Godavari pushkaralu
-
చిన్నమ్మా.. చేతకాలేదా?
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్ఎస్జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రాక్‌లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్‌కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలురైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదువిశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. -
అవినీతి ఫైలు అటకెక్కించేశారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా హాలోజన్ బల్బుల పేరుతో జరిగిన గోల్మాల్ను గత టీడీపీ ప్రభుత్వం విచారణ దశలోనే అటకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి వెలుగులోకి రాకుండా ఈ పనిచేశారని ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పుడు ఓ ఫిర్యాదు అందింది. దీంతో ఏపీ విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయని ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు వివరించారు. అప్పుడేం జరిగిందంటే? ► పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద హాలోజన్, రంగుల విద్యుద్దీపాలు అమర్చాలని 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.1,71,82,836లను మంజూరు చేసింది. నిజానికి రూ.5 లక్షలు దాటిన ప్రతీ కాంట్రాక్టుకు టెండర్ పిలవాలి. ఇదేమీ లేకుండా ఈ మొత్తాన్ని ఇష్టానుసారం ఖర్చుచేశారు. ► రూ.99 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చినట్లు రూ.72 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్లు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ► అలాగే, ఒక్కో ల్యాంపు రూ.824 చొప్పున 654 ల్యాంపులు కొన్నామని, వీటి విలువ దాదాపు రూ.5.4 లక్షలని, మరో 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు ఒక్కొక్కటీ రూ.588 చొప్పున.. 553 కొనుగోలు చేశామని, వీటి విలువ రూ.3.25 లక్షలని అధికారులు లెక్కలు చెప్పారు. లేబర్ ఛార్జీల కోసం రూ.10,32,500 ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. ► కానీ, రికార్డుల్లో చూపించిన షాపులన్నీ హాలోజన్ బల్బులు అద్దెకిచ్చే పరిస్థితే లేదని, బల్బుల నాణ్యతా ప్రమాణాలు కూడా ఏమాత్రం లేవని ఆరోపణలు వచ్చాయి. అసలు కొనుగోలు చేసిన హాలోజన్ బల్బులు ఆ తర్వాత మాయమవ్వడం, ఆ తర్వాత తుక్కుగా చూపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ► ఈ నేపథ్యంలో.. ‘సాక్షి’ 21–8–2015న ఈ బాగోతంపై ‘హలోజన్ హాంఫట్’ పేరుతో అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని, అవినీతినీ ఆధారాలతో బయటపెట్టింది. దీంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముత్యాలరాజు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ► మాయమైన బల్బులు, కొనుగోలులో అక్రమాలు, అద్దెకు తేవడం బూటకమని ప్రాథమిక ఆధారాలు లభించడంతో అప్పట్లోనే పదిమంది అధికారులకు సీఎండీ నోటీసులు జారీచేసి సమగ్ర విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ► కానీ, ఆ తర్వాత 2016లో ఈపీడీసీఎల్ సీఎండీగా వచ్చిన ఎంఎం నాయక్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో 2016 ఏప్రిల్‌లో విచారణలో ఉన్న ఈ కేసును మూసేశారు. ► ట్రాన్స్‌కో విజిలెన్స్ అప్పట్లో ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈపీడీసీఎల్‌కు సిఫార్సు చేసింది. అయితే, ఈ ఆదేశాలు డిస్కమ్ సీఎండీ పక్కనపెట్టారు. ఇప్పుడా ఫైలే కన్పించకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలే లేకుండా ఫైలు మూసేయడం ఆశ్చర్యంగా ఉంది. ట్రాన్స్‌కో సిఫార్సుల ఫైలే ఈపీడీసీఎల్‌లో లేకపోవడం మరో విడ్డూరం. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో వివరాలు తెలుస్తాయి. – కె. వెంకటేశ్వరరావు (ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ) దోషులకు శిక్ష తప్పదు హాలోజన్ బల్బుల కొనుగోళ్లలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అవినీతి జరిగిందనే తెలుస్తోంది. అందుకే తిరిగి విచారణ చేపట్టాం. దోషులను శిక్షించి తీరుతాం. – శ్రీకాంత్ నాగులాపల్లి (ట్రాన్స్‌కో సీఎండీ) -
గోదావరి పుష్కర ఘటనకు ఐదేళ్లు
-
బోయపాటికి షూటింగ్ చేయమని చెప్పింది ఎవరు?
సాక్షి, అమరావతి : పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జోగి రమేశ్ విమర్శించారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో పుష్కరాల నిర్వహణపై జోగి రమేశ్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. అందుకు సరిపడ ఏర్పాట్లు చేయలేకపోయింది. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్‌లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది?. అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇబ్రహీం గాంధీ సెంటర్లో ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి మురికి కాలువలో వేశారు. కృష్ణా పుష్కరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను అక్రమంగా తొలగించార’ని తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 29 మంది చనిపోయారు.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్‌కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారు. బోయపాటి శీనుతో ఆ షూట్ చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. పైగా భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత ప్రభుత్వం సమర్ధించుకుందని గుర్తుచేశారు. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదనకు పట్టించుకోలేదన్నారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్‌కమిటీతో విచారణ చేయిస్తాం సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్ సబ్‌కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. -
‘టీడీపీ అధర్మ పాలన వల్లే 29 మంది మృతి’
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి టీడీపీ ప్రభుత్వం, జస్టిస్ సోమయాజులు కమిషన్‌పై నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కొసలాటకు మీడియా అత్యుత్సాహం, భక్తుల అవగాహనాలేమి కారణమని తేల్చిన సోమయాజులు కమిషన్‌కు భారతరత్న, ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధర్మపాలన సాగుతోంది కనుకనే అంతటి ఘోరం జరిగిందని వాపోయారు. పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. టీడీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు.. తిరుమల శ్రీవారి ఆభరణాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు తనపై మూడు అక్రమ కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను విచారించాల్సిందిపోయి.. శైవక్షేత్ర ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : దోషం భక్తులది.. పాపం మీడియాది -
సోమయాజులు కమిషన్‌పై మండిపడుతున్న పండితులు
-
‘భక్తికి కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలి’
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు కమిషన్‌పై పండితులు, ప్రవచనకర్తలు మండిపడుతున్నారు. పుష్కరాలపై పండితులు, మీడియాను తప్పుపట్టడం సరికాదని పంచాంగ జ్యోతిష్య పండితులు మధురపాల శంకర్ శర్మ ధ్వజమెత్తారు. పంచాంగ కర్తలపై నిందవేయడం దారుణమన్నారు. పుష్కరాల తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వవైఫల్యమేనని పేర్కొన్నారు. సంప్రదాయాలు లేని చోటే దుర్మార్గాలు పుట్టుకొస్తాయని నిప్పులు చెరిగారు. పండితులపై చేసిన వ్యాఖ్యలను జస్టిస్ సోమయాజులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు గోదావరి పుష్కరాలకు ముహూర్తపెట్టింది పంచాంగ కర్తలు కాదని, అలాంటప్పుడు తమపై ఎందుకు నిందవేస్తున్నారన్నారు. భక్తి విషయాల్లో కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలన్నారు. ఆధ్యాత్మిక విషయాలకు మీడియా ప్రచారం కల్పించకుండా, తప్పుడు విషయాలకు ప్రచారం చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిటీని మళ్లీ వేసి దాంట్లో సరైన పంచాంగ కర్తలని తీసుకొని, ముహూర్త దోషాలు ఉన్నాయా లేదా అని తేల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక పారదర్శకంగా ఇచ్చిందని భావించడం లేదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకుగరై కమిషన్ నివేదిక ఇచ్చినట్లుందని తెలిపారు. గోదావరి పుష్కరాల దుర్ఘటనను భక్తుల నమ్మకాల మీదకు నెట్టేయడం దారుణమన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పుష్కరాలను ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా తీసుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుష్కరఘాట్ లో స్నానం చేస్తారన్న విషయం ముందుగానే అధికారులు ప్రజలకు చెప్పాల్సిందని తెలిపారు. అలా చెప్పకుండా భక్తులను ఘాట్ బయట నిలబెట్టడం తప్పు అన్నారు. కాగా, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, పండితులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
బాబును కాపాడేలా నివేదిక
-
పాపం ప్రజలదేనట..!
-
ఆ వీడియోలను బయటపెట్టాలని డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దాదాపు మూడేళ్లపాటు విచారణ జరిపి, ఇచ్చిన నివేదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు మీడియా ప్రచారం, భక్తుల రద్దీయే కారణమని తేల్చడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ తొక్కిసలాటతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని, పైగా చంద్రబాబు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారని కితాబు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశారని, సీఎం ప్రచారం యావ వల్లే ఈ తొక్కిసలాట జరిగి, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మీడియాను, భక్తులను కారకులను చేయడం సరికాదని పేర్కొంటున్నారు. సాధారణ భక్తుల ఘాట్‌కు సీఎం ఎందుకెళ్లారు? గోదావరి పష్కరాలకు తరలి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే టీవీ చానళ్లు, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో సాగించిన ప్రచారాన్ని సోమయాజులు కమిషన్ తన నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. వీఐపీలకు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతి ఘాట్ ఉండగా, సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు సాధారణ భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్‌లోకి ఎందుకు వెళ్లారో చెప్పలేదు. పుష్కరఘాట్‌లో భక్తులను నిలిపివేసి ఒక్కసారిగా వదిలారన్న అంశాన్ని కమిషన్ విస్మరించింది. రద్దీ అధికంగా ఉంటే భక్తులను పక్కనే 200 మీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ఘాట్, పద్మావతి ఘాట్లకు ఎందుకు మళ్లించలేదు? అని నివేదికలో ఎక్కడా ప్రశ్నించలేదు. ఆ వీడియోలు ఎక్కడున్నాయి? తొక్కిసలాట ఘటనకు మీడియా, భక్తులను బాధ్యులను చేయడం దారుణం. రూ.64 లక్షలకు ఏపీ టూరిజం శాఖ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయి? – ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు. రాజమహేంద్రవరం సీఎం ప్రచార యావ వల్లే తొక్కిసలాట 2003 నాటి గోదావరి పుష్కరాల ఫొటోలు ఉన్నాయి, మరి 2015 పుష్కరాల సీసీ కెమెరాల ఫుటేజీలు ఎందుకు లేవు? సాక్ష్యాధారాలను మాయం చేశారు. సీఎం ప్రచారం యావ వల్లే తొక్కిసలాట జరిగింది. మీడియా, భక్తులను కారకులను చేయడం సరికాదు. – కూనపురెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది, అఫిడవిట్దారుడు, రాజమహేంద్రవరం అబద్ధం ఎవరిది? తాను అక్కడ ఉండగానే తొక్కిసలాట గురించి తెలిసిందని, వెంటనే కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి కంట్రోల్ చేయాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఏకసభ్య కమిషన్ మరోలా చెప్పింది. ఇక్కడ చంద్రబాబు అబద్ధం అడారా? లేక కమిషన్ అబద్ధం చెప్పిందా? – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ మీడియాను నిందించడం సరికాదు పుష్కరాలపై సమాచారం తెలియజేయడం మీడియా ప్రధాన విధి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. దానికి మీడియాను కారణంగా చూపడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – మండేలా శ్రీరామమూర్తి, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజమహేంద్రవరం -
దోషం భక్తులది.. పాపం మీడియాది
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం ప్రచార యావకు సామాన్యులు బలి గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై అప్పటి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను గానీ, అలాగే ఘటన ఎలా జరింగిందనే దానిపై మీడియాలో వచ్చిన కథనాలను గానీ ఏకసభ్య కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు కమిషన్ ముందు విచారణకు హాజరై ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో అట్టహాసంగా నిర్వహించామని ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నానం చేస్తుండగా వెనుక పెద్ద ఎత్తున జనసందోహం కనిపించేలా వీడియోలు చిత్రీకరించడం, దానివల్లే తొక్కిసలాట జరగడాన్ని ఏకసభ్య కమిషన్ పట్టించుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చెబితే అదే నివేదికలో రాసిచ్చినట్లుగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్కర స్నానాన్ని కూడా ప్రస్తావిస్తూ దానికి మీడియాలో ప్రచారం కల్పించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీపై ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తాయని నివేదికలో ప్రస్తావించారు. 29 మంది మృతి చెందడం సాధారణ విషయమేనని, అందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, పొరపాటంతా పుష్కర భక్తులది, ప్రచారం చేసిన మీడియాదేనని నివేదికలో పేర్కొన్నారు. కమిషన్ నివేదికలో ఏముందంటే... ‘‘పుష్కరాలలో తీర్థవిధులు నిర్వర్తించడమే చాలా ముఖ్యమైన అంశం. భక్తులు తమ పెద్దల పుణ్యతిథి రోజు ఈ తీర్థవిధులు నిర్వర్తిస్తారు. అందరు తల్లిదండ్రుల తిథులు ఒకే రోజు రావుకదా! ఈ ఇంగితాన్ని తెలుసుకోలేని ప్రసార మాద్యమాలు, ప్రవచన పండితులు, పంచాగకర్తలు, స్వామీజీలు ప్రజలను మూఢ నమ్మకాల్లో ముంచెత్తారు. నదీ స్నానం తెల్లవారుజామున చేస్తే అది దేవత స్నానం, సూర్యోదయం తరువాత చేస్తే మనుష్య స్నానం, ఎప్పుడుపడితే అప్పుడు చేస్తే అది రాక్షస స్నానం అని విశ్వాసం. కానీ, పుష్కరాల సమయంలో ఎప్పుడు స్నానం చేసినా అది పుణ్యప్రదమేనని సూత మహర్షి తన శిష్యులకు చెప్పారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ సంగతిని ఏ టీవీ చానల్లోనూ సరిగ్గా చెప్పలేకపోయారు. ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి తప్పుదోవ పట్టించారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ పుణ్యకాలమేనని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేక తాము ఓ గొప్ప విషయాన్ని చెబుతున్నట్లుగా భావించి ఆ ముహూర్తానికే పుష్కర స్నానం చేయాలంటూ మీడియాలో ఊదరగొట్టారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు గోదావరి తీరాన పడిగాపులు పడ్డారు. ముహూర్తకాలంలోనే స్నానం చెయ్యకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో ఒక్కసారిగా వెల్లువలా నదిలోకి పరుగులు పెట్టారు. పల్లంలోకి ప్రవహించే నీటిని ఆపగలమా? ప్రచారమనే చెడ్డవాహిక వల్ల ఎన్నో ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్నానం చేసి వ్యాన్‌లోకి వెళ్లిన తరువాతే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని ఏకసభ్య కమిషన్ నివేదికలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను వదిలి ఉదయమే 6.26 గంటలకు ఇతర వీఐపీలతో కలిసి పుష్కర ఘాట్‌కు ఎందుకు వచ్చారనే విషయాన్ని కమిషన్ అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అక్కడ షూటింగ్ ఎందుకు నిర్వహించారనే అంశాన్ని ప్రస్తావించలేదు. తొక్కిసలాట ఘటనపై అప్పటి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆ నివేదిక గురించి ఏకసభ్య కమిషన్ కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కర ఘాట్‌ను గంటల తరబడి మూసివేశారని, తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. రెండు రోజుల ముందు నుంచే భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని, పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలని ఉత్సుకతతో ఆ రోజు తెల్లవారుజూమునే పుష్కర ఘాట్‌కు తరలివచ్చారని జిల్లా కలెక్టర్ తన నివేదికలో తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్‌లో ఉన్నారని, గోదావరి నదిలో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని, వారు స్నానం పూర్తయ్యి బయటకు వచ్చేసరికి ఉదయం 8.30 గంటలైందని కలెక్టర్ పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ భక్తులను అనుమతించకపోవడంతో తాకిడి విపరీతంగా పెరిగిపోయిందని, ఆ తర్వాత కూడా కేవలం ఒక్క గేటునే తెరవడంతో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాలను ఏకసభ్య కమిషన్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్ గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది జనం వెనుక కనిపిస్తుండగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తుండగా షూటింగ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వీఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. సీఎం, కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే, చివరి నిముషంలో జనసమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్ చేసి, డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని నిర్ణయించారు. దీంతో సీఎం, కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కర ఘాట్‌కు వచ్చారు. దీంతో భక్తులందరినీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కరాల ప్రారంభ ఘట్టాలను డ్రోన్ కెమేరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేట్ తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షులంతా ఇదే విషయం చెప్పారు. అయితే ఏకసభ్య కమిషన్ తన నివేదికలో దీనిగురించి ప్రస్తావించకపోవడం పట్ల బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాల షూటింగ్‌లు, ప్రచారాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసింది. -
.. ఇది క్షమార్హం కాదు!!
