Nana Patekar
-
75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!
మరాఠీ నటుడు, నిర్మాత, మాజీ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారి నానా పటేకర్ చలనచిత్ర రంగంలో అత్యంత విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా కుర్రాళ్ల మాదిరిగా చలాకీగా కనిపిస్తారు. ఆ ఫిట్నెస్ మంత్ర ఏంటో ఇన్‌స్టా థియోబ్లిక్స్లో షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఎలాంటి వ్యాయమాలు చేస్తారో కూడా చెప్పారు. అవేంటంటే..నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అన్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్‌గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి నలుగురిని పడగొట్టగలనని ధీమాగా చెప్పారు. ఫిట్నెస్ కంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం వంటివి చేయాలని చెప్పారు. ఈ దృక్పథమే మనల్ని ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తుందన్నారు. అద్దం ముందు నుంచొని రకరకాల ఫోజులిచ్చే అలవాటుని ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. దీనివల్ల తాను చాలా బాగున్నాను అనే నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లో బెంచ్ ప్రెస్‌లు, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్లు చేయడమం మంచిదన్నారు. ఒకవేళ ఈ వయసులో జిమ్ చేయలేం అనుకుంటే..సింపుల్‌గా సూర్యనమస్కారాలు వేయండి చాలు అంటున్నారు నానా. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుందన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నానాపటేకర్ ఇచ్చిన సలహాలు, సూచనలకు మద్దతిచ్చారు హైదరాబాద్‌లోని అపోలా ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. మలి వయసులో అవి తప్పనిసరి..ఆ నటుడు చెప్పినట్లుగా 70 ఏళ్లు పైబడిన వారు ఏరోబిక్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలతో సహా రెగ్యులర్ వ్యాయామాలు చేయాలన్నారు. వారంలో 150 నిమిషాలు సాధారణ వర్కౌట్లు, 75 నిమిషాలు శక్తిమంతమైన వ్యాయామాలు చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహ కూడా అని అన్నారు. పోనీ ఇవి కాకుండా 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈత వంటివి చెయ్యొచ్చన్నారు. అయితే ఈ ఏజ్ ఎక్కు దూరం జాగింగ్ లేదా పరిగెత్తకపోవడమే మంచిదన్నారు. శక్తి శిక్షణ కోసం పుష్ అప్స్, స్క్వాట్లు, చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చన్నారు. అలాగే ఈ వయసులో ఎక్కువగా కీళ్లు పట్టేస్తుంటాయి కాబట్టి..యోగాపై దృష్టి పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడే తాడాసనం వంటివి చేయాలన్నారు. ఇదీ వృద్ధాప్యంలోసాధారణంగా వచ్చే వణుకు లేదా పడిపోవటాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by Obliques24 (@obliques24_) (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
ఆ దెబ్బతో రోడ్డున పడ్డాం.. నెలకు రూ.35తో కుటుంబమంతా..
ప్రముఖ నటుడు, పద్మ శ్రీ గ్రహీత నానా పటేకర్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఎక్కువగా హిందీ, మరాఠి భాషల్లో నటించిన ఆయన మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో పాటలు కూడా పాడాడు. డైరెక్టర్‌గా 'ప్రహార్: ద ఫైనల్ అటాక్' అనే సినిమా కూడా తీశాడు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈయన 28 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత మొదటి కొడుకునూ కోల్పోయాడు. తాజాగా అతడు చిన్నతనంలో పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. దివాలా తీశాం.. 'ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించుకోకపోయినా అది మా మధ్య అంతర్లీనంగా ఉండేది. మా నాన్న మా కోసం కష్టపడుతున్నాడన్న విషయం మాకు అర్థమయ్యేది. ఓసారి మా నాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీశాం. అప్పటివరకు ధనవంతుడైన మా నాన్న ఆ దెబ్బతో నడివీధిలో నిలబడాల్సి వచ్చింది. తను దిగాలుగా, ఏదో శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు. ఒక్క పూట భోజనం.. ఆకలి.. అది చూసి నేను ఎందుకు నాన్న, అంత దిగులు చెందుతున్నావు? నీకు ఒక ఫ్యాక్టరీనే కదా పోయింది.. వదిలెయ్.. నీకింకా రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒకటి అన్నయ్య, రెండు నేను. ఎక్కువగా ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పాను. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలుపెట్టాను. నెలంతా పని చేస్తే రూ.35 ఇచ్చేవారు, రోజుకు ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ, నాన్న తిన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేది. కానీ ఆకలికి ఆగలేక నేను తినేసేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ఆరోపణలతో నటుడిపై మరక! చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా.. లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు నిజమని రుజువు కాకపోయినప్పటికీ నానా మీద విమర్శలు వెల్లువెత్తాయి దీంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే వ్యాక్సిన్ వార్‌లో కనిపించిన అతడు 'లాల్ బత్తి' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. అలాగే మరాఠీలో 'ఒలె ఆలె' అనే చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అమ్మ గదిలో దొంగతనం.. నా కొడకా.. అని తిట్టేది! -
ఆ అబ్బాయిని నేను కొట్టలేదు.. ఏం జరిగిందంటే: నానా పటేకర్
