Minister Pocharam Srinivas Reddy
-
గడువులోగా ప్రీమియం చెల్లించండి: పోచారం
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద రైతులు బీమా ప్రీమియంను గడువులోగా చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు కర పత్రాలు, గోడపత్రికలు ముద్రించి గ్రామాల్లో ప్రచారం చేశామని తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా వర్తించదని, పరిహారం అందదన్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే రైతులందరి బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులే మినహాయించుకుంటాయని పేర్కొన్నారు. బ్యాంకు రుణం తీసుకోని రైతులు తమ మండలంలోని కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియంను చెల్లించాలన్నారు. 2017–18 యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపినట్లు చెప్పారు. కాగా,పీఎంఎఫ్‌బీవై కింద వరి బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని, ఇతర పంటలకు జూలై 31 ఆఖరు అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. -
కౌలు రైతులకు ‘పెట్టుబడి’ ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: రాళ్లూ రప్పలున్న భూముల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అన్నిరకాల భూములకు సాయం అందుతుందని చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, టి.భానుప్రసాద్, భూపాల్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పోచారం సమాధానమిచ్చారు. కౌలుదారులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. భూ యజమానులకే ఇస్తామన్నారు. ఉద్యాన పంటలకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. పెట్టుబడి సాయం కింద చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూసేందుకు సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, తాము కూడా కేంద్ర ఆర్థికమంత్రిని కలిశామని తెలిపారు. పెట్టుబడి పంపిణీ చేపట్టేనాటికి అవసరమైన కరెన్సీ రాష్ట్రానికి రానుం దని తెలిపారు. ఏ బ్యాంకులోనైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులను పంపిణీ చేస్తామని, చెక్కుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 1.42 కోట్ల ఎకరాలకు చెందిన 72 లక్షల మంది రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం చేస్తామని, రబీ లో మాత్రం సాగయిన భూములకే ఇస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని ఖరీఫ్‌కు వచ్చే నెల 19 నుంచి మే నెలాఖరు వరకు అందజేస్తామన్నారు. రబీ సాయాన్ని నవంబర్ 20 నుంచి ఇస్తామన్నారు. ప్రజాప్రతినిధులంతా పెట్టుబడి పంపిణీలో భాగస్వాములవుతారన్నారు. రాష్ట్రం లో 2,638 రైతు మందిరాలను నిర్మిస్తామన్నారు. వాటికోసం 654 చోట్ల ఇప్పటికే భూమి సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి సాయాన్ని తాను వదులుకుంటున్నట్లు సభ్యుడు భూపాల్‌రెడ్డి సభలో ప్రకటించారు. భాషాపండితులకు న్యాయం రాష్ట్రంలో 2,487 మంది భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారని, నియామక నియమావళి సవరించే వరకు స్కూలు అసిస్టెంట్ పదవులను భర్తీ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపే అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని కడియం హామీ ఇచ్చారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని రాములు నాయక్ విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచు తున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘వేటు’ కాస్తా లేటు!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) పాలకవర్గాలపై వేటు వేయాలని సహకార శాఖ నిర్ణయించినా దాని అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వేటు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నెల 17 వరకు నిర్ణయం తీసుకోవడానికి అవకాశముండటంతో వాయిదా పద్ధతిని ఎంచుకు న్నారు. ఆ రెండు పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను ఇంకా కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) పాలకవర్గాల పదవీకాలం శనివారం ముగిసింది. డీసీ సీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్)ల పదవీకాలం ఈ నెల 17 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలపై వాయిదా వేశారు. మొత్తం 906 ప్యాక్స్‌లలో 90 ప్యాక్స్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. వాటి పాలకవర్గాలను రద్దు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. మిగతా సంఘాల చైర్మన్లు పర్సన్ ఇన్చార్జులుగా నియమితులయ్యారు. కొన్ని సంఘాల సభ్యులు సహకార శాఖకు బకాయిపడ్డారు. పాలకవర్గ గడువు తీరడం, మళ్లీ కొనసాగాలంటే బకాయిలు చెల్లించాల్సి రావడంతో అనేకమంది వాటిని తీర్చినట్లు చెబుతు న్నారు. రూ.20 కోట్లకుపైగా బకాయి సొమ్ము తమకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. మంత్రి పోచారం సమీక్ష... సహకార శాఖపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పార్థసారథి, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య శని వారం సమీక్ష జరిపారు. జిల్లా సహకార అధికారులతో ఆయన సమావేశమై పలు వివరాలు తీసుకున్నారు. సహకార సంఘాల పదవీ కాలం ముగియడం, పర్సన్ ఇన్చార్జుల నియామకం నేపథ్యంలో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. -
చట్ట సవరణ తర్వాతే ‘సహకార’ ఎన్నికలు
బీర్కూర్: పంచాయతీరాజ్ చట్ట సవరణ తరహాలోనే సహకార చట్టాన్ని సవరించిన తర్వాతే సహకార సంఘా లకు ఎన్నికలు నిర్వహిస్తామని వ్యవ సాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని శ్రీవేంకటేశ్వరాలయంలో నిర్వహించిన గోదా దేవి–రంగనాథుల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సహకార ఎన్నికల విషయమై ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశమయ్యా మన్నారు. పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహిం చడం, అఫీషియల్, నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిలతోపాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ వేయడం, ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
కౌలు రైతులకు సాయం చేయలేం
♦ రాజకీయాలకతీతంగారైతు సమన్వయ సమితులు ♦ వ్యవసాయశాఖ మంత్రి పోచారం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం చేయడం న్యాయపరంగా సాధ్యంకాదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, నిర్వహణపై డివిజన్, మండల వ్యవసాయ అధికారుల శిక్షణ’ కార్యక్రమంలోనూ, తర్వాత విలేకరులతోనూ మంత్రి పోచారం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా, కలెక్టర్ల సమావేశం వల్ల రాలేకపోయారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు వచ్చాయని, రైతులు ఆర్థికంగా బలోపేతమవుతూ బ్యాంకులను శాసించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. 1936 తర్వాత రాష్ట్రంలో భూసర్వే జరగలేదని చెప్పారు. ప్రతీ రైతుకు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న నేపథ్యంలో భూ సర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతీ గ్రామంలో 15 మంది సభ్యులతో రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తారని, అందులో ఒకరు సమన్వయకర్తగా ఉంటారని వివరించారు. ప్రతీ సంఘంలో మూడో వంతు మహిళలు ఉంటారని తెలిపారు. మండల, జిల్లా సమన్వయ సమితుల్లోనూ 24 మంది సభ్యులుగా ఉంటారని, వీటిల్లోనూ మూడో వంతు మహిళలు ఉంటారని వివరించారు. రైతు సమితుల సమన్వయకర్తలకు గౌరవ వేతనం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,24,06,474 పట్టాదారులు చెరువులు, కుంటలపై ఆధారపడి ఉన్నారన్నారు. ఈ నెల 9వ తేదీలోపు సమితుల ఏర్పాటు, ఈ నెల 10–14 తేదీల మధ్యలో మండల సదస్సులు, 15 నుండి డిసెంబర్ 15 వరకు భూముల రికార్డుల ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలకుగాను ప్రతి 9 గ్రామాలకు ఒక బృందం చొప్పున 1,193 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ బృందం ప్రతీ గ్రామంలో 10 రోజులుండి భూములను పూర్తిగా సర్వే చేస్తుందన్నారు. ఈ టీం భూమి కొలతల వివరాల పట్టిక, రైతులవారీగా భూముల వివరాలను సేకరిస్తుందని తెలిపారు. అనంతరం పాస్ పుస్తకాలను రూపొందించి రైతులకు అందజేస్తామన్నారు. రికార్డులను క్రమబద్ధీకరించడానికి ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ను ప్రారంభి స్తామనీ, ప్రతీ తహసీల్దార్ రిజిస్ట్రార్‌గానూ ఉంటారనీ అన్నారు. మరో 526 ఏఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని చెప్పారు. రైతు అవార్డు సీఎం తీసుకుంటారో లేదో..! ముఖ్యమంత్రికి రైతు అవార్డు బోగస్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరుపారేసుకోవడంపై మంత్రి పోచారం మండిపడ్డారు. అవార్డు కోసం తాము ఎవరినీ బతిమిలాడుకోలేదని అన్నారు. మూడేళ్లలో తాము రైతులకు చేసిన సేవలకు గుర్తింపుగా సంబంధిత సంస్థే ప్రకటించిందని చెప్పారు. రైతు అవార్డును ముఖ్యమంత్రి తీసుకుంటారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బ్రేకింగ్: మంత్రి పోచారంకు అస్వస్థత!
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తీసుకోకపోవడంతో ఆయన స్వల్పంగా అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని.. తిరిగి అతిథి గృహానికి చేరుకున్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు మొదట ఆయనను తిరుమలలో ఉన్న అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతానికి పోచారం ఆరోగ్యం బాగానే ఉందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మంత్రి పోచారం అస్వస్థత నుంచి కోలుకున్నారని, చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబసభ్యులు, స్పీకర్, మంత్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రి పోచారం కూడా ఉన్నారు. -
బ్రేకింగ్: మంత్రి పోచారంకు అస్వస్థత!
-
గ్రీన్హౌస్ సాగులో నెదర్లాండ్ సహకారం
మంత్రి పోచారంతో నెదర్లాండ్ దౌత్య బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీ హౌస్) సేద్యంలో తెలంగాణ రైతులకు సాంకేతిక సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెదర్లాండ్ హామీ ఇచ్చింది. ఢిల్లీలోని నెదర్లాండ్ ఎం బసీ కాన్సుల్ జనరల్ గైడో తైల్ మెన్ ఆధ్వ ర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సచివాల యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమైంది. చిన్నగా ఉన్నా తమ దేశం వ్యవసాయం, మాంసం, పాడి ఉత్పత్తు ల ఎగుమతులలో ఎంతో అభివృద్ధి సాధించిందని, పూల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని నెదర్లాండ్ ప్రతినిధులు మంత్రికి వివరిం చారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేవిధంగా పరిశ్రమలు నెలకొల్పాలని ఆ దేశ ప్రతినిధులను కోరారు. తెలంగాణలో వ్యవ సాయం, అనుబంధ రంగాలలో అపార అవకాశాలు ఉన్నాయని... రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పుత్తులకు అగ్రి ప్రాసె సింగ్ యూనిట్లను జోడిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించాక రాష్ట్రంలో గ్రీన్హౌస్ సేద్యానికి ప్రాధా న్యం ఇచ్చామని... ఇప్పటివరకు వెయ్యి ఎకరాలకు పైగా అనుమతులు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ భారీగా సబ్సిడీలు ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ దేశంలోని అత్యు త్తమ వ్యవసాయ వర్సిటీ వాగెనింగన్లు పరిశోధన రంగంలో పరస్పరం సహకరించు కోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశంలో వ్యవసా యశాఖ కమిషనర్ జగన్మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ పంటలు అధ్వానం
మంత్రికి జిల్లా వ్యవసాయాధికారుల నివేదన హైదరాబాద్: ప్రస్తుతం ఖరీఫ్ పంటలు అధ్వానంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శని వారం సచివాలయంలో జిల్లా జేడీఏలు, ఇతర వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. జేడీఏలు జిల్లాల్లో పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మొక్కజొన్న ఎండిపోతోందన్నారు. పోచారం మాట్లాడుతూ బోర్లల్లో తక్కువ నీరుండి పంటలకు సరిపోని పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు స్ప్రిం క్లర్లు ఇవ్వాలని, వాటిని ఎలా అందించాలో ఉద్యానశాఖ కసరత్తు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఖరీఫ్ పంటలు నష్టపోతే ముందస్తు రబీకి సన్నాహాలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోందని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
మంత్రి పోచారం దంపతుల వరుణయాగం
బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. -
నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు
మల్లన్నసాగర్ సాధన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం, సీతారాంపల్లి, రామచంద్రబోస్, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా కోటి ఎకరాలను సాగులోకి తెస్తామన్నారు. కాళేళ్వరం ఎత్తిపోతలు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి గోదావరి నీటితో రైతుల పాదాలు కడుగుతామని మంత్రి చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు. గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని, వాటిని మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చ0గొడుతూ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫెదారు రాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, షకీల్ అహ్మద్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐదారు రోజుల్లో మరో రూ.2,020 కోట్లు
మూడో విడత రుణమాపీని బ్యాంకులకు విడుదల చేస్తాం: పోచారం సాక్షి, హైదరాబాద్: మూడో విడత విడుదల చేయాల్సిన రుణమాఫీలో మిగిలిన సగం సొమ్మును ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధిపతులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడో విడతలో సగం రూ. 2,019.99 కోట్లు ఇటీవల విడుదల చేశామని... మిగిలిన రూ. 2,020 కోట్లు ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో సరాసరి 371.2 ఎం.ఎం. వర్షం కురవాల్సి ఉండగా... 435.9 ఎం.ఎం. కురిసిందని వివరించారు. ఆరుతడి పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయని.. మొత్తం 70 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయన్నారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గమే హరితహారంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. -
మల్లన్నసాగర్‌పై నీచ రాజకీయాలు!
సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల క్షేమం కోరి చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డుతగలడం నీచరాజకీయాలకు దిగజారడమేనని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడంతో పాటు ప్రజలు మమ్మల్ని గుర్తించరనే భయంతో ఏదో ఒక అంశాన్ని ముందేసుకొని చెడగొట్టే కార్యక్రమాలకు దిగుతున్నారన్నారు. అందులో భాగంగానే మల్లన్నసాగర్ భూనిర్వాసితులను రెచ్చగొడుతున్నారని, ప్రతిపక్షాలు సహకరించి పద్ధతి మార్చుకోకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి హెచ్చరించారు. మంగళవారం నిజామాబాద్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఉత్తర తెలంగాణ లో బీడుబడిన భూములను సస్యశ్యామలం చేసి శాశ్వతంగా కరువు బారిన పడకుండా చేయడానికి రూ. 83 వేల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు కలిపి పాత ఆయకట్టు 20 లక్షలు , కొత్త ఆయకట్టు 20 లక్షలు మొత్తం 40 లక్షల ఆయకట్టుకు నీరు ఈ ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం టెండర్లు పిలిచారని పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో తమకు ప్రజల మద్దతు ఉండదని భయంతో మల్లన్నసాగర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అక్కడే నిర్మిస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్న సోయి కేసీఆర్‌కు వచ్చిందని, కాని నీకు ఎందుకు రాలేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. 60 ఏళ్ల పరిపాలనలో మీరు ఏమి చేశారని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కుట్రరాజకీయాలు చేస్తున్నారని, నీచరాజకీయాలకు దిగజారుతున్నారని మండిపడ్డారు. ఎవరైన నీరు, ప్రాజెక్టులు తెస్తుంటే శత్రువులైన సహకరిస్తారని అలాంటిది రాజకీయ అజ్ఞానులు టీడీపీ, కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్షాలు అడ్డుతగిలి అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదారు రాజు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్మే బిగాల గణేష్‌గుప్త, నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
హరిత ఉద్యమం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం జిల్లా లో ఉద్యమంలా సాగుతోంది. ఈ నెల 8న వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ డిగ్రీ కళాశాల మైదానంలో అ«ధికారికంగా ప్రారంభించారు. సుమారు 14 రోజుల పాటు నిర్వహించే హరితహారంలో 3.35 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా.. అధికారులతో సమీక్షలు జరిపిన మీదట కలెక్టర్ డాక్టర్ యోగి తారాణా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో హరితహారం విజయవంతం కోసం ప్రజాప్రతి ని««దlులు, అధికారులు సర్వశక్తులొడ్డుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 22.01 లక్షలు మొక్కలు నాటారు. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 1 కోటి 51 లక్షల 13 వేల 819 మొక్కలు నాటినట్లు కలెక్టర్ కార్యాలయవర్గాలు తెలి పాయి. నిజామాబాద్ నగరంలో నగరపాలక సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన హరితహారం భారీ ర్యాలీలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మేయర్ ఆకుల సుజాత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త, జేసీ రవీందర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంత రం నిజామాబాద్ నగరంలో వివిధ డివిజన్లలో మొక్కలు నాటారు. అబ్కారీశాఖ మంత్రి టి పద్మారావు కామారెడ్డి మండలం రాఘవాపూర్‌లో కల్లుగీత సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గం గాధర్ గౌడ్, ఎక్సైజ్ డీసీ డేవిడ్ రవికాంత్, డీఆర్డీఏ పీఈ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యే హన్మంత్ సిం« దే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. నిజామాబాద్ రూర ల్ నియోజకవర్గం సిర్నాపల్లిలో అంతకు ముం దు రోజు రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిం చేందుకు ఆయన జక్రాన్‌పల్లి మండలం పడకల్లో రాత్రి బస చేసి గ్రామస్తులు, అ«ధికారులు, ప్రజాప్రతినిధులతో హరితహారం ప్రాధాన్యం వివరించారు. ఎల్లారెడ్డి, బాల్కొండ, బోధన్, ఆర్మూరు, బాన్సువాడలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమంలా హరితహారం సాగింది. పుట్టుక నుంచి చచ్చేవరకు .. మనిషి పుట్టుక మొదలు చనిపోయేంత వరకు కట్టె అవసరమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అందుకు చెట్టే ప్రధానమని ఆలోచించని మనిషి, పూర్వికులు నాటిన చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తుండటం వలన వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదన్నారు. నిజామాబాద్ పట్టణంలోని నెహ్రుచౌక్ వద్ద హరితహారం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఐటీఐలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు. అడవులు అధికంగా ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నయనే విషయాన్ని ప్రజలు గ్రహించి మన జిల్లాలోనూ ఎక్కువ మొత్తం మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. చెట్టుతోనే మనకు మనుగడ అని చెట్టు లేని యేడల భవిష్యత్తులో ప్రాణవాయువును ప్రతినిత్యం 3 సిలిండర్ల ప్రకారం కొనాల్సి వస్తుందన్నారు. నిజామాబాద్‌లాంటి çనగరంలో వారం రోజులకు ఒక మారు స్నానం చేయాల్సి న దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న వ్యవసాయ దినోత్సవం సందర్భంగా 2.50 లక్షల మొక్కలు నాటాలనుకున్నా.. హైదరాబాద్ మినహా 9 జిల్లాలో మొక్కల కొరత వల్ల ఈనెల 22వ తేదీన జరుపుకుంటున్నామని వివరించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ తన చిన్నతనంలో అడవులలో పండ్లను తినేవారిమని, చెట్ల ఆకులలో భోజనం చేసేవారిమని అన్నారు. వారం రోజులు ముసురుకురిసేదనీ, ఈ రోజు ఆ ఆనవాల్లె లేకుండా పోయాయని దానికి కారణం చెట్లను నరకడమే నన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రికైన హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాన మంత్రిని కొనియాడారని ఇలాంటి బహత్తర కార్యక్రమం 29 రాష్ట్రాలలో తెలంగా ణ రాష్ట్రంలో చేపట్టడం అభినందనీమని అన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగి తారాణా మాట్లాడుతూ విచక్షణా రహితంగా అడవులలోని చెట్లను నరికివేయడంతో వర్షాలు పడకపోవడం వల్ల తాగునీరు కొంటున్నామని, ఈ మాదిరిగా రాబోయే 5 సంవత్సరాలు మొక్కలు నాటకున్నచో ఇతర అవసరాలకు వేల రూపాయలతో నీరు కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో టారె ్గట్ ప్రకారం 5 లక్షల 61 వెయ్యి మొక్కలను నేటి పచ్చదనంతో పలకరించేలా చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సం యుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ రుణాలిచ్చేలా చూడండి
జిల్లా వ్యవసాయాధికారులు, బ్యాంకు మేనేజర్లకు పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్ : రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా వ్యవసాయాధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్లు చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, విత్తన గ్రామ కార్యక్రమం, ఇప్పటివరకు జరిగిన పంటల సాగు, హరితహారంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి పంట రుణాల రెన్యువల్స్ పూర్తిచేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్లకు సూచించారు. వడ్డీ లేని రుణాల కింద రైతుల నుంచి ఎటువంటి వడ్డీ వసూలు చేయకూడదని ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లా బ్యాంకులకు మార్గదర్శకాలు పంపించామన్నారు. హరితహారం కింద రైతులు తమ పొలాల గట్లమీద, ఇతరత్రా పెద్దఎత్తున మొక్కలు నాటేలా చూడాలన్నారు. పసుపు పంటకు కొత్త విత్తనం తీసుకున్న రైతులు... పంట పండాక దాన్నే విత్తనంగా వాడుకోవాలని సూచించారు. -
పోచారం... తప్పుకో : షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్ : నాసిరకం, నకిలీ విత్తనాలు కొంటే ప్రభుత్వానికి బాధ్యత లేదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రివర్గం నుంచి వైదొలగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తో కలిసి అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రుణాలు దొరకక, నాణ్యమైన విత్తనాలు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రెండు విడతల రుణమాఫీని ఒకేసారి చేయాలి’ అని షబ్బీర్ విమర్శించారు. ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్ (ఈ నెల 7) నాడు కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించాలని సీఎంకు షబ్బీర్లేఖ రాశారు. -
మల్లన్న సాగర్‌పై అనవసర రాద్ధాంతం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు మల్లన్న సాగర్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఎత్తై ప్రాంతం కావడం వల్ల, ఎత్తిపోతల అవసరం లేకుండా కాల్వల (గ్రావిటీ) ద్వారా నీరిచ్చే అవకాశం ఉండటం వల్ల మల్లన్న సాగర్‌ను చేపట్టామన్నారు. తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులంతా తెలంగాణ బిడ్డలేనన్నారు. విపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వాసితులను రె చ్చగొడుతున్నాయని, ఏ ప్రాజెక్టు నిర్మించినా ముంపు ఉంటుందని అన్నారు. -
జల పరిరక్షణతోనే మానవాళి భవిష్యత్తు!
తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సులో వక్తలు - వాన నీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలని పిలుపు - వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఇకపై ఎరువుల వాడకమన్న పోచారం - 230 కోట్ల మొక్కలు నాటుతామన్న మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేలా చర్యలు చేపట్టినప్పుడే మానవాళి మనుగడ సాగిస్తుందని తెలంగాణ జల సంరక్షణ వేదిక అభిప్రాయపడింది. భూగర్భ జలాలు పెంచుకునే ప్రణాళికలను రూపొం దించి, దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఉధృతంగా సాగాలని పిలుపునిచ్చింది. భవిష్యత్‌లో జల సంక్షోభాలు తలెత్తకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ జల సంరక్షణ వేదిక, దక్కన్ వాటర్ హార్వెస్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్తంగా ‘మేకింగ్ తెలంగాణ వాటర్ ఎఫిషియంట్ స్టేట్ బై 2020’ పేరిట సదస్సు నిర్వహించాయి. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వేదిక వ్యవస్థాపక చైర్మన్ వి.ప్రకాశ్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సింగరేణి డెరైక్టర్ మనోహర్‌రావు, సీనియర్ జర్నలిస్టు అష్టకాల రామ్మోహన్ హాజరయ్యారు. నీటి సంక్షోభానికి వర్షపాతం తగ్గడం కారణం కాదని... కురిసిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోకపోవడమే కారణమని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాలు పెంచుకునేలా చర్యలు చేపట్టాలని.. వాన నీటిని సంరక్షించి, భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఎరువులు: పోచారం రాష్ట్రంలో ఎరువుల వాడకంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తారణాధికారి, మం డలానికో వ్యవసాయాధికారి, డివిజన్‌కు ఒక ఏడీ ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారి రైతుల పొలాలను పరిశీలించి చేసే సూచనల మేరకే ఫర్టిలైజర్ దుకాణాలవారు ఎరువులు, పురుగు మం దులు ఇచ్చే విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు 230 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. ఇప్పటికే 15కోట్ల మొక్క లు నాటామని, రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సేంద్రియ ఎరువుల వాడకం వైపు రైతులు మళ్లేలా అవగాహన, ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. -
కేంద్రం తీరువల్లే పత్తికి దెబ్బ
జగదేవ్‌పూర్: కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ధోరణి వల్ల పత్తికి ఎదురుదెబ్బ తగిలిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో రాష్ట్రంలో పత్తి పంట సాగు చేసే పరిస్థితి లేదన్నారు. ఈసారి రైతులు పత్తి జోలికి వెళ్లొద్దని సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద విత్తన సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని తెలిపారు. మొత్తం 52 లక్షల మంది రైతులు ఉండగా, 906 సొసైటీలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో రైతులు ఏ పంటలు సాగు చేస్తారో సర్వే చేసి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత ఏడాది ధరలతోనే ఈ సారి కూడా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. విత్తనాలు సిద్ధం... ప్రస్తుతం 60 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా 7.80 లక్షల క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేశామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మన వద్దే సబ్సిడీలు అధికమన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు దాదాపు రూ.400 కోట్ల సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో 24, 500 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఇక్కడి రైతులు రారాజులు అని సంబోధించారు. కల్యాణ లక్ష్మికి రూ.510 కోట్లు.. కల్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.510 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే వర్తించే కల్యాణలక్ష్మి ఇక నుంచి బీసీలకు కూడా వర్తిస్తుందన్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరు కల్యాణలక్ష్మికి అర్హులేనన్నారు. -
దివాలా సొసైటీలకే ఇవ్వాలా..?
- వాటికి ఎరువులు, విత్తనాల పంపిణీ బాధ్యతపై విమర్శలు - 906 సహకార సొసైటీలకుగాను 400 నష్టాల అంచుల్లోనే - వ్యవసాయశాఖ నిర్ణయంతో రైతులకు తప్పని కష్టాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రాథమిక సహకార సొసైటీ(ప్యాక్స్)ల ద్వారా విత్తనాలు, ఎరువులను రైతులకు సరఫరా చేయాలని రాష్ట్రవ్యవసాయ శాఖ నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సహకార సొసైటీలు దివాలా అంచున ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 906 సొసైటీలుండగా వాటిల్లో 400 సొసైటీలు నష్టాల్లో ఉన్నాయని, సరైన నిర్వహణ లేక కొన్ని కునారిల్లుతున్నాయని, ఇలాంటి స్థితిలో వాటికి విత్తనాలు, ఎరువులను విక్రయించే బాధ్యత ఇస్తే సమస్యలు తప్పవంటున్నారు. గతంలో అనేక సొసైటీలు ఇలా మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు. 50 శాతం సబ్సిడీపై...: మండల కేంద్రాల నుంచి కాకుండా గ్రామాల్లో ఉండే సహకార సొసైటీల ద్వారానే విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సహకార సొసైటీల ద్వారానైతే రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో చేరతాయనేది వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్దేశం. ఈ ఏడాది మొత్తం 7.5 లక్షల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. వాటి విలువ రూ.412 కోట్లు. రైతులకు సబ్సిడీ పోను సర్కారు స్వయం గా రూ. 206 కోట్లు భరించనుంది. 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 3.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 77 వేల క్వింటాళ్ల వేరుశనగ, 70 వేల మొక్కజొన్న, 80 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేస్తాయి. అలాగే 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. బ్యాంకు గ్యారంటీ ఉన్నా... సొసైటీలకు ప్రభుత్వం కేటాయించే విత్తనాలు, ఎరువుల విలువ మేరకు సహకార బ్యాంకులు ప్రభుత్వానికి గ్యారంటీ ఇస్తాయి. బ్యాంకు గ్యారంటీ ఉన్నా నష్టాల బాటలో ఉన్న 400 సొసైటీలు విత్తనాలు, ఎరువులు తీసుకొని ఏ మేరకు వెన క్కు తిరిగి చెల్లిస్తాయన్న ప్రశ్న అధికారుల ను వేధిస్తోంది. అవి చేతులెత్తేస్తే సహకార బ్యాంకులు కుప్పకూలిపోతాయంటున్నారు. గతేడాది మార్క్‌ఫెడ్‌కు కొన్ని సొసైటీలు రూ. 3 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం తగదని, బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన ఇంజినీర్లు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, భూపతిరెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, మేయర్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటి మొక్కలు.. రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, 11 రకాల కాంపోనెంట్ల కింద 3.35 కోట్ల మొక్కలను పెట్టేందుకు ఈ నెలాఖరులోపు ఉపాధి పనులతో గుంతలను తవ్వించాలని సూచించారు. వర్షాలు ప్రారంభం ఆయన వెంటనే మొక్కలు నాటడాన్ని చేపట్టి ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగస్వాములను చేసేందుకు మండలాలు, గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ నివేదికలను ప్రజాప్రతినిధులకు అందజేయాలన్నారు. మిషన్ కాకతీయ.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద రూ. 234 కోట్లతో 76,724 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు మంజూరు చేసిన 658 పనులలో 571 పనులు పూర్తి అయ్యాయని పోచారం తెలిపారు. మిగిలిన 87 పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ కింద గుర్తించిన 674 పనులలో 50 వేల ఎకరాలకు నీరు అందించే 649 చెరువుల పునరుద్ధరణకు రూ. 227 కోట్ల అంచనాతో పనులను మంజూరయ్యాయన్నారు. వాటిలో 610 పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, 604 పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోపు అగ్రిమెంట్‌తో పాటు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిలువ చేసేందుకు అనువుగా చెరువుల తూములు, అలుగులను ముందస్తుగా పటిష్టపర్చాలని సూచించారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునికీకణకు ప్రభుత్వం రూ. 115 కోట్లను మంజూరు చేయనుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నామన్నారు. పథకాల అమలులో మనమే ఫస్టు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మన జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అధికారులకు సూచిం చారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 శాతం ఉంటే, జిల్లాలో 21.46 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చెట్లకు కూడా నీరందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం లోని రఘునాథ చెరువును ట్యాంకు బండ్‌గా మార్చనున్నామని కవిత తెలిపారు. చెరువు పక్కనుంచే నిజాంసాగర్ కాలువ వెళ్తున్నందున అందులోనుంచి నీరు ఈ చెరువులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ట్యాంకు బండ్ నిర్మించనున్నట్లు తెలిపారు. జూన్ 10 నుంచి హరితహారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటించడానికి ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హరితహారం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లల్లో వేయి ఎకరాలలో గమ్‌కరియా మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసేందుకు సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల ప్రభుత్వ భూములలో 42.22 ఎకరాలను సేకరించామని తెలిపారు. అలాగే 2.65 ఎకరాల ప్రైవేటు భూములలో రెండు ఎకరాలను సేకరించి అప్పగించామన్నారు. పైపులైన్లు, ఇతర నిర్మాణ పనులకు అవసమరైన 36 హెక్టార్ల అటవీ భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే 36 రైల్వే క్రాసింగ్‌ల గుండా పైపులైన్లు నిర్మించేందుకు రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి 35, ఆర్‌అండ్‌బీకి సంబంధించి 451, పీఆర్‌కు సంబంధించి 748, సాగునీటి కాలువలకు సంబంధించి 206 చోట్ల క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన అన్ని పనులను ఏకకాలంలో పూర్తి చేయించేందుకు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘భగీరథ’ వేగం పెంచండి ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలో రూ. 4 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం చేపడుతోందని, చరిత్రలో ఇది ఒక అద్భుత విషయమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ. 41.11 కోట్లతో జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్ పనులలో ఎక్కువ మంది కూలీలను నియమించాలని సూచించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జూన్ 30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూములలో వేసే పైపులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు ‘‘మిషన్ కాకతీయ విషయంలో నాకు ఒక్కసారి కూడా ఇరిగేషన్ ఎస్ఈ, సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు’’ అని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. ఎస్ఈ వద్ద తన ఫోన్ నంబరు కూడా లేదని పేర్కొన్నారు. ఈఈ, డీఈలకు కూడా నేను తెలియదన్నారు. రాజేశ్వర్ ఆవేదనపై మంత్రి పోచారం స్పందించారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో.. ఇందల్వాయి నుంచి ధర్పల్లికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు అత్యంత దారుణంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రోడ్డుకు అనుమతుల విషయంలో అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు బాగు చేయించలేకపోతున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా చెట్లు అడ్డుగా లేవన్నారు. అయినా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు ఇస్తే రోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని, అధికారులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. -
రైతు నెత్తిన ‘సోయా’ టోపీ
♦ విత్తనాల సేకరణలో అడ్డగోలు విధానం ♦ మార్కెట్ ధర రూ.3 వేలుంటే..కంపెనీల నుంచి రూ.6,600కు కొనుగోలు ♦ కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టేందుకే అని విమర్శలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయశాఖ సోయాబీన్ విత్తన కుంభకోణానికి తెరలేపింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పండించాలని పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం.. విత్తనాలను మాత్రం అధిక ధరలకు కొనేందుకు సిద్ధమైంది. వివిధ కంపెనీల నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి వాటికి కోట్లు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగైతే ఈసారి 11.5 లక్షల ఎకరాల్లో సాగును పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 4 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని అంచనా వేసింది. ఆ విత్తనాలను సేకరించే బాధ్యత వివిధ కంపెనీలకు అప్పగించింది. మధ్యప్రదేశ్ నుంచి వాటిని సేకరించే పనిలో కంపెనీలున్నాయి. ప్రభుత్వం క్వింటాల్ సోయాబీన్ విత్తన ధరను రూ.6,600 ఖరారు చేసింది. అందులో 33.33 శాతం సబ్సిడీని భరించి రైతులకు రూ.4,400 ధరకు అందజేస్తామని ఇటీవల ఉత్తర్వులిచ్చింది. కానీ ఈ ఏడాది సోయాబీన్ ధర మార్కెట్లో గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.3 వేలకు మించి ధర పలకడంలేదని స్వయంగా మార్కెటింగ్ శాఖే పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల కోసం ఏకంగా రెండింతల ధరను ఎలా ఖరారు చేశారో అంతుబట్టడం లేదు. ఒక్కో క్వింటాలుకు రైతుపై రూ.800 భారం ప్రస్తుత ధరను లెక్కలోకి తీసుకోకుండా గతేడాది ధరను అధికారులు ఎలా ఖరారు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో ధర ప్రకారమే రైతులు కొనుగోలు చేస్తే వారికి రూ.3 వేలకే దొరుకుతుంది. ఒకవేళ దాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,600కు మించి ధర ఉండదంటున్నారు. అలాంటిది రైతులకు క్వింటాలుకు రూ.4,400కు కట్టబెట్టబోతున్నారన్న మాట. ఈ లెక్కన రైతులపై ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ.800 భారం పడనుంది. ఇలా కంపెనీల నుంచి అధికంగా కొనుగోలు చేయడం వల్ల రైతులపై రూ.32 కోట్లు, ప్రభుత్వంపై రూ.88 కోట్లు అదనపు భారం పడనుంది. ఈ తతంగంలో ప్రైవేటు కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గతేడాది ధర ప్రకారమే సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ధర తగ్గినా ఎక్కువ ధరతో కంపెనీల నుంచి సోయాబీన్ విత్తనాలు ఎందుకు కొంటున్నారని ప్రశ్నించగా ఆయన సరైన సమాధానమివ్వలేదు. -
తెలంగాణకు ‘రసాయన’ ముప్పు!
