intolerance
-
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
భారత్‌ను చైనాతో పోల్చొద్దు: మోదీ
న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో భారత్‌ను పొరుగు దేశమైన చైనాతో పదేపదే పోలుస్తుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి తప్ప చైనాతో కాదని తేలి్చచెప్పారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందని చెప్పారు. భారత్‌ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చమే సముచితమని సూచించారు. ఇండియాలో నిరుద్యోగం, అవినీతి, పరిపాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల లేమి వంటివి పెద్దగా లేవని మోదీ పేర్కొన్నారు. నిజంగా ఇలాంటి అంశాలు ఉండి ఉంటే, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే హోదా మన దేశానికి దక్కేది కాదని స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో భారత సంతతి సీఈఓలు సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇండియాలో నైపుణ్యాల లేమి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మోదీ వెల్లడించారు. ప్రఖ్యాత విదేశీ సంస్థలను ఆకర్శించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో మైనార్టీలను అణచివేస్తున్నారన్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఇక్కడ క్షేమంగా జీవిస్తున్నారని చెప్పారు. -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్‌ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. -
మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్ ప్రశ్నించింది. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
జట్టులో లేని ఆటగాళ్లను పంపిస్తారా?
సౌతాంప్టన్: భారత జట్టు మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రపంచకప్‌లో రేపు భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా... దీనికి నెట్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన బౌలర్లు దీపక్ చహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు వచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు... టీమిండియా కెప్టెన్ కోహ్లి కాకపోయినా, హెడ్‌కోచ్ రవిశాస్త్రినో లేదంటే కనీసం సీనియర్ క్రికెటర్ ఎవరైనా వస్తారని ఆశించారు. తీరా జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్లో కనబడటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు... సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. దీనిపై టీమిండియా మీడియా మేనేజర్‌ను సంప్రదించగా... భారత్ ప్రపంచకప్ ఆట ఇంకా మొదలుకాకపోవడం వల్లే నెట్ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని బదులిచ్చాడు. గత ప్రపంచకప్‌లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటి కెప్టెన్ ధోని మీడియా సమావేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బుమ్రాకు డోప్ టెస్టు: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సోమవారం డోప్ టెస్టు నిర్వహించారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) గుర్తింపు ఉన్న ఏజెన్సీ బుమ్రా నుంచి మూత్ర నమూనాలను సేకరించింది. ఇది ప్రపంచకప్ టోర్నీ కావడంతో పలానా జట్టుకు అని కాకుండా ర్యాండమ్‌గా ఎవరికైనా డోపింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశముంటుంది. -
‘ఇలాంటి దేశం మనకొద్దు’
దుబాయ్ : రానున్న ఎన్నికల్లో గెలుపు కంటే కూడా మరో ముఖ్యమైన సవాలును ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శనివారం ఇక్కడి ఐఎమ్‌టీ దుబాయ్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ గెలుపుకంటే మరో ముఖ్యమైన సవాలును ఎదుర్కొబోతున్నామని తెలిపారు. జర్నలిస్ట్‌ల మీద కాల్పులు.. వేర్వేరు కారణాల పేరు చేప్పి జనాల మీద జరిగే దాడులను ఆపడమే నా ముందున్న అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. మనక్కావాల్సింది ఇలాంటి భారతదేశం కాదు. ఓర్పు అనేది మన సంస్కృతిలో భాగం. కానీ ప్రస్తుత ప్రభుత్వం వల్ల దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ. ఒక అంశాన్ని వేర్వేరు కోణాల్లో ఎలా చూడాలనే విషయం భారతదేశమే తనకు నేర్పిందన్నారు. అంతేకాక భారతదేశంలో మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తే.. విదేశాలకు వెళ్లిన వారంతా తిరిగి దేశంలోకి వస్తారన్నారు. -
కేసీఆర్ అసహనం ఓటమికి సంకేతం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పార్టీ కేడర్‌పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడం టీఆర్ఎస్ ఓట మికి సంకేతం అని సీపీఎం అభివర్ణించింది. టీఆర్ఎస్ పాలనలో చెప్పిం ది ఎక్కువ చేసింది తక్కువ, అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఆ పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. బుధవారం ఎంబీభవన్‌లో పార్టీ నాయకులు టి.జ్యోతి, డి.జి.నర్సింహారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం– సమగ్రాభివృద్ధి సాధన దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పోటీచేస్తున్న సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండటంతో, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి లోక్‌సభ ఎన్నికలకు ముందు పట్టు సాధించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారన్నారు. పాలకపార్టీకి ఈసీ వత్తాసు అధికార టీఆర్ఎస్కు ఈసీ వత్తాసు పలికేలా వ్యవహరిస్తోందని జ్యోతి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పంపిణీ కోసం గ్రామాలకు చేరుతున్నా ఈసీ ఉదాసీనంగా ఉందన్నారు. ఇప్పటికై నా డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేలా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమపథకాల చుట్టే ప్రధానపార్టీల మేనిఫెస్టోలు తిరిగినా, మౌలికంగా మార్పు ఎలా తెస్తారు, పథకాల అమలుకు అవసరమైన డబ్బును ఎలా సమకూరుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
అడవిలో అలజడి
కాకులు దూరని కారడవి కాదు.... చీమలు దూరని చిట్టడవి కాదు....అదొక మామూలు అడవే... కానీ అతి పెద్ద అడవి....ఆ అడవిలో ఒక అలజడి...అది సింహం సృష్టించిన సంహారమా!అది వ్యాఘ్రం విసిరిన పంజాయా!అది ఏనుగులు చేసిన విధ్వంసమా!అది నక్కలు పన్నిన కుతంత్రమా!అది తోడేళ్ళు ఆడిన నాటకమా!అది గద్దలు లేపిన దుమారమా!అది పందికొక్కులు మెక్కిన ఫలహారమా!అవన్నీ ఎలాగూ ఉన్నాయి,అందుకు కాదు అలజడి...మరెందుకు అడవిలో అలజడి రేగింది?ఈ అజెండాతోనే అడవికి రారాజు...మృగరాజు అడవిలోని అతిముఖ్య అమాత్య శేఖరులతో అత్యవసర సమావేశానికి ఆదేశించాడు. ‘‘ఏమిటి! నా అడవిలో అలజడి! నా చట్టం పట్టు తప్పుతోందా! ఏమిటి?’’ అంటూ గట్టిగా గర్జించాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించిన ఆ అడవిలో సింహరాజు చేసిన గర్జన భూదిగంతములంతటా ప్రతిధ్వనించింది. భూకంపం వచ్చినట్లుగా అడవిలోని పక్షులన్నీ భయభ్రాంతులకు గురవుతూ తమ వృక్షావాసాల నుంచి ఒక్కసారిగా రెక్కలు టపటపలాడిస్తూ ఎటో ఎగరిపోయాయి.అడవిలోని అల్ప జంతుజాలమంతా కకావికలమై భూమి కలుగుల్లోనో, చెట్ల పొదల్లోనో ముడుచుకుపోయి దాక్కున్నాయి. మృగరాజు అడిగిన ప్రశ్నకు అమాత్యులేవీ సమాధానం చెప్పడానికి సాహసించలేక మౌనంగా ఉండిపోయాయి. అవి ఉలుకు, పలుకు లేకుండా ఉండడంతో మృగరాజుకు అసహనం కలిగింది. ఏనుగు నుద్దేశించి ‘‘మత్తేభమా! ఏమిటిదంతా! మాకు తలవంపులు తెచ్చేవిధంగా అడవిలో అలజడి!’’ అని తిరిగి ప్రశ్నించింది.తననుద్దేశించి మృగరాజు అడిగేసరికి మత్తగజానికి మాట్లాడక తప్పలేదు.‘‘నేడు కొత్తగా వచ్చిన అలజడి కాదు ప్రభూ! అడవిలో మన న్యాయం ప్రతిష్టించినప్పటి నుంచి ఉన్న అలజడే. అయితే దాని తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదే మనకు తలనొప్పిగా పరిణమించింది’’‘‘ఏది ఏమైనా మాకిది చాలా సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. ఇదేమైనా మన ప్రత్యర్థుల పన్నాగమంటావా!’’ అంటూ నక్కవైపుతిరిగి‘‘జంబుకోత్తమా! నీవద్దేమైనా సమాచారముందా? కాలికి బలపం కట్టుకొని అడవంతా కలియదిరుగుతుంటావుగా! నీవైనా చెప్పు’’ అంటూ అడిగింది సింహం.ఏనుగు మాట్లాడిన తరువాత కొంత ధైర్యం తెచ్చుకున్న నక్క ‘‘ఏమీ లేదు ప్రభూ! అదే మన అడవి న్యాయం ఇక చెల్లదని కొద్దిమంది అల్పులు కొండలెక్కి, గుట్టలెక్కి అరుస్తూ అఘోరిస్తున్నారు’’నక్క ఇచ్చిన సమాచారానికి సింహం పక్కనే నిల్చున్న పెద్దపులి ఆగ్రహంతో శివాలెత్తి పోయింది.‘‘మృగరాజా! మీరు ఆదేశించండి! ఇప్పటికిప్పుడే వెళ్ళి వాళ్ళందరి భరతం పడతాను. వారేమనుకుంటున్నారు? ఇది అడవి కాదనుకుంటున్నారా! అడవి న్యాయం వద్దనిచెప్పడానికి వారికెన్ని గుండెలు’’ అంటూ పెద్ద పెట్టున గాండ్రించింది. మర ఫిరంగి మ్రోగినట్లుగా వచ్చిన ఆ శబ్దానికి కలుగుల్లోని ఎలుకలు బిక్కచచ్చి ఆంజనేయ దండకం ఆలపించాయి. పులి దూకుడుగా వ్యవహరించి పరిస్థితిని చేయి దాటిపోయేటట్లు చేస్తుందనే ఆందోళనతో ఏనుగు కల్పించుకొని ‘‘వ్యాఘ్ర శ్రేష్టమా! ఆగాగు, అన్ని పనులను దండనతోనే చక్కదిద్దలేము. యుగయుగాలుగానున్న మన చట్టానికి సవాలు ఎదురైనప్పుడు సంయమనంతో వ్యవహరించాలి’’‘‘హా!...చాలు.. చాలు మీ నీతి బోధలు. ఆఫ్ట్రాల్ భీతహరిణాలు! మనలను చూసి భయంతో పరుగులు పెట్టే వాటి గురించి ఇంతగా ఆలోచించాలా’’ అంటూ పులి కొట్టిపడేసింది. పులి వైఖరి నక్కకు నచ్చలేదు. అయినా పైకి నవ్వు పులుముకుంటూ ‘‘అయ్యా! మృగ శ్రేష్టమా! మీరు తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థులు. అందులో సందేహంలేదు. కానీ మనం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు వచించియున్నారు. నిజమే! నీవన్నట్లు అల్పులైన హరిణాలు మన కాళ్ళ కింద అణిగి, మణిగి ఉండతగ్గవే. అయితే అవన్నీ కలసి దుమ్ము రేపితే మట్టి మన కళ్ళలో వచ్చి పడుతుంది సుమా! వాటిని నీవు వేటాడుతున్నప్పుడు అవి తెలివిగా అమాంతంగా పరుగెడుతున్న దిక్కుమార్చి నీకు దక్కకుండా తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి గుర్తుంచుకో... ‘‘ఓహో!... మీ నక్క జిత్తులు వదిలించుకున్నారు కాదు. ఈ డొంక తిరుగుడు ఎందుకు? అటో ఇటో సూటిగా తేల్చేయకుండా’’ అని పులి జంబుకం వైపు చురచుర చూసింది. అప్పుడు సింహం కల్పించుకొని ‘‘ఆపండి! మీ వాగ్వివాదం...మనలో మనం కలహించుకోవడానికి కాదు నేను మిమ్మల్ని ఇక్కడకు పిలిచింది. హరిణాలు లేకుండా మన అడవి మనజాలదు. అలాగే అడవిన్యాయాన్ని అవి కాదనడానికి వీల్లేదు. కావున రెండింటికీ సయోధ్య కుదిర్చే సలహా ఇవ్వండి’’ అంటూ తిరిగి నక్కవైపే చూసింది.సింహమంతటి మృగ మహారాజు తననే సలహా చెప్పమని అడిగే సరికి జంబుకానికి లోలోపల ఆనందం జివ్వున ఉప్పొంగింది. దాన్ని బయటకు కనిపించకుండా ‘‘ప్రభూ! మీ దయాదాక్షిణ్యాల క్రింద బ్రతుకుతున్న భృత్యులం. మీ క్షేమమే మా క్షేమం. అదే అడవికి క్షేమం. అంతకు మించినది మరేముంది!’’ నక్క ఇలా సాగదీస్తూ మాట్లాడుతుంటే చిరుతకు చిర్రెత్తుకొచ్చింది.‘‘అది సర్లే!... మీ భట్రాజుల పొగడ్తలు తర్వాత చేద్దురుగాని. మీ ఆలోచన ఏమిటో తొందరగా చెప్పండి’’ అని అడిగింది. ‘‘మృగరాజ్య శేఖరులారా! నా యోచన ప్రకారం ఆ కురంగముల వద్దకు మన ప్రతినిధిని పంపుదాం. మొదట వారి కోర్కెలేమిటో తెలుసుకుందాం. రాజనీతి గురించి మీకు పాఠాలు చెప్పేటంతటి దాన్ని కాను. సామ, దాన,బేధముల తరువాత ఎలాగూ దండోపాయముందిగా’’ అని పలికింది.ఈ ప్రతిపాదనకు పులితో సహా అన్ని అంగీకరిస్తున్నట్లు తలలూపాయి. అతి చిక్కు సమస్యను తానే పరిష్కరించినట్లుగా నక్క అన్నిటివైపు ఒకసారి కలియజూసి తిరిగి ధీమాగా మాట్లాడింది.‘‘మన అమాత్యశేఖరులలో శాకాహార భక్షకులైన మత్త గజేంద్రమే ఇందుకు సార«థ్యం వహించి కార్య భారాన్ని వహిస్తే మంచిది. ఎలాగూ హరిణాలకు మనపై నమ్మకం లేదు’’ అంటూ మరొక సలహా ఇచ్చింది.‘‘భలే, భలే...భేష్! గోమాయువా! అలాగే చేద్దాం. మన కుంజరమును ఆ కురంగముల వద్దకు రాయబారిగా పంపుతున్నాను’’ అంటూ ప్రకటన చేసి మృగరాజు గంభీరంగా అడుగులు వేస్తూ నిష్క్రమించింది. ఆహా! ఎంతటి శోభాయమానంగా ఉందా దృశ్యం... అడవిలోని హరిణాలన్నీ ఒక్క చోట చేరితే అతి మనోహరం కదా! ప్రకృతిలోని వర్ణాలన్నీ విరబూసినట్లుంది. ఉషోదయాన ఆకుల గలగలల సవ్వడి వింటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో... ఇంద్రధనస్సులోని రంగులన్నింటినీ మేనికి పులుముకున్న ఆ కురంగములు అటూ ఇటూ చక చకా కదులుతూ ఒకటితో నొకటి దరహాస పలికింపులను చూస్తే మనస్సు పులకించక మానదు. వాటి వదనాల్లో లాలిత్యం, లావణ్యం విరజిమ్ముతుంటే... కళ్ళలో అణువణువునా ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది. మహిషాసురున్ని వధించి, దశమికి విజయోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైనట్లుందా సమూహం.ఆ హరిణాలు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి ముచ్చటించుకుంటున్న సమయంలో ఎవరో వస్తున్నట్లుగా కలకలం రేగింది. ఎవరు? ఎవరు? అని ఒకటి మరొకదాన్ని అడుగుతున్న సమయానికి మృగరాజు పంపిన మదపుటేనుగు భారీకాయాన్ని మోస్తూ, తొండమూపుతూ అక్కడికి వచ్చింది. ఏనుగు తమ సమీపానికి వచ్చేసరికి లేళ్ళన్నీ ఒకే పెద్ద గుంపుగా వచ్చి నిలబడ్డాయి.ఏనుగు వాటికి ఎదురుగా నిలిచి ఒక్కసారి అంతటా పరికించి చూసింది. లేళ్ళ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. ఇంతటి భారీ కాయమొచ్చి నిలబడితే అవి పల్లెత్తి మాట్లాడకుండా ఉండడంతో ఏనుగు ఒకింత కోపంతో ఘీంకరించి‘‘మీరంతా ఇలా గుమిగూడడం అడవికి మంచిది కాదు. మీలో దేనికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే అవి ఒక్కొక్కటిగా మృగరాజు వద్దకు వెళ్ళి చెప్పుకోవాలి. అంతేకాని కొండలెక్కి, గుట్టలెక్కిఅలజడికి దిగడం సరికాదు’’ అంటూ ఆయాసంగా పలికింది. ‘‘ఇబ్బంది కాదు మహానుభావా! మత్తగజమా!’’ అంటూ గుంపు వెనక భాగంలోంచి ఒక హరిణం గట్టిగా అరిచింది. అంతటా ముందున్నవన్నీ బాగా చెప్పావని అభినందిస్తున్నట్లుగా కాలి గిట్టలతో నేలకు రాస్తూ,గుర్–గుర్ మంటూ సకిలిస్తూ వెనక్కి తిరిగి చూశాయి. ‘‘ఇబ్బంది కాకపోతే కష్టం కావచ్చు. అంత మాత్రానికే ఇంత హంగామా చేస్తారా!’’‘‘కాదు, కాదు... కష్టం కూడా కాదు మహాశయా!’’ అంటూ అన్నీ ఒక్క పెట్టున గొంతెత్తాయి.‘‘ఇలా అన్నీ అరిస్తే నాకేమీ అర్థం కాదు. మీలో ఎవరైనా ఒకటి మీ కోర్కెలేమిటో నాకు ఎరుక పరిస్తే, మృగరాజుకు తెలియబరుస్తాను’’ ‘‘అలాగే... అలాగే...’’ అంటూ గుంపు ముందు భాగానున్న హరిణాలలో బంగరు మేని ఛాయతోనున్న ఒకటి మిగతా వాటిని వారించి ఏనుగు ఎదుటికి వచ్చి నిల్చుంది.‘‘గజరాజా! మా మొర అలకించడానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. ఇబ్బందులు, కష్టాలు ఓర్చుకోలేక మేమిలా గుమిగూడలేదు. అవన్నీ మాకు సహజమే. అంతకు మించిన ఉపద్రవం మామీద వచ్చి పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వేటాడుతోంది. మాలో ఒక్కదానికి మాత్రమే కాదు. మా జాతి జాతంతా నిత్యం భయ భ్రాంతులకు గురవుతోంది. అడవిలో ఆహారానికి వెళ్ళినా, నదీ తీరాలవద్ద నీళ్లుతాగుతున్నా, ఎండకు తాళలేక చెట్ల కింద సేద తీరుతున్నా, చివరకు చెట్టు పొదల్లో విశ్రమిస్తున్నా...మా పిల్లలకు పాలిస్తున్నా...అక్కడ, ఇక్కడ అని లేదు అన్ని చోట్ల మాపై వ్యాఘ్రాల వేట విలయతాండవం చేస్తోంది. మా నీడను చూసి మేమే భయపడాల్సి వస్తోంది’’ అంటూ ఉద్వేగభరితంగా రుద్ధ కంఠంతో విన్నవించింది. ఆ మాటల్లో అనంతకాలంగా గూడుకట్టుకున్న ఆవేదన ఉప్పెనలా పెల్లుబికింది. కాసేపు ఆ హరిణం తనను తాను సంభాళించుకొని కంఠస్వరం మార్చి మళ్ళీ ఇలా చెప్పింది. ‘‘ఏం! ఈ అడవి మాది కాదంటారా! నిర్భయంగా జీవించే హక్కు మాకు లేదా! చెప్పండి’’ అంటూ ఏనుగును నిలదీసింది. ‘‘రెండు రోజుల క్రితం మాలో ఒకటి ఏమరుపాటున ఒక వృద్ధ వ్యాఘ్రం సమీపానికి వెళ్లడమే అది చేసిన పాపమైపోయింది. ఆ వ్యాఘ్రం కండకావరంతో కన్నూమిన్నూ కానకుండా మా దానిపై లంఘించి రాక్షసంగా నొక్కి, రక్కి గాయపర్చింది. మా హరిణం ఎలాగో చావు తప్పించుకుని బయటపడింది. ఈ అన్యాయాన్ని అది నోరు తెరచి మాకు చెప్పడం వల్ల బయటకు తెలిసి వచ్చింది. బయటకు చెప్పలేక మౌనంగా రోదిస్తున్నవీ, కిరాతకంగా బలైనవి మా జాతిలో చాలా ఉన్నాయి. ఇలాంటి అన్యాయాలకు అంతం పలకాలనే మేమిలా చేస్తున్నాం’’ అని దృఢంగా పలికి ఊరుకుంది. ఆ హరిణం చెప్పిన విషయాన్ని సావధానంగా ఆలకించిన ఏనుగు ‘‘ఇంతకీ మీ కోర్కెలేమిటో మాకు విశదం కాలేదు’’ అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. అంతా విని సీతకి రాముడికి సంబంధమేమిటో తెలియదన్నట్లుగా ఏనుగు మాట్లాడే సరికి హరిణాలన్నీ ఆగ్రహంతో ఎగరి గంతులేస్తూ‘‘మీకు విశదం కాకపోవడమే మా విషాదం’’ అంటూ తిరిగి బర్–బర్మంటూ గావుకేకలు పెట్టాయి.‘‘శాంతించండి! శాంతించండి! ఆవేశపడకండి! మనం చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టం చేద్దాం’’ అంటూ ఇంతకు మునుపు వివరించిన ఆ లేడియే మిగతా వాటిని సమాధానపరచి ‘‘మా కోర్కె ఒకే ఒక్కటి. మమ్ములను భయోత్పాతంలో ముంచుతున్న మీ ఆటవిక న్యాయం మాకొద్దు. దాన్ని తిరగరాయాలి. బలాఢ్యులకు చట్టం చుట్టం కారాదు. అడవిలోని జంతువులన్నీ అంతటా సమానమని కొత్త చట్టాన్ని లిఖించాలి. కండ బలంతో మాపై దాడి చేసే మృగమదాంధులను వెలి వేయాలి. ఇలా చేస్తేనే మా అలజడి అగుతుంది. ఇంతే. ఇంతకు మించి ఏమీ లేదు’’ అని తెలియజేసి అడుగులు వెనక్కు వేసి లేళ్ళ గుంపులో కలిసింది. ఏనుగుకు ఏం చేయాలో, ఏమని సమాధానం చెప్పాలో కాసేపు పాలుపోలేదు. కొంత ఆలోచించిన తరువాత‘‘అడవి న్యాయాన్ని అధర్మమనీ, దీన్ని తిరగ రాయమని మీరు అడుగుతున్నట్లు నాకర్థమైంది. ఇది నా చేతిలో లేనిది. మృగరాజుకు విన్నవిస్తాను. ఆపై ప్రభువుల ఇష్టం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని మాత్రం ప్రత్యుత్తరమిచ్చి, తను ఇక చేయగలిగింది ఏమీ లేదని తలచి వెనక్కు తిరిగి భారంగా అడుగులు వేస్తూ వెళ్ళి పోయింది. ఏనుగు కనుమరుగు అయ్యేవరకు హరిణాల గుంపు కదలకుండా నిశ్చలంగా నిలబడి పోయాయి. తమను అధికారం ఆదుకుంటుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా లోకానికి తమ గోడును వినిపించేటట్లు చేయగలిగామనే సంతృప్తి వాటిల్లో కనిపించింది. ఆ అలజడి చివరికేమైంది?ఆటవిక న్యాయం అంతమైందా?అధికారం దాన, భేద, దండోపాయాలతో అణచి వేసిందా?ఇవి సమాధానాలు దొరకని ప్రశ్నలని భావించకండి!మాకెందుకులేనని మౌనం వహించకండి!రండి! వెళ్దాం!కాకులుదూరే కారడవికి...చీమలు దూరే చిట్టడవికి...అమ్మో! నాకు భయమేస్తుంది...క్రూరమృగాలు చంపుకుతింటాయి...అంటూ అక్కడే ఆగి పోయారా...ఆ భయం పెనుభూతమై మిమ్మల్ని కూడా వెంటాడుతుంది... - ఎస్. జి. జిజ్ఞాస -
ఎన్నిసార్లు చెప్పాలి..
