barrack obama
-
ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్టీ–ఇన్ నోటీసు ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మోసపూరిత ట్వీట్లు, లింక్‌లను దర్శించిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హ్యాకింగ్‌ను అడ్డుకునేందుకు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న జో బిడెన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తదితరుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. భారత్‌లోనూ పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లోకి దుండగులు ప్రవేశించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఈఆర్టీ–ఇన్ స్పందించింది. -
థన్‌బెర్గ్‌ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా
వాషింగ్టన్ : స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనను కలసిన థన్‌బెర్గ్‌ను ట్విటర్ వేదికగా అభినందించారు. అంత చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ గురించి థన్‌బెర్గ్ పోరాడడం గొప్ప విషయమని, ఆమెను కలవడం ఆనందం కలిగించిందని ఒబామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒబామా థన్‌బర్గ్‌ను కలిసిన వీడియోనూ ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది. '' మీరు, నేను ఒక టీంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు పిడికిళ్లు బిగిద్దామని'' ఒబామా పేర్కొన్నారు. దీనికి థన్‌బెర్గ్ అనుకూలంగా స్పందిస్తూ ... ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని, వాతావరణం పట్ల సృజనాత్మకంగా వ్యవహరిస్తూ మీకు నచ్చినది చేయొచ్చని, అందుకు నా సహకారం తప్పక ఉంటుందని పేర్కొన్నారు . వాతావరణ మార్పుల తీవ్రతను ఇప్పటి యువతరం భరిస్తుందని, అందులోనూ పర్యావరణం కోసం పరితపిస్తున్న థన్‌బెర్గ్ లాంటివారు అసలే భయపడరని ఒబామా పేర్కొన్నారు. గత శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ ముందు నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో థన్‌బెర్గ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాషింగ్టన్లో ఉన్న బరాక్ ఒబామాను తన్బెర్గ్ కలుసుకున్నారు. కాగా, సెప్టెంబర్ 20 న న్యూయార్క్‌లో జరగనున్న '' గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్'' లో ఇతర నిరసనకారులతో కలిసి ఆమె పాల్గొననున్నారు. -
ప్రేమలో ఒబామా కుమార్తె..!
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాపై అమెరికన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఆమె ప్రేమలో ఉన్నదని, పొగతాగడం కూడా అలవాటు చేసుకుందని వాటి సారాంశం. కాగా, మలియాపై అలా వార్తలు రాయడాన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్ష కుమార్తెలు ఖండించారు. మలియాకు పర్సనల్ లైఫ్ ఉంటుందని మీడియా గుర్తు పెట్టుకుంటే బావుంటుందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియాలు హితవు పలికారు. సాధారణంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ప్రచురించడాన్ని అమెరికన్ మీడియా వ్యతిరేకిస్తుంది. అయితే మలియా విషయంలో అలా జరగకపోవడంతో ఇవాంకా ట్రంప్, చెల్సియా క్లింటన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ‘మలియా ఒబామా ఒక ప్రైవేట్ సిటిజన్. తన జీవితంపై గోపత్య పాటించే హక్కు ఆమెకు ఉంటుంది. మీడియా తన పరిమితులను దాటి ప్రవర్తించకుండా ఉంటే మంచిది.’ అని ఇవాంకా ట్వీట్ చేశారు. ‘ఒక యువతిగా, కాలేజీ విద్యార్థిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. తనకు నచ్చినట్లు ఉండటం ఆమెకు ఉన్న హక్కు. దానిపై మీడియా అతిగా స్పందించాల్సిన పని లేదు’ అని చెల్సియా క్లింటన్ ట్వీట్ చేశారు. -
మోదీకి ఒబామా ఫోన్.. ఏం చెప్పారు?
-
అమెరికా అధ్యక్షుడిగా హిందువు?
అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని, ఇక్కడ భవిష్యత్తులో కేవలం మహిళలే కాక హిందువులు, లాటినోలు, యూదులు కూడా అధ్యక్షులయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. వైట్ హౌస్‌లో తన చిట్ట చివరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రతి జాతికి, మతానికి, ఈ దేశంలో ప్రతి మూలకు చెందిన ప్రతిభావంతులు ఎదుగుతున్నారని, అదే అమెరికా అసలైన బలమని ఆయన అన్నారు. ఈ అవకాశాలను మనం ప్రతి ఒక్కరికీ ఇవ్వడం కొనసాగిస్తే, త్వరలోనే ఒక మహిళ అధ్యక్షురాలవుతుందని చెప్పారు. అలాగే ఒక లాటినో, యూదు, హిందూ అధ్యక్షులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అన్ని రకాల అధ్యక్షులు వస్తారని, ఆ సమయానికి వాళ్లను ఏమని పిలవాలో ఎవరికీ సరిగ్గా తెలియదంటూ నవ్వేశారు. దేశానికి ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అయినప్పుడు.. అలాంటిది మళ్లీ జరిగే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఒబామా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అమెరికాలో చాలామంది తమకు గుర్తింపు లేదని భావించారని, వాళ్లే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఓటేశారని చెప్పారు. తమను చిన్నచూపు చూస్తున్నారని వాళ్లు అనుకున్నారని, తమకు వచ్చిన అవకాశాలు తమ పిల్లలకు వస్తాయో రావోనని భయపడ్డారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు వెళ్తారు. తాజాగా మీడియా మీద కూడా ట్రంప్ విరుచుకుపడిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఒబామా ప్రస్తావించారు. మీడియా ఉండటం వల్లే తాము నిజాయితీగా ఉండగలుగుతూ, మరింత కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. వాస్తవానికి వైట్‌హౌస్ నుంచి మీడియాను దూరంగా ఉంచాలని ట్రంప్ భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒబామా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. -
మోదీకి ఒబామా ఫోన్.. ఏం చెప్పారు?
మరొక్క రోజులో తన పదవీకాలం పూర్తయిపోతోందనగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. భారత్ - అమెరికా దేశాల మధ్య గల సంబంధాలను పెంపొందించడంలో భాగస్వామ్యం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా రక్షణ రంగం, పౌర-అణు ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు తదితర విషయాలపై ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగ ప్రాధాన్యాలు, భారతదేశాన్ని అమెరికాకు ప్రధాన రక్షణ రంగ భాగస్వామిగా గుర్తించడం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. నరేంద్రమోదీ 2014 సంవత్సరంలో భారత ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఆయనకు ఫోన్ చేసి అభినందించిన వారిలో బరాక్ ఒబామా అందరికంటే ముందున్నారు. అప్పుడే ఆయన మోదీని వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా. 2014 సెప్టెంబర్‌లో ఒబామా, మోదీ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లిద్దరి మధ్య ఎనిమిది సార్లు సమావేశాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ఇన్నిసార్లు వాళ్ల పదవీకాలంలో కలవడం ఇదే మొదటిసారి. ఇద్దరి మధ్య చాలా దృఢమైన బంధం ఉందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇద్దరికీ పరస్పరం గౌరవం ఉందని, ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటారని ఆమె చెప్పారు. -
ఒబామా సాధించినది ఏమిటి?
అమెరికా అధ్యక్షపదవి నుంచి దిగిపోతున్న బరాక్ ఒబామా మంగళవారం అమెరికా ప్రజలనుద్దేశించి ఆఖరిసారి భావోద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. మేధావి, మంచి వక్తగా గుర్తింపు పొందిన ఒబామా తన భావోద్వేగ మాటలతో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తారనే విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా ఆయన నోబెల్ శాంతి బహుమతిని ఆమోదిస్తూ చేసిన ప్రసంగం, చార్లెస్టాన్లో క్రైస్తవ కార్యక్రమంలో చేసిన ప్రసంగం చరిత్రలో ఎప్పటికి మిగిలిపోతాయని అమెరికా రాజకీయ, సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. మార్పు, ఆశ అనే నినాదాలతో ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఒబామా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత మేరకు మార్పు సాధించగలిగారు, ప్రజల ఆశలను ఎంత మేరకు తీర్చగలిగారనే అంశాలపై ఇప్పుడు ఇంటా, బయటా చర్చ జరుగుతోంది. జార్జి బుష్ తర్వాత అధికారంలోకి వచ్చిన ఒబామా, అప్ఘానిస్తాన్, ఇరాక్‌ల నుంచి అమెరికా సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకొస్తానని, గ్వాటెమాలాలోని సైనిక స్థావరాన్ని మూసేస్తానని హామీ ఇచ్చారు. సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి రప్పించలేకపోయారు. గ్వాటెమాలాలోని స్థావరాన్ని మూసివేయలేకపోయారు. కరేబియన్ జైలును కూడా ఎత్తివేయలేకపోయారు. దేశీయంగా అన్ని జాతుల వారిని ఏకం చేస్తానని, జాతి విద్వేషాలను నిర్మూలిస్తానని పలుసార్లు ప్రకటించారు. ఇందులోనూ ఆయన వైఫల్యం చెందారు. ఇటీవలనే ఇద్దరు నల్లజాతీయులను శ్వేతపోలీసులు కాల్చివేయడం వల్ల అమెరికాలో అల్లర్లు కూడా చెలరేగాయి. వ్యక్తిగతంగా జాతి విద్వేషాలకు వ్యతిరేకించే ఒబామా, అన్యాయంగా చనిపోయిన నల్లజాతీయుల కుటుంబాలను పరామర్శించకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. ప్రజలందరికి ఆరోగ్య సౌకర్యం కల్పిస్తానంటూ 2010లో ఒబామా తీసుకొచ్చిన హెల్త్‌కేర్ పథకం ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఇంటా బయటా, అంటే ఇటు డెమోక్రట్లతో విభేదించి, అటు రిపబ్లికన్లతో గట్టిగా విభేదించి హెల్త్‌కేర్ స్కీమ్‌ను తీసుjiరావడంతో ఆ స్కీమ్‌కు ఒబామా హెల్త్‌కేర్ అని పేరు కూడా వచ్చింది. ఎంతో చిత్తశుద్ధితో ఆయన ఈ ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ పథకం నుంచి పెద్ద ఆరోగ్య బీమా కంపెనీలు ఎప్పుడో తప్పుకున్నాయి. తాను అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను ఎత్తివేస్తానన్న అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్పుడే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా సౌమ్యుడు, మంచి పాలనాదక్షుడు, మంచి ఫ్యామిలీ మేన్ అని పేరు తెచ్చుకున్న ఒబామా ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిన గొప్ప మేలేమీ లేదు. కాకపోతే నాటి బుష్ కన్నా మంచి పాలన అందించారన్న పేరుతో పాటు తన పాలనలో అవినీతి మరక అంటకుండా దిగిపోవడం కూడా విశేషమే. యూరప్, ఆసియా పసిఫిక్, ఉత్తర అమెరికాలో గతేడాది చివరిలో నిర్వహించిన ఓ సర్వేలో కూడా అమెరికా అధ్యక్షుడిగా ఒబామాను 54 శాతం మంది కోరుకుంటున్నారని ‘ప్యూ’ రిసెర్చ్ సెంటర్ వెల్లడించడం గమనార్హం. రెండు గొప్ప విజయాలు విదేశాంగ విధానంలో బరాక్ ఒబామా రాణించలేకపోయారనే విమర్శలు ఉన్నా అంతర్జాతీయంగా రెండు గొప్ప విజయాలు సాధించారు. అందులో ఒకటి ఇరాన్‌తో అణు నియంత్రణ ఒప్పందం కాగా, మరోటి ఆగర్భ శత్రుదేశమైనా క్యూబాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడం. ఈ కారణంగా ఈ రెండు దేశాలపైనా ఆర్థిక ఆంక్షలను ఎత్తేశారు. మధ్యప్రాచ్యంలో, గల్ఫ్‌లో అమెరికా నిర్వహిస్తున్న సైనిక, వైమానిక స్థావరాలను గత అమెరికా అధ్యక్షులలాగానే ఒబామా కూడా కొనసాగించారు. సిరియా పౌరులపై సైన్యం రసాయనిక దాడులకు దిగినా ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను వెనకేసుకరావడం పట్ల కూడా ఒబామాపై విమర్శలు వెల్లువెత్తాయి. -
మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా.. రష్యాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ విషయం నేరుగా ప్రకటించకపోయినా.. దేశాధ్యక్షుల ప్రకటనలు, వాళ్ల సూచలను బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నందున వెంటనే తిరిగి వచ్చేయాలని అన్నారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి చెడిపోతున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పుకోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వీటో చేసేందుకు తమను లాగుతోందని పుతిన్ ఆరో్పించారు. ఆ తర్వాతి నుంచి రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి. అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలయగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడంతో.. ఆయనతో జరగాల్సిన భేటీని పుతిన్ రద్దుచేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే పెద్ద యుద్ధం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ అన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని రష్యా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవ్‌గెనీ బుజిన్స్కీ చెప్పారు. సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో.. పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. -
మా ఆవిడతో కలిసి తాజ్‌మహల్ చూడాలి: ఒబామా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గడిచిన రెండేళ్లలో ఈ ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇది ఎనిమిదోసారి. లావోస్‌లో జరిగిన ఏసియాన్ సదస్సుకు మోదీతో పాటు ఒబామా కూడా హాజరయ్యారు. త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఒబామా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మోదీ ఆయనను మరోసారి భారతదేశానికి ఆహ్వానించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా భారత్ రావాలని చెప్పారు. దానికి ఒబామా కూడా సానుకూలంగా స్పందించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను తాను ఇంతవరకు తన భార్య మిషెల్‌తో కలిసి చూడలేదని, ఒకసారి దాన్ని చూడాలని ఉందని, అందుకోసం తప్పకుండా వస్తానని చెప్పారు. 2008 నాటి ముంబై ఉగ్రదాడులతో పాటు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఈ జనవరిలో జరిగిన దాడికి కారకులను పాకిస్థాన్ గుర్తించి శిక్షించాలని ఏషియాన్ సదస్సు సందర్భంగా ఒబామా, మోదీ ఇద్దరూ గట్టిగా డిమాండ్ చేశారు. తమ పొరుగున ఉన్న ఒక దేశం ఉగ్రవాదాన్ని తయారుచేసి, ఎగుమతి చేస్తోందని పాకిస్థాన్ పేరు చెప్పకుండానే నరేంద్రమోదీ అన్నారు. అలాంటి దేశాల మీద ఆంక్షలు విధించి, వాటిని ఒంటరి చేయాలని చెప్పారు. జి20 సదస్సులో సైతం.. ఒకే ఒక్క దేశం దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని మోదీ అన్నారు. కాగా, జీఎస్టీ బిల్లును ఆమోదించినందుకు ప్రధాని మోదీని బరాక్ ఒబామా అభినందించారు. -
ఒబామాకు దుబాయ్‌లో ఉద్యోగం ఆఫర్
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న బరాక్ ఒబామా.. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎటూ ఖాళీగా ఉంటారు కదా అని ఆయనకు దుబాయ్‌లో ఉద్యోగం ఇస్తానంటూ ఓ లాయర్ ఆఫర్ చేశాడు. తన లా కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, దానివల్ల ఇస్లాం మతంపైన, సహనంపైన ఆయనకు మరింత అవగాహన వస్తుందని ఆ లాయర్ అన్నాడు. ఇస్లాం పట్ల సహనం అంటే అర్థం ఏంటో మరింత బాగా తెలుసుకోడానికి ఈ ఉద్యోగం ఆయనకు ఉపయోగపడుతుందని ఎమిరేటీ లాయర్ ఎయిసా బిన్ హైదర్ ట్వీట్ చేశారు. మంగళవారం నాటికి ఒబామా పదవీ కాలం ఇంకా 247 రోజులు ఉంటుంది. కొత్త అధ్యక్షుడు 2017 జనవరి 20వ తేదీన పదవీ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతంతో పాటు ఉండేందుకు ఇల్లు, అరబ్ దేశాలు తిరిగి రావడానికి టికెట్లు కూడా ఇస్తానని ఆ లాయర్ ఆఫర్ చేశారు. అమెరికన్, పాశ్చాత్య మీడియా ఎప్పుడూ ఇస్లాంను ఉగ్రవాదానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే అది పూర్తి అవాస్తవమని... ఇస్లాం అంటేనే సహనానికి, క్షమాగుణానికి, అర్థం చేసుకోడానికి మారుపేరని చెప్పారు. పాశ్చాత్యులు ఇస్లాంను అర్థం చేసుకుని, ఆమోదించడానికి ఏకైక మార్గం వాళ్లొచ్చి తమతో కలిసి ఉండటమేనని, ఒబామా వైట్‌హౌస్‌ను వదలగానే ఆయనకు తన సంస్థలో ఉద్యోగం ఆఫర్ ఇస్తానని తెలిపారు. అరబ్బులు, ముస్లింలతో కలిసి ఉంటే ఆయనకు సహనానికి అసలైన అర్థం తెలుస్తుందని చెప్పారు. -
90 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖాతాలో మరో రికార్డు చేరనుంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొని చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆయన తాజాగా క్యూబా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే మార్చిలో క్యూబా రాజధాని హవానాలో పర్యటించనున్నారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు మరోసారి క్యూబా గడ్డపై అడుగుపెడుతున్నారు. అమెరికా 30వ అధ్యక్షుడైన కావిన్ కూలిడ్జ్ 1928లో పర్యటించారు. ఒబమా పర్యటన ప్రదర్శన ఉద్దేశం ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడమే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయి దాదాపు 54 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ ప్రతిష్టంభనకు ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, ఒబామా కలిసి 2014 డిసెంబర్లో చరమగీతం పాడారు. మరికొద్ది రోజుల్లో బబామా పదవి ముగియనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
అతడి తల విలువ రూ.33 కోట్లుపైనే!
