Nirmala Sitharaman
-
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
నామినీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) చందాదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.పీపీఎఫ్ ఖాతాలకు నామినీ పేర్లను మార్చడానికి ఆర్ధిక సంస్థలు రూ.50 వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చార్జీలను తొలగించడానికే జీవో తీసుకురావడం జరిగింది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులు, భద్రతా లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వరకు నామినీలు ఉండవచ్చు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!నామినేషన్ కోసం ఫారం-10 ని దాఖలు చేయడం ద్వారా మీరు మీ పీపీఎఫ్ ఖాతాలోని నామినీ వివరాలను మార్చవచ్చు. దీన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాదారులు వివరాలను నవీకరించడానికి అనుమతిస్తాయి.Recently was informed that a fee was being levied by financial institutions for updating/modifying nominee details in PPF accounts. Necessary changes are now made in the Government Savings Promotion General Rules 2018 via Gazette Notification 02/4/25 to remove any charges on… pic.twitter.com/Hi33SbLN4E— Nirmala Sitharaman (@nsitharaman) April 3, 2025 -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
వాట్సప్ మేసేజ్‌లతో రూ.90 కోట్లు రికవరీ
పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎన్క్రిప్టెడ్ సందేశాలు, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేసే వెసులుబాటును పన్ను అధికారులకు కల్పించే ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. అక్రమ సిండికేట్ నుంచి రూ.90 కోట్లకు పైగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వాట్సాప్ సందేశాలను డీక్రిప్ట్ చేయడం ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లులోని నిబంధనలపై పార్లమెంట్లో ఆమె మాట్లాడారు.ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల దుర్వినియోగం పెరుగుతోందని, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి కార్యకలాపాల కోసం నేరగాళ్లు వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘1961 ఆదాయపు పన్ను చట్టంలో ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్, లెడ్జర్లు, మాన్యువల్ రికార్డుల గురించే ప్రస్తావించారు. డిజిటల్ రికార్డులను ప్రస్తావించలేదు. ఫిజికల్ లెడ్జర్లను చూపించినప్పటికీ డిజిటల్ రికార్డులు ఎందుకు అవసరమని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే ఇది ఎంతో అవసరం. ఈ రెండింటి మధ్య లోటును పూడ్చడమే కొత్త బిల్లు లక్ష్యం’ అని ఆమె పార్లమెంటులో అన్నారు.‘ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌లు, మొబైల్ ఫోన్లలోని వివరాలు స్కాన్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటికే రూ.250 కోట్లు లెక్కల్లోకి రాని నిధులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.200 కోట్ల బోగస్ బిల్లులకు పాల్పడిన సిండికేట్లు, తప్పుడు పత్రాలతో భూముల అమ్మకంలో మూలధన లాభాలను తారుమారు చేసిన ఉదంతాలున్నాయి. ఇవి వాట్సాప్ ద్వారా బట్టబయలయ్యాయి. లెక్కల్లోకి రాని లావాదేవీలను ట్రాక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ హిస్టరీలను కూడా ఉపయోగించాం. బినామీ ఆస్తులను గుర్తించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రొఫైల్స్ సహాయపడ్డాయి’ అని ఆమె అన్నారు. అయితే ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఎలా యాక్సెస్ అయ్యాయో మాత్రం ఆమె వివరించలేదు.ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల(300 కోట్ల) మంది యూజర్లు ఉన్నారని చెప్పుకునే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కేంద్ర ప్రతిపాదిత చట్టంపై స్పందించలేదు. మెటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి, మీకు మధ్య వ్యక్తిగత సందేశాలను షేర్ చేస్తుంది. దీన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరూ చదవలేరు, వినలేరు, షేర్ చేయలేరని కంపెనీ గతంలో తెలిపింది. కానీ ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదువాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మెసేజ్ ముందుగా షేర్ చేసిన మూలకర్తను గుర్తించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆదేశాలను సవాలు చేస్తూ వాట్సాప్ 2021లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేసింది. తన ఎన్క్రిప్షన్ ప్రమాణాల విషయంలో రాజీపడవలసి వస్తే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేందుకై వెనుకాడబోమని 2024 ఏప్రిల్‌లో వాట్సప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.2222233334223311233 -
హవా హవాయీ!.. నిర్మలా సీతారామన్ టార్గెట్‌గా కునాల్ కమ్రా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై వ్యంగ్య కామెడీతో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజాగా మరో వివాదానికి తెర తీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆమె ఆర్థిక విధానాలను విమర్శిస్తూ సూపర్ హిట్ హిందీ సినిమా ‘మిస్టర్ ఇండియా’లోని ఐకానిక్ పాట ‘హవా హవాయీ’ని పేరడీ చేశారు. ‘ఆప్ కా ట్యాక్స్ కా పైసా హో రహా హవా హవాయీ (జనాలు కట్టే పన్నుల డబ్బులు గోల్మాల్ అవుతున్నాయి)’అంటూ బుధవారం విడుదల చేసిన వీడియోలో చెణుకులు విసిరారు.తాజాగా కునాల్ కమ్రాన్.. ‘ట్రాఫిక్ బఢానే ఏ హై ఆయీ, బ్రిడ్జెస్ గిరానే ఏ హై ఆయీ, కెహతే ఇస్ కో తానాషాహీ (అది ఉన్నదే ట్రాఫిక్ కష్టాలు పెంచేందుకు, బ్రిడ్జిలను కూలగొట్టేందుకు. నియంతృత్వం అంటారు దాన్ని)’ అంటూ అధికార బీజేపీ తీరుపైనా వ్యంగ్యా్రస్తాలు సంధించారు. అయితే తమ పాటను అనుమతి లేకుండా వాడుకోవడం ద్వారా కామ్రా కాపీరైట్‌ను ఉల్లంఘించారని టీ సిరీస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే తాజా పేరడీని యూట్యూబ్‌లో బ్లాక్ చేయించింది. దీన్ని కామ్రా తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు షిండే ఉదంతంలో విచారణకు హాజరయ్యేందుకు వారం గడువు కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తిరస్కరించారు. తక్షణం విచారణకు రావాలంటూ రెండోసారి సమన్లు జారీ చేశారు. బుధవారం ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేసిన కునాల్ కమ్రా.. క్లబ్లో ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. షిండేను దోశద్రోహి అంటూ విమర్శిస్తూ పేరడి పాట పాడారు. దీంతో, శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో క్లబ్‌పై దాడిపై చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. The video has been blocked from YouTube by T-Series due to copyright.So before deleting the video from X, watch it yourself and share it with others to see it.#kunalkamra pic.twitter.com/pCZ67v6zmX— Dhruv Rathee (Parody) (@DhruvRatheeIN) March 26, 2025 -
ద్రవ్యబిల్లుతో భారీ పన్ను ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.ఆదాయపన్ను రిబేట్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్‌ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్‌సభలో ఆమోదంపన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే. -
ఆదాయపు పన్ను బిల్లుపై వర్షాకాల సమవేశాల్లో చర్చలు
లోక్‌సభలో కేంద్రబడ్జెట్ 2025-26 సమయంలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్యాక్సేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న మదింపు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం..వంటి నిబంధనలను విలీనం చేస్తూ పన్ను సంవత్సరం అనే ఏకీకృత భావనను ఈ బిల్లులో ప్రవేశపెట్టనున్నారు.ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు ద్వారా కొన్ని నిబంధనలు, సంస్కరణ చర్యలను ప్రవేశపెట్టామని, వర్షాకాల సమావేశాల్లో ఇవి చర్చకు వస్తాయని ఆశిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరించడం ద్వారా భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక బిల్లు వివిధ నిబంధనలను హేతుబద్ధీకరిస్తుంది. వీటిలో పన్ను మినహాయించబడిన మూలం(టీడీఎస్), పన్ను సేకరించిన మూలం(టీసీఎస్) నిబంధనలపై పరిమితులను తగ్గించడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..విలీన కాలాన్ని ఐదేళ్లు పొడిగించడం వల్ల స్టార్టప్‌లు కూడా ప్రయోజనం పొందుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. విలీన కాలం అనేది ఒక కంపెనీ అధికారికంగా స్థాపించబడి చట్టబద్ధ సంస్థగా నమోదు చేసేందుకు పట్టే సమయాన్ని సూచిస్తుంది. ఫైనాన్స్ బిల్లు 2025 సవరణలలో భాగంగా ఆన్లైన్ ప్రకటనలపై 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. దేశీయ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కస్టమ్ డ్యూటీ నిర్మాణాల హేతుబద్ధీకరణ, కోతలను ఆమె పునరుద్ఘాటించారు. కస్టమ్స్ హేతుబద్ధీకరణ వల్ల దిగుమతిదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. -
మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మణిపూర్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి రాజ్యసభలో మంగళవారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు మణిపూర్‌లో హింసను నిర్మూలించలేకపోయిందన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ సందర్శించకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.గతంలో హింస జరిగినప్పుడూ ప్రధానులు మణిపూర్‌ను సందర్శించలేదన్నారు. 1993లో మణిపూర్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నాగాలు, కుకీల మధ్య ఘర్షణల్లో 750 మంది మరణించారని, 350 గ్రామాలను తగులబెట్టారని, అయినా అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుగానీ, హోంమంత్రి శంకర్రావు చవాన్గానీ రాష్ట్రాన్ని సందర్శించలేదని చెప్పారు. మణిపూర్‌పై దృష్టి సాధించడం లేదని ప్రతిపక్షాల విమర్శలనూ ఆమె తిప్పికొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బందులు, దిగ్బంధాలతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడినా ఏ మంత్రి రాష్ట్రానికి వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ, అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించారని వెల్లడించారు.ప్రతిపక్షాల కంటే సున్నితంగానే ఆలోచిస్తున్నామని, దేశంలోని ప్రతిరాష్ట్రం గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడించారు. మణిపూర్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పూర్తి మద్దతునిస్తున్నామని తెలిపారు. శాంతి నెలకొల్పి తే ఆర్థికంగా మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెదరుమదురు ఘటనలు మినహా.. మరణాలు, అగ్ని ప్రమాదాలు, కాల్పుల సంఘటనలు, నిరసనల కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.శాంతిభద్రతల పరిరక్షణకు 286 కంపెనీల సీఏపీఎఫ్, 137 కంపెనీల ఆర్మీ, అస్సాం రైఫిల్స్.. రాష్ట్ర పోలీసులతో కలిసి పని చేస్తున్నాయన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకుంటున్నారని, జాతీయ రహదారిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మణిపూర్ బడ్జెట్ వివరాలను ఆమె సభకు వెల్లడించారు. ఒకరిపై ఒకరు వేలెత్తిచూపుతూ ఉంటే మణిపూర్‌కు ఎవరూ సాయం చేయరన్నారు. మేకిన్ ఇండియా మంచి ఫలితాలను ఇస్తోంది మేకిన్ ఇండియా పథకంపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. మేకిన్ ఇండియా భారత రక్షణ రంగాన్ని నికర ఎగుమతిదారుగా మార్చిందని ఆమె చెప్పారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని సీతారామన్ తెలిపారు. తన వాదనను బలపరిచే డేటాను సభకు తెలియజేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయని, ఇప్పటివరకూ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని, 9.5 లక్షల మందికి ఉపాధినిచ్చాయని చెప్పారు. తృణమూల్ ఎంపీల వాకౌట్ మణిపూర్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంత్రి ఇచ్చిన సమాధానంపై తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. మణిపూర్ బడ్జెట్‌పై మంత్రి ఇచ్చిన సమాధానం కంటితుడుపుగా ఉందని ఎంపీ సుస్మితాదేవ్ అన్నారు. 22 నెలలుగా మణిపూర్ కాలిపోతుంటే అల్లర్లను ఆపడానికి ప్రధాని, హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. -
మరి మీరు చేసిందేంటి?.. నిర్మలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులు కేంద్రం వర్సెస్ స్టాలిన్ అనే విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్‌ను తొలగించడం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ కౌంటరిచ్చారు.తాజాగా ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..‘గతంలో ఓ సందర్భంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆంగ్ల ‘రూ’కి బదులుగా తమిళంలోని ‘రూ’ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించడం కూడా సరైనదే కదా. ప్రస్తుతం భాషపై జరుగుతున్న వివాదంలో మా వైఖరిని మేము తెలియజేస్తున్నాం. మా మాతృ భాషను రక్షించుకుంటున్నాం. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాలనుకునే వారు కేంద్రమంత్రి చర్యపైనా ఇప్పుడు మాట్లాడండి’ అని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని ఆయన మండిపడ్డారు. దీంతో, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా.. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్రం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రూపాయి విషయంలో స్టాలిన్ నిర్ణయాలన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. -
జన్యు నిధుల అనుసంధానం కీలకం!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండవ ‘నేషనల్ జీన్ బ్యాంక్’ ఏర్పాటును ప్రక టించారు. ఇది ఒక మిలియన్ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం– పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం కోసం... పబ్లిక్, ప్రైవేట్ రంగాలూ, కమ్యూ నిటీలూ (వ్యక్తుల సమూహాలు, సంఘాలు, సంప్ర దాయ జాతులు) కలిసికట్టుగా ప్రయత్నిచవలసిన అవసరం ఉంది. అందువల్ల నిపుణులు ఈ నిర్ణ యాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నూతనంగా ఏర్పడ నున్న రెండవ జీన్ బ్యాంకుతో కమ్యూనిటీ విత్తన బ్యాంకుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక రంగంతో సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలు (షేర్ హోల్డర్లు) అందరూ అంతర్జాతీయ ఒప్పందం (కన్వెన్షన్ ఆన్ బయోలా జికల్ డైవర్సిటీ–సీబీడీ 1993), జాతీయ జీవ వైవిధ్య చట్టం–2002 (ఎన్బీఏ–2002)లో పొందుపరిచిన మూడు సూత్రాలకు (పరిరక్షణ, స్థిరమైన వినియోగం, న్యాయమైన – సమానమైన లాభాల పంపిణీ) కట్టుబడి ఉండగలరన్న ఆశా భావం వ్యక్తం అవుతోది.జాతీయ జన్యు బ్యాంక్ అనేది భవిష్యత్ తరాలకు వివిధ పంటలు, అడవి జాతులు, అనేక రకాల చెట్ల జన్యువులను నిల్వచేసే సదుపాయం. కమ్యూనిటీ విత్తన బ్యాంకులు పంటల అభివృద్ధి, ఆహార భద్రత, స్థిరమైన సమాజ అభివృద్ధికి బిల్డింగ్ బ్లాక్‌లుగా ఉపయోగపడే స్థానిక ప్రత్యామ్నాయ జన్యు వనరులుగా గుర్తించబడ్డాయి. జన్యు వనరుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవి దశాబ్దాల నుండి అనధికార వ్యవ స్థలుగా కొనసాగుతూనే ప్రాంతీయ కమ్యూనిటీలకు సంప్రదాయ విత్తన కోశాగారాలుగా పని చేస్తున్నాయి. అందులో ఉన్న వైవిధ్యభరిత జన్యు పదార్థాలను ఒక వ్యవస్థలో ఏకీకృతం చేయగలిగే కమ్యూనిటీ నిధులుగా ప్రస్తుతం సంఘటిత పడుతూ, అక్కడి వెనుకబడిన ఆదివాసీ కమ్యూ నిటీ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ కమ్యూనిటీ విత్తన బ్యాంకులు స్థానికంగా నిర్వహించబడే సంస్థలు. ఇవి విత్తనాలను సేకరించడం, నిల్వ చేయడం, కమ్యూనిటీ విత్తన అవసరా లను తీర్చడం వంటి సేవలు అందిస్తున్నాయి. అవి దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద–చిన్న పంటలు, ఔషధ మొక్కలు, అలాగే నిర్లక్ష్యం చేయబడి తక్కువ ఉపయోగంలో ఉన్న మొక్కల జాతులను తమ పరిధిలో అంతరించి పోకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇవి సరైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విత్తన శుద్ధి పరికరాలు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ లేమి, ఆర్థిక మద్దతు లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది.భారత్ తన మొదటి జాతీయ జన్యు నిధిని 1996లో జాతీయ జాతీయ జన్యు వనరుల బ్యూరో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చే సింది. మొట్ట మొదటి జన్యు నిధికి ఉన్న 0.47 మిలియన్ల నమూనాల పరి రక్షణ సామర్థ్యాన్ని అధిగమించి, రెండో జాతీయ జన్యు నిధికి నిల్వ సామర్థ్యాన్ని ఒక మిలియన్ దాకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశంలోని అధిక జీవవైవిధ్య సాంద్రత ఉన్న ప్రాంతాలలోని స్థానిక పరిరక్షకుల సంఘాలతో కమ్యూనిటీ విత్తన నిధులను జాతీయ జీన్ బ్యాంకుతో అనుసంధాన పరచడం ఒక ప్రగతిశీల ఆచరణయోగ్య కార్యక్రమం. భారత దేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈశాన్య, అండమాన్–నికోబార్ దీవులు వంటి అనేక జీవవైవిధ్య సాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక, ప్రస్తుత, భావితరాల ఆహార మరియు పోషకాల భద్రతా లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రెండవ జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటు చొరవలో స్థానిక పరిరక్షకులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.బలిజేపల్లి శరత్ బాబువ్యాసకర్త భారత వ్యవసాయ మండలి విశ్రాంత శాస్త్రవేత్త -
₹పై లొల్లి.. మరి అప్పుడేం చేశారు?
చెన్నై/న్యూఢిల్లీ: కేంద్రం-తమిళనాడు మధ్య భాషా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రూపాయి సింబల్(Rupee Symbol) ₹ ప్లేస్‌లో తమిళ అక్షరం చేర్చిన డీఎంకే ప్రభుత్వం తీరుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళంలోనే ఆమె కౌంటర్ ఇచ్చారు. అంత అభ్యంతరాలు ఉంటే.. గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారామె. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును (₹) తొలగించి.. రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. బీజేపీ నేత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. గతంలో.. యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉంది. ఆ సమయంలో ఆ గుర్తును తీసుకొచ్చారు. పైగా ‘₹’ సింబల్‌ను రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే. ఇప్పుడు దీన్ని పక్కనపెట్టడం ద్వారా.. డీఎంకే ఓ జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా.. తమిళ యువకుడి సృజనాత్మకతను విస్మరిస్తోంది అని సీతారామన్ అన్నారు. రూపాయి చిహ్నం ‘₹’ అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందిందని.. ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో దేశానికి గుర్తింపుగా నిలుస్తోందని అన్నారామె. అలాగే.. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా? అని డీఎంకేను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు. అలాంటిది జాతీయ చిహ్నాలను తొలగించడమంటే.. ఆ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించడమే అని వ్యాఖ్యానించారామె. డీఎంకే చేసిన పని జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీసే చర్యలన్న ఆమె.. ఇది భాష, ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణగా పేర్కొన్నారు.దేశ ఐక్యతను బలహీనపరిచే, ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. -
నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్ కౌంటర్
చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తమిళ భాషను పెరియార్ అవమానించారంటూ సీతారామన్ నిజంగా బాధపడుతున్నారా?అని ప్రశ్నించిన ఆయన.. అదే నిజమైతే తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేయకుండా ఆపాలని ఆమెకు సూచించారు.పెరియార్ తన కాలానికి మించిన ఆలోచనలతో సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. అందుకే ఇప్పటికీ ఇక్కడి ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ పెరియార్‌ను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోంది. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అని విజయ్ మండిపడ్డారు. నిర్మలమ్మ ఏమన్నారంటే.. జాతీయ విద్యా విధానం త్రిభాషా నిబంధనపై తమిళనాడు వర్సెస్ కేంద్రంగా విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. తమిళ భాషను అవమానించిన వ్యక్తిని(పెరియార్‌ను ఉద్దేశించి..) దేవుడిగా చూసే విధానం సరికాదని.. ఆయన్ని గౌరవించడం డీఎంకే పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. తమిళ భాషను తక్కువ అంచనా వేసిన వ్యక్తిని(పెరియార్‌ను ఉద్దేశించి..) తమ నాయకుడిగా కొనియాడడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. విజయ్ ఏమన్నారంటే.. నిజంగా తమిళ భాషపై పెరియార్ చేసిన వ్యాఖ్యలు నిర్మలా సీతారామన్‌కు సమస్యగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో మూడు భాషల విధానాన్ని ప్రయోగించడాన్ని ఆపాలని డిమాండ్ చేయాలి. ఇది తమిళ ప్రజలకు తగిన విధంగా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం అనే విషయాన్ని ఆమె గుర్తించాలి. పెరియార్ ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో ఉన్నారు. అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఇలాంటి చర్చలు జరుగుతుంటాయని అన్నారాయన. -
జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయని, పన్ను రేట్లు & శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. 2017 జూలై 1న GST అమలులోకి వచ్చిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గిందని అన్నారు. ఇది మరింత తగ్గుతుందని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 2021లో సీతారామన్ నేతృత్వంలోని.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి.. శ్లాబులలో మార్పులను సూచించడానికి మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు.శనివారం ఢిల్లీలో 'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్' కార్యక్రమంలో జీఎస్టీ రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించాల్సిన సమయం ఆసన్నమైందా అనే ప్రశ్నకు, నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఆ పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని అన్నారు.స్టాక్ మార్కెట్ అస్థిరతకు కారణాలు, మార్కెట్లు మరింత ప్రశాంతంగా ఉండటానికి మార్గం ఎలా ఉందనే ప్రశ్నకు సీతారామన్ స్పందిస్తూ.. మీరు అడిగే ప్రశ్నలు.. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా?, యుద్ధాలు ముగుస్తాయా?, ఎర్ర సముద్రం సురక్షితంగా ఉంటుందా?, సముద్ర దొంగలు ఉండరా అన్నట్లు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు మీరు, నేను ఖచ్చితమైన సమాధానం చెప్పగలమా? అని అన్నారు.ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గింపుపై సీతారామన్ మాట్లాడుతూ.. ప్రజల వాటాను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు సీతారామన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్? -
సంతృప్తికర సమాధానాలిస్తేనే.. పోలవరానికి నిధులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అడిగిన సాంకేతిక ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె గురువారం సాయంత్రం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సాంకేతిక సమస్యల వల్లే నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం తెలిపిన తర్వాతే నిధుల మంజూరు సాధ్యమవుతుందని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామని, సేవా రంగంలో నిర్దిష్టమైన ఆదాయం వస్తుందని చెప్పారు. నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామని తెలిపారు. తొమ్మిది కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే, మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, కొత్తగా పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. సుంకాలపై అమెరికా ప్రభావం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లి సుంకాల పెంపుపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని వ్యాఖ్యానించారు. తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నివసించానని, అక్కడ నీటి కష్టాలు అనుభవించానని ఆమె తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికే మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించేవని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖ సమీపంలో ఫార్మా రంగం అభివృద్ధికి బల్క్ డ్రగ్ పరిశ్రమలను విస్తృతం చేసినట్లు తెలిపారు. పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి వివిధ వ్యాపార వర్గాలు, పారిశ్రామిక, ఐటీ సంఘాల ప్రతినిధులతో గురువారం సాయంత్రం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ ముఖాముఖి కార్యక్రమంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)ల కోసం ‘కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్’ను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత ముంబయిలో జరిగిందని, రెండో చర్చ విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు... ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు చేసేందుకు థర్డ్ పార్టీ మదింపులపై ఆధారపడకుండా, అంతర్గత మదింపు సామర్థ్యాన్ని పెంచుకుంటాయన్నారు. అధికారిక అకౌంటింగ్ వ్యవస్థ లేని ఎంఎస్ఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. విశాఖలో వివిధ వర్గాల ప్రజలను కలసి బడ్జెట్‌పై వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ముందడుగు
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యం, పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షికవాదం కొత్త ఉ్రత్పేరకంగా కనిపిస్తుందన్నారు. బీఎస్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. సవాళ్లతో కూడిన కాలంలో భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్ట చెప్పారు. ‘‘ద్వైపాక్షికవాదం ఇప్పుడు ప్రముఖ అజెండాగా మారుతోంది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఇతోధికం చేసుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్యం లేదా పెట్టుబడుల కోసమే కాదు, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా కూడా అవసరమే. కొత్త ప్రపంచ క్రమంలో భారత్ తనకున్న టెక్నాలజీ, నిపుణుల బలంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారగలదు’’అని వివరించారు. మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయంటూ.. వాటి పునరుద్ధరణకు చేసే ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో మార్పులు.. ప్రపంచ వాణిజ్యం పూర్తిగా మార్పునకు గురవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్లు, వాటి సేవలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమర్థంగా పని చేయడం లేదు. ప్రాధాన్య దేశం హోదా (ఎంఎఫ్ఎన్) అన్నదానికి అర్థం లేకుండా పోయింది. ప్రతి దేశం తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటోంది. ఒకవేళ డబ్ల్యూటీవో బలహీనపడితే లేదా మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్లు సమర్థవంతంగా పనిచేయకపోతే.. అప్పుడు వాణిజ్యం విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలే కీలకంగా మారతాయి’’అని మంత్రి చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి బ్రిటన్ (యూకే) సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్ చర్చలు ప్రారంభించినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. 27 దేశాల సమూహం అయిన ఐరోపా యూనియన్ (ఈయూ)తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రుణ నిర్వహణ, ద్రవ్య క్రమశిక్షణ పరంగా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘సంస్కరణలన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వ అజెండాగానే ఉండిపోకూడదు. ప్రతి రాష్ట్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని కోరుకుంటున్నాను’’అని మంత్రి సీతారామన్ చెప్పారు. పోటీతత్వాన్ని పెంచుకోవాలి స్వీయ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్ పిలుపు ముంబై: పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడకుండా.. తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి, మరింత పోటీతత్వంతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గోయల్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ సహకారం కోసం ఎంత కాలం పాటు చూస్తారు? లేదా సబ్సిడీలు, సహకారం, ప్రోత్సాహకాలు, అధిక దిగుమతి సుంకాలు ఎంతకాలం పాటు కోరుకుంటారు? ప్రపంచంతో రక్షణాత్మక వైఖరి ఎంత కాలం? ఈ తరహా రక్షణాత్మక మనస్తత్వం, బలహీన ఆలోచనా ధోరణి నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకోవాలి’’అంటూ దేశీ పరిశ్రమ స్వీయ సామర్థ్యాలతో ఎదగాలన్న సంకేతం ఇచ్చారు. ఆవిష్కరణలు, తయారీ విధానాల నవీకరణ, నైపుణ్యాలు, సామర్థ్యాల నుంచే పోటీతత్వం వస్తుందన్నారు. పోటీతత్వంతో ఎదగనంత వరకు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరవని, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోకపోతే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చమురు, రక్షణ, ఆహారం వంటి కొన్ని రంగాల్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నట్టు చెప్పారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి పీయూష్ గోయల్.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాల నడుమ తీరిక లేకుండా ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ విధానాలతో దేశాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు మొదలైనట్టు తెలిపారు. భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యత భారత్‌కు దీర్ఘకాలిక సవాలుగా ఉన్నట్టు గోయల్ గుర్తు చేశారు. ఫార్మాలో తగిన అనుమతులు ఉన్న బడా సంస్థలు చిన్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని సూచించారు. -
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
‘మిగులు’ రాష్ట్రంగానే అప్పగించాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. అధికారం నుంచి దిగిపోయేనాడు కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్‌కు అప్పగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల వరకు అప్పు ఉందని.. అప్పులను మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని అన్నారు. పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఆదివారం కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చాం‘గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా వినియోగించి మా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. సమైక్య రాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామిగా నిలిపాం. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టు కాదు. తెచ్చిన అప్పుతో తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించే ప్రాజెక్టులను నిర్మించాం. భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను ఉపయోగించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయలేదని అన్నారు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంకేంద్ర బడ్జెట్లో, రైల్వే కేటాయింపుల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దితే, బహుమానంగా అవమానాలు మిగిలిస్తున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక్క పైసా కేటాయించలేదని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఇళ్లకు మంచినీళ్లిస్తే, దాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించాలని కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా దక్కిందేమీ లేదని అన్నారు. -
ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. సాధారణ బడ్జెట్(General budget)పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘‘వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.22 శాతంగా ఉంటే జనవరికల్లా దానిని 4.31 శాతానికి తగ్గించాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగొస్తోంది’’ అని మంత్రి నిర్మల అన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విపక్ష, అధికార ఎన్డీఏ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మోదీ సర్కార్ ఏ ఒక్క రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని నిర్మల బదులిచ్చారు. అయినా విపక్ష సభ్యులు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందలేదు. తర్వాత పలు విపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.అంతర్జాతీయంగా అనిశ్చితి‘‘అభివృద్ధిని పరుగుపెట్టించే లక్ష్యంతో బడ్జెట్‌కు తుదిరూపునిచ్చాం. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ భరోసానిస్తుంది. ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల ఊతం అందిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందేగానీ తగ్గుదల ఉండబోదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్ రూపకల్పన జరిగింది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధుల కేటా యింపులు తగ్గాయి. పరిస్థి తులు మారుతున్నా అత్యంత కచ్చితత్వంతో ముందస్తు బడ్జెట్ అంచనాలు వేశాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తు న్నాం. అంతర్జాతీయ పరిస్థి తులు ఎప్పటికప్పుడు మా రుతుండటంతో ఎల్లప్పుడూ ఒకే వ్యూహం పనికిరాదు. అనిశ్చితి రాజ్య మేలుతుండటంతో మన దిగుమతులపై దాని పెను ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెల కొన్న అస్తవ్యస్త ధోరణి మన ఆర్థికాభివృద్ధి పథంలో అవరోధంగా మారుతోంది. ద్రవ్యో ల్బణం కారణంగా టమాటా, ఉల్లి, బంగాళా దుంప చివరకు పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అననుకూల వాతావరణం కారణంగా దిగుబడులు తెగ్గోసు కుపోవడంతో ఆహార ద్ర వ్యోల్బణం కట్టుతప్పుతోంది. సరుకు రవాణా గొలు సుల్లో ఏవైనా ఆటంకాలుంటే వెంటనే కేంద్ర మంత్రుల బృందం రంగంలోకి దిగి సమయానికి విదేశీ దిగుమతులు వచ్చేలా చూస్తోంది’’ అని నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత బడ్జెట్ తొలిసెషన్లో భాగంగా రాజ్యసభను వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ ౖచైర్మన్ హరివంశ్ ప్రకటించారు. మార్చి పదో తేదీ ఉదయం 11 గంటలకు మళ్లీ రాజ్యసభ కార్యకలాపాలు మొదలుకానున్నాయని ఆయన చెప్పారు. -
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ! -
పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. లోక్‌సభ వాయిదా
ఢిల్లీ : లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే క్రమంలో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దాంతో లోక్‌సభ మార్చి 10 వరకూ వాయిదా పడింది. ఈ ఆదాయపు పన్ను కొత్త బిల్లు సెలక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపనున్నారు.కొత్త బిల్లు పన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని తీసుకొచ్చారు. టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం పరిగణించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ గతంలోలాగే ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాలతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
పాత vs కొత్త పన్ను విధానం: ఎప్పుడు ఏది ఎంచుకోవాలంటే..
