toss
-
బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!
మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది... నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా. .. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్‌లో ఆమె శవాన్ని పార్శిల్ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.పోలాండ్(Poland) నగరం కటోవీస్‌లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18). దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. గ్లివిస్ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది. -
పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చిన యజమానుల రిమాండ్
బంజారాహిల్స్: అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు పబ్‌ను డ్యాన్స్ ఫ్లోర్గా మార్చి అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తున్న పబ్ యజమానులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని టేల్స్ ఓవర్ ద స్పిరిట్ (టాస్) పబ్‌లో గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులో ఉండగా ఇష్టానుసారంగా బిల్లులు వేసి వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు రెండు రోజుల క్రితం ఈ పబ్‌పై దాడులు చేసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ యువకులకు ఎరవేస్తున్న 47 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 95 మంది యువకులను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించారు. పబ్ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు డీజే ప్లేయర్ ఆసిఫ్, నలుగురు బౌన్సర్లు, మేనేజర్, బార్టెండర్లను కూడా అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న 42 మంది యువతుల్లో 10 మంది తరచూ పట్టుబడుతుండటంతో వారిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా పబ్‌ను డ్యాన్స్ఫ్లోర్గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు బింగి బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేయడమే కాకుండా పబ్‌ను సీజ్ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు. లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా ఎక్సైజ్ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీలంకతో తొలి వన్డే.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
కొలంబో వేదికగా టీమిండియాతో జరుగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నారు. వన్డే స్పెషలిస్ట్‌లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అందరూ ఊహించినట్లు రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూడే తుది జట్టుకు ఎంపికయ్యారు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ షిరాజ్ -
ఇదేందయ్యా ఇది.. టాస్ ఇలా కూడా వేయవచ్చా? వీడియో
హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును గిల్ సేన చిత్తు చేసింది. కాగా ఆఖరి టీ20 టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కే ముందుకే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత నాలుగు గేమ్‌లలో టాస్ ఓడిన రజా ఈసారి తన ఆదృష్టాన్ని మార్చుకోనేందుకు కాస్త విన్నూత్నంగా ప్రయత్నించాడు. అతడు టాస్ కాయిన్‌ను గాల్లోకి జంప్ చేస్తూ స్పిన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వలు పూయిస్తోంది. టాస్ ఇలా కూడా వేయవచ్చా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్ pic.twitter.com/snhOXumMx4— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) July 14, 2024 -
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను టాస్ దరిద్రం వెంటాడుతూ ఉంది. రుతు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏకంగా పదింట టాస్ ఓడాడు. పంజాబ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి టాస్ ఓడిన రుతు.. ప్రత్యర్ది ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగాడు.టాస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు (టాస్ ప్రాక్టీస్) తీసుకుంటున్నా రుతురాజ్ వరుసగా టాస్ ఓడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన రుతు ఓ ఆల్ టైమ్ చెత్త రికార్డును సమం చేశాడు.ఐపీఎల్లో తొలి 11 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్) చెత్త రికార్డును సమం చేశాడు. సంజూ 2022 సీజన్లో తొలి 11 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్ ఓడాడు. రాజస్థాన్, సీఎస్కే తర్వాత తొలి 11 మ్యాచ్‌ల అనంతరం అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై 2011 సీజన్లో తొమ్మిదింట టాస్ ఓడింది. 2013 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తొలి 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట టాస్ ఓడింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి ఆజింక్య రహానే (9) ఔట్ కాగా.. రుతురాజ్ (25), డారిల్ మిచెల్ (25) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
BBL 2023: అటూ ఇటూ కాకుండా..! వైరల్ వీడియో
క్రికెట్లో కాయిన్‌తో టాస్ వేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కాయిన్‌తో కాకుండా మరో విధంగానూ టాస్ వేసే పద్దతి ఒకటుందన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో రొటీన్‌కు భిన్నంగా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తో టాస్ వేస్తారు. 2018 సీజన్ నుంచి బీబీఎల్‌లో ఈ నూతన ఒరవడి అమల్లో ఉంది. Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1 — Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 బీబీఎల్ 2023లో భాగంగా సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు కూడా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తోనే టాస్ వేశారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ వేసే క్రమంలో ఫలితం ఎటూ తేల్చకుండా బ్యాట్ మధ్యేమార్గం (బ్యాట్ ఫ్లిప్) ఎంచుకుంది. దీంతో నిర్వహకులు టాస్‌ను మరోసారి వేయాల్సి వచ్చింది. బీబీఎల్‌లో బ్యాట్ ఫ్లిప్ కావడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలా జరిగింది. ఇదిలా ఉంటే సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా టాస్ మాదిరే ఆసక్తికరంగా సాగుతుంది. గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంది. బ్రిస్బేన్ నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ ఒకింత తడబాటుకు లోనవుతుంది. కెప్టెన్ క్రిస్ గ్రీన్ (30 నాటౌట్) సిడ్నీను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత సిడ్నీ స్కోర్ 125/7గా ఉంది. సిడ్నీ గెలుపుకు 14 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 3 వికెట్లు మిగిలి ఉన్నాయి. -
క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే..
క్రికెట్ మ్యాచ్‌లో మనం ఎంచుకున్న జట్టే గెలవాలని బలంగా అనుకుంటాం. మైదానంలో క్రీడాకారులు ఆడుతుంటే ఊపిరి బిగబట్టి చూస్తూంటాం. టాస్ గెలిచినప్పటి నుంచి మ్యాచ్ చివరి బంతి ఆడే వరకు ప్రతిక్షణం ఉత్కంఠభరితంగానే సాగుతుంది. అయితే మనం కోరుకునే జట్టు గెలుపోటములు మాత్రం ఆటగాళ్ల నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ తరుణంలో అందరూ ఆటలోని మజాను ఆస్వాదిస్తుంటారు. అయితే క్రికెట్‌ను చూస్తూ ఆనందించడమే కాకుండా అది మనకు కొన్ని ఆర్థిక పాఠాలూ నేర్పుతుంది. వాటి గురించి ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటలో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ విజయమే అంతిమ లక్ష్యం. అందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితమైన అంచనాలతో ఆడాల్సిందే. పెట్టుబడులూ అంతే.. ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని చేరుకునేందుకు సరైన ప్రణాళిక లేకపోతే విజయం సాధించడం కష్టం అవుతుంది. ఆటగాళ్ల ఎంపిక చాలాముఖ్యం.. జట్టులోని ఆటగాళ్ల సెలక్షన్ బాగుంటేనే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అందరూ బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లే ఉంటే ఎలా జట్టు గెలుపొందడం కష్టం అవుతుంది. అందుకే వైవిధ్యంగా ఉండాలి. పెట్టుబడుల విషయమూ అంతే. ఒకే తరహా పథకాలు, స్టాక్‌లపై ఆధారపడితే ఎప్పటికీ అనుకున్నది సాధించలేం. షేర్లు, బాండ్లు, ఫండ్లు, బంగారం ఇలా పలు పథకాలు ఎంచుకోవాలి. ఒకే బ్యాట్స్‌మన్‌పై ఎక్కువగా ఆధారపడటమూ మంచిది కాదు. ఈక్విటీల్లో ఏదో ఒక షేరులోనే మొత్తం పెట్టుబడిని కేటాయించడం వల్ల నష్టభయం పెరుగుతుంది. వికెట్‌ను కాపాడుకోవాలి... వికెట్‌ను కాపాడుకోవడం.. క్రికెట్లో కీలకం. మైదానంలో నిలదొక్కుకుంటేనే బాగుంటుంది. కానీ, పరుగులు తీయకుండా అలాగే కొనసాగడం కూడా నష్టం చేస్తుంది. దాంతో విలువైన బంతులు వృథా అవుతాయి. మొత్తం పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావిస్తూ మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో సాధించేదేమీ ఉండదు. ద్రవ్యోల్బణం రాబడులను హరిస్తుంది. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలనే నమ్ముకుంటే ఫలితం ఉండదు. రాబడి ఇచ్చే పథకాలు ఎంచుకోవాలి. లక్ష్యం మర్చిపోకుండా... ప్రత్యర్థిజట్టు ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. భారీగా ఉండే లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లక్ష్యం మరిచిపోయి హిట్టింగ్ ఎంచుకుని వికెట్ పోగుట్టుకుంటారు. చాలామంది మదుపరులు ఇలాంటి పొరపాటే చేస్తారు. ఆర్థిక లక్ష్యం మరిచిపోయి అధిక రాబడులపై ఆశపెంచుకుంటారు. ఫలితంగా ట్రేడింగ్ లేదా ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఆ తొందరపాటులో లాభాలు రాకపోగా పెట్టుబడినీ నష్టపోతారు. లక్ష్యం భారీగా ఉన్నప్పుడు.. క్రమశిక్షణతో ఒక్కో ఓవర్‌కు ఇన్ని పరుగులు అని స్థిరంగా సాధించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. అదే తరహాలో క్రమానుగత పెట్టుబడులను కొనసాగించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. తొలి ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలి. సంపాదన ప్రారంభించిన వెంటనే వీలైనంత మదుపు చేసే ప్రయత్నం చేయాలి. ఒక చెత్త ఓవర్ ఆటను మలుపు తిప్పుతుంది. ఇదే తరహాలో మీ పెట్టుబడుల్లో పనితీరు బాగాలేని ఒక పథకం ఉంటే.. మొత్తం రాబడిపై ప్రభావం పడుతుంది. అలాంటి పథకాలను గుర్తించి, తొలగించాలి. మైదానంలో ఎన్నో అంశాలు క్రీడాకారుల దృష్టిని మరలుస్తాయి. కానీ, వారి లక్ష్యం మారదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు వచ్చే అవాంతరాలను పట్టించుకోకుండా లక్ష్యం చేరుకునే వరకూ ఓపిక పట్టాలి. లక్ష్యానికి చేరువైనప్పుడు.. దూకుడుగా కాకుండా.. కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు. ఇదే తీరుగా అనుకున్న మొత్తం సమకూరినప్పుడు నష్టభయం ఉన్న పథకాల నుంచి సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మార్చుకోవాలి. జట్టు సభ్యులందరితో కలిసి కోచ్ ఒకసారి మ్యాచ్‌ను సమీక్షిస్తారు. ఇలాగే పెట్టుబడులనూ సమీక్షించుకుంటూ ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్ -
CWC 2023 2nd Semi Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్,సీన్ అబాట్‌ల స్థానాల్లో మ్యాక్స్‌వెల్, స్టార్క్ రీఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ 'ఫిక్స్'..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. pakistani 😂pic.twitter.com/gfhnpMhBOn — Keh Ke Peheno (@coolfunnytshirt) November 15, 2023 కాగా, కివీస్‌పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్‌కు చేరడాన్ని పాకిస్తాన్ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్‌మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్ అత్యంత కీలకమైన టాస్ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్ టాస్ గెలవాలని ముందుగానే డిసైడ్ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ పాక్ అభిమాని టాస్కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్ శర్మ టాస్ ఎగరేస్తాడని, హిట్‌మ్యాన్ టాస్ కాయిన్‌ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్ టాస్ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్ విలియమ్సన్ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారీ అంచనాలు కలిగిన ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తిగా సహకరించనుందని అంచనాలు ఉండటంతో ఏ జట్టైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని భావిస్తుంది. ఈ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన సందర్భాలు కోకొల్లలు. ఇదే టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకుని చేయరాని తప్పు చేసింది. అనంతరం ఫలితం (302 పరుగుల భారీ తేడాతో ఓటమి) అనుభవించింది. ఇది దృస్టిలో ఉంచుకుని ఇరు జట్లు టాస్ గెలిస్తే తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లకు దోహదపడగలరు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని పేస్ బౌలర్లు చూసుకుంటారు. ఈ పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్ బౌలింగ్‌కు అంతగానే సహకరిస్తుంది. ఇది కూడా మనం ఇటీవలే చూశాం. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు తప్పక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటుంది. జట్టు ఏదైనా టాస్ గెలిచిందా.. సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక వాతావరణం విషయానికొస్తే.. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా రిజర్వ్ డే ఉంది. కాబట్టి వంద వాతం పూర్తి మ్యాచ్‌కు ఢోకా ఉండదు. మరి ఏ జట్టు గెలిచి ఫైనల్‌కు చేరుతుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో వేచి చూడాలి. -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్ ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్‌కు జతగా రింకూ సింగ్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/3గా ఉంది. యశస్వి (18), తిలక్ వర్మ (1), సంజూ శాంసన్ (40) ఔటయ్యారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ -
అభిమానిపై ప్రముఖ ర్యాపర్ ఫైర్.. మైక్ విసిరి.. బూతులు తిడుతూ..
