Ambati Rambabu
-
‘అర్ధరాత్రి గౌతమ్‌రెడ్డి ఇంటి కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్‌పురం దొంగలు కాదు.. పోలీసులు’
విజయవాడ: వైఎస్సార్సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదని, మెయిన్‌డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారన్నారు. అలా ప్రవేశించింది ఏ స్టూవర్ట్‌పురం దొంగలో కాదని, ఏకంగా పోలీసులే అటువంటి దుస్సాహానికి పాల్పడ్డారని అంబటి విమర్శించారు.వైఎస్సార్సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందని నేతలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, చంద్రశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, భాగలక్ష్మీ, శైలజారెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి.. కూటమి సర్కారు అప్రజాస్వామిక చర్యలపై ధ్వజమెత్తారు.‘12వ తేదీ అర్ధరాత్రి పూనురు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గం. కనీస నిబంధనలను కూడా పోలీసులు పాటించలేదు. మెయిన్ డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టారు. కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్ పురం దొంగలు కాదు.. పోలీసులు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి భార్య తప్ప మరొకరు లేరు. పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీచేయించాలని భావించాం. గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది. గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఒక సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారు. గౌతమ్ రెడ్డి పై పెట్టిన కేసు పూర్తిగా తప్పుడు కేసు. మహిళలు మాత్రమే ఉన్న సమయంలో అక్రమంగా పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తే ఎవరికైనా భయం కలగదా. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటో వేరే మార్గమే లేదా?విజయవాడ పోలీస్ కమిషనర్ ,డిజిపిలను ప్రశ్నిస్తున్నా. మీ ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారా?నేరం మోపబడిన వ్యక్తి ఇంట్లో ఇలా ప్రవేశించడం కరెక్టేనా అని హోంమంత్రి అనితను అడుగుతున్నా. ఏపీలో అరాచకం జరుగుతుందని మేం మొదట్నుంచి చెబుతున్నాం. గౌతమ్ రెడ్డిని పట్టుకోవడానికి ఇంతకంటే మరోమార్గం మీకు దొరకలేదా?, మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇలా చేయొచ్చా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను మేం తేలిగ్గా విడిచిపెట్టం...న్యాయపరంగా పోరాడుతాం. న్యాయసలహా తీసుకుని పోలీసుల పై ప్రవేట్ కేసు పెడతాం. పోలీసుల పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి’ అని అంబటి నిలదీశారు. ప్రశ్నించే వారిని కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది: ఎమ్మెల్యే చంద్రశేఖర్పోలీసులే అర్థరాత్రి దొంగల్లా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా డీజీపీ? అని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమని, అర్థరాత్రి మహిళలున్న సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలని, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. -
కూటమి పార్టీలు అసెంబ్లీ ప్రతిష్ట దిగజార్చేలా ప్రయత్నించాయి
-
‘ఆ కుట్ర అందరికీ తెలుసు.. అదే చంద్రబాబు, కూటమి నేతల భయం’
సాక్షి, గుంటూరు: కూటమి పార్టీల నేతలు శాసనసభ స్థాయిని దిగజార్చేలా మాట్లాడారని.. వైఎస్ జగన్‌పై వాడిన భాష సరికాదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బెల్టు షాపులు పెడితే ఉక్కుపాదం మోపుతామన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు షాపులే కనిపిస్తున్నాయి.’’ అని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.‘‘గతంలో జగన్‌పై రఘురామకృష్ణరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసిన మీపై చర్యలు తీసుకుంటే తప్పా..?. వైఎస్సార్సీపీకి 11 సీట్లు రావడానికి కారణమైన కుట్ర అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు, కూటమి నేతలు భయపడుతున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడగల వ్యక్తిత్వం జగన్‌ది. చంద్రబాబు కుట్రలు చేసి జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. రఘురామతో రచ్చబండ పెట్టించి తిట్టించింది చంద్రబాబే. ఏదో విధంగా జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ప్రయత్నిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అసెంబ్లీలో రఘురామకృష్ణంరాజును కస్టడీకి తీసుకుని హింసించారని చెప్పటం దారుణం. రఘురామ కృష్ణంరాజును హింసించలేదని సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటివరకు పవన్ కల్యాణే నటుడు అనుకున్నాను. పవన్‌ను మించిన నటుడు చంద్రబాబు. హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఎందుకు 420 కేసు నమోదు చేయకూడదు?. 