♦ వ్యవసాయశాఖ మంత్రి పోచారం ♦ రాంపూర్‌లో ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’ ప్రారంభం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రమాదం పొంచి ఉందని, ఇకనైనా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో పంజాబ్ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం రాంపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, పంజాబ్ నుంచి ఢిల్లీకి చికిత్స నిమిత్తం రోగులు రైలులో వెళ్లగా ఆ రైతులకు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్ అని పేరొచ్చిందని చెప్పారు. భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల భూమికి 10 లక్షల యూనిట్లుగా విభజించి భూసా ర పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భూసార పరీక్ష అనంతరం రైతులకు భూసార మట్టి పరీక్షా పత్రాన్ని అందిస్తామని తెలిపారు. -
వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంగళవారం అట్టుడికింది. మంత్రిని ఘెరావ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో రణరంగంగా మారింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్య పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా... నేరుగా భర్తీ చేయాలన్న డిమాండ్‌తో వెటర్నరీ విద్యార్థులు వారం రోజులుగా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ వర్సిటీలో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతుండడంతో... ఆయనకు తమ సమస్యలు చెప్పుకుందామని కొందరు వెటర్నరీ విద్యార్థులు వచ్చారు. కానీ మంత్రిని కలవడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని వెనక్కి పంపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న దాదాపు 500 మంది విద్యార్థులు సమావేశ మందిరం వద్దకు వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మంత్రి పోచారంను ఘెరావ్ చేశారు. పోలీసులు విద్యార్థులను పక్కకు నెట్టి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు.. సమావేశ మందిరంలోని కుర్చీలు, బల్లలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో సాయికిరణ్, శ్రీధర్, బి.రాకేష్ అనే ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంత్రిని కలసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎంకు విన్నవిస్తా: పోచారం పోలీసుల సహాయంతో సమావేశ మందిరంలోకి వెళ్లిన మంత్రి పోచారం.. విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో బయటకు వచ్చి మాట్లాడారు. వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశం తన పరిధిలో లేదని.. దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. మొత్తం 276 వైద్య పోస్టులుంటే అర్హులైన వారు 175 మందే ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గోశాలలకు ఉచితంగా గడ్డి సరఫరా కరువు పరిస్థితుల్లో రైతులకు మరింత అండగా ఉండాలని వర్క్‌షాప్ సందర్భంగా అధికారులకు మంత్రి పోచారం ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కొడంగల్, ఆలంపూర్, షాద్‌నగర్, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లోని గోశాలల్లో పశువులకు ఉచితంగా గడ్డి సరఫరా చేయాలని సూచించారు. 231 కరువు మండలాల్లోని ఒక్కో రైతుకు సంబంధించి ఒక్కో పశువుకు వచ్చే 2 నెలల పాటు వంద కిలోల దాణాను 50 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లను ఈ ఏడాది 100కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలకు ప్రతి లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తామన్నారు. -
తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సవరణలను సభ తిరస్కరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాల నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రవాణా, హోంశాఖ, వ్యవసాయం, పశు సంవర్ధనం, మత్స్య పరిశ్రమ, సహకార రంగాలకు చెందిన పద్దులకు ఆదివారం ఆమోదం లభించింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ముఖ్యపట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పోలీసుల వారంతపు సెలవును త్వరలో అమలు చేస్తామన్నారు. భూసార పరీక్షలకు ప్రత్యేక వాహనం: పోచారం భూసార పరీక్షలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే పశువైద్యం కోసం కూడా 108 తరహాలో వాహనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
మండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్
కరువుపై ప్రభుత్వ సమాధానాన్ని తప్పుబట్టిన విపక్షాలు ♦ రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి: షబ్బీర్ అలీ ♦ అది కమీషన్ కాకతీయ: రాజగోపాల్‌రెడ్డి ♦ ధరల నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలి: ఎంఐఎం ఎమ్మెల్యే అల్తాఫ్ రిజ్వీ ♦ కరువు సహాయక చర్యలు చేపడుతున్నాం: మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాధానంపై మంగళవారం శాసనమండలిలో విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని... 438 మండలాల్లో కరువున్నా, 231 కరువు మండలాలనే ప్రభుత్వం ప్రకటించిందని మండిపడ్డాయి. రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశాయి. కరువుపై మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ నిరసన గా చేస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఖరీఫ్‌కు ముందే ఇన్పుట్ సబ్సిడీ: పోచారం మంగళవారం కరువు పరిస్థితులపై లఘు చర్చ సందర్భంగా తొలుత వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, సాగునీటి కల్పన, పశు దాణా, తదితర సంక్షేమ చర్యలు చేపడుతున్నామన్నారు. కరువు సహాయం కింద కేంద్రాన్ని రూ.3వేల కోట్లు కోరితే రూ.791 కోట్ల సహాయాన్ని ప్రకటించి, రూ.56కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.989 కోట్లను మే నెల తర్వాత ఇన్పుట్ సబ్సిడీగా రైతులకు అందజేస్తుందని ప్రకటించారు. ఇక నిబంధనల ఆధారంగానే కరువు మండలాలను నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులున్నపుడు మహిళా రైతులకు రెండు గేదెలు ఇచ్చే విధంగా రూ.150 కోట్లు బడ్జెట్ కేటాయించామని, 12 వేల మందికి దీనికింద సహాయం అందించామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుంచి జూన్ 1, 2014 వరకు మొత్తం 7,304 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 462 మంది ఆత్మహత్య కేసులను త్రిసభ్య విచారణ సంఘం పరిశీలించిందని... 402 కేసుల్లో రూ.6లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించామని చెప్పారు. వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కరువు పరిస్థితులున్నాయని, వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని విపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మైనర్ ఇరిగేషన్లో ఉన్న అవినీతి మరెక్కడా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) ఆరోపించారు. మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయ అని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు పూర్తయి రైతులకు నీళ్లు అందాలంటే పదేళ్లు పడుతుందని, అప్పటివరకు రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా అని ప్రశ్నించారు. రూ.217 కోట్లు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. కరువు నేపథ్యంలో ధరల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాలని, నిత్యావసరాల ధర లు పెరిగినందున రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై అందించాలని ఎంఐఎం సభ్యుడు అల్తాఫ్ రిజ్వీ కోరారు. అనంతరం సభను ఆదివారానికి చైర్మన్ స్వామి గౌడ్ వాయిదా వేశారు. -
ఉలకని కేంద్రం.. అందని సాయం
♦ పదేపదే అడిగినా జాడ లేని కరువు సాయం ♦ కేంద్ర బృందం పర్యటించి నెల రోజులు దాటినా చర్యలు శూన్యం ♦ మూడుసార్లు ఢిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం ♦ గతవారం ఏపీ, యూపీ, ఒడిశాకు నిధుల విడుదల ♦ కరువు ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న రైతులు సాక్షి, హైదరాబాద్: కరువు సాయం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వంక కన్నెత్తి చూడటం లేదు! తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో కరువు సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలన్నర కిందట నివేదిక పంపించినా ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈ నెలన్నర వ్యవధిలో ప్రభుత్వ పెద్దలు మూడుసార్లు ఢిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సారథ్యంలో మంత్రుల బృందం, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం.. ఇలా మూడుసార్లు హస్తిన వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర హైపవర్ కమిటీ తెలంగాణకు కరువు సాయంపై నిర్ణయం వెల్లడించకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వర్గాలను మరింత విస్మయానికి గురి చేసింది. అదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.433 కోట్ల కరువు సాయం మంజూరుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్, ఒడిశాలకు సైతం కరువు సాయం అందించాలని ఆ భేటీలో నిర్ణయించారు. అదేరోజున నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులను కలిసి కరువు సాయం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. రాష్ట్రంలో పర్యటించి నెల దాటినా.. తీవ్ర వర్షాభావ పరిస్థితులుండటంతో రాష్ట్రం లో 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ నవంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు తగినంత సాయం చేయాలని కోరుతూ అదే రోజున కేంద్రానికి నివేదిక పంపింది. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి విన్నవించింది. డిసెంబర్ 7, 8 తేదీల్లో కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండ్రోజులు వివిధ జిల్లాల్లో పర్యటించింది. తగినంత సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బృందాన్ని కోరారు. అయితే నెలకుపైగా గడిచిపోయినా కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదు. కరువు సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రాన్ని మరోమారు అభ్యర్థించారు. స్వయంగా వెళ్లి రావాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారంను ఢిల్లీకి పంపారు. అయినా స్పందన లేదు. ఇటీవల మెదక్ జిల్లా ములుగులో హార్టికల్చర్ వర్సిటీ శంకుస్థాపనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనూ ఈ ప్రస్తావన రాలేదు. ప్రతిపాదనల లేటుతోనే జాప్యం కరువు ప్రతిపాదనలు సిద్ధం చేసే ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరిగిందని, అందుకే కేంద్రం నుంచి సాయం అందటం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకముందే స్పందించాయి. కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రైతులకు సొంతంగా ఆర్థిక సాయం ప్రకటించాయి. ఒడిశా సర్కారు 12 జిల్లాలను కరువుగా ప్రకటించి, వాటికి రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర సాయం కంటే ముందే రూ.200 కోట్ల ఆర్థిక ప్యాకేజీని రైతులకు ఇచ్చింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే ముందే కరువును ప్రకటించి కేంద్ర సాయం అందుకునే రేసులో ముందు నిలిచాయి. రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందిన వరుస క్రమంలోనే కేంద్రం కరువు సాయం అందిస్తోందని, అందుకే తెలంగాణకు నిధులివ్వడం ఆలస్యమవుతోందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సాయం కోసం రైతుల నిరీక్షణ కరువు ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు, తాగునీరు, ఉపాధి, పింఛన్ల చెల్లింపులకు రూ.3,002 కోట్లు కావాలని కోరుతూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ విభాగాల వారీగా సమగ్ర నివేదికను కేంద్రానికి పంపింది. కనీసం అందులో మూడో వంతు సాయమైనా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ కరువు ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్పుట్ సబ్సిడీ చేతికందితే పంటల పెట్టుబడులకు ఆసరాగా ఉంటుందని ఆశతో నిరీక్షిస్తున్నారు. కానీ రాష్ట్రం కేంద్రం వైపు చూస్తుండటంతో కరువు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలన్నీ పెండిం గ్లో పడ్డాయి. -
ప్రధాని దృష్టికి సాగు సంక్షోభం
♦ వచ్చే నెల గాంగ్టక్లో వ్యవసాయ మంత్రుల సమావేశం ♦ ప్రధాని మోదీ హాజరు... రాష్ట్రం నుంచి పోచారం సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ సమక్షంలో నే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, కరువు, రైతు ఆత్మహత్యలపై సమగ్రంగా చర్చించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ యోచిస్తోంది. వచ్చే నెల సిక్కిం రాజధాని గాంగ్టక్లో అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శుల ప్రత్యేక సమావేశం జరగనుంది. దీనికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యకార్యదర్శి పార్థసారధి హాజరుకానున్నారు. కీలకమైన ఈ సమావేశానికి ప్రధాని ముఖ్యఅతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల వ్యవసాయ మం త్రుల అభిప్రాయాలను ఆయన వినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమస్యలను ప్రధాని దృష్టికి తెచ్చి, రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన అవసరాన్ని మంత్రి పోచారం విన్నవించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్హౌస్, ఉద్యాన పంటల సాగు, బిందు సేద్యంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడం వంటి వాటికి సాయాన్ని కోరనున్నట్లు తెలిసింది. కరువు సాయాన్ని కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. స్వయంగా ప్రధానమంత్రే వస్తున్నందున వీలైనన్ని ఎక్కువ అంశాలను ప్రస్తావిస్తామని వ్యవసాయశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని నిర్ణయించారు. విత్తన భాండాగారానికి సహకారం: కరువుతో అప్పుల భారం పెరిగి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం విత్తన భాండాగారం వైపు అడుగులు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశంలోనే రాష్ట్రాన్ని విత్తన రాజధానిగా, ప్రపంచంలోనే విత్తన హబ్‌గా తయారుచేయడానికి కేంద్రం సహకరించాలని వ్యవసాయ మంత్రుల సమావేశంలో కోరనున్నారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారం పెంపొందించేందుకు కేంద్రం విత్తన ఎగుమతి సంబంధించిన విదేశీ వాణిజ్య అంశాలను పరిష్కరించాలని విన్నవించనున్నారు. విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరనున్నారు. -
కష్టపడితే కోటీశ్వరులవుతారు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు ఆత్మహత్యలు జరగాలని ఎవరూ కోరుకోరు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. కష్టపడితేనే రైతులు కోటీశ్వరులవుతారు. ప్రభుత్వం ఎవరికీ కూర్చో పెట్టి తిండిపెట్టదు. రాయితీలు ఇచ్చి తోవ చూపిస్తుంది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ పాత పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ‘పాలీహౌస్ రైతులు, పాలీహౌస్‌లు నిర్మించే కంపెనీల పరిచయ వేదిక’లో మంత్రి పాల్గొన్నారు. పాలీహౌస్ నిర్మాణ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన రైతులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ‘ప్రభుత్వ కార్యక్రమాల్లో లోపాల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏటా పెట్టుబడి కోసం అప్పులు చేస్తుండటంతో రైతులకు ఏమీ మిగలడం లేదు. అధికారులు వారి భుజం తట్టి ప్రోత్సహించాలి. రైతులు సాగు మానేస్తే దేశం తలకిందులవుతుంది. రాయితీలు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులకు తక్షణమే పరిష్కారం చూపాలి. లేదంటే పరిశ్రమల శాఖ తరహాలో సకాలంలో సమస్యలు పరిష్కరించని అధికారులకు జరిమానా విధిస్తాం’ అని పోచారం హెచ్చరించారు. నాబార్డు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఈ ఏడాది 55 వేల హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1.25 లక్షల ఎకరాల మేర దరఖాస్తులు అందాయని, అందరికీ రాయితీనిచ్చేందుకు నాబార్డు నుంచి రూ.వేయి కోట్లు సాయం కోరాం’ అని మంత్రి పోచారం వెల్లడించారు. పాలీహౌస్ నిర్మాణాలకు గతంలో గరిష్టంగా ఎకరం విస్తీర్ణంలో అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం మూడు ఎకరాలకు పెంచామన్నారు. సబ్సిడీని 50 నుంచి 75శాతానికి పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలను డ్రిప్, పాలీహౌస్ సాగు పరిధిలోకి తీసుకు రావడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా వున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పోచారం వెల్లడించారు. -
మరో రెండు ఏకగ్రీవాలు
♦ టీఆర్ఎస్ ఖాతాలోకి ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానాలు ♦ నామినేషన్లు ఉపసంహరించుకున్న ప్రతిపక్ష అభ్యర్థులు ♦ ఆదిలాబాద్‌లో గులాబీ గూటికి చేరిన టీడీపీ అభ్యర్థి ♦ మెదక్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆదిలాబాద్ టౌన్/సంగారెడ్డి/ఇందూరు: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ రెండూ అధికార పార్టీ ఖాతాలోకే చేరాయి. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పురాణం సతీశ్ ఎన్నిక ఖాయమైంది. ఈ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రియాజుద్దీన్ శుక్రవారం బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీ ఫలితాలను శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. టీడీపీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి నారాయణరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక సీఎం సొంత జిల్లా మెదక్‌లో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఎమ్మెల్సీగా ఆయన మూడోసారి మండలిలో అడుగు పెట్టనున్నారు. ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్‌పాటిల్, టీడీపీ అభ్యర్థి కొన్యాల బాల్‌రెడ్డి తప్పుకోవడంతో భూపాల్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. శివరాజ్‌పాటిల్‌ను హైదరాబాద్ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తమ వెంట తీసుకువచ్చారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్... శివరాజ్‌పాటిల్ నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూశారు. పాటిల్‌ను టీఆర్ఎస్లోకి చేర్చుకుంటున్నట్లు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తెలిపారు. సీఎం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు శివరాజ్‌పాటిల్ తెలిపారు. కాగా, మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి బరిలో నుంచి తప్పుకునేలా చేసినట్లు సమాచారం. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అటు ఎంపీటీసీల ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో ఉన్న జగదీశ్‌ను కూడా టీఆర్ఎస్ వర్గాలు సీఎం క్యాంపు కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. శనివారం జగదీశ్ నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి భూపతి రెడ్డి ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయినట్లే. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ వెనుక మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. -
రబీ సీజన్లో వరి వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రబీ వరి సాగుకు చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రబీ పంటల సాగుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వరి బదులు ఆరుతడి పంటలే సాగుచేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అందుకు రైతులను ఒప్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బావులు, బోర్లు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రధాన జలాశయాల్లోనూ నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే సగానికి పడిపోయాయన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా రబీ వ్యవసాయ పంటల సాగు 19 శాతానికి పడిపోయింది. అందులో ఆహార ధాన్యాల సాగు 13 శాతానికే పరిమితమైంది. వరి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. రబీలో 16.12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా... కేవలం 2 వేల ఎకరాలకే పరిమితమైంది. వరి వేసే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ నేపథ్యంలో వరి బదులుగా వేరుశనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, నువ్వులు, అలసంద వంటి పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. అందులో పెసర, మినుము, నువ్వులు, అలసంద వంటి విత్తనాల సబ్సిడీని 33 శాతం నుంచి 50 శాతం పెంచాలని నిర్ణయించాం’’ అని పార్థసారథి తెలిపారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాల రాయితీని కిలోకు రూ.25 నుంచి రూ.50కు పెంచినట్లు తెలిపారు. తద్వారా ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామన్నారు. విత్తనాలను సంబంధిత సరఫరా సంస్థల ద్వారా పంపిణీకి ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు. -
ఇక్కడి వ్యవసాయంపై అమెరికా ఆసక్తి
♦ ఆ దేశ వ్యవసాయ వ్యవహారాల అధికారి స్కాట్ సిండేలర్ వెల్లడి ♦ ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తామని మంత్రి పోచారానికి లేఖ ♦ అమెరికా ఆసక్తిపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల ఆశ్చర్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ విధానంపై అమెరికా ఆసక్తి ప్రదర్శిస్తోంది. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పద్ధతులను అధ్యయనం చేయాలని యోచిస్తోంది. అమెరికాకు, తెలంగాణకు మధ్య వ్యవసాయరంగంలో అభివృద్ధికి గల అవకాశాలపై అధ్యయనం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు అమెరికా ఎంబసీలోని వ్యవసాయ వ్యవహారాల మినిస్టర్-కౌన్సిలర్ స్కాట్ ఎస్.సిండేలర్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అమెరికా వ్యవసాయ శాఖ కార్యకలాపాలు ఏవిధంగా ఉండాలనే దానిపై మంత్రి పోచారంతో చర్చిస్తానని వెల్లడించారు. భారతదేశ వ్యవసాయరంగంలో తెలంగాణ ఒకానొక ఆదర్శవంతమైన రాష్ట్రమని స్కాట్ సిండేలర్ కొనియాడారు. వ్యవసాయరంగం ఎదుర్కొనే సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన విధానాలను అవలంభిస్తుందన్న అంశాన్ని అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంపై అమెరికా ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తుందన్న అంశం రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా అమెరికాకు చెందిన ఒక కీలకాధికారి రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు లేఖ ద్వారా తెలియజేయడం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. అధికారులూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని, ప్రపంచంలోనూ ఒకానొక కీలకమైన ప్రాంతంగా చేయాలని ఇటీవల జరిగిన జాతీయ విత్తన కాంగ్రెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాలను వెల్లడించింది. ప్రపంచంలో అవకాశం ఉన్నచోట్లా విత్తన ఎగుమతులు చేపట్టాలని నిర్ణయించింది. వ్యవసాయరంగంలో ఎగుమతులకు సంబంధించి ఇదే తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న కీలకమైన కార్యక్రమం. మరోటి జన్యుమార్పిడి పరీక్షలకు అనుమతి ఇవ్వాలన్న దానిపైనా కమిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బహుళజాతి విత్తన కంపెనీలకు వరంగా మారింది. ఈ ఉత్తర్వులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా తెలంగాణకు సంబంధించి కీలకమైన అంశాలు ఇవేనని అంటున్నారు. ఇంతకుమించి అమెరికా ఆసక్తి ప్రదర్శించడానికి ఇతర అంశాలు ఏమీ లేవంటున్నారు. ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో స్కాట్ సిండేలర్ సమావేశం కానున్నారు. -