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్‌ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్‌ను విసిరింది. 'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ్యక్తి డ్రింక్ బాటిల్‌ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv — Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023 కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్.. -
WTC Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఇషాన్, అశ్విన్‌కు నో ఛాన్స్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. వికెట్‌కీపర్‌గా కేఎస్ భరత్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు ఆసీస్ సైతం నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. గ్రీన్, కమిన్స్, స్టార్క్, బోలండ్ తుది జట్టులో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియోన్‌ను ఆసీస్ బరిలోకి దించింది. తుది జట్లు.. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చదవండి: WTC Final: అరుదైన మైలురాళ్లకు చేరువలో రోహిత్ శర్మ -
Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత
ఐపీఎల్ 16వ సీజన్లో విరాట్ కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల గత రెండు మ్యాచ్‌లుగా డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా బుధవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ డుప్లెసిస్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా పరిమితం కావడంతో కోహ్లి మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన కోహ్లి.. ఈసారి మాత్రం నెగ్గాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్‌గా 580 రోజుల తర్వాత టాస్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. కోహ్లి ఆఖరిసారి 2021 ఐపీఎల్లో కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. తాజాగా ఐపీఎల్ 2023లో మళ్లీ అదే కేకేఆర్‌తో మ్యాచ్‌లోనే తాత్కాలిక కెప్టెన్‌గా టాస్ నెగ్గడం విశేషం. The Roar for King Kohli is huge 🔥pic.twitter.com/azZZvMdp3j — Johns. (@CricCrazyJohns) April 26, 2023 చదవండి: సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం 'ఒక్క ఓవర్ జీవితాన్ని తలకిందులు చేసింది.. త్వరగా కోలుకో' -
డుప్లెసిస్ అర్థం కాని యాసతో కేకేఆర్‌కు మేలు
ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ యాస అర్థం కాక కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా అయోమయానికి గురయ్యాడు. అయితే దీనిపై తర్వాత డుప్లెసిస్ క్లారిటీ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. టాస్ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా కాయిన్ గాల్లోకి ఎగరేశాడు. ఆ సమయంలో డుప్లెసిస్ హెడ్స్ అన్నాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. అయితే మ్యాచ్ రిఫరీతోపాటు నితీష్ రానా కూడా డుప్లెసిస్ టెయిల్స్ అన్నాడనుకొని టాస్ కేకేఆర్ గెలిచినట్లు భావించారు. కానీ తాను హెడ్స్ అన్నట్లు డుప్లెసిస్ చెప్పాడు. ఆ సమయంలో టాస్ నిర్వహిస్తున్న సంజయ్ మంజ్రేకర్ కూడా ఫాఫ్.. హెడ్స్ అన్నాడని స్పష్టం చేశాడు. దీనిపై నితీష్ అసహనం వ్యక్తం చేస్తూ పక్కకెళ్లిపోయాడు. ఇది నీకు ఓకే కదా అని మంజ్రేకర్ అడిగినా అతడు పట్టించుకోలేదు. దీనిపై డుప్లెసిస్ వివరణ ఇచ్చాడు. "మొదట బౌలింగ్ చేస్తాం. నా యాస అర్థం కాక నితీష్ రాణా కాస్త తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నాడు" అని డుప్లెసిస్ చెప్పాడు. ఈ నిర్ణయంపై నితీష్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి ఉంటే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని నితీష్ రాణా పేర్కొన్నాడు. అయితే డుప్లెపసిస్ అర్థం కాని యాస కేకేఆర్‌కు ఒక రకంగా మేలు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ మొదట్లో తడబడినా ఆఖర్లో శార్దూల్, రింకూ సింగ్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దారుణ ఆటతీరును కనబరిచింది. 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇక ఈ సీజన్లో రాత్రి పూట మంచు కారణంగా టాస్ గెలిచిన జట్లు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. .@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪 Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI — JioCinema (@JioCinema) April 6, 2023 -
'వయసుతో పాటు మతిమరుపు'
టీమిండియా సీనియర్ ఆటగాడు.. ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్ పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శనివారం పంజాబ్ కింగ్స్ కేకేఆర్‌తో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ అనంతరం జట్టులో ఎవరు ఉన్నారనే దానిపై కెప్టెన్ మాట్లాడడం ఆనవాయితీ. మురళీ కార్తిక్ ధావన్‌ను తుది జట్టు గురించి అడిగాడు. ధావన్ తుదిజట్టు గురించి మాట్లాడుతూ విదేశీ ఆటగాళ్ల పేర్లు చెబుతున్న సమయంలో ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పాడు. బానుక రాజపక్స, నాథన్ ఎల్లిస్, సామ్ కరన్ ఇంకా.. అంటూ ఆగిపోయాడు. ఆ తర్వాత..'' నాలుగో ఆటగాడి పేరు మరిచిపోయా.. క్షమించండి'' అని పేర్కొన్నాడు. దీంతో అక్కడ నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంతకు ధావన్ మరిచిపోయిన నాలుగో విదేశీ క్రికెటర్ ఎవరో తెలుసా.. జింబాబ్వే సంచలనం సికందర్ రజా. అయితే ధావన్ చర్యను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.. 37 ఏళ్లు వచ్చాయి.. వయసు పెరుగుతోంది.. అందుకే మతిమరుపు కూడా అంటూ కామెంట్ చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 100 పరుగులు దాటింది. రాజపక్స అర్థసెంచరీతో దాటిగా ఆడుతుండగా.. ధావన్ అతనికి సహకరిస్తున్నాడు. .@KKRiders call it right with the 🪙! Who are you backing in #PBKSvKKR?#IPLonJioCinema is streaming LIVE & FREE across all telecom operators #IPL2023 #TATAIPL pic.twitter.com/xavY31Af5V — JioCinema (@JioCinema) April 1, 2023 చదవండి: 16 కోట్లు! ఇంతకీ ఏం చేశాడు? దండుగ అంటూ ట్రోల్స్! కానీ.. -
రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా!
