sharad pawar
-
వాజ్‌పేయి సర్కారును కూల్చిన ఆ ఒక్క ఓటు నేను వేయించిందే
న్యూఢిల్లీ: 1999లో వాజ్‌పేయి ప్రభుత్వా న్ని పడగొట్టిన ప్రతిపక్షంలోని ఆ ఒక్క ఓటు తను ఒప్పించి వేయించిందేనని సీనియర్ నేత, ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం మహారాష్ట్ర సంసద్‌లో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1999 లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం గద్దె దిగి పోవడానికి దారి తీసిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. ఓ ఎంపీతో సుమారు 10 నిమిషాలపాటు మాట్లాడాక అధికార పక్షం ఎన్డీలోని ఆ ఒక్క సభ్యుడి ఓటును ప్రతిపక్షానికి అనుకూలంగా వేసేలా ఒప్పించింది తనేనంటూ చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే ఆ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. ఈ సందర్భంగా నీలేశ్‌కుమార్ కులకర్ణి రచించిన ‘సన్సద్ భవన్ టు సెంట్రల్ విస్టా’ పుస్తకావిష్కరణ జరిగింది. -
శరద్ పవార్‌కు అనారోగ్యం
పుణే: సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్(84) అనారో గ్యం బారినపడ్డారు. తీవ్రమైన దగ్గు కారణంగా మా ట్లాడటం కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే 4 రో జుల్లో ఆయనకున్న కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఆరోగ్యం బాగోలేకున్నా ఆయన గురువారం పుణే లోని వసంత్‌దాదా షుగర్ ఇన్స్టిట్యూట్లో ప్రసంగించారు. ఆ సమయంలో తరచూ దగ్గుతూనే 18 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. ‘శరద్ పవార్ జీ ఎడతెగని దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే, వచ్చే నాలుగు రోజుల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి’అని శనివారం ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ చెప్పారు. -
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్ పవార్.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్ పవార్ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
‘మహా’ పాలిటిక్స్‌లో ట్విస్ట్..!ఫడ్నవీస్‌పై రౌత్ ప్రశంసలు
ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిట్టనిలువున చీలిపోయిన శరద్ పవార్ కుటుంబం మళ్లీ కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్)పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తాజాగా ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవిస్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రౌత్ అన్నారు. ఈ విషయమై రౌత్ శుక్రవారం(జనవరి3) మీడియాతో మాట్లాడారు.’గతంలో మేం ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం. మా సంబంధాలు కొనసాగుతాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి విషయంలో ఫడ్నవీస్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి’అని రౌత్ ప్రశంసించారు. ఇటీవల కోట్ల రూపాయల రివార్డులన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవిస్ ముందే లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్)ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌పవార్)పార్టీలతో కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టగా ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్) పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం. ఇదీ చదవండి: చొరబాటుదారులకు బీఎస్ఎఫ్ దన్ను -
ఒకతాటిపైకి పవార్ ఫ్యామిలీ!
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.కలిసిపోవాలని కోరుకున్నాతాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.పెద్దాయన అంటే చాలా గౌరవంపవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.అప్పుడు చాలా బాధపడ్డాంఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు. చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా? మళ్లీ ఒక్కటవుతారా?ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ నేటితో (2024 డిసెంబర్ 12) 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న జన్మించారు. ఆయన తన రాజీకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే కాంగ్రెస్‌ను వీడి సొంతంగా పార్టీ వ్యవస్థాపించడం ఆయన జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి. నాడు 12వ లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫ్రంట్‌లో గందరగోళం ఏర్పడిందని ప్రముఖ రచయిత రాజ్‌కమల్ ప్రకాశన్ ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. అప్పటికేప్పటికే పవార్, సోనియా గాంధీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పవార్ లోక్‌సభలో పార్టీ నేతగా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం పవార్ స్వయంగా సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదం తీసుకున్నారు. జాబితాను లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. మర్నాడు నాటి స్పీకర్ జిఎంసీ బాలయోగి.. పవార్‌కు ఫోన్ చేసి.. ‘నాకు ఇప్పుడొక సమస్య ఏర్పడింది. మీ పార్టీ నుంచి నాకు రెండు జాబితాలు అందాయి. కాంగ్రెస్ చీఫ్ డైరెక్టర్ పీజే కురియన్ నాకు మరో జాబితా పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి’ అని అన్నారు.లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఉన్నందున, కమిటీ సభ్యుల జాబితాను స్పీకర్‌కు సమర్పించడంపై శరద్ పవార్‌కు హక్కు ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ మరో జాబితా విడుదలైంది. రెండో జాబితా ఫోటోకాపీ అందిన తర్వాత పవార్ వివరాలు తెలుసుకునేందుకు కురియన్ను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి సూచనల మేరకే రెండో జాబితాను సిద్ధం చేసినట్లు వారి మాటల్లో వెల్లడైంది. వెంటనే పవార్ స్వయంగా సోనియాను కలిశారు. సోనియాతో మీరు రూపొందించిన జాబితాను ఉపసంహరించుకోవాలని పవార్‌ను కోరారు.1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆమె విదేశీయురాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో అర్జున్ సింగ్, ఏకే ఆంటోనీ, గులామ్‌నబీ ఆజాద్, అంబికా సోనీ తదితరులు సోనియాపట్ల తమ విధేయతను ప్రకటించారు. అయితే పీఏ సంగ్మా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సంగ్మాకు శరద్ పవార్, తారిఖ్ అన్వర్ మద్దతు పలికారు. కొద్దిరోజుల తరువాత పార్టీ ఈ ముగ్గురినీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనంతరం ఈ ముగ్గురూ మరికొందరు నేతల సహాయంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
ఎక్కడా లేని ఈవీఎంలు మనకెందుకు?
షోలాపూర్: అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మన దగ్గర మాత్రం ఈవీఎంలు ఎందుకని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ప్రశ్నించారు. ఈవీఎంలను పక్కనపెట్టి కేవలం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈవీఎంల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో నాసిక్ జిల్లా మర్కద్వాడీ గ్రామంలో బ్యాలెట్ పేపర్లతో రీపోలింగ్ జరపాలని పోరాడుతున్న ప్రజలను శరద్ ఆదివారం కలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. మర్కద్వాదీ గ్రామస్థులు గొప్ప ఉద్యమం ప్రారంభించారని, మొత్తం దేశానికే సరైన దశాదిశ చూపుతున్నారని శరద్ పవార్ ప్రశంసించారు. గ్రామస్థులపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు తనకు ఇవ్వాలని, ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. మమతా బెనర్జీ సమర్థ నేత విపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని అప్పగించాలన్న ప్రతిపాదనకు శరద్ పవార్‡మద్దతు పలికారు. ఆమె సమర్థత కలిగిన నాయకురాలు అని చెప్పారు. ఇండియా కూటమిని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: రైతులపై టియర్‌గ్యాస్.. ‘ఢిల్లీ చలో’లో హైటెన్షన్ -
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. దీంతో, వారి నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ మేరకు విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే వెల్లడించారు. ఈ సందర్బంగా థాక్రే మాట్లాడుతూ.. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో యూబీటీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఎన్నికల సందర్బంగా ఈవీఎంల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అందుకు నిరసనగా నేడు ప్రమాణస్వీకారం చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోను తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆరోపించారు.మరోవైపు.. ఆధిత్య థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి అంటూ సూచనలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు. -
‘మహా’ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు. ఈవీఎంలపై దేశమంతటా చర్చ ‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు. -
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. -
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
బీజేపీతో భేటీకి గౌతమ్ అదానీ హాజరు..?: ఫడ్నవీస్ క్లారిటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి ముదురుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడానికి అదానీయే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంతేగాక 2019లో అదానీ తన ఢిల్లీ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరారని శరర్ పవార్ ఆరోపించారు. ఈ సమావేశానికి తనతోపాటు, అమిత్ షా, తన మేనల్లుడు అజిత్ పవార్, అదానీ హాజరైనట్లు తెలిపారు.అయితే ఆ ఆరోపణలను తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. గౌతమ్ అదానీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో అదానీ తమ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఫడ్నవీస్, అమిత్ షాలతో సహా బీజేపీ అగ్రనేతలు, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్సీపీకి చెందిన నేతలంతా అదానీ ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన చర్చల్లో భాగమయ్యారని అజిత్ పవార్ కూడా ఆరోపించారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో.. కుటుంబ కథాచిత్రం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు! పవార్ వర్సెస్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్‌గా ఉంది. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్‌ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.భార్యాభర్తల సవాల్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్‌పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు. ఎందరో వారసులు... శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్‌లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మోహన్‌రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్‌కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.తండ్రీ కూతుళ్ల పోటీ గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్‌లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్పై బరిలోకి దిగారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై సుప్రీంకోర్టు మండిపడింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు అజిత్ పవార్ ఫోటోలను, వీడియోలను.. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఉపయోగించకూడదని హెచ్చరించింది.‘మీ సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోండి’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం బుధవారం చీవాట్లు పెట్టింది. శరద్ పవార్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉపయోగించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సర్క్యులర్ జారీ చేయాలని అజిత్ పవార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. కాగా అజిత్ పవార్ వర్గానికి పార్టీ చిహ్నమైన గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ సందర్భంగా శరద్ పవార్‌కు చెందిన వీడియోలను అజిత్ పవార్ వర్గం ప్రచారం చేస్తోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. అయితే అజిత్ పవార్ వర్గం తరపు నసీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. అదిపాత వీడియో అని తెలిపారు. కానీ కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది.‘ఈ వీడియో పాతది అయినా కాకపోయినా, శరద్ పవార్‌తో మీకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీరు మీ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రత్యేకమైన, భిన్నమైన రాజకీయ పార్టీగా మీ సొంత గుర్తింపును కనుగొనండి అని తెలిపారు. -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను
పుణే: ఎన్సీపీ దిగ్గజ నేత శరద్ పవార్ త్వరలో రాజ కీయాల నుంచి వైదొల గనున్నారా? అంటే అవు ననే చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళవారం మహా రాష్ట్రలోని బారామ తిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన వెల్లడించిన విషయం దీనిని రూఢీ చేస్తోంది. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, యువ తరానికి మార్గదర్శకంగా ఉంటానని శరద్ పవార్ అన్నారు. ‘ప్రస్తుతం అధికారంలో లేను. రాజ్యసభ సభ్యుడిగా మరో ఏడాదిన్నర కొనసాగుతాను. కానీ, ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు పోటీ చేయాలా వద్దా అనే విషయం ఆలోచించాలి. లోక్‌సభకే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను’అని అన్నారు.‘బారామతి నుంచి 14 సార్లు పోటీ చేశా. ప్రతిసారీ మీరు నన్ను గెలిపించారు. ఒక్కసారి కూడా ఓడించలేదు. కానీ, నేనే దీనికి ముగింపు పలకాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. ఆ తపనతోనే పనిచేస్తున్నా. అధికారం కాదు, ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం. ప్రజల కోసం ఇకపైనా పనిచేస్తూనే ఉంటా’అని ఆయన ప్రకటించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న శరద్‌పవార్ వయస్సు 83 ఏళ్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. 1967లో మొదటిసారిగా బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత 57 ఏళ్లలో ఒక్క ఓటమిని కూడా ఎరగని నేత శరద్‌పవార్. -
రాజకీయాల నుంచి తప్పుకోబోతున్న శరద్ పవార్?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్చంద్ర) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజ్యసభలో తమ పదవీకాలం ఇంకా ఏడాది కాలం మిగిలి ఉందని, అది పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బారామతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలో లేనని చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వెల్లడించారు. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న శరద్ పవార్.. ఇప్పటి వరకు 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 20న జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ(అజిత్) అధ్యక్షుడు అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై శరద్‌పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర తరఫున ప్రచారం చేస్తు్న్నారు. కాగా అజిత్ పవార్ బారామతి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విజయాల్లో అతనికి తన మామ పార్టీ మద్దతు ఉంది. కానీ పార్టీ నుంచి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని చెప్పారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30 ఏళ్లకు పైగా పనిచేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రాబోయే 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని మనం తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాగా శరద్‌పవార్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా అవతరించారు. 1999లో ఆయన ఎన్సీపీని స్థాపించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు. -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
‘అలా చేయటం.. నన్ను ఎంతో బాధపెట్టింది’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను అనుకరించటం చాలా బాధపెట్టిందని ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవర్ అన్నారు. శరద్ పవార్ అనుకరణపై బుధవారం అజిత్ పవార్ స్పందించారు. శరద్ పవార్ అలా చేయడం సరికాదని అన్నారు. తన తల్లి పేరు ప్రస్తావనతో భావోద్వేగానికి గురయ్యానని, అది సహజంగానే జరిగిందని చెప్పారు.‘‘నేనెప్పుడూ శరద్ పవార్‌ని దేవుడిగా భావించే వ్యక్తిని. కానీ ఆయన రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని అనుకరించారు. శరద్ పవార్ అనుభవజ్ఞులైన నేత. ఆయన నన్ను అనుకరించిన విధానం చాలా మందికి నచ్చలేదు. అదే పని.. బారామతి అభ్యర్థి యోగేంద్ర పవార్ లేదా ఇతరులు ఎవరైనా చేసి ఉంటే ఫర్వాలేదు. మా అమ్మ పేరు ప్రస్తావనతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. నేను కన్నీళ్లు పెట్టుకున్నా. అది చాలా సహజమైంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కూడా. నేను నా రుమాలు తీయలేదు. కానీ ఆయన అలా చేశారు. ఇంత కాలం ఆయన రాజ్ ఠాక్రేను మాత్రమే అనుకరిస్తారని అనుకున్నా. కానీ నిన్న(మంగళవారం) శరద్ పవార్ నన్ను కూడా అనుకరించారు. ఆయన అలా చేయటం నిజంగా చాలా బాధ పెట్టింది’ అని అన్నారు.చదవండి: ‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’ -
‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’
ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్‌ను అనుకరించారు. శరద్ పవార్ ప్రసంగిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు....నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్‌కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్‌కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్ పవార్ పైవ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వటం గమనార్హం.చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్ -
మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్
ముంబై: గుజరాత్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయవల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. ‘‘రతన్ టాటా మహారాష్ట్రలో టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ రావాలని భావించారు. సంప్రదింపులు జరిపిన అనంతరం.. నాగ్‌పూర్ ఎంఐడీసీ ప్రాంతంలో 500 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించటం జరిగింది. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగింది. ఇందులో నేను కూడా భాగమయ్యాను. తర్వాత మా ప్రభుత్వం మారిపోయింది. ..అనంతరం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. రతన్ టాటాకు ఫోన్ చేసి ఒప్పించి గుజరాత్లో ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో వేల మందికి ఉద్యోగాలు లభించేవి. మహారాష్ట్ర కోసం ఉద్దేశించిన (సెమీకండక్టర్) ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ను మోదీ కోరడంతో మహారాష్ట్రలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానమంత్రి ఏ ఒక్క రాష్ట్రానికి చెందినవారు కాదు.. దేశం మొత్తం గురించి ఆలోచించాలి’’ అని అన్నారు. అయితే ప్రస్తుతానికి శరద్ పవార్ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.చదవండి: ఢిల్లీ.. 72 గంటలు డేంజర్ -
అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీనే గడియారం గుర్తును కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పార్టీ గుర్తు గడియారం చిహ్నాన్ని ఉపయోగించకుండా నిషేధం విధాంచాలంటూ శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని సుప్రీం ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దని సున్నిహితంగా హెచ్చరించింది. అంతేగాక అజిత్ వర్గం గత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, శరద్ పవార్ వర్గానికి నష్టం వాటిల్లకుండా చిహ్నాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే సుమోటోగా స్వీకరించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.కాగా 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అధికార మహాయుతి కూటమిలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చీలికత ర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాకుండా, ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించింది. శరద్ చంద్ర పవార్ వర్గానికి.. ‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’ గుర్తును ఈసీ ఖరారు చేసింది. -
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
90 ఏళ్లు వచ్చినా.. శ్రమిస్తా: శరద్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రను సరైన మార్గంలో నడిపించే వరకు తాను విశ్రమించబోనని తేల్చిచెప్పారు. తాను ప్రసంగిస్తున్న సభలో కొందరు యువకులు ‘84 ఏళ్లు’ అని ప్లకార్డులు చూపించడం పట్ల శరద్ పవార్ స్పందించారు.‘కొంతమంది యువకులు చేతుల్లో 84 ఏళ్ల బోర్డులతో నిలబడి ఉన్నారు. దానిపై నా ఫొటో ఉంది. నాకు 84 ఏళ్ల వయస్సు అని రాసి ఉంది. అయితే మీరు చింతించకండి. ఇప్పుడు మాకు ఉంది నాకు 84 ఏళ్లు వచ్చినా, 90 ఏళ్లు వచ్చినా.. ఈ వృద్ధుడు విశ్రమించడు’’ అని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల షేరింగ్ ఫార్ములాకు సంబంధించిన చర్చల సందర్భంగా మహా వికాస్ అఘాడి (MVA)నియోజకవర్గాల మధ్య విభేదాల ఊహాగానాలను తిరస్కరించారాయన.I'm 84 right now, I may even turn 90, but until Maharashtra comes back on the right track, I am not going anywhere - Sharad Pawar NCP Chief pic.twitter.com/xQpJBWiK5t— Ravi Kapur (@Kap57608111) October 15, 2024మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ( మంగళవారం) ప్రకటింనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
గడియారం గుర్తు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ పార్టీ చిహ్నం (గడియారం) గుర్తు కేటాయింపు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా’(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్ పవార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.ఇక.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్ పవార్ దాఖలుచేసిన పిటిషన్ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడెందుకు? ముందు ఎన్నికల్లో గెలుద్దాం
మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. డైలమాలో కాంగ్రెస్రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
పవార్‌కు ‘జడ్ ప్లస్’ భద్రత
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎప్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. వీఐపీ భద్రతలో జడ్ ప్లస్ అత్యధిక రక్షణ కవచం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన 83 ఏళ్ల శరద్ పవార్‌కు జడ్ ప్లస్ రక్షణను కలి్పంచాలని కేంద్ర హోంశాఖ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కోరింది. జడ్ ప్లస్ కేటగిరీ కింద 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కలి్పస్తారు. కేంద్ర ఏజెన్సీలు ముప్పును అంచనా వేసి.. శరద్ పవార్‌కు అత్యంత పటిష్టమైన భద్రతను కలి్పంచాలని సిఫారసు చేశాయి. -
మహారాష్ట్ర మరో మణిపూర్ కావొచ్చు: శరద్ పవార్ వ్యాఖ్యలు
ముంబై: మణిపూర్ తరహాలో హింసాత్మక ఘటనలు మహారాష్ట్రలో కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం అరికట్టలేకపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు.కాగా, శరద్ పవార్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మణిపూర్‌లో కుకులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు సముహాల జాతి హింసను పరిష్కరించడంతో కేంద్రం విఫలమైంది. అలాగే, మహారాష్ట్రలో కూడా మరాఠీలు, ఓబీసీ రిజర్వేషన్ల గురించి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మణిపూర్ తరహాలోనే మహారాష్ట్రలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంది. అయితే, ఎంతో మంది మహనీయులు మహారాష్ట్రలో సామరస్యాన్ని పెంపొందించారు. కాబట్టి అలాంటి ఘటనలు జరగకపోవచ్చు అనే అనుకుంటున్నాను. రిజర్వేషన్ల నిరసనలపై ప్రభుత్వం మరిన్ని చర్చలు జరపాలి. నిరసనకారులతో చర్చలు ఎందుకు జరపలేదు. ముఖ్యమంత్రి ఒక వర్గం వ్యక్తులతో మాట్లాడుతుండగా, ప్రభుత్వంలోని మరికొందరు వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో ఏడాది కాలంగా హింసా జరుగుతున్నా ఒక్కసారి కూడా మోదీ అక్కడికి వెళ్లలేదన్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించలేదని మండిపడ్డారు. తరతరాలుగా జీవనం కొనసాగిస్తూ, సామరస్యాన్ని కొనసాగిస్తున్న మణిపురీలు నేడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితికి కేంద్రం కూడా ఒక్క కారణమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బహిష్కరణకు గురైన వ్యక్తి హోంమంత్రా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘అవినీతికి కింగ్ పిన్’అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో సుప్రీంకోర్టు అమిత్ షాను గుజరాత్ నుంచి బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ..అటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి ముఖ్యమైన హోం శాఖకు మంత్రి అయ్యారంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎటు వెళ్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. అమిత్ షా దేశాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారని ఆరోపించారు. 2010లో సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా రెండేళ్లపాటు గుజరాత్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే, 2014లో ఈ కేసు నుంచి ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఇటీవల పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా.. ప్రతిపక్షాలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయితే దేశ రాజకీయాల్లో అతిపెద్ద అవినీతి రారాజు శరద్ పవార్ అంటూ వ్యాఖ్యానించడం తెల్సిందే. -
అమిత్‌షాకు శరద్ పవార్ ఘాటు కౌంటర్
ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు. ఇటీవల అమిత్‌షా ‘అవినితికి రారాజు’ అంటూ తనపై చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు షా దూరంగా ఉండాల్సి వచ్చిందని ఎదురుదాడికి దిగారు.“కొన్ని రోజుల క్రితం, హోం మంత్రి అమిత్ షా నాపై విమర్శలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేను కమాండర్ అని అన్నారు. కానీ విచిత్రమేమిటంటే, హోంమంత్రి అమిత్‌షా గుజరాత్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి. దీని వల్ల సుప్రీంకోర్టు అతన్ని గుజరాత్ నుంచి బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వ్యక్తి మనకు నేడు హోంమంత్రి. మనం ఎటువైపు వెళ్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ దేశం ఎవరి చేతుల్లో ఉందో వారు మనల్ని, మన దేశాన్ని తప్పు దారిలో తీసుకెళ్తారని నాకు వంద శాతం నమ్మకం ఉంది. మేము దీనిపై దృష్టి పెట్టాలి’అని అన్నారు.కాగా 2010లో అమిత్‌షా 2010లో రెండు సంవత్సరాలపాటు గుజరాత్‌నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ సమయంఓ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. అప్పటికే బీజేపీ నేత సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఆ ఎన్కౌంటర్ నకిలీదేనని అంగీకరించింది. అనంతరం అమిత్ షా సీబీఐకి దొరక్కుండా నాలుగు రోజులు కనిపించకుండాపోయారు. చార్జిషీట్ దాఖలవడంతో 2010 జులై 24న అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కోర్టు ఆయనకు గుజరాత్లో అడుగుపెట్టరాదన్న షరతుపై బెయిలు మంజూరు చేసింది. అప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా.. గత ఆదివారం పుణెలో అమిత్‌షా మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు. పవార్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో మళ్లీ బలం పుంజుకుని తాము ప్రభంజనం సృష్టించబోతున్నట్లు చెప్పారు. -
మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు
ముఖ్యమంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం అంశాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో విభేదాలు కనిపిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వీటి మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, మొత్తం 288 స్థానాలకు గానూ తలా 95 స్థానాల్లో పోటీ చేయాలనేది! కానీ ఉద్ధవ్ పార్టీ 150 సీట్లలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఎంవీఏ ముఖ్యమంత్రి ముఖం ఉద్ధవ్ అని ఆయన గ్రూపు ప్రతినిధి వ్యాఖ్యానించడమూ, అలాంటి ముఖం ఏదీ లేదని శరద్ పవార్ అనడమూ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేను ముఖ్యమంత్రి ముఖంగా చెబుతూ పోస్టర్లు వెలియడమూ కూటమి మధ్య జరగనున్న ఘర్షణను సంకేతిస్తున్నాయి.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు సాధించిన అధిక ఓట్ల శాతం, మహారాష్ట్రలో ప్రతిపక్షాల చేతిలో తుపాకి గుండులా పనిచేసింది. అది వారికి ఎంత విశ్వాసాన్ని కలిగించిందంటే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం గురించి, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ గురించి అనేక అంశాలపై పరస్పరం వివాదాలకు దిగుతూ కనిపిస్తున్నారు. ఎంఏవీ భాగస్వాములు ఇటీవల ముంబైలో మీడియా ముందు ఐక్యతా ముఖాన్ని ప్రదర్శించి ఉండవచ్చు; కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు ముంబై వంటి ముఖ్య నగరాల్లోని కీలక నియోజకవర్గాలపై కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు.‘ముఖ్యమంత్రి ముఖం’ ఎవరు?విధాన్ భవన్లో ఈ మంగళవారం కూటమిలో పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన పార్టీ, ఆకస్మికంగా పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్‌ను జూలై 12 నాటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయమని కోరింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం చూస్తే మహా వికాస్ అఘాడీకి కేవలం రెండు సీట్ల కోటా మాత్రమే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ కోటాలో ఒక సీటును ‘పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ)కి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఉద్ధవ్ 12వ తేదీన పోటీని అనివార్యం చేస్తూ తన సొంత అభ్యర్థి ఎంపికతో ముందుకు సాగారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజక వర్గంలో ఉద్ధవ్ తన పార్టీ పోటీ చేస్తుందని పట్టుబట్టారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మల్లయోధుడు చంద్రహర్ పాటిల్‌కు ఉద్ధవ్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ మంచి ఆధిక్యతతో గెలుపొందారు.రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఉద్ధవ్ కోరినట్లు శివసేన–ఉద్ధవ్ గ్రూపు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన కూటమి సమావేశంలో మహావికాస్ అఘాడిలోని ముూడు భాగస్వాములు ఒక్కొక్కటీ 95 స్థానాల్లో పోటీ చేస్తాయని విస్తృత అవగాహన ఉన్నప్పటికీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు 150 నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గత వారం శివసేన ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి పదవికి కూటమి తరపు అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వెంటనే, తమ కూటమిలో సీఎం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించబోమని స్పష్టతనిచ్చారు. ‘‘మేము కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బలంతో ఎన్నికల్లో పోరాడతాం. మా అందరికీ ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రస్తుతానికి సీఎం ముఖం అంటూ ఏమీ లేదు’’ అని శరద్ పవార్ పుణెలో మీడియాతో అన్నారు. ఈ ‘సీఎం ఫేస్’ విషయంపై భిన్నాభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే శరద్ పవార్ కూటమిలో విభేదాలు లేవని చెప్పడమే కాకుండా, ప్రతి విషయంపైనా కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం ఉందని అన్నారు.ఎవరు ఎక్కడ?అలాగే కాంగ్రెస్ పార్టీ, శివసేన– ఉద్ధవ్ ఠాకరే గ్రూపు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లేదా ఎంఎంఆర్ లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలో తమ ఉనికిని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, ఉద్ధవ్ ఇప్పుడు తనకు గరిష్ఠంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సీట్లు కావాలని పట్టుబట్టారు. ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌లలో తమ స్థావరాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, శివసేన–ఉద్ధవ్ గ్రూప్ కొంకణ్, థానే, మరాఠ్వాడా ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; కాంగ్రెస్ పార్టీ విదర్భ ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; ఇకపోతే, శరద్ పవార్ ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేకు చెందిన విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణను మొదలుపెట్టింది.లోక్‌సభ ఎన్నికల సమయంలో సాంగ్లీలో ఏమి జరిగిందో పునరావృతం కాకుండా పశ్చిమ మహారాష్ట్రలో కచ్చితమైన సీట్ల పంపకం గురించి తమ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూపుతో తెర వెనుక కమ్యూనికేషన్ ను ప్రారంభించిందని శరద్ పవార్–ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలూ కెమెరా ముందు పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ, సీట్ల పంపకాల చర్చల కోసం కూర్చున్నప్పుడు కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉందని లోపలి వ్యక్తులు అంటున్నారు. కూటమి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రం ఏమిటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజారిటీని పొందినట్లయితే, అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. విదర్భలో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. కాబట్టి, ‘కాబోయే ముఖ్యమంత్రి ముఖం’ అనే సమస్య కూటమి భాగస్వాములలో కొన్ని చీలికలను, ఒత్తిడిని కలిగిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ చందావర్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
