Shinzo Abe
-
అసాధారణ వ్యక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జ్ఞాపకాలు ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసాధారణ నాయకత్వానికి నివాళులు అర్పించారు. ‘‘అసాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆర్థిక సంస్కరణల పట్ల. భారత ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు నిబద్ధత, అంకితభావం, అచంచలమైన చిత్తశుద్ధి ఉంది. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. తెలివైన వ్యక్తి. ఆలోచనాపరుడు. నిజాయితీపరుడు. భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) మన్మోహన్ సింగ్ ప్రభావం మరిచిపోలేనిది. వృద్ధిని ప్రోత్సహించే, పేదరికాన్ని తగ్గించే, విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను అమలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా), సమాచార హక్కు చట్టం వంటి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. తన పదవీకాలంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు’’. – అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన అంకితభావాన్ని గుర్తుంచుకుంటాం : అమెరికా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత ప్రజలకు అమెరికా ప్రగాఢ సంతాపం తెలిపింది. ‘‘అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారులేసిన గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ సింగ్ ఒకరు. గత రెండు దశాబ్దాల్లో మన దేశాలు కలిసి సాధించిన అనేక అంశాలకు ఆయన కృషి పునాది వేసింది. అమెరికా–భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలకు స్వదేశంలో మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారు. డాక్టర్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నాం. అమెరికా, భారత్‌లను మరింత దగ్గర చేయడానికి ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’అని అమెరికా ప్రకటించింది. ఆయన పర్యటన మైలురాయి ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి మాల్దీవుల ప్రజల తరపున సంతాపం తెలుపుతున్నా. 2011 నవంబరులో మాల్దీవుల్లో ఆయన చేసిన చారిత్రాత్మక పర్యటన మన ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అభివృద్ధి పట్ల డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఉన్న నిబద్ధత, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి, సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ – డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మాల్దీవుల అధ్యక్షుడు మన్మోహన్సింగ్ నాకు గురువు ‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నేను గురువుగా భావిస్తా. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆర్థిక అంశాలపై డాక్టర్ సింగ్ సలహాలు తీసుకున్నారు. 2013లో యూరోజోన్ క్రైసిస్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె డాక్టర్ సింగ్ సహాయం కోరారు’’ – జపాన్ మాజీ ప్రధాని షింజో అబే -
జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఘన నివాళులు అర్పించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా ప్రపంచదేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అబే అంత్యక్రియలను నిర్వహించింది. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. #WATCH | Prime Minister Narendra Modi pays respect to former Japanese PM Shinzo Abe at the latter's State funeral in Tokyo "India is missing former Japanese PM Shinzo Abe," said PM Modi earlier today (Source: DD) pic.twitter.com/8psvtnEUiA — ANI (@ANI) September 27, 2022 అంతకుముందు జపాన్ ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు మోదీ. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. షింజో అబే సేవలను భారత్ ఎంతగానో మిస్ అవుతోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. Prime Minister Narendra Modi pays respect to former Japanese PM Shinzo Abe at the latter's State funeral in Tokyo "India is missing former Japanese PM Shinzo Abe," said PM Modi earlier today (Source: DD) pic.twitter.com/cO5SnswgGQ — ANI (@ANI) September 27, 2022 చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత -
అబే అంత్యక్రియల కోసం జపాన్‌కు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జపాన్ దివంగత ప్రధాని షింజొ అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి టోక్యో బయలుదేరి వెళ్లారు. మంగళవారం అంత్యక్రియల అనంతరం జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా, అబే భార్య అకీతో మోదీ భేటీ అవుతారు. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్ -
Shinzo Abe: మా సొమ్ముతో అంత్యక్రియలొద్దు
టోక్యో: ప్రభుత్వ లాంఛనాలతో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు అంత్యక్రియలు నిర్వహించాలన్న ప్రయత్నాలపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జపాన్ సగం జనాభా అందుకు వ్యతిరేకంగా ఉండడమే ప్రధాన కారణం. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అవును.. జపాన్‌కు సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా చేసిన షింజో అబేకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజావ్యతిరేకత ఎదురవుతోంది. జులై 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై.. ఓ వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మత సంబంధిత వ్యవహారంతోనే షింజో అబే హత్య జరగడం, పైగా తన జీవితంలో పడ్డ కష్టలకు ప్రతిగానే సదరు వ్యక్తి కాల్పులు జరపడంతో.. నిందితుడిపైనే అక్కడి ప్రజల్లో సానుభూతి మొదలైంది. అయితే జపాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన సందర్భాలు చాలా అరుదు. పైగా అబే హత్యలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. అబేకు ప్రభుత్వ లాంఛనాలతో, అదీ ప్రజా ధనంతో అంత్యక్రియలు నిర్వహించకూడదంటూ వివిధ సర్వే పోల్స్‌లో జపాన్‌లోని సగానికి పైగా జనాభా అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా.. అబేకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను వ్యతిరేకిస్తూ ప్రధాని ఫుమియో కిషిదా కార్యాలయం వద్ద బుధవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకునే యత్నం చేసిన ఓ పోలీసాధికారికి సైతం గాయాలయ్యాయి. అయితే బాధితుడి పరిస్థితిపై వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇక ప్రభుత్వమేమో విమర్శలను, అభ్యంతరాలను లెక్కచేయకుండా సెప్టెంబర్ 27వ తేదీన అంత్యక్రియలు నిర్వహించాలని అనుకుంటోంది. ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. సగం గుండెతో పుట్టిన బిడ్డ -
అంతా చీకటే.. షింజో అబే హంతకుడి ఆవేదన
జపాన్ శక్తివంతమైన నేత, మాజీ ప్రధాని షింజో అబేను హ్యాండ్ మేడ్ గన్‌తో కాల్చి చంపాడు నిందితుడు టెత్సుయా యమగామి. అయితే.. ఈ ఘటన జరిగి నెలపైనే కావొస్తుంది. ఇప్పుడు యమగామి పట్ల ఇప్పుడు అక్కడి జనాల్లో సానుభూతి ఏర్పడింది. అంతేకాదు.. అతనికి కానుకలు కూడా పంపిస్తున్నారు. అసలు అబే ‘తన సిసలైన శత్రువు కాద’ని అతను రాసిన ఓ లేఖ ఇప్పుడు అక్కడ సంచలనంగా మారడంతో పాటు రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది. మాజీ ప్రధాని షింజో అబే మరణం.. జపాన్ను మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జులై 8వ తేదీ నారాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన్ని.. హ్యాండ్ మేడ్ గన్‌తో అతి సమీపం నుంచి కాల్చి చంపాడు టెత్సుయా యమగామి(41). ఘటనా స్థలంలోనే యమగామిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. షింజో అబే ప్రాణాల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లి చేసిన పనితోనే.. టెత్సుయా యమగామి తల్లి.. చర్చి ఏకీకరణ విధానానికి మద్దతుగా భారీగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్లింది. దాని వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నాశనం అయ్యింది. అప్పటికే ఉద్యోగం.. ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. షింజో అబేను చంపిన హంతకుడే అయినప్పటికీ.. యమగామి కథ తెలిశాక చాలామందికి సానుభూతి మొదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల ఆర్థిక, సామాజిక ఆటుపోట్లతో నలిగిపోతున్న ఒక తరం మొత్తం అతనికి మద్దతుగా నిలుస్తోంది. అతను మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ.. అతను ఉంటున్న జైలుకు కానుకలు పంపిస్తున్నారు. అతనికి మద్దతుగా సంతకాల సేకరణ నడుస్తోంది. అందులో అతని వాదనలు వినేందుకు సానుకూల స్పందన కోరుతూ ఏడు వేలమందికి పైగా పిటిషన్‌పై సంతకాలు చేశారు. ఒకవేళ అతను గనుక ఈ నేరం చేసి ఉండకపోతే.. అతని కథ తెలిశాక సానుభూతి ఇంకా ఎక్కువే జనాల్లో కలిగి ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. లేఖలో ఆవేదన షింజో అబే హత్యకు ముందు రోజు.. పశ్చిమ జపాన్‌కు చెందిన ఓ బ్లాగర్‌కు యమగామి ఓ కంప్యూటర్ టైప్డ్లేఖను పంపాడు. అందులో సమాచారం ప్రకారం.. తన తల్లి మతం మత్తులో అడ్డగోలుగా ధనం వృథా చేసిందని, దాని వల్ల తన యవ్వనం మొత్తం వృథా అయ్యిందని ఆవేదన చెందాడు. నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. తల్లి మతం మత్తులో పడిపోయి భారీగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్లింది. తిండి కూడా పెట్టకుండా ఆ డబ్బును విరాళానికే కేటాయించింది. చివరికి.. ఆస్తులన్నింటిని అమ్మేసి.. అప్పుల పాల్జేసింది. ఆ అప్పులకు భయపడి నా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాగోలా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నేను.. 2005 నుంచి మూడేళ్ల పాటు జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్‌గా పనిచేశా. ఆ తర్వాత ఏ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నా. చివరికి.. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న యమగామికి మానసిక సమస్యలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అలసిపోయా. చివరకు రాజీనామా చేశా. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు యమగామి. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ చర్చి ఏకీకరణ విధానాన్ని తప్పుబడుతూ పోస్ట్‌లు సైతం చేశాడు. నన్ను శిక్షించండి 1954 సౌత్ కొరియా నుంచి మొదలైన యునిఫికేషన్ చర్చి విధానం.. జపాన్‌కు చేరింది. అయితే దాని వల్ల తన లాంటి కుటుంబాలెన్నో ఆర్థికంగా నష్టపోయాయన్నది యమగామి లేఖ సారాంశం. అయితే.. తన లక్ష్యం చంపడం కాదని, విధానానికి.. దానికి మద్దతు ఇస్తున్నఓ మతసంస్థకు షింజో అబే మద్ధతును ప్రకటించడమే తనలో కసిని రగిల్చిందని అని యమగామి కన్నీళ్లతో చెప్తున్నాడు. ‘‘నా తల్లి చేసిన తప్పులతో నా జీవితం సర్వనాశనం అయ్యింది. అయినా ఫర్వాలేదు. నేను చేసిన పని వల్ల ఈ విధానానికి ముగింపు పలికితే చాలు. ఎన్నో కుటుంబాలు భవిష్యత్తులో నష్టపోకుండా బాగుపడతాయి. అబేలాంటి గొప్ప రాజకీయవేత్తను చంపినందుకు పశ్చాత్తాప పడుతున్నా. అలాగని క్షమాభిక్ష కావాలని నేను కోరుకోను. ఎందుకంటే నేను చేసింది తప్పే. చీకట్లు అలుముకున్న నా జీవితాన్ని త్వరగా శిక్షించి.. ముగించేయండి’’ అంటూ ఓ జపాన్ మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు యమగామి. ఇక షింజో అబే హత్య జరిగినప్పటి నుంచి.. జపాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిదా ప్రజాదరణ క్షీణిస్తూ వస్తోంది. యమగామి లేఖ రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రభావంతో.. తన కేబినెట్లో మతపరమైన సమూహంతో సంబంధాలు ఉన్నవాళ్లను తొలగిస్తూ వస్తున్నారాయన. ఇది అక్కడ రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది. మరోవైపు.. అబే హత్య జరిగిన నలభై రోజుల తర్వాత.. ఘటనకు బాధ్యత వహిస్తూ జాతీయ పోలీసు ఏజెన్సీ చీఫ్ గురువారం తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించారు. #ShinzoAbe Closest vid for now pic.twitter.com/RZGAFjqDMY — DanJuan (@DanJuan18) July 8, 2022 ఇదీ చదవండి: అగ్రరాజ్యంలో జాతి వివక్ష దాడి.. ఈసారి భారతీయులపై! -
జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ జయకేతనం
టోక్యో: జపాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని షింజో అబే పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మరణించిన రెండు రోజులకే జరిగిన ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ)-కొమైటో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ఎగువసభలో 76 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నర నగరంలో షింజో అబే శుక్రవారం హత్యకు గరయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే ఎన్నికలు జరిగాయి. అదే రోజు రాత్రి ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా, పార్టీ నేతలు నల్ల టైలు ధరించి మీడియా ముందు సంతాపం తెలిపారు. షింజో మృతితో బాధలో ఉన్న ఫుమియో కిషిదా.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను వెల్లడిస్తూ వారి పేర్ల పక్కన గులాబీ పూలు పెట్టారు. కానీ ఆయన మొహంలో మాత్రం బాధ తప్ప గెలిచిన ఆనందం కూడా లేదు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల ప్రక్రియను ఈసారి హింస భయపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించాలనే అనుకున్నట్లు చెప్పారు. జపాన్ ఎగువసభ ఎన్నికల్లో ఈసారి 52.05శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోల్చితే ఇది అధికం. ఈసారి 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకున్నారు. ఈ విజయంతో మరో మూడేళ్ల పాటు ఫుమియో కిషిదా ఎలాంటి ఆటంకం లేకుండా పరిపాలన కొనసాగించవచ్చు. చదవండి: మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య -
సెక్యూరిటీ అలా చేసి ఉంటే షింజో అబే బతికేవారు: ఆనంద్ మహీంద్రా
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది వైఫల్యం ఉందని పేర్కొన్నారు. సెక్యూరిటీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే షింజో బతికి ఉండేవారని చెప్పారు. అబేపై కాల్పులు జరిపినప్పుడు మొదటి తూటాకు, రెండో తూటాకు మధ్య కాస్త గ్యాప్ ఉందని మహీంద్రా వివరించారు. ఆ సమయంలో సెక్యూరిటీ షింజో అబేనూ కవర్ చేసి, ఆయనకు బుల్లెట్ తగలకుండా చూసుకుని ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా కాకుండా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకే భద్రతా సిబ్బంది ప్రయత్నించారని మహీంద్రా విమర్శించారు. The first shot missed. There was a potentially life-saving gap until the second shot. Shouldn’t his security have jumped on Abe & flattened & covered him instead of chasing the assailant? He could have & should have survived this. pic.twitter.com/aGSI1SO3yA — anand mahindra (@anandmahindra) July 9, 2022 షింజో అబే ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. తెత్సుయా యమగామీ అనే వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. సొంతంగా తయారు చేసుకున్న గన్‌తో ఈ దారుణానికి పాల్పడ్డాడు. షింజోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని క్షణాల్లోనే పట్టుకున్నారు భద్రతా సిబ్బంది. అనంతరం ఓ మతసంస్థపై ద్వేషంతోనే తాను షింజోను హత్య చేసినట్లు యమగామీ తెలిపాడు. జపాన్ అధికారులు కూడా షింజో భద్రతలో వైఫల్యాలు ఉన్నాయని అంగీకరించారు. చదవండి: మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య -
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్‌గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్‌లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
అగ్నిపథ్‌కు షింజో అబే హత్యకు ముడిపెడుతూ..