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా మొదలైంది. అయితే టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వింత అనుభవం ఎదురైంది. టాస్ గెలిచాకా రోహిత్ జట్టు నిర్ణయం ఏంటనేది మరిచిపోవడం ఆసక్తి కలిగించింది. అయితే కావాలని చేశాడా లేక నిజంగానే మరిచిపోయాడా అన్న సందేహం కూడా కలుగుతుంది. విషయంలోకి వెళితే.. రవిశాస్త్రి మ్యాచ్‌కు అంతా సిద్ధం.. టాస్ ఎవరు నెగ్గుతారు అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ రిఫరీ జగవల్ శ్రీనాథ్ టాస్ కాయిన్ ఎగురవేయగానే టామ్ లాథమ్ హెడ్స్ అని కాల్ ఇచ్చాడు. కానీ టెయిల్స్ పడడంతో శ్రీనాథ్ రోహిత్ టాస్ గెలిచినట్లు ప్రకటించాడు. అయితే రోహిత్ టాస్ గెలిచిన తర్వాత జట్టు నిర్ణయం మరిచిపోయాడు. దీంతో కొంతసేపు ఆలోచించిన రోహిత్ బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లు తన నిర్ణయం ప్రకటించాడు. రోహిత్ చర్యతో టామ్ లాథమ్‌తో పాటు శ్రీనాథ్, రవిశాస్త్రిలు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI. Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv — BCCI (@BCCI) January 21, 2023 చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. ఉమ్రాన్ మాలిక్‌కు మొండిచేయి Cristiano Ronaldo: 'మంచి వంటవాడు కావాలి.. జీతం రూ. 4.5 లక్షలు' -
భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే
మ్యాచ్ రద్దు వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వెల్లింగ్టన్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో.. ఒక బంతి కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు టాస్ ఆలస్యం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 11:30 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పడు ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం వర్షం తగ్గుమఖం పట్టింది. ఈ క్రమంలో గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని సిద్దం చేసే పనిలో పడ్డారు. ఇక ఈ సిరీస్‌కు భారత స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అదే విధంగా తొలి సారి భారత టీ20 జట్టుకు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇక సిరీస్ అనంతరం భారత జట్టు కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేపట్టనున్నాడు. టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: IPL 2023: విలియమ్సన్‌పై కన్నేసిన ఐపీఎల్ జట్టు ఇదే..? మరీ అన్ని కోట్లా! -
'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది'
James Neesham Comments After Nz Loss Toss 1st Test.. టీమిండియా పర్యటనలో న్యూజిలాండ్ వరుసగా టాస్ ఓడిపోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. ''అన్నిసార్లు టీమిండియానే టాస్ గెలుస్తుంది.. నాకెందుకో ఏదో జరుగుతుందని అనుమానం ఉంది.. ఎవరైనా వెళ్లి టాస్ కాయిన్‌ను క్లోజ్‌గా పరిశీలించండి'' అంటూ ట్విటర్ వేదికగా ఫన్నీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం నీషమ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే ఇక భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌కు టాస్ కలిసిరాలేదు. ఇప్పటికే ముగిసిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. ఈ మూడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన టీమిండియా అన్నింటా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ న్యూజిలాండ్ మరోసారి టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసరికి 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. గిల్ అర్థ సెంచరీ సాధించి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన అయ్యర్, జడేజాలు కూడా హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. కివీస్ బౌలర్లలో కైల్ జేమిసన్ మాత్రమే 3 వికెట్లతో కాస్త ప్రభావం చూపెట్టాడు. చదవండి: అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్ అడ్డుగా Can somebody take a closer look at those coins please? 🙄 #INDvNZ — Jimmy Neesham (@JimmyNeesh) November 25, 2021 -
మ్యాగజైన్ స్టోరీ 15 November 2021
-
IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్స్.. టాస్ గెలువు కోహ్లి
Toss Playing Key Role T20 WC 2021 IND Vs NZ.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను ఫ్యాన్స్ క్వార్టర్ ఫైనల్‌గా చూస్తుండడంతో టీమిండియాకు చావో రేవోగా మారింది. ఒకవేళ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గనుక టీమిండియా ఓడిపోతే సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి. ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకూడదంటే కివీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది. చదవండి: NZ VS IND: తీవ్రంగా శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు.. ఫొటోలు వైరల్ ఇక ఈసారి టి20 ప్రపంచకప్‌లో టాస్ కీలకపాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టుదే విజయం అన్నట్లుగా తయారైంది. సూపర్ 12 దశలో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టునే విజయం వరించడం విశేషం. అందులో 8 సార్లు ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లు విజయాలు సాధించడం విశేషం. ఒక్క అఫ్గనిస్తాన్ మాత్రం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకొంది. దీంతో టీమిండియాకు టాస్ కీలకం కానుంది. అయితే టాస్ విషయంలో కెప్టెన్ కోహ్లికి పెద్దగా కలిసిరాలేదు. అదీగాక ఐసీసీ టి20 ప్రపంచకప్‌ల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. అయితే ఫ్యాన్స్ మాత్రం టీమిండియా కివీస్‌పై విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే కోహ్లి మొదట టాస్ గెలవాలని.. ఆ తర్వాత మ్యాచ్ మనదే అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు కోహ్లి సేనకు టాస్ కీలకంగా మారింది. అక్టోబర్ 31(ఆదివారం) జరగనున్న మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. చదవండి: Chris Morris: దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్ మోరిస్ ఆవేదన -
IPL 2021: టాస్ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టేనా!
Mumbai Indians Need 171 Runs Win To Enter Playoffs.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు ఒకే సమయంలో జరగనున్నాయి. ఒక మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా.. మరొక మ్యాచ్ మాత్రం కీలకంగా మారింది. అదే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్‌లో ముంబై 171 పరుగుల తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అలా కానీ పక్షంలో కేకేఆర్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. దీంతో ముంబైకి టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి వీరబాదుడే లక్ష్యంగా పెట్టుకొని భారీ స్కోరు నమోదు చేయాలి. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ను 171 పరుగుల తేడాతో ఓడిస్తే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అడుగుపెడుతుంది. ఇది దాదాపు అసాధ్యం. కానీ ఇది టి20.. ఏ క్షణంలో ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. పైగా ముంబై ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్. అయితే టాస్ ఓడిపోతే మాత్రం ఎస్ఆర్హెచ్ కచ్చితంగా బ్యాటింగ్ చేస్తుంది. అప్పుడు ముంబైకి ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉండదు. అందుకే ముంబై ఇండియన్స్ అభిమానులు మొదట టాస్ గెలవాలని.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఫన్నీవేలో ట్రోల్ చేశాడు. ముంబైకి టాస్ ప్రాణసంకటంగా మారిందని.. టాస్ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టే అంటూ బాలీవుడ్ సూపర్‌హిట్ ''అందాజ్ అప్నా అప్నా'' సినిమాలో అమీర్- సల్మాన్‌లు టాస్ వేస్తూ తంటాలు పడే సన్నివేశాన్ని షేర్ చేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..! IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ -
టాస్ విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాలి
Need to learn from MS Dhoni To Win Toss.. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా మిథాలీ రాజ్ టాస్ నెగ్గిన సందర్భాల కంటే ఓడిపోయినవే ఎక్కువగా ఉన్నాయి. మిథాలీకి టాస్ విషయంలో ఏ మాత్రం కలిసిరాదని పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో మిథాలీ టాస్ ఓడిపోయింది. దీంతో మ్యాచ్ అనంతరం మిథాలీతో జరిగిన ఇంటర్య్వూలో మరోసారి టాస్ ప్రస్తావన వచ్చింది. దీనిపై మిథాలీ రాజ్ ఫన్నీవేలో స్పందించింది. టాస్ ఓడిపోవడం అనేది నా దృష్టిలో పెద్ద విషయం కాదు. అనవసరంగా దీనిని పెద్ద ఇష్యూ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాల్ చెప్పడం వరకే నా బాధ్యత.. ఆ తర్వాత జరిగేది నా చేతుల్లో ఉండదు. అయితే టాస్ గెలవడం విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. అని చెప్పుకొచ్చింది. చదవండి: Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా.. భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్ ‘పింక్ బాల్’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడం విశేషం. మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గురువారం నుంచి మొదలవుతుంది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు! Talk about taking a cue from @msdhoni to win the toss 🙂🙂#TeamIndia | @M_Raj03 | #AUSvIND pic.twitter.com/kFtDHeuItW — BCCI Women (@BCCIWomen) October 3, 2021 -
టాస్ సమయంలో పంత్, రోహిత్‌ల మధ్య ఏం జరిగింది!
Rohit Sharma And Rishab Pant Comedy During Toss.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు ప్రస్తుతం టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిస్తే వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. తాజాగా ఐపీఎల్లో ఇద్దరు వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా ఉన్నప్పటికీ ఎక్కడ కలిసినా అదే ఫన్ క్రియేట్ అవడం సహజం. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో రిషబ్ పంత్, రోహిత్‌శర్మల మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చదవండి: Eoin Morgan: ఏంటి మోర్గాన్.. జట్టు మొత్తం ఓకే.. నీ పరిస్థితి ఏంటి! రిఫరీ టాస్కు కాల్ ఇవ్వగానే రోహిత్ కాయిన్ ఎగిరేశాడు. పంత్ రిఫరీతో మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. అని చెప్పాడు. దీనికి రోహిత్ వెంటనే.. ఏంటి మనిద్దరం కలిసి బౌలింగ్ చేద్దామా అన్నట్లుగా కామెంట్ చేశాడు. దీంతో పంత్ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ.. లేదు.. మేం మాత్రమే బౌలింగ్ ఎంచుకున్నాం అంటూ రిఫరీకి తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ముంబై బ్యాటర్స్ ఏ దశలోనూ రాణించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే 🚨 Toss Update from Sharjah 🚨@DelhiCapitals have elected to bowl against @mipaltan. #VIVOIPL #MIvDC Follow the match 👉 https://t.co/Kqs548PStW pic.twitter.com/ERJAloH0vF — IndianPremierLeague (@IPL) October 2, 2021 -
ఇదేందయ్యా ఇది.. టాస్ గెలిస్తేనే ఇంత పని చేస్తావా..?