కర్నూలు : ‘ఇప్పటికే ఆలస్యమైంది. భవనం ప్రారంభించాం కదా? ఎన్నిసార్లు చెప్పాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో రూ.3.67 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ నూతన పరిపాలన భవనాన్ని, పక్కనేఏర్పాటు చేసిన గౌతమబుద్ధుని విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ భవనాన్ని పరిశీలించాలని కోరగా, లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. మెట్లు ఎక్కేందుకు కూడా ఇష్టపడకుండానే వెనుదిరిగారు. లోకేష్ వస్తున్నారని మూడు రోజులుగా జెడ్పీ చైర్మన్‌తో పాటు అధికారులు, సిబ్బంది రాత్రీ పగలు కష్టపడి భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి జెడ్పీటీసీ సభ్యులను పరిచయం చేయాలని, నాల్గో తరగతి ఉద్యోగులకు యూని ఫాం ఇప్పించాలని, నూతన భవనంలోని తన చాంబర్లో మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలని చైర్మన్ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే.. సమయం లేదంటూ మంత్రి ఒకానొక సందర్భంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌లో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకపోవడంతో సంబంధిత అధికారులు, జెడ్పీ పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మాతా శిశు భవనం ప్రారంభం కర్నూలు సర్వజన వైద్యశాలలో రూ.24 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మాతాశిశు భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. దీంతో పాటు రూ. 6.57 కోట్లతో నిర్మాణం కానున్న ఆధునిక బర్న్స్‌వార్డు, రూ.22 కోట్లకు పైగా నేషనల్ అక్రిడియేషన్ బోర్డు హాస్పిటల్స్ నిధులతో చేపట్టబోయే అప్‌గ్రేడెడ్ పనులకు శంకుస్థాపన చేశారు. గైనిక్‌వార్డులో ప్రసవించిన బాలింతలకు బేబీ కిట్లను అందజేశారు. అంతకుముందు జోహరాపురం వద్ద రూ.17 కోట్లతో హంద్రీ నదిపై హైలెవల్ వంతెన నిర్మాణానికి, రూ.కోటి అంచనాతో 5వ వార్డు జమ్మిచెట్టు వద్ద హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ.1.50 కోట్ల అంచనాతో 6వ వార్డు కమేళా వద్ద ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉస్మానియా కళాశాల మైదానంలో మైనారిటీ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, పెళ్లికుమార్తెలకు ‘దుల్హన్’ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో డిసెంబరులో జరిగే ఇస్తెమాకు పంచాయతీరాజ్ శాఖ తరఫున మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం నందికొట్కూరు మం డలం బ్రాహ్మణకొట్కూరులో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి అఖిలప్రియ, శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్, ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, వైస్ చైర్మన్ పుష్పావతి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, వీరభద్రగౌడ్, కే మీనాక్షినాయుడు, మాండ్ర శివానందరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తలు, మీడియా సమావేశంలో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. శంకుస్థాపనలకే పరిమితయ్యారంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా.. అందుకు ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా.. కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మెక్కుబడిగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు రెండు నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఇంతవరకు అధికారంలోకి రాలేదన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోవడం కొసమెరుపు. -
చిన్న పిల్లాడి పెద్ద మనసు
పిల్లాడు తన దగ్గరున్న చిల్లర నాణేలనిజేబులోంచి తీసి లెక్కించసాగాడు. వెయిట్రెస్ అసహనంగా ఫీలైంది. పిల్లాడు మెనూలోమరో ఫొటో వైపు చూపిస్తూ, ‘మరి ఈ బటర్ స్కాచ్ ఎంత?’ అన్నాడు. ఒక వేసవికాలం మధ్యాహ్నం. ఒక పదేళ్ల పిల్లాడు ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాడు. ఎగిరి కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. పెద్దవాళ్లు ఎవరూ వెంటలేని చిన్న పిల్లాడి దగ్గరికి వచ్చింది ఒక వెయిట్రెస్. గ్లాసు మంచినీళ్లు ముందుపెట్టి, ‘ఏం కావా’లని అడిగింది.టేబుల్ మీదున్న మెనూలోంచి ఒక ఫొటో చూపిస్తూ, ‘ఈ కస్టర్డ్ ఆపిల్ ఐస్‌క్రీమ్ ఎంత?’ అని అడిగాడు పిల్లాడు.‘యాభై రూపాయలు’ బదులిచ్చింది.పిల్లాడు తన దగ్గరున్న చిల్లర నాణేలని జేబులోంచి తీసి లెక్కించసాగాడు. వెయిట్రెస్ అసహనంగా ఫీలైంది.పిల్లాడు మెనూలో మరో ఫొటో వైపు చూపిస్తూ, ‘మరి ఈ బటర్ స్కాచ్ ఎంత?’ అన్నాడు. ఇంతలో పార్లర్‌కు వేరే కస్టమర్లు రావడంతో ఆమె త్వరగా కానిమ్మన్నట్టుగా జవాబు ఇస్తూ, ‘నలభై రూపాయలు’ అంది.పిల్లాడు మళ్లీ నాణేలు లెక్కించసాగాడు. వెయిట్రెస్ ఓపిక నశిస్తోంది. చివరకు తేల్చుకున్నట్టుగా, ‘బటర్ స్కాచ్’ అన్నాడు. ఆమె వేగంగా ఐస్‌క్రీమ్ తెచ్చి, బిల్లు కూడా టేబుల్ మీద పెట్టి, ఇతర కస్టమర్లకు ఏం కావాలో చూడటానికి వెళ్లింది. కాసేపయ్యాక తిరిగి వచ్చేసరికి పిల్లాడు టేబుల్ మీద లేడు. డబ్బు కౌంటర్లో కట్టేసి వెళ్లిపోయాడు. టేబుల్ మీద టిప్పుగా పెట్టిన పది రూపాయి బిళ్లలు చూసేసరికి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. -
ఆగర్భ హింస
‘‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన’’ని పంతులుగారన్నప్పుడే భయమేసింది.‘‘ఆఫీసులో నా మొగుడున్నాడు ! అవసరమొచ్చినా సెలవివ్వడ’’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది – ‘‘వాడికేం? మగమహారాజని ‘‘ఆడా మగా వాగినప్పుడే అర్థమైపోయింది – ‘‘పెళ్ళి’’ అంటే ‘‘పెద్దశిక్ష ’’ అని ‘‘మొగుడు’’ అంటే ‘‘స్వేచ్ఛా భక్షకుడు’’ అని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుందని ! సావిత్రి అనే స్త్రీవాద కవయిత్రి రాసిన ఈ కవిత మొదటిసారి చదివినపుడే కాదు, చదివిన ప్రతిసారీ హృదయాన్ని కంపింపజేస్తుంది . కేవలం పదకొండు పొట్టి వాక్యాలలో సావిత్రి మనం చూస్తున్న సమాజాన్ని, మన చుట్టూ పంజరంలా వేల ఊచలతో పరుచుకున్న పురుష పెత్తందారీ సమాజాన్ని చిత్రిక పట్టింది . చిత్రంగా మగవాళ్ళు కూడా విసుగునో, తప్పించుకోలేని పెత్తనాన్నో చెప్పాలంటే మొగుడు అన్న పదాన్నే వాడుతూ మొగుడు అనే పదవికి వున్న నిరంకుశ ధోరణిని చెప్పకనే ఒప్పుకుంటూ ఉంటారని ఆమె ఈ చిన్ని కవితలో చెప్పుకొచ్చింది. ‘తల్లి’ కడుపును చీల్చుకొని బయట పడకముందునుంచే బంగారు ‘తల్లి’కి లెక్కలేనన్ని కష్టాలు. ఒక్కో దశలో ఒక్కోరకం హింసను దాటుకొనొచ్చి నిలబడాలి ఆ తల్లి. పెళ్లయ్యాకైతే కొంతమందికి చెప్పుకోలేని, చెప్పనివ్వలేని హింస.. గృహహింస. నవంబర్ 25 ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్’ సందర్భంగా...రవీందర్ బాగా చదువుకున్న వ్యక్తి. ఒక ప్రైవేట్ సంస్థలో ఉన్నతోద్యోగంలో వున్నాడు. అతని భార్య ప్రవీణ, టీచర్. వారికిద్దరు పిల్లలు. అత్తమామలు వంటి బాదరబందీ లేని ఆధునిక కుటుంబం. అయినా రవీందర్ ఎప్పుడూ ప్రవీణను మనశ్శాంతిగా ఉండనిచ్చేవాడు కాదు. దానికి కారణం ఆమె ఒంటి రంగు. ఆమె నల్లగా ఉండటం అతనికి చాలా అసహనం కలగజేసేది. ఆమె ఇచ్చిన కట్నం డబ్బు ఆమె రంగును ఆనాడు అతని కంటికి కనిపించనీయకుండా అడ్డుపడింది. కానీ ఈరోజు ఆమెకి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఆమె లాగే నల్లగా ఉండటం అతనికి చిరాకుగా మారింది. ఆ చిరాకును అతను మొదట్లో సూటిపోటి మాటలతో వ్యక్తపరచేవాడు. కాలక్రమంలో ప్రవీణకు పుట్టింటివాళ్ళ వెన్నుదన్ను పెద్దగా లేదని అర్థమయ్యాక అతని అసహనం మాటల నుంచి చేతలకు మారింది. అతను పెట్టే హింస తట్టుకోలేనిదిగా వున్నా నలుగురి ముందు పరువు పోతుందనీ, పిల్లలు తండ్రి లేనివారవుతారనీ, ఈ వయసులో మొగుడ్ని వదిలేస్తే ఇంక దిక్కేముందనీ, నిదానంగా ఆయనే మారుతారని ప్రవీణ ఈ అత్యాచారాన్ని తన కర్మగా భావిస్తూ, భరిస్తూ వచ్చేది. సరిగ్గా పోయిన కార్తీక మాసంలో రవీందర్ కొట్టిన దెబ్బలు ఆమెకు తగలరాని చోట తగిలి అక్కడికక్కడే మరణించింది. అలా మరణించే వరకు ఆమె తన సహనాన్ని పాతివ్రత్యం అనీ, ఆ పాతివ్రత్యానికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా వుంటాయని అందరికీ చెప్తూ ఉండేది. ప్రవీణ మరణం ప్రమాదకర మరణం అని అందరినీ నమ్మించిన కొంతకాలానికి రవీందర్ ప్రవీణకు పుట్టిన నల్ల పిల్లల్ని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపేసి, ఇంకా పసి వయసులోనే వున్నాడు అని సమాజపు ఆమోదాన్ని పొంది రెండవ పెళ్లి చేసేసుకున్నాడు. ఈసారి కట్నానికి పెద్ద ఆశపడకూడదనీ, తనకి తెల్లటి అమ్మాయే కావాలని తెలిసివచ్చిందని భావించి, తెల్లటి అమ్మాయిని వెదికి పెళ్లి చేసుకున్నాడు. ప్రవీణ కేసు భారత దేశంలో నమోదు కాని అనేకానేక గృహ హింస కేసులలో ఒక కేసుగా, పోలీస్ స్టేషన్ వరకు రాని హత్యగా కాలగర్భంలో కలిసి పోయింది. స్త్రీవాద యోధులు మిరాబెల్ సిస్టర్స్ నవంబర్ 25వ తేదీని ఐక్య రాజ్య సమితి ‘‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్’’గా ప్రకటించింది. చలమూ, పెరియార్ ఈ వీ రామస్వామి ఇంకా చాలామంది స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించిన పెద్ద మనుషులు స్త్రీకి ’నీ గురించి నీవే ఆలోచించుకోవాలి’ అని చెప్పారు. తనకేం కావాలో, తాను అనుభవిస్తున్న బాధల రూపమేమిటో తానైతేనే బాగా చెప్పగలదని భావించారు. ప్రపంచవ్యాప్తంగా మొలకెత్తిన ఈ ఆలోచనా రూపమే స్త్రీవాదం. ఈ స్త్రీవాదం సాధించిన విజయమే నవంబర్ 25. స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినదిస్తూ ఏర్పడిన ఈ రోజు వెనుక ఒక ఘనమైన త్యాగం వుంది. ఆ త్యాగమూర్తులు ముగ్గురూ అనన్య సామాన్యమైన సాహసం కలిగిన స్త్రీలు. వీరే డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ‘మిరాబెల్ సిస్టర్స్’గా ప్రసిద్ధి పొందిన పాట్రియా మెర్సిడెస్ మిరాబెల్ రెయెస్, మారియా అర్జెంటీనా మినెర్వా మిరాబెల్ రెయెస్, ఆంటోనియా మారియా టెరెసా మిరాబెల్ రెయెస్లు.డొమినికన్ నియంత రాఫెల్ ట్రుజిలో అమలు జరుపుతున్న అన్యాయాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా వీరు గొంతెత్తారు. వీరి నిర్భీకతను సహించలేక నియంత రాఫెల్ 1960 నవంబర్ 25న వారిని హత్య చేయించాడు. దేశంపై వీరి హత్య తీవ్ర ప్రభావాన్ని చూపింది. తరువాతి కాలంలో వీరు ‘‘ఫెమినిస్ట్ ఐకాన్స్’’గా ప్రసిద్ధి పొందారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1999 డిసెంబర్ 17 నాటి సమావేశంలో వీరి వర్ధంతిని ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్‌గా ప్రకటించింది. ఈ దినోత్సవం ఎందుకంటే..? ఈ అంతర్జాతీయ దినోత్సవం ఆవశ్యకత ఏమిటన్న దానికి ఐక్యరాజ్య సమితి ఇలా సమాధానమిచ్చింది... ‘‘మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘన. చట్టాలలో, ఆచరణలో స్త్రీల మీద వున్న వివక్షకు, స్త్రీపురుషుల మధ్య వున్న అసమానత్వానికి పర్యవసానమే మహిళలపై జరుగుతున్న హింస. మహిళలపై జరుగుతున్న హింస అనేక రంగాలపై తిరోగమన ప్రభావాన్ని కలుగజేస్తుంది. పేదరిక నిర్మూలన, ఎయిడ్స్‌పై పోరాటం, శాంతిభద్రతలు వంటి అనేక అంశాలకు విఘాతం కలిగిస్తూ వుంది. మహిళలపై హింస అనివార్యమైనది కాదు. నివారణ సాధ్యమైనది, అత్యంత ఆవశ్యకమైనది. మహిళలపై హింస యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న జాడ్యం, రుగ్మత. మహిళలపై హింస బహిరంగ ప్రదేశాలలోనూ, రహస్య ప్రదేశాలలోనూ జరుగుతూనే వుంది. దీనికి అనేక రూపాలున్నాయి. కొన్ని సార్లు ఇది గృహ హింస, సన్నిహిత భాగస్వామి చేసే హింసగా ఉంటే, మరికొన్నిసార్లు లైంగిక వేధింపులు, లైంగిక దాడుల రూపంలోనూ, స్త్రీల జననాంగ విచ్ఛేదన, లైంగిక హత్యల రూపంలోనూ వుంటున్నది’’ అని పేర్కొన్నది. అంతే కాకుండా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీన జరిగే ‘హ్యూమన్ రైట్స్ డే’ వరకు క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాల్సిందిగా పిలుపునిస్తున్నది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘‘స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యత’’ప్రచారానికి థీమ్‌గా ‘‘లీవ్ నో వన్ బిహైండ్: ఎండ్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్ అండ్ గర్ల్స్’’ని ప్రకటించారు. అంటే అణగారిన వర్గాల వారిని, అల్పసంఖ్యాక వర్గాల వారిని, శరణార్థులను ఎవ్వరినీ వదిలి పెట్టకుండా అందర్నీ కలుపుకుని ‘‘యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’’–30 సాధించడానికి మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. అన్ని వర్గాల మహిళలూ బాధితులే! ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసకు బలవుతున్నారు. ఈ హింసకు అన్ని ఆదాయ వర్గాల వారు, అన్ని వయసుల వారు, అన్ని విద్యార్హతలు కలిగిన మహిళలూ బాధితులే. ఈ హింస స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది . తీవ్రమైన సంఘటనల్లో మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. స్త్రీల మీద హింసకు ప్రపంచ వ్యాప్తంగా భర్త వంటి సన్నిహిత భాగస్వాములే కారణమవుతున్నారు. స్త్రీల మీద జరిగే హింసలో శారీరక హింస కంటే లైంగిక హింస తక్కువే అయినప్పటికీ సన్నిహిత భాగస్వాములు హింసకు పాల్పడే ఘటనల్లో రెండు హింసలూ ఏకకాలంలో జరుగుతున్నాయి. అసమానతల నేపథ్యం ఆదిమ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి అసమానత లేదు. ఉత్పత్తి కన్నా, సంతానోత్పత్తికి ఎక్కువ గౌరవమున్న కాలంలో స్త్రీ సమ ప్రాధాన్యతను పొందుతూ వచ్చింది. ఎప్పుడైతే పురుషుడు ఆయుధోత్పత్తిపై ఆసక్తి చూపుతూ ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చాడో అప్పుడు శ్రమ విభజన మొదలయింది, దీనినే ఏంగెల్స్ ‘‘చరిత్రలో మొదటి శ్రమ విభజన స్త్రీపురుషుల మధ్య జరిగింది. మొదటి వర్గ పీడన, స్త్రీలపై పురుషుల పీడన ఒకే కాలంలో సంభవించాయి. కుటుంబంలో భర్త బూర్జువా, భార్య కార్మికురాలు’’ అని తన ‘కుటుంబం – వ్యక్తిగత ఆస్తి రాజ్యాల పుట్టుక’ లో పేర్కొన్నాడు. ఆశ్చర్యకరంగా ఎంతెంతో పెద్ద మేధావులు, తత్వవేత్తలూ స్త్రీకి కూడా పురుషునితో సమానమైన ఆలోచన చేయదగ్గ మెదడు ఉందని అంగీకరించడానికి నిరాకరించిన వారే. స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళమయమయ్యాడన్న రూసో స్త్రీ దగ్గరికొచ్చేసరికి ‘‘స్త్రీల చదువంతా తప్పనిసరిగా పురుషులను ఆనందపెట్టడానికి, వారికి ఉపయోగపడటానికి, పురుషులకు చిన్నతనంలో చదువు నేర్పటానికి, పెద్దయ్యాక వారి అవసరాలు తీరుస్తూ వారి జీవితం సౌఖ్యంగా సాగటానికి స్త్రీలు చదువుకోవాలి’’ అన్నాడు. పురుషులు స్త్రీని సంతాన రక్షణకు, ఇంటి అవసరాలను చూసుకోవడానికి పరిమితం చేసిన తరువాత అందుకు అనుగుణమైన తర్ఫీదును స్త్రీలకూ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ శిక్షణలో మొదటి అంశమే నీవు పురుషుని సౌఖ్యం కోసం పుట్టావ్ అన్న భావజాలం. ఈ భావజాలం స్త్రీ మనశ్శరీరాలను ఎంత ఆక్రమించుకున్నదంటే మూడవ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వేలో కుటుంబ హింస గురించి చేసిన సర్వేలో ఆడవాళ్లను మగవాళ్ళు కొట్టవచ్చు అని 55% మహిళలు అంగీకరించారు. అత్తమామలను అగౌరవపరిస్తే 48%, ఇంటిని నిర్లక్ష్యం చేస్తే 38%, భర్తతో వాదన పెట్టుకుంటే 35%, భర్త అనుమతి లేకుండా బయటకు వెళితే 30% మహిళలు భర్త తమను కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ తరహా పితృస్వామ్యం మెదడులో ఇంకిపోయిన మహిళలు కీలకమైన పదవులలో, భావజాల వ్యాప్తికి పనిచేసే విద్యాలయాల్లో ఉంటూ పురుషులకు ఇతోధికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. పురుషస్వామ్యం దాని పని అది చేసుకుంటూ వెళుతూ ఉంటే చైతన్యవంతులైన స్త్రీలు స్త్రీవాదులుగా మారి స్త్రీల జీవితాలకు చేసిన సేవ చిన్నది కాదు. పునరుత్పత్తి చేసే అవయవాలు ఉన్నప్పటికీ తాను బిడ్డకు జన్మనివ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఈనాటికీ లేదు. కానీ బ్రిటన్‌కి చెందిన మార్గరెట్ సాంగర్ వంటివారు ఎంతో పోరాడిన తరువాత ఈ రోజు అబార్షన్ హక్కు అమలులోకి వచ్చింది. స్త్రీలకు మేలు చేసిన సంస్కరణోద్యమం స్త్రీ వాద ఉద్యమమే కాదు, సంస్కరణోద్యమం కూడా భారతీయ స్త్రీలకు మేలు చేసింది, మార్పు రాత్రికి రాత్రే రాకపోయినా మార్పు రాకుండా ఆగిపోలేదు. గృహ హింస ఇండియాలో ప్రత్యేకమైన నేరంగా మొదటిసారి 1983లో చట్టాల్లో చేరింది. ఆ సంవత్సరం ఇండియన్ పీనల్ కోడ్ లో ‘సెక్షన్ 498–ఎ’ చేర్చడం ద్వారా భర్త లేదా అతని కుటుంబం భార్య మీద చేసే క్రూరత్వం ఒక ప్రత్యేకమైన నేరంగా పరిగణనలోకి వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గృహహింసను కొలవడానికి కాన్ఫ్లిక్ట్ టాక్టిక్ స్కేల్‌ను ఉపయోగించింది. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో 15 నుంచి 49 వయసు ఉన్న మహిళల్లో 39.7% మంది ఎదో ఒక రకమైన హింసకి బాధితులు. బీహార్‌లో అత్యధికంగా 60% మంది మహిళలు హింసకి బాధితులు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లో 36.8% మంది, కేరళలో 19.8%, తమిళనాడులో 44.1%, కర్ణాటకలో 21.5%. స్త్రీలు హింసకి బాధితులు. ఈ సర్వే ప్రకారం... నిరక్షరాస్యులైన స్త్రీలలో 44% హింసకి బాధితులైతే, విద్యాధికులైన స్త్రీలలో బాధితులు 14%. అలాగే భర్త నిరక్షరాస్యుడు అయితే 20% స్త్రీలు హింసకి బాధితులు అవుతుండగా, భర్త విద్యాధికుడు అయితే 8.9% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. అసలు మద్యపానం చేయని భర్త ఉంటే 12% స్త్రీలు హింసకి బాధితులు అయితే భర్త తాగుబోతు అయితే 38% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. ఆర్థిక స్థితిగతులు కూడా కుటుంబ హింసని ప్రభావితం చేస్తున్నాయి. సంపన్న వర్గాలలో హింసకి బాధితులు అయిన మహిళలు 19% అయితే నిరుపేద వర్గాలలో బాధిత మహిళలు 44%. ఈ సర్వే ప్రకారం మన దేశంలో 66%మంది మహిళలు తమపై జరిగిన హింసను ఎవరికీ చెప్పుకోరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం భర్త మరియు ఇతర కుటుంబ సభ్యుల క్రూరత్వం వల్ల మహిళలపై జరిగిన నేరాలు 2012 లో 29% ఉండగా, 2015లో అది 34% అయింది. ఈ కేసులు నమోదు చేయడానికి స్త్రీలు ముందుకు రావడానికి కారణం 2005 నుంచి అమలులోకి వచ్చిన ‘గృహ హింస’ చట్టం కారణం కావచ్చుట! ప్రతి 5 నిమిషాలకీ ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతూ వుండే భారత దేశంలో ఇటువంటి చట్టం అవసరం ఎంతైనా వుంది. ఈ చట్టానికి ముందు కుటుంబ హింసకి గురైన మహిళలకు అందుబాటులో వుండిన చట్టపరమైన ఉపశమనాలన్నీ దీర్ఘకాలికమైనవి. అటు 498–ఎ అయినా, విడాకులయినా అనేక సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ చట్టం ఈ లోపాలని సరిదిద్దిందనే చెప్పవచ్చు. ఈ చట్టంలోకి హింసకు గురయ్యే భార్యలే కాకుండా పిల్లలు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వుండే మహిళలు, వితంతువులై పుట్టింటికి చేరిన వారు వారి సొంత అన్నదమ్ములపై కూడా కేసులు పెట్టొచ్చు. ఈ చట్టం హింసను విపులంగా వర్గీకరించింది. అది శారీరక, లైంగిక హింస మాత్రమే కాదు, మాటలతో వేధించడం, మానసికంగా హింసించడం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ కేసు జరుగుతున్నంత కాలం ఆమె కావాలనుకుంటే తన భర్త ఇంటిలోనే వుండి పోరాడే నివాస హక్కుని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం అమలు తీరుపై పలువురు పలురకాలైన సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సిగ్గుపడాలి మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా బయటకి రాకుండా స్త్రీలు హింసను తాము తట్టుకోగలిగినంత మేర అనుభవిస్తున్నారు. సమాజం స్త్రీ చుట్టూ అల్లి పెట్టిన సంప్రదాయ వల చాలా గట్టిది. స్త్రీలు ఈ భ్రమాత్మకమయిన సంప్రదాయాలను ఛేదించుకుని బయటకి రావాలి. సమాజం కోసమో సంప్రదాయాల కోసమో లేదా చివరికి పిల్లల కోసమో స్త్రీలు హింసను భరించాల్సిన అవసరంలేదని తెలుసుకోవాలి. తండ్రులుగా, సోదరులుగా మగవాళ్ళు తమ స్త్రీలకు అక్కర వచ్చినపుడు పటిష్టమైన కొండంత అండగా నిలబడే శిక్షణను మన విద్య నేర్పించాలి. తస్లీమా నస్రీన్ అంటారు ‘‘మనం స్త్రీలం. ఒంటరిగా, చప్పుడు కాకుండా ఒంటరి ప్రదేశాల్లో ఏడుస్తూ ఇక ఎంతో కాలం ఉండలేం. మనం బాధితులమైతే గట్టిగా అరవాలి. మన అరుపులు అందరికీ వినిపించాలి’’. వ్యవస్థల ద్వారా జరిగే అణచివేతను ఆపటానికి స్త్రీలు పోరాడకపోతే ఆ స్త్రీలు సిగ్గుపడాలి. ప్రతిఘటించకుండా, పోరాడకుండా, ఆ వ్యవస్థను కొనసాగనిస్తున్నందుకు, మన పిల్లలను, మన పిల్లల పిల్లలనూ ఆ అణచివేతలో పడిపోనిస్తున్నందుకు సిగ్గుపడాలి. గృహహింసపై కవీంద్రుని కథ రవీంద్రనాథ్ టాగోర్ 1913లో ఒక క«థ రాశాడు. ఆ క«థ పేరు ‘‘భార్య వ్రాసిన లేఖ’’. 104 ఏళ్ళ క్రితం ఆయన రాసిన ఈ క«థలోని భార్య తన భర్తకి రాసిన ఉత్తరంలో చాలా విషయాలను చర్చకు పెడుతుంది. ఆమె ఆదరించి పెంచిన చిన్న అమ్మాయి ఒకతె వివాహానంతరం చీరకు నిప్పంటించుకుని చనిపోతుంది. అది చూసి సమాజం దిగ్భ్రమ చెందదు, కనీసం అయ్యో అని సానుభూతి కూడా చూపదు, చూపకపోగా ’’ఆడవాళ్లు చీరలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది’’ అని చిరాకు పడుతుంది. దానిని ప్రశ్నిస్తూ ఆ ఉత్తరం రాసిన భార్య ‘ఇదంతా నాటకం’ అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ కేవలం బెంగాలీ స్త్రీల చీరల మీదుగానే జరుగుతుందేం! బెంగాలీ వీరపురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకని?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం...!’’ అంటుంది. స్త్రీలు అనుభవిస్తున్న కుటుంబ హింస ఈ కథా కాలానికంటే కూడా చాలా పురాతనమైంది. – సామాన్య కిరణ్ -
ఇష్టం లేకపోతే ఇంటికెళ్లండి
♦ రికార్డులు ఇష్టమొచ్చినట్లు రాస్తారా? ♦ ‘భూప్రక్షాళన’ తీరుపై కలెక్టర్ అసహనం ♦ మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాలని ♦ అధికారులకు ఆదేశాలు జారీ ఖిల్లాఘనపురం : రెవెన్యూ రికార్డులను ఇష్టమొచ్చినట్లు రాస్తే ఎలాగని రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లండి..’అంటూ అసహనం వ్యక్తంచేశారు. సమస్యలు ఉన్న సర్వే నంబర్ల వివరాలు, సమస్యలను గుర్తించి ప్రత్యేకంగా ఓ రికార్డులో పొందుపర్చమని చెప్పామని, ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గురువారం ఆమె మండలం ఉప్పరిపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను ప్రత్యేకంగా పరిశీలించారు. గ్రామాల్లో ఆరురోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, రికార్డులను తీసుకుని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆమె కార్యాలయంలో ఉన్న ఆర్ఓఆర్, కాస్రాపహాణి, ఓల్డ్ ఆర్ఓఆర్, చెసాల, చేత్వార్లో ఉన్న భూములకు అధికారులు ప్రత్యేకంగా రాసిన రికార్డుల్లోని భూముల మధ్య వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రికార్డును మరోసారి పరిశీలించాలని డిప్యూటీ తహసీల్దార్ సునితను కోరారు. అనంతరం అప్పారెడ్డిపల్లికి వెళ్లిన కలెక్టర్ రికార్డుల నమోదు ప్రక్రియను చూసి అసహనం వ్యక్తంచేశారు. మరుగదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయండి ఉప్పరిపల్లిలో మరుగుదొడ్లను నిర్మించుకున్నప్పటికీ బిల్లులు రాలేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఎంపీడీఓ రెడ్డయ్య, ఏపీఓ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ మహిమూద్‌ను పిలిచి విచారించారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోవడంతోనే బిల్లులు ఆలస్యమైనట్లు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను కలెక్టర్ హెచ్చరించారు. బతుకమ్మ చీరలు పంపిణీ మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గురువారం కలెక్టర్ శ్వేతామహంతి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, సర్పంచ్ నర్సింహారెడ్డి, శ్రీనువాసులు, శంకర్‌గౌడ్, శ్రీనువాసాచారి, కృష్ణయ్య, విష్ణు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ పంపిస్తా!
►పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు ►ఇంజనీరింగ్ పనులపై కలెక్టర్ అసహనం ►తీసుకున్న జీతానికి న్యాయం చేయాలని ►అధికారులకు తీవ్ర హెచ్చరిక ‘నిధులున్నా పనులు చేపట్టేందుకు నిర్లక్ష్యం ఎందుకు?. మీ పనితీరు మార్చుకోండి. లేకుంటే ఆదిలాబాద్‌కు పంపిస్తా’ అంటూ కలెక్టర్ యోగితా రాణా ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం సర్వశిక్షాభియాన్ ఇంజనీరింగ్ పనుల సమీక్షలో ఆమె అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘తీసుకున్న జీతానికి న్యాయం చేయరా..’ అంటూ నిలదీశారు. ఇష్టం లేకుంటే బదిలీ చేయించుకొని వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. పనులు చేపట్టేందుకు నిర్లక్ష్యమెందుకు..? కాలపరిమితి అంటూ లేదా..? ప్రతి పనికి ఏదో ఒక సాకు. అలసత్వం ప్రదర్శిస్తే ఆదిలాబాద్ జిల్లాకు పంపిస్తా’ అని జిల్లా కలెక్టర్ యోగితా రాణా ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్వశిక్షాభియాన్ ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ‘పనితీరు మార్చుకోలేకపోతే బదిలీ చేసుకొని వెళ్లిపోండి..లేక నిర్లక్ష్యం వీడి పనిచేయండి. నెలసరి తీసుకున్న జీతానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? పని విషయంలో వెనక్కి తగేది లేదు. పనితీరు మారాల్సిందే’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కనీసం లక్ష నుంచి రెండు లక్షల వ్యయంతో చేపట్టే చిన్న చిన్న పనులను కూడా టెండర్ల సాకుతో పూర్తిచేయకపోవడం ఇంజనీర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సివిల్ పనులు నిర్ణీత గడువులోగా పాలసీ ప్రకారం పూర్తి చేయాలని, ప్రతి పనికి టెండర్ల ఖరారు...పరిపాలన మంజూరు వంటి కారణాలతో కాలయాపన చేస్తే ఇకపై సహించేది లేదని ఖరాకండిగా చెప్పారు. ఇకపై ఆయా పనులకు అగ్రిమెంట్ చేసుకునే ముందు వాటిని ఎంత వ్యవధిలో పూర్తి చేస్తారో ఖచ్చితంగా పేర్కొని పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు టెండర్లు ఆహ్వనించని పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. 144 అదనపు గదుల పనులు సెప్టెంబర్ 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్ యోగితా సూచించారు. పూర్తయిన పనికి ఫొటోగ్రాప్స్ పొందుపర్చాలని, కోర్టు కేసులు కారణంగా ఏవైనా పనులు ఆగిన పక్షంలో వాటి వివరాలను సంబంధిత తహసీల్దార్లకు అందజేయాలని ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళా వందనానికి సూచించారు ఈ సమావేశంలో డీఈవో , ఎస్ఎస్ఏ ఈఈ సాంబయ్య, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
దేశం వెనక్కి వెళుతోంది: నటి
కోల్‌కతా: దేశం వెనక్కు వెళుతోందని నటి, మోడల్ గౌహర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నానాటికీ అసహనం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ‘ముందుకెళుతున్నాం అనే పేరిట భారతదేశం మరింత వెనక్కు వెళుతుండటాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. దేశంలో విపరీతంగా అసహనం ఉంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తప్పకుండా శాంతంగా ఉండాలి’ అని ఆమె చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిలువరించేందుకు కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేయలేకుంటే మహిళలపై నేరాలు ఆగవు. 70 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు మహిళలు మాట్లాడగలుగుతున్నారు. నేను నా గురించి మాట్లాడగలిగితే నాకు ఏం కావాలో అది ఎంపిక చేసుకుంటాను. ఈ విషయంలో కొంతమంది ఆలోచన విధానం మారితే బాగుంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
ప్రమాణాలు నిల్.. ఫైటింగ్‌లు ఫుల్
విద్యా వికాసానికి అసహన బంధనాలు ప్రపంచంలో తొలి 500 వర్సిటీల్లో భారత వర్సిటీలకు చోటు లేదు ప్రమాణాలు పెంచే చర్యలు నిల్.. నిధులు, పోస్టుల కోతలు ఫుల్ వర్సిటీల్లో అసహన నిరసనలు.. భావజాలాల మధ్య భౌతిక ఘర్షణలు భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామిక చర్చకు పాతర సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఉన్నత విద్య: విద్యావేత్తల ఆందోళన భారత ఉన్నత విద్యారంగం ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని విద్యావేత్తలు, మేధావుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ విశ్వవిద్యాలయాలతో పోటీలో మన విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి అనేది చూస్తే.. అగ్రస్థాయిలోని తొలి 500 విశ్వవిద్యాలయాల్లో ఐఐఎస్సీ, ఐఐటీలకు మినహా దేనికీ స్థానం లభించలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలో మరింతగా మెరుగుపడడానికి కృషి జరగాల్సి ఉండగా.. ఇటీవలి పరిణామాలు పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి విరుద్ధ భావనలు, సిద్ధాంతాలపైన అయినా మేధోమధనానికి, భావప్రకటనా స్వాతంత్య్రానికి, స్వేచ్ఛాయుత చర్చలకు ప్రజాస్వామిక వేదికలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు.. ‘కుడి ఎడమ’ల భావోద్వేగాల అసహనాలకు భౌతిక ఘర్షణలకు కేంద్రాలుగా మారుతుండటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. సైద్ధాంతిక పరిశోధనలకు నిధుల కేటాయింపులో కోత పెట్టడం, ఆధికారంలో ఉన్నవారి భావజాలానికి విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేసే అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం వంటి చర్యలతో విద్యారంగంలో ప్రమాణాలు మరింత క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాణాల వెతలు.. కోతల మోతలు..: భారతదేశంలో ఉన్నత విద్యారంగం స్వాతంత్య్రానంతరం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రస్తుతం దాదాపు 750 విశ్వవిద్యాలయాలు, 35,000 కళాశాలలు, మూడు కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ.. వీటిలో ఏవీ ప్రపంచంలో అగ్రగామి సంస్థలుగా పోటీపడగల స్థాయిలో లేవు. తాజాగా ప్రకటించిన క్యూఎస్ ప్రపంచ వర్సిటీల జాబితాలో తొలి 150 స్థానాల్లో, టైమ్స్ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో కానీ.. తొలి 200 స్థానాల్లో భారతదేశానికి చెందిన ఏ ఒక్క విద్యా సంస్థకూ చోటు దక్కలేదు. ఐఐఎస్సీ, ఐఐటీలు కొన్నిటికి మాత్రం 150, 200 ర్యాంకుల తర్వాత స్థానాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో ఆయా విద్యాసంస్థల ప్రమాణాలను అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా పెంచేందుకు కృషి చేయాల్సి ఉండగా.. అందుకు విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు ప్రతిష్ఠాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పరిశోధనలకు కేటాయించే నిధులకు ఏకంగా 83 శాతం కోతపెట్టారు. 2017-18 విద్యా సంవత్సరానికి చేర్చుకునే పీజీ, పరిశోధన విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సైతం గత నెలలో 25 మంది అధ్యాపకులను విధుల నుంచి తొలగించారు. ఈ చర్యల పట్ల విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ‘భావ ప్రకటన’కు అసహన సంకెళ్లు..: ఇక భావప్రకటనా స్వాతంత్య్రానికి, మేధో మధనానికి కేంద్ర బిందువులుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో.. ఆ స్వాతంత్య్రం క్రమంగా క్షీణిస్తుండటం ఉన్నత విద్యారంగంలో చీకటి అలముకునే పరిస్థితులను కల్పిస్తోందని మేధావులు విచారం చెందుతున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2016లో జేఎన్‌యూలో విద్యార్థులు నిర్వహించిన ఒక కార్యక్రమం.. కశ్మీర్ అంశంపై రాజకీయ వివాదంగా మారడంతో లెఫ్ట్ రైట్ విద్యార్థి విభాగాల మధ్య పోటాపోటీ నిరసనలు పెల్లుబికాయి. విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్‌ను బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో దేశద్రోహం ఆరోపణల మీద అరెస్ట్ కూడా చేశారు. ఆ పరిణామాలు జాతీయవాదం మీద దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. 2016లో కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేములకు సంఘీభావంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులను ఈ ఏడాది పరీక్షలు రాయకుండా నిషేధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జాస్ కాలేజీలో పలువురు విద్యార్థులు ‘నిరసనల సంస్కృతి’ పేరుతో తలపెట్టిన ఒక సదస్సుకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంస్థ హింసాత్మక నిరసనలకు దిగింది. గత ఏడాది జేఎన్‌యూ వివాదంలో ఏబీవీపీ అభ్యంతరాలకు గురైన ఉమర్‌ఖాలిద్, షీలా రషీద్‌లను ఈ సదస్సుకు వక్తలుగా ఆహ్వానించడం బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన ఏబీవీపీకి ఆగ్రహం తెప్పించింది. హింసాత్మక నిరసనల కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. నిజానికి ఇటువంటి భౌతిక సంఘర్షణలు, విపరీత నిరసనలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. రామ్జాస్కళాశాల ఘటనకు వారం ముందు.. జోధ్‌పూర్‌లోని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజశ్రీ రాణావత్.. వర్సిటీలో ఒక ప్రసంగం ఇవ్వడం కోసం జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితా మీనన్‌ను ఆహ్వానించారు. దీనిపై ఏబీవీపీ నిరసన చేపట్టడంతో ప్రొఫెసర్ రాజశ్రీని సస్పెండ్ చేశారు. ఆమె కశ్మీర్ మీద, అక్కడ భారత సైన్యం పాత్ర మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు కూడా నమోదు చేశారు. అంతకుముందు.. 2013లో యూపీలోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలపై రూపొందించిన ఒక డాక్యుమెంటరీని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రదర్శించడాన్ని ఏబీవీపీ అడ్డుకుంది. ఈ పరిణామాలతో వర్సిటీల స్వయంప్రతిపత్తి, భావప్రకటనా స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యయుత చర్చా సంప్రదాయాలు క్షీణించిపోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్వేచ్ఛా, సహనాలతోనే మేధో వికాసం..: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో మేధోచర్చల సంప్రదాయాన్ని, అసమ్మతి తెలిపే స్వేఛ్చను ధ్వంసం చేసే ఇటువంటి ఘటనలు.. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గణనీయంగా పెరిగాయనేది అందరూ అంగీకరిస్తున్న విషయం. అప్పటివరకూ వామపక్ష భావజాలానికి పట్టుగొమ్మలుగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ‘జాతీయవాదం’ అజెండాను విస్తరించేందుకు ప్రభుత్వ పరోక్ష మద్దతుతో ఏబీవీపీ దూకుడుగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే.. విద్యారంగం అనేది భిన్న వాదనలు, భిన్నాభిప్రాయాల మధ్య మేధోమధనానికి వేదికగా ఉండాలే కానీ.. భౌతిక సంఘర్షణలకు కేంద్రం కారాదనేది ప్రముఖ విద్యావేత్తల ఉవాచ. ప్రస్తుతం భారత విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగి వికాసం దిశగా పయనించాలంటే.. అన్ని రకాల భావనలనూ అంగీకరించి, దానిపై చర్చించే ప్రజాస్వామిక వైఖరులను పెంపొందించడం ఒక్కటే మార్గమని వారు చెప్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పోలీసు రాజ్యం
త్రికాలమ్ అమరావతిలో శాసనసభ, శాసనమండలి భవన సముదాయాన్ని ప్రారంభించిన శుభసందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా చర్చిస్తారనీ, ప్రజాభ్యుదయానికి దోహదం చేసే చట్టాలను చేస్తారనీ, ఆ చట్టాలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారనీ ఆశించాలి. అధికారపక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రారంభోత్సవానికి హాజరైతే బాగుండేది. ఆహ్వానం పంపిం చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామ కృష్ణుడు చెబితే ఎస్ఎంఎస్ సైతం తమకు రాలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. హైదరాబాద్‌ను వీడి వెడుతున్న సందర్భంగా కొన్నిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కొందరు సీనియర్ పాత్రికేయులను కలుసుకున్నారు. కలుపుకొని వెళ్ళే వైఖరిని కొనసాగించి స్వయంగా ప్రతి పక్ష నాయకులకు ఫోన్ చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే ఆయన ప్రతిష్ఠ పెరిగేది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తే నిర్మాణాత్మకమైన వాతావరణం ఏర్పడటానికి తోడ్పడేది. అటువంటి సద్భావన లేదనేది స్పష్టం. మొత్తం మీద ప్రారంభోత్సవం ఏకపక్షంగా జరిగింది. సభా కార్యక్ర మాలు కూడా ఏకపక్షంగా జరగబోవని కోరుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ఆహ్వానించకపోగా అదేరోజే ప్రతిపక్ష నాయకుడిని తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించడం పాలకుల అసహనానికి పరాకాష్ఠ. లోగడ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకులు జలగం వెంగళరావు తీరును తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించింది. అప్రజాస్వామిక ధోరణి ఇదే వైఖరి కొనసాగితే కొత్త శాసనసభా ప్రాంగణంలో సైతం నిరర్థకమైన, అప్రజాస్వామికమైన, అసహనంతో, తిట్ల దండకంతో కూడిన పాత వైఖరే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమాలోచన జరిపి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఎటువంటి నిర్ణ యాలు తీసుకోవాలో, ఏయే చట్టాలు చేయాలో నిర్ణయించుకొని ప్రశాంత వాతా వరణంలో సభ జరిగే విధంగా వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఎవరు ఘాటుగా విమర్శిస్తారో, పరుష పదజాలం ప్రయోగిస్తారో, గొంతు చించుకుం టారో వారి వాదనలోనే పస ఉన్నదని భావిస్తే పొరపాటు. ఎవరు సమంజ సంగా, సహేతుకంగా, శాంతంగా మాట్లాడతారో వారినే ప్రజలు ఆదరిస్తారు. ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టి వారు వాకౌట్ చేసేవరకూ వెంటబడి ఆనక సభను ఏకపక్షంగా జరుపుకొని ఆత్మస్తుతికీ, పరనిందకూ గంటల సమయం వెచ్చిం చడం ఇంతకు ముందు జరిగిన సమావేశాలలో చూశాం. కొత్త ప్రాంగణంలోనైనా ఇందుకు భిన్నంగా సభాకార్యక్రమాలు జరిగితే సభాపతికి సభ్యులందరి మన్ననా దక్కుతుంది. పార్లమెంటు తలుపులు మూసి విభజన చట్టం ఆమోదించినప్పుడే అవ మానం దిగమింగా. శపథం చేశా, చేసి చూపిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్ర బాబు చెప్పుకున్నారు. రెండేళ్ళలోనే సచివాలయం, శాసనసభా ప్రాంగణం నిర్మించినందుకు తనను తాను అభినందించుకున్నారు. మంచిదే. కానీ పాస్టర్ పార్ట్నర్స్ అనే సంస్థ అమరావతి నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తోంది. ఇదంతా 2019 నాటికి పూర్తవుతుందని అంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండటానికి ఇంకా ఏడేళ్ళ సమయం ఉంది. 2019 వరకూ హైదరాబాద్‌లోనే చట్టసభల సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థలతో కొత్త రాజధానికి రూపకల్పన చేస్తున్నారు. అందులో శాసనసభా భవనానికీ చోటు కల్పించారు. ఈ లోగా తాత్కాలిక శాసనసభా భవన సముదాయం ఎందుకు? తాత్కాలిక సచివాలయం మాత్రం ఎందుకు? శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించుకుంటే వృథావ్యయం ఉండేది కాదు. ‘తాత్కా లిక దుబారా’ ఎందుకో చెప్పవలసింది ముఖ్యమంత్రి మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కరి అభద్రతా భావం కారణంగానే హడావుడిగా అందరినీ అమ రావతికి తరలిస్తున్నారు. ప్రశ్నించే అలవాటు లేదు కనుక మంత్రివర్గ సహ చరులు అధినాయకుడి నిర్ణయాన్ని శిరసావహిస్తున్నారు. ఎన్నికలలో గెలిచారు కనుక అయిదేళ్ళ వరకూ ఏమి చేసినా ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదనే అప్రజాస్వామిక ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జవాబుదారీతనం కలికానికి కూడా లేదు. మితిమీరిన అసహనం స్వీయపక్షంలోనే కాదు ప్రతిపక్షంలోనూ ఎవ్వరు ప్రశ్నించినా ముఖ్యమంత్రి సహించే పరిస్థితి లేదు. పెనుగంచిప్రోలు దగ్గర బస్సు ప్రమాదం అనంతర పరి ణామాలలో ముఖ్యమంత్రి వైఖరి, మంత్రివర్గ తీర్మానం ఇందుకు నిదర్శనం. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెడుతున్న ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సు కాలు వలో పడిపోతే పదిమంది ప్రయాణికులు మరణించారు. 32 మంది గాయప డ్డారు. ఈ వార్త విని ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కారులో అక్కడికి చేరుకునే వరకూ పాలకపక్షం ప్రతినిధులు ఎవ్వరూ రాలేదు. అక్కడికి గంటలోపు ప్రయాణ దూరంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ బాధితు లను పరామర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించే ప్రయత్నం చేయలేదు. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడికి శవాలను చుట్టివేసి తరలిస్తున్న దృశ్యం కనిపించింది. ఆసుపత్రిలో నాలుగు శవాలు మూటలు కట్టి ఉన్నాయి. వాటిలో ఒక శవంపైన డ్రైవర్ ఆదినారాయణ పేరు రాసి ఉంది. డ్రైవర్ శవానికి పోస్ట్‌మార్టమ్ చేశారా అని డాక్టర్ని జగన్ మోహన్ రెడ్డి అడిగితే అతను తడబడుతూ చేయలేదని చెప్పాడు. స్పీడ్ నియంత్రణ వ్యవస్థ లేకుండా 130 కిలోమీటర్ల వేగంతో పోతున్న బస్సు పది అడుగులు పైకి లేచి రోడ్డు పక్కన కాలువలో పడిందంటే డ్రైవర్ తాగి ఉండాలని అనుకోవడం సహజం. అది తెలుసుకోవాలంటే శవపరీక్ష ఒక్కటే మార్గం. పరీక్ష చేయకుండానే శవాన్ని పంపించివేయడానికి రంగం సిద్ధం చేశారు. రెండో డ్రైవర్ కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకొని విచారించినా వాస్తవాలు కొంత వరకూ తెలిసేవి. పోస్ట్‌మార్టం రెండు గంటలలో పూర్తి చేశామని మొదట చెప్పిన వైద్యులు తరచి డ్రైవర్ సంగతి అడిగితే శవపరీక్ష జరగలేదని చెప్పారు. డాక్టర్ దగ్గర ఉన్న కాగితాలు అడిగి ప్రతిపక్ష నాయకుడు తీసుకున్నారు. వెనకనే నిల బడిన జిల్లా కలెక్టర్ బాబు డాక్టర్ వైపు కోపంగా చూస్తూ కాగితాలు ఇవ్వవద్దనీ, వివరాలు చెప్పవద్దనీ కళ్ళతోనే వారిస్తున్నారు. వెనక్కి తిరిగి జిల్లా కలెక్టర్‌తో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ బస్సు యజమానిని రక్షించేందుకు వాస్తవా లను మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారనీ, ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందనీ హెచ్చరించారు. ప్రమాదంలో మరణించినవారి పట్ల వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన తీరునూ, గాయపడినవారినీ చూసిన తర్వాత ఎవరికైనా వ్యవస్థ పట్ల ఆగ్రహం కలుగుతుంది. అదే ధర్మాగ్రహాన్ని ప్రతి పక్ష నేత ప్రదర్శించడం అభ్యంతరకరమంటూ వాదించడం, మంత్రివర్గం పని కట్టుకొని టేపులన్నీ చూసి ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ తీర్మానించడం చూస్తుంటే ఎంత అల్పంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నదో తెలుస్తున్నది. ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతూ తీర్మానం చేయలేదు. బస్సు యాజ మాన్యంపైన కేసు పెట్టాలనీ, ప్రమాద కారణాలపైన దర్యాప్తు చేస్తామనీ తీర్మా నించలేదు. ఉత్తరోత్తరా బస్సు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన చర్యలను గుర్తించాలని తీర్మానం చేయలేదు. రాజధాని నిర్మాణం కోసం సింగ పూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు చర్చించలేదు. వివిధ ప్రాజె క్టుల వ్యయం అంచనాలను చిత్తం వచ్చినట్టు పెంచివేసిన సందర్భాలలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యమైన అన్ని విషయాలలో ఏకపక్షంగానో, కొంతమంది ఆంతరంగికులతో చర్చించో నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి అప్రధా నమైన అంశంపైన మంత్రివర్గ సమావేశంలో సమయం వృథా చేయడం విశేషం. మీడియా అడగవలసిన ప్రశ్నలే అవి మీడియా ప్రతినిధులు అడగవలసిన ప్రశ్నలనే జగన్ మోహన్ రెడ్డి అడిగారు. మీడియా అడిగినా, ప్రతిపక్ష నాయకుడు అడిగినా సమాధానం చెప్పవలసిన బాధ్యత డాక్టర్‌కు ఉన్నది. కలెక్టర్‌కూ ఉన్నది. ముఖ్యమంత్రి బాటలోనే అధి కారులూ నడిచి అహంకారపూరితంగా, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా, అమానవీయంగా వ్యవహరించడం దుర్మార్గం. ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరించడం, ప్రశ్నించిన వారిని అణచి వేయడం దేశం అంతటా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు దాష్టీకం శ్రుతి మించుతోంది. నగరి శాసనసభ్యురాలు రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానం అందుకొని గన్నవరం విమానాశ్రయంలో దిగిన శాసనసభ్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించడం ఆత్యయిక పరిస్థితిని తల పించిన దురాగతం. శుక్రవారంనాడు ఆమె కోర్టుకు వెడుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అరాచకం. ప్రభు త్వాన్ని ప్రశ్నించే ధైర్యం, తెలివితేటలు ఉన్నాయి కనుక ఒక మహిళా శాసన సభ్యురాలిని ఒక సంవత్సరం పాటు శాసనసభ నుంచి బహిష్కరించడమే కాకుండా కక్షకట్టి వెంటబడి వేధించడం అమానవీయం. పోలీసులనూ, కార్య కర్తలనూ ప్రయోగించి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నించడం కంటే అప్రజాస్వామ్యం ఏముంటుంది? టీవీ చానళ్ళు వచ్చిన తర్వాత అన్న మాట అనలేదనీ, చేసిన పని చేయ లేదనీ బుకాయించడానికి ఆస్కారం లేదు. ప్రత్యేక హోదా కావాలంటూ గట్టిగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునూ, ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునూ చూపించే అవకాశం ఉంది. తాను ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా ఎంతమంది అధి కారులతో ఎంత అమర్యాదగా మాట్లాడారో, ఎవరి తాటవొలుస్తానన్నారో, ఎవరిని బదిలీ చేయిస్తానంటూ బెదిరించారో చూపించడానికి అనేక సంద ర్భాలూ, దృశ్యాలూ ఉన్నాయి. పార్టీ నాయకుల ఆదేశం పాటిస్తూ జెండాలు పట్టుకొని రోజాను నిందిస్తూ నినాదాలు చేసిన స్త్రీలు సైతం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకోవడానికి సాటి మహిళ ప్రయత్నిస్తుంటే ఆమెకు అడ్డుతగలడం, వ్యతిరేకంగా కేకలు వేయడం ఎటువంటి సంస్కారమో వారు ఆలోచించుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులకు నియమావళి ఉంటుంది. అంతకు మించిన ఆత్మసాక్షి ఉంటుంది. వాటికి అనుగుణంగానే వ్యవహరించాలి. వారు ప్రజాసేవకులు కానీ పాలకులకు బానిసలు కాదు. మర్రి చెన్నారెడ్డితో విభేదాలు వచ్చి రాష్ట్రాంతరం వెళ్ళిపోయిన ఎస్ఆర్ శంకరన్‌ని నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడం లోనూ, ఆత్మాభిమానంతో నైతికంగా వ్యవహరించడంలోనూ, పేదప్రజలకు సేవ చేయడంలోనూ ఆదర్శంగా తీసుకోవాలి. అధికారులు సైతం పార్టీలకు విధే యంగా ఉంటూ పార్టీల ప్రాతిపదికగా చీలిపోవడం తమిళనాడులో చూశాం. మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు నియమావళికీ, నైతికతకూ ప్రాధాన్యం ఇస్తారనే మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతా ధికారులను (కలెక్టర్ కావచ్చు, డీజీపీ కావచ్చు) ప్రతిపక్షంపైన ప్రయోగించడం చూస్తుంటే తమిళనాడు తరహా వాతావరణం ఇక్కడ కూడా నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడు ప్రధానమైన అంగాలు–చట్ట సభలూ, ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ. చట్టసభలు ప్రజల సమస్యల పైన చర్చ జరపకుండా ఆధిక్య ప్రదర్శనతో, ఎత్తుగడలతో నిరర్థకంగా సాగిపోతు న్నాయి. పాలకపక్షం ప్రయోజనాలు రక్షించే ధోరణిలో ప్రభుత్వ యంత్రాంగం, ఉన్నతాధికారులూ ఉన్నారు. న్యాయవ్యవస్థలో జీవితకాలం గడిచినా తీర్పులు వెలువడవు. మీడియాకూ పరిమితులున్నాయి. ప్రజాస్వామ్య ప్రియులకు ఎటు చూసినా నిర్వేదమే కలుగుతోంది. ఈ పరిస్థితి మారాలి. - కె. రామచంద్రమూర్తి -
అసహనం పెరిగిపోతోంది
-
అసహనం పెరిగిపోతోంది
- దేశంలో అన్ని రూపాల్లో హింస పెచ్చరిల్లుతోంది - ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్‌పేయి విమర్శ - దురదృష్టవశాత్తు ప్రపంచం ఇండియాలా మారుతోందని వ్యాఖ్య - కన్నుల పండువగా ప్రారంభమైన 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం 7వ హైదరాబాద్ సాహిత్య సాంస్కృతిక ఉత్సవం(లిటరరీ ఫెస్టివల్) ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, పలు దేశాలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్‌పేయి ముఖ్య అతిథిగా హాజరై.. "మన కాలంలో సాహిత్యం" అన్న అంశంపై ఉపన్యసించారు. దురదృష్టవశాత్తూ ప్రపంచం ఇండియాలా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందన్నారు. కలిసే జీవించాం.. భారతదేశం ఎప్పుడూ ఏకోన్ముఖ సమాజం కాదని.. ఇక్కడ అన్ని మతాలు, సమాజాలు కలిసి జీవించాయని అశోక్ వాజ్‌పేయి గుర్తు చేశారు. "మన భారతీయ సంప్రదాయ వివేకంలో "ఇతర" అనేది లేదు. ప్రతిదీ మనదే. ఇక్కడ ఇతరులు లేకుండా దేవుడు కూడా మనలేడు. అందుకే రకరకాల అవతారాల్లో వచ్చి ఇతరులను కలిశాడు.." అని ప్రాచీన భారతీయ బహుముఖీనతను ప్రస్తుతించారు. ప్రస్తుతం ఆ వివేకం కొరవడుతోందని.. దాన్ని ప్రశ్నించిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. ఆ ధోరణిని నిరసిస్తూ తన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును, హెచ్‌సీయూ ఇచ్చిన డీ.లిట్‌ను రోహిత్ వేములకు జరిగిన అన్యాయానికి నిరసనగా వెనక్కి ఇచ్చానని గుర్తుచేశారు. "ఒక కొలంబియా రచయిత చెప్పినట్లు.. ఈ ప్రపంచం సరిగ్గా నిర్మితం కాలేదనడం అబద్ధం. ఇంకో మెరుగైన ప్రపంచానికి అవకాశం ఉంది. దానికోసం మనం కల కనొచ్చు.." అని ఆశాభావం వ్యక్తం చేశారు. సాహిత్యం మాత్రమే ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణాన్నీ, నైతికతనూ, మత విశ్వాసాన్నీ, భావజాలాన్నీ ఇవ్వగలదని పేర్కొన్నారు. మతం, రాజకీయం రెండూ కూడా సత్యాన్ని ఇవ్వలేవని, సాహిత్యం మాత్రమే సత్యాన్ని అందించగలుగుతుందని వ్యాఖ్యానించారు. సాహిత్యం అంటేనే సంబరం "ఒక నిజమైన రచయిత నీకో సత్యాన్ని ఇస్తాడు, అదే సమయంలో ఆ సత్యాన్ని అతడే శంకిస్తాడు. అత్యున్నత సత్యం అంటూ ఏదీ ఉండదు. సాహిత్యం అంటేనే ప్రతిసారీ జీవితాన్ని సెలబ్రేట్ చేయడం. కానీ ఒక్కోసారి జీవితం కూడా సాహిత్యాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి సాహిత్య సమావేశాలు అందుకు వీలు కల్పిస్తాయి.."అని ఫెస్టివల్ నిర్వాహకులను అశోక్ వాజ్‌పేయి అభినందించారు. 60 ఏళ్ల క్రితం తన 17వ ఏట హైదరాబాద్‌లోని "కల్పన" పత్రిక తన హిందీ కవితలను అచ్చు వేసి కవిగా తనకు తొలి గుర్తింపు ఇచ్చిందంటూ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన తన కవితలను ఆంగ్లంలోనూ, హిందీలోనూ చదివి వినిపించినప్పుడు సభికుల్లో మంచి స్పందన వచ్చింది. అనంతరం మరో అతిథి ఫిలిప్పీన్స్ రాయబారి టెరిస్టా సి డాజా మాట్లాడారు. భారతీయ సంస్కృతి, కళలు, భాషలకు.. ఫిలిప్పీన్స్ కళలు, భాషలకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్నారు. ఆ దేశంలోని సుమారు 400 స్థానిక భాషలలో సంస్కృత భాష మూలాలు కనిపిస్తాయని... భారతీయ నృత్య రూపాలను పోలిన నృత్యాలు ఫిలిప్పీన్స్‌లో ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అజయ్‌గాంధీ, కిన్నెర మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయలలితపై ఆసక్తికర చర్చ లిటరరీ ఫెస్టివల్లో ప్రముఖ తమిళ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు వాసంతి రాసిన ‘అమ్మ జయలలిత.. జర్నీ సినీస్టార్ టు పొలిటికల్ క్వీన్’పుస్తకంపై ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తం తమిళ సమాజాన్నే ప్రభావితం చేసిన జయలలితపై ఈ పుస్తకం అనేక కోణాలను ఆవిష్కరించింది. జయలలిత వ్యక్తిగత జీవితం నుంచి సినీ, రాజకీయ జీవితం వరకు అనేక అంశాలను ప్రస్తావించిన ఈ పుస్తకం వెలువడిన అనంతరం రచయిత్రి వాసంతి తమిళనాడులో ఉండలేని పరిస్థితి నెలకొంది. తాజాగా చర్చా కార్యక్రమంలో ఆ పుస్తకంలోని పలు అంశాలను సమన్వయకర్తగా వ్యవహరించిన సునీతారెడ్డి ప్రస్తావించారు. సినిమాల్లో, రాజకీయాల్లో బలంగా ఉన్న పురుషాధిపత్యాన్ని ఎదుర్కోవడం, ప్రత్యర్థి కరుణానిధిపై రాజకీయంగా పైచేయి సాధించడం, సంక్షేమం కోసం జయలలిత ప్రవేశపెట్టిన పథకాలు, శోభన్‌బాబుతో జయలలిత బంధం తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ సమయంలో రచయిత్రి వాసంతి మాట్లాడుతూ.. జయలలిత గొప్ప నాయకురాలు కాకపోయినా, అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకుని, వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎదిగారని చెప్పారు. కేవలం పదో తరగతి చదివినా విస్తృతమైన అధ్యయనంతో ఆంగ్లంపై పట్టు సాధించారని, జయలలిత జీవితంలో నిరంతర సంఘర్షణ, ఒత్తిడి, బాధలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు అందానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన జయలలిత రాజకీయాల్లోకి వచ్చాక తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయలేదన్నారు. శుక్రవారం నాటి కార్యక్రమాల్లో దివ్యదిశ సంస్థ "చైల్డ్‌హుడ్ ఇన్ మై సిటీ" కార్యక్రమం ఆకట్టుకుంది. మహాశ్వేతాదేవి కథ ఆధారంగా ప్రదర్శించిన "చోళీ కే పీచే క్యా హై" నాటక ప్రదర్శన, ఫిలిప్పీన్స్ కళాకారుల "కార్మిక్ హార్వెస్ట్", ఆదిలాబాద్ గిరిజనుల గుస్సాడి నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
తండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలకూ సమస్యలే!
మీరు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా? మీ పిల్లల దగ్గర కూడా మీ అసహనం ప్రదర్శిస్తున్నారా? తండ్రుల మానసిక ఒత్తిడి పిల్లల వికాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు పరిశోధకులు. పారాడే వయసులోనూ పిల్లలు తండ్రుల ఒత్తిడిని గ్రహించగలరని వెల్లడించారు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న తండ్రులను గమనిస్తూ ఉండే పిల్లలు ఆ తర్వాత పెరుగుతూ ఉండే క్రమంలో తమ భావవ్యక్తికరణ సరిగా జరపలేరని పేర్కొంటున్నారు ఈ అధ్యనానికి నేతృత్వం వహించిన టామీషా హేర్‌వుడ్. ఇలాంటి తండ్రులు వెంటనే పిల్లల సమక్షంలో తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఒత్తిడిని నియంత్రించుకోకపోవడం వల్ల తండ్రులు తాము డిప్రెషన్‌కు లోనుకావడంతో పాటు తమ పిల్లల వికాసానికీ ప్రతిబంధకమవుతారు’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు. -
భారత్‌కు మళ్లీ అమెరికా సుద్దులు!
వాషింగ్టన్: భారత్‌లో అసహనం, హింస పెరిగిపోతున్నాయంటూ వస్తున్న కథనాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడుతున్న వారిని చట్టప్రకారం శిక్షించాలని సూచించింది. గొడ్డుమాంసాన్ని తింటున్నవారిపై దాడులు జరగడం, బీఫ్ తరలిస్తున్నారని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ముస్లిం మహిళలను కొట్టడం వంటి ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. మతస్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలోనూ, అసహనాన్ని ఎదుర్కోవడంలోనూ మేం భారత ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటాం. అసహనం, హింస పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తలపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రస్తుతం ఈ సమస్యను ప్రపంచమంతా ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పౌరులను అండగా ఉంటూ.. దాడులకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
కేసుల విచారణ లోపభూయిష్టం
♦ డీజీపీకి నివేదిక అందజేస్తా ♦ సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌లో పలు ఠాణాల విలీనం ♦ కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్‌పై యోచన ♦ ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ఎస్పీలకు ఆదేశాలు ♦ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు: సీరియస్ కేసుల్లో పోలీసుల విచారణ లోపభూయిష్టంగా ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. వివిధ కేసుల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడారు. తాండూరులో సీరియస్ కేసుల విచారణ సరిగా జరగంలేదని, లోపాలు చాలాఉన్నాయని అన్నారు. ఆయా కేసులకు సంబంధించి రికార్డుల నిర్వహణ సరిగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నుంచి సీసీఎస్ డీఎస్పీ, ఇద్దరు సీఐలతో కేసుల రికార్డుల నిర్వహణను పరిశీలించగా లోపాలు ఉన్నట్టు తేలిందన్నారు. ఆయా అంశాలపై డీజీపీకి నివేదిక అందజేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసులు నిలబడేలా విచారణ ప్రక్రియతోపాటు రికార్డుల నిర్వహణను పోలీసులు మెరుగు పర్చుకోవాల్సి ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పోలీసుశాఖలో కూడా పునర్విభజన ప్రక్రియ మొదలైందనన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ పోలీసుస్టేషన్లు సైబరాబాద్ పశ్చిమంలో కలువనున్నట్టు తెలిపారు. సైబరాబాద్ తూర్పు, పశ్చిమలో 15 ఠాణాల్లో మార్పు జరుగనుందని చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం కలుగుతుందని, తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వం 20 మండలాలతో ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నదని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇసుక అక్రమ మార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్టు డీఐజీ స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లకు ఆదివారం వారాంతపు సెలవు ఇచ్చే విషయమై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా ఎస్పీ బీ.నవీన్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త ఎస్ఐలు ఠాణాలకు పరిమితం కావద్దు.. కొత్తగా నియామకమైన ఎస్ఐలు ఠాణాలకే పరిమితం కావొద్దని అకున్ సబర్వాల్ సూచించారు. ఉదయం 10గంటలకు తాండూరుకు చేరుకున్న డీఐజీ నేరుగా పట్టణంలోని మినీ స్టేడియానికి వెళ్లారు. అక్కడ తాండూరు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు,ఎస్ఐలు, కానిస్టేబుళ్ల పరేడ్‌ను పరిశీలించారు. కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ కానిస్టేబుళ్ల బదిలీలపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. పరేడ్‌లో యూనిఫాంలు బాగున్న కానిస్టేబుళ్లకు రివార్డులు ఇవ్వాలని ఎస్పీ నవీన్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి, తాండూరు రూరల్, అర్బన్ సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్యలతో పలు అంశాలపై డీఐజీ సమీక్షించారు. తర్వాత డీఏసీ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నవీన్‌కుమార్, ఏఎస్పీ చందనదీప్తి, సీఐలు సైదిరెడ్డి, వెంకట్రామయ్య, ఎస్ఐలు రేణకారెడ్డి, నాగార్జున, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డీఐజీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. -
'మోదీని అదే అడగాలనుకుంటున్నా'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకే తమ పాలన అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. 'ఓటమిని తట్టుకోలేకే పార్లమెంట్ లో తమను సోనియా గాంధీ అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీ అంటున్నారు. ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకే ఢిల్లీ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారా అని మోదీని అడగాలనుకుంటున్నా'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం పైనా కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాపై కోర్టు ఇచ్చిన తీర్పు మోదీ పాలన పెరిగిన అసహనంకు గట్టి చెంపపెట్టుగా ఆయన వర్ణించారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. -
అసహనం
ప్రత్యేక ప్రశంస పొందిన కథ ఫోన్ రింగవుతోంది. అప్పుడే నిద్రపడుతోంది. దాన్నలా వదిలేద్దాం అనుకున్నాను. అదేంటో ఫోన్ వస్తే అటెండ్ కాకుండా వుండలేను. ‘మళ్లీ ఫోన్ చేయాల్సి వస్తుందనా!’ అంటాడో మిత్రుడు. అలాంటిదేం వుండదు. నిజంగా నాతో మాట్లాడాలనుకుంటే వాళ్లే చేస్తారు. ఏ ఫోన్ ఎలాంటి వార్తని మోసుకొస్తుందో తెలియదు. ఇంతకుముందు ఉత్తరాల కోసం ఎదురు చూసేవాణ్ని. అవి అరుదైపోయాయి. ఉత్తరం కనీసం రెండు మూడు రోజులకి రాకపోయినా వెలితిగా వుండేది. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. మంచం మీద నుండి లేచి అందుకున్నాను. ‘హలో’ అన్నాను కొత్త నెంబర్ చూసి. ‘నమస్తే అన్నా’ వినిపించింది. ‘నమస్తే. ఎవరు కావాలి మీకు?’ ‘నువ్వే అన్నా.’ ‘మీరెవరో నాకు తెలియదు.’ ‘నువ్వు నాకు తెలుసన్నా.’ ‘మీ పేరు చెప్పండి?’ ‘నా పేరా... గొంతు గుర్తుపట్టలేదా?’ ‘లేదు.’ ‘అవున్లే. ఎట్టా గుర్తుపడతావ్. నేను సెలబ్రిటీ కాదుగా.’ చిరాగ్గా వుంది. అతని గొంతులో వున్న మద్యం వినిపిస్తోంది. ‘ఫోన్ కట్ చేయొద్దు బ్రో’ అన్నాడు. ‘ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా?’ అన్నాను విసుగ్గా. ‘మాట్లాడుకోవటానికి మనసుండాల. టైమ్ ఎందుకు?’ ‘ఇంతవరకు మీ పేరు చెప్పలేదు. నాకు మీతో మాట్లాడే మనసు లేదు. ఫోన్ కట్ చెయ్యి.’ ‘అట్టా అంటావేంటన్నా?’ ‘మందు తాగి ఎవరికీ ఫోన్ చేయొద్దు. ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలవుతోంది. ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు ముందు పేరు చెప్పటం అలవాటు చేసుకో. నువ్వు తెలిస్తే, మాట్లాడతారు. లేదంటే రాంగ్ కాల్ అని పెట్టేస్తారు. గుడ్‌నైట్’ అని కట్ చేశాను. ‘అదేదో ముందు చేయాల్సింది. ఇంత మర్యాదగా మాట్లాడటం అవసరమా’ అనుకున్నాను. నిద్ర మధ్యలో మెలకువ వస్తే నాకు మళ్లీ నిద్రపట్టదు. అందుకు తన్నుకు చావాలి. కనీసం గంటన్నర. మళ్లీ అతని ఫోన్ వస్తుందేమోనని అయిదు నిమిషాలు వెయిట్ చేశాను. ఇంక నిద్రపోదాం అని ఫోన్ పక్కన పెట్టి మంచం దగ్గరకు వచ్చాను. అప్పుడు మళ్లీ మోగింది. చూస్తే అదే నంబర్. కోపం వచ్చింది. స్విచ్ ఆఫ్ చేద్దామనుకున్నాను. వీడి సంగతేంటో చూద్దాం అనుకున్నాను అంతలోనే. ‘టాక్’ బటన్ ప్రెస్ చేసి మౌనంగా వున్నాను. ‘నా పేరు మనోహర్ బ్రో..’ అని వినిపించింది. రక్తం సర్రున పాకుతున్నట్లు నాకే తెలుస్తోంది. ‘నేనో అమ్మాయిని లవ్ చేశా. అదేమో నన్ను ‘నో’ అంటోంది. ఇప్పుడు నేనేం చేయాలి బాస్. దాని ముఖం మీద యాసిడ్ పొయ్యమంటావా?’ ‘వద్దు’ అన్నాను కంఠం మార్చి. ‘అదేంటి బ్రో. నేను దానికి ఎంత ఖర్చుపెట్టానో తెలుసా. నా బైక్ మీద తిరిగింది. రెస్టారెంట్స్‌లో ఐస్‌క్రీమ్ బిల్లు చెప్పనా, దాని డ్రెస్‌లకు ఎంతయిందో చెప్పనా... కసిగా వుంది. నువ్వయితే ఏం చేస్తావు?’ ‘యాసిడ్ నా ముఖం మీద పోసుకుంటా.’ ‘బ్రో’ అతని కంఠంలో షాక్. ‘ఎవడ్రా నీకు బ్రో. ఈ నెంబర్ ఎవరిదనుకుంటున్నావు. డి.సి.పి.’ అన్నాను. ‘సార్.’ ‘రెడీగా ఉండు. రేపు సాయంకాలానికి నువ్వు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తున్నా. లాకప్ రూమ్‌లో నిన్ను చంపేస్తా.’ ‘సార్ తప్పయిపోయింది. ఇంకెప్పుడూ ఫోన్ చెయ్య’ అంటూ కట్ చేశాడు. చిన్నగా నవ్వుకున్నాను. ఫోన్ సెలైంట్ మోడ్‌లో వుంచి మంచం మీదకు చేరుకున్నాను. ఇంతకీ ఈ మనోహర్ ఎవడు? సరదాకి చేశాడా? అసలు నా ఫోన్ నంబర్ వీడికి ఎలా దొరికింది? రకరకాల ఆలోచనలు. ఎప్పటికి నిద్ర పట్టిందో నాకు తెలియదు. ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను. స్కూటర్ మీద వస్తుంటే ఫోన్. ‘సార్, నేను అశ్విన్‌ని మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడ ఉన్నారు?’ ‘ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను.’ ‘నేను అమీర్‌పేట్‌లో ఉన్నాను. మీరు హౌసింగ్ బోర్డ్‌లో వుంటారు కదా.’ ‘అవును’ అన్నాను. ‘మనం మాట్లాడుకోవాలి. అమీర్‌పేట్‌లో నన్ను కలవగలరా?’ ‘అలాగే’ అన్నాను. ఇద్దరం ఓ పార్క్‌లో కూర్చున్నాం. రెండు నెలల క్రితం అశ్విన్ కథ మీద చర్చ జరిగింది. ప్రతి నెలా మొదటి ఆదివారం మేం కొందరం కలుసుకుంటాం. అప్పుడు ఓ కథ మీద చర్చ జరుగుతుంది. ఇంకొందరు ఓ నవలని పరిచయం చేస్తారు. హైదరాబాద్‌లో వుండే రచయితల కథలు మాత్రమే చర్చించం. రెండు రాష్ట్రాల్లో వుండే ఏ రచయిత లేదా రచయిత్రి కథ మీదైనా మాట్లాడవచ్చు. మా సమావేశాలకు పది మంది నుండి ఇరవై మంది దాకా వస్తుంటారు. అయిదారుగురు మాత్రమే వచ్చే సందర్భాలుంటాయి. ఒక్కోసారి రచయితలు వస్తుంటారు. చర్చలు సీరియస్‌గా వుంటాయి. ఆ సారాన్ని రచయితలకు తెలియజేస్తుంటారు. అందరి మాటల్ని రికార్డ్ చేస్తుంటారు. ఆ రోజు జరిగిన చర్చకు అశ్విన్ రాలేదు. ఇంతకుముందు ఓ సభలో అతన్ని కలుసుకున్నాను. ‘చెప్పండి’ అన్నాను. ‘నా కథ మీద మీరు మాట్లాడిన విషయాలు నా దాకా వచ్చాయి’ అన్నాడతను మెల్లగా. నేను చిన్నగా తలూపాను. ‘మీకు తెలుసో లేదో తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసిన ప్రముఖులు ఆ కథ అద్భుతంగా ఉందన్నారు’ అన్నాడు. ‘మంచిది అశ్విన్. మీరు రాసింది పది కథలు. అయినా మీకు అవార్డులు ఇచ్చారు. సంకలనాల్లో మీవి ఎనిమిది కథలు వచ్చాయి. వ్యక్తిగతంగా మీకు అభినందనలు’ అన్నాను. ‘ఇప్పుడు ఎదురుగా వున్నాను కాబట్టి అభినందనలు చెబుతున్నారు. ఆ రోజు మీరు దారుణంగా విమర్శించారు’ అన్నాడు సూటిగా. ‘దారుణంగా అనకండి. వివరంగా మాట్లాడాను. అది మీకు నచ్చకపోవచ్చు.’ ‘నచ్చలేదు. అయినా మీరు ఏం వూడబొడిచారని మాట్లాడాలి’ అన్నాడు అశ్విన్. నాకెందుకో రాత్రి ఫోన్ చేసిన మనోహర్ గుర్తుకు వచ్చాడు. చిన్నగా నవ్వాను. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ ‘నా రచనలు మీరు చదివారా?’ ‘ఒకటో అరో చదివాను. మీరు వందల కొద్దీ రాసినా రాని పేరు మాకు వస్తోందని మీ ఏడుపు అంటాను.’ ‘అది వుంటే వుండొచ్చు’ అన్నాను. అశ్విన్ కళ్లల్లోకి చూస్తూ. అతను మాట్లాడలేకపోయాడు. ‘అశ్విన్ మీకు ఎంత పేరు వచ్చిందనుకుంటున్నారు?’ ఆ మాత్రం తెలియదా అన్నట్లు చూశాడు. ‘నేను ఏడవాల్సి వస్తే నాలుగు వందల మంది తర్వాత మీరుంటారు. మీకు కొన్ని వందల మంది నుండి అభినందనలు వస్తే నా ఒక్క విమర్శను మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు. దారుణం అని మొదలుపెట్టిన మీరు వాడుతున్న భాష ఏమిటి?’ అన్నాను. అతని కళ్లల్లో ఎరుపు రంగు కనిపిస్తోంది. ‘నేను మొదట మీ కథలోని ప్లస్ పాయింట్ల గురించి చెప్పాను. అవి మీకు అనవసరం. మీ శైలి బాగుందన్నాను. సమస్యను బాగా ప్రెజెంట్ చేశారు అన్నాను. చిన్నవో, పెద్దవో తప్పుల గురించి నేను మాట్లాడలేదు. మీ కథ తీసుకువస్తే ఎదురుగా కూర్చొని అవన్నీ చెబుతాను. నేను ప్రశ్నించింది మీ ఫిలాసఫీ గురించి. అందులో మీరు చెప్పాలనుకున్న విషయం ఏంటని. అది మాట్లాడటం లేదు మీరు.’ ‘మీకు అర్థం కాలేదా. నేను ఏం చెప్పదలుచుకున్నానో’ అన్నాడు అశ్విన్. ‘అర్థం అయింది. అశ్విన్ నువ్వు ఓ గందరగోళంలో వున్నావు. నీకంటూ యింకా దారి ఏర్పడలేదు. నువ్వింకా బాగా చదవాలి. అది మాత్రం చెప్పాను.’ ‘మీ అంత తెలివితేటలు నన్ను అభినందించినవారికి లేవంటున్నారు. అంతే కదా.’ ‘వాళ్ల తెలివితేటల గురించి నేను మాట్లాడలేదు. వారందరూ నిన్ను అభినందించారని నువ్వు చెబితే ఇప్పుడు తెలిసింది. ఏ విమర్శా లేకుండా ఎందుకు అభిమానించారో వారు చెప్పాలి. బహుశా వారు నువ్వు యిలానే రియాక్టవుతావని చెప్పలేదేమో!’ ‘‘దీన్ని అహంకారం అంటారు’ అన్నాడు. ‘నీకు అహంకారం వుంటే నాకు వుండకూడదా. నాలుగు కథలు రాసిన నీకే అహంకారముంటే నాకు ఎంత వుండాలి. మిస్టర్ అశ్విన్, జీవితం చాలా చిన్నదని నువ్వు అనుకోవచ్చు. ప్రశంసలు తలకి ఎక్కించుకుంటే నువ్వు రచయితగా కొనసాగలేవు. చిన్నపాటి విమర్శను భరించలేనివాడివి ఈ రంగంలోకి రాకూడదు. ఇక్కడ పూలు మాత్రమే విసర్రు. రాళ్లు కూడా వుంటాయి.’ ‘థ్యాంక్స్’ అన్నాడు వ్యంగ్యంగా. ‘నువ్వు ఎంత వ్యంగ్యంగా అన్నా నాకు నష్టం లేదు. అసహనం ఎవరికీ మంచిది కాదు. నువ్వు నిజంగా గొప్ప రచన చేస్తే అభినందిస్తాను. నువ్వు ఎవరికోసం రచనలు చేయాలో నువ్వు నిర్ణయించుకో. పదుల కొద్దీ బహుమతులు వచ్చినవారు, అవార్డులు వచ్చినవారు ఇప్పుడు ఎక్కడున్నారో ఓ సారి స్టడీ చెయ్యి’ అన్నాను. ఆ తర్వాత మాటలు లేవు మా మధ్య. ‘నేను ఇంటికి వెళ్లాలి. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారో చెప్పండి’ అన్నాను. ‘అవసరం లేదు. మీరు వెళ్లండి’ అన్నాడు. వారం రోజులు గడిచిపోయాయి. అశ్విన్ విషయం నేను మరిచిపోయాను. మా మధ్య జరిగిన సంభాషణని కూడా ఎవరితోనూ నేను పంచుకోలేదు. ఇంతకుముందు ఓ విమర్శకుడు నాతో అన్నాడు. ఇప్పుడొస్తున్న కొంతమంది చిన్న విమర్శను కూడా భరించలేకపోతున్నారు. కనీసం మాట్లాడటం లేదు ఎందుకొచ్చిన విమర్శ అనిపిస్తోందని. ‘ఎవరూ మాట్లాడకపోతే ఎలా’ అన్నాను. ‘ఇదో సంధి కాలం. రచయితలు తక్కువయ్యారు. వారినన్నా నిలుపుకోవాలి కదా’ అన్నాడు. ‘ప్రశంస ప్రమాదకరమైంది. అది ఎక్కువయితేనే రచయితలను నిలుపుకోవటం కష్టం’ అన్నాను. అశ్విన్ లాంటి రచయితలు ఎందుకు మౌనంగా మిగిలిపోయారో నాకు తెలుసు. ఫోన్ రింగవుతోంది. కొత్త నెంబర్. ఆఫీస్ పనిలో వున్నాను. ‘హలో’ అన్నాను. ‘మీరు వేణుగారేనా?’ ‘అవును వేణునే.’ ‘నేను సార్. మనోహర్ని’ అన్నాడు. ‘నువ్వా... ఎక్కడున్నావు?’ ‘జైల్లో లేను సార్. ఆ రోజు రాత్రి మందుకొట్టి మీకు ఫోన్ చేశాను. నన్ను క్షమించండి’ అన్నాడు. ‘ఇంతకూ నీ ప్రేమ ఏమైంది?’ ‘అదేం ప్రేమ సార్. నన్ను యాసిడ్ నా ముఖం మీద పోసుకో అన్నారు. మనసు మీద పోసుకున్నాను. కవిత్వం చెబుతున్నాననుకోవద్దు. నాకు పుస్తకాలు చదివే అలవాటుంది. మీ నెంబర్ కూడా నాకు పుస్తకాల్లో దొరికింది. ప్రేమంటే కాఫీ హోటళ్ల చుట్టూ తిరగటం కాదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తే డబ్బులు ఎందుకు ఖర్చుపెట్టాలి. పెట్టాననుకోండి. ఆ అమ్మాయి నా సొంతం అయిపోతుందా? నేను, నా ప్రేమ గురించి చెబితే నా సొంతం అయిపోతుందా? ఫుల్‌గా తాగేశాను. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. మీ మాటలకు షాకయ్యాను. వేణుగారూ... తర్వాత ‘సారీ’ చెప్పటానికి చేస్తే పోలీస్ ఆఫీసర్ మాట్లాడాడు. అది మీరేనా?’ ‘కాదు.’ ‘నాలుగు రోజులు మా ఊరు వెళ్లాను. సిమ్ కార్డ్ పారేశాను. చాలా రకాలుగా కుర్రాళ్లం చెడిపోతున్నాం. ఇందులో ఆడపిల్లలు కూడా వున్నారు.’ ‘సరే. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. సంతోషం.’ ‘ఓసారి మిమ్మల్ని కలవాలి. కలుస్తాను.’ ‘మంచిది. మనం తర్వాత మాట్లాడుకుందాం’ అన్నాను. అశ్విన్ నుండి కూడా ఫోన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను. - పి.చంద్రశేఖర ఆజాద్ -
మోదీ సర్కారుపై అమెరికా 'మతం' బాంబు
న్యూఢిల్లీ: పైకి స్నేహం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆ దేశాధ్యక్షుడు 'చాయ్ పే చర్చ'ల్లో చిరునవ్వులు చిందించనప్పటికీ ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకున్న వ్యతిరేకతను అమెరికా మరోసారి బాహాటంగా ప్రకటించింది. యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం నేతృత్వంలోని స్వతంత్ర సంస్థ యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్ సీఐఆర్ఎఫ్) తన వార్షిక నివేదికలో మోదీ సర్కారుపై 'మతం' బాంబులు కురిపించింది. సోమవారం విడుదలైన ఈ వార్షిక నివేదికలో సంచలనాత్మక ఆరోపణలు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో అసహనం పెరిగిపోయిందని, మైనారిటీ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయని యూఎస్ సీఐఆర్ఎఫ్ ఆరోపించింది. 2015 నుంచి ఇండియాలో పరమతసహనం క్షీణిస్తున్నదని, మతస్వేచ్ఛపై నిర్భ్యంతరంగా దాడులు జరుగుతున్నాయన్న నివేదిక.. అధికార బీజేపీ ముఖ్యనేతల అండతో కొందరు బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మైనారిటీలపై దాడులను ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల(జూన్ లో) వాషింగ్టన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ సీఐఆర్ఎఫ్ నివేదిక ఈ రకమైన అంశాలు వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యూఎస్ సీఐఆర్ఎప్ భారత అంతర్గత వ్యవస్థలపైనా తీవ్ర నిందారోపణలు చేసింది. మైనారిటీలపై దాడులకు పాల్పడేవారిని నిరోధించడంలో పోలీసులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని, అవసరానికి తగ్గ సిబ్బంది న్యాయవ్యవస్థకు లేకపోవడం కూడా అసహనం పెరుగుదలకు మరో కారణమని తెలిపింది. అంతేకాదు.. భారత్ తో ద్వైపాక్షిక చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది. భారత్ తో చర్చల్లో మతసహనం అంశాన్ని కూడా చేర్చి, ఆ దేశంలో (ఇండియాలో)ఇప్పుడున్న పరిస్థితిలో మార్పునకు కృషిచేయాలని సలహాఇచ్చింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (1998) ఆధారంగా ఏర్పాటుచేసిన యూనైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్ సీఐఆర్ఎఫ్) దేశదేశాల్లో మతసహన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివేదికలు, సలహాలు ఇస్తుంది. యూఎస్ సీఐఆర్ఎఫ్ అధ్యక్షుడు, సభ్యులను అమెరికా అధ్యక్షుడు, సెనెట్ సభ్యులు ఎంపిక చేస్తారు. పేరుకు స్వతంత్ర సంస్థే అయినప్పటికీ ఇందులో ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తూఉంటారు. ఫెడరల్ ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది. -
దేశభక్తి నిరూపించుకోమంటే ఏడుపొచ్చింది
న్యూఢిల్లీ: ‘నా దేశభక్తిని నిరూపించుకోమన్నప్పడు ఏడుపొచ్చినట్టయింది. దేశంలో నా కంటే గొప్ప దేశభక్తిపరుడు ఎవరూ లేరు’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ అన్నారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కున్న షారుక్ ఇటీవల ‘ఆప్ కీ అదాలత్’లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘నా సినిమా ‘ఫ్యాన్’ హిట్టయినా, కాకున్నా.. నా కంటే గొప్ప దేశభక్తుడు ఎవరూ ఉండరని నేను చివరిసారిగా చెప్పాలనుకుంటున్నా. ఈ విషయం మళ్లీ మళ్లీ చెప్పను’ అని భావోద్వేగంతో అన్నారు. తన కుటుంబమే మినీ ఇండియా అని తెలిపారు. దేశం మోదీని ప్రధానిగా ఎన్నుకుందని.. మనమంతా ఆయనకు మద్దతివ్వాలన్నారు. యువత సహనంతో ఉండాలని.. జాతి పురోగమనానికి బాటలు వేసేలా కృషి చేయాలని తెలిపారు. ‘మతం, కులం, వర్ణం, వర్గం, ప్రాంతం తదితర విషయాల్లో అసహనం వద్దు. నటనను వ్యాపారంగా తీసుకోను. సినిమాల హిట్టయితే వీలైనంత ఇవ్వమని నిర్మాతలకు చెబుతాను. ఒప్పందాలు, ఈవెంట్లు, షోలకే ఫీజు వసూలు చేస్తాను’ అని అన్నారు. అమితాబ్కంటే మంచి నటుడినని 22 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను గుర్తుచేయగా.. అది వయసులో చేసిన దురహంకార వ్యాఖ్యగా, బాల్యచేష్ట అని చెప్పారు. ఏది గొప్ప నటుడిని చేస్తుందన్నది తనకు తెలియదని.. 22 ఏళ్ల తర్వాత ఇప్పటికి తెలుసుకున్నానని చెప్పారు. 50 ఏళ్ల వయసులో ఇప్పటికీ కొన్నిసార్లు తనలోని చిన్నపిల్లాడి తత్వం బయటపడుతుందని షారుక్ తెలిపారు. -