100 ఎస్కో బార్లు, 1000 మంది చీటర్లు, లక్షలాదిమంది దోపిడీ దొంగలను రుబ్బి బొమ్మ తీస్తే వచ్చేదే చంద్రబాబు బొమ్మ. చంద్రబాబు అత్యంత నీచమైన స్వభావం గల వ్యక్తి...రచ్చబండ పేరుతో రఘురామ కృష్ణంరాజు.. వైఎస్ జగన్‌ను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఎన్నికల అయిపోయిన తర్వాత రఘురామ కృష్ణంరాజు ఇక వైఎస్ జగన్‌ను దూషించనని చెప్పాడు. ఆ విషయం చంద్రబాబుకు గుర్తులేదా?. చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు. శాసనసభ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో రఘురాం కృష్ణంరాజు మాట్లాడిన మాటలపై కేసులు ఎందుకు పెట్టడం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ ఆదేశం.. వైఎస్సార్సీపీ ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’ -
మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదు : అంబటి రాంబాబు
-
అయ్యా డీజీపీ ఎక్కడ ఉన్నారు ? అంబటి ఫైర్
-
ఇవాళ మరో కార్యకర్త పోలీసులు అరెస్ట్ చేశారు : అంబటి
-
‘నారా లోకేష్‌పై చర్యలేవి’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ షోషల్‌మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఏడాదిలోని కంప్లైంట్‌పై ఒప్పుడు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గుంటూరు బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇవాళ మరో కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్, మా పార్టీ నేతలపై టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. నా కుటుంబసభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటం లేదు. మాపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?’’ అని నిలదీశారు.చదవండి: బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి -
సోషల్ మీడియా యాక్టివిస్టులను పరామర్శించిన YSRCP నేతలు
-
ఇంత అరాచకమా?.. కక్షగట్టి అక్రమ కేసులా?: అంబటి రాంబాబు ఫైర్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్ళం హరికృష్ణ రెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ, మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది?. ఏపీలో పౌర హక్కులు ఏమౌతున్నాయి.’’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబటి.. పోలీసులు కక్షగట్టి అందరిని కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు...గుంటూరు సబ్ జైలులో సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, ఆమె భర్తలను రిమాండ్ చేశారు. సుధారాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. భార్య, భర్తలు ఇద్దరూ జిల్లా జైలులో లేరు. పిటి వారెంట్ వేసి ఎక్కడికి తీసుకెళ్లారు తెలీదు. చిలకలూరిపేట సుధారాణి దంపతులను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లో కొట్టి, కోర్టులో ప్రవేశ పెట్టారు. మేజిస్ట్రేట్ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి వాగ్మూలాన్ని రికార్డు చేసి ఆమె చేతికి ఉన్న గాయాలను పరిశీలించి వైద్య సేవలకు ఆదేశించారు. అనంతరం జిల్లా జైలుకు రిమాండ్ విధించారు.ఎన్నికల అనంతరం ఊరు విడిచి హైదారాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రవీణ్ అనే ఐపీఎస్ అధికారి అరబ్ దేశాలలో అయితే ఇలాంటి వ్యవహారాల్లో నడిరోడ్డుపై కొట్టి చంపుతారంటూ మాట్లాడడం దారుణం. కోయ ప్రవీణ్ పైకి ఖాకీ చొక్కా వేసుకున్నాడు.. లోపల అంతా పసుపు పచ్చే. ఐపీఎస్ అధికారులు చట్ట పరిధిలో పని చేయాలి. చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడు.. ఆ పులే రేపు చంద్రబాబును తింటుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సోషల్ మీడియాలో చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. వాటిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. చాలా మంది ఐపీఎస్ అధికారులు పైకి ఖాకీచొక్కా వేసుకొని లోపల ఎల్లో ఇన్నర్స్ వాడుతున్నారు.టీడీపీ వల్లే ఫేక్ ఎకౌంట్లు పెట్టి, అక్రమ పోస్టింగులు పెడుతున్నారు. చట్టాన్ని పాటించకపోతే సర్వనాశనం అవుతారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్ పేరు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారు. మా సోషల్ మీడియాలో కార్యకర్తలకు అండగా ఉంటాం. త్వరలో సుప్రీంకోర్టును, రాష్ట్ర గవర్నర్ లను కలుస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
సనాతన ధర్మం ఇదేనా !?