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది అబు మహ్మద్ అల్ షిమాలి అలియాస్ తిరద్ అల్ జర్బాపై అమెరికా భారీ మొత్తంలో రివార్డు ప్రకటించింది. అతడి సమాచారం తెలిపిన వారికి దాదాపు రూ.33 కోట్లకుపైగా చెల్లిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా గత రాత్రి ఆమోదం తెలిపారు. జర్బా అమెరికా, యూరప్ దేశాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు నిధులను సేకరించడంలో కీలకమైనవాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అల్ కయిదా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేసిన 2005 సంవత్సరం నుంచి జర్బా ఇస్లామిక్ స్టేట్ లో చేరాడు. అప్పటి నుంచి సిరియాలో ఉన్న తమ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగే విదేశీ సైన్య వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో నష్టాన్ని అంఛనా వేసి ఆ మేరకు భర్తీ చేయగలగడంలో మంచి నేర్పరి. ఓ రకంగా ఉగ్రవాదులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి ఇతడే కారణమని కూడా అమెరికా బలగాలు నమ్ముతున్నాయి. అంతేకాదు, ఇతర దేశాలపైకి దాడులకు వెళ్లాలనుకున్నప్పుడు ఏయే ప్రాంతాలనుంచి వెళ్లాలనే విషయాలను చెప్పడంతోపాటు ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు కూడా జర్బానే చూసుకుంటాడట. అందుకే, అతడిని గుర్తించి మట్టుబెడితే ఇస్లామిక్ స్టేట్ కు గండికొట్టినట్లవుతుందని అమెరికా భావిస్తోంది. -
ఫేస్బుక్లో చేరిన ఒబామా
-
ఫేస్బుక్లో చేరిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్బుక్లో చేరారు. తన సొంత దేశంలోనే ఈ సోషల్ మీడియా ప్రారంభమైనా ఇంతకాలం అందులో లేని ఒబామా, తొలిసారి అందులో చేరి.. వాతావరణ మార్పుల గురించి వీడియోను తొలి పోస్టుగా పెట్టారు. దాన్ని ఇప్పటివరకు ఏకంగా 15.25 లక్షల మంది చూశారు. వైట్ హౌస్ బ్యాక్ యార్డులో నడుస్తూ మన అందమైన గ్రహాన్ని రక్షించాలంటూ చెప్పిన వైనాన్ని వీడియో తీయించి.. దాన్ని పోస్ట్ చేశారు. తన తర్వాత వచ్చే అధ్యక్షులు కూడా ఇలాగే పచ్చిక బయళ్లలో నడవాలని కోరుకుంటున్నానని, వాళ్లతో పాటు అమెరికన్లందరూ కూడా మంచి నేషనల్ పార్కులు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, కొండలు, సముద్రాలు అన్నింటినీ ఎంజాయ్ చెయ్యాలనే భావిస్తున్నట్లు అందులో చెప్పారు. ప్రతి నలుగురు పెద్దవాళ్లలో ముగ్గురు ఫేస్బుక్లో ఉంటున్నారని, అలాంటప్పుడు అందరితో భావాలు పంచుకోడానికి ఇదే మంచి సాధనమని భావించి చేరానని అన్నారు. బరాక్ ఒబామా పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంటుకు 4.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ అకౌంటును ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్ అనే సంస్థ నిర్వహిస్తుంది. మే నెలలోనే ట్విట్టర్లో చేరిన ఒబామా, తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా మారారు. -
బాంబులు కురిపించడం, క్షమాణలు చెప్పడమా!
విదేశాల్లోని పౌరకేంద్రాలపై గుడ్డిగా దాడులు జరపడం, అమాయక ప్రజలను బలి తీసుకోవడం, ఆనక తీరిగ్గా క్షమాపణలు చెప్పడం అమెరికా పాలకులకు ఆనవాయితీగా మారిపోయింది. అనేక ఘటనల్లో కనీసం క్షమాపణలు చెప్పకుండా గుడ్డిగా సమర్థించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రపంచ పౌరహక్కుల సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన సందర్భాల్లో మాత్రమే అమెరికా పాలకులు క్షమాపణలు చెప్పారు. అలాగే అఫ్ఘానిస్తాన్‌లోని కుందజ్ పట్టణంలో అక్టోబర్ 3న అమెరికా సైనికులు ఓ ఆస్పత్రిపై బాంబులు కురిపించి 22 మంది అమాయకులను బలితీసుకున్న సంఘటనకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పారు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం. 1991, జనవరి 21: బాగ్దాద్ శివారు, అబూ గ్రాహిబ్లోని 'ఇన్‌ఫ్యాంట్ ఫార్ములా ప్రొడక్షన్ ప్లాంట్' పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణసేనలు బాంబుల వర్షం కురిపించి శిశు పాల ఉత్పత్తి కేంద్రాన్ని సమూలంగా ధ్వంసం చేశాయి. ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. అది జీవ రసాయన ఆయుధాల ఉత్పత్తి కేంద్రం అవడం వల్లనే దాడులు జరిపామని అప్పటి హెచ్‌డబ్లూ బుష్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1991, ఫిబ్రవరి 13: బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలోని పౌరశిబిరంపై అమెరికా సైన్యం లేజర్ గైడెడ్ బాంబులను కురిపించగా 408 మంది ఇరాకీ పౌరులు మరణించారు. ఆ శిబిరం వద్ద ఇరాక్ సీనియర్ నాయకులు, సైనిక కమాండర్లు కనిపించడం వల్లనే దాడులు జరిపామని అమెరికా పాలకులు సమర్ధించుకున్నారు. 1998, ఆగస్టు 20: సూడాన్‌లోని అల్ షిఫా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీపై అమెరికా క్రూయిజ్ క్షిపణులతో దాడులు జరిపింది. అందులో ఒక పౌరుడు మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఒసామా బిన్ లాడెన్‌తో ఆ ఫ్యాక్టరీకి సంబంధం ఉన్న కారణంగానే తాము దాడులు జరిపామని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1999, ఏప్రిల్ 12: కొసోవో యుద్ధం సందర్భంగా సెర్బియాలోని గ్రెడిలికా వద్ద ఓ రైలుపై అమెరికా ఎఫ్-15ఈ యుద్ధ విమానం క్షిపణులు ప్రయోగించగా 14 మంది పౌరులు మరణించారు. ఆనక 'పొరపాటు' జరిగిందంటూ అమెరికా యంత్రాంగం క్షమాపణలు చెప్పింది. 1999, ఏప్రిల్ 23: కొసోవో యుద్ధం సమయంలోనే సెర్బియా బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రంపై అమెరికా బాంబులు కురిపించింది. 16 మంది ఉద్యోగులు మరణించారు. సెర్బియా అధ్యక్షుడు స్లొబోడన్ మిలోసెవిక్ కమాండ్, కంట్రోల్ కేంద్రం అవడం వల్లనే సైన్యం దాడులు జరిపిందని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1999, మే7: సెర్బియాలోని చైనా ఎంబసీపై అమెరికా యుద్ధ విమానం బాంబులు కురిపించడంతో ముగ్గురు ఎంబసీ సిబ్బంది మరణించారు. 20 మందికి పైగా మరణించారు. 'ఇది ఘోర తప్పిదం. పాత మ్యాప్‌ను ఆధారం చేసుకోవడం వల్ల పొరపాటు జరిగింది' అని అప్పటి అమెరికా రక్షణ మంత్రి విలియం కొహెన్ వివరణ ఇచ్చారు. 2001, అక్టోబర్ 16-26: కాబుల్‌లోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ కాంప్లెక్స్‌పై అమెరికా బాంబుదాడులు. 55వేల మందికి సరిపడా ఆహారం, బ్లాంకెట్లు, ఇతర సామాగ్రి ధ్వంసం. 2003, ఏప్రిల్ 8: బాగ్దాద్‌లోని అల్ జజీరా కార్యాలయంపై దాడి. ఓ జర్నలిస్ట్ మరణించగా, మరో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అక్కడికి సమీపంలో, విదేశీ జర్నలిస్టులు బసచేసిన ఓ పాలస్తీనా హోటల్‌పై అమెరికా బాంబుల దాడి జరపగా ఇద్దరు రిపోర్టర్లు మరణించగా, రాయిటర్స్‌కు చెందిన ఓ కెమెరామన్ మరణించారు. -
మోదీ రాష్ట్రపతి అయ్యారా..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి అయ్యారా..? మనకైతే ఈ విషయం తెలియదు గానీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాత్రం తెలిసిపోయినట్లుంది. అందుకే ఆయన మోదీని 'ప్రెసిడెంట్ మోదీ' అన్నారు. సోమవారం నాడు తమ సమావేశం ముగిసిన తర్వాత ఓ ప్రకటన చేసే సందర్భంలో ఒబామా పొరపాటున ఈ మాట అనేశారు. వైట్ హౌస్ వెబ్సైట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఈ మాట ఉంది. ''ప్రెసిడెంట్ మోదీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది'' అని ఒబామా చెప్పారు. ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో గుప్పుమంది. దాంతో ఆ తర్వాత వైట్‌హౌస్ సిబ్బంది నాలుక కరుచుకుని, దాని రాతప్రతిని విడుదల చేస్తూ.. అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు. -
డియర్ పోటస్.. హేపీ బర్త్‌డే!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ఈ సంవత్సరం మీకు చాలా బాగుండాలని, నూరేళ్లు చల్లగా బతకాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ఆయన ఆశించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు దేశాధినేతలకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు పంపడం మోదీకి అలవాటు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత సందర్శించిన దేశాల అధినేతలకు కూడా ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. Dear @POTUS, wishing you a Happy Birthday! Have a great year ahead. I pray for your long life & may you remain in good health. — Narendra Modi (@narendramodi) August 4, 2015 -
ఆ దాడి మన చరిత్రలో చీకటి అధ్యాయం
వాషింగ్టన్: దక్షిణ కరోలినాలోని చారిత్రక చర్చిపై దాడిపట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా స్పందించారు. అమెరికాలో తుపాకీ సృష్టిస్తున్న విద్వంసాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాన్ని దశలవారిగా చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో నిర్మూలించుకోవాలని కోరారు. 'ఇది ఎంతో విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భం.. అలాగే నిర్మూలించాల్సిన సమయం' అని ఒబామా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ కరోలినాలోని ఎమ్మాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్టు చర్చిపై ఓ శ్వేత జాతీయుడు దాడి చేసి తొమ్మిదిమందిని పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం శ్వేత సౌదం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేయడంతోపాటు శ్వేత జాతీయులు చేస్తున్న చర్యలను విమర్శించారు. ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలకు స్వస్థిపలకాల్సిన అవసరంఉందని, అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఈ మధ్య కాలంలోనే ప్రజలపై తుపాకీ దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. తక్షణమే వీటి విషయంలో వెనక్కి తిరగి చూసుకొని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రికార్డుల ప్రకారం ఇది పద్నాలుగో దాడి అని.. తాజాగా నల్లజాతీయుల చర్చిపై జరిగిన దాడి అందరినీ ప్రశ్నింపజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అమెరికాలో చరిత్రలో మచ్చగా ఉంటుందని, చీకటి అధ్యాయంలాంటిదని చెప్పారు. -
ఒబామా గిన్నిస్ రికార్డు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ట్విట్టర్లో ఖాతా తెరిచిన ఐదు గంటల్లోనే ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించి, ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. @POTUS అనే పేరుతో ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరుమీద తెరిచిన అకౌంట్‌కు కేవలం ఐదు గంటల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చిన విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇంతకుముందు నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22 నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. ఒబామాకు ఇంతకుముందే @BarackObama అనే ఐడీతో ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అధికారిక ఖాతా కోసం దీన్ని కొత్తగా తెరిచి, అంతలోనే పనిలో పనిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించేశారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. ఇది కేవలం బరాక్ ఒబామాది మాత్రం కాదు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేసేస్తామని వైట్‌హౌస్ ఇంటర్నెట్ స్ట్రాటజీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెక్స్ వాల్ తెలిపారు. -
లోకేశ్‌ను కలవొద్దు.. ఒబామాకు ఎన్నారైల లేఖ
భారతదేశం నుంచి వస్తున్న నారా లోకేశ్‌కు అపాయింట్మెంట్ ఇవ్వొద్దంటూ అమెరికాలోని ఎన్నారైలు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. అమెరికాలో ఉన్న కొంతమంది వద్ద డబ్బు సేకరించి, ఆ మొత్తాన్ని డెమొక్రాటిక్ పార్టీకి విరాళం రూపంలో ఇవ్వడానికి వస్తున్నట్లుగా వచ్చేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని.. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని బహిరంగ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి కొడుకుగా తప్ప లోకేశ్‌కు వేరే ఏ అర్హతా లేదని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అత్యంత క్రూరంగా నిర్మూలిస్తున్నారని, ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకుంటున్నారని లేఖలో ఆరోపించారు. ఇక పార్టీ కార్యకర్తల నిధికి చీఫ్ కోఆర్డినేటర్ పదవిలో ఉంటూ.. ప్రపంచవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నుంచి భారీమొత్తంలో డబ్బు సేకరించారని అట్లాంటాకు చెందిన గురవారెడ్డి అనే ఎన్నారై తెలిపారు. ఫండ్ రైజింగ్ ఈవెంట్లో 10 వేల డాలర్లు ఇచ్చి అమెరికా అధ్యక్షుడితో షేక్‌హ్యాండ్ కొనేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని, మళ్లీ స్వదేశానికి వెళ్లాక ఒబామాయే స్వయంగా తనను ఆహ్వానించినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తారని కూడా ఆయనా లేఖలో హెచ్చరించారు. అందువల్ల అసలు లోకేశ్‌ను కలిసే ఆలోచనే పెట్టుకోవద్దని సూచించారు. -
ఒబామా.. ఎస్ఎంఎస్ పంపరు.. ట్వీట్ చేయరు!
