RX 100 movie
-
ఆర్ఎక్స్ 100 మూవీతో ముంబై, హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకున్న
-
చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు జోడీగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి నటించిన సినిమా 'బెదురులంక 2012'. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగ విడుదల చేశారు. ఆగష్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన గత చిత్రం 'ఆర్ఎక్స్ 100' ట్రైలర్‌ని కూడా రామ్ చరణే రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని కార్తికేయ తెలిపారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్ చెప్పానన్నారు. ట్రైలర్ విడుదల అయ్యాక ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కార్తికేయ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని చాలామంది పలు రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలా ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే చాలా బాధేస్తుందని కార్తికేయ అన్నారు. ఆయన నుంచి వచ్చిన ఏదైనా సినిమా నచ్చలేదు, బాగోలేదు అని అనడం వరకు ఓకేగానీ.. కొంతమంది పనికట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారు. అలాంటి వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందని కార్తికేయ అన్నారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి.. అందుకే ఆయన మెగాస్టార్!) చిరంజీవినే కాదు అలా ఎవరినీ కూడా అనకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరమైనా కథ నచ్చే సినిమా తీస్తాం.. అనుకున్నంత స్థాయిలో అది ఆడకపోతే నేరమా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి తన కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డారు. జీవితంలో ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం మాత్రమే. ఇలాంటి వాటికి ఆయన ఏమాత్రం ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని ఇదీ అందరికీ తెలుసని కార్తికేయ తన అభిప్రాయం తెలిపారు. -
టాలీవుడ్ డైరెక్టర్లపై పాయల్ రాజ్‌పూత్ సెన్సేషనల్ కామెంట్స్
2018 జులై 12.. 'ఆర్ఎక్స్ 100' థియేటర్లో విడుదలైంది. సినిమా హిట్.. అందాల విందుతో పాటు అదిరిపోయే నటనను ప్రదర్శించిన పాయల్ రాజ్‌పూత్ గురించి అప్పట్లో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్డమ్ సాధించింది..’ అనుకున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు కానీ అది నిజం కాలేదు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఆమెకు ఫ్యాన్ బేస్ పెరిగింది కానీ. తరువాత తను చేసిన సినిమాల విషయంలో ఎంపిక సరిగా లేకపోవడంతో పాయల్ వెనకపడిపోయింది. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఇలా చెప్పింది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత టాలీవుడ్లో నన్ను కొంతమంది తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే నేను మాత్రమే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. దాంతో ఇక్కడున్న కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో వారు నన్ను మిస్ గైడ్ చేశారు. పలాన సినిమా మాత్రమే చయండి.. వారితో ఇలా మెలగండి అంటూ సలహాలిచ్చేవారు. చివరకు కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించి, అప్పట్లో నాకున్న ఫేమ్‌ను వాడుకున్నారని' సంచలన కామెంట్స్ చేసింది పాయల్. ప్రస్థుతం అన్ని రకాలుగా అలోచించే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని పాయల్ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్లో తనకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది. ఎటువంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని తెలిపింది. సినిమా రంగంలో ఎవరైనా టాప్ లోకి వెళతాం.. అలాగే కిందకి కూడా పడిపోతాం ఇదీ సహజం. కానీ వాటిని తట్టుకొని నిలబడాలని ఈ బ్యూటీ పేర్కొంది. నెగటివిటీని వదిలేసి.. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాని తెలిపింది. 'ఆర్ఎక్స్ 100'తో లైఫ్ ఇచ్చిన అజయ్ భూపతినే తనకు మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబోలో 'మంగళవారం' సినిమాతో మళ్లీ రాబోతున్నారు. ప్రభాస్‌పై కామెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని పాయల్ తెలిపింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నానని తను తెలిపింది. ఆయన హైట్‌కు తగినట్లు మ్యాచ్ అవుతానని ఈ బ్యూటీ చెప్పింది. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఈ బ్యూటీ ప్రభాస్ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. ఐకాన్ స్టార్ బన్నీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) (ఇదీ చదవండి: Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..) -
షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన అనారోగ్యం గురించి చెప్పి షాక్ ఇచ్చింది. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తెలిసిందే. 'నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని ఫలితంగా ఇలా జరిగింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అడ్డంకులు ఎదురైనా అధిగమించాలి. అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్. ఇక నాలా మీరు మాత్రం చేయకండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి' అంటూ పాయల్ సూచించింది. ఆర్ఎక్స్ 100తో హిట్ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్లోనే పాయల్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
యూవీ క్రియేషన్స్‌తో కార్తికేయ సినిమా.. పోస్టర్ రిలీజ్
‘‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి రాజశేఖర్. Super proud & excited to be associated with the Prestigious @UV_Creations banner 😇 Directed by @Dir_Prashant, #Kartikeya8 Title revealing soon 🏎️✨️ pic.twitter.com/SqKI2IOOyR — Kartikeya (@ActorKartikeya) April 8, 2022 -
చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్న హీరోలు!
చోలీ కే పీచే క్యా హై అంటే... చోలీ మే దిల్ హై మేరా అన్నారు మాధురీ దీక్షిత్. ‘ఖల్ నాయక్’లోని ఈ పాట చాలామంది దిల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు... ‘చొక్కా కే పీచే క్యా హై’ అని మన హీరోలను అడిగితే... చొక్కా మే ప్యాక్ హై మేరా అంటారేమో. కథ డిమాండ్ చేస్తే ఆరు పలకలు.. ఎనిమిది పలకల దేహంతో ఫ్యాన్స్ దిల్ని ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. షర్ట్‌లెస్‌గా కనిపించనున్నారు.. రండి... సిక్స్ ప్యాక్ చూద్దాం. ఫైట్ సీన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకుల శాతం ఎక్కువే ఉంటుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. వీటికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతారు. కొందరు హీరోలు అవసరమైతే సిక్స్ ప్యాక్ చేస్తారు. చొక్కా విప్పి, ఆ ప్యాక్‌ని చూపిస్తారు. ఒక సినిమాలో కనిపించి, మరో సినిమాలో కూడా షర్ట్‌లెస్‌గా కనిపించాలంటే ‘సై’ అంటారు. ‘టెంపర్’ చిత్రంలో షర్ట్‌లెస్‌గా సిక్స్ ప్యాక్‌తో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లో షర్ట్‌లెస్‌గా కనిపించిన దృశ్యాలు ఈ చిత్రం ట్రైలర్లో కనిపించాయి. ఇక ఇదే చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్ ‘ధృవ’లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లోనూ అలా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జనవరి 7న) విడుదల కావాల్సింది. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక ‘అర్జున్‌రెడ్డి’లో కొన్ని సీన్స్‌లో చొక్కా లేకుండా కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ‘లైగర్’ కోసం బాక్సర్‌గా సిక్స్‌ప్యాక్‌తో రెడీ అయ్యారు. ఇటీవల విడుదలైన ‘లైగర్’ గ్లింప్స్ వీడియోలో విజయ్ షర్ట్‌లెస్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ‘లైగర్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటివరకు లవర్‌బాయ్‌లా కనిపించిన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం కోసం ఒక్కసారిగా మాస్ లుక్‌లోకి మారిపోయారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాది కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో అఖిల్ సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్100’లోనే సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. తాజాగా అజిత్ హీరోగా చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘వలిమై’లో కార్తికేయ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కార్తికేయ ఓ ఫైట్‌లో సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లుగా కార్తికేయ సోషల్ మీడియాలో చొక్కా లేకుండా షేర్ చేసిన ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ హీరోలే కాదు.. మరికొందరు కూడా షర్ట్లెస్కి సై అంటున్నారు. మళ్లీ అలా కనిపిస్తారా డ్యూడ్... సిక్స్ ప్లస్ కటౌట్ ఉన్న ప్రభాస్ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తే.. ‘వావ్ డ్యూడ్’ అంటారు. ‘మిర్చి’ లో ప్రభాస్ కటౌట్ మీద ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ కూడా ఉందిగా. ‘బాహుబలి’లో తన కటౌట్‌ని చూపించారు ప్రభాస్. మరోసారి చొక్కా లేకుండా కనిపించే అవకాశం ఉంది. తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో రాముడి పాత్ర చేస్తున్నారు ప్రభాస్. రాముడంటే చొక్కా లేకుండా కనబడతారు కదా.. సో.. మరోసారి ప్రభాస్ కటౌట్‌ని చూడొచ్చన్న మాట. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
Payal Rajput: అందాల భామ.. ఆరాధ్య నాయిక!
ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్. గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ. బోల్డ్ ఫోటోలతో సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్న పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రియుడి సెన్సేషనల్ ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. నేడు(డిసెంబర్ 5) ఈ బ్యూటీ 29వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ వీడియో మీకోసం.. -
అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి
MahaSamudram Director Ajay Bhupathi Says Sorry: ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలు, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా డైరెక్టర్ భూపతికి తెలిపారు. తాజాగా పవన్‌రెడ్డి అనే ట్విట్టర్ యూజర్..మహాసముద్రం ఏంటి అన్నా అలా తీశావ్? చాలా ఎక్స్పెక్ట్ చేశా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అజయ్‌భూపతి.. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్ట్స్ టైం మంచి కథతో వస్తాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అజయ్ భూపతి చేసిన ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sorry for not reaching your expectations... Next time I will be back with a story that can satisfy you all... https://t.co/RTWin30gKV — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 చదవండి: హీరోయిన్గా మారిన టిక్‌టాక్ స్టార్ నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత -
బాలీవుడ్‌లోకి ఆర్ఎక్స్ 100, అల వైకుంఠపురములో.. టైటిల్స్ ఇవే
టాలీవుడ్ స్టోరీలు బాలీవుడ్ కి వెళుతున్నాయి. మన కథలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. రస్టిక్ లవ్ స్టోరీస్ ని మాత్రమే కాదు తెలుగులో సక్సెస్ అయిన కమర్షియల్ చిత్రాల్ని కూడా బాలీవుడ్ మేకర్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అలాంటి రెండు రీమేక్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం.. షెహజాదా... అంటే యువరాజు అని అర్థం. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇది బాలీవుడ్ రీమేక్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు టీ సిరీస్, బ్రాత్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. కృతీ సనన్ హీరోహిన్ గా యాక్ట్ చేస్తోంది. టబు పోషించిన పాత్రలో మనీషా కోయిరాల కనిపించబోతుంది. షెహజాదా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు 2022 నవంబర్ 4న షెహజాదా రిలీజ్ కాబోతున్న ప్రకటించింది మూవీ టీమ్. తడప్.. తెలుగులో స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఎక్స్100 కు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని మిలన్ లూద్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. అషన్ శెట్టి, తారా సుతారియా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌గా ‘తడప్’.. కథ కొంచెం మారినట్లుందిగా..
మొదటి సినిమాతోనే అజయ్ భూపతికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. కార్తికేయు, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో ఎలాంటి సంచనాలకు దారితీసిందో తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్లో ‘తడప్’గా రీమేక్ అవుతోంది. స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘ఆర్ఎక్స్ 100’ కథకి కొన్ని మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. అయితే హీరో, హీరోయిన్ల నటన మాత్రం అదిరిపోయింది. రఫ్, సాఫ్ట్ వంటి రెండు డిఫరెంట్ లుక్స్‌తో అహాన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్వాలా నిర్మిస్తుండగా.. మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతకుముందు కూడా కొత్త డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. కాగా టాలీవుడ్లో మరో కొత్త డైరెక్టర్ చేసిన ఈ సినిమా రీమేక్ ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి. చదవండి: ‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్ -
నిట్ వరంగల్‌లో లోహితను కలిశాను: హీరో కార్తికేయ
Karthikeya Shares Photo With Fiance: ‘‘నిట్ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది’’ అంటూ ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ అభిమానులతో శుభవార్తను పంచుకున్నాడు. బెస్ట్‌ఫ్రెండ్ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇక ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. గుణ 369, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో పలకరించాడు. నానీ గ్యాంగ్‌లీడర్ మూవీలో విలన్‌గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్ వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం Feeling elated to announce my engagement with my best friend who now is my partner for life.. From 2010when i first met #Lohitha in nitwaranagal to now and many more such decades.. pic.twitter.com/xXYp7pcH4K — Kartikeya (@ActorKartikeya) August 23, 2021 -
దర్శకుడిగా మారబోతున్న డైలాగ్ రైటర్
ఆర్ఎక్స్ 100 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియోలో వైరల్ అవుతుంటాయి. అజయ్ భూపతి కథ రచయితగా స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సయ్యద్ మాటల రచయితగా వ్యవహరించాడు. తొలి సినిమాతోనే తనదైన మాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్, ప్రశాంత్ వర్మ తీసిన “కల్కి” “జాంబిరెడ్డి” చిత్రాలకు మంచి డైలాగ్స్ అందించి తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ‘మహా సముద్రం’ సినిమాతో పాటు శ్రీహాన్ క్రియెషన్స్ లో ఒక వెబ్ ఫిల్మ్, సురేశ్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి మాటలు అందించారు. ఇలా తన ప్రతిభతో మంచి మంచి అవకాశాలతో రాణిస్తున్న ఈ యంగ్ డైలాగ్ రైటర్ ఇప్పుడు ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు కథ చెప్పటం, వారికి నచ్చటంతో సయ్యద్ కి ఈ అవకాశం వచ్చింది. ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. -
హీరో కార్తికేయ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి
సాక్షి, హైదరాబాద్: 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం తెలుగులో నానితో ‘టెక్ జగదీశ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక తమిళంలో పలు ప్రాజెక్టులకు సంతాకాలు చేసిన ఐశ్వర్యకు చేతి నిండా సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా సమంత స్థానంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తీస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్‌కు జోడిగా ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట దర్శకుడు సమంతను సంప్రదించినట్లు సమాచారం. ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల సమంత ఇటీవల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చివరకు ఈ పాత్రకు దర్శకుడు ఐశ్వర్య రాజేష్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరో హీరోగా లవర్ బాయ్ సిద్దార్థ నటింస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో గ్రాండ్ ఏంట్రీ ఇవ్వనున్నాడు ఈ లవర్ బాయ్. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వు వస్తానంటే.. నేనొద్దంటానా’తో తెలుగులో బ్లక్‌బస్టర్ హిట్ కొట్టిన సిద్దార్థ్‌కు ఆ తర్వాత సక్సెస్‌లు తక్కువే అని చెప్పుకొవచ్చు. 2016లో పలు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాల్లో నటించినప్పటికి అవి అంతగా గుర్తింపు పొందలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్ ‘మహా సముద్రం’తో ఎంట్రీ ఇస్తున్నాడు. -
దర్శకుడు అజయ్ భూపతికి కరోనా
టాలీవుడ్‌లోనూ కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందటం ప్రారంభం అయింది. ఇటీవలే దర్శకులు తేజ, రాజమౌళిలకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఆల్రెడీ నెగటివ్ అయ్యారు. తాజాగా దర్శకుడు అజయ్ భూపతికి కరోనా వచ్చింది. ‘వచ్చేసింది (కరోనాను ఉద్దేశించి). త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అజయ్. ‘ఆర్ ఎక్స్ 100’తో దర్శకుడు అజయ్ భూపతి సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ మల్టీ స్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. -
ఆర్ ఎక్స్100 గ్లామర్ భామ ‘ పాయల్ రాజ్‌పుత్ ’ ఫోటోలు
-
సినిమా నా కల: హీరో కార్తికేయ
సాక్షి, ఒంగోలు మెట్రో: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌ని ఆకట్టుకున్న నవతరం హీరో కార్తికేయ శనివారం ఒంగోలులో సందడి చేశారు. ఆ సినిమాతో యూత్ మదిలో నిలిచిపోయిన ఆయన కొత్త దర్శకుడు శేఖరరెడ్డితో తీసిన ‘90ఎం.ఎల్’ సినిమా ప్రమోషనింగ్ వర్క్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఒంగోలు నాగార్జున డిగ్రీ కాలేజీకి వచ్చారు. ఈ సందర్భంగా తొలుత కాలేజీ సెక్రటరీ వి.రాంప్రసాద్, ప్రిన్సిపాల్ వసంతలక్ష్మిలు సినీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన 90 ఎం.ఎల్ సినిమా హీరోయిన్ నేహాతో కలిసి విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్టాడారు. సినిమా తనకొక మధురమైన కల అని, దానిని ఆస్వాదిస్తున్నానన్నారు. సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతుందని, టైటిల్ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అనూప్ రూబెన్స్ పాటలకు చిందేసి ఆడాల్సిందేంటూ కితాబిచ్చారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు సరదాగా డ్యాన్స్ చేశారు. కార్యక్రమానికి సంచాలకులుగా వైస్ ప్రిన్సిపాల్ యోగయ్య చౌదరి, తెలుగు లెక్చరర్ డాక్టర్ నూనె అంకమ్మరావులు వ్యవహరించగా, సినీ బృందం, పలువురు లెక్చరర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీగాయత్రి కళాశాలలో.. కందుకూరు రూరల్: డిసెంబర్ 5వ తేదీ విడుదల కానున్న 90ఎంఎల్ సినీమా ఆదరించాలని హీరో కార్తికేయ, హిరోయిన్ నెహ అన్నారు. స్థానిక శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాంగ్ లీడర్ సినీమాలో విలన్ పాత్ర చేశానని చెప్పారు. గతంలో కందుకూరుకు వచ్చినట్లు చెప్పారు. వీరి వెంట కళాశాల కరస్పాండెంట్ సీహెచ్ రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ గీతా శ్రీనివాస్‌లు ఉన్నారు. -
‘ఇది నేను నిర్మిస్తున్న రెండో చిత్రం’
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ‘90 ఎంఎల్’ సినిమా హీరో, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ బుధవారం ఖమ్మం నగరంలో సందడి చేశాడు. తాను నటించిన ‘90 ఎంఎల్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తికేయ వేదికపై పాటలు పాడి అలరించాడు. అలాగే తన చిత్రాల్లోని డైలాగ్‌లు చెప్పి విద్యార్థుల్లో జోష్ నింపాడు. అమ్మాయిలు నృత్యాలు చేస్తూ, హీరోతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ‘90 ఎంఎల్’ సినిమాపై కార్తికేయ ముచ్చటించాడు. ఇది తాను నటించిన 5వ చిత్రమని, తాము నిర్మిస్తున్న రెండో సినిమా అని తెలిపారు. హీరోతో కరచాలనం చేస్తున్న విద్యార్థినులు అలాగే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనకు వచ్చిన పేరు మరోసారి ‘90 ఎంఎల్’తో వస్తుందన్నాడు హీరో కార్తికేయ. 90 ఎంఎల్ సినిమాకి సంబంధించిన మూడు పాటలను ఇప్పటికే విడుదల చేశామని, పాటలు బాగా వచ్చాయని, అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. గురువారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంకు తాను రావడం ఇది మూడోసారని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ రవికుల నారాయణ ప్రసాద్, శ్రీచైతన్య జూయనియర్ కళాశాలల ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, జి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇది లిక్కర్‌తో నడిచే బండి’
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్ అయి ఈ యంగ్ హీరో ఇప్పుడు హీరోగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100 నిర్మాతలు తెరకెక్కించిన 90 ఎంఎల్ సినిమాలో దేవదాసు పాత్రలో అలరించనున్నాడు. ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. పూటకో 90 తాగే కేర్‌లేస్ కుర్రాడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటిస్తుండగా రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పాయల్ రాజ్‌పుత్‌కు మరో చాన్స్!
