Wasim Akram
-
మార్చి పడేయండి.. అంత సీనుందా?.. వసీం అక్రంకు ఆఫ్రిది కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో చెత్త ప్రదర్శన కారణంగా రిజ్వాన్ బృందంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడాన్ని తప్పుబడుతున్నారు.కనీసం ఒక్క విజయం కూడా లేకుండానే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పటికైనా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని.. ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రం(Wasim Akram) కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.5-6 మార్పులు చేయాల్సి వచ్చినాటెన్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘జరిగిందేదో జరిగింది. ఇదే జట్టుతో గత రెండేళ్లుగా మనం ఎన్నో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు కోల్పోయాం. ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వకార్ యూనిస్ అంటున్నాడు. ఒకవేళ మన జట్టులో 5-6 మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వెనుకాడకండి.ఇదే జట్టును మాత్రం కొనసాగిస్తే వచ్చే ఆరునెలల్లో మనం మరిన్ని చేదు అనుభవాలు చూస్తాం. టీ20 ప్రపంచకప్-2026కు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయండి’’అని వసీం అక్రం పీసీబీకి సూచించాడు. అయితే, ఈ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వ్యాఖ్యలపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభ్యంతరం వ్యక్తం చేశాడు.‘‘వసీం భాయ్ మాటలు నేను విన్నాను. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత మనమంతా భావోద్వేగంలో మునిగిపోయిన మాట వాస్తవం. అయినా.. జట్టు నుంచి 6-7 మంది ఆటగాళ్లను తప్పించాలని వసీం భాయ్ అంటున్నాడు.నిజంగా అంత సీనుందా?ఒకవేళ అదే జరిగితే.. మనకు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐదారుగురు ప్లేయర్లు ఉన్నారా?.. మన బెంచ్ బలమెంతో మీకు తెలియదా వసీం భాయ్! మన దేశవాళీ క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగల ఆటగాళ్లు ఎంతమంది?.. ఒకవేళ మీరన్నట్లు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తే వారిలో ఎంత మందికి సరైన రీప్లేస్మెంట్ దొరుకుతుంది? మీరేమో ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని చెబుతున్నారు.కానీ ఒకవేళ మనం ఆ పని మొదలుపెట్టినా.. అప్పుడు కూడా మన మీద ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మళ్లీ విమర్శలు వస్తూనే ఉంటాయి’’ అని షాహిద్ ఆఫ్రిది సామా టీవీ షోలో వసీం అక్రం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. రెండో మ్యాచ్‌లో దాయాది భారత్ చేతిలో పరాజయం పాలైంది. అనంతరం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క గెలుపు కూడా లేకుండానే ఈ మెగా టోర్నీలో తమ ప్రయాణం ముగించింది. ఇక ఈ ఈవెంట్లో భారత్, న్యూజిలాండ్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం -
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
మార్చి 7, 1987లో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar). తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఈ ఫీట్ నమోదు చేసినా.. ఈ జాబితాలోకి ఎక్కిన మొదటి ఆటగాడిగా గావస్కర్ పేరు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుంది.అయితే, ఇంతటి ఘనమైన రికార్డు సాధించడానికి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాటలే కారణం అంటున్నాడు సునిల్ గావస్కర్. టెన్ స్పోర్ట్స్ షోలో భాగంగా పాక్ మాజీ సారథి వసీం అక్రం(Wasim Akram) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘పదివేల పరుగులు సాధించడం అత్యద్భుతమైన అనుభూతి.వెయ్యి పరుగులు చేసినాక్రికెటర్గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఇక్కడిదాకా చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. వెయ్యి పరుగులు చేసినా ఇంతే సంతోషంగా ఉండేవాడినేమో!.. నిజానికి ఈ మైల్స్టోన్ చేరుకోవాలనే లక్ష్యం నాకైతే లేదు. ఏదేమైనా.. టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా ఎలా చరిత్రలో నిలిచిపోతారో.. నేనూ ఈ మైలురాయికి చేరుకున్న మొదటి ఆటగాడిగా అలాగే గుర్తుండిపోతాను.నిజానికి నేను ఈ ఘనత సాధించడానికి ఏకైక కారణం ఇమ్రాన్ ఖాన్. అప్పుడు మేము ఇంగ్లండ్‌లో ఉన్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లాము. 1986లో ఇది జరిగింది. ఆరోజు.. నేను ఇమ్రాన్‌తో ఇదే నా చివరి సిరీస్ అని చెప్పాను. ఆ తర్వాతరిటైరైపోతానని అన్నాను.అలా అస్సలు చేయొద్దుఅందుకు అతడు.. ‘లేదు.. లేదు.. అలా అస్సలు చేయొద్దు’ అన్నాడు. అందుకు నేను.. ‘ఎందుకు? ఇది నా ఇష్టం కదా’ అన్నాను. దీంతో ఇమ్రాన్ కలుగుచేసుకుంటూ.. ‘త్వరలోనే పాకిస్తాన్ జట్టు భారత్‌కు రాబోతోంది. అక్కడ మేము మీ జట్టును ఓడిస్తాం. నువ్వున్న భారత జట్టును ఓడిస్తేనే అసలు మజా. నువ్వు లేకుండా టీమిండియాను ఓడించడం నాకైతే నచ్చదు’ అన్నాడు.అవునా.. పాక్ టీమ్ ఇండియాకు వస్తుందా? నిజమా అని అడిగాను. అవును.. ఐసీసీ సమావేశం తర్వాత వచ్చే వారం ప్రకటన వస్తుంది చూడు అన్నాడు. ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ వస్తే ఓకే. నేను ఆటలో కొనసాగుతా. లేదంటే రిటైర్ అవుతా అన్నాను. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మరో రెండో మూడో మ్యాచ్‌లు జరిగాయి. అప్పటికి నేను బహుశా 9200- 9300 పరుగుల వద్ద ఉన్నాననుకుంటా.ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయిందిఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ వల్లే నాకు ఈ అరుదైన రికార్డు దక్కింది’’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా 1971 నుంచి 1987 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సన్నీ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 శతకాలు, నాలుగు డబుల్ సెంచరీల సాయంతో 10122 రన్స్ చేసిన గావస్కర్.. వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 3092 పరుగులు సాధించాడు. 75 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్(Pakistan) కథ ముగిసిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలూండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది.ఈ క్రమంలో పాక్ జట్టు గ్రూపు స్టేజీలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. యావత్తు పాకిస్తాన్ మొత్తం వారి క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. మాజీ క్రికెటర్లు అయితే పాక్ జట్టును ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్(Wasim Akram) రిజ్వాన్ సేనపై విమర్శల వర్షం కురిపించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు సరైన డైట్ కూడా పాటించలేదని అక్రమ్ మండిపడ్డాడు."పాకిస్తాన్ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్గా లేరు. సరైన డైట్ కూడా పాటించడం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ళ కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉండడం చూశాను. కోతులు కూడా ఇన్ని అరటిపండ్లు తినవు. అవి వాటికి ఆహారం అయినప్పటికి అతిగా తినవు.కానీ మా ప్లేయర్లు మాత్రం కోతులు కంటే ఎక్కువగా తింటున్నారు. ఈ చెత్త ప్రదర్శన కనబరిచినందుకు జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. క్రికెట్ ఎంతో ముందుకు వెళ్తున్నప్పటికి మా జట్టు మాత్రం ఇంకా గతంలో ఆడినట్లే ఆడుతోంది.అది మారాలి. ఫియర్ లెస్ క్రికెటర్లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురండి. ప్రస్తుత జట్టులో కచ్చితంగా ఐదు, ఆరు మార్పులు చేయాలి. ఇప్పటికైనా మీ తప్పులను మీరు తెలుసుకుంది.టీ20 ప్రపంచకప్-2026 కోసం జట్టును సిద్దం చేయండి" అంటూ అక్రమ్ ఓ క్రికెట్ షోలో పేర్కొన్నాడు. ఇక పాకిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: IML 2025: సచిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ -
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
పాకిస్తాన్ యువ బౌలర్ అబ్రార్ అహ్మద్ వ్యవహారశైలిపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని.. అంతేతప్ప అతి చేయకూడదంటూ చీవాట్లు పెట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడింది.దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీయగా.. పేసర్లలో హార్దిక్ పాండ్యా రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ దక్కించుకున్నారు.పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిజ్వాన్(46) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లోనే 20 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆదిలో దూకుడుగా ఆడినా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకానికి చేరువైన సమయంలో అనూహ్య రీతిలో గిల్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.అయితే, ఆ సమయంలో అబ్రార్ అహ్మద్ కాస్త అతిగా స్పందించాడు. రెండు చేతులు కట్టుకుని నిలబడి.. ‘‘ఇక వెళ్లు’’.. అన్నట్లుగా కళ్లతోనే సైగలు చేయగా సహచర ఆటగాళ్లు కూడా వచ్చి అతడితో ఆనందం పంచుకున్నారు. అప్పుడు మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి కాస్త సంయమనం పాటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. అబ్రార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.‘‘ప్రిన్స్‌తో పెట్టుకున్నందుకు.. కింగ్ మీకు చుక్కలు చూపించాడు. మిమ్మల్ని ఓడించాడు. అందుకే అతి చేయొద్దు’’ అంటూ టీమిండియా అభిమానులు కోహ్లి శతకంతోనే పాక్ జట్టుకు బదులిచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గిల్ వికెట్ తీసిన తర్వాత అబ్రార్ అహ్మద్ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం కూడా స్పందించాడు.‘‘అబ్రార్ బంతి వేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. కానీ అతడి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వికెట్ తీసిన ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కానీ.. మ్యాచ్‌లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటివి పనికిరావు. ఎంత హుందాగా ఉంటే అంత మంచిది. అయితే, ఈరోజు అబ్రార్ అతి చేశాడు. అతడిని వారించేందుకు అక్కడ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇలాంటి ప్రవర్తన టీవీల్లో చూడటానికి కూడా అస్సలు బాగాలేదు’’ అని వసీం అక్రం అబ్రార్‌కు చురకలు అంటించాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక మెగా వన్డే టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో పాటు గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. -
CT 2025: అతడిని ఎలా ఎంపిక చేశారు?: వసీం అక్రం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం(Wasim Akram) పెదవి విరిచాడు. ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్‌కు మాత్రమే చోటివ్వడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బౌలింగ్ ఆల్‌రౌండర్ షాహీం ఆష్రఫ్(Faheem Ashraf)ను ఈ మెగా టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదంటూ విమర్శించాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుండగా.. ఇటీవలే పీసీబీ తమ జట్టును ప్రకటించింది.అతడిని ఎలా ఎంపిక చేశారు?ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘జట్టును ప్రకటించేశారు. కొద్ది మంది పేర్లను గమనించాను. ఫాహీం అష్రఫ్ ఈ జట్టులో ఉన్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్. ప్రతిభావంతుడైన క్రికెటరే.కానీ గత 20 మ్యాచ్‌లలో అతడి బౌలింగ్ సగటు 100.. బ్యాటింగ్ సగటు 9. అయినా.. సరే అష్రఫ్‌ను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. ఇక ఖుష్దిల్ షా ఎంపిక కూడా అనూహ్యం. అయినా.. ఈసారి మనం ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం.అదే టీమిండియా.. ముగ్గురు, నలుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. అందుకు కారణాలు ఏమైనా గానీ.. మనం మాత్రం ఒకే స్పిన్నర్‌ను ఎంపిక చేయడమేంటి?.. ఇక ఆతిథ్య జట్టుగా మనపై ఎలాగూ ఒత్తిడి ఉంటుంది. అన్ని ప్రతికూలతలు అధిగమించి సెమీ ఫైనల్ వరకైనా చేరాలని ఆశిస్తున్నా’’ అని వసీం అక్రం స్పోర్ట్స్ యారీతో పేర్కొన్నాడు.ఇదైతే బాగుందిఅయితే, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఫఖర్ జమాన్‌ను పిలిపించి మంచి పనిచేశారంటూ పాక్ సెలక్టర్ల నిర్ణయాన్ని వసీం అక్రం సమర్థించాడు. ‘‘మనకు ఓపెనింగ్ జోడీతో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకోవడం సానుకూలాంశం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు.ఏదేమైనా బాబర్ ఆజంను ఓపెనర్‌గా పంపాలి. అతడి బ్యాటింగ్ టెక్నిక్ గొప్పగా ఉంటుంది. యాభై ఓవర్లపాటు అతడు క్రీజులోనే ఉంటే.. కచ్చితంగా 125 పరుగులైనా చేస్తాడు. ఇక రిజ్వాన్‌ను మిడిలార్డర్లో పంపాలి. జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. నసీం షా వచ్చేశాడు. ఇప్పటికే షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ ఉన్నారు. వీళ్లకు తోడుగా హస్నైన్ కూడా ఉన్నాడు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.ఆ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటివ్వాల్సిందిఅయితే, ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమిర్ జమాల్‌కు చోటు దక్కకపోవడం తనను నిరాశపరిచిందని వసీం అక్రం ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీర్ఘకాలం పాటు జట్టుకు ఉపయోగపడగల ఆమిర్‌ను సెలక్టర్లు పట్టించుకోకపోవడం సరికాదన్నాడు. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ మరోసారి విజేతగా నిలిస్తే చూడాలని ఉందని.. అయితే, మిగతా జట్లు కూడా వరల్డ్‌క్లాస్ ఆటతో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అందరితోపాటు తాను కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించగా.. వరల్డ్‌కప్‌లో సెమీస్ కూడా చేరని పాక్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలోకి దూసుకువచ్చింది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు వెళ్లలేని టీమిండియా.. దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది.చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
బుమ్రా కాదు.. అతడే బెస్ట్ ఫాస్ట్ బౌలర్: పాక్ క్రికెటర్
ఆధునికతరం ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా ఉన్న ఈ రైటార్మ్ పేసర్ భారత్‌కు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించాడు. తనదైన బౌలింగ్ శైలితో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా మాజీ క్రికెటర్ల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు.అయితే, పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ మాత్రం బుమ్రా గురించి భిన్నంగా స్పందించాడు. ఈ తరం బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడన్న షెహజాద్.. తన దృష్టిలో మాత్రం పాక్ లెజెండ్ వసీం అక్రం మాత్రమే అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్ అని పేర్కొన్నాడు.నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అహ్మద్ షెహజాద్‌ను హోస్ట్ బెటర్ పేసర్‌ను ఎంచుకోవాలంటూ.. వసీం అక్రం, వకార్ యూనిస్, షేన్ బాండ్, జస్ప్రీత్ బుమ్రా, షాన్ టైట్, మిచెల్ స్టార్క్ పేర్లను చెప్పాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇది చాలా సులువైన ప్రశ్న. మీరు చెప్పినవాళ్లలో అందరి కంటే బెస్ట్ పేసర్ వసీం అక్రం’’ అని షెహజాద్ పేర్కొన్నాడు.ఇక బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుత బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. అతడొక వరల్డ్ క్లాస్ బౌలర్. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్నవాడు’’ అని షెహజాద్ భారత పేసర్‌ను ప్రశంసించాడు. అదే విధంగా.. అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరన్న ప్రశ్నకు బదలిస్తూ.. ‘‘రషీద్ లతీఫ్.. రిషభ్ పంత్ కంటే బెటర్ కీపర్’’ అని షెహజాద్ చెప్పుకొచ్చాడు. కాగా బుమ్రా, రిషభ్ పంత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో కంగారూల చేతిలో ఓడింది. మూడో టెస్టు డ్రా కాగా.. ఇరుజట్ల మధ్య మెల్బోర్న్, సిడ్నీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
టీమిండియాను పాక్ కూడా ఈజీగా ఓడిస్తుంది: వసీం అక్రమ్ ఎగతాళి
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో భారత జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలోనే స్పిన్‌కు బాగా ఆడుతారని పేరొందిన భారత బ్యాటర్లు.. ఇప్పడు అదే స్పిన్‌ను ఆడేందుకు భయపడుతున్నారు. ముంబై 147 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని కూడా భారత్ చేధించలేక చతికలపడింది. కివీస్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 9 వికెట్లు కివీ స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. అయితే ఇదే అవకాశంగా తీసుకుని భారత జట్టును ఇంగ్లండ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎగతాళి చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్‌లు భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ కూడా ఓడిస్తుంది?మెల్బోర్న్ వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అక్రమ్,మైఖేల్ వాన్లు కామేంటర్లగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా వాన్ మాట్లాడుతూ.."పాకిస్తాన్-భారత్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలనుకుంటున్నాను' అని అన్నాడు. అందుకు బదులుగా అక్రమ్ "నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుంది. ఇది రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని పెంచుతుంది" అని సమాధానమిచ్చాడు. ఇక్కడవరకు అంతే బాగానే చివరిలో అక్రమ్, వాన్ తన వక్ర బుద్దిని చూపించుకున్నారు. "ఇప్పుడు స్పిన్పిచ్లపై టీమిండియాను పాక్ ఓడించగలదు" అని వాన్ వ్యాఖ్యనించాడు. అక్రమ్ కూడా అందుకు అంగీకరించాడు."భారత్ స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడుతంది. కాబట్టి టర్నింగ్ వికెట్లపై టీమిండియాను ఓడించే అవకాశముంది. న్యూజిలాండ్ భారత జట్టును వారి స్వదేశంలోనే 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది" అని అక్రమ్ రిప్లే ఇచ్చాడు. కాగా వీరిద్దరి కామెంట్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
పంత్‌కు అలా జరిగినప్పుడు.. పాక్‌లోనూ భయపడ్డాము: వసీం అక్రమ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తనదైన స్టైల్లో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. టెస్టుల్లో తనొక బ్రాండ్ అని మరోసారి రిషబ్ నిరూపించుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భయంకరమైన కారు ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ తన మార్క్ చూపించిన పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ చేరాడు. పంత్ తిరిగి రావడంతో ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా ఉండాలని అక్రమ్ హెచ్చరించాడు."రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా అద్భుతం చేశాడన్పిస్తోంది. అంతటి ప్రమాదం నుంచి కోలుకుని అతడు రీ ఎంట్రీ ఇవ్వడం చాలా గ్రేట్. అతడి కారు ప్రమాదం జరిగిన తీరును చూసి పాకిస్తాన్లో మేమంతా ఆందోళన చెందాము. అందులో నేను కూడా ఉన్నాను.అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ కూడా చేశాను. టెస్టుల్లో పంత్ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆస్ట్రేలియా గడ్డపై అతడి సెంచరీ, ఇంగ్లండ్‌పై బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం పంత్ రివర్స్ స్వీప్ ఆడాడు. ఇందులో అతడిని మించినవారే లేరు.రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరైనా సరే కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతోంది. మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా పంత్ మాత్రం చాలా తక్కువ వ్యవధిలోనే తన ఫిట్నెస్ను సాధించాడు. పంత్ కథను తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఐపీఎల్ రీఎంట్రీలోనూ సత్తాచాటాడు. 40కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ రాణించాడు. అనంతరం తనకు ఇష్టమైన రెడ్‌బాల్ క్రికెట్లోనూ మెరిశాడు. పంత్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనిపిస్తోంది. అతడిని ఆపేందుకు ఆసీస్ ఇప్పటి నుంచే వ్యూహాలను రచించాలని " అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
అఫ్రిది, షమీ కాదు.. అతడే నా ఫేవరెట్ బౌలర్: వసీం అక్రమ్
భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం తరంలో బుమ్రానే తన ఫేవరెట్ బౌలర్ అని అక్రమ్ కొనియాడాడు. బుమ్రా టీమిండియాలో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వరల్డ్ క్రికెట్లో టీమిండియా నెం1 జట్టుగా ఎదగడంలో బుమ్రాది కీలక పాత్ర. అంతేకాకుండా గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను సైతం తన అద్బుత ప్రదర్శనతో బుమ్రా అందించాడు. తాజాగా అక్రమ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ బౌలర్ ఎవరన్న ప్రశ్న వసీంకు ఎదురైంది. వెంటనే అక్రమ్ ఏమీ ఆలోచించకుండా బుమ్రా పేరు చెప్పాడు.వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన వారు లేరు. ప్రస్తుత బౌలర్లలో అందరికంటే బుమ్రా ముందున్నాడ. అతడి బౌలింగ్ ఒక అద్భుతం. బంతితో అతడి కంట్రోల్ చేసే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.జస్ప్రీత్ బౌలింగ్‌లో ఎక్కువగా వేరియేషన్స్ ఉంటాయి. తన బౌలింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. కొత్త బంతితో కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. న్యూబాల్‌తో బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతడి ఔట్స్వింగర్లను ఎదుర్కొవడం చాలా కష్టం.చాలా సార్లు నేను ఔట్స్వింగర్లను బౌలింగ్ చేసినప్పుడు నియంత్రణ కోల్పోయి పరుగులు ఇచ్చేవాడిని. కానీ బుమ్రా మాత్రం అలా కాదు. బంతితో పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. కొత్త బంతితో బుమ్రా నాకంటే బెటర్‌గా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడని అమ్రిక్క్రిక్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ పేర్కొన్నాడు. కాగా వసీం తమ జట్టు స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదిని తన అభిమాన బౌలర్‌గా ఎంచుకోకపోవడం గమనార్హం. -
'పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు.. కొంచెం కూడా గేమ్ ప్లాన్ లేదు': అక్రమ్
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ చతకిలపడింది.దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ పాక్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విమర్శల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రాను మహ్మద్ రిజ్వాన్ మరింత జాగ్రత్తగా ఆడుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అక్రమ్ మండిపడ్డాడు."వారు 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. మా ఆటగాళ్లకు క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పించలేను. తొలుత మహ్మద్ రిజ్వాన్‌కు అస్సలు గేమ్‌పై అవగాహన లేదు. వికెట్లు తీయడానికే బుమ్రాను రోహిత్ ఎటాక్‌లోకి తెచ్చాడని రిజ్వాన్‌కు తెలుసు. అటువంటి అప్పుడు అతడి బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. కానీ రిజ్వాన్ మాత్రం రిజ్వాన్ భారీ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఇక ఇఫ్తికార్ అహ్మద్‌కి లెగ్ సైడ్ ఆడటం తప్ప ఇంకేమి రాదు. గతకొన్నేళ్లగా జట్టులో భాగమైనా బ్యాటింగ్ ఎలా చేయాలి అతడికి తెలియదు. పాక్ ఆటగాళ్లకు ఒక్కటే తెలుసు. మేము ఆడకపోతే మాకెంటి నష్టం, కోచ్‌లను కదా తొలగిస్తారని థీమాగా ఉన్నారు. కానీ నావరకు అయితే కోచ్‌లను కొనసాగించి మొత్తం జట్టును మార్చాల్సిన సమయమిదని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు. -
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్- సన్‌రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్ -
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఐపీఎల్-2024లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కన్నీళ్లుస్టార్ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో హిట్‌మ్యాన్ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్ శర్మ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్) మెంటార్షిప్లో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్. అతడు కేకేఆర్‌లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. -
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
పదకొండు ఇన్నింగ్స్.. 542 రన్స్.. సగటు 67.75.. స్ట్రైక్ రేటు 148.08.. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి దాకా నమోదు చేసిన గణాంకాలు. ఇక పదకొండింట జట్టు గెలిచిన మ్యాచ్‌లు నాలుగు.వరల్డ్‌కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నిస్తూఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి మెరుగ్గానే ఆడుతున్నా.. జట్టు వరుస పరాజయాల పాలవడంతో అతడి స్ట్రైక్‌రేటు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఎంతగా విఫలమవుతున్నా పట్టించుకోని కొందరు కామెంటేటర్లు అదే పనిగా కోహ్లి ఆట తీరును విమర్శించడం.. వరల్డ్‌కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నించడం వంటివి చేశారు.మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం జట్టు ప్రయోజనాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడుతున్నాడంటూ కోహ్లిని సమర్థించారు. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందిస్తూ.. ‘‘బయట ఎక్కడో కూర్చుని మాట్లాడేవాళ్ల కామెంట్లను పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ విమర్శకులకు కౌంటర్ వేశాడు.మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాముఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘అవునా.. చాలా మంది మేము బయట వాగుడు పట్టించుకోం అని గంభీరాలు పలుకుతూ ఉంటారు.మరెందుకని ఇలాంటి రిప్లైలు ఇస్తూ ఉంటారు. మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాము. మాకేమీ అజెండాలు ఉండవు. మేము ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతాం.మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే కోపం ఉండదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడతాం’’ అని గావస్కర్ అన్నాడు. ఈ నేపథ్యంలో గావస్కర్‌పై కోహ్లి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గతంలో.. కోహ్లిని విమర్శించే క్రమంలో అతడి భార్య అనుష్క శర్మను ఉద్దేశించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.ప్రతిసారీ కోహ్లి గురించే మాట్లాడటం ద్వారా ఎల్లపుడూ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నమే ఇదంటూ మండిపడుతున్నారు. గతంలో గావస్కర్ 176 బంతుల్లో 36 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం మీరు ఏం చేసినా చెల్లుబాటే గానీ.. కోహ్లి చేస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.విమర్శలు సరికాదుఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం స్పందిస్తూ.. కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడని.. అనవసరంగా అతడిని తక్కువ చేసి మాట్లాడవద్దని కామెంటేటర్లకు హితవు పలికాడు. ఆర్సీబీలో మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోహ్లిపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో గాడిలో పడింది.చదవండి: ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ -
మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్దది: వసీం అక్రమ్
ఐపీఎల్- ప్రపంచంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు రారాజు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ ఐపీఎల్లో భాగం కావాలని కలలు కంటుంటారు. పీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాచ్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. అయితే మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ సైతం ఐపీఎల్‌కు పోటీగా ఓ టీ20 లీగ్(పాకిస్తాన్ సూపర్ లీగ్)ను నిర్వహిస్తోంది. ఇప్పటికీ 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్ఎల్ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ పాక్ క్రికెటర్లు, మాజీలు పాకిస్తాన్ సూపర్ లీగ్‌నే వరల్డ్‌లో నెం1 అని ప్రగల్బాలు పలుకుతూ వస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ లీగ్ అని అక్రమ్ పేర్కొన్నాడు. అక్రమ్ తాజాగా ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్కీడాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వరల్డ్ ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లో ఐపీఎల్ లేదా పీఎస్ఎల్ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా.. 'నేను పీఎస్ఎల్తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పనిచేశాను. అన్నిటికంటే ఐపీఎల్ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్ లీగ్. అందులో ఎటువంటి సందేహం లేదు. పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చడం సరికాదు. పీఎస్ఎల్ పాకిస్తాన్‌కు మినీ ఐపీఎల్ వంటిది" అని అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
ఆసీస్‌తో టెస్టులో బాబర్ విఫలం.. వసీం అక్రం రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం విఫలమయ్యాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ ఘోర ఓటమి నేపథ్యంలో బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ పాక్ సారథిగా వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్.. టీ20 నాయకుడిగా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కెప్టెన్ మార్పు అనంతరం పాకిస్తాన్ జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113.2 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 346/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 141 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ (90; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక తొలి టెస్టు ఆడుతున్న పాక్ బౌలర్ ఆమెర్ జమాల్ 111 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (42; 6 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (30; 5 ఫోర్లు) అవుటయ్యారు. ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాబర్ ఆజం.. 54 బంతులు ఎదుర్కొని 21 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఆసీస్- పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రం సైతం బాబర్ ప్రదర్శన పట్ల పెదవి విరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) ఇదిలా ఉంటే.. మిగతా పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 28, అఘా సల్మాన్ 28 పరుగుల(నాటౌట్)తో పర్వాలేదనిపించారు. దీంతో 271 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇక మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, స్టీవ్ స్మిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ ఈసారి డకౌట్ కాగా.. మార్నస్ లబుషేన్(2) మరోసారి నిరాశపరిచాడు. -
టీమిండియాను భారతీయుడు, పాక్‌ను పాకిస్తానీయే నడిపించాలి: గంభీర్
టీమిండియా, పాకిస్తాన్ కోచింగ్ సిబ్బందిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్‌ల సేవల కోసం తాపత్రయ పడకుండా.. స్వదేశీ క్రికెటర్లను మార్గ నిర్దేశకులుగా నియమించుకుంటే సత్ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు భారత జట్టు చక్కని ఉదాహరణ అంటూ పరోక్షంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. కాగా గత కొన్నేళ్లుగా టీమిండియాకు భారత మాజీ క్రికెటర్లు హెడ్కోచ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం వరకు రవిశాస్త్రి, అతడి తర్వాత ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే, పాకిస్తాన్ మాత్రం ఎక్కువగా విదేశీ కోచ్‌లనే నియమించుకుంటోంది. అయితే, వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం తర్వాత మాత్రం పూర్తి ప్రక్షాళనకు సిద్ధమై.. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన విధానం చూసిన తర్వాత.. మనకు బయటి వ్యక్తులు కోచ్‌లుగా అవసరం లేదనే విషయం నిరూపితమైంది. విదేశీ కోచ్‌ల కంటే మన కోచ్‌లు ఏమాత్రం తక్కువకాదు. అయితే, మనవాళ్లకున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. విదేశీ కోచ్లలా.. ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవడం.. ఆ ల్యాప్‌టాప్‌లు పట్టుకుని హల్చల్ చేయడం.. అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం వంటివన్న మాట! ఎందుకంటే మనది కార్పొరేట్ సంస్కృతి కాదు. అయితే, క్షేత్రస్థాయి నుంచే మన ఆటగాళ్లను మెరికల్లా ఎలా తీర్చిదిద్దాలో మనవాళ్లకు బాగా తెలుసు’’ అని గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. ఇదే షోలో పాల్గొన్న పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రంతో చర్చిస్తూ.. ‘‘మనవి ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్న దేశాలు కాదు. వరల్డ్‌కప్ గెలిచిన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. టీమిండియాను భారత కోచ్, పాకిస్తాన్ టీమ్‌ను పాకిస్తానీ ముందుకు నడిపించగలరు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా 2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలో గంభీర్ సభ్యుడు. ఇక 2007లో భారత జట్టుకు కోచ్‌గా లాల్‌చంద్ రాజ్‌పుత్ వ్యవహరించగా.. 2011లో గ్యారీ కిర్‌స్టన్ మార్గదర్శనం చేశాడు. చదవండి: WC 2023: రోహిత్, ద్రవిడ్‌ను వివరణ అడిగిన బీసీసీఐ.. హెడ్‌కోచ్ ఆన్సర్ ఇదే?! -
ఫైనల్లో అలా ఎందుకు చేశారు.. అతడికి బదులు: గంభీర్ విమర్శలు
CWC 2023 Final Ind Vs Aus Winner Australia: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన తుదిమెట్టుపై బోల్తా పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచకప్ టోర్నీ ముగిసి రెండురోజులు అవుతున్నా క్రీడా వర్గాల్లో ఈ మ్యాచ్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ గౌతం గంభీర్, పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరోసారి జగజ్జేతగా నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ సేన విధించిన ఈ లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. ఫైనల్ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చర్చలకు తావిచ్చాయి. సూర్యకుమార్ యాదవ్‌ను ఆరో స్థానంలో గాకుండా ఏడో నంబర్లో ఆడించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా ఎందుకు చేశారు? ఈ విషయంపై తాజాగా స్పందించిన గంభీర్.. ‘‘నిజం చెప్తున్నా.. సూర్యకుమార్ కుమార్ విషయంలో అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ఏదేమైనా అతడిని ఏడో నంబర్‌కు డిమోట్ చేయడం సరైన నిర్ణయం కాదు. విరాట్ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నపుడు.. అతడికి తోడుగా సూర్యను పంపించి.. దూకుడుగా ఆడమని చెప్పాల్సింది. ఎందుకంటే అతడి తర్వాత జడేజా ఉంటాడు కాబట్టి సూర్య కూడా కాస్త స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య బాగా ఇబ్బంది పడ్డాడు. ‘‘నేను అవుటైతే.. నా తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌షమీ, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నారు’’ అనే మైండ్‌సెట్‌తో మరీ డిఫెన్సివ్‌గా ఆడాడు. సమర్థించిన వసీం ఒకవేళ తన తర్వాత జడేజా వస్తాడంటే సూర్య తన సహజమైన గేమ్ ఆడేవాడు. సూర్యకు ప్యూర్ బ్యాటర్‌గా జట్టులో చోటిచ్చి ఏడో నంబర్లో పంపే బదులు.. అతడికి బదులు వేరే వాళ్లను ఎంపిక చేయాల్సింది’’ అని స్పోర్ట్స్‌కీడా షోలో అభిప్రాయపడ్డాడు. ఇక వసీం అక్రం కూడా గంభీర్ వాదనను సమర్థిస్తూ.. ‘‘అవును.. అతడు ప్యూర్ బ్యాటర్. ఒకవేళ హార్దిక్ జట్టులో ఉన్నపుడు కేవలం కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయనకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదనిపిస్తుంది. కానీ అప్పటికి చాలా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా!’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. చదవండి: వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం View this post on Instagram A post shared by ICC (@icc) -
మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ ఎంతో బెటర్: షోయబ్ మాలిక్
వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పాకిస్తాన్.. తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం వరుస ఓటముల చవిచూసింది. దీంతో ఇటువంటి పోటీ ఇవ్వకుండా టోర్నీ నుంచి పాక్ నిష్కమ్రిస్తుందని అంతా భావించారు. కానీ బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై అద్బుత విజయాలు సాధించినపాకిస్తాన్ మళ్లీ సెమీస్ రేసులో నిలిచింది. అయితే శ్రీలంకపై కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. పాక్ సెమీస్ ఆశలపై నీళ్లు జల్లింది. అయితే పాకిస్తాన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 287 పరుగులతో తేడాతో విజయం సాధిస్తే సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ ఓడిపోవడంతో సెమీస్‌కు చేరే దారులు మూసుకుపోయాయి. ఇక తాజాగా పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆ దేశ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ ఎంతో బెటర్ అని మాలిక్ అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని పెవిలియన్ షోలో మాలిక్ పేర్కొన్నాడు. ఇదో షోలో మరో పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ మాట్లాడుతూ.."అఫ్గానిస్తాన్ జట్టు మాకంటే బలంగా కన్పించింది. మా బాయ్స్ నిరంతరం క్రికెట్ ఆడటం వల్ల బాగా అలసిపోయారు. నిజంగా అఫ్గానిస్తాన్ మాత్రం అద్బుతమైన క్రికెట్ ఆడిందని చెప్పుకొచ్చాడు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై..! -
CWC 2023: పాక్‌ను సెమీస్‌కు చేర్చేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్
ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్‌కు చేరడం ఖాయమైపోయింది. పాక్ సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్ 11) జరుగబోయే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్‌లో పాక్ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్‌కు ఈ టాస్క్ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్ సెమీస్ అవకాశాల విషయంలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్లే అని చెప్పాలి. ప్లాన్ బి ఏంటంటే.. పాక్ సెమీస్‌కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్లో అతను మాట్లాడుతూ పాక్ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్‌పై తమ జట్టు 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్ ఔట్' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్ పాక్ జట్టుపై టైమ్డ్ ఔట్ సెటైర్లు వేశాడు. -
Aus Vs Pak: చెత్త బౌలింగ్.. అయినా వరల్డ్‌కప్‌లో అరుదైన ఘనత!
ICC ODI WC 2023: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ లెజెండరీ పేస్ బౌలర్ వసీం అక్రం పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆసీస్ శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్‌కు.. కంగారూ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్ కలిసి మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 367 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(18), మహ్మద్ రిజ్వాన్(46), ఇఫ్తికార్ అహ్మద్(26) రూపంలో కీలక వికెట్లు తీయడంతో పాటు మహ్మద్ నవాజ్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్టార్క్ మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 65 పరుగులు సమర్పించుకుని.. ఒక (హసన్ అలీ(8)) వికెట్ తీయగలిగాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వసీం అక్రంతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ►గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా)- 39 మ్యాచ్‌లలో 71 వికెట్లు ►ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 40 మ్యాచ్‌లలో 68 వికెట్లు ►లసిత్ మలింగ(శ్రీలంక)- 29 మ్యాచ్‌లలో 56 వికెట్లు ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 22 మ్యాచ్‌లలో 55 వికెట్లు ►వసీం అక్రం(పాకిస్తాన్)- 38 మ్యాచ్‌లలో 55 వికెట్లు. ►►వసీం అక్రం కంటే వేగంగా స్టార్క్ 55 వికెట్లు తీయడం గమనార్హం. చదవండి: WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
సిరాజ్ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్‌బౌలర్లు రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. బుమ్రా మొదలెడితే.. సిరాజ్ చుక్కలు చూపించాడు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ఛేదించి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్ సాధించి నయా జోష్‌లో ఉంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతరీతిలో ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి సూపర్-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ ఇక ఆసియా కప్-2023లో కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్ Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఈ సిల్వర్ మెడల్ పసిడి కంటే ఎక్కువ.. వసీం అక్రం పోస్ట్! సెల్ఫ్ గోల్..
