Philippines
-
ఐదు దోమలకు రూపాయిన్నర
మనీలా: డెంగీ వ్యాధి పేరు చెబితే ఎవరైనా హడలిపోవాల్సిందే. ప్రజాసంక్షేమానికి, తమ పౌరుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైతం డెంగీ పేరు చెబితే వణికిపోతోంది. విజృంభిస్తున్న డెంగీ కేసులు, దోమలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది మాత్రమే రంగంలోకి దిగితే సరిపోదని స్థానిక పాలకులు భావించారు. పౌరులను ఈ క్రతువులో భాగస్వాములను చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా దోమలను చంపితే నజరానా ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఐదు దోమలకు ఒక ఫిలిప్పీన్స్ పేసో( 1 పేసో అంటే భారతీయ కరెన్సీలో రూ.1.50) చొప్పున డబ్బులు ముట్టజెప్తామని సెంట్రల్ మనీలాలోని బరాంగే అడిషన్ హిల్స్ గ్రామ పెద్ద కార్లిటో సెర్నాల్ స్పష్టంచేశారు. దోమలను చంపితే కూడా డబ్బులిస్తారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు వ్యంగ్య పోస్ట్‌లు చేసినా ఆయన దానిని సానుకూలంగా స్పందించారు. ‘‘ఎవరేమనుకున్నా పర్లేదు. మాకు మా పౌరుల ఆరోగ్యమే ముఖ్యం’’అని తాపీగా సమాధానమిచ్చారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు దోమకాటు కారణంగా డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దోమల దండుపై దండయాత్రకు గ్రామపెద్ద పిలుపునిచ్చారు. ‘‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన దోమనల్లా చంపేయండి. కేవలం నెలరోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది’’అని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఖాళీగా కూర్చోకుండా దోమల బ్యాట్‌తో రంగంలోకి దిగితే మంచి డబ్బులొస్తాయని కొందరు వెంటనే పని మొదలెట్టారు. గ్రామంలో ఇప్పటికే 21 మంది తాము చంపిన, సజీవంగా పట్టితెచ్చిన దోమలు, వారి లార్వాలను చూపించారు. వాళ్లు వందలాది దోమలు, లార్వాలను తీసుకొచ్చారు. బతికున్న దోమలను అవి డెంగీ వ్యాధికారక రకం దోమలో కాదో అతినీలలోహిత కిరణాల కింద పెట్టి పరీక్షించి నిర్ధారిస్తామని గ్రామ పెద్ద చెప్పారు. ఈ తతంగం చూసి నవ్వుకున్న కొందరు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో వ్యంగ్య పోస్ట్‌లు పెట్టారు. ‘‘పట్టుకునే, చంపే క్రమంలో దోమ రెక్క ఒకటి ఊడిపోతే దానిని లెక్కలోకి తీసుకుంటారా? లేదంటే తిరస్కరిస్తారా?’’అని ఒక వ్యక్తి పోస్ట్‌చేశారు. మెచ్చుకున్న ప్రభుత్వం స్థానిక యంత్రాంగం స్థాయిలో దోమల వ్యాప్తి కట్టడికి జరుగుతున్న కృషిని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెచ్చుకుంది. ‘‘ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిందే. పౌరులు సైతం తమ వంతు బాధ్యతగా స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ఫిలిప్పీన్స్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ ఆఫీస్‌లకు వెళ్లి డెంగీ నివారణ, దోమల వ్యాప్తి నిరోధక పద్ధతులపై అవగాహన పెంచుకోండి’’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘మా ప్రాంతంలో దోమల బెడద చాలా ఎక్కువ. ఇటీవలే 44 డెంగీ కేసులు వెలుగుచూశాయి. సొంతంగా కట్టడి చర్యలకు ఉపక్రమించాం. ఎవరేమనుకుంటున్నారు అనేది మాకు అనవసరం. మాకు తోచినంతలో మా ప్రాంతాన్ని మేం దోమలరహితంగా మారుస్తున్నాం’’అని గ్రామ పెద్ద అన్నారు. ‘‘సెంట్రల్ మనీలాలోని 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బరాంగే అడిషన్ హిల్స్ జనాభా 70,000. డెంగీ కారక దోమలు లార్వాలను విడిచేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు నీటి నిల్వ ప్రాంతాలను శుద్ధిచేయడం చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు. ఉష్ణమండల దేశమైన ఫిలిప్పీన్స్‌లో దోమల సమస్య ఎక్కువే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన 40 శాతం అధికంగా ఏకంగా 28,234 డెంగీ కేసులు నమోదైనట్లు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. నీరు నిల్వ ఉండే టైర్లు, నిరుపయోగ డ్రమ్ములు, బకెట్లను పారేయాలని, ప్రజలు చేతులు పూర్తిగా కప్పేసేలా వస్త్రధారణ ఉండాలని సూచించింది. -
రెక్కల గుర్రంపై... విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలు
చందమామ కథల్లో విన్న జలకన్యలు కళ్ల ముందు ప్రత్యక్షమై ‘హాయ్’ అని పలకరిస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లోనే చూసిన రంగుల వెలుగుల జలకన్యలు ‘పదండి మా లోకంలోకి’ అని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం సొంతమై మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. విశాఖ ఎక్స్పో– 2025 మెర్మైడ్స్ (జల కన్యలు) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎక్కడెక్కడి నుంచో విశాఖకు రెక్కలతో ఎగిరొచ్చిన జలకన్యల పరిచయం...చిన్నతనంలో కథలు, కార్టూన్లలో జలకన్యలను చూసి తెగ సంతోషించేది ఫిలిప్పీన్స్‌కి చెందిన కినా. ‘జలకన్యలు’ నిజం అనే భావనతోనే పెరిగింది. తాను కూడా వారిలా మారాలని బలంగా అనుకుంది. తరువాత కాలంలో స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. సముద్రంలో కూడా ఈద గలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న కినా మెర్మైడ్ప్రొఫెషన్ ఎంచుకుంది. ‘శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతో ప్రధానం’ అంటున్న కినా నాలుగు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉంది. మెర్మైడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.‘మెర్మైడ్గా నీటిలో ఈదుతూ ప్రేక్షకులను అలరించాలంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. దీనికి మంచినిద్ర, తగినంత వ్యాయాయం అవసరం. నిత్యం ఉదయంవేళల్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు, యోగా చేస్తాము. దీనివల్ల నీటిలో ఎక్కువ సమయం శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యపడుతుంది. ప్రత్యేకమైన మాస్క్, ఇయర్ ప్లగ్స్, ప్రత్యేకమైన సూట్, నడుముకి 2 నుంచి 4 కేజీల బరువుండే బెల్ట్, ఫిన్ వంటివి ధరిస్తాము’ అంటుంది ఫిలిప్పీన్స్ కు చెందిన రుత్.ఇటలీకి చెందిన క్లియోప్రొఫెషనల్ సింగర్. చిన్నప్పటి నుంచి మెర్మైడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పాటకు వీడ్కోలు చెప్పి శిక్షణ తరువాత మెర్మైడ్ ప్రొషెషన్లోకి వచ్చింది. ‘మమ్మల్ని చూసిన తరువాత చిన్నారుల మోముల్లో కనిపించే చిరునవ్వులు ఎంతోసంతోషాన్ని, వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తాయి. మా వృత్తిలో గౌరవప్రదమైన వేతనం ఉంటుంది’ అంటుంది క్లియో.ఫిజికల్ థెరపిస్ట్‌గా ఫిలిప్పీన్స్‌లోని హాస్పిటల్స్‌లో రెండేళ్లు పనిచేసిన విరోనికకు మెర్మైడ్ప్రొఫెషన్ అనేది చిన్ననాటి కల. తన కలను సాకారం చేసుకోవడమే కాదు రెండువృత్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ‘భారత్‌లో మమ్మల్ని బాగా ఆదరించారు’ అంటుంది విరోనిక.మూవీ థియేటర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇటలీకి చెందిన క్లియో మెర్మైడ్ ప్రొఫెషన్లోకి రావడం ద్వారా తన చిన్నప్పటి కలను నెరవేర్చుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, వృత్తిపరమైన సంతృప్తి, సంతోషాల మాట ఎలా ఉన్నా....ఇది ఆషామాషీ వృత్తేమీ కాదు. నిత్యం రెండు నుంచి నాలుగు గంటల సమయం నీటిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.హైపోథేమియా, హైకోక్సియావంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన నీరు లేని పక్షంలో చర్మసమస్యలు వస్తాయి. చర్మ, కేశ సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఖర్చు చేయాల్సి వస్తుంది. నీటిలో దిగే సమయంలో శరీరానికి వివిధ లోషన్లు పూసుకుంటారు. పైభాగంలో ఉంచే లైట్ల నుంచి వచ్చే వేడిని దృష్టిలో పెట్టుకొని సన్‌స్క్రీన్ వాడతారు. కాళ్లకు ఉపయోగించే ప్రత్యేకమైన తోక వంటి పరికరం వల్ల కాళ్లపై గాయాలు కావడం అనేది సర్వసాధారణం.నాలుగు దశల శిక్షణమెర్మైడ్ప్రొఫెషన్ కోసం ప్రాథమిక స్థాయి, ఓషన్ మెర్మైడ్, అడ్వాన్స్డ్, ఇన్స్ట్రక్టర్...నాలుగు దశల్లో శిక్షణ ఉంటుంది. తొలి దశలో ఈత కొట్టడంలోప్రాథమిక సూత్రాలు, రెండోదశలో సముద్రంలో, ద్వీపాలలో ఈత కొట్టడం, మూడోదశలో మరింత నైపుణ్యంతో ఈత కొట్టడం నేర్పిస్తారు. నాల్గవ దశలో ఈతలో, మెర్మైడ్స్గా ఉపాధిని పొందడానికి వచ్చే వారికి అవసరమైన శిక్షణ అందించే ఇన్‌స్ట్రక్టర్‌గా మారడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు.– వేదుల నరసింహంఎ.యూ. క్యాంపస్, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎం.డి. నవాజ్ -
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్‌ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
కోడిపుంజులాంటి హోటల్..!