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో మహా యాక్టివ్‌గా ఉంటారు. ఏ దేశానికెళ్లినా అక్కడి ఫొటోలు గానీ, అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌తో సెల్ఫీలు గానీ తీసుకుని వెంటనే ట్విట్టర్లో పెట్టేస్తారు. మరోవైపు ఆయనతో ఇటీవలే టీ పంచుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. అసలు ట్వీట్లు కాదుకదా.. కనీసం ఎస్ఎంఎస్లు కూడా పంపరట. అసలు ఆయనకు వీడియో రికార్డింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. ఆయన వద్ద ఉన్నది కేవలం బ్లాక్‌బెర్రీ మాత్రమే. అందులో ఈమెయిళ్లు మాత్రమే పంపుతానని ఒబామా చెప్పారు. భద్రతా కారణాల వల్లే రికార్డింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ వాడేందుకు తనకు అనుమతి లేదని తెలిపారు. అయితే టీనేజిలో ఉన్న తన కూతుళ్లిద్దరు మాత్రం స్మార్ట్ ఫోన్లు వాడతారని, స్నేహితులకు ఎస్ఎంఎస్లు పంపుతారని అన్నారు. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ ఐడీని కూడా ఎవరికీ చెప్పడానికి తనకు వీల్లేదని ఆయన చెప్పారు. -
మా పోరు ఇస్లాంతో కాదు: ఒబామా
అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ ఇస్లాంకు వ్యతిరేకమనే తీవ్రాదుల వాదనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా దీటైన జవాబిచ్చారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని స్పష్టం చేశారు. గురువారం వైట్‌హౌస్‌లో తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ప్రసంగించిన ఆయన ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి సంస్థల తీరును ముస్లిం ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇస్లాం రాజ్యస్థాపన అంటూ వెర్రెత్తిపోయే ఉగ్రవాదులు.. ముస్లింల జీవన స్థితిగతులను ఏనాడూ పట్టించుకున్నపాపన పోలేదని ఒబామా విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను తృణీకరిస్తాయనే అబద్ధాన్ని యువత మెదళ్లలో నూరిపోయడం ద్వారా ఉగ్రసంస్థలు తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అమెరికా తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించాలని సదస్సులో పాల్గొన్న దాదాపు 60దేశాల ప్రతినిధులను ఆయన కోరారు. -
మా పోరు ఇస్లాంతో కాదు: ఒబామా
వాషింగ్టన్: అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ ఇస్లాంకు వ్యతిరేకమనే తీవ్రాదుల వాదనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా దీటైన జవాబిచ్చారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని స్పష్టం చేశారు. గురువారం వైట్‌హౌస్‌లో తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ప్రసంగించిన ఆయన ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి సంస్థల తీరును ముస్లిం ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇస్లాం రాజ్యస్థాపన అంటూ వెర్రెత్తిపోయే ఉగ్రవాదులు.. ముస్లింల జీవన స్థితిగతులను ఏనాడూ పట్టించుకున్నపాపన పోలేదని ఒబామా విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను తృణీకరిస్తాయనే అబద్ధాన్ని యువత మెదళ్లలో నూరిపోయడం ద్వారా ఉగ్రసంస్థలు తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అమెరికా తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించాలని సదస్సులో పాల్గొన్న దాదాపు 60దేశాల ప్రతినిధులను ఆయన కోరారు. -
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా
-
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా
మహాత్మా గాంధీ బతికుంటే.. భారతదేశంలో ప్రస్తుతమున్న పరమత అసహనాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మాట్లాడుతూ మత సహనం గురించి ప్రస్తావించటం అధికార బీజేపీపై విమర్శేనన్న వాదనను శ్వేతసౌధం ఖండించింది. కాగా, తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ.. ''మిషెల్, నేను భారత్ నుంచి తిరిగివచ్చాం. అది అద్భుతమైన, అందమైన దేశం. ఘనమైన భిన్నత్వమున్న దేశం. కానీ.. అక్కడ గత కొన్నేళ్లుగా అన్ని రకాల మత విశ్వాసాల వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. కేవలం తమ సాంస్కృతిక వారసత్వం, నమ్మకాలను బలపరుచుకోవాలనే ఇలా చేస్తున్నారు. ఈ అసహన చర్యలు.. ఆ జాతిని విముక్తం చేసేందుకు దోహదపడిన గాంధీజీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవి'' అని పేర్కొన్నారు. దాదాపు 3,000 మంది అమెరికా, అంతర్జాతీయ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. హింస అనేది ఒక బందానికో, ఒక ప్రాంతానికో ప్రత్యేకం కాదని.. ఈ (మత అసహనం) సమస్యలతో మానవజాతి తన చరిత్ర అంతటా పోరాడుతూనే ఉందని వ్యాఖ్యానించారు. -
విశాల్‌ను ఒబామా వద్దకు తీసుకొచ్చిందెవరు?
ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)లో గతంలో ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేసిన కేకే మహ్మద్‌కు జనవరి 19న అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఏకంగా ఎంబసీ నుంచి ఫోన్ అనగానే ఆయన కాసేపు భయపడ్డారు. తర్వాత అవతల ఫోన్ చేసినవాళ్లు.. విశాల్ అనే కుర్రాడి చిరునామా ఇవ్వగలరా అని అడిగారు. భారతదేశ పర్యటనకు వస్తున్న ఒబామా దంపతులు ఆ పిల్లాడిని కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకీ విశాల్ ఎవరో గుర్తుపట్టారా? ఇంతకుముందు 2010 నవంబర్ నెలలో ఒబామా దంపతులు భారతదేశానికి వచ్చినప్పుడు హుమాయూన్ సమాధి వద్ద విశాల్‌ను మరికొందరు పిల్లలతో కలిసి చూశారు. అప్పట్లో కేకే మహ్మద్ ఏఎస్ఐలో సూపరెంటిండింగ్ ఆర్కియాలజిస్టుగా ఉండేవారు. అక్కడ పనిచేసే కూలీల పిల్లల్లో ఒకరే.. విశాల్. యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే ఈ కార్మికులు.. తమ పిల్లలను కూడా వెంట తెచ్చుకునేవారు. అప్పట్లో విశాల్ సహా మొత్తం 500 మంది పిల్లలకు మహ్మద్, ఇతరులు పాఠాలు చెప్పేవారు. అయితే, అమెరికన్ ఎంబసీ నుంచి ఫోన్ రాగానే, అసలు విశాల్ ఎక్కడున్నాడో.. వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడున్నారో గుర్తించడం ఎలాగని మహ్మద్ కాసేపు ఆందోళన చెందారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడి ఆచూకీ కావాలని అవతలి వ్యక్తి ఫోన్లో చెప్పారు. 'విశాల్‌ను నేను మర్చిపోయా గానీ, ఒబామాలు మర్చిపోలేదు' అని మహ్మద్ అన్నారు. ఎట్టకేలకు యూపీలోని ఝాన్సీ సమీపంలో గల గ్రామంలో విశాల్ కుటుంబం ఆచూకీ దొరికింది. అతడి తల్లి, తండ్రి, సోదరి అంతా కూడా ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా దంపతులను కలిశారు. బరాక్ ఒబామా తన ప్రసంగంలో కూడా విశాల్ పేరును, అతడి గాధను ప్రస్తావించారు. -
''వైట్‌హౌస్‌లోనే ఒబామా తల తీసేస్తాం''
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తలను ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోనే తీసేస్తామంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడొకరు హెచ్చరించాడు. అమెరికాను ముస్లిం దేశంగా మార్చేస్తామని కూడా అన్నాడు. కుర్దిష్ సైనికుడిని అత్యంత క్రూరంగా చంపిన వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యానాలు చేశాడు. 'మోసుల నగరంలో శాంతియుత ముస్లింల మీద బాంబుల వర్షం' అనే శీర్షికతో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇరాక్ లోని మోసుల్ నగరంలో బాంబు దాడుల కారణంగా జరిగిన నష్టాన్ని ప్రధానంగా ఈ వీడియోలో చూపించారు. అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, కుర్దుల మీద దాడి చేస్తామని ముసుగు వేసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాది హెచ్చరించాడు. తమవాళ్లు అమెరికా, కుర్దిష్ అధ్యక్షులను హతమారుస్తారని, యూరోపియన్ దేశాల్లో కారుబాంబుల మోతలు వినిపిస్తాయని కూడా ఆ వీడియోలో హెచ్చరిక జారీ చేశాడు. -
విజయవంతంగా ముగిసిన ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒబామా దంపతులు ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, ఇతర ఉన్నతాధికారులు ఒబామాకు వీడ్కోలు పలికారు. ఈ రోజు ఉదయం ఒబామా సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఈ రోజు ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శించాల్సివుంది. అయితే సౌదీ రాజు అబ్దుల్లా మరణించడంతో ఒబామా ఆగ్రా పర్యటనకు రద్దు చేసుకుని సౌదీకి బయల్దేరారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా మూడు రోజుల భారత్ పర్యటనలో అణు ఒప్పందం, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. -
సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా ప్రసంగం
-
'ఒబామాను ఆహ్వానించే ఛాన్స్ మిస్సయ్యాం'
లక్నో:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్సును కోల్పోయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా మూడు రోజుల పర్యటనకు ఒబామా ఆదివారం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒబామా ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉంది. అయితే గత గురువారం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా కన్నుమూయడంతో ఒబామా ఆగ్రా పర్యటన రద్దయ్యింది. ఒబామా రాష్ట్ర పర్యటన రద్దుకావడంతో అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్స్ కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం'అంటూ తన అధికారిక ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఒబామా విందుకు పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ విందుకు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
అద్భుతమైన ముగింపు ఇచ్చిన ఒబామా
మూడు రోజుల భారతదేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్భుతమైన ముగింపు ఇచ్చారు. నమస్తే.. బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగం ప్రారంభించి, జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఒక్కో మాట చెబుతున్నప్పుడల్లా ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మిన్నంటింది. అడుగుడుగునా భారతీయతను తన ప్రసంగంలో ఆయన నింపేశారు. షారుక్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే విజయాన్ని, మిల్కాసింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ప్రస్తావించారు. తాము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన 'విశాల్' అనే బాలకార్మికుడి విజయాన్ని కూడా గుర్తుచేశారు. స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమని ఒబామా చెప్పారు. భారతదేశంలోని మహిళా శక్తిని వేనోళ్ల పొగిడారు. మతస్వేచ్ఛను ప్రస్తావించారు. అమెరికాలో గురుద్వారాపై దాడి దురదృష్టకరమని అభివర్ణించారు. భారతదేశంలోని యువశక్తిని, వాళ్లకున్న అవకాశాలను, సాధించగలిగిన విజయాలను అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుచేశారు. భారతీయుల కష్టపడేతత్వాన్ని తాము నేర్చుకోవాలని నిజాయితీగా చెప్పారు. తాను వంటవాడి మనవడినని, మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని తమ మధ్య పోలికలను గుర్తుచేశారు. -
కదం తొక్కిన భారత నారి
వేడుకల్లో మహిళా పాటవం పతాకావిష్కరణ నుంచి.. కవాతు వరకూ.. నారీశక్తి కేంద్ర బిందువుగా సాగిన పరేడ్ న్యూఢిల్లీ: భారత 66వ గణతంత్రం సోమవారం ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే విధం గా మహిళా పాటవాన్ని ప్రదర్శించింది. నారీశక్తి కేంద్ర ఇతివృత్తంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ భారత్‌లో మహిళా సాధికారత ప్రపంచ పెద్దన్నను విస్మయ పరిచే విధంగా సాగింది. రాజ్‌పథ్‌లో పతాకావిష్కరణ దగ్గర నుంచి ఆసాంతం మహిళా ప్రాధాన్యమే కనిపించింది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో త్రివిధ దళాల నుంచి మహిళా జవానులు రాజ్‌పథ్ పరేడ్‌లో వివిధ బృందాలకు, శకటాలకు నేతృత్వం వహించారు. వీరి ప్రదర్శన పరేడ్‌కు హాజరైన అశేష ప్రజానీకంలో భావోద్వేగం పెల్లుబికేలా చేసింది. ముఖ్య అతిథి ఒబామా సైతం అబ్బుర పడేలా నారీశక్తి కదం తొక్కింది. పరేడ్ సాగుతుండగానే ఆయన నేతృత్వంలో సాగే అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తన ట్వీటర్ పేజిలో భారత మహిళా సైన్యానికి జోహారు అర్పించింది. ‘భారత రిపబ్లిక్ పరేడ్‌లో మహిళా సైనికపాటవం ఆకట్టుకునేలా సాగింది. భారత దేశంలోని అద్భుతమైన వైవిధ్యం ఒకేచోట ఏకరూపంగా ప్రదర్శితమైంద’ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్వీట్ చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పతాకావిష్కరణ పోడియం దగ్గరకు రాగానే, కెప్టెన్ హావోబమ్ బెల్లా దేవి.. ఆయన సమక్షంలో పతాకావిష్కరణ చేశారు. మణిపూర్‌కు చెందిన రెండోతరం సైనికాధికారి బెల్లాదేవి. పతాకావిష్కరణ జరగగానే జాతీయపతాకానికి వందన సమర్పణకు ఆమే కమాండ్ చేశారు. పరేడ్ ప్రారంభమైన తరువాత ముందుగా పదాతి దళం, కెప్టెన్ దివ్యా అజిత్ నాయకత్వంలో సైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం చేస్తూ ముందుకు సాగింది. దివ్యా అజిత్, 2010లో చెన్నైలోని అధికారుల శిక్షణ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’ అవార్డును పొందారు. దివ్యతోపాటు నౌకా, వాయు సైన్యానికి చెందిన మహిళా జవానులు కూడా రైసీనా హిల్స్ నుంచి ఇండియా గేట్ వరకూ దేశం గర్వపడేలా కవాతును నిర్వహించారు. నౌకాదళం ప్రదర్శించిన శకటం ‘భారతీయ నవసేన, నారీ శక్తి’కి లెఫ్టినెంట్ కమాండర్ శ్వేతాకపూర్, లెఫ్టినెంట్ వర్తికా జోషి నాయకత్వం వహించారు. మరో నలుగురు నౌకాదళ మహిళా అధికారులుశకటంపై అపూర్వమైన పాటవాన్ని ప్రదర్శించారు. ఈ అధికారులు గోవా నుంచి రియో జానెరియో వరకు ప్రతికూల వాతావరణంలో సముద్రంపై సాహస ప్రయాణం చేసిన ధీరవనితలు. ఎవరెస్టు పర్వత శకటంపై మహిళాధికారుల పర్వతారోహణ ఆహూతులను బాగా ఆకట్టుకుంది. ‘అమ్మాయిని రక్షించు.. అమ్మాయిని చదివించు’ (బేటీ బచావో, బేటీ పఢావో పథకానికి సంబంధించిన శకటం పరేడ్‌లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఎన్సీసీ బ్యాండ్ బృందం కూడా బాలికల నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ బాలికలు వినిపించిన ‘సారే జహాసే అచ్చా’ గానానికి ఒబామా సతీమణి మిషెల్లీ చప్పట్లు కొట్టి అభినందించారు. .