ఆగ్రహోదగ్రులైన జనాన్ని చల్లార్చడానికి విచారణ కమిషన్లు మత్తు మందుగా పనికొస్తాయని విఖ్యాత న్యాయ కోవిదుడు స్వర్గీయ జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ కమిషన్లకు నేతృత్వం వహించేవారిని ఎంపిక చేయటం మొదలుకొని జరిగే మొత్తం ప్రక్రియంతా సంశయాత్మక క్రీడ అని కూడా ఆయన చెప్పారు. ఏం చేయడానికైనా సిద్ధపడే రిటైర్డ్ న్యాయమూర్తుల దురాశను ఆయన చెరిగిపారేశారు. మూడేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్ర వరంలో తొక్కిసలాట జరిగి 29 నిండు ప్రాణాలు బలైన ఉదంతంపై నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదిక చూస్తే జస్టిస్ కృష్ణయ్యర్ అభిప్రాయాలు అక్షర సత్యాలని అర్ధమవుతుంది. సాధారణంగా కమిషన్లు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వాలు చాలా విష యాలు చెబుతాయి. జరిగిన ఉదంతానికి దారితీసిన పరిస్థితులేమిటో, వాటికి బాధ్యులెవరో, భవి ష్యత్తులో ఈ మాదిరి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి తీసుకోదగిన చర్యలేమిటో సూచించటం తదితరాలు అందులో ఉంటాయి. మూడేళ్లపాటు సాగిన విచారణలోఎందరో పాల్గొని అనేక అంశాలను జస్టిస్ సోమయాజులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాటి ప్రమాదంలో గాయాలపాలైనవారితో, మరణించినవారి కుటుంబసభ్యులతో అఫిడవిట్లు దాఖలు చేయించారు. ఏం జరిగుంటే ఈ విషాదాన్ని నివారించటం సాధ్యమయ్యేదో సవివరంగా చెప్పారు. పుష్కరాలకు భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నామంటూ వందల కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం తగిన సంఖ్యలో అంబులెన్స్‌ల మాట అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడాన్ని ఎత్తిచూ పారు. పైగా నిబంధనలు అతిక్రమించి ఘటనాస్థలికి సమీపంలో పలు వీఐపీ వాహనాలు, ఇతర వాహనాలు పార్క్ చేసిన తీరును వెల్లడించారు. ఊరునిండా పద్మవ్యూహాన్ని తలపించేలా బారికేడ్లు పెట్టి ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిని కల్పించిన వైనాన్ని వెల్లడించారు. వీటన్నిటికీ ఆధారాలుగా వీడియోలు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్‌లు కమిషన్‌కు సమర్పించారు. వాదనలన్నీ విని, వీరందరూ సమర్పించిన నివేదికలను పరిశీలించి చివరాఖరికి జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చిందేమిటన్నది చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి... పుష్కర ఏర్పాట్లతో, నిర్వహణతో, ఆనాటి ఘటనతో ఏమాత్రం సంబంధంలేని వారిపై బురదజల్లడానికి కమిషన్ చూపించిన ఉత్సాహం దిగ్భ్రమగొలుపుతుంది. పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణాలేమిటో అక్కడ విధులు నిర్వహించిన హోంగార్డు స్థాయి ఉద్యోగి సైతం చెప్పగలడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో దాదాపు 30 ఘాట్లు ఏర్పాటు చేశామని, ఎన్ని లక్షలమందైనా సునాయాసంగా స్నానాలు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఒక్క పుష్కరఘాట్ మినహా ఇతర ఘాట్లలో వాస్తవానికి అలాంటి పరిస్థితే ఉంది. ఉన్నవాటిలో పుష్కరఘాట్ చిన్నది. అయినా అక్కడ మాత్రమే ఇంత భారీయెత్తున జనం ఎందుకు గుమిగూడారన్న అంశంపై కమిషన్ దృష్టి సారించి ఉంటే ఎన్నో అంశాలు వెలుగు లోకొచ్చేవి. వేకువజామున 6.26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని, ఆ సమయంలో స్నానం చేస్తే ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ పోతాయని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీయెత్తున ప్రచారం చేసింది. ఆ ముహూర్తానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు తమ తమ కుటుంబాలతో స్నానానికి తయారయ్యారు. చేస్తే చేశారు... వీరంతా వీఐపీల కోసం కేటాయించిన విశాలమైన సరస్వతి ఘాట్‌ను కాదని, వైశాల్యంలో చిన్నదిగా ఉండే ఈ పుష్కరఘాట్‌కు పొలోమంటూ ఎందుకు పోవాల్సివచ్చిందో కమిషన్ అడగలేదు. ప్రభు త్వంవైపు నుంచి ఎవరూ చెప్పలేదు. సందేహాలే విజ్ఞానానికి బాటలు పరుస్తాయంటారు. కమిషన్‌కు ఈ విషయంలో సందేహం రాకపోవడం వల్ల అనేక అంశాలు మరుగునపడ్డాయి. పుష్కర సంరం భాన్ని, ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్నానం చేస్తున్న దృశ్యాలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ దృశ్యాల్లో జనసందోహం భారీయెత్తున కనబడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్ని పుష్కరఘాట్‌కు తీసుకొచ్చారు. గోదావరి స్టేషన్లో దిగేవారు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే భక్తులు వేర్వేరు‡ఘాట్లకు పోతే ఇక్కడ జనం తక్కువవుతారన్న ఆలోచనతో పోలీసులు, ఇతర సిబ్బంది సాయంతో అందరినీ పుష్కర ఘాట్‌కు మళ్లించారు. ఆ విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లారుజామున 4.30 మొదలుకొని 8 గంటల సమయం వరకూ ఆ ఘాట్ వెలుపల పడిగాపులు పడ్డారు. ఇంతమంది భక్త జనం కెమెరా ఫ్రేంలో అద్భుతంగా కనబడి ఉండొచ్చుగానీ, అది వారందరికీ శాపంగా మారింది. బాబు అక్కడినుంచి నిష్క్రమించగానే, అంతవరకూ అక్కడున్న బందోబస్తు మాయమైంది. ఆ ఘాట్కున్న ఒకే ఒక ప్రవేశద్వారాన్ని తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో గాయ పడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా సమీపంలో ఎక్కడా మంచినీరు లేని తీరును చాలామంది మీడియాకు ఆ వెంటనే వివరించారు. అలా నీళ్లు అందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యేదని చెప్పారు. ఆ దరిదాపుల్లో అంబులెన్స్‌ల జాడలేదని, చేతులపై మోసుకెళ్లామని వివరించారు. పైగా సీసీ టీవీ ఫుటేజ్గానీ, నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కోసం తీసిన వీడియోగానీ కమిషన్ ముందుకు రానేలేదు. మూడేళ్ల తర్వాత సమర్పించిన నివేదికలో ఇలాంటి కీలకమైన అంశాలు లేవు సరిగదా పంచాంగకర్తలు మొదలుకొని ప్రతిపక్షాల వరకూ టోకున అందరినీ ‘దోషుల్ని’ చేసిన వైనం, ప్రజలనూ, మీడియాను బాధ్యులను చేసిన తీరు విస్మయపరుస్తుంది. తనకనుకూలంగా అన్ని వ్యవస్థలనూ దిగజార్చటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆఖరికి విచారణ కమిషన్లపై జనంలో కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను కూడా దారుణంగా దెబ్బతీశారని నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇది క్షమార్హం కాదు. -
వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన సీఎం.. : శివస్వామి
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు కారణాలు వివరిస్తూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తప్పుపట్టారు. భక్తుల మూఢనమ్మకాలు, పంచాంగ కర్తలు, స్వామిజీలు, మీడియా వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ వ్యవహారాన్ని దాచేందుకే.. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారన్న శివస్వామి.. పుష్కరాల్లో బోయపాటి శ్రీను డాక్యుమెంటరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయినా పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన ముఖ్యమంత్రి సామాన్యులు స్నానం చేసే ఘాట్‌లో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘటనను స్వామిజీలు, మీడియాపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని స్వామిజీల తరపున ఖండిస్తున్నామన్నారు. కాగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆ నివేదిక సీఎం రాసినట్టుంది: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్ సోమాయాజులు నివేదిక ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని చెప్పడానికి సోమయాజుల కమిటీ నివేదికే నిదర్శనమన్నారు. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పించడం సిగ్గుచేటని ఆగ్రహం వక్తం చేశారు. అసలు సోమయాజులు కమిటీ ఎందుకు వేశారని, ఏం చెప్పారని ప్రశ్నించారు. ఈ నివేదికను చంద్రబాబే రాసినట్టుందని, ఆయన రాసిన రిపోర్ట్‌పై సోమయాజులు సంతకం పెట్టినట్లుందన్నారు. ముఖ్యమంత్రి స్నానం చేసే వరకు ఎవరిని అనుమతించలేదని, తొక్కిసలాట జరుగుతున్న విషయం సీఎంకు చెప్పమని జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారని, సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్సీ నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కమిషనేమో సీఎం వెళ్లిన తర్వాత జరిగిందని చెబుతోందన్నారు. పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. లేని ముహూర్తం పెట్టి.. ప్రచార యావతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదంపై చంద్రబాబుకి కనీసం మానత్వం కూడా లేదని విమర్శించారు. సీఎం స్నానం చేసే దృశ్యం డాక్యుమెంటరీ కోసం డైరెక్టర్ బోయపాటి బృందంతో ఏర్పాట్లు చేశారన్నారు. కమిషన్ రిపోర్ట్‌లో ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి చేతులెలా వచ్చాయని మండిపడ్డారు. తొక్కిసలాట ఫుటేజ్ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తికి గోదావరి గుణపాఠం తప్పదన్నారు. గోదావరి ఆయనను క్షమించదని, ఈ నివేదికను తమపార్టీ వ్యతిరేకిస్తుందని.. ఈ ఘటనపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు. -
పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణం
-
‘షార్ట్ ఫిల్మ్ కోసమే వారిని బలితీసుకున్నారు’
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో షార్ట్ ఫిల్మ్ తీయించాలని 29మంది భక్తుల చావుకు కారణమయ్యారని వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక.. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందనటంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటమే ప్రజలు చేసిన పెద్ద తప్పిదంగా ఆయన అభివర్ణించారు. కీర్తి ఖండూతి, పబ్లిసిటీ యావ ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడు ఈ ప్రపంచం అంతా వెతికినా కనపడరని అన్నారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కర ఘాట్‌లో ఎందుకు స్నానం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫోటేజీలను మాయం చేసి, మూడు సంవత్సరాలు కాలయాపన చేసి తూతూ మంత్రంగా ఒక నివేదికను ఇచ్చారని మండిపడ్డారు. బాధితులపై బండలేసే పరిస్థితి అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాదానికి భక్తుల మూడనమ్మకమే కారణమనటాన్ని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తప్పుబట్టారు. ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోకుండా బాధితులపై బండలేసే పరిస్థితి ఉందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం.. మానవత్వం లేని ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదకను తొక్కిపట్టి కొత్త నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కలెక్టర్‌కు మొట్టికాయలు వేసి నివేదికను తొక్కిపట్టారని అన్నారు. ప్రచార ఆర్భాటం వల్లే 29మంది ప్రాణాలు గాల్లోకి.. అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచార ఆర్భాటం వల్లే గోదావరి పుష్కర సమయంలో 29మంది ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. కేవలం కంటితుడుపు చర్యగా మాత్రమే కమిషన్ వేశారని అన్నారు. ప్రమాద సమయంలో అత్యవసర వైద్యం అందకపోవటం వల్లే అంతమంది చనిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబే తప్పుచేసి ఎవరి తప్పలేదన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. -
పుష్కర తొక్కిసలాటకు బాధ్యులెవరు!?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఒకే చోట వీఐపీలందరూ స్నానం చేయాలన్న కారణంతో పోలీసులు సాధారణ భక్తులను ఆపేశారు. ఫలితంగానే తొక్కిసలాట జరిగింది’ అని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై గురువారం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చ జరిగింది. దీంతో ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తేలిపోయింది. వీఐపీలందరికీ ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతీ ఘాట్‌ను కేటాయించినా.. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులందరూ ప్రజలకు కేటాయించిన పుష్కరఘాట్‌లో స్నానం చేశారు. షార్ట్ ఫిల్మ్ తీయాలని, అందులో భారీగా ప్రజలు కనిపించాలనే లక్ష్యంతో వారిని పుష్కర ఘాట్‌కు మళ్లించారు. మార్గదర్శకాల అమల్లో విఫలం.. మార్గదర్శకాల ప్రకారం.. విపరీత రద్దీ ఏర్పడకుండా నిర్దేశిత ప్రాంతాల్లో భక్తులను నిలువరించాలి. ఇతర ఘాట్లకు మళ్లించాలి. ఘాట్లలో ప్రతి 50 మీటర్లను కంపార్ట్మెంట్లుగా విడగొట్టాలి. సీసీ టీవీలు ఏర్పాటు చేసి 72 గంటల రికార్డును ఉంచుకోవాలి.. కానీ ఇవేమీ అధికారులు చేయలేదు. పైగా పుష్కరఘాట్‌కు ప్రజలను మళ్లించారు. పూజ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేసిన సమయంలో భారీగా జనం షార్ట్ ఫిల్మ్‌లో కనిపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ వాస్తవాలు బయటకొస్తాయన్న కారణంతోనే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ చిత్రీకరించిన సార్ట్‌ఫిల్మ్‌ను నేటికీ విడుదల చేయలేదు. అంబులెన్స్ వచ్చేందుకు దారిలేదు.. ఘాట్లలో అంబులెన్స్‌లు వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లుండాలని మర్గదర్శకాల్లో ఉన్నా.. అలాంటివేం జరగనట్లు స్పష్టమవుతోంది. ఉదయం 8 గంటల సమయంలో తొక్కిసలాట జరగ్గా 9.15 గంటలకు మొదట బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు అంబులెన్స్ లాగ్‌బుక్‌లో పేర్కొన్నారు. సరైన సమయంలో అంబులెన్సులు వచ్చి ఉంటే.. పలువురు బతికేవారని చెబుతున్నారు. ఎవరిని బాధ్యులను చేస్తారు! పుష్కరఘాట్‌లో వీఐపీల స్నానానికి అనుమతించిందెవరు? షార్ట్ ఫిల్మ్ కోసం గంటల తరబడి ప్రజలను ఆపిందెవరు? ఎవరి ఆదేశాలతో ఆపారు? దాదాపు మూడేళ్ల తర్వాత కమిషన్ తన విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చింది. మరి బాధ్యులను ఎవరిని చేస్తారు? ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మార్గదర్శకాలు అమలు చేయకే.. పుష్కరాల నిర్వహణ మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిచండంతోనే తొక్కిసలాట జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బాబు ప్రచార యావే భక్తులను పొట్టనపెట్టుకుంది.. చంద్రబాబు ప్రచార యావ భక్తులను పొట్టన పెట్టుకుంది. 29 మంది చనిపోవడానికి సీఎం చంద్రబాబే కారణమని తేలింది. – జక్కంపూడి విజయలక్ష్మి, న్యాయవాది, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు -
మూడేళ్ల క్రితం ఇదే రోజున..
మండపేట: మూడేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి సర్కారు ప్రచార దాహంకారణంగా తొక్కిసలాటలో చిక్కుకుని 29 మంది బలయ్యారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న పుణ్యస్నానాల కోసం రాజమహేంద్రవరం వచ్చిన 29 మంది సీఎం చంద్రబాబు ప్రచార యావ కారణంగా మృత్యువాత పడ్డారు. 52 మంది గాయాలపాలయ్యారు. పుష్కర ఘాట్‌లో తాను నిర్వహించే పూజలను చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలన్న సీఎం తాపత్రయమే అమాయకుల ప్రాణాలను బలిగొంది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రెండు గంటలకు పైగా ఘాట్‌లోనే ఉండిపోవడంతో రద్దీ పెరిగింది. షూటింగ్ పూర్తయిన అనంతరం చంద్రబాబు వెళ్లాక ఒక్కసారిగా భక్తులను వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మృత్యువాత పడ్డారు. దీనిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమిచిన జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. 19 మంది గిరిజనులు జలసమాధి ఈ ఏడాది మే 15న దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ తిరగబడిన సంఘటనలో 19 మంది గిరిజనులు జలసమాధి అయ్యారు. పడవ ప్రయాణాలకు సంబంధించి నిబంధనల అమలులో వైఫల్యం, లాంచీ యజమాని నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా గుర్తించారు. లాంచీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి నాలుగు రోజులు హడావుడి చేసినా తర్వాత పరిస్థితి షరా మామూలే అయింది. కాలిపోయిన పర్యాటక బోటు పాపికొండల అందాలను తిలకించేందుకు గత మే 11వ తేదీన పర్యాటకులు పడవలో వెళ్తుండగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సరంగు సమయస్ఫూర్తితో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్కూట్ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. పర్యాటక బోటులో గ్యాస్ సిలిండర్, కిరోసిన్ తదితర నిషేధిత వస్తువులు ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నా పాటించడం లేదు. నాడు కృష్ణాలో... సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా ఒంగోలు వాకర్స్ క్లబ్‌కు చెందిన దాదాపు 60 మంది సభ్యులు గత ఏడాది నవంబర్ 12న అమరావతి వెళ్లి అక్కడ దైవ దర్శనం తరువాత విజయవాడకు వచ్చారు. భవానీ ద్వీపం చూసిన తరువాత పున్నమీ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణా, గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడడంతో ఏపీ పర్యాటక శాఖకు చెందిన బోటు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్ సంస్థకు చెందిన ప్రైవేట్ బోటు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.300 తీసుకుని 38 మందితో బయల్దేరింది. కృష్ణా–గోదావరి నదులు కలిసే ప్రదేశం వద్దకు వచ్చే సరికి బోటు పెద్ద కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలిసేలోపే ఒక వైపునకు ఒరిగిపోయింది. బోటులోని వారంతా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడే ఉన్న జాలర్లు కొంతమందిని రక్షించారు. చివరికి 22 మంది జలసమాధి అయ్యారు. -
ఆ మహా ఘోరానికి మూడేళ్లు
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 29 మంది 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాల పేరుతో తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటం కారణంగా జరిగిన ఈ దుర్ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ దుర్ఘటన జరిగి నేటికి మూడేళ్లయినా.. ఈ ‘మహా’పాపానికి గల కారణాలు, దోషులెవ్వరనేది ఇంకా తేలలేదు. ఈ నిజాలను నిగ్గు తేల్చేందుకు వేసిన ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటి వరకూ చంద్రబాబు సర్కారు బహిర్గతం చేయలేదు. రాజమహేంద్రవరం క్రైం: ‘మహా’ ఘోరం జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. 2015 జూలై 14న గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావ కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాల పేరుతో నెలల తరబడి ప్రచారం నిర్వహించింది చంద్రబాబు సర్కారు. మరోవైపు ఆ ప్రచారాన్ని తన లబ్ధి కోసం వినియోగించుకునేందుకు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు పుష్కర క్రతువును చిత్రీకరించే బాధ్యత అప్పగించారు. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్‌లో తన కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించి సుమారు రెండు గంటలకు పైగా ఘాట్‌లోనే ఉండిపోవడంతో పుష్కర ఘాట్ జన సంద్రమైంది. ప్రజలు పుష్కర స్నానం ఆచరించడానికి తీవ్ర జాప్యం జరగడం, పుష్కర ఘాట్ సమీపంలో గోదావరి రైల్వేస్టేషన్, గోకవరం బస్టాండ్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఘాట్‌కు చేరుకోవడం, ఒకేసారి ఏడు రైళ్లు గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరడం తదితర కారణాల వల్ల ఘాట్ పూర్తిగా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. వీఐపీ ఘాట్(సరస్వతీ ఘాట్) ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులు, రాష్ట్ర అధికారులు మొత్తం 20కి పైగా వాహనాల కాన్వాయి ఘాట్‌లో గంటల తరబడి ఉండిపోవడంతో ప్రజలు విపరీతంగా పెరిగిపోయారు. తెల్లవారు జాము నుంచి ఘాట్‌లోకి వదలకుండా ముఖ్యమంత్రి తన పుష్కర స్నానం ముగించుకొని వెళ్లగానే భక్తులను ఘాట్‌లోకి అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి మొత్తం 29 మంది అక్కడికక్కడే మృతి చెందగా 52 మంది గాయాలపాలయ్యారు. నిజాయితీ నిరూపించుకునేందుకు కమిషన్ సంఘటన జరిగిన ఏడాది తరువాత ప్రభుత్వం తన తప్పులేదని, ప్రజల తప్పే అని నిరూపించుకునేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సోమయాజులుతో ఏకసభ్య కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో అనేక సార్లు బహిరంగ విచారణ జరిపినా ప్రభుత్వ శాఖలు సమాచార శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, తదితర శాఖలు తమ వద్ద ఉన్న ఆధారాలు, వీడియో క్లిప్పింగ్‌లు, నివేదికలు సమర్పించడంలో కమిషన్‌కు సహకరించలేదు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య నమోదు చేయడంలో ఒక శాఖకు, మరో శాఖకు పొంతన లేకుండా ఉంది. ఆ వీడియోలు బయటపెట్టని ప్రభుత్వం పుష్కర క్రతువు జరుగుతున్న తీరును ప్రపంచానికి చూపించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.40 లక్షల వ్యయంతో చిత్రీకరించేందుకు ఆ చానల్ ఒప్పందం కుదుర్చుకొని భారీస్థాయిలో పుష్కర ఘాట్‌లో చిత్రీకరణ చేశారు. ఈ ఛానల్‌తో పాటు ప్రైవేటు చానళ్లు, ఘాట్‌లో ఏర్పాటు చేసిన సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా పెద్ద ఎత్తున చిత్రీకరణ చేశారు. అయితే తొక్కిసలాట దుర్ఘటన జరిగిన తరువాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌చిత్రీకరించిన ఫుటేజీ, ఇతర శాఖలు చిత్రీకరించిన ఫుటేజీని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. గుట్టు బయట పెట్టాలి ఈ సంఘటనకు కారకులు ఎవరో బయట పెట్టాలి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ తీసిన ఫుటేజీ బయటకు రాకుండా అడ్డుకుంటున్న వారు ఎవరో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. పుష్కర తొక్కిసలాటకు కారకులైన వారిపై కేసులు పెట్టాలి. కమిషన్ గడువు పొడిగించి వాస్తవాలు బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.– ముప్పాళ్ల సుబ్బారావు,రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గడువు పెంచరు.. నివేదిక బయటకు రాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ గడువు ముగిసి ఏడాది పూర్తయినా ప్రభుత్వం కమిషన్ గడువు పొడిగించకపోవడంతో కమిషన్ నివేదిక బయటకు రావడం లేదు. కమిషన్ గడువు పొడిగిస్తే నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తన తప్పులు బయట పడతాయనే ఉద్దేశంతో కమిషన్ కడువు పొడిగించడం లేదు. దీంతో కమిషన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది మృతికి, గాయాలు పాలైన సంఘటనలో ఏవరు దోషులనేది బయటపడకుండానే మిగిలిపోయింది. ఇప్పటికీ పోలీస్ శాఖ చార్జ్ షీటు దాఖలు చేయని స్థితిలో ఉంది. ప్రగల్భాలు పలికే చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే తక్షణం కమిషన్ గడువు పొడిగించాలి. ప్రజల సొమ్ము లక్షలాది రూపాయల వ్య యంతో నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆ ఛానల్ వారు పుష్కరాల కోసం చిత్రీకరించిన ఫుటేజీని బయట పెట్టాలి. -
విచారణ ’పుష్కర’కాలం కొనసాగుతోంది
-
సోమయాజులు కమిషన్ విచారణ గడువు పెంపు
రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం మూడోసారి పెంచింది. రెండోసారి పెంచిన గడువు సెప్టెంబర్ 29తో ముగియడంతో 2017 జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు పొడిగిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూలై 14న తొక్కిసలాట ఘటన చోటుచేసుకుని 29మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత అక్టోబర్ 15న విచారణ కమిషన్‌ను నియమించి 2016 మార్చి 29కి విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే పలుమార్లు విచారణ చేపట్టిన కమిషన్‌కు ప్రభుత్వ అధికారులు ఆధారాలు సమర్పించకపోవడం వల్ల గడువులోపు విచారణ పూర్తి కాలేదు. ఈ విషయాన్ని పిటిషనర్లు ఎప్పటికప్పడు కమిషన్ దృష్టికి తీసుకొస్తూ అవసరమైన ఆధారాలు సమర్పించేలా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆధారాలు సమర్పించలేదు. సీసీ కెమెరాల రికార్డులు, పుష్కరఘాట్ వద్ద వీఐపీ కాన్వాయ్ రావడానికి అనుమతి ఎవరు ఇచ్చారు, రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎవరు తొలగించారు వంటి వివరాలను కమిషన్ కు సమర్పించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు గంటలపాటు పుష్కరఘాట్‌లో ఉండడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని పిటిషనర్లు వాదిస్తుండగా ఘటన జరిగిన సమయంలో అక్కడి పరిస్థితులు కూడా ఇందుకు బలం చేకూరుస్తుండడంతో ప్రభుత్వం కావాలనే విచారణను సాగదీస్తోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. మొదటిసారి గడువు పెంచిన ప్రభుత్వం నెల తర్వాత జీవో జారీ చేసింది. రెండో దఫా జూన్ 29న గడువు ముగియగా ఈసారి దాదాపు నెల తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పడు తాజాగా సెప్టెంబర్ 29తో సమయం ముగియగా 26 రోజుల తర్వాత జీవో జారీ చేసింది. ఇలా గడువు పెంచిన ప్రతిసారీ నెల రోజులపాటు సమయం వృథా అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించడం విచారణపై ప్రభుత్వ నాన్చివేత ధోరణికి అద్దం పడుతోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. -
విచారణ కొలిక్కి రాకుండానే ముగిసిన గడువు
-
ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్!
అక్షర తూణీరం ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’ అని మరోసారి సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి ముఖతా ‘‘ఆనంద ఆంధ్రప్రదేశ్’’ ఆవిష్కృతమైంది. అంతకు ముందు దోమరహిత రాష్ట్రంగా చేయాలని నిర్భయంగా తీర్మానించారు. దానికిముందు కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి కంకణ బద్ధులైనారు. చక్కని ఆలోచనలు చేస్తున్నారు. వింటుంటే పిచ్చి సంతోషంగా ఉంది. మన నేత ఏమి చెయ్యలేరో చెప్పడం కష్టం. ఆయన తలచుకుంటే డ్రోన్లతో దోమలకు పొగ పెట్టగలరు. ఆనంద ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పుష్కరాల రేవుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు గజ్జెలు కట్టి, తెరలు తీయనున్నారు. ఒకవైపు నాట్యాలు, ఇంకోవైపు గాన గోష్ఠులు, ఆవైపు కవి సమ్మేళనాలు, ఈవైపు జానపద కళారీతులు - కృష్ణా తరంగాలు నవరసా లొలికిస్తూ సాగిపోతుంటాయి. మల్టీఫ్లెక్స్‌లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అవి రెక్కలు తొడుక్కుని అమరా వతి పరిసరాల్లో వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆనందంగా ఉండాలన్నదే నిన్నటి మానిఫెస్టో లక్ష్యం. ఉద్యోగులు, శ్రామికులు, మరీ ముఖ్యంగా రైతులు ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మన తెలుగువారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వీధి కూడళ్ల దగ్గర సిగ్నల్స్ ఇస్తే కళాత్మకంగా ఉంటుంది. అవసరమైతే వారందరికీ సామూహిక శిక్షణ ఇప్పిస్తాం. ‘‘ఆనందమే బ్రహ్మ. ఆనందమే విష్ణువు. ఆనందమే యన్టీఆర్.’’ ఈ మూడోది నేవిన్లేదని ఒక రిక్షా కార్మికుడు వాదనకి దిగాడు. ‘‘ఇప్పుడు విన్నా వుగా’’ అంటూ సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. ‘‘నవ్వులో ఆనందం ఉంది. అదే విధంగా ఆనందంలో నవ్వు ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాల’’ అనగానే ‘‘ఆయన నవ్వడం నేనెప్పుడూ చూడనేలేదురా’’ అన్నాడు నిష్టురంగా. ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’అని మరోసారి సర్ది చెప్పాడు. ‘‘ఇది కాదుగాని, చూడగా చూడగా ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్‌గా మారి పోతోందని నాకు సందేహంగా ఉందండీ’’ అంటూ ఒక పెద్దాయన ఇంద్రకీలాద్రి మొగలో నిలబడి టాపిక్ మార్చాడు. ‘‘అదెలాగ’’ అన్నాను. గోదావరి పుష్కరాలు మహోధృతంగా సాగినాయి. నెల్లాళ్లు ఆధ్యాత్మిక శోభ. దర్భలు, పిండాలు, స్నానాలతో గడిచింది. ఆనక కృష్ణా పుష్కరం. పైగా గోదావరి అంత్య పుష్కరం వచ్చి పడింది. ఆ రెండు పుణ్యనదులు బాబుగారి పుణ్యమా అని సంగమించి మహాతీర్థమై కూచుంది. ఇదంతా ఒక నెలపాటు శ్రాద్ధ విధులతో, మంత్రాలతో తల్లడిల్లింది. రకరకాల హారతులతో మహానది వెలిగిపోయింది. ఇంతలో వినాయక ఉత్సవాలు ఓ రెండువారాలు భక్తిలో జనాన్ని ముంచెత్తాయి. ఆ పందిళ్లలోనే ఇప్పుడు అమ్మవారిని నిలుపుతున్నారు. శరన్నవరాత్రులు! ఇక కొండ మీదా సందడే. కొండకిందా సందడే. ఆయన సామాన్యుడు కాదు. అవసరమైతే బోలెడు కొత్త పండుగలు పుట్టించి ఆధ్యాత్మికాంధ్రప్రదేశం చేయడం ఖాయం’’ అంటూ అక్కడనించే దుర్గమ్మకి దణ్ణం పెట్టాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
రోడ్డెక్కిన పుష్కర పనుల కాంట్రాక్టర్లు
నరసాపురం : గోదావరి పుష్కరాల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. సోమవారం నరసాపురంలో రిలే దీక్షలు ప్రారంభించారు. పనులు పూర్తి చేసి ఏడాది దాటినా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తాము అప్పుల ఊభిలో కూరుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, గోరు సత్తిబాబు మాట్లాడుతూ పుష్కరాల సమయంలో తక్కువ సమయంలో పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని, అధికారుల ఒత్తిడి కారణంగా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని, పుష్కరాలు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో రూ.లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పనులు చేశామని, పనులు పూర్తి చేసి 14 నెలలు అయినా బిల్లులు ఇవ్వకపోవడంతో తెచ్చిన అప్పుల కంటే వడ్డీలు ఎక్కువయ్యాయని వాపోయారు. సుమారు రూ. 7 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. తొలిరోజు దీక్షలో కాంట్రాక్టర్లు యర్రంశెట్టి పార్ధసారధి, గుగ్గలపు శివరామకృష్ణ, అడబాల బాబులు, యాతం పెద్దిరాజు, చినిమిల్లి మురళీకృష్ణ, కంబాల మామాజీ, ఆచంట మూర్తి, కొండ్రెడ్డి బాబు, పెరికల హరిబాబు తదితరులు కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
పుష్కరాల పుణ్యం.. అందని భత్యం!
