Ramachandraiah
-
పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య.. కన్నుమూత!
ఖమ్మం: కంచుమేళం శాశ్వతంగా ఆగిపోయింది. ఆదివాసీ సంప్రదాయ కళల రక్షకుడు, మణుగూరు మండలం బావికూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) తుదిశ్వాస విడిచారు. అంతరించిపోతు న్న గిరిజన కళలను కాపాడుతూ, కాలినడకన మారుమూల గ్రామాల్లో తిరుగుతూ భవిష్యత్ తరాలకు అందించిన జానపద కళాకారుడు, డోలు వాయిద్య కారుడు అయిన రామచంద్రయ్య కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచుతాళం, కంచుమేళంతో ఆదివాసీ కథలు అలవోకగా, కళ్లకు కట్టినట్లు వివరించగలగిన ఏకైక కళాకారుడు రామచంద్రయ్య మృతిపట్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ ్వరరావు సంతాపం తెలిపారు.కుటుంబ సభ్యులకు కలెక్టర్ హామీ..భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కూనవరంలోని రామచంద్రయ్య మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం, స్థలం సమస్య ప్రస్తావించగా, పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని, అంత్యక్రియల అనంతరం తన వద్దకు రావాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.అందని నాటి ప్రభుత్వ సాయం..సకిని రామచంద్రయ్య వనదేవతల వీరగాథలు చెప్పడంతో పాటు రెండేళ్లకోసారి వచ్చే ఆదివాసీ జాతరైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజుల వంటి దేవరుల కథను కళ్లకు కట్టినట్లుగా గానం చేయడంతో పాటు సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెల వద్దకు తీసుకు వచ్చే క్రమంలో కీలకంగా వ్యవహరిస్తారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళలను కాపాడుతున్న తీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డు అందజేసింది.అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కరించింది. ఆ వెంటనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.కోటి ఆర్థికసాయంతో పాటు 426 చదరపు గజాల ఇంటి స్థలం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న తనకు ఆర్థిక సాయం అందించి, కాపాడాలని కలెక్టరేట్ చుట్టూ తిరిగినా, అధికారులకు విన్నవించినా మోక్షం కలగలేదు. కళాకారులకు అందించే రూ.10 వేల పింఛన్ అందించడంలోనూ జాప్యం జరిగింది.పలుమార్లు కలెక్టర్లకు విన్నవించి నా ఆర్థికసాయం ట్రెజరీ నుంచి రావాలంటూ సమాధానం రావడంతో వైద్య పరీక్షలకు అప్పులు చేసి రూ.4 లక్షలతో వైద్యం చేయించుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో మణుగూ రు వచ్చిన రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను కలిసి న్యాయం చేయాలని వేడుకోగా.. ఆమె ఆర్థిక సా యం అందించారు. ఎన్నికల కోడ్ ముగిశాక కలవా లని సూచించగా, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 21న మళ్లీ సీతక్కను కలిశారు. దీంతో నాలుగైదు రోజుల్లో చెక్కు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ లోపే రామచంద్రయ్య మృతి చెందారు.జానపద కళకు తీరని లోటు: భట్టిఖమ్మంవన్టౌన్ : అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని డోలు వాయిద్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి పెట్టారని కొనియాడారు. రామచంద్రయ్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరం..ఖమ్మంమయూరిసెంటర్: కోయ అధ్యయన వేదిక ఆత్మీయ మిత్రుడు, సమ్మక్క సారలమ్మ తదితర కోయ వీరపురుషుల కథా గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సకిని రామచంద్రయ్య ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరమని ప్రముఖ కవులు పద్దం అనసూయ, డాక్టర్ గూడూరు మనోజ, జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వయసు పైబడి మరణించలేదని, గత ప్రభుత్వం ఇస్తామన్న రూ. కోటి ఆర్థిక సాయం నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ ఆదివాసీ కళాకారుడు ఇలాంటి స్థితిలో మృతిచెందడం కలచి వేస్తోందని తెలిపారు. -
ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు
-
ప్రజారవాణాపై ఎజెండా ఎక్కడ?
‘‘జన జీవనంలో రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. కానీ ప్రజారవాణాపై పాలకులకు గానీ రాజకీయపార్టీలకు గానీ ఎజెండా లేకుండా పోతోంది. మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాల గురించి చెప్పుకొస్తున్నా.. రవాణా వ్యవస్థపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకటించడం లేదు. సౌకర్యవంతమైన ప్రజారవాణా కల్పిస్తామని హామీ ఇవ్వడం లేదు. ప్రజలకు రవాణా వ్యవస్థ సౌకర్యవంతంగా ఉంటే..బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లే. అలాంటి ఆదాయం ఇచ్చే వ్యవస్థను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. రూ. వేల కోట్లతో మెట్రో, ఫ్లైఓవర్లు కడుతున్నా.. రోడ్లపై సురక్షితంగా నడించేందుకు ఫుట్‌పాత్‌లు లేని పరిస్థితి ఉంది..’’ అని రవాణారంగ నిపుణుడు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. జనాభా పెరుగుతున్నా.. సరిపడా బస్సులేవి? పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణాను అందించే విషయమై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష మంది జనా భాకు 60 బస్సులు అవసరం. ఆ లెక్కన కోటి జనాభా దాటిన హైదరాబాద్‌లో ఎన్ని బస్సులుండాలి..? ప్రస్తుతం రాష్ట్రం మొత్తం తిరుగుతున్న బస్సులను హైదరాబాద్‌లోనే తిప్పాల్సి ఉంటుంది. ప్రయాణికులు వీలైనంత మేర సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే పరిస్థితి రావాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి.. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే ఇటు ప్రభుత్వానికి, అటు ప్రయాణికులకు మంచి జరుగుతుంది. కానీ మన దగ్గర అంతా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర పురోగతిని ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోల్చే ముందు మన దగ్గర రవాణా వ్యవస్థ, రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. చంద్రబాబు ఆర్టీసీని దెబ్బ తీశారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఆర్టీసీ కోలుకోని విధంగా దెబ్బతింది. చార్జీలు అడ్డగోలుగా పెంచుతూ పోయారు, ఫలితం.. ఆర్టీసీలో సమ్మెలకు దారితీసింది. పాదచారులు సురక్షితంగా నడిస్తేనే.. కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఆర్టీసీకి ఏవిధమైన ప్రాధాన్యం ఇవ్వలేదు. నగరంలో ప్రజారవాణాకు ఇప్పటికీ ఆర్టీసీనే వెన్నెముక. కానీ దాని పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫ్లైఓవర్ల మీద ఉన్న శ్రద్ధలో వందోశాతం కూడా ఫుట్‌పాత్‌ల మీద లేదు. దాంతో నడవడం, రోడ్లు దాటడం కూడా ప్రమాదకరంగా మారింది. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మూడు శాతం పాదచారులే బలవుతున్నారు. పాదచారులు సురక్షితంగా నడిచే నగరాలనే ప్రపంచ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఫుట్‌పాత్, బస్‌స్టాప్‌లు ఎక్కడ అనేక దేశాల్లో ఫుట్‌పాత్ అంటే రోడ్డులో ఒక భాగం. కానీ మన దగ్గర మాత్రం ప్రయాణికులు నడవాలంటే సరైన ఫుట్‌పాత్‌లే ఉండవు. ఒక్కసారి ఎర్రగడ్డ నుంచి ఎల్బీనగర్ వరకు చూస్తే ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది. రూ.వేల కోట్లతో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా.. పాదచారుల కనీస అవసరమైన ఫుట్‌పాత్‌లను మాత్రం తీవ్రంగా విస్మరిస్తున్నారు. విదేశీ పర్యటనలు చేసి వచ్చే నేతలు అక్కడి ఫుట్‌పాత్‌లను చూసి కూడా తీరు మార్చుకోకపోవటం విడ్డూరం. నగరం చుట్టూ సైకిల్ ట్రాక్ ఉండాలి విస్తరిస్తున్న నగరాల్లో సైకిల్ ట్రాక్ కూడా అందుబాటులో ఉండాలి. అభివృద్ధి చెందిన ఎన్నో నగరాల్లో జనం సైకిళ్లను విస్తృతంగా వాడుతున్నారు. ఇది వాహన రద్దీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కానీ హైదరాబాద్ నగరం అలాంటి వ్యవస్థకు దూరంగా ఉంది. ఎక్కడో ఓ చోట నిర్మించాం చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నగరం చుట్టూ సైకిల్ ట్రాక్ ఉండాలి. పీక్ అవర్‌పై దృష్టి పెట్టాలి కీలక సమయాలుగా పేర్కొనే వేళల్లో రోడ్లపై రద్దీని నియంత్రించేందుకు పక్కా ప్రణాళిక అవసరం. ఆయా వేళల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉండాలి. హైదరాబాద్‌లో చూడండి.. పీక్ అవర్స్‌లో సొంత వాహనాలు రోడ్లను ట్రాఫిక్ జామ్‌లతో నింపేస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలను విస్మరించండి అంటూ అభివృద్ధి చెందిన దేశాల్లో సూచనలు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా ఆ మార్గాల వైపే వెళ్లాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మనదగ్గర అలాంటి వ్యవస్థ లేదు. ఓట్ల కోసమే ఆరాటం తప్ప.. నేతలు కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఎలాంటి అంశాలు చేరిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్న వాటిపైనే ఆలోచిస్తున్నారు. ప్రజా రవాణాను మెరుగుపరుస్తామని చెబితే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే మేనిఫెస్టోల్లో ఆ అంశాన్ని చేర్చటం లేదు. ప్రజా రవాణా వ్యవస్థపై రాజకీయ పార్టీలకు ఎంత చులకన భావం ఉందో ప్రస్తుత మేనిఫెస్టోలను చూస్తే అర్థం అవుతుంది. ప్రజలు బయటికొస్తే ఆదాయం వచ్చినట్టే కదా ప్రజా రవాణా వ్యవస్థను గాలికొదిలేయడం వల్ల వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి.చాలా దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు అవసరాల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఆదాయం వచ్చినట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు చూడడంలేదో అర్థం కావడంలేదు. -గౌటే దేవేందర్ -
దివాళాకోరు రాజకీయం అంటే ఇదే!. పవన్ అప్పుడు ఏం చేశారు?
మచిలీపట్నం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నాడు చేసిన ప్రసంగం పూర్తిగా డొల్లతనంతో వైరుద్ధ్యాల పుట్టగా సాగిపోయింది. 10 ఏళ్ల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం వెగటు కలిగించే ఓ ప్రహసనం. ఈ పదేళ్లలో తను చేసిన పొరపాట్లు ఏమిటో, తన వైఫల్యాలకు కారణాలేమిటో కనీసమాత్రంగా కూడా చెప్పకపోగా ఓట్లు వేయనందుకు ప్రజల్ని తప్పు పట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 2014లో ‘జనసేన’ను స్థాపించి బేషరతుగా బీజేపీ, తెలుగుదేశంతో కలిసి ప్రచారం చేసి, ఆ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దోహదపడ్డారు పవన్. 2018 మార్చి 14న ఆ రెండు పార్టీలకు ‘రాం రాం’ పలికి వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకొని ఎన్ని కలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైఫల్యా లనూ, నారా లోకేష్ పాల్పడిన అవినీతినీ ప్రతి సభలో ఎండ గట్టారు. అయితే, ప్రజలు పవన్ కల్యాణ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే పోటీ చేసిన రెండుచోట్లా అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో అనేక వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆ వర్గాలు వైఎస్సార్సీపీకి చేరువై, వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టం గట్టారు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా బలపడ్డాయి. దీంతో, వెనుకబడిన వర్గాలు, కాపులు తిరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు లేక పోవడంతో, కాపులను వైఎస్సార్సీపీ నుంచి వేరు చేసి వారిని తెలుగుదేశం పార్టీ వైపు నడిపించడం అనే వ్యూహంతో గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే, కులాలను కలుపుతానంటూ పవన్ ఓ చిత్రమైన పల్లవిని వినిపిస్తున్నారు. కులాలను కలపడం ఏమిటి? కొన్ని కొన్ని ప్రాంతాలతో రాజకీయ పరంగానో, సామాజిక పరంగానో కొన్ని కులాల మధ్య అపోహలు ఏర్పడటం సహజం. కానీ, అవి తాత్కాలికంగానే ఉంటాయి తప్ప కులపరంగా ప్రజలు విడిపోయి ఘర్షణలు పడే పరిస్థితి ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు గత 2 దశాబ్దాలు పైబడి ఎన్నడూ లేదు. పాలకులు అన్ని కులాల్నీ సమానంగా ఆదరించినపుడు కులాల మధ్య అంతరాలు ఏర్పడవు. జగన్ పాలనలో ‘కులాల కుంపట్లు’ లేనే లేవు. ఇది ఒక వర్గం మీడియా కావాలని చేస్తున్న దుష్ప్రచారం. కాపులు, బలిజలు తను ఎంత చెబితే అంత అన్నట్లుగా పవన్ కల్యాణ్ భావించడం విడ్డూరం. కాపులు, బలిజల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేశారు? చిరంజీవి ప్రజారాజ్యంపై కుల ముద్ర వేసిందెవరు? చిరంజీవి, అల్లు అరవింద్‌లు పార్టీ టిక్కెట్లు అమ్ముకొంటూ వేల కోట్లు సంపాదించారన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజారాజ్యం విజయావకాశాలను దెబ్బతీసిన పార్టీతో, వ్యక్తులతో పవన్ కల్యాణ్ అంటకాగితే కాపులు, బలిజలు హర్షిస్తారా? కులాల్ని కలపాలంటే ముందుగా ఎవరైతే తమది గొప్ప కులమని, తమ బ్లడ్ ప్రత్యేకమైనదంటూ నోరు జారారో... వారిచేత మిగతా కులాలకు క్షమాపణలు చెప్పించగలగాలి. అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అని వారికి గడ్డి పెట్టాలి. ఎన్టీ రామారావు గానీ, డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ తెలుగునాట కుల రాజకీయాలు చేయలేదు. వారికి కులం రంగు పులమాలని అప్పట్లో కొందరు ప్రయత్నించినా, తమ ఉన్నత వ్యక్తిత్వాలతో, అన్ని వర్గాల ప్రజల పట్ల సమాదరణతో వారు కులాలకు అతీతంగా ఉన్నతమైన నాయ కులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ కోవలోనే నేడు వైఎస్ జగన్ తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. చట్టసభల గడప ముఖం తెలియని అనేక బడుగు వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందువల్ల, భవిష్యత్తులో ఆయన గెలుపు నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగిపోతుందని గ్రహించినవారు.. తెలివిగా పవన్‌ను ముందుకు నెట్టి కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే తన గెలుపు కూడా కష్టం అని 2019 ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠంతో పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జత కట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ కారణంగానే తమ పార్టీని విస్తరించడం లేదు. సీనియర్ నేతలెవరైనా వచ్చి తమ పార్టీలో చేరతారేమోననే అనుమానంతో తనకు నచ్చిన ఓ నాయకుడికి నంబర్ 2 స్థానం కల్పించి ముందు పెట్టుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు టిక్కెట్లు ఇవ్వకపోయినా, వారి నుంచి పెద్దగా ప్రతిఘటన రాదు కనుక ఓ 15–20 సీట్ల మేరకు ఎన్నికల పొత్తుల్లో భాగంగా తీసుకొంటే సరి పోతుందనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తన వ్యూహాల్ని, ప్రణాళికలను, ఎత్తుగడల్ని ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడ తనను నలుగురిలో ఎండగడతారేమోననే అనుమానంతో.. ‘అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు చీల నివ్వను’ అంటూ ఓ సరికొత్త నేరేటివ్‌ను గత కొంత కాలంగా విన్పిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందిన చంద్రబాబు ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ తను చేసిన తప్పుల్ని ఒప్పుకోలేదు. కించపరిచిన బీసీలు, ఎస్సీలను క్షమాపణ కోరలేదు. కాపునేత ముద్రగడ పద్మనాభాన్నీ, ఆయన కుటుంబ సభ్యులనూ అవమానించిన తీరుకు బాధనూ వ్యక్తం చేయలేదు. తమ పాలనలో రైతులకూ, వెనుకబడిన వర్గాలకూ అన్యాయం జరిగిందని ఒప్పుకోలేదు. అయినప్పటికీ.. పవన్‌కు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే, పవన్ కల్యాణ్ మర్మం తెలియని చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కుల ప్రముఖులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనీ, చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలనీ తమ మనసులోని మాటగా చెబుతున్నారు. కానీ, ఇప్పటికే పవన్–చంద్రబాబుల మధ్య ఎంఓయూలు కుదిరిపోయాయన్న నిజాన్ని వారు ఎప్పటికి గ్రహిస్తారు?! సినిమాలకు, రాజకీయాలకు గల తేడాను గ్రహించకుండా రాజకీయాలలో సైతం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి పరిమితం అయ్యారు పవన్. తనకు కులం, మతం, ప్రాంతం లేదంటారు. మరోవైపు కులాల ప్రస్తావన తీసుకువస్తారు. పైగా, ఆయనకు డబ్బు మీద మోజు లేదట. డబ్బు అవసరం లేదట. రోజుకు 2 కోట్లు సంపాదిస్తానని చెప్తారు. ఇంకోవైపు నెలనెలా ఈఎంఐలు కడుతున్నట్లు చెప్పారు. ఈ వైరుద్ధ్యాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పవన్ కల్యాణ్‌కు పెద్దగా చదువు లేదు. కానీ పుస్తకాలు బాగా చదివాననీ, ఎంతో విజ్ఞానవంతుణ్ణనీ చెప్పుకుంటారు. రాజకీయాల్లో రాణించడానికి చదువే ప్రామాణికం కాదు. కామన్సెన్స్ ముఖ్యం. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని పవన్ చేసే హితబోధలో హేతుబద్ధత కనిపిస్తుందా? ఏ ఒక్క కులం కూడా సమూహంగా ఆలోచించదు. సమూహంగా వ్యవహరించదు. అందుకు కాపు కులస్థులు మినహాయింపేమీ కాదు. ప్రజలు తమ తమ స్థానిక స్థితిగతులను అనుసరించి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో నిర్ణయాలు తీసుకొంటారు. ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో వారిలో ప్రజలు కులాన్ని చూడరు. ఇది చరిత్ర చెప్పే సత్యం. పవన్ కల్యాణ్‌కు ఈ వాస్తవాలు ఎవరు చెబుతారు? ప్రజలు స్థిరమైన వ్యక్తిత్వం లేనివారిని, ఎప్పటికప్పుడు మాటలు మార్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అందువల్ల పవన్ కల్యాణ్ గంపగుత్తగా కాపుల్నీ, బలిజల్నీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వేరొక పార్టీకి బదలాయించాలని చేసే ప్రయత్నాలు విఫలం కాకతప్పదు. పవన్ కల్యాణ్ చేసే దివాళాకోరు కుల రాజకీయాల్ని ఏ వర్గమూ హర్షించదు, సహించదు. సి. రామచంద్రయ్య, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
సంక్షేమ రాజ్య స్థాపనే రాజ్యాంగ లక్ష్యం
రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా మరో విష ప్రచారానికి తెరలేచింది. పేదవాళ్లకు అందుతున్న నగదు బదిలీలు, సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట వేయకపోతే కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక ఆర్థిక సంక్షోభం తరహా పరిణామాలు ఉత్పన్నం అవుతాయట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు... ఇత్యాది ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలు తక్షణం జోక్యం చేసుకొని ఆయా రాష్ట్రాలకు ముకుతాడువేసి సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి పేదవాణ్ణి శిక్షించాలని కోరుతున్నారు కొందరు. చదవండి: ఇవి అనుచితం ఏమీ కాదు! ఎంత దుర్మార్గం ఇది! శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆ ప్రభుత్వం అందించిన రాయితీలు, సంక్షేమ పథకాలు ఎంతమాత్రం కాదు. ఈ వాస్తవం శ్రీలంక ప్రజలకు తెలుసు. అధికారంలో ఉన్న వారు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే తమ దేశం దివాళా తీసిందని అక్కడి ప్రతిపక్ష పార్టీలు విమర్శించడాన్ని ఏవరైనా చూశారా, చదివారా? మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టే చందంగా శ్రీలంక దేశంలోని సంక్షుభిత రాజకీయ పరిణామాలను మన దేశంలోని ఆంధ్రప్రదేశ్‌తోసహా మరికొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి ముడిపెడుతున్నారు కొందరు కుహనా మేధావులు. ప్రజల ఆదరణ పొందిన ప్రభుత్వాలపై పనిగట్టుకొని బురద జల్లేందుకు అల్లిన ఇటువంటి కథనాలలో వాస్తవం లేదు. శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని బూచిగా చూపి ఇక్కడి పేదవాడి కంచంలోని అన్నం ముద్దను లాగేయాలనీ, పేద విద్యార్థులకు అందే నాణ్యమైన విద్యను దూరం చేయాలనీ, మధ్యతరగతి వర్గాలకు అందిస్తున్న నగదు బదిలీ వంటి పథకాలను రద్దు చేయాలనీ గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాలకు ఎక్కుతున్నారు. తాము కట్టే పన్నులన్నీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికే ఖర్చు చేసి... అభివృద్ధి పనుల్ని అటకెక్కిస్తున్నారనే వాదనతో సంపన్న వర్గాలను పేద వర్గాల వారిపై ఎగదోసి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏపీ లాంటి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్ల ఖర్చు తప్ప సంపద పెరగదని కొందరు పెదవి విరుస్తున్నారు. వారి దృష్టిలో అసలు సంపద అంటే ఏమిటి? సంపద అంటే పేదవర్గాల ఆర్థికాభివృద్ధే సంపద. అందుకే, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవాభివృద్ధి, కుటుంబ సంక్షేమమే నిజమైన సంపద అని మనసా వాచా నమ్ముతూ ఆ దిశలోనే నవరత్నాలను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదు. ప్రముఖ ఆర్థిక చరిత్ర కారుడు డేవిడ్ రాండెస్ 21వ శతాబ్దిలో ప్రపంచం ఎదుర్కొనే ఏకైక ప్రమాదం ‘ధనిక పేద ప్రజలను విడదీసే సంపద, ఆరోగ్యాల మధ్య ఏర్పడే అంతరం మాత్రమే’ అని పేర్కొన్నాడు. సమాజంలో సంపద పెరగాల్సిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. సగటు జాతీయోత్పత్తి పెరిగితే దానిని అభివృద్ధికి కొలమానంగా గుర్తించే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ తదితర ఆర్థిక సంస్థలు వేసే లెక్కలు తప్పని తేలింది. పేదరిక నిర్మూలనకూ, దిగువ మధ్య తరగతి వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకూ జాతీయ ఆదాయాన్ని పెంచడం ఒక్కటే మార్గం కాదని అంతర్జాతీయంగా రుజువైంది. పేదరికాన్ని సూటిగా ఎదుర్కోవడానికి ఆర్థిక, సామాజిక సంస్కరణలు చేపట్టి ఆయా వర్గాలను సాధికారులను చేయడం అనివార్యమని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, మరో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మక్బూన్ ఉల్హక్ వంటి వారు చాలా కాలం క్రితమే చెప్పారు. అందుకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యావిధానాలలో పూర్తిస్థాయిలో సంస్కరణలు చేయాలనీ; ఆరోగ్య రంగంలో రోగ నివారణ, వైద్యం, తల్లుల పౌష్టికాహారం, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల సంక్షేమం వంటివి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలనీ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ చర్యలు చేపట్టింది. రైతులు, అసంఘటిత కార్మికులు, చేతివృత్తులపై ఆధారపడిన వారి ఆదాయాల్ని పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఢిల్లీలో ఆవ్‌ుఆద్మీ ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగానీ ఆ బాటలోనే నడుస్తున్నాయి. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం సైతం కొన్ని వినూత్న సంక్షేమ పథకాలతోపాటు ‘దళితబంధు’ వంటి ప్రయోగాత్మక పథకాలను అమలు చేస్తోంది. నిజానికి, ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం సంక్షేమ రాజ్యస్థాపనే. ఈ ఏడు దశాబ్దాల కాలంలో కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ, అభివృద్ధి రంగాలపై ఖర్చు చేశాయి. అయినప్పటికీ దేశంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో ఉంది. నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరింది. ఖర్చు చేసిన నిధుల వల్ల అధికంగా ప్రయోజనం పొందిన వర్గాలేమిటి? ఎందుకు ఆర్థిక అంతరాలు అంతకంతకూ పెరిగాయి? సంపద పెంచామని చెప్పుకొంటున్న వారి పాలనలో ఎవరు బాగుపడ్డారు? ఏ ప్రాంతాలు అభివృద్ధి సాధించాయి? ఏ మేరకు ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గాయి? విద్య, వైద్యం ఖరీదుగా మారి పేద, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా మారిపోవడానికి కారణం ఏమిటి? ఇందుకు అవలంభించిన విధానాలను సమీక్షించాల్సిన అవసరం లేదా? అధికారంలో ఉండగా పేద వర్గాలను సాధికారులుగా చేయకుండా వారి సంక్షేమాన్నీ, అభివృద్ధినీ నిర్లక్ష్యం చేసినవారు... ఇపుడు ఆ వర్గాలు అభివృద్ధిబాటలో పయనిస్తూ తమను ఆదరించిన పార్టీకి కృతజ్ఞతాపూర్వకంగా మళ్లీ ఎన్నికలలో ఎక్కడ ఓట్లు వేస్తారేమోనని భయపడుతున్నారు. ఇపుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో, అక్కడ ఢిల్లీలో అమలు జరుగుతున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాల్ని ఎలాగైనా నిలుపుదల చేయించాలని కొన్ని విఫల యత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే, ఆ పార్టీల్ని ప్రజలు క్షమిస్తారా?! సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
ప్రజాస్వామ్య ప్రాణదీపం పార్లమెంట్
పునరావృతం కావడం అన్నది చరిత్రకున్న సహజ లక్షణమే అయినా... ఎన్డీఏ ఏడున్నరేళ్ల పాలనలో పదేపదే ఒకే రకమైన ఆక్షేపణీయ దృశ్యాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆవిష్కృతం కావడం నేడు దేశవ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. మన దేశంలో అన్ని స్థాయుల లోని చట్టసభలకు ఆదర్శంగా నిలిచేది, నిలవాల్సింది భారత పార్లమెంటే. భారత రాజ్యాంగంలోని 2వ అధ్యా యంలో ఆర్టికల్ 79 నుండి 122 వరకు... పార్లమెంట్ ఏర్పాటు, పార్లమెంట్ పనితీరు, విధివిధానాలను తెలియ జెపుతాయి. పార్లమెంట్‌కు ఎన్నికయ్యే వారు ఈ అధికరణ లపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మొత్తం రాజ్యాం గంపై అవగాహన కల్పించుకోవల్సిన అవసరం, బాధ్యత కూడా ప్రతి సభ్యుడిపై ఉంటుంది. సాధారణంగా పార్ల మెంట్ సభ్యులు తమ ప్రసంగాలు, ప్రవర్తన ద్వారా పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంచాలని అందరూ భావిస్తారు. పార్లమెంట్‌కు సంబంధించి లిఖితమైన పలు నిబంధనల తోపాటూ... స్థిరపడిన అత్యున్నత ప్రమాణాలూ ఉన్నాయి. అలాగే పార్లమెంట్‌ను అగౌరవపర్చే విధంగా ఏ సభ్యుడూ ప్రవర్తించకూడదన్న నియమావళి కూడా ఉంది. వీటివల్లనే పార్లమెంట్‌ను ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికగా పరిగ ణిస్తారు. పార్లమెంట్ ప్రజావేదికే తప్ప రాజకీయ వేదిక కాదు. ఉభయ సభల్లో ఆయా సందర్భాలలో రాజకీయాల ప్రస్తా వన అనివార్యం అయినా... కేవలం రాజకీయ లబ్ధి కోసం కాక, ప్రజాబాహుళ్యానికి మేలు చేసేందుకు ఆయా అంశా లపై తగిన వివరణ ఇవ్వాల్సిన అవసరం అధికార పార్టీకి ఉంటుంది. అలాగే, అధికార పార్టీ వైఫల్యాలను ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్షాలు సైతం కొన్నిసార్లు రాజకీయ వ్యాఖ్యలు తప్పనిసరిగా చేస్తాయి. అయితే ఇవన్నీ... పార్ల మెంట్ బిజినెస్‌లో భాగంగానే చూడాలి. కాగా, ఇటీవలి కాలంలో పార్లమెంట్లో ఒక్క ప్రజాహితానికి సంబంధిం చిన అంశాలు తప్ప మిగతావన్నీ ప్రస్తావిస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి అధికార, విపక్షాలు పోటీపడి ‘పార్లమెంట్’ను ఫక్తు రాజకీయ వేదికగా ఉపయోగించు కుంటున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన పలు ఉదంతా లను పేర్కొనవచ్చు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ... నిర్దిష్టంగా కొన్ని ప్రభుత్వ వైఫల్యాలను, ఇతర అంశాలను ఎత్తిచూపారు. అందులో కీలకమైన భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో చైనా దురాక్రమణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే రాఫెల్, పెగసస్ తదితర ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే, రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశా లకు సభలో జవాబులు దొరకలేదు. ప్రధాని నరేంద్ర మోదీ... ఇంతకు ముందెన్నడూ లేని విధంగా... కీలక అంశాలను స్పృశించకుండా వాటిని దాట వేశారు. మోదీ ప్రసంగం రాజకీయంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ గత 7 దశాబ్దాలలో చేపట్టిన అనేక అప్రజాస్వామ్య విధానాలను మోదీ తన ప్రసంగంలో ఎత్తిచూపారు. ఆ క్రమంలోనే 2014లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014’ను అత్యంత అవమానకర రీతిలో ఆమోదింప జేశారంటూ విమర్శలు చేశారు. అయితే, ఆనాడు విభజన బిల్లు హడా విడిగా ఆమోదం పొందడంలో బీజేపీ పోషించిన పాత్రను ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ, పార్లమెంట్లో ప్రజాసమస్యలను వదిలేసి ప్రసంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిప్పడాన్ని ఎవరు హర్షిస్తారు? గతంలో కూడా పార్లమెంట్‌ను ఓ రాజకీయ వేదికగా మార్చి, పరస్పర రాజకీయ ఆరోపణలు చేసుకొన్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్న మాట నిజమేగానీ... ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలన్నిం టినీ దాటవేసి ‘‘నేను చెప్పిందే జవాబు’’ అనే విధంగా ప్రధాని వ్యవహరించడం బహుశా ఇదే మొదటిసారేమో! దేశంలో ఎందుకు తాము పార్లమెంటరీ విధానానికి మొగ్గు చూపాల్సి వచ్చిందో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వివరిస్తూ ‘‘అధ్యక్షతరహా పాలనలో ప్రభుత్వం సుదృఢంగా ఉండేమాట నిజం. కానీ, పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబు దారీగా ఉంటుంది. చట్టాల రూపకల్పనలో దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని ప్రతిబింబించడానికి సభ్యులు చొరవ చూపుతారు. వారు బిల్లులను కూలంకుషంగా స్క్రూటినీ (శూలపరీక్ష) చేస్తారు, చర్చిస్తారు. ప్రజలకు హితంకాని అంశాలను బిల్లులోంచి తొలగించేందుకు పట్టుబడతారు. అప్పటికీ పాలకపక్షానికీ, విపక్షాలకీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే సదరు బిల్లులను సెలక్ట్ కమిటీకీ, ఇతర పార్లమెంట్ కమిటీలకూ పంపుతారు. ఇక, ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి అనేక అవకాశాలు, అనేక రూపాల్లో పార్ల మెంట్ ప్రతి సభ్యుడికీ అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిలో పార్లమెంట్ పని చేయడం వల్ల ప్రజాస్వామ్యం బలపడు తుంది. ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడతాయి’’ అని పేర్కొన్నారు. డిబేట్స్ (వాదనలు), డిస్ప్యూట్స్ (వివాదాలు), డైలాగ్ (చర్చ) అన్నవి పార్లమెంట్ ఆత్మగా పరిగణిస్తారు. పార్ల మెంట్ సంస్థాగత సామర్థ్యం ఎంత గొప్పగా ఉంటే, ప్రజా స్వామ్యం అంత బలంగా ఉంటుంది. దేశంలో ప్రజాస్వా మిక వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నంత మాత్రాన దేశం ప్రజాస్వామ్య దేశం కాబోదు. ఆ వ్యవస్థలన్నీ తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహించాలి. వాటిని నిర్వహించే వారికి వాటిపట్ల నమ్మకం, గౌరవం ఉండాలి. ప్రజాస్వామ్యానికి వాటిల్లిన అతిపెద్ద జబ్బు ‘పార్లమెంటరీ పెరాలిసిస్’. చచ్చుబడిన చట్టసభల వల్ల దేశం పురోగమిం చదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే, పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని చట్టసభలు సమర్థంగా పని చేయాలి. అందుకు పార్లమెంట్ దిక్సూచి కావాలి. ప్రజాస్వా మ్యానికి ప్రాణదీపం.. పార్లమెంటే! వ్యాసకర్త: సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్: మన తెలుగు పద్మాలు వీరే...) డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) – గుమ్మడి లక్ష్మినారాయణ ఆదివాసీ రచయితల వేదిక -
‘పద్మశ్రీ’కి ఎంపికైన రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపరాఫర్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు అతని సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో సీఎంను మంగళవారం ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. పద్మశ్రీ కనకరాజుకు రివార్డు ప్రకటించిన సీఎం గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం రూ.1 కోటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు. -
సమాఖ్య స్ఫూర్తి ఓ ఎండమావి
కొన్ని మాటలు చెప్పుకోవడానికి సొంపుగా ఉంటాయి. కానీ, ఆచరణలో చూసినప్పుడు ఆవేదన కలుగుతుంది. ‘సమాఖ్య స్ఫూర్తి’ అనే మాట అటువంటిదే. భారతదేశం రాష్ట్రాల కూటమిగా ఉంటుందనీ, సహకార సమాఖ్య భావస్ఫూర్తితో పని చేస్తుందనీ భారత రాజ్యాంగం చెబుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వాటి పరిధిలో వేటికవి సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఒకదానికొకటి సహ కరించుకొంటూ జాతీయ సమైక్యతతో ముందుకు సాగుతాయి. ఇందుకు అనుగుణంగానే శాసన నిర్మాణాధికారాలు, కార్యనిర్వహణాధికారాలు, ఆర్థిక నిర్వహణాధికారాల విభ జన జరిగింది. ఆచరణలో ఇది జరుగుతున్నదా? తాజా ఉదాహరణనే చూద్దాం. సరిహద్దు భద్రతాదళాల (బీఎస్ఎఫ్) చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఓ సవరణ చేసింది. దాని ప్రకారం, సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో 15 కిలోమీటర్ల లోపలికి వచ్చి సోదాలు, జప్తులు, అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఉన్న అధికారాల పరిధిని పెంచారు. తాజా సవరణతో బీఎస్ఎఫ్ బలగాలు 50 కిలోమీటర్ల లోపలికి వెళ్లవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు. కేంద్రం తన వద్ద నున్న సమాచారంతో భద్రతా చర్యల దృష్ట్యా ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్న ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో సమర్థించాలనుకొన్నా, సదరు నిర్ణయం తీసుకోవడానికి ఆయా రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవసరం లేదా? పార్ల మెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవాలి కదా? భారతీయ జనతా పార్టీ తనను తాను ‘పార్టీ విత్ ఎ డిఫరెన్స్’ అని చెప్పుకొనేది. తాము అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థలను సమూలంగా మార్చేస్తామని చెప్పు కోవడం అందరికీ తెలుసు. గుజరాత్‌కు 13 ఏళ్లు ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ... అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల కేంద్రీకృత విధానా లను ప్రతి సందర్భంలోనూ ఎండగట్టారు. తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో మాట్లాడే అవకాశం కలిగి నప్పుడు ఆయన ఎంచుకొన్న అంశం... ‘యూపీఏ ఎ గ్రేవ్ థ్రెట్ టు అవర్ ఫెడరలిజం’. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించడాన్ని మోదీ తీవ్రంగా నిరసించారు. రాష్ట్రాలు తమ వార్షిక ప్రణాళికలను ఆమోదింపజేసుకోవడానికి ఢిల్లీలోని యోజన భవన్లో ఉన్న ప్లానింగ్ కమిషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవస్థపై గట్టిగా మాట్లాడారు. అసలు రాష్ట్రాల ప్రాధాన్యతలు కేంద్రానికి ఏం తెలుస్తాయంటూ ప్రశ్నించడమేకాక, రాష్ట్రాలను పెద్దస్థాయి మున్సిపాలిటీ లుగా మార్చేశారని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తను ఎదుర్కొంటున్న వివక్షను ఎత్తి చూపినప్పుడు ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. 2014లో నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చినప్పుడు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో కొత్త శకం ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే, బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించి 8 ప్రధాన హామీలు ఇచ్చింది. గవర్నర్ల నియామకంలో రాష్ట్రాలను సంప్రదించే సత్సంప్రదాయాన్ని పాటిస్తామనీ, రాష్ట్రాలు చట్టాలు చేసే అధికారంలో జోక్యం చేసుకోబోమనీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే దుష్ట సంప్రదాయానికి చెల్లుచీటీ పాడుతామనీ... ఇలా నిర్ది ష్టమైన హామీలు అందులో ఉన్నాయి. ‘సమాఖ్య స్ఫూర్తి’కి ఓ నూతన నమూనా ప్రవేశపెడతామని చెప్పారు. కాంపిటీటివ్ ఫెడరలిజం అంటూ కొత్త పదాలు వాడారు. అధికారం చేపట్టిన తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి ఆ స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ప్రవేశ పెట్టడం మినహా ఏ నూతన ఒరవడిని సృష్టించలేదు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఆర్టికల్ 356ను ఉపయోగించి బీజేపీయేతర ప్రభుత్వాలను దింపివేశారు. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ నినాదంతో అమలులోకి వచ్చిన జీఎస్టీ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా సెస్సులు, సర్‌చార్జీలు వసూలు చేసుకొంటూ రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. రాష్ట్రాల జాబితాలోని ‘వ్యవసా యం’కు సంబంధించి ఏ చర్చా లేకుండా 3 వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ఆమోదింపజేసుకొన్న తీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసింది. ఉమ్మడి జాబితాలోని విద్య, విద్యుత్‌లకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు, అంగీకారాలు లేకుండానే నూతన విద్యా విధానం, విద్యుత్ సవరణ బిల్లులు రూపుదిద్దుకొన్నాయి. ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్థులను ప్రైవేటుపరం చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో ఆయా రాష్ట్రాలలో అశాంతి రేకెత్తు తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాభాలలో నడుస్తున్న విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైన్స్ లేవని, నష్టాలు వస్తున్నాయని ప్రైవే టీకరణ చేయడానికి సిద్ధం కావడంతో ఆ ప్రాంత ఉద్యో గులు, ప్రజలలోనేకాక రాష్ట్రవ్యాప్తంగా అలజడి నెలకొంది. నష్టాల సాకుతో ప్రైవేటీకరణ చేస్తున్నామని చెబుతున్న కేంద్రం లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ఎందుకు ప్రైవేటీ కరణ చేయాల్సి వస్తున్నదో చెప్పడం లేదు. ‘చిన్న రాష్ట్రాలు బలమైన కేంద్రం’ ఉండాలన్నది బీజేపీ మొదట్నుంచీ నమ్మిన సిద్ధాంతం. అందుకు అను గుణంగానే ఆంధ్రప్రదేశ్ విభజనలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అయితే, విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని... ఆంధ్రకు ఐదేళ్లు కాదు, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు ఏడేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన తెలుగుదేశం నిష్క్రియాపరత్వం రాష్ట్రానికి శాపమైంది. కృష్ణానదీ జలాల వాటాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను పెద్దన్నపాత్ర పోషించి పరిష్కరించవలసిన కేంద్రం కొన్ని ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశప్రధానిగా ఏడేళ్లు పాలనా పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న నరేంద్ర మోదీ దేశ ప్రజల జీవన పరిస్థితులు మెరుగు చేశానని, అద్భుతాలు జరిగాయంటూ తనకు తానే కితాబు నిచ్చుకొన్నారు. ప్రపంచ ఆహార సూచీలో భారత్ ర్యాంకింగ్ పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి చిన్న దేశాలకంటే దిగజారడం ఓ అద్భుతమేమో! అభివృద్ధికి కొలమానాలు ఇంతకంటే మెరుగైనవి ఉంటే అవేమిటో బీజేపీ పాలకులు చెప్పాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర సంబం ధాలను ఏవిధంగా మెరుగుపరిచారో చెప్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
బాబు ‘రైతు విన్యాసాలు’ ఫలించవు!