ఎన్ఎస్ఎస్ బృందం లో 148 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన ‘మా గంగా’ శకటం మహిళా దైవశక్తిసామర్థ్యాలను చాటింది. పంచాయతీరాజ్ శాఖ శకటం ఈ-గవర్నెన్స్‌ను ఒక పల్లె పడుచు లాప్టాప్ ద్వారా వినియోగించుకుంటున్నట్లు ప్రదర్శించింది. న్యాయ శాఖ శకటం, రైల్వే శకటాలకు కూడా మహిళా సాధికారతే ఇతివృత్తమయింది. స్త్రీశిశు సంక్షేమ శాఖ బాలికలతో ‘భవిష్యత్తు మాదే’ అన్న ఇతివృత్తం తో శకటాన్ని ప్రదర్శించింది. రిపబ్లిక్‌డే పరేడ్ మొత్తం భారత మహిళా స్ఫూర్తిని సాధికారికంగా ప్రపంచానికి చాటి చెప్పింది. రాజస్థానీ తలపాగాతో మెరిసిన మోదీ గణతంత్ర వేడుకల్లో రాజస్థానీ ‘బాందనీ’ తలపాగాతో మోదీ మెరిసిపోయారు. నలుపు సూట్‌పై ఎరుపురంగు తలపాగా ధరించిన మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా ఆయన ఇదే వేషధారణలో కనిపించారు. ఇక ఒబామా నల్లరంగు సూట్ ధరించారు. జల్లులు కురవడం, చల్లని వాతావరణం ఉండడంతో ఒబామా తన వాహనం నుంచి దిగగానే.. సూట్‌పై నిలువెత్తు కోటు వేసుకున్నారు. మిషెల్ ఒబామా పొడవాటి నల్ల సూట్‌పై ఎర్రని స్కార్ఫ్‌తో తళుక్కుమన్నారు. 2015 ఛబ్బీస్ జనవరిలో ఇవి ఫస్ట్.. త్రివిధ దళాల్లోని మహిళా సిబ్బందితో పరేడ్ గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవడం ఇటీవలే కొనుగోలు చేసిన తీరప్రాంత నిఘా, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, అత్యాధునిక మిగ్-29కే విమానం ప్రదర్శించడం ఇదే తొలిసారి. వేడుకలకు హాజరయ్యే విదేశీ ముఖ్య అతిథులు సాధారణంగా రాష్ట్రపతి వాహనంలో వస్తారు. కానీ ఈసారి ఒబామా తన సొంత వాహనం‘బీస్ట్’లో రాజ్‌పథ్‌కు వచ్చారు. సీఆర్పీఎఫ్కు చెందిన నక్సల్స్ నిరోధక దళం-కోబ్రా తొలిసారి పరేడ్‌లో పాల్గొంది. గణతంత్రంలో విశేషాలు.. సన్నని జల్లులు కురుస్తున్నా లెక్క చేయకుండా రాజ్‌పథ్ మార్గం రెండువైపులా జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓవైపు తడిసిపోతున్నా వేడుకలను ఆసక్తిగా వీక్షించారు. సతీమణి మిషెల్‌తో కలసి ఒబామా రాజ్‌పథ్‌కు రాగానే జనం హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రపతి రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో జల్లులు కురవడంతో ఒబామా తానే స్వయంగా గొడుగు పట్టుకొని నిల్చున్నారు. యువతీయువకులు ‘వి లవ్ ఒబామా’ అని చూపే ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఒబామా.. ఒబామా..’ అని నినాదాలు చేశారు. త్రివిధ దళాల విన్యాసాల సమయంలో చిన్నారుల కేరింతలతో రాజ్‌పథ్ మార్మోగింది. ‘నారీశక్తి’కి ప్రతీకగా త్రివిధ దళాల్లోని మహిళా అధికారులు కవాతు చేసిన సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లేచి నిలబడి అనందం వ్యక్తంచేశారు. ఆకాశంలో సుఖోయ్-30 ఎంకేఐ చేసిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. జాతీయ సాహస అవార్డులు గెల్చుకున్న బాలలకు గౌరవసూచకంగా సందర్శకులంతా లేచి నిలబడ్డారు. గణతంత్ర వేడుకల్లో ఒబామా కారు ‘బీస్ట్’ రాజ్‌పథ్‌పై రాచఠీవి ఉట్టిపడుతూ ముందుకు వస్తుంటే అంతా ఆసక్తిగా చూశారు. -
భారత్, అమెరికా సరైన దిశలో పయనిస్తున్నాయి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సరైన దిశగా పయనిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో ఒబామా ప్రసంగించారు. ఈ సదస్సులో ఒబామాతో పాటు భారత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకులు తనను అబ్బురపరిచాయని ఒబామా ప్రశంసించారు. భారత్, అమెరికా సాధించాల్సింది చాలా ఉందని ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య దిగుమతులు పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అమెరికా దిగుమతుల్లో కేవలం 2 శాతమే భారత్ నుంచి వస్తుండగా, భారత్ దిగుమతుల్లో 1 శాతం మాత్రమే అమెరికా వాటా ఉందని చెప్పారు. అమెరికా తయారీ విమానాలు భారత్ విమానాశ్రాయాల్లో నిరంతరం కనబడాలని ఒబామా అన్నారు. అంతకుముందు మోదీ ప్రసంగించారు. -
అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌లో అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను అమెరికాలో పర్యటించిన తర్వాత భారత్‌లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో మోదీ ప్రసంగించారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ హయాంలో ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి వచ్చిందని మోదీ అన్నారు. ఒబామా మాట్లాడుతూ అమెరికా, భారత్ వాణిజ్యంలో 60 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. వాణిజ్యంలో ఆధునికతకు తాను, మోదీ ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. -
సీఈవోల సదస్సులో పాల్గొన్న మోదీ, ఒబామా
న్యూయార్క్: భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సు సోమవారం సాయంత్రం ఆరంభమైంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత్, అమెరికాకు చెందిన 250 సీఈవోలు హాజరయ్యారు. మోదీ మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు సుపరిపాలనే పరిష్కారమని అన్నారు. వాణిజ్యంలో ఆధునికతపై తనకు, మోదీకి ఆసక్తి ఉందని ఒబామా అన్నారు. -
ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. -
ఒబామాతో సోనియా, మన్మోహన్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒబామా బస చేసిన మౌర్యా హోటల్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సోనియా, మన్మోహన్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. సోనియా బృందం మర్యాదపూర్వకంగా ఒబామాను కలిసినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సయమంలో 2010లో ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. -
పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’
త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
కెమిస్ట్రీ పండింది..!
ఒబామా, మోదీల మధ్య కుదిరిన సాన్నిహిత్యం, పెరిగిన అనుబంధం ఒబామా పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఇరువురు కలిసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో పేలిన చమత్కారాల్లో అది మరింత స్పష్టమైంది. భారతీయులకు ‘మేరా ప్యార్ భరా నమస్కార్’ అంటూ హిందీలో శుభాకాంక్షలు తెలిపిన ఒబామా.. మోదీతో తన సాన్నిహిత్యంపై జోక్స్ కూడా వేశారు. ‘హైదరాబాద్ హౌస్ లాన్లో ఈ రోజు.. రోజులో ఎంతసేపు నిద్రపోతాం అనే విషయం సహాచాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాకన్నా మోదీ చాలా తక్కువగా నిద్రపోతారు. అయినా ఆయనింకా అధికారానికి కొత్త కదా! అధికారంలో ఇంకో ఐదారేళ్లు ఉంటే ఇంకో గంట అదనంగా నిద్రపోతారు’ అంటూ ఒబామా చమత్కరించారు. ‘చాయ్ పే’కు థాంక్యూ! 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు మోదీని దగ్గర చేసిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని ఆదివారం మోదీతో కలిసి పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఒబామా ప్రస్తావించడం విశేషం. అంతకుముందే హైదరాబాద్ హౌస్ గార్డెన్లో ఒబామాకు మోదీ స్వయంగా టీ కలిపి ఇచ్చిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘ప్రైమ్ మినిస్టర్ మోదీ.. థాంక్యూ.. నాతో జరిపిన చాయ్ పే చర్చ సహా నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్యూ’ అన్నారు. ఇలాంటి చాయ్ పే చర్చ కార్యక్రమాలు చాలా వాషింగ్టన్లోనూ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. -
బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
-
బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
ఒకవైపు సైనిక దళాలు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తోంది. అయితే.. ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. వేడుకలు చూస్తూ చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. మధ్యమధ్యలో దాన్ని బయటకు తీసి, మళ్లీ నోట్లోకి పెట్టుకుంటూ ఫొటోలకు దొరికేశారు. రంగురంగుల తలపాగా ధరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కనే నల్లటి సూటులో వచ్చిన ఒబామా కూర్చున్నారు. ఇంతకుముందు బీజింగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సమితి (అపెక్) సమావేశాల సమయంలో కూడా ఒబామా ఇదే తరహాలో చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రేగింది. ఆ సదస్సులో పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు చ్యూయింగ్ గమ్ నములుతూ, తీస్తూ కనిపించారని, సదస్సుకు వచ్చేటప్పుడు కూడా అలాగే చేశారని ఇంగ్లండ్ పత్రిక 'ద ఇండిపెండెంట్' అప్పట్లో విమర్శించింది. -
మోదీ కుర్తా వేసుకోవాలని ఉంది
భారత్, అమెరికాల మధ్య 'దోస్తీ' పెరగాలని, తనకు మోదీ కుర్తా వేసుకోవాలని ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నల్లటి సూటు, టై కట్టుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. 2010 సంవత్సరంలో తాను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు తమ దంపతులతో డాన్సు చేయించారని అన్నారు. ముంబైలో కొందరు పిల్లలతో కలిసి మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా డాన్సు చేశారు. తనకంటే మిషెల్ బాగా డాన్సు చేస్తారని ఆయన అన్నారు. కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్రమోదీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు. తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు. అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని, మంచి స్టైలు కూడా ఉందని అన్నారు. ఒకప్పుడు మోదీ తండ్రి టీ అమ్ముకునేవారని, ఆయన తల్లి ఇళ్లలో పనిచేసుకునే వారని, కానీ వాళ్ల అబ్బాయి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మన ముందున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. -
విశాఖ ‘స్మార్ట్’ పట్నం
స్మార్ట్ సిటీపై అమెరికాతో ఏపీ ఎంవోయూ ఒప్పందంపై ఏపీ, అమెరికా అధికారుల సంతకాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే కార్యాచరణలో సాధ్యాసాధ్యాల అధ్యయనం, సలహా సంప్రదింపులు, వనరుల సమీకరణ అంశాల్లో ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో జరిపిన చర్చల్లో ఈ సిటీల అభివృద్ధిపై కుదిరిన అవగాహన మేరకు.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఒబామా కార్యరూపం ఇచ్చారు. దీని ప్రకారం స్థానిక ప్రభుత్వాలు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ)కు అవసరమైన సమన్వయం, సాంకేతిక సమాచారం, పథక రచన సమాచారం, సిబ్బందిని, పరికరాలను సమకూర్చాల్సి ఉంటుంది. ఆదివారం ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో యూఎస్టీడీఏ డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు యూఎస్టీడీఏ.. స్మార్ట్‌సిటీ సాధ్యాసాధ్యాల అధ్యయనం, స్టడీ టూర్స్, వర్క్‌షాపులు, శిక్షణ నిర్వహించేందుకు ఆర్థిక వనరులను ఏపీకి అందజేస్తుంది. అమెరికా ప్రభుత్వ వాణిజ్య శాఖ, యూఎస్ ఎగ్జిమ్ బ్యాంక్, ట్రేడ్ అండ్ ఎకనమిక్ సంస్థలు సైతం ఈ ఒప్పందం బలోపేతం చేయడానికి సహకరిస్తాయి. యూఎస్ పారిశ్రామిక సంస్థ కూడా.. ఈ సందర్భంగా.. వైజాగ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అమెరికా పారిశ్రామిక సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇది.. కొత్త మలుపు: వెంకయ్యనాయుడు భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కొత్త మలుపని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అభివృద్ధి సూచిక: మంత్రి నారాయణ విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థతో కుదిరిన ఒప్పందం ఏపీ అభివృద్ధికి సూచికని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘అణు’మార్గం సుగమం
అమెరికా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం అణు ఒప్పందంపై ప్రతిష్టంభనకు తెరదించిన మోదీ, ఒబామా భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆరేళ్ల ప్రతిష్టంభనకు తెర ఒబామా, మోదీ చర్చల్లో పరిష్కారం అణు వాణిజ్య సహకారం అమలుకు నిర్ణయం సరికొత్త శిఖరాలకు రక్షణ సహకారం.. రక్షణ రంగంలో 4 ప్రాజెక్టుల్లో సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తికి ఒప్పందాలు ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సామర్థ్యాల బలోపేతానికి ద్వైపాక్షిక సహకారం హైదరాబాద్ హౌస్‌లో ఇరువురి సుదీర్ఘ చర్చల్లో నిర్మాణాత్మక ఫలితాలు, నిర్ణయాలు భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ‘అణు’ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం, ఉగ్రవాదంపై పోరు, వివిధ రంగాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇక భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా దంపతులకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా.. రాష్ట్రపతి భవన్లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’, సైనిక వందనం’తోనూ గౌరవించారు. హైదరాబాద్ హౌస్‌లోని లాన్లో కూర్చున్నప్పుడు ఒబామాకు మోదీ స్వయంగా ‘చాయ్’ కలిపి ఇచ్చారు. తనకు అపూర్వ ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. భారతీయ సంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు. న్యూఢిల్లీ: భారత్-అమెరికాల మధ్య పౌర అణు సహకారంపై ఒప్పందం కుదిరిన ఆరేళ్ల తర్వాత.. ఆ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది. అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆదివారం ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్‌లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. అణు ఒప్పందం అమలుపై గణనీయ ఫలితం సాధించామని ఒబామా అభివర్ణించినప్పటికీ, దీని విధివిధానాలు ఏంటనేది వెంటనే తెలియరాలేదు. హైదరాబాద్‌హౌస్‌లో ఒబామా, మోదీలు ముఖాముఖిగా, ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో కలసి, ఇరువురూ తోటలో విహరిస్తూ చర్చలు జరిపారు. తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అణు వాణిజ్య సహకారం దిశగా ముందడుగు.. ‘‘భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న తొలి అమెరికా అధ్యక్షుడు, భారత్‌లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే అన్న వాస్తవం. రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు సూచికలు. కొద్ది నెలలుగా ఈ సంబంధంలో కొత్త ఉద్విగ్నత, విశ్వాసాలు నాకు కనిపించాయి. మా సంబంధాల్లో నూతనోత్తేజం కనిపించింది. గత సెప్టెంబర్‌లో ఇందుకు నేపథ్యాన్ని నెలకొల్పినందుకు మీ నాయకత్వానికికృతజ్ఞతలు చెప్తున్నా. కొత్త రూపం తీసుకున్న మన సంబంధాల్లో పౌర అణు ఒప్పందం కేంద్ర బిందువు. ఇది కొత్త విశ్వాసాన్ని రుజువుచేసింది. ఇది కొత్త ఆర్థిక అవకాశాలనూ సృష్టించింది. స్వచ్ఛ ఇంధనశక్తి కోసం మన అవకాశాలను విస్తరించింది. 