స్పీకర్ అలా మాట్లాడాల్సింది కాదు: శరద్‌పవార్
ముంబై: ఎమర్జెన్సీ అంశానికి సంబంధించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. స్పీకర్ స్థాయికి తగినట్లు సభలో మాట్లాడలేదని విమర్శించారు. శనివారం(జూన్29) మీడియా సమావేశంలో పవార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. లోక్‌సభ స్పీకర్ పదవిలో ఉన్న ఓం బిర్లా సందర్భం లేకుండా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారన్నారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదని విమర్శించారు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోందని, ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారని పవార్ ప్రశ్నించారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికను పవార్ స్వాగతించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఎన్సీపీ(శరత్చంద్ర) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో మిత్రపక్షాల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎన్సీపీ అంగీకరించిందని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని శరద్ పవార్ పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం శదర్ పవార్ పుణెలో రెండు పార్టీ సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో, పార్టీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.పుణె ఎన్సీపీ చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌తో పొత్తు చెక్కుచెదరకుండా ఉండేలా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందని శరద్ పవార్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఫార్ములా భిన్నంగా ఉంటుందని పార్టీ చీఫ్ తమకు సూచించాడని చెప్పారు.పూణే, బారామతి, మావల్, షిరూర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితిని కూడా ఎన్సీపీచీఫ్ సమీక్షించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను పవార్ పిలుపునిచ్చినట్లు చెప్పారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ సీట్ల పంపకం సందర్భంగా పార్టీ ఎన్ని సీట్లు కోరుతుందో ఇంకా నిర్ణయించలేదని రాష్ట్ర ఎన్సీపీచీఫ్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ప్రత్యర్థి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి విషయంలో శరద్ పవార్ సీనియర్ నిర్ణయం తీసుకుంటారని పాటిల్ చెప్పారు.కాగా ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
శరద్ పవార్‌కు ధన్యవాదాలు: అజిత్ పవార్
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్ పవార్.. తన అంకుల్ శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా నడిపించిన శరద్ పవార్‌కు అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేరకు సోమవారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే తక్కువ స్థాయిలో ఏ పదవిలో ఉండకూడదని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్‌ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు. స్తుతం 284 సీట్లు ఉన్న ఎన్డీయ బలం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయగా.. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు. -
శరద్ పవార్‌తో టచ్‌లో.. అజిత్ పవార్ వర్గం 15 మంది ఎమ్మెల్యేలు
ముంబై: మహరాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి(బీజేపీ, ఎన్సీపీ, శివసేన) బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శరద్ ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన) 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కూటమికి అత్యధిక సీట్లు రావడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది.ఈ క్రమంలో తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ పేరు చెప్పకుండానే పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పేర్కొన్నారు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.దీంతో ఆ నేతలు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలేన న్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక చోటనే గెలిచింది. అంతేగాక అజిత్ సతీమణి సైతం ఓటమి చెందింది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో లక్ష యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కాగా, మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో కాంగ్రెస్ 13 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకుంది.ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి మలుపులు తిరుగవచ్చని అంతా భావిస్తున్నారు. -
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్‌సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.‘కేజ్రీవాల్, సోరెన్‌లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు -
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
మహారాష్ట్రలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి... ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్‌గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్‌ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్‌సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్‌సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.సాంగ్లి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్‌గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.సోలాపూర్ 2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం! ఆమె తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్‌కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!సతారా మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్‌రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.రత్నగిరి–సింధుదుర్గ్ సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్‌కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.రాయగఢ్ ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.మాధా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్మామ విఠల్‌రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్‌కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్‌కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.అజిత్కూ ప్రతిష్టాత్మకమే ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్‌తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్తో పాటు బారామతిలో విజయం ఆయనకు సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సుప్రియా సులే ఆల్‌రౌండర్
శరద్ పవార్ వంటి రాజకీయ దిగ్గజానికి ఏకైక సంతానం. గారాలపట్టి. అలా తండ్రి నీడలోనే రాజకీయాల్లో ప్రవేశించినా తొందర్లోనే బలమైన నాయకురాలిగా ఎదిగి తనదైన ముద్ర వేశారు సుప్రియా సులే. బారామతి ఎంపీ, ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ తాను సాధారణ పార్టీ కార్యకర్తనే అని గర్వంగా చెప్పుకుంటారు. అంతకుముందు జర్నలిస్టుగా సామాజిక సమస్యలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. ఊపిరి సలపని రాజకీయాల నడుమ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. ఆల్‌రౌండర్ గా అన్ని పాత్రలకూ సమ న్యాయం చేస్తుంటారు. ఉత్తమ పార్లమెంటేరియన్ పుట్టిందే రాజకీయ కుటుంబం. దాంతో చిన్నప్పట్నుంచే రాజకీయ వ్యవహారాలపై సుప్రియకు లోతైన అవగాహన ఉంది. అయినా తొలుత రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకోలేదు. కొంతకాలం జర్నలిస్టుగా చేశారు. పెళ్లి తర్వాత పదేళ్లు విదేశాల్లోనే ఉన్నారు. తండ్రి, మామ అనారోగ్యం బారిన పడటంతో తిరిగొచ్చారు. 2006లో రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బారామతి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తండ్రి రాజ్యసభకు వెళ్లడంతో 2009 ఎన్నికల్లో అక్కడ బరిలో దిగారు 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లోనూ నెగ్గి బారామతిని బలమైన కోటగా మార్చుకున్నారు. ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో ఈసారి మాత్రం వదిన సునేత్ర నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఉమన్ ఆఫ్ ద డెకేడ్... ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కొద్దిమంది నేతల్లో సుప్రియ ఒకరు. స్వయం సహాయక సంఘాలతో కలిసి పని చేశారు. గిరిజనులు, ఆదివాసీల కోసం పాఠశాలల నిర్మాణానికి, వికలాంగుల హక్కుల సాధనకు కృషి చేశారు. మహిళల సమస్యలపై నిత్యం గొంతెత్తుతుంటారు. భ్రూణహత్యలు, వరకట్న వ్యవస్థపై పలు ఉద్యమాలు జరిపారు. మహిళా సాధికారతకు పోరాటం, సామాజిక సేవకు ప్రతిష్టాత్మక ‘ముంబై ఉమన్ ఆఫ్ ద డెకేడ్’ అవార్డు అందుకున్నారు. పలుమార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. నేల విడిచి సాము చేయొద్దని... రాజకీయాలు, కుటుంబం మధ్య సుప్రియ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. బంధుత్వానికి చాలా విలువిస్తారు. “్ఙమా అమ్మ బలమైన వ్యక్తి. నాన్న కంటే గట్టిది. నాన్న పబ్లిక్ లైఫ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మ అజ్ఞాతాన్ని ప్రేమిస్తుంది. జీవన పోరాటంలో మాకెప్పుడూ అండగా నిలుస్తూ వచి్చంది. రాజకీయాలు, సామాజిక సవాళ్లను అధిగమించడమెలాగో నాన్న చూపితే, ఎప్పుడూ నేలవిడిచి సాము చేయొద్దని అమ్మ నేరి్పంది. అందుకే కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉంటా. ఎంపీగా ప్రజల సమస్యలను చర్చిస్తున్నప్పుడు కూడా.. కొడుకు చదువు, కూతురు పుట్టినరోజు కేక్ ఎలా ఉండాలి వంటిని నా మనసులో మెదులుతూ ఉంటాయి’’ అంటారామె. సుప్రియకు నచ్చే నేత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. పార్టీ, సిద్ధాంతాల పట్ల ఆయన నిబద్ధత తనకు ప్రేరణనిస్తాయంటారు. పార్లమెంటేరియన్లుగా దివంగత అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లనూ బాగా ఇష్టపడతారు. ప్రేమ వివాహం చిరునవ్వుతో వెలిగే బక్కపలుచని ముఖం. మాటల్లో మృదుత్వంతో ఇట్టే ఆకట్టుకునే సుప్రియ 1969 జూన్ 30న జన్మించారు. బర్కిలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నీటి కాలుష్యంపై అధ్యయనం చేశారు. ఓ దినపత్రికలో జర్నలిస్టుగా చేస్తుండగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో సదానంద్ బాలచంద్ర సులేతో జరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వారికిద్దరు పిల్లలు. -
‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీల చీలికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు తమ సొంత పార్టీల నుంచి చీలిపోవడానికి కోడుకు, కూతురి మీద చూపించిన ప్రేమే కారణమని అన్నారు. ఆదివారం భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీలను విభజిస్తుందన్న ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘శివసేన, ఎన్సీపీల్లో చీలికలు రావడానికి కారణం ఉద్ధవ్‌కు కొడుకు మీద, శరద్ పవార్‌కు కూతురు మీద ప్రేమే కారణం. కూటమిలోని మూడు పార్టీ మహారాష్ట్రకుఘ ఏం మంచి చేశారు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. మరోవైపు.. ఇటీవల ప్రధాని నరేంద్ర ఎన్నికల ప్రచారం పాల్గొని శివసేన(ఉద్ధవ్) పార్టీపై నకిలీ శివసేన అంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమిత్ షా.. మహా వికాస్ ఆఘాడీను సరిపోలని విడి భాగాలతో కూడిన ఆటో రిక్షాతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఇక.. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సాంగ్లీ, భీవండి, ముంబై సౌత్ సెంట్రల్ స్థానాలను కాంగ్రెస్ వదులుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా శివసేన(ఉద్ధవ్) 21 స్థానాలు,ఎన్సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
‘బీజేపీవి చెత్త రాజకీయాలు’.. సుప్రియా సూలే ఫైర్
ముంబై: బారామతి లోక్‌సభ స్థానం విషయంలో బీజేపీ తమపై కుట్ర చేస్తోందని ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు. ముఖ్యంగా తన వదిన సునేత్ర పవార్‌ను బారామతి బరిలోకి దించి ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ రాజకీయంగా ఉన్న పేరును అంతం చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోందని దుయ్యబట్టారు. ‘నా పోరాటం ఒక వ్యక్తిగా వ్యతిరేకంగా కాదు. వారి(బీజేపీ) ఆలోచనలు, విధానాలుపై మాత్రమే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి18 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా నేను వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. సునేత్ర పవార్ తను పెద్దన్న భార్య అని.. అంటే తల్లితో సమానం’ అని అన్నారు. ‘బీజేపీవి చెత్త రాజకీయాలు, సునేత్ర పవార్ మా పెద్దన్న భార్య. మరాఠీ కుటుంబంలో అన్న భార్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మాకు ఆమె తల్లితో సమానం. మాలో మాకు శత్రుత్వం పెంచడానికి సునేత్రను బారామతి బరిలో దింపుతున్నారు. ఈ నిర్ణయం వెనక బీజేపీ హస్తం ఉంది. ఎన్సీపీ(శరద్ పవార్) చీఫ్ శరద్‌పవార్ పేరును రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బారామతి నియోజకవర్గం అభివృద్ధి గురించి బీజేపీ ఆలోచించదు’ అని సుప్రియా సూలే మండిపడ్డారు. అధికారికంగా బారామతి స్థానంలో మహారాష్ట్ర బీజేపీ కూటమి నుంచి సునేత్ర పవార్‌ను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునేత్ర పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ధన్యవాదాలు’ అని అన్నారు. -
‘బీజేపీది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’
ముంబై: బీజేపీలోకి చేరేవాళ్లంతా.. ఆ పార్టీ మీద ప్రేమతో చేరటం లేదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) పార్టీ ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్, సీబీఐ, ఈడీ కారణంగా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. బారామతి నియోజకర్గంలో తనపై పోటీగా ఎవరు నిలబడతారనే విషయం ఇంకా తెలియదన్నారు. అధికారికంగా ప్రకటన వెలువడలేదని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వాయ్యం హత్యకు గురువుతోంది. బీజేపీలో ఎవరూ ప్రేమతో చేరటం లేదు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్, సీబీఐ, ఈడీ వల్ల చేరుతున్నారు. బీజేపీ ఆశోక్ చవాన్‌పై ఒత్తిడి తెచ్చి.. పార్టీలోకి చేర్చుకుంది. బీజేపీ.. పార్టీలను ఎలా ముక్కలు చేస్తోందో తెలుస్తోంది. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’ అని సుప్రీయా సూలే మండిపడ్డారు. ఇక గత ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్సీపీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇక.. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే) కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే కీలకమైన బారామతి లోక్‌సభ స్థానంలో పవార్ వర్సెస్ పవార్‌గా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సతీమణి పర్యావరణ కార్యకర్త సునేత్ర పవార్ బారామతి బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బారిమతిలో ఈసారి కూడా తానే విజయం సాధిస్తానని సుప్రీయా సూలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బారామతి నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన పనులు అందరికీ తెలుసు. నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు’ అని సుప్రీయా సూలే స్పష్టం చేశారు. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆమె 2009 నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. బారామతి పార్లమెంట్ స్థానం ఎన్సీపీ (శరత్ చంద్ర పవార్) చీఫ్ శరత్ పవార్ కుటుంబానికి కంచుకోట. -
అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు: శరద్ పవార్
ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్'ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడాన్ని 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' అధినేత శరద్ పవార్ ఖండించారు. అధికార దుర్వినియోగానికి బీజేపీ తప్పకుండా మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని బారామతి వద్ద విలేకరులతో మాట్లాడిన పవార్.. కేజ్రీవాల్ అరెస్టును ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని అన్నారు. గతంలో మైనింగ్ కేసులో గిరిజన వర్గానికి చెందిన హేమంత్ సోరెన్ (జార్ఖండ్ మాజీ సీఎం)ని, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ) మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. అధికారం దుర్వినియోగం చేసి ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసే స్థాయికి నేడు బీజేపీ వెళ్లిందని పవార్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టు కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందా అనే ప్రశ్నకు, పవార్ సమాధానం ఇస్తూ.. తప్పకుండా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుంది. కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగుతారని పార్టీ పేర్కొంది. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి బీజేపీ భయపడుతోందని, ప్రతిపక్షాలకు సమస్యలు సృష్టించేలా భయాందోళనలకు గురిచేస్తోందని శరద్ పవార్ వెల్లడించారు. -
వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్ పవార్ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ గత ఏడాది జూలైలో అజిత్ పవార్.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్ పవార్ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. మీరు సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అజిత్ వర్గానికి సూచించింది. అజిత్ పవర్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీ శరద్ పవార్ పేరును ఉపయోగించడం లేదని, కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను నిలువరించడం సాధ్యం కాదని అజిత్ వర్గం పేర్కొన్నారు. అజిత్ వర్గం వాదనలు విన్న తరువాత.. మీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కోర్టు స్పష్టం చేసింది. రెండు పార్టీలుగా విడిపోయిన తరువాత తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉందని వెల్లడించారు. శరద్ పవార్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులు వాదనలు వినిపిస్తూ.. అజిత్ వర్గం ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుకు శరద్ పవార్‌కు ఉన్న రాజకీయ బంధం గురించి అందరికి తెలుసని అన్నారు. -
ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్.. సీట్ల పంపకంపై చర్చ!
ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో.. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్త్ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉద్ధవ్‌కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మంది ముఖ్యనేతలు ఏక్‌నాథ్‌షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్బంధన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు రాహుల్ కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. -
శరద్ పవార్‌కు మరో షాక్.. ‘అజిత్‌దే నిజమైన ఎన్సీపీ’: మహారాష్ట్ర స్పీకర్
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్‌కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు. చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది. అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్‌కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది. -
ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని ఎన్నికల సంఘం(ఈసీ)వెల్లడించిన నిర్ణయంపై ఆ పార్టీ పూర్వ అధినేత శరద్‌పవార్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత కోర్టులో సోమవారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అని ఈ నెల 6వ తేదీన తేల్చిన ఈసీ ఆ మరుసటి రోజే శరద్‌పవార్ వర్గానికి ఎన్సీపీ-శరద్‌పవార్ అనే పేరు కేటాయించింది. 1999లో స్థాపించి నిర్మించిన ఎన్సీపీని ఈసీ లాక్కుని వేరే వాళ్లకు ఇచ్చేసిందని, గతంలో ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదని శరద్‌పవార్ మండిపడ్డారు. కాగా, గతంలో ఎన్సీపీ నుంచి వేరుపడిన శరద్‌పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్ర బీజేపీ, శివసేన సంకీర్ణంలో చేరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. తన వద్దే మెజారిటీ ఎమ్మెల్యేలున్నందున అసలైన ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్లో ఈసీ తలుపు తట్టారు. దీంతో ఈసీ అసలైన ఎన్సీపీ అజిత్‌దేనని తేల్చింది. ఇదీ చదవండి.. ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు -
ఎన్సీపీని లాగేసుకున్న ఈసీ: పవార్
పుణే: ఎన్సీపీని ఎన్నికల సంఘమే తమనుంచి లాగేసుకుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ వాపోయారు. ఎన్సీపీ పేరును, గుర్తును అజిత్ పవార్ వర్గానికి ఈసీ కేటాయించడం తెలిసిందే. ఆదివారం పుణేలో జరిగిన శరద్ పవార్ ఒక కార్యక్రమంలో దీనిపై స్పందించారు. ఎన్సీపీని స్థాపించి, బలోపేతం చేసిన వారి చేతుల్లో నుంచి లాగేసుకోవడమే గాక ఇతరులకు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీన్ని ప్రజలు హర్షించరని నమ్మకం తనకుందని చెప్పారు. -
శరద్ పవార్ కొత్త పార్టీ పేరు.. NCP శరద్చంద్ర పవార్
ముంబై: శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇక.. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. -
శరద్ పవార్‌కు బిగ్ షాక్
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఎన్సీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ పవార్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి ఓ పేరును ఎంచుకోవాలని ఈసీ శరద్ పవార్‌ను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన(రేపు) ఈసీ ముందుకు శరద్ పవార్ వర్గం.. పార్టీ పేరు, గుర్తు అభ్యర్థనతో వెళ్లనుంది. ఆ వెంటనే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్‌ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్‌లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఏక పక్షంగా! ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. అయితే.. ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ కూటమి ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగడం గమనార్హం. -
ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్
ముంబయి: ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిని ముందు ప్రకటించాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. కూటమి పేరుతోనే ఓట్లు అడగాలని శరద్ పవార్ పేర్కొన్నారు. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా మారగలదని చెప్పారు. ఇండియా కూటమి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవార్.. "కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇండియా పేరుతో ఓట్లు అడగాలని నేను నమ్ముతున్నా. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయాన్ని అందించగలదు." అని శరద్ పవార్ అన్నారు. మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి అయినప్పుడు జరిగిన రాజకీయ మార్పులను కూడా పవార్ ప్రస్తావించారు. ఆనాటి ఎన్నికలకు ముందు జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థి, లోక్‌సభ సీట్ల పంపిణీపై వచ్చిన కొన్ని నివేదికలను తోసిపుచ్చుతూ "కూటమి సమూహంలో ఎలాంటి అసంతృప్తి లేదు" అని స్పష్టం చేశారు. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేయడంపై పవార్ మాట్లాడుతూ.. "ఇండియా కూటమి అధ్యక్షుడిగా ఖర్గే ఉండాలని కొందరు నేతలు సూచించారు. చాలా మంది అందుకు అంగీకరించారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రతిపాదించారు. అయితే.. అందుకు నితీష్ కుమార్ తిరస్కరించారు. ప్రస్తుతానికి అది అవసరం లేదు". అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్
‘లక్షద్వీప్’ విషయంలో మాల్దీవులు-భారత్ మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం భారత్‌పై మాల్దీవ్ మంత్రులు వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద వాతావరణం తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల వివాదంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఈ విషయంలో మోదీకి మద్దతుగా నిలిచి శరద్ పవార్.. ఇతర దేశాలకు చెందిన వారు ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము(దేశం) అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ‘మోదీ దేశానికి ప్రధానమంత్రి.. వేరే దేశస్థులు మా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని మేము అంగీకరించము. మేము ప్రధానమంత్రి పదవిని గౌరవిస్తాం. ఆయనకు వ్యతిరేకంగా బయటి వాళ్లు ఏం మాట్లాడినా మేం ఊరుకోం’ అని పేర్కొన్నారు. కాగా గత వారం ప్రధాని లక్ష్యద్వీలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన.. కొన్ని గంటలపాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. సంబంధిత వార్త: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా లక్షద్వీప్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఈ క్రమంలో ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. చాలా వరకు భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. బైకాట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరోవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌పై విమర్శలు చేసిన మంత్రులపై వేటు వేసింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో త్వరలోనే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చదవండి: లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు! -
రిటైర్మెంట్కి కొందరు ఎప్పటికీ ఇష్టపడరు: అజిత్ పవార్
ముంబయి: ఎన్సీపీలో అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. పార్టీలో ఉన్నత పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి శరద్ పవార్ కట్టుబడి ఉండనందుకు తాను ఇప్పటికీ కలత చెందుతున్నానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి అన్నారు. నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత కూడా పదవీ విరమణ చేయడానికి కొంతమంది ఇష్టపడరు అని శరద్ పవార్‌ను ఉద్దేశించి అజిత్ పవార్ అన్నారు. "ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రజలే ఆపాలి. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. వినడానికి సిద్ధంగా లేని కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాల పట్ల మొండిగా ఉంటారు. 60 ఏళ్ల తర్వాత, కొందరు 65 ఏళ్ల వయస్సులో, కొందరు 70 ఏళ్లలో, మరికొందరు 80 ఏళ్లలో పదవీ విరమణ చేస్తారు. కానీ 80 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఓ వ్యక్తి పదవీ విరమణకు సిద్ధంగా లేరు" అని అజిత్ పవార్ అన్నారు. "ఏం జరుగుతోంది? మేము పని చేయడానికే ఇక్కడ ఉన్నాం. ఎక్కడైనా తప్పు జరిగితే మాకు తెలియజేయండి. మాకు చాలా సత్తా ఉంది. నేను రాష్ట్రానికి చాలాసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాను. మేము అనేక పథకాలను విజయవంతం చేశాము" అని పరోక్షంగా శరద్ పవార్‌ను ఉద్దేశించే అజిత్ పవార్ అన్నారు. ఎన్సీపీలో అత్యున్నత పదవుల విషయంలో శరద్ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. శరద్ పవార్ అధ్యక్ష పదవి నుంచి తొలగినట్లే తొలగి మళ్లీ అధిష్టించారు. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంతో కలిసిపోయారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. పార్టీ పేరు, గుర్తుపై ఎన్నికల కమిషన్ వద్ద సవాలు చేశారు. ఈ పరిణామాల మధ్య అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య రాజకీయ వివాదం నడుస్తోంది. ఇదీ చదవండి: TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే.. -
కేజ్రీవాల్ అరెస్టుకు కుట్ర: శరద్ పవార్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. తమ అనుకూల రాజకీయ అభిప్రాయాలు లేని వారిని నిరుత్సాహపరిచేందుకు కేంద్రం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టుకు కుట్ర జరుగుతోందని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవార్ మాట్లాడుతూ.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు పంపిందని అన్నారు. ఆయనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ప్రజలు కేజ్రీవాల్‌ను అధికారంలోకి తెచ్చారని గుర్తుచేసిన శరద్ పవార్.. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులను జైలులో పెట్టారని అన్నారు. కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని పవార్ అన్నారు. "ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు వరుస నోటీసులు జారీ చేస్తున్నారు. ఆయన దేశ రాజధానికి రెండుసార్లు వరుస ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉందని ఢిల్లీలోని ప్రతీ సాధారణ వ్యక్తికి తెలుసు. అయినా.. ఆయన అరెస్టుకు కుట్ర జరుగుతోంది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు" అని పవార్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి మూడుసార్లు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కానీ ఆయన గౌర్హాజరయ్యారు. వివిధ కారణాలను చూపుతూ ఈడీ ముందుకు హాజరుకాలేదు. దీంతో ఆయన్ను ఈడీ అరెస్టు చేస్తుందని ఆప్ నేతలు గురువారం వరుస ట్వీట్లు చేశారు. కేజ్రీవాల్ అరెస్టు ఖాయమని వార్తలు రావడంపై ఈడీ కూడా స్పందించింది. అలాంటిదేమీ లేదని తెలిపింది. కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు -
ప్రధానిగా ఖర్గే పేరు.... ఇండియా కూటమిలో చీలిక?
ఢిల్లీ: ఇండియా కూటమి తరుపున పీఎం అభ్యర్థిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1977 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి పేరును ఖరారు చేయకుండానే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై శరద్ పవార్ స్పందించారు. '1977 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా అయ్యారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందే ప్రకటించకున్నా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త వ్యక్తులు ప్రధానిగా అయ్యారు.' అని పవార్ అన్నారు. అయితే.. ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కొన్ని పార్టీలు ఇప్పటికే సూచించాయి. శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దీదీ పేర్కొన్న ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ కూడా సంతోషంగా లేదని అన్నారు. ఇండియా కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు -
శరద్ పవార్‌కు ముందే తెలుసు.. అజిత్ సంచలన ఆరోపణలు..
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ అనుమతితోనే తాను ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరినట్లు వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, అజిత్ పవార్.. రెబల్ ఎన్సీపీ పార్టీ వర్గాలకు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ.. తాను అధికార పార్టీ ప్రభుత్వంలో చేరే ముందు శరద్ పవార్‌తో సమాలోచనలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన తన ఆలోచన మార్చుకున్నట్లు పేర్కొన్నారు. తన నిర్ణయం గురించి శరద్ పవార్‌కి తెలియజేశానని.. అదేవిధంగా జూలై 2 ముందు, ఆ తర్వాత కూడా ఆయనతో పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. అయినా ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం తనను పిలిచి షిండే ప్రభుత్వంలో చేరమన్నారని వెల్లడించారు. మా నలుగురు కుటుంబ సభ్యులుకు తప్ప ఆయన రాజీనామా గురించి ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఆయన్న రాజీనామా చేయాలని ఎవరు ఒత్తిడి చేయలేదని.. ఆయనే స్వతంత్రంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఆయనకు రాజీనామా చేయాలనే ఉద్దేశము లేనప్పుడు ఈ విషయాన్ని అంత పెద్దది చేయడం ఎందుకని ప్రశ్నించారు. అదే విధంగా తాను, జయంత్ పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్‌లతో కలిపి 12 పార్టీలకు చెందిన నేతలం ప్రభుత్వంలో చేరే విషయంపై శరద్ పవార్‌తో ప్రత్యక్షంగా మాట్లాడలేక సుప్రియా సోలేను సంప్రదించామని తెలిపారు. శరద్ పవార్‌ను ఒప్పిస్తానని తెలిపిన సుప్రియా వారం రోజుల గడువు అడిగిందని, అనంతరం తమకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని వివరించారు. కాగా, అజిత్ పవార్.. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఎనిమిది మంది రెబెల్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో జూలై 2న చేరిన విషయం తెలిసిందే. -
వర్షంలో శరద్‌పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే..
