Elections 2017
-
ఆ మంత్రికి హైకోర్టు షాక్..
అహ్మదాబాద్ : గుజరాత్లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్రసింగ్ చుడాసమా ఎన్నిక చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఎన్నిక చట్టవిరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు పేర్కొంది. 429 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్రమంగా రద్దు చేశారని ఆయన ప్రత్యర్ధి అశ్విన్ రాథోడ్ వాదనను సమర్ధిస్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ పరేష్ ఉపాథ్యాయ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదాబాద్ జిల్లాలోని డోక్లా నియోజకవర్గం నుంచి భూపేందర్ సింగ్ చుడాసమ 327 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి : శ్రామిక్ రైలులో ఆగిన గుండె -
‘సిద్దరామయ్యా నీకు దమ్ముందా..’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర విమర్శలు చేశారు. 'కర్ణాటకలో సిద్దరామయ్య అంటే అవినీతి అలాగే అవినీతి అంటే సిద్దరామయ్య అని అర్థం' అని వ్యాఖ్యానించారు. మైసూరులో గురువారం జరిగిన పార్టీ పరివర్తన యాత్ర కార్యక్రమంలో మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించాలని కోరారు. 'నేను కర్ణాటక ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఆపాలి' అని అమిత్‌షా సిద్దరామయ్యకు సవాల్ విసిరారు. పరివర్తన ర్యాలీ అంటే యువత జీవితాల్లో మార్పు అని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడం అని చెప్పారు. పలు వ్యూహాలతో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, కానీ ప్రజలు మాత్రం మారాలని కోరారు. 'బీజేపీ నిర్వహిస్తున్న పరివర్తన యాత్ర చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న ర్యాలీని అడ్డుకోవాలని చూస్తోంది.. బంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా వ్యతిరేకించింది. కానీ ఆ బిల్లు ముస్లింలకు న్యాయం చేసేందుకు తీసుకొచ్చాం. ముస్లిం సోదర, సోదరీమణులకు న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము' అని అమిత్ షా అన్నారు. -
హిమాచల్ సీఎం అభ్యర్థిపై బీజేపీకి తలనొప్పి!
సాక్షి, షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం విషయమై అక్కడికి వెళ్లిన పరిశీలన బృందానికి పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ ఇతర నేతలు ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ కమిటీ సమావేశ భవనం బయటే బీజేపీ సభ్యులు ప్రేమ్ కుమార్ దుమాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. 'ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని చేయాలే తప్ప ఎలాంటి లాబీయింగ్ జరగొద్దు' అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ దుమాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొత్తగా ఎవరిని పెట్టాలనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క, కేంద్రమంద్రి జేపీ నడ్డా పేరును సీఎంగా ప్రకటిస్తారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. -
గుజరాత్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
-
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
-
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
పణజి: ‘నితిన్ గడ్కరీ(బీజేపీ) ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. మన సీనియర్ నాయకులు ఏం చేస్తున్నార’ని ప్రశిస్తూ గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినాయత్వం చేతగానితనాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, మరింత మంది పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘గోవాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చాలా అవమానకర రీతిలో కాంగ్రెస్ హేండిల్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నార’ని విశ్వజిత్ రాణె వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎవరు పార్టీని వీడరని, రాణెతో మాట్లాడతామని చెప్పారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చక్రం తిప్పడంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ కంటే బీజేపీ తక్కువ సీట్లు గెల్చుకున్నప్పటికీ గడ్కరీ రంగంలోకి పరిస్థితిని తమ పార్టీకి అనుకూలంగా మార్చేశారు. పరీకర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే మద్దతు ఇస్తామన్న ఇతరుల కోరికను మన్నించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది. దీనికి అనుగుణంగా పరీకర్ తో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయించి మళ్లీ గోవాకు తీసుకురావడంతో బీజేపీపై ఇతరులకు విశ్వాసం కలిగింది. అతిపెద్ద పార్టీగా ఏర్పడిన హస్తం పార్టీ మీనమేషాలు లెక్కించడంతో కమలం పార్టీ పదుదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోయింది. ఫలితంగా కాంగ్రెస్ లో అసంతృప్తి రాజుకుంది. -
‘సీఎం పదవికి ముందు రాజీనామా చేయండి’
ఇంపాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్‌ను రాజీనామా చేయాల్సింది ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మాహెప్తుల్లా కోరారు. రాజీనామా చేస్తే తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన డిమాండ్‌ను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మొత్తం 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు, మిగితా సీట్లు ఇతర పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే 31 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ ప్రకారం కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. ఇతర పార్టీలవారు బీజేపీకి మద్దతిస్తామని చెబుతున్నారు. అయితే, గత రాత్రి ఇబోబీతోపాటు డిప్యూటీ సీఎం గైఖాంగమ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్ హావోకిప్ గవర్నర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని ఇబోబీకి గవర్నర్ హెజ్మా సూచించారు. అయితే, తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయని, 28 సీట్లు గెలుచుకున్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇబోబీ కోరారు. దాంతోపాటు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఖాళీ పేపర్లో రాసుకొని వచ్చి చూపించారు. అయితే, కాగితంపై రాసివ్వడం కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడిని, గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చూపించాలని కోరారు. బీజేపీ 21మంది గెలిచిన అభ్యర్థులతోపాటు ఎన్పీపీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుచ ఎల్జేపీ, టీఎంసీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి తమకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇబోబిని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. -
ఉక్కుమహిళ ఎందుకు ఓడారంటే?
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల రాజకీయ ప్రవేశం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం చేపట్టిన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు మణిపూర్ ప్రజలు పట్టం కడతారా? దీక్షకు వచ్చిన భారీ స్పందన మాదిరే ఆమె పార్టీ ‘పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’కి నీరాజనం పడతారా? అన్న ఆసక్తి రేగింది. దీక్ష విరమించినందుకు కొందరు షర్మిలను విమర్శించినా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమెకు ప్రజల నుంచి విస్తృతంగానే మద్దతు లభించింది. అయితే ఈ మద్దతు ఓట్ల రూపంలోకి మారలేకపోయింది. రాజకీయ దిగ్గజం, సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేసి ఓడిన ఆమె దయనీయంగా 90 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితి మారింది..: సాయుధ బలగాల చట్టవిరుద్ధ హత్యలు, అత్యాచారాలు జాతీయ మీడియాకు ముఖ్యమైన అంశాలే అయినా.. రాష్ట్ర ప్రజలకు మాత్రం బంద్‌లు, రోడ్ల దిగ్బంధనాలు, అభివృద్ధి లేమి పెద్ద సమస్యలుగా మారిపోయాయి. అఫ్సా రద్దు ఉద్యమానికంటే దైనందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం పెరిగింది. అఫ్సా రద్దు కోసం 16 ఏళ్ల కిందట షర్మిల ఉద్యమించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మొబైల్ ఫోన్లు, ఇతర భద్రతా సదుపాయాల రాకతో బలగాలు గతంలో మాదిరి నిరంకుశంగా వ్యవహరించే పరిస్థితి లేదు. అలాగే, ఎన్నికలు జాతి ప్రయోజనాల ప్రాతిపదికగా జరగడం, శక్తిమంతుడైన ఇబోబీ సింగ్‌తో తలపడడం కూడా షర్మిల ఓటమికి కారణమైంది. మెజారిటీ వర్గమైన మీటీలు.. తమ వ్యతిరేకులైన నాగాలను ఎదుర్కొనే నాయకుడు ఇబోబీనే అని తలపోశారు. థౌబాల్ నియోజకవర్గంతో(ఇబోబీపై)పాటు, తన స్వస్థలమైన ఖురాయ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల తర్వాత ఖురాయ్ నుంచి పోటీ విరమించారు. ఆమె ఓటమికి ఇదీ ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. షర్మిల మహిళ కావడం కూడా ఆమె పరాజయానికి కారణమైందని విశ్లేషకుల అంచనా. మొత్తం 268 మంది అభ్యర్థుల్లో ఆమె సహా పదిమంది మాత్రమే మహిళలు ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా పురుషుల వ్యవహారమనే భావన మణిపూర్‌లో ఉంది. షర్మిల రాజకీయాల్లోకి రాకుండా మానవ హక్కుల ఉద్యమాలకే పరిమితం కావాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
తర్వాతి గురి దక్షిణాదిపైనే ..!
బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లో అఖండ విజయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకునే దిశగా బీజేపీ అడుగులు వేయనుందా? ముఖ్యంగా కేరళ, తమిళనాడులో దూకుడు పెంచనుందా? అన్న ప్రశ్నలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే బీజేపీ మరి కొంత సమయం వేచిచూడక తప్పదనేది కొందరి వాదన కాగా...కర్నాటకలో విజయం సాధించాకే కేరళ, తమిళనాడుపై దృష్టి పెట్టవచ్చనేది మరికొందరి విశ్లేషణ. కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్నాక.. కేరళలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకునే లక్ష్యంతో కమలం ముందుకు సాగుతుందని, తమిళనాడులో అన్నాడీఎంకే చీలిక వర్గంతో కలిసి నడుస్తుందనేది వారి అభిప్రాయం. కేరళలో చాలా వేగంగా పావులు కదపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరి లెక్క ప్రకారం తమిళనాడు, కేరళలో పార్టీ విస్తరణకు బీజేపీ మరో మూడు నాలుగేళ్లు వేచిచూడాల్సిందే.. తమిళనాడులో విస్తరణకు ప్రాంతీయ పార్టీలు అడ్డంకిగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఓట్ల శాతం పరంగా చూస్తే కేరళలో ఇప్పటికే మంచి స్థానంలో ఉందని చెబుతున్నారు. -
403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ముస్లింల బలం అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రంలో 19 శాతం ముస్లింలు ఉండగా... తాజా శాసనసభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన 24 మంది మాత్రమే విజయం సాధించారు. 2012 ఎన్నికల్లో 69 మంది ముస్లిం సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ నినాదం ‘సబ్కా సాత్... సబ్కా వికాస్’ఊదరగొట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)... మొత్తం 403 స్థానాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికల బరిలోకి దింపకపోవడం గమనార్హం. ముస్లింలు అధికంగా ఉండే రోహిల్‌ఖండ్, తెరాయ్తో పాటు యాదవులు, దళితులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న తూర్పు ప్రాంతం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు పెద్ద ఓటు బ్యాంకులు. ఈ సామాజిక లెక్కల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌తో జతకట్టింది ముస్లింల ఓటు బ్యాంకు కోసమే. ఈ ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య చీలిపోతే... అంతిమంగా అది బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నది వారి అంచనా. మరోవైపు యూపీలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఆందోళనకరంగా తగ్గుతోంది. ఈసారి 479 మంది మహిళా అభ్యర్థులు పోటీపడితే... 40 మంది మాత్రమే గెలిచారు. వీరి గెలుపు శాతం పది కంటే తక్కువ. ఇక... 403 మంది నూతన శాసనసభ్యుల్లో డిగ్రీ ఆపై చదువులు చదివినవారు 290 మంది. 143 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 403 కొత్త ఎమ్మెల్యేల్లో 143 మంది నేర చరితులు, 322 మంది కోటీశ్వరులు ఉన్నారు. నేర చరితుల్లో హత్య తదితర తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నట్టు ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో బీజేపీ తరుఫున కోలొనెల్గంజ్ స్థానం నుంచి నెగ్గిన అజయ్ప్రతాప్సింగ్ టాప్‌లో ఉన్నారు. ఈయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.49 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,455 మంది కోటీశ్వరులు పోటీపడ్డారు. -
అమిత్ షాకు సీఎంల ఎంపిక బాధ్యత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతోపాటు మణిపూర్లకు ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు అప్పగిస్తూ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యంమంత్రిగా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను ఇప్పటికే పార్టీ ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల పరిశీలకులు ఎమ్మెల్యేలను సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు చెబుతారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లను పరిశీలకులుగా బీజేపీ నియమించింది. ఉత్తరాఖండ్‌కు పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ కార్యదర్శి సరోజ్ పాండేలు నియమితులయ్యారు. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్దేలు మణిపూర్ బాధ్యతలు చూసుకుంటారు. -
ప్రజాస్వామ్యానికి పాతరేసిన బీజేపీ
విమర్శించిన కాంగ్రెస్ పార్టీ పణజి/న్యూఢిల్లీ: గోవా, మణిపూర్లలో ప్రజాస్వామ్యానికి బీజేపీ పాతరేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని, ప్రజలు తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాంతారామ్ నాయక్ పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే బీజేపీ అనైతిక పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు. పారికర్‌ను ‘విలన్’గా ఆయన అభివర్ణించారు. మేం శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుండగానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయని శాంతారామ్ పేర్కొన్నారు. తగినంత సంఖ్యాబలం లేనందున గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ శనివారం చెప్పారని కూడా శాంతారామ్ గుర్తుచేశారు. మణిపూర్‌లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కిడ్నాప్ ఇంఫాల్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బలగాల సాయంతో మణిపూర్‌కి చెందిన ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సీఐఎస్ఎఫ్ బలగాలను, విమానాశ్రయ అధికారులను దుర్వినియోగం చేసి అసబుద్దీన్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బీజేపీ కిడ్నాప్ చేసిందని, ఆ ఎమ్మెల్యేని కలకత్తాకు తరలించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని, సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం పట్టపగలు ఖూనీ చేస్తోందని సుర్జేవాలా విమర్శించారు. -
16న అమరీందర్ ప్రమాణం
చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్య క్షుడు కెప్టెన్ అమరీందర్‌సింగ్ ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరీందర్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ బద్నోర్‌ను కలిశారు. ఈనెల 14న రాహుల్‌గాంధీతో భేటీ అవుతానని చెప్పిన ఆయన కేబినెట్ కూర్పుపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
రాష్ట్రపతి ఎన్నికలో స్వేచ్ఛ
►బీజేపీకి కలిసొచ్చిన యూపీ, ఉత్తరాఖండ్ గెలుపు ►వచ్చే ఏడాదికి రాజ్యసభలో 100కి చేరనున్న ఎన్డీఏ బలం న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం బీజేపికి అనేక తీపికబుర్లు అందించింది. ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థి ఎంపికలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశంతో పాటు, వచ్చే ఏడాది రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా నిలిచేందుకు ఆస్కారమిచ్చింది. తాము నిర్ణయించిన అభ్యర్థి రాష్ట్రపతి భవన్లో ఉంటే.. కొన్ని కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడం సులభమవుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది జులై 25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందాలంటే మొత్తం 10,98,822 ఎలక్టోరల్ ఓట్లలో 50.1 శాతం సాధించాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థి గెలుపునకు 75 వేల ఓట్లు తక్కుపడ్డాయి. తాజా ఫలితాలతో ఆ లోటు 20 వేలకు తగ్గిందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. అన్నాడీఎంకేకు చెందిన 134 మంది ఎమ్మెల్యేలు, బీజేడీ 117 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో స్వేచ్ఛగా తన అభ్యర్థిని ఎనుకునే అవకాశం బీజేపీకి కలుగుతుంది. రేసులో మహాజన్, రాంనాయక్, సుష్మ, జాదవ్‌లు! బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, యూపీ గవర్నర్ రామ్ నాయక్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ దళిత నేత నరేంద్ర జాదవ్, కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ల పేరు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో అకాలీ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, బీజేపీ నేత వెంకయ్య నాయుడులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదికి రాజ్యసభలోను బీజేపీదే హవా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో 243 మంది సభ్యులున్న రాజ్యసభలో వచ్చే ఏడాది కల్లా బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవనుంది. రాజ్యసభలో ఎన్డీఏ ఎంపీల సంఖ్య 100కు పెరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 56 మంది సభ్యులుండగా, కాంగ్రెస్‌కు 59 మంది ఉన్నారు. అదే విధంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు సులభంగా ఆమోదం పొందేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయి. జీఎస్టీ ఆమోదానికి లోక్‌సభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం ఉన్నా... రాజ్యసభలో మాత్రం విపక్షాలదే పైచేయి. తాజా విజయంతో రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య తగ్గవచ్చనేది బీజేపీ భావన. యూపీ సభ్యుడి ఎలక్టోరల్ విలువ ఎక్కువ పార్లమెంట్‌లోని ఉభయసభల సభ్యులు, 29 రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికల్లో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటేసే అవకాశముంటుంది. లోక్‌సభ స్పీకర్ కూడా ఓటేయవచ్చు. అయితే లోక్‌సభలోని ఆంగ్లో ఇండియన్ సభ్యులు, రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటేసే అధికారం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉండగా... ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో గెలుపుతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని మరింత సులభతరం చేసింది. యూపీలో ప్రతి అసెంబ్లీ సభ్యుడికున్న ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 208... మహారాష్ట్రలో ఆ విలువ 175 మాత్రమే. అందుకే యూపీ 324 సీట్లలో ఎన్డీఏ విజయంతో రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టును మరింత పెంచింది. ఇక 543 మంది సభ్యులున్న లోక్‌సభలో బీజేపీకి 281 మంది ఎంపీలుండగా... రాజ్యసభలో 56 మంది సభ్యులున్నారు. -
కమల వికాసం..