-
సప్త సముద్రాలు కాదు పది సముద్రాలూ దాటినా ఎవరిని వదలం..
-
విడదల రజినిని అంత మాట అన్నప్పుడు.. పవన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
బాబుపై సుమోటో కేసులేవీ పవన్?: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు మూడు నాలుగు రోజులు అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైయస్సార్సీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు.అక్రమ కేసులు బనాయించిన అధికారులను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ చెప్పారు. అక్రమ కేసులు బనాయించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చి వెళ్లినా.. రిటైర్ అయిపోయిన వదిలే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. అధికారులను బెదిరించడం ఏమిటని పవన్ మాట్లాడుతున్నారు. అంటే పవన్ కల్యాణ్ మమ్మల్ని బెదిరిస్తున్నారా?. మీ బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ లేరు.అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితేనే వైఎస్ జగన్ భయపడలేదు. పెద్దపెద్ద వాళ్లతో ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలుపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా.. అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు...సుధారాణిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొట్టారు.మాజీమంత్రి విడుదల రజనిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. మాటలతో చెప్పుకోలేని విధంగా ఆమెను దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన ముగ్గురు అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌లో ఉన్న 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సూపర్ సిక్స్, ఉచిత ఇసుక ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పోలీసులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నా నోటితో నేను చెప్పలేను’’ అని అన్నారు. -
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు : అంబటి
-
సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశాం
-
రెండ్రోజులు చూస్తాం.. కోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా ఇతర నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై డీజీపికి వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఆదిమూలపు సురేష్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం: అంబటిఅనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టుల కాపీలను డీజీపీకి అందజేశాం. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల విషయాన్ని డీజీపీకి వివరించాం. ఏపీలో జరుగుతున్న దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు.వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా పోస్టులను డీజీపీకి ఇచ్చాం. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరాం. మా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారు. దీనిపై కూడా డీజీపికి ఫిర్యాదు చేశాం. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, అవినాష్‌రెడ్డి ఇతరులపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ వివరాలు కూడా డీజీపికి ఇచ్చాం. మా వారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తాం. ఆడబిడ్డపై దాడులు జరిగితే సహించననే చంద్రబాబు సుధారాణి విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూస్తాం. మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు రోజులు చూస్తాం. తర్వాత కోర్టును ఆశ్రయిస్తాంకూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన: ఎమ్మెల్యే చంద్రశేఖర్చిన్న విషయాలకే పోలీసులు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘‘విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారంటే నాపై కేసు పెట్టారు. మంచినీటి కంటే ఎక్కువగా మద్యం ఏరులై పారుతోంది. ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాపై నిర్బంధ కేసు పెట్టారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం కాకుండా ఇంకెవరు అడుగుతారు? పేకాట క్లబ్‌లను ఎందుకు కట్టడి చేయడం లేదు?. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్సీపీ -
వేధింపులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీమంత్రి అంబటి
-
ఒక మహిళను ఉగ్రవాదుల్లా హింసించారు: అంబటి రాంబాబు
గుంటూరు, సాక్షి: చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని పలు చోట్ల కేసులు పెట్టారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సుధారాణి దంపతులతోపాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఈ నెల 4న తీసుకెళ్లి నిన్న జడ్జిముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముందు సుధారాణి జరిగిందంతా చెప్పారు.పోలీసులు కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారు సుధారాణి. ఒక మహిళను ఉగ్రవాదిని హింసించినట్టు హింసించారు. మహిళను ఐదు రోజులు చిత్ర హింసలు పెట్టారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. పోలీసు యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లింది. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. పోలీసు యంత్రాంగం మానవహక్కులు హరిస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలపై ఐఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుంది’’ అని అన్నారు. -
చంద్రబాబు, లోకేష్ పై అంబటి ఆగ్రహం
-
టీడీపీ సైకో బ్యాచ్‌పై పంచులే పంచులు (ఫొటోలు)
-
కాబోయే హోం మంత్రిగారూ.. పవన్‌పై అంబటి సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: కాబోయే హోం మంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఉన్మాదుల కర్మాగారం ఎవరిది? వీళ్లందరినీ పెంచి పోషిస్తోంది ఎవరు?. పవన్ కల్యాణ్‌గారూ.. తన తల్లిని, బిడ్డలను తిట్టారని అన్నారు(పవన్ తన తల్లిని తిట్టారని గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు). వాళ్లను క్షమించేశారు. మరి ఇవన్నీ తెలుగుదేశం ఫ్యాక్టరీలో తయారైనవే కదా. వీటన్నింటిని సూత్రధారి నారా లోకేష్. ఇప్పటికైనా ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోండి. చెడును భుజాన వేసుకుని ఊరేగకండి’’ అంటూ పవన్‌కు అంబటి హితవు పలికారు. కాగా, ఏపీలో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపైనా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారన్న పవన్.. హోం మంత్రి జరుగుతున్న అఘాయిత్యాలపై రివ్యూ జరపాలన్నారు. మంత్రిగా బాధత్య తీసుకోవాలి. విమర్శలను పట్టించుకోకపోతే.. చేతకాకపోతే హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఒకవేళ.. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందన్న పవన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అంబటి చురకలు అంటించారు.ఇదీ చదవండి: సీమరాజా, కిర్రాక్ ఆర్పీ, స్వాతి.. వీళ్లపై కేసులేవీ?: అంబటి‘‘టీడీపీ సోషల్ మీడియా ఉన్మాద కారాగారం. టీడీపీ అరాచకాన్ని అడ్డుకోలేరు గానీ మావారిపై మాత్రం అక్రమ కేసులు పెడతారా?. పచ్చమీడియాని బహిష్కరించమని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రజ్యోతినా? టీడీపీ జ్యోతినా? అని విమర్శించారు. మా తల్లిని కూడా టీడీపి వారు దూషించారు అంటూ పవన్ అన్నారు. నన్ను, నా కూతుర్లని నీచంగా దూషిస్తూ పోస్టులు పెట్టారు. మరి వారిపై పవన్ కల్యాణ్‌కి వారిపై కూడా చర్యలు తీసుకోగల దమ్ము ఉందా?. హోంమంత్రికి ఆ సైకోలను అరెస్టు చేతనవుతుందా?. రేపు డీజీపిని స్వయంగా కలుస్తాం. అవసరమైతే ప్రైవేట్ కేసులు వేస్తాం’’ అని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. -
పవన్ కళ్యాణ్ ఇది చూడు నా కూతుర్లను ఎలా తిట్టారో
-
Ambati Rambabu: ఇది కదా ఉన్మాదుల కర్మాగారం అంటే..
-
సోషల్ మీడియా కార్యకర్తలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి
-
పోస్టులు పెడితే కేసులు పెడతావా?