కోల్‌కతా: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్‌కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో విమర్శలకూ దారి తీసింది. జపాన్ రాజకీయవేత్త షింజో అబేను హతమార్చిన వ్యక్తి పేరు టెత్సుయ యమగామి(41). జపాన్ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్‌పేజీ కథనంగా ప్రచురించింది ఇవాళ. అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. యమగామి జపాన్ ఎస్డీఎఫ్లో పని చేశాడు. కానీ, ఎలాంటి పెన్షన్ అతను పొందలేకపోయాడు అంటూ ట్వీట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత ట్వీట్‌తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగానే ఆ పత్రిక కథనాలు ప్రచురిస్తుంది. అసలు అగ్నిపథ్‌కు అబే మరణానికి మృతి పెట్టి కథనం రాసింది ఎవరు?. దేశం మీద గౌరవం, ప్రేమ ఉన్న ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. జాగో బంగ్లా చేసింది ముమ్మాటికీ తప్పే. భారత యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ. షింజో అబే మీద గౌరవంతో భారత్ సంతాప దినం పాటిస్తున్న వేళ.. ఇలాంటి కథనం దురదృష్టకరం అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: షింజో అబేపై కాల్పులకు అసలు కారణం ఇదే.. -
షింజే అబే మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉన్నతాధికారి
Shinzo Abe's Security Had Flaws: జపాన్ మాజీ ప్రదాని షింజే అబే దారుణ హత్యకు సంబంధించి స్థానిక పోలీస్ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రతా విషయాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ మేరకు జపాన్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.....మాజీ ప్రధాని షింజో అబే భద్రతకు సంబంధించి కాదనలేని లోపాలు ఉన్నాయని అన్నారు. ఒక దుండగుడు ఆయనకు సమీపంలోకి వచ్చి మరీ కాల్పులు జరపగలిగాడంటే ఆయనకు ఎటువంటి పటిష్టమైన భద్రత ఉందో తెలుస్తోందని చెప్పారు. హింసాత్మక నేరాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యే జపాన్‌లో ఇలాంటి హత్య జరిగిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. పైగా కఠినమైన తుపాకి చట్టాలు ఉన్న జపాన్ దేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధకరం అన్నారు. అంతేకాదు జపాన్‌లో స్థానిక ప్రచార కార్యక్రమాల్లో భద్రత సాపేక్షంగా సడలించబడుతుందని చెప్పారు. ఏదీ ఏమైన ఆయనకు పటిష్టమైన భద్రత లేదని స్పష్టమవుతోందని అన్నారు. తన 27 ఏళ్ల కెరియర్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొలేదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. అంతేకాదు మాజీ ప్రధాని అబే రక్షణకు సంబంధించి భద్రతా చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది కాదనలేని వాస్తవమని జపాన్ పోలీస్ ఉన్నతాధికారి టోమోకి ఒనిజుకా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో కఠినమైన చర్యలు తీసుకోవడమే గాక పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: మత గురువును చంపాలనుకుని.. అబేపై కాల్పులు!) -
అంతర్జాతీయ రాజకీయాలపై... చెరగని ముద్ర
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం. అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్ జాతీయవాదానికి పోస్టర్ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడాక జపాన్‌పై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలను, బలవంతపు ఒప్పందాలను పక్కన పెట్టేందుకూ ప్రయత్నించారు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్ను తీర్చిదిద్దాలని తపించారు. దేశంలో జాతీయవాద విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అందరు దేశాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించినా, భారత్ అంటే మాత్రం అబెకు ప్రత్యేకమైన అభిమానం. అది 1950ల్లో జపాన్ ప్రధానిగా చేసిన ఆయన తాత నుంచి ఒకరకంగా ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. తనకు నెహ్రూ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాత తనకు వర్ణించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని పలుమార్లు అబె చెప్పారు. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడాపై అబె ప్రభావం చాలా ఉంది. అమెరికాతో జపాన్ బంధాన్ని పటిష్టంగా మార్చిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ‘క్వాడ్’తో చైనాకు ముకుతాడు రాజనీతిజ్ఞుడిగా అబె ముందుచూపు అత్యంత నిశితమైనది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఎప్పటికైనా పెను ముప్పేనని ముందే ఊహించారాయన. దాని ఫలితమే చైనాను ఇప్పుడు నిత్యం భయపెడుతున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సంయుక్త కూటమి (క్వాడ్). దీని రూపకర్త అబెనే. భారత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనే క్వాడ్‌గా రూపుదాల్చింది. అది జపాన్‌తో పాటు భారత్‌నూ అమెరికాకు సన్నిహితం చేసింది. -
బొమ్మ తుపాకీ అనుకుంటే.. గుండెను చీల్చేసింది
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆయనతో అనుబంధం ఉన్న ప్రపంచ నేతలు షాక్‌కు గురయ్యారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో శుక్రవారం ఈ ఘాతుకం జరిగింది. ఆదివారం జపాన్ పార్లమెంటు ఎగువ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో షింజో అబే మాట్లాడుతుండగా, వెనుకగా వచ్చిన దుండగుడు దేశవాళీ తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా, షింజే అబేపై కాల్పులు జరగడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తపు మడుగులో కుప్పకూలిన అబేను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దుండగుడు తొలిసారి కాల్చినప్పుడు అందరూ బొమ్మ తుపాకీ కాల్పులు అనుకున్నారట ప్రత్యక్ష సాక్షులు. అప్పటికి షింజో అబే కిందపడిపోలేదని, కానీ రెండో రౌండ్ కాల్చాక ఆయన నేలకొరిగారని ఓ యువతి ఘటన గురించి వివరించింది. రెండో రౌండ్ కాల్చడం స్పష్టంగా కనిపించిందని, తుపాకీ నుంచి నిప్పులు రావడంతోపాటు, పొగ కూడా వెలువడిందని, దాంతో అవి నిజం కాల్పులేనని అర్థమయ్యాయని ఆమె వెల్లడించింది. కిందపడిపోయిన షింజే అబే అచేతనంగా కనిపించడంతో, పలువురు ఆయన ఛాతీపై మర్దన చేశారు. కాగా, ఓ బుల్లెట్ షింజో అబే గుండెను నేరుగా తాకిందని, దాంతో ఆయన గుండె ఛిద్రమైందని చికిత్స అందించిన డాక్టర్లు వెల్లడించారు. గుండె భాగంలో పెద్ద రంధ్రం పడిందని వివరించారు. ఆయన మరణానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఓ బుల్లెట్ గుండెను తాకగా, మరో బుల్లెట్ ఆ గాయాన్ని మరింత క్లిష్టతరం చేసిందని వివరించారు. షింజో అబేను అసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురైన స్థితిలో ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించామని వివరించారు. రక్తం కూడా ఎక్కించామని తెలిపారు. ఏదీ ఫలితాన్నివ్వలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. టెత్సుయా యమగామి(41).. జపాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి. తనకు నచ్చని సంస్థతో షింజో అబే సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆయన తీరుపై అసంతృప్తితోనే కాల్చేశానని, రాజకీయ సిద్ధాంతాల పరంగా ఆయనతో ఎలాంటి విబేధాలు లేవని టెత్సుయా యమగామి పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. #ShinzoAbe Closest vid for now pic.twitter.com/RZGAFjqDMY — DanJuan (@DanJuan18) July 8, 2022 -
పైశాచికం.. షింజో అబే మృతిపై చైనాలో సంబురాలు!
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గన్ కల్చర్, రాజకీయ హింసలు పెద్దగా పరిచయంలేని దేశంలో.. అదీ షింజోలాంటి నేత మీద ఈ తరహా దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన సమర్థవంతమైన సంస్కరణలతో జపాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోనే ఆయన ఆగిపోలేదు. అమెరికా సహకారం లేకుండానే రక్షణ వ్యవస్థను పటిష్టపర్చుకునే స్థాయికి నిప్పన్(జపాన్)ను తీసుకురాగలిగారు ఆయన. పొరుగు దేశాలతోనూ మైత్రి, దౌత్యం విషయంలో ఆయనెంతో చాకచక్యంగా వ్యవహరించేవారు. అయితే.. ఆయన మరణ వార్త విని ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శత్రువు ఇక లేడంటూ సంబురాల్లో మునిగిపోయారు కొందరు చైనా పౌరులు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని యాంటీ జపాన్ హీరోగా అభివర్ణిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చైనా యూజర్ల చేష్టలను వెలుగులోకి తెచ్చిన కొందరు ఆ దేశ ప్రజలే.. ఇది దుర్మార్గమంటూ కామెంట్లు చేస్తున్నారు. సభ్యతగా వ్యవహరించాలని.. చనిపోయిన వాళ్ల విషయంలో ఇలా చేయడం సరికాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. వెయిబో, వీచాట్‌లో ఇప్పుడు దుర్మార్గమైన కామెంట్లు కనిపిస్తున్నాయి. షింజో అబేపై జోకులు పేల్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇంకొందరైతే జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతంతో పోలుస్తూ.. ఆనందిస్తున్నారు. 1937, జూలై7న చైనాపై జపాన్ పూర్తి స్థాయి దండయాత్ర చేసిన మార్కో పోలో బ్రిడ్జ్ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. జపాన్-చైనా సరిహద్దుల వెంట ఉద్రిక్త వాతావరణ ఏండ్ల తరబడి కొనసాగుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయంలోనూ పోటీ నడుస్తోంది. అదే సమయంలో ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మాత్రం మెరుగ్గానే కొనసాగుతున్నాయి. భారత్, తైవాన్లతో షింజో అబే మంచి సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పైగా చైనాను శక్తివంతమైన దేశంగా ఎదగనీయకుండా భారత్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కలిసి క్వాడ్ ఏర్పాటుకు కృషి చేశాడని రగిలిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచే షింజో అబేతో స్నేహం ఉంది. ఇలా చాలా విషయాలు షింజో అబేపై చైనా వ్యతిరేకతకు కారణం అయ్యాయి. -
Shinzo Abe Death: ఆత్మీయుడికి నివాళిగా భారత్ సంతాప దినం
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నా ప్రియమైన మిత్రుడు షింజో అబే ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. భారతదేశం-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎల్లప్పుడూ మక్కువ చూపే ఆయన( షింజోను ఉద్దేశించి..) జపాన్-ఇండియా అసోసియేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టోక్యోలో నా ప్రియమిత్రుడితో దిగిన రీసెంట్ ఫొటో అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో అనుబంధం కొనసాగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, తాజా పర్యటనలోనూ ఆయనతో ఎన్నో కీలకాంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ.. షింజో అబే సేవలను గుర్తు చేసుకున్నారు. Sharing a picture from my most recent meeting with my dear friend, Shinzo Abe in Tokyo. Always passionate about strengthening India-Japan ties, he had just taken over as the Chairman of the Japan-India Association. pic.twitter.com/Mw2nR1bIGz — Narendra Modi (@narendramodi) July 8, 2022 చైనా అంటే డోంట్ కేర్ చైనా దుష్టపన్నాగాలను ముందే ఊహించిన వ్యక్తి, చైనా అంటే బెణుకు లేని నేతగా షింజో అబేకి ఓ పేరుంది. అలాగే భారత్‌తో మైత్రి బలపడడానికి అబే కృషి ఎంతో దాగుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు ఉన్న టైంలో.. ఆయన నాలుగసార్లు భారత్‌కు వచ్చారు. ఇది చాలూ.. ఆయనకు భారత్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. ఆ సమయంలో భారత్ ఆతిథ్యాన్ని ఆస్వాదించడంతో పాటు మోదీ సర్కార్‌తో ఆయన కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు.. ప్రపంచబ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు చైనాకు భయపడి.. అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు వెనుకంజ వేశాయి. ఆ సమయంలో.. సుమారు 13 వేల కోట్ల రూపాయాలను ఈశాన్య రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు షింజో అబే. 2014లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. ఆ గౌరవంద దక్కించుకున్న జపాన్ ప్రధానిగా నిలిచారాయన. అలాంటి ఆత్మీయుడి కోసం జాతీయ జెండాను సగం వరకు అవనతం చేసి.. శనివారం నివాళి అర్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. -
అందుకే షింజో అబేను కాల్చేశా!
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యోదంతం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. సమర్థవంతమైన నేతగా, అజాత శత్రువుగా పేరున్న షింజోపై దాడి జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో జపాన్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కీలక విషయాలని వెల్లడించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. గతంలో జపాన్ సైన్యంలో మూడేళ్లపాటు (2002-2005) పని చేసిన టెత్సుయా యమగామి(41).. షింజో అబే మీద కాల్పులకు తెగబడ్డాడు. జపాన్ పశ్చిమ నగరం నారాలో ఓ ట్రైన్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో(అక్కడి కాలమానం ప్రకారం) పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు షింజో అబే. ఆ సమయంలో వెనుక నుంచి షింజోపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు టెత్సుయ యమగామి. మొదటి బుల్లెట్‌కు వెనక్కి వంగిపోయిన షింజో.. రెండో బుల్లెట్ తగలగానే కుప్పకూలిపోయారు ఆ వెంటనే దుండగుడు టెత్సుయాను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇక పోలీసుల ఎదుట యమగామి నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. #ShinzoAbe #安倍さん Sad news Offender, 41-year-old Japanese national Tetsue Yamagami, served in the Navy. With a homemade double-barreled gun, 2 shots, hit the lung and die. pic.twitter.com/dm4ElkceCg — manj.eth (@ManjTrader) July 8, 2022 ‘‘షింజో అబే రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదు. కానీ, అసంతృప్తితో రగిలిపోతున్నానని,అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆయనకు చికిత్స అందుతుండడంతో తాను నిరుత్సాహానికి లోనయ్యాను’’ అంటూ విచారణలో పోలీసుల ఎదుట సమాధానం ఇచ్చాడు. అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏంటి? నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన తుపాకీని అతనే స్వయంగా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. టెత్సుయాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు లభించినట్లు సమాచారం. అయితే అతని సమాధానాల్లో నిజానిజాలు ఎంతున్నాయో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. షింజో అబేపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని ఫుమియో కిషిదా.. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన అచేతనావస్థలోకి వెళ్లిపోయారని సిబ్బంది ప్రకటించారు. ఈలోపు ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ఫలించకపోగా.. కాసేపటికే ఆయన కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గుండెలోకి తూటా దూసుకెళ్లినందుకే ఆయన చనిపోయినట్లు నారా మెడికల్ యూనివర్సిటీ వైద్యులు నిర్ధారించారు. Abe Shooting and Arrest of Shooter pic.twitter.com/iFV6V67YXx — SubX.News (@NewsSubstance) July 8, 2022 -
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారని జపాన్ ప్రధాని కాసేపటి క్రితం ప్రకటించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పోవడంతో ఆయన్ని కాపాడడం వీలు కాలేదని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోవైపు షింజోను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. Officials say former Japanese Prime Minister #ShinzoAbe has been confirmed dead. He was reportedly shot during a speech on Friday in the city of Nara, near Kyoto: Japan's NHK WORLD News pic.twitter.com/7ayJpNCw17 — ANI (@ANI) July 8, 2022 -
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా అబే ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దుండగుడు తుపాకీతో అబేపై రెండురౌండ్లు కాల్పులు జరిపారని, ఆయనకు తీవ్ర రక్తస్రావం అయిందని జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తన కథనంలో తెలిపింది. హుటాహుటిన అబేను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు అబేకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా,2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి👇 మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్ ఓకే Russia-Ukraine war: ఎండ్ కార్డ్ ఎప్పుడు? -
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు "నేతాజీ అవార్డు 2022"ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ న్యూఢిల్లీ నుంచి ప్రసంగించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడి మనవడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ అయిన సుగతా బోస్, అబేను నేతాజీకి గొప్ప ఆరాధకుడిగా అభివర్ణించారు. (చదవండి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని) -
జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా!
టోక్యో: జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా చేయనున్నట్టు సమాచారం. తీవ్ర అనారోగ్యం వల్లనే ఆయన పదవి నుంచి వెదొలుగుతున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని జపాన్ జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కె శుక్రవారం ధ్రువీకరించింది. దీంతో ప్రస్తుతం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక ప్రధానిగా బాద్యతలు చేపట్టనున్నారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రధాని షింజో అబే టోక్యోలోని ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆయన కేవలం జనరల్ చెకప్ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. దీంతో ప్రధాని రాజీనామా చేయనున్నారనే వార్తలకు బలం చేకూర్చినట్లయింది. (ఆస్పత్రిలో చేరిన జపాన్ ప్రధాని.. రాజీనామా!) తన అనారోగ్యం ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందిగా మారకూడదనే ప్రధాని షింజో భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. 2021 సెప్టెంబరు వరకు ప్రధానిగా ఆయన పదవీకాలం ఉంది. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. తొలుత 2006లో సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబే.. కూటమిలో విభేదాలతో 2007లో రాజీనామా చేశారు. తిరిగి 2012లో రెండోసారి ప్రధానిగా ఎన్నికై అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే కరోనా మహమ్మారిపై నియంత్రణ, అధికార పార్టీ నేతల అవినీతి కుంభకోణం లాంటివి షింజో అబేను ఇరుకున పెట్టాయి. దీంతో బహిరంగంగానే ప్రధానిని కుర్చీలోంచి దిగిపోవాలంటూ పలువురు నిరసన తెలిపారు. అయితే ద్రవ్య సడలింపు విధానంతో ఆర్థిక వ్యవస్థను పునరుద్దరిస్తానంటూ షింజో ఓ సమావేశంలో పేర్కొన్నాడు. కానీ గత కొంత కాలంగా ఆయనను వేధిస్తున్న అనారోగ్య సమస్యలతో ఇక అధ్యక్షుని హోదా నుంచి వైదొలగక తప్పలేదు. (గుడ్ న్యూస్ చెప్పిన జపాన్ శాస్త్రవేత్తలు) -
ఆస్పత్రిలో చేరిన జపాన్ ప్రధాని.. రాజీనామా!