Neeraj Chopra- Arshad Nadeem- Wasim Akram's 'Worth More Than A Gold': వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మరోసారి మువ్వన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. నాలుగు దశాబ్దాల భారతీయుల కలను నిజం చేస్తూ ఈ జావెలిన్ త్రో స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించి భారతావని ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. నీరజ్ రెండో ప్రయత్నంలో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజతం దక్కించుకున్నాడు. అర్షద్‌ను పిలిచి మరీ ఫొటో దిగిన నీరజ్ ఇదిలా ఉంటే దాయాది దేశాలకు చెందిన నీరజ్, అర్షద్ పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ సన్నిహితంగా మెలిగిన తీరు క్రీడాభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా ఫొటో దిగేందుకు నీరజ్.. అర్షద్‌ను పిలవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రం మాత్రం తన పోస్ట్‌తో విమర్శల పాలయ్యాడు. అర్షద్ సిల్వర్ మెడల్ సాధించడాన్ని కొనియాడిన వసీం అక్రం.. ‘‘టేక్ ఏ బో అర్షద్ నదీం.. నీ రజత విజయం నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నువ్వు సాధించిన సిల్వర్ మెడల్ పసిడి పతకం కంటే ఎక్కువే! ఎందుకిలా అంటున్నానంటే.. మిగతా అథ్లెట్లతో పోలిస్తే నీకు అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా నువ్వు ఇక్కడిదాకా చేరుకున్నావు. క్రికెట్ కాకుండా మరో క్రీడను కూడా దేశ ప్రజలు సెలబ్రేట్ చేసుకునే అవకాశమిచ్చావు’’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. సెల్ఫ్ గోల్.. అభిమానుల నుంచి విమర్శలు ఈ నేపథ్యంలో.. సొంత అభిమానుల నుంచే వసీం అక్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘‘సరైన సౌకర్యాలు లేవని నువ్వే చెప్తున్నావు. క్రికెటర్‌గా బాగానే సంపాదించావు కదా! అర్షద్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించవచ్చు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక నీరజ్ చోప్రా అభిమానులు.. ‘‘నీరజ్, అర్షద్ అన్నదమ్ముల్లా బాగానే కలిసిపోయారు. నువ్వు మాత్రం ఇలా బుద్ధి చూపించావు’’ అంటూ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రంపై ఫైర్ అవుతున్నారు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం! Take a bow Arshad Nadeem… the whole Pakistan is celebrating your silver medal … worth more than a gold … in World Athletics Championship. Why I said it’s worth more than a gold is that you don’t get the top level facilities other athletes get, but you still excelled. So… pic.twitter.com/sG6ZA9alNw — Wasim Akram (@wasimakramlive) August 28, 2023 -
WC 2023: ఆ విషయంలో టీమిండియాకు కష్టమే.. ఎందుకంటే: పాక్ దిగ్గజ క్రికెటర్
పుష్కరకాలం తర్వాత భారత్ ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. టీమిండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా ట్రోఫీ కోసం పడనున్నాయి. ఇక ఐసీసీ టోర్నమెంట్లో ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వదేశంలో ఈవెంట్ జరగడం సానుకూలంగా పరిగణిస్తున్న తరుణంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇదే అంశం టీమిండియాకు ప్రతికూలంగానూ మారే అవకాశం ఉందంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం. ‘‘టీమిండియాలో గొప్ప ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, స్వదేశంలో ఆడటం ఒక్కోసారి మైనస్ అవుతుంది కూడా! 2011లో భారత్ ట్రోఫీ గెలిచింది. అందుకే ఈసారి సొంతగడ్డపై టోర్నీ జరగడం.. జట్టుపై మరింత ఒత్తిడి పెంచుతుంది. కేవలం టీమిండియా విషయంలో మాత్రమే కాదు.. ఒకవేళ పాకిస్తాన్లో ఈవెంట్ జరిగినా పాక్ జట్టు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రయోజనాలతో పాటు ఇలాంటి కొన్ని ‘నష్టాలు’ కూడా ఉంటాయి. సొంత ప్రేక్షకుల నడుమ భారీ అంచనాల నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడిలో ఆడటం అంత తేలికేమీ కాదు’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టులో అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నారన్న ఈ మాజీ పేసర్.. ‘‘టీమిండియాలో మహ్మద్ షమీ.. అతడి బౌలింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. అయితే, బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ అతడు అన్ని రకాలుగా మ్యాచ్‌లకు సన్నద్ధంగా ఉంటే.. అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. పేస్ విభాగం పటిష్టమవుతుంది. ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్.. వీరిద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే, ఇద్దరూ వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హులే’’ అని రేడియో హాంజీ కార్యక్రమంలో తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్- పాక్ మధ్య అక్టోబరు 15న మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు కాగా నవరాత్రుల నేపథ్యంలో తేదీ మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వసీం అక్రం దగ్గర ప్రస్తావించగా.. ‘‘మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ అన్న అంశంలో ఆందోళన చెందాల్సిన పనేలేదు’’ అని పేర్కొన్నాడు. -
గిల్‌ను సచిన్‌తో పోల్చిన అక్రమ్.. స్పందించిన పాక్ మాజీ కెప్టెన్! ఎమన్నాడంటే?
గత కొన్ని నెలలగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో అక్రమ్ పోల్చాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023లో ఈ యువ ఓపెనర్ అదరగొట్టాడు. ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేసి ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకుముందు ఈ ఏడాదిలో న్యూజిలాండ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ, అదే జట్టుపై టీ20 సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా గిల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఐపీఎల్లో దుమ్మురేపిన గిల్.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఈ నేపధ్యంలో స్టార్ స్పోర్ట్స్’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో అక్రమ్ పాల్గొన్నాడు. "ఒకవేళ నేను గిల్ వంటి అద్భుతమైన ఆటగాడికి టీ20 ఫార్మాట్లో బౌలింగ్ చేస్తే.. వన్డేలలో సచిన్‌కు తొలి 10 ఓవర్లలో ఎలా వేసేవాడినో అలాగే వేస్తా. అతడు కచ్చితంగా సచిన్ అంతటి వాడు అవుతాడని" అక్రమ్ కొనియాడాడు. ఇక గిల్‌ను ఉద్దేశించి అక్రమ్ చేసిన వాఖ్యలపై మరోపాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ స్పందించాడు. "గిల్‌కి బౌలింగ్ చేయడం సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం ఒక్కటే అని వసీం భాయ్ అన్నాడు. నాకు తెలిసి గత కొన్ని రోజులగా చాలామంది గిల్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. గొప్ప గొప్ప ఆటగాళ్లు గిల్‌ను సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్లతో పోల్చుతున్నారు. ముఖ్యంగా అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్ గిల్‌ను ప్రశంసించడం.. అది అతడికి దక్కిన గౌరవం. నిజానికి గిల్ కూడా అందుకు అర్హుడు. అతడు కొన్ని నెలలగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు ఇదే దూకుడును రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నా" అని తన యూట్యూబ్ ఛానల్లో భట్ పేర్కొన్నాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా
ది ఓవల్ వేదికగా జూన్ 7నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ నిలవాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో అత్యతుత్తమ ప్రదర్శన కనబరిచి డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తోంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత ఫాస్ట్ బౌలర్లకు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఓ విలువైన సలహా ఇచ్చాడు. ఓవల్ మైదానంలో బంతి సాధారణంగా స్వింగ్ అవుతుంది కాబట్టి బౌలర్లు మరీ అత్యుత్సహం చూపించల్సిన అవసరం లేదని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా షమీ, సిరాజ్ వంటి ప్రధాన బౌలర్లు సరైన వ్యూహాలతో బౌలింగ్ చేయాలని అక్రమ్ సూచించాడు. "భారత జట్టులో అనుభవజ్ణలైన బౌలర్లు ఉన్నారు. ఓవల్‌లో తొలి 10,15 ఓవర్ల పాటు బంతికి అద్బుతంగా స్వింగ్ అవుతుందని అందరికీ తెలుసు. కాబట్టి భారత బౌలర్లు కొత్త బంతితో అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదు. అత్యుత్సాహం చూపించి ఆ 10, 15 ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు అదనపు పరుగులు ఇవ్వకూడదు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త బౌన్స్ లభించిందని ఉత్సాహపడకండి. ఆస్ట్రేలియన్లకు కావాల్సింది అదే" అని ఐసీసీ షేర్ చేసిన వీడియోలో అక్రమ్ చెప్పుకొచ్చాడు. కాగా 140 ఏళ్ల ఓవల్ మైదానం చరిత్రలో జూన్ ప్రారంభంలో ఓ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. కాబట్టి పిచ్ ఎలా సహకరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై అక్రమ్ కూడా స్పందించాడు. ఓవల్ పిచ్ సాధారణంగా ఉపఖండంలోని జట్లకు అనుకూలంగా ఉంటుంది. మేము ఇక్కడ ఆడినప్పుడల్లా మాకు ఒక ఛాలెంజ్‌గా ఉండేంది. అయితే సాధారణంగా ఇక్కడ టెస్టు మ్యాచ్‌లు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ప్రారంభంలో జరిగేవి. కానీ ఈ సారి భిన్నంగా జూన్ ఆరంభంలో జరగుతుంది. పిచ్ ఫ్రెష్‌గా ఉంది. కాబట్టి డ్యూక్ బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని అక్రమ్ పేర్కొన్నాడు. . కాగా సాధారణంగా టెస్టు క్రికెట్లో కూకబుర్ర బంతిని వాడుతారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం డ్యూక్ బంతిని ఐసీసీ ఉపయోగించనుంది. చదవండి: IND vs WI: విండీస్‌తో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా హార్దిక్! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! రింకూ కూడా -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆ జట్టే టైటిల్ ఫేవరేట్: పాకిస్తాన్ లెజెండ్
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ జరగున్న సంగతి తెలిసిందే. జాన్ 7 నుంచి జూన్ 11 వరకు లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ తుది పోరు జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ కూడా చేరాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే అవకాశాలు భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. "ఓవల్‌లో సాధరణంగా టెస్టు మ్యాచ్‌లు ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటిలో జరగుతాయి. అప్పడు పిచ్ బాగా డ్రైగా ఉంటుంది. కాబట్టి బ్యాట్లరకు అనుకూలంగా ఉటుంది. కానీ ఢబ్ల్యూటీసీ పైనల్ మాత్రం జూన్‌లో జరగుతుంది. కాబట్టి పిచ్ ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. దీంతో పిచ్‌లలో బంతి బౌన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా డ్యూక్ బంతి ఎక్కువగా స్వింగ్ కూడా అవుతోంది. డ్యూక్ బంతి కూకబుర్ర కంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆసీస్ బౌలర్లు ఎక్కువగా బౌన్సర్లు వేస్తే భారత బ్యాటర్లు కచ్చితంగా ఇబ్బంది పడతారు. భారత బౌలింగ్ ఎటాక్ ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త వీక్‌గా ఉంది. నా వరకు అయితే ఆస్ట్రేలియానే టైటిల్ ఫేవరేట్" అని ఓ ఐసీసీ ఈవెంట్లో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా సాధారణంగా టెస్టు క్రికెట్లో కూకబుర్ర బంతిని వాడుతారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం డ్యూక్ బంతిని ఐసీసీ ఉపయోగించనుంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..! -
జడేజాను ట్రై చేశారు.. కానీ ఏం లాభం? కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాక్ దిగ్గజం
IPL 2023- CSK Future Captain: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులేని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించలేం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నాలుగుసార్లు సీఎస్కేను చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. మరి 41 ఏళ్ల ధోని రిటైరైన తర్వాత చెన్నైని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? సగటు అభిమానితో పాటు క్రీడా విశ్లేషకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. కెప్టెన్‌గా.. ఆటగాడిగానూ ఫెయిల్ గత సీజన్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బాధ్యతల వల్ల ఇటు కెప్టెన్‌గా విఫలం కావడంతో పాటు.. అటు ఆటగాడిగా కూడా జడ్డూ ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ ధోని పగ్గాలు అందుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సీఎస్కే పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ధోనికి ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో మరోసారి సీఎస్కే కెప్టెన్సీ అంశం తెరమీదకు వచ్చింది. రహానే బెస్ట్ ఆప్షన్ ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం చెన్నై సారథిగా ధోని వారసుడి ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘ఐపీఎల్-2022లో సీఎస్కే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ట్రై చేసింది. దాంతో జట్టుతో పాటు జడ్డూ ప్రదర్శనపై కూడా ఎలాంటి ప్రభావం పడిందో అందరూ చూశారు. మధ్యలోనే మళ్లీ కెప్టెన్‌ను మార్చాల్సి వచ్చింది. నాకు తెలిసి ప్రస్తుతం వాళ్ల ముందు రహానే కంటే మెరుగైన ఆప్షన్ లేదు. అతడు నిలకడైన ఆటతో ముందుకు సాగుతున్నాడు. స్థానిక(భారత) ఆటగాడు కూడా! ఫ్రాంఛైజ్ క్రికెట్లో లోకల్ క్రికెటర్లే కెప్టెన్లుగా రాణించడం చూస్తూనే ఉన్నాం. నిజానికి విదేశీ ఆటగాళ్లను కెప్టెన్లను చేస్తే.. వారు తమ జట్టులో ఉన్న అందరి పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా వారికి కష్టమే. అలాంటిది వాళ్లు జట్టును ఎలా ముందుకు నడిపిస్తారు? ధోని గనుక సీఎస్కే పగ్గాలు వదిలేయాలని భావిస్తే.. నా దృష్టిలో మాత్రం ధోని వారసుడిగా రహానే మాత్రమే సరైనోడు’’ అని స్పోర్ట్స్ కీడాతో వసీం అక్రం వ్యాఖ్యానించాడు. కానీ.. నమ్మకం ఉంటేనే అయితే, డ్రెసింగ్ రూంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదన్న అక్రం.. రహానేపై ఫ్రాంఛైజీకి నమ్మకం ఉంటేనే ఇలాంటి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో చెన్నై ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 5 గెలిచింది. దంచికొడుతున్న ఒకప్పటి వైస్ కెప్టెన్ ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు సీఎస్కే తరఫున 7 మ్యాచ్‌లలో ఆరు ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే 224 పరుగులు చేశాడు. ఈ ఎడిషన్‌లో తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేయడం విశేషం. ఇక ఇప్పటిదాకా రహానే అత్యధిక స్కోరు 71(నాటౌట్). కాగా రహానేకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో నాటి సారథి విరాట్ కోహ్లి గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో రహానేది కీలక పాత్ర. చదవండి: నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్ MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! -
ఫేర్వెల్ ఫంక్షన్లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్ మాలిక్ ఎక్కడ..?
Sania Mirza-Shoaib Malik: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న సానియా.. చివరిసారిగా రాకెట్ పట్టుకుని అందరినీ అలరించింది. ఫేర్వెల్ మ్యాచ్‌ల్లో భాగంగా జరిగిన సింగిల్స్ పోటీలో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీని ఢీకొట్టింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో సానియానే విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, హీరో దుల్కర్ సల్మాన్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్వెల్ మ్యాచ్‌ల అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్లో పాల్గొన్న సానియా.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్, ప్రిన్స్ మహేశ్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. Wasim Akram and Shoaib Malik in an intense discussion after the match 🧐 What could they be discussing? 🤔#IUvKKpic.twitter.com/HHumHfhUnt — Cricket Pakistan (@cricketpakcompk) March 3, 2023 కాగా, సానియా గౌరవార్ధం నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి నెటిజన్లు షోయబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జనాలకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. షోయబ్‌కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్వెల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే షోయబ్.. ఆ ఫ్రాంచైజీ మెంటార్, పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌తో వాదన తరహా డిస్కషన్‌కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. భార్య సానియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. సానియా-షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో వ్యవహరించడంతో వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే బాకీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
Wasim Akram: భారత వీసా లేదు.. బోరున ఏడ్చేసా..!
పాకిస్తాన్ మాజీ పేసర్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ గతంలో జరిగిన ఓ విషాద సన్నివేశాన్ని తన ఆటోబయోగ్రఫీ "సుల్తాన్.. ఎ మెమోయిర్"లో ప్రస్తావించాడు. ఆ విషయాన్ని అక్రమ్ తాజాగా స్పోర్ట్స్ స్టార్ మ్యాగజిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. విషయం ఏంటంటే.. 2009లో అక్రమ్ తన భార్య హ్యుమా అక్రమ్‌తో కలిసి చెన్నై మీదుగా సింగపూర్‌కు ఫ్లైట్‌లో బయల్దేరాడు. మధ్యలో ఇంధనం నింపుకునేందుకు విమానం చెన్నైలో ల్యాండ్ కాగానే అప్పటికే గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అక్రమ్ భార్య హ్యుమా తీవ్ర అస్వస్థతకు గురై, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని అక్రమ్ బోరున విలపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అక్రమ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో కొందరు గుర్తించారు. ఆ సమయంలో అక్రమ్‌కు కానీ అతని భార్యకు కానీ భారత వీసాలు లేవు. దీంతో అతని భార్య చికిత్స కోసం భారత్‌లో ప్రవేశించే అస్కారంలేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఎయిర్పోర్ట్ అధికారులు అక్రమ్‌కు సహకరించి, అతని భార్యను చెన్నైలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అక్రమ్ భార్య అతర్వాత కొద్ది రోజులకే కన్నుమూసింది. ఇదే విషయాన్ని అక్రమ్ స్పోర్ట్స్ స్టార్ మ్యాగజిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. భారత అధికారులు గొప్ప మనసును కీర్తించాడు. తాను పాకిస్తానీని అయినప్పటికీ చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తన పరిస్థితి తెలిసి జాలిపడటమే కాకుండా కావాల్సిన సాయం చేశారని కొనియాడాడు. ఆ సమయంలో ఏడుస్తున్న తనను ఓదార్చడమే కాకుండా, వీసా గురించి ఆందోళన చెందవద్దని, తాము అంతా చూసుకుంటామని తనలో ధైర్యం నింపారని తెలిపాడు. ఈ విషయాన్ని మనిషిగా తానెప్పటికీ మరిచిపోలేనని పాత విషయాలను నెమరేసుకున్నాడు. -
కోపంతో ఊగిపోయిన పాకిస్తాన్ దిగ్గజం.. సోఫాను తన్నుతూ! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ మరో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కరాచీ పరాజాయం పాలవ్వడంతో ఆ జట్టు ప్రెసిడెంట్, పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ తన సహానాన్ని కోల్పోయాడు. తమ జట్టు ఓటమిపాలైన వెంటనే అక్రమ్ తన ముందు ఉన్న సోఫాను బలంగా తన్నాడు. అతడి చర్య అక్కడ ఉన్న కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సింది. ఇక ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన కరాచీ.. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజాయం పాలైంది. చదవండి: BGT 2023: ఆసీస్‌తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత HAHAHAHAHAH pic.twitter.com/6w727GIhRy — a. (@yoonosenadaa) February 22, 2023 -
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పాక్ దిగ్గజ పేసర్లు వసీం అక్రం, వకార్ యూనిస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఇద్దరితో పాటు సలీమ్ మాలిక్ పైనా ఆరోపణలు రావడంతో దీనిపై జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అక్రమ్, వకార్ల పేర్లు ఉన్నాయి. తాజాగా రమీజ్ రాజా ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ ఫిక్సింగ్ కేసులో చాలా మంది ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 2010లో మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్ 2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ అయ్యాక వీళ్లెవరినీ సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయంపై రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు. ''నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా తప్పించుకోకూడదు'' అని అన్నాడు. . చదవండి: లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి -
'పబ్లిసిటీ కోసమే ఇదంతా.. మాట్లాడడం వ్యర్థం'
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్.. తన ఆటోబయోగ్రఫీ ''సుల్తాన్: ఏ మొమొయిర్'' ద్వారా వరుసగా సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ''విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు పాక్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ తనను ఒక పనివాడిలా చూసేవాడని.. బట్టలు ఉతికేంచేవాడని.. అవసరమైనప్పుడల్లా మసాజ్ చేయించుకునేవాడు.. అంతేకాదు అతనొక స్వార్థపరుడు.. నాకు బౌలింగ్ ఇవ్వడానికి ఆలోచించేవాడు'' అంటూ అక్రమ్ తన బయోగ్రఫీలో పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే తాజాగా అక్రమ్ వ్యాఖ్యలపై సలీమ్ మాలిక్ ఎదురుదాడి చేశాడు. ''వాస్తవానికి అక్రమ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. మేం అప్పట్లో ఏ టూర్‌కు వెళ్లినా అక్కడ లాండ్రీ మెషిన్లు ఉంటాయి. మా బట్టలు అందులో వేసేవాళ్లం తప్ప ఎవరు ఉతుక్కునేవాళ్లం కాదు. ఇక నేను స్వార్థపరుడిని అంటున్నాడు. నిజానికి నేను కాదు అక్రమ్ స్వార్థపరుడు. తన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం ఎన్ని అబద్దాలు అయినా చెప్తాడు. తాజాగా తన బయోగ్రఫీలోనూ అదే పేర్కొన్నాడు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు. తనను తాను అవమానించుకుంటున్నట్లు అతనికి అర్థమవడం లేదు. అయినా అక్రమ్ వ్యాఖ్యలపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బట్టలు ఉతికించడం.. మసాజ్ చేయించడం లాంటి పదాలు వాడాడు కాబట్టే.. అవన్నీ అబద్దాలు అని మాత్రమే చెప్పగలను. ఇంతకుమించి నేను ఏం మాట్లాడదలచుకోలేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అతనిపై జీవితకాలం నిషేధం పడింది. చదవండి: అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్ బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట! -
అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరో బాంబ్‌ను పేల్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సహచర ఆటగాడు సలీమ్ మాలిక్ తన పట్ల అమానవీయంగా ప్రవర్తించాడని అక్రమ్ ఆరోపించాడు. మాలిక్ తనను ఒక బానిసలా చూసేవాడని అక్రమ్ వెల్లడించాడు. కాగా సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో జీవితకాలం నిషేధం విధించబడింది. "సలీమ్ మాలిక్ చాలా స్వార్ధపరుడు. అతడు తన సీనియారిటీ నాపై ఉపయోగించేవాడు. నన్ను అతడి సేవకుడిలా చేసుకున్నాడు. నేను అతడికి మసాజ్ చేయాలని డిమాండ్ చేసేవాడు. అదే విధంగా తన బట్టలు, బూట్లు శుభ్రం చేయమని నన్ను ఆదేశించేవాడు. నా సహచర ఆటగాళ్లు రమీజ్, తాహిర్, మొహ్సిన్, షోయబ్ మొహమ్మద్ నన్ను నైట్‌క్లబ్‌లకు పిలిచే వారు. ఆ సమయంలో వాళ్లపై చాలా కోపం వచ్చేది" అని తన ఆత్మకథలో అక్రమ్ రాసుకున్నాడు. కాగా గతంలో సలీమ్ మాలిక్ కూడా చాలా సార్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌పై తీవ్రమైన వాఖ్యలు చేశాడు. నన్ను అసలు కెప్టెన్‌గా కొంచెం కూడా గౌరవించకపోయే వారని చాలా సందర్భాల్లో మాలిక్ తెలిపాడు. చదవండి: Wasim Akram Rehab Experience: 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే'
పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరోసారి సంచలన విషయాలు బయపెట్టాడు. గ్రేడ్ క్రికెటర్స్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అక్రమ్ కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు నాకు ఇష్టం లేకున్నా దాదాపు రెండున్నర నెలల పాటు రీహాబిలిటేషన్‌లో ఉండడం నరకంలా అనిపించదని పేర్కొన్నాడు. అంతేకాదు ఒకరికి ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచానికి చట్టవిరుద్ధం అనిపించొచ్చు.. కానీ పాకిస్తాన్లో మాత్రం అలా ఉండదన్నాడు. అక్రమ్ మాట్లాడుతూ.. ''ఇంగ్లండ్‌లో ఒక పార్టీకి వెళ్లినప్పుడు తెలియకుండానే కొకైన్కు బానిసగా మారిపోయా. ఎంతలా అంటే కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగేలాగా. తొలిసారి కొకైన్ రుచి చూడడం ఇప్పటికి నాకు గుర్తు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రయత్నిస్తారా అని అడిగాడు. అప్పటికే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడంతో పెద్దగా ఇబ్బంది ఉండదనుకొని తొలిసారి కొకైన్ రుచి చూశాను.. అందునా ఒక గ్రామ్ కొకైన్ మాత్రమే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చేశా. అయితే కొకైన్‌లో ఏదో తెలియని పదార్థం నా మనసును జివ్వుమని లాగడం మొదలుపెట్టింది. ఒక్కసారి రుచి చూసిన పాపానికి ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌గా మారిపోయాడు. ఇక కొకైన్ లేనిదే నా జీవితం లేదు అనే స్టేజ్‌కు వచ్చేశాను. అలా నా పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటికే నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని చాలా బాధపెట్టాను.. కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో వెంటనే నా భార్య నీకు చికిత్స అత్యవసరమని చెప్పింది. మా ఇంటికి కొద్ది దూరంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ ఉండడంతో అక్కడ జాయిన్ అవ్వమని చెప్పింది. నేను నెలరోజులు మాత్రమే ఉండడానికి అంగీకరించాను. కానీ నాకు తెలియకుండానే అక్కడ దాదాపు రెండున్నర నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. మనకు ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచంలో చట్టవిరుద్ధం కావొచ్చు.. కానీ పాకిస్తాన్లో అలా కాదు. చివరికి అక్కడి నుంచి బయటపడిన తర్వాత కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఒక రకంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక భయంకరమైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాను. ఇక ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో రీహాబిలిటేషన్ సెంటర్లు చాలా విశాలంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్లో అలా కాదు. కేవలం కారిడార్‌తో కలిపి ఎనిమిది గదులు మాత్రమే ఉంటాయి. దీంతో ఆ ప్రదేశం నిత్య నరకంలా అనిపించి భయంగా గడపాల్సి వచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే నా జీవితంలో అతి పెద్ద విషాదం చోటుచేసుకుంది. నా భర్యా చనిపోవడం నా జీవితాన్ని సరిదిద్దింది. విదేశాల్లో ప్రతీ తండ్రి పిల్లల పట్ల ఎంతో కేరింగ్‌గా ఉంటారు. కానీ మా దేశంలో ఇవన్నీ ఇంట్లోని ఆడవాళ్లు మాత్రమే చూసుకుంటారు. నా భర్య చనిపోవడంతో నాలో మార్పు మొదలైంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.. అవసరమైన సందర్భాల్లో వారికి అండగా నిలబడడం.. కొన్నిసార్లు వారు చదివే పాఠశాలకు వెళ్లడం.. పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చేది. ఈ విషయంలో ఇతర పిల్లల తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు.'' అంటూ ముగించాడు. చదవండి: ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం.. కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో -
పాక్ దిగ్గజ బౌలర్‌తో అర్ష్‌దీప్ సింగ్‌కు పోలికా?! ఇలా మాట్లాడితే..
T20 World Cup 2022- Arshdeep Singh: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ ప్రభావం చూపగలిగాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 23 ఏళ్ల అర్ష్ వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఆడిన ఆరు మ్యాచ్‌లలో మొత్తంగా 10 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. కొత్త స్వింగ్ సుల్తాన్ ముఖ్యంగా బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించి తనదైన ముద్ర వేయగలిగాడు ఈ లెఫ్టార్మ్ సీమర్. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడంతో వచ్చిన వరుస అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా.. కొత్త స్వింగ్ సుల్తాన్ వచ్చేశాడు అంటూ అర్ష్‌దీప్‌ను ఆకాశానికెత్తాడు. మరికొందరేమో.. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్, మాజీ పేసర్ వసీం అక్రమ్‌తో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ది గ్రేట్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్‌తో అర్ష్‌దీప్‌ను పోల్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. వసీం అక్రమ్- జాంటీ రోడ్స్(PC: PTI) పోలిక వద్దు.. ఇలా మాట్లాడితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ బౌలర్‌పై ఇలాంటి పోలికలు ఒత్తిడిని పెంచుతాయని.. అతడి ఆటపై ప్రభావం పడుతుందని పేర్కొన్నాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా లాగే అర్ష్‌దీప్ సింగ్ కూడా కెరీర్ ఆరంభంలోనే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అతడిలో మెండుగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలుగుతున్నాడు. పవర్ ప్లేలోనూ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. వసీం అక్రమ్ మాదిరి బౌలింగ్ చేయగలుగుతున్నాడు. కానీ ఇప్పుడే దిగ్గజాలతో పోలిస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుంది’’ 53 ఏళ్ల జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. అర్ష్‌దీప్‌నకు మేటి బౌలర్‌గా ఎదగగల సత్తా ఉందని.. అతడి భవిష్యత్తు బాగుంటుందంటూ జోస్యం చెప్పాడు. చదవండి: Aus Vs Eng 1st ODI: స్టార్క్ అద్బుత ఇన్‌స్వింగర్.. షాట్ ఎలా ఆడాలిరా బాబూ! బిక్క ముఖం వేసిన రాయ్ FIFA World Cup Trophy History: ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్ మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: నీకసలు బుద్దుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్
‘‘చూడండి.. ఈ అబ్బాయికి అసలు బుద్ధుందా? ఎలాంటి ప్రశ్న అడుగుతున్నావో తెలుసా? నీకంటే చిన్నవాళ్లు, పెద్ద వాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నీ దేశానికే చెందిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడుతావా? సిగ్గు లేదు. కాస్తైనా పశ్చాత్తాపపడు’’ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది గురించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు ఫైర్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా.. ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో అతడు బౌలింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. అయితే, అప్పటికే మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ.. ఆఫ్రిది బౌలింగ్ కొనసాగించి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేని ఓ నెటిజన్.. ‘‘పిరికిపంద షాహిన్ ఆఫ్రిది.. మిగతా ఐదు బంతులు వేసి నీ ఓవర్ పూర్తి చేయాల్సింది. కానీ పిరికివాడిలా మైదానాన్ని వీడి నువ్వు పరుగులు తీశావు’’ అంటూ ఆఫ్రిదిని ట్రోల్ చేశాడు. ఈ క్రమంలో ఏ- స్పోర్ట్స్ షోలో పాల్గొన్న వసీం అక్రమ్ దృష్టికి ఈ ట్వీట్ రావడంతో సదరు నెటిజన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘షాహిన్ ఆఫ్రిది గురించి అతడేం అంటున్నాడో చూడండి. కాస్తైనా సిగ్గుండాలి. ఒకవేళ నువ్వే గనుక నా ఎదురుగా ఉండి ఉంటేనా’’ అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా నవంబరు 13న మెల్బోర్న్లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో పాక్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకునే క్రమంలో ఆఫ్రిది మోకాలికి గాయమైంది. చికిత్స అనంతరం 16వ ఓవర్ వేసేందుకు అతడు మైదానంలోకి వచ్చాడు. అయితే ఒక బంతి వేయగానే ఆఫ్రిది బౌలింగ్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..? Shubman Gill: హీరోయిన్‌తో డేటింగ్‌పై స్పందించిన టీమిండియా యువ బ్యాటర్! ఒక్క మాటతో కన్ఫామ్ చేశాడా? pic.twitter.com/ht0m8wy6GP — Guess Karo (@KuchNahiUkhada) November 15, 2022 -
ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే
అది 1992వ సంవత్సరం. పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అప్పటి పాక్ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందు బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసిన అక్రమ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను శాసించాడు. అలా ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వసీం అక్రమ్ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తిన్న బిర్యానీ వల్లే ఈ ప్రదర్శన అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అక్రమ్ మాటలు విన్న ఇప్తికర్ షా అనే వ్యక్తి తెగ సంతోషపడిపోయాడు.ఇఫ్తికర్ షా అంత సంతోషపడడానికి కారణం ఏంటో తెలుసా.. అక్రమ్ తిన్న బిర్యానీ ఈయన తయారు చేసిందే. అప్పటికే ఇప్తికర్ షా ఆస్ట్రేలియాకు వలస వెళ్లి 10 సంవత్సరాలైంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని తెలియగానే.. తన స్వంత దేశమైన పాకిస్తాన్ ఆటగాళ్లకు బిర్యానీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ్ ఇప్తికర్ను తన వద్దకు పిలుపించుకొని బిర్యానీ చేసి పెట్టాలని ఆర్డర్ వేశాడంట. అక్రమ్ మాటలకు తెగ సంతోషపడిపోయిన ఇప్తికర్ ఎంతో ప్రేమతో బిర్యానీ తయారు చేసి అక్రమ్ సహా పలువురు ఆటగాళ్లకు రుచి చూపించాడు. కట్‌చేస్తే సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత అదే పాకిస్తాన్ జట్టు మెల్బోర్న్ వేదిగా ఆదివారం(నవంబర్ 13న) ఇంగ్లండ్‌తో టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కొన్ని గంటల్లో మొదలుకానున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందురోజు అంటే శనివారం పాక్ ఆటగాళ్లు మెల్బోర్న్లోని షా మింట్ అండ్ యునివర్సిటీ ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన బిర్యానీ తిని ఇప్తికర్ షాను సంతోషపెట్టారు. 1992లో పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో ఇప్తికర్ షా బిర్యానీ తినే తాను ఈ ప్రదర్శన చేసినట్లు అక్రమ్ అప్పట్లో మీడియాకు తెలపడం బాగా వైరల్ అయింది. అందుకే తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన పాక్ సెంటిమెంట్ ప్రకారం ఇప్తికర్ షా వద్దకు వచ్చి బిర్యానీ తిని వెళ్లారు. ఇక మ్యాచ్‌లో విజయం తమదేనని పాక్ జట్టు బలంగా నమ్ముతుంది. ఇది నిజమవుతుందో లేదో తెలియదు కానీ పాక్ ఆటగాళ్ల వల్ల తన బిర్యానీకి మంచి పేరు వచ్చిందని ఇఫ్తికర్ షా తెగ సంతోషపడుతూ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ -
Wasim Akram: "ఐపీఎల్ ప్రారంభమైంది.. భారత్ పని అయిపోయింది"
టీ20 ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలై భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత మాజీ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల మాజీ క్రికెటర్లు కూడా టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర హేల్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన అనుభవం తనకు బాగా కలిసొచ్చిందిని తెలిపాడు. ఇక ఇదే ప్రశ్న భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ.. "బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కలిసిచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడడం చాలా కష్టం. ఎందుకంటే దేశీవాళీ టోర్నీలతో పాటు అంతర్జాతీయ సిరీస్‌లతో టీమిండియా బీజీబీజీగా ఉంటుంది. దీంతో భారత ఆటగాళ్లకు ఆ అవకాశం లేదు. అయితే విదేశీ లీగ్‌ల్లో మా ఆటగాళ్ల ఆడడంపై తుది నిర్ణయం బీసీసీఐదే" అని ద్రవిడ్ తెలపాడు. ఇక ద్రవిడ్ చేసిన వాఖ్యలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. "ఏ స్పోర్ట్స్" ఛానల్ డిబేట్లో అతడు మాట్లాడుతూ.. "ఐపీఎల్ భారత జట్టుకు లాభం చేకూరుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు ఏం లాభం చేకూరుంది మరి? విదేశీ లీగ్‌ల్లో ఆడటానికి అనుమతిస్తే అయినా టీమిండియా ఆడే విధానం మారుతుందా అన్న సందేహం నెలకొంది" అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇక ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? -
'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి'
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తుంది. తొలుత భారత్‌పై ఓటమి పాలైన పాకిస్తాన్.. అనంతరం పసికూన జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. ఇక వరుసగా రెండు ఓటములు చవిచూసిన పాకిస్తాన్.. వారి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే బాబర్ ఒక పనికిరాని కెప్టెన్ పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శించగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చేరాడు. టీ20 ప్రపంచకప్‌కు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను ఎంపిక చేయకపోవడంపై అక్రమ్ సీరియస్ అయ్యాడు. పాకిస్తాన్ మిడిలార్డర్ దారుణంగా ఉంది అని అతడు విమర్శించాడు. ఒక వేళ పాక్ కెప్టెన్ తాను అయి ఉంటే ఖచ్చితంగా జట్టులో మొదటి ఆటగాడిగా షోయబ్ మాలిక్ పేరు ఉండేది అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. "పాక్ మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉందని గత ఏడాది కాలంగా మేము(పాక్ మాజీ ఆటగాళ్లు) పదే పదే చెప్పుతున్నాం. షోయబ్ మాలిక్ వంటి అనుభవ్ణడైనా ఆటగాడిని పిసీబీ ఇంట్లో కూర్చోబెట్టింది. అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన పెద్ద తప్పిదం. ఒక వేళ నేను కెప్టెన్‌గా ఉంటే నా లక్ష్యం ఏంటి.. వరల్డ్ కప్ గెలవడమే కదా. అటువంటి అప్పడు జట్టులో షోయబ్ మాలిక్ నాకు కావాలంటే.. నేరుగా ఛైర్మన్, చీఫ్ సెలక్టర్ దగ్గరికి వెళ్లి ఎంపికచేయమని అడిగే వాడిని. అతడిని ఎంపికచేయకపోతే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా అనే చెప్పేవాడిని. కానీ మా జట్టలో అటువంటి వ్యక్తులు లేరు. జట్టులో ఖచ్చితంగా మాలిక్ ఉండాల్సింది. ఆస్ట్రేలియాలో ఆడడం.. షార్జా లేదా పాకిస్తాన్లో ఆడినంత సులభం కాదు. బాబర్ కెప్టెన్సీ విషయంలో మరింత తెలివిగా వ్యవహరించాలి. పాకిస్తాన్ ఏమీ చిన్న జట్టు కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి" అని అక్రమ్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: 'ఆ జట్టుతో భారత్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అంతే సంగతి' -
జట్టులో కీలక సభ్యుడు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
India Vs Pakistan: ‘‘గత కొంత కాలంగా అతడి ఆటతీరును ఒక్కసారి గమనిస్తే.. ఐపీఎల్-2022 సందర్భంగా తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జట్టును విజయవంతంగా ముందుకు నడిపాడు. టైటిల్ గెలిచాడు. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఒత్తిడిని అధిగమించిన తీరు అమోఘం. ముఖ్యంగా ఫినిషర్‌గా బాధ్యతను నెరవేర్చిన తీరు అద్భుతం’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. మానసికంగా దృఢంగా ఉండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో పాండ్యా నిరూపించాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2021 తర్వాత పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సాధించే క్రమంలో చాలా కాలం భారత జట్టుకు దూరమైన అతడు.. ఐపీఎల్-2022తో తొలిసారిగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే జట్టును విజేతగా నిలిపాడు. పునరాగమనంలో అదరగొట్టి ఈ క్రమంలో టీమిండియాలో పునరాగమనం చేసి భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి పలు సిరీస్‌లు గెలిచాడు. ఇక ఆసియాకప్-2022లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో.. ప్రపంచకప్-2022లో దాయాదితో పోరులో విరాట్ కోహ్లితో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తదుపరి కెప్టెన్ అతడే ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన విధానాన్ని పాకిస్తాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు. ఇక వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ముందు తను ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ట్రోఫీ గెలిచాడు. ఇప్పుడు జట్టులో తను కీలక సభ్యుడు మాత్రమే కాదు.. కెప్టెన్‌కు సలహాలు ఇవ్వగల స్థాయిలో ఉన్నాడు. జట్టు జయాపజయాలపై తన ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తను టీమిండియా తదుపరి కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు. అసలైన పోరులో కీలక పాత్ర ఆసియాకప్-2022లో పాక్‌తో తొలి మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన హార్దిక్ పాండ్యా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత 17 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన హార్దిక్.. 37 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లికి సహకరిస్తూ అతడితో కలిసి జట్టును గెలిపించాడు. చదవండి: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా.. -
సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్
-
T20 WC 2022: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్
T20 World Cup 2022- Semi Finals Predictions: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సహా ఈ ఏడాది టీ20 క్రికెట్లో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న రోహిత్ సేనతో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. సౌతాఫ్రికా సైతం గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ సెమీస్ చేరే జట్లను అంచనా వేశాడు. తన ఫేవరెట్ జట్లు మూడు అని.. అయితే, వాటితో పాటు సౌతాఫ్రికాను కూడా తక్కువగా అంచనా వేయలేమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రొటిస్‌ను ‘డార్క్ హార్స్’గా అభివర్ణించాడు ఈ మాజీ ఫాస్ట్ బౌలర్. ఆ నాలుగు జట్లు సెమీస్‌లో ఈ మేరకు దుబాయ్‌లో మీడియాతో మాట్లాడిన వసీం అక్రమ్.. ‘‘నా వరకైతే ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్ సెమీస్‌లో ఉంటాయి. సౌతాఫ్రికా డార్క్ హార్స్(అంచనాలు తలకిందులు చేసి అనూహ్యంగా పుంజుకుంటుందన్న ఉద్దేశంలో) అయ్యే అవకాశం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. టీమిండియా ఈసారైనా! కాగా గతేడాది ప్రపంచకప్‌లో సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించిన టీమిండియా ఈసారి మాత్రం హాట్ ఫేవరెట్‌గా మారింది. స్వదేశంలో, విదేశాల్లో వరుసగా టీ20 సిరీస్‌లు గెలిచిన రోహిత్ సేన టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. విరాట్ కోహ్లి పూర్వపు ఫామ్ అందుకోవడం సహా సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆటతీరుకు తోడు హార్దిక్ పాండ్యా రాణించడం వంటి సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఇటీవల టీమిండియాను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం బౌలింగ్. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడం.. మరో సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం భారత జట్టును కలవరపెడుతున్నాయి. అయితే, ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకుని ట్రోఫీ ముద్దాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతామంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడు. పాక్ అలా.. ఆసీస్‌కు ఇలా మరోవైపు.. గత ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన పాకిస్తాన్ ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్ ఆడుతున్న బాబర్ ఆజం బృందం అక్టోబరు 23న టీమిండియాతో మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీలో ప్రయాణం ఆరంభించనుంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు.. స్వదేశంలో ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అదనపు బలంగా మారిందనడంలో సందేహం లేదు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఇటీవలి కాలంలో.. కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం జట్టుకు భారంగా మారింది. మెగా టోర్నీకి ముందు భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఓటమి జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. చదవండి: Syed Mushtaq Ali Trophy: అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్ BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు -
ఆఫ్రిది చెప్పింది నిజమే అయితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు!