తొలి సినిమాతోనే టాలీవుడ్‌ను షేక్ చేసిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ, తొలి ప్రయత్నంలోనే గ్లామర్ షోతో పాటు నెగెటివ్ రోల్లోనూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాల్లో నటిస్తున్నారు పాయల్. తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌కు చాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్ నటించబోయేది హీరోయిన్గా కాదు. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌లో అలరించారు. -
ఎవరా ‘చీప్ స్టార్’..?
తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించి యువ దర్శకుడు అజయ్ భూపతి. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అజయ్ భూపతి, తొలి సినిమా ఆర్ఎక్స్ 100తోనే తన మార్క్ చూపించాడు. ఈ సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌లతో పాటు దర్శకుడిగా అజయ్‌కి కూడా మంచి పేరు తీసుకువచ్చింది. అయితే తొలి సినిమా ఘన విజయం సాధించినా అజయ్ రెండో సినిమా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మహా సముద్రం అనే కథను సిద్ధం చేసుకున్న అజయ్ ఆ కథ కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నాడు. ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్న టాక్ వినిపించింది. కానీ తరువాత సీన్లోకి సీనియర్ హీరోగా రవితేజ వచ్చాడు. రవితేజ కూడా మహా సముద్రం నుంచి తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ సమయంలోనే అజయ్ భూపతి ‘చీప్ స్టార్’ అంటూ ట్వీట్ చేయటంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అజయ్ ఎవరి ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడన్న చర్చ జరుగుతోంది. ఇటీవల నాగచైతన్యతో కూడా అజయ్ చర్చలు జరిపాడన్న వార్తలు వినిపించాయి. ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్న కారణంగానే అజయ్ ఇలా స్పందించాడా..? బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రవితేజ, నాగచైతన్యలలో ఒకరిని ఉద్దేశించే ఇలాంటి ట్వీట్ చేశాడా..? లేక మరెవరినైనా దృష్టిలో పెట్టుకొని చేశాడా..? అన్న విషయం తెలియాలంటే మాత్రం అజయ్ క్లారిటీ ఇవ్వాల్సిందే. 'Cheap Star' — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 2, 2019 -
సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!
దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో) ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం) ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్ఎక్స్ 100) ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం) ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత) ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం) సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీ టౌన్ రోడ్డుపై ఆర్ఎక్స్ 100
సౌత్ ముంబైలోని ఓ థియేటర్‌కు వెళ్లారు ప్రముఖ బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి. ఇది పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ అహన్ శెట్టి వెళ్లింది సినిమా చూడటానికి కాదు. తన ఫస్ట్ సినిమా షూటింగ్లో జాయిన్ కావడానికి. తెలుగు హిట్ ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నారు అహన్ శెట్టి. ఈ చిత్రానికి మిలప్ లూద్రియా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. తొలుత థియేటర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముస్సోరీలో మేజర్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో తారా సుతారియా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘‘ఒరిజినల్ సినిమా చూశాను. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం’’ అని దర్శకుడు చెప్పారు. -
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా ‘RDX లవ్’
ఆర్ఎక్స్ 100 సినిమాతో అలరించిన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్(RDX లవ్) . తేజస్ కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు ‘పవర్’ చిత్ర దర్శకుడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌కు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆగస్ట్ 2న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింద’న్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’ అన్నారు. -
‘RX 100’ లాగే ‘గుణ 369’ కూడా!
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం గుణ 369. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలో ‘తొలి పరిచయమా ఇది... తొలి పరవశమా ఇది’ అనే తొలి పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. విశ్వనాథ్ రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తొలి సాంగ్ ‘తొలి పరిచయమా..’ను నేను విడుదల చేశాను. మంచి మెలోడీ సాంగ్. ఫీల్ గుడ్ సాంగ్, అందరికీ నచ్చుతుంది. కమల్‌హాసన్ గారి గుణ.. బాలకృష్ణగారి ఆదిత్య 369 సినిమాల రెండు టైటిల్స్ సగం సగం కలిసి చక్కగా కథకు తగ్గట్టు గుణ 369 అనే టైటిల్ కుదిరింది. టైటిల్లోని 369 ఏంటో ట్రైలర్‌ను చూడగానే అర్థమైంది. ట్రైలర్ బావుంది. కార్తికేయకు, టీమ్‌కు ఆర్ఎక్స్ 100లా సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. జరిగిన కథ. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. అత్యంత రియలిస్టిక్‌గా ఉంటుంది. తప్పక ప్రతి వారికీ కనెక్ట్ అవుతుంది. ఇదివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు. అలాంటి ఒరిజినాలిటీ ఉన్న కథ ఇది. తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది... అనే తొలి పాటను గురువారం దిల్‌రాజుగారి చేతుల మీదుగా విడుదల చేశాం. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన బాణీ వినగానే ఆకట్టుకుంటోంది. గేయ రచయిత విశ్వనాథ్ తేలిక పదాలతో మంచి భావంతో ఈ పాట రాశారు. తప్పకుండా మంచి ప్రేమ గీతంగా ప్రజల్లోకి వెళ్తుంది’ అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘టాలీవుడడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారి చేతుల మీదుగా మా గుణ 369 చిత్రంలోని తొలి పాట విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండదని నమ్ముతున్నాం. మా నమ్మకానికి తగ్గట్టు చైతన్ భరద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.విశ్వనాథ్ రాసిన పదాలు కూడా ప్రేమికుల మనసుకు ఇట్టే దగ్గరయ్యేలా ఉన్నాయి. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలో యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్లోనూ, మా కెరీర్లోనూ గుణ 369 చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం రామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ తమ్మిరాజు. సత్య కిశోర్, శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. -
ఆగస్టు 2న ‘గుణ 369’
‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ ఆగస్టు 2న విడుదల కానుంది. అనఘ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా చిత్ర సమర్పకురాలు ప్రవీణ కడియాల మాట్లాడుతూ గుణ 369 టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘తెలుగులో మంచి కథలతో సినిమా రావట్లేదని చాలా మంది అంటుంటారు. మా గుణ 369 చూసిన తర్వాత ఇంకెప్పుడూ ఎవరూ అలాంటి మాటలు అనరు. అంతగా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్రమత్తంగా చేస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం గుణ 369. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను, ట్రైలర్‌ను విడుదల చేసి, ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చాలా బావుంది. ప్రేక్షకులకు అన్నివిధాలా నచ్చుతుందని నమ్మకం కలిగింద’న్నారు. -
‘హిప్పీ’ మూవీ రివ్యూ
టైటిల్ : హిప్పీ జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : నివాస్ కే ప్రసన్న దర్శకత్వం : టీఎన్ కృష్ణ నిర్మాత : కలైపులి ఎస్ థాను ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ హిప్పీ. ఆర్ఎక్స్ 100లో బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాతగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిప్పీలో ఈ యంగ్ హీరో స్టైలిష్ మేకోవర్‌తో ఆకట్టుకున్నాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? కార్తికేయ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? కథ ; హిప్పీ దేవదాస్ (కార్తికేయ) ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి తొలి చూపులోనే మళ్లీ ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. హిప్పీకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ, వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు. కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలువుతుంది. ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని, చెప్పిన టైంకి రావాలని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు..? చివరకు హిప్పీ, ఆముక్తమాల్యదలు కలిసున్నారా.. విడిపోయారా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఆర్ఎక్స్ 100లో ఒకే ఎక్స్ప్రెషన్లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. యాక్షన్ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఒదిగిపోయింది. నటనతో పాటు గ్లామర్ షోతోను యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్ పాత్రను అవలీలగా పోషించాడు. వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్, బ్రహ్మాజీ, సుదర్శన్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం, తరువాత విడిపోవటం, తిరిగి కలవటం లాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెర మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కాన్సెప్ట్‌కు మరింత మసాలా జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు టీఎన్ కృష్ణ. తొలి పది నిమిషాల్లోనే జేడీ చక్రవర్తి చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సినిమా ఎవరిని టార్గెట్ చేసి రూపొందించారు క్లారిటీ ఇచ్చేశారు. రొమాంటిక్ సీన్స్ విషయంలోనూ కాస్త లిమిట్స్ క్రాస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కామెడీ బాగానే వర్క్ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలు బోర్ ఫీలింగ్ కలిగిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; యూత్‌ను ఆకట్టుకునే అంశాలు మైనస్ పాయింట్స్ ; డబుల్ మీనింగ్ డైలాగ్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
'డిగ్రీ కాలేజీ'లో విశృంఖలత్వం..
ముషీరాబాద్: ప్రస్తుతం విడుదలవుతున్న కొన్ని సినిమాలలో ఆశ్లీల దృశ్యాలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయిని, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలతో మరింత అశ్లీలత పెరిగిందని, నేడు ‘డిగ్రీ కాలేజీ’ పేరుతో వస్తున్న సినిమాలో మరింత విశృంఖలత్వంతో కూడిన దృశ్యాలున్నాయని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సినిమా ఇటీవల ట్రైలర్ మూడు నిమిషాలే ఉందని, దానిని చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోందన్నారు. బుధవారం పీవైఎల్ నాయకులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రదీప్ మాట్లాడుతూ... సినిమాలలో వస్తున్న శృంగార విశృంఖలత్వం చూసి యువత చెడిపోయే ప్రమాదముందన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. పీవైఎల్ నాయకులు కె.రాజేందర్, డివిఎస్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, రాకేశ్‌రెడ్డి, అశోక్, సమీర్, సాయి, సందీప్ పాల్గన్నారు. -
కార్తికేయ కొత్త చిత్రం ‘గుణ 369’
‘ఆర్ ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి ‘గుణ 369’ అనే పేరును ఖరారు చేశారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌లోగోను చిత్రయూనిట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వరకు మరో భారీ షెడ్యూల్ చేయబోతున్నాం. దాంతో ఒక సాంగ్ మినహా సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ. ‘369’ అంటే ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవలే క్రొయేషియాలో 2 పాటలు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది’ అని అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘రియల్ లవ్ ఇన్సిడెంట్స్ తో బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ కథను అద్భుతంగా తయారు చేసుకున్నాడు. వినగానే చాలా ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పేశాం. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్లో ఉంటుంది. కచ్చితంగా యువతరాన్ని ఉర్రూతలూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ క్యారక్టరైజేషన్ ‘ఆర్ ఎక్స్ 100’, ‘హిప్పీ’ కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘కొన్ని కథలు వినగానే నచ్చుతాయి. మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంటాయి. నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. వినగానే నచ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్పటిదాకా తీసిన రషెస్ చూసుకున్నాం. ప్రతి ఫ్రేమూ రియలిస్టిక్‌గా వచ్చింది’ అన్నారు. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం రామ్ సినిమాటోగ్రాఫర్. -
జూన్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ‘హిప్పి’
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా తెరకెక్కుతున్న సినపిమా హిప్పీ. కలైపులి ఎస్. థాను సమర్పణలో వి. క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు టిఎన్ కృష్ణ దర్శకుడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ‘మా హిప్పీ జూన్ 7న విడుదల కానుంది. షూటింగ్ చాలా బాగా జరిగింది. ఔట్పుట్ అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్ స్టోరి ఉంటుంది. మరో వైపు ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు దర్శకుడు. కబాలి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్. థానుగారి సంస్థలో హిప్పీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బడ్జెట్ చిత్రంలా చేశారు. జె.డి. చక్రవర్తిగారిది చాలా చాలా కీ రోల్. ఆయన కథ వినగానే ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్. అందరినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది’ అన్నారు. నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ - ‘కథ వినగానే నచ్చింది. నా పాత్రకున్న ఇంపార్టెన్స్ అర్థమై వెంటనే ఓకే చెప్పేశాను. కార్తికేయను ఆర్.ఎక్స్ 100లో చూశా. రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే హిప్పీ లాంటి కథ కుదరడం గ్రేట్. మంచి మనసున్న కలైపులి థానుగారి బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. -
ఆర్డీఎక్స్ షురూ
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘ఆవకాయ బిర్యానీ, హుషారు’ ఫేమ్ తేజస్ జంటగా శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్డీఎక్స్’. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకం సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా విజయవాడ కె.ఎల్.యూనివర్సిటీలో ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ క్లాప్ ఇవ్వగా, విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కెమెరా స్విచ్చాన్ చేయగా, సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇది. రెగ్యులర్ షూటింగ్‌ను ఆదివారం నుంచే ప్రారంభిస్తున్నాం. విజయవాడలో 4 రోజులు, తర్వాత పోలవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 40 రోజులు షూటింగ్ చేస్తాం. సినిమా చిత్రీకరణ అంతా ఆంధప్రదేశ్‌లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మరో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నా. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి పాత్ర చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘అద్భుతమైన కథ ఇది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు శంకర్ భాను. నరేష్ వి.కె, నాగినీడు, ఆదిత్య మీనన్, ఆమని, తులసి, ఐశ్వర్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : రధ¯Œ , కెమెరా: సి.రాంప్రసాద్. -
బోల్డ్ లవ్ స్టోరిలో టీవీ స్టార్
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాల సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్‌తో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక కీలకమైన హీరోయిన్ పాత్రకు బుల్లితెర నటిని ఫైనల్ చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ, ఓయ్ జెస్సీ సీరియల్స్‌తో ఆకట్టుకొని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న తారా సుతరియాను ఫైనల్ చేశారు. ఇప్పటికే అహన్, తారాలు వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మిలన్ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. -
‘హిప్పీ’ టీజర్ రిలీజ్ చేసిన నాని
ఆర్ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం హిప్పీ. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. వీ క్రియేషన్స్ బ్యానర్‌పై టీ ఎన్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ ఆవిష్కరణ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘కార్తికేయతో కలిసి ‘గ్యాంగ్ లీడర్’లో పనిచేస్తున్నాను. ఆర్ఎక్స్ 100 గురించి ఇంతకు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తుంటే... ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థమైంది. కార్తికేయతో పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఈ పరిచయంతోనే నేను హిప్పీ టీజర్ విడుదల చేశాను. టీజర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. చాలా బావుంది. సక్సెస్ఫుల్ సినిమాకు ఉండే అన్నీ లక్షణాలు, వైబ్రేషన్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుందనిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సమ్మర్లో తప్పకుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘నాని సార్‌తో పనిచేసే చాన్స్ నాకు ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంతో వచ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజర్ లాంచ్ ఆయన చేతుల మీదుగా జరిపించాలని అనుకున్నా. నేను అడగ్గానే అంగీకరించారు. ఆయనకు ధన్యవాదాలు. నేను అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు కదా సార్ అని అన్నా. నువ్వు అడక్కపోయినా చేసేవాడిని అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్యక్తి ఆయన . షూటింగ్ చేస్తున్నప్పుడే ఆయన బాగా క్లోజ్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియదు అని అనుకుంటున్న తరుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయనతో స్నేహపూర్వకంగా ఉండగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయనతో ఈ జర్నీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ ‘మా సినిమా టీజర్‌ను విడుదల చేసినందుకు నాని సార్‌కు చాలా ధన్యవాదాలు. ఆయనతో పాటు నేను దర్శకుడు విక్రమ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. విక్రమ్‌గారి షూటింగ్లో ఉండగానే మేం నానిగారితో టీజర్ విడుదల చేయించాం’ అని అన్నారు. విక్రమ్.కె.కుమార్ మాట్లాడుతూ ‘కార్తికేయకు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్ర దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. టీజర్ చూస్తుంటే మంచి ఫన్ రైడ్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలి. మంచి టీమ్ కలిసి చేసిన చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాటను పబ్బులో చిత్రీకరిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ షూటింగ్ ఉంటుంది. టీజర్ చాలా బావుందని అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అందరి అంచనాలకు తగ్గరీతిలో నిర్మిస్తున్నాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు. -
చెడుగుడు... చెడుగుడు!