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సిరీస్‌లో వరుసగా రెండు సార్లు టాస్ ఓడిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధవన్ ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలవడంతో ఆనందం పట్టలేక తొడ కొట్టి తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ధవన్ సెలెబ్రేషన్స్‌కు లంక కెప్టెన్ డసన్ షనకతో పాటు మ్యాచ్ రిఫరి, కామెంటేటర్లు పగలబడి నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. టాస్ గెలిచినందుకే ఇంత హడావిడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదేందయ్యా ఇది.. టాస్ గెలిస్తేనే ఇంత పని చేస్తావా..? అంటూ అభిమానులు సరదా వ్యాఖ్యలు చేశారు. #TeamIndia have won the toss and they will bat first #SLvIND pic.twitter.com/51qWQOtePK — Doordarshan Sports (@ddsportschannel) July 23, 2021 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గబ్బర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్‌లో బెంచ్ బలగానికి అవకాశం ఇస్తున్నామని తెలిపాడు. దాంతో జట్టులో ఆరు మార్పులు చోటు చేసుకున్నాయని.. మొత్తం ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. నవదీప్ సైనీతో పాటు అరంగేట్ర ఆటగాళ్లు సంజూ శాంసన్, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్ చేతన్ సకారియా, రాహుల్ చాహర్ అవకాశం దక్కించుకున్నారన్నారు. ఇదిలా ఉంటే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ధవన్(13) తక్కువ స్కోర్‌కే అవుటయ్యాడు. అనంతరం పృథ్వీ షా(49), సంజూ సామ్సన్(46) కాసేపు నిలకడగా ఆడి జట్టు స్కోర్‌ను 100 పరుగుల మార్కు దాటించారు. అయితే 16 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు మనీశ్ పాండే(15 బంతుల్లో 10), సూర్యకుమార్ యాదవ్(17 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంక బౌలర్లలో శనక, జయవిక్రమ, చమీరా తలో వికెట్ పడగొట్టారు. -
పాపం కోహ్లి.. ఆ విషయంలో దురదృష్టవంతుడు
పూణే: రికర్డులేవైనా.. అన్నీ తన ఖాతాలోనే ఉండాలనుకున్నాడో ఏమో, టాస్ ఓడిపోవడంలోనూ తనదైన ముద్రను వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ముచ్చటగా మూడోసారి టాస్ కోల్పోయిన టీమిండియా కెప్టెన్.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు అంగీకరించాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో (నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, 3 వన్డేలు) మొత్తం 12 సార్లు టాస్ వేయగా.. టీమిండియా కెప్టెన్ కేవలం రెండు సార్లు మాత్రమే టాస్ నెగ్గాడు. మిగిలిన 10 సందర్భాల్లో టాస్ ఓడిపోయాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో, అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో మాత్రమే కోహ్లీ టాస్ నెగ్గాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దరిద్రం అంటే నీదే భయ్యా.. టాస్ విషయంలో దరిద్రం అదృష్టం పట్టినట్లు పట్టిందంటూ ఫన్నీ కామెంట్లు చేశారు. కాగా, టాస్ ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ స్పందిస్తూ.. టాస్ గెలవడమనేది మన చేతుల్లో ఉండదని, ప్రస్తుత సిరీస్‌లో చాలాసార్లు బౌలింగ్ తీసుకుందామని భావించామని.. కానీ కుదరలేదని పేర్కొన్నాడు. అయితే టాస్‌లు గెలవకపోయినా మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లు కైవసం చేసుకోవడమే ముఖ్యమని కొందరు నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడో వన్డేలో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 329 పరుగలకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచింది. టీమిండియా బౌలర్ భవనేశ్వర్ స్వింగ్ మాయాజాలం చేయడంతో ఇంగ్లండ్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. -
టీమిండియా నుంచి ఇలాంటి ఫలితమా!
చెన్నై: ఆసీస్‌ను జయించి వచ్చిన తర్వాత భారత్ నుంచి ఇలాంటి ఫలితాన్ని ఎవరైనా అంచనా వేశారా! నాలుగేళ్ల క్రితం ఇక్కడే 0–4తో చిత్తుగా ఓడిన జట్టు, ‘నామ్‌కే వాస్తే’లాంటి ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌లో అడుగు పెట్టిన టీమ్ మనకు ఇలాంటి షాక్ ఇస్తుందని సగటు క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. అయితే అదే జరిగింది. స్వదేశంలో 2017 (పుణేలో)లో ఆసీస్ చేతిలో పరాజయం తర్వాత మళ్లీ టీమిండియాను ఒక జట్టు ఓడించగలిగింది. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత పిచ్ మారిపోవడం, చివరి రోజు బ్యాటింగ్ చేయాల్సి రావడం భారత్ ఓటమికి ఒకానొక కారణంగా కనిపించవచ్చు. కానీ అది అర్ధ సత్యం మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే జట్టు సమష్టిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమే చివరకు మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. ఇంగ్లండ్ ఏకంగా 190.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన తర్వాత మూడో రోజూ పిచ్ మెరుగ్గానే ఉంది. కానీ 60 ఓవర్లలోపే భారత్ 6 వికెట్లు చేజార్చుకుంది. దాంతో మరుసటి రోజు సుందర్ బ్యాటింగ్‌ను నమ్ముకోవాల్సి వచ్చింది. నిజానికి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా నిరోధించడంలో జట్టు విఫలమైంది. మన గడ్డపై విదేశీ బ్యాట్స్‌మెన్ రెండు రోజులపాటు ఇలా ఆడుకోవడం మనోళ్లకు ఎప్పుడూ అనుభవంలోకి రానిది. ఇక్కడే రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అశ్విన్ రాణించినా... కెరీర్లో రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న నదీమ్, సుందర్‌లకు అసలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి! తొలి ఇన్నింగ్స్ స్కోర్లలో భారీ అంతరం వచ్చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో దానిని పూడ్చటం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న చోట, సుందర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం ఎలాంటి వ్యూహమో అర్థం కాలేదు. సుందర్ కేవలం బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉన్నాడా అన్నట్లుగా చివర్లో ఒకే ఒక ఓవర్ అతనితో వేయించారు. చెన్నై పిచ్ ఎలా స్పందిస్తుందో భారత జట్టుకు పూర్తిగా తెలుసు. దానికి అనుగుణంగా సిద్ధం కావాల్సింది. ఆఖరి రోజు 381 పరుగుల ఛేదన అసాధ్యం అనిపించిన వేళ ‘డ్రా’ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఈ జట్టుకు ఉన్నాయనే అందరూ నమ్ముతారు. కానీ ఆఖరి రోజు దానికి భిన్నంగా జరిగింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ కలిసి ఏకంగా 573 బంతులు (95.3 ఓవర్లు) ఆడిన అశ్విన్ ఒక్కడే ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున హీరోగా కనిపించాడు. మ్యాచ్‌లో ఆయా ఆటగాళ్ల భాగస్వామ్యాన్ని చూస్తే రోహిత్ శర్మ మాత్రమే అందరికంటే ఘోరంగా (18 పరుగులు) విఫలమయ్యాడు. మెల్బోర్న్ సెంచరీ తర్వాత వరుసగా విఫలమవుతున్న రహానే ఇక్కడా దానిని కొనసాగించడం జట్టుకు చేటు చేసింది. ఒక్క టెస్టు పరాజయంతో ఆందోళన అనవసరం అనిపించవచ్చు కానీ టీమిండియా ప్రస్తుత స్థితి, ఇటీవలి ఫామ్, సొంతగడ్డపై బలం... ఇలా ఏం చూసినా భారత్‌దే పైచేయిగా ఉండాల్సిన చోట వచ్చిన ఈ ఓటమి తీవ్రంగా నిరాశ కలిగించడం సహజం. టాస్‌తో ఫలితమా..! భారత జట్టు టాస్ గెలిచి ఉంటే ముుందుగా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం సరిగ్గా దీనికి రివర్స్‌లో వచ్చేది అంటూ ఒక చర్చ సాగుతోంది. అయితే టాస్ మాత్రమే మ్యాచ్ ఫలితాన్ని శాసించదు. పట్టుదలగా రెండు రోజులు నిలబడి దాదాపు 600 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. దీంతో ఇంగ్లండ్ తమ విజయానికి బాటలు వేసుకోగా, భారత్ అదే అంకితభావాన్ని ప్రదర్శించలేకపోయింది. ఇక చరిత్ర చూస్తారా... ఇక్కడ గత రెండు పర్యటనల్లో ఇంగ్లండ్ 3 టెస్టులు గెలిచింది. ఈ మూడు సార్లూ ఇంగ్లండ్ టాస్ ఓడిపోవడం విశేషం! 2012 సిరీస్‌లో రెండు టెస్టుల్లోనూ భారత్ ముందుగా బ్యాటింగ్ చేయగా, 2006 ముంబై టెస్టులో భారత్ కోరడంతో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. -
బొమ్మ పడితే యాక్ట్ చేస్తా.. లేదంటే
మొన్న జనవరి 31తో ప్రీతి జింటాకు 46 ఏళ్లు నిండాయి. బాలీవుడ్లో టాప్ స్టార్ అయి ఆ తర్వాత అంట్రప్రెన్యూర్‌గా మారిన ప్రీతి తను సినిమాల్లోకి వచ్చేందుకు కాయిన్ ఎగరేసి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ‘లిరిల్’ యాడ్ చేసి లిరిల్ గర్ల్‌గా క్రేజ్ సంపాదించుకుంది ప్రీతి జింటా. తండ్రి చిన్నప్పుడే మరణించడం, కుటుంబానికి తనే ఆధారం కావడంతో ఈ సిమ్లా అమ్మాయి త్వరత్వరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (క్రిమినల్ సైకాలజీ) చేసి ముంబై చేరుకుంది. అక్కడ మోడల్‌గా కెరీర్ మొదలెడితే సహజంగానే బాలీవుడ్ కన్ను పడింది. ‘దర్శకుడు శేఖర్ కపూర్ నన్ను మొదటగా ‘తర రమ్ పమ్’ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. ఆయనను నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద దర్శకుడు. కాని నాకు సినిమా కెరీర్ పట్ల అప్పటికి ఆలోచన లేదు. విధి నిర్ణయం అలాగే ఉంటే తప్పక నటిస్తాను అని ఆయనతో చెప్పి ఆయన దగ్గరే కాయిన్ ఎగరేశాను. బొమ్మ పడితే సినిమా చేస్తాను. బొరుసు పడితే చేయను అనుకున్నాను. బొమ్మ పడింది. సినిమా ఒప్పుకున్నాను’ అని అప్పటి సంగతి గుర్తు చేసుకుందామె. అయితే ఆ సినిమా కొన్నాళ్లకు మూలన పడింది. ప్రీతి జింటా మణిరత్నం ‘దిల్ సే’ తో మొదట పరిచయం అయ్యి స్టార్‌గా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వేరే టీమ్ ‘తర రమ్ పమ్’ చేసింది సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలతో. ‘అది కూడా విధి నిర్ణయమే కావచ్చు’ అంటుంది ప్రీతి. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రీతి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా ఆమె ఎగరేసిన కాయిన్‌కు మనం థ్యాంక్స్ చెప్పాలి. అది బొమ్మ పడటం వల్లే కదా ఈ చక్కటి బొమ్మ తెర మీద కనిపించింది. -
‘నేను టాస్ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’
కోల్‌కతా: గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2011 ప్రపంచకప్ ఫైనల్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్ అశ్విన్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కుమార సంగక్కర ఈ అంశం గురించి మాట్లాడాడు. ‘టాస్ సమయంలో వాంఖెడే స్టేడియం అరుపులతో హోరెత్తుతోంది. టాస్కు సంబంధించిన నేను నా ఎంపిక చెప్పాను. కానీ ధోనికి వినబడనట్లుంది. అతను వెంటనే నువ్వు టెయిల్స్ ఎంచుకున్నావా? అని నన్ను అడిగాడు. లేదు హెడ్స్ అని చెప్పాను. అప్పటికే రిఫరీ నేను టాస్ గెలిచాను అని ప్రకటించాడు. తను ఇంకా ఏం చెప్పలేదని ధోని అనడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ టాస్ వేయాలంటూ ధోని కోరడంతో రెండోసారి వేయగా... నేను కోరుకున్న హెడ్స్ పడింది. దీంతో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. అప్పుడు టాస్ గెలవడం అదృష్టమో కాదో తెలియదు కానీ ఒకవేళ నేను టాస్ ఓడిపోయి ఉంటే ఇండియా మొదట బ్యాటింగ్ చేసి ఉండేది. ఫలితం మరోలా ఉండేదని నేను నమ్ముతున్నా’అంటూ సంగక్కర నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. -
ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్
హైదరాబాద్: దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా రెండోసారి ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అపూర్వ విజయం సాధించి భారత్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు సంబంధించి ఆనాటి లంక సారథి కుమార సంగక్కర పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో సంగక్కర పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేసిన విషయాన్ని తెలుపుతూ, దానికి గల కారణాలు వెల్లడించాడు. (ధోనికి ఆ హక్కు ఉంది ) ‘నేనెప్పుడు శ్రీలంకలో అంతమంది ప్రేక్షకులను మైదానంలో చూడలేదు. ఆ స్థాయిలో అభిమానులు మైదానానికి రావాలన్నా, ఆటగాళ్లను ఉత్సాహపరచాలన్నా అది భారత్‌లోనే సాధ్యం అవుతుందనుకుంటా!. కిక్కిరిసిన ప్రేక్షకులు, భారీ శబ్దాలు, ఫైనల్ టెన్షన్‌తో టాస్కు వెళ్లాం. ధోని టాస్ వేశాడు. నేను టెయిల్స్ అన్నాను. భారీ శబ్దాల కారణంగా నేను చెప్పింది ధోనికి వినపడలేదు. అతడు నన్ను అడిగాడు..నువ్వు టెయిల్స్ అన్నావా? అని, కాదు నేను టెయిల్స్ అని అన్నాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో సౌండ్స్ ఉన్నాయో. ఇక మ్యాచ్ రిఫరీ వచ్చి శ్రీలంక టాస్ గెలిచిందని చెప్పగా ధోని గందరగోళంగా ఉందని మరోసారి టాస్ వేయాలని రిఫరీని, నన్ను కోరాడు. దీంతో మరోసారి టాస్కు వెళ్లాం. (నన్ను అవమానించారు.. లేదు మనోజ్!) మరోసారి టాస్ వేయగా మళ్లీ మేమే గెలిచాం బ్యాటింగ్ తీసుకున్నాం. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే ఐదు, ఆరు స్థానాల వరకు మా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్‌లో పలు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యాం. ఇక మాథ్యూస్ గాయం కూడా మా ఓటమికి కారణమైంది. అతడు ఆరోజు మ్యాచ్‌లో ఉండి ఉంటే మేము ఛేజింగ్ వైపు మొగ్గు చూపేవాళ్లం. ఎందుకంటే అవసరమైన సమయంలో టెయిలెండర్ల సహాయంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను గట్టెక్కించేవాడు. జరిగిందేదో జరిగిపోంది. టీమిండియా అద్భుతంగా ఆడింది. ధోని తన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించాడు’అని పేర్కొంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు సంగక్కర. -
పింక్ బాల్ టెస్ట్; బంగ్లా బ్యాటింగ్
కోల్‌కతా: భారత గడ్డపై తొలిసారిగా పింక్ బాల్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభమైంది. టీమిండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ టీమ్‌లో రెండు మార్పులు జరిగాయి. తైజూల్, మెహిదీ స్థానంలో ఆల్-అమీన్, నయీమ్ జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్‌కతా నగరం గులాబీ మయంగా మారింది. పింక్ బాల్‌తో తొలిసారిగా మన దేశంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఈడెన్ గార్డెన్స్‌కు అభిమానులు పోటెత్తారు. కాగా, ఇండోర్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పేలవ ప్రదర్శనతో గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన బంగ్లా ఈ మ్యాచ్‌లోనైనా పోరాడి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. (చదవండి: గులాబీ కథ షురూ కావళి) తుదిజట్లు: భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, జడేజా, సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ బంగ్లాదేశ్: మోమినుల్ (కెప్టెన్), కైస్, షాద్మన్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, మిథున్, లిటన్ దాస్, నయీమ్, ముస్తఫిజుర్, అబూ జాయెద్, అల్ అమీన్ -
‘ఆమెది లక్కీ హ్యాండ్.. అందుకే’
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో శ్రీలంక మహిళా జట్టు సారథి చమరీ ఆటపట్టు సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కేవలం 66 బంతుల్లోనే శతకం సాధించిన తొలి లంక మహిళా క్రికెటర్‌గా.. వన్డే, టీ20ల్లో ఆసీస్ సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆటపట్టు అరదైన రికార్డును నెలకొల్పింది. ఆదివారం స్థానిక నార్త్ సిడ్నీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డులను ఆటపట్టు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇదే మ్యాచ్‌లో టాస్ సమయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా మ్యాచ్‌లో టాస్ వేసేటప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు వస్తారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్ సారథి మెగ్ లానింగ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తనకు టాస్ కలసి రావడం లేదని వికెట్ కీపర్ అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చింది. మ్యాచ్ రిఫరీ కాయిన్‌ను హీలేకు ఇచ్చి టాస్ వేయమన్నాడు. అయితే అనూహ్యంగా ఆసీస్ టాస్ గెలిచింది. అనంతరం హీలే పక్కకు తప్పుకోవడంతో రెగ్యులర్ కెప్టెన్ లానింగ్ వచ్చి తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక టాస్ గెలవడంతో హీలే మైదానంలో గంతులు వేసింది. అయితే ఈ విషయంపై మెగ్ లానింగ్ స్పందిస్తూ.. ‘గత కొన్ని రోజులుగా నేను టాస్ గెలవడం లేదు. బహుశా నాకు అదృష్టం కలసి రావడం లేదనుకుంటా. అందుకే అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చాను. లక్కీగా మేమే టాస్ గెలిచాం. నాకు తెలుసు హీలేది లక్కీ హ్యాండ్ అని’పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టాస్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. Just when you think you've seen it all! #AUSvSL pic.twitter.com/eaKpDnW3jr — cricket.com.au (@cricketcomau) September 30, 2019 -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
-
మూడో వన్డే: టాస్ గెలిచిన టీమిండియా
మెల్బోర్న్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతన్న నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ కాస్త ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఆరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్ సిరాజ్‌ను తప్పించి అతడికి చోటు కల్పించారు. రాయుడు స్థానంలో కేదార్ జాదవ్, కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. టి20 సిరీస్‌ను 1-1తో ముగించి, టెస్ట్ సరీస్‌లో 2-1తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. (మెల్‌బోర్న్‌లోనూ మెరిస్తే...) తుది జట్లు: భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, జడేజా, చహల్, భువనేశ్వర్, షమీ. ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, జంపా, స్టాన్లేక్, సిడిల్, రిచర్డ్సన్ -
అడిలైడ్ వన్డే; మార్ష్ హాఫ్ సెంచరీ
అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయినప్పటికీ షాన్ మార్ష్ అర్ధ సెంచరీతో ఆసీస్ కోలుకుంది. మార్ష్ 62 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్లతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. హ్యాండ్స్కోంబ్(20) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ 30 ఓవర్లలో 141/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మార్ష్ 65, స్టొయినిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. 26 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరోసారి విఫలమ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 పరుగులు చేసిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీని మహ్మద్ షమి పెవిలియన్‌కు పంపాడు. టాస్ గెలిచి ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీలో రాణించినట్టుగానే ఇక్కడ కూడా సత్తా చాటుతామన్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. (లెక్క సరిచేస్తారా!) తుది జట్లు భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి(కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), షాన్ మార్ష్, ఉస్మాన్ ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, రిచర్డ్సన్, లయన్, పీటర్ సిడిల్, జాసన్ బెహ్రిన్డార్ఫ్ -
టాస్ కొనసాగుతుంది...
టెస్టు క్రికెట్లో ‘టాస్’ తొలగించాలంటూ ఇటీవల వినిపించిన చర్చకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముగింపు పలికింది. ఇకపై కూడా టాస్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. ‘టాస్ వేయకుండా పర్యాటక జట్టుకు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. అయితే టెస్టు క్రికెట్లో టాస్ అంతర్గత భాగంగా క్రికెట్ కమిటీ భావించింది’ అని ఐసీసీ ప్రకటించింది. ఇకపై సిరీస్ విజయానికి కాకుండా మ్యాచ్‌కు పాయింట్లు కేటాయించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. -
టెస్టుల్లో టాస్ ఉండాల్సిందే: గంగూలీ
కోల్‌కతా: ఆతిథ్య జట్లకు అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో టెస్టుల్లో ‘టాస్’ను ఎత్తివేయాలన్న ప్రతిపాదనను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యతిరేకించాడు. ‘ఈ ఆలోచన అమల్లోకి వస్తుందో రాదో కానీ, టాస్ ఎత్తివేతను మాత్రం వ్యక్తిగతంగా నేను సమర్థించను. ఒకవేళ ఆతిథ్య జట్టు టాస్ గెలవకుంటే దానికి ప్రయోజనాలు దక్కవు కదా?’ అని వ్యాఖ్యానించాడు. 1877 నుంచి టెస్టుల్లో అమల్లో ఉన్న టాస్ పద్ధతి రద్దుపై ఈ నెల చివర్లో ముంబైలో ఐసీసీ క్రికెట్ కమిటీ చర్చించనుంది. -
‘టాస్ లేకపోవడమే మంచిది’
కరాచీ: టెస్టు క్రికెట్లో టాస్‌ను తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచనలు చేస్తోంది. ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానానికి స్వస్తి పలకాలనే భావిస్తోంది. దీన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ స్వాగతించాడు. టెస్టుల్లో టాస్ లేకుండా ఉండటం వల్ల మంచి పిచ్‌లను రూపొందించడానికి ఆతిథ్య జట్లు కృషి చేస్తాయన్నాడు. దీనివల్ల లాభమే తప్పా నష్టమేమీ లేదని మియాందాద్ అభిప్రాయపడ్డాడు. ‘ఆతిథ్య జట్లు వారికి నచ్చిన తరహాలో పిచ్‌లను తయారు చేస్తున్నాయి. దీనివల్ల చాలా ఎక్కువ సందర్బాల్లో పేలవమైన పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఒకవేళ టెస్టుల్లో టాస్ లేకపోతే అప్పుడు ఆతిథ్య మంచి పిచ్‌లను తయారు చేయడానికి వెనుకాడదు. ఈ ప్రయోగం మంచిదే’ అని మియాందాద్ తెలిపాడు. టెస్టుల్లో టాస్ తొలగించే అంశంపై ఈ నెల 28, 29 తేదీల్లో ముంబైలో జరగనున్న సమావేశంలో కమిటీ చర్చించనుంది. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, ఐసీసీ రిఫరీలు రంజన్ మదుగలే, షాన్ పొలాక్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్‌షిప్ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండా... బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
-
ఇకపై క్రికెట్లో టాస్ ఉండదా?