4 నెలలుగా దీనిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేం కృషి చేశాం. ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసిన ఆరేళ్ల తర్వాత మా చట్టానికి, మా అంతర్జాతీయ న్యాయ బాధ్యతలకు, సాంకేతికంగా, వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యతలకు అనుగుణంగా వాణిజ్య సహకారం దిశగా ముందడుగు వేస్తుండటం నాకు సంతోషాన్నిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. అవరోధాలకు నేడు పరిష్కారం సాధించాం.. ఒబామా మాట్లాడుతూ.. ‘మా పౌర అణు సహకారంపై ముందుకెళ్లకుండా నిరోధిస్తున్న రెండు అంశాలకు ఈ రోజు మేం పరిష్కారం సాధించాం. దానిని పూర్తిస్థాయిలో అమలు చేయటానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు. ‘ఇది చాలా ముఖ్యమైన ముందడుగు. మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేం ఉమ్మడిగా ఎలా కృషి చేయగలమనేది ఇది చాటుతోంది’ అని అన్నారు. నాలుగు అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు త్వరగా పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేలా మద్దతిచ్చేందుకు అమెరికా కృషి చేస్తుందని కూడా ఒబామా హామీ ఇచ్చినట్లు మోదీ తెలిపారు. ‘రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనీ నిర్ణయించాం.ఆధునిక రక్షణ ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని, ఉత్పత్తి చేయాలని అంగీకారానికి వచ్చాం. దేశీయ రక్షణ పరిశ్రమ స్థాయి పెరగటానికి, భారత్‌లో తయారీ రంగ విస్తరణకు ఇవి దోహదపడతాయి’ అని మోదీ అన్నారు. ఉగ్రవాద సంస్థల మధ్య తేడా చూపరాదు.. ప్రస్తుత సవాళ్లు అలాగే ఉన్నప్పటికీ ఉగ్రవాదమనేది ముఖ్యమైన ప్రపంచ ముప్పుగానే ఉందని, అది సరికొత్త రూపం తీసుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి సమగ్ర అంతర్జాతీయ వ్యూహం, విధానం అవసరమని అగీకారానికి వచ్చాం. ఉగ్రవాద సంస్థల మధ్య ఎలాంటి భేదమూ చూపరాదు. ఉగ్రవాదులకు భద్రమైన ఆవాసాలుగా ఉన్న ప్రాంతాలను నిర్మూలించేందుకు, వారిని చట్టం ముందు నిలిపేందుకు ప్రతి దేశమూ తన బాధ్యతను నిర్వర్తించాలి’ అని చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను, సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకోవడానికి రెండు దేశాలూ ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ముంబైపై 26/11 ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా, భారత్‌లు స్పష్టం చేశాయి. ప్రాంతీయ సహకారం గురించి ప్రస్తావిస్తూ.. రెండు దేశాల భవిష్యత్తుకు, ప్రపంచ భవిష్యత్తుకు కీలకమైన ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సుసంపన్నతలను పెంపొందించేందుకు సహకారాన్ని బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ఇరు దేశాలూ పునరుత్తేజితం చేశాయన్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించిన తర్వాత అఫ్ఘాన్ పరిణామక్రమంలో దోహదపడేందుకు కృషి చేయటంపై కూడా ఒబామా, తాను చర్చించామని మోదీ చెప్పారు. అఫ్ఘాన్ ప్రజలకు తమ రెండు దేశాలూ విశ్వసనీయమైన భాగస్వాములుగా ఉంటాయని ఒబామా పేర్కొన్నారు. ‘ఇరు దేశాల పురోభివృద్ధికి, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరత, సుసంపన్నత ముందుకెళ్లడానికి భారత్ - అమెరికాల భాగస్వామ్యం విజయవంతం కావడం ముఖ్యం. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, నవీన ఆవిష్కరణ, వ్యవసాయం తదితరాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తాం’ అని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య హాట్ లైన్లు నెలకొల్పుతాం ‘మన విస్తృత ప్రాంతంలో అభివృద్ధి, అనుసంధానాన్ని పెంపొందించేందుకు కలిసి కృషిచేయాల్సిన బాధ్యతను చేపట్టినపుడే వ్యూహాత్మక భాగస్వామ్యం పరిపూర్ణమవుతుంది. దీనిని ప్రాధాన్యంగా గుర్తించి ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని ఒబామా నేనూ అంగీకరించాం. మా సంబంధం ఈ రోజు కొత్త స్థాయికి చేరింది. ఈ శతాబ్దపు అవకాశాలను, సవాళ్లను ప్రతిఫలించేలా మా స్నేహానికి, సహకారానికి విస్తృత ప్రణాళికను రచించాం. భారత్ - అమెరికాలు చాలా తరచుగా శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాలని అంగీకారినికి వచ్చాం. అమెరికా, భారత్‌ల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య హాట్లైన్లను కడా నెలకొల్పుతాం. ఈ ఏడాది ఆరంభంలో మేం సరికొత్త ప్రయాణం మొదలు పెడతాం’ అని చెప్పారు. ‘అణు’మానాలు తొలగినట్లే.. అణు బాధ్యతకు ‘సమీకరణ నిధి’ పరిష్కారం భారతదేశపు ‘అణు బాధ్యత చట్టం’లోని.. అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలన్న నిబంధనపై అమెరికాకు చెందిన అణు రియాక్టర్ల తయారీ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం.. ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే ప్రభావితులకు పరిహారం చెల్లించేందుకు రియాక్టర్ నిర్వహణ సంస్థ రూ. 1,500 కోట్లు పక్కన పెట్టాలి. అయితే.. సరఫరాదారుల నుంచి నిధుల హక్కును నిర్వహణదారు కోరవచ్చు. ఈ నిబంధన వల్ల భారత అణు రంగంలో పెట్టుబడులు పెట్టడం కష్టమవుతోందని విదేశీ అణు సరఫరాదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అణు రియాక్టర్లకు బీమా కల్పించే అంశమూ పీటముడిగా మారింది. అలాగే.. భారత్‌కు సరఫరా చేసే అణు ఇంధనాలను వాటికి సంబంధించిన అణు రియాక్టర్లకు చేరుతున్నాయో లేదో తాను స్వయంగా పర్యవేక్షించి, పరిశీలిస్తానని అమెరికా పట్టుపడుతోందని, ఇందుకు భారత్ వ్యతిరేకిస్తోందని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల మేరకే పనిచేస్తామని చెప్తోందని సమాచారం. పౌర అణు ఒప్పందం అరేళ్లుగా అమలుకాకపోవటానికి ఈ రెండు కీలక అంశాలే కారణం కాగా.. వీటిపై తాజాగా ఎలాంటి పరిష్కారాలు కనుగొన్నారన్నది తెలియరాలేదు. అయితే.. అణు ప్రమాదం జరిగిన పక్షంలో అందుకు సంబంధిత సరఫరాదారులే బాధ్యత వహించాలన్న నిబంధన విషయంలో అమెరికాకు భరోసా ఇచ్చేందుకు భారత్ ఒక ప్రతిపాదన చేస్తోంది. అణు ప్రమాదం జరిగినా అమెరికా అణు రియాక్టర్ల సంస్థలపై భారం పడకుండా భద్రత కల్పించేందుకు తాము ఒక సమీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్తోంది. రియాక్టర్లకు బీమా కల్పించేందుకు విదేశీ సంస్థలను అనుమతించటానికి సుముఖంగా లేని భారత్.. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కోరింది. అయితే.. ఆ సంస్థ వద్ద ఇందుకు అవసరమైనంత ఆర్థిక సామర్థ్యం లేదు. దీంతో.. పలు కంపెనీలు తమ నిధులను ఒక చోటకు సమీకరించి రియాక్టర్లకు బీమా కల్పించేలా.. అణు బీమా సమీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నాలుగు ప్రభుత్వ బీమా సంస్థలు రూ. 750 కోట్లను సమీకరించాయి. ఇది అవసరమైన మొత్తంలో కేవలం సగం మాత్రమే కావటంతో..ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుంది. కాగా, అణు ప్రమాదాలకు బాధ్యత, అణు పదార్థాల జాడ తెలుసుకోవడానికి సంబంధించి అమెరికాకు ఉన్న అభ్యంతరాలు.. ఒబామా - మోదీ సమావేశంలో కుదిరిన అవగాహనతో పరిష్కారమయ్యాయని ఆ దేశ ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ వాషింగ్టన్లో అన్నారు. మరోవైపు. ప్రతిష్టంభనను బద్దలుకొట్టామని, అణు బాధ్యత నిబంధన, అణు ఇంధనం జాడ తెలుసుకోవటంపై అమెరికాకు భరోసాలు ఇచ్చామని భారత ప్రభుత్వం తెలిపింది. ‘మీతో ఎక్కువ వ్యాపారం చేయాలనుకుంటున్నాం’ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బిట్)పై చర్చలను పునఃప్రారంభించాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. రెండు దేశాల్లోనూ పరస్పర పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై 2008 నుంచి చర్చలు జరుగుతున్నాయి. భారత్, అమెరికాల వాణిజ్యం గత కొన్నేళ్లలో 60 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒబామా చెప్పారు. ‘మరింత ఎక్కువగా వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వ్యాపారం చేయడం మరింత సులభం చేస్తూ ప్రధాని అమలు చేస్తున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. మరింత ఎక్కువ మంది భారతీయులను బ్యాంకు ఖాతాలతో సాధికారం చేయాలని, భారతీయులకు పరిశుభ్రమైన నీరు, గాలి అందించాలని మోదీ చేస్తున్న కృషిని నాకు వివరించారు. ఈ కృషిలో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు ముఖ్యమైన సామాజిక భద్రత ఒప్పందంపై చర్చలను కూడా పునఃప్రారంభిస్తామని మోదీ చెప్పారు. రక్షణ ఒప్పందం పొడిగింపు భారత్-అమెరికాల మధ్య ఈ ఏడాదితో ముగియనున్న 2005 నాటి రక్షణ చట్ర ఒప్పందం (డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్)ను మరో పదేళ్లు కొనసాగించేలా తాజాగా ఒప్పందం ఖరారైంది. ఉన్నతస్థాయి రక్షణ సామగ్రిని సంయుక్తంగా ఉత్పత్తి చేయటానికి ఇది తోడ్పాటునిస్తుంది. ఇందులో భాగంగా ఖరారుచేసిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనీషియేటివ్ కింద.. కొత్త తరం రావెన్ మిని యూఏవీలు, సి-130 సైనిక రవాణా విమానానికి ప్రత్యేక కిట్లు, మొబైల్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ పవర్ సోర్స్, యూనిఫాం ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్ ఇంక్రిమెంట్ 2 అనే ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం, ఉత్పత్తి చేయటం చేపట్టాలని నిర్ణయించినట్లు భారత్ తెలిపింది. ‘క్లీన్ ఎనర్జీ’కి మద్దతు స్వచ్ఛ ఇంధనశక్తి (క్లీన్ ఎనర్జీ) కోసం, వాతావరణ మార్పు అంశాలపై పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందిస్తామని భారత్, అమెరికాలు ప్రకటించాయి. వచ్చే వేసవి కాలంలో భారత్‌లో క్షేత్రస్థాయి పెట్టుబడి అధికారిని నియమించటం ద్వారా స్వచ్ఛ ఇంధనశక్తికి నిధులను వేగవంతం చేయడానికి అమెరికా అంగీకరించింది. ఈ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను రప్పించేలా మద్దతివ్వడానికి ఒక బృందాన్నీ నియమిస్తామని పేర్కొంది. వాతావరణ మార్పు అంశంపై చర్చల్లో భారత్ వాణి చాలా ముఖ్యమైనదని ఒబామా పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో అమెరికా - చైనాల మధ్య కుదిరిన ఒప్పందం తరహా ఒప్పందం కుదుర్చుకునేలా భారత్‌పై ఒత్తిడి ఉందా? అని విలేకర్లు మోదీని ప్రశ్నించగా.. ‘ ఏ ఒత్తిడి అనేది భారత్‌పై ప్రభావం చూపదు. అయితే.. భవిష్యత్ తరానికి మనం ఎలాంటి వాతావరణం అందిస్తామనేదానిపై ఒత్తిడి ఉంది. వాతావరణ మార్పు అనేదే ఒత్తిడి. భూతాపోన్నతి అనేదే ఒత్తిడి’ అని అన్నారు. -
ఒబామా దంపతులకు విందు
-
చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా
-
చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా
మాడిసన్ స్క్వేర్ ప్రసంగం అద్భుతం బాలీవుడ్ స్టార్లకు వచ్చినట్లు జనం వచ్చారు మోదీపై అమెరికా అధ్యక్షుడి ప్రశంసల జల్లు అన్ని రంగాల్లో సహకారం ఉంటుందని భరోసా భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు న్యూఢిల్లీ: నమస్తే.. మేరా ప్యారా భాయీ నమస్కార్ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, తనకు మధ్య 'చాయ్‌పే చర్చా' బాగా జరిగిందని, ఇలాంటివి వైట్‌హౌస్‌లో కూడా మరిన్ని జరగాలని ఒబామా అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ''భారతదేశంతో బంధం మరింత దృఢపరుచుకోవడం నా హయాంలో జరుగుతున్నందుకు సంతోషం. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. గత నెలలో వాషింగ్టన్ వచ్చినప్పుడు, అక్కడ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్‌లో మీ ప్రసంగానికి బాలీవుడ్ స్టార్‌కు వచ్చినట్లుగా జనం రావడం చూసి ఆశ్చర్యపోయాం. 'చాయ్ పే చర్చా' బాగా జరిగింది. ఇలాంటివి వైట్ హౌస్‌లో కూడా జరగాలి. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నాం. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుంది. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉంటుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయి. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని హైడ్రో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మరో పదేళ్ల పాటు కూడా ఇలాగే సహకారం కొనసాగాలని భావిస్తున్నాం. రక్షణ రంగంలోను, అణు రంగంలోను కూడా సహకారం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భారతీయులకు మరోసారి చెబుతున్నాను'' అన్నారు. అనుకున్న సమయం కంటే దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా సంయుక్త విలేకరుల సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చోపచర్చలు సాగాయి. సంయుక్త ప్రకటనను ఇరుదేశాల ఉన్నతాధికారులు సిద్ధం చేయగా, దానికి ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు బరాక్ ఒబామా ఇద్దరూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామా ఎప్పుడొస్తారా అని చాలాసేపు బయట ఇరు దేశాల మంత్రులు, జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురు చూడటం కనిపించింది. ఈలోపు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అమెరికా బృందంతో మాటా మంతీ సాగించారు. -
ఒబామా భారత పర్యటన ప్రారంభం
-
పౌర అణు ఒప్పందంలో మేలిమలుపు!
భారత్, అమెరికాల మధ్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పౌర అణు ఒప్పందం ఖరారైపోయింది. ఇందులో అత్యంత ముఖ్యమైన 'ట్రాకింగ్ క్లాజు'ను తొలగించేందుకు అమెరికా అంగీకరించడం ఇందులోని ప్రధానాంశం. భారత అణు ఉపయోగాన్ని తాము పరిశీలించబోమని అమెరికా చెప్పడం మన దేశంలోని చాలామందిని సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఒబామా తన విశేషాధికారాలను ఉపయోగించుకుని ఈ క్లాజును తొలగించినట్లు తెలిసింది. వేరే దేశం నుంచి తెచ్చుకున్న అణు సామగ్రిని అమెరికా కంపెనీలు సరఫరా చేసిన రియాక్టర్లలో ఎలా ఉపయోగిస్తున్నారో కూడా అమెరికా ట్రాక్ చేయబోదు. ఆదివారం సాయంత్రం జరిగే సంయుక్త విలేకరుల సమావేశంలో దీన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అనేక అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు ఒబామాల మధ్య ఇంకా పలు అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవడం, రక్షణ రంగ సహకారం లాంటి విషయాలపైనా ఒప్పందాలు కుదరొచ్చని అంటున్నారు. -
హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు
న్యూఢిల్లీ: భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజ్ ఘాట్ కు చేరుకున్న ఒబామా.. అక్కడి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ కు బయల్దేరి వెళ్లారు.ప్రస్తుతం మోదీతో కలిసి ఇక్కడ చర్చలు జరుపుతున్న ఒబామా.. గం.2.45 ని.లకు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించనున్నారు. -
రావిమొక్క నాటిన అధ్యక్షుడు
రాజ్‌ఘాట్‌లో బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అక్కడ ఓ రావిమొక్కను నాటారు. రాజ్‌ఘాట్ సందర్శనకు చిహ్నంగా ఈ మొక్కను నాటారు. సందర్శకుల పుస్తకంలో కూడా తన సందేశం రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశానికి ఒబామా హాజరయ్యారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులూ కొద్దిసేపు మాట్లాడుకున్న అనంతరం.. లోపలకు వెళ్లారు. విందుతో పాటే ఇరువురు నాయకుల మధ్య పలు అంశాలపై చర్చలు కూడా సాగుతాయని అధికార వర్గాల సమాచారం. -
మహాత్మా గాంధీకి ఒబామా నివాళి
-
బాపూజీకి నివాళులు అర్పించిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్‌ఘాట్‌కు చేరుకుని, అక్కడ మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి బయల్దేరారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్ వద్దకు వచ్చి, నివాళులు అర్పించడం గమనార్హం. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒబామా బాపూజీకి నివాళులు అర్పించారు. ముందుగా పలువురు భద్రతా దళాధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని అణువణువూ గాలించారు. ఇరుదేశాలకు చెందిన భద్రతా దళాల అధికారులతో పాటు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తదితరులు కూడా ఒబామా వెంట ఉన్నారు. బాపూజీ శాంతియుత పోరాటానికి ఒబామా ఏనాడో ఆకర్షితులయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తాను చేసిన ప్రసంగంలో కూడా ఆయన గాంధీజీ సిద్ధాంతాలను ప్రస్తావించారు. అలా బాపూజీ అంటే ఎనలేని గౌరవం ఉన్న ఒబామా.. భారతదేశంలో తన రెండో కార్యక్రమంగానే రాజ్‌ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు. తొలుత రాష్ట్రపతి భవన్లో స్వాగతం, సైనిక వందనం అనంతరం నేరుగా అక్కడి నుంచి రాజ్‌ఘాట్ వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
రాష్ట్రపతి భవన్లో ఒబామాకు స్వాగతం
-
మహిళా అధికారికి అరుదైన అవకాశం
-
మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం
వింగ్ కమాండర్ పూజా ఠాకూర్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించే అరుదైన అవకాశం దక్కిన ఏకైక మహిళా సైనికాధికారిణి. రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి.. ఆయనను సైనిక వందనానికి తోడ్కొని తీసుకెళ్లిన ఏకైక అధికారిణి పూజా ఠాకూర్ మాత్రమే. ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు, మంత్రులు, ఇతరులతో కూడిన బృందాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా పరిచయం చేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. రాజ్‌ఘాట్‌కు బయల్దేరారు. -
రాష్ట్రపతి భవన్లో ఒబామాకు స్వాగతం
భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా ప్రథమ పౌరుడు బరాక్ ఒబామాకు రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒబామాను స్వాగతించారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్కోర్ట్ ప్రాంతంలో రెడ్ కార్పెట్ పరిచి రాష్ట్రపతి భవన్లో ఒబామాను స్వాగతించారు. ఆయనకు పూర్తిస్థాయి సైనిక వందనం లభించింది. తుపాకులను 21 రౌండ్లు గాల్లోకి పేల్చి.. రిపబ్లిక్ డే అతిథికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ ప్రధాన గేటు వద్ద నుంచి అశ్వికదళం తోడు రాగా ఒబామా ప్రయాణిస్తున్న 'ద బీస్ట్' వాహనం నెమ్మదిగా లోపలకు వచ్చింది. తర్వాత తొలుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్వాగతించారు. అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారిక్కర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు ఉదయమే రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకున్నారు. తొలుత షెడ్యూలు కంటే పావుగంట ముందుగానే వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఒబమాకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. విమానశ్రయం నుంచి తొలుత ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఒబామా.. అటు నుంచి నేరుగా తన 'ద బీస్ట్' కారులో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. -
మౌర్య హోటల్‌కు చేరుకున్న ఒబామా
పాలం విమానాశ్రయం నుంచి ద బీస్ట్ వాహనంలో బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విమానం వద్దకు వచ్చి మరీ ఒబామా దంపతులకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, ఇతర అధికారులు కూడా ఒబామాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. కాగా, ఒబామా దంపతులు బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కనీ వినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 మీటర్లకు ఒకటి చొప్పున హాలోజన్ దీపాలను ఏర్పాటుచేశారు. అక్కడకు సమీపంలో ఉన్న తాజ్ హోటల్‌ను కూడా భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!
అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగానే వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు విమానం వద్దే స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో.. దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్రమోదీ.. ఆ తర్వాత ఆయనను బలంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోదీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోదీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, ఒబామా బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ బయట పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. సమీపంలో ఉన్న తాజ్ హోటల్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
ఒబామాకు.. మోడీ ఘన స్వాగతం
-
భారత్ చేరుకున్న ఒబామా దంపతులు
-
భారత్ వచ్చిన బరాక్ ఒబామా దంపతులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు అధికారులు సర్వ సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అలాగే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే. -
ఇదీ ఒబామా భారత పర్యటన షెడ్యూల్!
-
ఒబామా భారత పర్యటన తాజా షెడ్యూల్ ఇదే
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తున్న ఒబామా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనవరి 25వ తేదీన ఢిల్లీ రానున్నారు. మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. కాగా ఈ నెల 27న ఒబామా ఆగ్రా తాజ్‌మహల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా ఇక్కడి నుంచి నేరుగా ఆ దేశం వెళ్లనున్నారు. భారత్‌లో ఒబామా పర్యటన షెడ్యూల్ ఇదే: జనవరి 25: ఉదయం 10 గంటలకు ఢిల్లీకి రాక 12 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. 12:40: రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు మధ్యాహ్నం 2:45 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ, సాయంత్రం 4:10 గంటలకు మోదీ, ఒబామా మీడియా సమావేశం రాత్రి 7:35 గంటలకు మౌర్య హోటల్లో అమెరికా ఎంబసీ సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం 7:50 గంటలకు రాష్ట్రపతి భవన్లో విందు జనవరి 26: ఉదయం 10.00 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, అనంతరం రాష్ట్రపతి భవన్‌కు రాక మధ్యాహ్నం మోదీతో కలసి సీఈవో సదస్సులో ప్రసంగం రాత్రి: ప్రధానితో విందు జనవరి 27: ఉదయం 10.40: ఢిల్లీలోని సిరి కోటకు రాక 12.20-1.30: హోటల్లో మధ్యాహ్న భోజనం అనంతరం సౌదీకి బయల్దేరడంతో ఒబామా పర్యటన ముగుస్తుంది. -
మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆరుగురే
ఈసారి రిపబ్లిక్ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఇప్పటివరకు మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఎవరెవరన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లయినా.. ఇప్పటికి ఒబామాతో కలిపి కేవలం ఆరుగురు అధ్యక్షులు మాత్రమే అమెరికా నుంచి వచ్చారు. ఇంతకుముందు 1959 సంవత్సరంలో ఐసన్‌హోవర్, 1969లో రిచర్డ్ నిక్సన్, 1978లో జిమ్మీ కార్టర్, 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్, 2006లో జార్జ్ డబ్ల్యు బుష్, 2010లో బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించారు. ఇప్పుడు ఒబామా.. రెండోసారి మన దేశానికి వస్తున్నారు. -
ద బీస్ట్.. ఈ కారు చాలా స్పెషల్ గురూ!
వాషింగ్టన్: బాంబులతో దాడి చేసినా ఏమీకాదు. బుల్లెట్ల వర్షం కురిపించినా చెక్కు చెదరదు. మందుపాతర పేల్చినా దానికి ఇసుమంత కూడా నష్టం వాటిల్లదు. ఈ లక్షణాలన్నీ ఓ కారుకు ఉన్నాయి. దాని పేరు 'ద బీస్ట్'. దాని ప్రత్యేకతలేంటో ఓసారి చూస్తారా.. ఈ కారు 18 అడుగుల పొడవు, 8 టన్నుల బరువు ఉంటుంది. ఆ వాహనం టైర్లు పంక్చర్ కావు. ఇంధన ట్యాంకు పేలకుండా నిరోధించేందుకు ప్రత్యేకంగా ఫోమ్ ఉంటుంది. రాత్రిపూట పనిచేసే 'నైట్ విజన్' కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. అలాగని ఈ కారును ఎవరు పడితే వారు నడపడానికి వీల్లేదు. ఈ కారును నడపాలంటే 180 డిగ్రీల్లో నడిపేలా ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఈ కారును వినియోగించేది ఎవరో కాదు... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఈ కారులో శాటిలైట్ ఫోన్ ఉంటుంది. అది నేరుగా పెంటగాన్‌కు, అమెరికా ఉపాధ్యక్షుడికి కలుస్తుంది. వాస్తవానికి భారత పర్యటన సందర్భంగా కూడా ఒబామా ఈ కారులోనే వస్తారని అంతా అనుకున్నారు. కానీ, భారత్‌లో ఉన్న ప్రొటోకాల్ కారణంగా ఒబామా ఈ కారును తీసుకురావట్లేదు. -
ఒబామా వస్తున్నారనే కుట్ర?
కొత్త సంవత్సరం వేడుకల్లో అంతా మునిగి ఉంటారు. ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరు కాబట్టి సులభంగా దేశంలో ప్రవేశించవచ్చు.. జనవరి 26వ తేదీ.. రిపబ్లిక్ డే నాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి, ఆ రోజున భారతదేశంలో భారీగా ఉగ్రదాడులకు పాల్పడాలి.. స్థూలంగా ఇదీ లష్కరే తాయిబా ఉగ్రవాదుల కుట్ర. ఈ విషయం కోస్ట్ గార్డ్ సిబ్బంది, నిఘా వర్గాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందించిన నివేదికలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే... వాళ్ల కుట్రను ముందుగానే పసిగట్టిన భారతీయ కోస్ట గార్డ్ సిబ్బంది.. దాన్ని సమర్థంగా భగ్నం చేయగలిగారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు వేసుకొచ్చిన బోటులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో కనీసం నలుగురు ఉన్నారని, వాళ్లను కోస్ట్ గార్డ్ సిబ్బంది దాదాపు గంటపాటు వెంటాడటంతో.. చివరకు వాళ్లు తమను తాము పేల్చేసుకున్నారని సమాచారం. పాక్ తాలిబన్లు పెషావర్ లోని ఓ పాఠశాలలో 130 మంది పిల్లలను కాల్చి చంపిన తర్వాతే భారత నిఘా సంస్థలు మన దేశం మీద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు పంపాయి. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదుల మాటలను తాము ఇంటర్సెప్ట్ చేశామని, దాంట్లోనే ఉగ్రవాద దాడి విషయం తెలిసిందని నిఘా వర్గాలు చెప్పాయి. 26/11 దాడి వెనక కూడా లష్కర్ హస్తం ఉన్న విషయం తెలిసిందే. ఆనాటి దాడిలో 166 మంది మరణించారు. ఇక ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ఒకరు రావడం ఇదే మొదటిసారి. దాంతో.. ఇలాంటి సందర్భాన్నే తాము వాడుకోవాలని ఉగ్రవాదులు కూడా భావించినట్లు తెలిసింది. -
తెరకెక్కనున్న ఒబామా ప్రేమకథ!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు.. తన భార్య మిషెల్ అంటే ఎనలేని ప్రేమ ఉంది. వీరిద్దరి ప్రేమకథను తెరకెక్కించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచన కొంతమందికి వచ్చింది. అంతే.. వెంటనే అమెరికా తొలి జంట ప్రేమకథను సినిమాగా తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. సౌత్ సైడ్, యూ విల్ అనే రెండు సంస్థలు కలిసి సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసుకుంటున్నాయి. మిషెల్ యుక్తవయసులో ఉన్నప్పటి పాత్రకు టికా సంప్టర్ను ఎంచుకున్నారు. ఒబామా పాత్రకు ఎవరు సరిపోతారా అని ఇంకా వెతుకుతున్నారు. బరాక్ ఒబామాతో కలిసి మిషెల్ తొలిసారిగా చికాగోలోని ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో డూ ద రైట్ థింగ్ అనే ప్రదర్శన చూసిన సంఘటనను ఈ సినిమాలో బాగా హైలైట్ చేస్తారని సమాచారం. తాను స్వయంగా రాసిన స్క్రీన్‌ప్లే ఆధారంగా రిచర్డ్ టేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ట్రేసి బింగ్, స్టెఫానీ అలైన్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. -
మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి: ఒబామా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనను 'చేతల మనిషి'గా అభివర్ణించారు. 64 ఏళ్ల వయసులో కూడా మోదీ చకచకా పరుగులు పెడుతూ అధికారులను కూడా పరుగులు పెట్టించడాన్ని గుర్తించిన 53 ఏళ్ల ఒబామా.. ఆయన్ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. మయన్మార్ రాజధాని నేపిటాలో జరుగుతున్న ఆసియాన్ - తూర్పు ఆసియా దేశాల సదస్సులో కాసేపు మోదీతో ఒబామా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానిని ‘చేతలమనిషి’గా ప్రశంసించినట్టు విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మోదీ- ఒబామా కలవడం గత 45 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబర్‌లో మోదీ అమెరికా వెళ్లినపుడు కూడా ఒబామా, ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. Prez Obama greets PM @narendramodi at Gala dinner - "You are a man of action!" pic.twitter.com/sMDQqBuevg — Syed Akbaruddin (@MEAIndia) November 12, 2014 -
ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. షికాగోలో ఓటు వేయడానికి ఆయన వెళ్లినప్పుడు.. అక్కడో వ్యక్తి ఆయన్ను ఆపాడు. 'మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు' అన్నాడు. దాంతో ఒబామాతో పాటు.. సదరు ప్రేయసి కూడా ఒక్క నిమిషం షాక్ తిన్నారు. తీరా చూస్తే.. అతగాడు సరదాగా అన్నట్లు తర్వాత తీరిగ్గా చెప్పాడు. విషయం ఏమిటంటే, షికాగోలో ఓటువేయడానికి ఒబామా వెళ్లినప్పుడు, ఆయన ఆయా కూపర్ అనే మహిళ తర్వాత నిల్చున్నారు. సరదాగా అధ్యక్షుడితో మాట్లాడాలని కూపర్ ప్రియుడు మైక్ జోన్స్‌కు అనిపించింది. అందుకే ఆ మాట అన్నాడు. అసలు అధ్యక్షుడు తనతో పాటు ఓటు వేయడానికి వచ్చారనగానే తొలుత ఆమె కొంత ఉద్వేగానికి గురైంది. అంతలో ప్రియుడు ఈ మాట అనడంతో షాకయ్యింది. తర్వాత విషయం తెలిసి అంతా రిలాక్సయ్యారు. తనకు మిషెల్‌ను ఒకసారి కలవాలని ఉందని కూపర్ చెప్పింది. తన ప్రియుడు చేసిన పనికి ఆమె ఒబామాకు క్షమాపణ చెప్పింది. అయితే ఒబామా కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకుని, కూపర్‌కు ఓ చిన్నపాటి కౌగిలి, ముద్దు ఇచ్చారు. ఆయన తనను కేవలం బుగ్గమీదే ముద్దు పెట్టుకున్నారని, అందువల్ల మిషెల్ దీని గురించి ఏమీ అనుకోవద్దని ఆమె తెలిపింది. ఇప్పుడు నీ ప్రియుడు నిజంగా అసూయ పడతాడని కూపర్‌తో ఒబామా అన్నారు. (ఇంగ్లీషు కథనం) -
ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!
మీకు క్రెడిట్ కార్డు ఉందా? దాన్ని వాడేందుకు వెళ్తే.. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? మీరేంటి.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తన క్రెడిట్ కార్డుతో ఇబ్బంది పడ్డారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. తీరా అక్కడ ఏదో హోటల్లో క్రెడిట్ కార్డు వాడదామని చూస్తే.. ఆ కార్డు తిరస్కరణకు గురైంది. ఇలా ఎందుకు జరిగిందో ఒబామాకు కాసేపు అర్థం కాలేదు. విషయం ఏమిటంటే.. ఆయన క్రెడిట్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడేశారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరోలో చెప్పారు. క్రెడిట్ కార్డు మోసాల్లాంటి విషయాల గురించి ఆయన వివరించారు. తాను పెద్దగా వాడకపోయినా అప్పుడే లిమిట్ ఎలా అయిపోయిందా అనుకున్నానని, అప్పుడు తనకు ఏదో మోసం జరిగినట్లు అర్థమైందని నవ్వుతూ చెప్పారు. అదృష్టవశాత్తు మిషెల్ కార్డు మాత్రం బాగానే ఉందని ఒబామా తెలిపారు. అమెరికాలో క్రెడిట్ కార్డులకు చిప్ అండ్ పిన్ తరహా రక్షణ కల్పించే ఉత్తర్వులపై ఒబామా సంతకం చేశారు. చివరకు తాను కూడా దీని బారిన పడ్డానని, ఆ విషయం హోటల్లో వెయిట్రెస్‌కు చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చిందని ఆయన అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఒబామా భద్రత డొల్ల!
అమెరికా అధ్యక్షుడికి భద్రత అంటే.. అమ్మో అద్భుతం అనుకుంటాం. కానీ, అదంతా ఉత్త డొల్లేనని తేలిపోయింది. మూడు నేరాల్లో శిక్ష అనుభవించిన ఓ నేరస్థుడు తుపాకితో సహా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు లిఫ్టులోకి ప్రవేశించాడు. అయితే ఈ సంఘటన జిరిగింది ఇప్పుడు కాదు.. సెప్టెంబర్ 6వ తేదీన. ఇలా అధ్యక్షుడితో పాటు లిఫ్టులోకి తుపాకితో వెళ్లిన సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అతడు కేవలం తుపాకితో వెళ్లడమే కాక, లిఫ్టులో తన సెల్‌ఫోన్ కెమెరాతో చుట్టుపక్కల పరిసరాలను కూడా షూట్ చేశాడు. ఇంతకుముందు వైట్‌హౌస్ ఫెన్సింగ్ దూకి ఓ వ్యక్తి లోపలకు ప్రవేశించాడు. ఆ సంఘటన కూడా అక్కడి భద్రతా వైఫల్యాలను వెక్కిరించింది. వాస్తవానికి అధ్యక్షుడి చుట్టూ స్టేట్ ఏజెంట్లు, ఏజెన్సీ అధికారులు మాత్రమే ఆయుధాలతో ఉండటానికి అవకాశం ఉంది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ జూలియా పియర్సన్‌ను వివరణ కోరారు. ఎందుకిలా జరిగిందో చెప్పాలని అడిగారు. -
మీ వీపు దురద పుడితే.. మేం గోకం!
అమెరికా పర్యటనకు వెళ్లి, అక్కడి వాళ్లను పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించి, ప్రభుత్వంతో కూడా విస్తృతస్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సిరియాలో ఐఎస్ మీద దాడుల విషయంలో మాత్రం తన విధానాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేశారు. దాడులకు తాము ఎలాంటి సాయం చేయబోమని, అయితే ఉగ్రవాదం మీద పోరాటానికి మాత్రం తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 90 నిమిషాల పాటు సాగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న సమస్యలపై కూడా మోదీ చర్చించారు. అంతర్జాతీయ అంశాల్లో చాలా సంక్లిష్టత ఉంటుందని, తాము ప్రస్తుతం దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియాలో వస్తున్న ఉగ్రవాద సవాళ్లపై కూడా చర్చించామని ఆయన అన్నారు. ఉగ్రవాద, నేర నెట్వర్కుల స్వర్గధామాలను కూల్చేయడానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయడానికి అమెరికా, భారత్ అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సిరియా మీద దాడుల విషయంలో మాత్రం భారత్ కలగజేసుకోదని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు. -
ఇప్పుడే రండి.. లేకపోతే క్యూ పెరిగిపోతుంది
ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశానికి తిరిగి బయల్దేరారు. తన పర్యటన చాలా సంతృప్తికరంగా సాగిందంటూ, అందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. ''థాంక్యూ అమెరికా. ఈ ఐదు రోజుల్లో నేను చాలా సాధించాను. చాలా సంతృప్తితో నేను ఇండియాకు తిరిగి వెళ్తున్నాను'' అని ఆయన చెప్పారు. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయానికి బయల్దేరే ముందు మోదీ అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ''మీరంతా ఇప్పుడే రండి. లేకపోతే క్యూ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. అమెరికన్ పెట్టుబడిదారులకు, మరే దేశానికైనా కూడా మంచిచేద్దాం'' అని ఆయన అన్నారు. పన్నుల ఉగ్రవాదం ముగిసిపోవాలని, పన్నుల పద్ధతి సులభంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఏమాత్రం ఉపయోగకరంగా లేని పన్నుల వ్యవస్థను తీసేయడానికి తానో కమిటీని కూడా నియమించానన్నారు. ఏ ప్రభుత్వానికైనా మూడు నాలుగు నెలల అనుభవం పెద్దగా చాలదని, కానీ ఆర్థికపరంగా మాత్రం భారతదేశం వెనకబడటానికి ఎలాంటి కారణం తనకు కనిపించడంలేదని విశ్లేషించారు. చివర్లో కూడా ఒకసారి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు వాషింగ్టన్ డీసీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ బయల్దేరారు. -
‘రాక్‌స్టార్’ మోదీ!
-
మోదీ.. ఒబామా కలిసి రాసిన సంపాదకీయం!
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. వీళ్లిద్దరూ కూడా తమ తమ ఎన్నికల ప్రచారాల్లో సోషల్ మీడియాను, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకున్నవాళ్లే. ఇప్పుడు తొలిసారి వాళ్లిద్దరూ కలిసి ఓ సంపాదకీయం రాశారు. అమెరికాలోని ఓ దినపత్రికకు వాళ్లిద్దరూ కలిసి సంయుక్తంగా సంపాదకీయం రాశారని, అది రేపు ప్రచురితం అవుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, అందులో విషయం ఏమిటనే దాని గురించి మాత్రం అటు భారత్, ఇటు అమెరికన్ అధికారులు ఎవరూ ఒక్క మాట కూడా చెప్పడంలేదు. అలాగే ఏ పత్రికకు రాశారో కూడా తెలియజేయడం లేదు. వాళ్లిద్దరూ ముందు డిజిటల్ పద్ధతిలో సంప్రదించుకున్నారని, ఆ తర్వాత ఏం రాయాలో కూడా నిర్ణయించుకుని, పరస్పరం పంపుకొని తుది రూపం ఇచ్చారని అంటున్నారు. భారతదేశానికి చెందిన ఓ నాయకుడు ఇలా అమెరికా అధ్యక్షుడితో కలిసి సంపాదకీయం రాయడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఓ సంపాదకీయం రాశారు. -
ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది: మోదీ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. తాము పలు అంశాల గురించి ఆ సమావేశంలో చర్చించుకున్నామన్నారు. ఈ విషయాలను ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తాను రెండు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించుకున్నామని, ఇరు దేశాలు కలిసి మొత్తం మానవాళికి మేలు జరిగేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని కూడా ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ వెళ్లిన విషయం తెలిసిందే. -
గుక్కెడు నీళ్లు చాలు నాకు!