⇒ పుష్కర విధులకు వెళ్లిన అధికారులకు అందని భత్యం ⇒ గోదావరి పుష్కరాలకు ఏడాది ⇒ పంపేశామంటున్న ఉన్నతాధికారులు ⇒ రాలేదంటున్న జిల్లా అధికారులు ⇒ బాధ నేరుగా చెప్పుకోలేక ఆకాశ రామన్న ఉత్తరాలు పన్నెండేళ్లకోమారు పుష్కరాలు వస్తే... ఒక్క మునకతోనే పుణ్యం వస్తుందంటూ వేలాదిమంది పరుగులు పెడతారు. అదే డెప్యుటేషన్‌పై విధి నిర్వహణ నిమిత్తం వెళ్లినవారైతే రోజూ మునకలు చేయొచ్చు. ఇక వారికి లెక్కనేనంత పుణ్యం లభిస్తుందనుకున్నారో ఏమో.. వారికివ్వాల్సిన భత్యం మాత్రం చెల్లించలేదు. గోదావరి పుష్కరాలకు ఏడాది పూర్తయ్యాయి. తాజాగా కృష్ణా పుష్కరాలు ముగిసిపోయాయి. కానీ నాటి భత్యం గురించి మాత్రం నోరు మెదపడంలేదు. డబ్బులిచ్చేశామని ఉన్నతాధికారులు చెపుతుండగా.. రాలేదని ఇక్కడి అధికారులు సెలవిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆకాశరామన్న ఉత్తరం ద్వారా ఉద్యోగులు తమ విలాపం తెలియజేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాలు.... ఈ ఏడాది కష్ణాపుష్కరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి విస్తతంగా చేపట్టిన ప్రచార పుణ్యమాని ఎక్కడెక్కడినుంచో జనం వెళ్లి మునకలు పూర్తి చేశారు. వారికి పుణ్యఫలం దక్కిందో లేదోగానీ... అక్కడి సేవలందించే తహసీల్దార్లు... ఉపతహసీల్దార్లకు మాత్రం గత ఏడాది నిర్వహించిన పుష్కరసేవల భత్యం ఇప్పటికీ అందలేదు. అదేంటి? ఎంతో ఖర్చు చేసిన పెద్ద కార్యక్రమ బాధ్యతను తమ భుజస్కంధాలపై మోసిన అధికారులకు ఇంకా భత్యం చెల్లించలేదా అని ఆశ్చర్యపోతున్నారా? విషయమేమంటే ఆ నిధులు పంపించేశామని విజయవాడలోని ఉన్నతాధికారులు చెబుతుంటే అసలు రాలేదని ఇక్కడి అధికారులు చెప్పడం విశేషం. మిగతా జిల్లాలవారికి అందినా.. గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో సేవలకు ఇక్కడినుంచి పదిమంది తహసీల్దార్లు, మరో 15మంది ఉప తహసీల్దార్లు రెండు రోజుల ముందే అక్కడకు వెళ్లారు. పుష్కరాలు ముగిశాక ఇక్కడకు వచ్చిన వారంతా తమకు రావాల్సిన టీఏ, డీఏలకోసం బిల్లులు పెట్టుకున్నారు. కానీ ఒక్క అధికారికీ పైసా కూడా ఇవ్వలేదు. మిగతా జిల్లాల అధికారులకు మాత్రం ఈ బిల్లులు అందినా... ఇక్కడివారికి ఎందుకో ఇవ్వలేదు. ఇప్పటికీ వాటికోసం అడుగుతున్న అధికారులకు డబ్బులు రాలేదన్న సమాధానమే వస్తోంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 5వేలకు పైగానే చెల్లించాల్సి ఉంది. పలుమార్లు అడుగుతున్నా లేదన్న సమాధానం రావడంతో కొందరు తహసీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి కలెక్టరేట్‌ను సంప్రదించగా.. వారు ఆ డబ్బులు ఎప్పుడో డ్రాఫ్ట్ తీసి జిల్లాకు పంపించేసినట్టు చెప్పారని తెలుసుకున్నారు. అయితే ఇక్కడి ఉన్నతాధికారులను అడగలేక ఓ ఆకాశ రామన్న ఉత్తరం రాశారు. పేరు పొందుపరచకుండా వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రి మణాళిని, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, మీడియా ప్రతినిధుల పేరున ఆ లేఖలు పంపించారు. ఇలా గోదావరి పుష్కరాల్లో సేవలందించిన జిల్లాకు చెందిన వారికి సుమారు రూ. 10లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రీ పగలు నిద్రలు లేనిరాత్రులు కూడా గడిపి సేవలందిస్తే కష్ణా పుష్కరాలు కూడా వచ్చి వెళ్లిపోయినా ఇంకా నిధులు రాలేదని చెప్పడంపై వీరు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ బిల్లులు వచ్చాయా? రాలేదా? అన్న అంశంపై కొద్దిపాటి విచారణ చేస్తే విషయం తెలుస్తుంది. అప్పుడయినా వీరికి బిల్లులు అందే అవకాశం లేకపోలేదని సంబంధిత అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు
విచారణను నాన్చుతున్న ప్రభుత్వం సాక్షి, రాజమహేంద్రవరం: గతేడాది జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాల మొదటి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మరో ఎత్తుగడకు దిగుతోంది. ఘటనపై విచారణ కోసం నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గడువును గురువారం రెండోసారి పొడిగించింది. నాటి ఘటనలో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏక సభ్యకమిషన్‌ను నియమించింది. 2016 మార్చి 29న నివేదిక ఇవ్వాలని గడువు విధిస్తూ.. కమిషన్‌కు ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకుండా జాప్యం చేయించింది. దీంతో కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జూన్ 29 వరకు 3 నెలలు గడువు పెంచుతూ నెల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ పలుమార్లు విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేసిన వారు సాక్ష్యాలు కమిషన్‌కు సమర్పించారు. ప్రభుత్వ శాఖలు సమర్పించ లేదు. విచారణలో ఏఏ శాఖలు ఆధారాలు సమర్పిస్తాయో తెలపాలని కమిషన్ ఆదేశించడంతో కలెక్టర్ తొమ్మిది శాఖల పేర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29 వరకు గడువు పొడిగించారు. -
కరీంనగర్లో గోదావరి అంత్యపుష్కరాలు
-
గోదావరి నమోస్తుతే
ఆరో రోజు ప్రదోశకాల హారతి మంగపేట ఘాట్‌వద్ద భక్తుల పుష్కరస్నానాలు మంగపేట : గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం ఆరో రోజు సాయంత్రం పూజారులు గోదారమ్మకు ప్రదోశకాల హారతినిచ్చారు. ఉదయం వేళలో భక్తులు కార్లు, ప్రైవేట్ వాహనాల్లో మంగపేట పుష్కరఘాట్‌కు తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరిం చారు. ఈ సందర్భంగా మహిళలు గోదావరి వద్ద కొబ్బరికాయలు కొట్టి, నదిలో పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలు, పండ్లు, జాకెట్, గాజులు నీటిలో వదిలారు. కొందరు భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. -
భక్తులు అంతంతమాత్రమే
వచ్చిన వారికి కూడా సౌకర్యాలు లేవు మంగపేట, ఏటూరునాగారం: వరంగల్ జిల్లాలో గోదావరి అంత్యపుష్కరాలకు భక్తులు పెద్దగా రావడం లేదు. సోమవారం మంగపేట ఘాట్‌కు సుమారు 250 మంది వస్తే..ఏటూరునాగారం మండలం రామన్నగూడెం ఘాట్‌కు వందలోపే వచ్చారు. దేవాదాయ శాఖ కూడా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. వచ్చిన భక్తులు కూడా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పుష్కరస్నానాలు చేసిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేవు. పుష్కరస్నానం పూజలు, పిండ ప్రదానం కార్యక్రమాలను నిర్వహించేందుకు స్థానిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పూజారులు అందుబాటులో ఉంటున్నారు. మంగపేట ఘాట్‌కు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు వచ్చారు. గోదావరి నదిలో మహిళలు పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలను సమర్పించారు. సాయంత్రం గోదావరికి అర్చకులు హారతి ఇచ్చారు. -
చంద్రబాబుతో బోయపాటి శ్రీను భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను బుధవారం భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. కాగా గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా బోయపాటి...తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ జరిగిన తొక్కిసలాటలో 30మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కృష్ణా పుష్కరాల హారతికి సంబంధించి బోయపాటే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. నటుడు సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుష్కర పనుల్లో రూ.కోట్ల దోపిడీ
-
పుష్కర పనుల్లో రూ.కోట్ల దోపిడీ
► పచ్చ నేతలకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగింత ► స్మార్ట్ పల్స్ సర్వేను వెంటనే నిలిపివేయాలి ► ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: రాష్ట్రంలో సాగుతున్న దోపిడి దందాకు ఉదాహరణగా కృష్ణా పుష్కర ఏర్పాట్లు నిలుస్తాయుని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కోట్లు దోపిడి చేయుడం కోసం టెండర్లు పిలవడంలో జాప్యం చేసి నామినేషన్ పద్ధతిలో తనకు అనూకులమైన వారికి పనులను చంద్రబాబు కేటాయిస్తూ కోట్లు దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన గోదావరి పుష్కరాల్లో మొదటి రోజే పుష్కారాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమై 29 వుంది అవూయుకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడంతో పాటు 51 వుంది గాయపడటానికి కారుకులైయ్యారు. వురోసారి అదే తరహాలో సీఎం చంద్రబాబు తానే ధర్మకర్త అన్న రీతిలో వ్యవహరిస్తారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయూలన్న సాకుతో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే పనులు చేపడుతున్నారని తెలిపారు. స్మార్ట్ పల్స్ సర్వేను వెంటనే నిలిపివేయాలి: స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను స్మార్ట్‌గా మోసగించడానికి సిద్ధమైరుుందని ఎమ్మెల్యే తెలిపారు. సర్వే పై ప్రజల్లో అనేక అనువూనాలు ఉన్నాయుని, బైక్, సెల్‌ఫోన్, ఫ్రిజ్ తదితర వస్తువులు వినియోగిస్తే వారికి బియ్యుం, ఇంటి స్థలాలు కూడా రాకుండా చూడాలని కుట్ర పన్నుతున్నారని సూచించారు. సర్వే ప్రారంభించినప్పటి నుంచి వుండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సవూవేశంలో పార్టీ జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, జోగి సంఘం రాష్ట్ర నాయుకులు జోగి వెంకటేష్, సుబ్బయ్యు, జడ్పీటీసీలు లలితవ్ము , తిప్పయ్యు తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లను వాళ్లే తొక్కుకుని చనిపోయారా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఏడాది గడిచిపోయింది.. అయినా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎవరినీ వదలడం లేదు. గోదావరి పుష్కరాల్లో మొట్టమొదటి రోజునే పుణ్యస్నానం చేయాలని.. అది కూడా రాజమండ్రి అయితేనే పుణ్యఫలం దక్కుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. పన్నెండు కాదు.. పన్నెండు పన్నెండ్లు 144 ఏళ్లకోసారి మాత్రమే వచ్చే మహా పుష్కరాలని, అందువల్ల వీటిలో స్నానం చేయకపోతే ఇక జన్మ జన్మలకు ఆ అవకాశం రాదని కూడా చెప్పారు. అయితే.. కేవలం ఒక్క వ్యక్తి ప్రచార ఆర్భాటం వల్ల ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముఖ్యమంత్రి ప్రత్యేకపూజలు చేస్తున్నారని, అందువల్ల భక్తులంతా కాసేపు ఆగాలని చెబుతూ గేట్లు మూసేసి మరీ ఆపేశారు. వందలు కాదు.. వేలాది మంది భక్తులు సరస్వతి ఘాట్ వద్దకు వచ్చారు. అక్కడకు కూతవేటు దూరంలోనే వీవీఐపీ ఘాట్ ఉన్నా కూడా దాన్ని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరస్వతి ఘాట్ వద్దకే వచ్చారు. ఉదయం 6.00 గంటల నుంచి 7.30 వరకు అంటే, గంటన్నర పాటు ఆయన అక్కడే ఉన్నారు. నిజానికి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అక్కడకు చేరుకున్నా, ముఖ్యమంత్రి వస్తున్నారన్న కారణంగా ముందే గేట్లు మూసేసి అందరినీ అక్కడే ఆపేశారు. ముఖ్యమంత్రి వెళ్లీ వెళ్లగానే ఒక్కసారిగా గేట్లు తీయడంతో విపరీతమైన తొక్కిసలాట జరిగింది.. దాంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంత మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఊపిరాడక నలిగిపోయారు. ఇంత జరిగినా.. పుష్కరాల దుర్ఘటనకు ఎవరు బాధ్యులన్న విషయం ఏడాది తర్వాత కూడా తేలలేదు. దీనిపై వేసిన కమిషన్ గడువు రెండుసార్లు పొడిగించినా, చివరకు ఎవరూ ఆ కమిషన్‌కు సహకరించకపోవడంతో విషయం ఏమీ తేల్చకుండానే వదిలేశారు. దీంతో సోషల్ మీడియా ఈ ఘటన, అనంతర పరిణామాలపై భగ్గుమంది. పుష్కరాల్లో భక్తులు వాళ్లకు వాళ్లే, వాళ్లను వాళ్లే తొక్కుకుని చనిపోయారని.. దీనిపై చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాజకీయాలు చేయడం ఎందుకంటూ తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారో నెటిజన్. నిజానికి అదంతా ఫక్తు వెటకారం. ఎలాంటి కారణం లేకుండా భక్తులు తమను తామే తొక్కుకుని చనిపోవడం ఉండదని తనదైన శైలిలో చెప్పారు. చంద్రబాబు పాలనా తీరుకు దీనికంటే నిదర్శనం అక్కర్లేదని, గోదావరి పుష్కరాలు వెళ్లిపోయి కృష్ణాపుష్కరాలు కూడా వచ్చేస్తున్నా ఇంతవరకు పాత ఘటనకు ఎవరు బాధ్యులో తేల్చడం గానీ, వాళ్లను శిక్షించే ప్రయత్నం గానీ జరగలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇంకొందరైతే.. గోదావరి పుష్కరాల సమయంలో ఒక దర్శకుడితో చంద్రబాబు సినిమా షూటింగ్ తీయించుకున్నారని, ఈసారి కృష్ణా పుష్కరాల్లో ఎవరితో సినిమా షూట్ చేయిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే సీఎం చంద్రబాబు ఏ పుష్కర ఘాట్‌లో స్నానం చేస్తున్నదీ ముందుగానే ప్రకటిస్తే.. అటువైపు ఎవరూ వెళ్లకుండా వేరే ఘాట్లు చూసుకుని స్నానాలు చేస్తారని అంటున్నారు. ఇక కృష్ణా పుష్కరాలకు కూడా గతంలో గోదావరి పుష్కరాలకు చేసినట్లుగా ప్రచార ఆర్భాటం చేయకుండా భక్తులను తమ మానాన తాము ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోనివ్వాలని ఇంకొందరు వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో మాత్రం పుష్కరాలు, చంద్రబాబునే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. -
' గోదావరి పుష్కరాల నివేదికను బయట పెట్డండి'
హైదరాబాద్: కృష్ణా పుష్కరాల లోపు రాజమండ్రి పుష్కర తొక్కిసలాట నివేదిక బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రచార యావ కారణం గానే పుష్కరాల్లో 29 అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సంవత్సరం పూర్తయినా విచారణ నివేదిక ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నా దానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
ఆ దుర్ఘటనను ఇంకా మర్చిపోలేదు..
హైదరాబాద్ : గోదావరి పుష్కర దుర్ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి 30మంది బలయ్యారన్నారు. తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన సోమయాజులు కమిటీ ఇప్పటివరకూ చంద్రబాబును విచారించలేదన్నారు. దీన్నిబట్టే కమిషన్ నివేదిక ఏవిధంగా ఉంటుందో చెప్పవచ్చని ఆయన అన్నారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో 30మంది మరణిస్తే, కృష్ణా పుష్కరాల ప్రారంభానికి ముందే 30 గుళ్లను కూల్చేశారని పార్ధసారధి మండిపడ్డారు. ఇక పుష్కరాల పేరుతో అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగానే పుష్కర పనుల్లో జాప్యం చేసి, నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్ట్‌లు ఇవ్వడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు. పుష్కర నిధులపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా గోదావరి పుష్కరాల దుర్ఘటన జరిగి నేటికి ఏడాది అయింది. godavari pushkaralu stamped, Justice Cy Somayajulu committee,chandrababu naidu, గోదావరి పుష్కరాల తొక్కిసలాట, జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్, చంద్రబాబు నాయుడు -
ఆ కుటుంబాల్లో తీరని శోకం
విశాఖపట్నం: పుష్కర స్నానానికి వారు రాజమహేంద్రవరం వచ్చారు. ఆ పుణ్యకార్యాన్ని పూర్తి చేద్దామని పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ఇంతలో తోపుటలాట జరిగింది. ఆ తోపులాటలో వారు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది జూలై 14న ప్రారంభమైన గోదావరి పుష్కారాల్లో జరిగిన తొక్కిసలాటలో విశాఖ జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మధురవాడ సమీపంలోని మారికవలసకు చెందని అవ్వ బంగారమ్మ, ఆమె కుమార్తె గౌరి, సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి, పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ, గాజువాకకు చెందిన పాండవుల విజయలక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మహిళలే. ఆ విషాద సంఘటనకు నేటి కి ఏడాది కావడంతో ప్రథమ వర్ధంతికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆడ దిక్కు లేకపోతే వెలితే.. మధురవాడ దరి మారికవలస జేఎన్ఎన్యూఆర్ఎం ఇంట్లో ఉంటున్న ఆటో డ్రైవరు అవ్వ కృష్ణ పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో భార్య ఎ.బంగారమ్మ, కుమార్తె ఎ.గౌరిని కోల్పోయాడు. ఇంటి దీపం దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ‘‘భార్య, కుమార్తెలు జ్ఞాపకాలు మరువలేక పోతున్నాం.. ఇంటికి ఆడ దిక్కులేకపోతే వెలితే.. ఎప్పుడూ సందడిగా ఉండే మా ఇల్లు బోసిపోయింది. కుమార్తె నవ్వులు దూరమయ్యాయి. మా ఇంట్లో ఆ విషాదచాయలు ఇంకా పోలేదు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు’’ అని తండ్రీకుమారుడు బాధాతప్త హృదయాలతో చెబుతున్నారు. ప్రథమ వర్ధంతికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అక్క కొల్లి దాలమ్మ, వదిన గంగమ్మల సాయంతోనే నెట్టుకు వస్తున్నామని చెప్పారు. బతుకు తెరువుకు నగరానికి వచ్చి.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సరవవిల్లి సమీపంలోని అవ్వపేట వీరి స్వగ్రామం. బతుకు దెరువు కోసం కృష్ణ కుటుంబం 1995లో విశాఖపట్నం వలస వచ్చింది. అతడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 1995లో మారికవలసలో ఇల్లు రావడంతో అక్కడ నివాసం ఉంటున్నారు. ఇంతలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ప్రస్తుతం తండ్రీకుమారులిద్దరే అక్కడ ఉంటున్నారు. ఆటో నడుపుతూ కుమారుడు రాంబాబును డిప్లమో చదివించాడు. కృష్ణ వదిన గంగమ్మ వీరికి వండిపెడుతోంది. -
ఆరని కన్నీటి చారిక
ఏడాదైపోయింది... అయినా ఆ పుణ్య గోదారి గట్టుపై కన్నీరు ప్రవహించిన క్షణాలు ఇంకా ఎవరూ మరిచిపోలేదు. వేలాది మంది మధ్య ఆ అభాగ్యులు చేసిన ఆర్తనాదాలు ఎవరి చెవినీ విడిచి పోలేదు. పుణ్యం కోసమని వెళ్లి కన్ను మూసిన ఆవేదనాభరిత సంఘటనలు ఎవరి మదిలోనూ చెరిగిపోలేదు. గత ఏడాది ఇదే రోజు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. అందులో జిల్లా వాసులు తొమ్మిది మంది చనిపోయారు. ఆ కుటుంబాలు ఏడాది దాటినా ఇంకా తేరుకోలేదు. వారి రోదనలు ఇంకా ఆగలేదు. ఆర్థిక సాయాలు, పరామర్శలు, సానుభూతులు వారి బాధను దూరం చేయలేకపోతున్నాయి. కొడుకును కోల్పోయి ఒకరు, తల్లిని కోల్పోయి మరొకరు, కుటుంబాన్నంతా కోల్పోయి మరొకరు పడుతున్న వేదన ఏ కొలమానానికీ అందనిది. వీరి కన్నుల్లో గోదావరి ఇంకా ప్రవహిస్తోంది. ఆ కన్నీటి ప్రవాహానికి ఈ కథనాలే సాక్షి. ఆమదాలవలస: ఏడాది అయ్యింది. ఉత్సాహంగా గోదావరి పుష్కరాలకు వెళ్లిన వారు ఊపిరి అక్కడే వదిలేసి వచ్చి. ఘటన జరిగి ఏడాదైనా మృతుల కుటుంబాల్లో కన్నీరు ఇంకా ఆగలేదు. తమ కుటుంబ సభ్యులకు ఇప్పటి కీ మరువలేకపోతున్నామని ఆమదాలవలస పట్టణానికి చెందిన వారంటున్నారు. పట్ణణంలో కొత్తవీధిలోగల పొట్నూరు అమరావతి, ఆమె చెల్లెలు పొట్నూరు లక్ష్మి, తల్లి కొత్తకోట కళావతి (సంతకవిటి మండలం, బొద్దూరు గ్రామం), కళావతి మనుమడు బరాటం ప్రశాంత్(శ్రీకాకుళం బలగ)మరో పదిమంది కుటుంబ సభ్యులు గత ఏడాది జూలై 13న ఆమదాలవలసలో రెలైక్కి గోదావరి పుష్కరాలకు వెళ్లారు. రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న అమరావతి కుమారుడు నవీన్(బ్యాంకు టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటున్నాడు) గదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని ఉదయాన్నే నాలుగు గంటలకు బయల్దేరి పుష్కర ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పైన తెలిపిన నలుగురూ మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆమదాలవలస ఉలిక్కిపడింది. అన్నింటా అమ్మే... ‘నాకు ఊహ తెలిసిన నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా నన్ను, తమ్మడిని అమ్మే పెంచింది. గోదావరి పుష్కరాలకు నాన్న పొట్నూరి వీరబ్రహ్మం, అమ్మ అనంతలక్ష్మి, తమ్ముడు సాయిభరత్కుమార్ కలిసి వెళ్లాం. అక్కడ పుష్కరాల్లో మొదటిరోజు జరిగిన తొక్కిసలాటలో అమ్మ చనిపోయింది. అమ్మ లేకపోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అమ్మ జ్ఞాపకాలే ముందుకు నడిపిస్తున్నాయి.’ అని శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి హరిణి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతలక్ష్మి భర్త వీరబ్రహ్మం మాట్లాడుతూ లక్ష్మి జ్ఞాపకాలతోనే బతుకుతున్నట్లు చెప్పారు. బతుకు తెరువుకోసం ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వచ్చామని, తనకు మొదటి నుంచి అన్నింటా చేదోడువాదోడుగా ఉన్న భార్య చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ప్రశాంత్ జ్ఞాపకాలతోనే... మా కుమారుడు బరా టం ప్రశాంత్‌కుమార్ జ్ఞాపకాలతోనే ఇంకా మేం ఉన్నాం. మేము కూరగాయల షాపు పెట్టుకొని శ్రీకాకుళం నగరంలో జీవనం సాగిస్తున్నాం. మా కుమార్తె సుప్రియ శ్రీచైతన్య కళాశాలలో ఇంట ర్మీడియెట్ చదువుతోం ది. కుమారుడు ప్రశాంత్ 7వ తరగతి చదవుతుండగా, ఈ దుర్ఘటన జరిగింది. తాను పెద్దయ్యాక పోలీస్ అవుతానని ఇంట్లో అందరితో ప్రశాంత్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఇంట్లో ఏ పనిచేసినా, చేసు ్తన్నా ప్రశాంత్ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఈనెల 14కు ఏడాది అవుతుండడంతో నగరంలోని అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచే శాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన రూ.12 లక్షలను పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులో ఫిక్స్డ్ చేశాం. - బరాటం కామేశ్వరరావు, ఇందిర అమ్మ లేని జీవితం అంధకారం వంగర: అమ్మ లేని జీవితం అంతా అంధకారం ఉందని మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభుక్త రాము, లచ్చుభుక్త వెంకటరావులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో తల్లి లచ్చుభుక్త పారమ్మ(65) మృతి చెందిన ఘటన ఇంకా మరువలేకపోతున్నామని వారు విలపిస్తున్నారు. ‘ఇంటి కష్టసుఖాలన్నీ మా అమ్మగారే చూసుకునేవారు, ఆమె మృతితో మేం ఇంటి పెద్దను కోల్పోయాం. ఆర్థిక సాయం అందింది. కానీ అమ్మ లేని లోటు ఎలా తీరుతుంది’ అని గద్గద స్వరంతో గతాన్ని వారు గుర్తు చేసుకున్నారు. -
ఔను... తొక్కేశారు!
జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు ఆధారాలు ఇవ్వని అధికారులు మరో రెండు వారాల గడువు కావాలని విన్నపం నేటితో పూర్తి కానున్న కమిషన్ కాల పరిమితి రాజమహేంద్రవరం క్రైం : పుష్కర తొక్కిసలాటపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్‌కు సమర్పించకుండా ప్రభుత్వ శాఖలు ఆధారాల ను తొక్కిపెట్టాయి. కమిషన్ గడువు బుధవారంతో ముగియనున్నప్పటికీ మంగళవారం జరిగిన విచారణలో ఊహించినట్టుగానే ఆధారా ల సమర్పణకు ప్రభుత్వ శాఖలు మరో రెండు వారాల గడువు కోరడం గమనార్హం. దీనిపై ‘సాక్షి’లో కథనం వచ్చిన విషయం విదితమే. గడువు విషయం ఎలా ఉన్నప్పటికీ కనీసం ఆధారాలిచ్చే ప్రభుత్వ శాఖల వివరాలు ఇవ్వా లని కమిషన్ కోరగా, ఆ మేరకు శాఖల జాబితా ను జస్టిస్ సోమయాజులుకు సమర్పించాయి. కాగా బుధవారంతో గడువు ముగుస్తున్నందున కమిషన్ కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు జస్టిస్ సోమయాజులు తెలిపారు. ప్రభుత్వం గడుపు పొడిగిస్తే ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం కమిషన్ మరోసారి బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వ శాఖ లు ఎప్పుడు ఆధారాలు సమర్పిస్తాయని ప్రభు త్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావును జస్టిస్ సోమయాజులు ప్రశ్నించారు. పుష్కర ఏర్పాట్లలో వివిధశాఖలు నిమగ్నమయ్యాయని, అవి ఒకచోట లేనందున ఆధారాలు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆ వీడియోలు తీసుకోవాలి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ చానల్ (ఎన్జీసీ) చిత్రీకరించిన వీడియోలను ప్రభుత్వ శాఖలు తీసుకోవచ్చని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిషన్‌కు సూచించారు. ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో రికార్డింగ్ లేదని చెబుతున్న దృష్ట్యా, కనీసం ఎన్జీసీ వీడియో క్లిపింగులైనా కమిషన్‌కు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సెక్షన్-14 ప్రకారం ఏ శాఖ నుంచైనా ఆధారాలు రప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు. ఘటనపై సబ్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని కోరారు. కమిషన్‌కు సహాయకుడిగా మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. విచారణలో కాంగ్రెస్ లీగల్‌సెల్ నాయకుడు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, డీఎస్పీలు రామకృష్ణ, కులశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాచార శాఖ వద్ద ఆధారాలు ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా సమాచార శాఖ వీడియోలు, ఫొటోలు చిత్రీకరిస్తుందని, పుష్కర తొక్కిసలాటపై సమాచార శాఖ తీసిన వీడియోలు, ఫొటోలను కమిషన్ పరిశీలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.అరుణ్ కమిషన్‌ను కోరారు. ప్రచార ఆర్భా టం కోసం పుష్కర ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. గోదావరిపుష్కర ఫొటోఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. లక్ష్యం నెరవేరదు పుష్కర తొక్కిసలాట ఎలా జరిగింది, దీనికెవరు బాధ్యులనేది తేల్చకపోతే కమిషన్ లక్ష్యం నెరవేరదని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు పేర్కొన్నారు. దుర్ఘటన ఎలా జరిగింది, కారణాలేమిటి, కారకులు ఎవరనేది తేల్చాలని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చాక పుష్కర ఘాట్ గేటు ఎవరు మూసేశారు, రెండున్నర గంటల తర్వాత ఎవరు తీశారనేది తేలాలని తెలిపారు. అంత్య పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఉన్నందున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ ఇచ్చే సూచనలు మార్గదర్శకంగా ఉండాలని చెప్పారు. సీఎం అక్కడెందుకు వచ్చారు? దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన కోటిలింగాల ఘాట్‌తో పాటు వీఐపీ తదితర ఘాట్లుం డగా.. సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లోకి ఎందుకొచ్చారని న్యాయవాది, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ నగర కన్వీనర్ వెండ్రపగడ ఉమామహేశ్వరి ప్రశ్నించా రు. సీఎంను ఎవరు తప్పుదారి పట్టించారని, ఆయన పర్యటనను ఎవరు ఖరారు చేశారనేది నిగ్గు తేల్చాలని కోరారు. -
పుష్కర తొక్కిసలాటపై ఇప్పటికీ ఆధారాలివ్వని యంత్రాంగం
29 మంది బలైన ఘోరంపై క్షమార్హం కాని అలసత్వం ఏకసభ్య కమిషన్ ముందు వాయిదా మంత్రజపం రేపటితో ముగియనున్న కమిషన్ గడువు నేడు రాజమహేంద్రవరంలో మరోసారి విచారణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని ప్రగల్భాలు పలుకుతూ, ‘గాలిలో బొమ్మలు గీసి’ ఊరిస్తున్న ప్రభుత్వం.. 29 నిండు ప్రాణాలు గాలిలో కలిసిన దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. కారణమేంటో, కారకులెవరో తేల్చలేదు. పుష్కరుడు గోదావరి జలాల్లో ప్రవేశించే పుణ్యఘడియల్లో స్నానమాచరించాలని గంటల తరబడి నిరీక్షించిన వారిపై మృత్యువే తొక్కిసలాట రూపంలో పాశం విసిరింది. అంత ఘోరం జరిగితే దానికి గల అసలు కారణాలను తొక్కేసేందుకు యత్నిస్తున్నట్టుంది అధికార యంత్రాంగం తీరు. కాకినాడ : గత జూలై 14న గోదావరి పుష్కరాల ప్రారంభం నాడు రాజమహేంద్రవరం పుష్కరఘాట్వద్ద జరిగిన తొక్కిసలాట, అనంతర పరిణామాలకు బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన దుర్ఘటనపై విచారణకు నియమించిన జస్టిస్ సోమయూజులు ఏకసభ్య కమిషన్‌కు కూడా నివేదించారు. సీఎం వీఐపీలకు కేటాయించిన ఘాట్‌లో కాక సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో సుమారు గంటపాటు పిండప్రదానాలు చేయడం, ఆయన వెళ్లిపోయే వరకూ లక్షలాది మంది భక్తులను గేటు బయటే నిలిపి ఒకేసారి అనుమతించడం, టెలీఫిల్మ్ నిర్మాణం కోసం కూడా భక్తులు వెల్లువలా ఒకేసారి ఘాట్‌కు వచ్చేలా నిలిపివేయడం ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగమవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీఎం సమక్షంలో జరిగినందునే.. దుర్ఘటన జరిగిన కొన్నినెలల తరువాతే ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15న జస్టిస్ సోమయాజులు కమిషన్ నియమించింది. కమిషన్ మొదటిసారి ఈ ఏడాది జనవరి 18న బహిరంగ విచారణ జరపగా మొదటి అఫిడవిట్‌ను ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు వేశారు. తరువాత 18 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. రెండోసారి ఫిబ్రవరి 23న, మూడోసారి మార్చి 21న బహిరంగ విచారణ నిర్వహించాక కమిషన్ కాలపరిమితి ముగియడంతో సర్కారు మరో మూడు నెలలు కమిషన్ గడువు పెంచింది. అనంతరం జూన్ 18, 21న రెండు పర్యాయాలు విచారణ నిర్వహించగా అఫిడవిట్లు దాఖలు చేసినవారు సమర్పించిన ఆధారాలు, సీడీలను కమిషన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో పరిశీలించింది. తిరిగి 23న బహిరంగ విచారణ చేపట్టారు. కమిషన్‌కు ఆధారాలు సమర్పించేందుకు ప్రభుత్వం మరో రెండు వారాలు గడువు కోరడంతో తిరిగి జూన్ 28కి విచారణ వాయిదా వేసింది. కాగా కమిషన్ గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇన్నిసార్లు విచారణ నిర్వహించినా అధికారులు దుర్ఘటనకు సంబంధించి ఒక్క ఆధారం కూడా అందజేయకపోవడం గమనార్హం. పుష్కర దుర్ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనమైనా, చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరగడంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్నే జపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే విచారణలో అధికారులు ఏం చేస్తారో చూడాలి. సీఎంను విచారణకు పిలవాలి.. తొక్కిసలాటప్పుడుఘాట్లో ఉన్న ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షి అని, పుష్కరాలను రాజమహేంద్రవరం నుంచి పర్యవేక్షించిన సీఎం తానే ఐ విట్నెస్ అని విలేకరుల సమావేశంలో తెలిపారని, అలాంటి సీఎంను బహిరంగ విచారణకు పిలవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీబార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు విచారణ జరిపినా జిల్లా యంత్రాంగం నుంచి కనీస సమాచారం, ఆధారాలు అందజేయకపోగా, ఇప్పుడు మరోసారి మూడు నెలల గడువు కోరడాన్ని అఫిడవిట్ దాఖలు చేసిన ముప్పాళ్ల తదితరులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 29న కమిషన్ గడువు ముగిసిపోనున్న తరుణంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ కమిషన్ గడువును మరో మూడు నెలలు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం విస్మయాన్ని కలిగిస్తోంది. కమిషన్ అనేక పర్యాయాలు విచారణ జరిపినా ఆధారాలు ఇవ్వలేని యంత్రాంగం మరో మూడు నెలలు పొడిగిస్తే మాత్రం ఇస్తుందనే గ్యారంటీ ఏమిటని అఫిడవిట్లు దాఖలు చేసిన వారు ప్రశ్నిస్తున్నారు. తప్పిదాలు బయట పడతాయనే జాప్యం పుష్కరాల సందర్భంగా అధికారుల తప్పిదాలు బయట పడతాయనే కమిషన్‌కు ఆధారాలు సమర్పించడంలో జాప్యం చేస్తున్నారు. కలెక్టర్ తాను ఇచ్చిన తొలి నివేదికలో ఆధారాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎప్పుడైనా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే కలెక్టర్ మరో మూడు నెలలు గడువు కోరడం గమనార్హం. అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారు. పుష్కరాలకు లక్షలాది రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తీరా ఇప్పుడు దానిలో రికార్డింగ్ చేయలేదని బుకాయిస్తున్నారు. దుర్ఘటన నాడు నేషనల్ జియోగ్రఫిక్ చానల్ చిత్రీకరించిన చిత్రాలను బయటపెట్టాలి. వాస్తవాలు బయట పెట్టకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అర్థమవుతుంది. కమిషన్ గడువు ముగుస్తున్నందున అధికారులు ఆధారాలు సమర్పించి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు -
పుష్కర తొక్కిసలాటపై నేడు బహిరంగ విచారణ
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆధారాల పరిశీలన ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు నెలాఖరుతో ముగియనున్న కమిషన్ కడువు రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది జూలై 14వ తేదీన జరిగిన తొక్కిసలాటపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీవై సోమయాజులు ఏక సభ్య కమిషన్ మంగళవారం మరోసారి బహిరంగ విచారణ చేపట్టనుంది. పుష్కర తొక్కిసలాటలో 29 మృతి చెందగా 52 మంది వరకూ గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ గడువు గత మార్చి 29తో ముగియగా మరో మూడు నెలలు గడువు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ పెంచిన గడువు కూడా ఈ నెల 29తో ముగిసిపోతోంది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని ఈ విషయంలో విచారించలేదు. ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ను విచారించాలని ఆఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. అయితే ఆధారాలు చూపిస్తే విచారించేందుకు అవకాశం ఉందో? లేదో ? పరిశీలిస్తామని గతంలో జస్టిస్ సోమయజులు స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో మంగళవారం న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సమర్పించిన వీడియో క్లిపింగ్‌లు, ఇతర ఆధారాలను రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోమయాజులు పరిశీలిస్తారు. ఈ ఆధారాలను ఆయన పరిశీలించిన తరువాతైనా ఈ కేసులో రెండు రకాలుగా నివేదికలు ఇచ్చిన కలెక్టర్‌ను విచారిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది. -
అవసరం అయితే చంద్రబాబును విచారిస్తాం
రాజమండ్రి: అవసరమని భావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా విచారిస్తామని గోదావరి పుష్కర తొక్కిసలాట ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్ స్పష్టం చేసింది. పుష్కర తొక్కిసలాటపై నిన్న రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో కమిషన్ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పుష్కరాలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ, ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించడం, భక్తులను రెండున్నర గంటల పాటు ఆపేయడం... ఇవన్నీ తొక్కిసలాటకు కారణమనే విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
ఆ షార్ట్ ఫిల్మ్‌ను బయటపెట్టాలి
నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చిత్రించిన షార్ట్ ఫిల్మ్‌ను బయటపెట్టాలి సోమయాజులు కమిషన్‌కు పలువురి డిమాండ్ పుష్కర ఘాట్ విషాదంపై కలెక్టర్ రెండు రకాల నివేదికలిచ్చారని వెల్లడి 29 మంది మృతి చెందితే ఏ ఒక్కరిపైనా చర్యలు లేకపోవడం దారుణమని ఆవేదన రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి.. కలెక్టర్‌ను కమిషన్ ముందు హాజరుపరచి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. పుష్కర తొక్కిసలాట ఘటనపై రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ నాలుగోసారి బహిరంగ విచారణ జరిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతపల్లి ప్రభాకరరావు తన వాదనలు వినిపిస్తూ.. పుష్కర తొక్కిసలాటకు ఎవరూ బాధ్యులు కారని, కమిషన్ ముందు అధికారులను హాజరుపరచి విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. బాధితులెవరూ అఫిడవిట్లు దాఖలు చేయలేదని.. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారని.. వారి వాదనలు పట్టించుకోనవసరం లేదని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందిస్తూ ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఏ ప్రభుత్వ అధికారుల తప్పు లేదంటూ కలెక్టర్ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. ఇదే కలెక్టర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘాట్‌లో 2 గంటలపాటు ఉండిపోయినందువల్లనే తొక్కిసలాట జరిగినట్టు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అదే కలెక్టర్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ఈ ఘటనలో ఏ అధికారి తప్పిదమూ లేదని నివేదిక ఇవ్వడమేమిటని తప్పుపట్టారు. ఒకే వ్యక్తి రెండు రకాలుగా ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. సంఘటన స్థలంలో ఉన్న కలెక్టర్‌ను, ఆర్డీఓను, సబ్ కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను హాజరుపరచి విచారణ జరపాలని కమిషన్‌ను కోరారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, పుష్కర ఏర్పాట్లపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం పుష్కరాల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రజాప్రతినిధులు, న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు ఈ నెల 14న కమిషన్ తిరిగి విచారణ జరుపుతుందని తెలిపారు. కలెక్టర్‌ను విచారించాలి రెండు రకాలుగా నివేదికలిచ్చిన కలెక్టర్‌ను కమిషన్ ముందు హాజరుపరచి విచారణ జరపాలి. వీఐపీ ఘాట్ ఉండగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్కే ఎందుకు రావాలి? ఆయన ఆ ఘాట్‌లో స్నానం చేయడంవల్లే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తరువాత సకాలంలో వైద్యం అందక చాలామంది మృతి చెందారు. దీనిపై విచారణ జరపాలి. కృష్ణా పుష్కరాల సందర్భంగా రైలింగ్ పడిపోయి ఐదుగురు మృతి చెందితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. దానిని నిర్మించిన కాంట్రాక్టర్ పైన, సూపరింటిండెంట్ ఇంజనీర్ పైన, ఇతర అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 29 మంది మృతి చెందితే ఏ ఒక్కరి పైనా చర్యలు తీసుకోలేదు. - జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు ముఖ్యమంత్రిని కమిషన్ ముందు హాజరుపరచాలి గోదావరి పుష్కరాల గొప్పతనం ప్రపంచానికి తెలిసేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ ఛానల్, షార్ట్ ఫిల్మ్‌లను బయట పెట్టాలి. ఇంత పెద్ద ఘటన జరిగితే ఏ అధికారి తప్పూ లేదని చెప్పడం దారుణం. ఘటనా స్థలంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షి కనుక ఆయనను, కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారులను కమిషన్ ముందు హాజరుపరచి ఎలా జరిగిందనేది బయటపెట్టాలి. - ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ కలెక్టర్‌ను విచారించాలి తప్పుడు సమాచారం ఇచ్చిన కలెక్టర్‌ను విచారించాలి. ఈ ఘటనకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, ఫొటోలు కానీ, సీసీ కెమెరా ఫుటేజ్‌లు కానీ కమిషన్‌కు సమర్పించలేదు. కలెక్టర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. పైగా 53 సంవత్సరాల 3 నెలల వయస్సున్న వృద్ధ మహిళలు మృతి చెందినట్లు కలెక్టర్ నివేదికలో ఇచ్చారు. అంటే ఆ వయస్సున్న మహిళల ప్రాణాలకు విలువ లేదా? నేషనల్ జియోగ్రఫీ చానల్ వీడియో ఫుటేజ్‌లు కమిషన్‌కు అందజేయాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, పౌరహక్కుల కౌన్సిల్ అధ్యక్షులు -
చిరకాలం గుర్తుండేలా కృష్ణాపుష్కరాలు
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : గోదావరి పుష్కరాలను మరిపించేలా కృష్ణాపుష్కరాలను నిర్వహించి చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కృష్ణానదీ తీరం వెంట నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను వారు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లోని కేఎల్ఐ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రెండునెలల క్రితం ముఖ్యమంత్రి కే సీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గతంలో గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను చూసి ఏపీ ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి పుణ్యస్నానాలు చేశారని గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి 86 ఘాట్ల నిర్మాణానికి *212 కోట్లు, ఇతర ఏర్పాట్లకు *825 కోట్లు, కృష్ణాతీరంలోని దేవాలయాల ఆలంకరణ కోసం *4.50కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15 తేదీలోగా ఘాట్ల పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని, పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. కొల్లాపూర్‌కు కళ తెస్తాం : జూపల్లి నల్లమల అంచున ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గానికి పర్యాటకంగా, ఆహ్లాదభరితంగా, ఆలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులకు సూచించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కనీవిని ఎరుగని రీతిలో కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై పక్కరాష్ట్రం నాయకులు చేస్తున్న విమర్శలకు ఇక్కడి నాయకులు వంత పాడడం సరికాదని, ఉద్యమ స్ఫూర్తితో సీఎం.కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే 3 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో జరగనంత అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చెర్మైన్ జూపల్లి రఘుపతిరావ్, నాయకులు జూపల్లి రామారావు, సిబ్బది నర్సింహారావు పాల్గొన్నారు. -
పుష్కరాలకు అమరావతి బ్రాండ్