టోక్యో : జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అనారోగ్య సమస్యలతో సోమవారం టోక్యోలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని అబేకు దాదాపు ఏడున్నర గంటలు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రధాని కాన్వాయ్‌లో ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద మొత్తంలో మీడియా అక్కడకు చేరుకుంది. కాగా షింజో అబే అనారోగ్యానికి గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్) అయితే అబే ఆస్పత్రిలో చేరడం ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అబే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారని స్థానిక మీడియా నివేదించింది. జూలై 6న అబే తన కార్యాలయంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు వీక్లీ మ్యాగజైన్ ప్రచురించింది. అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆయన కేవలం జనరల్ చెకప్ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. (చైనాకు మద్దతుపై డైలమాలో జపాన్..) ఇంతకముందు తన మేనమామ ఐసాకు పేరు మీద ఉన్న ఈ రికార్డును అబే సోమవారంతో అధిగమించాడు. ఈ మైలురాయిని చేరుకున్న తరువాత అతను రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2007లో కొంత ఆరోగ్య సమస్యల వల్ల తన పదవీకి రాజీనామా చేసి 2012లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఒకవేళ అబే తన పదివి నుంచి తొలగిపోతే ప్రస్తుతం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలికంగా ప్రధాని బాద్యతలు స్వీకరించనున్నారు. అలా కాకుండా అబే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే ఎన్నికల అనంతరం అధికారికంగా మరొకరు ప్రధానమంత్రి అయ్యేవరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు. -
అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్
టోక్యో: అణుఆయుధాలను నిషేధించాలని జపాన్‌దేశం మరోసారి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. అగ్రరాజ్యం అమెరికా జపాన్‌లోని రెండు ముఖ్య నగరాలైన హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. నాగసాకి నగరంపై దాడి జరిగి ఆదివారం నాటికి(ఆగస్టు 9) 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నాగసాకి పీస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు పౌరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగసాకి నగర మేయర్ టొమిహిమ టావ్ శాంతి సందేశాన్ని ఇచ్చారు. అణుఆయుధాలను నిషేధించాలని మేము విజ్ఞప్తి చేస్తుంటే.. అమెరికా, రష్యాలు మాత్రం అణుఆయుధాల శక్తిని పెంచుకుంటున్నాయని ఆరోపించారు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) 2017లో ఏర్పాటు చేసిన అణుఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలతోపాటు, జపాన్ ప్రభుత్వఅధికారులను కోరారు. జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. అణుఆయుధాల ట్రీటీ ఒప్పందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అణుఆయుధాలు తయారు చేస్తున్న రాష్ట్రాలు, అణురహిత రాష్ట్రాలు కూడా దీనికి మద్దతు ఇవ్వవని ఆయన అన్నారు. రష్యా, అమెరికా దేశాలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవాలని కోరారు. న్యూక్లియర్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా దానిని ఎవరూ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 1945 ఆగస్టు 6,9 తేదీలలో జరిగిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు అణుబాంబుల దాడితో ఆగస్టు 15న జపాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. (అణుబాంబు విలయానికి 75 ఏళ్లు) -
చైనాకు మద్దతుపై డైలమాలో జపాన్..
టోక్యో: కరోనా వైరస్‌ను ముందే పసిగట్టినా ఎవరికి తెలియకుండా చైనా అందరిని మోసం చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ జపాన్ మాత్రం చైనాతో అంశాల వారిగా మద్దతుకు ప్రయత్నిస్తోంది. అయితే 2018డిసెంబర్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఏడు సంవత్సరాల తరువాత కలిసిన మొదటి ప్రధానిగా జపాన్ ప్రధాని షింజో అబే నిలిచిన విషయం తెలిసిందే. చైనాతో మైత్రి కొనసాగించడానికి జపాన్ డైలమాలో పడిందని, చైనాతో పోటీని కొనసాగిస్తునే ఆ దేశానికి సహకారం అందిస్తున్నామని జపాన్ సెక్యూరిటీ డైరెక్టర్ నార్శిగ్ మిచిస్త తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, జపాన్ దేశాలు ఆర్థిక, రాజకీయ అంశాలలో సహకారం అందించుకోవాలని ఇది వరకే నిర్ణయించుకున్నాయి. కానీ ఇటీవల దేశంలో చైనా పెట్టుబడుల విషయంలో జపాన్ పలు ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో దేశంలోనే విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు జపాన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. డిఫెన్స్ రంగంలో జపాన్‌కు చైనా సహకారం అందిస్తుంది, అందువల్ల చైనా విషయంలో జపాన్ సానుకూల వైఖరి అవలంభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే పర్యాటక రంగంలో చైనా, జపాన్ దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. గత ఏడాది లక్షమంది వరకు చైనా విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. -
కరోనా: మరకల మాస్కులు అవసరమా..!
టోక్యో: జపాన్‌లో కరోనా కట్టడి చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శల నడుమ మరో అంశం తెరపైకొచ్చింది. గర్భిణీ మహిళలకు పంపిణీ చేసిన మాస్కులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. దుమ్ము, మరకలతో కూడిన మాస్కులు పంపించారని 80 మున్సిపాలిటీల నుంచి 1900 ఫిర్యాదులు అందినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, దేశంలో మాస్కుల కొరత ఉన్నందున ప్రజందరికీ తలా రెండు పునర్వినియోగ మాస్కులను ఇవ్వాలని ప్రధాని షింజో అబే ఏప్రిల్ 1న ప్రకటించారు. (చదవండి: ఆగని మరణ మృదంగం) ఆ మేరకు మొదటి ప్రాధాన్యంగా గర్భిణీ స్త్రీలకు బట్టతో తయారు చేసిన 5 లక్షల మాస్కులు పంపిణీ చేయగా.. వాటిలో నాణత్య లోపించిందని, సైజు కూడా చిన్నగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కు, నోటిని కప్పి ఉంచలేని మాస్కులు చూడండంటూ పలు టీవీ షోలలో ప్రభుత్వం వెనుకబాటుతనాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎత్తిచూపుతున్నాయి. కాగా, పరిశుభ్రమైన మాస్కులు అందించాలని తయారీదారులకు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలకు మాస్కులు పంపిణీ చేసేముందు స్థానిక అధికారులు చెక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశంలో మాస్కుల కొరత ఉండటం.. బట్ట మాస్కులు అందివ్వడంపై ప్రధానిపై ప్రజలు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. (చదవండి: అక్టోబర్ నాటికి వ్యాక్సిన్?) -
పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం
టోక్యో : జపాన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశ రాజధానిలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని షింజో అబే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రేపు(మంగళవారం) స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ జపనీస్ పత్రిక మొమియురి పేర్కొంది. ఈ సోమవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తారని తెలిపింది. బుధవారం రోజున కరోనాను అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలను తెరపైకి తేనున్నట్లు న్యూస్ ఏజెన్సీ క్యోడో తెలిపింది. కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పేర్కొంది. ( కరోనా: ఎక్కడ చూసినా శవాలే! ) కొద్దిరోజుల క్రితం టోక్యో గవర్నర్ యురికో కొయికే మాట్లాడుతూ.. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీకి సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ కారణంగా దేశ ప్రజలు కచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, జపాన్ ఇప్పటివరకు 3,500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని టోక్యోలో దాదాపు 1000 పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం. ( భారత్‌లో 4వేలు దాటిన కరోనా కేసులు ) -
షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్: జపాన్ ప్రధాని
టోక్యో: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు. ఇటీవల టోక్యో మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు. షెడ్యూల్‌పై భరోసా కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వక్రీడల్ని వాయిదా వేయాలని సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జపాన్ ప్రధాని షింజో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘మేం వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నాం. సంబంధిత వర్గాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అయితే టోక్యోలో మెగా ఈవెంట్ నిర్వహణలో ఎలాంటి మార్పుల్లేవు. షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహిస్తాం. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా... పక్కా ప్రణాళికతో, వైరస్ వ్యాప్తిని నిరోధించే జాగ్రత్తలతో ఒలింపిక్స్‌ను ఘనంగా నిర్వహిస్తాం. విశ్వక్రీడలు విజయవంతమయ్యేందుకు అమెరికాతో కలిసి సమన్వయంతో పనిచేస్తాం’ అని అన్నారు. -
‘ఒలింపిక్స్‌ను జరిపి తీరుతాం’
టోక్యో: ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా లేదంటే రద్దు చేయాలా అనేది డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒకవైపు చెబుతుంటే, టోక్యో ఒలింపిక్స్‌ను షెడ్యూల్ ప్రకారమే జరిపి తీరుతామని జపాన్ ప్రధాని షింజో అబే విశ్వాసం వ్యక్తం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతుందని, ఈ విషయంలో ఐఓసీతో కలిసి పని చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా పడిన నేపథ్యంలో ఒలింపిక్స్‌ను సైతం రీ షెడ్యూల్ చేస్తే బాగుంటుందని వాదన ఎక్కువైంది. ఈ క్రమంలోనే మాట్లాడిన జపాన్ ప్రధాని షింజో అబే.. ఒలింపిక్స్ నిర్వహణ అనేది ఆలస్యం కావడం కానీ, వాయిదా పడటం కానీ జరగదన్నారు. షెడ్యూల్లో పేర్కొన్నట్లు జూన్ 24వ తేదీ నుంచే ఒలింపిక్స్ జరుగుతుందన్నారు. ఈ విషయంలో స్టేక్ హోల్డర్స్‌తో కూడా టచ్‌లో ఉన్నామన్నారు. ఒకవైపు కరోనా విజృంభణ, మరొకవైపు ఒలింపిక్స్ నిర్వహణ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇక ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే విశ్వక్రీడల్ని విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఏ నిర్ణయమైనా డబ్ల్యూహెచ్ఓ సూచనల మేరకే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సంస్థతో మా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి వల్ల ఆయా దేశాల్లో వాయిదా, రద్దయిన క్వాలిఫయింగ్ టోర్నీలతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని అన్నారు. జపాన్ మాత్రం తమ దేశంలో జూలై 24 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌పై గంపెడు ఆశలతో స్టేడియాలకు కొత్తసొబగులు అద్దుతోంది. -
ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, సిరిల్ రమఫోసా, జాయిర్ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు. నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు. -
కొత్త శిఖరాలకు సంబంధాలు
ఒసాకా: అమెరికాలో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. జపాన్‌లోని ఒసాకాలో జీ20 సదస్సు సందర్భంగా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్–అమెరికా వివాదం, భారత్‌లో 5జీ సాంకేతికతను ప్రవేశపెట్టడం సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ట్రంప్‌తో పలు అంశాలపై చర్చించా. టెక్నాలజీ, రక్షణ, భద్రత రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించాం’ అని తెలిపారు. కలసి ముందుకెళతాం: ట్రంప్ ‘ప్రధాని మోదీ, నేను చాలామంచి స్నేహితులయ్యాం. భారత్–అమెరికాల మధ్య ఇప్పుడున్నంత సత్సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేవు. మిలటరీ సహా పలు రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని మేం నిర్ణయించాం. ఈరోజు మాత్రం వాణిజ్యంపై చర్చించాం’ అని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని ఆపేశామని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. హోర్ముజ్ జలసంధిలో భారత చమురు ట్యాంకర్లపై దాడులు జరగకుండా యుద్ధనౌకలను మోహరించామని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో స్థిరత్వాన్ని, గల్ఫ్ ప్రాంతంలో పనిచేన్తున్న భారత సంతతి ప్రజల రక్షణను తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. దీంతో చమురు ధరలు స్థిరంగా ఉండేలా తామూ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్–అబేలతో త్రైపాక్షిక భేటీ జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేలతో త్రైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. జపాన్–అమెరికా–ఇండియా(జయ్)గా వ్యవహరించే మూడు దేశాల భేటీలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, శాంతిస్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై మోదీ, ట్రంప్ అబేలు చర్చించారు. మరోవైపు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జే–ఇన్‌తో సమావేశమయ్యారు.‘స్నేహితుడైన మూన్–జే–ఇన్ను కలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. దక్షిణకొరియా–భారత్‌ల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరిచేందుకు మూన్ కృషిచేస్తూనే ఉంటారు’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కల్తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సైబర్ భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. సమ్మిళితవృద్ధికి ఏకాభిప్రాయం.. సమ్మిళిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి కోసం అన్నిదేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక ఫలాలు సామాన్యులకు చేరేలా తమ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. డిజిటల్ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి ఐదు ‘ఐ’లు అవసరమని పేర్కొన్నారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో శుక్రవారం ప్రారంభమైన జీ20 దేశాల సదస్సులో మోదీ మాట్లాడుతూ..‘భారత్‌లో టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు అందేలా మా ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. 120 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భాగంగా పీఎం జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై), ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని తీసుకొచ్చాం. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ పెన్షన్లు, రుణాలు, రెమిటెన్సులు పొందడం వంటి ఆర్థిక సేవలను ప్రజలు పొందేందుకు జన్‌ధన్ యోజన ఎంతగానో ఉపకరించింది’ అని చెప్పారు. టెక్నాలజీ సాయంతో సమాజానికి గరిష్ట లబ్ధిచేకూర్చడానికి ఐదు ‘ఐ’లు అంటే.. అందర్ని కలుపుకుపోవడం(ఇన్‌క్లూజివ్‌నెస్), స్వదేశీకరణ(ఇండిజినైజేషన్), నవకల్పన(ఇన్నొవేషన్), పెట్టుబడులు–మౌలికవసతులు(ఇన్వెస్ట్మెంట్–ఇన్ఫ్రా), అంతర్జాతీయ సహకారం(ఇంటర్నేషనల్ కోఆపరేషన్) అవసరమని మోదీ తెలిపారు. పుతిన్‌తో జోక్ వేసిన ట్రంప్ అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై మీడియాప్రతినిధులు ప్రశ్నలతో ట్రంప్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో ట్రంప్ పుతిన్‌వైపు వేలు చూపిస్తూ..‘ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు’ అని జోక్ వేశారు. దీంతో పుతిన్, మీడియా ప్రతినిధులు నవ్వుల్లో మునిగిపోయారు. పుతిన్‌తో సత్సంబంధాలున్నాయనీ, భవిష్యత్‌లో మంచి ఫలితాలొస్తాయని ట్రంప్ అన్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసి 75 ఏళ్లయిన సందర్భంగా రష్యాలో వేడుకలకు రావాలని పుతిన్ ట్రంప్‌ను కోరారు. ‘ఎస్–400’పై చర్చించని నేతలు.. ట్రంప్–మోదీల భేటీ సందర్భంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్–400 క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రస్తావన రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ తెలిపారు. ఇరుదేశాల మధ్య రక్షణ రంగ సహకారం బలోపేతం చేసుకోవడంపై చర్చ జరిగిందన్నారు. 2014లో 5 బిలియన్ డాలర్లతో ఎస్–400 వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. ప్రజల సమాచారాన్ని(డేటా) సరికొత్త సంపదగా ఆయన అభివర్ణించారు. డేటా ఫ్లో విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను కంపెనీలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తమ పౌరుల సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని భారత్ సహా పలుదేశాలు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీ20 సదస్సు సందర్భంగా డేటాను స్థానికంగా భద్రపరచడాన్ని అమెరికా వ్యతిరేకిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. -
కారు నుంచి బుల్లెట్ రైలు వరకూ