యూనియన్ బడ్జెట్ 2025లో కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే విధంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని ప్రధాన మార్పులను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. సెక్షన్ 87A కింద రాయితీ కోసం ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు.నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4 లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. పాత పన్ను విధానం ఎందుకోవాలా? కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అని కొంత తికమకపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ పన్ను విధానం ఎందుకోవాలో పరిశీలిద్దాం..కొత్త పన్ను విధానం ఎప్పుడు ఎందుకోవాలంటే..➤సెక్షన్ 87A కింద పూర్తి రాయితీకి అర్హత ఉన్నందున, రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి.➤సెక్షన్ 80C (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, జీవిత బీమా, లేదా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు వంటివి) లేదా సెక్షన్ 80డీ (మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం) కింద మినహాయింపులు ఉండవు.➤మీరు భారీ తగ్గింపులను క్లెయిమ్ చేయకపోతే.. కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణాత్మక డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది.మీరు పాత పన్ను విధానం ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..అధిక తగ్గింపులను క్లెయిమ్ చేయగల వ్యక్తులకు పాత పన్ను విధానం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. సెక్షన్ 80సీ కింద పీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ చెల్లింపు మొదలైనవి మాత్రమే కాకుండా.. సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత & కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటివి కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపులను గరిష్టంగా పెంచుకుంటే, వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో శ్లాబులురూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5 శాతంరూ.8-12 లక్షలు - 10 శాతంరూ.12-16 లక్షలు - 15 శాతంరూ.16-20 లక్షలు - 20 శాతంరూ.20-24 లక్షలు - 25 శాతంరూ.24 లక్షల పైన 30 శాతంపాత పన్ను విధానంలో పన్ను శ్లాబులురూ.2,50,001 - రూ.5,00,000 - 5 శాతంరూ.5,00,000 నుంచి రూ. 10,00,000 - 20 శాతంరూ.10,00,000 ఆపైన - 30 శాతంఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
దేశాభివృద్ధికి జీడీపీ అద్దంపడుతోంది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4 శాతం వృద్దిరేటుతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చెప్పారు. సాధారణ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంగళవారం లోక్‌సభలో విత్తమంత్రి హోదాలో నిర్మల ప్రసంగించారు. ‘‘ ప్రజల చేతుల్లో నగదు నిల్వలు ఉండేలా బడ్జెట్‌ను రూపొందించాం. కేంద్రప్రభుత్వం తెచ్చే రుణాల్లో 99 శాతం నిధులను మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూల ధన వ్యయాల కోసమే ఖర్చుచేస్తున్నాం. తద్వారా భవిష్యత్ సంపదను సృష్టిస్తున్నాం.ద్రవ్యోల్బణం కట్టడికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందుకే ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నుంచి ఆరు శాతం మధ్యే తచ్చాడుతోంది. ఆహార వస్తువులకు సంబంధించి ద్రవ్యోల్బణం సైతం మధ్యస్థాయిలోనే కట్టడిలో ఉంది. 2024–24 ఆర్థిక సంవత్సరానికి మూడేళ్ల ముందువరకు భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 8 శాతంగా నమోదైంది’’ అని మంత్రి అన్నారు. అయితే గత నాలుగేళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి 6.4 శాతంగా నమోదుకావచ్చన్న విశ్లేషణలు వెలువడటం తెల్సిందే. ఇటీవల పార్లమెంట్లో ఆర్థి కశాఖ ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే సైతం తదుపరి ఆర్థికసంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8శాతం మధ్యలో కదలాడవచ్చని పేర్కొనడం విదితమే.‘‘ గత 12 త్రైమాసికాల్లో కేవలం రెండు త్రైమా సికాల్లోనే భారత వృద్ధిరేటు 5.4 శాతం లేదా అంతకంటే తక్కువకు పడిపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో తైమాసికంలో వృద్ధిరేటు గత యేడు త్రైమాసికాల కనిష్టమైన 5.4 శాతానికి పడి పోయింది. అయితే ఆ తర్వాత ఆర్థిక పునాదులు బలపడటంతో వృద్ధిరేటు మళ్లీ పుంజుకుంది. ఇకపై భారత్ వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీడీపీలో మొత్తం సేవలు, వస్తూత్పత్తుల విలువ ఏకంగా 61.8 శాతానికి పెరిగింది. 2002–03 సంవత్సరం నుంచి చూస్తే ఇది ఈస్థాయికి పెరగడం ఇదే తొలిసారి. వచ్చే ఆర్థికసంవత్సరంలో మౌలికవసతుల కల్పన కోసం చేసే మూల ధన వ్యయం రూ.15.48 లక్షల కోట్లకు చేరుకోనుంది.ఇది జీడీపీలో 4.3 శాతానికి సమానం. కొత్త ఆర్థికసంవత్సరంలో ఆర్థిక లోటును రూ.15.68 లక్షల కోట్లకు పరిమితంచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇది జీడీపీలో 4.4 శాతానికి సమానం.అంతర్జాతీయంగా ఎన్నో అంతర్యుద్ధాలు, యుద్ధ భయాలు, ఆర్థిక అస్థిర పరిస్థితుల మధ్య నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చాం. గత పదేళ్లలో యావత్ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వీటన్నింటినీ సరిచూసుకుంటూ జాతీయ ప్రయోజనాలకు పట్టంకడుతూ బడ్జెట్ కేటాయింపులు చేశాం’’ అని మంత్రి అన్నారు. -
బంగారం వేలం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ విషయమై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్బీఎఫ్సీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్‌లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలను బ్యాంక్‌లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగారానికి డిమాండ్: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు’’అని వివరించారు. -
అణు విద్యుత్తు ఆశలు... బారెడు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో టెక్నాలజీ రంగంలో పెద్ద ప్రతిపాదనలే చేశారు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ‘అణుశక్తి’ మిషన్, ‘కృత్రిమ మేధ’ మిషన్. వీటితోపాటు ప్రైవేట్ రంగంలో టెక్నాలజీల అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ కేటాయింపులు పెంచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో మౌలిక వసతులను, ఎంబీబీఎస్ సీట్లను గణణీయంగా పెంచుతామని కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ స్వాగతించదగ్గ ఆలోచనలే. కానీ వీటి అమలుకు నిర్దేశించుకున్న కాలావధులు, ఆర్థిక అంశాల విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తమవుతాయి. ఎందు కంటే, ఈ అంశాలేవీ కొత్తవి కావు, నిరుటి బడ్జెట్లో ప్రస్తావించినవే. పేరు మార్చితే కొత్త పథకమా?అణు శక్తి మిషన్ సంగతి చూద్దాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్) అభివృద్ధికి పరిశోధనలు చేపట్టడం ఈ మిషన్ ఉద్దేశం. భారీ అణు విద్యుత్ కేంద్రాల స్థానంలో ఎస్ఎంఆర్లను ఎందుకు ఎంచుకున్నారు అన్నదానికి శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గించుకునేందుకు అన్న సమాధానం వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి చెప్పినట్లు, ‘2047 నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని’ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సుమారు రూ. 20,000 కోట్లతో పూర్తి స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా ఐదు ఎస్ఎంఆర్లు నిర్మిస్తామనీ, 2033 నాటికల్లా వీటితో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామనీ మంత్రి వివరించారు. ఇందుకోసం అణుశక్తి విభాగానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయింపులు మాత్రం చేయలేదు. గతేడాది మొత్తమే ఈ ఏడాదీ ఉండనుంది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎస్ఎంఆర్లపై ఆర్థిక శాఖ మంత్రి కేవలం తన ఉద్దేశాన్ని మాత్రమే వ్యక్తం చేశారూ అని!వాస్తవానికి ఎస్ఎంఆర్ల ఆలోచన కొత్తది కాదు. 2024 బడ్జెట్ ప్రసంగంలోనూ అణుశక్తి విస్తృత వినియోగం కోసం ఎస్ఎంఆర్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. భారత్ స్మాల్ రియాక్టర్స్, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని నామకరణం కూడా చేశారు. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి ప్రక్రియ మొదలైందని 2024 డిసెంబరులో ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన కూడా చేసింది. ‘వీటి తయారీలో భాగస్వాములవుతామని చాలా దేశాలు ఆసక్తి చూపాయి’ అని కూడా చెప్పింది. ఈ రియాక్ట ర్లను అక్కడికక్కడే విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగల రంగాల్లో ఉపయోగి స్తారని చెప్పారు. అణుశక్తి విభాగం ఎస్ఎంఆర్ల అభివృద్ధి ప్రక్రి యను ఇప్పటికే ప్రారంభించి ఉంటే, వాటికి ఈ ఏడాది బడ్జెట్లోనే నిధుల కేటాయింపు జరిగి ఉండాలి. కానీ 2025 బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఎస్ఎంఆర్కు ముందు జోడించిన భారత్‌ను వదిలేశారు. బీఎస్ఎంఆర్ అని కాకుండా ఎస్ఎంఆర్ అనడం ద్వారా కొత్త అణు రియాక్టర్ల అభివృద్ధికి నాంది పలికినట్లు ధ్వనించారు.ఎస్ఎంఆర్లను 2023లో నీతి ఆయోగ్ ప్రచురించిన ఒక విధాన ప్రకటనలో ప్రతిపాదించారు. సుమారు 220 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల, అది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రెష రైజ్డ్ హెవీ వాటర్ టెక్నాలజీతో పనిచేసే వాటిని చిన్నస్థాయి అణు రియాక్టర్లుగా పరిగణిస్తున్నారు. ఎస్ఎంఆర్ల విషయానికి వస్తే అవి 30 మెగావాట్ల సామర్థ్యం, కొత్త డిజైన్ కలిగినవి. ఫ్యాక్టరీల్లో తయారు చేసుకుని అవసరమైన చోట అమర్చుకోగల వీటి వినియోగం వల్ల ఖర్చులు తగ్గుతాయని అంచనా. చిన్న రియాక్టర్లు కావడం వల్ల తరచూ ఇంధనం మార్చాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత సమయం తరువాత వీటిని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడుకునే వీలుంటుంది. పెద్ద రియాక్టర్లతో పోలిస్తే వీటి భద్రత, పర్యావరణపరమైన అంశాలు, అనుమతులు భిన్నంగా ఉంటాయి. ఒత్తిడి పెద్దగా ఉండక పోవడం, ఉత్పత్తి కూడా తక్కువగా ఉండటం... ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొద్ది సంఖ్యలో మాత్రమే ఎస్ఎంఆర్ల అభివృద్ధి జరుగుతోంది. వ్యయం–కాలయాపనస్వాతంత్య్రం అనంతరమే అణువిద్యుత్తు ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్వశక్తితో ఎంతో పురోభివృద్ధి సాధించింది కూడా. అణ్వాస్త్రాల తయారీకి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చు కునేలా వ్యూహాత్మకంగా అణుశక్తి కార్యక్రమం నడిచింది. అయినా వాణిజ్య స్థాయి అణు విద్యుత్‌లో దేశం వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్‌లో 24 అణు రియాక్టర్లు ఉమ్మడిగా 8,180 మెగవాట్ల సామ ర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇంకో 15,300 మెగావాట్ల సామర్థ్యం కలి గిన మరో 21 అణురియాక్టర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కేంద్ర అణుశక్తి విభాగం సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. 1970లలో దేశంలో రెండే అణువిద్యుత్ ప్లాంట్లు ఉన్న సమయంలో 1990 నాటికల్లా 10,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తామని ప్రక టించింది. 1980లలో 2000 నాటికల్లా సామర్థ్యాన్ని 20 వేల మెగా వాట్లకు పెంచుతామని చెప్పింది. తరువాత గడువును 2020కి మార్చారు. తాజాగా గతేడాది లక్ష్యాన్ని 2047 నాటికి లక్ష మెగావాట్లు అని ప్రకటించింది. రెండంటే రెండు దశాబ్దాల్లో ఎకా యెకిన 92,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించడం అత్యాశే అవుతుంది. అణువిద్యుత్తు ఉత్పత్తికి మూలధన వ్యయం చాలా ఎక్కువ.ఇంధన సరఫరా సమస్యలున్నాయి. పర్యావరణ, భద్రతలకు సంబంధించిన ఖర్చులూ ఎక్కువే. హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలోని గోరఖ్‌పూర్ అణువిద్యుత్ కేంద్రం విషయమే చూద్దాం. 700 మెగా వాట్ల సామర్థ్యమున్న నాలుగు రియాక్టర్లు ఇక్కడ ఏర్పాటవు తున్నాయి. 2013లో ఈ కేంద్రానికి సంబంధించి పర్యావరణ అంచ నాలు నిర్ధారించారు. తొలి దశకు 2014 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. ఆ తరువాతి ఏడాది అణుశక్తి నియంత్రణ బోర్డు నుంచి అనుమతులు లభించాయి. అదే ఏడాది జూన్ లో నిర్మాణం ప్రారంభ మైంది. 2021 నాటికి తొలి యూనిట్ పని ప్రారంభించాల్సి ఉన్న ప్పటికీ 2020 నాటికి కానీ దీంట్లో భద్రతకు సంబంధించిన కాంక్రీట్ పోయడం మొదలుకాలేదు. 2022లో వేసిన లెక్కల ప్రకారం దీని నిర్మాణం 2028కి పూర్తి కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 2032 నాటికి రెండు యూనిట్లు పనిచేయడం ప్రారంభం కావచ్చు. ప్రాజెక్టు ఖర్చు రూ.40 వేల కోట్లు. ఇంధన భద్రతకు అణుశక్తి మేలని అనుకునేవాళ్లు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.బాధ్యత ఎవరిది?నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో లక్ష మెగావాట్ల అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వాములను చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం చట్టాలను సవరిస్తున్నట్లు చెప్పారు. అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రమాదాల బాధ్యత విషయంలో ప్రైవేట్ కంపెనీలు తటపటాయిస్తున్నాయి. 2010లో ఆమోదం పొందిన చట్టం ప్రకారం, ప్రమాదాలకు బాధ్యత ఆ కేంద్రం నిర్వాహకులది అవుతుంది. నష్ట పరిహారం మొత్తం రూ. 1500 కోట్లకు పరిమితం చేశారు. ఒకవేళ ప్రమాదం ప్లాంట్ లోపం కారణంగా జరిగితే (భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మాదిరి) సరఫరా దారు మీద నిర్వాహకులు కోర్టుకు వెళ్లవచ్చు. ఈ అంశాల కారణంగానే అణుశక్తి రంగానికి సంబంధించి విదేశీ కంపెనీలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఏమైనా బాధ్యత అనేది సీరియస్ వ్యవహారం. ప్రభుత్వం నష్ట పరిహారం విషయంలో పునరాలోచన చేయాలి. కేవలం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నంత మాత్రాన అణు విద్యుదుత్పత్తి జరిగిపోదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
కొత్త ఐటీ బిల్లు వచ్చే వారమే..
ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (New Income Tax Bill) లోక్‌సభలో వచ్చే వారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఎగువసభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో బడ్జెట్ అనంతర సంప్రదాయ సమావేశంలో ప్రసంగించిన తర్వాత సీతారామన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసిన తర్వాత బిల్లు మళ్లీ కేబినెట్‌కు వెళ్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారని మంత్రి చెప్పారు. బిల్లు విషయంలో తనకు ఇంకా మూడు క్లిష్ట దశలు ఉన్నాయని అన్నారు.‘రెండు సంవత్సరాల క్రితం కూడా కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కొన్ని హేతుబద్ధీకరించాం. భారత్‌ను మరింత పెట్టుబడిదారులు, వాణిజ్య స్నేహపూర్వకంగా మార్చాలనుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్‌తో సమతుల్యం చేయాలనుకుంటున్నాం. పరిశ్రమకు అవసరమైన విధంగా సుంకాల రక్షణను అందిస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. -
రూ.32,024 కోట్లు వెంటనే ఇవ్వండి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.32,024 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ నివాసంలో నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిధుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రావాల్సిన నిధులకు సంబంధించి గతంలో రాసిన లేఖలను సైతం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే పథకాలతోపాటు ప్రాయోజిత పథకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు, షెడ్యూల్ 9 క్రింద ఉన్న సంస్థల నిర్వహణ కోసం అయ్యే ఖర్చు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఖర్చు చేసిన నిధులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద తీసుకున్న నిధులు అన్ని కలిపి రూ.32,024 కోట్లను ఇవ్వాలని కోరారు. ఏపీ నుంచి బకాయిలు ఇప్పించండి హైదరాబాద్‌లోని పలు రాజ్యాంగ సంస్థల భవనాల నిర్వహణ ఖర్చుల కింద ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.408 కోట్లను వెంటనే ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014లోని సెక్షన్ 56 (2) ప్రకారం రావాల్సిన రూ.208.24 కోట్లను కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భట్టి వెంట ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, అధికారులు ఉన్నారు. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ
-
కేంద్ర మంత్రిని కలిసిన భట్టి విక్రమార్క
ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఆమె అధికారిక నివాసంలో కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట.. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి,చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు1.వివిధ కార్పొరేషన్లు/SPVల రుణ పునర్వవ్యవస్థీకరణ (Restructuring of Debt) – ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.2. తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు.3. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టం, 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావలసిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు.4.2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.5.ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణచట్టం, 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 6.ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాద్యత (Excess Liability) మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశం పైన చర్చించారు.7. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టం, 2014 కింద నిధుల బదిలీ (Transfer of Funds) కోరుతూ విజ్ఞప్తి చేశారు.8.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. -
‘సగానికి’ భాగమిదేనా?
ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది.. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం జెండర్ బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులనూ పెంచామంటోంది. ఇక్కడొక మాట.. జెండర్ బడ్జెట్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైంది కాదు. కానీ వార్షిక బడ్జెట్లోనే లింగసమానత్వం, మహిళా ప్రగతికి ప్రత్యేక నిధులు ఇస్తుంది వివిధ శాఖలు, విభాగాలలో బాలికలు, మహిళలకున్న సంక్షేమ పథకాలకు పూర్తిగా లేదా పాక్షిక కేటాయింపులతో! ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కింద రూ. 4.49 లక్షల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మొత్తం బడ్జెట్లో ఇది 8.86 శాతం. కిందటేడుతో పోలిస్తే 37 శాతం పెరిగింది. అంకెల్లో ఇది పెరిగినట్టు కనిపించినా దాన్ని శాఖలు, విభాగాల వారీగా విశ్లేషించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.అన్ని మంత్రత్వ శాఖలు, విభాగాల కేటాయింపుల్లో స్త్రీ పక్షపాతమే చూపించామని... ఏకపక్షంగా నిధులు ఇచ్చామని... మహిళల ప్రగతి విషయంలో తమ దృక్పథంలో మార్పేమీ లేదు..అంటున్న ప్రభుత్వం మరి తగ్గించిన కేటాయింపులు, అసలు కేటాయింపులే చేయని వాటికి సమాధానమేం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. జెండర్ బడ్జెట్ కేటాయింపుల మీద తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదుజెండర్ బడ్జెట్ అంటే ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, చదువు, ఉపాధి, రక్షణ, ఆంట్రప్రెన్యూర్షిప్కి సంబంధించి ఉండాలి. స్త్రీ, పురుష అసమానతలను తొలగించే దిశగా కేటాయింపులు చేయాలి. ఉదాహరణకు పదేళ్ల నుంచి జెండర్ బడ్జెట్‌ను పెడుతూ వస్తున్నారు. ఈ పదేళ్ల జెండర్ బడ్జెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లెక్క ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ల వారీగా డిపార్ట్మెంట్ల డబ్బులను దామాషా పద్ధతిలో పంచి చూపిస్తుందే తప్ప మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు లేవు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రత్యేక పనివిధానం కోసం కేటాయించి.. ఆ లక్ష్య సాధనకే ఖర్చు చేసినప్పుడే అది జెండర్ బడ్జెట్ అవుతుంది. ఇది అయితే కాదు. – మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం! గర్భిణులు, తల్లుల కోసం పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఊసే లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యం అయినది.. మహిళల భద్రత, రక్షణ! ఇటీవలి కోల్‌కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో యువ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మహిళల భద్రత, రక్షణను యుద్ధ్రపాతిపదికన తీసుకుంటాయని, కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని బడ్జెట్లో కేటాయింపుల రూపంలో చూపిస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడు నిర్భయ ఫండ్ కింద కేటాయించింది కేవలం రూ. 30 కోట్లే! ఇది పెట్టిన తొలినాళ్లలో దీనికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వాలు.. అంతకంతకు పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఈ నిధులను పెంచాల్సింది పోయి రెండంకెలకు కుదించడం మహిళల భద్రత, రక్షణ పట్ల వాటికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.ఇంకొంత కసరత్తుఈ ఏడు జెండర్ బడ్జెట్‌కు కేటాయింపులు పెరిగాయి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం పలు పథకాల అమలుకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో – బేటీ పఢావో, వన్‌స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్‌లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మహిళల భద్రత– రక్షణ కోసం, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపే దిశగా బడ్జెట్ పరంగా ఇంకొంత కసరత్తు జరగాల్సింది. – మల్లవరపు బాల లత, మాజీ డిప్యూటీ డైరెక్టర్, రక్షణ మంత్రిత్వశాఖనిజాయితీతో కూడిన మద్దతు అవసరంమహిళలకు వంద శాతం నిధులు కేటాయించవలసిన ’కేటగిరీ–ఎ’లో 23.5 శాతం మంది మాత్రమే లబ్ధిదారులున్నారు. మెజారిటీ కేటాయింపులు మహిళా లబ్ధిదారులు తక్కువ ఉండే ఇతర పథకాలకు తరలుతున్నాయి. తక్షణ ఫలితాలనిచ్చే బాలికల విద్య, ఉన్నతికి కేటాయించిన నిధులు ఆయుష్మాన్ భారత్ వంటి దీర్ఘకాలిక పథకాలకు తరలిస్తున్న సందర్భాలున్నాయి. సిసలైన మహిళా సాధికారతకు, అభివృద్ధికి రాజకీయ ఉపన్యాసాలకన్నా నిజాయితీతో కూడిన రాజకీయ మద్దతు చాలా అవసరం.– డా. సమున్నత, వైస్ ప్రిన్సిపల్కామర్స్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీపెద్దగా మార్పు కనపడలేదు2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్.. అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యం. అదీ మహిళల నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది శుభపరిణామం. మొత్తంమీద మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా ప్రత్యేకించి మహిళల కోసమే ఉన్న కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనపడలేదు. అంటే జెండర్ ఈక్వాలిటీ, మహిళల అభివృద్ధికి చేపట్టిన పథకాల మీద కేటాయింపులను పెంచలేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. – ప్రియ గజ్దార్, చైర్పర్సన్, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్శ్వేతపత్రం విడుదల చేయాలిస్త్రీ పక్షపాతినని చెప్పుకుంటున్న ప్రభుత్వం జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి కదా! అసలు ఆ మాటకొస్తే పదిహేనేళ్లుగా జనాభా లెక్కలే లేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీలకు కేటాయించింది ఎంత? అందులో ఖర్చు పెట్టింది ఎంత? ఇంకెంత బాకీ ఉంది? అన్న దాని మీద శ్వేతపత్రం విడుదలచేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి! – ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్, దళిత్ స్త్రీ శక్తి – సరస్వతి రమ -
సీతమ్మ నోట స్త్రీ కష్టం
మహిళల శ్రమశక్తికి సాక్ష్యాలు, తూనికరాళ్లు అక్కర్లేదు. స్త్రీ శ్రమశక్తి అనేది నిత్యం కళ్ల ముందు కనిపించేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రమ అంటేనే స్త్రీ. అయినా సరే, ఎప్పటికప్పుడు మహిళలు తమను తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కష్టం గురించి చేసిన వ్యాఖ్యలుప్రా«ధాన్యతను సంతరించుకున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.‘గుర్తింపు పొందడానికి మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. స్కూల్, కాలేజీ, బోర్డ్, ఆర్మీ, మీడియా... ఇలా ఎక్కడైనా సరే గుర్తింపు రావాలంటే పురుషుల కంటే మూడురెట్లు తమను తాము నిరూపించుకోవాలి. ఇది అన్ని చోట్లా ఉంది’ అంటున్నారు నిర్మలమ్మ.‘లైఫ్ ఈజ్ అన్ ఫెయిర్’ అంటూనే అంతర్గత శక్తి ని పెంపొందించుకోవడం గురించి నొక్కి చెబుతున్నారు. అన్యాయాలు జీవితంలో ఒక భాగమని, వాటిని అధిగమించడానికి అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడం కీలకం అంటున్నారు నిర్మలా సీతారామన్.‘కంపెనీ బోర్డులలో మహిళల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కంపెనీ బోర్డుల్లో ఉండడానికి తాము అర్హులమని ఇప్పటికీ నిరూపించుకోవాలా!’ అని ప్రశ్నిస్తున్న సీతారామన్– ‘మహిళలు తమను తాము నిరూపించుకున్నారు. తమదైన గుర్తింపు పొందారు’ అంటూ చరిత్రను గుర్తు తెచ్చారు. -
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అందరికీ అర్థమయ్యేలా.. ఆదాయ పన్ను చట్టం
వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ తెలిపారు. కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు అర్ధమయ్యే విధంగా ఉంటుందని అన్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం జూలై 2024లో ఆదాయపు పన్ను చట్టానికి సంబందించిన సమగ్ర సమీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభతరం చేయడమే దీని లక్ష్యం అని అప్పుడే వెల్లడించింది. పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడే.. చెల్లింపుదారులకు పన్ను ఖచ్చితత్వం లభిస్తుంది. కాబట్టి దీనిని త్వరగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాల సరళీకృతం జరుగుతున్నప్పుడు.. కేపీఎంజీ జనవరి 2025లో పరిశ్రమ అభిప్రాయాలను మరియు అంచనాలను సంగ్రహించడానికి ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 200 కంటే ఎక్కువ మంది అభిప్రాయాలను పొందుపరిచారు. ఇందులో పారిశ్రామిక తయారీ, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, వినియోగదారుల మార్కెట్లు, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ అండ్ నేచురల్ రీసోర్సెస్, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా మొదలైన ఇతర రంగాలకు సంబంధించిన కార్యనిర్వాహకులు ఉన్నారు.సర్వేలో తేల్చిన విషయాలు➤సుమారు 84 శాతం మంది సరళీకరణ చాలా అవసరమని చెప్పారు. ఇందులో 30 శాతం కంటే ఎక్కువమంది లావాదేవీ వర్గాలను కవర్ చేసే టీడీఎస్ నిబంధనలను సరళీకృతం చేయాలని అన్నారు. మూలధన లాభాల పన్ను, వ్యాపార ఆదాయ గణన వంటి ఇతర అంశాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.➤96 శాతం మంది ప్రభుత్వం ప్రచురించిన ఆదాయపు పన్ను వ్యాఖ్యానాన్ని రూపొందించడానికి మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. పన్ను సర్క్యులర్లు లేదా నోటిఫికేషన్ల నుంచి ఇప్పటికే తీసుకున్న ప్రయోజనకరమైన స్పష్టీకరణలను ఆదాయపు పన్ను చట్టంలో నేరుగా చేర్చాలని కోరుకుంటున్నారు.➤87 శాతం మంది తప్పనిసరి TDS సర్టిఫికేట్ జారీని తొలగించాలని అంటున్నారు. 61 శాతం మంది ఫేస్‌లెస్ ఇంటరాక్షన్లకు మద్దతు ఇస్తున్నారు. డివిడెండ్ పన్నులతో సహా అధిక ప్రభావవంతమైన పన్ను రేట్లను పేర్కొంటూ 58% మంది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని చెబుతున్నారు. 34 శాతం మంది ప్రస్తుత రేట్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. 7 శాతం మంది నాన్ రెసిడెంట్ కంపెనీలకు మాత్రమే తగ్గింపులను కోరుకుంటున్నారని తెలుస్తోంది. -
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ క్లారిటీ
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఓ సమావేశంలో వెల్లడించారు.పాత పన్ను విధానం ఔచిత్యం, ప్రణాళికల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ పన్ను వ్యవస్థ మొత్తం సరళంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్ను విధానం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, దీనికోసం పాత పన్ను విధానాన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.మొత్తం పన్ను చెల్లింపుదారులందరూ.. కొత్త పన్ను విధానానికి మారాలని కోరుకుంటున్నారా? అని ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి ప్రస్తావిస్తూ.. 1931లో తీసుకొచ్చిన పాత పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్దేశ నిర్మాణం కోసం పన్ను చెల్లింపుదారులు చేస్తున్న సేవలను గౌరవించడానికి ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' చేసిన ప్రయత్నమే 2025 బడ్జెట్లో ఇచ్చిన పన్ను ఉపశమనం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా, మేము నిరంతరం పన్ను చెల్లింపుదారులతో నిమగ్నమై ఉన్నాము. ప్రభుత్వంపై వారి నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటానికి, మేము అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. -
అందుకే..భారీగా పన్ను మినహాయింపు: నిర్మలాసీతారామన్
న్యూఢిల్లీ:దేశ ప్రజలకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక అసలు కారణాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. మంళవారం(ఫిబ్రవరి4) ఓ టీవీ ఛానల్‌తో ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ‘గత మూడు నాలుగేళ్ల నుంచి మేం ట్యాక్స్ పేయర్స్‌తో మాట్లాడుతున్నాం. పన్ను చెల్లించే విషయంలో వారు ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్ముతున్నారు.వారంతా క్రమం తప్పకుండా పన్ను కడుతూ దేశానికి చేస్తున్న సేవను గౌరవించేందుకే ప్రధాని మోదీ పన్ను మినహాయింపు ఇచ్చారు. పాత పన్ను విధానంలో మినహాయింపులు కావాల్సిన వాళ్ల కోసం దానిని కూడా అందుబాటులోనే ఉంచాం. కొత్త ఆదాయపన్ను చట్టం మొత్తం పన్ను ప్రక్రియను సులభతరం చేస్తుంది. 1961 పన్ను చట్టం చాలా క్లిష్టతరంగా ఉండడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని నిర్మల తెలిపారు.కాగా, ఇటీవలి బడ్జెట్లో రూ.12 లక్షల దాకా ఆదాయం ఉన్న వేతన జీవులకు పూర్తిగా పన్ను మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మినహాయింపుతో పాటు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ వెసులుబాటు కూడా లభించనుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను శ్లాబులను కూడా తగ్గించారు. -
మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు
ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ కరుణించిందనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిగురించిందనే అనాలి. త్వరలో కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. అందులో ఏం ఉంటుందనే ఆతృత, ఉత్కంఠకు తెరదించుతూ, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆదాయ పన్నుకి సంబంధించి ముఖ్యమైన మార్పులు కొన్ని చేశారు. అవేమిటంటే.. ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటోంది. రూ. 10 లక్షలు దాటిన వారికి ఎంత ఉన్నా 30 శాతంగా ఉంది. ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ వస్తోంది. తాజా మార్పుల వల్ల రూ. 24 లక్షల వరకు 30 శాతం చొప్పున పడదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. బేసిక్ లిమిట్‌ని రూ. 4,00,000కు పెంచారు. ఇది చిన్న ఉపశమనంలాగా కనిపించినా. శ్లాబులు మార్చారుకొత్త శ్లాబులు, పన్ను రేట్లు ఇలా ఉంటాయి. ఈ మార్పుల వల్ల రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. చాలా సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం. వేతనజీవులకు ఈ లిమిట్‌ను రూ. 12.75 లక్షలు చేశారు. వీరికి స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో రూ. 75 వేలు మినహాయింపు లభిస్తుంది. ఇంత భారీ మినహాయింపు గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. సాహసం చేశారు. కొన్ని లక్షల మందికి పన్నుండదు. ఇంతకు తగ్గట్లుగా టీడీఎస్ విషయంలో చాలా మంచి మార్పులు తెచ్చారు. హేతుబద్ధత పేరున న్యాయం చేకూర్చారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయం మీద టీడీఎస్ వర్తింపును రూ. 1,00,000కు పెంచారు. చివరగా పన్నుభారం విషయంలో మార్పులు ఉండకపోయినా ఇది ముఖ్య ఉపశమనం. ఇంటికి అద్దె చెల్లించే విషయంలో సంవత్సరానికి రూ. 2,40,000 దాటితే టీడీఎస్ ఉంది. ఇక నుంచి టీడీఎస్ రూ. 6,00,000 దాటితేనే వర్తిస్తుంది. ఈ రోజుల్లో నగరంలో నెలకు అద్దె రూ. 20,000కు తక్కువ ఉండటం లేదు. ఓనర్లు మాకు బ్లాక్‌లో ఇవ్వండి అని పేచీ.. టీడీఎస్ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఆ భయాల్లేవు. ఈ లిమిట్‌ని భారీగా పెంచినట్లు చెప్పవచ్చు. ఈ ఉపశమనంతో పాటు బ్లాక్ వ్యవహారాల జోలికి వెళ్లకుండా రాచమార్గంలో వెళ్లే అవకాశం కల్పించారు. మనలో చాలా మంది విదేశాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం/సర్దుబాటు/బదిలీలు చేస్తుంటాం. ప్రస్తుతం ఏటా రూ. 7,00,000 దాటితే టీడీఎస్ కంపల్సరీ. ఆ లిమిట్‌ని ఇప్పుడు రూ. 10,00,000కు పెంచారు. అంతే కాకుండా విద్య నిమిత్తం ఎంతైనా పంపవచ్చు. టీడీఎస్ లేకుండా. అయితే, ‘‘సోర్స్’ మాత్రం రుణం రూపంలో ఉండాలి. ప్రస్తుతం ఒక ఇంటి మీద యాన్యువల్ వేల్యూ నిల్‌గా భావించవచ్చు. ఇక నుంచి ఈ జాబితాలో మరొక ఇల్లును జోడించారు. ఏతావతా రెండిళ్ల మీద మినహాయింపు పొందవచ్చు. రూల్సు మేరకు ఈ రెండూ లభ్యమవుతాయి. ఆర్థిక మంత్రి సీతారామన్‌గారు మినహాయింపులు పెంచకపోయినా, 80సీ మొదలైన సెక్షన్లలో మినహాయింపులు ముట్టుకోకపోయినా, వాటికి రెట్టింపు/మూడింతలు ఉపశమనం ఇచ్చారు. వినియోగం వైపు మధ్యతరగతి వాళ్లు మొగ్గు చూపేలా మార్గనిర్దేశం చేశారు. వచ్చే వారం మరిన్ని తెలుసుకుందాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో టారిఫ్‌లకు సంబంధించి అడిగిన అంశాలపై ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ఇటీవల తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం వల్ల నేరుగా భారత్‌పై పరిణామాలను అంచనా వేయడం ప్రస్తుతం తొందరపాటు అవుతుందన్నారు. అయితే భారత్ అప్రమత్తంగా ఉందని, టారిఫ్‌ల అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు.అమెరికా తాజాగా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు ప్రభావం భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి నిర్మతా సీతారామన్ మాట్లాడుతూ..‘అమెరికా కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన సుంకాల ప్రభావం కచ్చితంగా భారత్‌పై ఎలా ఉంటుందో ప్రస్తుతం అంచనా వేయలేం. కానీ తప్పకుండా భారత్‌పై కొంత పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి భారత్ అన్నింటినీ గమనిస్తోంది. అప్రమత్తంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతర జరిగిన మీడియా సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ భారత్‌పై ఈ సుంకాల పరోక్ష ప్రభావాలను అంగీకరించారు.పరిశ్రమలకు ప్రోత్సాహంవాణిజ్య పరిధిని విస్తరించడం, ఆత్మనిర్భరత (స్వావలంబన-దేశీయ తయారీని ప్రోత్సహించడం)పై దృష్టి సారించడం వల్ల అమెరికా సుంకాల నుంచి ఎదురయ్యే ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషించడానికి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ), ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నిత్యావసర సరుకులకు సంబంధించి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని భారత్ లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడే అంతరాయాలను నిర్వహించడానికి స్థానిక పరిశ్రమలు బాగా సన్నద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్‌పై ప్రభావంటారిఫ్లు ఎందుకంటే..అక్రమ వలసలు, అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవాహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించాలని నిర్ణయించారు. ఈ టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి పరిశ్రమలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇక ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: లోక్‌సభలో వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్పందించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రంగాలవారీగా పెట్టుబడుల కేటాయింపులు, పథకాలు తదితర ప్రతిపాదనల ఆధారంగా స్టాక్స్ కదలికలు నమోదుకానున్నట్లు తెలియజేశారు. రూ. 12 లక్షలవరకూ ఆదాయంపై పన్ను చెల్లింపులు లేకపోవడంతో శనివారం ట్రేడింగ్‌లో వినియోగ రంగ కౌంటర్లు జోరు చూపాయి. బీమా రంగానికి బూస్ట్‌నిస్తూ ఇప్పటివరకూ 75 శాతంగా అమలవుతున్న ఎఫ్‌డీఐలను 100 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. బడ్జెట్లో యువత, మహిళలు, రైతులకు సైతం మద్దతుగా పలు చర్యలు ప్రతిపాదించారు. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరిన్ని రంగాలవైపు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. వినియోగ రంగం మరింత జోరు చూపవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ ప్రణవ్ హరిదాసన్ అంచనా వేశారు. 7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దిగ్గజాలు రెడీ ఈ ఏడాది(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటికే వేడెక్కింది. మరిన్ని దిగ్గజాలు ఈ వారం క్యూ3((అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, టైటన్, ఎన్‌హెచ్‌పీసీ, టాటా పవర్, పీసీ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు వివిధ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకునే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోనున్నట్లు ఏంజెల్ వన్ డెరివేటివ్స్ సీనియర్ విశ్లేషకులు ఓషో కృష్ణన్ పేర్కొన్నారు.ఇతర అంశాలు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకూ మార్కెట్లో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఇటీవల బలహీనపడుతుంటే చమురు ధరలు పటిష్టంగా కదులుతున్నాయి. మరోపక్క యూఎస్ డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ మరింత పుంజుకుంటే సెంటిమెంటుపై ప్రభావంపడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. జనవరిలో ఎఫ్‌పీఐలు 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్లు అంచనా. గత వారమిలాగత వారం(జనవరి 27–ఫిబ్రవరి1) దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ నికరంగా 1,316 పాయింట్లు(1.7 శాతం) బలపడి 77,506 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 390 పాయింట్లు(1.7 శాతం) పుంజుకుని 23,482 వద్ద స్థిరపడింది. కాగా.. ఎఫ్‌పీఐల అమ్మకాల కారణంగా జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీ 3.5 శాతం క్షీణించగా.. మిడ్, స్మాల్ క్యాప్స్ 9 శాతం చొప్పున పతనమయ్యాయి. -
ఇది ప్రజల బడ్జెట్!!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు. ‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది.. బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు. ఏడాదిగా కసరత్తు.. గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు. కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు. -
పన్ను మినహాయింపు నిర్ణయం అసలెవరిది..?
న్యూఢిల్లీ:సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం వరకు వేతన జీవులకు పన్ను మినహాయించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు.. అసలేం జరిగింది..నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ఆసక్తికర విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సామాన్యులకు పన్ను మినహాయింపు విషయంలో ప్రధాన మంత్రి మోదీ తొలి నుంచి సుముఖంగా, స్పష్టంగా ఉన్నారని తెలిపారు. ఆయన వద్దకు పన్ను మినహాయింపు ప్రతిపాదన తీసుకెళ్లగానే ఓకే చెప్పారు. అయితే ఈ విషయంలో తన ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను ఒప్పించేందుకే ఎక్కువ సమయం పట్టిందన్నారు. పన్ను మినహాయింపు ద్వారా ప్రభుత్వానికి జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ఇతర మార్గాల ద్వారా ఆదాయం చూసుకున్న తర్వాతే వారు ఒప్పుకున్నారని, ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లానా పన్ను చెల్లింపుదారులు తనను కలిసి నిజాయితీగా పన్ను చెల్లించే తమకు బడ్జెట్లో వరాలేవీ ఉండవా అని అడిగేవారని గుర్తుచేశారు. వారి కోసమే పన్ను మినహాయింపు ప్రకటించామని నిర్మల చెప్పారు. -
గేమ్ ఛేంజర్ బడ్జెట్
-
Union Budget 2025: కొత్త టెక్నాలజీలకు రాచబాట
కొత్త పరిశోధనలు, అభివృద్ధి కోసం శాస్త్ర–సాంకేతిక శాఖకు రూ.20 వేల కోట్లు భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ‘డీప్ టెక్’ ఫండ్ ఆఫ్ ఫండ్స్న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ. 55,679 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు.. ⇒ కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు కేటాయించారు. ⇒ బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు. ⇒ అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు. ⇒ అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు. -
రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
కేంద్రబడ్జెట్ 2025-26లో నిర్మలా సీతారామన్ సామాన్యుడికి రూ.13 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలామందికి ఇది ఎలా వర్తిస్తుందో అనుమానాలున్నాయి. అయితే ఒక ఉదాహరణతో దీనిపై స్పష్టతకు వద్దాం. మీ వార్షిక వేతనం రూ.13 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. ఎందుకంటే మీ ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీ సంపాదన రూ.13 లక్షల నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా మిగిలిన రూ.12.25 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.ఇందులో రూ.4 లక్షలవరకూ జీరో ట్యాక్స్‌రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలుమిగిలిన నాలుగు లక్షలు.. రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలుమిగిలిన 25 వేలపై 15 శాతం అంటే రూ.3,750గా లెక్కిస్తారు.మొత్తంగా రూ.4-8 లక్షలు- 5 శాతం ట్యాక్స్ రూ.20,000రూ.8-12 లక్షలు(మిగిలిన రూ.4 లక్షలనే పరిగణిస్తారు)-10 శాతం ట్యాక్స్ రూ.40,000రూ.12-16 లక్షలు(మిగిలిన రూ.25,000కు)- 15 శాతం ట్యాక్స్ రూ.3,750మొత్తం కలిపి రూ.13 లక్షలు ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.63,750.ఇదీ చదవండి: స్టార్టప్‌లకు జోష్రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని అని గుర్తుంచుకోవాలి.అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రైవేట్ రంగానికి పీఎం గతి శక్తి డేటా..