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రైతు కోసం తెలుగుదేశం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం వెయ్యి ఎలుకల్ని తిన్న ‘పిల్లి’ పునీతం కావడానికి గంగాస్నానం ఆచరించిన చందంగా ఉంది. సదరు కార్యక్రమానికి, ‘మీడియా కోసం తెలుగుదేశం’ అనే పేరు పెడితే సరిపోయేదేమో! చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ మీడియా స్పేస్ ఆక్రమించడానికే కదా? ‘రైతు’ అనే పదం పలకడానిక్కూడా చంద్రబాబుకు అర్హత లేదు. చంద్రబాబు చేసిన తప్పిదాల్ని రైతులు మర్చిపోతారా? మరోసారి మోసపోవడానికి సిద్ధపడతారా? 1995–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొన్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆనాడు రాష్ట్రం అల్లకల్లోలం అయింది. ‘వ్యవసాయం దండగ’ అని ప్రచారం చేశారు. వ్యవసాయంపై ఆధారపడిన వాళ్లు బయటపడి సేవారంగంలో అవకాశాలు అందుకోవాలని ఓ గొప్ప సలహా ఇచ్చారు. కృష్ణానది మిగులు జలాలపై గల హక్కులను సద్వినియోగపర్చుకోలేదు. ఏ ఒక్క భారీ సాగునీటి ప్రాజెక్టునూ నిర్మించలేదు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా ఆల్మట్టి డ్యావ్‌ు ఎత్తు పెంచుకొంటుంటే... నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి కృష్ణా డెల్టా రైతాంగాన్ని ముంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలను దెబ్బతీశారు. సహకార రంగంలోని లాభాలు ఆర్జిస్తున్న చక్కెర కర్మాగారాలను, స్పిన్నింగ్ మిల్లులను మూత వేయించి, ఆ సంస్థలకు చెందిన విలువైన భూముల్ని కారుచౌక ధరలకు అయినవారికి కట్టబెట్టారు. రైతులు పెద్దయెత్తున ఆత్మహత్యలు చేసుకొంటున్న నేపథ్యంలో మానవత్వం లేకుండా విద్యుత్ చార్జీలను భారీగా పెంచారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఉద్యమించిన వారిపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించి ఐదుగురి ఉసురు తీశారు. ఆ కాల్పుల్లో 70 మందికి బుల్లెట్ గాయాలైతే ఆ సంఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయలేదు. ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడి.్డ.. ‘‘మేం అధికారంలోకి వస్తే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం’’ అని హామీ ఇస్తే చంద్రబాబు దానిని ఎద్దేవా చేశారు. విద్యుత్ రంగం కుప్పకూలుతుందని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని బెదిరించారు. అయితే, నాడు రైతులు చంద్రబాబు మాటలు నమ్మలేదు. ఎన్నికలలో చంద్రబాబును ఓడించి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొన్న వర్గాలలో రైతాంగమే ప్రథమస్థానంలో నిలిచింది. 2004 లో చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక, స్వరం మార్చి, మళ్లీ ఓట్ల కోసం ‘యూటర్న్’ తీసుకొని, ‘అధికారంలోకి వస్తే 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం’ అంటూ తమ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఆ వాగ్దానాన్ని చేర్చారు. కానీ రైతులు నమ్మలేదు. అయితే, 2014లో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో– ‘‘అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం; బంగారంపై తీసుకొన్న రుణాలతో పాటుగా’’ అంటూ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని రైతులు నమ్మారు. ప్రభుత్వ ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో మాఫీ సాధ్యమని చంద్రబాబు చెబితే నిజమేనని అనుకున్నారు. మాఫీ అర్హతకు పంట రుణాలు తీసుకొన్న కటాఫ్ తేదీని మార్చి 31, 2014గా తీసుకొంటామన్నారు. అధికారంలోకి రాగానే తన సహజ ప్రవృత్తిని బయట పెట్టుకొన్నారు. బంగారంపై తీసుకొన్న రుణాల మాఫీ మాట మర్చిపోయారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ కటాఫ్ తేదీని మార్చి 31, 2014 నుంచి డిసెంబర్ 31, 2013కు కుదించారు. అయినప్పటికీ మాఫీ చేయాల్సిన బకాయిలు రూ. 89,000 కోట్లు ఉండగా, రద్దు చేయాల్సిన రుణాలు కేవలం రూ. 24,000 మాత్రమేనని తేల్చారు. ఆ మొత్తమైనా ఏకకాలంలో చెల్లించారా? ఐదు విడతలలో చెల్లిస్తామని చెప్పి, ఆ మాట మీద కూడా నిలబడకుండా ఐదేళ్లల్లో రూ. 13,000 కోట్లు మాత్రమే చెల్లించి 2019 ఎన్నికల నాటికి రూ. 11,000 కోట్ల మేర బకాయి పెట్టి రైతుల్ని నిలువునా వంచించారు. రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబునాయుడు ఏదో ఒక సందర్భంలోనైనా తప్పుచేశానని ఒప్పుకొని ఉంటే కొందరైనా ఆయనను క్షమించేవారేమో! కానీ, చంద్రబాబులో నిజాయితీ లేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలన రాష్ట్ర రైతాంగానికి పీడకలగా మిగిలింది. కరువే భయపడి పారిపోయేట్లు అనంతపురం జిల్లాను కోనసీమగా మారుస్తానంటూ ప్రగల్భాలు పలికారు. పొరుగురాష్ట్రాల మాదిరిగా రైతాంగానికి ‘బోనస్’ ఇవ్వలేదు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో వ్యవసాయంలో నెగెటివ్ గ్రోత్ నమోదయింది. అయితే, తెలివిగా చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపదలో కనిపించిన వృద్ధిని వ్యవసాయంలో కలిపి, వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అంటూ వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారు. చంద్రబాబు రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రానికి, ఒకసారి విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూముల్ని పారిశ్రామికీకరణ పేరుతో కారుచౌకగా వేలాది ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. కానీ పేదలకు 50 గజాల నివేశన స్థలం ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రాలేదు. అమరావతి రైతులకు గ్రాఫిక్స్ చూపి, 3 పంటలు పండే భూముల్ని లాఘవంగా వారి నుంచి తీసుకొని వారి జీవితాల్లో చిచ్చుపెట్టారు. వ్యవసాయరంగాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన స్థాయిలో దేశంలో వేరొకరు చేసిన దాఖలాలు లేవు. కరోనా నేపథ్యంలో రాష్ట్రం, దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సేవల, పర్యాటక రంగాలు కుప్పకూలాయి. ఆ రంగాలదే భవిష్యత్తు అని ప్రచారం చేసిన చంద్రబాబు వాటి గురించి ఇప్పుడేమీ మాట్లాడ్డం లేదు. ‘రైతేరాజు’ అని భావించి వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డే నిజమైన దార్శనికుడని నేటి పరిస్థితులు నిరూపించాయి. కరోనా కష్టకాలంలో దేశాన్ని, రాష్ట్రాన్ని నిలబెట్టింది; ప్రజలకు తిండి గింజల కొరత లేకుండా చేసింది వ్యవసాయ రంగమే. రాజశేఖరరెడ్డికి నిజమైన వారసుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, దానివల్ల ఒనగూరుతున్న ఫలితాల్ని పొందుతున్న రైతాంగం... చంద్రబాబు విసిరిన వలకు ఎట్టి పరిస్థితులలో చిక్కుకోరు, మరోమారు మోసపోరు. చంద్రబాబు కృత్రిమ పోరాటాలకు కాలం చెల్లింది. బాబు చేసే ‘రైతు విన్యాసాలు’ ఇకపై ఫలించవు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
పెట్రోలు ధరలు తగ్గాలంటే...
పెట్రో ధరలు ఎవరి నియంత్రణలో లేనట్టు పెరిగిపోవడం దేశ ప్రజల్ని అసహ నానికి గురి చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలియం ధరల పెరుగుదలను ఓ ధర్మ సంకటంగా అభివర్ణించారు. పెట్రోధరల నియం త్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వ యంతో పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఈలోపు పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ సెంచరీ మార్కు దాటేశాయి. ఇటీవల కోవిడ్ ఔషధాలను తక్కువ శ్లాబ్‌లోకి చేర్చడానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశాన్ని ఎవ్వరూ చర్చించలేదు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రస్తావన ఇరువైపుల నుండి రాలేదు. పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేయడానికి కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనట్లు అర్థమవుతున్నది. కరోనా దెబ్బతో రాబడులు తగ్గి ఆర్థికంగా సతమతమవుతూ వైద్య ఆరోగ్యరంగంలో, సంక్షేమ రంగంలో అదనంగా నిధులు ఖర్చుపెట్టాల్సిన నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై తమవంతు భారం వేశాయి. కేంద్రం ఏకపక్షంగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల సెస్సులు విధిస్తూ తద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు దామాషా ప్రకారం వాటా ఇవ్వకుండా మొత్తాన్ని తమ ఖజానాలో జమ చేసుకొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మరో ప్రత్యామ్నాయం ఏముంది? పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించకుండా కారణాలు ఏమి చెప్పినా అవి ప్రజలను సంతృప్తి పర్చలేవు. భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న కొన్ని దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించి డిమాండ్‌ను పెంచుకున్న మాట వాస్తవమే. కరోనా నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యరంగంలో అధిక నిధులు ఖర్చు పెట్టాల్సిరావడం కూడా నిజమే. అందుకు పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధించి సామాన్యులను దొంగ దెబ్బ తీయడం సహేతుకం కాదు. కరోనా బెడద ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. భారత్‌తో పోల్చితే సాపేక్షంగా ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఒకవైపు కరోనాతో యుద్ధం చేస్తూనే తమ ప్రజలపై అదనపు భారం మోపకుండా పెట్రో ధరల్ని నియం త్రణలో ఉంచాయి. భారత్‌లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటిన దశలో నేపాల్‌లో లీటర్ రూ.51, శ్రీలంకలో రూ.55 మాత్రమే. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్’ నివేదిక ప్రకారం వివిధ దేశాలలో పెట్రోల్ స్థూల ధరపై జర్మనీలో 65%, ఇటలీలో 62%, జపా¯Œ లో 45%, అమెరికాలో 20% పన్నులు ఉండగా భారత్‌లో 260% మేర ఉన్నాయి. దీనిని ఎవరు సమర్థించగలరు? స్థూలంగా చూస్తే లీటర్ పెట్రోల్ రూ.100 ఉంటే అందులో రూ.59 పన్నుల రూపంలో పోతోంది. ప్రతియేటా దేశంలో అవసరమయ్యే పెట్రో ఉత్పత్తులు సగటున 211.6 మిలియన్ల టన్నులు కాగా, ఏటా 3.9% మేర ముడిచమురు వాడకం పెరుగుతోంది. దేశ అవసరాలలో 83% ముడిచమురును దిగుమతి చేసుకొంటున్న భారత్ అందుకు తన జీడీపీలో 4% నిధుల్ని ఖర్చు చేస్తోంది. ముడిచమురుకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిం చాలన్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్లనే ముడిచమురు అవసరాలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్, ఇథనాల్, మిథనాల్, విద్యుత్, సౌర విద్యుత్, బయోడీజిల్ మొదలైన వాటిని ఉపయోగించు కోలేకపోతున్నాం. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరే. ఉదాహరణకు ఇథనాల్, మిథనాల్‌లను పెట్రోల్‌లో 10% మేర కలిపి వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమేకాక, దిగుమతుల బిల్లులో దాదాపు రూ. 50,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. కానీ, దశాబ్దకాలంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 8% మించలేదు. తాజాగా 2025 నాటికి ఇథనాల్ మిశ్రమం 20%కు పెంచాలని, తద్వారా ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. చెరకు, మొక్కజొన్న, ఇతర రకాల వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథనాల్, మిథనాల్‌లను తయారు చేస్తారు. కనుక చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని, వీటి ఉత్పత్తుల కోసం అదనపు భూమిని సాగులోకి తేవాలన్న సూచనలు గతంలోనే అందాయి. సాగునీటి సదుపాయాలను పెంచడం కోసం దేశంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులను పబ్లిక్, ప్రైవేటు సంయుక్త రంగం నుండి సేకరించాలని నిపుణులు సూచించారు. దీనిపై పార్లమెంట్లో కూడా అనేక సందర్భాలలో చర్చలు జరిగాయి. కానీ, ఆ దిశగా తగిన చొరవ కనపడలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు కూడా ఆ అనువైన పరిస్థితుల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కారణం దేశంలో ముడిచ మురును నిల్వ చేసుకొనే మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండటమే. దేశంలో ప్రస్తుతం 23 ముడిచమురు శుద్ధి ప్లాంట్లు, ముడిచమురును దిగుమతి చేసుకోవడానికి 12 పోర్టులు, ముడి చమురు తెచ్చుకోవడానికి 10,406 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే దేశ అవసరాలకు 14 రోజులపాటు సరిపోయే ముడిచమురును మాత్రమే నిల్వ చేసుకోవడం సాధ్యపడుతుంది. ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఇంధన విధానంపై అనుసరించాల్సిన మార్గసూచీని 2020లో నీతి ఆయోగ్ అందిం చింది. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదు. ముడిచమురు చౌకగా దిగుమతి చేసుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషించాలి. భారత్‌కు ముడిచమురు ఎగుమతి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడం ద్వారా అనుచిత లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షల కారణంగా చౌకగా ముడిచమురు సరఫరా చేసే ఇరాన్, వెనిజులా దేశాల్ని భారత్ దూరం చేసుకొంది. ఇపుడు, అమెరికాలో అధికారం ట్రంప్ నుండి జో బైడెన్‌కు దక్కిన నేపథ్యంలో తిరిగి ఇరాన్, వెనిజులాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించు కోవచ్చు. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలి. దేశంలో ‘ఆయిల్ సప్లయ్ ఎమర్జెన్సీ’ విధానం లేకపోవడాన్ని ఇంధన రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై విధించే సర్‌చార్జీ నిధులను కేంద్రం ఆ రంగంపైనే ఖర్చు చేయాల్సి ఉండగా వాటిని దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై సెస్సులు విధించడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. దేశవ్యాప్తంగా కరోనా రెండోవేవ్ తగ్గుముఖం పడుతూ, ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన ధరల్ని నియంత్రించగలిగితేనే ఆర్థికరంగం గాడిన పడుతుంది. ముఖ్యంగా ఒకవైపు ఉపాధి, ఆదాయాలు కోల్పోయి ఇంకోవైపు వైద్య ఖర్చులు పెరిగిన ఈ కీలక దశలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కోలుకోవాలంటే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలి. ఆ ధరలు తగ్గితేనే ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర కార్యాచరణ ప్రకటించాలి. దేశ ప్రజలపై పెట్రో భారాన్ని వదిలించాలి. సి. రామచంద్రయ్య – వ్యాసకర్త శాసన మండలి సభ్యులు – ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు: సి రామచంద్రయ్య
-
‘కేవైసీ’ తెలుసుకోవాల్సింది ఎవరు?
ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజ లను వశపర్చుకొనే తంత్రం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ‘కేవైసీ’ అనే ఓ క్యాచీ స్లోగన్ వది లారు. అంటే నో యువర్ కాన్స్టి ట్యూషన్. ఇప్పటివరకూ కేవైసీకి నో యువర్ కస్టమర్ (నీ వినియోగ దారుని గురించి తెలుసుకో) అనే అర్థం ఉంది. మోదీ నో యువర్ కాన్ స్టిట్యూషన్ (నీ రాజ్యాంగాన్ని తెలుసుకో) అనే అర్థాన్నిచ్చి, భారత రాజ్యాంగ అమలుపై మరోసారి చర్చ జరిగేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 26, 2020న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత సభాపతుల ముగింపు సమావేశంలో మోదీ దీన్ని ప్రస్తావించడం విశేషం. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగంలో, చట్టాల్లో ఉన్న భాషను సరళతరం చేయాలని మోదీ చేసిన సూచన సముచితమైనది. రాజ్యాంగం ప్రతులు ప్రజలందరి దగ్గర ఉండాలి. ముఖ్యంగా, ప్రజాప్రతినిధుల వద్ద తప్పని సరిగా ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలిసినంత మాత్రాన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయా? గత 7 దశాబ్దాల అనుభవాలను చూసినట్లయితే అన్ని అక్ర మాలు రాజ్యాంగం నీడలోనే జరిగాయి. రాజ్యాంగం అమ లులో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దితేనే అన్ని వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తాయి. అంబేడ్కర్ ‘ఈ రాజ్యాంగం ఎంత మంచిదైనా కావొచ్చు. దీనిని అమలు జరిపేవారు మంచివారైతే ఇది మంచిదవుతుంది. చెడ్డవారైతే ఇది చెడ్డదవుతుంది’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నిజానికి, 5 ఏళ్ల క్రితమే 2016 నవంబర్ 26ను రాజ్యాంగదినంగా ప్రకటించి, నవంబర్ 26, 27 తేదీలలో రెండు రోజులపాటు ‘రాజ్యాంగానికి నిబద్ధులం’ అనే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్ పాలనలో అనేక రాజ్యాంగ వ్యవ స్థలు గాడి తప్పాయి. కాంగ్రెస్‌కు భిన్నంగా మోదీ నేతృ త్వంలో అన్ని వ్యవస్థలు రాజ్యాంగ సూత్రాలకు లోబడి పని చేస్తాయని ఆశించడం జరిగింది. గవర్నర్ల వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ... అన్నీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయ డానికి తగిన సంస్కరణలను ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుం దని ఆశించారు. గత ఆరేళ్ల అనుభవాలు చూసినట్లయితే రాజ్యాంగాన్ని ఓ దిక్సూచిలా చేసుకొన్నట్లు కనపడదు. అందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గతంలో కంటే మెరుగుపడిన దాఖలాలు లేవు సరికదా పలు అంశాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పీఠముడి పడేస్థాయికి చేరాయి. పశ్చిమ బెంగా ల్లో గవర్నర్ వ్యవహారశైలి వివాదంగా మారింది. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం దురదృ ష్టకరం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణల తర్వాత కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవడానికి కారణం సభాపతి (స్పీకర్/చైర్మన్) తన నిర్ణయాన్ని వెలువ రించడానికి నిర్ణీత కాలపరిమితి లేకపోవడం. ఇది ఫిరాయిం పుదారులకు వరంగా పరిణమించింది. 2014–19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అందులో నలు గురు రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఈ ప్రక్రియను సరిదిద్దడా నికి మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం చేయడం లేదు. 190వ ‘లా కమిషన్’ సిఫార్సులను అమలు చేయడం లేదా మరోసారి చట్టసవరణ చేయడం ద్వారా ఫిరాయింపుల జాడ్యాన్ని అరికట్టవచ్చు. అటువంటి చొరవ ఎన్డీఏ ప్రభు త్వంలో కనపడటం లేదు. పార్లమెంటులో చేసే చట్టాలను పటిష్టవంతంగా అమలు చేయడం కేంద్రానికున్న రాజ్యాంగ బాధ్యతల్లో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పార్లమెంట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014’లోని పలు అంశాలను ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదు. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా అందించా ల్సిన విధులు, నిధులు బదలాయించడంలో గత యూపీఏ అనుసరించిన మార్గంలోనే ఎన్డీఏ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అటకెక్కిన మహిళా రిజర్వే షన్ల బిల్లు చట్టరూపం దాల్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. వైద్యరంగంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రైవేటు వైద్యరంగం పాల్పడిన దాష్టీకాలనుండి గుణపాఠాలు నేర్చు కోవాలి. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు కబంధ హస్తాల నుండి విముక్తం చేసి వాటిని సార్వజనీనం చేయాలి. ప్రజల విశ్వసనీయతను కోల్పోతున్న వ్యవస్థల్లో ఒకటైన ‘భారత ఎన్నికల కమిషన్’ను మరింత సమర్థవంతంగా, పారదర్శ కంగా రూపొందించి ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షిం చదన్న భయాన్ని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు కలిగేలా సంస్కరణలు చేపడతారని ఆశించినప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. న్యాయవ్యవస్థ ప్రజలకు సమ న్యాయాన్ని, సత్వర న్యాయాన్ని అందించడానికి అవసర మైన సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందగలగాలి. దేశంలో దాదాపు 3,500కుపైగా వెనుకబడిన కులాలు ఉండగా అందులో 3,400 కులాలు ఇంతవరకు పార్లమెం టులోగానీ, అసెంబ్లీలోగానీ అడుగు పెట్టలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 100కుపైగా ఉన్న వెనుక బడిన కులాలవారికి దాదాపు 70కుపైగా ప్రత్యేక కార్పొ రేషన్లు ఏర్పరచి రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రోత్సాహం కల్పించడం దేశంలోనే ఓ విప్లవాత్మక ముందడుగు. అయితే, జనాభాలో 50 శాతంగా ఉన్న ఓబీసీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు పెంచాల్సిన అవ సరం ఉంది. ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకించి మంత్రి త్వశాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ దానిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వంలో కనపడటం లేదు. రాజ్యాంగానికి నిబద్ధులం అని చాటుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆకలి, అనారోగ్యం, పేదరికం నిర్మూలన, దోపిడీ, వివక్షల నుండి రక్షణ తదితర సామాజిక లక్ష్యాల సాధనలో ఏ మేరకు విజయం సాధించారన్నదే కొలమానం. రాజ్యాంగం అంటే చట్టపరమైన పత్రాలే కాదు, అదొక సామాజిక పత్రం అన్న అంబేడ్కర్ మాటల్ని చిత్త శుద్ధితో అమలు చేసి ఫలితాలు చూపించాలి. అప్పుడే రాజ్యాంగానికి కట్టుబడినట్లు భావించగలం. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
సమాఖ్య స్ఫూర్తి ఏదీ? ఎక్కడ?
కేంద్రీకృత విధానాలకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ కాగా, ఆ విధానాలను తూర్పారపడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రాష్ట్రాల హక్కులను హరించడంలో తామేమీ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నం కాదని నిరూపిస్తోంది. నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరణ, రాష్ట్రాల అధికారాలలో కోత వంటి అంశాల్లో కేంద్రం ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటం. కాగా జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య స్ఫూర్తిని నీరుగార్చేదిగా ఉంది. జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకొనే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, అందుకు అనుగుణంగా చట్టంలో చేర్చిన అంశాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. జీఎస్టీ రాబడులు తగ్గాయి కాబట్టి రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు ఎగ్గొట్టడం మన సమాఖ్య స్ఫూర్తికే భంగకరం. మన దేశంలో ఉన్నది అర్థఫెడరల్ విధా నంతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని; కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగానూ, పరస్పరం సహకరించుకొంటూ రాజ్యాంగ లక్ష్యాలను సాధించే దిశగా సాగాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రవచించినా, అది ఆచరణకు నోచలేదు. రాజ్యాంగ స్వరూపంలోనే కేంద్రానికి ఎక్కువ అధికారాలు దఖలు పడ్డాయి. కారణాలు ఏవైనా, ప్రపంచంలోని ఏ ప్రజాస్వామిక సమాఖ్య వ్యవస్థలో లేనన్ని వైరు ధ్యాలు మన వద్ద కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనవి వనరుల సమీకరణ, ప్రజా సంక్షేమ బాధ్యత. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఎప్పటికప్పుడు మెరుగుపరిచే గురుతర బాధ్యత రాష్ట్రాలపైనే ఎక్కువ. ప్రజా రక్షణ, దేశ భద్రత, సామాజిక విముక్తి, ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరత మొదలైన అంశాలలో కేంద్ర, రాష్ట్రాలది ఉమ్మడి బాధ్యత. దీని ఆధారంగానే విధులు, బాధ్యతలు, హక్కుల విషయంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబి తాలు ఏర్పాటయ్యాయి. వైరుధ్యం ఎక్కడ ఉందంటే ఎక్కువ బాధ్య తలు కలిగిన రాష్ట్రాలకు తక్కువ అధికారాలు కల్పించబడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకొని కేంద్రం తనకున్న అపరిమితమైన అధికారాలతో రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవడం ఎక్కువగా కనపడుతుంది. ఫలితంగానే, రాష్ట్రాలు ఆశిం చిన స్థాయిలో బలపడలేకపోయాయి. పాత బాటలోనే ఎన్డీఏ కేంద్రీకృత విధానాలకు అంకురార్పణ చేసింది కేంద్రంలో సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీయే. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రా లలో ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా చేసుకొని అధికారం చలాయిం చిన చరిత్ర, తమ పార్టీ అధికారంలేని రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఆ విధానాలను తూర్పార పడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రాల హక్కులను హరిం చడంలో తామేమీ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నం కాదని నిరూపిస్తోంది. గత ఎన్డీఏ–1 ఐదేళ్ల పాలనగానీ, ప్రçస్తుత ఎన్డీఏ–2 పద్నాలుగు నెలల పాలనగానీ పరిశీలించినపుడు నోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరణ, తదితర అంశాలలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటం. రాష్ట్రాల పరిధిలోని అంశాలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేసి, మళ్లీ వాటిల్లో కొన్నింటిని కేంద్ర జాబితాకు బదిలీ చేసు కోవడం కేంద్రానికి పరిపాటిగా మారింది. జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకొనే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, అందుకు అనుగుణంగా చట్టంలో చేర్చిన అంశాలకు పూర్తి విరు ద్ధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. ‘కరోనా’ కారణంగా పారిశ్రామిక వ్యాపార రంగాలు కుదేలైన నేప థ్యంలో జీఎస్టీ వసూళ్లు అంచనాలు అందుకోలేకపోయాయని, మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు కావల్సి ఉండగా కేవలం 65,000 కోట్లు మాత్రమే వచ్చాయని, కనుక రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించలేమని కేంద్రం తెగేసి చెప్పడం అసాధారణం. లాభాలొస్తే మాకు, నష్టాలొస్తే మీకు అనే చందంగా వ్యవహరించడం కేంద్రానికి తగని పని. రాష్ట్రాలకు నష్టపరిహారంగా ఉపయోగించాల్సిన రూ. 47,272 కోట్ల నిధులను కేంద్రం అక్రమంగా తనవద్ద ఉంచేసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనలర్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికను పరిశీలించినట్లయితే, కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లం ఘించినట్లు స్పష్టమవుతుంది. కరోనా కష్టకాలంలో ఉమ్మడి బాధ్యత ‘ఒకే దేశం–ఒకే పన్ను’ నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం లోని ఎన్డీఏ–1 ప్రభుత్వం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016 సెప్టెంబర్ 8న వస్తు, సేవల పన్నులను నిర్ణయించడానికి జీఎస్టీ కౌన్సిల్ అనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీని సజావుగా ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఆ సందర్భంగా రాష్ట్రాలకు పలు వాగ్దానాలు చేశారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాల ఆదాయాలకు నష్టం వాటిల్లదని, ఒకవేళ లోటు ఏర్పడినట్లయితే కేంద్ర సంచితనిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్రాల ఆర్థికలోటును భర్తీ చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో నాటి కేంద్ర ఆర్థికమంత్రి పదేపదే చెప్పారు. నిజానికి, జీఎస్టీ బిల్లు ముసాయిదాలోనే రాష్ట్రాల అభ్యంతరాలకు చోటు లేకుండాపోయింది. బిల్లులోని సెక్షన్ 12(9) ప్రకారం జీఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయమైనా జరగాలంటే, ఆ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేవారిలో 75% మంది ఆమోదం పొందాలి. అయితే, జీఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాలకు 67% ఓట్లు మాత్రమే కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పాల్గొనే ఇరువురు మంత్రులకు 33% ఓట్లు నిర్ధారించారు. అటువంటప్పుడు జీఎస్టీ కౌన్సిల్లో తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే అవకాశమే లేదు. జీఎస్టీ వసూళ్లు మందగించడానికి కరోనా కారణం అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన కొంతవరకు నిజమే. కానీ, కరోనా ప్రభావం ఎక్కువగా రాష్ట్రాలపై పడింది. కరోనా దెబ్బకు కేంద్రానికి లభించే ఆదాయంలో దాదాపు 40% మేర క్షీణత నమోదుకాగా, రాష్ట్రా లకు లభించే ఆదాయంలో 60% నుంచి 70% తగ్గుదల కనిపిస్తున్నది. పైగా, కరోనా కట్టడికి, బాధితుల చికిత్సకు కేంద్రం కంటే రాష్ట్రాలే అధిక మొత్తంలో నిధులు ఖర్చు పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ గడ్డు పరిస్థితులలో రాష్ట్రాలకు బకాయిలు చెల్లించ కుండా అవసరమైన నిధుల సమీకరణకు ‘అప్పులు తెచ్చుకోండి’ అని కేంద్రం నోటి మాటగా చెప్పడమే ఆశ్చర్యం. ఒకవైపు రుణాల స్వీకరణకు రాష్ట్రాలపై ఎఫ్ఆర్బిఎం పరిమితులు మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి. ఇంకోవైపు పరిమితులను మించి రుణాలు స్వీకరించాలంటే సంస్కర ణల అమలు పేరుతో కొన్ని రంగాలలో అదనంగా పన్నులు వేయా లన్న కేంద్రం ఆంక్షలు మరోవైపు. కోవిడ్ ఎంత కాలం ఉంటుందో, రెవెన్యూ లోటు ఎంత పెరుగుతుందో తెలియనపుడు రాష్ట్రాలు అధిక వడ్డీపై ఏవిధంగా అప్పులు తెచ్చుకోగలవు? బ్యాంకుల నిరర్థక ఆస్తులు గత యూపీఏ హయాంలో దాదాపు 4 లక్షల కోట్లు ఉండగా, గత ఆరేళ్లల్లో ఆ మొత్తం 10 లక్షల కోట్లకు చేరాయి. దీంతో బ్యాంకులే నిధుల కొరతతో సహాయానికై రిజర్వు బ్యాంకు వైపు చూస్తున్నాయి. ఎంతకాలం ఇలా? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉన్నదంటే జీఎస్టీ వసూళ్లలోనూ మొండిబకాయిలు కొండలా పెరుగుతున్నాయి. జీఎస్టీ రేట్లు, శ్లాబుల మార్పుపై జీఎస్టీ కౌన్సిల్ మొదట్లోనే సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, శ్లాబులలో మార్పులు చేసి ఉంటే పారిశ్రామిక వర్గాలకు వెసులుబాటు లభించేది. జీఎస్టీని ఎవ్వరూ ఎగ్గొట్టేవారు కాదు. కేంద్రం ఏకపక్షంగా ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడి జీఎస్టీ కట్టలేక చేతులెత్తేశాయి. కేంద్రం అవలంభించిన ఇటువంటి విధానాలు రాష్ట్రాలకు శాపాలుగా మారాయి. ప్రణాళికాసంఘం రద్దు కానంత వరకు కనీసం ఆ సంస్థ రాష్ట్రాల విన్నపాలను, డిమాండ్లను పట్టిం చుకొనేది. ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి ఆ స్థానంలో ఏర్పాటు చేసిన ‘నీతి ఆయోగ్’ కేవలం కేంద్రానికి సలహాలిచ్చే వ్యవస్థ మాదిరిగా పని చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు? అన్నది ప్రశ్న కాదు. ఎందుకు రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారు? సమాఖ్య స్ఫూర్తిని ఎందుకు అమలు చేయడం లేదు? అన్నదే అసలు సమస్య. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం సాధ్యమని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ, రాష్ట్రాలు బలోపేతం కాకుండా కేంద్రమే అడ్డుపడుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహపర్చడం, ఆర్థిక నిర్వహణ సరిగాలేని రాష్ట్రాలకు అధికమొత్తంలో నిధులు ఇవ్వడం, ఓట్ల రాజకీయాల మాయలోపడి కొన్ని రాష్ట్రాలకు భారీ ఆర్థిక ప్యాకే జీలు ప్రకటించడం, ఇచ్చిన వాగ్దానాలపై వెనక్కి పోవడం, పార్లమెంట్ చేసిన చట్టాలను గౌరవించకపోవడం తదితర ఏకపక్ష కేంద్రీకృత పోకడల్ని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టాలి. కరోనా నుంచి నేర్చుకొనే పాఠాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలన్నది ఒకటి. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడా నికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి చెప్పిన విధంగా ‘ఆత్మ నిర్భర్’తో ముందుకు సాగాలి. ‘మేము ఏమీ చేయలేం. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ నిస్సహాయంగా చేతులు ఎత్తేస్తే ప్రజలు క్షమించరు. కేంద్రం ఇప్పటికైనా సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. రాష్ట్రాలకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలవాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
మానవీయ స్పర్శ ఏది?
అనుకోని ఆపద వచ్చిపడి నప్పుడు ఆందోళన పడటం కంటే ఆత్మవిశ్వాసంతో వుండటం చాలా అవ సరం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మూడునెలల్లో వ్యక్తుల ఆదాయాలతో పాటు వ్యవస్థల, సంస్థల ఆదాయాలు పూర్తిగా తుడి చి పెట్టుకుని పోయాయి. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటి పరిస్థితి కూడా ఇదే. ఈ కల్లోలం నుంచి ఉపశమనం కలిగించడానికి మన కేంద్ర ప్రభుత్వం తొలి విడత లక్షా 80 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీగా ప్రకటించింది. ఆ తదుపరి చాలా ఆలస్యంగా మలివిడత ప్యాకేజీని భారీ అంకె లతో... అంటే రూ. 21 లక్షల కోట్లతో, ఆకర్షణీయ మైన పేరుతో–ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ప్రక టించింది. తొలి ప్యాకేజీ–ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్, మలి ప్యాకే జీ–ఆత్మ నిర్భర్ భారత్ కలిసి దేశ స్థూల ఉత్పత్తిలో 10 శాతం అవుతుందని లెక్కలు చెప్పారేగానీ, ఇది రూ. 30 లక్షల 42 వేల 230 కోట్ల వార్షిక బడ్జెట్లో భాగమా అని అడిగితే బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారుగానీ, లెక్కలు చెప్పడానికి సిద్ధప డటం లేదు. ‘భారీ ప్యాకేజీ’ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ మేధా వులు ‘ఆహా ఓహో’ అంటూ శ్లాఘిస్తున్నారు. వ్యతి రేకించిన వారిని నిందిస్తున్నా రు. కానీ ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నిశితంగా విమర్శిస్తుంటే ఏం మాట్లాడాలో ఈ పెద్దలకు అర్థం కావడం లేదు. ఆ సంస్థ విమర్శించడంతో సరి పెట్టలేదు, కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల్ని సంఘటితం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించింది. కరోనా వల్ల వచ్చిపడిన కష్టం నుంచి దేశాన్ని ఆర్థి కంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం మంచిదే. కానీ ఆచరణలో ‘ఆత్మ నిర్భర్’ అందుకు ఎలా ఉపయోగ పడుతుం దన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దేశం ఆర్థికంగా బల పడాలంటే అన్ని రకాల ఉత్పత్తులు జరగాలి. వినిమయం పెరగాలి. అది సాధ్యం కావాలంటే ప్రజల వద్ద డబ్బు వుండాలి. అందుకవసరమైన ఆదాయ మార్గాలుండాలి. ప్రజల పొదుపు పెరగాలి. దశాబ్దాలుగా కార్మికుల రక్తం, స్వేదంతో బల పడిన బొగ్గు, రైల్వేలు, ఉక్కు, విద్యుత్, టెలికం, బ్యాంకింగ్, రక్షణ, తపాలా తదితర రంగాల్లో కొన్ని టిని గంపగుత్తగా, కొన్నింటిలో 75 శాతం వాటా ల్ని, మరికొన్నిటిలో ఇంకా గరిష్టంగా ప్రైవేటుపరం చేయడం ఒక్కటే మంచి అవకాశం అవుతుందా? ఇవి పరాధీనతకు సంకేతమా లేక స్వావలంబనకు నిదర్శనమా? దాచేస్తే నిజాలు దాగుతాయా? తొలి విడత ఉద్దీపనలో బ్యాంకులకు చెల్లించే వాయిదాలను మూడు నెలలు వాయిదా వేస్తామని, వాటిపై వడ్డీ మాఫీ చేస్తామని కేంద్రం ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు. బ్యాంకులు యథావిధిగా వాయిదాలు కట్టించుకున్నాయి. అందుకు బ్యాంకుల్ని తప్పుబట్ట లేము. అవి డిపాజిటర్లకూ, రుణ గ్రహీతలకూ మధ్యవర్తులుగా వ్యవహరి స్తాయి. కోశాగారం లోటు ఒకపక్క, కేంద్రం చేస్తున్న అప్పులు మరో పక్క పెరిగి అంతర్జాతీయ స్థాయిలో మన దేశం రేటింగ్ పడిపోయింది. 2020–21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 1.5 శాతం వుండొచ్చునని కేంద్రమే అంచనా వేసింది. ఇది మైనస్ 1.7 శాతం వుండొచ్చునని కొన్ని సంస్థల అంచనా. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మాత్రం ఇకపై జీడీపీకి సంబం దించిన అంచనాల జోలికి వెళ్లబోమని చెప్పింది.ఇక ‘పీఎం కేర్స్’కు జమపడిన విరాళాలెంతో బహిర్గతం చేయకపో వడం మొదలుకొని అనేక అంశాల్లో కేంద్రం పాటిస్తున్న గోప్యత ఎవరికీ అర్ధం కావడం లేదు. సమాఖ్య స్ఫూర్తి గల్లంతు కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారింది. మన రాజ్యాంగ నిర్మాణంలోనే సహకార ఫెడరలిజం అంతర్లీనంగా వుంది. కేంద్ర–రాష్ట్రాలు వేటికవి సర్వసత్తాక సార్వ భౌమాధికారాన్ని కలిగి ఒకదా నితో మరొకటి సహ కరించుకుంటూ జాతీయ సమైక్యతతో ముందు కెళ్లాలన్నది ఫెడరల్భావ స్ఫూర్తి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాల అధికారాలను క్రమేపీ తగ్గించి ఈ స్ఫూర్తిని దెబ్బతీసింది. ఎన్డీఏ కూడా దాన్నే కొన సాగి స్తోంది. ఇందువల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పోతు న్నారు. మార్చి 24న కేవలం 4 గంటల వ్యవధిలో ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధిం చిన లాక్డౌన్ వల్ల ఎన్ని సమ స్యలు ఏర్పడ్డాయో మూడు నెలలుగా చూస్తూనే వున్నాం. అంతకు చాలాముందే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని, కనుక ఆ వాటా ఇక పెరగ దని సాకు చూపించి అనేక కేంద్ర ప్రాయోజిత పథ కాలు నిలిపివేయడమో, కోత పెట్టడమో జరిగింది. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను కేంద్రమే రూపొందించింది. జనాభాతో ముడిపెట్టి, పన్నుల వాటాను లెక్కించే విధానం వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం కలగడంతోపాటు, వాటి స్వతంత్ర విధాన నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకున్నట్టవుతుంది. జీఎస్టీ ద్వారా కూడా పన్నుల వాటాలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. విద్యుత్ సవరణ చట్టం ఈ ధోరణితో రూపొందించిందే. దీనికి పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇది అమల్లో కొస్తే పేదలకు రాయితీ ధరకు విద్యుత్ అందించే రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు గండిపడుతుంది. మానవత్వమే పరమావధి సంక్షేమ రాజ్య స్థాపన రాజ్యాంగ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తూ, తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. అందు కోసం సున్నితత్వంతో, మానవత్వంతో వ్యవహరించాలి. కరోనా నేపథ్యంలో వలసకూలీలు ఎదుర్కొన్న కడగండ్లకు కారణం కేంద్రంలో లోపించిన ఈ సున్నితత్వమే నన్న విమర్శలొ చ్చాయి. కరోనా నేర్పిన పాఠాలతో మన గమ్యం ప్రైవేటీకరణ దిశగా కాకుండా... మెరుగైన ఆరో గ్యం, నాణ్యమైన విద్య, రైతులు, పేదల సంక్షేమం వైపుగా అన్నది స్పష్టమైంది. 2004లోనే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించి దేశానికి దిశా నిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలతో మారుమూల ప్రాంతాల పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిం చారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌తో నిరుపేదల పిల్లలు ఉన్నత విద్యనభ్య సించే అవకాశం అందిం చారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృ త్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనం చేసింది. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందించడా నికి పూనుకుంది. చేతివృత్తుల వారికి ఆర్థిక సహా యం అందిస్తోంది. వలస కార్మికుల ఇబ్బందులకు చలించి, వారి ఆకలిదప్పులు తీర్చి, వారిని సగౌర వంగా గమ్యస్థానాలకు చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. పాలకులు ఇలా సున్నితత్వంతో, మానవత్వంతో ఆలోచిస్తేనే పౌర సమాజానికి భరోసా కలుగుతుంది. కేంద్రం తన భారీ ప్యాకేజీలో సమూల మార్పులు తెచ్చి, ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు అందుతాయి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి -
వ్యవస్థల ప్రక్షాళన అనివార్యం
పౌరుషం, రోషం, సిగ్గు, అభిమానం లాంటి భావోద్వేగాలు మనుషులకు ఉండటం సహజం. ఆత్మా భిమానం లోపించినవారే వాటిని పక్కన పెట్టగలరు. సరిగ్గా ఏడాది క్రితం ఎన్ని కల సమయంలో ముఖ్య మంత్రిగా ఉన్న చంద్ర బాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచారంటూ వీరావేశం ప్రద ర్శించారు. మోదీ ఎన్నికల సంఘాన్ని బీజేపీ బ్రాంచ్ ఆఫీసులా మార్చేశారని దుయ్యబట్టారు. 2019 ఏప్రిల్ 10న అమరావతిలో; ఏప్రిల్ 20న తిరుపతిలో; ఏప్రిల్ 23న ముంబైలో మీడియా సమావేశాలు పెట్టి దూషించారు. ముంబై సమా వేశంలో కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్లను చెరోపక్కన కూర్చో బెట్టుకొని, మోదీ రష్యా హ్యాకర్లతో ఈవీఎంలను తనకు అనుకూలంగా ప్రోగ్రామింగ్ చేయించుకొన్నారని ఆరోపించారు. ఎన్డీయేతర పక్షానికి చెందిన 23 రాజకీయ పార్టీలను కూడగట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమి షన్‌పై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయమంటూ తనను ‘క్రూసేడర్’ అని అభివర్ణించు కొన్నారు. సరిగ్గా ఏడాది తర్వాత కరోనా నేపథ్యంలో ప్రధాని ఫోన్ చేసినందుకు చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ‘ప్రధాని మోదీ ఫోన్’ ముచ్చ ట్లను పార్టీ నేతలతో, మీడియాతో పంచుకొంటు న్నారు. మరోపక్క తెలుగుదేశం, బీజేపీ భవిష్య త్తులో కలిసి పనిచేస్తాయన్న ప్రచారాన్ని సొంత మీడియా ద్వారా ఉధృతం చేస్తున్నారు. ప్రతి ఎన్ని కల ముందు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటే. మోదీ నియంతృత్వంపై, ఎన్నికల సంఘం అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామన్న చంద్రబాబు ఆ దిశగా ఒక్క అంగుళం కూడా ముందుకు సాగకపోవడమే విశేషం. ఎన్నికలు ముగిసిన వెంటనే, చెట్టపట్టాలేసు కొని తిరిగిన 23 ఎన్డీయేతర రాజకీయ పార్టీలకు కారణాలు చెప్పకుండానే చంద్రబాబు దూరం జరి గారు. ఏ కూటమిలోనూ చేరకుండా ‘తటస్థ’ వైఖ రితో ఉంటామంటూ తాత్కాలికంగా సోనియా అండ్ కోతో చేసిన స్నేహం వదులుకుంటున్నట్లు ప్రధానికి సంకేతాలు పంపించారు. తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి సాదరంగా పంపించారు. వారి విలీన ప్రక్రియ ప్రజాస్వామ్య విరుద్ధమని ఓ పార్టీనేతతో తంతుగా ఓ ప్రకటన ఇప్పించి, తర్వాత మౌనవ్రతం దాల్చారు. తన అక్రమాలు వెలుగు చూడకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు అవసరమని చంద్రబాబుకు తెలుసు. మరి, ప్రధానితో మాట్లాడినప్పుడు, రాష్ట్రానికి ఉదా రంగా నిధులివ్వాలనీ; తను డిమాండ్ చేస్తున్నట్లు ప్రతి కుటుంబానికీ రూ. 5,000 కేంద్ర ప్రభుత్వం అందించాలనీ ఎందుకు కోరలేదు? మోదీకి ఆగ్రహం వస్తుందని భయపడ్డారా? కరోనా నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టీ వారు చేస్తున్న విమర్శలు మీడియాలో ప్రచురణ కావడానికి తప్ప మరెందుకూ పనికిరావు. హైదరాబాద్‌లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి లేఖలు సంధిస్తున్నారు. కరోనాపై తగి నంత అధ్యయనం చేయాలని, ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న ఉచిత సలహాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజమండ్రి గోదావరి ఘాట్‌లో తను, తన కుటుంబ సభ్యులు స్నానం చేస్తున్న దృశ్యా లను అంతర్జాతీయ మీడియాకి ఇవ్వడం కోసం గంటల కొద్దీ భక్తుల్ని క్యూలైన్లలో నిలిపివేసి, తర్వాత జరిగిన తొక్కిసలాటలో 31 మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు నిర్వాకాన్ని ప్రజలు మర్చిపోగలరా? ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేసిన చంద్రబాబు నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో లోపాయికారీ అవగాహన కుదుర్చుకొని ప్రభుత్వా నికి సమస్యలను సృష్టించాలని చూశారు. రమేష్ కుమార్ పారదర్శకంగా వ్యవహరించలేదని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. తన సన్నిహి తులను కీలక వ్యవస్థల్లోకి పంపి, భవిష్యత్తులో తనకు ఎటువంటి సమస్యలు రాకుండా ముందు చూపు ప్రదర్శించడం రాజకీయాల్లో చంద్రబాబు ఒక్కడికే చెల్లింది. ఆ క్రమంలోనే, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్ణీత గడువు ప్రకారం 2019 సాధారణ ఎన్నికల కంటే ముందుగానే నిర్వహించాల్సి ఉన్న ప్పటికీ, పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని గ్రహించి ఎన్నికలను జరపనీయకుండా పంచా యతీరాజ్ చట్టానికి తూట్లు పొడిచారు. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తొలిరోజు నుంచే, అక్ర మాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై ఆరోప ణలు చేయడం మొదలుపెట్టారు. చివరకు తన అమ్ములపొదిలోని ‘నిమ్మగడ్డ’ అస్త్రాన్ని ఉపయో గించి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయించారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగం ముసా యిదా ప్రతిని సమర్పిస్తూ అంబేడ్కర్ ‘‘రాజ్యాంగం ఎంత గొప్పదయినా కావొచ్చు. దీనిని అమలు జరిపేవారు మంచివారైతే అది మంచిదవుతుంది. చెడ్డవారైతే అది చెడ్డదవుతుంది’’ అన్నారు. ఇందుకు, 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలే పెద్ద ఉదాహరణలు. నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 29 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి ఫిరా యించుకోవడం, అందులో నలుగురిని క్యాబినెట్ మంత్రుల్ని చేయడంతో గవర్నర్, స్పీకర్ వ్యవస్థల ఔన్నత్యం దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించడానికే పత్రికలను నడుపుతున్నామనే కొందరు మీడియా సంస్థల యజమానులు చంద్ర బాబు రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తుంటే మౌనం దాల్చారు. ఇప్పుడు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసేముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఉండాల్సిందన్న ప్రాథ మిక సూత్రాన్ని ఈ మీడియా బాసులు ఎందుకు చెప్పలేదు? నిమ్మగడ్డకు ఏ హక్కు ఉందని గౌరవ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉందని ఆరో పిస్తారు? అది అతని వాచాలత్వం కాదా? వైఎ స్సార్సీపీ ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు, ఆ పదవి కోసం ఎందుకు పాకులాడాలి? ముందే ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రభుత్వం తెచ్చిన తాజా ఆర్డినెన్స్‌తో పదవి పోగానే న్యాయ స్థానానికి ఎందుకు వెళ్లినట్లు? ఈ వ్యక్తికి ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ వ్యవస్థను నిర్వహించే నైతిక హక్కు ఉందా? ‘ఒక దేశం యొక్క బలాన్ని నిర్ణయించేది సైనిక పాటవం ఒక్కటే కాదు. పటిష్టమైన వ్యవస్థల సముదాయమే’ అని అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ అన్నారు. అక్కడ దేశాధ్యక్షుడైనా, మరే ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా తమ బలహీనతలతో అధికారాలను పణంగా పెట్టిన ప్రతి సందర్భంలో వారిని ఆ పదవుల నుంచి దించి వేయడానికి ఆస్కారం ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటారు. దురదృష్టవశాత్తూ మన కొన్ని వ్యవస్థల్లో ‘బ్లాక్ షీప్’ తిష్టవేసి ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లాంటి వ్యక్తులను చంద్ర బాబు నమ్ముకొంటే, జగన్మోహన్రెడ్డి ప్రజలనే నమ్ముకొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు! వ్యాసకర్త సి. రామచంద్రయ్య మాజీ మంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి -
బడుగు వర్గాలకు బాబు ద్రోహం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటిల రాజకీయ చాణక్యానికి కాలం చెల్లింది. ఆయన వేసే ఎత్తుగడలు, కుతంత్రాలు, చేసే మాయామర్మాలు సామాన్య ప్రజలకు సైతం అర్ధమైపోతున్నాయి. అయినా అయన ఇంకా వాటినే నమ్ముకున్నారు, అమలుచేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం బయటపడి అందులో... చంద్రబాబు క్యాబినేట్లో మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణల ప్రమేయం ఉందని వెల్లడి కాగానే... ఉలిక్కిపడిన చంద్రబాబు ‘వారు బీసీలు కనుకనే ఆరోపణలు చేస్తున్నారు. బీసీలంటే సీఎం జగన్మోహన్రెడ్డికి పడదు’ అంటూ పాత పల్లవినే కొత్త రాగంలో అందుకున్నారు. ఐదేళ్ల తన పాలనలో బీసీ, ఎస్సీ, మైనారిటీలతో సహా అనేక వర్గాలను దూరం పెట్టి, వారిని దూరం చేసుకొన్నది స్వయంగా చంద్రబాబే! దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడానికి తాపత్రయపడుతున్న చంద్రబాబు... సీఎం వైఎస్ జగన్‌పైన, రాష్ట్ర ప్రభుత్వపైన పసలేని ఆరోపణలతో బురద జల్లడానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఏ నాయకుడికి లేనివిధంగా ప్రతి చిన్న అంశాన్ని కులం కోణంలో చూడటం చంద్రబాబుకు అలవాటు. చట్టానికి కులం, మతం, ప్రాంతం ఉంటాయా? తప్పు చేసిన వారిని కులం దృష్టితో చూసి వదిలి వేసే విధానం భారతీయ శిక్షాస్మృతిలో గానీ, రాజ్యాంగంలో గానీ ఉన్నదా? ఈ విషయాలు చంద్రబాబుకు తెలియక కాదు. బడుగు బలహీన వర్గాలను తన రాజకీయ ఆయుధాలుగా, తన రక్షణ కవచాలుగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డ చంద్రబాబు ఈఎస్ఐ కుంభకోణంలో తన సహచర నాయకుల ప్రమేయం ఉన్నదని తెలియగానే వారి కులాన్ని తన రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడానికి సిద్ధపడ్డారు. బాబు ‘బీసీ’ థియరీ బలహీనవర్గాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలి కానీ వారు రాజకీయంగా సాధికారత సాధించరాదన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. తాజా ఉదంతాన్ని పరిశీలిస్తే... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం ఎస్టీలకు 6.77 శాతం మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీర్మానం చేసి ఆ మేరకు జీవో జారీ చేసింది. హైకోర్టు దీనిపై అభ్యంతరం తెలపలేదు. కానీ... తెలుగుదేశం పార్టీ నేత అయిన బి. ప్రతాపరెడ్డి అనే వ్యక్తి దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... తొలుత ‘స్టే’ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. చివరకు హైకోర్టు అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని రూలింగ్ ఇవ్వడంతో బీసీలకు వర్తింపజేయాలనుకున్న కోటాలో 9.85 శాతం కోత పడి బీసీలకు వేలాది సంఖ్యలో పదవులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. బీసీలకు మరోమారు అన్యాయం చేయడానికి టీడీపీ పాల్పడిన అనైతిక చర్య బయటపడగానే తమకు అలవాటైన రీతిలో ‘దొంగే దొంగ దొంగ...’ అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే పనిగట్టుకొని బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేసిందంటూ పచ్చ మీడియాతో బురద జల్లిస్తున్నారు. బీసీలంటే బాబుకు చులకన బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప... బీసీలను అన్ని రంగాలలో ప్రోత్సహించి, గౌరవించి వారికి సాధికారత కల్పించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు లేదు. ఈఎస్ఐ కుంభకోణంలో చిక్కుకొన్న తన పార్టీనేతలు బీసీలు కనుకనే... వారిని ఇరికించారని మాట్లాడిన చంద్రబాబు ఒకసారి గతంలోకి తొంగి చూడాల్సిన అవసరం ఉంది. 2000వ సంవత్సరంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న కృష్ణాయాదవ్ ‘తెల్గీ స్టాంప్‌ల’ కుంభకోణంలో చిక్కుకొన్నాడని తెలియగానే... క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. సీఎంగా ఉన్న చంద్రబాబు అతనిని మంత్రి పదవి నుంచి తప్పించాడు. పైగా, ఎంతో సాహాసోపేతంగా వెంటనే చర్య తీసుకున్నట్లుగా పత్రికల్లో రాయించుకున్నారు. కృష్ణాయాదవ్ బీసీ నేత అయినా తప్పుచేశారు కనుక ఉపేక్షించలేదు. ఆ ధర్మం ఇప్పుడు వర్తించదా? వందలాది కోట్ల విలువైన స్కామ్ జరిగితే.. కులాన్ని చూసి నిందితులను వదిలిపెట్టాలా? తన ప్రభుత్వంలో ఒక ధర్మం... వేరొకరి ప్రభుత్వంలో మరో ధర్మం ఉంటుందా? కులం కార్డును బాబు తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటాడో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలో డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో తెలుగుదేశం ఓటమి పాలయిన తర్వాత... బీసీ కులాలను దగ్గర చేసుకోవడానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు 2007లో వరంగల్‌లో ‘బీసీ గర్జన’ పేరిట భారీ సభ నిర్వహించారు. ప్రధాన బీసీ వర్గాల వారి సమక్షంలో జరిగిన ఆ సభలో బీసీలకు తెలుగుదేశం పార్టీ 33 శాతం మేర.. అంటే 100 పార్టీ టిక్కెట్లు కేటాయిస్తుందంటూ ఓ డిక్లరేషన్ రూపొందించి అందరి హర్షధ్వానాల మధ్య దానిని ఆమోదించారు’. రెండేళ్ల తర్వాత, అంటే... 2009 ఎన్నికలలో చంద్రబాబు అర కొరగా బీసీలకు సీట్లు ఇచ్చి యధావిధిగా బీసీలను మోసం చేశారు. బీసీలు ఆర్థికంగా బలహీనులు కనుక వారికి 33 శాతం టిక్కెట్లు ఇచ్చినా గెలవలేరంటూ సాకు చూపి మరీ మోసం చేశారు. 1999లో ఆనాడు కేంద్రంలోని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీని చేరమని బీజేపీ కోరింది. అయితే ఎంపీలుగా ఉన్న కె. ఎర్రన్నాయుడు, అల్లాడి రాజ్‌కుమార్ మొదలైన బీసీ నాయకులు కేంద్ర మంత్రులయితే... తన ఇమేజ్ తగ్గిపోతుందనే ఏకైక కారణంతో 29 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్నప్పటికి ఎన్డీయే ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి సపోర్టు చేస్తాం అనే పేరుతో సరిపెట్టారు. కాగా, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడానికి సిద్ధపడి, సీనియర్, సమర్ధుడు అయిన బీసీ నేత కొనకళ్ల నారాయణను పక్కన పెట్టి... ఒకటి అశోకగజపతి రాజుకు, రెండోది జూనియర్ అయిన సుజనా చౌదరికి కట్టబెట్టి... బీసీలకు చంద్రబాబు మరోసారి అన్యాయం చేశారు. బీసీల పట్ల బాబు వ్యతిరేక వైఖరి 2014 ఎన్నికలలో నరేంద్రమోదీ, పవన్‌కళ్యాణ్‌ల బలంతో స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అడుగడునా బలహీనవర్గాల వ్యతిరేక వైఖరిని నిసిగ్గుగా బహిర్గతపర్చారు. న్యాయమూర్తులుగా పని చేయడానికి బీసీ వర్గాల అభ్యర్థులు పనికిరారంటూ బాబు రాసిన లేఖ బహిర్గతమైనప్పుడు... ఆయన అసలు స్వరూపం ఏమిటో ప్రజలకు అవగతమైంది. అదే విధంగా, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన బలహీనవర్గాల ప్రతినిధులను సీఎం హోదాలో చంద్రబాబు బెదిరించిన వైనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. పార్టీలో సీనియర్ నేతగా, నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకొన్న దళితనేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని అడుగుతున్నానంటూ ప్రచారం చేసి... చివరకు చంద్రబాబు ఆయనకు అన్యాయం చేశారు. రాజ్యసభ సీటును ఎగ్గొట్టడానికి ఆయనకు గవర్నర్ పదవి ఆశ చూపి... చివరకు ఏదీ లేకుండా ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు కల్పిం చారు. దళితులంటే చంద్రబాబుకు ఏ పాటి గౌరవమో చెప్పడానికి ఈ ఉదంతం చాలదా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వున్న మరో దళిత నాయకుడు జె.ఆర్. పుష్పరాజ్‌ను బయట కుర్చోబెట్టి... చంద్రబాబు తన చాంబర్ లోపల ఓ పారిశ్రామికవేత్తతో బేరం కుదుర్చుకొని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారంటూ... ఆ పార్టీ నేతలే ఇప్పటికీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. వైఎస్సార్సీపీ మీద గట్టిగా విమర్శలు చేయించడానికి ఉపయోగించుకొన్న పార్టీ దళితనేతల్లో ఒకరైన వర్ల రామయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నామని ప్రకటించి, తీరా.. ఆయన తన ఇంటినుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకునే సమయానికి జాబితాలో ఆయన పేరును తప్పించి సొంత సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌కు రాజ్యసభ పదవి ఇవ్వటం పట్ల తెలుగు సమాజం ఆనాడు నిర్ఘాంతపోయింది. అమరావతి కాంతుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల్లో 5 శాతం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తామంటూ చట్టం తెచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు దానిని అమలు చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పేదలకు, బలహీనవర్గాలకు న్యాయం చేయడానికి ఆ ప్రాంతంలోని 1250 ఎకరాలను 54 వేల కుటుంబాల వారికి పంచి పెట్టడానికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టగానే... చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి కొందరితో న్యాయస్థానంలో కేసులు వేయిస్తున్నారు. చంద్రబాబుకు బలహీన వర్గాల మీద అభిమానం వుంటే పట్టాలిచ్చే కార్యక్రమాన్ని అడ్డుకొంటారా? దేహంలో అంతర్భాగమే దివగంత నేత మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల వారిని సమాజమనే దేహంలో అంతర్భాగంగానే పరిగణించారు. వారి సాధికారతకు ఫీజుల రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేశారు. పలు వెనుకబడిన కులాలను బీసీ జాబాతాలో చేర్పించి... వారికి న్యాయం చేశారు. వైఎస్సార్ ఏనాడూ కుల, మత రాజకీయాలు చేయలేదు. ఆయన చూపిన బాట లోనే ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ బడుగు బలహీనవవర్గాలకు క్యాబినెట్ కూర్పు మొదలుకొని అన్నింటా సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కులం రంగు పులమాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. జరగబోయే మున్సిపల్, పంచాయితీ ఎన్నికలలో లబ్ధి పొందడానికి చంద్రబాబు తనకు తెలిసిన పాత విద్యలనే మళ్లీ ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు అవినీతి, ఆశ్రిత పక్షపాతంపట్ల ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు మరోసారి పునరావృతం కావాలి. ప్రజలు విజ్ఞులు. ఆ విజ్ఞత మరోసారి చాటాలి. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వ్యతిరేక వైఖరికి శాశ్వత సమాధి కట్టాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
‘లోకేష్ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్ ఉందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిందని, చంద్రబాబు అండ్ కో చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి : చంద్రబాబుది పోరాటం కాదు..ఆస్తుల కోసం ఆందోళన) ‘రాజధాని రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ఆదుకుంటారు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. రైతులకు సీఎం రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఒకటి అభివృద్ధి చేయడం. రెండు వారి భూముల వారికి తిరిగి ఇవ్వడం. చంద్రబాబు తన వారికోసమే ఉద్యమం చేయిస్తున్నాడు. కొంత మంది పెయిడ్ లీడర్లను తయారుచేసి తిప్పుతున్నాడు. నీ పాలనలో ఒకసారైనా రిఫరెండం పెట్టావా చంద్రబాబు. అయినా, లోకేష్ ఓడిపోయాక రిఫరెండం ఎందుకు..? బాబుకు అవసరమైనప్పుడల్లా రిఫరెండం పెట్టాలా. ఆయన మాటలు విని రైతులు మోసపోవద్దు. ఇప్పటికైనా రాజధాని రైతులు దీక్ష విరమించాలి. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎందుకు రాత్రికి రాత్రే అమరావతికి పరిగెత్తి వచ్చాడు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయని తుగ్లక్ చంద్రబాబు. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని పెట్టిన పెద్ద తుగ్లక్ ఆయన. మా విధానమే పరిపాలన వికేంద్రీకరణ. చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైలుకు వెళ్తారు. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపినా జైలుకు వెళ్లడం తప్పదు. ఆయన చచ్చిన పాము. టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. టీడీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎందుకు రాజధానిలో పర్యటన చేస్తానంటున్నారు. పార్లమెంట్లో చెప్పిన తరువాత కూడా రాజకీయాలు చేస్తున్నారు’అని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. (చదవండి : ప్రజాసేవే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. బలం..) -
పవన్‌తో బీజేపీకి నష్టమే..!
సాక్షి, కడప: సిద్ధాంతాలు, విలువలు లేని రాజకీయాల కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎగబడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఎవరితో కలిసినా వైఎస్సార్సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. జనసేన ను రాజకీయాల్లో పరిగణనలోకి తీసువాల్సిన అవసరం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. ప్రజలకు సేవ చేయాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధాంతమని.. ఇదే తమ బలమని చెప్పారు. నాటి శత్రువులు నేడు మిత్రలయ్యారా.. బీజేపీతో కలిసి పోరాడతాం అని పవన్ కామెడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలో కమ్యూనిస్టులు పోరాడినంతగా ఏ పార్టీలు చేయలేవని.. అలాంటి పార్టీలను విభేదించి బయటకొచ్చిన ఘనుడు పవన్ అని పేర్కొన్నారు. ‘2014 లో టీడీపీ, బీజేపీ తో పొత్తు అన్నావ్.. 2019 లో కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ లతో పొత్తు పెట్టుకున్నావ్... మళ్ళీ ఇప్పుడు బీజేపీతో జత గట్టావ్... 2019 ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతి కాళ్ళు మొక్కి కాబోయే ప్రధాని అన్నావ్.. హోదా విషయంలో పాచిపోయిన లడ్డులు ఇచ్చారన్నవ్.. మళ్ళీ ఏవిధంగా బీజేపీతో కలుస్తారు’ అని రామచంద్రయ్య మండిపడ్డారు. నాడు శత్రువులు.. నేడు మిత్రలయ్యారా అని ప్రశ్నించారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా విభేదించారు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనను విభేదించి పార్టీకి దూరంగా ఉన్నారని.. దీంతో దిక్కుతోచని స్థితిలో పవన్ ఉన్నారన్నారు. ఇవన్నీ చూస్తోంటే చంద్రబాబు ను పరిరక్షించేందుకు రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమవుతుందన్నారు. ఆయన స్థిరత్వం లేకుండా ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పొత్తుల మీద ఉన్న ధ్యాస తన పార్టీని నిర్మాణం చేసుకోవాలన్న దానిపై ఆయనకు లేదన్నారు. బీజేపీతో ఎలా జతగట్టారు.. చేగువీర ఆశయాల సాధనే లక్ష్యం అనే పవన్.. ఫాసిజం ఉన్న బీజేపీ తో ఎలా జత గట్టారని ప్రశ్నించారు. ఆయన వల్ల బీజేపీ కే నష్టం అని పేర్కొన్నారు. బీజేపీ మన రాష్ట్రంలో మనుగడ కోసం పాకులాడుతుందనేది అందరికి తెలుసునని.. టీడీపీ రాజ్యసభ సభ్యులను ఎందుకు బీజేపీలో కలుపుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా బ్లాక్ డే.. అని, పవన్ వల్ల యువత మోసపోయారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కావాలనుకునే వారు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సహకారాన్ని అందించాలని రామచంద్రయ్య పిలుపునిచ్చారు. -
ఆ రెండు పార్టీలకు ఆయన బ్రోకర్..!
