four killed
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం
బిర్మింగ్హమ్: అమెరికాలోని అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా, 18 మంది గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నగరంలో రెస్టారెంట్లు, బార్లకు నిలయమైన ఫైవ్ పాయింట్స్ సౌత్ ఎంటర్టెయిన్మెంట్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ ప్రాంతంలో గుమికూడిన జనం పైకి కొందరు విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు గుర్తించామన్నారు. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
లిఫ్టు కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలస కార్మికులు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
కెనోషా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్లో తాజా ఘటన చోటుచేసుకుంది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణిం చగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని కౌంటీ షెరిఫ్ డేవిడ్ బెత్ వెల్లడించారు. ఘటనకు ముందుగా నిందితుడు బార్లోనే ఉన్నాడని, అయితే అతన్ని బయటకు పంపడంతో తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామన్నారు. ఎవరిని చంపాలో నిందితుడు ముందుగానే నిర్ణయించు కొని వచ్చినట్లు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు చెప్పారు. దాడి చేసేందుకు ఒక హ్యాండ్‌గన్‌ను ఉపయోగించారని తెలిపారు. నిందితున్ని పట్టుకోవడానికి స్థానికులు సాయం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారులను మూసేసి తనిఖీలు చేపట్టారు. ఒమహాలోనూ కాల్పులు.. ఒమహాలోని ఓ మాల్లోనూ ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటనానంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను సేకరించిన అనంతరం తిరిగి మాల్‌లోకి సందర్శకులను అనుమతించారు. నిందితుడు స్పష్టమైన లక్ష్యంతోనే వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ కాలికి సైతం గాయమైంది. -
బంగ్లా బంద్ హింసాత్మకం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ సంస్థ హెఫాజత్–ఇ–ఇస్లామ్ పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. భారత ప్రధాని మోదీ పర్యటనపై హెఫాజత్–ఇ–ఇస్లామ్ తదితర సంస్థలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు మృతి చెందటాన్ని నిరసిస్తూ ఈ బంద్ జరిగింది. నారాయణ్‌గంజ్ జిల్లా సనర్‌పారాలో పోలీసు కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. నిరసనకారులు రాజధాని ఢాకాతో తీరప్రాంత నగరం చిట్టగాంగ్‌తో కలిపే ప్రధాన రహదారిని దిగ్బంధించారు. పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. బ్రహ్మణ్‌బారియా జిల్లాలో ఆందోళనకారులు రైలుపై దాడికి దిగారు. ఇంజిన్ రూం సహా అన్ని బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పది మంది వరకు గాయాలపాలయ్యారు.ఇదే జిల్లా సరైల్‌లో భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అల్లర్ల అనంతరం ఈ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బంద్ కారణంగా రాజధాని ఢాకాలో వీధులు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ నేరుగా మద్దతు ప్రకటించలేదు. కాగా, హెఫాజత్–ఇ–ఇస్లామ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా మత విద్యాసంస్థలు నడుపుతోంది. -
ప్రధాని మోదీకి నిరసన సెగ: నలుగురి మృతి
ఢాకా: స్వాతంత్ర్యం సిద్ధించి 50 వసంతాలు కావడంతో బంగ్లాదేశ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం బంగ్లాదేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్‌లో నిరసన సెగ తగిలింది. నరేంద్ర మోదీ పర్యటనకు నిరసనగా కొందరు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు వినియోగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. చిట్టగ్యాంగ్‌లో శుక్రవారం నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన హింసాత్మకంగా మారింది. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. దీంతో పోలీసులు విధిలేక బాష్ప వాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రబ్బర్ బుల్లెట్ల ధాటికి నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢాకాలో పర్యటించగా అక్కడ కూడా కొందరు నిరసన చేపట్టడం గమనార్హం. ఓ మతానికి చెందిన వారు ఈ ఆందోళనలు చేపట్టారు. దీనికి కారణం తెలియాల్సి ఉంది. చదవండి: నా టీనేజ్‌లో బంగ్లాదేశ్ కోసం కొట్లాడాను చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
నలుగురు లష్కరే ముష్కరులు హతం
శ్రీనగర్: సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయని, మిలిటెంట్లను గుర్తించిన అనంతరం లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపగా నలుగురు తీవ్రవాదులు మరణించారని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వీరంతా తమను తాము లష్కరే ముస్తఫా వర్గంగా చెప్పుకుంటారని, కానీ పోలీసు రికార్డుల్లో వీరు లష్కరేతోయిబా తీవ్రవాదులనే ఉందని చెప్పారు. ఎన్కౌంటర్ స్థలంలో మూడు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారన్నారు. మృతులను రాయిస్ అహ్మద్ భట్, అమిర్ షఫి మిర్, రఖిబ్ అహ్మద్ మాలిక్, అఫ్తాబ్ అహ్మద్ వనిగా గుర్తించారు. సంఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడగా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ంతవరకు 9 ఎన్కౌంటర్లు జరిగాయని, వీటిలో 19మంది తీవ్రవాదులు హతమయ్యారని ఐజీ వివరించారు. తిరిగి వచ్చేయండి ఈ సంవత్సరం 18 మంది యువకులు మిలిటెంట్లలో చేరారని, వీరిలో 5గురు ఎన్‌కౌంటరయ్యారని, ముగ్గురు అరెస్టయ్యారని, మిగిలిన వారు లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇలా ఏడుగురు యువకులు మిలిటెంట్లనుంచి తిరిగి వచ్చారన్నారు. సెక్యూరిటీ దళాలపై లోయలో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందన్నారు. స్థానిక యువతను తీవ్రవాదంవైపు మరల్చేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని, సోషల్‌మీడియా ద్వారా రెచ్చగొడుతోందని విమర్శించారు. దీనికితోడు పాక్ డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తోందని, ఇలా డ్రగ్స్‌కు బానిసైనవారు తమను సంప్రదిస్తే డీఅడిక్షన్ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. యువతకు సాయం చేసేందుకు పోలీసులు సదా సిద్ధమన్నారు. లోయలో శాంతిస్థాపన తమ ధ్యేయమన్నారు. దళాలపై రాళ్లురువ్వే సంఘటనలు చాలా తగ్గిపోయాయని, గతంలోలాగా కాకుండా మిలిటెంట్లకు భయపడకుండా ప్రజా జీవనం కొనసాగుతోందని చెప్పారు. నిజానికి మిలిటెన్సీ కన్నా రాళ్లు రువ్వే ఘటనలు చాలా తీవ్రమైనవని, సామాజికంగా సీరియస్ సమస్యని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పలువురిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. -
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
సాకక్షి, అనంతపురం : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నంబులపూలకుంట సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి సోలార్ పవర్ ప్రాజెక్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో కత్తిపోట్లు..
లాస్ఏంజెలిస్: దోచుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోయిన ఓ వ్యక్తి యథేచ్ఛగా కత్తిపోట్లకు పాల్పడటంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మాన్‌గ్రోవ్ సిటీలో జరిగింది. సిటీకి చెందిన ఓ వ్యక్తి(33) మొదటగా తన అపార్టుమెంట్‌లోని ఓ దుకాణదారును కత్తి చూపి బెదిరించి, దోచుకున్నాడు. ఆపైన ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నాడు. ఈ ఘటనలో ఆ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కత్తి, తుపాకీ చూపి బెదిరిస్తూ సుమారు ఆరు దుకాణాల్లో నగదు దోచుకున్నాడు. మొత్తం ఆరుగురిని గాయపరచగా నలుగురు మృతి చెందారు. రెండు గంటలపాటు చెలరేగి పోయిన అతడిని పక్కనే ఉన్న సాంటాఅనా సిటీలో పోలీసు డిటెక్టివ్లు పట్టుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు రూరల్ మండలానికి చెందిన మోహన్ నాయుడు కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలో ధర్మస్థల స్వామివారి దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బెంగళూరు జాతీయ రహదారిపై అదుపు తప్పి మరో లారీని ఢీకొంది. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో మోహన్ నాయుడుతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఆయన తండ్రి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔటర్‌పై అంబులెన్స్‌ను ఢీకొన్న కారు
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ముగ్గురితోపాటు అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. అంబులెన్స్‌లోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వరరావు(60) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందాడు. చికిత్స పూర్తికావడంతో తన భార్య సుబ్బలక్ష్మి(55), సోదరుడు రామారావు(70), కుమారుడు హేమచందర్‌రావు, అల్లుడు శ్రీనివాసరావుతో కలసి ప్రైవేటు అంబులెన్స్‌లో ఈ నెల 10న రాత్రి హైదరాబాద్ మీదుగా బళ్లారికి బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట నుంచి ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్‌కు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు తుక్కుగూడ రావిర్యాల సమీపంలోని ఔటర్ ఎగ్జిట్ 13 వద్దకు వచ్చారు. ఆ సమయంలో శంషాబాద్ నుంచి బొంగుళూరు గేటుకు వస్తున్న హస్తినాపురానికి చెందిన మనోజ్‌తోపాటు ఆరుగురితో ఉన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటుకుని అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, అంబులెన్స్ డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతిచెందారు. హేమచందర్‌రావు, శ్రీనివాసరావు, రామారావు, అంబులెన్స్ మరో డ్రైవర్ మోహిద్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు కాగా.. అంబులెన్స్ డ్రైవర్ శివది ఆంధ్రప్రదేశ్. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ఆదిభట్ల పోలీసులు వచ్చి క్షత్రగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన రామారావును వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిభట్ల సీఐ నరేందర్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో నలుగురు యువకులు మృతి
శామీర్‌పేట్/తొర్రూరు రూరల్ (పాలకుర్తి): తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనుకున్న నలుగురు యువకుల లక్ష్యం నెరవేరకుండానే జీవితాన్ని చాలించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మెదక్ జిల్లాకు వలస వచ్చి తాము లీజుకు తీసుకున్న ఫౌల్ట్రీ ఫామ్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. స్వయం ఉపాధి ద్వారా నలుగురుకీ ఊరి లో ఆదర్శంగా నిలుస్తారనుకున్న ఆ యువకుల అకాల మరణం గ్రామస్తుల్ని విషాదంలో నింపింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మరాశిపేట శివారు కేజీఎల్ పౌల్ట్రీఫామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, వెంకటాపూర్‌కు చెందిన గాదగాని వెంకన్న, అరుణ దంపతుల రెండో కుమారుడు అరవింద్‌గౌడ్(23), మొగుళ్ల వెంకన్న, సోమనర్సమ్మ దంపతుల కుమారుడు శివశంకర్‌గౌడ్(21)లు శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో నెల క్రితం సుధాకర్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌ను లీజుకు తీసుకుని కోళ్ల పెంపకం చేపట్టారు. వీరికి తోడుగా ఉండేందుకు వారి స్వగ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను, సుభద్ర దంపతుల కుమారుడు మహేశ్ ముదిరాజ్(22)ను వారం రోజుల క్రితం తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. కాగా, ఈ ముగ్గురినీ కలిసేందుకు వీరి స్నేహితుడు పోరెడ్డి మహేందర్‌రెడ్డి(25) వెంకటాపురం నుంచి గురువారం బొమ్మరాశిపేటకు వచ్చాడు. రాత్రి సుమారు 1 గంట వరకు వీరంతా కోడిపిల్లలకు వాక్సిన్ వేశారు. అనంతరం భోజనం చేసి పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు. ఉదయం 11 గంటలకు కేజీఎల్(అభ్యుదయ) కంపెనీ సూపర్వైజర్ సతీశ్ కోడిపిల్లల పరిశీలనకు పౌల్ట్రీఫామ్ దగ్గరకు వచ్చాడు. కోడిపిల్లలకు నీరు కూడా పెట్టలేదని గమనించిన సతీశ్ యువకులు నిద్రించిన గది వద్దకు వెళ్ళి వారిని పిలవగా ఎవరూ స్పందించలేదు. దీంతో సతీశ్ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లగా నలుగురు యువకులు మృతిచెందినట్టు కన్పించారు. వెంటనే పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డిలు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటే వీరి మృతికి కారణమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. నివేదిక అనంతరమే.. ఈ యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గుల కుంపటి వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని కొందరు, కోడి పిల్లలకిచ్చే వ్యాక్సిన్ ద్రావణం ఆహారంలో కలవడం వల్లేనని, వీరంటే గిట్టని వారెవరో ఆహారంలో విషం కలిపి ఉంటారన్న మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీరి మృతికి విషాహారమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. -
కెనడాలో కాల్పులు.. నలుగురు మృతి
ఒట్టావా: కెనడా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి న్యూబ్రున్స్విక్ ప్రావిన్సులోని ఫ్రెడెరిక్టన్ సిటీలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు శుక్రవారం ఉదయం 7 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) బ్రూక్సైడ్ డ్రైవ్‌లో తన అపార్ట్మెంట్ కిటికీ నుంచి కోర్టు ప్రాంగణంపైకి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా దుండగుడు దాక్కున్న అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. బ్రూక్సైడ్ ప్రాంతంలోని ప్రజలెవరూ బయటకు రావొద్దనీ, ఆపరేషన్ కొనసాగుతోందని ట్విట్టర్లో హెచ్చరించారు. గంట తర్వాత ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కావేరిలో మునిగి నలుగురు మృతి
సేలం: కావేరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు నీట మునిగి మృతి చెందగా ఒక బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మెట్టూరు సమీపంలోని కోల్నాయకన్ పట్టి గ్రామానికి చెందిన వాణిశ్రీ (19), ధనుశ్రీ (16)తోపాటు తిరుప్పూర్ జిల్లా విజయమంగళంనకు చెందిన శరవణన్ (35), ఆయన భార్య మైథిలి (32), కుమారుడు హరిహరన్ (9), రవినా (15) కావేరి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. స్థానికులు ధనుశ్రీని మాత్రమే కాపాడగలిగారు. గజ ఈతగాళ్ల సాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. హరిహరన్ కోసం ఆదివారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. -
ప్రచారాన్ని హడలెత్తిస్తున్న ఉగ్రదాడులు
దేరా ఇస్మాయిల్ ఖాన్/పాకిస్తాన్: ఓవైపు ఎన్నికల్లో ఉగ్రనేతలు పోటీకి దిగడంతో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోవైపు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో బాంబు దాడులు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తానీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) తరపున ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇక్రాముల్లా ఖాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఖాన్ వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్త్వా ప్రావిన్సులో గల దేరా ఇస్మాయిల్ ఖాన్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు.ఈ దాడిలో ఇక్రాముల్లాతో జీపు డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీస్ అధికారి పలీస్ జరూర్ అఫ్రీదీ తెలిపారు. ఖైబర్ పంక్త్వాలో అతిపెద్ద బాంబు దాడి ఇదిలా ఉండగా పది రోజుల క్రితం కూడా ఖైబర్ పంక్త్వా ప్రావిన్స్‌లో బాంబుల వర్షం కురిసింది. ఎన్నికల ప్రచార ర్యాలీపై విరుచుకుపడిన ఉగ్రవాదులు 149 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ ఎన్నికల ప్రక్రియకు సవాల్ విరిసింది. ఈ నెల 25న పాకిస్తాన్‌లోఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజయింది. ఇండోర్-భూపాల్ హైవేపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో కుటుంబం దుర్మరణం
సాక్షి,పెద్దపల్లి/సుల్తానాబాద్: రోడ్డు ప్రమాదం నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి 1.30 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారు నడుపుతున్న చదువాల అరుణ్‌కుమార్ (37) భార్య సౌమ్య (30), కుమారుడు అఖిలేశ్ (9), కూతురు శాన్వీ(5) దుర్మరణం చెందారు. కారు ప్రమాదానికి గురికాగానే, సమీపంలోని రైస్‌మిల్లు సిబ్బంది, గ్రామస్థులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుజ్జునుజ్జు కావడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. అప్పటికే అరుణ్‌కుమార్, భార్య, కూతురు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న బాలుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. అరుణ్ మంథనిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గురువారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో తన సోదరు డు సాయికుమార్ బావమరిది ఓం ప్రకాశ్‌ను పాలిటెక్నిక్ కళాశాలలో చేర్చి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లాలని రాత్రే బయలుదేరినట్లు బంధువులు చెప్పారు. ఈ క్రమంలో కాట్నపల్లి వద్ద వీరి కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు 4 గంటలు శ్రమి ంచారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ ట్యాం క్ రోడ్‌కు చెందిన అరుణ్ కుటుంబం 6 ఏళ్ల క్రితం మంథనిలో స్థిరపడింది. -
ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తర్‌పూర్‌లో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రాజేశ్ భారతీ సహా నలుగురు నేరస్తుల్ని కాల్చిచంపారు. గాయపడ్డ మరో నేరస్తుడిని ఆస్పత్రిలో చేర్చారు. ఛత్తర్పూర్ దగ్గర్లోని చందన్‌హోలా గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో రాజేశ్ గ్యాంగ్ భేటీకానుందని పక్కా సమాచారం అందిందని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని గ్యాంగ్ సభ్యుల్ని హెచ్చరించారు. అయినా, నేరస్తులు పోలీసులపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో రాజేశ్, విద్రోహ్, ఉమేశ్, భీకూ, కపిల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా రాజేశ్‌తో పాటు మరో ముగ్గురు నేరస్తులు మార్గమధ్యంలో చనిపోయారు. రాజేశ్ గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో హెడ్‌కానిస్టేబుల్ గిర్ధర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలం నుంచి రెండు .30 బోర్ తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో హతమైన రాజేశ్, విద్రోహ్‌లపై రూ.లక్ష, ఉమేశ్‌పై రూ.50 వేల రివార్డు ఉంది. ఈ నేరస్తులపై హత్య, బెదిరింపులు, కార్ల హైజాకింగ్, దోపిడీ వంటి 25 కేసులు ఉన్నాయి. -
అతివేగం.. ప్రాణాలు తీసింది..