రాజసంగా నిలుచున్న కోడిపుంజును చూశారు కదూ! ఇది కోడి గౌరవార్థం నిలిపిన విగ్రహమేమీ కాదు. ఇది హోటల్ భవంతి. కోడిపుంజు ఆకారంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భవంతిగా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ భవంతి ఎత్తు 114.7 అడుగులు. ఫిలిప్పీన్స్‌లోని నెగ్రోస్ నగరంలో ఉందిది.నిలువెత్తు కోడిపుంజులాంటి ఈ హోటల్ భవనంలో సమస్త సౌకర్యాలతో కూడిన 15 ఎయిర్ కండిషన్డ్ గదులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్ స్థానిక సంస్కృతిలో కోడిపుంజుకు విశేష ప్రాధాన్యముందని, ఆ ఒక్క కారణమే కాకుండా, జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు కోడిపుంజు ఆకారంలో ఈ భవంతిని నిర్మించామని ఈ హోటల్ యజమాని రికార్డో కానో గ్వాపో తెలిపారు. ఈ హోటల్ పేరు ‘కాంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్’. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
అధ్యక్షుడినే చంపేయిస్తా
మనీలా: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌లో రెండు శక్తివంత రాజకీయ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిరాజుకుంటోంది. ఈ కుటుంబాల మధ్య పాత వైరం మరోసారి బట్టబయలైంది. తన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్‌ను చంపేస్తానని ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టే బహిరంగ ప్రకటన చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించారు. సారా డ్యుటెర్టే తండ్రి రోడ్రిగో డ్యుటెర్టేకు, ఫెర్డినాడ్ తండ్రి మార్కోస్ సీనియర్‌కు మధ్య చాన్నాళ్ల క్రితం బద్దశత్రుత్వం ఉన్న విషయం తెల్సిందే. ఫెర్డినాడ్ జూనియర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా రాజీనామాచేసినప్పటికీ సారా ఇంకా దేశ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవలికాలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అస్సలు పొసగట్లేదు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సారా ఆన్లైన్లో మీడియాసమావేశంలో మాట్లాడారు. ‘‘నా యోగక్షేమాల గురించి ఎవరికీ ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే మీకో విషయం చెప్తా. ఇటీవల నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడా. నా ప్రాణాలను హాని ఉండి, నన్ను ఎవరైనా చంపేస్తే వెంటనే దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్, ఆయన భార్య లిజా అరనేటా, పార్లమెంట్లో ప్రతినిధుల సభ స్పీకర్ మారి్టన్ రోమాల్డేజ్ను చంపేసెయ్. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకునేదాకా దాడిచెయ్ అని చెప్పా. అందుకే తను సరేనన్నాడు. ఇది సరదాకి చెప్పట్లేను. ఇది జోక్ కానేకాదు’’అని సారా చెప్పారు. అధ్యక్షుడిని అంతం చేయాలని కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడినట్లు స్వయంగా ఉపాధ్యక్షురాలే ప్రకటన చేయడంతో అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ కార్యాలయం అప్రమత్తమైంది. ‘‘అధ్యక్షుని ప్రాణాలకు ఇంతటి హాని పొంచి ఉందని తెలిశాక భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. రక్షణ బాధ్యతలను అధ్యక్షుడి రక్షణ దళాలకు అప్పజెప్తున్నాం. సారా వ్యాఖ్యలపై తగు చర్యలకు సిద్ధమవుతున్నాం’’అని కార్యనిర్వాహక కార్యదర్శి లూకాస్ బెర్సామిన్ చెప్పారు. 2022 మేలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మార్కోస్, ఉపాధ్యక్షురాలిగా సారా పోటీచేసి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు, తదితర అంతర్జాతీయ, దేశీయ అంశాల్లో ఇద్దరు నేతల మధ్య ఇటీవలికాలంలో తీవ్ర బేధాభిప్రాయాలొచ్చాయి. ఈమధ్య ఓసారి అధ్యక్షుడి తలను నరుకుతున్నట్లు ఆలోచనలొస్తున్నాయని సారా వ్యాఖ్యానించారు. ‘‘అధ్యక్షుడు అవినీతిలో కూరుకుపోయారు. పరిపాలించే సత్తా లేదు. అబద్ధాలకోరు. మా కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరచాలని కుట్ర పన్నుతున్నారు’’అని సారా ఆరోపించారు. సారా తండ్రి రోడ్రిగో డ్యుటెర్టో ఫిలిప్పీన్స్‌లో కరడుగట్టిన రాజకీయనేతగా పేరొందారు. దేశంలో మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు. దావో సిటీ మేయర్‌గా, ఆతర్వాత దేశాధ్యక్షుడిగా తన పరిపాలనాకాలంలో ‘డెత్ స్క్వాడ్’పేరిట వేలాది మంది డ్రగ్స్‌ముఠా సభ్యులను అంతమొందించారు. ఆనాడు దేశాధ్యక్షుడిగా ఉంటూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. సారా ప్రకటనపై దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ రోమియో బ్రేవ్నర్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘లక్షన్నరకుపైబడిన దేశ సైనికులు ఎల్లప్పుడూ పక్షపాతరహితంగా పనిచేస్తారు. ప్రజాస్వామ్యయుత రాజ్యాంగబద్ధ సంస్థలు, పౌరవ్యవస్థల ఆదేశాలను శిరసావహిస్తారు’’అని అన్నారు. -
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయిన చింతా స్నిగ్ధ
-
ఫిలిప్పీన్స్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి
డాక్టర్ అన్న కోరికతో విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించ డానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది. పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాస ముంటున్నారు చింత అమృత్ రావు. మెదక్‌లోని ట్రాన్స్‌కో డీఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టిన రోజు విషెస్ చెబుతామని ఫోన్ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో అర్థంకావడం లేదని, తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ద తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్నిగ్ధ మరణానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. -
కోడి కాదిది.. హోటల్
ఇదేదో రాక్షస కోడి అనుకుంటున్నారా? అదేమీ కాదు. ఆ ఆకారంలో ఉన్న హోటల్. కోడి ఆకృతిలోని హోటళ్లలో ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇది ఫిలిప్పీన్స్‌లో కంపుస్టోహన్లోని హైలాండ్ రిసార్ట్‌లో ఉంది. 115 అడుగుల ఎత్తు, 92 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పున్న ఈ హోటల్లో సకల సదుపాయాలతో కూడిన 15 గదులున్నాయి. ఈ నిర్మాణం తన భార్య ఆలోచనంటూ రిసార్టు యజమాని మురిసిపోతున్నాడు. ఫిలిప్పీన్స్ తుఫాన్లకు, వరదలకు పెట్టింది పేరు. వాటన్నింటినీ తట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఈ నిర్మాణాన్ని కేవలం ఆర్నెల్లలో పూర్తి చేశారట! -
ఫిలిప్పీన్స్‌లో వరదలు.. 23 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతాన్ని ట్రామి తుపాను అతలాకుతలం చేస్తోంది. బికోల్ ప్రాంతంతోపాటు క్వెజాన్ ప్రావిన్స్‌లో నీట మునిగిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగా నగరంలోనే ఏడుగురు చనిపోయారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని అధికారులు తెలిపారు. ఆల్బే ప్రావిన్స్‌లో మయోన్ అగ్ని పర్వతం నుంచి వెల్లువెత్తుతున్న బురద ప్రవాహం అనేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. ఇళ్లపైకి చేరిన వారిని, వరదలో చిక్కుకున్న వారిని యంత్రాంగం మోటారు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ట్రామి తుపానుతో 75,400 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం 20 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం తెలిపింది. బుధ, గురు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయం అందించడం కూడా కష్టంగా మారిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. -
ఫిలిప్పీన్స్‌కు మన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి పంపించే ప్రక్రియకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి ఏటా సగటున 70 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో రాష్ట్ర అవసరాలకు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగించుకొంటుండగా, మిగతా మొత్తాన్ని ఎఫ్‌సీఐకి లెవీ కింద పెడుతున్నారు. కాగా ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో నాణ్యమైన సన్నబియ్యం ఉత్పత్తి పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో నేరుగా విదేశీ ఎగుమతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. నాణ్యతా కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్నేళ్లుగా భారతదేశం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులపై ఆ దేశ వ్యవసాయ మంత్రి రోజేర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఫిలిప్పీన్‌లకు ప్రతి సీజన్లో 3 టన్నుల వరకు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో సాగాయి. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు మంత్రి ఉత్తమ్‘సాక్షి’కి తెలిపారు. త్వరలో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని, అనంతరం ఫిలిప్పీన్స్ వెళ్లి నేరుగా ఆ దేశంతో చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. అది కార్యరూపం దాల్చితే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఇది మరో మంచి అవకాశం కానుంది. -
70 ఏళ్ల వయసులో మెడికల్ గ్రాడ్యుయేట్‌గా
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించేందుకు వయసు ఏమాత్రం అడ్డురాదని మలేసియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్‌కెంగ్ నిరూపించారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన తోహ్ ఇటీవల మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఔరా అనిపించారు. 70 ఏళ్ల వయసులో మెడిసిన్ చేసి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్ చేసిన వారిలో ఒకరిగా తోహ్ రికార్డ్ సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తుందా..! చిరంజీవి స్టైల్‌గా క్లాస్‌లోకి వస్తుంటే అందరూ ఆయనను ప్రొఫెసర్ అని పొరబడతారు. ఫిలిప్పీన్స్‌లోని సెబులో ఉన్న సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ పీహెచ్ ఎంఏ విద్యార్థులు సైతం తోహ్ మొదటిసారి క్లాసులో అడుగుపెట్టినప్పుడు అలాగే అనుకున్నారు. కానీ తోటి విద్యార్థి అని తర్వాత తెల్సుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయనను ‘సర్ తోహ్’అంటూ గౌరవంగా పిలుచుకుంటున్నారు. అయితే ఆయన చిన్నతనం నుంచే డాక్టర్ కావాలనేమీ కలలు కనలేదు. అప్పటికే ఆర్థికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఎల్రక్టానిక్ ఇంజనీరింగ్ చదివేశారు. తర్వాత ఆయన మనసు మెడిసిన్ వైపు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్ విహారయాత్రలో ఉండగా ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులను కలిశారు. ఆ పరిచయం ఆయనను వైద్య విద్య పట్ల అమితాసక్తిని పెంచిందని తోహ్ చెప్పారు. 2019లో కార్పొరేట్ ప్రపంచం నుంచి పదవీ విరమణ పొందాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ అన్నిచోట్లా వైద్యవిద్య చదవడానికి వయోపరిమితి అడ్డుగా ఉందని తర్వాత అర్థమైంది. ఈ వయసులోనూ తనను మెడిసిన్ చదివేందుకు అనుమతించే కాలేజీ కోసం తెగ తిరిగారు. అయితే తమ పని మనిషి కూతురు చదివిన ఫిలిప్పీన్స్‌లోని వైద్య పాఠశాలలో వయోపరిమితి లేదని తెలుసుకుని ఎగిరి గంతేశారు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత సెలక్షన చకచకా జరిగిపోయాయి. పెట్టే బేడా సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి స్కూల్లో చేరారు. 2020లో కరోనా విజృంభించడంతో హాంకాంగ్‌కు మకాం మార్చేసి తన క్లాసులన్నీ ఆన్లైన్లో విన్నారు. కుటుంబం, సహాధ్యాయిల సహకారంతో గత జూలైలో మెడిసిన్ పట్టా అందుకున్నారు. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్డ్ డాక్టర్‌గా మారడానికి ఆయనకు మరో పదేళ్లు పట్టొచ్చు. విదేశీ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల కోసం.. మెడికల్ బోర్డు పరీక్ష కోసం ఏడాది పాటు ఇంటర్న్íÙప్, మరింత అధ్యయనం అవసరం. దానికి బదులుగా అతను హాంకాంగ్‌లో స్నేహితుడి సంస్థ అలెర్జీ అండ్ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేయాలని యోచిస్తున్నారు. త నలాగా మెడిసిన్ చేస్తున్న పేద పిల్లలకు సాయం చేద్దామని భావించారు. ట్యూషన్ ఫీ చెల్లించడానికి కష్టపడే విదేశీ వైద్య విద్యార్థుల కోసం స్కాలర్íÙప్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ ప్రకారం అమెరికాలో ప్రభుత్వ వైద్య పాఠశాలలలో స్థానిక విద్యార్థులకు సంవత్సరానికి సగటు ట్యూషన్ ఫీజు సుమారు 60,000 డాలర్లు. విదేశీ విద్యార్థు లకు 95,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రైవేటు వైద్య పాఠశాలల్లో విదేశీయులకు ట్యూషన్, ఫీజులు 70 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఫిలిప్పీన్స్‌లో ట్యూషన్ ఫీజులు అంత ఎక్కువగా లేవు. తోహ్ సౌత్ వెస్ట్రన్ వర్సిటీ ఏడాదికి దాదాపు 5,000 డాలర్లు ఖర్చు చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఇది పెద్దమొత్తమే. ఇలాంటివారికి ఆ నిధిని ఖర్చు చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఔట్ సోర్సింగ్ హబ్‌గా ఫిలిప్పీన్స్!.. ఒకటితో మొదలై..
పారిశ్రామిక విప్లవం సమయంలోనే ఔట్ సోర్సింగ్ అనేది ప్రారంభమైంది. 1970లలో కూడా పెద్ద కంపెనీలు పూర్తిగా స్వయం సమృద్ధి సాధించలేదు. ఆ సమయంలో సంస్థల పనితీరును మెరుగుపరుచుకోవడానికి మార్గాలను అన్వేషించడంలో భాగంగానే ఔట్ సోర్సింగ్ ఎంచుకున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే ఫిలిప్పీన్స్‌లో ఔట్ సోర్సింగ్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు ఫిలిప్పీన్స్ బీపీఓ పరిశ్రమ కేవలం ఓకే సంప్రదింపు కేంద్రం ఉండేది. నేడు ఆ దేశమే ప్రపంచంలో ప్రముఖ అవుట్సోర్సింగ్ హబ్‌గా ఎదిగింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం..👉1992: ఫిలిప్పీన్స్‌లో ఔట్ సోర్సింగ్ ప్రారంభమైంది.👉1995: ఫిలిప్పీన్ ఎకనామిక్ జోన్ అథారిటీ (PEZA) మొదలైంది. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాలలో తమ వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడంలో విదేశీ పెట్టుబడిదారులకు సహాయం చేయడంపై ఏజెన్సీ దృష్టి సారిస్తుంది.👉1997: సైక్స్ ఆసియా ఫిలిప్పీన్స్‌లో మొదటి మల్టీనేషనల్ బీపీఓ కంపెనీగా స్థిరపడింది.👉1999: మల్టినేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మాజీ ఉద్యోగులు జిమ్ ఫ్రాంకే & డెరెక్ హోలీ ఈ-టెలీకాలర్ స్థాపించారు. ఇదే దేశంలో మొట్ట మొదటి కాల్ సెంటర్‌గా ప్రసిద్ధి చెందింది.👉2000: జీడీపీలో మొత్తం 0.075 శాతం బీపీఓ పరిశ్రమ ద్వారా లభించింది.👉2005: 2005 నాటికి ఫిలిప్పీన్స్ బీపీఓ పరిశ్రమ మార్కెట్ వాటా 3 శాతానికి చేరింది. ఇది దేశ జీడీపీలో 2.4 శాతంగా ఉంది.👉2006: 2006లో బీపీఓ పరిశ్రమ భారీగా వృద్ధి చెందింది. 2010లో ఫిలిప్పీన్స్ ప్రపంచానికే బీపీఓ రాజధానిగా మారింది. కాల్ సెంటర్లలో ఏకంగా 525,000 మంది ఏజెంట్లు పని చేస్తున్నారు. 2012లో బీపీఓ ఆదాయం 5.4 శాతానికి పెరిగింది. 👉2018: ఫిలిప్పీన్స్ థోలోన్స్లో రెండో స్థానంలో నిలిచింది.👉2019: ఫ్రీలాన్సర్ల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఫిలిప్పీన్స్ ఆరవ స్థానంలో నిలిచింది👉2020: థోలన్స్ టాప్ 50 డిజిటల్ నేషన్స్ జాబితాలో ఫిలిప్పీన్స్ ఐదవ స్థానంలో నిలిచింది.👉2022: ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) మార్కెట్ గ్లోబల్ మార్కెట్ షేర్లో 13 శాతం కలిగి ఉంది. దీని ఆదాయం దాదాపు 30 బిలియన్ డాలర్లు.కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫిలిప్పీన్ బీపీఓ పరిశ్రమ మాత్రం స్థిరమైన వృద్ధి సాగిస్తూనే.. తమ కార్యకలాపాలను విస్తరించడానికి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఔట్ సోర్సింగ్ విషయంలో ఇండియాకు ఫిలిప్పీన్స్ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ప్రధాన కారణం టైం జోన్ మాత్రమే కాకుండా.. అక్కడి ప్రజలు ఇంగ్లీషులో మనకంటే మరింత ప్రావీణ్యం ఉండడం కూడా అని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ చాలా కాలం పాటు బ్రిటిష్ కాలనీగా ఉండటం కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. -
ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న యాగి
మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. క్వెజాన్ ప్రావిన్స్‌లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్ ప్రావిన్స్‌లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్ ప్రావిన్స్‌లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు. మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్ ప్రావిన్స్‌లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు. పసిఫిక్ రింగ్ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భీకర తుపాను హయియాన్తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు
మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణమండల తుఫాను యాగీ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న కామరైన్స్ నోర్టే ప్రావిన్స్‌లోని విన్జోన్స్ పట్టణ తీరాన్ని తాకింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు కామరైన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా పట్టణంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన లుజోన్‌లో టైఫూన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను వాతావరణం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. రాజధానికి సమీపంలో ఉన్న మరికినా నదిలో నీటిమట్టం పెరిగిన దృష్ట్యా స్థానికులను హెచ్చరిస్తూ అధికారులు సైరన్ మోగించారు.ఉత్తర సమర్ ప్రావిన్స్‌లోని కోస్ట్ గార్డు సిబ్బంది రెండు గ్రామాలకు చెందిన 40 మందిని రక్షించారు. తుఫాను కారణంగా పలు ఓడరేవుల్లో షిప్పింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాను వాతావరణం కారణంగా పలు దేశీయ విమానాల రాకపోకలను రద్దుచేశారు. -