బాలీవుడ్లో తన నటనతో ఎనలేని ప్రశంసలు దక్కించుకున్నాడు నానా పటేకర్.. కానీ ఆయన నిజ జీవితంలో అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకుంటుంటాడు. కొద్దిరోజుల క్రితం ‘ది వ్యాక్సిన్ వార్’తో ప్రేక్షకులను అలరించాడు నానా పటేకర్. సినిమా షూట్లో భాగంగా ఆయన వారణాసిలో తాజాగా పర్యటించాడు. వారణాసి వీధుల్లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో గట్టిగా తల మీద ఒక్కటిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను తప్పుపట్టారు. ఈ వివాదంపై ఆ చిత్ర దర్శకనిర్మాత అనిల్ శర్మ ఇలా స్పందించాడు. 'సినిమాలో నానా పటేకర్ మానసిక స్థితి బాగలేని పాత్రలో కనిపిస్తారు. గుంపులో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీకోసం ఒకరు రావడం. తనను ఆ వ్యక్తి కొట్టడం. ఇదంతా షూటింగ్లో భాగం మాత్రమే' అని అన్నారు. క్షమించమని కోరిన నానా పటేకర్ 'నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేశాము... మేము రెండవ రిహార్సల్ చేయడానికి షెడ్యూల్ చేశాము. దర్శకుడు స్టార్ట్ అనగానే. వీడియోలోని అబ్బాయి లోపలికి వచ్చాడు. అప్పుడు కెమెరా ముందు మేము నటించేందకు సిద్ధంగా ఉన్నాము. అతను ఎవరో నాకు తెలియదు, అతను మా సిబ్బందిలో ఒకడని భావించాను కాబట్టి నేను చెంపదెబ్బ కొట్టాను. సీన్ ప్రకారం అతన్ని వెళ్లిపొమ్మని కూడా అప్పుడు చెప్పాను. తర్వాత, అతను సిబ్బందిలో భాగం కాదని నాకు తెలిసింది. (ఇదీ చదవండి: నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్) కాబట్టి, నేను వెంటనే అతనిని తిరిగి పిలిచాను కూడా.. కానీ అతను అప్పటికే వెళ్లిపోయాడు. బహుశా అతని స్నేహితుడు ఈ వీడియో చిత్రీకరించి ఉంటాడు. నేను. ఫోటో కోసం ఎవ్వరితోనూ ఇప్పటి వరకు నో చెప్పలేదు. నేను ఇలా చేసే వ్యక్తిని కాదు. పొరపాటున ఇలా జరిగింది. నేను అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఈ వీడియో ద్వారా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను.' అని ఆయన అన్నాడు. #WATCH | On a viral showing him slapping a boy for taking a selfie with him, actor Nana Patekar says, "A video is going viral where I have hit a boy. Though this sequence is a part of our film, we had one rehearsal...We were scheduled to have a second rehearsal. The director told… pic.twitter.com/CVgCainRg1 — ANI (@ANI) November 16, 2023 वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 -
సెల్ఫీ కోసం వెళ్తే తల మీద ఒక్కటిచ్చిన నటుడు, వీడియో వైరల్
అభిమాన తారలు కనిపిస్తే చాలు ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు జనాలు. కొందరు సెలబ్రిటీలు ఓపికగా చిరునవ్వుతో వారికి సెల్ఫీ ఇవ్వడానికి ముందుకొస్తే మరికొందరు మాత్రం అభిమానులను పట్టించుకోకుండా హడావుడిగా వెళ్లిపోతుంటారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ మాత్రం తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టాడు. మెడ పట్టి గెంటేశారు ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి.. కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది. ఏదేమైనా మీటూ వివాదం ఆయన కెరీర్‌కు మచ్చ తెచ్చింది. దీంతో కొంతకాలం మీడియాకు, సినిమాలకు దూరగా ఉన్న ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమాలో నటించాడు. वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 చదవండి: చైతూ తొలి వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు? -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్‌ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్‌ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్‌గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్‌లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్‌లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్‌కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్‌తో వచ్చే సీన్లు అంతగా హైలెట్‌గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్‌గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్‌పై నెగిటివ్ ఇమేజ్‌ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్‌గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్‌గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటించారు. పల్లవి జోషి నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి బయో–సైన్స్ చిత్రమిది. కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ‘వ్యాక్సిన్ వార్’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది. -
వార్‌లో సప్తమి
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కోవిడ్ 19 పరిస్థితులు, దేశంలోని వ్యాక్సిన్ డ్రిల్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ హిట్ ‘కాంతార’ ఫేమ్ హీరోయిన్ సప్తమి గౌడ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో సప్తమి పాల్గొంటున్నారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పతాకంపై ‘వ్యాక్సిన్ వార్’ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్నారు పల్లవీ జోషి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, మరాఠీ, అస్సామీ భాషలతో సహా ఈ సినిమాను మరికొన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. -
నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్
తనుశ్రీ దత్తా.. మీటూ ఉద్యమం జోరుగా నడిచిన సమయంలో బాగా వినిపించిన పేరు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను శారీరకంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసిందీ బాలీవుడ్ హీరోయిన్. ఆమె గొంతు విప్పిన తర్వాతే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చిన తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. కానీ మీటూ తర్వాత నుంచి తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని పలుమార్లు వాపోయింది తనుశ్రీ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసింది. 'నాకేదైనా అయితే అందుకు నానా పటేకర్, అతడి బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వాళ్లందరూ బాలీవుడ్ మాఫియాలో ఉన్నవారే. దయచేసి వారి సినిమాలు చూడకండి, వారిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో వారిని వెంబడించండి. నా గురించి విషప్రచారం చేసినవారిని వదిలిపెట్టకండి. ఈ న్యాయస్థానం నా విషయంలో విఫలమైనా ప్రజల మీద నాకు నమ్మకముంది. జైహింద్, బై..మళ్లీ కలుద్దాం' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) చదవండి: నా గురువుకి నేను సాయం చేయడమేంటి? విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే -
తండ్రీకూతుళ్లుగా నటించిన వాళ్లు ప్రేమలో పడ్డారు!
నానా పాటేకర్ నటనే కాదు జీవితమూ వైవిధ్యమే! నటుడిగా విజయాలే ఎక్కువ. భర్తగా, ప్రేమికుడిగా వైఫ్యలాలు ఎక్కువ! మనీషా కోయిరాలా కూడా వెర్సటైల్ నటే. ఆమెకూ జీవితంలో పోరాటం తప్పలేదు. స్వభావ రీత్యా ఇద్దరూ ఒకటే. కోపం, ఆవేశం విషయంలో ఇద్దరిదీ ఒకే మీటర్. ప్రేమ విషయంలోనూ ఆ మీటర్ తప్పలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఇద్దరూ తప్పారు. వివరాలు.. 1996లో వచ్చిన అగ్నిసాక్షి.. నానా, మనీషా కలసి చేసిన మొదటి సినిమా. ఆ సెట్స్ మీదే వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. తనలాగే ఉండే మనీషా ముక్కుసూటి వ్యవహారం అతనికి నచ్చింది. ఆమె మీద ప్రేమా కలిగింది. అంతకుముందే వివేక్ ముష్రాన్తో బ్రేకప్ అయిన బాధలో ఉన్న మనీషాకు నానా స్నేహం, చూపిస్తున్న ప్రేమ ఊరటనిచ్చాయి. దాంతో తనూ నానా పట్ల ప్రేమను పెంచుకుంది. అదే యేడు వచ్చిన ఖామోషీ (ఇందులో తండ్రీ, కూతురిగా నటించారు)తో ఆ ఇద్దరి మధ్య అనుబంధం బలపడ్డమే కాదు ఆ రహస్యం చిత్రపరిశ్రమకూ తెలిసిపోయింది. ఆ ప్రేమను పెళ్లిగా మలచుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు నానా పాటేకర్. మనీషా ‘నో’ చెప్పలేదు కాని అప్పటికే పెళ్లయి ఉన్న నానాతో ‘నీ భార్యకు విడాకులివ్వు’ అంది. మౌనంతో ఆ సందర్భాన్నుంచి బయటపడ్డాడు అతను. నిజానికి నానా పాటేకర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్నేమీ ఆస్వాదించట్లేదు. అతని భార్య నీలకాంతి. మరాఠీ నటి, దర్శకురాలు, నిర్మాత. మంచి శిల్పి కూడా. పెళ్లయిన ఏ కొంత కాలమో సంతోషంగా ఉన్నారు ఆ భార్య, భర్త. తర్వాత నుంచి విభేదాల ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారింది వాళ్ల దాంపత్యం. ఇద్దరు పిల్లలూ పుట్టడంతో వాళ్ల ముందు కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం ఇష్టం లేక విడాకులు తీసుకోకుండానే విడి విడిగా ఉండడం ప్రారంభించారు. ఆయేషా, నీలకాంతి విడాకులు, పెళ్లి గురించిన వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి మనీషా, నానా మధ్య. ఇంకోవైపు ఆమె మీద పొసెసివ్‌నెస్ ఎంతలా పెరిగిందంటే మనీషా ప్రవర్తనకు హద్దులు పెట్టేంతగా. ఆమె కాస్త ఆధునికంగా అలంకరించుకున్నా నానా అభ్యంతరపెట్టేవాడు. సహ నటులతో కొంచెం చనువుగా మాట్లాడినా ఆమె మీద నోటి దురుసుతనం ప్రదర్శించేవాడు. పెళ్లితో ఆ అభద్రతకు చెక్ పెట్టొచ్చని ఆశపడింది మనీషా. అందుకే నీలకాంతితో విడాకుల కోసం ఒత్తిడి తెచ్చింది. ‘ఇవ్వను. నీతో కలసి ఉండడానికి సిద్ధమే.. కాని నీలకాంతికి విడాకులు ఇచ్చేసి కాదు’ అని స్పష్టం చేశాడు నానా పాటేకర్. నివ్వెరపోయింది మనీషా. అప్పటి నుంచి ఆమెలో అభద్రత మొదలైంది. ఈలోపు.. నానా పాటేకర్.. ఆయేషా జుల్కాతో దగ్గరగా ఉంటున్నాడన్న విషయం పరిశ్రమలో గుప్పుమంది. పత్రికల్లోనూ అచ్చయింది. మనీషా మెదడులోనూ పడింది. ఒకసారి మనీషా నానా పాటేకర్‌ను కలవడానికి వెళ్లేసరికి ఆయేషా జుల్కా అక్కడే ఉంది. స్నేహం కంటే ఎక్కువ దగ్గరితనం వాళ్ల మధ్య కనపడేసరికి కోపావేశాలకు లోనైన మనీషా ఇంగితం మరచిపోయి ఆయేషా జుల్కాను తిట్టేసింది. నానా పాటేకర్ జోక్యంతో అక్కడికి, అప్పటికి సద్దుమణిగినా ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసింది. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం నెమ్మది నెమ్మదిగా వాళ్ల మధ్య అనుబంధాన్ని, బంధాన్నే తెంచేసింది. నానా పాటేకర్, మనీషాల ప్రేమ కథ బ్రేకప్‌తో ఎండ్ అయిపోయింది. నానా పాటేకర్, ఆయేషా జుల్కా కలసి ఉండడం ప్రారంభించినా, మనీషా ముందుకు సాగిపోయినా విడిపోవడం ఆ రెండు మనసులనూ వేధించింది. ‘బ్రేకప్ అనేది డిఫికల్ట్ ఫేజ్. అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది ఆ బాధేంటో. మనీషా కస్తూరి మృగం లాంటిది. చాలా సున్నిత మనస్కురాలు. ఆమె నన్ను వదిలి వెళ్తుంటే అతికష్టమ్మీద కన్నీళ్లను దిగమింగా. ఐ మిస్ మనీషా’ అని చెప్పాడు నానా పాటేకర్ ఒక ఇంటర్వ్యూలో. 2010లో మనీషా .. నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ను పెళ్లిచేసుకుంది. కాని రెండేళ్లకే ఆ పెళ్లి విఫలమైంది. తర్వాత ఆమె క్యాన్సర్ బారినపడింది. ఆ పోరాటంలో గెలిచి.. మళ్లీ సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. -ఎస్సార్ చదవండి: శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..? -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్‌లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్‌లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్‌కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్‌లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
కాపాడమని లాయర్ దగ్గరకు వెళ్తే..
బాలీవుడ్లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా. చిత్ర పరిశ్రమలో ఈ ఉద్యమం పెను దుమారాన్నే సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఈ ముద్దగుమ్మ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే తను శ్రీ ఆరోపణలను ఖండిస్తూ నానా పటేకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో తనుశ్రీ తన తరుఫున వాదించేందుకు నితిన్ సత్పుటే అనే ఓ లాయర్‌ను నియమించుకుంది. (మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’) సదరు లాయర్ నితిన్ సత్పుటే కూడా కామాంధుడేనట. ఇటీవల లాయర్ నితిన్‌పై ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు నితిన్.. ప్రత్యర్థి మహిళా లాయర్‌తో కలిసి మాట్లాడాడట. ఆ సమయంలో తన పట్ల నితిన్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా న్యాయవ్యాది కేసు పెట్టింది. తననేదో రక్షిస్తాడని ఓ లాయర్‌ను పెట్టుకుంటే ఆయన కూడా కామాంధుడేనని కేసు పడింది. దీంతో తనుశ్రీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. (ఇన్స్పిరేషన్ #తనూటూ..!) -
కబ్జా చేస్తా
అండర్ వరల్డ్ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. అందుకోసం కత్తి పట్టుకొని రెడీ అయిపోయారు కూడా. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
డ్యాన్స్ రూమ్
సాక్ష్యాధారాలు మరకల్లాంటివి. ఏళ్లు గడిచే కొద్దీ ఆనవాళ్లు లేకుండాపోతాయి. మనసుకు తగిలిన గాయం మచ్చలాంటిది. ఎన్నేళ్లు గడిచినా బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. తనుశ్రీదత్తా నానా పటేకర్‌పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా పెట్టిన లైంగిక వేధింపుల కేసు తేలిపోయింది. పోలీసులే తేల్చేశారు! కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా కోర్టుకు ‘బి సమ్మరీ’ రిపోర్ట్ కూడా ఇచ్చారు. బి సమ్మరీ రిపోర్టును ఇవ్వడం అంటే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు దొరకలేదని చేతులు ఎత్తేయడం. ఇక కేసును కొట్టేయడమా, కొనసాగించడమా అన్నది కోర్టు పరిధిలోని విషయం. సాక్ష్యాధారాలను ‘సేకరించలేక పోయిన’ పోలీసులు 51 పేజీల బి సమ్మరీలో కొన్ని అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు. మిస్అండర్స్టాండింగ్ కారణంగా, మలేషస్ ఇంటెంట్తోనూ తనుశ్రీ నానా పటేకర్ మీద కేసు పెట్టారట. అపార్థం కారణంగా, హాని తలపెట్టే ఉద్దేశంతో అని. నానా పటేకర్‌తో పాటు మరో ముగ్గురిపైన కూడా తనుశ్రీ కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ సమీ సిద్ధిక్, నిర్మాత రాకేశ్ సారంగ్. వీళ్లలో ప్రధాన నిందితుడు నానా పటేకర్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌లో 2008 మార్చి 23–26 మధ్య.. సీన్‌ని అడ్డుపెట్టుకుని పటేకర్ తనను వేధించాడని, మిగతావాళ్లు అతడికి సహకరించారని తనుశ్రీ దత్తా ఫిర్యాదు. బి సమ్మరీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ నిందితులంతా నిర్దోషులుగా విడుదల అవొచ్చు. అంతేకాదు, పోలీసులు తలచుకుంటే (పటేకర్ తలచుకుంటే అనాలి) రివర్స్‌లో తనుశ్రీ మీదే కేసు పెట్టొచ్చు. పటేకర్ గారి ప్రతిష్టకు ఆమె భంగం కలిగించిందని. తనుశ్రీ దత్తా పటేకర్ పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! తనుశ్రీ కేసు ఫైల్ చేసింది గత ఏడాది అక్టోబర్ 6న. ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది అక్టోబర్ 10న అందులో నానా అండ్ టీమ్‌పై ఆమె చేసిన ఆరోపణలు.. పదేళ్ల క్రితం జరిగిందని ఆమె చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించినవి. అప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేయకుండా ఏమీ లేరు. పోలీసులు కోర్టుకు ఇప్పుడు ఫైల్ చేసిన బి సమ్మరీ ప్రకారం.. తనుశ్రీ మొదటే 2008 మార్చిలో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. గుర్గావ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తను లైంగిక వేధింపుల కేసు పెడితే పోలీసులు దానిని వట్టి వేధింపుల కేసుగా నమోదు చేశారని కూడా అప్పట్లోనే ఆమె ఆరోపించారు. తర్వాత పదేళ్లకు.. గత ఏడాది అక్టోబర్‌లో ఒషివారా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ వివరాలన్నీ బి సమ్మరీలో పొందుపరుస్తూ.. ‘కనీసం పదమూడు మంది సాక్షుల్ని విచారిస్తే వాళ్లలో ఒక్కరు కూడా నానా పటేకర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు పోలీసులు. తనుశ్రీ ఇచ్చిన ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం.. నిర్మాత, డైరెక్టర్ ఆమెకు మొదట చెప్పింది.. సోలో ఐటమ్ సాంగ్‌కు మాత్రమే ఆమె చెయ్యాల్సి ఉంటుందని. చేస్తాను కానీ, స్టెప్పులు అశ్లీలంగా ఉంటే తను చెయ్యనని ఆమె అన్నారు. అశ్లీలం మాత్రమే కాదు, తనకు అసౌకర్యంగా ఉండే మూవ్‌మెంట్స్‌ని ఇవ్వలేనని కూడా ముందే స్పష్టంగా చెప్పేశారు. వాళ్లు ఒప్పుకున్నారు. సాంగ్‌లో పటేకర్‌కు మాత్రం సింగిల్ లైన్ ఉంటుందనీ, అది కూడా వేరుగా షూట్ చేసుకుంటామని అన్నారు. అయితే పాట షూటింగ్ జరుగుతున్న నాలుగు రోజులూ నానా పటేకర్ సెట్స్ లోపలికి వచ్చి తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించే నెపంతో ఆమె ఒంటిని టచ్ చేస్తూనే ఉన్నాడు. అది బ్యాడ్ టచ్. అదంతా ఓ స్ట్రాటెజీతో జరుగుతోందని, మిగతావాళ్లు అతడికి సహకరిస్తున్నారని గ్రహించిన వెంటనే సెట్స్లోంచి బయటికి వెళ్లిపోయారు తనుశ్రీదత్తా. అయితే పటేకర్ అసలలా ప్రవర్తించనేలేదని జూనియర్ ఆర్టిస్టులు చెప్పిన విషయానికి పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు! డైసీ షా స్టేట్మెంట్ను కూడా వాళ్లు తీసుకున్నారు. డైసీ డ్యాన్సర్, మోడల్. తనుశ్రీ వయసే. ‘‘నానా పటేకర్‌కి పెద్దగా డ్యాన్స్ రాదు. స్టెప్పులు ఎలా వేయాలో నేను, నా మేల్ కొరియోగ్రాఫర్స్ ఆయనకు నేర్పిస్తున్నాం. మార్చి 26 ఉదయాన్నే పటేకర్ సెట్స్‌కి వచ్చేశారు. తనుశ్రీ మధ్యాహ్నం వచ్చారు. అందరు డ్యాన్సర్లు సెట్లో ఉన్నారు. పటేకర్ తనుశ్రీ వెనుక ఉన్నారు. హఠాత్తుగా తనుశ్రీ అగ్నిపర్వతమే అయ్యారు. విసురుగా బయటికి వెళ్లిపోయారు. ఏమైందో మాకెవరికీ తెలియదు. నిర్మాత, దర్శకుడు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. తన కారులో తను వెళ్లిపోయారు’’ అని డైసీ చెప్పారు. పటేకర్‌కి అనుకూలంగా ఉన్న ప్రతి పాయింట్నీ పోలీసులు శ్రద్ధగా నోట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే పటేకర్ బయటపడినట్లే. తనుశ్రీ బయటపడుతుందా అన్నది పటేకర్ దయాదాక్షిణ్యాలపై ఉంటుంది! తనుశ్రీ నానా పటేకర్‌పై తప్పుడు కేసు పెట్టారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కనుక పటేకర్ ఆమెను వేధించాలనుకుంటే తిరిగి ఆమె మీదే కేసు పడేలా పోలీసుల్ని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. నానా పటేకర్‌కు క్లీన్ చిట్ వచ్చిందన్న వార్త యు.ఎస్.లో ఉన్న తనుశ్రీకి తెల్లవారుజామున ఐదు గంటలకు ఇండియాలోని ఆమె ఫ్రెండ్ ద్వారా తెలిసింది. పోలీసులు కేసు క్లోజ్ చెయ్యవచ్చు. కోర్టు కేస్ కొట్టేయవచ్చు. తను మాత్రం న్యాయపోరాటం చేస్తాననే అంటున్నారు తనుశ్రీ! దేవుడి నుంచి రావలసిన జడ్జ్మెంట్ ఇంకా మిగిలే ఉంది కదా అని ఆమె ఆశ. ఆమె ఆశ పెట్టుకున్న దేవుడు, ఆమె అప్లికేషన్ పెట్టుకున్న న్యాయదేవత.. ఆ ఇద్దరూ ఇచ్చే తీర్పు ఎవరి వైపు ఉండబోతున్నప్పటికీ పటేకర్‌పై తనుశ్రీ చేసిన ఆరోపణల్లో మాత్రం అబద్ధం లేదని.. డ్యాన్స్ రాని పటేకర్, డ్యాన్స్ నేర్పించడానికి తనుశ్రీ మీద చెయ్యి వెయ్యడాన్ని బట్టే స్పష్టం అవుతోంది. దీన్ని ఇంకో యాంగిల్లో చూసేవాళ్లూ ఉండొచ్చు. డ్యాన్స్ రాని పటేకర్ తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించడానికి ఎందుకు ట్రై చేస్తాడు, కేసు ఇక్కడే తేలిపోవడం లేదా అని! పళ్లు లేనివాడు కొరకలేడు నిజమే. పళ్లు లేనంత మాత్రాన కొరికే ఉద్దేశం లేకుండా పోతుందా? పాతికేళ్ల అమ్మాయి.. ఉద్దేశాలను గ్రహించలేకపోతుందా?! నానా పటేకర్, తనుశ్రీ దత్తా : సాక్ష్యాధారాలు లేవని పోలీసులు తనుశ్రీ కేసును క్లోజ్ చేసేశారు. మరకల్లేవని మచ్చ కూడా లేకుండా పోతుందా? పటేకర్‌కి క్లీన్ చిట్ వచ్చిందని తనుశ్రీ పదేళ్ల ఆవేదన వట్టి అబద్ధమైపోతుందా? - మాధవ్ శింగరాజు -
అందుకే నానాకు క్లీన్ చిట్
‘నటుడు నానా పటేకర్ 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి తనుశ్రీ దత్తా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ‘మీటూ’ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టింది కూడా తనుశ్రీయే. ఆమె వ్యాఖ్యలతో నానా పటేకర్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసును బుక్ చేసి, విచారణ చేపట్టారు. తనుశ్రీ చేసిన వేధింపులకు ఎటువంటి సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు. దీంతో నానా పటేకర్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తనుశ్రీ దత్తా మండిపడ్డారు. ‘‘పోలీసు, న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అని భారతీయ చట్టం చెబుతోంది. అందుకే నానా పటేకర్‌కు క్లీన్ చిట్ దక్కింది. పోలీసు, న్యాయ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా ఈ అవినీతిపరుడైన నానాకి క్లీన్ చిట్ ఇచ్చాయి. నాకంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా అతని తప్పులు బయటపడలేదు. నా కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షులను బెదిరించి వారి నోరు నొక్కేశారు. ఈ తీర్పు నన్ను షాక్‌కి గురిచేయలేదు. ఇండియాలోని ప్రతి మహిళ ఇలాంటి అనుభవాలకు అలవాటు పడిపోయింది. నాకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికీ న్యాయం జరగదని కాదు. లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలి. ఏదో ఒక రోజు నానా విషయంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ఉంది’’ అన్నారు. -
మీ టూ : నానా పటేకర్‌కు క్లీన్ చిట్
ముంబై : లైంగిక వేధింపుల ఆరోపణలపై అలోక్ నాధ్, వికాస్ బల్లు క్లీన్ చిట్ అందుకున్న క్రమంలో తాజాగా మీటూ ఆరోపణలపై బాలీవుడ్ నటుడు నానా పటేకర్కూ క్లీన్ చిట్ లభించింది. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించనందున కేసును మూసివేసినట్టు సమాచారం. కాగా నానా పటేకర్‌కు క్లీన్ చిట్ లభించిందని గతంలోనూ వార్తలు వెలువడగా ఆయనపై ఆరోపణలు గుప్పించిన తనుశ్రీ దత్తా వాటిని వదంతులుగా తోసిపుచ్చారు. నానా పటేకర్ పీఆర్ బృందం ఈ వదంతులను వ్యాపింపచేస్తున్నారని తనుశ్రీ ప్రతినిధి, అడ్వకేట్ నితిన్ సత్పుటే ఆరోపించారు. కాగా నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమి సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సావంత్‌లు తనపై, తనతో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులపై దాడిచేశారని తాము ఫిర్యాదు చేయగా పోలీసులు నానా పటేకర్‌కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ఇటీవల తనుశ్రీ ప్రశ్నించారు. కాగా, 2008లో హార్న్ ఓకే ప్లీస్ సెట్లో నటుడు నానా పటేకర్ తనతో ఇంటిమేట్ సీన్లో నటించాలని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో తనతో పాటు తన కారులో ఉన్న కుటుంబ సభ్యులపై వారు దాడికి తెగబడ్డారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. -
నటుడిపై మండిపడ్డ లాయర్
ముంబై: హీరోయిన్ తనుశ్రీ దత్తాను వేధించిన కేసులో విలక్షణ నటుడు నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్చిట్ ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది నితిన్ సత్పాతే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారన్నది కేవలం వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కేసు నుంచి బటయపడేందుకు, తప్పుడు పుకార్లు ప్రచారం చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు నానాపటేకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటివరకు నమోదు చేయలేదన్నారు. సాక్షులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా కోర్టుకు వెళ్లలేదు. పోలీస్ స్టేషన్లో మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరామ’ని నితిన్ చెప్పారు. ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నానాపటేకర్ తనను వేధించాడని 2018, సెప్టెంబర్‌లో తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. తనుశ్రీ కేసు దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి ఉత్ప్రేరంగా పనిచేసింది. తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని ఎంతో మంది మహిళలు నిర్భయంగా గళం విప్పారు. -
‘విరాటపర్వం’లో నానా పటేకర్!
రానా, సాయి పల్లవి కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం విరాటపర్వం 1992. భిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న రానా, సాయి పల్లవి జంటగా నటించనున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపించగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘నీది నాదీ ఒకే కథ’ అనే చిత్రంతో అందర్నీ మెప్పించిన వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
మీటూపై షార్ట్ ఫిల్మ్
ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకోవడానికి తనుశ్రీ దత్తా ముఖ్య కారణం. నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారామె. తనుశ్రీ దత్తా ధైర్యం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత చాలామంది నటీమణులు సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా లైంగిక వేధింపులపై ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట తనుశ్రీ. మార్చి 8న మహిళా దినోత్సవం. ఆ రోజు ఈ వీడియో రిలీజ్ ప్లాన్ చేశారట. వాస్తవిక సంఘటనలకు కాల్పనికత జోడించి ఈ షార్ట్‌ఫిల్మ్ కథను తయారు చేశారట. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించడమే కాకుండా రైటింగ్ సైడ్ కూడా పాలుపంచుకున్నారట తనుశ్రీ దత్తా. -
కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నట సామ్రాట్’..!
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. నక్షత్రం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ త్వరలో ఓ రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన మరాఠి సినిమా నట సామ్రాట్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానా పాత్రలో తన ఆస్థాన నటుడు ప్రకాస్ రాజ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ రీమేక్ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సెస్ వస్తుందేమో చూడాలి. -
ఎట్టకేలకు అక్షయ్ సినిమా పూర్తైయింది!