కబడ్డీ... కబడ్డీ.. అంటూ కూత పెట్టి కోర్టులో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు కథానాయిక పాయల్ రాజ్‌పుత్. కానీ ఆమె కోర్టులోకి అడుగు పెట్టింది సొంత ప్రయోజనాల కోసం కాదు. ఊరి మాట నిలబెట్టడం కోసం. మరి... ఆమె ఎలా చెడుగుడు ఆడారు? అనే విషయం చూడాలంటే ఆట వెండితెరపైకి వచ్చేంతవరకు ఆగాల్సిందే. భాను శంకర్ దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల మెయిల్ లీడ్ యాక్టర్‌గా చేస్తున్నారు. ‘‘ఇందులో కబడ్డీ ఆడే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఈ ఆట కోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాను. ఐదుగురు అబ్బాయిలతో నేను కబడ్డీ ఆడే ఓ సీన్ ఈ సినిమాలో ఒక హైలైట్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు పాయల్. ‘వెంకీమామ, మన్మథుడు 2’ తెలుగులో పాయల్ రాజ్‌పుత్ ఒప్పుకున్న ఇతర చిత్రాలు. తమిళంలో ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘ఏంజెల్’ అనే సినిమా చేస్తున్నారు. మొత్తానికి తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తెచ్చిన ఫేమ్ పాయల్ని బిజీ చేసిందని చెప్పొచ్చు. -
లొకేషన్ల వేటలో ‘ఆర్ఎక్స్ 100’..!
టాలీవుడ్లో ‘ఆర్ఎక్స్ 100’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు ఆజయ్ భూపతిల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ మూవీపై.. అన్ని ఇండస్ట్రీల కన్ను పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో ప్రముఖ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తూ.. ఆర్ఎక్స్ 100ను అక్కడ రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసమే యూనిట్ లొకేషన్ల వేటలో పడింది. ముస్సోరిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేయాలని యూనిట్ భావిస్తోందట. ఇక్కడ సంచనాలు నమోదు చేసిన ఈ మూవీ.. అక్కడ ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో వేచి చూడాలి. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిలాన్ లుత్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. -
ప్రేమలో మాస్టార్లు..
ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు పలకరిస్తుందో ఎవరికి తెలుసు? వస్తూనే ఓ గిలి.. మది లోగిలి అదిరిపడేలా.. ఆ ప్రత్యేకమైన వ్యక్తి స్ఫురణకు వస్తే చాలు.. అప్పటి వరకు దగ్గరున్న వారంతా దూరమైపోతే బాగుణ్ణు అనే భావన. ఆమె లేదా అతడి ధ్యాస తప్ప మరేదీ అవసరం లేదన్న తాదాత్మ్యత. ఇదీ.. అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేని ఓ మధురానుభూతి మనసును ఆవరిస్తుంది. నూత్న యవ్వనం తొలి రోజుల్లోనే కాదు.. మలి వయసులోనూ.. ఆ మాటకొస్తే ఏ వయసులోనైనా.. కారణమేదైనా స్పందించే మనసుండాలే కానీ వలపుశరాల బారిన పడనివారుండరు అనడం అతిశయోక్తి కాదేమో.. అలాంటి ప్రేమజీవుల అనుభూతులు.. ప్రేమైక జీవనం గడుపుతున్న కొన్ని జంటల విజయాలు ప్రేమికుల రోజున మీ కోసం.. ఆత్రేయపురం (కొత్తపేట): మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు యువతీ, యువకులు వారి ప్రేమ యుద్ధంలో విజయం సాధించి సుఖమయ జీవనం సాగిస్తున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు వేగేశ్న అజయ్ భూపతి, శిరి వారిలో ఒక జంట. వీరి ఇరువురు ప్రేమికుల రోజు సాక్షిగా ‘ఆర్ఎక్స్–100’ వాహనంపై యమస్పీడుగా దూసుకుపోతున్నారు. ఆయన సతీమణి శిరి ఇంజినీరింగ్ పూర్తి చేసి తను ప్రేమించిన వ్యక్తిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని పెళ్లి చేసుకుని జీవితాన్ని పూలబాటగా మార్చుకున్నారు. అలాగే ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన కప్పల శ్రీధర్, స్వరూప పరస్పరం అవగాహనతో ప్రేమికుల రోజు సాక్షిగా జీవితాన్ని సుఖమయం చేసుకుని పిల్లా పాపలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అలాగే ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి , మద్దూరి బంగారం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ప్రేమికులందరికీ ఆదర్శంగానిలుస్తున్నారు. ప్రేమకు పెద్దల అంగీకారం ఉంటేనే మంచిది ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటేనే జీవితమంతా ఆనందంగా ఉంటుందంటారు ఎల్ఐసీ రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచి ఉద్యోగి గురుమహేష్, అంజలి దంపతులు. మూడున్నరేళ్ల క్రితం దగ్గర బంధువైన అంజలిని ప్రేమించారు. ఇద్దరి మనసులు ఒక్కటవడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోవడం వలన సంతోషంగా జీవించవచ్చంటారు. అందుకే ప్రేమికులు ఎవరైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటే ఆ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందన్నారు. మా దాంపత్యం ఎంతో అన్యోన్యం మామిడికుదురు (పి.గన్నవరం): ‘చదువుకునే సమయంలో ఇద్దరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాం. రెండు దశాబ్దాలు అయ్యింది. ఇంత వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నాం’ అంటున్నారు మామిడికుదురుకు చెందిన ఉండ్రు శ్రీనుబాబు, బళ్ల జ్యోతి. 1999లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసిన శ్రీనుబాబు ప్రస్తుతం తాటిపాక భాష్యం స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. జ్యోతి కూడా బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసి సర్వశిక్షాభియాన్‌లో సీఆర్పీగా పని చేస్తున్నారు. వీరి కుమారుడు వినయ్‌రామ్ కృష్ణా జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అంబిక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బీఎన్ఎం కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా చదువుతోంది. ‘మాకు కుటుంబ సభ్యుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి’. ‘మా పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం. మేము కోరుకున్న జీవితం ఇదే. మా పిల్లలు ప్రయోజకులు కావాలనే మేము కోరుకున్నాం. మా అభిలాష నెరవేరింది. మాకు ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది. మా 20 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు’ అంటున్నారు శ్రీనుబాబు, జ్యోతి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే ఎటువంటి సమస్యలు ఉండవంటారు వారు. పంతాలు, పట్టింపులకు పోకుండా ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే ఏ విధమైన సమస్యలు ఉండన్నది వారి సిద్ధాంతం. ధనిక–పేద వ్యత్యాసంచెరిపేసిన ప్రేమ.. అమలాపురం టౌన్: పెద్దలను ఎదిరించి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం తిరుగుబాటు అవుతుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం సర్దుబాటు అవుతుంది. ఈ రెండు మార్గాల్లో ప్రేమికులు ఏ మార్గంలో పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవించగలిగితేనే వారి ప్రేమకు అర్థం.. పరమార్థం. ప్రేమపెళ్లితో ఒక్కటైన జంట వాసంశెట్టి సుభాష్, లక్ష్మీ సునీత. అమలాపురం పట్టణం మద్దాలవారిపేటకు చెందిన సుభాష్ది ధనిక కుటుంబమైనప్పటికీ తన మనసుకు నచ్చిన పేదింటి యువతిని నిజాయతీగా ప్రేమించి.. అంతే నిజాయతీగా తన ఇంట్లో వారికి చెప్పి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎదురెదురు ఇళ్లలోని కుటుంబాలైన వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ సుభాష్‌కు తాను మెచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ సునీత అంటే నాడూ.. ఈనాడూ అదే మక్కువ. పదేళ్ల వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే కవల ఆడపిల్లలు సత్య దీవిత, సత్య దీక్షిత. వారిరువురికీ వీరిరువురే ప్రపంచం. కాకతాళీయమే అయినా సుభాష్ తన పెద్దలను, ఆమె ఇంటి పెద్దలనూ ఒప్పించిన రోజు ఫిబ్రవరి 14 కావడం గమనార్హం. ప్రేమలో మాస్టార్లు సామర్లకోట (పెద్దాపురం): వారు ఇరువురు వేర్వేరు పాఠశాలల్లో ఉపాధ్యాయులు. తరువాత ఒకే హైస్కూల్లో పనిచేశారు. ఆ కాలంలో ప్రేమజీవులై పట్టణ ప్రముఖులు సహకరించడంతో 1991లో వివాహం చేసుకున్నారు తాళ్లూరి వైకుంఠం, ఏఎల్‌వీ కుమారి. ప్రస్తుతం వైకుంఠం పీడీగాను, కుమారి సైన్సు టీచరుగా బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లోనే పని చేస్తున్నారు. వైకుంఠం యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్స్‌లో పని చేసి అనేక మంది క్రీడాకారులను తయారు చేశారు. కబడ్డీ, ఖోఖోలలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. దాంతో అనేక మంది విద్యార్థులు కబడ్డీ కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కుమారి సైన్సు టీచరుగా 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు బోధించడంలో ఆరితేరిన ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందారు. ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారని సహోపాధ్యాయులతో పాటు, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ కూడా ఆమెను అభినందిస్తుంటారు. వైకుంఠం వ్యాయామ ఉపాధ్యాయుడు కావడంతో పిల్లలకు ఆటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం కుమారుడి ఎస్సై సెలక్షన్‌కు ఎంతగానో దోహదం చేసింది. రెండో కుమారుడు పుష్పకల్యాణ్ ఐఏఎస్ లక్ష్యంతో హైదరాబాద్‌లో గ్రూప్స్‌కు శిక్షణ పొందుతున్నట్లు వైకుంఠం తెలిపారు. తమది ప్రేమ వివాహం అయినా పెద్దలు కూడా అంగీకరించడంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు ఏఎల్‌వీ కుమారి, వైకుంఠం తెలిపారు. తమ పిల్లల వివాహం వారి ఇష్టం ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ప్రేమ వివాహం చేసుకునే ముందు వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొవడం వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉండదని తెలిపారు. ఏది ఏమైనా సమస్యలు వచ్చిన సమయంలో సర్దుకుపోవడం వల్ల ప్రశాంతంగా జీవించడానికి వీలు కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వైకల్యం శరీరానికే.. ప్రేమకు కాదు.. రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలం నరసాపురపుపేటకు చెందిన పంపన శివయ్య పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. శారీరకంగా మరుగుజ్జుతనం ఉన్నా.. మానసికంగా దృఢ చిత్తంతో ఎదిగాడు. అంగవైకల్యం వల్ల అతని చదువు 8వ తరగతిని మించి సాగలేదు. అయినప్పటికీ తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన కన్నతల్లిని వృద్ధాప్యంలో కంటి పాపలా కాపాడుకున్నాడు. రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద పలు సమస్యలతో వచ్చే వారికి సహాయకారిగా ఉంటూ వారికి దరఖాస్తులు నింపడం, అర్జీలు రాయడం చేస్తూ తల్లిని పోషించుకునేవాడు. దూరపు బంధువైన ధనలక్ష్మిని శివయ్యను పెళ్లి చేసుకోమని బంధువులు అడిగారు. కన్నతల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్న శివయ్య వ్యక్తిత్వం తెలిసిన ఆమె వెంటనే వివాహానికి ఒప్పుకుంది. కానీ శివయ్య వివాహం చేసుకుంటే తన తల్లిని పోషించుకోలేమోనని భావించి పెళ్లికి నిరాకరించాడు. అయితే శివయ్యను ఇష్టపడిన ధనలక్ష్మి అతనినే పెళ్లి చేసుకోవాలని భావించి, నిరీక్షించింది. రెండేళ్ల తరువాత వృద్ధాప్యంతో తల్లి మరణించిన తరువాత ధనలక్ష్మి తన కోసం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తోందని తెలిసి ఆమెను 2006 పిబ్రవరి పదిన వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా కుమార్తె కల్యాణి జన్మించింది. శివయ్యకు 2013లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. రామచంద్రపురం వైఎస్సార్ నగర్లో సొంత ఇల్లు ఉంది. కుమార్తె కల్యాణి ఏడో తరగతి చదువుతోంది. ఈ ప్రేమజంట తమ ప్రేమకు ప్రతిరూపమైన కుమార్తెను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ప్రేమకు కోవెల ఆ ఇల్లు కాకినాడ రూరల్: 1984లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆ దంపతులు ఆనాటి ప్రేమను వ్యతిరేకించిన పెద్దలను ప్రేమతోనే ఒప్పించారు. ఎవరేంటో, వారి మనసేంటో తెలియకుండా పెళ్లి చేసుకునే వారికంటే ఒకరి మనస్సు ఒకరు అర్ధంచేసుకున్న దంపతులు అన్యోన్యంగా ఉంటారనే విషయాన్ని పెద్దలకు వివరించిన దంపతులు మణమ్మ, శర్మ. కాకినాడ వాజపేయాజుల వారి వీధిలో 1983లో కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి నాగమణిని సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సీతారామ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి సంతానమైన ఇద్దరబ్బాయిలకు ప్రేమ పెళ్లిళ్లే చేశారు. జమ్మలమడక నాగమణి, రామశర్మ దంపతుల కుమారులు రామ్‌లాల్ భరత్, రవితేజలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటానంటే సరే అని పెళ్లిళ్లు చేసిన ఘనత వారికే దక్కింది. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా కాపురాలు చేసుకుంటూ ఆదర్శ కుటుంబాలుగా పేరు పొందుతున్నారు. -
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి ‘మహా సముద్రం’
తొలి చిత్రం ఆర్ఎక్స్ 100తోనే ఘన విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా సక్సెస్‌తో అజయ్ భూపతికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నితిన్ లాంటి యంగ్ హీరోస్ అజయ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. తాజాగా అజయ్ భూపతి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయనున్నాడు అజయ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడిగా ఓ స్టార్ హీరోయిన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
మరో సినిమాను ప్రారంభించిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో!