► రాజధాని ప్రాచుర్యానికి ప్రభుత్వ వ్యూహం ► ద్యానబుద్ధ, అమరలింగేశ్వర ► ఆలయం వద్ద ప్రత్యేక ఘాట్లు ► ఎండిపోయిన కృష్ణానది ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల మల్లగుల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కర ఘాట్లన్నీ నీళ్లు లేక వెలవెలపోతున్నాయి. ఇదే పరిస్థితి ఆగస్టు వరకు కొనసాగితే పుణ్యస్నానం కాదు కదా.. కనీసంజల్లు స్నానం కూడా దక్కదేమోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.నీటి లభ్యతపైపెద్దఎత్తునచర్చజరుగుతున్నా పట్టించుకోని సర్కారు.. పుష్కరాలపై రాజధాని అమరావతి ముద్ర వేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అయినా ఘాట్ల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సాక్షి, విజయవాడ బ్యూరో : గోదావరి పుష్కరాలప్పుడు నదుల అనుసంధాన ప్రచారాన్ని ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం.. కృష్ణా పుష్కరాల్లో రాజధాని అమరావతి బ్రాండ్‌ను ప్రయోగించాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే పాత అమరావతితోపాటు ఏపీ రాజధాని అమరావతికి పుష్కర ఏర్పాట్లలో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలను రాజధాని ప్రాంత బ్రాండ్ ఇమేజ్‌కు ముడిపెట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అమరావతిలోని 125 అడుగుల ధ్యానబుద్ధ సమీపంలో భారీ ఘాట్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు చేరువలోనే పంచారామ క్షేత్రమైన అమరేశ్వరాలయం ఉండడంతో ఆ రెంటినీ కలిపేలా భక్తుల కోసం ఘాట్లను సమకూర్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీరు లేనందున పుష్కరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయం వరకు నిర్మించే ఘాట్ వరకు నీరు వచ్చేలా చిన్న పాయ (కాలువ) తవ్వేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఏడాది పొడవునా ప్రత్యేకంగా తవ్వే కాలువలో నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ నదిలోకి నీరు రాకపోతే పుష్కర స్నానం ఎలాగని భక్తులు మధనపడుతున్నారు. ప్రత్యేకంగా కాలువ తవ్వేందుకు అమరేశ్వరస్వామి ఆలయ సమీపంలోని నదిలో ఉన్న కొండలు అవరోధంగా మారనున్నాయి. దీనికితోడు ఆగస్టు నాటికి నీరు విడుదలైతేనే పుష్కర స్నానం దక్కుతుందని, లేకుంటే తుంపర స్నానమే దిక్కని భక్తులు భావిస్తున్నారు. వినియోగం కాని నిధులెందుకో! పాత అమరావతిని హెరిటేజ్ సిటీగా ఎంపిక చేయడంతో కేంద్రం విడుదల చేసే నిధులతో పుష్కరాల నాటికి పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులతోనే పుష్కరాలకు అమరావతికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు రెస్ట్రూమ్లు, టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకు నిబంధనలు అడ్డువస్తాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి కేంద్రం ఎంపిక చేసిన హెరిటేజ్ సిటీల్లో అమరావతి ఒక్కటే గ్రామం కావడంతో దీనికి నగరస్థాయి కల్పించాలన్నా సాంకేతిక సమస్య ముడిపడి ఉంది. అమరావతి డెవలెప్మెంట్ అథారిటీ ఏర్పడినప్పటికీ హెరిటేజ్ సిటీ ఆగ్మెంటేషన్ అండ్ డెవలెప్మెంట్ యోజన (హెఆర్ఐడీఏవై) ద్వారా వచ్చే నిధులను పుుష్కర ఏర్పాట్లకు ఖర్చుచేసే అవకాశం లేదు. ఇప్పటికే విడుదలైన రూ.23 కోట్ల నిధులు అనేక సాంకేతిక సమస్యలతో వినియోగంలోకి రాలేదు. దీంతో హెరిటేజ్ నిధులతో పాత అమరావతిలో పనులు చేపట్టాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రూ.400 కోట్లతో వెంకన్న ఆలయం మరోవైపు రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో పలు నమూనా దేవాలయాల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు నమూనా దేవాలయాలను చూసేందుకు రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నది సర్కారు యోచన. దీంతోపాటు వెంకటపాలెం-రాయపూడి ప్రాంతాల్లో రూ.400 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించనున్న బాలాజీ టెంపుల్‌కు పుష్కరాల నాటికి శంకుస్థాపన చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే స్థల అన్వేషణ సాగుతోంది. ఇలా పాత అమరావతి ప్రాంతంతోపాటు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంతో పుష్కరాలను ముడిపెట్టి బ్రాండ్ ఇమేజ్‌పై బహుళ ప్రాచుర్యం కల్పించేలా వ్యూహరచన చేయడం కొసమెరుపు. -
పుష్కర తొక్కిసలాటపై మూడోసారి విచారణ
రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ సోమవారం మూడోసారి విచారణ చేపట్టనుంది. అంతకుముందు ఈ ఏడాది జనవరి 18న, ఫిబ్రవరి 23న రెండు దఫాలుగా జరిగింది. తొలిదఫా ఒక్క అఫిడవిట్ మాత్రమే అందగా, తర్వాత 31 అఫిడవిట్లు దాఖలయ్యాయి. అఫిడవిట్ల సమర్పణకు ఈ నెల 5తో గడువు ముగిసింది. అఫిడవిట్ల సమర్పణకే మూడు నెలలు గడిచింది. మిగిలిన మూడు నెలల కాలంలో విచారణ పూర్తిస్థాయిలో జరిపి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా ఈ సంఘటనలో ప్రభుత్వ లోపాలు ఉండడం వల్లే బాధ్యులపై చర్యలు ఉంటాయా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి అందని ఆధారాలు తొక్కిసలాట సంఘటనపై వివిధ శాఖల అధికారులు ఇంకా ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించలేదు. క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యతలు ఎవరు నిర్వహించారు, ఏ శాఖలు ఉన్నాయి, వాటి ఇన్చార్జిలు ఎవరు, పుష్కర సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఎంత మందిని వలంటీర్లుగా నియమించారు తదితర విషయాలపై రికార్డులు కమిషన్‌కు అందజేయాలి. ఇలాఉండగా బాధితుల పక్షాన ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటీషన్‌పై కమిషన్ ఎదుట ప్రభుత్వ ప్లీడర్ ప్రాథమిక అభ్యంతరాలు తెలిపారు. కమిషన్ ముందు ముప్పాళ్ల సుబ్బారావు పార్టీగా కాకుండా సాక్షిగా మాత్రమే హాజరవుతున్నారని, ఆర్డర్ 12, రూల్ 8 సివిల్ ప్రొసీజర్ కింద అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. అందువల్ల కమిషన్ ముందు డాక్యుమెంట్లను దాఖలు పరిచే అంశాన్ని తిరస్కరించాలని ఫిబ్రవరి 22న ఫైల్ చేశారు. నిజనిర్ధారణ ఎలా! పుష్కర తొక్కిసలాటకు సంబంధించి ఆయా శాఖల వద్ద ఉన్న ఆధారాలు కమిషన్ కు సమర్పించకపోతే నిజనిర్ధారణ ఎలా జరుగుతుందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బాధితుల తరఫున ముప్పాళ్ల సుబ్బారావు నిబంధనల మేరకు తన వాదనలు దాఖలు చేస్తున్నారు. కమిషన్ కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను విచారణ సమయంలో అనుసరిస్తామని బహిరంగంగా చెప్పింది. పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతుందన్న భయంతోనే విజువల్స్ సాక్ష్యాలను మాయం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 19లోగా ఆధారాలు సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా ఇవ్వలేదు. -
పుష్కర తొక్కిసలాటపై విచారణ వాయిదా
రాజమండ్రి గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన పీవై సోమయాజులు కమిషన్ మంగళవారం మరోసారి విచారణ నిర్వహించింది. రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విచారణ జరగ్గా... నాటి ఘటనకు సంబంధించి బాధితులు అఫిడవిట్ల సమర్పణకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో సోమయాజులు విచారణను మార్చి 21కి వాయిదా వేశారు. -
మోగనున్న పెళ్లిబాజా
* నేటి నుంచి మాఘమాసం ప్రారంభం * రేపటి నుంచి వివాహ ముహూర్తాలు పిఠాపురం : గోదావరి పుష్కరాల కారణంగా ఆరు నెలలకు పైగా మూగబోయిన పెళ్లిబాజాలు ఇకనుంచి మోగనున్నాయి. పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే మాఘమాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో వివాహాలు కూడా మొదలు కానున్నాయి. బుధవారం నుంచే ముహూర్తాలు కూడా ఆరంభమవుతున్నాయి. దీంతో ఆరు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న కల్యాణ మండపాలు బాజాభజంత్రీలతో వివాహ మంత్రాల ఘోషతో మార్మోగనున్నాయి. బంధుమిత్రుల సందళ్లతో కళకళలాడనున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభకార్యాలకు కూడా పలువురు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పేరొందిన కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. పురోహితులు, షామియానాలు, మైక్, లైటింగ్, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, కేటరర్స బిజీగా మారిపోయారు. -
6 నెలల తర్వాత కమిటీ వేశారు!
-
గోదావరి పుష్కర దుర్ఘటనపై న్యాయవిచారణకు కమిటీ
గోదావరి పుష్కరాల తొలిరోజునే తొక్కిసలాట జరిగి, 25 మంది మరణించిన దుర్ఘటనపై న్యాయ విచారణకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. విచారణకు ఆరు నెలల గడువు విధించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. పుష్కరాల మొదటి రోజున సీఎం చంద్రబాబు పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం చేయడం, ఆరోజు చాలామంది భక్తులు వేచి చూడాల్సి వచ్చి.. చివరకు అందరినీ ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 25 మంది మరణించడం లాంటి ఘటనలు జరిగాయి. ఇంకా ఎంతోమంది ఆరోజు గాయపడ్డారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించింది. -
రెండునెలలకే.. బండారం బట్టబయలు
రాజమండ్రి : కోట్లాదిమంది వచ్చే గోదావరి పుష్కరాల కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారు. పుష్కరా లు ఫలానా సంవత్సరంలో ఫలానా సమయంలో వస్తాయని ఎన్నడో తెలిసినా.. ‘పుణ్యకాలం దగ్గర పడేదాకా’ పనులు మొదలు పెట్టని నిర్వాకం, అవినీతి ఫలితం.. పుష్కరాలు ముగిసి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాక ముందే వేసవిలో గోదావరిలో ఇసుక తిన్నెలు బయటపడ్డంత స్పష్టంగా కళ్లకు కడుతోంది. ఆర్ అండ్ బీ చేపట్టిన రాజమండ్రి- బూరుగుపూడి రోడ్డు విస్తరణ పనులే అందుకు నప్రబల నిదర్శనం. ఈ రహదారి సెంట్రల్ డివైడర్ అప్పుడే పలుచోట్ల ధ్వంసమైంది. రాజమండ్రి నుంచి బూరుగుపూడి దాటే వరకు ఈ రహదారి విస్తరణకు ప్రభుత్వం పుష్కరాలకు ముందు రూ.37 కోట్లు కేటాయించింది. రహదారి నిర్మాణం, ఆక్రమణ తొలగింపు, డ్రైన్, సెంట్రల్ డివైడర్ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా శానిటోరియం నుంచి బూరుగుపూడి వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణం నాసిరకంగా జరిగిన విషయాన్ని ‘సాక్షి’ అప్పట్లోనే ‘దండుడుకే ప్రాధాన్యం’ అనే కథనంతో వెలుగులోకి తెచ్చింది. బలంగా తన్నితేనే పడిపోయేంత బలహీనంగా నిర్మిస్తున్న డివైడర్ ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదని ముందే హెచ్చరించినా కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు రెండు నెలలు పూర్తికాకున్నా డివైడర్ పలుచోట్ల ధ్వంసమవుతోంది. వాహనాలు ఢీ కొట్టడం వల్ల ఇలా జరిగిందని అధికారులు సాకు చెబుతున్నా, నిర్మాణంలో చోటు చేసుకున్న లోపమే కారణమని నిపుణులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిలిచిపోయిన కొద్దిపాటి నీటికే డివైడర్లు కొట్టుపోతున్నాయంటే నిర్మాణం ఎంత దృఢంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మధురపూడి, గాడాల, నిడిగట్ల మధ్యలో డివైడర్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల ఐదారడుగుల మేర డివైడర్లు పగిలిపోవడం గమనార్హం. సుందరీకరణా అరకొరే.. మధురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి నగరానికి వచ్చే ఈ రహదారిలో సెంట్రల్ డివైడర్ పైన, రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.లక్షల విలువ చేసే మొక్కలు నాటారు. వీటిని చాలా వరకు పశువులు మేసేస్తుండగా, రహదారిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకూ మొక్కలే నాటకపోవడం గమనార్హం. మధురపూడి విమానాశ్రయం నుంచి బూరుగుపూడి దాటే వరకు సెంట్రల్ డివైడర్ ఉన్నా మొక్కలు నాటలేదు. ఇక్కడ పిచ్చి మొక్కలు, ముళ్ల మొక్కలు పెరుగుతున్నాయి. అంటే ఆహ్లాదం రాజమండ్రి-మధురపూడిల మధ్య రాకపోకలు సాగించే విమాన ప్రయాణికులకే తప్ప మిగిలినవారికి అవసరం లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అద్దె పేరుతో.. అడ్డగోలు దోపిడీ
రాజమండ్రి :గోదావరి పుష్కరాల పేరుతో అధికారులు కోట్ల రూపాయలు దుబారా చేశారనడానికి ఫైబర్ టాయిలెట్లు, విద్యుద్దీపాలంకరణలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటికి అసలు ఖరీదుకంటే రెట్టింపు మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించిన ఘనత నగరపాలక సంస్థ అధికారులదే. దీనిపై వస్తున్న విమర్శలకు, ప్రశ్నలకు వారి జవాబు మౌనమే అవుతోంది. గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం చేసిన పనుల్లో అడ్డగోలు దోపిడీ జరిగింది. ప్రధానంగా ఫైబర్ టాయిలెట్ల ఏర్పాటులో సంబంధిత కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులు చేతులు కలిపి కాసులు దండుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని కోటిలింగాలు, పుష్కర, వీఐపీ వంటి ఘాట్ల వద్ద, రైల్వేస్టేషన్, బస్టాండ్, పుష్కర నగరాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫైబర్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈవిధంగా నగరంలో మొత్తం 1,200 టాయిలెట్లు ఏర్పాటు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇన్ని ఏర్పాటు చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక వీటికి చెల్లించిన అద్దె చూస్తే నివ్వెరపోక తప్పదు. ఒక్కోదానికి రూ.26 వేల వరకూ అద్దె చెల్లించినట్టు సమాచారం. అయితే వాస్తవానికి దీని తయారీకి అయిన ఖర్చు రూ.10 వేలు కావడం గమనార్హం. మొత్తం 1,200 టాయిలెట్లకు అద్దెరూపంలో రూ.3.12 కోట్లు చెల్లించగా, వీటి తయారీకయ్యే ఖర్చు రూ.1.20 కోట్లు మాత్రమే. కార్పొరేషన్ వీటిని నేరుగా కొనుగోలు చేసి ఉంటే రూ.1.92 కోట్లు మిగిలేది. వీటిని వచ్చే కృష్ణా పుష్కరాలకు పంపించడం ద్వారా అటు ప్రభుత్వం నుంచి కానీ, లేదా విజయవాడ నగరపాలక సంస్థ నుంచి కానీ రాజమండ్రి కార్పొరేషన్ ఆదాయం పొంది ఉండేది. లేకుంటే కనీసం తుక్కు రూపంలో అమ్మినా ఎంతోకొంత ఆదాయం వచ్చేది. అవేమీ లేకుండా మొత్తం టాయిలెట్లను ఒకే కాంట్రాక్టర్ నుంచి అద్దె పద్ధతిలో తీసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ములు వృథా అయ్యాయి. ఇక పుష్కరాల సమయంలో నగరాన్ని విద్యుద్దీప తోరణాలతో ముస్తాబు చేసిన విషయంలో కూడా అధికారులు ఇదే పద్ధతి అవలంబించి, కార్పొరేషన్‌పై ఆర్థిక భారం మోపారు. నగర వీధుల్లోను, రాజమండ్రి - కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన, పాత హేవలాక్, మూడో రైలు వంతెనలకు సగం వరకూ ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు, పార్కులు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలకు ఏకంగా రూ.2 కోట్ల వరకూ అద్దె రూపంలో చెల్లించారు. ఇక్కడ కూడా ఒక కాంట్రాక్టర్నే ఆశ్రయించారు. అద్దెకు బదులు కొనుగోలు చేసి ఉంటే ఇంతకన్నా ఎక్కువ విద్యుద్దీపాలంకరణ చేసుకోవడంతో పాటు, తరువాత వేలం వేయడం ద్వారా మూడొంతుల ఖర్చు వెనక్కు వచ్చేదని అధికార పార్టీ కార్పోరేటర్లే బాహాటంగా అంటున్నారు. అసలు ఎన్ని లైట్లు ఏర్పాటు చేశారు? ఎంత చొప్పున, ఎంత మొత్తం చెల్లించారనే ప్రశ్నలకు నగరపాలక సంస్థ అధికారుల వద్ద సమాచారం లేదు. ఈ విషయంపై ఇటీవల జరిగిన కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు ప్రశ్నించినా అధికారుల నుంచి సమాధానం లేదు. శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మొత్తం వివరాలు వెల్లడిస్తామని చెప్పి తప్పించుకున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 15 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేసేది కూడా లేదని సమాచారం. -
ఆర్భాటం ఎక్కువ..అసలు తక్కువ
రాజమండ్రి :అసలు తక్కువ.. హడావుడి ఎక్కువ.. అన్నట్టుగా ఉంది ప్రభుత్వ పెద్దల తీరు. గోదావరి పుష్కరాల సందర్భంగా నగర దశ దిశ మారిపోతుందని ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే తమ ప్రభుత్వం రూ.240 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి, కార్పొరేటర్ వరకూ అందరూ ఆర్భాటం చేశారు. తీరా చూస్తే.. పుష్కరాల సందర్భంగా నగరంలో చేపట్టిన పనులు.. ఆ మహాపర్వం ముగిసిన తరువాత కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల టెండర్లు ఖరారైన పనులతోపాటు, టెండర్ దశలోనే నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగడం లేదు. నగరంలోని వివిధ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడంలేదు. పుష్కరాల సందర్భంగా కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. ఇన్ని కోట్లు వచ్చినందు పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి. కానీ నగరంలో అటువంటి పరిస్థితి కానరావడం లేదు. పుష్కర ఘాట్లవద్ద జరిగిన అభివృద్ధి వల్ల నగర ప్రజలకు ప్రత్యక్షంగా ఒనగూడిన ప్రయోజనం లేదన్న విమర్శలు వచ్చాయి. రహదారులు, డ్రైన్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలకు ఎక్కువగా నిధులు కేటాయించారు. ఉన్న రోడ్లపై రోడ్లు వేయడం, ఎత్తు చేస్తున్నామన్న వంకతో బాగున్న ఫుట్‌పాత్‌లు బద్దలుకొట్టి కొత్తగా నిర్మించడం, పాత డ్రైన్ల ఇనుముతో కొత్త డ్రైన్లు నిర్మించి, అడ్డగోలుగా దోచేయడం అందరికీ తెలిసిందే. రూ.240 కోట్లతో చేపట్టినవాటిలో ఇప్పటివరకూ రూ.118 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.62 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఇంకో మరో రూ.60 కోట్ల విలువైన పనులకు ఇంతవరకూ టెండర్లే పిలవలేదు. వీటికి పరిష్కారమేదీ? ఏమాత్రం వర్షం పడినా ఆర్యాపురం, కోటిలింగాలపేట, హైటెక్ బస్టాండ్, పేపరుమిల్లు రోడ్డు, కృష్ణానగర్, రామచంద్రరావుపేట, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాలు గోదావరిని తలపిస్తున్నాయి. రహదారులు కాలువలైపోతున్నాయి. ఈ సమస్య చాలాకాలంగా ఉన్నా పుష్కరాల్లో శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ రోడ్లపై మూడడుగుల ఎత్తున మురుగునీరు నిలిచిపోతోంది. పుష్కర నిధులతో డ్రైన్లు విస్తరించి, కొత్తవి నిర్మించి ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది. గూడ్స్‌షెడ్ నుంచి ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకూ రూ.13 కోట్లతో డ్రైనేజీ నిర్మించాలి. ఈ పనులు ఇంకా మొదలవలేదు. నగరంలోని 50 డివిజన్లలో చేపట్టాల్సిన 240 డ్రైనేజీ పనులకు, 116 రహదారుల నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాలేదు. సుందరీకరణ పేరుతో పుష్కరాల్లో చనిపోయిన మొక్కలు నాటి సొమ్ములు నొక్కేసిన అధికారులు.. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన 23 జంక్షన్ల పనులు కూడా ఇంతవరకూ చేపట్టలేదు. ఇప్పటికైనా పుష్కర నిధులతో శాశ్వత పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
జ్ఞాపకశక్తి దెబ్బతింటోందా బాబూ?
- సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సూటి ప్రశ్నలు దేవీచౌక్ (రాజమండ్రి): ‘గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను పుష్కర స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యం వల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా.. లేక మానసిక స్థితిలో ఏమైనా తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా’ అని సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాజ మండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకశక్తికి సంబంధించిన అల్జీమర్‌తో బాధపడ్డారు. సీనియర్ ఎంపీ జార్జి ఫెర్నాండెజ్ కూడా అదే వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు కూడా అలాంటి వ్యాధి సోకిందన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఎద్దేవా చేశారు. తొక్కిసలాట జరిగి 45 రోజులవుతున్నా నిజాలు నిగ్గుతేలుతాయనే విచారణకు ఆదేశించలేదా అని సీఎంను నిలదీశారు. ఒక్కరు చనిపోయినా విచారణకు ఆదేశించాల్సిందేనని స్పష్టం చేశారు. -
'బాబు జ్ఞాపకశక్తి దెబ్బతింటోందా?'
-
'బాబు జ్ఞాపకశక్తి దెబ్బతింటోందా?'
దేవీచౌక్ (రాజమండ్రి) : 'గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యంవల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా? లేక మానసిక పరిస్థితిలో తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా?' అని చంద్రబాబునాయుడుని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకశక్తికి సంబంధించిన అల్జీమర్స్‌తో బాధపడ్డారని, సీనియర్ ఎంపీ జార్జి ఫెర్నాండెజ్ కూడా దీనిబారిన పడ్డారని, సీఎంకు కూడా అలాంటి వ్యాధి సోకిందన్న అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సీఎం చంద్రబాబు పుష్కరాల రేవులో స్నానం చేసి వెళ్లిన తర్వాత అధికారుల్లో రిలాక్స్ ధోరణి వచ్చిందన్నారు. 'తొక్కిసలాట జరిగి 45 రోజులవుతున్నా.. నిజాలు వెల్లడవుతాయనే విచారణకు ఆదేశించలేదని విమర్శించారు. 'గత కృష్ణా పుష్కరాల సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో ఒక బ్రిడ్జిపై రెయిలింగ్ విరిగిపోయి ఆరుగురు మరణించారు. హైదరాబాద్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి వెంటనే ఎస్పీ, కలెక్టర్లను బదిలీ చేసి, సంబంధిత ఇంజనీర్‌ను సస్పెండ్ చేసి న్యాయ విచారణకు ఆదేశించారు. నాడు వైఎస్ రాజీనామా చేయకపోతే, పుష్కరాలు జరగనివ్వబోమంటూ టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు’ అని ఉండవల్లి గుర్తు చేశారు. అనంతరం పుష్కరాల రేవులో సీఎం స్నానం చేసిన స్థలం, తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఉండవల్లి సందర్శించారు. -
తొక్కిసలాటపై విచారణ జరగకపోవడం దారుణం
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న గోదావరి పుష్కర ఘాట్ మరణాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పుష్కర తొక్కిసలాట ఘటనపై ఇంతవరకు ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేశారని ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణం అని ఉండవల్లి అన్నారు. -
హాలోజన్.. హాంఫట్!