Shaheen Shah Afridi Treatment- Shahid Afridi Comments On PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. షాహిన్ షా ఆఫ్రిది విషయంలో పీసీబీ వ్యవహరించిన తీరు పట్ల మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ షాహిన్ విషయంలో పీసీబీ గురించి షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని వసీం వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2022 టోర్నీకి ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మోకాలి గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం షాహిన్‌ను లండన్‌కు పంపినట్లు పీసీబీ గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గాయం నుంచి కోలుకుంటున్న షాహిన్.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మాజీ సారథి, షాహిన్‌కు కాబోయే మామగారు షాహిద్ ఆఫ్రిది సామా టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌లో తన సొంత డబ్బుతో షాహిన్ చికిత్స పొందుతున్నాడని.. తానే అతడి కోసం డాక్టర్‌ను ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చాడు. సొంత డబ్బుతో చికిత్స.. నేనే! ఈ మేరకు.. ‘‘షాహిన్ ఆఫ్రిది తన సొంత డబ్బుతో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. టికెట్‌కు కూడా తనే డబ్బులు చెల్లించాడు. అక్కడ సొంత ఖర్చులతో కాలం వెళ్లదీస్తున్నాడు. నేను డాక్టర్ పేరును సూచించగా.. అతడిని కలిసి చికిత్స తీసుకుంటున్నాడు. షాహిన్ విషయంలో పీసీబీ అసలు ఎలాంటి చొరవ తీసుకోలేదు. తన సొంత ఖర్చులతో అతడు లండన్‌లో ఉంటున్నాడు. పీసీబీ డైరెక్టర్ జాకిర్ ఖాన్ బహుశా ఒకటీ రెండుసార్లు తనతో మాట్లాడి ఉంటాడు అంతే’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. స్పందించిన పీసీబీ! కానీ ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. ‘‘లండన్‌లో చికిత్స పొందుతున్న షాహిన్ షా ఆఫ్రిది కోలుకుంటున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ ఆరంభం నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడు. ఆటగాళ్లకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం.. వారి పునరావాసం విషయంలో పీసీబీ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఆటగాళ్లకు ఎలాంటి అవసరాలు ఉన్నా.. వాటిని తీర్చడంలో బోర్డు ముందు ఉంటుంది’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ.. షాహిన్ చికిత్స విషయంలో ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై నేరుగా స్పందించలేదు. షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే! ఈ నేపథ్యంలో.. ఏఆర్వై న్యూస్‌తో మాట్లాడిన వసీం అక్రమ్.. ‘‘ఒకవేళ షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే.. అంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. అతడు(షాహిన్ ఆఫ్రిది) పాకిస్తాన్ మేటి ఆటగాళ్లలో ఒకడు. అలాంటి క్రికెటర్ పట్ల పీసీబీ ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సర్జన్ వద్ద అతడికి చికిత్స చేయించాలి. కానీ, అతడు సొంతంగా ఖర్చులు భరిస్తున్నాడంటే.. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని పీసీబీ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. కాగా షాహిద్ ఆఫ్రిది కుమార్తెతో షాహిన్ వివాహం జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. -
'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే'
Asia Cup 2022- India Vs Pakistan: క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదరుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఆసియాకప్-2022లో భాగంగా ఆదివారం(ఆగస్టు 28)న దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. కాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌ను పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఎంచుకున్నాడు. అతడు కోహ్లి, రోహిత్, రాహుల్ కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు అక్రమ్ మొగ్గు చూపాడు. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌కు చక్కలు చూపించే సత్తా సూర్యకుమార్‌కు ఉందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. పాక్‌కు చుక్కలు చూపించే సత్తా అతడికే ఉంది! "భారత జట్టులో కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో నాకు అత్యంత ఇష్టమైన ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సూర్యని తొలిసారిగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పుడు చూశాను. అతడు ఆ సీజన్లో కొన్ని మ్యాచ్‌ల్లో ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ వచ్చాడు. అతడు ఆ మ్యాచ్‌ల్లో అంతగా రాణించికపోనప్పటికీ.. అతడు ఆడిన షాట్లు అసాధారణమైనవి. ఫైన్ లెగ్ దిశగా సూర్యలా షాట్లు ఆడడం చాలా కష్టం అని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ పేర్కొన్నాడు. అద్భుతమైన ఫామ్‌లో సూర్య కాగా సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు విండీస్‌తో టీ20 సిరీస్‌లో కూడా దుమ్మురేపాడు. ఇప్పటి వరకు 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 672 పరుగులు సాధించాడు. అతడి టీ20 కెరీర్లో ఒక సెంచరీ కూడా ఉంది. ఈ ఏడాది జూలై ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య తన సెంచరీని సాధించాడు. ఇక ఆసియాకప్-2022కు విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీలో మెత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే భారత్,పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. ఇక మరో స్థానం కోసం క్వాలిఫియంగ్ రౌండ్లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. కాగా 2016 తర్వాత తొలి సారి ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?! -
అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే: జయవర్ధనే
కెరీర్లో తాను ఎదుర్కొన్న అత్యంత ఉత్తమమైన, కఠినమైన ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అన్నాడు. అతడితో మ్యాచ్ అంటేనే పీడకలలా ఉండేదని గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో జయవర్దనే క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే అద్భుతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక- పాకిస్తాన్ తలపడిన ప్రతిసారి వసీం బౌలింగ్ అంటే తాను భయపడేవాడినంటూ జయవర్ధనే తాజాగా వ్యాఖ్యానించాడు. ఐసీసీ డిజిటల్ షోలో అతడు మాట్లాడుతూ తన అనుభవం గురించి పంచుకున్నాడు. మీరు ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వసీం అక్రమ్. అతడు తన కెరీర్ పీక్‌లో ఉన్నపుడు నేను అరంగేట్రం చేశాను. తన చేతిలో కొత్త బంతి ఉందంటే అంతే ఇక! అతడిని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని! నిజంగా పీడకలలా అనిపించేది. వసీం బౌలింగ్ యాక్షన్ బాగుంటుంది. బ్యాటర్న ఇబ్బంది పెట్టడం తనకు వెన్నతో పెట్టిన విద్య’’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. నిలకడగా బౌలింగ్ చేయడంలో వసీం అక్రమ్ దిట అని ప్రశంసించాడు. కాగా పాక్ మాజీ సారథి వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్లో 916 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టు వికెట్లు 414. వన్డే వికెట్లు 502. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
భార్య పోయాక సుష్మితతో క్రికెటర్ సహజీవనం, కానీ!
క్రికెట్, సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదంటే.. పచ్చగడ్డిని భగ్గున మండించే వైరాన్ని కూడా పక్కకు తోసేసి ప్రేమించేలా చేస్తుంది! మన బాలీవుడ్, పాక్ క్రికెట్టే దీనికి ఉదాహరణ! ఆ ఆటగాళ్లు.. ఈ తారల మధ్య నడిచిన ప్రేమ కథలే ప్రత్యక్ష సాక్ష్యాలు! అవునవును.. జీనత్ అమన్ – ఇమ్రాన్ ఖాన్, రీనా రాయ్ – మొహ్సిన్ ఖాన్... వీళ్ల సరసన ఉన్న మరో జంటే సుష్మితా సేన్, వసీమ్ అక్రమ్! ఆ ఇద్దరిదే ఈ మొహబ్బతే అని అర్థమయ్యే ఉంటుంది. ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్. ఆ ఆకర్షితుల్లో వసీమ్ అక్రమ్ కూడా ఉన్నాడు. క్రికెట్లో ఆల్ రౌండర్ వసీమ్ అక్రమ్‌కు జగమంతా అభిమానులున్నారు. అందులో సుష్మితా సేన్ ఉందో లేదో తెలియదు కానీ.. అతని పేరు మాత్రం ఆమెకు తెలుసు. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్ అయింది. తెర మీద కనిపించిన సుష్మితాకూ, ఆమె నటనకూ అభిమానిగా మారాడు వసీమ్. అప్పటిక్కూడా ఆ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం లేదు. సినిమా, క్రికెట్ ఈవెంట్లలో కలవలేదు. మరి ఎక్కడ కలుసుకున్నారు? ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ సెట్స్‌లో. అది సినిమా కాదు. ఓ ప్రైవేట్ చానెల్లో ప్రారంభమైన రియాలిటీ షో. దానికి న్యాయనిర్ణేతలుగా సుష్మితా సేన్, వసీమ్ అక్రమే వ్యవహరించారు. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆమె మీద అతనికున్న అభిమానాన్ని ఆ సందర్భంలోనే ఆమెతో చెప్పాడు అతను. అతని ఆదరాన్ని ఆమె స్వీకరించింది. ఆ రియాలిటీ షోతో వాళ్ల మధ్య స్నేహం కుదిరింది. వాళ్లు హాజరవ్వాల్సిన ఫంక్షన్లు, పార్టీలకు కలసే వెళ్లడం.. జంటగా కనిపించడం మొదలుపెట్టారిద్దరూ. దాంతో వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే గుసగుసలు వినిపించసాగాయి బాలీవుడ్లో. దాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళ్లింది.. ఆ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ. ఆ ప్రచారాన్ని కానీ.. మీడియా కథనాన్ని కానీ ఆ జంట కలసి కానీ.. విడివిడిగా కానీ ఖండించలేదు. అసలు వాటిని వాళ్లు పట్టించుకోనే లేదు. వీళ్ల మౌనాన్ని తమ కథనానికి అంగీకారంగా అనుకుందో ఏమో మరి ఆ జంట త్వరలోనే పెళ్లీ చేసుకోబోతోందనే వార్తనూ వ్యాప్తి చేసింది మీడియా. అప్పుడు ఉలిక్కిపడ్డారు ఆ ఇద్దరూ. ‘వసీమ్ అక్రమ్‌కు, నాకూ పెళ్లంటూ వస్తున్న వార్తలను చదివాను. అందులో రవ్వంత కూడా నిజం లేదు. ఇలాంటి విషయాలను పత్రికల్లో చదివినప్పుడు, టీవీ చానళ్లలో చూసినప్పుడే అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు మీడియా ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందోనని. ఇలాంటి వార్తల వల్ల కుటుంబాలు కూలిపోతాయి. వసీమ్ అక్రమ్ నాకు మంచి స్నేహితుడు. అద్భుతమైన సహధర్మచారిణితో చక్కటి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలాంటి వార్తలతో వాళ్ల కాపురంలో కలతలు రేపొద్దు. ఇంకో విషయం.. నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు ఆ విషయం మొదట మీకే చెప్తాను’ అంటూ ట్విట్టర్లో తన స్పందనను తెలియజేసింది సుష్మితా. అటు వసీమ్ అక్రమ్ కూడా ‘ఈ వదంతులు వినీ వినీ విసుగొచ్చేసింది. ‘మరో పెళ్లి’ గురించిన ఆలోచనలు నాకు లేవు. నా ఫోకస్ అంతా నా పిల్లల (ఇద్దరు అబ్బాయిలు) మీదే. వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. తండ్రిగా నా అవసరం వాళ్లకిప్పుడు ఎంతో ఉంది. అందుకే ఏడాది పాటు ఐపీఎల్ నుంచి కూడా విరామం తీసుకుని నా పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులో మాటను మీడియాకు స్పష్టం చేశాడు. నాకు వసీమ్ అంటే చాలా ఇష్టం.. ఓ స్నేహితుడిగా మాత్రమే. నా దృష్టిలో రిలేషన్షిప్ అనేది బిగ్ డీల్. నిజంగానే నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇలా మీ ఊహలకు వదిలేయను – సుష్మితా సేన్ అయితే... ఒక పత్రిక (హిందుస్థాన్ టైమ్స్) కథనం ప్రకారం.. ‘ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా’ మొదలైన కొన్నాళ్లకు అంటే 2009లో వసీమ్ భార్య హుమా చనిపోయింది. అతను విషాదంలో మునిగిపోయాడు.. దిగులుతో కుంగిపోయాడు. ఆ బాధను పంచుకుంటూ వసీమ్‌కు సొలేస్ అయింది సుష్మితా. ఆమె స్వాంతనతో వసీమ్ ఊరట చెందాడు. అది ప్రేమగా మారింది. సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా సేన్ షెడ్యూల్ వల్ల వసీమ్ అక్రమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ .. ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. వసీమ్ అక్రమ్ ఓ అస్ట్రేలియన్ మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. - ఎస్సార్ -
PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై కరోనా పంజా..
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌లో పాల్గొనబోయే నలుగురు క్రికెటర్లు సహా ఆ దేశ దిగ్గజ బౌలర్, కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రెసిడెంట్ వసీం అక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 27 నుంచి ప్రారంభంకావాల్సిన లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కోవిడ్ బారిన పడిన ఆటగాళ్లలో పెషావర్ జల్మీకి చెందిన వాహబ్ రియాజ్, హైదర్ అలీ ఉన్నారు. అంతకుముందు ఇదే ఫ్రాంచైజీకి చెందిన కమ్రాన్ అక్మల్, అర్షద్ ఇక్బాల్‌లకు కూడా కరోనా వచ్చింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా, కొద్ది రోజుల క్రితం వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు పీసీబీ గతంలో ప్రకటించింది. చదవండి: 145 కిమీ పైగా స్పీడ్‌తో బౌల్ చేసే ఆ బౌలర్‌ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్ రాహుల్ -
వాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్ వద్దు
Wasim Akram Comments on Team india: టీ20 ప్రపంచకప్2021లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పేలవ ప్రదర్శనపై మాజీలు, క్రికెట్ నిపుణులు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా చేరాడు. పరిమిత ఓవర్లలో తగినంత అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడమే భారత్ వైఫల్యానికి కారణమని ఆక్రమ్ తెలిపాడు. ఈ ప్రపంచకప్‌కు ముందు టీమిండియా వైట్-బాల్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో మాత్రమే తలపడినట్లు అతడు చెప్పాడు. ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్లో బారత ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ.. అంతర్జాతీయ స్ధాయిలో పోటీ, టీ20 లీగ్‌లకు భిన్నంగా ఉంటుందని అక్రమ్ అభిఫ్రాయపడ్డాడు. “భారత్ చివరిసారిగా మార్చిలో సీనియర్ ఆటగాళ్లందరితో అంతర్జాతీయ స్ధాయిలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. ఆ తరువాత పరిమిత ఓవర్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా అంతర్జాతీయ సిరీస్‌లను సీరియస్‌గా తీసుకోవడం లేదు. న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఐపీఎల్ ఆడితే సరిపోతుందని భారత ఆటగాళ్లు అనుకుంటున్నారు. మీరు లీగ్ టోర్నీలు ఆడుతున్నప్పడు ప్రత్యర్థి జట్టులో ఒకరిద్దరు అత్యుత్తమ బౌలర్లు కనిపిస్తారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఐదుగురు మంచి బౌలర్లను మీరు ఎదుర్కొంటారు" అని అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: Kevin Pietersen: ఇంగ్లండ్‌పై గెలవగల సత్తా ఆ రెండింటికే.. కప్ మాత్రం మాదే! -
పాక్ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్
వసీం అక్రమ్.. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్రమ్.. 1999 వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చాడు. దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అక్రమ్.. గతంలో వ్యాఖ్యాతగానూ పని చేశాడు. అయితే ఇంత అనుభవం ఉన్న అక్రమ్ ఏనాడు పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు. దీనిపై చాలా మందికి సందేహం ఉండగా.. తాజాగా ఈ యార్కర్ దిగ్గజం క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ కోచ్ పదవి చేపట్టకపోవడంపై అక్రమ్ ఒక ఇంటర్య్వూలో పెదవి విప్పాడు. క్రికెట్ కార్నర్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. ''పాకిస్తాన్‌కు కోచ్‌గా ఎంపికైతే ఫ్యామిలీకీ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేగాక సంవత్సరంలో 200 నుంచి 250 రోజులు పాకిస్తాన్ క్రికెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇక పాక్ జట్టు ఓడిపోతే అభిమానులు చేసే అల్లరి నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారి ప్రవర్తన నన్ను పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవికి దూరంగా ఉండేలా చేసింది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అఫ్కోర్స్.. ఈ వ్యాఖ్యలు చేయడానికి నేనేం ఫూల్‌ను కాదు. పాకిస్తాన్ ఏ సిరీస్‌లో ఓడిపోయినా సోషల్ మీడియా వేదికగా కోచ్‌ను, సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్లు పెట్టే కామెంట్స్ చిరాకు కలిగిస్తాయి. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ మ్యాచ్‌లో కోచ్ ఆడడు.. ప్లేయర్స్ మాత్రమే ఆడుతారు. కోచ్ అనేవాడు ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా కోచ్‌ల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తారు. మా దేశంలో జట్టు ఓడిపోవడం కంటే కోచ్‌లపై కక్షసాధింపు చర్యలే ఎక్కువ ఉంటాయి. అందుకే పాకిస్తాన్ జట్టుకు కోచ్ పదవిలో ఎక్కువకాలం ఎవరూ ఉండరు. ఇలాంటివి బయటిదేశాలలో ఎక్కువగా కనిపించవు. నా దృష్టిలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాళ్లను.. ఇష్టంతో చూసేవాళ్లను ఎంత ప్రేమిస్తానో.. నాతో తప్పుగా ప్రవర్తించేవారిపై అంత కోపంతో ఉంటాను. అందుకే పాకిస్తాన్ క్రికెట్లో కోచ్ పదవిని ఎప్పుడు ఆశించలేదు.. ఆశించబోను కూడా'' అని చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ వసీం అక్రమ్ తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో పాక్ తరపున 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. ఇక క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ కేకేఆర్ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇటీవలే పాకిస్తాన్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిస్బాఉల్ హక్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి వకార్ యూనిస్ కూడా వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాక్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్.. మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా పీసీబీ ఎంపిక చేసింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న టీమిండియాతో ఆడనుంది. చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపా..
న్యూఢిల్లీ: "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్"కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని పొగడ్తలతో ముంచెత్తాడు. బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద పక్కా ప్రణాళిక ఉంటుందని, దాన్ని అతను తూచా తప్పకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించాడని మరో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే పేర్కొన్నాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడని అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే బౌలర్లు సైతం కుంబ్లేను ఆకాశానికెత్తారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం తన కళ్లెదుటే మెదులుతుందని, అతని పదో వికెట్ నేనే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. కాగా, కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్‌గా కూడా పనిచేశాడు. చదవండి: ఇంగ్లండ్‌లో ఐపీఎల్ నిర్వహణ డౌటే.. -
సచిన్ కోవిడ్‌ను కూడా సిక్సర్ కొట్టగలడు: వసీం అక్రం
ఇస్లామాబాద్: ఇటీవల కరోనా బారినపడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. డాక్టర్ల సూచన మేరకు శుక్రవారం ఆసుపత్రిలో చేరాడు. ఈ వార్త బయటకు రాగానే యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ప్రముఖులందరూ సచిన్ ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. అయితే తనకెటువంటి ఇబ్బంది లేదని, తాను క్షేమంగా ఉన్నానని, సచిన్ స్వయంగా ట్వీట్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం కూడా సచిన్ ఆరోగ్యం గురించి ఆరా తీసి, అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. Even when you were 16, you battled world’s best bowlers with guts and aplomb... so I am sure you will hit Covid-19 for a SIX! Recover soon master! Would be great if you celebrate India’s World Cup 2011 anniversary with doctors and hospital staff... do send me a pic! https://t.co/ICO3vto9Pb — Wasim Akram (@wasimakramlive) April 2, 2021 "16 ఏళ్ల వయసులోనే ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను గడగడలాడించావు, నువ్వు కోవిడ్‌ను కూడా సిక్స్ కొట్టగలవు, త్వరగా కోలుకో మాస్టర్" అంటూ అక్రం ట్వీట్లో పేర్కొన్నాడు. "భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి దశాబ్ద కాలం పూర్తయ్యింది, ఈ ఆనంద క్షణాలను నువ్వు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో పంచుకుంటావని ఆశిస్తున్నా, సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను నాకు కూడా పంపించు" అని అక్రం ట్వీట్లో ప్రస్థావించాడు. 90వ దశకంలో సచిన్, అక్రంల మధ్య మైదానంలో ఆధిపత్య పోరు నడిచింది. ఇందులో అనేక సందర్భాల్లో సచిన్‌దే పైచేయిగా నిలిచింది. కాగా, ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ సందర్భంగా సచిన్‌తో పాటు భారత దిగ్గజ జట్టు సభ్యులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రీనాధ్లు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: సన్‌రైజర్స్‌కు డబుల్ ధమాకా.. జట్టులో చేరిన స్టార్ ఆటగాళ్లు -
అక్రమ్, మెక్‌గ్రాత్ తర్వాత అండర్సన్ మాత్రమే
అహ్మదాబాద్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండోరోజు ఆటలో అజింక్య రహానేను ఔట్ చేయడం ద్వారా అండర్సన్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 900 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకూ ఆరుగురు బౌలర్లు మాత్రమే ఈ మార్క్‌ని చేరుకోగా.. ఇందులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. గురువారం ఓపెనర్ శుభమన్ గిల్ (0)ని మొదటి ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న జేమ్స్ అండర్సన్.. ఈరోజు వైస్ కెప్టెన్ అజింక్య రహానేను ఔట్ చేసి ఈ ఫీట్ అందుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని వెంటాడిన రహానె.. స్లిప్‌లో బెన్‌స్టోక్స్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితా చూస్తే.. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 1,347 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (1,001 వికెట్లు), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (956), ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (949), పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (916) టాప్-5లో కొనసాగుతున్నారు. తాజాగా ఆరో బౌలర్/ మూడో పేసర్‌గా జేమ్స్ అండర్సన్ (900) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదవండి: ఒకే దెబ్బకు రోహిత్ శర్మ రెండు రికార్డులు నాలుగో టెస్టు : పంత్ దూకుడు.. ఆధిక్యంలోకి టీమిండియా -
'వాళ్లను చూస్తే 90లలో మమ్మల్ని చూసినట్లుంది'
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆరవసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీపై గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడనుంది. ఐపీఎల్ తర్వాత కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జట్టు నేరుగా ఆసీస్ పర్యటనకు బయలుదేరనుంది. మొత్తం రెండు నెలల పాటు కొనసాగనున్న సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. కాగా నవంబర్ 27 నుంచి టెస్టు సిరీస్ మొదలవనుండగా.. ఇందులో అడిలైడ్ వేదికగా డే- నైట్ టెస్టు కూడా ఉంది. (చదవండి : అగస్త్యను చాలా మిస్సవుతున్నా : హార్దిక్) ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ టీమిండియా ఆటతీరుపై యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ' ఈసారి సిరీస్‌కు ఆసీస్ జట్టుకు ప్రపంచలోననే అత్యుత్తమ బౌలర్లు కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నా. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్‌లతో ఆసీస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తుంది. వాళ్లు ఉపయోగించే కూకాబుర్ర బంతిని ఉపయోగించే పద్దతులను ఎదుర్కొనే సత్తా కష్టమే అని చెప్పొచ్చు. (చదవండి : ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!) స్వదేశంలో ఆసీస్ జట్టు ఫేవరెట్ కావొచ్చు.. కానీ టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. అందులోనూ బుమ్రా లాంటి ప్రపంచస్థాయి నెంబర్ వన్ బౌలర్ ఆసీస్ గడ్డపై కీలకం కానున్నాడు. ఒక్క బుమ్రా అనే కాదు.. షమీ, ఇషాంత్ లాంటి ఆటగాళ్లు గంటకు 140-150 కిమీ వేగంతో బంతులు విసురుతూ వికెట్లను తీస్తున్నారు. ఇక టీమిండియా బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ బ్యాట్స్‌మెన్ టీమిండియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. అందుకే నాకు ఇప్పుడు టీమిండియా కొత్తగా కనబడుతుంది. టీమిండియా వాళ్ల ఆటతీరుతో పాటు శైలిని మార్చుకున్న తీరును చూస్తుంటే.. 90వ దశకంలో మా జట్టును గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే 90వ దశకంలో నేను, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్‌లాంటి ప్రపంచస్థాయి పేస్ బౌలర్లతో ఉండేవాళ్లం. ఇప్పుడు టీమిండియా పేస్ బౌలింగ్ విభాగం కూడా అలాగే కనిపిస్తుంది. టీమిండియా ఆటగాళ్లు కాస్త వంకరగా తయారయ్యారంటూ' అంటూ అక్రమ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోపిని టీమిండియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. -
‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ భేష్’
కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో కచ్చితంగా ఐపీఎల్‌దే టాప్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ పుట్టుక మొదలు ఇప్పటివరకూ ఆ క్యాష్ రిచ్ లీగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే పోతుంది కానీ ఎక్కడ దాని క్రేజ్ తగ్గిన దాఖలాలు లేవు. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారంటే ఆ లీగ్ గురించి వేరే చర్చ కూడా అనవసరం. అయితే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ మాత్రం పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చకూడదంటూనే తమ లీగ్‌పై ప్రేమ కురిపించాడు. ప్రధానంగా నాణ్యమైన బౌలింగ్ అంశానికొస్తే ఐపీఎల్ కంటే పీఎస్ఎలే ఉత్తమం అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఇది తన అభిప్రాయం కాదని, కొంతమంది విదేశీ ఆటగాళ్లు తనతో చెప్పిన మాటనే చెబుతున్నానని అక్రమ్ స్పష్టం చేశాడు.(ముష్ఫికర్‌కు ‘నో’ చెప్పిన బీసీబీ ) ‘గత కొన్నేళ్లుగా పీఎస్ఎల్ను సీరియస్‌గా గమనిస్తున్నా. దానిలో భాగంగానే చాలా మంది విదేశీ ఆటగాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నా. ఐపీఎల్‌కు పీఎస్ఎల్కు ఉన్న తేడా ఏమిటి అని అడిగా. వారంత ఐపీఎల్లో నాణ్యమైన బౌలింగ్ లేదనడమే కాకుండా పీఎస్ఎల్లో ఒక క్వాలిటీ బౌలింగ్ ఉందన్నారు. ప్రత్యేకంగా బౌలింగ్ విషయంలో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో ముందంజలో ఉందని వారు చెప్పారు’ అని మాజీ క్రికెటర్ బాసిత్ ఆలీతో యూట్యూబ్ చాట్‌లో అక్రమ్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చలేం.. ఏది ఏమైనా పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చలేమని మరొక ప్రశ్నకు సమాధానంగా అక్రమ్ చెప్పాడు. ‘పీఎస్ఎల్ అనేది ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తున్న లీగ్. ఐపీఎల్‌కు ఎప్పుడో ఒక గొప్ప వైభవం వచ్చేసింది. ఐపీఎల్ పుట్టి 12 ఏళ్లు అయ్యింది. పీఎస్ఎల్ అనేది ఇంకా ఐదేళ్ల బాలుడే. పీఎస్ఎల్కు అంకురార్పణ జరిగినప్పుడు ఇంత పెద్ద లీగ్ ఎలా నిర్వహిస్తారనుకున్నా. ఇప్పుడు ఆ లీగ్ వరల్డ్‌లో రెండో అతి పెద్ద టోర్నమెంట్‌గా ఉంది. ఐపీఎల్ తర్వాత స్థానం కచ్చితంగా పీఎస్ఎల్’అని అక్రమ్ తెలిపాడు. ఇక ఐపీఎల్ అతి పెద్ద క్యాష్ రిచ్ లీగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పీఎస్ఎల్లో పలు ఫ్రాంచైజీలతో కలిసి పని చేశాడు. అందులో ఇస్లామాబాద్ యునైటెట్, కరాచీ కింగ్స్‌లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కరాచీ కింగ్స్‌కు అక్రమ్ సేవలందిస్తున్నాడు. ఇక ఐపీఎల్లో 2016 వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా అక్రమ్ కొనసాగాడు.(విదేశాల్లో ఐపీఎల్2020? బీసీసీఐ సమాలోచన) -
‘రిచర్డ్స్.. నన్ను చంపేస్తానన్నాడు’
కరాచీ: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ పేస్‌కు వన్నె తెచ్చిన బౌలర్లలో అక్రమ్ కూడా ఒకడు. ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఆ స్థాయి బౌలింగ్‌ను అందుకున్న బౌలర్ అక్రమ్. ప్రధానంగా బంతిని రివర్స్ స్వింగ్ చేయడంలో అక్రమ్ సిద్ధహస్తుడు. తన మాయాజాలంతో పాకిస్తాన్‌కు ఎన్నో విజయాలను అందించిన ఘనత ఈ ఎడమచేతి వాటం బౌలర్‌ది. ఆ క్రమంలోనే ప్రత్యర్థి జట్లు అక్రమ్ బౌలింగ్‌కు భయపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఓ వికెట్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత అక్రమ్ భయపడ్డాడట. ఈ విషయాన్ని అక్రమ్ షేర్ చేసుకున్నాడు. (బాస్.. నాకు ఓపెనింగ్ కొత్త కాదు) ‘ 1988 ప్రాంతంలో రిచర్డ్స్ నా బౌలింగ్‌లో చాలాసార్లు హిట్ చేశాడు. అతనొక భారీ కాయుడు. నేనేమో సన్నగా ఉండేవాడిని. అయితే రిచర్డ్స్కు బౌలింగ్ చేసేటప్పుడు ఓ బౌన్సర్ వేస్తే అతని క్యాప్ కింది పడిపోయింది. అదొక పెద్ద ఘనతగా నేను భావించా. దాంతో రిచర్డ్స్ వద్దకు వెళ్లి నాకు వచ్చీ రాని ఇంగ్లిష్‌లో స్లెడ్జ్ చేశా. దానికి రిచర్డ్స్ రిప్లై చేసి షాక్ తిన్నా.మళ్లీ ఇలా చేశావంటే ఊరుకోను అన్నాడు. ఆ తర్వాత ఏదో అన్నాడు. అది నాకు సరిగా అర్థం కాలేదు. ఇదే విషయాన్ని అప్పటి మా కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పా. ఏమీ భయపడవద్దు. మళ్లీ బౌన్సర్ వేయమన్నాడు. దాంతో బౌన్సర్ వేశా. చివరగా ఓ ఇన్‌స్వింగర్‌తో రిచర్డ్స్‌ను బౌల్డ్ చేయడంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఇక వెళ్లిపో’ అంటూ పెద్దగా అరిచాను. ఆ తర్వాత రిచర్డ్స్ పెవిలియన్‌కు చేరిన తర్వాత షర్ట్ లేకుండా కూర్చోవడం చూశాను. అయితే నాకు కోసమే చూస్తున్నాడని అనుకోలేదు. మేము డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో రిచర్డ్స్ బ్యాట్ పట్టుకుని షర్ట్ లేకుండా నా కోసం చూస్తున్నాడు. ఇది నాకు అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఇమ్రాన్‌కు చెప్పా. నువ్వే హ్యాండిల్ చేసుకుంటేనే బాగుంటుదని చెప్పాడు. అదే సమయంలో ఇమ్రాన్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయా. ఆ తర్వాత రిచర్డ్స్ వద్దకు వెళ్లి సారీ చెప్పా. మళ్లీ ఆ తప్పు చేయనన్నా. నువ్వు అలా చేయకపోవడం మంచిది. ఒకవేళ మళ్లీ రిపీట్ అయితే నిన్ను చంపేస్తా’ అని రిచర్డ్స్ వార్నింగ్ ఇచ్చాడన్నాడు. (‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్’) -
కోహ్లి సాధిస్తాడా!.. అనుమానమే?
హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అనేక రికార్డులను టీమిండియా సారథి విరాట్ కోహ్లి బద్దలుకొట్టగలడా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మజీ సారథి, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్. కోహ్లి అత్యుత్తమ బ్యాట్మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని కానీ సచిన్‌తో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను నెలకొల్పాడాడని గుర్తుచేసిన అక్రమ్.. సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తాడా లేడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలన్నాడు. ‘నేను మనసులో ఏది అనుకుంటే అది నిర్మోహమాటంగా బయటకు చెబుతాను. సచిన్, కోహ్లి ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు, ఇప్పటికే కోహ్లి అనేక రికార్డులను నెలకొల్పాడు. కానీ వీరిద్దరిని పోల్చడం సరికాదు. ఇద్దరి బ్యాటింగ్‌లో, బాడీ లాంగ్వేజీలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే సచిన్, కోహ్లిలు దూకుడైన ఆటగాళ్లు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. సచిన్‌ను స్లెడ్జింగ్ చేస్తే నవ్వుతూ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. ప్రత్యర్థి బౌలర్ కవ్వింపు చర్యలకు దిగితే సచిన్ మరింత ఏకాగ్రతతో వ్యవహరిస్తాడు. కానీ కోహ్లి ఏకాగ్రతను దెబ్బతీయం చాలా సులువు. అతడిని స్లెడ్జింగ్ చేస్తే చాలా సులువుగా తన సహనాన్ని కోల్పోతాడు. అయితే ఇలా సహనం కోల్పోతే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంది’ అని వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. చదవండి: ‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’ 'పాంటింగ్ నిర్ణయం మా కొంప ముంచింది' -
‘బుమ్రాకు మాత్రం అనవసరం’
కరాచీ: తమ ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవడం కోసం చాలా మంది క్రికెటర్లు ఇంగ్లిష్ కౌంటీల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. తమ దేశంలో ఎంతటి స్టార్ క్రికెటర్లైనా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటాన్ని హుందాగా స్వీకరిస్తారు. ఇలా ఇంగ్లిష్ కౌంటీలు ఆడిన ప్రధాన భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, సౌరవ్ గంగూలీ, అజింక్యా రహానే, యువరాజ్ సింగ్, చతేశ్వర పుజారా తదితరులు ఉన్నారు. అయితే ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం కౌంటీలు ఆడాల్సిన అవసర లేదంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్. బుమ్రా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటం కంటే విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్న బుమ్రాకు ఇంగ్లిష్ కౌంటీ ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డాడు. (ఆ రచ్చ ఇప్పుడెందుకో..?) దాంతో అతి పెద్ద లీగ్ అయిన ఐపీఎల్లో కూడా బుమ్రాది అతి పెద్ద రోల్ కాబట్టి, కౌంటీల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నాడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. బుమ్రా ఒక టాప్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ కొనియాడాడు. ప్రస్తుత ప్రపంచ టాప్ బౌలర్లలో బుమ్రా కూడా ఒకడని ప్రశంసించాడు. ఇక టీ20 ఫార్మాట్ నుంచి బౌలర్లు నేర్చుకునేది ఏమీ ఉండదన్నాడు. టీ20 ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ప్రతిభను తాను జడ్జ్ చేయలేనన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ ద్వారానే క్రికెటర్ల ప్రతిభను గుర్తించగలనన్నాడు. కాగా, తాను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో తన టాలెంట్‌ను ఇమ్రాన్ భాయ్, మియాందాద్ భాయ్, ముదాసర్ నజార్‌లు మాత్రమే గుర్తించారన్నాడు. ఈ కుర్రాడిలో టాలెంట్ ఉందని వారు పదే పదే చెబుతూ ఉండేవారని, అది తనకు అర్థం అయ్యేది కాదని గత జ్క్షాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. ఈ ముగ్గుర్నీ వేరు వేరు విషయాలను నేర్చుకున్నానన్నాడు. అయితే తాను టాలెంట్ అనే ట్యాగ్‌ను ఎంజాయ్ చేసేవాడినని అక్రమ్ తెలిపాడు. (హార్డ్ హిట్టర్‌పై ఆరేళ్ల నిషేధం) -
17 ఏళ్లకు ‘వరల్డ్‌కప్’ ఆరోపణలా?
కరాచీ: తాను క్రికెట్‌కు గుడ్ బై చెప్పి దాదాపు 17 ఏళ్లు అయ్యిందని ఇంకా తనను వివాదాల్లోకి లాగడానికి వెనుక కారణాలు ఏమిటో అర్థం కావడం లేదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మండిపడ్డాడు. తనపై ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నారని ధ్వజమెత్తాడు.ఇటీవల అమిర్ సొహైల్ చేసిన వ్యాఖ్యలు తనను మరింత నైరాశ్యంలోకి నెడుతున్నాయని అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 1992లో పాకిస్తాన్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత మరో వరల్డ్‌కప్ గెలవకపోవడానికి వసీం అక్రమ్ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని అమిర్ సొహైల్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 1996, 1999, 2003 వరల్డ్‌కప్‌ల్లో అక్రమ్ పాకిస్తాన్ కెప్టెన్‌గా చేయడాన్ని సొహైల్ ప్రస్తావించాడు. (పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో) ‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో వరల్డ్‌కప్ రాకుండా చేయడమే అక్రమ్‌కు అప్పట్లో లక్ష్యం. అక్రమ్‌కు దేశం పట్ల అంకితభావం ఉంటే పాక్ 1996, 1999, 2003 వరల్డ్‌కప్‌లు నెగ్గేది. ఒక కారణంతో ఈ నాటకమంతా జరిగింది. 1995లో పాక్‌కు రమీజ్ రాజా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతకుముందు సలీమ్ మాలిక్ పాక్‌కు సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా ఎంతో విజయవంతమైన మాలిక్‌ను కొనసాగించివుంటే అసలు అక్రమ్ కెప్టెన్ అయ్యేవాడేకాదు. మూడు వరల్డ్‌కప్‌లకు కొంతకాలం ముందు మాత్రమే అక్రమ్ కెప్టెన్ అయ్యేవాడు. ఎందుకంటే పాక్‌కు మరో వరల్డ్‌కప్ ఉండకూడదనే ఉద్దేశంతోనే. పాక్‌కు వరల్డ్‌కప్‌కు సాధించిన ఘనత తన గురువు (ఇమ్రాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు)పేరిట మాత్రమే ఉండాలనే కారణం.దీనిపై విచారణ జరిపించాలి’ అని ఈ పాక్ మాజీ ఓపెనర్ డిమాండ్ చేశాడు.(‘భారత్‌తో డబ్యూటీసీ వద్దు.. యాషెస్ పెట్టండి’) -
'అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని'
లాహోర్ : తరచూ ఏదో ఒక వివాదంలో ఉండే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చి ఉంటే అతన్ని కచ్చితంగా చంపేసివాడినంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఇలాగే మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడి తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారని, దీంతో పాక్ క్రికెట్ మసకబారిదంటూ గతేడాది ఇదే సమయంలో అక్తర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే') తాజాగా అక్తర్ మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేస్తూ..' వసీం అక్రమ్ ఒకవేళ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని ఒత్తిడి తెచ్చి ఉంటే కచ్చితంగా అతన్ని నాశనం చేయడమో లేదా చంపేయాడానికి సిద్దపడేవాన్ని. కానీ అక్రమ్ అలాంటి ప్రతిపాధనతో నా ముందుకు ఎప్పుడు రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామంటూ నా దగ్గరకు బూకీలు వచ్చిన ప్రతీసారి వారిని వెనక్కి పంపించాను.నేను పాకిస్తాన్‌ను ఎప్పుడూ మోసం చేయకూడదని భావించా. 21 మంది ఆడే ఆటలో ఎంతమంది మ్యాచ్ ఫిక్సర్లు ఉన్నారనేది ఎవరు చెప్పలేరు. అంతేగాక తాను అక్రమ్‌తో కలిసి 1990వ దశకంలో ఆడాను. అతను ఎప్పుడు తప్పుడు దారిని ఏంచుకోలేదు. తన అద్బుతమైన బౌలింగ్‌తో కష్టాల్లో ఉన్న పాక్ జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. (నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు) అక్రమ్‌తో కలిసి ఎనిమిది సంవత్సరాలు ఆడిన విషయం నాకు బాగా గుర్తుంది. టాప్ ఆర్డర్ పని తాను చూసుకుంటానని.. నువ్వు టెయిలెండర్లను ఔట్ చేసే బాధ్యత నీదేనంటూ అక్రమ్ నాతో చెప్పేవాడు. బహుశా అందుకేనేమో క్రికెట్ ఆడే సమయంలో నాకు అక్రమ్‌ను గౌరవించాలని అనిపించలేదు. నన్ను బౌలింగ్ విషయంలో మాత్రం ఎప్పుడూ మెచ్చుకుంటాడని, బౌలింగ్‌లో వైవిధ్యం చూపించేలా ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. ఆటకు దూరమైన తర్వాత నేను అక్రమ్‌ను పర్సనల్‌గా కలిసి నా ప్రవర్తనను క్షమించమని కోరానంటూ' చెప్పుకొచ్చాడు.షోయబ్ అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు. -
'ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే'
కరాచి : సాధారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైవోల్టేజ్ లెవల్లో ఉంటుంది. ఇరు జట్లలో ఎవరు గెలిచినా , ఓడినా అభిమానులను ఆపడం ఎవరితరం కాదు. ఇక ఫైనల్లో ఇరు జట్లు తలపడితే ఆ మజా ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో చూశాం. సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఏప్రిల్ 18) భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అసలే ఫైనల్ మ్యాచ్.. ఆపై ఉత్కంఠంగా జరిగింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన దాయాదుల పోరు ఇప్పటికి అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నది. ('నీలాంటి వాళ్లతో నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది') ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు నాలుగు పరుగుల అవసరం కాగా జావేద్ మియాందాద్ ' సిక్స్ కొట్టడంతో పాక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విషయం పక్కనపెడితే ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో మియాదాంద్ అక్రమ్ బ్యాట్‌తో బరిలోకి దిగాడంట. అదే బ్యాట్‌తో తన ఇన్నింగ్స్ కొనసాగించిన మియాందాద్ చేతన్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి పాక్ జట్టుకు అపరూప విజయాన్ని అందించాడు. వసీం అక్రమ్ ఈ విషయాన్ని శనివారం ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. 'ఆరోజు జరిగిన మ్యాచ్‌లో మియాందాద్ నా బ్యాట్‌నే ఉపయోగించాడు. ఫైనల్ మ్యాచ్‌లో మియాందాద్ ఆఖరి బంతికి కొట్టిన సిక్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆఖరి బంతికి ఏ మాత్రం తడబడకుండా సిక్స్ కొట్టిన మియాందాద్ ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మియాదాంద్ సిక్స్ కొట్టిన బ్యాట్ నాదే. అంత గొప్ప మ్యాచ్‌లో నేను భాగస్వామినయినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇది జరిగి 34 ఏళ్లు అయినా ఇంకా నా మదిలో మెలుగుతూనే ఉంది' అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. Some moments are etched in ur memory and @I_JavedMiandad hit that epic six against India at Sharjah is 1 of them. It’s a piece of cricket beauties. Whenever you watch it, it gives you real joy and tells how great a batsman he was.BTW the bat from which that 6 was hit was mine😀 https://t.co/T90s0uOgN0 — Wasim Akram (@wasimakramlive) April 18, 2020 -
నిధుల సేకరణకు దిగ్గజ క్రికెటర్లు
కరాచీ: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు క్రీడాకారులు చేయూతనివ్వగా ఇప్పుడు వారి జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్‌లు చేరిపోయారు. తమ హయాంలో కీలక ఆటగాళ్లకు పేరుగాంచిన వీరిద్దరూ తమ వంతు సాయంగా వారు పదిలంగా దాచుకున్న కొన్ని జ్ఞాపకాలను వేలంలో వేయడానికి సిద్ధమయ్యారు. కరోనా వైరస్ బాధితులకు అండగా నిలిచేందుకు నిధుల సేకరణ చేపట్టనున్నారు. తమ వస్తువుల ద్వారా వచ్చే మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. (షాట్ కొట్టి.. పరుగు కోసం ఏం చేశాడో తెలుసా!) ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని క్రికెట్ వస్తువులను వేలం వేయనున్నట్లు వీరు తెలిపారు. పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వికెట్లను సాధించిన ఘనత అక్రమ్‌ది. 104 టెస్టుల్లో 414 వికెట్లు సాధించిన అక్రమ్.. 20సార్లు ఐదుకు పైగా వికెట్లను తీశాడు. ఇక 356 వన్డేల్లో 502 వికెట్లను అక్రమ్ సాధించాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ డారెన్ గాఫ్. 159 మ్యాచ్‌ల్లో 234 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు గాఫ్. ఇక్కడ జేమ్స్ అండర్సన్ 237 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. వరల్డ్‌కప్ విన్నింగ్ షర్ట్ వేలంలో.. ఇక మరో ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ కూడా ముందుకొచ్చాడు. 2019 వరల్డ్‌కప్ గెలిచిన మ్యాచ్‌లో ధరించిన షర్ట్(జెర్సీ)ను వేలం వేయనున్నాడు. రవి బొపారాకు కూడా తన వంతు సాయంగా నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) బృందానికి ఫ్రీ చికెన్‌ను అందించనున్నాడు. తన సొంత రెస్టారెంట్ నుంచి వారికి చికెన్‌ను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. -
మా బ్యాట్స్‌మన్ తర్వాతే సెహ్వాగ్..
కరాచీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని దూకుడుతో ఓపెనింగ్ స్థానానికే వన్నె తెచ్చిన ఆటగాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో కూడా తనదైన ముద్ర వేశాడు సెహ్వాగ్. టెస్టు క్రికెట్లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ మజాను అందించిన క్రికెటర్ సెహ్వాగ్. టెస్టుల్లో ఎన్నో సందర్భాల్లో హాఫ్ సెంచరీ, సెంచరీలను సిక్స్‌లతో ముగించిన సెహ్వాగ్. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫార్మాట్ ఓపెనింగ్ మైండ్‌సెట్‌ను మార్చేశాడనేది చాలామంది అభిప్రాయం. అయితే టెస్టుల్లో ఓపెనింగ్ మైండ్‌సెట్‌ను మార్చింది సెహ్వాగ్ ఎంతమాత్రం కాదని అంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్. వీరేంద్ర సెహ్వాగ్ కంటే ముందే టెస్టు ఓపెనింగ్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అని అక్రమ్ తెలిపాడు. ‘సెహ్వాగ్ క్రికెట్లో అరంగేట్రం చేయకముందే అఫ్రిది టెస్టు ఫార్మాట్లో ఓపెనింగ్ మైండ్ సెట్‌ను మొత్తం మార్చేశాడు. 1998లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఫార్మాట్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఆపై 1999-2000 సీజన్లో భారత పర్యటనకు ఆఫ్రిది వచ్చాడు. అదే ఆఫ్రిది కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఒక విధ్వంసకర ఆటగాడిగా ఆఫ్రిది గుర్తింపు సాధించింది ఆనాటి భారత పర్యటనలోనే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆఫ్రిది మొదటి సెంచరీ సాధించడమేకాకుండా మ్యాచ్‌లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆ సిరీస్‌ను పాకిస్తాన్ 2-1తో గెలుచుకుంది. ఈ పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు ఆఫ్రిదిని ఎంపిక చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పా. అయితే చాలా మంది సెలక్టర్లు ఆఫ్రిది తీసుకోవడం వ్యతిరేకించారు. కానీ ఇమ్రాన్‌ఖాన్ నుంచి కెప్టెన్ అయిన నాకు మద్దతు లభించింది. ఆఫ్రిది కనీసం ఒకటి లేదా రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిపిస్తాడని నమ్మకాన్ని ఇమ్రాన్ కల్పించాడు. అదే జరిగింది. ఓపెనింగ్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్ ఆఫ్రిది. సెహ్వాగ్ కంటే ముందు దూకుడైన ఆటతో క్రికెట్ అభిమానులను అలరించాడు ఆఫ్రిది. నేను సాధారణంగా చాలా విషయాలను ఇమ్రాన్‌తో చర్చిస్తాను. ఒక పర్యటనకు ముందు మా లెజెండ్ కెప్టెన్ అయిన ఇమ్రాన్‌తో చర్చించడం నాకు అలవాటు. అతని సలహాలు ఎప్పుడూ నాకు బాగా ఉపయోగపడేవి. చెన్నై ట్రాక్‌లో అనిల్ కుంబ్లే, సునీల్ జోషిల బౌలింగ్‌లో సిక్స్‌లు మోత మోగించాడు ఆఫ్రిది. స్పిన్నర్లు ప్రధాన బలమైన భారత్‌పై ఆఫ్రిది విరుచుకుపడ్డాడు. ఆనాటి మ్యాచ్‌లో ఆఫ్రిది 141 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా ఆఫ్రిది మార్కు సెపరేటు. నా పరంగా చూస్తే టెస్టుల్లో ఓపెనింగ్ మైండ్‌సెట్‌ను మార్చింది మాత్రం ఆఫ్రిదినే’ అని అక్రమ్ తెలిపాడు. -
ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం..: అక్రమ్ చురకలు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు ఆ జట్టు ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని వసీం అక్రమ్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఎటువంటి పరిపక్వత లేని ఆటగాళ్లు మాత్రమే ఇలా చేస్తారంటూ ధ్వజమెత్తాడు. రెండు చేతుల్లోని పైకి ఎత్తి ఒక చేత్తో ఐదు వేళ్లను, మరో చేత్తో రెండు వేళ్లను చూపించడం ఎందుకు నిదర్శనమన్నాడు. ఒకవేళ స్టీవ్ స్మిత్‌ను ఇప్పటివరకూ ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం ఈ తరహాలో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మనం జట్టు విజయం కోసం ఏం చేశామన్నదే ముఖ్యమని, ఇలా తానే ఏదో సాధించానన్నట్లు సెలబ్రేట్ చేసుకుని అవతలి ఆటగాడ్ని ఎత్తిచూపడం ఎంతమాత్రం తగదన్నాడు. ‘ మన సమయం ఏమిటో నీకు తెలుసు. నేను ఆడుతున్నప్పుడు ఎవర్నైనా ఔట్ చేసిన సందర్భాల్లో ఈ తరహాలో సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ రోజుల్లో ఎవరు ఏమిటో ప్రతీ ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా గణాంకాల విషయంలో అంతా ఓపెన్‌గా ఉంటుంది. మరి అటువంటప్పుడు ఇలా వేళ్లు చూపించి సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా. ఒక బౌలర్‌గా మనం ప్రాక్టీస్ చేస్తున్నామా.. లేదా.. పాకిస్తాన్ జట్టుకు విజయం అందిస్తున్నామా.. లేదా అనేది ముఖ్యం. మనం జట్టుకు ఉపయోగపడనప్పుడు ఏడుసార్లు ఒక ఆటగాడ్ని ఔట్ చేస్తే లాభం ఏమిటి. అది అనుభవలేమి అంటారు’ అని అక్రమ్ విమర్శించాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలంటే గేమ్ పరిస్థితి ఎలా ఉందో ముందు అర్థం చేసుకోవాలన్నాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో స్మిత్‌ను యాసిర్ షా ఏడు సార్లు ఔట్ చేశాడు. ఆ క్రమంలోనే యాసిర్ షా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. కాకపోతే ఆ టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతోనే యాసిర్ షా సెలబ్రేషన్స్‌ను అక్రమ్ వేలెత్తి చూపాడు. -
వారిద్దరూ నమ్మక ద్రోహం చేశారు..
కేప్‌టౌన్: తనను పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రస్తుత హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బావుల్ హక్ కూడా ఒక కారణమంటూ మికీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను తప్పించడంలో మిస్బావుల్తోపాటు వసీం అక్రమ్ కూడా కీలక పాత్ర పోషించారంటూ ఆర్థర్ పేర్కొన్నాడు.. వీరిద్దర్నీ తాను ఎంతగానో నమ్మితే తనకు అన్యాయం చేశారన్నాడు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆర్థర్ పేర్కొన్నాడు.వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ వైఫల్యం తర్వాత పీసీబీ ఒక కమిటీని నియమించింది. దీనిపై సదరు కమిటీ విచారణ చేపట్టిన తర్వాతే మికీ ఆర్థర్ కాంట్రాక్ట్‌ను పొడిగించడానికి పీసీబీ మొగ్గు చూపలేదు. ఇందులో మిస్బావుల్ హక్‌తో పాటు వసీం అక్రమ్‌లు సభ్యులుగా ఉండటాన్ని ఆర్థర్ ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ కమిటీ రిపోర్ట్ తనకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఈ క్రమంలోనే మిస్బావుల్, వకార్‌లను టార్గెట్ చేశాడు. ‘ నేను ఎందుకు పదవి కోల్పోయానో ఊహించగలను. అందుకు కారణం నేను నమ్మినవారే. మిస్బావుల్, అక్రమ్‌లు కమిటీ సభ్యులిగా ఉన్నప్పటికీ నా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. నేను పాకిస్తాన్ క్రికెట్‌కు పూర్తిస్థాయిలో సేవలందించాను. దాంతోనే మిస్బావుల్-అక్రమ్‌లు నాకు అనుకూలంగా నివేదిక ఇస్తారనుకున్నా. కానీ నాకు వ్యతిరేకంగా ఇచ్చారు. దాంతో నేను కోచ్ పదవి నుంచి వైదొగాల్సి వచ్చింది’ అని ఆర్థర్ పేర్కొన్నాడు. మరొకవైపు కొత్తగా హెడ్ కోచ్‌గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ సక్సెస్ కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశాడు. ‘ మిస్బావుల్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అతనొక ఉన్నతమైన వ్యక్తి.. అందుకోసమే పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల్ని అప్పజెప్పింది. కానీ నేను ప్రతీ సెకండ్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా నన్ను తప్పించడం బాధించింది’ అని ఆర్థర్ తెలిపాడు. -
మన హీరోల్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా?
