప్రొడక్షన్ ఖర్చులు: ఈ ఖర్చు చాలా కీలకం. నటీనటులు, సిబ్బంది జీతాలు, పరికరాల అద్దె, సెట్ నిర్మాణం, దుస్తులు, ప్రత్యేక ఖర్చులు దీని కిందకు వస్తాయి.పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు: ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లైసెన్సింగ్ వంటి వాటి కోసం కొంతక ఖర్చు చేయాల్సి ఉంటుంది.మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్: సినిమాను ప్రమోట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం దీని కిందకు వస్తాయి.సౌకర్యాలకు పెద్దపీటగతంలో వీటన్నింటికి తక్కువగానే ఖర్చు అయ్యేది. ఇటీవల కాలంలో వీటి వ్యయం రూ.కోట్లల్లోనే ఉంది. కొన్నేళ్ల కిందట టౌన్‌లోని చిన్న థియేటర్లో ఫ్యాన్ సౌండ్‌ను భరిస్తూ సినిమా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏసీ థియేటర్, ప్రీమియం సీటింగ్, లగ్జరీ సౌకర్యాలతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా మౌలిక సదుపాయాలను అప్డేట్ చేస్తున్నాయి. ఆ ఆర్థిక భారాన్ని తుదకు ప్రేక్షకులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.పాన్ ఇండియా మార్కుఒకప్పుడు స్థానిక భాషలో సినిమా నిర్మించి అదే రాష్ట్రంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా ‘పాన్ ఇండియా’ మార్కుతో విభిన్న భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అక్కడి భాషల్లో విడుదల చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఫలితంగా సినిమా కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో టికెట్ రేట్లు పెంచుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!లిస్టెడ్ కంపెనీల జోరుపీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీలు దేశవ్యాప్తంగా చాలా మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నాయి. సినిమా టికెట్ కాస్ట్ కంటే యాడ్ఆన్ సర్వీసులుగా ఉండే స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, వాటర్ బాటిల్.. వంటివి విక్రయించడంతోనే అధిక మార్జిన్లు సంపాదిస్తాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తే అదనంగా ఆదాయం సమకూరినట్లే. థియేటర్లలో విభిన్న కంపెనీలు యాడ్లు ఇస్తుంటాయి. దానివల్ల ఆదాయం సమకూరుతుంది. మల్టిప్లెక్స్‌లు ప్రైవేట్ ఈవెంట్లకు స్కీన్లను రెంట్‌కు ఇస్తూంటాయి. అది కూడా ఒక ఆదాయ వనరుగా ఉంది. -
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. అంతా మాయ!
రూ.99కే సినిమా చూసే ఛాన్స్. దేశవ్యాప్తంగా ఏకంగా 4000 స్క్రీన్స్‌లో ఈ ఆఫర్ వర్తింపు. కొత్త సినిమాల్ని కూడా తక్కువ ధరలోనే మల్టీప్లెక్స్‌లో చూసేయొచ్చు. మూడు రోజుల క్రితం మల్టీప్లెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్దగా ప్రచారం చేసుకుంది. మిగతా చోట్ల రూ.99 అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రూ.112 అని చెప్పుకొచ్చింది. తీరా చూస్తే అది కూడా లేదు. పైకి చెబుతున్నది ఒకటి రియాలిటీలో జరుగుతున్నది మరొకటి అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఆఫర్ కొన్నిచోట్లేనేషనల్ సినిమా డే అని ఘనంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ సహా చాలా థియేటర్లలో తక్కువ రేటు టికెట్ అని ఊరించారు. కానీ నిజంగా అలా చేయట్లేదు. ఈ శుక్రవారం రెండు మూడు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటికి అరకొరా థియేటర్లు దొరికాయి. అందులో కొన్నింటిలోనే రూ.112 ఆఫర్ ఉంది.మోసం చేస్తున్నారా?ఆఫర్ అన్నప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు అయితే ప్రదర్శితమవుతున్నాయో అన్నింటికి అప్లై అవుతుందేమో? కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'మత్తువదలరా 2', 'సరిపోదా శనివారం', '35 ఇది చిన్న కథ కాదు' చిత్రాలు కూడా థియేటర్లలో ఉన్నాయి. కానీ వీటిని ఆఫర్లో పెట్టలేదు. మళ్లీ హైదరాబాద్‌లో పలు మల్టీప్లెక్స్‌లో రిలీజైన హిందీ సినిమాలకు పెట్టారు. అంటే తెలుగు ప్రేక్షకులంటే మల్టీప్లెక్స్ అసోసియేషన్‌కి చిన్నచూపా లేదంటే ఆఫర్ చెప్పి మోసం చేయాలని చూస్తున్నారా?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?)ఇలా చేస్తే ఎలా?ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లకు జనాలు వెళ్లడం గతంతో పోలిస్తే తగ్గింది. సినిమా డే నాడు ఆఫర్స్ అని చెప్పినప్పుడు పూర్తిగా పాటిస్తేనే కదా ఆసక్తి లేకపోయినప్పటికీ టికెట్ డబ్బులు తక్కువే కాబట్టి ప్రేక్షకుడు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా పైకి ఒకటి చెప్పి లోపల మరొకటి చేస్తే ఉన్న క్రెడిబులిటీ కూడా పోతుందేమో? ఈ విషయం మల్టీప్లెక్స్‌లు ఆలోచిస్తే బెటర్.. లేదంటే సినిమా డే-ఆఫర్ అని చెప్పేటప్పుడు కేవలం ఉత్తరాదికి మాత్రమే చెప్పుకొంటే బెటర్!రీ రిలీజ్ సినిమాలకు కూడాకొత్త సినిమాలకు ఆఫర్ పెట్టలేదంటే నిర్మాత కోట్లు ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు. 'బొమ్మరిల్లు' లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా రూ.250, రూ.300 టికెట్ రేటు పెట్టున్నారు. కనీసం వీటినైనా సరే సినిమా డే ఆఫర్ కిందకు తీసుకొస్తే జనాలు థియేటర్లకు వస్తారేమో?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)National Cinema Day returns for its 3rd edition on September 20th! Enjoy movies at over 4,000 screens across India for just Rs. 99. Don’t miss this perfect opportunity to catch your favorite films with your friends and family. #NationalCinemaDay2024 #20September pic.twitter.com/hEduoRbGtZ— Multiplex Association Of India (@MAofIndia) September 17, 2024 -
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. అయితే ఆ ఒక్క రోజే!
మూవీ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్, డిలైట్ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఆ రోజు అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్ పట్ల సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.99 మాత్రమే
సినిమాలు తెగ చూసేవాళ్లకు ఇది బంపరాఫర్. ఎందుకంటే మే 31న అంటే ఈ శుక్రవారం సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏ మల్టీఫ్లెక్స్‌లో అయినా సరే రూ.99 మాత్రమే మూవీ చూడొచ్చని ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తించదని చెప్పి చిన్నపాటి షాకిచ్చింది.ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో 'హనుమాన్', 'గుంటూరు కారం' లాంటి సినిమాలు వచ్చాయి. వీటి వల్ల బాక్సాఫీస్ కళకళాలాడింది. దీని తర్వాత టాలీవుడ్ అనే కాదు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి చూడటం గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్ రూ.99 అని ఆఫర్ పెట్టింది.(ఇదీ చదవండి: హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!)ఆఫర్ చూసి మీరు తెగ ఎగ్జైట్ అయిపోయింటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వర్తించదని చెప్పి షాకిచ్చింది. మన దగ్గర సినిమా లవర్స్ డే ఉన్నప్పటికీ.. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ ధర రూ.112గా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. వీళ్లకు ఆఫర్ ఇవ్వకపోయినా సరే ఎలానూ చూస్తారులే అనే ధీమానా? లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. ఇలా తెలుగు ప్రేక్షకులపై మల్టీప్లెక్స్‌లా చిన్నచూపు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ ఏడాది జనవరిలోనూ ఇలానే సినిమా లవర్స్ డే అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫర్ ప్రకటించింది. నాలుగు నెలల తిరక్కుండానే మళ్లీ బంపరాఫర్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వ్యాపారం తగ్గినా ప్రతిసారీ కావాలనే ఇలా ఆఫర్స్ అని అంటున్నారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)Cinema Lovers Day returns on 31st May with movies for just Rs 99/-!🍿Join us at cinemas across India to celebrate a day at the movies. Over 4000+ screens are participating, making it an unforgettable cinematic experience!#CinemaLoversDay pic.twitter.com/b2XAOC3yxy— Multiplex Association Of India (@MAofIndia) May 28, 2024 -
ఆ థియేటర్లలో బొమ్మ పడదు
సాక్షి, హైదరాబాద్: థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమష్టి నిర్ణయం కాదని... నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే...శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా.. అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం పదిశాతం ఆదాయం కూడా రావడం లేదని ఎగ్జిబిటర్ చారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మల్టీప్లెక్స్‌లకు పర్సెంటేజీ రూపంలో లాభాలు సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా మల్టీప్లెక్స్‌లకు ఒక విధంగా, సింగిల్ థియేటర్లను మరోలా చూస్తున్నారన్న వాదన కూడా ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా వారంరోజులు నడిస్తే..వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు ఇస్తుంటే.. సింగిల్ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారని, అద్దె చెల్లించడానికి వచ్చే ఆదాయం కంటే తక్కువ కలెక్షన్లు వచి్చనప్పుడు పర్సెంటేజీ లెక్కన తీసుకోమంటున్నారని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుండడంతో.. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోందని, దానికితోడు ఓటీటీల్లోనూ సినిమాలు వస్తుండడంతో.. థియేటర్లకు ఆదరణ తగ్గుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుదర్శన్ థియేటర్ యజమాని గోవింద్‌రాజు తెలిపారు. అది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం.. రెండువారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్‌నారంగ్, కార్యదర్శి కె.అనుపమ్‌రెడ్డి స్పష్టం చేశారు. చిత్రసీమ అపెక్స్ బాడీకి నోటీసు ఇవ్వలేదు..తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయానికి చిత్ర పరిశ్రమ అపెక్స్బాడీలైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలికి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శనలు రద్దు చేయడమైందని గతంలోనూ బోర్డులు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు. -
హీరో అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్.. ఈసారి ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీబిజీ. మొన్నీమధ్యే వైజాగ్ వెళ్లొచ్చాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో కలిసి పనిచేస్తాడని అంటున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మూవీ ఉంది. ఇంత బిజీలోనూ అటు ఫ్యామిలీకి టైమ్ ఇస్తూనే మరోవైపు తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు. కొత్తగా మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) ఒకప్పుడు తెలుగు హీరోలు.. సినిమాలు చేస్తూ మహా అయితే పలు వ్యాపారాలు చేసేవారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, మహేశ్ బాబు తదితరులు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంటరయ్యారు. హైదరాబాద్‌లో ఇప్పటికే మహేశ్‌కి ఏఎంబీ, అల్లు అర్జున్‌కి ఏఏఏ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. త్వరలో రవితేజది ఓపెన్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్.. వైజాగ్‌లోనూ ఏఏఏ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. నిజామా కాదా అనేది త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు ప్రస్తుతం చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు ఈ బిజినెస్‌లో హవా చూపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
టాలీవుడ్ ప్రిన్స్ సందడి.. ఆ హిట్ సినిమా చూసేందుకే!
గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్.. తదుపరి చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉన్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు హైదరాబాద్‌లో సినిమా థియేటర్లో సందడి చేశారు. ఇటీవల రిలీజైన మలయాళ డబ్బింగ్ హిట్ సినిమా ప్రేమలు చిత్రాన్ని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో వీక్షించారు. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #TFNExclusive: Super 🌟 @urstrulyMahesh along with #NamrataShirodkar spotted near AMB Cinemas!📸#MaheshBabu #GunturKaaram #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/X1SJYekSt4 — Telugu FilmNagar (@telugufilmnagar) March 10, 2024 -
సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!
సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఈనెల 13న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఒక్క రోజు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల్లో కేవలం రూ.99 కే టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన సినిమాను ఆస్వాదించవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఎంఏఐ(MAI) ట్వీట్ చేసింది. అక్టోబర్ 13న శుక్రవారం కావడంతో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికే రిలీజైన సినిమాలతో పాటు శుక్రవారం రిలీజయ్యే చిత్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తక్కువ ధరకే సినిమా చూసే ఒక్కరోజు మాత్రమే. ఈ ఆఫర్ ప్రముఖ థియేటర్లు అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్‌లో రూ.99 కే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా.. 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అంతకుముందు సెప్టెంబర్ 16వ తేదీని వేడుకల రోజుగా ప్రతిపాదించగా.. ఆ తర్వాత అది సెప్టెంబర్ 23కి మారింది. గతేడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున 6.5 మిలియన్ల మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూశారని వెల్లడించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆ ఏడాదిలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన రోజుగా నిలిచిందని ప్రెసిడెంట్ కమల్ జియాన్చందానీ తెలిపారు. National Cinema Day is back on October 13th. Join us at over 4000+ screens across India for an incredible cinematic experience, with movie tickets priced at just Rs. 99. It's the perfect day to enjoy your favorite films with friends and family. #NationalCinemaDay2023 #13October pic.twitter.com/Pe02t9F8rg — Multiplex Association Of India (@MAofIndia) September 21, 2023 -
పార్లమెంట్ కొత్త భవనం.. మోదీ మల్టీప్లెక్స్
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం సౌకర్యవంతంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణ శైలి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఈ భవనాన్ని ‘మోదీ మలీ్టప్లెక్స్’ లేదా ‘మోదీ మారియెట్’ అని పిలిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నూతన భవనం పట్ల జైరామ్ రమేశ్ అభ్యంతరాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను జైరామ్ రమేశ్ కించపర్చారని మండిపడ్డారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. అవయవదాతలకు -
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్!
మల్టీప్లెక్స్‌లో సినిమాలు వీక్షించేవారికి ఊరట కలిగించే విషయం ఇది. సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరల కంటే అక్కడ అమ్మే తినుబండారాలు, పానీయాల రేట్లే అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్‌లలో విపరీతమైన వాటి ధరలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వక్తమవుతుండటం తెలిసిందే. సోషల్ మీడియాలో విమర్శల దెబ్బకు ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ దిగొచ్చింది. తమ వద్ద విక్రయించే తినుబండారాలు, పానీయాల ధరలను 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫుడ్ కాంబోల ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ‘బెస్ట్ సెల్లర్@99’ అనేది స్పషల్ షోలకు, గ్రూప్ బుకింగ్స్‌కి వర్తించదని, ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కోవాలని ప్రకటించింది. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక టబ్ చీస్ పాప్‌కార్న్ రూ.450, సాఫ్ట్ డ్రింక్ 600 ఎంఎల్ రూ.360 ఉండేది. దీనిపై ట్విటర్లో పది రోజుల క్రితం ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దానికి స్పందిస్తూ సదరు మల్టీప్లెక్స్ యాజమాన్యం తినుబండారాలు, పానీయాల రేట్లు తగ్గించింది. దీనికితోడు థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలపై జీఎస్టీని ప్రభుత్వం ఇటీవల 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం కూడా కలిసివచ్చింది. ఇదీ చదవండి: FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! -
విశాఖ సిగలో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్‌గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది. మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది. డీఎఫ్బీవోటీ పద్ధతిలో..! వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది. అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీఎఫ్బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీ జూన్ 16న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ మార్చేశారు. దీంతో ప్రస్తుతం థియేటర్లలో మార్చిన సినిమానే ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురవగా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో మళ్లీ ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. ఈ టికెట్లపై 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే.. ) View this post on Instagram A post shared by T-Series (@tseries.official) -
మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల బాటలో శివకార్తికేయన్... కొత్త బిజినెస్!
కోలీవుడ్‌లో తక్కువకాలంలోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శివకార్తికేయన్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన డాన్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే తెలుగులోనూ అభిమానులను సంపాదించుకోవాలన్న ఆశతో నటించిన ప్రిన్స్ చిత్రం నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన మావీరన్ చిత్రం జూలై 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అశ్విన్ మడోనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఇదిలా ఈ మధ్య నటీనటులు, దర్శకులు ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. దర్శకుడు అమీర్ ఇటీవలే ఒక కాఫీ షాపును ప్రారంభించారు. నయనతార, ప్రియ భవానీ శంకర్ వంటి వారు కూడా ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్ కూడా ఇతర వ్యాపారంలోకి దిగుతున్నట్టు తాజా సమాచారం. ఈయన ఒక మల్టీ ఫ్లెక్స్ థియేటర్‌కు భాగస్వామి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్ సంస్థతో కలిసి చైన్నెలో ఒక మల్టీఫ్లెక్స్ థియేటర్ ప్రారంభించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఏషియన్ గ్రూప్ సంస్థ ఇప్పటికే టాలీవుడ్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారి భాగస్వామ్యంలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు ప్రారంభించిందన్నది గమనార్హం. చదవండి: ఆర్జీవీ ఆఫీస్.. బ్రూస్లీ నుంచి బూతు బొమ్మల దాకా -
AAA Cinemas Photos: అల్లు అర్జున్ AAA థియేటర్ ఓపెనింగ్..కిక్కిరిసిన జనం (ఫొటోలు)
-
అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేట్‌లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్‌ను అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్‌ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్‌ను నడిపిస్తున్నాడు బన్నీ. Nizam king 👑 🔥 @alluarjun #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/NkM10Nzqn8 — AlluArjun Celebrations (@AA_CELEBRATIONS) June 15, 2023 ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం! ) the magnificent Grand Inauguration of #AAACinemas today graced by our beloved Icon Star, @alluarjun, and esteemed Minister @YadavTalasani Garu!@alluarjun Don't forget to use the hashtag #AAACinemasLaunch all day long to be a part of the excitement! 👍 pic.twitter.com/xKqnpNIi1C — AAA cinemas (@aaa_cinemas) June 15, 2023 -
AAA Cinemas Images: అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
AAA Cinemas Photos In HD: బన్నీ మల్టీప్లెక్స్‌లో అన్నీ ప్రత్యేకతలే.. చూస్తే వావ్ అనాల్సిందే (ఫోటోలు)
-
ఆకాశ భవనాలు.. రోడ్లపై వాహనాలు ‘ఇంపాక్ట్’..పడేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో గంటల కొద్దీ ప్రయాణం.. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి ఒక్కసారిగా బయటికొచ్చే జనంతో రోడ్లు జామ్.. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికీ అరగంటకుపైగా పట్టడం.. ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికితోడు భవిష్యత్తులో మరింత పెరిగే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా తెరపైకి వచ్చినదే ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’. కొత్తగా భారీ భవనాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించదలిస్తే.. ఆయా రహదారుల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, అదనంగా పెరిగే ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన నిబంధనలతో అనుమతులు ఇవ్వడమే ‘టీఐఏ’. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నాలుగేళ్ల కిందటే ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల పక్కన భారీ నివాస, వాణిజ్య భవనాలు వెలుస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది పెరిగి పోతూనేఉంది. ‘ట్రాఫిక్ ఇంపాక్ట్’ అంచనా ఇలా.. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ భవనం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటే భవనం బిల్టప్ ఏరియా, అందులోని సినిమా స్క్రీన్లు, షాపులు ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వచ్చిపోయే వారి సంఖ్య, ఆ ప్రాంతంలో పెరగబోయే రద్దీ, సినిమా షోల ప్రారంభ, ముగింపు సమయాల్లో ప్రభావం తదితర అంశాలు బేరీజు వేస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రహదారి òపెరగ నున్న రద్దీకి సరిపోతుందో లేదో అంచనా వేస్తారు. ఒకవేళ సరిపోని పక్షంలో రహదారిని విస్తరించేందుకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సమీపంలోని జంక్షన్లు, వాటి వద్ద ఏర్పడబోయే ట్రాఫిక్ పరిస్థితి వంటి వివిధ అంశాలను పరిశీలి స్తారు. తర్వాత షరతులతో అనుమతులిస్తారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి ఉంటే.. దాని పరిష్కారానికి వీలుగా బిల్డర్ ఎక్కువ సెట్బ్యాక్లు వదలాల్సి ఉంటుంది. లేదా లింక్ రోడ్ల వంటి వాటికి చాన్స్ ఉంటే వేసేందుకు అనుమతిస్తారు. ఒకవేళ జీహెచ్ఎంసీయే రోడ్లు వేస్తే అందుకయ్యే వ్యయాన్ని బట్టి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేస్తారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటిప్రత్యా మ్నాయ పరిష్కారాలు లేని పక్షంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తారు. ఒక్క అడుగూ పడక.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ మ రింత జటిలం కాకుండా ఉండేందుకు‘ఇంపాక్ట్’ ఆలోచన చేశారు. కొత్తగా నిర్మించే భవ నాల వల్ల ఆ ప్రాంతంలో ఎంత రద్దీ పెరగనుంది? అప్ప టికే ఉన్న ట్రాఫిక్ ఎంత? కొత్తగా పెరగబోయే వాహనాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది? పెరిగే ట్రాఫిక్ నుంచి ఉపశమనంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలతో ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ సర్టిఫికెట్‌ను జత పరిచేలా భవన నిర్మాణ నిబంధనల్లో పొందు పర్చేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ప్రధాన ప్రాంతాల్లోనూ ఆకాశ హర్మ్యాలు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయి. ఎల్బీ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి అత్యధిక రద్దీ ఉండే ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనితో ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినా ట్రాఫిక్ సమస్యలు తగ్గకపోగా.. పెరిగిపోతూనే ఉన్నాయి. బంజారాహిల్స్‌లో ఇదివరకు ఉన్న భవనాల గరిష్ట ఎత్తు నిబంధనలను సైతం సవరించి ఆకాశ హర్మ్యాలు అనుమతులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇక్కట్లున్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది వంద ఆకాశ హర్మ్యాలు: గతంలో జీహెచ్ఎంసీ వెలుపల మాత్రమే ఆకాశ హర్మ్యాలను ఎక్కువగా నిర్మించేవారు. ఇటీవలి కాలంలో బల్దియా పరిధిలోనూ ఇవి పెరుగుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు వంద హైరైజ్ భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులిచ్చింది. అంతకుముందు ఏడాది వాటి సంఖ్య 80కిపైనే ఉంది. వారిని తప్పనిసరి చేస్తే మంచిదే.. పెద్ద బిల్డర్లు హైరైజ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో పార్కింగ్ స్థలం వినియోగం కోసం ట్రాఫిక్ కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే ప్రతీ ఒక్కరూ పాటిస్తారు. దీనితో ప్రాజెక్టుతోపాటు సదరు ప్రాంతంపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది. డివైడర్లు, బారికేడ్లు, వీధి దీపాలు వంటి ట్రాఫిక్ వ్యయా లను సీఎస్ఆర్ కింద బిల్డర్ చేపట్టేలా చేయాలి. – నరేంద్ర కుమార్ కామరాజు, ప్రణీత్ గ్రూప్ ఎన్ఓసీ ఉంటేనే.. భవనాల నుంచి వచ్చే వాహనాలు, బయట పార్కింగ్ చేసే వాహనాలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. అందుకే వాణిజ్య సముదాయాలతో పాటు హైరైజ్ నివాస భవనాలకు కూడా ట్రాఫిక్ పోలీసు ఎన్ఓసీ ఉంటేనే అనుమతులు జారీ చేయాలి. 25 అంతస్తులకు మించిన ప్రతి భవనానికి ఈ విధానాన్ని అమలు చేస్తే మంచిది. – కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ జాయింట్ సీపీ, సైబరాబాద్ -
Viral:మల్టీప్లెక్స్‌లోకి గిరిజన కుటుంబం అడ్డగింత
Tribal Video: చెన్నైలోని ఓ పాపులర్ మల్టీప్లెక్స్ కమ్ షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా చూసేందుకు వెళ్లిన ఓ గిరిజన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాళ్లను స్క్రీన్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మల్టిప్లెక్స్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చుకుంది. చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్‌లో శింబు నటించిన ‘పాతు తల’ చిత్రం నడుస్తోంది. ఇంతలో ఓ కుటుంబం టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లేందుకు యత్నించింది. అయితే.. వాళ్ల అవతారం, వేషధారణ చూసి థియేటర్ సిబ్బంది వాళ్లను లోపలికి అనుమతించలేదు. టికెట్లు ఉన్నా అనుమతించకపోవడంపై ఆ కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. గిరిజనులపై వివక్ష ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యి హక్కుల సాధన ఉద్యమకారుల నుంచి విమర్శలకు తావిచ్చింది. ఇంకోపక్క నారికురవర్(ఆ కుటుంబం ఈ వర్గానికి చెందిందే) తెగ పెద్దలు సైతం ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించేందుకు యత్నించారు. అయితే.. காசு கொடுத்து டிக்கெட் வாங்கினப்புறம் என்னடா இது @RohiniSilverScr pic.twitter.com/bWcxyn8Yg5 — Sonia Arunkumar (@rajakumaari) March 30, 2023 ఈలోపే సదరు మల్లిప్లెక్స్ నిర్వాహకులు ఘటనపై వివరణ ఇచ్చారు. పాతు తల చిత్రానికి సెన్సార్ బోర్డు యూ బై ఏ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి, 12 ఏళ్లలోపు వాళ్లు సినిమా చూసేందుకు అనుమతి లేదు. ఆ లెక్కన ఆ కుటుంబంలో రెండు, ఆరు, ఎనిమిది, పదేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అందుకే లోపలికి అనుమతించలేదు. అంతేతప్ప.. అక్కడ ఎవరినీ అవమానించలేదు. ఈలోపు కొందరు గుమిగూడి గూడడంతో.. పరిస్థితి చెయ్యి దాటకూడదన్న ఉద్దేశంతో వాళ్లను సినిమా చూసేందుకు అనుమతించాం అంటూ ఆ కుటుంబం వీడియో చూస్తున్న వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. pic.twitter.com/dvfewZsxuN — Rohini SilverScreens (@RohiniSilverScr) March 30, 2023 ఇదిలా ఉంటే.. ఓ గిరిజన మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 341 కింద ఇద్దరు థియేటర్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయగం గమనార్హం. మరోవైపు సినీ ప్రముఖులు సైతం ఈ వీడియోపై స్పందించారు. ఈ వ్యవహారంలో థియేటర్ సిబ్బంది తీరుపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేయగా.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, వ్యవహారం అప్పుడే సర్దుమణిగిందని, వాళ్లను సినిమా చూసేందుకు మేనేజ్మెంట్ అనుమతించిందంటూ రీట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రియల్ కాంతార.. భూత కోల చేస్తూ కుప్పకూలాడు పాపం -
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99 కే టికెట్
మీకు అతి తక్కువ ధరకే సినిమా టికెట్ కావాలా? కేవలం వంద రూపాయల్లో సినిమా చూసేయలనుకుంటున్నారా? అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు టికెట్ అందిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్ సినిమాలో ఈ ఆఫర్ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్టీతో కలిపి ఉండనుంది. మొత్తంగా తెలంగాణలో రూ.112+జీఎస్టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్ ఈ ఆఫర్ పరిధిలోకి రావని తెలిపింది యాజమాన్యం. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్సైట్ చూడాలని సూచించింది. -
అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. త్వరలోనే ప్రారంభం
సినిమాలతో పాటు బిజినెస్‌లపై కూడా దృష్టిపెట్టారు మన స్టార్ హీరోలు. ఎంతోమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఏఎంబీ మాల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్‌కి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్సును ప్రారంభించనున్నారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
National Cinema Day: మల్టీఫ్లెక్సుల్లో రూ.75కే టికెట్!
