Loan waiver
-
రూ. 2 లక్షలపైన రుణమాఫీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్ మహేశ్వర్‌రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్‌రావు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పల్లా వర్సెస్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో హామీల అమలుతోపాటు పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దాడి చేయగా.. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుస ఆరోపణలు చేస్తుండగా మంత్రులు పదేపదే కల్పించుకుని సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పల్లా సొంత నియోజకవర్గం జనగామలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.124 కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము మూడు నెలల్లోనే రూ.263 కోట్లు మాఫీ చేశామన్నారు. మా సీఎం కూడా మీ సీఎంలాగే ఉండాలా?: భట్టి సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యా శాఖ ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని, 2 లక్షలమంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యా రని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేయగా, భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. మీ సీఎం (కేసీఆర్) తరహాలోనే మా సీఎం ఉండాలని ఊహించుకుంటే ఎలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారని, 22వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చారని, 36 వేల మంది టీచర్లకు బదిలీలు కల్పించారన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను గాలికి వదిలేస్తే, 12 మంది వీసీలను నియమించారన్నారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతోపాటు నిర్మాణానికి రేవంత్ రూ.540 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం మీకు (పల్లాకు), ఇతరులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేస్తే వాటికి దీటుగా తాము ప్రభుత్వ వర్సిటీలను తీర్చిదిద్దుతున్నామన్నారు. బీఆర్ఎస్ ధోరణితోనే అన్యాయం: మంత్రి ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితోనే రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యం పెంపు విషయంలో ఏపీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము కేంద్రం, కృష్ణా బోర్డుతో కొట్లాడి సాగర్ కుడి కాల్వకు ఏపీ తీసుకుంటున్న జలాలను 10వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు. మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించని బీఆర్ఎస్ వాళ్లు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రుణమాఫీ చేశామని, రైతులందరికీ బోనస్ చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టు ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలోని భాషను చూసి కూడా ఆమెను సమరి్థస్తారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% రుణమాఫీ జరిగితే ముక్కును నేలకు రాస్తా: పల్లా రైతు రుణమాఫీ 50 శాతంలోపే జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామతోపాటు భట్టి నియోజకవర్గం మధిరలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100శాతం రుణమాఫీ జరిగితే తాను ముక్కును నేలకు రాసి, రాజీనామా చేస్తానని ప్రకటించారు. 27 శాతం మంది రైతులకే బోనస్ లభించిందని, ఏడాదిలో 564 మంది రైతులు, 116 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారని, అరెస్టైన జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ని విడుదల చేయాలన్నా రు. కాకతీయ కళాతోరణం, చారి్మనార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే పోరాడతామన్నారు. తెలంగాణ తల్లి సాధారణంగా ఉండాలని, నగలు, వడ్డాణం ఉండకూడదని చెప్పేటోళ్లు రూ.కోట్ల వాచీలు, వారి కుటుంబ సభ్యులు ఖరీదైన నగలు ధరిస్తున్నారన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 55వేల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. -
చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికుల కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు రూ. 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ. లక్ష వరకూ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రుణమాఫీ జీవో విడుదల చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ తయారీ రంగం కూడా ఉంది. సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల మంది వరకూ చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటోంది. ఇక్కడ సుమారు 40 పైగా సొసైటీలు ఉండగా, వాటిల్లో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. -
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రుణమాఫీపై సీఎం రేవంత్‌తో చర్చకు సిద్ధం: హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తాను చర్చకు సిద్ధంగా ఉన్ననాని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని, అబద్ధాల్లో ఆయన గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు హరీష్.రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌లపై క్లారిటీ ఇవ్వలేదని, ఏడాది దాటినా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇక సంద్య థియేటర్ ఘటన చాలా బాధాకరమన్న హరీష్.. వాంకిడి హాస్టల్లో విషాహారం తిని బాలిక చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో బాలిక కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదన్నారు. ఒక వ్యక్తి సీఎం సోదరుడి కారణంగా చనిపోతే చర్యలు మాత్రం శూన్యమని మండిపడ్డారు హరీష్.సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధివిధానాల పై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. మరో నాలుగేళ్లకు అవసరమైన శక్తి లభించింది ‘2023 వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతుబంధు కింద చెల్లించాం. శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి మా ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు. తద్వారా మిగిలిన నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ఇంధనశక్తి మాకు లభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలన అనంతరం 2023 డిసెంబర్ 7న రూ.7 లక్షల కోట్ల అప్పులతో మా ప్రభుత్వం ఏర్పడింది. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా రూ.6,500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిలో మేం అధికారం చేపట్టాం. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు కలిగి ఉన్నట్టు నాటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్లు ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను వివరించాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు.. ‘రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణమాఫీని 100 శాతం పూర్తి చేశాం. బ్యాంకర్లు మాకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఏదైనా కారణాలతో బ్యాంకర్ల నుంచి వివరాలు అందక ఎవరిదైనా రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిశీలించి రుణమాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు. పంట పొలాలను తనఖా పెట్టి వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సైతం బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడంతోనే గతంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలున్నట్టు చెప్పాం. తప్పుడు సమాచారమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించడంతో బ్యాంకులు వివరాలను సరిచేసి ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు సంబంధించిన రూ.17,869 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నాలుగో విడతగా శనివారం మహబూబ్‌నగర్ సభలో రూ.2,747 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మొత్తం 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది గొప్ప రికార్డు..’ అని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ధాన్యమే పేదలకు ఇస్తాం.. ‘సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లింపు యాసంగి పంటకు సైతం కొనసాగిస్తాం. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇక్కడ పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలి. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలో సైతం తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. గుజరాత్లో మధ్య నిషేధం ఉందని బీజేపీ అంటోంది. కావాలంటే ఇక్కడి నుంచి గుజరాత్‌కు మీడియాను తీసుకెళ్లి ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తా. కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో మేమిచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ రూ.3,331 కోట్లే..‘రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఏక మొత్తంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి నాలుగున్నరేళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన రూ.11 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ నాలుగున్నరేళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద రూ.8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా రెండో పర్యాయంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ రూ.3,331 కోట్లు మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
నాలుగో విడత రుణమాఫీకి మరో రూ. 2,747.67 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచి్చన రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు విడతల్లో 22.37 లక్షల మంది రైతుల రుణాల కింద రూ. 17,933 కోట్లు బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం, శనివారం పాలమూరు వేదికగా నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెక్కును రైతులకు అందజేశారు. తద్వారా ఇప్పటివరకు రూ.20.68 వేల కోట్లు రుణమాఫీ కింద బ్యాంకులకు విడుదల చేసినట్లయింది. శనివారం పాలమూరులో ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని 3,13,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా నాలుగు విడతల్లో రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరిగినట్టు. భవిష్యత్తులో రూ.2 లక్షలపైన ఉన్నవారికి.. రూ. 2 లక్షలపైన రుణాలు పొందిన రైతులకు కూడా రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గతంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే రూ. 2 లక్షలపైన ఉన్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి ఈ రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులు లెక్కలు తీశారు. శనివారం సీఎం ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని రేషన్‌కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు, పేర్లలో తప్పులు దొర్లిన 3,13,897 మంది రైతుల రుణ ఖాతాలకు జమచేస్తారు. తరువాత రూ. 2లక్షల పైన అప్పులున్న రైతులకు జమచేయాల్సి ఉంది. -
రుణమాఫీపై సిట్టింగ్ జడ్జికి నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తాము ఇచ్చిన హామీ అమలు చేశామని చెప్పే ధైర్యముంటే.. రుణమాఫీ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సైతం హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ధ్వజమెత్తారు. ఏడాది తిరక్కుండానే రూ.లక్ష కోట్ల అప్పులు మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే, కాంగ్రెస్ ఏడాది తిరగకుండానే రూ.లక్ష కోట్ల అప్పులు చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ‘ప్రచారం ఫుల్ పనులు మాత్రం నిల్’అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మందికే రుణమాఫీ చేసి, మొత్తం చేశామంటూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం ఏదీ?కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్.. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట ఇచ్చిన అనేక హామీల అమలు ఏమైందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలలో మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో సైతం మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా హామీలను ఎప్పటిలోగా, ఏవిధంగా అమలు చేస్తారనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువవుతోందని అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, వివాహం చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం హామీలు ఏమయ్యాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. -
కాంగ్రెసోళ్లను ప్రజలే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి
సాక్షి, ఆదిలాబాద్: ప్రజలే మర్లవడి కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. గరీబులు, రైతులు, విద్యార్థులతోపాటు తనపై కేసులు పెడతానంటే ఊరుకొనేవారెవరూ లేరన్నారు. ఈ ప్రభుత్వం ఎవరినీ వదలకుండా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా ఇచ్చే దాకా.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే వరకు పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఆదిలాబాద్ నుంచే అగ్గి అంటుకుందని.. ఈ సర్కారుపై మూడేళ్లు కొట్లాడేది ఉందని.. అందుకు పోరాట తోవ చూపారన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు పోరుబాట సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజలు కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా? రుణమాఫీ కాలేదని రైతులు ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేస్తే పోలీసులు వారిని జైల్లో పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వంద రోజుల్లో అన్నీ చేస్తామని మాట తప్పిన వారిని జైల్లో పెట్టాలా లేక పేద ప్రజలను జైల్లో పెట్టాలా అని ప్రశ్నించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు వరుసపెట్టి కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీకి శక్తినిస్తే రైతుల పక్షాన పోరాడతామని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటే.. భారత రాష్ట్ర సమితే కాకుండా భారత రైతు సమితి కూడా అని ఆయన పేర్కొన్నారు. అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి.. ‘పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. లేదంటే మా టైమ్ వ స్తది. ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి. మిత్తితో సహా చెల్లిస్తాం. పెద్ద పెద్దోళ్లను చూసినం.. చంద్రబాబుతోనే కొట్లాడినం.. ఈ చిట్టినాయుడు ఎంత? అతన్ని చూసి మనం భయపడాల్నా?’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడి బంధువులు, శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసిన మోసాల గురించి వివరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన పత్తికి సైతం గుజరాత్ ధర ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలు మరింత ప్ర మాదకారులని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబా ద్ ఎమ్మెల్యే, ఎంపీ బీజేపీ నేతలేనని వివరించా రు. ‘గుజరాత్లో పత్తి క్వింటాల్‌కు రూ. 8,800 ఇ స్తున్నారు. అక్కడికన్నా తెలంగాణలో పత్తి నాణ్య మైనదని పరిశ్రమ వర్గాల వారే నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. అందుకే గుజరాత్లో ఇచ్చినట్టే పత్తికి ఇక్కడ కూడా ధర ఇవ్వాలని బీజేపీపై కొట్లాడాలి’అని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందూ దొందేనన్నారు. పీఎం మోదీ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసగిస్తే.. రేవంత్‌రెడ్డి రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో వేస్తానని వేయలేదని విమర్శించారు. ఈ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌసిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, లోలం శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సీజన్ రైతు భరోసా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిందని, పంట దిగుబడులు కూడా వచ్చేశాయన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు.కమిటీ నివేదికకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రబీ సీజన్ నుంచి రైతుభరోసా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్‌లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా అమలు చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. గత ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, దాదాపు రూ.25 వేల కోట్లు ఇలాంటి భూములకు ఇచ్చినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లతో..: దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలు, చిన్నపాటి పొరపాట్లతో దాదాపు 3 లక్షల మందికి మాఫీ కాలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారని, వారికి డిసెంబర్‌లోగా రూ.2,500 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు. రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా రూ.2 లక్షలకు మించి ఉన్న బకాయిని చెల్లించిన రైతులకు మాఫీ చేసేందుకు విడతల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. రాష్ట్రంలో పంటబీమా అమలు లేదని, త్వరలో ప్రతి రైతుకూ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని, త్వరలో బీమా కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందని, రెండేళ్లపాటు ఈ కమిషన్‌కు అవకాశం ఉందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసల్లేవుగానీ.. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారా అని సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే కమీషన్లు రావని.. అదే మూసీ ప్రాజెక్టు అయితే రూ.30 వేల కోట్లు దోచుకోవచ్చని ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, పెద్ద లూటిఫికేషన్ అని విమర్శించారు. పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి కుర్చీని కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘పైసలు కావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు వేసుకుని ఇస్తాం. రాహుల్‌గాంధీకి పంపి కుర్చీని కాపాడుకో.. అంతేకానీ పేదల జోలికి రావొద్దు. నీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లు కూల్చు.కానీ పేదల ఇళ్లను కూలగొట్టవద్దు. ముందు రెడ్డికుంటలోని మీ ఇంటిని, దుర్గంచెరువులోని మీ అన్న ఇంటిని కూల్చు’’ అని రేవంత్‌కు సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సిగ్గు, శరం ఉన్నవాళ్లకు మనం మర్యాద ఇవ్వాలి. ఈ సీఎంకు అలాంటివి ఏమీ లేవు. కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్లను కూడా మళ్లీ రుణం తెచ్చుకోండి మాఫీ చేస్తాం అని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానన్నారు. పది నెలలైంది. ఇప్పటికీ పైసా రుణం మాఫీ కాలేదు. ఎన్నికల ముందు ఎక్కడ దేవుడు కనిపిస్తే.. ఆ దేవుళ్ల మీద ఒట్లు వేశారు. ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేశారు. చిట్టినాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు. పెద్ద మనుషులు, మహిళలకు పింఛన్లు అన్నారు. లేవు. మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చాయా? పండుగ పండుగలా ఉందా? ఇందిరమ్మ ఇళ్లు కడతా అంటే ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.బ్రదర్స్‌కు దోచిపెట్టేందుకే..మేం ఏడేళ్లపాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాలు సేకరించాం. ఈ సర్కారు ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మా సిటీ భూములనే ఫోర్త్ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫోర్త్ సిటీ కాదు. రేవంత్‌రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ. వాళ్లు రైతులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెప్తున్నారు. బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టుల్లో కేసులు వేయాలి. వారికి బీఆర్ఎస్ లీగల్‌సెల్ అండగా నిలుస్తుంది. రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే అలా వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్నారే తప్ప.. సీఎంలా పనిచేయటం లేదు.ఎవరినీ వదిలిపెట్టేది లేదు..మూసీ గబ్బు అంతా సీఎం, మంత్రుల మెదళ్లలోనే ఉంది. వారి గబ్బు మాటలను ఇక వదిలేది లేదు. నాపై అడ్డగోలు గా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా. గతంలో ప్రతి పక్షంలో ఉన్నారని ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోలే దు. ఇకపై వారిని వదిలేది లేదు. మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా?‘‘ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదా? పండుగ పూట కూడా పల్లె లను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకో వాలా? పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపు రించాయి. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం?బతుకమ్మ చీరలను రద్దు చేశారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’’ – ‘ఎక్స్’లో కేటీఆర్ విమర్శలు -
నిత్యం ప్రజాక్షేత్రంలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. ప్రజా సమస్యలే ఎజెండాగా అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రైతులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని బలంగా ఎత్తిచూపుతున్న బీఆర్ఎస్.. ఇతర వైఫల్యాలపైనా ఫోకస్ పెంచాలనుకుంటోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తదితర అంశాలపై వివిధ రూపాల్లో నిరసన తెలిపిన పార్టీ.. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరిట నిర్వాసితులను బలవంతంగా తరలించడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయిన నేపథ్యంలో, ఆరు గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి పెంచే యోచనలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఉన్నారు. దసరా పండుగ తర్వాత ఆరు గ్యారంటీల అమలు కోసం పార్టీ పరంగా చేపట్టాల్సిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై కసరత్తు జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగం, ఆరు గ్యారంటీల లబ్ధిదారులను భాగస్వాములను వీటిల్లో భాగస్వాముల్ని చేయాలని భావిస్తున్నారు.బీసీ డిక్లరేషన్ అమలు కోసం .. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీల కోసం కాంగ్రెస్ ప్రకటించిన ‘కామారెడ్డి డిక్లరేషన్’ అమలుకు నవంబర్ 10వ తేదీని గడువుగా బీఆర్ఎస్ విధించింది. ఆ లోపు కాంగ్రెస్ స్పందించని పక్షంలో బీసీ వర్గాలను కలుపుకొని ఉద్యమించాలని భావిస్తోంది. బీసీ సామాజికవర్గానికి 42 రిజర్వేషన్ల పెంపు, బీసీ కులగణన వంటి అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ బీసీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీల రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఇటీవల తమిళనాడులో రెండురోజుల పర్యటనకు వెళ్లిన వచ్చిన బృందం త్వరలో కేసీఆర్‌కు నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను మరింత గట్టిగా విన్పించనుంది. మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన ఉద్యమ రూపాలపైనా బీసీ నేతల భేటీల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ‘జాట్లు’ తమ హక్కుల కోసం చేపట్టిన నిరసన రూపాలను అధ్యయనం చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో నెలల తరబడి రైతులు చేసిన ఉద్యమ తీరుతెన్నులు కూడా పరిశీలిస్తున్నారు. స్థానిక సమస్యలపైనా..స్థానిక సమస్యలపైనా ఆందోళనలు నిర్వ హించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఫల్యాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజ కవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలను భాగస్వాము లుగా చేస్తూ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడ తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాలు, పంచాయతీలకు నిధుల కొరత, గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, పారిశుధ్య లోపం, ప్రజారోగ్యం, వైద్యం, అధికారుల పనితీరు, అధికార పార్టీ దాడులు, అక్రమ కేసులు వంటి అనేక అంశాలపై స్థానికంగా ఉద్యమించాలని నేతలకు పార్టీ సూచిస్తోంది. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్ అఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు తదితర రూపాల్లో నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు చెప్తోంది. స్థానికంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనేలా చూడటం ద్వారా పార్టీ యంత్రాంగంలో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. -
‘మాఫీ’ కోసం సెల్ఫీ..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా(కే) రైతులు రుణ మాఫీకోసం వినూత్న నిరసన చేపట్టారు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని సోమవారం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో సెల్ఫీ దిగి సీఎం కార్యాలయానికి పంపించారు. తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖరా(కే)లో 190 మంది వరకు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో 50 మంది రైతులకే రుణమాఫీ అయిందని, మిగతా 140 మంది అర్హులైనా రుణమాఫీ కాలేదని వాపోయారు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా అమలు కాకపోవడంతో పొలం పనులు విడిచి రోజుల తరబడి బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని తెలిపారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. -
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల రాస్తారోకో
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కామారెడ్డి– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గంటసేపు రైతులు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రైతుబంధు వేయలేదన్నారు. అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు విజయ డెయిరీ నుంచి నాలుగు నెలల బిల్లులు రావాలని, వెంటనే వాటిని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తాడ్వాయి, గాంధారి ఎస్సైలు తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రహిమొద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. -
ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోరుతూ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘రుణమాఫీ కోరుతూ చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన రైతులను బుధవారం రాత్రి నుంచే అక్రమంగా అరెస్టు చేసి దొంగలు, ఉగ్రవాదుల్లా పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణం.పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులను పోలీసులు బేషరతుగా విడుదల చేయాలి. రుణమాఫీపై హామీ ఇచ్చి మోసం చేసినందునే రైతులు ఆందోళన చేస్తున్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా రైతులు సంఘటితమై చేస్తున్న ఉద్యమం ఆగదు. దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు’ అని కేటీఆర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శిశు మరణాలపై కమిటీ వేస్తాం గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. సమస్యపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ తరపున నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తామన్నారు. ఈ కమిటీ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి, ప్రజలకు నివేదిస్తుందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం స్వీకరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమీక్ష చేసి వైద్యంలో నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. గాంధీ ఆసుపత్రిలో అనుభవం కలిగిన వైద్యులను బదిలీ చేయడం వల్లే చికిత్సకు ఆటంకం ఏర్పడిందన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
17ను విమోచన దినంగా నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిమాండ్ చేసింది. రైతు భరోసా, రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న బీజేఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు డా.కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్, డీకే అరుణ, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, డా.పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలని, ‘హైడ్రా’నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే డిమాండ్లను ఈ సమావేశం ఫ్రభుత్వం ఎదుట పెట్టింది. దీంతో పాటు పార్టీపరంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దేవాలయ భూముల రక్షణకు పోరాడాలని, బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరద నిధుల వ్యయంపై శ్వేతపత్రం: ఏలేటి డిమాండ్ వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకు చేసి న పనులు, ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేఎల్పీ భేటీ అనంతరం ఎంపీ అ ర్వింద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వరద సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. కాగా, అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వలసదారుడు, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పాతబస్తీకి వెళ్లడానికి భయపడుతున్నారని, మూసీ నది పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను దమ్ముంటే కూల్చాలని అన్నారు. -
త్యాగమనే మాటే కేసీఆర్‌కు నప్పదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనలో అసలైన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా అవమానించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్యాగమనే పదం కొండా లక్ష్మణ్‌కే చెల్లుతుందని, కేసీఆర్ త్యాగాలు చేశానంటూ చెప్పుకోవడం ఏమా త్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌కు నీడనిచ్చిన వ్యక్తి కొండా లక్ష్మణ్. ఆయన సొంత ఇల్లు (జలదృశ్యం)ను కేసీఆర్‌కు ఇస్తే.. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరించారు. ఉద్యమం పేరుతో రాజకీయ రాజీనామాలు చేశారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అనే మార్గంలో భారీగా లబ్ధి పొందాడు. ఉద్యమం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌కు ఎలాంటి ఆస్తులు లేవు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం టీవీ చానళ్లు, పత్రికలు, బిల్డింగులు, ఫాంహౌజ్‌లు, ఇతర ఆస్తులు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనే చేనేత టెక్నాలజీ చదువు కోసం.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎనాడూ చేనేతల అభివృద్ధి కోసం ఆలోచించలేదు. రాష్ట్ర విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటగిరికో, ఒడిశా రాష్ట్రానికో పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ అంశం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు వినతిపత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేశారు. వెంటనే దీనిని అందుబాటులోకి వచ్చేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నా.. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తాం. చేనేతల సంక్షేమం కోసం.. చేనేత ఉత్పత్తులంటే గత ప్రభుత్వంలో సినీతారల తళుకుబెళుకులే ఉండేవి. ఒక్క చేనేత కార్మికుడికి కూడా ప్రయోజనం కలగలేదు. గతంలో బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు పనికలి్పస్తామంటూ ఆర్భాటం చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. మా ప్రభుత్వం తక్షణమే రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసింది. బతుకమ్మ చీరల కంటే మెరుగైన నాణ్యతతో కూడిన చీరెలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తాం. ఏడాదికి దాదాపు 1.30కోట్ల ఈ చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇస్తాం. చేనేత రుణాల భారం రూ.30కోట్లను తప్పకుండా మాఫీ చేస్తాం. ప్రజా ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య వచ్చినా పెద్దన్నలా ముందుండి పరిష్కరిస్తా..’’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాది మాటలతో మభ్య పెట్టే ప్రభుత్వం కాదు: మంత్రి తుమ్మల రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేది కాదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత కార్మీకుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు సమర్థవంతంగా అందేలా చూసేందుకు ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్న శైలజా రామయ్యర్‌కు ఆ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించామని తెలిపారు. చేనేత కార్మీకులు ఎలాంటి సమస్యలున్నా ఆమెకు నేరుగా వివరించాలన్నారు. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ పేరుతెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు ఐఐహెచ్‌టీకి పెడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.అనంతరం ఐఐహెచ్‌టీలో వివిధ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందించారు. -
మాకెప్పుడు మాఫీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఫిర్యాదులు తీసుకుంటున్నా, గ్రామాల్లో సర్వే చేస్తున్నా తమకు న్యాయం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదనీ ప్రభుత్వం చెబుతూ సర్వే చేస్తున్నç³్పటికీ.. వారికి ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందో స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకెందుకు రుణమాఫీ జరగడం లేదని వ్యవసాయశాఖ అధికారులను నిలదీస్తున్నారు. సురేందర్‌రెడ్డి అనే 52 ఏళ్ల రైతు తనకు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో శుక్రవారం మేడ్చల్ వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. మాఫీకి దూరంగా లక్షలాది మంది గత ఆర్థిక సంవత్సరం (2023–24) మార్చి 31 నాటికి బ్యాంకులు రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని మొదట్లో కాంగ్రెస్ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయంటూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తీరా బడ్జెట్ కేటాయింపుల్లో దాన్ని రూ.26 వేల కోట్లకు కుదించారు.చివరికు మూడు విడతల్లో రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే కావడంతో లక్షలాది మంది రుణమాఫీకి దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీకి 36.68 లక్షల రైతులు అర్హులు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రూ.లక్ష రుణమాఫీతో పోల్చితే రూ.2 లక్షల మాఫీలో రైతుల సంఖ్య ఏకంగా 14.31 లక్షలు తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. లక్షలాది మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రైతుల వివరాల సేకరణ పూర్తయ్యేదెప్పుడు?రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, ఇతర సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు మాఫీకాని రైతుల కుటుంబస భ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. బ్యాంకు డేటా ఆధారంగా 4.5 లక్షల మంది రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది రైతుల వివరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల ఆధార్ నంబర్లు, వారి వయస్సులు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు కుటుంబ పెద్దతో ఫొటో తీయాల్సి ఉంది.వారి సెల్ఫీ ఫొటోలను, రైతులు ఇచ్చిన అఫిడవిట్లను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వరదలు, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల సేకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అంతుబట్టడం లేదనే నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ఐదేళ్ల కాలంలో కుటుంబ పెద్ద చనిపోయిన రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి రుణమాఫీ కాలేదని అనేకచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాట్లో ఎలాంటి కాలమ్ లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. అదనపు మొత్తంపై మార్గదర్శకాలెప్పుడు?ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపై ఒక్క రూపాయి అదనంగా రుణం తీసుకుని ఉన్నా మాఫీ వర్తింపజేయలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణం సొమ్మును రైతులు చెల్లించాకే ప్రభుత్వం నుంచి సొమ్ము జమ అవుతుందని అంటున్నారు. అయితే ఇందుకు వ్యవసాయాధికారులు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే అదనపు మొత్తం చెల్లించి అధికారులను సంప్రదించారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని చెబుతున్న అధికారులు, కనీసం అవి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.రుణమాఫీ కాలేదని..మేడ్చల్‌లో దుబ్బాక రైతు ఆత్మహత్యబ్యాంకులో తల్లి, కుమారుడికి వేర్వేరుగా పంట రుణాలుఒకే రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లూ ఉండటం, ఇద్దరి రుణాలూ కలిపి రూ.3 లక్షలకు పైగా ఉండటంతో జరగని రుణమాఫీమనస్తాపంతో వ్యవసాయ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణంమేడ్చల్/దుబ్బాక రూరల్: రుణమాఫీ కాలేదని మనో వేదనకు గురైన ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట సురేందర్‌రెడ్డి (52) మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య మంజుల, కుమారుడు నితిన్రెడ్డితో కలిసి నివాసముంటున్నాడు. కండ్లకోయలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డికి చిట్టాపూర్‌లో ఆయన పేరుపై 4.5 ఎకరాల భూమి, తల్లి సుశీల పేరిట రెండు ఎకరాల భూమి ఉంది. ఇద్దరూ చిట్టాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్æ గ్రామీణ వికాస బ్యాంకులో 2012లో పంట రుణం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ రాగా ప్రస్తుతం సుశీల పేరిట రూ.1,15,662, సురేందర్‌రెడ్డి పేరిట రూ.1,92,440 పంట రుణం ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. కాగా సురేందర్‌రెడ్డి, సుశీల ఇద్దరి రుణాలూ కలిపి రూ.3,08,102 ఉండటంతో వారి రుణాలు మాఫీ కాలేదు. దీంతో సురేందర్‌రెడ్డి పలుమార్లు బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారులను సంప్రదించాడు. తనకు మాఫీ ఎందుకు కాలేదని వారిని అడగగా.. తల్లి, కుమారుడి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయని, రుణం రూ.3 లక్షల పైచిలుకు ఉండటం వల్ల మాఫీ కాలేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం రేషన్ కార్డుకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసిందని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇద్దరికీ వేర్వేరు రేషన్‌కార్డులు ఉండి ఉంటే మాఫీ అయ్యేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయమై పలుమార్లు తన సోదరుడు రవీందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రేషన్‌కార్డు నుంచి తల్లి పేరు తొలగించేందుకు దరఖాస్తు కూడా చేశాడు. సురేందర్‌రెడ్డికి గతంలోనూ రుణమాఫీ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసమని ఇంట్లో నుండి వెళ్లిన సురేందర్‌రెడ్డి మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేçహాన్ని నగరంలోని గాంధీ మార్చురీకి తరలించారు.రెండురకాల సూసైడ్ నోట్లుమృతుడి జేబులో నుంచి పోలీసులు రెండు రకాల సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం (ఎస్బీఐ)లోంచి వచ్చే స్లిప్పులపై ఇవి రాసి ఉన్నాయి. ఒక దానిపై ‘నా చావుకు కారణం నా అమ్మ’ అని రెండు సార్లు, మరో పత్రంపై ‘చిట్టాపూర్ బ్యాంకులో లోన్ మాఫీ కాలేదని, అందుకే నా ఆత్మహత్య’ అని రాసి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు సురేందర్ రెడ్డి బ్యాంకు రుణం రూ.192440, తల్లి సుశీల బ్యాంకు రుణం రూ.115662 ఇద్దరిది కలిపి మొత్తం రూ.308102రైతు రుణమాఫీ కాని కుటుంబాల వివరాలు నమోదురామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శుక్రవారం రుణమాఫీ కాని రైతు కుటుంబాల ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు వందల సంఖ్యలో ఉదయం 10 గంటలకే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రైతులు రెండుగంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మూడు ఫోన్ల ద్వారా వివరాలను అప్లోడ్ చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. -
రాహుల్‌ను సీఎం సొంతూరుకు తీసుకెళ్తా
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి గజదొంగలా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నాడు. రుణమాఫీ జరగలేదని ఓవైపు మంత్రులు చెబుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీలో రాహుల్ గాం«దీని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకే వరంగల్ సభకు రావాలని రేవంత్ మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్ రావట్లేదు.హైదరాబాద్‌కు రాహుల్ వస్తే విమానాశ్రయంలోనే స్వాగతం పలికి సీఎం సొంతూరుకు తీసుకెళ్లి రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆయనకు చూపిస్తాం’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో హరీశ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్ చిట్‌చాట్ పేరిట ‘చీట్‌చాట్’(మోసగించే ముచ్చట్లు) చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాల్మికి స్కామ్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయని.. ఈ స్కామ్‌పై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే ఈడీ విచారణ జరగట్లేదని హరీశ్‌రావు ఆరోపించారు. దీనిపై విచారణ కోసం త్వరలో ఈడీని కలుస్తామని చెప్పారు. హైడ్రా ఆఫీసును రంగనాథ్ కూల్చివేయాలి ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని... దేవుళ్లపై ఒట్లతో ప్రజల విశ్వాసాన్ని కూల్చేసింది. బుద్ధ భవన్ నాలా కింద ఉన్న హైడ్రా ఆఫీసును కమిషనర్ రంగనాథ్ కూలగొట్టి ఇతర భవనాల వైపు చూడాలి. జీహెచ్ఎంసీ ఆఫీసు, నెక్లెస్ రోడ్డు రెస్టారెంట్లు, మీరాలం, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లోని నిర్మాణాలు కూడా కూలుస్తారో లేదో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఫోర్త్ సిటీ పేరిట భూములు కొల్లగొట్టే కుట్ర ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సర్వే నంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని... తుక్కుగూడలో సర్వే నంబర్ 895లో 25 ఎకరాలను పేద రైతుల నుంచి బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చెలామణి అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరిట భూములు కొంటున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తే మంత్రులెవరూ రాలేదని హరీశ్ ఎద్దేవా చేశారు. కవిత బెయిల్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’మొట్టికాయలు ‘సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ధి ఉన్నవారికి అన్నీ వంకరగానే కనిపిస్తాయి. బీజేపీ ఇస్తేనే ఓటుకు రూ. కోట్లు కేసులో రేవంత్‌కు బెయిల్ వచ్చిందా? ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కవితకు బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది. ఈడీ, సీబీఐ తీరుపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ వస్తే అది బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీ అనడం రేవంత్ అపరిపక్వతకు నిదర్శనం’అని హరీశ్ విమర్శించారు. విద్యార్థులను ఎలుకలుకరవడం దారుణం మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులపై, నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేయడం దారుణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 500 మందికిపైగా గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలవగా 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. -
‘నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే’
సాక్షి, హైదరాబాద్: ‘కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల వివరాలు వాస్తవం/సరైనవి. రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు తేలినా లేదా పంట రుణమాఫీకి అర్హత లేదని నిర్ధారణ అయినా.. పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నాను. ఆ మొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది..’ఇది రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు, రుణమాఫీ కోసం ఇవ్వాల్సిన అఫిడవిట్. ఇలా అఫిడవిట్ కోరడంతో పాటు రుణమాఫీ–2024 బ్యాలెన్స్ ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. మార్గదర్శకాలకు రైతులు ఇవ్వాల్సిన అఫిడవిట్‌ను జత చేసింది. ఫొటో తీయాలి..సెల్ఫీ దిగాలి ⇒ పంట రుణం ఉన్న రైతు ఇంటిని ఎంఏవో తప్పనిసరిగా సందర్శించి, రైతు వెల్లడించిన కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్ నంబర్‌తో సహా నమోదు చేసుకోవాలి. ⇒ ఎంఏవోతో సహా ఏ అధికారికీ ఒకటి కంటే ఎక్కువ మండలాలను కేటాయించకూడదు. మండల స్థాయిలో నియమితులైన అధికారి వివరాలను వెంటనే రుణమాఫీ విభాగానికి సమర్పించాలి. ⇒ ఎంఏవో రుణమాఫీ లాగిన్లలో కుటుంబ సభ్యుల వివరాలను అప్లోడ్ చేయడానికి మొబైల్ యాప్ అభివృద్ధి చేయడం జరిగింది. ⇒ మండలంలోని అన్ని బ్యాంకు బ్రాంచీల వారీగా కుటుంబ సభ్యులను నిర్ధారించి రుణం పొందిన రైతుల జాబితా ప్రదర్శించాలి. ⇒ రుణం పొందిన రైతు జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయాలి. ⇒ జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ⇒ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో పాటు వారి వయస్సు నమోదు చేయాలి. కుటుంబ పెద్దతో ఫొటో తీయాలి. ⇒ రైతు సమర్పించే అఫిడవిట్లో అతను అందించిన కుటుంబ సభ్యుల వివరాలు ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా పంచాయతీ కార్యదర్శి లేదా ఏఈవో లేదా ఏఏవో ధ్రువీకరించాలి. ⇒ రైతులు సమర్పించిన అఫిడవిట్‌ను యాప్‌లో అప్లోడ్ చేయాలి. ⇒ డేటా సేకరణ సమయంలో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు రుణం పొందిన రైతుతో ఎంఏవో సెల్ఫీ దిగి యాప్‌లో అప్లోడ్ చేయాలి. వివరాల సేకరణ షురూ రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, సాంకేతిక కారణాలతో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గ్రామాల్లో సర్వే చేపట్టారు. మండలం యూనిట్‌గా రైతుల వివరాలను సేకరిస్తున్నారు. అనేకచోట్ల వివరాలను సేకరిస్తున్నా రైతులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు రుణమాఫీ విషయంపై నిలదీస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న సొమ్ము బ్యాంకులో చెల్లించాలా వద్దా? అని అడుగుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని అన్నారం గ్రామంలో ఎస్బీఐ, గ్రామీణ వికాస్‌బ్యాంక్ సైట్లు ఓపెన్‌కాగా ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. గ్రామంలో 30 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. కానీ ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ ఓపెన్ కాకపోవడంతో 15 మంది రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇంకోవైపు రుణం తీసుకొని మృతి చెందిన రైతుల రుణమాఫీకి సంబంధించి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ల నమోదులో తప్పిదాలను సరిచేయడం కోసం యాప్‌లో ఎలాంటి ఆప్షన్లు లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది. ఇలాంటి వారికి సంబంధించి గ్రామంలో 11 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
చేతకాని సన్నాసి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎక్కడా చారాణా రుణమాఫీ కాలేదు. ఆ తప్పు.. ఈ చేతకాని సన్నాసి సీఎం రేవంత్‌రెడ్డిది. రేవంత్‌రెడ్డీ నీ భాషలోనే చెబుతున్నా.. నువ్వు మగాడివైతే..బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు.. పోలీసు సెక్యూరిటీ లేకుండా ఊళ్లలోకి రా..నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ వారు ఊళ్లలోకి వస్తే తరిమికొట్టాలన్న ఆలోచనతో రైతులు ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే రుణమాఫీ విషయంలో పోలీసులు, వ్యవసాయ అధికారులను తప్పు పట్టాల్సిన పనిలేదని, ఆ తప్పు సీఎం రేవంత్‌దే అన్నారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై జరిగిన దాడి, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. రుణమాఫీ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయిన ఇద్దరూ మహిళా జర్నలిస్టుల పైన, ఇతర జర్నలిస్టులపైన దాడి చేసిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు.అనంతరం డీజీపీ కార్యాలయ ఆవరణలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తిలో ప్రజాస్వామ్యపద్ధతిలో శాంతియుతంగా చేస్తున్న రైతు నిరసన దీక్షపై కాంగ్రెస్ గుండాలు ఆకస్మికంగా రాళ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘మా వారు తిరగబడి ఉంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మిగలరు. కానీ శాంతియుతంగా నిరసన తెలపాలనే మేం ప్రతిఘటనకు పాల్పడలేదు’ అన్నారు. రుణమాఫీపై ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డిఅని, క్షేత్రంలో తిరగాల్సిన సీఎం ంఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.కొండారెడ్డిపల్లిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఒక పార్టీకి శాశ్వతం కాదని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని కేటీఆర్ సూచించారు. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసినవారిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్, ఆర్.రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్, నోముల భగవత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లవి ముందు కూల్చండి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ వంటి నేతల భవనాలను కూల్చేసి.. ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని పేర్కొన్నారు. ‘చలో ఢిల్లీ కాదు..చలో పల్లె’ చేపట్టాలి రుణమాఫీ జరగక లక్షలాది మంది రైతులు రగిలిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ ‘చలో ఢిల్లీ’కి బదులుగా ‘చలో పల్లె’ చేపట్టాలని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డెంగీ మరణాలు, పెరుగుతున్న నేరాలు, రైతుల ఆందోళనలు రాష్ట్రంలో పాలన గాడి తప్పడాన్ని సూచిస్తున్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం, మంత్రులు పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం పాకులాడకుండా ప్రజల నడుమకు వెళ్లాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఏదో ఒక రోజు సీఎం కుర్చీ లాగేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్కు ఐదేళ్లు పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఐదేళ్లైనా లక్ష రుణమాఫీ చేయని బీఆర్ఎస్కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అన్నారు కానీ.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజును చేసే పనిలో పడ్డామని చెప్పారు తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాజీ మంత్రుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.‘ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం. మిగతా ఖర్చులు తగ్గించుకుని రైతులకు మేలుచేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైన ఉన్న మొత్తంచెల్లిస్తే రుణమాఫీ అవుతుంది. బీఆర్ఎస్లా మేం రూ. వేల కోట్లు దోచుకోలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పాంకేటీఆర్ ఆరోపణలకు కౌంటర్రేవంత్పైకేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ఇల్లు అని పెట్టారు. ఇప్పుడా ఇల్లు నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు. నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జోన్లో పాంహౌజ్ కట్టుకున్నారు. మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పనునా ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నా.. ఎఫ్టీఎల్లో ఉన్నా మొత్తం పడగొట్టండి. కేటీఆర్ చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ విమర్శలకు కట్టుబడి ఉండాలి. కొత్త టేప్ తెచ్చుకుని కొలవండి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నా’ అని తెలిపారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా?