ఒలింపిక్ స్వర్ణాల విజేతకు భారీ నజరానా
మనీలా: విశ్వక్రీడల పతకాలకు ఉన్న ప్రతిష్టకు ఇదొక మచ్చుతునక. ఫిలిప్పీన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ యులో పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ‘రిసార్ట్ హోమ్’ను బహుకరించాలని నిర్ణయించింది. సాధారణంగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, క్రీడా అవార్డులు, స్థానిక ప్రభుత్వాలైతే విలువైన ఇంటి స్థలాల్ని ఇవ్వడం పరిపాటి! కానీ ఫిలిప్పీన్స్ మాత్రం కార్లోస్‌కు అద్వితీయ కానుకను సిద్ధం చేస్తోంది. అంతేనా... తమ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికింది. పారిస్ నుంచి మంగళవారం స్వదేశం చేరుకున్న 24 ఏళ్ల చాంపియన్‌కు అసాధారణ ఏర్పాట్లతో వెల్కమ్ చెప్పిన ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ 10 లక్షల అమెరికా డాలర్లు (రూ. 8.39 కోట్లు) చెక్ ఇవ్వడంతోపాటు ఒక రిసార్ట్ హోమ్‌నే బహుమతి ఇస్తామని ఆ రిసార్టులో జీవితకాలం ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని ప్రకటించారు. కార్లోస్ రెండు స్వర్ణాలతో పారిస్ గేమ్స్ పతకాల పట్టికలో ఫిలిప్పీన్స్ 37వ స్థానంలో నిలిచింది. -
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
ఫిలిప్పీన్స్‌లో ఇండియన్ కంపెనీ.. 48 దేశాల్లో హవా
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రాండ్ అమ్మకాలను ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ తన కార్యకలాపాలను ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించింది.కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో భాగమైన టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ (TMC).. ఫిలిప్పీన్స్‌లోని హీరో మోటోకార్ప్ ఉత్పత్తుల అసెంబ్లర్, విక్రయదారుగా ఉంటుంది. ఈ భాగస్వామ్యం అక్టోబర్ 2022లో ప్రకటించినప్పటికీ ఇప్పటికి అమలు అయ్యింది. దీంతో హీరో మోటోకార్ప్ వాహనాలు ఆగ్నేయాసియా మార్కెట్లోకి కూడా విస్తరిస్తున్నాయి.ఫిలిప్పీన్స్‌లోని లగునాలో టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్లో అసెంబ్లీ యూనిట్, విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 600 చదరపు మీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ సదుపాయంలో సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలుస్తోంది.ఈ కొత్త తయారీ కేంద్రంలో ఎక్స్‌పల్స్ 200 4వీ, హంక్ 160ఆర్ 4వీ, జూమ్ వంటి టూ వీలర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. హీరో మోటోకార్ప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్‌కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
ఫిలిప్పీన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లో ఈరోజు(గురువారం)బలమైన భూకంపం సంభవించింది. సోక్స్సర్జెన్కు 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలెబ్స్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపం లోతు 620 కిలోమీటర్లు.భూకంపం ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపించినప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ వార్తలు లేవు. అలాగే భూకంపం తర్వాత ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. EQ of M: 6.7, On: 11/07/2024 07:43:18 IST, Lat: 6.02 N, Long: 123.31 E, Depth: 650 Km, Location: Mindanao Philippines. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/d5AEc6OJZP— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2024 -
దక్షిణ చైనా సముద్రంలో కలకలం
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణచైనా సముద్రంపై తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేసి యా, వియత్నాం, బ్రూనై, తైవాన్లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. రెండు ఓడల ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.అసలేం జరిగింది?నన్షా ద్వీపాల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దిబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెల్సికూడా ఉద్దేశపూర్వకంగా అదే దిశలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్‌కు చెందిన సరకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్(సీసీజీ) ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌకపై మేం నియంత్రణ సాధించామని సీసీజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ షావల్ స్థావరంలోని మా బలగాలకు సరకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది’’ అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరేస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) పరిధిలో ఉండేది. 2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసా గుతోంది. దక్షిణ చైనా సముద్రజలాల గుండా ప్రయాణించే పొరుగుదేశాల సరకు రవాణా నౌకలపై తరచూ జల ఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నావికాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెల్సిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజులపాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్‌గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Philippines: విరిగిపడ్డ కొండ చరియలు.. 54 మంది మృతి
మనీలా: పిలిప్పీన్స్‌లోని డావో ప్రావిన్సు మాకో టౌన్లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు -
ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో దీవిని శనివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూమిలో 32 కిలోమీటర్ల లోతులో రాత్రి 10.37 గంటల సమయంలో ఇది సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాలు, మలేసియాలో సునామీ అలలు మీటరు ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసినట్లు పసిఫిక్ సునామీ వారి్నంగ్ సెంటర్ తెలిపింది. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్‌లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR — 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023 -
'మాలి' ఇక లేదు!
పిలిప్పీన్స్ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే... నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్ జూ అధికారులు ఒక కాంక్రీట్ ఎన్‌క్లోజర్‌లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్ బిషప్‌లు, గ్లోబల్ పాప్ స్టార్, నోబెల్ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు. అంతేగాదు ఆ ఏనుగును థాయ్‌లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు. ఎలా ఈ జూకి వచ్చిందంటే.. శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్‌కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు మలాకానాంగ్ ప్యాలెస్‌లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం. చనిపోవడానికి కారణం.. ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్ లాకునా చెప్పారు. (చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది) -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్ మరోసారి భారీ భూకంపంతో కంపించి పోయింది. శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని జర్మనీ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టంపై తక్షణ సమాచారం ఏదీ లేదని ప్రకటించింది. అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది. తాను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే బలమైన భూకంపం అని షియా లేరాన్ తెలిపారు. దీంతో జనం భయాందోళనలతో పరుగులు తీశారని చెప్పారు. భూకంప కేంద్రం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో జరిగే సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. అలాగే బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, కంప్యూటర్లు కింద పడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్‌కు తరలించారని భూకంపం సంభవించినప్పుడు విమాన ప్రయాణికుడు మైఖేల్ రికాఫోర్ట్ తెలిపారు. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కేంద్రం "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. దీంతోపాటు గత వారం పది రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 -
ఫిలిప్పీన్స్ నౌకలను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్ షిప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో ఆదివారం ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్ గార్డ్ నౌక, మిలటరీ రవాణా బోటులను చైనా కోస్ట్‌గార్డ్ షిప్, దానితోపాటే వచ్చిన చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించకపోయుంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్ షోల్ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్ మెరైన్ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది. -
24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్..
బీజింగ్: 1999లో చైనా ద్వీప తీరమైన రెనై రీఫ్ కు వచ్చిన ఫిలిప్పీన్స్ యుద్ధనౌక అప్పటి నుండి అక్కడే నిలిచిపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం మనీలా యుద్ధనౌకను మళ్ళీ మరమ్మతులు చేసి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుండగా దయచేసి దానిని అక్కడి నుంచి తొలగించమని అభ్యర్ధించింది చైనా. చైనా అధికార ప్రతినిధి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, ఇప్పటికే ASEAN దేశాలు సంయుక్తంగా నిర్దేశించుకున్న నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు. ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ బృందం యుద్ధ నౌకలో యధాతధంగా కార్యకలాపాలను కొనసాగిస్తోందని దీని వలన శతృ దేశాలకు నీటి మార్గంలో తమను టార్గెట్ చేయడం సులువయ్యే అవకాశముందన్నది అభిప్రాయపడ్డారు. గడిచిన 24 ఏళ్లలో చైనా అనేకమార్లు ఓడను తొలగించమని ఫిలిప్పీన్స్ ను అభ్యర్ధించగా ఫిలిప్పీన్స్ తీర దళాలు తొలగిస్తామని చెబుతూ కాలాన్ని నెట్టుకుంటూ వచ్చాయి. ఇక ఇప్పుడైతే నౌకకు మరమ్మతులు చేసి చైనా తీరంలోనే పాతుకుపోయే ప్రయత్నం చేస్తోందని చైనా తీర దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా చైనా కోస్ట్ గార్డ్ బృందం కూడా నిబంధనలను ఉల్లంఘించి ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ వైపుగా ఒక నౌకను తరలించింది. అది తప్పు కాదా అంటూ ఎదురు ప్రశ్నించింది ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఫిలిప్పీన్స్ తీరానికి చేరువగా వస్తోన్న చైనా ఓడ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. అంతే కాదు సెకండ్ థామస్ షోల్ వద్ద చైనా అక్రమాలపై 2020 నుంచి ఇప్పటివరకు 400 సార్లకు పైగా మేము మా నిరసన తెలుపుతూనే ఉన్నామని గుర్తుచేసింది ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ. In China's own words: how it occupied Mischief Reef w/ a few small huts in 1995, then upgraded it to a large building with helipads, guns in 1999. This is why the Philippines placed BRP Sierra Madre on Second Thomas (Ayungin) Shoal to stand watch in 1999. pic.twitter.com/QiyagaetKj — Jay L Batongbacal (@JayBatongbacal) August 8, 2023 ఇది కూడా చదవండి: పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్ -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్‌ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్‌కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్‌ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్‌ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్‌ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్‌ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్‌కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్‌ల్యాండ్‌ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్‌లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్‌ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్‌సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
పడవ మునక.. 21 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీస్తుండటంతో ప్రయాణికులంతా పడవలో ఒకే వైపునకు చేరడంతో ప్రమాదం జరిగిందన్నారు. -
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
ఫిలిప్పీన్స్‌లో మణికాంత్‌రెడ్డి మృతి.. పోస్టుమార్టం రిపోర్టు ఇదే..
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్‌రెడ్డి (21) మృతికి కార్డియాక్ అరెస్టే (గుండె ఆగిపోవడం) కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మణి కాంత్‌రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి ఫిలి ప్పీన్స్‌కి వెళ్లి అక్కడ ఈ నెల 23న ఉదయం అను మానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మణికాంత్ మృతదేహానికి అక్కడి వైద్యులు బుధవారం పోస్టుమార్టం నిర్వహించగా కార్డియాక్ అరెస్ట్‌తోనే మృతిచెందినట్టు తేలిందని, ఈ మేరకు అక్కడి అధికారుల నుంచి సమాచారం వచి్చందని మృతుడి బంధువులు తెలిపారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అ«ధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహం హైదరాబాద్‌కు రానుందని తెలిసింది. ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమైందని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్! -
ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
భూదాన్‌పోచంపల్లి: వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు మణికాంత్‌రెడ్డి(21) ఫిలిప్పీన్స్‌లోని దావో మెడికల్ కాలేజీలో 2020లో ఎంబీబీఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా కొద్దిరోజులు ఆన్లైన్లో క్లాసులు విన్నాడు. గత ఏడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ప్రస్తుతం థర్డ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాడు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున మణికాంత్‌రెడ్డి ఉంటున్న హాస్టల్ మేనేజర్ రాంరెడ్డికి ఫోన్‌చేసి మీ కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌చేసి మెట్లపై నుంచి జారి పడి మృతిచెందాడని చెప్పారు. మణికాంత్‌రెడ్డి మృతదేహం ఫొటో, వీడియో పంపించారు. కాగా.. హాస్టల్ వెనుక డ్రెయినేజీలో మణికాంత్‌రెడ్డి మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. హాస్టల్ యాజమాన్యం, పోలీసులు చెప్పిన తీరు వేర్వేరుగా ఉండటంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మణికాంత్‌రెడ్డి డ్రెయినేజీలో పడి ఉండటం,తలకు గాయం ఉండటంతో హత్యేనని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో హత్య చేసి డ్రెయినేజీలో పడేసి ఉంటారని అంటున్నారు. 15 రోజుల క్రితం హాస్టల్లో మనదేశానికే చెందిన విద్యార్థులకు, మణికాంత్‌రెడ్డికి మధ్య గొడవ జరిగిందని, వారిలో ఎవరైనా ఘాతుకానికి పాల్పడ్డారా అనిఅనుమానిస్తున్నారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని వెంటనే ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి, ఫిలిప్పీన్స్‌లోని ఎంబసీతో పాటు, అక్కడి ఎన్ఆర్ఐలతోనూ మాట్లాడి.. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మేమెట్టా బతికేది నాలుగురోజుల కిందట మాట్లాడినం. హాస్టల్ ఫీజు కావాలంటే పంపించిన. ‘పరీక్షలు నడుస్తున్నయి, నేనే ఫోన్ చేసి మాట్లాడుతా’అన్నడు. శనివారం ఫోన్ చేస్తే కలువలేదు. ఆదివారం చేద్దామనుకొన్నం. ఈ లోపు ఘోరం జరిగిపోయింది. నా కొడుకు లేకుండా మేమెట్లా బతికేది. – గూడూరు రాంరెడ్డి, మృతుడి తండ్రి -
పెను విషాదం.. పదుల సంఖ్యలో మరణాలు!
మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది. వివరాల ప్రకారం.. లేడీ మేరీ జాయ్-3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మందిని కాపాడినట్టు వెల్లడించారు. కాగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అయ్యో పాకిస్తాన్.. రంజాన్ వేళ దారుణ పరిస్థితులు! -
ఫిలిప్పీన్స్‌లో పంజాబీ దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కాల్పులు..
మనీలా: పంజాబ్‌కు చెందిన దంపతులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చాడు. హత్యకు గురైన భార్యాభర్తలను సుఖ్వీందర్ సింగ్(41), కిరణ్‌దీప్ కౌర్(33)గా గుర్తించారు. ఇద్దరూ పంజాబ్ జలంధర్ జిల్లా గొరాయాకు చెందినవారు. సుఖ్వీందర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఓ దుండగుడు తుపాకీతో వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొదట భర్తపై కాల్పులు జరిపి, ఆ తర్వాత భార్యపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితమే ఫిలిప్పీన్స్ వెళ్లి స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే కిరణ్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుఖ్వీందర్ కాల్ లిఫ్ట్ చేయలేదని అతని తమ్ముడు లఖ్వీర్ సింగ్ చెప్పాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న తమ అంకుల్‌ను వెళ్లి చూడమన్నానని, అప్పటికే ఇద్దరూ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారని పేర్కొన్నాడు. చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి -
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్‌గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి. ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. పలు నగరాల్లో కంపించిన భూమి..