చివరి అంచె వరకు డెలివరీ సేవలు అందేలా చూసేందుకు, మౌలిక సదుపాయాల ఆధారిత యాప్‌లను రూపొందించేందుకు ఉపయోగపడేలా పీఎం గతి శక్తి పోర్టల్‌లోని నిర్దిష్ట డేటా, మ్యాప్‌లను ప్రైవేట్ రంగానికి అందించే దిశగా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ప్రైవేట్ రంగానికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ శాఖలు అందించే రైల్వే స్టేషన్లు, గూడ్ షెడ్లు, జాతీయ.. రాష్ట్ర రహదారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు, ఎంఎంఎల్‌పీలు (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు) మొదలైన డేటా, ప్రైవేట్ రంగం లాస్ట్ మైల్ డెలివరీ సేవలను మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడనుంది. అలాగే, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌ను రూపకల్పన, టెక్ ఆధారిత లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అవసరాలకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. -
కస్టమ్స్ టారిఫ్‌లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్‌లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్‌ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్‌లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్‌లను 70 శాతం టారిఫ్‌లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్‌కు ఇది అమలవుతుందన్నారు. -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
టీడీఎస్ ఖుషి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎవరికి ప్రయోజనం..?తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్‌లు/ఎన్జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది. ఇప్పుడు వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్‌లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు. కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్ ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు. కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్‌లపై టీసీఎస్ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్‌లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్‌లపై టీసీఎస్‌ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం. కామినేని శశిధర్ఎండి, కామినేని హాస్పిటల్స్సిమెంట్ రంగ వృద్ధికి..హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్‌ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.మెడికల్ టూరిజంకు బూస్ట్..దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్‌కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది. – బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్పోటీతత్వాన్ని పెంచడానికి.. ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. – అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.ఈవీల ఉత్పత్తికి బాసట.. బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య. – గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్. ఉద్యోగాలను సృష్టించడానికి..వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి. – సంజీవ్‌పురి, ప్రెసిడెంట్, సీఐఐపట్టణ సంస్కరణలకు.. ఊతంప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు అంకితం. – వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. -
చిన్న సంస్థలకు.. భారీ బూస్ట్
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) మరింత ఊతమిచ్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను పెంచడం, రుణ హామీ పథకం కవరేజీని పెంచడం, ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు కస్టమైజ్ చేసిన క్రెడిట్ కార్డులు అందించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచుతూ బడ్జెట్లో మంత్రి ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 10 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను ’సూక్ష్మ’ సంస్థలుగా వర్గీకరిస్తారు. రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ’చిన్న’ తరహా సంస్థలుగా, రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులతో రూ. 500 కోట్ల లోపు టర్నోవరు ఉన్న సంస్థలను ’మధ్య’ తరహా సంస్థలుగా వ్యవహరిస్తారు. ఎంఎస్ఎంఈల విషయంలో ప్రకటించిన చర్యలను పరిశ్రమ స్వాగతించింది. దేశ ఎకానమీలో తయారీ రంగ వాటాను పెంచే దిశగా ఇది కీలకమైన అడుగని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తెలిపారు. కీలకమైన రెండో ఇంజిన్.. దేశాభివృద్ధికి కీలకమైన రెండో ఇంజిన్‌గా ఎంఎస్ఎంఈలను నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఉత్ప త్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మె రుగుపర్చుకునేందుకు, మరింతగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాజా ప్రతిపాదనలు ఉపయోగపడతాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించేందుకు, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు లఘు సంస్థలకు ధీమా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి పైగా ఉన్న రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు, సుమారు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో వీటి వాటా 36 శాతంగాను, ఎగుమతుల్లో దాదాపు 45%గా ఉంది. మరిన్ని విశేషాలు.. → 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఎంట్రప్రెన్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి కొత్త ప్రతిపాదన ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించేందుకు తోడ్పడుతుంది. → లఘు, చిన్న సంస్థలకు రుణ హామీ కవరేజీని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. దీనితో వచ్చే అయిదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు లభిస్తాయి. → స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు. → ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు. → మేడిన్ ఇండియా ఆట»ొమ్మలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఇంటర్నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు. -
నిధుల్లో మేజర్
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.ఆధునీకరణ కోసం.. మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లుదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు..కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)’కు ఈ బడ్జెట్లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ⇒ మొత్తం బడ్జెట్లో 13.45%⇒ మన దేశ జీడీపీలో 1.91%⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు) -
బీమాకు 100% దన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ తాజా బడ్జెట్లో బీమా రంగానికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు)ను అనుమతించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం బీమాలో 74 శాతంవరకూ ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఆధునికతరం ఫైనాన్షియల్ రంగ సంస్కరణలలో భాగంగా ఇందుకు తెరతీశారు. అయితే మొత్తం ప్రీమియంను దేశీయంగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు మాత్రమే పెంచిన పరిమితి వర్తించనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. వెరసి విదేశీ పెట్టుబడుల పరిమితులను సమీక్షించడంతోపాటు సరళతరం చేసినట్లు వెల్లడించారు. ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు వీలుగా ప్రభుత్వం బీమా చట్టం 1938, జీవిత బీమా చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత చట్టం 1999లకు సవరణలు చేయనుంది. మరిన్ని సంస్థలు ప్రవేశించడం ద్వారా బీమా విస్తృతి పెరగడంతోపాటు భారీ ఉద్యోగ అవకాశాలకు తెరలేవనుంది. కొన్ని నిబంధనలు, విధానాలను సరళతరం చేసే ముసాయిదా బిల్లు త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఇంతక్రితం 2021లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం హెచ్చించింది. అంతకుముందు 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు అనుమతించింది. -
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు
న్యూఢిల్లీ: కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికి మించి సెస్సు లేదా సర్‌చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు. -
బాహుబలికి కళ్లెం..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది. మార్కెట్లో మరిన్ని సంగతులు → కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. కావేరీ సీడ్స్ , పారదీప్ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్ బయో–జీన్స్, బేయర్ క్రాప్‌సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో చంబల్ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. → ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్ గ్లోబల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియలిటి, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. → లెదర్ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్‌వేర్ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్ 20% ఎగసి అప్పర్ సర్క్యూట్ తాకింది. క్యాంపస్ ఆక్టివేర్ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్ 4%, లెహర్ ఫుట్‌వేర్స్ 3%, రిలాక్సో పుట్వేర్స్ ఒకశాతం పెరిగాయి. ట్రేడింగ్ సాగిందిలా...స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్‌పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.వినిమయ షేర్లు పరుగులు ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్ షేర్లు పరుగులు పెట్టాయి. → వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్ 13% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్ 8%, హావెల్స్ 6%, వోల్టాస్ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్‌పూల్ 3% చొప్పున, టైటాన్ 2% ఎగిశాయి. → ఎఫ్ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్‌యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి. → ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్ మోటార్స్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, బజాజ్ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి. మౌలిక రంగ షేర్లు డీలా ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక, ఇంధన ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి. . → రైల్వే రంగ షేర్లైన టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్స్, జుపిటర్ వేగన్స్ , టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్సీటీసీ, రీట్స్ షేర్లు 3% నష్టపోయాయి. → రోడ్లు, కస్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ 8%, ఎన్బీసీసీ, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్ ఇ్రన్ఫా, ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్అండ్టీ, అజాద్ ఇంజనీరింగ్స్ షేర్లు 3–6% క్షీణించాయి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్ లక్ష్యం.బ్యాటరీల తయారీకి దన్ను ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల (మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్ మహాజన్ చెప్పారు. బలమైన అడుగులు.. క్యాన్సర్ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్ టూరిజం, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు. సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్‌లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్.వైద్య సంరక్షణ కేంద్రంగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్ ఇన్ ఇండియా మిషన్ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్‌ను ఉంచు తుంది. – ప్రతాప్ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్.పెట్టుబడులకు ఊతం.. వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.వృద్ధికి ఇంధనం.. తయారీ, గ్రీన్ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్. కస్టమర్లకు ఉపశమనం లేదు.. విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్ గూడ్స్) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. పంకజ్ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్.ఇంధన శక్తిలో అగ్రగామిగా.. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్ మీటరింగ్ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. – నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. -
పర్లేదు సార్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్‌కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 బడ్జెట్లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్‌ను స్వాగతించారు. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. ఐఐటీల విస్తరణ.. 2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు. నైపుణ్యాల పెంపు.. విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు. ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది. ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్వేర్ సర్విసెస్)రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు ఐఐటీలు, ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను పెంచడం వల్ల పీహెచ్డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్స్పష్టత ఇవ్వాల్సింది సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్‌కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360జాతి వృద్ధికి ఊతం ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్ఏటా కుదింపులు.. ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి -
5 ఏళ్లలో 75 వేల సీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.99,858.56 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా, ఈసారి 11 శాతం మేర పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. ఈ పెంచిన సీట్ల ద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారి కల సాకారమైనట్లేనన్నారు. కాలేజీల్లో మెడికల్ సీట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీటు రాక.. మరో ఏడాదిపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏడాదికి 10 వేల సీట్ల చొప్పున ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతున్నట్లు శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025–26 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.1 లక్షల అండర్ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లుఇటీవల కాలంలో కేన్సర్ బారిన పడుతూ ఎంతోమంది రోగులు ఆసుపత్రుల్లో బారులుతీరుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఆ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2025–26లో సుమారు 200 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.కేటాయింపులు ఇలా...» వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లను కేటాయించగా, ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.3,900.69 కోట్లు కేటాయించారు.» ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,992.90 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.3,497 కోట్లను కేటాయించారు.. ఇప్పుడు 14.15 శాతం పెంపు.» జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.37,226.92 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.36,000 కోట్లు.» ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు (ఏబీపీఎం–జేఏవై) రూ.9,406 కోట్లు.» స్వయంప్రతిపత్తి గల సంస్థలకు రూ.20,046.07 కోట్లు కేటాయించారు. 2024–25లో రూ.18,978.72 కోట్లు కేటాయించారు.36 మందులకు సుంకం మినహాయింపు» కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం అందించేందుకు వారు వాడే మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయించను న్నారు. వారు చికిత్సకు వినియోగించే 36 రకాల జీవ ఔషధాలపై ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే, ఫార్మాకంపెనీలు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కింద రోగులకు అందించే మరో 37 రకాల మందులతోపాటు 13 కొత్త ఔషధాలకు బీసీడీని మినహాయించనున్నారు. దీంతో ఆయా మందులను రోగులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. » ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో దేశంలో మెడికల్ టూరిజం, ‘హీల్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంతోపాటు, సులభతర వీసా విధానాన్ని తెస్తామని చెప్పారు. » ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక స్కూళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.మెరుగైన ఆరోగ్య జీవితం కోసం...ఈ బడ్జెట్ మెరుగైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు దోహదపడుతుంది. దేశంలో 200 డేకేర్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు, కేన్సర్, దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చర్యలు సంక్రమణేతర వ్యాధులపై పోరాటానికి, రోగుల జేబులపై భారం తగ్గించేందుకు దోహదపడతాయి. కొత్త విద్యావకాశాలతోపాటు ఉపాధి కల్పనకు కూడా ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.– ప్రతాప్ సి.రెడ్డిఅపోలో హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ -
గ్రామాలే మన బలగం
న్యూఢిల్లీ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా మోదీ 3.0 సర్కారు తాజా బడ్జెట్లో పూర్తి అండదండలు అందించింది. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ఫ్లాగ్షిప్ పథకాలకు కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు పుష్కలంగా నిధులు కేటాయించారు. అలాగే, ఉపాధికి ఢోకా లేకుండా.. గ్రామీణ రోడ్లు పరుగులు తీసేలా.. బడ్జెట్లో ఫోకస్ చేశారు. ఇక తాగునీటి పథకం.. జల్ జీవన్ మిషన్‌ను 100% పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పొడిగించి, నిధుల వరద పారించారు. భారత్‌నెట్ గొడుగు కింద ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ సెకండరీ స్కూళ్లు, పీహెచ్‌సీలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం దక్కనుంది. సొంతింటికి ఫుల్ సపోర్ట్ (పీఎంఏవై) 2025–26 కేటాయింపులు: రూ.74,626 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.46,096 కోట్లు (సవరించిన అంచనా)పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి ఫుల్ సపోర్ట్ లభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పీఎంఏవై 2.0 స్కీమ్ కింద చేపట్టనున్నట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే. పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అదనంగా కోటి ఇళ్లు అందించే పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.19,794 కోట్లు కేటాయించారు. 2025–26లో గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందుకు మొత్తం రూ.3,500 కోట్లను కేటాయించారు. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,832 కోట్లు దక్కాయి. 2029 మార్చికల్లా రూ.3.06 లక్షల నిధులతో 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2024–25లో 40 లక్షల ఇళ్ల లక్ష్యానికి గాను డిసెంబర్ నాటికి 18 రాష్ట్రాల్లో 27.78 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామీణ రోడ్లు.. టాప్ గేర్2025–26 కేటాయింపులు: రూ.19,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.14,500 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్ ప్రకటించగా.. ఇప్పుడు జోరందుకుంటోంది. 25,000 ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు దృష్టిపెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 17,570 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 35,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘గ్రీన్’టెక్నాలజీతో 18,000 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు.‘ఉపాధి’కి ఢోకా లేదు2025–26 కేటాయింపులు: రూ.86,000కోట్లు2024–25 కేటాయింపులు: రూ.86,000కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారీ నిధుల ‘హామీ’దక్కింది. అయితే, 2024– 25 సవరించిన అంచనాల (రూ.86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కేటాయించారు. రా ష్ట్రాల్లో లక్ష్యాలు, అవసరాలను బట్టి అవసరమైతే మరి న్ని నిధులను కేటాయించే అవకాశం ఉంది. 2023– 24లో రూ.60,000 కోట్లు కేటాయించగా, వాస్తవ వ్యయం రూ.89,153 కోట్లు కావడం గమనార్హం.జల్‌జీవన్ మిషన్... మరో మూడేళ్లు పొడిగింపు2025–26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రా>మ్ను అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు. కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025–26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్ లక్ష్యం. కాగా, ‘జన్ భాగీధారీ’ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.కనెక్ట్ టుభారత్ నెట్.. 2025–26కేటాయింపులు: రూ.22,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 6,500 కోట్లు (సవరించిన అంచనా)దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్ స్పాట్స్, 12,21,014 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించనుండగా... 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.స్వచ్ఛ భారత్.. విస్తరణ2025–26 కేటాయింపులు: రూ. 12,192 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 9,351 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2025–26లో 2 లక్షల వ్యక్తిగత టాయిలెట్లు, 20,000 కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించనున్నారు. 98 శాతం వార్డుల్లో ఇంటింటికీ ఘన వ్యర్థాల సేకరణను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 89,000 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణలోకి తీసుకురానున్నారు. 60,000 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు. అలాగే 800 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ 2.0 కింద తాగునీరు, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల కోసం 100 నగరాలను గుర్తించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
రైల్వేలకు పాత పద్దే!
న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్లో రైల్వేశాఖ పద్దుల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. 2025–26 బడ్జెట్లో ఈ శాఖకు మొత్తం రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు మొత్తం రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తాయని అంచనా వేశారు. మరో 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు ప్రవేశపె ట్టేందుకు అనుమతి ఇచ్చారు. వచ్చే నాలుగేళ్ల లో మొత్తం రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రకటన అనంతరం శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదాయ అంచనా రూ.3 లక్షల కోట్లు2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అన్ని మార్గాల ద్వారా రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2024–25 బడ్జెట్లో సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.2,79,000 కోట్లుగా ఉంది. గత బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ఆదాయం 2024–25లో రూ.80,000 కోట్లు ఉండగా, 2023–24లో రూ.70,693 కోట్లు వచ్చింది. 2024–25 బడ్జెట్లో సరుకు రవాణా ద్వారా రూ.1,80,000 కోట్ల ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. 2023–24లో ఇది 1,68,199 కోట్లుగా ఉంది. రైల్వేల్లో భద్రతాపరమైన చర్యల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,14,062 కోట్లు ఉండగా, 2025–26 బడ్జెట్లో దీనిని రూ.1,16,514 కోట్లుగా అంచనా వేశారు. అయితే, ఇంతగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ రైల్వేలకు వస్తున్న ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుదల ఉండటం లేదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్, టెలి కమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్రకుమార్ గోయెల్ చెప్పారు. మరో 200 వందేభారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా మరో 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తక్కువ దూరంగల పట్టణాల మధ్య ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను మరో 100 ప్రారంభిస్తామని చెప్పారు. 17,500 కొత్త కోచ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వివరించారు. -
ధన ధాన్య కృషి రైతే మహర్షి
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా పథకాలు, కేటాయింపులు ప్రకటించింది. రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సబ్సిడీతో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగాల్లో వ్యవసాయం మొదటిదని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..2025–26 బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి కార్యక్రమాలకు కలిపి రూ.1.45 లక్షల కోట్లు కేటాయించారు. అయితే కొత్త పథకాలకు కేటా యింపులపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.1.47 లక్షల కోట్లను తాజా బడ్జెట్ అధిగమించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 2.75 శాతం తక్కువ బడ్జెట్‌ను ప్రకటించినప్పటికీ, కేంద్రం కీలక పథకాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అయితే అను బంధ రంగాలకు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమకు 37 శాతం అధికంగా రూ.7,544 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు 56 శాతం అధికంగా రూ.4,364 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) మొత్తంగా రూ.1.57 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం ప్రతిపాదించింది.ఆహార భద్రతపై దృష్టి .. తాజా బడ్జెట్లో ఆహార భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేంద్రం.. తక్కువ సాగు, ఉత్పాదకతతో వ్యవసాయంలో వెనుకబడిన దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ఈ పథకంతో..ధాన్యం ఉత్పాదకత పెంపు, పంటల్లో వైవిధ్యం, పంటల కోత అనంతర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి .. పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) లక్ష్యంగా ఆరేళ్ల పప్పు ధాన్యాల కార్యక్రమాన్ని (పల్సెస్ మిషన్) కేంద్రం ప్రకటించింది. కంది, మినప, ఎర్రపప్పు (మసూర్) ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్లు రైతులతో లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుని నాలుగేళ్ల పాటు ఈ పప్పు ధాన్యాలను సేకరిస్తాయి. పండ్లు, కూరగాయలు.. పత్తికి ప్రత్యేక కార్యక్రమాలుకూరగాయలు, పండ్ల ఉత్పాదకతను పెంచే సమగ్ర ఉద్యాన కార్యక్రమానికి, అలాగే మంచి (పొడవైన పింజ) పత్తి రకాలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కాటన్ (పత్తి) మిషన్‌కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించా రు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం.. తాజా బడ్జెట్లో బిహార్‌కు రూ.100 కోట్లతో మఖానా (తామర గింజ (ఫాక్స్ నట్) బోర్డును మంజూరు చేసింది. అదేవిధంగా మరో రూ.100 కోట్లతో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాల అభివృద్ధి లక్ష్యంగా ఓ పరిశోధనా వ్యవస్థను ప్రకటించింది. అసోంలోని నామ్రూప్లో 12.7లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఓ యూరియా కర్మాగారాన్ని కూడా ప్రతిపాదించారు.గ్రామీణ ప్రగతి కార్యక్రమం..గ్రామీణ నిరుద్యోగితకు పరిష్కారంగా సమగ్ర ‘గ్రామీణ ప్రగతి..స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పా రు. వలసలు అనేవి తప్పనిసరి కాకుండా ఓ ప్రత్యా మ్నాయంగానే ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని ఆర్థికమంత్రి వివరించారు. గ్రామీణ మహిళలు, యువత, యువ రైతులు, సన్న చిన్నకారు రైతులు, భూముల్లేని కుటుంబాలపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్ .. రూ.60 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ. చేపలు, ఆక్వాకల్చర్ ఉత్తత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఓ సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ప్రపంచ సీఫుడ్ మార్కెట్లో భారత్ పోటీ తత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా..ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి)పై కనీస దిగు మతి సుంకాన్ని (బీసీడీ) 30% నుంచి 5 శాతానికి తగ్గించింది. కృషి వికాస్ యోజనకు రూ.8,500 కోట్లురాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి 41.66 శాతం పెంపుతో రూ.8,500 కోట్లు కేటాయించారు. కృషియోన్నతి (రూ.8వేల కోట్లు), నమో డ్రోన్ దీదీ, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి, మత్స్య సంపద యోజన తదితర పథకాలకు నిధులు గణనీయంగా పెంచారు.కిసాన్ క్రెడిట్ కార్డులతో మరింత రుణం రైతులకు రుణ భద్రతను మరింత పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి. ఈ కార్డుపై ఇప్పటిదాకా రూ.3 లక్షల రుణ పరిమితి ఉండగా..దీన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచడంతో దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు లబ్ధి పొందనున్నారు. పెంచిన పరిమితి మేరకు వీరు స్వల్పకాలిక రుణాలు పొందేందుకు అవకాశం ఉంది.పరిశ్రమ వర్గాల హర్షం బడ్జెట్లో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) అధ్యక్షుడు సంజీవ్ అస్థానా, ఫెడ రేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ)చైర్మన్ అజయ్ రాణా, అదాని విల్మార్ సీఈఓ అంగ్షు మాలిక్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఎండీ సైమన్ వీ బుష్‌లు హర్షం వ్యక్తం చేశారు.దూరదృష్టి బడ్జెట్..‘ఇది దూరదృష్టితో కూడిన బడ్జెట్. విశ్వాసం అనే పరిమ ళం ఇందులో ఉంది. అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం తపన ఇందులో ఉంది. స్వయం సమృద్ధి భారత్ దిశగా ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించింది..’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.రైతు సంఘాల అసంతృప్తి.. 5న ధర్నా అన్ని పంటలకు చట్టబద్ధమైన గ్యారంటీతో కూడిన కనీస మద్దతు ధర కల్పించాలనే తమ దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోక పోవడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు, కారి్మక, పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 5న ధర్నా నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తదితర సంఘాలు ప్రకటించాయి. -
మహిళా, శిశు అభివృద్ధికి రూ.26,889కోట్లు
న్యూఢిల్లీ : మహిళా, శిశు అభివృద్ధి శాఖకు నిధుల కేటా యింపులు స్వల్పంగా పెరిగాయి. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.26,889.69 కోట్లు కేటా యించింది. 2024–25లో సవరించిన అంచనా రూ.23,182.98 కోట్లు కాగా, తాజాగా బడ్జెట్లో మరో రూ.3,706.71 కోట్లు పెంచారు. మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లను ‘సాక్షం అంగన్వాడీ’, పోషణ్ 2.0 కార్య క్రమాలకు ఖర్చు చేయనున్నారు. చిన్నారులు, కౌమార దశలోని బాలికల్లో పోషకాహార లేమిని అరికట్టా లని, శిశు సంరక్షణను బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ బోతోంది. సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్మన్)కు అదనంగా రూ.120 కోట్లు కేటాయించారు. ఈ నిధులను 75 గిరి జన జాతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యయం చేస్తారు. గిరిజనాభివృద్ధి కోసం ధార్తి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. బాలల రక్షణ సేవలకు గాను ‘మిషన్ వాత్సల్య’ కోసం గతేడాది రూ.1,391 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు. మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల రుణం తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ.2 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేయనుంది. 5 లక్షల మందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల కోసం ‘మాన్యుఫాక్చరింగ్ మిషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు మహిళా సాధికారతే ధ్యేయంగా ‘మిషన్ శక్తి’ అమలుకు రూ.3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో.. బేటీ పడావో, వన్‌స్టాప్ సెంటర్లు, నారీ ఆదాలత్‌లు, ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.629 కోట్లు ఖర్చు చేస్తారు. స్వధార్ గృహాలు, ప్రధాని మాతృ వందన యోజన, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, నేషనల్ క్రెష్ స్కీమ్‌కు రూ.2,521 కోట్లు వెచ్చిస్తారు. నిర్భయ నిధికి రూ.30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్‌కు రూ.28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్మెంట్కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)కు రూ.14.49 కోట్లు కేటాయించారు. -
ఓం భీమ్ తుస్.. గురజాడ నామస్మరణ.. ఏపీ విస్మరణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్లో కూడా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో నిధుల వర్షం కురిపించారు. గత బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.ఏ మేలూ లేని బడ్జెట్‌పై పొగడ్తలా?అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. గత బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్‌కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది. గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు. గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అందజేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జెట్లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్ నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్‌కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. మోదీ సారథ్యంలోని వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. – ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుందికేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది. – కె.పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు 2025–26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్లో చేసిన అన్యాయంపై పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. – పీవీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేతకూటమి చేతకానితనం వల్లే అన్యాయంబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్‌కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
లక్కీ భాస్కర్ లెక్కలివి..
(సాక్షి, అమరావతి) : ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. మేమంతా ‘లక్కీ భాస్కర్’లమే అని మధ్య తరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపా దనలు చేశారు. ఈ రకంగా చూస్తే.. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా... వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!. శనివారం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ... అత్యధిక పన్నురేటు30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా... ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్‌కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక కొత్త పన్ను చట్టంఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా... ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా... పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో... ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ... దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల. వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో.... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి. నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే.... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.రూ.80వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభంకొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్‌ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.సీనియర్ సిటిజన్లకు ఊరటవడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.ప్రస్తుతం ఈ వడ్డీఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారురెమిటెన్స్లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్లై టీసీఎస్‌ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు. ఇక నుంచి అధిక టీడీఎస్‌ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో... చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని. అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ఉదాహరణకు... మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే... దీన్లో రూ.4 లక్షలవరకూ జీరో... రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం... అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే... రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క. ఇది మరిచిపోకండి... జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
సాగుకు ఊతమేది?
భారత్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
అసలు లాభం కోటి మందికేనా?