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లో రికార్డుల మోత మోగించారు. ఈ సినిమాతో హీరో కార్తీకేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌లకు భారీగా క్రేజ్ వచ్చేసింది. పాయల్ ఇటీవలె ఎన్టీఆర్ కథానాయకుడిలో అతిథి(జయసుధ)పాత్రలో మెరవగా.. హీరో కార్తీకేయ హిప్పీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాయే కాకుండా మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ఈ యంగ్ హీరో ప్రారంభించాడు. నూతన దర్శకుడైన అర్జున్ జంధ్యాల, కార్తీకేయ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ మూవీ షూటింగ్ నేటి(జనవరి 17) నుంచి ఒంగోలులో జరుగుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని అనిల్ కడియాలా, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. చైతన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. -
ఆ తర్వాతే బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తా : పాయల్
అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ సోషల్‌మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లు సరదాగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పాయల్ బదులిచ్చి తన ఇన్స్టామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. మీ బికినీ ఫోటో ఉంటే పోస్ట్ చేయండి అంటూ ఓ నెటిజన్ అడిగి ప్రశ్నకు.. ఇప్పుడు కాదు. కొంత బరవు తగ్గడానికి వర్కవుట్స్ చేస్తున్నాను. శరీరం మంచి ఆకృతికి వచ్చిన తర్వాత బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తా అంటూ బదులిచ్చారు. నెటిజన్లు అడిగిన మరిన్ని ప్రశ్నలకు పాయల్ సమాధానం ఇచ్చారు. నెటిజన్ : ఆర్ఎక్స్ 100 సినిమా మీ తల్లిదండ్రులతో కలిసి చూశాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి నుంచి ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా? పాయల్ రాజ్‌పుత్ : అవును, ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని మా అమ్మతో కలిసి చూశాను. చిత్రంలో హీరోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాలను మా అమ్మతో కలిసి చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సినిమాలో భాగంగా నీ పని నువ్వు చేశావు, నువ్వు చేసే పనిలో ఇదంతా ఓ భాగమే కదా అంటూ అమ్మ నాకు అండగా నిలిచింది. నెటిజన్ : కేజీఎఫ్ చిత్రాన్ని చూశారా? పాయల్ రాజ్‌పుత్ : క్షమించండి ఇంకా చూడలేదు. తీరిక సమయం దొరకగానే ఖచ్చితంగా చూస్తా నెటిజన్ : మీ అందమైన నవ్వు వెనకున్న రహస్యం ఏంటి ? పాయల్ రాజ్‌పుత్ : ఆనందంగా బతకాలనుకుంటున్నా అంతే, ఏవరైతే ఆనందంగా ఉంటారో, మిగతావారిని కూడా హ్యాపీగా ఉంచగలుగుతారు. నెటిజన్ : మీ మొదటి ప్రాధాన్యత ఎవరికిస్తారు? పాయల్ రాజ్‌పుత్ : ముందు కుటుంబం. ఆ తర్వత కేరీర్ నెటిజన్ : మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? పాయల్ రాజ్‌పుత్ : సాంబార్ రైస్ -
‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ కొత్త సినిమా ఓపెనింగ్
‘ఆర్ఎక్స్–100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఈ చిత్రం ద్వారా అర్జున్ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వంతో పాటు హీరోపై క్లాప్ నిచ్చారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘నేను ఏ సినిమా ఓపెనింగ్లకు వెళ్లను. అటువంటిది ఈ చిత్ర నిర్మాతలు ఎంతో కష్టపడి ఇంతదూరం ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలోని మొదటి సినిమా ఓపెనింగ్‌కు వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యత అనిపించింది. వారితో పాటు మరో నిర్మాత తిరుమల్ రెడ్డి, దర్శకుడు అర్జున్ జంధ్యాల లకు అల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘నా దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్, టైమింగ్ ఉన్నవాడతను. అలాగే ఈ నిర్మాతలు నాకు మొదటినుండి మంచి మిత్రులు. హీరోకి ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘‘ఆర్ ఎక్స్100’ చిత్రం విడుదల తర్వాత నేను చాలా కథలు విన్నాను. నేను విన్న అన్ని కథల్లోకి బెస్ట్ కథ ఇది. అందుకే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడేప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య, మిరియాల రవీంధర్ రెడ్డి, ప్రవీణ్, నటులు హేమా తదితరులు పాల్గొన్నారు. -
కనిపించదు... వినిపించదు!
టాలీవుడ్లో ఈ ఏడాది పాయల్ రాజ్‌పుత్ ఒక సంచలనం. తెలుగులో నటించిన తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’లోనే నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ చేయడమే కాకుండా ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకున్నారీ పంజాబీ బ్యూటీ. అటు గ్లామర్ పరంగానూ కుర్రకారును ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో సినిమాకి ఇంకా పెద్ద సవాల్‌ని స్వీకరించారు పాయల్. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మాతగా ‘డిస్కో రాజా’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించనున్నారు. 1980 నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తారని సమాచారం. అలాగే పాయల్ రాజ్‌పుత్ అంధురాలిగా, బధిర (మూగ, చెవిటి) యువతిగా నటించనున్నారు. అంటే.. ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా పాయల్‌కు వినిపించదు. కనిపించదన్నమాట. ఈ పాత్రలో పర్ఫెక్ట్గా ఒదిగిపోవడానికి బ్లైండ్ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్ హావభావాలను పరిశీలించాలని డిసైడ్ అయ్యారు పాయల్. అలాగే తమిళంలో ‘ఏంజిల్’ అనే చిత్రంలో ఒక కథానాయికగా నటిస్తున్నారామె. ఉదయనిథి స్టాలిన్ ఇందులో హీరో. -
బోల్డ్ ఎంట్రీ
బోల్డ్ అండ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు బోల్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించిన మిలన్ లూథ్రియా ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. సాజిద్ నడియాడ్వాలా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ‘‘ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ సినిమాని రీమేక్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా ద్వారా యంగ్ హీరో అహన్ శెట్టి పరిచయం అవుతున్నాడు, సాజిద్లాంటి నిర్మాత ఉన్నారు. ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండబోతోందని అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు మిలన్. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌లో స్టార్ వారసుడు
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాల సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరోను కూడా ఫైనల్ చేశారు. ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి, ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. మిలన్ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. IT'S OFFICIAL... Sajid Nadiadwala ropes in director Milan Luthria for Ahan Shetty’s debut... An official remake of #Telugu hit #RX100. pic.twitter.com/AliZIgcFCS — taran adarsh (@taran_adarsh) 15 November 2018 -
‘ఆర్ఎక్స్ 100’తోనే గుర్తింపు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ఇటీవల విడుదలై విజయవంతమైన ‘ఆర్ఎక్స్ 100’తోనే తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించిందని ఆ చిత్రం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ఆ చిత్రం విజయవంతంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మరో రెండు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించబోతున్నానని తెలిపారు. అమలాపురంలో ‘దుర్గాస్ స్పైసీ ట్రీట్ రెస్టారెంట్’ను ఆమె ఆదివారం ఉదయం ప్రారంభించారు. రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హీరో రవితేజ నటించే చిత్రంతో పాటు మరో కొత్త చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. తన సొంత రాష్ట్రం పంజాబ్ అని, హిందీ టీవీ సీరియల్స్‌లో నటిగా గుర్తింపుతోనే సినిమాల్లో అరంగేట్రం చేశానని పేర్కొన్నారు. హిందీ టీవీ షోల్లో కూడా నటించానన్నారు. 2012లో ‘ సప్నా సే భారే నైనా’ అనే హిందీ టీవీ సీరియల్‌తో నట జీవితాన్ని ప్రారంభించానని చెప్పారు. తమిళంలో కూడా నాలుగు చిత్రాల్లో నటించానని, అవి కూడా విజయవంతమయ్యాయని చెప్పారు. కోనసీమకు రావడం ఇదే తొలిసారని, ఇంత పచ్చదనాన్ని, గోదావరి పాయలను చూసి ఇక్కడ ఉండిపోవాలన్నంత అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో రెస్టారెంట్ యజమాని సత్తి సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. -
నగరంలో పాయల్ మెరుపులు
ప్రముఖ సినీ నటి, ఆర్ఎక్స్ 100 చిత్ర కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ఒంగోలు నగరంలో సందడి చేసింది. మంగమూరు రోడ్డులో బీఎంఆర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యూవెలరీ షోరూం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె ధగధగలాడే ఆభరణాలతో మెరిసిపోయింది. పాయల్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఒంగోలు: నాలుగు తరాలుగా బంగారు, వజ్రాభరణాల విక్రయంలో బీఎంఆర్ సంస్థ ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచిందని సినీ హీరోయిన్ (‘ఆర్ఎక్స్ 100’ ఫేం) పాయల్ రాజ్‌పుత్ అన్నారు. శుక్రవారం ఉదయం ఒంగోలులోని మంగమూరు డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎంఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను ఆమె ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రకాల వజ్రాభరణాలను పాయల్ ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బొమ్మిశెట్టి మల్లికార్జునరావు ప్రారంభించిన సంస్థను వారి వారసులు కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం వల్లే నేడు మల్టిపుల్ షోరూంలను ప్రారంభించగలుగుతున్నారన్నారు. షోరూంలో దక్షిణ భారత సంప్రదాయం, సంస్కృతులను ప్రతిబింబించే బంగారు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచారన్నారు. షోరూం అధినేత బొమ్మిశెట్టి అర్జున్ మాట్లాడుతూ కాలానుగుణంగా ప్రజలు మెచ్చే అన్ని రకాల వజ్రాభరణాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తమ షోరూంలో 200 రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి 8 గ్రాముల బంగారంపై రూ.1025 తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ‘మీ టూ’ అంశం అత్యంత సున్నితమైనదిగా పేర్కొన్నారు. తెలుగులో తనకు ఆర్ఎక్స్ 100 సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం తెలుగులో హీరో రవితేజతో రెండో సినిమాతోపాటు తమిళ్లో ఏంజెల్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. షోరూం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. -
‘హిప్పీ’ షూటింగ్ మొదలైంది
-
‘హిప్పీ’ షూటింగ్ మొదలైంది..!
Rx 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ , దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టీఎన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం హిప్పీ. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు . ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘RX 100 సినిమా తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. ఆ తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ ఈ సినిమా కథ చెప్పారు. కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఆ తర్వాత నిర్మాత కలైపులి థాను ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. దాంతో మరింత ఉత్సాహం కలిగింది. కలైపులి థాను దక్షిణాదిలో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ తెలుసు. కబాలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత, బ్యానర్లో నటించడం, అలాంటి ప్రొడ్యూసర్‌తో నా కెరీర్ ఆరంభంలో రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్‌ని టాప్ లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు. దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా నాకు తెలుగులో తొలి స్ట్రయిట్ చిత్రం హిప్పీ. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ చూశాను. నాకు బాగా నచ్చింది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం చాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రస్టింగ్ ఎంటర్టైనర్ ఇది . తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. ‘హిప్పీ సినిమా కథ తెలుగు వారందరికీ నచ్చుతుంది. ఆర్ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత కార్తికేయ ఈ సినిమాకు యాప్ట్ అనిపించింది. కార్తికేయ కథ వినగానే ఓకే అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. -
రాజా సరసన రాజ్‌పుత్
మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ సూపర్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ నెక్ట్స్ సినిమా విషయంలో కంగారు పడకుండా మెల్లిగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు పాయల్ రాజ్‌పుత్. ఈ భామ లేటెస్ట్గా రవితేజ సరసన ఓ హీరోయిన్గా ఎంపికయ్యారని సమాచారం. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓ హీరోయిన్గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ ఎంపికయ్యారు. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఇందులో ఆయన తండ్రి – కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారు. ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటించనున్నారు. దీపావళికి ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేయనుంది. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. -
పెళ్లికళ వచ్చేసిందే పాయల్
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడామె పెళ్లిపీటలు ఎక్కేశారు. ఇక్కడి వరకూ చదివిన పాయల్ ఫ్యాన్స్ పరేషాన్ అవ్వక తప్పుదు. ముందుకెళ్లండి అసలు విషయం తెలుస్తుంది. తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న పాయల్ ఇటీవల ఓ తమిళ చిత్రంలో నటించేందుకు అంగీరించిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కే.ఎస్. అధియామన్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు పాయల్. ముందుగా ఉదయ్, పాయల్లపై పెళ్లినాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని ఓ సీన్ కోసం పాయల్ పెళ్లి కూతురయ్యారు. ఈ చిత్రానికి ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ‘‘నా తొలి తమిళం సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఆశిస్తున్నాను. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు పాయల్ రాజ్‌పుత్. -
‘మేం నటులం.. తీవ్రవాదులం కాదు’
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఈ సినిమా ప్రేరణతో తమ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు రావటంతో మరోసారి ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనపై హీరో కార్తికేయ స్పందించాడు. తమ సినిమాలో హీరో ఆత్మహత్య చేసుకునే సన్నివేశం అసలు లేదని.. క్లైమాక్స్‌లో కూడా ఇందునే హీరోను చంపిస్తుంది.. కానీ తాను బలవన్మరణానికి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమా దర్శకులు ఎప్పుడు తమ సినిమా చూపి చేడిపోండి అని తీయరు. విద్యార్థులు ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చుట్టుపక్కల వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చదవండి : ఆర్ఎక్స్ 100 సినిమానే ప్రేరణ -
విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
-
ఆర్ఎక్స్ 100 సినిమానే ప్రేరణ
జగిత్యాల క్రైం: విద్యార్థుల ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఓ ప్రేమ కథతో రూపొందించిన సినిమాను ప్రేరణగా తీసుకొని.. తామూ ఆత్మహత్య చేసుకుని ప్రియురాళ్ల మనస్సులో చిరకాలం నిలిచిపోదామని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. జగిత్యాలలో ఆదివారం రాత్రి పదో తరగతి చదువుతున్న మహేందర్, రవితేజ ఆత్మహత్యకి పాల్పడిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను జిల్లా ఎస్పీ సింధూశర్మ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ ప్రకాశ్ చనిపోయిన ఇద్దరు విద్యార్థుల స్నేహితులను విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. ఈ ఇద్దరు విద్యార్థులు ఏడాది కాలంగా అదే పాఠశాలకు చెందిన ఇద్దరమ్మాయిలతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ.. చాటింగ్‌లు చేస్తూ ఉండేవారు. ఈ మేరకు సినిమాల ప్రేరణతో ఇద్దరు బాలురు ప్రియురాళ్ల కోసం ప్రాణం తీసుకున్నట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది. ఇటీవల విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ కోసం హీరో పాట పాడుతూ ప్రాణత్యాగం చేసుకుంటాడని, ఆ సంఘటనను ప్రేరణగా తీసుకుని తాము కూడా అలాగే ఆత్మహత్య చేసుకుంటామని మహేందర్ తన మిత్రుడు అజీజ్‌కు చెప్పినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. చనిపోయిన విద్యార్థులు గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసైనట్లు తేలిందని, పథకం ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి ఇద్దరూ కలసి బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి.. కలిసే వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వెంకటరమణ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కాగా, జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలాన్ని ఎస్పీ సింధూశర్మ సోమవారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె వెంట పట్టణ సీఐ ప్రకాశ్, ఎస్సై ప్రసాద్, రాములు ఉన్నారు. రెండు కుటుంబాల్లో విషాదం అల్లారుముద్దుగా పెంచుతూ.. కొడుకులను ప్రయోజకులను చేయాలని కలలు కన్న తల్లిదండ్రులకు ఆ కొడుకులు శోకాన్నే మిగిల్చారు. విద్యార్థుల మృతితో రెండు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. పట్టణంలోని విజయపురి కాలనీకి చెందిన కూసరి రవి, లత రెండో కుమారుడు మహేందర్, విద్యానగర్‌కు చెందిన శ్యామల కుమారుడు రవితేజ ఆత్మహత్యతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సోమవారం కుటుంబసభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు. -
రీమేక్‌తో ఎంట్రీ
బాలీవుడు నటుడు సునీల్ శెట్టి 25 సంవత్సరాలుగా హిందీ, దక్షిణాది చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన రెండో జనరేషన్ యాక్టర్స్‌ని స్క్రీన్కు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కూతురు అతియా శెట్టిని ‘హీరో’ సినిమా ద్వారా 2015లో సల్మాన్‌ఖాన్ పరిచయం చేశారు. ఇప్పుడు కుమారుడు అహన్ శెట్టిని బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ న డియాడ్వాలా పరిచయం చేయనున్నారు. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ రైట్స్ ఈ నిర్మాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ద్వారా అహన్ శెట్టిని హీరోగా బాలీవుడ్లో పరిచయం చేయనున్నారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. -
నాగ్ గురించి వికీపీడియా తప్పు చెబుతోందా?
టాలీవుడ్ మన్మథుడు, నిత్య యవ్వనుడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు అసూయపుట్టేలా చేస్తున్నాడు కింగ్ నాగార్జున. వయసు ఆరుపదులకు దగ్గరవుతున్నా.. ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే ఉన్నాడు నాగ్. గురువారం రిలీజైన దేవదాస్ మూవీలో దేవ పాత్రలో నాగ్ నటన అందరినీ మెప్పించింది. అయితే నాగ్ ఫిట్‌నెస్‌పై యంగ్‌హీరో కార్తికేయ (ఆర్ఎక్స్ 100 ఫేమ్) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘వికీపీడియా తప్పు చూపిస్తోందా? ఈ మనిషికి 59 సంవత్సరాలని చూపిస్తోంది. ఆయన ఫిట్నెస్తో యంగ్ హీరోలకు చాలెంజ్ విసిరుతున్నాడు. ఏమ్ ఉన్నాడ్రా బాబు’ అంటూ దేవదాస్లోని నాగ్ పిక్‌ను పోస్ట్చేశాడు. ఆర్ఎక్స్ 100తో విజయం సాధించిన కార్తికేయ.. తదుపరి చిత్రంగా ‘హిప్పీ’ని పట్టాలెక్కిస్తున్నాడు. Is wikipedia wrong ?coz it says this man is 59yrs old .#Devadasu .@iamnagarjuna sir 🙏🙏🙏 challenging actors in 20s with his fitness levels.Em unnadra babu🙏🙏 pic.twitter.com/5D1tcZ75t8 — Kartikeya (@ActorKartikeya) 27 September 2018 -
ఆర్ఎక్స్100తో శాండిల్‌వుడ్‌కి...