ఒసాకా/కోబే: భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ కీలకమైన పాత్ర పోషించిందని ప్రధాని మోదీ తెలిపారు. సంయుక్త భాగస్వామ్యంలో కార్లు(మారుతీ సుజుకీ) తయారుచేయడం దగ్గర్నుంచి బుల్లెట్ రైళ్ల వరకూ ఇరుదేశాల మధ్య సంబంధాలు కాలంతోపాటు దృఢమయ్యాయని వ్యాఖ్యానించారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సు కోసం మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పటిష్టత కోసం, అవినీతిని నిర్మూలించడానికి రుణఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, డేటా ఫ్లో నియంత్రణ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని మోదీ–అబేలు నిర్ణయించారు. వాతావరణ మార్పులపై ఈ జీ20 సదస్సులోనే ఓ నిర్మాణాత్మక అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో జపాన్ నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్(ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు)పై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. జీ20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగం.. ప్రపంచదేశాలతో భారత్ సంబంధాల విషయానికి వస్తే జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. సామరస్యం, పరస్పరం గౌరవించుకోవడం అన్నది ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో గురువారం భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీకి భారత సంతతి ప్రజలు కరతాళధ్వనులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంలో జపాన్ పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఇండియాలో ప్రతీచోట జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉన్నాయి. అదే సమయంలో భారత మానవ వనరులు, నైపుణ్యంతో జపాన్ లబ్ధిపొందుతోంది’ అని అన్నారు. ‘విపత్తు’ సాయం కోరుతున్నా.. విపత్తు నిర్వహణ, పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో జపాన్ సహకారాన్ని తాము కోరుతున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఏడాది భారత్‌లో జరిగే ఇండియా–జపాన్ వార్షిక సదస్సుకు అబే రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా, ఈ భేటీకి ముందు ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 3 కోతుల కథ చెప్పిన మోదీ భారత్–జపాన్ల మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలిపేందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న మూడు కోతులను మోదీ ప్రస్తావించారు. ‘చెడు చూడవద్దు.. చెడు వినవద్దు.. చెడు మాట్లాడవద్దు అని బాపూ(మహాత్మా గాంధీ) చెప్పడాన్ని మనమందరం వినుంటాం. ఇందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న కోతులను ప్రతీకగా చూపుతారు. కానీ ఇందుకు మూలం 17వ శతాబ్దపు జపాన్‌లో ఉంది. మిజారు అనే కోతి చెడు చూడదు. కికజారు అనే కోతి చెడు వినదు. ఇవజారు అనే కోతి చెడు మాట్లాడదు’ అని మోదీ తెలిపారు. -
భారత్–జపాన్, 2+2
దౌత్య సంబంధాలు ఏర్పడటంలోనూ, అవి చిక్కబడటంలోనూ ఎన్నో అంశాలు కీలకపాత్ర పోషి స్తాయి. అందుకే రెండు దేశాలు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంటే... ఆ రెండు దేశాలతో లేదా వాటిలో ఒక దేశంతో విభేదాలున్న మూడో దేశం ఆ సాన్నిహిత్యాన్ని సంశయంతో చూస్తుంది. జపా న్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పం దాలను సహజంగానే ఇతర దేశాలకన్నా చైనా నిశితంగా గమనిస్తుంది. భారత్–జపాన్ల మధ్య ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంత ర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆరు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం మరింత పెంపొందించేం దుకు ఈ శిఖరాగ్ర సమావేశంలో అంకురార్పణ జరిగింది. ఇంతవరకూ అమెరికాతో మాత్రమే ఉన్న మంత్రుల స్థాయి 2+2 చర్చల ప్రక్రియ విధానాన్ని జపాన్‌కు కూడా వర్తింపజేసేందుకు అంగీకారం కుదిరింది. అమెరికాతో రక్షణ శాఖ, విదేశాంగ మంత్రుల స్థాయిలో 2+2 చర్చల ప్రక్రియ సాగు తోంది. జపాన్‌తో ప్రస్తుతం ఇది కార్యదర్శుల స్థాయిలోనే ఉంది. అయితే దాన్ని మరింత విస్తృతం చేయడం కోసం 2+2 చర్చల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. 2+2 చర్చల్లో ఇరు దేశాలూ వ్యూహాత్మక, భద్రతా అంశాలపై లోతుగా చర్చించుకుంటాయి. రక్షణ రంగానికి సంబం ధించి రెండు దేశాలూ మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ తమ సైనిక స్థావరాలను ఇరు దేశాలకూ చెందిన సైనిక దళాలు అవసర సమయాల్లో పరస్పరం వినియోగించుకోవడానికి వీలు కల్పించే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికొచ్చాయి. ఈ మాదిరి ఒప్పందం మనకు ఇంతవరకూ అమెరికా, ఫ్రాన్స్‌లతో ఉంది. ఇది జపాన్‌తో కూడా కుదిరితే ఆఫ్రికా ఖండం లోని ఏడెన్ జలసంధి సమీపంలో జపాన్‌కున్న జిబౌతి స్థావరం మన నావికా దళానికి అందు బాటులోకొస్తుంది. అలాగే హిందూ మహా సముద్రంలోని అండమాన్, నికోబార్ దీవుల్లో భారత్ కున్న సైనిక స్థావరాలు జపాన్ ఆత్మరక్షణ దళాలకు వినియోగపడతాయి. మొన్న ఆగస్టులో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు తాజాగా దీనిపై తదుపరి చర్చలు జరపాలన్న నిర్ణయానికొచ్చారు. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశమూ ఖండాంత రాల్లో తన సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. మన దేశం హిందూ మహా సముద్ర ప్రాంత దేశమైన సేషెల్స్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని క్రమేపీ విస్తరించుకోవడాన్ని గమనించాక మన దేశం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత స్థావరాల విషయంలో సేషెల్స్ సానుకూలత ప్రదర్శించినా స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో మొన్నీ మధ్య వెనకడుగేసింది. వాస్తవానికి సేషెల్స్ 2011లో సైనిక స్థావరం ఏర్పాటు చేయమని చైనాను కోరింది. అది అంగీకరించి ఆ పని పూర్తిచేసింది. సముద్ర దొంగల బెడద నివారణ కోసం ఇది అవసరమని సేషెల్స్ భావించింది. ఇప్పుడు భారత్‌ను కూడా అను మతిస్తే ఆ రెండు దేశాలమధ్యా మున్ముందు సమస్యలు తలెత్తి అవి యుద్ధానికి దారితీస్తే తమ భూభాగంలోనే అవి కత్తులు దూసుకునే ప్రమాదం ఏర్పడుతుందని అక్కడి విపక్షాలు ఆందోళన మొదలుపెట్టాయి. పర్యవసానంగా అది కాస్తా ఆగిపోయింది. యుద్ధ సమయాల్లో తమ దళాలకు అవసరమయ్యే ఆహారం, రక్షణ సామగ్రి తదితరాలను సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో చేరే యడం కోసం ఈ స్థావరాలను నెలకొల్పుకుంటారు. నిజానికి హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని ఏ దేశమూ సైనిక స్థావరంగా వినియోగించుకోకుండా, దాన్ని శాంతి మండలంగా ప్రకటించాలని మన దేశంతో సహా చాలా దేశాలు కోరేవి. 60, 70 దశకాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలు దానిపై పట్టు బట్టేవి. 1971లో ఐక్యరాజ్యసమితి ఆ మేరకు తీర్మానం కూడా చేసింది. అప్పట్లో అమెరికా– సోవి యెట్ యూనియన్ల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుండేవి. తమ దగ్గర అలాంటి స్థితి ఏర్పడకూడదని హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల భావన. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరికి వారు పోటీలు పడి సుదూర తీర ప్రాంతాల్లో తమ సైనిక స్థావరాలుండాలని కలలు కంటున్నారు. జిబౌతి నిరంకుశ పాలనలో ఉన్న అతి చిన్న దేశం కనుక అక్కడ జపాన్ సైనిక స్థావరానికి అడ్డంకులు ఏర్పడలేదు. ఇప్పుడా స్థావరాన్ని మనం కూడా వినియోగించుకోవడానికి జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది గనుక సేషెల్స్ వెనకడుగేయడం వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదు. తూర్పు చైనా సముద్రంలోని కొన్ని దీవుల విషయమై చైనాతో ఏర్పడ్డ వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు జపాన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశం మనతో సాన్నిహిత్యాన్ని మరింత పటిష్టపరుచుకోవాలన్న ఉత్సు కతతో ఉంది. అయితే ఇరు దేశాల మధ్యా వాణిజ్యం అనుకున్నంతగా విస్తరించడం లేదు. ద్వైపాక్షిక వాణిజ్యంపై 2011లో భారత్–జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నా అందులో పెద్దగా పురోగతి లేదు. 2017–18లో మూడేళ్లనాటితో పోల్చినా వాణిజ్యం అంతంతమాత్రమే. ఆ దేశానికి మన ఎగు మతులైనా, అక్కడినుంచి మన దేశానికి దిగుమతులైనా ఒకలాగే ఉన్నాయి. ఈ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఆ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. అయితే జపాన్ తాను రూపొందించిన నావి కాదళ విమానాలను మనతో డజను వరకూ కొనిపించాలని అయిదేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈసారి కూడా ఆ విషయంలో జపాన్‌కు నిరాశే ఎదురైంది. ఏదేమైనా ఈ శిఖరాగ్ర సమావేశం సాధించింది తక్కువేమీ కాదు. -
మూడేళ్ల తర్వాత ‘నరకం’ నుంచి విముక్తి
టోక్యో : సిరియా మిలిటెంట్ల నిర్బంధంలో మూడేళ్లుగా చిత్రహింసలు అనుభవించిన జపనీస్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు జుంపై యసుదాకు విముక్తి లభించింది. సిరియా అంతర్యుద్ధంలో పౌరులు అనుభవిస్తున్న బాధలను ప్రపంచానికి తెలియజేసేందుకు యసుదా సహా మరో ఇద్దరు జపాన్ జర్నలిస్టులు 2015లో అక్కడికి వెళ్లారు. అయితే జుంపై కార్యకలాపాలను పసిగట్టిన ఉగ్రమూకలు అతడిని నిర్బంధించాయి. ఈ విషయం తెలుసుకున్న తోటి జర్నలిస్టులు ఆయనను విడిపించేందుకు ప్రయత్నించడంతో వారి తల నరికి అత్యంత దారుణంగా హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో జుంపై కూడా మరణించి ఉంటాడని అంతా భావించారు. అయితే ఉగ్రవాదులు జుంపైని మాత్రం ప్రాణాలతోనే ఉంచి నానా రకాలుగా వేధించి కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ క్రమంలో జుంపై దక్షిణ టర్కీకి చేరుకోగా.. అక్కడి అధికారులు జపాన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. జపాన్ నుంచి వెళ్లిన అధికారులు జుంపై తమ దేశ పౌరుడేనని నిర్ధారించారు. దీంతో గురువారం టర్కీ నుంచి బయల్దేరిన జుంపై ఎట్టకేలకు జపాన్ చేరుకున్నాడు. ఈ విషయంసై స్పందించిన జపాన్ ప్రధాని షింజో అబే టర్కీ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా జుంపై మిలిటెంట్ల చేతిలో చిక్కడం ఇదే మొదటిసారి కాదు. 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో మూడు రోజుల పాటు మిలిటెంట్ల చేతుల్లో బంధీగా ఉన్నారు. ఆ సయమంలో తన అనుభవాలిన్నింటినీ కలిపి ‘యసుద ఈజ్ టఫ్’ అనే పుస్తకాన్ని రాశారు. జపాన్ చేరుకున్న అనంతరం మాట్లాడుతూ.. మూడేళ్ల తర్వాత నరకం నుంచి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. అయితే జుంపై తిరిగిరావడం పట్ల జపాన్ పౌరుల స్పందన మిశ్రమంగా ఉంది. చెప్పినా వినకుండా మాటిమాటికీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న జుంపైని విడిపించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ కొంతమంది విమర్శిస్తుండగా.. మరికొంత మాత్రం తమ సానుభూతి తెలుపుతున్నారు. -
జపాన్ ప్రధాని షింజో అబే కొత్త రికార్డు
-
2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా
వాషింగ్టన్: తమ దేశంలో ఉన్న 2.5 కోట్ల మంది మెక్సికన్లను జపాన్‌కు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఆదేశ ప్రధాని షింజో అబేను బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. గత వారం కెనడాలో జరిగిన జీ–7 సమావేశం సందర్భంగా ట్రంప్ ఇలాంటి పలు వ్యాఖ్యలు చేశారని భేటీలో పాల్గొన్న యూరప్ దేశాల ప్రతినిధులు వెల్లడించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ‘యూరప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసలు. షింజో, మీకు ఈ సమస్య లేదు. అందుకే మీ దేశానికి నేను 2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా. అప్పుడిక మీరు వెంటనే పదవి కోల్పోతారు’అని ట్రంప్ అనడంతో అబే సహా అక్కడున్న నేతలంతా అసహనానికి గురయ్యారు. ఇరాన్, ఉగ్రవాదం అంశంపై ట్రంప్ మాట్లాడుతూ..‘మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి ఇమ్మానుయేల్, ఎందుకంటే టెర్రరిస్టులంతా పారిస్‌లోనే ఉన్నారు’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్నుద్దేశించి అన్నారు. అమెరికా దిగుమతులపై సుంకం పెంచిన చైనా బీజింగ్: అమెరికా నుంచి దిగుమతయ్యే దాదాపు 50 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా శనివారం సుంకాలు పెంచింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం పెంచిన మరుసటి రోజునే, గట్టి సమాధానమిచ్చేలా చైనా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యయుద్ధం మొదలైంది. -
తొందర్లోనే నీ పదవి ఊడిపోతుంది!
వాషింగ్టన్ : కెనడాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే జీ-7 సదస్సులో ప్రసంగిస్తూ సభ్యదేశాలు, అధినేతల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదం, వలసదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, సదస్సులో ఆయన ప్రవర్తించిన తీరు తోటి సభ్యులకు చిరాకు తెప్పించిందని యూరోపియన్ యూనియన్ అధికారి తెలిపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇమాన్యుయల్ను ఉద్దేశించి ఉగ్రవాదులంతా ప్యారిస్‌లోనే ఉన్నారన్నారు. వలసదారుల వల్ల స్థానికులకు కలుగుతున్న నష్టాల గురించి ప్రస్తావిస్తూ.. యూరోప్‌లో వలసదారులు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో జపాన్ ప్రధాని షింజో అబేకు అసలు ఏ సమస్యా లేదు. కానీ నేను తలచుకుంటే 25 మిలియన్ మంది మెక్సికన్లను జపాన్‌కు పంపించగలను. అదే జరిగితే తొందర్లోనే నీ పదవి ఊడిపోతుందంటూ’ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కథనాలపై స్పందించిన ట్రంప్.. మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని.. జీ-7 దేశాధినేతలతో తనకు సత్సంబంధాలే ఉన్నాయంటూ వరుస ట్వీట్లతో అమెరికన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జీ–7లోకి మళ్లీ రష్యా రావాలి
లామాల్బే(కెనడా): జీ–7 కూటమిలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షించారు. కెనడాలోని క్యూబెక్‌లో జీ–7 దేశాల కూటమి సదస్సుకు హాజరయ్యేందుకు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల్లో రష్యా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘వాళ్లు రష్యాను కూటమి నుంచి పంపించారు. రష్యా మళ్లీ మనతో చేరాలి’ అని పరోక్షంగా ఇతర భాగస్వామ్య దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రతిపాదనను కూటమిలోని యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. క్రిమియాను ఆక్రమించినందుకు 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించారు. దీంతో అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌లతో జీ–7గా మారింది. శుక్రవారం ప్రారంభమైన ఈ కూటమి సదస్సులో వాణిజ్య వివాదాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తమ ఇనుము, అల్యూమినియం ఎగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో మిత్ర దేశాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దీంతో సదస్సు ముగిసిన తరువాత ఏకాభిప్రాయంతో కూడిన ఉమ్మడి ప్రకటన జారీకాకపోవచ్చని తెలుస్తోంది. అగ్రరాజ్యంతో తాడోపేడో.. ‘అమెరికాతో వాణిజ్యం చేసి అన్ని దేశాలు ప్రయోజనం పొందాయి. మేము మాత్రం లోటువాణిజ్యంలో మునిగిపోతున్నాం. ఆ లెక్కను సరిచేయాలనుకుంటున్నా ’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత జీ–7 దేశాలు తొలిసారి పలు అంశాలపై చీలిపోయాయి. అందులో పర్యావరణం, ఇరాన్‌తో అణు ఒప్పందం లాంటివి ఉన్నాయి. టారిఫ్‌లు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని మిగిలిన సభ్య దేశాలు భావిస్తున్నాయి. వాణిజ్యం విషయంలో ట్రంప్‌తో రాజీకుదరకపోతే తామూ వెనకడుగు వేయమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తేల్చిచెప్పారు. వైట్‌హౌజ్‌కు ఆహ్వానిస్తా! వాషింగ్టన్: జూన్ 12న సింగపూర్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగనున్న సమావేశం సానుకూలంగా సాగితే.. ఆయన్ను శ్వేతసౌధానికి ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, సమావేశంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరని పక్షంలో వెంటనే బయటకు వచ్చేందుకు కూడా సంకోచించబోనని ఆయన స్పష్టం చేశారు. జపాన్ ప్రధాని షింజో అబేతో వైట్‌హౌజ్‌లో సమావేశమైన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘ఉత్తరకొరియాతో యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం సానుకూలంగా సాగితే కిమ్‌ను వైట్‌హౌజ్‌కు లేదా ఫ్లోరిడాలోని మారాలాగో రిసార్టుకు ఆహ్వానిస్తా. అనుకున్న లక్ష్యాల దిశగా భేటీ జరగకపోతే.. వెంటనే బయటకు వచ్చేస్తా’ అని ట్రంప్ స్పష్టం చేశారు. -
జపాన్ ప్రధానికి తీవ్ర అవమానం
టెల్అవీవ్, ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన అబేకు చెఫ్ బూటులో ఆహార పదార్థాలను ఉంచి సర్వ్ చేయడం వివాదాస్పదంగా మారింది. నెతన్యాహు అత్యంత ఇష్టపడే చెఫ్ మోషే సెర్గీ ఈ విందుకు వంటకాలను తయారు చేశారు. అబేకు డిసర్ట్‌తో పాటు ఓ బూటులో చాకెట్లను ఉంచి సర్వ్ చేయడంపై జపాన్ దౌత్యవేత్తలు భగ్గమన్నారు. బూటుతో ఆహారాన్ని అందించడాన్ని జపాన్‌లో తీవ్రంగా, ఘోర అవమానంగా భావిస్తారని చెప్పారు. ఘటనపై చెఫ్ సెర్గీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అది నిజమైన షూ కాదని, మెటల్‌తో తయారు చేసిన వస్తువని వెల్లడించారు. కాగా, భోజన వడ్డన సమయంలో సెర్గీ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్, నెతన్యాహూల ముఖచిత్రాలు కలిగిన బౌల్స్‌లో సెర్గీ డిసర్ట్స్‌ను సర్వ్ చేశారు. -
భారీ స్కాంలో ప్రధాని భార్యను తప్పించారు
-
భారీ స్కాంలో ప్రధాని భార్య.. పేరు మాయం?