మనిలా: ఫిలిప్పీన్స్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. న్యూ బటాన్ ప్రాంతం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఫిలిప్పీన్స్ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. భూకంపం ధాటికి పలు దక్షిణాది రాష్ట్రాలోని నగరాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గానీ జరిగినట్లు ఇంకా నిర్ధరణ కాలేదు. 🔴🇵🇭#Philippines 🚨#ÚLTIMAHORA | FILIPINAS 🇵🇭 Un terremoto de magnitud 6.0 sacudió New #Bataan en Davao De Oro a las 6:44 p.m. del miércoles, según Phivolcs.#filipinas .#TerremotoPH #terremoto #davao #earthquake,#joshtve #EarthquakePH #joshtve #temblor video 1📹#EarthquakePH pic.twitter.com/OA0sk7QCZz — Joshtve_ (@Joshtve_) February 1, 2023 పసిపిక్ మహా సముద్రం ప్రాంతంలోని ఫిలిప్పీన్స్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ఏటా 20 టైఫూన్లు, ఉష్ణమండల తుఫాన్లు వస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటిగా ఉంది. 🔴🇵🇭#Philippines 🚨#ÚLTIMAHORA | FILIPINAS 🇵🇭 Un terremoto de magnitud 6.0 sacudió New #Bataan en Davao De Oro a las 6:44 p.m. del miércoles, según Phivolcs.#filipinas .#TerremotoPH #terremoto #davao #earthquake,#joshtve #EarthquakePH #joshtve #temblor video 2 📹#EarthquakePH pic.twitter.com/O0nGlW5agE — Joshtve_ (@Joshtve_) February 1, 2023 చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష -
అక్కడ ఉల్లి ధర వింటే..కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం!
మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్ నుంచి చిన్న కాక హోటల్ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది. అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్‌లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ రెండు భారీ తుపాన్లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. (చదవండి: పాక్‌లో భూకంపం) -
తమిళ యువకుడు, పిలిప్పీన్స్ యువతి.. అలా ఒక్కటయ్యారు!
అన్నానగర్(చెన్నై): నాగర్‌కోయిల్‌లో ఆదివారం పిలిప్పీన్స్ యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వివరాలు.. స్థానిక నేశమణి నగర్‌కు చెందిన గుణశీలన్, మెర్సీ దంపతుల కుమారుడు జామీ రెన్స్విక్ (25), ఉన్నత విద్యావంతుడు. పిలిప్పీన్స్‌లోని మిండోనాకు చెందిన లాలిన్ (23) గ్రాడ్యుయేట్. ఉద్యోగ రిత్యా జామీ రెన్స్విక్స్ పిలిప్పీన్స్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఉద్యోగి అయిన లాలిన్ను ప్రేమించాడు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తమిళ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. పిలిప్పీన్స్ నుంచి వీడియో కాల్ ద్వారా లాలిన్ వధువులు వివాహ వేడుకలో పాల్గొనడం గమనార్హం. చదవండి: మగవాళ్ల విందు.. తింటే పసందు -
పిలిప్పీన్స్‌లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య!
మనీలా: పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. భారత్‌లోని పంజాబ్, మోగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్ గుర్ప్రీత్ సింగ్ గిండ్రూ(43)ను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్ప్రీత్ నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తలలో తూటాలు దిగి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ కోచ్‌ను దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కెనడాలో మరో ఘటన.. కెనడాలోని ఒంటారియాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. పంజాబ్‌కు చెందిన మోహిత్ శర్మ(28) నిర్మాణుష్య ప్రాంతంలో కారు వెనకసీటులో మృతి చెంది కనిపించాడు. కొద్ది రోజులుగా విదేశాల్లో భారత సంతతి వ్యక్తులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. భారతీయులపై దాడులు పెరిగిన క్రమంలో కెనడాలో ఉన్న పౌరులు అప్రమతంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మార్గదర్శకాలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
జీఎంసీఏసీలో జీఎంఆర్ వాటాల విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంసీఏసీలో వాటాల విక్రయ డీల్‌కు సంబంధించి రూ. 1,390 కోట్లు తమకు అందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. జీఎంసీఏసీకి 2026 డిసెంబర్ వరకూ తాము టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా కొనసాగుతామని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లోని సెబు విమానాశ్రయానికి సంబంధించి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్ (జీఏఐబీవీ), మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎంసీసీ) కలిసి జీఎంసీఏసీని ఏర్పాటు చేశాయి. ఇందులో తమ వాటాలను అబోయిటిజ్ ఇన్‌ఫ్రాక్యాపిటల్‌కు విక్రయించేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
AP: లవ్ ఇన్ సింగపూర్.. మధురవాడలో పెళ్లి!
మధురవాడ(భీమిలి): వారి భాషలు.. మతాలే కాదు.. దేశాలు కూడా వేర్వేరు. అయినా వారి ప్రేమకు అవేమీ అడ్డుకాలేదు. సింగపూర్‌లో వారి పరిచయం ప్రేమగా మారగా.. మధురవాడలోని ఎంవీవీ సిటీలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. మధురవాడలో స్థిరపడ్డ పెండిమి శ్రీనివాస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన జమేలాహ్ వివాహం గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో అంగరంగవైభవంగా జరిగింది. నగరంలోని శాలిపేటకు చెందిన శ్రీనివాస్ విశాఖ బుల్లయ్య కళాశాలలో డిగ్రీ పూర్తి తర్వాత పుణెలో ఎంబీఏ చదివారు. ఉద్యోగరీత్యా ఏడేళ్ల కిందట సింగపూర్ వెళ్లి అక్కడ హెచ్‌పీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సింగపూర్‌లోనే శాప్(సిస్టమ్ అప్లికేషన్ ప్రొవైడర్)లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన జమేలాహ్‌తో 4 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించారు. మన దేశంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో మధురవాడలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరికీ కెనడాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. త్వరలోనే కెనడా వెళ్లనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. -
సునామీ భయం ప్రాణాలు తోడేసింది
మనీలా: సునామీ భయం ఫిలిప్పీన్స్ పర్వతప్రాంత ప్రజల ప్రాణాలు తీసింది. అక్కడ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారీ అలలు వచ్చి పడటంతో సునామీ ముంచుకొస్తోందని మగుందనావో ప్రావిన్స్‌లోని కుసియాంగ్ గ్రామవాసులు భయపడ్డారు. గతంలో ఆ గ్రామాన్ని భయంకర సునామీ ముంచెత్తింది. నాటి నేటికీ వెంటాడుతున్నాయి. దాంతో వారంతా హుటాహుటిన కొండ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి అక్కడ మట్టి, బురదచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఊబిలో చిక్కి దాదాపు 20 మంది సజీవ సమాధి అయ్యారు. అయితే, ఈసారి మృత్యువు మరో రూపంలో వారిని కబళించింది. వాయవ్య ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్న నాల్గే తుపాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఈ తుపాను ప్రభావ వర్షాల కారణంగానే కుసియాంగ్ గ్రామంలో బురదచరియలు విరిగిపడ్డాయి. ‘ఏటా ఇక్కడి వారు సునామీ వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగినప్పుడు సైతం వార్నింగ్ బెల్స్ మోగడంతో చాలా మంది కొండ వద్ద ఉన్న చర్చి వద్దకు పరుగులు తీశారు. అదే వారి ఉసురు తీసింది’’ అని ఆ ప్రావిన్స్ మంత్రి చెప్పారు. -
ఫిలిప్పైన్స్‌లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫిలిప్పైన్స్‌లో ఎంట్రీ ఇస్తోంది. వాహనాల అసెంబ్లింగ్, పంపిణీ కోసం టెరాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లగూనా నగరంలోని తయారీ ప్లాంటులో ప్రత్యేకంగా 29,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అసెంబ్లింగ్ కేంద్రాన్ని టెరాఫిర్మా నెలకొల్పనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఈ యూనిట్లో కార్యకలాపాలు మొద లు కానున్నాయి. 43 దేశాల్లో విస్తరించిన హీరో మోటాకార్ప్నకు భారత్‌లో ఆరు, కొలంబియా, బంగ్లాదేశ్‌లో ఒక్కొక్క తయారీ కేంద్రం ఉంది. -
Sagubadi: ఆహార భద్రత చేకూరడమే కాదు.. గృహహింస కూడా తగ్గింది!
అర్బన్ ప్రాంతాల్లో ప్రజలను సేంద్రియ ఇంటిపంటల సాగుపై దృష్టి కేంద్రీకరింపచేయడానికి కరోనా మహమ్మారి దోహదం చేసిన సందర్భాలు ప్రపంచం అంతటా కనిపిస్తున్నాయి. సంక్షోభ సమయంలో కిక్కిరిసిన నగరాల్లో తమ ఇళ్ల చుట్టుపక్కల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలాల్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పరిమితులకు లోబడి పండించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇళ్ల దగ్గరే కాకుండా నలుగురూ కలసి కమ్యూనిటీ గార్డెన్లలో సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభించి, ఇప్పటికీ కొనసాగిస్తుండటం సంతోషించవలసిన విషయం. ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్ నగరంలోని మురికివాడల్లో పేద గృహిణుల కథ కూడా ఇలాంటిదే. కరోనా కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులకు ఆహారాన్ని అందించటం కోసం గృహిణులు సేంద్రియ కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టారు. పేదలు నివసించే ప్రాంతాలను ఫిలిప్పీన్స్‌లో పాయటాస్లు అంటారు. ఈ వాడల్లో ప్రజలు లాక్డౌన్ కాలంలో ఆకలికి అల్లాడిపోయారు. ఆ క్లిష్ట సమయంలో మహిళల నేతృత్వంలో నడిచే ‘అగ్రియా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ, పుసో ఎన్జీ అమ ఫౌండేషన్ తదితర సంస్థలు పేద కుటుంబాలకు తొలిదశలో కూరగాయలను విరాళంగా అందించి ఆదుకున్నాయి. అయితే, ఎన్నాళ్లని ఎక్కడి నుంచో కూరగాయలు తెచ్చిస్తాం.. వాటిని పండించుకోవటం వారికే నేర్పిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ఆ విధంగా క్యూజోన్ నగరంలో సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. అగ్రియా సంస్థ చొరవతో మహిళలకు శిక్షణ ఇచ్చింది. పోషకాహారం ఆవశ్యకత, నగర వాతావరణంలో సాంద్ర పద్ధతిలో సేంద్రియ పంటలు పండించే వివిధ పద్ధతులు, వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకోవటం, చీడపీడలను నియంత్రించే పద్ధతులతో పాటు ఆహారోత్పత్తులను విక్రయించడం, ఆర్థిక విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి ప్రధాన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈస్ట్‌వెస్ట్ సీడ్ ఫౌండేషన్, గుడ్ షెఫర్డ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ రాయబార కార్యాలయాలు ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్‌కు అండగా నిలిచాయి. సుమారు 200 మంది మహిళలు ఆహారోత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. అందరూ కలసి తమ ఇళ్లదకు దగ్గర్లోని ఖాళీ స్థలంలో 800 చదరపు మీటర్ల ఉమ్మడి కూరగాయల తోటను నిర్మించుకున్నారు. వాడేసిన ప్లాస్టిక్ సంచులు, గ్రోబ్యాగ్‌లు, కుండీల్లో, నేలపై ఎత్తు మడుల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఈ గార్డెన్ మహమ్మారి నెమ్మదించిన తర్వాత కూడా ఇప్పటికీ రోజూ చక్కని వంకాయలు, చిక్కుళ్లు, ఆకు కూరలు, బొప్పాయి వంటి పండ్లను అందిస్తోంది. ఇంటిపంటల శిక్షణ కార్యక్రమానికి ‘ఫుడ్ హైవ్స్: విమెన్ నౌరిషింగ్ సిటీస్ ప్రోగ్రామ్’ అని ‘అగ్రియా’ సంస్థ పేరు పెట్టింది. శిక్షణ పొందిన మహిళలు తమ ఇళ్లల్లో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు కలసి కమ్యూనిటీ గార్డెన్ ఆరోగ్యకరమైన సేంద్రియ కూరగాయలు పండించగలుగుతున్నారు. చెర్రీ అటిలానో అనే యువతి ‘అగ్రియా’ సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. ఆమె స్వయంగా అర్బన్ ఫార్మర్ కూడా. సేంద్రియ ఇంటిపంటల సాగు నేర్పిన తర్వాత పేదల కుటుంబాలకు ఆహార భద్రత కొంతమేరకు చేకూరిందని, గృహహింస కూడా తగ్గిందని ఆమె అన్నారు. మహమ్మారి కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఈ కారణంగా ఇద్దరు తల్లులు ఆత్మహత్య చేసుకున్నారు కూడా. మహిళా సాధికారతపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది ప్రధాన కారణమని, మహిళలకు సేంద్రియ ఇంటిపంటల సాగు నేర్పించడం వెనుక కారణం కూడా ఇదే అంటారామె. మురికివాడల దగ్గరల్లో భూమి చెత్త కుప్పలు, రసాయనిక వ్యర్థాలతో కూడినదై ఉండటం వల్ల మట్టి విషపూరితమై ఉంది. ఆ నేల ఆహారోత్పత్తికి అనుకూలం కాదు. అందుకని, గ్రామీణ ప్రాంతం నుంచి 800 చదరపు మీటర్ల కమ్యూనిటీ గార్డెన్లో ఎత్తు మడులు నిర్మించడానికి 40 టన్నుల నాణ్యమైన మట్టిని లారీల్లో తేవాల్సి వచ్చింది. లాక్డౌన్ నిబంధనలు, ఇరుకైన రోడ్ల కారణంగా లారీలను దూరంగానే ఆపేయాల్సి వచ్చింది. మహిళలే పట్టుదలగా మట్టి బస్తాలను కిలోమీటరు దూరం మోసుకొచ్చి పంటలు పండించడం ప్రారంభించారని ఆమె వివరించారు. నగరవాసులైన పేద, మధ్యతరగతి మహిళలకు సరైన శిక్షణను అందిస్తే ఆరోగ్యదాయకమైన కూరగాయలు పెంచి కుటుంబానికి పోషకాహారాన్ని అందించడంతో పాటు, అదనపు ఆదాయాన్ని సైతం పొందగలుగుతారని మా అనుభవం రుజువు చేసిందని చెర్రీ అంటున్నారు. – పంతంగి రాంబాబు చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా -
స్టూడెంట్స్ కాపీ కొట్టకుండా సూపర్ ఐడియా.. ఫోటోలు వైరల్