జనగామ: కాంగ్రెస్ తొలుత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ చేసినట్టు భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి తనతో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా పోలీస్ కంట్రోల్ రూం ఏరియాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు.ఎక్కడైనా తేదీ ఖరారు చేసి కబురు పంపిస్తే జనగామ ఎమ్మెల్యే పల్లాను వెంట బెట్టుకుని వస్తామని.. ఆ దమ్ము, ధైర్యం సీఎంకు ఉందా? అని హరీశ్ అన్నారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి, ములుగు సభలో సమ్మక్క, సారలక్క, భువనగిరికి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిపై.. ఇలా ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో పంట రుణమాఫీపై ఒట్టు వేసిన రేవంత్.. ఎలక్షన్లు ముగియగానే దైవ ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, క్యామ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. -
పావుశాతం మాఫీతో వంద శాతం మోసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను పచ్చి దగా చేస్తోందని, రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. కేవలం పావు శాతం రుణమాఫీతో వంద శాతం రైతులను మోసం చేశారని.. ఈ అంశంపై సీఎం, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కోరుతున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఏమిటని నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, ఆయన పన్నిన వలలో తాము చిక్కుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘రైతు ధర్నా’ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ‘‘సీఎం రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు రైతులకు ఎంత మేర రుణం మాఫీ అయిందో కూడా సీఎం, మంత్రులకు తెలియనట్టుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమయ్యాయని చెప్తున్నారు. నిజంగా వంద శాతం రుణమాఫీ అయి ఉంటే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో సీఎం చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూ, బ్యాంకులను ముట్టడిస్తున్నారని.. రైతు రుణమాఫీ కోరుతున్న రైతులపై ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, బజార్‌హత్నూర్‌లలో ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోని పక్షంలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జైల్‌భరోకు పిలుపునిస్తామని చెప్పారు. లక్షలాది మంది రైతులను మోసం చేసిన ప్రభుత్వంపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. బజారు భాషకు వ్యతిరేకంగా పాలాభిషేకాలు ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నందుకు సీఎం రేవంత్ బజారు భాష మాట్లాడారు. ఆ బజారు భాషకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రైతు ధర్నాను ప్రారంభించాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి మండలంలో ఐదు బ్యాంకుల్లో కలిపి 20,239 రైతు ఖాతాలుంటే.. కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. రుణమాఫీకి ఎన్నో కుంటిసాకులు చెబుతూ ఆంక్షలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుబంధుకు ఇంకెన్ని ఆంక్షలు పెడుతుందోననే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండాం వెంటాడుతాం, వేటాడుతామని చెప్పారు. రేవంత్ ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయాలి హైడ్రా పేరిట హైడ్రామా ఆపండి.. ‘‘జన్వాడలో నాకు ఎలాంటి ఫామ్‌హౌజ్ లేదు.. ఓ మిత్రుడి ఫామ్‌ను లీజుకు తీసుకున్నా. ఒకవేళ ఆ ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. ప్రభుత్వానికి దమ్ముంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, మహేందర్‌రెడ్డి, వివేక్ వంటి కాంగ్రెస్ నాయకుల రాజభవనాలు కూడా కూల్చేయాలి. ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా ఆపాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే అన్ని అక్రమ నిర్మాణాలను ఒకేరోజు కూల్చాలని.. రేవంత్‌రెడ్డి అ«దీనంలోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు. -
మాకెందుకు రుణమాఫీ కాలేదు
సాక్షి, నెట్వర్క్: రుణమాఫీ జరగలేదంటూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. పలుచోట్ల బ్యాంకుల వద్ద బారులుదీరి మాకెందుకు రుణమాఫీ కాలే దంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ⇒ సిద్దిపేట జిల్లా తోటపల్లిలో రైతులు ఇండియన్ బ్యాంక్ సిబ్బందిని బయటకు పంపి బ్యాంకును మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 1,300 మంది రైతులుంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని మండిపడ్డారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ⇒ మెదక్ మండల పరిధిలో అత్యధికంగా రైతులు ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వచ్చే రైతుల రద్దీ పెరగ్గా, బ్యాంకు అధికారులు రోజూ కొందరికి టోకెన్లు ఇచ్చి వివరాలు చెబుతున్నారు. ఆదివారం సెలవు, సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో బ్యాంకుకు రైతులు పెద్దగా రాలేదు. మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రోడ్డువెంట బారులు తీరారు. ఈ క్రమంలో చిన్నపాటి వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా వరుసలోనే నిలబడ్డారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతువేదికల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యూనియన్ బ్యాంకుకు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘సారూ.. జర మా ఖాతా చూడండి. ఎందుకు మాఫీ కాలేదో చెప్పండి’ అంటూ వేడుకున్నా రు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల వద్ద, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, నర్సింహులపేటలలో, జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ⇒ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో అన్నదాతలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు ముస్కు సాగర్‌రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్ రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కు న్నారు. పంటల సాగుకు చేసిన అప్పు పెరిగిపోయిందని, రుణమాఫీ కాలేదని సాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన రైతు సోమ శ్రీనివాస్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య సోమలత పేరిట ముత్యంపేట ఇండియన్ బ్యాంక్‌లో రూ.1.21 లక్షల రుణం ఉందని, మాఫీకి అన్ని అర్హతలూ ఉన్నా, కాలేదన్నారు. ⇒ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర బ్యాంకు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుడిహ త్నూర్ మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.మాకు రుణమాఫీ కాలేదు⇒ ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు రైతుల ఫిర్యాదు⇒ రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు బ్యాంకులు ⇒ సందర్శించే షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకు రుణమాఫీ కాలేదని, మాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 566 రైతు వేదికల రైతులతో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, జనగామ, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌తోపాటు పలు రైతు వేదికలకు చెందిన రైతులు పంట రుణ మాఫీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకులు గోపి పంట రుణాల మాఫీ పథకానికి సంబంధించిన వివిధ ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ, కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం విధివిధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణ మొత్తాలు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రైతులు బ్యాంకులను సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. ఇంకా రుణమాఫీ పొందని రైతులు ఆధార్ కార్డులకు సంబంధించిన సమాచారం, బ్యాంక్ డేటాలో తప్పులు, పట్టా పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగ్గా లేకపోవడం మొదలైన ఫిర్యాదు లను మండల స్థాయిలో సమర్పించవచ్చని సూచించారు.పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారమయ్యే వరకు అన్ని పని దినాల్లో మండల స్థాయిలో నియమించబడిన నోడల్ అధికారులు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతులు రుణమాఫీ ప్రయో జనం పొందుతారని తెలిపారు. ఫిర్యా దుల స్వీకరణకు నిర్దిష్ట కటాఫ్ తేదీ లేనందున రుణాల మాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రైతులు ఎప్పుడైనా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. మండల స్థాయిలో నోడల్ అధికారు లను నియమించాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యవసాయ సంచాలకులు గోపి కిందిస్థాయి అధికారులను కోరారు. అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పంట రుణా ల మాఫీ ఫిర్యాదులకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. -
ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు ప్రభుత్వం రూ.18 వేల కోట్లు జమ చేస్తే, బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు రూ.7,500 కోట్లు మాత్రమేనంటూ అసహనం వ్యక్తం చేశారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రానికి వెన్నెముకగా వ్యవసాయ రంగంరూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని భట్టి చెప్పారు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నామని, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని చెప్పారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరచడం హర్షణీయమన్నారు.రూ.2,005 కోట్లు పెరిగిన డిపాజిట్లుఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2,005 కోట్ల మేరకు డిపాజిట్లు పెరిగాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ ప్రకాశ్ చంద్రబరార్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రూ.17,383 కోట్ల పంట రుణాలు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.23,848 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రూ.220.49 కోట్ల మేర విద్యారుణాలు ఇచ్చినట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.57.079 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్రాధాన్యతా సెక్టార్లకు మొత్తం రూ.1,00,731 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కమల్‌ప్రసాద్ పట్నాయక్, నాబార్డు సీజీఎం సుశీలా చింతల తదితరులు పాల్గొన్నారు.సంపూర్ణ రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలి: తుమ్మలకేవలం అంకెలు చదువుకునేందుకు మూడు నెలలకో సారి మీటింగ్‌లు పెట్టడం, బ్యాంకర్ల సదస్సు నిర్వహించడంలో అర్థం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కష్టకాలంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం రూ.18 వేల కోట్లు రుణమాఫీ కింద విడుదల చేసిందని చెప్పారు. రుణ ఖాతాల్లో తప్పులు సరిది ద్దేటట్లు బ్రాంచ్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వా లని కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని.. సీఎం రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయలని.. అప్పటిదాకా ప్రభుత్వంపైన పోరాటం ఆగదని కేటీఆర్ హెచ్చరించారు. -
రూ.31 వేల కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు రూ.31 వేల కోట్ల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివరాలన్నీ క్లియర్‌గా ఉన్న 22,37,848 మంది రైతులకు సంబంధించిన రూ.2 లక్షల లోపు రుణాలు, వాటి వడ్డీలకు సంబంధించి మొత్తం రూ.17,933 కోట్లను ఆగస్టు 15లోగా ఏకకాలంలో మాఫీ చేశామని తెలిపారు. అయితే ఆధార్ కార్డు నంబర్లో 12 అంకెలకు బదులుగా 11, 13 అంకెలుండడంతో 1.20 లక్షల మందికి, బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల్లోని పేర్లలో తేడాలుండడంతో 1.6 లక్షల మందికి, బ్యాంకులు ఇచ్చిన వివరాల్లో తప్పులుండడంతో 1.5 లక్షల మందికి, రేషన్‌కార్డు లేకపోవడంతో 4.83 లక్షల మందికి, రూ.2 లక్షలకు మించి రుణం పొందిన 8 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని మంత్రి వెల్లడించారు. ఆయా కారణాలతో మొత్తం 17.13 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూటికి నూరు శాతం రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అర్హతలుండీ రుణమాఫీ జరగని రైతుల నుంచి వివరాలను సేకరించి, తప్పులు సవరించి అప్లోడ్ చేయాల్సిందిగా మండల వ్యవసాయ అధికారులను ఆదేశించామని, ఆ వెంటనే వారికీ రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. సోమవారం జలసౌధలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్‌కార్డు లేని రైతుల ఇళ్లకు అధికారులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద లబ్ధి పొందేందుకు రైతులకు అవకాశమిస్తామని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. రేషన్‌కార్డు లేని రైతుల ఇళ్లకు స్వయంగా మండల వ్యవసాయ అధికారి వెళ్లి కుటుంబసభ్యులను నిర్థారించుకున్న తర్వాత రుణమాఫీ చేస్తామన్నారు. రూ.2 లక్షలకు మించి రుణం తీసుకున్న వారు ఆపైన ఉన్న రుణ మొత్తాన్ని చెల్లిస్తే వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి రాజకీయ దురుద్దేశంతో రుణమాఫీపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే నినాదం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రుణమాఫీ ఊసెత్తలేదని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం రూ.26 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందని తెలిపారు. 2014–18 మధ్యకాలంలో ఏటా సుమారు రూ.4 వేల కోట్లు చొప్పున విడుదల చేసినా మొత్తం రూ.1,743 కోట్లు వడ్డీల కింద సర్దుబాటు కావడంతో అసలు రుణాలు అలానే మిగిలిపోయాయని విమర్శించారు. 2018లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018–19, 2019–20, 2022–23లో ఎలాంటి నిధులు విడుదల చేయలేదన్నారు. 2020–21లో రూ.408.3 కోట్లతో 2.96 లక్షల మందికి, 2021–22లో రూ.1,339.5 కోట్లతో 3.88 లక్షల మందికి, 2023–24లో తొలి విడతగా రూ.6,763 కోట్లతో 10.68 లక్షల మందికి, రెండో విడతగా రూ.4,818.24 కోట్లతో 8.07 లక్షల మందికి రుణమాఫీ చేశారన్నారు. 20.84 లక్షల ఖాతాలకు సంబంధించిన రూ.8,579 కోట్ల రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేయలేదన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతోనే కొందరు రైతుల ఖాతాల్లో లోపాలు చోటుచేసుకున్నాయని, దీంతో వారికి రుణమాఫీ జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడాన్ని జీరి్ణంచుకోలేకే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. -
Telangana: మాఫీ మంటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణమాఫీ వ్యవహారం రోజురోజుకు మరింత రచ్చరేపుతోంది. ఓవైపు రాజకీయ పార్టీల మధ్య రగడకు.. మరోవైపు రైతుల ఆందోళనలు, ఆవేదనకు వేదికగా మారుతోంది. ‘రుణం తీరలే’ శీర్షికన ‘సాక్షి’ రాసిన కథనంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు రుణమాఫీ డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో గడపగడపకు వెళ్లి రుణమాఫీ బండారాన్ని బయటపెడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీలకు రుణమాఫీ బోగస్ అంటూ లేఖలు రాశారు. ఇక రుణమాఫీ కోసం 23న రైతుదీక్ష చేపట్టనున్నట్టు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రుణమాఫీ కాని అర్హులకు న్యాయం చేస్తామని, ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తామని ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ వ్యవహారం మున్ముందు మరిన్ని ప్రకంపనలు సృష్టించే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చెప్పిందొకటి.. చేసిందొకటి! రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. మొదట్లో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని కాంగ్రెస్ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రూ.31 వేల కోట్లు అవుతాయని కేబినెట్ సమావేశంలో తేల్చారు. ఈ మేరకు సీఎం, మంత్రులు స్వయంగా ప్రకటనలు చేశారు. కానీ బడ్జెట్లో మాత్రం రుణమాఫీకి రూ.26 వేల కోట్లే కేటాయించారు. చివరికి మూడు విడతల్లో కలిపి రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే. దీనితో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీ కోసం 36.68 లక్షల మంది రైతుల లెక్కతేలితే.. ప్రస్తుతం రూ.2 లక్షల మాఫీ కేవలం 22.37 లక్షల మంది రైతులకే అందడం విస్మయం కలిగించింది. రైతుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు.. రోడ్డెక్కుతున్న అన్నదాతలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు తమకు రుణమాఫీ జరగలేదంటూ ఆందోళనలు చేపడుతున్నారు. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పీఎం కిసాన్ నిబంధనలు, ఇతర షరతులు తమకు వర్తించకపోయినా రుణమాఫీ జరగపోవడానికి కారణాలేమిటో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల మేరకు.. 58 వేల మందికిపైగా రైతుల నుంచి ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదుల వివరాలను తెప్పించుకున్నామని.. వాటిని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాయి. కామారెడ్డి జిల్లా వజ్జపల్లి తండాలో రుణమాఫీ కాలేదంటూ రైతుల నిరసన తలపట్టుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటివరకు 58వేల ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నా.. ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని రైతు సంఘాల నేతలు, నిపుణులు చెప్తున్నారు. లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని.. చాలా మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని అంటున్నారు. చాలా మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపిస్తున్నారని.. లిఖితపూర్వక ఫిర్యాదులు తీసుకోవడానికి అంగీకరించడం లేదని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాలు ఒకవైపు, రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి మరోవైపు.. ఏం చేయాలో అర్థంగాక తల పట్టుకుంటున్నామని వ్యవసాయ అధికారులు వాపోతున్నారు. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగకపోవటానికి కారణమేంటో, ఏ ప్రాతిపదికన అర్హులను నిర్ధారించారో, ఏ కొలమానాలతో అనర్హులను తేల్చారో తమకు కూడా అంతు పట్టడం లేదని అంటున్నారు. అదనపు మొత్తం కట్టేదెలా? ప్రస్తుతం రూ.2 లక్షల వరకు రుణమున్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని.. రూ.2 లక్షలపైన రుణాలున్నవారు అదనంగా ఉన్న సొమ్మును చెల్లించాకే మాఫీ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక రైతు బ్యాంకులో రూ.3 లక్షల రుణం తీసుకుంటే.. రైతు ముందుగానే రూ.లక్ష బ్యాంకులో జమ చేయాలి, ఆ తర్వాతే మిగతా రూ.2 లక్షల మాఫీని ప్రభుత్వం వర్తింపజేస్తుంది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధన పెట్టాల్సిన అవసరమేమిటని నిలదీస్తున్నారు. ఆ అదనపు రుణసొమ్మును చెల్లించడానికి ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం నేరుగా మాఫీ వర్తింపజేస్తే.. మిగతా రుణాన్ని కొంతకాలం తర్వాతైనా తీర్చుకునే వెసులుబాటు వస్తుందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు. మాఫీగాక.. కొత్తరుణాలు రాక.. బ్యాంకులు ఇప్పటివరకు రుణమాఫీ జరిగిన రైతులకు.. వానాకాలం పంటల కోసం రుణాలు ఇస్తున్నాయి. కానీ మాఫీ జరగని రైతులకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదు. దీంతో కీలకమైన వ్యవసాయ సీజన్లో పంట రుణాలు దొరక్క ప్రైవేట్ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. అర్హులైతే మాఫీ చేస్తాం: తుమ్మల బ్యాంకుల నుంచి తమకు వివరాలు అందిన ప్రతి రైతుకు అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమదేనని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు. రూ.2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన రైతులందరికీ మాఫీ చేశామని.. కుటుంబ నిర్ధారణకాని వారికి ఆ ప్రక్రియ పూర్తిచేసి మాఫీ సొమ్ము జమ చేస్తామని తెలిపారు. రూ.2 లక్షలకుపైన రుణాలున్న వారికి మాత్రం.. అదనంగా ఉన్న మొత్తాన్ని చెల్లించేస్తే, అర్హతను బట్టి వారికి మాఫీ చేస్తామన్నారు. బ్యాంకర్ల నుంచి డేటా తప్పుగా వచ్చిన రైతుల వివరాలనూ సేకరిస్తున్నామని వివరించారు. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరామన్నారు. ‘‘రూ.లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, సగం మందికి కూడా చేయని ఒకరు.. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లోనూ రుణమాఫీ ఆలోచనే చేయని మరొకరు.. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ఆ ప్రక్రియ కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. వారు ఇకనైనా హుందాగా ప్రవర్తించి ప్రజల్లో స్థాయిని కాపాడుకుంటారని ఆశిస్తున్నా..’’ అని తుమ్మల పేర్కొన్నారు. తనిఖీ చేసేదెప్పుడు.. మాఫీ అయ్యేదెప్పుడు?అర్హత ఉండీ రుణమాఫీ కాని రైతుల విషయంలో తాము బాధ్యత తీసుకొని మాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్తున్నారు. కానీ తొలి విడత నుంచే ఎందరో రైతులు ఫిర్యాదు చేసినా మాఫీ చేయలేదని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారులు ఇంటింటికీ తిరిగి కుటుంబాలను తేల్చి, అర్హులను గుర్తించి రుణమాఫీ చేస్తామని అంటున్నారని.. అదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమా అని నిలదీస్తున్నారు. లక్షలాది మంది రైతుల ఇళ్లకు వెళ్లడం, వారి డేటాను తనిఖీ చేయడం, కచ్చితత్వాన్ని నిర్దేశించుకోవడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ప్రభుత్వం చెప్పిందని.. ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం ఏమిటో అంతుబట్టట్లేదని అంటున్నారు. మాఫీ వ్యవహారాన్ని, విమర్శలను కొన్నాళ్లపాటు పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. -
ఏమైంది మీ వరంగల్ డిక్లరేషన్?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకిచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్‌రెడ్డి సర్కార్ నీరుగార్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీకి అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.17 వేల కోట్ల మాఫీతో రైతులను నట్టేట ముంచిందంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆదివారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. వరంగల్ డిక్లరేషన్‌లో మీరిచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని, రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడతామని హెచ్చరించారు.47 లక్షల మందికి గాను 22 లక్షల మందికేనా?‘అబద్ధాలు, అభూతకల్పనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్.. 8 నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారు.‘రూ. రెండు లక్షల రుణమాఫీకి రూ.49,500 కోట్లు కావాలని ఎస్ఎల్బీసీ అంచనా వేయగా, రూ.40వేల కోట్లు అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. కేబినెట్ భేటికి వచ్చేసరికి దాన్ని రూ.31 వేల కోట్లకు కుదించారు. తీరా మూడు విడతల మాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు’ అని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ కాని అన్నదాతల ఆందోళనలతో యావత్ తెలంగాణ అట్టుడుకుతోందని, రుణమాఫీకి సంబంధించి తమ పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వారం రోజుల్లోనే 1,20,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ చావుకు కారకులెవరు?మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్య లతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకోవడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. జీతం రాక కుటుంబం గడవక, భార్యా పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాసుకున్నాడని, ఈ ఘటన విషాదకరమని పేర్కొన్నారు.ప్రతీనెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలి స్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తు న ప్రచారం చేసుకోవడమే తప్ప అందులో వాస్తవం లేదని విమర్శించారు. కాగా తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వానికి పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
సాక్షి, హైదరాబాద్: రైతులకు వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూ పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి రైతుల సమక్షంలోనే చర్చ పెట్టి, పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. అందరికీ రుణ మాఫీ జరగలేదని రైతులు చెబితే, రేవంత్‌రెడ్డి రాజ కీయాల నుంచి తప్పుకోవడమో, రాజీనామా చేయడమో.. ఏది చేస్తా రో చెప్పాలని డిమాండ్ చేశారు.శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు. మొత్తం 60 లక్షల మంది అర్హులుండగా.. 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు ఇవ్వాల్సిఉండగా.. కేవలం రూ.17 వేల కోట్లే ఇచ్చారని తెలిపారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. దీనిపై రైతుల సమ క్షంలో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగిన రైతుల వివరాలను వారంరోజు ల్లోగా ప్రభుత్వం వెల్లడించాలన్నారు.పెండింగులో ఉన్న రైతుల రుణాలను ఈ నెలా ఖరులోగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి, రైతు భరోసా పథకానికి మార్గదర్శ కాలు ఖరారు చేసేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. రైతు భరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్ కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని రేవంత్ ప్రచారం చేస్తున్నారన్నారు. -
మాకేదీ రుణమాఫీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ ప్రకటించిన తర్వాత కూడా తమకు రుణాలు మాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చాలాచోట్ల రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్, బోథ్, భీంపూర్ మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. తలమడుగులో 500మందికి పైగా రైతులు సీఎం దిష్టిబొమ్మతో డప్పుచప్పుళ్ల మధ్య శవయాత్ర నిర్వహించారు. కర్మకాండ కుండలతోనే మహారాష్ట్ర బ్యాంకులోనికి వెళ్లారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. జైనథ్ మండలం గిమ్మలో రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. తర్వాత బ్యాంకు అధికారుల వినతిమేరకు తాళాలు తొలగించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌లో రైతు జక్కుల లచ్చన్న పంచాయతీ కార్యాలయం వద్ద విషగుళికలు తిని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడ ఉన్న మరో రైతు అడ్డుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.⇒ నిజామాబాద్ జిల్లా 63 నంబరు జాతీయ రహదారి వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్, మోర్తాడ్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.⇒తమకు రుణమాఫీ కాలేదంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్ శాఖ ఇండియన్ బ్యాంక్‌ను ముట్టడించి రైతులు షట్టర్‌ను మూసివేశారు. తర్వాత అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఈ నెల 20న రైతు వేదికలో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ బ్యాంక్ పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించి సుమారు 1,250 మంది రైతులకు ఖాతాలుండగా కేవలం 430 మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ⇒ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రుణమాఫీ జాబితాలో తమ పేర్లులేవంటూ సుమారు 500 మంది రైతులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ⇒ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని రైతువేదికలో వ్యవసాయశాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన రుణమాఫీ అవగాహన సమావేశం రసాభాసగా ముగిసింది. మూడో విడతలో కూడా తన పేరు లేకపోవడంతో ఏలేటి రాజారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. ⇒ బౌరంపేట్లోని బ్యాంక్‌లో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మందికే రుణమాఫీ అయ్యిందని, మిగతా రైతులకు ఎందుకు మాఫీ చేయలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.⇒ఖమ్మం రూరల్, కొనిజర్ల, వైరా, రఘునాథపాలెం తదితర మండలాల రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.రుణమాఫీ రూ.83తిమ్మాపూర్: కేవలం రూ.83 మాత్రమే రుణమాఫీ కావడంతో ఓ రైతు కంగుతిన్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్యకు రూ.83 మాఫీ అయినట్టు మొబైల్‌కు సందేశం వచ్చింది. గత డిసెంబర్లో ఎల్ఎండీలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.1.50 లక్షల పంటరుణం తీసుకున్న మల్లయ్య మూడో విడతలో మాఫీ అవుతుందని సంతోషించాడు.కానీ.. రూ.83 రుణఖాతాలో జమ అయినట్లు ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్‌కు గురైన ఆయన శనివారం వ్యవసాయాధికారులను సంప్రదించగా, వారు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించారు. అయితే అప్పటికే బ్యాంక్ టైం అయిపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగాడు. మాఫీకి ప్రభుత్వం విధించిన నిబంధనలకు తాను అర్హుడినని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ టౌన్: తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రంలోని 3,292 బ్యాంకుల బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి సేకరించిన పంట రుణాల వివరాలతో.. డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు. ఈ మేరకు శనివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన మూడు రోజుల్లోనే తొలివిడత కింద రూ.లక్ష లోపు రుణాలున్న 11.50లక్షల మంది రైతులకు రూ.6,098.93 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలున్న 6,40,823 ఖాతాదారులకు రూ.6190.01 కోట్లు, పంద్రాగస్టు నాడు రూ.2లక్షలలోపు రుణాలున్న 4,46,832 ఖాతాల్లో రూ.5,644.24 కోట్లు.. కలిపి మొత్తంగా 22.37 లక్షల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వారా వారందర్నీ రుణవిముక్తులను చేశామని తెలిపారు. తగిన రికార్డులిస్తే మాఫీ చేస్తాం.. రేషన్‌కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకున్నామని, అది మాఫీకి ప్రామాణికం కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధార్‌కార్డులో తప్పులు, రేషన్‌కార్డు లేనివారు, ఇతర కారణాలతో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని వివరించారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలున్నవారు.. సదరు అధిక మొత్తాన్ని బ్యాంకు లో జమచేస్తే, వారికి రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కానీ రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తొలి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి, వాటికి సంబంధించిన 44.95 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇక కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమ స్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.70,000 నుండి రూ.80,000లోపు రుణాలున్న ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ప్రతిపక్ష నేతలు ని జంగా రైతు సంక్షేమాన్ని కోరేవారే అయితే.. ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలు తెప్పించుకొని చెల్లించాలని వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం చెల్లించని పలు పథ కాల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు. రుణమాఫీపై అర్థంలేని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని మంత్రి తుమ్మల మండిపడ్డారు. శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి షో’ను శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షలకు మించి ఉంటే ముందు కట్టండిఆ తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రైతులకువ్యవసాయ శాఖ సూచనసాక్షి, హైదరాబాద్: రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులు.. అదనపు సొమ్మును బ్యాంకులో కట్టాలని, మిగతా రెండు లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే, తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన జారీ చేసింది.ఆధార్, పాస్‌బుక్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్‌లో ఉందని తెలిపింది. రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలను సరిచేసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ప్రకటించింది. బ్యాంకులు, ఖాతాల్లో పలు సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని... ఆ తప్పులను సరిచేసి, ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది. అందువల్ల రూ.2 లక్షలలోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రుణమాఫీ కాలేదని ఫిర్యాదులుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారని.. ఆ రైతు కుటుంబంలోని వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తీసుకుని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని వివరించింది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి, అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది. -
ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహమే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీకే రూ.17 వేల కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రూ.17,900 కోట్లతోనే రూ.2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అయ్యిందో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడం కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. వరికి బోనస్ పథకంలా.. రుణమాఫీ కూడా బోగస్ అని విమర్శించారు. చారాణా రుణమాఫీకి బారాణా ప్రచారం అని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును రైతన్నలతో కలిసి ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. -
అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది
సాక్షి, హైదరాబాద్: దిగజారుడు భాషలో నోటికొచ్చినట్లు బీఆర్ఎస్ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు హితవు చెప్పారు. రుణమాఫీపై మాటతప్పి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఎం అవాకులుచెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టు ప్రవర్తించడం లేదనే విషయాన్ని రేవంత్ ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని విమర్శించారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ ప్రవర్తన ఉందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, తనపై విమర్శలకు దిగారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. తర్వాత అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని, ఆగస్టు 15 వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టి, ఇప్పుడు రూ.13 వేల కోట్లు కోత పెట్టారన్నారు. అయినా ఎవరూ నమ్మడం లేదని, ప్రతి ఊరి దేవుడి మీద రేవంత్ ప్రమాణాలు చేశారని చెప్పారు.మోసమే తన విధానం..‘సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా రేవంత్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తేనే దాదాపు రూ.17 వేల కోట్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా, రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే ఈ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోతోందన్నారు.రుణమాఫీ పేరుతో దగా చేశారని స్పష్టంగా తేలిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏట్లో దూకి ఎవరు చావాలి? అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి రైతు ద్రోహానికే కాక దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి, మాట తప్పిన ఆయన చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. కానీ ఆయనకు ఆ సంస్కారం లేదని, రేవంత్‌లో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదని విమర్శించారు.ముఖ్యమంత్రి స్థాయిలో మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, ఆ పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని తాను ఆందోళన చెందుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ చేసిన తప్పుకు, దైవ ద్రోహానికి తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్లు హరీశ్ చెప్పారు. -
అప్పుడు కలెక్షన్ కౌంటర్లు..ఇప్పుడు కాల్‌సెంటర్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు అరకొరగా రైతు రుణమాఫీ అమలు చేశారని, దీంతో అర్హులైన 3లక్షల మందికి మాఫీ కాలేదని, సాంకేతిక కారణాలతో ఆ రైతులకు అన్యాయం చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని స్వయంగా అప్పటి మంత్రి హరీశ్ ప్రకటన విడుదల చేశారే తప్ప...ఆ రైతులకు మాఫీ కాలేదని వెల్లడించారు. రుణమాఫీ కాకపోవడంతో వేలాదిమంది రైతులను బ్లాక్‌లిస్టులో పెట్టి బ్యాంకులు కొత్త రుణాలు నిరాకరించినప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రశ్నించారు. అప్పుడే హరీశ్‌రావు కాల్‌సెంటర్ పెట్టుకొని ఉంటే బాగుండేదన్నారు. అప్పుడేమో కలెక్షన్ కౌంటర్లు పెట్టి... ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణమాఫీ అందని రైతులకు లేని తొందర హరీశ్‌రావుకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లలో ఆరులక్షల కోట్లు అప్పులు చేస్తే..వడ్డీలు కడుతున్నామని, కాలమైతే మీ ఖాతాలో, కరువొస్తే పక్కోళ్ల ఖాతాలో వేసే నైజం బీఆర్ఎస్ నేతలదని విమర్శించారు. అప్పులకు బాధ్యత వహించని బీఆర్ఎస్ అభివృద్ధిని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని ప్రశ్నించారు. పలుశాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కాల్‌సెంటర్ల పేరుతో ఇప్పుడు కహానీలు చెబుతున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆ ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు. -
పాస్‌బుక్ ఆధారంగా.. ప్రతి రైతుకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే దానిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతుకు రుణ విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 30 వేల మంది రైతులకు రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయని మంత్రి చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక సమస్య, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల పేర్ల నమోదుకు అధికారులను నియమిస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారు గతంలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.15న వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీ!ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేసిన వాళ్లు ఈ రోజు రుణమాఫీపై మాట్లాడడం ఏమిటని తుమ్మల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసేలా వ్యవసాయ శాఖ ఆలోచిస్తోందని తెలిపారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు.సకాలంలో ప్రాజెక్టులు ఫుల్..ఈ ఏడాది సకాలంలో అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయంటూ మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు కేంద్రం సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రైతులకు కాంగ్రెస్ దగా!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో ఆంక్షలు పెట్టి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతులను దగా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభిస్తున్నట్టు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.‘‘రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా చేస్తోంది. రైతులకు ఏ ప్రతిపాదికన రుణమాఫీ చేస్తున్నారన్న అంశాన్ని స్పష్టం చేయాలి. చాలా మంది రైతులు రుణమాఫీ జరగక బ్యాంకుల్లో డీఫాల్టర్‌గా మారే దుస్థితి ఏర్పడింది’’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మోసపూరిత హామీలిచి్చ, అధికారంలోకి వచ్చాక దగా చేయడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.. గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి, రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తామని.. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికిపైగా బడ్జెట్ కేటాయిస్తే.. అది తెలంగాణలో 7.60 శాతమేనన్నారు. మాటలు కోటలు దాటినా.. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దా టుతున్నా.. చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పంటలకు మద్దతు ధర పెంపు, నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మ ద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలతోనే ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తోందే తప్ప.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.ఇదీ బీజేపీ హెల్ప్‌లైన్ నంబర్రుణమాఫీకాని రైతులకు అండగా నిలిచేలా, ‘రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తున్న తెలంగాణ’ పేరుతో బీజేపీ పోస్టర్‌ను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం హెల్ప్‌లైన్ నంబర్ 8886 100 097ను ప్రారంభించారు. కాగా.. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన వస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు. -
రుణం ఇచ్చింది.. ‘మాఫీ’కి వద్దంది!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ కోసం అవసరమైన రూ. 31 వేల కోట్లలో రూ. 5–6 వేల కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై ఆ సంస్థ నీళ్లుచల్లింది. తెలంగాణ సర్కారు అడిగిన విధంగా రూ. 5 వేల కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు మంజూరు చేసిన ఎన్సీడీసీ.. ఆ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించరాదని షరతు విధించింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నిధుల ధీమాతోనే... సహకార సంఘాలను, డీసీసీబీలను బలోపేతం చేయడానికి రూ. 5 వేల కోట్ల రుణ సాయం చేయాలని గతేడాది ఎన్సీడీసీని టెస్కాబ్ కోరింది. టెస్కాబ్, డీసీసీబీల నిర్వహణ తీరును పరిశీలించిన ఎన్సీడీసీ.. ఆ తర్వాత రుణం మంజూరు చేసింది. వాస్తవానికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న రూ. 31 వేల కోట్లు ఎలా సమకూరుతాయన్న విషయాన్ని ఆర్థికశాఖ రహస్యంగానే ఉంచుతోంది. రుణమాఫీ చేయాల్సిన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని అడిగిన ఆర్థికశాఖ అధికారులు సదరు మాఫీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా స్పష్టత ఇవ్వలేదు.ఇప్పటివరకు మొదటి విడత 11 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కోసం రూ. 6,070 కోట్లను సర్దుబాటు చేసి ఆ మేరకు రైతుల అప్పు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సుమారు రూ. 25 వేల కోట్ల నిధులను వచ్చే నెలాఖరులోగా సర్దుబాటు చేయాల్సి ఉంది. రూ. 5 వేల కోట్లు ఎన్సీడీసీ నుంచి వస్తే మిగిలిన నిధులను ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్సీడీసీ షరతు నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. రుణమాఫీకి మళ్లింపు సాధ్యమేనా? తాజాగా మంజూరైన రుణం గురించి టెస్కాబ్ వర్గాల వివరణ కోరగా రుణమాఫీకి వినియోగించవద్దని అప్పు ఇచి్చన సంస్థ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని పేర్కొన్నాయి. అప్పుగా ఇచి్చన నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న విషయమై ఏ క్షణంలోనైనా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థకు ఉందని చెబుతున్నాయి. అయితే ఈ రుణాన్ని టెస్కాబ్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డీసీసీబీలు తీసుకొనే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నాయి.ఒకవేళ రుణమాఫీ చేసుకుంటామని సదరు డీసీసీబీలు నిర్ణయం తీసుకున్నా ప్యాక్స్‌ల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింపజేయగలమని, అది కూడా ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణమాఫీ కోసం ఈ నిధులను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున ఏదో విధంగా ఆ నిధులను వాడుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామని, సాధ్యం కాకపోతే ప్యాక్స్‌ల ద్వారా రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం లేదా రైతులకు అందించే ఇతర సహకార కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకుంటామని టెస్కాబ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతామని అంటున్నారు. -
ఆ రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కాలేదని అనేక మంది రైతులు ఆవేదన చెందుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు పంట రుణాన్ని రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నామని, తక్షణమే పరిష్కరించాలని హరీశ్‌రావు కోరారు. -
