adulterated liquor
-
కల్తీ మద్యం తాగి.. 20 మంది మృతి
పట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం రాత్రి బిహార్‌లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య 6కు చేరింది. అయితే ఇవాళ మృతుల సంఖ్య 20కి చేరిందని ఎస్పీ శివన్ అమితేష్ కుమార్ వెల్లడించారు.#UPDATE | Bihar: The death toll in Siwan, Bihar after consuming illicit liquor, rises to 20: SP Siwan Amitesh Kumar https://t.co/GhfIE9961h— ANI (@ANI) October 17, 2024 భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని భగవాన్‌పూర్ ఎస్హెచ్ఓ, ప్రొహిబిషన్ ఏఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంకా.. పలువురు కల్తీ మద్యం బాధితులకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారుగా 73 మందికి పైగా కల్తీ మద్యం తాగినట్లు తెలుస్తోంది. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
తమిళనాట కల్తీ మద్యం కాటు..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు బలైన వారి సంఖ్య 18 నుంచి గురువారం 40కి చేరుకుంది. ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలైన ఘటన తనకు తీవ్ర వేదన కలిగించిందని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారని సీఎం చెప్పారు. ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు తేలిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సంభవించిన మరణాలకు కారణాలను కనుగొనడంతోపాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ బి.గోకుల్దాస్ సారథ్యంలో ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు.16 మంది పరిస్థితి విషమంబుధవారం తమ ఆస్పత్రిలో చేరిన 19 మంది కల్తీ మద్యం బాధితుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. జిప్మర్తోపాటు సేలం, కళ్లకురిచ్చి, విల్లుపురం ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కల్లకురిచ్చి ఘటనపై సీబీసీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 200 లీటర్ల కల్తీ మద్యం పట్టుకున్నారు. అందులో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు తేలింది. -
కల్తీ మద్యానికి అవకాశం లేకుండా విశాఖలో ఎక్సైజ్ లేబొరేటరీ
దొండపర్తి(విశాఖ దక్షిణ)/ఆనందపురం(భీమిలి) : కల్తీ మద్యాన్ని పరీక్షించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబోరేటరీని గురువారం డిప్యూటీ సీఎం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా, కల్తీ మద్యానికి అవకాశం లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడమే నిజమైన అభివృద్ధి అని, అదే సీఎం జగన్ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు చంద్రబాబును కోరినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆనందపురం మండలం గోరింటలో రూ.20 కోట్లతో నిరి్మంచనున్న ఎక్సైజ్ శాఖ కాంప్లెక్స్, ఏపీఎస్‌బీసీఎల్ డిపో నిర్మాణ పనులకు నారాయణస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని జగన్ రాష్ట్రమంతా తిరిగి సీఎం అయ్యారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫొటో పట్టుకుని తిరిగి లోకేశ్ ఒక్క సీటైనా గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, చంద్రబాబు అక్రమాలను రోడ్డు మీదకు లాగుతానని చెప్పిన దత్తపుత్రుడు పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశి్నంచారు. తండ్రి చావుకు కారకుడైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదం కల్తీ మద్యం తాగడం వల్లే విశాఖలో ఇద్దరు చనిపోయారని పురందేశ్వరి అన్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే ఎవరైనా చనిపోయారని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తండ్రి చావుకు కారణమైన బాబుకు పురందేశ్వరి వత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణ జరుపుతున్నందుకే ఈనాడులో రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులున్నారు. -
నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతాం
హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరాను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఇందులో ఎంతటి వారి ప్రమేయమున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొబేషనరీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్టేషన్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అసలు మద్యానికి ఏమాత్రం తేడా లేకుండా స్టిక్కర్లు, బాటిళ్లు, కార్టన్లు తీసుకుని వెళ్లి స్కాన్ చేసినా బయటపడని విధంగా ఒడిశాలోని కటక్ జిల్లా అభయ్‌పూర్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. దొరికిన ఒక బాటిల్ ఆధారంగా కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు డొంకంతా కదిలించారని అభినందించారు. -
ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు
తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు. ‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది. -
హోలీ విషాదం: కల్తీ మద్యానికి ఆరుగురి మృతి
పాట్నా: కల్తీ మద్యం కాటుకు బిహార్‌లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. కల్తీ మద్యం తాగి కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిలో 24 గంటల్లో ఆరుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. హోలీ రోజు సరదాగా మద్యం తాగగా.. వారి ప్రాణం మీదకు వచ్చింది. ఈ ఘటనలు నవాడ జిల్లా ఖరిడి బిఘా, గుండాపూర్ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 29న హోలీ పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన రామ్‌దేవ్ యాదవ్, అజయ్ యాదవ్, దినేశ్, శైలేంద్ర యాదవ్, లోహ సింగ్, గోపాల్ కుమార్ వేర్వేరుగా మద్యం కొన్నారు. పండుగ ఆనందంలో వారు ఇతరులతో కలిసి మద్యం సేవించారు. అయితే సేవించిన అనంతరం వారి కళ్లు తిరిగాయి. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ విధంగా ఒకేరోజు ఆరు మందికి కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆ దుకాణంలో మద్యం తీసుకున్న వారందరికీ ఆ విధంగా అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు బిగుసరాయి ప్రాంతంలో కూడా ఇద్దరు కల్తీ మద్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో ఏవిధంగా మద్యం ఏరులై పారుతోందని ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ప్రశ్నించింది. కల్తీ మద్యం తాగి ప్రజలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు. -
కల్తీ కల్లు కలకలం, 100 మందికిపైగా అస్వస్థత
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100కి మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో తయారు చేస్తున్న కృత్రిమ కల్లును మండల పరిధిలోని నవాబ్ పేట్, అర్కతల, వట్టిమీనపల్లి, ఎక్ మామిడి, కేశపల్లి, తిమ్మారెడ్డి పల్లి, మమ్దాన్పల్లి, వికారాబాద్ మండలం కొత్తగడి, నారాయణపూర్, ఎర్రవళ్లి, పాతూర్, కామరెడ్డిగూడ, పులుసుమామిడి గ్రామాలకు డీసీఎంలో గత కొంత కాలంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా కల్లు సరఫరా చేశారు. కల్లు సేవించిన వారిలో వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాకు చెందిన దాదాపు 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిట్టిగిద్దకు చెందిన ప్యాట రాములు(65) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిని వారివారి బంధువులు నవాబ్‌పేట్, వికారాబాద్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాలను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవేళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్యలు పరామర్శించారు. -
మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆలూరు కల్తీ కల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేష్, ఖాసీం మృతి చెందారు. మరో వ్యక్తి శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ మద్యం: 86కి చేరిన మృతుల సంఖ్య
చండీగఢ్ : పంజాబ్‌లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 86కు చేరింది. శుక్రవారం రాత్రి వరకు తార్న్‌తరన్‌లో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం తార్న్‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంతో విఫలమైన ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సస్పెండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. -
కల్తీ మద్యం తాగి 14 మంది మృతి
బారాబంకీ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతిచెందారు. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి రామ్‌నగర్‌లో ఈ ఘటన జరిగిందని, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు యూపీ ప్రభుత్వం ఆదేశించింది. రాజకీయ కుట్ర కోణంలోనూ విచారించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. 10మంది ఎౖసజ్ అధికారులను, ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబాలకు సీఎం 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లోనూ విచారించాలని, 48 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం కోరినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. రాణీగంజ్, దాని పరిసర ప్రాంతాల ప్రజలు సోమవారం రాత్రి రామ్‌నగర్ ప్రాంతంలోని ఓ దుకాణంనుంచి మద్యం కొనుగోలు చేశారని, మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతతో స్థానిక ఆసుప్రతిలో చేరారు. బాధితులకు దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీస్ సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో సహా బారాబంకీ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారని, అధికారుల పాత్రపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని, వారి నిర్లక్ష్యం ఉంటే తీవ్రమైన చర్యలకు వెనుకాడవద్దని ఆదేశించినట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా, గతంలో రాజకీయ కుట్ర కోణంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని, ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం ఈ దిశలోనూ విచారణ చేపట్టనున్నారు. -
గ్లాస్లో మందు పడకముందే.. సీసాలోనే మిక్సింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘బ్రాండ్ మిక్సింగ్’ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. మద్యం షాపులు, బార్లలో అమ్ముతున్న బ్రాండ్లలో చీప్ లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. రెండ్రోజుల కిందట రాజధాని ప్రాంతం విజయవాడలోని బార్లలో భారీగా ‘బ్రాండ్ మిక్సింగ్’ కేసులు పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరగనున్నందున బార్లలో బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ముఖ్య పట్టణాల్లోని బార్లలో ఈ బాగోతం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే విజయవాడ, గుంటూరు నగరాల్లో జరుగుతున్న ఈ తతంగం గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మద్యం షాపుల్లో, బార్లలో బ్రాండ్ మిక్సింగ్‌పై ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదులందడంతో ఇటీవలే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు, ఉయ్యూరు, విజయవాడలో మద్యం దుకాణాలు, ఎక్సైజ్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. కమిషనర్ తనిఖీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే విజయవాడలో బ్రాండ్ మిక్సింగ్ కేసులు పట్టుబడ్డాయి. అయితే మద్యం షాపుల్లో అక్రమాలు జరిగినా.. వాటి జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రులే అధికారులను బెదిరిస్తుండటంతో వారు తనిఖీలను అటకెక్కించారు. ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే.. బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలతో మద్యం ప్రియుల్ని దోచుకుంటున్న సిండికేట్లు.. జనం ప్రాణాలతో చెలగాటమాడేలా కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ ఏడాది గుంటూరు, విజయవాడలలో వరుసగా కల్తీ మద్యం ఘటనలు వెలుగు చూశాయి. కల్తీ మద్యం తయారీ కేంద్రాలను ఎక్సైజ్ అధికారుల సహకారంతోనే నడుపుతున్నారని ఉన్నతాధికారుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్సుని నిర్వీర్యం చేసిన సర్కారు మద్యం వ్యాపారులు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), కల్తీ మద్యం అమ్మకాలు చేపట్టినా, బెల్టు షాపులు నడిపినా ఎక్సైజ్ సేŠట్ట్ టాస్క్ఫోర్సు దాడులు చేసి వీటిని అడ్డుకోవాలి. స్టేట్ టాస్క్ఫోర్సు యూనిట్‌కు ఓ సీనియర్ ఐజీ స్థాయి అధికారిని నియమించి తరచూ దాడులు నిర్వహించాలి. అయితే రెండు నెలల కిందట ఎస్టీఎఫ్ డైరెక్టర్‌ను బదిలీ చేసి ఇంతవరకు ఆ పోస్టులో ఎవ్వర్నీ నియమించలేదు. మద్యం సిండికేట్ల అక్రమ వ్యాపారం కోసం సర్కారు ఎస్టీఎఫ్ డైరక్టర్‌గా సీనియర్ ఐపీఎస్‌ను నియమించలేదని ఎక్సైజ్ వర్గాల్లోనే ప్రచారం జరగడం గమనార్హం. చీప్ లిక్కర్ విక్రయాలు గతేడాదికి 80 లక్షల కేసులకు చేరింది. అంతకు ముందు ఏడాది 40 లక్షల చీప్ లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఏడాదికేడాదికి వంద శాతం చీప్ లిక్కర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏడాదికేడాది 10 శాతం వరకే అమ్మకాలు పెరగాలి. అయితే ఏకంగా వంద శాతం అమ్మకాలు పెరుగుతుండటంతో మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను మీడియం, అంతకంటే పెద్ద బ్రాండ్లలో కలుపుతున్నారని ఎక్సైజ్æ కమిషనరే స్వయంగా అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారంటే.. ఇక క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. విజయవాడలో పట్టుబడిన డైల్యూషన్, బ్రాండ్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్రాండ్ మిక్సింగ్ అంటే.. బ్రాండ్ మిక్సింగ్ అంటే.. చీప్ లిక్కర్‌ను మీడియం లిక్కర్, అంతకంటే పెద్ద బ్రాండ్లలో కలుపుతారు. ఒక బ్రాండ్, మీడియం బ్రాండ్‌లోని బాటిళ్లలో సగం పరిమాణం మద్యాన్ని తీసేసి.. చీప్ లిక్కర్‌ను కలుపుతారు. ఈ విధానం ఎక్కువగా బార్లలో జరుగుతోంది. దీంతో పాటు లిక్కర్ డైల్యూషన్ కూడా ఎక్కువగా జరుగుతుందని ఎక్సైజ్ ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. -
కల్తీమయం!
అచ్చంపేట రూరల్ : కొన్ని సంవత్సరాలుగా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. వివిధ శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తూ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించారు. గత పదేళ్లుగా మద్యం వ్యాపారంలో బాగా రాటుదేలిన నాయకులే దీనికి సూత్రధారులుగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో అమ్రాబాద్ మండలంలో జోరుగా కల్తీ మద్యం వ్యాపారం కొనసాగగా.. ఆ ప్రాంతంలో వైన్సులను లాటరీ పద్ధతిన దక్కించుకున్న వారు విచ్చలవిడిగా మద్యం కల్తీ చేసి అమ్మకాలు సాగించారు. రెండుసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నారని మరోసారి కేసు చేశారు. అయితే అప్పట్లో లైసెన్స్ ఉండటంతో మద్యాన్ని కల్తీ చేసి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. అలవాటు పడిన వారు వైన్సులు.. లైసెన్సు లేకున్నా అదే తరహాలో మద్యం కల్తీ చేసి వైన్స్‌లకు చేరవేస్తున్నారు. కూతవేటు దూరంలోనే.. గతంలో అమ్రాబాద్ ప్రాంతంలో మద్యం కల్తీ చేసిన వారు, లైసెన్స్‌లు దక్కని వారు ప్రస్తుత సంవత్సరం నుంచి అచ్చంపేట పట్టణాన్ని ఎంచుకుని మద్యం కల్తీ చేసి అమ్రాబాద్, పదరతోపాటు వివిధ వైన్సులకు చేరవేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ఇంటిలో గుట్టుగా మద్యం కల్తీ వ్యాపారం సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే మద్యం కల్తీ దందా జరగడం గమనార్హం. అయినా ఇన్ని రోజులు స్థానిక ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మామూళ్ల విషయంలో తేడా వచ్చినందుకే ఇప్పుడు దాడులు జరిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓసీ, ఎంసీలతో.. బ్రాండెడ్ అమ్రాబాద్ మండలానికి చెందిన వెంకట్రామ్నాయక్ గతంలో ఇదే మండలంలో వైన్సు షాపును దక్కించుకున్నారు. అప్పట్లో నకిలీ మద్యం తయారు చేసి వైన్‌షాపులో అమ్మినట్లు రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది మద్యం షాపు దక్కించుకోని వెంకట్రామ్నాయక్ అచ్చంపేట, వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు చెందిన ఓసీ, ఎంసీ లాంటి కొన్ని మద్యం బాటిళ్లను షాంపిల్‌గా తీసుకుని, అధిక రేట్లు ఉన్న బ్లెండర్‌స్పైడ్, సిగ్నేచర్, రాయల్ ఛాలెంజ్, రాయల్‌స్టాగ్ లాంటి ఖాళీ బాటిళ్లలో సగం మద్యం, సగం నీటిని నింపి బాటిళ్లపై మూతలను ఏర్పాటు చేసి వైన్ షాపులకు తరలిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు చేస్తున్నాడని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి వెంకట్రామ్నాయక్ ఇంట్లో తనిఖీ చేయగా కల్తీ మద్యం తయారు చేసిన 5 కాటన్ల ఓసీ బాటిళ్లు, 15 లీటర్ల కల్తీ మద్యం బాటిళ్లు, ఖాళీ సీసాలు, వాటిపై బిగించే మూతలను గుర్తించారు. బెల్టుషాపులకు సరఫరా.. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. మద్యం ఏరులై పారుతుంది. సాధారణ మద్యం నుంచి విలువైన మద్యం వరకు లభ్యమవుతుంది. ప్రతి ఫుల్ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.150 వరకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని గ్రామాల్లోని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి బెల్ట్‌షాపులపై దాడులు చేయడం లేదని, కేసుల కోసం మాత్రమే అప్పుడప్పుడు దాడులు చేసి ఉనికి చాటుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జరగకుండా, గ్రామాల్లో బెల్ట్‌షాపు లేకుండా, మద్యం అధిక రేట్లకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మత్తులో కల్తీ చిచ్చు!