‘ఆర్ఎక్స్ 100’.. తెలుగులో ఈ ఏడాది అనూహ్య విజయం అందుకున్న చిత్రాల్లో ఒకటి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు కన్నడంలో రీమేక్ కానుంది. నిర్మాత డి.ఎస్. రావు ‘ఆర్ఎక్స్ 100’ కన్నడ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. నితిన్‌తో ‘ద్రోణ’, నానీతో ‘ పిల్ల జమీందార్’, నిఖిల్‌తో ‘ కళావర్ కింగ్’, మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాలు నిర్మించిన డి.ఎస్.రావు ‘ఆర్.ఎక్స్.100’తో నిర్మాతగా కన్నడ రంగంలోకి అడుగుపెట్టను న్నారు. ‘‘ఓ యువ కన్నడ కథానాయకుడితో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అన్నారు డీఎస్ రావు. -
కొత్త ఏంజిల్
అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్లు ఈ పంజాబీ బ్యూటీ తలుపు తట్టాయి. కానీ మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారీ సొగసరి. అలా ఓ కథ నచ్చి కోలీవుడ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారామె. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కేఎస్ అదియమాన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ఒక హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ ఎంపికయ్యారు. ఈ సినిమాకు ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా ఆనంది నటిస్తారని టాక్. ఆల్రెడీ పాయల్ తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేశారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్నారు పాయల్ రాజ్‌పుత్. మరోవైపు తెలుగులో హిట్ సాధించిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తమిళంలో రీమేక్ కానుంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తారు. ఇందులో కథానాయికగా ఇంకా ఎంపిక కాలేదు. పాయల్‌నే తీసుకున్నా ఆశ్చర్యపోవడానికి లేదు. -
‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ హీరోగా ‘హిప్పీ’
సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఈ యంగ్ హీరోతో కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి యస్.థాను సినిమా చేస్తున్నారు. తుపాకి, కబాలి, వేలై ఇల్లా పట్టదారి2, స్కెచ్ లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రస్తుతం థాను కార్తికేయ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘హిప్పీ’ అనే టైటిల్ ఫైనల్ చేశారు. రేపు (శుక్రవారం) కార్తికేయ పుట్టినరోజు జరుపుకోనుండటంతో ఒక రోజు ముందుగానే ‘హిప్పీ’ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శ కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ ‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. కార్తికేయ తన తొలి చిత్రానికి భిన్నంగా కనిపిస్తారు. ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేయాల్సి ఉంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే సినిమా. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ఉంటుంద’ని తెలిపారు. నిర్మాత కలైపులి యస్.థాను మాట్లాడుతూ ‘తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గ హీరో అనిపించింది. ఆయనతో ‘హిప్పీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఎక్కడా బడ్జెట్‌కు వెనకాడకుండా భారీగా రూపొందిస్తాం’ అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘ఆర్ఎక్స్ 100 తర్వాత ఓ పెద్ద సంస్థలో అవకాశం రావడం నా అదృష్టం. కథ చాలా బావుంది. నిత్యం మన జీవితంలో జరిగే అంశాలను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది’ అని అన్నారు. -
కడపలో సందడి చేసిన హిరోయిన్ పాయల్ రాజ్‌పుత్
-
స్పెషల్ సాంగ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ
ఇటీవల ఘన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమా తోనే భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ త్వరలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌లో పాయల్ రాజ్‌పుత్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే బెల్లంకొండ సినిమాలో పాయల్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గతంలో సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో తమన్నా, కేథరిన్ థ్రెస్సాలు స్పెషల్ సాంగ్స్‌లో తళుక్కుమన్నారు. -
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్
తొలి సినిమాతోనే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అజయ్ దర్శకత్వంలో నటించేందుకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో హలోగురు ప్రేమ కోసమే సినిమాలో నటిస్తున్న రామ్.. ఆ సినిమా తరువాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. ఈ సినిమాలో రామ్ తో పాటు మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‌ను నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాను రామ్ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్మించనుంది. -
‘ఆర్ఎక్స్100’ హీరోయిన్ కొత్త సినిమా అప్డేట్
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్100. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా తొలి సినిమాలోనే బోల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే పాయల్ మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ భామ తన రెండో సినిమాకు ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భానుశంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పాయల్ యాక్షన్స్ సీన్స్ కూడా చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు సీ కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కించనున్న మరో సినిమాకు కూడా పాయల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. -
‘ఆర్ఎక్స్ 100’ హీరో ఫైర్..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరో కార్తికేయ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ప్రస్తుతం కార్తికేయతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ బైలింగ్యువల్ సినిమాకు ఓకె చెప్పిన కార్తికేయ ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కార్తికేయ నటించిన మరో సినిమా రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. సుపారి పేరుతో తెరకెక్కిన సినిమాలో కార్తికేయ నటించాడన్నదే ఆ వార్తల సారాంశం. అంతేకాదు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల లిస్ట్‌తో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. సినిమాకు కార్తికేయ పాత్ర హైలెట్ అంటూ ప్రకటించారు చిత్రయూనిట్. అయితే హీరో కార్తికేయ వెర్షన్ మరోలా ఉంది. అసలు తాను ఆ సినిమాలో నటించలేదంటున్నాడు కార్తికేయ. ‘ఆ వీడియో లో ఉన్నది నేనే. కానీ నేను ఆ సినిమాలో నటించలేదు. కేవలం డెమో రీల్ అని షూట్ చేసి దాన్ని సినిమాకి వాడుకున్నారు. షూటింగ్ త్వరలో స్టార్ చేస్తామన్నారు కానీ చేయలేదు. నేను సుపారి సినిమాలో నటించలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇక ఈ నాన్సెన్స్ ఆపాలంటూ సుపారి చిత్రయూనిట్‌ను కోరారు. అయితే సుపారి నిర్మాతలు మాత్రం కార్తికేయ ఆర్ఎక్స్ 100 సక్సెస్ తరువాత మొహం చాటేశాడంటున్నారు. This is fake.Its not my https://t.co/NHhJAc1kU6 was supposed to be DEMO shoot for a movie which the director said would start soon but never started .Now shots of that demo are used for some other movie and being picturised as if i acted in it.I request them to stop this nonsense pic.twitter.com/tXhdPTKWdr — Kartikeya (@ActorKartikeya) 3 September 2018 -
ఓ ఇంటివాడైన ‘RX 100’ దర్శకుడు
-
జనక్ జనక్.. పాయల్ బాజే!
పాలమూరు : ఇటీవల విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మనుసు దోచేసి.. యువతను ఆకట్టుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ హాబీబ్ బ్యూటీపార్లర్‌ను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కూడా పాల్గొన్నారు. హీరోయిన్ పాయల్ ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకోగా ఆమెను చూసేందుకు యువకులు పెద్దసంఖ్యలో వచ్చారు. దీంతో పార్లర్ వద్ద సందడి నెలకొంది. కార్యక్రమంలో పార్లర్ ఎండీలు నాగులవంచ వెంకట్, రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాధ, కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద మనసు చాటుకున్న ఆర్ఎక్స్ 100 చిత్రయూనిట్
-
కేరళ బాధితుల కోసం ‘ఆర్ఎక్స్ 100’ వేలం
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను కూడా సాధించింది. తాజాగా ఆర్ఎక్స్ 100 చిత్రయూనిట్ తమ పెద్ద మనసును చాటుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ కోసం తమ వంతుసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బాదితుల కోసం సినిమాలో ఉపయోగించిన ఆర్ఎక్స్ 100 వాహనాన్ని వేలానికి పెట్టారు. వేలం ద్వారా వచ్చిన మొత్తానికి కేరాళ వరద బాధితుల సహాయనిధికి అందించనున్నారు. ఈ మేరకు హీరో కార్తీకేయ, దర్శకుడు అజయ్ భూపతి వీడియో మేసెజ్‌లు రిలీజ్ చేశారు. Please support this noble cause.Send your details and bidding amount to rx100auction@gmail.com or whatsapp to 9100445588 .Minimum bid amount is 50,000₹. pic.twitter.com/ywPER3y52a — Kartikeya (@ActorKartikeya) 20 August 2018 -
నన్ను కాంప్రమైజ్ అవ్వమన్నారు: నటి
‘రోడ్డు మీద కనిపించిన రూపాన్ని చూసి వెంటనే మోహించడం.. ప్రేమ పేరుతో వల వేయడం.. మోజు తీరాక వదిలేసి మొహం చాటేయడం’... ఇవన్నీ చేయడం కొందరు అబ్బాయిల పనే కదా! అదే పని ఓ అమ్మాయి చేస్తే... వినడానికే ఆశ్చర్యం అనిపించే ఈ వి‘చిత్రం’ చూడ్డానికి ఇంకెలా ఉంటుంది? మరి అలాంటి అమ్మాయి పాత్రని తెరపై పండించడం ఇంకెంత సాహసం అనిపిస్తుంది? ఆ సాహసం చేసింది కాబట్టే పాయల్ రాజ్‌పుత్ సూపర్ పాపులర్ అయింది. ఈ పంజాబీ అమ్మాయి ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగాళ్ ఇమేజ్ సంపాదించుకుంది. ‘అదొక స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను వ్యక్తిగతంగా స్ట్రాంగ్. అయితే ‘ఇందూ’ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని మాత్రం అస్సలు ఇష్టపడను’ అంటున్న పాయల్ .. ‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా ఆఫర్లు ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ‘ఆర్ఎక్స్100’ పెద్ద హిట్టయి, నాకు పేరొచ్చిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్ అవ్వమంటూ అడుగుతున్నారు. ఈ మాటను తప్పకుండా పబ్లిష్ చేయండి. ఐ మీన్.. ఇది క్యాస్టింగ్ కౌచ్ గురించి. ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇలాంటి ప్రపోజల్‌తో నాలుగు రోజుల క్రితమే ఒకరు కలిశారు. బహుశా ఫస్ట్ మూవీలోనే బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల అలా అనుకుంటున్నారో ఏమో! కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ టాలెంట్‌తో ఈ పొజిషన్లో ఉన్నాను. అంతే తప్ప.. కాంప్రమైజ్ అయ్యో, మరో విధంగానో కాదు’’ అంటోంది పాయల్ రాజ్‌పుత్. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు.. పుట్టి పెరిగింది ఢిల్లీలో. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్స్. నాకు ఒక సోదరుడు. మాది చిన్న హ్యాపీ ఫ్యామిలీ. సినిమాల మీద చిన్నప్పటి నుంచి ఇష్టమే. అయితే కాలేజీకి ముందు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. పిరికిదాన్ని కూడా. అక్కడి నుంచే సెల్ఫ్‌మేడ్ ఉమన్‌గా మారాను. చదువుతూనే ట్యూషన్లు చెబుతూ మోడలింగ్ చేశాను. మోడలింగ్ నుంచి టీవీ రంగంలోకి ప్రవేశించాను. అలా తర్వాత పంజాబీ సినిమాలు చేశాను. అక్కడ మంచి పేరు రావడంతో ఇప్పుడు కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నాను. ఇందూ.. అందరికీ నచ్చేసింది.. ‘ఆర్ఎక్స్ 100’లో ఇందూ పాత్ర అంగీకరించేటప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలైన మాట వాస్తవం. ఇందూ క్యారెక్టర్ విన్నప్పుడు ‘ఓమై గాడ్’ అనుకున్నాను. పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కాదిది. తెస్తే మంచి పేరు తేవొచ్చు.. లేదా నా పేరు చెడగొట్టొచ్చు. తెలుగులో ఆరంభ చిత్రంలోనే పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ పోషించడమంటే... అది ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు. పైగా సినిమాలో శృంగార దృశ్యాలు కూడా ఆలోచింపజేశాయి. మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. దీనిపై మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. నాన్న తొలుత కొంచెం డిస్ట్రబ్ అయినా... చివరికి అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ నాతో కలిసి సినిమా చూశారు. ఆమెకు ఏమీ అభ్యంతరం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే పబ్లిక్ ఇందూని బాగా లవ్ చేస్తున్నారు. నిజానికి పంజాబీ సినిమాల్లో నా పాత్రలన్నీ చాలా ఒద్దికగా, సిగ్గరి అయిన అమ్మాయి పాత్రలే. ప్రస్తుతం అమ్మాయిలు బాగా డామినేటింగ్‌గా, చాలా తెలివిగా కూడా ఉంటున్నారు. కొందరైతే మగవాళ్ల కంటే కన్నింగ్‌గా కూడా ప్రవర్తిస్తున్నారు. కాని నిజ జీవితంలో ఇందూ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయెవరూ నాకు తారస పడలేదు. ఒకవేళ పరిచయమైనా... నేను దూరం పెట్టేస్తాను. డబుల్ ధమాకా.. నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో తొలిసారి తమిళ సినిమా చేశాను. అయితే ఏవో సమస్యలతో అది విడుదల కాలేదు. ఆ తర్వాత కూడా సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక డిఫరెంట్ రోల్ కోసం వెయిట్ చేశాను. అందుకే ‘ఇందూ’ పాత్రకు ఓకే చెప్పా. చాలా బాగా ప్రారంభమై.. అంతే బాగా ముగిసింది ‘ఆర్ఎక్స్ 100’ జర్నీ. ఈ నెల 15న నా పంజాబీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్టర్ 420’ కూడా రిలీజైంది. అదీ మంచి హిట్టయింది. ఇటు ‘ఆర్ఎక్స్ 100’, అటు పంజాబీ సినిమా రెండూ హిట్ కావడంతో నాకు డబుల్ ధమాకా అన్నమాట. ‘హీరోయిన్’ నా డ్రీమ్ రోల్... ఆఫర్స్ బాగా వస్తున్నాయి. అయితే నేను ఏవి పడితే అవి అంగీకరించను. ఇందూ హిట్టయింది కాబట్టి... అన్నీ అదే రకమైన నెగెటివ్ క్యారెక్టర్స్ చేయను. ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేయాలని ఉంది. ఒక అమ్మాయిగా నేను చాలా స్ట్రాంగ్. అందుకేనేమో... పవర్ఫుల్ రోల్స్, ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ అంటే ఇష్టం. ‘హీరోయిన్’ అనే సినిమాలో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. ఒక యువతి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే అలాంటి పాత్ర ప్రస్తుతానికి నా డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. ఓ రకంగా ఇందూ కూడా డ్రీమ్ రోల్ లాంటిదే. నేను నార్త్ ఇండియన్ అయినా నా ఫేస్ సౌతిండియన్లా ఉంటుంది అంటున్నారు. బహుశా మా అమ్మ గారి ఫీచర్స్ వల్ల అలా అనిపిస్తున్నానేమో. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా గుడ్ స్క్రిప్ట్, గుడ్ డైరెక్షన్, మంచి పాత్రలకే నా ప్రాధాన్యత. ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి లాంటి దర్శకులు చాలా తక్కువ. ఆయన ఈ సినిమాలో నన్ను అద్భుతంగా పోట్రైట్ చేయించారు. అతనితో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. సిటీలో సెటిల్ అవుతానేమో... స్వీట్స్ అంటే బాగా ఇష్టం. సౌతిండియా ఫ్రెండ్ నుంచి నిన్నే నాకు పెద్ద స్వీట్ ప్యాకెట్ కూడా వచ్చింది (నవ్వుతూ). ఏవి తిన్నా, రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తాను. అన్నింటికన్నా యోగాసనాలు బాగా ఇష్టం. ఈ మధ్య పంజాబ్, హైదరాబాద్ ఎక్కువగా తిరగడం వల్ల 10కిలోలు పెరిగాను. మళ్లీ తగ్గాలి. ప్రస్తుతం ముంబైలో నివస్తున్నాను. కానీ ఐ లవ్ హైదరాబాద్. ఏమో భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుతానేమో చెప్పలేను. ఇక్కడ నాకు స్నేహితులు కూడా ఏర్పడ్డారు. తెలుగులో నా తర్వాతి సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. అది అక్టోబరులో ప్రారంభమై డిసెంబరులో రిలీజ్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఇంతకు మించి వివరాలు ఇప్పుడే చెప్పలేను. ఐ యామ్ ప్రొఫెషనల్.. ఇకపై కూడా ‘ఆర్ఎక్స్ 100’లో లాంటి బోల్డ్ సీన్స్ ఉన్న పాత్రలు చేస్తారా అంటే... అది దర్శకుడు నాకు నా పాత్ర గురించి, సినిమా కథకు అవెంత వరకు అవసరమో చెప్పి కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే... ఇక్కడకి నేను నటించడానికి వచ్చాను. మంచి పాత్ర ఇస్తే... నా సత్తా ఏమిటో చూపిస్తా. ఉత్తరాది అమ్మాయిని కాబట్టి ఇన్హిబిషన్స్ తక్కువగా ఉంటాయి. అయితే నేను పూర్తిగా ప్రొఫెషనల్‌ని అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి నేనిక్కడికి రాలేదు. -