రుణమాఫీకి భారీ కోత!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు నిజమేనని బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీకి గాను రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పగా, గరువారం నాటి రాష్ట్ర బడ్జెట్లో రూ.26 వేల కోట్లే కేటాయించడం గమనార్హం. ఏకంగా రూ.5 వేల కోట్లు కోత విధించడంతో.. ఈ మేరకు మాఫీ లబ్ధిదారుల్లో కోత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి విడతలో లక్షలాది మందికి జరగని మాఫీ మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగానే అర్హులైన లక్షలాది మంది రైతుల అప్పులు మాఫీ కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రేషన్‌కార్డు లేనివారిని అనర్హుల్ని చేయడం, పీఎం కిసాన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే రుణమాఫీ జరగలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ముఖ్యమంత్రి చెప్పిన మొత్తాని కంటే భారీగా నిధులు తగ్గించడం చూస్తే నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో అర్ధమవుతోందని అంటున్నారు. మొదటి విడత రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు రుణాలున్న 11.32 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,014 వేల కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకున్న రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. మొత్తం 39 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం మొన్నటివరకు చెబుతూ వచ్చింది. కానీ బడ్జెట్లో రూ.26 వేల కోట్ల మేరకే కేటాయింపులు జరపడంతో.. తదుపరి విడతల్లో ఎంతమందికి రుణమాఫీ జరుగుతుందో, ఎంత మందికి పథకంతో లాభం లేకుండా పోతుందోనన్న చర్చ జరుగుతోంది. తొలి విడతలో రుణమాఫీ కాని అర్హులైన రైతులు లక్షలాది మంది ఇప్పటికీ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రైతు భరోసాకు గతంలో కేటాయించినంతే..రైతు భరోసాకు కూడా ప్రభుత్వం సరిపడా నిధులు ప్రతిపాదించలేదు. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ రైతుభరోసా (రైతుబంధు) కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెరగకపోవడం గమనార్హం. 2023–24 వానాకాలం సీజన్‌కు అప్పటి ప్రభుత్వం రూ.7,625 కోట్లు ఇచ్చింది. యాసంగి సీజన్ నాటికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతే సొమ్ము ఇస్తామని ప్రకటించి అమలు చేసింది. అంటే ఆ సంవత్సరం రైతుబంధు కింద రూ.15,250 కోట్లు రైతులకు అందజేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రైతు భరోసాకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామ ని చెప్పినా, బడ్జెట్లో మాత్రం రూ. 15,075 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిని బట్టి చూస్తే రైతు భరోసాలోనూ భారీగా కోతలు ఉంటాయనే విషయం అర్ధమవుతోందని అంటున్నారు. గతంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకూ రైతుబంధు వర్తింపజేశారని.. అలాంటి వాటిని గుర్తించి తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతుల ఊసే లేదుకౌలు రైతుల ఊసే బడ్జెట్లో లేదు. భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ. 1,200 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము కేవలం 10 లక్షల కూలీలకే సరిపోతుందని అంటున్నారు. కాగా రాష్ట్రంలో 25 లక్షల నుంచి 30 లక్షల వరకు రైతు కూలీలు ఉంటారని అంచనా. పంటల బీమా కవరేజీకి కోత! ఈ సీజన్ నుంచి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం రూ.3 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కానీ బడ్జెట్లో పంటల బీమాకు రూ.1,300 కోట్లే కేటాయించారు. దీనిని బట్టి చూస్తే పంటల బీమా కవరేజీ చాలా తక్కువ ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రైతు బీమాకు రూ.1,589 కోట్లు, పంటల బోనస్‌కు రూ.1,800 కోట్లు కేటాయించారు. రూ.500 చొప్పున బోనస్ సొమ్ము ఏమేరకు సరిపోతుందో అనుమానమేనని అంటున్నారు. వ్యవసాయానికి మొత్తం రూ.72,659 కోట్లు కేటాయించామన్న ప్రభుత్వం.. అందులో విద్యుత్ సబ్సిడీకి రూ.11,500 కోట్లు, నీటిపారుదల శాఖ రూ.10,829 కోట్లు, ఇతర పథకాలకు రూ.3,366 కోట్లు కలిపింది. ఆయిల్ పామ్ సాగును లక్ష ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.1,358 కోట్లు కేటాయించారు. రైతు వేదికలకు రూ.43 కోట్లు, రైతులకు విత్తనాల సరఫరాకు రూ.106 కోట్లు ప్రతిపాదించారు. -
కేంద్ర పద్దుపై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2024–25) కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణాలేవైనా గత పదేళ్లుగా తెలంగాణ అవసరాలు, అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లోనైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందని ఆశిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తామని చెపుతున్న తమకు ఏ మేరకు సాయమందుతుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కనిపి స్తోంది. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రీజనల్ రింగు రోడ్డు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐల ఆధునీకర ణకు ప్రత్యేక ఆర్థిక సాయం, నికర అప్పుపై సీలింగ్, ఆఫ్ బడ్జెట్ (బడ్జెటే తర) రుణాలపై పరిమితులు, మూసీ సుందరీకరణకు నిధులు, సెస్ తగ్గింపు, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లాంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అమలు పర్చాల్సిన ఆరు గ్యారంటీలకు తోడు రైతు రుణమాఫీ లాంటి అదనపు భారాల నుంచి ఉపశమనం పొందాలంటే కేంద్రం నుంచి సాయం అవసరమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రుణ సమీకరణకు కేంద్రం చేయూత అవసరమవు తుందని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులను తీసుకునేందుకు గాను ఆఫ్ బడ్జెట్ రుణాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాయి. ఆ రెండిటిపై గంపెడాశలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు పద్దు లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టు కుంది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు ఏ మేరకు వస్తాయోనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నాయి. వీటిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉంటాయని, ఈ రెండు పద్దుల్లో కేటాయింపులు అటూ ఇటు జరిగితే మొత్తం బడ్జెట్ అంచనాలే తారు మారవుతాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పన్నుల్లో వాటా కింద రూ.26 వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయి డ్ పద్దు కింద రూ.21 వేల కోట్ల పైచిలుకు నిధులను ప్రతిపాదించింది. ఇవి రెండూ కలిపి మొత్తం బడ్జెట్లో 17 శాతం కావడం గమనార్హం. కాగా కేంద్ర పన్నుల వాటాలో ఈసారి పెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తు న్నామని, అలాగే గత కొన్నేళ్లుగా ఆశించిన మేర ఇవ్వని గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఈసారైనా అవసరం మేరకు కేటా యించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.నికర అప్పు సీలింగ్‌పై తేల్చండిజాతీయ రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీకి, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, ఆర్థిక సంఘం సిఫారసుల అమలుకు బడ్జెట్ కేటాయింపు, మహిళా శిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నికర అప్పుపై సీలింగ్‌ను కూడా బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే వెల్లడించాలని, తద్వారా తాము అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై ఎలాంటి జీఎస్టీ విధించకూడదని, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికేంద్రాన్ని కోరారు.ఈసారి బడ్జెట్లో తెలంగాణ ఆశిస్తున్నవివే..ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరు ద్ధరణ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, ఆఫ్బడ్జెట్ రుణాల విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల మంజూరు మరో ఐదేళ్లు పొడిగింపు, సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా పన్నుల ప్రతిపాదన, స్కిల్స్ యూనివర్సిటీకి సహకారం, మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్ సిటీ మిషన్, సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు. నష్టాలకు తోడు బకాయిలు..!కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో అనుసరించిన ఆర్థిక వైఖరి కారణంగా తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో చాలా నష్టపో యింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రూ. 33,712 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని, నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసుల మేరకు రావాల్సిన రూ.19,205 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.17,828 కోట్లు ఇంకా రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల నుంచి రూ.5,374 కోట్లు ఇంకా అలాగే ఉన్నాయని, వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద రూ.2,250 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రూ.817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు రూ.723 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విజ్ఞప్తులు, సూచనలపై తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే. -
మొద్దు నిద్ర ప్రభుత్వం.. తట్టినా లేవట్లేదు∙
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, బీఆర్ఎస్ పార్టీ.. ఈ సర్కారును తట్టి లేపినా నిద్ర లేవట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నా కనీసం రోజువారీ సమస్యలను కూడా రేవంత్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా ముందడుగు వేయడం లేదని విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ఏడాది మార్చికి ముందే పంచాయతీలకు రూ.500 కోట్లు విడుదలైనా కారి్మకులకు కనీసం జీతాలు అందడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం మరో రూ.750 కోట్ల నిధుల విడుదలను నిలిపివేసిందని వెల్లడించారు. ఆసరా పింఛన్లు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి వేతనాల చెల్లింపులో కూడా తాను ప్రశ్నించిన తర్వాతే కొంత చలనం వచి్చందన్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం రేవంత్ చెప్పినా అమలు కావడం లేదని హరీశ్‌రావు అన్నారు. రూ.లక్ష లోపు రుణమాఫీకి అర్హులైన వారిలో 30 నుంచి 40 శాతం మందికి లబ్ధి జరగలేదని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ప్రభుత్వ బదిలీల్లో పారదర్శకత లేకఅన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయని అన్నారు. -
తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్‌బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. -
ఊరించి.. కంటతడి పెట్టించారు!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై రైతులను ఏడు నెలలుగా ఊరించి, చివరకు కంటతడి పెట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ‘చారాణ కోడికి.. బారాణా మసాలా’అనే సామెతను తలపించేలా రుణమాఫీపై ప్రభుత్వం తీరు ఉందన్నారు. అర్హత ఉన్నా అనేక మంది రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పే నాథుడు లేడని, రైతుల గోడు వినేవారే లేరని అన్నారు. రుణమాఫీ జరగని అర్హులైన రైతులు ఓ వైపు ఆందోళనలో ఉంటే, సంబురాలు ఎందుకని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.40 లక్షల మంది లబ్ధిదారుల్లో 30 లక్షల మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వ్యవసాయ సీజన్లు కావస్తున్నా రైతు భరోసాను ప్రారంభించలేదన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వంటి హామీలను అమలు చేయకుండా మభ్య పెడుతోందన్నారు. ఇంతకాలం ప్రజల దృష్టిని మళ్లించిన రేవంత్ ప్రభుత్వం, ప్రస్తుతం నిధుల దారిమళ్లింపునకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.పేదరిక నిర్మూలనలో రెండో స్థానంకేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లెక్కలే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.2020–21తో పోలిస్తే 2023–24 (ఎస్డీజీ)లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020 –21తో పోలిస్తే ఐదు పాయింట్లు మెరుగైందన్నా రు. చాలారంగాల్లో తెలంగాణ సాధించిన మా ర్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి.. రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. -
‘చారాణ కోడికి.. బారాణ మసాలా..!’ రైతు రుణమాఫీపై కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు మరోసారి విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని విమర్శలు గుప్పించారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం ఎందుకీ సంబరాలు జరుపుతోందని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? లేక ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని నిలదీశౠరు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు‘సీఎం రేవంత్ రెడ్డి గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు...అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!మభ్యపెట్టే మీ పాలన గురించి..ఒక్క మాటలో చెప్పాలంటే..ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!జై తెలంగాణ’సీఎం గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ…— KTR (@KTRBRS) July 19, 2024 -
మొదటి విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల
-
రుణ మాఫీలో రేవంత్ సర్కార్ స్కాం
-
రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు.. మెసేజ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్‌ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.బ్యాంకుల పేరిట వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వాటిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్‌ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్లోడ్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు మీ గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
సోషల్ మీడియా ద్వారా చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత రుణమాఫీ సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల రైతులతో మాట్లాడారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని ఆ జిల్లాలోని తాంసీ మండలం బండల్ నాగాపూర్ గ్రామానికి చెందిన రైతు మహేందర్‌కు చెప్పారు. వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల రైతులతో కూడా ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. సీఎం, మహేందర్ మధ్య సంభాషణ ఇలా.. సీఎం: ఎంత భూమి ఉంది మహేందర్? మహేందర్: ఎకరం ఉంది సార్. సీఎం: రుణం ఎంత ఉంది..? మహేందర్: రూ.50 వేలు ఉంది. ఒకేసారి రుణం తీరిపోతున్నందుకు సంతోషంగా ఉంది. సీఎం: రైతుల కష్టాలు, ఆదివాసుల కష్టాలు తెలుసుకుంటుందనే సీతక్కను మీ జిల్లాకు ఇన్చార్జిగా మంత్రిగా వేశాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నావా? మహేందర్: ఉన్నాను సార్. సీఎం: రైతు రుణమాఫీ గురించి సోషల్ మీడియా ద్వారా చెబుతావా? మహేందర్: చెబుతా. సీఎం: ధన్యవాదాలు మహేందర్.. మీ జిల్లాలో ప్రాణహితపై తుమ్మడిహెట్టిప్రాజెక్టుతో నీళ్లు ఇస్తాం. వరంగల్ జిల్లా ఎల్లయ్యతో.. ఎల్లయ్య: రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుండటంతో పండగ రోజులా అనిపిస్తోంది. సీఎం: రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్‌లోనే చేశాం తెలుసా? ఎల్లయ్య: తెలుసు సార్. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. సీఎం: ఆ సభకు వచ్చావా? ఎల్లయ్య: వచ్చా... సీఎం: వరంగల్‌లో సభ పెట్టి రాహుల్‌గాందీని పిలుద్దామా? ఎల్లయ్య: పిలిచి కృతజ్ఞతలు తెలుపుదాం. సీఎం: సభకు వస్తావా..? ఎల్లయ్య: నేను తప్పకుండా వస్తా.. వరంగల్ జిల్లా అంటేనే రైతులు. సభకు నాతో పాటు రైతులను తీసుకువస్తా. ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం రైతు సీతారాంతో.. సీతారాం: రుణమాఫీతో సంతోషం కలిగింది. యువ రైతులకు సాగు చేయాలనే సంకల్పాన్ని మీరు కలి్పంచారు. సీఎం: సీతారాం ఎంత భూమి ఉంది? ఎంత అప్పు ఉంది? సీతారాం: నాలుగున్నర ఎకరాల భూమి, రూ.78 వేల అప్పు ఉంది. సీఎం: మొత్తం రుణమాఫీ అవుతోంది. మీకు ఎలా ఉంది..? సీతారాం: చాలా సంతోషంగా ఉంది.. మీరు చల్లగా ఉండాలి. సీఎం: పిల్లలు ఎంతమంది సీతారాం? సీతారాం: ఇద్దరు పాపలు. పెద్ద పాప ఇంటర్, చిన్న పాప పదో తరగతి చదువుతున్నారు. సీఎం:ఇద్దరిని మంచిగా చదివించు, చదువు ఆపొద్దు సీతారాం: ఆపను సార్.. మంచిగా చదివిస్తా. ఇప్పుడు నమ్మకం కలిగింది.. రేవంత్‌రెడ్డితో బోధన్ రైతు రవి రవి: గతంలో రుణమాఫీపై ఎవరు హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు నమ్మకం కలిగింది. సంతోషంగా ఉంది. మిమ్మలి మరో రాజశేఖరరెడ్డిలా చూస్తున్నాం. రైతులందరి తరఫున పాదాభివందనం చేస్తున్నా. సీఎం: మీ నిజామాబాద్ జిల్లాకు రూ.225 కోట్లు రుణమాఫీ కింద ఇస్తున్నాం. రవి: నాట్లు వేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నాంసీఎం: అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? రవి: తప్పకుండా.. అంత అదృష్టం ఎలా వదులుకుంటాం సార్? -
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రుణమాఫీలో రోల్‌మోడల్ కావాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ దేశానికి రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. వ్యవసాయ విధానంలో రాష్ట్రం మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలని అన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ‘గురువారం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నాం. రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తాం. ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీ చేసి ప్రక్రియను పూర్తి చేస్తాం..’అని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మాట ఇస్తే చేస్తామన్న నమ్మకం కలిగించాలి ‘నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్‌గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం. అయితే ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కానీ ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రాహుల్‌గాంధీ కూడా మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రూ.28 వేల కోట్ల రుణాలు కూడా మాఫీ చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే రూ.31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలి ‘కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదు. ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించి హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలి. తెలంగాణలో రైతు రుణమాఫీపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రాహుల్ ఇచ్చిన హామీని అమలు చేశామన్న విషయాన్ని పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాలి. ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో రుణమాఫీ సంబురాలు చేయాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. నిద్రలేని రాత్రులు గడిపాం: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రూపాయి రూపాయి పోగు చేసి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని, ఇందుకోసం నిద్ర లేని రాత్రులు గడిపామని చెప్పా రు. ఎవరినీ వదలకుండా అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ తల ఎత్తుకుని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలని, ప్రతి పోలింగ్ బూత్, ఓటర్ వద్దకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పులతో అధికారాన్ని చేపట్టినా, నెలల వ్యవధిలోనే రూ.2 లక్షల రుణమాఫీని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పి రైతులు, ప్రజల హృదయాలను గెలవా లని పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షు లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, పలు కార్పొరేషన్ల చైర్మ న్లు, కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నాం: సీఎం సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత ఏడు నెలల కాలంలో రూ.30 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేసినా 3 పైసల ప్రచారం కూడా చేసుకోలేకపోయామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘చారానా కోడికి బారానా మసాలా’అన్నట్టు మోదీ, కేసీఆర్‌లు ఏమీ చేయకపోయినా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ మనం అలా చేసుకోలేకపోతున్నాం. ఈ విషయంలో నాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ విఫలమైనట్టే. ఇప్పటికైనా జిల్లా ఇన్చార్జి మంత్రులు వారానికో రోజైనా తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలి. స్థానిక నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. తామున్నామనే ధీమా కల్పించాలి. ముఖ్యమైన నేతలను కలెక్టర్లు, ఎస్పీలకు పరిచయం చేయాలి. 18,19, 20, 21 తేదీల్లో సంబురాలు రైతు రుణమాఫీపై 18,19 తేదీల్లో మండల కేంద్రాల్లో, 20, 21 తేదీల్లో గ్రామాల్లో సంబురాలు చేయాలి. అంబేడ్కర్ చౌరస్తాల నుంచి రైతు వేదికల వరకు మోటార్‌సైకిల్, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించాలి. గతంలో మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా రూ.71 వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తే ఇప్పుడు తెలంగాణలో రూ.31 వేల కోట్లు చేస్తున్నాం. తెలంగాణ మోడల్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఆ బాధ్యతను ఎంపీలు తీసుకోవాలి.’అని సీఎం చెప్పినట్లు సమాచారం. -
నేడే లక్ష రుణమాఫీ.. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు దీనిని నిర్వహించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆన్లైన్లో రైతులతో మాట్లాడనున్నారు. కొన్ని గ్రామాల్లో గందరగోళం రైతు వేదికల్లో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించనున్నారు. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. -
ఒకేసారి అన్నారు.. ఇప్పుడు దశలవారీ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ సొమ్మును ఒకేసారి రైతుల ఖాతాల్లో వేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. దశల వారీగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ తదుపరి విడత ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారీగా రుణమాఫీ చేయడం వలన ఇతర రైతులు ఆ సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కీలకమైన వానాకాలం సీజన్లో రైతులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. లక్షకు పైన ఉంటే ఎదురుచూపులే..! రుణమాఫీని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరో పద్ధతిలో చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రైతుకు లక్షన్నర రూపాయల రుణం ఉంటే... 18వ తేదీన ఆ రైతుకు లక్ష వరకు మాఫీ చేయరు. కేవలం లక్ష రూపాయలలో పు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు. అంటే లక్షకు పైగా రుణాలున్నవారు ఆ తర్వాత ప్రభు త్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురుచూడాల్సిందేనన్న మాట. గతంలో రుణం ఎంతున్నా ప్రభుత్వం నిర్ధారించిన మేరకు అందరికీ రుణమాఫీ జరిగేది. గత ప్రభుత్వం లక్షరూపాయల లోపు రు ణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.ఆ డేటా ఆధారంగానే ఈసారి 18వ తేదీన రైతులకు రుణమాఫీ చేస్తారని అంటున్నారు. మరోవైపు రేషన్ కార్డు వెరిఫికేషన్, పీఎం కిసాన్ నిబంధన ప్రకారం అనర్హులను 18వ తేదీ రుణమాఫీ సందర్భంగా ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. గురువారం ఒక్క రోజులోనే లక్ష లోపు రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం సెలవు అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అ లాగే బ్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారని, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు లేకపోయినా బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి 11.50 లక్షల మందికి సంబంధించిన లక్షలోపు రుణాలు దాదాపు రూ.6,800 కోట్లు ఒకేసారి మాఫీ చేస్తారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వ మార్గదర్శకాలే.. ‘రుణమాఫీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారని నిర్ధారించేందుకు రేషన్‌కార్డు ఒక్కటే ప్రామాణికం. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారో గుర్తించేందుకే ఇది తప్పనిసరి. రేషన్‌కార్డులు లేని రుణ ఖాతాలు 6 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి రుణమాఫీ చేస్తారు. రేషన్‌కార్డులు లేనివారికి రుణమాఫీ జరగదని చేస్తున్న ప్రచారం తప్పు.రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుంది..’అని తుమ్మల వివరణ ఇచ్చారు.ఆ రుణాలు మాఫీ కావు: ‘బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్‌బుక్ తాకట్టుపెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేస్తాం. కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ కావు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఆదాయం పన్ను చెల్లించే బడా వ్యక్తులను గుర్తించేందుకు వినియోగించుకుంటాం. ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1,2,3 ఉద్యోగాల్లో ఉన్న అధికారులకు రుణమాఫీ ఉండదు. నెలకు లక్ష రూపాయలకు పైన వేతనం పొందేవారికి రుణమాఫీ వర్తించదు. ఇలాంటివి 17 వేల అకౌంట్లను గుర్తించాం. మహిళా గ్రూపు అప్పులకు మాఫీ వర్తించదు’అని మంత్రి చెప్పారు.రీషెడ్యూల్డ్ రుణాలు కూడా ..‘గత ప్రభుత్వంలో తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రూ.1,400 కోట్లు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కు వచ్చాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లోని తమ అప్పును రీషెడ్యూల్ చేసుకున్నారు.ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతాయి. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది. అందులో మహిళలకు తొలి ప్రాధాన్యతనిస్తాం. రాష్ట్రంలో 39 లక్షల కుటుంబాలకు సంబంధించి 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి..’అని తుమ్మల తెలిపారు. -
'రేషన్' ఉంటేనే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి. -
షరతులు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు..నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయా లని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ రుణమాఫీ ఇవ్వలే కనే కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కొత్తకథలు చెబుతోందని మండిపడ్డారు. దీనిపై గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినప్పుడు ఎలాంటి షరతులు విధించని విషయాన్ని గుర్తుచేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు రుణ మాఫీకి మాత్రం రేషన్‌కార్డును లింక్ చేస్తోందని ధ్వజమెత్తారు. చాలామందికి ఇది వర్తించకుండా ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఒకే రేషన్‌కార్డుపై చాలామంది పేర్లు ఉంటాయని, అందులో నలుగు రికి రుణాలుంటే ఒక్కరికే మాఫీతో మిగతావారు నష్ట పోతారన్నారు. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించి చేర్చుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం రేవంత్‌కు మరో బహిరంగలేఖ గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగలేఖలో మహేశ్వర్‌రెడ్డి కోరారు. పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ కార్యదర్శులు వెల్లడించినా.. సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తీరులో మార్పు రాకపోతే ప్రజాక్షేత్రంలో సర్కార్ తీరును ఎండగడతామని తెలిపారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వలపోతల కంటే వడపోతలపైనే దృష్టి : మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలను పరిశీలిస్తే రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిందని ఎద్దేవా చేశారు.2018 డిసెంబర్ 12వ తేదీకి ముందు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదనే నిబంధన అసమంజసం అని పేర్కొన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతోందని నిందించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం ద్వారా లక్షలాదిమంది రైతుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని హరీశ్‌రావు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవి మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టే ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మార్గదర్శకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొంతమందికే రుణమాఫీని పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2లక్షల పంట రుణం తీసుకున్న రైతుల జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు లోపభూ యిష్ట షరతులు విధిస్తోందని నిందించారు. రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల క్రితం చెప్పిన సీఎం రేవంత్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. రేషన్ కార్డులు లేని రైతులు, పది ఎకరాల భూమి ఉండి కూడా పింక్ రేషన్ కార్డు కలిగిన రైతుల సంగతేంటో తేల్చాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలు అధికారులు, రైతుల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రుణమాఫీకి ఆంక్షలేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలుకోసం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడిలా కొర్రీలు పెట్టడం ఏమిటని.. ఇలాగైతే లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందకుండా పోతుందని రైతులు, రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆచరణలోకి వచ్చేసరికి ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కొర్రీలు పెడుతోందని మండిపడుతున్నారు. చాలా మందికి రేషన్‌కార్డులు లేవంటూ..ప్రధానంగా రేషన్‌కార్డు ద్వారానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొనడంపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. లక్షలాది మంది రైతులకు రేషన్‌కార్డులు లేవని.. వేర్వేరు కుటుంబాలుగా విడిపోయి పంట రుణాలు తీసుకున్న వారికి విడిగా రేషన్‌కార్డులు రాలేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. రేషన్‌కార్డు లేనివారికి రుణమాఫీ వర్తించకపోవడం, పాత రేషన్‌కార్డుల్లో ఒకే కుటుంబంగా ఉన్నవారందరికీ కలిపి రూ.2లక్షలలోపే రుణమాఫీ చేయడం వల్ల లక్షల మందికి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు.ఆధార్ లింకేజీ సమస్యతోనూ..బ్యాంకు రుణఖాతా, పాస్‌బుక్ డేటా, రేషన్‌కార్డు డేటాలను లింక్ చేసి.. ఆధార్ ఒకటిగా ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవన్నీ సరిగా లేని, ఆధార్ లింక్ కాని రైతులు లక్షల మంది ఉన్నారని.. వారికి రుణమాఫీ వర్తించకపోతే ఎలాగనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అలాగే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. మరి వీరి పరిస్థితి ఏమిటని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.పీఎం కిసాన్ నిబంధనలతో కష్టమే!ఇక పీఎం కిసాన్ నిబంధనలనూ పరిగణనలోకి తీసుకుంటే.. మరికొన్ని లక్షల మంది రుణమాఫీకి అర్హత కోల్పోతారని రైతులు అంటున్నారు. పీఎం కిసాన్ పథకంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆదాయపన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇందులో ఆదాయ పన్ను చెల్లించేవారిలో అనేక మంది ప్రైవేటు ఉద్యోగులు, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వారు గ్రామాల్లో తీసుకున్న పంట రుణాలు కూడా మాఫీ కాని పరిస్థితి ఉంటుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.ఆర్థిక భారం తగ్గించుకునే దుష్ట ప్రయత్నంరుణమాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన కొర్రీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దుష్ట ప్రయత్నం. రేషన్‌కార్డులు, పాస్ పుస్తకాలు లేని రైతులు లక్షల్లో ఉన్నారు. ధరణి సమస్యల వల్ల 15 లక్షల మందికి పాస్ పుస్తకాలు రాలేదు. పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉంటేనే రుణమాఫీ అనడం సరికాదు. రుణాలు రెండు లక్షలకుపైగా ఉంటే.. ఆ అదనపు మొత్తాన్ని రైతులు చెల్లించాకే రుణమాఫీ చేస్తామనడం తప్పు. రీషెడ్యూల్ చేసిన రుణాలను మినహాయించడం సరికాదు. కటాఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలి. కౌలుదారులకు, జేఎల్జే, ఎస్ హెచ్‌జీ గ్రూపులకు రుణమాఫీ వర్తింప చేయ కపోవడంతో వారికి నష్టం జరుగుతుంది. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకులుపీఎం కిసాన్ నిబంధనలతో పెరగనున్న రుణమాఫీ అనర్హులుపీఎం కిసాన్ డేటాకు జోడించడం వలన చాలా మంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోతారు. రేషన్‌కార్డులను బట్టి కుటుంబాన్ని నిర్ణయించడం వల్ల లక్షల మందికి నష్టం జరుగుతుంది. కరువులు, వరదల వల్ల నష్టపోయిన రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకుంటే వారికి రుణమాఫీ వర్తించని పరిస్థితి. రెండు లక్షలకు మించి రుణం ఉంటే.. ఆపైన ఉన్న మేర అప్పు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందనే కూడా దారుణం. ప్రభుత్వం వెంటనే ఈ మార్గదర్శకాలను సవరించాలి. – పోతినేని సుదర్శన్‌రావు, తీగల సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులురైతుల్లో అసంతృప్తి రగులుతుందిరుణమాఫీ అమలుకు కొత్తగా షరతులు, నిబంధనలు విధించడం భావ్యం కాదు. రేషన్‌కార్డులతో ముడిపెట్టడం, స్వల్పకాలిక పంట రుణాలకే ఇస్తామనడం వంటివి పొరపాటు. దీనివల్ల రుణమాఫీ కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుంది. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగ యువతలో అసంతృప్తి పెరుగుతుండగా.. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు రైతుల్లో అసంతృప్తి రగిలే అవకాశాలు ఉన్నాయి. – డి.పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకుడు -
రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు పూర్తి
-
రైతు భరోసా, రుణమాఫిపై సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్
-
రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అయితేనే తమకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉందన్నారు. మూసీ పరీవాహాక ప్రాంతాన్ని 55 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నామని, కింద రోడ్డు మార్గం, సైక్లింగ్, పైన మెట్రో వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్‌కు ఎంతమాత్రం పోటీ కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.అమరావతిలో రాజధాని నిర్మాణం, భవనాల నిర్మాణం తర్వాత 10 వేల ఎకరాలే రియల్ ఎస్టేట్‌కు ఉంటుందని, అందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కష్టమనేది తన ఆలోచన అని అన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టేకన్నా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. లేదా పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్.. మీడియా సమావేశంలో వివరాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మూసీ అభివృద్ధి.. నా మార్క్ ‘మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ఓ మార్క్ ఉంది. ఇలా నా మార్క్ ఏంటనేది చెప్పాల్సి వస్తే మూసీ నది అభివృద్ధేనని చెప్తా. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో 10 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు లేదా లేదా నష్టపరిహారం చెల్లిస్తాం.మధ్యమధ్యలో ఎస్టీపీలు కట్టి నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా చేస్తున్నాం. 36 నెలల్లో పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. 12–15 కీ.మీ.లకు ఒక క్లస్టర్ లెక్కన 4 కస్టర్లుగా విభజించి 4 కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టును మరింత హుందాగా డిజైన్ చేసేందుకు ఆగస్టులో దక్షిణ కొరియా, జపాన్ వెళ్లి అక్కడి రివర్ డెవలప్మెంట్ మోడల్‌ను చూసి మరిన్ని ఆలోచనలు చేస్తాం. మొత్తం మూసీ నది అభివృద్ధే రేవంత్ మార్క్ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తా’అని రేవంత్ వివరించారు. గండిపేటకు ట్రంక్ లైన్.. ‘మంచినీటి నిల్వ కోసం గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు ట్రంక్ లైన్ వేస్తున్నాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాల గురించి ప్రధాని మొదలు కేంద్ర మంత్రులందరినీ నేను, నాతో పాటు మంత్రులు కలుస్తున్నాం. కేంద్రం తెలంగాణకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎన్నికలు అయిపోయినందున ఇప్పుడు రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. అందుకే అందరినీ కలుస్తున్నాం..’అని సీఎం చెప్పారు. మరికొన్ని అంశాలపై ⇒ వివాదం లేకుండా పోటీ పరీక్షలన్నీ నిర్వహించామని సీఎం అన్నారు. తమకు మంచి పేరు వస్తుందనే గ్రూప్–1 విషయంలో బీఆర్ఎస్ అనవసర రచ్చకు తెరలేపి నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతోందని రేవంత్ ఆరోపించారు. అయితే గ్రూప్–1 గురించి ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ వెళ్లలేమని.. అలా వెళ్తే కోర్టులు ఆక్షేపిస్తాయని చెప్పారు. ⇒ లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని ప్రధానిని కోరానని.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో త్వరలో కొత్త బ్యాచ్‌కు చెందిన వారిని కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందన్నారు. ⇒ కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలైనట్లు కేసీఆర్ పరిస్థితి ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వ్యక్తి ఆ కేసుకే పట్టుబడేలా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని.. తన ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.పదేళ్లు నేనే సీఎం..ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందని, ఈ లెక్కన పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌కు వచ్చే ఢోకా ఏమీ లేదని చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో పదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారి తే, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకమారు ప్రభు త్వం మారుతోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కచ్చి తంగా కొనసాగుతుంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా’అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఈవీఎంలపై అప్పుడు టీడీపీయే ప్రశ్నించిందిసార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాపరింగ్లు జరిగినట్లు వస్తున్న వార్తలపై అభిప్రాయం ఏమిటని మీడియా అడగ్గా సీఎం రేవంత్ వివరంగా బదులిచ్చారు. ‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పారీ్టలోనే ఉన్నా). ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కలి్పంచాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి..’అని అన్నారు. ఎలా జరగొచ్చంటే.. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపినీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగానే కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఆ ఈవీఎంల స్థానంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆ 15 శాతం ఈవీఎంలను అదనంగా ఇస్తారు. ఈవీఎంల పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ రోజు ఈవీఎంలను పోలింగ్ బూత్‌లకు తరలిస్తారు.అదనంగా తెచి్చన 15 శాతం ఈవీఎంలను మాత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఉంచుతారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్‌కు కాకుండా తొలుత డి్రస్టిబ్యూషన్ సెంటర్‌కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటుఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు కదా? పంపిణీ కేంద్రం బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లు వాటిని తనిఖీ చేయడానికి ఉంటారు. మన చేతిలో అధికారం, బలం ఉంటే మనకు ఇష్టమైన వ్యక్తుల్ని అక్కడ డ్యూటీకి వేసుకొనే అవకాశం కూడా ఉంది. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్తున్నాయి..’అని రేవంత్ తెలిపారు. ట్యాంపరింగ్ ఏ రకంగా చేస్తారో చెప్పలేం‘ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎక్కడో కూర్చుని చేశారా లేక చిప్‌లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్‌లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్నిబట్టే ఈవీఎం పనిచేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’అని రేవంత్ చెప్పారు. -
నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. హెచ్‌ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. -
ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్న వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చాన్స్గానీ, నామినేటెడ్ పదవులుగానీ ఇచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో, పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవులు దక్కుతాయి. కొత్తగా వచి్చ చేరిన నేతలకు పదవులు ఉండవు. కేవలం కాంగ్రెస్ నుంచి బీఫామ్‌లు తీసుకుని గెలిచిన వారికి, కాంగ్రెస్‌లో ఉన్న వారికే పదవులు వస్తాయి..’’ అని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రేవంత్ గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. వచ్చే నెల తొలివారంలో నియామకాలు కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చ జరిగిందని.. అయితే ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఏ నిర్ణయం జరగలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పడూ ఉంటుందని.. పదవులు పొందేవారిలో మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరైనా ఉండవచ్చని చెప్పారు. జూలై మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తవుతాయని వెల్లడించారు. రుణమాఫీకే మొదటి ప్రాధాన్యత తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు మాత్రమే పంట రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాలను గుర్తించడానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. కుటుంబంలోని వారు మూడు, నాలుగు లోన్లు తీసుకుని ఉన్నా.. అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో డబ్బున్నవారికి, ఫామ్‌హౌజ్‌లకు కూడా పథకాల సొమ్ము ఇచ్చారని.. నిజమైన లబి్ధదారులకు పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పు జరగవద్దనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే రూ.7లక్షల కోట్ల మేర ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇతరత్రా మరో లక్ష కోట్లు అప్పులు ఉంటాయని చెప్పారు. ప్రతి నెలా రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కొత్త లోన్ల కోసం ప్రయతి్నస్తూ, వడ్డీలు తగ్గించుకునేందుకు ప్రయతి్నస్తున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తవుతుందని.. కొత్త కమిషన్ నియామకం తర్వాతే రాష్ట్రంలో కులగణన చేపడతామని రేవంత్ తెలిపారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 80శాతానికి పెరిగిందని రేవంత్ చెప్పారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. జిల్లాలపై కమిషన్ వేసి నిర్ణయం రాష్ట్రంలో జిల్లాలను కుదిస్తామనిగానీ, పెంచుతామనిగానీ తాము చెప్పలేదని రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు ఎలా కమిషన్ వేస్తారో.. అలా జిల్లాలపై ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. పాతబస్తీలో విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు.. హైదరాబాద్ పాతబస్తీలో సరఫరా చేసిన విద్యుత్‌లో కేవలం 60శాతమే బిల్లులు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీ విద్యుత్ నిర్వహణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని మోదీలా తాము ప్రభుత్వ రంగ సంస్థలను పల్లీబటానీల్లా ప్రైవేటుకు బదలాయించబోమని చెప్పారు. అదానీ వ్యాపారమేదీ చేయవద్దని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు తాము హైదరాబాద్‌లో అదానీ సంస్థకు ఆస్తులు రాసివ్వడం లేదని.. వారితో పెట్టుబడి మాత్రమే పెట్టిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది లాభమైతే అదే చేస్తామని.. గదుల్లో కూర్చుని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొన్నారు. -