కనిగిరి: కల్తీ మద్యం మందుబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనికి కనిగిరి వేదికగా మారింది. ఇటీవల జరిగిన వరుస మరణాలు.. మంగళవారం టాస్క్ ఫోర్స్ దాడుల్లో దొరికిన కల్తీ మద్యం బాటిళ్లతో అక్రమార్కుల గుట్టు రట్టయింది. కనిగిరిలో నకిలీ మద్యంపై గత కొంతకాలంగా పుకార్లు హోరెత్తుతున్నాయి. దీనిపై స్థానిక ఎక్సైజ్ అధికారులను పలుమార్లు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని కల్తీ జరిగే ప్రసక్తే లేదంటూ బుకాయించారు. ఈ నేపథ్యంలో కనిగిరిలో మద్యం వ్యాపారుల అక్రమాలపై స్టేట్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఎక్సైజ్ శాఖ స్టేట్ డైరక్టర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు విజయవాడ ఎక్సైజ్ ఎస్సై సుబ్బిరెడ్డి, రామకృష్ణ టీం కనిగిరిలో దాడులు నిర్వహించి రెండు షాపుల్లో 175 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో దాడులు.. పక్కా సమాచారంతో విజయవాడ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు కనిగిరిలో మకాం వేశారు. మండంలోని అడ్డరోడ్డు వద్దగల నందిని వైన్స్, హాజీస్ పురం వద్ద గల కళ్యాణి వైన్స్‌పై ఏకకాలంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. నందిని వైన్స్‌లో విక్రయదారుడు రమణారెడ్డి అప్పుడే బ్రాండ్ మిక్సింగ్ (కల్తీ)చేసి అమ్మకానికి ఉంచిన 144 క్వార్టర్ బాటిళ్లను పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో హజీస్‌పురం కల్యాణి వైన్స్‌లో దాడులు చేయగా నౌకర్ నామ శివరాములు షాపులో కల్తీ మద్యం బాటిళ్లు విక్రయిస్తుండటంతో టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేసి పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 32 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మిక్సింగ్ ఇలా.. ఆఫీసర్ ఛాయిస్ బ్రాండ్ రూ. 100 కాగా, హెచ్డీ బ్రాండ్ రూ. 50 వరకు ఉంటుంది. అయితే అక్రమార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. ఖాళీ ఓసీ (ఆఫీసర్ ఛాయిస్) మద్యం బాటిళ్లలో హెచ్డీ మద్యం నింపుతారు. అంటే రూ. 50 ఖరీదైన మద్యం సీసాకు అక్రమంగా రూ. 100 వసూలు చేస్తున్నారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా హెచ్డీ బాటిళ్లపై ఉండే హెచ్ఈఎల్సీల్ను అతికిస్తారు. దీంతో మద్యం మిక్సింగ్ జరిగిన బాటిల్‌గా ఎవరూ గుర్తించలేరు. బాటిల్ అంతా ఓసీగా ఉంటుంది. మూతలపై మాత్రం హెచ్డీ బ్రాండ్‌కు సంబంధించిన సీల్ ఉంటుంది. కేవలం ఎక్సైజ్ శాఖ వారి అధునాత పరికరాలతో ప్రత్యేక యాప్ కోడ్‌తో మాత్రే వాటిని గుర్తించడానికే వీలయ్యే పరిస్థితి నెలకొనడంతో అక్రమార్కులు రెచ్చిపొతున్నారు. ఆ ముగ్గురు? కల్తీ మద్యం వ్యాపారంలో ముగ్గురు వ్యాపారులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కల్తీ మద్యం పట్టుబడిన షాపుల్లోని నిందులను పోలీసులు విచారించగా చెందిన ఓ యువ మద్యం వ్యాపారి పేరును వెల్లడించినట్లు తెలిసింది. తమ పాత్ర ఏమీ లేదని యువ వ్యాపారి ఆధ్వర్యంలో తంతు జరిగిన తర్వాతే తాము అమ్మకాలు జరుపుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ టీం విచారణలో వారు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. యువ వ్యాపారి భాగస్వామ్యంతో ఉన్న వైన్ షాపుల టాస్క్ ఫోర్స్ టీం ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. 10 వేల కేసుల్లో 5వేల కేసులు హెడీనే.. కనిగిరి ఎక్సైజ్ పరిధిలో 28 షాపుల్లో నెలకు 10వేల కేసులు (సుమారు రూ. 4కోట్లు) మేర వివిధ రకాల బ్రాండ్లు ( ఓసీ, ఐవీ, తదితరాలు) కొనుగోలు జరుగుతుంటే.. ఒక్క హెడీ బ్రాండే సుమారు 5వేల కేసులు అంటే సుమారు రూ. 1.50 కోట్ల కొనుగోలు జరుగుతున్నట్లు నివేదికలున్నాయి. అధికారులు మాత్రం తక్కువ రేటు మద్యం కాబట్టి లేబర్ ఎక్కువగా హెచ్డీ బ్రాండ్‌ను తాగుతున్నట్లు వెల్లడిస్తున్నా... అసలు తతంగం ఇదని తాజా దాడుల్లో బహిర్గతమైంది. రెండు నెలల్లో ఇద్దరు మృతి మద్యం మత్తులో గడిచిన రెండు నెలల్లో సుమారు 6 మంది వరకు చనిపోగా అందులో వెలుగులోకి వచ్చింది ఇద్దరి మరణాలే. గత నెలలో లాడేసాహెబ్ వీధికి చెందిన బాష(40) పూటుగా మద్యం తాగి షాపు సమీపంలోనే చనిపోయాడు. తాజాగా కోటి కూడా మద్యం మత్తులో అపస్మారక స్థితికి చేరి షాపు సమీపంలోనే చనిపోవడంతో బంధువులు ఆందోళన చేశారు. మద్యం మరణాల వెనుక కల్తీ విక్రయాలే కారణం అన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లలో కనిగిరిలో మాత్రమే ఇలాంటి కేసులు దొరికాయని చెబుతున్నారు. జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులు కనిగిరి పై ప్రత్యేక నిఘా పెట్టి విస్తృత దాడులు నిర్వహిస్తే మరిన్ని కల్తీ విక్రయాల కేసులు దొరికే అవకాశం లేక పోలేదు. మద్యం వ్యాపారుల అరెస్ట్ కనిగిరి: పట్టణంలోని రెండు మద్యషాపుల్లో కల్తీ చేసిన (బ్రాండ్ మిక్సింగ్)175 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు పి. సుబిరెడ్డి, రామకృష్ణ తెలిపారు. కనిగిరి ఎక్సైజ్ సీఐతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని అడ్డరోడ్డులో గల నందిని వైన్స్‌లో సుమారు 144 మద్యం క్వార్టర్ ఓసీ బాటిళ్లు, హజీస్పురంలోని కల్యాణి వైన్స్‌లో 32 మద్యం క్వార్టర్ ఓసీ బాటిళ్లు స్వాధినం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ. 50 విలువ చేసే మద్యం హెచ్డీ బ్రాండ్ క్వార్టర్ బాటిళ్లను ఊడదీసి.. అదే లిక్కర్‌ను రూ. 100 విలువ చేసే ఓసీ బ్రాండ్‌లోకి మార్చి మూతలకు హెచ్డీ బ్రాండ్ సీల్స్ అతికించి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. షాపులైసెన్స్పై కొనగోలు చేసిన ఓసీ క్వార్టర్ బాటిళ్ల సంఖ్య కంటే నిల్వలు అధికంగా ఉన్నాయన్నారు, బ్రాండ్ మిక్సింగ్ చేసి ఓసీ ఖాళీ బాటిళ్లలో హెచ్డీ బ్రాండ్ లిక్కర్‌ను నింపారని తెలిపారు. షాపుల్లో ఖాళీ ఓసీ, హెచ్డీ క్వార్టర్ ఖాళీ బాటిళ్లు, కుయ్యనులు, బాటిల్ మూతలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు షాపుల్లో కల్తీ విక్రయాలకు కారకులైన ఆరు మందిపై సెక్షన్ 34ఏ, 36, 37, బ్రాండ్ మిక్సింగ్కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రమణారెడ్డి, శివరాములును అరెస్ట్ చేశామని, లైసెన్స్ దారులు, నౌకర్ నామాలు వై . మాలకొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, రామయ్యలను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ఆ రెండు షాపులు సీజ్ చేయనున్నట్లు తెలిపారు. మార్కాపురం ఈఎస్ రావిపాటి హనుమంతరావు, ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డి, సీఐ వెంకట్రావ్ సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం
-
అమరవతిలో కుటీర పరిశ్రమగా కల్తీ మద్యం
-
కల్తీ మద్యం సేవించి వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం మండలంలోని గుమ్మళ్లపల్లి గ్రామంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. బుధవారం సాయంత్ర కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎర్రోళ్ల లాస్మయ్య(50) చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కాటారం ఎక్సైజ్ ఎస్సై శీలం రాజేశ్వరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మురళి ఆదేశాలు జారీచేశారు. -
కల్తీ బీర్లంటూ వైన్స్ ఎదుట ఆందోళన
► రూ.110కి విక్రయించాల్సిన బీరు రూ.60కే ► బీరు రుచిగా లేదనే అనుమానంతో.. ► శేరిగూడ ఆంజనేయ వైన్స్ వద్ద ఘటన ఇబ్రహీంపట్నంరూరల్: కల్తీ బీర్లు అమ్ముతున్నరంటూ మద్యం దుకాణం ముందు పలువురు ఆందోళన చేశారు. బీరు ధర రూ.110 ఉండగా.. లెబుల్స్ మార్చి రూ.60కే 650ఎంఎల్ బీరును విక్రయించారు. దీంతో బీరు సేవిస్తుండగా లెబుల్స్ కవర్ ఉడిపోవడంతో అనుమానం వచ్చిన కొందరు యువకులు మద్యం దుకాణ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సంఘటన ఆదివారం శేరిగూడ శ్రీఆంజనేయ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన కొందరు యువకులు రెండు కాటన్ల హైవర్డ్స్ 5000 బీర్లు కొనుగోలు చేశారు. సమీపంలోని బహిరంగ ప్రదేశంలో సేవిస్తుండగా బీరుపై గల లేబుల్స్ ఉడిపోయింది. లేబుల్‌ను పరిశీలించగా దానిపై ఎమ్మార్పీ ధర రూ.60గా ఉంది. అదేవిధంగా సేవించిన బీరు రుచికరంగా లేకపోవడంతో అనుమానంతో ఆ యువకులు వైన్స్ వద్దకు వచ్చి కల్తీ బీర్లంటూ ప్రశ్నించారు. దీంతో వైన్స్ యాజమాన్యం ఏమీ కాదులేండీ అంటూ దాటవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లేబుల్స్ పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తామంటూ ఆ మద్యాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఇంత జరిగిన ఎక్సైజ్ అధికారులు రాకపోవడంతో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఆంజనేయ వైన్స్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నరని ఆరోపించారు. -
బెజవాడలో కల్తీ మద్యం కలకలం
విజయవాడ: విజయవాడలో మరోసారి కల్తీమద్యం కలకలం రేపుతోంది. శుక్రవారం రిక్షా కార్మికుడు అచ్చన్న శుక్రవారం మద్యం తాగిన కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో అచ్చెన్న కుటుంబసభ్యులు కల్తీ మద్యం వల్లే మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వద్ద ఉన్న మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కల్తీ దందా
► నీళ్లు, స్పిరిట్ కలిపి మద్యాన్ని కల్తీ చేస్తున్న వ్యాపారులు ► ఇప్పటికే పలు కేసులు నమోదు ∙ఆందోళనలో మందుబాబులు ► పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు సిర్పూర్(టి) : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంలో నీళ్లు, స్పిరిట్ కలిపి కల్తీ చేస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో కల్తీ మద్యం తయారు చేసిన బాటిళ్లలో స్పిరిట్ కలిపినట్లు తేలడంతో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తరుచూ అధికారుల దాడుల్లో లూజ్ విక్రయాలు జరుగుతున్నట్లు తేలడంతో కల్తీ మద్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కొందరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌పోర్స్ హైదరాబాద్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో పడి ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో ఇది వరకే కల్తీ మద్యం లభించడంతో పలు కేసులు నమోదయ్యాయి. అయినా పలు మద్యం దుకాణాల్లో లూజ్ విక్రయాలు, అక్రమ రవాణా నిలిపివేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మచ్చుకు కొన్ని సంఘటలు.. గతంలో కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో అధికారులు చేసిన దాడుల్లో ఓ ఇంటిలో ఉన్న కల్తీ మద్యం తయారు చేసే పరికరాలు, ఖాళీ బాటిళ్లు, బాటిళ్లకు అమర్చే మూతలు చూసి నివ్వెరపోయారు. ఆ ఇంటిలో బాటిళ్లకు అమర్చే 15వేల మూతలు, 5వేల ఖాళీ బాటిళ్లు, 8 కాటన్ల మద్యం లభించింది. ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిపై కేసులు కూడా నమోదు చేశారు. దీనికి ముందు దహెగాం మండలంలోని ఓ వ్యాపారి కల్తీ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడటంతో కేసు నమోదైంది. అలాగే కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ వైన్‌షాపులో లూజ్ విక్రయాలు జరుపుతుండటంతో కేసు నమోదు చేశారు. సిర్పూర్(టి)లోని మద్యం షాపులో గతంలో అదిక ధరలు, లూజ్ విక్రయాలు చేస్తుండగా అధికారులకు పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం తిరిగి కల్తీ మద్యం, లూజ్ విక్రయాలు జరుపుతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి షాపుసీజ్ చేసి కేసు నమోదు చేశారు. షాపులోని 12లూజ్ బాటిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. లూస్ విక్రయాలు చేసినందుకు రూ.5లక్షల జరిమానా విధించారు. మహారాష్ట్రకు రవాణా.. మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో మద్య నిషేధం ఉండటంతో మహారాష్ట్రలోని పలు పట్టణాలు,, గ్రామాలకు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఈ రెండు జిల్లాలు నియోజకవర్గంలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్ మండలాలకు ఆనుకోని ఉండటంతో మద్యం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. అలాగే కాగజ్‌నగర్ పట్టణం నుంచి రామగిరి ప్యాసింజర్, నాగ్‌పూర్ ప్యాసింజర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాత్రి సమయాల్లో మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. రైళ్లలో అప్పుడప్పుడు చేసిన తనిఖీలలో మద్యం రవాణాదారులు మద్యం వదిలి వెళ్లడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిర్పూర్(టి)–మాకిడి అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ప్రతీరోజు మద్యం అక్రమ రవాణా చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేసి పలు సార్లు కేసులు నమోదు చేశారు. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అక్రమ రవాణాను అడ్డుకోవంలో విఫలమవుతున్నారు. అలాగే కౌటాల, బెజ్జూర్ మండలాల నుంచి సమీపంలో ఉన్న పెన్‌గంగ, ప్రాణహిత నదులను దాటిస్తూ మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. కౌటాల మండలంలో సైతం పలుమార్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మద్యం షాపుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి కల్తీ మద్యం జరగకుండా చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం మద్యం అక్రమరవాణా, కల్తీ మద్యం, లూజ్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించి సిర్పూర్(టి) షాపులో లూజ్ విక్రయాలు చేస్తుండటంతో షాపును సీజ్ చేసి రూ.5లక్షల జరిమానా విధించాం.– మంగమ్మ, ఎక్సైజ్ సీఐ -
కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత
కల్తీ కల్లుతాగి 30 మంది అస్వస్థతకు గురైన సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లాలోని కొండేపి మండలం ముగచింతల, మర్రిపూడి మండలం రామయపాలెం గ్రామాల్లో ఆదివారం కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడి గ్రామంలో కల్తీ కల్లు తాగి నీరొద్దిన్(30) అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం నమాజ్ చేసుకున్న తర్వాత కల్లు తాగగానే అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలాడు. దీంతో బంధువులు కల్లు కాంపౌండ్‌ను ధ్వంసం చేసి శవంతో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణ
మంత్రి పద్మారావు కల్తీ కల్లు నియంత్రణ మిషన్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని త్వరలోనే గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు తెలిపారు. కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని సచివాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. కల్తీ కల్లు మరణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యంత్రంతో కల్తీ కల్లును నిమిషాల్లోనే గుర్తించగలమన్నారు. మద్యంలో నీళ్లు కలిపి సీల్ వేసి అమ్ముతున్న సంఘటనలను అరికట్టేందుకు హైడ్రోమీటర్‌ను ప్రారంభించారు. ఈ మీటర్‌ను మద్యంలో వేస్తే ఎంతమేరకు నీళ్లు కలిపారో వెంటనే తెలిసిపోతుందని నిపుణులు వివరించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెంటనే ఈ యంత్రాలను పంపి దాడులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి చోటులేకుండా పనిచేస్తున్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ధూల్‌పేటలో గుడుంబా దాడుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీ నుంచి బయటపడ్డవారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ డెరైక్టర్ అకున్ సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రసదన్ తదితరులు పాల్గొన్నారు. -
200కేసుల కల్తీ మద్యం స్వాధీనం
విజయవాడ : గురునానక్ కాలనీలోని ఓ వైన్ షాపులో కల్తీ మద్యం పట్టబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 200 కేసుల మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నారు. అయితే విషయాన్ని బయటకు పొక్కనీకుండా చూడాలని అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. -
కల్తీ కల్లు అమ్మినందుకు ఎక్సైజ్ జరిమానా
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులకు ఎక్సైజ్ అధికారులు జరిమానాలు విధించారు. భైరాపూర్, నెమలి, మీర్జాపూర్ గ్రామాలకు చెందిన బాలరాజు, అశోక్, శ్రీశైలం కల్తీ కల్లు విక్రయిస్తూ మంగళవారం పట్టుబడ్డారు. గతంలో వీరిని ఇదే విషయమై తహశీల్దార్ బైండోవర్ చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఎక్సైజ్ అధికారులు జరిమానా విధించారు. -
కల్తీ మద్యానికి ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ బలి
సూళ్లూరుపేట : కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుండే విషయం మనకు తెలిసిందే. తాజాగా అదే కల్తీ మద్యానికి ఓ ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ సహా ఇద్దరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. సూళ్లూరుపేటలో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పంతంగి శ్రీనివాసులుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సుధాకర్, రామ్మూర్తిలు రోజులాగే మంగళవారం సాయంత్రం మద్యం తాగారు. మత్తు ఎక్కువగా వచ్చేందుకు మద్యంలో రసాయనాలు కలుపుకుని తాగడం వారికి అలవాటు. మంగళవారం సాయంత్రం మద్యం సేవిస్తూ ఆ రసాయనాన్ని ఎక్కువగా కలుపుకుని తాగడంతో ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుధాకర్‌ను చెన్నై తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరో వ్యక్తి రామ్మూర్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తాజాగా బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడుంబా, కల్తీకల్లు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆఫీసుల నిర్వహణకు ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బందికి వాహనాలు అందజేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