ఇపుడు యావద్దేశమూ బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను పరిమితి గురించే మాట్లాడుతోంది. తాము భారతదేశ మధ్య తరగతికి ఎనలేని మేలు చేశామని, యావత్తు మధ్య తరగతికీ ఊరటనిచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఇది నిజమేనా? వాస్తవానికి 145 కోట్ల మంది భారతదేశ జనాభాలో 2024–25లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య దాదాపుగా 8.09 కోట్లు. అందులో దాదాపుగా 6 కోట్ల మంది రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉండి జీరో రిటర్నులు వేసినవారే. మిగిలిన వారిలో కోటి మంది రూ.12 లక్షలకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు. అంటే మిగిలిన 1.09 కోట్ల మందికే తాజా నిర్ణయంతో ఎక్కువ మేలు కలుగుతుందన్న మాట. ఎందుకంటే వారు మాత్రమే ప్రస్తుతం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉండి పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నవారు. కాకుంటే.. శ్లాబుల మార్పు వల్ల రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఆదాయం ఉండేవారికి కూడా కొంత ప్రయోజనం కలుగుతుండటం గమనార్హం. మరి ఈ 1.09 కోట్ల మందికి లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని యావత్తు మధ్య తరగతికీ మేలు చేశామని చెప్పటం కరెక్టేనా? అసలు పన్ను పరిధిలోకే రాని 138 కోట్ల మంది సంగతేంటి? వారి బతుకు తెరువేంటి? అలాంటి వారందరినీ కూడా మధ్య తరగతిలోకో కనీసం ఆదాయ పు పన్ను పరిధిలోకో తేవాలంటే వారందరికీ తగిన ఉద్యోగాలు, ఉపాధి ఉండాలి కదా? కాకపోతే ఆ దిశగా ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలేవీ కనిపించలేదు. కాకపోతే ఉద్యోగులంటేనే ఎక్కువగా మాట్లాడేవాళ్లు. వివిధ వేదికలపై వినిపించేది వారి గొంతే. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేదీ వాళ్లే. అందుకే మోదీ వారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టే ఇపుడు దేశమంతా బడ్జెట్లో మిగతా విష యాలు పక్కనబెట్టి ఆదాయపు పన్ను గురించి మాట్లాడుతోంది. లక్ష కోట్లు నష్టపోయి మరీ... ఎందుకిలా? ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య వల్ల ఏడాదికి లక్ష కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. మామూలుగా ఎప్పుడూ ఇంతటి నష్టం వచ్చే చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పటికే రుణాలు పెరిగిపోతున్నాయి. మరి లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవటమంటే మాటలు కాదు కదా? కాకపోతే ప్రభుత్వ ఉద్దేశం వేరు. తాత్కాలికంగా ఉద్యోగుల్ని సంతృప్తి పరచటం ద్వారా తక్షణ ప్రయోజనాలు పొందటమే కాక... పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి ఒక్కరినీ కొత్త పన్ను విధానంలోకి తేవటమన్నది ప్రభుత్వ అసలు లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ పరిమితి పెంపు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పన్ను విధానం నిరర్ధకమైపోతుంది. పన్ను కోసం చేసే సేవింగ్స్, అలవెన్సులు, పన్ను కోసం చేసే బీమా చెల్లింపుల వంటివన్నీ తెరమరుగైపోతాయి. మొత్తంగా అలవెన్సుల వ్యవస్థే కనిపించకుండా పోతుంది. దీనికితోడు మినహాయింపులేవీ ఉండవు కనక అత్యధిక శాతం మందికి పన్ను రిటర్నులు దాఖలు చేయటం అత్యంత సులభమైపోతుంది. రకరకాల ఆదాయాలుండి, వాటిని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నవారికి తప్ప.. ఒక్క జీతంపైనే ఆధారపడ్డ వారెవ్వరికీ పన్ను రిటర్నులు వేయటానికి ట్యాక్స్ అసిస్టెంట్లు, ఆడిటర్ల అవసరం ఉండదు.ఇక ఆదాయపు పన్ను విభాగంలో కూడా రిఫండ్ల వంటి ప్రక్రియ ఉండదు. పన్నుల వ్యవస్థ సరళమైపోతుంది కనక ఆదాయపు పన్ను విభాగాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు సరళమైన పగడ్బందీ పన్ను విధానం అమల్లోకి వస్తుంది. రిబేట్ పరిమితి 12 లక్షల వరకూ ఉంటుంది కనక వృత్తి నిపుణులతో సహా ఎక్కువ మంది రిటర్నులు వేయటానికి ముందుకొస్తారు. ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. మున్ముందు వీరంతా పన్ను చెల్లిస్తే ఆదాయ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. -
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
పంచరంగుల చిత్రం
గమ్యస్థానం: వికసిత భారత్ దారిదీపం: సమష్టి కృషి ఇంధనం: కొత్త తరం సంస్కరణలు స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు. పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే... పరిశ్రమలకు మహర్దశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు. చదువుకు జేజే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. పట్టణాలకు ప్రాధాన్యం పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ఊపు మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.సాగుకు పట్టం...వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలున్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.తాజా బడ్జెట్లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. బడ్జెట్ హైలైట్స్⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది. ⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు ⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం ⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్సీపీఎఫ్లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి. ⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం ⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్‌తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుఅభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్‌కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రిబిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్‌కుమార్, బిహార్ సీఎంకోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్బడ్జెట్లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత వరుసగా 8వసారిదేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తిజీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాంఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన ఇదే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రముఖులు వివిధ మాధ్యమాల్లో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో మద్దతు ఇవ్వడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే, సామాన్యులకు బడ్జెట్లో పన్ను శ్లాబ్‌లను సవరించి మేలు చేశారని, తద్వారా వారి ఆదాయాలు పెంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు బడ్జెట్‌పై ఎలా స్పందిస్తున్నారో కింద తెలుసుకుందాం.ఆదాయంలో పెరుగుదల -ఆశిష్‌కుమార్ చౌహాన్, ఎండీ అండ్ సీఈఓ ఎన్ఎస్ఈబలమైన అభివృద్ధి చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, తగ్గిన పన్ను భారంతో భారతదేశ వృద్ధి ఊపందుకుంటుంది. ఆదాయంలో పెరుగుదలను, వినియోగ వృద్ధిని పెంచుతుంది. భారతీయ కుటుంబాలకు మరింత సంపద సృష్టి అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుతం 11 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారుల సమూహంలో మరింత ఎక్కువ మంది చేరుతారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో వాటాదారులు అవుతారు. తద్వారా ఆర్థిక వృద్ధి, మూలధన నిర్మాణానికి కృషి చేస్తారు.వినియోగదారుల చేతిలో మరింత ఆదాయం- డాక్టర్ అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ.పన్ను నిర్మాణంలో మార్పుల ద్వారా 2025 బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నాం. భారతీయ వినియోగదారుల చేతిలో మరింత ఆదాయాన్ని ఉంచడం మంచి విషయం. ఇది ప్రైవేట్ సెక్టార్ మూలధన వ్యయం సానుకూల దిశలో పయనించడానికి ప్రోత్సహిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. భారతదేశం తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధికి తక్షణ ఉద్దీపన అందించడంతో పాటు, బడ్జెట్ గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. పునాదులు వేస్తోంది.వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి- ప్రశాంత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, యస్ బ్యాంక్మెరుగైన ఆర్థిక వ్యవస్థకు వేదికగా బడ్జెట్‌ను మార్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పాదరక్షలు, తోలు, బొమ్మలు, ఆహార ప్రాసెసింగ్ వంటి విభాగాలకు బడ్జెట్లో ప్రోత్సాహం అందించారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపరిచే మార్గాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా తగిన అవకాశాలను అందించినట్లయింది. మరింత స్థిరమైన పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తద్వారా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్ బూస్టర్- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓకేంద్ర బడ్జెట్ 2025-26 స్వయం సమృద్ధి, వికసిత్ భారత్‌కు సరైన బూస్టర్‌ను అందిస్తుంది. మధ్యతరగతికి గణనీయమైన పన్ను ఉపశమనం, క్రమబద్ధీకరించిన టీడీఎస్ నిబంధనలు, స్థానిక తయారీకి బలమైన ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ వినియోగదారుల చేతుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఉంచుతుంది. వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అధికం చేస్తుంది. ఎంఎస్ఎంఈల వృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల స్థానిక వ్యాపారాలు బలోపేతం కావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్థానిక తయారీని మెరుగుపరచడానికి, దేశం అంతటా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, సాంకేతికతను ఉపయోగించడానికి బడ్జెట్ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్అదనంగా 75 వేల వైద్య సీట్లు- డా.మల్లికార్జున, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీకేంద్రబడ్జెట్ 2025లో ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాల కోసం ఎక్కువ కేటాయింపులు జరపడం సంతోషంగా ఉంది. 75 వేల వైద్య సీట్లను అదనంగా జోడించడంతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే విధానాన్ని కొంత కట్టడి చేసినట్లవుతుంది. చాలా క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మేలు జరుగుతుంది. అంగన్వాడీలకు మూలధన వ్యయాన్ని పెంచారు. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
లక్ష్మీదేవిగా నిర్మలమ్మ.. బడ్జెట్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి, ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ సరదా చర్చ నడుస్తుంటుంది. అయితే.. వాటిని తాను కూడా అంతే సరదాగా చూస్తానని ఆమె అంటుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఆమె బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించడం తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఊరట ఇవ్వడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టులు పెడుతున్నారు. NO INCOME TAX UPTO RS 12 LAKH! pic.twitter.com/FunZJjyGvB— Arjun* (@mxtaverse) February 1, 2025 అంతేకాదు.. మధ్యతరగతి పాలిట లక్ష్మీదేవి అంటూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అయితే ఇది కేవలం మీమ్స్ దగ్గరే ఆగిపోలేదు. ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు.. మార్ఫింగ్ ఫొటోలతో మీమర్స్ చెలరేగిపోతున్నారు.How middle class is seeing @nsitharaman ji today. pic.twitter.com/PsrUDavoWj— Ankit Jain (@indiantweeter) February 1, 2025సబ్ కా వికాస్ లక్ష్యంగా.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ అన్నారు. కానీ, బడ్జెట్ లెక్కలు పొంతన లేకుండా పోయాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పాలిత రాష్ట్రం బీహార్‌కు భారీగా వరాలు కురిపించింది కేంద్రం. దీంతో సహజంగానే మిగతా ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. ఆమె తన ప్రసంగంలో పదే పదే బీహార్ పేరును ప్రస్తావించడమూ ‘ఆచార్య పాదఘట్టం’ తరహాలో నెట్టింట ట్రోలింగ్‌కు దారి తీసింది.Bihar supremacy Budget mein 💪#NirmalaSitharaman#Budget2025 pic.twitter.com/JlC39kuWWS— Raja Babu (@GaurangBhardwa1) February 1, 2025 Most repeated words. #Budget2025 pic.twitter.com/4pjtahNdks— Sagar (@sagarcasm) February 1, 2025ఇదిలా ఉంటే.. ఇవాళ్టి బడ్జెట్‌తో ఎనిమిదిసార్లు వరుసగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారు. గంటా 17 నిమిషాలపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. -
Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు!
కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక విషయాన్ని ప్రకటించారు. బిహార్ (Bihar)పై వరాల జల్లు కురిపించిన ఆర్థికమంత్రి అక్కడ మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫూల్ మఖానా (lotus seeds) పై ఆసక్తి ఏర్పడింది. మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. అసలేంటి మఖానా ప్రత్యేకత, వీటివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటి తెలుసుకుందామా!బిహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డుతో అక్కడి రైతులకు మేలు చేయనుంది. దీని ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మఖానా ప్రయోజనాలుఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన డైట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరుచక్కని పౌష్ఠికాహారం మఖానా. మఖానా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడంవల్ల, బరువు తగ్గడంతోపాటు, షుగర్ గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. బాదం, జీడిపప్పు,ఇతర డ్రై ఫ్రూట్స్, మఖానా పోషక విలువలు చాలా ఎక్కువ.కార్బోహైడ్రేట్లు, ఐరన్ లభించే సూపర్ ఫుడ్. అందుకే మఖానా తినడం వల్ల ఏనుగు లాంటి శక్తి వస్తుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయనిచెబుతున్నారు నిపుణులు.మఖానాల్లో మెగ్నీషియం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.మఖానా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి.కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ల మూలం కాబట్టి మఖానాతో ఎముకళు, కీళ్లను బలపోతం చేస్తాయి. దంతాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా మాఖానా పనిచేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. ఇందులోని థయామిన్ నరాల, అభిజ్ఞా పనితీరుకు మంచిది. న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది. సంతానోత్పత్తికి మంచిది: మఖానా వంధ్యత్వ సమస్యలతో వ్యవహరించడంలో పురుషులు,మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇవీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర -
బడ్జెట్లో వ్యవసాయానికి ఊతం రైతులకు శుభవార్త
-
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
బీహార్ సాధించుకుంది మరి ఏపీకి ఏమైంది ?
-
దులారి దేవి ‘గిఫ్ట్’తో నిర్మలా సీతారామన్ బడ్జెట్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించే కేంద్ర బడ్జెట్ 2025-26ను శనివారం (ఫిబ్రవరి 1, 2025) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడు బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా సీతారామన్ తన చీరలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆఫ్-వైట్ చేనేత పట్టు చీరలో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చీర ను పద్మశీ పురస్కారాన్ని అందుకున్న మధుబని కళాకారిణి దులారి దేవి బహుమతిగా అందించారట. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ కళాత్మకతకు అద్దం పట్టిన ఈ చీర, ఆర్టిస్ట్ దులారి దేవి గురించి తెలుసుకుందాం పదండి!ఉదయం 11:00 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతూ పార్లమెంటులో సంప్రదాయ చీరలో కనిపించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, శతాబ్దాల నాటి కళను గౌరవిస్తూ ఎంతో సంక్లిష్టమైన మధుబని కళాకృతులతో తీర్చిదిద్దిన చీర అది. ప్రధానంగా మిథిలా కళా సంప్రదాయంలో పనిచేసే దులారి దేవి, అణగారిన దళిత మల్లా కులంలో జన్మించారు. బీహార్‌లోని మధుబనిలోని మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఔట్రీచ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సందర్భంగా ఆమెకు ఈ చీరను బహూకరించారట. తాను ఎంతో కష్టపడి, జాగ్రత్తగా రూపొందించిన మధుబని ప్రింట్ చీరను నిర్మలా సీతారామన్‌కు అందజేసి బడ్జెట్ దినోత్సవం నాడు ధరించాలని దులారీ దేవి కోరారట. దీనిక మ్యాచింగ్‌గా ఎరుపు రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్నారు.మధుబని కళబిహార్లోని మిథిలా ప్రాంతంలో మిథిలా పెయింటింగ్‌గా పేరొందిన కళ ఇది. ఇది సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలు, పూల మూలాంశాలు, ప్రకృతి, పురాణాల వర్ణనల ద్వారా దుస్తులను రూపొందిస్తారు. ఈ కళారూపం దాని శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతీకాత్మక వర్ణనలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ కళాకారిణి , చిత్రకారిణి చిన్న వయసులోనే.. అంటే పదమూడేళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెద్దగా చదువుకోలేదు కూడా. మధుబని కళాకారిణి మహాసుందరి దేవి ఇంట్లో గృహ సేవకురాలిగా పని చేస్తున్న సమయంలో దులారీ దేవి మధుబని కళను ఒంట పట్టించుకున్నారు. ఆ త రువాత మరో కళాకారిణి కర్పూరి దేవిని పరిచయంతో ఈ కళలోని మరిన్ని మెళకువలను నేర్చుకుని నైపుణ్యం సాధించారు. భర్తను కోల్పోవడం , గ్రామీణ జీవితంలోని కష్టాలు వంటి అనేక వ్యక్తిగత సవాళ్ల మధ్య మిథిలా ప్రాంతంలో ఈ కళతోనే జీవనోపాధి వెతుక్కున్నారు. తన కళను విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఈ కళలో ఆమె చేసిన కృషి, సేవలకు గాను 2021లో దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు వచ్చి వరించింది.మరోవైపు 2019లో మధ్యంతర బడ్జెట్ మొదలు, వరుసగా 2020, 2021, 2022, 2023, 2024 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 1), 2024 (మధ్యంతర బడ్జెట్, జులై 23) ఇలా వరుసగా 7 సార్లు నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇలా ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగా రికార్డ్ సాధించారు. అంతేకాదు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ,2019-20 బడ్జెట్లో భాగంగా 1372020-21లో 162 నిమిషాల పాటు ప్రసంగించిన ఆమె తాజా బడ్జెట్ ప్రసంగంలో 74 నిమిషాల పాటు ప్రసంగించడం విశేషం. -
నగల ధరలు తగ్గుతాయా..?
కేంద్ర బడ్జెట్ 2025లో ఆభరణాలపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి 2, 2025 నుంచి ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని (ఐటమ్ కోడ్ 7113-విలువైన లోహం లేదా విలువైన లోహంతో కప్పబడిన ఆభరణాలు, భాగాలు) 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. అదనంగా ప్లాటినం ఆభరణాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక వస్తువులపై సుంకాన్ని 25% నుంచి 5%కు తగ్గించారు.టారిఫ్ తగ్గింపు ప్రభావాలువినియోగదారులకు తక్కువ ధరలు: కస్టమ్స్ సుంకం తగ్గింపు వల్ల ఆభరణాల ధర తగ్గుతుందని, వినియోగదారులకు మరింత చౌకగా అవి లభిస్తాయని భావిస్తున్నారు. ఇది లగ్జరీ ఆభరణాల వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక సుంకాలు తరచుగా ధరలు పెరిగేందుకు దారితీస్తాయి.దేశీయ డిమాండ్‌కు ఊతంఆభరణాలు మరింత చౌకగా మారడంతో దేశీయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది దేశీయంగా తయారయ్యే ఆభరణాల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతుంది.తయారీదారులకు లాభదాయంప్లాటినం ఆభరణాల తయారీకి ఉపయోగించే వస్తువులపై సుంకాల తగ్గింపు వల్ల తయారీదారులకు పెట్టుబడి ఖర్చులు తగ్గినట్లవుతుంది. ఇది వారి లాభదాయకతను పెంచుతుంది. ఇది మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్మార్కెట్ స్పందనఈ ప్రకటన తర్వాత ఆభరణాల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇది ఈ రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత సెంకో గోల్డ్, మోటిసన్స్ జ్యువెల్లర్స్, కళ్యాణ్ జువెలర్స్ వంటి కంపెనీలు తమ స్టాక్ ధరల్లో గణనీయమైన లాభాల్లో ట్రేడయ్యాయి. -
ప్రజల జేబులు నింపే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ:ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో శనివారం(ఫిబ్రవరి1) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందన్నారు. బడ్జెట్‌పై శనివారం మధ్యాహ్నం మోదీ స్పందించారు.‘భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనది. ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు సంబంధించిన బడ్జెట్.ఈ బడ్జెట్ ప్రతీ భారతీయుడి కలను నెరవేరుస్తుంది. బడ్జెట్ ద్వారా అనేక రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాన్యులే వికసిత్ భారత్ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లేలా ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఖజానను ఎలా నింపాలన్నదానిపై బడ్జెట్ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ సామాన్యుల జేబులు ఎలా నింపాలన్నదానిపై దృష్టి పెట్టి రూపొందించినది. ఈ బడ్జెట్‌తో దేశ పౌరులు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరవడం లాంటి చర్యలు ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలు’అని ప్రధాని కొనియాడారు. కాగా, కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయించడంతో పాటు పాత విధానంలోనూ శ్లాబులు మార్చి పన్ను తగ్గించారు. దీంతో ఈ బడ్జెట్ ప్రజల చేతిలో మిగులు ధనం ఉండేందుకు దోహదం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. -
బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు
అధికమొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74% నుంచి 100%కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మార్పు చాలా బీమా రంగంలో అవసరమైన మూలధనం సమకూరుతుందని, పోటీని పెంచుతుందని, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ చర్య 2047 నాటికి ‘అందరికీ బీమా’ అనే ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు, షరతులను సమీక్షించి కేంద్రం వాటిని సరళీకృతం చేయనుంది. ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆకర్షించడం, పోటీని పెంచడం, కొత్త మార్కెట్‌ను తీసుకురానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్కరణ బీమా సంస్థలు ఒకే విధానంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి అనుమతిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్.. వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు ఈ ప్రకటన తర్వాత భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, వనరులను తీసుకువచ్చేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్కు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘నిర్మలమ్మ బడ్జెట్ ఓ పెద్ద జోక్’
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్‌కు వరాలు ఇచ్చిందన్నారు. బీహార్ కోసమే బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. హర్యానా రైతులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగం, ఆదాయం గురించి కాదు.. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావనే లేదన్నారు.కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనకు జీతం లేకపోతే ఏం జరుగుతుంది? ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఆదాయపు పన్ను ఉపశమనం నుండి ప్రయోజనం పొందాలంటే, మీకు నిజంగా ఉద్యోగాలు అవసరం. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. మీకు జీతం ఉంటే మీరు తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే, ఒక దేశం, ఒక ఎన్నిక కోరుకునే పార్టీ వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ఉపయోగించి మరిన్ని ఉచితాలను అందిస్తుందని చెప్పడం హాస్యాస్పదం.#WATCH | On #UnionBudget2025, Congress MP Shashi Tharoor says, "I think frankly the applause you heard from the BGP benches was for the middle-class tax cut. We look at the details and that may be a good thing. So if you have a salary you may be paying less tax. But the important… pic.twitter.com/vbOJHyMMMy— ANI (@ANI) February 1, 2025కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ..‘వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది’ అని ఎద్దేవా చేశారు.The FM spoke of 4 engines: Agriculture, MSMEs, Investment, and Exports. So many engines that the Budget has been completely derailed.— Jairam Ramesh (@Jairam_Ramesh) February 1, 2025కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ..‘రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. అణు విద్యుత్ గురించి మాట్లాడారు కానీ హర్యానాలో ఉన్న గోరఖ్‌పూర్‌లోని అణు విద్యుత్ కేంద్రం చాలా కాలంగా ఉంది. దీని గురించి మాట్లడలేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. MGNREGA వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏమీ ప్రకటించలేదు. ప్రకటించినదంతా ప్రధానంగా బీహార్ గురించే ఉందన్నారు. #WATCH | #UnionBudget2025 | Congress MP Kumari Selja says, "Farmers didn't get MSP. They talked about nuclear but our nuclear power plant in Haryana's Gorakhpur (Gorakhpur Haryana Anu Vidyut Pariyojana) has been there for a long and both are happening there. Many such issues are… pic.twitter.com/fanSTExEzs— ANI (@ANI) February 1, 2025 -
ట్యాక్స్ పేయర్లకు కొత్త పన్ను శ్లాబులు ఇవే
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి: Nirmala Sitharaman
-
రూ.50.65 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుమూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లురుణాల రికవరీ రూ.29,000 కోట్లుఇతర వసూళ్లు రూ.47,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లుమొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లుమొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లురెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లుమూలధన ఖాతా రూ.11,21,090 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లురెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లుద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లుప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 20 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుప్రధాన సబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలుఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 8 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 22 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 24 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు -
బడ్జెట్ వేళ.. పద్మశ్రీ గ్రహీత ఇచ్చిన చీరలో నిర్మలమ్మ
-
రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..కొత్త పన్ను విధానం ప్రకారం.. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. కొత్త విధానం ప్రకారం రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుందని చెప్పారు.కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణరూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5%రూ.8-12 లక్షలు - 10%రూ.12-16 లక్షలు - 15%రూ.16-20 లక్షలు - 20%రూ.20-24 లక్షలు - 25%రూ.24 లక్షల పైన 30 శాతంఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఈ కొత్త విధానం పన్ను సౌలభ్యాన్ని సులభతరం చేయడం, వాటిని మరింత క్రమబద్దీకరించడానికి తోడ్పడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. ఎలా లెక్కిస్తారంటే..నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. తాజా బడ్జెట్లో రిబేట్‌ను రూ.60 వేలుగా నిర్ణయించారు. ఇది ఇప్పటివరకు రూ.25,000గా ఉండేది. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. అలాంటి వారు పైన పేర్కొన్న శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను వర్తించని ఆదాయం రూ.7 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్స్ రూ.75 వేలు కలుపుకొని రూ.7.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని తాజాగా రూ.12.75 (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలు, రిబేట్ కలిపి)కు సవరించారు. -
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
కేంద్ర బడ్జెట్.. బీహార్‌కు వరాలు!
ఢిల్లీ: పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వ్యూహత్మక అడుగులు వేసింది. బీహార్‌లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బీహార్ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా దేశంలో ఆహార ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధిని కల్పిస్తుంది. అలాగే, బీహార్‌లో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.అంతేగాక మఖానాను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నారు. దీని ద్వారా మఖానా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ దేశంలోనే మఖానా ఉత్పత్తిలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిని మరింత ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.🚨 Big boost for Bihar’s Makhana farmers! 🌿💰 FM Nirmala Sitharaman announces the setup of a Makhana Board in Bihar to enhance processing, marketing & farmer training. This will strengthen the Bihar Makhana industry, ensuring better value & global reach!#Makhana #BiharInfra pic.twitter.com/6sfaDR9m2t— Bihar Infra & Tech (@BiharInfra) February 1, 2025ఇది బీహార్‌కి నిజంగా చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. బీహారీలు చాలా ఏళ్లుగా మఖానాను పండిస్తున్నారు. ఇక, మఖానా అనగా ఇదొక రకమైన ఆహారం. ఇవి ఆకుల మాదిరిగా ఉండి గింజలాంటి నిర్మాణంలో ఉంటాయి. వీటిలో గింజల లాంటివి వస్తాయి. దేశంలో 90 శాతం మఖానాను బీహార్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బీహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అపే పేరు కూడా వచ్చింది. బడ్జెట్లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.బీహార్‌కు వరాలు ఇలా..బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థికసాయం.ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం.పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంఇందులో భాగంగానే బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.బీహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన. దీదీంతో ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది. -
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
బడ్జెట్ లో ఏపీకి ఊరట దక్కనుందా?
-
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు. -
బడ్జెట్ 2025: గిగ్ వర్కర్లకు ఇక మంచిరోజులు
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్కు లాభం చేకూరనుంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె. గిగ్ వర్కర్లు అంటే..తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్‌ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్‌లు, రైడ్ యాప్‌లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు. అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం. -
బడ్జెట్లో వ్యవసాయ రంగం అప్డేట్స్.. ‘ధన్ ధాన్య కృషి యోజన’ ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతదేశం అంతటా రైతులకు ఉత్పాదకత, సుస్థిరత, మార్కెట్ సౌలభ్యాన్ని పెంచడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయంపై ఫోకస్ పెడుతున్నట్లు పేర్కొన్నారు.ధన్ ధాన్య కృషి యోజనతక్కువ ఉత్పాదకత, సగటు కంటే తక్కువ రుణ పారామితులు ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా, రుణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు.రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఆర్ఎల్ఐ) పథకంవ్యవసాయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, విజయవంతమైన పరిశోధనలు, వాటి అభివృద్ధి ఫలితాల కోసం ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకునే పంటల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం లక్ష్యం.ఏకీకృత విత్తన నమోదు ప్రక్రియవిత్తన నమోదు కోసం వన్ నేషన్, వన్ లైసెన్స్ విధానాన్ని బడ్జెట్ ప్రతిపాదిస్తుంది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, రైతులకు అధిక నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగమని నిర్మాలా సీతారామన్ చెప్పారు.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సరళీకరణవ్యవసాయ పెట్టుబడులకు జీఎస్టీ ఫ్రేమ్ వర్క్‌ను సరళతరం చేయడం, నిత్యావసర వస్తువులను మరింత చౌకగా, సుస్థిరంగా మార్చడానికి బడ్జెట్లో చర్యలు సాగనున్నాయి.భారతదేశ వ్యవసాయ విస్తరణలో కీలక చోదకాలుగా ఉన్న ఉద్యానవన, పశుసంపద, చేపల పెంపకం వంటి అధిక విలువ ఆధారిత రంగాల వృద్ధికి బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ప్రభావం ఇలా..2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న కార్యక్రమాలు వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయని, మార్కెట్ ప్రాప్యతను మెరుగుపరుస్తాయని, వ్యవసాయ పద్ధతుల సుస్థిరతను నిర్ధారిస్తాయని భావిస్తున్నారు. సృజనాత్మకత, పరిశోధన, క్రమబద్ధీకరించిన ప్రక్రియలపై దృష్టి పెట్టడం ద్వారా వ్యవసాయ రంగానికి మేలు చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. -
Watch Live: మోదీ 3.Oలో నిర్మలమ్మ తొలి పద్దు
-
బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంటుందా ?
-
బడ్జెట్ పై కోటి ఆశలు
-
బడ్జెట్ రెడీ.. ఊరటనిస్తారా? ఉసూరుమనిపిస్తారా? (చిత్రాలు)
-
ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
-
ఎనిమిది బడ్జెట్లు: ఎనిమిది రంగుల చీరలు
-
దటీజ్ నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' కాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా.. వరుసగా ఎనిమిదిసార్లు పద్దును సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈసారి బడ్జెట్ ఉండనున్నట్లు కేంద్రం ఇప్పటికే సంకేతాలిచ్చింది. అంతే కాకుండా.. మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రధాని మోదీ మాటలను బట్టి అర్థమవుతోంది.ఇప్పటి వరకు ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఎనిమిదోసారి బడ్జెట్ చదవనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సొంతం. ఈయన 10 బడ్జెట్లను ప్రవేశపట్టారు. సీతారామన్ కూడా ఈ సంఖ్యకు చేరువలో ఉన్నారు. సుదీర్ఘంగా బడ్జెట్ ను చదివి వినిపించిన ఘనత కూడా ఈమె సొంతం చేసుకున్నారు.బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు➤భారతదేశంలో మొట్టమొదటిసారి 1947 నవంబర్ 26న 'షణ్ముఖం చెట్టి' బడ్జెట్ సమర్పించారు.➤అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు.➤ఫిబ్రవరి 1, 2020న నిర్మలా సీతారామన్ 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.➤1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం.. ఇప్పటివరకు అతి చిన్న బడ్జెట్‌గా నిలిచింది. ఎందుకంటే ఇది కేవలం 800 పదాలతో కూడిన బడ్జెట్.➤ప్రారంభంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. కానీ 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో సమయాన్ని మార్చారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.➤2017లో బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. అప్పటి వరకు ఫిబ్రవరి 29న బడ్జెట్ సమర్పించేవారు. -
ఈ పొద్దు.. ఆశల పద్దు!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని నగర వాసులు ఎదురుచూస్తున్నారు. ఎంఎంటీఎస్ కొత్త రైళ్లతో పాటు చర్లపల్లి టెర్మినల్ నుంచి పూర్తి స్థాయిలో నగరంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ, పుణ్య క్షేత్రాలకు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నారు. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నిధులు కేటాయించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అనుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు. విశ్వ నగరిగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ఐటీ రంగానికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్రం కరుణిస్తుందని, బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేస్తారని అంతా ఆశాభావంతో ఉన్నారు. –సాక్షి, సిటీబ్యూరోబల్దియాను ఆదుకునేనా?కేంద్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి ఏ మేరకు కేటాయింపులుంటాయోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న జీహెచ్ఎంసీ పలు కార్యక్రమాలకు కేంద్రంపై ఆశలు పెంచుకుంది. గృహ నిర్మాణానికి పీఎంఏవై నిధులతోపాటు ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి, వరద సమస్యల పరిష్కారం, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితరాల కోసం రూ. 10 వేల కోట్లకు పైగా కేంద్రాన్ని కోరింది. వరద ముంపు సమస్యల పరిష్కారంతో పాటు చెత్త సమస్య పరిష్కారానికి నిధులు అడిగింది. హైదరాబాద్ వారసత్వాన్ని పరిరక్షించేందుకు పురాతన కట్టడాల పరిరక్షణ తదితరమైన వాటి కోసం కోరింది. రోజురోజూకూ పరిధి పెరుగుతూ, విస్తృతమవుతున్న జనాభాకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులవసరముంది. బల్దియా కోరికల్లో ఎన్నింటికి నిధులిస్తారోనని జీహెచ్ఎంసీ వర్గాలు వేచి చూస్తున్నాయి.కొత్త రైళ్లకు పచ్చజెండా ఊపేనా? రెండో దశలో భాగంగా అటు మేడ్చల్ నుంచి ఇటు ఉందానగర్ వరకు. ఘట్కేసర్ నుంచి తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్ లైన్లు పూర్తయ్యాయి. నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఎక్కడికైనా అతి తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే సదుపాయం ఉంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేకుండాపోయాయి. కొత్త లైన్లతో పాటు 9 బోగీలతో కూడిన కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను కూడా కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఉన్న రైళ్లనే వివిధ ప్రాంతాల మధ్య నడుపుతున్నారు.చర్లపల్లికి ఏదీ కనెక్టివిటీ..మార్చి నుంచి పలు రెగ్యులర్ రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి టెరి్మనల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసి ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయి కనెక్టివిటీ లేదు. ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకొనేలా ఎంఎంటీఎస్ సేవలను పెంచాలి. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లతో పాటు నగరంలోని ఏ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచైనా బయలుదేరి చర్లపల్లికి వెళ్లేలా సరీ్వసులను విస్తరించాల్సి ఉంది.యాదాద్రి ఎంఎంటీఎస్ నత్తడనక..గత ఏడాది బడ్జెట్లో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించారు. కానీ రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, వనరులు, భూమి, తదితర మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 430 కోట్లతో అంచనాలు రూపొందించారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. రైల్వేశాఖ ఇప్పటి వరకు రెండు దఫాలుగా రూ.60 కోట్లు మాత్రం కేటాయించింది. కానీ పనులు ప్రారంభించలేదు.పుణ్యక్షేత్రాలకు వెళ్లేదెలా? హైదరాబాద్ నుంచి అయోధ్య, షిరిడీ, శబరిమల తదితర పుణ్యక్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే అనేక ప్రాంతాలకు డిమాండ్‌కు సరిపడా రైళ్లు లేకపోవడంతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తే తప్ప రైలెక్కడం సాధ్యం కాదు. షిరిడీకి ప్రస్తుతం అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. శబరిమలకు కూడా ఒక్క రైలే అందుబాటులో ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. పదేళ్లుగా రైళ్ల పెంపు లేకుండాపోయింది.ఆశల మూసీ భాగ్యనగరానికి మణిహారమైన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్ ప్రణాళిక రూపకల్పనలపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) దృష్టి సారించింది. మూసీ పునరుజ్జీవానికి రూ.14,100 కోట్ల బడ్జెట్‌ను అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్లో సహాయం అందుతుందని ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు పట్టణ నీటి నాణ్యతను మెరుగుపర్చడం, సుస్థిర ప్రగతిని సాధించేందుకు దశల వారీగా నిధులు కేటాయించాలని కోరారు.మూసీ పునరుజ్జీవంలో భాగంగా తొలిదశలో బాపూఘాట్, మీరాలం ట్యాంక్ వద్ద అభివృద్ధి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బాపూఘాట్ వద్ద రక్షణ శాఖకు చెందిన 220 ఎకరాల భూ సమీకరణతో పాటు రిజర్వాయర్, మురుగు నీటి అప్గ్రేడ్లు, మూసీ నదిపై హెరిటేజ్ వంతెనల నిర్మాణం తదితరాల వ్యయాలను బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు.మూసీని ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమీకరించనున్నారు. మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్పానర్íÙప్లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనున్నారు.ఐటీ బూస్ట్..‘సాఫ్ట్వేర్ ట్రయినింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పిలిచే హైదరాబాద్ ఐటీ రంగం బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకుంది. దేశీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 31 శాతంఆ ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగం కేంద్రీకృతమైన హైదరాబాద్‌లో సుమారు 1,500లకు పైగా కంపెనీలలో 9 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రేటర్లో నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీతో పాటు ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏఐ సిటీతో పాటు ఐటీ పార్క్‌లకు ప్రత్యేక కేటాయింపులు, పన్ను మినహాయింపులతో పాటు ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక కేటాయింపులు చేయాలని పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు.హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31తో ముగియనున్న సంవత్సరానికి తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.7 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేశారు. మధ్య తరగతి జీతభత్యాలకు పన్ను మినహాయింపులతో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ కోసం పన్నులను హేతుబద్దీకరించాలని, నైపుణాభివృద్ధికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఎంఎస్ఎంఈ రంగానికి దన్నుగా నిలిచేలా బడ్జెట్లో కేటాయింపులు చేయాలిజలమండలిపై దయ చూపేనా..లక్డీకాపూల్: కేంద్ర బడ్జెట్‌పై జలమండలి ఆశలు పెట్టుకుంది. నలువైపులా విస్తరిస్తున్న çమహా హైదరాబాద్ పరిధిలో మురుగు నీటి నెట్వర్క్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టు కోసం సుమారు రూ.17,212.69 కోట్లు, మూసీ ప్రక్షాళనలో భాగంగా నదిలో మురుగు నీరు చేరకుండా ఇరువైపులా 55 కి.మీ (మొత్తం 110 కి.మీ) కాల్వల ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టు నిర్మాణాల కోసం మరో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ రెండు పథకాలను అమృత్ పథకం– 2.0 కి చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.రైల్వే బ్రిడ్జిల అభివృద్ధికి రూ.500 కోట్లు కావాలికేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల ప్రతిపాదనలుదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేయటంతో పాటు రైల్వే క్రాసింగ్, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర పనులకు కేంద్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని కోరుతూ స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈటల తన నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేశారు.మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బోల్లారం నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న 12 అండర్, ఓవర్ సింగిల్ బ్రిడ్జిలను పెరుగుతున్న కాలనీలు,బస్తీలకు అనుగుణంగా.. మారుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టేక్కించేందుకు డబుల్ బ్రిడ్జిలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.యాభై ఏళ్ల క్రితం నాటి రైల్వే క్రాసింగ్‌లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాని ఎంపీ ఈటల కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అభివృద్ధి పనులకు సుమారు రూ.500 కోట్ల ని«ధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి సమాంతరంగా శివారు మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అమృత్ పథకంలో అత్యధిక నిధులు కేటాయిచాలని కోరారు. -
ఊరట దక్కేనా.. నిర్మలమ్మ వరాలు ఇచ్చేనా !
/telugu-news/business/liveblog/union-budget-2025-live-updates-and-key-highlights-details-inside
-
బడ్జెట్ 2025: ముఖ్యాంశాలు
కొత్త ట్యాక్స్ విధానం పాటించే వారికి మాత్రమే మినహాయింపులు -
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్‌తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్‌ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే
2020: కొత్త ట్యాక్స్ స్లాబులతో పన్ను రేట్లలో మార్పులు జరిగినా, పరిశ్రమ వర్గాలకు అనువైన నిర్ణయాలేవీ బడ్జెట్ లో లేకపోవడం సెంటిమెంట్ ను దెబ్బతీసి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది.2021: ఇది పూర్తిగా విభిన్న బడ్జెట్. కోవిడ్ తొలిదశ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీస్థాయిలో మౌలిక రంగ కేటాయింపులు జరిగాయి. స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ హాలిడేలు వంటి వృద్ధి ప్రేరక చర్యలతో మార్కెట్ ఆనందానికి అవధులు లేవు. దీంతో సెన్సెక్స్ బడ్జెట్ రోజున ఏకంగా 2314 పాయింట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే చరిత్రలో ఇది అత్యుత్తమంగా నిలిచిపోయింది.2022: ఇది కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది. 2023: ఈ బడ్జెట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా ఆరోజు సెన్సెక్స్ ఒకదశలో 1100 పాయింట్లు పెరిగినా చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.2024: మూలధన లాభాలపై అధిక పన్ను విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1 శాతం పడిపోయింది.బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఇలా చేయండి⇒ బడ్జెట్ రోజున మార్కెట్లో హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటుతో వ్యవహరించకండి.⇒ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయండి. సాధ్యమైనంత వరకు ఒకట్రెండు రోజులు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మంచిది.⇒బడ్జెట్ అనంతరం నిపుణుల/విశ్లేషకుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్కెట్లో కదలికలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏం చెబుతున్నారో ఆలకించండి.⇒ బడ్జెట్ రోజు ట్రెండ్ ను అంచనా వేయడం చాలా కష్టం. పెరుగుతున్నాయి అనుకునే లోపే సూచీలు పడిపోతాయి. పడిపోతున్నాయి అనుకునే లోపే పైకి ఎగసిపోతాయి. మీకు మార్కెట్లో అనుభవం లేకపోతే బడ్జెట్ రోజు ట్రేడింగ్ చేయకండి. లాభాల మాట అటుంచి భారీ నష్టాలు కళ్లచూడాల్సి వస్తుంది.⇒ బడ్జెట్ లో ఏయే రంగాలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయో సమగ్రంగా గ్రహించండి. తదనుగుణంగా సంబంధిత రంగాలకు చెందిన షేర్లపై దృష్టి పెట్టండి.⇒అనాలోచిత నిర్ణయాలతో, గుడ్డిగా షేర్లు కొనేయకండి.-బెహరా శ్రీనివాస రావు మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
బడ్జెట్: మార్కెట్లకు జోష్ ఇస్తేనే...!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే మరో బడ్జెట్ వెలుగు చూసేది రేపే. ఈ బడ్జెట్ పై ఇప్పటికే గణనీయమైన అంచనాలున్నాయి. ఇదొక విప్లవాత్మకమైన బడ్జెట్ అవుతుందనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 13 నెలలుగా ఎడతెరిపి లేకుండా షేర్లను అమ్ముకుంటూ మన మార్కెట్ కు చుక్కలు చూపిస్తున్న విదేశీ మదుపర్లు.. ఈసారి బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. గత జనవరి నుంచి చూస్తే ఈ జనవరి చివరికి వీళ్ళు దాదాపు రూ. 3.80 లక్షల కోట్ల షేర్లను విక్రయించి మన మార్కెట్ కు గట్టి నష్టాన్నే కలిగించారు.వీళ్ళ పయనం ఇదేమాదిరి కొనసాగకూడదంటే ఆర్ధిక మంత్రి మార్కెట్ ఫోకస్ తో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.3-6.8% నమోదుకావొచ్చని అంచనా. ప్రపంచ అస్థిర, అనిశ్చిత వాతావరణంతో మన ఆర్ధిక వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది.ఈనేపథ్యలో స్టాక్ మార్కెట్ విశ్వాసాన్ని పెంచే, ఇన్వెస్టర్ల మనసు చూరగొనే అంశాలపై ఈసారి బడ్జెట్ లో దృష్టి సారించాల్సిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ నడుస్తోంది. దానికి తోడు శుక్రవారం వెలువడ్డ ఆర్ధిక సర్వే మార్కెట్ కు ఉత్సాహాన్నే ఇచ్చింది. దీన్ని నిజం చేస్తూ బడ్జెట్ సాగాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ సెంటిమెంట్ ను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందా... నివ్వెరపరుస్తుందా? అన్నది రేపు ఎటూ తేలిపోతుంది.⇒ పన్నుల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మార్కెట్ వర్గాలు గట్టిగానే పట్టుబడుతున్నాయి.⇒ దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో సమూల మార్పులు తీసుకు రావాలని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక లాభాలు అనేవి మూడేళ్లకు పైబడితేనే పన్నురహితంగా ఉంటున్నాయి. అలాగే డివిడెండ్లను కూడా మామూలు ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తున్నారు. ఇలా చేయడం రెండుసార్లు పన్ను విధించడమే అవుతుందని, డివిడెండ్ ఆదాయాన్ని పన్నులనుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.⇒ షేర్ల లావాదేవీలపై విధించే పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లావాదేవీల పన్నును ప్రస్తుతమున్న 0.625% నుంచి తగ్గిస్తే డెరివేటివ్స్ లావాదేవీలు ఊపందుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరే మార్గాల్లో ఇదొకటి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు పాజిటివ్ గా స్పందిస్తుంది అన్నది సందేహమే.⇒ ఈ రెండూ జరిగితే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరిగి రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులతో ముందుకొస్తారు.⇒ మరోపక్క మౌలిక రంగానికి కేటాయించే నిధులు మార్కెట్ కు ఉత్సాహాన్ని ఇస్తాయి. రోడ్లు, రైల్వేలు , రక్షణ రంగాలకు కేటాయింపులు పెంచితే సదరు నిధులు వినియోగాన్ని విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో వినియోగం పెరగడం ద్వారా ఆయా రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతుంది.⇒ ఇక తయారీ, వ్యవసాయం, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడం, పాలసీ పరంగా సంస్కరణలు తీసుకురావడం ప్రధానం. విధానపరమైన నిర్ణయాలు సంబంధిత రంగాల షేర్లపై మదుపరులకు మక్కువ పెంచుతాయి. తద్వారా తయారీ రంగంలో సెంటిమెంట్ పెరుగుతుంది.⇒ సబ్సిడీలు లేదా సంస్కరణలు వ్యవసాయ, అగ్రి బిజినెస్ రంగంలో కొత్త మార్పులను తీసుకొచ్చి ఆ రంగాల్లో డిమాండ్ పెంచుతాయి. దీర్ఘ కాలిక వృద్ధికి ప్రోత్సాహమిచ్చే ఇటువంటి చర్యలకు మార్కెట్లు ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి.భారత ఆర్ధిక రంగానికి సంబంధించినంతవరకు బడ్జెట్ అనేది ఒక ప్రధాన సంఘటన. పన్ను సంస్కరణలు, రాబడులు, వ్యయాలు, ఆయా రంగాలకు కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు, అనుకూల/ప్రతికూల అంశాలు.. ఇత్యాది అంశాల సమాహారమే బడ్జెట్. మార్కెట్ వర్గాలకు బడ్జెట్ రుచించకపోతే భారీగా పడగొట్టేస్తారు. నచ్చిందా నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం గత రెండు, మూడు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ కనిపిస్తోంది. తాజా బడ్జెట్ అంచనాలను చేరుకోకపోతే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు.ఇప్పటికే నిక్కు నీలుగుతున్న మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. దూరమవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఎంత చేటు చేయాలో అంతా చేసేస్తారు. అదే సమయంలో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా పడిపోయే మార్కెట్లు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తాయి. ఆర్ధిక మంత్రికి ఈవిషయాలన్నీ తెలియనివి ఏమీ కావు. అందరినీ మెప్పించే నిర్ణయాలతోనే ముందుకెళ్తారని ఆశిద్దాం. కొద్ది గంటలు ఓపిక పట్టి చూద్దాం... ఏం జరుగుతుందో... -
నిపుణ్ భారత్ ఇనిషియేటివ్పై ఆర్థిక సర్వే ఫోకస్
కేంద్ర బడ్జెట్ 2025ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను విడుదల చేశారు. ఇది భారతదేశ ఆర్థిక పనితీరుతోపాటు భవిష్యత్తు పరిణామాలకు పునాది వేసింది. 2026లో 3వ తరగతి పూర్తి చేసుకునే ప్రతి చిన్నారికి సమగ్ర అక్షరాస్యత కల్పించేందుకు ‘నిపుణ్ భారత్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఈ సర్వే హైలైట్ చేసింది.నిపుణ్ భారత్ ఇనిషియేటివ్కేంద్ర మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ నిపుణ్ భారత్ ఇనిషియేటివ్పై చర్చించారు. 2026 నాటికి 3వ తరగతి పూర్తి చేసుకునే చిన్నారులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా బేసిక్ అక్షరాస్యత, సంఖ్యలపై పూర్తి అవగాహన కల్పించేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. విద్యా సవాళ్లను పరిష్కరించడంలో, దేశవ్యాప్తంగా లెర్నింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న విధంగా బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విజయవంతమైన నిర్దిష్ట కార్యక్రమాలను సీఈఏ హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండబోయే కొన్ని కీలకాంశాలు కింది విధంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలుఉపాధ్యాయ శిక్షణ: బేసిక్ నైపుణ్యాలను సమర్థవంతంగా విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులకు విస్తృతమైన శిక్షణను అందించడం.పాఠ్యప్రణాళిక రూపకల్పన: ప్రాథమిక దశ నుంచే అక్షరాస్యత, సంఖ్యలపై నైపుణ్యానికి ప్రాధాన్యమిచ్చే పాఠ్యప్రణాళికను రూపొందించి అమలు చేయడం.సమాజాన్ని భాగస్వామ్యం చేయడం: పిల్లల అభ్యసనకు మద్దతు ఇవ్వడానికి విద్యా ప్రక్రియలో తల్లిదండ్రులు, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం.మానిటరింగ్ అండ్ అసెస్మెంట్: బేసిక్ నైపుణ్యాల్లో విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి, వాటిని అంచనా వేయడానికి బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం. -
ఏఐతో ముప్పు ఇదీ.. ఆర్థిక సర్వే హెచ్చరిక!
విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ప్రయోజనాలు ఎంత ఉన్నా దాని విపరిణామాల పట్ల చాలా మందిలో ఆందోళన ఉంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన నుండి ఆర్థికాంశాలు, విద్య వరకు ఆర్థికంగా విలువైన చాలా పనులను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఏఐ డెవలపర్లు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ పురోగతి గణనీయమైన విపరిణామాలనూ తీసుకుతో రావచ్చని ఆర్థిక సర్వే 2024-2025 (Economic Survey 2024-2025) హెచ్చరిస్తోంది.ఆర్థిక సర్వే 2024-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పార్లమెంట్ ముందు సమర్పించారు. ఏఐ పురోగతి ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని, వివిధ రంగాలలో మానవ నిర్ణయాధికారాన్ని ఏఐ అధిగమించడం వలన పెద్ద ఎత్తున ఉపాధిలో మార్పులు సంభవిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.ఏమిటీ ఎకనామిక్ సర్వే?ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సమీక్షించే ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పనితీరు, విధానపరంగా సానుకూల మార్పులను సంగ్రహించి విశదీకరిస్తుంది. అలాగే స్వల్ప, మధ్య కాలానికి ఆర్థిక వ్యవస్థకు ఉన్న అవకాశాలను తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా దీన్ని వెల్లడిస్తారు.ఏఐపై ఆర్థిక సర్వే 2024-25 ఏం చెప్పిందంటే.. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేర న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమించగలదని అంచనా ఉంది. ఇది పెద్ద ఎత్తున మధ్య, దిగువ ఆదాయ కార్మికుల ఉపాధిని ప్రభావితం చేస్తుంది.మునుపటి పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా కనిపించకపోవచ్చు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవా ఆధారితమైన నేపథ్యంలో చిన్న స్థాయి ఐటీ సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేషన్ ముప్పు ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి కార్మికులను తొలగించి సాంకేతికతతో భర్తీ చేస్తాయి.ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం అవసరం. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా భారతదేశం బలమైన సంస్థల సృష్టిని వేగవంతం చేయాలి.నైపుణ్య సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో కలిసి పనిచేసేలా సన్నద్ధం చేయాలి.ఏఐ ప్రస్తుతం శైశవదశలో ఉన్నందున దాని పునాదులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్త సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం దేశానికి లభించింది.విస్తృత-వ్యాప్తి స్వీకరణను సాధించడానికి ముందు ఏఐ డెవలపర్లు అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనేది డెవలపర్లు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు.యువ, డైనమిక్, సాంకేతిక-అవగాహన ఉన్న జనాభాను పెంచడం ద్వారా పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది.కార్మిక శక్తి, సాంకేతికత సరైన మార్గంలో సమతుల్యం అయినప్పుడు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. పని భవిష్యత్తు శ్రామిక శక్తి, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేసే 'అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది.లేబర్ మార్కెట్లో ఏఐతో వచ్చే మార్పులు శాశ్వత ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉన్నందున విధాన నిర్ణేతలు ఆవిష్కరణలను సామాజిక వ్యయాలతో సమతుల్యం చేయాలి. -
ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమగ్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2024-25లో జరిగిన వృద్ధిని, భవిష్యత్తు అంచనాలతో 2025 ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. అందులోకి కొన్ని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.స్థిరమైన జీడీపీ వృద్ధి: అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంది.రంగాలవారీ పనితీరు: వ్యవసాయం, పరిశ్రమలు, సేవలతో సహా అన్ని రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. వ్యవసాయ రంగం బలంగా ఉంది.ద్రవ్యోల్బణం నియంత్రణ: రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 4.9 శాతానికి తగ్గింది.బ్యాంకింగ్ రంగం: వాణిజ్య బ్యాంకులు తమ స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తిలో స్థిరమైన తగ్గుదలను నమోదు చేశాయి. ఇది 2024 సెప్టెంబర్ చివరి నాటికి 2.6% కనిష్టానికి చేరుకుంది.గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్: గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్‌లో భారత్ వాటా 2023లో 17 శాతం నుంచి 2024 నాటికి 30 శాతానికి చేరింది.మూలధన వ్యయం: 2024 నవంబర్ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రైల్వేలు, రోడ్డు రవాణా వాటా 75 శాతంగా ఉంది.ఆహార ద్రవ్యోల్బణం: కూరగాయల ధరల కాలానుగుణంగా భారీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ వస్తుండడంతో ఆహార ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి తగ్గుతుందని భావిస్తున్నారు.బీమా రంగ వృద్ధి: బీమా రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధి చెంది మొత్తం ఎఫ్‌డీఐల్లో 62% ఆకర్షించింది.హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్: భారత బీమా రంగం వృద్ధికి ఆరోగ్యం, మోటారు బీమా గణనీయంగా దోహదపడ్డాయి.ఇదీ చదవండి: తగ్గిన జీడీపీ వృద్ధి అంచనానిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. అయితే వృద్ధిరేటు కొనసాగేందుకు క్షేత్రస్థాయి సంస్కరణలు కొనసాగాలి. ప్రపంచస్థాయిలో పోటీపడే దిశగా మెరుగుపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సరైన యంత్రాంగం లేకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.భౌగోళిక, రాజకీయ అస్థిరతల వల్ల డాలర్ బలపడడంతో రూపాయి మారక విలువ పడిపోయింది. 2025లో స్టాక్ మార్కెట్లు కొంత పడిపోయే అవకాశం ఉంది. -
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
తగ్గిన జీడీపీ వృద్ధి అంచనా
కేంద్ర బడ్జెట్‌కు ముందు శుక్రవారం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధిని నమోదు చేసిందన్నారు. దాంతో వరుసగా మూడో ఏటా 7% పైగా వృద్ధి నమోదు చేసినట్లయింది.ఆర్థిక సర్వే 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.3-6.8% అంచనా వేసింది. ఇది అంతకుముందు సంవత్సరం వృద్ధి కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడంలో విధానకర్తలు కీలక పాత్ర పోషించారని ఆర్థిక సర్వే తెలిపింది. సవాలుతో కూడిన అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధిని కొనసాగించాలంటే గణనీయమైన ప్రయత్నాలు అవసరమని సర్వే నొక్కి చెప్పింది.ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా వంటి కీలక రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సవాళ్లను ఎదుర్కొంటాయని అంచనా వేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం, లక్పతి దీదీ పథకం, ఇండియా ఏఐ మిషన్ సహా ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పురోగతి ఉంటుందని ఈ సర్వే తెలిపింది.ఇదీ చదవండి: జాతికి ముప్పు చేసే టెక్నాలజీలుకేంద్ర బడ్జెట్ 2025 అంచనాలుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం, గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం వంటి చర్యలతో జీడీపీ వృద్ధిని ప్రోత్సహించడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
👉 వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.👉 ఇటీవల 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్‌భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్ డాకింగ్‌తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్‌లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. ఎంఎస్ఎంఈ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్‌పై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్‌సెల్ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అభవృద్ధి చేశాం. 👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. President Murmu says, "My government is committed to fulfilling the dream of the middle class of having their own house..." pic.twitter.com/Y58sa0z61Z— ANI (@ANI) January 31, 2025 👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు. 👉బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. President Droupadi Murmu to address the joint sitting of both Houses of Parliament, shortlySource: DD News pic.twitter.com/2RVQS79blX— ANI (@ANI) January 31, 2025👉కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్, బ్యాంకింగ్, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్ చేశారు.#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9— ANI (@ANI) January 31, 2025 👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్‌సభ హాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్‌సభలో 2025–26 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతుంది. నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచనమోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. సహకరించాలన్న మోదీ సర్కార్శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్‌చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు.వక్ఫ్ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
టీమ్ సీతారామన్... బడ్జెట్ మే ‘సవాల్’!
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.4 శాతానికి తగ్గుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. ప్రజల వినిమయం తగ్గిపోవడం, ప్రైవేటు పెట్టుబడుల్లో స్తబ్దత, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు మోదీ సర్కారుకు కత్తిమీద సాముగా మారాయి. రూపాయి పాతాళానికి నిచ్చెనేసినట్లు జారిపోతోంది. తాజాగా డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 86.7 జీవిత కాల కనిష్టానికి క్రాష్ అయ్యింది. మరోపక్క, అమెరికా ఆధ్యక్ష పీఠమెక్కిన ట్రంప్... చాలా దేశాలతో పాటు మన మెడపైనా సుంకాల కత్తి పెట్టడంతో టారిఫ్ వార్ 2.0కు తెరలేచింది. దీంతో మన ఎగుమతులకు గడ్డుకాలం తప్పేలా లేదు. ఇంటాబయటా ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల కోట్లకు మించిన బడ్జెట్‌ను రెడీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండానే ప్రగతిని పట్టాలెక్కించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా దేశ ప్రజల కోసం సీతారామన్ అండ్ టీమ్ తయారు చేసిన ఈ బడ్జెట్ నలభీమ పాకాన్ని అలుపెరగకుండా వండివార్చిన ఉద్ధండ అధికారుల సంగతేంటో చూద్దాం...ఎం. నాగరాజుఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి ఆయన. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు వంటి సంస్కరణలకు రోడ్‌మ్యాప్ రూపొందించడం, అంతకంతకూ పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడం, బ్యాంకింగ్ రంగానికి మరింత ఆర్థిక జవసత్వాలను అందించడంపై బడ్జెట్లో ఫోకస్ చేశారు.తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ అధికారి. ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో దీపమ్ (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి దేశ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీపమ్ సెక్రటరీగా ఎయిరిండియా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల డివిడెండ్ పాలసీ వంటి కీలక చర్యలు చేపట్టి దమ్మున్న అధికారిగా పేరు దక్కించుకున్నారు. దీపమ్ సెక్రటరీగా రాకముందు ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో పని చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్ఐడీఓ) ప్రాంతీయ కార్యాలయంలో కూడా సేవలందించారు. వి. అనంత నాగేశ్వరన్2022లో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులయ్యారు. మోదీ 3.0లోనూ కొనసాగుతుండటం ఆయన దీక్షాదక్షతలకు నిదర్శనం. 2025–26 కేంద్ర బడ్జెట్‌కు ముందు వరుసగా మూడోసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. ఆర్థికాంశాల బోధనతో పాటు క్రెడిట్ సూసే గ్రూప్ ఏజీ, జూలియస్ బేయర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గతంలో పనిచేశారు. నేడు పార్లమెంట్‌కు సమరి్పంచనున్న ఆర్థిక సర్వేలో నాగేశ్వరన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను కళ్లకు కట్టడంతో పాటు 2047 నాటికి వికశిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలిపేందుకు అవసరమైన కీలక సూచనలను కూడా పొందుపరిచడానికి తీవ్రంగా శ్రమించారు. అజయ్ సేథ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. 2021 నుంచి నాలుగు దఫాలుగా బడ్జెట్ రూపకల్పన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖలో రెండో సీనియర్ అధికారిగా ఆయన నేతృత్వంలోనే వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మొత్తం బడ్జెట్ ప్రక్రియకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆయన సారథ్యంలో బడ్జెట్ విభాగం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, రుణ సమీకరణ మధ్య సమతూకంతో బ్యాలెన్స్ షీట్‌కు తుదిమెరుగులు దిద్దింది. భారతదేశంలో తొలి సార్వ¿ౌమ గ్రీన్ బాండ్స్ జారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఏర్పాటు వంటి సాహసోపేతమైన చర్యల అమలు ఘనత సేథ్ సొంతం. ద్రవ్యలోటును ప్రభుత్వ లక్ష్యమైన 4.5 శాతం దిగువన కట్టడి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయడంతో పాటు జీడీపీతో పోలిస్తే ప్రభుత్వ రుణ నిష్పత్తి విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం రానున్న బడ్జెట్లో ఆయన ప్రధాన అజెండాగా మారింది.మనోజ్ గోవిల్1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గోవిల్... మోదీ 3.0లో 2024 ఆగస్టులో కేంద్ర వ్యయ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మొదటిసారి భాగస్వామ్యం వహిస్తున్నారు. రూపాయి ఘోరంగా పడిపోతున్న తరుణంలో బడ్జెట్లో సబ్సిడీలకు సంబంధించి అంచనాలు, కేటాయింపుల వంటి కఠిన వ్యవహరాలపై కఠోరంగా శ్రమించారు.అరుణీశ్ చావ్లా దీపమ్, ప్రభత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) కార్యదర్శిగా 2024 డిసెంబర్లో చార్జ్ తీసుకున్నారు. 1992 బ్యాచ్ బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన చావ్లా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పొందిన చావ్లాకు 2014 నుంచి వ్యయాల విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, పీఎస్‌యూలకు చెందిన నిరుపయోగ ఆస్తుల విక్రయం, పీఎస్‌యూల కార్యకపాలాలను గాడిలో పెట్టి, మరింత బలోపేతం చేయడం వంటి వాటిపై బడ్జెట్లో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. -
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిధులకు నిరీక్ష.. కూటమికి పరీక్ష
కేంద్రం రేపు పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ‘ఉపాధి’, వ్యవసాయం, రైల్వేకు కేటాయింపులపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్టంగా 150 పని దినాలు కల్పిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రకటన చేయాలని, పథకం అమలుకు సరిపడినన్ని నిధులను ముందుగానే కేటాయించాలని కోరుతున్నారు. ఏటా కేటాయింపులు తక్కువగా ఉండటంతో సరైన సమయానికి నిధులు విడుదల కాక రాష్ట్రాల్లో పేదలకు పనుల కల్పన తగ్గిపోతోందని చెబుతున్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది సగటున ఒక్కో కుటుంబానికి 55 రోజుల చొప్పున పనులు కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 47కు తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో 68 శాతం జనాభా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న తరుణంలో గతేడాది బడ్జెట్లో కేవలం రూ.1.52 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 3.1 శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఇతర రంగాలకు జరిపే కేటాయింపులతో పోల్చి చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిపే కేటాయింపులు కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో రైల్వే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదని ఆ రంగ ఉద్యోగులే వాపోతున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఆధునికీకరణపై ఈసారైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. – సాక్షి, అమరావతికనీసం 150 పని దినాలు కల్పించాలిఉపాధి హామీ పథకం అమలుకు ఆర్థిక ఏడాది చివరిలో నిధుల కొరత తలెత్తకుండా కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget)లోనైనా నిధులు కేటాయించాలని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) జాబ్‌కార్డుదారులు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతుంది. చట్టం నిబంధన ప్రకారం పని అడిగిన ప్రతి కూలీ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అయితే, కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. దీంతో ప్రతి ఏటా ఆర్థిక ఏడాది చివరిలో జనవరి–మార్చి నెలల మధ్య పని చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీనికి తోడు మ్యాచింగ్‌గా మెటీరియల్ కేటగిరిలో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆలస్యంగా విడుదల చేస్తున్న కారణంగా అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత 2024–25 వార్షిక బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్రం రూ.86 వేల కోట్లు కేటాయించింది. అయితే, జనవరి 26వ తేదీ (సోమవారం) నాటికే అన్ని రాష్ట్రాల్లో జరిగిన పనులకు రూ.87,865 కోట్లు ఖర్చయింది. ఈ లెక్కన ఈ ఆర్థిక ఏడాదిలో ఇంకా మిగిలి ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో పని చేసే కూలీలకు వేతనాలు చెల్లించడానికి అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు కూలీల వేతనం ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పని దినాల సంఖ్య 100 నుంచి 150కి పెంచాలని పేదలు, వివిధ ఎన్జీవో సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. పెద్దపీటతోనే ‘సాగు’ క్షేమంవ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దేశ జీడీపీలో 15 శాతానికి పైగా ఈ రంగం నుంచే వస్తోంది. ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ వంటి పథకాలకు 2023–24తో పోలిస్తే 2024–25లో భారీగా కోత విధించారు. ఈసారి మొత్తం బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కనీసం 5–10 శాతానికి తక్కువ కాకుండా కేటాయింపులు జరపాలనే డిమాండ్ విన్పిస్తోంది. పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే సాయం రెట్టింపు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులు పెంచడమే కాదు.. ప్రీమియం చెల్లింపు భారం రైతులపై మోపకుండా పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేలా మార్పులు తీసుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను, జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్‌గా వీటిని ప్రోత్సహించేందుకు ఎఫ్‌పీవోలు, ఎస్హెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఆయిల్ పామ్ మరింతగా విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూరగాయల ఉత్పత్తి, సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయడం, వీటి నిల్వ కోసం గ్రామ స్థాయిలో స్టోరేజ్, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు చేయూతనివ్వాలి. బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. యంత్ర పరికరాలతో పాటు డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఉద్యాన, మత్స్య, పాడి రంగాల్లో కూడా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించాలి. అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పరిశోధన కేంద్రాలకు నిధులు పెంచాలి.పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులురాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కోటలు దాటినా నిధుల కేటాయింపు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఖజానా దాటడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 2025–26 వార్షిక బడ్జెట్లో అయినా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు తగినన్ని నిధులు రాబట్టడంలో సఫలమవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 2014లోనే రైల్వేశాఖ ఆమోదించినట్లు ప్రకటించింది. ఆ ఐదేళ్లలో కనీసం సర్వే కూడా పూర్తిచేయలేదు. ఇప్పుడు మరోసారి అమరావతి రైల్వే లైన్‌పై మాటల గారడి చేస్తున్నాయి. రైల్వేకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. » కాకినాడ–పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల–నల్గొండ (92 కి.మీ.), కంభం–ప్రొద్దుటూరు (142కి.మీ.), గూడూ రు–దుగ్గరా జుపట్నం (41.55 కి.మీ.) రైల్వేలైన్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించాలి. కొండపల్లి– కొత్తగూడెం (125 కి.మీ.), భద్రాచలం–కొవ్వూరు (151 కి.మీ.) లైన్ల నిర్మాణం సంగతి తేల్చాలి.» కడప–బెంగళూరు (255 కి.మీ), కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. » నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా, విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–నాగ్‌పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు వెంటనే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేయాలి.» కర్నూలు జిల్లాలో రూ.440 కోట్లతో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు సకాలంలో పూర్తి చేయాలి.» తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను ఏర్పాటుచేయాలి. జయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మించాలి. కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్చాలి. ఇప్పటికే ఆమోదించిన మచిలీపట్నం–రేపల్లె రైల్వేలైన్‌ను బాపట్ల వరకు పొడిగించాలి.» ఓబులవారిపల్లి–కృష్ణపట్నం రైలు మార్గంలో పాసింజర్ రైలును నడపాలి. నందలూరు రన్నింగ్ స్టాఫ్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేయాలి. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒంటిమిట్టలో హాల్టింగ్ కల్పించాలి. -
పద్దు ప్రసంగాలు.. సుదీర్ఘమైతే సంచలనాలు!
రాబోయే బడ్జెట్ సెషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. తమ ఆకాంక్షలకు ఈ బడ్జెట్లో చోటు లభిస్తుందోమోనని బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి చిరువ్యాపారుల వరకూ, వేతన జీవులు మొదలుకొని రోజుకూలీల వరకూ ఇలా.. వివిధ వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా ఏం ప్రకటిస్తారు.. ఎంత సేపు ప్రసంగిస్తారు..? అని ఆమె బడ్జెట్ ప్రసంగం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు పన్ను మినహాయింపుల గురించి దేశం ఆశాజనకంగా ఉంది. శనివారం సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించి చేసే ప్రసంగంతో బడ్జెట్‌కు సంబంధించిన అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.ఇది చదివారా? ముందే లీకైన బడ్జెట్.. ఎప్పుడో తెలుసా?బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రులు చేసే ప్రసంగాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కొంత మంది మంత్రులు తమ ప్రసంగాలకు పొయెటిక్ టచ్ ఇచ్చి ఆకట్టుకుంటుంటారు. బడ్జెట్ ప్రసంగాలు కొన్నిసార్లు గంటలపాటు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. మరికొన్ని మూడు ముక్కల్లో ముగుస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమేం చేస్తుందో ప్రసంగాల ద్వారా ముందుకు తీసుకురావడం మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. అందుకే బడ్జెట్ ప్రసంగం అంటే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బడ్జెట్ 2025-26 మన ముందుకు వస్తున్న తరుణంలో భారత బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, సంక్షిప్తమైన ప్రసంగాలు ఏవో ఇప్పుడు చూద్దాం..సుదీర్ఘ ప్రసంగాలు2020 బడ్జెట్ సమర్పణ సమయంలో ఆర్థిక మంత్రి సీతారామన్ భారతీయ చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. 2020-21 బడ్జెట్ కోసం ఆమె ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది. ఈ బడ్జెట్లోనే కొత్త పన్ను విధానం వంటి అనేక కీలక, సంచలన ఆర్థిక సంస్కరణలను సీతారామన్ ప్రవేశపెట్టారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను కూడా ఆర్థిక మంత్రి అప్పుడే ప్రకటించారు. ఇంతటి సుదీర్ఘమైన ప్రసంగం మధ్యలో నిర్మలాసీతారామన్ ఒకానొక సమయంలో అస్వస్థతకు కూడా గురయ్యారు. ఈ ప్రసంగం 2 గంటల, 19 నిమిషాల నిడివితో ఉన్న 2019 రికార్డును (నిర్మలా సీతారామన్‌దే) బద్దలు కొట్టింది.సీతారామన్ కంటే ముందు, సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత జస్వంత్ సింగ్‌ది. 2003లో ఆయన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ జాబితాలో తర్వాతి స్థానం అరుణ్ జైట్లీది. ఆయన 2014లో 2 గంటల 10 నిమిషాల ప్రసంగం చేశారు.అత్యంత సక్షిప్తం ఇదే..దేశంలోనే అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం.పటేల్ చేశారు. అప్పట్లో ఆయన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతోనే పూర్తయింది. 2024లో మధ్యంతర బడ్జెట్ ముందు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల వ్యవధిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఇదే ఇప్పటి వరకు ఆమె చేసిన అత్యంత సంక్షిప్త బడ్జెట్ ప్రసంగం.మన్మోహన్ సింగ్ పదాలు సుదీర్ఘంపదాల పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు అప్పటి ఆర్థిక మంత్రి దివంగత డా. మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 1991లో ఆయన చారిత్రాత్మక బడ్జెట్ ప్రసంగంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ తలుపులు తెరిచారు. ఆ సంవత్సరం మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రసంగ పాఠం 18,650 పదాలను కలిగి ఉంది. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ సమర్పించిన ఆర్థిక సంస్కరణలు సరళీకృత ఆర్థిక వ్యవస్థకు దారితీశాయి. ఆయన సాహసోపేతమైన ప్రణాళికలు, వ్యూహాత్మక విధాన మార్పులు ప్రపంచంలో భారతదేశ స్థితిని మార్చేశాయి. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991 నుండి 1996 వరకు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. -
Budget-2025: బడ్జెట్లో మాకేంటి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్‌తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.👉2025-26 బడ్జెట్లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్ పేర్కొన్నారు.👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్‌లో కెమెరామెన్‌గా పని చేసే వ్యక్తి చెప్పారు.👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.:: సిరికుమార్, సాక్షి వెబ్ బిజినెస్ డెస్క్ -
బడ్జెట్‌పై సామాన్యుల ఆశలు
-
నిత్యావసర ధరలపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం
-
పన్ను విధానాల్లో కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించే అవకాశం
-
కేంద్ర బడ్జెట్‌పై భారీగా అంచనాలు
-
31నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జనవరి 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వేను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా చర్చ ఇరు సభల్లో కొనసాగనుంది.ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే శనివారం రోజు మంత్రి నిర్మలా కేంద్ర సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ లోక్‌సభలో ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో కొనసాగనుంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఫిబ్రవరి ఆరో తేదీన చర్చపై రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) తన ఎనిమిదవ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. బడ్జెట్ తయారీ చివరి దశకు గుర్తుగా 'హల్వా వేడుక' కూడా ముగిసింది. కాగా త్వరలో సమర్పించనున్న బడ్జెట్‌ను రూపొందించే వ్యక్తులు ఎవరనేది, ఈ కథనంలో చూసేద్దాం.తుహిన్ కాంత పాండే (ఆర్థిక & రెవెన్యూ కార్యదర్శి)తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆర్ధిక, రెవెన్యూ విభాగాల్లో ఈయనకు గొప్ప అనుభవం ఉంది. పన్ను రాయితీలను బ్యాలెన్స్ చేస్తూ.. ఆదాయాలను తగ్గకుండా చూసుకోవాల్సిన పని ఈయనదే. బడ్జెట్ ప్రారంభం కావడానికి ముందు.. పాండే ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా రాబోయే సెషన్లో ఆదాయపన్ను చట్టాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.వీ అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు)అనంత నాగేశ్వరన్ ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ఈయన ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యునిగా పనిచేశారు. అతను, అతని బృందం రచించిన ఆర్థిక సర్వే అభివృద్ధిని ప్రోత్సహించడం, సంస్కరణ ఫలితాలను అంచనా వేయడం వంటివి చేస్తుంది.మనోజ్ గోవిల్ (డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శి)మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శిగా చేరడానికి ముందు.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. రాయితీల హేతుబద్ధీకరణ మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చు నాణ్యతను మెరుగుపరచడం వంటివి గోవిల్ బృందం విధి.అజయ్ సేథ్ (ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి)అజయ్ సేథ్.. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన తుది బడ్జెట్ పత్రాలను సిద్ధం చేయడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఆర్ధిక వనరులను నిర్వహించడం, వ్యయాల నియంత్రణ అంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి.ఇదీ చదవండి: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్సీక్ఎం నాగరాజు (డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)నాగరాజు 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు.. ప్రైవేట్ వాణిజ్య మైనింగ్ రంగంలో ఉన్నారు. ఆ సమయంలోనే సుమారు 113 కంటే ఎక్కువ బొగ్గు గనులను వేలం వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన బృందం డిపాజిట్ల మొబలైజేషన్, ఫిన్‌టెక్‌ల నియంత్రణ, బీమా కవరేజిలను పెంచడం వంటివి చూస్తుంది.అరుణిష్ చావ్లా (డీఐపీఏఎం & డీపీఈ సెక్రటరీ)అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి. అయితే ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడు. చావ్లా ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆస్తుల నిర్వహణ, డిజ్ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా.. ఐడీబీఐ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ప్రణాళికలు తయారు చేశారు. -
ఆర్ధిక మంత్రి హల్వా.. రుచులే వేరయా!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారి హల్వా (halwa) వంటకం పూర్తయింది. జనాలకి రుచి చూపించడమే తరువాయి. హల్వా అంటేనే తీపి పదార్ధం. కానీ ఆర్ధిక మంత్రి గారి హల్వాకి మాత్రం రకరకాల రుచులుంటాయి. ఒకరికి తీపి, ఇంకొకరికి చేదు, మరొకరికి చప్పగా... మొత్తమ్మీద అందరూ రుచి చూడాల్సిందే... వంటకం మొన్నే పూర్తయినా... రుచి చూపించేది మాత్రం ఫిబ్రవరి 1నే.2025-26 ఆర్ధిక సంవత్సరానికి నరేంద్రం మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్ (budget 2025) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభమవుతాయి. ఆరోజు మొదట ఎకనామిక్ సర్వే ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరం తాలూకు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి, లక్ష్యాలు, ఆర్ధిక వనరులు, భవిష్యత్ అవకాశాలతో సమ్మిళితమైన ఈ సర్వే బడ్జెట్ కు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.ఆమర్నాడు అంటే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8 వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వాస్తవానికి మనం బడ్జెట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ... దీన్ని ఫైనాన్స్ బిల్ గా భావించాలి. సాధారణ పన్ను చెల్లింపుదారులు మొదలుకొని... ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, ఫైనాన్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్... ఇలా వివిధ రంగాలు ఈ బడ్జెట్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి.ఆర్ధిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? అవి కలగజేసే ప్రయోజనం, చోటుచేసుకోబేయే మార్పులు... ఇత్యాది అంశాలను విశ్లేషిస్తూ భవిష్యత్ మార్పులకు ఆయా రంగాలు సిద్ధమవుతాయి. వాస్తవానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం కావడానికి ముందే ఆర్ధిక మంత్రి ఆయా రంగాల వారితో సమావేశమై వారి విజ్ఞప్తులు, ఆకాంక్షలు, డిమాండ్లను లుసుకున్నారు. కోరికలు, డిమాండ్లు ఎక్కువగానే ఉండటం సహజం, అయితే ఈ బడ్జెట్ లో వాటిలో ఎన్ని నెరవారుతాయో నాన్న ఆసక్తితో పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తూ ఉంటాయి.జనవరి 31 న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 13 న ముగుస్తుంది. రెండో విడత సమావేశాలు మార్చి 10 న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగుస్తాయి. ఈ రెండు విడతల సమావేశాల్లోనూ పార్లమెంట్లో విస్తృత స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. విపక్షాల ఎదురుదాడిని తట్టుకుంటూనే ప్రభుత్వం తన వాదనలు సమర్ధించుకునే యత్నాలు చేస్తుంది. ఒక్కోసారి సాధారణ, కార్పొరేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అసంతృప్తుల్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన మార్పులు చేస్తుంది. ఇలా చేసిన బడ్జెట్ (ఫైనాన్స్ బిల్లు) కు లోక్ సభ, రాజ్య సభ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా లాంఛనం పూర్తయ్యాక కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ఈ బడ్జెట్ పై ఎన్నో వర్గాలు రకరకాల ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బడ్జెట్ వస్తున్న ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ... చివరకు నిట్టూర్పులు విడిచే వర్గం ఒకటి ఉంది. వారే పన్ను చెల్లింపుదారులు.ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని, ట్యాక్ రిబేటులు పెంచాలని వీరు ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ వర్గాలు తమ తమ రంగాలకు దక్కే ప్రయోజనాలకోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి.స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే వేళ.. అంటే 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత దేశం) నినాదంతో నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్.. యువరక్తంతో ఉరకలేస్తోందని, రాబోయే 30 - 40 ఏళ్ళు మనవేనని, ప్రపంచమంతా మనవైపే ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రధాన మంత్రి మోదీ చెబుతూ వస్తున్నారు. మరి ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అనుగుణమైన కసరత్తు ఇప్పటినుంచీ జరగాలి. మోదీ 3.O లో వెలుగు చూడబోయే బడ్జెట్ ఇందుకు వేదికగా నిలవాలి. 2023 - 24 లో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత ఆర్ధిక వ్యవస్థ... 2024 -25 లో 6 .5 శాతం వృద్ధికే పరిమితం కావచ్చనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో జీడీపీ వృద్ధిని పెంచే దిశగా బడ్జెట్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. జాతీయ రహదారుల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి.మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రవేశపెడుతున్న తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమీ లేవు, కాబట్టి ఎన్నికల అనుకూల బడ్జెట్ గా ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి తాజా బడ్జెట్ లో కొంత కరమైన నిర్ణయాలే వెలువడే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ నుంచి ఏయే వర్గాలు ఏమేమి ఆశిస్తున్నాయో.. రాబోయే కథనాల్లో వివరంగా చర్చిద్దాం.స్టాక్ మార్కెట్ ఈసారి బడ్జెట్ వచ్చేది శనివారం. వాస్తవానికి ఆరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించాయి. ఆరోజు యధావిధిగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 కి ప్రారంభమై మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగుతాయి. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. బడ్జెట్ వెలువడే సమయంలోనూ... ముఖ్యంగా ఆర్ధిక మంత్రి రెండో పార్ట్ (ట్యాక్స్‌లకు సంబంధించి) చదివే వేళ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు తారాస్థాయికి చేరతాయి.ఆ తర్వాత విశ్లేషకులు, ఆర్ధిక నిపుణులు వెలువరించే అభిప్రాయాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి సగటు మదుపర్లు ప్రధానంగా ట్రేడర్లు ఆరోజు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు ఆరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మేలు. అధిక స్థాయిలో లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉందో భారీ నష్టాలు కళ్లజూసేందుకు కూడా అంతే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
పోలవరం, అమరావతికి నిధులు కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం తరఫున ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బడ్జెట్లో నిధులు కేటాయించండి..ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీమాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆయన నివాసంలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు వెంటకేంద్ర ఉక్కు, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండోనేషియా ఆరోగ్య శాఖమంత్రి బుది జి సాదికిన్‌తో భేటీ అయినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో తెలిపారు. పరిటాల రవి 20 వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించినట్లు కూడా పేర్కొన్నారు. అలాగే.. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, భవిష్యత్తు తమ ప్రధాన ప్రాధాన్యతలని పోస్ట్ చేశారు. త్వరలో దిగ్గజ సంస్థల సీఈవోలు వస్తారు దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులపై జరిగిన చర్చలకు కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు త్వరలో రాష్ట్రానికి వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ విజయానంద్, సీఎంవో అధికారులతో తన నివాసంలోనే సమావేశమై దావోస్ పర్యటనపై చర్చించారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చే నాటికి తగిన ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
సందడిగా ‘బడ్జెట్ హల్వా’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆర్థిక శాఖ కార్యాలయం ‘నార్త్‌బ్లాక్’లో శుక్రవారం బడ్జెట్ ముందరి సంప్రదాయ ‘హల్వా’ కార్యక్రమం సందడిగా సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ అక్కడి ఏర్పాట్లను ఒక్కసారి పరిశీలించారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ముద్రించనున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు. -
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్‌లు స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2025-26(Budget 2025-26) తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) నేడు సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహిస్తుంది. ఈ వేడుకలు పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాలుపంచుకున్న అధికారులు పాల్గొంటారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వీరు పార్లమెంట్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణానికే పరిమితం అవుతారు.ఎలా జరుపుకుంటారు..?భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది.ఎవరు పాల్గొంటారు..?కేంద్రమంత్రి ఈ ఏడాది వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో ఉన్న అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు1980 నుంచే హల్వా వేడుకబడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది. -
ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించాలి!
బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల సమాహారం కాదు. దేశ ప్రగతికి, ప్రజల సమస్యలకు దర్పణం పట్టే ఒక దిక్సూచి. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రైతులు, వేతన జీవులు, సామాన్యులు, పేదలు, పెట్టుబడి దారులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాలు ప్రభావితం అవుతాయి. మోదీ సర్కార్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 48 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం ఇస్తూ... రైతులు, మహిళలు, పేదలు, యువత లక్ష్యంగా 9 అంశాలకు ప్రాధాన్య మిస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరిలో 2025–26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆశాజనకంగా లేని వృద్ధిరేటు, రైతాంగ సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా నిలుస్తున్న నేపథ్యంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవాళ్లను అధిగమించడానికి బడ్జెట్లో ఏ ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. 2024– 25 బడ్జెట్లో నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్యత కల అంశాలలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ ప్రధానమైనవి. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను నిరుటి బడ్జెట్లో ప్రకటించారు. యువత సులభంగా ఉద్యోగాలను సాధించటానికి ‘ఇంటర్న్ షిప్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘మోడల్ స్కిల్ లోన్ స్కీం’ కింద యువతకు రుణాలు, ‘ముద్ర’ రుణాల పెంపు లాంటి చర్యలు ఉపాధి – ఉద్యోగాల కల్పనకు పెద్దగా దోహదపడలేదనే చెప్పాలి. ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వక పోవడం వలన దేశంలో గడిచిన సంవత్సరంలో నిరుద్యోగితా రేటు ఏడు శాతం నుండి 9.2 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ అంచనా వేసింది. రైతాంగం కూడా బడ్జెట్‌పై పెద్దగానే ఆశలు పెట్టుకుంది. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ఆధ్వర్యంలో రైతాంగం ఉద్యమిస్తోంది. కాబట్టి ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయం, ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ కింద రైతుకి పెట్టుబడి సహాయం 6,000 నుండి 10,000 రూపాయలకు పెంపు నిర్ణయాలు ఈ బడ్జెట్లో తీసుకుంటారని రైతాంగం ఆశిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, 80(సి) కింద రాయితీల పరిమితిని పెంచా లని వేతన జీవులు కోరుకుంటున్నారు. ద్రవ్య లోటు అదుపులో ఉన్నదని చెప్తున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరగటం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ధరలు పెరగటం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పత నాన్ని నియంత్రణ చేసే చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారు. ‘ఆత్మ నిర్భర భారత్’, ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’, ‘వికసిత్ భారత్’ లాంటి భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేసేలా 2025–26 బడ్జెట్ ఉంటుందని ఆశిద్దాం.డా‘‘ తిరుణహరి శేషు వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 98854 65877 -
డబుల్ గుడ్‌న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?
కేంద్ర కొత్త బడ్జెట్-2025 (Union Budget 2025) మన ముందుకు వచ్చేందుకు ఇక కొన్ని రోజులే ఉన్నాయి. ఇదిలా ఉంటే పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు చేయనున్నారు. కొత్త పన్ను విధానంలో మినహాయింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చే ప్రణాళిక ఇది. అలాగే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చేసి వారి ఖర్చు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం.ఆయా వర్గాల సమాచారం నిజమైతే.. ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయవచ్చు. కానీ ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, మినహాయింపు పరిధిని పెంచవచ్చు. మొదటి ప్రయోజనం స్టాండర్డ్ డిడక్షన్‌లో కాగా, రెండోది రూ.15-20 లక్షల పన్ను శ్లాబ్‌లో ఉన్నవారికి ఇవ్వవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు?కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.75,000 లుగా ఉంది. మూలాల ప్రకారం.. ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచవచ్చు. గత బడ్జెట్లో కూడా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50000 నుండి రూ. 75000కి పెంచింది. ఈ మార్పు జరిగితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో రూ.లక్ష వరకు పన్ను ఆదా అవకాశాన్ని పొందుతారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.20% పన్ను శ్లాబ్ పరిధి పెంపు?రెండవ పెద్ద శుభవార్త ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 20% పన్ను స్లాబ్ పరిధిని పెంచవచ్చు. రూ. 12-15 లక్షల ఆదాయం ఉన్న వారిపై ఇప్పటి వరకు 20% పన్ను విధించేవారు. కానీ, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షల ఆదాయానికి పెంచవచ్చు. ఈ మార్పు ముఖ్యంగా రూ.15-20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మార్పు మధ్య, అధిక ఆదాయ సమూహానికి చెందిన పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?పీఎంవోదే తుది నిర్ణయం 2025 బడ్జెట్లో పన్ను సంబంధిత మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం పీఎంవో తీసుకుంటుంది. దీనికి సంబంధించిన నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకునేందుకు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిధిని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో ఉంది.ఆర్థిక లోటును తగ్గించడమే సవాలుదేశ సార్వత్రిక బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తి బడ్జెట్. ఆర్థిక లోటును అదుపులో ఉంచుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంటుందని పెద్ద ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యం 4.9%. దీనిని 2026 నాటికి 4.5% కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఢిల్లీ: రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి -
Union Budget 2025: నిర్మలా మేడం..మా మీద దయ చూపండి
-
ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో.. ట్యాక్స్ మినహాయింపుపై ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా? అని పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పరిమిత ఆదాయ వనరులతో.. సీనియర్ సిటిజన్లు పెన్షన్లపై ఆధారపడతారు. కాబట్టి ట్యాక్స్ మినహాయింపు వారికి కీలకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.2020 - 21 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానం ప్రకటించిన తరువాత.. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు. కాబట్టి త్వరలోనే జరగనున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) ఎట్టకేలకు పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.2023-24 బడ్జెట్లో, ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ) రూ.3 లక్షలకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు & అంతకంటే ఎక్కువ) రూ.5 లక్షలకు పెంచింది. అయితే రాబోయే బడ్జెట్లో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.పాత పన్ను విధానంప్రస్తుతం పాత పన్ను విధానం ప్రకారం.. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అయితే రూ. 3,00,001 నుంచి రూ. 5,00,000 మధ్య 5 శాతం, రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షలకు పైన 30 శాతం ట్యాక్స్ ఉండేది. సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొన్ని సేవింగ్స్ స్కీముల్లో సేవింగ్స్ చేసుకుంటారు. వీరికి పాత పన్ను విధానంలోనే సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. కొత్త పన్ను విధానంలో పరిమితిని పెంచితే.. ట్యాక్స్ నుంచి వారికి కొంత ఉపసమయం లభిస్తుంది.కొత్త శ్లాబులుఫిబ్రవరి 1న జరగనున్న బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే.. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారు రూ. 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రూ. 5,00,001 నుంచి రూ. 10,00,000 మధ్య 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లింపు ఉంటుంది.సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం లేదా 80 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ వయసున్న వారు రూ. 7,00,000 వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 7,00,001 నుంచి రూ. 10,00,000 వరకు.. 20 శాతం, రూ. 10 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాపన్ను మినహాయింపు పరిమితి పెరిగితే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు.. తమ ఆదాయం 10 లక్షలయినా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే.. వారి ఆదాయం రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో రూ. 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పరిమితి. సెక్షన్ 80సీ ద్వారా రూ. 1.50 లక్షలు, సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ. 50,000, సెక్షన్ 80డీ ద్వారా రూ. 50వేలు, స్టాండర్డ్ డిడక్షన్ మరో రూ. 50,000, సెక్షన్ 80TTB ద్వారా రూ. 50,000.. ఫ్యామిలీ పెన్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 15,000.. సెక్షన్ 80DDB ద్వారా రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తాయి. ఇలా మొత్తం మీద తగ్గింపు రూ. 5,65,000. కాబట్టి దీని ప్రకారం ఆదాయం 10 లక్షల రూపాయలైనా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. -
నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వండి
న్యూఢిల్లీ: గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈపీఎస్–95 పెన్షనర్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై, నెలకు కనీసం రూ.7,500 పెన్షన్‌తో పాటు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కోసం ఎప్పటి చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్–95 లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్–95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించనున్నట్లు ఆర్థికమంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసిన 78 లక్షలకుపైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థికమంత్రికి వివరించినట్లు ఈపీఎస్–95 నేషనల్ అగిటేషన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రౌత్ తెలిపారు. రూ.5,000 డిమాండ్ సరికాదు.. కనీసం రూ.5,000 పెన్షన్ డిమాండ్ చేసే కొన్ని కారి్మక సంస్థలపై ఆయన విమర్శలు చేశారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు పట్టించుకోకపోవడమేనని, అన్యాయమైన ప్రతిపాదన అని అభిప్రాయపడ్డారు. ‘‘గౌరవమైన జీవితం కోసం కనీసం రూ.7,500 అవసరం,‘ అని ఆయన స్పష్టం చేశారు.హామీ ఇచ్చారు.. నెరవేర్చాలి..! నెలకు రూ.1,000 పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని, డీఏతో పాటు పె న్షనర్, వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని పెన్షనర్లు గత 7–8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్ అశోక్ రౌత్ ప్రస్తావించారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తోంది. కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జె ట్లో కనీసం రూ.7,500 పెన్షన్‌ను డీఏతో ప్రకటించాలి’ అన్నారు. -
మహిళకు సముచిత గౌరవం ఇచ్చిన భారత్ నాగరికత
న్యూఢిల్లీ: భారతీయుల జీవితంలోని వివిధ రంగాలలో మహిళలు పోషించే పాత్రను భారతీయ జీవన దృక్కోణం ద్వారా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పశ్చిమ దేశాల దృక్కోణం నుండి భారతీయ మహిళల ఔన్నత్యాన్ని ఎంతమాత్రం చూడరాదని ఆమె స్పష్టం చేశారు. భారతీయ నాగరికత ఎల్లప్పుడూ మహిళలకు సముచితమైన గౌరవాన్ని ఇస్తుందని, పాశ్చాత్య దేశాలు అంచనాలకు భిన్నంగా వారిని ఎల్లప్పుడూ సమానంగా చూస్తుందని ఆమె ఇక్కడ జరిగిన పుస్తక విడుదల కార్యక్రమంలో అన్నారు. ‘‘శక్తి: మహిళలు, జెండర్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా – పెర?్స్పక్టివ్స్ ఆన్ ఫెమినిజం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాభారతం వంటి ఇతిహాసాలను ఉటంకించారు. ఈ సందర్భంగా ప్రాచీన భారతదేశంలో మహిళలు పోషించిన పాత్రను వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. → స్త్రీ పరాక్రమాన్ని ఉపయోగించుకోవడాన్ని మన ధర్మం అంగీకరించింది. మన ధర్మం స్త్రీ పాత్రను కాదనలేదు. ఇది స్త్రీ లేదా పురుషుడన్న విషయాన్ని చూడదు. ఆచరించే ధర్మాన్ని చూస్తుంది. చాలా సార్లు స్త్రీలు ఆ ధర్మాన్ని ఆచరించడానికి తెరపైకి వచ్చారు. ఈ విషయాన్ని పశి్చమ దేశాలు చూడలేదు. కాబట్టి, మనం ఈ రక్షణాత్మక మనస్తత్వం నుండి బయటపడాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను. → ఇక్కడ మహాభారతాన్ని ప్రస్తావించాలి. ద్రౌపదికి అన్యాయం జరిగినప్పటికీ, ఆమె తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ సొంత మార్గంలో తనను తాను నిరూపించుకుంది. తాను సాధించాలనుకున్నది సాధించింది. → భారత్ మహిళ ఔన్నత్యం చరిత్ర పుటల్లో రికార్డు అయ్యింది. ఏదీ ఫిల్టర్ కాలేదు. జరిగిన అన్యాయాన్ని రాయడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు. మన నాగరికత ఎప్పుడూ విషయాలు ఉన్నట్లుగా చెప్పడానికి దూరంగా ఉండదు. → మహిళలపై ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిస్తే, పాశ్చాత్య స్త్రీవాద దృక్పథం తగిన విధంగా లేదు. మనల్ని మనం నిర్వచించుకోవడానికి వారి పదజాలాన్ని ఉపయోగిస్తాము. ఇది ఎంతమాత్రం సరికాదు. → భారత్ సాంస్కృతిక విలువలు, మహిళల పట్ల తమ విశిష్టమైన ప్రవర్తన పట్ల దేశ ప్రజలు గర్వపడాలి. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని కేంద్రాన్ని ఆర్థిక రంగం విజ్ఞప్తి చేసింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఏడో ప్రీ–బడ్జెట్ సమావేశంలో ఆర్థిక రంగం ప్రతినిధులు ఈ మేరకు వినతులు ఇచ్చారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలను కూడా తెలియజేసినట్లు ఎడెల్విస్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలకు సంబంధించి రీఫైనాన్స్ విండోను ఏర్పాటు చేయాలని నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కోరినట్లు ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఐడీసీ) డైరెక్టర్ రమణ్ అగర్వాల్ వివరించారు. గృహ రుణాల కంపెనీల తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి రీఫైనాన్సింగ్ చేసేందుకు సిడ్బి, నాబార్డ్‌ల కోసం నిర్దిష్ట ఫండ్‌ను ఏర్పాటు చేయొచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన ఆర్థిక సలహాదారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. -
అవకాయ పచ్చడి కాదు..! ఇది GST కిచిడి
-
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
భారత‘రత్న’ వాజ్‌పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
బడ్జెట్ రోజున ఎక్సేచెంజీలు పనిచేస్తాయ్
ముంబై: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2025–26) గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఆ రోజు శనివారం అయినా కూడా ఎక్స్ఛేంజీలు పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ఇరు ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. గతంలో 2020 ఫిబ్రవరి 1న, 2015 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పని చేశాయి. -
ఏటీఎఫ్‌పై జీఎస్టీకి నో!
జైసల్మేర్: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముడి పెట్రోలియం డీజిల్ ఉత్పత్తుల్లో భాగమని భావిస్తున్నందున ఏటీఎఫ్‌ను వేరుగా చూడలేమని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని ఆమె చెప్పారు. రుణ నిబంధనలను పాటించనందుకు రుణగ్రహీతల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వసూలు చేసే జరిమానా ఛార్జీలపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ చెల్లింపులను ప్రాసెస్ చేసే పేమెంట్ అగ్రిగేటర్లు జీఎస్టీ మినహాయింపునకు అర్హులు. ఫిన్‌టెక్ సర్వీసెస్, పేమెంట్ గేట్‌వేలకు ఇది వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఎగవేతకు ఆస్కారం ఉన్న వస్తువుల కోసం ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. ఆరోగ్య బీమాపై.. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రుల బృందానికి మరింత సమయం అవసరమని, పన్నుల హేతుబద్ధీకరణపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి చెప్పారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను, అలాగే ఆరోగ్య బీమా కవర్ కోసం సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. రూ.5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీ మినహాయించాలని బృందం సూచించింది. పాత ఈవీలపై పన్ను.. పాత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయిస్తే ఎటువంటి జీఎస్టీ ఉండదు. అయితే కంపెనీ లేదా పాత కార్ల అమ్మకాల్లో ఉన్న నమోదిత విక్రేత ఈవీ/పెట్రోల్/డీజిల్ కారును విక్రయిస్తే మార్జిన్ విలువపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బలవర్ధకమైన (ఫోర్టిఫైడ్) బియ్యంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అయితే జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్టు వివరించారు. పాప్‌కార్న్‌పై పన్ను రేటు మారలేదని జీఎస్టీ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. 50 శాతం పైగా ఫ్లైయాష్ కలిగి ఉన్న ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఏసీసీ) బ్లాక్స్‌పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి కుదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మిరియాలు, ఎండు ద్రాక్షలను వ్యవసాయదారుడు సరఫరా చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో.. ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపులు లభించనున్నట్లు.. ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు. అయితే ఈ మినహాయింపు.. ఫిన్‌టెక్ సేవలకు వర్తించదు.రుణగ్రహీత రుణ నిబంధనలను పాటించనందుకు, అంటే.. ఈఎంఐ చెల్లింపు లేదా రీపేమెంట్ షెడ్యూల్‌లను ఉల్లంఘించిన్నప్పుడు బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా విధిస్తుంది. అయితే ఈ జరిమానాలపై కూడా ఎటువంటి జీఎస్టీ విధింపు ఉండదని సీతారామన్ ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదాబీమా ప్రీమియంపై జీఎస్టీ వాయిదాజీఎస్టీ కౌన్సిల్.. ఆరోగ్య, జీవిత బీమాతో సహా ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలకు GST తగ్గించడంపై చర్చ జరుగుతుండగా.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత చర్చ అవసరమని అన్నారు. తరువాత జనవరిలో జరగనున్న సమావేశంలో బహుశా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
జీఎస్టీ మినహాయింపు వీటిపైనే?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఈనెల 21న జరిగే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సమావేశంలో తీసుకుబోయే నిర్ణయాలు కింది విధంగా ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.మినహాయింపులు..జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలున్నాయి.సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవర్ చేసే పాలసీలకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ కొనసాగిస్తారని అంచనా.మార్పులు..జీఎస్టీ హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం విలాసవంతమైన వస్తువులు, సిన్ గూడ్స్ (అత్యంత ఖరీదైన దిగుమతి చేసుకునే వస్తువులు)పై పన్ను పెంచుతారు.చేతి గడియారాల ధర రూ.25,000 ఉంటే జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్‌పై జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.1,500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5% జీఎస్టీ.రూ.1,500-రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18% జీఎస్టీ.రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 28% జీఎస్టీ.కొన్ని పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీను కొత్తగా 35% స్లాబ్‌లోకి తీసుకురాబోతున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..పన్ను తగ్గింపు..ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (20 లీటర్లు, అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు.రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింపు.నోట్‌బుక్‌లపై 12% నుంచి 5%కి తగ్గింపు. -
రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణ
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు పోగేసి వివిధ బ్యాంకులను మోసం చేసిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్థంగా చర్యలు తీసుకుంటోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతోపాటు వివిధ మోసాలకు పాల్పడిన వారికి చెందిన రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.సంపద రాబట్టేందుకు ఈడీ ప్రయత్నంనిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్లపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మంత్రి మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులు బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి రాబట్టేందుకు ఈడీ చాలా ప్రయత్నిస్తోంది. ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించాం. నీరవ్ మోదీ నుంచి రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈడీ అధికారులు తిరిగి అప్పగించారు. మెహుల్ చోక్సీకు చెందిన రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వేలం వేయడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.ఎన్ఎస్ఈఎల్.. రూ.17.47 కోట్లు రికవరీవ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ సృష్టించే లక్ష్యంతో 2005లో ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణంకు సంబంధించి రూ.17.47 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి ఈ డబ్బును ఇచ్చినట్లు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ఆధ్వర్యంలోని ప్రధాన కేసుల నుంచి కనీసం రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ విజయవంతంగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..బ్లాక్ మనీ చట్టంతో పెరిగిన సంఖ్య2015లో రూపొందించిన బ్లాక్ మనీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఆస్తులను ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2021-22లో 60,467 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పెరిగిందన్నారు. జూన్ 2024 నాటికి బ్లాక్ మనీ చట్టం కింద మొత్తం రూ.17,520 కోట్లకు సంబంధించి 697 కేసుల విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 163 ప్రాసిక్యూషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పనామా పేపర్లు, పండోర పేపర్లు, హెచ్ఎస్బీసీ, ఐసీఐజే లీక్‌ల వంటి హైప్రొఫైల్ అంశాలకు సంబంధించి విచారణ సాగుతున్నట్లు స్పష్టం చేశారు.