సాక్షి, కడప: మూడు రాజధానులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుది పోరాటం కాదని.. ఆస్తులను కాపాడుకోవడం కోసం చేసే ఆందోళన మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై వ్యక్తిగత ద్వేషాలతో ప్రజల సమస్యలను జోడించి రెచ్చ గొడుతున్నారన్నారు. వాస్తవాలను వక్రీకరించి దుష్ఫ్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పబ్బం గడుపుకోవడానికే ధర్నాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు.. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించిన నిపుణుల కమిటీల నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి లేకపోతే..రాష్ట్రమే లేదనే విధంగా అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో దారుణంగా పోస్టింగ్‌లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దురుద్దేశంతోనే రెచ్చ గొడుతున్నారు.. పవన్‌కల్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని.. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులను దురుద్దేశంతోనే రెచ్చగొడుతున్నారని.. ఎన్నికల సమయంలో చేసే కుట్రలు ఇప్పుడు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులపై అన్ని రకాలుగా పరిశీలించి శివరామ కృష్ణన్ నివేదిక ఇచ్చారని.. ఆ నివేదిక రాక ముందే చంద్రబాబు బినామీ నారాయణ నివేదిక ఆధారంగా రాజధాని ప్రకటించారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని వద్దని అప్పట్లో తన అనుకూల మీడియాలోనే వార్తలు రాసారని.. శివరామకృష్ణన్ కమిటీ పై చర్చ జరపాలని అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి నష్టం జరగదని...ప్రతి రైతుకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. బ్రోకర్లా పవన్ తయారయ్యారు.. ‘బీజేపీ-టీడీపీకి మధ్య బ్రోకర్లా పవన్‌కల్యాణ్ తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై చాడీలు చెప్పడానికే పవన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని విన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమకు అన్ని తెలుసునని చెప్పినట్లు సమాచారం’ అని రామచంద్రయ్య పేర్కొన్నారు. వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని..ఇప్పుడు బీజేపీతో వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న పవన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు నేరుగా బీజేపీని సంప్రదించకుండా.. ఇలాంటి మధ్య వర్తిత్వం తీసుకుంటున్నారని రామచంద్రయ్య ధ్వజమెత్తారు. -
‘బాబు అనుకూల మీడియా సమాధానం చెప్పాలి’
సాక్షి, వైఎస్సార్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియా సపోర్ట్ చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. అభివృద్ధిని సమతుల్యం చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై నిపుణల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. జీఎన్ రావు కమిటీ 13 జిల్లాలో పర్యటించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచనలు చేసిందని తెలిపారు. జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనలనే సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారని అన్నారు. పాలనలో దూరదృష్టితోనే సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజమౌళి గ్రాఫిక్స్ చూపించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏం చేసినా స్వప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. 13 జిల్లాల రాష్ట్రానికి గ్రాఫిక్స్ రాజధాని అవసరమా అని ప్రశ్నించారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించాలనుకోవడాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు. దీనికి చంద్రబాబుకు అనుకూల మీడియా సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు అందరు సమర్థించాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు వన్‌సైడ్ ట్రేడింగ్ చేశారని.. ఆయన మైండ్ మార్చుకోకపోతే టీడీపీ మరింత దిగజారుతుందని విమర్శించారు. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా న్యాయం చేస్తారని భరోసా కల్పించారు. -
‘బాబు అనుకూల మీడియా సమాధానం చెప్పాలి’
-
చంద్రబాబు రాజకీయ విష వృక్షం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 40 ఏళ్ల విష వృక్షమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్ర య్య ఎద్దేవా చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత చంద్ర బాబు బాగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఆయనను ప్రజలు శిక్షించి 23 సీట్లకు పరిమితం చేసినా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెడితే.. చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి ఆ పోస్టులోని బూతును మీడియా సమావేశంలో చదివి వినిపించటం దారుణమన్నారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం ఇలాంటి పోస్టులకు ఆద్యు డు చంద్రబాబేనని రామచంద్రయ్య విమర్శించారు. పదేళ్లుగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు చేయించిన దుష్ప్రచారంపై విచారణ జరిపితే.. ఇది వ్యక్తులుగా చేసింది కాదని.. ఒక వ్యవస్థలా చేయించారనే విషయం తేలిందన్నారు. దాదాపు 2 వేల మందిని నియమించుకుని హైదరాబాద్‌లోని ఎన్బీకే బిల్డింగ్, టీడీపీ ఆఫీస్, విజయవాడలోని సోషల్ మీడియా కార్యాలయం నుంచి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించారన్నారు. నెహ్రూ, గాంధీ, ఇందిరా గాంధీ, మోదీలపైనా అత్యంత నీచమైన వ్యాఖ్యలు రాయించారని చెప్పారు. చివరకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై కూడా ఇష్టం వచ్చినట్లు రాయించి కించపరిచారని పేర్కొన్నారు. -
కోడెలను కాటేసిందెవరు?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందించడం దొంగే.. దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉంది. నాలుగయిదు నెలల క్రితమే.. అంటే, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చివరి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగుపెట్టడానికి అనుమతించబోమంటూ జీవో తెచ్చారు. అంతకుముందే చంద్రబాబు పలుమార్లు గవ ర్నర్ వ్యవస్థ మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని బహి రంగంగానే వ్యాఖ్యానించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య అందర్నీ కలచివేసింది. కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రాగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కోడెల కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ప్రతి రాజకీయనాయకుడి మీద పలురకాల ఒత్తిళ్లు ఉంటాయి. కోడెల కూడా తన రాజకీయ జీవితంలో అనేక కష్టాలు, ఒత్తిళ్లతోనే ముందుకు సాగారు. కానీ, 2014 నుంచి కోడెలకు సొంత పార్టీ నుంచే కష్టాలు ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో నరసరావుపేట టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. చివరి క్షణంలో కోడెలను సత్తెనపల్లి పంపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. స్వల్ప మెజార్టీతో గెలిచిన కోడెలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. స్పీకర్ పదవి ఉన్నతమైనదే. కానీ రాజకీయంగా క్రియాశీలకమైనది కాదు కనుక దానిని నిర్వహించడానికి కోడెల ఆసక్తి చూపలేదన్న వార్తలొచ్చాయి. చివరకు అయిష్టంగానే స్పీకర్ పదవి చేపట్టారు. స్పీకర్‌గా ఉండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ తమ నాయకుడు చంద్రబాబు మెప్పుపొందడానికి చేసినట్లుగానే కన్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే డాక్టర్ కోడెల కుటుంబం బాధితులందరూ బయటకొచ్చారు. సొంత పార్టీ వారే ఆయన మీద ఫిర్యాదులు పెట్టారు. వాటి ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజానికి, కోడెల పట్ల గౌరవంతో పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. కక్షసాధింపు చేయాలనుకొంటే ఆయనను విచారణకు పిలిపించేవారు. కోడెల కుటుంబంపై పెట్టిన కేసులపై యాగీ చేస్తున్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ముద్రగడ పద్మనాభం మొదలుకొని ఎంతోమందిని రాజకీయంగా వేధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యార్థులపై కూడా కేసులు పెట్టి వేధించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నారు. నిజానికి, కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం బాబు అనుచితవైఖరే. 2014లో అధికారంలోకి రాగానే కెటాక్స్ పేరుతో నరసరావుపేటలో కోడెల కుమార్తె, సత్తెనపల్లిలో ఆయన కుమారుడు దందాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువె త్తాయి. వారి బాధితుల్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తులూ ఉన్నారు. కానీ, కుటుంబ సభ్యుల్ని కట్టడి చేయమని చంద్రబాబు కోడెలకు చెప్పలేకపోయారు. కారణం వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఫైల్ స్పీకర్‌గా ఉన్న కోడెల వద్ద ఉన్నది. ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా తెలుగుదేశంలోని ఒక వర్గం గుంటూరులోని టీడీపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. పొమ్మనకుండా పొగబెట్టి కోడెలను పార్టీ నుంచి సాగనంప డానికి చంద్రబాబే కోడెల వ్యతిరేక వర్గంతో.. పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేయించారని పార్టీలో చర్చ సాగింది. గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కోడెల వెళ్ళినపుడు ఆయనతో చంద్రబాబు అంటీముట్టనట్లుగా వ్యవహరించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చంద్రబాబు చేయించిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి కోడెలను రావొద్దంటూ కబురు చేశారన్న వార్త మీడియాకు లీక్ చేశారు. కోడెల కుమారుడి ఆఫీస్‌లో అసెంబ్లీ ఫర్నిచర్ దొరికిన అంశంలో సీనియర్ నేతతో పార్టీ కార్యాలయంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ‘కోడెల ఫర్నిచర్‌ను తరలించడం వల్ల పార్టీకి అప్రదిష్ట కలిగింది’ అని మాట్లాడించారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాన్ని కోడెల తట్టుకోలేకపోయారు. చంద్రబాబు కావాలనే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనను వదిలించుకోవడానికే జూనియర్ నేతలతో విమర్శలు చేయిస్తున్నారని గ్రహించి అవమానపడ్డారు. దాంతో కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రిలో చేర్పించడంతో ఆయనకు అప్పుడు ప్రాణాపాయం తప్పింది. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో గుండె నొప్పితో కోడెల ఆసుపత్రిలో చేరారంటూ పార్టీ నేతలతో చెప్పించారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా, సుదీర్ఘ కాలం మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి కూడా చంద్రబాబు ఆయనను పరామర్శించలేదు. పైగా డాక్టర్ కోడెలకు ఉన్న ఆసుపత్రి గుంటూరు నగరంలోనే ఉంది. గుంటూరులోనే ఉన్న పార్టీ కార్యాలయానికి చంద్రబాబు రోజూ వెళుతుంటారు. కానీ, ఐదు నిమిషాల సమయాన్ని కోడెలను పరామర్శించడానికి కేటాయించలేకపోయారు. అధికారం కోల్పోయాక, మాజీ స్పీకర్‌గా మిగిలిన కోడెలతో అక్కర తీరిపోయిందని చంద్రబాబు భావించి నందునే ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు సృష్టించారన్నది తేటతెల్లం. అయితే, కోడెల ఆత్మహత్య అంశాన్ని అధికార పక్షం మీద ఆయుధంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు చకచకా పావులు కదిపారు. అంతకు ఒకరోజు ముందు ఆయన కుమార్తె మీడియా ముందుకొచ్చి స్వయంగా ‘జరిగిందేదో జరిగింది. మమ్మల్ని వదిలివేయండి. రాజకీయం చేయకండి’ అని వేడుకొన్నారు. తరువాత ఎవరి ప్రోద్భలంతో వెంటనే మాట మార్చారో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. కోడెల బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరిపారని ఆ పార్టీ నేతలు బయట పెట్టడంతో.. చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టింది. ‘యూజ్ అండ్ త్రో’ పాలసీకి తాజాగా బలైపోయిన కోడెల ఆత్మకు శాంతి లేకుండా ఆయన ఆత్మహత్యను రాజకీయంగా మలుచుకోవాలనుకుంటున్న చంద్రబాబుది శవరాజకీయమే! వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సామాజిక సమానత్వం పునాదులపై ప్రభుత్వం ఏర్పాటు కావడం సహించలేని చంద్రబాబు విధ్వంసకర రాజకీయం వికృతరూపం దాల్చింది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదా బాబూ..!
-
అందుకే పెట్టుబడుదారులు పారిపోయారు..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడుపు గొట్టు రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య హితవు పలికారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు తిరస్కరించినా బాబులో మార్పు రాలేదని.. కుట్రలు,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర్రంలో అస్థిరతను నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సామరస్య వాతావరణాన్ని తేలేని వ్యక్తి.. రాజకీయవేత్తే కాదన్నారు. బాబు సిద్ధాంతాలను వైసీపీ ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని.. వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారన్నారు. నాటి చంద్రబాబు వంద రోజుల పాలన.. నేటి జగన్ వంద రోజుల పాలనపై బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. పీపీఎల పునఃసమీక్ష, పోలవరం రీ టెండరింగ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అందుకే పెట్టుబడుదారులు పారిపోయారు.. అవినీతి, అక్రమాలు బయటపడతాయని చంద్రబాబుకు భయమా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి పరిపాలనతో పెట్టుబడిదారులు భయపడి పారిపోయారని పేర్కొన్నారు. తప్పులు జరిగితే.. సరిదిద్దుకుపోవాలని చంద్రబాబు చెప్పితే..తప్పును నిలదీయాలని వైఎస్ జగన్ అంటున్నారని..దీన్నిబట్టి చూస్తే ఎవరు నిజాయితీగా పాలన అందిస్తున్నారో అర్థం అవుతుందన్నారు. గత ఐదేళ్ల పాలనలో రైతులకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబుకు వైఎస్సార్సీపీని విమర్శించే హక్కు లేదన్నారు. అనంతపురం జిల్లాలో రైన్ గన్స్ తెచ్చి కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబూ..జైలు కెళ్లే రోజూ దగ్గరలోనే ఉంది.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబుకు విమర్శ చేసే హక్కు లేదన్నారు. చంద్రబాబుకు జైలు కెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. వ్యాపార లావాదేవీలు చక్కదిద్దుకునే సుజనా చౌదరి.. వైఎస్సార్సీపీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న పార్టీని ప్రైవేట్ రాజ్యం అని ఆరోపించడం సిగ్గు చేటన్నారు. చట్టాన్ని చేతిలో పెట్టుకుని చంద్రబాబు పరిపాలించారని..కోడెల దోపిడీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా సిగ్గు రాలేదా అని ప్రశ్నించారు. జోక్ ప్యాక్ట్ తేడా తెలియని బాబు.. ప్రతిపక్ష హొదాలో ఉండటం సిగ్గు చేటన్నారు. -
చంద్రబాబు అన్నం లేకుండా ఉండగలరు కానీ..
సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నం లేకుండా ఉండగలరు కానీ, అధికారం లేకుండా ఉండలేరంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు అంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేంద్రం ఏడా పెడా పన్నులు పెంచింది. కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి పెట్టలేదు. పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. పూర్తి మెజారిటీ వచ్చిందనే దర్పముతో రాష్ట్రాలు అవసరం లేదనే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారు. మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఫలితంగా దేశీయ మీడియా దెబ్బతింటుంది. ఈ బడ్జెట్ కార్పొరేట్ ఆదాయం పెంచేలా ఉంది తప్ప.. సామాన్యుల ఆదాయం కాదు. పన్నుల విధింపులలో పారదర్శకత లేదు. జీఎస్టీ ఏకీకృతం కాలేదు.. ముడి సరుకు, అంతిమ ఉత్పత్తి పైనా పన్నులు వేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధికి ఏమాత్రం ఈ బడ్జెట్ సహకరించదు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు.. విభజన చట్టంలో ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. పోలవరం నిధుల ప్రస్తావన లేదు.. రాజధాని నిధులు లేవు.. రైల్వేల విషయంలోనూ ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింద’’ని పేర్కొన్నారు. -
బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది
-
ఎగ్జిట్ పోల్ ఫలితాలను బాబు జీర్ణించుకోలేక పోతున్నారు
-
‘స్పీకర్ ఔన్నత్యాన్ని మంటగలిపిన కోడెల’
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో స్పీకర్ ఔన్నత్యాన్ని కోడెల శివప్రసాద్ రావు మంటగలిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. కంచె చేను మేసే విధంగా కోడెల వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అసెంబ్లీ జరిపిన తీరు ఏపీ చరిత్రలోనే చీకటి అధ్యాయమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేసిన వ్యక్తి కోడెలని, ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా సభ నుంచి ఏడాది సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో అన్నీ టీడీపీ కార్యక్రమాలుగా మారిపోయాయని, చంద్రబాబును ఎవరితో పోల్చినా వాళ్లను అవమానిచ్చినట్టేనన్నారు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వారినే ప్రజలు ఓడించారని, సభలో న్యాయం జరగలేదనే వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. కోడెల రాజకీయంగా అత్యంత వివాదస్పదమైన వ్యక్తని, ఆయన అరచకాలను రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చిన అప్రజాస్వామిక వాది కోడెలని మండిపడ్డారు. కోడెల బెదిరింపులకు ఎవరు భయపడరని, అధికారం శాశ్వతం కాదని, కోడెల తెలుసుకోవాలని సూచించారు. తన అవినీతిని బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. -
‘లోకేష్‌తో సహా మంత్రులంతా ఓడిపోతారు’
సాక్షి, అమరావతి : లోకేష్‌తో సహా టీడీపీ మంత్రులంతా దారుణ పరాజయం పొందబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్‌ను తప్పు పట్టడం బాబు ఇష్టం కానీ తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం బాబుకు తగదన్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు బాబు ప్రయత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ మీద తనకు నమ్మకం లేదంటారు.. మళ్లీ ఆయనే ఈసీ దగ్గరకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ఇంటిలిజెన్స్ ఐజీ, కొందరు ఎస్పీలు, డీజీపీని గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థను నడిపిద్దామనుకున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. కానీ ఈసీ చంద్రబాబు ఆటలు సాగనివ్వలేదని పేర్కొన్నారు. చంద్రబాబు చర్యలకు సీఎస్ బలిపశువు అయ్యారన్నారు. ఈసీపై చంద్రబాబు వేలు చూపిస్తూ మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు అవినీతిపరుడని అన్నా హజారేకు కూడా అర్థమయ్యింది.. అందుకే ఢిల్లీలో ఆయన దీక్షకు చంద్రబాబును రానివ్వలేదని పేర్కొన్నారు. ఈవీఎంల్లో చిప్స్ మార్చారు.. ట్యాంపరింగ్ చేశారు అని చంద్రబాబు నాయుడు అనడం హాస్యాస్పదమన్నారు. అలాంటి బుద్ధులు చంద్రబాబుకే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో వైఎస్ జగన్ పరిణీతి చెందిన రాజకీయ నేతగా ఎదిగారిని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటింగ్‌కు ఒక రోజు ముందు జనాల అకౌంట్లో డబ్బులేసినా జగన్ ఎవరికి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి.. ప్రజాస్వామ్య విజయం రాబోతుందని రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకూ చంద్రబాబును ఊహాలోకంలో బతకనివ్వండన్నారు. -
‘బాబు ఇంటికి హెలికాప్టర్లో డబ్బులొస్తున్నాయి’
సాక్షి, విజయవాడ : ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు అధ్వర్యంలో చంద్రబాబు నివాసానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో డబ్బులు వస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలను కలిసింది డబ్బు మూటల కోసమేనా అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించని చంద్రబాబు తిరిగి తనపై అవి పెత్తనం చేస్తున్నాయని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. తనను కాపాడాలంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినీ తారలను రాజకీయాల్లోకి తెచ్చి ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబుదేనని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి అద్దె తారాలను తెచ్చుకుంటోందని వైసీపీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిలా మారారు’
సాక్షి, విజయవాడ : అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఐపీఎస్‌లపై ఈసీ వేటువేయడంపై చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తూ, రాజ్యాంగేతర శక్తిలా మారారని మండిపడ్డారు. గతంలో ఎస్పీ యాదవ్ బదిలీ విషయంలో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలా ఎందుకు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారిని బదిలీ చేస్తే సీఎంకు ఎందుకు ఇబ్బంది అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి మాత్రమేనని జ్యుడిషీయరి తన పరిధి కాదన్నారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీకి ప్రవేశం లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు వల్లే ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని అంటారేమోనని విమర్శించారు. చంద్రబాబు మాటలను ప్రజలెవ్వరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి అప్పుడే ఎన్నికలు సజావుగా సాగుతాయని సూచించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే మతిభ్రమించిన వ్యక్తి మాటల్లా ఉన్నాయని, కేసీఆర్ పేరు ఇక్కడ ఎందుకు? ఆయనకు ఏపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హరికృష్ణ శవం పక్కన బెట్టుకుని టీఆరెస్తో పొత్తుకు ప్రయత్నించలేదా అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారని తాను అనుకోలేదన్నారు. -
‘జగన్‌ను కలిస్తే.. ఉలిక్కిపడుతున్న బాబు’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య విమర్శల వర్షం కురిపించారు. వైఎస్సార్సీపీలోకి వస్తున్న వలసలను చూసి బాబు భయపడుతున్నారని అన్నారు. జగన్ ఎవరైనా కలిస్తే ఉలిక్కి పడుతున్నారని, బాబుకు ఎందుకింత అభద్రతాభావం అని ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేశాకే ఇతర పార్టీల నాయకులను వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించి ఓట్లు దుండుకునే వ్యూహం పన్నుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేరస్తులకు కొమ్ముకాస్తూ చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. ‘ప్రజస్వామ్యంలో నీ అంత హీనమైన చరిత్ర ఇంకొకరిది లేదు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దళితులపట్ల వెటకారంగా మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దళితులను దూషించిన ఎమ్మెల్యేపై, రైతు కోటయ్య మృతి వంటి వాటిపై మీ చానెళ్లలో చర్చ పెట్టరు. చంద్రబాబు చక్రం తిప్పడం కాదు. తానే తిరుగుతున్నాడు’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ విలువలు, విశ్వసనీయత లేని పార్టీ అని అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బాబు.. రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చనిపోతే బాధ్యత వహించారా అని సూటిగా ప్రశ్నించారు. -
కొత్తగా సాధించింది ఏంటి చంద్రబాబు : రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ దీక్ష అనేది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకోసమేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య అన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలను పార్టీ డబ్బుతో నిర్వహించుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రామచంద్రయ్య మాట్లాటుతూ.. 'ఎన్టీఆర్ ట్రస్ట్ రిచ్‌గానే ఉందికదా. ప్రభుత్వ ధనం దేనికి. పెయిడ్ఆర్టిస్ట్లను తాబేదార్లను తీసుకువెళ్లి ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభుత్వ ఖజానానుంచి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పచ్చమీడియా ప్రతినిధులను సైతం తీసుకువెళ్లి వారికి ఖరీధైన వసతి కల్పించి ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు విషయం తెలుసు కాబట్టే కామ్రెడ్లు ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఏంటి డ్రామాలు? నిన్న నీ దగ్గరకు వచ్చిన పార్టీలన్నీ పార్లమెంట్లో మన ఏపీ డిమాండ్లపై మధ్దతు ఇచ్చిన వారే. కొత్తగా నువ్వు సాధించిందేంటి? కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినపుడు మధ్దతు పలికినవారే ఇప్పుడు వచ్చినవారు కూడా. ఏఐసీసీ కోశాధికారిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంతోపాటూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పలు రాష్ట్రాలలో తన వల్లే గెలుపు జరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. చంద్రబాబుతో కలసి తిరిగేందుకు రాహుల్‌కు పౌరుషం ఉందా? రాహుల్ తల్లిని, వంశాన్ని చంద్రబాబు తిట్టిన విషయం మరిచిపోయారా? కేవీపీ రామచంద్రరావు ఆందోళన చేసిన సందర్భంలో టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా నోరుమెదపలేదు. రాహుల్ గాంధీని చూసి నవ్వాలో ఏడ్వాలో నాకు అర్దం కావడంలేదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు గుంటూరు వస్తే గోబ్యాక్ అని చంద్రబాబు రాళ్లు వేయించారు. కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేయించారు. ఇవన్నీ తెలిసి చంద్రబాబుతో కలిశారంటే రాహుల్‌కు దేశాన్ని, కాంగ్రెస్‌ను నడిపించే మెచ్యూరిటి ఉందా? స్పెషల్ ప్యాకేజీ చంద్రబాబు కోరుకున్నారు తప్పితే వేరెవరు కాదు' అని అన్నారు. -
‘ఎన్నికలప్పుడే బాబుకు ప్రజలు గుర్తుకొస్తారు’
-