-
టాస్ లేకుండానే టెస్టు?
న్యూఢిల్లీ: క్రికెట్లో... మరీ ముఖ్యంగా టెస్టుల్లో ‘టాస్’ ప్రాధాన్యం అంతాఇంతా కాదు. 1887లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొట్టమొదటి టెస్టు నుంచే ఆతిథ్య జట్టు కెప్టెన్ నాణెం ఎగురవేయడం... పర్యాటక జట్టు సారథి తన ఎంపిక చెప్పడం పద్ధతిన టాస్ అమల్లో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో పిచ్‌లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానం ఆతిథ్య జట్టుకే ఎక్కువ మేలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో టాస్ తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచనలు చేస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో ముంబైలో జరగనున్న సమావేశంలో కమిటీ చర్చించనుంది. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, ఐసీసీ రిఫరీలు రంజన్ మదుగలే, షాన్ పొలాక్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్‌షిప్ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండా... బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు. గతంలో భారత దేశవాళీ క్రికెట్లోనూ దీని అమలు దిశగా ఆలోచించినా ముందడుగు పడలేదు. -
టెస్ట్ క్రికెట్లో ‘టాస్’కు గుడ్ బై..!
క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్కు ఉండే విశిష్టత గురించి తెలుసు. మ్యాచ్‌లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ చేపట్టాలన్నది టాస్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ విధానానికి మంగళం పాడాలని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. 1877లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం అయినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. తొలుత బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏది ఎంచుకోవచ్చనేది టాస్ గెలిచిన కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ విధానం ద్వారా అతిథ్య జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు ఎక్కువయ్యాయి. పిచ్‌ల ఏర్పాటు అనేది అతిథ్య జట్టు మీదే ఆధారపడి ఉండటంతో టాస్ గెలిస్తే పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌లలో దేనికి అనుకూలిస్తే వారు దాన్నే ఎంచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఐసీసీ నియమించిన కమిటీ మే 28, 29 తేదీలలో ముంబైలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ కమిటీలో ప్రముఖ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేళ జయవర్దనే, రాహుల్ ద్రవిడ్, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, థర్డ్ అంపైర్ రిచర్డ్, ఐసీసీ రిఫరీలు రంజన్, షాన్ పొలాక్‌లు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. భారత్‌లో కూడా దేశవాలీ క్రికెట్లో టాస్కు స్వస్తి చెప్పే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది అమల్లోకి రాలేదు. -
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
వడోదర : ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అస్వస్థత కారణంగా మొదటి వన్డేకు దూరం అయినా కెప్టెన్ మిథాలి రాజ్ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. -
ముక్కోణపు టోర్నీలో 'గోల్డెన్' టాస్
కొలంబో: శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. వేడుకల సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆరంభానికి ముందే వేసే టాస్ కాయిన్ ను ప్రత్యేక రూపొందించింది. బంగారం పూతతో ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను తయారు చేసినట్టు బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. టోర్నీలోని అన్ని మ్యాచ్‌ల్లో ఇదే కాయిన్‌ను వాడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఎమర్జెనీతో మ్యాచ్‌కు అంతరాయం కలగదని బీసీసీఐ స్పష్టం చేసింది. -
టాస్ వేసి.. పోస్టింగ్!
చండీగఢ్: పోస్టింగ్ విషయమై ఇద్దరు లెక్చరర్ల మధ్య తలెత్తిన పోటీని మంత్రి నాణెం టాస్ వేసి పరిష్కరించడంపై వివాదానికి దారి తీసింది. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 37 మంది ఎంపికయ్యారు. సాంకేతిక విద్యా మంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని సమక్షంలో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు వారందరినీ సోమవారం పిలిపించారు. అయితే, ఇద్దరు లెక్చరర్ల విషయంలో వివాదం ఏర్పడింది. ఈ ఇద్దరూ పటియాలాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలనే కోరుకున్నారు. అన్ని విషయాల్లోనూ ఇద్దరూ సమానంగా ఉండటంతో ఈ సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి చన్ని తీసుకున్నారు. నాణెం టాస్ వేసి బొమ్మా బొరుసూ ప్రకారం ఒక్కరిని ఆ పోస్టుకు ఎంపికచేశారు. అయితే, ఈ వ్యవహారం మొత్తం మీడియాలో రావటంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే చన్నిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. -
భారత్‌దే బ్యాటింగ్
కేప్‌టౌన్: భారత్‌తో న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా ఆతిథ్య జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గాయంతో దూరమైన సఫారీ కీపర్ డికాక్ స్థానంలో హెన్రీచ్ క్లాసెన్, బౌలర్ మోర్కెల్ స్థానంలో లుంగి ఎంగిడిలను తీసుకున్నారు. ఈ ఇద్దరు ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లి సేన మరో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇక ఆతిథ్య జట్టుకు గాయాల బెడద వెంటాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌పై అవకాశాలు వదులుకోవద్దని సఫారీ జట్టు భావిస్తోంది. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, మిల్లర్, జొండొ, హెన్రీచ్ క్లాసెన్, మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి -
రెండో వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లిసేన బరిలోకి దిగుతుండగా సఫారీ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్‌తో ఖాయా జోండో అరంగేట్రం చేస్తున్నాడు. గాయంతో కెప్టెన్ డుప్లెసిస్ దూరం కాగా ఈ స్థానంలో జోండోను తుది జట్టులోకి ఎంపిక చేశారు. ఇక ఆలౌరౌండర్ పెహ్లుకువాయో స్థానంలో స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని ఎంపిక చేశారు. తాత్కలిక కెప్టెన్‌గా మార్క్రమ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. డర్బన్ వన్డే విజయంతో కోహ్లిసేన ఉత్సాహంగా ఉండగా కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్ తడబాటును ఎదుర్కొంటోంది. తుది జట్లు భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్ దక్షిణాఫ్రికా : హషిమ్ ఆమ్లా, డికాక్, మార్క్రమ్, డుమిని, డేవిడ్ మిల్లర్, ఖాయా జోండో, క్రిస్ మొర్రిస్, రబడా,మోర్కెల్. తబ్రాజ్ షమ్సీ, ఇమ్రాన్ తాహిర్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
సెంచూరియన్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తన తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సాహా స్థానంలో పార్థీవ్ పటేల్, శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మకు చోటు దక్కింది. కాగా గాయం కారణంగా ఈ రెండో టెస్ట్‌కు కూడా స్టెయిన్ దూరంగా ఉన్నాడు. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో సఫారీలు 1-0 తో ఆధిక్యంలో ఉన్నారు. జట్లు భారత్: రాహుల్, విజయ్, పుజారా, కోహ్లి (కెప్టెన్), ఆర్జీ శర్మ, పాండ్యా, పార్ధీవ్ పటేల్, ఆర్ అశ్విన్, షమీ, బుమ్రా, ఇషాంత్ శర్మ. దక్షిణాఫ్రికా: ఎల్గర్, మార్క్రమ్, ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్ (కెప్టెన్), డికాక్, ఫిలాండర్, క్రిస్ మోరిస్, కేశవ్ మహరాజ్, రబడ, మోర్నీ మోర్కెల్ -
మరో యువ కెరటం అరంగేట్రం..
-
మరో యువ కెరటం అరంగేట్రం..
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరోసారి రోహిత్‌కు టాస్ కలిసిరాలేదు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై మంచు ప్రభావం కారణంగా టాస్ కీలకంగా మారిన దశలో రోహిత్ టాస్ కోల్పోయాడు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా శ్రీలంక బరిలోకి దిగుతుండగా.. భారత్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుంధర్‌ను తీసుకున్నారు.. తొలి మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేయగా.. ఈ మ్యాచ్‌తో 18 ఏళ్ల వాషింగ్టన్ సుంధర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే రహానేను తీసుకుంటారని అందరు భావించగా మరో సారి అతనికి మొండిచేయ్యే ఎదురైంది. వాషింగ్టన్ సుంధర్ మ్యాచ్‌కు ముందు కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా సుంధర్ గుర్తింపు పొందాడు. తొలుత టీ20లకే సెలక్ట్ అయిన ఈ 18 ఏళ్ల కుర్రాడు. ఆలౌరౌండర్ కేదార్ జాదవ్ గాయంతో జట్టుకు దూరం అవ్వడంతో అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక భారత్‌కు ఈ మ్యాచ్ చావోరేవో అన్నట్లుగా మారింది. ఇది గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి మ్యాచ్ విజయంతో లంకేయులు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయాన్నందుకోవాలని ఉవ్విలూరుతున్నారు. జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, వాషింగ్టన్ సుంధర్, బుమ్రా, చహల్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, తిరిమన్నే, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్. -
అయ్యర్ అరంగేట్రం.. రహానే ఔట్
ధర్మశాల: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్ ఆటగాడైన మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. కెప్టెన్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో ఈ సిరీస్‌కు రోహిత్ కెప్టెన్సీ వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ ఆటగాడైన అజింక్యా రహానేకు జట్టులో చోటు దక్కలేదు. పేసర్లకు అనుకూలించే పిచ్ అని, కెప్టెన్‌గా ఓ గొప్ప బాధ్యత తనపై ఉందని, మంచి జట్టుతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇక బ్యాటింగ్ పిచ్ కావడంతో చేజింగ్ సులువని ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ పెరీరా పెర్కొన్నాడు. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్ శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), తరంగ, గుణతిలక, తిరిమన్నె, డిక్వెలా, మాథ్యూస్, గుణరత్నే, సచిత్, లక్మల్, ప్రదీప్, అకిల ధనంజయ -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
-
టాస్ నెగ్గిన కోహ్లి సేన..