గోదావరి పుష్కరాల్లో కొందరు పుణ్యం మూటగట్టుకుంటే మరికొందరు మాత్రం అక్రమంగా ప్రజాధనాన్ని మూటగట్టుకున్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే పుణ్యకార్యంగా చెప్పుకునే పుష్కరాల కోసం చేసిన ఏర్పాట్లలోనూ అవినీతికి పాల్పడి జేబులు నింపుకున్నారు. ఒక్క రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విద్యుదీకరణ పనుల్లోనే కోట్లాదిరూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏర్పాట్లలో ఎన్నికోట్లు.. ఎవరెవరి జేబుల్లోకి వెళ్లాయో..! వెల్లువెత్తుతున్న ఆరోపణలపై సర్కారు మిన్నకుంటున్న వైనం... మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుదీకరణ పనులకు ఉపయోగించిన హాలోజన్ విద్యుద్దీపాలు, రంగుల బల్బులెక్కడున్నాయో తెలియడంలేదు. పుష్కరాల తర్వాత వీటిని నగరపాలక సంస్థకు అప్పగించలేదు. వీధి దీపాల నిర్వహణ బాధ్యతను చూసే కార్పొరేషన్‌కు ఇస్తే వీటిని తక్షణమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ లైట్ల ఆచూకీ లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలు వీటిని కొన్నారా? అద్దెకు తెచ్చారా? కొన్నట్టు లెక్కలు చూపించి డబ్బులు కాజేశారా? అసలేం జరిగిందంటే.. రాజమండ్రి పుష్కర ఘాట్‌ను విద్యుల్లతలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)ను ఆదేశించింది. ఇందుకోసం రూ.1,71,82,836ను విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ. 99,23,100తో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చారు. మరో రూ. 72,59,736ను హాలోజన్ ల్యాంపులు, బల్బులు కొనుగోలుకు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్ల కొనుగోలుకు వెచ్చించారు. నిజానికి అంతపెద్ద మొత్తంలో బల్బులు అద్దెకు దొరికే పరిస్థితి నగరంలో లేకపోయినా పేరుకు కొన్ని దుకాణాల పేర్లురాశారు. అద్దెకు తెచ్చినవాటిని తిరిగిచ్చారు సరే.. మరి కొన్నవేవి? నిబంధనల ప్రకారం రూ. 5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలి. దాదాపు రెండుకోట్ల వ్యవహారం జరిగినా ఎక్కడా టెండర్లన్న పదమే వినిపించలేదు. వెయ్యి వోల్టుల హాలోజన్ ల్యాంపులు కాంట్రాక్టరు చెప్పిన రేటుకే కొనేసినట్టు చెబుతున్నారు. ఒక్కో ల్యాంపు రూ. 824 చొప్పున 654 ల్యాంపులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.5,41,512. 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు 553 కొనుగోలు చేశారు. ఒక్కొక్కటీ రూ. 588 చొప్పున రూ. 3,25,164 చెల్లించారు. లేబర్ చార్జీల పేరుతో 295 మందికి ఏడు రోజుల పాటు రోజుకు రూ.500 లెక్కన రూ. 10,32,500 చెల్లించారు. వీళ్ళను ఏ పనులకు వినియోగించారనే వివరాలు లేవు. సీఎండీ విచారణకు ఆదేశించినట్టు తెలియడంతో జిల్లా విద్యుత్ అధికారులు పాత తేదీల్లో బిల్లులు సంపాదించేందుకు హైదరాబాద్‌లోని ఓ విద్యుత్ ఉపకరణాల సంస్థను సంప్రదించినట్టు తెలిసింది. విచారణకు ఆదేశించాం గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుదీకరణ పనులపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సంస్థ డెరైక్టర్‌ను రాజమండ్రికి పంపుతున్నట్టు చెప్పారు. అయితే కొన్ని హాలోజన్ ల్యాంపులను విశాఖపట్టణానికి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. ఏదేమైనా అవకతవకలు జరిగినట్టు తేలితే, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. -
యజమాని ఇంటికే కన్నం వేశాడు
పుస్కార స్నానానికి రాజమండ్రి వెళ్తే ఘటన నగలు, నగదు, కారుతో డ్రైవర్ పరార్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఎన్ఆర్ఐ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం బంజారాహిల్స్: పుష్కర స్నానానికి వెళ్లిన ఓ ఎన్నారై కుటుంబానికి చెందిన నగలు, నగదు, దుస్తులను కారు డ్రైవర్ సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లాడు. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ రాధానగర్‌లో నివసించే వ్యాపారి కొల్లి గాంధీ అల్లుడు ఆర్.నారాయణరెడ్డి, తన భార్య, కుమార్తెతో కలిసి పుష్కర స్నానం చేసేందుకు గతనెల 17న లండన్ నుంచి నగరానికి వచ్చారు. గతనెల 18న రాజమండ్రిలో పుష్కర స్నానం చేసేందుకు గాంధీకి చెందిన కారులో జూబ్లీహిల్స్ గాయత్రీ హిల్స్‌కు చెందిన డ్రైవర్ గౌతంకృష్ణ(28)ను తీసుకెళ్లారు. అదే రోజు రాజమండ్రి చేరుకున్న వారు కారును వీఐపీ పార్కింగ్‌లో నిలిపారు. నారాయణరెడ్డి, ఆయన భార్య, కూతురు పుష్కర స్నానం కోసం గోదావరి నదికి వెళ్తూ తమ ఆభరణాలు, డబ్బులు, దుస్తులు, సెల్ఫోన్లు మూటకట్టి కారు వెనుక ఉంచి, కారు తాళాలు డ్రైవర్ గౌతంకృష్ణకు ఇచ్చారు. పుష్కరస్నానం చేసి తిరిగి వచ్చేసరికి కారుతో సహా డ్రైవర్ ఉడాయించాడు. బాధితుడు నారాయణరెడ్డి రాజమండ్రి టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు పెద్దగా స్పందించలేదు. అయితే డ్రైవర్ ను కారులో ఎక్కించుకుంది జూబ్లీహిల్స్ పరిధిలో కావడంతో ఈనెల 8న బాధితుడి మామ గాంధీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఆభరణాలను గౌతంకృష్ణ తన సోదరికి ఇచ్చి వ్యవసాయ రుణం తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. క్షణక్షణం సెల్‌ఫోన్ సిమ్‌కార్డులు మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. ఇతను ఇప్పటి వరకూ 40 సిమ్‌కార్డులు వాడాడని, సెల్ఫోన్లు ఇంటి ఆవరణలో పాతిపెట్టాడని పోలీసులు గుర్తించారు. -
అనుకున్నదొకటి.. అయినది మరొకటి!
*పుష్కరాల్లో రైల్వేకి ఊహించని ఎదురుదెబ్బ * రూ.100 కోట్లు ఆశిస్తే.. వచ్చింది రూ.49 కోట్లు * అన్రిజర్వ్డ్ రైళ్లతో చేయి కాల్చుకున్న వైనం హైదరాబాద్: 'అనుకున్నదొకటి అయినది మరొకటి' అన్న చందంగా మారింది పుష్కరాల్లో రైల్వే శాఖ పనితీరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల మహా పుష్కరాలు ముగిసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో 12 రోజులపాటు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో భక్తులు భారీగా పుష్కరఘాట్లకు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు 11 కోట్లమంది పుష్కరాలకు హాజరైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకూ కలిపి 823 ప్రత్యేక రైళ్లు నడిపి రూ.100 కోట్ల దాకా లాభాలు ఆర్జించాలని రైల్వే అధికారులు భావించారు. అనుకున్నట్లే అన్ని రైళ్లూ కిక్కిరిశాయి. తాజాగా లెక్కలు వేసిన అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మొత్తం ఆదాయం రూ.49.10 కోట్లుగా తేల్చారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపి ఉంటే ఈ మొత్తం రూ.100 కోట్లు దాటేదని ఉసూరుమంటూ నిట్టూర్చుతున్నారు. ప్యాసింజర్ రైళ్లే కొంప ముంచాయి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లతో రైల్వేశాఖ భారీ నష్టాలు చవి చూస్తోంది. టికెట్ ధరలు తక్కువగా ఉండటం, రైళ్ల నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో వాటితో చేయికాల్చుకుంటోంది. పుష్కరాల సందర్భంగా మొత్తం 823 ప్రత్యేక రైళ్లను నడిపినట్టు రైల్వే శాఖ పేర్కొంటోంది. ఇందులో 757 ప్యాసింజర్ రైళ్లే. కేవలం 66 మాత్రమే ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జి రూ.65 ఉండగా.. అదే ప్యాసింజర్ రైలుకు కేవలం రూ.26 మాత్రమే. ఇలా అన్ని ప్రాంతాల ఛార్జీలు అంతే మొత్తంలో ఉండటంతో... రైళ్లు కిటకిటలాడినా ఆదాయం అంతంత మాత్రంగానే వచ్చింది. వ్యయమే ఎక్కువ.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పుష్కర క్షేత్రాలు దగ్గరగా ఉండటం, అన్ని ప్రాంతాలకు రైల్వే వసతి లేకపోవటంతో అతి తక్కువగా నడిపింది. మొత్తం 66 ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరిగితే 60 రైళ్లు రాజమండ్రికే పరుగుపెట్టాయి. తెలంగాణలో భద్రాచలం రోడ్ స్టేషన్‌కు మాత్రమే ఆరు ఎక్స్‌ప్రెస్‌రైళ్లు వచ్చాయి. ఇక 757 అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ రైళ్లు తిరిగితే అందులో తెలంగాణ పరిధిలో 356, ఏపీ పరిధిలో 401 రైళ్లు తిరిగాయి. వీటిద్వారా వచ్చిన ఆదాయంకంటే ఖర్చే ఎక్కువ ఉందని అధికారులు తేల్చారు. లాభాల కోసం కాకుండా కేవలం ప్రయాణికులకు ఇబ్బందులు కలగొద్దనే రైళ్లను నడిపామని, నష్టం ముందు ఊహించిందేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
జగన్ దృష్టికి పుష్కర అవినీతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రిలో చేపట్టిన పనుల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా వివరించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన రాజా పుష్కర పనులను అధికారపార్టీ నేతలు పంచేసుకుని దోచుకున్నారని చెప్పారు. పనుల్లో అవినీతే కాక ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు, సేవలందించడంలో కూడా విఫలమైందన్నారు. వివిధప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున పార్టీ నాయకులంతా సమన్వయంతో సేవాకార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని, స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు అనేక సేవలందించాయని రాజా చెప్పారు. సేవా సంస్థలు ముందుకు రాకుంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. -
30కి చేరిన పుష్కరాల మృతుల సంఖ్య
రాజానగరం: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 30కి చేరుకుంది. తొక్కిసలాటలో అక్కడిక్కడే 27 మంది మృతి చెందగా, అనంతరం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించిన సంగతి విదితమే. విజయనగరం జిల్లా బాడంగి మండలం, పాల్టేరుకు చెందిన పూడి పారమ్మ(80) తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో స్థానిక జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను గత కొన్ని రోజులుగా వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. -
పుష్కర తొక్కిసలాటలో గాయపడిన మహిళ మృతి
బాడంగి (విజయనగరం) : గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం కన్నుమూసింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం తాల్తేరు గ్రామానికి చెందిన పూడి తారమ్మ(65) కుటుంబ సభ్యులతో కలసి పుష్కర స్నానం కోసం రాజమండ్రి వెళ్లింది. ఆ రోజు జరిగిన ఘోర తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా ఆ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారిలో తారమ్మ కూడా ఉన్నారు. అప్పటి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారమ్మ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది. -
ఇంత కుప్పలో నాకు నప్పే చెప్పులెక్కడ?
రాజమండ్రి: గోదావరి పుష్కరాల 12 రోజులూ కోట్లమంది స్నానమాచరించి, ఆ పుణ్యఫలం దక్కిందన్న తృప్తితో తిరిగి వెళ్లారు. పుష్కరాలు ముగిసి అయిదు రోజులైనా రాజమండ్రిలోని ఘాట్ల వద్ద ఇప్పటికీ అనేకులు నదిలో మునిగి తేలుతూనే ఉన్నారు. వారి లక్ష్యం పుణ్యఫలం మాత్రం కాదు..స్నానాల సందర్భంగా భక్తులు గోదారమ్మకు సమర్పించిన నాణేలు, వెండి, బంగారు ప్రతిమల వేట. అందుకోసం అయిస్కాంతాలు, చేటలు, ఇతర సాధనాలతో రేవుల్లో దేవుతూనే ఉన్నారు. మరికొందరు బడుగు జీవులు మాత్రం పుష్కర రద్దీలో భక్తలు విడిచిన వేలాది చెప్పుల్లో తమకు సరిపోయే 'జోడు' కోసం వెతుక్కుంటున్నారు. వీఐపీ ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద భక్తులు విడిచి వెళ్లిన చెప్పులను పారిశుద్ధ్య సిబ్బంది ...ఇస్కాన్ ప్రాంతంలో గుట్టగా వేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ గుట్టను గాలించిన ఓ బాలుడు చివరకి అనుకున్నది సాధించాడు. కొందరికి ఎంతసేపు వెతికినా నిరాశే మిగులుతోంది. -
పుష్కరాలు ముగిశాయ్.. సమస్యలు మిగిలాయ్
నరసాపురం అర్బన్:పుష్కర సంరంభం ముగిసింది. అధికారులు, ఉద్యోగులు 20 రోజులపాటు పుష్కర విధుల్లో తలమునకలు కావడంతో అన్ని శాఖల్లో పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కీలక శాఖల్లో ముఖ్యమైన పనులు పెండింగ్‌లో పడిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగమంతా పుష్కర విధులకే సమయం కేటాయించింది. దీంతో పుష్కరాలు జరిగిన ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని అన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, ఫిషరీస్, ఎక్సైజ్, మునిసిపల్, వ్యవసాయ శాఖతోపాటు దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు పుష్కర విధుల్లో ఉండిపోయాయి. దీంతో ఆయా శాఖల్లో పనులు కుంటుపడ్డాయి. పుష్కరాలు జరిగిన ప్రాంతాల్లో అయితే దాదాపు మూడు నెలల నుంచీ అన్ని ప్రభుత్వ శాఖలు పుష్కర జపం తప్ప మరోపని పెట్టుకోలేదు. దీంతో సమస్యలు పేరుకుపోయాయి. మహాపర్వం ముగిసిన అనంతరం అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సోమ, మంగళ వారాలు సెలవు ఇచ్చింది. బుధవారం నుంచి వారంతా విధులకు హాజరు కానున్నారు. విధుల్లోకి వచ్చాక సమస్యలు, పెండింగ్ పనులను పూర్తి చేయడానికి యంత్రాంగమంతా మరికొన్ని రోజులపాటు పుష్కరాల్లో మాదిరిగానే ఊపిరి సలపకుండా పని చేయాల్సి ఉంది. మరి వీరంతా వాటిపై ఏ మేరకు దృష్టిపెడతారనేదే ప్రశ్నార్థకంగా ఉంది. అయోమయంలో రైతులు జిల్లాలోని రైతులంతా అయోమయంలో ఉన్నారు. ఖరీఫ్ సాగు ఈ ఏడాది ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ తలపోసినప్పటికీ అన్నుకున్నంత స్థాయిలో సాగలేదు. జూలై నాటికి నాట్లు పూర్తవ్వాలి. కాలువలు ఆలస్యంగా వదలడం, శివారు ప్రాంతాలకు నీరందకపోవడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. డెల్టాలోని నరసాపురం, మొగల్తూరు, భీమవరం ప్రాంతాల్లో ఇంకా చాలాచోట్ల దుక్కులు దున్నడం కూడా పూర్తవ్వలేదు. అంటే సాగు దాదాపు నెల రోజులుపైనే ఆలస్యమైంది. వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. రెవెన్యూకు సంబంధించి అన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కలెక్టర్ సైతం పుష్కరాల పనులు, ఏర్పాట్లపై నెల రోజులపాటు ప్రధానంగా దృష్టిపెట్టారు. దీంతో రెవెన్యూ పాలన కుంటుపడింది. నరసాపురం, కొవ్వూరు డివిజన్లలో మూడు వారాలుగా ‘మీ కోసం కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు. అత్యవసర పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్న వారు, అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నరసాపురం, కొవ్వూరు మునిసిపాలిటీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలజారీ నుంచి అన్ని పనులు నిలిచిపోయాయి. ఈ రెండు మునిసిపాలిటీల్లో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) మందకొడిగా సాగాయి. మిగిలిన మునిసిపాలిటీల అధికారులు, సిబ్బంది డెప్యుటేషన్‌పై పుష్కర విధులకు రావడంతో అన్ని మునిసిపాలిటీల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెండింగ్ పనుల సంగతేంటి! నరసాపురం, కొవ్వూరు పట్టణాల్లో పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. అలాంటివన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పుష్కరాలు సమీపించేసరికి ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఘాట్లకు సమీపంలో చేపట్టిన పనులను పూర్తిచేసి, మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు. డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం వంటి కీలక పనులు ఈ జాబితాలో ఉన్నాయి. నరసాపురంలో రూ.15 కోట్లు, కొవ్వూరులో రూ.12 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. ఖర్చు చేయని పుష్కర నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే ప్రచారం సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నిధులు వెనక్కి వెళ్లవని భరోసా ఇస్తున్నప్పటికీ.. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి నిధులు వెనక్కి మళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదనే ఆందోళన కూడా ఉంది. పుష్కర విధుల్లో అలసిపోయిన అధికారులు వెంటనే పుష్కర పెండింగ్ పనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
పుష్కర రోజుల్లో 96 ప్రమాదాలు
ఏలూరు (సెంట్రల్) : గోదావరి పుష్కరాల 12రోజుల్లో జిల్లాలో 96 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 43 మంది పుష్కర యాత్రికులు మరణించారు. 165 మంది యాత్రికులు గాయపడ్డారు. ఈనెల 14న ప్రారంభమైన గోదావరి పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి కోటిన్నరు పైగా జనం జిల్లాకు వచ్చారు. వారు ప్రయాణించిన 96 వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురికాగా, 35 ప్రమాదాల్లో 43 మంది మరణించాడు. అన్ని ప్రమాదాల్లో 165 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై 27 ప్రమాదాలు జరగ్గా, ఇతర రోడ్లపై 69 ప్రమాదాలు నమోదయ్యూయి. సెలవు రోజులైన ఈ నెల 18, 19 తేదీల్లోను, పుష్కరాల చివరి రోజులైన 24, 25 తేదీల్లో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. ఇందుకు గల కారణాలపై పోలీస్ శాఖ సమీక్షిస్తోంది. ఎక్కువ ప్రమాదాలు వేకువజాము 3నుంచి ఉదయం 6 గంటల మధ్యలో జరిగాయి. కార్లు, బైక్‌ల ప్రమాదాలే ఎక్కువ ఈ ప్రమాదాలకు గురైన వారిలో కార్లు, మోటారు సైకిళ్లపై వెళుతున్న వారే ఎక్కువ ఉన్నారు. పోలీసులు లెక్క ప్రకారం బైక్ ప్రమాదాలు 21 కాగా, కారుల్లో వెళుతూ ప్రమాదం బారిన పడినవి 26 కేసులు ఉన్నారుు. ఘోర ప్రమాదాలివీ ఈనెల 15న భీమడోలు మండలం సాయన్నపాలెంకు చెందిన గొలుగూరి హరినారాయణరెడ్డి తన కుటుంబసభ్యులతో కలసి బైక్‌పై పుష్కర సాన్నానికి వెళుతుండగా అనంతపల్లి ఎర్రకాలువ వద్ద వెనుక నుంచిఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో హరినారాయణరెడ్డి(32), అతని కుమారుడు శ్యాంమనోజ్ రెడ్డి(16 నెలలు) అక్కడిక్కడే మృతిచెందారు. ఈనెల 20న రాజమండ్రికి చెందిన వైరాల తరుణ్ కుమార్ (20), దిగమర్తి ప్రేమకుమార్(17) రాజమండ్రి నుంచి కొవ్వురు వస్తుండగా వెనుక నుండి కారు ఢీకొనడంతో ఇద్దరూ మరణించారు. ఈనెల 23 పుష్కర స్నానాలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా తాడేపల్లిగూడెం ఆటోనగర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో పుల్లెల భూషారావు(40), బుడావల రామకృష్ణ(42), కొఠారి పుట్టయ్య(65) అక్కడిక్కడే మృతిచెందారు. ఈనెల 24న విజయవాడకు చెందిన నాలుగురు యాత్రికులు పుష్కర స్నానాలు ముగించుకుని తిరిగి వెళుతుండగా, తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న తాడిచెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో వీఎస్ఎస్కేహెచ్ ప్రసాద్(36), ఎన్వీఎస్ ప్రసాద్(30), పామర్తి పాపారావు(60) మృతి చెందారు. ఈ ప్రమాదానికి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రపోవటమే అని భావిస్తున్నారు. ఉండి శివారులోని పదెకరాల తూము వద్ద పుష్కర స్నానాలు ముగించుకుని ఆటోలో తిరిగి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి మినీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో లంకా సత్తిబాబు(35), కాగిత జ్యోతిష్బాబు(6) మృతిచెందారు. దొమ్మేరు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాటూరుకు చెందిన దొండపాటి నందిని (7) అక్కడిక్కడే మృతిచెందింది. -
నీటిపర్వంలో అవినీతి కెరటాలు
ప్రజాధనాన్ని దిగమింగారు.. రాజమండ్రి సిటీ : పుష్కరాల పనుల్లో ప్రజాధనాన్ని దిగమింగారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ఆరోపించారు. వారెవరో తేల్చేందుకు విచారణ జరిపించాల ని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కర పనుల్లో జరిగిన అవకతవకలపై సిద్ధం చేసిన నివేదికను త్వరలో ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు చెప్పారు. అవినీతిని అధికారులపై నెట్టి వేస్తున్న ప్రజాప్రతినిధులు వారిని సాగనంపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిపరులైన అధికారులను ఇక్కడకు తీసుకు వచ్చిన వారిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పనుల కేటాయింపు, పారిశుద్ధ్య కార్మికులకు చెల్లింపుల వ్యవ హారంపై విచారణ జరపాలన్నారు. చంద్రబాబు వల్లే పుష్కరాలు విజయవంతం అధికారుల నిర్లక్ష్యం వల్లనే మొదటిరోజు తొక్కిసలాట చోటు చేసుకుందని గన్ని అన్నారు. పోలీసులు ద్వంద్వనీతిని అవలంబించారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులను పోలీస్ వాహనాల్లో యథేచ్ఛగా ఘాట్ల వద్దకు తీసుకు వెళ్ళారని, చివరి రోజు రద్దీ లేకపోయినా కోటిలింగాల ఘాట్‌లో తన వాహనాన్ని అడ్డుకున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు చేపట్టిన వీఐపీ పాస్‌ల సంస్కృతి ఏమిటో అర్థం కాలేదన్నారు.పుష్కరాలు విజయవంతమైన ఘనత ఆ సమయంలో రాజమండ్రిలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. పుష్కర యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు చేసిన సేవలు అద్వితీయమన్నారు. ‘పుష్కర’ అవినీతిని ఉపేక్షించబోం.. దానవాయిపేట (రాజమండ్రి) : పుష్కరాలో జరిగిన అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నివేదిక అందజేస్తామని బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. సోమవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర పనులో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, నగర సుందరీకరణ పనుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. కార్మికులకు రూ.425 వేతనం చెల్లిసున్నామని చెప్పి కేవలం రూ.280 మాత్రమే చెల్లించారని ఆరోపించారు. పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి స్థానికులు ముందుకు వచ్చినా బయట నుంచి ఎక్కువ మందిని తీసుకురావడంలో కమీషన్ల కక్కుర్తి ఉందని ఆరోపించారు. నగరంలో సుందరీకరణ పనులను కడియం నర్సరీలకు ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా ఇచ్చారన్నారు. బారికేడ్ల ఏర్పాటులో, ఘాట్ల నిర్మాణంలో, కొన్ని సివిల్ పనుల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని సహించమని, త్వరలోనే పుష్కర అవినీతిపై ప్రభుత్వాన్నికి నివేదిక అందజేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు, గరిమెళ్ళ చిట్టిబాబు, నగర ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ, వాసంశెట్టి గంగాధరరావు, మహిళా మోర్చా రాష్ర్ట కార్యదర్శి నాళం పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్ బక్క మనిషైనా.. బలమైన నిర్ణయాలు తీసుకున్నారు'