ఆగస్టుకు ముందే రుణమాఫీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రైతు రుణమాఫీని ఆగస్టు కంటే ముందే అందిస్తే ఏమైనా ఇబ్బందా’అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలపై ప్రజాభిప్రాయం సేకరిస్తామని, విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాతే అందిస్తామని ప్రకటించారు. అంతే కానీ నలుగురం కూర్చుని మాదేం పోయింది..ప్రజల డబ్బే కదా అన్నట్టుగా భావించి గుట్టలు ఉన్న చోట, పంటలు వేయని భూములకు రైతుభరోసా అందించే ఉద్దేశం లేదని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరందించలేకపోయారని విమర్శించారు. రూ.42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ పేరుతో ఖర్చు చేసినా, ఇప్పటివరకూ ఇంటింటికీ తాగునీరు రాని గ్రామాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయన్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బులను ఎవరికి పడితే వారికి పంచి, రూ.7లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని చెప్పారు. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సహకారంతో ఐటీ హబ్, పాల్వంచలో కొత్త «థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 12 ఆర్వోబీలకు ప్రతిపాదనలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కనెక్టివిటీ పెంచేందుకు 12 ఆర్వోబీలకు సేతుబంధన్ కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అందులో రూ.148 కోట్లతో నిర్మించే కొత్తగూడెం ఆర్వోబీ కూడా ఉందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచి్చన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు అమలు చేశామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.35 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ట్రయల్‌రన్ ద్వారా బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు అంకురార్పణ జరిగిందనిచ, మిగిలిన పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్‌నాయక్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీచైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు యాక్షన్ ప్లాన్ గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గోదావరి వరదల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. -
రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం సర్కారు వేట ప్రారంభించింది. రూ.31 వేల కోట్లు సమకూర్చుకునేందుకు పలు జాతీయ బ్యాంకులను సంప్రదించింది. చివరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) అవసరమైన రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీకి ఎన్సీడీసీ నుంచి తొలివిడత రూ.3,955 కోట్ల రుణం తీసుకుంది. రెండోవిడతకు రూ.4,563 కోట్ల రుణం ఇవ్వాలని కోరగా.. ఎన్సీడీసీ చివరి నిమిషంలో ఆపేసింది. అప్పుడు రాజకీయ కారణాలు అడ్డుగా మారడంతో మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు. ఇలాంటి విష యాల్లో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంలో ఎన్సీడీసీ ముందుంటుంది. దీంతో దాన్నే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీసీ అధికారులతో చర్చలు జరిపింది.అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, కేంద్ర సహకారశాఖ పరిధిలో ఎన్సీడీసీ ఉన్నందున రాజకీయకారణాలు ఏమైనా అడ్డుగా ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్సీడీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలున్నాయి. ముంచుకొస్తున్న గడువు... వచ్చే ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం రూ. 31వేల కోట్లు అవసరం అవుతాయని ప్రకటించారు. సీఎం చెప్పిన గడువుకు మరో నెలన్నర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అంత భారీ మొత్తాన్ని ఏ విధంగా సమాకూర్చుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రుణమాఫీ కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా రుణం ఇవ్వాలంటే షరతులు ఉంటాయని ఎన్సీడీసీ అధికారులు అంటున్నట్టు తెలిసింది. అంతేగాక కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా అవసరమన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో రుణం కోసం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే పార్టీ పనులతోపాటు ఈ విషయంపైనా తేల్చుకునేందుకు సీఎం ఢిల్లీలో నాలుగు రోజులుగా మకాం వేసినట్టు వ్యవసాయశాఖవర్గాలు అంటున్నాయి. ఇదిలాఉండగా, రుణం కోసం ముంబై వెళ్లి రిజర్వు బ్యాంకు వద్ద ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. ఢిల్లీలో పలు జాతీయ బ్యాంకుల అధికారులతోనూ చర్చించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీడీసీపైనే ప్రభుత్వం ఆధారపడినట్టుగా చెబుతున్నారు. రుణం ఇస్తే ప్రభుత్వం అవసరమైన గ్యారంటీ ఎన్సీడీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. -
గ్రామాల వారీగా రుణమాఫీ రైతుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా రైతుల జాబితాను బ్యాంకులతో కలిసి అధికారులు తయారు చేయాలని యోచిస్తోంది. అనంతరం గ్రామసభలో చర్చించి తుది జాబితా సిద్ధం చేస్తారని అధికారులు అంటున్నారు. పంట రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో అందులో ఉండాల్సిన అంశాలపై వ్యవసాయశాఖ అధికారులు తలమునకలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 31 వేల కోట్లు ఖర్చు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన సంగతి విదితమే. రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చి స్తున్నారు. గతంలో రుణమాఫీ అమలు సందర్భంగా విడు దల చేసిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేస్తు న్నారు. దాదాపు అవే మార్గదర్శ కాలు ఉంటాయని వ్యవసాయ శాఖవర్గాలు అంటున్నాయి. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. పాస్‌పుస్తకం జత చేసి బంగారు రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే....అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే..భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే... వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు. ఇప్పు డు కూడా వాటినే అమలు చేయనున్నారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లతో సహా), గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణా లు, బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని నిబంధనలను మాత్రం తీసుకుంటారని, పూర్తిగా దాన్నే రుణమాఫీ పథకానికి వర్తింపజేయరని అంటున్నారు. మార్గదర్శకాల్లో చేర్చాల్సిన అంశాల్లో ముఖ్యాంశాలు.. » రైతులకు రుణమాఫీ అందజేయడానికి అర్హులైన లబ్ధి దారుల డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు పోర్టల్‌ను అభివృద్ధి చేయాలి.» పంట రుణ బకాయిలున్న రైతుల జాబితాను సిద్ధం చేసి వాటిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాటిని చెక్ చేయాలి. రెండు లక్షల వరకు పరిమితమైన రైతుల తుది జాబితాను బ్యాంక్ బ్రాంచీలో సిద్ధం చేయాలి. అందుకు సంబంధించిన ఒక కాపీని జిల్లా కలెక్టర్‌కు పంపాలి.» అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు, బ్యాంకు శాఖల పంట రుణాలు పొందిన బంగారు రుణాలు మాఫీ చేయరు. అయితే ఆయా బ్యాంకులు గ్రామీణ బ్రాంచీలు ఉంటే అక్కడ తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తారు. » కొంతమంది రైతులు ఒకే బ్యాంకుకు చెందిన ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు శాఖల నుంచి పంట రుణాలు తీసుకొని ఉండవచ్చు. అందువల్ల నకిలీ లేదా మల్టీపుల్ ఫైనాన్సింగ్‌ను తొలగిస్తారు. అందుకు జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా మండల స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారు. రుణమాఫీకి అర్హులైన వారందరికీ వ్యవసాయ భూములున్నాయో లేదో ధ్రువీకరిస్తారు. » ఒక రైతు కుటుంబానికి వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నా, పంటరుణం మొత్తం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అర్హత ఉన్న మాఫీ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం విభజిస్తారు. » తహసీల్దార్, ఎంఏఓ, ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి అధికారుల బృందం సంబంధిత గ్రామానికి చెందిన ఏఈఓ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు రైతు వివ రాలు సేకరిస్తారు. ఆయా రైతుల సమగ్ర సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. సామాజిక తనిఖీ చేస్తారు. గ్రామసభ నిర్వహించడం ద్వారా బ్రాంచి మేనేజర్ అన్ని అభ్యంతరా లను తీసుకుంటారు. అనంతరం బ్యాంకుల రైతుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. » జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుల వారీగా, రైతుల వారీగా రుణమాఫీకి సంబంధించిన జిల్లా వివరాలు నమోదు చేస్తారు. దాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి పంపిస్తారు. దాన్ని ఐటీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. బ్యాంకుల వారీగా, శాఖల వారీగా, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు పంపిస్తారు. » రుణాలు ఇచ్చిన బ్యాంకులే రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత కచ్చితత్వానికి బాధ్యత వహించాలి. » పంట రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నట్టు లేదా రుణమాఫీకి అర్హులు కాదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతు నుంచి ఒక హామీని వ్యవసాయశాఖ తీసుకోవాలి. -
ముఖ్యమంత్రి గారూ..! సీఎం అంటే ‘కటింగ్ మాస్టరా’?
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ.. సీఎం అంటే కటింగ్ మాస్టరా?’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ‘ఎక్స్’వేదికగా వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటిలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెడుతోందని, సీఎం అనే పదానికి కటింగ్ మాస్టర్ అనే సరికొత్త నిర్వచనం తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయా పథకాల్లో కోతల గురించి కేటీఆర్ పోస్ట్ చేశారు. ‘నాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు రూ. 2 లక్షల రుణ మాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదట రూ.39 వేల కోట్లు అని ఇప్పుడు రూ. 31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు’అని పేర్కొన్నారు.పాసుబుక్కులు లేవనే నెపంతో.. లక్షల మందికి కోత పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరించారు. అలాగే రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ వదిలేయమని స్పష్టం చేశారు.ఇప్పటికే రూ. 500 సిలిండర్, రూ. 200 యూనిట్ల విద్యుత్ పథకాలకు కూడా కోతలు విధించారని విమర్శించారు. ఇదే విధంగా రూ. 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి, లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని అన్నారు. ‘నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండుగ ముగిసినా.. ఎకరానికి రూ.7,500 రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో ‘‘అందరికీ అన్నీ’’అన్నారు. అధికారంలోకి రాగానే ‘‘కొందరికే కొన్ని’’అని కోతపెడుతున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం, పోరాడుతాం’అని హెచ్చరించారు. -
ఒకే దఫా రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దఫాలో రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపింది. ఇందుకు రూ. 31 వేల కోట్లు అవసరమని పేర్కొంది. సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీకి కటాఫ్‌గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. అనంతరం సహచర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే మడమ తిప్పని నాయకులు ‘2022 మే 6వ తేదీన వరంగల్‌లో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించారు. అందుకు సంబంధించి మంత్రివర్గంలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న కాంగ్రెస్ విధానంతో ముందుకుపోతున్నాం. సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ఖర్గే మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు. 2004లో కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న మాటను సోనియా నిలబెట్టుకున్నారు. దానివల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు అందరికీ తెలుసు. సోనియా మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారు. సోనియాగాంధీ ఏదైనా మాట చెప్పారంటే అది శిలాశాసనమే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడతారు. రూ.2 లక్షల రుణమాఫీపై మేధావులు, విశ్లేషకులు కూడా కాంగ్రెస్‌వి అలవి కాని మాటలు అంటూ వ్యాఖ్యానించారు..’ అని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ విముక్తి ‘కేబినెట్లో రుణమాఫీ విధివిధానాలపై చర్చించాం. త్వరలో జీవో విడుదల చేస్తాం. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి అవసరమైన సొమ్మును సేకరించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తాం.ప్రజాపాలన, రైతు సంక్షేమం, రైతు రాజ్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం 2014, 2018లలో రెండుసార్లు రుణమాఫీ చేసింది. మొదటిసారి రూ.16 వేల కోట్లు, రెండోసారి రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది. ఇలా రెండు విడతలుగా చేసిన రుణమాఫీ మొత్తం రూ.28 వేల కోట్లు మాత్రమే. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబర్ 11వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది..’ అని రేవంత్ చెప్పారు. 8 నెలల్లోగానే రుణమాఫీ ‘గత ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు, వడ్డీ మాపీ చేస్తామని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను సంక్షోభం వైపు తీసుకెళ్లి అన్నదాతల ఆత్మహత్యలకు కారణమైంది. పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం 8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్లమెంటు ఎన్నికలు రావడంతో రెండున్నర నెలలు కోడ్‌లోనే గడిచిపోయాయి. అయితే 8 నెలల్లోపే సామాజిక బాధ్యతతో రుణమాఫీకి చేసేందుకు మంత్రివర్గం మొత్తం ఏకతాటిమీద నిలిచి, ఏక గొంతుకతో నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల్లోని రైతు రుణాల వివరాలను సేకరించాం..’ అని సీఎం తెలిపారు. నిధుల సేకరణ బాధ్యత ఆర్థిక మంత్రిది ‘రుణమాఫీకి నిధుల సేకరణ ఆర్థిక మంత్రి భట్టి బాధ్యత. ఈ విషయంలో ఏదైనా ఉంటే ఆయన్ను సంప్రదించవచ్చు. ఏ ప్రాతిపదికన చేస్తామనేది మా అంతర్గత అంశం. అయితే గడువులోగానే చేస్తాం. ఆయనలాగా (కేసీఆర్) వాయిదాలతో చేయాలంటే ఇంత హడావుడి ఎందుకు? గడువు కంటే ముందు చేస్తే మీకేమైనా (విలేకరులకు) అభ్యంతరమా? తినబోతూ రుచులెందుకు? దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు. నియమ నిబంధనలు అన్నీ జీవోలో పొందుపరుస్తాం..’ అని రేవంత్ చెప్పారు. రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ‘రైతు భరోసా (గతంలో రైతుబంధు)పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశాం. రైతు ప్రతినిధులు, రైతు సంఘాలు సహా పలువురు స్టేక్ హోల్డర్లతో చర్చించి జూలై 15వ తేదీలోగా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతుభరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంటాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని పత్రికలు లేనిపోనివి రాస్తున్నాయి.. ‘మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలన పరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించాం. వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం. ఏదైనా సమాచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి. కొన్ని పత్రికలు లేని వార్తలను రాస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఎక్కడో ఒకదగ్గర ఎవరో ఏదో మాట్లాడారని చెబుతూ వార్తలు రాస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వివరాలపై, అలాగే అపోహాలపై సమాచారం కావాలంటే ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించాలి. ఊహించుకొని, కాయించుకొని రాయకుండా ఇలా చేశాం. మిగతా విషయాలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల మంత్రులు ఇస్తారు. అయితే రాజకీయాలపై ఎవరైనా ఏదైనా మాట్లాడతారు..’ అంటూ రేవంత్ వివరించారు. సాహసోపేతమైన నిర్ణయం: తుమ్మల రుణమాఫీ ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఆర్థికంగా ఎంత కష్టమున్నా, ఇబ్బంది ఉన్నా రుణమాఫీ చేయడానికి పూనుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మాఫీ లెక్క తేలిందా? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించింది. ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అయితే ఒక్క 2023– 24లోనే తెలంగాణలో రైతులు ఏకంగా రూ. 64,940 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని 2022 మే నెలలోనే ప్రకటించింది.ఈ నేపథ్యంలో గత ఏడాది రుణాలు తీసుకున్న చాలామంది రైతులు తిరిగి చెల్లించలేదని బ్యాంక్ వర్గాలు అంటున్నాయి. కాగా ఒక్క ఏడాదిలో రూ. 64 వేల కోట్ల రుణాలుంటే రూ. 31 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడమేమిటని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఏడాదికే ఇంత తేడా ఉంటే.. ఐదేళ్లకు ఎంత ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ లెక్కలపై స్పష్టత రావాల్సి ఉంది. -
రుణమాఫీకి పరిమితులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణ మాఫీకి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. అనర్హులకు రుణమాఫీతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని.. అర్హులందరికీ పూర్తి న్యాయం జరిగేలా రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రుణమాఫీ అంశంపై శుక్రవారం తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఈ సమావేశంలోనే పూర్తిస్థాయిలో చర్చించి రుణమాఫీపై ఒక నిర్ణయానికి వస్తారని.. మార్గదర్శకాలకు ఒక రూపం ఇస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయని సమాచారం. ధనికులు, ప్రముఖులను మినహాయిస్తూ.. సీఎం కార్యాలయ వర్గాలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. ధనికులకు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్నా పీఎం కిసాన్ పథకం కింద.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్ పర్సన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న రైతు రుణమాఫీలోనూ ఈ వర్గాలను మినహాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లించే ప్రతీ ఒక్కరినీ కాకుండా.. అధిక ఆదాయమున్న వారిని మాత్రమే మినహాయిస్తారని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరినీ కాకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారని వివరిస్తున్నాయి. ఇలాంటి వారికి రుణమాఫీని మినహాయిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నాయి. ఇక రుణమాఫీకి కటాఫ్ తేదీని కూడా మంత్రివర్గ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తేదీ, లేదా సోనియాగాంధీ పుట్టినరోజును ప్రామాణికంగా తీసుకునే ప్రతిపాదన ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. భూసీలింగ్ ఏదైనా వర్తింపజేస్తారా? ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు కూడా. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం? అందుకు తగ్గట్టుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులేమిటన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతోపాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులపై అధికారులు అధ్యయనం చేశారు. ఆ పథకాల ప్రయోజనాలు, అనుసరించిన విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులు ముంబై వెళ్లి మహారాష్ట్ర రుణమాఫీని అధ్యయనం చేసి వచ్చారు. ఏం చేసినా అసలైన రైతులకు మేలు జరిగేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ రైతుకు ప్రయోజనం కలిగించేలా విధివిధానాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అయితే ధనిక రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉండదన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేసే ప్రతిపాదన ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసాను ఐదు లేదా పదెకరాలకు పరిమితం చేసే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రుణమాఫీకి కూడా అలాంటి పరిమితి విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా తర్జనభర్జన రైతు రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి దాదాపు రూ.35 వేల కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. కటాఫ్ తేదీ, షరతులను బట్టి ఆర్థికభారం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆర్థికభారం తగ్గించుకునేందుకు ఎక్కువ షరతులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా? అన్న సంశయం ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్టు చెప్తున్నారు. ఉద్యోగులను మినహాయిస్తే వారి నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న చర్చ జరుగుతోంది. అలాగే ఐదు లేదా పదెకరాలకే పరిమితి విధిస్తే.. మిగతా రైతుల నుంచి వ్యతిరేకత రావొచ్చని అంటున్నారు. షరతులు పెడితే ఆర్థికంగా పెద్ద మొత్తంలో మిగులు ఉండాలని.. అలాకాకుండా మిగిలేది తక్కువే ఉంటే షరతులు ఎక్కువగా పెట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం కూడా నెలకొంది. ఈ క్రమంలో ‘మినహాయింపుల’పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతూనే ఉంది. మరోవైపు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును సమకూర్చడం సాధ్యంకానందున.. విడతల వారీగా రుణమాఫీ జేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. -
రుణమాఫీకి ‘పీఎం కిసాన్’ రూల్స్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివా లయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమై వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై చర్చించి ఖరారు చేయనుంది. రుణమాఫీకి అర్హులను గుర్తించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం విధివిధానాలనే వర్తింపజేయాలా? లేక ఇతర పద్ధతులను అనుసరించాలా? అనే అంశంపై రాష్ట్రమంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం అందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ఉన్నత ఆదా యం పొందే సంతానం ఉన్నా ఈ పథకం కింద అనర్హులే. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు సైతం ఇలాంటి మార్గదర్శకాలనే అమలు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హులైన రైతులెవరూ నష్టపోకుండా మార్గదర్శకాలను మంత్రివర్గం ఖరారు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎవరు ? ప్రభుత్వ సహాయం అవసరమున్న రైతులను ఏ ప్రాతిపదికన గుర్తించి రుణమాఫీ వర్తింపజేయాలి ? ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీకి అమలు చేసిన మార్గదర్శకాలు ఏమిటి? వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రుణమాఫీకి కటాఫ్ తేదీతోపాటు ఈ పథకం అమలుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీపైనే చర్చ జరుగుతుందని, ఎజెండాలో ఇతర అంశాలు లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. -
దశల వారీగానే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే విడతల వారీగా పంటల రుణమాఫీ చేపట్టాలని.. వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను, తర్వాత రూ. 75 వేల వరకు, అనంతరం రూ.లక్ష.. ఇలా రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి రూ.లక్ష లోపే రుణాలు ఉన్నట్టు అంచనా. వీరికి తొలిదశలో మాఫీ చేసి.. తర్వాత మిగతా వారికి అమలు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీకి భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వం అన్నిరకాల మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నాయి. నాలుగు పథకాలకు రూ.50 వేల కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాల్సి ఉంది. ఈ రెండింటికీ నిధులు సమీకరించడం సవాల్‌గా మారిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి సుమారు రూ.35 వేల కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసా కింద ప్రస్తుత వానాకాలం సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల మేరకు కావాలి. రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించేందుకు రూ.1,500 కోట్లు కావాలి. పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలంటే దాదాపు రూ.2,500 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇలా ఈ నాలుగింటికి కలిపి రూ.50 వేల కోట్ల వరకు అవసరం. రైతుభరోసా కింద ఈ నెల నుంచే పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించాలి. అంటే ఈ రెండు నెలల్లోనే నిధులన్నీ సమకూర్చుకోవాలి. భారం తగ్గించుకోవడంపై దృష్టి! భారీగా నిధుల అవసరం ఉండటంతో.. ఈ నాలుగు పథకాల భారాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు తీరును పరిశీలించింది. వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ రుణమాఫీ అమలుతీరును అధ్యయనం చేసి వచ్చారు. రాజస్తాన్‌లో రుణమాఫీ అమలుతీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. అర్హులైన రైతులకు లబ్ధిచేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు కొనసాగుతోంది. నిజానికి రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీయిచ్చింది. కానీ ఆయా పథకాలకు అర్హులను గుర్తించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించింది. ఇప్పుడు ‘‘రైతు భరోసాకు, రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? అలా చేస్తే అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలుండాలి?’’ అన్నదిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంటే పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎం కిసాన్‌లో మినహాయింపు ఉన్న వర్గాలతోపాటు ఐదెకరాల పరిమితి పెట్టడం, సాగుచేసే రైతులకే భరోసా సాయం ఇవ్వడం వంటివి అమలు చేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రుణమాఫీకి కూడా ఇలాంటి నిబంధనలు పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆలోచన సాగుతున్నట్టు సమాచారం. నిధుల సమీకరణ ఎలా? ఈ నాలుగు పథకాల కోసం ఒకేసారి రూ.50 వేల కోట్ల మేరకు నిధులు సమీకరించడం అంత సులువైన వ్యవహారం కాదని.. ఒకవేళ ఆంక్షలు విధించి, కోతలు పెట్టినా కూడా అంత పెద్ద మొత్తంలో సొమ్ము సేకరణ కష్టమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే, నిధుల సమీకరణకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ‘రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్’ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.35 వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న ఆలోచన జరుగుతోంది. అయితే ఏదైనా కార్పొరేషన్‌కు భారీగా రుణం ఇవ్వాలంటే.. దానిని అదే సంస్థ తిరిగి చెల్లించగలదంటూ ఆదాయ మార్గాలను చూపాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏదైనా సంస్థ లేదా పథకం పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణం సొమ్మును ఆ పనికి మాత్రమే వినియోగించాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లకుండా చూడాలని ఇటీవల రిజర్వుబ్యాంకు వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ సేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతోంది. వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 700 ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం గుర్తించింది. అందులో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రూ.20 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే రిజర్వుబ్యాంకు గవర్నర్‌తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. -
రుణమాఫీపై వారంలో కేబినెట్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై చర్చించేందుకు, విధివిధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీకి సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి.. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలిస్తున్నారు. కటాఫ్ తేదీ ఏది? మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి, అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. కేంద్రం మాదిరి ఉద్యోగులు, డాక్టర్లు తదితరులకు మినహాయింపు? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్టులు లాంటి ప్రొఫెషనల్స్‌ను ఈ పథకం నుంచి మినహాయించింది. పీఎం కిసాన్ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలు అసలైన రైతులకు లబ్ధి చేకూర్చాయనే అభిప్రాయం ఉంది. ఈ మేరకు రుణమాఫీ అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా ఎలాంటి విధివిధానాలుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
రుణమాఫీ ‘లెక్క’ తీయండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి అవసరమైన లెక్క అంతా సిద్ధం చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో రేవంత్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల వివరాలను సేకరించి, అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన ప్రణాళికతో రండి.. బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీకి సంబంధించిన డేటా, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాలని తేలి్చచెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకేసారి మాఫీతో ఇబ్బంది అంటూ..! రుణమాఫీకి నిధుల జమ విషయంలో ఇబ్బందులను కొందరు అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచి్చనట్టు తెలిసింది. సుమారు రూ.35 వేల కోట్ల వరకు నిధులను జమ చేయడం అంత సులువైన విషయం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. రుణాలున్న ప్రతీ రైతుకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు తయారు చేయాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇప్పటివరకు కొన్ని బ్యాంకుల నుంచి రైతు రుణాల సమాచారం వచి్చందని, మిగతావాటి నుంచి కూడా డేటా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అయితే రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. -
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. – సాక్షి, హైదరాబాద్రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ ⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ⇒ కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది. లక్ష రుణమాఫీఅప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. -
రుణమాఫీకి మహారాష్ట్ర మోడల్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా తెలంగాణలోనూ రైతులకు పంటల రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. మహారాష్ట్రలో గతంలో ఒకేసారి రూ.20 వేల కోట్లు మాఫీ చేశారు. సహకార శాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి.. రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాల మాఫీని అమలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇటీవల మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటించి అధ్యయనం చేశారు. ఒకేసారి రూ.20 వేల కోట్లు ఎలా సమకూర్చారన్న దానిపైనా ఆరా తీశారు. రాజస్తాన్‌లోనూ ఇదే పద్ధతిలో రుణమాఫీ చేశారని తెలుసుకున్నారు. ఆ వివరాలతో తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిసింది.అసలు వడ్డీతో కలిపి మాఫీ..మహారాష్ట్రలో పర్యటించి వచ్చిన అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆ రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల మంది రైతులు ఉన్నారు. వారిలో చాలా మంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే 2015 నుంచి 2019 వరకు కరువు పరిస్థితులతో రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31వ తేదీ మధ్య రైతులు తీసుకున్న పంట రుణాల్లో రూ.2 లక్షల వరకు ఉన్నవాటిని మాఫీ చేసింది. ఇందుకోసం పెద్దగా షరతులేవీ పెట్టలేదు.రైతుకు ఎక్కువ భూమి ఉందా, తక్కువ ఉందా అన్న కొర్రీ ఏదీ పెట్టలేదు. నిర్ణీత గడువులో రుణం అసలుతోపాటు వడ్డీ మొత్తాన్ని కూడా మాఫీ చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా పంట రుణాలు తీసుకున్న రైతులకు.. ఆ పరిమితి వరకే మాఫీ చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణఖాతాలకు సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఆధార్‌తో లింక్ చేయని రుణ ఖాతాదారులను గుర్తించి లింక్ చేయించారు. రైతుల సమాచారాన్ని పోర్టల్‌లోకి అప్లోడ్ చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయి పాలనా యంత్రాంగం రుణమాఫీ బాధ్యతను స్వీకరించింది.కటాఫ్ తేదీనే కీలకం..తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక దానిపై కొంత కసరత్తు జరిగింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కసరత్తు చేపట్టిన అధికారులు.. మహారాష్ట్రలో అధ్యయనం చేశారు. తెలంగాణలో రైతుల రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే.. వడ్డీతో కలిపి దాదాపు రూ. 35 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. కటాఫ్ తేదీని బట్టి ఈ మొత్తం మారొచ్చని అధికారులు అంటున్నారు.అయితే బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపచేయాలా, వద్దా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు సంపన్నులకూ రైతుబంధు ఇచ్చి దుర్వినియోగం చేశారంటూ విమర్శలున్న నేపథ్యంలో.. రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు ప్రచారం అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినతేదీ డిసెంబర్ 9ని పంట రుణమాఫీకి కటాఫ్ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7వ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు సమాచారం. -
రుణమాఫీపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్ సచివాలయంలో జరగనుంది. లోక్ స భ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకా శం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణాల ను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లక్షల రూపాయల వర కు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఒక నిర్ణయం తీసు కుని.. నిధులు సమకూర్చే బాధ్యతను అధికార యంత్రాంగంపై పెట్టే అవకాశం ఉంది.ధాన్యం కొనుగోళ్లపై చర్చప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (కాళేశ్వరం) రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది.ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. -
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి నిధుల సర్దుబాటు అంశం ఆర్థిక శాఖను కలవరానికి గురి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులు, కేంద్ర గ్రాంట్లు, రాష్ట్రానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం.. రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు, గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంటే.. రుణమాఫీకి నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిధుల వేటలో తలమునకలైంది. రైతు రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని దాదాపు రూ.40 వేల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, గృహ నిర్మాణం ఎలా?ఎన్నికల సమయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు సంక్షేమ మండలి (ఎఫ్‌డబ్ల్యూసీ)కి రైతు రుణాలన్నింటినీ బదలాయించి, రైతుల పాస్ పుస్తకాలను విడిపించి వారికి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే కార్పొరేషన్‌కు రుణ మొత్తాన్ని బదలాయించినా..ఆ మొత్తం ‘ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఈ ఒక్క పథకానికే భారీ మొత్తంలో నిధులు తీసుకుంటే, మిగిలిన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం తదితర పథకాలకు నిధులెలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అప్పు చెల్లించడానికి అప్పు కుదురుతుందా?దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ, అసలు కలుపుకొని రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు అంగీకరించినా.. రుణమాఫీ కింద ప్రతినెలా చెల్లించేందుకు రూ.800 కోట్లకు పైగానే కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అనివార్య ఖర్చుల భారం పెరిగి ఇతర కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ఇప్పుడు కొత్తగా చేరే రుణమాఫీ పద్దు ఖజానాకు భారమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు అప్పు చెల్లించడం కోసం తిరిగి అప్పు చేయడానికి ఆర్థిక సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక మహాలక్ష్మి, ఉద్యోగుల పీఆర్సీ, ఇతర పథకాలు దశల వారీగా అమలు చేసినా.. వాటికి కూడా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారవర్గాలు అందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి.తొలి మూడు నెలల్లో రూ.11 వేల కోట్లుఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రణాళికల్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా తొలి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్) రూ.11 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. ఆ మొత్తంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లు పూర్తి కాగా, మే నెలలోనే మరో రూ.2 వేల కోట్ల రుణ సేకరణ ఆర్బీఐ వద్ద షెడ్యూల్ అయి ఉంది. జూన్‌లో మరో రూ.3వేల కోట్లను తీసుకోనుంది. మొత్తం మీద ఆర్బీఐకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ మూడు నెలల్లో రూ.11 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఎన్నికల వేళ అప్పుల మోతఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల మోత మోగించింది. ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించింది. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంది.ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.2 వేల కోట్లు తీసుకోగా, మే నెలలో రెండు దఫాల్లో రూ.4 వేల కోట్లను సేకరించింది. ఏప్రిల్ 23న రూ.1,000 కోట్లు, అదే నెల రెండో తేదీన రూ.1,000 కోట్లు, మే 7వ తేదీన రూ.3 వేల కోట్లు, మే 14న మరో రూ.1,000 కోట్లు తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నుంచి 28 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. -
మాఫీకి మార్గం చూడండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన విధి విధానా లతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి‘రైతుల సంక్షేమానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్తాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి..’ అని రేవంత్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి‘ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా త్వరగా ధాన్యం కొనాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలి..’ అని సీఎం ఆదేశించారు. -
TG: పాలనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎన్నికలు ముగి శాయి. రాజకీయం అయిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకు సమయం అయిపోయింది. నా విమర్శకులు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం నుంచి సచివాలయానికి వెళ్తానని.. పాలనపై, ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడతానని తెలిపారు. రైతు రుణమాఫీ, తడిచిన ధాన్యం కొను గోళ్లు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్‌లు, హాస్టళ్లకు సన్నబియ్యం లాంటి కార్య క్రమాల అమలు పనిని ప్రారంభిస్తానని వివరించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు పలు అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ఒక్క మెదక్‌లోనే బీఆర్ఎస్ పోటీలో ఉందిలోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధిస్తాం.మహబూబ్‌నగర్ పార్లమెంటులో 50 వేల మెజా ర్టీతో గెలవబోతున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీలో 20 వేల మెజార్టీతో గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏం చేసిందన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ బలవంతంగా మాకు బీజేపీని ప్రత్యర్థిగా సృష్టించింది. బీఆర్ఎస్ వ్యవస్థనంతటినీ తీసుకెళ్లి బీజేపీకి ఔట్సోర్సింగ్ చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. ఆ పార్టీకి ఐదారు చోట్ల డిపాజిట్లు రావు. ఒక్క మెదక్‌లోనే పోటీలో ఉంది. ఈ ఎన్నికల్లో మోదీ గాలి లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 220కి ఓ పదిశాతం ఎక్కువో, తక్కువో వస్తాయి. కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాదు. 12 సీట్లు గెలిచి ప్రధాని రేసులో ఉంటానన్న కేసీఆర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయినా మాకేం అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం పడిపోవాలంటే బీఆర్ఎస్, బీజేపీలు కలిసే ప్రయత్నం చేయాలి కదా. అలా జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపునకే వెళ్లాలని ఏముంది? సగం మాతో కూడా రావచ్చు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీనే మిగలదు.రైతు రుణాల బాధ్యత తీసుకుంటాంరాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అన్ని విషయాలు చెప్పాం. రైతులకు ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందో లెక్కలు తీయమని చెప్పాం. ఈ రుణాలకు మేం బాధ్యత తీసుకుంటాం. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి ఆదాయం చూపించి రుణాలపై బ్యాంకర్లను ఒప్పిస్తాం. రైతులను అప్పుల నుంచి విముక్తులను చేస్తాం. అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలుబీఆర్ఎస్ గత పాలనలో వివాదాస్పదమైన అన్ని అంశాలపై అసెంబ్లీలో లేదంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటాం. రైతు సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటాం. రైతుకు పెట్టుబడి, గిట్టుబాటు ధరలు కల్పించడంపై నా ఫోకస్ 100 శాతం ఉంటుంది. రైతుబంధు ఇవ్వలేదన్నారు. మే ఆరోతేదీ కల్లా 100 శాతం వేసి చూపించాం. గతంలో డిసెంబర్ వరకూ వేసేవాళ్లు. రైతుబంధు కొత్త నిబంధనలపై ఆషామాషీగా నిర్ణయాలు తీసుకోబోం.రేషన్‌షాపుల్లో సంస్కరణలురేషన్షాపుల ద్వారా గతంలో మేం 9 వస్తువులిచ్చే వాళ్లం. ఇప్పుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తాజాగా రైతులు పండించే అన్ని పంటలను గిట్టు బాటు ధర కంటే కొంచెం ఎక్కువే ఇచ్చి కొనుగోలు చేసి వాటిని ఉత్పత్తుల కింద మార్చి రేషన్‌షాపుల ద్వారా పేదలకు తక్కువ ధరకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. వడ్లు కొని మేమే సన్న బియ్యం తయారు చేసి పేదలకిస్తాం. ఇక్కడ పండే దొడ్డు బియ్యాన్ని ఎఫ్సీఐకిస్తాం. మిల్లర్లు ఎక్కడైనా తేడా చేస్తే లోపల వేస్తా. రైతుకు, వినియోగదారుడికి మధ్య వారధిగా ప్రభుత్వం ఉంటుంది. పదేళ్లలో వందేళ్ల ప్రణాళికలుపదేళ్లు ఇక్కడే ఉంటా. 2024–34 వరకు తెలంగాణ రాష్ట్రమే నా ప్రపంచం. ఈ పదేళ్లలో వందేళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించి భావితరాలకు అందించడమే నా బాధ్యత. కొత్తగా మంత్రి పదవులు రెండయితే గ్యారంటీ వస్తాయి. నేనైతే అధిష్టానాన్ని నాలుగు భర్తీ చేసుకునేందుకు అనుమతి అడుగుతున్నా. అనుమతి లభిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి. యూటీ.. ఓ విఫల ప్రయోగంహైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తారనే చర్చ చేస్తున్న వారికి మెదడు లేనట్టే. తలకు మాసినోళ్లు చేసే చర్చ అది. యూటీ ఎందుకు చేస్తారు? అదో విఫల ప్రయోగం. ఏపీతో సానుకూల వైఖరితోనే ముందుకు..ఏపీ నుంచి ఎవరు సీఎం అయినా వారితో కలిసి పనిచేస్తా. సానుకూల వైఖరితోనే ముందుకెళ్తా. -
క్రాప్‌లోన్ కట్టాల్సిందే...!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి. భరోసా ఇవ్వని యంత్రాంగం...అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు. అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు. -
అలాగైతే తప్పుకుంటా
కరీంనగర్ టౌన్, సిరిసిల్ల: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచే తప్పుకుంటా... నిరూపించకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్‌తోపాటు తెలంగాణ ఉద్యమకారుడు కుమార్ తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహా్వనించారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కుట్రలతో నన్ను ఓడించాలని చూస్తుండ్రు కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చీకటి ఒప్పందాలతో తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నారని నిందించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని, ఆయన తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వరి్ధల్లు’అని అర్థమన్నారు. పరారీలో దోచుకున్న కుటుంబం మొన్నటివరకు బోయినపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని సంజయ్ ఆరో పించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్‌కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప వినోద్‌కుమార్ సాధించేదేమీ లేదని సంజయ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ‘సెస్’మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ పాల్గొన్నారు. -
కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు. ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పట్లో సాధ్యం కాదా? ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్ నుంచే వానాకాలం సీజన్ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని, రె న్యువల్ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్ చేయడం గమనార్హం. కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. -
సిగ్గు ఎగ్గూ అన్నీ ఒగ్గేసీ...
హ.. హవ్వ! చదివిన వాళ్లు నవ్వుకుంటారే అని సిగ్గు ఎగ్గూ అన్నింటినీ ‘ఈనాడు’ వదిలేసింది. అధికారంలోకి వస్తే డ్వాక్రా (పొదుపు సంఘాల) రుణాలన్నీ (రూ.14,203.58 కోట్లు) భేషరత్తుగా మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు మాటిచ్చి ఆ తరువాత ఒక్క రూపాయీ మాఫీ చేయని చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల మహిళలందరూ ఓ వెలుగు వెలిగారట. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి (2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలో అందజేస్తే.. పొదుపు సంఘాలను, మహిళలు నిలువునా మోసం చేయడమట. ఇలాంటి పచ్చి అబద్ధాలను రామోజీరావు తన ‘ఈనాడు’ పత్రికలో ‘నాడు దర్జా– నేడు గజగజ, డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం’ అంటూ రోత రాతలు అచ్చేశారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయని అంశాన్ని అప్పటి మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా వెల్లడించినా.. ఆ అంశాన్ని రామోజీ తన రాతల్లో ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. – సాక్షి, అమరావతి ఈనాడు అబద్ధం: 2014 –19 మధ్య టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు ఉన్నతి పథకంలో రూ. 800 కోట్లు వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీగా వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారితకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్టు గొప్పులు చెప్పుకునే జగన్.. ఈ ఐదేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వాస్తవం: ఉన్నతి పథకం ద్వారా ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో 2.40 లక్షల మందికి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల మంది వడ్డీ లేని రుణాలను అందజేసింది. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా ఒక్కొక్కరి గరిష్టంగా కేవలం రూ. 30 వేల వరకు మాత్రమే రుణాలు ఇచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లు, అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్లు కలిపి మొత్తం తొమ్మిదేళ్లలో 1.67 లక్షల మందికి రూ. 800 కోట్లు ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తే, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలోనే 2.40 లక్షల మందికి రూ. 900 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందజేసింది. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం(ఒక్క ఏడాది)లోనే దాదాపు రూ.200 కోట్లు ఇచ్చింది. ఈనాడు అబద్ధం: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీలోనూ కోత పెట్టింది. వాస్తవం: బ్యాంకులో రుణం తీసుకొని సకాలంలో కిస్తీల వారీగా చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ.4969.05 కోట్లు చెల్లించింది. ఆర్థిక ఏడాది ముగిసిన వెంటనే ఠంచన్‌గా సున్నా వడ్డీ పథకాన్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. దీని ద్వారా ఏటా 1.05 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు. ఇంకోవైపు.. చంద్రబాబు ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో చివరి మూడు సంవత్సరాలు 2016 ఆగస్టు తర్వాత కాలానికి సున్నా వడ్డీ పథకానికి నిధులే ఇవ్వలేదు. ‘ఈనాడు’ తన కథనంలోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని అంగీకరించింది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న ఈ పథకానికి నిధులే విడుదల చేయలేదు. అదే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూనే.. నవరత్నాల కార్యక్రమాలు ద్వారా కూడా అదనపు లబ్ధి చేకూర్చింది. ఈనాడు అబద్ధం: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘మిత్ర’లకు తీరని ద్రోహం చేసింది. వాస్తవం: రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆ కోటి మందిలో ఓ రెండు మూడు వేల మందిని అప్పటి టీడీపీ ప్రభుత్వం భీమా మిత్రలుగా నియమించింది. ఆ నియామకాలు కూడా అప్పటి జన్మభూమి కమిటీ సభ్యుల తరహాలోనే జరిగాయి. తమ పరిధిలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వం ఇచ్చే బీమా సొమ్ములో కనీసం పది శాతం లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలూ ఉండేవి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన అనంతరం ఇప్పుడు ఈ కార్యక్రమాలను వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిపిస్తోంది. బీమా లబ్ధిదారుల నుంచి ఒక పైసా కూడా వసూలు చేయకుండా అందిస్తున్నారు. బీమా ప్రీమియాన్ని కూడా పూర్తిగా రద్దు చేసింది. -
రుణమాఫీపై సర్కారు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల కొర్రీలు పెట్టిందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ. 25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని ధ్వజమెత్తింది. మరోవైపు అయిదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం.. చివరకు కేవలం 23 లక్షల మంది రైతులకే రుణ మాఫీ చేసినట్టుగా అధికారులు లెక్కలు తేల్చినట్టు సమాచారం. దాదాపు 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్‌లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చాయి. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్ను ఇంటింటికీ పంపారు. అందులో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని, మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ అందులో ఇచ్చిన హామీలు అమలయ్యాయా?’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. -
మళ్లీ రెడీ.. మోసం గ్యారంటీ
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. ‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు. కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. షరతులతో కత్తెరలు రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు. మాట మార్చి.. రైతులను ఏమార్చి 2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు. అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్‌పై ఆర్బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు. నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు 2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది. మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు. దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. -
రబీ రంది తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ అయ్యింది. 9.44 లక్షల ఎకరాల్లో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు సాగు చేశారు. అందులో 1.47 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మరో 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయి. ఈ కీలకమైన సమయంలో సొమ్ము పడకపోతే ప్రైవేట్ అప్పులే శరణ్యమని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈనెల 12 నుంచి రైతుబంధు ప్రక్రియ ప్రారంభం కాగా, ఎకరాలోపు భూమి ఉన్న రైతుల్లో.. అది కూడా కొందరికే సొమ్ము పడింది. వాస్తవంగా రోజుకో ఎకరా చొప్పున మొదటి రోజు ఎకరా వరకు, రెండో రోజు రెండెకరాలు... ఇలా రోజుకు ఎకరం చొప్పున గతంలో ఇచ్చేవారు. అలాగే ఇస్తామని అధికారులు కూడా చెప్పారు. కానీ ఎకరాకు మించి భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందలేదని రైతులు అంటున్నారు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలు: అధికారంలోకి రాగానే రైతుబంధు సొమ్ము అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఆ ప్రకారం రైతుబంధు సొమ్ము జమ ప్రక్రియ ప్రారంభమైంది. అది ఎకరాలోపు కొందరికి మాత్రమే ఇచ్చి నిలిచిపోయింది. మిగిలిన వారికి సొమ్ము పడలేదు. మొత్తం రైతుబంధు లబ్దిదారులు 68.99 లక్షలున్నారు. వారందరికీ కలిపి రూ.7,625 కోట్లు చెల్లించాలి. ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వారికి రూ. 642.57 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు ఎకరాలోపున్న వారి లో సగం మందికే రైతుబంధు వచ్చింది. మొత్తంగా చూస్తే రైతుబంధు కోసం ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధులు లేకపోవడం వల్లే రైతుబంధు ఆలస్యమవుతుందని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరుకైనా ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత పంటల రుణమాఫీ పూర్తికాకపోవడం, ఇంకా పెండింగ్‌లో ఉండటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొత్త రుణమాఫీపై కసరత్తు... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖకు విన్నవించినట్టు తెలిసింది. గత రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటారా? లేక కొత్తగా అదనపు నిబంధనలతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
మూడింటిపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి. మాఫీ కోసం రూ.36 వేల కోట్లు! రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 15వ తేదీకల్లా రైతు బంధు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులపై కసరత్తు ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి. ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి? సీఎం రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు. తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్‌ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
రైతులను మోసం చేసింది మీ బాబే రామోజీ
సాక్షి, అమరావతి: రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చంద్రబాబు చేసిన వాగ్దానాలను అప్పట్లో తుంగలో తొక్కినా రామోజీరావు తన పత్రికలో ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఇచ్ఛిన హామీలకంటే మిన్నగా రైతులకు ఈ ప్రభుత్వం సాయం చేస్తుంటే నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. దుష్ప్రచారమే లక్ష్యంగా అబద్ధాలను పోగేసి ‘సున్నా వడ్డీలో మహా మోసం’ అంటూ మరో కథనాన్ని శనివారం ఈనాడు పత్రిక అచ్చేసింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పైసా భారం పడకుండా ఉచిత పంటలబీమా, సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం, సకాలంలో సున్నా వడ్డీ రాయితీ సహా రైతులకు మేలు చేసే ఎన్నో పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నా నిజాలను వక్రీకరించి వక్రరాతలు రాసేసింది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగు వేళ తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో శ్రీకారం చుట్టింది. రూ. లక్ష లోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాక మునుపే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని అందించడం కోసం ఈ క్రాప్ డేటా ఆధారంగా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. గతంలో రైతుపైనా వడ్డీ భారం గతంలో రూ. లక్ష లోపు పంట రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలు చేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తే, మిగిలిన 4 శాతం వడ్డీని రైతులు భరించేవారు. ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునేవి. గతంలో క్లయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్‌లకు మాత్రమే అధికారం ఉండేది. దీంతో ఎంత మంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. పారదర్శకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటాను ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాలు) పోర్టల్ ((https://karshak.ap.gov.in/ysrsvpr/))లో ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఏడాదిలోగా రూ. లక్ష లోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, ఒక వేళ జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాలో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వంప్రతీ ఏటా క్రమం తప్పకుండా జమ చేస్తోంది. రైతులలో జవాబుదారీతనాన్ని పెంచడం, సకాలంలో రుణ చెల్లింపు అలవాటు పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఈ పథకం ద్వారా రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాలకే జమ చేస్తోంది. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లింపు టీడీపీ ఐదేళ్ల హయాంలో సుమారు 40.61 లక్షల మందికి కేవలం రూ. 685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 4.5 ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో 39.08 లక్షల మంది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిలున్నాయి. కాగా రబీ 2021–22, ఖరీఫ్–2022 సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాయితీ సొమ్మును డిసెంబర్లో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడ్డీ రాయితీని సకాలంలో అందించడమే కాదు. రైతులకు సంస్థాగత రుణాలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 2019 ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటి వరకు రూ. 8,24,428 కోట్ల పంట రుణాలను ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించారు. అంతేకాదు వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల ద్వారా 14 లక్షల మంది కౌలురైతులకు రూ. 8,054 కోట్ల వ్యవసాయ రుణాలు అందించింది. ఈ ఏడాది అత్యధికంగా 8.22 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, వారిలో ఇప్పటికే 4.88 లక్షల మందికి రూ.1,385.25 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. అంతేకాదు.. రైతు భరోసా కింద 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ. 33,209.81 కోట్లు, రాయితీపై విత్తన సరఫరా కోసం 74.45 లక్షల మందికి రూ. 1,316.57 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.50 లక్షల మందికి రూ. 7,802.05 కోట్లు, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1,977 కోట్లు చెల్లించి రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. మరో వైపు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేస్తోంది. -
రుణ మాఫీ, కుల గణన
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈ నెల 7, 17వ తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కులగణన, ధాన్యానికి మరింత మద్దతు ధర, రైతులకు రుణామాఫీ, సబ్సిడీ ధరకే వంటగ్యాస్ వంటివి ఇందులో ప్రధాన హామీలుగా ఉన్నాయి. రాజ్‌నందన్‌గావ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం బఘేల్ ఎన్నికల హామీలను ప్రకటించారు. మళ్లీ అధికారమిస్తే.. ఎకరానికి 20 క్వింటాళ్ల వరిధాన్యాన్ని రూ.3,200 చొప్పున కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని తెలిపారు. తునికాకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.4 వేలకు బదులు రూ.6 వేలు చెల్లిస్తామని, సేకరణ దారులకు అదనంగా రూ.4 వేల బోనస్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. -
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని సీపీఎం హామీనిచ్చింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతూ మేనిఫెస్టోలో పలు అంశాలను జోడించింది. రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని కోరతామని పేర్కొంది.ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రు ణాలు, సబ్సిడీలు, పంట బీమా, కౌలు, పోడు రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తి డి చేస్తామని సీపీఎం పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో సాగులో వున్న అర్హులైన అందరికీ హక్కు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపింది. 10 ఎకరాల లోపు రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉచితంగా ప్రభుత్వం అందించాలని కోరింది. సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. ♦ ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఆ ఇళ్ల నిర్మాణానికి రు. 10 లక్షల ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం. ♦ ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటిస్థలం ఉచి తంగా కేటాయించాలి. ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలి. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు రూ.10 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. వారి పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ స్కీంను అమలు చేయాలి. ♦ ప్రభుత్వ భూములను ఆర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని పోరాడుతాం. ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న, సాగుచేస్తున్న పేదలకు పట్టాల కోసం పోరాటం చేస్తాం. ♦ భూమి లేని వ్యవసాయ కూలీలకు మిగులు భూ మి పంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ♦ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు తగ్గకుండా నిర్ణయించేవరకూ పోరాటం. ♦ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కృషి చేస్తాం. ♦ అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ తదితర స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు జరిగే పోరాటాలకు అండగా ఉంటాం. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ అమ లు, హెల్త్ స్కీమ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. ♦ బీసీ కులాలకు జనగణన చేపట్టాలి. ♦ 250 యూనిట్లలోపు కరెంటు వాడకం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ♦ నిరుద్యోగులకు రూ. 5 వేల భృతి ఇవ్వాలి. ♦ సింగరేణి కోల్ బ్లాకులను ప్రైవేటుపరం చేయకుండా ఒత్తిడి తెస్తాం. ♦ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వంపై పోరాడతాం. ♦ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి. ♦ కాటికాపరుల వృత్తిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇవ్వాలి. -
ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీరికి వెంటనే రుణమాఫీ సొమ్ము అందజేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... రుణమాఫీకి సంబంధించి ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యక్రమంలో రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లు ఆర్థికశాఖ విడుదల చేసిందన్నారు.17.15 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయన్నారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కారమార్గాలు కనుగొన్నారు. ఆధార్ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది. ఎన్పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు. మిగతా 16 వేల మందికి సంబంధించి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌సెల్ రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలి.. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. కొత్త రుణాలు మంజూరు చేయాలి రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పారు. రుణమాఫీ పొందినవారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యూవల్ పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యూవల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణమాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబంధిత అన్ని సమస్యలు పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. -
రాజన్న రాజ్యంలో రైతే రారాజు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వేసిన ప్రతీ అడుగు, చేసిన ప్రతీ ఆలోచన రైతుల కోసమే. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో అమలుచేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలలో చెరగని ముద్రవేశాయి. ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకంతో మొదలైన తన పాలనలో అడుగడుగునా రైతులకు తోడుగా నిలిచారు. రుణమాఫీతో రైతుకు వెన్నుదన్ను.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణమాఫీని అమలుచేయగా, దేశంలోనే అత్యధికంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 64లక్షల మంది రూ.11,100 కోట్ల లబ్ధిపొందారు. రుణమాఫీ దక్కని 36 లక్షల మంది రైతులకు “ప్రోత్సాహం కింద’ ఒకొక్కరికి రూ.5వేల చొప్పున రూ.1,800 కోట్లు అందించారు. పునరావాస ప్యాకేజీ కింద.. వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన భూ యజమానులు, కౌలుదారుల కుటుంబాలకు సైతం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. అలాగే, ఉమ్మడి ఏపీలోని 23 డీసీసీబీల్లో 18 డీసీసీబీలు దివాళ తీసే స్థాయికి చేరుకోగా, వైద్యనాథన్ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800 కోట్ల సాయం అందించి సహకార రంగం పునరుజ్జీవానికి బాటలు వేశారు. ప్రపంచంలోనే తొలిసారి పావలా (3 శాతం) వడ్డీకే రుణాలకు శ్రీకారం చుట్టారు. కనీస మద్దతు కనీవినీ రీతిలో పెంపు.. 1999లో క్వింటాల్‌కు రూ.490 ఉన్న ధాన్యం కనీస మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550కు చేరింది. ఐదేళ్లలో పెరిగిన ఎమ్మెస్పీ కేవలం రూ.60 (12.5%) మాత్రమే. అలాంటిది 2004–09 మధ్య రూ.550 నుంచి రూ.1,000కు అంటే అక్షరాల రూ.450 (78.5%) పెరిగిందంటే అది ఆ మహానేత కృషి ఫలితమే. ధాన్యంతో పాటు ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచగలిగారు. తండ్రి బాటలో తనయుడు రైతుల కోసం ఆ మహానేత ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానంటూ అధికారంలోకి వచ్చింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమం కోసమే సీఎం జగన్ అహరహం శ్రమిస్తున్నారు. మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవంగా రైతుల మధ్యలో జరుపుకుంటున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించేలా ఆర్బీకేలు తీసుకొచ్చారు. సహకార రంగ బలోపేతానికి రూ.295 కోట్ల మూలధనంగా సమకూర్చారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇక సంక్షేమ పరంగా చూస్తే.. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా రైతు సంక్షేమం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాల రూ.1,70,769.23 కోట్ల లబ్ధిని చేకూర్చింది. -
త్వరలో రూ. లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీ
మెదక్: త్వరలో రూ.లక్షకుపైగా ఉన్న రైతు రుణాలను సైతం మాఫీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రూ.99,999వరకు రుణాలన్నీ మాఫీ అయ్యాయని అన్నారు. బ్యాంకు అకౌంట్లు వినియోగంలో లేకపోవడంతో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్లు తెలిసిందన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని, ఆ రెండు పార్టీలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పు డు అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముతోందని, ఆ పార్టీ అధికా రంలోకి వస్తే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 35 –40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గతంలోకంటే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇంటి ముందు అభివృది్థ.. కంటి ముందు అభ్యర్థి నినాదంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. హరీశ్ వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
ఒక్క రూపాయి 20 లక్షల మంది రైతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు. రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్‌గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అంతు చూస్తారట!
75 ఏళ్ల ముసలాయన, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు మాట్లాడుతున్న మాటలు వినండి. అధికారం ఇస్తే ఏం చేస్తారో వీళ్ల నోటితో వీళ్లే చెప్పారు. తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట.. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట.. మట్టుబెడతాడట.. ఉగ్రరూపం చూపిస్తాడట.. ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట! ఇదీ ఈ పెద్దమనిషి నైజం. ఇలాంటి ఆయన కోసం ఆయన దత్తపుత్రుడు పరుగెడుతున్నాడు. ఈ పెద్దమనిషికి ఏనాడైనా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఉందా? ఫలానా పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేం రాజకీయం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: ‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అలా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే గొడవలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాత్రలు, సభల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నిజంగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ‘వారు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేశారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. ఎక్కడికక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న వారి పట్ల మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. శవ రాజకీయాలు చేస్తున్నారు. ♦ మొన్న అంగళ్లులో చంద్రబాబు తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించారు. మళ్లీ పుంగనూరులో ఒక రూటుకు అనుమతి తీసుకొని ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు మీకు అనుమతి లేదని, అక్కడ అధికార పార్టీవాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు. ♦ దీంతో చంద్రబాబు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాళ్ల క్యాడర్‌ను రెచ్చగొట్టి 47 మంది పోలీసులను గాయపరిచారు. ఒక పోలీసు సోదరుడికి కన్ను కూడా పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన ♦ ఈ పెద్దమనిషి చంద్రబాబు మనస్తత్వం చూడండి. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి వారిని నానా ఇబ్బందులకు గురిచేశాడు. బీసీల తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నిలువునా దగా చేశాడు. ♦ మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొన్న విషయం గుర్తుకు తెస్తున్నా. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఏ రోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు. ♦ అక్కచెల్లెమ్మలను సైతం మోసం చేశాడు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అగౌరవ పరిచాడు. ఇటువంటి పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టకుని ఊదరగొడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే ♦ 2014కు ముందు ఈయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశాడు. రూ.85,712 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, చేయకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. ♦ రూ.14,207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. చివరకు చదువుకుంటున్న పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను లేదా ఉపాధి కల్పిస్తాను అని నిస్సిగ్గుగా అబద్ధాల వాగ్దానాలు చేశాడు. లేదంటే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ రూ.2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ ఏటా రూ.24 వేలు అలా ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మోసం చేశాడు. ♦ మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే అధికారం కావాలి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. నాడు, నేడు అదే బడ్జెట్.. ♦ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మారాడు. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావాలని ప్రయత్నం చేశాడు. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని ఆలోచించండి. ♦ మీ బిడ్డ మీ కోసం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఈ నాలుగేళ్లలో ఇంతటి సంక్షేమాభివృద్ధిని ఏనాడైనా చూశామా? చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా? నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా ఇచ్చారా? ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేశాడా? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలంటే కూడా వద్దన్న చరిత్ర ఆయనది. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు మాత్రం ఇంగ్లిష్ మీడియం కావాలి. ♦ చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించడం ఎప్పుడైనా చేశారా? ఇలా చేయలేకపోయిన ఈ 75 ఏళ్ల ముసలాయన వాటిని అడ్డుకోవడంలో మాత్రం ముందుంటారు. దత్తపుత్రులు ఎందుకిలా పరుగెడుతున్నాడంటే ఆయన సీఎం కావడానికి కాదట. ఈ ముసలాయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికట. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా? ♦ మీకు మంచి చేయడానికి వస్తున్న వలంటీర్లను కూడా వదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయ, మీ దీవెనలనే. మీకు మంచి జరిగి ఉంటే నాకు మద్దతివ్వండి. అమలాపురంలో మూడు వంతెనలకు రూ.10 కోట్లు అమలాపురంలో మూడు పాత బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిని పునర్ నిర్మించాలని మంత్రి విశ్వరూప్ అడిగారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం.. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం.. అని విశ్వరూప్ చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్‌ను, లేదా అతని కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను బాగా తిరిగి ఏం పనులు కావాలో చెప్పాలన్నాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. -
రుణమాఫీ సొమ్ము వెనక్కి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ సొమ్ము కొందరు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కి వస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయా రైతుల రుణ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌లో ఉండటం లేదా డిఫాల్ట్లో ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అనేకమంది రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు రూ.50 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. మూడు సీజన్లలో చెల్లించకుంటే డిఫాల్టరే... రాష్ట్రంలో ప్రతీ ఏటా సరాసరి 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే, తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పుడు టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) హామీ ఇచ్చి న సంగతి తెలిసిందే. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.1,200 కోట్లకు పైగా రుణమాఫీ చేశారు. మిగిలిన మొత్తం సొమ్మును మరో నెలన్నరలో మాఫీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సొమ్మును విడతల వారీగా జమ చేస్తున్నారు. బకాయిలు చెల్లించమని సర్కారు విన్నవించినా... ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేకమంది రైతులకు రెన్యువల్ సమస్య వచ్చి ంది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు గుంజుకున్నాయి. అలా రెన్యువల్ చేశాయి. రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం గతంలో విన్నవించిన సంగతి తెలిసిందే. కొందరు రైతులు అలా చెల్లించగా, మరికొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలినట్లు అంచనా. రుణమాఫీ అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో జరగడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చి పడింది. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. -
రైతు రుణమాఫీ ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం పునఃప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ప్రకారం ఆర్థికశాఖ పూర్తి రుణమాఫీ కోసం రూ. 18,241 కోట్ల విడుదలకు గురువారం ఉత్తర్వులు (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) జారీ చేసింది. మొదటి విడతలో భాగంగా రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మధ్యన ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 237.85 కోట్లు విడుదల చేసింది. దీంతో 62,758 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు సంక్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారన్నారు. రైతు రుణమాఫీకి ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రైతు బీమా దరఖాస్తులు అప్లోడ్ చేయండి... రైతు బీమా పథకానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే కొత్త దరఖాస్తులను అప్లోడ్ చేయాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం సచివాలయంలో అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను వాడేలా మరింత ప్రోత్సహించాలన్నారు. నేల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దిశగా రైతాంగాన్ని చైతన్యపరచాలన్నారు. పంటల సాగు వివరాలు వెంటనే తెలియజేయాలన్నారు. 83 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు.. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 83 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలు, 7.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగయ్యాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇటీవలి వర్షాలతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెపె్టంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ సీజన్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయిల్‌పామ్ సాగును అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. -
రుణమాఫీ మళ్లీ షురూ.. గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చక్కబడిన నేపథ్యంలో, రాష్ట్రంలోని రైతుల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా, కేంద్రం వైఖరితోనే ఆలస్యం ‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. అయితే కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం రాష్ట్రం పట్ల అనుసరించిన కక్షపూరిత వైఖరి తదితర కారణాల వల్ల ఏర్పడిన ఆర్థిక లోటుతో.. రుణ మాఫీ ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైంది. కానీ రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే వస్తోంది. మేం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. రైతు సాధికారత సాధించే వరకు, రైతులను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు..’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని తెలిపారు. బకాయిలు చెల్లించినా మాఫీ వర్తింపు! లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటివరకు రూ.36 వేల వరకు బకాయిలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు మిగిలిన వారికీ మాఫీ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద తీసుకున్నాయి. మరోవైపు కొత్త రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించినట్టైతే తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కొందరు రైతులు సొంతగా బ్యాంకులకు చెల్లింపులు చేశారు. కొందరు మాత్రం చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. కాగా కొత్త రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు రుణం చెల్లించిన రైతులకు సైతం ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రైతుల జాబితా ప్రకారమే సొమ్మును వారివారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని అధికారులు అంటున్నారు.రూ.19 వేల కోట్ల చెల్లింపుతో రూపాయి కూడా మిగలకుండా తెలంగాణలో సంపూర్ణ ‘రైతు రుణమాఫీ’కార్యక్రమం పూర్తి కానుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 42 లక్షల ఖాతాలకు సంబంధించి రుణమాఫీ జరగనుంది. తద్వారా 29.61 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రైతుబంధు తరహాలో విడతల వారీగా.. ► రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలా పదిహేను రోజుల్లో, సెపె్టంబర్ రెండో వారం వరకు రైతు రుణమాఫీ కార్యక్రమం మొత్తం పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే పునఃప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆగస్టు 3వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరి్వంద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రైతు రుణమాఫీ పూర్తి చేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి హైదరాబాద్: రైతు రుణమాఫీ పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రేపట్నుంచి(ఆగస్టు3వ తేదీ) రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్లో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు కేసీఆర్. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు, తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లు రైతు రుణమాఫీ కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు. -
స్తబ్ధత వీడేలా.. జోరుగా
సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది. ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు. 20 నుంచే రంగంలోకి కిషన్‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్‌తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. -
మళ్లీ వస్తున్నాడు.. దొంగ హామీల ‘బాబా’.. బాబ్బాబు నమ్మండి ‘బాబు’
సాక్షి, అమరావతి: ఏవేవో హామీలతో ప్రజలను బుట్టలో వేసుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలను వంచించడంలో సిద్ధహస్తుడుగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి దొంగ హామీలతో మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థి కంగా పైకి తీసుకొస్తా, టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తా, ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చేస్తా అంటూ ఇప్పటికే రకరకాల మాయ మాటలు చెబుతున్న ఆయన.. మరోసారి ఎన్నికల మేనిఫెస్టో పేరుతో వంచనకు సిద్ధమవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో తయారు చేసే పేరుతో గ్రామ స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ అనే డ్రామాకు తెరలేపారు. యువకులు, మహిళలు, నిరుద్యోగుల వంటి వర్గాలను బుట్టలో వేసుకోవాలంటే ఏమేమి హామీలు ఇవ్వాలంటూ మండల, జిల్లా స్థాయి వరకు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రజలను మాయ చేసే మేనిఫెస్టో కోసం ప్రత్యేకంగా వ్యూహకర్తల బృందాన్ని కూడా నియమించి, వారితో అధ్యయనాలు చేయిస్తున్నారు. వీటిన్నింటినీ క్రోడీకరించి, ఈ నెల 27న రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడులో ట్రైలర్ (శాంపిల్) మేనిఫెస్టోను విడుదల చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మరిన్ని వంచనలతో పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపొందించాలని చంద్రబాబు భావిస్తున్నారు. నమ్మకానికి, చంద్రబాబుకు అస్సలే పడదు ఈ ఎన్నికల మేనిఫెస్టోపై చంద్రబాబు చాలా రోజుల నుంచే పనిచేస్తున్నారు. మేనిఫెస్టో, అందులో హామీలు ఎలా ఉంటే ప్రజలు తనను నమ్మడానికి అవకాశం ఉంటుందో అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే.. నమ్మకానికి, చంద్రబాబుకు అస్సలు పడదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏదైనా ఒక మాట చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో పేరుండగా.. చంద్రబాబుపై మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయం ఉంది. చంద్రబాబు ఏ మాట చెప్పినా అది రాజకీయం కోసమే తప్ప ఆచరణలోకి తీసుకురారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అధికారం కోసం తప్పుడు హామీలతో ప్రజల్ని వంచించిన చరిత్ర ఆయనది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ వంటి అనేక హామీలే ఇందుకు ప్రబల నిదర్శనం. రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత దానికి సవాలక్ష కొర్రీలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. అదే విధంగా డ్రాక్రా మహిళలనూ వంచించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను నమ్మించి, ఎన్నికల ఏడాది వరకు దాని గురించి పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా దాన్ని తూతూమంత్రంగా అమలు చేసి నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. ఇంటికో ఉద్యోగం, బాబొస్తేనే జాబు వంటి ఎన్నో హామీలు బుట్టదాఖలయ్యాయి. 2014 ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు 600కి పైగా హామీలతో చంద్రబాబు ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. అందులో పది శాతం కూడా అమలు చేయలేదు. ప్రతిపక్షాలు, ప్రజలు వాటి గురించి అడుగుతుండడంతో సమాధానం చెప్పలేక చేతులెత్తేసి తోకముడిచేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును చీదరించుకుని చిత్తుగా ఓడించారు. ప్రజలను ఎలాగైనా నమ్మించడమే లక్ష్యం గత ఎన్నికల్లో తనని తిరస్కరించిన ప్రజలను ఎలాగైనా నమ్మించడానికి చంద్రబాబు మాయోపాయం పన్నుతున్నారు. ప్రజలను ఏమార్చే హామీలపై అధ్యయన బృందాలు, వ్యూహకర్తలతో కలిసి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మహానాడులో శాంపిల్ మేనిఫెస్టోను ప్రజల్లోకి వదిలేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ఆయన ఇప్పటికే ప్రజలకు నమ్మబలుకుతున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థపైనా నర్మగర్భంగా ప్రకటనలు చేస్తూ దాన్ని కొనసాగిస్తాననే సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి పలు ప్రకటనల ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ముమ్మరం చేసే క్రమంలోనే మేనిఫెస్టో రాజకీయానికి తెరలేపారు. చంద్రబాబు మాయ మాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్ముతారా అనే ప్రశ్నకు టీడీపీ నాయకులే నీళ్లు నములుతున్నారు. -
మీరు రైతులా! దున్నపోతులా!