పే...ద్ద..చిన్న సినిమాలు
సినిమాల్లో పెద్దా చిన్న ఉండదు. కానీ చిన్న సినిమా ఒక్కోసారి పెద్దగా కనబడుతుంది.కథా వస్తువు గొప్పదనమే అనలేం! ఇవ్వాళ చిన్న సినిమా పెద్దగా కనబడటానికి కారణం కథ కంటే పెద్ద కథనమే! నిజానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాల మధ్య వెంట్రుక వాసంత సందు కూడా దొరికేది కాదు.ఊపిరాడక డబ్బాల్లోనే చచ్చిపోయేవి. కానీ టైమ్ మారింది. కాదు.. కాదు.. సినిమా మారింది. కాదు.. కాదు.. కాదు.. ఆడియన్స్ మారారు. సినిమాను మారుస్తున్నారు. 2018లో వచ్చిన ఆరు పే...ద్ద.. చిన్న సినిమాల దర్శకులతో మీకోసం ‘సాక్షి ఫన్డే’ స్పెషల్..! ఛలో విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018 దర్శకుడు: వెంకీ కుడుముల నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందన్న నిర్మాత: ఉష ముల్పురి సంగీతం: మహతి స్వరసాగర్ ‘ఛలో’.. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ కుడుముల. ‘ఛలో’తో పాపులర్ అయిన ఈ దర్శకుడి ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే... ∙ ఇంట్లో వాళ్లను ముందే ప్రిపేర్ చేశా! మాది భద్రాద్రి జిల్లా. హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోబోతున్నట్లు ఇంట్లో నేరుగా చెప్పకుండా ముందు అమ్మానాన్నల్ను ప్రిపేర్ చేశా. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పా. ఆ తర్వాత ‘పై చదువులు చదువుతావా?’ అని అడిగారు. లేదన్నాను. సినిమా ఫీల్డ్‌లోనే కెరీర్ అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వడంతో వాళ్లూ నో చెప్పలేదు. ∙ సోషల్ మీడియా పరిచయాలతో ఇండస్ట్రీలోకి..! కాలేజీ డేస్‌లోనే సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టేవాడ్ని. డైలాగ్స్‌ను స్టేటస్‌లుగా పెడుతుండేవాడ్ని. హీరో శివబాలాజీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రవి వీరందరూ నాకు ఇలానే పరిచయం. అలా ‘ఇంకోసారి’ సినిమా దర్శకుడు సుమన్ పాతూరి పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నాకు రైటర్ బలభద్రపాత్రుని రమణిగారు పరిచయం అయ్యారు. ఆవిడ నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశారు. నిజానికి నేను యాక్టర్ అవుదామని వెళ్లాను. కానీ తేజగారు నాలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆ టైమ్‌లో డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ యోగిగారి దగ్గర, నాగశౌర్య ‘జాదుగాడు’ సినిమాకు పనిచేశా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి దగ్గర కూడా వర్క్ చేశా. ∙ ‘ఛలో’ అలా మొదలైంది! ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నప్పుడు, ఈ సినిమా తర్వాత డైరెక్షన్ ప్రయత్నాలు స్టార్ట్ చేయమన్నారు త్రివిక్రమ్‌గారు. ‘జాదుగాడు’ సినిమా టైమ్‌లో హీరో నాగశౌర్య పరిచయం అయ్యారు. ‘మనం సినిమా చేద్దాం కథ రెడీ చేయ్!’ అన్నారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఓ నిర్మాతకు కథ చెప్పాం. ‘కథ కమర్షియల్‌గా ఉంది. వేరే హీరోకి వెళ్దామా?’ అన్నారు. శౌర్యతో ఇంకో లవ్‌స్టోరీ చేయవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. ‘నేను శౌర్యతోనే చేస్తాను’ అని చెప్పా. ఆ సమయంలోనే శౌర్య తన పేరెంట్స్‌కు నేను చెప్పిన కథ చెప్పాడు. వాళ్లు ఎగై్జట్ అయ్యారు. అలా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా ‘ఛలో’ మొదలైంది. ∙ ‘ఛలో’ కథ అప్పుడే పుట్టింది! ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా మా ఊరు అశ్వరావుపేట తెలంగాణ బోర్డర్లోకి వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర్నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఓకే.. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ అయితే ఎలా ఉంటుంది? హీరో తమిళనాడు అమ్మాయిని లవ్ చేస్తే? ఈ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే వర్కౌట్ అవుతుంది కదా అనిపించింది. అలా ‘ఛలో’ సబ్జెక్ట్‌ను టేకప్ చేశాను. ∙ నితిన్‌తో చేస్తున్నా! నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. తొలిప్రేమ విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2018 దర్శకుడు: వెంకీ అట్లూరి నటీనటులు: వరుణ్‌తేజ్, రాశిఖన్నా నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ సంగీతం: ఎస్. థమన్ వరుణ్‌తేజ్‌కు హీరోగా ఫస్ట్ మేజర్ బాక్సాఫీస్ హిట్ ‘ఫిదా’ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా అంతే పెద్ద హిట్. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒక సింపుల్ ప్రేమకథనే రిఫ్రెషింగ్ కథనంతో నడిపించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ∙ యాక్టింగ్ నుంచి డైరెక్షన్‌కి! నాది హైదరాబాద్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు రైటింగ్‌పై ఆసక్తి కలిగింది. ముందు ‘స్నేహగీతం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత నాకు యాక్టింగ్ కన్నా, రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటేనే మక్కువ ఏర్పడింది. అందుకే ‘స్నేహగీతం’ సినిమా చేసిన తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్‌పై ఫోకస్ పెట్టాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్లీ ‘తొలిప్రేమ’తో డైరెక్టర్ అయ్యాను. నిజానికి ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్.. టీమ్ వర్క్ అని చెబుతా. ∙ ‘తొలిప్రేమ’కు నో చెప్పారు! మొదట్లో ‘తొలిప్రేమ’ కథకు చాలా మంది ఓకే చెప్పలేదు. ఆ తర్వాతే అది దాని దారి వెతుక్కొని ఇలా వచ్చింది. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఎవరి పని వాళ్లని చేయనిస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది 95 పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక ఫైవ్ ఫర్సెంట్ లక్ ఉండాలి. ‘తొలిప్రేమ’ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. ∙ పొలిటికల్ డ్రామా చేస్తా! లవ్‌స్టోరీస్‌తో పాటు నాకు ఫ్యామిలీ డ్రామాలంటే ఆసక్తి ఎక్కువ. పొలిటికల్ డ్రామాలన్నా ఇష్టమే. భవిష్యత్‌లో నానుంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాను ఆశించవచ్చు. ∙ అఖిల్‌తో సినిమా చేస్తున్నా! ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు దృష్టంతా ఈ సినిమాపైనే. ఒక సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఎఫర్ట్ అంతా సినిమా మీదనే పెడతా. ప్యారలల్‌గా మరో సినిమా చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఏకాగ్రత తగ్గుతుందేమోనని నా భయం. మణిరత్నం, త్రివిక్రమ్ నా ఫేవరైట్ డైరెక్టర్స్. వాళ్ల నుంచి ఎక్కువ ఇన్‌స్పయిర్ అయ్యాననే చెప్తా. అ! విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018 దర్శకుడు: ప్రశాంత్ వర్మ నటీనటులు: కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, నిత్యామీనన్ నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని సంగీతం: మార్క్ కె. రాబిన్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘అ!’తో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. ఒక మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు అర్బన్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కథల్ని తెరకెక్కించాలన్న డ్రీమ్‌తో ముందుకెళ్తానంటున్న ప్రశాంత్ వర్మ తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు.... ∙ సినిమాలను పిచ్చిగా చూసేవాడ్ని! మాది భీమవరం దగ్గర పాలకొల్లు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్లో మంచి స్టూడెంట్‌ని. చిన్నప్పుడు ప్రతి సినిమా చూసేవాణ్ని. అయితే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. తర్వాత ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా గురించి తెలుసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఆ తర్వాత యాడ్స్ చేశాను. ∙ ‘అ!’ నా 33వ కథ... ‘అ!’.. ఫ్రస్ట్రేషన్‌తో రాసిన కథ. 2017 న్యూ ఇయర్‌కు నా కొత్త సినిమా స్టార్ట్ కావల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అప్పుడు ఈ కథ రాశాను. ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక కొత్త కథ చెబుదాం అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ పిక్ చేసుకున్నాను. ఇది నేను రాసిన 33వ కథ. అలా అని ముందు 32 కథలు రిజెక్ట్ అయ్యాయని అనను. ఏవేవో కారణాలతో సినిమా ఫైనలైజ్ కాలేదు. ‘అ!’ సినిమా నా సొంత ప్రొడక్షన్లోనే చిన్న సినిమాలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్నాను. మెల్లిగా కాజల్, నాని వచ్చి పెద్ద ప్రాజెక్ట్ అయింది. ∙ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు! మన దగ్గర మాత్రమే ‘నా కథతో నేనే సినిమా తీస్తాను’ అనుకుంటాం. హాలీవుడ్లో ఒకరు కథ రాస్తారు. మరొకరు స్క్రీన్‌ప్లే. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒక డైరెక్టర్ని నియమించుకుంటుంది. ఇలాగే బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ నా దగ్గరికొచ్చింది. ‘అ!’ పనుల్లో బిజీగా ఉండి చేయడం కుదర్లేదు. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, మిగతా భాగమంతా వెళ్లి పూర్తి చేసి వచ్చాను. డైరెక్షన్ అనేది ఒక జాబ్ అని అనుకుంటాను నేను. అలానే వెళ్లి ఆ సినిమా చేసి వచ్చాను. నా తర్వాతి సినిమా వేరే అతని కథతో చేస్తున్నాను. ‘కథ’ అని అతనికి టైటిల్ వేస్తాను. నాకెలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు. ∙ ఆ బ్రాండ్ నా డ్రీమ్! ‘స్క్రిప్ట్ విల్లా’ అనే కంపెనీ ద్వారా మంచి కథల కోసం వెతికే ప్రొడక్షన్ హౌస్‌లకు, యాక్టర్స్‌కు మా సంస్థ నుంచి కథలను అందించే ప్రయత్నం మొదలుపెడుతున్నా. వీలైనన్ని కొత్త కథలు ఆడియన్స్‌కు చెప్పడమే నా డ్రీమ్. ‘వీడు ఇప్పటివరకూ మనం అనుకున్నట్టుగా కాకుండా, కొత్తగా కథలు చెబుతాడ్రా!’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఆర్ఎక్స్ 100 విడుదల తేదీ: జూలై 12, 2018 దర్శకుడు: అజయ్ భూపతి నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నిర్మాత: అశోక్‌రెడ్డి సంగీతం: చైతన్ భరద్వాజ్ 2018లో చిన్న సినిమాల్లో అతిపెద్ద సెన్సేషన్ ‘ఆర్ఎక్స్100’. కొత్త దర్శకుడు అజయ్ భూపతి కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి. ఫ్యూచర్లో ఎంత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చినా వాళ్లను తన స్టైల్లోకి తీసుకొచ్చుకొని సినిమా చేస్తానంటున్న అజయ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే.. ∙ సినిమాలో మా ఊరే! మాది ఆత్రేయపురం. సినిమాలో మీరు చూసిందే. నా ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా మా ఊర్లోనే చదువుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా నాన్న గారు ‘నీకు నేనేం ఆస్తులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్విలా ఉండు. అలా ఉండు అని చెప్పొచ్చు. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అన్నారు. ∙ అప్పుడే ఫిక్స్ అయ్యా! నా పదో తరగతిలోనే ఫిక్స్ అయ్యా, సినిమా డైరెక్టర్ అవ్వాలని. ఆ తర్వాత చదువుకోవడం కూడా టైమ్ వేస్ట్‌లా ఫీల్ అయ్యాను. ఎవ్వరైనా సరే వాళ్లేమవ్వాలనుకుంటున్నారు అనే చిన్న క్లారిటీ ఉంటే చాలు.. అది ఎంత కష్టమైనా చేసేయొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని ‘రైడ్’, రవితేజ ‘వీర’ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత మా బాస్ రామ్‌గోపాల్ వర్మ ‘అటాక్’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ సినిమాలకు వర్క్ చేశాను. ∙ ఎన్నో అవమానాలు.. చీదరింపులు... సినిమాల్లోకి రావాలనుకున్నాక అవమానాలు, చీదరింపులు, పస్తులు ఉండటాలు... అన్నీ ఉన్నాయి. కానీ ‘ఆర్ఎక్స్ 100’ కథను చాలామందికి చెప్పా. ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు కానీ, వాళ్ల వాళ్ల కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదు. కార్తికేయకి బాగా నచ్చేసింది. తర్వాత నిర్మాత అశోక్ వచ్చారు. నాకు రియలిస్టిక్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్ బావుంటుందని గట్టి నమ్మకం ఉండేది. నేను తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు ఈ సబ్జెక్ట్‌ని. ‘ఆర్ఎక్స్ 100’లో మీరు చూసిన హీరో క్యారెక్టర్ మన ఊర్లో కనబడే రెబల్ కుర్రాడిలానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్, రాంకీగారి పాత్ర.. ఇలా ప్రతీ పాత్రను ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా డిజైన్ చే శాను. ∙ నెక్ట్స్ మల్టీస్టారర్... ‘ఆర్ఎక్స్100’ సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే ఏదీ ఫైనల్ చేయలేదు. కానీ నెక్ట్స్ సినిమా మాత్రం మల్టీస్టారర్ ఉంటుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి వ్యక్తుల కథ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. రెండు నెలల్లో ఫుల్ డీటైల్స్ అనౌన్స్ చేస్తాను. ఏ కథ చెప్పినా రియలిస్టిక్ అప్రోచ్‌తో చెప్పడమే నా లక్ష్యం. అలాగే ప్రభాస్, రామ్ చరణ్‌తో సినిమా చేయడం నా డ్రీమ్. ఒకవేళ మా స్టైల్లో సినిమా కావాలని వాళ్లు అడిగినా స్టోరీ సిట్టింగ్స్‌లో వాళ్లను నా దారిలోకి తెచ్చేసి నా స్టైల్లో సినిమా తీసేస్తా! చి.ల.సౌ విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: రాహుల్ రవీంద్రన్ నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ నిర్మాతలు: నాగార్జున, జశ్వంత్ నడిపల్లి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’. జనరల్‌గా చాలా మంది నటీనటులు చెప్పే మాట ఇది. అయితే రాహుల్ రవీంద్రన్ మాత్రం ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అంటున్నారు. హీరోగా సినిమాలతో మెప్పిస్తూనే ఉన్న రాహుల్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సినిమా ఈ నెల్లోనే విడుదలై సూపర్ హిట్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. డైరెక్టర్‌గా మారిన ఈ యాక్టర్ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పిన విశేషాలు... ∙ చిన్నప్పట్నుంచీ కథలంటే ఇష్టం! నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే! నాన్న ఎన్.