హైదరాబాద్: అందరి సహకారంతో తెలంగాణలో గోదావరి పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పుష్కరాలు విజయవంతం చేసిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బక్కపలుచని మనిషైనా కొన్నింటిలో బలమైన నిర్ణయాలు తీసుకున్నారని వారు అన్నారు. గతంలో పుష్కరాలు అంటే రాజమండ్రి అన్న భ్రమను తొలగించారన్నారు. ఇప్పుడా పరిస్థితిని మార్చి తెలంగాణలో పుష్కరాలను విజయవంతం చేశారన్నారు. ఇదే అనుభవంతో రానున్న సమ్మక్క సారక్క, కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేస్తామని వారు తెలిపారు. -
గోదావరిలో గల్లంతైన మహిళల మృతదేహాలు లభ్యం
ఏటూరునాగారం: గోదావరిలో పుష్కర స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతానపల్లి పడవరేవు వద్ద మహిళల మృతదేహాలను సోమవారం ఉదయం గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్వతి(35), కల్పన (21) కంతానపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 25 న సాయంత్రం గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయారు. వారి కోసం అప్పటి నుంచి గాలిస్తుండగా సోమవారం ఉదయం మృతదేహాలు బయటపడడంతో పోలీసులు నది వద్దకు చేరుకుని వాటికి వెలికి తీయించారు. పోస్ట్‌మార్టం కోసం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నెలముందే కృష్ణా పుష్కర పనులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిన నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరగనున్న కృష్ణా నదీ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. శనివారంతో గోదావరి పుష్కరాలు ముగియటంతో ఇక కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు అనుకున్నదానికి మించి భక్తులు పోటెత్తినప్పటికీ ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంతమంది భక్తులు పుణ్యస్నానాలాచరించారనే విషయంలో శాస్త్రీయ పద్ధతిలో లెక్కలు తేల్చనప్పటికీ... ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య 6.7 కోట్లుగా పేర్కొంటోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెల్లువెత్తటంతో అన్ని పుష్కర క్షేత్రాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు కూడా భక్తులు వెల్లువెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నిజానికి గోదావరి పుష్కరాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. నిధుల విషయం తేల్చకపోవటం, సకాలంలో వాటిని విడుదల చేయకపోవటంతో పుష్కరాలు ప్రారంభం అయ్యాక కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. వానలు లేక నదిలో నీటి ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకోవటంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ అదే ఓ రకంగా వరంగా మారింది. పుష్కరాల సమయంలో భారీ వర్షాలు కురిసి ఉంటే అంతా గందరగోళంగా మారేది. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని చోట్లా భక్తులు అధిక సంఖ్యలోనే కనిపించారు. ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తే భక్తులకు తలదాచుకునే సౌకర్యం ఉండకపోయేది. భద్రాచలం, బాసర, కాళేశ్వరం, ధర్మపురిలాంటి ప్రధాన ఘాట్ల వద్దనే ఏర్పాట్లు చాలకపోగా మిగతా చిన్న ఘాట్ల పరిస్థితి దారుణంగా ఉంది. వానలు కురవకపోవటంతో ఇబ్బందులు తప్పాయి. కృష్ణా పుష్కరాలు కూడా వానాకాలంలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలు ప్రారంభమయ్యే నెల ముందే ఏర్పాట్లు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుష్కర ఘాట్లకు ప్రాంతాలను గుర్తించే పని త్వరలో ప్రారంభించనున్నారు. మేడారంపై దృష్టి: ఇదిలా ఉండగా వచ్చే ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించాల్సి ఉంది. ప్రధాన గిరిజన జాతర కావటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. మూడురోజుల జాతరలో భక్తుల సంఖ్య కోటిని మించుతుంది. గత రెండు జాతరల్లో ఏర్పాట్లు సరిగా లేక భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పుష్కర విజయం సమష్టి కృషి ఫలితం
అభినందన సభలో సీఎం సాక్షి, రాజమండ్రి, రాజానగరం: ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సమష్టి కృషితోనే గోదావరి పుష్కరాలు విజయవంతమయ్యూయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు పోటీపడి ఈ క్రతువును జయప్రదం చేశారన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. పుష్కరాల్లో సేవలందించిన ఉద్యోగులకు సోమవారం నుంచి రెండు రోజులను సెలవులుగా ప్రకటించారు. ఆ కుటుంబాలను ఆదుకుంటాం.. పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 29 మంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చెప్పారు. అనంతరం పుష్కరాల్లో సేవలందించిన అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. మీడియాపై చిందులు... అభినందన సభలో మీడియాపై సీఎం చిందులేశారు. ‘వెళ్లిపోతే శాశ్వతంగా వెళ్లిపోండి. నోబడీ కెన్ డిక్టేట్. ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు...’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాస్తవానికి సభలో మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ కేటాయించినప్పటికీ ఇతరులు కూర్చుండిపోవడంతో పాత్రికేయులు, వీడియోగ్రాఫర్లు వీఐపీ గ్యాలరీ వెనుక నిలబడి చిత్రీకరిస్తుండగా వెనుకనున్న ఉద్యోగులు తమకు వేదిక కనబడలేదంటూ గొడవ చేశారు. దీంతో వేదికపై నుంచి సీఎం కలగజేసుకుంటూ ఫొటోగ్రాఫర్లంతా పక్కకు వచ్చేయాలన్నారు. తామెలా తీయాలంటూ వారంతా అనడంతో.. కెమెరాలు వేదికవైపు సెట్ చేసి కింద కూర్చోవాలని, లేదంటే అక్కడి నుంచి తప్పుకోవాలని చెప్పారు. దీనికి నిరసనగా కొంతమంది పాత్రికేయులు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సీఎం మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత సర్దుకొన్న ఆయన.. పుష్కరాలు విజయవంతంలో మీడియా కృషి మరువలేనిదంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మహాపుష్కర వనానికి శంకుస్థాపన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న గోదావరి మహాపుష్కర వనానికి సీఎం శంకుస్థాపన చేశారు. గోదావరి మహాపుష్కరాల పైలాన్‌ని ఆవిష్కరించారు. 2015 పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, కోట్లాది మంది భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించి తరించారన్నారు. సీఎం వెంట మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, మేయర్ పంతం రజనీశేషసాయి, కలెక్టర్ హెచ్ అరుణకుమార్ తదితరులు ఉన్నారు. -
'టీడీపీనే చేసిందేమోనని అనుమానం'
-
12 రోజుల్లో రూ. 250 కోట్ల వ్యాపారం
రాజమండ్రి : రాజమండ్రిలో 12 రోజులపాటు జరిగిన గోదావరి పుష్కరాలతో నగరంలో వ్యాపార లావాదేవీలు ఓ రేంజ్లో జరిగాయని జిల్లా ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాల వల్ల ఒక్క రాజమండ్రిలోనే రూ. 250 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పుష్కరాల మొదలైన నాటి నుంచి ప్రతి రోజు 20 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు రాజమండ్రికి విచ్చేశారు. పాన్ షాపులు, కిరాణ కొట్లు, బట్టల దుకాణాలు, హోటళ్లు, టీ స్టాల్స్, ప్రైవేట్ ట్రావెల్స్, టిఫిన్ సెంటర్లు... పుష్కర ఘాట్లలో పిండ ప్రధానం వరకు భక్తులు బాగానే ఖర్చు పెట్టారని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఒక్కో భక్తుడు ఎంత లేదన్నా కనీసం రూ. 200 ఖర్చు చేసినా... 12 రోజుల్లో వ్యాపారం రూ. 250 కోట్లుపైగానే ఉంటుందని భావిస్తున్నారు. నగరంలోని అన్ని పుష్కర ఘాట్లలలో 55 లక్షల మంది పిండ ప్రధానం చేస్తే... ఒక్క కోటి లింగాల రేవులోనే 22 లక్షల మంది పిండ ప్రధానం చేశారు. దీంతో ఎంతగా వ్యాపారం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చని అంటున్నారు. -
పుష్కర తీరంలో 4 లక్షల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన తిరుమల నమూనా ఆలయంలో శ్రీవారిని 4.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందజేసింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.35 లక్షల ఆదాయం లభించింది. తిరుమల తరహాలోనే రాజమండ్రిలో కూడా శ్రీవారికి పూజలు నిర్వహించారు. నమూనా ఆలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకూ ప్రతి రోజు నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపునకు విశేష స్పందన లభించినట్టు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. -
ఆదిపర్వం..పరిసమాప్తం..
♦ ముగిసిన గోదావరి పుష్కర మహాసరంభం ♦ అట్టహాసంగా ఆది పుష్కరాల ముగింపు వేడుకలు ♦ చివరి రోజు తగ్గిన భక్తుల రద్దీ ♦ 12 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 3.35 కోట్ల మంది పుణ్యస్నానాలు రాజమండ్రి : ఒక మహాసంరంభానికి తెరపడింది. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద పండగగా నిలిచిన.. పన్నెండు రోజులపాటు సాగిన.. గోదావరి పుష్కర మహాపర్వం శనివారం సాయంత్రం 6.38 గంటలకు అట్టహాసంగా ముగిసింది. మానవాళితోపాటు సమస్త జీవజాలానికీ జీవనాడిగా మారిన తల్లి గోదావరి మాత రుణం తీర్చుకునేందుకు ఈ జిల్లా జిల్లావాసులతోపాటు.. రాష్ట్రం నలుమూలల నుంచి.. దేశ విదేశాల నుంచి యాత్రికులు కోట్లాదిగా ఈ మహాపర్వం సందర్భంగా పోటెత్తారు. గోదారి మాత ముందు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లారు. వెల్లువెత్తిన భక్తులను చూసి గోదావరి తల్లి కూడా పులకించిపోయింది. పుష్కరాల తొలి రోజే జరిగిన తొక్కిసలాటలో 29 మంది, పుష్కరాలకు వస్తూ ఇంకా అనేకమంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలింది. మరోపక్క పుష్కర పనులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోపక్క ప్రభుత్వం అరకొర సౌకర్యాలు మాత్రమే కల్పించడం యాత్రికులను ఇబ్బందులకు గురి చేసింది. ఏది ఎలా ఉన్నా ఈ మహాపర్వానికి కోట్లాదిగా భక్తులు తరలివచ్చి, విజయవంతం చేశారు. పుష్కర పర్వానికి ఘనంగా వీడ్కోలు గోదావరి నదికి మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు జరుగుతాయి. ఈ నెల 14నుంచి ప్రారంభమైన ఆది పుష్కరాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు జిల్లావాసులు స్పందించారు. శనివారం రాత్రి ఇంటింటా దీపారాధనతో మహిళలు గోదావరి పుష్కరాలకు ఘనమైన వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆధ్వర్యాన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నిత్యహారతి శోభాయమానంగా జరగడంతోపాటు, లేజర్ కాంతులు పరచిన రంగులతో గోదావరి తీరం ముగ్ధమనోహరంగా మారింది. కళ్లు మిరిమిట్లు గొలిపేలా సాగిన బాణసంచా కాల్పులు ప్రేక్షకులను అలరించాయి. పెద్ద సంఖ్యలో ఎగురవేసిన ఆకాశ దీపాలు ఆకాశ వీధిలో నక్షత్రాలు ఎగురుతున్నాయా అన్నట్టుగా భ్రమింపజేశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పుష్కర ఘాట్ జనగోదారిగా మారింది. వేడుకల్లో యోగా గురువు బాబా రామ్‌దేవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. తొలి రోజు తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాట్ బయట గుమిగూడిన ప్రజలను చెల్లాచెదరు చేశారు. ఈ సందర్భంగా వారు దురుసుగా ప్రవర్తించడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు బాబా రామ్‌దేవ్ వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. 3.35 కోట్ల మంది భక్తులు పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం భక్తులతో పోటెత్తిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ 12 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 3,35,09,316 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 12,32,670 పిండప్రదానాలు జరిగాయి. ఈసారి యాత్రికుల తాకిడి ఒక్క రాజమండ్రి నగరానికే పరిమితం కాలేదు. గ్రామీణ ఘాట్లకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లాలోని కోటిపల్లి ఘాట్‌లో 20,51,417 మంది స్నానాలు చేశారు. చివరి రోజు తగ్గిన తాకిడి మహాపర్వం చివరి రోజైన శనివారం భక్తుల రాక ఆశించిన స్థాయిలో కనిపించలేదు. రాజమండ్రిలోని కోటిలింగాలు, వీఐపీ, గౌతమ ఘాట్లు ఉదయం మినహా, మిగిలిన సమయాల్లో ఖాళీగా దర్శనమిచ్చాయి. రాజమండ్రి నగరంలో రైల్వే, బస్టాండ్ల వద్ద కూడా పెద్దగా రద్దీ కనిపించకపోవడం గమనార్హం. అయితే అధికారులు మాత్రం 31,60,599 మంది స్నానాలు చేసినట్టు చెప్పడం విడ్డూరంగా ఉంది. గ్రామీణ ఘాట్లలో మాత్రం భక్తజనం యథాతథంగా పోటెత్తారు. చివరి రోజు యాత్రికులకు ఆతిథ్య మర్యాదలు చేసేందుకు రాజమండ్రి నగరవాసులు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఏర్పాట్లు చేశాయి. భక్తుల రాక పెద్దగా లేకపోవడంతో వారంతా నిరాశ చెందారు. మూడు రోజులు మినహా.. గోదావరి పుష్కరాల ఆరంభం నుంచి ముగింపు వరకూ జిల్లాలో గోదావరి తీరం జనజాతరను తలపించింది. పుష్కరాలు ఆరంభమైన తరువాత గత బుధ, గురువారాలు, చివరి రోజైన శనివారం మినహా మిగిలిన రోజుల్లో జనం వరదలా తరలివచ్చారు. గోదావరి జిల్లాలో ప్రవేశించే నెల్లిపాక మండలం గుండాల నుంచి సముద్ర సంగమ ప్రాంతాలైన అంతర్వేది, యానాం, ఓడలరేవు వరకూ గోదావరి తీరం ప్రతి రోజూ జనసంద్రదమైంది. చివరకు గోదావరి కాలువలు ప్రవహించేచోట కూడా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేశారు. గత శని, ఆదివారాల్లో అయితే గోదావరి తీరం జనసునామీని తలపించింది. ఆ రెండు రోజులూ జిల్లాలో సుమారు 83 లక్షల మంది స్నానాలు చేయగా, ఆదివారం ఒక్కరోజే 42.50 లక్షల మంది స్నానాలు చేశారు. నగరంలోని స్టేడియం రోడ్డులో టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయాన్ని 4 లక్షల మంది దర్శించుకున్నారు. సాయంత్రం సమయంలో స్వామివారిని వేదమంత్రాలు, మేళతాళాల నడుమ వీఐపీ ఘాట్ వరకూ తీసుకువెళ్లడం తిరుమల మాడవీధుల్లో జరిగే ఊరేగింపును తలపించింది. కందుకూరి రాజ్యలక్ష్మీ కళాశాలలో ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలను ఏడు లక్షల మంది భక్తులు సందర్శించారు. ప్రత్యక్ష నరకం చూపించారు పుష్కరాలకు తరలిరావాలంటూ కోట్ల రూపాయలతో ప్రచారం చేసిన ప్రభుత్వం యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో చేతులెత్తేసింది. చాలీచాలని పుష్కర నగర్లు, ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక రైళ్లు భక్తులను తీవ్ర అసౌకర్యానికి గురి చేశాయి. మరుగుదొడ్లకు నీరు లేక యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గత శని, ఆదివారాల్లో రాజమండ్రి నగరంతోపాటు జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో భక్తులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. రాజమండ్రి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో వారు పడిన పాట్లు అనీ ఇన్నీకావు. -
శుభ మంగళం
తెలంగాణలో 12 రోజుల్లో 6.76 కోట్ల మంది పుష్కర స్నానాలు సాక్షి నెట్వర్క్: 12 రోజులపాటు అత్యంత వైభవోపేతంగా సాగిన గోదావరి పుష్కరాలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను నింపిన పుష్కరుడికి జనకోటి భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ప్రధాన పుష్కర ఘాట్ల వద్ద ప్రభుత్వం తరఫున మంత్రులు గోదారమ్మకు మహాహారతినిచ్చారు. ఆది పుష్కరాల వీడ్కోలు కార్యక్రమానికి జనం లక్షలాదిగా తరలివచ్చారు. ఈసారి పుష్కరాలకు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భక్తులు పోటెత్తారు. పన్నెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 6.76 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2.93 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. కాళేశ్వరంలో 83 లక్షలు, ధర్మపురిలో 93 లక్షలు, మంథనిలో 24 లక్షలు, కోటిలింగాలలో 20 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. శనివారం కాళేశ్వరంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చెంచులతో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు జిల్లాకు తరలివచ్చారు. ఈనెల 14న ఉదయం 6.21 నిమిషాలకు సీఎం కేసీఆర్ దంపతులు ధర్మపురిలో పుణ్యస్నానాలు చేసి పుష్కరాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ధర్మపురిలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బాసరలో గోదారమ్మకు మహా హారతి ఇచ్చి 12 రోజుల పుష్కర వేడుకలకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఘనంగా పుష్కర శోభాయాత్ర నిర్వహించారు. కన్నుల పండువగా వేడుకలు.. బాసరలో చదువుల తల్లి సరస్వతీ వెలసిన వ్యాసపురిలో పుష్కరాల ముగింపు ఉత్సవం కన్నుల పండువగా సాగింది. బాసర ఆలయం నుంచి గోదావరి వరకు సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. తొలుత సరస్వతీ అమ్మవారి విగ్రహా న్ని పల్లకిలో శోభాయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకువెళ్లారు. మేళతాళాలు, భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల మధ్య అమ్మవారిని స్మరిస్తూ నదీ తీరానికి చేరుకున్న అర్చకులు, పూజారులు పూజలు చేశారు. నదీతీరాన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అందరినీ చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. అనంతరం నది మధ్యకు వెళ్లి సంప్రదాయక మొంటెల వాయినం సమర్పించారు. అనంతరం గోదావరి నదికి మహా హారతినిచ్చారు. హారతి సమయంలో వరుణుడు చినుకులు కురిపించడంతో భక్తులు పులకరించిపోయారు. శనివారం అత్యధికంగా మంచిర్యాల గోదావరి తీరం వద్ద సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. బాసరలో లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, జెడ్పీచైర్మన్ శోభారాణి, ఎంపీ నగేశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. భద్రాచలంలో 33 లక్షల మంది.. పుష్కరాల్లో భాగంగా 12 రోజుల్లో ఖమ్మం జిల్లాలో అరకోటికిపైగానే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అందులో ఒక్క భద్రాచలంలోనే 33 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. పర్ణశాల, మోతె ఘాట్ లు కూడా కిక్కిరిసిపోయాయి. శనివారం పుష్కరాలు ముగిసేసరికి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎనిమిది ఘాట్లకు 68 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. అయోధ్య, కాశీ నుంచి తరలివచ్చిన సాధువులు యాగం నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. భద్రాచలం వచ్చిన సాధువులు గోదావరిలో పుష్కరస్నానం చేసి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం డీజీపీ అనురాగ్‌శర్మ మోతెలో పుష్కర స్నానం ఆచరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. భద్రాద్రి రామయ్యను 12 రోజుల్లో సుమారు 10 లక్షల మందికిపైగా దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో చివరి మూడు రోజులు వీఐపీ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. ‘పుష్కర’ సిబ్బందికి సీఎం అభినందనలు తెలంగాణలో గోదావరి మహాపుష్కరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఒక ప్రకటనలో అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఐదు జిల్లాల్లో స్నానం చేసిన కోట్లాది మంది భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆది పుష్కరాలను దిగ్విజయం చేశారని కొనియాడారు. పుష్కర ఉద్యోగులకు రెండు రోజుల సెలవు సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పుష్కర విధులు నిర్వహించిన ఉద్యోగుల సెలవుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. -
ముగిసిన పుష్కర పర్వం