ఘట్కేసర్: రైతుల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అన్నదాతలపై విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎక్కడ చేశారని నిలదీసిన రైతుల్ని పట్టుకుని ‘మీరు రైతులా దున్నపోతులా’అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడికక్కడే సభలోనుంచి లేచి నిరసనకు దిగారు. మంగళవారం పట్టణంలోని నారాయణగార్డెన్‌లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన 2022–23 అర్థ వార్షిక నివేదిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనేవారని, నేడు పండుగ వాతావరణంలో సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో హరినాథ్‌రెడ్డి అనే రైతు రుణమాఫీ అవుతుందని తీసుకున్న రూ.80 వేలకు మరో 80 వేలు వడ్డీ అయిందని రుణమాఫీ ఎక్కడ చేశారని అడగగా మరో రైతు మహిపాల్‌రెడ్డి వడ్డీ రేటు తగ్గించాలని కోరారు. దీంతో దున్నపోతుల్లా ఉన్నారు, మీరు రైతులా, బయటకు గుంజుకుపోండని మల్లారెడ్డి ఆదేశించడంతో రైతులు నిరసనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రైతుల్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/మోర్తాడ్(బాల్కొండ)/భీమ్‌గల్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల సమస్యల పరిష్కారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ మాదిరిగా ‘రైతు కమిషన్’ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి ఆదివా రం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వద్ద రైతులతో ముఖా ముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. రైతులను ఆదుకునేందుకు చేసిన వరంగల్ డిక్లరేషన్‌ను అమలు చేసే బాధ్యతను తీసుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా భూమి లేని రైతులకు రూ. 12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నట్లుగా వరికి క్వింటాలుకు రూ. 2,660 మద్దతు ధర ఇస్తామన్నారు. కాగా కేసీఆర్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటూ క్రాప్ హాలిడే ప్రకటిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లో తెరిపిస్తామన్నారు. అలాగే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, ఆరోగ్యశ్రీ కింద రూ. 5 లక్షలు చెల్లిస్తామన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు తామెలా మోసపోయామో ఆలోచించాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, ఎరువులు, విత్తనాలకు సబ్సిడీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం మానేసి కేవలం రైతుబంధు పేరిట ఎకరానికి రూ.10వేలు ఇచ్చి రైతులకు ద్రోహం చేస్తోందన్నారు. పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లే..: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూస్తే ప్రజలు పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన అర్వింద్ మాటతప్పారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజన్న జ్ఞాపకాలు పదిలం.. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలను గుర్తెరిగిన నేతగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలతో ఆయన పాలన సమయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని రైతులు, కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కమ్మర్‌పల్లిలో జరిగిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో వారు రాజన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డికి రైతుల సమస్యలు తెలుసు కాబట్టి ప్రకృతి వల్ల పంటలు దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. సీఎం కూతురునే ఓడించారు హామీలను నేరవేర్చని సీఎం కూతురు కవితనే ఓడించిన ఘనత నిజామాబాద్ జిల్లా రైతులకు ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం భీమ్‌గల్‌లోని లింబాద్రి గుట్టపై లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గుట్ట కింద విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ నేను ఏది చెబితే అది చేస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పదేపదే అంటారని.. అలాంటప్పుడు ఇక్కడి చెరుకు పరిశ్రమను తెరిపించాల్సిన బాధ్యత ఆయనకు లేదా?’అని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పే మంత్రి.. భీమ్‌గల్ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు ఎందుకు తేలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. -
9న రాష్ట్ర కేబినెట్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడం, కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోవడం కోసం రాష్ట్ర కేబినెట్ ఈ నెల 9న సమావేశం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ మొదలుకానుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఇంకా అమలుకాని వాటిని సమీక్షించనున్నట్టు తెలిసింది. నిరుద్యోగ భృతి, సొంత స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం వంటి పథకాల అమలుకు అవకాశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక పేదలకు ఇళ్ల పట్టాలు, గిరిజన రైతులకు పోడు పట్టాల పంపిణీ, దళితబంధు అమలు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా గత నెల 5న ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైనా.. కేవలం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదానికి పరిమితమైంది. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై చర్చ రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా రాష్ట్రం కొత్త రుణాలను సమీకరించలేకపోతోంది. రాష్ట్రంలో కీలక సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయ సమీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. గతంలో బాలానగర్ కో–ఆపరేటివ్ సొసైటీ, హఫీజ్‌పేట మినీ ఇండ్రస్టియల్ ఎస్టేట్, ఆజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాల నుంచి పలు పరిశ్రమలను నగర శివార్లలోకి తరలించారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన స్థలాలను క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రానుంది. వాలంతరి భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించాలనే ప్రతిపాదన కూడా సిద్ధమైంది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా కేబినెట్ భేటీలో కీలక ప్రకటనలు వెలువడవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
5.42 లక్షల మందికి రుణాలు మాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రూ. 36 వేల వరకు రుణాలున్న 5.42 లక్షల మంది రుణాలు మాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ బడ్జెట్లో రూ. 90 వేల వరకున్న రుణాల మాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. శాసనసభలో ఆదివారం సభ్యులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బిగాల గణే‹Ù, నలమోతు భాస్కర్‌రావు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, దుర్గం చిన్నయ్య, పొడెం వీరయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ కొల్లాపూర్ మండలం రాంపూర్‌లో రూ. 5.45 కోట్లతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, త్వరలోనే అక్కడ మార్కెట్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. -
రుణమాఫీపై నీలినీడలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు రుణమాఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం 2023–24 బడ్జెట్లో రూ. 6,380 కోట్లే కేటాయించింది. అంటే అవసరమైన సొమ్ములో దాదాపు మూడో వంతు కేటాయించారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కేటాయింపుతో ఎంతమంది రైతులు లబ్ధిపొందుతారన్నది స్పష్టం కావాల్సి ఉంది. పంటనష్ట పరిహారానికి ఈ‘సారీ’... రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినా ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. వాస్తవంగా నెల కిందట దీనికి సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కొత్తగా బెంగాల్ తరహా పంటల బీమా పథకాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. కానీ చివరకు బడ్జెట్లో రైతులకు నిరాశ కలిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. మూడు పథకాలకే సింహభాగం కేటాయింపులు.. 2022–23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ. 26,831 కోట్లు కేటాయించింది. అంటే గత బడ్జెట్‌కన్నా సుమారు రూ. 2,500 కోట్ల మేర కేటాయింపులు పెంచింది. అయితే ఈసారి మొత్తం కేటాయింపుల్లో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకే సింహభాగం కేటాయించింది. రైతుబంధుకు 2022–23లో రూ. 14,800 కోట్లు కేటాయిస్తే 2023–24 బడ్జెట్లో రూ. 15,075 కోట్లు కేటాయించింది. రైతు బీమాకు 2022–23లో రూ. 1,466 కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి బడ్జెట్లో రూ. 1,589 కోట్ల మేర కేటాయింపులు చేసింది. రైతు రుణమాఫీకి 2022–23 బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించి విడుదల చేయని ప్రభుత్వం ఈసారి రూ. 6,380 కోట్లు కేటాయించింది. ఈసారి మొత్తం వ్యవసాయ బడ్జెట్లో ఈ మూడు పథకాలకే రూ. 23,049 కోట్లు కేటాయించింది. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధికి కేటాయించింది తక్కువేనన్న విమర్శలున్నాయి. ప్రగతి పద్దులో వ్యవసాయ కేటాయింపులు ►వ్యవసాయ యాంత్రీకరణకు ప్రగతి పద్దులో రూ. 377.35 కోట్లు కేటాయించారు. ►రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 39.25 కోట్లు ►ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 75 కోట్లు ►కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 17.50 కోట్లు ►రైతుబంధు సమితికి రూ. 3 కోట్లు ►రైతువేదికలకు రూ. 12 కోట్లు ►మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. 75.47 కోట్లు ►వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు రూ. 1.99 కోట్లు ►విత్తనాభివృద్ధి సంస్థకు సాయం రూ. 25 కోట్లు ►మైక్రో ఇరిగేషన్‌కు కేవలం రూ. 1.25 కోట్లు ►ఉద్యాన కార్యకలాపాలకు ప్రోత్సాహం రూ. 7.50 కోట్లు ►ప్రభుత్వ ఉద్యానవనాల అభివృద్ధికి రూ. 3.50 కోట్లు రుణమాఫీ కోసం 31 లక్షల మంది ఎదురుచూపు ►ఊసేలేని పంటల బీమా పథకం.. రైతులకు తప్పని నిరాశ ►అత్యధికంగా రైతుబంధుకు రూ.15,075 కోట్లు కేటాయింపు ఆయిల్‌పామ్ సాగుకు రూ. వెయ్యి కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. నీటివనరులు పుష్కలంగా ఉండటంతో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. ఇది ప్రజల బడ్జెట్ వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించడంపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల బడ్జెట్ అని, తమది రైతు ప్రభుత్వమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి రూ. 26,885 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1,91,612 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. సీఎంకేసీఆర్ రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి ఆదర్శమన్నారు. – వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కేటాయింపే..ఖర్చేది? వ్యవసాయరంగ మొత్తం కేటాయింపుల్లో రైతుబంధుకు, రైతుబీమా పథకాలకు తప్ప మిగిలిన వాటికి కేటాయించిన నిధులను ఎక్కువగా ఖర్చు చేయడం లేదని రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్ ఆరోపించారు. రైతు బంధుకు భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులలో కనీసం 40 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఈ నిధులు వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర సాగుదారుల్లో 35 శాతంగా ఉన్న కౌలు రైతులకుగానీ, పోడు రైతులకుగానీ, భూమిపై హక్కులులేని మహిళా రైతులకుగానీ ఒక్క రూపాయి కూడా రైతుబంధు సాయం అందడం లేదన్నారు. – రైతు స్వరాజ్య వేదిక -
AP: మేలు చేసిన సర్కారుపై.. మహిళాభిమానం
మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి? ఈ ప్రశ్న వేయగానే చంద్రబాబు సమాధానంగా కనిపిస్తారు. మరి అదే మహిళలను ఆదుకున్న ముఖ్యమంత్రిగా... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కళ్లెదుట నిలబడతారు. ఇదే.. ఈ ఇద్దరికీ ఉన్న తేడా. అందుకే ఈ సర్కారును ‘మహిళా పక్షపాత ప్రభుత్వం’గా అంతా గుర్తిస్తున్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రో... ప్రభుత్వమో ఏవైనా సభలు నిర్వహిస్తే ఆ మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావటంలో ఆశ్చర్యమేముంది? దానిక్కూడా బెదిరింపులు... జరిమానాలు.. అంటూ కథలు అల్లాలా రామోజీరావు గారూ? వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉండకూడదన్న కక్షతో రాస్తున్న మీ రాతలు... అబద్దాల్లో ఆస్కార్ స్థాయిని కూడా దాటిపోయాయని ఈ రాష్ట్రంలో తెలియనిదెవ్వరికి? అసలు పొదుపు సంఘాల మహిళల్ని మోసం చేసిందెవరు? సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే బ్యాంకు రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానని, వాయిదాలు చెల్లించొద్దని 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గెలిచాక ఐదేళ్లలో ఒక్క పైసా కూడా మాఫీ చెయ్యలేదు. పైపెచ్చు ఎప్పటికప్పుడు ‘డ్వాక్రా రుణ మాఫీ’పై కథనాలను తన ఎల్లో పత్రికల్లో రాయిస్తూ ఆ మహిళలను ఆశపెట్టి ఉపయోగించుకున్న తీరు దారుణాతి దారుణం. ఆ మహిళలను నిరంతరం టీడీపీ సభలకు తరలించడానికి ఏకంగా టీడీపీ తరుఫున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అడ్వయిజర్‌గా నియమించేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన బత్తుల విజయభారతిని చంద్రబాబు 2014లో తాను సీఎం అయ్యాక సెర్ప్ అడ్వయిజర్‌గా నియమించారు. నిజానికి సెర్ప్ సీఈఓగా ఐఏఎస్ అధికారులే ఉంటలారు. కానీ బాబు తన సామాజికి వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారిని (ఐఏఎస్ కాదు) ముఖ్యమంత్రి ఓఎస్డీ పేరిట నియమించుకుని... ఆయన్నే సెర్ప్ సీఈఓగానూ కొనసాగించారు. పొదుపు సంఘాల మహిళల్ని టీడీపీ సభలకు తరలించటమే ఈ సీఈఓ, అడ్వయిజర్ పని. అధికారికంగా మాత్రం... పొదుపు మహిళలకు ట్రైనింగ్ అని బిల్లులు పెడుతూ... ఆ డబ్బుల్ని మాత్రం వాళ్లను సభలకు తరలించడానికి బస్సులకు, ఇతర వాహనాలకు పెట్టేవారు. అదీ కథ. ఉదాహరణకు బాబు సీఎంగా ఉన్నపుడు నంద్యాలకు ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున డబ్బులు పంచడానికి నియోజకవర్గంలో ప్రతి 50 ఏళ్లకు ఒక పొదుపు సంఘ మహిళను ‘సంఘమిత్ర’గా నియమించారు. ఆ ఎన్నికల ముందు చంద్రబాబే నేరుగా పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారంటే ఈ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశారో తెలియకమానదు. బాబు పాపాల ఫలితమేంటి? పొదుపు సంఘాలను ఇంతలా వాడేసుకున్న బాబు... వాటికి చేసింది మాత్రం ఏమీ లేదు. హామీ ఇచ్చి కూడా... ఒక్క రూపాయిని సైతం మాఫీ చేయలేదు. అప్పటిదాకా ఉమ్మడి ఏపీలో పొదుపు సంఘాలకు ‘సున్నా వడ్డీ’ పథకం అమలయ్యేది. బాబు సీఎం అయ్యాక ఆ పథకానికి నిధులు నిలిపేశారు. దీంతో వడ్డీ డబ్బులు కూడా మహిళలే చెల్లించాల్సి వచ్చింది. ► ఇక బాబు మాటలు నమ్మి మహిళలు వాయిదాలు కట్టలేదు. దీంతో వడ్డీ, చక్రవడ్డీల భారం పెరిగిపోయింది. 2014 నాటికి రూ.14205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అప్పు, 2019 ఏప్రిల్ నాటికి రెట్టింపు స్థాయిలో రూ. 25,517 కోట్లకు చేరింది. 2019 మార్చి నాటికి పొదుపు మహిళలు తీసుకున్న రుణాలు 20వేల కోట్లకు పైగా ఉన్నాయని ఘనంగా చెప్పిన ‘ఈనాడు’... అందులో సగానికి సగం రుణమాఫీ చెయ్యకపోవటం వల్ల మీదపడిన వడ్డీయేనని ఎందుకు చెప్పదు? ఇంతటి కఠిన వాస్తవాన్ని దాచిపెట్టడానికి కాస్తయినా సిగ్గుండాలి కదా రామోజీరావు గారూ? ► పైపెచ్చు 98.4 శాతం రికవరీ అనేది రామోజీరావు రాతల సారాంశం. అదే నిజమైతే 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా (నిరర్థక ఆస్తులు) ఎందుకు మారతాయి? బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని నెలల పాటు కేవలం కేవలం 4.4 శాతం సంఘాలే నెలనెలా సమావేశాలు నిర్వహించుకున్నాయి. గ్రామాల్లో ప్రతి నెలా రూ.70 కోట్ల దాకా ఉండే పొదుపు... జస్ట్ రూ.2 కోట్లకు పడిపోయింది. ► ఉమ్మడి ఏపీలో 2014లో మూడున్నర లక్షల పొదుపు సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉంటే... బాబు సీఎం అయ్యాక 2015 ఏప్రిల్‌కు ఏ, బీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కలిపి 2.54 లక్షలకు పడిపోయాయి. ఇక 2015 నవంబరు నాటికి అవి 38 వేలకు (అంటే కేవలం ఐదు శాతం) పడిపోయాయి. ఈ వాస్తవాలు చాలవా... పొదుపు సంఘాల వ్యవస్థను కూకటివేళ్లతో సహా ఈ చంద్రబాబు... రామోజీరావులు ఎంతలా ధ్వంసం చేశారో తెలియటానికి!!?. ఇప్పుడు.. 91 శాతం సంఘాలది ఏ గ్రేడే... బాబు చేసిన మోసంతో పూర్తిగా అప్పల ఊబిలో మునిగిపోయిన పొదుపు సంఘాలను ఆదుకుంటానని తన పాదయాత్రలో హామీ ఇచ్చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. తాను గెలిచాక నాలుగు విడతల్లో నేరుగా బకాయి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం... 2019 ఏప్రిల్ ఉన్న రూ.25,517 కోట్లు అప్పును నాలుగు విడతలుగా చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వరుసగా రెండేళ్లు రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ► వై.ఎస్.జగన్ ప్రభుత్వం మళ్లీ 2020 ఏప్రిల్ 24న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. గడిచిన మూడేళ్లగా ఏకంగా రూ.3615.29 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించింది. ఫలితం... ఇపుడు 91 శాతం సంఘాలు ఏకంగా ‘ఏ’ గ్రేడ్‌కు చేరాయి. 99.5 శాతం మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారు. ► ఇవేకాక వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, పేదలకు సొంతిళ్లు వంటి పథకాలన్నిటినీ ప్రభుత్వం మహిళల పేరుతోనే అమలు చేస్తోంది. అందుకే మహిళలు ఈ ప్రభుత్వంపై అభిమానం చూపిస్తున్నారు. సభలకు స్వచ్ఛందంగా తరలి వచ్చి జేజేలు పలుకుతున్నారు. దీన్ని భరించలేని కడుపుమంటకు ప్రత్యక్ష రూపమే... ‘ఈనాడు’ కథనం. కాదంటారా రామోజీ? -
రైతు పోరుతో ప్రజల్లోకి కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ను ఎదుర్కొని నిలబడాలంటే ఉద్యమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు రైతు పోరుబాటను చేపట్టనుంది. ముఖ్యంగా రుణమాఫీ జరగని అన్నదాతలు, ధరణి పోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పోడు భూములు సాగుచేసుకుంటూ హక్కుల కోసం పోరాడే ఆదివాసీ, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో మద్దతును, సానుభూతిని పొందాలని భావి స్తోంది. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళనలను నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించింది. మండల స్థాయిలో ఈనెల 24న జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు నవంబర్ 30న నియోజకవర్గస్థాయి నిరసనలు, డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతు పక్షాన ఉద్యమించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు అంశాలను పట్టించుకుంటుందని, టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల సమయంలోనే రైతులకు తాయిలాలు ప్రకటిస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రైతుల పక్షాన ఆందోళనలు ముగిసిన తర్వాత బీసీల సమస్యలపై ఉద్యమించే ప్రణాళికలను కూడా కాంగ్రెస్ పెద్దలు సిద్ధం చేస్తున్నారు. ఆందోళనల కోసం జిల్లాల వారీ ఇన్చార్జులు వీరే.. మహేశ్‌కుమార్‌గౌడ్ (ఆదిలాబాద్), కె. ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), జీవన్‌రెడ్డి (జగిత్యాల), జి. నిరంజన్ (పెద్దపల్లి), వి. హనుమంతరావు (సిరిసిల్ల), పి. సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్), షబ్బీర్‌అలీ, సురేశ్ షెట్కార్ ( కామారెడ్డి), సిరిసిల్ల రాజయ్య (వరంగల్), కొండా సురేఖ (హన్మకొండ), డి. శ్రీధర్‌బాబు (భూపాలపల్లి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), టి. జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (మెదక్), జె. గీతారెడ్డి (సిద్దిపేట). -
అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్
పాలక్కడ్ (కేరళ): కుబేరుల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, రైతులు, చిన్న వ్యాపారులను రుణాల పేరిట వేధిస్తున్న మోదీ అవినీతి సర్కార్‌పై పోరాటమే భారత్ జోడో యాత్ర అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం యాత్ర 19వ రోజు పాలక్కడ్ జిల్లా కొప్పమ్‌లో పార్టీ మద్దతుదారులు, గిరిజన యువతతో రాహుల్ భేటీ అయ్యారు. బీజేపీ సర్కారు తెర తీసిన రెండు రకాల హిందుస్తాన్ పాలనను దేశం సహించబోదన్నారు. గిరిజన వైద్యాన్ని కేంద్రం ఆయుష్‌లో భాగం చేయాలని, గిరి పుత్రుల స్కూల్, కాలేజీ డ్రాప్ఔట్స్ తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గిరిజనులు రాహుల్‌తో అన్నారు. -
అమెరికాలో 10 వేల డాలర్ల దాకా విద్యార్థి రుణాల మాఫీ
వాషింగ్టన్: ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక ముందడుగు వేశారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విద్యార్థుల రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 1.25 లక్షల డాలర్ల కంటే తక్కువ వార్షిక ఆదాయమున్న వారికి 10 వేల డాలర్ల విద్యార్థి రుణాలను మాఫీ చేస్తారంటూ బుధవారం ట్వీట్ చేశారు. న్యాయపరమైన అడ్డంకుల్ని తట్టుకుని ఈ పథకం అమల్లోకి వస్తే లక్షలాది మంది అమెరికా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఆర్థికంగా వెనకబడ్డవారికి అదనంగా మరో 10 వేల డాలర్ల దాకా రుణ మాఫీ అందనుంది. అమెరికాలో 4.3 కోట్ల మంది పై చిలుకు మంది సగటున ఒక్కొక్కరు 37 వేల డాలర్ల చొప్పున విద్యార్థి రుణాలు తీసుకున్నారు. బైడెన్ నిర్ణయంతో వీరిలో కనీసం 2 కోట్ల మంది రుణాలు పూర్తిగా రద్దవుతాయని అంచనా. చదువుకునేందుకు విద్యార్థ రుణాలపై ఎక్కువగా ఆధారపడే నల్ల జాతి అమెరికన్లకు పథకంతో మేలు జరుగుతుందని సమాచారం. -
బడా కార్పొరేట్ల రుణ మాఫీపై చర్చకు సిద్ధమా?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5.8 లక్షల కోట్లను ఎందుకు మాఫీ చేశారు? ఏటా రూ.1.45 లక్షల కోట్ల మేర కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల మాఫీ, కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపుపై చర్చకు ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రద్దు చేసిన రూ.9.92 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని మీడియాకు ఆయన వివరించారు. రద్దైన రుణాల నుంచి కేవలం రూ.1.03 లక్షల కోట్లను మాత్రమే రాబట్టగలిగామంటూ ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించిందన్నారు. రానున్న కాలంలో రుణ రికవరీ మరో 20% మేర పెరుగుతుందని భావించినా అప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ మాఫీ రూ.5.8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ధనికులకు వివిధ రూపాల్లో వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు. -
జన ప్రమేయంలేని చర్చ!
ఎప్పటిలాగే ఉచిత పథకాలపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగానే ప్రజల కోసం అమలయ్యే ఉచిత పథకాల చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు రద్దవుతున్న వైనం గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. బహుశా ఇలా రద్దు చేయడం ఉచితాలకిందకు రాదన్న అభిప్రాయం చర్చిస్తున్నవారికి ఉన్నట్టుంది. గత నెలలో ఒక సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత పథకాలు ప్రకటించడాన్ని ‘మిఠాయిల సంస్కృతి’గా అభివర్ణించారు. ఈ సంస్కృతికి అడ్డదారి రాజకీయంగా కూడా ఆయన పేరుపెట్టారు. ఉచితపథకాల వల్ల ఆర్థికాభివృద్ధి నాశనమవుతుందన్నారు. ఆయన దీన్ని ప్రత్యేకించి ఎందుకు లేవనెత్తారో తెలియంది కాదు. వచ్చే డిసెంబర్లో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మహిళలకు ప్రతి నెలా వేయి రూపాయలు ఇవ్వడంతోసహా బోలెడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. ఇక తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. మధ్య తరగతి, ఆ పై తరగతులవారికి అన్ని రకాల ఉచిత పథకాలపైనా ఎప్పటినుంచో అభ్యంతరం ఉంటోంది. వారి ఉద్దేశం ప్రకారం ఉచిత రేషన్ మొదలుకొని ఉపాధి హామీ పథకం వరకూ అన్నీ వ్యర్థమైనవే. తాము కట్టే పన్నుల ద్వారా సమకూడే రాబడిని ప్రభుత్వాలు ఉచిత పథకాలకింద ప్రజలకు ఇస్తూ వారిని సోమరులను చేస్తున్నాయన్న అభిప్రాయం వారిది. దేశంలో 90వ దశకం మొదట్లో ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక సమాజంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని అట్టడుగు కులాలకు మాత్రమే పరిమితమై ఉండే వృత్తుల్లోకి సైతం సంపన్నవర్గాలు భారీ పెట్టుబడులతో ప్రవేశించి లాభార్జన మొదలుపెట్టాయి. వారితో సరితూగలేక అట్టడుగు కులాలు మరింత పేదరికంలోకి జారుకున్నాయి. సంస్కరణల అనంతరం వచ్చిన సేవారంగం చూస్తుండగానే విస్తరిస్తూ పోతున్నా అందులో ఉద్యోగావకాశాలు బాగా నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే పరిమితమయ్యాయి. నైపుణ్యం అవసరంలేని ఉద్యోగాల్లో కుదురుకున్నవారు సైతం ఆ ఉద్యోగాల స్వభావరీత్యా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. పైగా అవి ఎప్పుడు ఉంటాయో, పోతాయో తెలియని కొలువులుగా మిగిలిపోయాయి. ఇవి చాలదన్నట్టు చంద్రబాబువంటి నేతలు అంతవరకూ నిరుపేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో దొరికే ఉచిత వైద్యానికి కూడా యూజర్ చార్జీలు విధించారు. రైతులు మొదలుకొని అట్టడుగు కులాల వరకూ అనేకులు బతకడానికి దోవలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగానికి చేయూతనివ్వడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకతను కూడా అధిగమించి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అంతవరకూ నామమాత్రంగా ఉండే వృద్ధాప్య పింఛన్‌ను పెంచారు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రాణావసర చికిత్సలు అవసరమయ్యే నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం దక్కేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినవారున్నారు. కానీ ఏ పథకాలు దారిద్య్ర నిర్మూలనకు తోడ్పడతాయో, భిన్న వర్గాల ఎదుగుదలకు ఉపయోగపడతాయో నిర్దిష్టంగా ఆలోచించి నిర్ణయించింది మాత్రం ఆయనే. అందుకే సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ అందరికీ ఆయన పేరే గుర్తుకొస్తుంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘అహేతుక ఉచిత పథకాలు’ అవినీతితో సమానమన్న పిటిషనర్ వాదనను సమర్థించారు. కానీ ఒక పథకం అహేతుకతమైనదో, సహేతుకతమైనదో నిర్ణయించేదెవరు? సుప్రీంకోర్టు ప్రతిపాదించిన నిపుణుల కమిటీ వంటివి ఆ అంశాన్ని నిర్ణయించగలవా? నిపుణులు తటస్థులనీ, అన్ని అంశాలపైనా వారికి సమగ్ర అవగాహన ఉంటుందని, వారి అభిప్రాయాలు శిరోధార్యమని భావించడం ఈ ప్రతిపాదన వెనకున్న భావన కావొచ్చు. కానీ నిపుణుల్లో ఉచితాలు సంపూర్ణంగా రద్దు చేయాలని వాదించేవారున్నట్టే, వాటిని కొనసాగించటం అవసరమని కుండబద్దలు కొట్టేవారున్నారు. అసలు ఉచిత పథకాలపై ఏ పార్టీకైనా నిర్దిష్టమైన అభిప్రాయం ఉందా? అనుమానమే. ఎందుకంటే ఉచిత పథకాలను మిఠాయి సంస్కృతిగా అభివర్ణించిన మోదీయే పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉచిత పథకాల గురించి ఏకరువుపెట్టిన ఉదంతాలున్నాయి. అంతెందుకు? విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి, ప్రతి ఒక్కరి జేబులో రూ. 15 లక్షలు వేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రకటన దేనికిందికొస్తుంది? అసలు ప్రజల ప్రమేయం లేకుండా ఉచిత పథకాల గురించి చర్చించడం దండగ. అన్ని పార్టీలూ ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఎవరో ఒకరినే జనం ఎందుకు విశ్వసిస్తున్నారు? వారినే ఎందుకు గెలిపిస్తున్నారు? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అలవిమాలిన హామీలిచ్చి అధికారం అందుకున్న చంద్రబాబును, వాగ్దానాల అమలులో చతికిలబడ్డాక 2019 ఎన్నికల్లో అదే జనం ఓడించలేదా? ప్రజాక్షేత్రాన్ని విస్మరించి, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలను పరిగణనలోకి తీసుకోకుండా ఉచితాల గురించి చర్చించడం వృథా ప్రయాస. -
అధికారంలోకొచ్చిన 30 రోజుల్లోనే రూ.2లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని అమలు చేసి తీరుతామని, బ్యాంకర్లను ఒప్పించి తనఖా కింద ఉన్న పాస్ పుస్తకాలను విడిపిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది›ప్రెస్’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతుల పంట రుణాలు రూ.25–30 వేల కోట్ల వరకు ఉంటాయని, ఈ మొత్తాన్ని నాలుగేళ్లలో వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించేలా బ్యాంకర్లతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. అంతకుముందే రైతుల రుణాలకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మాఫీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. కేసీఆర్ షోకుల కోసం అప్పులు: ‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ అప్రాధాన్య పనులకు ఖర్చు చేసిన కారణంగానే అప్పులు పెరిగిపోయాయి. ఏటా పెరిగే 15 శాతం ఆదాయాన్ని కేసీఆర్ తనకు లాభం వచ్చే కార్యక్రమాలకు మళ్లించడం వల్లే నష్టం జరుగుతోంది. అలాంటి నిరర్థక పెట్టుబడులను నియంత్రిస్తాం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవినీతిని అరికడతాం. దోపిడీకి గురవుతున్న సహజ వనరులను కాపాడుకుంటాం. పౌడర్లు, స్నోలు, డెకరేషన్లు, బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, సోకులు, విందులు, వినోదాలకు ఖర్చు తగ్గించుకుంటే.. వరంగల్ డిక్లరేషన్‌లో అన్ని హామీలను అమలు చేయవచ్చు. కౌలు రైతులకూ పెట్టుబడి సాయం టీఆర్ఎస్ ప్రభుత్వ బరితెగింపు, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా ఆగర్భ శ్రీమంతులకు కూడా రైతుబంధు ఇస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక అలాంటి అనర్హులకు రైతుబంధు రద్దు చేస్తాం. ఇందుకోసం కొన్ని ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే సమయంలో భూమి యజమానితోపాటు కౌలు రైతులకూ ఇందిరమ్మ భరోసా పథకం కింద ఏటా రూ.15వేల పెట్టుబడి సాయం అందజేస్తాం. ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తాం. ప్రతి పంటకు మద్దతు ధర రాష్ట్రంలో పండించే ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. సన్నరకం వరి ఎంత సాగు చేసినా కొనుగోలుకు ఇబ్బంది లేదు. కేసీఆర్ నిర్వాకం కారణంగానే పసుపు, చెరుకు, ఎర్రజొన్న, కందులు వంటివి పండించే రైతులు కూడా వరి పండించడం మొదలుపెట్టారు. మేం వరి పండించే రైతులను బెదిరించబోం. వద్దని ఒత్తిడి చేయబోం. రైతుబంధుకు లింకు పెట్టబోం. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లినవారికి బోనస్ ఇస్తాం. ఆయా పంటల సాగుపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తాం. కేసీఆర్‌ను దింపేయడమే పరిష్కారం రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ పేరిట.. కేసీఆర్ దురుద్దేశంతో, దోపిడీ ఆలోచనతో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ పోర్టల్‌ను రద్దు చేసి.. దానిస్థానంలో డిజిటల్ టెక్నాలజీతో కూడిన సులభతర విధానాన్ని అమల్లోకి తెస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రైతు టాస్క్‌ఫోర్స్‌ను, చట్టబద్ధత కల రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ విషయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరనే విషయంలో వాస్తవం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతులకు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే చేసింది. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినది, భూసంస్కరణలు అమలు చేసింది, పేదలకు భూములిచ్చింది, 2004లో అధికారంలోకి వచ్చాక ప్రణాళిక ప్రకారం జలయజ్ఞం పేరుతో 81 ప్రాజెక్టులను నిర్మించింది, పంటలకు కనీస మద్దతు ధరలను అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. రూ.73 వేల కోట్ల మేర రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది, రుణమాఫీ వర్తించని వారికి రూ.5వేల ఆర్థిక సాయం, ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెసేనని గుర్తుంచుకోవాలి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. టీఆర్ఎస్ను ఓడించగల శక్తి కూడా కాంగ్రెస్‌కే ఉంది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం కోసం చేసిన అప్పులు రూ.69వేల కోట్లు మాత్రమే. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలోనే ఆ అప్పు ఐదు లక్షల కోట్లకు చేరింది. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణను ఇస్తే.. ఇప్పుడు లోటు బడ్జెట్‌తో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేని స్థాయికి దిగజార్చారు. శ్రీలంకతో పోటీపడే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కింది. అక్కడ రాజపక్సే కుటుంబం ప్రజల ఆగ్రహానికి ఎలా గురయిందో.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం కారణంగా ప్రజల ఆగ్రహం ఎదుర్కొనే పరిస్థితి టీఆర్ఎస్ నేతలకు వచ్చింది’’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల అధ్యయన వేదిక నేతలు బి.వేణుగోపాల్‌రెడ్డి, సాదిక్, మధు, సురేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మాఫీ.. వారంతా హ్యాపీ
సాక్షి, చేవెళ్ల( రంగారెడ్డి): రుణమాఫీ రెండో విడతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రూ.50వేల రుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రల కేబినెట్ సమాశంలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అర్హత సాధించిన రైతుల్లో 30–40 శాతానికిపైగా రెండో విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ► ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు కుటుంబానికి రూ.లక్ష వడ్డీతో కలుపుకొని నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. ► దీని ప్రకారం గత ఏడాది తొలివిడత రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులకు వర్తింపచేశారు. ► ఇది జిల్లాలోని 10 శాతం మంది రైతులకు మాత్రమే వర్తించింది. కొంతమంది అర్హులైన వారికి పలు కారణాలతో వర్తించ లేదు. ► రుణాలు పొందిన రైతులు మాఫీ వస్తుందని బ్యాంకులకు బాకీలు కట్టడం మానేశారు. ► ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడిస్తోందో తెలియక బ్యాంకర్లు బాకీలు కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడం పరిపాటిగా మారింది. ► రెండో విడత రుణమాఫీపై ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ► ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో వెంటనే రెండో విడత రుణమాఫీ విడుదలపై నిర్ణయం తీసుకుంది. ► ఈ నెల 16నుంచి రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత.. ► జిల్లాలో మొత్తం 1,46,417 మంది రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హులని అధికారులు గుర్తించారు. ► ఇందులో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న పది శాతం మందికి మాత్రమే వర్తించింది. ► ఇప్పుడు రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంతో 30 నుంచి 40 శాతం మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ► రూ.50 వేల లోపు ఉన్న రైతులకు సంబంధించి రెండో విడతలో అమలు చేసేందుకు బ్యాంకర్ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ► ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పక్కా సమాచారం అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. ► జిల్లాలో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న వారిని 17,943 మందిగా గుర్తించగా ఇందులో 10,928 మందికిగాను రూ.16.73కోట్లు విడుదల చేసింది. ► మిగతావారికి వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. వారికి ఇప్పుడు రెండో విడతలో వడ్డీతో కలుపుకొని రూ.50వేలలోపు రుణమాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో రైతు రుణమాఫీకి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 36.80 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేలగా అందులో గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ. 25 వేల వరకు రుణాలపై రూ. 408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 5,225 కోట్లు కేటాయించింది. అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది. గతంలో రూ. 25 వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్. ఈ కేటగిరీలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం రూ. 4,900 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ రూ. 25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్‌ను తయారు చేశారు. అంటే రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు రుణాలున్న వారందరికీ రూ. 25 వేలు మాఫీ అవుతాయన్నమాట. ఈ ఆప్షన్ ప్రకారం చూస్తే 13.45 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం రూ. 5,100 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపుతోందని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరికీ ఊరటనిచ్చే విధంగానే రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలి. కాబట్టి ఆ ప్రకారమే సర్కారు నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. రుణమాఫీకి సంబంధించి ఈ రెండు ఆప్షన్ల ప్రకారం రైతుల జాబితాను సిద్ధంగా ఉంచామని, ఆ మేరకు వివరాలను సర్కారుకు పంపించామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో సొమ్ము విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: రుణమాఫీ నిధులు విడుదల చేయాలి -
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి
కల్వకుర్తి : రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సూచన మేరకు సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దిగుబడి సరిగా రాలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా రాలేదని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తేల్చాలని అడిగారు. రైతులకు 26 లక్షల టన్నుల యూరియా ఉచితంగా ఇస్తామని 2017లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని సీఎంను విమర్శించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్తున్న సీఎం కేసీఆర్ కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఈ చట్టాలను రద్దుచేసే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఆరో రోజుకు రేవంత్ పాదయాత్ర ఊర్కొండ: రేవంత్‌రెడ్డి పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, వెల్దండ మండలాల్లో పాదయాత్ర కొనసాగింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేటలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. జకినాలపల్లి, ఇప్పపహాడ్ గ్రామాల మీదుగా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద సోయి లేకుండా, మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉపఎన్నిక వచ్చిన చోట మాత్రమే వరాల జల్లు కురిపిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నిక రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
దారుణం.. మూడున్నర రూపాయల కోసం
బెంగళూరు: వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. దేశాలు దాటి పోతున్న బడా బాబుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండే బ్యాంకులు.. రైతుల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా లేని రూల్స్ మాట్లాడతాయి. పాత బాకీ చెల్లించకపోతే.. కొత్తగా రుణం మంజూరు చేయవు. అప్పు వసూలు చేయడం కోసం నోటీసులు పంపడం.. చివరికి ఆస్తుల్ని వేలం వేయడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. కేవలం మూడున్నర రూపాయల(3రూపాయల 46 పైసలు) అప్పు తీర్చడం కోసం ఓ రైతును ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు బ్యాంకు అధికారులు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో జరిగింది. వివరాలు.. బారువే గ్రామానికి చెందిన అమాదే లక్ష్మీనారాయణ అనే రైతు వక్కలు పండిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సమీప పట్టణం నిత్తూరులో ఉన్న కెనరా బ్యాంక్‌లో రూ. 35 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రూ.32 వేలు మాఫీ అయ్యింది. మిగిలిన రూ.3 వేలు లక్ష్మీ నారాయణ చెల్లించాడు. రుణం మొత్తం తీరింది. మళ్ళీ అప్పు తీసుకోవచ్చు అనుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీ నారాయణకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అప్పు మొత్తం తీరలేదని వెంటనే బ్యాంక్‌కు రావాలని అధికారులు అతడికి ఫోన్ చేశారు. కంగారు పడిన లక్ష్మీ నారాయణ బ్యాంకుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన గ్రామానికి బస్సులు రావడం లేదు. దాంతో నడుచుకుంటూ 15కిలోమీటర్ల దూరానా ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లాకా బ్యాంకు అధికారి లక్ష్మీ నారాయణ పేరు మీద రూ. 3.46 పైసల అప్పు ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఈ మాత్రం అప్పు కోసం తనను ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బకాయి సొమ్ము చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎల్ పింగ్వా స్పందిస్తూ.. కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనే ఉద్దేశంతోనే బ్యాలెన్స్ రూ.3.46 పైసలు అడిగినట్లు తెలిపాడు. అయితే బ్యాంకు అధికారుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గర మాత్రమే కాక అందరి దగ్గర ఇలానే అప్పు వసూలు చేస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు. -
జగదీష్ రెడ్డి మంత్రి హోదాను మరిచిపోయారు
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ ప్రజలకు ఇచ్చిన బహుమతి. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు అబద్ధాలు మాట్లాడుతూ దబాయించడం అలవాటు అయింది’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రతి విషయంలో టీఆర్ఎస్ నేతలు బూటకపు మాటలు చెబుతూ వస్తున్నారు. నిన్న నల్గొండలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీష్ రెడ్డి నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ ఏడాది రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ జరగలేదు. రుణామఫీపై ప్రశ్నిస్తే జగదీష్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రుణంలేని వాళ్లకు కూడా ఎకరానికి ఇంత అని కూడా ఇచ్చింది. రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. 1.82లక్ష కోట్ల బడ్జెట్లో రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు చేయదో ప్రభుత్వం చెప్పదు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన గంటలోపే రూ.11వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. (నువ్వెంత.. నువ్వెంత?) 2018 ఎన్నికల్లో గెలుపు కోసమే ఆనాడు 90శాతం రుణమాఫీ చేశారు. ఎన్నికల తర్వాత ఎప్పుడూ రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదు. నల్గొండ డివిజన్లో రైతు రుణబంధు కింద రూ.62 కోట్లు అయితే 35 కోట్లు మాత్రమే అయింది. ఇక రబీ సీజన్లో ఒక్క డివిజన్‌లోనే 75 కోట్లు కావాలంటే 50కోట్లు మాత్రమే ఇచ్చారు. ధాన్యం 1కోటి 4లక్షల మెట్రిక్ టన్నులకు 50లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. 30వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 10వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. గత ఏడాది నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పెడితే రైతులు అమ్మడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పెట్టాలని సీఎం అంటున్నారు. పత్తి కొనుగోళ్లు విషయంపై ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ, ప్రణాళిక ఇవ్వాలి. ఛత్తీస్‌గఢ్ రైతులు తెలంగాణకి వచ్చి పంట అమ్ముకుంటున్నారనేది పచ్చి అబద్ధం. (కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!) రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సన్న రకాల ధాన్యం పండించాలని అంటుంది కానీ రైతులకు హామీ ఇవ్వడం లేదు. మూడు నెలల క్రితం ప్రభుత్వం కొన్న కందుల రైతులకు నిధులు ఇవ్వలేదు. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. పసుపు రైతుల విషయంలోనూ సీఎం కేసీఆర్ మాట తప్పారు. నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్యలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి జగదీష్ రెడ్డే కారణం. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇరిగేషన్ అభివృద్ధి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 75లక్షల ఎకరాల ఇరిగేషన్ ఆయకట్టు ఉంది. 2009లో నాపై పోటీ చేసి ఓడిపోయిన బాధ ఇంకా జగదీష్ రెడ్డి మర్చిపోనట్లు ఉన్నారు. నేను కూడా మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. జగదీష్ రెడ్డి నిన్నమంత్రి హోదాను మరిచి వ్యవహరించారు. రుణమాఫీ చేయలేదు అని నేను ప్రశ్నించాను. మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాము’ అని అన్నారు. (ప్రభుత్వానికి సోయి వస్తలేదు) -
మరో 3 నెలలు... వాయిదా!