వైట్‌హౌస్ చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. అమెరికా అధ్యక్షుడు దాదాపు పూర్తి శాకాహార మెనూతో భారీగా డిన్నర్ సిద్ధం చేయించారు. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒకవైపు భారత ప్రధాని, మంత్రులు, సీనియర్ అధికారులు కూర్చుంటే మరోవైపు అమెరికన్ దిగ్గజాలు కొలువు తీరారు. అయితే.. ఈ విందు సమావేశానికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ మాత్రం హాజరు కాలేదు. హాలిబట్ అనే ఒక రకం చేప తప్ప మిగిలినవన్నీ పూర్తి శాకాహార వంటకాలే అక్కడున్నాయి. అవకాడో, మేక చీజ్, బేబీ బెల్ పెప్పర్స్, మైక్రో బేసిల్, ద్రాక్ష గింజల నూనె, రోటీ, బాస్మతి బియ్యంతో వండిన అన్నం.. ఇవన్నీ టేబుల్ మీద కొలువుదీరాయి. కాలిఫోర్నియా నుంచి తెప్పించిన రెడ్ వైన్ కూడా ఉంది. అతిథులు వాటిలో చాలా డిష్‌లను రుచి చూస్తున్నారు. కానీ ప్రధాన అతిథి.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కేవలం కాస్త గోరువెచ్చటి నీళ్లు మధ్యమధ్యలో తాగుతూ గడిపేశారు తప్ప అక్కడ పెట్టినవాటిలో ఏ ఒక్కదాన్నీ ముట్టుకోలేదు. మోదీ శాకాహారి కాబట్టి.. అన్నీ శాకాహార వంటకాలే సిద్ధం చేయిస్తున్నారని తొలుత కథనాలు వచ్చాయి గానీ, ఎలాగోలా ఒక్క చేప మాత్రం మెనూలోకి దూరిపోయింది. మోదీ ప్రత్యేకంగా తయారుచేయించుకున్న నిమ్మరసం కూడా భారతదేశం నుంచి తెచ్చుకున్నారు. కానీ అమెరికా పర్యటనలో చాలావరకు కేవలం గోరువెచ్చటి నీరు మాత్రమే తాగుతున్నారు. దసరా శరన్నవరాత్రులు కావడంతో ఈ తొమ్మిది రోజులూ మోదీ పచ్చి ఉపవాసం ఉంటారు. కేవలం నిమ్మరసం, అందులో రెండు తేనె చుక్కలు, టీ మాత్రమే తీసుకుంటారు. కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉండటంతో బిజీ షెడ్యూలు ఉన్నా కూడా ఆయనలో ఏమాత్రం అలసట కనిపించడం లేదని, డిన్నర్ సమయంలో కొన్ని వందల మందికి షేక్‌హ్యాండ్ ఇస్తున్నా ఆయన చేతి పట్టు మాత్రం అలాగే సడలకుండా ఉందని అహ్మదాబాద్‌కు చెందిన జాఫర్ సరేష్వాలా అనే వ్యాపారవేత్త చెప్పారు. సోమవారం ఉదయం అమెరికాకు చెందిన పెద్దపెద్ద సీఈవోలతో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో కూడా మోదీ కేవలం గోరువెచ్చటి నీళ్లే తాగారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
నవ శకానికి నాంది
కెన్నెడి హత్య తరువాత భారత్ పట్ల అమెరికా వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు మొదలైన భారత్ వ్యతిరేక వైఖరి 1971లో పరాకాష్టకు చేరుకుంది. అప్పుడు జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాక్‌ను అమెరికా బాహాటంగానే సమర్థించింది. ప్రపంచ రాజకీయ దృశ్యం నిశితంగా, క్లిష్టంగా మారిన కాలంలో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఒకప్పుడు వీసా తిరస్కరించిన దేశమే ఇప్పుడు ఎర్ర తివాచీ పరిచి ఆ వ్యక్తికే స్వాగత సత్కారాలు చేయడానికి సిద్ధం కావడం మారిన పరిస్థితులనే సూచిస్తోం ది. కమ్యూనిస్టు వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఆశించి భంగపడిన అమెరికా, ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదం మీద జరిపే పోరులో భారత్ కలసి రావడం వరంగానే భావిస్తోంది. 2009లో బరాక్ ఒబామా అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం అమెరికా చరిత్ర లోనే కొత్త అధ్యాయం. అయితే భారత్‌తో సంబంధాల విషయంలో ఆయన మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారన్న వాదన ఉంది. అంతకుముందు జార్జి బుష్ (జూనియర్) సాధించిన విజయాలను కూడా ఆయన నిలబెట్టలేదన్న విమర్శ వినిపిస్తుంది. వాణిజ్య, వ్యూహాత్మక అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, అంతర్జాతీయ ఉగ్రవాదం మీద రాజీలేని వైఖరిని ప్రదర్శి స్తున్న మోదీ ఇప్పుడు అమెరికా పర్యటనను ప్రారంభిం చడం ఆసక్తికి కారణమవుతోంది. ఓ అచ్చుయంత్రం కొని, చేతులు కాల్చుకున్న అమె రికా హాస్య, వ్యంగ్య రచయిత మార్క్‌ట్వైన్ 1896లో ఆసి యాలో పర్యటించాడు. కొంత నిధి సేకరించి, కష్టాల నుంచి బయటపడడం ఆయన ఉద్దేశం. అప్పుడే భారత దేశం వచ్చి ఇక్కడి వైవిధ్యానికి మురిసిపోయాడు. మన సాంస్కృతిక సంపదనీ, లేమినీ కూడా చూశాడు. దాదాపు 120 సంవత్సరాల తరువాత ఇప్పుడు అమెరికా హఠాత్తుగా భారత్ పట్ల విశేషమైన ఆసక్తిని ప్రదర్శించడం,మైత్రికి తహతహలాడుతున్నట్టు కనిపించడం వెనుక ఇలాంటి కారణమే కనిపిస్తుంది. ఉగ్రవాదం విషయంలో చేతులు కాల్చుకున్న ఆ అగ్రరాజ్యం భారత్ వంటి ఒక ‘విశ్వసనీయ’ మిత్రుడి కోసం అన్వేషిస్తున్న మాట నిజం. 1776 ముందు నాటి అమెరికా స్వాతంత్య్ర పోరాటం నుంచి భారత స్వాతంత్య్రోద్యమం ప్రేరణను కూడా పొందింది. ఆ విధంగా భారత్ మీద అమెరికాకు కొంత సానుభూతి ఉంది. కానీ ఈ సానుకూల దృక్పథం 1947 తరు వాత భారత్-అమెరికా సంబంధాలలో ఒకే రీతిన కొనసాగక పోవడమే పెద్ద వైచిత్రి. మారిన ప్రపంచ రాజకీయ దృశ్యం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధం, కమ్యూనిజం, సోవియెట్ రష్యా పతనం, అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం, అంతర్జాతీయ ఉగ్రవాదం మీద పోరు - ఇవన్నీ మన రెండు దేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆయా కాలాలను బట్టి ఒక్కొక్కసారి కౌగిలింతలకూ, ఒక్కొక్కసారి కత్తులు దూసుకోవడానికి కారణమైనాయి. నేటి ప్రధాని మోదీ తొలి అమెరికా అధికారిక పర్యటన ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతోంది. అయితే మన ప్రథమ ప్రధాని నెహ్రూ అక్టోబర్ 11, 1949 నుంచి నవం బర్ 7, 1949 వరకు పర్యటించారు. సహజంగా సామ్య వాద ప్రియుడైన నెహ్రూ సోవియెట్ రష్యా వైపు మొగ్గుతూ ఉండేవారు. అలీన విధానంతో అటు రష్యాకూ, ఇటు తమకూ అందకుండా ఉనికిని నిలుపుకుంటున్నందుకు భారత్ మీద అమెరికా ఒకింత అలకతో ఉండేది. కాశ్మీర్ సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికాకు అవకాశం ఇవ్వరాదని 1948 నుంచి భారత్ విధానం నిర్ణయం చేసుకుంది. కానీ 1962 నాటి చైనా దురాక్రమణ విషయంలో భారత్ వాదనను సంపూర్ణంగా సమర్థించిన దేశం అమెరికాయే. కొంత ఆయుధ సంపత్తిని కూడా అమెరికా భారత్‌కు సరఫరా చేసింది. మరో యుద్ధమే జరిగితే చైనాపై అణ్వాయుధం ప్రయోగించాలని అమెరికా భావించిన విషయం తరువాత బయటపడింది. నిజానికి చైనా రిపబ్లిక్‌ను గుర్తించవద్దంటూ అమెరికా చేసిన సూచనను భారత్ ఆదిలో నిరాకరించింది. కానీ 1963లో జాన్ ఎఫ్ కెన్నెడి హత్య తరువాత భారత్ పట్ల అమెరికా వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు మొద లైన భారత్ వ్యతిరేక వైఖరి 1971లో పరాకాష్టకు చేరు కుంది. అప్పుడు జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాక్‌ను అమెరికా బాహాటంగానే సమర్థించింది. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్థాన్‌కు ఆయుధాలను సమకూర్చాడు. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పోఖ్రాన్-1 అణుపరీక్ష జరపడంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బల హీనపడ్డాయి. భారత్ తన అలీన విధానం నుంచి కొంచెం పక్కకు జరిగి సోవియెట్ రష్యాతో స్నేహ, సహకార ఒప్పం దం మీద సంతకాలు చేసింది కూడా అప్పుడే. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభు త్వం వచ్చే వరకు మన రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. జనతా ప్రభుత్వం సోవియెట్ రష్యా వ్యతిరేఖ వైఖరిని అవలంబించినట్టు విశ్లేషకులు చెబుతారు. జనతా హయాంలోనే అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారత్‌లో పర్యటించారు. అయినప్పటికీ ఇండియాకు అణు పదార్థాల ఎగుమతి మీద ఉన్న నిషేధాన్ని అమెరికా తొలగించలేదు. మళ్లీ 1980లో అధికారంలోకి వచ్చిన ఇందిర రష్యాను వ్యతిరేకించక తప్పని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో రష్యా జోక్యాన్ని ఇందిర నిరసించి, పరోక్షంగా అమెరికాకు సన్నిహితమయ్యారు. అయితే భోపాల్ విషవాయువు కేసులో ప్రధాన నిందితుడు ఆండర్సన్‌ను అప్పగించే విషయంలో రెండు దేశాలకు మధ్య సంబంధాలలో మరోసారి ఒడిదుడుకులు వచ్చాయి. సోవియెట్ రష్యా పతనం తరువాత ప్రపంచ రాజ కీయ దృశ్యం సంపూర్ణంగా మారింది. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహించే అవకాశం మొదటిసారి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి పీవీ నరసింహారావుకు దక్కింది. డాక్టర్ మన్మోహన్ సహ కారంతో పీవీ ఆర్థిక సంస్కరణలను తెచ్చారు. సరళీకరణ విధానాలతో భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తం అమెరికాతో ఆర్థిక సంబంధాలను నెరపవలసి వచ్చింది. 1998, మేలో ఎన్డీయే ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పోఖ్రాన్ -2 అణుపరీక్ష జరపడంతో చరిత్రలో ఎన్నడూ లేని అథమ స్థాయికి అమెరికా-భారత్ సంబం ధాలు చేరుకున్నాయి. పోఖ్రాన్-2కు జవాబు అన్నట్టు పాకిస్థాన్ అదే నెలలో అణు పరీక్ష జరిపింది. ఉపఖండానికి అణు బెడదను ఊహించి అమెరికా, జపాన్ సహా పలు దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో అమెరికా రాయబారిని వెనక్కి పిలిపించారు. అమెరికా ఆంక్షలు భారత్‌ను ఏమీ చేయలేకపోవడం, మారిన పరిస్థితులను బట్టి క్లింటన్ 2000 సంవత్సరంలో భారత్‌లో పర్యటించి, సం బంధా లకు మళ్లీ ఊపిరి పోశారు. చిత్రం ఏమిటంటే, 1962 యుద్ధంలో చైనాను అభిశంసించినట్టే, ఈ మధ్యలో జరిగిన కార్గిల్ ఘర్షణలో ఇండియా శత్రుదేశమైన పాకిస్థాన్‌ను అమెరికా తప్పుపట్టింది. అధీన రేఖ వెంబడి ఉన్న పాక్ సేన లను ఉపసంహరించాలని ఆ దేశం మీద ఒత్తిడి తెచ్చింది. సెప్టెంబర్ 11, 2001నాటి డబ్ల్యూటీసీపై దాడులు, భారత పార్లమెంటు మీద దాడి ఘటనలతో ఇరు దేశాలు మరింత సన్నిహితమైనాయి. మన్మోహన్ సింగ్ హయాంలో ఇవి జరిగాయి.అంతర్జాతీయ ఉగ్రవాదం మీద తాము ఆరంభించిన పోరులో భారత్‌ను ఒక విశ్వసనీయ మిత్రు నిగా భావిస్తున్నట్టు జార్జిబుష్ ప్రకటించారు. 2005లోనే రక్షణ ఒప్పందాలను చేసుకున్నాయి. ఆ సంవత్సరంలోనే ఇరు దేశాలు పౌర అణు సహాయ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. దీనితో అణు సంబంధ ఎగుమతులకు సంబంధిం చి భారత్ మీద ఉన్న అన్ని నిషేధాలు తొలగిపోయాయి. ఒబామా తన పదవీ స్వీకారం సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్సింగ్ను తొలి అంతర్జాతీయ అతిథిగా విందుకు ఆహ్వానించారు కూడా. అయినా ఆ ఆతిథ్యం ఫలి తాలను ఇవ్వలేకపోయింది. తన హయాంలో పటిష్టమైన బంధం, తన కళ్ల ఎదుటే నీరుగారుతున్న దృశ్యాన్ని మన్మో హన్ చూడవలసి వచ్చింది. హెచ్ 1బీ వీసాల వివాదం, దేవయాని ఖోబ్రాగడే అరెస్టు వంటివి ద్వైపాక్షిక సంబం ధాల మీద గట్టి ప్రభావాన్నే చూపించాయి. 21వ శతాబ్దం లో భారత్ ఒక ఆర్థికశక్తిగా ఆవిర్భవించబోతున్నది. ఆసి యాలో ఇదే స్థాయి ఆర్థిక శక్తి చైనా. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను మోదీ తన గ్రామానికి తీసుకువెళ్లడం ద్వారా తన మనోగ తాన్ని మోదీ వ్యక్తీకరించారు. ఇదే అమెరికాను తొందరపెట్టి ఉండవచ్చు. ఏమైనా, ప్రస్తుతం మోదీ యాత్ర పట్ల అమెరికా చూపుతున్న ఆసక్తి ఇక్కట్లతో బల హీనపడుతున్న ఒక పెద్ద రాజ్యం, బలపడుతున్న ఒక ఆర్థిక శక్తితో వ్యవహరించవలసిన తీరునే తలపిస్తున్నది. -డాక్టర్ గోపరాజు నారాయణరావు -
గర్భిణికి తన కాన్వాయ్ ఇస్తానన్న ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా ఇప్పుడు నిండు గర్భిణి. ఆమె న్యూయార్క్ వెళ్లి అక్కడ బిడ్డను కనాలి. అందుకోసం అవసరమైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లడానికి తన కాన్వాయ్ ఇస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫర్ చేశారు. సిరియాలో యుద్ధం మొదలైన తర్వాత కూడా ఏమాత్రం టెన్షన్ పడకుండా.. చాలా సరదాగా గడిపారాయన. బిల్ క్లింటన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయనీ ఆఫర్ చేశారు. న్యూయార్క్ నగరంలో వాహనాల్లో వెళ్లాలంటే చాలా కష్టం. అక్కడ ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. ఇదే విషయాన్ని తాను క్లింటన్‌తో చర్చించానని, అప్పుడే విషయం వచ్చిందని ఒబామా అన్నారు. తన కాన్వాయ్ ఉపయోగిస్తే ఆమె సులభంగా వెళ్లగలదని చెప్పానన్నారు. న్యూయార్క్ ట్రాఫిక్ గురించి అందరూ చెప్పడమే తప్ప తాను ఎప్పుడూ పెద్దగా గమనించలేదని కూడా ఆయన అన్నారు. తాను బహుశా అక్టోబర్ ఒకటోతేదీ నాటికల్లా తాతను అవుతానని బిల్ క్లింటన్ చెబుతున్నారు.