టోక్యో : ఓ భారీ కుంభకోణం (క్రోనిజం స్కాం) నుంచి జపాన్ ప్రధాని షింజో అబే భార్య అకీ అబేని తప్పించారు. ప్రధాని, ఆయన కింద ఉండే ఆర్థికశాఖ ఒత్తిడి మేరకు ఆయన భార్యను కుంభకోణానికి పాల్పడిన వ్యక్తుల జాబితాలో లేకుండా తొలగించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రధాని స్థాయి వ్యక్తి కాబట్టే తన భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికీ అనుమానం రాకుండా తప్పించారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి చెందిన భూమిని మోరిటోమో గాకువెన్ ఓ విద్యాసంస్థ యజమానికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్‌కు కట్టబెట్టారంట. ఆ స్కూల్ యజమానితో అబే భార్య అకీ ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, అదొక పెద్ద కుంభకోణం అంటూ దానికి పాల్పడిన వ్యక్తుల జాబితాను రూపొందించారు. తొలుత అందులో అబే భార్య పేరు ఉన్నప్పటికీ తాజాగా విచారణ బృందం చేతికి వెళ్లే సమయంలో ఆమె పేరును మాయం చేశారు. దీనిపై అబే కూడా స్పందిస్తూ తనకు గానీ, తన భార్యకు గానీ ఆ స్కూల్ యజమానికి సంబంధం లేదని, ఒక వేళ నిజంగానే సంబంధాలు ఉన్నట్లు గుర్తిస్తే కచ్చితంగా తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గాకువెన్ ఆయన భార్యను గత (2017)లోనే పోలీసులు అరెస్టు చేశారు. అధిక మొత్తంలో సబ్సిడీలు పొందిన ఆరోపణల కిందట వీరిని అరెస్టు చేసి విచారించగా అందులో అబే భార్యకు కూడా భాగం ఉన్నట్లు తెలిసింది. -
ప్రధాని విమానం రెక్క పలక ఊడిపోయింది
టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే ప్రయాణించే అధికారిక జంబో జెట్ విమానాల్లో ఒక విమానం రెక్కకు ఉండే ఓ పలక(ల్యాప్ టాప్ సైజ్లోది) ఊడిపోయింది. ఈ విషయాన్ని జపాన్ రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత భయాందోళనలు అలుముకున్నట్లు తెలిపారు. హోక్కాయిడోకు ఉత్తరంగా ఉన్న ద్వీపానికి బోయింగ్ 747 జంబో జెట్ బయలుదేరిన తర్వాత దాని రెక్క పలక ఊడిపోయిందని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అది కనీసం 15 అంగుళాల వరకు ఉంటుందని, విమానం రైట్ వింగ్‌కు ఉండే ఇంజిన్ పక్కన ఉండే పైలాన్‌కు కనెక్ట్ చేసి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో ప్రధాని అబే విమానంలో లేరని, దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అన్నారు. మరోపక్క, ఆ ప్యానెల్ ఎలా ఊడిపోయిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. కాగా, తూర్పు యూరప్ దేశాలకు అబే నేడు (శుక్రవారం) బయలుదేరుతున్నారు. ఆరు రోజులపాటు జరిగే ఈ పర్యటన ఈ జంబో జెట్ విమానాల ద్వారానే జరగనుంది. -
'కిమ్ ఒకసారి మారు.. మీ దేశం రిచ్ అవుద్ది'
టోక్యో : ఉత్తర కొరియా వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని జపాన్ అధ్యక్షుడు షింజో అబే విజ్ఞప్తి చేశారు. తన విధానాలను మార్చుకొని ప్రజలకు మంచి చేసే పనులపై ఆ దేశం దృష్టిని సారించాలని అన్నారు. మొత్తం తన అణుకార్యక్రమానికి ఉత్తర కొరియా శుభంకార్డు వేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం అబే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'ఉత్తర కొరియా తన పంథాను మార్చుకునేందుకు, అణుకార్యక్రమాలకు ముగింపు పలికేందుకు దక్షిణ కొరియా, అమెరికాతో కలిసి జపాన్ ఎంత మేరకు ఒత్తిడి చేయాలో అంత చేసింది' అని ఆయన అన్నారు. ఉత్తర కొరియాకు అంతర్జాతీయంగా దక్కాల్సినవి తాత్కాలికంగా నిలిపివేస్తుండంతో ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందా అనే విషయాన్ని చాలా సీరియస్‌గా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా ప్రచ్చన్నయుద్ధంలాంటి పరిస్థితుల్లో ఇది తీవ్రంగానే ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి కిమ్ సరైన విధానాలు అనుసరిస్తే ఉత్తర కొరియా అత్యంత ధనిక దేశమవుతుందని చెప్పారు. -
షింజో అబేకే మళ్లీ పట్టం!
టోక్యో: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జపాన్‌లో ఆదివారం జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షింజో అబే ఘన విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. లాన్ తుపాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షింజో అబేకే జపాన్ ప్రజలు మళ్లీ పట్టంగట్టనున్నారని ఎన్నికలకు ముందు కూడా పలు సర్వేలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జపాన్‌కు అత్యంత ఎక్కువకాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే నిలవనున్నారు. జపాన్ పార్లమెంటులో మొత్తం 465 స్థానాలుండగా, 311 సీట్లను షింజో అబేకు చెందిన లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) నేతృత్వంలోని కూటమి గెలుచుకోనుందని టీబీఎస్ అనే ఓ వార్తా చానల్ వెల్లడించింది. అబేకు మూడింట రెండొంతుల ఆధిక్యం (310 సీట్లు) లభిస్తే జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణానికి సవరణలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. 9వ అధికరణం ప్రకారం జపాన్ ఏ యుద్ధంలోనూ పాల్గొనకూడదు. యుద్ధమే లేనప్పుడు సైన్యం అవసరం లేదు. కాబట్టి జపాన్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సైన్యం లేదు కానీ అతికొద్ది మందితో ఆత్మ రక్షణ దళాన్ని మాత్రం ఆ దేశం ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఉత్తర కొరియా కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో 9వ అధికరణానికి సవరణలు చేయడం ద్వారా జపాన్‌కు సొంతంగా మిలిటరీని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాగా, సాధారణం కన్నా ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చి షింజో అబే అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం, ఉత్తర కొరియా అణుపరీక్షలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతోపాటు ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇచ్చేందుకు మళ్లీ తనకే ఓటు వేయాలని షింజో అబే ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేస్తున్న కాన్స్టిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ (సీడీపీ), పార్టీ ఆఫ్ హోప్‌లు సరైన పోటీని కూడా ఇవ్వలేకపోయాయి. ఈ రెండు పార్టీలనూ కొన్ని వారాల క్రితమే స్థాపించారు. పార్టీ ఆఫ్ హోప్‌కు 50 సీట్లు, సీడీపీకి 58 సీట్లు దక్కనున్నాయని టీబీఎస్ అంచనా వేసింది. అబేదే విజయమని సర్వేలు చెబుతున్నప్పటికీ జపాన్‌లో ఆయనను విమర్శించేవారూ ఎక్కువగానే ఉన్నారు. అబే ప్రభుత్వంలో బయటపడిన కుంభకోణాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన ముందస్తు ఎన్నికలు నిర్వహించారని పలువురు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ప్రధాని షింజో అబే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన దాని ప్రకారమే ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరిస్తానన్నారు. రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో చర్చిస్తామని, ఎక్కువ మంది మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తానని అబే పేర్కొన్నారు. గంటకు 216 కి.మీ. వేగంతో గాలులు లాన్ తుపాను జపాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షాలతోపాటు గంటకు 216 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులకు ఈ చిన్న ద్వీపదేశం అతలాకుతలమవుతోంది. అనేక ద్వీపాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయానికి రాజధాని టోక్యోపై తుపాను తన ప్రతాపం చూపొచ్చు. పశ్చిమ జపాన్‌లో రైళ్లు, రవాణా సాధనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 420 విమానాల రాకపోకలు నిలిపేశారు. తుపాను కారణంగా ఇద్దరు మరణించారు. -
కలల ‘బుల్లెట్’ కు ముందడుగు..
► అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేసిన భారత్, జపాన్ ప్రధానులు ► భారత్‌కు జపాన్ ఇచ్చిన పెద్ద కానుకన్న ప్రధాని మోదీ ► ఇరుదేశాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభం: షింజో అబే ► వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు సహా 15 ఒప్పందాలపై సంతకాలు అహ్మదాబాద్/గాంధీనగర్: భారత్–జపాన్ సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది. జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు గురువారం అహ్మదాబాద్‌లో శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబర్మతిలోని అథ్లెటిక్స్స్టేడియంలో జరిగిన కార్యక్రమం సభలో మోదీ మాట్లాడుతూ.. రూ.1.1 లక్షల కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ‘భారత్‌కు జపాన్ ఇచ్చిన పెద్ద కానుక’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత కలల ప్రాజెక్టుకు ముందడుగు పడిందన్నారు. ‘భారత–జపాన్ భాగస్వామ్యం ప్రత్యేకం, వ్యూహాత్మకం, అంతర్జాతీయం’అని అబే పేర్కొన్నారు.ఆ తర్వాత గాంధీనగర్‌లో జరిగిన భారత్–జపాన్ వార్షిక సదస్సులో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను పెంచేలా భద్రతతోపాటు పలు రంగాల్లోనూ కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రసాయం మానుకోవాలని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. భారత్–జపాన్.. ఒకరికొకరు! ‘పటిష్ఠ భారత్ కావాలని జపాన్.. జపాన్ బలోపేతాన్ని భారత్ కోరుకుంటున్నాయ’ని అబే వ్యాఖ్యానించారు. ‘నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘదృష్టి గల నేత. నవభారత నిర్మాణానికి ఆయన సంకల్పించారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితమే హైస్పీడ్ రైళ్లను తీసుకురావాలని ఆయన భావించారు. కొన్నేళ్లలోనే బుల్లెట్ రైలు కిటికీ నుంచి అందమైన భారతాన్ని దర్శిస్తాం’ అని అబే పేర్కొన్నారు. దేశంలో బుల్లెట్ రైలుండాలన్న భారత్ కలను సాకారంచేసే దిశగా ధైర్యంగా తొలి అడుగు ముందుకు పడిందని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.88వేల కోట్ల రూపాయలను నామమాత్రమైన 0.1శాతం వడ్డీకే ఇచ్చినందుకు జపాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను బుల్లెట్ రైలు గురించి మాట్లాడితే.. పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు దీనికి పనులు మొదలవుతుంటే.. ఇప్పుడు ఈ రైలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. వేగవంతమైన అనుసంధానత కారణంగా సమయం తగ్గుతుంది తద్వారా ఆర్థిక ప్రగతికి మార్గం పడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు శిక్షణ కోసం వడోదరలో జపాన్ సాయంతో ఏర్పాటుచేయనున్న ఇన్స్టిట్యూట్లో 4వేల మందికి శిక్షణనివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు విజయ్ రూపానీ, ఫడ్నవిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆప్‌ను అహ్మదాబాద్ – ఆంచీ ముంబై! బుల్లెట్ రైలు ద్వారా అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రయాణ సమయంతోపాటుగా ప్రజల మధ్య దూరం కూడా తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. గుజరాతీ, మరాఠీ పదాలను ఉపయోగిస్తూ.. ‘ఆప్‌ను అహ్మదాబాద్ నుంచి ఆంచీ ముంబై’ మధ్య నడిచే రైలు వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ‘భారతీయులం, మరీ ముఖ్యంగా గుజరాతీలం ఏది కొనాలన్నా, అమ్మాలన్నా గీచి గీచి బేరమాడతాం. చిన్న బండి కొనుక్కునేందుకు పది బ్యాంకులు తిరిగి ఎవరు తక్కువ వడ్డీకి రుణమిస్తారో వెతుకుతాం. ఇప్పుడు జపాన్ కూడా రూ.1.1 లక్షల కోట్ల ప్రాజెక్టుకు కేవలం 0.1 శాతం వడ్డీకే రుణమిచ్చింది’ అని మోదీ పేర్కొన్నారు. జపాన్‌లో తొలి రెండక్షరాలు (ఇంగ్లీషులో) జే,ఏ ఇండియాలో తొలి అక్షరం ఐ కలిస్తే ‘జై’ అవుతుందన్న అబే.. ‘జై జపాన్, జై ఇండియా’ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ నినాదం కోసం మోదీతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. అనంతరం గాంధీనగర్‌లోని దండి కుటీర్ మ్యూజియంను అబేకు దగ్గరుండి మోదీ చూపించారు. వ్యూహాత్మక బంధాల బలోపేతం అనంతరం, గాంధీనగర్‌లో భారత్–జపాన్ వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మోదీ–అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌరఅణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా వీరిద్దరూ చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. అనంతరం ఇరువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంయుక్త ప్రకటనపై సంతకం చేయటం ద్వారా.. భారత–జపాన్ సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం కానుంది. దీని ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా శాంతినెలకొల్పేలా.. ఇరుదేశాల ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మేం బలంగా ముందుకు తీసుకెళ్తాం’ అని అబే తెలిపారు. ఇరుదేశాలు ‘భారత్–జపాన్ పెట్టుబడుల రోడ్ మ్యాప్’కు అంగీకరించాయన్నారు. పౌర అణు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. క్లీన్ ఎనర్జీ రంగంలో ఇరుదేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందని అబే తెలిపారు. అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేలా చరిత్రాత్మక ఒప్పందంపై గతేడాది తన జపాన్ పర్యటన సందర్భంగా సంతకం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని మోదీ వెల్లడించారు. కాగా జపాన్ ప్రధాని అబే అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఆయన భార్య అకీ అబే కూడా బిజీగా గడిపారు. వివిధ పాఠశాలలు, కాలేజీలతోపాటుగా అంధులకోసం నడుస్తున్న ఎన్జీవోను సందర్శించారు. భూములు తీసుకుంటారనే బాధతో.. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకోసం భూసేకరణలో తమ వ్యవసాయ భూములు పోతాయేమోనని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బోయ్సర్ రైల్వే స్టేషన్ ఎదుట నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టిన రైతులు.. వ్యవసాయ భూములు తీసుకుంటే తమ జీవితాలు దుర్భరమవుతాయని ఆవేదన చెందారు. గుజరాత్ ఎన్నికల కోసమే: కాంగ్రెస్ హైస్పీడ్ రైలును కాంగ్రెస్ పార్టీ ‘గుజరాత్ ఎన్నికల బుల్లెట్ రైలు’గా అభివర్ణించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రైలుకు శంకుస్థాపన చేశారని విమర్శించింది. ప్రయాణికుల భద్రతపై దృష్టిపెట్టాల్సిందిపోయి.. ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించారని లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విశేషాలు ♦ ప్రాజెక్టు ఖర్చు రూ.1.1లక్షల కోట్లు ♦ జపాన్ చేస్తున్న సాయం 88వేల కోట్లు (0.1 శాతం వడ్డీపై రుణం) ♦ ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్లు ♦ గరిష్ట వేగం గంటకు 320 – 350 కిలోమీటర్లు ♦ మొత్తం స్టేషన్లు 12 ♦ ప్రయాణ సమయం 12 స్టేషన్లలో ఆగితే 2.58 గంటలు ♦ కొన్ని స్టేషన్లలోనే ఆగితే 2.07 గంటలు ♦ ప్రస్తుత రైల్వే మార్గంలో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణ సమయం 7–8 గంటలు ♦ 2022 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించాలని లక్ష్యం. ఉగ్రసాయంపై.. ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు సంపూర్ణ సహకారం ఉంటుందని అబే స్పష్టం చేశారు. అల్‌కాయిదాతోపాటుగా పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై పోరాటంలో సహకారానికి మద్దతు తెలిపారు. ముంబై (2008), పఠాన్‌కోట్ (2016) ఉగ్రదాడులకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా మోదీ, అబేలు పాకిస్తాన్‌ను కోరారు. ‘ఉగ్రవాద కేంద్రాలు తొలగించటం, వారికి ఎలాంటి వసతులు అందకుండా చేయటం, ఉగ్ర నెట్‌వర్క్‌ల ధ్వంసం, సీమాంతర ఉగ్రవాదం లేకుండా చూడాలని అన్ని దేశాలను మోదీ–అబే కోరారు’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. -
మోదీ-అబె : మండిపడుతున్న చైనా
సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-జపాన్ బంధంపై చైనా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ తమకు రాకపోవడం, డోక్లామ్ వ్యవహారంలో ఎదురు దెబ్బ తగలడంతో.. తన ఆక్రోశాన్ని మరో రూపంలో చైనా బయట పెడుతోంది. తాజాగా నరేంద్ర మోదీ-షింజో అబెల సాన్నిహిత్యంపై చైనా మీడియా నిప్పులు కురిపించింది. హైస్పీడ్ రైల్ విషయంలో వాళ్లిద్దరూ తమగోతిని తామే తవ్వుకుంటున్నారని చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబెల్ టైమ్స్ పేర్కొంది. ఆసియాలోని ఏ దేశం కూడా సాంకేతికంగా, జాతీయ భద్రత విషయంలో చైనాకు సరితూగవని చెప్పింది. ఆసియా ఖండం నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.. అందులో సందేహం లేదు.. అయితే ఈ అబివృద్ధి పరుగుపందెంలో.. ఎవరు ముందుగా గమ్యం చేరతారో వారే విజేతగా నిలుస్తారు. ఇందులో ఇప్పటికై చైనా ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని.. ఇప్పుడు కొత్తగా భారత్-జపాన్‌లు ఏం సాధించగలవని గ్లోబెల్ టైమ్స్ అపహాస్యం చేసింది. ఆసియాలో అత్యంత సంకుచితంగా ఆలోచించే దేశం జపాన్ అంటూ ఆ పత్రిక నిందారోపణలు చేసింది. బారత్-జపాన్‌లు ఎంత దగ్గరైనా.. చైనాకు వచ్చే నష్టం ఏమీలేదని ఆ పత్రిక పేర్కొంది. -