‘ఈ ఎన్నికతో కాంగ్రెస్ ఖాతా క్లోజ్’
భూపాలపల్లి : కాంగ్రెసోళ్ల మొహం చూస్తే ఎవరూ ఓట్లు వేయరని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇటీవల చేపట్టింది రైతు భరోసా యాత్ర కాదని, కాంగ్రెస్ పరేషాన్ యా త్ర అని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ కావడం ఖాయమన్నారు. టీడీపీ, బీజేపీలు వరంగల్ జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కుంచాల సదా విజయ్‌కుమార్, సిరికొండ ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, నాయకులు మేకల సంపత్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, క్యాతరాజు సాంబమూ ర్తి, పైడిపెల్లి రమేష్, నియోజకవర్గంలో ని టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రపంచ విత్తన హబ్‌గా తెలంగాణ
♦ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో విత్తనోత్పత్తి ♦ ‘విత్తన భాండాగారం’పై దర్శన పత్రం విడుదల సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విత్తన హబ్/వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో కూడిన ‘దేశంలోనే విత్తన భాండాగారంగా తెలంగాణ’ పేరుతో ఒక దర్శన పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన జాతీయ విత్తన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ పత్రాన్ని విడుదల చేశారు. విత్తనోత్పత్తికి రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, అందుకు ప్రభుత్వం అందించే సహకారంపై వివరాలు పొందుపరిచారు. విత్తనోత్పత్తిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అన్ని జిల్లాలు విత్తన ఉత్పత్తికి అనుకూలమైనవేనని, రాష్ట్రంలో అధికంగా వాణిజ్య, కూరగాయల విత్తనాలే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. తెలంగాణ శీతల వాతావరణంతో కూడి ఉంటుందని... ప్రపంచంలో ఇలాంటి వాతావరణం ఉండటం అరుదన్నారు. దర్శన పత్రంలోని ముఖ్యాంశాలివే... ► విత్తన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పించడం. ► విత్తన పరిశ్రమను ప్రోత్సహించేందుకు అనుకూలమైన విధానాల రూపకల్పన. ► విత్తన పంట పండించాక అందుకు అవసరమైన విత్తన ప్లాంట్లు, నిల్వ, రవాణా సౌకర్యం కల్పించడం. ► కొత్త ప్రాంతాలకు ఎగుమతి చేయడం. ► ఆఫ్రికా, ఇండోనేసియా, వియత్నాం, బంగ్లాదేశ్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు వృద్ధి చేసే అవకాశాలను గుర్తించడం. ► విత్తన ఉత్పత్తికి ప్రత్యామ్నాయ ప్రాంతా లను గుర్తించి అందుకు అనుగుణంగా క్లస్టర్లను తయారుచేయడం. ► రాష్ట్ర విత్తన వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం. ► విత్తన ఉత్పత్తి ప్రాంతాలకు పూర్తిస్థాయి విద్యుత్ కల్పించడం. నిల్వల కోసం గోదాములు ఏర్పాటు చేయడం. ► విత్తన కంపెనీలు తమ సామాజిక బాధ్యతగా తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలను కూడా తయారు చేయాలి. -
మంచి విత్తనానికి భరోసా ఇవ్వండి
♦ కంపెనీలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు ♦ దేశంలో అరగంటకో రైతు ఆత్మహత్య ♦ రెండు దశాబ్దాల్లో 2.75 లక్షల మంది బలవన్మరణం ♦ ఈ పరిస్థితి నివారణకు విత్తన కంపెనీలు ముందుకు రావాలి ♦ విత్తన పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి ♦ జాతీయ విత్తన సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: దేశంలో అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నేర నమోదు సంస్థ లెక్కల ప్రకారం 1995 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,75,940 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. సన్న, చిన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనం దొరికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో విత్తన కంపెనీలు భరోసా ఇవ్వాలని, దీనికి కంపెనీలు ఏం చేస్తాయో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరిగే 8వ జాతీయ విత్తన సదస్సును మంత్రి మంగళవారం ప్రారంభించారు. సదస్సు చేసే తీర్మానాలు, సిఫార్సులు, చర్చలు రైతులకు అనుకూలంగా ఉండాలన్నారు. దేశంలోనే కాకుం డా ప్రపంచంలోనే తెలంగాణ విత్తన భాండాగారంగా వెలుగొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 400కుపైగా విత్తన కంపెనీలున్నాయని, గంటకు 670 మెట్రిక్ టన్నుల విత్తనాలను శుద్ధి చేసే సామర్థ్యం వీటి సొంతమని చెప్పారు. దేశానికి అవసరమైన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. అలాగే 14 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. రెండు లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్లలో విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇటీవలే ‘విత్తన గ్రామం’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ ఏడాది 1,458 గ్రామాలను ఎంపిక చేసి 36,415 మంది రైతులను భాగస్వాములను చేసి 14,500 హెక్టార్లలో 3.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. విత్తనాలకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సు ప్రవేశపెడతామని తెలిపారు. పంటల బీమాను విత్తన పంటలకూ వర్తింపజేసే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పాదకతను పెంచడానికి విత్తనం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. పంటల ఉత్పాదకత పెరుగుదలలో ఆధునిక ఆవిష్కరణల పాత్రపై భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తోనఫి మాట్లాడారు. ఈ సదస్సులో కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కాంట్బ్రాడ్ఫోర్డ్, కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి ఎ.కె.శ్రీవాత్సవ, ఇక్రిశాట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పీటర్కార్బెర్రీ, భారత వ్యవసాయ పరిశోధనల మండలి ఏడీజీ డాక్టర్ చౌహాన్, రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు ఎం.వీరబ్రహ్మయ్య, వెంకట్రామిరెడ్డి, ఉషారాణి, కావేరీ సీడ్స్ ఎండీ భాస్కర్‌రావు, నూజివీడు సీడ్స్ సీఎండీ ఎం.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. పేలవంగా ప్రారంభ సభ మొదటి రోజు సభ పేలవంగా జరిగింది. జాతీయ సదస్సుకు సీఎం కేసీఆర్, కేంద్ర వ్యవసాయ మంత్రి వస్తారని ప్రచారం చేశారు. ఇతరత్రా కారణాల వల్ల ఇద్దరూ రాలేదు. సీఎం రాకపోయినా కనీసం ఇతర మంత్రులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో సమన్వయ లోపం కనిపించింది. వివిధ రాష్ట్రాల నుంచి సరైన ప్రాతినిధ్యం కనిపించలేదు. రైతుల జాడ లేకుండా పోయింది. మొత్తం విత్తన కంపెనీల హవానే కనిపించింది. వారి విత్తనాలకు మార్కెటింగ్ చేసుకునే సదస్సుగా పలువురు విమర్శించారు. రైతు సంఘాల ప్రతినిధులెవరినీ ఆహ్వానించలేదు. -
4,442 నుంచి వెయ్యికి తగ్గిన వ్యవసాయ పోస్టులు
మూడు వేలకు పైగా తగ్గడంపై నిరుద్యోగుల ఆవేదన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల తగ్గింపు నిర్ణయం నిరుద్యోగుల్లో గుబులు రేపుతోంది. రాష్ట్రంలో 4,442 సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో)ను నియమిస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని మూడు వేలకుపైగా తగ్గించి వెయ్యికే పరిమితం చేస్తూ తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వ్యవసాయ నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇక ప్రత్యేకంగా ఏఏఈవో పోస్టులంటూ ఉండవని, అవన్నీ ఏఈవో పోస్టులేనని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం మండలానికో వ్యవసాయాధికారి (ఏవో) ఉన్నారని, ఇంకా క్షేత్రస్థాయిలో రైతులకు సేవలు అందించేలా 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున నియమిస్తామంటున్నారు. ఇప్పటికే 1,100 ఏఈవో పోస్టులు ఉన్నందున, మిగిలిన వెయ్యి పోస్టులను ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయన్నా రు. వాస్తవంగా గతేడాది ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థ స్థానే ప్రకటించిన 4,442 పోస్టుల్లో 90 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారికి, 10 శాతం అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారికి కేటాయించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం ఆర్థికశాఖ ఆమోదానికీ పంపారు. కానీ చివరకు వెయ్యి పోస్టులతోనే సరిపెట్టారు. రెండు మూడు గ్రామాలకొకరు: పోచారం ఆదర్శ రైతు వ్యవస్థ స్థానే ఏఏఈవో పోస్టులను భర్తీ చేయాలని తొలుత అనుకున్నామని, ఇప్పుడు ఏఏఈవో అని కాకుండా ఏఈవో పోస్టులనే ప్రభుత్వం భర్తీ చేస్తుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున నియమిస్తామని, రెండు మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ఉంటారన్నారు. -
చేతులెత్తి మొక్కుతున్నా.. ఆత్మహత్యలొద్దు
రైతులను కోరిన మంత్రి పోచారం గజ్వేల్/వర్గల్: ‘చేతులెత్తి మొక్కుతున్నా.. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ సర్కార్ మీకు అండగా ఉం టుంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో బుధవారం రైతులకు భూసార కార్డుల పంపిణీకి వచ్చిన ఆయన చేతులు జోడించి చేసిన ఈ విజ్ఞాపనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. రైతు ప్రభుత్వంపై విమర్శలా? ‘గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటాలు చేయండి. అప్పుడే రైతులకు మేలు చేసినోళ్లవుతరు. రైతుల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తారా?’ అని మంత్రి పోచారం కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్పులకు శ్రీకారం చుడుతున్నారని, దీంతో లక్షలాది ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది జరిగితే తమకు పుట్టగతులు ఉండవని భయపడి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. -
‘కృష్ణా-గోదావరి బేసిన్’ వాటాతో కోటి ఎకరాలకు నీరు
తెలంగాణలో రైతు ఆత్మహత్యలే ఉండవు : మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: కృష్ణా-గోదావరి బేసిన్లో తెలంగాణకు కేటాయించిన నీటిని ఉపయోగించుకుంటే కోటి ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడిం చారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి’పై తయారుచేసిన ప్రతిపాదనలను మంత్రి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రెండు నదుల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు కిందికి పోతుందనీ, ఈ నీటిని సద్వినియో గం చేసుకుంటే తెలంగాణలో రైతు ఆత్మహత్యలే ఉం డవన్నారు. గతంలో ప్రాణహిత- చేవెళ్ల కోసం రూ. 9.500 కోట్లు ఖర్చుచేశారని.. కాని ప్రాజెక్టు నిర్మించకుండా కాల్వలు మాత్రమే తవ్వడంతో నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. గోదావరిపై మహారాష్ట్రలో 187 ప్రాజెక్టులు నిర్మిం చారని, దీంతో శ్రీరాంసాగర్ కు నీరెలా వస్తుందని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-ఇంద్రావతిపై కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు 365 రోజులూ నీటిని అందించవచ్చని, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో మరిన్ని ఏఈవో పోస్టుల భర్తీ త్వరలో మరిన్ని వ్యవసాయ, ఉద్యాన విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారుచేస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయశాఖలో 1,112 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులు ఉన్నాయన్నారు. వీటి సంఖ్య పెంచే విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. 2,500 హెక్టార్లకు ఒక ఏఈవో చొప్పున నియమిస్తే 1,523 పోస్టులు వస్తాయన్నారు. 2 వేల హెక్టార్లకు ఒక ఏఈవో చొప్పునైతే 1,921 పోస్టులు, వెయ్యి హెక్టార్లకు ఒక ఏఈవో చొప్పునైతే 3,842 పోస్టులు వస్తాయన్నారు. వీటిలో ఏ ప్రతిపాదన ప్రకారం పోస్టులను మంజూరు చేయాలన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే వ్యవసాయ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర అధ్యాపక పోస్టులు 637 ఉన్నాయన్నారు. కొత్తగా 4 పాలిటెక్నిక్ కాలేజీలు, పాలెంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో మరో 251 పోస్టులు ప్రతిపాదిస్తున్నామన్నారు. వ్యవసాయ అధికారులకు పదోన్నతులు, వాహన సౌకర్యం కల్పించి, కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
409 మంది రైతుల ఆత్మహత్య
వ్యవసాయశాఖ మంత్రి పోచారం వెల్లడి సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 24 వరకు రాష్ట్రంలో 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందులో 141 బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి మిగిలిన కుటుంబాలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ భూతద్దంలో చూపిస్తున్నాయని విమర్శించారు. పోచారం బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ నాయకులు రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ విధానాల వల్లనే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. రైతు యూనిట్‌గా పంటల బీమా సౌకర్యం ఉన్నట్లయితే ఆత్మహత్యలు జరిగేవి కావని, ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. రైతు రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు విడతల వారీగా ఇస్తున్నామని... ఇక రైతుకు బాకీతో సంబంధం లేదని, అది ప్రభుత్వ బాకీ అని స్పష్టం చేశారు. సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ చేసుకొన్న రైతుల వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసిందని పోచారం చెప్పారు. అలాంటి రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఎవరైనా బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తే తిరిగి చెల్లిస్తామన్నారు. కొన్నిచోట్ల ఆంధ్రకు చెందిన బ్యాంకు అధికారులు ఇంకా బుద్ధి మార్చుకోలేదని విమర్శించారు. లక్షలోపు రుణాలకు వడ్డీ లేదని... మూడు లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 15 లక్షల మంది రైతులకు రూ. 6,631 కోట్ల రుణాలు ఇచ్చామని, ఈ నెలాఖరుకు 35 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వర్షపాతం వివరాలను విపత్తు నిర్వహణ శాఖకు పంపామని, శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా రెవెన్యూశాఖ కరువు మండలాల ప్రకటన చేస్తుందని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో అన్ని రకాల పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అయితే వరి సాగు మాత్రం తగ్గిందని మంత్రి పోచారం పేర్కొన్నారు. -
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా డీఎస్
నిజామాబాద్‌కల్చరల్ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలోని డీ బ్లాక్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తోపాటు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వేమూరి ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏఎస్ పోశెట్టిలు శ్రీని వాస్‌ను కలిసి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిజామాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభ, ఎంపీపీ యాదగిరి, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జీ డాక్టర్ భూపతిరెడ్డి, దాదాన్నగారి విఠల్‌రావు, బీరెల్లి లక్ష్మణ్‌రావు, డి. రాజేంద్రప్రసా ద్, దారం సాయిలు, మాయావార్ సాయిరాం, పాండు, డి. నారాయణరావు, ఆకుల చిన్నరాజేశ్వర్‌తోపాటు కార్పొరేటర్లు, డీఎస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
ప్రాణహితకు ‘మహా’ సీఎం వ్యతిరేకి
మంత్రి పోచారం బాన్సువాడ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించవద్దంటూ ఆందోళనలు చేశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నిం చారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని మరుగున పడేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఏటా సుమారు 1,000 టీఎంసీల నీరు వచ్చి గోదావరిలో కలుస్తోందని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి, సుమారు 470 టీఎంసీల నీటిని మళ్లించేందుకు రూ.35 వేల కోట్లతో పథకం రూపొందించామని తెలిపారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరులోకి, అటు నుంచి మెదక్‌కు, తూఫ్రాన్‌కు, అక్కడి నుంచి హల్దీవాగు మీదుగా నిజాం సాగర్‌లోకి నీరు మళ్లిస్తామని వివరించారు. దీంతో 365 రోజుల పాటు కాలువల్లో నీరు ఉంటుందని, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. తెలంగాణలో ఉన్నది ‘మోతేబర్’ ప్రభుత్వమని, అందుకే ప్రపంచ బ్యాంకుతో పాటు జపాన్, అమెరికన్ తదితర బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పథకాలను చూసి కాంగ్రెస్‌కు మతి పోతోందని, భవిష్యత్తులో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. -
‘గ్రామజ్యోతి’ని బహిష్కరిస్తున్నాం..
నిజామాబాద్‌లో మంత్రి పోచారం ఎదుట ఎంపీటీసీ సభ్యుల నిరసన ప్రగతినగర్ : నిజామాబాద్ గ్రామజ్యోతి డివిజన్‌స్థాయి సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు చేపట్టిన గ్రామజ్యోతిలో తమకు సముచిత న్యాయం కల్చించలేదంటూ నిజామాబాద్ డివిజన్ మండలాల ఎంపీటీసీ సభ్యులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎదుట నిరసన తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగిస్తుండగా వేదిక ముందు బైఠాయించారు. తమకు గ్రామజ్యోతిలో సముచిత న్యాయం కల్పించాలని, లేనిపక్షంలో నేటి నుంచి జరిగే గ్రామజ్యోతిని తమ ఎంపీటీసీల ఫోరం తరఫున బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్యెల్యేలు తమ నియెజక వర్గాల ఎంపీటీసీ సభ్యులను పక్కకు తీసుకెళ్లి బుజ్జగించారు. ఎమ్యెల్యేలు జీవన్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ చైర్మన్ ధపెధర్‌రాజు,వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి పాల్గొన్నారు. -
‘గ్రామజ్యోతి’కి రూ.1,824 కోట్లు
బాన్సువాడ : పార్టీలకతీతంగా గ్రామజ్యోతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలని, ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, పట్టింపులకు వెళ్లొద్దని సూచించారు. ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగే గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు రూ.1,824 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యను పరదోలుతామన్నారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ శాంతారూప్‌సింగ్ గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం మాట్లాడారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా గ్రామజ్యోతి నిధులను కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి తదితర పింఛన్ పథకాలకు ప్రత్యేకంగా ఒక తేదీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే మంజూరు చేస్తామన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచడం తమ ప్రభుత్వ ఘనత అని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభిస్తోందని, త్వరలో పాఠశాలలకు విస్తరింపజేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. రూ.5.05లక్షలతో 560 చదరపు అడుగుల ఏరియాలో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అధికారులే గ్రామాల్లో తిరిగి గుడిసెల్లో, అద్దెకు ఉంటున్న వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా కట్టించిన ఇళ్లను అప్పగిస్తారని తెలిపారు. లబ్ధిదారులు నేరుగా ఇంటికి సున్నం వేసుకుని, గృహప్రవేశం చేయాలని, మిగతా అన్ని పనులను ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించామని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, ప్రతి ఒక్కరికి 100 లీటర్ల నీరు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.3,470 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు, ఎస్సారెస్పీ ద్వారా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాలకు నీరందిస్తామని మంత్రి పోచారం వివరించారు. బోర్లం గ్రామానికి అన్నివిధాలా సహకారం బోర్లం సర్పంచ్ శాంతారూప్‌సింగ్ టీఆర్ఎస్లో చేరడాన్ని ప్రశంసించిన మంత్రి, గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. బోర్లం క్యాంప్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని, సీసీ రోడ్లు వేస్తామని, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బసవేశ్వర మందిర సమీపంలో రూ.40లక్షలతో వంతెన నిర్మిస్తామని చెప్పారు.సర్పంచ్ శాంతారూప్సింగ్తో పాటు మరో 400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, తహసీల్దార్ గోపి, ఎంపీడీఓ విజయ్‌భాస్కర్, ఎంపీపీ రే ష్మాబేగం ఎజాస్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయ గంగాధర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నార్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తకొండ భాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ శాంతారూప్‌సింగ్, మాజీ సర్పంచ్ నర్సింలు, సాయిలు, రఘురాం, జలీల్, సయ్యద్ అహ్మద్ పాల్గొన్నారు. ఉల్లి ధర స్థిరీకరణకు చర్యలు.. బాన్సువాడ : రాష్ట్రంలో ఉల్లి ధర విపరీతంగా పెరగడంతో ఈ ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి తన నివాసగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లి ధరల స్థిరీకరణ కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, ఇందులో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నట్లు వెల్లడించారు. రైతులు ఉల్లి సాగు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి విత్తనాల సబ్సిడీని 50 నుంచి 75 శాతానికి పెంచినట్లు తెలిపారు. ధర ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా రూ.20కి కిలో చొప్పున విక్రరుుంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం జరిగే సమావేశంలో రైతులు పాల్గొనవచ్చని సూచించారు. -
రూ.40 వేల కోట్లతో ప్రాణహిత-ఇంద్రావతి
మంత్రి పోచారం బాన్సువాడ: రూ.40 వేల కోట్లతో ప్రాణహిత-ఇంద్రావతి నదుల నుంచి వృథాగా పోతున్న 350 టీఎంసీల నీటిని తెలంగాణకు మళ్లించి, ఐదు జిల్లాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ శాంతారూప్‌సింగ్ గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల పథకం వల్ల ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం కేసీఆర్ దానిస్థానంలో ప్రాణహిత-ఇంద్రావతి ఎత్తిపోతల పథకానికి ప్రణాళిక రూపొందించారన్నారు. మధ్యప్రదే శ్, మహారాష్ట్ర గుండా వచ్చే ప్రాణహిత-ఇంద్రావతి నదుల్లో పుష్కలంగా నీరుంటుందని, 450 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ నీటిని వినియోగించుకోవడానికే కాళేశ్వరం వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి మిడ్‌మానేరులోకి నీరు తరలిస్తామన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
ఖమ్మం మయూరిసెంటర్ : ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళితులకు భూపంపిణీ, గృహ నిర్మాణం, రుణమాఫీ, నియామకాలు, నీళ్లు ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చే దిశగా పాలన సాగడం లేదన్నారు. ప్రజలను దూషించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కార్మిక సంఘాలను దిక్కుమాలిన సంఘాలు అన్న కేసీఆర్‌కు సకల జనుల సమ్మె సందర్భంలో సంఘాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మంత్రులు అహంకార ధోరణితో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించకపోగా.. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సచ్చినోళ్లు లేచి వస్తారా అని అర్థరహితంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు. కార్మిక సంఘాలను, ఎర్రజెండాలను విస్మరిస్తే ఎర్రజెండాల దెబ్బను కేసీఆర్ రుచి చూడక తప్పదన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, కార్యదర్శివర్గ సభ్యులు పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, సింగు నర్సింహారావు, నగర కార్యదర్శి ఎస్కె.జానిమియా తదితరులు పాల్గొన్నారు. -
హబ్.. కబ్?
గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 2,500 యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు రైతులకు చెక్కులను సైతం పంపిణీ చేశారు. మొదటి ఏడాది 500, రెండో ఏడాది 1000, మూడో ఏడాది మరో వెయ్యి యూనిట్ల రైతులకు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్ విలువ(రెండు ఆవులు లేదా గేదెలు) రూ.1.2లక్షలు ఉంటుంది. ఇందు కోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇస్తారు. సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా... దానిని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ మొదటి ఏడాదిగా భావించిన 2014లో కేవలం 200 మందికి మాత్రమే రూ.60 వేల చొప్పున చెక్కులను(మొత్తం రూ.1.2కోట్లు) పంపిణీ చేశారు. నిజానికి పంపిణీ చేసింది 200 యూనిట్లలో సగం మాత్రమే. ఈ ఏడాదిలో సగం గడిచిపోయినా ఇప్పటివరకు ఈ వ్యవహారంపై చడీచప్పుడు లేదు. గత ఏడాది యూనిట్లు పంపిణీ చేసిన రైతుల్లో చాలావరకు నాబార్డ్ నుంచి సబ్సిడీ అందక ‘స్త్రీనిధి’ నుంచి రుణాలు అందజేసినట్లు తెలిసింది. ‘గజ్వేల్ మిల్క్‌గ్రిడ్’ పథకం ముందకు సాగకపోవడానికి నాబార్డు, బ్యాంకర్ల సహకార లోపమే కారణంగా తెలుస్తున్నది. తాజాగా ఈసారి కూడా సబ్సిడీలు అందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు.. కానీ రూపాయి అందలేదు గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌కు నన్ను పిలిచిండ్రు. బర్ల లోన్ రూ.60 వేలు వచ్చిందని ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు రూపాయి అందలే. బ్యాంకుకు ఈ ప్రొసీడింగ్ తీసుకొని వెళ్తే వాళ్లు పట్టించుకుంటలేరు. ఏడు నెలల నుంచి ఇంతే పరిస్థితి. - కుంట శ్రీనివాస్‌రెడ్డి, ఆహ్మాదీపూర్ గ్రామ రైతు మంత్రి దృష్టికి తీసుకెళ్లాం... ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి బడ్జెట్ సక్రమంగా కేంద్రం నుంచి రావటం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ మేరకు మంత్రి కేంద్రానికి లేఖ రాశారు. కొద్ది రోజుల్లో బడ్జెట్ పెంపునకు అవకాశమున్నది. ప్రస్తుతం వచ్చిన బడ్జెట్‌తో పథకం కొనసాగుతుంది. గజ్వేల్ పథకానికి ఇబ్బంది ఉండదు. - రమేశ్ కుమార్, నాబార్డు ఏజీఎం -
జన కెరటం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వచ్చిపోయే వాహనాలు... పుష్కర స్నానం చేసేందుకు దూర ప్రాం తాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు.. జిల్లాలోని పుష్కరఘాట్ల లో నెలకొన్న పరిస్థితి ఇదీ. శుక్రవారం సైతం లక్షలాది మంది భక్తులు 11 పుష్కరఘాట్లలో స్నానమాచరించారు. శనివారంతో పుష్కరాలు ముగియనుండడంతో వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచీ కుటుంబసమేతంగా భక్తులు వస్తున్నారు. చివరి రోజున ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం అన్ని పుష్కరఘాట్లలో తగిన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపున మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్, జేసీ రవీందర్‌రెడ్డి శుక్రవారం వివిధ ఘాట్లను పరిశీలించి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు సైతం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భక్తజనం పోటెత్తుతున్న కందకుర్తి, తడపాకల్, పోచంపాడ్ సహా అన్ని పుష్కరఘాట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షిస్తున్నారు. పుష్కరఘాట్లలో అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్యసేవలు, ఇతరత్ర కార్యక్రమాలు భక్తులకు అందుబాటులో కొనసాగుతున్నాయి. పోచంపాడ్‌లో బారులు తీరి... బాల్కొండ మండలం పోచంపాడ్ పుష్కరఘాట్‌లో భక్తుల కోలహలం కొనసాగింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చారు. దీంతో జాతీయ రహదారి, పోచంపాడ్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిపోయాయి. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే. శుక్రవారం సాయంత్రం వరకు ఇక్కడ 4 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తుల రద్దీ పెరిగింది. పిండ ప్రదానాలు నిర్వహించి పితృ తర్పణాలు వదిలారు. భక్తులు అధికంగా రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. నిజమాబాద్ జిల్లాలో కోటికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పులకించిన త్రివేణి సంగమం.. రెంజల్ మండలం కందకుర్తిలోని త్రివేణి సంగమం భక్తులతో పులకించిపోయింది. శుక్రవారం 3.35 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి సైతం భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లల్లో తరలి వచ్చారు. బోధన్ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ దంపతులు గోదారమ్మ తల్లికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. కందకుర్తిని సందర్శించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి లలితా సహస్రనామ పారాయణ శిబిరానికి వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నదిలో పర్యటించి సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరఘాట్లకు పోటెత్తిన భక్తులు... పోచంపాడు, కందకుర్తి, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని, దోంచంద, గుమ్మిర్యాల్, సావెల్ సహా అన్ని పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఏపీలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎస్సారెస్పీలో భక్తులు అధికం కావడంతో అధికారులు వారిని సావెల్ ఘాట్‌కు మళ్లించారు. నవీపేట మండలం తుంగిని ఘాట్‌లో శుక్రవారం 1.30 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. ఘాట్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్లు, పోలీసులు, ఎన్సీసీ విద్యార్థులు, ఎస్పీవోలు అందుబాటులో ఉన్నారు. ఉమ్మెడలో 40 వేలకు పైగా భక్తుల పుణ్య స్నానాలు చేశారు. ఈ ఘాట్‌లో స్నానం చేయడానికి గుర్రంపై వచ్చిన భక్తుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే మహారాష్ట్రలోని పర్బనీ, నాందేడ్, ధర్మాబాద్, కిన్వర్ట్, బోకర్, ముదికేడు నుండి ఉమ్మెడ ఘాట్‌కు భక్తులు తరలివచ్చారు. కోస్లిలో సుమారు 16 వేలకుపైగా భక్తులు స్నానమాచరించారు. పెరిగిన వీఐపీల తాకిడి... మహా పుష్కరాల పదకొండో రోజూ వీఐపీల తాకిడి పెరిగింది. వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మోర్తాడ్ మండలం తడపాకల్ వద్ద పుష్కర స్నానం చేశారు. పిండ ప్రదానం అనంతరం స్థానిక శ్రీకోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోంచంద ఘాట్‌లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్మ రవీందర్, పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మామిడి రవీంద్రనాథ్‌రెడ్డి దోంచందలో పుష్కర స్నానాలు ఆచరించారు. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజశేఖర్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రావణ్, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి పుణ్య స్నానాలు చేశారు. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద బీజేపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి పుష్కర స్నానం చేశారు. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లలో సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానమాచరించారు. కస్టమ్స్ కమిషనర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సారెస్పీలో పుష్కర స్నానం చేశారు. సినీ నటులు శ్రీధర్, నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీసీకి రూ.85 లక్షల ఆదాయం నిజామాబాద్ నాగారం : గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 11వ రోజు శుక్రవారం ఆర్టీసీ 1079 ట్రిప్పుల బస్సులకుగాను 49,400 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. తద్వారా సంస్థకు సుమారు రూ.85 లక్షల ఆదాయం సమకూరింది. -
మాధవ సేవగా భావిస్తున్నాం
♦ పండుగలా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు ♦ భక్తులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం ♦ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కందకుర్తి సాక్షి బృందం : మానవసేవయే మాధవ సేవగా భావిం చి ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గోదావరి మహా పుష్కరాలలో ము క్కోటి దేవతలను ప్రత్యక్షంగా చూడకున్నా, నదీ స్నానాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి మాధవసేవ చేసుకున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం మంత్రి పోచా రం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మా ట్లాడారు. పదవ రోజు వరకు జిల్లాలోని 18 క్షేత్రాలలో 65 లక్షల మంది భక్తులు పవిత్ర స్నా నాలు చేశారని తెలిపారు. చివరి రెండు రోజు లలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కే సీఆర్ పుష్కరాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తు, ప్రత్యేక శ్రద్దతీసుకుంటున్నారని వివరించారు. తెలంగాణలో ఏర్పాట్లు బాగుండటంతో చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డు నుంచి డీఐజీ వరకు ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో పండుగ జరిగితే ఎంత శ్రద్ధ తీసుకుంటారో పుష్కరాలలో సైతం అదే తరహాలో సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించడంలేదని, భక్తులకు సౌకర్యాలపైనే ప్రదానంగా దృష్టిని సారించిందని అన్నా రు. ప్రకృతి సహకరించకున్నా ఉన్న వనరులను వినియోగించుకుని గోదావరి నదిలో నీటి సౌకర్యం కల్పించామని, నీరు కలుషి తం కాకుండా అన్ని చ ర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలి పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని మంత్రి పోచారం సూచించారు. వాహనాలను అతివేగంగా నడపవద్దన్నారు. సిద్ధిపేట వద్ద రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మంత్రి వెంట డ్వామా పీడీ వెంకటేశం, ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్పీలు రాంకుమార్, రవీందర్, తహశీల్దార్లు రాజేశ్వర్, వెంకటయ్య, సర్పంచ్ ఖలీంబేగ్ తదితరులు ఉన్నారు. -
పులకించిన గంగ
♦ పదో రోజూ పుష్కరఘాట్లు కిటకిట ♦ {పవాహంలా తరలివచ్చిన జనం ♦ పొరుగు రాష్ట్రాల నుంచీ వచ్చిన భక్తులు ♦ గోదారిలో పవిత్రస్నానాల కోలాహలం ♦ వానలోనూ ఏమాత్రం తగ్గని ఉత్సాహం ♦ అంతటా కొనసాగిన స్వచ్ఛంద సంస్థల సేవలు ♦ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఎస్పీ ♦ ఆది పుష్కరాల ముగింపునకు ఇక రెండు రోజులే సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పదవ రోజు కూడా మహాపుష్కరాలకు భక్తుల తాకిడి కొనసాగింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాల కోసం జనం బారులు తీరారు. దాదాపు 11,64,370 మంది భక్తులు పవిత్ర స్నానమాచరించారు. జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సం ఖ్యలో తరలివస్తున్నారు. వీఐపీల తాకిడి కూడా రోజు రోజు కూ పెరిగిపోతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీకళాకారులు, విదేశీయులు సైతం పుష్కరస్నానాలను ఆచరించారు. పోచంపాడ్, కందకుర్తి, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, దోంచంద, ఉమ్మెడ, సావెల్ తదితర ప్రాంతాలలో లక్షలాది మంది భక్తులు స్నానమాచరించి వెళుతున్నారు. ఆది పుష్కరాల చివరి రోజులు దగ్గరపడడంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ర్ట భక్తులు అధిక సంఖ్య తరలివస్తున్నారు. వర్షం పడుతున్నప్పటికీ రద్దీ తగ్గ లేదు. పుష్కరఘాట్లు, దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఎ.రవీంద ర్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీలిస్తూ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పుష్కరఘాట్లలో బం దోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోచంపాడ్‌కు కొనసాగుతున్న భక్తుల రద్దీ పోచంపాడ్‌కు భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం పుష్కరస్నానాలు చేసిన భక్తుల సంఖ్య సు మారుగా నాలుగు లక్షలకు చేరింది. జాతీయ రహదారికి అనుకొని ఉండడంతో హైదరాబాద్‌తోపా టు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. దీంతో రహదారులను వాహనాలు, జ నాలతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్క ర ఘాట్లు ఇ సుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. రాత్రి వరకు భక్తుల తాకిడి కొనసాగింది. ఘాట్లకు ఉన్న అన్ని దారుల నుంచి భ క్తులు కాలి నడకన తరలి వచ్చారు. ఎస్ఆర్ఎస్పీలో నీరు పరిశుభ్రం గా ఉందన్న సమాచారం భక్తుల ద్వారా వెళ్లడంతో అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. శనివారంతో పుష్కరాలు ముగుస్తున్నందున నేడు, రేపు రెండు రోజులు కూడ భక్తుల రద్దీ పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలోనూ జనవాహిని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రంలో భక్త జనజాతర సాగింది. పుణ్యస్నానాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నాం 12 గంటల సమయం లో 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. వర్షంలోనే నదీ స్నానాలకు వెళ్లారు. వికలాంగులు, వృద్ధులను నది లోపల నుంచి ఒడ్డుకు చేర్చేందుకు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, అంగన్వాడీలు, సత్యసాయి సేవ సమితి సభ్యులు, ఎన్సీసీ విద్యార్థులు పాట్లు పడ్డారు. ఉదయం వర్ష సూచన కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదనంగా బోధన్, రెంజల్ మండలా ల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ సేవకులను రప్పించారు. చివరి రెండు రోజుల్లో భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ మేరకు వివిధ శాఖల సిబ్బందిని నియమించారు. స్వచ్చంద సంస్థలు సేవలను కొనసాగించాయి. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ లయన్స్ క్లబ్ శాఖ భక్తులకు ఉచితంగా పులిహోర, నీళ్ల ప్యాకెట్లను పంపిణి చేశారు. పుష్కరఘాట్లకు జనశోభ జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 పుష్కరఘాట్లకు ఉద యం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. పోచంపాడ్, కందకుర్తితో పాటు మోర్తాడ్ మండలంలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచందకు ఉదయం నుం చే జనసందోహం మొదలయింది. భక్తులు ప్రైవేట్వాహనాలు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో పుష్కరఘాట్లకు చేరుకొని పుష్కరస్నా నాలు ఆచరించారు. రద్దీ అధికంగా ఉండడంతో కొంత ఇబ్బంది పడ్డారు. పుష్కరాలకు గడువు సమీపించడంతో వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. తడపాకల్‌లో సుమారు 1.70 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. గుమ్మిర్యాల్, దోంచందలో 45 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. నవీపేట మండలంలోని తుంగిని ఘాట్‌లో 1.15 లక్షల మంది భక్తులు పుష్క ర స్నానాలు చేశారు. నందిపేట మండలం ఉమ్మెడలో పదవ రోజు ఉమ్మెడలో భక్తుల తాకిడి తగ్గ లే దు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఖ మ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి తరలి వ చ్చారు. అలాగే మహారాష్ట్రలోని పర్భణీ, నాందేడ్, లాతూర్ నుంచి భక్తులు వచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కోస్లీకి సుమారు 11వేలకుపైగా భక్తులు రావడంతో పుష్కరఘాట్ల వద్ద రద్దీ ఏర్పడింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్‌ను పరిశీలించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. తాడ్ బిలోలి పుష్కరఘాట్ భక్తులతో కిటకిటలాడింది. పుణ్యస్నానాల కోసం సు మారు ఏడు వేల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. సావెల్‌కు భక్తులు పెద్ద సం ఖ్య లో హాజరై పుణ్యస్నానాలు చేశారు. బారులు తీరిన వీఐపీలు పదో రోజున పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి పెరిగింది. శాసనసభలో బీజేపీ ప నేత డాక్టర్ లక్ష్మణ్ దోంచందలో పుష్కర స్నానం చేసి, గుమ్మిర్యాల్ శ్రీకష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్ట ర్ జె.గీతారెడ్డి మోర్తాడ్ మండలం తడపాకల్‌లో పుష్కర స్నానం చేశారు. మాజీ శాసనసభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మజారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి తడపాకల్‌లో పుష్కరస్నానం చేశారు. ఒలింపిక్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జె రంగారావు కందకుర్తిలో పుష్కర స్నానం ఆచరిం చి, పెద్దలకు పిండప్రదానం చేశారు. దోంచందలో టీవీ నటులు హరిత, జాకీ, విజయ్ పవిత్ర స్నానాలు చేశారు. ఐసీడీఎస్ కమిషనర్ విజయేం ద్ర దోంచందలో పుష్కరస్నానమాచరించారు. సావె ల్లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీఫెన్ హుక్, సం ట్రాన్ పుష్కర స్నానామాచరించారు. -
జలం.. జనం
ఎనిమిదో రోజూ భక్తుల పుణ్యస్నానాలు ♦ కిటకిటలాడుతున్న పుష్కరఘాట్లు ♦ {తివేణి సంగమంలో ప్రత్యేక పూజలు ♦ పోచంపాడ్లోనూ కొనసాగిన రద్దీ ♦ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత ♦ మంత్రి పోచారం, కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ ♦ తరలివచ్చిన వీఐపీలు, వీవీఐపీలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి చాలా మంది వస్తుండడంతో పోచం పాడ్, తడపాకల్, కందకుర్తి, తుంగిని, సావె ల్, ఉమ్మెడ, గుమ్మిర్యాల్ సహా పుష్కరఘాట్ల న్నీ రద్దీగా మారాయి. పుష్కరస్నానాల అనంతరం భక్తులు దైవదర్శనాల కోసం బారులు తీరుతున్నారు. త్రివేణి సంగమానికి భక్తుల రాకపోకలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక, మహారాష్ర్ట నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ఇందుకు తగినట్లుగా అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప ర్యవేక్షిస్తూ లోపాలను సవరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీ లించారు. కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ సుడిగాలి పర్యటనతో పుష్కరఘాట్లలో అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. కందకుర్తిలో అదేజోరు కందకుర్తిలో భక్తుల సంఖ్య పెరుగుతోంది. మం గళవారం రెండు లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంగా ప్ర సిద్ధి చెందడంతో భక్తుల సంఖ్య భారీగా పెరి గింది. నీరు కూడా సమృద్ధిగా చేరుతుండటంతో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఉద యం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు పు ణ్యస్నానాలు చేస్తున్నారు. కందకుర్తి పుష్కర క్షేత్రానికి కిలోమీటరు దూరంలో ఎగువ భాగాన ఉన్న సంగమేశ్వరాలయం వద్ద గోదావరి నది లో నీళ్లు నిల్వ ఉండటంతో భక్తులు అధిక సం ఖ్యలో ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. కందకుర్తి ని టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు సందర్శించారు. జేసీ రవీందర్‌రెడ్డి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరా న్ని సందర్శించా రు. పోచంపాడ్లోనూ భక్తుల రద్దీ కొనసాగింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఇక్కడికి తరలివచ్చారు. రెండు లక్షల వరకు గోదావరిలో పుష్కరస్నానం ఆచరించారు. వచ్చే దారి, వెళ్లే దారి ఒకటే కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అన్ని పుష్కరఘాట్లకు తాకిడి తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్‌లోని పుష్క ర క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున పుణ్యస్నానాలు ఆచరిస్తే బా గుంటుందనే నమ్మకంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తడపాకల్‌లో జనం రద్దీ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. దోంచంద, గుమ్మిర్యాల్‌కు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదారమ్మకు నీరాజనం పలి కారు. గంగమ్మతల్లి ఆశీస్సులను భక్తులు పొం దారు. బినోల ఘాట్‌లో 8120 మంది భ క్తులు పుష్కర స్నానాలు చేశారు. గ్రామాభివధ్ది కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానకార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఉమ్మెడ పుష్కర ఘాట్ లో ఎనిమిదవ రోజు పుష్కర భక్తులు తాకి డి తగ్గలేదు. వివిద ప్రాంతాల నుంచి 21 వేల మందికి పైగా భక్తులు గోదావరినదిలో పుష్కర స్నానం చేశారు. పుష్కరాల ఉత్సవాలలో భాగం గా చాకు లింగం ఆధ్వర్యంలో కళాకారులు బుర్రకథను వినిపించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ మోహన్‌లాల్ పర్యవేక్షణ చేశారు. పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి ఎస్ఆర్ఎస్పీ పుష్కర ఘాట్ల వద్ద ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కు టుంబ స భ్యులు పుష్కర స్నానమాచరించి పుణ్య పూ జలు నిర్వహించారు. కర్నూల్ జిల్లా పా ణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పు ణ్యస్నానాలు ఆచరించారు.తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు దంపతులు పుణ్య స్నానమాచరించారు. రాష్ట్ర గిడ్డం గుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఐటీ కమిషనర్ శ్రీధర్, ఐఓసీ సీఈఓ నందకిషోర్ పవిత్ర స్నానాలు చేశారు. మాజీ మంత్రి శనిగరం సం తోష్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. నిజా మాబాద్ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌ డ్ , మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వ ర్లు, వికారబాద్ ఎమ్మెల్యే సం జీవ్రావు పుష్కర స్నానమాచరించారు. దోంచంద పుష్కరఘాట్ లో మంగళవారం సినీ, టీవీ ఆర్టిస్టులు మీణా కు మారి, నందకిషోర్ పుష్కరస్నానాలు చేశారు. ఆచరిం చా రు. -
మూడేళ్లలో నిరంతర విద్యుత్
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : మరో మూడేళ్లలో రాష్ట్రంలో 24 గంట లపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం స్థానిక మీనా గార్డెన్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2018 చివరి నాటికి 500 కోట్ల రూపాయల వ్యయంతో 24,475 మెగావాట్ల విద్యుత్తును సిద్ధం చేస్తామని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో విద్యుత్తు కోతే ఉండదని, గృహ.. వ్యవసాయ విద్యుత్తు పుష్కలం గా సరఫరా అవుతుందని అన్నారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన 18 డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యం గా ప్రత్యేకంగా టెండర్ల కేటాయింపు, పోలీసులు.. అటవీ శాఖ అధికారుల వేధింపుల నివారణ డిమాం డ్లను పుష్కరాల తరువాత పరిష్కరిస్తానని అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జంగం విజయ, సర్పంచ్ దోన్కంటి వాణి విఠ ల్, పీఏసీఎస్ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నార్ల సురేష్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరహరి చారి, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌చారి, కోశాధికారి బాలవీర చారి, మండల అధ్యక్షుడు పుండరీకం చారి, ప్రధాన కార్యదర్శి బి.సత్యనారాయణ చారి, సభ్యులు అంజ య్య చారి, రామాచారి, గంగాధర చారి తది తరులు పాల్గొన్నారు. -
గౌతమికి నీరాజనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి మహా పుష్కరాలకు భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. మూడోరోజు గురువారం వేలాది మంది భక్తులు గోదావరి ఒడిలో పవిత్ర స్నానాలు చేశారు. కంద కుర్తి మొదలు..పోచంపాడ్, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, ఉమ్మెడ సహా జిల్లాలో అన్ని ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు మహారా ష్ర్ట, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించి పునీతులయ్యారు. పుష్కరఘాట్లలో సౌకర్యాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. కందకుర్తి, పోచంపాడ్, తుంగిని తదితర ఘాట్లను సందర్శించిన ఆయన మొదటి, రెండోరోజు ఎదురైన సమస్యలను గుర్తించి భక్తులకు తగిన ఏర్పాట్లను చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తడపాకల్ను సందర్శించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కుటుంబసభ్యులతో ఎస్ఆర్ఎస్పీ వద్ద పవిత్ర స్నానమాచరించారు. కాగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బం దోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. వాచ్టవర్ల ద్వారా వీవీఐపీ, వీఐపీల సందర్శన, భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు, ఘాట్ ఇన్‌చార్జ్‌లు, ప్రత్యేక విభాగాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రధాన పుష్కరఘాట్ కందకుర్తిలో నీటి సమస్య ఏర్పడింది. పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ నుంచి పోచంపాడ్, సావెల్ తదితర ఘాట్లకు నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. నిరంతరం మూడు వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు. నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సరస్వతీ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు వదులుతుండగా, గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్ట్ నీటి మట్టం 2.5 అడుగుల మేరకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 1,091 అడగులు కాగా, గురువారం సాయంత్రానికి 1055.30 అడుగుల నీరు ఉంది. -
మంత్రి పోచారం డ్రైవర్‌పై బౌన్సర్ల దాడి
బంజారాహిల్స్: ఫిలింనగర్ రోడ్ నెం. 1లోని ఓ ఇంటి ముందు సహచరుల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్ నాగరాజుపై నలుగురు బౌన్సర్లు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నాగరాజు తన సహచరుల కోసం ఫిలింనగర్‌లోని ఓ ఇంటి ముందు వేచి చూస్తున్నాడు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఇక్కడ ఎందుకు నిలబడ్డావని నాగరాజును ప్రశ్నించారు. నా స్నేహితుల కోసం చూస్తున్నానని రోడ్డు పక్కనే నిలబడ్డాను కదా అని అన్నాడు. దీంతో రెచ్చిపోయిన బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు ఎవరికి సంబంధించిన వారన్నదానిపై ఆరా తీస్తున్నారు. -
రుద్రూరులో ‘ఆహార’ కళాశాల
ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక నాయకులు వర్ని: వర్ని మండలం రుద్రూర్ వ్యవసాయ పరిశోధ నా కేంద్రంలో ‘కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (ఆహార శాస్త్ర, సాంకేతిక కళాశాల) ఏర్పాటుకు బుధవా రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలి పింది. ఏడాదికి 40 మంది చొప్పున విద్యార్థులకు ఈ కోర్సును అందించనున్నారు. పరిశోధనా కేంద్రంలోనే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇప్పటికే సీడ్ టెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇపుడు మంత్రివర్గం ఆమోదంతో కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో ఈ కళాశాల మంజూరైందని వర్ని జడ్పీటీసీ సభ్యుడు గు త్ప విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోనే ఇది ప్రథమ కళాశాల అని పే ర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ కళాశాలను ఏర్పాటు చే యడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పరిశోధానా కేంద్రానికి పూర్వ వైభవం వస్తుందని, మంత్రికి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలి పారు. కళాశాల ఆమోదం తెలపడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చే స్తున్నారన్నారు. -
ఇజ్రాయిల్‌కు మంత్రి పోచారం బృందం
ఆగిపోయిన మంత్రి తనయుడు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మ రో ఆరుగురు సభ్యుల బృందం ఇజ్రాయిల్ పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లింది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయిల్‌లో అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శన జరుగుతుండటంతో వారు అందులో పాల్గొనేందు కు వెళ్లారు. విమర్శలు రావడంతో ఆ బృందంలోని మంత్రి కుమారుడు భాస్కర్‌రెడ్డి మాత్రం పర్యటనను విరమించుకున్నారని తెలిసింది. అలాగే ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు కూడా చివరి క్షణంలో ఆగిపోయారు. బృందంలో మంత్రితోపాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మోహన్‌రెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను ఆదర్శ రైతులుగా ఈ పర్యటనకు తీసుకెళ్తుండటం విమర్శలకు దారితీసింది. -
అధైర్యపడొద్దు..ఆదుకుంటాం..