కల్తీకల్లు తాగి 20 మందికి అస్వస్థత
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కల్తీకల్లు కలకలం రేపింది. రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఆదివారం కల్తీకల్లు తాగిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తు కలిగించే రసాయనాలు మోతాదుకు మించి కలపడం వల్లే ఈ సంఘటన జరిగిందని స్థానికలు చెబుతున్నారు. -
కల్తీ కల్లు తయారీ కేంద్రంపై దాడులు
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని ఉదయ్‌నగర్‌లో కల్తీ కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి 40 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకుని నిందితురాలు వెంకటమ్మను అరెస్టు చేశారు. తడి చెత్త, పొడిచెత్త వేర్వేరుగా భద్రపరిచేందుకు ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి రెండు డబ్బాలను ఉచితంగా అందజేశారు. వెంకటమ్మ కల్తీ కల్లు తయారుచేస్తూ ఇవే డబ్బాల్లో నింపి అధికారులకు పట్టుబడింది. కొంత కాలం నుంచి బస్తీలో కల్తీ కల్లు విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. -
కల్తీ మద్యం.. వైన్ షాప్ సీజ్
జమ్మికుంట (కరీంనగర్) : కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. గాంధీ చౌరస్తా వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నారని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దుకాణాన్ని సీజ్ చేసి షాప్ యాజమని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో కూడా మద్యం కల్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
బెల్ట్ షాపులే లక్ష్యం!
జిల్లాలో సుమారు 1500 షాపులు యథేచ్ఛగా కల్తీ మద్యం సరఫరా లీటర్ మద్యంలో ఆరు లీటర్ల నీరు, స్పిరిట్ యనమలకుదురు ఉదంతంతో వెలుగులోకి కట్టడికి ఎక్సైజ్ అధికారుల యత్నం విజయవాడ : జిల్లాలో కల్తీ మద్యం మాఫియా తన హవా కొనసాగిస్తోంది. బెల్ట్ షాపులే లక్ష్యంగా నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. యనమలకుదురు, బందరులో నకిలీ మద్యం వ్యవహారం మరోసారి వెలుగులోకి రావటంతో ఎక్సైజ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయవాడ స్వర్ణబార్‌లో మద్యం సేవించి ఐదుగురు మృతిచెందిన ఘటనను మరువకముందే మరోమారు ఈ ఉదంతం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. జిల్లాలో గ్రామాలు మొదలుకొని విజయవాడ నగరం వరకు ఉన్న ప్రతి వైన్ షాపునకు అనుబంధంగా సగటున 20 నుంచి 35 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయనేది అధికారులకూ తెలిసిందే. వైన్ షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు దాడులు చేసి కేసుల నమోదు, అరెస్టులు చేస్తున్నా అదే తీరు కొనసాగుతోంది. జిల్లాలో 336 వైన్ షాపులకు అనుసంధానంగా సుమారు 1500 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 5,164 కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈక్రమంలో బెల్ట్ విక్రయాలు తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుంటోందని తెలుస్తోంది. ట్రాక్ అండ్ ట్రేసింగ్‌లో... వరుస ఘటనల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కొంత సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు అన్ని బార్లు, వైన్ షాపులను తనిఖీ చేసి మద్యం బ్యాచ్ నంబర్లను పరిశీలించారు. మరోవైపు డిస్టిలరీల్లోనే ప్రతి మద్యం సీసాల నంబర్లు నమోదు చేయటంతో పాటు ప్రతి బార్, వైన్ షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేసింగ్ విధానం పెట్టి ప్రతి బాటిల్‌పై బార్‌కోడ్‌ను నోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే కల్తీ కట్టడి అయ్యే అవకాశం ఉంది. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు సాక్షితో మాట్లాడుతూ కల్తీ ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, దాడులు ముమ్మరం చేస్తామని చెప్పారు. కల్తీ మద్యం తయారీ ఇలా... జిల్లాలో రెక్టిఫైడ్ స్పిరిట్ తయారుచేసే యూనిట్లు 12 వరకు ఉన్నాయి. వాటి నుంచి కొందరు అనధికారికంగా సిర్పిట్‌ను కొనుగోలు చేసి మద్యంలో కలిపి విక్రయిస్తున్నారు. జిల్లాలో మద్యం కల్తీ 1989 నుంచీ అధికంగా ఉంది. మద్యం కల్తీ రెండు రకాలుగా చేస్తుంటారు. చీప్ లిక్కర్ అయితే లీటరు మద్యంలో ఐదు లీటర్ల వరకు నీటిని కలిపి మద్యం రంగు పోకుండా చూసి, కిక్ కోసం స్పిరిట్‌ను వినియోగించి మళ్లీ డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యం సీసాల మాదిరిగా స్టిక్కర్లు, ధరల లేబుళ్లు అన్నీ అతికించి ఎక్కడా అనుమానం రాకుండా విక్రయాలు చేస్తుంటారు. ఇంకో కల్తీ ఎలాగంటే.. లీటర్ చీప్ లిక్కర్లో ఆరు లీటర్ల నీరు, ఒక లీటర్ సిర్పిట్‌ను కలిపి సిద్ధం చేసి క్వార్టర్ సీసాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా కల్తీ చేసిన చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌ని రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తుంటారు. దానిని పలు బ్రాండ్ల క్వార్టర్ సీసాల్లో నింపటం ద్వారా నాలుగు రెట్లు లాభాలు ఆర్జిస్తున్నారు. -
కృష్ణలంక పీఎస్‌కు మల్లాది విష్ణు తరలింపు
-
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు
-
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్టు
విజయవాడ సిటీ: కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అతని తమ్ముడు మల్లాది శ్రీనివాస్(బుల్లియ్య)లను గురువారం రాత్రి 11.20 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. విష్ణును బుధవారం దాదాపు 12.30 గంటలపాటు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గురువారం కూడా విచారించారు. బార్ లెసైన్స్దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుందరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.ఎ.లక్ష్మిని కూడా పిలిపించిన విచారణ అధికారులు.. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో విష్ణుతోపాటు మిగిలినవారిని ఎదురెదురుగా పెట్టి విచారించారు. సిట్ అధినేత మహేష్ చంద్ర లడ్హా ఆధ్వర్యంలోని అధికారుల బృందం వీరినుంచి పలు వివరాలనడిగి తెలుసుకుంది. తొలిరోజు విచారణలో చెప్పిన అంశాల్నే విష్ణు పునరుద్ఘాటించినట్టు సమాచారం. లెసైన్స్‌దారులు చెపుతున్న విషయాలతో పోల్చినప్పుడు విష్ణు చెప్పిన సమాధానాలు కొంత విరుద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణును, ఆయన తమ్ముడు శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. -
'పారిపోలేదు..పుణ్యక్షేత్రాలకు వెళ్లా..'
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. మంగళవారం ఉదయం ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ఆయన రాకను పసిగట్టిన మీడియా హుటాహుటిన మల్లాది ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదనీ.. దైవ దర్శనం కోసం షిరిడీ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లానని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం విచారణ బృందం ఎదుట హాజరవుతానన్నారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించిన విచారణలో పూర్తిగా సహకరిస్తానన్నారు. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడడం పద్ధతి కాదనీ, బుధవారం మధ్యాహ్నం అన్ని వివరాలూ వెల్లడిస్తానని చెప్పారు. అప్పటి వరకూ పాత్రికేయలు సహకరించాలని కోరారు. అనంతరం మల్లాది విష్ణు పార్టీ ముఖ్య నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. -
మద్యం బాధితులకు కామినేని పరామర్శ
విజయవాడ: కల్తీ మద్యం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మందిని డిశ్చార్జ్ చేశామని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. మద్యంలో మిథైనాల్ కలపడం వల్లే ఘటన జరిగిందని కామినేని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
కల్తీకల్లు దొరక్క మహిళ మృతి
కల్తీ కల్లు దొరక్క ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల్‌గాం పంచాయతి పరిధిలోని సౌర్య నాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తామీబాయి(36) గత కొన్నేళ్లుగా కల్లుకు బానిసైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు దొరకక పోవడంతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మరణం
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు లభించకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన చిలకల సురేష్(35) గత ఐదేళ్లుగా చిలక జోస్యం చెప్పుకుంటూ ధారూర్లోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో కల్తీ కల్లుకు బానిసయ్యాడు. కొంతకాలంగా కల్తీకల్లు దొరక్కపోవడంతో..తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
కల్తీ కల్లు దొరక్క ముగ్గురి మృతి
కల్తీ కల్లు లభించక ముగ్గురు వ్యక్తులు గురువారం మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కల్తీ కల్లుకు బానిసలై వింత వింతగా ప్రవర్తిస్తూ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు బాధితులు మరణించారు. మరో 25 మంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. జిల్లాలో కల్తీ కల్లుకు బానిసలై.. అదిదొరక్క మతిస్థిమితం తప్పుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. -
కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా : కల్తీకల్లు దొరక్క ఒకవైపు పదుల సంఖ్యలో బాధితులు రంగారెడ్డి జిల్లా తాండూరులోని ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తుంటే.. మరోవైపు ఇదే జిల్లా బషీరాబాద్ మండలంలో ఓ వ్యక్తి కల్తీకల్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని ఎక్మయి గ్రామంలో నర్సప్ప (35) మంగళవారం రాత్రి కల్తీ కల్లు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రి కావడంతో ఎవరూ గుర్తించలేదు. బుధవారం ఉదయం నర్సప్ప మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు -
పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
కల్తీ కల్లుకు బానిసై .. అది దొరకని పరిస్థితుల్లో వింత ప్రవర్తనతో రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 18 మంది చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. దీంతో వింత ప్రవర్తనతో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య 80కు పెరిగింది. మంగళవారం కూడా 17 మంది బాధితులు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మృతి
కల్తీకల్లు దొరక్క ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ధారూరు మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ధారూర్‌కు చెందిన బుడజంగం దస్తయ్య(35) అనే వ్యక్తి కల్తీ కల్లుకు బానిసయ్యాడు. అధికారుల దాడులు ముమ్మరంగా ఉండటంతో.. మూడు రోజులుగా కల్తీ కల్లు దొరకడం లేదు.. దీంతో దస్తయ్య మూడు రోజులుగా వింత వింతగా ప్రవర్తిస్తుండటంతో.. కుటుంబీకులు దస్తయ్యను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అతడు బుధవారం మరణించారు. కల్తీకల్లు తాగకపోవడం వల్లే దస్తయ్య మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
తాండూరు: రంగారెడ్డి జిల్లాలో కల్తీకల్లు పంజా విసురుతుంది. గత రెండు రోజులుగా తాండూరు జిల్లా ఆస్పత్రిలో 50 మంది వరకు కల్తీకల్లు బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. మల్రెడ్డిపల్లికి చెందిన పార్వతమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. బాధితుల పిచ్చి చేష్టలు, అరుపులతో జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. బాధితులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మత్తుపదార్థాలు లేని కల్లు సేవించడం వల్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు తెలిపారు. కాగా, రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో సోమవారం ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కల్తీకల్లు తాగి ఇద్దరి మృతి
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో కల్తీ కల్లు మరోసారి పంజా విసిరింది. సోమవారం ఒక్కరోజే 60 మంది బాధితులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రిలో చేరారు. బాధితుల్లో మేరెడ్డిపల్లికి చెందిన భీమప్ప(40), అంజమ్మ(50) మృతిచెందారు. బాధితుల పిచ్చి చేష్టలతో, అరుపులతో జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పలువురు ఫిట్స్ రోగుల్లాగా కొట్టుకుంటుండగా.. మరి కొంత మంది వింత చేష్టలు చేస్తున్నారు. కల్తీ కల్లు తాగడం వల్ల ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని... అది దొరక్క పిచ్చి చేష్టలు చేస్తున్నారని తెలుస్తోంది. -
కల్తీ కల్లుపై మళ్లీ యుద్ధం
* మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో నేటి నుంచే దాడులు * ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మలివిడత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ కల్లుపై దాడులకు ఆబ్కారీశాఖ మరోసారి సిద్ధమైంది. కల్తీ కల్లును అరికట్టే చర్యల్లో భాగంగా నెల కిందట విక్రయ దుకాణాలపై అధికారులు దాడులు చేయగా కల్తీ కల్లుకు అలవాటుపడ్డ వ్యక్తులు అది దొరకక పిచ్చెక్కినట్లు ప్రవర్తించడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా దాడులను నిలిపేయడం తెలిసిందే. కల్తీ కల్లును ఎక్కువగా విక్రయించే ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖతో కలసి జిల్లా కేంద్రాలు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆస్పత్రుల్లో కల్తీ కల్లు బాధితుల కోసం డీ-అడిక్షన్ సెంటర్లు, మందులు అందుబాటులో ఉంచిన సర్కారు... శుక్రవారం నుంచి దాడులు జరపాలని నిర్ణయించింది. ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఈ మేరకు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఏసీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. తాటి, ఈత చెట్లు తక్కువగా ఉండే మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ జిల్లాల నుంచే దాడులు మొదలుపెట్టనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మలివిడతలో తనిఖీలు చేపట్టనున్నారు. అల్ఫ్రజోలం స్టాక్ లక్ష్యంగా... కల్లును కల్తీ చేసేందుకు గతంలో డైజోఫాం, క్లోరోఫాం వంటి రసాయనాలు వాడేవారు. మత్తును కలిగించే ఈ రసాయనాలు కల్లు తయారీలో వాడితే ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు జరిగినప్పుడు పరీక్షల్లో ఈ మత్తు మందు కలిపినట్లు అప్పటికప్పుడు తేలుతుంది. ఈ నేపథ్యంలో కల్తీకల్లు తయారీదారులు అల్ఫ్రజోలం అనే మాదకద్రవ్యం (డ్రగ్) వాడకాన్ని ప్రారంభించారు. ఈ మందు కలిపినట్లు నిర్ధారణ చేయాలంటే హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రంలోనే వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో ముంబై, హైదరాబాద్ శివార్లలోని ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలకు సరఫరా అయ్యే అల్ఫ్రజోలం కల్లు దుకాణాలకు చేరడం మొదలైంది. కిలో అల్ఫ్రజోలం మందును ఆరునెలల పాటు ఒక దుకాణంలో వినియోగించుకునే అవకాశం ఉండడంతో కల్తీ కల్లు తయారీదారులులు దీన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ మందు మోతాదు మించితే నాడీ వ్యవస్థ దెబ్బతిని, మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనికి అలవాటయితే అల్ఫ్రజోలం కలిపిన కల్లు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకుంటారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చెట్లు లేని చోట జరిపే విక్రయాల్లో అల్ఫ్రజోలంతో కూడిన కల్లు విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిపే దాడులు అల్ఫ్రజోలం నిల్వలనే లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. కల్లు దుకాణాలకు ఈ మందును అమ్ముతున్న మధ్యవర్తులు, ఎక్కడి నుంచి ఈ మందు తెస్తున్నారనే కోణంలోనే ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దాడులు జరిపే జిల్లాల్లో ముందుగా గుర్తించిన మండలాలు, గ్రామాల వివరాలను రహస్యంగా ఉంచి ఉదయం నుంచే దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు ఓ అధికారి వివరించారు. భవిష్యత్తులో కల్తీ కల్లు దొరకదనే విషయాన్ని కౌన్సెలింగ్ ద్వారా బాధితులకు వివరించేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
కల్తీకల్లు బాధితుడి మృతి
నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో కల్తీకల్లు మహమ్మారి బారిన పడిన ఓ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్కెళ్ల గ్రామానికి చెందిన ఏడుగురు కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ వారం రోజుల నుంచి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో షాహుకారు అనే వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో షాహుకారు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కల్లుకు అండగా ‘కల్తీ’నేత!