హైదరాబాద్: అతివేగం ఐదు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఐదుగురు స్నేహితులు విహార యాత్రకు వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతిచెందగా.. మరో యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరంతా 19 ఏళ్ల లోపు వారే.. అందివచ్చిన కొడుకులు చేదోడు వాదోడుగా నిలుస్తారన్న ఆ తల్లిదండ్రుల కలలు రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరైపోయాయి. కారు అద్దెకు తీసుకుని.. పోలీసుల కథనం ప్రకారం.. కృషికాలనీకి చెందిన భీంసేన్ తిరుపతమ్మల మూడో కుమారుడు రామారావు(18) పదో తరగతితో చదువు మానేసి క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు కుమారుడు ఉదయ్‌కిరణ్(19) అమలాపురంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పాండుబస్తీకి చెందిన పోలనాయుడు, సరస్వతిల కుమారుడు హేమసుందర్(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కృషికాలనీకే చెందిన నారాయణ, నిర్మల కుమారుడు కిరణ్(18) జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సాయిబాబా, వాణిల కుమారుడు గణేష్(19). వీరు ఐదుగురు ప్రాణ స్నేహితులు. శుక్రవారం వికారాబాద్‌లోని అనంతగిరి వెళ్లేందుకు వీరంతా ప్లాన్ వేసుకున్నారు. వీరికి కారు లేకపోవడంతో గచ్చిబౌలిలోని జూమ్‌క్యాబ్స్ నుండి హ్యుండయ్ ఐ20(టీఎస్07యూఎఫ్5592) కారును మూడు రోజులకు బుక్ చేసుకున్నారు. గాల్లోకి ఎగిరి.. పల్టీలు కొట్టి.. శుక్రవారం తెల్లవారుజామున 2:40 గంటలకు వికారాబాద్ వెళ్లేందుకు సాయిబాబానగర్ నుండి బాలానగర్ వైపు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జీడిమెట్ల డిపో సమీపంలోని డీపీ కాలనీ వద్ద గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. దాదాపు ఐదు మీటర్ల ఎత్తున గాల్లోకి ఎగిరిన కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టి 100 మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న రామారావు, పక్కసీట్లో కూర్చున్న ఉదయ్‌కిరణ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన హేమసుందర్, గణేష్, కిరణ్‌లను స్థానికులు 108లో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. హేమసుందర్, గణేష్ చికిత్స పొందుతూ కన్నుమూయగా.. కిరణ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కారు వెనక సీట్లో కూర్చున్న కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు యువకులు మృతిచెందడంతో సాయిబాబానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. హేమసుందర్ తండ్రి పోలనాయుడు మృతిచెందడంతో తల్లి సరస్వతి కుమారుడిని చదివిస్తోంది. చదువు పూర్తి చేసుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చిన తీరు కంటతడి పెట్టించింది. -
ఆ తల్లీ బిడ్డలది హత్యే..
భువనేశ్వర్ : డబ్బు కోసం కన్న కూతుర్ని, ఆమె పిల్లల్ని హతమార్చాడో కిరాతకుడు. ఈ విషాద సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన జగత్సింగ్పూర్ జిల్లా కుజంగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామం మహానది తీరంలో తల్లీబిడ్డల శవాలు తేలిన సంఘటన రాష్ట్ర ప్రజల హృదయాల్ని కలిచివేసింది. భర్త అకాల మరణంతో చేతికి ముట్టిన మృత్యుపరిహారం నగదు కోసం కన్న కూతురితో పాటు ఆమె బిడ్డల్ని సైతం హతమార్చిన కసాయి కన్నతండ్రి ఈ సంఘటనలో నిందితుడు. జగన్నాథ్‌పూర్ గ్రామస్తుడు అక్షయ శెట్టి కన్న కూతురితో పాటు ఆమె బిడ్డల్ని హతమార్చిన హంతకుడని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో కన్నతల్లితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుని మృతదేహాలు మహానదిలో కనిపించాయి. వీరిని దివంగత విశ్వంబర శెట్టి కుటుంబీకులుగా గుర్తించారు. విశ్వంబర్ శెట్టి గత నెల 4వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన మృతికి పరిహారంగా రూ.3లక్షలు అందింది. ఈ సొమ్ము మీద మృతుని మామ కన్నువేసి కాజేసేందుకు వ్యూహం పన్నాడు. వ్యూహం మేరకు తొలుత మనుమడు, మనుమరాళ్ల అడ్డు తొలగించాడు. బిడ్డల కోసం ఆరాటపడి తండ్రి చెంతకు చేరిన కన్నకూతుర్ని చివరగా నీటిలో తోసి ఖతం చేశాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితుడు అక్షయ శెట్టి మనుమడు మున్నా, ఇద్దరు మనుమరాళ్లు బొర్షా, దిశాలకు బిస్కెట్లు ఇచ్చి మురిపించి మహానది ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ పిల్లల్ని అకస్మాత్తుగా నదిలోకి నెట్టేసి చల్లగా జారుకున్నాడు. ముగ్గురు బిడ్డలు ఒక్కసారిగా కనుమరుగు కావడంతో తల్లడిల్లిన తల్లి మమినా శెట్టి కన్నతండ్రి చెంతకు చేరి బిడ్డల కోసం ఆరా తీసింది. తల్లడిల్లుతున్న కన్న తల్లి ఆవేదనను ఆసరాగా తీసుకున్న అక్షయ శెట్టి కన్నకూతురన్న మమకారం కూడా లేకుండా బిడ్డల కోసం గాలించే నెపంతో ఆమెను కూడా మహానది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. పసి బిడ్డల తరహాలో ఆమెను కూడా నదిలోకి అకస్మాత్తుగా నెట్టేశాడు. తెల్లారేసరికి కన్నతల్లితో పాటు ముగ్గురు బిడ్డల మృతదేహాలు నదిలో తేలాయి. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు ఒడిశా విపత్తు స్పందన దళం(ఒడ్రాఫ్), అగ్నిమాపక దళం, స్థానిక పోలీసుల సహకారంతో నదిలో తేలిన శవాల్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అనుబంధ పరీక్షల్ని నిర్వహించారు. తరువాత సంఘటనపై కేసు నమోదు చేసి, నిర్వహించిన దర్యాప్తులో కథ వెనుక ఖల్నాయక్ మమినా శెట్టి కన్న తండ్రి అక్షయ శెట్టిగా దర్యాప్తు బృందం ఖరారు చేసిందని జగత్సింగ్పూర్ జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంగళవారం ప్రకటించారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు నలుగురు మృతి
-
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సత్తెనపల్లిలోని వావిలాలనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరో తరగతి విద్యార్థి రాళ్లబండి విశ్వం మృతిచెందాడు. వినుకొండ మండలం గోకనకొండలో జరిగిన ప్రమాదంలో వీరాంజనేయులు మృత్యువాత పడ్డాడు. పొగమంచు కారణంగా ఆగివున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఉద్యోగి విఘ్నేశ్వర్ దుర్మరణం చెందాడు. నకరికల్లులో బంధువుల ఇంటి వెళ్లి వస్తూ యువకుడు మృతిచెందాడు. సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాలనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. 30 వ వార్డు వావిలాలనగర్కు చెందిన రాళ్లబండి విశ్వం (12) ఆరో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంబేడ్కర్ నగర్ 2వ లైను నుంచి సైకిల్‌పై ఎడమవైపు ప్రయాణిస్తూ వావిలాలనగర్లోని ఇంటి వద్దకు వస్తున్నాడు. అదే సమయంలో సత్తెనపల్లినుంచి పాకాలపాడువెళ్తున్న యనబర్ల యాకోబు ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో విశ్వంకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ రూ.లక్ష ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తిరిగి జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ విశ్వం బుధవారం మృతిచెందాడు. మృతుని తల్లిదండ్రులు రాళ్లబండి వీరబ్రహ్మం, సుజాత వడ్రంగి పని చేస్తు జీవనం వెళ్లదీస్తారు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పండుగ పూట బిడ్డ మృత్యువాతను తట్టుకోలేక కుటుంబ సభ్యులు గుండెలుబాదుకుంటూ రోదిస్తున్నారు. వారి రోదన చూపరులను సైతం కంటతడి పెట్టించింది. విశ్వం మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని 30వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఆకుల స్వరూపా హనుమంతరావు సందర్శించి నివాళులర్పించారు. గోకనకొండ యువకుడు మృతి వినుకొండ రూరల్,దాచేపల్లి: సంక్రాంతి సెలవులు ముగించుకొని ఉద్యోగానికి వెళ్లూ రోడ్డు ప్రమాదంలో గోకనకొండ గ్రామానికి చెందిన వేల్పుల వీరాంజనేయులు (28) మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు భార్య హైమావతికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడైన వీరాంజనేయులు కొంతకాలంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతిని పురస్కరించుకొని సెలవులపై ఈనెల 13న ఇంటికి చేరుకున్నారు. సెలవులు ముగించుకొని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలు దేరాడు. దాచేపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈసంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అలుముకున్నాయి. కలగా మిగిలిన జీవితం జీవితంలో స్థిరపడి, వివాహం చేసుకుని తనకాళ్లపై తాను స్థిరపడి తల్లి దండ్రులను పోషించాలని కలలు కన్నాడు. ముందుగా తమ్ముడికి విహహిం జరిపించాడు. తల్లి దండ్రులను సుఖపెట్టాలనే కోరిక తీరక ముందే ప్రమాదంలో ఆయన మృతి చెందడంపై గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ... నకరికల్లు : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన నకరికల్లు మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి జరిగింది. క్రోసూరుకు చెందిన గుత్తి గంగయ్య(40), క్రాంతికుమార్, ఝాన్సీలు రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో అడ్డరోడ్డు సమీపంలోని గోడౌన్స్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో గంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, క్రాంతికుమార్, ఝాన్సీలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ జి.అనీల్‌కుమార్ బాధితుల బంధువులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పొగమంచుకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి పిడుగురాళ్లరూరల్: తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. దాచేపల్లి నుంచి ద్విచక్రవాహనంపై నలుగురు యువకులు పిడుగురాళ్ల వైపు వస్తున్నారు. మార్గం మధ్యలో టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలపాలు కాగా క్షతగాత్రులను టోల్‌ప్లాజా అంబులెన్సు ద్వారా పిడుగురాళ్లలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాగిడి విఘ్నేశ్వర్(20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టి చిన్న, గొట్టిముక్కల ప్రేమ్‌చంద్, ఇట్టె బాలాజీలు చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విఘ్నేశ్వర్ నర్సరావుపేట ఎన్ఈసీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
టేకులపల్లి (ఇల్లెందు): ఆగి ఉన్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం పంతులునాయక్ తండాకు చెందిన మాలోతు మోతీలాల్, ఆయన భార్య లత, కుమారుడు చరణ్, మేనల్లుడు వంశీ (ఆటో డ్రైవర్).. ఆదివారం పాల్వంచ సమీపంలోని పెద్దమ్మ గుడికెళ్లారు. సాయంత్రం అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొత్తగూడెం క్రాస్‌రోడ్డు వద్ద మరో ముగ్గురు ప్యాసింజర్లు ఆటో ఎక్కారు. అయితే టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ తంగెల్లతండా సమీపంలోకి రాగానే చరణ్, అతడి తల్లి లత కాలకృత్యాలు తీర్చుకోడానికి ఆటో దిగారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటో లారీ కింద ఇరుక్కుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. జేసీబీల సాయంతో 3 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో ఒకరిని ఎర్రనాగు రమేశ్(25)గా గుర్తించారు. మరో ఇద్దరు మహిళల వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కొత్తగూడెం తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాలోతు మోతీలాల్ (40) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి
-
భీకరి