‘ప్రజలను మభ్య పెట్టేందుకే కొత్త పథకాలు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకి ప్రజలు గుర్తుకొస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే.. పథకాలను ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా మభ్యపెట్టే పథకాలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడపడితే అక్కడ అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు.. తెచ్చిదంతా టీడీపీ నేతలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ద్రవ్యాన్ని సృష్టిస్తానని గోప్పలు చెప్పిన చంద్రబాబు.. మరి వేల కోట్లు అప్పు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, అణగారిన వర్గాలు అంటే చంద్రబాబు అసహ్యమని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంతా బూటకమన్నారు. ప్రజల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రను అవహేళన చేయ్యడం తగదన్నారు. -
'ఏపీకి హైకోర్టు వస్తే.. చంద్రబాబుకు బాధ ఏంటి?'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా హైకోర్టు ఏపీకి వచ్చింది, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాధ ఎందుకు అని వైఎస్సార్సీసీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. హైకోర్టు విభజన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును, రాష్ట్రపతి ఉత్తర్వులను చంద్రబాబు వ్యతిరేకించడం ఏంటన్నారు. హైకోర్టు విభజన అయితే నడుస్తున్న కేసుల్లో న్యాయం ఏమైనా మారుతుందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు బుర్రలోనే కుట్ర దాగిఉందని, మళ్లీ ఆయనే కుట్ర అనడం విడ్డూరంగా ఉందని నిప్పులుచెరిగారు. వైఎస్సార్సీపీ కేంద్రకార్యలయంలో రామచంద్రయ్య మాట్లాడుతూ.. 'ప్రత్యేక ప్యాకేజీ వస్తే తన వాళ్లకి ఫండ్స్ పంచి పెట్టొచ్చు అని చంద్రబాబు చూశారు. పర్యావరణ అనుమతులు లేకున్నా ముఖ్యమంత్రి భవనంలో నివాసముంటున్నారు. ఏ సౌకర్యాలు లేకుండా అధికారులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. బాబు మాత్రం నది ఒడ్డున మంచి భవంతిలో బతుకుతున్నారు. ప్రభుత్వ మీటింగుల కోసం విజయవాడ హోటల్స్‌లో కోట్లు ఖర్చు చేశారు. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న చంద్రబాబుపై సుమోటోగా కేసు పెట్టాలి. న్యాయ వ్యవస్థలే కుట్ర పన్నుతున్నాయని బాబు అంటున్నారు. చట్టసభలను, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారు. బాబుపై సుమోటోగా కేసు వేసి విచారణ జరపాలి. రాత్రికి రాత్రి బాబు సెక్రటేరియట్ తరలిస్తే తప్పు కాదు. కానీ, కోర్టును తరలించాలంటే తప్పా? ఏపీకి హైకోర్టు రావాలన్న పేపర్లు, వ్యక్తులు ఇప్పుడు మాట మార్చాయి. బాబు తన కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారు. కోర్టులు ఏపీకి వస్తే వైఎస్ జగన్ కేసులు మొదటికొస్తాయి అని బాబు అనడం దారుణం. న్యాయ వ్యవస్థకే రాజకీయాలు అంటగడుతున్నారు. మనం డిమాండ్ చేసుకున్న కోర్టును, వారు ఇస్తే.. బాబు దీన్ని కుట్ర అంటారు. డిసెంబర్ 15 లోగా కోర్టులకు భవంతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు' అని తెలిపారు. -
‘పవన్ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. ఆదివారం హైదరబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మద్దతుతోనే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వందల కొద్ది డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల సంపదను కొల్లగొట్టారని మండిపడ్డారు. బాబుకు 2009, 2014 ఎన్నికల ఖర్చు మొత్తం సుజనా చౌదరి నుంచే వచ్చిందని అన్నారు. అమాయక ప్రజలు దాచుకున్న డబ్బును చంద్రబాబు అండ్ కో దోచుకుని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని తెలిపారు. ఉగ్రవాదుల కన్న చంద్రబాబు అండ్ కో ప్రమాదకరమైన వ్యక్తులని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల డబ్బు దోచుకుంటున్నారు.. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అవినీతి అంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతుంది. సుజనా చౌదరి చేసిన సాయానికి క్విడ్‌ప్రోకోగా చంద్రబాబు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారు. సుజనా చౌదరి అవినీతి దందాలన్ని చంద్రబాబుకు తెలుసు. గతంలోనే ఆయనపై చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. చంద్రబాబు చెప్పిన వారికే ఇరిగేషన్ కాంట్రాక్టులు దక్కుతాయి. సాక్షాత్తూ అగ్రిగోల్డ్ ఆస్తిని టీడీపీ ఎమ్మెల్యే భార్య కొనుగోలు చేసిందని ఆధారాలు సమర్పించిన చర్యలు లేవు. విశాఖ భూ కుంభకోణంలో మంత్రి భార్యకు ప్రమేయం ఉందని తెలిసినా వదిలేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. ఈ డబ్బును ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అవినీతిపరులను ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబు ఒక ఎకనామికల్ టెర్రరిస్ట్’ అని అన్నారు. చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయి.. ‘చంద్రబాబు చేతిలో సుజనా చౌదరి ఓ పనిముట్టు. 23 మంది ఎమ్మెల్యేలను కొని, మంత్రి పదవులు ఇచ్చి.. గవర్నర్ వ్యవస్థను నాశనం చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా?. పెద్దబాబు, చినబాబు రాష్ట్రాన్ని సొంత జాగీరులా పాలిస్తున్నారు. షెల్ కంపెనీలతో 6900 కోట్ల రూపాయలను సుజనా చౌదరి కొల్లగొట్టారు. వడ్డీతో కలిపి 8వేల కోట్ల రూపాయలు ఆయన దోచుకున్నారు. ఏ మాత్రం నెట్వర్క్ లేని కంపెనీలకు బ్యాంకులు ఎలా లోన్ ఇచ్చాయి?. బ్యాంక్‌లను మేనేజ్ చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదే. ఈడీ భ్రష్టు పట్టిందని ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దేశంలో బ్యాకింగ్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలక ముందే.. ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోకముందే చంద్రబాబును చట్టం ముందు నిలబెట్టాలి. చంద్రబాబు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదని ఎందుకు జీవోలు ఇస్తున్నార’ని రామచంద్రయ్య ప్రశ్నించారు. పవన్ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారు.. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ సుజనా చౌదరి మోసాలకు పాల్పడ్డారని ఈడీ ప్రకటించినా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణం. శనివారం సుజనాకు సంబంధించి ప్రధాన వార్త ఉన్న పవన్ కల్యాణ్ దానిపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కల్యాణ్ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే అనుమానం వస్తుంది. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. టీడీపీలో ఆర్థిక నేరగాళ్లు, గుండాలే ఉన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న సుజనా చౌదరిని సమాజం నుంచి వెలివేయాలి. చంద్రబాబుకు ధైర్యం ఉంటే సుజనా చౌదరిపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించాల’ని సవాలు విసిరారు. -
సి రామచంద్రయ్యకు కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పలు పార్టీల్లో కీలక పదవులను అలంకరించిన ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సేవలను తగువిధంగా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాటిచ్చారు. చదవండి : వైఎస్సార్ సీపీలో చేరిన రామచంద్రయ్య -
కాంగ్రెస్ పార్టీకి సి రామచంద్రయ్య గుడ్ బై
-
వైఎస్సార్ సీపీలో చేరిన రామచంద్రయ్య
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బద్ధ శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్‌ల కలయికతో మనస్తాపానికి లోనైనా ఇరు పార్టీల నేతలు కొందరు ఇప్పటికే వారి పార్టీలను వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన రామచంద్రయ్య.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రయ్యకు కండువా కప్పిన వైఎస్ జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు అదే జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్ సుబ్బరాఘవరాజు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. రామచంద్రయ్య చేరికతో వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్న అరాచక శక్తులను అంతమొందిచాల్సిన అవవసరం ఉందన్నారు. ఈ అక్రమాలను అరికట్టే శక్తి వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదని అన్నారు. తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని.. దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో వస్తారని అన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి సీఆర్సీ గుడ్‌బై
కడప కార్పొరేషన్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడకుండా రాహుల్‌గాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను ఎగదోసి చంద్రబాబు తన పబ్బం గడుపుకున్నాడని, ఫలితంగా కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశారన్నారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని, బంగళాఖాతంలో కలపాలని మాట్లాడారని గర్తు చేశారు. సోనియా, రాహుల్‌ను కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఉన్నట్టుండి ఎలా పవిత్రుడయ్యాడని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టడమే పది నాలుకలతో పుట్టాడని, ఆయన అవకాశవాద రాజకీయాలను మోయాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్‌కు ఏంటని నిలదీశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంపారం చేసి, వారు తానా అంటే తందానా అన్నారని, ప్యాకేజీ ప్రకటించగానే హోదా కంటే గొప్పదని సంబరాలు చేసుకొని, సన్మానాలు చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి ప్రత్యేక హోదాను మోదీ వద్ద తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీసి, మోసం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం దారుణమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన పాపం వల్ల స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా నిలపలేని స్థితికి చేరిందన్నారు. ఏ పార్టీలోకి పోలేకనే ఆయన కాంగ్రెస్‌లో చేరారన్నారు. నాలుగున్నరేళ్లు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. ఇక్కడ డ్యామేజీ అయిన ప్రతిసారీ ఢిల్లీకి వెళ్లడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులకు శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చినంత మాత్రానా రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదన్నారు. ఇది చంద్రబాబును రక్షించాల్సిన సమయం కాదని, శిక్షించాల్సిన సమయమన్నారు. సేవ్ ఏపి నినాదంతో భావసారుప్యత కలిగిన పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు రాజకీయాల్లో నీళ్లు బాగుండేవని, ఇప్పుడు బురద ఎక్కువైందన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకోలేదని, అసలు రాజకీయాల్లో ఉంటానో లేదో కూడా తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
చంద్రబాబుకు అందుకే భయం
-
చంద్రబాబుకు అందుకే భయం: కాంగ్రెస్ నేత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుని కొడుకు లోకేశ్‌కు, బినామిలకు పంచిపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పు చేయనప్పుడు ఐటీ దాడులకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే నాటాకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవ చేశారు. ప్రతీ పనిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అక్రమంగా ఇసుకను అమ్ముకుని టీడీపీ నాయకులు కోట్ల రూపాయలు సంపాదించారని ధ్వజమెత్తారు. మహిళా ఎమ్మార్వోను ఎమ్మెల్యే కొడితే చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల అవినీతి జరిగిందని.. ఇక పోలవరం ప్రాజెక్టులో అయితే లెక్కేలేదని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో బయటకు వచ్చిన ఆడియో వాయిస్ ఎవరిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పన్ను ఎగవేత దారులకు సీఎం అండగా ఉండటం దుర్మార్గమని, చంద్రబాబు, లోకేశ్లపైన విచారణ జరపాలని రామచంద్రయ్య కోరారు. -
అట్టడుగు వర్గాలపై ఇంత అక్కసా?
సంప్రదాయ వృత్తులు, సేవల ద్వారా ఆర్థిక, సామాజిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వర్గాల వారికి వారు చేసే సేవలకు తగిన పారితోషికం లభించకపోగా ఆ వృత్తులను చంద్రబాబు వంటి సీఎంలు నీచంగా, అపవిత్రంగా హేళనగా చూస్తూ అగౌరవించడం అనాగరికం. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నది. బలహీనవర్గాల దోపిడీ జరుగుతున్నది. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. హేళన చేస్తున్నారు. చిన్నచూపు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు తన ఫ్యూడల్ భావజాలాన్ని వదులుకొని బీసీలకు న్యాయం చేయనట్లయితే.. అందుకు తగిన మూల్యాన్ని రాబోయే ఎన్నికలలో చెల్లించక తప్పదు. సందర్భం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల నాయీ బ్రాహ్మణుల పట్ల ప్రవర్తించిన తీరు, చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు షాక్ కలిగించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలలో పనిచేసే క్షురకులు తమకు ప్రభుత్వం ఇస్తున్న పారితోషికాన్ని పెంచాలని చాలా కాలంగా కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంలో తప్పేముంది? కానీ, ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదు. ఈ నేపథ్యంలో నాయీబ్రాహ్మణ ప్రతినిధులు తమ డిమాం డ్లను పరిష్కరించాలంటూ అమరావతి సచివాలయానికి వెళ్లారు. అదే సందర్భంలో కాన్వాయ్‌లో సచివాలయానికి వస్తున్న బాబుకు నాయీబ్రాహ్మణ ప్రతి నిధులు ఎదురుగా కన్పించారు. తానుండే సచివాలయ బిల్డింగ్‌కు వారు రావడం సీఎంకు రుచించలేదు. వాహనం దిగిన వెంటనే బాబు ఆగ్రహంతో ఊగిపోతూ నాయీబ్రాహ్మణ ప్రతినిధులవైపు దూసుకువెళ్లారు. తన చూపుడువేలును వారివైపు చూపిస్తూ, వారిని హెచ్చరిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల ఉండాల్సిన సానుభూతి కించిత్తు లేనివిధంగా సీఎం ప్రవర్తించిన తీరుకు సభ్యసమాజం నివ్వెరపోయింది. నాయీ బ్రాహ్మణులు కోరిన కోర్కెలేమీ గొంతెమ్మ కోర్కెలు కావు. వారి హామీలను నెరవేర్చితే రాష్ట్ర ఖజానాపై విపరీత భారమేమీ పడదు. ఒక వేళ వారు చేసిన డిమాండ్లలో సహేతుకత కొంత లేదనే అనుకొందాం.. కానీ సంప్రదింపుల ద్వారా, వాస్తవ పరిస్థితులను తెలియజెప్పి వారిని ఒప్పించగలిగే నేర్పును ప్రభుత్వం చూపాలి. మీడియా కెమెరాలు తన చుట్టూ ఉన్నాయని తెలిసినప్పటికీ నాయీ బ్రాహ్మణులపట్ల అలా దురుసుగా, కర్కశంగా, ఉన్మాదంగా వ్యవహరించారంటే అర్థం.. బలహీనవర్గాల వారెవరూ భవిష్యత్‌లో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సచివాలయం వైపు కన్నెత్తి చూడరాదన్న సంకేతాన్ని బలంగా తెలియజెప్పడమే! ద్వంద్వ ప్రమాణాలు ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టినా అధికారపార్టీ ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆయా సామాజికవర్గాల వారు ఆందోళన బాట పట్టడం నేరం అవుతుందా? అదే నిజమైతే.. నాలుగేళ్ళపాటు బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని అధికారాన్ని పంచుకొని ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం ఇప్పుడు ఆందోళనలు చేయడంలో అర్ధమేమిటి? టీడీపీ ఏమి చేసినా అది పవిత్రం, పోరాటం. ఇతర పార్టీలు, కుల సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే.. అది అపవిత్రం, అనైతికం. నిజానికి నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉందన్న స్పృహ సీఎం చంద్రబాబుకు లోపించింది. రాష్ట్రానికి ప్రత్యేక హాదా సాధన కోసం అంటూ తన పార్టీ ఎంపీలతో పార్లమెంట్ ఆవరణలోనే నిరసన ప్రదర్శనలు, విచిత్ర వేష విన్యాసాలు చేయించారు. ప్రజల సొమ్ముతో ధర్మదీక్షలు, నవనిర్మాణ దీక్షలంటూ చేసి కేంద్రాన్ని, ప్రధాని మోదీని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌పార్టీ, జనసేనలతో పాటు వామపక్షాలను సైతం తిట్టిపోశారు. ఆ వేదికల నుంచి బాలకృష్ణ వంటివారు సభ్యసమాజం భరించలేని బూతుపురాణాలను వల్లించారు. ఇదంతా బాబుగారు చేసే ప్రజాస్వామ్య పోరాటం! కానీ, నాయీ బ్రాహ్మణులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయంలోకి అడుగుపెడితే బాబుగారు సహిం చలేకపోయారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం బాబుకు కొత్తేమీ కాదు. బీసీల పట్ల కపట ప్రేమ ఈ ఘటన కంటే ముందే బాబు అసలు రంగేమిటో, వెనుకబడిన వర్గాల పట్ల ఆయన అనుసరించిన దుర్మార్గపు వైఖరి ఏవిధంగా ఉన్నదో.. వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ బయటపెట్టారు. న్యాయవాద వృత్తిలో సీనియర్లుగా ఉండి, అన్ని అర్హతలు కలిగిన వారిని హైకోర్టు జడ్జీలుగా నియామకం చేసే ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరడం ఓ సాంప్రదాయంగా కేంద్రప్రభుత్వం పాటిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ, తెలంగాణల నుంచి హైకోర్టు జడ్జీలుగా ఎంపిక చేయడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం ఏప్రిల్ 30, 2016న అభ్యర్థుల జాబితాను పంపింది. తనకందిన జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమోదం వ్యక్తం చేయగా.. బాబు మాత్రం 11 నెలలపాటు నిర్ణయం చెప్పకుండా జాప్యం చేశారు. చివరకు మార్చి 21, 2017న.. తనకందిన జాబితాలోని ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, మరొక బ్రాహ్మణ కులానికి చెందిన అభ్యర్థులకు నైపుణ్యాలు లేవని, వారికి నిబద్ధత లేదని, జడ్జీలుగా నియమించడానికి తగిన అర్హతలు వారిలో ఏమాత్రం లేవంటూ బాబు కేంద్రానికి లేఖలు రాశారు. అయినప్పటికీ ఆ అభ్యర్థుల అర్హతల ఆధారంగా కేంద్రం వారిని జడ్జీలుగా నియమించింది. సీఎం చంద్రబాబు కేవలం సదరు అభ్యర్థులు హైకోర్టు న్యాయమూర్తులు కాకుండా ఉండేందుకే జాప్యం చేశారని, వారికి వ్యతిరేకంగా లేఖ రాశారని స్పష్టమైంది. ఇదే అంశాన్ని జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టడంతో.. చంద్రబాబుకి బలహీన వర్గాల పట్ల ఉన్న వ్యతిరేకత నగ్నంగా బయటపడింది. చంద్రబాబు వైఖరి చాలా మందికి తీవ్ర ఆవేదన కలిగిం చింది. ఓట్లకోసం బయటకు బీసీ జపం చేస్తూ.. బీసీలను అణగదొక్కే బాబు వైఖరిని చాలా మంది జీర్ణిం చుకోలేక పోయారు. నిజానికి తెలుగు రాష్ట్రాలను కుదిపివేసే ఈ వార్తపై ఏ ఒక్క మీడియా కూడా బహిరంగ చర్చ నిర్వహించలేదు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బాబుని వెనకేసుకురావడానికి తాపత్రయ పడ్డారు. గతంలో తమ హయాంలో జడ్జీలుగా బీసీలను నియమించామని సమర్థించుకున్నారు. కానీ.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారని బాబు లేఖ రాసిన విషయాన్ని సమర్ధించుకోలేకపోయారు. బీసీలు మాత్రమే కాదు.. ఎస్సీల పట్ల కూడా బాబు అనుచితంగా మాట్లాడటం గమనార్హం.‘‘కావాలని ఎవరు ఎస్సీల్లో పుడతారు?’’ అంటూ బాబు చేసిన వ్యాఖ్యను ఎవ్వరూ మర్చిపోలేరు. ఫ్యూడల్ మనస్తత్వం ప్రజలందరినీ కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఆదరించాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బలహీన వర్గాలను కించపర్చే విధంగా మాట్లాడ్డం, నిర్ణయాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. బలహీనవర్గాల పట్ల, మరికొన్ని వర్గాలపట్ల చంద్రబాబుకు చులకన భావమే కాదు.. వ్యతిరేక భావం కనిపిస్తోంది. ఇది ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. భౌతిక శ్రమ చేస్తూ సంపద సృష్టికి మూల కారకుల్లో అధికశాతం మంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలే! సమాజానికి సర్వ సంపద సృష్టించేవారు, మనిషి నాగరికంగా కన్పించడానికి కారకులైనవారు.. బాబుకు చులకనగా కనిపిస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న మహోన్నత ఆశయంతో భారత రాజ్యాంగాన్ని రాసిన డా‘‘ బీఆర్ అంబేడ్కర్ కూడా ఒక సందర్భంలో ‘‘రాజ్యాంగంలో వెనుకబడిన కులాల పరిరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయనందుకు నేను చాలా చింతిస్తున్నాను. రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడిన కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వాలే ఆ పనికి పూనుకోవాలని మేం భావిస్తున్నాం’’ అని ప్రకటించారు. పేరుకే బీసీల జపం ఓట్ల రాజకీయం కోసం బాబు వేసుకొన్న అనేక ముసుగుల్లో ‘సామాజకన్యాయం’ ఒకటి. ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజం. కానీ.. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చాక.. సామాజిక న్యాయం ఒక నినాదంగానే మిగిలింది. 2007లో ‘వరంగల్ బీసీ సభ’ నిర్వహించిన బాబు.. బీసీలకు 100 సీట్లు ఇస్తానని డిక్లరేషన్ ప్రకటించారు. కానీ, 2009లో ఇచ్చిన మాట తప్పారు. 2014లో ఆ ఊసే లేదు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీసీలకు నామమాత్రపు ప్రాతినిధ్యమే తప్ప.. వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదు. బీసీలు మెజార్టీగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం మినహా లోక్‌సభ అభ్యర్థులుగా బీసీలకు టికెట్లివ్వడం లేదు. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట వరకు రెండు కులాలకే లోక్‌సభ టికెట్లు కేటాయించారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు మొండి చేయి చూపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వృత్తిదారులైన బీసీ కులాలు అనేకం ఉన్నాయి. వారందరికీ దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎంతమంది బీసీలకు టికెట్లిస్తారో బాబు చెప్పగలరా? బాబు అభివృద్ధి ఎజెండాలో బలహీన వర్గాలకు చోటు లేదు. విశాలమైన రోడ్లు, ఐకానిక్ బిల్డింగ్లు మాత్రమే అభివృద్ధికి సంకేతమని బాబు నమ్ముతారు. అందుకే తను చేసిన సైబరాబాద్ నిర్మాణం వల్లనే తెలంగాణలో ఆదాయం పెరిగిందని పదే పదే చెప్పారు. అంతే తప్ప 80%గా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆదాయాలు, జీవనప్రమాణాల మెరుగుదలతోనే అభివృద్ధి సాధ్యమని బాబు గ్రహించకపోవడం దురదృష్టం. నూతనంగా ఏర్పడిన ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నది. బలహీనవర్గాల దోపిడీ జరుగుతున్నది. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. హేళన చేస్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారు. బాబు తన ఫ్యూడల్ భావజాలాన్ని వదులుకొని బీసీలకు న్యాయం చేయనట్లయితే.. అందుకు తగిన మూల్యాన్ని రాబోయే ఎన్నికలలో చెల్లించక తప్పదు. వ్యాసకర్త మాజీ ఎంపీ సి. రామచంద్రయ్య ఫోన్ : 81069 15555 -
నమస్కారం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో
-
బాబుకు బీజేపీ పెద్దల వార్నింగ్
సాక్షి, కడప : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పులిలా, ఢిల్లీలో పిల్లిలా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీకి చంద్రబాబు ఒంగి నమస్కారం చేయడం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల నుంచి కడప స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రాన్ని నిలదీయకుండా నిద్రపోయారా అంటూ మండిపడ్డారు. నాలుగేళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న టీడీపీ, ఈరోజు డ్రామాలు చేస్తూ దొంగ దీక్షలకు సిద్ధమౌతోందని దుయ్యబట్టారు. ఇక్కడ ఏమో ఢిల్లీకి వెళ్తే ప్రకంపనలు వస్తాయని బాబు డప్పు కొట్టుకుంటున్నారని, కానీ వాస్తవానికి అక్కడ ఏమీ లేదని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రామచంద్రయ్య పేర్కొన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయామని విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశం వల్ల రాష్ట్రానికి ఒరిగిన లాభం ఏమీ లేదన్నారు. హోదా కోసం ఢిల్లీలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా మద్దతు అడిగారా అని ప్రశ్నించారు. హోదా గురించి దేశంలో ఎక్కడా ప్రస్తావించొద్దని చంద్రబాబుకు బీజేపీ పెద్దలు హెచ్చరించారని, ఆ సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. చంద్రబాబు మంతనాల రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడని, ఇందుకోసం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ఢిల్లీలో బీజేపీతో మంతనాల కోసం పెట్టారని రామచంద్రయ్య ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన ఎన్నికల సర్వే మొత్తం బోగస్ అని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు సర్వే నిర్వహించిన వారితో మాట్లాడామని, వాళ్లు చెప్పింది ఒకటని... కానీ ఎల్లో మీడియా మరొకటి చూపించిందని విమర్శించారు. -
చంద్రబాబుకి కాంగ్రెస్ నేత రామచంద్రయ్య సవాల్
-
ఏపీకి పట్టిన శనిలా చంద్రబాబు మారారు
-
తెలుగు ప్రజల ఆత్మగౌరంపై దెబ్బ: రామచంద్రయ్య
అమరావతి: నాడు ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కొరకు పోరాడితే.. నేడు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని మండలి కాంగ్రెస్ విపక్ష నేత సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన ధన్యవాదల తీర్మానంపై శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పునర్విభజన చట్టంలోని అంశాలనే కేంద్రం ప్యాకేజి పేరుతో అందిస్తుందన్నారు. దీనికి చంద్రబాబు ధన్యవాదాల తీర్మానం పెట్టడం ప్రజలను వంచించడమేనన్నారు. సొంత రాజకీయ బలహీనతలను బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికే సీఎం ప్రత్యేక సహాయం ఎంతో గొప్పది, తన కష్టార్జితమని ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు. పోలవరానిక జాతీయ హోదా, తెలంగాణలోని ముంపు మండలాల్ని కలపడం కూడా విభజన చట్టం ప్రకారమే జరిగిందన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాలు అనేకం ఉన్నాయని తెలిపారు. వాటిని తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. విశాఖకు రైల్వేజోన్ వంటి కీలక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. కేంద్రం ఇస్తున్న అరకొర సహాయాన్ని ఘనంగా చాటడం, అభినందన తీర్మానం చేయడం.. రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించడమే అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు ప్రత్యేక సహాయనికి ఎంతో తేడా ఉందన్నారు. అధికారపక్షం ఈ అంశాలను అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తకుండా అడ్డుతగిలి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట ప్రజలను మభ్యపెట్టెందుకు ఈ అభినందన తీర్మాన డ్రామా అని విమర్శించారు. కేంద్రంతో లాలూచీ పడి తెలుగు ప్రజల హక్కులను దెబ్బతీయడం క్షమించరాని నేరమన్నారు. ఎన్డీఏ, తెలుగుదేశం ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసిన ఈ కుట్రకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అభిప్రాయ పడ్డారు. -
సభాపతులు అమ్ముడుపోయారు!
శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌పై ఉందని, కానీ సభాపతులు అమ్ముడుపోయారని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ... ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకు న్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నా రని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు. ఏపీలో ఉండే చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్ అధికారులు వినీవిననట్లు ఉంటున్నారని, ఇది తప్పని ప్రతిపక్ష నాయకునిగా తాను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్టెన్షన్లు వస్తాయని దిగజారుడుతనంతో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలను ఎన్నికల కమిషన్ కాని, పార్లమెంటరీ కమిటీ కాని రివ్యూ చేసే అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్ స్పీకర్‌కు, రాష్ట్రపతికి లేఖ రాస్తున్నామన్నారు. -
గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు
చంద్రబాబు ప్రభుత్వంపై రామచంద్రయ్య ధ్వజం సాక్షి, అమరావతి: గవర్నర్ నరసింహన్‌తో చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని శాసనమండలి ప్రతి పక్ష నేత సి రామచంద్రయ్య ధ్వజమెత్తారు. సోమవారం గవర్నర్ ప్రసంగం ఆసాంతం వాస్తవాలకు భిన్నంగా సాగిందని.. ఆయన ధోరణి చూస్తుంటే కాలం వెళ్ల దీస్తున్నట్టుగా ఉందన్నారు. పుష్కరాల్లో 29 మంది చని పోతే బ్రçహ్మాండంగా జరిగాయని చెప్పడాన్ని రామ చంద్రయ్య ఆక్షేపించారు. ఎకనమిక్ సర్వేలో అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రకారం ఆర్నెల్ల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ సమావేశాలు పెట్టినట్టు ఉందన్నారు. అసెంబ్లీ భవనాలు సుందరంగా ఉంటే సరిపోదని, సభలో అర్థవంతమైన చర్చలు జరిగి సమస్యలకు పరిష్కారాలు చూపాలని సూచించారు. -
'చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారు'
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా, అనైతికంగా టీడీపీలో చేర్చుకోవడాన్ని ఈ సందర్భంగా రామచంద్రయ్య తప్పుబట్టారు. ఏపీలో జరుగుతున్న అనైతిక పార్టీ ఫిరాయింపుల కార్యక్రమాన్ని చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. నిస్సిగ్గుగా, రాజ్యాంగాన్ని అగౌరవ పరిచే విధంగా చంద్రాబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. -
27న ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధ మహాసభ
ఆమనగల్లు(మహబూబ్‌నగర్ జిల్లా): శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని కోరుతూ ఈనెల 27న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దర్మయుద్ద మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ధర్మయుద్ద మహాసభ పోస్టర్లను స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 23 ఏళ్లుగా పవిత్ర యుద్దం చేస్తుందని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించి తీరుతుందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ సాధన కోసం ఎమ్మార్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని, డిల్లీ వేధికగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేసిందని ఆయన వివరించారు. ఈనెల 23న జరిగే ధర్మయుద్ద మహాసభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
'ప్రతిపక్షాలతో కలిసి పోరాడతాం'
తిరుపతి: రైతులంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు చులకన అని శాసనమండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అందుకే రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. సినిమా షూటింగ్‌ల కోసం ఉపయోగించే రెయిన్ గన్స్‌ను పొలాలకు ఉపయోగిస్తే ఏం లాభం అని ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పంట పొలాల గురించి తెలిసిన వ్యక్తిని మంత్రిగా నియమించాలని సూచించారు. ఆక్వా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, ప్రతిపక్షాలతో కలిసి పోరాడతామని హెచ్చరించారు. -
‘స్విస్ చాలెంజ్’పై సమాధానమేదీ? : రామచంద్రయ్య
సీఎం చంద్రబాబుకు రామచంద్రయ్య ప్రశ్న సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టడంపై ప్రశ్నించిన విపక్షాలు, మేధావులు, ప్రజా సంఘాలను ఉన్మాదులుగా అభివర్ణించిన సీఎం చంద్రబాబునాయుడు.. అమరావతిని రహస్యంగా చేపట్టడం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించడంపై ఏమంటారని శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య నిలదీశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు ప్రజలు తనకు సీఎం పదవి అనే లెసైన్స్ ఇచ్చారని భావించడం మంచిది కాదని చంద్రబాబుకు గురువారం ఓ ప్రకటనలో ఆయన హితవు పలికారు. రాజధాని నిర్మాణంపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఈ అక్రమ విధానాలకు వంత పాడలేక ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారని వివరించారు. -
స్విస్ చాలెంజ్ అవినీతికి రాజబాట: రామచంద్రయ్య
విజయవాడ: నగరంలో ఆలయాలన్నీ కూలగొట్టిన తర్వాత మంత్రుల కమిటీ వేయడం ఎందుకని ఏపీ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా పర్యటనలో ఉండి రాష్ట్రంలో ఏ మూల వర్షం పడిందో తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలో జరిగిన ఆలయాల కూల్చివేత గురించి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డం పడుతున్నాయని పదేపదే ఆరోపిస్తున్న చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ పాలనపై అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మంత్రివర్గంలో దేవాదాయశాఖ పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండానే దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రపంచమంతా స్విస్ చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే ఆ విధానం అద్భుతం, అమోఘం అంటూ బాబు చెప్పడం ఆయన అవినీతి బుద్దికి నిదర్శనమని అన్నారు. -
కాపుల్ని బీసీల్లో చేర్చితే ఉద్యమాలే
- రాష్ర్ట బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య హెచ్చరిక తిరుపతి కల్చరల్ సామాజికంగా అభివృద్ధి చెందిన కాపు, బలిజలను బీసీ జాబితాల్లో చేర్చి బీసీల కడుపు కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉద్యమ పోరుతోగుణపాఠం తప్పదని రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతిలో బుధవారం రాష్ట్రస్థాయి బీసీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై చర్చించారు. బీసీ సంఘాల నేతలంతా ఏకమై రాష్ట్ర బీసీ జేఏసీ ఏర్పాటుచేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా అన్నా రామచంద్రయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆయనతో పాటు అన్ని జిల్లాలకు చెందిన బీసీ నేతలు పది మందితో బీసీ జేఏసీ అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ సామాజికంగా ఎదగిన కాపులను బీసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం అణగారుతున్న బీసీలను దగా చేయడమేనన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి బీసీల కడుపు కొట్టే కుట్ర పన్నడం దారుణమన్నారు. 1983లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన టీడీపీ ఇప్పటివరకు పట్టించుకోకపోగా మొన్న తెరపైకి వచ్చిన కాపు, బలిజలను బీసీల్లో చేర్చే విధానానికి తలొగ్గడం అమానుషమన్నారు. చరిత్ర కలిగిన బీసీ కులాలను చరిత్రహీనులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీలను దగా చేసే చంద్రబాబు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని బీసీలందరూ ఐక్యవేదికగా ఉద్యమ పోరుకు సిద్ధం కావాలన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జూలై మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీలను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనంతరం విజయవాడలో భారీ ఎత్తున బీసీ రణభేరి చేపట్టి బీసీల సత్తా చాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు సాంబశివరావు, గంగాధరం, ప్రసాద్‌బాబు, వెంకటేశ్వరరావుర, ఎంవీవీఎస్.మూర్తి, శ్రీనివాసులు, అశోక్‌సామ్రాట్ యాదవ్, యానాదయ్య, రెడ్డి సత్యనారాయణ, అన్ని జిల్లాల బీసీ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేవుని భూములూ వదలవా బాబూ..
‘సదావర్తి’ భూముల వేలం రద్దు చేయాలని సి.రామచంద్రయ్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : ‘రాజధాని పేరిట రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. కనీసం దేవుని భూములను కూడా వదలరా.. సదావర్తి భూముల వేలం వెంటనే రద్దు చేయాల’ని శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇందిర భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వ పెద్దలు కేవలం రూ. 23 కోట్లకు దక్కించుకున్నారన్నారు. ఇందులో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ది ప్రధాన హస్తమన్నారు. సదావర్తి సత్రం భూముల పరిసర ప్రాంతాల్లో 200 గజాల స్థలంలో కట్టిన ఒక్కో విల్లా రూ.2 కోట్లు ఉందంటే 83.11 ఎకరాల భూముల విలువ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రామచంద్రయ్య అన్నారు. భూములను వేలం వేయాలంటే ముందుగా దేవాదాయశాఖ కమిషనర్ ఆ స్థలాన్ని పరిశీలించి ధర నిర్ణయించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగలేదన్నారు. వేలం పాట వ్యవహారాన్ని రద్దు చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత జరుగుతున్నా ఆ శాఖ మంత్రి మాణిక్యాలరావు నోరు తెరవకపోవడం శోచనీయం అన్నారు. -
‘సదావర్తి’ భూముల దోపిడీపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడటానికి పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ‘అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీ’ని నియమించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. కమిటీ తన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రామచంద్రయ్య నేతృత్వంలో పీసీసీ కమిటీ: సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో జరిగిన కుంభకోణంపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య నేతృత్వంలో పీసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. -
కాపులపై కక్షకట్టి వర్గాలు సృష్టిస్తున్న బాబు
శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: కాపులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి ఆ కులస్తుల మధ్యే వర్గాలను సృష్టిస్తూ అన్నిరకాలుగా హింసిస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. పీసీసీ నేతలు సాకే శైలజానాథ్, జంగా గౌతం, సూర్యానాయక్‌లతో కలిసి ఆయన శుక్రవారం ఇందిర భవన్లో మీడియాతో మాట్లాడారు. కాపులకు ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రెండేళ్లయినా వాటి గురించి పట్టించుకోకపోవడంతో బాబుపై నమ్మకం లేక ముద్రగడ శాంతియుతంగా ఆందోళనకు దిగితే తప్పా? అని ప్రశ్నించారు. తునిలో రైలుకు నిప్పు పెట్టడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయన్నారు. తుని సంఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశిస్తే వాటి వెనక చంద్రబాబు పాత్ర ఉందా? లేదా? అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
సదావర్తి సత్రం భూ కుంభకోణాలపై పీసీసీ కమిటీ
హైదరాబాద్: అమరావతిలోని సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో జరిగిన భారీ కంభకోణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలను సేకరించి అక్రమాలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కాంగ్రెస్ పార్టీకి కమిటీ నివేదిక ఇవ్వనుంది. కమిటీలో రామచంద్రయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ, పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ సుందరరామ శర్మ, ప్రధాన కార్యదర్శి పాకల సూరిబాబు ఉన్నారు. -
11ఏళ్ల తర్వాత సొంత గూటికి..
తిరిగి ఇంటికి చేరిన మతిస్థిమితం లేని వ్యక్తి చౌటుప్పల్: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటికెళ్లిన ఓ వ్యక్తి 11ఏళ్లకు మళ్లీ సొంత గూటికి చేరాడు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన మాసారం రామచంద్రయ్య మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నల్లగొండలో 2011లో జరిగిన పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈయనను అమ్మానాన్న అనాథాశ్రమం నిర్వాహకులకు అప్పగించారు. ఆశ్రమ నిర్వాహకులు ఐదేళ్లుగా ఎర్రగడ్డలో చికిత్స చేయించారు. కోలుకున్న రామచంద్రయ్య తన చిరునామా చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఖాజా సమక్షంలో రామచంద్రయ్యను భార్య కాళమ్మ, తల్లి జంగమ్మలకు అప్పగించారు. -
హోదా ఇవ్వరని బాబుకు ముందే తెలుసు
అందుకే ఆయనకు నోరు, చెవులు పనిచేయడం లేదు: కాంగ్రెస్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వరని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని, కావాలనే మోసం చేస్తూ వచ్చారని ఏపీ శాసనమండలి విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శించారు. అందుకే చంద్రబాబు నోరు గతంలోనే మూగబోయిందని, ఇప్పుడు ఆయన చెవులు కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బేలతనం వీడాలని సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ నేత గిడుగు రుద్రరాజుతో కలసి విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు. -
'దేశవ్యాప్త చర్చకు, ఇక్కడి పరిస్థితులకు పొంతలేదు'
విజయవాడ: అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం లేకుండా రాజధాని నిర్మాణం చేపట్టడం సరి కాదని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిటైర్ ప్రొఫెసర్ అమితాబ్ కుందు, జేఎన్ యూ సీనియర్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్యలు అభిప్రాయ పడ్డారు. రైతుల కోరిక మేరకు రాజధాని గ్రామాలలో వీరు పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో తమ పర్యటన వివరాలను పంచుకున్నారు. సామాజికంగా, భౌగోళికంగా అమరావతి ప్రాంతంలో శాస్త్రీయ అధ్యయనం చేయకపోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమరావతి పై జరుగుతున్న చర్చ కు, ఇక్కడి పరిస్థితులకు మద్య పొంతన లేదని అన్నారు. పర్యావరణంకు జరుగుతున్న నష్టం పై ఎన్ జి టి లో విచారణ జరుగుతున్న సమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీలు వేయటం అర్ధరహిత మని అన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం సరి కాదన్నారు. భవిష్యత్ లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల న్యాయ పరమైన చిక్కులే కాక పర్యావరణ ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు. -
సోమిరెడ్డి, రామచంద్రయ్య మధ్య వాగ్వాదం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇసుక మాఫియాపై మంగళవారం వాడివేడిగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోచుకున్నారంటూ ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు సంధించుకున్నారు. దీంతో ఇరువురు సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాటి జోక్యం చేసుకున్నారు. ఇరువురికి సర్థిచెప్పి.. చర్చను ముగించినట్లు చక్రపాటి ప్రకటించారు. -
'ఏపీ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శిచారు. రాజధాని భూదందాపై బుధవారం ఆయన మట్లాడుతూ.. రాజధాని విషయంలో మొదటి నుంచీ అక్రమాలే జరుగుతున్నాయన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. భూదందాకు సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చడానికి చంద్రబాబే సీబీఐ విచారణను కోరాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆత్మహత్యాయత్నం కేసులో రామచంద్రయ్య అరెస్ట్
ఆత్మహత్యాయత్నం కేసులో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్యను అలిపిరి సీఐ శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ అన్నా రామచంద్రయ్య నిరాహార దీక్ష చేపట్టగా నాలుగో రోజున పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ని చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. కాగా, ఈ సందర్భంగా రామచంద్రయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన్ని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
అప్పు తీర్చే మార్గం కనిపించక..
కలిసిరాని కాలానికి మరో రైతు బలయ్యాడు. అప్పుచేసి పెట్టుబడులు పెట్టి.. ఆరుగాలం శ్రమిం చినా దిగుబడి ఆశాజనకంగా రాలేదు..చేసిన అప్పులకు ఏటేటా వడ్డీ పెరిగిపోతుండడం.. అవి తీర్చే మార్గం కనిపించగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాంపల్లి మండలం చామలపల్లి గ్రామనికి చెందిన రాసాల వెంకయ్య(54)వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న 9 ఎకరాల భూమిలో ఎక రం వరి, మిగతా భూమిలో పత్తి సాగుచేస్తున్నా డు. పెట్టుబడుల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 4లక్షల50వేల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాకపొవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీర్చే మార్గం కనిపించక మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్దే పురుగులమందు తాగాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్ద కు వెళ్లి చూడగా బీడు భూమిలో అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అతడిని వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పురుగులమందు తాగి.. నల్లగొండ క్రైం : నల్లగొండ మండలం బుద్దారం గ్రామానికి చెందిన చిలుకల రామచంద్రయ్య (46) తనకున్న ఐదెకరాలలో పత్తి సాగు చేశాడు.పెట్టుబడుల కోసం * 6 లక్షల వరకు అప్పులు చేశాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి రాలేదు. అప్పులు తీర్చే మార్గం కనిపించక మంగళవారం ఇంట్లో ఎవరూల లేని సమయంలో పురుగులమందు తాగాడు. పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన కుమార్తెలు ఇంటి తలుపులు తీసి చూడగా తండ్రి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. వెంటనే కూలికి వెళ్లిన తల్లి లక్ష్మమ్మకు సమాచారం అందించగా వచ్చి చూసే సరికి మృతిచెంది ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డానియల్ కుమార్ తెలిపార -
కాపులను బీసీల్లో చేర్చితే రాష్ట్రం అగ్నిగుండమే
- కాపు, బలిజల్లో అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తే వ్యతిరేకించం - అన్నా రామచంద్రయ్య హెచ్చరిక తిరుపతి కల్చరల్: కాపులను, బలిజలను బీసీల్లో చేర్చే ప్రయత్నాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించకుంటే బీసీల తిరుగుబాటుతో రాష్ట్రం అగ్నిగుండం కాక తప్పదని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య హెచ్చరించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ వృత్తులతో బతుకులు సాగిస్తున్న 93 కులాలు అనాదిగా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. వ్యవసాయం, వ్యాపార రంగాల్లో రాణిస్తూ రాజకీయ రంగంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న బలిజలను బీసీల్లో చేర్చాలనుకోవడం బీసీలను దగా చేయడమేనని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పుండచ్చు కానీ బీసీల పేరుతో దోపిడీ చేస్తూ వారి కడుపు కొట్టడం దగా కోరుతనమన్నారు. బలిజ, కాపులలో అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వ చేపడితే తాము వ్యతిరేకం కాదన్నారు. పాలక ప్రభుత్వాలు రాజకీయ కుట్రలో బలిజ, కాపులు బలికావద్దని సూచించారు. టీడీపీ సర్కార్ బీసీలను దగా చేస్తున్నా రాజకీయంలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం అమానుషమన్నారు. బలిజ, కాపులను బీసీల్లో చేర్చే విధానాన్ని బీసీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి ఇళ్ల ముందు ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్నప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య తదితరులు కూడా వీఐపీ విరామ సమయంలో ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. -
వర్షప్రభావిత జిల్లాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలకి నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న మూడు జిల్లాల్లో వీరి పర్యటన కొనసాగనుంది. ఈ నెల 27న వైఎస్ఆర్ జిల్లా, 28న చిత్తూర్, 29న నెల్లూరు జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో పర్యటన సాగనుంది. ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్యతోపాటూ మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గోనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారి వివరాలు తెలుసుకోనున్నారు. -
'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అసమానతలపై ఆ ప్రాంత ప్రజలు రగిలి పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలను సమీక్షించుకొని ..అభివృద్ధి వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు
హైదరాబాద్: నిబంధనలు పాటించకుండా భూమి కేటాయింపులు జరిపారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్యను వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి ఆయన భూమిని కేటాయించిన కేసులో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హయత్ నగర్ మండలం తుర్కయాంజల్‌లోని సర్వే నంబర్ 52లో పది ఎకరాల భూమిని నిబంధనలు పాటించకుండా డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్య మంజూరు చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. -
బాబు మాఫియాడాన్లా మాట్లాడుతున్నరు
-
బాబుపై ప్రజలు కోర్టుకెళ్లే రోజులు దగ్గర్లోనే....
కడప : హామీల అమలులో జాప్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజలు త్వరలోనే కోర్టుకెళ్లే రోజులున్నాయని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని ఇందిరాభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హామీలు ఇచ్చానని, ఇప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉన్నందున వాటిని నెరవేర్చలేనని చేతులెత్తెయ్యడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు గుప్పించిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారని, త్వరలో ప్రజలు ఆ విషయాన్ని కోర్టు ద్వారా గుర్తు చేయనున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్న ప్రతిపక్షాలను రాక్షసులంటావా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను శాసన సభలో ఎండ గట్టిన ప్రతిపక్ష నేత జగన్‌ను, చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శించడం దుర్మార్గపు చర్య అన్నారు. సొంతింటి నిర్మాణానికి పునాది రాయి వేసినట్లు రాజధానికి భూమి పూజ నిర్వహించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఓ వైపు రేవంత్‌రెడ్డిని పంపించి ఓటుకు నోటు వ్యవహారం నడిపించిన చంద్రబాబు.. అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తామని చెప్పడం చూస్తుంటే దొంగే.. దొంగ, దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. -
’ఇది రాజకీయ దురహంకారమే’
-
భూచట్టంపై అనంతపురం జిల్లాలో సీపీఐ నిరసన
అనంతపురం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలోని రాప్తాడులో పార్టీ కార్యకర్తలు సీపీఐ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. -
కరెంట్‌షాక్‌తో రైతు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దుగ్గపురం రామచంద్రయ్య (50) తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. అయితే, పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగలపై మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు పైగా వెళ్తున్న విద్యుత్ తీగ పడింది. అది తెలియని రామచంద్రయ్య ఫెన్సింగ్ తీగను తాకటంతో షాక్‌నకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రామచంద్రయ్యకు భార్య అలివేలుతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. (తలకొండపల్లి)