విద్యార్థులు పరీక్ష రాసేసమయంలో కాపీ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్లను పర్యవేక్షించే సిబ్బంది. అయితే ఫిలిప్పీన్స్‌లోని బికోల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ వినూత్న ఆలోచన చేశారు. 'నో చీటింగ్' పేరుతో పరీక్ష రాసే సమయంలో తలలు తిప్పకుండా టోపీ, లేదా వస్త్రం ధరించాలని విద్యార్థులను ఆదేశించారు. అయితే స్టూడెంట్స్ కూడా వీరిక తగ్గట్టే క్రేజీగా అలోచించారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి రకాల రకాల టోపీలు, హ్యాట్లను తయారు చేసుకుని వచ్చారు. పేపర్లు, కార్డ్ బోర్డ్, ఎగ్ బాక్సెస్, రీసైకిల్డ్ మెటీరియల్ ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో హెల్మెట్‌లా వాటిని ధరించి పరీక్ష రాశారు. ఎవరివైపు చూడకుండా, కాపీయింగ్‌కు పాల్పడుకుండా నిజాయితీగా ఉన్నారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ధరించిన హ్యాట్లు, హెల్మెట్లకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్ మేరి జోయ్ మాండేన్ ఆర్టిజ్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్ అందరూ సమగ్రతతో నిజాయితీగా ఉండాలనే ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు. 2013లో థాయ్‌లాండ్‌లో ఇలా చేయడం చూశానని, ఇప్పుడు దాన్నే అమలు చేశామని పేర్కొన్నారు. Students Wear Bizarre ‘Anti-Cheating Hats’ In Philippines College, Video Goes Viral#TNShorts #Cheating #Philippines pic.twitter.com/wdmp5C7OYP — TIMES NOW (@TimesNow) October 24, 2022 చదవండి: పోటీ నుంచి తప్పుకున్న బోరిస్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్! -
‘సెబు’ ప్రాజెక్టును విక్రయిస్తున్న జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిలిప్పైన్స్‌లోని సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తనకున్న 40 శాతం వాటాను జీఎంఆర్ గ్రూప్ విక్రయిస్తోంది. అమ్మకం కారణంగా కంపెనీ రూ.1,330 కోట్లు అందుకోవడంతోపాటు రాబోయే కాలంలో నాలుగేళ్లకుపైగా ఆదాయం స్వీకరించనుంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్ బీవీ, అబూటిజ్ ఇన్ఫ్రా క్యాపిటల్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రుణ భారం తగ్గించడం, అధిక రాబడి కోసం ఆస్తులను మళ్లించడంపై దృష్టి సారించడంలో భాగంగా ఈ వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2026 డిసెంబర్ వరకు సాంకేతిక సేవలను జీఎంఆర్ అందించనుంది. సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును 2014లో జీఎంఆర్ దక్కించుకుంది. -
మన ‘తేజస్’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
ఫిలిప్పీన్స్ లో తెలుగు యువతి తిప్పలు
-
పాస్‌పోర్టు బ్లాక్.. ఫిలిప్పీన్స్‌లో హైదరాబాద్ యువతి తిప్పలు
ఫిలిప్పీన్స్‌లో నవ్య అనే తెలుగు యువతి తిప్పలు పడుతోంది. మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్‌పోర్ట్ బ్లాక్ అయ్యిందని, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. దీంతో మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రంతా నవ్యదీప్తి పడిగాపులు కాసింది. అయితే తన పాస్‌పోర్ట్‌ను కావాలనే బ్లాక్ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనిల్లా ప్రాంతంలో నవ్య 2 ఏళ్ళుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. కోవిడ్ టైంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ఓనర్ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతోంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్ బ్లాక్ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారని..డబ్బులు కట్టనందుకు పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్ పనిచేస్తున్నట్లు నవ్య తెలిపారు. కాగా మెడిసిన్ కోసం నవ్య మూడేళ్లేగా ఫిలిప్పీన్స్‌లో ఉంటోంది. కోవిడ్ సమయంలో ఇండియాకు చేరుకున్న ఆమె ప్రస్తుతం పరిస్థితులు చక్కపడటంతో తిరిగి ఫిలిపిన్స్‌కు బయలు దేధారు. రెండు రోజుల క్రితం నవ్య హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లారు. అయితే మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్న ఆమెను.. తిరిగి ఇండియా వెళ్ళేవారకు లగేజ్ ఇవ్వమని తెలిపారు. -
భార్య లేకపోతేనేం.. పిల్లో ఉందిగా.. యువకుడి వెకేషన్ ఫోటోలు వైరల్
మనీలా: ఏదైనా పర్యటక ప్రదేశానికి వెళ్లినప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామే వెంట ఉంటే ఆ మజానే వేరు. కానీ చివరి నిమిషంలో వెకేషన్‌కు రానని భార్య చెబితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ యువకుడికి. అయితే భార్య లేకున్నా ఒంటరిగానే టూర్‌కు వెళ్లి అతడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సరికొత్తగా ఆలోచించాడని అందరూ అతడ్ని అభినందిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ యువకుడి పేరు రేమండ్ ఫార్చునడో. భార్య జోనీతో పలవన్ రాష్ట్రంలోని కొరన్కు వెకేషన్‌కు వెళ్లాలని చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశాడు. అయితే చివరి నిమిషంలో ఆమె రాలేనని చెప్పింది. అయితే ఎలాగైనా టూర్‌కు వెళ్లాలని భావించిన అతడు భార్య లేని లోటు ఉండకూడదు అనుకున్నాడు. దీనికోసం వినూత్న ఆలోచన చేశాడు. భార్య ఫోటోను ముద్రించిన ఓ దిండును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. టూర్‌కు దాన్ని వెంటతీసుకెళ్లాడు. ఇక తను తిరిగిన ప్రతి చోటుకు ఆ దిండును కూడా తీసుకెళ్లాడు రేమండ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. రేమండ్ ఆలోచన సూపర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. అతని భార్య చాలా అదృష్టవంతురాలని మరికొందరు అన్నారు. రేమండ్ తన భార్య ఫోటో ఉన్న దిండును పట్టుకుని పర్యటక ప్రదేశాలను సందర్శించిన ఫొటోలను మీరూ చూసేయండి.. మరో ఆసక్తికర విషయమేంటంటే టూర్‌కు వెళ్లేముందు కొవిడ్ నింబంధనల ప్రకారం తన భార్య ఫోటో ఉన్న దిండుకు కూడా టెంపరేచర్ చెక్ చేయించాడు రేమండ్. ఇతని క్రియేటివ్ ఆలోచనలను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నాటికి 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది. -
మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?
బడ్జెట్ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం, బదులుగా మరో వస్తువు తీసుకోవడమే. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, ఇతర లోహాలతో చేసిన నాణేలు కరెన్సీగా అమల్లోకి వచ్చాయి. కాగితాన్ని కనిపెట్టాక నోట్లు మొదలయ్యాయి. అందులోనూ ఏ దేశానికి ఆ దేశం నచ్చినట్టుగా కరెన్సీ నోట్లు, నాణేలను తయారు చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ కరెన్సీలో కొన్ని చిత్రాలేమిటో చూద్దామా..? స్టాంపు కాదు డబ్బులే.. ప్రపంచంలోనే ఇప్పటివరకు అధికారికంగా చలామణీ అయిన అతిచిన్న కరెన్సీ నోటు.. రొమేనియా దేశానికి చెందిన ‘10 బని’. 1917లో ముద్రించిన ఈ కరెన్సీనోటు పరిమాణం 4.4 సెంటీమీటర్ల ఎత్తు, 3.3 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే కాస్త పెద్ద సైజు స్టాంపు అంత అన్నమాట. సాధారణంగా కరెన్సీ నోట్లు తక్కువ ఎత్తుతో, ఎక్కువ వెడల్పుతో అడ్డంగా ఉంటాయి. కానీ దీని ఎత్తు ఎక్కువ, వెడల్పు తక్కువ. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ నోట్లకు నకిలీలను తయారు చేస్తే పదేళ్లు జైల్లో వేస్తామని ఆ నోటుపైనే ముద్రించారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) సర్టిఫికెట్ సైజులో లక్ష నోటు... ఈ ఫొటోలో ఓ సర్టిఫికెట్ అంత పెద్దగా కనిపిస్తున్నది ఫిలిప్పీన్స్‌కు చెందిన లక్ష పెసోల కరెన్సీ నోటు. ఆ దేశానికి స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 300 ఏళ్లయిన సందర్భంగా.. 1998లో 14 అంగుళాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పుతో ఈ నోటును విడుదల చేసింది. ప్రపంచంలో అధికారికంగా చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు ఇదే. కోటి కోట్ల కోట్లు.. ఒక్క నోటు మామూలుగా మనం చూసే పెద్ద నోట్లు అంటే ఏంటి? ఐదు వందలు, రెండు వేలే కదా. ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేది. మరి ప్రపంచంలో ఇలా అత్యధిక డినామినేషన్ ఉన్న నోటు ఏదో తెలుసా..? హంగరీ దేశానికి చెందిన ‘కోటి కోట్ల కోట్లు (100 మిలియన్ బిలియన్)’ పెంగో నోటు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న హంగరీలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. దాంతో ఈ నోటును విడుదల చేశారు. 2008లో జింబాబ్వేలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఏకంగా కోటి కోట్ల (హండ్రెడ్ ట్రిలియన్) జింబాబ్వే డాలర్ల నోట్లను విడుదల చేసింది. పోకెమాన్.. డాలర్ మిక్కీమౌస్.. 2 డాలర్లు సాధారణంగా ఏ దేశమైనా తమ నాణేలపై ప్రముఖులు, తమ దేశ ప్రత్యేకతలు వంటివాటిని ముద్రిస్తుంటుంది. కానీ నియూ మాత్రం చిత్రంగా స్టార్‌వార్స్, పోకెమాన్, మిక్కీమౌస్, చివరికి ఇటీవలి ఫ్రాజెన్ వంటి యానిమేటెడ్ క్యారెక్టర్లను కాయిన్లపై ముద్రిస్తోంది. పసిఫిక్ సముద్రం మధ్యలో చిన్న దీవి అయిన నియూ.. న్యూజిలాండ్ పర్యవేక్షణలో స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. ‘నియూ డాలర్స్’గా పిలిచే ఈ కరెన్సీ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది కూడా. -
తొలి అడుగు.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
న్యూఢిల్లీ: ఆయుధాలను, క్షిపణి వ్యవస్థల్ని ఎప్పుడూ దిగుమతి చేసుకునే భారత్ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి సారిగా బ్రహ్మోస్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్‌కు విక్రయించనుంది. ఈ మేరకు భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 37.4 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం (రూ.28 వందల కోట్లకు పైనే) కుదిరింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (బీఏపీఎల్) ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఛేదించగలవు. ఫిలిప్పీన్స్ నేవీకి యాంటీ–షిప్ బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)తో కలిసి బీఏపీఎల్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఫిలిప్పీన్స్ నావికాదళం ఎన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయనుందో రక్షణ శాఖ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని భారీగానే మోహరించింది. తాను సొంతంగా క్షిపణుల్ని తయారు చేయడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన చారిత్రక సందర్భంలో తాను ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి శంభు కుమరన్ వ్యాఖ్యానించారు. ఈ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్వేచ్ఛాయుత వాణిజ్యమనే ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి మరో అడుగు పడినట్టయిందని కుమరన్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్, అస్త్ర, రాడార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం కూడా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని డీఆర్‌డీఒ చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి తొలి ఆర్డర్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది. దాదాపు రూ. 2,780 కోట్ల కాంట్రాక్ట్‌ను బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కు ఫిలిప్పీన్స్ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. క్షిపణులతోపాటు మూడు బ్యాటరీలు, క్షిపణుల నిల్వ, వాటిని ఎలా ప్రయోగించాలనే అంశాలపై ఫిలిప్పీన్స్ సైనిక సిబ్బందికి శిక్షణ, తదితర వివరాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంలో భాగంగా యాంటీ–షిప్ వేరియంట్ క్షిపణులను సరఫరాచేస్తారు. -
ఫిలిప్పీన్స్‌కు భారత్ బ్రహ్మోస్
న్యూఢిల్లీ: భారత తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఫిలిప్పీన్స్ నేవీకి బ్రహ్మోస్‌ను అందించే ఈ డీల్‌పై సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా ఒప్పందంతో భారత్– ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆ దేశ బడ్జెట్‌శాఖ ఇటీవల రెండు ఎస్‌ఏఆర్‌ఓ(స్పెషల్ అలాట్మెంట్ రిలీజ్ ఆర్డర్స్)ను విడుదల చేసింది. వచ్చే కొన్ని వారాల్లో కొనుగోలు విషయమై అధికారిక ప్రకటన వెలువడచ్చని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు అందజేయబోయే క్షిపణుల రేంజ్ సుమారు 290 కిలోమీటర్లు. ఇది ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు అధిక వేగంతో పయనిస్తుంది. దీన్ని సబ్మెరైన్లు, నౌకలనుంచి ప్రయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్ పలు చర్యలు తీసుకుంటోంది. భారత్, ఫిలిప్పీన్స్ గత ఆగస్టులో దక్షిణ చైనా సముద్రంలో నౌకా విన్యాసాలు జరిపాయి. ఈ ప్రాంతంలో ఫిలిప్పీన్స్‌కు చైనాతో వివాదాలున్నాయి. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశారు. -
ఫిలిప్పీన్స్ తుపాను.. 375కు చేరిన మరణాలు
మనీలా: ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుపాను ‘రాయ్’ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య భారీస్థాయిలో పెరుగుతోంది. తాజాగా మరణాల సంఖ్య మొత్తంగా 375కు చేరుకుంది. మరోవైపు, ఈ తుపాను ధాటికి 56మంది జాడ తెలియడం లేదని అధికారులు సోమవారం తెలిపారు. గోడలు, చెట్లు కూలిపడటం, ఆకస్మిక వరదలు, కొండచెరియలు విరిగి పడిన ఘటనల్లో మరో 500 మంది గాయపడ్డారన్నారు. తుపాను తాకిడికి గురైన 25 నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం వీలుకాలేదని చెప్పారు. మరో 200కు పైగా నగరాలు, పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, మంచినీరు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. -
రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి
strongest typhoon to hit the Philippines: ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటి వరకు 208 మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో తుపాను వల్ల ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. (చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!) కాగా, ఆర్చిపెలాగోలోని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని చెప్పారు. ఈ మేరకు కోస్తా ప్రాంతాల్లో మొత్తం తుడుచి పెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్ రెడ్‌క్రాస్ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది పై తుపాను ప్రభావం పడింది. ఈ తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్ కోలుకోలేని స్థితికి చేరింది. కేవలం రెండే రోజుల్లో యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు ఫిలిప్పీన్స్‌లోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పైగా సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మేరకు భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అంతేకాదు చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కు బిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) -
‘రాయ్’ బీభత్సం.. ఫిలిప్పీన్స్‌లో 146 మంది బలి
మనీలా: ఫిలిప్పీన్స్‌ను గురు, శుక్రవారాల్లో అతలాకుతలం చేసిన రాయ్ తుపాను తాకిడికి మృతి చెందిన వారి సంఖ్య 146కు చేరింది. గంటకు 195 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ప్రభావం 7.80 లక్షల మంది ప్రజలపై పడిందని ప్రభుత్వం తెలిపింది. లక్షలాది మందికి నిలువ నీడలేకుండా చేసిందని తెలిపింది. సుమారు 3 లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. General Luna, #siargao update as of 5:00 pm #Odette #TyphoonRai #TyphoonOdette pic.twitter.com/qfxS3LbGJS — queenette blaze (@queenetteblaze) December 18, 2021 Pretty devastating to see Siargao like this 💔 #TyphoonOdette #siargao #TyphoonRai pic.twitter.com/m6d47OWGNE — queenette blaze (@queenetteblaze) December 18, 2021 పలు ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వివిధ ఘటనల కారణంగా ఇప్పటి వరకు 146 మంది చనిపోయినట్లు సమాచారం. తుపాను తీవ్ర ప్రభావం చూపిన ఒక్క బొహోల్ ప్రావిన్స్‌లోనే 72 మంది చనిపోగా, మరో 10 మంది జాడ తెలియడం లేదని గవర్నర్ ఆర్థర్ చెప్పారు. MANILA- At least 33 people were killed in the strongest #Typhoon to hit the #Philippines this year, official tallies showed yesterday, with dozens more missing.#TyphoonRai #TyphoonOdettePH #Flood #Manila #weather pic.twitter.com/Bsa3ZTx2SR — Journalist Siraj Noorani (@sirajnoorani) December 19, 2021 ☠️🌪️ #Typhoon deaths in #Philippines top 137, mayors plead for food 📰 https://t.co/oAGWJn1nn5#TyphoonRai #TyphoonOdette #OdettePh #Rai #RaiTyphoon 🎬 #Aftermath #video pic.twitter.com/83prgV4qd9 — Ψ ABYSS Chronicles (@AbyssChronicles) December 19, 2021 An update for Del Carmen, Siargao #siargao #OdettePH #siargaoupdate #siargaoneedshelp #TyphoonOdette #TyphoonRai pic.twitter.com/cySEVTWaZc — queenette blaze (@queenetteblaze) December 19, 2021 🔴 INFO - #Philippines : Le #typhon #Rai a déjà fait au moins 99 morts et près de 500000 déplacés aux Philippines. (🎥Reuters) #TyphoonRai pic.twitter.com/E1HddJzcZP — FranceNews24 (@FranceNews24) December 19, 2021 (చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!) -
‘రాయ్’తుపాను విధ్వంసం.. 75 మంది మృతి
Super Typhoon Rai Hits Philippines: మనీలా: ఫిలిప్పీన్స్‌ను శక్తివంతమైన టైఫూన్ ‘రాయ్’తుపాను కుదిపేసింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాలు, గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దినగట్, బొహోల్స్ ప్రావిన్స్‌లలో విధ్వంసం సృష్టించాయి. దినగట్లోని నివాసాల్లో 95% వరకు నేలమట్టమయ్యాయి. స్కూళ్లు, ఆస్పత్రులతోపాటు అత్యవసర షెల్టర్లు దెబ్బతిన్నాయి. (చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!) సియార్గావో నామరూపాల్లేకుండా పోయింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలడం తదితర ఘటనల్లో ఇప్పటివరకూ 75 మంది మరణించారని అధికారులు తెలిపారు. సుమా రు 3 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. లేకుంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని చెప్పారు. కొన్ని ప్రావిన్సుల్లో గురువారం నుంచే మొదలైన తీవ్ర గాలులు, వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్, సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం ఇప్పటికీ వీలుకాలేదని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #BREAKING #PHILIPPINES 🔴PHILIPPINES: TYPHOON RAI INTENSIFIED TO CAT 5 STORM! #TyphoonRai / #TyphoonOdette rapidly intensified to a Category 5 storm before making landfall in the Southern Philippines on Thursday, forcing mass evacuations.#BreakingNews #Video #Storm #Tornado pic.twitter.com/yoTof2i6Uk — loveworld (@LoveWorld_Peopl) December 16, 2021 At least 12 people have died in the strongest #typhoon to hit the #Philippines, after the #storm swept across the archipelago uprooting trees, toppling power poles and #flooding villages. Severe flooding in #Mindanao.#TyphoonOdette #Rains #TyphoonRai pic.twitter.com/j7IiLG8WCR — 𝐁𝐡𝐚𝐛𝐚𝐧𝐢 𝐒𝐚𝐧𝐤𝐚𝐫 𝐉𝐞𝐧𝐚 (@Bhabanisankar02) December 18, 2021 (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) LOOK: Philippine Coast Guard release aerial footage of Siargao Island showing extensive flooding. 📸: PCG #TyphoonRai #TyphoonOdette pic.twitter.com/5G9fYQJvsa — Howard Johnson (@Howardrjohnson) December 17, 2021 #Philippines: 18 dead as #TyphoonRai batters country#Odette #TyphoonOdette #Typhoon pic.twitter.com/4A7h3A3h5j — Ψ ABYSS Chronicles (@AbyssChronicles) December 18, 2021 The after math. At Mandaue City Cebu. 🙏😭#OdettePH #TyphoonRai #TyphoonOdette#TyphoonOdettePH Vid from Tina Fajardo pic.twitter.com/jFP8fRCzL4 — DJ Tors (@toraynosaurus) December 17, 2021 -
రాయ్ తుఫాన్ బీభత్సం ఫోటోలు
-
గ్యాంగ్‌స్టర్ పూజారి భారత్‌కు అప్పగింత
ముంబై: ముంబై, కర్ణాటకలో పలు బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో ప్రధాన నిందితుడు, 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ సురేశ్ పూజారిని ఫిలిప్పీన్స్ పోలీసులు అరెస్ట్‌చేసి భారత్‌కు అప్పగించారు. అక్టోబర్‌లో అతడిని ఫిలిప్పీన్స్‌లో అరెస్ట్‌చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అతడిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీబీఐ అధికారులు థానెలో నమోదైన కేసు విచారణ నిమిత్తం ముంబైకు తరలించారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ బెదిరింపుల కేసులో అతడిని 25వ తేదీ దాకా మహారాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) కస్టడీకి అప్పగిస్తూ థానెలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజేంద్ర బుధవారం ఉత్తర్వులిచ్చారు. మహారాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు థానెలో నమోదైన 23 కేసులను మహారాష్ట్ర ఏటీఎస్‌కు బదలాయించారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న పూజారిని అరెస్ట్‌చేయాలంటూ గతంలో ముంబై, థానె పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేశారు. -
కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి
ఇటీవలకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ సెల్ఫీ మోజు మాములుగా లేదు. వేగంగా వెళ్లుతున్న బస్సు లేక రైలు పక్కన సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఏమని అనాలో కూడా అర్థంకాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ మోజుతో ఎంత పిచ్చి పని చేశాడో చూడండి. (చదవండి: ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) అసలు విషయంలోకెళ్లితే...ఫిలిప్పీన్స్‌లోని నెహెమియాస్ చిపాడా అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్మెంట్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ కొలనులో కృత్రిమ మొసళ్లు ఉంటాయనుకుని వాటితో సెల్ఫీకోసం అక్కడ ఉన్న థీమ్ పార్క్‌లోని కొలనులోనికి దిగిపోయాడు. ఇక అంతే అతను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మొసలితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ మొసలి అతని పై దాడి చేసి గట్టిగా ఎడమచేయి పట్టుకుని లాగుతుంది. అయితే చిపాడ పాపం ఏదోరకంగా ఆ చెయ్యిని విడిపించుకుని బయటపడతాడు. దీంతో చిప్పాడను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు అతని ఎడమ చేతికి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే కోలుకుంటున్నాడు. అంతేకాదు అతను కుటుంబసభ్యులు ఆ కొలనులోని దిగవద్దని హెచ్చరిక బోర్డులు లేవు అందువల్ల అతను దిగాడంటూ ఆ పార్క్వాళ్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు . ఈ మేరకు అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు మొసలి కూడా కృత్రిమమైనదని వారు భావించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. పైగా తాము తమ పార్క్ టూర్ గైడ్లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే విషయాలను పర్యాటకులకు చెబుతామని అన్నారు. అయితే చివరికి అమయా వ్యూ పార్క్ అధికారులు చిపడా వైద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) -
వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము
ఫిలిప్పీన్స్: ఎవరికైన పామును చూస్తే సహజంగానే భయం వేస్తుంది. ఎప్పడైన మనం పాములను ఆహారం కోసం వచ్చినప్పుడో లేక ఏదైన చెత్తచెదారాల్లోనో, పొదలుపొదలుగా ఉన్న గుబురు చెట్ట మధ్యలనో చూసి ఉంటాం. కానీ వీధిలో మాంచి రద్దీ రహదారిలో అది కూడా కేబుల్ వైర్లపై నుంచి పాము జారిపడటం ఎప్పుడైనా చూశారా . కానీ ఫిలిప్పీన్స్ నగరంలో ఈ ఘటనే చోటు చేసుకుంది. పైగా రాత్రి సమయంలో తగ్బిలారన్ సిటీలోని అత్యంత రద్దీగా ఉండే బోహోల్ మార్కెట్ వీధిలో ఓవెర్ హెడ్ వైర్లపై అతి పెద్ద పాము పాకుతూ కనిపిస్తుంది. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది) దీంతో అక్కడ నివాసితులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురువుతారు. అంతేకాదు కాసేపటి తర్వాత ఆ పాము రోడ్డు మీద పడిపోతుంది. ఈ మేరకు అక్కడ ఉన్న సదరు వ్యక్తులు ఆ పాముని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో నెటిజన్లు ఏంటో ఎక్కపడితే అక్కడ పాములు కనిపిస్తున్నాయి" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: "థింక్ బి ఫోర్ యూ డయల్") -
ఫిలిప్పీన్స్ అధ్యక్ష బరిలో బాక్సర్ పకియావ్
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆ దేశ బాక్సింగ్ దిగ్గజం, సెనేటర్ మానీ పకియావ్(42) ప్రకటించారు. ఆదివారం జరిగిన పీడీపీ–లబన్ పార్టీ సమావేశంలో పకియావ్ పేరును ఒక వర్గం నేతలు ప్రతిపాదించగా ఆయన అందుకు సమ్మతించారు. ప్రభుత్వ మార్పు కోసం వేచి చూస్తున్న ఫిలిపినో ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘నేనొక యోధుడిని. బరిలోనూ వెలుపల యోధుడిగానే ఎల్లప్పుడూ ఉంటాను’ అని పేర్కొన్నారు. అధికార పీడీపీ–లబన్లోని ఒక వర్గానికి పకియావ్, సెనేటర్ అక్విలినో నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలోని మరో వర్గం, ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు డుటెర్టెని ఉపాధ్యక్షుడిగా, సెనేటర్ బాంగ్ గోను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. బాక్సింగ్‌లోని ఎనిమిది వేర్వేరు విభాగాల్లో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక బాక్సర్‌గా పకియావ్ చరిత్ర సృష్టించారు. చదవండి: షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు.. అయినా సరే పోరాటం -
ఒలింపిక్ రికార్డు.. 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..
టోక్యో: 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... మహిళా వెయిట్‌లిఫ్టర్ హిదిలిన్ దియాజ్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఫిలిప్పీన్స్ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో 30 ఏళ్ల దియాజ్ మొత్తం 224 కేజీల (స్నాచ్‌లో 97+క్లీన్ అండ్ జెర్క్‌లో 127) బరువెత్తి కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. దాంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. లియావో కియున్ (చైనా–223 కేజీలు) రజతం, జుల్ఫియా చిన్షాన్లో (కజకిస్తాన్–213 కేజీలు) కాంస్యం సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో దియాజ్ రజత పతకాన్ని సాధించింది. 1924 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న ఫిలిప్పీన్స్ ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు సాధించింది. -
రూ.8.82 కోట్ల విలువైన కార్లను తుక్కుతుక్కు చేశారు..