- రైతులకు మంత్రుల హామీ - వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల పరిశీలన సిరికొండ : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భరోసా ఇచ్చారు. మండలంలోని కొండూర్, న్యావనంది, చిన్నవాల్గోట్ గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, సజ్జ, నువ్వు పంటలను మంత్రులు గురువారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవమేనన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పంటల నష్టానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం చెల్లించామని తెలిపారు. అకాల వర్షాలతో బుధవారం వరకు జిల్లాలో 13300 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని, గురువారం కూడా వర్షం కురుస్తున్నందున నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని తప్పనిసరిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన కొండూర్ గ్రామ రైతులు గోపాల్, గంగయ్యలు మంత్రి పోచారంతో మాట్లాడారు. తాము కొన్నేళ్లుగా పంటల బీమా చెల్లిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పరిహారం చెల్లించడం లేదని రైతులు వాపోయూరు. మండలాల వారీగా బీమా ఉండటంతో పరిహారంలో నష్టపోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతు గత ఏడాది రాష్ట్రం ఏర్పడకముందే రబీలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయూయని, అటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. పంటలు పండినా అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ సుమనారెడ్డి, జేడీఏ నర్సింహ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట రాజన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జబ్బుల్లోనూ మహిళలే టాప్..
మధుమేహం, ఊబకాయంలో వారే ఎక్కువ తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్లే సమస్యలు సిటీబ్యూరో: మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వెరసి మహిళల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పురుషుల్లో ఎక్కువగా కన్పించే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్స్, ఎండోక్రైనాలజీ అండ్ యాడిపాసిటీ (ఒబెసిటీ), ఆస్లర్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హోటల్ తాజ్ డెక్కన్‌లో మధుమేహం, ఊబకాయం, ఎండోక్రైనాలజీపై సదస్సు నిర్వహించారు. దీనిని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 200 మంది వైద్య నిపుణులు ఇందులో పాల్గొని ప్రసంగించారు. ప్రతి పది మందిలో ఒకరు మధుమేహం, అధిక బరువు, థైరాయిడ్, గుండె జబ్బుల్లో ఏదో ఒక దానితో బాధపడుతున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మధుమేహం దేశ మధుమేహ రాజధాని హైదరాబాద్‌గా చెప్పుకునే వాళ్లం. కానీ హైదరాబాద్ కన్నా అత్యధికంగా మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో మధుమేహులు ఎక్కువ ఉన్నట్టు తేలింది. నగరంలో పదేళ్లలోపు ఏడువేల మంది చిన్నారులు మధుమేహంతో బాధపడుతుంటే, వీరిలో 3000 పైగా మంది నెలవారి ఇన్సులిన్ ఖర్చులకు నోచుకోలేని దుస్థితిలో ఉన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు, ముడి బియ్యం వంటకాలు తినడం ఉత్తమం. - డాక్టర్ పీవీరావు, నిమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం పొట్టపై కొవ్వు ప్రమాదం భారతీయుల్లో పొట్ట, మూత్రపిండాలు, కాలేయం, గుండె, కిడ్నీల చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు చాలా ప్రమాదం. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. పరోక్షంగా ఇది గుండె, మోకాళ్లు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. మిత ఆహారం, విధిగా వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. - డాక్టర్ శ్యామ్ కల్వలపల్లి, ఐడియా సెంటర్ ఆరోగ్య స్పృహ పెరగాలి యూకేలో 5 శాతం మంది మధుమేహంతో బాధపడుతుంటే, భారతదేశంలో మాత్రం 15 శాతం మంది మధుమేహులు ఉన్నారు. సెలైంట్ కిల్లర్‌గా చెప్పుకునే ఈ వ్యాధి పట్ల అప్రమత్తమై ఎవరికి వారు నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని ఆ దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - డాక్టర్ జెఫ్రీ స్టీఫెన్, లండన్ -
బిక్నూరు వెంకటేశ్వర ఆలయానికి పోచారం
బిక్నూరు : నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఆలయాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఆయనతో పాటు హార్టీకల్చర్ రాష్ట్ర కమిషనర్ వెంకట రామిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. గుట్ట చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, పచ్చదనం గురించి కమిషనర్‌కు వివరించారు. -
షరతులు లేకుండా భృతి ఇప్పించండి
మంత్రికి బీడీ కార్మికుల వినతి బీర్కూర్ : బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి ఇప్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బీడీ కార్మికులు విన్నవించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి ఎదుట కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు జీవన భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోందని, దీంతో తాము నష్టపోతున్నామని వాపోయూరు. తమలో కొంత మందికి పీఎఫ్ నంబర్లు లేవని, దీన్ని ఆసరా చేసుకుని తమకు పింఛన్ రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లు వస్తున్న కుటుంబంలోని బీడీ కార్మికులకు జీవన భృతి అందించడం లేదన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉం టుం దని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. పీఎఫ్ నంబర్లు లేని వారికి సైతం పింఛన్లు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు వచ్చే కుటుం బీకులకు కూడా భృతి అందేలా సీఎంతో మాట్లాడుతానన్నారు. ఎంపీడీవో తీరుపై ఆగ్రహం.. ఆసరా పింఛన్ల కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నామని, అయినా పెన్షన్లు ఇవ్వడం లేదని బీర్కూర్‌కు చెంది న సాయవ్వ, భూదెవ్వ అనే వృద్దులు మంత్రికి చెప్పగా ఆయన ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డిని పిలిచి ప్రశ్నిం చారు. తీరు మార్చుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేస్తున్నా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ మల్లెల మీనాహన్మంతు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రభుత్వ సొమ్మంటే లెక్కేలేదా?
బీర్కూర్ : ‘‘ప్రభుత్వ సొమ్మంటే లెక్కలేకుండా పోయింది. నాణ్యమైన సీడ్‌ను అందించాల్సిన సీడ్ ఫాంను భ్రష్టు పట్టించేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి’’ అంటూ బొప్పాస్పల్లి విత్తనోత్పత్తి క్షేత్రం జేడీఏ నర్సింహ, ఏడీఏ సైదులులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన బొప్పాస్పల్లి విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని తనిఖీ చేశారు. సీడ్ ఫాంలో చేస్తున్న పనులను పరిశీలించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వాటర్ పాండ్లను పరిశీలించి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ కంటే ఎత్తు ఎక్కువగా ఉంటే నీళ్లు ఎలా నిలువ ఉంటాయని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులతో పాటు సీడ్‌ఫాంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తన ఉత్పత్తి క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం కార్యాలయం నుంచి సుమారు రూ. 2 కోట్ల నిధులు కావాలంటూ తన కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయితే ఈ ప్రతిపాదనలు దేనికోసం పంపించారని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. 475 ఎకరాలు ఉన్న సీడ్ ఫాం భూమికి కంచె నిర్మాణం కోసం రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారని అయితే ఈ రూ. 60 లక్షలు ఎందుకు కావాలో తనకు తెలియాలని ప్రశ్నించారు. ప్రతిపాదనలు పంపిన విషయం తన దృష్టికి రాలేదని జేడీఏ సమాధానమిచ్చారు. కింది స్థాయి అధికారులు ఏ ప్రతిపాదనలు పంపుతున్నారో తెలియకపోతే మీరంతా ఎందుకు ఉన్నారంటూ మంత్రి మండిపడ్డారు. పంట భూమిని నాశనం చేశారు బ్రహ్మాండంగా పంటలు పండే భూమిని గుంతలు తవ్వి నాశనం చేశారని, పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని మంత్రి పోచారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న ఫైల్‌ను సైతం ఆయన విసిరి కొట్టారు.. ఇప్పటికే భూమి మొత్తం నాశనం అయిందని మరో రూ. 20 లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపించారని, ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి అడిగిన ఏ ప్రశ్నకూ ఏడీఏ వద్ద సమాధానం లేకపోవడంతో.. ఏం చేస్తే మీరు మారతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎత్తిపోయాయని, వాటిని బాగు చేయించే దిక్కు లేదు కాని మరికొన్ని బోర్లు వేయడానికి నిధులు కావాలా అని నిలదీశారు. పని చేయకుండానే జీతం తీసుకునే అలవాటు అధికారుల్లో ఎక్కువ అయ్యిందని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి పేర్కొన్నారు. గతంలో వచ్చిన నిధులతో ఏ ఏ పనులు చేశారని ఆయన ఏడీఏను అడిగారు. వంతుల వారీగా డబ్బులు పంచుకుంటూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంకు సంబంధించిన 475 ఎకరాల్లో సుమారు 225 ఎకరాల్లో పంటలు పండించవ చ్చని, అయితే ఇంత వరకు ఒక్క ఎకరంలో అరుునా పంటలు పండించిన దాఖలాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ సీడ్ఫాం భూమి ద్వారా రెండు జిల్లాలకు సోయా విత్తనాలు అందించవచ్చన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సోయా విత్తనాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏడీఏను వెంటనే మార్చండి ప్రస్తుతం ఉన్న ఏడీఏ సైదులును వెంటనే ఇక్కడి నుంచి పంపించివేయాలని, ఆయన స్థానంలో మరో రెగ్యులర్ ఏడీఏను, ఇతర సిబ్బందిని నియమించాలని జేడీఏ నిర్సింహను మంత్రి ఆదేశించారు. సిబ్బంది స్థానికంగా ఉండేలా క్వార్టర్లకు సైతం మరమ్మతులు చేయించాలని సూచించారు. మంత్రి కాలికి గాయం సీడ్ఫాంను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పోచారం కాలికి కర్ర గుచ్చుకోవడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక నాయకులు ఆయనకు ప్రథమ చికిత్స చేరుుంచారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ రాములు, జడ్పీటీసీ సభ్యుడు కిషన్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేశ్, నాయకులు సతీశ్, బస్వరాజ్, హన్మంతు తదితరులున్నారు. -
అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యం
తెలంగాణలో మరో పార్టీ జెండా ఎగరదు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే నడుస్తున్నరు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి : తెలంగాణ సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మడమతిప్పని పోరాటం చేసి, రాజకీయ పార్టీగా ఎది గి రాజ్యాధికారాన్ని సాధించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇన్నేళ్లుగా నష్టపోయిన తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నా యకత్వంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి లో శనివారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే టార్గెట్‌ను దాటి సభ్యత్వాలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఎన్నికలు నిర్వహించుకుని ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతృప్తి చెందుతూ పార్టీ సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు జరుగుతున్నాయని, మొక్కల పెంపకం వల్ల వర్షాలు కురుస్తాయన్నారు. పాలీహౌస్ పథకానికి రూ. 250 కోట్లు కేటాయించామని, దీన్ని రైతులు విని యోగించుకోవాలన్నారు. అలాగే డ్రిప్ పథకాన్నీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామం లో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు టీఆర్ఎస్తోనే తీరుతాయన్న నమ్మకంతోనే అధికారం ఇచ్చారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విజయం సాధించారని పేర్కొన్నారు. అందుకే సభ్యత్వ నమోదులో అన్ని వర్గాల ప్రజలు ఉత్సహాంగా పాల్గొంటున్నారని తెలిపారు. పలు సంక్షేమ పథకాలతో ప్రజాశ్రేయస్సుకు పాటుపడుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, టీఆర్ఎస్ నాయకులు తిర్మల్‌రెడ్డి, పున్న రాజేశ్వర్, నిట్టు వేణుగోపాల్‌రావు, ఎంపీపీ మంగమ్మ, వైస్ ఎంపీపీ క్రిష్ణాజీరావు, సర్పంచ్రామాగౌడ్, ఎంపీటీసీ గంగాధర్‌రావు, విండో వైస్‌చైర్మన్ నాగభూషణం, నాయకుడు గోపిగౌడ్, కమ్మరి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మారెడ్డి, గైని శ్రీనివాస్‌గౌడ్, పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావు, రాంరెడ్డి, రమేశ్‌గుప్తా, చంద్రశేకర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు నందరమేశ్, మధుసుదన్‌రావు, తదితరులు ఉన్నారు. -
ఆస్పత్రి ఉండేది ఇలాగేనా?