అన్ని వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ ఆధిక్యత న్యూఢిల్లీ: ముస్లిం మైనారిటీలు.. దళితులు.. గ్రామీణ ప్రాంతాలు.. పట్టణ ప్రాంతాలు.. ఇలా ఎక్కడ చూసినా కమల వికాసమే. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లో 2014 సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమయ్యాయి. దీంతో దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన యూపీలో బీజేపీ రికార్డు స్థాయి విజయాన్ని కైవసం చేసుకుంది. దాదాపు అన్ని వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ కమలనాథులు స్పష్టమైన ఆధిక్యత చూపించారు. సంప్రదాయంగా తమకు పట్టున్న నియోజకవర్గాల్లోనే కాదు.. బీజేపీ గెలుపు అసాధ్యం అనుకునే స్థానాల్లోనూ కాషాయం రెపరెపలాడింది. గ్రామీణం(97/142) గ్రామీణ జనాభా 93 శాతానికిపైగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో 142 ఉన్నాయి. 2012లో వీటిల్లో 9 సీట్లు మాత్రమే గెలిచిన కమలనాథులు.. ఇప్పుడు ఆ సంఖ్యను 97కు పెంచుకోగలిగారు. కాంగ్రెస్–ఎస్పీ బలం 105 నుంచి 28కి.. బీఎస్పీ సీట్లు 26 నుంచి మూడుకు తగ్గిపోయాయి. ముస్లిం మైనారిటీలు(93/133) ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల సంఖ్య 22 శాతం కంటే ఎక్కువగా ఉన్న అసెంబ్లీ్ల నియోజకవర్గాలు 133 ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీ 93 చోట్ల విజయం సాధించింది. 2012లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువ. ఇదే సమయంలో కాంగ్రెస్–సమాజ్‌వాదీ కూటమి 2012లో 75 చోట్ల విజయం సాధిస్తే.. ఈసారి 30 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ బలం 25 నుంచి ఐదుకు పడిపోయింది. దళితులు(107/140) యూపీలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితుల సంఖ్య 23 శాతం కంటే ఎక్కువ ఉంది. వీటిల్లో 107 స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది. 2012లో బీజేపీకి ఈ స్థానాల్లో దక్కింది ఎనిమిది సీట్లే. ఇదే సమయంలో కాంగ్రెస్–సమాజ్‌వాదీ కూటమి బలం 94 నుంచి 22 సీట్లకు పడిపోయింది. బీఎస్పీ 34 నుంచి ఐదు స్థానాలకే పరిమితమైంది. -
యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు
⇒ అత్యధికం 1,50,685 ⇒ అత్యల్పం 171 లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వివిధ పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరు లక్షన్నరకు పైగా మెజారిటీ సాధిస్తే.. మరొకరు కేవలం 171 ఓట్ల తేడాతో గట్టెక్కారు. యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన వారిని పరిశీలిస్తే.. ఐదుగురు అభ్యర్థులు లక్ష ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో గెలవగా, ఎనిమిది మంది కేవలం వెయ్యి లోపు మెజారిటీతో గట్టెక్కారు. అలాంటివారి వివరాలు... ► సాహిబాబాద్ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ అత్యధికంగా 1,50,685 ఓట్ల మెజారిటీ సాధిం చారు. కాంగ్రెస్ అభ్యర్థి అమర్ పాల్‌ను సునీల్ ఓడించారు. ► రథ్ నియోజకవర్గంలో మనీషా అనురాగి 1,04,643 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గాయదీన్ అనురాగిపై గెలిచారు. ► నోయిడా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొడుకు పంకజ్ సింగ్ 1,04,016 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎస్పీ అభ్యర్థి సునీల్ చౌదరిని ఆయన ఓడించారు. ► దోమరియాగంజ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ కేవలం 171 ఓట్ల మెజారిటీ సాధించారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యదా ఖటూన్‌ను ఆయన ఓడించారు. ► మీరాపూర్‌లో బీజేపీ అభ్యర్థి అవతార్ సింగ్ భదానా 193 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి లియాకత్ అలీపై గెలుపొందారు. ► మంత్ నియోజకవర్గంలో బీఎస్పీకి చెందిన శ్యామ్ సుందర్ శర్మ ఆర్ఎల్డీ అభ్యర్థి యోగేశ్ చౌదరిని 432 ఓట్ల తేడాతో ఓడించారు. -
నెహ్రూకు పోటీగా.. మోదీ?
►జనాదరణలో జవహర్‌లాల్‌తో పోటీపడుతున్న నరేంద్రుడు ►ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో ఇందిరను వెనక్కి నెట్టిన ప్రధాని న్యూఢిల్లీ: జనాదరణ విషయంలో జవహర్లాల్ నెహ్రూ ఎంత ఉన్నతుడో ఒక సందర్భంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వివరించారు. అప్పట్లో ముంబైలో కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఆ సమయంలో పటేల్ అమెరికా జర్నలిస్ట్ విన్సెంట్ షీన్‌తో మాట్లాడుతూ.. ‘‘వారు వచ్చింది నాకోసం కాదు. జవహర్ కోసం’’ అని చెప్పారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. భారీ మెజార్టీతో ఉత్తరప్రదేశ్ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం నేతలలో నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారని చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ఉక్కుమహిళగా పేరొందిన ఇందిరాగాంధీతో మోదీని పోల్చుతున్నారు. అమిత్ షా మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుత ప్రధాని తొలి ప్రధానినే అధిగమించేశారని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. భారత చరిత్రను అధ్యయనం చేస్తున్నవారికి, విశ్లేషకులకు అమిత్ షా వ్యాఖ్యలు ఒక అతిశయోక్తిగానే కనిపిస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ తర్వాత స్థానం నెహ్రూదే. తిరుగులేని ఆయన శక్తిని తరచూ ‘‘నెహ్రూ స్వామ్యం’’గా అభివర్ణించేవారు. స్వాతంత్య్రం తదనంతర దేశ నిర్మాణంలో ఆయన పాత్ర గణనీయమైనది. అయితే అమిత్ షా వ్యాఖ్యలు ఏమంత తీసిపారేయతగ్గవి కూడా కాదు. ఇప్పటి మోదీ జనాదరణ అప్పటి నెహ్రూ జనాదరణతో పోటీ పడుతోంది. 2014లో చిన్న విజయం.. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీల కంటే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ మాత్రం చాలా తక్కువగా ఉంది. 1977లో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్‌ను కూడా బీజేపీ చేరుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ దిగ్గజ నేతలతో పోటీలో మోదీ వెనకబడ్డారని చెప్పలేం. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తన అధికారంతో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ (దాదాపు 40 శాతం) చూస్తే.. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్‌ను అధిగమించేసింది. అంతేగాక 1962లో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ సాధించిన ఓట్ షేర్ (36 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో సాధించిన ఈ విజయం సాధారణమైనదికాదు. మోదీ గుజరాత్‌ను వదిలి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడం మొదలు దీని వెనకాల ఎంతో కృషి ఉందని చెప్పవచ్చు. అలాగే ఒక్కో రాష్ట్రంలోనూ బీజేపీ పాగా వేస్తూ వస్తోంది. 1967లో కాంగ్రెస్ 10 రాష్ట్రాలను పాలిస్తే.. 2017లో బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తోంది. దీనిని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మోదీ స్వామ్యం.. అప్పట్లో నెహ్రూకు ఉన్న జనాదరణతో పార్టీలో ఉన్న రైటిస్టులు కూడా కిమ్మనకుండా ఉండేవారు. దీంతో నెహ్రూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. పథకాలు, చట్టాలు రూపకల్పన చేశారు. పురాతన హిందు సంప్రదాయాలు స్థానంలో ప్రగతిశీల చట్టాలను తీసుకొచ్చారు. లౌకిక విధానాన్ని అవలంభించి దేశ విభజన తర్వాత భారత్‌లోని ముస్లింలకు భద్రత కల్పించే చర్యలు తీసుకున్నారు. అయితే నరేంద్ర మోదీది రైటిస్ట్ భావజాలం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయడంతో ఆ ప్రభావం ఆయనపై ఉంటుంది. నెహ్రూ స్థాయిలో ఆయన అధికారాలు ఉంటే దేశాన్ని తన భావజాలంవైపు తీసుకెళ్లవచ్చు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ పోటీకి దింపలేదు. ఈ విజయం పూర్తిగా హిందు ఓట్ బ్యాంకుపై ఆధారం. తానో హిందు శక్తిగానే కనిపించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. -
ఉత్తరప్రదేశ్‌లో గెలుపు కోసం బీజేపీ వ్యూహం
⇒ 900 సభలు ⇒ 10000 వాట్సాప్ గ్రూపులు ⇒ 67000 కార్యకర్తలు లక్నో: యూపీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కాషాయ దళం.. గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. రెండేళ్ల కిందటే కసరత్తు ప్రారంభించిన బీజేపీ.. సభలు, రోడ్‌షోలు, సమ్మేళనాలు, సోషల్ మీడియా.. వంటి అనేక మార్గాల్లో ప్రజలను చేరుకుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ శ్రేణులను పటిష్టం చేసి, 67 వేలమంది క్రియాశీల కార్యకర్తలను రంగంలోకి దింపింది. ఒక్కో నియోజ కవర్గంలో 2 నుంచి 4 సభల చొప్పున మొత్తం 900 సభలు ఏర్పాటు చేసింది. మోదీ 23 సభ ల్లో ప్రసంగించారు. వ్యూహాన్ని పార్టీ అమిత్ షా, రాష్ట్ర ఇన్చార్జి ఓ మాధుర్, రాష్ట్ర కమిటీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రూపొందించి అమలు చేశారు. దళితులు, ఓబీసీల ఓట్ల కోసం.. గత ఏప్రిల్‌లో మాజీ ఎంపీ, బౌద్ధ సన్యాసి ధమ్మ విరియోతో బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. మాయావతి ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి దళితులు, ఓబీసీల జనాభా అధికంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోవిరియో ‘ధమ్మ చేతన యాత్ర’ చేపట్టి మోదీకి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. ఓబీసీలను ఆకట్టుకోవడానికి పార్టీ 200 పిచ్డా వర్గ్ సమ్మేళనాలను, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేందుకు 18 స్వాభిమాన్ సమ్మేళనాలను, వ్యాపారుల మద్దతు కోసం 14 వ్యాపారీ సమ్మేళనాలను నిర్వహించింది. కాలేజీల్లో 1,650 సభల ద్వారా యువతకు చేరువైంది. యాత్రలు.. మహిళా సమ్మేళనాలు.. రోడ్‌షోల రూపంలో డిసెంబర్ 24 నుంచి మొత్తం 403 నియోజకవర్గాల్లో పరివర్తన్ యాత్రలు చేపట్టింది. 50 లక్షల మంది ప్రజలకు మోదీ విజయాలను వివరించింది. మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి అన్ని జిల్లాల్లో 77 ‘మహిళా సమ్మేళన్’లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ 34 జిల్లాల్లో ‘కమల్ మేళా’ ఎగ్జిబిషన్లను, రైతులకు చేరువకావడానికి 3,564 ‘అలావో సభ’ (చలిమంట భేటీలు) ఏర్పాటు చేశారు. 75 జిల్లాల్లో జరిగిన ‘మాటీ తిలక్ ప్రతిజ్ఞా ర్యాలీ’ల్లో తాము రైతుల ఆకాంక్షలను నెరవేరుస్తామని బీజేపీ ఎంపీలు తిలకధారణ చేశారు. సోషల్ మీడియా.. సోషల్ మీడియాలో ప్రచారం కోసం కమల నాథులు రాష్ట్రస్థాయిలో 25 మంది ఐటీ నిపుణు లతో ఒక టీమ్‌ను, ప్రాంతీయ స్థాయిలో 21 మందితో 6 టీమ్‌లను ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో మరో 90 జిల్లా యూనిట్లనూ రంగంలోకి దింపారు. ఈ టీమ్‌లన్నీ కలిపి మొత్తం 10,344 వాట్సాప్ గ్రూపులు, 4 ఫేస్బుక్ పేజీలను ఏర్పాటు చేసి, ఆడియో, వీడియో క్లిప్పులను చేరవేశాయి. ఇంకా ఏం చేశారంటే.. ► పార్టీ పరిశోధన బృందాలు ఒక్కో నియోజక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్నికల ప్రణాళిక రూపొందించాయి. ► 33 మంది ఎంపీలు 92 నియోజకవర్గాల్లో 263 సభల్లో ప్రసంగించారు. 1,025 శిక్షణా శిబిరాలు నిర్వహించి 88 వేలమంది కార్యకర్త లకు పార్టీ విధానాలను వివరించారు. ► ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి 75 వీడియో వ్యాన్లను రాష్ట్రమంతటా తిప్పారు. ‘బూత్ విజయ్ అభియాన్’ పేరుతో అభ్యర్థులకు ఓటేయాలని ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు పంచారు. ► రాష్ట్రంలోని మొత్తం 1,47,401 పోలింగ్ బూత్‌లలో 10 నుంచి 21 మందితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశాలను ఉద్దేశించి పార్టీ చీఫ్ అమిత్ షా ప్రసంగించారు. ‘ఆజీవన్ సహయోగ్ నిధి’ పేరుతో సభ్యుల నుంచి రూ.16.91 కోట్లను వసూలు చేసి పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. -
40 ఏళ్లలో ఇదే రికార్డు!
యూపీలో 312 స్థానాలతో బీజేపీ విజయం ⇒ 1977లో 352 స్థానాలు సాధించిన జనతా పార్టీ ⇒ ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల చరిత్రలో అతిచెత్త ప్రదర్శన న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో గత 40 ఏళ్లలో ఎవరూ సాధించని రికార్డుని బీజేపీ సొంతం చేసుకుంది. మొత్తం 403 స్థానాల కుగాను 312 సీట్లను (77.4%) తన ఖాతాలో వేసుకుని ప్రభంజనం సృష్టించిం ది. 1977 తరువాయి ఒక పార్టీ ఇన్ని స్థానాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అలాగే 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతాన్ని 25 నుంచి 39.7 శాతానికి పెంచుకుంది. ఎమర్జెన్సీ అనంతరం 1977 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ మొత్తం 425 అసెంబ్లీ స్థానాలకు 352(82.8 శాతం) సీట్లతో కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. 47.8 శాతం ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక 1980లో ప్రస్తుతం బీజేపీ సాధించిన స్థాయిలో కాంగ్రెస్ మంచి ఫలితాలు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో మొత్తం 425 స్థానాలకు గాను కాంగ్రెస్ 309(72.7 శాతం) స్థానాలు గెలుపొంది.. 39.6 శాతం ఓట్లు గెలుచుకుంది. కాగా ఆ ఎన్నికల్లో 10.8 శాతం ఓట్లతో బీజేపీ 11 స్థానాలకే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అలాంటి ప్రదర్శననే కనపరుస్తూ.. 6.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. మరోవైపు 2014 పార్లమెంట్ ఎన్నికల నాటి అద్భుత ప్రదర్శనను బీజేపీ మళ్లీ కనపర్చింది. ఆ ఎన్నికల్లో 42.7 శాతం ఓట్లతో మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను 73(90 శాతం కంటే అధికం) సీట్లు దక్కించుకుంది. 1993 అనంతరం... ప్రస్తుత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు 20 శాతానికి మించి ఓటు బ్యాంకు గెలుచుకున్నా సీట్లు సాధించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ 21.8, బీఎస్పీ 22.2 శాతం ఓట్లు సాధించగా, 2012లో ఎస్పీ 29, బీఎస్పీ 26 శాతం ఓట్లను గెలుపొందాయి. 1993 నుంచి ఎస్పీ, బీఎస్పీల ఓట్ల శాతం క్రమంగా పెరగ్గా... జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం తగ్గింది. 2017కి వచ్చేసరికల్లా పార్టీ చరిత్రలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చగా, 1977 అనంతరం అతి తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ తీవ్రంగా నిరాశపర్చింది. ఆవిర్భా వం అనంతరం ఎస్పీ, బీఎస్పీల అతిచెత్త ప్రదర్శన కూడా ఇదే కావడం గమనార్హం. బీజేపీ ఓట్ల సునామీ: నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల శాతం -
గోవా, మణిపూర్ బీజేపీవే..