మనీలా: లక్షల రూపాయలు ఖరీదు పెట్టి ఎంతో ఇష్టంగా కొనుకున్న కారు మీద చిన్న గీత కనిపించినా మనసు కలుక్కుమంటుంది. చాలా రోజుల పాటు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది కోట్ల రూపాయలు విలువ చేసే కార్లను తుక్కుతుక్కుగా మార్చితే.. అబ్బో తల్చుకోవడానికే బాధగా ఉంది కదా. కానీ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలను విలువ చేసే లగ్జరీ కార్లను వరుసగా పార్క్ చేసి ఆ తర్వాత బుల్డోజర్తో వాటిని తుక్కుతుక్కుగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ కార్లను దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చారట. దాంతో కార్ స్మగ్లర్స్‌ను గట్టిగా హెచ్చరించడం కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 1.2మిలయన్ డాలర్లు(రూ. 8,89,72,920.00) విలువ చేసే 21 కార్లను ఇలా తుక్కుగా మార్చేసింది. ఇలా ధ్వంసం చేసిన కార్లలో మెక్లారెన్ 620 ఆర్, పోర్స్చే 911, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా, మెర్సిడెస్ ఎస్‌ఎల్‌కే, లోటస్ ఎలిస్, మాడిఫైడ్ హ్యుందాయ్ జెనెసిస్ కూపే, టయోటా సోలారా, 14 “మిత్సుబిషి జీపు’’లను ఇలా తుక్కుగా మార్చింది. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ప్రకారం, ఈ లగ్జరీ కార్లన్నీ వేర్వేరు మార్గాల ద్వారా దేశంలోకి "అక్రమ రవాణా" చేయబడ్డాయి. 2018 నుంచి 2020 వరకు వేర్వేరు సందర్భాల్లో వీటిని స్వాధీనం చేసుకుని తుక్కుగా మార్చారు. “ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ 2017-447 ప్రకారం, ప్రభుత్వం కార్ల స్మగ్లర్ల పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలపడం కోసం వీటిని ఇలా నాశనం చేయవలసిందే’’ అని అధ్యక్షుడు రోడ్రిగో రో డ్యూటెర్టే పునరుద్ఘాటించారు. దేశంలోకి అక్రమ రవాణా చేసిన లగ్జరీ కార్లను ఇలా తుక్కుగా మార్చడం ఇది రెండో సారి. గతంలో బీఎమ్‌డబ్ల్యూ జెడ్ 1, ఫెరారీ 360 స్పైడర్, లంబోర్ఘిని గల్లార్డోతో సహా 17 వాహనాలను ఫిబ్రవరి 9 న బ్యూరో ఆఫ్ కస్టమ్స్ తుక్కుతుక్కు చేసింది. ఇది ఇక్కడ చాలా సాధారణ విషయం. గతంలో ఇలా తుక్కుగా మార్చిన వాటిలో రెనాల్ట్ 5 టర్బో, మెర్సిడెస్ ఎస్ఎల్ 55 ఏఎమ్‌జి, ఒపెల్ మాంటా, మసెరటి క్వాట్రోపోర్ట్, కాక లెక్కలేనన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వ చర్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఇంత ఖరీదైన కార్లను ఇలా ధ్వంసం చేసే బదులు ప్రభుత్వమే వేలం వేసి.. వచ్చిన డబ్బును మంచి పనుల కోసం వాడవచ్చు కదా అంటున్నారు జనాలు. చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే! -
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ యుద్ధ విద్యలు ఇక్కడివి కావు
సాక్షి, హైదరాబాద్: మడవి హిడ్మా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు. బీజాపూర్ జిల్లాలో తన ఉనికిపై తానే సమాచారం ఇచ్చి, భద్రతా దళాలకు ఎరవేసి, 23మంది జవాన్లను మట్టుబెట్టే ఆపరేషన్‌కు నేతృత్వం వహించి నడిపించిన హిడ్మా నేపథ్యంపై చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిడ్మాకు అత్యంత కఠిన మావోయిస్టుగా దళంలో పేరుంది. అతను అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులు అంచనా వేయలేకుండా ఉంటాయి. అత్యంత జఠిలంగా.. వ్యూహంలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటికి వెళ్లలేనంత పకడ్బందీగా ఉంటాయి. చేతికి చిక్కిన, ఎదురైన శత్రువుల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. జాలి దయ లేకుండా మరణించేవరకు చంపాలన్నది అతని సిద్ధాంతం. అందుకోసం ఏ మార్గం అనుసరించినా తప్పులేదనే మనస్తత్వం. ఇలాంటి పాశవిక దాడులు గతంలో మావోయిస్టులు అనుసరించలేదు. ఇవి ఇక్కడి యుద్ధ విద్యలు కావు 2010 నుంచి మావోల దాడుల్లో, వ్యూహాల్లో, ఆపరేషన్లు నిర్వహించే తీరులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి వారు చేస్తున్న ప్రతి దాడిలోనూ ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. ఇలాంటి పాశవిక యుద్ధ విద్యలు భారత్‌కు చెంది నవి కావు. ఇవి తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలాంటి దేశాల్లో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనుసరించే వ్యూహాలు. మరి అక్కడి వ్యూహాలు ఇక్కడి వారు ఎలా అమలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఫిలిప్పీన్స్ అన్న సమాధానం వినిపిస్తోంది. మొత్తం దశాబ్దానికిపైగా జరిగిన భారీ ఆపరేషన్లకు హిడ్మానే వ్యూహరచన చేశాడని సమాచారం. తాజా దాడితో పాటు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో చోటుచేసుకున్న విధ్వంసకర సంఘటనలన్నింటికీ ఇతనే నేతృత్వం వహించాడని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. ట్యాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) కూడా హిడ్మా నేతృత్వంలోనే పనిచేస్తుంది. భద్రతా దళాల కోసం మరిన్ని ఉచ్చులు..? ఎరవేసి దాడులు చేయడంలో పేరుగాంచిన హిడ్మా మరిన్ని వ్యూహాలు సిద్ధం చేసి ఉంటాడని నిఘా వర్గాలు ఇప్పటికే భద్రతా దళాలను హెచ్చరించా యి. ప్రతీకార దాడికి దిగే కంటే ఆచితూచి స్పందించడమే మేలని సూచించినట్లు సమాచారం. హిడ్మా కోసం గాలిస్తూ ఆవేశంగా మావోలకు పట్టున్న ప్రాంతాల్లోకి చొరబడితే, ఇదే అవకాశం కోసం చూస్తున్న హిడ్మా మరిన్ని ఉచ్చులతో మరో భారీ దాడికి దిగే అవకాశం లేకపోలేదని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు సైతం అభిప్రాయపడుతున్నారు. చదివింది ఐదో తరగతే.. మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్ సం తోష్ అలియాస్ ఇడ్మాల్ అలియాస్ పొడియం బీమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే అయినా, హిందీ–ఇంగ్లి్లష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు. అందులో మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే కావడం గమనార్హం. అనూహ్యం .. అమానవీయం హిడ్మా దశాబ్దానికి ముందే ఫిలి ప్పీన్స్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అప్పటి మావోయిస్టు చీఫ్ గణ పతి ఆదేశాల మేరకు హిడ్మా బిహార్ మీదుగా నేపాల్ వెళ్లి, అక్కడ నుంచి దొంగ పాస్‌పోర్టు ద్వారా ఫిలిప్పీన్స్ చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. అక్కడే అతను భారీ ప్రాణనష్టమే లక్ష్యం గా భీకరదాడులు చేయడం, వీలైనంత ఎక్కువమందిని చంపడం, ప్రత్యర్థులకు ఎరవేసి చంపడంలో ఆరితేరాడని సమాచారం. హిడ్మా వ్యూహా లన్నీ మూడంచెల్లో ఉంటాయి. తొలుత బాంబులతో దాడి, తర్వాత బుల్లెట్ల వర్షం, ఆ తర్వాత గా యాలతో అల్లాడుతున్న క్షతగాత్రుల గొంతులు కోయడం, శరీరాన్ని కత్తులతో తూట్లుగా పొడవడం తదితర కర్కశ చర్చలన్నీ సైనిక పాలిత, నియంతల పాలనలో సాగుతున్న దేశా ల్లో ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు అనుసరించే యుద్ధతంత్రాలని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో, అంతర్యుద్ధాలు సాగుతున్న దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. 2010లో దంతెవాడలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఓ సైనికుడి శవంపై 78 కత్తిపోట్లు ఉండటం దీనికి నిదర్శనం. ఆపై నెలరోజుల వ్యవ ధిలో ఆర్టీసీ బస్సును పేల్చి సాధారణ ప్రజలతోపాటు 30 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపడ మూ హిడ్మా ఆలోచనే అన్న అనుమానాలున్నాయి. పక్కా వ్యూహం .. పకడ్బందీ ప్రణాళిక బీజాపూర్‌లో జొన్నగూడెం సమీప అటవీ ప్రాం తంలో జరిగిన భారీ దాడికి డిసెంబర్, జనవరిలోనే వ్యూహరచన జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి కోసం బస్తర్ ప్రాంత నక్సలైట్లలో తాను గెరిల్లా శిక్షణ ఇచ్చిన దాదాపు 300 మందికిపైగా షార్ప్ షూటర్లను హిడ్మా పిలిపించినట్లు సమాచారం. వారికి ప్లాన్ వివరించడంతో పాటు తిరిగి సురక్షితంగా తప్పించుకోవడంపై మాక్ డ్రిల్ నిర్వహించేందుకు 2 నెలలకు పైగానే సమయం పట్టి ఉంటుందంటున్నారు. అంతా సరే అనుకున్నాక.. భద్రతా దళాలకు ఉప్పందించడం, వారు ఇతని కోసం పగలూరాత్రి వెదకడం, వారు తాము అనుకున్న ప్రాంతానికి రాగానే, జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా సులువుగా దాడి చేసి పారిపోవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న తక్కువ సామగ్రితోనే వీలైనంత ఎక్కువమంది శత్రువులను మట్టుబెట్టడం హిడ్మా లక్ష్యం. బుల్లెట్లను వీలైనంత తక్కువగా వాడటం, జవాన్లను కత్తులతో పొడిచి, మిగిలిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం అతని వ్యూహంలో భాగమని అంటున్నారు. జొన్నగూడెం ఆపరేషన్‌లో పీఎల్జీఏకు చెందిన సుమారు 200 నుంచి 250 మంది పాల్గొన్నట్లుగా స్పష్టమవుతోంది. -
జీఎంఆర్‌కు ‘ఫిలిప్పీన్స్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను జీఎంఆర్ ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించి అందిన ఫిర్యాదుపై ఫిలిప్పైన్స్‌లోని మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంసీఐఏఏ), అలాగే విమానాశ్రయ ఆపరేటర్ జీఎంఆర్ మెగావైడ్ సెబూ ఎయిర్పోర్ట్ కార్ప్ (జీఎంసీఏసీ) అధికారులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైనట్లు ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ) తెలిపింది. ఈ ఫిర్యాదు విషయంలో న్యాయశాఖ అధికారుల ముందు తమ యాంటీ–ఫ్రాడ్ విభాగం ఆరోపణలు దాఖలు చేసినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు ఫిలిప్పైన్స్కు చెందిన ఎంసీఐఏఏ ఉన్నత స్థాయి అధికారులు, జీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన కొందరితోసహా పదకొండుమంది విదేశీయులు ఉన్నారని ఎన్‌బీఐ ఇటీవల ఒక ప్రకటన తెలిపింది. ఎన్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం ఐర్లాండ్, ఘనాలకు చెందిన వారూ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన కేసులో ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను జీఎంఆర్ ప్రతినిధి నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కేసు నుంచి బయటపడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చట్టం ఏం చెబుతోందంటే.. ఫారిన్ ఈక్విటీ విషయంలో నియంత్రణలు, జాతీయీకరణ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనలను తీసుకువచ్చింది. మోసపూరిత ఒప్పందాలు, అవగాహనలను ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది. కేసు వివరాల్లోకి వెళితే... అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన జీఎంఆర్, ఫిలిప్పీన్స్ మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కన్సార్షియంకు 2014లో విమానాశ్రయ కాంట్రాక్ట్ దక్కింది. నిర్మాణం, అభివృద్ధి, ఆధునికీకరణ, విస్తరణ, నిర్వహణకు సంబంధించి 25 సంవత్సరాల పాటు సేవలకుగాను 320 మిలియన్ డాలర్లకు ఈ కాంట్రాక్టును కన్సార్షియం దక్కించుకుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఫిలిప్పీన్స్ యాంటీ–డమ్మీ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు తాజాగా మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యాయశాఖ అధికారుల ముందు ఫిర్యాదు దాఖలైంది. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకూ న్యాయ విభాగం నుంచి జీఎంసీఏసీకి సమాచారం లేదు. మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ జనరల్ మేనేజర్ ఒకరిని ఈ ఆరోపణలపై ఇటీవలే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం. నిజానికి ఈ కాంట్రాక్ట్ కన్సార్షియంకు దక్కడంపై 2014లోనే ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అన్ని పత్రాలూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2016లో ఈ పిటిషన్‌ను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే విషయాన్ని తన తాజా ప్రకటనలో జీఎంఆర్ ప్రతినిధి ప్రస్తావిస్తూ.. ఈ కాంట్రాక్ట్ పక్రియ మొత్తం చట్టాలకు అనుగుణంగా ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పునర్నిర్మాణానికి ఓకే... ప్రతిపాదిత పునర్నిర్మాణ ప్రక్రియకు ఎక్సే్ఛంజీల అనుమతి లభించినట్టు జీఎంఆర్ ఇన్ఫ్రా (జీఐఎల్) సోమవారం తెలిపింది. పునర్నిర్మాణంలో భాగంగా ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ సర్వీసెస్ విభాగాలను జీఐఎల్ నుంచి విడదీసి జీఎంఆర్ పవర్, అర్బన్ ఇన్ఫ్రాకు బదిలీ చేస్తారు. జీఐఎల్ పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్ వ్యాపార సంస్థగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని విడిగా లిస్ట్ చేయనున్న ట్టు ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ వెల్లడించింది. (చదవండి: ‘మహీంద్రా’ శాంగ్యాంగ్ దివాలా) -
ట్రెండింగ్: పొరపాటున 42 ఆర్డర్లను బుక్ చేసిన చిన్నారి
ఫిలిప్పీన్స్‌లోని సిబూ సిటీలోని ఒక వీధిలో ఒక చిన్నారి చేసిన తప్పు కారణంగా ఒక్క సారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో ఆ కాలనీ నిండిపోయింది. అక్కడ ఉన్న 7 ఏళ్ల చిన్నారి 2ఆర్డర్లకు బదులుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో చేసిన చిన్న తప్పు కారణంగా 42 ఆర్డర్లను బుక్ చేసింది. దింతో అప్పటికే చాలా రద్దీగా ఉండే ఆ వీధి ఒక్కసారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో నిడిపోయింది. దీనికి సంబదించిన ఒక వీడియోను ఫేస్బుక్ యూజర్ డాన్ కైన్ సువారెజ్ అనే వ్యక్తి షేర్ చేసాడు. (చదవండి: వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది అత్యంత సురక్షితం?) వివరాల్లోకి వెళ్ళితే.. 7 ఏళ్ల చిన్నారి తన బామ్మతో కలిసి భోజనం చేయడానికి 2 బాక్సుల చికెన్ ఫిల్లెట్ను ఫుడ్ డెలివేరి యాప్ లో ఆర్డర్ చేయడానికి ప్రయత్నించింది. ఆ పాప ఆర్డర్ చేసినప్పుడు ఇంటర్ నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో ఆ ఫుడ్ ఆర్డర్ పై 42 సార్లు ప్రెస్ చేసింది. ఇలా చేయడం వల్ల ఒక్క సారిగా 42 ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా రద్దీగా ఉండే కాలనీలోకి వచ్చేసరికి అక్కడ వింత వాతావరణం చోటు చేసుకుంది. ఈ అమ్మాయి ఇలా చేయడం మొదటి సారి కాదు గతంలో కూడా ఇలా చాలా సార్లు చేసింది. అసలు ఒక్క ఆర్డర్ ధర వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు 42 ఆర్డర్లకు కలిపి పూర్తి బిల్లు 12,186 రూపాయలు అయ్యింది. దాంతో ఆ పిల్ల బోరున ఏడుపు అందుకుంది. అక్కడ ఉన్నా ప్రజలకు ఈ విషయం తెలవడంతో ఆ ఆర్డర్ లను వారు అవసరం లేకున్నా కొన్నారు. అందుకే మీరు కూడా ఆర్డర్ చేసే ముందు జర జాగ్రత్త. అలాగే, మీ పిల్లకు కూడా ఇలాంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. -
బాలికకు షాక్ ఇచ్చిన స్లో ఇంటర్నెట్
మనీలా: స్లో ఇంటర్నెట్ ఓ బాలిక కొంపముంచింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి కడుపు నింపుకుందామనుకున్న తనకు పెద్ద షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలిక కొద్దిరోజుల క్రితం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంటర్నెట్ స్లోగా ఉండటంతో కన్ఫర్మేషన్ బటన్‌ను పదేపదే నొక్కి తన కోసం, బామ్మ కోసం రెండు ఆర్డర్లను ప్లేస్ చేసింది. కొద్ది సేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగటంతో హుషారుగా తలుపు తెరిచింది. ఇంటి ముందు క్యూలో నిలబడ్డ డెలివరీ బాయ్‌లను చూసి ఒక్కసారిగా ఖంగుతింది. దాదాపు 30 మంది బాయ్స్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 42 ఫుడ్ ఆర్డర్లను తెచ్చి ఆమె ముందు ఉంచారు. ( సెక్యూరిటీ కెమెరాల్లో పదిలంగా తండ్రి ప్రేమ ) దీంతో బాలికకేమీ అర్థం కాలేదు. ఫోన్లో తను ఉంచిన ఆర్డర్ల లిస్ట్‌ను ఓపెన్ చేసి చూసి షాక్ తింది. మొత్తం 42 ఆర్డర్లు ఉంచినట్లు అక్కడ చూపించింది. స్లో ఇంటర్నెట్ కారణంగానే ఇదంతా జరిగిందని తెలుసుకుంది. అయితే 40 ఆర్డర్లను ఏం చేయాలో తెలియలేదు. ఈ నేపథ్యంలో పొరుగింటి వారు బాలికకు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. వీలైనన్ని ఆర్డర్లను వాళ్లు కొనుగోలు చేశారు. బాలిక పొరుగింట్లో ఉండే సుఆరెజ్ అనే మహిళ దీన్నంతా వీడియో తీసి తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. -
ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు!
పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం.. ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ.. అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతినే ఒడిసిపడతాయి. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్న మాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణా లను ఈ పదార్థం ఉపయోగించుకుం టుంది. ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమిపై అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూ వబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందు కున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీల లోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజీని నియంత్రిం చుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసు కోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేం దుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధా రణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిము ఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండ దు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు 9 రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నా యాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుం దని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌ను కుదిపేస్తున్న ‘వామ్కో’
మనీలా: భారీ తుపాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్ఎన్ తెలిపింది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ తెలిపాయి. -
షూలో గుట్టలుగా సాలీళ్లు
మనీలా : ఓ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూసిన నినోయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఏయిర్పోర్టు అధికారులకు వింతైన అనుభవం ఎదురైంది. షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు బయటపడటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఫిలిప్పీన్స్ ఎన్ఏఐఏ ఏయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 28న ఎన్ఏఐఏ కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ జరుగుతోందన్న సమచారంతో సోదాలు చేపట్టారు. ఓ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో స్పోర్ట్స్ షూలు కనిపించాయి. ( వారిపై జీవితాంతం నిషేధం విధించండి! ) వాటిని పరీక్షించగా చిన్న పాటి ప్లాస్టిక్ బాటిళ్లలో అరుదైన జాతికి చెందిన 119 సాలీళ్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు వాటిని వన్య ప్రాణి సంరక్షణా కేంద్రానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని స్మగ్లింగ్‌కు పాల్పడిన వారి కోసం అన్వేషిస్తున్నారు. ఆ పార్శిల్‌పై టూ అడ్రస్ కేవిట్లోని జనరల్ ట్రియాస్కు ఉన్నట్లు గుర్తించారు. ( ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...) -
తుపానులో ‘పెళ్లి’ తంటాలు.. ఫోటోలు వైరల్
కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదన్నట్టు.. వానొచ్చినా...వరదొచ్చినా.. తమ పెళ్లి ముచ్చట కాస్తా జరిగి తీరాల్సిందే అని ఒక జంట నిశ్చయించుకుంది. భారీ వరదల మధ్య ప్రమాదకరమైన నదిని దాటి మరీ ఈ జంట వివాహ వేడుకను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఒక్కటైన జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు. స్థానిక వార్తాపత్రిక ఫిలిప్పీన్ స్టార్ ప్రకారం,టైఫూన్ క్వింటా కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వివాహబంధంతో ఒక్కట వ్వాలనుకున్నారు రోనీ గుళీపా, జెజిల్ మసూలా. వరదలతో పోటెత్తిన లుయాంగ్ నదిని దాటుకుని చర్చికి వెళ్లి అక్టోబర్ 23న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి గౌనులో వధువు, సూట్ ధరించిన వరుడు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ జంటతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ పెళ్లికి హాజరు కావడం విశేషం. వేడుక అనంతరం అంతా ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. బంధువుల్లో ఒకరైన జోసెఫిన్ బోహోల్ సబనాల్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
జూమ్ లైవ్‌లో ప్రభుత్వ అధికారి శృంగారం..
మనీలా : చుట్టు పక్కల ఏం జరుగుతోందో తెలియకుండా తన సెక్రటరీతో శృంగారంలో మునిగిపోయాడో ప్రభుత్వ అధికారి. జూమ్ లైవ్‌లో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికి పోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పిన్స్, ఫాతిమా దాస్ గ్రామ కౌన్సిల్ సభ్యులు పై అధికారి జీసన్ ఎస్టిల్తో ప్రతిరోజూ లాగే గత బుధవారం కూడా జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే టెక్నాలజీ మీద అంత అవగాహన లేని జీసన్ తన చర్చ ముగియగానే ఒక బటన్‌కు బదులు వేరే బటన్ నొక్కి కెమెరా ఆఫ్ చేయకుండా అలానే వదిలేశాడు. అనంతరం తన సెక్రటరీతో శృంగారంలోకి దిగాడు. ( ఆత్మలతో శృంగారం.. అందుకే గర్భస్రావం!) ఇదంతా జూమ్ లైవ్‌లో ఉన్నవారికి కనపడుతోందని అతడు గుర్తించలేదు. కానీ, కొద్దిసేపటి తర్వాత ఇది గమనించిన సెక్రటరీ వెంటనే అతడికి సమాచారం అందించింది. ఆ వెంటనే తేరుకున్న ఆయన కెమెరా ఆఫ్ చేశాడు. అయితే జూమ్ లైవ్‌లో ఉన్న ఓ సభ్యుడు ఆ దృశ్యాలను వీడియో తీశాడు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన స్థానిక ఉన్నతాధికారులు అతడిపై చర్యలకు సిద్ధమయ్యారు. కానీ, వీడియో బయటకు విడుదలైన తర్వాత ఆ ఇద్దరూ తమ విధులకు హాజరు కాకపోవటం గమనార్హం. -
‘ఛేజ్ ది వైరస్ పాలసీ’తో కరోనా కట్టడి!
ముంబై/మనీలా: పది లక్షలకు పైగా జనాభా కలిగి, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, కరోనా మహోగ్రరూపం దాలిస్తే భారీగా ప్రాణ నష్టం చవిచూడాల్సి వస్తుందని మొదట్లో అంతా భయపడ్డారు. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మూడు నెలల్లోనే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలిగింది. ఈ నేపథ్యంలో ధారావి మోడల్‌ను ప్రశంసిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమనడానికి ధారావి అతి పెద్ద ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.(కరోనా: ధారావిపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు) ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కరోనా కట్టడికై ‘ధారావి మోడల్’ను అనుసరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి.. ‘‘ఛేజ్ ది వైరస్ పాలసీ’’ బ్లూప్రింట్‌ను బీఎంసీ ఫిలిప్పీన్స్‌తో పంచుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రయత్నాలకు దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాపించి తొలినాళ్లలో భారత్ ఇతర దేశాల కోవిడ్ కట్టడి మోడల్‌ను ఆచరిస్తే.. ఇప్పుడు విదేశాలు ధారావి మోడల్‌ను ఫాలోకావడం సంతోషంగా ఉందన్నారు. కాగా బీఎంసీ అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం ధారావిలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి 0.8 శాతానికి తగ్గింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 81 శాతానికి చేరుకుంది. గతంతో పోలిస్తే కోవిడ్ మరణాల రేటులో కూడా తగ్గుదల నమోదైంది. -
సోనూసూద్ హామీ: రెండు రోజుల్లో వారంతా ఢిల్లీకి..
ముంబై: లాక్డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒకరు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్. ఇక వలస కూలీలు, కార్మికులను వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్ పేరే వినిపిస్తుంది.కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విమానం ఈ రోజు(శుక్రవారం) మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది. (సోనూ సూద్ దాతృత్వం: మరో విమానం) విదేశీ బాలలకు సోనూసూద్ సాయం కాలేయం మార్పిడి చికిత్స కోసం ఫిలిప్పీన్స్ నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన 39 మంది చిన్నారుల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ పిల్లలందరూ 1–5 ఏళ్ల వారే. వీరంతా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి న్యూఢిల్లీలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ప్రయాణం కుదరడం లేదన్న సంగతి సోను దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన ఆయన.. వచ్చే రెండ్రోజుల్లో వీరిని ఢిల్లీకి తీసుకువస్తామని, వీరి విలువైన ప్రాణాలు కాపాడాల్సి ఉందని ట్వీట్ చేశారు. (నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్ ఇస్తాను) Let’s save these precious lives. Will get them to India in the next two days. Lining up for these 39 angels. Pack their bags. ✈️ https://t.co/oY700MN4B2 — sonu sood (@SonuSood) August 13, 2020 -
సోనూ సూద్ దాతృత్వం: మరో విమానం
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కాలంలో వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న మన భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు మరోసారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు సోనూ సూద్ స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. (చదవండి: నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్ ఇస్తాను) Phase -2 india ➡️ Phillipines. I hope you are ready to be with your families❣️ I have lined up the flight from Manila to Delhi on 14 Aug at 7:10 pm SG9286. Can’t wait you to board and get you home. Have sent you the link❣️🙏 — sonu sood (@SonuSood) August 12, 2020 ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ ట్వీట్ చేస్తూ.. ‘‘భారత్-పిలిప్పీన్స్.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే సోనూ సూద్ ఫిలిప్పీన్స్‌కు విమానాన్ని పంపించడం ఇది రెండవ సారి. కొన్నిరోజుల కిందట మనీలా నుంచి తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అంతేగాక కజకస్థాన్లో చిక్కుకున్న మన తెలుగు వారి కోసం కూడా మరోక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోనూ సూద్ మరో ట్వీట్లో తెలిపారు. ఇది ఆగస్టు 14న కజకస్థాన్ బయల్దేరడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోనూ సూద్ వెల్లడించారు. (చదవండి: కొత్త ఇల్లు: సోనూ సూద్ రాఖీ గిఫ్ట్) Kazakhstan to India is happening. Let's get you home. Almaty Friends.. Pack your bags. SG 9520 Almaty to Delhi, 14th August at 2:15pm is set. The wait to meet your families is finally over. @flyspicejet Start packing. Jai hind🇮🇳 — sonu sood (@SonuSood) August 12, 2020 -
అనంతకు వైద్య విద్యార్థుల మృతదేహాలు
సాక్షి, అనంతపురం: ఫిలిప్పిన్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వంశీకృష్ణ, రేవంత్‌కుమార్ మృతదేహాలు అనంతపురం జిల్లాకు చేరాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఇద్దరు వైద్య విద్యార్థుల మృతదేహాలు ఇండియాకు తీసుకొచ్చారు. ఏప్రిల్ 6న ఫిలిప్పిన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వంశీకృష్ణ, రేవంత్‌కుమార్ మృతిచెందారు. ఎంబోజింగ్ సిస్టం ద్వారా మృతదేహాలు కుళ్లిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఫిలిప్పిన్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షల రూపాయలు వెచ్చించి వైద్య విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించారు. తమ పిల్లల మృతదేహాలు అప్పగించేందుకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు, కేంద్రప్రభుత్వ పెద్దలకు మృతుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కదిరిలో రేవంత్ కుమార్, యాడికి మండలం నిట్టూరులో వంశీకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు విద్యార్థుల మృతదేహాలకు నివాళులు అర్పించారు. అసలేం జరిగిందంటే? కదిరి పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉంటున్న ఎల్ఎల్వీ క్లాత్ సెంటర్ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌తో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లాక్డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా.. వారి మృతదేహాలు భారత్‌కు రావడం కష్టంగా మారింది. సీఎం జగన్ చొరవ.. ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు త్వరగా తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఖర్చుకు వెనకాడవద్దని అధికారులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్ కుమార్ మృతదేహాలను రాష్ట్రానికి రప్పించడంపై విదేశాంగశాఖ మంత్రికి సీఎం లేఖ రాసి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు.