the Central Government
-
థర్డ్ వేవ్ ముప్పు.. పండగలొస్తున్నాయ్ జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్ వేవ్ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్‌్కఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది పండగల సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా తిరగడం పెరుగుతుందని తద్వారా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్ అన్న మాట వాడకుండానే పాల్ కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ‘అయితే దేశంలో పెద్దవాళ్లలో దాదాపుగా 62% మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్‌ల స్థాయిలో తీవ్రంగా మూడో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా సోకితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ అయ్యే అంశంలో ప్రజలకు తగినంత అవగాహన రావడంతో మళ్లీ కరోనా కేసులు విజృంభించినా అంత ప్రమాదమేమీ ఉండడు’ అని వీకే పాల్ ధైర్యం చెప్పారు. చదవండి: ఆరోగ్యానికి కేరాఫ్ పనస ప్రస్తుతానికి బూస్టర్ డోసు ఆలోచన లేదు కోవిడ్ బూస్టర్ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. కరోనా రెండు డోసులు ఇవ్వడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. బూస్టర్ డోసు గురించి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి చర్చ జరగడం లేదని ఆయన స్పష్టంచేశారు. -
కడపలో పాస్‌పోర్టు కార్యాలయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : గల్ప్ దేశాలకు వెళ్లేవారు పాస్ పోర్టు కోసం తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం జిల్లా ప్రజల కోసం కడప పోస్టల్ కార్యాలయంలో పాస్ పోర్టు కార్యాయాలన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సరిపడా గదులను సైతం నిర్మిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా కువైట్, సౌదీ అరేబియా, సింగపూర్ మలేషియా, అమెరికా వంటి దేశాలకు జీవనోపాధి కోసం ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళుతుంటారు. పాస్ పోర్టు తయారు చేయించుకోవడానికి ఇతర ప్రాంతాలైన తిరుపతి. హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. పాస్ పోర్టులో ఏవైనా పొరపాట్లు మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి. -
నగదు రహితం.. కష్టం
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయినప్పటికీ తగినంత నగదు లభించడం లేదు. బ్యాంకులకు నగదు సరఫరా నామమాత్రంగానే ఉండడంతో రోజువారీ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్వైపింగ్, ఈ వాలెట్లు తదితర మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ‘నగదు రహిత లావాదేవీలు-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ జయశంకర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ హరిబాబు, టెక్నికల్ అధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత, టెక్నాలజీపై మెజార్టీ ప్రజలకు అవగాహన లేకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు. -
కసరత్తు చేసిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు
కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని నిరోధించడానికి, అవి నీతిని అంతమొందించడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందుగా పెద్ద చర్చలు, కసరత్తును ప్రధాని మోదీ చేశారన్నారు. నల్ల వ్యాపారాన్ని అరికట్టడంవల్ల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు చాలా అవకాశం వచ్చిందన్నారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. నోట్ల రద్దుతో కశ్మీర్‌లోనూ ఉగ్రవాదం తగ్గిపోరుుందన్నారు. దేశంలో చాలా బ్యాంకుల్లో నగదు మార్పిడితో సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మోదీ చెప్పిన 50 రోజుల సమయంలోగా సమస్యలన్నీ తీరుతాయన్నారు. నగదు రహిత వ్యవహారాలను పెంచ డం ద్వారా మరింత నియంత్రణ చేస్తామన్నారు. తెలం గాణ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. కాజీపేట దర్గాలో పూజలు... కాజీపేట రూరల్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని హజ్రత్ సయ్యద్‌షా అఫ్జల్ బియాబానీ దర్గాను హన్స్‌రాజ్ ఆదివారం సందర్శించారు. ఈ దర్గాలో నాలుగు రోజుల ఉర్సు ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యారుు. ఈ సందర్భంగా మంత్రి చాదర్ సమర్పిం చారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన అక్కడకు వచ్చిన భక్తులు, ముస్లిం మత పెద్దలుతో పెద్ద నోట్లు రద్దు వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. -
రూ. 450 కోట్ల ఎన్హెచ్ఎం నిధులకు బ్రేక్
► ఈ ఏడాది నయాపైసా విడుదల చేయని కేంద్రం ► గతేడాది నిధులను సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్లకు బ్రేక్ పడింది. గతేడాది ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలకు కాకుం డా ఇతరత్రా తన ప్రాధాన్యాలకు వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. అందుకే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా రూ.450 కోట్లు విడుదల చేసే పరిస్థితి కనిపించడంలేదని, ఈ మేరకు కేంద్ర ఎన్హెచ్ఎం అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో చేపట్టిన అనేక ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలకు నిధుల కటకట ఏర్పడింది. ఆ పథకం కింద పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 2016-17లో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి రూ.750 కోట్ల వరకు కేటాయించింది. అందులో కేంద్రం వాటా రూ.450 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6నెలలు గడిచాయి. కానీ, కేంద్రం తన వాటాలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన సొమ్ములో ఇప్పటికీ రూ.300 కోట్లు తన వద్దే ఉంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఇతరత్రా అవసరాలకు బదలాయించడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈ ఏడాది నిధులను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. స్వయంగా జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. అయినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో జన ని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందు లు, పరికరాల కొనుగోలుకు బ్రేక్ పడింది. పిల్లల టీకాలకు, గర్భిణులకు అందించే ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడింది. ఎన్హెచ్ఎం కింద పనిచేసే 300 మంది డాక్టర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 5 వేల మంది ఏఎన్ఎంలు సహా ఇతరత్రా సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు రూ. 15 కోట్లు వేతనాల కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
పార్టీని బలోపేతం చేయాలి
చిట్యాల : గ్రామ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కాసర్ల రాంరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు గాజర్ల పోశాలు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాలలో ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేష్‌గౌడ్, జిల్లా, మండల నాయకులు అల్లం రవీందర్, దేవేందర్‌రావు, గజనాల రవీందర్, నారాయణరెడ్డి, రాగుల మహేందర్, పెరుమాండ్ల రాజు, బుగులయ్య, పెరుమాండ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు ప్రతిపక్ష పార్టీలంటే చులకన
► స్థాయి తెలుసుకొని మాట్లాడాలిజల కోసం నిలదీస్తాం ► బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి మంచిర్యాలసిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపక్ష పార్టీలంటే గౌరవం లేకుండా పోయి, చులకనబావం ఏర్పడిందని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, రాష్ట్ర సీఎం అసభ్యపదాలను వాడుతూ దూషించడం సరికాదన్నారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను సీఎం విమర్శించే ముందు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితలు పలికారు. ప్రజల సమస్యల కోసం ప్రభుత్వానికి భయపడకుండా, ప్రభుత్వం పెట్టే కేసులు, పరువునష్టం దావాలకు జంకకుండా తప్పనిసరిగా నిలదీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజల సమస్యలను పక్కకుపెట్టి, అభివృద్ధిని గాలికి వదలేసి కేవలం తన కుటుంబం, పార్టీ అభివృద్ధి కోసం సీఎం పాటుపడుతున్నారని ఆరోపించారు. కరువు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.792 కోట్లతోపాటు 52 కోట్ల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు నిధుల కోసం వెళ్లినపుడు ఒకమాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ బీజేపీ నాయకులను విమర్శించే విధానాన్ని మానుకోవాలన్నారు. కేంద్రం సహాకారం లేనిదే రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ముందుకు సాగదనే విషయాన్ని సీఎంతోపాటు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గమనించాలన్నారు. సమావేశంలో మున్నారాజ్ సిసోధ్య, లింగన్నపేట విజయ్‌కుమార్, శశి, అశోక్‌వర్ధన్ ఉన్నారు. -
పోలీసుల తీరు దారుణం
హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై సభలో చర్చలో విపక్షాలు ♦ విద్యార్థులపై లాఠీచార్జి, అరెస్టు గర్హనీయమంటూ ధ్వజం ♦ వీసీ అప్పారావుపై కఠిన చర్యలకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై శనివారం అసెంబ్లీ అట్టుడికింది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టులను ప్రతిపక్షం తప్పుబట్టింది. వర్సిటీలో వివక్షను ఆపాలని, రోహిత్ మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ సందర్భంగా సభ్యుల పరస్పర విమర్శలు, దూషణలతో చర్చ వేడెక్కింది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతిపై వివాదం, వర్సిటీ వీసీ అప్పారావుకు తిరిగి పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాలపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు తీవ్ర స్థాయిలో వాదులాడుకోగా విద్యార్థులపై పోలీసుల చర్య విషయంలో ప్రభుత్వ తీరును ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ తప్పుబట్టాయి. హెచ్‌సీయూ, ఓయూ ఉదంతాలపై సభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు మాట్లాడారు. వారేమన్నారంటే... కన్హయ్య కోసమే అప్పారావును తెచ్చారు జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఈ నెల 23న హెచ్సీయూకు వస్తున్నారనే సమాచారంతో విద్యార్థులను రెచ్చగొట్టేందుకే 22న సెలవులో ఉన్న వర్సిటీ వీసీ అప్పారావును విధుల్లోకి తెచ్చారు. వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీసీ అప్పారావును రీకాల్ చేసి జైలుకు పంపాలి. హెచ్‌సీయూలో యుద్ధ వాతావరణం లేకుండా చూడాలి. - రవీంద్ర కుమార్, సీపీఐపక్ష నేత వీసీని విధుల్లోకి తీసుకోవడమే గొడవలకు కారణం హెచ్‌సీయూ వీసీ అప్పారావును తిరిగి విధుల్లోకి తీసుకోవడమే గొడవలు రాజుకోవడానికి కారణం. అప్పారాావు చేరికను వ్యతిరేకించిన 25 మందిని పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ చిత్రహింసలకు గురి చేసి జైల్లో పెట్టడం సమంజసమా? హెచ్‌సీయూ ఘటనలకు కారకులైన అప్పారావుపై కేసు నమోదు చేయాలి. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌ను పోలీసులు చితకబాదడం శోచనీయం. - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీపక్ష నేత సీఎం మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం కూర్చోలేదు హెచ్సీయూకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూసింది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యలను సృష్టించడం మంచిది కాదు. సీఎం మాట్లాడుతుంటే మేం అందరం కూర్చుంటాం. కనీసం ఎంఐఎం సభ్యులు కూర్చోలేదు. మిత్రపక్షమని చెబుతూనే సీఎం లేచినప్పుడు కూడా మాట్లాడారు. - గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీసీని రీకాల్ చేయాలి వీసీ అప్పారావును రీకాల్ చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కన్హయ్యను రోహిత్ తల్లి కలిసేందుకూ పోలీసులు అవకాశమివ్వాలి. మతసామరస్యాన్ని కాపాడాలి. - సున్నం రాజయ్య, సీపీఎంపక్ష నేత రాజకీయ విషవలయంలో పార్టీలు ఒక విద్యార్థి చనిపోతే శవరాజకీయాలు చేయ డం అలవాటుగా మా రింది. రాజకీయ విష వలయంలో పార్టీలు కూరుకుపోయాయి. తెలంగాణ ఉద్యమంలో 1,200మంది ఆత్మబలి దానాలు చేసుకున్నప్పుడు పరామర్శించేం దుకు రాని వాళ్లు రోహిత్ మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు.ఉస్మానియా వర్సిటీలో ఎమ్మెల్యే సంపత్, టీడీపీ నేత రాజారాం యాదవ్‌పై దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత రాహుల్‌ది రాజకీయ యాత్ర కాదు.. రోహిత్ మరణం సమాజాన్ని జాగృతం చేసే అలారం గంట వంటిది. దేశంలో బాధ్యతగల పాలకులు వివక్ష లేని పాలన అందించాలని రోహిత్ సమాజాన్ని హెచ్చరించారు. అతని మరణం వెనుకగల నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రోహిత్ మరణంతో కుంగిపోయిన అతని తల్లిని ఓదార్చేందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ వచ్చారే తప్ప, రాజకీయాల కోసం కాదు. మా పార్టీ వాళ్లనెవరినీ యూనివర్సిటీకి రావద ్దని చెప్పారు. రాజకీయాల కోసమే ఆయన వచ్చిఉండుంటే యూనివర్సిటీని దిగ్బంధం చేసేవాళ్లం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే ఈ అంశంపై పార్లమెంటులో రాజకీయం చేశారు. రోహిత్ మరణంపై సీఎం స్పందించలేదని, 12 గంటల వరకు వైద్యం అందలేదని స్మృతి పార్లమెంటులో చెప్పారు. కానీ ఈ విషయంపై ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంటు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ రాజేశ్వరి ఫోన్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే యూనివర్సిటీలో ఉన్నట్లు చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలో జరిగిందేంటో స్పష్టం చేయాలి. రోహిత్ దళితుడే కాదని హోంమంత్రి చెప్పడం విచారకరం. వీసీ అప్పారావు విషయంలో విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లను చితకబాది కేసులు పెట్టి జైలుకు పంపారు. అంబేద్కర్ స్టడీ సెంటర్ డెరైక్టర్ రత్నంను చెంపదెబ్బలు కొట్టారు. ఇవి అంబేద్కర్ వాదులందరికీ తగిలిన దెబ్బలు. వర్సిటీలో వివక్షను ఆపాలి. రోహిత్ మరణానికి కారకులైన వారిని శిక్షించాలి. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నానని చెప్పే సీఎం కేసీఆర్ హెచ్సీయూకు ఒక్కరోజూ వెళ్లలేదు. దేశ సమగ్రతపై బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై పోలీసుల తీరును ఖండిస్తున్నా. - భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సభ్యుడు అవును పక్కా రాజకీయమే.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతోమంది దళిత విద్యార్థులు, విద్యార్థియేతరులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు రాని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రోహిత్ ఆత్మహత్య తర్వాత రెండు మార్లు హెచ్సీయూకు ఎందుకొచ్చారు? తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ లేఖలో పేర్కొన్నప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలే కారణమని లేఖలో రాసి చాలా మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శకు రాని కాంగ్రెస్ నాయకులు రోహిత్ ఆత్మహత్యను అవకాశంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల కోసం నైతికంగా ఎంతకైనా దిగజారేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధపడతారు. (ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత లక్ష్మణ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది). మెడపై కత్తి పెట్టి భారతమాతకు జై అనమంటే అననంటూ వ్యాఖ్యానించిన ఎంపీ (అసదుద్దీన్‌ను ఉద్దేశించి) కూడా హెచ్‌సీయూకి వెళ్లి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. సుప్రీం కోర్టు ఉరిశిక్ష వేసిన ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడిన వీరిపై చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాది శవయాత్రలో పాల్గొన్న వీరి వల్ల తెలంగాణకు అవమానం కలిగింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం అంటుంటే ఇలాంటి ద్రోహులు మరోరకంగా హైదరాబాద్‌ను ప్రపంచం ముందు నిలుపుతున్నారు. ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగింస్తున్న వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌పై దాడిని ఖండిస్తున్నా. - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ సభ్యుడు కావాలంటే నన్ను చంపండి.. అంబేడ్కర్ భావజాలంతోపాటు దళితులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించేలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామలు ఉన్నాయి. కావాలంటే నన్ను చంపండి కానీ దళితులను ఎందుకు వేధిస్తారు. హెచ్‌సీయూలో పరిస్థితిని ప్రశాంతంగా మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పార్లమెంటులో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి చెప్పారు. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందంటే జితేందర్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించినట్టే కదా. వర్సిటీలో పరిస్థితి గురించి మాట్లాడేందుకు గంటపాటు ఎదురుచూసినా ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో పేర్కొన్నార ంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. దళితుల్లో ఆత్మస్థైర్యం నింపేది ఇలాగేనా? హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై హోంమంత్రి ప్రకటన కూడా సరిగా లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో లభించిన యువకుడి మృతదేహం విద్యార్థిది కాదనటానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. నేను అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించాను. మృతదేహాన్ని వ్యాన్‌లో ఎక్కించేవరకు పోలీసులు బాగానే ఉన్నా ఆ తర్వాత వారి అసలు నైజం బయటపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పే అవకాశం ఉందని గ్రహంచి ఆ నినాదాలు రాకుండా వారిని అక్కడి నుంచి తరిమేందుకు పోలీసులే విద్యార్థులపై రాళ్లు రువ్వి పరిస్థితి చేయిదాటేలా చేశారు. నాతోపాటు వచ్చిన కొందరు నేతలు, విద్యార్థులు లక్ష్యంగా వందమంది పోలీసులు పనిచేశారన్నారు. ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలిగింది. దీనిపై నేను రిప్రజెంటేషన్ ఇస్తా. - సంపత్ కుమార్, కాంగ్రెస్ సభ్యుడు -
నిరాశే..
► గిరిజన యూనివర్సిటీకి రూ.కోటి మాత్రమే ► జాడలేని ఐఐఎం సంస్థ ► రోడ్ల విస్తరణకు అవకాశం ► ఉక్కు కర్మాగారానికి ఉత్తచేయి ► మెరుపుల్లేని అరుణ్ జైట్లీ బడ్జెట్ సాక్షి, హన్మకొండ : జిల్లాలో నెలకొల్పబోతున్న గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో గిరిజన యూనివర్సిటీకి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. విభజన చట్టం హామీల అమలులో భాగంగా గిరిజన వర్సిటీ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ (ఐఐఎం) తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాల్సి ఉంది. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇప్పటికే గిరిజన వర్సిటీ వరంగల్‌లో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, ఐఐఎం విషయంలో సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా కోటి రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. దీంతో వర్సిటీ స్థాపన పనుల్లో వేగం మందగించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పాల్సిన ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ విషయంలో బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. ఉక్కు పరిశ్రమకు ఉత్తచేయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ముడి ఇనుము ఖనిజం పుష్కలంగా ఉన్న గూడూరు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా బయ్యారం మండలాల పరిధిలో ఉక్కు పరిశ్రమను నిర్మించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సెయిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదనంతరం సెయిల్ ప్రతినిధులు పలుమార్లు గూడూరు, బయ్యారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. దాంతో ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కేంద్రప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. వరంగల్‌లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్ విషయంలో సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తిగా విస్మరించారు. టెక్స్టైల్స్ పార్కుకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనా లేదు. రహదారులకు పెద్దపీట జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వే సింది. ప్రస్తుతం రేణిగుంట - సిరోంచ, హైదరాబాద్ - భూ పాలపట్నం జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళ్తున్నా యి. కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు రహదారుల విస్తరణకు నిధుల స మస్య ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ సందర్భంగా రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పన్ను రహిత బాండ్లు జారీ చేస్తామని కేంద్రం ప్రకటించడం వల్ల యాదగిరిగుట్ట-వరంగల్ హైవే విస్తరణ పనులు ప్రారంభయ్యాయి. సార్టప్‌లకు ఊతం కొత్తగా స్థాపించబోయే (స్టార్టప్) కంపెనీలకు తోడ్పాటునందిస్తామంటూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఐటీ పరిశ్రమను వరంగల్‌లో నిలదొక్కుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పటికే ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. మరోవైపు సెయింట్ కంపెనీ సైతం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇక్కడ నెలకొల్పబోయే ఐటీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అందించే పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. దీనివల్ల మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్ వైపు దృష్టి సారించేందుకు అవకాశం ఉంది. పర్యాటక రంగం పుంజుకునేనా.. కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాహనాల కొనుగోలు ప్రక్రియపై ఉన్న ఆంక్షలను సరళీకృతం చేశారు. దీంతో వా హనాల కొనుగోలు పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా చిన్న వాహనాలు పెరిగి ట్రావెనింగ్ ఏజెన్సీలు విస్తరించనున్నారుు. తద్వారా పర్యాటక రంగం పుంజుకుని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే ఆస్కారం ఉంది. కేబుల్‌టీవీ క్రమబద్ధీకరణలో భాగంగా అనలాగ్ సిస్టమ్‌ను డిజిటలైజ్ చేస్తున్నారు. 2016 మార్చి 31లోగా మున్సిపాలిటీలలో ఉన్న కేబుల్ టీవీ వినియోగదారులు తప్పనిసరిగా సెట్బాక్సులు అమర్చుకోవాల్సి ఉంది. ఈ బడ్జెట్లో సెట్బాక్సులపై పన్నులు తగ్గించారు. దీనివల్ల మున్సిపాలిటీలలో ఉన్న కేబుల్‌టీవీ వినియోగదారులకు లాభం చేకూరనుంది. బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే.. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం. 2018 నాటికి ప్రతి గ్రామానికి విద్యుత్, 2029నాటికి ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించటం హర్షణీయం. రైతులకు బీమా ద్వారా వారి ఆర్థిక భద్రతకు వీలు కలిగినట్లయింది. సాగునీరుకు రూ.86,500 కోట్లు, ఉపాధి రంగానికి రూ. 38,500 కోట్లు కేటాయించడంతో ఆయూ రంగాలు అభివృద్ధి చెందుతారుు. వ్యవసాయ రంగానికి 35,984 కోట్లు, యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాలను పెంపొందించేందుకు రూ. 9 వేల కోట్లు కేటాయించడమంటే ఆ వర్గాలకు పెద్దపీట వేసినట్టే. - సురేశ్‌లాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ ఎకనామిక్స్ విభాగం అత్యంత నిరాశాజనకం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత నిరాశజనక ంగా ఉంది. ఆర్ధిక మందగమనంలో 3.1 శాతం ఉన్నప్పటికీ భారత్ 7.6 శాతం జీడీపీ ఉందని ఐఎంఎఫ్ ఆశాజ్యోతిగా కితాబిచ్చింది. భారత్ మంచి స్థితిలోఉన్నప్పుడు ఉద్యోగులకు ,పెన్షనర్లకు మధ్యతరగతి వారికి ఆదాయ పన్ను స్లాబులలో మార్పు సూచించకపోవటం గమనార్హం. రైతులకు గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పాపింగ్ మాల్స్ వారం రోజులు తెరిచి వుండేలా అనుమతి ఇవ్వడంతో చిరు వ్యాపారులపై ప్రభావం పడతుంది. పన్ను ఎగవేత దారులపై కొరడా ఝుళిపించే శక్తి ఈ ప్రభుత్వాలకు లేదు. కార్పొరేట్ శక్తులకే కొమ్ముకాచే ప్రభుత్వం ఇది. - టి.సీతారాం, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లాప్రధాన కార్యదర్శి వేతన జీవులకు మొండిచేయి... ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత పన్ను స్లాబు రేట్లు సవరించకపోవటంతో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులపై మి గులను కూడా లాగేసుకుంది. కార్పొరేట్ శక్తులకు రాయితీల పేరుతో వేలకోట్లు ఇస్తున్న ప్రభుత్వం సగటు వేతన జీవిపై కనికరం చూపలేదు. స్టాక్, బీమా ,పెన్షన్ రంగాల్లోలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించటం ద్వారా పింఛన్ సౌకర్యం ప్రమాదంలో పడుతుంది. - బద్దం వెంకటరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాత్కాలిక ప్రయోజనాలకే పరిమితం తాత్కాలిక ప్రయోజనాలకే బ డ్జెట్‌ను పరిమితం చేశారు. ప్రజల సామాజిక ప్రయోజనాలను కాపాడుతూ దేశాన్ని ముందుకు నడిపేలా రూపొందిస్తే బాగుండేది. ప్రస్తుతం దేశం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటారుుంచాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టానికి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకర-త్రిపురనేని గోపిచంద్, చార్టెర్డ్ అకౌంటెంట్ మార్పులకు అనుగుణంగా ఉంది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా బడ్జెట్ తయారుచేశారు. వ్యవసాయ, పారిశ్రమిక రంగాలతో పాటు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. అరుుతే సామాన్య ప్రజలు అశించిన ఆదాయపు పన్ను రేటు తగ్గించకపోవడం, పన్ను చెల్లింపు పరిమితిలో మాత్రమే రిబేట్ ఇవ్వడం నిరాశ కలిగించింది. - రాజేంద్ర కుమార్, ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ నిర్మాణ రంగాలను ప్రోత్సహించారు గృహనిర్మాణ సంస్థలకు 100శాతం పన్ను మినహాయింపు ఇవ్వ డంతో నిర్మాణ రంగాన్ని ఉత్తేజ పరిచారు. రోడ్లకు, హైవేలకు రూ.55వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. మొత్తంగా ఈ బ డ్జెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సాగునీటి ప్రాజె క్టులకు రూ.85 వేల కోట్లు కేటాయించడంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. - తిప్పర్తి రాఘవరెడ్డి, చార్టెర్డ్ అకౌంటెంట్ రూ.5వేల మినహాయింపు సరిపోదు బడ్జట్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది. కేవలం ఆదాయ పన్ను మినహాయింపు 2 వేల నుంచి 5 వేలకు పెంచారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది 90 శాతం మంది ఉద్యోగలకు వర్తించదు. ఎందుకంటే నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ప్రస్తుతం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నారు. - కాందారి బిక్షపతి, వీఆర్వోల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు మా అభ్యర్థనలు పట్టించుకోలేదు. జిల్లాలో ఇటీవల జరిగిన అఖిల భారత మహిళా ఉద్యోగులజాతీయ సదస్సులో మహిళలకు ఆదాయ పన్ను పరిమితి కనీసం 4 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాం. ప్రభుత్వానికి వినతులు ఇచ్చాం. అయినా మా అభ్యర్థన పట్టించుకోలేదు. ఉద్యోగులను బడ్జట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. - ఇ.వి.కిరణ్మరుు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రచార కార్యదర్శి దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరింపజేసేలా ఉంది గ్రామీణ భారతాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ రానున్న కాలంలో ప్రపంచంలోనే దేశాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉంది. బ్యాంకులు, పీఆర్, రైతు రుణాలకు భారీగా నిధులు కేటారుుంచారు. ఎల్పీజీ కనెక్షన్లు, ఆరో గ్య భీమా, 3 సంవత్సరాలలో 100 శాతం గ్రామాల విద్యుద్దీకరణ, రేషన్ షాప్‌ల ఆన్లైన్ రంగాలకు సముచిత స్థానం కల్పించారు. నిరుపయోగ విమానాశ్రయాల అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించడంతో మామునూరు విమానశ్రాయం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - పీ.వీవి.నారాయణ రావు, చార్టెర్డ్ అకౌంటెంట్ బడ్జెట్ నిరుత్సాహపరిచింది. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులను కేంద్ర బడ్జట్ పూర్తిగా నిరుత్సాహపరిచింది. బడ్జట్లో ఉద్యోగుల గురించి ఏ మాత్రం ఆలోచించిలేదు. దొడ్డిదారిన పన్నులు ఎగ్గొట్టే వారిని వదిలి ప్రతి పైసకు పన్ను చెల్లించే ఉద్యోగుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూడడం దుర్మార్గం. - జగన్మోహన్రావు, టీజీవోస్ అధ్యక్షుడు ఆదాయపన్ను పరిమితి పెంచాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి కనీసం 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉంది అయితే ఈ విషయంలో కొంతయినా పెంచితే బాగుండేది. రాష్ట్రంలో 43 శాతం పీఆర్సీ ఇవ్వడంతో దాదాపు ప్రతి ఉద్యోగి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం ఉద్యోగుల పరంగా ఆలోచించక పోవడం బాధాకరం. - కుమారస్వామి, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు రాష్ట్రం ఇస్తుంటే... కేంద్రం తీసుకుంటోంది ఉద్యోగులు పోరాడి 43 శాతం పీఆర్సీ సాధించుకున్నారు. ప్రభుత్వం డీఏ విడుదల చేసింది, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఇలా ఉద్యోగుల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే... కేంద్రం మాత్రం ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత వరకు పన్నులు వసూలు చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు బడ్జట్లో స్పష్టమవుతోంది. బడ్జట్‌పై ఉద్యోగులెవ్వరూ సంతృప్తిగా లేరు. - ఫణికుమార్. ట్రెస్సా కేంద్ర సంఘం కార్యదర్శి -
రైతుబడ్జెట్లో పాలమూరుకు ప్రాధాన్యం
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గద్వాలలో రూ. 10కోట్లతో దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారం ప్రారంభం గద్వాల : రాబోయే 2016-17 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగంలో అన్ని జిల్లాల కంటే పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గద్వాలలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 44 మండలాల్లో 20వేల మంది పాడి రైతులు విజయ డెయిరీకి నిత్యం పాలను అందిస్తున్నారని చెప్పారు. డెయిరీకి అందుతున్న పాల సేకరణలో 2లక్షల లీటర్లు ఉంటుందన్నారు. రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా పాలీ హౌస్, గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, పూలు సాగు చేసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా లాభాలు అర్జించవచ్చని పేర్కొన్నారు. పాలీహౌస్‌లకు ప్రభుత్వం 80 నుంచి 90 శాతం రాయితీ ఇస్తుందని తెలిపా రు. ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ. 2,514కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆశించిన స్థాయిలో సహాయం అందలేదన్నారు. తొలకరి వర్షాలకు ముందే నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. బిందుసేద్యంలో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంద న్నారు. నష్టం జరిగితే కంపెనీలపై చర్యలు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో విత్తనపత్తి సాగులో జరిగిన నష్టంపై కమిటీ వేసి నివేదిక తెప్పించడం జరిగిందన్నారు. విత్త నం ద్వారా పత్తి పంటలకు నష్టం చేకూరితే బాధ్యులైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీడ్‌పత్తి విత్తనాల ద్వారా నష్టపోతే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు రైతులకు రాయితీపై మంజూరైన ట్రాక్టర్లను, రొటొవేటర్, వ్యవసాయ పరికరాలను మంత్రి పోచారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ర్ట పాడి పరిశ్రమశాఖ మేనేజింగ్ డెరైక్టర్ నిర్మల, జేసీ రాంకిషన్, ఉద్యానవనశాఖ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్ది, గట్టు తిమ్మప్ప, బండ్ల రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు
ఐటీడీఏ పీవో కర్ణన్ అర్జుని కొలాంగూడలో కొలాం గిరిజనుల ప్రత్యేక సమావేశం నార్నూర్ : కొలాం గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ తెలిపారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు చేయడం అలవర్చుకుంటే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని అర్జుని కొలాంగూడ గ్రామంలో కొలాం గిరిజన సంఘాల అధ్వర్యంలో కొలాంల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీవో ముఖ్య అతిథిగా హాజరై గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కొలాం గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ చేయడానికి భూమి ఉన్నా ఎండ్లు లేవు. నీళ్లు, క రెంటు మోటారు, ఆరుులింజన్లు లేవు. కొలాం గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు అందడం లేదని కొలాం గిరిజనుడు కన్నా పీవో దృష్టికి తెచ్చారు. పీవో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలు తీసుకొని చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నారు. చిన్న చిన్న రుణాల కోసం ఐటీడీఏ, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఐకేపీ ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం, జీవన్‌జ్యోతి బీమా యోజన పథకం కింద కొలాం గిరిజనులకు ఐటీడీఏ ద్వారా బీమా చేయడం జరిగిందని తెలిపారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 1000 రైల్వే పోలీసు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిందని, గ్రామంలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఈ నెల మార్చి 3వరకు స్థానిక ఐకేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రూపావంతిజ్ఞానోబాపుస్కర్, ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, కొలాం అభివృద్ధి అధికారి భాస్కర్, సర్పంచ్ జంగుబాయి కన్నా, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, మాజీ ఎంపీటీసీ భీంరావ్, గ్రామ పటేల్ జంగు, తహశీల్దార్ దేవానందం, ఎంపీడీవో సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, పశువైద్యాధికారి రామకృష్ణ, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఈ-మార్కెటింగ్
వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు ఆన్లైన్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు ఎలక్ట్రానిక్ కాంటాల ఏర్పాటుకు చర్యలు ధరల నియంత్రణ, అక్రమాలకు అడ్డుకట్ట రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో చెల్లింపులు జిల్లాలో ఎనిమిది మార్కెట్ యార్డులలో అమలు పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ధరల నిర్ణయం లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖలో సంస్కరణల కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వ్యవసాయ మా ర్కెట్ యార్డుల్లో సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిం చేందుకు నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్(నామ్) విధానాన్ని ప్రవేశపెట్టి ఇంటర్నెట్ అనుసంధానంతో ఆన్లైన్ కొనుగోళ్లకు రూపకల్పన చేసింది. కరీంనగర్ అగ్రికల్చర్ : మార్కెట్ యూర్డుల్లో ప్రధానంగా వరి, పత్తి, మక్కలు, కందులు, పెసర్లు తదితర పంటల ఉత్పత్తులు మాత్రమే అమ్మకానికి వస్తున్నాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని తమ ఉత్పత్తులు తీసుకువచ్చిన అన్నదాతలకు మార్కెట్‌యార్డులో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దళారుల బెడద, ఇష్టారీతిగా ధరల నిర్ణయం, తూకంలో మోసాలతో రైతులు దగాపడుతూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మార్కెట్‌యార్డులు, సబ్‌మార్కెట్ యార్డులతో పాటు కొత్తగా మంజూరైన వాటితో కలిపి 35 మార్కెట్ యార్డులున్నాయి. ఇందులోని ప్రధాన మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తూ రైతులను మోసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నారుు. మార్కెట్ యార్డులలో క్రయవిక్రయాలు జరపడానికి అవకాశాలున్నప్పటికీ వ్యాపారులకు, కమీషన్‌దారులకు పాలకవర్గం అండదండలు ఉండటం, నేతల ఒత్తిళ్ల కారణంగా మార్కెట్ పరిధిలో అమ్మకాలు తగ్గిస్తూ రైతుల ఇళ్ల వద్దే దోపిడీ సాగిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న సర్కారు మార్కెట్‌యార్డులలో సాంకేతిక సంస్కరణలకు తెరతీసింది. తొలిదశలో ఎనిమిది మార్కెట్లు నామ్ కింద తొలిదశలో జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లు ఎంపికయ్యూరుు. అందులో కరీంనగర్, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, గంగాధర, మెట్పల్లి, గొల్లపల్లి మార్కెట్లున్నాయి. ఆయా మార్కెట్లలో ఆన్లైన్ కొనుగోళ్లకు వసతుల కోసం ప్రభుత్వం ఒక్కో మార్కెట్‌కు రూ.30 లక్షల నిధులు కేటాయించింది. కంప్యూటర్లు, ఎల్ఈడీ మానిటర్లు, ఇతర సామగ్రిని సమకూర్చే పనిలో మార్కెటింగ్‌శాఖ నిమగ్నమయ్యింది. ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డులకు ఎలక్ట్రానిక్ కాంటాలు అందించనున్నారు. తూకం, తక్‌పట్టీలు (ఈ-బిల్లింగ్) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానం వచ్చే రబీ సీజన్లో అమలు చేసే అవకాశాలున్నాయి. దశలవారీగా జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా జరిగే క్రయవిక్రయాలు ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తారు. రైతులు మార్కెట్‌కు ఉత్పత్తులు తీసుకురాగానే చీటి ఇచ్చి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతులు విక్రయించిన ఉత్పత్తులను ఆన్లైన్లో గ్రేడ్లవారీగా నమోదు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లెసైన్స్ ఉన్న వ్యాపారులు ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే అవకాశాలున్నాయి. మార్కెట్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నామ్ నుంచి అనుమతి తీసుకుంటే దాని పరిధిలోని మార్కెట్లలో ఎక్కడైనా కొనే అవకాశం కల్పించనున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు అమ్ముకునే రైతులకు ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకానున్నాయి. ఇప్పటికే సీసీఐ ఆద్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఆన్లైన్ విధానం అమలు చేశారు. గత సీజన్లో వరి ధాన్యానికి ఇదే పద్ధతిలో చెల్లింపులు చేశారు. కొంతమందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో చెక్కుల ద్వారా చెల్లింపులు జరిపారు. ఇలా చెక్కుల కోసం మార్కెట్‌యార్డుల చుట్టూ అన్నదాతలు తిరగాల్సిన అవసరం రాదు. ఉత్పత్తులు కొనుగోలు చేయగానే రైతులకు సమాచారం అందుతుంది. సంబంధిత అధికారులు డబ్బులు జమ చేయగానే వారి ఫోన్లో మెసేజ్ వస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసే నేపథ్యంలో మార్కెట్‌రంగంలో సాంకేతిక పద్ధతులు రావడం రైతులకు కొంత మేలు జరగనుంది. ఆన్లైన్ వ్యవస్థతో వ్యాపారులు ఎక్కువ మంది పోటీలో ఉంటారు కాబట్టి ధర నిర్ణయంలో గతంలో కంటే మెరుగుదల ఉండే అవకాశముంది. పంట ఉత్పత్తుల వివరాలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తుండడంతో మోసాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అక్రమ నిల్వలకు అడ్డుకట్ట పడుతుంది. -
కామధేను నిధులకు కన్నం
మరమ్మతుల పేరుతో నిధుల స్వాహాకు యత్నం నాణ్యతపై పట్టించుకోని అధికారులు ఉదయగిరి: కొండాపురం మండలం చింతలదేవి పశుక్షేత్రంలో ఏర్పాటుచేయనున్న కామధేను ప్రాజెక్టు పనుల్లో అవినీతిచోటు చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను దేశానికి రెండు మంజూరుచేయగా, వాటిలో ఒకటి చింతలదేవికి వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి మెట్ట ప్రాంతవాసులతో పాటు జిల్లాలోని పశుగణాభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు మంజూరవుతున్న నేపథ్యంలో వాటిని కాజేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులతో జరుగుతున్న పనుల్లో వీలైనంత మేర దుర్వినియోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.91 లక్షల కేటాయింపు కామధేను ప్రాజెక్టు కింద ముందుగా రూ.91 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో డిప్యూటీ డెరైక్టర్ కార్యాలయం, వైద్యుల వసతి గృహాలు, 4వ తరగతి ఉద్యోగులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆరు భవనాలు నిర్మించాలని భావించి రూ.91 లక్షలకు టెండర్లు నిర్వహించారు. పాత భవనాల పైకప్పులు తీసివేసి వాటికి శ్లాబులు వేసి ఆధునికీకరించే విధంగా డిజైన్ చేశారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ భవనాలు ఇరుగ్గా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండానే ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు పెంచి పాత వాటికే మరమ్మతులు చేసే విధంగా రూపకల్పన చేయడంపై విమర్శలున్నాయి. నాణ్యతలో డొల్ల ఇప్పటికే పాత భవనాల పైకప్పులు తీసి శ్లాబు వేసే క్రమంలో నాణ్యతకు నీళ్లొదిలారు. పెన్నా నదినుంచి తెచ్చిన ఇసుకను ఉపయోగించాల్సివుండగా, స్థానికంగా వంకలు, వాగుల్లో దొరికే నాసిరకం ఇసుకను ఉపయోగిస్తున్నారు. దీంతో శ్లాబు ఆయుష్షు ప్రశ్నార్థకంగా మారింది. కాంక్రీటులో కూడా సరైన నాణ్యత పాటించడం లేదనే విమర్శలున్నాయి. పాత భవనాల మరమ్మతుల్లో మర్మమేమిటో?ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ నిధులతో కొత్త భవనాలు నిర్మించే అవకాశముంది. కానీ పాత భవనాలకు మరమ్మతులు చేయించడం వెనుక కొంతమంది అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తూతూమంత్రంగా పనులు నిర్వహించి ఎక్కువ మొత్తంలో నిధులు కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ప్రాజెక్టు నేపథ్యం: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొండాపురం మండలం చింతలదేవికి కామధేను పునరుత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.11.12 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. గతేడాది మార్చిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 250 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఆదిలోనే వివాదాస్పదంఉదయగిరి ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని భావించిన ఈ ప్రాజెక్టు వ్యవహారం మొదట్లోనే వివాదాస్పదంగా మారింది. కొంతమంది అధికార పార్టీనేతలు ఈ ప్రాజెక్టును తమకు కామధేనువుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నిధులు వస్తుండడంతో వాటిపై కన్నేసి కన్నం వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జిల్లాకు మారుమూలన ఈ ప్రాజెక్టు ఉండటంతో దీనిపై జిల్లా అధికారులు పెద్దగా శ్రద్ద వహించకపోవడంతో అభివృద్ధి పనుల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్, బోర్ల తవ్వకంలో అవినీతి చోటుచేసుకున్నట్లు విమర్శలున్నాయి. -
రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో వైఫల్యం
నేడు బస్సుజాత ఆర్‌యూకు రాక విజయవంతానికి విద్యార్థి జేఏసీ పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవడంలో కేంద్ర సర్కారు పూర్తిగా విఫలమైందని విద్యార్థి జేఏసీ నాయకులు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య చోటు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా కేంద్రప్రభుత్వ పెద్దలు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటామన్న మంత్రుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. రోహిత్ మృతిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఎన్ఎస్యూఐ నాయకులు జేఏసీగా ఏర్పడి చేపట్టిన బస్సుజాత శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీకి రానుంది. క్రమంలో వర్సిటీ సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు చంద్రశేఖర్(ఏఐఎస్ఎఫ్), ఎమ్మార్ నాయక్(ఎస్ఎఫ్ఐ), భాస్కర్(పీడీఎస్‌యూ), నాగమధుయాదవ్(ఎన్ఎస్యూఐ), అనిల్‌కుమార్(వైఎస్‌ఆర్‌ఎస్‌యూ) విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సుజాతను విజయవంతంచ చేయాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కఠిన చట్టాలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేంద్ర, శివ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరం రాస్తే వరద సాయం రాదు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాలపై లేఖ రాస్తే కేంద్రం పరిహారం ఇవ్వదని, సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వలేద న్నారు. ఆయన ఆదివారం విశాఖలో గ్లోబల్ యూత్ మీట్ సదస్సులో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'ఏపీకి ప్రకృతి వైపరీత్యాల కింద ఇవ్వాల్సిన రెండు విడతల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇటీవల వరదల నష్టానికి అదనంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే పరిహారం రాదు.. ఇంత పంట నష్టం, ఇన్ని రోడ్లు, సమాచార, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నాయని సమగ్ర నివేదిక పంపిస్తే కేంద్ర బృందం వస్తుంది. వారు కొన్ని ప్రాంతాలు తిరిగి ఓ అంచనాకొస్తారు. విశాఖలో హుద్‌హుద్ తుపానుకు నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అది రూ. 733 కోట్లు నష్టమని నిరూపించారు.' అని వెంకయ్య వివరించారు. అలాగే వారం పది రోజుల్లో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లును ఆమోదిస్తామని ఆయన తెలిపారు. -
మెట్రో రైలు లేనట్టే!
ఫీజబిలిటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ లాభసాటిగా ఉండదనే అనుమానం గుంటూరు, విజయవాడ నగరాలను కలిపితేనే లాభం విజయవాడ : విజయవాడ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్టే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికలను పరిశీలించిన తరువాత మెట్రో రైలు ప్రాజెక్టుకు ఫీజబిలిటీ ఇచ్చేందుకు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. విజయవాడ నగరంలో ప్రస్తుతం 13 లక్షల వరకు జనాభా ఉంది. నిత్యం వచ్చిపోయే వారి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని వ్యాపార వర్గాల అంచనా. మొత్తం మీద మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండే అవకాశం లేదని కేంద్రం తేల్చింది. గుంటూరు-విజయవాడ కలిపితేనే... విజయవాడ, గుంటూరు నగరాలను కలిపితేనే జనాభా పరంగా చూసినా, కిలోమీటర్ల పరంగా చూసినా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు ఫీజబిలిటీని పరిశీలించేందుకు వచ్చిన శ్రీధరన్ గుంటూరు నగరాన్ని మినహాయించి విజయవాడ నగరంలోనే 30 కిలోమీటర్ల వరకు రైలు నడిచే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. విజయవాడకే పరిమితం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అప్పటిలో ఆయన చెప్పారు. బందరు వైపు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వరకు, హైదరాబాద్ వైపు ఇబ్రహీంపట్నం వరకు నగరాన్ని చుట్టే విధంగా మెట్రో రైలు నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. రాజకీయ కోణం... మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బందరు రోడ్డు మధ్యలో నుంచి మెట్రో రైలు ట్రాక్ వేయాల్సి ఉంటుంది. 13 కిలోమీటర్ల పొడవున బందరు రోడ్డులో మెట్రో నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల రోడ్డును మరికొంత వెడల్పు చేయాల్సి ఉంది. అలా చేస్తే పలు దుకాణాలు తొలగించాల్సి ఉంటుంది. దీంతో కొందరు బడా వ్యాపారులు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు. దీంతో ఆయన మోకాలడ్డటం వల్లే కేంద్రం ఈ రకమైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డీపీఆర్ సిద్ధం చేసి ఢిల్లీకి పంపినందున తాను ఇక్కడ ఏమీ చెప్పలేనని, ఢిల్లీ వారి ద్వారానే ఆ మాట చెప్పిస్తే సరిపోతుందని చంద్రబాబునాయుడు సుజనా చౌదరికి సలహా ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తిస్థాయిలో అయిపోయిందని, త్వరలోనే పనులు చేపడతారని భావిస్తున్న తరుణంలో ప్రాజెక్టు తిరస్కరణకు గురికావడం స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
వీధివ్యాపారులపై అలసత్వం
చిరువ్యాపారులు.. నిగనిగలాడే పండ్లు, కూరగాయలు, తినుబండారాలను విక్రయించే వీరి జీవితాల్లో ఎలాంటి మెరుపూ ఉండదు. అద్దెలు, ఖర్చులు, పోలీసు మామూళ్లు, రోజువారీ వడ్డీలకు పోగా రోజంతా నిలువుకాళ్ల జీతంతో చేసే వ్యాపారంలో మిగిలేది స్వల్పమే. వీరిని వీధివ్యాపారులుగా గుర్తిస్తూ, కేంద్రప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినా, అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రత్యేక జోన్లు లేవు. గుర్తింపు కార్డుల పంపిణీలేదు. పావలా వడ్డీ రుణాల ప్రసక్తే లేదు. - కేంద్రప్రభుత్వం చేసిన చట్టం అమలులో తీవ్ర నిర్వక్ష్యం - ప్రత్యేక జోన్లు లేవు, గుర్తింపు కార్డులు సంగతి సరేసరి - పావలా వడ్డీ రుణాల ఊసే లేదు తెనాలి : జిల్లాలో అధికారుల అంచనా ప్రకారమే 4,397 మంది చిరువ్యాపారులు ఉన్నారు. వాస్తవ సంఖ్య యాభై శాతం అధికంగా ఉంటుందని చెబుతారు. ప్లాట్‌ఫారాలు, తోపుడుబండ్లపై, రోడ్డు పక్కన బుట్టల్లో వ్యాపారాలు చేసుకొనే పేదలకు ఆదాయం అస్తుబిస్తుగానే ఉంటుంది. సరుకు కొనుగోలుకు వడ్డీ వ్యాపారుల నుంచి రోజువారీ రూ.5, రూ.10 వడ్డీకి అప్పులు తెచ్చుకొని అమ్మకం ఆరంభిస్తారు. పెట్టుబడికి వడ్డీ, తోపుడుబండి అద్దె, తమ సాదర ఖర్చులు, వారం వంతున పోలీసులకు చెల్లించే మామూళ్లు పోతే చిరువ్యాపారులకు మిగిలేది స్వల్పమే. ఇళ్లు, దుకాణాల ఎదుట సరుకు పెట్టుకొని వ్యాపారం చేస్తే, ఆ గృహస్తులు/దుకాణ యజమానులకు రోజుకు ఇంతని డబ్బు చెల్లించాల్సిందే. చట్టం చేసిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం 2004లో వీరిని వీధి వ్యాపారులుగా గుర్తిస్తూ చట్టం చేసింది. మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. వీరు వ్యాపారం చేసుకొనేందుకు ప్రత్యేక జోన్లు ఏర్పాటుచేయాలనీ, గుర్తింపుకార్డులు మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసుల, రౌడీల మామూళ్ల బెడద ఉండదని ప్రభుత్వ భావన. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వీధివ్యాపారులకు పావలా వడ్డీ రుణాలను కల్పించాలని నిర్ణయించింది. సూక్ష్మరుణాలను పట్టణ దారిద్య్ర నిర్మూలన పథకం (మెప్మా) కింద అందజేస్తామని ప్రకటించారు. కొనసాగుతున్న నిర్లక్ష్యం.. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అలసత్వం కొనసాగుతోంది. గుంటూరు రీజియన్‌లో వీధివ్యాపారుల గుర్తింపు కేవలం 42 శాతమే జరగడంపై ఈనెల 19న గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ డి.మురళీధరరెడ్డి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో గుర్తించిన వీధివ్యాపారులు 4,397 కాగా, వాస్తవంగా మరో రెండువేలమంది అదనంగా ఉంటారనే వాదన ఉంది. ఉదాహరణకు తెనాలిలో గుర్తించిన చిరు వ్యాపారులు సంఖ్య 227 కాగా, పండ్ల, చిల్లర వర్తక సంక్షేమ సంఘం సభ్యులు 380 ఉండగా, దెబ్బతిన్న పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి వే రేచోట అమ్మేవారు. రోడ్డుపక్క ఇడ్లీ, దోసె వేసి అమ్మేవారు మరో 300 ఉంటారని సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బొల్లు సుబ్బులమ్మ చెప్పారు. అధికారుల అంచనా ప్రకారమే జిల్లాలోని 4,397 మందికిగాను ఇప్పటికీ 274 మందికి మాత్రమే గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇక రుణాల సంగతి వీరిలో ఎవరికీ తెలియదు. పొన్నూరులో మున్సిపాలిటీ చొరవతో డ్వాక్రా తరహాలో పొదుపు చేయించి, కొందరికి రుణాలిచ్చినట్టు తెలిసింది. ఇకనైనా చిరువ్యాపారులను ఆదుకోవలసిన అవసరం ఉంది. -
ఉచితం గ్యాస్!