'లక్ష కోట్ల లూటీకే మోదీ 'బుల్లెట్''
ముంబయి : ప్రధాని నరేంద్రమోదీపై శివసేన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. రూ.1.08లక్షల కోట్లను లూటీ చేసేందుకే బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోదీ తెరమీదకు తెచ్చారంటూ తన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. ఇది మోదీ అత్యంత ఖరీదైన డ్రీమ్ అని దాని పేరిట దేశం సొమ్మును దోపిడిచేయాలనుకుంటున్నారనితీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య పీయూష్ గోయల్‌ను రైల్వే మంత్రిని చేశారని, ఆయన బీజేపీ కోశాధికారి కూడా అని, అందుకే ఆయనను ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వేమంత్రిని చేశారంటూ విమర్శించింది. 'ఈ ప్రాజెక్టు కోసం జపాన్ ప్రతి ఒక్కటి అందిస్తుంది.. నెయిల్స్ నుంచి రైళ్ల వరకు.. మానవ శక్తి వనరుల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఇంకా చెప్పాలంటే సిమెంట్ నుంచి కాంక్రీట్ వరకు కూడా.. డబ్బు భూమి మాత్రం.. గుజరాత్, మహారాష్ట్రది. మొత్తం ఆదాయం మాత్రం టోక్యోకు వెళ్లిపోతుంది. ఈ లూటీని, మోసాన్ని ఎవరూ ప్రశ్నించకుండా మోదీ మానస పుత్రిక (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు మాత్రం అభినందనలు చెబుతున్నారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడింది. -
జై జపాన్-జై ఇండియా
మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్నాం బుల్లెట్ రైలు శంకుస్థాపనలో జపాన్ ప్రధాని షింజో అబే రాబోయే రోజులు హైస్పీడ్ కారిడార్లవే జపాన్ మనకు నిజ స్నేహితుడు అబేకు కృతజ్ఞతలు తెలియజేసిన మోదీ సాక్షి, అహ్మదాబాద్: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపు ఉన్న నేత అని, అందుకే మేకింగ్ ఇండియా కలను సార్థకం చేసుకునేందుకు జపాన్ లాంటి దేశాన్ని భాగస్వామిగా ఎంచుకున్నారని జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తెలిపారు. గురువారం ఉదయం సబర్మతిలో ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, అనంతరం అబే ప్రసంగించారు. నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలుపెట్టిన అబే.. భారత్ తో జపాన్ అనుబంధం ప్రత్యేకమైనదన్న ఆయన మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్న దేశం జపానేనని తెలిపారు. భారత్-జపాన్ల చేతులు కలిస్తే అన్ని సుసాధ్యాలే అని చెప్పిన అబే.. జై జపాన్-జై ఇండియా నినాదంతో ఇరు దేశాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తన తదుపరి పర్యటనలో మళ్లీ ఇక్కడికి వస్తే మోదీతో కలిసి షింకసెన్(బుల్లెట్ ట్రైన్) లో కలిసి ప్రయాణించాలనుకుంటున్నానని షింజో అబే ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా భారత్ తో మరిన్ని వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటామని ఆయన ప్రకటించారు. బుల్లెట్ అసలు స్టోరీ ఇక ఏ దేశ అభివృద్ధికైనా రవాణా వ్యవస్థే ప్రాథమిక అవసరమని భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుల్లెట్ ప్రాజెక్టును ఉద్దేశిస్తూ... తర్వాతి తరాలు హై స్పీడ్ కారిడార్లతోనే వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సాంకేతికతతో పేదలకు సాధికారత ప్రయత్నిస్తే పేదరికంపై విజయం సాధించినట్లేనని మోదీ పేర్కొన్నారు. మన రైల్వే సంస్థ చాలా పెద్దదని పేర్కొన్న మోదీ.. ఒక వారం రైళ్లలో ప్రయాణించే మన దేశ ప్రజల సంఖ్య.. జపాన్ మొత్తం జనాభాకు సమానమని చెప్పుకొచ్చారు. సగటు భారతీయుడికి మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పటంతోపాటు ఉద్యోగాల కల్పన ఆస్కారం లభించదన్నారు. కాలుష్య రహితం అయిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మన జీవితాలలో కీలకంగా మారబోతుందని అభిప్రాయపడ్డారు. ‘88,000 కోట్లను కేవలం 0.1 శాతం వడ్డీకే జపాన్ భారత్ కు ఇచ్చిందని, కీలకమైన మెట్రో ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించేందుకు ముందుకు వచ్చిందని, అందుకే జపాన్ భారత్‌కు ఓ నిజమైన ఆత్మీయ దేశమని మోదీ చెప్పుకొచ్చారు. 2022-23 కల్లా మెట్రో రైలు ప్రారంభం అవుతుందన్న ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అవాంతరాలు ఉండబోవని ప్రకటించిన జపాన్ ప్రధాని షింజో అబేకు.. మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. -
జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం
-
జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం
అహ్మదాబాద్ : జపాన్ ప్రధానమంత్రి షింజో అబే బుధవారం భారత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. షింజో అబే సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో గుజరాత్ విచ్చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీతో కలిసి ఆయన సబర్మతీ ఆశ్రమంతో పాటు సిద్ది సయ్యద్ మసీదును సందర్శించనున్నారు. అలాగే ఇండో-జపాన్ వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఇద్దరు ప్రధానులు పాల్గొంటారు. అలాగే గురువారం అహ్మదాబాద్ - ముంబై మధ్య తొలి హైస్పీడ్ రైలు పనుల ప్రారంభ కార్యక్రమంలో షింజో అబే పాల్గొంటారు. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అహ్మదాబాద్ సర్వాంగ సుందరంగా తయారైంది. మరోవైపు భద్రతా ఏర్పాట్ల కోసం నగరంలోని పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల పోలీసులు కూడా మోహరించారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఎన్ఎస్జీ కమాండోల బృందం పహరా కాస్తున్నాయి. -
కొత్త శకానికి నాంది
కొత్త శకంలోకి ప్రయాణిస్తున్నాం :మోదీ ఇక తిరుగులేని విజయాలు సాధిద్దాం నమ్మకమే పునాది ఏర్పడ్డ బంధం : షింజో అబె ఇండో-జపాన్ బంధం ప్రత్యేకమైంది సాక్షి, అహ్మదాబాద్ : భారత్-జపాన్ బంధం అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బంధంగా జపాన్ ప్రధాని షింజో అబె అభివర్ణించారు. భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండో-జపాన్ బంధం అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇండో-జపాన్ బంధం వల్ల భారత్ సాంకేతికంగా కొత్త శకంలోకి ప్రయాణిస్తుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రయిన్ శంకుస్థాపనకు భారత్ వచ్చిన షింజే అబెతో కలసి మోదీ అహ్మదాబాద్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ రీజియన్‌లో శాంతి, ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్నాయని చెప్పారు. జపాన్ ప్రధాని మాట్లాడుతూ.. భారత్‌తో ఆర్థిక, వ్యాపార బంధాలను బలోపేతం చేసుకునేందేకు ఆసక్తిని చూపుతున్నట్లు చెప్పారు. అందులో భాంగగానే ఇక్కడ బుల్లెట్ ట్రయిన్ ఏర్పాటు చేసేందుకు ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. భారత్ ప్రస్తుతం ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా సాధిస్తోందని అన్నారు. భారత వృద్ధిరేటును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన హై స్పీడ్ రైళ్ల సాంకేతికను ఇకముందుకూడా అందిస్తామని చెప్పారు. మా దగ్గర ఆత్యంత శక్తివంతమైన, పటిష్టమైన సాంకేతికత, వాటిని నిర్వహించే సంస్థలున్నాయి.. భారత్‌లో తిరుగులేని మానవ వనరులు ఉన్నాయి.. ఈ రెండింటిని మేళవిస్తే.. ప్రపంచంలో మనం తిరుగులేని విజయాలను సాధించవచ్చిన షింజో అబె చెప్పారు. ఒప్పందాల మూలంగా భారత్-జపాన్ల మధ్య బంధం ఏర్పడలేదని.. ఇది పరస్పర నమ్మకం మీద ఏర్పడిందని అబె చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు జపాన్‌కు దగ్గరగా ఉంటాయని అబె పేర్కొన్నారు. ఇక్కడ పుట్టిన బౌద్ధమతం, యోగా మేంకూడా అనుసరిస్తామని చెప్పారు. ఇక్కడి సినీనటులకు జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పారు. -
‘ఉత్తర కొరియా సమస్య ముగిస్తా.. బెట్ కాస్కోండి’
రోమ్: ఉత్తర కొరియా ఒక ప్రపంచ సమస్య అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జపాన్ ప్రధాని షింజో అబేను కలిసి పలు విషయాలు మాట్లాడారు. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశం జరుగడానికి ముందే ఆయన షింజోను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇది చాలా పెద్ద సమస్య.. ప్రపంచ సమస్య.. త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఏదో ఒక చోట అది కచ్చితంగా పరిష్కారం జరుగుతుంది.. కావాలంటే మీరు దీనిపై పందెం కాయొచ్చు’ అని ట్రంప్ అన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తపూరిత పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఇప్పటికే ఉత్తర కొరియా సముద్ర జలాలకు సమీపంలో మోహరించి ఉంచారు. అయితే, తాను మధ్యే మార్గంగా సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్యవర్తిత్వంతో అది సాధించాలని భావిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోగా తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
జపాన్‌కు ట్రంప్ జై.. ‘నన్ను నమ్మండి’
టోక్యో: జపాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జై కొట్టారు. జపాన్ ప్రధాని షింజో అబేకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన చాలా ఉల్లాసంగా కబుర్లు చెబుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు 100శాతం తనకు సమ్మతమేనని చెప్పారు. ఇటీవల ఉత్తర కొరియా నాలుగు ఖండాంతర క్షిపణులను పరీక్షించిన విషయాన్ని కూడా వారిద్దరు చర్చించుకున్నట్లు మీడియా ప్రతినిధులకు అబే తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో భద్రతాపరమైన తీర్మానానికి విరుద్ధంగా ఉత్తర కొరియా వ్యవహరించిందని, ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా ఒప్పందానికి ఒక సవాలు అని ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చినట్లు అబే వివరించారు. ‘అమెరికా 100శాతం జపాన్‌తో కలిసి పనిచేస్తుందని డోనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్లో చెప్పారు. ఆయన చెప్పిన మాటల్ని మొత్తం జపాన్ ప్రజలకు తెలియజేయాలని నన్ను కోరారు. ఈ విషయంలో రెండో ఆలోచనే అవసరం లేదని, పూర్తి స్థాయిలో తనను నమ్మవచ్చని చెప్పారు. ప్రమాదం ఇప్పుడు కొత్త దశలోకి వచ్చిందని మేమిద్దరం అంగీకరించాం(ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో)’ అని అబే తెలిపారు. -
పట్టువదలని ట్రంప్
► కొత్త వలస నిషేధ ఉత్తర్వుల జారీకి కసరత్తు ► వలస చట్టాల అమలును కఠినతరం చేస్తామని వెల్లడి వాషింగ్టన్ : కోర్టుల్లో వరుసగా షాక్‌లు తగులుతున్నా... నిషేధపు ఉత్తర్వులపై మాత్రం వెనక్కి తగ్గనంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్వల్ప మార్పులతో వచ్చే వారం కొత్త ఉత్తర్వులు జారీ చేస్తానని శనివారం ఆయన స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని కోర్టులు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునే లక్ష్యంతో ట్రంప్ ముందడుగు వేస్తున్నారు. ‘ఈ యుద్ధంలో మేం గెలుస్తాం. అందుకు కొంత సమయం పట్టినా మాదే విజయం. ఇందుకోసం ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా పరిశీలిస్తున్నాం... అందులో ఒకటి కొత్త ఉత్తర్వులు జారీచేయడం’అని ట్రంప్ పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ లో జపాన్ అధ్యక్షుడు షింజో అబేతో కలిసి ఫ్లోరిడాకు వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘దాదాపు అలాంటిదే... భద్రత కోసం చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరముంది. కోర్టు నిర్ణయంపై ఎలా ముందుకెళ్లాలనే నిర్ణయంపై వచ్చే వారం వరకూ వేచి చూస్తా. అది సోమవారం లేదా మంగళవారం కావచ్చు’అని ట్రంప్ వెల్లడించారు. ఇక నుంచి క్షుణ్నంగా తనిఖీలు: ట్రంప్ కొత్త ఉత్తర్వుల వివరాలు వెల్లడిస్తూ... వలస చట్టం అమలు కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కొత్తగా భద్రతా చర్యలు పొందుపరుస్తాం. ఇక నుంచి చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం. మన దేశానికి రావాలనుకుంటున్న ప్రజలు మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేలా ఉండాలి’అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు శుక్రవారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ... అమెరికాకు అదనపు భద్రత కోసం ఏదొకటి చాలా త్వరగా చేయాలని, వచ్చేవారం వాటిని మీరు చూస్తారంటూ దీమాగా చెప్పారు. ‘కోర్టులో పోరాటాన్ని కొనసాగిస్తాం. కేసు గెలుపుపై నాకు ఎలాంటి సందేహం లేదు’అని జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దేశ భద్రత కోసమే అధ్యక్షుడినయ్యా... ‘మనం దేశాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాం. దేశ భద్రత కోసం ఏది అవసరమో అది చేయాలనుకుంటున్నాం. మన నిర్ణయం విజయవంతమవుతుందని భావించాం.. అయితే ఇంత సమయం తీసుకోకూడదు. ఎందుకంటే దేశ భద్రతే మనకు ముఖ్యం. ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే అది దేశ భద్రత కోసమే.. నేను భద్రత ఇవ్వగలనని ఓటర్లు నమ్మారు’ అని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఎన్నో ముప్పులు పొంచి ఉన్నాయని, అలా జరిగేందుకు అనుమతించకూడదన్నారు. అధ్యక్షుడిగా చాలా తక్కువ సమయంలోనే అనేక విషయాల్ని నేర్చుకున్నానంటూ తన అనుభవాలు వెల్లడించారు. వాటికి నా దెబ్బ రుచిచూపిస్తా విదేశాలకు వ్యాపారాల్ని తరలించాలనే ఆలోచనలో ఉన్న కంపెనీలకు నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవలం బై బై చెప్పి, అందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించి వెళ్లిపోవడం అంత సులువు కాదనే విషయం ఆ కంపెనీలకు తెలిసేలా చేస్తానన్నారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి శనివారం వారాంతపు ప్రసంగం చేస్తూ... భారీ పన్ను సంస్కరణల కోసం కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త పన్ను విధానాలు అమల్లోకి వస్తే ఉద్యోగులపై, వ్యాపారులపై భారం తగ్గుతుందని చెప్పారు. అమెరికాలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనేది ప్రభుత్వ అభిమతమని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
నిలబడే నిద్రపోయిన దేశ అధ్యక్షుడు!
వయసుకారణంగానో లేక చాలా దూరం ప్రయాణించడం మూలంగానో తెలియదు కానీ ఏకంగా దేశాధ్యక్షుడే ఓ ముఖ్యమైన సమావేశంలో నిలబడే కునుకు తీసినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అది కూడా మీడియా ప్రతినిధుల ముందు. ఇంకేముంది సమావేశంలో నిద్రపోవడమేంటని విమర్శలు రావడంతో అవన్ని వట్టి ఆరోపణలేనని సదరు దేశం కొట్టిపారేసింది. జపాన్ ప్రధాని షింజో అబే ఆహ్వానం మేరకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(92) జపాన్‌లో పర్యటించడానికి వచ్చారు. ఆఫ్రికా అభివృద్ది కోసం ప్రతి ఏడాది నిర్వహించే టోక్యో అంతర్జాతీయ సదస్సు(టీఐసీఏడీ) ఈ ఏడాది అగస్టులో కెన్యాలో జరుగనుంది. దీనిలో భాగంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల గురించి వివరించడానికి టోక్యోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జపాన్, జింబాబ్వే దేశాల దౌత్య సంబంధాల బలోపేతం గురించి అబే మాట్లాడారు. ఆఫ్రికాకు ముగాబే ఒక దిగ్గజంగా అభివర్ణిస్తూ మాట్లాడుతుండగా..నిలబడే ఉన్న ముగాబే కునుకు తీసినట్టు స్పష్టంగా కనిపించింది. తనకు కుడి వైపు నిద్రమత్తులో అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉన్న ముగాబేను ఒక్కసారి అలా చూసి చూడనట్టు అబే చూశారు. కొంత అసహనానికి గురి అయినట్టు కూడా కనిపించింది. నిలబడే ఓ దేశ అధ్యక్షుడు కునుకు తీశారా అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ ప్రారంభం అవ్వడంతో జింబాంబ్వే సమాచార మంత్రిత్వ శాఖ వివరణ కూడా ఇచ్చుకుంది. ఆ సమయంలో ముగాబే నిద్రపోవడంలేదని కేవలం అక్కడ జరగబోయే ఒప్పందాల గురించి ఆలోచిస్తున్నారని తెలిపింది. మీడియా సమావేశంలో ఎవరైనా నిద్రపోతారా ? ముగాబేను అగౌరవ పరిచేలా వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమని ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ముగాబే ఇలాంటి సంఘటనలో మీడియా కంటికి చిక్కడం మొదటిసారేం కాదు. ఆఫ్రికా యూనియన్ శిఖరాగ్రసమావేశంలోనూ పలువురు ముఖ్యులు ప్రసంగిస్తున్న సమయంలో కూడా నిద్రపోయారు. -
ముగిసిన ప్రధాని షింజో అబే భారత్ పర్యటన..
ఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబే భారత్‌లో మూడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఢిల్లీలో భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సులో భాగంగా శనివారం భారత్ వచ్చిన ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై.. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఒప్పందాలు చేసుకోనున్నారు. సదస్సు పూర్తయిన తర్వాత మోదీ, అబే అదే రోజు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. దశాశ్వమేధఘాట్ వద్ద గంగా హారతిని తిలకించారు. ఇందుకోసం అలహాబాద్ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని గంగా తీరాన భారీ వేదిక ఏర్పాటు చేశారు. శుక్రవారం జపాన్ ప్రధాని అబేకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జయంత్ సిన్ ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. -
మోదీ-అబే గంగా హారతి!
45 నిమిషాలసేపు ఘాట్‌లోనే... ♦ సరికొత్త సాంస్కృతిక బంధానికి నాంది ♦ వేదికపై ఇద్దరు ప్రధానుల సెల్ఫీ వారణాసి: ఢిల్లీలో శనివారమంతా చర్చలు, ఒప్పందాల్లో బిజీగా ఉన్న భారత్, జపాన్ ప్రధానులు మోదీ, షింజో అబే.. సంధ్యాసమయంలో వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో.. గంగా హారతిలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సరికొత్త సాంస్కృతిక బంధానికి నాందిగా కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరూ గంగకు హారతి ఇవ్వటంతో పాటు తర్వాత జరిగిన కార్యక్రమాలను 45 నిమిషాల సేపు వీక్షించారు. వేదికపై అబే.. మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా, ఇద్దరు ప్రధానుల ఈ పర్యటన కోసం దాదాపు 7వేల మంది పోలీసులు, సిబ్బంది పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ), ఎన్ఎస్జీ, యాంటీ-టైస్టు స్క్వాడ్ బలగాలు వారణాసిని జల్లెడపట్టాయి. బాబత్‌పూర్ ఎయిర్‌పోర్టునుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు 22 కిలోమీటర్ల దూరం.. ఇద్దరు ప్రధానులకు స్వాగతం పలుకుతూ.. పోస్టర్లు కట్టారు. కొందరు జపాన్ భాషలో అబేకు వెల్కమ్ చెప్పారు. గతేడాది మోదీ జపాన్ పర్యటనలో క్యోటో-వారణాసి భాగస్వామ్యంపై (ఈ రెండు ప్రాంతాలు ఇరు దేశాల సంస్కృతికి ప్రతిబింబమని) ఇరుదేశాల ప్రధానులు చర్చించడం తెలిసిందే. -
చెన్నైవరద మృతులకు జపాన్ ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: చెన్నై వరదల్లో మరణించిన వారికి జపాన్ ప్రధానమంత్రి షింజొ అబే ప్రగాఢ సంతాపం తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. మూడవ సారి భారత పర్యటనకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, షింజొ పర్యటనను ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. షింజొ భారతదేశ సందర్శన ఇరుదేశాల సంబంధాలకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధానికి విమానాశ్రయంలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా తదితరులు ఘన స్వాగతం తెలిపారు. షింజొ రేపు ప్రధాని మోదీతో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు. అనంతరం ఇండో-జపాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. -
మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!
-
మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!
కౌలాలంపూర్: కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది. చర్చలకు ముందు లాంఛనంగా మోదీ-అబె కరచాలనం చేస్తుండగా.. వారి వెనుక రెండు దేశాలు జెండాలు ఎగరేసి ఉన్నాయి. భారత జాతీయ త్రివర్ణ పతాకంలో మొదట కాషాయ వర్ణం, మధ్యలో తెలుపు రంగు, చివరన ఆకుపచ్చ వర్ణం ఉంటాయి. తిరగేసి ఎగురవేయడంతో మొదట ఆకుపచ్చ రంగుతో జాతీయ జెండా కనబడింది. అధికార వర్గాలు ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేయడంతో ఏమారపాటు వల్లో, ఆ జాగ్రత్త వల్లో ఇలా జరిగిందని, ఇది దురదృష్టకరమని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కౌలాలంపూర్‌లో జరుగుతున్న 13వ ఆసియన్-భారత్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- జపాన్ ప్రధాని అబెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!
కెమెరాతో కూడిన ఒక డ్రోన్ జపాన్ ప్రధాని షింజో అబె ఇంటిమీద కనపడింది. దీంతో ప్రధాని భద్రత గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ డ్రోన్ ఎక్కడినుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియలేదు. 50 సెంటీమీటర్ల వింగ్స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని అధికారిక నివాసం పైకప్పు మీద పడింది. సెక్యూరిటీ సిబ్బంది దాన్ని గమనించారని ఎఫె వార్తా సంస్థ తెలిపింది. అబె ప్రస్తుతం ఏషియా-ఆఫ్రికన్ సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేసియాలోని జకార్తాలో ఉన్నారు. భద్రతా అధికారులు డ్రోన్‌ను పరిశీలించారు. అందులో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించారు. జనవరి నెలలో ఇలాగే అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లాన్లో ఓ డ్రోన్ పడింది. ఇప్పుడు జపాన్ ప్రధాని వంతు అయింది. -
లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని
టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91) అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ మరణించారు. ఆయన 1965-1990 మధ్య కాలంలో సింగపూర్ ప్రధానిగా సేవలందించారు. అనంతరం ఆయన సీనియర్ మంత్రిగా, మంత్రి వర్గ సలహాదారుగా దేశానికి సేవలందించారు. -
'వారిని ఎప్పటికీ క్షమించను'
టోక్యో: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద సంస్థను ఎప్పటికీ క్షమించనని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అన్నారు. తమ దగ్గర బందీగా ఉన్న జపాన్ జర్నలిస్ట్ కెన్జీ గోటోను ఐఎస్ ఉగ్రవాదులు చంపేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు. కెన్జీ గోటో తలనరికిన వీడియోను ఉగ్రవాదులు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. 'తీవ్రవాదులు అమానవీయమైన, హేయమైన చర్యలకు పాల్పడడం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటువంటి ఉన్మత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నరమేధానికి పాల్పడుతున్న ఐఎస్ తీవ్రవాదులను ఎన్నటికీ క్షమించను. ఉగ్రవాదుల కిరాతక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తాం' అని షింజో అబే వ్యాఖ్యానించారు. కెన్జీ గోటోను సంతాపం తెలపడానికి తనకు మాటలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మాలవీయ, వాజ్‌పేయిలకు భారతరత్న
- భారత 65వ గణతంత్ర దినోత్సవాలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. - నార్వే మాజీ ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ నాటో సెక్రటరీ జనరల్‌గా మార్చి 27న ఎంపికయ్యారు. - మిస్ ఇండియా -2014 కిరీటాన్ని ఢిల్లీ యువతి కోయల్ రాణా కైవసం చేసుకుంది. - భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. - జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మే 30న నియమితులయ్యారు. - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే (64) న్యూఢిల్లీలో జూన్ 3న రోడ్డు ప్రమాదంలో మరణించారు. - 16వ లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ జూన్ 6న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని అలంకరించిన రెండో మహిళ ఆమె. - భారత 14వ అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కేంద్రం మే 28న ఎంపిక చేసింది. - ఇక్రిశాట్ రాయబారులుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నియమితులయ్యారు. - సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ జూలై 31న బాధ్యతలు స్వీకరించారు. - చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్‌రాహా జూలై 30న బాధ్యతలు చేపట్టారు. - లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఆగస్టు 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. - పోలెండ్ ప్రధాని డోనాల్డ్ టుస్క్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆగస్టు 30న ఎన్నికయ్యారు. - అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ ప్రచార కర్తగా బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ ఆగస్టు 28న ఎంపికయ్యారు. - ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కొత్త హైకమిషనర్‌గా జోర్డాన్ యువరాజు జీద్ అల్ - హుస్సేన్ సెప్టెంబర్ 7న బాధ్యతలు చేపట్టారు. - లోక్‌సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ నియమితులయ్యారు. . - జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా లలితా కుమార మంగళంను సెప్టెంబర్ 17న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ నియమించింది. - సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు సెప్టెంబర్ 28న నియమితులయ్యారు. - బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అక్టోబర్ 9న యునిసెఫ్ దక్షిణ ఆసియా రాయబారిగా నియమితులయ్యారు. - ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు సూర్య ప్రకాశ్ అక్టోబరు 28న ఎంపికయ్యారు. - ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. - భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అగ్రస్థానంలో నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండు, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శిఖాశర్మకు మూడో స్థానం దక్కింది. - ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నియమితులయ్యారు. - సీబీఐ కొత్త డెరైక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా డిసెంబరు 3న బాధ్యతలు చేపట్టారు. - మిస్ సుప్రనేషనల్ -2014 కిరీటాన్ని భారత యువతి ఆశాభట్ గెలుచుకున్నారు. - మిస్ వరల్డ్-2014 కిరీటాన్ని మిస్ దక్షిణాఫ్రికా రోలిన్ స్ట్రాస్ దక్కించుకుంది. . - జపాన్ ప్రధానిగా షింజో అబే, మారిషస్ ప్రధానిగా అనిరుధ్ జగన్నాథ్ ఎన్నికయ్యారు. - కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-71), సిస్టర్ యూఫ్రేసియా (1877- 1952)లు సెయింట్‌హుడ్ పొందారు. వీరిని మహిమాన్వితులుగా, బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్యదైవాలుగా పోప్ ప్రకటించారు. - భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. - రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా రాజిందర్ ఖన్నా, సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ప్రకాశ్మిశ్రాను కేంద్రం డిసెంబర్ 19న నియమించింది. - ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు ప్రముఖ అంత ర్జాతీయ సైన్స్ పత్రిక నేచర్ 2014 ఏడాదికి టాప్-10 శాస్త్రవేత్తల్లో స్థానం లభించింది. కొత్త ముఖ్యమంత్రులు రాష్ట్రం-పేరు: ఉత్తరాఖండ్-హరీష్ రావత్; బీహార్- జీతన్‌రాం మాంఝీ; ఒడిశా-నవీన్ పట్నాయక్; గుజరాత్-ఆనందీబెన్ పటేల్; సిక్కిం-పవన్ కుమార్ చామ్లింగ్; నాగాలాండ్-టీఆర్ జెలియాంగ్; తమిళనాడు-పన్నీర్ సెల్వం; హర్యానా-మనోహర్‌లాల్ ఖట్టర్; మహారాష్ట్ర-దేవేంద్ర గంగాధర్రావ్ ఫడ్నవీస్; గోవా-లక్ష్మీకాంత్ పర్సేకర్; జార్ఖండ్-రఘుబార్ దాస్. నూతన గవర్నర్లు రాష్ట్రం-పేరు: ఉత్తరప్రదేశ్-రామ్ నాయక్; గుజరాత్ - ఓమ్ ప్రకాశ్ కోహ్లి; పశ్చిమ బెంగాల్-కేసరినాథ్ త్రిపాఠి; చత్తీస్‌గఢ్-బలరాందాస్ టాండన్; నాగాలాండ్-పద్మనాభ ఆచార్య; హర్యానా-కప్టన్ సింగ్ సోలంకి; మహారాష్ట్ర- సీహెచ్ విద్యాసాగర్ రావు; రాజస్థాన్-కళ్యాణ్ సింగ్; కర్ణాటక-వాజూభాయ్ రూడాభాయ్ వాలా; గోవా-మృదులా సిన్హా; కేరళ- జస్టిస్ పి. సదాశివం. - పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నర్సింహా రెడ్డి డిసెంబర్ 27న నియమితులయ్యారు. అవార్డులు - కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వీటిలో రెండు పద్మ విభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ ఉన్నాయి. పద్మ విభూషణ్‌కు డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర), తెలుగువారిలో పద్మ భూషణ్‌ను దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్) అందుకున్నారు. - 86వ ఆస్కార్ అవార్డుల వివరాలు.. గ్రావిటీ చిత్రానికి ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం: 12 ఇయర్స ఎ స్లేవ్, ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద గ్రేట్ బ్యూటీ (ఇటలీ) - 2013 గాంధీ శాంతి బహుమతికిప్రముఖ గాంధేయ వాది, పర్యావరణ వేత్త చాందీ ప్రసాద్ భట్ ఎంపికయ్యారు. చిప్కో ఉద్యమ నిర్మాతల్లో చాందీ ఒకరు. - ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక, నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక 45వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా. - భారత సంతతికి చెందిన విజయ్ శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. - ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం-2013 (49వది) ప్రముఖ హిందీ కవి కేదార్నాథ్ సింగ్‌కు ప్రకటించారు. - భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్ గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. - ఉత్తమ పార్లమెంటేరియన్ల వివరాలు.. 2010-అరుణ్ జైట్లీ (బీజేపీ); 2011-కరణ్‌సింగ్ (కాంగ్రెస్); 2012-శరద్ యాదవ్ (జేడీయూ); - జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. - టాటా వ్యవస్థాపకుడు జెంషెడ్జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్ప్లాండే హౌస్‌కు యునెస్కో ఆసియా-పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హాల్ గ్రామం సతారాలోని శ్రీ సఖరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. నోబెల్ బహుమతులు - వైద్యం: బ్రిటన్ అమెరికన్ జాన్ ఓ కీఫ్, నార్వే జంట, ఎడ్వర్డ్ మోసర్, మేబ్రిట్ మోసర్. ఫిజిక్స్: జపాన్‌కు చెందిన ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుజి నకమురాలు. రసాయన శాస్త్రం: అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్, విలియం మోర్నర్ , జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్. ఆర్థిక శాస్త్రం: ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్. సాహిత్యం: పాట్రిక్ మోడియానో(ఫ్రాన్స్). శాంతి: కైలాశ్ సత్యార్థి (భారత్), మలాలా యూసుఫ్ జాయ్ (పాకిస్థాన్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. - మ్యాన్ బుకర్ ప్రైజ్ -2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ప్లనగన్ను వరించింది. - జమ్మూకాశ్మీర్‌కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014 అవార్డు లభించింది. - మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్‌కు ఎంపికయ్యారు. - ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి-2014కు ఇస్రో ఎంపికైంది. - భారత-అమెరికన్ నేహాగుప్తాకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి-2014 లభించింది. - అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం-2014ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు డిసెంబరు 27న అందించారు. - ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ (84) చెన్నైలో డిసెంబరు 23న మరణించారు. తెలుగు, కన్నడ, హిందీ భాష ల్లో 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. - స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్మోహన్ మాలవీయ (మరణానంతరం), మాజీ ప్రధానమంత్రి అటల్ బీహరీ వాజ్‌పేయిలకు ప్రభుత్వం డిసెంబరు 25న దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. - మదన్ మోహన్ మాలవీయ: లీడర్ అనే ఆంగ్ల పత్రికను, మరియాద అనే హిందీ వార పత్రికను ప్రారంభించారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. 1946 నవంబరు 12న మరణించారు. - అటల్ బీహారి వాజ్‌పేయి: పదో భారత ప్రధాని. 1996లో 13 రోజులు, 1998-1999 మధ్య 13 నెలలు, 1999-2004 వరకు పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. 1980లో షెకావత్, ఎల్కే అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఆయన గొప్పవక్త, కవి. భారత రత్న పొందిన ఏడో ప్రధాని వాజ్‌పేయి. 1998 మేలో రెండో అణు పరీక్ష, 1999 కార్గిల్ విజయం ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మాలావత్ పూర్ణ (13) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరో తెలుగు విద్యార్థి ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్‌ను ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడి (17)గా ఘనతను సాధించాడు. ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా సత్య నాదెళ్ల ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ నోకియా ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి ఎంపికయ్యారు. -