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్‌ఫుల్4 చిత్రం షూటింగ్ పూర్తైయింది. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ సోషల్ మీడియాద్వారా ప్రకటించేశాడు. బాలీవుడ్లో చెలరేగిన మీటూ మంటలతో ఈ సినిమాపై గందరగోళం నెలకొంది. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన నానా పటేకర్, దర్శకుడు సాజిద్ నదియావాలాపై మీటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. చిత్రయూనిట్ వీరిద్దరిని హౌస్‌ఫుల్4 నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. బాలీవుడ్లో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తమ చిత్రాల్లోంచి బహిష్కరించడం మొదలుపెట్టారు మేకర్స్. అయితే నానా పటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకున్నారు. అయితే సాజిద్ నదియావాలాను బహిష్కరించినట్లు ప్రకటించినా.. మిగిలిన భాగాన్ని కూడా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రితేష్ దేశ్‌ముఖ్, కృతి సనన్, కృతి కుర్బంధ, పూజా హెగ్డేలు నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. While we have called it a 'wrap’ for #Housefull4, fun never ends..See you all in 2019!@Riteishd @kritisanon @kriti_official @thedeol @hegdepooja @RanaDaggubati @ChunkyThePanday @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/XVBV0uiio1 — Akshay Kumar (@akshaykumar) November 20, 2018 -
నానా పోయి రానా వచ్చె
బాలీవుడ్ కామెడీ మూవీ సిరీస్ ‘హౌస్‌ఫుల్’ టీమ్‌లోకి రానా జాయిన్ అయ్యారు. నానా పటేకర్ స్థానాన్ని ఈ హీరో భర్తీ చేశారు. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వల్ల చిత్రబృందానికి ఇబ్బంది కలగకూడదని నానా ‘హౌస్‌ఫుల్4 ’ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నానా పటేకర్ స్థానంలోకి రానా వచ్చారు. మొదట ఈ పాత్రను అనిల్‌కపూర్ చేస్తారని వార్తలు వినిపించినా ఫైనల్‌గా రానా వచ్చారు. ఈ పాత్ర గురించి రానా మాట్లాడుతూ – ‘‘హౌస్‌ఫుల్’ లాంటి కామెడీ జానర్ సినిమాలో ఇప్పటి వరకూ నేను నటించలేదు. కొత్త కొత్త జానర్స్‌లో కనిపించడం నాకెప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. హైదరాబాద్ బయటకు వచ్చి పని చేయడం కొత్తగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తాను. అక్షయ్ కుమార్‌తో ఆల్రెడీ పని చేశాను. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’లో అనుభవం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి’’ అని పేర్కొన్నారు. కేవలం నానా పటేకర్ మాత్రమే కాదు దర్శకుడు సాజిద్ ఖాన్ ప్లేస్‌లో ఫాహద్, సంజీ ద్వయం దర్శకులుగా వచ్చిన సంగతి తెలిసిందే. -
నానా.. కాదు రానా?
‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాల నుంచి కొందరు తప్పుకుంటున్నారు. మరికొందరిని చిత్రబృందం తొలగిస్తోంది. ‘హౌస్‌ఫుల్–4’ సినిమాలో నటిస్తున్న నానా పటేకర్, చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో సినిమా షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ పడింది. అయితే నానా పటేకర్, సాజిద్ ఖాన్ల స్థానాలను వేరే వారితో భర్తీ చేసి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారట చిత్రబృందం. సాజిద్ ఖాన్ స్థానంలో దర్శకుడిగా ఫర్హాద్ సంజనీని తీసుకున్నారట. నానా పటేకర్ స్థానంలో టాలీవుడ్ హీరో రానాను తీసుకోనున్నారని బాలీవుడ్ టాక్. నానా స్థానంలో జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ల పేర్లు వినిపించాయి. తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. చిత్ర వర్గాలు రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి రానా ఫిక్సా? వెయిట్ అండ్ సీ. -
నానా ప్లేస్‌లో రానా
బాలీవుడ్ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణల కారణంగా కొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు తమకు తాముగా ప్రాజెక్ట్స్నుంచి తప్పుకుంటుండగా.. మరికొందరిని యూనిట్ సభ్యులే తొలగిస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌ఫుల్ 4 సినిమా మీద ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నానా పటేకర్, దర్శకుడు సాజిద్ఖాన్లను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించటంతో కొత్తవారిని వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే దర్శకుడిగా ఫర్హాద్ సంజినీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నానా పటేకర్ స్థానంలో సౌత్ స్టార్ రానా దగ్గుబాటి నటించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
నానా పటేకర్ అలాంటోడే కానీ..
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడని తనకు తెలుసన్నారు. అయితే ఆయన ఇలాంటి పనులు చేశాడని తాననుకోవడం లేదని, కోర్టులే దీన్ని నిగ్గుతేలుస్తాయని వ్యాఖ్యానించారు. మీటూ సీరియస్ అంశమని, దీనిపై మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సున్నిత అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరగరాదని కోరారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెట్రో ధరలు, రూపాయి క్షీణత, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే ఈ ఉద్యమం ముందుకువచ్చిందని రాజ్ థాకరే సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వారు ఎంఎన్ఎస్ను సాయం కోసం ఆశ్రయించవచ్చన్నారు. మహిళలు తాము అణిచివేతకు గురైన వెంటనే గొంతెత్తాలని, పదేళ్ల తర్వాత కాదని ఆయన చురకలు వేశారు.