కళ్ల మంటలు, దగ్గు, కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ బాధ, తడిసిపోయిన కర్రలు వెలగక... మంట కోసం ఊదలేక గుండెలార్చుకుపోయే పరిస్థితి నుంచి బయటపడవచ్చని ఎంతో ఆశతో గ్యాస్ కనెక్షన్లకోసం ఏజెన్సీల వద్దకు వెళుతున్న పేదల ఆశలు నీరుగారిపోతున్నాయి. డబ్బులు చెల్లించలేక, గ్యాస్ కనెక్షన్లు పొందలేకపోతున్నవారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకానికి ఏజెన్సీలు తూట్లు పొడుస్తున్నాయి. అధిక ధరలను వసూలు చేస్తూ , అడ్డమైన ఉత్పత్తులనూ అంటగడుతున్నాయి. విజయనగరం కంటోన్మెంట్: కేవలం పది రూపాయలు చెల్లిస్తే గ్యాస్ కనెక్షన్, ఖాళీ సిలెండర్ ఉచితంగా అందజేస్తామని, గ్యాస్ ఫిల్చేసిన సిలెండర్, ట్యూబ్‌ల కోసం రూ.790లు చెల్లిస్తే సరిపోతుందని ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు దొంగనిద్ర నటిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఏజెన్సీలకు కాసులవర్షం కురిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలలో ఎవరికి నచ్చిన ధరను వారు వసూలు చేస్తున్నారు. తమ దగ్గర గ్యాస్ స్టౌలను కొంటేనే కనెక్షన్ ఇస్తామని నిబంధన విధిస్తున్నారు. కేవలం కనెక్షన్ ను రూ. 790కు ఇవ్వాల్సినప్పటికీ వాటి ధరను రూ.900కు పెంచారు. అలాగే గ్యాస్ స్టౌను బయట కొనుగోలు చేసుకోవచ్చని ప్రారంభంలో ప్రకటించినా ఇప్పుడు తమ వద్దే కొనుగోలు చేయాలని, లేకుంటే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని తెగేసిచెబుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.దీంతో గత్యంతరం లేక వారి వద్దే అధిక ధరకు స్టౌలను కొనుగోలు చేస్తున్నామని బాబామెట్ట, గాజుల రేగ ప్రాంతాలకు చెందిన మహిళలు వాపోయారు. కొన్ని ఏజెన్సీలు కుక్కర్లు, మరికొన్ని ఏజెన్సీలు వివిధ కంపెనీలకు చెందిన టీ పొడులు అంటగడుతున్నారు. 46 వేలు మాత్రమే మంజూరు జిల్లాలో బీపీసీ, ఐఓసీ,హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 63 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 46 వేలు మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో హెచ్‌పీసీఎల్ కంపెనీకి ఎక్కువ కనెక్షన్లు కేటాయించారు. హెచ్‌పీకి 32 వేలు, ఐఓసీకి 8,500, బీపీసీకి 5,500 కనెక్షన్లు కేటాయించారు. ఆయా కంపెనీలు ఏజెన్సీల వారీగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రారంభంలో ప్రకటించిన విధంగా రూ.790లు తీసుకుని వెళితే ఏకంగా 2,900 చెల్లించాలని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు రూ.3,080 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్యూబు కోసం రూ.190లు, పుస్తకానికి రూ.50లు, స్టౌధర రూ.1975 నుంచి 2,300 వరకూ టీపొడి రూ.107లు, గ్యాస్ కోసం రూ.651.50లు వసూలు చేస్తున్నారు. దీంతో అంతసొమ్ము చెల్లించలేక చాలా మంది కనెక్షన్లను తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. గతంలో మంజూరైన 16,000 దీపం కనెక్షన్లను కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. గ్యాస్ ఏజెన్సీలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎక్కువ ధరలకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్ష జరిగి కనీసం పది రోజులయినా గడవక ముందే ఈ విధంగా ఏజెన్సీలు వ్యాపారం చేసుకుంటున్నాయి. -
సూపర్ ‘జాప్యం’
చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రకటనలకే పరిమితం నిధులిచ్చినా.. ఒక్క అడుగూ ముందుకు పడని వైనం నేటికీ ఎక్కడ కడతారో తెలియని దుస్థితి విజయవాడ : విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కల ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కాని అయోమయ స్థితి నెలకొంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుంది. గత ఏడాది జూన్‌లో కేంద్రం ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.150 కోట్లు కేటాయించింది. వాటిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేకంగా భవన నిర్మాణం చేపట్టడంతో పాటు, అత్యాధునిక పరికరాలు సమకూర్చేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సూపర్ ఆశ నెరవేరినట్లేనని అందరూ భావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది గడిచినా నేటికీ అంచనాలు రూపొందించే దశలోనే ఉండటంతో ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఎక్కడ కట్టాలనేదే సమస్య... ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా రూ.150 కోట్లు కేటాయించగా, వాటిలో రూ.80 కోట్లు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మిగిలిన రూ.70 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో పాటు, ప్రస్తుతం ఉన్న విభాగాల్లో మరమ్మతులు చేపట్టాలని భావించారు. అయితే భవన నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనేది సమస్యగా మారింది. తొలుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సందర్శించి ప్రస్తుతం ఉన్న వైద్యకళాశాల భవనాల్లో సగ భాగాన్ని తొలగించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌లు వైద్య కళాశాలను సంద ర్శించి క్రీడా ప్రాంగణంలోని కొంత భాగంలో సూపర్ స్ఫెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు ఒక ప్రాంతంలో, ప్రజాప్రతినిధులు మరో ప్రాంతంలో ప్రతిపాదనలు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీర్లు రెండు ప్రాంతాల్లోనూ డిజైన్లు వేసి ప్రభుత్వానికి పంపారు. అక్కడ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గతం పునరావృతమయ్యేనా? నాలుగేళ్ల కిందట వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తొలి విడతగా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.9 కోట్లు విడుదల చేశారు. దానికి మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయక పోవడంతో రెండో విడత నిధులను వైద్య కళాశాల కోల్పోవాల్సి వచ్చింది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు రెండు, మూడు విడ తలు నిధులు పొందగా మన రాష్ట్రంలో మాత్రం మొదటి విడతతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కేటాయించిన రూ.150 కోట్లలో 20 శాతం అంటే రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నిధులు కూడా సగంలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు చెపుతున్నారు. -
లెక్క తేలుస్తున్నారు
పుష్కర మృతులు 22 మంది క్షతగాత్రులు ముగ్గురు శ్రీకాకుళం సిటీ : రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆర్భాటంగా నిర్వహించిన పుష్కర యాత్ర ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. ఈ వివరాల నమోదుపై ఇప్పుడు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పుష్కరాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పదిలక్షలు వంతున అందించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ. రెండులక్షల వంతున అందిస్తామని ప్రకటించింది. పుష్కరఘటనలో తొలిరోజు మృతి చెందిన 27 మంది పూర్తి సమాచారాన్ని అందించాలని కేంద్రం ఆదేశంతో అక్కడి యంత్రాంగం కూడా ఇప్పటికే జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో జిల్లా వాసులు తొమ్మిది మంది వరకు మృతి చెందారు. అనంతరం పుష్కరాలకు వె ళ్తూ వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ. మూడు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబందించిన ఉత్తర్వులు జిల్లాకు రావల్సి ఉన్నాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. పుష్కరాల మృతులు 22 మంది గోదావరి పుష్కరాల్లో తొలిరోజున మృతిచెందిన వారు తొమ్మిది మంది కాగా, పుష్కరాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు 13 మంది వరకు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు మృతి చెందిన వారిలో రేగిడి ఆమదాలవలసకు చెందిన పైల పెంటన్నాయుడు, జడ్డు అప్పలనర్శమ్మ, పొట్నూరు అమరావతి (ఆమదాలవలస), కొత్తకోట కళావతి (సంతకవిటి), పొట్నూరు లక్ష్మి, బరాటం ప్రశాంత్ కుమార్ (శ్రీకాకుళం), లమ్మత తిరుపతమ్మ(సంతబొమ్మాళి), సాసుపల్లి ఆమ్మాయమ్య(భామిని), లచ్చుభుక్త పారమ్మ(వంగర) ఉన్నారు. వీరి కుటుంబీకులకు కేంద్రం నుంచి పరిహారం అందాల్సి ఉంది. ఇక పుష్కరాలకు వెళ్లే ప్రయత్నంలో, అక్కడి నుంచి తిరిగి వచ్చేటపుడు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన 13 మంది మృత్యువాత పడ్డారు. కర్రి సుభద్రమ్మ(గార), బోర ఎర్రప్పడు, బోర సరస్వతి(పోలాకి), పిట్టా అప్పలరాజు(జలుమూరు), పడాల ప్రసాదరావు, పడాల యశ్వంత్, పడాల షణ్ముఖం(పాలకొండ), కర్ర చంద్రరావు(రాజాం), పెంట శివకుమార్(పలాసా), పిన్నింటి సత్యనారాయణ( నందిగాం), కెల్లవలస రాజారావు(సారవకోట), మెండ అప్పన్న(వంగర), కూన అప్పలరాజు(సరుబుజ్జలి) ఉన్నారు. వీరికి రాష్ట్ర ్రపభుత్వం నుంచి పరిహారం అందాల్సి ఉంది. క్షతగాత్రులు పుష్కరాల రాకపోకల్లో జిల్లా వాసులు సుమారు 37 మంది వరకు గాయపడిన ట్లు తగిన సమాచారం అదికారుల వద్ద ఉండగా వారిలో అధికారికంగా ముగ్గురిని మాత్రమే ఈ జాబితాలో ఎంపిక చేశారు. అధికారులు ఎంపిక చేసిన వారిలో పాలకొండ కు చెందిన మొదల రమణమ్మ, లావేటి తవిటమ్మ, లావేటి యాసినిలు ఉన్నారు. -
సవతి తల్లి ప్రేమ చూపుతున్న కేంద్రం
బెంగళూరు: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధుల విడుదల్లో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ శాసనసభలో ఆరోపించారు. బెళగావిలోని సువర్ణ విధానసౌధలో జరుగుతున్న వర్షాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా తన మంత్రిత్వశాఖకు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సోమవారం సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ, ‘ అంతకు ముందు ఏడాది తమిళనాడుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసిన నిధుల్లో తమిళనాడు ప్రభుత్వం 73 శాతమే ఖర్చుచేసినా ఈ ఏడాది రూ.30,943 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదే కర్ణాటక ప్రభుత్వం కేం ద్రం విడుదల చేసిన మొత్తం నిధులను వినియోగించుకోవడమే కాకుండా అదనంగా మరో 20 శాతం నిధులను ఈ పథకం కిం ద ఖర్చు చేసింది. అయినా కర్ణాటకకు విడుదల చేసే నిధుల్లో రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కోత వేసి రూ.18,200 కోట్లను మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఎక్కువ నిధులు విడుదల చేస్తోంది.’ అని గణాంకాలతో సహా మం త్రి శాసనసభకు వివరించారు. ఈ సమయంలో బీజేపీ శాసనసభ్యుడు జీవరాజ్ కలుగజేసుకుని, ‘‘మీరు ప్రతిపక్ష పార్టీకు చెందిన శాసనసభ్యుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఈ వాఖ్యలతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి స్పీకర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చి కర్యాకలాపాలు ముందుకు సాగాయి. -
జిల్లాకు అమృత్ కలశం
విజయనగరం కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత) పథకానికి జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేశారు. లక్ష పైన జనాభా ఉండే నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలోని 31 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, మన జిల్లాలో విజయనగరం పట్టణాన్ని ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలైతే అధికస్థాయిలో నిధులు విడుదలవుతాయి. విజయనగరం పట్టణం చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. ఈ పథకంతో వివిధ కార్యక్రమాలకు నిధులు విడుదలై పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పలు అభివృద్ధి పథకాలను ఈ పథకం కింద పునఃప్రారంభించి పూర్తి చేస్తారు. మురికి వాడలకు మహర్దశ జిల్లా కేంద్రంలో 2.75లక్షల జనాభా ఉన్నారు. విజయనగరంలో 72 గుర్తించిన మురికి వాడలున్నాయి. మరో ఎనిమిది గుర్తించని మురికి వాడలున్నాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి స్థానికంగా ఉంటున్న వారు ఏటా పెరుగుతున్నారు. వీరికి సరిపడా సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో పలు అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో పట్టణంలోని మురికి వాడల్లో ఉన్న ప్రజలు ఏటా వైద్యం కోసం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అమృత పథకం వల్ల మురికివాడల్లో సౌకర్యాలు మెరుగవుతాయి. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపడతారు. పారిశుధ్యానికి అధిక నిధులు వెచ్చిస్తారు. రహదారులు... పట్టణంలోని రహదారులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పథకం కింద రహదారులను అభివృద్ధి చేస్తారు. పట్టణం పరిధి విస్తరించనుండడంతో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తారు. పార్కులు, ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. తాగునీరు.. జిల్లా కేంద్రంలో ఉన్న జనాభాకు అవసరమైన తాగునీరు లభించడం లేదు. ప్రతి మనిషికీ 20 లీటర్ల తాగునీరు కావాలంటే ఒక్క విజయనగరం పట్టణంలోని ప్రజలకే దాదాపు 34 ఎంఎల్డీల తాగునీరు అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం కేవలం 16 ఎంఎల్డీల తాగునీరు మాత్రమే లభ్యమవుతోంది. ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థం ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పైపుల ద్వారా నీరు తీసుకోవాలంటే గోతులు తవ్వుకునే పరిస్థితి ఉంది. మురుగు కాలువల్లో ఉన్న పైపులు తుప్పిపట్టి పోతున్నాయి. వాటి ద్వారా సరఫరా అయ్యే తాగునీటినే ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్నారు. కొత్త పథకం ద్వారా తాగునీరు పుష్కలంగా లభిస్తుంది. -
నిర్లక్ష్యంతో నిధుల గల్లంతు..?!
- యూసీ సమర్పించడంలో బల్దియా జాప్యం - కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం - రూ. 20 కోట్లపై నీలినీడలు - మధ్యలో ఆగిన 60 పనులు - జనరల్ ఫండ్ వైపు చూపులు సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ. 20 కోట్ల నిధులు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధుల ఆధారంగా చేపడుతున్న అరవైకి పైగా వివిధ రకాల పనులు మధ్యలో ఆగిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు జనరల్ ఫండ్ ద్వారా చేపట్టేందుకు బల్దియా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూసీ సమర్పించడంలో నిర్లక్ష్యం.. పద మూడో ఆర్థిక ప్రణాళిక కింద ఐదేళ్ల కాలవ్యవధి (2010-15)లో వివిధ అభివృద్ధి పథకాల కోసం కార్పొరేషన్ అధికారులు రూ. 51.31 కోట్ల విలువైన ప్రతిపాదనలు రూపొందిం చారు. అయితే వీటి ప్రకారం కేంద్రం ఒక్కో ఆర్థిక సంవత్సరానికి విడతల వారీగా నిధులు మంజూరు చేసింది. గత నాలు గేళ్లలో రూ.35.56 కోట్లు విడుదలయ్యాయి. కాగా, ఈ నిధులు ఖర్చు చేసిన విధానంపై ధ్రువీకర ణ పత్రాన్ని(యుటిలిటీ సర్టిఫికెట్, యూసీ) కార్పొరేషన్ అధికారులు కేంద్రానికి సమర్పించలేదు. నాలుగేళ్లకు సంబంధించి రూ 35.56 కోట్లు ఖర్చు చేసిన అధికారులు కేవలం రూ .2.38 కోట్లకు సంబంధించిన యూసీలనే కేంద్రానికి పంపించారు. దాంతో చివరిదైన 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ 16.73 కోట్లను కేంద్రం విడుదల చేయకుండా నిలిపేసింది. మరోవైపు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పద మూడో ఆర్థిక ప్రణాళిక కింద కార్పొరేషన్‌కు రావాల్సిన రూ 16.73 కోట్ల నిధుల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే తరహా పొరపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్జీఎఫ్) నిధుల విషయంలో దొర్లడంతో రూ 3.23 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. బీఆర్జీఎఫ్ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7.38 కోట్లకు మంజూరు చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు రూ.4.15కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన రూ. 3.23 కోట్ల నిధులు ఇవ్వలేమంటూ కార్పోరేషన్ అధికారులకు కేంద్రం లేఖను పంపింది. జనరల్ ఫండ్‌కు ఎసరు..! బీఆర్జీఎఫ్, పదమూడో ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు మొత్తం రూ.19.96 కోట్లు నిలిచిపోవడంతో వాటి ఆధారంగా చేపడుతున్న పనులు ఏ విధంగా పూర్తి చేయాలనే అంశం పై కార్పొరేషన్ అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. అయితే నిధుల ఆధారంగా చేపడుతున్న అరవైకి పైగా అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లుల చెల్లింపు, సగంలో ఆగిన పనులు ఏ రకంగా పూర్తి చేయాలనే అంశంపై కార్పొరేషన్ అధికారులు కిందా మీదా అవుతున్నారు. చివరకు ఈ బిల్లుల చెల్లింపునకు జనరల్ ఫండ్ నిధుల ద్వారా చెల్లించేందుకు పావులు కదుపుతున్నారు. సాధారణంగా జనరల్ ఫండ్‌ను అత్యవసర పనులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులకే ఉపయోగించాలి. కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జనరల్ ఫండ్ నిధులపై కన్నేశారు. -
ఆ ‘ఐదు’ వ్యాధులిక దూరం.
- రేపు పెంటావలెంట్ టీకా ప్రారంభం - ప్రాణాంతక వ్యాధుల నుంచి సంరక్షణ - తిరుపతిలో సీఎంచే పిల్లలకు టీకాలు చిత్తూరు (అర్బన్): హిమోఫిలస్ ఇన్ప్లూయెంజా టైప్ బీ (హిబ్) .. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులను బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి. దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 3.7లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది. మృతుల్లో సుమారు 20 శాతం మంది మనదేశానికి చెందిన వారే. మరికొంతమంది పిల్లలు శాశ్వత పక్షవాతం, చెవుడు, మెదడు వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెంటావలెంట్ను ప్రవేశపెట్టింది. ప్రాణాంతకమైన ఐదు వ్యాధులను నియంత్రించే శక్తి ఇందులో ఉంది. మన జిల్లాలోనూ పిల్లలకు ఈ టీకా వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నెల 7న సీఎం చేతులమీదుగా పెంటావలెంట్ను రాష్ట్రంలోనే మొదటి సారిగా జిల్లాలో ప్రారంభిస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పెంటావలెంట్ టీకాను చిన్నారులకు వేయనున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తిలో భాగంగా ప్రస్తుతం వైద్యశాఖాధికారులు అందిస్తున్న టీకాలు ఏదో ఒక వ్యాధిని నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీంతో ఏ వ్యాధికి అనుగుణంగా ఆ టీకా వేస్తున్నారు. ఆరునెలల శిశువుకే ఆరు నుంచి ఏడు టీకాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఫలితంగా శిశువు శరీరం ఇబ్బందులకు గురవడంతో పాటు టీకాలు వేసే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రాణాంతర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చేలా ఒకే ఒక పెంటావలెంట్ను అందుబాటులోకి తెచ్చింది. పెంటా అంటే ఐదు. వలెంట్ అంటే టీకా అని అర్థం. కంఠసర్పి (డిఫ్తీరియా), కోరింత దగ్గు, ధనుర్వాతం(టెటనస్), హెపటైటీస్ -బి,హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (హిబ్) అనే ఐదు రకాల ప్రాణాంతక వ్యాధులను పెంటావలెంట్ నియంత్రిస్తుంది. శిశువు పుట్టిన ఆరు వారాలకు ఈ పెంటావలెంట్ టీకా వేస్తారు. 10, 14వ వారాల్లోగా సైతం ఈ టీకా వేస్తారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో కోటీశ్వరి జిల్లాలోని వైద్యాధికారులకు, సిబ్బందికి దాదాపు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. -
‘మధుమేహం’.. అంతా మోసం..!
- నిరుద్యోగుల నుంచి రూ.అరకోటి వసూళ్లు - కోరుట్లలో ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకం కోరుట్ల : డయాబెటిక్ శిక్షణ, ఉపాధి పేరిట నిరుద్యోగుల నుంచి వేలల్లో డబ్బులు గుంజుతున్న ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకమిది. ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నప్పటికీ తమకు ఉపాధి కల్పించడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకం ద్వారా శిక్షణ నిర్వహిస్తున్నామని మభ్యపెడుతూ నిర్వాహకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఉపాధి విషయమై గొడవ చేయగా స్వచ్చంద సంస్థ నిర్వాహకులు వారిలో కొందరి వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయడం గమనార్హం. దీంతో పాటు నామమాత్రంగా ఓ డయోబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొందరికి ఉపాధి ఇచ్చినట్లు నమ్మిస్తున్నారు. ఒక్కోక్కరికి రూ.30వేలు కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ కింద తమకు డయాబెటిక్ నివారణ, అవగాహన శిక్షణ కేంద్రం మంజూరైందని, శిక్షణ తర్వాత ఉపాధి కల్పనకు అనుమతి ఉందని పేర్కొంటూ కోరుట్లకు చెందిన స్టార్ మహిళా మండలి నిర్వాహకులు ఏడాది క్రితం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ తీసుకున్న వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే డయాబెటిక్ అవేర్నెస్ సెంటర్లలో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ ప్రచారం నిజమేనని నమ్మిన నిరుద్యోగ యువతీ యువకులు కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కేంద్రంలో అడ్మిషన్లు తీసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు రూ.30వేలు వసూలు చేశారు. శిక్షణ కేంద్రంలో అభ్యర్థులను చేర్పించడానికి ఏజెంట్లను నియమించుకుని వారికి ఒక్కో విద్యార్థిని చేర్పించినందుకు రూ.10వేలు అందజే శారు. ఈవిధంగా మొతం్త రెండు వందల మంది అభ్యర్థులను అడ్మిట్ చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.50 లక్షల వసూలు చేశారు. ఈ శిక్షణ ఏడాదికాలంగా కొనసాగుతున్నా.. ఉపాధి జాడ మాత్రం లేకుండా పోయింది. అడిగితే డబ్బులు వాపస్.. రెండు నెలల క్రితం క్రితం డయూబెటిక్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు తమకు ఇంకా ఎన్నాళ్లు శిక్షణ ఇస్తారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సంస్థ నిర్వాహకులు గొడవ చేసిన వారికి డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సుమారు ఇరవై మందికి డబ్బులు వాపస్ చేశారు. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో ఓ డయాబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వారిలో కొందరిని అక్కడ నియమించి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా డయాబెటిక్ కేంద్రాలు ఏర్పాటవుతాయని, శిక్షణ పొందిన వారికి ఆయూ కేంద్రాల్లో ఉపాధి దొరకుతుందని చెబుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో అలీంను వివరణ కోరగా... డయాబెటిక్ శిక్షణ కేంద్రం నిర్వహణ అంశం తమ పరిధిలోకి రాదన్నారు. అభ్యర్థులు పలుమార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. -
రైతు కన్నీళ్లు తడుస్తాం..
- రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ విద్యాసాగర్‌రావు - కేంద్రం రూ. 2 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు వెల్లడి - ఘనంగా అవతరణ దినోత్సవం - అమరులకు ప్రముఖుల నివాళి సాక్షి, ముంబై: అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 కోట్ల ప్యాకేజీ మంజూరు చేసిందని గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం దాదర్‌లోని శివాజీపార్క్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాథలైన వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు. ఇందుకోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. గ్రామాల్లోని ప్రజల సహకారంతో వర్షపు నీటిని భద్రపరచుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నాసిక్‌లో జరిగే కుంభమేళాకు వచ్చే లక్షలాది భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిమగ్నమైందని వివరించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దివంగత మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ పేరుతో ‘ప్రమోద్ మహాజన్ కౌసల్య వికాస్ యోజన’ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మేయర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. అమర వీరులకు ఘన నివాళి రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘన నివాళి అర్పించారు. అమరవీరుల స్తూపానికి ప్రముఖ రాజకీయ నేతలంతా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నగరంలోని హుతాత్మ చౌక్(అమరవీరుల స్మృతి చిహ్నం) వద్ద మేయర్ స్నేహల్ అంబేకర్, బీజేపీ, శివసేన మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే సునీల్ తట్కరే, ప్రకాశ్ బిన్సాలే, పార్టీ ముంబై మహిళా శాఖ అధ్యక్షురాలు చిత్ర వాఘ్, సంజయ్ తట్కరే తదితర నాయకులు, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు అశోక్ చవాన్, శివసేన నాయకురాలు నీలం గోర్హే, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠావలే తదితరులు నివాళులర్పించారు. -
రాష్ట్రంలో ‘రవాణా’ బంద్
- రోడ్డు భద్రత బిల్లు-2014 కు వ్యతిరేకంగానే.. - దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన ఎన్‌ఎఫ్‌టీవీ - బిల్లుపై పునరాలోచించాలని డిమాండ్ సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రోడ్డు భద్రత బిల్లు-2014’కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఆర్టీసీ, బెస్ట్ బస్సు, ఆటో, ట్యాక్సీల సంఘాలు ఏప్రిల్ 30న బంద్‌కు పిలుపునిచ్చాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ (ఎన్‌ఎఫ్‌టీవీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే మినహా మిగతా రవాణా వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన రోడ్డు భద్రత బిల్లు కారణంగా ప్రైవేటు రవాణ వ్యవస్థకు మేలు జరిగినప్పటికీ ఆటో, ట్యాక్సీ, ఆర్టీసీ, బెస్ట్ లాంటి ప్రజా రవాణ సంస్థలపై ప్రభావం పడుతుందని నేషనల్ ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది. ఈ విషయంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వివిధ సంఘాల నాయకులు భేటీ అయ్యారని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దేశ వ్యాప్తంగా చక్కా జాం (చక్రాలకు బ్రేక్) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. బిల్లుపై కేంద్ర పునరాలోచించాలని డిమాండ్ చేసింది. దేశంలోని 40 లక్షల మంది కార్మికులతో పాటు రాష్ట్రంలోని ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు, రెండు లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లు, ముంబైలో సేవలందిస్తున్న బెస్ట్, ఆర్టీసీ సేవలు నిలిచిపోతాయని ఫెడరేషన్ స్పష్టం చేసింది. శివసేన అనుబంధ యూనియన్లు మినహా హింద్ మజ్దూర్ సభ, భారతీయ మజ్దూర్ సంఘ్, సిటూ, ఐటక్, ఇంటక్ తదితర యూనియన్లు బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. ముంబైకర్ల ఆందోళన ఆటో, ట్యాక్సీ, బస్సులు అన్నీ బంద్ అయితే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని ముంబైకర్లు ఆందోళన చెందుతున్నారు. ముంబైలో లోకల్ రైళ్ల తర్వాత అత్యధిక శాత ం ప్రజలు ప్రయాణించేది బెస్ట్ బస్సుల్లోనే. ప్రతిరోజు దాదాపు 40 లక్షల మంది ముంబైకర్లు బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. లక్షకుపైగా ఆటోలు, 15 వేలకుపైగా ట్యాక్సీలు నగరంలో సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో రవాణా మొత్తం స్తంభించిపోనుంది. -
జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం?
- తెలంగాణకు పెరిగిన మూడు మండలి సీట్లు - స్థానాల పునర్విభజనకు ఈసీ కసరత్తు - స్థానిక సంస్థల కోటాలో మరో స్థానం లభించే ఛాన్స్ సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం రానుంది. స్థానిక సంస్థల కోటాలో అదనపు సీటు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించడంతో త్వరలోనే ఈ సీటుపై స్పష్టత రానుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను 14కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సంఖ్యకు అనుగుణంగా మండలి సీట్ల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాన్ని డీలిమిటేషన్‌ను చేయనున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు సహా దాదాపు వేయి మంది ప్రజాప్రతినిధులున్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 48 డివిజన్లు మన జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కాలపరిమితి ముగిసింది. త్వరలోనే వీటికి అదనంగా మరో 50 డివిజన్లు శివార్లలోనే ఏర్పడుతున్నాయి. వీటన్నింటినీ గమనంలోకి తీసుకుంటే జిల్లాకు అదనంగా మరో ఎమ్మెల్సీ స్థానం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నం నరేందర్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే దీనికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఈ ఎన్నికను కూడా పునర్విభజన అనంతరం పెరిగే సీట్లతో చేస్తారా? గడువులోపు చేస్తారా? అనే అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టీకరించడంలేదు. కేంద్ర ప్రభుత్వం గురువారమే గెజిట్ ప్రకటించినందున.. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పరిశీలించిన తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, లోకల్‌బాడీ కోటాలో రెండు సీట్లు వస్తాయని గత కొంతకాలంగా భావిస్తున్న ఆశావహులు.. సీట్ల సంఖ్యపై మల్లగుల్లాలు పడుతున్నారు. బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 48 డివిజన్లు ఖాళీగా ఉన్నందున ఇప్పట్లో స్థానిక సంస్థల కోటా ఎన్నికలు జరిగే అవకాశంలేదని కొందరు అంటున్నారు. అయితే, మొత్తం సీట్లలో 50శాతం సీట్లు తక్కువగా ఉంటే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని, ఇక్కడ మాత్రం ఆ పరిస్థితిలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై సీఈసీ కసరత్తు ప్రారంభిస్తున్నందున సరికొత్త ప్రచారానికి తెరలేచింది. సీట్ల పునర్విభజన పూర్తయితే తప్ప ఎన్నికలుండవనే వాదన తెరపైకి వస్తోంది. -
ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో అవినీతి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామీణులకు రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణులకు తాగునీటిని అందించడం ఎలా ఉన్నా.. ఈ పథకం కింద చేయాల్సిన పనులు చేయకుండానే.. బిల్లులు స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పథకం కింద మంజూరైన పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తూ.. ఇష్టం వచ్చినప్పుడు టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ భారీగానే దోపిడీ సాగిస్తున్నారు. అధికారులు టెండర్ల ముగుసులో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీలో నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. ఇతర పథకాల నిధులతో పనులు పూర్తయిన తర్వాత.. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులతో పనులు చేసినట్లు రికార్డులుృసష్టిస్తున్నారు. చేయని పనులకు తప్పుడు రికార్డులు తయూరు చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. గ్రామాల్లో తాగు నీటికి తండ్లాట తప్పడం లేదు. ఒక పథకం కింద పనులు.. మరో పథకం కింద నిధులు.. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద దాదాపు రూ.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఎన్ని పనులు.. ఎక్కడెక్కడ చేశారనే సమాచారం ఈ విభాగం అధికారుల వద్ద లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఇతర పథకంలో చేపట్టిన పనులు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకంలో చేసినట్లు రికార్డులు సృష్టించి విషయం ఆలస్యంగా వెలుగు చూసిం ది. ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ) పరిధిలోని 13 మండలాల్లో జరుగుతున్న అక్రమాలకు అంతూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల ఐటీడీఏలో చేపట్టిన పనికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సుమారు రూ.5 లక్షలకు పైగా బిల్లుల రూపం లో చెల్లించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... ఏటూరునాగారం మం డలం షాపల్లిలో 2010లో ఐటీడీఏలోని ఇంజినీరింగ్ విభాగం ఏఆర్‌డబ్ల్యూఎస్ పథకంలో రూ. 2 లక్షల వ్యయంతో స్టాస్టిక్ ట్యాంకును నిర్మిం చింది. గ్రామంలో పైపులైను నిర్మించాలని వినతులు మేరకు ఐటీడీఏ అధికారులు 2010-11 లో ఎస్సీఏ గ్రాంటులో పైపులైన్ నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సుమారు 1200 మీటర్ల పైపులైన్‌ను గ్రామంలో నిర్మించి 32 నల్లాలను ఏర్పా టు చేశాడు. ఎస్సీఏ గ్రాంటుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ పనులు చేపట్టడంతో ఈ పనికి బి ల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా పోయా యి. చేసిన పనికి బిల్లులు రాకపోవడంతో సద రు కాంట్రాక్టర్ పైపులైన్‌ను కట్ చేసినట్లు తెలి సింది. ఈ పైపులైన్‌ను ఇతర పథకంలో చేపట్టినట్లు రికార్డులు సమర్పించి రూ.లక్షల బిల్లుల ను అధికారులు చెల్లించారని.. ఈ పని పూర్తి చే సిన కాంట్రాక్టర్ ఆరోపణలు చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంటోంది. ఒకే పనికి.. రెండు బిల్లులు! షాపెల్లిలోని కొత్తూరులో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్, పైపులైన్లు, నల్లాల నిర్మాణం కోసం ఎస్వీఎస్ పథకంలో భాగంగా 2011-12లో రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ ప నులకు 2013 ఆగస్టులో టెండర్ నిర్వహించా రు. 4.90 శాతం ఎక్కువ(ఎక్సెస్)తో కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఈ పనుల్లో భా గంగా ఓవర్ హెడ్ ట్యాంకును షాపల్లి కొత్తూరులో నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ముందుచూపుతో షాపల్లి పాత గ్రామంలోనే నిర్మించా డు. ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించి ఐటీడీఏ నిధులతో గతంలోనే నిర్మించిన పాత పైపులైన్లకు కనెక్షన్ ఇచ్చి నల్లాలను ప్రారంభించినట్లు తెలిసింది. ఈ పనులను అధికారులకు చూపెట్టి రూ.12 లక్షల వరకు బిల్లులు పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో 20 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్‌తోపాటు పైపులైను నిర్మిం చాల్సి ఉన్నా ఇదేమీ చేయకుండానే బిల్లులు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు నిధులు కేటాయించిన విధంగానే.. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ విభాగంలో చేపట్టే తాగు నీటి పనులకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ ఉప ప్రణాళిక(టీఎస్పీ), మైదాన ప్రాంతాల అభిృద్ధి సంస్థ(మాడా), డిజర్ట్ ట్రైబల్ గ్రూప్(డీటీజీ) వర్తించే గిరిజన గూడేలు, తండాల్లో ఈపనులు చేపడుతున్నారు. ఒకే పనిని ఒకే గ్రామంలో చేపడుతుండడంతో బిల్లులు రెండు శాఖల్లో చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
శ్రీవారి భక్తుల కోసం విమాన సర్వీసులు
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు సాక్షి, తిరుమల: దేశ, విదేశాల నుంచి తిరుమలకు వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం నూతన విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు తెలిపారు. ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి విమానాశ్రయంలో జూన్‌లోపు కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విభజన చట్ట ప్రకారం ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. హామీల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ విషయంలో కేంద్రంపై అభాండాలు వేయడం ప్రతిపక్షాలకు తగదని హితవు పలికారు. -
ఎల్పీజీ నగదు బదిలీలోకి 10 కోట్ల మంది!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంట గ్యాస్(ఎల్పీజీ) నగదు బదిలీ పథకంలోకి 10 కోట్ల మంది లబ్ధిదారులు చేరారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా ఈ స్కీం రికార్డు సృష్టించిందని తెలిపారు. ‘పహల్ యోజన’లోకి రెండు నెలల్లోనే 10 కోట్ల మంది చేరడం తనకు గొప్ప సంతోషం కలిగిస్తోందని ప్రధాని ట్వీటర్లో పేర్కొన్నారు. నగదు బదిలీ పథకంతో బ్లాక్ మార్కెటింగ్‌కు ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సమ్మె పాక్షికం
దేశంలోని బొగ్గు పరిశ్రమలను, బొగ్గు బ్లాక్‌లను దొడ్డిదారిన ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పేర్కొంటూ జాతీయ కార్మిక సంఘాలు మంగళవారం నుంచి చేపట్టిన సమ్మె సింగరేణిలో పాక్షికంగా జరిగింది. సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌తో పాటు ఆయా ఏరియాల్లో ప్రాతినిథ్య సంఘమైన హెచ్ఎంఎస్ దూరంగా ఉండటంతో సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. కార్మికులు యథావిధిగా ఉదయం షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యారు. కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేసేందుకు ఉదయమే గనుల వద్దకు చేరుకున్న జాతీయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విధులకు అంతరాయం కలుగకుండా గనులపై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని ఆయా గనుల్లో బొగ్గు ఉత్పత్తి కొనసాగింది. -గోదావరిఖని గోదావరిఖని: రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1 డివిజన్లో 66 శాతం, ఆర్జీ-2 డివిజన్లో 73 శాతం, ఆర్జీ-3 డివిజన్లో 75 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆర్జీ-1లో ఉదయం షిప్టులో 4,180 మందికి 2,738 మంది, ఆర్జీ-2లో 2,700 మందికి 1974 మంది, ఆర్జీ-3లో 1670 మందికి 1256 మంది, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాలో 1672 మందికి 979 మంది విధులకు వెళ్లారు. రెండవ షిప్టులో ఆర్జీ-1 ఏరియాలో 1313 మందికి 856 మంది, ఆర్జీ-2లో 905 మందికి 393 మంది, ఆర్జీ-3లో 1418 మందికి 1042 మంది విధులకు హాజరయ్యారు. బొగ్గు ఉత్పత్తిని పరిశీలిస్తే.. ఆర్జీ-1 ఏరియాలో 7,238 టన్నులకు 6,741 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 5,242 టన్నులను రవాణా చేయగలిగారు. నాయకుల అరెస్టు.. జాతీయ సంఘాల నాయకులు ఉదయమే గనులపైకి చేరుకొని కార్మికులను సమ్మెకు సమాయత్తం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు జీడీకే-1వ గని వద్ద విధులకు హాజరవుతున్న కార్మికులను అడ్డుకుంటున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, ఆర్జీ-1 అధ్యక్షుడు టి.నరహరిరావు, ఐఎన్టీయూసీ ప్రధానకార్యదర్శి ఎస్.నర్సింహారెడ్డి, నాయిని మల్లేశ్, ఏఐటీయూసీ ఆర్జీ-1 కార్యదర్శి మడ్డి ఎల్లయ్య, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇ.నరేష్‌లను అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టును నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ మూలమలుపు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇందులో వివిధ సంఘాలకు చెందిన నాయకులు వై.గట్టయ్య, టుంగుటూరి కొమురయ్య, ఎం.దయాకర్‌రెడ్డి, సదానందం, కృష్ణమూర్తి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు.. సమ్మె ఈనెల 10వ తేదీ వరకు కొనసాగనుండగా, గనులు, ప్రాజెక్టులపై పోలీసులను పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, భద్రయ్య తదితరులు పర్యవేక్షించారు. హెచ్ఎంఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వర్తించారు. సోమవారం రాత్రి పూట విధులకు హాజరైన 36 మంది ఈపీ ఆపరేటర్లను ముందు జాగ్రత్తగా ఓసీపీ-3 బేస్‌వర్క్‌షాప్‌లో అదుపులో ఉంచుకున్నారు. కానీ హాజరు శాతం పెరగడంతో వారిని సాయంత్రం పంపించివేశారు. 2013లో జరిగిన సకలజనుల సమ్మె తర్వాత జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వగా, దానికి కార్మికుల నుంచి ఆశించిన స్పందన కానరాలేదు. గుర్తింపు సంఘం సమ్మె విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడడం వల్లనే సమ్మె పాక్షికంగా జరిగిందని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. -
బోడోల మారణకాండపై ఎన్ఐఏ దర్యాప్తు
అస్సాంలో పర్యటించిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని ఆదేశం మరిన్ని బలగాలను మోహరిస్తామని వెల్లడి గువాహటి: అస్సాంలో ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు విచ్చలవిడిగా విరుచుకుపడి 81 మందిని బలిగొన్న మారణకాండపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల పరిధిలో స్థానిక పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్ఐఏ తన ఆధీనంలోకి తీసుకోనుంది. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ శనివారం అస్సాంలో పర్యటించారు. బాధిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలు, ప్రస్తుతమున్న బలగాల సంఖ్య, మరిన్ని అదనపు బలగాలను మోహరించే తదితర అంశాలపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు రక్షణ అందించడంతో పాటు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని.. ఇందుకోసం అవసరమైతే మరిన్ని బలగాలను పంపిస్తామని సూచించారు. బాధిత ప్రాంతాల్లో శాంతి తిరిగి నెలకొల్పేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, నిఘా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని, సాధ్యమైనంత సహకారం అందించాలని ఆర్మీ అధికారులకు సూచించారు. తర్వాత బాధిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్... అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్లారు. దర్యాప్తు ప్రారంభించనున్న ఎన్ఐఏ.. అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్‌ల సరిహద్దులోని సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో ఆదివాసీలపై బోడో తీవ్రవాదుల మారణకాండపై దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని అస్సాం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఘటనపై పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్ఐఏ తన అధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించనుంది. మరోవైపు బోడో తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ఆదివాసీ వికాస్ పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపుతో అస్సాంతో పాటు బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. -
ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
-
పంటరుణాల వడ్డీపై సబ్సిడీ కొనసాగింపు
కేంద్ర కేబినెట్ నిర్ణయం నాబార్డ్‌కు రూ. 4399 కోట్లు విద్యుత్ చట్ట సవరణకు ఓకే న్యూఢిల్లీ: స్వల్పకాలిక పంట రుణాల వడ్డీపై సబ్సిడీ సదుపాయాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 3 లక్షల వరకు రుణంపై సంవత్సరానికి 7% వడ్డీ, అలాగే 2014-15 సంవత్సరానికి రుణం తీసుకున్నవారు సమయానికి రుణం చెల్లిస్తే.. వారికి అదనంగా 3% వడ్డీ తగ్గింపు సదుపాయం అందించాలన్న ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. ఇందుకోసం రూ. 18,583 కోట్లను విడుదల చేసేందుకు అంగీకరించింది. అందులో రూ. 4,399 కోట్ల ఆర్థిక సాయాన్ని సహకార బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్స్ కోసం నాబార్డ్‌కు అందించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న చిన్న రైతులకు వడ్డీపై సబ్సీడీ ఇవ్వనున్నారు. కబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. ► లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామక కమిటీలో లోక్‌సభలో అత్యధిక స్థానాలున్న ప్రతిపక్ష పార్టీ నేతకు స్థానం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం. ► 500 మెగావాట్ల సామర్ధ్యంతో వివిధ రాష్ట్రాల్లో 25 సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు రూ. 4050 కోట్ల ఆర్థిక సాయం . ► మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం భూ బదిలీ వేగవంతంగా జరిగేలా చర్యలు. ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమికి ఇకపై నగదు పరిహారమే ► సంస్కరణలకు ఊతమిచ్చేలా విద్యుత్ చట్టంలో సవరణలకు అంగీకారం. ► చక్కెర మిల్లులకు శుభవార్త. ఇథనాల్ సేకరణ రేటును లీటరుకు రూ. 48.50 నుంచి రూ. 49.50 మధ్యగా నిర్ణయించారు. ► తమిళనాడులో రూ. 1593 కోట్లతో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం. -
ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
309 సెక్షన్ తొలగించాలని కేంద్రం నిర్ణయం లా కమిషన్ సిఫారసుకు 18 రాష్ట్రాలు అనుకూలం న్యూఢిల్లీ: ఆత్మహత్యాయత్నం ఇకపై నేరం కాబోదు. ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ చేసిన సిఫార్సుపై దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సానుకూలంగా స్పందించాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది. ఇది త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశముందని తెలిపింది. ఈ అంశంపై ఒక సభ్యుడి ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 309వ సెక్షన్‌ను రద్దు చేయాలని లా కమిషన్ తమ 210వ నివేదికలో సిఫారసు చేసింది. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున దీనిపై వారి అభిప్రాయం కోరాం. 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే 309వ సెక్షన్‌ను రద్దుచేసే అవకాశముంది..’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ సెక్షన్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదనను పలు రాష్ట్రాలు వ్యతిరేకించగా.. మరికొన్ని పలు సూచనలు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయకుండా, కొన్ని సవరణలు మాత్రం చేయాలని బిహార్ డిమాండ్ చేసింది. ఎవరైనా తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారు ఆత్మహత్యాయత్నం చేస్తే.. దానికి సంబంధించి వేరే చట్టాలు ఉండాలని సూచించింది. ఇక ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకపోతే... సెక్షన్ 306 (ఆత్మహత్యకు పురిగొల్పడం)ను బలహీన పరుస్తుందని మధ్యప్రదేశ్ స్పష్టం చేసింది. సిక్కిం కూడా లా కమిషన్ సిఫారసు పట్ల వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక 309 సెక్షన్‌ను రద్దుచేయడం పట్ల ఢిల్లీ సానుకూలంగానే స్పందించినా... సదరు ఆత్మహత్యాయత్నం ఘటనలను సంబంధిత అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువచ్చేలా, వారికి ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించింది. -
నేడు ఆటోల బంద్
రోడ్ సేఫ్టీ బిల్లు-2014పై నిరసన జేఏసీ నాయకుల స్పష్టీకరణ సుల్తాన్‌బజార్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్ సేఫ్టీ బిల్లు-2014కు నిరసన గా శుక్రవారం ఆటోల బంద్‌కు ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు బి.వెంకటేశం(ఏఐటీయూసీ), కిరణ్ (ఐఎఫ్టీయూ), వేముల మారయ్య (టీఆర్ఎస్కేవీ), అమానుల్లాఖాన్ (టీఏడీజేఏసీ)లు ఈ వివరాలు తెలిపారు. రోడ్ సేఫ్టీ బిల్లు-2014 మోటార్ రంగంలో ఉన్న కార్మికులకు శాపంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూవారీగా ఆటోలు నడిపేవారి బతుకు భారమై పోతుందన్నారు. 8వ తరగతి చదువుకున్న వారే ఆటోలు నడపాలనే నిబంధన, ఈ-చలాన్లతో పాటు జీవో 108 మేరకు చలాన్ ఒక్కసారి రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచడం వంటివి ఆటో డ్రైవర్లకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చలానా కనీస మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ నరహంతక చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, రాష్ట్ర రవాణా శాఖ అధికారుల ఆంక్షలు, దాడులకు నిరసనగా శుక్రవారం ఒక్క రోజు ఆటో బంద్ పాటి ంచనున్నట్టు వారు తెలిపారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు జరిగే భారీ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆటోడ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు కూడా పాల్గొంటారని వారు తెలిపారు. -
కేంద్రంపై పోరుకు కార్మికులు సిద్ధం కావాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, కేంద్రంపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని కార్మిక ఐక్య సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణలను వ్యతిరేకిస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శింగు నర్సింహారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్కె. ముక్తర్‌పాషా, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జలీల్, జిల్లా నాయకులు హనుమంతరెడ్డిలు మాట్లాడారు. దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తున్న మోడీ సంస్కరణాలను తిప్పికొట్టాలన్నారు. ధరలు పెంచి, సంక్షేమ కార్యక్రమాల్లో కోత విధించి కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తున్న కేంద్రప్రభుత్వ చర్యలపై సమరశంఖం పూరించాలని పిలుపుని చ్చారు. విష్ణువర్ధన్, మేకలసంగయ్య,వీరభద్రం, విజయ్‌కుమార్, నున్నామాధవరావు, వెంకటనారాయణల అధ్యక్షతన జరిగిన సదస్సులో నాయకులు గణపతి, సాంబశివరావు, వేణుగోపాల్, కుమారి, శ్రీనివాసరావు,అంజిరెడ్డి, క్లైమెంట్, సీతామహలక్ష్మి, రామారావు, వెంకటేశ్వర్లు, సత్యం, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉడా పాలకవర్గ సమావేశం
విజయవాడ : వీజీటీఎం ఉడా పాలకవర్గ సమావేశం శనివారం జరగనుంది. ఉడా రద్దవుతున్న నేపథ్యంలో జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. నగరంలోని లెనిన్ సెంటర్లో ఉన్న ఉడా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుతం ఉడా నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులు, విజయసిరి ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నారు. గతంలో ఉడా అధికారులు రూ.1,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూలంగా స్పందన వ్యక్తమైనా ఉడా స్వరూపం మారిపోవటంతో అవి మరుగున పడిపోయాయి. ఉడా ఆదాయ వనరులు, ఆస్తులు, ఇతర విషయాలను ఈ నేపథ్యంలో చర్చించనున్నారు. సమావేశంలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఇతర విభాగాల, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొననున్నారు. -
పంచాయతీలకు షాక్ !
చిలకలూరిపేటరూరల్: గ్రామాల పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఈనెల మూడవ తేదీన ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామస్తులు, సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలకు 112 మేజర్, 899 మైనర్‌గా ఉన్నాయి. అన్ని పంచాయతీలకు ప్రతి ఏటా రెండు విడతలుగా జనాభా ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సి వుంది. 13వ ఆర్థిక సంఘం నిధులు ఇలా... గ్రామ పంచాయతీలకు విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రోడ్లు, వీధి లైట్ల ఏర్పాటు, పంచాయతీ భవనం, మంచినీటి పథకాల నిర్వాహణ నిర్వహించాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపాదికన ఒక్కరికి రూ. 400 వంతున జిల్లాలోని 32,02,477 లక్షల మందికి నిధులను విడుదల చేస్తోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 128 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటై ఏడాది గడిచింది. ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం, స్టేట్‌ఫైనాన్స్ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతోంది. ఈ నిధుల్లో కోతలు విధించినా, దారి మళ్లించినా అభివృద్ధి ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంపై పంచాయతీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి పంచాయతీ నిధుల నుంచి 15 శాతం మాత్రమే విద్యుత్ అవసరాలకు వినియోగించాలి. అలా కాకుండా ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని ఆదేశించడంపై అధికారులు తటపటా ఇస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, మంచినీటి సరఫరా అవసరాలకు విద్యుత్ వినియోగంతో అక్టోబర్ చివరి వరకు రూ. 55.85 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. బకాయిలు వెంటనే చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, అయితే ప్రజల అవసరాల మేరకు ఇప్పటి వరకు కొనసాగించామని పేర్కొంటున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొలి విడతగా రూ. 25 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. గత నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పై నుంచి ఆదేశాలు జారీ చేశారు. - గ్లోరియా, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి, గుంటూరు ఇదీ బాబు భాష్యం... గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను త్వరలో కేంద్రప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులతో చెల్లించాలి. మిగిలిన వాటితో ప్రతి పంచాయతీలో ఒక్కో సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ నిధులు పూర్తిస్థాయిలో సమకూరని పక్షంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధిహామీ పథకంతో నిర్వహించాలి. - ఇటీవల గ్రామ పంచాయతీ అధికారులతో రాష్ట్ర సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలివి.. వాస్తవంగా ఇలా చెల్లించాలి.. గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలను పంచాయతీ అధికారులు పన్నులు వసూలు చేసి చెల్లించేవారు. ఇంటి పన్నుల వసూలులోనే వీధి దీపాల పన్ను ఉంటుంది. ఇంటి పన్నుల సమయంలోనే మంచినీటి కుళాయిల పన్నుల చెల్లింపులు ఉంటాయి. మంచినీటి సరఫరా అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామీణ మంచినీటి సరఫరా పథకం (ఆర్‌డబ్లుఎస్) అధికారులే నిధులు మంజూరు చేస్తారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వసూలు చేసిన నీటి కుళాయిల పన్నులను విద్యుత్ బకాయిలకు చెల్లించేవారు. బకాయిలు అధికంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు. ఉన్న నిధులన్నీ విద్యుత్ బకాయిలకేనా ? మైనర్ పంచాయతీగా ఉన్న మద్దిరాల గ్రామానికి 13వ ఆర్థిక సంఘం ద్వారా కేవలం లక్ష రూపాయలు మాత్రమే మంజూరవుతాయి. అందులో నుంచి విద్యుత్ బకాయిలు రూ. 52,912 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కొద్దిపాటి నిధులతో గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందా. ప్రత్యేక నిధులు కేటాయించకుండా ఉన్న నిధులను వీటితో వినియోగించటం భావ్యమేనా. - మాలెంపాటి త్రిపురాంబ, సర్పంచ్, మద్దిరాల బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి పేరుకు మేజర్ పంచాయతీ అయి నా అభివృద్ధి కార్యక్రమాలకు అదే తరహాలో నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎన్నికై సంవత్సరం పూర్తయినా అరకొర నిధులే వస్తున్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి జనాభా ప్రాతిపాదికన రూ 6.50 లక్షలు విడుదలవుతాయి. ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలు రూ 7.68 లక్షలు ఉన్నాయి. ఆ నిధులతో బకాయిలు చెల్లిస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేదెలా.బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తే పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమే. - కొమ్మనబోయిన దేవయ్య, సర్పంచ్, మురికిపూడి -
ఇక బాదుడే..
ఆదిలాబాద్ క్రైం : నేటి యువతరం రయ్‌మని రోడ్లపైకి దూసుకెళ్లడం.. ప్రమాదాలకు గురికావడం పరిపాటి. ప్రస్తుతం కుర్రకారు స్పీడుకు బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్త చట్టం తెస్తోంది. వాహనం తీసి రోడ్లపైకి రావాలంటేనే భయపడేలా చట్టానికి పదును పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఈ చట్టం ద్వారా భారీగా జరిమానా విధించి కొరడా ఝులింపించాలని భావిస్తోంది. అంతా పెద్ద మొత్తంలో జరిమానా కట్టేదానికన్నా.. అన్ని పత్రాలు ఉంటేనే వాహనం రోడ్డుపైకి తీద్దాం అనే భయాన్ని నెలకొల్పనుంది. ఇప్పటి వరకు చిన్నపాటి జరిమానాలతో సరిపెట్టి.. స్పెషల్ డ్రైవ్‌ల పేరుతో హల్చల్ చేసినా.. వాహ నదారుల్లో పెద్ద మార్పులేవి రావడం లేదు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లెసైన్సు లేకుండా యువకులు విచ్చలవిడిగా బైకులపై రయ్మంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కాలరాస్తూ.. ట్రాఫిక్ సిగ్నల్స్‌లను తెంచేస్తూ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదే ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టం తీసుకురానుంది. వేలల్లో జరిమానా.. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే ఇకపై భారీ జరిమానా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టానికి రూపకల్పన చేస్తోంది. దీని ప్రతిపాదనల ముసాయిదాను ( డ్రాప్ట్బిల్లు ) అభ్యంతరాల కోసం రాష్ట్రానికి పంపింది. దీని ప్రకారం డ్రైవింగ్ లెసైన్సు లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు, ద్విచక్రవాహనం నడిపే వారికి హెల్మెట్ లేకపోతే రూ.500, పత్రాలు లేకుండా నడిపితే రూ.500, ఇన్సురెన్స్ లేకుంటే రూ.10 వేల జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. నాలుగు చక్రాల వాహనాలను బెల్టు లేకుండా నడిపితే రూ.వెయ్యి, ఇన్సురెన్సు లేకపోతే రూ.10 వేలు, పత్రాలు లేకపోతే రూ.5 వేలు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేల చొప్పున జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మూడు సార్లు పట్టుబడితే వాహనాలు జప్తు లేదా.. లెసైన్సుల రద్దు చేస్తారు. ఇంతటి కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తే వాహనదారుల్లో భయం ఏర్పడి.. నిబంధనల ప్రకారం నడుచుకుంటారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో అమాయకులు బలవుతున్నారు. వాహన చట్టాలు కఠినంగా లేకపోవడం, వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెసైన్సు లేకుండా వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకుండా వేగంగా వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే వారిలో భయంలేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు. అదే విదేశాల్లో వాహన చట్టాలు కఠినంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ కఠినమైన చట్టాలతో అరెస్టులు చేయడం లాంటి చర్యలతో వాహనదారుల్లో భయం ఏర్పడి నిబంధనల మేరకు డ్రైవింగ్ జరుగుతుందనే భావన ఉంది. ఇప్పుడే మన దగ్గర కూడా అది అమలవుతే రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశాలు లేకపోలేదు. -
ఉపాధి పోతే ఎలా?
జిల్లాలో 2008లో జాతీయ ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదికి సుమారు రూ.200 కోట్లు చొప్పున ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల పనులు జరిగాయి. ఇందులో ఏటా 1.50 లక్షల నుంచి 2.75 లక్షల మందికి వందరోజుల పనిదినాలు పనులు కల్పించారు. అలాగే మరో 40 వేల మంది వికలాంగులకు ఉపాధి కల్పించారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ పాలనలో ప్రజలకు ఒక్కో పథకం దూరమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అభివృద్ధి నిధులను సైతం దారి మళ్లించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం దూరం కానుందని ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే జాబితాలో నెల్లూరుకు చోటు దక్కకపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వలస నివారణ కోసం గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో వేలాది మంది ఉపాధి పొందేవారు. అయితే ఈ పథకాన్ని కేవలం కరువు పీడిత ప్రాంతాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఆయా జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా 200 జిల్లాలను ఉపాధిహామీ పథకం నుంచి దూరం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఒకటని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. అదే జరిగితే జిల్లాలో సగ భాగం ప్రాంతాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరుపేద కుటుంబాలు రెండు లక్షలు జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల కుటుంబాలు ఉంటే.. అందులో రెండు లక్షలకుపైగా నిరుపేద కుటుంబాలున్నాయి. మరో 2.50 లక్షలకు పైగా మధ్యతరగతి కుటుంబాలున్నాయి. ఇకపోతే జిల్లాలో సుమారు నాలగు లక్షల ఎకరాలకుపైగా వర్షాధారంపై ఆధారపడి ఉంది. ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాం పురం, మర్రిపాడు, దగదర్తి, వెంకటగిరి, డక్కిలి, రాపూరు తదితర మండలా ల్లో వేసిన పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేదు. కావలి పరిధిలో కాలువలు న్నా.. ప్రతి ఏటా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఏటా పంటలు సాగు చేయడం, వర్షాలు లేక ఎండిపోవడం జరుగుతూనే ఉంది. దీంతో ఈ ప్రాంతా ల నుంచి వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. ఏటా కరువు పీడిత ప్రాంతా ల నుంచి సుమారు 20 వేల నుంచి 30 వేల మంది జనాభా వలసలు వెళ్తుం టారు. వీరంతా ఇతర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు, తమలపాకులు కోసే పను ల్లో, ఇళ్ల నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుం టారు. ఈ వలసల నివారణ కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ద్వారా ఉపాధి పొందేందుకు జిల్లాలో 5.20 లక్షల మందికి జాబ్‌కార్డులు ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించింది. అయినా వలసలు మాత్రం ఆగలేదు. నివేదికల్లో ఏముంది? కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా నుంచి అధికారులు నివేదిక ఏమని ఇచ్చారనేది తెలియరాలేదు. అయితే అధికారుల కొందరు జిల్లాలో ఆరు మండలాల్లో మాత్రమే కరువని నివేదిక పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే జిల్లాకు ఉపాధి హామీ పథకం దూరమయ్యే అవకాశం ఉందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఆరు మండలాల కోసం జిల్లా అంతటా ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే జిల్లాలో సగభాగం మంది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోక తప్పదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకులు, అధికారులు స్పందిం చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రచారం జరుగుతోన్న మాట వాస్తవం : గౌతమి, డ్వామా పీడీ ఉపాధిహామీ పథకం నెల్లూరు జిల్లాకు ఉండదనే ప్రచారం వాస్తవమే. మాకు అధికారికం గా ఎటువంటి ఆదేశాలు అందలేదు. ప్రభుత్వం మాత్రం జిల్లా పరిస్థితులపై నివేదికలు అడిగిన మాట కూడా వాస్తవమే. -
ఆర్టీసీని కేంద్రం ఆదుకోవాలి
విజయవాడ : రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడే లోటు బడ్జెట్‌ను భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఈ మేరకు విడిపోవడం వల్ల నష్టపోయిన ఏపీఎస్ ఆర్టీసీని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సమావేశం ఆదివారం స్థానిక సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని నాడార్స్ ఫంక్షన్ హాలులో జరిగింది. తొలుత యూనియన్ జెండాను సారథి ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం, భూస్థాపితం చేయడంలో చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు మరెవరికీ లేవని విమర్శించారు. గతంలో డెయిరీలను నిర్వీర్యం చేసి సొంత డెయిరీని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆర్టీసీని దెబ్బతీసి ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ ఉద్యోగులను దశలవారీగా ఇంటికి పంపాలని చూస్తే, టీడీపీని ప్రజలే సాగనంపుతారని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎంవీ టాక్స్‌ను 15 శాతం పెంచి ఆర్టీసీని ఆర్థికంగా నష్టపోయేలా చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 2004లో బాధ్యతలు స్వీకరించిన వైఎస్సార్ ఎంవీ టాక్స్‌ను ఏడు శాతానికి తగ్గించి ఆర్టీసీకి మేలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లను ప్రోత్సహిస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని కాపాడుకుంటాం : గౌతమ్‌రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ రూ.2వేల కోట్ల నష్టాల్లో ఉందని చెబుతూ ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి విమర్శించారు. ఆర్టీసీకి రూ.12వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని, మార్కెట్ విలు ప్రకారం వాటి ధర రూ.30వేల కోట్లకు పైగా ఉంటుందని ఆయన వివరించారు. ఆర్టీసీ ప్రైవేటుపరం కాకుండా వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ తరఫున పోరాటాలు చేసి కాపాడుకుంటామని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ యూనియన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఎ.రాజిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీకి టాక్స్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనధికార ప్రైవేట్ ఆపరేటర్లను నియంత్రించి ఆర్టీసీకి మేలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో యూనియన్ను బలోపేతం చేసి ఆర్టీసీ వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి పీవీ రమణ, కోశాధికారి సీవీఎస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్, నేతలు ఎంబీఎల్ శాస్త్రి, పి.రవికాంత్, 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అందరికీ ఇళ్లు
గుజరాత్ స్ఫూర్తితో అమలుకు శ్రీకారం ఇళ్ల సంఖ్య, స్థల లభ్యతపై సర్వే చేపట్టాలని ఆదేశం త్వరగా నివేదిక ఇవ్వాలనిపురపాలక సంఘాలకు సూచన సాక్షి ప్రతినిధి, వరంగల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అందరికీ ఇళ్లు-2022 పథకం అమలు కసరత్తు వేగంగా సాగుతోంది. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా సొంత ఇళ్లు లేని పేదలు, వారికి అవసరమైన ఇళ్ల సంఖ్య, భూముల లభ్యత వంటి అంశాలతో సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు అందాయి. త్వరగా ఈ నివేదికలు రూపొందించి పంపించాలని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల కమిషనర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఈ మేరకు జిల్లా అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఆయూ ప్రాంతంలో ఎన్ని కాలనీలు ఉన్నాయి ? ఏ స్థితిలో ఉన్నాయి ? ఎంతమందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందనే అంశాలపై సర్వే చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయూలి. పథకం ఉద్దేశం దేశంలోని పేదలకు 2022లోపు సొంత ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చేపట్టిన ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. దేశంలో సొంత ఇల్లు లేని వారి సంఖ్య కచ్చితంగా ఎంత ఉంటుందనేది తేల్చేందుకు కేంద్రం ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. అల్పాదాయ, నిరుపేదల్లో 95 శాతం మందికి సొంతిళ్లు లేవని ఈ సర్వేలో తేలింది. సొంత ఇల్లు లేని వారి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇల్లులేని వారిని కేంద్రం నాలుగు కేటగిరీలు (మురికివాడల్లో నివసించే పేదలు, మురికివాడలు కాని ప్రాంతాల్లో నివసించేవారు, పూర్తిగా నిరాశ్రయులు, వలసకాలనీల్లో నివసిస్తున్నవారు)గా విభజించింది. ఈ నివాస ప్రాంతాల్లో కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థలాల్లో ఉండగా మరికొన్ని ప్రైవేట్ స్థలాల్లో ఉన్నాయి. కొన్ని అనుమతి లేని ప్రాంతాల్లో ఉన్నాయి. పేదలు ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లోనే వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. లేనిపక్షంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాల పాలక మండళ్లు పంపించే నివేదిక తర్వాత జాతీయ స్థాయిలో దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. తీరనున్న కష్టాలు గ్రేటర్ వరంగల్ జనాభా 8.20 లక్షలు ఉండగా... ఇప్పటివరకు రాజీవ్ ఆవాస్ యోజన కింద కేవలం 576 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కా గృహాలు నిర్మిస్తున్నారు. రెండో విడతలో మీరా సాహేబ్కుంట, గాంధీనగర్ ఎంపికయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కానీ, అధికారిక లెక్కల ప్రకారమే నగరంలో 183 మురికివాడలుగా ఉండగా... ఇందులో 3.30 లక్షల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఎంతమాత్రం నివాసయోగ్యం కాని చెరువు ముంపు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో 31 కాలనీలు విస్తరించగా, ఇక్కడ లక్షలకు పైగా జనాభా నివసిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం అందుబాటులోకి వస్తే మురికివాడల్లో నివసించే ప్రజల కష్టాలు గట్టెక్కినట్లే. -
జాతీయ సమైక్యతా దినంపై వివాదం!
పటేల్ జయంతిని సమైక్యతా దినంగా ప్రకటించిన కేంద్రం ఇప్పటికే ఇందిర జయంతిని ఈ రోజుగా పాటిస్తున్న దేశం న్యూఢిల్లీ/ముంబై: ఉక్కుమనిషి, దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19ని ఇప్పటికే జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారే అవకాశముంది. పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినంగా(రాష్ట్రీయ ఏకతా దివస్)గా నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతముందు ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబైలో విలేకర్లతో మాట్లాడుతూ.. పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న ‘జాతీయ సమైక్యతా పరుగు’ (రన్ ఫర్ యూనినిటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పటేల్ సందేశాన్ని ఘనంగా చాటేందుకే దీన్ని చేపడుతున్నామని, ఇందులో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొంటారని తె లిపారు. ‘సర్దార్ పటేల్ దేశానికి చేసిన నిరుపమానమైన సేవల గురించి నేటి సమాజానికి అవగాహన తక్కువే. ఇది చాలా దురదృష్టకరం. ఇటీవలే నేను పదో తరగతి చరిత్ర పుస్తకాన్ని చూశాను. అందులో పటేల్ ప్రస్తావనే ఒకే ఒక్కసారి ఉంది’ అని అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక 1947-1949 మధ్య పటేల్ 500 సంస్థానాలను దేశంలో విలీనం చేశారని, దీన్ని సంస్మరించుకునేందుకే జాతీయ సమైక్యతా దినం పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
కేంద్రం ‘స్పాట్’!
రూ. 5,600 కోట్ల చెల్లింపుల స్కామ్‌పై.. * ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో ఎన్ఎస్ఈఎల్ విలీనం * కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశం... * ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమేనని వెల్లడి * ఎన్ఎస్ఈఎల్ చెల్లింపులు, అప్పులనూ ఎఫ్టీఐఎల్ భరించాల్సిందేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. జిగ్నేశ్ షా నేతృత్వంలోని మాతృసంస్థ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) గ్రూప్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను విలీనం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కామ్‌లో చిక్కుకొని నష్టపోయిన ఇన్వెస్టర్లు, బ్రోకర్ల సొమ్మును తిరిగి ఇప్పించడం, వాళ్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది. కాగా, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని.. దీనిపై తమ న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని ఎఫ్టీఐఎల్ పేర్కొంది. ఇక బాధ్యతంతా ఎఫ్టీఐఎల్దే... ఎన్ఎస్ఈఎల్ బకాయి పడిన చెలింపులతో పాటు ఆ కంపెనీ రుణాలన్నింటికీ ఎఫ్టీఐఎల్ బాధ్యత వహించాల్సిందేనని ఆదేశాల్లో కేంద్రం తేల్చిచెప్పింది. ఎస్ఎస్ఈఎల్ మొత్తం వ్యాపారం, ఆస్తులు ఇతరత్రా అన్నీకూడా ఎఫ్‌టీఐఎల్‌కు బదిలీఅవుతాయి. ప్రజా ప్రయోజనాల రీత్యాప్రైవేటు రంగ కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న కంపెనీల చట్టంలోని సెక్షన్ 396(నిబంధన-క్లాజ్)ను ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ప్రయోగించింది. ఈ క్లాజ్‌ను చాలా అరుదుగా మాత్రమే ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. కాగా, 2009లో సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణం తర్వాత మళ్లీ ఒక ప్రైవేటు కంపెనీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దాదాపు ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అయితే, సత్యం కేసు లో ఆ కంపెనీని థర్డ్‌పార్టీ(టెక్ మహీంద్రా)కి వేలం ద్వారా విక్రయిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అన్నీ పరిశీలించాకే... ఏడాది కాలంగా పెండింగ్‌లోఉన్న బకాయిల రికవరీ, చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ చేతులెత్తేసిందని.. దీంతో తగిన వనరులున్న ఎఫ్‌టీఐఎల్‌లో విలీనం చేయడంద్వారా చెల్లింపులను వేగంగా రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 2013 నాటికి ఎన్ఎస్ఈఎల్ నెట్‌వర్త్ రూ.175.76 కోట్లుగా అంచనా. విలీనానికి సంబంధించి విధివిధానాలన్నీ పాటిస్తామని.. ఇరు కంపెనీల వాటాదారులు, రుణదాతలు తమ అభ్యంతరాలు/సూచనలను 60 రోజుల్లోగా వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ముఖ్యంగా కంపెనీల చట్టం-1956లోని పలు నిబంధనలను ఇరు కంపెనీలూ ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని.. అంతేకాకుండా ఎఫ్టైఎల్, దాని కీలక యాజమాన్య వ్యక్తుల నియంత్రణలో ఎన్ఎస్ఈఎల్ నడిచిందన్న విషయం కూడా వెలుగుచూసినట్లు కార్పొరేట్ వ్యవహరాల శాఖ ముసాయిదా ఆదేశాల్లో తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఏవైనా కేసులు నమోదుకావాలన్నా, లేదంటే ఎలాంటి చట్టపరమైన చర్యలైనా ఎఫ్టీఐఎల్పైనే ఫైల్ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల ఆనందం... ఇదిలాఉండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ల ఫోరం(ఎన్ఐఎఫ్) స్వాగతించింది. చెల్లిం పులు నిలిచిపోయిన 13,000 మంది ఇన్వెస్టర్లు కలసి ఈ ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఎన్ఐఎఫ్ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షేరు క్రాష్: ప్రభుత్వ విలీన ఆదేశాల వార్తలతో ఎఫ్టీఐఎల్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 20 శాతం కుప్పకూలి లోయర్ సర్కూట్‌ను తాకింది. రూ.169.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.200 కోట్ల మేర ఆవిరైంది. రూ.781.72 కోట్లకు దిగజారింది. -
డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేత
లీటర్‌కు రూ. 3.37 తగ్గిన ధర శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. ఇకపై అంతర్జాతీయ ధరలకు తగ్గట్టు ధర సహజవాయువు ధర 46 శాతం పెంపు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, చమురు కంపెనీలు లాభాల బాటలోకి ప్రవేశించడంతో డీజిల్ ధరలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. దీంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా లీటర్ డీజిల్‌పై రూ. 3.37 పైసలు ధర తగ్గింది. కొత్త ధర శనివారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించినట్టు చెప్పారు. దీనివల్ల సామాన్యులపై ఎటువంటి భారం పడబోదన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయడంతో వచ్చే నెల నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలు ఉండబోతున్నాయి. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 58.97 నుంచి రూ. 55.60కి తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 64.27 నుంచి రూ. 60.60కు, వరంగల్‌లో రూ. 63.90 నుంచి రూ. 60.24 కు తగ్గింది. ఐదేళ్లలో ఇదే తొలిసారి.. ఐదేళ్ల కాలంలో డీజిల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. ఆఖరిసారిగా 2009 జనవరి 29న డీజిల్ ధరను రూ. 2 మేరకు ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబర్1న చివరిసారిగా డీజిల్ ధరను 50 పైసల చొప్పున పెంచారు. 2013 జనవరి నుంచి ఇప్పటి వరకూ 19 సార్లు డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోవడంతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సుమారు 25 శాతం తగ్గి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లకు పరిమితమైంది. ఇప్పట్లో ఇది వంద డాలర్లను దాటే అవకాశం లేదని పరిశ్రమ వర్గాల అంచనా. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. గత ఏడాది జనవరిలో ప్రతినెలా 50 పైసల చొప్పున డీజిల్ ధరను పెంచాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఐదు సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. దీంతో రెండు నెలల్లోనే పెట్రోల్ ధర రూ. 7 మేరకు తగ్గింది. డీజిల్ విషయానికి వస్తే సెప్టెంబర్ రెండో వారం నాటికే కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. లీటర్‌కు రూ. 3.56 చొప్పున డీజిల్‌పై లాభాలను ఆర్జిస్తున్నాయి. తాజాగా డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడంతో ఇకపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ చమురు సంస్థలు డీజిల్‌పై ఎలాంటి సబ్సిడీని అందించవు. డీజిల్ ధరల నుంచి చమురు కంపెనీలకు ఉపశమనం లభించినా కిరోసిన్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి. లీటర్ కిరోసిన్‌పై రూ. 31.22, 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 404.64 చొప్పున కంపెనీలు నష్టపోతునున్నాయి. పెరిగిన సహజవాయువు ధర...మరోవైపు సహజవాయువు ధరను 46 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు ధర నవంబర్ 1 నుంచి 6.17 డాలర్లకు చేరనుంది. ఈ గ్యాస్ ధరను రెట్టింపు చేయాలన్న రంగరాజన్ కమిటీ సిఫార్సుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టి, కొత్త ఫార్ములా కింద ధర నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ, ముఖేష్ అంబాని నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షించనుంది. దీనిపై తదుపరి సమీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 1న చేపడుతుంది. సహజవాయువు ధరను పెంచడంతో సీఎన్జీ ధర కేజీకి రూ. 4.25 చొప్పున, పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే వంట గ్యాస్ ధర రూ. 2.60 చొప్పున పెరగనుంది. కాగా గ్యాస్ ఆధారిత విద్యుత్, ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. కేజీ డీ6లోని ధీరుబాయ్ అంబానీ 1, 3 గ్యాస్ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఆర్ఐఎల్ కొత్త గ్యాస్ ధరను పొందలేదు. ఆర్ఐఎల్ కస్టమర్లు కొత్త ధరను చెల్లించినా.. ఆర్ఐఎల్కు 4.2 డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గెయిల్ నేతృత్వంలోని గ్యాస్ పూల్ ఖాతాలో జమ చేస్తారు. నిబంధనల మేరకు గ్యాస్‌ను ఉత్పత్తి చేసిన తర్వాత మాత్రమే ఆర్ఐఎల్ కొత్త ధరను పొందగలుగుతుంది.మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ భవనాలను స్మారక చిహ్నాలుగా మార్చరాదని కేంద్రం నిర్ణయించింది. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్ తన తండ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ నివసించిన బంగళాను స్మారక చిహ్నంగా మార్చాలని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ జయంతి, వ ర్ధంతి వేడుకలను ఇకపై కేంద్రమే నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మళ్లీ నగదు బదిలీ.. యూపీఏ హయాంలో అమలు చేసిన వంట గ్యాస్‌కు నగదు బదిలీని తిరిగి అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకూ దేశంలోని 54 జిల్లాల్లో వంట గ్యాస్‌కు నగదు బదిలీని అమలు చేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. పాత పథకంలో ఉన్న లోపాలను సవరించి తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఆధార్‌కార్డు లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ నేరుగా నగదు బదిలీ చేస్తామని జైట్లీ చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేని వారికి మాత్రం కొంత కాలం పాటు పాత పద్ధతిలోనే గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు. వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. జనధన యోజన పథకం కింద ఇప్పటి వరకూ 6.02 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్టు చెప్పారు. -
చెరువులను అనుసంధానించండి
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి హరీశ్‌రావు విజ్ఞప్తి న్యూఢిల్లీ: దేశంలోని నదులను అనుసంధానించడంతో పాటు చెరువుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. నదుల అనుసంధానంతో పోలిస్తే చెరువుల అనుసంధానం తక్కువ సమయంలోనే పూర్తవడంతోపాటు ప్రజలకు సత్వర ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)’ నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని.. తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు ప్రతిపాదనలు చేశారు. అనంతరం సాయంత్రం ఉమాభారతితో, కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్గంగ్వార్తో వేర్వేరుగా సమావేశమై పలు విజ్ఞప్తులు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేయొద్దు.. దేశంలోని నదుల అభివృద్ధితో పాటు హిమాలయ, ద్వీపకల్ప నదుల అనుసంధానంపై చర్చలో తెలంగాణ తరఫున పలు అంశాలను కేంద్రం దృష్టికి తెచ్చామని హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ సాగునీటి అవసరాలు తీరకుండా నీళ్లను పక్క ప్రాంతాలకు మళ్లించడానికి అంగీకరించబోమని స్పష్టం చేశామన్నారు. నదుల అనుసంధానానికి పదేళ్లకుపైగా పడుతుండగా చెరువుల అనుసంధానం ఏడాదిన్నరలోగా పూర్తిచేయొచ్చని అన్నారు. జాతీయ హోదా ఇవ్వాలి.. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర అనుమతులు వెంటనే వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు హరీశ్ వెల్లడించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, జాతీయ హోదా ఇస్తామని మంత్రి సలహాదారుడు వెదిరె శ్రీరాం సమక్షంలో హమీ ఇచ్చినట్టు తెలిపారు. భూగర్భజలాలను పెంపులో భాగంగా చెరువుల పునరుద్ధరణకు రూ. 248 కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని కోరగా.. పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టులో ఏఐబీపీ వాటా కింద తెలంగాణకు రావాల్సిన రూ. 112 కోట్లను విడుదల చేయాలని కోరగా ఆదేశాలిచ్చారని చెప్పారు. సీసీఐ కేంద్రాలు పెంచండి.. తెలంగాణలో వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను హరీశ్ కోరారు. తక్షణమే 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తమ ముందే సీసీఐ చైర్మన్‌ను ఆయన ఆదేశించారని చెప్పారు. పత్తికి రూ. 4,050 మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరగా దానికి మంత్రి హామీ ఇచ్చారని హరీశ్ చెప్పారు. -
సిగరెట్ ప్యాకెట్లపై 85% స్థలంలో హెచ్చరికలు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. పొగతాగటం వల్ల అనర్థాలపై సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను తప్పనిరిగా ముద్రించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పొగాకు ఉత్పత్తుల తయారీ కంపెనీలు సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. సిగరెట్ల తయారీ కంపెనీలు ప్యాకెట్లపై దీనికి అనుగుణంగా మార్పులు చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు గడువు ఇవ్వనున్నారు. -
స్కిల్ డెవలప్మెంట్కు.. మరో కొత్త పథకం
స్కిల్ గ్యాప్ అనే మాట తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లోనూ యువతకు వృత్తి విద్య నైపుణ్యాలు అందించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లకు అదనంగా రూపొందిస్తున్న ఈ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు కానున్నట్లు సమాచారం. ఈ కొత్త పథకం మల్టీ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యంగా ఉంటుందని ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగావకాశాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలు లభిస్తాయని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ నిర్వహణకు జర్మనీ సహకారం తీసుకోనున్నారు. యూనివర్సిటీల్లో ‘యోగా’ క్లాసులు తప్పనిసరి నిరంతరం అకడమిక్స్ అభ్యసనంలో తలమునకలై ఉంటున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా యోగా క్లాసులు నిర్వహించాలని అన్ని యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. పాజిటివ్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా యోగా సెషన్స్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ సందర్భంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ యోగా క్లాస్‌లకు ఉపక్రమించినప్పటికీ.. ప్రమోషన్ ఆఫ్ యోగా ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్ అండ్ పాజిటివ్ హెల్త్ ఇన్ యూనివర్సిటీస్ అనే పథకాన్ని పదకొండో పంచవర్ష ప్రణాళికలోనే సిఫార్సు చేశారు. కానీ ఇంతవరకు అమలు కాలేదు. -
వచ్చేస్తోంది.. నాలుగేళ్ల డిగ్రీ
మంచిర్యాల సిటీ : ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలు చేయనుంది. దీంతో ఇంతకాలం మనుగడలో ఉన్న మూడేళ్ల డిగ్రీ కోర్సు కనుమరుగు కానుంది. ఇటీవల నిర్వహించిన వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుం ది. ఇప్పటివరకు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల కాల వ్యవధి మూడేళ్లుగా ఉంది. 2015-16 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులను నాలుగేళ్లపాటు నిర్వహించడానికి అవసరమైన చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. కరిక్యులం రూపకల్పనకూ వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఈడీ, ఎంఈడీ ఏడాది కోర్సులను కూడా రెండేళ్లకు పెంచుతూ ఈపాటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాలవ్యవధి పొడిగింపు ఎందుకంటే.. మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను నాలుగేళ్లకు పొడిగించడం వెనుక విద్యాప్రమాణాల పెంపే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులే ఉన్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులతో విదేశాలకు ఉద్యోగానికి వెళ్లిన మన విద్యార్థులు ప్రతిభా పరీక్షల్లో వెనుకబడిపోతున్నారు. బీకాం డిగ్రీ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది. అయితే ఇలాంటి ఉపాధినిచ్చే మూడేళ్ల డిగ్రీ కోర్సుతో మన విద్యార్థులు ముందుకెళ్లలేకపోతున్నారు. మూడేళ్ల సైన్స్ డిగ్రీ చేసిన విద్యార్థులు రెండేళ్ల రెగ్యులర్ పీజీ కోర్సులోని ఒత్తిడిని తట్టుకోలేక రాణించలేకపోతున్నారు. ఒకవేళ పీజీ కోర్సులో బయట పడినా పీహెచ్‌డీకి దూరమవుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చదివినవారు కానరావడం లేదు. పీహెచ్డీ పూర్తిచేసిన వారిని డిగ్రీ అధ్యాపకులుగా, సహాయక ప్రొఫెసర్లుగా నియమించుకుందామంటే.. యూనివర్సిటీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చదివినవారు దొడ్డి దారిన ఉద్యోగం, పదోన్నతులు పొందుతున్నారు. దూర విద్య ద్వారా డిగ్రీ చదివిన వారికి న్యాయవిద్య కోర్సుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో ఈ సమస్యలకు కొంత చెక్ పడనుంది. అంతేకాకుండా నిరుద్యోగుల సంఖ్య వేగంగా పెరగడానికి అవకాశం ఉండదు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థి మాత్రమే నాలుగేళ్లపాటు కళాశాలలో ఉంటాడు. తట్టుకోలేని విద్యార్థి మధ్యలోనే మానేసే అవకాశాలు ఉన్నాయి. పరిశోధనలకు అవకాశం ఇంజినీరింగ్ నాలుగేళ్లు, వైద్య విద్య ఐదేళ్లు, బీకాం, బీఎస్సీ(ఆనర్స్) నాలుగేళ్లు చదవాలి. ఈ కోర్సులన్నింటికీ చివరి సంవత్సరంలో ప్రాజెక్టు కోర్సు(పరిశోధన) తప్పనిసరి ఉంటుంది. మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు ఏ ప్రాజెక్టు ఉండదు. దూరవిద్య ద్వారా అనేక మంది డిగ్రీ పట్టాతో ముందుకొస్తున్నారు. త్వరలో అమలుకానున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో చివరి ఆరు నెలలు ప్రాజెక్టు కోర్సుగా అమలు చేయనుండడంతో పీజీ, పీహెచ్‌డీలో విద్యార్థులు ప్రతిభావంతులుగా తయారవుతారు. పైకోర్సుల్లో వారిపై ఒత్తిడి ఉండదు. డిగ్రీలో పరిశోధనలకు అవకాశం ఉంటే ఇంజినీరింగ్ విద్యార్థులతో సమానంగా రాణిస్తారనేది కేంద్రం ఆలోచన. -
పునరాలోచిస్తా: ఉద్ధవ్
సాక్షి ముంబై: కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగుతామని ప్రకటించి 24 గంటలు గడవకముందే శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే మాటమార్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత ఎన్డీఏలో నుంచి బయటపడే విషయంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు కలిసిపోటీ చేశాయి. కేంద్రంలో శివసేనకు చెందిన అనంత్ గీతేకు మంత్రి పదవి దక్కింది. కానీ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై విభేదాలు ఏర్పడడంతో బీజేపీ, శివసేనలు విడిపోయిన అనంతరం కేంద్ర మంత్రికి అనంత్ గీతే రాజీనామా చేస్తారని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శివసేన బయటపడుతుందని ఉద్దవ్ ఠాక్రే సోమవారం ప్రకటించారు. అయితే మాతోశ్రీలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఈ విషయంపై కూడా మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి బయటపడే విషయంపై పునరాలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన కేంద్రంలో మాత్రం అధికారం కోసం ఆ పార్టీతో అంటకాగుతోందని ఎంఎన్ఎస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే విమర్శించడంతో ఉద్ధవ్ స్పందించి అనంత్ గీతే రాజీనామా చేస్తారని ప్రకటించారు. కానీ తన నిర్ణయంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమిని ప్రజలు ఎన్నుకొని కేంద్రంలో అధికారం ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైదొలగితే ప్రజల తీర్పును వమ్ము చేసినట్లవుతందని అన్నారు. అందువల్ల పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను శివసైనికుడనని, నాయకుడు ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని అనంత్ గీతే ఢిల్లీలో ప్రకటించారు. -
ఏవీ..ఆ కాంతులు
ఆతిథ్యమిచ్చినా.. ఒక్కటే మిగిలింది! విజ్ఞాన ప్రదర్శనలో తుస్సుమన్న జిల్లా ఇన్స్పైర్ చేయలేని విద్యాశాఖ ఆ ఒక్క రోజు హడావుడే ముంచిందా? పథకం : విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచాలి. వారిలో దాగివున్న సృజనాత్మకతను, విజ్ఞానాన్ని వెలికి తీయాలి. సైన్స్ పురోభివృద్ధి వైపు ముందడుగు వేసేలా పోత్సహించాలి. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల్ని ప్రవేశపెట్టింది. నిధులు : ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోంది. ప్రతి పాఠశాలలో ఒకరిని, ఉన్నత పాఠశాలలయితే ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం వారెంట్(ప్రోత్సాహకం) అందిస్తుంది. ఫలితం : విద్యార్థుల్ని బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం అంతంతే. ఇటీవల విశాఖ ఎస్ఎఫ్ఎస్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా నమూనాలు తీవ్ర నిరాశ పరిచాయి. ఒకే ఒక నమూనా జాతీయ పోటీలకు ఎంపిక కావడ మే ఇందుకు నిదర్శనం. సాక్షి, విశాఖపట్నం : ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయిలో 2011లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శనలు జరిగాయి. 2011లో నాలుగు నమూనాలు, 2012లో ఆరు నమూనాలు జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 2012లో దక్షిణ భారత్ స్థాయిలో జతిన్వర్మ అనే విద్యార్థి రూపొందించిన రోబో ఎంపికయింది. 2013లో జిల్లాకు చెందిన 16 నమూనాలు అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్లాయి. అందులో నాలుగు(గబ్బాడ-నర్సీపట్నం, బూరుగుపాలెం-మాకవరపాలెం, దిమిలి-రాంబిల్లి, చీడిగుమ్మల-గొలుగొండ జెడ్పీ హైస్కూళ్ల) ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. అయితే అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఏ ఒక్క నమూనా కూడా జాతీయ స్థాయికి పంపలేకపోయారు. తాజాగా ఈ నెల 20, 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ఇందులో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 506 నమూనాలు ఎంపికగా అందులో 456 రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వచ్చాయి. జిల్లా నుంచి కేవలం 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోగా అందులో ఒక్కటే(తిమ్మరాజుపేట-మునగపాక) జాతీయ స్థాయికి ఎంపికయింది. ఎందుకిలా..! రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా తొలి విడత తిరుపతిలో ఏడు జిల్లాలకు చెందిన నమూనాలు, రెండో విడతగా విశాఖలో ఆరు జిల్లాలకు చెందిన నమూనాలు ప్రదర్శనకు ఉంచారు. ఇందులో జిల్లా నుంచి 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోవడం వెనుక పాఠశాల స్థాయి నుంచి జిల్లా విద్యాశాఖ వరకు తిలాపాపం తలా పిడికెడు పంచుకున్నారన్న ఆక్షేపణలున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 1300కు పైగా వారెంట్ల కోసం దరఖాస్తులు గతేడాది జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. అయితే విద్యాశాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ జాబితాను ఎస్సీఈఆర్టీకి పంపడంలో జాప్యం చేశారు. దీంతో కేవలం 199 స్కూళ్లకు మాత్రమే వారెంట్లు వచ్చాయి. అందులో కూడా అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్కూళ్లే కావడం గమనార్హం. ఆ ‘ఒక్క రోజే’ ముంచిందా? మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖామాత్యుల వైఖరి కూడా ఈసారి ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా చతికిలపడటానికి కారణమన్న ఆక్షేపణలున్నాయి. ఈ ఏడాది జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను జూలై 31న ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ఒక్క రోజు ముందే మంత్రిగారి ఉత్తర్వులతో హడావుడిగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ పూర్తి స్థాయిలో నమూనాలను తయారు చేసుకోలేకపోయారు. సులభంగా పూర్తయ్యే/రెడీమేడ్ నమూనాలనే ప్రదర్శనకు తీసుకొచ్చారు. 199 అంశాల్లో 163 మంది మాత్రమే ప్రదర్శనకు వచ్చారు. దీంతో వీటి నుంచే 12 నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయాల్సి వచ్చింది. నిబంధనల మేరకు వీటినే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ఉంచారు. దీంతో మిగిలిన జిల్లాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ముందు విశాఖ విద్యార్థుల నమూనాలు తేలిపోయాయి. -
కొత్త లెవీతో అవినీతికి గేట్లు బార్లా
సాక్షి, నెల్లూరు: లెవీ విధానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులు అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మంచి చేయకపోగా అక్రమాలను మరింత ప్రోత్సహించేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం వల్ల బియ్యం అక్రమ రవాణా ఎక్కువవుతుందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం మిల్లర్లు సేకరించిన 75 శాతం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చే పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన నిబంధనల ప్రకారం కేవలం 25 శాతం బియ్యాన్ని మాత్రం ప్రభుత్వానికి అప్పగించి మిగిలిన 75 శాతం బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. కొత్త లెవీ నిబంధన అక్టోబర్ నుంచే అమలులోకి రానుంది. ఈ విధానంతో అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కాదని, ఈ ఏడాదికి పాత విధానమే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ క్రమంలో 50:50 లెవీ విధానాన్ని అయినా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఏటా మిల్లర్ల నుంచి 75 శాతం లెవీ కింద 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం, మరో 50 వేల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరిస్తోంది. ఇందు కోసం మిల్లర్లు 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తారు. మిగిలిన 25 శాతం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవచ్చు. లెవీ నిబంధనల మేరకు ప్రభుత్వం మిల్లర్లకు పర్మిట్లు జారీచేయాలి. మరోవైపు అధికారులు సైతం మిల్లర్లకు సక్రమంగా పర్మిట్లు ఇవ్వడంలేదు. వాటి కోసం లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే మిల్లర్లు సైతం జిల్లా వ్యాప్తంగా పండే వరిధాన్యాన్ని రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి లెవీ అనుమతుల మాటున తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు జాక్‌పాట్ ట్రాన్స్పోర్ట్ మాఫియా ద్వారా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సెంథిల్ కుమార్ వరుస దాడులతో జాక్‌పాట్ మాఫియా ట్రాన్స్పోర్ట కార్యకలాపాలతో పాటు బియ్యం అక్రమ ఎగుమతులు బట్టబయలయ్యాయి. కొత్తలెవీతో మరిన్ని అక్రమాలు కొత్త లెవీ విధానంతో అక్రమాలకు పెద్ద ఎత్తున గేట్లు ఎత్తినట్లేననే విమర్శలున్నాయి. జిల్లాలో పండే రెండు పంటలకు కలిపి 25 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. కొత్త నింబంధనల మేరకు 25 శాతం లెవీ కింద పట్టుమని రెండు నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ప్రభుత్వానికి అవసరముండదు. మిగిలిన మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇందుకోసం రైతుల నుంచి తక్కువధర కే ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు వత్తిడి పెంచవచ్చు. అడిగిన రేటుకు ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని డిమాండ్ కూడా చేయవచ్చు. ఈ లెక్కన రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశముండదు. తప్పనిసరి పరిస్థితిలో తక్కువ ధరకే రైతులు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం చేసి మిల్లర్లు అక్రమంగా ఎగుమతలు చేసే అవకాశం ఎక్కువ. కేవలం 25 శాతం బియ్యాన్ని అమ్ముకొనేందుకే అధికారులు మిల్లర్లకు పర్మిట్లు సక్రమంగా ఇవ్వడంలేదు. అలాంటిది ఇక 75 శాతం బియ్యం అమ్మకాలకోసమైతే అధికారులు పర్మిట్లు ఇచ్చేది గగనమే. దీంతో బియ్యం అక్రమ రవాణా మినహా మిల్లర్లకు గత్యంతరముండదు. ఎటూ జాక్‌పాట్ ట్రాన్స్పోర్ట్ మాఫియా ఉండనేవుంది. దీంతో అక్రమాలు మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడనుంది. -
ఆర్థిక సంఘం ముందూ ‘ఆవు కథ’లేనా?
సర్కారు వైఖరిని దుయ్యబట్టిన తమ్మినేని సీతారాం హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాల్సిన ఈ తరుణంలోనూ సీఎం చంద్రబాబు 14వ ఆర్థిక సంఘం అధికారుల ముందూ తన పాత ‘ఆవు కథ..’నే ఎత్తుకొని రాజకీయ ఉపన్యాసాలు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం నడుచుకునే ఆర్థిక సంఘం ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం బాధ్యతాయుతంగా రాష్ట్రావసరాలను విని పించి ఉండాల్సిందని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా రాష్ట్రంలో అక్షరాస్యత, స్థూల జాతీయోత్పత్తి, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిధులను కేటాయించడం ఆర్థిక సంఘం బాధ్యతని... అక్షరాస్యత పెరిగితే రాష్ట్రాలకు నిధులు కేటాయింపు తగ్గించే ఇప్పుడున్న నిబంధనలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మనలాంటి రాష్ట్రాలకు నిరాశకలిగించేవన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి నిబంధలనుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరి ఉండాల్సిందనీ.. దీనికితోడు రాష్ట్రంలో కేంద్రం వసూలు చేసే పన్నుల మొత్తంలో ఇప్పుడు కేటాయిస్తున్న 33 శాతం కాకుండా 50 శాతం కేటాయించాలని కోరి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు మాత్రం గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రం వెనక్కి వెళ్లిందన్న పాత విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. -
పద్మ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రదానం కోసం 2015 సంవత్సరానికి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోగా దరఖాస్తులు పంపవచ్చని కేంద్ర హోంశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత నమూనాలోని నామినేషన్లను, దరఖాస్తుదారు కృషికి సంబంధించి 800 పదాలలోపు సంక్షిప్త లిఖిత పత్రాన్ని జతచేసి.. కేంద్ర హోంశాఖ లేదా కేంద్ర హోంశాఖ కార్యదర్శి కార్యాలయాలకు (నార్త్‌బ్లాక్,న్యూఢిల్లీ-110001) పంపించాలని సూచించింది. నిర్దేశిత న మూనా పత్రాన్ని కేంద్ర హోంశాఖ వెబ్సైట్ నుంచి పొందవచ్చని పేర్కొంది. 2015 సం వత్సరానికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్నారు. -
ఇష్టానుసార బదిలీలతో అస్థిరత్వం
ఐఏఎస్ కేడర్ పోస్టులపై కేంద్రం అభిప్రాయం నేడు రాష్ట్రాల జీఏడీ ముఖ్యకార్యదర్శులతో సమీక్ష హైదరాబాద్: కేడర్ పోస్టుల్లోని ఐఏఎస్‌లను ఇష్టానుసారం బదిలీ చేయడం వల్ల స్థిరత్వం లేక పాలనపై ప్రభావం చూపుతోందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌లను కేడర్ పోస్టుల్లో కనీసం రెండేళ్ల పాటు బదిలీ చేయకుండా ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నా అన్ని రాష్ట్రాల సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులతో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం మంగళవారం ఢిల్లీలో దీనిపై సమీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని సేకరించనుంది. అన్ని రాష్ట్రాల అఖిల భారత సర్వీసు అధికారుల కేడర్‌పై సమీక్ష నిర్వహించనున్నారు.ఐఏఎస్ అధికారుల అనధికారిక గైర్హాజరు, రాష్ట్ర కేడర్ సర్వీసు నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతుల పెండింగ్‌తో పాటు ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం, అఖిల భారత సర్వీసు అధికారులపై ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుల పెండింగ్‌పై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమీక్షలో తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యకార్యదర్శికి మాట్లాడే అవకాశం కల్పించారు. కాగా 2012 అక్టోబర్ 17న అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హక్కుల నోటీసు ఇచ్చారు. దీనిపై వాస్తవ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పంపకపోవడంతో ఆ అంశం పెండింగ్ ఉంది. నివేదికను సమీక్షలో కోరనున్నారు. గతేడాది రాష్ట్ర కేడర్ సర్వీసు నుంచి ఐఏఎస్‌ల పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను, ఖాళీలను కూడా పంపలేదు. ఇందుకు రాష్ట్ర విభజన కారణమని ప్రభుత్వం తెలిపింది. -
శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా
- ‘సాక్షి’తో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా’నని టీటీ డీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టీకరించారు. టీటీడీ ఈవో పోస్టు పొందేందుకు తానెవరి సహాయం కోరలేదని.. కొనసాగేం దుకూ ఎవరి సహాకరం అడగలేదని స్పష్టీకరించారు. గురువారం తిరుపతిలో తన క్యాంప్ ఆఫీసులో ఈవో ఎంజీ గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే తనను శ్రీవేంకటేశ్వరస్వామే టీటీడీ ఈవో పదవి ఇచ్చేలా చేశారని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు స్వామివారిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నించానన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా.. తెలంగాణలో పెరిగానన్నారు. ఐఏఎస్‌ల విభజనలో కేంద్ర ప్రభుత్వం తనను తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యహరిస్తానని స్పష్టీకరించారు. టీటీడీ ఈవోగా కొనసాగేందుకు తానెవరి సహాయం కోరలేదన్నారు. శ్రీవారి ఆజ్ఞతో పనిచేస్తానని స్పష్టీకరించారు. -
పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ
సాక్షి,విశాఖపట్నం: కేంద్రప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ లభిస్తే రాష్ట్రంతోపాటు విశాఖకు భారీస్థాయిలో పెట్టుబడులు రానున్నాయని కెనడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వైజాగ్ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కష్ణబాబు పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏపీ-కెనడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్క్లేవ్’ సదస్సులో పాల్గొన్న ఆయన కెనడా ప్రతినిధులకు రాష్ట్ర పారిశ్రామికరంగం అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. విభజన తర్వాత ఏపీలో సుదీర్ఘతీరప్రాంతం ఆధారంగా ప్రభుత్వం భారీస్థాయి అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఓడరేవు అధారిత పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం కల్పించడం ద్వారా మరింత ప్రగతి సాధించడానికి వీలుంటుందని చెప్పారు. భావనపాడుతోపాటు కాకినాడలోనూ కొత్త పోర్టులు వస్తున్నాయని, ఎల్ఎన్జీ టెర్మినల్లు కాకినాడ,విశాఖలోని గంగవరం పోర్టులోను రావడం ద్వారా పరిశ్రమలకు కావలసినంత ఇంధనం భవిష్యత్తులో నిరంతరం అందేఅవకాశం ఏర్పడుతుందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా,స్పెషల్ ప్యాకేజీ అమలైతే ఉత్తరాంధ్రలో ఎన్నడూ ఊహించని పారిశ్రామికపెట్టుబడులు తరలిరానున్నట్లు విశ్లేషించారు. పైగా ఉత్తరాంధ్రలో నాణ్యత కలిగిన మావనవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌పైపులైన్ నిర్మాణానికి ఆమోదం లభించడం తో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయన్నారు. పారిశ్రామికరంగానికి అనువైన వాతావరణంపై కెనడా ప్రతినిధులకు కూలంకుషంగా పలు అంశాలను వివరించారు. వైజాగ్ నుంచి చెన్నైకు ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి సంబందించి ప్రస్తుతం చురుగ్గా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అధ్యయనం చేస్తోందని, రానున్న ఏడాదిలోగా పూర్తిస్థాయిలో మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతుందని తెలిపారు. జలరవాణాతోపాటు రైలురవాణాకు సంబంధించి విశాఖ,ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతికి,పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. అరూప్‌దత్తా ఆర్కిటెక్ట్ లిమిటెడ్ కంపెనీ స్మార్ట్‌సిటీల నిర్మాణంలో తమకున్న అనుభవాలను వివరించగా, బాంబేర్ డైర్,వోర్లీ పేర్‌సన్స్,క్లియర్‌ఫోర్డ్ ఇండస్ట్రీస్,లీ ఇంటర్నేషనల్ లిమిటెడ్,ఐబీఐ తదితర కెనడా కంపెనీల ప్రతినిధులు భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాల గురించి వివరించారు. -
శాశ్వత ఉపాధికి..సర్కారు కసరత్తు
సాక్షి, మంచిర్యాల : స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై) పథకాన్ని మరింత నవీకరించేందుకు కేంద్ర సర్కారు నడుం బిగించింది. ఈ పథకంలో మార్పు చేయడమే కాకుండా దాని స్థానంలో కొత్త పేరుతో మరో పథకాన్ని తీసుకువచ్చే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున రుణంతోపాటు అధిక సబ్సిడీని ఇచ్చే మార్గదర్శకాలను సిద్ధంచేస్తోంది. రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఆర్ఎల్ఎం) పేరుతో శాశ్వత ఉపాధి కల్పించేందుకు పథకాన్ని రూపొందించే దిశగా కసరత్తు వేగంగా జరుగుతోందని గ్రామీణాభివృద్ధి సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. పల్లెల పరిపుష్టే ధ్యేయం.. పల్లెలను కరువు కాటేసిన స్థితిలో రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల నుంచి హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు వలసబాట పట్టిన వారున్నారు. ఇటీవల తెలంగాణ సర్కారు నిర్వహించిన సమగ్ర సర్వేకు హాజరైన వారిలో కొందరికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ‘ఈ ఏడాది వానలు పడేట్లు లేవు. మేం కూడా మీ దగ్గరకు వచ్చి ఏదో పనిచేసుకుంటాం. మాకు కూడా జర పని సూడుండ్రి’ అంటూ హైదరాబాద్, ముంబయి, భీవండి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విన్నవించుకోవడం కనిపించింది. వలసలకు వెళ్లిన వారు సర్వేకు పెద్దఎత్తున తిరిగిరావడం సైతం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ పరిస్థితులన్నీ గమనించి సర్కారు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కల్పించే దిశగా ఒక పథకం రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. ఇప్పటివరకు మహిళలకు, స్వయం ఉపాధి సంఘాలకు ఉపాధి కల్పించడంపైనే దృష్టిసారించిన గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)ను ఇందుకు ఎంచుకున్నట్లు సమాచారం. అధిక రుణం.. ఎక్కువ సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకు ద్వారా రాయితీ రుణాలిస్తున్నారు. ఈ రాయితీ అరకొరగా ఉండటంతో ఆశించిన స్థాయిలో నిరుద్యోగులు ఉపాధి పొందేందుకు ముందుకు రావడంలేదని సర్కారు భావించింది. తాజాగా ఏర్పాటు చేయబోయే పథకంలో అధిక మొత్తంలో రుణ సదుపాయాన్ని కల్పించడంతోపాటు యూనిట్ కాస్ట్లో పెద్దఎత్తున రాయితీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చర్యల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉపాధి యూనిట్లను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణాభివృద్ధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిధులతో ఐకేపీ ద్వారా చేసే పనులను సమష్టిగా ఒక్కరే నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో పాలన పరమైన అనుమతులతోపాటు ఉపాధి యూనిట్లు పెట్టుకున్న వారికి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం మరింత సులభతరం కానుంది. -
పంచాయతీలకు మహర్దశ
రూ.58.44 కోట్లతో 487 పంచాయతీలకు సొంత భవనాలు రూ.25 లక్షలతో మండలానికో ఎమ్మార్సీ భవనం రూ.2 కోట్లతో జిల్లా కేంద్రంలో డీఆర్సీ భవనం రూ.3.76 కోట్లతో 376 పంచాయతీల్లో కంప్యూటరీకరణ 142 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం చిత్తూరు(టౌన్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆర్‌జీపీఎస్‌ఏ’ (రాజీవ్ గాంధీ పంచాయతీ స్వశక్తీకరణ్ అభియాన్) పథకంతో జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలకు మహర్దశ కలగనుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 487 పంచాయతీలకు సొంత భవనాలు జిల్లాలో మొత్తం 1,363 పంచాయతీలున్నాయి. వాటిలో 487 పంచాయతీలకుసొంత భవనాలు లేవు. వాటన్నిటికీ రూ.58.44 కోట్లతో సొంత భవనాలను నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఐదు వేల మంది జనాభాకులోగా ఉండే పంచాయతీకి రూ.12 లక్షలు, దానికన్నా ఎక్కువగా ఉండే పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున మంజూరు చేసింది.మరమ్మతుల కోసం ఒక్కోదానికి రూ.3 లక్షలను మంజూరు చేసింది. వీటిని అంచెలంచెలుగా కంప్యూటరీకరణ చేపట్టనుంది. కంప్యూటర్ ఆపరేటర్లను కూడా ప్రభుత్వమే నియమించి వారికి జీతాలను చెల్లించనుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని రికార్డులను కంప్యూటరైజేషన్ చేయడం, గ్రామసభల నిర్వహణకు సంబంధించిన ఫొటోలు, మినిట్స్బుక్కులను స్కాన్‌చేసి నెట్లో పెట్టడం తదితర కార్యక్రమాలకు వీటిని ఉపయోగించుకునే వీలుకల్పిస్తోంది. ఫోన్బిల్లులనూ కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. రూ.18.25 కోట్లతో ఎమ్మార్సీ, డీఆర్సీ భవనాలు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించేందుకు అనువుగా ప్రతి మండలంలోనూ ఒక ఎమ్మార్సీ భవనాన్ని నిర్మించనుంది. దీనికోసం ఒక్కోదానికి రూ.25 లక్షలు, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్సీ భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలోని 65 మండలాల్లో నిర్మించే ఎమ్మార్సీ, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్సీ భవనానికి గాను మొత్తం రూ.18.25 కోట్లు ఖర్చు చేయనుంది. కంప్యూటరీకరణలో మనమే ఫస్ట్ జిల్లాలోని 1,363 గ్రామ పంచాయతీల్లో తొలిదశగా 448 కంప్యూటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో మండలానికొకటి చొప్పున 65 మండలాలకు 65 కంప్యూటర్లు, 2 జెడ్పీకి, మరో 2 డీపీవో కార్యాలయానికి, 3 డీఎల్పీవో కార్యాలయానికి, 376 పంచాయతీలకు మంజూరు చేసింది. ప్రతి పంచాయతీకి ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అవి పనిచేయడానికి బ్యాటరీతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లును చేపడుతున్నారు. వీటికోసం ప్రతి పంచాయతీకి ఇంచుమించు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టింది. భవనాలు ఉన్న పంచాయతీల్లో కంప్యూటరీకరణ కోసం రూ.3.76 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టింది. అయితే ఫోన్ కనెక్షన్ అందుబాటులో ఉండే 142 గ్రామ పంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించింది. పంచాయతీల కంప్యూటరీకరణలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 135 పంచాయతీలకు డంపింగ్ యార్డులు జిల్లాలోని 135 పంచాయతీలకు డంపిం గ్ యార్డుల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. దీనికోసం ప్రతేకంగా నిధులను మంజూరు చేసింది. చెత్తను సేకరించడానికి ట్రైసైకిళ్లు, యార్డు చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం, బోరుబావి తవ్వకం, చెత్తను కత్తిరించే యంత్రాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం తదితరాల కోసం నిధులను విడుదల చేసింది. -
జిల్లాకు ‘నిర్భయ’ సెంటర్ మంజూరు
ఇందూరు : దేశంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. మరెందరికో శిక్షలు పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్తారింట్లో, పని చేసే స్థలాల్లో మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతూనే ఉన్నారు. బాధిత మహిళలకు తక్షణ వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందడం లేదు. నిందితులకు శిక్షా పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. మహిళల రక్షణ కోసం, తక్షణ సాయం, న్యాయం అందించడం కోసం వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్(నిర్భయ సెంటర్) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో 660 ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు కూడా ‘నిర్భయ సెంటర్’ను మంజూరు చేసింది. దీనికి సంబంధించి లెటర్ నం: 1037 ద్వారా ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి ఈ నెల 13న పంపించింది. భవన నిర్మాణానికి రూ. 36 లక్షలను కేటాయించింది. ఈ కేంద్రం ఎందుకంటే.. సెంటర్లో డాక్టర్, నర్సు, లీగల్ కౌన్సెలర్, పోలీసు, న్యాయవాది, హెల్పర్ ఉంటారు. వేధింపులు, అత్యాచారానికి గురైన వెంటనే సమాచారం అందించేందుకు సెంటర్లో ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. సంఘటన లేదా వేధింపులకు గురైనవారు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. సంఘటనను బట్టి సంబంధిత ఉద్యోగులు ప్రత్యేక వాహనం ద్వారా లేదా అంబులెన్స్‌లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల వేధింపుల కేసైతే ఇరువురికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల పై, లేదా భర్త, అత్త, మామలపై చర్యలు తప్పవన్న పరిస్థితుల్లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురైతే కూడా పై పద్ధతిన చర్యలు తీసుకుంటారు. అత్యాచారానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కేసులను ఉచితంగానే కోర్టులో వాదిస్తారు. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు బాధితురాలి వాంగ్మూలం వినేందుకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇటు బాధిత మహిళలకు తాత్కాలిక వసతిని కల్పిస్తారు. ఐదుగురు అధికారుల కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మొత్తం మీద బాధిత మహిళలకు తక్షణ సాయం, న్యాయం జరిగేలా ఈ ‘నిర్భయ సెంటర్’ పని చేస్తుంది. సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాకు నిర్భయ సెంటర్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ. 36 లక్ష లను కేటాయించింది. వీలైనంత త్వరగా భవనా న్ని నిర్మించి అందులో బాధిత మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తయారు చేయాలని ఐసీడీఎస్ అధికారులను కేంద్రం ఆదేశించింది. భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా వేరే భవనాన్ని చూసుకోవాలని సూచించింది. ఈ నిర్భయ సెంటర్‌ను 300 చదరపు మీటర్లు గల స్థలంలో నిర్మించాలని, అది కూడా జిల్లా కేంద్రంలోనే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. అయితే జిల్లా ఆస్పత్రి ఆవరణలో లేదా రెండు కిలోమీటర్ల సమీపంలో భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కేంద్రంలో స్థలం వెతకడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
స్పెషల్‌గా పంపకాలు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జెడ్పీలో వర్కుల వేట కొనసాగుతోంది. మంజూరుకాక ముందే బీఆర్జీఎఫ్ పనులు చేతులు మారిపోతున్నాయి. పనుల దక్కని నేతల్లో ఆవేదన పెల్లుబుకుతోంది. మమ్మల్ని విస్మరించారని పలువురు లోలోపల మధనపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అమలవుతున్న బీఆర్జీఎఫ్ పథకం కింద 2014-15 సంవత్సరానికి జిల్లాకు రూ.22.94 కోట్లు కేటాయించారు. ప్రాదేశిక ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి పంపించాలని జెడ్పీ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ సమయంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. నిబంధనల మేరకు పంచాయతీల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి, పనులు గుర్తించి, వాటికి తీర్మానం ద్వారా ఆమోదం తెలిపి, దశల వారీగా జిల్లా అధికారులకు పంపించాలి. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు ఆ పనిచేయలేదు. ఎలాగూ జెడ్పీకి కొత్త పాలకవర్గం వస్తోంది. వారికి చేతికి పనులు అప్పగించి మన్ననలు పొందవచ్చన్న ఉత్సాహంతో ప్రతిపాదనలు రూపొందించలేదని తెలిసింది. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన కీలక నేతలు దూరదృష్టితో వ్యవహరించారు. పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి, పనుల ప్రతిపాదన చేస్తే పోటీ పెరుగుతుందని, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తుందని, అలా చేస్తే బీఆర్జీఎఫ్ పనులపై గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ ముఖ్య నేతలకు ఆశించిన విధంగా న్యాయం చేయలేమని పాలకవర్గంలో చాలామందికితెలియకుండానే కథ నడిపించారు. పాలకవర్గం ఆమోదం జోలికి వెళ్లకుండా, స్పెషల్ ఆఫీసర్ల హయాంలోనే తీర్మానం జరిగినట్టు చూపించారు. తమకు నచ్చిన పనులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. కొంతమంది నేతలు చెప్పిన పనులకే ప్రాధాన్యం కల్పించారు. తాము చెప్పిన పనులనే ప్రభుత్వానికి నివేదించాలని మౌఖికంగా అధికారులను ఆదేశించారు. వ్యూహాత్మకంగా ప్రతిపాదనలు కీలక నేతలు చెప్పినట్టే అధికారులు నడుచుకున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, టీడీపీ ముఖ్య నేతలు సూచించిన పనులకు నాలుగు గోడల మధ్య ప్రతిపాదనలు రూపొందించి, వాటికి ఆమోదం తెలుపుతూ గ్రామసభలు తీర్మానం చేసినట్టుగా కాగితాలు సృష్టించారు. వాటినే దశల వారీగా జిల్లా అధికారులకొచ్చేలా చేశారు. గుట్టు చప్పుడు కాకుండా, పాలకవర్గం సమావేశం పెట్టకుండా, స్పెషలాఫీసర్ పాలనలో జరిగినట్టు ప్రణాళికను రూపొందించి కీలక నేతల కనుసన్నల్లో ప్రభుత్వానికి నివేదించారు. ఈవిధంగా బీఆర్జీఎఫ్ పనులను దాదాపు వాటాలు వేసి పంపకాలు చేసేశారని సమాచారం. త్వరలోనే వీటికి ప్రభుత్వ ఆమోదం రానుంది. ఇదే అడ్డగోలు ప్రక్రియ అనుకుంటే తాజాగా మరో అక్రమానికి తెరలేచింది. విక్రయాలకు పనులు ఇలా పొందిన పనులను సొంతంగా చేసే ఓపికలేని వారు, కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వారు వాటిని వేరేవారికి బదలాయించేందుకు సిద్ధమయ్యారు. తమ వాటాకు వచ్చే పనులను... అంచనా విలువలో 10 శాతం కమీషన్‌కు కట్టబెట్టేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పనులు చేతులు మారిపోయాయి. మరికొన్ని సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఇప్పుడిది అశోక్ బంగ్లాలో చర్చనీయాంశమైంది. తెలుగు తమ్ముళ్లోనూ అసంతృప్తి ఈ నోట, ఆ నోట ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పనులు దక్కని నేతలంతా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అంతా వారే పంచేసుకుంటే తమ పరిస్థితి ఏంటని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. కాంగ్రెస్ మాదిరిగానే వ్యవహారాలు నడుస్తున్నాయని తోటి నాయకుల వద్ద చెప్పుకుని బాధ పడుతున్నారు. ఇక, కొంతమంది టీడీపీ జెడ్పీటీసీలు కూడా అసంతృప్తితో ఉన్నారు. తమకు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా పనులను ప్రతిపాదించి, తమ మండలంలో ఉన్న ముఖ్య నేతలకు కట్టబెట్టారన్న అక్కసుతో ఉన్నారు. పాలకవర్గ సమావేశం పెట్టి, ఆమోదం తెలిపి ఉంటే తమ దృష్టికొచ్చేవని అందుకు భిన్నంగా చేయడంతో ఏకపక్షంగా సాగిపోయిందని లోలోపల బాధ పడుతున్నారు. ఇంకొందరు తమకు ప్రాధాన్యం కల్పించాలని అంతా అయిపోయాక పనుల జాబితాను అధికారులకు సమర్పిస్తున్నారు. ఇప్పుడేం చేయగలమని అధికారుల నుంచి సమాధానం వస్తుండడంతో కిమ్మనలేక సతమతమవుతున్నారు. మొత్తానికి పనుల ప్రతిపాదనలే అడ్డగోలుగా జరిగాయనుకుంటే ఇప్పుడా పనులు విక్రయాలకు పెట్టి మరింతంగా అక్రమాలకు తెరలేపారనే వాదన విన్పిస్తోంది. -
ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం కోటా!
కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ దిశగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తవర్చంద్ గెహ్లట్, సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేందర్సింగ్తో ఆయన శుక్రవారం చర్చలు జరిపారు. అంతకుముందు ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరమ్, హెలెన్ కెల్లర్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ డిసేబుల్డ్ సంస్థల ప్రతినిధుల బృందం వెంకయ్యనాయుడిని కలిసింది. వికలాంగులకు తక్షణం మేలు చేకూర్చేలా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. -
నిషేధం ఎత్తివేయలేం..
ఈ రిక్షాలపై కేసులో న్యాయస్థానం స్పష్టీకరణ అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం విధివిధానాల ఖరారుకు రెండు నెలల గడువు కోరిన సర్కార్ కుదరదన్న కోర్టు..తాత్కాలిక పద్ధతిలోనైనా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని హితవు మోటారు వాహన చట్టం కిందకు తేనున్నట్లు పేర్కొన్న కేంద్రం తదుపరి విచారణ 11 వ తేదీన న్యూఢిల్లీ: ఈ రిక్షాలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు వాటిపై గతంలో తాను విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించింది. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాల నియంత్రణకు మార్గదర్శకాలను ఖరారు చేయడానికి రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ రిక్షాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్, బీమాకు సంబంధించిన అంశాలు స్పష్టమయ్యేంతవరకు వాటిని నగర రోడ్లపై తిరగడానికి అనుమతించబోనని స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణను న్యాయస్థానం సోమవారం కొనసాగించనుంది. ఈ రిక్షాచోదకుల జీవనోపాధి గురించి అంత ఆందోళన చెందుతున్నట్లుయితే వాటికి సంబంధించిన మార్గదర్శకాలను తొందరగా ఎందుకు రూపొందించడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ రిక్షాలపై నిషేధాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు బి.డి. అహ్మద్, సిద్ధార్థ మదుల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తెస్తామని ప్రభుత్వం అందులో పేర్కొంది. వాటికి మోటారు వాహన చట్టం ప్రకారం నష్టపరిహారం నిబంధనను వర్తింపచేస్తామని, ఈ రిక్షాలకు రిజిస్టేషన్,్ర చోదకులకు లెసైన్స్ తప్పనిసరి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాల నియంత్రణకు రవాణా మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గరదర్శకాల ముసాయిదాను ప్రభుత్వం న్యాయస్థానం ముందుంచింది. మార్గదర్శకాలను ఖరారు చేయడానికి రెండు నెలల వ్యవధి కావాలని, అంతవరకు ఈ రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. విధివిధానాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించవలసి ఉన్నందున, వాటి రూపకల్పనకు చర్చలు జరపవలసి ఉన్నందున రెండు నెలల సమయం అవసరమని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ రిక్షాలు గంటకు 25 కిమీల గరిష్ట వేగంతో నడుస్తాయని వాటిలో నలుగురు ప్రయాణికులు, 50 కిలోల బరువును మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మున్సిపల్ ప్రాంతాలు, గ్రామ పంచాయతీల పరిధిలోనే ఈ రిక్షాలను అనుమతిస్తామని, అవి ఏయే రూట్లలో నడవాలనేది డీఎం, మున్సిపల్సంస్థలు , ఢిల్లీ పోలీసులు ఖరారు చేస్తారని అఫిడవిట్ తెలిపింది. ఈ రిక్షాలకు నామమాత్రంగానే రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేస్తామని, సులువుగా అర్థమయ్యేలా రిజిస్ట్రేషన్ ఫారం రూపొందిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. 650 నుంచి 1000 వాట్లున్న ఈ రిక్షాలను అనుమతిస్తామని, డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన చోదకుల పేరు మీద మాత్రమే ఈ రిక్షాలను రిజిష్టర్ చేస్తామని, డ్రెవిైంగ్ లెసైన్స్‌ను మూడేళ్ల కోసారి రెన్యూవల్ చేస్తామని పేర్కొంది. మొదట్లో ఈ రిక్షాల రిజిస్ట్రేషన్ల కోసం శిబిరాలను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం వివరించింది. ఈ రిక్షా ప్రమాద బాధితులకు మోటారు వాహనచట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుందని ప్రభుత్వం తెలి పింది. ఈ రిక్షాలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, అందువల్ల విధివిధానాల రూపకల్పనకు రెండునెల సమయం అవసరమవుతుందని ఆ అఫిడవిట్ పేర్కొంది. కానీ ప్రభుత్వం కోరినట్లుగా రెండునెలల గడువు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ రిక్షా చోదకుల జీవనోపాధి గురించి అంత ఆందోళన ఉన్నట్లయితే వెంటనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని పేర్కొంది. దానికి వీలుకాకపోతే తాత్కాలిక రిజిస్ట్రేషన్, తాత్కాలిక లెసైన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కోర్టు సూచనలకు వెంటనే సమాధానమివ్వలేనని తనకు సమయం కావాలని ప్రభుత్వం తరపున హాజ రైన అదనపు సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోరడంతో ఈ కేసుపై ఆగస్టు 11న విచారణ జరుపుతానని న్యాయస్థానం ప్రకటించింది. ఈ రిక్షాలను ఆదుకుంటాం: గడ్కరీ న్యూఢిల్లీ: హైకోర్టు ఆదేశాలనుసారం నగరంలో ఈ రిక్షాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రిక్షాల విషయం కోర్టులో ఉందని, ప్రభుత్వం తరఫున తమ సూచనలను కోర్టుకు నివేదించామని ఆయన తెలిపారు. -
రైల్వే, కార్మిక చట్టాలకు సవరణలు
లోక్‌సభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే కార్మిక చట్టాలను సవరించేందుకు ఉద్దేశించిన రెండు వివాదాస్పద బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అదనపు పనివేళల(ఓవర్ టైమ్) పరిమితి పెంపు, నాన్-ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ శిక్షణ, రాత్రి షిఫ్టుల్లో మహిళలకున్న పలు సడలింపుల ఎత్తివేత తదితర అంశాలకు సంబంధించి ‘ద ఫ్యాక్టరీస్(సవరణ) బిల్లు, 2014’తోపాటు ‘అప్రెంటిసెస్ (సవరణ) బిల్లు, 2014’ను కేంద్ర కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టారు. వీటిని గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించే వరకూ ప్రవేశపెట్టొద్దని కాంగ్రెస్ ఎంపీలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై తర్వాత పూర్థి స్థాయిలో చర్చించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
రుణమాఫీ చేసి తీరుతాం
కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు ఐటీ రంగంలో రూ 40 వేల కోట్ల టర్నోవరే లక్ష్యం టీడీపీ మైనారిటీ విభాగం సర్వసభ్య సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి చిత్తూరు(సిటీ): కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర పౌర సంబంధాలు, ఐటీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన చిత్తూరులో టీడీపీ జిల్లా కార్యాల యంలో జరిగిన పార్టీ మైనారిటీ విభాగం కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మసీదు స్థలా లు, వక్ఫ్ భూములు, మైనారిటీల శ్మశాన స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. దీనిపై తాను ఇప్పటికే విచారణకు ఆదేశించానని, విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా 1,20,000 మంది రైతులకు చెందిన రూ.37వేల కోట్ల రుణ బకాయిలు, మరో 7,500 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై తెలంగాణ సీఎం కేసీఆర్ రాద్ధాంతం చేయడం తగదన్నారు. చిత్తూరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు సత్యప్రభ, శంకర్ మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్,రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గ మాట్లాడారు. అనంతరం ముస్లింలు మంత్రికి సన్మానం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పీలేరు నియోజకవర్గ నేత ఇక్బాల్ అహ్మద్, మైనారిటీ నేతలు షబ్బీర్, రఫీ, జహంగీర్‌ఖాన్, నౌషద్, జహంగీర్‌ఖాన్, పర్వీన్‌తాజ్, నగర మేయర్ కఠారి అనురాధ, డెప్యూటీ మేయర్ సుబ్రమణ్యం, మహిళా నేతలు వైవీ.రాజేశ్వరి, ఇందిర పాల్గొన్నారు. -
స్మార్ట్‌సిటీగా ఒంగోలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెనుకబడిన జిల్లాలోని ఒంగోలు నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎంపీ వె వీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్రం వంద పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికోసం ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడిని కలిసి వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొనకొండ ప్రాంతంలో రాజధాని పెడితే జిల్లా వెనుకబాటుతనాన్ని తగ్గించవచ్చని ఇక్కడి మేధావులు ఒక నివేదిక సిద్ధం చేసి ఇచ్చారని, దీన్ని శివరామకృష్ణన్ కమిటీకి అందజేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, వ్యవసాయేతర భూములు అందుబాటులో ఉన్న దొనకొండ, గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాలను కూడా కమిటీ సందర్శించాలని ఆయన కోరారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో జాతీయ స్థాయి విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు విజ్ఞప్తి మేరకు ఒంగోలు నగరానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం-2ను పెద్దారవీడు మండలంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ విజయకుమార్‌ను కోరానని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రతి గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎంపీ లాడ్స్‌తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా అభివృద్ధి చేద్దామని కలెక్టర్‌కు సూచించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులో రాష్ట్రంలోని వెనుకబడిన మండలాలను అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారని, అందులో 14 మండలాలు ప్రకాశం జిల్లావి ఉన్నాయని, వీటితోపాటు మరికొన్ని మండలాలను చేర్చడం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు ఎంపీ తెలిపారు. జిల్లా రైతులు కష్టాల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. శనగ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. 2012-13, 2013-14 సంవత్సరాల్లో పండించిన పంట ఇప్పటికీ అమ్ముడు పోలేదన్నారు. ఇప్పటికే జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో 21 లక్షల క్వింటాళ్ల శనగ నిల్వలు పేరుకుపోయాయని చెప్పారు. తక్షణమే శనగ రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆయన కోరారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాది ప్రాంతాల వారు బయట నుంచి శనగలు తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రైతులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని కలవనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. శనగను దిగుమతి చేసుకోవడం ఆపాలని, లేనిపక్షంలో వాటిపై దిగుమతి సుంకం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు రైతులు కూడా సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎక్కువ పంట పండిస్తే బోర్డు వారు భారీగా జరిమానా విధిస్తున్నారని, దీన్ని తగ్గించాలని ఆయన కోరారు. సుబాబుల్, జామాయిల్‌కు కూడా గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వైవీని కలిసిన వివిధ సంఘాల నాయకులు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతు సంఘాల నాయకులు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. ఈ మేరకు ఎంపీని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. శనగకు గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లో ఉన్నారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనగలు రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని, వాటిపై తీసుకున్న రుణానికి గడువు ముగియడంతో బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారని ఎంపీకి వివరించారు. ‘రెండు నెలల్లో అధికారంలోకి వస్తాం. శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామ’ని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా శనగ రైతులను పట్టించుకోలేదని రైతు సంఘం నాయకులు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు సంఘం నేత దుగ్గినేని గోపీనాథ్ తదితరులు ఉన్నారు. ఎన్జీఓ హోమ్‌ను త్వరలో సందర్శిస్తా.. ఎన్జీఓ నాయకులు సోమవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వారి సమస్యలను వివరించారు. ఎన్జీఓ హోం నిర్మాణం రెండు అంతస్తుల శ్లాబ్ పూర్తి చేశామని, మిగిలిన నిర్మాణానికి అవసరమైన నిధులు ఇప్పించాలని ఎంపీని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ ఎన్జీఓ హోంను త్వరలోనే సందర్శించి తప్పకుండా నిధులు ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి కె. శరత్‌బాబు, సహాధ్యక్షుడు స్వాములు, పట్టణ అధ్యక్షులు వలి, కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్‌సెక్రటరీ శివకుమార్ తదితరులు ఉన్నారు. -
‘మంచాల’కు మంచికాలం!
మంచాల: పర్యాటక అభివృద్ధిలో భాగంగా మంచాల మండలానికి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి తలపెట్టిన ప్రణాళికలో మంచాల మండలానికి చోటుదక్కింది. అంతేకాకుండా మెగా సర్క్యూట్లో భాగం గా మండల సరిహద్దు ప్రాంతాలైన రాచకొండ కోటతోపాటు గాలిషాహీద్ దర్గా, నారాయణపురం, అల్లపురం గ్రామాల్లోని దేవాలయాలు, ఆరుట్ల దేవాలయంతోపాటు వ్యాలీ ఆఫ్ బంజారా సర్క్యూట్ కింద శివన్నగూడెం రాక్ ఫార్మేషన్స్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపద్ యశోనాయక్ ఈ నెల 22న లోక్‌సభలో లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. దీంతో రాచకొండ కోటను చారిత్రాత్మక కట్టడంగా గుర్తించడంతోపాటు దీని సమీపంలోని గాడిపీర్లవాగు సమీపంలోని గాలిషాహీద్ దర్గాను కూడా అభివృద్ధి చేయనున్నారు. అల్లాపూర్ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయం, ఆరుట్లలోని శ్రీ బుగ్గరామ లింగేశ్వరస్వామి దేవాలయం, నారాయణపురం మండలంలోని రాచకొండగుట్టల సరిహద్దులోని పలు దేవాలయాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. భూముల కొనుగోలుపై నజర్ మంచాల మండలానికి తూర్పు భాగంలో అటు రాచకొండకోట, నల్గొండ జిల్లా నారాయణపురం మండలం, ఇటు శివన్నగూడెం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. దీంతో ద్వీపకల్పంగా మారిన మంచాల మండల పరి సర భూములపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించారు. సర్కారు సైతం పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇక్కడి ప్రభుత్వ భూములను గుర్తించారు. నారాయణపు రం మండలంలోని రాచకొండకోట పరిస ర ప్రాంతంలోని సర్వే నంబర్ 273లో దాదాపు 8 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇవి అటు నాగారం నుంచి మొదలుకొని అల్లాపురం, నారాయణపురం, జనగామ, పల్లెగుట్ట తండా, కడీలబావి తండా గ్రామాల పరిసర ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇందులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. మంచాల రెవెన్యూ పరిధిలోని ఆరుట్ల సమీపంలో 587 సర్వే నంబర్ నుంచి 619 సర్వే నంబర్లలో నాలుగు వందల ఎకరాల పట్టా భూములను బెంగళూరు- తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ భూము లు ముచ్చర్లకుంట గ్రామం నుంచి బండలేమూర్, వాయిలపల్లి, జనగామ, లోయపల్లి శివారు ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇదే కంపెనీ మంచాల మండలాన్ని అనుసరించి ఉన్న నల్గొండ జిల్లా ఖుదాభక్షుపల్లి, లచ్చమ్మగూడెం, చిల్లాపురం పరిసర ప్రాంతాల్లో మరో వెయ్యి ఎకరాలు కొనుగోలు చేశారు. రాచకొండగుట్టలకు మంచి రోజులు రావడంతో మంచాల మండలం, నారాయణపురం, మర్రిగూడ మండలాలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. కాగా ఇప్పటికే రియల్టర్లు, వివిధ కంపెనీల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా భూముల కొనుగొలుపై దృష్టి సారించినట్లు సమాచారం. -
ఆధార్ కొర్రీ.. వర్రీ..!