డిచ్పల్లి : ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఇందల్వాయి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో పీహెచ్సీలో కేవలం ఫార్మాసిస్ట్ సంపత్లక్ష్మి మాత్రమే ఉన్నారు. ఉదయం 11 గంటలు దాటినా పీహెచ్సీ వైద్యురాలు అశ్విని విధులకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ చేసి ఇన్చార్జి డీఎంహెచ్ఓ బసవేశ్వరిని పీహెచ్‌సీకి రప్పించారు. ఇది ‘ప్రభుత్వ ఆస్పత్రా.. లేక ప్రైవేటు దుకాణామా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ఇలా ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పీహెచ్సీ ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్ట్రర్‌ను తనిఖీ చేయగా అందులో మూడు రోజులుగా సంతకాలు లేకపోవడాన్ని గమనించి ఇదేనా మీ శాఖ పని తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నారం, తిర్మన్‌పల్లి గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోగులకు అందుబాటులో ఉండాల్సిన ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు అందుబాటులో ఉండటం లేదని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అస్పత్రికి చెందిన ఏఎన్ఎం అరుంధతి, సూపర్వైజర్ కాడయ్య నిజామాబాద్‌లో శిక్షణ కోసం వెళ్లినట్లు మూవ్మెంట్ రిజిష్టర్‌లో నమోదు చేసి ఉండటాన్ని గమనించిన మంత్రి.. శిక్షణ కేంద్రానికి ఫోన్ చేసి వాకబు చేశారు. అక్కడ పై ఇరువురు లే రని సమాధానం రావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే.. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలు వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మూలంగానే చనిపోతున్నారని మంత్రి ఆరోపించారు. సమయ పాలన పాటిస్తూ రోగులకు సరైన సేవలందించి వృత్తికి న్యాయం చేయూలని సూచించారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకుని పీహెచ్‌సీకి చేరుకున్న డాక్టర్ అశ్వినిపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. చెత్తా చెదారం ఉండటాన్ని గమనించి మంత్రి నివ్వెరపోయారు. ‘ఇది ఆస్పత్రేనా లేక కూరగాయల దుకాణమా’ అంటూ మండిపడ్డారు. రోగులు ఇక్కడికి వస్తే రోగం తగ్గదని, ఇంకా పెరుగుతుందని అన్నారు. ‘ట్రామాకేర్’ ఏర్పాటుకు కృషి.. ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయనను ఇందల్వాయి సర్పంచ్ పాశం కుమార్, తిర్మన్‌పల్లి సర్పంచ్ చాంగీబాయి, ఎంపీటీసీ సభ్యుడు షేక్ హుస్సేన్ తదితరులు కలిసి ట్రామా కేర్ సెంటర్ విషయూన్ని ప్రస్తావించారు. 44వ నంబరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అంది ప్రాణాలు దక్కే అవకాశాలుంటాయని వివరించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్కొన్నారు. పీహెచ్సీ చుట్టూ ప్రహరీ నిర్మాణం, కొత్త ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామన్నారు. -
అట్టహాసంగా
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం ⇒ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ⇒ కార్యకర్తల సమక్షంలో నేతల సభ్యత్వ స్వీకరణ ⇒ సెగ్మెంట్‌కు 30 వేలు తగ్గకుండా నమోదు లక్ష్యం ⇒ వేదికపై విప్ గోవర్ధన్, కార్యకర్త రాజు జన్మదినం ⇒ ప్రతిపక్షాలపై విమర్శలు.. కేసీఆర్‌కు ప్రశంసలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిజామాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కొంపల్లిలో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై దిశానిర్ధేశనం చేసి న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలోని భారతి గార్డెన్స్‌లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా మంత్రి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రి ఎంపీ కవితకు సభ్యత్వం అందించారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులు సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇదే రోజు విప్ గంప గోవర్ధ న్ పుట్టినరోజు కూడా కావడంతో వేదికపై కే క్ కట్ చేశారు. ఇంకా ఎవరిదైనా పుట్టినరో జు ఉంటే వేదికపైకి రావాలని ఎంపీ కవిత కోరడంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన రాజు అనే కార్యకర్త వేదిక పైకి వచ్చారు. దీంతో విప్‌తోపాటు రాజు కు జన్మదిన వేడుకలు జరిపి అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రసంగించిన పలువురు నేతలు ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పించారు. అదే సమయం లో సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురి పించారు. సెగ్మెంట్‌కు 30 వేలు తగ్గకుండా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, వేముల ప్రశాంత్‌రెడ్డి, షకీల్ అహ్మద్ ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 30 వేలకు తగ్గకుండా చేయాలని సభ్యులను చేర్పించాలని కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. 5 వేల క్రియా శీల, 25 వేల సాధారణ సభ్యులు తప్పనిసరిగా చేరే లా చూడాలని కోరారు. టీఆర్ఎస్ పటిష్టం కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందూరులో ఇప్పటికే ఘన విజయం అందుకున్న పార్టీకి, సభ్యత్వ నమోదులోనూ రాష్ట్రంలో రికార్డు దక్కేలా చేయాలన్నారు. ఈ నెల 20 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయలని, మార్చి ఒక టి నుంచి గ్రామ కమిటీలు వేసుకోవాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీకి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 12 మందితో అడహక్ కమిటీని వేసి,సభ్యుల పేర్లను మంత్రి వెల్లడించారు.మండలాలోనూ తాత్కాలిక కమిటీలను వేసుకుని గ్రామస్థాయిలో కమిటీలు వే యాలన్నారు. త్వరలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు సమావేశంలో మాట్లాడిన పలువురు నేతలు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాబోయే కా లంలో జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలకు నాయకులు, కార్యకర్తలు మిగలరన్నా రు. ఇతర పార్టీల కండువాలు ఉండవని, టీఆర్ఎస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులకు స్థానం లేదని, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఉంటే, టీఆర్ఎస్లో చేరాలన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి పనులు చేస్తుంటే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి పుట్టగతులు ఉండవని వారు దుయ్యబట్టారు. కేసీఆర్ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేశారని, ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. విదేశాలలోనూ కేసీఆర్‌కు పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. అలాంటి నేత నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, గులాబీ కండు వా కింద పనిచేసే ప్రతి ఒక్కరికి కేసీఆర్ న్యా యం చేస్తారన్నారు. చురుకుగా పని చేసి సభ్య త్వ నమోదును పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశె ట్టి, జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, మేయర్ అకుల సుజాత, నాయకులు ఈగ గంగారెడ్డి, ముజీబుద్దీన్ తది తరులు పాల్గొన్నారు. -
గులాబీ రేస్
⇒సంస్థాగత నిర్మాణంపై ఇక టీఆర్ఎస్ దృష్టి ⇒నేటి నుంచి సభ్యత్వ సేకరణ ⇒చురుకుగా పాల్గొన్నవారికే నామినేటెడ్ పదవులు! ⇒కనీసం 2.70 లక్షల సభ్యత్వాలు లక్ష్యం ⇒పరుగులు పెడుతున్న నేతలు ⇒మార్చిలో కొత్త కమిటీలు ⇒తాత్కాలిక కమిటీలో జిల్లాకు దక్కని చోటు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొత్త రాష్ర్టంలో తొలిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ర్ట సమితి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిం చింది. గ్రామస్థాయి నుంచి ఇప్పుడున్న అన్ని కమిటీలను రద్దు చేసిన ఆ పార్టీ నాయకత్వం సభ్యత్వ సేకరణ సందర్భంగా బలాన్ని నిరూపించుకునేందుకు సన్నద్ధమైంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ సేకరణ చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 5 వేల క్రియాశీల, 25 వేల సాధారణ సభ్యత్వాలను సేకరించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు మంగళవారం జరిగిన సమావేశంలో దిశానిర్ధేశనం చేశారు. ఈ లెక్కన జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 2.70 లక్షలకు తగ్గకుండా సభ్యులను పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు సభ్యత్వ సేకరణకు పోటీపడే అవకాశం ఉంది. కాగా, 12 మందితో రాష్ట్రస్థాయిలో వేసిన పార్టీ అడ్‌హక్ కమిటీలో జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. మార్చి 1 నుంచి కొత్త కమిటీల ప్రక్రియ టీఆర్ఎస్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో నిర్వహించిన సమావేశం తర్వాత అన్ని కమిటీలు రద్దయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీలోగా అన్ని స్థాయిలలో కొత్త కమిటీలను ఎ న్నుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత కమిటీలను మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే జిల్లాలో కొత్తగా సభ్యత్వ సేకరణ నమోదు చేయాల్సి ఉంది. అయితే, గురువారం నుంచి నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బాన్సువాడ తదితర నియోజకవర్గాల నుంచి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితులలోనూ సభ్యత్వ నమోదును ఈనెల 24 వరకు ముగించాల్సి వుంది. నాలుగైదు రో జులు అటుఇటైనా మార్చి ఒకటి నుంచి కొత్త కమిటీల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన నాయకులను సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా నియమించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి పది వరకు గ్రామ కమిటీల ఎన్నికలు, 11 నుంచి 20 వరకు మండల, పురపాలిక కమిటీల ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో జిల్లా కమిటీతోపాటు, అనుబంధ కమిటీల ప్రక్రియ పూర్తి కానుంది. ఏప్రిల్ 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఆవిర్భావసభ కంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు ఆధారంగానే నామినేటెడ్ పదవులు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన టీఆర్ఎస్ నామినేటెడ్ పదవులను కట్టబెట్టేందుకు గ్రేడింగ్‌ను నిర్ణయించనుంది. నామినేటెడ్ పదవులను ఆశించే నాయకులు సభ్యత్వ సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఏ మేరకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారన్న విషయాలను పరిశీలించనుంది. ఇందుకోసం జిల్లా మంత్రులతోపాటు సంస్థాగత ఎన్నికల పరిశీలకుల నివేదికలనే ప్రామాణికంగా తీసుకోనున్నారని తెలిసింది. సంస్థాగత పదవులను రద్దు చేసిన కేసీఆర్, సభ్య త్వ సేకరణ, కొత్త కమిటీలతోపాటు నామినేటెడ్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్లు ప్రకటించా రు. ఈ నేపథ్యంలో జిల్లా, రాష్ర్టస్థాయిలలో పదవులు ఆశిస్తున్న ఎమ్మె ల్యేలు, ద్వితీయశ్రేణి నేతలకు సభ్యత్వ సేకరణ సవాల్‌గా మారనుంది. పార్టీ ఇచ్చిన టార్గెట్లను మించి సభ్యత్వ సేకరణ చేసేందుకు నేతలు కార్యాచరణ రూ పొందించుకుంటున్నారు. వాటర్ గ్రిడ్, టీఎస్ఎండీసీ పోస్టుల కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు పోటీ పడుతుండగా, వ్యవసాయ మార్కెట్, దేవాలయ, గ్రంథాలయ కమిటీలతోపాటు పలు నామినేటెడ్ పదవులపై నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే కలలు కంటున్నారు. దీంతో వారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురు గ్గా పాల్గొనే అవకాశం ఉంది. పార్టీలో సభ్యులుగా చేరేవారికి రూ. రెండు లక్షల బీమా సౌకర్యం కూడ కల్పించనున్నట్లు కేసీఆర్ ప్రకటిం చడం కూడ కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఏదేమైనా ప్రజాకర్షక పథకాలతో ఎనిమిది నెల లుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ నేతలందరూ లక్ష్యసాధన దిశగా కదులుతున్నారు. నేటి నుంచే సభ్యత్వ నమోదు నిజామాబాద్ అర్బన్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో బుధవారం జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని భారతీ గార్డెన్లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నా రు. పార్టీ శ్రేణులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆ యా నియోజకవర్గాలలో సంబంధిత ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా నమోదు చేయాలన్నారు. ఇందుకు త గిన కార్యాచరణను రూపొందించారు. ఈ స మావేశంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేపపిల్లల్ని వదిలిన మంత్రి
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఆదివారం నాడు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపపిల్లల్ని వదిలారు. ఈ ప్రాజెక్టులో 2.2 లక్షల చేపపిల్లల్ని వదలడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించినట్లు అవుతుందన్నారు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్య కారులను, రైతులను ఆదుకుంటామని మంత్రి పోచారం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను త్వరితగతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితర నాయకులు పాల్గొన్నారు. -
దండం పెట్టే రోజులు పోయాయి
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బిచ్కుంద: తెలంగాణ ఆవిర్భావంతో దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే రోజులు పోయాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ బీబీపాటిల్‌తో కలిసి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. మండల పరిధిలోని మిసన్కల్లాలి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నది మంత్రి పదవులు అనుభవించడానికి కాదన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఒక్క జుక్కల్ నియోజకవర్గానికే రూ.170 కోట్లు మంజూరు చేశారన్నారు. మార్చి నుంచి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంచినీటి సమస్యను అధిగమించేందుకు రూ.35వేల కోట్లతో వాట ర్‌గ్రిడ్, కరెంట్ సమస్యకు రూ.45 వేల కోట్లు వెచ్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. మూడేళ్ల తర్వాత గృహా లకు, పరిశ్రమలకు 24 గంటల పాటు, రైతులకు 7గంటల కరెంట్ ఇస్తామన్నా రు. అనంతరం గుండెనెమ్లీ గ్రామంలో విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన, పుల్కల్లో ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం, మిషన్ కల్లాలిలో పంచాయతీ భవ నం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సర్పంచులు కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ సిందే, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జేసీ రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీఓ శ్యాం ప్రసాద్ లాల్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు గంగారెడ్డి, ప్రజా ప్రతినిధు లు, అధికారులు పాల్గొన్నారు. సీమాంధ్రుల పాలనలో అడుక్కోవాల్సి వచ్చింది నిజాంసాగర్: సీమాంధ్రుల పాలనలో అభివృద్ధి పనుల నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడుక్కోవాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలో ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులకు ఆ పరిస్థితి లేద ని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రా రంభించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల ప్రాణత్యాగాలు, ఉద్యమాల తో పాటు, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేయటానికి కృషి చేస్తున్నామని చె ప్పారు. ఇందుకోసం నిధులకు కొదువ లేదని స్పష్టం చేశారు. మూడేళ్లలో ఇం టింటికీ నల్లా నీరు అందజేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యం బాన్సువాడ : అంగన్వాడీ కేంద్రాల్లో నూ త్వరలో సన్నరకం బియ్యం పంపి ణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయ న స్వగృహంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. టీఆర్ఎస్కు ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖు రాన్ వంటిదని, ఎన్నిక హామీలన్నీ తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు. సమైక్య రాష్ర్టంలో తెలంగాణలోని 29లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 35లక్షల దాటాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన నిజామాబాద్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తొలు త మంత్రులు, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. -
మంచి కాలం ముందుంది
⇒ చెరుకు రైతుల శ్రేయస్సు కోసం కృషి ⇒ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది ⇒ ఎఎన్ఎస్ఎఫ్ సర్కారు పరమవుతుంది ⇒ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ: జిల్లాలోని చెరుకు రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి, చక్కెర కర్మాగారాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బోధన్‌లోని ఎన్ఎస్ఎఫ్ (నిజాం షుగర్ ఫ్యాక్టరీ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని చెప్పారు. సో మవారం తన స్వగృహం నుంచి నిజామాబాద్ రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి మహారాష్ట్రలోని పూణె ప్రాంతానికి మంత్రి బస్సులో బయలుదేరారు. ఆయన వెంట బాన్సువాడ, బోధన్, డిచ్పల్లి ప్రాంత రైతులు ఉన్నారు. బస్సుయాత్రను ప్రారంభించే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆసియాలోనే పేరుగాంచిన ఎన్ఎస్ఎఫ్ ప్రయివేటుపరం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మహారాష్ట్రలోని పూణె సమీపంలో గల బారామత్లో రైతులు విజయవంతంగా కర్మాగారాలను నడిపిస్తున్న ట్లు తెలిసిందని, వారు ఎలా నడుపుతున్నారో తెలుసుకొనేందుకు ఈ పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. రైతులను చైతన్యపర్చి, వారిలో ఉత్సాహం నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు. ఎన్ఎస్ఎఫ్ కర్మాగారాల కోసం రూ. 400 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు. ఉత్సాహంగా ప్రారంభమైన పర్యటన పర్యటనలో చెరుకు రైతులతో మంత్రి, ఎమ్మెల్యేలు కలిసిరావడంపై రైతులు హ ర్షం వ్యక్తం చేశారు. చెరుకు రైతులకు మహర్దశ రానుందన్నారు. నిజాం చక్కెర క ర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, రైతుల భాగస్వామ్యంతో నడపడా న్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. ఈ పర్యటనలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ పర్యటనలో తాము మహారాష్ట్ర రైతుల ఆధునిక వ్యవసాయపద్ధతులను తెలుసుకొంటామన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొత్తకొండ భాస్కర్ పాల్గొన్నారు. -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత రెండోసారి సర్వసభ్య సమావేశం జరగనుంది. గతంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సభ వాడివేడిగా జరిగింది. గతంతో పోల్చితే ప్ర స్తుత పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నా యి. ప్రధానంగా జిల్లాలో వైద్యా, ఆరోగ్య శాఖ పనితీరుతోపాటు తాగునీటి తదితర సౌకర్యాల కల్పన, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఈజీఎస్, ఐకేపీ శాఖలను ఎజెండాలో అంశాలుగా పొందుపర్చారు. వీటిపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే రాష్ర్ట రోడ్లు భవనాలు, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆయా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నప్పటికీ ముందురోజే మంత్రి హోదాలో జిల్లాలోని పలు సమస్యలపై తుమ్మల వివరణ ఇచ్చారు. వచ్చే పర్యటనలోగా అధికారులు తీరు మార్చుకోవాలని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఈ సర్వసభ్య సమావేశంలో పెద్దగా చర్చజరిపే అవకాశాలు కనిపించడం లేదు. గత సమావేశంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు రుణ మాఫీ రూ. లక్ష వరకు వర్తింప జేయాలని, ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలని తీర్మానించారు. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉపాధిహామీ పై సమావేశంలో కొంతమేర చర్చజరిగే అవకాశం ఉంది. 30న ప్రత్యేక సమావేశం వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై ఈ నెల 30న జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన జరిగే ప్రత్యేక సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, విత్తనాభివృద్ధి, మత్స్య, పాడిపరిశ్రమ తదితర శాఖల పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ శాఖల్లో అమలవుతున్న పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపులపై చర్చించనున్నారు. -