అసహనంపై ఉమ్మడి పోరు: మన్మోహన్
గాంధీనగర్: అసమానత, అసహనం నుంచి ప్రపంచానికి విముక్తి కోసం విద్యార్థులు విధాన నిర్ణేతలతో కలసి పనిచేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. ఆయన శనివారమిక్కడ ‘బాపు గుజరాత్ నాలెడ్జ్ విలేజ్’లో భావిభారతంలో విద్యార్థుల పాత్రపైప్రసంగించారు. భవిష్యత్తుపై యువత ఎంతో ఆశావాద దృక్పథంతో ఉందని, పేదరికం, నిరుద్యోగం, అసమానత, అసహనం నుంచి ప్రపంచం విముక్తి పొందాలని కోరుతోందని చెప్పారు. ఈ మార్పులు సాధ్యం కావాలంటే విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ముందుండి నడిపించే నాయకులతో చేతులు కలపాలన్నారు. అసహనంపై అప్రమత్తమవ్వాలి: బాన్‌కీ మూన్ న్యూయార్క్: ప్రపంచంలో పెరిగిపోతున్న అసహనం, విద్వేషపూరిత హింసాకాండపై అప్రమత్తమవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ పిలుపునిచ్చారు. ఇస్లాం వ్యతిరేక దురభిమానం తదితర విద్వేషాలపై అంతర్జాతీయ సమాజం గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ జాత్యహంకార వివక్ష నిర్మూలన దినం సందర్భంగా ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?'
కోజికోడ్: లౌకికవాదులు ఎప్పుడూ హిందూ మతవాదులనే ప్రశ్నిస్తారుగానీ.. ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు అని వివాదాస్పద రచయిత్రి, మహిళా హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ అన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. శనివారం కోజికోడ్‌లో జరుగుతున్న 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్' కు హాజరయ్యారు. ఇండియాలో అసహనం ఉందని తాను భావించడంలేదన్న తస్లీమా ఇక్కడ ఒకరి నమ్మకాలపై మరొకరు సహనంతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. భారత చట్టాలు అసహనానికి మద్దతు పలకవని, అయినప్పటికీ ఇక్కడ అసహనానికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీకాదని అన్నారు. లౌకికవాదులు గా పేరుపొందినవారు కేవలం హిందూ మతవాదులనే ప్రశ్నించి ఊరుకుంటారని, ముస్లిం మతవాదుల జోలికి పోరని, ఇలాంటి బూటకపు లౌకికవాద ప్రజాస్వామ్యం ఎప్పటికీ నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదని తస్లీమా అభిప్రాయపడ్డారు. -
షారుఖ్ షూటింగ్‌కు 'అసహన' సెగ!
భుజ్ (గుజరాత్): దేశంలో మత అసహనంపై బాలీవుడ్ సూపర్ష్టార్ షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఆయన తాజా సినిమా షూటింగ్‌ను అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రయత్నించింది. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో జరుగుతున్న షారుఖ్ సినిమా 'రాయిస్' షూటింగ్ వద్ద వీహెచ్‌పీ కార్యకర్తలు బుధవారం ఆందోళన నిర్వహించారు. గత ఏడాది నవంబర్‌లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో తీవ్ర మత అసహనం ఉందని షారుఖ్ వ్యాఖ్యలు చేశాడు. 'మత అసహనం కలిగి ఉండటం, లౌకికంగా వ్యవహరించకపోవడం దేశంలో తీవ్రమైన నేరమే' అని ఆయన పేర్కొన్నాడు. షారుఖ్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వెనుకకు తగ్గారు. భారత్ అసహన దేశమని తాను ఎన్నడూ అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షారుఖ్ సినిమా షూటింగ్‌కు భుజ్ పట్టణంలో అనుమతి ఇవ్వవద్దంటూ గతకొన్ని రోజులుగా వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించిన ఆందోళనకారులు.. అక్కడి నుంచి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరారు. వారిని దారి మధ్యలోనే పోలీసులు అడ్డుకొని చెల్లాచెదురు చేశారని స్థానిక ఎస్సై ఎంబీ పర్మార్ తెలిపారు. -
బాలీవుడ్ లో అసహనమా?
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ దేశంలో అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే, బాలీవుడ్ నుంచే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ వచ్చింది. అది కూడా కరణ్ స్నేహితురాలు, ప్రముఖ హీరోయిన్ కాజోల్ నుంచి రావటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి వారు దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ కామెంట్ చేసి విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో కాజోల్ ' బాలీవుడ్లో అసహనం లాంటిదేమి లేదు. సినీరంగం ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కులం, మతం లాంటి అడ్డుగోడలేమి లేవు.' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె ఈ విధంగా స్పందించింది. అదే వేదికపై కరణ్ భారత్‌లో ప్రజాస్వామం పెద్ద జోక్ అంటూ కామెంట్ చేయటం, తరువాత ఆ వ్యాఖ్యలపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్పందించటం తెలిసిందే. -
సహనమే ఆయుధం
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మలప్పురం(కేరళ): వివాదరహిత సమాజ నిర్మాణంలో సహనమే ప్రధాన ఆయుధమని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ స్పష్టంచేశారు. మతాల మధ్య అంతరాలను తొలగిస్తే అసహనం అనేది ఉండదన్నారు. భిన్నత్వం కలిగి ఉన్న మన సమాజంలో సహనంతో దేన్నైనా స్వీకరించే, అన్ని మతాలను అర్థం చేసుకునేతత్వాన్ని ప్రజల్లో పెంపొందిచాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారమిక్కడ ‘అసహనం’పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మతాల మధ్య ఘర్షణ నివారణకు సహనం.. ధర్మం, స్వేచ్ఛలా పనిచేస్తుందన్నారు. -
పరస్పరం గౌరవించుకోవాలి
సంప్రదాయాలు, అభిప్రాయాలపై ప్రధాని రాయ్‌పూర్: ‘అసహనం’పై విస్తృత చర్చ నేపథ్యంలో శాంతి, ఐకమత్యం, సామరస్యాలకు పిలుపునిస్తూ.. పరస్పర సంప్రదాయాలు, అభిప్రాయాలను గౌరవించుకోవాలని ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. వివేకానంద జయంతిని సందర్భంగా రాయ్‌పూర్ జరుగుతున్న జాతీయ యువజనోత్సాన్ని ఉద్దేశించి మంగళవారం ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘మనది భిన్నత్వం గల దేశం. సామరస్యం మన బలం. మా ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం పని చేస్తోంది. సామరస్యంగా ఉండకపోతే ప్రగతి సాధించలేం. ఐకమత్యం, సామరస్యం లేకపోతే.. ఒకరి సంప్రదాయాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించకపోతే.. అభివృద్ధి మార్గంలో ఆటంకాలు కలగవచ్చు. శాంతి, ఐకమత్యం, సామరస్యం లేకపోతే సౌభాగ్యం, సంపద, ఉపాధి కల్పనలకు అర్థం ఉండదు. మనం శాంతియుతంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాల్సిన సమయమిది. దేశ ప్రగతికి ఇవి హామీనిస్తాయి. వందలాది భాషలు, విభిన్న మతాలతో కూడిన భిన్నత్వ దేశం శాంతియుతంగా జీవించగలదని భారత్ ప్రపంచానికి చాటింది. ఈ సంస్కృతిని మనం దీనిని పరిరక్షించాల్సి ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని ప్రస్తావిస్తూ మనిషి చేతులు ఏదో ఒకరంగంలో నైపుణ్యంతో బలోపేతం కావాలి కానీ, ఒకరిని చంపటానికి ఉపయోగపడవద్దని అన్నారు. -
‘రాష్ట్ర ధర్మ్’ మహోన్నతం: మోదీ
అన్ని మతాలకంటే అదే గొప్పది ♦ భారత్ ప్రపంచానికి మతతత్వం గురించి చెప్పలేదు.. ♦ ఆధ్యాత్మికత గురించే బోధించింది ♦ మతంతో సమస్యలు..ఆధ్యాత్మికతతో పరిష్కారాలు.. ముంబై: భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధించిందే తప్ప మతతత్వం గురించి చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్ని మతాల కంటే ‘రాష్ట్ర ధర్మ’(దేశానికి సేవ చేయటం) మహోన్నతమైనదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత అనేది భారతీయ వారసత్వ ఆస్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విశ్వసించేవారని, మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు అది పరిష్కారం చూపుతుందని అన్నారు. ఫలానా మతానికే బద్ధులుగా ఉండాలని భారత్ ఎన్నడూ ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నించలేదని, ఈ విషయమై మనం అర్థం చేసుకున్నట్లు ప్రపంచం మనల్ని సరిగా అర్థం చేసుకోలేదని విచారం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా అసహనం, మతతత్వం పెరుగుతోందన్న ఆరోపణలపై చర్చ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జైన సన్యాసి ఆచార్య రత్నసుందర్‌సురీశ్వర్జీ మహరాజ్ రచించిన 300వ పుస్తకాన్ని మోదీ ఆదివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించి మాట్లాడారు. మతం కొన్నిసార్లు సమస్యలను సృష్టిస్తుందని, అయితే ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ సమస్యలకు పరిష్కారాలు చూపుతుందని చెప్పారు. సుందర్ గొప్ప సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడని అభివర్ణించారు. విశ్వంలోని అన్ని రకాల అంశాలపై ఆయన తన పుస్తకాలతో భావాలను వ్యక్తపరిచారన్నారు. 10 రోజులుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మికత సమాలోచన కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం ముంబైలోని సోమయ్య గ్రౌండ్స్‌లో ఆయన తాజా పుస్తకం ‘మై ఇండియా నోబెల్ ఇండియా’ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన 30వేల మందిని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘భౌతికంగా నేను మీకు దూరంగా ఉండొచ్చు. అయితే మీ మనసుకు చాలా సన్నిహితంగా ఉన్నాను. శిరసు వంచి ఆచార్య పవిత్ర పాదాలకు వందనం చేస్తున్నా’నన్నారు. వివిధ రకాల సామాజిక దురాచారాలపై ఆయన తన పుస్తకాల్లో రాశారన్నారు. అన్ని మతాల కంటే జాతీయత గొప్పమతమన్నారు. సుందర్ మహరాజ్ అనేక సామాజిక రుగ్మతలను వెలుగులోకి తెచ్చి వాటిని ఖండించారని మోదీ అన్నారు. ఆయన రచనలు భారత సాంస్కృతిక జాతీయతను ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రధర్మం గురించి రత్నసుందర్ సురీశ్వర్జీ బోధనలు అనుసరణీయాలని ఆయన అన్నారు. -
ఆ వ్యాఖ్యలు చేసినందుకు షారుఖ్ సారీ!
తన తాజా చిత్రం 'దిల్వాలే' విడుదలకు రెండురోజుల ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేశారు. దేశంలో తీవ్ర అసహనం నెలకొందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన క్షమాపణలు చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీచానెల్‌తో మాట్లాడుతూ దేశంలో విపరీతమైన మత అసహనం ఉందని షారుఖ్ అన్నారు. మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేవి దేశానికి ఒక దేశభక్తుడు చేసే తీవ్రమైన నేరమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. అసహనంపై షారుఖ్ వ్యాఖ్యల తర్వాత అమీర్‌ఖాన్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన షారుఖ్ తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే క్షమించాలని కోరారు. దేశంలో తాను ఎలాంటి అసహనాన్ని ఎదుర్కొనలేదని, దాని గురించి కూడా తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ఈ నెల 18న 'దిల్వాలే' విడుదల కానున్న నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. -
ట్రంప్‌కి చెంపదెబ్బ
సమ్‌థింగ్ స్పెషల్ అసహనం గురించి, విద్వేషం గురించి ప్రపంచానికి లెక్చర్లిచ్చే అమెరికా ఇప్పుడు అసహనంతో ఊగిపోతోంది. ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ స్థాయి వ్యక్తి ముస్లింలను అమెరికాలోకి రానీయకూడదంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని చూసి కలవరపడుతున్న అమెరికన్ జనం కూడా ట్రంప్‌ను లైక్ చేస్తున్నారు. ఈ సమయంలో గల్ఫ్ యుద్ధంలోనే బాంబు దాడిలో కాలు పోగొట్టుకున్న క్రిస్ హెర్బర్ట్ అనే ఓ మాజీ సైనికుడు ట్రంప్‌కి చెంపదెబ్బ లాంటి జవాబిచ్చాడు. గతాన్ని మరచిపొమ్మని బతుకు బాటలో ముందుకు సాగమని పిలుపునిచ్చాడు. తన మిత్రుడిని చంపి, తన కాలు పోయేలా చేసినవాడు ముస్లిమే. కానీ తనకు, తన కుంటుంబానికి ఎన్నో విధాల సాయం చేసిన వాళ్లూ ముస్లింలేనని ఒక పోస్టును సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ పోస్టు ఇప్పుడు అమెరికా, యూరప్‌లలో హల్ చల్ చేస్తోంది. చాలా మంది ఫేస్బుక్కులో, ట్విట్టర్లో ఈ పోస్టును ప్రశంసిస్తున్నారు. -
అరగంట నిద్ర లేకుంటే అసహనమే: కడియం
ఎంజీఎం (వరంగల్): డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రిగా క్షణం తీరిక లేకుండా పనిచేసే కడియం శ్రీహరి.. అప్పుడప్పుడూ తనను అసహనం ఆవహిస్తుందని చెప్పారు. ఆదివారం వరంగల్ లోని ఓ హోటల్ లో స్లీప్ అప్ డేట్స్ (స్లీప్ సెన్సెన్)పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 'మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అర్ధగంట సేపు నిద్రపోకపోతే తీవ్ర అసహనానికి గురవుతా. చక్కగా ఓ అర్ధగంట నిద్రపోతే, రిఫ్రెష్ అయి, మళ్లీ రాత్రి వరకు చురుకుగా పనిచేయగలుగుతా' అని చెప్పుకొచ్చారు. వర్తమాన జీవన విధానం ఎంతటి గందరగోళంగా ఉందో తనదైన శైలిలో వివరిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఏది ఏమైనా రాత్రి 10.30 దాటుతుందంటే కంటి మీద కునుకు ఆగదని, పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోతానని, ఉదయం 7 గంటలకుగానీ మెలకువ రాదని వివరించారు కడియం. -
బాబోయ్ బాబు అసహనం
-
చెరిగిపోని మరకలు
-
చెరిగిపోని మరకలు
- దురాగత ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య - అవి సమాజంపై, దేశంపై మచ్చగా మిగిలిపోతాయి - ఐక్యత, సామరస్యాలే మంత్రంగా ముందుకు సాగాలి - భారతీయులందరూ దేశభక్తులే.. అందుకు రుజువులు అవసరంలేదు - చట్టాల రూపకల్పనలో రాజ్యసభ అడ్డంకిగా మారకూడదు - దేశహితం కోసం రాజకీయాలను పక్కనబెట్టాలి - రాజ్యాంగంపై చర్చకు రాజ్యసభలో ప్రధాని సమాధానం న్యూఢిల్లీ: దురాగత ఘటనలేవైనా.. అవి సమాజంపై, జాతి ప్రతిష్టపై మచ్చగా మిగిలిపోతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆ అపఖ్యాతి బాధను దేశమంతా భరించాల్సి ఉంటుందన్నారు. ‘ఎవరిపై జరిగిన ఎలాంటి దుశ్చర్యైనా.. అది మనందరిపై మచ్చగా మిగులుతుంది. సమాజంపై, దేశంపై మరకగా నిలిచిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ఏ ఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. సంచలనం సృష్టించిన దాద్రి, తదనంతర అసహన ఘటనలు, వాటిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చనుద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. పారిస్‌లో జరుగుతున్న వాతావరణ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మంగళవారం భారత్ చేరుకున్నారు. అనంతరం, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏకైక మార్గం ఐక్యత, సామరస్యతలేనని స్పష్టం చేశారు. 125 కోట్ల భారతీయుల్లో ఏ ఒక్కరి దేశభక్తిని కూడా ప్రశ్నించలేమన్నారు. ఏ భారతీయుడు కూడా.. ఎవరికైనా సరే.. తాను కూడా దేశభక్తుడినేనంటూ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దేశంలో నెలకొన్న అసహన వాతావరణంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌పై కొందరు ‘పాకిస్తాన్‌కు వెళ్లిపో’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఐక్యత, సామరస్యత భారతదేశ సంప్రదాయం. భారత్ లాంటి వైవిధ్యతకు నెలవైన దేశంలో.. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు మార్గాలను వెతకాలే కానీ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కారణాలు వెతకొద్దు. ప్రజలందరి ఐక్యత మన బాధ్యత’ అని హితవు పలికారు. ‘సమత, ప్రేమ అనే భావనల్లో ఎంతో శక్తి ఉంది. అయితే, మనలో ఉన్న శక్తే ఇతరుల్లోనూ ఉంటుందని గుర్తించాల’న్నారు. మోదీ ప్రసంగం అనంతరం.. భారతదేశ వైవిధ్యతను, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక లక్షణాలను కాపాడుతామంటూ రాజ్యసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంపై.. ‘రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే విభిన్న వాదనలు వచ్చాయి. అయితే, దేశ అవసరాలను, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన దార్శనిక, చరిత్రాత్మక విధాన పత్రాన్ని రాజ్యాంగంగా మనకు అందించారు. ఇలాంటి దార్శనిక పత్రాన్ని మనకందించినందుకు రాజ్యాంగ రూపకర్తలకు సదా కృతజ్ఞులమై ఉండాలి’ అంటూ నివాళులర్పించారు. ‘రాజ్యాంగం అంటే కేవలం చట్టాలు కాదు. అదొక సామాజిక విధాన పత్రం. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా, వివరణ అవసరమైనా మనమంతా చూసేది రాజ్యాంగం వైపే’ అన్నారు. భారతీయులనందరినీ ఐక్యంగా ఉంచే శక్తి రాజ్యాంగానికి ఉందన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పోషించిన ఆదర్శప్రాయమైన మార్గదర్శక పాత్రను విస్మరించలేమన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ‘ఎథిక్స్ కమిటీ’ గురించి ఆలోచించలేదని, కానీ ఆ తరువాత దాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘1787లో ఫిలడెల్ఫియాలో రూపుదిద్దుకున తరువాత.. బహుశా ప్రపంచంలో చోటు చేసుకున్న అతిగొప్ప రాజకీయ కార్యక్రమం భారత రాజ్యాంగ రూపకల్పనే’ అన్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత రచయిత గ్రేన్విల్ ఆస్టిన్ చేసిన వ్యాఖ్యను మోదీ గుర్తు చేశారు. ‘రేపటి నుంచి మనం చేసే పనులకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తప్పుబట్టలేం’ అంటూ 1947 ఆగస్ట్ 14న తొలి ఉప రాష్ట్రపతి ఎస్ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ఉన్నతస్థాయిలో అవినీతి, ఆశ్రీత పక్షపాతం ఉంటే పరిపాలన సమర్థంగా సాగదని కూడా రాధాకృష్ణన్ చెప్పారన్నారు. దేశంలో దళితులకు భూమి లేనందువల్ల.. వారికి ఉపాధి కల్పించేందుకు దేశంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలని అంబేద్కర్ సూచించారని గుర్తుచేశారు. రాజ్య సభపై.. ‘రాజ్యసభకే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇది పెద్దల సభ. ఎక్కడైనా పెద్దవారు లేకుండా ఎలాంటి చర్చ జరగదు’ అని మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, రాజ్యసభల మధ్య సహకారం అవసరమన్నారు. చట్టసభలకు ఎన్నికైన తరువాత రాజకీయాలకు అతీతంగా ఎదగడంపై దృష్టి పెట్టాలన్నారు.‘రాజ్యసభకు మించిన మార్గదర్శి లేదు. అయితే, చట్టాల రూపకల్పనలో రాజ్యసభ అడ్డంకిగా నిలవరాదు’ అన్న రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు గోపాలకృష్ణ అయ్యంగార్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. లోక్‌సభ, రాజ్యసభల మధ్య వివాదం తలెత్తినప్పుడు లోక్‌సభ వాదనకే విలువుంటుందని పేర్కొన్నారు. రెండు సభలు సామరస్యంగా సాగాలని ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఆకాంక్షించారన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పలు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొంది, ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేని కారణంగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉండిపోయిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. విపక్షంతో రాజీ ధోరణి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లుల ఆమోదం తప్పని సరైన నేపథ్యంలో.. ప్రధాని ప్రసంగంలో ప్రతిపక్షాలతో సయోధ్యాపూరిత తీరు కనిపించింది. జాతి హితానికి సంబంధించిన అంశాల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని, పక్షపాత రహితంగా, ఏకాభిప్రాయం దిశగా సాగాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నువ్వు.. నేను అనే వాదనలతో అభివృద్ధి జరగదన్న మోదీ.. అన్నింటినీ రాజకీయం చేసే తీరును విడనాడాలన్నారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ ‘ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి. ప్రాంతాల మధ్య కూడా. అందుకే దేశ ఐక్యతను బలోపేతం చేసేందుకు ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నాం. రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని పెంచే దిశగా ఇతర రాష్ట్రాల భాషలను నేర్చుకోవడం, వారి పండుగలను జరుపుకోవడం లాంటి కార్యక్రమాలను చేపడతాం’ అని మోదీ వెల్లడించారు. ప్రధాని ప్రసంగంలో కోట్స్ - నేను, మీరు అనే శబ్దాలను ప్రయోగించటం నా పద్ధతి కాదు. నేను ‘మనము’ అనే పదాన్నే వాడతాను ‘కరత్ కరత్ అభ్యాస్ కే, జడ్మతీ హోత్ సుజాన్ రస్రీ ఆవత్ జాత్ తే, శిల్ పర్ పరత్ నిశాన్’ - బావిలో నీళ్లను చేదే తాడుకు.. రాయితో పోరాడేంత శక్తి ఉండదు. కానీ నిరంతర సాధన వల్ల ఆ రాయిపైన కొత్త రూపం కల్పించగలుగుతుంది. ‘న సా సభా యత్ర న సంతి వృద్ధా:, వృద్ధ: నతేయో న వదంతి ధర్మం ధర్మ: స నో యత్ర న సత్యమస్తి, సత్యం న తథాచ్ఛలంభ్యుపైతి’ - ఏ సభలో అయితే చర్చ జరగదో.. అనుభవజ్ఞులైన, ధర్మజ్ఞులైన పెద్దలు ఉండరో.. ఆచరిస్తున్న ధర్మంలో సత్యం ఉండదో.. అది అర్థరహితమైనసభ. అందుకే రాజ్యసభకు ఓ విశిష్ఠత ఉంది. ‘యద్య దాశరథి శ్రేష్ఠస్తత్ దేవేతరో జన: స యత్ ప్రమాణం కురుతే లోకస్త దనువర్తతే గొప్పవాళ్లు పాటించే వాటిని.. మిగిలిన వాళ్లు ఆచరిస్తారు. వాళ్లు ఏదైతే చేయాలని నిర్ణయిస్తారో.. దాన్ని మిగిలిన వారంతా అనుసరిస్తారు. ‘ప్రపంచంలో గొప్ప దేశమేదని నన్నెవరైనా అడిగితే.. ప్రకృతిలోనే ధనం, శక్తి, సౌందర్యం ఎక్కడైతే ఉంటుందో.. అలాంటి భూతల స్వర్గమైన భారత్ గురించే చెబుతాను. భారతీయులు ప్రపంచంలోని చాలా సమస్యలు పరిష్కారాన్ని ఎప్పుడో సూచించారు. ప్లూటో గురించి వాళ్లు ఎప్పుడో తెలుసుకున్నారు’ - మాక్స్ ముల్లర్ -