సాక్షి, కర్నూలు/కోసిగి: ఆధార్.. ప్రజల పాలిట గుదిబండగా మారింది. వంట గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికి దానికి బ్రేకులు పడ్డాయి. హమ్మయ్యా.. ఇక ఆధార్ పీడ విరుగుడైందని సంతోషిస్తున్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆధార్‌ను తెరపైకి తెచ్చింది. రేషన్ సరుకులు కావాలన్నా.. పింఛన్ రావాలన్నా.. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా.. ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనమైనా పొందాలంటే ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీంతో ఆధార్ కార్డు లేని ప్రజలు నలిగిపోతున్నారు. ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకుని, ఐరిస్ తీయించుకుని, ఫొటోలు తీయించుకున్నా.. నేటికి కార్డులు రాని వారు లక్షల్లో ఉన్నారు. ఆధార్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయో లేదోనన్న అయోమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చౌక దుకాణాల్లో రేషన్ సరుకులు తీసుకోవాలంటే రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని లింకు పెట్టింది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు డీలర్‌కు అందజేసి అనుసంధానం చేయించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో రేషన్ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. జిల్లాలో లక్షలాది మందికి ఇప్పటికీ ఆధార్ కార్డుల్లేవు. ఎన్నిసార్లు ఐరిస్ తీయించుకున్నా.. ఆధార్ కార్డులు రాలేదు. ఈ నెలాఖరులోగా రేషన్ కార్డులకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆధార్ కార్డులున్న వారు కూడా సరైన సమాచారం లేకపోవడంతో అనుసంధానం చేసుకోవడంలేదు. దీనిపై ప్రభుత్వం సరిగా ప్రచారం చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా జనాభా 43 లక్షలు కాగా 11,54,000 రేషన్ కార్డులున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఆధార్ కార్డులు వచ్చాయి. ఇంకా ఎంతమందికి రాలేదనే సమాచారం కూడా అధికారులు వద్ద లేకపోవడం గమనార్హం. 47 శాతం అనుసంధానం.. జిల్లాలో ఆధార్ కార్డులు ఉన్న వారిలో 47 శాతం మంది మాత్రమే రేషన్ కార్డులతో అనుసంధానం చేసుకున్నట్లు తెలిసింది. మిగతా 53 శాతం మంది ఆధార్ కార్డుల వివరాలు అందజేయలేదంటూ తహశీల్దార్లు పేర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కోసిగి మండలంలోనే 57 వేల మంది ఆధార్‌తో అనుసంధానం కానట్లు తేలింది. జిల్లాలో 23 లక్షల మందికి అవసరం.. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డులకు 23 లక్షల మంది తమ పేర్లు అనుసంధానం చేసుకోవాల్సి ఉన్నట్లు తెలిసింది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుండి అందరికీ ఆధార్ ఉన్నా.. ఆ వివరాలు రేషన్ డీలరుకు అందకపోతు భవిష్యత్తులో సరుకుల పంపిణీ ఆగిపోవచ్చు. కుటుంబ సభ్యులందరి వివరాలు అందిస్తేనే రేషన్ ఇబ్బంది లేకుండా అందుతుంది. అయితే ఇంతవరకు అనుసంధానం కానివారికి రేషన్‌లో కోత విధించాలన్న నిర్ణయమేమీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. ఆధార్, రేషన్ కార్డులకు అనుసంధానం కాని వారిలో ఎక్కువ మంది కోసిగి మండలంలోనే ఉన్నట్లు తేలింది. -
ఐసీడీఎస్ ‘ఖాళీ’ 697 పోస్టుల భర్తీ ఎప్పుడో..?
ఖమ్మం: తల్లిగర్భంలో ఉన్నప్పటి నుంచి బిడ్డ ఆరోగ్యం, మాతాశిశుసంక్షరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు గొప్పలు పోతున్నారు. నెలనెలా కోట్లాది రూపాయల విలువైన పౌష్టికాహారం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నామని అంటున్నారు. కానీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలతోపాటు సీడీపీవోలు, అసిస్టెంట్ సీడీపీవోలు, సూపర్వైజర్ల ఖాళీలు ఐసీడీఎస్ శాఖను అధోగతి పాలుజేస్తున్నాయి. ఉన్నవారు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడం, ఖాళీలు సకాలంలో భర్తీ కాకపోవడంతో జిల్లాలో పలు కేంద్రాల్లో అంగన్వాడీ సేవలు అందటంలేదనే విమర్శలు వస్తున్నాయి. మాతాశిశు మరణాలకు పౌష్టికాహారలోపం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, బాల్యవివాహాలే కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ను బలోపేతం చేసింది. దీనిలో భాగంగా జిల్లాలో 23 ప్రాజెక్టులను ఎంపిక చేసిం ది. వాటి పరిధి లో 4,888 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిద్వారా జిల్లాలో 29,996 మంది గర్భిణులు, 27,635 బాలింతలు, 31,456 మంది ఆరునెలల నుంచి సంవత్సరంలోపు పిల్లలు, 79,039 మంది సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు, 78,921 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళలకు ఆరోగ్యసూత్రాలు చెప్పడం, పిల్లలను పాఠశాలలకు సన్నద్ధం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ జిల్లాలో పలు కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు లేకపోవడం, అధికారుల కొరతతో పర్యవేక్షణ కొరవడింది. పౌష్టికారం సక్రమంగా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. మాతాశిశుసంక్షేమ శాఖలో మొత్తం 697 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 105 అంగన్వాడీ కేంద్రాలకు, 299 మినీ అంగన్వాడీ కేంద్రాలకు కార్యకర్తలు లేకపోవడంతో వాటిని తెరిచేవారే కరువయ్యారు. 190 సెంటర్లలో ఆయాలు లేకపోవడంతో పిల్లలను సెంటర్‌కు తీసుకురావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీఆర్‌పురం, చింతూరు, చర్ల ప్రాజెక్టుల్లో సీడీపీవోలు లేరు. అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడు, ఖమ్మం రూరల్, వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలో ఒక్కొక్కటి, బూర్గంపాడు ప్రాజెక్టు పరిధిలో మూడు, కల్లూరు ప్రాజెక్టు పరిధిలో నాలు గు, ఇల్లెందు ప్రాజెక్టు పరిధిలో రెండు అసిస్టెం ట్ సీడీపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 52 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెంటర్లను పర్యవేక్షణ చేయటం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో 35 సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో కిందిస్థాయిలో సెంటర్లను పర్యవేక్షణ చేయలేక పోతున్నారు. దీనిని సాకుగా తీసుకోని పలు సెంటర్లలో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు గుడ్డు, ఆకుకూరలు, పప్పు, పాలు, బాలామృతం వంటి పోషక విలువలున్న ఆహారం అందడంలేదు. ముఖ్యంగా భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం డివిజన్లోని పలు కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమైక్యలకు మధ్య సమన్వయం లేకపోవడంతో పోషకాహారం అందించడంలేదు. వీరిని సమన్వయం చేయడంలో అధికారుల విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలో మాతా శిశు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, పాలు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు. -
టెండర్లు లేకుండానే వాహనాల కొనుగోలు
సాక్షి, ముంబై: వీఐపీల భద్రత కోసం కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ సూచనల ప్రకారం కీలకవ్యక్తుల భద్రత కోసం ఆరు కొత్త ‘బుల్లెట్‌ప్రూఫ్’ వాహనాలు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు అంగీకరించింది. అయితే వీటి కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరపడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశాయి. వీఐపీల కోసం ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న ఆరు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ అదనంగా ఆరు టొయోటా ఫార్చ్యూన్ మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో 2009 తయారీ ఆరు టాటా సఫారీ మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయి. ఇందులో రెండు వాహనాలు ముఖ్యమంత్రి, ఉప-ముఖ్యమంత్రి వినియోగిస్తున్నారు. మిగతా నాలుగు వాహనాలను వీఐపీల కోసం రిజర్వు చేసి ఉంచారు. ఇవన్ని పూర్తిగా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. అయినప్పటి టెండర్లను ఆహ్వానించకుండా స్ట్రెయిట్ ఆర్మింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఈ ఆరు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రూ.2.75 కోట్లు చెల్లించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు సరఫరా చేయడంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మహీంద్రా వంటి అనేక ప్రముఖ కంపెనీలకు అపార అనుభవం ఉంది. 1992 జనవరి రెండు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ.50 వేలు, ఆపై విలువచేసే వస్తువుల కొనుగోలుకు బహిరంగ టెండర్లు ఆహ్వానించడం తప్పనిసరి చేశారు. టెండర్లను ఆహ్వానిస్తూ అన్ని దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ పరిపాలన విభాగం నియమాల ప్రకారం రూ.10 లక్షలకుపైగా విలువచేసే ఏ వస్తువులైన కొనాలంటే ఈ-టెండర్లను కచ్చితంగా ఆహ్వానించాలి. సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వానికి వాహనాలు అందజేసిన తరువాత వాటిని పరిశీలించిన తరువాతే మిగతా నగదు చెల్లించాలని నియమాలున్నాయి. ఇదిలా ఉంటే రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల జరిగే సూచనలు ఉన్నాయి. దీంతో త్వరలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హడావుడిగా వాహనాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిందని, అందుకే నియమాలను తుంగలో తొక్కిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆదరబాదరగా స్ట్రెయిట్ ఆర్మింగ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఒక్కో వాహనం ధర రూ.22 లక్షలు ఉంది. దీనిని బుల్లెట్‌ప్రూఫ్ వాహనంగా మార్చేందుకు అదనంగా రూ.36 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
ఆర్డినెన్స్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదింపజేసుకుందని, జిల్లా ఏజెన్సీ ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసిన ఈ బిల్లుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడంపై తీవ్రంగా వ్యతిరేకించిచామన్నారు. ఒంటెద్దు పోకడలతో కేంద్రం అనుసరించిన తీరు ఆదివాసీలకు ఆశనిపాతమైందన్నారు. ఈ బిల్లును తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీలు వ్యతిరేకించినా కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. బిల్లుపై స్పీకర్ కూడా న్యాయస్థానానికి వెళ్లండన్న రీతిలో మాట్లాడడం శోచనీయమన్నారు. ఆదివాసీలకు మద్దతుగా ఈ బిల్లును తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా ఈ అభిప్రాయాలను కేంద్రం పట్టించుకోకపోవడంపై దారుణమని ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌కు నిరసనగా వేలరుపాడు, కుక్కునూరు మండలాల్లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించి నామినేషన్లు వేయకపోయినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. భద్రాచలం మండలం సీతారామపట్నంలోని రామాలయ భూములు కూడా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తాయని.. ఇదంతా టీడీపీ నేత చంద్రబాబునాయుడు నిర్వాకంతోనే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతి.. సంప్రదాయాలు, వందళ ఏళ్ల నాటి వారి చరిత్రకు ఈ ఆర్డినెన్స్‌తో మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ధోరణితో అరుదైన ఆదివాసీ జాతులు చెల్లా చెదురయ్యే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని ఏజెన్సీలో ఆర్డినెన్స్ పెట్టిన చిచ్చుతో ఆదివాసీలు పోరాటం చేస్తున్నారని ఈ పోరాటానికి కడవరకు తాను అండగా ఉంటానని పొంగులేటి స్పష్టం చేశారు. బిల్లు ఆమోదానికి నిరసనగా శనివారం జరిగే బంద్‌లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. -
బడ్జెట్లో తెలంగాణపై వివక్ష
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ఈ బడ్టెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్రం ఆదుకుంటుందేమోన్న ఆశలు నీరుగారిపోయాయన్నారు. గ్రామీణాభివృద్ధి , వ్యవసాయ, ఉపాధి హామీ పథకాలకు నిధుల కేటాయింపును కేంద్రం విస్మరించిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గింగచలేదన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. -
గవర్నర్ చేతికి లాఠీ?
-
గవర్నర్ చేతికి లాఠీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పోలీసు పరిపాలన పర్యవేక్షించే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించాలనే కేంద్ర సర్కారు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షిస్తారని రాష్ట్ర పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లు గవర్నర్ పరిధిలో పనిచేస్తాయని పునర్విభజన బిల్లులో పేర్కొంది. అయితే, దీనిపై అప్పట్లో కేంద్ర హోంశాఖ స్పష్టత ఇవ్వలేదు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సమీపంలోని మరికొన్ని మండలాలు సైబ రాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో వీటిని ఏ పరిధిలో చేరుస్తారనే అంశంపై సందేహాలు తలెత్తాయి. ఈ సందేహాలను నివృత్తి చేసేలా కేంద్రం తాజాగా చర్యలు తీసుకుంటోంది. రాష్ర్ట పునర్విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు అధికారాలను కట్టబెడుతోంది. తద్వారా సైబ రాబాద్ కమిషనరేట్ సహా రంగారెడ్డి గ్రామీణ ప్రాంత పోలీసు పరిపాలన కూడా గవర్నర్ చేతుల్లోకి వెళ్లనుంది. గవర్నర్ గిరిని కేవలం సైబ రాబాద్కే పరిమితం చేస్తారని ఊహించినా తాజాగా కేంద్రం గ్రామీణ పోలీసింగ్‌ను ఆయన కనుసన్నల్లోకి తీసుకురావాలని యోచిస్తుండడం పోలీసువర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. కాసులు కురిపించే శివారు ఠాణాల్లో పోస్టింగ్‌ల కోసం పెద్దఎత్తున పైరవీలు సాగేవి. అధికార పార్టీ, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో హాట్‌సీట్లు దక్కించుకునేవారు. సైబ రాబాద్, గ్రామీణ ఎస్పీలపై గవర్నర్ ఆజమాయిషీ ఉంటే వీరి ఆటలు సాగవు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలు చెల్లుబాటు కావు. ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్‌కు అధికారం కట్టబెట్టడంపై సహాజంగానే రాజకీయపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో గవర్నర్ పెత్తనమేమిటినీ ప్రశ్నిస్తున్నాయి. -
నిధుల గ్రహణం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధుల గ్రహణం పట్టింది. భవనాలు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా సరిపడా డబ్బు మంజూరు కాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగించాల్సి వస్తోంది. అయితే కొత్త ప్రభుత్వాలపై అంగన్వాడీ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. నిధులు మంజూరు చేస్తే అద్దె భవనాల్లో అవస్థల నుంచి విముక్తి లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,670 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 1,634 సొంత భవనాలు కాగా, 2,036 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో వసతులు సరిగా లేకపోవడం, శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా కేంద్రాల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. నూతన భవనాలు మంజూరైనా అవి కాగితాలకే పరిమితం కావడంతో సిబ్బంది, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్లలో జిల్లాకు బీఆర్జీఎఫ్, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈఏ, ఐఏపీ (ఇంప్లిమెంటేషన్ ఆన్యువల్ ప్రోగ్రామ్) కింద మొత్తం 1,364 అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయి. అయితే నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఏళ్లు గడిచినా ఇందులో ఇప్పటి వరకు 583 భవనాల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మిగిలిన కేంద్రాల పనుల్లో ఏమాత్రం పురోగతి లేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే విడుదలయ్యే నిధులు కావడంతో జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. రూ.కోట్లలో నిధులు అవసరమని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా వాటికి మోక్షం కలగడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా అంగన్వాడీ నూతన భవనాల నిర్మాణం పూర్తయి, ఉపయోగంలోకి వచ్చేలా కనిపించడం లేదు. పనులు ప్రారంభించని 159 కేంద్రాలు... కొన్ని భవనాలు మంజూరైనట్లు కాగితాల్లో చూపిస్తున్నా.. ఏళ్లు గడిచినా ఇంకా నిర్మాణ పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. బీఆర్జీఎఫ్ కింద మంజూరైన వాటిలో 2, ఐఏపీ ద్వారా మంజూరైన 157 భవనాల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఇందులో అత్యధికంగా వెంకటాపురం మండలంలోనే 62 కేంద్రాలున్నాయి. ఇవి మంజూరైతే అయ్యాయి కానీ.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఐసీడీఎస్ అధికారులు చెపుతున్నారు. వీటి కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి స్పందన లేదంటున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో అసలు ఈ భవనాల నిర్మాణం పూర్తవుతుందా..? లేక మంజూరు రద్దు అవుతుందా..? అనే సందిగ్ధం నెలకొంది. కాగా, ప్రస్తుతం ఉన్న సొంత భవనాల్లోనూ 371 కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతుకు ఒక్కో భవనానికి రూ.లక్ష వరకు అవసరం. అయితే అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకునే సమయం దగ్గర పడతున్నా.. ఈ నిధులూ మంజూరు కాలేదు. ఈ పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే కేంద్రాలు నిర్వహించాల్సి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడడంతో ఇకనైనా నిధులు విడుదలవుతాయని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. -
రైతుపై రాయితీ
సాక్షి, కర్నూలు : సూక్ష్మ సేద్యంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాయితీల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం రైతులకు శాపంగా మారుతోంది. సాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న రైతులు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. సూక్ష్మ సేద్యం విస్తీర్ణాన్ని పెంచుతూ భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. కరువు మండలాలు, కరువు లేని మండలాలకు వేర్వేరుగా రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 35 వేల హెక్టార్లలో సాగవుతున్న సూక్ష్మ సేద్యంపై ఆ ప్రభావం చూపనుంది. అయితే కేంద్రం తగ్గించిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగంలో సూక్ష్మ సేద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక రాయితీ కల్పిస్తున్నాయి. సన్న, చిన్న కారు రైతులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిగా వంద శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నారు. బీసీలకు 90 శాతం రాయితీ లభిస్తోంది. 5 నుంచి 10 ఎకరాల భూమి కలిగిన రైతులకు 75 శాతం రాయితీ.. 15 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన రైతులకు 60 శాతం రాయితీ కల్పించారు. అయితే ఇకపై కొత్త రాయితీ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. కరువు పీడిత మండలాల్లో సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 35 శాతం రాయితీ మాత్రమే లభించనుంది. ఈ రెండింట్లో 10 శాతం రాయితీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే నిబంధన విధించారు. కరువులేని సాధారణ మండలాల్లో చిన్న రైతులకు 35 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 25 శాతం రాయితీ అమలు చేయనున్నారు. ఈ రెండింట్లోనూ రాష్ట్ర వాటాగా 10 శాతం భరించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో బిందు సేద్యంపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. ఇందుకు సంబంధించి యూనిట్ల మంజూరుకు యేటా నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంటోంది. గత ఏడాది 17 రకాల నిబంధనలు అమలు చేశారు. గతంలో బిందు, తుంపర సేద్యం యూనిట్లను పొలంలో అమర్చిన తర్వాత భూసార పరీక్షల నివేదిక కోరేవారు. గత ఏడాది దరఖాస్తుతో పాటే భూసార పరీక్ష నివేదిక, తహశీల్దార్, ఉప తహశీల్దార్, ఉద్యానవన శాఖ అధికారుల్లో ఎవరిదో ఒకరి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌డీడ్.. ఒకవేళ టైటిల్‌డీడ్ బ్యాంకులో ఉంటే ఫాం-1(బీ)పై తహశీల్దార్ సంతకం ఉండాలనే నిబంధన విధించారు. అదేవిధంగా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలనే మెలిక పెట్టడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రాయితీల్లోనూ కోత విధించడం రైతులను ఈ సేద్యం పట్ల విముఖతకు కారణమవుతోంది. ఉత్తర్వులు అందలేదు కేంద్ర ప్రభుత్వం రాయితీల్లో కోత విధించడం వాస్తవమే. జిల్లా స్థాయిలో అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందాల్సి ఉంది. మంత్రివర్గం రెండు రోజుల క్రితమే ఏర్పాటైంది. ఈ విభాగానికి మంత్రి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. మంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు చేపడతాం. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ఇంకా పూర్తి కానందున బిందు సేద్యం పరికరాలు ఎవరికీ అందజేయలేదు. - పుల్లారెడ్డి, పీడీ, ఏపీఎంఐపీ -
ముంపు.. ముప్పు..
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తీసుకున్న ముంపు మండలాల బదలాయింపు నిర్ణయంతో జిల్లాలోని ఆదివాసీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా ఏడు మండలాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా)మండలాలు, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు,బూర్గంపాడు( ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చేందుకు రోడ్ కనెక్టవిటీ నిమిత్తం 12 గ్రామాలు తెలంగాణలోనే ఉంచారు) మండలాల్లో గల 87 పంచాయితీలు, 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రలో కలుస్తున్నాయి. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 1,91,792 మంది జనాభా తెలంగాణ నుంచి వేరుచేయబడుతున్నారు. అపాయింటెండ్ డే అయిన జూన్ 2 తరువాత ఈ గ్రామాలను జిల్లా నుంచి వేరు చేస్తూ సరిహద్దులు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఈ పరిణామాలను ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంపు వాసులకు కష్టకాలమే... ముంపు మండలాల్లో ముందున్నదంతా కష్టకాలమేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వచ్చేది వర్షాకాలం.. మూడు నెలల పాటు గోదావరి పరివాహక వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక అంటువ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడితులు సంఖ్య ఎక్కువగా నమోదయ్యేది ముంపు మండలాల్లోనే. గోదావరి వరదల సమయంలో ఈ మండలాలకు దారీ తెన్నూ ఉండదు. ఈ సమయంలో పునరావాస చర్యలకు అధికార యంత్రాంగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంటుంది. జూన్ 2 తరువాత తమను జిల్లా నుంచి వేరుచేస్తుండడంతో ఈ కష్టాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం కేంద్రంగా చేపట్టే పునరావాస చర్యలే అంతంత మాత్రంగా ఉంటే, ఇక కాకినాడ లేదా రంపచోడవరం, పాల్వంచ డివిజన్ వాసులకు కోటరామచంద్రాపురం నుంచి చేపట్టే సహాయక చర్యలు ఏ మేరకు ఉంటాయోనని వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నో చిక్కులు... రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచుతున్నారు. పట్టణంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేట, శ్రీరామ్న గర్ కాలనీలు ఆంధ్రలో కలసిపోతున్నాయి. రాజుపేట కాలనీలో ఇంటి పన్నులు సైతం భద్రాచలం పంచాయతీ వారే వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ కాలనీ సీమాంధ్రలోకి వెళుతుంది. భద్రాచలం నుంచి తెలంగాణలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు ఆంధ్రలో ఉన్న గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పట్టణానికి అనుకొని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఎక్కువగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్తుండడంతో ఇక్కడి విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయా లేదా అనే సందిగ్ధిత ఏర్పడింది. రామాలయం తెలంగాణలో ఉండగా, దీనికి సంబంధించి పట్టణానికి ఆనుకొని ఉన్న దేవస్థానం భూములన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. భద్రాచలం మండల కేంధ్రం తెలంగాణలో ఉంటుండగా, మిగతా గ్రామాలన్నీ ఆంధ్రలోకి వెళ్తాయి. ఇక్కడి విద్యార్థులకు ఈ ఏడాది అడ్మిషన్లకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎవరు జారీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. బూర్గంపాడు మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే అంటుండటంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తాము ఆంధ్రలో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం... తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రాచలం జిల్లా కేంద్రం అవుతుందని అంతా భావించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు. కానీ డివిజన్లో నాలుగు మండలాలు వేరు కానుండటంతో ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ భవిష్యత్‌లో వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువగా నివసించే చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, వేలేరుపాడు వంటి మండలాలు ఆంధ్రలోకి పోతుండటంతో ఐటీడీఏను కూడా తరలిస్తారనే చర్చ సాగుతోంది. అధికారులు సైతం ఈ విషయంలో అవుననే అంటున్నారు. ఇలా ముంపు మండలాల బదలాయింపుతో భద్రాచలం అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
తెలంగాణ వాహనాలకు టీజీ సిరీస్ కేటాయింపు
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలకు కేంద్రప్రభుత్వం ‘టీజీ’ సిరీస్‌ను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్ర , శనివారాల్లో ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. తెలంగాణ ఆంగ్ల పదం పొడి అక్షరాలుగా టీజీ ఉండనున్నా... జిల్లాల వారీగా ప్రస్తుతం అమలులో ఉన్న నంబర్లనే కొనసాగించనున్నారు. ఈ నంబర్లు అవే ఉండాలా, కొత్తవి కేటాయించాలా అన్న అధికారాన్ని కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దఖలుపరిచింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆ నిర్ణయం వెలువడే వరకు టీజీ సిరీస్‌లో పాత నంబర్లనే అధికారులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సిరీస్‌తో ఒక్కో జిల్లాకు ఒక్కో నంబరు అమలులో ఉంది. ఖైరతాబాద్‌కు ఎపి-09, మెహిదీపట్నంకు ఎపి-13, వరంగల్‌కు ఎపి-36 ఇలా ఆయా ప్రాంతాల అక్షరక్రమం ఆధారంగా నంబర్ కొనసాగుతోంది. కొత్తగా తెలంగాణకు టీజీ సిరీస్ వచ్చినా జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న నంబర్లే అమలులో ఉంటాయి. తెలంగాణలోని జిల్లాలకు మళ్లీ 01 నుంచి వరుసగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆమేరకు కొత్త నంబర్లు అమలులోకి వస్తాయి. అయితే అది ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను విడగొట్టి 25కు పెంచాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఆ విభజన జరిగితేనే నంబర్ల కేటాయింపు సాధ్యమవుతుంది. ప్రస్తుత పది జిల్లాల అక్షర క్రమం ఆధారంగా ఇప్పుడే కేటాయిస్తే జిల్లాల విభజన తర్వాత అయోమయం తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాల నంబర్లను మార్చుకోవాలా, ఏపీ సిరీస్‌తోనే కొనసాగవచ్చా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.