గోవా ముఖ్యమంత్రిగా పరీకర్ ►బలనిరూపణకు 15 రోజుల గడువు ►మణిపూర్‌లోనూ చక్రం తిప్పిన కమలనాథులు ►బీజేపికి ఎన్పీపీ, ఎల్జేపీ మద్దతు ►గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కలిసిన బీజేపీ మద్దతుదారులు ►రెండు రాష్ట్రాలలో కమలం కన్నా హస్తానికే ఎక్కువ సీట్లు పణజి/ఇంపాల్: మినీరణంగా పేరొందిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కమల నాథుల విజయపరంపరం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో స్పష్టమైన విజయాన్ని నమోదుచేసిన బీజేపీ.. తక్కువ సీట్లకే పరిమితమైన గోవా, మణిపూర్‌లలోనూ పీఠాలను కైవసం చేసుకోగలిగింది. దీంతో పంజాబ్ ఒక్కదానికే కాంగ్రెస్ పరిమితం కావలసి వచ్చింది. గోవా, మణిపూర్లలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ చిన్నపార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతును బీజేపీ సంపాదించగలిగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసమే.. తీర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ తెలిపారు. అస్థిరత కారణంగా రాష్ట్రం అభివృద్ధికి దూరం కావడం తమకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పరీకర్ నాయకత్వం వహిస్తున్నారన్న కారణంతోనే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని ఎంజీపీ నాయకులు సుదిన్ ధావలికర్ తెలిపారు. పరీకర్‌ను చూసి తాము బీజేపీకి మద్దతు లేఖ ఇచ్చామని, ఆయన లేకుంటే మద్దతిచ్చేవారం కాదని సుదిన్ పేర్కొన్నారు. అంతకుముందు పణజిలో సమావేశమైన బీజేపీ శాసనసభ్యులు పారికర్‌ను శాసనసభాపక్షనేతగా ఎంపిక చేయాల్సిందిగా కోరుతూ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపించారు. తమ ప్రతిపాదనను అధిష్టానం అంగీకరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలసినట్లు బీజేపీ గోవా అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ చెప్పారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన బీజేపీ గోవాలో బీజేపీ 32.5శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కన్నా ఇది 4.1శాతం ఎక్కువ అయినా అది ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. 28.4శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా 32.5శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 13 సీట్లను మాత్రమే గెలుచుకోగలగడం విశేషం. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఎంజీపీ 3, జీఎఫ్‌పీ 3, ఇండిపెండెంట్లు 3 స్థానాలలో గెలవగా ఎన్సీపీ ఒక స్థానంలో విజయం సాధించింది. గోవాలో 1.2 శాతం మంది నోటాను ఉపయోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో నోటా ఇంతశాతం మరెక్కడా నమోదు కాలేదు. పరీకర్ నాయకత్వంలో గోవాలో బీజేపీ ప్రభుత్వం గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. ముఖ్యమంత్రి గా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. గవర్నర్ మృదులా సిన్హాను ఆదివారం సాయంత్రం కలసిన పరీకర్ తన నాయకత్వంలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశమి వ్వాల్సిందిగా కోరారు. పరీకర్‌ను ముఖ్యమంత్రిగా నియమించిన గవర్నర్.. మెజారిటీ నిరూపించుకునేందుకు 15 రోజుల గడువిచ్చారు. అంతకుముందు, తమకు ఎన్సీపీ, స్థానిక పార్టీలు, కొందరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నట్లు ఆయన గవర్నర్‌కు తెలిపారు. ముగ్గురేసి ఎమ్మెల్యేలున్న గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న ఎన్‌సిపి, ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్న లేఖలను పరీకర్ గవర్నర్‌కు సమర్పించారు. 13 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ బలం వీరి మద్దతుతో 22కు చేరుకుంది. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 21 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి అవసరమైన నలుగురు ఎమ్మెల్యేల మద్దతును సాధించలేకపోయింది. మణిపూర్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలు కాంగ్రెస్ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. బీజేపీకి మద్దతిస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఆదివారం ప్రకటించాయి. ఎన్పీపీ, ఎల్జేపీలతో అవగాహన కుదిరిందని.. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్ వ్యవహారాల బాధ్యుడు) రామ్ మాధవ్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలూ కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వీటి చేరికతో బీజేపీ బలం 26కు చేరుకుంది. కాగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) కూడా మణిపూర్‌లో బీజేపీకే మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. దీనికి తోడు ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా నిలిచారు. కాగా, బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రి గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిశారు. ‘60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు’ అని గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్‌పై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీకి మద్దతిచ్చారని హిమంత తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం లేదని ఈ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. -
‘అఖిలేశ్‌తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్‌వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్‌వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్‌తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు. -
మణిపూర్‌లో పెద్దపార్టీ హస్తం
⇒ అధికారానికి 3 స్థానాల దూరంలో కాంగ్రెస్.. బీజేపీ 21 సీట్లు ⇒ కీలకంగా మారిన చిన్న పార్టీలు ⇒ షర్మిలకు దారుణ పరాభవం ఇంఫాల్: తుది నిమిషం వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మణిపూర్‌లో ఓట్ల లెక్కింపు హంగ్‌కు దారితీసింది. 60 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ఫిగర్ అయిన 31ని ఏ పార్టీ చేరలేదు. అధికార కాంగ్రెస్ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో ఒక్కసీటూ దక్కించుకోని బీజేపీ ఈసారి 21 సీట్లు సాధించి మెరుగైన ప్రదర్శన చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ కన్నా ముందంజలో నిలిచింది. 59 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 35.1 శాతం, 60 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 36.3 శాతం ఓట్లు సొంతం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకున్న ఎన్సీపీ ఈసారి ఖాతా తెరవలేదు. శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీల చేతులు మారింది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్థి కీలకం కానున్నారు. ది నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) , ది నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి. మరో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు సంప్రదింపులు, చర్చలు ప్రారంభించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. సారీ.. ఇరోమ్!! మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల గుర్తుందా..? ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ధీర! పోలీసులు కొన్ని వందలసార్లు దీక్ష భగ్నం చేయడానికి యత్నించినా.. ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగించారు. ఏళ్ల తరబడి దీక్ష చేసినా ఫలితం లేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్‌జేఏ పార్టీ స్థాపించారు. ఈ ఎన్నికల్లో సీఎం ఇబోబిసింగ్‌పైనే పోటీచేశారు. ...అయితే ఆమెకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 90!! దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు! ఎస్పీ నేత, యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతి గుర్తున్నాడా? మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు ఇతడు. ఇదే ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 50 వేల పైచిలుకు!! ...ప్రజాస్వామ్యంలో ఇదో విషాదం కాకపోతే మరేంటి?? -
గోవాలో హంగ్ అసెంబ్లీ
⇒ అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ⇒ సీఎంతోపాటు ఆరుగురు మంత్రుల ఓటమి ⇒ రాజీనామా సమర్పించిన పర్సేకర్ పణజీ: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అతి చిన్నదైన గోవాలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సంపాదించలేకపోయింది. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 40 కాగా అధికారం చేపట్టడానికి కావలసిన కనీస స్థానాలు 21. 17 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు 4 సీట్ల దూరంలో ఆగిపోగా, బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)లు చెరో మూడు స్థానాల్లో గెలిచాయి. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయ బావుటా ఎగురవేశారు. ఎన్సీపీకి ఒక స్థానం లభించింది. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి లక్ష్మీకాంత్ పర్సేకర్ మండ్రెమ్ స్థానం నుంచి పోటీ చేసి ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. పర్సేకర్ శనివారం గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు. 9 నుంచి 17కు పెరిగిన కాంగ్రెస్ బలం.. ప్రస్తుత అసెంబ్లీలో కేవలం 9 మంది సభ్యులను కలిగిన కాంగ్రెస్..ఈ ఎన్నికల్లో తన బలాన్ని దాదాపు రెట్టింపు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన దిగంబర్ కామత్, ప్రతాప్‌సిన్హ్ రాణే, రవి నాయక్, ల్యుజిన్హో ఫెలేరియోలు ఈ ఎన్నికల్లో భారీ విజయాలను అందుకున్నారు. హంగ్ రావడంతో చిన్న పార్టీలైన జీఎఫ్‌పీ, ఎంజీపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించనున్నాయి. స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ మద్దతుతోనే గెలవడం లాభించే అంశం. మేం కూడా రేసులో ఉన్నాం: పరీకర్ కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ మాట్లాడుతూ ‘గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రేసులో ఉంది’అని అన్నారు. రాజీనామా సమర్పించిన అనంతరం లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ ‘గోవా ప్రజలు తప్పు చేశారని నేను భావిస్తున్నా. వచ్చే ఐదేళ్లపాటు వారు పశ్చాత్తాప పడతారు’అని వ్యాఖ్యానించారు. -
ఫలితం తేలేది నేడే!
-
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర!
-
ఫలితం తేలేది నేడే!
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ♦ 12 గంటల కల్లా స్పష్టత! ♦ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ♦ రాజ్యసభ లెక్కలపైనే కమలదళం దృష్టి ⇒ ఉత్తరప్రదేశ్ : మొత్తం సీట్లు 403 .. మేజిక్ ఫిగర్ 202 ⇒ పంజాబ్: మొత్తం సీట్లు..117 .. మేజిక్ ఫిగర్ 59 ⇒ ఉత్తరాఖండ్: మొత్తం సీట్లు 70 .. మేజిక్ ఫిగర్ 36 ⇒ మణిపూర్: మొత్తం సీట్లు 60 .. మేజిక్ ఫిగర్ 31 ⇒ గోవా: మొత్తం సీట్లు 40 .. మేజిక్ ఫిగర్ 21 నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలే మిగిలింది. కీలకమైన యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. రాజ్యసభలో మెజారిటీ దక్కాలంటే కమలం పార్టీకి విజయం అత్యంత అవసరం. అటు ఎస్పీ–కాంగ్రెస్ కూటమి అస్తిత్వం నిలుపుకునేందుకు ఈ ఎన్నికలు క్రియాశీలకం. న్యూఢిల్లీ/లక్నో: యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవనుండగా.. 11 గంటలకల్లా ఫలితాలపై ఓ అంచనా, 12 కల్లా స్పష్టత వచ్చే వీలుంది. పోలింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో సాయుధ బలగాలు పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటుచేశాయి. ప్రధాన మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి రెఫరెండంగా భావిస్తున్న ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కువసీట్లున్న యూపీలో బీజేపీ అధిక సీట్లు గెలిచే వీలున్నప్పటికీ.. హంగ్ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని నిపుణులంటున్నారు. పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటుగా ఉత్తరాఖండ్, మణిపూర్లలో అధికారాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అటు ఢిల్లీ బయట తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌పై విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ.. మహాకూటమే గెలిచిన విషయాన్ని లాలూ గుర్తుచేశారు. రాజ్యసభపై బీజేపీ గురి లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్న బీజేపీ.. రాజ్యసభలో బలం లేక తన నిర్ణయాలకు ఆమోదం పొందలేకపోతోంది. అందుకే యూపీలో విజయం కోసం శతవిధాలా శ్రమించింది. యూపీ నుంచి గరిష్టంగా 31 మంది రాజ్యసభ ఎంపీలుంటారు. ప్రస్తుతం బీజేపీకి యూపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కలసి మొత్తంగా 12 మంది ఎగువసభకు వెళ్లగలరు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌కు 59 మంది (యూపీఏ–65) సభ్యులుండగా.. బీజేపీకి 56 మంది (ఎన్డీఏ–74) ఎంపీలున్నారు. మిగిలిన విపక్షాలన్నింటికీ కలసి 106 మంది ఎంపీలున్నారు. యూపీలో బీజేపీ గెలిస్తే 2018లో ఈ లెక్కల్లో భారీ మార్పులు జరగనున్నాయి. యూపీ అసెంబ్లీ ఫలితాలు ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రాంతీయపార్టీల బలాబలాలను నిర్దేశించే అవకాశం ఉంది. ఈ విషయం అఖిలేశ్‌కు అర్థమైందని.. అందుకే బీజేపీని అడ్డుకునేందుకు బీఎస్పీతోనూ దోస్తీకి సిద్ధమనే సంకేతాలిచ్చారని రాజకీయ నిపుణులంటున్నారు. ఎన్నికలకు నెల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్‌కు.. ఇప్పుడు గెలిస్తేనే పార్టీపై పట్టు దక్కుతుంది. లేదంటే నష్టపోక తప్పదు. గోవా సీఎంగా పరీకర్? 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 19–22 సీట్లు రావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. సీఎం ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. ప్రచారాన్ని కేంద్రమంత్రి పరీకర్ ముందుండి నడపటంతో ఆయనే మళ్లీ సీఎంగా వస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. -
అనూహ్యం.. బీఎస్పీకి అఖిలేశ్ పిలుపునిచ్చాడా?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? బిహార్‌లో మాదిరిగా జాతీయ పార్టీని వెళ్లగొట్టేందుకు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక్కటైనట్లుగానే ఇప్పుడు యూపీలో కూడా ఎడమొహంపెడమొహంలాగా ఉండే పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయా? లౌకికవాదం పేరుతో బీజేపీకి యూపీ నుంచి తిరుగుటపా కట్టే చర్యకు దిగబోతున్నారా? అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తాజాగా చేసిన ప్రకటన అదే ఆలోచనకు ఊపిరిపోస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని, అధికారం చేపట్టనుందని తేలడంతో అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాషాయవర్ణ పార్టీ(బీజేపీ)ని యూపీలోకి అడుగుపెట్టనివ్వకుండా చేయాలంటే లౌకిక వాద శక్తులు(ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ, తదితరపార్టీలు) ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూటమిగా అయ్యాయి. ఇక మిగిలిన మరో పెద్ద లౌకికవాద పార్టీ బీఎస్పీ. అఖిలేశ్ తాజా ప్రకటన ప్రకారం బీఎస్పీని కూడా తమతో పెట్టుకునేందుకు, చేయికలిపేందుకు కలిసి రావాలని ఆహ్వానం పంపించినట్లేనని రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ‘సమాజంలోని అన్ని రకాల వ్యవస్థలకు, వ్యక్తులకు రక్షణ కల్పించాలంటే కాషాయ పార్టీని ఎదుర్కోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య బద్ధ ప్రభుత్వాన్ని అందించేందుకు లౌకికవాద శక్తులంతా ఒక బాధ్యతగా భావించి ఏకం కావాలి’ అంటూ అఖిలేశ్ ఓ మీడియాకు చెప్పారు. అయితే, లౌకిక అనే పదం తప్ప ఆయన నేరుగా బీఎస్పీ కూడా రావాలని ప్రత్యక్షంగా మాత్రం చెప్పలేదు. అయితే, ఒక వేళ రాష్ట్రంలో హంగ్ పరిస్థితి తలెత్తితే తాము కానీ, ఇతరులు కానీ రాష్ట్రపతి పాలనకు అంగీకరించబోమని, అలా జరిగితే యూపీపై కేంద్రం పెత్తనం పెరిగిపోతుందని అన్నారు. అయితే, మరోసారి తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మకం ఉందని, ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేనని అఖిలేశ్ చెప్పారు. అయితే, లౌకిక శక్తులు మాత్రం కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని హింట్ మాత్రం ఇచ్చారు. అయితే, 1995 జూన్‌లో జరిగిన సంఘటనను బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఎప్పటికీ మర్చిపోదని, ఆ సమయంలో సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా వేధించారని, ఆ ఆగ్రహం ఆమెను ఇప్పటికీ వెంటాడుతునే ఉందని అంటున్నారు. అయితే, 1993లో మాత్రం మాత్రం బీఎస్పీ, ఎస్పీలు పొత్తు పెట్టుకుని సమర్థంగా బీజేపీని అడ్డుకున్నాయి. అయితే, 1995నాటికే ఆ బంధం బద్దలైంది. ఎన్నికల ఫలితాలను బట్టి ఎలాంటి పరిణామాలైన జరిగే అవకాశం ఉందని మాత్రం అఖిలేశ్ పరోక్షంగా చెప్పారు. -
పాంచ్ పటాకా పేలింది...!