పోచారం గిది మా గాచారం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అయ్యా.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారూ.. కా లం కలిసిరాక ఏటా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాం. దీంతో మా జిల్లా అన్నదాతలు ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 72 మందికి పైగానే తనువు చాలించారు. కానీ.. అధికారుల లెక్కల ప్రకారం 18 మంది మాత్రమేనట. ఇదెక్కడి న్యాయం. సర్కారు సాయం అందక.. పెట్టుబడికి రుణాలు లేక.. కరెంటు కోతలతో పంటలు ఎండి.. శక్తులన్నీ ఒడ్డి, ఆస్తులనమ్మి.. కొండంత ఆశతో పంటలు సాగు చేస్తే నెర్రెలు బారిన నేలలు మా గుండెలు పగిలేలా చేసినయ్. దిగుబడి రాక అప్పు లు గుదిబండలా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉరివేసుకుని.. పురుగుల మందులు తాగి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. నేడు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా.. ప్రభుత్వం గుర్తించింది.. ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు 51 మంది రైతు కుటుంబాల్లో దర్యాప్తు నిర్వహించి 18 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించింది. కొత్త ప్రభుత్వం వచ్చినా అన్నదాతల బతుకులు మాత్రం మారడం లేదు. పైగా రైతులకు మరిన్ని సమస్యలు పెరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన సర్కారు రైతుల సంక్షేమానికి అనేక వాగ్దానా లు చేసి అధికారంలోకి వచ్చి ఆరు నె లలు గడుస్తున్నా వారి సమస్యలు పూ ర్తిస్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు. ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల మాఫీ, సాగుకు కొత్త రుణాల మంజూరు, గతేడాది దెబ్బతిన్న పంటకు నష్టపరిహారంలో జాప్యం, పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో జిల్లాలో 72మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయినా.. రైతు ఆత్మహత్యలు వాస్తవం కా దంటూ తప్పుడు నివేదికలిస్తున్నారు. జిల్లాలో ఈ ఆరు నెలల్లో కేవలం 51 మంది రైతుల ఆత్మహత్యల గురించి అధికారులు దర్యాప్తు జరిపి 18మంది రైతులు వ్యవసాయంలో ఇబ్బందుల తో ఆత్మహత్యలు చేసుకున్నారని తే ల్చారు. వారికి మాత్రమే ప్రభుత్వ స హాయం అందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అందని రుణాలు.. గతంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసి ప్రభుత్వం కొత్త రుణాలు అందిస్తుందని రైతులు ఎదురుచూస్తే వారికి నిరాశే ఎదురైంది. రుణ మాఫీకి ప్రభుత్వం నెలల తరబడి కాలయాపన చేస్తూ 25 శాతం ప్రకటించింది. పాత రుణాలు మాఫీ అయి కొత్త రుణాలు అందుతాయని ఖరీఫ్ సాగు పెట్టుబడి ఖర్చులకు అవుతాయని బ్యాంక్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులకు ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది రూ.2,280 కోట్లు ఖరీఫ్, రబీ కలిపి జిల్లా రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్, రబీ కలిపి ఇప్పటివరకు 2 లక్షల 40 వేల 976 మంది రైతులకు రూ.1,163 కోట్ల 89 లక్షలు అందించారు. ఈ లెక్కన ఖరీఫ్ సాగు పూర్తయినా సగం మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో రుణాలు అందలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సాగు చేసే పరిస్థితి లేక.. రుణం కోసం బ్యాంక్ వైపు చూసే పరిస్థితి లేక రుణ లక్ష్యం నీరుగారుతోంది. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,693 కోట్ల 74 లక్షలు కాగా, రబీ రూ. 534 కోట్ల 86 లక్షలు ఇవ్వాలని ఈ ఏడాది నిర్ణయించారు. అందని పంటనష్టం పరిహారం.. అతివృష్టి, వడగళ్ల వానలతో వేలాది హెక్టార్లలో పం టలు నీటమునిగాయి. అధికారులు సర్వేచేసి ప్రభుత్వనికి నివే దిక అందించారు. నష్టపోయిన రైతులుకు పంట పరిహారం ఇంతవరకూ అందలేదు. వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతుల తప్పిదాలతో అనర్హుల జాబితాల్లో పరిహారం జమ అయ్యింది. పంట భూములు లేనివారికి పంటలు వేయని వారికి పరిహారం అందింది. కొంత మంది పంట నష్ట పోయినప్పుడు రైతుల ఖాతాల నెంబర్లు సరిగా లేవని అధికారులు పేర్కొంటున్నారు. కరువు కరాళ నృత్యం జిల్లా వ్యప్తంగా 3.90 లక్షల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. పంటలు 80 శాతం వర్షాధారంపైనే ఆధారపడ్డారు. గతేడాది అతివృష్టి, వడగళ్లతో పంటలను నష్టపరిస్తే ఈ ఏడాది అనావృష్టితో పంటలు ఎండిపోయాయి. ఖరీఫ్‌లో కరువు రక్కసి కరాళనృత్యం చేసింది. ఈ ఖరీఫ్‌లో 6.50 లక్షల హెక్టార్ల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. తగ్గిన వర్షాభావ పరిస్థితులతో 5.47 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాలో 52 మండలాలకుగాను 41 మండలాలను కరువు మండలాలుగా వ్యవసాయ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వం రుణాలు అందించకపోవడంతో పంట సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను అశ్రయిస్తున్నారు. తగ్గిన వర్షపాతం.. గతేడాది ఖరీఫ్ సమయానికి 1382 మిల్లీమీటర్ల వర్షపాతం (సాధారణం కంటే అధికంగా) కురిసింది. ఈసారి నవంబర్ వరకు 743 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దాదాపు 32 శాతం మేర తక్కువగా న మోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. జలాశయాల కింద పంట సాగు చేసుకునేందుకు రైతులు వెనుకడుగు వేయాల్సి వ స్తోంది. శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) జలాశయం వర ద నీరు పూర్తిస్థాయిలో రాలేదు. మిగితా జలాశయా ల పరిస్థితీ అదేవిధంగా ఉంది. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు నీరందక దిగుబడి భారీగా పడిపోయింది. రబీ సాగులో ప్రాజెక్టుల నీటితో సాగు చేసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో వరి సాగు చేపట్టొద్దని ప్రభుత్వమే చెబుతోంది. ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందుకే.. రబీ 90 వేల హెక్టార్లకు కావాల్సి ఉండగా 20 వేలకే పరిమితమైంది. జిల్లాలో 52 మండలాలకు గాను 11 మండలాల్లో 70 శాతం వర్షపాతం నమోదైంది. 41 మండలాల్లో 80 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయని.. వ్యవసాయ అధికారులు కరువు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. కరెంటు కష్టాలు బోరు బావుల్లో నీరున్నా పంటలకు అందించడానికి వీలు లేకుండా పో తోంది. రైతులను కరెంటు కోతలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న 7 గంటల కరెంటును 5 గంటలకు కుదించారు. సరఫరాలోనైనా మూడుగంటలు పూ ర్తిస్థాయిలో ఇవ్వక ఖరీఫ్‌లో పంట లకు నీరు అందించలేకపోయారు. రబీ సాగు చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేశారు. ఖాళీల తీరు.. జిల్లాలో 52 మండలాలకు గాను 98 వ్యవసాయ అధికారులు (ఏఓ)లు ఉండాలి. కానీ.. 55 మంది ఏవోలు మాత్రమే పనిచేస్తున్నారు. మరో 43 ఖాళీలు ఉన్నాయి. అంతేకాకుండా మండల విస్తరణ అధికారులు (ఏఈవో) 134 పోస్టులకు గాను 97 మంది పనిచేస్తుండగా, 43 ఖాళీలు ఉన్నాయి. జిల్లా సహా య ఉపసంచాలకులు మూడు పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. కొన్ని కొంత మంది అధికారులకు రెండు మూడు మండలాలు అప్పజెప్పడంతో పూర్తిస్థాయి లో రైతులకు న్యాయం జరగడం లేదు. సాగు దిగుబడి తెలియక పాత పద్ధతులనే అనుసరిస్తూ నష్టపోతున్నారు. కొత్త వంగడాలు, యాంత్రీకరణ పద్ధతులను ఎప్పటికప్పుడు అన్నదాతలకు తెలిపి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాల్సి ఉంటుం ది. క్షేత్రస్థాయి అధికారుల పోస్టులు భర్తీకి నోచుకోక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పేరుకే పరీక్ష కేంద్రాలు.. భూసార పరీక్ష కేంద్రాలు జిల్లాకు నాలుగున్నా జిల్లా కేంద్రంలో మినహా ఇంద్రవెల్లి, నిర్మల్, మంచిర్యాల లో ఎక్కడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో అధికారులు, పరికరాలు లేక రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించేవారు కరువయ్యారు. భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితా ల ఆధారంగా పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించే విధంగా సలహాలు, సూచనలు అందించేవారు కరువయ్యారు. ఈ పరీక్ష కేంద్రాలకు నాలుగు ఏవో స్థాయి అధికారులతోపాటు ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ.. జిల్లా కేంద్రంలో ఎని మిది మందికి ముగ్గురు ఏవోలు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు భూసార పరీక్ష కేంద్రాల ద్వారా 10,500 పరీక్ష నమూనాలు లక్ష్యం కాగా, సిబ్బంది కొరతతో జాప్యం జరుగుతోంది. సగం వరకు నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అందరికీ ఇవ్వాలి.. జిల్లాలో 72 మంది రైతులు రుణాలు అందక పంటలు ఎండిపోయి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారుల ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు. రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి దిగుబడులు రాక.. అప్పులు తీర్చ లేక తనవు చాలిస్తున్నా. అలాంటి కుటుంబాలందరికీ జీవో 421 సవరించి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. అప్పుడే ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది. - ముడుపు ప్రభకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి -
రైతాంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట
* త్వరలో రుణమాఫీహామీ పత్రాలు * మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడరూరల్ : దేశానికి అన్నంపెట్టే రైతన్నల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొల్లూర్ గ్రామంలో రూ.18లక్షల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల గోడౌన్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 250కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈసారి బీపీటీ ధాన్యానికి మద్దతుధర లేకపోవడంతో అక్కడడక్కడ ధాన్యం రాశులు పేరుకు పోయిన మాట తమ దృష్టికి వచ్చిందన్నారు. వారంతా రైతుబంధు పథకంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిల్వచేసి, పంటవిలువలో 75శాతం వరకు అప్పుగా తీసుకునే వెసులుబాటు వుందన్నారు. తీసుకున్న అప్పుకు గరిష్టంగా రూ. 2లక్షలకు 6మాసాల వరకు ఎలాంటి వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృషితో ఈసారి 25 ఎకరాల్లో రైతులకు ఫౌండేషన్ సీడ్ సాగు చేయిచడం అభినంద నీయమన్నారు. ప్రభుత్వం విత్తనాలను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 160 గోడౌన్లు నిర్మించడానికి నాబార్డుకు ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ హామీ పత్రాలు అందిస్తామన్నారు. గ్రామస్తులు సూచించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించడానికి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. అంతకు ముందు కొల్లూర్ మసీద్ వద్ద మంత్రిని ముస్లింలు ఘనంగా సన్మానించారు. పాఠ శాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. సభ ప్రారంభానికి ముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొల్లూర్ గ్రామ సర్పంచ్ మాధవీ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ మాసాని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ రేష్మాబేగం ఎజాస్, జెడ్పీటీసీ విజయగంగాధర్, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజిరెడ్డి, నార్లసురేష్, ఇన్చార్జి సర్పంచ్ బస్వంత్, ఎంపీటీసీ సభ్యురాలు సురేఖరాచప్ప , మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మోర్తాడ్ : వ్యవసాయానికి అండదండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు సూక్ష్మ సేద్యానికి రూ. 150 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం పది జిల్లాలకు భారీగా నిధులను కేటాయించి రైతు ప్రభుత్వంగా పేరు సంపాదించిందన్నారు. శనివారం మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూక్ష్మ సేద్యంతో సాగునీటి కొరతను అధిగమించవచ్చన్నారు. వరి మినహా ఇతర వాణిజ్య, ఆహార పంటలకు సూక్ష్మ సేద్యం మేలైందన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి మన సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను సృష్టించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.సహకార సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులను నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వసతులను కల్పించడానికి సహకార శాఖ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాను జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడు తాళ్లరాంపూర్‌లో గిడ్డంగి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చానన్నారు. అప్పటి చైర్మన్ క్యాతం నర్సింలును వేదికపైకి పిలిపించిన మంత్రి పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులు స్థలం కేటాయిస్తే కోల్డ్ స్టోరేజీని నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..మారుమూల గ్రామంలోని ఒక చిన్న సహకార సంఘం రైస్‌మిల్లును నిర్మించి కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఆసరా పింఛన్ గురించి అర్హులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పట్వారి గంగాధర్‌రావు, డెరైక్టర్ సోమచిన్న గంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అమిత, ఎంపీపీ కల్లెడ చిన్నయ్య పాల్గొన్నారు. -
పిచ్చోళ్లను చేస్తున్నరు!
⇒ వైద్యులపై మండిపడిన మంత్రి ‘పోచారం’ ⇒ శానిటేషన్ అధ్వానంగా ఉంది, పరిశుభ్రత లేదు ⇒ మెడికల్ కళాశాల నిధుల వినియోగంపై స్పష్టత లేదు ⇒ పేద రోగులకు మానవత్వంతో సేవలందించాలని హితవు ⇒ సదరం శిబిరాల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం ⇒ వాడీవేడీగా సాగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్ : ‘‘మేమేమైన పిచ్చోళ్లలాగా కనబడుతున్నామా, సూటిగా సమాధానం చెప్పరెందుకు? మమ్మల్నే తికమక పెడతరు. మీతో మాట్లాడితే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించండి. మీలో మీకు సమన్వ యం లేదు. పనిలో శ్రద్ధ లేదు. వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి’’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్యులపై మండిపడ్డారు. సోమవారం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమీక్ష సమావేశం జరిగింది. ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగుల అవసరాలపై చర్చించారు. వైద్యాధికారుల తీరుపై తీవ్రంగా చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ ‘‘శానిటేషన్ ఎవరు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి రాగానే దుర్వాసన వస్తుంది. ఏ మాత్రం శుభ్రత లేదు. శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరు? నెలకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారని, 61 మంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ బదులిచ్చారు. కొత్త, పాతవారికి వేరువేరు బడ్జెట్లు ఉన్నాయని, నిధులు రావడం లేదన్నారు. ఆస్పత్రి శుభ్రంగా శుభ్రంగా ఉందని చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేమేమైనా పిచ్చోళ్లమా...మాకు కనిపించడం లేదా, ఎక్కడ ఉంది శుభ్రత, మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తావా’’ అంటూ అసహనం వ్యక్తం చే శారు. శానిటేషన్ సిబ్బందికి గత జులై నుంచి నిధులు విడుదల కాలేదని చెప్పడంతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, డీఎంఈ శ్రీనివాస్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ మీనాకుమారితో మంత్రి పోచారం ఫోన్లో మాట్లాడారు. నిధులకు సంబంధించి ఎవరూ అడగలేదని వారు చెప్పడంతో, సమన్వయం లేకనే పనులన్ని నిలిచి పోతున్నాయని, సక్రమంగా పనులు చేయాలని వైద్యులను హెచ్చరించారు. ఎందుకు వెళుతున్నారు? రేడియాలిస్టు సమయపాలన పాటించడం లేదని, అందుబాటులో ఉండడం లేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మంత్రి దృష్టికి తెచ్చారు. తాను పగలు 2.30 గంటలకు ఇంటికి వెళుతున్నానని రేడియాలజిస్టు చెప్పడంతో, ఎందుకు వెళుతున్నారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడం తో, మీతో మాట్లాడితే మాకే పిచ్చి లేస్తుంది. ఎర్రగడ్డకు పోవల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలకు మంజూరైన రూ. 26 కోట్లను ఎలా వినియోగిస్తారో అధికారులు చెప్పలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న జనరిక్ మందుల దుఆణాలు, ఆస్పత్రికి డబ్బులు చెల్లించకపోవడం, ఆస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన ఆంధ్ర బ్యాంకు ఏటీఎంకు కేవలం నెలకు రూ. 1500 మాతమే వసూలు చేయడాన్ని మంత్రి ప్రశ్నించారు. ఆస్పత్రిలో సైకిల్ స్టాండ్, క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జనరిక్ మందు ల దుకాణాలను టెండర్ల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి పక్షాన జరుగ కపోతే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘సదరం’ ఇలాగేనా? సదరం నిర్వహణపై కలెక్టర్ మండిపడ్డారు. నియోజకవర్గాలవారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రి వైద్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘‘మీకు వాహనాలు ఏర్పాటు చేయాలా! మీరు ప్రభుత్వ వైద్యులు కారా! వైద్యులు లేరని ఆర్మూర్ నుంచి తరచూ ఫోన్లు వచ్చాయి. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోండి’’ అని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. డీసీహెచ్ఎస్ శివదాస్ సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి, డీఎంహెచ్ఓ గోవింద్‌వాగ్‌మోరే, ఆస్పత్రి సూ ప రిండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు రజినీకాంత్, బ న్సీలాల్, విశాల్ పాల్గొ న్నారు. అంతకు ముం దు మంత్రి పోచారం ఆ స్పత్రిలోని వివిధ వా ర్డులను తిరుగుతూ పరి శీలించారు. -
సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం
* విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యతను పెంచుతాం * సకల సౌకర్యాల కల్పన కోసం రాత్రుల్లో బసచేస్తాం * మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు : రాష్ట్రంలో 85శాతం మంది ప్రజలు బడుగు, బలహీన వర్గాలవారున్నారని గుర్తించిన ప్రభుత్వం సంక్షేమ రంగానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని హమాల్వాడీలో కోటి రూపాయలతో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతిగృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం శిలాఫకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్‌చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో మొదటి నూతన వసతిగృహాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సొంత భవనాలు లేక మారు మూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు బయట గదుల్లో అద్దెకు ఉంటూ ఇబ్బందులు పడ్డారని, ఇక ఆ ఇబ్బందులు తప్పాయన్నారు. ఇలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నూతన వసతిగృహాలు జిల్లాకు చాలా ముంజూరయ్యాయని, అవి త్వరలోనే పూర్తి కానున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు సంక్షేమ రంగాన్ని నీరుగార్చాయని ఆరోపించారు. కేజీ టూ పీజీ విద్యనందించేందుకు ప్రతి మండలానికి 17ఎకరాల్లో పెద్ద భవనాన్ని నిర్మించబోతున్నామని, అందులో సు మారు వెయ్యి మంది విద్యార్థులకు విద్యనందించడంతో పాటు విశాలమైన వసతిని కల్పిస్తామన్నారు. సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు ప్రస్తుతం అమలు చేస్తున్న మెనూ కాకుండా అందులో మార్పులు చేపట్టి సంపూర్ణ, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. ఎప్పటికప్పుడు వసతిగృహాల్లో రాత్రుల్లో బస చేసి విద్యార్థుల బాగోగులు, అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్టీ వసతిగృహా కళాశాల విద్యార్థులు కొత్త భవనంలో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కరించాలని సంబంధిత మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే నిర్మించిన వసతిగృహంలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్‌ను నిర్మించలేదని తెలసుకున్న మంత్రి కాంట్రాక్టర్‌తో మాట్లాడి అందుకు గల కారణాలు తెలుసుకున్నారు. వాటి నిర్మాణాల కోసం ప్రపోజల్స్ పంపాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ కోతల పాపం కాంగ్రెస్, టీడీపీలదే రాష్ట్రంలో విద్యుత్ కోతలకు గత కారణం, పాపం గత ప్రభుత్వాలు కాంగ్రెస్, టీడీపీలదేనని మంత్రి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రోజు 20కోట్లు వెచ్చించి విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో, రాష్ట్రంలో వర్షాధార పంటలు ఎండిపోతున్నందున వాటిపై సర్వే చేసి నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు అన్ని రకాల ఏర్పాట్లు బాన్సువాడ : ఖరీఫ్‌లో జిల్లాలో 96 శాతం పంటలు సాగయ్యాయని, అన్ని రకాల పంటల కొనుగోళ్ళు, మద్దతు ధర కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. జిల్లాలో 60 సొసైటీల పరిధిలో ఆర్ఐడీఎఫ్ -20 కింద గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, సన్‌ఫ్లవర్, వేరుశనగ, మి నుము, పెసర వేయాలని మంత్రి సూచిం చారు. రాష్ట్రంలో 18వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనుండగా, అందులో నిజామాబాద్ జిల్లాలోనూ థర్మల్, సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు -
కలెక్టరే నిర్ణేత
ప్రగతినగర్ : కలెక్టరెట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం నీటి సలహాబోర్డు సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్యెల్యేలు షకీల్, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడి, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5.09 టీఎంసీల నీరు నిలువకు పోగా, తాగు నీటికి రెండు టీఎంసీలు కేటాయిస్తారు. మిగితా నీటిని వృథాపోకుండా, పంటల కనుగుణంగా సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇస్తున్నట్లు మొదటి తీర్మానం చేశారు. అదేవిధంగా అలీసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి 0.8 టీఎంసీల నీటి ని వ్యవసాయానికి విని యోగించుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ 2వ తీర్మానం, గుత్ప ఎత్తిపోతల నుంచి అవకాశం ఉన్నం త వరకు నీటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి 3వ తీర్మానం, కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి అవసరానికనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కలెక్టర్‌కు అధికారం ఇస్తూ 4వ తీర్మానాన్ని బోర్డు ఆమోదిం చింది. క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించాలి - మంత్రి పోచారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా వివరాలు సేకరించాలని, ఆదర్శరైతుల రిపోర్టులపైనే ఆధారపడడం మానుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ, సహాయ వ్యవసాయాధికారులు, ఉపసంచాలకులు పంటల విస్తీర్ణాన్ని పరిశీలించాలన్నారు. వ్యవసాయ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు సమాచార సేకరణకు స్వయంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. సాగు చేస్తున్న పంటలకు విద్యుత్ ఏమేరకు అందించాలో నిర్ణయించాలని, పంటలను కాపాడడానికి రైతులకు చేయూతనందించాలన్నారు. పంటనష్టం, పంటరుణాల నిధులు ఎట్టిపరిస్థితుల్లోను దుర్వినియోగం కాకూడదన్నారు. రాష్ట్రానికి 2400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 1400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని, పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయ పంటలు కాపాడడానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. 2009 నుంచి 2014 వరకు పంటనష్టం పరిహారం కింద 482.52 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తద్వారా 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో 51 వేల మంది రైతులకు 20.06 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్‌షిండే మాట్లాడుతూ 300 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మండలానికి విడుదలచేయాలని కోరారు. నియోజక వర్గంలో తీవ్ర వర్షభా వ పరిస్థితులు తట్టుకొని రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి ఈనీరైన ఉపయోగపడుతుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఆద ర్శ రైతుల నుంచి వీఆర్ఓలు వారి ద్వారా వ్యవసా య అధికారులు వివరాలను సేకరించడం ద్వారా సరైన పద్ధతిలో న్యాయం జరుగడం లేదన్నారు. దీని ద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందని షకీల్ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నం దున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సహకార బ్యాంకు చైర్మన్ గంగాధర్పట్వారి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ షకీల్ ఉర్ రహమాన్, జేడీఏ నర్సింహ, ఆర్డీఓలు యాది రెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.