కొలంబో: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో కోహ్లి సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. జ్వరంతో గాలె టెస్టుకు దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగిరాగా.. అభినవ్ ముకుంద్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. శ్రీలంక జట్టులో మూడు మార్పులు జరిగాయి. దనుష్క, కుమార, అసెలాలు గాయాలతో దూరమవ్వగా వారి స్థానంలో శ్రీలంక కెప్టెన్ చండిమల్,మలింద పుష్పకుమార, ధనుంజయా డెసిల్వాలు జట్టులోకి వచ్చారు. తొలి టెస్టు విజయంతో భారత్ ఉత్సాహంగా ఉండగా.. సొంత గడ్డపై ఓటమి చెందడంతో శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను కాపాడుకోవాలని శ్రీలంక భావిస్తోంది. తుది జట్లు: భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా, ఉమేశ్, షమీ. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, డెసిల్వా పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్. -
టాస్ నెగ్గిన మిథాలీ సేన..
డెర్బీ: మహిళల ప్రపంచకప్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో మిథాలీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను అంపైర్లు 42 ఓవర్లకు కుదించారు. ఓవర్ల కుదింపుతో ఇద్దరి బౌలర్లకు 9 ఓవర్లు, మిగిలిన ముగ్గురికి 8 ఓవర్లు వేసే అవకాశం ఇచ్చారు. ఇక ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో టోర్నీ లీగ్ దశలోని పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగలమనే విశ్వాసంతో మిథాలీ సేన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది. లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తుది జట్ల వివరాలు భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్వెల్, హీలీ, ఆష్లీ గార్డ్నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్ -
రెవెన్యూ అధికారులతోనే ‘టాస్’
రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ విన్నపం సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో మాదిరిగానే రాష్ట్రంలోనూ రెవెన్యూ అధికారులతోనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(టాస్)ని ప్రవేశపెట్టాలని రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రెవెన్యూ జారుుంట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల బృందం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(టాస్) ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా శుక్రవారం బెంగళూరులో విధానసౌధ(సెక్రటేరియేట్)ను సందర్శించింది. కర్ణాటకలో 1957 నుండి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉందని, ఇందులో గ్రూప్ ఏలో డిప్యూటీ కలెక్టర్ స్థారుు అధికారులు, గ్రూప్ బీలో తహసీల్దార్ స్థారుు అధికారులతో పూర్తిగా రెవెన్యూశాఖ అధికారులతో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(కాస్) నిర్వహిస్తున్నారని తెలిపారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
రాజ్‌కోట్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్ వేదికగా తొలిమ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకొంది. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్ల(ఉమేష్ యాదవ్, షమి)తో బరిలోకి దిగింది. ఇషాంత్ శర్మకు తుది జట్టులో స్థానం దక్కలేదు. మ్యాచ్ ప్రారంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ కుక్ అందించిన క్యాచ్‌ను భారత ఆటగాళ్లు రెండు సార్లు జారవిడిచారు. తొలి ఓవర్లో షమి బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే వదిలేయగా.. రెండో ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ మరో క్యాచ్ జారవిడిచాడు. ఇంగ్లండ్ 12 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 42 పరుగులతో ఆడుతోంది. -
రెండేళ్ల తర్వాత గంభీర్
ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో, చివరి టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్ ఎదురు చూపులు ఈ మ్యాచ్‌తో ఎట్టకేలకు ఫలించాయి. ఇంగ్లండ్‌లో 2014లో చివరిసారి టెస్టు ఆడిన ఈ ఢిల్లీ స్టార్ రెండేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. గాయం కారణంగా ఓపెనర్ లోకేష్ రాహుల్ తప్పుకోవడంతో గంభీర్‌కు అవకాశం కల్పించారు. రెండేళ్ల తర్వాత తుదిజట్టులో స్థానం సంపాదించిన గంభీర్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు. పరుగులు రాబట్టే క్రమంలో 60 పరుగుల వద్ద గౌతం గంభీర్ 29 పరుగులు (రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు) చేసి ఔటయ్యాడు. 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పుజారా, కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల విజయంతో సిరిస్‌ను కైవసం చేసుకున్న టీం ఇండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేస్తే, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సత్తా చాటాలని న్యూజిలాండ్ భావిస్తోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, గప్టిల్, టేలర్, రోంచీ, సాన్‌ట్నర్, వాట్లింగ్, జిమ్మి నీషమ్, జీతన్, సోధి, బౌల్ట్. -
ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
హరారే: జింబాబ్వేతో సోమవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణంగా చల్లగా ఉండడంతో 10 నిమిషాలు ఆలస్యంగా టాస్ వేశారు. టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. జింబాబ్వే టీమ్ లో ఒక మార్పు జరిగింది. క్రెయిగ్ ఎర్విన్ స్థానంలో సీన్ విలియమ్స్ జట్టులోకి వచ్చాడు. శనివారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తు చేసిన ధోని సేన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. -
ముంబై ఇండియన్స్ 'ఢమాల్'
విశాఖ: తడబాటుకు మారు పేరు అన్న చందంగా ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఒక మ్యాచ్‌లో గెలిస్తే.. మరో మ్యాచ్‌లో ఘోర ఓటమి. ఐపీఎల్ ఆరంభం నుంచి నిలకడలేమితో సతమవుతున్న రోహిత్ సేన మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు సన్ రైజర్స్ లో చతికిలబడ్డ రోహిత్ అండ్ గ్యాంగ్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2), కృనాల్ పాండ్యా(17), పొలార్డ్(11),హార్దిక్ పాండ్యా(7)లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ కు చేరడంతో ముంబైకు కష్టాల్లో పడింది. ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను 30 పరుగులకే కోల్పోయిన ముంబై ఏ దశలోనూ కోలుకోలేదు. ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 92 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో హర్భజన్ సింగ్(21 నాటౌట్) దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, బరిందర్ శ్రవణ్ కు రెండు,భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆ తరువాత యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. -
రోహిత్ సేన 'చెత్త రికార్డు'
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఈ టోర్నీలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రోహిత్ సేన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబాటుకు లోనైంది. నగరంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 30 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్ తొలి ఐదు వికెట్లను స్వల్ప స్కోరుకే కోల్పోవడం ముంబై ఇన్నింగ్స్ లో ఇదే ప్రథమం కాగా, ఓవరాల్ గా ఇది ఆరో అత్యల్పం కావడం గమనార్హం. సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2),కృనాల్ పాండ్యా(17)లు పెవిలియన్ బాటపట్టారు. ముంబై కోల్పోయిన ఐదు వికెట్లలో ఆశిష్ నెహ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, బరిందర్ శ్రవణ్‌లకు తలో వికెట్ దక్కింది. -
చెలరేగిన ధవన్
విశాఖపట్నం:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా వచ్చిన ధవన్ ఆద్యంతం తనదైన మార్కుతో ఆకట్టుకున్నాడు. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సన్ రైజర్స్ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. శిఖర్ ధవన్, వార్నర్‌లు చక్కటి పునాది వేశారు. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడి తరువాత ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ జోడి 9.5 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం తొలి వికెట్ గా వార్నర్ వెనుదిరిగాడు. అనంతరం కేన్ విలియమ్సన్(2) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ 91 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోశిఖర్ కు జత కలిసిన యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్-యువరాజ్ ల జోడి మూడో వికెట్ కు మరో 85 పరుగులను జోడించడం విశేషం. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
విశాఖపట్నం: ఐపీఎల్ 9లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో పట్టికలో అమీతుమీగా ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది. అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి. -
బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20సిరిస్ గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు సిరీస్ చేజారడంతో ఆసీస్ పూర్తి ఒత్తిడిలో పడింది. దీనికి తోడు కెప్టెన్ ఫించ్ మోకాలి కండర గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాజా బరిలోకి దిగుతున్నాడు. సీనియర్ ఆటగాడు వాట్సన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. కీలక ఆటగాళ్లు వార్నర్, స్మిత్ లేకపోవడం కూడా లోటుగా కనిపిస్తోంది. -
ధోని సేనదే సిరీస్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ20లోనూ సమష్టిగా పోరాడిన టీమిండియా సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్న టీమిండియా..ఆపై బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా రాణించి 27 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను సాధించింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. షాన్ మార్ష్(23),లాయన్(2), మ్యాక్స్ వెల్(1) , షేన్ వాట్సన్(15), ఫాల్కనర్(10)లు నిరాశపరిచారు. తొలి వికెట్ కు 94 పరుగులు జోడించిన ఆసీస్.. ఆ తరువాత వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి భారీ ఇన్నింగ్స్ ఏర్పడటానికి సహకరించారు. రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడారు. ఈ జోడీ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా, శిఖర్ హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి ఆదిలో ఆచితూచి ఆడినా తరువాత రెచ్చిపోయాడు. ప్రత్యేకంగా 14 ఓవర్ లో హేస్టింగ్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టిన కోహ్లి.. తరువాత బోలాండ్ వేసిన ఓవర్ లో సిక్స్ కొట్టి తన మార్కును ఆటను చూపెట్టాడు. అయితే జట్టు స్కోరు 143 పరుగుల వద్ద అనవసర పరుగు కోసం యత్నించిన రోహిత్ శర్మ రనౌట్ గా అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసిన విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) అదే ఊపును కొనసాగించి హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉండగా, చివరి ఓవర్ లో ధోని(14) అవుట్ కావడంతో సహా 10 పరుగులు మాత్రమే రావడంతో టీమిండియా20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మ్యాచ్ విశేషాలు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 68 బంతుల్లో 100 పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది. 2013లో బ్రిస్బేన్ లో వెస్టిండీస్ 67 బంతుల్లో 100 పరుగులు సాధించింది. ట్వంటీ 20లో మెల్బోర్న్ గ్రౌండ్ లో భారత్ నమోదు చేసిన 184 పరుగులే అత్యధిక స్కోరు. అంతకుముందు 2008-09లో దక్షిణాఫ్రికా 182 పరుగులు చేసింది. -
దీటుగా బదులిస్తున్న ఆసీస్
మెల్బోర్న్:టీమిండియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. టీమిండియా విసిరిన 185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(65నాటౌట్), లయన్(0 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు షాన్ మార్ష్(23) తొలి వికెట్ గా అవుటయ్యాడు. టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. -