న్యూఢిల్లీ : కౌంటింగ్‌కు ముందే పాంచ్ పటాకా పేలింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈలోపే ఎన్నికలకు సంబంధించి ప్రజా అభిప్రాయ ఫలితాలు (ఎగ్జిట్ పోల్స్) గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పంజాబ్ కాంగ్రెస్, యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ, రెండో స్థానంలో ఎస్పీ కూటమి, మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ... ఉత్తరాఖండ్, మణిపూర్‌లో కమలం వికసించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. గోవా విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ : అతి పెద్ద రాష్ట్రం, దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి ఉత్తర ప్రదేశ్‌లో కమలం రెపరెపలాడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రం యావత్ దేశంలోనే అత్యంత కీలకం. అక్కడ గెలిస్తే ఢిల్లీకి దారి దగ్గరవుతుందనేది నానుడి. అందుకే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ తో యూపీలో బీజేపీ వనవాసం ముగుస్తున్నట్లే కనిపిస్తోంది. పంజాబ్ : ఇంతకాలం పంజాబ్‌లో రెండు పార్టీల పాలనే. అయితే కాంగ్రెస్, లేకుంటే అకాలీదళ్ కూటమి. తాజాగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో బలమైన పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. దీంతో 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ముక్కోణపు పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. అలాగే బీజేపీ ఇక్కడ చతికిలపడిందనే చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ : చిన్నరాష్ట్రం అయిన ఉత్తారాఖండ్ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కేరళ తరహా వ్యవహారమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలను మార్చడం ఆ రాష్ట్ర ప్రజల ఆనవాయితీ. ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించి... కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి...కమలం చేతపట్టారు. ఇక మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉత్తరాఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటన సందర్భంగా పలు నేషనల్ ఛానల్స్ బీజేపీ గెలుపుకే మొగ్గుచూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. గోవా: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా ఎన్నికలు కూడా అందరినీ ఆకర్షించాయి. రక్షణమంత్రి మనోహర్ పారీకర్ సొంత రాష్ట్రం కావడంతో గోవాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ జరగ్గా... ఈసారి 4 స్తంభాలాటగా తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎంజీపీ కూటమి కూడా సెగలు పొగలు పుట్టించింది. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మణిపూర్ : ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు పండగే. ప్రచార ఆర్భాటాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో... ఒక విధమైన సందడి కనిపిస్తుంది. కాని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సైలెంట్‌గా ఎన్నికలు జరిగిపోయాయి. నాగాల ఆర్థిక దిగ్బంధం ప్రభావం ఉన్నా.. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి మణిపూర్ ఎన్నికల్లో సరికొత్త కెరటం రాజకీయ రంగప్రవేశం చేసింది. ఆమె ఉక్కుమహిళ ఇరోం షర్మిల. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన షర్మిల... పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. కాగా మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి. -
మా కుటుంబంలో బాధ వర్ణించలేను: అఖిలేశ్
న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి నరేంద్రమోదీని ఎన్నికల ప్రచారంలో ముందు పెట్టకపోయుంటే బీజేపీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఆయన తన సతీమణి డింపుల్ యాదవ్‌తో కలిసి కాలిదాస్ మార్గ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సేద తీరుతూ కనిపించారు. ఈ సందర్భంగా సరదాగా మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అభివృద్ధిని చూసే ఓటు వేశారని, ఆర్భాటం చూసి కాదని అన్నారు. వారణాసి మొత్తం కూడా ఎస్పీ చేతుల్లోకి వచ్చేదని, ఆ విషయం ముందు గ్రహించే చివరకు మోదీని అక్కడ ప్రచారంలోకి బీజేపీ దింపిందని లేదంటే అక్కడ ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయి ఉండేదని చెప్పారు. వారణాసి కోసం ప్రత్యేకంగా బీజేపీ కేంద్రమంత్రులంతా ప్రచారం నిర్వహించారని, తమ పార్టీకి అలాంటి పరిస్థితి లేదని అన్నారు. తాము చేసిన మంచి పని ముందు బీజేపీ వారణాసిలో గల్లంతయ్యేదని మోదీని ముందుపెట్టి ఆ పరిస్థితిని కొంత మార్చుకోగలిగారని చెప్పారు. ‘తొలుత వారం రోజులపాటు బాగా కష్టంగా అనిపించింది. కానీ, తర్వాత పరిస్థితి మెరుగవుతూ వచ్చింది’ అని డింపుల్ ప్రచారం గురించి చెప్పారు. గత ఏడాది కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా తట్టుకోగలిగారు ఆ పరిస్థితిని కాస్త చెబుతారా అని డింపుల్‌ను ప్రశ్నించగా అఖిలేశ్ మధ్యలో జోక్యం చేసుకొని ఒక కథ చెప్పారు. ‘ఒకసారి రామకృష్ణ పరమహంసను ఒకసారి వివేకానందుడు దేవుడిని చూపించమని అడిగారు. దాంతో ఆయన గట్టిగా గిల్లారు. ఏమైందని ప్రశ్నించగా నొప్పిగా ఉందని బదులిచ్చారు. నొప్పి చూపించాలని రామకృష్ణ పరమహంస కోరగా వివేకానందుడు ఆశ్చర్యపోయారు. అలాగే మా ఇంట్లో పరిస్థితి ఎంత బాధకరమైందో మాటల్లో చెప్పలేను’ అని చెప్పారు. ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. -
యూపీ ఆఖరి దశలో ఓటేసిన ప్రముఖులు
-
నేడే యూపీ, మణిపూర్లలో తుదిదశ పోలింగ్
-
నేడే యూపీ, మణిపూర్లలో తుదిదశ పోలింగ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగే ఉత్తరప్రదేశ్ ఏడో దశ, మణిపూర్ రెండో దశ పోలింగ్‌లతో శాసనసభ ఎన్నికలు ముగుస్తాయి. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 4న మొదలైంది. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 15న ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల ఫలితాలు మార్చి 11న వెల్లడవుతాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లోని మొత్తం 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఆలాపూర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో పోలింగ్ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ చివరిదైన రెండో దశ పోలింగ్ బుధవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 22 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరుగుతాయి. సైనిక బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుదీర్ఘకాలం నిరాహార దీక్ష సాగించిన ఉద్యమకారిణి ఇరోం చాను షర్మిల తౌబాల్ నుంచి పోటీ చేస్తున్నారు. -
ఆఖరి పోరు.. ఎవరిది జోరు?
వారణాసిపైనే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల యుద్ధం బుధవారంతో ముగుస్తోంది. చివరిదైన ఏడో దశలో పోలింగ్ 40 సీట్లకు జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగాల్సి ఉన్న ఆలాపూర్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో అక్కడ గురువారం ఎన్నిక ఉంటుంది. ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లా ఈ చిట్టచివరి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఉండటంతో ఈ దశకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది. మొత్తం ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా వాటిలోని వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్ భోజ్‌పురీ ప్రాంతంలోనివే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 సీట్లలో ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లు సాధించాయి. ఈ ఏడింటిలో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్ పూర్(9). కులం ప్రభావం ఎక్కువే! అన్ని విధాలా వెనుకబడిన ఆరు జిల్లాల్లో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో వీరే యాదవ పరివార్ నాయకత్వంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డారు. అలాగే బ్రాహ్మణులు, ఠాకూర్‌లతోపాటు యాదవేతర బీసీల మద్దతు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్నందించింది. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండటంతో నక్సలైట్లకు కూడా మూడు జిల్లాల్లో జనాదరణ ఉంది. అప్నాదళ్‌తో పొత్తు లాభిస్తుందా? కుర్మీల(పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్(సోనేలాల్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్. అనుప్రియ అప్నాదళ్ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. ఆమె తల్లి కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేసింది. భారతీయ సమాజ్ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ పోలింగ్ జిల్లాల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
‘భయం లేదు.. పవన్‌పై పది ఓట్ల తేడాతో గెలుస్తా’
అమరావతి: ఎన్నికలంటే తనకు అస్సలు భయం లేదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని, తాను పోటీ చేస్తే.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మీద కూడా 10 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వచ్చే ఐడియాలు మరెవరికీ రావని, అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని కొనియాడారు. చంద్రబాబు ముందు మోదీ కూడా సరిపోడంటూ ఆకాశానికెత్తేశాడు. బీజేపీతో ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా అవసరాలు కూడా లేవని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందో లేదో తనకు తెలియదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవికంటే ఎమ్మెల్యేగా ఉండటమే చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. -
మోదీ వృద్ధుడయ్యారు..
► యూపీలో యువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ► ఎన్నికల ప్రచారంలో రాహుల్ జౌన్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీకి వయసు మీదపడిందని, అలసిపోయారంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్రా్తలు సంధించారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమి యువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. సోమవారం జౌన్ పూర్లో ఆయన మాట్లాడుతూ... తమ నేతృత్వంలోని యువ ప్రభుత్వం యూపీని ప్రపంచానికి కర్మాగారం మారుస్తుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రధమ మహిళ మిషెల్ ఒబామా కూడా తన వంట గదిలో ‘మేడిన్ జౌన్ పూర్’ పాత్రల్ని కలిగి ఉండే రోజు వస్తుందన్నారు. ‘మేడిన్ ఉత్తరప్రదేశ్’ ఉత్పత్తులు ప్రపంచమంతా లభ్యమవుతాయని పేర్కొన్నారు. ‘మోదీకి తప్పనిసరిగా సాయం చేయాలని నేను అఖిలేశ్‌కి చెప్పాను. ఆయనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కోరా. అఖిలేశ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మోదీ విశ్రాంతి పొందుతారు’ అని రాహుల్ చెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీ వరుస రోడ్‌షోలపై స్పందిస్తూ... మోదీ సినిమాలో పదే పదే రీటేక్‌లు తీసుకుంటున్నారని చమత్కరించారు. నాలుగు రోజుల్లో నాలుగు రీటేక్‌లు తీసుకున్నారని, అయితే ఆశించిన ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు. వారణాసి ఫలితంపై మోదీ భయపడుతున్నారని, అందుకే గత మూడు రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. గంగా మాత పుత్రుడిగా మోదీ అభివర్ణించుకోవడాన్ని తప్పుపడుతూ... భారత్‌లో గంగా నదికి ఒక్కరే కొడుకు ఉన్నారా? అన్న ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. -
రేపే తుది దశ పోలింగ్
యూపీలో 40, మణిపూర్‌లో 22 స్థానాలకు లక్నో/ఇంఫాల్: హోరెత్తించిన మైకులు... ప్రత్యర్థులే లక్ష్యంగా ఎక్కుపెట్టిన మాటల తూటాలు... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో రెండు నెలలకు పైగా వాడి వేడిగా సాగిన ఉత్తరప్రదేశ్, మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. యూపీలో ఏడు దశల్లో, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో బుధవారం జరగనున్న ఆఖరి దశ పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉత్తర యూపీలోని మొత్తం 40 స్థానాలకు, మణిపూర్‌లోని 22 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వారణాసిలో కాశీ విశ్వనాథుడు, కాళభైరవ తదితర ఆలయాల సందర్శన, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించిన మోదీ... ఎన్నో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ వెటరన్ నాయకులు వారణాసికి క్యూకట్టారు. ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు మోదీకి దీటుగా ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం సాగించారు. ఈనెల 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
నేనూ పేదరికం అనుభవించా..
అందుకే పేదల జీవితం బాగుపడాలని కోరుకుంటున్నా.. ► కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ యూపీని నాశనం చేశాయి ► ఆ పార్టీలను ఎన్నికల్లో ఓడించండి: ప్రధాని మోదీ వారణాసి: ‘‘నేను కూడా ఒకప్పుడు పేదరికం అనుభవించా. అందుకే దేశంలో ఉన్న లక్షలాది మంది పేదల జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నా..’’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం రోహనియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుషీపూర్ గ్రామంలో నిర్వహించిన ఆఖరి ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్–ఎస్పీ, బీఎస్పీలు ఉత్తరప్రదేశ్‌ను నాశనం చేశాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని యూపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని, పోలీసు విభాగంలో ప్రొఫెషనలిజం తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా దేశంలోని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 45 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో మోదీ బీజేపీ మిత్ర పక్షాలైన ఆప్నాదళ్, భారతీయ సమాజ్ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీ పూర్తి మెజారిటీ వచ్చినా.. మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రైతుల అభివృద్ధిపైనే ఆధారపడిందని, వారి కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దేశం ముందుకెళుతుందని చెప్పారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 2019 నాటికి దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. అఖిలేశ్ యాదవ్ సర్కార్‌పై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో 50–60 శాతం మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి తీసుకొస్తే..యూపీలో మాత్రం 14 శాతం మందే ఈ పథకం కిందికి వచ్చారని, ఇది యూపీ సర్కారు వైఫల్యమేనని మండిపడ్డారు. పోటీపరీక్షల విషయంలో బంధుప్రీతి, అవినీతిల్లో ఎస్పీ ప్రభుత్వం కూరుకుపోయిందని, కిందిస్థాయి ఉద్యోగాలకు ఇంటర్యూలు లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోంటే.. అఖిలేశ్ సర్కారు మాత్రం దానికి అడ్డుపడుతోందని ఆరోపించారు. లాల్‌బహదూర్ శాస్త్రికి నివాళి అంతకుముందు ప్రధాని మోదీ గర్హా్వ ఘాట్ ఆశ్రమాన్ని సందర్శించారు. స్వామి శరణానంద నేతృత్వంలోని ఈ ఆశ్రమానికి ఎక్కువగా యాదవ సామాజికవర్గం వారే వస్తుంటారు. అలాగే సంప్రదాయంగా ఈ ఆశ్రమం సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ఉంటుందనే ప్రచారం ఉంది. అనంతరం రామ్‌ఘాట్‌కు చేరుకున్న మోదీ అక్కడ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అలాగే శాస్త్రి చిన్నతనంలో నివసించిన ఇంట్లో కాసేపు గడిపారు. కాగా, యూపీ ఎన్నికల తుది దశ ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. -
ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం పొడిగింపు
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని ఒకరోజు పాటు పొడిగిస్తూ భారతీయ ఎలక్షన్ కమిషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్‌పోల్స్‌ను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ మధ్య వెల్లడించకూడదని ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అలాపూర్, కర్ణప్రయాగ్‌లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు హఠాన్మరణం చెందడంతో మార్చి 9 వరకూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదని పేర్కొంది. -
పరారీలోనే మంత్రి, అనుచరుడి లొంగుబాటు
లక్నో: పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి ప్రధాన అనుచరుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రపాల్ సోమవారం లక్నో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గ్యాంగ్ రేప్ తో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కేసులో గాయత్రీ ప్రజాపతి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రజాపతి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. కాగా అజ్ఞాతంలో ఉన్న మంత్రితోపాటు మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఆయన పాస్‌పోర్టుపై నాలుగు వారాలపాటు నిషేధం విధించి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చింది. కాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించడంతో బాధిత మహిళ సుప్రీంను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల దాడి గుప్పిస్తోంది. -
‘మోదీ వృద్ధుడవుతున్నారు.. యువనేత కావాలి’
లక్నో: మరో ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా సోమవారం ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. బీజేపీ, ఎస్పీ కూటమి, బీఎస్పీలో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ తన స్వరాన్ని పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీపై గట్టి విసుర్లు విసిరారు. మోదీ పెద్దవారిగా(వృద్ధుడిగా) మారి పోతున్నారని, అందుకే ఉత్తరప్రదేశ్‌కు యువనేతనే పాలకుడిగా తెచ్చుకుందామంటూ వ్యాఖ్యానించారు. తానే మొత్తం చేశానని మోదీ చెప్పుకుంటారని, ఇస్రో రాకెట్ పంపించినా దానికి కూడా తానే కారణమని చెప్పుకుంటారని మండిపడ్డారు. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ను మాత్రం ఇక్కడే ఉంచి ఆయనే వెళ్లి ఒబామాతో మాట్లాడి వస్తారని విమర్శించారు. మోదీ చెప్పిన అచ్చేదిన్ అనే సినిమా అట్టర్ ప్లాఫ్ అయిందని, ఇక చూద్దామని అనుకున్న ఈ చిత్రం కనిపించబోదని ఎద్దేవా చేశారు. విజయ్ మాల్యాకు మోదీ రూ.1200కోట్లు ఇచ్చారని, ఆయన వాటితో విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉటంకిస్తూ ప్రజల సొమ్ము మొత్తాన్ని మోదీ లాక్కున్నారని, ఆ మొత్తాన్ని కూడా కేవలం 50మంది కుబేరులకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో మోదీకి, ఆయన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని, తమకే పూర్తి స్థాయి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. అంతకుముందు, అమిత్ షా మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది రూ.కోట్లు పంపించినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఖర్చు చేయడం లేదని, పైగా కొన్నింటిని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి యువకుడికి కులాలు, మతాలు అనే తారతమ్యం చూడకుండా ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మాత్రం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచిపరిపాలన అందించగలదని అన్నారు. -
వారణాసి వార్
► గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ ► కీలకంగా మారిన 20 శాతం ముస్లింల ఓట్లు వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వారణాసిలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో పాటు ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ–కాంగ్రెస్‌లు ఏకమవడం, పట్టున్న నేతలకు మిగతా పార్టీలు సీట్లివ్వగా... అభ్యర్థుల ఎంపికలో తడబడడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ప్రచారంలో హోరెత్తించిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వారణాసిలో బహిరంగ ర్యాలీల్లో ప్రసంగించడంతో పాటు పలు రోడ్‌షోలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతల్ని వారణాసిలో ప్రచారం కోసం మోహరించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ మూడింటిని గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు సిట్టింగ్‌ల్లో ఇద్దరు అభ్యర్థుల్ని మార్చింది.వారణాసి సౌత్ స్థానం నుంచి ఏడు సార్లు విజేతగా ఉన్న శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరీ స్థానంలో నీలకంఠ తివారీకి అవకాశమిచ్చింది. ఇక వారణాసి కంటోన్మెంట్ నుంచి జోత్సానా శ్రీవాత్సవకు బదులు ఆమె కుమారుడు సౌరభ్ శ్రీవాత్సవ పోటీ చేయనున్నారు. ఈ మార్పులు పార్టీలో కొందరు నేతలకు రుచించలేదు. కాగా వారణాసి నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర జైశ్వాల్‌కే అవకాశమిచ్చింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో జైశ్వాల్ గట్టెక్కారు. నియోజక వర్గంలోని ముస్లింలు ఈసారి ఎస్సీ – కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేయడం కలిసొచ్చే అంశం. రోహనియా నుంచి బీజేపీ, మిత్రపక్షం అప్నా దళ్ల మధ్య పొత్తు కుదరకపోవడంతో విడి విడిగా పోటీ చేయడం మరో ఎదురుదెబ్బ. ‘ఎందుకు ఓటేయాలి’ వారణాసి నియోజకవర్గంలో దాదాపు 20 శాతం ముస్లిం జనాభా ఉన్నారు. ఈసారి వారంతా బహిరంగంగా ఎస్పీ–కాంగ్రెస్ కూటమికే ఓటేయవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల్లో చీలిక బీజేపీ మూడు సీట్లు గెల్చేందుకు సాయపడింది. మోదీ రోడ్ షోల్లో ముస్లింలు కనిపించినా అవన్నీ ఓట్లుగా మారకపోవచ్చని అంచనా వేస్తున్నారు. యూపీలో బీజేపీ ఎంత మంది ముస్లింలకు సీట్లిచ్చింది? ఒక్కరికి కూడా ఇవ్వలేదు.. మేం ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి అంటూ ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. -
కేబినెట్లో రేపిస్టు మంత్రా?