ఇటు ఐక్యత ప్రబోధం-అటు విమర్శల దాడి!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో మంగళవారం అరుదైన దృశ్యం కనిపించింది. ఇటు రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అటు లోక్‌సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏకకాలంలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చకు పెద్దల సభలో ప్రధాని మోదీ సమాధానమివ్వగా.. 'అసహనం'పై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 'విభజించడానికి ఎన్నైనా సాకులు ఉండొచ్చు కానీ మనం ఐక్యంగా ఉండటానికి అవసరమైన కారణాలపై దృష్టి పెట్టాలి' అని సూచించారు. ప్రతిపక్షాల పట్ల ఆయన రాజీ ధోరణి కనబర్చారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో కాంగ్రెస్ నేతల పాత్ర కూడా ఉందని గుర్తుచేశారు. కష్టకాలంలో మన ఐక్యత నిలబడేవిధంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయాలను పక్కనబెట్టి రాజ్యాంగ విలువల్ని ప్రతిబింబించాల్సి ఉంటుందని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. మరోవైపు లోక్‌సభలో మాట్లాడిన రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నిరసన కూడా దేశద్రోహంగా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో జరిగిన హేతువాదుల హత్యలు, బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై మోదీ మౌనంగా ఉండటాన్ని రాహుల్ ప్రశ్నించారు. దళిత చిన్నారులను కుక్కతో పోలుస్తూ కేంద్రమంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై, దాద్రి ఘటనపై మోదీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. -
'మోదీని విమర్శిస్తే దాడులు చేస్తున్నారు'
న్యూఢిల్లీ: లోక్‌సభలో అసహనంపై మంగళవారం జరిగిన చర్చలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హేతువాదుల హత్యలపైనా, బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించారని రాహుల్ విమర్శించారు. 'కేంద్ర మంత్రి వీకే సింగ్.. దళితులను కుక్కలతో పోల్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. గాంధీని చంపిన గాడ్సేను బీజేపీ నేత సాక్షి మహరాజ్ ప్రశంసించారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని స్పందించలేదు. దాద్రి ఘటనపైనా మోదీ మాట్లాడలేదు. డబోల్కర్, కల్బుర్గి హత్యలపైనా ఆయన మౌనం వహించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో రోజు రోజుకూ అసహనం పెరిగిపోతోంది. ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. నిరసనలకు దిగితే రాజద్రోహం కేసులు పెడుతున్నారు' అని రాహుల్ అన్నారు. -
ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా
-
సలీం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం
-
పార్లమెంటులో అసహనంపై చర్చ
-
'ఆయన విదేశాలకు వెళ్తే.. తిరిగి తీసుకొస్తాం'
భోపాల్: బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ అసహనం వివాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత రాందాస్ అథావాలే స్పందించారు. ఆమిర్ ఒకవేళ విదేశాలకు వెళ్లిపోయినా.. తమ కేడర్‌ను పంపించి ఆయనను తిరిగి భారత్‌కు తీసుకొస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఆయనకు భద్రత అవసరమైతే తమ పార్టీ కేడర్ ఆయనకు రక్షణకవచంగా ఉంటుందని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. -
ఆమిర్ వ్యాఖ్యలతో పెరిగిన బిజినెస్
ముంబై: వ్యతిరేక ప్రచారం కారణంగా కొన్ని సందర్భాల్లో నష్టం కన్నా లాభమే ఎక్కువ జరుగుతుంది. ఏ ప్రచారం లేకపోవడంకన్నా ఏదో ప్రచారం ఉండడం మేలని నమ్మే రాజకీయ నాయకుల గురించి మనకు తెల్సిందే. దేశంలో అసహన పరిస్థితులు పెరిగిపోతున్నాయంటూ బాలివుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ‘స్నాప్‌డీల్’ అప్లికేషన్ కంపెనీ చెప్పడం తెల్సిందే. ‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది’ అన్నట్టు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల వల్ల స్నాప్‌డీల్ మార్కెట్ పడిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. వాస్తవానికి వారి అంచనాలు తలకిందులై స్నాప్‌డీల్ మార్కెట్ మరింత పుంజుకుంది. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నవంబర్ 23వ తేదీనాడు గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌డీల్ ఇండియా ర్యాంక్ 28వ స్థానంలో ఉండగా, ఆ మరుసటి రోజు కూడా అదే ర్యాంక్ కొనసాగింది. ఆ తదుపరి రోజు, అంటే 25వ రోజున ‘ఘర్వాప్సీ’ తరహాలో ‘యాప్వాప్సీ’ అనే వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకొంది. తద్వారా స్నాప్‌డీల్ ఒక స్థానాన్ని అధిగమించి 27వ ర్యాంక్‌కు చేరుకుంది. నవంబర్ 26వ తేదీ నాడు ఒక్కసారిగా ఐదు ర్యాంకులు అధిగమించి 22వ ర్యాంక్‌కు చేరుకుంది. గత 30 రోజుల కాలంలో ఐదు ర్యాంక్‌లు అధిగమించడం ఇదే మొదటిసారి. -
'ఆ ఒక్కరు తప్ప.. ఎవరికైనా..'
న్యూఢిల్లీ: భారత దేశంలో తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఎవరికైనా ఉందని అయితే, ఒక్క సెలబ్రిటీకి మాత్రం లేదని ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ భిన్నంగా స్పందించారు. దేశంలో అసహన పరిస్థితులు, భావ వ్యక్తీకరణపై సోనూ శుక్రవారం తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నాడు. 'ఒక్క సెలబ్రిటీ తప్ప ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయాన్ని కలిగిఉండే హక్కు ఉంది. అయితే, ఇది నా అభిప్రాయం మాత్రం కాదు. ఎందుకంటే నేను ఇలాంటివాటికి విరుద్ధమైనవాడిని.. అస్సలు మద్ధతివ్వను' అని ఆయన చెప్పారు. భారత్‌లో అసహన పరిస్థితులు పెరిగాయని వ్యాఖ్యలు చేసి పలు విమర్శల పాలై ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతున్న సమయంలో తాజాగా సోనూ తన అభిప్రాయాన్ని ప్రకటించారు. -
ఆమిర్ ఖాన్‌ను దూరం చేసుకుందామా?
న్యూఢిల్లీ: భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తున్న సోషల్ మీడియా కూడా నేడు అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం శోచనీయంగా ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యల స్ఫూర్తిని గ్రహించకపోయినా సరే, ఆయన చేసిన వ్యాఖ్యలను యధాతథంగా కాకుండా వక్రీకరించి మాట్లాడడం, ఆమిర్ ఖాన్‌తో ఎలాంటి సంబంధంలేని ఎవరో భార్యాభర్తలు గొడవ పడి అందులో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే ఆ సంఘటనను ఆమిర్‌కు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం! నెట్ న్యూట్రాలిటీ (తటస్థత వైఖరి) అంటే ఇదేనా ? లగాన్, తారా జమీన్ పర్, పీకే లాంటి విభిన్న చిత్రాలను తీసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమిర్‌ఖాన్‌ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ‘సత్యమేవ జయతే’ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలకు పట్టని సామాజిక సమస్యలను ప్రజలకుముందుకు తీసుకొచ్చిన విషయాన్ని అప్పుడే మరిచిపోయామా? ముంబైలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సల్మాన్ రష్దీ రాసిన పుస్తకం ‘ది సెటానిక్ వర్సెస్’ను భారత్‌లో నిషేధించడమే కాకుండా 2012లో జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌కు వస్తానంటే రానియ్యలేదే! అలాగే ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించాడన్న కారణంగా ఆయన్ని దేశం నుంచే తరిమేశామే! జీవిత చరమాంకంలో పుట్టిన గడ్డ భారత్‌లో తుదిశ్వాస విడుస్తానంటే కూడా కాదన్నమే! వారిలాగే ఆమిర్ ఖాన్‌ను కూడా వదులుకుందామా? సహనం అంటే ఇదేనా! అవును, భారతీయులు సహనపరులు. భోఫోర్స్ కుంభకోణం, బొగ్గు స్కామ్, సిక్కుల ఊచకోత, గుజరాత్ అల్లర్లు, వారసత్వ పాలన, కుళ్లు రాజకీయాలు, తరతరాల ప్రభుత్వాల అసమర్థత తదితరాలను సహించాంగదా! -ఇది ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఏది సహనం ఏదసహనం ఓ మహాత్మా!
సమకాలీనం ఒక్క మతోన్మాదమే కాకుండా ఈరోజు జీవితం అన్ని పార్శ్వాల్లోనూ అసహనం ప్రబలు తోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భాషా, ప్రాంతీయ పరమైన అసహనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా బహుళ సంఖ్యాకుల్లో సహనమే భారత వైవిధ్యానికి రక్షణ. కొన్నేళ్లుగా పెరుగుతున్న పోకడలే ప్రమాదకరంగా ఉన్నాయి. సహనా నికి ప్రతీక భారతదేశం అని చెబుతూ, ‘మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి’ అంటే నడిచే రోజులు కావివి. ఇప్పుడేం జరుగుతోందన్నదే ముఖ్యం. అసాధారణ అసహనం పట్లా అతి సహనంగా ఉన్నామా? మన సహజ సహనం వీడి అసహనంతో ఉంటున్నామా? లేక రెండూనా? అంతుబట్టని స్థితి నెలకొంటోంది. చిత్ర ప్రముఖుడు అమీర్‌ఖాన్ తన భార్య కిరణ్‌రావ్‌కు వచ్చిన ఓ ఆలోచనను ప్రస్తావించి,‘‘..... ఏమిటిది? ఏం జరుగుతోంది?’’ అని తన మనసు పంచుకొని, ఆందోళన వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. లేని ‘అసహనా’న్ని పెద్దది చేసి చూపుతూ భారత ప్రతిష్టను ఆయన మంటగలుపుతున్నాడంటూ ఊగిపోతున్న వారి మాటలు... ‘లేదు లేదు, అసహనం ఉంది, అది తీవ్ర స్థాయిలోనే ఉంద’ని ధృవీకరించేవిగా ఉన్నాయి. అమీర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆయనది దేశద్రోహుల భాష అని, ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం రాకుండా పాక్ పన్నిన కుట్రలో ఇది భాగమనీ, అట్లయితే ఆయన్ని పాకిస్తాన్ వెళ్లమనండని, ఆయన సినిమాల్ని నిషేధించండని ఇలా... చాలా విమర్శలే వచ్చాయి. ‘ఇంతకీ, అమీర్ ఏమి మాట్లాడాడు...?’ అది తెలుసుకొని స్పందించడంలోనే ఈ వ్యాఖ్యాతల ‘సహనం’ లోపించింది. పోనీ, ఏం మాట్లాడి ఉండాల్సింది? ఎవరితోనైనా ముందు సంప్రదించి, అనుమతి తీసుకుని ఆ మేరకే మాట్లాడి ఉండాల్సిందా? ఇదేనా ప్రజా స్వామ్యం? సగటు ఆలోచనాపరులందరిలోనూ ఇప్పుడీ సందేహాలు కలుగు తున్నాయి. ఎందుకంటే, ఆయన మాటల్ని ముక్కలుగా విరిచి, వీలయిన రీతిలో అన్వయించి, పెడార్థాలు తీస్తున్న వారి వాదనలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది! రామునితోక..... పివరుండిట్లనియే అని విడగొట్టి చదవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఇందులో మీడియా పాత్రేం తక్కువది కాదు! ఈ దేశంలో... ప్రభుత్వం, చట్టం, రాజ్యాంగం నీడన రక్షణ పొందుతున్న కొందరు పెద్దలు మాట్లాడినట్టు అమీర్‌ఖాన్ మరీ బాధ్యతా రహితంగా ఏం మాట్లాడలేదే! ‘హిందువులు కాని వారు దేశం వీడిపోవాలి’ అనో, ‘గోవధ నిషేధాన్ని సమర్థించని వారికీ దేశంలో స్థానం లేదు- వారంతా పాకిస్తాన్ వెళ్లాల’నో, ‘పశుమాంసం తినే వారిని ఉరితీయాల’నో అనలేదు. ఇద్దరు దళిత కుర్రాళ్లను దుండగులు సజీవ దహనం చేసినపుడు, ‘దారినపోయే ఎవరో, కుక్కలపై రెండు రాళ్లు విసిరితే అందుకు తమ ప్రభుత్వం బాధ్యత వహించజాలద’నీ అనలేదు. అలా మాట్లాడినవారంతా సహనశీలురయ్యారు. ‘రోజూ వస్తున్న వార్తా కథనాల తీవ్రత చూస్తే... గతంలో కన్నా ఇప్పుడు భయం పెరిగి, అభద్రత నెలకొందని అనిపిస్తోంది.... నేనూ నా భార్య కిరణ్ జీవితమంతా భారత్‌లోనే ఉన్నాం. కానీ, తను మొదటిసారి... భారత్ విడిచి వెళ్దామా? అంది, ఆమెకెందుకా ఆలోచన వచ్చిందో గాని, అలా మాట్లాడటం దురదృష్టకరం...’ అని తన మనసు విప్పి చెప్పిన అమీర్, అసంబద్ధంగా మాట్లాడాడు అన్నది ఇప్పుడీ పెద్దల సూత్రీకరణ! ‘ఈ దేశం అమీర్‌కు ఇంత స్థానం కల్పిస్తే, ఇలా మాట్లాడతాడా?’ అంటారు. దేశంలో ఏం జరుగుతున్నా... నోరు విప్పొద్దనే ఒప్పందం మీద ఆయన్ని స్టార్‌ని చేశారా ఎవరైనా? ఆయన సినీ హీరో అయి సంపాదించిందంతా ఎవరైనా ఉదారంగా విరాళమిస్తే వచ్చిందా? పోనీ, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి సంపాదిస్తే, శిక్షించకుండా దయతో ఉపేక్షించారా? ఏం పెద్ద మనుషులు వీరు? తమకు సరిపోని భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కవులు, రచయితలను మతోన్మాదులు మట్టుపెట్టడం అసహనం కాదా? కర్ణాటకలో కల్బుర్గి, మహారాష్ట్రలో పాండేను హతమార్చడం, సుధీంద్ర కులకర్ణిపై ఇంకు పోయడం దేశ వ్యాప్తంగా కవులు, కళాకారుల్ని కలవరానికి గురి చేసింది. అవార్డులు, గౌరవ పురస్కారాల్ని వెనక్కి ఇచ్చి తమ నిరసన తెలిపారు. ఒక వ్యక్తి గోవును చంపి మాంసం తిన్నాడనే నింద మోపి, ఉన్మాదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్కడికక్కడే ఆయన్ని హతమార్చడం అసహనం అవదా? వీటిని సరైన రీతిలో నియంత్రించాల్సిన పాలనా వ్యవస్థలు చేష్టలుడిగి ఉండటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఇంటింటి వద్ద కాపలా ఉంచో, ప్రతి ఉన్మాది మీద నిఘా పెట్టో రక్షణ కల్పించలేకపోవచ్చు! కానీ, అసహనం పెరిగి, చట్టవ్యతిరేక ఘటనలు చోటు చేసుకున్నపుడు తక్షణం స్పందించడం ద్వారా సరైన సంకేతాలు పంపాలి. మన ప్రధాని నరేంద్ర మోదీ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఇలాంటి స్థితే వచ్చినపుడు ఎలా స్పందించారో తెలీదా! ఒక నల్లజాతి ప్రొఫెసర్‌పై అమెరికా నడిబజారులో దాడి జరిగితే, స్వయంగా అక్కడికి వెళ్లి, ‘ఇది అరుదుగా జరిగే అసాధారణ ఘటన, మేం ఇటువంటివి ఎక్కడా జరుగనివ్వం’ అని విస్పష్టంగా ఖండిస్తూ, సదరు ప్రొఫెసర్‌ను వైట్‌హౌజ్‌కు తెచ్చుకొని సహపంక్తి భోజనం చేశారు. భవిష్యత్ భద్రతా చర్యలపై అమెరికన్లకు ఓ భరోసా కల్పించారు. ఇక్కడ అలా చేయకపోవడం ద్వారా, పెచ్చరిల్లిన మత అసహనం పట్ల పాలకులు అత్యంత సహనం చూపిన వారవుతున్నారు. అదే అలుసుతో పెట్రేగిన ఉన్మాదులు ‘కబడ్దార్’అని ఊగిపోయారు ఒక దశలో! అక్కడక్కడ ముఖ్యమంత్రులకే హెచ్చరికలు చేశారు. ఇక నాలుకల విచ్చలవిడి తనానికి హద్దే లేదు. భారతదేశంలోని ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపిస్తే ఇక్కడ జనాభా తగ్గి, హిందువులంతా హాయిగా ఉంటారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అనడం ఏ రకమైన సహనానికి ప్రతీక? ‘ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురిని కనాలి’ అన్న ఇంకో ఎంపీ, సాక్షీ మహారాజ్, గోవధకు పాల్పడే వారిని ఉరితీసేందుకు ఓ చట్టమే తేవాలనడం సహనమా? అసహనమా? బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు, అస్సాం ప్రస్తుత గవర్నర్ పీబీ ఆచార్య ‘భారత్ హిందువులది, అసంతృప్తి ఉన్న ముస్లింలు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చ’ని బహిరంగంగా ప్రకటించడం ఏ లౌకిక రాజ్యాంగ సూత్రాలకు లోబడి చెప్పిందో ఈ సహనశీలురే వివరించాలి. భారత రాజ్యాంగం కల్పించే హక్కులకు పూచీకత్తుగా ఉంటానని ప్రమాణం చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్, ‘మోదీని వ్యతిరేకించేవారు యథేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అంటారు. అదే గిరిరాజ్ సింగ్, 2014 ఎన్నికలప్పుడు ‘సోనియాగాంధీ ఏ నల్లతోలు నైజీరియనో అయితే ఈ స్థాయికి వచ్చి ఉండేవారా?’ అని వదరుబోతుతనం చాటి, క్షమాపణ చెప్పాలని నైజీరియన్ హై కమిషన్ డిమాండ్ చేస్తే చివరకు తోక ముడిచారు. ఎల్లెడలా పెరుగుతున్న ‘అసహనాలు’ ఒక్క మతోన్మాదమే కాకుండా ఈరోజు జీవితం అన్ని పార్శ్వాల్లోనూ అసహనం ప్రబలుతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భాషా, ప్రాంతీయ పరమైన అసహనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మనిషి మనుగడను తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా బహుళ సంఖ్యాకుల్లో సహనమే భారత వైవిధ్యానికి రక్షణ. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న పోకడలే ప్రమాదకరంగా ఉన్నాయి. సహనానికి ప్రతీక భారతదేశం అని చెబుతూ, ‘మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి’ అంటే నడిచే రోజులు కావివి. ఇప్పుడేం జరుగుతోందన్నదే ముఖ్యం. మానవసంబంధాలు పలుచబారడంతో పెరుగుతున్న సామాజిక అసహనం నుంచి చట్టసభల్లో ప్రత్యర్థులే ఉండొద్దని కుట్రలు-కుతంత్రాలు పన్నే రాజకీయ అసహనం వరకు అంతటా అలముకొందీ జాఢ్యం. అవధుల్లేని అధికారపు రుచి మరిగి, ఇక విపక్షంలో ఉండలేని రాజకీయ అసహనానికి హద్దులే లేవు. రాజస్థాన్‌లో గుజ్జర్లు, గుజరాత్లో పటేళ్లు, ఉత్తర భారతంలో జాట్లు జరిపిన సామాజిక ఆందోళనలు వారిలో పెరుగుతున్న అసహనానికి ప్రతీక. నదీ జలాలకోసం ముదురుతున్న వివాదాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యే కాకుండా ఆయా రాష్ట్ర ప్రజల మధ్య అసహనం పెరుగుదలకు కారణమౌతున్నాయి. కేరళ-తమిళనాడు మధ్య ముళ్లపెరియార్ డ్యామ్ వివాదం, తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరీ జలజగడం, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) తుంగభద్ర-కృష్ణా జల పంచాయతీ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య కృష్ణా-గోదావరీ జలాల వివాదం, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య బాబ్లీ నీటి తగాదా.... ఇవన్నీ కూడా పాలకుల్లో, పౌరుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. భాషాపరమైన అసహనాలు పెచ్చుమీరుతున్నాయనడానికి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి ఆందోళన ప్రత్యక్ష ఉదాహరణ. మనుషుల నిత్యావసరాలైన విద్య-వైద్యం వ్యాపారమయం కావడంతో సంబంధీకులందరిలోనూ అసహనం ప్రబలుతోంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు, పెద్ద జీతాలు రావాలనే ఆరాటంలో విద్యార్థులు, వారిపై ఒత్తిడి పెంచుతున్న తల్లిదండ్రులు, ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న విద్యాసంస్థలు... ఇలా అందిరిలోనూ ఏదో ఒక దశలో అసహనం బట్టబయలౌతోంది. సంఘంలో ఆర్థిక అంతరాలు అఘాతాలు సృష్టిస్తున్నాయి. ఆదాయం లేక జీవన ప్రమాణాలు పెరగని చోట ఆర్థిక ఇబ్బందులు, ఇబ్బడి ముబ్బడిగా ‘తేలిక’ సంపాదన పెరిగిన చోట ఆధునిక జీవన సరళి తెచ్చిన కొత్త సమస్యలు.... ఇలా కారణమేదైతేనేం కుటుంబాల్లో అసహనం పెచ్చుమీరుతోంది. అంతిమంగా అది అశాంతికి దారి తీస్తోంది. మిగతా అన్ని రంగాల్లో లాగానే ఇక్కడ కూడా విలువలు నశించడంతో సగటు జీవనం సంక్లిష్టమై అసహనం అసాధారణ స్థాయికి చేరుతోంది. కడకది కుటుంబ కలతలకు, విడాకులకు, ఆత్మహత్యలకు, హత్యలకు దారి తీస్తున్న విపరిణామాలెన్నో! చిన్న తగాదాలు, సూటిపోటి మాటలకే బలవన్మరణాలు మామూలయ్యాయి. ‘నేను ప్రేమిస్తున్నాను, కనుక నువ్వు ప్రేమించాల్సిందే’ ననే ఏకపక్ష ఉన్మాదం యాసిడ్ దాడులకో, హత్యలకో పురిగొల్పేంత అసహ నాలు పెచ్చు మీరాయి. భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ‘సహనం’ ఈ రోజు నవతరానికి పుక్కిట పురాణమైపోతోంది. ఏ వెలుగులకీ ప్రస్థానం? ‘అసహనమే ఒక విధమైన హింస, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎదుగుదలకు పెద్ద అవరోధం’ అంటారు పూజ్య బాపూజీ. సహనమైనా, అసహనమైనా... పాలకుల స్వభావాన్ని బట్టి, వారిచ్చే సంకేతాల్ని బట్టి ఆయా సమాజాల్లో వాటి హెచ్చు-తగ్గులు సహజం. అనారోగ్యకరమైన పోటీలో ప్రసార మాధ్య మాలు బాధ్యత మరచి వ్యవహరిస్తే మరింత ప్రమాదమన్నది సామాజిక వేత్తల భావన. అమీర్‌ఖాన్ వివాదం ఇందుకొక ఉదాహరణ అంటున్నారు. కులం, మతం, వర్గం అన్న భేదాల్ని కాసేపు పక్కన పెడితే, దేశంలో నెలకొన్న ఓ పరిస్థితిపై అభిప్రాయం వ్యక్తం చేస్తే తప్పెలా అవుతుందన్నదే ప్రశ్న. ‘కాలుష్యం పెరిగిపోయి ఈ నగరం నివాసయోగ్యంగా లేదు’ అంటే, ‘పిచ్చోడివా...? ఇదే నగరంలో పుట్టి, ఇక్కడే చదివి, మంచి ఉద్యోగం-ఆస్తి సంపాదించిన నీవు.... నగరం గురించి ఇదేనా మాట్లాడే తీరు? తప్పు!’ అంటే, ఇక భావ ప్రకటనా స్వేచ్ఛకు దిక్కేది? దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఆమిర్‌కు పాక్ టికెట్లు బుక్కయ్యాయి!!
అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమిర్ కుటుంబం మొత్తం పాకిస్థాన్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్కయ్యాయి. ఆమిర్ ఖాన్, ఆయన భార్య, కొడుకు కోసం నవంబర్ 30న పాక్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని హిందూసేన బుక్ చేసిందని ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. టికెట్ల కాపీలను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే టికెట్లు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు ఖాన్, కొడుకు ఆజాద్ రావు ఖాన్ ముగ్గురి పేరు మీద టికెట్లు బుక్ అయినట్లు ఉంది గానీ.. వాటిని ఎవరు బుక్ చేశారనడానికి మాత్రం అందులో ఎలాంటి ఆధారం లేదు. -
స్నాప్ డీల్‌కు ఎసరు పెట్టిన ఆమీర్ ’అసహనం’
-
ఇంత అసహనమా?!
దేశంలో ఈమధ్య దాదాపు సద్దుమణిగినట్టు కనిపించిన ‘అసహనం’ మళ్లీ బుసలు కొట్టింది. ఈసారి సందర్భం చిత్రమైనది. దేశంలో అసహనాన్ని ప్రదర్శించే ఉదంతాలు ఇటీవలి కాలంలో పెరిగాయని... ఈ విషయంలో తన భార్య కూడా ఆందోళన వెలిబుచ్చిందని సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మరుక్షణం అందరూ ఒక్కుమ్మడిగా ఆయనపై విరుచుకుపడ్డారు. ఆమీర్‌ఖాన్ చెప్పినదంతా అక్షరాలా నిజమని నిరూపించారు. దేశంలో అంతా సవ్యంగా ఉన్నదని, ఎక్కడ చూసినా సహనమే రాజ్యమేలుతున్నదని కళాకారులు, రచయితలు తదితరులను కూడగట్టి న్యూఢిల్లీలో ర్యాలీ నిర్వహించిన మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఇలాంటివారిలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమీర్ ఖాన్ ఇంటర్వ్యూను మొత్తం చూసినవారికి, ఆ మాటల వెనకున్న ఆవేదనను అర్ధం చేసుకున్నవారికి ఆయనేదో మహాపరాధం చేశాడన్న భావన కలగదు. ఆయన ఈ దేశం విడిచి వెళ్లిపోతున్నామని గానీ, దానిపై ఆలోచిస్తున్నామని గానీ చెప్పలేదు. ఆమాటకొస్తే ఆయన భార్య కిరణ్ సైతం అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. తనకూ, తన భార్యకూ మధ్య జరిగిన ఒక ప్రైవేటు సంభాషణలో దొర్లిన విషయాలను ఆయన వివరించారు. ‘మనం ఈ దేశం విడిచి వెళ్దామా’ అని ఆమె అడిగిందంటూనే... ఇది ఆమెనుంచి వచ్చిన దురదృష్టకరమైన అభిప్రాయమన్నారు. ఆమె తన పిల్లవాడి గురించి... చుట్టూ ఉండబోయే వాతావరణం గురించి భయపడుతున్నదని ఆమీర్ చెప్పారు. రోజూ పత్రికలు తెరవాలంటేనే భయపడుతున్నదన్నారు. గత ఆరేడు నెలలుగా తమలో అభద్రతాభావమూ, నైరాశ్యమూ ఏర్పడుతున్నాయన్నారు. పాలకులుగా ఉన్నవారు ఇలాంటి ఉదంతాల్లో కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశం పంపితే దేశంలో అభద్రత పోతుందన్నారు. ఇంతమాత్రానికే ఆమీర్‌పై అందరూ విరుచుకుపడ్డారు. ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగించారు. పాకిస్థాన్ పొమ్మని ఒకరూ...వెళ్తే దేశ జనాభా తగ్గుతుందని మరొకరూ వ్యాఖ్యానించారు. అవార్డు వాపసీని అనుకరిస్తూ కొందరు...ఆయన ప్రచారం చేసిన ఒక వాణిజ్య సంస్థ యాప్‌ను తొలగించుకుంటున్నట్టు ప్రకటించారు. చుట్టూ జరుగుతున్న విషయాలపై మౌనంగా ఉండిపోయేవారూ.... సూటిగా ప్రశ్నించినా దాటవేసే రీతిలో జవాబిచ్చేవారూ ఇలాంటివారి దృష్టిలో ఉత్తములు. గతంలో మరో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆమీర్ తరహాలోనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ఆయనపై కూడా ఇలాగే విరుచుకుపడ్డారు. ఆమీర్, షారుఖ్ లాంటివారు చెప్పిన మాటల్లో అతిశయోక్తులన్నాయని విమర్శించవచ్చు...నిజం లేదని వాదించవచ్చు. కానీ వారి దేశభక్తిని, నిజాయితీని శంకించడం...ద్రోహులుగా చిత్రించడం అమానుషమనిపించుకుంటుంది. నిజానికి ఆమీర్ నేపథ్యాన్ని గమనించినా, వివిధ సామాజికాంశాలపై ఆయన స్పందిస్తున్న తీరును అర్ధం చేసుకున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త అబుల్ కలాం ఆజాద్‌కూ, రాష్ట్రపతిగా పనిచేసిన మరో నేత జాకీర్ హుస్సేన్ కూ ఆయన ముని మనుమడు. ‘సత్యమేవ జయతే’వంటి కార్యక్రమాలు చేసినవాడు. ఉత్తమాభిరుచి గల, సామాజిక బాధ్యతగల నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నవాడు. ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న ఉదంతాలు గమనించినా, అవి జరిగాక కొందరు బీజేపీ ఎంపీలు, మంత్రులు చేసిన ప్రకటనలు చూసినా భయాందోళనలు కలగడంలో వింతేమీ లేదు. ఈ సంగతిని బీజేపీ నాయకత్వం గమనించబట్టే అలాంటి నేతలను పిలిచి మందలించవలసి వచ్చింది. అనవసరమైన ప్రకటనలు చేయొద్దని కోరవలసివచ్చింది. ఒక సాధారణ ముస్లిం కుటుంబం భోజనం ముగించుకుని, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నవేళ వందమందికి పైగా ఉన్న గుంపు ఇంటి యజమానిపై దాడి చేసి కొట్టి చంపేశారంటే, అతని కుమారుణ్ణి తీవ్రంగా గాయపరిచారంటే... ఆ ఇంట్లోని మహిళలు చేతులెత్తి వేడుకుంటున్నా అది అరణ్యరోదనగా మిగిలిందంటే ఆందోళన కలగదా? ఒక యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా పనిచేసి రిటైరైన సాహితీవేత్త కేవలం తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేశాడన్న ఆగ్రహంతో ఉన్మాదులు కాల్చిచంపేశారంటే... అదే రీతిలో అంతక్రితం మరో ఇద్దర్ని అంతమొందించారంటే బాధ, ఆందోళనా ఏర్పడవా? ఒక అధ్యాపకుడు రచయితగా తాను మరణించానని ప్రకటించవలసి వచ్చిందంటే ఇంత ఘోరమైన పరిస్థితులు వచ్చాయేమిటని ఎవరైనా ఆవేదన చెందరా? ఈ ఉదంతాలన్నీ ఒక ఎత్తయితే...అవి జరిగాక వెలువడిన ప్రకటనలు మరో ఎత్తు. గొడ్డు మాంసం తిన్నారన్న వదంతి ఆధారంగా దాడి చేయడం తప్పని ఒక నాయకుడంటారు. ఆయన దృష్టిలో అది వదంతికాక నిజమైన పక్షంలో జనం చేసింది సరైందే అవుతుందన్నమాట! ఇద్దరు పసిపిల్లలను సజీవదహనం చేసిన ఉదంతం విషయంలో...కుక్కపై ఎవరైనా రాయి విసిరితే దానికి కూడా మేమే బాధ్యులమా అని మరో నాయకుడు వెకిలిగా వ్యాఖ్యానిస్తారు. ఇవన్నీ గమనిస్తున్న ఒక తల్లి తన బిడ్డడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడంలో వింతేముంది? ఈ దేశంలో చాలామంది సంపన్నులు, ఎగువ మధ్య తరగతి జనం తమ పిల్లలకు ఇక్కడైతే మంచి భవిష్యత్తు ఉండదని భావించి విదేశాలకు పంపి చదివిస్తున్నారు. కొందరైతే ఉన్నతశ్రేణి విద్యా సంస్థల్లో సబ్సిడీకి చదువుకొని విదేశాల్లో భారీ వేతనాలు అందుతాయని, త్వరగా సంపద పోగేసుకోవచ్చునని అంచనావేసుకుని వెళ్లిపోతున్నారు. అలాంటివారంతా దేశభక్తులై... కేవలం తన పిల్లవాడి భవిష్యత్తుపై ఆందోళనపడి ఒక సందేహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేసినవారు దేశద్రోహులు కావడం ఎంత వింత? అసహనంతో ఉన్మాద చర్యలకు పాల్పడేవారి ఆటకట్టిస్తామని, అలాంటి ఉదంతాలు ఇకపై జరగకుండా చూస్తామని భరోసా ఇవ్వాల్సిందిపోయి దబాయింపునకు దిగడం న్యాయమేనా? భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన ఎవరినైనా సరే ఏమైనా అనడానికి తమకు హక్కున్నదని భావించే ధోరణిని బీజేపీ నేతలు విడనాడాలి. ఆరోగ్యకరమైన చర్చకు తావిచ్చే వాతావరణానికి దోహదపడాలి. -
'ఆమిర్ వ్యాఖ్యలతో మాకేం సంబంధం లేదు'
న్యూఢిల్లీ: భారత్ లో పెరుగుతున్న అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయ, సినీ రంగ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ కు ఈ వ్యాఖ్యల సెగ తగిలింది. దేశంలో చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పలువురు నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్ లో స్నాప్ డీల్ యాప్ పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. స్నాప్ డీల్ యాప్ కు పెద్ద ఎత్తున పూర్ రేటింగ్ ఇచ్చారు. వెంటనే ఆమిర్ ఖాన్ ను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మొదట మౌనంగా స్నాప్ డీల్ సంస్థ ఎట్టకేలకు బుధవారం పెదవి విప్పింది. ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఆమిర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలలో స్నాప్ డీల్ కు ఎలాంటి పాత్ర కానీ, సంబంధం కానీ లేదు. స్నాప్ డీల్ భారత్ కు గర్వకారణమైన సంస్థ. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్థ.. సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టింది. ప్రతిరోజూ మేం భారత్ లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ లో పది లక్షలమంది విజయవంతమైన ఆన్ లైన్ వ్యాపారవేత్తలను తయారుచేయాలన్న పెట్టుకున్న లక్ష్యం దిశగా మేం ముందుకు సాగుతున్నాం' అని స్నాప్ డీల్ తెలిపింది. -
పాత విషయాలు వదిలేసి.. ముందుకు పోదాం
న్యూఢిల్లీ: నవంబరు 26 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అధికార బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను బిల్లు, భూసేకరణ బిల్లుతో పాటు 9 కీలక బిల్లుల్ని ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వర్షాకాల సమావేశాల చేదు అనుభవాలను మర్చిపోయి ముందుకు పోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు. దాద్రి హత్యోదంతంపై పత్రిపక్షాల వ్యూహాలు తమకు తెలుసుని ఆయన అన్నారు. మరోవైపు నవంబరు 26 నుంచి డిసెంబరు 23 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను 'అసహనం' అంశం కుదిపేయనుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, పలు వివాదాస్పద అంశాలు అధికార పార్టీలో అశాంతిని రేపిన మాట వాస్తవం. ముఖ్యంగా దేశంలో చెలరేగిన మతఘర్షణలు, బీఫ్ బ్యాన్, దాద్రి ఘటన, అవార్డు వాపసీ లాంటి పలు అంశాలపై యుద్ధానికి ప్రతిపక్షాలు తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి. అలాగే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రాజేశాయి. బీజేపీ ఎంపీలు, నాయకులు, మరి కొందరు సీనియర్ నటులు ఆయనపై విరుచుకుపడ్డారు. దేశం విడిచి పొమ్మని ఒకరంటే, నీకు అంత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన దేశానికే కళంకితం ఆపాదిస్తావా అంటూ మరొకరు ధ్వజమెత్తారు. చివరికి శివసేన అధికార పత్రిక సామ్నా లో అమీర్ పై విమర్శలు గుప్పించింది. అటు ప్రతిపక్షాలు కోరిన అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. సభ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా సామరస్య పూర్వక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతోపాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ సహా, ప్రతిపక్షాలన్నీ అస్త్రశస్త్రాలతో రడీగా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న అసహనం తనకు బాధ కలిగించిందని, అందుకే పార్లమెంటులో దీనిపై చర్చను కోరుతున్నామని మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. అటు కీలక బిల్లుల్ని గట్టెక్కించేందుకు ప్రతిపక్షాలతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో బలం ఉన్నా... రాజ్యసభలో మాత్రం బలహీనంగా ఉంది. జీఎస్టీ బిల్లు, భూ సేకరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలోనే ఉన్నాయి. వీటిని గట్టెక్కించేందుకు ప్రతిపక్షాలను ఒప్పించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రతిపక్షాల సహకారం కోరుతూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాగా లలిత్ మోదీ వివాదం కేంద్రంగా.. గత సమావేశాలు కృష్ణార్పణం అయిపోయాయి. ఇక 21 రోజుల పాటు సాగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే. -
ఆమిర్ ఖాన్ చేసిన తప్పేంటి?
ముంబై: దేశంలో నానాటికి పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేయడం తప్పా? అసహనానికి వ్యతిరేకంగా చరిత్రకారులు, రచయితలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు తమ జీవన సాఫల్యంలో తమకు లభించిన ఆవార్డులను వెనక్కి ఇచ్చివేయడం నిజం కాదా? వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఆమిర్ ఖాన్ ఏమైనా మాట్లాడారా? హిందువులైన వారి పట్ల అంత తీవ్ర స్థాయిలో స్పందించని వారు ఆమీర్ మాటలపై ఎందుకంత దుమారం లేవదీస్తున్నారు? మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అవడం వల్లనేనా. ఆమిర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం అసహనం నిర్వచనం కిందకు రాదా? ప్రముఖ గజల్ సింగర్ గులాం అలీ పాటను కొన్ని తరాలుగా పదిలంగా గుండెలో దాచుకున్నామే, భారత్‌లో ఎన్నో కచేరీలతో మనల్ని అలరించారే, కేంద్రంలో ప్రభుత్వం మారగానే ముంబైలో ఆయన కచేరిని ఎందుకు రద్దు చేయించారు? అది అసహనం కాదా? గోమాంసం తిన్నారనే ఆరోపణలతోనే దాద్రీలో ఓ ముస్లింను దారుణంగా హత్య చేశారే, అది అసహనం కాదా? కేవలం గోవులను తల్లిగా భావించడం వల్లనే గోహత్యలను నిషేధించారా? అదే నిజమైతే నేడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గుజరాత్లో ఆలనాపాలనా లేకుండా వందలాది గోవులు ఎందుకు డొక్కలెండుకుపోయి చస్తున్నాయి? దేశంలోని అసహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని దేశ భక్తులు కాదంటూ దేశం వీడిపోవాల్సిందిగా అసహన వ్యాఖ్యలు చేస్తున్నారు. 1990 దశకం నుంచి దేశం నుంచి ముఖ్యంగా పంజాబ్, గుజరాత్ల నుంచి లండన్, అమెరికా, కెనడా, ఇతర యూరప్ దేశాలకు వలసపోతున్న వారి గురించి ప్రభుత్వాలుగానీ, దేశభక్తిపరులుగానీ ఎన్నడైనా ఆలోచించారా? మురికి వాడలు, పేదరికం, అవినీతి కంపును భరించలేమంటూ కన్న తల్లిని వదిలేసి బ్రిటన్‌లో బతుకుతున్న భారతీయులు, వారి సంతతి వారు ఇటీవల వెంబ్లీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీకి నీరాజనాలు పలకగానే దేశభక్తులైపోయారా? మాతృగడ్డపై బతుకుతున్న వారు మాత్రం పరాయులైపోయారా ?- ఇదీ ఓ సెక్యులరిస్ట్ కామెంట్. -
'రాహుల్ గాంధీ నన్ను కాపీ కొడుతున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు తన ఉపన్యాసాల శైలిని కాపీ కొడుతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. 'ఉపన్యాసాలు, ప్రసంగాలు ఇచ్చేటప్పుడు నాకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. అమేథిలో నేను ప్రసంగించిన విషయాలైమైనా మీరొసారి చూస్తే.. మీకు ఆ విషయం స్పష్టమవుతుంది. ఆశ్చర్యకరంగా నా తరహా మాట్లాడే శైలి రాహుల్ గాంధీలోనూ కనిపిస్తున్నది' అని ఆమె పేర్కొన్నారు. ఓ ఆంగ్ల చానెల్‌తో సరదాగా మాట్లాడిన స్మృతి ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ మిమ్మల్ని అనుకరిస్తున్నారా అన్న ప్రశ్నకు నవ్వుతూ.. 'అది నేనేమి ప్రశంసగా తీసుకోనం'టూ బదులిచ్చారు. అయితే అది జోక్ మాత్రమేనని తర్వాత చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అమేథిలో రాహుల్‌ను సవాల్ చేసిన స్మృతి ఇరానీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్ కావాలంటే తన చొక్కా చేతులను ఎంతవరకైనా మడుచుకోవచ్చునని, ఏమైనా మాట్లాడే హక్కు ఆయనకు ఉందని స్మృతి చెప్పారు. అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో సహనం ఉంది కాబట్టే ఒక కేంద్రమంత్రి సమక్షంలో ప్రజావేడుకలో ఆమిర్ ఆ మాటలు మాట్లాడగలిగారని ఆమె అన్నారు. -
ఆరని చిచ్చు
-
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ
-
ఆమిర్‌పై అసదుద్దీన్ ఫైర్!
ముంబై: అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. దేశాన్ని వీడాలని భావించినట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ స్వాతంత్ర్య సమరయోధులను కించపరచడమే అవుతుందని ఒవైసీ మండిపడ్డారు. 'మేం ఇండియాను వీడాలనుకుంటున్నామని మాట వరుసకు చెప్పినా అది దేశ స్వాత్రంత్య సమరయోధులకు అపకారం చేయడమే అవుతుంది. విశ్వంలో భూగ్రహం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ ఇండియా విడిచివెళ్లిపోమ్మని బలవంతపెట్టలేరు. మేం కూడా విడిచివెళ్లబోము' అని ఒవైసీ పేర్కొన్నారు. 'ఆయన వెళ్లిపోతే దేశంలో జనాభా తగ్గుతుంది' దేశంలోని అభద్రతా భావం ఉందన్న బాలీవుడ్ ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఆమిర్ ఖాన్ కావాలనుకుంటే దేశాన్ని తప్పక వీడి వెళ్లిపోవచ్చునని, ఆయన వెళ్లిపోతే దేశంలో కొంత జనాభా అయినా తగ్గుతుందని ఆదిత్యనాథ్ సూచించారు. ఆమిర్ నివాసం వద్ద ఆందోళన.. భద్రత పెంపు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ముంబైలోని ఆయన నివాసం ఎదుట భద్రతను పెంచారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూసేన కార్యకర్తలు కొందరు ఆయన నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగంలోకి భద్రతను పెంచారు. -
పారిపోవడం హీరోయిజం కాదు అమీర్!
ముంబై: దేశంలో ఉందని చెప్తున్న పరమత అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్ లో తీవ్రస్థాయి చర్చనే లేవనెత్తాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనలతో దేశం విడిచి వెళ్లిపోదామా? అని ఓ దశలో తన భార్య కిరణ్ రావు అడిగిందని అమీర్ ఖాన్ చెప్పడం పెద్ద దుమారమే రేపుతున్నది. ఆయన వ్యాఖ్యలను ఉత్త భయాలేనని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేయగా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా అమీర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విట్టర్ లో స్పందించారు. బాలీవుడ్ నటులు రిషి కపూర్, పరేశ్ రావల్, అనుపమ్ ఖేర్ అమీర్ తీరును విమర్శించారు. రిషీ కపూర్ స్పందిస్తూ 'అమీర్ ఖాన్.. తప్పులు జరుగుతున్నప్పుడు వ్యవస్థను సరిదిద్దాలి. మరమ్మతు చేయాలి. తప్పులను సరిచేసేందుకు ప్రయత్నించాలి. కానీ పారిపోకూడదు. అలా చేయడమే హీరోయిజం అవుతుంది' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. బీజేపీ పరేశ్ రావల్ స్పందిస్తూ ' అమీర్ పోరాటయోధుడు. ఆయన దేశాన్ని విడిచివెళ్లకూడదు. దేశంలోని పరిస్థితులను మార్చాలి. జీనా యాహా మర్నా యాహా' అని అన్నారు. 'నిజమైన దేశభక్తుడు దేశాన్ని కల్లోలంలో వదిలేసి పారిపోడు. కష్టకాలంలో మాతృదేశాన్ని వీడడు. దేశం నుంచి పారిపోవడం కాదు దేశాన్ని నిర్మించు' అని పేర్కొన్నారు. మాతృదేశాన్ని ప్రేమించేవారు ఎవ్వరు కూడా దేశాన్ని విడిచిపోతామని మాట్లాడారని, అలా మాట్లాడితే మరోలా అనుకోవాల్సి ఉంటుందన్నారు. హిందూ విశ్వాసాలను ప్రశ్నిస్తూ అమీర్ ఖాన్ 'పీకే' సినిమా తీశారని, అయినా దేశంలోని మెజారిటీ హిందువుల నుంచి ఏనాడైనా ఆయన ఆగ్రహాన్ని చవిచూడలేదని, అంతేకాకుండా దేశమంతటా ఈ సినిమాను సూపర్ హిట్ చేశారని, ఇంకా అసహనం ఎక్కడిదని రావెల్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా అమీర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ, అలనాటి హీరోయిన్ రవీనా టాండన్, వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలువురు బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ కు మద్దతుగా ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. -
'బెదిరించడం కాదు వారిని అర్థం చేసుకోండి'
న్యూఢిల్లీ: దేశంలో మత అసహనముందంటూ బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తమను ప్రశ్నించేవారిని వేధించడం, బెదిరించడం, అగౌరవపరచడం కేంద్ర ప్రభుత్వం మానుకుంటే మంచిదని ఆయన సూచించారు. దానికంటే దేశ ప్రజలకు చేరువై.. వారు ఎందుకు అశాంతికి గురవుతున్నారో అర్థం చేసుకోవాలని మంగళవారం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 'ప్రభుత్వాన్ని, మోదీజీని ప్రశ్నించేవారిపై దేశద్రోహులుగా, దేశభక్తిలేనివారిగా, ఇతరత్రా ప్రేరేపకులుగా ముద్రవేయడం కంటే ప్రభుత్వం ప్రజల మనస్సులను అర్థం చేసుకొని.. వారిని అశాంతికి గురిచేస్తున్నదేమిటో తెలుసుకోవడం మంచిది' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'భారత్ లో సమస్యల పరిష్కారానికి అదే మార్గం. అంతేకానీ వేధించడం, బెదిరించడం, అగౌరవపరచడం కాదు' అని ఆయన తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ... మత అసహనంపై తాను ఆందోళనకు గురయ్యానని అమీర్ ఖాన్ అన్నారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆయన చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. -
దేశానికి నువ్వేమిచ్చావు: రవీనా టాండన్
ఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌పై నటి రవీనా టాండన్, బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చూడలేని వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్నారని నటి రవీనాటాండన్ పేర్కొన్నారు. రవీనా టాండన్ ట్వీట్ల సారాంశం ఇలా ఉంది.. ''మోదీని ప్రధానిగా చూడకూడదని అనుకునేవాళ్లంతా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. వాళ్లు దేశానికి సిగ్గుచేటు. అసహనాన్ని ఖండించాలని, దానిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. కానీ, ఇలా విషం చిమ్మడం సరికాదు. దేశానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మీద బాంబుల వర్షం కురిసినప్పుడు వాళ్లకు ఎందుకు భయం వేయలేదో అని ఆశ్చర్యం వేస్తోంది. మోదీ ప్రధాని అయిన రోజు నుంచి తాము సంతోషంగా లేమని వీళ్లు బహిరంగంగా చెబితే బాగుండేది. అంతేతప్ప మొత్తం దేశం సిగ్గుపడేలా వ్యాఖ్యానించడం సరికాదు. వాళ్లకు నిజంగా దమ్ముంటే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. అంతేతప్ప దేశ పరువు ప్రతిష్ఠలను దిగజార్చకూడదు. ఏ రకమైన నిరసనతోనూ నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ మన దేశాన్ని గౌరవించే విషయానికొద్దాం.. దేశం నీకు ఏమిచ్చిందో, నువ్వు దేశానికి ఏమిచ్చావో ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.'' ఇక ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కుందని షానవాజ్ హుస్సేన్ చెబుతూనే, ఈ దేశం అమీర్ ఖాన్‌కు చాలా ఇచ్చిందన్నారు. భారత్ కన్నా మరో మెరుగైన దేశాన్ని అమీర్ ఖాన్ చూడలేరని, దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి అమీర్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని షానవాజ్ ధ్వజమెత్తారు. మరోవైపు అమీర్ ఖాన్ పై ఢిల్లీలోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ ఇంటి ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు ప్రారంభించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్‌రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా అవార్డుల కార్యక్రమంలో అమీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
'అందరూ అంటున్నదే మాట్లాడారు'
న్యూఢిల్లీ: మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి అందరూ అంటున్నదే ఆమిర్ మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. 'అగ్రహీరోల్లో ఒకరైన ఆమిర్ ఖాన్.. బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో తమ అసహనంపై గళం విప్పారు. మోదీ పాలన గురించి ప్రపంచమంతా, దేశమంతా చెప్పుకుంటున్నదే ఆయన చెప్పారు' అని సింఘ్వి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో మత అసహనంపై ఆమిర్ ఖాన్ మాట్లాడారు. మత అసహనంపై గళం విప్పినంతమాత్రానా ఆమిర్ ఖాన్ ను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా ముద్ర వేయడం తగదన్నారు. ఆయన ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. సినిమాల్లో కాకుండా నిజజీవితంలోనూ ఆమిర్ ఖాన్ సందేశాత్మకంగా వ్యవహరించారని సింఘ్వి ప్రశంసించారు. -
మీ భార్యను ఈ ప్రశ్నలు అడిగారా?
న్యూఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ పశ్నల వర్షం కురిపించారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆమిర్ ఖాన్ వెల్లడించిన నేపథ్యంలో ట్విటర్ ద్వారా అనుపమ్ ఖేర్ పలు ప్రశ్నలు సంధించారు. * 'నన్ను స్టార్ హీరోను చేసిన ఇండియాను వదిలి వెళ్లాలనుకుంటున్నావా' అని మీ భార్యను అడిగారా? * గతంలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇండియా వదిలి వెళ్లాలనిపించలేదా అని కిరణ్ ను ప్రశ్నించారా? * 'ఇంక్రెడిబుల్ ఇండియా' కాస్తా 7-8 నెలల కాలంలో మీకు 'ఇన్ టోలరెంట్ ఇండియా'గా ఎలా మారిందో చెప్పగలరా? * దేశంలో మత అసహనం పెరిగిందని అంటున్నారు. దీని ద్వారా ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి. ఇండియా వదిలి వెళ్లమంటారా? లేదా పరిస్థితులు చక్కబడేవరకు ఆగమంటారా? * 'సత్యమేయ జయతే' కార్యక్రమం ద్వారా దేశంలోని సమస్యలను వెలుగులోకి తెచ్చారు. నేడు మత అసహనం పెరిగిందని చెబుతున్న మీరు ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాలి కానీ భయపెట్టకూడదు. Dear @aamir_khan. Did you ask Kiran which country would she like to move out to? Did you tell her that this country has made you AAMIR KHAN. — Anupam Kher (@AnupamPkher) November 23, 2015 -
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ
ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాల మీదే స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లకు పని చెప్పాడు. ఎక్కువగా సినీ తారాలను మాత్రమే టార్గెట్ చేసే వర్మ, ఈ సారి మాత్రం అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావులు, సామాజిక వేత్తలను తన ట్వీట్లతో ప్రశ్నించాడు. దేశంలో అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావటం లేదంటూ తనదైన స్టైల్లో స్పందించాడు. 'హిందూ దేశంగా పేరున్న భారత్‌లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరి అసహనం ఎక్కడుందో నాకు అర్ధం కావటం లేదు..? ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లు అయ్యారంటేనే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని ప్రూవ్ అవుతోంది. సెలబ్రిటీలుగా పరిగణించబడుతున్న, ఎవరైతే అసహనం గురించి మాట్లాడుతున్నారో.. వారు విమర్శిస్తున్న దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్నారు. కొన్ని ఘటనల మూలంగా అసహనం ఉన్నట్టుగా ప్రకటించకూడదు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. If Aamir,Sharuk and Salman the three biggest stars of the Hindu country "India" are Muslims, I don't understand where intolerance is ? — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 In a predominantly Hindu country,if 3 Muslims can become the biggest iconic super stars that itself proves the majority aren't intolerant — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 Some celebs complaining about Intolerance should be the last ones to complain becos they became celebs in a so called intolerant country — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 Isolated incidents cant be taken as sign of intolerance and the super stardom of 3 Muslims is proof enough of the vast majority's tolerance — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 -
అవార్డు వాపసీపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు, సినీ ప్రముఖులు తమ అవార్డులను వాపస్ ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు లభిస్తాయని, వాటితో గౌరవంగా స్వీకరించాలని ప్రణబ్ పేర్కొన్నారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. 'కొన్నిసార్లు సున్నిత మనస్కులు సమాజంలోని కొన్ని ఘటనలు చూసి ఆందోళనకు గురవుతారు. అయినప్పటికీ భావోద్వేగాలు హేతుబద్ధతను అధిగమించరాదు' అని పేర్కొన్నారు. అసహనం, అవార్డు వాపసీ వివాదాలపై పరోక్షంగా పేర్కొంటూ 'అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయాలి' అని సూచించారు. సమయం వచ్చినప్పుడల్లా ఆత్మపరిశోధన చేసుకొని తన తప్పులను తాను సరిదిద్దుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రణబ్ అన్నారు. '21వ శతాబ్దంలో శక్తిమంతమైన, వైభవోజ్వలమైన భారత్ కోసం స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నరు. ప్రజాప్రయోజనాలు రక్షించడంలో, అట్టడుగు వర్గాలకు అండగా నిలువడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. -
అసహనాన్ని ఎంతమాత్రం అంగీకరించను: మోదీ
లండన్: భారత్‌లో ఏ మూల అసహనపు ఘటనలు చోటుచేసుకున్నా.. వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించబోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి స్వేచ్ఛను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరున్తో సమావేశమై.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు. అనంతరం మోదీ, కామెరున్ సంయుక్త విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ శక్తివంతమయ్యేందుకు బ్రిటన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. భారత్-బ్రిటన్ సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయన్నారు. అభివృద్ధి బాటలో కలిసి నడువాలన్నది భారత్-బ్రిటన్ లక్ష్యమని పేర్కొన్నారు. రక్షణరంగంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. వచ్చేరోజుల్లో ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తృతం అవుతాయని తెలిపారు. భారత్‌లో బ్రిటన్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారు అని, రానున్న రోజుల్లో బ్రిటన్ పెట్టుబడులు మరింత పెరుగనున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్-బ్రిటన్ కలిసి పోరాడుతాయని చెప్పారు. బ్రిటన్‌లో పర్యటించకుండా తనను ఎప్పుడూ అడ్డుకోలేదని, 2003లో కూడా తనకు ఘనస్వాగతం లభించిందని మోదీ గుర్తు చేశారు. -
లండన్‌లోనూ తప్పని 'అసహనం' సెగ
లండన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని అసహనం తాలూకు నిరసనలు వదిలేలా లేవు. దేశలో అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు, మేధావులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన మోదీకి అక్కడ కూడా ఇదే తరహా నిరసన వ్యక్తమౌతుంది. భారత్‌లో పెరుగుతున్న అసహనంపై చర్యతీసుకోవాలని మోదీకి సూచించాల్సిందిగా కోరుతూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్‌కు అక్కడి రచయితలు బహిరంగ లేఖ రాశారు. దీనిలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీతో పాటు సుమారు రెండు వందల మంది రచయితలు సంతకం చేశారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్‌లో ఛాందసవాదం, భయానకమైన పరిస్థితులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని, విమర్శకుల గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందనీ దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మోదీ పర్యటన సందర్భంగా మరో వర్గం బ్రిటన్ పార్లమెంట్ భవనంపై 'మోదీ నాట్ వెల్కమ్' అంటూ పోస్టర్‌ను ప్రొజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. -
'సహనం పుష్కలంగా ఉంది'
ఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ పలువురు రచయితలు, మేధావులు తమ అవార్డులను వెనక్కిస్తున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శనివారం రాష్ట్రపతి భవన్‌కు పలువురు బాలీవుడ్ నటులతో ర్యాలీని నిర్వహించారు. దేశంలో సహనానికి వచ్చిన నష్టం ఏమీ లేదనీ, సహనం పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతితో భేటీ వివరాలను అనుపమ్ తెలియజేశారు. అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం లేదని, దేశ ప్రజలే ఇస్తున్నారని ప్రణబ్ ఈ సందర్భంగా అన్నట్లు తెలిపారు. అంతే కాకుడా మతాలకతీతంగా తయారుచేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల అందరూ గౌరవాన్ని కలిగి ఉండాలని ప్రణబ్ సూచించినట్లు చెప్పారు. అసహనం పేరిట అవార్డులను తిరిగి ఇచ్చే ఘటనలను సహనానికి ప్రతీక అయిన ఇండియా పట్ల కొందరు చేస్తున్న దుష్ప్రచారంగా చూడాలన్నారు. అయితే కొంతమంది చేస్తున్న ఈ నిరసనల పట్ల భారతీయులు ఏకీభవించడం లేదని ఆయన అన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కొందరు అవార్డుల రిటర్న్ ద్వారా తమ నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. తమ ర్యాలీకి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపిన అనుపమ్ ఖేర్ ఇది కేవలం భారతీయుల కోసం నిర్వహించిన ర్యాలీ అని అన్నారు. -
'అసహనం'పై అనుపమ్ పోరాటం
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ 'అసహనం'పై పోరాటానికి సంసిద్ధులయ్యారు. 'మార్చ్ ఫర్ ఇండియా' పేరుతో శనివారం ఉదయం ఢిల్లీలోని జనపథ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా మేధావులు, సినీ దిగ్గజాలు, సాధారణ ప్రజలకు ఆహ్వానం పలికారు. దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ రచయితలు, సినీ దర్శకులు, శాస్త్రవేత్తలు తమకు లభించిన విశిష్ట అవార్డులను వెనక్కి ఇస్తుండటాన్ని అనుపమ్ ఖేర్ మొదటి నుంచీ తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే కొందరు అవార్డులు తిరిగిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇలా చేయడం జాతిని అవమానించినట్లేనని అనుపమ్ ఆరోపిస్తున్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో సుప్రసిద్ధ నాయకురాలన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రం ఇస్తామని ఖేర్ చెప్పారు. కాగా,ఖేర్ ర్యాలీకి పలువురు సినీ దిగ్గజాలు మద్దతు పలికారు. దర్శకులు మథుర్ భండార్కర్, అశోక్ పండిట్ లు తాము కూడా 'మార్చ్ ఫర్ ఇండియా'లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి అసహన పరస్థితులపై ఫిర్యాదుచేసిన సంగతి విదితమే. -
కొనసాగుతున్న అవార్డు వాపసీ కార్యక్రమం
-
'ఎవరో చేసినదాన్ని.. దేశానికి అంటగట్టరాదు'
న్యూఢిల్లీ: విష ప్రచారంతో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అసహనం ఎవరిలో పెరిగిందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. దేశంలో మత అసహనం పెరిగిందని ప్రతిపక్షాలు, మేధావులు, కళాకారులు, రచయితలు విమర్శిస్తున్న నేపథ్యంలో వెంకయ్య స్పందించారు. ఎవరో ఒకరు చేసినదాన్ని దేశానికి అంటగట్టడం సరికాదని అన్నారు. -
షారుక్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ముంబై: దేశంలో ‘అసహనం’ పెరిగిపోతోందని మూడు రోజుల క్రితం తన 50వ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ హీరో షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం, దానిపై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. బాంద్రాలోని షారుక్ ఖాన్ మన్నాట్ ఇంటి వద్ద అభిమానుల సందడి పెరిగింది. దీంతో గురువారం నుంచి ఆయన ఇంటి వద్ద గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకు షారుక్ ఖాన్ హిందూ అతివాద పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారని షారుక్ ఖాన్ ఇంటివద్ద అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ వెబ్సైట్లో కూడా ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు. షారుక్ ఖాన్ వ్యాఖ్యలపై ముందుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ ట్విట్టర్లో స్పందించారు. షారుక్ భారత్‌లో నివసిస్తున్నారని, అయితే ఆయన ఆత్మ మాత్రం పాకిస్తాన్‌లోనే ఉందంటూ వివాదాస్పద ట్వీట్లు చేశారు. షారుక్ పాకిస్తాన్ ఏజెంట్ అంటూ విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచి ఆరోపించారు. షారుక్ భాష, పాకిస్తానీ ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాష ఒకేలాగా ఉందని, భారత్‌ను అగౌరవించేవాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ మరింత ఘాటుగా స్పందించారు. పలువురు అభిమానులు గురువారం షారుక్ ఇంటి వద్ద సందడి చేశారు. ఆయన ఇంటి ముందు ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఒక్కసారైనా షారుక్ బయటకు రాకపోతారా! అనుకొని ఇంటి ఎదురుగా గంటలకొద్దీ నిరీక్షించారు. ‘షారుక్ మంచి నటుడు, మాకు కావాల్సిందే అంతే....రాజకీయ నాయకులు ఏం మాట్లాడారన్నది మాకనవసరం. వారుండేది కేవలం ఐదేళ్లు. షారుక్ ఉండేది జీవితాంతం’ అని పుణె నుంచి వచ్చిన అభిషేక మిశ్రా అనే ఇంజనీరు మీడియాతో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లోకన్నా ముస్లింలు భారత్‌లోనే సురక్షితంగా ఉన్నారు’ అని మరో అభిమాని షాహిద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ‘బాలీవుడ్లో ఎంతోమంది ముస్లిం నటులు ఉన్నారు. ఎందుకు షారుక్ ఖాన్‌ను టార్గెట్ చేస్తున్నారు? పాకిస్తాన్లో కనీసం ఇంటి స్థలం కూడా లేని షారుక్‌ను అక్కడికెళ్లిపోండని ఎలా అంటారు’ అని అస్సాం నుంచి వచ్చిన ఓ కళాకారుడు వ్యాఖ్యానించారు. ‘షారుక్ ఖాన్‌ను టార్గెట్ చేసుకొని రాజకీయ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. రానున్న (రాయీస్) సినిమాలో షారుక్ ఖాన్ జంటగా పాకిస్తానీ నటి మహీరా ఖాన్ నటించడమే’ అని మరో అభిమాని వ్యాఖ్యానించారు. -
భిన్నాభిప్రాయాల అణచివేత చాలా ప్రమాదకరం
న్యూఢిల్లీ: మత అసహనంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పెదవి విప్పారు. ఇటీవలి పరిణామాలు జాతిని తీవ్రంగా బాధించాలయని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. వాక్ స్వేచ్ఛ, విశ్వాసాలు, నమ్మకాలపై జరిగిన దాడులు బాధాకరమని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మేధావుల హత్యలను ఎవరూ సమర్థించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. భిన్నాభిప్రాయాల అణచివేత చాలా ప్రమాదకరమని మన్మోహన్ అన్నారు. జవహర్ లాల్ 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మతం అనేది వ్యక్తిగతమని, దీనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు. కాగా నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అహసనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు, నటీనటులు సాహిత్య అకాడమీ పురస్కారాలను వాపస్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయంగా దెబ్బతిన్న వాళ్లంతా.. ఏం చేయాలో అర్థంకాక అసహనం పేరుతో నాటకాలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. -
'బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు'
బెంగళూరు: మత అసహనాన్ని సహించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సామ్యవాదంపై బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని పునరుద్ఘాటించారు. ప్రముఖ హేతువాది ఎంఎం కల్బుర్గీ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మత అసహనంపై మాట్లాడేముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన దాడులపై చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
అనుపంతో కౌంటర్ ప్లాన్ చేస్తున్న బీజేపీ
'అసహనం'పై దేశ వ్యాప్తంగా రచయితలు, కళాకారులు, సినిమా స్టార్లు నిరసన వ్యక్తం చేస్తుండటంతో.. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రుల ద్వారా సమాధానం చెబతూ వస్తున్నబీజేపీ తాజాగా.. కౌంటర్ ఎటాక్ పదును పెంచాలని భావిస్తోంది. విపక్షాలకు గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నుంచి రాష్ట్ర పతి భవన్ వరకూ నిర్వహించిన ర్యాలీకి కౌంటర్ గా.. ప్రముఖ నటుడు అనుపం ఖేర్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈనెల 7న కళాకారులు, నటులతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. కాగా.. మోదీ సర్కారు తీరు దేశంలో సామాజిక, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. ర్యాలీ అనంతరం రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. -
రాజధర్మం తప్పుతూనే ఉంటారా?
చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. బీజేపీ వంటి పార్టీలు అధికా రంలో ఉంటే చరిత్ర మరింత వేగంగా పునరావృతం అవుతుంది. గుజరాత్ లోని గోధ్రాలో 2002లో జరిగిన మత ఘర్షణల్లో ముస్లిం మైనారిటీలు ఊచ కోతకు గురైనప్పుడు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తమ పార్టీకే చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని ‘రాజధర్మం పాటించు’ అని సూచించారు. ‘జరిగిన దారుణానికి నీ ఉదాసీనతే కారణం సుమా!’ అని అటల్జీ మోదీని పరోక్షంగా హెచ్చరించారన్నది నిష్ఠుర సత్యం. ఇప్పుడు నరేంద్రమోదీ... భారతదేశ ప్రధాని. ఆయన ‘రాజధర్మం’ తప్పుతున్నా హెచ్చరించేందుకు బీజేపీలో ‘అటల్ బిహారీ వాజ్‌పేయి’ వంటి రాజనీతిజ్ఞులు కనిపించడం లేదు. పైగా, మోదీయే ప్రతిపక్షాల అసహనానికి బలిపశువు అవుతున్నారంటూ... వింతవాదన లేవనెత్తే వెంకయ్యనాయుడు వంటి మాట కారి నాయకులు ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్షాలను, రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను సైతం విమర్శిస్తు న్నారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం గొప్పదనాన్ని, లౌకిక పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామికవ్యవస్థ విలక్షణతను గుర్తుచేసే విధంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేస్తే... వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేని సంఘ్ పరివార్ మేధావులు ఆయనకూ రాజ కీయాలు ఆపాదిస్తున్నారు. మతపర అసహనంపై ఆత్మావలోకనం ఏది? దేశంలో స్పష్టంగా కనిపిస్తున్న మతపర అసహనం హఠాత్తుగా ఎక్కడనుంచో ఊడిపడలేదు. బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సాధ్వీలు, సాధువులు వివిధ సందర్భాల్లో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే మొదలైంది. సామాజిక వేత్తలు దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యలు, అక్కడక్కడ రచయితల ముఖాలకు నల్లరంగు పూసిన సంఘటనలూ సమాజంలో భయాందోళనలు, అభద్రతాభావం పెంచాయి. ఈ పరిణామాల పట్ల కలత చెందిన ప్రముఖ రచయితలు, మేధావులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు... చివరకు వ్యాపార దిగ్గ జాలు సైతం పాలకపక్షం అనుసరిస్తున్న ‘మతపర అసహనం’ పట్ల నిరసన, ఆవేదన వ్యక్తం చేస్తుంటే జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామనే మాట బీజేపీ నేతల నుంచి రావడంలేదు. వారిలో ఆత్మావలోకనం ఏ కోశానా కనపడటం లేదు. ‘మతపర అసహనం’పై మాట్లాడే హక్కు అసలు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ బీజేపీ అగ్రనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు విమర్శిస్తున్నారు, జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పందించే నైతిక హక్కు లేదని కాసేపు అనుకొందాం. కాని, జరుగుతున్న దారుణాలపై ప్రధానమంత్రిగా మోదీ స్పందించాలి కదా? ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగిన వెంటనే... ప్రధాన మంత్రి ట్వీట్ క్షణాల్లో వచ్చేస్తుంది. అభినందనలు, ఖండనలు, విమర్శలు... ఒకటనే మిటి? సర్వం... మోదీ ట్వీట్ల పరంపరలు నిరంతరం వెలువడతాయని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ... దేశంలో దారుణ సంఘటనలు జరుగు తుంటే... ట్వీట్ చేయ డానికి కూడా ఆయనకు సమయం లేదు. తన పార్టీ సహచరులు చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలు ఆయనకు వినిపించవు. రచ యితల ముఖాలకు నల్లరంగు పూస్తున్న వికృత సంఘటనలు ఆయన దృష్టికి సోకడం లేదు. కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే... ప్రస్తుతం దేశంలో నెలకొన్న మతపర అసహన వాతావరణం ఎవరి వల్ల ఏర్పడిందో తెలుస్తుంది. ‘‘మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ముస్లిం అయినప్పటికీ గొప్ప జాతీయవాది’’ అంటూ కేంద్ర మంత్రి రమేష్‌శర్మ చేసిన వ్యాఖ్య దేశంలో కలకలం సృష్టించింది. ఒక గొప్ప వ్యక్తిని దారుణంగా కించపర్చే వ్యాఖ్య అది. మరోవైపున ‘‘భారతదేశంలో ముస్లింలు జీవించాలంటే వారు గోమాంసం తినడం మానేయాలి’’ అని హరియాణా రాష్ట్ర బీజేపీ ముఖ్య మంత్రి మనోహర్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. ఏం తినాలో ఎవరు నిర్ణయించాలి! బీజేపీ నేతల భావజాల వైరుధ్యానికి ఓ చిన్న ఉదాహరణ. బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమ ప్రసంగాల్లో ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని తరచుగా ఉపయోగించారు. ఎక్కడికెళ్లినా వారు ‘‘నితీష్, లాలూల మాయలో పడకండి... స్వేచ్ఛగా ఓటేయండి’’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ‘స్వేచ్ఛ’ను గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు మిగతా సమయాల్లో మాత్రం- ‘‘ప్రజలు ఏమి తినాలి? ఏమి కట్టుకోవాలి? ఏమి రాయాలో, ఎంత మంది పిల్లల్ని కనాలో’’ నిర్దేశిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. గోమాంసం తినేవారు అసలు హిందువులే కారంటూ హిందూ మతానికి నూతన భాష్యాలు చెప్పుకొస్తున్నారు. ‘బీఫ్’ తింటే తప్పులేదని చెప్పేవారు అసలు హిందువులే కారంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు స్వర్గీయ స్వామి రంగధానంద మాటలు గుర్తుతెచ్చుకోవాలి. ఆయన ఒక సందర్భంలో ‘ఎవరు హిందువు?’ అనే అంశంపై ఏమన్నారంటే ‘‘మీరు పుట్టుకతోనే హిందువు అయిపోరు. హిందువు కావాలంటే హిందూమతం ధర్మాల్ని ఆచరించాలి. హిందూమతం... సహనాన్ని బోధిస్తుంది. ఇతరుల పట్ల ప్రేమానురాగాల్ని చూపమంటుంది. ఇటువంటి విలువల్ని పాటిస్తేనే మిమ్మల్ని మీరు హిందు వుగా చెప్పుకోగలరు’’ అంటూ స్వామి రంగధానంద హిందూమతంలోని ఔన్నత్యాన్ని చెప్పారు. కాని... ఇప్పుడు బీజేపీలోని కొందరు హిందూమతం ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూ... మరోపక్క తాము హిందూమత పరిరక్షకులుగా చిత్రీకరించుకొనే యత్నం చేస్తున్నారు. ఎన్డీయే పాలనలో కనిపిస్తున్న విద్వేషపూరిత వాతావరణం పట్ల కవులు, రచయితలు, కళాకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తుంటే... ‘పరిస్థితి తీవ్రత’ను అర్థం చేసుకోకుండా వారందర్నీ కాంగ్రెస్ పార్టీ అనుకూల శక్తు లుగా, బీజేపీ వ్యతిరేక మూకలుగా పేర్కొంటున్నారు. ప్రముఖ రచయిత్రి నయనతార సెహగాల్ గొప్ప రచయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు విజేత. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు మేనకోడలు. కన్నడ రచయిత కల్బుర్గీ హత్య తర్వాత... నయనతార తన నిరసన వ్యక్తం చేస్తూ... తాను పొందిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగిచ్చేస్తున్నానంటూ ప్రకటించగానే ఆమెను కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలంటూ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. అయితే నయనతార సెహగాల్... ఎమర్జెన్సీని గట్టిగా వ్యతిరేకించి... శ్రీమతి ఇందిరా గాంధీని తీవ్రంగా విమర్శించిన విషయం బహుశా చాలామంది బీజేపీ నేతలకు తెలిసి ఉండకపోవచ్చు. నిరసన గళాల్లో రాజకీయ ఉద్దేశాలా? ఎన్డీయే పాలనపై మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు తెలియజేస్తున్న నిరసనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ‘‘తయారు చేయబడిన తిరుగు బాటు (మాన్యుఫాక్చర్డ్ రెబెల్లియన్)’’గా కొట్టిపారేస్తున్నారు. తిరుగుబాటు ఏ రూపంలో వ్యక్తం అయినా అది సహజసిద్ధంగా రావాల్సిందే తప్ప... తయారు చేస్తే నిలబడేది కాదని.. అరుణ్‌జైట్లీ వంటి మేధావికి తెలియదా? దేశంలో నెలకొన్న ఈ కలుషిత వాతావరణం ఆర్థిక రంగానికి చేటు కలిగి స్తుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చేసిన హెచ్చరికల వెనుక ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, రాహుల్ బజాజ్, హర్ష గోయెంకా వంటి పారిశ్రామికవేత్తలు... దేశ ఆర్థిక రంగానికి ప్రస్తుతం నెలకొని ఉన్న పరిణామాలు చేటు కలిగిస్తాయంటూ ఆందోళన వ్యక్తపర్చడం స్వతహాగా చేసినవా? లేక వారి వెనుక ఎవరైనా ఉన్నారని అనుమానించ గలమా? చివరకు ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ సైతం... దేశం అభివృద్ధి పథంలోకి దూసుకొని వెళ్లాలంటే సామరస్య వాతావరణం అవసరం అని స్పష్టం చేశారు. పైనుంచి కిందిస్థాయి వరకు బీజేపీ నేతల్లో అసహనం గూడుకట్టుకొని పోయింది. ఇచ్చిన హామీలు ఆచర ణలో కనిపించకపోవడంతో వివిధవర్గాల ప్రజల నుండి ఎదురవుతున్న ప్రశ్న లకు సమాధానం చెప్పుకోలేని ఆత్మరక్షణలో బీజేపీ నేతలు పడిపోయారు. అందుకే ఈ అసహనం. తాజాగా విజయవాడలో ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా’పై విద్యార్థి జేఏసీ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్పుడు వారిపై జరిగిన దాష్టీకం దారుణం. బీజేపీ నేతలు సృష్టిస్తున్న ఈ వికృత వాతావరణం తొలగిపోవాలంటే మరిన్ని చైతన్యవంతమైన గళాలు గట్టిగా వినిపించాల్సిందే. నిరసన వివిధ రూపాల్లో తెలియజెప్పాల్సిందే. -సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత, ఏపీ శాసనమండలి మొబైల్: 81063 15555 -
అసహనమా అదెక్కడ?
న్యూఢిల్లీ: దేశం శాంతియుతంగా ఉందని, మత అసహనం అనేది ఎక్కడా లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలో ఆరోగ్యకర వాతావరణం ఉందని, ఈ సమయంలో సినిమా రంగానికి చెందిన అవార్డులు వెనక్కు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. అవార్డులు ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు ఆరోగ్యకర వాతావరణాన్ని పాడు చేస్తాయని అభిప్రాయపడ్డారు. సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ స్పందించారు. దేశంలో అసహనం లేదని ఎవరైనా చెబితే అందులో తప్పేముందని ప్రశ్నించారు. అరుణ్ శౌరీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు జైట్లీ నిరాకరించారు. యూపీఏ హయాంలో మహారాష్ట్రలో జరిగిన ఘటనలతో తమ ప్రభుత్వానికి ముడిపెట్టొదని ఆయన కోరారు. పలువురు మంత్రులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పప్పుల ధరలను కనిపెట్టిచూస్తున్నామన్నారు. నూనెలు, డీజిల్, గ్యాస్, పంచదార ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.