ఆసీస్‌కు భారీ లక్ష్యం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో టీమిండియా 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి భారీ ఇన్నింగ్స్ ఏర్పడటానికి సహకరించారు. రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడారు. ఈ జోడీ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా, శిఖర్ హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి ఆదిలో ఆచితూచి ఆడినా తరువాత రెచ్చిపోయాడు. ప్రత్యేకంగా 14 ఓవర్ లో హేస్టింగ్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టిన కోహ్లి.. తరువాత బోలాండ్ వేసిన ఓవర్ లో సిక్స్ కొట్టి తన మార్కును ఆటను చూపెట్టాడు. కాగా, జట్టు స్కోరు 143 పరుగుల వద్ద అనవసర పరుగు కోసం యత్నించిన రోహిత్ శర్మ రనౌట్ గా అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసిన విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) అదే ఊపును కొనసాగించి హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉండగా, చివరి ఓవర్ లో ధోని(14) అవుట్ కావడంతో సహా 10 పరుగులు మాత్రమే రావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. -
రోహిత్ దూకుడు
మెల్బోర్న్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడును కొనసాగిస్తున్నాడు. రోహిత్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు మరో ఓపెనర్ శిఖర్ ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడే క్రమంలో తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. రోహిత్(53) కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్ లో ఉన్నాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. తొలి ట్వంటీ 20లో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను సాధించాలని భావిస్తోంది. -
ఐదు ఓవర్లలో భారత్ స్కోరు 44/0
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ట్వంటీ 20లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. రోహిత్(20 నాటౌట్),ధావన్(18 నాటౌట్)క్రీజ్ లో ఉన్నారు. తొలి ట్వంటీ 20లో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను సాధించాలని భావిస్తోంది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
మెల్ బోర్న్: భారత్ తో జరుగుతున్న రెండో టి20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోని సే ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఈరోజు మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ దక్కించు కోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. భారత్ జట్టులో ఎటువంటి మార్పులు లేదు. ఆస్ట్రేలియా టీమ్ లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. జాన్ హాస్టింగ్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి వచ్చారు. మొదటి మ్యాచ్ లో ధోనిసేన గెలిచిన సంగతి తెలిసిందే. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 0-4తో సిరీస్‌లో వెనకంజలో ఉన్న భారత్ శనివారం జరిగే వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తోంది. వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో జోరు మీదున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. -
69 పరుగులకు ఓపెనర్లు అవుట్
నాగపూర్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. 69 పరుగులకు ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. 50 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(12)ను ఎల్గర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 40 పరుగులు చేసి మోర్కెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో పుజారా 18, విరాట్ కోహ్లి 11 పరుగులతో ఆడుతున్నారు. -
టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
నాగపూర్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుణ్ అరోన్, స్టువర్ట్ బిన్నీ బదులు రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరిగింది. కైలీ అబాట్ స్థానంలో సిమన్ హార్మర్ ను తీసుకున్నారు. డేల్ స్టెయిన్ ఫిట్ లేనందువల్ల ఈ మ్యాచ్ లో ఆడడం లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషిమ్ ఆమ్లా తెలిపాడు. తర్వాతి మ్యాచ్ లో అతడు ఆడే అవకాశముందన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నామని వెల్లడించాడు. కోహ్లి సేనను తొందరగా అవుట్ చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని చెప్పాడు. పిచ్ పొడిగా ఉందని, మొదటి రోజు బాగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివరించాడు. తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, బెంగళూరులో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా రద్దయింది. -
5 ఓవర్లలో భారత్ స్కోరు 32/2
కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) భారత్ తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు ఓవర్లలో భారత్ రెండు వికెట్ కోల్పోయి 32 పరుగులుచేసింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ(17), రైనా(1) లు క్రీజ్ లో ఉన్నారు. 28 పరుగుల వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్ లో శిఖర్ ధావన్(11) అవుటయ్యాడు. 30 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో కోహ్లి(1) రనౌట్ గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ కు ఒక వికెట్ లభించింది. -
బ్యాటింగ్ కు దిగిన భారత్
కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఆరంబించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు బ్యాటింగ్ కు దిగారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ రెండో టీ20 మ్యాచ్ లోనూ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలో దిగాయి. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, మొహిత్ శర్మ, హర్భజన్ సింగ్. దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), హాషిమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, బెహర్దీన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, రబడా, అబాట్, మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) భార త్ తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీ స్కోరు చేసినా ఓడిపోయామన్న బాధలో భారత్, మరోవైపు సిరీస్‌పై కన్నేసిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండో టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో మార్పు చేశాయి. భారత జట్టులో శ్రీనాథ్ అరవింద్ స్థానంలో హర్భజన్ సింగ్, దక్షిణాఫ్రికా జట్టులో డిలాంగ్ స్థానంలో మోర్కెల్‌లు ఆడనున్నారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
మిర్పూర్: భారత్‌తో గురువారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం బారిన పడిన టెస్టు తర్వాత ఇప్పుడు ఇరు జట్లు కొత్తగా కనిపిస్తున్నాయి. పలువురు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లు కూడా మారారు. ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత భారత్ తొలిసారి వన్డే ఆడబోతుండగా... ఇటీవల పాక్‌ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం (నేడు) ఇక్కడ తొలి మ్యాచ్ (డేనైట్) జరగనుంది. అయితే టెస్టులాగే ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటం ఊరటనిచ్చే విషయం. -
టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం
టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం వచ్చింది. భారత్ క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ నైకీ గురువారం మెల్బోర్న్లో న్యూ జెర్సీని ఆవిష్కరించింది. ఆస్ట్రేలియాలో శుక్రవారం నుంచి జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీమిండియా ఈ దుస్తులను ధరించనుంది. సగటున 33 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఒకో కిట్‌ను నైకీ తయారు చేసింది. అంతేకాకుండా కొత్త యూనిఫాం కోసం ఆటగాళ్లందరి అభిప్రాయం కూడా తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆటగాళ్ల ప్రతిభను దృష్టిలో పెట్టుకుని డ్రై-ఫిట్ టెక్నాలజీతో ఈ జెర్సీలను తయారు చేశామని, ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉండేలా.. వారు ఆటపై దృష్టి పెట్టేందుకు కొత్త దుస్తులు దోహదపడతాయని తెలిపింది. మరోవైపు టీమిండియా కెప్టెన్ ధోనీ సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కోల్‌కతా: నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను గెలుచుకోవడంతో మరికొందరు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఉంది. మరోవైపు భారత్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, అశ్విన్ స్థానాల్లో రోహిత్ శర్మ, లెగ్‌స్పిన్నర్ కరణ్ కరణ్ శర్మ, స్టువర్ట్ బిన్నీలకు చోటు దక్కింది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
కొచ్చీ: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎన్నుకుంది. కొచ్చిలో బుధవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగుతోంది. మరోవైపు పారితోషికం పెంచాలన్న ఆటగాళ్ల డిమాండ్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించింది. దాంతో విండీస్ ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యారు. పారితోషికం పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రాక్టీస్ సెషన్‌కు వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతోపాటు మ్యాచ్ ముందు రోజు జరిగే మీడియా సమావేశానికి కూడా విండీస్ తరుపున ఎవరూ హాజరు కాని విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే విండీస్ ఆటగాళ్లతో బోర్డు జరిపిన చర్చల ఫలవంతం కావటంతో మ్యాచ్‌పై సందిగ్ధత వీడింది. -
చాంపియన్స్ లీగ్ టీ-20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పెర్త్
హైదరాబాద్: హైదరాబాద్‌లో క్రికెట్ సందడి మొదలైంది. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదికైంది. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పెర్త్ కెప్టెన్ వోజెస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్నాడు. -
పది పరుగులకే రెండు వికెట్లు
లండన్: సిరీస్‌ను సమం చేయాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్ పేలవంగా ఆడుతోంది. శుక్రవారం ఆరంభమైన చివరి, ఐదో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గంభీర్ (0)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ డకౌట్ చేయగా, పుజారా (4)ను బ్రాడ్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం మురళీ విజయ్, కోహ్లీ క్రీజులో ఉన్నారు. ఐదు టెస్టుల సిరీస్‌లో కుక్ సేన 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి టెస్టు వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. -
ఐదో టెస్టు: బ్యాటింగ్ దిగిన భారత్
లండన్: భారత్, ఇంగ్లండ్‌లు చివరి, ఐదో టెస్టు కోసం సన్నద్దమయ్యాయి. కెన్నింగ్టన్ ఓవల్‌లో శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్‌లో కుక్ సేన 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ గెలిచితీరాలి. కాగా వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. భారత ఓపెనర్లు మురళీ విజయ్, గంభీర్ బ్యాటింగ్ దిగారు. జట్లు భారత్: మురళీ విజయ్, గంభీర్, పుజారా, కోహ్లీ, రహానె, ధోనీ (కెప్టెన్/కీపర్), బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, అరోన్, ఇషాంత్ ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బాలెన్స్, బెల్, రూట్, అలీ, బట్లర్ (కీపర్), వోక్స్, బ్రాడ్, జోర్డాన్, అండర్సన్ -
ఐపీఎల్-7: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
బెంగళూరు: ఐపీఎల్-7లో భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఆరంభమైంది. సొంతగడ్డపై చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరుకు విరాట్ కోహ్లీ, హైదరాబాద్‌కు శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్నారు.