అఖిలేశ్‌యాదవ్‌ను ప్రశ్నించిన యూపీ గవర్నర్ లక్నో: ‘అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్లో ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ ఆదివారం ఘాటు లేఖ రాశారు. ‘ఒక రేప్ కేసులో మంత్రి తప్పించుకు తిరుగుతుండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన పాస్‌పోర్టును నాలుగు వారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఇది తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఇంకా కేబినెట్లో కొనసాగించడం వల్ల రాజ్యాంగ నైతికత, గౌరవానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎంను వివరణ కోరారు. ‘లొంగిపోవాలని సీఎం స్వయంగా చెప్పినా, ప్రజాపతి ఆ పని చేయకుండా పరారీలో ఉన్నారు. విదేశాలకు తప్పించుకుని పోయే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే అరెస్ట్: షా తాము యూపీలో అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అతణ్ని నరకంలో ఉన్నా పట్టితెచ్చి జైలుకు పంపుతామన్నారు. ప్రజాపతి గత నెల 27న పోలింగ్ కేంద్రానికొచ్చి ఓటేశారని, అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. -
ప్రతి ముగ్గురిలో ఒకరిపై కేసు!
యూపీ ఎన్నికల బరిలో అభ్యర్థుల జాతకమిది ► 30% మంది కోటీశ్వరులు ► 41% అభ్యర్థులు పన్నెండో తరగతి లోపువారే! న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాతకాలు విస్తు గొలుపుతున్నాయి. బరిలో నిలిచిన ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. వాటిల్లో హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నవారూ అధికంగానే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇక డిగ్రీ కూడా పూర్తి కాని వారి శాతం 41. నిరక్షరాస్యులు 54 శాతం. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఏడు దశల ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 8న జరగనుంది. బరిలో ఉన్న మొత్తం 4,823 (మహిళలు 445) అభ్యర్థుల్లో 859 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో 704 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. 31 మంది అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేకపోవడంతో వారి వివరాలు ఇక్కడ ఇవ్వలేదని ఏడీఆర్ తెలిపింది. 38 మంది లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. 1457 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.1.91 కోట్లు. రూ.5 కోట్ల పైనున్నవారు 453 మంది. 13 మంది జీరో ఆస్తులు ప్రకటించడం గమనార్హం. 411 మంది రూ.లక్ష కంటే తక్కువని పేర్కొన్నారు. 1210 మంది పాన్ కార్డు, 2,790 మంది ఆదాయ పన్ను వివరాలు సమర్పించలేదు. -
యూపీకి ఏం చేశారు?
మోదీకి అఖిలేశ్ ప్రశ్న సోనేభద్ర: ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీకి గరిష్టసంఖ్యలో ఎంపీలను అందించారు. అయితే ఆ పార్టీ వారికేం చేసింది? వారు వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, వారి ప్రధానిని తెచ్చుకున్నారు. ప్రజలకు భ్రమలు కల్పించి ఉత్తిచేతులు చూపారు’ అని సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. ప్రధాని మోదీని విమర్శించారు. మొత్తం ప్రపంచమంతా తిరిగిన మోదీ.. యూపీ ప్రజల కోసం ఏం తెచ్చారని ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో నిలదీశారు. మూడేళ్లలో తను చేసిన పనులేవో చెప్పాలని తాను ప్రధానికి సవాల్ విసిరినా ఆయన ఇంతవరకూ అవేమిటో చెప్పలేదన్నారు. -
అఖిలేశ్, రాహుల్ అసమర్థులు
వాళ్లు కఠిన నిర్ణయాలు తీసుకోలేరన్న మోదీ ► వారణాసిలో బీజేపీ భారీ బహిరంగ సభ ► ఎస్పీ, బీఎస్పీలు ఒకే నాణేనికి రెండువైపులన్న ప్రధాని వారణాసి: యూపీ సీఎం అఖిలేశ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సున్నితంగా ఆలోచిస్తారని.. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీళ్లు అసమర్థులని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారణాసిలో జరిగిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ.. ‘అఖిలేశ్‌కు ఆయన తండ్రి ములాయం సింగ్ నుంచి అధికారం వచ్చింది. రాహుల్ గాంధీకి.. తాతలు తండ్రుల నుంచి వచ్చింది. ఇద్దరూ ఉచితంగా వచ్చిన అధికారాన్నే అనుభవిస్తున్నారు. వీళ్లు సున్నితంగా పెరిగారు. కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. నేను గెలిచింది కాశీ ప్రజల ఆశీర్వాదం తోనే. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని సమస్యలనుంచి బయటపడేస్తా. ఆ ధైర్యం నాకుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్పీ, బీఎస్పీలు రెండూ ఒకే నాణేనికి రెండు వైపులన్నారు. దేశం మొత్తం నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తే.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. యూపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తనదని ఓటర్లకు ప్రధాని భరోసా ఇచ్చారు. ఇటీవల దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతోందని.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేదని పరిశోధకులు చెప్పుకునే రోజు వస్తుందని మోదీ అన్నారు. వారణాసి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చిరు వ్యాపారులు అవినీతిపై చేస్తున్న దాడుల గురించి భయపడాల్సిన పనిలేదని.. రాజకీయ నాయకులు, అధికారులే దేశాన్ని దోచుకున్నారని ప్రధాన మంత్రి తెలిపారు. పథకాల అమల్లోనూ అఖిలేశ్ వివక్ష ఎస్పీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వివక్ష చూపిందని.. ‘కుఛ్ కా సాథ్, కుఛ్ కా వికాస్’ అన్నట్లుగానే పనిచేసిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా అఖిలేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించిందని ప్రధాని ఆరోపించారు. వారణాసికి తను ఇచ్చిన ప్రాజెక్టులను అఖిలేశ్ ఉద్దేశపూర్వకంగానే నెమ్మదింపజేశారన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద బ్లూప్రింట్ సిద్ధంగా ఉందన్న మోదీ.. ఈ ప్రాంతంలో రోడ్లు, రైల్వే లైన్లు, పరిశ్రమలు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మార్చి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని మోదీ కోరారు. ‘తూర్పు యూపీలో అభివృద్ధి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్రం నిధులను రాష్ట్రం ఖర్చుచేయలేకపోయింది. అందుకే వారు పెట్టిన ఖర్చు చెప్పాలని నేను అడుగుతున్నా. ప్రజానిధులను దోచుకున్నందుకు ప్రశ్నిస్తే.. నన్ను ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి విమర్శిస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. తనపై కానీ తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక కూడా లేదని మోదీ గుర్తుచేశారు. వారణాసి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి. అంతకుముందు, బెనారసీ సాంప్రదాయ దుస్తుల్లో మోదీ రెండోరోజు ఎన్నికల ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ జెండాలతో ప్రధానికి స్వాగతం పలికారు. పోలీస్ లైన్స్ హెలిప్యాడ్ నుంచి పాండేపూర్ చౌరాహ వరకు కిలోమీటర్ దూరం మోదీ ర్యాలీ వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టింది. మహిళలు రోడ్లకు ఇరువైపులా పూలబుట్టలతో నిలబడి మోదీపై పూలు చల్లారు. -
ఆరో దశలో 57% పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగిన ఆరో దశ పోలింగ్‌లో 57.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1.72 కోట్ల ఓటర్లున్న 49 స్థానాలకు 635 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 63 మంది మహిళలున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ అజాంగఢ్తో పాటు, బీజేపీ ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్, కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా డియోరియా వంటి కీలక నియోజకవర్గాలు ఈ దశ పోలింగ్‌లో ఉన్నాయి. బీఎస్పీ ముఖ్యనేత స్వామి ప్రసాద్ మౌర్య (పద్రౌనా), ఎస్పీ తరఫున మాజీ గవర్నర్ రాంనరేశ్‌యాదవ్ తనయుడు శ్యాంబహదూర్ యాదవ్ (ఫుల్పూర్ పవాయ్) ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖలు. మణిపూర్‌లో 84 శాతం పోలింగ్ ఇంఫాల్: మణిపుర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో గురువారం రికార్డు స్థాయిలో 84 శాతం పోలింగ్ నమోదైంది. 38 స్థానాల్లో 168 మంది పోటీపడ్డారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు చెప్పారు. -
నినాదాల ‘వార్’ణాసి
వారణాసి: ప్రధాన పార్టీల ఎన్నికల రోడ్‌షోలతో ఉత్తరప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికల కేంద్రమైన వారణాసి దద్దరిల్లింది. బీజేపీ, ఎస్పీ పార్టీల పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని చేసిన ‘ఖబరస్తాన్ , శ్మశాన్ ’ వ్యాఖ్యల నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలో భారీ స్పందన కనిపించింది. మోదీ కాశీలో పర్యటించాల్సి ఉన్నా.. పర్యటనను శనివారానికి మార్చారు. మరోవైపు, రెండోసారి యూపీలో అధికారాన్ని ఆశిస్తున్న సీఎం అఖిలేశ్ ప్రచారం కూడా శనివారం వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిలేశ్ భార్య, ఎంపీ డింపుల్ కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. వారణాసితోపాటు చుట్టుపక్కన జిల్లాల్లో 8న పోలింగ్ ఉంది. -
మీరు అభివృద్ధి చూపగలరా?
ప్రధాని మోదీకి యూపీ సీఎం అఖిలేశ్ సవాల్ ► తాను చేసిన అభివృద్ధిని చూపడానికి సిద్ధమని వెల్లడి బదోహి (ఉత్తరప్రదేశ్): దమ్ముంటే ఈ మూడేళ్లలో చేసిన 10 అభివృద్ధి పనులను ప్రకటించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రధాని నరేంద్రమోదీకి సవాల్ విసిరారు. యూపీలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రకటించడానికి సిద్ధమని పేర్కొన్నారు. ‘‘నా ప్రభుత్వంలో నేను చేసిన 10 పనులను చూపిస్తా. ఆయన (మోదీ) చేసిన 10 పనులను చూపగలరా? నా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నేను చేసిన పనులపై నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే, ఆయన తన మూడేళ్ల పాలనపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.’’ అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ శనివారం నిర్వహించిన ర్యాలీలో అఖిలేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయని, వారి వద్ద నుంచి డబ్బు తీసుకొని.. ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండని ఓటర్లకు సలహా ఇచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికీ అఖిలేశ్ చురకలంటించారు. ‘‘సజీవంగా ఉండగానే ఆమె స్మారకం తయారు చేశారు. ఇప్పుడు ఆమె భాషలో కూడా మార్పు వచ్చింది. ఆమె కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. ప్రజలు ఆ మాటలు విని నిద్రలోకి జారుకుంటున్నారు.’’ అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తన ఐదేళ్ల పాలనలో చేసిన పనులను అఖిలేశ్ ఉద్ఘాటించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే పేద మహిళలకు రూ.1000 పింఛను ఇస్తానని ప్రకటించారు. -
వారిది ‘ప్రజాపతి’ మంత్రం
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడుతున్నారు ♦ కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే వారు పనిచేస్తున్నారు ♦ అఖిలేశ్, ఎస్పీ–కాంగ్రెస్‌లపై ప్రధాని మోదీ విమర్శలు ♦ వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని జౌన్ పూర్(ఉత్తర్‌ప్రదేశ్): అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు గాయత్రి ప్రజాపతి విషయంలో యూపీ సీఎం అఖిలేశ్ నిద్రపోతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రజలను హింసించిన వారికి బుద్ది చెప్పే అవకాశం ఓటర్లకు వచ్చిందని, చిత్రహింసలకు గురిచేసిన వారికి పిండప్రదానం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాదిరి ‘అందరి కోసం.. అందరి అభివృద్ధికే..’ నినాదంలా కాకుండా.. ‘ప్రతిపక్షాలు కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే..’’అనే నినాదంతో పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మనం ఏదైనా మంచిపని చేసేటప్పుడు లేదా చేసినప్పుడు గాయత్రి మంత్రం పఠిస్తామని, కానీ, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి మాత్రం ‘గాయత్రి ప్రజాపతి’ మంత్రాన్ని పఠిస్తోందన్నారు. ప్రజాపతిపై ఓ కేసు నమోదైందని, కానీ సీఎం ఆయన కోసం ప్రచారం చేశారని, అప్పుడు ప్రజాపతి అక్కడికి వచ్చారని, కానీ ఇప్పుడు పోలీసులకు ప్రజాపతి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని చెపుతున్నారని విమర్శించారు. ఓ కూతురు న్యాయం కోసం ఎదురుచూస్తోందని, కానీ సీఎం నిందితునికి కొమ్ముకాస్తున్నారని ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందన్నారు. ఓ మంత్రి గేదెలు తప్పిపోతే మాత్రం.. మొత్తం ప్రభుత్వమే వాటి కోసం పరుగులు పెడుతుందని.. అదే న్యాయం కోసం ఓ కూతురు కన్నీరు పెట్టుకుంటున్నా.. ముఖ్యమంత్రి, పోలీసులు నిద్రపోతున్నారని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమేథీలో ఎస్పీ టికెట్‌పై పోటీచేస్తున్న ప్రజాపతి తరఫున ఇటీవల అఖిలేశ్ ప్రచారం నిర్వహించారు. అయితే ఓ మైనర్ బాలికపై అత్యాచారం.. ఆమె తల్లిపై సామూహిక అత్యాచారం అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రజాపతిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అఖిలేశ్ కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది) నినాదంపై ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలపై తాను కొన్ని ఎన్నికల సభల్లో ప్రశ్నించగానే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తొలగించారని, ఇదేనా మీరు చెప్పే పని మాట్లాడే పద్ధతి అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌కు విద్యుత్ ఇస్తామంటే ముఖ్యమంత్రి వద్దన్నారంటూ.. విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి నిజాలే చెపుతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ‘లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం చేస్తే.. నేను (మోదీ) ఎస్పీకి ఓటేస్తానని అఖిలేశ్‌జీ చెప్పారు. కానీ.. జౌన్ పూర్లోని ఖేతాసరాయ్–ఖుతాన్ రోడ్లపై కొత్త మిత్రుడు (రాహుల్)తో కలిసి సైకిల్‌పై ప్రయాణించండని అఖిలేశ్‌ను కోరుతున్నా. ఆ తర్వాత ఆయనే ఎస్పీకి ఓటేయరు’ అని ప్రధాని మోదీ విమర్శించారు. మోదీపై కేసు నమోదుచేయండి: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా వారణాసిలో రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలపై కేసులు నమోదుచేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే ప్రధాని మోదీ వారణాసిలో రోడ్‌షో నిర్వహించారని కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. వారణాసిలో మోదీ పూజలు.. వారణాసి: లోక్‌సభకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీవిశ్వనాథునికి, కాల భైరవునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వారణాసిలో ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభైన ఈ రోడ్‌షో వారణాసి వీధుల గుండా సాగింది. ఈ రోడ్‌షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూత్వ సిద్ధాంతకర్త మదనమోహన మాలవ్య విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ఆఖరి దశ ఎన్నికలు జరగనున్న వారణాసి ప్రాంతంలో మొత్తం 49 నియోజకవర్గాలు ఉన్నాయి. -
‘నేనెందుకు? నీ కొత్త దోస్తుతో సైకిల్‌పై వెళ్లు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. అఖిలేశ్ పరిపాలనలో ఏ తల్లి, ఏ కూతురు క్షేమంగా లేరని అన్నారు. గాయత్రి ప్రజాపతిలాంటి రేపిస్టులకు అఖిలేశ్ ఆశ్రయం ఇస్తుంటే మహిళలు భయపడిపోతున్నారని చెప్పారు. శనివారం జాన్‌పూర్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అఖిలేశ్‌పై మాటల యుద్ధం ప్రకటించిన మోదీ.. ‘అఖిలేశ్ నన్ను ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ రోడ్డు మీద ప్రయాణించమన్నాడు. అలా చేస్తే నా ఓటుకు కూడా అఖిలేశ్‌కే వేస్తానని చెప్పాడు. నేను అఖిలేశ్‌ను ఆయన కొత్త దోస్తు(రాహుల్)తో కలిసి సైకిల్‌పై జాన్పూర్ రోడ్లలో వెళ్లాలని కోరుతున్నాను. కచ్చితంగా ఆయన దోస్తు కూడా అఖిలేశ్‌కు ఓటెయ్యడు’ అని మోదీ తిప్పికొట్టారు. దేశంలో భక్తులంతా గాయత్రి మంత్రం జపిస్తుంటే, ఎస్పీ ఆ పార్టీ కూటమి మాత్రం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతి పేరును తలుస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక కూడా గాయత్రి ప్రజాపతి తన ఓటు వినియోగించుకునేందుకు వెళ్లాడని, పోలీసులు మాత్రం అతడికి కోసం చూస్తున్నారని, అఖిలేశ్ మాత్రం అతడికి అండదండలు ఇస్తున్నారని విమర్శించారు. మార్చి 11న ఫలితాలు వచ్చిన తర్వాత దేశ ప్రజలంతా యూపీలో బీజేపీ విజయంతో హోళీ సంబురాల్లో మార్చి 13న మునిగిపోతారని చెప్పారు. విద్యుత్ అందుబాటులో లేని గ్రామాలు యూపీలో చాలా ఉన్నాయని, దేశంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు 18,000 ఉంటే అందులో 1500 గ్రామాలు యూపీవేనని మోదీ చెప్పారు. -
‘మెజార్టీ ఖాయం.. విజయం మాదే’
న్యూఢిల్లీ: ‘యూపీ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. రాజకీయ నిపుణులు కూడా ఇదే అంగీకరిస్తున్నారు’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ‘ఈస్ట్రన్ ఉత్తరప్రదేశ్ మీదుగా బీజేపీ పవనాలు బలంగా రాష్ట్రమంతటా వీస్తున్నాయని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు వారణాసిలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీ జరిగిన తీరు, తరలివచ్చిన జనాలను చూస్తే బీజేపీకి ఎంత అనుకూలంగా ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ర్యాలీని ప్రారంభించిన మోదీ కాళ భైరవ ఆలయం వరకు కొనసాగించారు. -
సర్జికల్ దాడులపై రాజకీయాలా?
-
సర్జికల్ దాడులపై రాజకీయాలా?: మోదీ
వారణాసి: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ 40 ఏళ్లుగా ఉన్నా ఏ పార్టీ కూడా ఏం చేయలేకపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాము పార్లమెంటు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని, అధికారంలోకి రాగానే ఇచ్చేశామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్రమోదీ వారణాసిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అసలు జాతీయ భద్రతపరమైన అంశాలను ఎందుకు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ భద్రత కోసం తీసుకొనే అలాంటి నిర్ణయాలను ఎందుకు? ఎలా ప్రశ్నించగలుగుతున్నారని అన్నారు. ఎవరు సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్నారో వారు జాన్పూర్ వెళ్లి అమర జవానుల కుటుంబాలను అడగాలని, అప్పుడు ఎందుకు సర్జికల్ దాడులు చేయాల్సి వచ్చిందో తెలుస్తుందని చెప్పారు. తాము చేసిన హామీలను మర్చిపోబోమని, ఉత్తరప్రదేశ్‌లో అధికారం వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే సన్నకారు రైతులకు రుణాలనిచ్చే విధానం సరళీకృతం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
విజయం మాదే: ఇరోమ్ షర్మిల
ఇంఫాల్ : ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల అన్నారు. మణిపూర్‌లో కూడా అలాంటి మార్పే రావాలని ఆమె ఆకాంక్షించారు. యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఇరోమ్ షర్మిల తన గెలుపుపై ముందే ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8న జరిగే ఎన్నికల్లో ముఖమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. కాగా ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇరోమ్ షర్మిల తాను స్థాపించిన పీఆర్జేఎ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరికి దింపారు. మరోవైపు పీఆర్‌జేఏ అభ్యర్థి ఎలాండ్రో లైకోంబామ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మణిపూర్ తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తొలి దశలో మొత్తం 38 అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 69శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే మరో రెండోవిడత పోలింగ్ బుధవారం జరగనున్నాయి. -
పూర్వాంచల్‌లో పోటాపోటీ
► నేడే పోలింగ్ ► బీజేపీకి తలనొప్పిగా హిందూ యువవాహిని సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. నేపాల్, బిహార్‌లతో సరిహద్దును పంచుకుంటున్న పూర్వాంచల్ ప్రాంతంలోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు)లు ఎక్కువమంది ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యనేనని వారి అభిప్రాయం. ఇక్కడ 2012 ఎన్నికల్లో ఎస్పీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. బీఎస్పీ నుంచి ముక్తార్ అన్సారీ పోటీ పూర్వాంచల్‌లోని మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ జిల్లా సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు స్వతంత్రుడిగా గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని సీఎం అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్ గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఆజంగఢ్ జిల్లా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్‌పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువవాహిని అభ్యర్థులు.. హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్‌పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీని దెబ్బతీస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్‌ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్‌టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్‌ది బలియా జిల్లా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోవడంతో పరిస్థితి బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన స్థానాలే మెజారిటీ అందించాయి. స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు.. 2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్ లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్‌లోని అసమ్మతివర్గం పంపిణీచేస్తోంది. -
యూపీ 6వ దశ, మణిపూర్ తొలి దశ ఎన్నికలు నేడు
లక్నో/ఇంఫాల్: ఉత్తరప్రదేశ్‌లో 6వ దశ 49 అసెంబ్లీ స్థానాలతో పాటు మణిపూర్‌లో తొలి దశ 38 నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 1.72 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 635 మంది ఈ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. 6వ దశ కింద మాయు, గోరక్‌పూర్, మహరాజ్‌గంజ్, ఖుషినగర్, డెఒరియా, ఆజంగఢ్, బాలియా జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరవ దశలో బీజేపీ 45 స్థానాల్లోనూ, అప్నా దశ్ ఒకటి, సుహెల్దేవ్ బీఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అలాగే బీఎస్పీ.. 49, ఎస్పీ.. 40, కాంగ్రెస్.. 9 చోట్ల బరిలోకి దిగుతున్నాయి.స్వామిప్రసాద్ మౌర్య, సూర్య ప్రతాప్ షాహి, శ్యామ్ బహదూర్ యాదవ్, అంబికా చౌదరీ, నరడ్ రాయ్ లాంటి హేమాహేమీలంతా ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మణిపూర్‌లో తొలి దశ...: తొలి దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ దశలో 38 నియోజకవర్గాల పరిధిలో 1,643 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్‌తో పాటు కొండ ప్రాంత జిల్లాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 168 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 19, 02, 562 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
ఆ పార్టీలకు 11న కరెంట్ షాక్
యూపీ ఫలితాలపై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లను ఉద్దేశించి మోదీ మీర్జాపూర్: ఈ నెల 11న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు విద్యుత్ షాక్‌లు తగులుతాయని ప్రధాని మోదీ అన్నారు. యూపీలో విద్యుత్ పంపిణీ సరఫరా సరిగా లేదన్న తన ఆరోపణలకు బదులుగా.. కరెంటు ఉందో లేదో తేల్చుకోవడానికి తీగ పట్టుకోవాలని సీఎం సవాల్ విసిరిన నేపథ్యంలో మోదీ స్పందించారు. ‘కరెంటు ఉందో లేదో తీగ పట్టుకుని చూడాలని అఖిలేశ్ సవాల్ విసిరారు. అయితే ఆయన కొత్త మిత్రుడు రాహుల్ గాంధీ మదిహన్ (మీర్జాపూర్) సభలో కరెంటు తీగ పట్టుకుని అందు లో కరెంటు లేదని గులాం నబీ ఆజాద్‌తో చెప్పారు. అఖిలేశ్‌జీ.. ఇప్పుడు ప్రజలు కరెంటును ప్రవహింపజేస్తున్నారు. అది ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు మార్చి 11న షాకిస్తుంది’ అని శుక్రవారం మీర్జాపూర్లో జరిగిన ఎన్నికల సభలో మోదీ అన్నారు. ప్రతి పనికీ లంచం.. యూపీలో ప్రతి పనికి, ఉద్యోగానికి లంచాన్ని నిర్ధారించారని ఆరోపించారు. ఈ అవినీతి పోవాలంటే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు. తన విగ్రహాలకు మీర్జాపూర్ నుంచి రాళ్లను తెప్పించుకున్నానన్న బీఎస్పీ చీఫ్ మాయావతి.. దర్యాప్తు మొదలయ్యాక రాళ్లను రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నట్లు చెప్పారని, ఆమెకు మీర్జాపూర్ రాళ్లపైనా ఇంత ద్వేషమెందుకని ప్రశ్నించారు. మీర్జాపూర్‌లోని ఇత్తడి పరిశ్రమకు ప్రభుత్వం విద్యుత్ ఇచ్చి ఉంటే యువత గుజరాత్, మహారాష్ట్రలకు వలసపోయేవారు కారన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: అఖిలేశ్ కాన్పూర్ రైలు ప్రమాదం వెనక ఐఎస్ఐ హస్తముందన్న మోదీ ఆరోపణలను అఖిలేశ్ ఖండించారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఘాజీపూర్ సభలో విమర్శించారు. కాన్పూర్‌లో రైలుపట్టాల బాగోగులు పట్టించుకోని రైల్వే మంత్రి.. వాటిని ఐఎస్ఐ ధ్వంసం చేసిందంటూ ప్రధానికి నివేదిక ఇచ్చారని, సీఎం అయిన తనకు మాట కూడా చెప్పలేదని అన్నారు. బీజేపీకి ఆ పార్టీ శ్రేణులే బుద్ధి చెబుతాయి: మాయావతి యూపీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను, నేరచరితులను నిలబెట్టిన బీజేపీకి ఆ పార్టీ సొంత శ్రేణులే గుణపాఠం నేర్పుతాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. తమ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జాన్ పూర్ సభలో ధీమా వ్యక్తం చేశారు. -
నేడు సమరాంగణంగా వారణాసి
మోదీ, రాహుల్, మాయావతి ప్రచారం వారణాసి: ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి శనివారం రాజకీయ దిగ్గజాల ప్రచారంలో సమరాంగణంగా మారనుంది. మోదీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ప్రచారంతో హోరెత్తించనున్నారు. వీరందరూ ఒకేరోజు పర్యటనకు రానుండడంతో అధికారులు ఠారెత్తిపోతున్నారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్న మోదీ మొదట కాశీవిశ్వనాథ ఆలయానికి వెళ్తారు. తర్వాత బెనారస్ వర్సిటీలో విశ్రాంతి తర్వాత కాశీ విద్యాపీఠ్ వర్సిటీకి వెళ్లి ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. అఖిలేశ్, రాహుల్‌లు కచేరీ ప్రాంతం నుంచి గిరిజాఘర్ వరకు రోడ్‌షో చేస్తారు. మాయావతి రొహానియాలో ర్యాలీ నిర్వహిస్తారు. మోదీ ఆదివారం కూడా వారణాసిలో ప్రచారంలో పాల్గొనే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
‘గంగలో రాహుల్ దూకాలి.. లేదంటే నేను దూకుతా’
వారణాసి: ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీజేపీ తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రకటించింది. గంగా నది విషయంలో మోదీని విమర్శించిన రాహుల్‌పై కేంద్ర మంత్రి ఉమా భారతి విరుచుకుపడ్డారు. ‘రాహుల్‌గాంధీ అయినా గంగా నదిలో దూకాలి.. లేదంటే నేను దూకుతాను’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ది పరిపక్వత లేని మెదడు అని అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాహుల్ ఏ థాయిలాండ్‌కో పారిపోవడం కాదని, నేరుగా తనతో గంగా నది వద్దకు రావాలని, అప్పుడు గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభంకాకుంటే తాను గంగలో దూకుతానని, లేదంటే రాహుల్ దూకాలని సూచించారు. వారణాసిలో పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌కు చేసిందేమి లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు కుమారుడిగా చెప్పుకున్న రాహుల్ గంగా నదిని తన కన్నతల్లిగా చెప్పుకున్నారని, ఇప్పుడు గంగా తల్లికి ఆయన చేసేందేమిటని ప్రశ్నించారు. యూపీకిగానీ, గంగకుగానీ ఏమైనా చేశారా అని నిలదీశారు. గంగను శుద్ధి చేశారా అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆయనపై విరుచుకుపడ్డారు. ‘గంగా పరివాహక ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మొదలుకాలేదు. మేం ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ, ఇంతవరకు నో అబ్జెక్షన్ కాపీ వాళ్లు ఇవ్వలేదు. వాస్తవానికి గంగాకు నిజమైన శత్రువు అఖిలేశ్ యాదవ్. ఓసారి ములాయం వచ్చి గంగా నదిపై పనులు ప్రారంభం కాలేదని పార్లమెంటులో అరిస్తే ఇంతవరకు మీ రాష్ట్రమే ఎన్వోసీ ఇవ్వలేదని గుర్తు చేస్తే చప్పుడు చేయకుండా కూర్చున్నారు. కావాలనే గంగా శుద్ధి కార్యక్రమానికి యూపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభం అవడం ఖాయం. అలా జరగకుంటే నేనన్నా అందులో దూకుతాను. రాహుల్ అయినా దూకాలి’ అని ఉమాభారతీ మండిపడ్డారు. -
వ్యూహాత్మకంగా అఖిలేశ్‌పై రాహుల్‌తో మోదీ ఎటాక్
మిర్జాపూర్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన కూటమిపై దాడి చేశారు. గతంలో ఆయన చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రస్తుం అఖిలేశ్‌తో భాగస్వామ్యం పంచుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉపయోగించుకున్నారు. గతంలో అఖిలేశ్ మాటలను ఉటంకిస్తూ ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉందో లేదో తెలుసుకునేందుకు వైర్లను పట్టుకోమని అఖిలేశ్ యాదవ్ నాకు చెప్పారు. ఈ సందర్భంగా నేను ఆయనకు తన కొత్త స్నేహితుడు రాహుల్‌గాంధీ గత ఏడాది నిర్వహించిన ఖాట్ సభలో చెప్పిన మాటలు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. 27 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ లైన్లు ఉన్నాయి. కానీ అందులో విద్యుత్ లేదు అని రాహుల్ అన్నాడు. ఆ విషయం అఖిలేశ్ మర్చిపోయాడేమో’ అంటూ తనదైన శైలిలో రాహుల్‌ను, అఖిలేశ్‌ను ఇరుకున పడేశారు. ‘ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రెండు పెద్ద వంతెనలు మిర్జాపూర్‌లో నిర్మిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆపని పూర్తి కాలేదు. ఇప్పటికే ఆ హామీ ఇచ్చి 13 ఏళ్లు అయినా తన తండ్రి ఇచ్చిన హామీని ఎందుకు అఖిలేశ్ నెరవేర్చలేదు. పర్యాటకానికి ఉత్తరప్రదేశ్ ఎంతో అనుకూలమైనది. కాశీకి వింద్యాచల్ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. దేశంలో ఉన్నవారందరినీ ఇక్కడికి ఆకర్షించవచ్చు’ అని మోదీ చెప్పారు. -
నాడు 300 ర్యాలీల్లో ములాయం.. నేడు ఏమైంది?
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల హోరాహోరీ ప్రచారం, దూషణల పర్వం కొనసాగుతుంటే.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒకప్పటి రాజకీయ యోధుడు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైందని విమర్శలు వినబడుతున్నాయి. 2012 ఎన్నికల్లో 300 ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించిన ములాయం.. ఈసారి కేవలం రెండంటే రెండే ర్యాలీలకు హాజరయ్యారు. అదీ తమ్ముడు శివ్‌పాల్ తరపున ఒకటి.. చిన్న కోడలు అపర్ణయాదవ్ తరపున మరొకటి. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ.. అనారోగ్య కారణాలతో కేవలం 18 ర్యాలీల్లోనే ములాయం పాల్గొన్నారు. ‘పార్టీ సంరక్షకుడిగా ములాయంను నియమించిన మరుక్షణమే.. ఆయన అధికారాలు తగ్గిపోయాయి. ఎస్పీలో ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం.. ములాయం బాధ్యతలు అఖిలేశ్ తీసుకున్నారు’ అని బీజేపీ సీనియర్‌నేత హృదయ్ నారాయణ్ దీక్షిత్ తెలిపారు. ‘ఎస్పీ కార్యకర్తలే కాదు. ఇతర పార్టీన నేతలూ ములాయం గురించి బాధపడుతున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని సీనియర్ సోషలిస్టు నాయకుడు రఘునందన్ సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థాపకుడికి ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని ఆర్ఎల్డీ అధ్యక్షుడు సునీల్ సింగ్ అన్నారు. బాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం సైకిల్ (ఎస్పీ పార్టీ గుర్తు)ను పంక్చర్ చేస్తే.. శివ్‌పాల్ చైన్ తెంపేశాడు’ అని విమర్శించారు. ములాయం పుత్రవ్యామోహంలో పడిపోయారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం.. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ములాయం ఆశీస్సులున్నాయంటున్నారు. -
సీఎం చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చిన నేత..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాలు విభిన్నంగా దర్శనం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని తీరుతో ప్రచార హోరు కొనసాగుతుండగా విచిత్ర, అనూహ్య దృశ్యాలకు తావిస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో శైలిలో ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఏకంగా ఓటర్ల ముందూ బోరుమని ఏడుస్తున్నారు. తాము గతంలో తప్పు చేశామని, ఈ ఒక్కసారి క్షమించి అధికారం ఇవ్వాలంటూ తమ చెప్పులతో తమనే కొట్టుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ముందే ఓ ఎస్పీ నేత వెక్కివెక్కి ఏడ్చాడు. కారణం చెప్పకుండా మైకులో ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే మాట్లాడటం ఆపేసి మధ్యలో ఏడ్వడం మొదలుపెట్టాడు. అయితే, సొంతపార్టీలో తనకు అసమ్మతి ఎదురైన కారణంగా ఆయనకు చేస్తున్న అవమానాలు గుర్తొచ్చి ఏడ్చారని ఆయనతో ఉన్న ఇతర నేతలు చెప్పారు. ఏం జరిగిందంటే పీడీ తివారీ అనే వ్యక్తి సమాజ్‌వాది పార్టీ తరుపున బార్హాజ్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగాడు. ఆరో దశలో భాగంగా శనివారం ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి. అయితే, ఇక్కడికి ప్రచారానికి వచ్చిన మోదీ పీడీ తివారీ పోటీ చేసే స్థానం బీజేపీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడికే ప్రచారానికి వచ్చిన అఖిలేశ్ యాదవ్ పీడీ తివారీకి భరోసా ఇచ్చారు. ప్రజలు తమ విశ్వాసాన్ని ఓటు ద్వారా తివారీకి అప్పగించాలని అన్నారు. ‘ ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లన్ని కొల్లగొడుతుందని చెప్పారు. బార్హాజ్ సీటును ఎలా కొల్లగొడతారో మనమూ చూద్దాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అనగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తివారీకి మద్దతుగా చప్పట్లు శబ్దాలు, ఈలలు వినిపించాయి. ఆయన అలా అన్న తర్వాత భావోద్వేగం ఆపుకోలేక అతడు వెక్కివెక్కి ఏడ్చాడు. అంతకుముందు సుజాత్ అలాం అనే వ్యక్తి తన చెప్పులతో తానే పదేపదే తలపై కొట్టుకొని ఈ ఒక్కసారి క్షమించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసింది. -
‘దత్తపుత్రుడు ఇంటికి.. కూతురుకే అధికారం’
సోనేభాద్ర: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్ వాసులు దత్తపుత్రుడిని(ప్రధాని నరేంద్రమోదీ)ని తిరిగి గుజరాత్ పంపిచేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తమ సొంత కూతురు(మాయావతి) చేతుల్లోనే అధికారం పెడుతున్నారని చెప్పారు. బీజేపీకి ఆమె కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపే అంటే భారతీయ జనతా పార్టీ కాదని, భారతీయ జుమ్లా పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. నల్లధనం తీసుకొస్తామని, రూ.15 లక్షలు ప్రతి సామాన్యుడి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఆ హామీ కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. తన హామీలు నెరవేర్చలేకనే ఆ వైఫల్యాలు వేరే వారికి తెలియకుండా ఉండేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల దృష్టిని మరల్చారని మండిపడ్డారు. -
ఏం టైమింగ్.. పవర్ మంత్రికి భలే అనుభవం
వారణాసి: ఆహా.. ఏం టైమింగ్ అని సాధారణంగా అంటుంటాం. ఎవరి గురించి మాట్లాడుతామో.. ఏ విషయం గురించి చర్చిస్తామో దాన్ని ప్రతిబింబించేలా ఆవ్యక్తి వచ్చినప్పుడుగానీ, ఆ విషయం తాలూకు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఈ టైమింగ్ అనే డైలాగ్‌ను ఉపయోగిస్తుంటాం. సరిగ్గా నిజంగా ఏం టైమింగ్ అన్నట్లుగా కేంద్ర మంత్రి ఉన్నచోట ఏర్పడిన పరిస్థితిని చూసి అక్కడి వారంతా అనుకున్నారు. ఇంతకీ ఎవరా కేంద్రమంత్రి? ఏం సంఘటన అక్కడ జరిగిందని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా ఆయన మాట్లాడుతుండగానే పుటుక్కున కరెంట్ పోయింది. లైట్లు ఆగిపోయాయి. అది కూడా సరిగ్గా విద్యుత్ అంశంపై మాట్లాడుతుండగానే కావడంతో అక్కడ ఉన్నవారంతా ఏం టైమింగ్ మంత్రిగారిది అని గుసగుసలాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉపయోగిస్తున్న అస్త్రాల్లో విద్యుత్ సమస్య కూడా ఒకటి. తాము అధికారంలోకి వస్తే కరెంట్ సమస్యే ఉండదని, పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందిస్తామని ఆయన హామీ ఇస్తున్న సమయంలోనే లైట్లు ఆగిపోవడంతో అందరు బిత్తరపోయి నవ్వుకున్నారు. అయితే, తాను చీకట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సమాజ్‌వాది పార్టీపై విమర్శలు చేశారు. విద్యుత్ అందరికీ సమానంగా అందించాలని, ఇలా అంతరాయం కలిగిస్తూ కొన్ని ప్రాంతాలకే పూర్తి సహాయం చేస్తే ఎలా అని ఆయన నిలదీశారు. ‘నేను నా గురించి ఆందోళన చెందడం లేదు.. బాధపడటం లేదు. నేను కాలేజీల్లో, పాఠశాలల్లో చదివే విద్యార్థుల గురించి ఫీలవుతున్నాను. రైతుల గురించి, ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న వైద్యుల గురించి, రోగుల గురించి ఆందోళన చెందుతున్నాను’ అని గోయల్ అన్నారు. -
‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్ కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ ప్రచారం ఉండబోదంట. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. మంగళవారం బెనారస్‌లో మీడియాతో ఆజాద్.. పార్టీ తరుపున మొత్తం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు ప్రియాంకనే చూసుకుంటున్నారని, అందువల్ల ఆమెకు ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని అన్నారు. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ప్రచారం చేయబోరని చెప్పారు. సోనియాకు ఏమైంది అని ప్రశ్నించగా అంతపెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తీవ్ర సమస్యేం కాదని సమాధానం దాట వేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్, రాహుల్ ఇద్దరూ సమానమేనని, రాహుల్ రెండో నేత కాదని స్పష్టం చేశారు. వారు ఎక్కడికి వెళ్లినా ఉమ్మడిగానే వెళుతున్నారని, కలిసి పనిచేస్తూ తమ కూటమి గెలుపుకోసం కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తాము అనుకోలేదని, ప్లేయర్ల మాదిరిగానే ఉండాలని బరిలోకి దిగినట్లు చెప్పారు. -
బేరసారాల కోసం కొత్త ఆట
ఓటమి తప్పదని ఎస్పీ, బీఎస్పీకి అర్థమైంది ► అందుకే హంగ్ రావాలని కోరుకుంటున్నాయి ► హంగ్ వస్తే అధికారం కోసం బేరసారాలు ఆడాలనేది వారి ఆలోచన ► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మావు(యూపీ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన ఎస్పీ, బీఎస్పీ కొత్త ఆటకు తెర తీశాయని, యూపీలో హంగ్ రావాలని కోరుకుంటున్నాయని, తద్వారా అధికారంకోసం బేరసారాలు ఆడొచ్చనేది వారి ఆలోచన అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘యూపీలో మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ, బీఎస్పీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశాలు లేవని అర్థమైపోయింది. దీంతో వారు కొత్త ఆట, సరికొత్త ఎత్తుగడను ప్రారంభించారు. ఒకవేళ తాము ఓడిపోయినా.. లేదా సీట్ల సంఖ్య తగ్గినా.. ఎవరికీ మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నాయి’’ అని చెప్పారు. సోమవారం యూపీలోని మావు పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఎస్పీ, బీఎస్పీ నాయకులకు నేను చెప్పేదొకటే. బీజేపీని ఓడించడానికి మీరు ఏమైనా చెయ్యండి. దానితో ఎటువంటి సమస్యా లేదు. కానీ యూపీ భవిష్యత్తుతో మాత్రం ఆటలాడొద్దు. యూపీ ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొంది. హంగ్ అసెంబ్లీ వస్తే బేరసారాలు ఆడేందుకు అవకాశం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారేమో.. కానీ యూపీ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ఎన్నికల్లో కూడా యూపీ ప్రజలు బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెడతారు’’ అని చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఎస్పీ అధికారం పోతుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అయితే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, దానితో పాటు ఎస్పీ కూడా మునిగిపోతుం దని, కాంగ్రెస్, ఎస్పీ కలసి మీడియా కవరేజీతో ప్రజలను ఏమార్చాలనుకుంటే కుదరదని చెప్పారు. ప్రజలకు పాలను.. నీటినీ ఎలా వేరు చేయాలో తెలుసన్నారు. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తమకు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్–ఎస్పీ నేతలు చెప్పారని, కానీ మూడో దశ పూర్తయ్యేసరికి వారికి వాస్తవం అర్థమైందని, మెజారిటీ మాట పక్కన పెట్టి తమకు మరో అవకాశం ఇస్తే.. తప్పులను సరిచేసుకుంటామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ వచ్చినా సరే మిత్రపక్షాలను కలుపుకునే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కీర్తిస్తోందని, ఇదే విధంగా యూపీలోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే దేశం మొత్తం యూపీని కీర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
యూపీ ఐదో దశలో 57 శాతం పోలింగ్
లక్నో: ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో 57.36% ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి టి.వెంకటేశ్ చెప్పారు. సోమవారం 11 జిల్లాల్లోని 51 స్థానాలకు జరిగిన ఈ దశ పోలింగ్‌లో మొత్తం 607 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కీలకమైన అమేథీ, ఫైజాబాద్ ప్రాంతాలు ఈ దశలోనే ఉన్నా యి. తొలి నాలుగు దశల (వరుసగా 64, 65, 61.16, 61 శాతం) కంటే ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతి వల్ల అలాపూర్ స్థానంలో పోలింగ్‌ను మార్చి 9కి ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నియో జక వర్గమైన అమేథీలోనూ, కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. బీజేపీ 50, బీఎస్పీ 51, ఎస్పీ 43, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
యూపీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో 2012తో పోలిస్తే 2017 ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహం భారీగా పెరిగింది. యూపీలో 2012లో రూ.36.29 కోట్ల నగదు, రూ.6.61 లక్షల విలువైన 3,073 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా ఈసారి ఏకంగా రూ.115.7 కోట్ల నగదు, రూ.57.69 కోట్ల విలువైన 20.29 లక్షల బ్యారెళ్ల మద్యం, రూ.7.91 కోట్ల విలువైన 2,725 కేజీల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుత ఎన్నికల సమయంలో రూ.3.4 కోట్ల నగదు, రూ.3.1 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2012లో ఈ రాష్ట్రంలో పట్టుకున్న నగదు రూ.1.3 కోట్లు, మద్యం విలువ రూ.15.15 లక్షలు. పంజాబ్‌లో 2012లో రూ.11.51 కోట్ల నగదు, రూ.2.59 కోట్ల మద్యాన్ని పట్టుకోగా 2017లో రూ.58.02 కోట్ల నగదు, 13.36 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. -
నేడే యూపీ ఐదో దశ పోలింగ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని 51 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎస్పీ అభ్యర్థి కనౌజియా మరణంతో ఆలంపూర్ స్థానంలో పోలింగ్ వచ్చేనెల 9న జరగనున్నది. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆదివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
‘కసబ్’కు కొత్త నిర్వచనం
‘కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ , బచ్చే’ అని చెప్పిన డింపుల్ జౌన్ పూర్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సంక్షిప్త పదాలతో ప్రత్యర్థి పార్టీ లపై విరుచుకుపడుతుండటం కొనసాగుతోం ది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంధించిన ‘కసబ్’ వాగ్బాణాన్ని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ తిప్పికొట్టారు. ‘క అంటే కాంగ్రెస్ అని బీజేపీ చెబుతోంది. కానీ ‘క’ అంటే కంప్యూటర్ అని మీ అఖిలేశ్ భయ్యా చెప్పారు. ‘స’ అంటే స్మార్ట్‌ఫోన్ . ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసు కోవచ్చు. ఇక ‘బ్’ అంటే బచ్చే (చిన్నా రులు)’ అంటూ డింపుల్ వివరించారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు, స్మార్ట్ఫోన్లు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. గర్భిణులకు ఇంటివద్దనే ఆహార ధాన్యాలు అందిస్తామని డింపుల్ యాదవ్æ హామీ ఇచ్చారు. -
‘మాకు 300స్థానాలు పక్కా’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారం చేపట్టడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 300పైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కలయిక ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పెద్ద మార్పును తీసుకొస్తుందని అది ప్రతి ఒక్కరూ చూస్తారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా చెప్తున్నానని, తమకు ఈ ఎన్నికల్లో 300 సీట్లు దాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడుతూ ‘ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒప్పందం కాదు. ఇది ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఒప్పందం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మార్పు తీసుకురాగల యువకులది ఈ ఒప్పందం’ అని చెప్పారు. రెండు అవినీతి కుటుంబాల మధ్య యూపీలో పొత్తు జరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అఖిలేశ్ ఇలా బదులిచ్చారు. -
కొత్త మిత్రులకు పరీక్ష
► రేపు యూపీ ఐదో దశ ఎన్నికలు ► అమేథీ సహా 51 స్థానాల్లో పోలింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదో దశ ఎన్నికలు కొత్త మిత్రులైన యువనేతలు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లకు పరీక్షగా నిలవనుంది. రాహుల్ సొంత ప్రాంతమైన అమేథీ సహా 11 జిల్లాల్లోని 51 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. షెడ్యూలు ప్రకారం మొత్తం 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అలాపూర్‌లో ఎస్పీ అభ్యర్థి మృతితో 51 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2012 ఎన్నికల్లో ఈ 52 స్థానాల్లో వేర్వేరుగా పోటీచేసిన సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లలో, కాంగ్రెస్ ఐదు సీట్లలో గెలిచాయి. తాజా ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఈ పార్టీలు నాటి విజయాన్ని పునరావృతం చేయడం రాహుల్, అఖిలేశ్‌ల ముందున్న సవాల్. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావస్తి, బలరాంపూర్, సుల్తాన్ పూర్, అంబేడ్కర్‌నగర్ జిల్లాల్లో ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి పరిస్థితి ఏకపక్షంగా లేకున్నా... త్రిముఖ పోరులో పొత్తు లాభంతో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని ఎస్పీ ధీమాతో ఉంది. ఐదో దశ బరిలో ఉన్న 9 మంది మంత్రులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దోస్తీమే సవాల్.. ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చి రాహుల్ ప్రతిష్టతో ముడిపడి ఉన్న అమేథి లో తమ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీ, రాజవంశీకుడు సంజయ్ సింగ్ రెండో భార్య అమితా సింగ్, బీజేపీ నుంచి సంజయ్ మొదటి భార్య గరిమా పోటీపడుతున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి ఎస్పీ టికెట్‌పై బరిలో ఉన్నారు. అమేథి జిల్లాలోని మరో స్థానం గౌరిగంజ్‌లోననూ ఎస్పీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా అభ్యర్థులను నిలిపాయి. బీఎస్పీ ఆశలు తమ ముస్లిం– దళిత ఫార్ములాపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఐదోదశలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో చాలాచోట్ల ముస్లిం, దళితులు కలిసి మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలో 38 శాతం, బహ్రాయిచ్ జిల్లాలో 36 శాతం, సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో 30 శాతం ముస్లింలే. అందుకే ఈ దశలో 18 మంది ముస్లింలకు బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీని ఓడించగల స్థితిలో ఉన్న అభ్యర్థివైపు ముస్లింలు మొగ్గుతారని బీఎస్పీ ఆశిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఎన్నికలు జరిగే స్థానాలు: 51 బరిలో ఉన్న అభ్యర్థులు: 608 జిల్లాలు: 11 మొత్తం ఓటర్లు: 1.84 కోట్లు పోలింగ్ బూత్‌లు: 19,167 గమనిక: 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎస్పీ అభ్యర్థి మృతితో అలాపూర్ ఎన్నిక మార్చి 9న జరగనుంది. 2012లో ఎవరికెన్ని స్థానాలు ఎస్పీ 37 కాంగ్రెస్ 5 బీజేపీ 5 బీఎస్పీ 3 పీస్ పార్టీ 2 మొత్తం 52 -