జపాన్ ప్రధానిగా మళ్లీ అబే
టోక్యో: జపాన్ ప్రధానిగా షింజో అబే మరోసారి ఎన్నికయ్యారు. అబే చేపట్టిన ఆర్థిక విధానాలకు రిఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. అయినాసరే ఈ ఎన్నికల్లో అబే సునాయాసంగా విజయం సాధించారు. ఓటింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ), దాని మిత్రపక్షం కొమిటో కలసి పార్లమెంట్ దిగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తాయని వెల్లడైంది. టీవీ అసాహీ పార్లమెంట్‌లోని 475 సీట్లకుగానూ ఈ కూటమి 333 సీట్లలో విజయం సాధిస్తుందంది. టీబీఎస్ ఎల్డీపీ కూటమి 328 స్థానాలు సాధిస్తుందని చెపితే.. నిక్కే న్యూస్ పేపర్ ఎల్డీపీ ఒంటరిగానే 290 నుంచి 310 స్థానాలు సాధిస్తుందని తెలిపింది. కాగా, ఓటింగ్ శాతం బాగా తక్కువగా ఉన్నా ప్రధాని అబే ఘనవిజయం సాధిస్తారని తాను భావిస్తున్నట్టువసేడా వర్సిటీ ప్రొఫెసర్ మసారు కోహ్నో పేర్కొన్నారు. షింజో అబేకి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమని అన్నారు. -
జపాన్ ప్రధానిగా మరోసారి అబె ఎన్నిక
టోక్యో: జపాన్ ప్రధానిగా షింజో అబె మరోసారి ఎన్నికయ్యారు. అబె సారథ్యంలోని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, మిత్రపక్షం కొమీటొ పార్టీ కలసి ఘనవిజయం సాధించాయి. 475 సీట్లకు గాను 246 సీట్లు కైవసం చేసుకుంది. అబె ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలకు రెఫరెండంగా ఈ ఎన్నికలు జరిగాయి. జపాన్ ప్రధానిగా అబె మూడో సారి ఎన్నికయ్యారు. -
నేటీతో ముగియనున్న చంద్రబాబు పర్యటన
-
ఏపీకి సహకరిస్తాం
సీఎం చంద్రబాబు బృందానికి జపాన్ ప్రధాని షింజో అబే హామీ రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో పాలుపంచుకుంటామని వెల్లడి ఏపీలో ఉన్న అవకాశాలు, జపాన్ పెట్టుబడులు మంచి జోడీ అని బాబు వ్యాఖ్య జపాన్ ప్రధానిని సత్కరించి, తిరుమల వెంకన్న ప్రసాదాన్ని అందజేసిన సీఎం జపాన్ ప్రభుత్వం, సంస్థలతో అవగాహన ఒప్పందాలు నేటి రాత్రి 12.30కి హైదరాబాద్‌కు రాక సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే హామీ ఇచ్చారు. నూతన రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో పాలుపంచుకుంటామని జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ ఇచ్చారు. చంద్రబాబు బృందం శుక్రవారం జపాన్ ప్రధాని అబేతో టోక్యోలోని ఆయన కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా అబే మాట్లాడుతూ దౌత్య సంబంధాలతో పాటు వర్తక, వాణిజ్యంలో భారత్ తమకు ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, జపాన్ల మధ్య పరస్పర సహకారం వృద్ధి చెందుతుందన్నారు. భారత ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల వ్యవధిలోనే జపాన్ను సందర్శించడం గొప్ప పరిణామమని అభివర్ణించారు. అంతకుముందు చంద్రబాబు తన ఐదు రోజుల పర్యటనను అబేకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న అవకాశాలు, జపాన్ పెట్టుబడులు మంచి జోడీ అని అభివర్థించారు. కొత్త రాష్ట్రంతో పాటు, రాజధాని అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని సంద ర్శించాలని అబేను చంద్రబాబు ఆహ్వానించారు. జపాన్ ప్రధాని అబే ను శాలువతో సత్కరించి జ్ఞాపికను, తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందచేశారు. శనివారం ఉదయం చంద్రబాబు టోక్యో నగరంలోని తెలుగువారితో సమావేశమవనున్నారు. అనంతరం బాబు బృందం భారత్‌కు బయల్దేరి, రాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. జపాన్ ప్రధానితో భేటీ అయిన వారిలో మంత్రులు యనమల, పి. నారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సి.ఎం. రమేష్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, పరకాల ప్రభాకర్, జపాన్‌లో భారత రాయబారి దీపా గోపాలన్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉన్నారు. పలు అవగాహన ఒప్పందాలు జపాన్ ప్రభుత్వం, కంపెనీలతో బాబు బృందం 6 ఒప్పందాలు కుదుర్చున్నట్లు హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది. ఒప్పందాలివీ.. హాజపాన్ ప్రభుత్వ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎంఈటీఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, జపాన్ ట్రేడ్ పాలసీ బ్యూరో డెరైక్టర్ జనరల్ హైడో సుజుకి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జపాన్ ఆర్థిక, వ్యాపార, వాణి జ్య మంత్రి యోచి మియజవా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని జపాన్ నుంచి అందించేందుకు వర్కిం గ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడం ఈ ఒప్పం దంలో ముఖ్యాంశం. ఈ గ్రూప్‌లో భారత్‌లోని జపాన్ రాయబార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (నెడో), జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జెబీఐసీ), జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఈటీఆర్వో), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జె ఐసీఏ)లు సభ్యత్వం కలిగి ఉంటాయి. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రం గాలకు ప్రాధాన్యతనిస్తారు. జపాన్ పారిశ్రామిక పార్కుల ఏర్పాటును కూడా ఎంఈటీఐ ప్రోత్సహిస్తుంది. జపాన్ సంస్థలను ప్రోత్సహించేందుకు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు మంచి వాతావరణం కల్పిస్తామని, ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. హాపరస్పరం ఆసక్తి ఉన్న అంశాల్లో అవకాశాలను వెలికితీయటం, సహకారానికి నెడో, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. స్మార్ట్ కమ్యూనిటీ (స్మార్ట్ నగరాలు) ఏర్పాటుతో పాటు అక్కడ వివిధ కార్యకలాపాలు, జపాన్‌లో ఈ రంగంలో విజయగాథలపై నెడో ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, అభిప్రాయాలను పంచుకుంటుంది. సోలార్, బయోమాస్, గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో సహకారం, ఇంధన సామర్ధ్యం, నిల్వలకు ఉన్న అవకాశాలను గుర్తిస్తాయి. హాకొబె స్టీల్ గ్రూప్, కొబెల్కో క్రేన్స్, శ్రీ సిటీల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. -
మేకప్ స్కాం: జపాన్ మహిళా మంత్రి రాజీనామా
రాజకీయ విరాళాలను తన మేకప్ కోసం వాడుకున్నారన్న ఆరోపణలతో.. జపాన్ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రధాని ఆమోదించారు. ఈ వ్యవహారం మొత్తం ప్రధాని షింజో అబెకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. యుకో ఒబుచి అనే ఈ మంత్రి వాస్తవానికి జపాన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి కూడా అవుతారని ఒక దశలో అంతా భావించారు. అయితే.. ఉన్నట్టుండి ఈ వ్యవహారం బయటపడటం, అది కాస్తా గందరగోళంగా మారడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి షింజో అబె ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఈ మొత్తం విషయంపై తాను త్వరలోనే విలేకరుల సమావేశం నిర్వహించి అన్ని విషయాలూ బయట పెడతానని ఒబుచి చెబుతున్నారు. 2012 డిసెంబర్ నెలలో షింజో అబె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేసిన తొలిమంత్రి ఒబుచియే. జపాన్‌లోనే అత్యంత కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల లాంటి శాఖలను సమర్థంగా చేపట్టిన మొట్టమొదటి మహిళా మంత్రిగా ఒబుచి బాగా పేరు గడించారు. దాదాపు 58 లక్షల రూపాయల మొత్తాన్ని సౌందర్య సాధనాలు, ఇతర సామగ్రి కోసం ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఖర్చుపెట్టినట్లు తేలింది. -
బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్
టోక్యో: భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది. జపాన్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ ఆదేశ ప్రధాని షియిజో అబేల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో సహకారమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో బుల్లెట్ రైళ్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఇన్ ఫ్రా, రైల్వే, పౌర విమానం, ఎనర్జీ రంగాల్లో సహకారమందించుకోవడానికి ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. -
భారత్ - జపాన్ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం
క్యోటో:భారత్ - జపాన్ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే అతి పురాతన భారతీయ ఆధ్యాత్మిక నగరం వారణాసికి, వెయ్యి ఏళ్లకు పైగా జపాన్‌కు రాజధానిగా ఉంటున్న క్యోటో నగరాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిన్జో అబేల సమక్షంలో భారత రాయభారి దీపా వాధ్వా, క్యోటో మేయర్ దైసాక కాడోకవా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వారసత్వ పరిరక్షణ, విద్య, సాంస్కృతిక రంగాలలో ఈ రెండు నగరాలు సహకరించుకుంటాయి. అంతకు ముందు అయిదు రోజుల జపాన్ పర్యటకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒసాకా ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. -
ఇద్దరు మిత్రులు.. రెండు దేశాలు!!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. జపాన్ ప్రధాని షింజో అబెకు మధ్య చాలా పోలికలున్నాయి. షింజో అబె ట్విట్టర్లో కేవలం ముగ్గురినే ఫాలో అవుతారు. వాళ్లలో ఒకరు ఆయన భార్య, మరొకరు జపాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఆ మూడో వ్యక్తి.. భారత ప్రధాని నరేంద్ర మోడీ!! ఇద్దరూ కూడా రైట్ వింగ్ జాతీయవాదులే. ఇద్దరూ తమ దేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవాళ్లే. ప్రాంతీయంగా చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలి అనుకుంటూనే చైనాతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నవాళ్లే. ఇద్దరూ కూడా తమ తమ దేశాల్లో చాలా బలమైన నాయకులుగా పేరుపొందారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి రీరెగ్యులేషన్ మంత్రాన్ని ఇద్దరూ జపిస్తున్నారు. ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మోడీ జపాన్ చేరుకున్న తర్వాత ఇద్దరు ముందు ఆ దేశ రాజధాని నగరమైన టోక్యోలో అధికారికంగా కాకుండా.. ముందు వ్యక్తిగతంగా ట్యోకో నగరంలో కలుస్తున్నారు. అక్కడ ఒక విందులో పాల్గొన్న తర్వాతే అధికారిక చర్చలు ప్రారంభం అవుతాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ రెండుసార్లు జపాన్ వెళ్లారు. ఆ రెండు సార్లూ ఆయన షింజో అబెను కలిశారు. ఇప్పుడు జపాన్ వెళ్లడానికి ముందు జపనీస్ భాషలో ట్వీట్ చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
జపాన్ పర్యటనకు బయల్దేరిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరారు. భారత ఉపఖండం వెలుపల ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే మొదటిది. ముందుగా ఆయన క్యోటో విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని మోడీ గౌరవార్థం అబె ఒక విందు కూడా శనివారమే ఏర్పాటుచేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ తదితరులు కూడా ఉన్నారు. ప్రధానంగా స్మార్ట్ సిటీ అయిన క్యోటోను మోడీ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటుచేస్తామని ఇంతకుముందే ఆయన హామీ ఇవ్వడంతో ఆ తరహా నిర్మాణాల కోసం అక్కడ పరిశీలిస్తారు. అలాగే జపాన్ బుల్లెట్ రైళ్లను కూడా మోడీ చూస్తారు. దేశంలో ప్రవేశపెట్టబోయే బుల్లెట్ రైళ్లను తమవద్దనుంచే కొనుగోలు చేయాలని జపాన్ భారతదేశాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మూడో విదేశీ పర్యటన. బ్రిక్స్ సదస్సుకు వెళ్లడం, నేపాల్‌లో పర్యటించడం తర్వాత ఆయన జపాన్ వైపు మొగ్గుచూపారు. -
రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’
చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాగే అబే కూడా ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. అంతర్జాతీయ వాణిజ్యం చైనా ప్రధాన అస్త్రం. జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. ‘ఒకే పర్వతంపై రెండు పులులు మనలేవు.’ప్రాచీన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల చైనాపై విరుచుకుపడ్డారు. విపరీతంగా పెరిగిపోతున్న జపాన్ రక్షణ వ్యయం పట్ల గత నెల చివర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జపాన్ ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద సైనిక బడ్జెట్గల దేశం. ఈ ఏడాది అది సైనిక దళాలపై 5 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయనుంది. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో (జీడీపీ) 10 శాతాన్ని సైన్యంపై ఖర్చు చేస్తుండగా, తాము 3 శాతాన్నే ఖర్చు చేస్తున్నామని అబే అక్కసు. ప్రపంచంలోని మూడవ అతి పెద్ద దేశమైన చైనాతో 65వ స్థానంలో ఉన్న జపాన్ రక్షణ వ్యయాన్ని పోల్చడం అర్థరహితం. చైనా గత కొన్నేళ్లుగా 10 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుండగా, జపాన్ ఈ ఏడాదే వృద్ధి బాట పట్టింది. ప్రపంచంలోని రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని చైనా నుంచి తిరిగి దక్కించుకోగలమని అబే విశ్వాసం! అందుకే అబే ‘ఆసియా పర్వతంపై’ చైనా స్వేచ్ఛా విహారాన్ని సహించలేకుండా ఉన్నారు. ఆయన తరచుగా జపాన్ ‘గత వైభవాన్ని’ గుర్తుచేసుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఇతర దేశాలపై సాగించిన దురాక్రమణ యుద్ధాలకు ఒకప్పటి ప్రధాని తమీచి మురయామా క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించడం లేదని అబే సెలవిచ్చారు. అసలు ‘దురాక్రమణ’ అంటేనే ఎవరూ ఇదమిత్థంగా నిర్వచించలేదని వాదించారు. ‘వివిధ దేశాల మధ్య ఘటనలు మనం ఎక్కడ నిలబడి చూస్తున్నాం అనే దాన్ని బట్టి విభిన్నంగా కనిపిస్తాయి’ అని అన్నారు. 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాను దురాక్రమించి, అత్యంత పాశవిక అణచివేత సాగించింది. 1931-37 మధ్య అది చైనాలోని సువిశాల భాగాన్ని ఆక్రమించింది. ఒక్క నాంకింగ్లోనే రెండు లక్షల మంది చైనీయులను ఊచకోత కోసింది. 1941లో పెరల్ హార్బర్ (అమెరికా) దాడితో ప్రారంభించి థాయ్‌లాండ్, మలయా, బోర్నియా, బర్మా, ఫిలిప్పీన్స్‌లపై దండెత్తింది. ఆసియా దేశాల మహిళలను సైన్యపు లైంగిక బానిసలుగా దిగజార్చిన హేయ చరిత్ర నాటి జపాన్‌ది. జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం అది ‘యూనిట్ 731’ను ఏర్పాటు చేసింది. కొరియా, చైనా, రష్యా తదితర దేశాలకు చెందిన లక్షలాది మందిని ‘ప్రయోగాల’ కోసం హతమార్చింది. అబే ఆ స్థానం నుంచి ‘గత వైభవాన్ని’ చూస్తున్నారు. ఈ ఏడాది ‘731 యూనిట్’ సంస్మరణ సభకు హాజరై ‘731’ అని ప్రముఖంగా రాసి ఉన్న యుద్ధ విమానం కాక్‌పిట్‌లో ఎక్కి మరీ ఫొటోలు దిగారు! ‘అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి బెదిరింపులను లేదా బలప్రయోగాన్ని జపాన్ శాశ్వతంగా తిరస్కరిస్తుంది’ అనే రాజ్యాంగంలోని నిబంధనకు తిలోదకాలివ్వడానికి ‘దేశ రక్షణకు చట్టపరమైన ప్రాతిపదిక పునర్నిర్మాణ సలహా మండలిని’ అబే నియమించారు. జపాన్ ‘రక్షణకు’ ఇప్పటికే ఐదు లక్షల సేనలతో త్రివిధ దళాలున్నాయి. ఆత్యాధునిక క్షిపణులు తప్ప సకల సాయుధ సంపత్తి ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులపై ఫిలి ప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు చైనాకు మధ్య వివాదాలు రగులుతున్నాయి. జపాన్ ఇదే అదనుగా ఒకప్పటి తన వలసవాద అవశేషమైన సెనెకాకు దీవులను ‘జాతీయం’ చేసి చైనాతో కయ్యానికి కాలుదువ్వింది. ఆ సాకుతో చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. తనలాగే అమెరికా సైనిక స్థావరాలున్న దేశమైన ఫిలిప్పీన్స్‌తో జపాన్ చేయి కలిపింది. భారత్‌తో సైనిక సహకారానికి ఉవ్విళ్లూరుతోంది. అణు వ్యాపా ర భాగస్వామ్యంతో భారత్‌ను అమెరికా, జపాన్ల చైనా వ్యతిరేక వ్యూహంలో భాగస్వామిని చేయాలని అశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలాగే అబే కూడా వర్తమాన ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. చైనా ‘శాంతియుతంగా’ ఆధిపత్యపోరు సాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం దాని ప్రధాన అస్త్రం. ప్రపంచ వాణిజ్యం లో చైనాదే అగ్రస్థానం. జపాన్ విదేశీ వాణిజ్యంలో సైతం అమెరికా తర్వాత ద్వితీయ స్థానం చైనాదే. ఏటా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ 30,000 కోట్ల డాలర్లు! జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. గత వారం ఇండోనేసియాలోని బాలీలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో (ఎపెక్) చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ కేంద్ర బిందువుగా నిలవడం అదే సూచిస్తోంది. చైనాను చూసి కాకపోయినా జర్మనీని చూసైనా అబే ‘శాంతియు తం’గా ఆర్థిక ప్రాభవం కోసం ప్రయత్నించడం ఉత్తమం. - పిళ్లా వెంకటేశ్వరరావు