కరాచీ: ఇటీవల దుబాయ్‌లో జరిగిన బాక్సింగ్ బౌట్లో ఫిలీప్పిన్స్ బాక్సర్ కార్నడో తనోమోర్‌ను కేవలం 82 సెకండ్లలో నాకౌట్ చేసి దిగ్విజయంగా స్వదేశానికి వచ్చిన పాకిస్తాన్ ప్రొఫెషనల్ బాక్సర్ మహ్మద్ వసీంకు చేదు అనుభవమే ఎదురైంది. దేశం తరఫున విజయం సాధిస్తే అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మహ్మద్ వసీంకు కనీస స్వాగత ఏర్పాట్లు చేయలేదు. దీన్ని ఘోర అవమానంగా భావించిన వసీం.. ‘తాను పాకిస్తాన్ టాలెంట్‌ను ప్రపంచ వేదికపై చాటడానికి మాత్రమే వెళతాను. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతాల కోసం నేను ఫైట్ చేయడం లేదు. ప్రతీ క్యాంప్, ప్రతీ టూర్, ప్రతీ ట్రైయినింగ్ నాకు ముఖ్యమే. పాకిస్తాన్ బాక్సింగ్ టాలెంట్‌ను ప్రపంచం గుర్తించాలనే కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. దీనిపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. ఇదేనా తమ దేశ హీరోల్ని గౌరవించుకునే విధానం అంటూ ధ్వజమెత్తాడు. ‘నేను వసీంకు పాక్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. దేశం తరఫున ఎవరైనా సత్తా చాటితే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మన హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇవే నా క్షమాపణలు. నువ్వు తర్వాత బౌట్లో గెలిచినప్పడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా. నీ విజయానికి ఇవే నా అభినందలు’ అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ పది బౌట్లలో పాల్గొన్న వసీం.. ఒకదాంట్లో మాత్రమే పరాజయం చూసి తొమ్మిది బౌట్లలో గెలుపు అందుకున్నాడు. ఇందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. -
వసీం అక్రమ్‌కు ఘోర అవమానం
మాంచెస్టర్: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్‌కు మాంచెస్టర్ విమానశ్రయంలో ఘోర అవమానం ఎదురైంది. ఇన్సులిన్ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, పబ్లిక్‌లో తనపై గట్టిగా అరిచారని ట్విటర్ వేదికగా అక్రమ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాంచెస్టర్ విమానశ్రయంలో జరిగిన సంఘటనతో తీవ్ర నిరాశ చెందాను. నేను అనేక దేశాలు ఇన్సులిన్ వెంటబెట్టుకునే వెళ్లాను. కానీ ఈ రోజు అదే ఇన్సులిన్‌తో మాంచెస్టర్‌లో ఘోర అవమనానికి ఎదురయ్యాను. దీనికి సంబంధించి అధికారులు నన్ను పబ్లిక్‌లో గట్టిగా ప్రశ్నించారు, నాపై అరిచారు. అధికారుల కారణంగా కోల్డ్ కేస్‌లో ఉండాల్సిన ఇన్సులిన్ చెత్త బుట్టలో పడ్డాయి’అంటూ అక్రమ్ ట్వీట్ చేశాడు. కాగా, వసీం అక్రమ్ ట్వీట్‌కు మాంచెస్టర్ ఎయిర్‌పోర్టు అఫిషియల్స్ స్పందించారు. ‘థ్యాంక్యూ వసీం. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు. దీనిపై విచారిస్తాం. మీరు మాకు డైరెక్ట్‌గా మెసెజ్ చేస్తే.. మరింత సమాచారం తీసుకోగలం’అంటూ ఎయిర్పోర్ట్ అఫిషియల్స్ ఆక్రమ్కు తెలిపారు. ‘త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. మీకు కాంటాక్ట్‌లో ఉంటాను’అంటూ అక్రమ్ రిట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అక్రమ్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. టోర్నీ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న అతడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. 104 టెస్టులు, 356 వన్డేలు ఆడినే ఆక్రమ్.. పాక్ సాధించిన అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. -
అతనికి ఫేర్వెల్ డిన్నర్ ఇస్తే చాలు: అక్రమ్
లండన్: వన్డే వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్న తమ దేశ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు ఫేర్వెల్ డిన్నర్ ఇస్తే సరిపోతుందని పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేర్కొన్నాడు. అతనికి ఫేర్వెల్ మ్యాచ్ లేకపోయినా ఫర్వాలేదు కానీ, కనీసం ఫేర్వెల్ డిన్నర్ ఇవ్వమంటూ సూచించాడు. ఏ క్రికెటర్‌కైనా తన కెరీర్లో ఆడబోయే చిట్టచివరి మ్యాచ్ గానీ, సిరీస్ గానీ, టోర్నమెంట్ గానీ అత్యుత్తమంగా భావిస్తారని, దురదృష్టవశావత్తూ షోయబ్ మాలిక్ దీనికి నోచుకోలేదన్నాడు. పాకిస్తాన్ జట్టుకు షోయబ్ మాలిక్ పలు విజయాలు అందించాడని, దాన్ని ఎవరూ విస్మరించబోరని అన్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో షోయబ్ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడారని, అందులోనూ అతను ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు షోయబ్ మాలిక్ చాలా సేవ చేశారని, కొన్ని చిరస్మరణీయమైన విజయాలను అందించారని, దీనికి గుర్తుగా ఓ మంచి ఫేర్వెల్ డిన్నర్ ఇవ్వొచ్చని వ్యాఖ్యానించాడు. మాలిక్‌కు ఏమైనా ఫేర్వెల్ మ్యాచ్ ఉంటుందా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అక్రమ్ సమాధానమిచ్చాడు. ఒక ప్లేయర్ వీడ్కోలు కోసం వన్డే మ్యాచ్ ఏర్పాటు చేయడానికి ఇదేమీ క్లబ్ క్రికెట్ కాదని అక్రమ్ అన్నాడు. అతని కోసం ఫేర్వెల్ డిన్నర్ ఇస్తే చాలని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమైన షోయబ్ మాలిక్.. గత నెల 16వ తేదీన మాంచెస్టర్‌లో టీమిండియాతో చివరిసారి ఆడాడు. ఆ తర్వాత అతన్ని జట్టులోకి తీసుకోలేదు. షోయబ్ స్థానంలో హారిస్ సొహైల్‌కు తుది జట్టులో చోటు కల్పించింది పాక్ టీమ్ మేనేజ్మెంట్. అతను అద్భుతంగా రాణిస్తుండటంతో ఇక షోయబ్ అవసరం జట్టుకు లేకుండా పోయింది. రిటైర్ అవుతున్న నేపథ్యంలోమాలిక్ను బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిస్తారని అందరూ ఆశించారు. అలా జరగలేదు. జట్టులో షోయబ్ ఉన్నాడనే విషయాన్నే విస్మరించినట్టుంది పాక్ టీమ్ మేనేజ్మెంట్. అతణ్ని యథావిధిగా పక్కన పెట్టింది. ఎలాంటి మార్పులు లేకుండానే బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఫేర్వెల్ మ్యాచ్ కోసమైనా షోయబ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
‘ఆ ఫీట్‌ను పాక్ రిపీట్ చేస్తుంది’
బర్మింగ్హమ్ : టీమిండియాపై ఓటమి అనంతరం పుంజుకొని దక్షిణాఫ్రికాపై విజయం అందుకున్న పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్ బలమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే వరుస విజయాలతో దూసుకపోతున్న కివీస్‌ను ఓడించడం పాక్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే కివీస్‌పై పాక్ విజయం సాధించి తీరుతుందని ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్ టీంనే బరిలోకి దింపాలని వసీం అక్రమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు సూచించాడు. 1992 వరల్డ్‌కప్ ఫీట్‌ను పాక్ జట్టు పునరావృతం చేస్తుందని అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పాక్‌కు చెందిన మీడియా చానెల్‌తో అక్రమ్ మాట్లాడుతూ .. 1992 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో పాక్ చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని ఆక్రమ్ గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డాడు. అలాగే పాక్ జట్టు ఫీల్డింగ్‌లో బాగా మెరుగుపడాలని సూచించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 క్యాచ్‌లను నేలపాలు చేసి అత్యధిక క్యాచ్‌లను జారవిడిచిన జట్లలో పాక్ తొలి స్థానంలో నిలవడం మంచిది కాదని అక్రమ్ హెచ్చరించాడు. పాక్ టాపార్డర్ రాణిస్తున్నప్పటికీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైపల్యంతో ఓడిపోతున్నామని పేర్కొన్నాడు. ఇక వన్‌డౌన్‌లో వస్తున్న బాబర్ అజమ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమవుతున్నాడని తెలిపాడు. కాగా, ఇప్పటివరకు పాక్ జట్టు 6 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 5 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా మాడు మ్యాచ్‌లు తప్పక గెలవడమేగాక ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కివీస్‌తో పాక్ తలపడనుంది. -
‘భారత్-పాక్ క్రికెట్ మ్యాచే.. యుద్దం కాదు’
ఇస్లామాబాద్ : యావత్ క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల అభిమానులు మైదానంలో జరుగుతున్న ఓ యుద్ధంలా చూస్తారు. ఇక అది ప్రపంచకప్ మ్యాచ్ అయితే టీవీలకే అతుక్కుపోతారు. తామే మైదానంలో యుద్దం చేస్తున్నట్లు ఫీలవుతారు. ప్రతికూల ఫలితాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఈ దాయాదుల పోరు జరగనున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇంకా కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానులు, ఆటగాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అయితే భారత్-పాక్ మధ్య జరిగేది క్రికెట్ మ్యాచేనని, యుద్ధం కాదని.. అభిమానులు ప్రశాంతంగా ఉండాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విజ్ఞప్తి చేస్తున్నాడు. (చదవండి: పాక్ మీకు కావాల్సిన కప్ ఇదే: పూనమ్ ఫైర్) ‘ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అభిమానులు ఈ మ్యాచ్ చాలా పెద్దదిగా చూస్తారు. కాబట్టి ఇరు జట్ల అభిమానులను నేను కోరేది ఒక్కటే.. మ్యాచ్ అన్నప్పుడు ఒక జట్టు ఓడి మరో జట్టు గెలవడం సర్వసాధారణం. కావున దీన్ని ఓ యుద్దంలా భావించవద్దు. అలా ఎవరూ పరగణిస్తారో వారు నిజమైన క్రికెట్ అభిమానులు కాదు.’ అని వసీం పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్ చరిత్రలో పాక్, భారత్‌ను ఇంత వరకు ఓండిచలేకపోయింది. కానీ ఆదివారం పాక్ ఈ రికార్డు తిరగరాస్తుందని వసీం ఆశాభావం వ్యక్తం చేశాడు. 1992, 1999, 2003 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ చేతిలో ఓడిన పాక్ జట్టులో వసీం అక్రమ్ కూడా సభ్యుడే. ‘ అవును. భారత్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఓడాం. వాటి నేను గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. కానీ అభిమానులు ఎక్కడ ఉన్నా టీవీలకు అతుక్కుపోవడం వంటి నాటి పరిస్థితులను బాగా ఆస్వాదించాను. ఆదివారం కూడా ఇవే పరిస్థితులు పునరావృతం కానున్నాయి.’ అని వసీం చెప్పుకొచ్చాడు. ఇక భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉండదని, అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి : ‘ఆ ఫైనల్ ఫలితాన్ని రిపీట్ చేద్దాం’) -
‘వరల్డ్‌కప్‌లో ధోనిని ఆడించాలి’
కరాచీ:. గత ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లోనూ ఎంఎస్ ధోని బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆస్ట్రేలియాతో టీ20సిరీస్‌కు ధోనికి చోటు కల్పించలేదు సెలక్టర్లు. ఆసీస్‌తో మూడు టీ20లకు ధోని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్ కోసం సెలక్టర్లు ఇంకా జట్టుని ప్రకటించలేదు. ఈ వన్డే సిరీస్‌లో గనుక ధోనికి ఎంపిక కాకపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో అతను ఎంపిక కావడమనేది ప్రశ్నార్థకమనే వాదన వినిపిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ధోనిని తప్పక ఆడించాలని అంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్. ‘ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి, వచ్చే వరల్డ్‌కప్‌లో ధోనిని చూడాలని అనుకుంటున్నా. ధోని ఓ మ్యాచ్ విన్నర్, అతడిలో ఇంకా క్రికెట్ ఉందని నేను భావిస్తున్నా, ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో ధోని అనుభవం టీమిండియాకు అవసరం’ అని అక్రమ్ అన్నాడు. రెండు రోజుల క్రితం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం వరల్డ్‌కప్ నాటికి ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
మరీ ఇంత దారుణంగా ఓడిపోతారా?
దుబాయ్: ఆసియాకప్‌లో టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలుకావడంపై వకార్ యూనిస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా, సూపర్-4లో సైతం అదే ఆట తీరును పునరావృతం చేయడంపై వసీం అక్రమ్ విమర్శలు గుప్పించాడు. ‘ప్రతీ విభాగంలోనూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన చేసింది. ఫలాన దాంట్లో పాకిస్తాన్ మెరుగైన ఆట తీరు కనబరిచింది అని చెప్పుకోవడానికి లేదు. ఇది మొత్తంగా దారుణమైన ప్రదర్శన. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకుంది. ఇది పాకిస్తాన్ హోంగ్రౌండ్. అటువంటప్పుడు పాక్ ఛేజింగ్ చేస్తేనే ఫలితం మరొకలా ఉండేది. ఆటలో గెలుపు-ఓటముల అనేవి సహజం. కానీ ఇంత దారుణంగా ఓడిపోతారా. ఆసియాకప్‌లో ఈ తరహా ప్రదర్శనను పాక్ నుంచి ఆశించలేదు. ఒక పాకిస్తానీ మాజీ ఆటగాడిగా చెబుతున్నా. ఇది పాకిస్తాన్ అన్ని విభాగాల్లో విఫలమై ఓటమి చెందడం చాలా నిరాశను కల్గించింది. ఇదొక బోరింగ్ గేమ్. మొత్తం దేశాన్నే నిరాశపరిచారు’ అని అక్రమ్ విమర్శించాడు. మరొకవైపు భారత్ జట్టులో కీలక ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేకుండానే వరుస విజయాలు సాధించడాన్ని అక్రమ్ కొనియాడాడు. పాక్‌ను ‘శత’కొట్టారు -
మాలిక్లో ధోని కనిపించాడు: పాక్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్ : ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ ఆటతీరు టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనిని తలపించిందని ఆ జట్టు మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో కడదాక నిలిచిన మాలిక్ హాఫ్ సెంచరీతో పాక్‌కు విజయం అందించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. మూడు బంతుల్లో ఎలాంటి తడబాటు లేకుండా ఒక సిక్స్, ఫోర్ బాది విజయాన్నందించిన మాలిక్‌పై వసీం అక్రమ్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. (చదవండి: ధోని కెప్టెన్సీ.. షకీబ్ బలి) ‘అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని షోయబ్ మాలిక్ అఫ్గానిస్తాన్ మ్యాచ్‌తో మరోసారి నిరూపించాడు. మాలిక్, ధోనిలా ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి చేశాడు. తన ముఖంలో ఎలాంటి హావాభావాలు లేకపోవడంతో అసహనంతో బౌలర్‌కు ఏం చేయాలనో అర్థం కాలేదు. అద్భత బ్యాటింగ్’ అని ట్వీట్ చేశాడు. (చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్..) Experience has no substitute... Shoaib Malik proved it against a spirited Afghanistan .Did a Dhoni like finish ... when Malik faced a bowler, he had no expression on his face and that frustrates a bowler becos he doesn’t know what to expect... wonderful knock @realshoaibmalik — Wasim Akram (@wasimakramlive) September 22, 2018 -
ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు
హెడింగ్లే: పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ (414)ను అధిగమించాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అసాద్ షఫిక్ వికెట్ పడగొట్టిన బ్రాడ్ 415 వికెట్లతో శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్‌తో సమంగా నిలిచాడు. ఇక ఈ జాబితాలో 800 వికెట్లతో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ తొలి స్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619), మెక్ గ్రాత్(563)లు తరువాతి స్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జేమ్స్ అండర్సన్ (540) తరువాత ఈ జాబితాలో స్టువర్ట్ బ్రాడే ఉన్నాడు. ఓటమి దిశగా పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబాటుకు గురైంది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమవడంతో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులకు ఆలౌటవ్వడంతో ఆ జట్టుకు 189 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా పాక్ 84 పరుగుల వెనుకంజలో ఉంది. -
ఈ బుడ్డోడు ఎక్కడున్నాడో వెతకండి
సాక్షి, ఇస్లామాబాద్ : పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్. సుదీర్ఘ కెరీర్లో పాక్‌కు ఎన్నో ఘన విజయాలను అందించాడు. 104 టెస్టుల్లో 414 వికెట్లు.. 356 వన్డేల్లో 502 వికెట్లు ఆయన ఘనత. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓ బుడ్డొడి గురించి తెగ ఆరా తీస్తున్నారు. కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో నిండా పదేళ్లు కూడా లేని ఓ బుడ్డొడు తన బౌలింగ్ వాటం చూపించాడు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో అక్రమ్, మహ్మద్ అమీర్ బౌలింగ్ యాక్షన్లు కలబోసినట్లు ఉన్న ఆ బుడ్డొడు ధాటిగా 17 బంతులను విసిరాడు. అందులో 7 సింగిల్ స్టంప్‌ను ఎగిరేయగా.. మిగతావి తప్పిపోయాయి. ఫైజాన్ రంజాన్ అనే యువకుడు దీనిని ట్విట్టర్లో పోస్టు చేయగా.. చిన్నారి బౌలింగ్ యాక్షన్ చూసి ఫిదా అయిన అక్రమ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇలాంటి టాలెంట్ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన అక్రమ్ భార్య షానెరియా ‘బహుశా అతను మరో అక్రమ్ ఏమో?’ అంటూ కామెంట్ చేసింది. Where is this boy??? We have serious talent flowing through the veins of our nation and no platform for these kids to be discovered. It’s time we do something about it #TheFutureOfCricketIsWithOurYouth https://t.co/ybzd5ASeTx — Wasim Akram (@wasimakramlive) 28 February 2018 -
బుడ్డోడి గురించి ఆరా తీస్తున్న క్రికెటర్
-
టెస్టుల్లో రికార్డు సృష్టించిన లంక బౌలర్
ఢాకా: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తైజూల్ ఇస్లాం వికెట్ పడగొట్టి అత్యధిక వికెట్ల పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉండగా హెరాత్ అధిగమించాడు. ఇప్పటికే 400 వికెట్ల మార్కును దాటిన ఐదో స్పిన్ బౌలర్‌గా హెరాత్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక 89 టెస్టు మ్యాచ్‌లాడిన హెరాత్ 28.17 సగటుతో 415 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ 104 మ్యాచుల్లో 414 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హెరాత్ 4వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌పై 215 పరుగుల తేడాతో లంక భారీ విజయంసాధించింది. ఈ గెలుపుతో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. లంక ఆటగాడు రోషన్సిల్వా కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ఆఫ్ది సిరీస్‌లు లభించాయి. తొలి ఇన్నింగ్స్: శ్రీలంక 222 ఆలౌట్, బంగ్లాదేశ్ 110 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: శ్రీలంక 226 ఆలౌట్, బంగ్లాదేశ్ 123 ఆలౌట్ -
బాల్ ఆఫ్ ది సెంచరీ కాదు.. అదో ‘జఫ్ఫా’
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కళ్లు చెమర్చే బంతితో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికే ఆ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు బాల్ ఆఫ్ ది సమ్మర్, బాల్ ఆఫ్‌ది యాషెస్, బాల్ ఆఫ్‌ది 21వ సెంచరీ, బాల్ ఆఫ్ ది మిలినియమ్ అంటూ పేర్లు పెడుతున్నారు. అయితే ఈ దిగ్గజ బౌలర్ మాత్రం ఆ బంతిని ‘జఫ్ఫా’ అని పిలుస్తానని ట్వీట్ చేశాడు. ‘ఆ బంతిని నేను మాత్రం జఫ్ఫా అని పిలుస్తా.! ఏం బంతేసినవ్ స్టార్క్.. నీ ప్రదర్శన నా బౌలింగ్ రోజులను గుర్తుచేసింది. దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నీ ప్రదర్శనతో ఎడమ చేతి బౌలర్లను తలెత్తుకునేలా చేశావు!’ అని పేర్కొన్నాడు. That’s called a JAFFA! What a delivery @mstarc56 you reminded me of my bowling days and I enjoyed it to the hilt! You made left armers proud! @CricketAus — Wasim Akram (@wasimakramlive) 17 December 2017 యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్ విన్స్‌ను స్టన్నింగ్ బంతితో పెవిలియన్ చేర్చాడు. గంటకు143.9 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి ఒక్కసారిగా 40 సెంటీమీటర్ల మేర రివర్స్ స్వింగ్ అయి జేమ్‌విన్స్ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. దీంతో జేమ్‌విన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు ఏం జరిగిందో తెలియకుండా క్రీజును వదిలాడు. చదవండి: స్టార్క్ స్టన్నింగ్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
'ఇక బౌలింగ్ చేయడం మానుకో'
కరాచీ: అనుమానాస్పద బౌలింగ్ తో పదే పదే సస్పెన్షన్ కు గురువుతున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ తన బౌలింగ్ ను వదులుకుంటేనే ఉత్తమమని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సలహా ఇచ్చాడు. ఒక మంచి బ్యాట్స్ మన్ కూడా అయిన హఫీజ్.. బౌలింగ్ గురించి ఆలోచించకుండా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టడమే ఉత్తమని సూచించాడు. 'ఇక హాఫీజ్ బౌలింగ్ ను వదులుకోవాలి. అప్పుడే బ్యాటింగ్ పై మరింత ఏకాగ్రత పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్ పై మాత్రమే ఫోకస్ పెట్టు. హఫీజ్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు లోబడి లేనప్పుడు దానిపై దృష్టి పెట్టడం ఎందుకు. బౌలింగ్ గురించే పదే పదే పాకులాడుతున్నాడు. అతనికి బ్యాటింగ్ కూడా ఒక ఆయుధం. అటువంటప్పుడు బౌలింగ్ ను మరిచిపో. ఆ క్రమంలోనే బ్యాటింగ్ పై మరింత ఫోకస్ చేస్తే నీ కెరీర్ కు మంచిది'అని అక్రమ్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం హఫీజ్ అనుమానాస్పద బౌలింగ్ శైలితో మరోసారి బౌలింగ్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అతడిని ఐసీసీ అనర్హుడిగా ప్రకటించింది. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి .2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు. -
ఐసీసీకి అంతసీన్ లేకనే..: అక్రమ్
కరాచీ: తమ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లో పాల్గొనేలా భారత్ ను ఒప్పించడంలో విఫలమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అసలు బీసీసీఐని శాసించే సత్తా ఐసీసీకి లేదనడానికి ఇదే ఉదాహరణగా అక్రమ్ విమర్శించాడు. 'ఇరు దేశాల ఆటగాళ్లు పరస్పరం తలపడటం ఎంతో ముఖ్యం. క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి.బీసీసీఐని ఐసీసీ ఒప్పించడంలో విఫలమవుతుంది. బీసీసీఐని అనునయించే సత్తా ఐసీసీకి ఉందని అనుకోవడం లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును శాసించే సత్తా ఐసీసీకి లేదనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది' అని అక్రమ్ మండిపడ్డాడు. ఇక్కడ భారత్ కు ఇష్టం లేకపోతే పాకిస్తాన్ ఎటువంటి బలవంతం చేయకుండా ఉంటేనే మంచిదన్నాడు. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే సిరీస్ లకే ఎక్కువ ఆదరణ లభిస్తుందనేది కాదనలేని సత్యమని అక్రమ్ తెలిపాడు. రాజకీయాలకు అతీతంగా క్రీడల్ని చూసినప్పుడే ఇరు దేశాల మధ్య సిరీస్ లు జరుగుతాయన్నాడు.