► గజరాజు బీభత్సం ► నలుగురి మృతి ► శోకసంద్రంలో కోవై ► మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా గజరాజు అంటూ ప్రజలచే గౌరవంగా పిలిపించుకునే ఏనుగు ఆ ప్రజల ప్రాణాలనే హరించి వేసింది. ప్రజలను వెంటపడి తరిమింది. పదిగంటలకు పైగా గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ముక్కుపచ్చలారని 12 ఏళ్ల చిన్నారిని కాలితో చిదిమేసింది. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వృద్ధులను చంపేసింది. అటవీ, పోలీసు శాఖల వందలాది మంది అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. మదంపట్టిన గజరాజు మారణకాండ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు నగరానికి ఆనుకునే పోత్తనూరు, వెల్లలూరు, కోవైపుత్తూరు, మధుకరై ప్రాంతాల్లో అడవి ఏనుగులు ఊళ్లోకి చొరబడి ప్రజలపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. అటవీ అధికారులపై ఆశలు పెట్టుకోకుండా ప్రజలు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే శుక్రవారం నాడు జరిగిన గజరాజు బీభత్సాన్ని మాత్రం జనం మరువలేకున్నారు. పోత్తనూర్ సమీపం గణేశపురం మురనండమ్మాళ్ ఆలయం వీధిలో నివసించే విజయకుమార్ (30) హస్తసాముద్రిక జోస్యం నిపుణుడు. ఇతని కుమార్తె గాయత్రి (12). ఎండకాలం కావడంతో ఇద్దరూ ఇంటి వసారాలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజాము 3.15 గంటల సమయంలో మదం పట్టిన ఒక అడవి ఏనుగు ఆలయ వీధిలోకి ,చొరబడింది. ఇష్టం వచ్చినట్లుగా విహరిస్తూ ఇంటి వసారాలో గాయత్రిపై విరుచుకుపడి కాలితోతొక్కి నలిపేయడంతో సంఘటన స్థలంలోనే చిన్నారి మృతి చెందింది. కుమార్తెను కాపాడేందుకు విజయకుమార్ ముందుకు వెళ్లడంతో ఏనుగు తన తొండతో అతన్ని చుట్టి దూరంగా గిరాటు వేసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఏనుగు విలయతాండవానికి భయభ్రాంతులకు గురైన ప్రజలు దాన్ని అడవుల్లోకి తరిమివేసేందుకు ప్రయత్నించారు. కర్రలు చేతపట్టుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు తరుముకోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని పంట పొలాల్లోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో పొలాల్లో బహిర్భూమికి వెళుతున్న జ్యోతిమణి (60), నాగరత్నం (50) అనే ఇద్దరు మహిళలపై దాడి చేయగా వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ పరిసరాల ప్రజలు త్రిశూలాలు, కమ్ములు, కత్తులు పట్టుకుని ఏనుగు వెంటపడ్డారు. దీంతో మరింత ఆవేశానికి లోనైన గజరాజు వారికి ఎదురుతిరగడంతో భయపడిన ప్రజలు తలోదిక్కుగా పారిపోయారు. ఊరి శివార్లలోని తన తోటకు నీళ్లుపట్టేందుకు బయలుదేరిన పళనిస్వామి (73) ఏనుగు బీభత్సాన్ని చూసేందుకు అగిపోయాడు. దీంతో ఒక్క ఉదుటన అక్కడి చేరుకున్న ఏనుగు పళనిస్వామిపైనా దాడి చేసింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే పళనిస్వామి (73) ప్రాణాలు కోల్లోయారు. మరో నలుగురిని గాయపర్చిన ఏనుగును అడవుల్లోకి తరిమేందుకు అటవీఅధికారులు బాణసంచా కాల్చారు. అయితే టపాసుల చప్పుళ్లకు ఏమాత్రం జంకని ఏనుగు ఆ పరిసరాల్లోనే తచ్చాడుతూ గడిపింది. ఇంతలో తెల్లారిపోయి ప్రజలంతా రోడ్లపైకి రావడంతో ఏనుగు మరింత విజృంభించి ఊళ్లోకి ప్రవేశిస్తే మరింత ప్రమాదమని భావించిన అధికారులు బాణసంచా కాల్చడం నిలిపివేశారు. దీంతో ఏనుగును అటవీవైపు మళ్లించడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇక లాభం లేదనుకుని మదపుటేనుగును తమవైపు ఆకర్షించుకుని అడవిదారి పట్టించే సామర్థ్యం కలిగిన కలీమ్, మారియప్పన్, పారీ, సుజయ్ అనే నాలుగు గుమ్కీ ఏనుగులను రప్పించారు. అలాగే మరోవైపు మత్తు ఇంజక్షన్లను ఇచ్చేందుకు పశువైద్యులు, ఆయుధాలతో కోయంబత్తూరు నగర పోలీసులు సైతం సిద్ధమయ్యారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో పశు వైద్యులు మనోహరన్ ఆ ఏనుగుకు రెండు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అదుపులోకి తెచ్చుకున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు ఎవ్వరూ రాకుండా 150 మంది పోలీసులు బందోబస్తులో నిలిచారు. ఈ సమయంలో ప్రజల సహాయాన్ని తీసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పశువైద్యులు జీపులో 25 అడుగుల దూరం నుంచి తుపాకీల ద్వారా మదపుటేనుగుపై మత్తు ఇంజక్షన్లను ఇచ్చారు. కొద్దిసేపటికి ఏనుగు స్పృహతప్పడంతో బలమైన తాళ్లు కట్టి అదుపులోకి తీసుకున్నారు. స్పృహ వచ్చిన తరువాత లారీలో తరలించారు. ఏనుగులు సంచరించే భూములను ప్రజలు ఆక్రమించి నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే గజరాజులు దాడులు చేస్తున్నాయని అధికారులు అంటున్నారు.సీఎం రూ.4లక్షల నష్టపరిహారం: ఏనుగు దాడిలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నష్టపరిహారాన్ని ప్రకటించారు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం, నలుగురు మృతి
చెన్నై : చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున వడపళని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిప్రమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురుని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పొగతో ఊపిరి ఆడక వారు మృతి చెందారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసి ఉన్న బైక్‌లు దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. మృతులు మీనాక్షి, సెల్వి, షాలిని, సంజయ్గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహా విషాదం
⇒ గోదావరిలో మునిగి నలుగురు మృతి ⇒ చింతలబయ్యారం వద్ద ప్రమాదం ⇒ యువకుల ప్రాణాలు తీసిన శివరాత్రి స్నానం ⇒ మరణంలోనూ వీడని స్నేహ బంధం మహా శివరాత్రి పండగ పూట ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, దైవ దర్శనానికి వెళ్లాలనుకున్న ఆ నలుగురు మిత్రుల ప్రాణాలను గోదారి మింగేసింది. పినపాక మండలం చింతల బయ్యారం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘటనలో గూదె ప్రేమ్‌కుమార్(22), తంతరపల్లి మురళీకృష్ణ(20), అల్లి నాగేంద్రబాబు(20) బోనగిరి పవన్‌కుమార్(20) గోదావరిలో ఉన్న సుడిగుండంలో మునిగి ప్రాణాలు వదిలారు. శివరాత్రి పండగ.. నలుగురి యువకుల ప్రాణాలను బలిగొంది. నాలుగు నిరుపేద కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. శివరాత్రి రోజున గోదావరిలో పుణ్య స్నానాలు చేసేం దుకు వెళ్లిన స్నేహితులైన నలుగురు యువకులు నీట మునిగి మృతిచెందారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామ పంచాయతీలోని చింతలబయ్యారం గ్రామం వద్ద గల శివాలయంలో పూజలు చేసేందుకని ఏడూళ్ళబయ్యారం సాయినగర్‌కు చెందిన గూదె ప్రేమ్‌కుమార్(22), తంతరపల్లి మురళీకృష్ణ(20), సెంటర్‌కు చెందిన అల్లి నాగేంద్రబాబు(20), ఉప్పాక గ్రామానికి చెందిన బోనగిరి పవన్‌కుమార్(20) తమ కుటుంబీకులతో కలిసి శుక్రవారం ఉదయం వెళ్లారు. అందరూ కలిసి పుణ్య స్నానాలు ఆచరించేందుకని గోదావరిలోకి దిగారు. స్నేహితులైన ఆ నలుగురు యువకులు మాత్రం గోదావరి మధ్యలోకి వెళ్లి అక్కడ జలకాలాడుతున్నారు. అక్కడ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశం(సుడిగుండం)లో బోనగిరి పవన్‌కుమార్ మునిగిపోతుండడాన్ని మిగి లిన ముగ్గురు గమనించారు. అతడిని రక్షిం చేందుకని నాగేంద్రబాబు, మురళీకృష్ణ, గూదె ప్రేమ్‌కుమార్ వెళ్లారు. నలుగురూ పూర్తిగా నీట మునిగారు. అక్కడకు దగ్గరలోనే స్నానమాచరిస్తున్న స్థానికులు, ఈతగాళ్లు గమనించి వెంటనే ఈదుకుంటూ వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు వెదికారు. నాటు పడవ సాయం తో సుడిగుండం వద్ద ఆ నలుగురి మృతదేహాలను గుర్తించారు. ఒడ్డుకు తీసుకొచ్చారు. ఉత్సాహంగా లోనికెళ్లిన ఆ నలుగురు.. గంటల వ్యవధిలోనే నిర్జీవంగా బయటకు వస్తుండడాన్ని వారి కుటుంబీకులు తట్టుకోలేకపోయా రు. గుండెలవిసేలా రోదించారు. ప్రాణ స్నేహితులు ఈ నలుగురు యువకులవి నిరుపేద కుటుం బాలే. గూదె ప్రేమ్‌కుమార్, తంతరపల్లి మురళీకృష్ణ, అల్లి నాగేంద్రబాబుది ఏడూళ్లబయ్యారం గ్రామం. బోనగిరి పవన్‌కుమార్‌ది ఉప్పాక గ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రేమ్‌కుమార్ డిగ్రీ చదువును మధ్యలో ఆపేశాడు. మిగతా ముగ్గురు, భద్రాచలంలోని ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ సెకండియర్ విద్యార్థులు. వీరు గురువారం పరీక్షలు రాసి ఇంటికి వచ్చారు. ఉప్పాకలో ఉంటున్న పవన్‌కుమార్‌ని పిలిపించారు. ప్రాణ స్నేహితులైన ఈ నలుగురు, శుక్రవారం మహాశివరాత్రి రోజున చింతలబయ్యారం గ్రామంలోని శివాలయంలో పూజలు చేసేందుకని కుటుంబీకులతో కలిసి వచ్చారు. ప్రాణ స్నేహితులైన ఈ నలుగురిని విడదీయడం.. శివయ్యకు ఇష్టం లేకపోయిందేమో! నలుగురినీ ఒకేసారి తీసుకెళ్లాడు. ఓదార్పు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మణుగూరు డీఎస్పీ బి.అశోక్‌కుమార్, ఏడూళ్ళబయ్యారం సీఐ అంబటి నర్సయ్య హుటాహుటిన గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. మృతుల కుటుంబీకులను ఓదార్చారు. మృతదేహాలకు గోదావరి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించేలా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫోన్లో కోరారు. వైద్యులు వెంటనే వచ్చి, పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు నలుగురు యువకుల మృతిపై ఏడూళ్లబయ్యా రం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమా దం తీరును తెలుసుకున్నారు. మృతుల వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ అంబటి నర్సయ్య చెప్పారు. -
ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి
-
ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి
► మరో నలుగురికి తీవ్ర గాయాలు ► ట్రెయిలర్ లారీ పైనుంచి పక్కన వెళుతున్న ఆటోపై పడిన రాడ్లు ► మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే ► సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ వద్ద ఘటన సాక్షి, సంగారెడ్డి రూరల్ ఓ ట్రెయిలర్ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ వద్ద సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. పనికోసం వెళుతూ.. ఇంద్రకరణ్ గ్రామ శివారులో నువోసాల్ అనే సోలార్ కంపెనీ నిర్మాణం జరుగుతోంది. ఆ కంపెనీ షెడ్డు నిర్మాణం కోసం సోమవారం రాత్రి ఓ ట్రెయిలర్ లారీలో పర్లిన్ బండిల్స్ (షెడ్డు పైకప్పు వేసేందుకు ఉపయోగించే ఇనుప రాడ్లు)ను తీసుకువచ్చారు. అయితే అప్పటికే రాత్రి 7.30 దాటిపోవడంతో తాము అన్లోడ్ చేసుకోబోమంటూ కంపెనీ ప్రతినిధులు తిప్పి పంపారు. ఇదే సమయంలో ఆ కంపెనీలోనే క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్న అస్సాం కార్మికులు కొందరు ఓ ఆటోలో పనికోసం వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రెయిలర్ లారీని చూసిన ఆటో డ్రైవర్ కాస్త పక్కగా జరిపి నిలిపాడు. అయితే రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండడంతో.. ట్రెయిలర్ తీవ్రంగా ఊగి పర్లిన్ బండిల్స్ ఆటోపై పడిపోయాయి. దీంతో అందులో ఉన్న సరోజ్‌కుమార్ (28), సూరజ్ కుమార్ భక్తా (23), చుట్టూ భక్తా (18), సుధామ (20) అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్చెరు మండలం క్యాసారానికి చెందిన ఆటోడ్రైవర్ పాండుగౌడ్తో పాటు అస్సోంకు చెందిన మానస్ మజ్జి, రూబెన్, ప్రదీప్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా అస్సాం రాష్ట్రంలోని నవగాం జిల్లా ఇటాసలి పంచాయతీ సమితి పరిధిలోని బర్హాపూర్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సెలవు కోసం గొడవ.. నలుగురిని కాల్చేశాడు!
అతడు రెండు నెలల పాటు యోగా శిబిరానికి హాజరై వచ్చాడు. మళ్లీ సెలవు కావాలన్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ అతడికి ఒక్కసారిగా కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిల్ తీసుకున్నాడు.. దాన్ని అన్‌లాక్ చేశాడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురు తోటి జవాన్లను బలిగొన్నాడు. ఈ ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గల నబీ నగర్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీజీసీఎల్) యూనిట్లో జరిగింది. నిందితుడు బల్వీర్‌సింగ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక ఏఎస్ఐ కూడా ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. విధులు ముగించుకుని షిఫ్ట్ మారుతున్న సమయంలో జవాన్లు ఒకచోట చేరారు. ఇంతలో అక్కడ చిన్న వివాదం తలెత్తడంతో అకస్మాత్తుగా బల్వీర్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. "బల్వీర్ తన సర్వీస్ రైఫిల్ తో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది సహోదర హత్యతో సమానం" అని ఎస్పీ అన్నారు. ఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారని తెలిపారు. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించిందని సీఐఎస్ఎఫ్ పేర్కొంది. బిహార్ విద్యుత్తు బోర్డులో ఎన్టీపీసీ, ఎన్సీజీసీఎల్ జాయింట్ వెంచర్‌గా నడుస్తున్నాయి. -
పోలీసులపై దూసుకెళ్లిన లారీ: నలుగురు మృతి
-
పోలీసులపై దూసుకెళ్లిన లారీ
ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు నాగార్జునసాగర్: రోడ్డుపై బోల్తాపడిన ట్రాక్టర్ని తొలగిస్తున్న పోలీసులు, జెన్కో ఉద్యోగులపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ప్రమా దం చోటు చేసుకుంది. సాగర్ దయ్యాలగండి రోడ్డుపై ఓ గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు బోల్తా పడిన ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగిస్తుండగా, నాగార్జునసాగర్ హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్, జెన్కో ఉద్యోగులను, వారి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరియదాస్ (35), పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బాలు నాయక్ (25), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్ (19), పెద్దవూర మండలం నెల్లికల్లుకు చెందిన చంద్రయ్య(45)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఎడమకాలువపై ఉన్న విద్యుత్ ఉత్పాదక కేంద్రంలో పనిచేస్తున్న ఏఈ క్రాంతిభూషణ్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. -
నెత్తురొడిన రహదారులు
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పికప్ చేసుకునేందుకు వెళ్లి... గుత్తి రూరల్ : కొత్తపేట గ్రామ శివార్లలో కాశిరెడ్డి నాయన ఆలయం వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి తూఫాన్ జీపు పల్సర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడుకు చెందిన బాబా పకృద్ధీన్ అతని మేనమామ అనంతపురానికి చెందిన ఖాదర్‌బాషా కర్నూలు నుంచి గుత్తికి వచ్చాడు. బస్టాండ్ నుంచి అతడిని గ్రామానికి తీసుకువచ్చేందుకు తన స్నేహితుడైన షేక్ బాషాను తీసుకొని పల్సర్ బైక్‌లో గుత్తికి బయలుదేరాడు. కొత్తపేట గ్రామ శివార్లలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న బైక్‌ను తాడిపత్రి వైపునకు వెళ్తున్న తూపాన్ జీపు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ పైకి ఎగిసి పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను తూపాన్ జీపు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. కాస్త ముందుకెళ్లిన తర్వాత తూఫాన్ వాహనం టైరు పంక్చర్ కావడంతో అందులో ఉన్న వారు కిందకు దిగి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని గుత్తి ఎస్ఐ రామాంజనేయులు సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు షేక్ బాషాకు భార్య నసీమా, కుమార్తె ఉండగా బాబా పకృద్ధీన్ అవివాహితుడు. కోడలిని పిలుచుకొచ్చేందుకు వెళ్లి మామ.. మడకశిర రూరల్ : ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెలితే.. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా కదిరేపల్లికి చెందిన శివన్న (52), భార్య జయమ్మ, కుమారుడు ప్రకాష్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుడిబండ మండలం కల్లురొప్పం గ్రామం నుంచి కోడలు రూప, ఆమె కుమారుడు ప్రీతమ్‌ను స్వగ్రామానికి పిలుచుకుపోవడానికి వచ్చారు. గురువారం వీరితోపాటు రాళ్లపల్లికి చెందిన లక్ష్మమ్మ, మైనగానపల్లికి చెందిన పార్వతమ్మ మడకశిరకు ఆటోలో బయల్దేరారు. గుర్రపుకొండ క్రాస్ వద్ద ప్రధాన రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలోని వారందరితోపాటు డ్రైవర్ రంగనాథ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సతీష్‌కుమార్ చికిత్స చేశారు. శివన్న చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరొకరు సోమందేపల్లి(గోరంట్ల) : గోరంట్ల మండలం పాలసముద్రం జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం గుర్తు తెలియని కారు ఢీకొని చిలమత్తురు మండలం బందేపల్లికు చెందిన సుబ్బిరెడ్డి(56) మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మతో కలిసి ద్విచక్రవాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈశ్వరమ్మ స్వల్ప గాయాలతో బయటపడింది. సుబ్బిరెడ్డి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పండుగకు వచ్చి పరలోకాలకు
సాగర్ కాల్వలో పడి నలుగురి మృత్యువాత కోదాడ: ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మృతుల్లో కృష్ణా జిల్లా వత్సవాయి మండ లం దేశపాలెంకి చెందిన ఫకీరాబీ, చిన సైదులు దంపతుల సంతానం షేక్ సుద్దాబీ(18), హుస్సేనాబేగం (14), ముస్తఫా (10)తోపాటు, ఖమ్మం జిల్లాకు చెందిన సైదాబీ, షేక్ మహబూబ్ హుస్సేన్‌ల కుమారుడు రియూజ్(9) ఉన్నారు. వీరంతా 4 రోజుల క్రితం పీర్ల పండుగకు అమ్మమ్మ మీరాబీ నివాసం ఉంటున్న నడిగూడెం మండలం సిరి పురానికి వచ్చారు. బుధవారం బట్టలు ఉతికేం దుకు సైదాబీతోపాటు నలుగురు వెళ్లారు. హుస్సేనాబేగం తమ్ముళ్లు ముస్తఫా, రియూజ్ లకు కాల్వ దరి వెంట స్నానం చేయిస్తుండగా, అత్త సైదాబీ, సుద్దాబీ బట్టలు ఉతుకుతున్నారు. ఈ క్రమంలో హుస్సేనాబేగం ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడడంతో ముస్తఫా, రియూజ్‌లు ఆమెను రక్షించేందుకు నీటిలోకి వెళ్లారు. ఈత రాక ముగ్గురూ కేకలు వేస్తుండగా.. పక్కనే బట్టలు ఉతుకుతున్న సుద్దాబీ వారిని రక్షించేం దుకు నీటిలోకి దూ కింది. అయితే వారంతా సుద్దాబీని గట్టిగా పట్టుకోవడంతో ఆమెతో పాటు అందరూ నీటిలో మునిగిపోయూరు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి కాల్వలోకి దిగి నలుగురిని బయటికి తీయగా అప్పటికే వారంతా చనిపోయూరు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా, సుద్దాబీకి 8 నెలల క్రితమే వివాహం జరిగింది. -
సిరిపురంలో విషాదం
నల్గొండ : నల్గొండ జిల్లా నడిగూడ మండలం సిరిపురంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు నలుగురు చెరువులోకి దిగారు. అయితే వారు దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో నీట మునిగి మరణించారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గుర్తించి... వారి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు. -
రక్తమోడిన రైలు పట్టాలు
వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి నెల్లూరు(క్రైమ్) : నగరంలోని రైలుపట్టాలు గురువారం రక్తమోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైలుప్రమాదంలో మృతిచెందగా ఓ యువతికి గాయాలైయ్యాయి. వివరాలు.. నక్కళోళ్ల సెంటర్లో పెయింట్ పనులు చేసే అరవ ప్రకాష్(40), విజయమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు. ప్రకాష్ గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి సమీపంలోని సులభ్‌కాంప్లెక్స్ వద్దకు వెళ్లాడు. దానిని తాళం వేసి ఉండటంతో సమీపంలోని రైలుపట్టాల వద్దకు వెళ్లాడు. పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు అతడిని ఢీకొంది. ఈఘటనలో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్సార్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. రైలుఢీకొని యువకుడు.. పశ్చిమబెంగాల్‌కు చెందిన శుభంకర్ బోర్దాలై(24) నెల్లూరులోని కామాటివీధిలో ఉంటూ బంగారు పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఏడాది క్రితం పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఖైజురీ ప్రాంతానికి చెందిన రాఖీ బోర్దాలైతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఏడోనెల గర్భిణి. బుధవారం రాత్రి 8.30 గంటల వరకు శుభంకర్ స్నేహితులతో గడిపాడు. అనంతరం సినిమాకు వెళుతున్నానని చెప్పి అక్కడ నుంచి ఎస్2 థియేటర్ వద్దకు వచ్చాడు. థియేటర్ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద మూత్రవిసర్జనకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు అతడిని ఢీకొని వెళ్లిపోయింది. ఈఘటనలో శుభంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. శుభంకర్ ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మృతదేహం రైలుపట్టాలపై ఉందని తెలిఽసి అక్కడి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్సార్ ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పట్టాలు దాటుతూ.. కడపకు చెందిన వసంతకుమారి(55)కి బాలాజీ, భాగ్యలక్ష్మిలు పిల్లలు. బాలాజీ నెల్లూరు రామలింగాపురంలో నివాసముంటూ మహేంద్ర ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదిరోజుల క్రితం వసంతకుమారి తన కుమార్తెతో కలిసి బాలాజీ వద్దకు వచ్చింది. గురువారం ఉదయం తల్లి, కుమార్తెలు కూరగాయలు తీసుకువచ్చేందుకు ఇంటినుంచి నడుచుకుంటూ ఏసీ కూరగాయాల మార్కెట్‌కు బయలుదేరారు. సౌత్రైల్వేస్టేషన్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు వారిని ఢీకొని వెళ్లిపోయింది.ఈ ఘటనలో వసంతకుమారి అక్కడికక్కడే మృతిచెందగా, భాగ్యలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు భాగ్యలక్ష్మిని 108 సాయంతో చికిత్స నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వరలక్ష్మి పరిశీలించారు. డీఎస్సార్ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సౌత్ రైల్వేస్టేషన్లో.. నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం గుర్తుతెలియని యువతి అనుమానాస్పద స్థితిలో రైలుపట్టాలపై మృతిచెందింది. మృతురాలు 20 ఏళ్ల వయస్సు ఽకలిగి నలుపు రంగు టాప్, పింక్ కలర్ లోయర్ ధరించి ఉంది. ప్రమాదం జరగక ముందు మృతురాలితో ఓ యువకుడు రైల్వేస్టేషన్ వద్ద ఘర్షణ పడ్డాడని, అనంతరం ఏం జరిగిందో తెలియదుగానీ ఆమె రైలుపట్టాలపై పడిఉందని స్థానికులు తెలిపారు. ఆమె ప్రమదవశాత్తు రైలు కిందపడిందా? లేదా ఆ యువకుడు ఆమెను తోసివేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులకు దీనిపై సమాచారం లేదు. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
-
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మాల్‌లోకి చొరబడిన దుండగుడు (లు?) కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్లోని ఈ మాల్లో కాల్పులు జరిపినవారు పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. నలుగురు మరణించిన విషయాన్ని వాషింగ్టన్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మాల్‌ను క్లియర్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మాల్లో ఉన్న క్షతగాత్రులను బస్సులో 'హిజ్ ప్లేస్' చర్చి వద్దకు తీసుకెళ్తామని కూడా ఆయన చెప్పారు. అత్యవసర వైద్యసేవల బృందం మాల్ వద్దకు చేరుకుంది. పోలీసు రక్షణతో వచ్చిన ఆ బృందం.. గాయపడిన వారికి అత్యవసరంగా చేయాల్సిన వైద్యసేవలు అందిస్తోంది. 1990లో బర్లింగ్టన్లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి. దీంతో అక్కడకు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. గన్ కల్చర్ గురించి విపరీతంగా చర్చలు నడుస్తున్న తరుణంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. 4 confirmed deceased in the mall, shooter(s) left scene b4 police arrived, unknown # of shooter, possibly just 1, police clearing mall now — Sgt. Mark Francis (@wspd7pio) 24 September 2016 EMS starting to enter to attend to injured inside Mall w/ police escort and after initial clearance. pic.twitter.com/Nkfb7co6sa — Sgt. Mark Francis (@wspd7pio) 24 September 2016 -
బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
జ్వరాలతో నలుగురు మృతి
బోనకల్/బూర్గంపాడు/కారేపల్లి : విజృంభిస్తున్న జ్వరాలు జిల్లాలో నలుగురిని బలిగొన్నాయి. బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన మర్రి ఆదిలక్ష్మి (30) మూడురోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గురువారం తీవ్రతరం కావడంతో మృత్యువాత పడింది. బూర్గంపాడు మండలం పాతసారపాకకు చెందిన కేసుపాక భద్రమ్మ(55) వారం రోజుల క్రితం జ్వరం బారిన పడింది. భద్రాచలం తీసుకెళ్లినా తగ్గలేదు. మూడురోజుల క్రితం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కారేపల్లి మండలం మొట్లగూడెంకు చెందిన అంగన్వాడీ కార్యకర్త కొమ్మినేని లలితమ్మ(45) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీనికి తోడు డైయాబెటీస్ ఉండటంతో.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ఇదే మండలం చింతలపాడుకు చెందిన దూడ మోహన్‌రావు(35) వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నాడు. ప్లేట్లెట్స్ తగ్గడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు వాహనాలు ఢీకొని మృతి చెందగా ఒకరు ఓవర్‌టెక్ చేయబోయి వాహనం తగిలి దుర్మమరణం చెందారు. గన్నవరం : ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు వెంకటనరసింహాపురం కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... కాలనీలోని మూడో రోడ్డులో ఉంటున్న పులి ప్రభాకర్(60) రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మణమ్మతో కలిసి పొలం వెళ్తుండగా ముస్తాబాద వైపుగా వెళ్తున్న బైక్ ప్రభాకర్‌ను ఢీకొట్టింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని తప్పించబోయి విద్యార్థి.. నూజివీడు : పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన మత్తే డేవిడ్‌రాజు బంగినపల్లితోట ప్రాంతంలో ఉన్న కల్వరి హాస్టల్లో ఉంటూ ధర్మఅప్పారావు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. డేవిడ్‌రాజు, స్నేహితుడు సూదం సాగర్‌తో బైక్‌పై వెళ్తూ ట్రాలీని ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా మరో ద్విచక్రవాహనం రావడంతో బండికి బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో ట్రాలీని కుడివైపునకు మళ్లించడంతో డేవిడ్‌రాజు నడుపుతున్న బైక్‌ను ట్రాలీపట్టి లాక్కెళ్లింది.108లో ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు. ఇన్చార్జి ఎస్ఐ చిన్ని నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపాల్ జీవీ రామారావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులురెండు నిమషాలు మౌనం పాటించారు. మినీ వ్యాన్ ఢీకొని వృద్ధుడి.. íÜంగన్నగూడెం (ఆగిరిపల్లి): మినీ వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ కథనం మేరకు గ్రామానికి చెందిన చిన్ని చంద్రయ్య (50) విజయవాడ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో గేదెలను మేపుతున్నాడు. విజయవాడ వెళ్తున్న మినీవ్యాన్ చంద్రయ్యను సోమవారం మధ్యాహ్నం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108లో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. నందిగామ రూరల్ : పట్టణ శివారుల్లోని అనాసాగరం గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఓర్సు ప్రసాద్ (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో విధుల్లో చేరేందుకు అనాసాగరం వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా, హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సు ఢీకొట్టింది. ప్రసాద్ అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తులసి రామకృష్ణ తెలిపారు. -
190 ఆలయాలు నేలమట్టం
మయన్మార్ దేశాన్ని కుదిపేసిన భూకంపం తాకిడికి నలుగురు మరణించగా.. 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. అత్యంత పురాతనమైన ఈ పగోడాలు చాలావరకు కుప్పకూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. మాగ్వే ప్రాంతంలోని పక్కోకు టౌన్షిప్లో పొగాకు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ కూలిపోవడంతో ఓ పురుషుడు, మహిళ మరణించారు. యెనాన్చౌంగ్ టౌన్షిప్లో 7, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావం పొరుగునున్న భారతదేశంలోని పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ మీద కూడా కనిపించింది. భూకంప కేంద్రం మయన్మార్‌కు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గరలో ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది భూమికి 90 కిలోమీటర్ల లోతులో ఉంది. మయన్మార్‌లో గడిచిన రెండు రోజుల్లో భూకంపాలు రెండుసార్లు వచ్చాయి. భారత్- మయన్మార్ సరిహద్దులతో పాటు అసోం, త్రిపుర, మిజొరాం, మేఘాలయ లాంటి ప్రాంతాల్లో మంగళవారం నాడు 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీని ప్రభావం మరీ ఎక్కువగా కనిపించలేదు. 2016 జనవరి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 26 సార్లు భూమి కంపించింది. -
కశ్మీర్లో మళ్లీ హింస
* నలుగురు పౌరుల మృతి, పలువురికి గాయాలు * 62కు చేరిన మృతుల సంఖ్య శ్రీనగర్: కశ్మీర్ ఇంకా రగులూతూనే ఉంది. మంగళవారం నాటి అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీంతో నెలరోజుల పైగా సాగుతున్న హింసలో మృతుల సంఖ్య 62కు చేరింది. కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు, వేర్పాటువాదుల బంద్‌తో మంగళవారం లోయలో సామాన్య జనజీవనం స్తంభించింది. బుద్గాం జిల్లా మాగంలో ఆందోళనకారులు సీఆర్పీఎఫ్ వాహనాలపై రాళ్లురువ్వడంతో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు అనంత్‌నాగ్ జిల్లా జంగ్లాట్ మండీలో రాళ్లదాడి చేస్తోన్న యువతను చెదగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిలో అమిర్ యుసఫ్ కొద్దిసేపటి తర్వాత మరణించాడని అధికారులు తెలిపారు. రాజ్‌నాథ్‌కు ఉన్నతాధికారుల వివరణ కశ్మీర్లో తాజా హింసపై ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సమీక్షించారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, నిఘా విభాగాల అధిపతులు రాజ్‌నాథ్‌కు వివరించారు. శాంతి పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని, ప్రజలు, భద్రతాదళాలకు ప్రాణనష్టం జరగకుండా చూడాలని హోం మంత్రి ఆదేశించారు. అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనానికి 1947-54 మధ్య పాక్‌కు వలసవెళ్లిన కశ్మీరీల పునరావాసానికి వీలుకల్పించే పునరావాస చట్టం చె ల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను అవసరమైతే రాజ్యాంగ బెంచ్‌కు సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్ని అంశాల్లో రాజ్యాంగ వివరణ తప్పనిసరైతే అప్పుడు నిర్ణయం తీసుకుంటామంది. -
మీరట్‌లో అక్రమ కూల్చివేతల్లో విషాదం
-
మీరట్‌లో అక్రమ కూల్చివేతల్లో విషాదం
మీరట్ : ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం నెలకొంది. మీరట్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో అక్రమంగా నిర్మించిన భవనాల తొలగింపు సందర్బంగా ఒక భవనం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. -
కంటైనర్‌ను ఢీకొన్న కారు : నలుగురి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద శుక్రవారం ఆగిఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
నకిరేకల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. జిల్లాలోని నకిరేకల్, రామన్నపేట, చింతపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన బొల్లెపల్లి గోపాల్(48) హమాలీగా పని చేస్తున్నాడు. శాలీగౌరారం మండలం మాదారం గ్రామం నుంచి ట్రాక్టర్‌పై ధాన్యం తోడుతో నకిరేకల్‌కు బయలుదేరాడు. గోపాల్ ట్రాక్టర్ ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. అర్వపల్లి మండలం బొల్లెపల్లికి చెందిన పాల్వాయి సోమ వెంకన్న(45) తన బంధువు మాచర్ల చిరంజీవితో కలిసి నోముల గ్రామంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్నారు. నకిరేకల్ వైపు నుంచి నోములకు వస్తున్న వీరి బైక్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనక కూర్చున్న అర్వపల్లి మండలం బొల్లెపల్లికి చెందిన పాల్వాయి సోమ వెంకన్న రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ ఇంజన్‌పై ఉన్న కట్టంగూర్ మండల అయిటిపాముల గ్రామానికి చెందిన బొల్లెపల్లి గోపాల్ కూడా రోడ్డుపై పడి తీవ్రగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని నకిరేకల్ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నోముల గ్రామానికి చెందిన మాచర్ల చిరంజీవికి గాయాలయ్యాయి. ఇద్దరి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.మృతుల కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ఆటో, ఇన్నోవా ఢీ.. చింతపల్లి : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన చింతకాలయ నర్సింహ్మ (65) మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలంబైరపురం గ్రామంలో ఉంటున్న కూతురు ఇంటికి బయలుదేరాడు. మాల్ వెంకటేశ్వరనగర్‌లో ఆటో ఎక్కాడు. మార్గమధ్యలో చింతపల్లి మండలం గొడకొండ్ల సమీపంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నర్సింహ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగభూషణ్‌రావు తెలిపారు. బైక్ చెట్టును ఢీకొట్టడంతో.. రామన్నపేట:చిట్యాల మండల కేంద్రానికి చెందిన నూనె స్వామి(45) తాపి మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఎన్నారం గ్రామంలో తనసమీప బంధువైన చిట్టిమాల సంజీవయ్య ఇంట్లో జరి గే దశదినకర్మకు హాజరయ్యేందుకు మండలి నర్సిం హతో కలిసి బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఎన్నారం గ్రామ శివారులోని మూలమలుపు వద్ద బైక్రాయి ఎక్కడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్వామికి తీవ్రగాయాలయ్యాయి. వెనుక ఆటోలో వస్తున్న మండలి శంకర్ గమనించి చికిత్స నిమిత్తం 108లో కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెం దాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
కారు బాంబు పేలి నలుగురు మృతి
డియార్బాకిర్: టర్కీలోని డియార్బాకిర్ నగరంలో గురువారం కారుబాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) రెబల్స్, టర్కీ సాయుధ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కారు బాంబు పేల్చినట్టు సమాచారం. -
ఏనుగుల దాడిలో నలుగురి మృతి
బర్ధమాన్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్లో వేర్వేరు చోట్ల ఏనుగుల మంద చేసిన దాడిలో ఒక మహిళ సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. బర్ధమాన్ జిల్లాలోని నశిగ్రామ్ గ్రామానికి చెందిన ఆనందమయి రాయ్ (60), నారాయణ్ చంద్ర మాఝి(60) శనివారం వేకువజామున బహిర్భూమికి వెళ్లగా అక్కడ సంచరిస్తున్న రెండు అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి. మరో ఘటనలో, కత్వాలో ఉండే ప్రకాశ్ బోయ్రా(40) బఘాసొలే గ్రామానికి శనివారం వచ్చి గ్రామంలోని తన స్థలాన్ని చూసుకునేందుకు అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన అడవి ఏనుగు ప్రకాశ్‌ను తొక్కిచంపేసింది. మంతేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్ గ్రామంలో తన పొలంలో పనిచేస్తున్న సిరాజ్ షేక్(45)ను సైతం అడవి ఏనుగు వెంటాడి తొక్కి చంపేసింది. బంకురా జిల్లాలోని దల్మా అటవీ ప్రాంతంలోని ఐదు ఏనుగుల మంద దామోదర నదిని దాటి శనివారం బర్ధమాన్ జిల్లాలోకి ప్రవేశించి ఇలా బీభత్సం సృష్టించిందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు. -
విమానం కుప్పకూలి.. నలుగురి మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలి ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు. ఈ ప్రమాదం కాలేజి స్టేషన్‌కు ఆగ్నేయంగా గల నవసోటాలో జరిగింది. నాలుగు సీట్లు మాత్రమే ఉన్న సింగిల్ ఇంజన్ సైరస్ ఎస్ఆర్-20 రకం విమానం సిటీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయత్నాలలో ఉండగా అది కూలిపోయిందని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఎయిర్ అఖ్తర్ సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ఈ విమానం.. డేవిడ్ వేన్ హూక్స్ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరింది. కానీ నవసోటా సమీపంలో ఓ విమానంలో వెళ్తున్న పైలట్.. ఈ విమానం కూలిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అందులో నలుగురు ప్రయాణికులు మరణించిన విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విచారణ జరుపుతోంది. -
కూలిన బొగ్గు గని : నలుగురు మృతి
మాస్కో : ఉత్తర రష్యా కొమి ప్రాంతంలోని సెవర్నియా బొగ్గు గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో 26 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. శిథిలాల నుంచి మాత్రం ఎనిమిది మందిని రక్షించి...పైకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 110 మంది పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని పేర్కొన్నారు. గనిలో ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై వార్త తెలిసిన వెంటనే అత్యవసర సేవల మంత్రి వాద్లమిర్ పుచ్కొవ్ ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా రష్యాతోపాటు సోవియేట్ దేశాల్లోని బొగ్గు గనులు కుప్పకూలడం సాధరణమైన విషయమే. ఈ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది. -
టిప్పర్ బోల్తా,నలుగురు మృతి
-
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
-
బోల్తా పడ్డ బస్సు : నలుగురు మృతి
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లాలోని రాణిరత్ సమీపంలో రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జల్పాయిగురి సర్ధార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగంతో వెళ్తున్న బస్సు రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. అనంతరం బోల్తా పడిందని చెప్పారు. దూప్గురి నుంచి జమర్ధహ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కారు - లారీ ఢీ : ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచిపెంట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు... లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారు సహా దంపతులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో చిన్నారి మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారు. -
భీకర బైక్ రేస్.. నలుగురు దుర్మరణం
బెంగళూరు: ఓ అనాలోచిత చర్య నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. బైక్ రేసింగ్ సరదా నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగిసేలా చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదూ ఏకంగా నలుగురు విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బెంగళూరు విమానాశ్రయం మార్గంలో భీకర బైక్ రేస్ కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చే దానిని చూసిన వారికి గుండె దడపుట్టించేలా ఉంది. ఆ నలుగురు యువకుల చేతిలో ఉంది లక్షలు పోసి కొన్న స్పోర్ట్స్ బైక్సే కావడం.. అవి గాలికంటే వేగంగా దూసుకెళ్లి అంతే వేగంతో ప్రధాన రహదారిపై పడి వారిని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో ఓ స్థాయిలో నిప్పులు చెలరేగాయి. ఈ క్రమంలో వారి నలుగురి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. అసలు రేస్ ఎలా మొదలైందంటే... బెంగళూరుకు చెందిన నలుగురు యువకులు... టైం : అర్థరాత్రి.... ప్లేస్ : బెంగళూరు ఏయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారి.... బైక్ రేస్ మొదలయ్యింది.... రయ్ మంటూ దూసుకెళ్లారు.... ఒకరిని మించి మరొకరు.... టార్గెట్‌ను రీచ్ కావటానికి పోటీపడ్డారు.. కానీ... టార్గెట్‌కు చేరుకునేలోపే లైన్ మిస్ అయ్యాడు ఓ రేసర్... రేసర్స్ ముందు వీడియో రికార్డ్ చేస్తున్న కారును ఢీ కొట్టాడు.. తగిలిన క్షణమే అల్లంత దూరంలో పడిపోయాడు ఆ రేసర్.. అతడి వెనుక ఉన్న మరో రేసర్.. తరువాత మరొకరు.. ఇలా అంతా హైస్పీడ్‌లో కిందపడిపోయారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. ఈ రేస్‌లో వారు చేసిన తప్పులు మొదటి తప్పు రేసింగ్‌కు సిద్దమైన వారెవరూ హెల్మెట్ ధరించలేదు రెండోది.. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హైస్పీడ్ బైక్స్‌పై రేసింగ్ కు దిగడం మూడోది.. అర్థరాత్రి బైక్ రేసింగ్‌కు దిగటం నాలుగోది.. అత్యంత రద్దీగా ఉండే ఏయిర్పోర్ట్ వెళ్లేదారిని ఎంచుకోవటం ఐదో తప్పు రేసింగ్ సమయంలో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చర్యలు అందుబాటులో లేకపోవటం -
రక్తమోడిన రాజీవ్ రహదారి
మెదక్: రాజీవ్ రహదారిపై మరోసారి నెత్తురు పారింది. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. -
బస్సు - ట్రక్ ఢీ: నలుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కకొరి ప్రాంతంలో శనివారం మినీ బస్సు ట్రక్‌ను డీ కొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలోని ట్రూమా సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
రోడ్ టై..
తెల్లారితే చాలు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం..ఈ వారం రోజుల్లో ఇవి మరీ ఎక్కువైపోయాయి. ఏం వినాల్సి వస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవల్సి వస్తోంది. పుష్కరాలు ప్రారంభమై 8రోజులైంది. ఈ ఎనిమిది రోజులూ వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోనో..లేదా పొరుగు జిల్లాలోనూ జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలామంది క్షతగాత్రులయ్యారు. రోడ్లమీద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడ్డం..తొందరగా గమ్యం చేరాలని వాహనచోదకుల మితిమీరిన వేగం..కొత్త మార్గాల మీద అవగాహన లేకపోవడం..కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కించడం..వాహనాలను పరిమితికి మించి జనంతో నింపేయడం లాంటి కారణాలు ఈ వరుస ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో సుమారు 22 మంది చనిపోగా 118 మంది గాయపడ్డారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కేకోటపాడు మండలంలో వంతెన పైనుంచి వ్యాను కింద పడి నలుగురు మృత్యువాత పడ్డారు. - వంతెన పైనుంచి టాటాఏస్ బోల్తా - నలుగురు దుర్మరణం - 28 మందికి గాయాలు - పుష్కరాల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం - రెడ్డివానిపాలెంలో విషాదం కె.కోటపాడు : పుష్కర స్నానాలు ముగించుకొని కొద్ది సేపట్లో గ్రామానికి చేరుకుంటారనగా అంతులేని విషాదం చోటుచేసుకుంది. రక్షణ గోడలేని వంతెనపై నుంచి టాటాఏస్ బోల్తాపడింది. కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం కూడలి వద్ద మంగళవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 28 మంది గాయాల పాలయ్యా రు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రెడ్డివానిపాలెం వాసులు. బాధితులు, బంధువుల రోదనలతో కె.కోటపాడు ఆస్పత్రి మార్మోగిపోయింది. ఆదివారం రాత్రి టాటాఏస్ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది రాజమండ్రి వెళ్లారు. తిరిగి వస్తుండగా స్వగ్రామానికి పది కిలోమీటర్ల దూరంలోని వారాడ సంతపాలెం కూడలివద్ద వంతెన పైనుంచి టాటా ఏస్ బోల్తాపడింది. ప్రమాదంలో రెడ్డివానిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ(62), వేపాడ మండలం సింగరాయి గ్రామానికి చెందిన కొల్లి సన్యాసమ్మ(58)లు సంఘటన స్థలంలోనే మృతిచెం దారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రెడ్డి సన్యాసమ్మ(60), రెడ్డి అచ్చియ్యమ్మ(63)లు చనిపోయారు. ఈ ప్రమాదంలో కాళ్లు,చేతులు విరిగిపోయిన ఆర్.ఈశ్వరమ్మ, ఎ.రాముడమ్మ, ఆర్.గణేష్, ఆర్.శ్రీలక్ష్మి, ఆర్.రాజేశ్వరి, ఆర్.లక్ష్మణరావు, ఆర్.సింహాచలం, రెడ్డి సింహాచలంనాయుడు, ఆర్. వేములమ్మ, ఆర్. లక్ష్మి, ఆర్.ఈశ్వరరావులకు కె.కోటపాడు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఆర్.భవాని, రెడ్డి సన్యాసమ్మ , ఆర్.చినదేముడు , ఆర్.సన్యాసమ్మ , అనపర్తి కీర్తన, అనపర్తి భరత్ , రెడ్డి కోటి , కొప్పు ముత్యాలరావు, అనపర్తి లక్ష్మి , ఆర్. ఈశ్వరమ్మ , ఆర్.సన్యాసమ్మ , ఎ.లక్ష్మి , ఆర్.అక్కమ్మ , కె.బుచ్చమ్మ , వి.కన్నమ్మ , ఎ.రాముడమ్మ , ఆర్.కోమలి (2)లు కె.కోటపాడులో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సంఘటన స్థలానికి ఉదయం ఐదున్నర గంటలకే చేరుకున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 11 మందిని విశాఖపట్నం తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేశారు.మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాలని వైద్యులను ఆదేశించారు. మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నక్కెళ్ల నాయుడుబాబులు పరామర్శించారు. మృతులకు, బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. కె.కోటపాడు తహశీల్దార్ కె.సత్యారావు చనిపోయిన రెడ్డి సన్యాసమ్మ, రెడ్డి దేముడమ్మ, కొల్లి సన్యాసమ్మ, రెడ్డి అచ్చియ్యమ్మల దహన సంస్కారాలకు ఒక్కొక్కరికి రూ.8వేలు చొప్పున ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబాలను స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రెడ్డి జగన్మోహన్, శ్రీకాంత్ శ్రీనులు పరామర్శించారు. చోడవరం సీఐ కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. వంతెనకు రక్షణ గోడ లేక.. వారాడ సంతపాలెం గ్రామ కూడలిలోని వంతెనకు పూర్తి స్థాయిలో రక్షణ గోడలు నిర్మించలేదు. ఇటీవల ఈ రోడ్డును విస్తరించారు. గతంలో కల్వర్టు అంచులకు సమానంగా తారురోడ్డు ఉండేది. రోడ్డు మార్జిన్‌ను వాహనదారులు గుర్తించేవారు. వేకువజామున పుష్కరయాత్రికులతో వెళుతున్న టాటాఏస్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో వాహనాన్ని అదుపుచేయలేకపోయారు. అది వంతెన పైనుంచి బోల్తాపడింది. వంతెన రక్షణ గోడలు ఎత్తుగా ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదన వ్యక్తమవుతోంది. విషాద ప్రయాణాలు - 15న ఎస్.రాయవరం ప్రాంతం కోనవానిపాలెం వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ వ్యాన్ ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. - 18న ప్రత్తిపాడు టోల్ గేట్ వద్ద జీపును ఆర్టీసీ బస్సు ఢీకొట్టంది. ఎం.వరలక్ష్మి మృతి చెందింది. నలుగురు గాయపడ్డారు. - అదే రోజు కత్తిపూడి వద్ద కల్లుపాకల ప్రాంత వాసి సంపంగి శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు. - వడ్డాది మార్గంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. - 19న రాజమండ్రి నుంచి గాజువాక వస్తున్న కారు నక్కపల్లి దరి వేంపాడు వద్ద ఆటోను ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. - అదే రోజు సామర్లకోట వద్ద లారీ, ఆటో ప్రమాదంలో కొత్తకోట ప్రాంత వాసి సన్యాసిరావు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. - యలమంచిలి హైవేలో ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. - ఈ నెల 20న మారికవలస జంక్షన్ వద్ద ఆటోను ఆర్టీసీ పుష్కర స్పెషల్ బస్ ఢీకొనడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. ఆరుగురికి గాయాలయ్యాయి. - అదే రోజు కశింకోట వద్ద రెండు బస్సులు ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. మరో ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. - చోడవరం మండలం తామర చెరువు వీధికి చెందిన వెంకటేశ్వర్లు రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. - 21న వారాడ సంతపాలెం వద్ద వంతెనపై టాటా ఏస్ అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు. - నక్కపల్లి ఏరియా ఆస్పత్రి సమీపంలో ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. -
హోటళ్లపై దాడి: నలుగురు మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో అల్ షబాబ్ సంస్థకు చెందిన తీవ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని దేశాధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న రెండు హోటళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. హోటల్ వద్ద కారుతోపాటు వచ్చిన వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడగా... మరో వ్యక్తి తుపాకీతో రెండు హోటళ్లపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ అన్ని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఐఐటీలో ఘర్షణ.. నలుగురి మృతి
మండి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఐఐటీ ప్రాంగణం రక్తసిక్తంగా మారింది. శనివారం రెండు గ్రూపులకు మధ్య తలెత్తిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మండి ఎస్పీ మోహిత్ చావ్లా తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో ఏర్పాటయిన మండి ఐఐటీలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, హిమాచల్ వ్యాప్తంగా నిర్మాణ కూలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఓ యూనియన్ శనివారం బంద్‌కు పిలపునిచ్చింది. అయితే ఐఐటీ నిర్మాణంలో పనిచేస్తోన్న కూలీలు మాత్రం యథావిథిగా పనికి హాజరయ్యారు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు, ఇతర కూలీలు.. ఐఐటీ ప్రాంగణానికి వచ్చి పనులు నిలిపివేయాలని ఆందోళన చేశారు. వీరిని చెదరగొట్టేందుకు సదరు నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టరుకు చెందిన ప్రైవేట్ గన్ మన్ లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడటంతో రెచ్చిపోయిన యూనియన్ కార్యకర్తలు గన్మెన్లు, ఐఐటీలో పనిచేస్తున్న కూలీలలపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన వచ్చింది. పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాయి. దాడుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కూలీల యుద్ధాన్నిచూసి హడలిపోయిన ఐఐటీ విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది పోలీసులు వచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిచామని, కూలీల మృతికి కారణమైనవారిని విడిచిపెట్టబోమని ఎస్పీ తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం ఉదయం సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. లింగాల మండలం దత్తారం వద్ద ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రాణాలు కో్ల్పోయారు. నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూరు లో జరిగిన మరో ప్రమాదంలో ఆగిఉన్న ట్రాక్టర్ ను ఆటో ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
మునిపల్లి/నర్సాపూర్ రూరల్/ పటాన్చెరు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మునిపల్లి మండలం పొల్కంపల్లి శివారులో మంగళవారం రాత్రి బైక్ కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కొమిషెట్పల్లి గ్రామానికి చెందిన ఎండీ ఆసీఫ్ (24)తో పాటు అదే గ్రామానికి చెందిన ఎండీ ముక్తాద్దీర్, మోమిన్‌పేట మండలానికి చెందిన ఎండీ ఇస్మాయిల్ (25)లు కలిసి సింగూరు ప్రాజెక్టులో సరదాగా గడిపేందుకు మంగళవారం సాయంత్రం బైక్‌పై వస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం మండలంలోని పొల్కంపల్లి శివారులోకి రాగానే అదుపు తప్పి క ల్వర్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సల అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఎండీ ఆసీఫ్, ఇస్మాయిల్‌లు మృతి చెందారు. ఎండీ ముక్తాద్దీర్ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతు ల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున ్నట్లు బుదేరా ఎస్ఐ సాముల కోటేశ్వర్రావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన వివరించారు. చెట్టును ఢీకొన్న లారీ.. చెట్టును ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ - మెదక్ రహదారిలోని రెడ్డిపల్లి సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గండిమైసమ్మకు చెందిన ఇసుక లారీ (టీఎస్ 07, 4199) ఇసుకలోడ్‌తో డ్రైవర్ రామ్‌భూపాల్‌రెడ్డి (45) మెదక్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రెడ్డిపల్లి సమీపంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్ఐ గోపీనాథ్ క్రేన్ రప్పించి దాని సాయంతో రామ్‌భూపాల్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీయించి నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ అని ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డీసీఎం వాహనం, బైక్ ఢీ పటాన్చెరు : డీసీఎం వాహనాన్ని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం చోటు చేసుకుంది. పటాన్చెరు సీఐ కృష్ణయ్య కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లికి చెందిన నవీన్ (25), సంగారెడ్డికి చెందిన మురళిలు బుధవారం బైక్‌పై సంగారెడ్డి వైపు వెళుతున్నారు. అయితే మండలంలోని ముత్తంగి వద్దకు రాగానే ముందు వెళుతున్న డీసీఎం వాహన డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వెనుకనే వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మురళి తీవ్రంగా గాయపడ్డాడు. 108లో మురళిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నవీన్ స్వగ్రామం మేకవనంపల్లి అయినప్పటికీ ఆయన పటాన్చెరు దగ్గరలోని ఆర్సీ కోలా ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
దుండగుడి కాల్పులు : నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని క్విట్టా నగరంలో గస్తీ తిరుగుతున్న పోలీసు వాహనంపై దుండగుడు శనివారం విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు మరణించారు. ఈ మేరకు మీడియా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మరోకరని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని చెప్పారు. -
లారీ- ట్రాక్టర్ ఢీ; నలుగురి మృతి
కర్నూలు( రాచర్ల): కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం రాచర్ల సమీపంలో సోమవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్టు తెలిసింది. ఎదురుగా వస్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డవారంతా బనగానపల్లె మండలానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దేవుడా...
కారును ఢీకొన్న లారీ నలుగురు దుర్మరణం కర్ణాటకవాసులుగా గుర్తింపు శ్రీశైలం వెళ్తుండగా ఘటన అతివేగమే కారణం ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మరో రెండు గంటల్లో శ్రీశైలం చేరుకోవాల్సిన తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. అప్పటి వరకు పిల్లల చిలిపిచేష్టలతో సందడిగా సాగిన ప్రయాణం.. క్షణాల్లో భీతావహంగా మారిపోయింది. సగానికి పైగా వాహనం నుజ్జునుజ్జవడం.. క్షతగాత్రుల హాహాకారాల నడుమ పిల్లల బేల చూపులకు స్థానికుల గుండెలు బరువెక్కాయి. ఆత్మకూరు:అతివేగం నలుగురిని పొట్టన పెట్టుకుం ది. శ్రీశైల మల్లన్న దర్శనార్థం వెళ్తున్న కర్ణాటకవాసు లు నలుగురు మార్గమధ్యంలోనే మృత్యువొడి చేరా రు. తుపాను వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్ర మాదం చోటు చేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీ వ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్పంగా గా యపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సంఢోకి తాలూకా మూరటి గ్రామానికి చెందిన 14 మంది ఈనెల 3న మల్లన్న దర్శనార్థం శ్రీశైలానికి తుఫాన్ కారు(కేఈ32 ఎన్3282)లో బయలుదేరారు. ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని విజయవాడ నుంచి వెలుగోడుకు వెళ్తున్న లారీ(ఏపీ 21 పివి 8558) వేగంగా ఢీకొంది. ఘటనలో శాంతాబాయి(65), సోమశేఖర్ గోల(69) అక్కడికక్కడే మృతి చెందారు. పద్మావతి, సరోజలు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించారు. తీవ్రంగా గాయపడిన డ్రె ైవర్ రాజు, రేణుక, దుంగమ్మ, పార్వతి, రాజశేఖర్, నిర్మలను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుజాత, రవి, సునీల్, పార్వతిలకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యసేవలు అందించారు. నుజునుజ్జయిన కారు వేగంగా వస్తున్న కారు, లారీ సింగిల్ రోడ్డుపై అదు పు చేసుకోలేక ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో తు ఫాన్ కారు నుజునుజ్జయింది. ఘటనలో కారు డ్రైవర్ రాజుతో పాటు మరో ముగ్గురు రేకులకు అతుక్కుపోయారు. కారు పైభాగం ఎగిరిపడింది. వెనుక సీట్లో కూర్చున్న పిల్లలు మాత్రమే స్వల్ప గాయాలతో బ యటపడ్డారు. కార్డు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను, క్షతగాత్రులను స్థానికు లు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు మధ్యనున్న గోదావరినది వంతెనపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సారంగాపూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బట్టల శ్రీనివాస్(23), ఇదే గ్రామానికి చెందిన వెయ్యినూరి రాజశేఖర్(17) ద్విచక్ర వాహనంపై కలమడుగు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన బోర్ల కుంట రాజన్న(30), బొర్లకుంట ప్రశాంత్( 22) జగిత్యాలకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో కమ్మునూర్-కలమడుగు వంతెనపై రెండు బైక్‌లు అతివేగంతో ఢీకొనడంతో బట్టల శ్రీనివాస్, బొర్నకుంట రాజన్న, బొర్నకుంట ప్రశాంత్ తలకు బలమైన దెబ్బలు తగిలి తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ రాజశేఖర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. శ్రీనివాస్‌కు ఏడాది క్రితమే లావణ్య అనే యువతితో వివాహం జరిగింది. ప్ర శాంత్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, జన్నారం మండలాలకు హెచ్ఎంటీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజన్నకు వివాహం జరిగి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. సంఘటన స్థలానికి సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సారంగాపూర్ ఎస్ఐ నరేష్‌రెడ్డితో పాటు జన్నారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల వివరాల కోసం పోలీసులు తర్జనభర్జన పడ్డారు. ఈ విషయూన్ని తేల్చుకోవడానికి ఆలస్యమైంది. ఈ విషయంపై ఎస్సై నరేష్‌రెడ్డి మాట్లాడుతు మురిమడుగు వెళ్తుతున్న రాజన్న, ప్రశాంత్ ఎడమ వైపు నుంచి కుడిదిక్కు వెళ్లి ఎదుటి వాహణాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో ఆనవాళ్ల ద్వారా తెలుస్తోందన్నారు. చికిత్స పొందుతున్న రాజశేఖర్ మండలంలోని బీర్పూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. -
నెత్తురోడిన రహదారి
కొయ్యలగూడెం : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం సమీపంలో స్టేట్ హైవేపై ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బయ్యనగూడెం గ్రామానికి సమీపంలో ఇటుకల బట్టీ వద్ద కలప లోడుతో ఆగివున్న లారీని జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరువూరు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరత్నం (75), చిట్యాల గ్రామానికి చెందిన బజ్జూరి లక్ష్మీదేవి (65), ఖమ్మం జిల్లా కళ్లూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వనిగళ్ల కొండయ్య (50) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మట్టా నాగరత్నం కుమార్తె వెంకట నర్సమ్మ (50) ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరువూరు మండలం అంజనాపురానికి చెందిన మట్టా రాము, అతని భార్య కల్యాణి తమ కుమార్తెకు నామకరణం, అన్నప్రాసన చేయించేందుకు ఈనెల 13న బాడుగకు కుదుర్చుకున్న వ్యాన్‌లో అన్నవరం బయలుదేరారు. తమవెంట పరిసర గ్రామాలకు చెందిన 16 మంది బంధుగణ ంతో తరలివెళ్లారు. తమ కుమార్తెకు అన్నవరంలో క్షితాక్షి అను నామకరణం, అన్నప్రాసన చేయించారు. అక్కడి నుంచి సింహాచలం, మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని శనివారం అర్ధరాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం వేకువజామున కొయ్యలగూడెం చేరుకోగా, అక్కడ అందరూ టీ తాగారు. అనంతరం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. 10 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు వివరాలివీ... ఈ ప్రమాదంలో గాయపడినవారిలో మట్టా కల్యాణి, ఆమె భర్త రాంబాబు (రాము), కల్యాణి తల్లి వెలిగల సావిత్రి, తండ్రి కొండయ్య, అవనిగడ్డ సావిత్రి, బొజ్జారి ధనలక్ష్మి, బొజ్జారి వేణు, మరీదు వీరరాఘవులు, మట్టా లక్ష్మణ్, బొజ్జారి దిలీప్‌సాయి, మట్టా స్రవంతి, బొజ్జారి వేణుగోపాల్, మట్టా స్వాతి, మట్టా తపస్వి, బొజ్జారి పూజిత, పరిగెల వీరభద్రరావు ఉన్నారు. వీరంతా అంజనాపురం, చిట్యాల గ్రామాలకు చెందినవారు. క్షతగాత్రుల రోదనలతో ప్రమాద ప్రాంతం దద్దరిల్లింది. వారి ఆర్తనాదాలతో నిద్ర లేచిన స్థానికులు భయకంపితులయ్యారు. కొందరు ఘటనా స్థలానికి వెళ్లి వ్యాన్‌లోని వారిని బయటకు లాగారు. సీఐ కె.బాలరాజు, ఎస్సై ఎస్ఆర్ఆర్ గంగాధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎంత ప్రయత్నించినప్పటికీ లారీ, వ్యాన్ వేరుకాకపోవడంతో చేసేది లేక లారీని సుమారు అర కిలోమీటరు మేర వ్యాన్ సహా నడుపుకొంటూ వెళ్లారు. అనంతరం ట్రాక్టర్ సాయంతో వ్యాన్‌ను లాగారు. అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు లాగి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ పరామర్శించారు. అత్యవసర వైద్యసేవలు అందించేవిధంగా వైద్యాధికారులతో చర్చించారు. క్షతగాత్రులలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు, ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు. అలుముకున్న విషాదం తిరువూరు : అన్నప్రాశన కార్యక్రమం కోసం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని చిట్టేల, ఆంజనేయపురం గ్రామాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా కల్లూరు, తల్లాడ, తాళ్లూరు, తిరువూరు మండలం చిట్టేల, ఆంజనేయపురం గ్రామాల నుంచి వచ్చిన బంధువుల సమక్షంలో అన్నవరం వెళ్లిన వీరంతా తిరిగి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్తోమత అంతంతే... కవలలైన మట్టా రాంబాబు, లక్ష్మణరావులు మైలవరంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ తిరువూరులో కూడా దుకాణం ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. రాంబాబు కుమార్తె అన్నప్రాశన కార్యక్రమం అయిన తర్వాత తిరువూరులో వస్త్ర వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించి బంధువులను, కుటుంబసభ్యులను తమతోపాటు అన్నవరం తీసుకెళ్లారు. మృతులలో బజ్జూరి లక్ష్మీదేవి వృద్ధాప్యంలో కూడా చిట్టేలలో కూలి పనులు చేసి జీవిస్తున్నారు. రోడ్డుప్రమాదానికి గురైన కుటుంబాల ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు రోడ్డుప్రమాదంలో చనిపోయిన బజ్జూరి లక్ష్మీదేవి, మట్టా నాగరత్నం, కొండలు, వెంకట నర్సమ్మ మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. తిరువూరు శాసనసభ్యుడు కే రక్షణనిధి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. -
నెత్తురోడిన రహదారి
నలుగురు మృతి, 16మందికి తీవ్ర గాయాలు బయ్యనగూడెం సమీపంలో ఘోర ప్రమాదం అన్నవరం నుంచి వస్తూ ఆగివున్న లారీని ఢీకొట్టిన వ్యాన్ మృతులు, క్షతగాత్రులు కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతవాసులు కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం సమీపంలో స్టేట్ హైవేపై ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బయ్యనగూడెం గ్రామానికి సమీపంలో ఇటుకల బట్టీవద్ద ఆగివున్న కర్రల లోడు లారీని జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న కృష్ణాజిల్లా తిరువూరు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరత్నం (75), చిట్యాల గ్రామానికి చెందిన బజ్జూరి లక్ష్మీదేవి (65), ఖమ్మం జిల్లా కళ్లూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వనిగళ్ల కొండయ్య (50) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మట్టా నాగరత్నం కుమార్తె వెంకట నర్సమ్మ (50) ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా తిరువూరు మండలం అంజనాపురానికి చెందిన మట్టా రాము, అతని భార్య కల్యాణి తమ కుమార్తెకు నామకరణం, అన్నప్రాసన చేయించేందుకు ఈనెల 13న బాడుగకు కుదుర్చుకున్న వ్యాన్‌లో అన్నవరం బయలుదేరారు. పరిసర గ్రామాలకు చెందిన 16మంది బంధుగణాన్ని తమవెంట తీసుకెళ్లారు. కుమార్తెకు అన్నవరంలో నామకరణం, అన్నప్రాసన చేయించారు. అక్కడి నుంచి సింహాచలం, మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని శనివారం అర్ధరాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం వేకువజామున కొయ్యలగూడెం చేరుకోగా, అక్కడ అందరూ టీ తాగారు. అనంతరం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. 10 నిముషాల వ్యవధిలోనే వారంతా ఘోర ప్రమాదానికి గురయ్యారు. బయ్యనగూడెం సమీపంలో ఇటుక బట్టీల కోసం పుల్లలను దిగుమతి చేయడానికి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఆ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో శేషారత్నం, లక్ష్మీదేవి, కొండయ్య, వెంకట నర్సమ్మ మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులు వివరాలివీ మట్టా కల్యాణి, ఆమె భర్త రాంబాబు (రాము), వెలిగల సావిత్రి, కొండయ్య, అవనిగడ్డ సావిత్రి, బొజ్జారి ధనలక్ష్మి, బొజ్జారి వేణు, మరీదు వీరరాఘవులు, మట్టా లక్ష్మణ్, బొజ్జారి దిలీప్‌సాయి, మట్టా స్రవంతి, బొజ్జారి వేణుగోపాల్, మట్టా స్వాతి, మట్టా తపస్వి, బొజ్జారి పూజిత, పరిగెల వీరభద్రరావు గాయాల పాలయ్యారు. వీరంతా అంజనాపురం, చిట్యాల గ్రామాలకు చెందిన వారు. క్షతగాత్రుల రోదనలతో ప్రమాద ప్రాంతం దద్దరిల్లింది. వారి ఆర్తనాదాలతో నిద్రలేచిన స్థానికులు భయకంపితుల య్యారు. కొందరు ఘటనా స్థలానికి వెళ్లి వ్యాన్‌లోని వారిని బయటకు లాగారు. సీఐ కె.బాలరాజు, ఎస్సై ఎస్ఆర్ఆర్ గంగాధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎంత ప్రయత్నించినప్పటికీ లారీ, వ్యాన్ వేరుకాకపొవడంతో లారీని సుమారు అర కిలోమీటరు మేర ముందుకు నడిపారు. ఆ తరువాత ట్రాక్టర్ సాయంతో వ్యాన్‌ను లాగారు. అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు లాగి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ పరామర్శించారు. అత్యవసర వైద్యసేవలు అందించేవిధంగా వైద్యాధికారులతో చర్చించారు. క్షతగాత్రులలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు, ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి
-
కారు - లారీ ఢీ: నలుగురు సజీవ దహనం
-
విషాదం నింపిన విహారయాత్ర