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్‌పవార్ మళ్లీవర్షంలో తడుస్తూ స్పీచ్ ఇచ్చారు. నవీముంబైలో పార్టీ బహిరంగసభ జరుగుతున్నపుడు చిరుజల్లులు పడ్డాయి. ఈ వర్షంలోనే పవార్ తన ప్రసంగాన్నికంటిన్యూ చేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే వర్షంలో తడుస్తూ పవార్ చేసిన ప్రసంగం వెనుక ఒక సెంటిమెట్ ఉంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సతారా నియోజకవర్గంలో పవార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. పవార్ ప్రసంగిస్తుండగానే బోరున వర్షం పడింది. పక్కనున్న పార్టీ వ్యక్తి ఒకతను గొడుగు తీసుకురాగా పవార్ వద్దన్నారు. 83 ఏళ్ల పవార్ భారీ వర్షంలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఫొటోలు, వీడియోలు అప్పట్లో ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం వెనుక ఈ ఫొటోల పాత్ర కూడా ఉందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే మళ్లీ పవార్ వర్షంలో స్పీచ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘మన ప్లాన్‌ను ఇక్కడ వర్షం డిస్ట్రబ్ చేసింది. అయినా మనం వెనుకడుగువేసే వాళ్లం కాదు. అంత ఈజీగా మనం దేనికి లొంగేవాళ్లం కాదు. భవిష్యత్తులోనూ మనం మన పోరాటాన్ని కొనసాగించాలి’ అని నవీముంబై సభలో శరద్‌పవార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తన మేనల్లుడు అజిత్ పవార్‌ను ఉద్దేశించి చేసినవేననే ప్రచారం జరుగుతోంది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని చీల్చి బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీసీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఎన్సీపీ పార్టీ, సింబల్ కూడా తనవేనని ఆయన ఎన్నికల కమిషన్‌లో క్లెయిమ్ చేశారు. ఇదీచదవండి...క్లాస్‌మేట్‌ను 108సార్లు పొడిచారు..కారణమిదే.. -
రాజకీయ విభేదాలు.. దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రియా సూలే
ముంబై: రాజకీయ విభేదాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణె జిల్లాలోని బారామతిలో 'భౌ బీజ్' (భాయ్ దూజ్) వేడుకలను జరుపుకున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, వారి కుమారులు పార్థ్ పవార్, జే పవార్‌తో పాటు మిగిలిన పవార్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది పవార్ కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా భాయ్ దూజ్ వేడుకలు జరుపుకుంటారు. భాయ్ దూజ్ వేడుకలు అన్న చెల్లెల్ల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని పేర్కొంటూ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలను పంచుకున్నారు. రాజకీయ మనస్పర్ధల మధ్య ఈసారి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉన్నాయా? అని సుప్రియా సూలేను అడిగినప్పుడు.. 'వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ భిన్నమైన విషయాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మేము భాయ్ దూజ్ పండుగను జరుపుకోవడానికి అజిత్ పవార్ నివాసానికి వెళ్లాము. వ్యక్తిగతమైన కక్షలు ఎవరితోనూ ఉండవు' అని అమె అన్నారు. ఈ ఏడాది ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో అజిత్ పవార్ చేతులు కలిపారు. అటు నుంచి ఎన్సీపీలో శరద్ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్‌తో కలిసి దీపావళి పండగ వేళ వేడుక చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా? -
శరద్ పవార్‌పై అసోం సీఎం వ్యంగ్యాస్త్రాలు
ముంబయి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో భారత్ స్టాండ్‌ను ఎన్సీపీ నేత శరత్‌పవార్ తప్పుబట్టడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను యుద్ధంలో హమాస్ తరుపున పోరాడటానికి పంపుతారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఇజ్రాయెల్‌లోని నోవా ఫెస్టివల్ వేళ హమాస్ దళాలు రాకెట్ దాడులు జరిపాయి. ఇజ్రాయెలీలను దారుణంగా హతమార్చాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. హమాస్ దాడులను ఖండించారు. అమాయక ప్రజల పక్షాన నిలుస్తూ ఇజ్రాయెలీలకు మద్దతు తెలిపారు. అయితే.. హమాస్ దాడులపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో శరద్ పవార్.. ప్రధాని మోదీ స్టాండ్‌ను విమర్శించారు. పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడాలని ఆయన భావించారు. ఇజ్రాయెలీలకు భారత్ మద్దతు తెలపడంపై శరద్ పవార్ తప్పుబట్టడాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని కోరారు. హమాస్ పట్ల సీనియర్ నాయకుడైన శరద్ పవార్ దృక్పథం సరిగా లేదని అన్నారు. దేశం గురించి మొదలు ఆలోచించాలని కోరారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా శరద్ పవార్ వ్యాఖ్యలను ఖండించారు. ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
ఎన్డీఏతో కలిస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా.. ఇండియా టీమ్‌తో కలిస్తే..
ఎన్డీఏతో కలిస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా.. ఇండియా టీమ్‌తో కలిస్తే అందరిలాగే ప్రధాని మంత్రి అభ్యర్థి.. తేల్చుకోండి సార్! -
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. -
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
13న ‘ఇండియా’ సమన్వయ కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న ఢిల్లీలో జరుగనుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరుగుతుందని కూటమి నేతలు ఆదివారం వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వివిధ పారీ్టలకు చెందిన 14 మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో ఈ కమిటీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పనిచేస్తోంది. -
‘భారత్’గా మారనున్న ఇండియా?.. ఆ హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరగనున్న తరుణంలో.. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చనున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. సదస్సులో పాల్గొనే అతిథులు, ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందుకు పంపిన ‘ఆహ్వానం’మే కారణమైంది. ఆహ్వానంపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని మాత్రమే పేర్కొనడంతో.. ఇండియా పేరును ‘భారత్’గా మార్చనున్నారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిని ప్రతిపక్షాలు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా, ఇది భారత్; రాష్ట్రాల సమాఖ్య’ అని ఉంటుందని, ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా దాడికి గురవుతోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. చదవండి: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం నేషనలిస్టు కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ తాజాగా స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియా సమావేశంలో పవార్ పాల్గొని మాట్లాడుతూ.. ‘దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు అంత కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ‘రాజ్యాంగంలో ఇండియాను పేరు మార్చేందుకు అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ బదులిచ్చారు. ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతల సమావేశం బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతోందని తెలిపారు. ఈ సమావేశంలో దేశం పేరు మార్పుపై చర్చ ఉంటుందని తెలిపారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ పేరు మార్చలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యుల ముందుంచనుందని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు -
ఇంకెంత మంది వీడితే చీలినట్లో చెప్పమంటున్నార్సార్!
ఇంకెంత మంది వీడితే చీలినట్లో చెప్పమంటున్నార్సార్! ఎమ్మెల్యేలు -
పార్టీ చీలదు
కొల్హాపూర్: ఎన్సీపీలో చీలిక రాబోతోందంటూ వినవస్తున్న ఊహాగానాలకు పార్టీ అధినేత శరద్ పవార్ అడ్డుకట్టవేశారు. ‘పార్టీలో చీలిక అనే సమస్యే లేదు. ఒక వేళ నిజంగానే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడితే అది అంతవరకే పరిమితం. అంతేగానీ అది మొత్తం పార్టీకి వర్తించదు. ఎమ్మెల్యేలు అంటే అర్థం మొత్తం పార్టీ అని కాదు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నేనే. మహారాష్ట్ర రాష్ట్ర విభాగానికి జయంత్ పాటిల్ సారథ్యం కొనసాగుతుంది. తిరుగుబాటు శాసనసభ్యులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?’ అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం పవార్ కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘ అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌లో భాగస్వామ్యం అయినా సరే ఎన్సీపీ చీలిపోలేదు. అజిత్ ఎన్సీపీ నేతగానే కొనసాగుతారు’ అని తెలిపారు. దీనిపై శరద్ స్పందిస్తూ.. ‘ అవును అది నిజమే. ఇందులో వివాదం ఏం లేదు’ అని అన్నారు. కానీ కొద్ది సేపటికే అలా అనలేదంటూ మాటమార్చారు. -
మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్
ముంబై: కొద్దీ రోజుల క్రితం అధికార శివసేన-బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్ ఇప్పటికీ మా పార్టీకి చెందిన వారేనన్నారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. ఆయన రాజకీయంగా మాతో విభేదించినంత మాత్రాన మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కొల్హాపూర్ వెళ్లేముందు పూణే బారామతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తమ పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని తాము ఇప్పటికీ కలిసే ఉన్నామన్నారు. అజిత్ పవార్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై మేము అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని సభాపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దీన్ని ఆధారం చేసుకుని మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా చెబుతారు? ఆయన ఇప్పటికీ మా పార్టీకి చెందినవారేనని అన్నారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో నాయకులు పార్టీ నుండి వేరైతే దాన్ని పార్టీలో చీలిక రావడమంటారు. మా పార్టీలో అలాంటిదేమీ జరగలేదు కదా. కొంతమంది మా పార్టీని విడిచి వెళ్లారు. మరికొంతమంది రాజకీయంగా మాతో విభేదించారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. నేను సర్వేలు ఇంకా అధ్యయనం చేయలేదు కానీ ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని అన్నారు. శరద్ పవార్ కంటే ముందు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అని ఆయన ఇంకా మా పార్టీతోనే ఉన్నారని అన్నారు. ఇది కూడా చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు -
ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ..
ముంబయి: ఇటీవల శరద్ పవార్, అజిత్ పవార్ల భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జట్టు కడుతున్న ఇండియా కూటమిని చెదరగొట్టేందుకు అజిత్ పవార్ నేతృత్వంలో వ్యూహం నడుస్తోందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తు కుదిరితే శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని వినికిడి. దీనిపై ఆయన ఏం చెప్పారంటే..? పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శరద్ పవార్, అజిత్ పవార్లు భేటీ అయ్యారు. అజిత్ పవార్ వర్గం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిన నెలరోజుల తర్వాత చిన్నాన్న శరద్ పవార్‌ను కలిశారు. అయితే.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష కూటమికి షాక్ ఇచ్చే విధంగా శరద్ పవార్‌ను బీజేపీతో కలిసేలా అజిత్ పవార్ ఒప్పించే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకున్నారు. ఈ పుకార్లపై మాట్లాడిన శరద్ పవార్.. అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొంతమంది శ్రేయోభిలాషులు తనను బీజేపీతో పొత్తు కుదిరేలా ఒప్పించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని కూడా పేర్కొన్నారు. అజిత్ పవార్‌తో సమావేశం జరిగినట్లు పేర్కొన్న ఆయన.. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పార్టీ పెద్దగా తనకు ఏం ఆఫర్ ఇవ్వగలరని అన్నారు. అజిత్ పవార్‌తో సాధారణంగానే సమావేశం జరిగిందని శరద్ పవార్ గతంలో కూడా చెప్పారు. అయితే.. శరద్ పవార్ భేటీ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) కూటమిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శరద్ పవార్‌ను భీష్మ పితామహగా పేర్కొన్న ఎంపీ సంజయ్ రౌత్.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఎలాంటి పనులను శరద్ పవార్ చేయరని ధీమా వ్యక్తం చేశారు. ముంబయిలో ఆగష్టు 31న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిణామాలు మహాకూటమిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విభజించడమే బీజేపీకి తెలిసిన పని అని శరద్ పవార్ విమర్శించారు. యథావిధిగా కూటమి భేటీ జరుగుతుందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
వెళితే ప్రధాని అభ్యర్థి ఆశలు అడియాశలే అవుతాయ్ సార్..!