15 నెలల్లో అభివృద్ధి చేస్తాం
మణిపూర్ ఎన్నికల సభలో మోదీ ఇంఫాల్: పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ తీవ్రంగా వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 15 నెలల్లో అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారమిక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పాలనలో మణిపూర్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు తాగునీరు అందించడంతో ప్రభుత్వం విఫలమైంది. 15 ఏళ్లలో ఆ పార్టీ చేయలేని పనిని(రాష్ట్ర అభివృద్ధి)ని మా ప్రభుత్వం 15 నెలల్లోనే చేస్తుంది’ అని చెప్పారు. ‘15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం 10 పర్సెంట్ సీఎం అని నేను విన్నాను. వంద శాతం నిజాయతీగల సీఎం కావాలా, లేకపోతే 10 శాతం కమీషన్ తీసుకునే వ్యక్తి కావాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం భారీగా పంపుతున్న నిధుల్లో అధిక భాగాన్ని నేతలు, అధికార పార్టీ మంత్రులు దారి మళ్లిస్తున్నారన్నారు. నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం నాగా మిలిటెంట్లతో కేంద్రం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఇబోబీ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మోదీ మండిపడ్డారు. మణిపూర్, మణిపురీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమేదీ ఒప్పందలో లేదని స్పష్టం చేశారు. ‘ఏడాదిన్నర కిందట ఆ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ’ అని మండిపడ్డారు. యునైటెడ్ నాగా కౌన్సిల్(యూఎన్ త ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరవధిక ఆర్థిక దిగ్బంధాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే తొలగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఔషధాలు, ఇతర సరుకులు అందక అల్లాడతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
వంద శాతం సీట్లు బీజేపీకే కట్టబెట్టాలి
యూపీ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి గోండా(యూపీ): ‘‘ఈ ఎన్నికల్లో ఒక్క తప్పునకు కూడా తావు ఇవ్వొద్దు. బీఎస్పీ, ఎస్పీ పార్టీ ఏదైనా ఒక్క సీటు కూడా వారికి దక్కనివ్వొద్దు. వంద శాతం సీట్లను బీజేపీకే కట్టబెట్టాలి’’అని ఉత్తరప్రదేశ్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని ఆయన ప్రస్తావించారు. శుక్రవారం ఇండో–నేపాల్ సరిహద్దులకు సమీపంలోని గోండా ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో మోదీపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశా, మహారాష్ట్ర, చండీగఢ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదా గుజరాత్‌లోని పంచాయతీ ఎన్నికలైనా గత మూడు నెలల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు తమ మూడో కన్నుతో చూసి బీజేపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టారు.’ అని అన్నారు. 150 మంది ప్రాణాలు బలి తీసుకున్న కాన్పూర్ రైలు ప్రమాదం ఘటన వెనుక కుట్ర ఉందని, సరిహద్దుల అవతల నుంచి కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లభించాయని మోదీ చెప్పారు. -
సింహగర్జన కాదు.. చిట్టెలుక స్వరం
ప్రధాని మోదీపై రాహుల్ విసుర్లు లక్నో : ప్రధాని మోదీ స్వరం చిట్టెలుక కంటే బలహీనంగా మారిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాసి నియోజకవర్గంలో ప్రసంగిస్తూ... ‘మేకిన్ ఇండియా అంటూ ప్రధాని పిలుపునిచ్చారు. అయితే అది సింహ గర్జన కాదు... చిట్టెలుక శబ్దం కంటే బలహీనంగా మారింది’ అంటూ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రతీచోట ‘మేడిన్ ఇన్ చైనా’ వస్తువులు అందుబాటులో ఉన్నాయని, నా ఫోన్ కూడా మేడిన్ చైనానే అంటూ రాహుల్ చమత్కరించారు. ఎస్పీ–కాంగ్రెస్‌లు జట్టు కట్టినప్పటి నుంచి మోదీ మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారన్నారు. మోదీ ధనికుల రుణాలు మాఫీ చేశారు గానీ, రైతుల్ని పట్టించుకోలేదని తప్పుపట్టారు. యూపీకి దత్తపుత్రుడిగా మోదీ ప్రచారం చేసుకోవడాన్ని కూడా రాహుల్ ఎద్దేవా చేశారు. ఎక్కడికెళ్తే అక్కడ బంధుత్వం ఏర్పరచుకుంటారని, అది కేవలం పెదాలకే పరిమితం కాకూడదన్నారు. మోదీ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే(అచ్చే దిన్ వాగ్దానం) సినిమా తీశారని, నోట్ల రద్దుతో అది షోలేగా మారిందన్నారు. రాహుల్‌పై బీజేపీ వ్యంగ్యా స్త్రాలు రాహుల్‌గాంధీ ఇంకా పరిణతి చెందలేదని, అందుకు మరికొంత సమయం అవసరమన్న షీలాదీక్షిత్ వ్యాఖ్యల్ని బీజేపీ సమర్ధించింది. ఒకవేళ రాహుల్ పరిణితి చెందకపోతే... బలవంతంగా ఎందుకు ఉత్తరప్రదేశ్‌పై ప్రయోగిస్తున్నారు? ఇదేమైనా రాజకీయ ప్రయోగశాలా లేక పాఠాలు నేర్చుకునే వేదికా? అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ ప్రశ్నించారు. ఎస్పీని అడ్డుకునేందుకు ఏకమైన బీజేపీ, బీఎస్పీ: అఖిలేశ్ బీజేపీ సాయంతో ఎస్పీని అడ్డుకునేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారంటూ యూపీ సీఎం అఖిలేశ్ ఆరోపించారు. అయోధ్యలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బీజేపీపై పోరాడాలనే ఉద్దేశం బీఎస్పీకి లేదని, అందుకే వారిద్దరు సమాజ్‌వాదీ పార్టీని అడ్డుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు. మరోవైపు, యూపీ అసెంబ్లీ ఐదో విడత పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ఐదో విడతలో 12 జిల్లాల్లోని 51 సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. -
బీఎంసీలో బీజేపీ ‘మహా’ విజయం
-
బీజేపీ ‘మహా’ విజయం
బీఎంసీ సహా 8 కార్పొరేషన్లలో సత్తా చాటిన కమలం ► ముంబైలో 84 సీట్లతో మొదటి స్థానంలో శివసేన.. బీజేపీకి 82 ► గతంకన్నా కమలదళానికి 52 సీట్లు అధికం ►మ్యాజిక్ ఫిగర్‌కు రెండూ దూరం ►కాంగ్రెస్, ఎన్సీపీకి పరాభవం.. ఎంఐఎం బోణీ ముంబై: మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ముంబై మునిసిపాలిటీలో గణనీయంగా సీట్లు పెంచుకుంది. 25 ఏళ్లుగా శివసేనతో పొత్తు ఆధారంగా స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన బీజేపీ ఈసారి ఒంటరిగానే (అక్కడక్కడ చిన్న పార్టీలను కలుపుకుని) పోటీచేసి ఘనమైన ఫలితాలు సాధిం చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది. శివసేన కంచుకోటగా ఉన్న బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. ఇందులో 84 సీట్లతో శివసేన అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ 82 స్థానాలతో రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 31, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) 9, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 7, మజ్లిస్ పార్టీ 3 స్థానాల్లో గెలుపొందాయి. కాగా ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో పాగా వేశారు. అయితే బీఎంసీ పీఠాన్ని అధిరోహించేందుకు కావాల్సిన 114 సీట్ల మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకి దక్కలేదు. అయితే సంపన్న కార్పొరేషన్ (2016–17 సంవత్సరానికి 37వేల కోట్ల బడ్జెట్)పై అధికారాన్ని నిలుపుకుంటామని శివసేన, తమదే మేయర్ పీఠమని బీజేపీ ప్రకటనలు చేస్తుండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. జోరుమీదున్న బీజేపీ: శివసేనతో కలసి ప్రభుత్వంలో ఉన్నా విడిగా పోటీ చేయటమే బీజేపీకి కలిసొచ్చింది. సొంతంగా పోటీచేస్తామంటూ శివసేన ఆర్నెల్ల ముందునుంచే స్పష్టం చేస్తుండటంతో.. బీజేపీ తన బలాన్ని చాటుకునేందుకు అవకాశం కలిగింది. గత ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 51 స్థానాలను అదనంగా గెలుచుకోవటంతో ముంబై బీజేపీ సంబరాలు జరుపుకుంటోంది. తగ్గిన కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు చుక్కెదురైంది. గత ఎన్నికల్లో 52 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి 31 సీట్లకే పరిమితమైంది. ఎన్సీపీ 13 స్థానాలనుంచి 9కి చేరుకుంది. చాలాచోట్ల ఈ రెండు పార్టీలు ఐదు, ఆరో స్థానాలకు పడిపోయాయి. అటు, రాజ్‌ఠాక్రే నాయకత్వంలోని ఎంఎన్ కూడా 28 స్థానాలనుంచి ఏడుకు పడిపోయింది. ముంబై మునిసిపల్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన ఎంఐఎం బోణీ చేసి 3 చోట్ల విజయం సాధించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ కోటల్లో కమలం పాగా శరద్ పవార్‌కు కంచుకోట పుణేలో బీజేపీ తొలిసారి జెండా ఎగరేసింది. మహారాష్ట్ర సాంస్కృతిక, ఐటీ రాజధానిగా పేరున్న 162 స్థానాల పుణే మునిసిపల్ కార్పొరేషన్ ఎంసీ)లో 77 సీట్లతో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ఎన్సీపీకి 44 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్16, శివసేన 10 స్థానాల్లో గెలుపొందాయి. మ్యాజిక్ ఫిగర్ 81 చేరుకునేందుకు బీజేపీకి 4 స్థానాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ మేయర్ పీఠం అధిరోహించనుంది. నాగ్‌పూర్ మునిసిపాలిటీపై మరోసారి బీజేపీ పట్టు నిలుపుకోగా, థానేలో శివసేన ఆధిపత్యం కొనసాగింది. 131 సీట్లకు గానూ శివసేన 67 స్థానాలతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అమరావతి, నాసిక్, ఉల్లాస్‌నగర్, పింప్రి–చించ్వాడ్, అకోలా, షోలాపూర్ మునిసిపల్ కార్పొరేషన్లనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇందులో అమరావతి, షోలాపూర్‌లో గతంలో కాంగ్రెస్ విజయం సాధించగా.. నాసిక్, పింప్రి–చించ్వాడ్ ఎన్సీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. జెడ్పీల్లోనూ బీజేపీ హవా 25 జిల్లాపరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. మొత్తం 1518 జెడ్పీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 409 చోట్ల విజయం సాధించింది. చెరకు రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్సీపీకి పట్టు తప్పగా.. బీజేపీ ఇక్కడ పాగా వేసింది. కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాల్లోనూ బీజేపీ దూసుకుపోయింది. కరువు కోరల్లో చిక్కుకున్న లాతూర్కు రైలు ట్యాంకర్ల ద్వారా నీరందించటం బీజేపీకి బాగా కలిసొచ్చింది. రత్నగిరి, సింధుదుర్గ్, బీడ్, పర్భణి ప్రాంతాల్లో బీజేపీ జోరును ఎన్సీపీ అడ్డుకుంది. బీడ్ జెడ్పీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ స్థానిక మంత్రి పంకజా ముండే రాజీనామా చేశారు. అయితే దీన్ని ఆమోదించలేదని తెలుస్తోంది. ధన్యవాదాలు... మోదీ: ‘మహారాష్ట్ర సోదర, సోదరీమణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీ, అభివృద్ధి రాజకీయాలపై విశ్వాసం ఉంచుతున్న ప్రతి భారతీయుడికీ ధన్యవాదాలు. మహారాష్ట్ర, ఒడిశా ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞులం. కార్యకర్తలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తొందరెందుకు: ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్ ‘బీఎంసీలో అధికారం ఎవరిదనే దానిపై తొందరెందుకు? కూటమి ఉండాలా వద్దా అనేది ఇప్పుడే నిర్ణయించలేం. కానీ బీఎంసీ మేయర్, భవిష్యత్తు ముఖ్యమంత్రి ఇద్దరూ శివసేన వాళ్లే ఉంటారని పక్కాగా చెప్పగలను’ అని ఉద్ధవ్ చెప్పారు. దోస్తీ ఉంటుందా? లేదా? బీఎంసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో ఎవరు మేయర్ అనేదానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ, శివసేన పొత్తుపై ఎలాంటి స్పష్టత రానప్పటకీ.. ఫలితాలకు ముందునుంచే బీజేపీ పొత్తు సంకేతాలు పంపుతోంది. గొడవలకు స్వస్తి పలికి పారదర్శకతకోసం ఒక్కటవ్వాలంటూ ఫడ్నవిస్ సంకేతాలివ్వగా.. ఇతర నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో విమర్శలను పక్కనపెట్టి ఏకమవ్వాలనే సందేశాన్ని పంపిస్తున్నారు. అటు శివసేన కూడా మేయర్ పీఠం తమదేనంటూనే.. బీజేపీతో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేమంటోంది. పొత్తుపై గతంలో చేసిన ప్రకటనకే (బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు) కట్టుబడతామని ఉద్ధవ్ చెబుతున్నా.. చర్చలు మొదలైతే ఉద్ధవ్ దూకుడు తగ్గించవచ్చని ముంబై రాజకీయ వర్గాలంటున్నాయి. ముంబైలో ‘తెలుగు’ విజయం బీఎంసీ ఎన్నికల్లోని 174 వార్డు (హిందూ కాలనీ) నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన తెలుగు మహిళ కందిక కృష్ణవేణి రెడ్డి (45) విజయం సాధించారు. ఈమె చిత్తూరు జిల్లా, నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డిని వివాహమాడారు. ముంబైలోనే స్థిరపడినా.. కొత్త ఆరూరులో జరిగే గంగజాతరతో పాటు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు ఇప్పటికీ వీరి కుంటుంబం హాజరవుతోంది. -
బీఎస్పీ, ఎస్పీ మద్దతుదారుల తన్నులాట
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్‌వాది పార్టీ, సమాజ్‌వాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఎస్పీ నేత సిద్ధ గోపాల్ సాధు కుమారుడిపై బీఎస్పీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. కర్రలతో కొట్టుకుని రాళ్లను పరస్పరం రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల నుంచి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముగ్గురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగ దఫాలో భాగంగా 53 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం కాస్తంత కలవరానికి గురి చేసింది. సంబంధిత కథనాలకై చదవండి.. ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు -
ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ హత్యాప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. సమాజ్‌వాది పార్టీకి చెందిన నేత కొడుకుపై బీఎస్పీ నేత కుమారుడు దాడికి పాల్పడ్డాడు. అతడిపై తుపాకితో కాల్పులు జరపడంతో ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ చర్యతో మహోబా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సిద్ధ గోపాల్ సాహు కుమారుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. నాలుగో దఫా ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. గురువారం ఉదయాన్నే గుర్తు తెలియని గుండాలు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతడిని కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలయ్యాయి. సిద్ధగోపాల్ కుటుంబం మాత్రం బహుజన్ సమాజ్‌వాది పార్టీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడే ఈ దాడి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
నేడే నాలుగోదశ పోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (గురువారం) నాలుగో దశ పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లో ఉన్న 53 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంతో పాటు, నెహ్రూ కుటుంబం కంచుకోట రాయ్‌బరేలీ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ప్రతాప్‌గఢ్, కౌశంబి, అలహాబాద్, జలౌన్, ఝాన్సీ, లలిత్పూర్, మహోబా, బందా, హమిర్పూర్, చిత్రకూట్, ఫతేపూర్. రాయ్‌బరేలీ జిల్లాల్లో నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తర అలహాబాద్ స్థానంలో అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2012లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 24 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ–5, బహుజన్ సమాజ్ పార్టీ–15, కాంగ్రెస్–6, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.