ముంబై: ఓటీటీల కాలంలో.. కరోనా తర్వాత సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీఫ్లెక్స్‌లకే ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం ఒకటి తీసుకుంది. వంద రూపాయలలోపు టికెట్ రేటుతో ప్రేక్షకుడికి సినిమా అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడో విషయం ఉందండోయ్. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా.. ప్రేక్షకులకి ఈ బంపరాఫర్ ప్రకటించింది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI). కరోనా లాక్డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఆ ఒక్కరోజు ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది ఎంఏఐ. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, ఏషియన్.. ఇలా పలు మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీల్లో ఆరోజున కేవలం రూ.75కే సినిమా చూడొచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4000 స్క్రీన్స్‌లో సినిమా చూడొచ్చని మల్టీఫ్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ ద్వారా అయిన ఆడియొన్స్‌ను ఆ ఒక్కరోజు రప్పించ వచ్చనే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే బాయ్‌కాట్‌ట్రెండ్ మోజులో ఉన్న ఆడియెన్స్.. ఈ బంపరాఫర్‌ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీలు మాత్రం ఫ్యామిలీ ఆడియొన్స్ రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Cinemas come together to celebrate ‘National Cinema Day’ on 16th Sep, to offer movies for just Rs.75. #NationalCinemaDay2022 #16thSep — Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022 ఇదీ చదవండి: బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి -
మల్టీప్లెక్స్‌ను దాటనున్న ఓటీటీ
ముంబై: దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్ త్వరలో మల్టీప్లెక్స్ పరిశ్రమను అధిగమించనుంది. 2018లో రూ. 2,590 కోట్లుగా ఉన్న ఓటీటీల మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకు పెరగనుంది. ఏటా 36 శాతం వృద్ధి సాధించనుంది. తద్వారా ఒకప్పుడు వీసీఆర్‌లు, వీసీపీ, వీసీడీలను కనుమరుగయ్యేలా చేసిన మల్టీప్లెక్స్‌లను దెబ్బతీయనుంది. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 1980లలో తెరపైకి వచ్చిన వీసీఆర్, వీసీపీలు ఆ తర్వాత డీవీడీల్లాంటివి .. 2000ల తొలినాళ్లలో మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు కుప్పతెప్పలుగా వచ్చే వరకూ హవా కొనసాగించాయి. ఆ తర్వాత సాంకేతికాంశాలు, మల్టీప్లెక్స్‌ల ధాటికి అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవాతో మల్టీప్లెక్స్‌లకు కూడా అదే గండం పొంచి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఓటీటీలు ఇప్పటికే వినోద రంగంలో 7–9 శాతం వాటాను దక్కించుకున్నాయని, అన్ని భాషల్లోనూ ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ 40 పైచిలుకు సంస్థలు నిలకడగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 45 కోట్ల పైచిలుకు ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారని, 2023 ఆఖరు నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరవచ్చని గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి ఆప్షన్లు సంప్రదాయ సినీ వినోదంపై గణనీయంగా ప్రభావం చూపాయని పేర్కొన్నారు. చౌక ఇంటర్నెట్ .. డిస్కౌంట్ల ఊతం.. ఇంటర్నెట్ వినియోగించే వారు పెరుగుతుండటం, చౌకగా వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ లభిస్తుండటం, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు ఓటీటీల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా సంస్థలు డిస్కౌంటు రేటుకే సర్వీసులు అందిస్తుండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. డిస్నీ+హాట్‌స్టార్ (14 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్), అమెజాన్ ప్రైమ్ వీడియో (6 కోట్ల మంది), నెట్‌ఫ్లిక్స్ (4 కోట్లు), జీ5 (3.7 కోట్లు), సోనీలివ్ (2.5 కోట్లు) తదితర సంస్థలు అమెరికాతో పోలిస్తే 70–90 శాతం చౌకగా తమ ప్లన్స్ అందిస్తున్నాయి. వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హోయ్‌చోయ్ లాంటి స్థానిక, ప్రాంతీయ ఓటీటీలకు కూడా డిమాండ్ బాగా ఉంటోంది. 50 శాతం మంది ఓటీటీలను నెలకు 5 గంటల పైగా వినియోగిస్తుండటంతో ఆ మేరకు థియేటర్ల లాభాలకు గండిపడనుంది. సాంప్రదాయ విధానాల్లో సినిమాల నిర్మాణంతో పోలిస్తే ఓటీటీల కోసం స్ట్రీమింగ్ సిరీస్‌లు, సినిమాలను తీయడమే లాభసాటిగా ఉంటోందని పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి. తమ సొంత ఓటీటీలు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేని విధంగా కోవిడ్ కాలంలో థియేటర్లు మూతబడటం.. ఓటీటీలకు లాభించింది. ఈ వ్యవధిలో 30 పైగా హిందీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ జరుపుకున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా మరింతగా దృష్టి పెడుతున్నాయి. ►ఇప్పటికీ ఉచితంగా సర్వీసులు అందిస్తున్న ఓటీటీలే (యాడ్ ఆధారిత) ముందంజలో ఉంటున్నాయి. 2017లో వీటి వినియోగదారుల సంఖ్య 18.4 కోట్లుగా ఉండగా ఇది ఈ ఏడాది 35.1 కోట్లకు, 2027 నాటికి 46.6 కోట్లకు చేరనుంది. ►పే–పర్–వ్యూ సెగ్మెంట్లో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 3.5 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది 8.9 కోట్లకు, 2027లో 11.7 కోట్లకు చేరనుంది. ►రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విద్య, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర రంగాల్లోకి కూడా విస్తరించనున్నాయి. తద్వారా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. ఓటీటీలతో కంటెంట్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి -
ఎట్టకేలకు నెరవేరనున్న కశ్మీరీల కల!
శ్రీనగర్: మిలిటెంట్ దాడులు, ఎన్కౌంటర్లు, భద్రతా దళాల పహారాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది జమ్ము కశ్మీర్లో. అలాంటి చోట కశ్మీరీల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దేశంలో మిగతా ప్రాంతాల్లోలాగే.. సరదాగా అయినవాళ్లతో సినిమాలు చూసే అవకాశం కలగబోతోంది అక్కడి ప్రజలకు. ఆ గడ్డపై మొట్టమొదటి మల్టీఫ్లెక్స్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఐనాక్స్ సంస్థ నిర్మించిన ఈ మల్టీఫ్లెక్స్.. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుంది. మూడు సినిమా హాల్స్‌తో ఐదువందల మంది సినిమా వీక్షించేలా ఏర్పాటు చేస్తోంది ఐనాక్స్. ఫుడ్ కోర్టుతో పాటు పిల్లల కోసం ప్లే స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. పైగా కశ్మీరీ కల్చర్ ప్రతిబింబించేలా లాబీలు, వుడెన్ వర్క్‌తో ప్రత్యేక ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అల్లకల్లోల పరిస్థితుల నడుమ 90వ దశకంలో కశ్మీర్లో థియేటర్లు మూతపడ్డాయి. అయితే.. 1999లో తిరిగి వాటిని తెరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. శ్రీనగర్‌లో నీలం, రెగల్, బ్రాడ్వేలు తెర్చుకున్నప్పటికీ.. మిలిటెంట్ల దాడులతో మళ్లీ అవి మూతపడ్డాయి. ఇన్నేళ్ల తర్వాత కశ్మీర్లో ఒక మల్టీఫ్లెక్స్ రాబోతుండడంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలు పేదలకు భారం కావడం దురదృష్టకరం.. సిగ్గుచేటు -
కుంభస్థలాన్ని బద్దలు కొట్టనున్న ఆర్ఆర్ఆర్, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే?
‘‘ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం... రా’’ అంటూ రామ్, భీమ్ చేసిన యుద్ధాన్ని తెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఈ యుద్ధాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది వేల స్క్రీన్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ భారీ సినిమా కాబట్టి ఈ సినిమాతో పోటీ పడకుండా తెలుగుతో కలుపుకుని ఇతర భాషల్లో కూడా తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నాయి పలు నిర్మాణ సంస్థలు. అంతెందుకు? దేశవ్యాప్తంగా చాలావరకూ ఎక్కువ స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ కనిపిస్తుంది. ఇక జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) అయితే శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప వేరే సినిమా కనిపించదు. ఆ విశేషాల్లోకి వస్తే... సింగిల్ 100... మల్టీప్లెక్స్ 40 హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న థియేటర్లు ఎన్ని? అనే లెక్కలోకి వస్తే... సింగిల్ థియేటర్లు దాదాపు 100. మల్టీప్లెక్స్ దాదాపు 40 ప్రాపర్టీస్ (మల్టీప్లెక్స్‌లో పలు స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి వీటిని ప్రాపర్టీస్ అంటారు). మామూలుగా ఏ మల్టీప్లెక్స్ థియేటర్లో అయినా మినిమమ్ మూడు స్క్రీన్ల నుంచి మ్యాగ్జిమమ్ తొమ్మిది స్క్రీన్ల వరకూ ఉంటాయి. సో... టూకీగా ఒక్కో ప్రాపర్టీలో ఐదు స్క్రీన్లు ఉన్నాయనుకుందాం... అప్పుడు 40 ప్రాపర్టీస్‌లో 200 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతుందనుకోవచ్చు. సో.. సింగిల్, మల్టీప్లెక్స్ కలుపుకుని దాదాపు 300 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతుంది. మరి.. ఇప్పటివరకూ థియేటర్లలో ఉన్న సినిమాల సంగతేంటి? రెండు మూడు స్క్రీన్లు మినహా... గురువారం వరకూ ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘రాధే శ్యామ్’, ‘బచ్చన్ పాండే’, ‘జేమ్స్’తో పాటు హాలీవుడ్ ‘బ్యాట్ మేన్’ తదితర చిత్రాలు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే శుక్రవారం రెండు మూడు స్క్రీన్లు మినహా మిగతా అన్నింటిలోనూ ‘ఆర్ఆర్ఆర్’ దర్శనమిస్తుంది. ఎన్ని రోజుల పాటు ఇలా అన్ని స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే ఉంటుంది అంటే..? ‘ద కశ్మీర్..’కి చాన్స్ జంట నగరాల్లో ఆడుతున్న ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’, ‘రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ చిత్రాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. అయితే ‘ద కశ్మీర్ ఫైల్స్’ శుక్రవారం ఒకట్రెండు స్క్రీన్లలో మాత్రమే కనిపించి, మళ్లీ సోమవారం నుంచి కాస్త ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ వంటి రెండు మూడు చిత్రాలకూ స్కోప్ ఉంది. అయితే ఈ రెండు మూడు సినిమాలూ జస్ట్ పదీ పదిహేను శాతం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శితమవుతాయని, మిగతా అన్ని స్క్రీన్లలోనూ ఓ వారం.. పది రోజులు ‘ఆర్ఆర్ఆర్’ ఉంటుందని జంట నగరాలకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. ఆ పదిహేను శాతంలో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లే ఎక్కువని, అది కూడా ‘ద కశ్మీర్...’ సినిమా స్క్రీన్లే ఎక్కువ అని కూడా తెలిపారు. ‘‘ఆదివారం వరకూ ఎలానూ ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వేరే సినిమాలకు ఎన్ని స్క్రీన్లు కేటాయించాలనేది ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చే స్పందన నిర్ణయిస్తుంది’’ అని ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు.. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ, రే స్టీవెన్సన్... ఇలా భారీ తారాగణంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందింది. కోవిడ్ బ్రేక్స్ నడుమ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన ఈ సినిమా నిడివి ఎంత అంటే.. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు. నిజానికి ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అట. అయితే ముందు 1 నిమిషం 35 సెకన్ల నిడివిని తగ్గించారట. ఆ తర్వాత క్రెడిట్స్‌లో 3 నిమిషాల 26 సెకన్ల నిడివిని తగ్గించారని భోగట్టా. ఫైనల్‌గా ప్రేక్షకులు చూడనున్నది 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు ‘ఆర్ఆర్ఆర్’ అని తెలిసింది. చదవండి: RRR Movie: అందరిముందే అబద్ధాలు ఆడతాను: రాజమౌళి -
టిక్కెట్ రేట్ల పెంపే కాదు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి మరో శుభవార్త!
బాహుబలి తర్వాత తెలుగు తెర నుంచి వస్తోన్న మరో భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బడ్జెట్‌కి తగ్గట్టుగా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చింది. అంతకు ముందే తెలంగాణలో కూడా జీవో జారీ అయ్యింది. వీటికి తోడు ఆర్ఆర్ఆర్ టీమ్‌ని ఖుషి చేసే మరో వార్త వెలుగు చూసింది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఇదే సమయంలో ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరిగారు. లాక్డౌన్ ఎత్తేసినా సీ సెంటర్లో సింగిల్ స్క్రీన్ నుంచి మెట్రోలో మల్టీప్లెక్సుల వరకు ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. థియేటర్ల దగ్గర సందడేది? సౌత్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ వరకు బాగానే ఉన్నా.. తర్వాత థియేటర్‌కి వస్తున్న వారి సంఖ్య బాగా పడిపోయింది. ఇక బాలీవుడ్ నార్త్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇండియా వైడ్‌గా ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న అక్షయ్ కుమార్ నటించిన బెల్‌బాటమ్, సూర్యవంశీ సినిమాలు ఆశించిన మేర బాక్సాఫీసు వద్ద సందడి చేయలేకపోయాయి. లోకల్ సర్కిల్స్ సర్వే ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వే సినిమా ఇండస్ట్రీకి ఉత్సాహం అందించే ఫలితాలను వెలువరించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 331 జిల్లాల నుంచి 19 వేల మందికి పైగా సినిమా గోయర్స్ నుంచి పలు దఫాలుగా సమాచారం సేకరించి విశ్లేషించింది. ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. థియేటర్లలో చూస్తాం 2021 డిసెంబరులో సేకరించిన సమాచారం ప్రకారం గత 60 రోజుల్లో సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశామని చెప్పిన వాళ్ల సంఖ్య 14 శాతం ఉండగా 2022 ఫిబ్రవరి నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఇక సినిమాలకు కీలకమైన మార్చ్, ఏప్రిల్‌లలో థియేటర్‌కి వెళ్లి కచ్చితంగా సినిమా చూస్తామని చెప్పిన వారి సంఖ్య ఏకంగా 41 శాతంగా ఉంది. కంటెంట్ ఉంటే కనక వర్షమే లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం సినిమా గోయర్స్‌లో 75 శాతం మంది ఏడాది కాలంగా థియేటర్లో ఒక్క సినిమా కూడా చూడలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఈ సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పేందుకు మార్చిలో రిలీజైన కశ్మీర్‌ఫైల్స్ ఓ ఉదాహారణ. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ లేకపోయినా ప్రేక్షకులను కదిలించే కంటెంట్ ఉండటంతో సినిమా గోయర్స్ థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృస్టిస్తోంది. రికార్డులు ఖాయం కశ్మీర్ ఫైల్స్ సినిమాకే బాక్సాఫీసు దగ్గర సందండి నెలకొంటే బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి అండ్ కో నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ కంటెంట్ బాగుంటే థియేటర్లలో కనకవర్షమే అనే అంచనాలు నెలకొన్నాయి. పైగా లోకల్ సర్కిల్స్ సర్వేలో 44 శాతం శాంపిల్స్ మల్టీప్లెక్సులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల నుంచి తీసుకున్నారు. మల్టీప్లెక్సుల్లో ఎక్కువ రోజులు హౌజ్‌ఫుల్ బోర్డులు పడితే బాహుబలి 2, దంగల్ రికార్డులు చెరిగిపోవడం ఖాయం! -
వైభవంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ థియేటర్..
-
Multiplexes In India: మల్టీప్లెక్స్‌లకు మరో ఏడాది కష్టాలే!
ముంబై: మల్టీప్లెక్స్‌లకు (సినిమా ప్రదర్శన, వినోద కేంద్రాలు) మరో ఏడాది పాటు నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా మరోవిడత తీవ్రరూపం దాల్చడంతోపాటు దేశవ్యాప్తంగా స్థానిక లాక్డౌన్లు మల్టీప్లెక్స్‌లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. దీనివల్ల వచ్చే కొన్ని నెలల పాటు వీక్షకుల సీట్ల భర్తీ (ఆక్యుపెన్సీ) తక్కువగానే ఉంటుందని వివరించింది. దీంతో వరుసగా రెండో ఆర్థిక ఏడాది మల్టీప్లెక్స్ సంస్థలు (పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర) నిర్వహణ నష్టాలను ఎదుర్కొంటాయని అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న రంగం ఇదొకటని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లోనే రికవరీని (కోలుకోవడం) చూస్తుందని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. 2020 మార్చిలో లాక్డౌన్ల కంటే ముందే మూతపడినవి మల్టీప్లెక్స్లేనని.. ఆలస్యంగా (అక్టోబర్‌లో) తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన రంగం కూడా ఇదేనని క్రిసిల్ వివరించింది. కార్యకలాపాలు తిరిగి ఆరంభించిన తర్వాత నుంచి సీట్ల భర్తీ మెరుగుపడడం కనిపించినట్టు.. నిర్వహణ లాభం దృష్ట్యా తటస్థ స్థాయికి ప్రస్తుత త్రైమాసికంలో చేరుకోవచ్చని అంచనా వేసినట్టుగా పేర్కొంది. అయితే, ఇటీవల పెరిగిపోయిన కేసుల వల్ల రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగానికి వాయిదా పడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2020–21లో మొదటి ఆరు నెలల్లో సీట్ల భర్తీ 10–12 శాతంగాను, ద్వీతీయ ఆరు నెలల్లో 20–22 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా చర్యలతో భారీ కలెక్షన్లు వచ్చే నూతన సినిమాల విడుదల ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికానికి (జూలై–సెప్టెంబర్) వాయిదా పడొచ్చని తెలిపింది. 2020–21లో మల్టీప్లెక్స్‌లు రూ.900 కోట్ల నష్టం చూడగా.. 2021–22లోనూ నష్టాలనే నమోదు చేస్తాయని అంచనా వేసింది. 6 నెలలు నెట్టుకురావచ్చు.. 2020–21లో వ్యయాల నియంత్రణ కోసం మల్టీప్లెక్స్ కంపెనీలు తీసుకున్న చర్యలు, మూలధన వ్యయాల వాయిదా, ఈక్విటీల జారీ రూపంలో సమీకరించిన రూ.1,350 కోట్ల నిధులతో అవి నష్టాలను ఏదుర్కోగలవని క్రిసిల్ తెలిపింది. వాటివద్ద ప్రస్తుద నగదు నిల్వలు 4–6 నెలల పాటు నిర్వహణ వ్యయాలు, రుణాల చెల్లింపులకు సరిపోతాయని పేర్కొంది. -
కొత్త బిజినెస్‌లోకి ‘రౌడీ’.. పవన్ కల్యాణ్‌తో ఓపెనింగ్
సినిమా హీరోలు ఇతర వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు. సినిమాలతో సంపాదించిన సొమ్మంతా ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొందరు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలే చేస్తుంటే.. మరికొందరు పుడ్,, ఫ్యాషన్ వరల్డ్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్లో మహేశ్ ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ప్రారంభించిన ఏఎంబి సూపర్ సక్సెస్ అయింది. భారీ స్క్రీనింగ్, అద్భుతమైన సీటింగ్‌తో ఇండియాలో వన్ అఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్‌గా పేరు తెచ్చుకుంది. మహేశ్‌తో పాటు వెంకటేష్, వినాయక్, ప్రభాస్ లాంటి సినీ ప్రముఖులకు కూడా సొంత థియేటర్స్ ఉన్నాయి. అంతే కాదు అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఓ మల్లీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాడు. అమీర్‌పేట సత్యం థియేటర్ స్థానంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ హీరోల సరసన ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా చేరాడు. విజయ్ ఇప్పటికే రౌడి వేర్ అంటూ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల మాదిరి మల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసాడు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఏవీడీ సినిమాస్ (ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ )అని పేరు పెట్టారు.అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఏవీడీ సినిమాస్ ప్రారంభంకానుందట. విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. -
సిటీలో పార్కింగ్ దందా.. ఇక బంద్!
సాక్షి, సిటీబ్యూరో: మాల్స్, మల్టీప్లెక్సులు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తొలినాళ్లలో అమలైనప్పటికీ.. క్రమేణా తిరిగి పార్కింగ్దందా మొదలైంది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో పెద్దయెత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సిద్ధమైంది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. అక్రమంగా ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారంతో ఫొటోను ఆన్లైన్ ద్వారా ఈవీడీఎంలోని ‘సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్’కు షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు పెనాల్టీ విధించనుంది. వీటితోపాటు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించని వాణిజ్యసంస్థల పైనా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల అమలుకు ముందుగా మాల్స్, మల్టీప్లెక్సులు, వాణిజ్యసంస్థలకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనుంది. నోటీసు మేరకు.. అన్ని వాణిజ్య సంస్థలు నిర్ణీత నమూనాలో పార్కింగ్ టిక్కెట్లను ముద్రించాలి. టిక్కెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్నెంబర్ ఉండాలి. పార్కింగ్ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్ టిక్కెట్ ఇవ్వాలి. ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’ అని, ఉచితమైతే ‘ఎగ్జెంపె్టడ్’ అని స్టాంపు వేయాలి. పార్కింగ్ ఇన్చార్జి సంతకంతో కూడిన పార్కింగ్ టిక్కెట్లను వాహనాలు నిలిపిన అందరికీ ఇవ్వాలి. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసు అందిన 15రోజుల్లోగా ఈమేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే, ఉల్లంఘనకు రూ. 50వేల వంతున పెనాల్టీ విధిస్తుంది. ప్రజలనుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి పెనాల్టీలు విధిస్తుంది. పార్కింగ్ టికెట్ ఇలా.. నోటీసుతోపాటు పార్కింగ్ టిక్కెట్ ఎలా ఉండాలో నమూనాను కూడా పంపుతారు. నమూనా మేరకు.. టిక్కెట్‌పై వాహనం నెంబరు, పార్కింగ్ చేసిన సమయం, తిరిగి వెళ్లే సమయం రాయాలి. ఎంతసేపు పార్కింగ్చేసింది (30ని లోపు, 30 ని–1గం.లోపు, 1గం.కంటే ఎక్కువ) టిక్ చేయాలి. షాపింగ్ చేసిన బిల్లు మొత్తం ఎంతో వేయాలి. ఏజెన్సీ పేరు, తదితర వివరాలు. టికెట్ వెనుక వైపు.. పార్కింగ్ టిక్కెట్ వెనుకవైపు 20 మార్చి 2018న ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు ఫీజు ఉచితం, చెల్లింపు ఎలానో ఆ వివరాలు ముద్రించాలి. అవి.. 30 నిమిషాల వరకు: ఎలాంటి పార్కింగ్ ఫీజు లేదు. 30 నిమిషాల నుంచి గంట వరకు: మాల్, వాణిజ్యప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే ఫ్రీ. లేని పక్షంలో అక్కడ వసూలు చేసే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టిక్కెట్‌ను కానీ చూపించాలి. బిల్లు, మూవీ టిక్కెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్ ఫీజు కంటే తక్కువుండే పక్షంలో నిరీ్ణత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే. చదవండి: బెంగళూరు తరహాలో పార్కింగ్ పాలసీ 2.o బెటరేమో! -
షాక్.. మళ్లీ మూతపడనున్న థియేటర్లు?
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ అనంతరం ఇటీవలె తెరుచుకున్న థియేటర్లు తెలంగాణలో మళ్లీ మూతపడేలా కనిపిస్తున్నాయి. సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు నెలకొన్న వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే సింగిల్ స్క్రీన్లకు కూడా వర్తింపజేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మల్టీపెక్సుల మాదిరే పర్సంటేజ్ సిస్టమ్‌ను అమలుచేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా పెద్ద సినిమా అయితే విడుదలైన 6వారాల తర్వాత, అదే చిన్న సినిమా అయితే 4వారాల గ్యాప్ తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 1నుంచి థియేటర్లు మూసివేస్తామని హెచ్చరించారు.(ఆ సీన్లలో నటించడం తగ్గించేశా: సుమంత్) ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు.. తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ల మధ్య చర్చలు జరిగాయి. దగ్గుబాటి సరేష్‌బాబు ఏర్పాటైన ఈ సమావేశంలో డివివి దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ అనంతరం తిరిగి తెరుచుకున్న థియేటర్లలో సినిమాల సందడి పెరిగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాలు సైతం భారీగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్‌లోనూ చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లకు నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (మండుటెండలో మట్టిలో కూర్చున్న మహేశ్ డైరెక్టర్) -
8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని రంగాలు మెల్లమెల్లగా పునఃప్రారంభం అవుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు ఇప్పటికే తెరుచుకోగా మెట్రో సర్వీసులు మరి కొన్నిరోజుల్లో మొదలు కానున్నాయి. అయితే కేవలం విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం అన్‌లాక్ 4.0లో భాగంగా దేశంలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. (సినిమాను కాపాడండి) ఈ క్రమంలో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ నెల 8న సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధనలపై చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టనుందనేది ఆసక్తిగా మారింది. (రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం) కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు వాయిద పడ్డాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. -
‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?!
సాక్షి, ముంబై : ‘ ప్రతి పదేళ్లకోసారి ఓ కొత్త సవాల్ వచ్చి పడుతూనే ఉంది. 1980 దశకంలో సినిమా వీడియోలు వచ్చాయి. అంతే ఇక సినిమా థియేటర్ల పని అయిపోయిందన్నారు. 2010లో టెర్రరిజమ్ బాంబు దాడులు, ఆ తర్వాత మల్టీ ప్లెక్సులు, ఓటీటీలు వచ్చాయి. అంతే సింగిల్ థియేటర్ కథ ముగింసిందన్నారు. ఇప్పుడు 2020లో కరోనా ముట్టడించింది. ఇంతకాలం కష్టనష్టాలకోడ్చి బయట పడిందీ ఓ ఎత్తు. ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాల నుంచి బయట పడడం ఓ ఎత్తు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముంబై నగరంలోని ‘భారత మాతా సినిమా’ థియేటర్ యజమాని కపిల్ భోపాత్కర్ వ్యాఖ్యానించారు. 1939లో ఏర్పాటైన ఈ సినిమా హాలు పేరు ముందు లక్ష్మీ థియేటర్. ‘నేషనల్ కార్పొరేషన్ మిల్’ స్థలంలో ఓ మూలన, ఆ మిల్లులో పనిచేసే కార్మికుల వినోదం కోసం ఏర్పాటయింది. కార్మికుల షిప్టులను దృష్టిలో పెట్టుకొని సినిమా ఆటల వేలలుండేవి. 1982–83 మధ్య ఆ కార్పొరేషన్ పరిధిలోని 60 బట్టల మిల్లుల్లో కార్మికులు సమ్మె చేశారు. ఆ సందర్భంగా మొదటిసారి సినిమా హాలుకు కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల అక్కడి నుంచి మిల్లులు, మిల్లులోని కార్మికులు పెద్దపెద్ద మిల్లులకు తరలి పోయారు. (బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్) సినిమా వీడియోలు రంగప్రవేశం చేయడంతో ఇక ‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందంటూ బంధు మిత్రులు హెచ్చరించారని, అయితే మానవుడు సంఘ జీవని, ఇంట్లో కూర్చొని సినిమా చూసే బదులు మిత్రులతో కలిసి సినిమాకు వెళ్లడానికే ఎవరైనా ఇష్ట పడతారంటూ ఓ జర్నలిస్టు మిత్రుడు తన భుజం తట్టినట్లు కపిల్ తెలిపారు. ఆ తర్వాత మల్టీప్లెక్స్‌లు, నేటి ఓటీటీల వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. ఓటీటీ అంటే ఒవర్ ది టాప్ అని అర్థం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, స్లింగ్ టీవీ తదితర యాప్‌లు ఓటీటీ పద్ధతిలో సినిమాలను మనకు ప్రసారం చేస్తున్నాయి. (సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!) ఇలాంటి పోటీలను తట్టుకొని ఇప్పటికీ ‘భారత మాతా సినిమా’ మనుగడ సాగించడానికి టిక్కెట్ ధర అతి తక్కువగా ఉండడం, ఎక్కువగా మరాఠీ చిత్రాలను ఆడించడమే కారణం. టాప్ క్లాస్ టిక్కెట్ ధర కేవలం 80 రూపాయలే. ఒకప్పుడు 750 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఆ సినిమా హాలు సీట్ల ఆధునీకరణ వల్ల 600 సీట్లకు పరిమితమైంది. మరోసారి ఆధునీకరించడం కోసం మార్చి ఒకటవ తేదీన సినిమా హాలును మూసి వేశారు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. తెరచుకునే అవకాశం లేకుండా పోయింది. సినిమా హాలు శాశ్వతంగా మూసివేసి అక్కడ మరో వ్యాపారం నిర్వహించాలంటే అందుకు చట్టం అనుమతించడం లేదు. 1992లో తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఓ సినిమా హాలును మూసివేసినట్లయితే ఆ స్థలంలో మూడోవంతు స్థలంలోనైనా మరో సినిమా థియేటర్ నిర్మించాలి. అందుకనే సింగిల్ థియేటర్లు మూత పడిన చోట పుట్టుకొచ్చిన మల్టీఫ్లెక్స్‌లలో సినిమా హాళ్లు వెలిశాయి. అంత స్థలం తనకు లేకపోవడం వల్ల హాలును మూసివేయలేక పోతున్నానంటూ కపిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నగరంలోని దాదాపు వంద సింగిల్ థియేటర్ల పరిస్థితి ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా సింగ్ థియేటర్ల పరిస్థితి బాగోలేదు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయను) -
‘మల్టీ’ అక్రమం!
కోడెల శివరామకృష్ణ మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఆది నుంచి అంతా అక్రమమే. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించలేదు. స్థలం ఇదరు వ్యక్తుల పేరుతో ఉంది. కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఒకరి పేరుతో అనుమతులు ఇచ్చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించ లేదు. డెవలప్మెంట్ చార్జీలు అస్సలే కట్టలేదు.. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించేశారు. ఒక్క అధికారి కూడా ప్రశ్నించలేదు. సాక్షి, గుంటూరు : గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ ఇండో అమెరికన్ సూపర్ స్పెషాలిటీస్ లిమిటెడ్ పేరుతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్టీ ప్లెక్స్‌ను నిర్మిం చారు. అయితే నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ విధించిన ఏ ఒక్క నిబంధనను పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. పన్నుల ఎగవేత వ్యవహారాన్ని పక్కన బెడితే ఏకంగా మల్టీఫ్లెక్స్‌లో సెట్‌బ్యాక్ కోసం వదిలేసిన స్థలంలో అక్రమంగా మరో వ్యాపార సముదాయాన్ని నిర్మించడం విశేషం. మంటరాజుకుంటే ఎలా? నిబంధనల ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణ నష్టం జరుగకుండా అగ్నిమాపక శకటాలు కాంప్లెక్స్ చుట్టూ తిరిగేలా సెట్‌బ్యాక్‌ను వదలాల్సి ఉంది. కోడెల కుమారుడి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణ సమయంలో కార్పొరేషన్ అనుమతులు పొందడం కోసం సెట్‌బ్యాక్స్ స్థలాన్ని చూపించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొంది కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కాంప్లెక్సుకు పన్నులు సైతం వేసేశారు. ఇదంతా పూర్తయిన వెంటనే సెట్‌బ్యాక్‌కు వదిలిన స్థలంలో కేఎస్పీ ఫుడ్ వరల్డ్ పేరుతో అడ్డగోలుగా 15 షాపులను నిర్మించి వివిధ రకాల ఆహార వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల వారు ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు, చిన్న నిర్మాణం చేపడితేనే అనుమతులు లేవంటూ హడావుడి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల కుమారుడు గతంలో పట్టపగలు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. పార్కింగ్ పేరుతో.. కోడెల కుమారుడి మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫీజు అధికంగా వసూలు చేస్తుండటంతో కాంప్లెక్సులోని సినిమా హాళ్లకు, షాపింగ్‌కు వచ్చే ప్రజలు కాంప్లెక్సుకు ఎదురుగా ఉన్న రోడ్డుపైనే వాహనాలు నిలిపివేసి వెళుతున్నారు. ద్విచక్రవాహనానికి రూ.20, కారుకి రూ.50 వసూలు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
ప్రభాస్ థియేటర్లో రామ్ చరణ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులు, యూవీ క్రియేషన్స్ అధినేతలు నిర్మించి భారీ మల్టీప్టెక్స్ వీ సెల్యులాయిడ్. ఈ మల్టీప్లెక్స్ రేపు సాహో సినిమాతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చెర్రీ ‘ఆసియా లోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. చిరంజీవి నటించిన సైరా సినిమాను కూడా ఇక్కడ ప్రదర్శించేలా చూస్తాం చిరంజీవిని కూడా ఇక్కడకు తీసుకువస్తా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్‌తో పాటు మల్టీప్లెక్స్ నిర్వహకులు, సాహో చిత్ర దర్శకుడు సుజీత్ పాల్గొన్నారు. -
పీవీఆర్ సినిమాస్, సినీపొలిస్‌లకు షాక్
న్యూఢిల్లీ : మూవీ టికెట్లపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేటు తగ్గింపును ప్రకటించినా అందుకు అనుగుణంగా సినిమా టికెట్ల ధరలను తగ్గించలేదని పీవీఆర్ సినిమాస్, సినిపొలిస్ థియేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ రెండు థియేటర్ చైన్లపై యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ రెండు మల్టీప్లెక్స్ సంస్థలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు మళ్లించలేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో న్యూఢిల్లీలోని రెండు సంస్థలపై రాష్ట్రస్ధాయి యాంటీ ప్రాఫిటీరింగ్ కమిటీ ప్రాధమిక దర్యాప్తును పూర్తిచేసింది. పీవీఆర్ థియేటర్లలో సింబా మూవీ టికెట్ల ధరలను తగ్గించలేదని, ఢిల్లీలోని సాకేత్‌లో సినీపొలిస్‌పై కూడా ఇదే తరహా ఫిర్యాదు అందినట్టు అధికారులు తెలిపారు. ప్రేక్షకులకు సినిమా వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో రూ 100కిపైగా ఉన్న మూవీ టికెట్లపై జీఎస్టీని ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 శాతం పన్ను శ్లాబు నుంచి 18 శాతం పన్ను శ్లాబుకు మార్చారు. ఇక తక్కువ ఖరీదు కలిగిన టికెట్లపై జీఎస్టీ శ్లాబును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో తమ స్క్రీన్లలో జనవరి 1కి ముందు, తర్వాత సినిమా టికెట్ల ధరలపై పూర్తి వివరాలు అందచేయాలని ఈ రెండు మల్టీప్లెక్స్ సంస్థలను రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ కోరిందని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆయా సంస్థలు ఎంతమేర లబ్ధిపొందాయో లెక్కగట్టి అందులో కొంత మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమచేస్తామని చెప్పారు. -
మొబైల్ మూవీ థియేటర్ వచ్చేసింది
ఒకప్పుడు సినిమాకి వెళ్లాలన్నా... లైబ్రరీకి వెళ్లాలన్నా.. మంచి బిర్యానీ తినాలన్నా బయటకి వెళ్లాల్సి వచ్చేది. ఆ కష్టం లేకుండా మొబైల్ లైబ్రరీ, మొబైల్ కోర్టు, మొబైల్ ఫుడ్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. మన వీధి చివరనో.. మన కాలనీ పార్కు వద్దనో మనకు కనిపిస్తూనే ఉంటాయి. వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అన్నీ వచ్చాయి కాని సినిమా థియేటర్ కూడా వీటి లాగే వచ్చి ఉంటే బాగుండు అని అనుకునే వారికి ఇది శుభవార్తే. సినిమా ప్రేమికుల కోసం మన గల్లీకి దగ్గరలో వినోదాన్ని పంచేందుకు పిక్చర్‌టైమ్ వచ్చేసింది. అదేనండీ, మొబైల్ థియేటర్. పిక్చర్ టైమ్ మనదేశంలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల వారికి కూడా మల్టీప్లెక్స్ అనుభూతి! దేశంలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు వినోదం పంచాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్త సుశీల్ చౌదరి ‘పిక్చర్‌టైమ్’ను స్థాపించారు. మన దేశంలో సినిమా, క్రికెట్‌పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అది మాటల్లో చెప్పలేనిది. సినిమాలపై ఉన్న మక్కువను గ్రహించిన ఆయన సినిమాకు దూరంగా ఉన్న ప్రజలకు కూడా వినోదం అందివ్వాలనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. అంతే... తక్కువ ఖర్చుతో థియేటర్, మల్టీప్లెక్స్ అనుభూతికి తీసిపోని విధంగా పిక్చర్‌టైమ్ రూపంలో మన ముందుకొచ్చారు. మొట్ట మొదటి షో మన తెలుగు సినిమాదే... పిక్చర్ టైమ్ కార్యకలాపాలను ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మొబైల్ థియేటర్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. దీనిలో మొదటి షోను బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 2021 సంవత్సరం కల్లా 3 వేల మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని పిక్చర్ టైమ్ వ్యవస్థాపకులు సుశీల్ చౌదరి తెలిపారు. దీనికి భారత ప్రభుత్వం గుర్తింపు కూడా ఉండటం విశేషం. సినిమా బ్రేక్ టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం పథకాల అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శించి చైతన్యం కల్పిస్తోంది. వందకోట్లకు పైగా జనాభా...2200 మల్టీప్లెక్స్‌లు... వందకోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో కేవలం 2200 మల్టీప్లెక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రధాన నగరాలలోనే ఎక్కువ ఉండటం గమనార్హం. వరల్డ్ క్లాస్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను మారుమూల గ్రామాల ప్రజలకు అందించేందుకు పిక్చర్‌టైమ్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొబైల్ థియేటర్స్‌ను ఏర్పాటు చేసి తక్కువ ధరకే కొత్త సినిమాలను ప్రదర్శిస్తోంది. డిజిటల్ ప్రొజెక్షన్, డాల్బీ సరౌండ్ సౌండ్, ఎయిర్ కండిషనింగ్, కంఫర్టబుల్ సీటింగ్ ప్రత్యేకతలతో మల్టీప్లెక్స్‌కు తీసిపోని సౌకర్యాలను అందిస్తున్నామని సుశీల్ చౌదరి తెలిపారు. 100 నుంచి 120 మంది చూసే వీలుగా... ఒక చిన్న సైజు ట్రక్కులో ఈ డిజిప్లెక్స్ను ఎక్కడికైనా తీసుకెళ్లి సినిమాను చూపించవచ్చు. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన ఒక బెలూన్ లాంటి పెద్ద టెంట్ సహాయంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకుని నిలిచే మెటీరియల్‌ను వాడటం విశేషం. 70/30 వైశాల్యంలో ఉండే ఈ తాత్కాలిక థియేటర్లో సుమారు 100 నుంచి 120 మంది సినిమాను వీక్షించవచ్చు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో దీనిని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమాలకు దూరంగా ఉండే మారుమూల ప్రాంత ప్రజ ల వద్దకు సినిమాను తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఒక థియేటర్కుఆరు మంది సిబ్బంది ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రాగానే ఆరుమందితో ఉన్న బృందం థియేటర్ సామగ్రి ఉన్న ట్రక్కుతో బయల్దేరుతారు. ఇందులో ప్రధానంగా ఒక సైట్ ఇన్చార్జ్, ప్రొజెక్షనిస్ట్, ఎలక్టీష్రియన్‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. థియేటర్ ఏర్పాటు నుంచి దానిని తీసేసే వరకు అన్ని వారే చూసుకుంటారు. మొబైల్ థియేటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. పేరున్న సంస్థలు కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకోవడానికి అద్దెకి ఇస్తామని తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకుని మార్చులు చేర్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. – సచిందర్ విశ్వకర్మ, సాక్షి సిటీడెస్క్ 14 రాష్ట్రాలలో చిత్ర ప్రదర్శనలు పిక్చర్ టైమ్ దేశంలోని 14 రాష్ట్రాలలో మొబైల్ థియేటర్స్ ద్వారా చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు తమ మొబైల్ థియేటర్లలో 18వేల గంటలపైనే చిత్ర ప్రదర్శనలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలకు వినోదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం కాచిగూడ, కామారెడ్డి, నిజామబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్‌లలో చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. త్వరలో బొల్లారంలోనూ మొబైల్ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రోజూ ఐదు ఆటలు... రిలీజైన కొత్త సినిమాలను అతి తక్కువ టికెట్ ధర (రూ.30–80)కు వినోదాన్ని ఇస్తుండటంతో పిక్చర్ టైమ్‌కి ఆదరణ పెరుగుతోంది. ప్రతిరోజు ఐదు షోలను ప్రదర్శిస్తూ వినోదాన్ని పంచుతోంది. థియేటర్‌తో కంపేర్ చేసుకుంటే దీని రేటు తక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుల వాహనాలను నిలపడానికి ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్వెల్ టైమ్‌లో స్నాక్స్, తదితర వాటిని విక్రయించేందుకు క్యాంటీన్‌ను సైతం ఏర్పాటు చేశారు. వాటిని సాధారణ ధరలకే విక్రయించడం విశేషం. -
మహేష్.. శభాష్!
సాక్షి, హైదరాబాద్ : సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించిన సినీనటుడు మహేష్‌బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్సు (ఏఎంబీ సినిమాస్) యజమానులైన మహేష్‌బాబు, సునీల్ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి.. తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని.. మహేష్‌బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. ఇది చదవండి : మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్’ -
మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్’
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ షాక్ తగిలింది. మహేశ్ బాబు కు సంబంధించిన ఏఎంబీ మాల్లోని మల్టీప్లెక్స్‌లపై ప్రదర్శిస్తున్న సినిమాల టికెట్ల ధర విషయంలో జీఎస్టీ నిబంధనలను అతిక్రమించారని, తగ్గించిన పన్ను ఆధారంగా టికెట్లు అమ్మకుండా ఎక్కువ వసూలు చేశారని జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో జీఎస్టీ అధికారులు చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమయ్యే తరుణంలో ఏఎంబీ మాల్ యాజమాన్యం టికెట్ ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అయినా టికెట్ ధరలు ఎక్కువగా వసూలు చేసినందుకు రూ.35 లక్షలు చెల్లించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుం టామని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే మహేశ్‌బాబు ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో పన్ను వసూలు చేసిన జీఎస్టీ అధికారులు మళ్లీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన మాల్ నుంచి పన్ను వసూలుకు ఉపక్రమించడం గమనార్హం. సినిమా మాల్స్‌పై ప్రత్యేక దృష్టి: తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం సినిమా టికెట్లు అమ్ముతున్నారా లేదా అనే కోణంలో హైదరాబాద్ జీఎస్టీ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కన్పిస్తోంది. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా టికెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే ఆరోపణలపై ప్రసాద్, ఐమ్యాక్స్, పీవీఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్స్‌లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దీంతో చాలా మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్ కూడా రంగంలోకి దిగడంతో ఏఎంబీ మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
వివాదంలో మహేష్ ఏయంబీ సినిమాస్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల హైదరాబాద్‌లో ఏయంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ థియేటర్స్ లో సినిమా చూడాలంటే డబ్బు కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టాల్సిందే. తాజాగా ఈ మల్టీప్లెక్స్‌కు జీఎస్టీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఆ షోకాజ్ నోటీసు జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 100కు పైగా టికెట్ ఉన్న థియేటర్లలో జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. జనవరి 1 నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే ఏయంబీ సినిమాస్‌లో మాత్రం ఇంకా రేట్లు తగ్గించకుండా పాత రేట్లనే కొనసాగిస్తుండటంతో రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఏయంబీ సినిమాస్ పార్టనర్ అయిన సునీల్.. అధికారులు తనిఖీలు నిర్వహించిన మాట వాస్తవమే గాని, నోటీసులు ఇవ్వలేదని, తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌ను ఏసియన్ గ్రూప్‌తో కలిసి మహేష్ బాబు నిర్వహిస్తున్నారు. ఏయంబీ సినిమాస్ -
కోడెల ‘మల్టీ’ మాయ ..!
గుంటూరు నడిబొడ్డున నాజ్ సెంటర్లో కోట్ల రూపాయల విలువ చేసే మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ నిర్మించారు స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ. దీని నిర్మాణం కోసం ముందుగా కొంత స్థలాన్ని జీఎంసీకి ఇస్తూ ఆయన గాలం వేశారు. టైటిల్ డీడ్ కూడా మార్చకుండానే అధికారులు హడావుడిగా కాంప్లెక్స్ నిర్మాణానికి అన్ని అనుమతులు చకచకా మంజూరు చేశారు. అనంతరం కార్పొరేషన్‌కు సమర్పించిన స్థలం వెనక్కి ఇవ్వాలంటూ శివరామ్ లేఖ రాసేశారు. కార్పొరేషన్ ససేమిరా అనడంతో నిబంధనలన్నీ తుంగలో తొక్కి అదే స్థలంలో ప్రహరీ నిర్మించేశారు. ఇలా యథేచ్ఛగా ఉల్లంఘనులకు పాల్పడుతున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. సాక్షి, గుంటూరు: మల్టీప్లెక్స్ అనుమతి కోసం లక్షల రూపాయల విలువైన స్థలం జీఎంసీకి అప్పగించారు. ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో ఆ స్థలాన్ని మళ్లీ వెనక్కి తీసేసుకుని ప్రహరీ నిర్మించారు. కోట్ల రూపాయల వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే రూపాయి కూడా చెల్లించకుండానే ఆక్కుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ), ప్రాపర్టీ ట్యాక్స్ పొందారు. అధికార పార్టీ మార్క్ రాజకీయం చూపారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోడెల శివరామకృష్ణ పేరుతో 5,135 చదరపు అడుగుల స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు 2013 జనవరిలో నగరపాలక సంస్థ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు రోడ్డు ఇరుకుగా ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెప్పడంతో నిబంధనల ప్రకారం భవిష్యత్తులో రోడ్డు విస్తరణ కోసం 165.55 చదరపు అడుగుల స్థలాన్ని కార్పొరేషన్‌కు అప్పగించారు. దీంతో మల్టీప్లెక్స్ నిర్మాణానికి నగరపాలక సంస్థ అనుమతులు మంజూరు చేసింది. అయితే అదే సమయంలో జిల్లాలోని ఓ ఉన్నత స్థాయి అధికారి పావులు కదిపి మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న ఏఈఎల్సీ స్థలంలోకి రోడ్డు వేసి విస్తరణ చేశారు. అప్పట్లో దీనిపై తీవ్ర ఆందోళనలు కూడా జరిగాయి. అయితే అధికారులు మాత్రం బలవంతంగా రోడ్డు విస్తరణ చేసి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత తాము రోడ్డు విస్తరణ కోసం ఇచ్చిన స్థలాన్ని వెనక్కు ఇవ్వాలంటూ నగరపాలక సంస్థ అధికారులకు లేఖ రాశారు. అయి తే రోడ్డు కోసం ఇచ్చిన స్థలాన్ని వెనక్కు ఇవ్వడం కుదరదని నగరపాలకసంస్థ అధికారులు తేల్చి చెప్పారు. అయితే కోడెల శివరామకృష్ణ మాత్రం నగరపాలక సంస్థ అధికారులు అనుమతి లేకుం డా దౌర్జన్యంగా కార్పొరేషన్‌కు ఇచ్చిన స్థలాన్ని కలుపుకుని ప్రహరీ గోడ నిర్మించేశారు. ఇదంతా తెలిసినప్పటికీ కార్పొరేషన్ అధికారులు అడ్డుకునే ధైర్యం చేయలేక వదిలేశారు. గుంటూరు నగరానికి నడిబొడ్డున ఉండే నాజ్‌సెంటర్‌లో గజం స్థలం విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుం దని చెబుతున్నారు. అంటే కోడెల శివరామకృష్ణ కార్పొరేషన్ నుంచి లాగేసుకున్న 18.3 గజాల స్థలం విలువ సుమారు రూ.50 లక్షలకు పైగా ఉం టుందని అంచనా వేస్తున్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న నిర్మాణాలను సైతం బలవంతంగా తొ లగించే నగరపాలక సంస్థ అధికారులు లక్షల వి లువ చేసే జీఎంసీ స్థలాన్ని లాగేసుకున్నా అడ్డుకో కపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు యత్నం మల్టీప్లెక్స్ నిర్మాణం జరిపిన స్థలానికి సంబంధించి ఖాళీ స్థలానికి వేసే పన్నును ఇంత వరకూ చెల్లించలేదు. సుమారుగా రూ.1.30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా టీఎస్ పలనీయపు పిల్లై పేరుతో సగం, ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ ఎండీ కోడెల శివరామకృష్ణ పేరుతో సగం స్థలం ఉంది. అయితే టైటిల్ కూడా ట్రాన్స్ఫర్ చేయకుండానే మొత్తం స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం దారుణమైన విషయం. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ టీఎస్ పలనీయపు పిల్లై, ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ ఎండీ కోడెల శివరామకృష్ణ పేరుతో వేరువేరుగా వేసిన అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం టైటిల్ ట్రాన్సఫర్ కాకపోయినా ఇండో అమెరికన్ సూపర్‌స్పెషాలిటీస్ లిమిటెడ్ ఎండీ కోడెల శివరామకృష్ణ పేరుతో సగం, డీమార్టు పేరుతో సగం వేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అడ్డగోలుగా వ్యవహరించారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌కు సంబంధించి ఒక్క రూపాయి పన్ను చెల్లించకపోయినా ఆక్కుపెన్సీసర్టిఫికెట్ (ఓసీ), ప్రాపర్టీ ట్యాక్స్ వేశారంటే అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మినహాయింపు ఇచ్చిన పురపాలక శాఖ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత కోడెల మల్టీప్లెక్స్ విషయంలో పురపాలకశాఖ ఉన్నతాధికారులు అనుసరించిన తీరుకు సరిగ్గా సరిపోతుంది. నిబంధనల ప్రకారం ఏదైనా స్థలంలో అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోడెల మల్టీప్లెక్స్ విషయంలో మాత్రం సుమారు రూ.1.30 కోట్ల వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ బకాయి ఉన్నప్పటికీ నగరపాలకసంస్థ అధికారులు బిల్డింగ్ నిర్మాణ అనుమతులు, ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించకుండా ప్రాపర్టీ ట్యాక్స్ వెయ్యకూడదు. అయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లో 50 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కోడెల శివరాం పురపాలకశాఖ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు పరిశీలనలో ఉందన్న కారణాన్ని చూపి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ప్రాపర్టీ ట్యాక్స్ వేసేశారు. అధికారం చేతుల్లో ఉంటే ఏ పనైనా జరిగిపోతుందనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. -
థియేటర్లలో నో లైట్స్ ఆఫ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిత్ర పరిశ్రమలో కొత్త శకం ప్రారంభమైంది. ఇక థియేటర్లో సినిమా చూడాలంటే లైట్లు ఆపేయాల్సిన అవసరం లేదు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ ‘ఓనిక్స్’ పేరిట ఎల్ఈడీ తెరలను అభివృద్ధి చేసింది. అమెరికా, మెక్సికో, చైనా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా భారత్‌లో విడుదల చేసింది. మల్టిప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ లీజర్స్‌తో ఒప్పందం చేసుకొని బుధవారం ముంబైలో ‘ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా శామ్సంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ సేథీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. గతేడాది కొరియాలో తొలి ఎల్ఈడీ ఆధారిత సినిమా స్క్రీన్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం చైనా, మలేషియా, మెక్సికో, థాయ్‌ల్యాండ్ వంటి దేశాల్లో 26 స్క్రీన్లున్నాయి. ఇండియా విషయానికొస్తే.. ఈ ఏడాది ఆగస్టులో పీవీఆర్ సినిమాతో ఒప్పందం చేసుకొని ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని పీవీఆర్ ఐకాన్‌లో తొలి ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్‌ను ప్రారం భించాం. డిజిటల్ సినిమా ఇనీషియేటివ్ (డీసీఐ) సర్టిఫికేషన్ పొందిన తొలి స్క్రీన్ ఇది. వచ్చే ఏడాది జనవరిలో ముంబైలోని ఫోనిక్స్ మాల్లో రెండో స్క్రీన్‌ను ప్రారంభించనున్నాం. తాజాగా ఐనాక్స్‌తో ఒప్పం దం చేసుకొని ముంబైలోని ఇనార్బిట్ మాల్లో ఎల్ఈడీ తెరను ప్రారంభించాం. ఏడాదిలో 20 తెరలు.. ఇవి కాకుండా పీవీఆర్‌తో మరో రెండు స్క్రీన్స్, ఐనాక్స్‌తో ఒక స్క్రీన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో 20 స్క్రీన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఇందుకోసం ఇతర మల్టిప్లెక్స్ చెయిన్స్‌తో సంప్రదింపులు జ రుపుతున్నాం. సినిమా ప్రేక్షకుల స్పందనను బట్టి ఓ నిక్స్ ఎల్ఈడీ స్క్రీన్లను ముంబైతో పాటూ ఢిల్లీ, బెం గళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరిస్తాం. ఓనిక్స్ ప్రత్యేకతలివే.. ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేకత ఏంటంటే? థియేటర్లో ప్రొజెక్టర్ అవసరం ఉండదు. సినిమా కంటెంట్ నేరుగా సర్వర్ నుంచి ఎల్ఈడీ తెర మీద పడుతుంది. సాధారణ తెర మీద కంటే ఓనిక్స్‌లో బొమ్మ 10 రెట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఓనిక్స్‌లో స్పష్టతతో పాటూ వ్యూ, త్రీడీ, సౌండ్ మూడు కేటగిరీలూ మిళితమై ఉంటాయి. దీంతో మొబైల్, టీవీ స్క్రీన్లలో బొమ్మలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో సినిమా తెర మీద కూడా అంతే స్పష్టత ఉంటుంది. త్రీడీ సాంకేతికతతో థియేటర్లో లైటింగ్ ఉన్నప్పుడు కూడా సినిమాను స్పష్టంగా చూడొచ్చు. థియేటర్ అన్ని వైపులా ధ్వని తరంగాలు ప్రసరించి.. థియేటర్లో ఏ దిక్కున కూర్చున్నా సరే శబ్దం అన్ని వైపులా ఒకే విధంగా, స్పష్టంగా వినిపిస్తుంటుంది. ధర రూ.5 కోట్లు సాధారణ స్క్రీన్ నుంచి ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్కు మారడానికి 6–8 వారాలు పడుతుంది. ప్రస్తుతం 5, 10, 14 మీటర్ల తెరల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు తెరల సైజ్‌ను బట్టి రూ.4–5 కోట్ల వరకుంటాయి. 6డబ్ల్యూ రీసెర్చ్ ప్రకారం దేశంలో డిజిటల్ స్క్రీన్ల మార్కెట్ 2022 నాటికి 874 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ స్క్రీన్స్ వ్యాపారంలో శామ్సంగ్కు 50% మార్కెట్ వాటా ఉంది. ఏటా డిజిటల్ సైనేజ్ బిజినెస్ 20% వృద్ధి చెందుతుంటే.. తాము దానికంటే ముందున్నామని పునీత్ తెలిపారు. ఏడాదిలో హైదరాబాద్‌లో 40 ఐనాక్స్ స్క్రీన్స్ మల్టిప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ లీజర్స్.. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా మరో 40 తెరలను ప్రారంభించాలని లకి‡్ష్యంచింది. ప్రస్తుతం నగరంలో 11 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐనాక్స్ తెరలను ప్రారంభించనున్నామని ఐనాక్స్ లీజర్స్ సీఈఓ అలోక్ టాండన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఐనాక్స్కు 67 నగరాల్లో 137 మల్టీప్లెక్స్‌ల్లో 542 స్క్రీన్స్ ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో అదనంగా 850 స్క్రీన్ల ఏర్పాటు ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. ‘‘లగ్జరీ, సర్వీస్, టెక్నాలజీ ఇదే ఐనాక్స్ సక్సెస్‌కు కారణం. 2012లో లగ్జరీ ప్రొజెక్టర్ స్క్రీన్స్‌తో డిజిటల్లోకి రంగం ప్రవేశం చేశాం. ఆ తర్వాత ఫుడ్ యాప్, కియోస్క్ టికెట్స్ వంటివి సర్వీస్‌లను తీసుకొచ్చాం. తాజాగా ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్లను ముంబైతో పాటూ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం’’ అని వివరించారు. -
మహేష్ బాటలో బన్నీ..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సినిమాల మీదే దృష్టి పెట్టిన మహేష్ ఏఎంబీ సినిమాస్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు మరింత మంది తారలు ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వ్యాపర రంగంలో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే సిటీ సెంటర్లో ఓ ప్రముఖ థియేటర్ ఉన్న స్థలాన్ని మల్టీప్లెక్స్ నిర్మాణానికి సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై బన్నీ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. -
మహేష్ మల్టీప్లెక్స్ ప్రారంభం
-
మహేష్ మల్టీప్లెక్స్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : అత్యాధునిక హంగులతో ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మహేష్ తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ చేతులమీదుగా మహేష్ మల్టీప్లెక్స్ వైభవంగా ప్రారంభమైంది. మొత్తం ఏడు స్క్ర్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ఉన్న థియేటర్లో 2.ఓ చిత్రం నేడు తొలి సినిమాగా ప్రదర్శితమవుతోంది. టికెట్ ధర రూ. 230 నుంచి ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు టికెట్లు ఇప్పటికే బుక్ అయినట్టు తెలిసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఆధునిక వసతులతో కూడిన థియేటర్ మరొకటి లేదని చెబుతున్నారు. ఏఎంబీ సినిమాస్‌లో పడుకుని చిత్రాన్ని చూసే వెసులుబాటు ఉండటం విశేషం. మరిన్ని ఫొటోల కోసం స్లైడ్ క్లిక్ చేయండి! -
ఏఎమ్‌బీ మహేష్‌లా అందంగా ఉంది : ఆర్జీవీ
సూపర్‌స్టార్ మహేష్ బాబు బిజినెస్మెన్ అయిపోతున్నాడు. అదేంటీ బిజినెస్మెన్ ఎప్పుడో అయిపోయాడు.. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కూడా అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఇక్కడ మాట్లాడేది సినిమా గురించి కాదులేండి. ఈ సూపర్‌స్టార్ హైదరాబాద్‌లో ఓ అధునాతన మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. దీన్ని రేపు (డిసెంబర్ 2) ప్రారంభించబోతున్నారు. అయితే రీల్ లైఫ్‌లో బిజినెస్‌మెన్‌గా సక్సెస్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం రియల్‌లైఫ్‌లో బిజినెస్‌మెన్‌గా మారబోతున్నాడు. ఈ ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌ను సందర్శించిన రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో దాన్ని వర్ణించాడు. దీనిపై ట్విటర్లో స్పందిస్తూ.. ‘ఇప్పుడే ఏఎమ్‌బీ సినిమా స్ర్కీన్స్ చూశాను. డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. బ్రీత్‌టేకింగ్ ఎక్స్పీరియన్స్. మహేష్ ఎంత అందంగా ఉంటాడో అది కూడా అంత అందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ మల్టీప్లెక్స్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రారంభించనున్నాడని సమాచారం. Just saw the AMB cinema screens opening on 2nd ..BREATHTAKING EXPERIENCE ..The whole ambience looks as BEAUTIFUL and as HANDSOME as @urstrulyMahesh — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2018 -
అరాచకీయం..
సాక్షి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: అధికారం, డబ్బు, పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయం, ఇవేమీ లేని సామాన్య ప్రజలకు మరో న్యాయం..ఇదీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో జరుగుతున్న నయా పాలన. సిఫార్సులుంటే చాలు ఆ పని అనధికారికం, అక్రమమైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా చేసుకోవచ్చు. నిర్మాణానికి అనుమతి లేకపోయినా కట్టేయవచ్చు. ఇవేవీలేని వారు మాత్రం తమకున్న 70 లేదా 100 గజాల్లో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా ఏళ్లు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పని జరగని వైనం. మల్టీప్లెక్స్ ఘటన తాజా ఉదాహరణ.. తాజాగా నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో జరుగుతోన్న మల్టీప్లెక్స్ నిర్మాణ ఘటనే దీనికి ఉదాహరణ. పది వేల గజాల్లో మూడు సెల్లార్లు, జీ ప్లస్ ఐదు అంతస్తులతో కూడిన భారీ షాపింగ్ మాల్, ఆరు సినిమా స్రీన్లతో కూడిన మల్టీప్లెక్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అనుమతులకు కనీసం దరఖాస్తు చేయకుండా, బిల్డింగ్ అభివృద్ధి ఫీజు, బెటర్మెంట్ ఛార్జీలు, నిర్మాణ ఫీజు, బిల్డింగ్ నిర్మాణ అనుమతి ఫీజులు చెల్లించకుండా పనులు ఎలా చేశారన్నది అంతుచిక్కుతున్న ప్రశ్నగానే ఉంది. ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా ఇలా పనులు మొదలు పెట్టబోరని రాజమహేంద్రవరం ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతోంది. అధికారులకు తెలిసినా అటు వైపు వెళ్లకుండా మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్లో వాటాలున్న ప్రజా ప్రతినిధులు ఒత్తిళ్లు తెచ్చిన విషయం సుస్పష్టం. కన్వెన్షన్ సెంటర్లోనూ ఇదే తీరు... మల్టీప్లెక్స్ మాత్రమే కాదు భారీ నిర్మాణం, రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఉన్న నిర్మాణం ఏదైనా సరే వారికి నచ్చినట్టుగా కట్టుకునేలా ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నారు. 2015 మహా పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం సెంట్రల్‌జైలు ఎదురుగా ఉన్న జైళ్ల శాఖకు చెందిన ఆరెకరాల భూమిని కేటాయించారు. కన్వెన్షన్ సెంటర్ అంటే తమకేదో మేలు జరుగుతుందని నగర ప్రజలు భావించారు. కొద్ది రోజులకే అసలు విషయం బోధపడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అక్కడ సినిమా స్క్రీన్లు, ఫంక్షన్ హాల్, బ్రాండెడ్ దుస్తులు దుకాణాలు, రెస్టారెంట్లు ఉండేలా రూ.120 కోట్లు ఖర్చుతో నిర్మాణం చేపడుతున్నారు. వీటికి అదనంగా నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మిస్తున్నారు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటి నాలుగు నక్షత్రాల హోటల్‌గా ఇది చర్రిత్రకెక్కనుంది. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అనుమతులు లేవు. అయినా సరే పనులు చేస్తున్నారు. ఇందులో కూడా ‘ముఖ్య’నేతకు బినామీగా ప్రచారంలో ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధికి, సీనియర్ ప్రజా ప్రతినిధికి వాటాలున్నాయనే ప్రచారం సాగుతోంది. అనుమతుల తీసుకున్నారని, కానీ మరోసారి సరిచేసిన(రివైజ్డ్) అనుమతులకు దరఖాస్తు చేయనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చిన అనుమతి ఒకటైతే.. మరో విధంగా నిర్మాణం చేస్తుంటే గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా), నగరపాలక సంస్థ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక కన్వెన్షన్ సెంటర్లో వాటాలున్న ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లే కారణమని, ఎవరూ చెప్పాల్సిన పని లేదని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బలవుతున్న అధికారులు నిబంధనల ప్రకారం అధికారులు పని చేయనీయకుండా అనధికారిక, అక్రమ నిర్మాణాలు సాఫీగా జరిగేలా ఒత్తిళ్లు, సిఫారసులు చేసే ప్రజా ప్రతినిధులు ఆయా అంశాల్లో తేడా వస్తే మాకేమీ తెలియదంటూ నటిస్తున్నారు. అంతేకాదు అధికారులను నిందిస్తూ వారిపై చిందులు తొక్కుతున్నారు. చివరకు ప్రజా ప్రతినిధులు తప్పించుకుంటూ ఈ తప్పును అధికారులే చేసినట్టుగా వారిని బలిపశువులను చేస్తున్నారు. -
ప్రకంపనల వెనుక... మురళీ ‘మనోహర’మే...
సాక్షి, రాజమహేంద్రవరం: రాజకీయ, ఆర్థిక బలాన్ని బట్టి ప్రభుత్వ శాఖల్లో పనులు జరుగుతాయన్నది కాదనలేని నిజం. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు రాజమహేంద్రవరం నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. సామాన్యులు చిన్నపాటి ఇళ్లు నిర్మించుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు, ప్లాన్లు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీ (అభ్యంతరలేమీ పత్రం)లు.. ఇలా సవాలక్ష ఆంక్షలు, ఆపసోపాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది రాజమహేంద్రవరం నగరంలోనే అతి పెద్ద నిర్మాణంగా నిలవనున్న ప్రసాదిత్య మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం జరిగిపోతోంది. అనుతులు లేకుండా, అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా తెరవెనుక మంత్రాంగం నడిపిన శక్తి ఎవరన్న విషయంపై నగరంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంపీ మురళీమోహన్‌కు ఈ మల్టిప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో వాటా ఉంది కాబట్టే అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, కనీస ప్రమాణాలు పాటించకుండా పనులు చేయగలుగుతున్నారని తెలిసింది. ఘటన జరిగిన సమయంలోనూ, అంతకుముందు జరిగిన పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. శంకుస్థాపనకు హాజరైన ఎంపీ.. ప్రసాదిత్య సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. సంస్థ చైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి. ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్తోపాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీశేష సాయి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ నిర్మాణం, నగర అభివృద్ధిపై ప్రసంగించారు కూడా. అన్నీ తానై నడిపిన వైనం... మల్టిప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ విభాగాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఎంపీ మురళీమోహన్ తీసుకున్నారని ఆరోపణలు తాజా ఘటన తర్వాత వెల్లువెత్తుతున్నాయి. 2016లో అర్బన్ జిల్లా ఎస్పీగా ఉన్న హరికృష్ణ నుంచి ఎన్వోసీ తీసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ తన అనుచరులను పంపి ఈ పనులు చేయించారని సమాచారం. మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్‌కు నగరపాలక సంస్థ పూర్వపు కమిషనర్ వి.విజయరామరాజుపై ఒత్తిడి తెచ్చి మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని తెలుస్తోంది. తమకు రాతపూర్వక అనుమతులు ఇంకా రాలేదని, కమిషనర్ అనుమతులు ఇచ్చారంటూ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో నిర్మాణ సంస్థ అధికారులు చెప్పడం గమనార్హం. గుడా పరిధిలో మొదటిసారిగా భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా అధికారులు కానీ, నగరపాలక సంస్థ యంత్రాంగం కానీ ఆ వైపు వెళ్లకుండా చేయడం వెనుక ప్రజాప్రతినిధులు ఒత్తిడి ఉందనడంలో సదేహం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలోనే కనీస ప్రమాణాలు పాటించకుండా అంచుల వరకు తవ్వినా అధికారులు దృష్టికి రాకుండా ఉండదు. పైగా నగర ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే దారి వినాయక చవితి రోజున గోతుల వైపు వాలిపోయింది. మట్టి జారిపోకుండా తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఘటన తర్వాత అనుక్షణం అప్రమత్తం.. ఘటన జరిగిన తర్వాత ఎంపీ మురళీమోహన్ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హుటాహుటిన ఎంపీ అనుచరులు, కార్యాలయ సిబ్బంది ఆయన కారులోనే వచ్చారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. రాత్రి 8 గంటల వరకు నగరంలో ఉన్న ఎంపీ మురళీమోహన్ అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోయారని సమాచారం. ఘటనా స్థలానికి వచ్చిన సబ్ కలెక్టర్, కమిషనర్, డీఎస్పీ, నగరపాలక సంస్థ అధికారులతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు. తర్వాత ఏమి చేయాలన్నదానిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ అనుచరుల హల్చల్.. శనివారం రాత్రి ఘటన జరిగిన సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అనుచరులు హల్చల్ చేశారు. ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. లోపలకి వెళ్లేందుకు అనుమతిలేదంటూ హడావుడి చేశారు. అధికారులతో మాట్లాడుతూ అంతా తామై నడిపారు. రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలానికి వచ్చిన స్థానిక టీడీపీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియపై కూడా జులుం ప్రదర్శించారు. తూతూ మంత్రంగా చర్యలు... అనధికారికంగా గోతులు తీసి, చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు నష్టం కలిగించినా కూడా సదరు నిర్మాణదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్మాణం ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు మాత్రం జారీ చేశారు. రాజకీయ అండలేని ఓ సామాన్యుడైతే పరిస్థితి మరోలా ఉండేదని నగర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
రజనీ చేతుల మీదుగా మహేష్ మల్టీప్లెక్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఏసియన్ ఫిలింస్ సంస్థతో కలిసి మహేష్ ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. ఏయంబీ సినిమాస్ పేరుతో నిర్మిస్తున్న ఈ థియేటర్స్‌ను ముందుగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతోనే ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ థియేటర్స్‌ను 2.ఓ సినిమాతో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన థియేటర్స్ కావటంతో 2.ఓ లాంటి 3డీ విజువల్, 4డీ ఆడియోతో రూపొదించిన సినిమాతో ప్రారంభించటమే కరెక్ట్ అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా హాజరవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై మహేష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
ప్చ్.. మారలేదు!
విజయవాడలోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లలో అధిక ధరలు నియత్రించాలని జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినా ఫలితం కన్పించడం లేదు. న్యాయస్థానం తీర్పు సైతం పట్టించుకోకుండా మాల్స్ యాజమాన్యాలు ధరలు తగ్గించకుండా దందా కొనసాగిస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖాధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : కొద్ది రోజులుగా నగరంలోని మల్టీప్లెక్స్‌లు.. సినిమా థియేటర్లలో అధిక ధరల అదుపు కోసం తూనికలు కొలతల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నా.. ఫలితం సున్నా అన్నట్లు ఉంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులపై కేసులు సైతం నమోదు చేసి.. జరిమానాలు విధించారు. మరోవైపు వినియోగదారుల ఫోరం కూడా లక్షలాది రూపాయల చొప్పున మాల్స్‌లో స్టాల్స్ నిర్వహిస్తున్న కంపెనీలపై జరిమానా విధించింది. ఈ పరిణామాలతో అధిక ధరల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని నగరవాసులు భావించారు. కానీ, అక్కడ జరుగుతున్న తంతు మాత్రం వేరేలా ఉంది. ఎమ్మార్పీ ధరలను చూసి జనం గుడ్లు తేలేస్తున్నారు. పాత ధరలనే కొత్త స్టిక్కర్‌పై చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తేనేమో సంబంధిత అధికారులు తమకేమీ సంబంధం లేదంటూ చేతులెత్తేస్తుండటంతో అంతిమంగా నగరవాసులే నష్టపోతున్నారు. ధరల దోపిడీకి గురవుతున్నారు. అక్రమాలకు అడ్డాగా.. అనేక సామాజిక సందేశాలు.. పోరాటాల ఇతివృత్తంగా రూపొందే చలనచిత్రాలు ప్రదర్శించే వేదికలే అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. నిబంధనలు అమలు చేయాలని చట్టాలు ఆదేశిస్తున్నా.. న్యాయస్థానాలు భారీ జరిమానాలు విధిస్తూ తీర్పులిస్తున్నా విక్రేతలకు, సినిమా హాళ్ల యాజమాన్యాలకు మాత్రం పట్టడం లేదు. మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో పేరుతో ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు. ఏడు నెలల్లో థియేటర్లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు చేసిన దాడులు నామమాత్రంగా ఉండటమే దీనికి తార్కాణం. ఈ ఏడాది జూలై నాటికి షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అదనంగా విక్రయిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పీవీపీ, పీవీఆర్, ట్రెండ్‌సెట్, ఎల్ఈపీఎల్ ఐనాక్స్, ఊర్వశీ ఐనాక్స్, మీరజ్ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌పై మొత్తం 77 కేసులు నమోదు చేశారు. జరిమానా రూ.5.52 లక్షలు వసూలు చేశారు. అయినా మల్టీప్లెక్స్‌ల్లో ఏ మార్పు లేకపోవడం గమనార్హం. అదే తీరు.. అదే దందా.. నెల రోజులుగా అధికారుల ఆకస్మిక దాడులు.. కేసులు.. జరిమానాలతో మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్ల నిర్వాహకుల్లో మార్పు వచ్చిందా?.. అని ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. అదే దోపిడీ.. అదే దందా కొనసాగుతోంది. కాకపోతే మరో పద్ధతిలో, అంటే.. వారు నిర్ణయించుకున్న ధరల్లో మార్పు లేకుండా కొత్తగా అతికించిన స్టిక్కర్లపై వాటిని ముద్రించి విక్రయిస్తున్నారు. చాలా చోట్ల బిల్లు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల మాత్రం ధరలు బోర్డులను ప్రదర్శించారు. మల్టీఫ్లెక్స్ థియేటర్లో విక్రయించే తినుబండారాల ధరలను ప్రేక్షకులకు కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలి. విక్రయించిన వస్తువులకు విధిగా బిల్లు ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి. బోర్డులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తినుబండారాలు కొనుగోలు చేస్తే.. బిల్లు ప్రేక్షకుడి చేతికి ఇస్తారు. దానిని తీసుకెళ్లి సర్వర్‌కు ఇవ్వాలి. ఈ క్రమంలో బిల్లు ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి తీసేసుకుంటున్నారు. ప్రేక్షకుడిని దగా చేయడంలో ఇదో లాజిక్‌గా అనుసరిస్తున్నారు. విడిగా విక్రయిస్తే మేమేం చేయలేం.. నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ముద్రించిన గరిష్ట చిల్లర ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా.. చట్టవిరుద్ధమే. మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్యాకింగ్ చేసి కాకుండా విడిగా తినుబండారాలు, ఇతర వస్తువులను ఎంతకు విక్రయించినా.. మా పరిధిలోకి రాదు. అలాంటి ఫిర్యాదుల విషయంలో మేమేం చేయలేం. – పీఎస్‌ఆర్‌ఎన్‌టీ స్వామి, డెప్యూటీ కంట్రోలర్, తూనికలు, కొలతలు శాఖ -
సినిమా చూసేటప్పుడే తినాలా?
సాక్షి, హైదరాబాద్:మల్టీప్లెక్స్‌లోని సినిమా హాళ్లల్లోకి ప్రేక్షకులు తమ వెంట తినుబండారాలు తీసుకుని వెళ్లేలా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మల్టీప్లెక్స్‌లోని సినిమా హాళ్లల్లో ఆహార పదార్థాల నాణ్యత, అధిక ధరలు అంశాలపై వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆహార భద్రత, తూనికలు–కొలతలు, సినిమా రెగ్యులేషన్ యాక్ట్‌లతో ముడిపడిన ఈ వ్యవహారంపై పిల్ ద్వారా న్యాయ సమీక్ష వీలుకాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం మంగళవారం పేర్కొంది. మల్టీప్లెక్స్‌ల్లోని సినిమా హాళ్లల్లో తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారని, ప్రేక్షకులే తమ వెంట ఆహార పదార్థాలను తీసుకువెళ్లేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది సతీశ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను కోర్టు కొట్టివేసింది. -
‘అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారత దేశంలో ‘ఎస్పీఐ సినిమాస్’ హాళ్లను ‘పీవీఆర్ సినిమాస్’ కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సత్యం సినిమా హాళ్లతో మాకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను ఎలా మరచిపోయేది?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఐ సినిమాస్‌ను సాధారణంగా సత్యం సినిమాస్‌గా వ్యవహరిస్తారు. వెన్న చిలకరించిన వివిధ ఫ్లేవర్ల పాప్‌కార్న్ ఇక తినే భాగ్యం లేదా ? అంటూ ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ఈ సత్యం థియేటర్లలో పాప్‌కార్న్ చాలా పాపులర్. అది అత్యంత రుచికరంగా ఉంటుంది. అది అమెరికాలోని ఓ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో పండిస్తున్న అధికోత్పత్తి రకం పాప్‌కార్న్ కావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుందని ఎస్పీఐ సినిమాస్‌లోని ‘ఎక్స్పీరియన్నెస్ విభాగం’ అధ్యక్షుడు భవేశ్ షా తెలిపారు. భారత్‌లో దొరికే పాప్‌కార్న్ తక్కువ దిగుబడినిచ్చే వంగడం నుంచి వచ్చేదని, ఇది లావుగా ఉండి, కాస్త గట్టిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాప్‌కార్న్ కాస్త సన్నగా, మృదువుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబైలోని ఎస్పీఐ సినిమాస్‌లో 71.7 శాతం వాటాను అంటే, 222,711 ఈక్విటీ వాటాను 633 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్లు దేశంలోనే అతిపెద్ద సినిమా థియేటర్ల చైన్‌ను కలిగిన పీవీఆర్ సినిమాస్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో దేశంలోని 60 నగరాల్లో పీవీఆర్‌కు సినిమా హాళ్ల సంఖ్య 703కు చేరుకుంది. ఎస్పీఐ సినిమాస్ వ్యవస్థాపకులైన కిరణ్ ఎం రెడ్డి, స్వరూప్ రెడ్డిలు తమ వ్యాపారంతో కొనసాగుతారని పీవీర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విక్రయంపై ట్విట్టర్ వినియోగదారులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇది విచారకరమైన వార్త. చెన్నై వాసులకు సత్యం ఒక ఆత్మ, ఒక అనుభూతి... మీరు మీ థియేటర్లను ఎవరికైనా అమ్ముకోండి. వారు వాటికి ఏ పేరైనా పెట్టుకోనియ్యండి, మా దృష్టిలో మాత్రం అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే... పీవీఆర్ అనేది ఓ పేరు మాత్రమే. సత్యం అన్నది మా భావోద్వేగం’ అంటూ కొందరు స్పందించగా ఎక్కువ మంది ‘మా పాప్ కార్న్ జోలికి రాకండి’ అంటూ అది అలాగే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకున్నారు. వారి కోరిక మేరకు సత్యం సినిమా హాళ్లలో పాత ఫుడ్ చైన్‌ను అలాగే కొనసాగిస్తామని పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నితిన్ సూద్ స్పష్టం చేశారు. -
మల్టీ దోపిడీకి కళ్లెం ఎప్పుడు?
గుంటూరు ఈస్ట్: తెలంగాణ ప్రభుత్వం లక్షలాదిమంది ప్రేక్షకుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సినిమా థియేటర్లలో మల్టీప్లెక్స్ దోపిడీకి చెక్ పెట్టింది. కాని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం పట్టించుకోవడం లేదు. అయితే విజయవాడలో కొందరు ప్రేక్షకులే వినియోగదారుల ఫోరంలో కేసువేసి అధిక ధరలపై విజయం సాధించడం గమనార్హం. రాజధాని నగరమైన గుంటూరులో కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఫోరంలో కేసు వేస్తే తప్ప మల్టీ దోపిడీకి తెరపడేలా లేదు. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా టిక్కెట్ ధరను మించి తినుబండారాల ధరలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ, ప్రేక్షకుల నడ్డి విరుస్తున్నారు. దీనికి తోడు ప్రధాన ద్వారం వద్దే తనిఖీలు చేసి మంచినీళ్ల బాటిళ్లు, తినుబండారాలు, చివరకు వక్కపొడి ప్యాకెట్లు కూడా లాక్కుంటున్నారు. చివరకు చేతిలో బ్యాగుకు పది రూపాయలు వసూలు చేయడమే కాక, హెల్మెట్లను లోపలకు అనుమతించడం లేదు. ఇదేమని అడిగితే దురుసుగా సమాధానం చెబుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ల క్యాంటీన్లో పిజ్జా 150 నుంచి 200 రూపాయలు, కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ రూ.90 నుంచి రూ.100 రూపాయలకు విక్రయిస్తున్నారు. బయట 10 రూపాయలు ఉండే సమోసా ఇక్కడ 40 రూపాయలు, కూల్‌డ్రింక్ 60 నుంచి 70 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వాటర్‌బాటిల్స్‌ను వారిష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు.వాస్తవానికి ఎమ్మార్పీ ధర కంటే అదనంగా వసూలు చేయడం తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు విరుద్ధం. చిన్నపిల్లలని కూడా చూడకుండా... చిన్న పిల్లలతో, అనారోగ్యంతో ఉన్న ప్రేక్షకులను సైతం వదలకుండా వాటర్ బాటిళ్లు, తినుబండారాలు లాక్కోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కృత్తికా శుక్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో సినిమాహాళ్లలోకి తినుబండారాలు అనుమతించాలని ఆదేశించారు. అనుమతించకపోతే తనకు ఫోన్ చేయాలని కోరారు. సినిమా హాళ్ల యజమానులు ఈ ఆదేశాన్ని బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్, తమిళనాడులనుఎందుకు ఆదర్శంగా తీసుకోరు? హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1 నుంచి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలన్నీ ఎమ్మార్పీ ధరలకు విక్రయించేలా కఠినమైన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే వాహనాల పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయడం లేదు. తమిళనాడులోనూ ఇదే తరహాలో ప్రభుత్వం కఠినచర్యలు అమలు చేయడం ప్రారంభించింది. ప్రతిదానికి హైదరాబాద్‌తో పోల్చి అంతకంటే గొప్పగా పాలన చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి మల్టీప్లెక్స్ దోపిడీ గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు సామాన్యులకుఅందుబాటులో ఉండాలి థియేటర్లలో సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా ఆహార పదార్ధాలు విక్రయించాలని థియేటర్ యజమానులకు సూచించాం. గ్రీన్ చానల్లో శీతల పానీయాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటిని బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకే విక్రయించాలని సూచించాం. పార్కింగ్ రుసుం నామమాత్రంగా విధించాలని చెప్పాం. మల్టీప్లెక్స్ థియేటర్లలో పార్కింగ్ రుసుం వసూలు చేయకూడదన్న ఉత్తర్వులు మాకు ప్రభుత్వం నుంచి అందలేదు.– జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్ -
తీర్పుతోనైనా తెరపడేనా?
జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి తీర్పుతోనైనా విజయవాడలోని మల్టీఫ్లెక్స్ థియేటర్లు, మాల్స్‌లో దోపిడీకి తెరపడుతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న సెలక్ట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఫోరం ఆదేశించింది. తినుబండారాలు, పానీయాలపై మార్కెట్ కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో ఫిర్యాదుదారుడికి తిరిగి చెల్లించాలని çహుకుం జారీ చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు మేరకు అన్ని థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లలో బయటి నుంచి తినుబండారాలు, నీరు, పానీయాలు అనుమతించాలని.. వినియోగదారులకు నీరు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే ఎవరైనా ఫిర్యాదు చేయడానికి అనువుగా అన్నిచోట్లా తూనికలు, కొలతల శాఖ అధికారుల ఫోన్ నంబర్లున్న బోర్డులుంచాలన్నారు. ధరల పట్టికను కూడా ప్రముఖంగా కన్పించేలా ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నింటినీ అమలయ్యేలా చూడాల్సినబాధ్యత తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ తీసుకోవాలని స్పష్టం చేశారు. స్నాక్స్ పేరుతో దోపిడీ.... రోజువారీ సాధక బాధల నుంచి సగటు జీవికి ఊరట ఉపశయాన్ని ఇచ్చే ‘సినిమా’ ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి వెళ్లకముందే సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతో పాటు కాంబో ప్యాక్, అర్డనరీ ప్యాక్ కొనుగోలు తప్పని సరి చేస్తున్నాయి. అప్పటికే చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. పెద్ద హీరో సినిమాలయితే.. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్ అవుతుండడంతో అక్కడే వెళ్లి సినిమా చూడాల్సి వస్తోంది. . కేవలం పాప్ కార్న్ , కూల్ డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూళ్లు చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ రూ.150 వంతున వసూళ్లు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరు చెప్పినా.. విజయవాడ నగరంలో 5 మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి.. అందులో ఒక్కో మల్లీప్లెక్స్‌లో సగటున 6 స్కీన్స్ ఉన్నాయి.. ప్రతి చోట స్నాక్స్ పేరుతో అడ్డుగోలు దోపిడి చేస్తున్నారు. థియేటర్ వెలుపల కొనుగోలు చేసినా ఏ తినుబండార మూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్ క్యాంటీన్లోనే కొనుగోలు చేయాలి. ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ.50.. చిన్న పాప్‌కార్న్‌కు రూ.170 , కోల్డ్ కాఫీ రూ.150, పిజ్జా, కోక్ రూ.200 , స్వీట్స్ కేక్స్ రూ.80 ఇలా 28 రకాల పుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ. 100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అధనమే. గతంలో సెలక్ట్ చానల్ దోపిడికి జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం కళ్లెం వేస్తానంటూ హడాహుడి చేసినా ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కొన్ని మల్టీప్లెక్స్‌లలోకి బయట నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అనుమతి మాత్రమే ఇప్పించగలిగాడు. రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు పలుమార్లు కాళ్లు నొప్పుట్టేలా తనిఖీలు చేసినా ధరలు మాత్రం యథా«తథంగా ఉన్నాయంటే వారి అసమర్థతా ?. అధికారుల నిర్లక్ష్యమా..? అనేది నగరంలో చర్చగా మారింది.. పార్కింగ్ పేరుతో దోపిడీ... మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడి చేస్తున్నారు. పార్కింగ్ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు.. అయినా నిర్వహకులు యథేచ్చగా వాహనదారులు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.. మాల్స్‌లో ద్విచక్రవాహనానకి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు చేస్తూ పక్కా దోపిడికి పాల్పడుతున్నా పట్టించుకోనే వారు కరువయ్యారు. -
కేసులే.. ఫైన్లు లేవ్..
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్లలో ఎమ్మార్పీ అమలు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం ప్యాకేజ్డ్ కమొడిటీస్ చట్టం అమలుపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ నెల 1 నుంచి ఎమ్మార్పీ అమలు చేయాలని ఆయా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన సైతం కల్పించినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారింది. నిబంధనల అమలుపై నిరంతర తనిఖీలు చేపడతామని హెచ్చరించినా కనీస స్పందన కరువైంది.దీనిని తీవ్రంగా పరిగణించిన తూనికలు, కొలతల శాఖ ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్‌లపై దాడులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను 30 మందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 107 కేసులు నమోదు గ్రేటర్ పరిధిలో మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో ఎమ్మార్పీ నిబంధనల ఉల్లంఘనపై తూనికలు, కొలతల శాఖ అధికారులు ఇప్పటి వరకు 107 కేసులు నమోదు చేశారు. నగరంలో సుమారు 28 మల్టీప్లెక్స్‌లు ఉండగా ఈ నెల 2న, 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించి, 18 థియేటర్లపై 54 కేసులు నమోదు చేసింది. 3న 8 మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 6 మల్టీప్లెక్స్‌లపై 19 కేసులు, 21 సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించి14 థియేటర్లపై 17 కేసులు నమోదు చేశారు. తాజాగా ఆదివారం 17 మల్టీప్లెక్స్‌లలో రెండో దఫా తనిఖీలు నిర్వహించగా నిబంధనలు పాటించని 12 మల్టీప్లెక్స్‌లపై 17 కేసులు నమోదు చేశారు. ఫిర్యాదుల వెల్లువ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల నుంచి తూనికల కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబర్, వాట్సప్ నంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. రెండురోజుల్లోనే దాదాపు రెండు వందలకు పైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. తూనికల కొలతల శాఖ నిబంధనలు పాటించకుండా ఎమ్మార్పీకి మించి ధరలు వసూ లు చేస్తే వాట్సప్ నంబర్ 7330774444, టోల్ ఫ్రీ నంబర్ 180042500333లకు ఫిర్యాదు చేయా లని తూనికలు, కొలతల శాఖ సూచించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లపై ఎక్కువగా ఫిర్యాదులు అందడం విశేషం. ఈ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని తూనికల కొలతల శాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కేసులు సరే... జరిమానా ఏదీ?... మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలుతల శాఖ కేవలం కేసుల నమోదుతో చేతులు దులుపుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది. రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష తప్పవని హెచ్చరించింది. కాగా మల్టీప్లెక్స్, థియేటర్లపై వరసగా రెండురోజులు జరిపిన దాడుల్లో నిబంధనల ఉల్లంఘనపై సుమారు 88 కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
సినిమా ప్రేక్షకులకు ఊరట
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లలో ధరల దూకుడుకు కళ్లెం పడనుంది. వినోదం కోసం వచ్చే వినియోగదారుల నుంచి వివిధ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో అడ్డగోలు ధరలపై తూనికలు, కొలుతల శాఖ కన్నెర్ర చేసింది. బుధవారం (ఆగస్టు ఒకటి) నుంచి సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీ ప్రకారమే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు కఠినతరం చేసింది. కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించక తప్పదు. విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాతో పాటు జైలుపాలు కావాల్సిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలుజరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలు, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తూనికలు, కొలుతల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అడ్డగోలు దోపిడీ సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలు అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణంగా తయారైంది. దీంతో గత కొంత కాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్ మెట్రాలజీ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయడానికి తూనికల కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలోని థియేటర్ యాజమాన్యాలతో ఏరియా వారిగా సమావేశాలు నిర్వహించి అధిక ధరల దోపిడీని కట్టడిచేయాలని సూచించారు. కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. నిబంధనలు ఇలా... ⇔ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఏ వ్యాపారం కానీ, ఏ సేవ కానీ, ఏ వినోదం కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఈ విషయంలో ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. ⇔ ఆగస్టు 1వ తేదీ నుండి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పీ ప్రకారం విక్రయాలు జరపాలి. తినుబండారాలు, మంచి నీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. ⇔ విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ⇔ సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి. ⇔ ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడికి వివిధ బ్రాండ్లు అందుబాటులో ఉంచాలి. ⇔ ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్పీ, కస్టమర్ కేర్ వివరాలు ⇔ ఎమ్మార్పీ ధర ఉన్న ఫడ్స్ మాత్రమే విక్రయించాలి. ⇔ వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి. రెండు రోజులు తనిఖీలు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బహిరంగ మార్కెట్లో ఏదైతే ఎంఆర్పీ ఉందో అదే ధరకు మల్టీప్లెక్స్, థియేటర్లల్లో కూడా విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎంఆర్పి ధర ప్రకారమే విక్రయిస్తున్నారా, ఇతరత్రా కొత్త నిబంధనల అమలుపై బుధ, గురువారాల్లో తూనికల, కొలుతల శాఖ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పరిశీలించనున్నాయి. అనంతరం ఆకస్మిక తనిఖీలతో కేసుల నమోదు, జరిమానాలు విధించనున్నారు. -
రీల్స్ ఆన్ వీల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిండి.. బట్ట.. ఇల్లు. ఈ మూడింటి తర్వాత మనిషికి కావాల్సింది వినోదమే!!. అందులో ముందుండేది సినిమానే!. కాకపోతే ఈ రంగంలో పెద్ద కంపెనీలదే హవా. ఇక్కడ చిన్న కంపెనీలు రాణించాలంటే వినూత్న ఆలోచన కావాలి.పిక్చర్ టైమ్ చేసిందిదే!!. గ్రామీణ ప్రాంతాల వారికి మల్టీప్లెక్స్ సినిమా అనుభూతిని కల్పించాలనుకుంది. దీనికోసం ప్రత్యేకంగా వాహనాలకు అభివృద్ధి చేసి సినిమాలను ప్రదర్శిస్తోంది. గోవా కేంద్రంగా 2015 అక్టోబర్‌లో ప్రారంభమైన ‘పిక్చర్ టైమ్’ సేవల గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ సుశీల్ చౌధురి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం.. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తున్నాం. కొత్త సినిమాల రిలీజ్ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్లతో పాటు శోభు యార్లగడ్డ, శీతల్ భాటియా వంటి నిర్మాతలు, యశ్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్), రెడ్ చిల్లీస్ వంటి నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో ఫాక్స్ స్టార్, డిస్నీ, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకోనున్నాం. కార్పొరేట్ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ ప్రదర్శనలు, బ్రాండింగ్, సినిమా టికెట్ల అమ్మకం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. గత సంవత్సరం రూ.8 లక్షల టర్నోవర్‌ను నమోదు చేశాం. ప్రకటనల ధరలు డీఏవీపీ నిర్దేశించినట్లే ఉంటాయి. వచ్చే నెలాఖరుకు తెలుగు రాష్ట్రాల్లోకి... ప్రస్తుతం ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50కి పైగా సినిమాలను ప్రదర్శించాం. రేస్–3, సంజు, బాహుబలి–2 సినిమాలు నేరుగా పిక్చర్ టైమ్‌లో రిలీజయ్యాయి. వచ్చే నెలాఖరుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంట్రీ ఇస్తాం. స్థానికంగా ఒకరిద్దరితో జట్టుకట్టాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతో పాటూ హిందీ సినిమాలనూ ప్రదర్శిస్తాం. 10 మొబైల్ సినిమా ట్రక్స్.. సినిమాలను ప్రదర్శించేందుకు, ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా ట్రక్‌లను ఆధునీకరిస్తాం. ఏసీ, హెచ్డీ స్క్రీన్, 5.1 డోల్బీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. థియేటర్లో 120–150 సీట్లుంటాయి. ప్రస్తుతం పిక్చర్ టైమ్‌లో 10 మొబైల్ సినిమా ట్రక్‌లున్నాయి. ట్రక్ వెలుపలి భాగంలో ఫుడ్ కోర్ట్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ జోన్లు, వై–ఫై హాట్‌స్పాట్స్, మైక్రో ఏటీఎం వంటి ఏర్పాట్లుంటాయి. టికెట్ ధరలు రూ.30–50. ఆక్యుపెన్సీ 60% ఉంటుంది. 6 నెలల్లో రూ.100 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 60 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరికి 3 వేల పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్లను ఏర్పాటు చేస్తాం. ఇటీవలే ప్రీ–సిరీస్ రౌండ్లో భాగంగా రూ.25 కోట్ల నిధులు సమీకరించాం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీఎక్స్ పార్టనర్స్ కో–ఫౌండర్ అజయ్ రిలాన్ ఈ పెట్టుబడి పెట్టారు. వచ్చే 6 నెలల్లో మరో రౌండ్లో రూ.100 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తాం. 2021 నాటికి ఎస్ఎంఈ వేదికగా ఐపీవోకి వెళ్లాలని లకి‡్ష్యంచాం. -
‘పైసా ఎక్కువ వసూలు చేసినా కేసే’
సాక్షి, హైదరాబాద్ : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లల్లో ప్యాకేజ్డ్ వస్తువులను ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ విషయంపై మంగళవారం రోజు పౌరసరఫరాల భవన్లో సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ యజమాన్యాలతో అకున్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్లో ఎంఆర్పీ ప్రకారం ఏవిధంగా అయితే వస్తువులను విక్రయిస్తారో అదే విధంగా సినిమాల హాళ్లు, మల్టిప్లెక్స్‌లలో కూడా విక్రయించాలని ఆదేశించారు. ఎంఆర్పి కంటే ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని, ఇది ప్రతి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్ యజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేది నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులతో పాటు అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. -
మల్టీ దోపిడీ
ఐటీ సిటీలో టాకీస్లు పోయాయి, మల్టీప్లెక్స్ స్క్రీన్లు వచ్చాయి. ఒక్కసారిసరదాగా వెళ్తే అక్కడి టికెట్లు, తిండి పదార్థాల ధరలు వింటే నిజంగానే సినిమా కనిపిస్తుంది. బిస్కెట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ వంటి సాధారణ చిరుతిళ్లను 10, 15 రెట్లు అధిక ధరలకు అమ్ముతూ ప్రేక్షకులను నిలువునా దోచుకోవడం మామూలు విషయమే. ఈ పరిస్థితుల్లో ముంబయి హైకోర్టు తీర్పు నగరవాసులకు ఆశాకిరణమైంది. సాక్షి బెంగళూరు: మల్లీప్లెక్స్‌లో బయట ఆహారాన్ని అనుమతించరని విషయం అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్స్‌లో ఏదీ కొనాలన్నా ధరలు ఆకాశంలో ఉంటాయి. సరదాగా కుటుంబంతో కలసి సినిమా చూద్దామని వెళితే అక్కడ దొరికే చిరుతిండ్లను కొనాలంటే గుండెలు అవిసిపోతాయి. అలా అని ఇంటి నుంచో, బయట నుంచో ఆహారాన్ని తెచ్చుకుంటే లోపలికి అనుమతించరు.. దీంతో చేసేదేమీ అయిష్టంగానే అంతంత ధరలను భరించి మల్టీప్లెక్స్‌లోనే ఆహారాన్ని సినీ ప్రియులు కొంటుంటారు. అయితే ఇటీవల ముంబైలోని మల్టీప్లెక్స్‌లో బయట తిండి, కూల్‌డ్రింక్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముంబయి హైకోర్టు ఏం చెబుతోంది ముంబయి హైకోర్టు ఆదేశాలనుసారం మహారాష్ట్ర ప్రభుత్వం మల్టీప్లెక్స్ థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లేలా నిబంధనలను సవరించింది. దీనివల్ల ప్రేక్షకులకు వేలాది రూపాయలు ఆదా కానున్నాయి. అలాంటి నిబంధనలేవీ బెంగళూరులని మల్టీప్లెక్స్‌లో లేనందువల్ల సినిమాలు చూసేందుకు వెళ్లే సినీప్రియులు అక్కడ లభించే ఖరీదైన స్నాక్స్‌ను కొనాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడి ధరలు వింటే ఎవరైనా హడలిపోతారు. నలుగురితో కూడిన కుటుంబం వెళ్తే స్నాక్స్‌కు కనీసం రూ.3 వేలు చెల్లించుకోవాల్సిందే. కాఫీ– రూ. 120, పాప్‌కార్న్ రూ.270 ♦ బెంగళూరులోని ఏదైనా ఒక హోటల్లో కాఫీ ధర రూ. 10 నుంచి రూ. 20 వరకు ఉంటోంది. కానీ మల్టీప్లెక్స్‌లో ఓ కప్పు కాఫీ ధర రూ. 120 చెల్లిస్తే కానీ దొరకడం లేదు. ♦ మల్లీప్లెక్స్‌లో మినీ పాప్‌కార్న్ కనీస ధర రూ. 270. ♦ ఇక మీడియం సైజు పాప్ కార్న్ ధర రూ. 360 కాగా, బకెట్ పాప్‌కార్న్ రూ. 470గా ఉంది. ♦ కూల్‌డ్రింక్స్ ధరలు వింటే అంతే. 900 మిల్లీలీటర్ కలిగిన కూల్‌డ్రింక్ ధర రూ. 170 కాగా, 650 మిల్లీలీటర్ల శీతల పానీయం ధర రూ. 160గా ఉంది. బయట షాపులో ఇవి రూ.80 లోపే లభిస్తాయి. ♦ 100 గ్రా ఫ్రెంచ్ ప్రైస్‌ను ఆన్లైన్లో రూ. 100–రూ. 120 మధ్య లభిస్తుంటే అదే మల్టీప్లెక్స్‌లో దాని ధర రూ. 160ను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ♦ అర్ధలీటర్ బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ ధర కేవలం రూ. 10. లీటరు ధర రూ. 19, రెండు లీటర్ల ధర రూ. 28. మల్టీప్లెక్స్‌లో హాఫ్ లీటర్ వాటర్ బాటిల్‌కు రూ. 40– 60 చెల్లించాలి. -
థియేటర్లో అధిక రేట్లు.. మేనేజర్‌ను చితక్కొట్టారు..
పూణే : మల్టీఫ్లెక్స్‌లో ఆహార పదార్థాలను అధిక రేట్లకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) కార్యకర్తలు అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి చేశారు. అధిక రేట్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతన్ని చావబాదారు. ఈ ఘటన శుక్రవారం పూణేలోని ఓ మల్టీఫ్లెక్స్‌లో చోటు చేసుకుంది. కాగా, థియేటర్లో అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి చేసిన వారిలో మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సేనాపతి బాపత్ రోడ్‌లోని పీవీఆర్ ఐకాన్ మల్టీఫ్లెక్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన మాజీ కార్పొరేటర్ షిండే.. థియేటర్లలో అధిక రేట్లకు ఆహార పదార్థాలను అమ్మడంపై హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు. అధిక రేట్లకు ఆహారపదార్థాలను అమ్ముతున్నారని, అలా చేయకుండా అరికట్టాలని ప్రభుత్వానికి కోర్టు చేసిన సూచనలను షిండే గుర్తు చేశారు. అన్ని థియేటర్లకు వెళ్లినట్లే పీవీఆర్ ఐకాన్‌కు కూడా వెళ్లామని తెలిపారు. అధిక రేట్ల గురించి మల్టీఫ్లెక్స్ అసిస్టెంట్ మేనేజర్‌తో మాట్లాడగా ఆయన ’డబ్బులు ఉన్నవాళ్లే థియేటర్‌కు రావాలి. భరించలేని వాళ్లు థియేటర్‌కు రావొద్దు.’అని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్‌తో వాగ్వాదం జరిగిందని, దీంతో కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు అతనిపై చేయి చేసుకున్నారని వెల్లడించారు. కాగా, ముంబైలో సినిమా టికెట్ల రేట్ల కంటే అక్కడ అమ్మే ఆహార పదార్థాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. -
పార్కింగ్ నుంచి థియేటర్లను మినహాయించాలి
‘‘గ్రేటర్ హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మున్సిపల్ ఆఫీసుల్లో వాహన దారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ, థియేటర్స్‌లో, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ రుసం వసూలు చేయొద్దని చెప్పడం వల్ల యాజమాన్యానికి నిర్వహణ భారం మరింత పెరిగింది’’ అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(టీ.ఎస్.ఎఫ్.సీ.సీ.) అధ్యక్షుడు కె.మురళీ మోహన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో గురువారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కె.మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 852 థియేటర్స్ ఉండేవి. ప్రస్తుతం 400 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి నిర్వహణ భారం వల్ల మూత పడ్డాయి. జీవీకే, ఇన్ఆర్బిట్ మాల్లో పార్కింగ్ రుసం అధికంగా వసూలు చే శారు. దాన్ని సాకుగా చూపి జీహెచ్ఎంసీ నార్మ్స్ ప్రకారం థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ వసూలు చేయకూడదని చెప్పడం యజమానులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పార్కింగ్‌పై ఆధారపడిన 6000 మంది ఉపాధి కోల్పోయారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమస్యను విన్నవించాం. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో రెండు మూడు గంటలకు నామినల్ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాం. ఈ ఫీజు తీసేయడం వల్ల పార్కింగ్‌లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. పైగా ప్రేక్షకుల వాహనాలకు భద్రత కరువైంది. పార్కింగ్ వసూలు నుంచి థియేటర్లను మినహాయించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం’’ అని టీ.ఎస్.ఎఫ్.సీ.సీ. జాయింట్ సెక్రటరీ బాలగోవింద్ రాజ్ అన్నారు. ‘‘థియేటర్, వాహనాల భద్రత, పార్కింగ్ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఉచిత పార్కింగ్ కావడంతో బయటి వారు కూడా పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. వాహనాల పార్కింగ్‌కి ప్రభుత్వం ఓ ధర నిర్ణయించి, ఎక్కువ వసూలు చేసిన వారికి భారీ జరిమానాలు విధించినా మేం సిద్ధమే. మల్టీప్లెక్స్‌లలోని క్యాంటీన్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు కానీ, థియేటర్స్‌లో ఎక్కడా ఎక్కువ వసూలు చేయడం లేదు’’ అని టీ.ఎస్.ఎఫ్.సీ.సీ. సెక్రటరీ సునీల్ నారంగ్ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు కిరణ్, టీ.ఎస్.ఎఫ్.సీ.సీ. ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ఈసీ మెంబర్ శేఖర్, పలువురు థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. -
నా చావు నే చస్తా
తాతామనవళ్లిద్దరూ ఒక నిద్ర తీశాక.. మధ్యరాత్రిలో ఏదో చప్పుడైంది. మనవడు మేల్కొన్నాడు. ‘‘భయమేస్తోంది తాతా’’ అన్నాడు.. ముఖాన్ని తాత డొక్కలోకి దూర్చేస్తూ. శుభం! సినిమా ముగిసింది. ‘నా సావు నే సస్తా. నీకెందుకు?’.. సినిమాలోని డైలాగ్. ఎవరో పకపకమంటున్నారు. డిమ్ లైట్లలో కొద్దికొద్దిగా కదులుతూ ‘ఎగ్జిట్’ వైపుకు మెట్లు దిగుతున్నారు తాత, మనవడు. పదేళ్లుంటాయి మనవడికి. తాత చెయ్యి పట్టుకుని ఒక్కో అడుగూ వేస్తున్నాడు. చూసిన సినిమాపై లేదు వాడి ధ్యాస. చూడబోయే ‘స్కేరీ హౌస్’ మీద ఉంది. మల్టీప్లెక్స్ అది. నాలుగైదు స్క్రీన్లు, చిన్న షాపింగ్ మాల్, కిడ్స్ ప్లే జోన్, స్కేరీ హౌస్.. ఇలాంటివన్నీ ఉన్నాయి. థియేటర్ లోపలికి వెళ్లే ముందే మాట తీసుకున్నాడు మనవడు. ‘‘తాతా.. సినిమా అయిపోయాక స్కేరీ హౌస్‌కి వెళ్లాలి’’ అని. తాతగారు నవ్వారు. ‘‘సరే’’ అన్నారు.మొదట పిల్లల సినిమాలు ఏవైనా ఉంటాయేమోనని ఆయన చూశారు. ఉన్నాయి కానీ, ఆ టైమ్‌లో షోలు లేవు. ‘‘ఈ సినిమాకు టిక్కెట్లు ఉన్నాయట. వెళ్దామా?’’ అన్నాడు. ‘‘వద్దు తాతా. స్కేరీ హౌస్‌కు వెళ్దాం’’ అన్నాడు మనవడు. స్కేరీ హౌస్‌లో ఏముంటుందో తాతగారికి కొద్దిగా తెలుసు. ఏవో దెయ్యాల కొంపలోని సెట్టింగులు, అరుపులు ఉంటాయని విన్నాడు. ‘‘వద్దురా బుజ్జులూ.. భయపడతావు’’ అన్నారు వాడి తలను నిమురుతూ. బుజ్జులు నవ్వాడు. ‘‘నాకు భయమా తాతా! కేపీసాయి కన్నా నాకే ధైర్యం ఎక్కువ’’ అన్నాడు. ‘‘కేపీసాయి ఎవర్రా?’’ అన్నారు తాతగారు. ‘‘మా క్లాస్మేట్ తాతా. స్ట్రాంగ్‌గా ఉంటాడు. కానీ భయం. బాత్రూమ్ వస్తే చీకట్లో ఒక్కడే వెళ్లలేడు తెలుసా?’’ అన్నాడు చిటికిన వేలు చూపిస్తూ. తాతగారు నవ్వారు. థియేటర్ ‘ఎగ్జిట్’ డోర్ నుంచి బయటికి రాగానే ఎస్కలేటర్‌లో పై ఫ్లోర్‌కు వెళ్లారు తాతా మనవడు. ఆ ఫ్లోర్‌లోనే ఉంది స్కేరీ హౌస్.‘‘రెండు టిక్కెట్లు ఇవ్వు బాబూ’’ అడిగారు తాతగారు. కౌంటర్లో ఉన్న కుర్రాడు టిక్కెట్లు ఇవ్వబోతూ, తాతగారి పక్కన మనవణ్ని చూసి ఆగిపోయాడు. ‘‘పిల్లలకు నో ఎంట్రీ అండీ’’ అన్నాడు. మనవడు భయంగా చూశాడు. ‘లోపలికి పోనివ్వనంటాడా ఏంటీ!’ అన్న భయం అది. ‘‘పర్లేదు ఇవ్వు బాబూ.. నేనున్నాగా’’ అన్నారు తాతగారు. ‘‘లేదండీ.. పిల్లలు భయపడితే మాకు మాటొస్తుంది’’ అన్నాడు కౌంటర్లోని కుర్రాడు. ‘‘పదరా బుజ్జులూ.. పిల్లల్ని పోనివ్వరట’’ అన్నారు తాతగారు మనవడి చెయ్యి పట్టుకుని. మనవడు ఆ కౌంటర్లోని కుర్రాడి వైపు కోపంగా చూశాడు.‘‘నా చావు నే చస్తా. నీకెందుకు’’ అన్నాడు!ఆ మాటకు తాతగారు, కౌంటర్లోని అబ్బాయి .. ఇద్దరూ ఒకేసారి పెద్దగా నవ్వారు.స్కేరీ హౌస్‌లోకి వెళుతుండగా తాతగారు అడిగారు.. ‘‘ఆ డైలాగ్ నీక్కూడా నచ్చిందా?’’ అని. ఏ డైలాగ్ తాతా అన్నట్టు చూశాడు మనవడు. తాతగారు చెప్పారు. ‘‘ఓ.. అదా తాతా..! ఆ డైలాగ్ నాకు సినిమా చూడకముందే తెలుసు’’ అన్నాడు మనవడు. ‘‘ఎలా?’’ అన్నారు తాతగారు ఆశ్చర్యాన్ని నటిస్తూ. ‘‘ఎప్పుడూ.. డాడీ, మమ్మీ అంటుంటారు తాతా..’’అన్నాడు. తాతగారు నవ్వుకున్నారు. పాడుపడినట్లున్న ఆ చీకటి గుయ్యారంలో తాతామనవడు మెల్లగా తడుముకుంటూ నడుస్తున్నారు. తాతగారు ఊహించిన దానికంటే భయంకరంగా ఉంది స్కేరీ çహౌస్! అడుగుకో దెయ్యం వచ్చి మీద పడబోతోంది. అలా పడబోతున్నప్పుడల్లా లోపల ఉన్నవాళ్లంతా భయంతో పెద్దగా అరుస్తున్నారు. ఓ చోట కాళ్ల కింద నుంచి దెయ్యం ఒకటి తాతామనవళ్ల మీదకి రాబోయింది. తాతగారు అదిరిపడ్డారు. కానీ మనవడు నవ్వాడు! ఇంకోచోట అస్థిపంజరం కిందికి జారి, వీళ్ల తల మీద ఊగింది. అప్పుడు కూడా మనవడు నవ్వాడు. మరో మూల.. కొరివి దెయ్యం గుర్రున చూసింది. మళ్లీ మనవడి నవ్వు! దెయ్యాలు, భూతాలు రకరకాలుగా భయపెడుతుంటే మనవడు రకరకాలుగా నవ్వుతున్నాడు. నవ్వుతూనే వాడు బయటికి వచ్చేశాడు. వెనకే తాతగారు. తాతగారి వెనకే బతుకు జీవుడా అనుకుంటూ మిగతావాళ్లు. ‘‘భయం వెయ్యలేదురా.. బుజ్జులూ నీకు?’’ అన్నాడు తాతగారు అదురుతున్న గుండెలతో. ‘‘లేదు తాతా.. మస్తు మజా వచ్చింది’’ అన్నాడు వాడు. ఆ రాత్రి కూడా మనవడు తాతగారి దగ్గరే పడుకున్నాడు. కూతురి దగ్గరికి హైదరాబాద్ వచ్చి రెండు రోజులు అయింది ఆయన. అల్లుడిని చూసి కూడా రెండు రోజులు అవుతోంది! తను ఊర్నుంచి వచ్చిన రోజు మాత్రం.. ‘‘బాగున్నారా మావయ్యా’’ అని అతడు అడిగినట్లు గుర్తు. ‘‘బాగున్నాను బాబూ’’ అనే లోపే అతడు బండి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. అది కూడా గుర్తు. తాతామనవళ్లిద్దరూ ఒక నిద్ర తీశాక.. మధ్యరాత్రిలో ఏదో చప్పుడైంది. మనవడు మేల్కొన్నాడు. ‘‘భయమేస్తోంది తాతా’’ అన్నాడు.. ముఖాన్ని తాత డొక్కలోకి దూర్చేస్తూ.అందుకేరా ఆ దెయ్యాలకొంపకు వద్దంది.. అనబోయి, ఇప్పుడు దాన్ని గుర్తు చేయడం ఎందు కని, మనవడి మీద చెయ్యి వేశారు తాతగారు. ‘‘తాతా.. రేపే కదా నువ్వు ఊరికి వెళ్లిపోయేది’’ అన్నాడు మనవడు బెంగగా.‘‘మళ్లీ వస్తాను కదరా బుజ్జులూ..’’ అన్నారు తాతగారు మురిపెంగా. ‘‘పోవద్దు తాతా. నువ్వు ఇక్కడే ఉండిపో తాతా. నువ్వుంటే నాకు భయం వెయ్యదు తాతా’’ అంటున్నాడు వాడు. అలా అంటూనే నిద్రలోకి జారుకున్నాడు. స్కేరీ హౌస్‌లో దెయ్యాల్ని చూసి పడీపడీ నవ్విన వాడికి భయమేంటి?! మనవడి కాలు, చెయ్యి ఆయన మీద ఉన్నాయి. వాడి నిద్ర పాడవకూడదని ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయారు ఆయన.ఊరు వెళ్లిన తర్వాత కూతురుకి ఫోన్ చేశారు తాతగారు.‘‘మీ ఇంట్లో రెండు దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు పోట్లాడుకుంటూ.. గిన్నెలు, కంచాలు ఎత్తేస్తుంటే నా మనవడు భయంతో వణికిపోతున్నాడు. ఎలాగైనా మీ భార్యాభర్తలే ఆ దెయ్యాలకు సర్దిచెప్పి, ఇంట్లోంచి తరిమేయాలి’’ అని చెప్పారు. - మాధవ్ శింగరాజు -
మహిళల బాత్రూమ్లో యువకులు
►అసభ్యకరంగా ప్రవర్తించారంటూ దేహశుద్ధి చేసిన మహిళలు ►అర్థరాత్రి ఘటనపై కేసు నమోదు విశాఖపట్నం : నగరం నడిబొడ్డున ఉన్న చిత్రాలయ మల్టీప్లెక్స్‌లో సెకండ్ షో సినిమాకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అత్యధిక భద్రత ఉండే హై క్లాస్ మల్టీప్లెక్స్‌లో ఆడవాళ్ల బాత్ రూమ్‌లో కొందరు మధ్యప్రదేశ్ యువకులు దూరడం తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు మహిళలు కూడా ఆ కుటుంబంతో పాటు బాధితులైనప్పటికీ పరువు కోసం ఆలోచించి వారెవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సంఘటన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులపై గురువారం కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ జంట నగరంలో దుస్తుల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి సెకండ్ షో సినిమా చూసేందుకు చిత్రాలయ మల్టీప్లెక్స్‌కు వెళ్లారు. సినిమా పూర్తయిన తర్వాత ఆ జంటలోని మహిళ బాత్రూమ్కు వెళ్లింది. అయితే అప్పటికే లేడీస్ బాత్రూమ్లో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిని గమనించిన యువతి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తుకుని వచ్చేసింది. ఆమెతో పాటే బాత్రూమ్లోకి వెళ్లిన మరికొంతమంది మహిళలు కూడా పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న మిగతావారు ఆ యువకులను పట్టుకున్నారు. ఆడవాళ్ల బాత్రూమ్లోకి వెళ్లిన ముగ్గురు యువకులతో పాటు, బాత్రూమ్ బయట ఉన్న వారి సంబంధీకులు మరో ముగ్గురికి దేహశుద్ధి చేశారు. ముగ్గురిపై కేసు : పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. అయితే స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగితే పరువు పోతుందని మహిళలు అనడంతో వారిచ్చిన వివరాల మేరకు మహరాణిపేట పోలీస్ స్టేషన్ సీఐ వెంకట నారాయణ కేసు నమోదు చేశారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్లా, దినేష్, మహ్మద్ అన్వర్‌లుగా గుర్తించామని, వారు నగర వీధుల్లో దుస్తులు విక్రయిస్తుంటారని సీఐ తెలిపారు. కాగా మహిళల బాత్రూమ్లో దూరి వారిని అసభ్యకరంగా సెల్ఫోన్లో చిత్రీకరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాటిని సీఐ కొట్టిపడేస్తున్నారు. అలాంటివేమీ జరగలేదని, ఆ యువకులు తెలియక లేడీస్ బాత్రూమ్కి వెళ్లారని ఆయన అంటున్నారు. -
సినిమా టికెట్ ధరలపై కమిటీలు
ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సినిమా హాళ్లలో టికెట్ ధరలను నిర్ణయించేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శుల అధ్యక్ష తన కమిటీలను ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. టికెట్ ధరలను నిర్ణయించేటప్పుడు ప్రేక్షకుల ప్రయోజనాలతో పాటు ఎగ్జిబిట ర్లు, పంపిణీదారుల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోవాలంది. ఇందుకు 2017 మార్చి 31 లోపు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కమిటీలకు సూచించింది. కమిటీల్లో సభ్యులుగా ఎవరు ఉండాలన్నది ముఖ్యకార్యదర్శులు నిర్ణయించుకుంటారంది. కమిటీలు నిర్ణయం తీసుకునేంత వరకు నిర్వహణ వ్యయాల ఆధారంగా టికెట్ ధరల ను నిర్ణయించుకోవచ్చునని థియేటర్లకు తెలిపింది. అయితే టికెట్ ధరల గురించి సంబంధిత అధికారులకు తెలియచేయాలంది. ఇదే సమయంలో టికెట్ ధరలను సవరిస్తూ 2013 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 100ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల తీర్పునిచ్చారు. జీవో 100ను సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాల్లోని పలు థియేటర్ల యాజ మాన్యలు 2014లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై తుది విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల ఈ తీర్పు వెలువరించారు. ప్రస్తుతం థియేటర్ల రూపు రేఖలు మారాయని, సాధారణ థియేటర్ల నుంచి మల్టీఫ్లెక్స్‌లుగా రూ పాంతరం చెందాయని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ వ్యయాల్లోనూ భారీ మార్పులు వచ్చిన క్రమంలో పాత జీవో అమలులో ఉండటం సరికాదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా టికెట్ల ధరలు కూడా మారాల్సి న అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తరువాత తాజాగా మరికొన్ని థియేట ర్లు పిటిషన్లు వేశాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జస్టిస్ ఇలంగో తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలకు కూడా అదే తీర్పు వర్తిస్తుందన్నారు. -
రైల్వే సమస్యలను పరిష్కరించండి
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే జోనల్ మేనేజర్ రవీంద్రగుప్తాను కోరారు. హైదరాబాద్‌లోని రైల్వే జోనల్‌మేనేజర్‌తో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ ముఖ్యంగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వేళలతో ప్రయాణికులకు చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు. అక్టోబర్‌లోపు సింహపురి వేళల్లో మార్పులు తీసుకొస్తే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లకు దక్షిణంవైపు రైల్వేకు సంబంధించి దాదాపుగా ఎకరా స్థలం ఉందన్నారు. ఈ ప్రదేశంలో రైల్వే మల్టిప్లెక్స్ కట్టిస్తే రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. నెల్లూరు ప్రదాన రైల్వే స్టేషన్‌తో పాటు దక్షిణ స్టేషన్, పడుగుపాడు, వేదాయపాళెం, కావలి, బిట్రగుంట, ఉలవపాడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు అవసరమైన పలు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. నెల్లూరు-తిరుపతి, నెల్లూరు-చెన్నైకి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెము రైళ్లను పెంచితే ఉపయోగంగా ఉంటుందన్నారు. నెల్లూరు నుంచి సుదూర ప్రాంతాలకు వ్యాపారులు, విద్యార్థులు ప్రయాణాలు సాగిస్తున్నారన్నారు. వీరి కోసం నెల్లూరు స్టేషన్లో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపితే రైల్వేకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్పందించిన జోనల్ మేనేజర్ జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు. -
ఏడాదిలో 160 స్క్రీన్లతో వస్తారట!
న్యూఢిల్లీ: మెక్సికోకు చెందిన మల్టీప్లెక్స్‌ల నిర్మాణ సంస్థ సినీ పొలిస్ భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జావియెర్ సోటోమేయర్ చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం 60నగరాల్లో దాదాపు 160 సినిమా స్క్రీన్లు డిసెంబర్ 2017నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారి అమృత్ సర్ లో 2009లో సినీ పొలిస్ పేరిట స్క్రీన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. 2015లో ఫన్ సినిమాస్ పేరుతో మరో అడుగు వేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల సిని పొలిస్.. ఫన్ సినిమాస్ పేరిట స్క్రీన్లు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో యూనిట్ గ్రూప్ అనే సంస్థ భాగస్వామ్యంతో కలిసి కొత్తగా నాలుగు స్క్రీన్లు ప్రారంభించిన సందర్భంగా ఆ సంస్థ ఈ వివరాలు తెలిపింది. -
కమీషన్లు కొట్టేయడానికి కొత్త ప్లాన్
మార్క్‌ఫెడ్ నెత్తిన మల్టీప్లెక్స్ భారం రూ.450 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం సంస్థ వద్ద నిధుల్లేవు.. రుణాలింకా మంజూరు కాలేదు డీపీఆర్‌లు లేకుండానే అంచనా వ్యయంలో 25 శాతం చెల్లింపు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు తెచ్చిన రుణాల వినియోగం! కమీషన్ల కోసం పాలకమండలి కక్కుర్తి వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు సాక్షి, విజయవాడ బ్యూరో: రైతులకు సేవలు చేయాల్సిన మార్క్‌ఫెడ్ దారి తప్పుతోంది. కమీషన్ల కక్కుర్తితో ‘కమర్షియల్’ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకొని వేగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. పూర్తయిన నిర్మాణాలను కారుచౌకగా కొట్టేయడానికి అధికార పార్టీ నేతలు వ్యూహం పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్కెఫెడ్‌కు విజయవాడతోపాటు రాష్ట్రంలోని మరో ఐదు ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో విజయవాడలో ఉన్న స్థలంలో మల్టీప్లెక్స్, మిగిలిన చోట్ల కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని మార్క్‌ఫెడ్ పాలకమండలి ఇటీవల తీర్మానించింది. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. విలువైన మార్క్‌ఫెడ్ స్థలాలు కొట్టేయడానికి ఇదో రాచమార్గమని, రుణాలు తీసుకొని మార్కెఫెడ్ నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత వాటిని చౌకగా లీజుకు తీసుకోవాలని వ్యూహం రూపొందించినట్లు తెలిసింది. నిర్మాణ పనులు చేపడితే భారీగా కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. అధికార పార్టీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే పాలకమండలి తీర్మానం చేసిన మరుసటి రోజే.. కన్సల్టెంట్ ఫీజు పేరిట రూ. 2.5 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మంతా పాలకవర్గం సభ్యులే నొక్కేశారని మార్క్‌ఫెడ్‌లో ప్రచారం జరుగుతోంది. తీర్మానం చేసి 10 రోజులు తిరగకముందే.. ప్రాజెక్టు నివేదికలు సిద్ధం కాకపోయినా, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(ఈపీఐ)కి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. కన్సల్టెంట్ ద్వారా మొత్తం అంచనా వ్యయంలో 25 శాతం(రూ. 110 కోట్లు) చెల్లించారు. ఈ అడ్డగోలు చెల్లింపులను సంస్థలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, పాలకమండలి, ఎండీ, జీఎం కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ చేసేది లేక మౌనంగా ఉండిపోతున్నారు. అందరూ కుమ్మక్కు కావడం వల్లే ఈ మొత్తం చెల్లించగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు, ప్రభుత్వం ఎంపిక చేసిన నోడల్ ఏజన్సీలకు యూరియాను నిల్వ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీపై వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల నుంచి ఈ రూ.110 కోట్లు చెల్లించడం గమనార్హం. ప్రభుత్వ అనుమతి లేకుండానే.. భారీ ప్రాజెక్టులు.. అవి కూడా వాణిజ్య కార్యకలాపాలు చేయడానికి నిర్మించే వాటికి ప్రభు త్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన ఉంది. ఒకవేళ అనుమతి లభించకపోతే భారీ కమీషన్లు పోతాయనే భయంతోనే హడావుడిగా సొమ్ములు చెల్లించేస్తున్నారని సమాచారం. అసలు వ్యాపారం వదలి కొసరు వ్యాపారం చేయడానికి ప్రభుత్వం నుంచి అ నుమతులు ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని అధికార పార్టీ నేతలు గట్టిగా హా మీ ఇవ్వడం వల్లే.. పాలకవర్గం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక దశలోనే ఉంది కమర్షియల్ ప్రాజెక్టు చేపట్టాలని పాలకమండలి తీర్మానం చేసిన మాట నిజమే. ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం. - మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు బ్యాంకులు రుణాలిస్తాయనే గ్యారంటీ లేదు మార్క్‌ఫెడ్ చేపడుతున్న భారీ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. గత 10 రోజులుగా అన్ని బ్యాంకులతో సంస్థ పాలకమండలి మాట్లాడినా ఫలితం లేదు. అయినా సరే ఏదో విధంగా రుణం అందుతుందనే నమ్మంతో ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న ఇతర రుణాలను మళ్లించడం గమనార్హం. భారీ ప్రాజెక్టు చేపట్టే ముందే ఆర్థిక వనరులను సమీక్షించుకోకపోవడాన్ని కిందిస్థాయి అధికారులు తప్పుబడుతున్నారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా ఏదో సంస్థను కన్సల్టెంట్ ద్వారా ఎంపిక చేసుకొని, భారీగా సొమ్ము చెల్లిస్తే మునిగిపోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మల్టీప్లెక్స్‌లతో సినిమాకు కళ..
వీక్షకుల్లో 75 శాతం యువతే అంతర్జాతీయ స్థాయిలో స్క్రీన్లు మల్టీప్లెక్స్‌ల విజయానికి ఇవే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండున్నర దశాబ్దాల క్రితం భారత్‌లో సినిమాయే ప్రధాన ఎంటర్టైన్మెంట్. తర్వాత టీవీలు రావటంతో సీరియళ్లు, వినోద కార్యక్రమాలు వరుస కట్టాయి. దీంతో థియేటర్లకు తాకిడి తగ్గింది. 2000వ సంవత్సరం నుంచి మల్టీప్లెక్స్‌లు పెరిగాయి. దీంతో తిరిగి సినిమా హాళ్లు కళకళలాడాయి... ఇదీ మల్టీప్లెక్స్‌ల నిర్వహణలో భారత్‌లో టాప్-5లో ఉన్న మిరాజ్ సినిమాస్ ఎండీ అమిత్ శర్మ మాట. వీక్షకులకు వినూత్న అనుభూతి, ఇతర సౌకర్యాలు ఉండటం వల్లే మల్టీప్లెక్స్‌లు విజయవంతమవుతున్నాయని చెప్పారాయన. హైదరాబాద్ కొత్తపేటలో కంపెనీ తొలి థీమ్ ఆధారిత థియేటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. పరిశ్రమ తీరుతెన్నుల గురించి ఈ సందర్భంగా వివరించారు. విశేషాలు ఇవీ.. మల్టీప్లెక్స్‌ల విజయానికి కారణాలేంటి? ఒకే స్క్రీన్‌తో 1,200 దాకా సీట్లున్న థియేటర్లున్నాయి. వీటిల్లో రోజులో మూడు నాలుగు షోలే వేస్తారు. మల్టీప్లెక్సుల్లో ఇప్పుడు 150-200 సీట్లున్న స్క్రీన్లు ఏర్పాటవుతున్నాయి. 8 స్క్రీన్లున్న మల్టీప్లెక్స్ అయితే 15 నిముషాలకో షో వేయొచ్చు. అంటే థియేటర్‌కు ఏ సమయంలో వచ్చినా సినిమా చూసే వీలుంటుందన్న మాట. వీక్షకులు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, అనుభూతి కోరుకుంటున్నారు. కట్టిపడేసేలా ఖరీదైన విదేశీ సీట్లు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఉంటోంది. టీ, కూల్‌డ్రింక్స్, సమోసా, పాప్‌కార్న్ వంటివి గతం. ఇప్పుడు బర్గర్స్, పిజ్జా, పాస్తా వంటి వందలాది ఆహార పదార్థాలు మల్టీప్లెక్సుల్లో కొలువుదీరుతున్నాయి. ఇక వీక్షకుల్లో 75 శాతం మంది 15-35 ఏళ్ల యువతే. దూరమైనా సరే మంచి థియేటర్‌కే వెళ్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సగటున 20 శాతం సీట్లు (ఆక్యుపెన్సీ) నిండితే, మల్టీప్లెక్సులో ఇది 35 శాతం దాకా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితెలా ఉంది? ఇక్కడ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషు సినిమాలనూ చూస్తారు. అందుకే ఇక్కడి మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ 40 శాతానికి పైగా ఉంటోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది వీక్షకుల్లో 40 శాతం మంది ఆన్లైన్లో టికె ట్లు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాదిన ఇది 15-20 శాతమే. థియేటర్లో ఫుడ్ కోసం ఒక్కో వ్యక్తి సగటున రూ.80 దాకా ఖర్చు చేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరపై నియంత్రణ ఉండడం ఒక్కటే సమస్య. సాధారణ సీటుకు రూ.150, రెక్లైనర్స్‌కు రూ.250 మించకూడదు. మల్టీప్లెక్సుల నిర్మాణం ఖరీదైన అంశం. సాధారణ థియేటర్‌తో వీటిని పోల్చలేం. ఇతర నగరాల్లో అయితే సినిమానుబట్టి సీటుకు రూ.2 వేల దాకా చార్జీ చేసిన సందర్భాలున్నాయి. భారత్‌లో స్క్రీన్ల పెరుగుదల ఎలా ఉంది? దేశంలో మల్టీప్లెక్సుల్లో 2,000 స్క్రీన్లున్నాయి. దుబాయిని మించి థియేటర్లు ఇక్కడున్నాయి. పుణేలో 14 స్క్రీన్లున్న మల్టీప్లెక్స్ కూడా ఉంది. ఏటా 300 స్క్రీన్లు జతకూడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 75 స్క్రీన్లున్నాయి. ఒకో స్క్రీన్కు ఎంత కాదన్నా రూ.1.5 కోట్ల దాకా ఖర్చవుతోంది. స్థలం, భవన నిర్మాణ వ్యయం అదనం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ మల్టీప్లెక్సులు విస్తరించాయి. భారత్‌లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు చాలా ఉన్నాయి. మిరాజ్ సినిమాస్ ప్రస్తుతం 55 స్క్రీన్లను నిర్వహిస్తోంది. 2017 మార్చికల్లా 46 స్క్రీన్లు జోడిస్తున్నాం. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 28 వేలకు చేరుతుంది. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌కు విస్తరిస్తున్నాం. విమానాశ్రయం థీమ్‌తో థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. కంపెనీకి తెలంగాణలో తొలి కేంద్రమైన దిల్సుఖ్నగర్ థియేటర్‌ను యూరప్ వీధులను పోలిన డిజైన్ థీమ్‌తో నిర్మించాం. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు 7,000 దాకా ఉన్నాయి. -
మల్టీప్లెక్స్లంటే మక్కువ తక్కువే!
న్యూయార్క్: నేటికాలంలో దేశంలోని అనేక పట్టణాల్లో మల్టీప్లెక్స్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్స్‌తో ఉండే ఇవి సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి సంఖ్య ఇంతగా పెరుగుతున్నా మన దేశంలో మల్టీప్లెక్స్లకంటే సాధారణ థియేటర్లవైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. పెద్ద పట్టణాల్లో కొత్తగా ఏ నిర్మాణం చేపట్టాలన్నా స్థలం దొరకడం సమస్యగా మారింది. అలాగే భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తక్కువ స్థలంలోనే మల్టీప్లెక్స్ నిర్మాణాలు చేపట్టే వీలుండడంతో ఇవి ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇందులో సినిమా స్క్రీన్లు చిన్నగా ఉంటాయి. ఎక్కువ షోలు ప్రదర్శించే వీలుంటుంది. విద్యావంతులు, సంపన్నులు సినిమాలు చూడడానికి మల్టీప్లెక్స్‌లకే వెళ్తున్నారు. వీరు మినహా మిగతా ప్రాంతాలవారు, ఇతర వర్గాలవారు మాత్రం సాధారణ థియేటర్లవైపే మొగ్గు చూపుతున్నారు. -
ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు
సాక్షి, హైదరాబాద్: బీవోటీ (నిర్మించు-నిర్వహించు-బదలాయించు) పథకం కింద ఆర్టీసీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, మాల్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలుత విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో రూ.350 కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టనుంది. వచ్చే ఏడాది మార్చిలోగా వీటిని నిర్మిస్తారు. పబ్లిక్-ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, ఇన్స్టిట్యూషనల్ భవనాలు, వినోద కేంద్రాలు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఈ స్థలాలను లీజుకు ఇవ్వనున్నారు. వీటివల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, ఆర్టీసీ బస్టాండ్ల సమీపంలోని స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, మాల్స్ నిర్మిస్తే బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికుల ద్వారాతద్వారా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 123 బస్ డిపోల పరిధిలో ఆర్టీసీకి 1,960 ఎకరాల స్థలాలున్నాయి. వీటిలో ముఖ్య పట్టణాల్లోని స్థలాలను లీజు కింద ప్రైవేటు వ్యక్తులకిచ్చే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. -
అదో కొత్త నగరం!
* సరికొత్త సిటీలను నిర్మిస్తున్న బిల్డర్లు * శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా మారుతోన్న గ్రామాలు ప్లాట్లు, ఫ్లాట్లే కాదు.. విద్య, వైద్యం, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు అన్నీ ఇక్కడే ఇప్పటివరకు బిల్డర్లు అంటే అపార్ట్మెంట్లు, విల్లాలు, డ్యూప్లెక్స్‌లు మాత్రమే నిర్మిస్తారని మనకు తెలుసు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏకంగా కొత్త నగరాలనే నిర్మిస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా గ్రామాలకు గ్రామాలనే కొనేసి శాటిలైట్ టౌన్‌షిప్‌లను రూపొందిస్తున్నారు. ఈ సరికొత్త సిటీల్లో నివాస, వాణిజ్య సముదాయాలే కాదు విద్య, వైద్యం, షాపింగ్ మాళ్లు, క్రీడా అకాడమీలు సకలం కొలువుదీరనున్నాయి. దీంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. సాక్షి, హైదరాబాద్: 2011 జనాభా లెక్కల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా దాదాపు 90 లక్షలు. 2031 నాటికి 1.84 కోట్లకు చేరుకుంటుందని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ అంచనా. అంటే అప్పటి ప్రజల మౌలిక అవసరాలు, ఇళ్ల కొరతను దృష్టిలో పెట్టుకొని నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది ఒకే చోటకు పరిమితమైతే అందరూ ఆ వైపే పరుగులు తీస్తారు. దీంతో ఆయా ప్రాంతాలపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అందుకే నగరం మొత్తం సమాంతరమైన అభివృద్ధి జరగాలని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. అందుకే శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేస్తే నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగం, ట్రాఫిక్, ఇళ్ల కొరత వంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. గ్రామాలకు గ్రామాలే.. శాటిలైట్ టౌన్షిప్ వంటి మెగా ప్రాజెక్ట్‌లను నిర్మించాలంటే వేల ఎకరాల్లో స్థలం కావాలి. అందుకే శివారు ప్రాంతాలు, గ్రామాలను పూర్తిగా రియల్ వెంచర్లు, మెగా, శాటిలైట్ టౌన్‌షిప్‌లతో ముంచెత్తుతున్నారు. ప్రగతి గ్రూప్ చిలుకూరు, ప్రొద్దుటూరు, టంగుటూరు, గొల్లగూడెం, గొల్లపల్లి వంటి 15 గ్రామాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో దశల వారీగా మెగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ కొలువుదీరింది. ప్రస్తుతం 200 ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ధి పరుస్తున్నారు. రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో 600 ఎకరాల్లో డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, కర్తాల్ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ’ పేరుతో సరికొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. అన్నీ ఒక్క చోటే.. శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా మారుతోన్న గ్రామాల్లో నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వినోదం వంటి సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత రాబోయే ప్రజల అవసరాలను ముందుగానే ఊహించి ఆయా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. కేజీ నుంచి పీజీ స్థాయి వరకు అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, ఐటీ, ఫార్మా వంటి అనేక రంగాల కార్యాలయాలు, ఇండోర్, అవుట్ డోర్ ఆట స్థలాలు, థీమ్ పార్క్ వంటివెన్నో కొలువుదీరుతున్నాయి. ఇప్పటికే డిస్కవరీ సిటీలో 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది. అలాగే ఫార్చూన్ బటర్‌ఫ్లై ప్రాజెక్ట్‌లో ఫార్చూన్ బటర్‌ఫ్లై స్కూల్ మూడేళ్లుగా నడుస్తోంది. శాటిలైట్ నగరాలిలా.. * శాటిలైట్ నగరాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ, రహదారులు, మురుగునీటి వ్యవస్థ, రక్షిత మంచినీరు, పార్కులు, సాంస్కృతిక సంస్థలు ఇలా అన్ని రంగాలకు వేదికగా ఉంటాయి. * నగరం నుంచి సుమారు 100 కి.మీ ల దూరంలో ఉన్న ముఖ్య పట్టణాలు, మండలాలను శాటిలైట్ నగరాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తారు. * శాటిలైట్ నగరాల నుంచి రాజధానికి చేరుకునేందుకు ఎంఎంటీఎస్, మెట్రో రైళ్ల పరిధిని విస్తరించాలి. * ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలు, పరిశ్రమలను శాటిలైట్ నగరాల్లోనే ఏర్పాటు చేసేలా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి. * పతి చిన్న పనికి నగరానికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను శాటిలైట్ నగరాల్లో ఏర్పాటు చేయాలి. * విద్య, వైద్యం, వృత్తి విద్యా కళాశాలలు, శిక్షణ సంస్థలను ఆయా నగరాల్లోనే ఏర్పాటు చేయాలి. 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ’ సాక్షి, హైద రాబాద్: ఇంటి పక్కనే స్కూల్, అనారోగ్యం వస్తే ఆసుపత్రి, వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయడానికి షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఒక్క ప్రాజెక్ట్‌లోనే ఉంటే ఎంత బాగుంటుంది కాదూ. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌నే రూపొందిస్తున్నామని ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. బీ శేషగిరిరావు సీఎండీ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. * కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, కర్తాల్ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ’ పేరుతో సరికొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. 3 వేల ఎకరాలు నివాస, 600 ఎకరాలు వాణిజ్య సముదాయాల కోసం కేటాయించాం. ఇందులో విద్యా సంస్థల కోసం 300 ఎకరాలు, వైద్యం అవసరాల కోసం వంద ఎకరాలు, వినోద, మాల్స్ కోసం 50 ఎకరాలు, స్పోర్ట్స్ అకాడమీ కోసం 25 ఎకరాలు కేటాయించాం. * నివాస సముదాయాల విభాగంలో.. 2,500 ఎకరాలు ఓపెన్ ప్లాట్స్ కోసం, 500 ఎకరాలు విల్లాల కోసం కేటాయించాం. ఇప్పటికే 600 ఎకరాల ప్లాట్లు, సుమారుగా 600లకు పైగా విల్లాలను విక్రయించామంటే ఇక్కడి అభివృద్ధిని, గిరాకీని అర్థం చేసుకోవచ్చు. * ఆగస్టు 15న సీనియర్ సిటిజన్స్ కోసమే సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ఫార్చూన్ ఎవరెస్ట్ పేరుతో మధ్య తరగతి ప్రజల కోసం, ఎన్నారైల కోసం ఫార్చూన్ ఎన్నారై టౌన్‌షిప్‌లను కూడా నిర్మిస్తాం. ఇక ధరల విషయానికొస్తే ప్రారంభ ధరలు ఓపెన్ ప్లాట్స్ అయితే గజానికి రూ.3,500, అలాగే విల్లా రూ.35 లక్షలుగా నిర్ణయించాం. 2018 డిసెంబర్ 31నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. -
నిఘానేత్రం
నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఆఫీసుకని బైక్‌పై బయలుదేరా డు. ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఐలెండ్‌లో ఉన్న కానిస్టేబుల్ బస్టాండ్‌వైపు నుంచి వెళ్తున్న వాహనాలను ఆగమని సైగచేశాడు. ఆయన దూరంగా ఉన్నాడు కదా... పట్టుకునేలోపు వెళ్లిపోవచ్చులే... అని పట్టించుకోకుండా బైక్‌ను ఫాస్ట్‌గా పోనిచ్చాడు. సరిగ్గా ఆఫీసు సమయానికి చేరుకుని హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఐదు రోజుల తర్వాత అతడి ఇంటికి ఓ రిజిష్టర్ పోస్టు వచ్చింది. తీసుకుని తెరిచి చూస్తే జూలై 8న ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద నిబంధనలు అతిక్రమించారని, రూ. 200 జరిమానా చెల్లించాలని... అతడు జంప్‌చేసిన తీరుతో బండి ఫొటోతో కూడిన చలానా వచ్చింది. అది చూసి అవాక్కయిన శ్రీనివాస్ తాను వెళ్లినప్పుడు ఎవరూ చూడలేదు కదా? అని దీర్ఘాలోచనలో పడిపోయాడు. కానీ, అక్కడే ఉన్న ఓ నిఘానేత్రం అతడిని వెంటాడింది. - కరీంనగర్ క్రైం వాహన చోదకులు జాగ్రత్త! ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక చెల్లదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసులు తప్పవు. నిర్లక్ష్యంగా ట్రాఫిక్ సిగ్నల్ దాటేసినా.. బైక్‌పై ట్రిపుల్ రైడ్ చేసినా... అతివేగంతో దూసుకెళ్లినా... పోలీసులెవరూ చూడట్లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. పోలీసుల ‘కెమెరా’ కళ్లు మీపై నిఘా వేశాయి. అవి నిరంతరం మిమ్మల్ని పర్యవేక్షిస్తుం టాయి. ఫొటో కెమెరాలు ప్రతీక్షణం రోడ్లపై పహరా కాస్తుంటాయి. పొరపాటున నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారా.. మీరు చేసిన తప్పు ఫొటోతో సహా మీ ఇంటికి ఈ-చలానా రూపంలో వచ్చేస్తుంది. ట్రాఫిక్ విభాగంలో టెక్నాలజీ వినియోగంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌లాంటి నగరాల్లోనే కనిపించే ఈ చలానా పద్ధతి ఇక జిల్లాలోనూ అమలు కానుంది. నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌తో ఇబ్బందులెదురవుతుండడంతో క్రమబద్ధీకరణపై అధికారులు దృష్టిసారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడికక్కడే జరిమానా వేస్తూ చర్యలు తీసుకుంటున్న పోలీసులు తాము ప్రత్యక్షంగా చూడనప్పుడు ఉల్లంఘించే వారి భరతం పట్టాలని నిర్ణయించారు. అలాంటి వాహనాలను వీడియోలో రికార్డు చేసి వాహన నంబర్ అడ్రస్‌కు జరిమానా పంపిస్తారు. ఇదే ఈ చలానా. కెమెరాలు అందజేత ఇప్పటికే జిల్లాలోని కీలకమైన కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేస్తుండగా తాజాగా ట్రాఫిక్ పోలీసులకు కూడా 3 వీడియో కెమెరాలు, 3 ఫొటో కెమెరాలు అందించారు. కమాన్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బస్టాండ్, ప్రతిమ మల్టిప్లెక్స్, తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, శిక్షణ ఇచ్చి వీటిని అప్పగించారు. ఉదయం, సాయంత్రం, ఇతర ముఖ్య సమయాల్లో వారు ఈ కెమెరాల్లో అంతా రికార్డు చేస్తారు. ఐదారు రోజులుగా చిత్రీకరణ కొనసాగుతోం ది. ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనం నంబర్ కని పించేలా ఫొటోలు, వీడియో తీసి... వాహనం నంబర్ ప్రకారం ఉన్న చిరునామాకు ఈ చలానా(జరిమానా) పంపిస్తారు. దీన్ని సమీప ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో లేదా మీసేవ కేంద్రంలో చెల్లించాలి. గడువులోగా జరిమానా కట్టకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేయడానికి కూడా వెనకాడరు. పదే పదే ఇలా ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘించేవారి డాటా మొత్తం ఒకదగ్గర నుంచే పర్యవేక్షిస్తుండ గా... కొద్ది రోజుల్లో ట్రాఫిక్ ముఖ్య సిబ్బందికి హైదరాబాద్‌లో వలే ఎక్కడికక్కడే వాహనం వివరాలు తెలుసుకునే పరికరాలు సమకూర్చే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలుండగా ఈ చలా నా పద్ధతితో అలాంటివాటికి అడ్డుకట్టపడే అవకాశముంది. వాహనదారుల నుంచి నెలకు రూ.3.5 లక్షల కుపైగా జరిమానా వసూలవుతుండగా ఆరు నెలల కాలంలో రూ.20 లక్షలు వసూలైంది. ఈ చలానాతో ఇది మరింత పెరిగే అవకాశముంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్టాపర్లు, స్టాప్బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. నగరంలోని కమాన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు అక్కడక్కడ ఉన్న చిన్నచిన్న దారులు ప్రమాదాలకు, అస్తవ్యస్త ట్రాఫిక్‌కు కారణమవుతుండగా ఆయా ప్రాంతాల్లో స్టాపర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకే.. జిల్లా కేంద్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీ ప్రయాణానికి చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని కెమెరాల ద్వారా గుర్తించి ఈ చలానా పంపించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాం. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రజలందరూ సహకరించాలి. - ఉపేందర్, సీఐ, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కరీంనగర్ -
అడుగుకో అగ్నిగుండం
జీహెచ్ఎంసీ ‘ఫైర్’ వెబ్సైట్లో సంస్థల వివరాలు ఎట్టకేలకు కదులుతున్న యంత్రాంగం సాక్షి, సిటీ బ్యూరో: గ్యాస్ సిలిండర్లు పేలడం.. రోడ్లు కుంగడమే కాదు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎక్కడికెళ్లినా ఏదో రూపంలో ముప్పు పొంచి ఉంటోంది. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లతో పాటు ఇంజినీరింగ్ విద్యా సంస్థల నుంచి మల్టీప్లెక్స్‌ల దాకా ఎక్కడా భద్రత లేదు. పొరపాటున అగ్ని ప్రమాదం వంటివి జరిగితే తప్పించుకునేందుకు తక్షణ ఏర్పాట్లు లేవు. కనీస రక్షణ చర్యలు అంతకన్నా లేవు. చివరకు ప్రాణాపాయంలో ఆస్పత్రులకు వెళ్తే అక్కడ కూడా గ్యారెంటీ లేదు. గ్రేటర్‌లోని అనేక ఆస్పత్రులకు కనీస ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవు. సాధారణ స్థాయి నుంచి భారీ వ్యాపారాలతో రూ.కోట్లు ఆర్జిస్తూ పేరొందిన సంస్థల వరకూ అన్నిటిదీ ఇదే వరుస. పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లు నిర్వహించుకునే హాళ్లు, కల్యాణ మండపాల్లో సైతం అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు సేఫ్టీ ఏర్పాట్లంటూ లేవు. సాధారణ ప్రజల నుంచి సైతం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల ఫీజుల వంటి వాటిపై శ్రద్ధ చూపే జీహెచ్ఎంసీ.. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వాటిపై ఇంతవరకు దృష్టి సారించలేదు. గతంలో పార్క్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. పొరుగు రాష్ట్రంలో అగ్నికీలలు ఎగసి పడినప్పుడు హడావుడి చర్యలకు సిద్ధమైనప్పటికీ ఆ తర్వాత మరచిపోయింది. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని ఆస్పత్రుల లెసైన్సులు రద్దు చేస్తామని భారీ ప్రకటనలే గుప్పించింది. అగ్నిమాపక విభాగం నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) తప్పనిసరి అని పేర్కొంది. కానీ క్రమేపీ ఆ విషయాన్ని మరచిపోయింది. దీంతో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేస్తున్న వారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటున్నారు. చదువుకునేందుకు విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లకు వెళ్లే వారి దాకా అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముషీరాబాద్‌లో కలప దుకాణంలో అగ్ని ప్ర మాదం జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం చూసిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ శ్చర్యపోయారు. ప్యారడైజ్ హోటల్లో నూ ఏర్పాట్లు లేకపోవడంపై నోరెళ్లబెట్టారు. ఎట్టకేల కు ఇక ‘సేఫ్టీ లేని సంస్థలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థల వివరాలు సేకరించి ప్రజలకు తెలిసేలా వెబ్సైట్లో పెట్టాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచన మేరకు సంబంధిత అ ధికారులు ఆ పనుల్లో మునిగారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేనివి గుర్తించారు. ఆవివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపరిచారు. ‘వీటిల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు.. ఇక అక్కడ మీ పిల్లలను చదివించాలో లేదో మీరే అంచనా వేసుకోండి’ అని సూచిస్తున్నారు. చిన్నస్కూళ్ల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజే సంస్థలు సైతం వీ టిలో ఉన్నాయి. ఏయే సంస్థలకు ఈ ఏర్పాట్లు లేవో ఆ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. కఠిన చర్యలు చేపడతాం... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంస్థలను చూస్తూ ఊరుకునేది లేదని జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అడిషనల్ డెరైక్టర్ పి.వెంకటరమణ హెచ్చరించారు. ఇందులో భాగంగా పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓలకు, కళాశాలలపై చర్యలకు కళాశాల విద్య కమిషనర్‌కు, ఆస్పత్రులపై చర్యలకు జిల్లాల వైద్యాధికారులకు లేఖలు రాశామన్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని వాటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా కోరామన్నారు. వారు స్పందించని పక్షంలో ఫైర్‌సేఫ్టీ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మలిదశలో హోటళ్లు, మల్లీప్లెక్స్‌లు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే సంస్థల సర్వే నిర్వహించి, వాటి వివరాలూ వెబ్సైట్లో పెడతామన్నారు. జీహెచ్ంఎసీ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు 946 ఆస్పత్రులు, 634 ఫంక్షన్ హాళ్లు, 178 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. విద్యాసంస్థలూ వేల సంఖ్యలో ఉన్నాయి. -
మల్టీపర్పస్.. మెట్రో ఈ-పర్స్
=కెడిట్ కార్డు తరహాలో కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు =అందుబాటులో 16 రకాల సేవలు =రీచార్జీ ఆప్షన్ కూడా... =హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ రూపకల్పన =ఆర్టీసీ, ఎంఎంటీఎస్తోనూ అనుసంధానం =ఆధునిక పద్ధతిలో టికెటింగ్ =2015 నుంచి అందుబాటులోకి! సాక్షి, సిటీబ్యూరో: క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డు.. పెట్రో కార్డు.. ఈ వరసలో కొత్తగా చేరనుంది ‘కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు (సీఎస్సీ)’. హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్ అండ్ టీ ఈ బహుళ ప్రయోజనకార్డును అందుబాటులోకి తేనున్నాయి. నగరవాసుల వాలెట్‌లోకి కొత్తగా చేరనున్న ఈ కార్డు.. సెల్ఫోన్లో ప్రీపెయిడ్ రీచార్జి తరహాలో ఒక్కసారి టాప్అప్ చేస్తే అందులో డబ్బులు అయిపోయే వరకు మెట్రోలో తిరగొచ్చు. మాల్స్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకులకు నగదు బదిలీ చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడొచ్చు. ఇలా 16 రకాల సేవలను వినియోగించుకోవచ్చు. బహుళ ప్రయోజన కార్డుగా రాబోతున్న ఈ సీఎస్‌సీని తొలివిడత మెట్రోరైలు పట్టాలపైకి వచ్చే 2015 ఉగాది నాటికే అందుబాటులోకి తెచ్చే యోచనలో మెట్రోరైలు, ఎల్అండ్టీ అధికారులున్నారు. మెట్రో... ప్రజల జీవన గమనం ‘మెట్రోరైలు కేవలం ప్రయాణం కోసమే కాదు... నగర ప్రజల జీవితంలో ఓ భాగం’.. ఇది జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ చెబుతున్న మాట. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న అధికారులు స్మార్ట్ కార్డులనూ ఇందులో భాగంగానే తెరపైకి తెస్తున్నారు. ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి పాకెట్లో పైసా లేకుండా నగరమంతా తిరిగి అవసరమైన షాపింగ్ చేసుకొని హాయిగా ఇంటికి చేరుకునే తరహాలో హెచ్ఎంఆర్ ఈ కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డును రూపొందిస్తోంది. ఇందులో రూ.వెయ్యి రీచార్జీ చేసుకుంటే మెట్రో ప్రయాణంతో పాటు క్రెడిట్ కార్డును ఉపయోగించుకున్నట్టే 16 రకాల సేవలకు దీన్ని వినియోగించుకోవచ్చని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కార్డులు.. టోకెన్లు.. మెట్రోరైలులో ప్రయాణించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్సీ) ద్వారా టికెటింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నారు. దీనికి మూలం కాంటాక్ట్‌లెస్ ఫేర్ మీడియా టెక్నాలజీ అని హెచ్ఎంఆర్ చెబుతోంది. శామ్సంగ్ కంపెనీకి ఈ బాధ్యతను ఇప్పటికే అప్పగించారు. ఈ విధానంలో టికెట్ తనిఖీ ఇతరత్రా పనులన్నీ సెన్సర్లు, మిషన్ల ద్వారా జరిగిపోతాయి. ఏఎఫ్సీ టికెట్ల జారీ రెండు రకాలు.. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు (సీఎస్సీ): ఇందులో మళ్లీ రెండు రకాలు.. కేవలం మెట్రో రైలు పాస్‌గానే ఉపయోగించుకోవచ్చు. ‘ఈ-పర్స్’ గానూ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వివిధ రకాలైన 16 సేవలు పొందవచ్చు. కాంటాక్ట్ లెస్ స్మార్ట్ టోకెన్ (సీఎస్టీ): టోకెన్ అంటే, రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికి ముందు తీసుకునే టికెట్. దీన్ని అవసరమైతే రానుపోను కూడా ఒకేచోట కొనుగోలు చేయవచ్చు. టోకెన్ అంత వరకే ఉపయోగపడుతుంది. ఏఎఫ్సీ విధానంలో లభించే మెట్రో పాస్‌ల సేవలు ఎలక్ట్రానిక్/స్టోర్డ్ వాల్యూ పర్స్(ఈ-పర్స్) పాస్ అంటే స్మార్ట్ కార్డు అన్నమాట. దీంతో పాటు టూరిస్ట్ పాస్, ట్రిప్ పాస్, డైలీ పాస్, వీక్లీ పాస్, మంత్లీ పాస్, హాలిడే పాస్‌లు కూడా ఏఎఫ్సీ విధానంలో మెట్రోరైలు అందించనుంది. సిటీబస్సుల్లో పాస్‌లతో ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా మెట్రోరైలు అందించే పాస్‌లనూ వినియోగించుకోవచ్చు. ఉద్యోగులకు ఆర్టీసీ తరహాలో రాయితీ ఇచ్చే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పటి డిమాండ్, మార్కెట్ లెవల్‌ను బట్టి రాయితీలిచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
కొత్తగా వంద స్క్రీన్లు : పీవీఆర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వందకు పైగా కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నామని మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ శుక్రవారం తెలిపింది. ఇందుకోసం రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పీవీఆర్ ఎండీ, అజయ్ బిజిలి చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వంద స్క్రీన్లలలో సగం మెట్రో నగరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న 400 స్క్రీన్లకు ఇవి అదనమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రతీ ఏడాది వంద స్క్రీన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొత్తం స్క్రీన్ల సంఖ్యను వెయ్యికి పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో సినిమా హాళ్ల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. భారత్‌లో వినోదపు పన్ను అధికంగా ఉందని, ఈ పన్నును తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.