ముంబై: కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి. ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రుణగ్రహీతలపై పన్నీరు లాక్‌డౌన్‌ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్‌కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది. కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది. కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్‌లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి ప్రతికూలం.. అంచనాల కంటే కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు. డిమాండ్ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్/ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది. కార్పొరేట్ గ్రూపులకు మరిన్ని రుణాలు ఒక కార్పొరేట్ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్లైన్ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి. ద్రవ్యోల్బణంపై అస్పష్టత కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు. దివాలా చర్యలకు మరింత వ్యవధి ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి. మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం 2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు ► మార్చి 3: కరోనా వైరస్ ప్రవేశంతో, పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని ప్రకటన. ► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు. ► ఏప్రిల్ 3: రోజువారీ మనీ మార్కెట్ ట్రేడింగ్ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది. ► ఏప్రిల్ 17: రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్హౌసింగ్ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు. ► ఏప్రిల్ 27: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్ ఫండ్స్‌కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది. ► మే 22: రెపో, రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు. ఇతర కీలక అంశాలు ► ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది. ► దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్‌ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది. ► 2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి 487 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్ దాస్ సహా ఐదుగురు 40 బేసిస్ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్ ఘటే మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. ► రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. మారటోరియం తీసుకున్నది 20 శాతమే మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు. నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు చెల్లింపులు చేయడమే మంచిది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ మరిన్ని చర్యలు... భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
ఆరోగ్యపథం.. సంక్షేమ రథం
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా కరోనా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వైపు మళ్లనుంది. వైరస్ కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే, ప్రగతి కార్యక్రమాలను పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వైరస్ నియంత్రణతోపాటు ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల అమలుపై ఆయన కలెక్టర్లకు సూచనలు చేసే దిశగా సమావేశపు ఎజెండాను ఖరారు చేశారు. (ప్రొఫెసర్ ఖాసీం విడుదల) ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయంతో పాటు భూముల ప్రక్షాళన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, భూసేకరణ, రుణమాఫీ, ఉపాధి హామీ పనులు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర పది అంశాలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సేద్యం..రైతులు..భూములు కలెక్టర్లతో నేడు జరిగే సమావేశంలో నియంత్రిత వ్యవసాయం, భూముల ప్రక్షాళన, రైతు రుణమాఫీ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత సాగు చేయాలి?, ఏ ప్రాంతంలో ఎలాంటి పంటల సాగుకు రైతులు అలవాటుపడ్డారు?, ఒకవేళ ఆ ప్రాంతంలో పంటమార్పిడి చేయాలనుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు ఆ దిశగా కౌన్సెలింగ్ ఎలా చేయాలనే విషయాలపై కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా నేటి సమావేశానికి వ్యవసాయ శాఖ, జిల్లా రైతుసమన్వయ కమిటీ అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. భూముల ప్రక్షాళన అంశంపై కేసీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములపై హక్కుల మార్పిడి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, వ్యవసాయ భూములుగా పేర్కొంటూ వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల లెక్కలు తేల్చనున్నారు. అలాగే ఇంకా రాష్ట్రంలో జరగాల్సిన భూసేకరణ, ప్రజలకు కనీస అవసరాల కల్పనలో (పట్టణ ప్రాంతాల్లో) భూముల లభ్యత, ఆహారశుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ గిడ్డంగులు, ఆగ్రి కాంప్లెక్సుల నిర్మాణానికి భూముల లభ్యతపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. తద్వారా రైతు సంబంధ పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేసేలా ఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే దానిపై కూడా కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీపై కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక బ్యాంకర్లతో సమావేశమై ఏ మేరకు మాఫీ జరిగిందన్న వివరాలు తీసుకురావాలని కలెక్టర్లకు సమాచారమందింది. ఇంకా ఉపాధిహామీ పథకం అమలు, పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల జారీ, పల్లె ప్రగతి అమలుపైనా సీఎం కలెక్టర్లతో చర్చించే వీలుంది. సమావేశ ముఖ్యాంశాలు రైతులకు రుణమాఫీ కరోనా నియంత్రణ చర్యలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, అగ్రి కాంప్లెక్సులు, గోదాముల నిర్మాణానికి భూముల లభ్యత ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములను సమగ్ర భూరికార్డుల నిర్వహణ విధానం (ఐఎల్‌ఆర్‌ఎంఎస్)తో సరిపోల్చే అంశం ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో అన్ని ప్రభుత్వ ఆస్తుల మార్కింగ్ పంచాయతీల్లో లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విశ్లేషణ ద్వారా వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల గుర్తింపు, వాటిని ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో నవీకరణ భూసేకరణ తప్పనిసరి అయిన ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు పట్టణాల్లో ప్రజావసరాలకు భూముల లభ్యత ఉపాధి హామీ అమలు, జాబ్ కార్డులు, ఉపాధి పనుల కల్పన, పల్లె ప్రగతి వర్షాకాలంలో పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో తీసుకోవాల్సిన చర్యలు -
రెండు రోజుల్లో ఆ డబ్బులు విడుదల చేస్తాం
సాక్షి, మెదక్ : రైతు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల్లో రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తామని చెప్పారు. 25 వేల రూపాయలలోపు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తామని, లక్ష రూపాయల రుణం ఉన్నవారికి నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని చెప్పారు. 5 లక్షల 80 వేలమంది రైతులకు రూ.1198 కోట్లు బ్యాంకులో జమ చేయనున్నామన్నారు. బుధవారం ఆయన నిజాంపేట్ మండలం నార్లాపూర్ లో కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీశ్ మీడియాతో మాట్లాడుతూ..జిల్లాలో కొత్తగా కరోనా కేసులులేవని....రేపో మాపో గ్రీన్‌జోన్‌లోకి జిల్లా మారనుందని తెలిపారు. (చదవండి : వైన్స్ షాపుల వద్ద ప్రత్యేక మార్క్‌లు ) కరోనా తగ్గినా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని... మాస్క్ లేకుండా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. కరోనా ఉధృతిలోనూ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే.. కాంగ్రెస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లకు క్వింటా రూ.1,835కు కొనుగోలు చేస్తోందని, అదే కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.1,300కు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200కు కొనుగోలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. -
పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించాలి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను రక్షించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను విస్మరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె ప్రధాని మోదీకి రాసిన లేఖలో హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఈ రంగం కోసం రూ.లక్ష కోట్ల వేతన ప్యాకేజీని అందించాలి. అంతే మొత్తంతో సమానమైన రుణహామీ నిధిని ఏర్పాటు చేయాలి. పరిశ్రమలను ఆదుకునేందుకు రోజంతా పనిచేసే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలి’అని అందులో కోరారు. -
4 విడతల్లో రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: వడ్డీతో సహా రూ.లక్ష వరకు ఉన్న వ్యవసాయ పంటల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. గతంలోలాగే ఈసారి కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయనుంది. వ్యవసాయ రుణమాఫీ పథకం–2018 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వల్పకాలిక పంట రుణాలు, బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతా ల్లో తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. దీని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింపజేయనున్నారు. రైతులు పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని కొనుగోలు చేసే విధానానికి స్వస్తి చెప్పేందుకు సీఎం కేసీఆర్ హామీకి అనుగుణం గా సంస్థాగత రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి ఇది వర్తించదు. రైతు కుటుంబం అంటే భర్త, భార్య వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. రూ.లక్షలో ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ చార్జీలు, ఇన్సూరెన్స్ వంటివి ఉండవు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలు తీసుకున్న రైతులకు ఒకే దశలో మాఫీ చేస్తారు. మిగతా రైతులకు మిగిలిన మొత్తాన్ని 4 దశలుగా మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో చెల్లించనున్నారు. రైతుల జాబితాల తయారీ ఇలా.. - 2018 డిసెంబర్ 11 నాటికి స్వల్పకాలిక పంట రుణా లు బకాయిపడిన రైతుల జాబితాల (ఏ–లిస్టు)ను గ్రామాల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో ప్రతి రుణ సంస్థ (బ్యాంకు) బ్రాంచీ తయారు చేయాలి. - బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తించనుంది. 2018 డిసెంబర్ 11 నాటికి ఇలాంటి రుణ బకాయిలు కలిగిన రైతుల జాబితాల (బీ–లిస్టు)ను ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో గ్రామాల వారీగా ప్రతి బ్యాంకు తయారు చేయాలి. - బంగారం తాకట్టుపెట్టి అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు/బ్యాంకు బ్రాంచీల నుంచి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించదు. అయితే అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులకు సంబంధించిన గ్రామీణ బ్రాంచీల నుంచి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించనుంది. - స్వల్పకాలిక పంట రుణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన రైతుల జాబితాలను బ్యాంకు బ్రాంచీల మేనేజర్లు పోల్చి చూసి రూ.లక్ష వరకు రుణ బకాయిలు కలిగిన రైతు తుది జాబితాల (సి–లిస్టు)ను నిర్దేశిత నమూనాలో రూపొందించాలి. స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు, గ్రామీణ ప్రాంతాల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు, తుది రైతుల జాబితాలను లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో పాటు జిల్లా కలెక్టర్లకు బ్రాంచీ మేనేజర్లు పంపాలి. - కొందరు ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీల నుంచి పంట రుణాలు పొంది ఉంటారు. ఒక బ్యాంకుకు చెందిన వేర్వేరు బ్రాంచీలు లేదా ఇతర బ్యాంకుల బ్రాంచీల నుంచి రుణాలు పొంది ఉండొచ్చు. ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తించేలా నియంత్రించడంతో పాటు డూప్లికేషన్/మల్టీపుల్ ఫైనాన్సింగ్ నియంత్రణకు మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ (జేఎంఎల్‌బీసీ) సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో బ్యాంకర్లందరూ తమ బ్యాంకుల ఏ, బీ, సీ జాబితాలను తీసుకొచ్చి ఇతర బ్యాంకుల జాబితాలతో పోల్చి చూడాలి. అన్ని బ్రాం చీల తుది జాబితాలను మండల తహసీల్దార్ పరిశీలించి చూడాలి. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారా? లేదా రుణ గ్రహీతలంతా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారా? అన్న విషయాన్ని తహసీ ల్దార్ పరిశీలించి చూడాలి. పరిశీలన తర్వాత ఏవైనా తప్పుడు క్లెయిమ్స్ ఉంటే తొలగించాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు బ్రాంచీల నుంచి రుణా లు పొందిన రైతు కుటుంబ సభ్యులను జేఎంఎల్‌బీసీ కమిటీ సభ్యులు గుర్తించాలి. వారి జాబి తాల (డీ–లిస్టు)ను నిర్దేశిత నమూనాలో తయారు చేయాలి. జిల్లా సహకార ఆడిట్ అధికారి పర్యవేక్షణలో సహకార శాఖ ఆడిటర్లు ప్రాథమిక సహకార సంఘాలు, డీసీసీబీల ఏ, బీ, సీ జాబితాలను డీ జాబితాలతో పోల్చి చూడాలి. జిల్లా సహకార ఆడిట్ అధికారి తన పరిధిలోని మండలాలకు ఆడిటర్లను కేటాయించాలి. జిల్లాస్థాయి ఆడిట్ నివేదిక ఇవ్వాలి. జేఎంఎల్‌బీసీ రూపొందించిన డీ–జాబితాలను మండల స్థాయిలో అన్ని బ్యాంకుల బ్రాంచీలకు అందుబాటులో ఉంచాలి. - కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీల నుంచి రుణాలు తీసుకుని ఉంటే ఐటీ ఆధారంగా గుర్తించేందుకు బ్యాంకులు సమర్పించే తుది రైతుల జాబితా (సి–లిస్టు)ను విశ్లేషించి తుది డీ–జాబితాలను తయారు చేస్తారు. - రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నా ఒక కుటుంబానికి ఒక లక్ష మేరకే రుణం మాఫీ చేయాలని నిర్ణయించారు. - కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పంట రుణానికి అర్హులైతే రూ. లక్ష మొత్తంలో ఉన్నవారందరికీ సమానంగా ఇస్తారు. - స్వల్పకాలిక పంట రుణాలు 18 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది. ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. - రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఏఈవో, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. వీరికి మండల తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. - తాత్కాలిక తుది జాబితా (జాబితా–ఈ)ను సంబంధిత గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత బ్రాంచ్‌ల వారీగా అర్హు్హలైన రైతుల తుది జాబితాను లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. - రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను జిల్లాల్లో బ్యాంకర్ల మీటింగ్‌లో సమీక్షించి, రికార్డు చేసి దాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. అదే ఐటీ పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది. అర్హుల గుర్తింపు ఇలా.. - మొదటి సారి మాఫీ చేసినప్పుడు తీసుకున్న కటాఫ్ తేదీ తర్వాత 2014 ఏప్రిల్ 01 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా మాఫీ చేస్తారు. వీటికి వర్తించదు.. - భాగస్వామ్య (టై అప్) రుణాలు - మూసేసిన పంట రుణాలు/రైటాఫ్ చేసిన రుణాలు - జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జేఎల్‌జీ)/రైతు మిత్ర గ్రూప్ (ఆర్ఎంజీ)/లోన్ ఎలిజిబిలిటీ కార్డు (ఎల్ఈసీ)లకు ఇచ్చిన రుణాలు - రీస్ట్రక్చర్డ్/రీషెడ్యూల్డ్ రుణాలు - రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు ఐటీ వ్యవస్థ లేదా పోర్టల్‌ను వ్యవసాయ శాఖ తయారు చేయాలి. రైతుల సమాచారం కోసం, వారి రుణాల మొత్తం వంటివి ఫైనల్ చేసేందుకు దీన్ని వినియోగించాలి. -
పంట రుణాల మాఫీ రూ. 4.7 లక్షల కోట్లకు
ముంబై: గడిచిన పదేళ్లలో వివిధ రాష్ట్రాలు మాఫీ చేసిన వ్యవసాయ రుణాల పరిమాణం ఏకంగా రూ. 4.7 లక్షల కోట్లకు చేరింది. ఇది మొత్తం పరిశ్రమల మొండిబాకీల్లో (ఎన్పీఏ) దాదాపు 82 శాతం. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.79 లక్షల కోట్లుగా ఉండగా, వీటిలో వ్యవసాయ రంగ ఎన్పీఏలు రూ. 1.1 లక్షల కోట్లకు చేరాయి. ‘మొత్తం ఎన్‌పీఏల్లో వ్యవసాయ రంగ బాకీలు రూ.1.1 లక్షల కోట్లుగానే ఉన్నా.. గడిచిన దశాబ్ద కాలంగా మాఫీ చేసిన సుమారు రూ. 3.14 లక్షల కోట్ల రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులు, ప్రభుత్వాల మీద ఏకంగా రూ. 4.2 లక్షల కోట్ల పైగా భారం పడినట్లే. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరో రూ. 45,000–51,000 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 4.7 లక్షల కోట్లకు చేరుతుంది. మొత్తం పరిశ్రమ స్థాయిలో పేరుకుపోయిన మొండిబాకీల్లో ఇది 82 శాతం అవుతుంది’ అని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. రుణభారాలతో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల సమస్య తీవ్రతను తగ్గించేందుకు పది పెద్ద రాష్ట్రాలు 2015 ఆరి్థక సంవత్సరం నుంచి రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రూ. 24,000 కోట్లు, తెలంగాణ రూ. 17,000 కోట్లు, తమిళనాడు రూ. 5,280 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశాయి. నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మాఫీల్లో అత్యధిక భాగం తూతూమంత్రంగానే జరిగిందని .. వాస్తవ రైటాఫ్‌లు 60 శాతం మించబోవని నివేదిక పేర్కొంది. -
రైతు సంతకంతోనే రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రైతులు తమ సంతకంతో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే రుణమాఫీ అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాంకుల వద్ద ఉన్న రైతు రుణాలు, వడ్డీ సమాచారంతో ఆ ధ్రువీకరణ పత్రం ఉండాలని అధికారులు అంటున్నారు. ఒకవేళ అలా లేకుంటే ఆయా రైతులకు రుణమాఫీ అమలు చేయడం కుదరదని చెబుతున్నారు. గతంలో రుణమాఫీ అమలు చేసినప్పుడు పారదర్శకతపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ఈసారి రైతు స్వీయ ధ్రువీకరణ చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లేకుంటే గ్రామ సభలు పెట్టి అర్హులైన రైతుల సంఖ్య తేల్చాలన్న నిబంధనను కూడా తెరపైకి తెస్తున్నారు. 2014లో రుణమాఫీ అమలు సమయంలో అర్హులైన రైతుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించినా కొందరు అర్హులకు రుణమాఫీ జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రుణమాఫీ అందని కొందరు రైతులు ఉన్నతస్థాయి వరకు వెళ్లి పోరాడారు. అలాగే ఆడిట్ అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. రుణమాఫీ పొందిన వారంతా రైతులనే గ్యారంటీ ఏంటంటూ కాగ్ ప్రశ్నించింది. గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించామని వ్యవసాయశాఖ ఇచ్చిన వివరణతో కాగ్ ఏమాత్రం సంతృప్తి చెందలేదని అధికారులు అంటున్నారు. గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదని, రుణమాఫీ లబ్ధిదారులంతా రైతులేనని ఎవరు ధ్రువీకరించారని కాగ్ నిలదీసింది. ఈ నేపథ్యంలోనే రైతుల స్వీయ ధ్రువీకరణ అంశాన్ని వ్యవసాయశాఖ తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల ఎక్కడైనా అక్రమాలు జరిగితే అప్పుడు రైతునే బాధ్యుడిని చేసే అవకాశముందని అంటున్నారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. మాఫీ సొమ్ము నేరుగా మాకే బదిలీ చేయాలి రుణమాఫీపై బ్యాంకర్లు, అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేయాలి? ఎంత చేయాలి? వడ్డీ వివరాలు ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. అధికార టీఆర్ఎస్ రూ. లక్షలోపు రైతు రుణమాఫీ అమలుకు గతేడాది డిసెంబర్ 11ను కట్ ఆఫ్ తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే అప్పటి వరకు రైతులు తీసుకున్న సొమ్ములో రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సర్కారు ప్రకటించింది. అంటే ఏడాదిగా అనేక మంది రైతుల బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసింది. అప్పుడు 35.29 లక్షల మంది రైతులకు రూ. 16,138 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. ఈసారి రుణమాఫీ సొమ్ము మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. వ్యవసాయ వర్గాల సమాచారం ప్రకారం రూ. 26 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా బ్యాంకర్లు మాత్రం అలా చేయవద్దని, గతంలోలాగా తమకే అందజేయాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ కార్డుల పద్ధతి లేదా రైతుబంధు నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి వేసినట్లుగా ఏదో ఒక పద్ధతిలో రుణమాఫీ సొమ్మును జమ చేస్తామని అధికారులు చెబుతుండగా అలా చేస్తే రైతులు బకాయిలు చెల్లించరని బ్యాంకర్లు అంటున్నారు. రైతులు ఇతర బ్యాంకు ఖాతాలు చూపించి వాటిల్లో జమ చేసుకునే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలపై తర్జనభర్జన రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీపై తర్జనభర్జన జరుగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి బంగారంపై తీసుకున్న రుణాలను పంట రుణాలుగా పరిగణించబోమని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తింపజేయాలా వద్దా? అనే చర్చ జరుగుతోంది. దీనిపై బ్యాంకర్ల మధ్యే భిన్నాభిప్రాయాలున్నాయి. ఆర్బీఐ నిబంధన ప్రకారం మాఫీ చేయొద్దని కొందరు అంటుంటే మాఫీ చేయాలని మరికొందరు అంటున్నారు. ఆ ప్రకారం బ్యాంకర్లు వేర్వేరుగా జాబితాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 5.56 లక్షల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ. 5,253 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ బకాయిలు మాఫీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2014లో రుణమాఫీ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి పట్టణాల్లో గోల్డు లోన్లు తీసుకున్న రైతులకు మాఫీ చేయలేదు. కుటుంబమే యూనిట్‌గా...? 2014లో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని రుణమాఫీ చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో కలిపి ఒక కుటుంబంగా పరిగణించారు. అంతకుమించి వయసుంటే మరో కుటుంబంగా గుర్తించారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత లేదు. ఈసారీ కుటుంబం యూనిట్‌గానే రుణమాఫీ చేస్తారని అంటున్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే సర్కారు ఆర్థిక భారం తగ్గుతుంది. దీనిపై పెద్దగా అభ్యంతరాలు లేవు. కుటుంబమే యూనిట్‌గా రుణమాఫీ జరగవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
కీలక హామీ నెరవేర్చిన సీఎం ఠాక్రే
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి ప్రభ్వుతం మరో హామీని నెరవేర్చింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు లక్షలలోపు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు రుణమాఫీ ప్రకటనపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతు రుణమాఫీని ప్రకటించాలని ప్రతిపక్ష బీజేపీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని, రుణమాఫీ ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని బీజేపీపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో అన్నారు. ప్రతిపక్ష, రైతుల డిమాడ్లకు తలొగ్గని ఉద్ధవ్ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రవేశపెట్టింది. -
అధికారంలోకి వస్తే రుణమాఫీ
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హామీలను నెరవేరుస్తామని, ఎప్పుడు చేస్తామన్న విషయాన్ని వివరించే టైమ్‌లైన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తవుతోందని, త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. తన్వార్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తమకు వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరియాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. మనం భారత్‌మాతా కీ జై అంటే వారు... కాంగ్రెస్ పార్టీ నేతలకు దేశం కంటే అధిష్టానమే ముఖ్యమని, అందుకే వారు సోనియా మాతాకీ జై అంటారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. గూర్గాన్‌కు చెందిన కాంగ్రెస్ నామినీ సోనియా గాంధీకీ జై అంటూ నినాదాలు చేసిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీకి దేశం ప్రాధాన్యమని అందుకే తాము భారత్ మాతాకీ జై అంటామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచ నేతగా ఎదిగారని ఆయన తెలిపారు. -
అతివలకు ఆసరా
సాక్షి, అనంతపురం న్యూసిటీ : ‘‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో ఉన్న రుణాల మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే అందిస్తాం.. అంతేకాదు మళ్లీ సున్నావడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ సొమ్ము మేమే కడతాం.’’ అని ఎన్నికల వేళ మహిళలకు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ‘వైఎస్సార్ ఆసరా’, వీధి వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ‘వైఎస్సార్ చేయూత’ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రూ.360.55 కోట్లతో వైఎస్సార్ ఆసరా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద జిల్లాలోని నగరపాలక సంస్థ, వివిధ మునిసిపాలిటీల్లో మహిళా సంఘాలకు రూ.360.55 కోట్ల రుణాల మాఫీ కానున్నాయి. ఇక వైఎస్సార్ చేయూత కింద మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని 7,916 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం. 82 మందికి రూ.72.52 లక్షలు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారు. ఇంకా 2,618 మందికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 12,233 సంఘాలు జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు 11 మున్సిపాలిటీల్లో మెప్మా పరిధిలో 12,233 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఆ సంఘాలకు నాలుగు విడతల్లో రుణాలు మాఫీ కానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తామని ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు వందశాతం మహిళా సంఘాలకు రుణాలు మాఫీ కానున్నాయి. చిరువ్యాపారుల హర్షం : మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని నగరపాలక సంస్థ, వివిధ మున్సిపాలిటీల్లో మొత్తం 8,700 వీధి వ్యాపారులను లక్ష్యంగా 7,916 మందిని రిజిస్టర్ చేయించారు. వారిలో 1,628 మందికి గుర్తింపు కార్డులను అందజేశారు. దీంతో పాటు 82 మందికి రూ.72.52 లక్షల మేర బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు అందించారు. 213 గ్రూపుల్లో 24 మంది గ్రూపులకు రూ.21 లక్షల రుణాలు మంజూరయ్యాయి. దీనిపై వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారులకు వారి వ్యాపారాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. -
రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు
సాక్షి, మెదక్: కరువు కాలంలో వరుస పంట నష్టాలతో కుదేలైన రైతులకు కొండంత ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించింది రుణమాఫీ పథకం. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు మళ్లీ ఈ పథకం అమలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటం.. ముక్కుపిండి మరీ వడ్డీ కట్టేలా బలప్రదర్శనకు దిగుతున్న నేపథ్యంలో విధిలేక అప్పులు చేస్తున్నారు. రుణమాఫీ ఆదుకుంటుందనే భరోసాతో సర్కారుపై భారం వేసి కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. రైతుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంది. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రైతుల ఖాతాల్లో జమచేసింది. కరువు కాలంలో ఇది రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ క్రమంలో ఇటీవల(2019) ఎన్నికల సమయంలోనూ మళ్లీ రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ‘గులాబీ’ బాస్ కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండోసారి సైతం అధికారంలోకి రాగా.. వరుస ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీపై అధికారికంగా ప్రకటిస్తారని భావించినా.. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో దాని ఊసే లేకుండా పోయింది. కటాఫ్ తేదీ 2018 డిసెంబర్ 11 రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మార్గదర్శకాల తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి.. జిల్లాల వారీగా బ్యాంకులు, పంట రుణాల మొత్తం, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల వివరాలు సేకరించి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే.. ప్రధానంగా కటాఫ్ డేట్ డిక్లేర్ అయితే ఈ వివరాలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి మాఫీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 2014లో నాలుగు దఫాలుగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కటాఫ్ తేదీని నిర్ణయించి మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు నాలుగు దఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతుల పంట రుణాలు సుమారు రూ.16,125 కోట్లను బ్యాంకుల్లో జమచేసింది. మెదక్ జిల్లాకు సంబంధించి 20 మండలాల్లోని 1,27,098 మంది రైతులకు రూ.603.72 కోట్ల రుణమాఫీ వర్తించింది. 65 వేల మంది రైతులు.. రూ.400 కోట్లు గతంలో నాలుగు విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పటికీ కొందరు రైతులకు ప్రయోజనం చేకూరలేదు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో రుణమాఫీకి సంబంధించి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో ఉన్న రైతుల కంటే ఈ సారి సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు 65 వేల మంది రైతులు రుణమాఫీకి అర్హులని.. రూ.400 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. వడ్డీ తిప్పలు.. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. అయితే.. వాటికి ఏటేటా వడ్డీ కట్టాలి. రెన్యూవల్ చేయకుంటే రుణమాఫీకి అర్హులు కారని.. కచ్చితం గా మిత్తి కట్టాల్సిందేనని బ్యాంకర్లు రైతుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నారు. తూప్రాన్‌తోపాటు పలు ప్రాంతాల్లో పలువురు రైతులకు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు అప్పులు చేసి వడ్డీ కడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరగా రుణమాఫీ నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. వడ్డీ కట్టకుంటే ఊరుకుంటలేరు నాకున్న రెండెకరాలకు సంబంధించి శివ్వంపేటలోని ప్రాథమిక సహకార సంఘంలో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ చేయాలి. బ్యాంకు అధికారులు వడ్డీ కట్టకుంటే ఊరుకుంటలేరు. వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకుంటేనే రుణమాఫీ వర్తిస్తుందని చెబుతున్నరు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభమైనందున తక్షణమే రుణమాఫీ డబ్బులు అందజేస్తే బాగుంటుంది. – సంజీవరెడ్డి, రైతు, ఎదుల్లాపూర్, శివ్వంపేట సగం వడ్డీకే పోయినయ్.. పోయినసారి రుణమాఫీ పైసలు సగం వడ్డీకే పోయినయ్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకింత రుణం కావాలని బ్యాంకుకు పోతే.. పాతవి కడితే పెంచి ఇస్తామంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ డబ్బులు అందజేయాలి. పోయినసారి పంటల బీమా అందలేదు. ఈ సారి కూడా బీమా సొమ్ము కడితేనే వర్తిస్తుందంటున్నారు. రుణమాఫీ కోసం చూస్తే బీమా కూడా అందకుండా పోతుంది. – బానోత్ చత్రు, కామారం తండా, చిన్నశంకరంపేట బ్యాంకు నుంచి నోటీసు ఇచ్చిండ్రు తూప్రాన్: నాకు రెండేకరాల పొలం ఉంది. పంట సాగు కోసం తూప్రాన్‌లోని వ్యవసాయ సహకార బ్యాంకులో 2009లో రూ.70 వేల రుణం తీసుకున్న. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు మాఫీ చేసింది. కానీ నాలుగు దఫాలుగా చేసింది. నాకు రూ.70 వేలు మాఫీ అయ్యాయి. అయితే అప్పటికే బ్యాంకు అధికారులు వడ్డీకి వడ్డీ కలుపుతూ రూ.1.13లక్షలు కట్టాలని నోటీసు ఇచ్చిండ్రు. ఒకే సారి మాఫీ చేయకపోవడంతో మాపై భారం పడింది. – పెంటారెడ్డి, రైతు, గుండ్రెడ్డిపల్లి -
రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల గురించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోన్న రుణమాఫీపై ఇంకా స్పష్టత రాలేదని మండి పడ్డారు. వడ్డీ చెల్లింపు అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో బ్యాంకులు రైతుల దగ్గర నుంచే ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కేబినెట్లో రైతుల గురించి, ఉద్యోగస్తుల గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు. టీఆర్టీకి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్, పీఆర్సీ, ఐర్ 27 శాతం పెంచారన్నారు. కానీ మన దగ్గర ఆ ప్రస్తావనే రాలేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారని మన దగ్గర ఆ ఊసే లేదన్నారు. పక్క రాష్ట్ర సీఎం అప్పుడే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ ఇంతవరకూ ఒక్క సారి కూడా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించలేదని దుయ్యబట్టారు. -
‘రైతుల కష్టాలకు పరిష్కారం ఇదే’
చండీగఢ్ : దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేస్తూ జాతీయ స్ధాయిలో ఈ పథకాన్ని వర్తింప చేయాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రైతుల కష్టాలకు ఇది సరైన పరిష్కారమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం రైతుల కష్టాలను పూర్తిగా పరిష్కరించలేదని గతంలో అమరీందర్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటికే ఐదు లక్షల మంది రైతులు తీసుకున్న రుణాల మాఫీ కోసం రూ 4468 కోట్లు సమకూర్చామని లేఖలో సింగ్ పేర్కొన్నారు. మిగిలిన రైతులకూ త్వరలో ఈ పథకం ద్వారా ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. జాతీయ స్ధాయిలో రైతు రుణాల మాఫీతో పాటు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా అవసరమైన మార్పులు చేయాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సింగ్ కోరారు. -
లోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రైతు రుణమాఫీ తరహాలోనే భిన్న వర్గాలకు రుణ భారం నుంచి ప్రభుత్వాలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో వ్యక్తులకు సైతం రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పధకానికి అధికారులు తుదిరూపు ఇస్తున్నారు. రూ 60,000లోపు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడే వ్యక్తులు రుణ మాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించనుంది. అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ నూతన రుణమాఫీ పధకాన్ని దివాళా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఇన్సాల్వెన్సీ లా కమిటీ (ఐఎల్సీ) ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుతీరే ప్రభుత్వానికి ఐఎల్సీ తన ప్రతిపాదనలను సమర్పించనుంది. కాగా ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకే దివాళా చట్టం వర్తిస్తుండటంతో మలిదశలో ఈ ప్ర్రక్రియను భాగస్వామ్య సంస్ధలు, వ్యక్తులకూ వర్తింపచేయనున్నారు. కార్పొరేట్ దిగ్గజాలకు ఇచ్చిన రుణాలను హెయిర్ కట్ పేరుతో కుదిస్తున్న క్రమంలో ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులకూ ఇన్సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇక వ్యక్తులకు గరిష్టంగా రూ 60,000 వరకూ రుణ మాఫీని వర్తింపచేస్తారు. చెల్లించాల్సిన రుణం రూ 60,000కు మించడంతో పాటు వార్షికాదాయం మెరుగ్గా ఉంటే అలాంటి వ్యక్తుల రుణ మాఫీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
వచ్చే ఖరీఫ్ నాటికి రుణమాఫీ...
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ నాటికి పంటల రుణమాఫీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ కొనసాగుతుండటం, ఆ తర్వాత మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రుణమాఫీని ఖరీఫ్ ప్రారంభం నాటికి చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రుణమాఫీ కోసం ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీ ఉంటుందని ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనే దానిపై ఇటీవలే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల హామీగా.. కేసీఆర్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. అంటే రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు మాఫీ కానున్నాయి. రుణాల మాఫీకి కటాఫ్ తేదీగా గతేడాది డిసెంబర్ 11ని ప్రకటించింది. ఆ తేదీని గడువుగా లెక్కించి అప్పటివరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది. బ్యాంకర్ల వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 48 లక్షల మందికి రూ. 30 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు ఒక విడతగా కేటాయించిందంటే, మొత్తంగా ఐదు విడతల్లో బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనూ రుణమాఫీ అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. -
మాఫీ మాయ
సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): రైతులు చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా నష్టపోయారు. టీడీపీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చినుకు రాలక ఎండిన చెరువులు, బోరుబావులతో కరువు పరిస్థితులు దాపురించి సాగు చేసిన పంటలు చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు చంద్రబాబు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మాటతప్పి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే చేస్తామన్నారు. ఈ నగదును కూడా ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మూడు విడతలు మాత్రమే రుణమాఫీ నగదును అరకొరగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్ము ఇస్తారేమోనని రైతులు ఇప్పటి వరకు ఎదురు చూసినా చంద్రబాబు తీరుతో వారికి నిరాశే మిగిలింది. జిల్లాలో రైతుల పరిస్థితి... వాస్తవంగా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత అధికారంలోకి రాగానే మాటమార్చి రుణమాఫీ పరిధిని రూ.1.50 లక్షల వరకు కుదించారు. వీటిని కూడా ఒకే సారి కాకుండా ఐదు విడతలో అందజేస్తామని బీరాలు పలికారు. కానీ చెప్పిన విధంగా తన ఐదేళ్ల పాలనలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతన్న నడ్డివిరిచారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,56,318 మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ వర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాల్లోని అర్హత పొందిన 3,71,484 మంది ఖాతాలకు మూడు విడతల్లో నగదు జమ చేశారు. పొన్నలూరు మండలంలో రుణమాఫీకి అర్హత పొందిన రైతులు సుమారుగా 9058 మంది ఉన్నారు. వీరందరికీ వారు తీసుకున్న బ్యాంకు రుణాల అర్హతను బట్టి రూ.44 కోట్లను ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే గత ఐదేళ్లుగా ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.26 కోట్ల రుణమాఫీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయినా ఇంకా సుమారుగా రూ.18 కోట్లు మండలంలోని రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నగదును నాలుగు, ఐదు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు మిగిలిన రుణమాఫీ నగదును రైతుల ఖాతాలకు జమచేయలేదు. అప్పుల ఊబిలో అన్నదాత మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికినా నేటికీ ఎలాంటి తోడ్పాటు కల్పించలేదు. పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి సాయం ప్రభుత్వం నుంచి సక్రమంగా అందలేదు. దీంతో ప్రభుత్వ సాయంతో పాటు అనుకున్న స్థాయిలో పంటల దిగుబడులు, మద్దతు ధర లేకపోవడం వలన రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అలాగే పండిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కనీసం బీమా డబ్బులు వస్తే కొంత వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలను చంద్రబాబు నీరుగార్చారు. రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరిత వాగ్దానాలు, మాయ మాటలు చెబుతూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వలన నష్టపోయిన పంటలకు రైతులు ప్రీమియం డబ్బులు చెల్లించినా, ఈ ఐదేళ్ల కాలంలో బీమా చెల్లించకుండా కాలయాపన చేసింది. గ్రామాల్లో రైతులు సాగుచేసి ఎండిపోయిన పంటలను పరిశీలించి సంబంధిత వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నివేదికగా తయారుచేసి ప్రభుత్వానికి పంపించనా బీమా ఊసేలేదు. బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని తొంగలో తొక్కి పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. ఈ క్రమంలో బ్యాంకులు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు వందల మంది రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అరకొర నగదును రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసినా, ఆ నగదు రైతులు తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇటువంటి తరుణంలో చెప్పిన మాటలను అమలు చేయని చంద్రబాబు మళ్లీ ఎన్నికలు రావడంతో జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లోని వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కాపీ కొడుతూ రైతులను మభ్యపెడుతున్నారు. ఎదురు చూసిన అన్నదాతలు ఇదిలా ఉంటే నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్మును గత ఏడాది డిసెంబర్ నెలలో రైతులకు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ ఏడాది వ్యవసాయ పనులు మొదలై నెలలు గడిచినా రైతులను ఆదుకునేలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నించ లేదు. దీంతో వ్యవసాయ పనులకు పెట్టుబడి డబ్బులు లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. రుణమాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమకాకపోవడంతో గత్యంతరం లేక బయట అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి వ్యవసాయ పనులు చేపట్టారు. వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి వలన సాగు చేసిన పంటలు చేతికిరాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇటువంటి తరుణంలో కనీసం రానున్న ఎన్నికల ప్రకటనకు ముందన్నా రుణమాఫీ చేస్తే కొంత మేర ఆదుకుంటుందని ఆశపడిన రైతులకు ప్రభుత్వ తీరు వలన నిరాశ మిగిలింది. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కింద రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి పది శాతం వడ్డీ కలిపితే రూ.34.81 కోట్లు చొప్పున రూ.382.98 కోట్లు అవుతుంది. దీంతో పాటు ఐదో విడత నగదు కూడా రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ నగదు కలిపితే రూ.731.15 కోట్లును చంద్రబాబు ప్రభుత్వం అందించాల్సి ఉంది. రైతులను మోసం చేసిన చంద్రబాబు వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకున్నాను. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసి అరకొరగా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం జమ చేసిన రుణం వడ్డీలకు కూడా సరిపోలేదు. అవి కూడా మూడు విడతలు మాత్రమే ఇచ్చారు. నాలుగు, ఐదో విడత సొమ్ము ఇంత వరకు ఇవ్వలేదు. – వరికూటి బ్రహ్మరెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం పెట్టుబడుల కోసం అప్పులు చేశాం చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా దగా చేయడం వలన రైతులు పూర్తిగా మోసపోయారు. ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులకు రైతుల దగ్గర డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేశారు. కనీసం ప్రభుత్వం నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బులు చెల్లిస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. – దావులూరి మాల్యాద్రి, రైతు, విప్పగుంట ప్రభుత్వం ఆదుకోలేదు నేను 15 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పంట ఎండిపోయింది. సుమారుగా ఒక లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. అంతేకాకుండా పంటకు బీమా కూడా చేశాను. ఇంత వరకు బీమా అందలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులను ఏ విషయంలో ఆదుకోలేదు. – శిరిగిరి వెంకటకృష్ణారెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం -
ప్రాణం తీసిన అప్పు
వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. తీసిచ్చిన అప్పు చెల్లించకపోవడంతో వి.కోటలో ఓ వివా హితుడు, మనస్పర్థలతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో మరో వ్యక్తి బలవన్మరణం చెందారు. చిత్తూరు, వి.కోట: వ్యక్తిగత అవసరాల నిమిత్తం తాను బావమరిదికి అప్పు తీసిస్తే తిరిగి చెల్లించకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో అవమానభారంగా ఎంచిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని దాసార్లపల్లెకు చెందిన వెంకటరమణ తన పెద్ద అక్క కుమారురుడికి అవసరాల నిమిత్తం వేరొకరి వద్ద అప్పు తీసిచ్చాడు. ఈ నేపథ్యంలో అప్పు చెల్లించాలని రుణదాతల వెంకటరమణను పదేపదే అడుగుతుండటం..బావమరిది తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటరమణ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తన భర్త మరణానికి అతని అక్కచెల్లెళ్లే కారణమని, అప్పు తీర్చేంతవరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి భార్య సరిత తేల్చిచెప్పింది. తన భర్త మృతదేహాన్ని అలాగే ఫ్రీజర్‌లో ఉంచారు. దీంతో గ్రామస్తులు వెంకటరమణ అక్కచెల్లెళ్లకు సమాచారమిచ్చారు. అయితే రెండు రోజులైనా వారు రాకపోవడంతో మంగళవారం వెంకటరమణ భార్య తన ఆడపడుచులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి వెంకటరమణ మృతదేహాన్ని పోస్టుమాçర్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉరేసుకుని వివాహితుడు ఆత్మహత్య శ్రీకాళహస్తి రూరల్: ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం శ్రీకాళహస్తి మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల కథనం.. మండలంలోని రాచగున్నేరి పంచాయతీ చటర్జీనగర్లో రేణిగుంటకు చెందిన నారాయణప్వామి(35), ధనలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. మనస్పర్థలతో ఇటీవల ధనలక్ష్మి తన పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు మధ్యస్థం చేసి సర్దుబాటు చేశారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు సజావుగా వీరి కాపురం సాగిననూ మళ్లీ దంపతుల నడుమ విభేదాలు తలెత్తాయి. రెండు రోజుల కిందట ధనలక్ష్మి తన ఇద్దరి పిల్లలను తీసుకుని మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన నారాయణస్వామి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతే రాజు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖకు నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. నిధులు మూడేళ్లలో మూడింతలయ్యాయి. దీనిని బట్టి రైతుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవు తుంది. రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాల కారణంగా వ్యవసాయశాఖ బడ్జెట్ భారీగా పెరిగింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.15,511కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.20,107 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.4,596 కోట్లు పెరిగినట్లయింది. ఈసారి రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతుబీమా అమలుకు రూ.650 కోట్లు కేటాయిం చారు. అంటే సింహభాగం ఈ 3 పథకాలకే ప్రభుత్వం కేటాయించింది. పంట కాలనీపై కేంద్రీకరణ... ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పంట కాలనీలపై దృష్టి సారించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని బట్టి రాష్ట్రాన్ని పంట కాలనీలుగా చేస్తారు. ఆ దిశగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసా యశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా యి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు, దేశవిదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ పంట కాలనీల లక్ష్యం. ఈ పథకాన్ని అమలుచేసే క్రమంలో చిన్న, మధ్యతరహా భారీ ఆహారశుద్ధి కేంద్రాలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పుతారు. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళాసంఘాల్ని భాగస్వాములు చేయాలని ప్రభుత్వం సంక ల్పించింది. 1.61 లక్షలున్న రైతు సమితి సభ్యులకు గౌరవ వేతనమిచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలను అందించాలనే బహు ముఖ వ్యూహంతో సమితులు పనిచేస్తాయి. ఈ సమితుల వేదికగా రైతు లందరినీ సంఘటిత పర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా పథకాలపై అస్పష్టత వ్యవసాయ శాఖ చేపడుతున్న అనేక ఇతర పథకాలు, కార్యక్రమాలకు మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో స్పష్టత ఇవ్వ లేదు. వ్యవసాయ, ఉద్యానశాఖలు ఇప్ప టికే అనేక ముఖ్యమైన కార్య క్రమాలు చేపడుతు న్నాయి. గ్రీన్ హౌస్, వ్యవసాయ యాంత్రీకరణ వంటివి అమలు చేస్తున్నాయి. యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. కానీ ఈసారి ఎంతనేది తెలియరాలేదు. ఉద్యాన శాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఎంతనేది ప్రకటించలేదు. వ్యవసాయ మార్కెటింగ్‌కు గత బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో కేవలం రూ.122 కోటు కేటాయిం చారు. అయితే, ఈసారి ఎంతనేది తెలియాల్సి ఉంది. రైతుబీమాతో ధీమా... రైతు ఏ కారణం వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలను కేవలం పదిరోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటివరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు రూ.283 కోట్లు అందించింది. ఈ బడ్జెట్లో రైతుబీమా పథకానికిగాను రైతుల తరఫున కిస్తీ కట్టేందుకు రూ.650 కోట్లు ప్రతిపాదించారు. ఇన్ని పథకాలు ఎక్కడా లేవు ఒక రాష్ట్రంలో వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ బడ్జెట్ ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొట్ట మొదటిసారి. దీంతో శాస్త్రీయ సాగు, రైతులకు ఆధునిక సాగు పరిజ్ఞానం, సాగులో మౌలిక వసతులు తక్షణమే అందించేందుకు వీలవుతుంది. దేశంలో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ... ఈ మూడూ ఎక్కడా అమలు కావడంలేదు. ఏదో ఒక పథకం అమలు చేయడానికే వివిధ రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. కానీ, ఇక్కడ ఇన్ని పథకాలు అమలు చేయడం చిన్న విషయం కాదు. – పిడిగం సైదయ్య,ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన వర్సిటీ రుణమాఫీకి 40 లక్షల మంది అర్హులు! రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాష్ట్రరైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణా లు మాఫీ కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11ని గడువుగా లెక్కించి ఆ తేదీ నాటికి రుణం తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీని ప్రభు త్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వారందరికీ రూ. లక్ష లోపున రుణా లు మాఫీ చేయాల్సి వస్తే దాదాపు రూ. 28 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 31 నాటి వరకు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న స్పష్టమైన లెక్కల ప్రకారం 48 లక్షల మందికి రూ. 31 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 11కి, డిసెంబర్ 31కి మధ్య రుణాలు తీసుకున్న వారి సంఖ్యలో భారీ తేడా కనిపిస్తుంది. 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి. రుణాలు తీసుకున్న రైతులు తమకు ఎప్పుడు మాఫీ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఈ రబీ సీజన్లో రూ. 16,998 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు కేవలం రూ. 7,765 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఓటాన్ అకౌంట్ ఎందుకంటే.. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి బడ్జెట్‌ను పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దానిపై సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వివరణ ఇచ్చారు. ‘ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు అనేక కారణాలున్నాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉం టాయి? ఏయే రంగాలకు ఎలాంటి కేటాయింపులుంటాయి? ప్రాధాన్యాలేం టి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలపై స్పష్టత లేదు. కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత మేరకు ఆర్థికసాయం అందుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. తెలంగాణ ప్రభు త్వం కూడా ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబో యే ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకున్నామ న్నారు. -
రుణ మాఫీపై ఉద్యమించిన రైతులు
సాక్షి, అమరావతి: రైతుల రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో దగా చేస్తోందని రైతులు మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలొస్తున్నా హామీ నిలబెట్టుకోలేకపోగా ఇప్పుడు చివరి రెండు విడతలను చెక్కులుగా ఇస్తామనడం దారుణమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు వద్దు, నగదు జమ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గన్నవరంలోని రైతు సాధికార సంస్థ ఎదుట రైతు సంఘాలు పెద్దఎత్తున ధర్నా చేశాయి. నగదును ఒకేసారి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. నల్లబాడ్జీలు ధరించిన రైతులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ పూర్తి చేయకపోవడాన్ని రైతులు నిరసించారు. ఇంకెంత కాలం సాగదీస్తారన్న నినాదాలతో రైతు సాధికార సంస్థ దద్దరిల్లింది. మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చెక్కులతో రైతుల్ని మోసం చేయవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాను ఉద్దేశించి రైతు సంఘాల నేతలు పలువురు ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.87,612 కోట్లు మాఫీ కావాల్సి ఉంటే దాన్ని రూ.24,500లకు కుదించారని, ఆ మొత్తాన్ని కూడా ఇంతవరకు ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందుల పాల్జేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది బ్యాంకుల ఎదుట డిఫాల్డర్లుగా మారారని మండిపడ్డారు. మూడో విడత డబ్బులు అందక రైతులు ఇప్పటికీ ఇక్కట్లు పడుతూ రైతు సాధికార సంస్థ చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాల్గోవ విడత మంజూరైన రూ.4,100 కోట్లు ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. ఈ ఆర్ధిక ఏడాది బడ్జెట్ ముగిసినప్పటికి నాలుగు, ఐదు విడతల రుణమాఫీ మొత్తం రూ.9,100 కోట్లు చెల్లించకపోవడం దారుణమన్నారు. రెండు విడతల మొత్తాన్ని ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రైతు సాధికార సంస్థ ఓఎస్డీ సురేంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ప్రతిరోజు వందల మంది గన్నవరం చుట్టూ తిరుగుతున్నందున రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలోని వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు కేవీవీ ప్రసాద్, యల్లమందరావు, వెలగపూడి అజాద్, జి.రమేష్, వై.కేశవరావు, పి.పెద్దిరెడ్డి, సీతారావమ్మ, పెద్ది వెంకటరత్నం, సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. వేర్వేరుగానే చెక్కులు.. దీనిపై రైతు సాధికార సంస్థ ఓఎస్డీ సురేంద్రబాబు స్పందిస్తూ 4, 5 విడతల రుణమాఫీ చెక్కులను వేర్వేరుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మార్చి 31లోగా చెల్లించేందుకు నిధులు సమీకరిస్తున్నామని, బ్యాంకుల వద్ద అవమానాల పాలుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బాధ్యులను నియమించామని, వారి పేర్లను, ఫోన్ నెంబర్లను మీడియాకు కూడా అందజేస్తామన్నారు. గతంలో ఇచ్చిన బాండ్లతో ఇక సంబంధం ఉండదని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని బ్యాంకుల్లో వేసుకుని నగదు చేసుకోవచ్చని వివరించారు. అయితే దీనిపై రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ప్రభుత్వం రైతులకు పోస్ట్డెటేడ్ చెక్కులు ఇవ్వడం సరికాదన్నారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే చెక్కులు చెల్లుబాటయ్యే పరిస్ధితి లేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు బకాయిలు నోటిఫికేషన్ ముందే చెల్లించాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
అరకొర రుణమాఫీకీ వాయిదా బేరం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాం... తొలి సంతకం కూడా దానిపైనే..’ అని గత ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చకుండా అన్నదాతలను అప్పుల ఊబిలోకి గెంటేసి వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల ముంగిట మరోసారి ప్రలోభాల వల విసిరేందుకు పోస్ట్ డేటెడ్ చెక్కుల పంపిణీకి తెర తీస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టాక రుణమాఫీపై కోటయ్య కమిటీ ఏర్పాటుతోపాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర వడపోతలతో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.24 వేల కోట్లకు కుదించి చివరకు వాటిని కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో రైతులు నిండా అప్పుల్లో మునిగారు. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను రుణమాఫీ నుంచి తొలగించడంతోపాటు కుటుంబానికి కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామంటూ పలు ఆంక్షలు విధించారు. దీంతో మాఫీ చాలామందికి వర్తించలేదు. మార్చిలో చెల్లుబాటు అయ్యేలా చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం నాల్గో విడత, ఐదో విడత రుణమాఫీ కింద రైతులకు చెల్లించాల్సిన రూ.8,832 కోట్లను ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు 4, 5వ విడత మాఫీ డబ్బులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇవి చెల్లుబాటు అయ్యేలా చెక్కుల తయారీ కోసం ఈనెల 15వ తేదీలోగా వివరాలను అందజేయాలని సహకార, వాణిజ్య బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్మును లబ్ధిదారుల సేవింగ్ ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ అర్హత కలిగిన వారి వివరాలను పంపాలని ప్రభుత్వం కోరింది. ఖాతాదారుడి పూర్తి పేరు, సేవింగ్స్ ఖాతా నెంబర్, సహకార సంఘం, బ్రాంచీలో సీకేసీసీ ఖాతా నెంబరు, బ్యాంకు బ్రాంచి పేరు, ఐయఫ్‌యస్‌సి కోడ్ వివరాలతో పాటు నాలుగు, ఐదవ విడత మొత్తం వివరాలను పంపాలని ప్రభుత్వం పేర్కొంది. మాఫీపై గవర్నర్‌తో సభలో అవాస్తవాలు.. రాష్ట్రంలో రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామంటూ సాక్షాత్తూ అసెంబ్లీలో రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్ చేత ప్రభుత్వం అవాస్తవాలను చెప్పించింది. సమాచారశాఖ జారీ చేసిన ప్రకటనల్లో కూడా రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు అసత్యాలను ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్ల దాకా ఉన్నాయి. ఈ రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సి ఉండగా చంద్రబాబు మాట తప్పడంతో రైతులపై వడ్డీల మీద వడ్డీల భారం పడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణ మాఫీ చేయకపోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మారారు. మరోవైపు వారికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకుండా చేశారు. దీంతో పొలం పనుల కోసం ప్రైవేట్ వ్యాపారస్తుల నుంచి ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుంటూ అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా బంగారం కుదువ పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలని, బాబు రాగానే బంగారాన్ని విడిపించి ఇస్తారంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బంగారంపై తీసుకున్న రుణాలను మాఫీ చేయబోనని ప్రకటించారు. దీంతో బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేశాయి. దీన్ని తట్టుకోలేక పరువుపోయిందనే బాధతో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో రైతుల అప్పులు పెరిగినట్లు జనవరి 25వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అజెండా కూడా స్పష్టం చేసింది. -
రుణమాఫీతో రుణం తీరేనా?
ఎన్నికల సమయంలో వాగ్దానాలను చూస్తుంటే ఎన్నికలకు రైతులకు అవినాభావ సంబంధం ఉందా అనిపిస్తుంది. నేడు ఏ రాష్టంలో ఎన్నికలు జరిగినా అక్కడి రాజకీయ పార్టీలు చేసే ముఖ్యమైన వాగ్దానం ‘ రైతుల రుణమాఫీ‘. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా, ఇంకా వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రంగం మీద ఆధార పడిన 61.5 శాతం రైతుల బతుకులు మారలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగానికి మేలుచేసి, వారి అభివృద్ధికి దోహదం చేసే ఎన్నికల వాగ్దానాలు అవసరమే! అయితే అవి దీర్ఘకాలంలో రైతులకు ప్రయోజనం చేకూరేవిగా, వారి సంపదను పెంచేవిగా ఉండాలి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు రైతుల ‘వ్యవసాయ రుణమాఫీ’కే పెద్దపీట వేస్తున్నాయి. ఈ వాగ్దానం ఆశ చూపి రైతుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల వేళ ‘రుణ మాఫీ’ ప్రకటనతో రైతులకు చేకూరే ప్రయోజనం కంటే దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు చేకూరే ముప్పే ఎక్కువ అన్న విషయం మననేతలకు తెలియదా? నిజానికి, రైతుల అభివృద్ధి ‘రుణ మాఫీ’తో సాధ్యం కాదు అనే విషయం తేటతెల్లం. రాజకీయ నాయకులు ‘రుణమాఫీ’ కాకుండా రైతులకు ‘పెట్టుబడి సాయం’ రూపంలో నగదు బది లీపై ఆలోచించాలి. నిజానికి 2008 లోనే నాటి సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి రైతులకు పెట్టుబడి సాయం రూపంలో నగదు బదిలీ గురించి ఆలోచించారు కానీ ఆయన అకాల మరణంతో అది కార్యరూపం దాల్చ లేక పోయింది. రైతుకు నేరుగా పెట్టుబడి కింద నగదును బదిలీ చేయడం ద్వారా రైతుకు బ్యాంకుల మీద లేదా వడ్డీవ్యాపారస్తులమీద ఆధార పడాల్సిన అవసరం ఉండదు. వడ్డీల భారం ఉండదు, రైతు తన సాగు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకునే అవకాశముంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరాకు 8 వేల రూపాయలు ఇవ్వడం ఒక విధంగా ‘రైతుల రుణమాఫీ’కి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలను ఇప్పుడు తెలంగాణ మోడల్ గా చెప్పుకుంటున్నారు. రైతుల ఈ దుస్థితికి కారణం వారు పండించే పంటకు సరైన ‘మార్కెటింగ్ విధానం’ లేకపోవడమే అని చెప్పక తప్పదు. మనదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికి, లోపభూయిష్టమైన వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్ విధానం స్థూల సమస్యగా చెప్పవచ్చు. ఇప్పటికీ, రైతు పండించిన పంట అమ్మడానికి స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల మీద ఆధార పడుతున్నాడు. దీనితో విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలను కోల్పోతున్నాడు. ఇక ప్రభుత్వాలు ప్రకటించే ‘కనీస మద్దతు ధర’ కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప క్షేత్ర స్థాయికి చేరుకోవడంలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం‘ (ఈ– నామ్) కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. వీటికి తోడూ సాగునీరు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత మొదలగు సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యల పరి ష్కారాన్నే పార్టీలు తమ ప్రధాన వాగ్దానాలుగా ప్రకటించగలిగిననాడు కేవలం రైతుల జీవితాల్లో నిజ మైన మార్పు రాగలదు. -డాక్టర్ రామకృష్ణ బండారు, మార్కెటింగ్ పరిశోధకుడు, ఓయూ మొబైల్ : 80191 69658 -
కరువు, తుపాన్లు వచ్చినా 11 శాతం వృద్ధి రేటు!
సాక్షి, అమరావతి: కేంద్రం సహకరించకుండా అడుగడుగునా అడ్డుపడినా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువులు, తుపాన్లు వచ్చినప్పటికీ 11 శాతం వృద్ధి రేటును సాధించామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) అత్యధికంగా రాష్ట్రంలో 300 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు చొప్పున జమ చేస్తానన్న నరేంద్ర మోదీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు చొప్పున ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటోందని విమర్శించారు. రుణమాఫీకి సహకరించాలని ప్రధాని మోదీని కోరితే అందుకు సహకరించకపోగా డబ్బులు ఇవ్వొద్దంటూ ఆర్బీఐకి చెప్పారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల కనీస అవసరాలను తీర్చే ప్రయత్నమే చేయలేదన్నారు. పేదలపై మానవత్వం చూపకుండా సబ్సిడీ చక్కెరను సైతం రద్దు చేసిందన్నారు. మహిళలకు వారి తల్లిదండ్రులు పసుపు కుంకుమ ఇచ్చినట్లే తాను ఒక అన్నగా ఈ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా బీసీల కోసం 20 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం డీపీఆర్–2ను కేంద్రం ఆమోదించకుంటే ఈనెల 11వతేదీన ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా కృష్ణా జలాలను మడకశిరకు తరలిస్తామన్నారు. నిండుసభ సాక్షిగా విపక్ష నేతపై నిందారోపణలు.. రాష్ట్రంలో నీతిమాలిన ప్రతిపక్షం ఉందంటూ శాసనసభ సాక్షిగా సీఎం చంద్రబాబు నిందారోపణలు, దూషణలకు దిగారు. రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు, అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. పోలవరం కాలువను తెగ్గొట్టడమే కాకుండా తునిలో రైలుకు నిప్పు పెట్టారన్నారు. ‘కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం తన పరిధిలో లేదని జగన్ అన్నారు... తునిలో రైలుకు నిప్పు పెట్టేది మాత్రం నీ పరిధిలో ఉందా?’ అంటూ సీఎం వ్యక్తిగత విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా...? వారికి ప్రజలు ఓట్లు ఎందుకు వేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్నా వారు రావడం లేదు, అలాంటప్పుడు జీతాలెందుకు తీసుకోవాలి? అని ప్రశ్నించారు. కేసుల భయంతోనే ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీని గట్టిగా అడగటం లేదన్నారు. ఎన్నికలొస్తున్నాయని భయపెట్టేందుకు పశ్చిమ బెంగాల్లో కేంద్రం సీబీఐతో దాడులు చేయిస్తే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించలేదన్నారు. మోదీ ఫ్రంట్ పెట్టించి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక వేత్తలను బెదిరించడం వల్లే విశాఖలో ఏర్పాటు చేయాల్సిన ఫోక్స్ వ్యాగన్ కంపెనీ పుణెకు తరలి వెళ్లిందన్నారు. బొత్స సత్యనారాయణ వాటాల కోసం బెదిరించడం వల్లే పరిశ్రమ రాకుండా పోయిందని ఆరోపించారు. 17 లక్షల పంపుసెట్లను సోలార్కు మారుస్తాం.. దేశంలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడిని తానేనని, ఇప్పుడు చేపట్టే వినూత్న కార్యక్రమాలతో ప్రపంచం తనను చూసి నేర్చుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పవరింగ్ ఏపీ’ పేరిట విజయవాడలో రెండు రోజులు పాటు జరిగిన ఎనర్జీ ఇన్నోవేషన్ ముగింపు సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చామని, మొత్తం 17 లక్షల పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చడమే కాకుండా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించేలా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పంపుసెట్ల నుంచి వచ్చే మిగులు విద్యుత్‌ను రైతుల నుంచి యూనిట్ రూ.1.50 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. దేశంలో టెలికాం సంస్కరణలను కూడా తానే చేపట్టానని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో వరుసగా రెండేళ్లుగా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. -
ఎన్నికలప్పుడే బాబుకు ప్రజలు గుర్తుకొస్తారా?
సాక్షి, నెల్లూరు : ఎన్నికలు వస్తేనే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తారా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచుతానని హామీ ఇచ్చేంతవరకు చంద్రబాబుకు పెన్షన్ పెంచాలనే ఆలోచనే రాలేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే వైఎస్సార్ సీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాటలను నమ్మి రుణాలు కట్టని మహిళలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో మహిళలను మరోసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగా.. మూడు విడతలుగా పదివేలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూడా రుణ మాఫీ చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. మూడు నెలలు కూడా పనిచేయని సెల్ఫోన్లను ఇస్తూ వాటి కొనుగోలులో కూడా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసం చేసిన తీరును రైతులు, డ్వాక్రా మహిళలు చర్చించుకుంటున్నారని గోవర్ధన్ రెడ్డి వివరించారు. -
బడ్జెట్ లైవ్ అప్డేట్స్ : వేతన జీవులకు భారీ ఊరట
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కారు బడ్జెట్ ఉంటుందన్న భారీ అంచనాల నేపథ్యంలో తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు గోయల్ తన బడ్జెట్ చిట్టాను విప్పారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్.. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు.. (సాక్షి లైవ్ కవరేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మధ్యంతరం కాదు.. అభివృద్ధికి రోడ్ మ్యాప్ తాత్కలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మధ్యంతరం కాదిది.. అభివృద్ధికి రోడ్ మ్యాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వేతన జీవుల ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించే సందర్భం సభికులను, టీవీల ముందున్న సాధారణ ప్రజలను ఆకట్టుకుంది. సమయం: 12.45: ముగిసిన పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం. లోక్ సభ సోమవారానికి వాయిదా ఆదాయపు పన్ను పరిమితి పెంపు ఎన్నికల ముందు వేతన జీవులకు భారీ ఊరట రూ.5లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు ఇప్పటివరకు ఇస్తున్న పన్ను మినహాయింపు రెట్టింపు గృహరుణాలు, ఇంటిఅద్దెలు,. ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలకు పెంపు పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంపు నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ ఉండదు. సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు. సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు సినీనిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు సినిమా టికెట్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు పైరసీ అరికట్టడం కోసం యాంటీ కామ్ కార్డింగ్ ప్రొవిజన్ యాక్ట్ అతి తక్కువ ఖర్చుతో డేటా, వాయిస్ కాల్స్ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచంలోనే అతి తక్కవ ఖర్చుతో డేటా, వాయిస్ కాల్స్ సేవలు 24 గంటల్లో ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్ 2030 నాటికి భారత్‌లో ఎలక్ట్రానిక్ వాహనాలు రైల్వే బడ్జెట్ రూ. 64,587 కోట్లు రేల్వేశాఖకు రూ. 64, 587 కోట్ల బడ్జెట్ కేటాయింపు రైల్వే చరిత్రలోనే ప్రమాదాలు జరగని ఏడాది బారీగేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం. త్వరలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఒక్కరికి ఇళ్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో 10 రెట్ల వృద్ధి 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించాం దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు జాతీయ గ్రామీణుపాధి హామీ పథకానికి రూ. 60వేల కోట్ల కేటాయింపు ఈఎస్ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు రక్షణ రంగానికి భారీ కేటాయింపులు రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయింపు సైనికులకు ప్రత్యేక అలవేన్స్లు అవసరమైతే రక్షణ శాఖకు అదనంగా నిధులు ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు కార్మికుల కోసం పెన్షన్ పథకం ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్. 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా పథకం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్. అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు బోనస్ పరిమితి 21వేల పెంపు ఉపాది అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారు. బోనస్ పరిమితి 21వేల పెంపు గ్రాట్యూటీ పరిధి 10 లక్షల నుంచి 30 లక్షల పెంపు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలి ఎన్పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు రైతులపై వరాల జల్లు చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం. ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లింపు 12 కోట్ల రైతులకు లబ్ధి కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు రైతు పెట్టుబడి సాయం 2018 డిసెంబర్ నుంచే అమలు రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్ పాడిపరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనపు మూడు శాతం వడ్డీ రాయితీ 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యం రంగం భారీ మార్పులు చూసింది. ప్రధాని మోదీకి ప్రజల ఆరోగ్యంపై ఎంతో ఆందోళన ఉండేది. 50 కోట్ల మందికి వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయుష్మాన్ పథకం ప్రవేశపెట్టాం. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం దేశ ఆత్మవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది. 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది. జీడీపీ వృద్ధి రేటులో గణనీయ పురోగతి సాధించాం విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం గడిచిన ఐదేళ్లలో భారత్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. డబుల్ డిజిట్ ద్రవ్యోల్పణాన్ని తగ్గించాం. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్ నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాం రాష్ట్రాలికచ్చే ఆర్థిక వాటాను పెంచాం. సహకార సమాక్యస్పూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాం బ్యాంకింగ్ రంగంలో 4ఆర్ ప్రవేశపెట్టాం మొండిబకాయిలు మూడు లక్షల కోట్లు వసూలు చేశాం మా చర్యల కారణంగా నిన్నే 3 బ్యాంకులపై ఆంక్షలు తొలిగాయి. బ్యాంకుల సరైన స్థితి ప్రజల ముందుంచాలని ఆర్బీఐని కోరాం బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం. ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడటమే మా ధ్యేయం మేం అవినీతి రహిత పాలనను అందించాం. స్వచ్ఛభారత్ ద్వారా ప్రవర్తనలో మార్పు తెచ్చాం. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాం. రెరా ద్వారా నియంత్రణను విధించాం. రిజర్వేషన్లను యథాతధంగా ఉంచుతూ కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చాం. సమయం 10:55: విపక్షాల నిరసనల మధ్య మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెడుతున్నారు. సమయం 10:55: తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌కు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. సమయం 10:35: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హయాంలో నోట్ల రద్దు చేసిన ఏడాదే అత్యధికంగా భారత్ వృద్ధి రేటు 8.2 శాతం వచ్చిందని, మరోసారి నోట్ల రద్దు చేయాలన్నారు. ఈ సారి రూ.100 నోట్లు రద్దు చేయమని సూచిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. The demonetisation year was the best year of growth (8.2%) under Mr Modi. So, let's have another round of demonetisation. This time let's demonetise 100 rupee notes. — P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019 సమయం 10:16: రైల్వే శాఖలో ప్రభుత్వ పెట్టుబడులు మరింతే పెరిగే అవకాశం ఉందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇప్పటికే సీసీటీవీల ఏర్పాట్లు, వైఫై సౌకర్యాల కోసం పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వం.. ఈబడ్జెట్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని మనోజ్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. Manoj Sinha, Minister of State for Railways: The way the government has increased the investment in railways, from installing CCTV cameras to WiFi, I believe further investment in railways will certainly be increased. #Budget2019 pic.twitter.com/hCxmn2rFpW — ANI (@ANI) February 1, 2019 సమయం 10:10: మధ్యంతర బడ్జెట్‌ను మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పత్రాలతో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. అంతకుముందు పీయూష్ గోయల్ రాష్ట్రపతి భవన్లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. #WATCH Finance Minister Piyush Goyal arrives at the Parliament with the #Budget briefcase. He will present the interim #Budget 2019-20 at 11 am #Budget2019 pic.twitter.com/4sCsHZUCBI — ANI (@ANI) February 1, 2019 సమయం 10:05: పార్లమెంట్ భవనంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరి సంప్రదాయం ప్రకారమే అయితే, పదవీకాలం చివర్లో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్లో కీలక విధాన నిర్ణయాలేవీ ఉండవు. పరిమిత కాలానికి ఖర్చులకు సంబంధించి అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. అయితే, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు, సమస్యల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు రుణాలపై వడ్డీ రాయితీతోపాటు పలు ఇతర ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలను విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంటు అనుమతి కోరడానికి అదనంగా.. గ్రామీణ, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలను పీయూష్ గోయల్ ప్రకటించొచ్చని భావిస్తున్నారు.