వెళితే ప్రధాని అభ్యర్థి ఆశలు అడియాశలే అవుతాయ్ సార్..! -
వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఉద్దవ్ ఠాక్రే వార్గానికి చెందిన శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.ఈ మేరకు సంజయ్ రౌత్ సోమవారం మాట్లాడుతూ.. వారణాసి ప్రజలలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలసుకోగా లేనిది శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ఆదివారం శరద్, అజిత్ పవార్ సమావేశమయ్యారని మీడియా ద్వారా తెలిసింది. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించేందుకే అజిత్ పవార్‌ను.. శరద్ పవార్ కలిసి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై మహారాష్ట్ర ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన -
బీజేపీతో నడవాలని కోరుతున్నారు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎన్సీపీలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ చేరాలని కొంతమంది శ్రేయోభిలాషులు తనను ఒప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎన్సీపీ చేతులు కలిపే ప్రసక్తేలేదని పవార్ కుండబద్దలు కొట్టారు. అయితే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్‌ను కలవడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. కాగా, శరద్ పవార్ సోలాపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌తో భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘అజిత్ నా సోదరుడి కుమారుడు. అతడిని కలవడంలో తప్పేముంది?. ఒక ఇంట్లోని సీనియర్ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదు’ అని అన్నారు. ఇదే సమయంలో ఎన్సీపీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపారు. కానీ, మా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. బీజేపీతో కలవాలని కొందరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. మా పార్టీ బీజేపీతో ఎప్పటికీ జతకట్టదు. బీజేపీతో ఎలాంటి అనుబంధమైనా.. అది ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదు. ఈ విషయంపై ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఇది అందరికీ స్పష్టం చేస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఈ నెలాఖరున మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఇండియా కూటమి ముంబైలో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఏదో ఒక మార్పు చేయాలని అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల జయంత్ పాటిల్ కూడా ఎన్డీయేలో కలిసిపోతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం.. -
ఎన్డీయేలోకి శరద్ పవార్..? తాజా భేటీ ఎందుకు..?
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు జరుగుతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్‌ను కలవడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. శరద్ పవార్ కూడా బీజేపీతో చేతులు కలపనున్నారా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కోరేగావ్ పార్క్‌లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త అతుల్ చోర్డియా ఇంట్లో అజిత్, శరద్ పవార్లు అరగంటపాటు చర్చలు జరిపారని సమాచారం. ఈ సమావేశంలో శరద్ పవార్ ముఖ్య అనుచరుడు జయంత్ పాటిల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భేటీలో చర్చ దేనిపై..? ఎన్సీపీలో ఇటీవల చీలికలు వచ్చి మహారాష్ట్ర రాజకీయంలో కీలక మలుపులు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల అనంతరం ఇప్పటికే అజిత్, శరద్ పవార్లు పలుమార్లు కలిశారు. కానీ ప్రస్తుతం ఎందుకు కలిశారనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. తాజాగా బెయిల్‌పై బయటికి వచ్చిన నవాబ్ మాలిక్, ఎన్డీయేలో అజిత్ పాత్రకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. శరద్ పవార్‌ను కూడా ఎన్డీయేలో కలిసే విధంగా అజిత్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ జయంత్ పాటిల్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే పార్టీని వీడేవారు బీజేపీతో కలిసే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నెలఖరున మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఇండియా కూటమి ముంబయిలో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఏదో ఒక మార్పు చేయాలని అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల జయంత్ పాటిల్ కూడా ఎన్డీయేలో కలిసిపోతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Independence Day: సైనిక దళాల డ్రస్ రిహార్సల్.. రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు.. -
శరద్ పవార్ అందుకే ప్రధాని కాలేకపోయారు: మోదీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే శరద్ పవార్ ప్రధానమంత్రి కావాలన్న కల నెరవేరలేదని ఆరోపించారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగానే పవార్‌కు ప్రధాని అవకాశం చేజారిపోయిందని అన్నారు. కాగా శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ ఎన్సీపీని మహారాష్ట్ర కేబినెట్లో చేరిన అనంతరం ప్రధాని ఈ విధంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంచరించుకుంది. మహారాష్ట్ర ఎన్డీయే కూటమి ఎంపీలతో మంగళవారం మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగాంగా ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని అన్నారు. అనేక మంది గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బంధుప్రీతి కారణంగా కాంగ్రెస్ ప్రతిభ కలిగిన అనేక మందిని ప్రోత్సహించలేదని విమర్శించారు. చదవండి: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ ప్రసంగం.. నో క్లారిటీ శివసేన(యూబీటీ)తో బీజేపీ తెగదెంపులు చేసుకోలేదని ఉద్ధవ్ నేృతృత్వంలోని శివసేనపై విరుచుకుపడ్డారు. వారే కారణం లేకుండా వివాదాలు సృష్టించారని, అయినా సహించామన్నారు. కొన్నిసార్లు క్షమించామని తెలిపారు. ఓ వైపు అధికారంలో ఉండాలని, మరోవైపు విమర్శించాలనుకున్నారు, ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయి? అని ప్రశ్నించారు. కాగా 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తలెత్తిన రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతకొన్ని రోజులుగా వారసత్వ రాజకీయాలపై మోదీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని తెలిపారు. చాలా సందర్భాల్లో అధికారంలో ఉండి తప్పు చేసిన వారిని బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (74)తో పోలిస్తే జేడీయూకి(జనతాదళ్ యునైటెడ్) తక్కువ సీట్లు (43) వచ్చినప్పటికీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎన్డీయే కూటమిలో తమ మిత్రపక్షాలే ముఖ్యమని, అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. బీజేపీకి కాంగ్రెస్‌లా అహంకారం లేదని, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని ఆయన తేల్చిచెప్పారు. చదవండి: సోదరులిద్దరూ కలిసేనా? ఏకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే! -
కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఇటీవల కీలక మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల రెండుగా చీలిన విషయం తెలిసిందే. కొంత మంది నేతలతో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి ఎన్సీయేతో కలిసి ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ వర్గం కాగా.. శరద్ పవార్ నాయకుడిగా ఎన్సీపీ మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే.. తాజాగా శరద్ పవార్ అధినేతగా ఉన్న ఎన్సీపీలో జయంత్ పాటిల్ రూపంలో మళ్లీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయంత్ పాటిల్ తిరుగుబాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో జయంత్ పాటిల్ పార్టీ మారనున్నారని పుకార్లు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జయంత్ పాటిల్‌తో పాటు రాజేశ్ తోపే పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. రాష్ట్రంలో సంగాలీ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్టు, తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జయంత్ పాటిల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఎన్డీయేలో కలుస్తారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పుణె జిల్లాల్లోని నాలుగు స్థానాలకు సంబంధించిన నాయకులతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే అమిత్ షాతో జయంత్ పాటిల్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఊహాగానాలను జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్ షాతో కలవలేదని స్పష్టం చేశారు. శరద్ పవార్‌కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. #WATCH | Maharashtra NCP (Sharad Pawar faction) President Jayant Patil on reports that he met Union Home Minister Amit Shah yesterday; says, "Who told you this? (that I met Amit Shah) You should ask those who are saying all this. Last evening I was there at the residence of… pic.twitter.com/CkJHnEFZIR — ANI (@ANI) August 6, 2023 ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
ఈ గౌరవం జాతికి అంకితం.. ప్రధాని మోదీ
పూణే: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. స్వాతంత్ర సమరయోధుడు బాలాగంగాధర్ తిలక్ పేరిట నెలకొల్పిన లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పుణేలో అందుకున్నారాయన. ఈ సందర్భంగా ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర సమరంలో తిలక్ పాత్ర మరువలేనిది. ఎనలేని సేవలు అందించారాయన. అలాంటి వ్యక్తి గురించి కొంతే మాట్లాడి తక్కువ చేయలేం. తిలక్‌కు.. అలాగే అన్నా బాహూ సాథేలకు నా గౌరవ వందనాలు అంటూ పేర్కొన్నాయాన. VIDEO | PM Modi receives Lokmanya Tilak National Award in Pune, on the 103rd death anniversary of freedom fighter Bal Gangadhar Tilak. (Source: Third Party) pic.twitter.com/2KKNgqrCJW — Press Trust of India (@PTI_News) August 1, 2023 బాలాగంగాధర్ తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా.. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ఇవాళ పుణేలో నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. నాయకత్వ పటిమ, పౌరుల్లో దేశభక్తి పెంపొందించినందుకుగానూ ఈ ఏడాది ఆ పురస్కారాన్ని మోదీకి ‘ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్’’ అందించింది. మెమెంటోతో పాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అందించారు. ఆ ప్రైజ్‌మనీని నమామీ గంగ ప్రాజెక్టుకు ఇచ్చేశారాయన. ప్రతీ ఏడాది ఆగష్టు 1వ తేదీన ఆయన వర్థంతి సందర్భంగా ఈ అవార్డును బహుకరిస్తారు. 1983 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. దేశ పురోగతి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది. ఇప్పటివరకు 40 మంది ఈ పురస్కారం అందుకోగా.. ప్రధాని మోదీ 41వ వ్యక్తి. పవార్‌తో ఆప్యాయ పలకరింపు ఇదిలా ఉంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరుకాగా.. ప్రధానిమోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇండియా కూటమి తరపున విపక్షాలు.. ముఖ్యంగా థాక్రే శివసేన వర్గం ఆయన్ని కార్యక్రమానికి హాజరు కాకూడదని కోరిన సంగతి తెలిసిందే. #WATCH | Maharashtra | Prime Minister Narendra Modi holds a candid conversation with NCP chief Sharad Pawar in Pune. (Source: Maharashtra Dy CM Devendra Fadnavis YouTube) pic.twitter.com/JPowJFgVWT — ANI (@ANI) August 1, 2023 పలు ప్రాజెక్టులు సైతం.. మెట్రో రైళ్ల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో శంకుస్థాపన చేశారు. -
ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు . పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే. అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..