⇒జీపును ఢీకొన్న కంటైనర్ వాహనం: నలుగురి దుర్మరణం ⇒మృతుల్లో ముగ్గురు మహిళలు,కంటైనర్ డ్రైవర్ ⇒ హైదరాబాద్‌ను సందర్శించి కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం ⇒శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద ఘటన శంషాబాద్ రూరల్: వారంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా హైదరాబాద్‌కు విహారయాత్రకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మధుర స్మృతులు నెమరువేసుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే వారిపై మృత్యువు పంజా విసిరింది. వారు ప్రయాణిస్తున్న జీపును కంటైనర్ వాహనం రూపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు కంటైనర్ డ్రైవర్ దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతంలోని ఫర్తాబాద్కు చెందిన రాజశేఖర్‌కు తన సొంత జీపును నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువులు 12 మంది ఆదివారం ఉదయం 7 గంటలకు విహారయాత్ర నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరారు. సాయంత్రం వరకు చార్మినార్, బిర్లా మందిర్ తిలకించారు. రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసేందుకు వచ్చారు. అక్కడే రాత్రి 12 గంటల వరకు సరదాగా గడిపారు. మరోమార్గంలో వెళ్తూ.. ఉదయం హైదరాబాద్ కు వీరు బీజాపూర్ మార్గంలో చేవెళ్ల మీదుగా వచ్చారు. శంషాబాద్ నుంచి షాద్‌నగర్-పరిగి దారిలో కర్ణాటక వెళ్లొచ్చని ఎయిర్‌పోర్ట్‌లో ఓ డ్రైవర్ వీరికి చెప్పాడు. దీంతో వారు బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఘాంసిమియాగూడకు చేరుకున్నారు. చీకటి కావడంతో జీపు డ్రైవర్ రాజశేఖర్ దారి తప్పినట్లు భావించాడు. దీంతో ఘాంసిమియాగూడ వద్ద బస్టాప్ వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఓ హోటల్లో దారి గురించి వాకబు చేద్దామని జీపును రోడ్డు పక్కన నిలిపాడు. ఇదే సమయంలో షాద్‌నగర్ నుంచి బైక్‌ల లోడుతో శంషాబాద్ వైపు వస్తున్న ఓ కంటైనర్ వాహనం వీరి జీపును వెనక నుంచి ఢీకొంది. ప్రమాద తీవ్రతకు జీపు వెనక వైపు డోరు ఊడిపోయింది. కంటైనర్ జీపును సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత జీపు రోడ్డు అవతలి వైపు ఉన్న గుంతలో పడిపోగా కంటైనర్ ప్రమాద స్థలం నుంచి సుమారు 250 అడుగుల వరకు డివైడర్ మీదుగా వెళ్లి అదుపుత ప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటనతో జీపులో ఉన్న వారు తీవ్రగాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తోడికోడళ్లు మృతి.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీపు వెనక వైపు కూర్చున్న గీత(29)కు తీవ్రగాయాలవడంతో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈమె తోడికోడలు కమలాబాయి(33), ప్రియాంక(20), కవిత, ఐశ్వర్య, బసమ్మకు తీవ్రగాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కమలాబాయి, ప్రియాంక సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. జీపులో ఉన్న బస్వరాజు, శర ణు, రేణుక, అన్నపూర్ణ, లక్ష్మీబాయి, కవిత, జీపు డ్రైవర్ రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడి.. ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ వైపు బోల్తాపడింది. దీంతో వాహనం డ్రైవర్ జ్ఞానేశ్వర్(50) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. జాకీ సహాయంతో పోలీసులు అతి కష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. అతని రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో కాళ్లకు తీవ్ర రక్తస్రావమైంది. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా సోమవారం ఉదయం మృతి చెందాడు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్‌కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పోలీసులు సోమవారం నలుగురి మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. ట్రాఫిక్‌కు అంతరాయం.. రోడ్డు ప్రమాదంలో కంటైనర్ వాహనం రహదారిపై బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం భారీ క్రేన్ సహాయంతో కంటైనర్‌ను రహదారిపై నుంచి తొలగించారు. -
తీవ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో నిఘా కార్యాలయంపై ఆత్మాహుతి దాడే లక్ష్యంగా చేసుకున్న అల్ ఖైదా తీవ్రవాదుల లక్ష్యాన్ని పాక్ సైన్యం శుక్రవారం భగ్నం చేసింది. ఆ క్రమంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో కమాండర్‌తోపాటు ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. మృతదేహల వద్ద నుంచి ఆత్మహుతి జాకెట్లతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కరాచీలోని కైయమ్మబాద్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. -
గ్రేనేడ్‌తో వివాహ వేడుకపై దాడి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ బాల్క్ ప్రావెన్స్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. చమ్మథాల్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ వేడుకపైకి ఆగంతకుడు గ్రేనేడ్ విసిరాడు. ఆ గ్రేనెడ్ పేలుడులో నలుగురు మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆ దాడికి తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పోలీసులు వెల్లడించారు. -
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
-
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
విశాఖ : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. రావికమతంలో బుధవారం ఉదయం స్థానిక టీడీపీ నేతకు చెందిన కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో నర్నీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కారు పాదచారులను ఢీకొన్న అనంతరం కొద్దిదూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవటం వల్లే ఈప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తాత, మనవడిని కబళించిన మృత్యువు
నాదెండ్ల/ఫిరంగిపురం: ఒకరు ఉద్యోగ విధులకు, మరో ముగ్గురు కూలి పనుల కోసం తమ గమ్య స్థానాలకు చేరేందుకు తూపాను జీప్ ఎక్కిన గంటలోపే విగతజీవులుగా మారిన సంఘటన మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గుంటూరు-కర్నూలు రాష్ట్ర రహదారిపై శుక్రవారం ఉదయం 6.50 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడి గుంటూరు పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామం పరిధిలో ఉన్న మేరికపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై తూపాను జీప్‌ను ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టింది. డ్రైవరుతో కలిపి ఎనిమిది మంది వున్న ఆ వాహనం 100 అడుగుల ఎత్తునుంచి ఫ్లైఓవర్ సైడ్‌వాల్ మీదుగా కిందకు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో గుంటూరులో నివాసం ఉంటూ ఈపూరు మండలం కొచ్చెర్ల జెడ్పీ హైస్కూల్లో హెడ్మాస్టరుగా పని చేస్తున్న నాగండ్ల లక్ష్మీ ద్రాక్షాయణి(52), కూలి పనులు చేసుకునే ఇర్ల నాగరాజు (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇర్ల నాగేశ్వరరావు (65), షేక్ ఖాదర్‌వలి (45) అనే ఇద్దరూ మృతి చెందారు. వీరిద్దరూ కూలీలే. మృతి చెందిన ఇర్ల నాగేశ్వరరావు, నాగరాజులు తండ్రీకుమారులు. జీప్ డ్రైవరు మల్లికార్జున నాయక్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు ఫరీద్ షుకూర్, షేక్ రవూఫ్, ముసునూరి శ్రీనివాసరావులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీనివాసరావు గుంటూరు శ్యామలానగర్‌లో నివాసం ఉంటూ పిడుగురాళ్ల మండలం కరాలపాడు పాఠశాలలో హెడ్మాస్టరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం సెలవులో ఉండి నరసరావుపేట వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. డ్రైవరు నాయక్, శ్రీనివాసరావుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జీప్ బయలు దేరిందిలా... కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన మల్లికార్జుననాయక్ అనే వ్యక్తి తూపాను జీప్ నడుపుతున్నాడు. బాడుగు నిమిత్తం గుంటూరు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రయాణికుల కోసం మార్కెట్ సెంటర్లో జీపు నిలిపాడు. ఆ సమయంలో కొచ్చర్ల జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టరు ద్రాక్షాయణి, కరాలపాడు ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముసునూరి శ్రీనివాసరావు జీప్ ఎక్కారు. అక్కడి నుంచి బయలుదేరిన తరువాత మార్గమధ్యలో ఫిరంగిపురం మండలం వేములూరిపాడు, అమీనాబాద్ గ్రామాల వద్ద తండ్రీ కుమారులు ఇర్ల నాగేశ్వరరావు, నాగరాజు, మరో ముగ్గురు షేక్ ఖాదర్‌వలీ, ఫరీద్ షుకూర్, షేక్ రవూఫ్ జీపు ఎక్కారు. వీరంతా కూలీలే.. మేరిక పూడి గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి జీప్ వెళుతుండగా నరసరావుపేట వైపు నుంచి ఎదురుగా గుంటూరు వస్తున్న సిమెంట్ లోడు లారీ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వచ్చి జీప్‌ను ఢీకొట్టింది. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జీప్ కిందనున్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. భర్త,కుమారుడిని కోల్పోయి... తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు, నాగరాజులు మృతి చెందడంతో నాగేశ్వరరావు భార్య పార్వతి, నాగరాజు భార్య అంకాళమ్మ రోధనలు స్థానికులను కలచి వేశాయి. భర్త, కుమారుడిని కోల్పోయిన పార్వతమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు అంత కష్టజీవులే. రాతి పనులు చేస్తూ బతుకుతుంటారు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. 7 మృతి చెందిన అమీనాబాద్ గ్రామానికి చెందిన రాతి పనుల కార్మికుడు షేక్ ఖాదర్‌వలీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొచ్చర్లలో విషాద ఛాయలు వినుకొండ( ఈపూరు): ఈపూరు మండలం కొచ్చర్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగండ్ల లక్ష్మీద్రాక్షాయణి (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలియడంతో కొచ్చెర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చివరిసారిగా ఆమెను చూసేందుకు ఉపాధ్యాయులు గుంటూరు వెళ్లారు. 1983లో టీచరుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ద్రాక్షాయణి తొలుత మేడి కొండూరు ప్రాథమిక పాఠశాలలో పని చేశారు. ఆ తరువాత 2000లో పదోన్నతిపై స్కూల్ అసిస్టెంటుగా కొచ్చర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చారు. ఇక్కడి విద్యార్థులకు జీవశాస్త్రం బోధించే లక్ష్మీద్రాక్షాయణి ప్రధానోపాధ్యాయురాలిగా అటు ఉపాధ్యాయులు, విద్యార్థులతో చాలా బాగుంటారనే మంచి పేరు ఉంది. హెచ్ఎంగా స్కూల్ అభివృద్ధికి కృషి చేశారని ఇందులో భాగంగానే ఎనిమిది తరగతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందని సహచర ఉపాధ్యాయులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త యడ్లపాడులోని ఆర్సీఎం స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో ద్రాక్షాయణి నిబద్ధతగా ఉండేవారు... మృతి చెందిన ప్రధానోపాధ్యాయురాలు ద్రాక్షాయణి విధి నిర్వహణలో నిబద్ధతగా ఉండేవారని ఘటనా స్థలానికి చేరుకున్న తోటి ఉపాధ్యాయులు తెలిపారు. ఉదయం ఆరు గంటలకే గుంటూరు నుంచి బయలుదేరి అందరి కంటే ముందుగా విధులకు హాజరయ్యేవారని గుర్తుచేసుకున్నారు. ఆమె భర్త లూర్ధురాజు యడ్లపాడు మండలం మైదవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పెద్దకుమారుడు ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. రెండోకుమారుడు దంత వైద్యం అభ్యసిస్తున్నాడు. గుంటూరులోని శ్రీనగర్ కాలనీ 2వ లైన్లో సొంతింటిలో నివసిస్తున్నారు. భర్త లూర్ధురాజు ప్రతిరోజు ఉదయం బైక్‌పై ఆమెను తీసుకువచ్చి ఆర్టీసీ బస్సుఎక్కించి వెళ్లేవారు. డీఈవో కార్యాలయంలో పని ఉండటంతో రాజు సెలవులో ఉన్నారు. షేవింగ్ షాపులో ఉన్న ఆయన ప్రమాద వార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు. నిత్యం గుంటూరు నుంచి రాక... హెచ్ఎం ద్రాక్షాయణి గుంటూరులో నివాసం ఉంటూ నిత్యం కొచ్చెర్లకు రాకపోకలు సాగిస్తుం టారు. గుంటూరు నుంచి వినుకొండకు 100 కిలోమీటర్లు, అక్కడి నుంచి కొచ్చర్లకు మరో 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరికొందరు విజయవాడ, తెనాలి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు పనిచేసే చోటే ఉండాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వస్తూ తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలకు ఎంతో మంది ఉద్యోగులు మృత్యువాత పడడం అందరి మనసులను కలచివేసే విషయమే. -
జీపు, లారీ ఢీ: నలుగురు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములోరిపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనం... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప.గో.జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:ఏడుగురు మృతి
ప.గో: జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దెందులూరు చెక్ పోస్ట్ సమీపంలో లారీని టవేరా వాహనం ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఎనిమిది మంది ప్రయాణికులతో టవేరా వాహనం రావులపాలెం నుంచి ఏలూరు వెళుతున్నసమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా వెంకటేశ్వర గానమృత భజన బృందానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.