కల్తీకల్లు మాఫియాతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమ్మక్కు ఎక్సైజ్ దాడులను తనకు అనుకూలంగా మలచుకున్న పాలమూరు నేత మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బేరాలు ‘అల్ఫ్రజోలం’ కల్లు విక్రయాలు సాగేలా చూస్తానంటూ రూ.3 కోట్లు వసూలు అదే సమయంలో దాడులపై సర్కారు వెనకడుగు.. తన ఘనతేనని ప్రచారం సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన సీఎం.. చర్యలకు సిద్ధం త్వరలో మళ్లీ కల్తీకల్లుపై దాడులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కల్తీకల్లు’పై ఆబ్కారీ శాఖ జరిపిన దాడులతో తలెత్తిన పరిణామాలను అధికార పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు తనకు అనుకూలంగా మలచుకున్నారు. అల్ఫ్రజోలంతో నకిలీ కల్లు తయారుచేసే మాఫియాకు అండగా నిలిచారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కల్లు మాఫియాతో రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకొని రంగంలోకి దిగారు. డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోకుండా ‘మందు కల్లు’ను ఒక్కసారిగా నిలిపేయడంతో మరణాలు సంభవిస్తున్నాయంటూ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. మొత్తంగా ‘కల్తీకల్లు’పై దాడులను తాత్కాలికంగా నిలిపేసేందుకు కారణమయ్యారు. రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు మళ్లీ కల్తీకల్లు ఏరులై పారేలా కల్లు మాఫియాకు అండగా నిలిచారు. ఈ ఎమ్మెల్యే ‘కల్తీ’ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారని సమాచారం. దీనిపై సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం కేసీఆర్.. తదుపరి చర్యలకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ‘కల్తీకి అడ్డా.. వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు దశాబ్దాలుగా కల్తీకల్లుకు అడ్డాగా మారింది. వర్షాభావ పరిస్థితులు, సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడం, ఇతర భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువ. కల్వకుర్తి ప్రాంతంలో మినహా జిల్లాలో గుంపుగా తాటిచెట్లు కనిపించే గ్రామాలు కూడా లేవు. మహబూబ్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో తాటిచెట్లు 300కు మించవు. ఈ పరిస్థితుల్లో కల్తీకల్లు మాఫియా విజృంభించింది. జిల్లాలోని పేద కల్లు సహకార సంఘ సభ్యులను మచ్చిక చేసుకుని, వారికి నెలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తూ కల్తీకల్లు విక్రయాలు జరిపింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఒకరు ఐదేళ్ల క్రితం వరకు మహబూబ్‌నగర్ జిల్లాకు ‘కల్లు కింగ్’గా వ్యవహరించాడు. ఆయన 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్‌పైనే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం గమనార్హం. ఆ ఎన్నికల తరువాత ఆయన ప్రభావం తగ్గిపోయింది. అయితే 2014 ఎన్నికల తరువాత ఈ జిల్లా నుంచే గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన ప్రతాపం చూపడం ప్రారంభించారు. ప్రభుత్వంలో తనకున్న పరిచయాలు, శాసనమండలిలోని పెద్దల అండతో పాలమూరులో ‘కల్తీకల్లు’పై ఆధిపత్యానికి పావులు కదిపారు. గద్వాల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మరో నేత కల్లు దందా సాగిస్తుండడంతో... అక్కడ కూడా అధికార పార్టీ నాయకుడిని రంగంలోకి దింపారు. తన అనుయాయుడికి జిల్లాలో ముఖ్యమైన పదవిని కట్టబెట్టడంతో పాటు అక్కడ కల్తీకల్లుపై పట్టున్న ఓ ఇద్దరిని తన అదుపాజ్ఞల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లుపై సర్కారు చేపట్టిన సమరం ఆ ఎమ్మెల్యేకు మంచి అవకాశంగా మారింది. పాలమూరు జిల్లాతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ‘కల్తీ’ మందు అమ్మే వ్యాపారులంతా ఈ ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు. అల్ఫ్రజోలాన్ని ఒక్కసారిగా నిలిపేస్తే మరణాలు సంభవిస్తున్నాయనే నెపంతో... కొన్నేళ్ల పాటు యధాతథంగా కొనసాగించేలా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే రూ.3 కోట్లు చేతులు మారాయని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కల్తీకల్లుపై వెనక్కి తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేకు అటు సొమ్ముతో పాటు కల్తీ మాఫియాకు పెద్దదిక్కుగా పేరొచ్చింది. ఎక్సైజ్ ఈడీ తిరిగి రాగానే..! డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్‌గా ఉన్న అకున్ సబర్వాల్‌కు ఎక్సైజ్ ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్రగ్స్ కంట్రోల్‌కు సంబంధించి శిక్షణ కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి రాగానే క ల్తీకల్లుపై దాడులను తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈలోపు జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి కూడా. ఇక కల్తీకల్లు అడ్డాలతో పాటు ‘అల్ఫ్రజోలం’ను సరఫరా చేసే ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ శివార్లలోని పరిశ్రమలపైనా దాడులు చేయనున్నట్లు సమాచారం. -
కల్లుకు అండగా ‘కల్తీ’నేత!
కల్తీకల్లు మాఫియాతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమ్మక్కు ఎక్సైజ్ దాడులను తనకు అనుకూలంగా మలచుకున్న పాలమూరు నేత మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బేరాలు ‘అల్ఫ్రజోలం’ కల్లు విక్రయాలు సాగేలా చూస్తానంటూ రూ.3 కోట్లు వసూలు అదే సమయంలో దాడులపై సర్కారు వెనకడుగు.. తన ఘనతేనని ప్రచారం సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన సీఎం.. చర్యలకు సిద్ధం త్వరలో మళ్లీ కల్తీకల్లుపై దాడులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కల్తీకల్లు’పై ఆబ్కారీ శాఖ జరిపిన దాడులతో తలెత్తిన పరిణామాలను అధికార పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు తనకు అనుకూలంగా మలచుకున్నారు. అల్ఫ్రజోలంతో నకిలీ కల్లు తయారుచేసే మాఫియాకు అండగా నిలిచారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కల్లు మాఫియాతో రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకొని రంగంలోకి దిగారు. డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోకుండా ‘మందు కల్లు’ను ఒక్కసారిగా నిలిపేయడంతో మరణాలు సంభవిస్తున్నాయంటూ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. మొత్తంగా ‘కల్తీకల్లు’పై దాడులను తాత్కాలికంగా నిలిపేసేందుకు కారణమయ్యారు. రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు మళ్లీ కల్తీకల్లు ఏరులై పారేలా కల్లు మాఫియాకు అండగా నిలిచారు. ఈ ఎమ్మెల్యే ‘కల్తీ’ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారని సమాచారం. దీనిపై సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం కేసీఆర్.. తదుపరి చర్యలకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ‘కల్తీకి అడ్డా.. వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు దశాబ్దాలుగా కల్తీకల్లుకు అడ్డాగా మారింది. వర్షాభావ పరిస్థితులు, సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడం, ఇతర భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువ. కల్వకుర్తి ప్రాంతంలో మినహా జిల్లాలో గుంపుగా తాటిచెట్లు కనిపించే గ్రామాలు కూడా లేవు. మహబూబ్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో తాటిచెట్లు 300కు మించవు. ఈ పరిస్థితుల్లో కల్తీకల్లు మాఫియా విజృంభించింది. జిల్లాలోని పేద కల్లు సహకార సంఘ సభ్యులను మచ్చిక చేసుకుని, వారికి నెలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తూ కల్తీకల్లు విక్రయాలు జరిపింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఒకరు ఐదేళ్ల క్రితం వరకు మహబూబ్‌నగర్ జిల్లాకు ‘కల్లు కింగ్’గా వ్యవహరించాడు. ఆయన 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్‌పైనే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం గమనార్హం. ఆ ఎన్నికల తరువాత ఆయన ప్రభావం తగ్గిపోయింది. అయితే 2014 ఎన్నికల తరువాత ఈ జిల్లా నుంచే గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన ప్రతాపం చూపడం ప్రారంభించారు. ప్రభుత్వంలో తనకున్న పరిచయాలు, శాసనమండలిలోని పెద్దల అండతో పాలమూరులో ‘కల్తీకల్లు’పై ఆధిపత్యానికి పావులు కదిపారు. గద్వాల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మరో నేత కల్లు దందా సాగిస్తుండడంతో... అక్కడ కూడా అధికార పార్టీ నాయకుడిని రంగంలోకి దింపారు. తన అనుయాయుడికి జిల్లాలో ముఖ్యమైన పదవిని కట్టబెట్టడంతో పాటు అక్కడ కల్తీకల్లుపై పట్టున్న ఓ ఇద్దరిని తన అదుపాజ్ఞల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లుపై సర్కారు చేపట్టిన సమరం ఆ ఎమ్మెల్యేకు మంచి అవకాశంగా మారింది. పాలమూరు జిల్లాతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ‘కల్తీ’ మందు అమ్మే వ్యాపారులంతా ఈ ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు. అల్ఫ్రజోలాన్ని ఒక్కసారిగా నిలిపేస్తే మరణాలు సంభవిస్తున్నాయనే నెపంతో... కొన్నేళ్ల పాటు యధాతథంగా కొనసాగించేలా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే రూ.3 కోట్లు చేతులు మారాయని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కల్తీకల్లుపై వెనక్కి తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేకు అటు సొమ్ముతో పాటు కల్తీ మాఫియాకు పెద్దదిక్కుగా పేరొచ్చింది. ఎక్సైజ్ ఈడీ తిరిగి రాగానే..! డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్‌గా ఉన్న అకున్ సబర్వాల్‌కు ఎక్సైజ్ ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్రగ్స్ కంట్రోల్‌కు సంబంధించి శిక్షణ కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి రాగానే క ల్తీకల్లుపై దాడులను తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈలోపు జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి కూడా. ఇక కల్తీకల్లు అడ్డాలతో పాటు ‘అల్ఫ్రజోలం’ను సరఫరా చేసే ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ శివార్లలోని పరిశ్రమలపైనా దాడులు చేయనున్నట్లు సమాచారం. -
కల్తీకల్లు మరో బాధితుడి మృతి
రంగారెడ్డి(వికారాబాద్): కల్తీ కల్లు తాగిన ఓ వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఉస్మానియా ఆసుపత్రిలో మరణించాడు. వివరాలు.. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట వార్డుకు చెందిన మల్లికార్జున్(40) అనే వ్యక్తి పట్టణంలోని ఓ కల్లు దుకాణంలో ఇటీవలే కల్తీకల్లు తాగాడు. అప్పటి నుంచి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో పట్టణంలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మల్లికార్జున్‌కు ఓ భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
జీవితాలను కల్తీ చేసిన కాలం
డేట్లైన్ హైదరాబాద్ సోమవారం నాటి ‘సాక్షి’ దినపత్రిక లోపలి పేజీలలో ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ శీర్షికన ప్రచురించిన వార్తలోనే ఆసక్తి కలిగించే మరో చిన్నవార్త గుండ్రటి బాక్స్‌లో కనిపిస్తుంది. ఆ బాక్స్ ఐటమ్ సారాంశం ఏమిటంటే పది రోజులపాటు కల్తీకల్ల్లు బాధితులతో కిటకిటలాడిన మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల్ల మండలం బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆదివారం తాకిడి తగ్గింది అని. తిరగబడ్డ వాస్తవం రోగులు రాకపోతే, రోగాలు తగ్గుముఖం పడితే అదో వార్త కావాలి. ఆస్ప త్రులు ఖాళీగా ఉంటే జనమంతా సంతోషించాలి. కానీ ఇక్కడ అది పూర్తిగా తిరగబడింది. అదే వార్తలో ఇంకా కొంచెం ముందుకుపోయి చదివితే, కల్తీ కల్లు బాధితుడు ఒక్కరు కూడా ఆదివారం ఆస్పత్రిలో చేరలేదు అని ఉంటుం ది. అంతకుముందు పదిరోజులపాటు ఇదే ఆస్పత్రిలో 13 మంది కల్తీకల్లు బాధితులు చనిపోయారు. మరో వందమంది దాకా చికిత్స తీసుకున్నారు. వింతచేష్టలు, మరణాలతో అట్టుడికిన ఆస్పత్రి ప్రాంగణం ఆదివారం ప్రశాం తంగా కనిపించడంతో డాక్టర్లు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ చివరి వాక్యం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ వాక్యం గురించే ఇప్పుడు చర్చించుకోవాలి. బాధపడాలి, ఆందోళన చెయ్యాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఇంతకీ ఆ వాక్యం అంతరార్థం ఏమిటి? మత్తు కలిపిన కల్లు, అంటే కల్తీకల్లు మళ్లీ దొరుకుతున్నందు వల్లనే బాధితులు తగ్గిపోయారనే. కల్తీ కడుపులో పడక చావులా? గత పక్షంరోజులలో తెలంగాణలో చాలా జిల్లాల నుంచి ఇటువంటి వార్తలు వరసగా ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఇందులో వింతేముంది అని ఎవరైనా అనుకోవచ్చు. మామూలుగా మనం ఏమనుకుంటాం? కల్తీకల్లు, కల్తీ సారా తాగేవాళ్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. దానితో చనిపోతారనే కదా! కల్తీ జరిగిన ఆహారం తింటే మనుషులూ, కల్తీమందులు చల్లితే చెట్లూ, పంటలూ కూడా చనిపోతాయని కదా మన అవగాహన. ఇలాంటి సర్వ సామాన్యమైన మన అవగాహన ఈ సందర్భంలో దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు తెలం గాణలో జరుగుతున్న తంతు ఏమిటంటే జనం కడుపులోకి కల్తీ వెళ్లక అనా రోగ్యం పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. ఏమిటీ విచిత్రం? ‘ఆగని కల్తీకల్లు మరణాలు’ అని వార్తలకు శీర్షికలు ఉంటాయి. సామాన్యులు ఇది చూసి ఏం అర్థం చేసుకుంటారు? ఓహో! కల్తీకల్లు తాగడం వల్లనే జనం చని పోతున్నట్టున్నారు అని కదా అనుకుంటారు. అయినా కల్తీకల్లును నిరోధించ కుండా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈ బాగోతం చూస్తూ కూర్చోడానికేనా ఓట్లేసి గెలిపించింది? అని తిట్టుకుంటారు కూడా. పాపం, ఈ ఉదంతంలో ప్రభుత్వాన్ని నిందించవద్దండీ! ఈ మరణాలూ, అనారోగ్యాలూ కల్తీకల్లు తాగినందువల్ల కాదు, తాగడానికి ఆ కల్తీకల్లు అందుబాటులో లేనందువల్ల. ఈ వ్యాసం ఆరంభంలో బాదేపల్లి ఆస్పత్రి ప్రస్తావన తెచ్చింది అందుకే. కల్తీ కల్లును అడ్డుకునేందుకు మన ఆబ్కారీ శాఖ గత కొద్దిరోజులుగా నడుం బిగించి, దాడులు చేసి ఎక్కడికక్కడ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఏళ్ల తరబడి ఆ మత్తుకు బానిసలైనవాళ్లు తీవ్రమైన ఇబ్బందులలో పడిపోయారు. అది దొరక్క అనారోగ్యం పాలై, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఆస్పత్రుల పాలవుతు న్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు కూడా. కల్తీకల్లు ప్రవాహం మీద విరుచుకుపడాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే కల్తీ ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించవలసిందే. కల్తీ ఆహారం, కల్తీ మద్యం, కల్తీ పురుగుల మందులు, కల్తీ ఎరువులు వైగైరా వైగైరా. అన్ని కల్తీలతో పాటు కల్తీ రాజకీయాలను కూడా. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీకల్లును అరికట్టేందుకు నడుం బిగించిన ఆబ్కారీ శాఖ సంకల్పం ఏమై నట్టు? మళ్లీ కల్తీకల్లు దొరుకుతున్నందు వల్లనే బాదేపల్లి ఆస్పత్రికి రోగులు రావడం లేదన్న వార్త అంతరార్థం ఏమిటి? ఆకస్మిక నిర్ణయాలతో వచ్చిన తంటా ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం! ఆలోచనారహితమైన, లోపభూయిష్టమైన, ఆకస్మికమైన ప్రభుత్వ నిర్ణయాలు చే టు చేస్తాయని తెలంగాణ రాష్ర్టంలో మద్యపానం వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు గొప్ప ఉదాహరణగా మిగులుతాయి. ప్రస్తుతం తెలంగాణలో కల్తీకల్లు అందుబాటులో లేక సంభవిస్తున్న మరణాలు, రోగా లతో జనం ఆస్పత్రుల పాలు కావడానికి గల నేపథ్యాన్ని గురించి మాట్లాడు కుంటే ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే జవాబుదారీ అవుతుందని అంతా అంగీకరిస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యం విషయంలో అనుసరిస్తున్న ధోరణి ఇప్పటి గందరగోళానికి కారణం. అధికా రంలోకి రాగానే కల్లు విధానం ప్రకటించారు. హైదరాబాద్‌లో కల్లు అమ్మ కాలను అనుమతించాలని నిర్ణయించారు. అసలు చుట్టుపక్కల తాడిచెట్లు, ఈతచెట్లు లేనిచోట కల్లు దుకాణాలు తెరిస్తే అక్కడ అమ్మేది కల్తీకల్లే మహా ప్రభో అంటే, మన సర్కార్ కొట్టిపారేసింది. ఇప్పటికే చాలా గ్రామాలలో తాటివనాలు అంతరించిపోయాయి. ఆ వృత్తి మీద జీవిస్తున్న సామాజిక వర్గంలోని తరువాతి తరం చదువుల వైపు చూస్తున్నది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం అన్వేషిస్తున్నది. సరైన ఆధారం లేని ప్రమాదకరమయిన ఆ వృత్తిలో ఉండటానికి ఇప్పటితరం అంగీకరించడం లేదు. అయినా సరే, కల్లు డిపోలూ, దుకాణాల తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కల్తీకల్లు విక్రయాలు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే జరుగుతున్నాయి. ఈ కల్తీకల్లు తాగడం వల్ల ఎప్పుడో అప్పుడు మనుషులు తీవ్ర అనారోగ్యం పాలై, చివరికి చనిపోవడం ఖాయం. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇది విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది. ఒత్తిడితోనే సర్కారు వెనక్కి తగ్గిందా? ఇప్పుడు దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం కదా, మళ్లీ విమర్శి స్తారెందుకు అని ఘనత వహించిన మన సర్కారు వారు దబాయించవచ్చు. ఇప్పుడు ఈ కల్తీకల్లు మీద ఎందుకు విరుచుకుపడ్డట్టు? జనం చనిపోవడం మొదలు కావడంతో మళ్లీ కొంతకాలం చూసీచూడనట్టు వ్యవహరించాలని ఎందుకు అనుకుంటున్నట్టు? ఈ తదుపరి నిర్ణయం ఎవరి స్థాయిలో జరి గిందో కానీ కల్తీకల్లు తయారీదారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం తన సంకల్పం నుంచి వెనక్కు తగ్గిందని మాత్రం ప్రైవేటుగా ఏ అధికారిని అడిగినా చెబు తాడు. సరే, కల్తీకల్లును అరికట్టాలన్న నిర్ణయం వెనక మతలబు ముందు తెలుసుకుందాం. చీప్‌లిక్కర్ ప్రత్నామ్నాయం కారాదు తెలంగాణ రాష్ర్టంలో కల్తీకల్లు, సారాయి, గుడుంబా వంటి ప్రాణాంతక మత్తుపానీయాలను అరికట్టడం కోసం చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని అను కుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక టన చేశారు. చీప్‌లిక్కర్ పేరిట జనాన్ని మరింత వ్యసనపరులను చేస్తారా అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విరుచుకుపడటంతో ఆ నిర్ణ యం వెనక్కు తీసుకున్నారు. కల్తీ మద్యం బారి నుంచి జనాన్ని కాపాడటానికి మేం చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనుకుంటే అడ్డుతగులుతారా, మీరే చూడండి ఫలితాలు ఎట్లా ఉంటాయో? అని కల్తీకల్లు మీద దాడులు మొదలు పెట్టిం చింది ప్రభుత్వం. ఎప్పటికైనా ఈ మహమ్మారిని పారద్రోలాల్సిందే కాబట్టి జన బాహుళ్యం దీన్ని సమర్ధిస్తున్నది. కానీ ప్రభుత్వం ఈ చర్య తీసుకో వడానికి ముందు కల్తీకల్లుకు బానిసలైన వారిని బయటకు తీసుకువచ్చి, వాళ్ల ప్రాణాలు రక్షించడానికి అవసరమైన కార్యాచరణను ముందే రూపొందించి అమలులోకి తెచ్చి ఉంటేఅందరి ప్రశంసలు అందుకునేది. కానీ ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంకా ఎన్ని వైపరీత్యాలు చూడాలో! మద్యం అలవాటు మాన్పించడం కోసం అవసరమైనన్ని డీ అడిక్షన్ కేంద్రా లను నెలకొల్పవలసిందని న్యాయస్థానాలు ముందే చెప్పాయి. అటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా, అవసరమయిన మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోకుండా, సరైన వైద్య సదుపాయాలు కల్పించకుండా, కల్తీకల్లు మీద ఒక్కసారిగా విరుచుకుపడితే ఇటువంటి ఫలితాలే ఎదురవుతాయి. కల్తీ మద్యానికి చీప్‌లిక్కర్ ప్రత్యామ్నాయం కాకూడదు. జనాన్ని ఆ దుర్వ్యసనం నుంచి బయటకు తీసుకువచ్చి వారి ఆరోగ్యాలు బాగుచేసే పథకాలు ప్రభుత్వం రూపొందిస్తే అంతా సంతోషిస్తారు. అది సాధ్యమేనా? రాష్ర్టం నడపడానికి నిధుల కోసం సాగే వేటలో మద్యం ఒక ప్రధాన వనరుగా ఉన్నం తకాలం ఏ ప్రభుత్వానికైనా సాధ్యంకాదు. ప్రభుత్వాలు ఈ సాలెగూడు నుం చి బయటపడే వరకు ఇంకా ఎన్నో వైపరీత్యాలను మనం చూడవలసిందే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కల్తీ కల్లు మరణాలకు.. సర్కారుదే బాధ్యత
- కాంగ్రెస్ బృందం ఆరోపణ - ఉస్మానియాలో బాధితులకు పరామర్శ సాక్షి, సిటీబ్యూరో : ‘రాష్ట్రంలో కల్తీ కల్లు పాలై అమాయకులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నా, ఆ మరణాల నివారణ కోసం ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టటం లేదు. ఈ వ్యవహరంపై తక్షణం స్పందించి అన్ని ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో రెస్క్యూ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేనట్లయితే ఉన్నత స్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. శనివారం పార్టీ ప్రతినిధులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్ల బృందం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్తీ కల్లు బారిన పడి వందల సంఖ్యలో జనం మరణిస్తున్నా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని, కల్లు మాఫియా వెనక టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల హస్తం ఉందని వారు ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో విక్రయిస్తున్న కల్లులో చాలా చోట్ల డైజోఫాం,అల్ఫాజోంతో పాటు అధిక మత్తు కోసం ఎపిడ్రిన్ అనే విష రసాయనాలు కూడా వాడుతున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే కల్తీకల్లు మరణాలపై సిట్టింగ్‌జడ్జి చేత విచారణకు ఆదేశించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ముగ్గురు కల్తీ కల్లు బాధితుల మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు దొరక్క అస్వస్థత పాలైన బాధితుల్లో మరో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు. వీరంతా జడ్చర్ల మండలానికి చెందిన వారు. మండలంలోని జంగాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ(50) ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అలాగే, బూరుగుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(45) ఇంటివద్దే మృతి చెందగా, చెన్నయ్య(50) మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కన్నుమూశాడు. -
ఆరుగురు కల్తీకల్లు బాధితులు మృతి
జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్) : కల్తీకల్లు బాధితుల పిచ్చిచేష్టలు మరింత ముదిరిపోతున్నాయి. ఒక్కసారిగా కల్లు దొరకకపోవడంతో మతిస్థితిమితం కోల్పోయి రోడ్లపైకి వచ్చి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో ఆరుగురు మృతిచెందారు. జడ్చర్ల హౌజింగ్‌బోర్డు కాలనీలో సర్దార్(65) తన బావమరిది ఇంటివద్ద ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయి గురువారం జడ్చర్ల స్టేషన్ వద్ద రైల్వేగేటు సమీపంలో శవమై కనిపించాడు. జడ్చర్ల గ్రామపంచాయతీ ఇందిరానగర్‌కు చెందిన గొల్ల అంజమ్మ(65) మూడురోజులుగా అనారోగ్యానికి గురై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇక మాగనూర్ మండలం తంగిడి గ్రామానికి చెందిన కాశిమప్ప (62) కల్తీకల్లు లేకపోవడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మిద్దె చెన్నయ్య(60) కల్తీకల్లు దొరకక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం పొలంలో శవమై కనిపించాడు. కొడంగల్ పట్టణానికి చెందిన యాలాల చెన్నప్ప(65) కల్లులో మత్తు లేకపోవడతో మతిస్థిమితం కోల్పోయి చనిపోయాడు. కొత్తూరు మండలంలోని నర్సప్పగూడ గ్రామానికి చెందిన నీరటి మణెమ్మ(65) రెండుమూడు రోజులుగా కల్లులో మత్తు తగ్గిన కారణంగా పిచ్చి చేష్టలు చేస్తోంది. గురువారం ఉదయం కుటుంబసభ్యులు బయటకు వెళ్లగానే ఇంట్లోనే చీరతో ఫ్యానుకు ఊరేసుకుని మృతి చెందింది. -
కన్నీళ్లు పెట్టిస్తున్న ‘కల్లు’
- మరో ముగ్గురు కల్లుకు బలి - బావిలోకి దూకిన మరో వ్యక్తి.. - ఐదుకు చేరిన మృతుల సంఖ్య భైంసా/బాసర : కల్లు కన్నీళ్లు పెట్టిస్తోంది. చదువుల తల్లి క్షేత్రం బాసరలో కల్లు మృతుల సంఖ్య పెరుగుతూపోతోంది. కల్తీ కల్లు మహమ్మారిలా ఒక్కొక్కరిని పొట్టనపెట్టుకుంటోంది. కల్లులో మత్తు తక్కువై ఇప్పటికే పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. ఆదివారం బాసర గ్రామానికి చెందిన గైని శంకర్, మోతుకురి స్వరూపం చారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం బాసరలో మరో ఇద్దరు మృతిచెందగా, నిర్మల్‌లో మరొకరు మృతిచెందారు. దీంతో కల్లు బాధిత మృతుల సంఖ్య ఐదుకు చేరింది. స్థానికుడైన ముల్కిపోతన్న కల్లులేక ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలిపోయూడు. దీంతో చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన నిజామాబాద్‌కు తరలిస్తుండగా ముల్కిపోతన్న(57) కన్నుమూశాడు. మృతిచెందాడు. బాసరకే చెందిన దూజ్‌గాం పోశెట్టి(63) ఫిట్స్ వచ్చి ఇంట్లో సృ్పహతప్పి కిందపడిపోయారు. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు. మైలాపూర్‌లో.. బాసర అనుబంధ గ్రామమైన మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి కల్లులేక అస్వస్థతకులోనయ్యాడు. బాసర పీహెచ్‌సీకి తరలించి చికిత్సలు చేయించారు. ఇంటికి చేరుకున్నాక విచిత్రంగా ప్రవరిస్తూ పక్కనే ఉన్న బావిలోకి దూకాడు. అపస్మారక స్థితిలో ఉన్న కొందపురం పోశెట్టిని కుటుంబీకులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా బాసరలో కల్లుదుకాణం మూసి ఉంచారు. కల్లు దొరకక కొందరు, దొరికిన కల్లులో మత్తులేక మరికొందరు అస్వస్థతకు లోనవుతున్నారు. కల్లులేక బాసరలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల కుటుంబీకులను భైంసాకు చెందిన వ్యాపారవేత్త రామారావుపటేల్ పరామర్శించారు. నిర్మల్‌లో ఒకరి మృతి.. నిర్మల్ అర్బన్ : కల్తీకల్లుకు నిర్మల్‌లో బుధవారం మరొకరు బలయ్యారు. స్థానిక ఈద్గాంకు చెందిన మహమూద్(45) మంగళవారం కల్లు తాగాడు. అందులో మత్తు మోతాదు తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు చికిత్సలు అందించినా బుధవారం పరిస్థితి విషమించడంతో మహమూద్ మృతిచెందారు. ఆయనకు భార్య అమీనాబేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత రెండురోజుల్లో 40 మంది కల్లుబాధితులు నిర్మల్ ఆస్పత్రికి తరలివచ్చారు. -
సైకోగా మారిన కల్తీ కల్లు బాధితుడు
కల్లులో మత్తు తగ్గడంతో కల్లుప్రియులు వింతగా ప్రవర్తిస్తున్నారు. జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి కల్తీకల్లుకు బానిసయ్యూడు. 15 రోజులుగా కల్లులో మత్తు తగ్గడంతో వికృత చేష్టలకు దిగుతున్నాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం ఉదయం భార్య రాధతో గొడవపడి ఆమెనుగోడకు కొట్టడంతో కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, జలపతి గతేడాది కల్లు తాగొచ్చి మత్తులో భూమి హద్దుల విషయంలో సోదరుడు జలేంధర్‌ను గడ్డపారతో తలపై మోది హత్య చేసిన ఘటనలో నిందితుడు. మరో ఘటనలో సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన శ్రీరాముల రాజయ్య(55) కల్లులో మత్తు తక్కువై వింతగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. 21న వైద్యసిబ్బందికి చెప్పకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణ శివారులో చెరువు సమీపంలో బుధవారం రాజయ్య శవమై కనిపించాడు. కల్లు తాగే అలవాటున్న రాజయ్య మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. -
బీడీ వెలిగించబోయి వ్యక్తి సజీవదహనం
నార్వ(మహబూబ్‌నగర్): కల్తీ కల్లుకు అలవాటు పడి అది లభించకపోవడంతో పిచ్చి చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కల్తీ కల్లు లభించక పోవడంతో మతిస్థిమితం కోల్పోయి.. గ్యాస్ తెరిచి ఉందని గమనించక బీడీ వెలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొకంణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి(39) గత కొన్నెళ్లుగా కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈరోజు కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లగా.. గుడిసెలో నిద్రిస్తున్న రవీందర్ రెడ్డి బీడీ వెలింగించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ఆన్ చేసి ఉంచడంతో, ఇంట్లో గ్యాస్ వ్యాపించి ఉండటాన్ని గమనించని రవీందర్ అగ్గిపుల్ల గీయడంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న అతను సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ కల్లు దొరకక మహిళ ఆత్మహత్య
నర్వ(మహబూబ్‌నగర్): కల్తీ కల్లుకు అలవాటుపడిన మహిళ కల్లు దొరకకపోవడంతో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొంకణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన బోయ బుచ్చమ్మ(48) గత కొంతకాలంగా కల్తీ కల్లుకు అలవాటు పడింది. వారం రోజులుగా కల్లు లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తూ.. మంగళవారం రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవరారం నాడు ఆమె మృతిచెందింది. -
కల్తీ కల్లు లేక వ్యక్తి మృతి
కల్తీ కల్లుకు బానిసైన మరో వ్యక్తి అది దొరక్క ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బండారి పర్వయ్య (46) కల్తీ కల్లుకు బానిసయ్యాడు. అయితే, కొన్ని రోజులుగా కల్తీ కల్లు ఈ ప్రాంతంలో లభించకపోవడంతో పర్వయ్య రెండు రోజులుగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ ప్రాంతంలో కల్తీ కల్లు మరణం నమోదు కావడం ఇదే ప్రథమం. -
కల్తీ కల్లు తాగి 14 మందికి అస్వస్థత
మెదక్ జిల్లా సిద్ధిపేటలో కల్తీకల్లు బారినపడి 14 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని దోబీ గల్లీకి చెందిన కొందరు మంగళవారం కల్తీకల్లు సేవించారు. అనంతరం ఆరుగురు అస్వస్థతతో ఏరియా ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం వరకు మరో ఎనిమిది మంది అస్వస్థతతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించారు. దీంతో ఎకై్సజ్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
కల్తీ కల్లు దొరక్క ఉరేసుకున్నాడు..
కల్లీ కల్లు మృతుల పరంపర కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో తాజా ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములనర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య(65) స్థానికంగా దొరికే కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ప్రస్తుతం అది దొరక్కపోవటంతో నాలుగైదు రోజులుగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
‘కల్లు’ తేలేస్తున్నారు..!
సాక్షి నెట్వర్క: తెలంగాణలో కల్తీ కల్లు కల్లోలం కొన సాగుతోంది. కల్తీ కల్లు అమ్మకాలను ఒక్కసారిగా నిలిపివేయడంతో బాధితులు మృత్యువాతపడుతున్నారు. పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం 21 మంది మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 15 మంది మరణించారు. వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికి త్స పొందుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం చేగిరెడ్డిఘనాపూర్ చెన్నారెడ్డిగూడకు చెందిన పెంటమ్మ(68) ఉరేసుకోగా, షాద్‌నగర్‌కు చెందిన భీమమ్మ(73) నీటి గుంతలో దూకింది. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ(40), ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సాలె యాదగిరి(60), కొందుర్గు మండలం లింగారెడ్డిగూడకు చెందిన ఖాజామియా(60), కర్రోల్లపెంటమ్మ(70), బాబుమియా(60), కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వకు చెందిన శాంతమ్మ(70) అనారోగ్యంతో మరణించారు. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఇబ్రహీం(75), దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌కు చెందిన చెన్నరాయుడు(60) సొమ్మ వచ్చి పడిపోయి మృతి చెందారు. గద్వాలకు చెందిన సత్యమ్మ(35) ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. గంజిపేట కాలనీకి చెందిన అబ్దుల్సలాం(60) మంగళవారం విం తగా ప్రవర్తిస్తూ కుప్పకూలిపోయాడు. కొడంగల్‌కు చెం దిన రాంపురం వెంకటలక్ష్మి(27), ధరూరు మండలం ఉప్పేరుకు చెందిన చాకలి సవారన్న(45), అల్వాలపాడులో కావలికారు నర్సమ్మ ఆస్పత్రులలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్లో నాగరాజు(28), నందికందిలో కిష్టయ్య (35), కల్హేర్ మండలం బాచేపల్లిలో రాములు(55), మెదక్ పిట్లంబేస్ వీధికి చెందిన అప్పల బాలయ్య(54) కల్లుకు బానిసై వింతగా ప్రవర్తిస్తూ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్కి చెందిన సాదుల నాగభూషణం(38) పిచ్చిగా ప్రవర్తిస్తూ రోడ్డుపై పడిపోయి మరణించాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రిక్షా కార్మికుడు మొహినొద్దీన్(65) కల్లుకు బానిసయ్యాడు. అది దొరకపోవడంతో రోడ్డుపై పడిపోగా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సాయమ్మ (48) చెరువులో దూకగా గత ఈతగాడు కాపాడారు. కాగా, మెదక్ జిల్లా సదాశివపేట మండలంలో 50 మంది, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. -
కల్తీకల్లు దొరకక ఇద్దరు మృతి
కొత్తూరు (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లుకు అలవాటుపడిన వ్యక్తులు అది లభించకపోవడంతో.. అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం ఇన్మలనర్వ గ్రామానికి చెందిన శాంతమ్మ(72) అనే వృద్ధురాలు గత కొన్ని రోజులుగా కల్లు తాగుతుంది. అయితే గత వారం రోజులుగా కల్తీ కల్లు లభించకపోవడంతో.. పిచ్చి చేష్టలు చేస్తోంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. అలాగే దేవరకద్ర మండలం పెదరాజామూర్ గ్రామానికి చెందిన మాల చండ్రాయుడు(58) అనే వ్యక్తి కల్తీ కల్లు లభించక వికృత చేష్టలు చేస్తూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. -
కల్తీకల్లు మరణాలు సంభవించకుండా చర్యలు
సంగారెడ్డి : జిల్లాలో కల్తీ కల్లు మరణాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మొదక్ జాయింట్ కలెక్టర్ పి.వెంకటరాం రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం కల్తీ కల్లు మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎక్సైజ్ శాఖ కల్తీ కల్లును నిషేధించకపోవడంతోనే ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని, ఈ సమయంలో శాఖలన్ని సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. -
కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి
జగిత్యాల (కరీంనగర్) : కల్తీ కల్లు తాగి వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న నయీముద్దీన్(54) చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కల్లుకు బానిసయ్యాడు. మంగళవారం కల్లు ఎక్కువగా తాగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీకి బానిసైన మద్యం ప్రియులు
-
కల్తీ కల్లు కల్లోలం
సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో కల్తీకల్లు మరణాలు ఆగడం లేదు. సోమవారం మరో నలుగురు కల్లు బాధితులు మరణించారు. వీరిలో ఇద్దరు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో 120 మంది, మెదక్ జిల్లాలో 30 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి గౌరీశంకర్‌కాలనీలో నివాసముంటున్న కుమ్మరి లక్ష్మమ్మ(65)కు నాలుగు రోజులుగా మతిస్థిమితం లేదు. అస్వస్థతకు గురైంది. తల్లి పరిస్థితిని గమనించి మిడ్జిల్ మండలం దోనూరు నుంచి కల్లు తీసుకురమ్మని భార్యను పంపించాడు. అనంతరం లక్ష్మమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే జిల్లా బొంరాస్‌పేట మండలం ఎన్కెపల్లికి చెందిన జోగు మణెమ్మ(75) కల్తీ కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయింది. దీంతో సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను చుట్టుపక్కలవారు కొడంగల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. జడ్చర్ల మండలం బండమీదిపల్లికి చెందిన గూళ్ల వెంకటమ్మ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. మెదక్ జిల్లా అందోలు మండలం పోసానిపేటకు చెందిన గడ్డమీది బాగయ్య (50) అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఉదయం కల్లు తాగేం దుకు దుకాణానికి వెళుతుండగా మార్గమధ్యంలో కుప్పకూలిపోయి చనిపోయాడు. కాగా, మహబూబ్‌నగర్ 336, మెదక్ 30, ఆదిలాబాద్ జిల్లాలో 120 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్తీ కల్లు బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వారి వింత ప్రవర్తనలతో బాధిత కుటుంబాలు, వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. 450 సీసాల కల్లు స్వాధీనం నల్లగొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్‌లో సోమవారం పోలీసులు 450 లీటర్ల కల్తీ కల్లుతోపాటు మత్తు పదార్థాలను పట్టుకున్నారు. -
కల్తీ కల్లు దొరకక ఆత్మహత్య
జడ్చర్ల (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లు దొరకక ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ(65) కల్తీ కల్లుకు బానిసైంది. ఈ క్రమంలో కల్తీ కల్లు లభించకపోవడంతో.. గత నాలుగు రోజులుగా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తోంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించినా లాభం లేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కల్తీకల్లుకు అలవాటు పడిన వ్యక్తులు అది లభించకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకూ 32 మంది చేరారు. వీరిలో అమరచింతకు చెందిన మునీశ్వరమ్మ, ఆత్మకూరుకు చెందిన జలీల్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పెరుగుతున్న కల్లు బాధితులు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రుల్లో చేరిన 490 మంది బాధితులు సాక్షి నెట్వర్క్, మహబూబ్‌నగర్ : కల్తీకల్లుకు బానిసలుగా మారి వింతగా ప్రవర్తిస్తున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో 490 మంది ఈ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ఇద్దరు బాధితులు మరణించగా, అనేక గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నారాయణపేట మండలంలో 11 మంది, గద్వాల మండలంలో శనివారం 18 మంది బాధితులు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20 మంది ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 రోజుల్లో నియోజకవర్గంలో 48 మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో చేరారు. కొడంగల్‌లో 20 మంది, చిట్లపల్లిలో 5, బొంరాస్‌పేట మండలం ఎనికెపల్లిలో 10, రేగడిమైలారంలో 15, బొంరాస్‌పేటలో 8, మద్దూరు మండలం దోరేపల్లిలో 28, దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో 8, దామరగిద్దలో 25, దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో 5, గోకాపస్లావాద్‌లో 10, కోస్గిలో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. బాలానగర్ మండలంలో రెండు రోజుల్లో 170 మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. జడ్చర్ల మండలంలో 19 మంది ఆస్పత్రిలో చేరారు. అలంపూర్ నియోజకవర్గంలో 23 మంది కల్తీకల్లు బాధితులున్నట్టు తేలింది. అలంపూర్‌లో 11 మంది, ఇటిక్యాలలో 12 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి నారాయణపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన బాలమ్మ (70), మక్తల్ మండలం ఊట్కూర్‌కు చెందిన కూలి జంగిడి క్రిష్ణయ్య(55) నారాయణ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా కరీంనగర్లో 18 మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో చేరారు. -
మత్తులేక ఐదుగురు బలవన్మరణం
పలువురు ఆస్పత్రిపాలు కామారెడ్డి/కామారెడ్డి రూరల్/బాన్సువాడ టౌన్/ నిజాంసాగర్/గద్వాల: కల్తీ కల్లును ప్రభుత్వం నిలువరిస్తున్న క్రమంలో మత్తుకు అలవాటుపడ్డ ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గురువారం నుంచి శుక్రవారం వరకు నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. జిల్లాలోని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన ముదాం నారాయణ(45) వారం రోజులుగా ఇబ్బంది పడుతూ శుక్రవారం ఉరి వేసుకున్నాడు. ఇదే మం డలంలోని లింగాపూర్‌కు చెందిన పెద్దొల్ల చిన్న మల్లయ్య(50)నాలుగు రోజులుగా ఇబ్బంది పడుతూ గురువారం చెరువులో పడి చనిపోయాడు. కామారెడ్డిలోని బతుకమ్మకుంటకు చెందిన షేక్ హుస్సేన్ (34) ఈ నెల 17న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. బాన్సువాడకు చెందిన ఉప్పరి సోమయ్య(47) దాల్మల్గుట్టలో గాలించగా చెట్టుకు ఊరేసుకుని ఉన్నాడు. నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన పసుల కిష్టయ్య(48) మూడు రోజుల నుంచి కల్లు దొరక్కపోవడంతో అనారోగ్యానికి గురైయ్యాడు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గద్వాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ఐదుగురు కల్తీకల్లు బాధితులు చేరారు. వీరందరూ కృత్రిమ కల్లుకు అల వాటు పడ్డారు. ఇటీవల ఈ ప్రాంతంలోని కల్తీకల్లు దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఇప్పుడు మందులేని కల్లు తాగుతున్నారు. వారికి అందులో మత్తు సరిపోకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. -
కలకలం రేపుతున్న కల్తీ కల్లు !
నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు 256 మంది ఆస్పత్రిపాలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆస్పత్రుల్లో చేరుతున్న ‘కల్లు’ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరగా... జిల్లావ్యాప్తంగా మంగళవారం 256 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇందులో 62 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో ఈత, తాటి చెట్లు లేక కృత్రిమ కల్లు అవసరం ఏర్పడటం.. ‘కల్లు మాఫియా’ కల్తీకల్లు అలవాటు చేయడం.. చివరికి ప్రభుత్వం ఇలాంటి కల్లుపై ఉక్కుపాదం మోపడంతో కల్లుకు బాని సలైన వారు మరణాలు, ఆస్పత్రుల పాలవుతున్నారు. కల్లులో రసాయన పదార్థాల మోతాదు తగ్గి మాక్లూరు, కామారెడ్డి, నిజామాబాద్ మండలాల్లో మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందగా... మంగళవారం నందిపేట మండలం ఐలాపూర్‌కు చెంది న బంజ మాధవరావు (60) తనువు చాలించాడు. ప్రమాదకర పదార్థాలను కలిపిన కల్లును తాగిన వారు, ప్రస్తుతం కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. -
ప్రైవేటు ఆస్పత్రులకు కల్తీకల్లు బాధితులు
నిజామాబాద్ : మెదక్ జిల్లాకు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కల్తీ కల్లు బాధితులను చికిత్స నిమిత్తం రామాయంపేటలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇసన్నపల్లి గ్రామంలో వందలాది మంది కల్తీ కల్లుతో అస్వస్థతకు గురి కాగా వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి, రామాయంపేట, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇసన్నపల్లికి రామాయంపేట 5 కిలోమీటర్ల లోపు ఉండటంతో రోగులను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈమేరకు గత నాలుగు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 మంది వరకు చికిత్సలు పొందారు. సోమవారం ఐదుగురిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు వింత చేష్టలతో ప్రవర్తిస్తుండగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. -
‘కల్తీ’కల్లోలం
- కల్తీ కల్లు బారిన బాధితులు - వింత మార్పులు.. విచిత్ర ప్రవర్తనలు.. - జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరిన 96 మంది - ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం.. - తాళ్లతో కట్టేసి చికిత్స చేస్తున్న వైద్యులు - మత్తు పదార్థాలు తగ్గడమే ప్రధాన కారణం నిజామాబాద్‌అర్బన్ : ఆస్పత్రిలో అటూ ఇటూ తిరుగుతూ పిచ్చిగా అరవడం... ఆస్పత్రి మంచంపై చిందులు వేయడం... ఎదురు పడిన వారిని కొరకడం.. ఇలా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వీరికి విధి వక్రీకరించి వచ్చిన వ్యాధి కాదు.. వీరంతా కల్తీ కల్లు బారిన పడిన బాధితులు.. ఇలా రెండు రోజుల్లో 96 మంది ఆస్పత్రిలో చేరి అల్ల కల్లోలం చేస్తున్నారు. పదార్థాల మోతాదు తగ్గడమే దీనికి కారణమని వైద్యులు అంటున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు నిరోధానికి ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. దీంతో కల్లులో కలిపే నిషేధిత పదార్థమైన డైజోఫాంను తయారీదారులు వినియోగించడం లేదు. అరుుతే రోజూ కల్లుకు అలవాటుపడిన వారికి డైజోఫాం లేక మత్తు మోతాదు తగ్గిపోయి వింతగా ప్రవర్తిస్తూ, విచిత్ర చేష్టలు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గత నాలుగు రోజులుగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇలా పిచ్చి ప్రవర్తనతో శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మండలం కులాస్పూర్, కులాస్పూర్ తండాలో ఎనిమిది మంది శనివారం నుంచి ఇలా విచిత్ర చేష్టలు చేస్తున్నారు. బోధన్ మండలం ఎడపల్లి ప్రాంతంతో పాటు బాన్సువాడ, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని దుబ్బ, ఆదర్శనగర్, కోటగల్లి, గౌతంనగర్ ప్రాంతాల్లో 30 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో పోచమ్మగల్లికి చెందిన ఎల్లయ్య నగరంలోని ఓ కల్లు డిపోలో పనిచేస్తాడు. ఇతడు నాలుగు రోజులుగా విచిత్ర చేష్టలకు పాల్పడుతున్నాడు. గౌతంనగర్‌కు చెందిన రాజయ్య కల్లు తాగినా మత్తు రాకపోవడంతో ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దీంతో తలకు గాయాలు కాగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదర్శనగర్‌కు చెందిన ఇద్దరు దంపతులు ఇదే కారణంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇలా.. రెండు రోజులుగా మొత్తం 56 మంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా రు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని వైద్యులు అంటున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పరామర్శించారు. కల్తీకల్లును నిరోధించడంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మత్తు సరిపోక చిత్తు.. ఆదర్శనగర్‌కు చెందిన గంగాధర్ చిన్న వ్యా పారం చేస్తుంటాడు. ప్రతి రోజు పని ముగియగానే కల్లు తాగడం అలవాటు. అయితే మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ప్రవర్తనలో మా ర్పు వచ్చింది. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా మార్పు లేదు. ఫిట్స్ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అటెండర్ కూడా.. రాజయ్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ కల్లు తాగడం అలవాటు. రెండు రోజులుగా కల్లు దొరకకపోవడంతో ప్రవర్తనలో మార్పు వచ్చింది. డిచ్పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తే అక్కడా కల్లు లేకపోవడంతో కుప్పకూలిపోరుు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఫిట్స్ కూడా వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మత్తు మోతాదు తగ్గడం వల్లే... కల్లుకు బానిస అయిన వారు అందులో మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్టుండి కల్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఇలా మారుతుంటారు. కల్తీ కల్లు తాగడంతో నరాలు బలహీనపడడం, మెదడు మొద్దుబారడం వంటివి జరుగుతుంటారుు. ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. బాధితులకు వివిధ మందుల ద్వారా పిచ్చి ప్రవర్తనలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. క్రమంగా మెరుగుపడుతారు. - డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు -
జోరుగా కల్తీ కల్లు విక్రయాలు
- జాడలేని ఎక్సైజ్ పోలీసులు పుల్కల్ : కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తనఖీలు నిర్వహించాల్సిన అధికారులు మాముళ్లు మత్తులో మునిగిపోయారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీకల్లు విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కొర్పోల్, వెండికోల్, పోచారం, బస్వాపూర్, ముదిమాణిక్యం, ఎస్. ఇటిక్యాల్, సింగూర్, పెద్దారెడ్డిపేట తదితర గ్రామాల్లో స్థానికంగానే కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. బస్వాపూర్‌లో కల్తీ కల్లు సేవించిన వారు నేరుగా ఇంటికి చేరే పరిస్థితి లేనది గ్రామస్తులు ఆరోపించారు. నాణ్యమైన కల్లు లేకపోవడంతో కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. దీంతో కల్లు ప్రియులు తమకు కిక్కు ఎక్కడం లేదంటే చాటు కల్లు వ్యాపారులు అధనంగా కావాల్సిన మత్తు పదార్థం (డైసోఫామ్)తో కూడిన మందును పై నుంచి వస్తారని తెలిపారు. దిన్ని సేవించిడం వల్ల పూర్తిగా మత్తులోకి వెళ్ల్లిపోతారని ఫలితంగా అనారోగ్యాలకు గురి కావడమే కాకుండా ప్రమాదాలకు సైతం గురైన సంఘటనలున్నాయి. ఇందుకు గత నెల రోజుల్లోనే పుల్కల్కు చెందిన ఐదు మంది యువకులు బస్వాపూర్‌లో కల్లు త్రాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మత్తులోకి జారి వాహనంపై నుంచి పడిన ఘటనలున్నాయి. ఇందులో ఇద్దరికి శాశ్వితంగా అంగవైకల్యం అయిన సందర్బాలున్నాయి. సింగూర్‌లో సైతం రోడ్డుపైనే ఫీవర్ కల్లు అంటు విక్రయాలు జరుపుతుంటారు కాని అసలు ఆ ప్రాంతంలోనే ఈత చె ట్లు లేకుండా ఎలా పివర్ కల్లు తయారు అవుతుందో అధికారులకే తెలియాలి. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వస్తుంటారు. దీంతో ఫీవర్ కల్లు అని విక్రహించి సంపాదించుకుంటున్నారు. కాని కల్తి కల్లు అనే విషయం మాత్రం తెలియడం లేదు. సింగూర్‌లో కల్లు సేవించిన వారు తిరుగు ప్రయాణంలో గాని సేవించిన కల్లు దుకాణం వద్దనే మత్తులోకి జారి అక్కడే పండుకున్న సందర్బాలున్నాయి. కొర్పోల్‌లో సైతం రెండు డిపోలకు చెందిన కల్లు విక్రయాలు జరుపుతుండటంతో పోటీ పెరిగింది. దీంతో స్థానికులు గ్రామానికి ఎవ్వరు డబ్బులు ఎక్కువగా ఇస్తే వారే విక్రహించుకోవాలని సూచించడంతో గ్రామస్తులు డిమాండ్ చేసిన మేరకు ఒప్పదం చేసుకున్న ఇటిక్యాల్ సురేందర్‌గౌడ్ కొర్పోల్‌లో కల్లు విక్రయాలు నిర్వహిస్తున్నారు. దీంతో కల్లు ధరను పెంచడమే కాకుండా కల్తీ కలు విక్రయాలు జరుపుతున్నారు. అయిన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. పోచారంలో సైతం కల్తి కలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ సైతం పోటీ పడి విక్రయాలు జరుపడంతో మత్తు వచ్చేందుకు గాను డైజోఫాం పరిమితి మించి కలిపి విక్రయాలు జరుపుతున్నారు. ఇలా మండలంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జోగిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కల్తి కల్లు విక్రహించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కల్తీ కల్లు నివారణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: కల్తీకల్లు కారణంగా ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన మరణాల నేపథ్యంలో రాష్ట్రంలో కల్లు విధానాన్ని మరింత పటిష్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని కల్లు కాంపౌండ్లలో అల్ప్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్ వంటి మానసికంగా మత్తుకు బానిసలను చేసే విషతుల్యమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన కల్లును మాత్రమే కాంపౌండ్లలో విక్రయించేలా చూసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో 4,478 కల్లు గీత సహకార సంఘాలు(టీసీఎస్) ఉండగా, 3,762 గీత వృత్తి సంఘాలు(టీఎఫ్టీ) ఉన్నాయని, వీటి నేతృత్వంలో కల్లు దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. కల్తీ కల్లు వల్ల అనారోగ్యం పాలు కావడం, దీనికి బానిసలుగా మారి పిచ్చివాళ్లుగా తయారవడం వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మహారాష్ట్ర తరహా ఘటనలు రాష్ట్రంలో జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, అందుకు భిన్నంగా అక్రమ కల్లు అమ్మకాలపై నిషేధం, విషతుల్య పధార్థాలు కల్లులో వినియోగించకుండా చట్టం తేవడం కోసం సర్కారు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, డీజీ(డ్రగ్స్), సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రెస్ అకాడమీ చైర్మన్, అమ్రిత ఫౌండేషన్ సొసైటీ , ఎక్సైజ్ కమిషనర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ కల్లు విధానంపై ఇచ్చే నివేదిక , సూచనల ఆధారంగా కల్తీకల్లు నిరోధానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. -
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
గోకవరం : కల్తీకల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనను వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో కల్తీకల్లు తాగి మృతి చెందిన నాగులపల్లి దుర్గారావు, దాకారపు శ్రీను కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా రూ. పది వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చూస్తే ఇవి ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రభుత్వ లోపభూయిష్టం, ఎక్సైజ్‌శాఖ అనాలోచిత విధానం వ ల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల సొసైటీ నిర్వహణ లేకపోవడం, ఎక్సైజ్‌శాఖ అధికారులు బాధ్యతలు, విధివిధానాలు గుర్తెరగకపోవడం వలన కల్తీకల్లు నిరోధించలేక రాష్ట్రంలో తరచూ ఈ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాల పరిస్థితి రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితని, వీరి కుటుంబాల్లో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారన్నారు. జరిగిన సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. పది లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు పాలూరి బోసుబాబు, పార్టీ నాయకులు జనపరెడ్డి బాబు, వరసాల ప్రసాద్, అత్తులూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు మొగలి వెంకటరమణ, చింతల సత్యవాణి, మండల కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ, సెక్రటరీ కర్రి సూరారెడ్డి తదితరులు ఉన్నారు. చిచ్చు పెట్టే యత్నాలు వద్దు గోకవరం : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా పార్టీ పరంగా జరిగిన రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పక్కదారి పట్టిస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. గోకవరంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇటీవలి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు రూ.90 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారని, కానీ రాష్ట్రంలో బీద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఉదంతానికి చంద్రబాబు బాధ్యత వహించాలే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడం తగదని, హితవు పలికారు. -
కష్టజీవుల్ని కాటేసిన..కల్తీ కోర
జగ్గంపేట / గోకవరం :కష్టంతో పులిసే ఒళ్లు కాస్త తేలిక పడాలని తాగిన మత్తుపానీయమే వారి పాలిట మృత్యుఘాతమైంది. ఎప్పుడూ తాగే కల్లే వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. ఇద్దరిని బలి తీసుకుని, నలుగురిని ఆస్పత్రుల పాల్జేసింది. పేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గోకవరం మండలం రంపయర్రంపాలెంలో కల్తీ కల్లు సృష్టించిన దారుణానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దాకారపు శ్రీను (39), నాగులపల్లి దుర్గారావు (32) శుక్రవారం ఉదయం గ్రామంలోని కల్లు వ్యాపారి కాళ్ల చంద్రరావు వద్ద కల్లు తాగిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. అదే దుకాణంలో కల్లు తాగిన అదే గ్రామానికి చెందిన కోశెట్టి గంగరాజు, కాళ్ల వెంకటేశ్వరరావు, పెబ్బిలి శివ, సుంకర శ్రీను, గేదెల వీర్రాజు, రాజానగరం మండలం కానవరానికి చెందిన పితాని సత్తిబాబులకూ వాంతులయ్యూరుు. వీరంతా వ్యవసాయ కూలీలే. దాకారపు శ్రీను, దుర్గారావులను కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే దుర్గారావు మృతి చెందాడు. శ్రీను చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. దుర్గారావుకు మూడేళ్ల క్రితం వివాహం కాగా ప్రస్తుతం భార్య గర్భవతి. శ్రీనుకు భార్య, కుమార్తె ఉన్నారు. అస్వస్థతకు గురైనవారిలో గంగరాజు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, పితాని సత్తిబాబు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివ, సుంకర శ్రీనులను గోకవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు, వీర్రాజుల ఆరోగ్యం కుదుటపడింది. అంత్యక్రియలకు తరలిస్తుంటే అడ్డుకున్న అధికారులు కల్తీ కల్లుతో జరిగిన దారుణం విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా శనివారం ఉదయం పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. దుర్గారావు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకువెళుతుండగా అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజమండ్రి అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్ మృతదేహాలను పరిశీలించి, రంపయర్రంపాలెంలో విచారణ నిర్వహించారు. కల్లు అమ్మిన చంద్రరావును గోకవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎస్సై ఆర్.శివాజీ కేసు నమోదు చేసి, రాజమండ్రి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. చంద్రరావు దుకాణంలోని కల్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాంబాబు, రంపచోడవరం ఎక్సైజ్ సీఐ చిట్టిబాబు సంఘటనపై విచారణ నిర్వహించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శివాజీ తెలిపారు. కల్తీ కల్లు సంఘటన గోకవరం మండలంలో ఇదే ప్రథమం. కాగా గుమ్మళ్లదొడ్డిలో నాలుగేళ్ల క్రితం కల్తీ సారా తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. కలిపింది క్లోరల్ హైడ్రేడా? మరొకటా? కల్తీ కల్లు సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తాటి గెలలు వాడిపోతూ కల్లు దిగుబడి తగ్గడంతో, దానిలో నిషా తగ్గకుండా ఎక్కువ కల్లుగా మార్చేందుకు క్లోరల్ హైడ్రేడ్ కలిపారన్న అనుమానం వ్యక్తమవుతోంది. క్లోరల్ హైడ్రేడ్‌ను కలపడం వల్ల లీటరు కల్లునే నాలుగులీటర్లుగా తయారు చేయవచ్చని అంటున్నారు. కల్లులో తాగిన వారికి చేటు కలిగించే ఏ పదార్థం కలిసిందన్నది ల్యాబ్ పరీక్షల్లో తేలాల్సి ఉంది. కాగా కల్లు వ్యాపారి చంద్రరావుకు వేరొకరితో కల్లు తీసుకునే తోట లీజు సొమ్ము విషయమై వివాదం నేపథ్యంలో అతడి దుకాణంలోని కల్లును కావాలనే విషపూరితం చేశారా అన్న అనుమానమూ వ్యక్తమవుతోంది. క్లోరల్ హైడ్రేడ్ విషంతో సమానం.. కల్లులో కల్తీకి వినియోగించే క్లోరల్ హైడ్రేడ్ విషంతో సమానమని జగ్గంపేట ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ జి.ఎస్.చార్లెస్ చెప్పారు. అది చిన్నమెదడు పనిచేయకుండా మొద్దుబారుస్తుందని, గ్యాస్ట్రైటిస్ (కడుపులో పుండ్లు) వచ్చి విపరీతంగా వాంతులు అవుతాయని చెప్పారు. కొన్ని సార్లు ప్రాణాలు పోతాయన్నారు. -
కల్తీ మద్యం గుట్టు రట్టు
టెక్కలి (కోటబొమ్మాళి) : స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. మద్యం తయారీదారుడి నుంచి స్వాధీనం చేసుకున్న 572 మద్యం సీసాల్లో 123 పూర్తిగా కల్తీ మద్యంగా గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన అధికార బృందం కోటబొమ్మాళి మండలంలో దాడులు చేయడం మద్యం దుకాణదారులను ఠారెత్తించింది. క్షేత్రస్థాయిలోని ఎక్సైజ్ అధికారుల పనితీరుకు శుక్రవారం జరిగిన దాడులు చెంపపెట్టులా ఉన్నాయి. కోటబొమ్మాళిలో ఒక మద్యం దుకాణం ప్రధాన కేంద్రంగా పరిసర ప్రాంతాల్లోని బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేయడంతో పాటు నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర డెరైక్టర్ సూర్యప్రకాశ్‌కు సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఎక్సైజ్ రాష్ట్ర అధికారులు కోటబొమ్మాళి పరిసర ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్‌ఫోర్స్) డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, ఎస్సై బి.శ్రీహరిలతో పాటు సిబ్బంది పాకివలస గ్రామంలో సాహుకారి శ్రీధర్‌కు చెందిన బెల్టు షాపుపై మెరుపు దాడి చేశారు. దుకాణంలో 572 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 123 సీసాల్లో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. కోటబొమ్మాళిలోని సూర్య రత్నం వైన్స్ నుంచి శ్రీధర్ రోజూ సుమారు 8 బాక్స్‌ల చీప్ లిక్కర్ మద్యాన్ని తీసుకువచ్చి, శ్రీకాకుళం నుంచి ఖరీదైన మద్యం బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాలు, కప్పులను కొనుగోలు చేసి వాటిలో చీప్ లిక్కర్‌ను పోసి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసింది. దీంతో శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని నకిలీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో సూర్యరత్నం వైన్స్ నిర్వాహకులు దుకాణాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే మండలం చీపుర్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు దుకాణంలో 60 మద్యం సీసాలు, జర్జంగిలో 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ మద్యం తయారీ చేస్తున్న శ్రీధర్‌పై రెండు కేసులు నమోదు చేసామని, వాటిలో నకిలీ మద్యం తయారీ, లెసైన్స్ లేకుండా మద్యం అమ్మకాలు వంటి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీనికి సహకరిస్తున్న సూర్యరత్నం వైన్స్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ అధికారి ప్రసాద్ తెలిపారు. మంత్రి సొంత మండలంలో.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడి సొంత మండలం కోటబొమ్మాళిలో బెల్టు షాపుల జోరుతో పాటు నకిలీ మద్యం తయారు కావడం గమనార్హం. ఎక్సైజ్ రాష్ట్ర అధికార బృందాలు నేరుగా రంగంలోకి దిగే వరకు స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పలుకుబడికి భయపడుతున్నారా లేక మద్యం ‘మామూలే’నని పట్టించుకోవడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన మండలాల్లో కూడా ఈ విధమైన దాడులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
ధర తక్కువ..కిక్కెక్కువ!
ఒరిజినల్ చాయిస్ విస్కీ క్వాటర్ బాటిల్ ధర రూ.75. ఇదే మద్యం ఇప్పుడు జిల్లాలో రూ.50లకే దొరుకుతోంది. మీ వద్ద రూ.45లే ఉన్నాయా.. ఫర్వాలేదు బాటిల్ తీసుకోండనే బేరం ఇటీవల ముమ్మరమైంది. అలాగనిక్లియరెన్స్ సేల్ అనుకుంటే పొరపాటు. ఈ కల్తీ కర్ణాటకమద్యం మందుబాబులకు కిక్కెక్కిస్తోంది. గ్రామాలు మొదలు.. ఢాబాల వరకు ఈ మద్యం వ్యాపారం జోరందుకుంది. మొదట్లో కర్ణాటక రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న శివారు గ్రామాల్లో మొదలైన ఈ నిషా జిల్లా మొత్తానికి పాకింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పల్లెల నుంచి పట్టణం వరకూ విస్తరించిన కల్తీ మద్యం వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. తక్కువ ధరకే లభ్యమవుతున్న మద్యానికి మందుబాబులు బానిసలవుతున్నారు. మొదట్లో అసలును పోలిన బాటిళ్లలో మద్యం సరఫరా చేసిన వ్యాపారులు.. ఆ తర్వాత తెలివికి పదును పెట్టారు. మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు టెట్రా ప్యాకులతో కిక్కెక్కిస్తున్నారు. జ్యూస్ తాగినట్టుండే.. ఈ ప్యాకింగ్ ఇప్పుడు సరికొత్త బ్రాండ్‌గా అవతరించింది. జిల్లాలోకి వస్తున్న నకిలీ మద్యమంతా గోవాలోని డిస్టిలరీలలో తయారవుతున్నదే. అక్కడి నుంచి బెంగళూరుకు.... అనంతరం బళ్లారి మీదుగా రాష్ర్టంలోకి తరలిస్తున్నారు. ఇందులోనూ ప్రధానంగా బళ్లారి నుంచి కర్నూలు జిల్లాకే అధికంగా కల్తీ మద్యం రవాణా అవుతోంది. ఈ మద్యాన్ని ఒరిజినల్ బాటిల్‌ను పోలిన ప్యాకింగ్‌తో మందుబాబులకు చేరుస్తున్నారు. కర్ణాటక రాష్ర్టంలో తయారు చేసినట్టుగా నకిలీ లేబుళ్లు సృష్టిస్తున్నారు. ఒరిజినల్‌ను పోలిన బాటిళ్లలో మద్యం నింపేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే, కర్ణాటక మద్యం అని ముక్తాయిస్తున్నారు. అందుకే తక్కువ ధరకు అమ్ముతున్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ కల్తీ మద్యం ఎన్ని కుటుంబాల్లో అంధకారం నింపుతుందో.. ఎందరి ఆరోగ్యంతో చెలగాటమాడుతుందోననే ఆందోళన ఇటీవల కాలంలో అధికమవుతోంది. కూల్‘డ్రింక్’ షాపులతో మొదలు... కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రధానంగా చిన్న షాపులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. మొదట్లో కూల్ డ్రింక్ షాపులు... అనంతరం పాన్ షాపులు, కిరాణా షాపుల ద్వారా విస్తరించారు. ఇప్పుడు ఏకంగా ఢాబాలకూ ఈ కల్తీ వ్యాపారం వ్యాపించింది. వాస్తవానికి బెల్టు షాపులకు వైన్ షాపుల నుంచి సరుకు రావడం కొంచెం కష్టమయింది. ప్రతి బాటిల్‌కు లెక్క చెప్పాల్సి రావడంతో వైన్షాపుదారులు కూడా ఇటీవల కాలంలో విచ్చలవిడిగా బెల్టు షాపులకు సరుకు ఇచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఈ లోటును ఇప్పుడు కర్ణాటక కల్తీ మద్యం వ్యాపారులు భర్తీ చేస్తున్నారు. ఒరిజినల్ ఛాయిసే... అయితే, కర్ణాటక మద్యం.... అందులోనూ ధర తక్కువంటూ మాయమాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మాములు మద్యంతో పోలిస్తే తక్కువ ధర కావడంతో ప్రధానంగా పేద ప్రజలు ఈ మద్యానికి బానిసవుతున్నారు. విచారణకు సహకరించండి జిల్లాతో పాటు రాష్ర్టమంతటా వ్యాపించిన ఈ నకిలీ మద్యానికి అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్‌శాఖ విఫలమయింది. కొత్త పంథాలో విస్తరించిన ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటే కర్నాటక ప్రభుత్వ సహకారం అవసరమని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తరించిన కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు విచారణకు సహకరించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ కోరినట్టు సమాచారం. అందులో భాగంగానే ఉన్నతాధికారులు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. వాస్తవానికి జిలాలో పట్టుబడిన భారీ నకిలీ మద్యం కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బళ్లారి, బెంగళూరులకు కూడా జిల్లా ఎక్సైజ్ పోలీసులకు వెళ్లారు. అయితే, కేసు విచారణకు సంబంధించిన ప్రధానమైన ఆధారాలు ఏవీ లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వ సహకారం కోరినట్టు సమాచారం. -
మూడు గ్లాసులు.. ఆరు సీసాలు
⇒ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు వ్యాపారం ⇒రోజుకు 50 మందికి తగ్గకుండా అస్వస్థత ⇒సంగెంలో ఒకరి మృతి, నలుగురు సీరియస్ ⇒ఆస్పత్రిలోనే మరో 30 మంది బాధితులు ⇒సహజంగా మారిన ‘కల్తీ’ మరణాలు ⇒నిషేధిత మత్తు మందులతో కల్లు తయారీ ⇒కళ్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ అధికారులు ధనదాహం ఒళ్లు విరిస్తే అక్రమ వ్యాపారం ‘కట్ట’లు తెంచుకుంటుంది. కల్తీ కల్లు ‘విషం’ చిమ్ముతున్నా ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. కల్తీ కల్లు తయారీదారులు, అమ్మకందారులపై నామమాత్రపు కేసులు నమోదు చేస్తూ పరోక్షంగా వారికి అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దోషులపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. కల్తీ కల్లు తయారీ ‘మూడు గ్లాసులు.. ఆరు సీసాలు’గా వర్ధిల్లుతోంది. అందుకు బీర్కూరు మండలం సంగెంలో తాజాగా జరిగిన విషాద సంఘటనే నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కల్తీ కల్లు మహమ్మారి బడుగుల జీవితాలలో చిచ్చు పెడుతోంది. ఏటా కల్తీ కల్లు మరణాలు పెరుగుతున్నా చర్యలు అంతంత మాత్రమే. తీవ్ర సంఘటనలు జరిగితే తప్ప ఆబ్కారీ అధికారులు కదలడం లేదు. బీర్కూరు మండలంలో కల్తీ కల్లుకు బానిసలుగా మారి గతంలో పదులసంఖ్యలో ప్రజలు చనిపోయిన సంఘటన మరవకముందే అదే మండలంలోని సంగెం గ్రామంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి పాల్త్య మోతీరాం (60) అనే వృద్ధుడు మృతి చెందగా, 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఐశ్వర్య (5), జశ్వంత్ (6), సరోజ (5) అనే ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. నమూనాలను సేకరిం చి కల్తీ కల్లు మరణాలను మొక్కుబడి గా ‘మమ’ అనిపించడం పరిపాటిగా మారిన అబ్కారీ శాఖ నిర్లక్ష్యంతో మ రో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎం దుకు స్పందించడం లేదో అర్థం కావ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు బుట్ట దాఖలు ‘కల్తీ’కల్లు తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని నిబంధనలున్నా అవి బుట్టదాఖలవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాల యాల పరిధిలో ఇలాంటి సంఘటన లు నిత్యకృత్యంగా మారాయి. తాజా గా సంగెంలో ఒకరిని కాటేసిన సంఘటన కలకలం రేపుతోంది. 2012లో ఒక్క బీర్కూరు మండలంలోనే 15 రోజులలో 22 మంది చనిపోగా, ఆ తర్వాత నిజామాబాద్ నగరంలోను కల్తీ కల్లు పలువురిని బలిగొంది. బీర్కూరులో అప్పటి కలెక్టర్ డిపోలను రద్దు చేసి డిపో నిర్వహకునిడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు షరా‘మామూలు’గా తీసుకున్న అబ్కారీ శాఖ అధికారులు కల్లు వ్యాపారానికి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొద్దిరోజుల కే బీర్కూరు, బాన్సువాడ డిపో పరిధిలో కల్లు తాగిన పలువురు పిచ్చివాళ్లుగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీ యాంశం అయ్యింది. ‘‘సార్ కల్తీ కల్లు తో మా ప్రాంత జనం పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు...దయచేసి మీరైనా స్పందించి కల్తీకల్లును అరికట్టండి..డిపోలను మళ్లీ మూసెయ్యండి’’ అం టూ స్వాతి అనే యువతి ఈ ఏడాది జనవరి 16న పోలీసు వెబ్సైట్లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనూ కలెక్టర్ రొనాల్డ్ రోస్ సైతం కల్తీ కల్లుపై పోరాడాలని మహిళలకు పిలుపునిచ్చారు. అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇష్టారాజ్యంగా వెలుస్తున్న కల్లు దుకాణాలు పేద ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. జిల్లాలో సగటున రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు ‘‘కల్తీ కల్లు తయారీని ఆపండి మహాప్రభో’’ అంటూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలూ అధికారులను మాత్రం కది లించడం లేదు. హానికర అవశేషాలతో అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ కల్లు వ్యాపారానికి హానికర అవశేషాలు డైజో, క్లోరోఫామ్లు, క్లోరల్‌హైడ్రేట్, అల్ఫాజోలం ముడి పదార్థాలు. డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్, క్లో రోఫాం (మత్తు కోసం), చాక్రిన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కో సం), కుంకుడు కాయల రసం (నురు గు కోసం) వాడతారు. ఏళ్ల తర బడి వీటితో కల్తీ కల్లు తయారీ విచ్చలవి డిగా సాగుతున్నా, అది తాగినవారు మరణిస్తున్నా, అస్వస్థతకు గురి అవుతున్నా నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలో ఉన్న ఈత, తాటి చెట్లకు, మార్కెట్లో లభ్యమవుతున్న కల్లుకు ఏమాత్రం పొంతన లేదని, లక్ష ల లీటర్ల కల్తీ కల్లు తయారవుతుందనేది బహిరంగ రహస్యం. సామాన్యుల శరీరాలను పీల్చి పిప్పి చేస్తున్నా, కల్లు తాగినవారు ఎముకల గూడులా త యారవుతున్నా, నిరుపేదల కుటుంబాలలో మత్యు ఘంటికలు మోగుతున్నా అధికారులు చలించటం లేదు. గీత వృత్తితో సంబంధం లేనివారే ‘కల్లు మాఫియా’గా అవతారమెత్తడంతో అ క్ర మార్జనే తప్ప, పేదల ప్రాణాలు పట్టింపు లేకుండా పోతోంది. ఇప్ప టికైనా సంబంధిత అధికారులు కదు లుతారో లేదో చూడాలి.