రవీంద్రన్, అమ్మ వసుమతి. నాన్న బిజినెస్‌మేన్. చిన్నప్పట్నుంచీ అమ్మ రామాయణం, మహాభారతం కథలు చెబుతూ, యాక్టింగ్ చేసి చూపించేది. అప్పుడే నాకు కథలంటే ఇష్టం పెరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నంగారి ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) సినిమాను టీవీలో చూశా. చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించింది. ఓ సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అనిపించింది. అప్పట్నుంచి సినిమా, డైరెక్షన్ సైడ్ ఇష్టం పుట్టింది. ఇంటర్‌కి వచ్చాక ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుని డిసైడ్ అయ్యా. నటుడవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ∙ అసిస్టెంట్‌గా చాన్స్ దొరకలేదు.. హీరో అయ్యా! మా ఫ్యామిలీలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. మాది ఆ నేపథ్యం కాదు. అందుకే ఫస్ట్ చదువు పూర్తి చేసి తర్వాత ప్రయత్నిద్దామనుకుని అహ్మదాబాద్‌లో ‘మైకా’ కళాశాలలో ఎంబీఏ మార్కెటింగ్ చేశా. తర్వాత బాంబేలో ఏడాదిన్నర పాటు రేడియో సిటీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా చేశా. 2007లో చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నా. కానీ, ఎవరి వద్దా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఓ రోజు ఆడిషన్స్‌కి రమ్మని కాల్ వచ్చింది. వెళ్లగానే యాక్టింగ్ రోల్ అన్నారు. ఏ పాత్ర అంటే.. హీరో అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్ రాలేదు. హీరోగా వచ్చింది. చేస్తే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు. డబ్బులు కూడా వస్తాయని చేశా. రవివర్మన్ డైరెక్షన్లో ‘మాస్కోవిన్ కావేరి’ చిత్రం చేశా. ∙ ‘అందాల రాక్షసి’ మొత్తం మార్చేసింది! ‘అందాల రాక్షసి’ చిత్రా నికి ఇద్దరు హీరోలు కావాలి. నవీన్ చంద్ర ఓ హీరోగా ఓకే. రెండో హీరో సెట్ అవడం లేదు. మీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? అని పాటల రచయిత లక్ష్మీ భూపాల్‌గారు అహ్మదాబాద్‌లో నాతోపాటు చదువుకున్న ఫ్రెండ్ దీప్తిని అడిగారు. తను నా గురించి చెప్పింది. తెలుగు రాదు అంది. పర్లేదు ఫొటోలు పంపమన్నారు. దీప్తికి పంపా. హను రాఘవపూడిగారు ఆడిషన్స్ చేసి ఓకే చేశారు. ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. సాయి కొర్రపాటిగారు బాగా ప్రమోషన్ చేశారు. నాకు, నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠికి మంచి లైఫ్ వచ్చింది. ఆ సినిమా విడుదలై ఆరేళ్లయింది. ∙ డైరెక్షన్ ట్రయల్స్.. హీరో అయినా, ఆ వెంటనే దర్శకుడిగానూ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాలుగున్నరేళ్ల క్రితం ఓ హీరోకి ‘చిలసౌ’ కథ చెప్పా. అప్పుడది వర్కవుట్ అవ్వలేదు. ఈలోగా మళ్లీ హీరోగా బిజీ. తర్వాత సుశాంత్‌కి చెప్పా. ఓకే. నచ్చింది అన్నాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్‌కి చెప్పాడు. ఆయన నిర్మాతలు భరత్, జశ్వంత్‌లకు చెప్పారు. వారు కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై ఇంత పెద్ద హిట్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. ∙ చిన్మయి హ్యాపీ! ‘అందాల రాక్షసి’ టైమ్‌లో పరిచయమైన సింగర్ చిన్మయి కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండయింది. తను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేశా. తను కొద్దికాలం ఆలోచించి ఓకే చెప్పింది. తను నాకు, నేను తనకు బలం. ‘చి.ల.సౌ.’ రిలీజయ్యాక, నేను నా కలను సాధించినందుకు తను ఎంతో హ్యాపీ! ∙ యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేస్తా! తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘చిలసౌ’ రిలీజ్‌కి ముందే చాలామంది కలిసి సినిమాలు చేయమన్నారు. అయితే రెండో సినిమా అన్నపూర్ణ బ్యానర్లో చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నా. ఇకపై డైరెక్షన్‌కే నా మొదటి ప్రాధాన్యత. మంచి సినిమాలు తీస్తా. అయితే యాక్టింగ్ వదులుకోను. ప్రస్తుతం ‘యూ టర్న్’, ‘దృష్టి’ సినిమాలు చేశా. త్వరలో రిలీజ్ కానున్నాయి. గూఢచారి విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: శశికిరణ్ తిక్క నటీనటులు: అడివిశేష్, శోభిత దూళిపాల, మధుశాలిని నిర్మాతలు: అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంగీతం: శ్రీచరణ్ పాకాల హీరో అడివి శేష్ ‘క్షణం’ సినిమాతో రెండేళ్ల క్రితం న్యూ వేవ్ సినిమా అంటూ రవికాంత్ పేరు అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. మళ్లీ రెండేళ్లకు అదే న్యూ వేవ్ అంటూ ‘గూఢచారి’తో మరో కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కను పరిచయం చేశారు. ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిఫ్రెషింగ్ స్పై థ్రిల్లర్‌గా, లో బడ్జెట్లో తెరకెక్కిన బెస్ట్ విజువల్స్‌తో మెప్పిస్తోన్న ఈ సినిమా గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి శశికిరణ్ మాటల్లో.... ∙ కేరాఫ్ అమలాపురం నేను పుట్టింది అమలాపురంలో. అమ్మానాన్న రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. నాన్న గతంలో కొబ్బరి, కన్స్ట్రక్షన్ బిజినెస్‌లు చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. అన్నయ్య రాజమండ్రిలో బిజినెస్ చూసుకుంటున్నారు. ∙ 15 మంది నిర్మాతలకు కథ చెప్పా! నాకు మొదట్నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్, రైటింగ్‌లో రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నా. ఇండియాకొచ్చి శేఖర్ కమ్ములగారి దగ్గర ‘లీడర్’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ‘లీడర్’కు పనిచేసిన తర్వాత కొన్ని కథలు రాసుకొని దాదాపు 15మంది నిర్మాతలకి చెప్పా. కొందరు చేద్దామన్నా రకరకాల కారణాల వల్ల కుదర్లేదు. ఓ సినిమా అయితే రేపు లాంచ్ అనగా ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో ఫ్రెండ్స్‌కి రైటింగ్ సైడ్ హెల్ప్ చేశా. అడివి శేష్ ‘కర్మ’ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేశా. ∙ ‘గూఢచారి’ అలా పుట్టిందే! ‘కర్మ’ సినిమా అప్పుడే అడివి శేష్‌తో మంచి స్నేహం కుదిరింది. శేష్ రాసిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ కథను ఆయనతో కలిసి నేను, రాహుల్ పాకాల (రైటర్) ఎనిమిది నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేశాం. కథని అబ్బూరి రవిగారికి వినిపించాం. ఆయన సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. ∙ ఇంత పెద్ద సక్సెస్ ఊహించలేదు! ‘గూఢచారి’ హిట్ అవుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు. ఈ సినిమా సక్సెస్ కాగానే చాలా మంది నిర్మాతలు అడిగారు. ఇంకా ఎవరి వద్దా అడ్వాన్సులు తీసుకోలేదు. ఎవరితో చేయాలన్నది నిర్ణయించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పని సంతృప్తినివ్వడమే ముఖ్యం. నావల్ల నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ∙ అన్ని జానర్స్ చెయ్యాలి! స్పై థ్రిల్లర్‌తో డెబ్యూట్ ఇచ్చినా నాకు కామెడీ అంటే ఇష్టం. ఫ్యూచర్లో అన్ని జానర్స్‌లో సినిమాలు చేయాలనుంది. నాకిష్టమైన దర్శకుల నుంచి ఇన్స్పైరై ఇంకా బాగా పని చేయాలనుకుంటా. – సాక్షి సినిమా డెస్క్ -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌లో టాప్ హీరోయిన్!
టాలీవుడ్లో ఈ ఏడాది సంచలనం రేపిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ కొట్టింది. ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉందంటూ ఎన్ని విమర్శలు వచ్చినా.. అవి సినిమా సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఇక ఇలాంటి సంచలనం సృష్టించిన సినిమా వస్తే.. ఊరికే ఉంటారా? ఇతరా భాషల వాళ్లు రీమేక్ అంటూ ఎగబడతారు. ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ ‘అర్జున్‌రెడ్డి’ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా... ‘ఆర్ఎక్స్ 100’ను ఆది పినిశెట్టి హీరోగా తమిళంలో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్రను డామినేట్ చేస్తూ.. హీరోయిన్ పాత్ర ఉంటుంది. మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆదితో ఇదివరకే నటించిన తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఇక తాప్సీ.. పాయల్ రాజ్‌పుత్‌ను మరిపించేలా ఘాటు సీన్లలో ఏ మేరకు నటిస్తుందో చూడాలి. ‘గుండెల్లో గోదారి’, విడుదలకు సిద్దంగా ఉన్న ‘నీవెవరో’ సినిమాల్లో ఆది, తాప్సీలు కలిసి నటించారు. -
తమిళ ‘ఆర్ఎక్స్ 100’లో ఆది!
బోల్డ్ కంటెంట్‌తో భారీ హిట్లు కొడుతున్నారు నూతన దర్శకులు. ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి వెళ్తున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలతో సందీప్ రెడ్డి వంగా, అజయ్ భూపతి తమ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే అర్జున్‌రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఆర్ ఎక్స్ 100 మూవీని కూడా తమిళ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్ తెలుగునాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్100. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాడు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మంచి విజయం సాధించటమే కాదు నిర్మాతకు కాసుల పంట పండించింది. అందుకే తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడికి నిర్మాత అశోక్ గుమ్మకొండ ఓ కాస్ట్లీ బహుమతి ఇచ్చారు. అజయ్ భూపతికి జీప్ కంపెనీ కారును అందించారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాలో రావూ రమేష్. రాంఖీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చైతన్య భరద్వాజ్ సంగీతమందించారు. -
కాలేజీలో ఐటమ్ అని పిలిచేవారు
‘నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది. కానీ బ్రేకప్ భయ్యా..’ అంటూ చెప్పారు ఆర్ఎక్స్ 100 మూవీతో యూత్‌ను ఆకట్టుకున్న కార్తికేయరెడ్డి గుమ్మకొండ. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అనేక కష్టాలు ఎదుర్కొన్న కార్తికేయ.. తన సినీ, పర్సనల్ లైఫ్ గురించి ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు ఆయన మాటల్లోనే.... శ్రీనగర్‌కాలనీ: హైదరాబాద్‌లోని వనస్థలిపురం నా అడ్డా. అమ్మానాన్నలు విద్యావంతులు. మాకు వనస్థలిపురంలో నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలని ఇంట్లో వాళ్ల కోరిక. కానీ నాకేమో డ్యాన్స్ అంటే పిచ్చి. స్కూలింగ్ సమయంలో పొట్టిగా 93 కిలోలు ఉండేవాణ్ని. అయినా కల్చరల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేవాణ్ని. ఇంటర్ హైదరాబాద్‌లో, బీటెక్ వరంగల్ ఎన్ఐటీలో పూర్తి చేశాను. ఐటమ్ అనేవారు... ఇంటర్ తర్వాత బాగా హైట్ పెరిగాను. బాడీ బిల్డింగ్‌పై దృష్టిసారించాను. మంచి ఫిజిక్ సాధించాను. ఇక అమ్మాయిల్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది. కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటూ అమ్మాయిలతో ఉండే సరికి కాలేజీలో ఐటమ్ అని పిలిచేవారు. నేను కల్చరల్ సెక్రటరీగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. కళాశాలలో గొడవలు జరుగుతుండేవి. అందరూ నన్ను ఐటమ్ అంటుంటే... రెచ్చిపోయి డ్యాన్స్ చేసేవాడిని. అమ్మాయిల నుంచి ఫుల్ సపోర్ట్ ఉండేది. అమ్మ వద్దంది... బీటెక్ అయిపోయాక యాక్టర్ అవుతానంటే అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఒప్పించి సినీ రంగంలోకి దిగాను. నాకు ఎవరూ తెలియదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. బేసిక్‌గా నాకు నటన, డ్యాన్స్ తప్ప ఇంకేమీ తెలియదు. సన్నిహితుల సలహా మేరకు సుబ్బారావు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. తర్వాత ఆడిషన్స్‌కు వెళ్లాను. ‘బాడీతో పాటు మంచి హైట్ ఉన్నావు. కానీ బడ్జెట్ లేదు. నీ సహకారం కావాలి’ అని అడిగేవారు. నాకు తెలియక ఇద్దరి దగ్గర ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా అనుభవం వచ్చింది. కొన్ని రోజులకు ఓ సినిమా ప్రారంభమై పూర్తయింది. కానీ రిలీజ్ కాలేదు. చాలా బాధపడ్డాను. నాకే ఎందుకిలా జరుగుతోందని అనుకున్నాను. ఆ తర్వాత ‘ప్రేమలో మీ కార్తీక్’ అనే సినిమా చేశాను. అయితే అది రిలీజ్ అయిందని ఎవరికీ తెలియదు. అలా సినిమా కష్టాలు ఎదుర్కొన్నాక ఇంట్లో ప్రెజర్ పెట్టారు. కానీ ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పాను. డైరెక్టర్ అజయ్ పిలుపు... డైరెక్టర్ అజయ్ భూపతి ఓ లవ్ స్టోరీ స్క్రిప్ట్‌తో చాలామందిని కలిశారు. కానీ కుదరలేదు. నా సన్నిహితుడు రమేష్ ద్వారా ఆయనకు పరిచయమయ్యారు. నా గురించి తెలుసుకొని స్టోరీ చెప్పారు. తొలి భాగం విన్నాక ఈ సినిమా నాకు లైఫ్ ఇస్తుందని అనుకున్నాను. కానీ చాలా డౌట్స్ ఉండేవి. అయితే రెండో భాగం చెప్పాక తెలియని ఉద్వేగం ఏర్పడింది. కొత్తదనంతో ఎంతో డెడికేషన్ ఉన్న దర్శకుడు అజయ్భూపతిపై రెట్టింపు నమ్మకం ఏర్పడింది. ప్రొడ్యూసర్స్ కోసం వెతికాం. నాలాంటి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారికి ఎవరు నిర్మాతగా ముందుకొస్తారు. చివరికి అజయ్‌భూపతి, మా బాబా య్ అశోక్‌రెడ్డితో సినిమాను పట్టాలెక్కించాం. మొదట సినిమాకు ‘యమహా ఆర్ఎక్స్ 100’ అనుకున్నాం. తర్వాత ఆర్ఎక్స్ 100గా పెట్టాం. పోస్టర్స్‌తోనే సినిమా మీద హైప్ వచ్చింది. ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ అయ్యాక క్లాస్ కన్నా మాస్ ఆడియన్స్, యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. మేము అనుకున్న దానికన్నా మూడు రెట్లు రెట్టింపు విజయం లభించింది. దేవి థియేటర్లో ఆల్‌టైమ్ రికార్డ్ వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. అర్జున్‌రెడ్డిలా నువ్వు మరో విజయ్ దేవరకొండ అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సినిమాకు కీలకం. చాలా అద్భుతంగా నటించింది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ యువత హృదయాలను రంజిపచేసింది. ఆ గుర్తింపు కావాలి... డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. ‘సాక్షి’, పూరి జగన్నాథ్ నిర్వహించిన షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్‌లో మా లఘు చిత్రానికి అవార్డు వచ్చింది. పెద్ద స్టార్ అవ్వాలని లేదు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా విభిన్న పాత్రలు చేయాలని ఉంది. విభిన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ధ్యేయం. యాటీట్యూడ్ నచ్చి... నాకో లవ్ స్టోరీ కూడా ఉంది. బీటెక్‌లో ఓ అమ్మాయికి చాలామంది ట్రై చేశారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నేనూ ప్రయత్నించాను. పట్టించుకునేది కాదు. కానీ నా యాటీట్యూడ్ నచ్చి... చివరకు లవ్ యాక్సెప్ట్ చేసింది. అయితే కాలేజీ ముగిసిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. కామన్ రీజన్స్‌తోనే మా లవ్ బ్రేకప్ అయింది. నిజం చెప్పాలంటే నా సినిమా పిచ్చితోనే గ్యాప్ ఏర్పడి దూరమయ్యాను. తర్వాత లవ్ ఫెయిల్యూర్ బాధను అనుభవించాను. సినిమా చేయాలనే కసితో సిక్స్ ప్యాక్ చేశాను. కాలేజీ డేస్‌లో ఓ సీనియర్‌తో కలిసి 7 షార్ట్ ఫిలిమ్స్ తీశాను. ఇంకో విషయం ఏమిటంటే కాలేజీల్లో పరీక్షలుంటే అందరూ చదివేవాళ్లు. కానీ నేను జిమ్‌కు వెళ్లి మరింతగా బిల్డ్ చేసేవాడిని. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాణ్ని. -
రష్మీ ఫైట్ చేస్తే...
జై, రష్మీ గౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో యూ అండ్ ఐ సమర్పణలో ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘అంతకు మించి’. సతీష్, ఎ. పద్మనాభరెడ్డి, జై నిర్మించారు. భాను, కన్నా సహ నిర్మాతలు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ‘ఆర్ఎక్స్ 100’ మూవీ దర్శకుడు అజయ్ భూపతితో ఎనౌన్స్మెంట్ చేయించారు చిత్రబృందం. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లా డుతూ– ‘‘ట్రైలర్, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమా నిర్మాత కమ్ హీరో జై చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘దర్శకుడు సుకుమార్‌గారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. రష్మిగారు చాలా బాగా నటించారు. జై అనుభవం ఉన్న నటుడిలా యాక్ట్ చేశాడు’’ అన్నారు జానీ. ‘‘అంతకుమించి’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూశాక ఆడియన్స్‌కు అర్థం అవుతుంది’’ అన్నారు జై. ‘‘అందరి ఎఫర్ట్ ఈ ‘అంతకు మించి’ సినిమా. నిర్మాతల ముఖాల్లో నవ్వు కనబడితే తృప్తిగా ఉంటుంది. ఈ చిత్రం నిర్మాతల ముఖాల్లో ఆ నవ్వు చూశా. హీరో జైకి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఈ సినిమాలో నేను డూప్స్ లేకుండా స్టంట్స్ చేశా’’ అన్నారు రష్మీ గౌతమ్. అజయ్ ఘోష్, టిఎన్ఆర్, మధునందన్, హర్ష నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
కొట్టాడయ్యో లక్కీ చాన్స్
‘ఆర్ఎక్స్ 100’ పేరు చెబితే గతంలో బైక్ గుర్తొచ్చేది. ఇప్పుడు సినిమా గుర్తుకొస్తోంది. హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌లు ‘ఆర్ఎక్స్ 100’ బైక్‌లా ఇండస్ట్రీకి దూసుకొచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కార్తికేయ, పాయల్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. కార్తికేయకు అయితే తమిళ ఇండస్ట్రీ పెద్ద నిర్మాత నుంచి కబురొచ్చింది. ‘తుపాకి, తేరి, కబాలి’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్.థాను బ్యానర్లో తెరకెక్కనున్న తెలుగు చిత్రంలో కార్తికేయ నటించనున్నారు. ఒక్క చిత్రంతోనే అంత పెద్ద నిర్మాతతో పనిచేసే అవకాశం రావడం లక్కీ చాన్సే అంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా రెండో పెద్ద ప్రాజెక్ట్‌కు పునాది పడింది. నాకు ఇష్టమైన ‘నువ్వు నేను ప్రేమ’ (సూర్య, జ్యోతిక నటించిన ‘జిల్లున్ను ఒరు కాదల్’కి డబ్బింగ్) సినిమా తెరకెక్కించిన టీఎన్ కృష్ణతో సినిమా చేయబోతున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ చూసి నా నటనను మెచ్చుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి అద్భుతమైన కథ వినిపించారు. లెజెండరీ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాత కావడం హ్యాపీ. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తారు’’ అన్నారు కార్తికేయ. -
జూలైలో బాక్సాఫీస్ వెలవెల
సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు వేడెక్కాయి. రంగస్థలం, భరత్ నేను, మహానటి లాంటి సినిమాలతో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆ తరువాత సమ్మోహనం సినిమా ఆ ఊపును కంటిన్యూ చేసింది. సమ్మర్లో థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. ప్రథమార్దం టాలీవుడ్‌కు మరిచిపోలేని హిట్లు వచ్చాయి. ప్రథమార్దంలో క్రియేట్ అయిన బాక్సాఫీస్ రికార్డులు ఇప్పట్లో చెరిగిపోయేలా లేవు. ద్వితీయార్దాన్ని ఎంతో ఆశగా మొదలుపెట్టినా.. జూలై మాసం మాత్రం టాలీవుడ్‌కు అంతగా కలిసిరాలేదు. మొదటి వారం రిలీజైన పంతం, తేజ్ ఐ లవ్ యూ చతికిలబడ్డాయి. ఇక రెండోవారం విజేత, ఆర్ఎక్స్ 100, చినబాబు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కాస్త డిఫరెంట్‌గా, బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఆర్ఎక్స్ 100ను మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా భారీ ఓపెనింగ్స్‌తో మొదలై.. మంచి కలెక్షన్లను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన మురళీ శర్మకు ప్రశంసలు దక్కాయి కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. కార్తీ హీరోగా వచ్చిన ‘చినబాబు’ సినిమా ఎప్పటిలాగే తమిళ నేటివిటీ ఎక్కువయ్యే సరికి తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. మూడోవారంలో వచ్చిన ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్, లవర్, పరిచయం సినిమాల్లో ... మంచు లక్ష్మి ప్రధాన ప్రాతలో వచ్చిన ‘వైఫ్ ఆఫ్ రామ్’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఆ నలుగురు ఫేమ్ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ‘ఆటగదరా శివ’కు మంచి టాక్ దక్కినా... కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఇక ఎప్పటిలాగానే రాజ్‌తరుణ్ ‘లవర్’ సినిమాతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ప్రమోషన్స్‌లో చెప్పినంత విషయం సినిమాలో లేకపోయే సరికి ‘పరిచయం’ ఆకట్టుకోలేకపోయింది. జూలై చివరి వారంలో సాక్ష్యం, హ్యాపి వెడ్డింగ్, పెదవి దాటని మాటొకటుంది, మోహిని సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సాక్ష్యం, హ్యాపి వెడ్డింగ్‌కు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేశారు. పంచ భూతాల కాన్సెప్ట్‌తో వచ్చిన ‘సాక్ష్యం’.. రొటీన్ కథా, కథనాలతో వచ్చినా.. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సాక్ష్యం నిలబడింది. మెగా డాటర్ నిహారిక ‘హ్యాపి వెడ్డింగ్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. ఇక త్రిష లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మోహిని’, పెదవి దాటని మాటకటుంది ప్రేక్షకులను థియేటర్స్ వైపు రప్పించలేకపోయాయి. ఇక ఆగస్ట్‌లో రిలీజయ్యే గూఢాచారి, శైలజా రెడ్డి అల్లుడు, గీతా గోవిందం, శ్రీనివాస కళ్యాణం, ఆటగాళ్లు, నర్తనశాల లాంటి సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దాహం తీరుతుందో లేదో చూడాలి. - బండ కళ్యాణ్ -
టాలీవుడ్లో యువ సంగీత దర్శకుల హవా
శ్రీనగర్‌కాలనీ: ‘పిల్లా.. రా.. అందాల రాక్షసివే’ పాటతో ఇప్పుడు కుర్రకారు ఊగిపోతున్నారు. ఎవరిమొబైల్లో చూసినా ఇదే హోరెత్తుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని ఈ పాటకు యువత ఫిదాఅయిపోయింది. మొబైల్స్ నుంచి సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. అంతేకాకుండా‘మళ్ళీరావా’ చిత్రంలోని పాటలు, ఇటీవలే విడుదలైన ‘సమ్మోహనం’.. ‘చి..ల..సౌ’.. ‘సాక్ష్యం’.. చిత్రాల్లోని గీతాలు సంగీత ప్రియుల మనసును దోచుకున్నాయి. కానీ ఈ పాటల వెనుక ఉన్న తెలుగు యువ సంగీత దర్శకుల గురించి చాలా మందికి తెలిసుండదు. ఓ సినిమాలోని పాటలు బాగున్నాంటే ఆ చిత్రం హిట్టే. అలాంటి సంగీతం అందించాలంటే ఆ మ్యూజిక్ దర్శకుడికి ప్రేక్షకుల హృదయాలను రంజినచేసే సృజనాత్మకతతో పాటు వారి నాడి తెలుసుండాలి. కానీ అదంత సులువు కాదు. ప్రస్తుతంమన యువ తెలుగు సంగీత దర్శకులు ఉన్నత చదువులు చదివి సంగీతం మీద ప్రేమతో ఇటు వచ్చారు.తమ విశేష ప్రతిభతో ప్రేక్షకుల నాడి పట్టుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో మధురమైన పాటలతో యువతకు చేరువైన యువ సంగీత దర్శకులుతమ సినీ ప్రయాణ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. యడవల్లి ప్రభాకర్ చైతన్య ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని పాటలు ఇంతగా యువతను ఆకట్టుకుంటాయని అనుకోలేదు. చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మాది వైజాగ్. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. నాకు కీబోర్డ్‌పై పట్టుంది. కానీ చదువుల వల్ల పూర్తి సమయం కేటాయించలేదు. గీతం యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ చేసి అనంతరం ఐఆర్‌డీఏలో ఉద్యోగంలో చేరాను. అక్కడి నుంచి ‘జావా డెవలపర్’గా జాబ్ చేశాను. మనసంతా సంగీతం వైపు లాగుతుంటే ఉద్యోగం మానేసి మ్యూజిక్‌పై దృష్టి పెట్టాను. మొదట షార్ట్‌ఫిల్మŠస్కు సంగీతం అందించాను. దర్శకుడు రమేష్‌వర్మ ‘7’ అనే చిత్రానికి సంగీతం చేయడానికి అవకాశం ఇచ్చారు. అక్కడే ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి పరిచయమయ్యారు. నా మీద నమ్మకంతో చిత్రానికి సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. ‘పిల్లా రా’.. పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహిచలేదు. ‘కొడవలి నిండా’ పాట కూడా యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇండస్ట్రీలోని అందరితో పనిచేయాలని ఉంది. హైదరాబాద్‌లో చాలా ప్రీడం ఉంటుంది. బిర్యానీ, ట్యాంక్‌బండ్ ఇష్టం. మాల్స్‌కు ఎక్కువగా వెళుతుంటా. మంచి సంగీత దర్శకుడిగా ప్రేక్షకులకు చేరువకావాలన్నది నా ఆకాంక్ష. వివేక్ సాగర్.. నా పూర్తి పేరు వివేక్‌సాగర్ ముడుంబా.. పక్కా హైదరాబాదీని. సెయింట్ మేరిస్ కాలేజీలో బీటెక్ చేశాను. అమ్మకు సంగీతంపై పట్టుంది. ఆమే నా తొలి గురువు. స్కూల్లో రామాచారి మాస్టర్ దగ్గర మెళకువలు నేర్చుకున్నాను. కాలేజ్ డేస్‌లో ఓ మ్యూజిక్ బ్యాండ్‌ను స్టార్ చేశాం. గిటార్‌తో పాటు పలు వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాను. షార్ట్ఫిలింస్, టీవీ యాడ్స్‌కు సంగీతం అందించాను. అనంతరం ‘అర్జున్‌రెడ్డి’ ఫేం రాహుల్ ద్వారా దర్శకుడు తరుణ్ భాస్కర్ పరిచయమయ్యారు. అతని ‘సైన్మా’ ఫార్ట్ఫిలింకు మంచి ఆదరణ లభించింది. తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు’ సినిమా నా కెరీర్‌ని మలుపు తిప్పింది. చిత్రంలోని పాటలు ప్రతి ఒక్కరికీ నచ్చాయి. ఆ హిట్‌తో మంచి అవకాశాలు వచ్చాయి. ‘యుద్ధం శరణం’, ‘షీష్మహల్’ చిత్రాలకు కూడా సంగీతం అందించాను. ‘సమ్మోహనం, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలోని పాటలు కూడా శ్రోతల మనసు దోచుకున్నాయి. ఇప్పడు విశ్వక్సేన్ దర్శకత్వంలో ‘ఫలక్నామా దాస్’ చిత్రంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మధురమైన పాటలను అందించాలన్నదే నా ఆకాంక్ష. శ్రావణ్ భరద్వాజ మాది గుంటూరు. హైదరాబాద్‌లో డిగ్రీ చేశాను. ఓల్డ్ సిటీలో ఉండేవాళ్లం. సంగీతం వినడం, పాడడం ఇష్టం. మా బావ విజ్ఞాన్ నాకు సహకారం అందించారు. సన్నిహితులు కృష్ణకాంత్, క్రిష్‌తో కలిసి 2013లో ‘కలయో నిజయో’ అనే వీడియో ఆల్బమ్ చేశాం. మధుర శ్రీధర్ ఆల్బమ్‌ను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో మ్యూజిక్ షోలు సైతం ఇచ్చాం. మా అల్బమ్‌లోని పాటను తరుణ్ భాస్కర్ తీసిన ‘అనుకోకుండా’ షార్ట్‌ఫిలింలో వాడారు. ఆ షార్ట్‌ఫిలిం హిట్టై పాటకు మంచి ఆదరణ లభించింది. తర్వాత ‘పంజా’ చిత్రం నిర్మాత నీలిమ తిరుమలశెట్టి నిర్మించిన ‘అలియాస్ జానకి’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా పాటలు కూడా అందరికీ నచ్చాయి. అనంతరం ‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘మీకుమీరే మాకు మేమే’.. నారా రోహిత్ ‘సావిత్రి’ సినిమాలకు పనిచేశాను. సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీరావా’ చిత్రం నన్ను మరో మెట్టు ఎక్కించింది. మెలోడీస్ అంటే ఇష్టం. అన్ని రకాల సంగీతాలను అందించి సంగీతప్రియుల మనుసు గెలవాలన్న తపనతో పనిచేస్తున్నాను. ప్రశాంత్ ఆర్ విహారి మాది కోదాడ. వరంగల్ కిట్స్‌లో ఇంజినీరింగ్ చేశాను. సంగీతం మీద అమితాశక్తితో చెన్నైలో ఏఆర్ రెహమాన్ కేఎం మ్యూజిక్ కన్సర్వేటరీలో పియానో నేర్చుకున్నాను. పలు తెలుగు, తమిళ షార్ట్ ఫిలింస్‌కి పనిచేశాను. నా మొదటి చిత్రం ‘వెళ్ళిపోమాకే’. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో లీడ్‌రోల్ చేసిన విశ్వక్సేన్ ఆ చిత్రంలో హీరో. ఈ మూవీని దిల్‌రాజు రిలీజ్ చేశారు. పాటలకు మంచి ఆదరణ వచ్చింది. అ తర్వాత రాజ్ కుందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ అవకాశం వచ్చింది. పాటలకు శ్రోతల నుంచి పేరొచ్చింది. సుశాంత్ నటించిన ‘చి..ల..సౌ’ చిత్రానికి సంగీతం అందించాను. పాత చిత్రాల్లోని మెలోడీస్ చాలా ఇష్టం. అన్ని విభిన్నమైన సంగీతాలను ప్రేక్షకులకు అందించాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి, మరో తమిళ, తెలుగు చిత్రాన్ని సంగీతాన్ని అందిస్తున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ మా సొంతూరు రాజమండ్రి. కానీ పెరిగిందంతా చెన్నైలోనే. బీకాం చేశాను. మా నాన్న లక్ష్మీనారాయణ దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారు. ఆయన మార్గదర్శకంతో సంగీతం నేర్చుకున్నాను. రిథమ్, కీబోర్ట్, గిటార్ నేర్చుకున్నాను. సంగీత దర్శకుల వద్ద చాలా సినిమాలకు పనిచేశాను. అనంతరం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి పరిచయంతో ఆ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాను. ఈ చిత్రంలోని పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు మంచి పేరొచ్చింది. తర్వాత ‘సాక్ష్యం’, ‘విజేత’ చిత్రాలకు సంగీతాన్ని అందించే అవకాశం వచ్చింది. ఇండిపెండెంట్‌గా ఆల్బమ్ మ్యూజిక్స్ చేయాలన్నది నా తపన. అర్జున్‌రెడ్డి హిందీ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పలు చిత్రాలను సంగీత దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో విభిన్న సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలి. కబీర్ రఫీ ‘సిమా’ బెస్ట్‌మ్యూజిక్ డైరెక్టర్ ఒక ముస్లిం యువకుడిగా సంగీత దర్శకుడిగా రాణించడం కష్టమని చాలా మంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే తప్పక అవకాశాలు వస్తాయి. నేను పుట్టింది గుంటూరు. కానీ పెరిగిందంతా ముంబై,హైదరాబాద్‌లోనే. సంగీతం మీద ఆసక్తితో ఇటువైపు వచ్చాను. హైదరాబాద్‌లోనే ఎంబీఏ చేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల ‘జస్ట్ డయిల్’లో ఉద్యోగం కూడా చేశాను. కానీ సంగీతమే ప్రాణం అవడం వల్ల ఈ రంగంలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను. అప్పుడప్పుడే షార్ట్ఫిలింకు, ఇండిపెండెంట్ సినిమాలకు ఆదరణ లభిస్తుండడం చూసి షార్ట్ఫిలింస్కు సంగీతం అందించాను. ‘కిక్’ (కొంచెం ఇష్టం చాలా కష్టం) షార్ట్ఫిలింకు గతేడాది ప్రకటించిన ‘సిమా’ షార్ట్‌ఫిలిం అవార్ట్స్‌లో నాకు ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ అవార్డు వచ్చింది. ఇది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకూ 120కి పైగా ష్టార్ట్ఫిలింస్కు సంగీతం అందించాను. టాప్ వెబ్‌సీరిస్‌లకు సంగీతం అందించాను. పలు చిత్రాలకు సైతం సంగీతం చేసే అవకాశం వచ్చింది. ‘బాబు సాఫ్ట్వేర్’ సినిమాతో పాటు మరికొన్ని కన్నడ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే పాటలను అందించి ప్రేక్షకుల మన్నన పొందాలన్నదే నా లక్ష్యం. -
బెల్లంకొండ సినిమాలో బోల్డ్ హీరోయిన్
వరుసగా భారీ చిత్రాలతో అలరిస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ శుక్రవారం సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాక్ష్యం రిలీజ్‌కు ముందే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సాయి, కొత్త దర్శకుడితో ఇప్పటికే ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్‌పాత్రకు ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమాతోనే హాట్ టాపిక్ గా మారారు. ఆ సినిమా భారీ వసూళ్లు సాధించటంతో పాయల్‌కు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ బ్యూటీ ఏ సినిమాకు ఓకె చెప్పలేదని తెలుస్తోంది. -
ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్
-
RX 100.. ఆత్రేయపురం టూ ముంబై
మౌత్ పబ్లిసిటీతో టాలీవుడ్లో సెన్సేషన్‌గా మారింది ఆర్ఎక్స్ 100 చిత్రం. ఈ మధ్య రిలీజ్ అయిన చిత్రాల్లో క్రౌడ్‌పుల్లర్‌గా నిలిచిన ఈ చిత్రం.. త్వరలో బాలీవుడ్‌లోకి వెళ్లబోతోంది. ఈ విషయాన్ని విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విటర్లో తెలియజేశారు. (`ఆర్ఎక్స్ 100` మూవీ రివ్యూ) ‘కంగ్రాచ్యూలేషన్ అజయ్ భూపతి.. నీ సూపర్ బ్లాక్ బస్టర్ ఆర్ఎక్స్ 100 ఆత్రేయపురం నుంచి ముంబైకి చేరుకుంది. హిందీలో ఫాంటోమ్ ప్రొడక్షన్లో మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు(అమీర్ ఖాన్ గజిని నిర్మాతల్లో ఒకరు)’ అని వర్మ తెలియజేశారు. అయితే పాత్రధారులు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. అన్నట్లు డైరెక్టర్ అజయ్ భూపతి వర్మ శిష్యుల్లో ఒకరు అన్న విషయం తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రావు రమేశ్, ‘సింధూర పువ్వు’ రాంకీ ముఖ్య పాత్రల్లో అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ కంటెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్‌గా నిలిచింది.