* ఆంధ్రప్రదేశ్‌లో అట్టహాసంగా ముగింపు * 274 ఘాట్లలో 4.89కోట్ల మంది భక్తుల పుణ్యస్నానం సాక్షి, రాజమండ్రి: పుష్కర మహాపర్వం ముగియడంతో పన్నెండు రోజులుగా భక్తజనంతో కిక్కిరిసిన గోదావరి తీరం ఒక్కసారిగా బోసిపోయింది. పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కర పుణ్యస్నానానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు, ప్రవాస భారతీయులు ఖండాంతరాలు దాటి మరీ వచ్చారు. గోదావరి మాత ఆశీస్సులు అందుకున్న భక్తులు ఒక్కొక్కరుగా తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 14 ఉదయం 6.26 గంటలకు రాజమండ్రి పుష్కరఘాట్‌లో గోదావరి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా గోదావరి మాతకు పూజలు చేసి పుష్కరస్నానమాచరించారు.అదే రోజు అక్కడ జరిగిన తొక్కిసలాట అపశ్రుతితో ప్రారంభమైన పుష్కరాలు శనివారంతో అట్టహాసంగా ముగిశాయి. ఉభయగోదావరి జిల్లాల్లో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పండుగలా జరిగిన ఈ పుష్కరాలకు శనివారం సాయంత్రం 6.38 గంటలకు ముగింపు పలికారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రముఖసినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో పుష్కర ఘాట్‌లో నిత్యహారతికి ప్రత్యేకతను తీసుకువచ్చేలా స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టం, కాంతులీనే లేజర్‌షో, గోదావరిలో రెండు వంతెనల నడుమ కళ్లు మిరిమిట్లు గొలిపేలా భారీ బాణసంచా కాల్పులతో ఈ మహాపర్వానికి ఘనమైన వీడ్కోలు పలికారు. పుష్కర గడియలు ముగియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లక్షదీపార్చన ప్రారంభించారు. ఆ తర్వాత సుమారు గంటన్నర వరకు గోదావరిలో లక్షదీపాలు వదిలే కార్యక్రమం కొనసాగింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన సుమధుర గాత్రకచేరీతో శ్రోతలను తన్మయుల్ని చేశారు. పలు గీతాలతో పుష్కర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ భక్తులను పులకింపజేశారు. వెయ్యి మంది కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ముగింపు వేడుకల్లో బాబా రామ్‌దేవ్, సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రసంగించారు. చంద్రబాబు పిలుపు ఇచ్చిన ఇంటింటి దీపారాధనకు స్పందన కరువైంది. కాగా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో డీజీపీ జేవీ రాముడు పుష్కర స్నానమాచరించి, పిండప్రదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పి.సుజాత, పి.మాణిక్యాలరావు, శిద్దా రాఘవరావు కొవ్వూరులోని ఘాట్లను పరిశీలించారు. ముహూర్తం నుంచి.. నిత్య హారతి వరకు.. పుష్కర ముహూర్తమే వివాదంతో మొదలైంది. పండితులు, వివిధ మఠాధిపతులు భిన్నమైన తేదీలు చెప్పినా ప్రభుత్వం జూలై 14న ప్రారంభించి తన పంతం నెగ్గించుకుంది. గోదావరి నిత్యహారతి సంప్రదాయ విరుద్ధంగా గోదావరికి కాకుండా వీఐపీలకు ఇచ్చినట్టుగా పట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కళ్లు తెరిచిన ప్రభుత్వం 26వ తేదీ నుంచి నిత్యహారతి గోదావరికి అభిముఖంగా నిర్వహించనుంది. వీఐపీల రాక: పుష్కర స్నానాలకు పలువురు రాజకీయ, సినీ, పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరించారు. గవర్నర్ నరసింహన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్బాబాసాహెబ్ బొసాలే, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యోగా గురువుబాబారామ్దేవ్, చినజీయర్‌స్వామి తదితరులు పుష్కరాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రికి సీడ్ కేపిటల్ ప్లాన్‌ను అందించారు. 29 కుటుంబాల్లో విషాదం పుష్కరాలు ప్రారంభమైన గంటన్నరలోనే రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన ఘటన పుష్కర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. రెండు జిల్లాల్లో పుష్కర స్నానానికి వచ్చి గల్లంతై, రోడ్డు ప్రమాదాల్లో మరో 80 మంది మృతిచెందారు. అలాగే 22వ తేదీ రాత్రి రాజమండ్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలో మూడు పోలీసు వాహనాలు దగ్ధమై, పలువురు ఆస్పత్రిపాలైన ఘటన భక్తులను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. అవరోధాలు ఎదురైనా... సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయలేక సర్కారు చేతులెత్తేసింది. ప్రణాళిక లేకుండా అనుసరించిన ఏకపక్ష విధానంతో భక్తులు నరకయాతన పడ్డారు. అటు విజయవాడ, ఇటు విశాఖ వరకు జాతీయరహదారిపై పూటలతరబడి ట్రాఫిక్ స్తంభించి ప్రయాణం నరకప్రాయమైంది. దీనికితోడు ముఖ్యమంత్రి రాజమండ్రిలోనే మకాంచేసి మంత్రులు, అధికారగణంతో సమీక్షలు, పర్యటనల పేరుతో కలియతిరగడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వ ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉన్నా భక్తులు సర్దుకుపోయారు. వందలాది స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు, స్థానికులు ముందుకు వచ్చి తలోచేయి వేసి పుష్కరాలను గట్టెక్కించారు. భళా ‘పుష్కర గోదావరి’ * 1,260 మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన * అలరించిన మంగళంపల్లి సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల చివరి రోజైన శనివారం రాజమండ్రిలో ప్రదర్శించిన భారీ కూచిపూడి నృత్యం ప్రేక్షకులను అలరించింది. 1,260 మంది కూచిపూడి కళాకారులతో ‘పుష్కర గోదావరి’ పేరిట కూచిపూడి నాట్యారామం సమర్పణలో వేదాం తం రామలింగంశాస్త్రి పర్యవేక్షణలో నృత్యరూపకం ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు దంపతులు, యోగా గురువు బాబా రాందేవ్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరీ శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. అలిగిన పల్లె: ఏపీ సమాచార, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అలిగారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి వేదికపైకి ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను వేదిక కిందే ఉంచి సభలో పాల్గొన్నారు. -
ముగిసిన పుష్కర పండుగ
పన్నెండేళ్లకొచ్చిన పుష్కరాలు.. గోదారి వైపు సకల జన పరుగులు.. పన్నెండు రోజుల పుణ్యస్నానాలు.. లక్షలాదిగా భక్తజన హారతులు.. గంగమ్మ తీరం జనతీర్థంగా.. మంగపేట మురవంగా.. రామన్నగూడెం రాజసంగా.. ముల్లకట్ట మురిపెంగా.. ఉట్టిపడిన సంప్రదాయం.. సమ్మక-సారలమ్మకు వందనం.. హేమాచలుడికి నీరా‘జనం’.. కాకతీయ కళను చాటిన రామప్ప దర్శనం.. గోదావరి పుష్కర మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశారుు. మంగపేటలో డిప్యూటీ సీఎం శ్రీహరి, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మె ల్యే ధర్మారెడ్డి, కలెక్టర్, ఎస్పీ పూజలు చేశారు. పూజారులు గోదారమ్మకు సంధ్యాహారతి ఇచ్చి, పన్నెండేళ్లకు కలుద్దామని బై..బై చెప్పారు. ముగిసిన పుష్కర మహోత్సవాలు - గోదావరి తల్లికి సంధ్యా హారతితో ఘన వీడ్కోలు - మంగపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పూజలు - హాజరైన జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మెల్యే ధర్మారెడ్డి సాక్షి, హన్మకొండ : గోదావరి పుష్కర పండుగ ముగిసింది. చివరిరోజు శనివారం వరకు జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్ట ఘాట్లలో సుమారు 25ల క్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. 12రోజుల పాటు పో లీసులు, రెవెన్యూ అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు ‘పుష్కర’ సేవలో నిమగ్నమయ్యాయి. అగ్రస్థానంలో మంగపేటఘాట్ గోదావరి నదిలోని రామన్నగూడెం, ముల్లకట్ట తది తర ప్రాంతాల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో తక్కువ సంఖ్యలోనే భక్తులు పుష్కర స్నానా లు ఆచరించారు. అరుుతే, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న మంగపేట ఘాట్ వద్ద 90శాతం మంది పుణ్యస్నానాలు చేశారు. మంగపేట్తోపాటు రామన్నగూడెం, మంగపేటలోనూ నీటి నిల్వలు ఉన్న ప్రాంతం లో చలువపందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునే గదు లు ఏర్పాటు చేశారు. డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ అజ్మీరా సీతారాయం నాయక్ స్వయంగా ఏర్పాట్లు పర్యవే క్షించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్ పాటి ల్, ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్ ఘాట్ల వద్దే మకాం వేశారు. పోలీసుల అంకితభావం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా 12 రోజు ల పాటు పుష్కరఘాట్ల వద్దే ఉంటూ భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. భక్తులు వదిలేసిన వ్యర్థ్యాలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య కార్మికు లు వందలాదిమంది పుష్కరఘాట్లు, గోదావరి తీ రంతోపాటు సమీప గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో విశ్రమించకుండా పనిచేశారు. నీటిలో దిగి స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా సుమారు 90 మంది గజఈత గాళ్లు అనునిత్యం కంటికి రెప్పలా కాపలాకాశారు. జనహారతి మంగపేట : పన్నెండు రోజుల్లో గోదావరితో కలి సి సుమారు 25 లక్షల మంది భక్తులను దీవిం చిన పుష్కరుడు శనివారం సెలవు తీసుకున్నా డు. ప్రభుత్వం తర ఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 5.35 గంటలకు శాస్త్రోక్తంగా పుష్కరాలకు సమాప్తం పలికారు. శ్రీసూక్త పద్ధతి న హేమాచల నర్సింహస్వామి, ఉమాచంద్రశేఖ రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సుదర్శన అళ్వార్, గంగమ్మకు షోడ శోపచార పూ జలు నిర్వహించారు. అనంతరం తలపై హేమాచల లక్ష్మీనర్సింహస్వామి శఠారి, పాదుకలు త లపై ధరించిన కడియం గోదావరి వైపు అడుగు వేశారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ ఆయన ముందు నడిచి గోదారమ్మకు చీరసారెలు సమర్పించారు. అనంతరం వీరు జల్లుస్నానం చేయడంతో పుష్కరాలు ముగి సినట్లరు్యంది. అర్చకులు విస్సావఝ్జల నరేశ్‌శర్మ, కొయ్యాడ శివరాం, వెంకటనారాయణ, రాజీవ్నాగశర్మ ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతినిచ్చారు. -
నీరాజనం
నరసాపురం అర్బన్ : నరసాపురంలో శ నివారం జన కెరటాలు ఎగిసిపడ్డాయి. పట్ణణంలో ఏ వీధి చూసినా జనమే. అందరి పయనం గోదావరి ఘాట్లవైపే సాగింది. పుష్కర మహాసంబరం చివరిరోజు కావడంతో భ క్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే ఘాట్లన్నీ రద్దీగా మారిపోయాయి. ఘాట్లకు వచ్చే రహదారులు జనంతో నిండిపోయాయి. వలంధరఘాట్, లలితాంబ, కొండాలమ్మ, అమరేశ్వర్ ఘాట్లు జనంతో కిక్కిరిశాయి. రూరల్ పరిధిలోని ముస్కేపాలెం, లక్ష్మణేశ్వరం, దర్భరేవు, పీచుపాలెం, బియ్యపుతిప్ప ఘాట్ల వద్ద కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఘాట్లకు చేరుకున్న భక్తులు స్నానాలు చేయడానికి అరగంట సమయం వరకు పట్టింది. ఉదయం పూట పాటు కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో భక్తులు జల్లు స్నానాలు ఆచరించారు. మహిళలు, వృద్ధులు, పెద్దసంఖ్యలో స్నానాలు చేశారు. విపరీతమైన వేడి, ఉక్కపోత ఉన్నప్పటికీ అశేష జనం భక్తి ముందు అవేమీ నిలబడలేదు. దాతలు, స్వచ్ఛంద సంఘాలు భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. 22 లక్షల మందికి పైగా స్నానాలు గోదావరి పుష్కర సంబరం ముగిసింది. అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ యాత్రికులు పుష్కరాలకు పోటెత్తారు. నరసాపురం రేవుల్లో 22 లక్షలకు మందికి పైగా స్నానాలు చేశారు. ప్రతిరోజూ 1.50 లక్షలకు మంది వరకూ స్నానాలు చేశారు. 2003 పుష్కరాల్లో నరసాపురంలో 5 లక్షల మంది వరకు స్నానాలు చేసినట్టు అంచనా. ఈ పుష్కరాల్లో భక్తుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. 12 రోజులూ నరసాపురంలో ఉన్న అన్ని ఘాట్లలో 22,10,059 మంది పుష్కర స్నానాలు చేశారని అధికారులు లెక్కలు కట్టారు. తేదీ= హాజరైన భక్తులు 14= 1,062,248 15= 1,46,228 16= 1,39,340 17= 1,42,649 18= 3,18,396 19= 2,06,974 20= 1,72,147 21= 1,19,658 22= 1,80,636 23= 1,75,124 24= 1,66,981 25= 3,35,138 కిక్కిరిసిన కొవ్వూరు టోల్గేట్ (కొవ్వూరు) : గోదావరి పుష్కరాల సందర్భంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి స్నానఘట్టం భక్తులతో కిటకిటలాడింది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యాహ్నానికి స్నానఘట్టానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అన్ని స్నానఘట్టాల్లో భక్తుల సందడి నెలకొంది. సాయంత్రం ఆరు గంటలకు భారీ సంఖ్యలో మహిళలు గోష్పాదక్షేత్రానికి చేరుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి గోదావరి మాతకు నీరాజనం అర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు పూజలు చేశారు. తాళ్లపూడికి యూత్రికుల తాకిడి తాళ్లపూడి : పుష్కరాల చివరిరోజు తాళ్లపూడి మండలంలోని ఘాట్లకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్నానమాచరించారు. గోదారమ్మ సంబరాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆఖరిరోజు కావడంతో గోదావరికి ఉదయం నుంచి హారతులు ఇచ్చి ఘనంగా ముగింపు పలికారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేగేశ్వరపురం, ప్రక్కిలంక, తాళ్లపూడి, తాడిపూడి, బల్లిపాడు ఘాట్ల వద్దకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేశారు. శనివారం సుమారు 55 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. కోడేరు కిటకిట కోడేరు (ఆచంట) : పుష్కరాల చివరి రోజున ఊహించినట్టుగానే కోడేరు పుష్కరఘాట్ భక్తులతో పోటెత్తింది. నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. చివరిరోజు కావడంతో గోదార మ్మకు భక్తిశ్రద్ధలతో గంగ పూజలు నిర్వహించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఘాట్లలోకి ఎగువ నుంచి నీరు పెద్దఎత్తున చేరడంతో భక్తులు ఉత్సాహంగా పుష్కరస్నానాలు ఆచరించారు. మండలంలోని కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్లు భక్తులతో కళకళలాడాయి. కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్ల వద్ద దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జనసంద్రమైన తీపర్రు పెరవలి : గోదావరి పుష్కరాలు చివరిరోజైన శనివారం పుష్కర ఘాట్లకు భారీగా పోటెత్తారు. ఏ పుష్కర ఘాట్ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు రావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. ఒకవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు జనసంద్రాన్ని చూసి హడలిపోయారు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రూపులు గ్రూపులుగా పుష్కర పుణ్య స్నానాలకు భక్తులను నదిలోకి దింపి స్నానాలు చేయించారు. తీపర్రు పుష్కర ఘాట్‌కు 90 వేల మంది, ఖండవల్లికి లక్షకు పైగా, ఉసులుమర్రు 15 వేలు, కానూరు అగ్రహారానికి 20 వేలు, కాకరపర్రులో 35 వేలు, ముక్కామలలో 80 వేలు, ఉమ్మిడివారిపాలెంలో 60 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనాలు వేశారు. సిద్ధాంతంలో జన ప్రవాహం సిద్ధాంతం (పెనుగొండ రూరల్) : గోదావరి పుష్కరాలకు సిద్ధాంతంలో మహా ముగింపు పలికారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పుణ్యస్నానాలు చేస్తూ గోదారమ్మకు భక్తులు నిరాజనం పలికారు. శనివారం ఆఖరిరోజు కావడంతో భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. వేకువజాము నుంచి రాత్రి వరకు పుణ్యస్నానాలు జరుగుతూనే ఉన్నాయి. రికార్డుస్థాయిలో భక్తులు తరలిరావడంతో సిబ్బంది చెమటోడ్చారు. భక్తులతో నాలుగు ఘాట్లు కిక్కిరిశారుు. శనివా రం ఒక్కరోజే 1.50 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నా రు. భక్తుల సంఖ్య అధికంగా వచ్చి నా సిద్ధాంతం గ్రామస్థులు ఆతి థ్యంలోనూ మిన్న అని నిరూపించుకొన్నారు. ప్రతి ఒక్కర ూ ఎవరి స్తోమతను బట్టి వారు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. మం చి నీరు, పాలు, టీ, వేడినీళ్లు, అల్పాహారం, భోజ నాలు, ప్రసాదాలు ఇలా అన్నింటిని దాతలు ఇతోధికంగా పంపిణీ చేశారు. పట్టిసీమకు పోటెత్తారు పోలవరం : పుష్కరాలు చివరిరోజైన శనివారం పట్టిసీమ రేవుకు భక్తులు పోటెత్తారు. వరుసగా 3వ రోజు కూడా లాంచీలు తిరగకపోవటంతో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం లేక భక్తులు నిరాశతో వెనుదిరిగారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో పట్టిసీమ రేవులో పుష్కర ఘాట్ మెట్లపైనే పుష్కర స్నానాలు చేయాల్సి వచ్చింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గోదావరి పెరగటంతో మహానందీశ్వర క్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గం కూడా మునిగిపోయింది. పట్టిసీమతో పాటు పోలవరం తాత్కాలిక ఘాట్లలో, గూటాల ఆంజనేయస్వామి ఘాట్‌లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేశారు. పట్టిసీమలో సుమారు 50 వేల మంది మిగిలిన ఘాట్లలో మరో 50 వేల మంది పుష్కరస్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేశారు. -
వైభవంగా గోదావరి పుష్కరాలు ముగింపు సంబరం
చివరి రోజున 18.10 లక్షల మంది పుణ్యస్నానాలు అత్యధికంగా కొవ్వూరు డివిజన్లో 7.39 లక్షలు తరలివచ్చిన ఒడిశా భక్తులు 15.50 లక్షల మంది పుష్కర యాత్రికులను తరలించిన ఆర్టీసీ 12 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం రూ.4.40 కోట్లు సాక్షి, కొవ్వూరు :గోదావరి పుష్కరాలకు భక్తులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. పుష్కరోత్సవాల ముగింపు రోజైన శనివారం ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తం 12 రోజుల్లో జిల్లాలోని 97 ఘాట్లలో శనివారం సాయంత్రం 4 గంటల సమయానికి స్నానాలు ఆచరించిన వారి సంఖ్య కోటిన్నర దాటింది. శనివారం ఒక్కరోజే 18.10 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 2003 పుష్కరాలతో పోలిస్తే ఈసారి సుమారు 35 లక్షల మంది యాత్రికులు అధికంగా వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయానికి సమయానికి అందిన సమాయారం ప్రకారం గడచిన 12 రోజుల్లో 1,52,50,779 మంది స్నానాలు ఆచరించారు. శనివారం జిల్లాలోని 97 ఘాట్లకు 18,10,487 మంది భక్తులు వచ్చినట్టు ప్రకటన వెలువడింది. కొవ్వూరు డివిజన్లో అత్యధికంగా 7,38,997 మంది, నరసాపురం డివిజన్లో 6,32,997 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్లో 4,38,513 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలో సుమారు 55 వేల మంది ఒడిశా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు సమాచారం. ఆర్టీసీకీ రూ4.40 కోట్ల ఆదాయం : పుష్కరాల నేపథ్యంలో జిల్లా ఆర్టీసీకి రూ.4.40 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రదానంగా పుష్కరాల 12 రోజులు జిల్లావ్యాప్తంగా 498 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి. వీటిలో 400 బస్సులు జిల్లాలోని పుష్కర ఘాట్లకు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించగా, కొవ్వూరులో 80 ఉచిత బస్సులు, నరసాపురంలో 10, సిద్ధాంతంలో 8 బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 15.50 లక్షల మంది రాకపోకలు సాగించారు. -
గోదారమ్మా.. నీకు వందనం
పావన వాహిని మహాపర్వం అట్టహాసంగా ముగిసింది. ఎందరికో తీపి జ్ఞాపకాలను.. కొందరికి చేదు అనుభవాలను మిగిల్చి కాలప్రవాహంలో కలిసిపోయింది. 2027లో వచ్చే పుష్కరాల వరకు గుర్తుండేలా ఇప్పటి పాలకులకు, అధికారులకు గుణపాఠం నేర్పింది. కేవలం ప్రచారయావ తప్ప యాత్రికులకు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని పాలకుల నిర్లక్ష్యం ఎన్ని పుష్కరాలకైనా మాయనిమచ్చలా మిగిలిపోనుంది. రాజమండ్రిలో తొలిరోజు 29మంది మృత్యువాత పడిన ఘోర విషాద ఘటన పొరుగునే ఉన్న పశ్చిమ వాసులనూ కలవరపర్చింది. ఇక ఎన్నో వ్యయ ప్రయాసలు, దూరాభారాలకోర్చి వచ్చిన యాత్రికులు ప్రభుత్వ అరకొర ఏర్పాట్లు నరకయాతన అనుభవించేలా చేసినా.. గోదారి బిడ్డల ఔదార్యానికి, దాతృత్వానికి, సహాయ గుణానికి పరవశిం చిపోయారు. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలతో తిరుగు పయనమయ్యారు. కేంద్రమంత్రులు.. ప్రముఖులు ఎక్కడ? కుంభమేళా తరహాలో నిర్వహించే పుష్కరాలకు దేశ, విదేశీ ప్రముఖులను తీసుకువస్తామని ఈ ప్రాంత వైశిష్ట్యాన్ని నలుచెరగులా వ్యాపింపజేస్తామని పాలకులు తొలుత ఆర్భాటంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చే అవకాశముందని సీఎం చంద్రబాబు.. రాష్ట్రపతికి, ఉపరాష్ర్టపతికి స్వయంగా ఆహ్వానం ఇచ్చామని జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డాంబికాలు పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా 18మంది కేంద్రమంత్రులు గోదావరి పుణ్యస్నానాలకు తరలిరానున్నారని మాణిక్యాలరావు ఒకటికి పదిసార్లు చెప్పారు. కానీ మన రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు మినహా మరే ఇతర కేంద్రమంత్రి పుష్కర స్నానానికి వచ్చిన దాఖలాలు లేవు. ఇక గోదావరి తీర ప్రాంత ఎంపీ మురళీమోహన్ సినీ నేపథ్యంతో తారలు దిగివస్తారని సగటు సినీ అభిమానులు ఆశించారు. ఒకరిద్దరు ప్రముఖులు తప్ప చలన చిత్రదిగ్గజాలే కాదు మినీ స్టార్లూ రాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల రాక ఏమోగానీ.. గోదారమ్మ చల్లని ఆశీస్సులు పొందేందుకు భక్తజనం ఊహించని విధంగా పోటెత్తింది. కానీ.. ప్రభుత్వ ఏర్పాట్లు అడుగడుగునా వెక్కిరించాయి. ‘రండి రండి.. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పుణ్యస్నానం చేసి తరించండి..’ అంటూ మూడునెలలుగా విపరీతమైన ప్రచారంతో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా రెండు నెలల ముందు నుంచే ఆదరాబాదరగా పుష్కర పనులు చేపట్టింది. అప్పుడు వేధింపులు.. ఇప్పుడు అభినందనలు జిల్లాలో చేపట్టిన పనుల్లో పుష్కరాలు మొదలయ్యే నాటికి 70శాతం కూడా పూర్తి కాలేదు. అరకొర పనుల మధ్యనే పుష్కరాలు మొదలు కాగా, పూర్తయ్యేనాటికి కూడా ఇంకా కొన్ని పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఆ పనులు కూడా ఉన్నతాధికారులు రాత్రిపగలు తేడా లేకుండా వెంటపడితేగానీ పూర్తి కాలేదనేది నిర్వివాదాంశం. తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ దశలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌పై కాంట్రాక్టర్లు, అధికారులు తిరగబడే పరిస్థితి వచ్చినా... పుష్కరాలు పూర్తయిన తర్వాత కలెక్టర్‌ను అభినందిస్తున్నారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఒళ్లు హూనమయ్యేలా పనిచేయడం వల్లనే ఉన్నంతలో గట్టెక్కగలిగామనేది అధికారవర్గాల వాదన. ఈ క్రమంలో జిల్లాలో పుష్కరాల విజయవంతం క్రెడిట్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్న అధికారులు పుష్కరాల పేరుతో అడ్డంగా రూ.కోట్లు దోచేసిన అక్రమార్కులను వెలికితీసి వారి ఆట కట్టిస్తారో లేదో చూడాలి. పుష్కరాలు మా కష్టం వల్లే జయప్రదమయ్యాయని ఎవరెన్ని గొప్పలు చెప్పుకున్నా.. నిజాలకు సజీవ సాక్ష్యంగా పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్న తెలుగువాడి జీవనాడి గోదారమ్మ తల్లికి వందనం. -జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు