Shoes
-
డాక్టర్ బూట్లు ఎత్తుకెళ్లాడు..
సాక్షి, హైదరాబాద్ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. వైద్యుడి గదిలోకి వచ్చిన ఓ ఆగంతకుడు అక్కడ ఉన్న బూట్లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజీగూడ, యశోద ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు డాక్టర్లు వినియోగించే బీ1 సెల్లార్ నుంచి లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడ ఓ వైద్యుడి గదిలో డాక్టర్‌కు చెందిన డ్రెస్సింగ్ రూమ్ నుంచి రూ.15 వేల విలువ చేసే షూస్‌ను తస్కరించాడు. ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణ ఫిర్యాదు మేరకు పంజగుట్ట (Panjagutta) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తి బీ1 సెల్లార్ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లి డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ తొడుక్కుని అక్కడి నుంచి నడిచి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన అతను రాజ్‌భవన్ వైపు నడిచి వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చిల్లర దొంగ పనే సూర్యాపేటకు చెందిన మహేష్ (22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చిన అతను సోమాజీగూడలోని దక్కన్ ఆస్పత్రిలో పని చేస్తూ ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న యశోద ఆస్పత్రి సిబ్బందితో పరిచయాలు పెంచుకుని తరచూ వచ్చి పోతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రి ఐదో అంతస్తుకు వెళ్లి వైద్యుడి డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ దొంగిలించి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి గదిలో సోదాలు చేయగా ఒక ఐ–ఫోన్, ట్యాబ్‌తో పాటు షూస్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: రియల్ టైమ్‌లో పట్టేస్తున్నారు! -
తిరుమల వెంకన్నస్వామికి ఘోర అపచారం
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్ పాలనలో తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా, ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు. పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పర్యవేక్షణ లోపంపై కూడా భక్తులు మండిపడుతున్నారు.కాగా, అక్టోబర్ నెలలో తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం బట్టబయలైంది.ఇదీ చదవండి: బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు -
విజయవాడ దుర్గగుడిలో అపచారం
సాక్షి,విజయవాడ : కనక దుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా పోలీసులు కాళ్లకు షూ వేసుకొని అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు షూ వేసుకుని డ్యూటీ చేయడంపై భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే, ఆలయ ముఖద్వారం వద్ద షూ వేసుకుని డ్యూటీ చేస్తున్నా చూసి చూడనట్టు ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తుంది. కాగా, ఆలయాల పవిత్రతను కాపాడుతామని సీఎం చంద్రబాబు ,మంత్రులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆలయంలోనికి చెప్పులతో వచ్చిన అధికారి సస్పెండ్
మీర్జాపూర్: యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.ఆలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలోని వివరాల ప్రకారం విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్‌తో సహా ఆలయంలోనికి ప్రవేశించారు. ఇది కలకలం సృష్టించింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని చూసి, తాను ఆలయంలో నుంచి బయటకు పంపించివేశానని తెలిపారు. ఇది కూడా చదవండి: దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు -
కేంద్రమంత్రి బూట్లు తీసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్
కేంద్రమంత్రికి ఓ ప్రభుత్వ అధికారి సేవలు చేయడం విదాదాస్పదంగా మారింది. సదరు ఉన్నతాధికారి మంత్రి పైజామాను సరిచేయడం, బూట్లను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికారి, మంత్రి తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే సోమవారం జార్ఖండ్ పర్యటనకు వచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుంబంధ సంస్థ అయిన బీసీసీఎల్ జనరల్ మేనేజర్ అరిందమ్ ముస్తాఫీ.. కేంద్ర మంత్రి బూట్లను తొలగించారు. అలాగే ధన్‌బాద్‌లోని భూగర్భ గని సందర్శన సమయంలో ఆయన పైజామాను సరిచేశారు.On an official visit to review several coal projects of BCCL, Union Minister of State for Coal Satish Chandra Dubey was seen taking the help of a senior BCCL official to remove his shoes and tighten his pajama. #Watch #Dhanbad #Jharkhand #India #SatishChandraDubey #BCCL pic.twitter.com/v1mvbbUxWo— Mirror Now (@MirrorNow) September 9, 2024ఈ వీడియో వైరలవ్వడంతో కాంగ్రెస్ స్పందిస్తూ.. ఈ ఘటన అవమానకరమైన విషయమని విమర్శించింది. బీసీసీఎల్ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి చర్యల ద్వారా మంత్రులను సంతోష పెడుతున్నారని ఆరోపించింది.‘మంత్రి కాళ్లకు షూస్ జీఎం తొలగిస్తే అది సిగ్గుచేటు. జీఎంను బీబీసీఎల్ సీఎండీ (చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్)గా చేయాలి. అలాంటి బీసీసీఎల్ అధికారులు అవినీతికి పాల్పడి, తమ లోపాలను దాచిపెట్టి మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని ధన్‌బాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మండిపడ్డారు. -
క్విక్ కామర్స్..ఫ్యాషన్ షో!
కిరాణా సరుకులు.. కూరగాయలు.. మిల్క్ ప్రోడక్టులు.. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 15 నిమిషాల్లో గుమ్మంలోకి చేరుస్తూ... శరవేగంగా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ మరిన్ని ఉత్పత్తులను కార్ట్‌లోకి చేరుస్తోంది. నగరాల్లో సూపర్ సక్సెస్ నేపథ్యంలో అపారెల్, ఫుట్‌వేర్ కంపెనీలు దీనిపై ఫోకస్ చేస్తున్నాయి. ఫాస్ట్ సెల్లింగ్ జాబితాలో ముందున్న దుస్తులు, షూస్ ఇతరత్రా ఫ్యాషన్ ప్రోడక్టులను సైతం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు సై అంటున్నాయి.జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. ఈ క్విక్ కామర్స్ స్టార్టప్‌లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవలే ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకాలు మొదలు పెట్టడంతో కస్టమర్లకు మరిన్ని రకాలు ప్రోడక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. జాకీ, అడిడాస్ బ్రాండ్స్‌కు చెందిన బేసిక్ కలర్ టీ–షర్టులు, ఇన్నర్‌వేర్ వంటి ఉత్పత్తులను ఇన్‌స్టామార్ట్ సేల్ చేస్తోంది. ఇక బ్లింకిట్ జాకీ, పెపే, అడిడాస్ టీ–షర్ట్స్, కొన్ని రకాల ఫుట్‌వేర్, ట్రాక్ ప్యాంట్లతో పాటు లోదుస్తులను ఆఫర్ చేస్తోంది. జెప్టో కూడా నేను సైతం అంటూ రంగంలోకి దూకింది. దీంతో మరిన్ని ఆపారెల్, ఫుట్‌వేర్ బ్రాండ్స్ క్విక్ కామర్స్ అండతో అమ్మకాలు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యాబ్ ఇండియా, ఉడ్ల్యాండ్తో పాటు ప్యూమా తదితర దిగ్గజాలు క్విక్ కామర్స్ కంపెనీలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచి్చనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. దేశంలోని 15 టాప్ నగరాల్లో కస్టమర్లు తమ నిత్యావసరాల కోసం క్విక్ కామర్స్ బాట పడుతున్నారు. దీంతో మరింత మందిని బుట్టలో వేసుకోవాలని చూస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లు గ్రాసరీలు, ఎఫ్ఎంసీజీకి మించి తమ పరిధిని విస్తరించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఆ రెండు విభాగాలపై గురి... ప్రస్తుతం భారత ఈ–కామర్స్‌లో మార్కెట్లో ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్నది ఫ్యాషన్ ఉత్పత్తులే. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 20–25 శాతంగా అంచనా. దీంతో ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకం అటు బ్రాండ్లతో, ఇటు క్విక్ కామర్స్ సంస్థలకు ఉభయతారకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ విభాగంలోకి కూడా దూకేందుకు ఈ స్టార్టప్‌లు ఉవి్వళ్లూరుతున్నాయి. యారో, కాలి్వన్ క్లీన్, టామీ హిలి్ఫగర్, యూఎస్ పోలో వంటి టాప్ బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫ్యాషన్స్.. క్విక్ కామర్స్ ద్వారా ముందుగా టీ–షర్ట్లు, ఇన్నర్వేర్తో పాటు బెల్టులు, సాక్స్‌ల వంటి యాక్సెసరీలను క్విక్ కామర్స్‌లో విక్రయించనుంది. ఐపీఎల్ సీజన్లో టీమ్ జెర్సీలను ఈ ప్లాట్‌ఫామ్‌లలో జోరుగా విక్రయించిన ప్యూమా... ఇతర ప్రోడక్టులకు సైతం తమ భాగస్వామ్యాన్ని విస్తరించే సన్నాహాల్లో ఉంది. ‘ఇన్స్టంట్ డెలివరీని ఎంచుకుంటున్న వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫ్యాషన్ రంగంలో కూడా క్విక్ కామర్స్ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ–కామర్స్‌లో మా కంపెనీ సేల్స్ 30 శాతానికి చేరుకున్నాయి’ అని ఉడ్‌ల్యాండ్ ఇండియా సీఈఓ హర్కీరత్ సింగ్ చెప్పారు. రిటర్న్‌లు చాలా తక్కువగా ఉండే బేసిక్ ప్రోడక్టులను తాము ఈ ప్లాట్ఫామ్లో విక్రయించనున్నట్లు ఫుట్‌వేర్ సంస్థ లిబర్టీ వెల్లడించింది. బాటా కూడా క్విక్ కామర్స్ రూట్లో వెళ్తోంది. ’10–15 నిమిషాల్లో డెలివరీ చేసేలా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం’ అని బాటా ఇండియా సీఈఓ, ఎండీ గుంజన్ షా వెల్లడించారు. నో రిటర్న్ పాలసీ...ఈ–కామర్స్ మాదిరిగా క్విక్ కామర్స్‌లో ప్రోడక్టులు నచ్చకపోతే వెనక్కి తిరిగిచ్చేందుకు రిటర్న్ పాలసీ లేదు. తయారీపరమైన లోపాలకు మాత్రమే నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో సైజ్, రంగులు ఇతరత్రా కారణాలతో రిటర్న్ చేసే కస్టమర్లు ఎక్కువ. దీంతో ఉడ్‌ల్యాండ్ వంటి బ్రాండ్లు తమ స్టోర్స్ ద్వారా రిటర్న్ పాలసీని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. కాగా, వివిధ ప్రదేశాల్లోని రిటైల్ స్టోర్లలో స్టాక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసి, ఎక్కువ ప్రోడక్టులను కస్టమర్లకు అందించాలనేది క్విక్ కామర్స్ సంస్థల వ్యూహం. ఎందుకంటే ఫ్యాషన్ ఉత్పత్తులను తమ డార్క్ స్టోర్లలో (వేగంగా డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసే భారీ గోదాములు) నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడం వాటికి పెద్ద సమస్య అవుతుందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అయితే, ఫాస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులైన ఇన్నర్‌వేర్, సాక్సులు, వైట్, సాలిడ్ కలర్ టీ–షర్ట్లు, బ్లాక్ ట్రౌజర్లు, బ్లూజీన్స్, కుర్తాలు, ఫార్మల్ బ్లాక్ షూస్, స్కూల్ షూస్, ఇంట్లో వాడే స్లిప్పర్స్, వాకింగ్ స్నీకర్స్ వంటివి తమ డార్క్ స్టోర్లలో నిల్వ చేయడం ద్వారా 15 నిమిషాల్లోనే డెలివరీ చేయొచ్చనేది క్విక్ కామర్స్ కంపెనీల యోచన.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు. ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ 'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ. ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్‌వే వంటి విజయవంతమైన బ్రాండ్ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఫరా. ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని నెక్ట్స్ లెవల్‌కి చేర్చాయి. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు చదివి కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్సైట్ ఏర్పాటు చేసి, ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్ చేసిన మెట్రో విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్’గా అవతరించింది.మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది. దీని ప్రకారం భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్ కాస్ట్ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు. -
చర్మం ఒలిచి..చెప్పులు కుట్టించి..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ అనే మాజీ గ్యాంగ్‌స్టర్ తన తల్లిపై ఉన్న ప్రేమను అచ్చంగా రామాయణంలో శ్రీరాముడు పేర్కొన్నట్లుగా చాటాడు. ఏకంగా తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించి కానుకగా ఇచ్చాడు! ఇందుకుగల కారణాన్ని అతను వివరించాడు. గతంలో నేరప్రవృత్తి కారణంగా పోలీసు కాల్పుల బారినపడ్డ గుర్జర్ ఆ తర్వాత నిత్యం రామాయణ పారాయణంతో పూర్తిగా మారిపోయినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రీరాముని పాత్ర నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని.. తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా ఆమె రుణం తీర్చుకొనేందుకు చాలదని శ్రీరాముడు స్వయంగా పేర్కొన్న మాట తనను ఎంతగానో ఆకర్షించిందని గుర్తుచేసుకున్నాడు. అందుకే తాను తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాలని నిర్ణయించుకున్నట్లు గుర్జర్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండా ఆస్పత్రిలో చేరి తన కాలి తొడ చర్మాన్ని సర్జరీ చేయించి తొలగించుకున్నానని.. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తికి ఇచ్చి చెప్పులు చేయించానన్నాడు.గత వారం ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తన తల్లికి ఈ చెప్పులను బహూకరించగా వాటిని చూసి ఆమె కన్నీటిపర్యంతమైందని గుర్జర్ తెలిపాడు. తల్లిదండ్రుల పాదాల చెంతనే స్వర్గం ఉంటుందనే విషయాన్ని సమాజానికి చాటిచెప్పాలనే ఈ పని చేశానన్నాడు. ‘తండ్రి స్వర్గానికి నిచ్చెనయితే తల్లి ఆ మార్గాన్ని చేరుకొనే వ్యక్తి’ అని గుర్జర్ పేర్కొన్నాడు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్
ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత బ్రాండ్ షూస్‌ను విడుదల చేశారు. ఆదివారం ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్ సెంటర్లో వాటిని ప్రదర్శించారు. బంగారు వర్ణం షూలు 399 డాలర్లకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు విక్టరీ47 అనే సెంటును కూడా విడుదల చేశారు. ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిన నేరానికి కోర్టు ఏకంగా 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించిన మరునాడే ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనున్నారు. -
ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..
ఓ క్రీడాకారుడు ధరించిన షూ వేలంటో కనివినీ ఎరుగుని రీతీలో ధర పలికాయి. ఆ షూతోనే ఆ క్రీడాకారుడు టైటిళ్లను గెలిచుకున్నాడు. ఆ షూలు ప్రముఖ బ్రాండ్‌వి కావడం ఒక విశేషం అయితే క్రీడాకారుడి గెలుపులో పాత్ర షోషించడం మరో స్పెషల్టీ. దీంతో అవి వేలంలో మంచి క్రేజ్ రావడంతో వేలంలో ఇంతలా ధర పలికి అందర్నీ షాక్ గురి చేసింది. ఎవరా క్రీడాకారుడు? ఏంటా బ్రాండ్ అంటే.. బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ప్రసిద్ధ బ్రాండ్‌కి చెందిన ఆరు షూల జతను ధరించి ప్రతిష్టాత్మకమైన ఆరు ఎన్బీఏ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నారు. అవి ప్రమఖ ఎయిర్ జోర్డాన్ బ్రాండ్‌కి చెందినవి. సాధారణంగానే ఆ బ్రాండ్ షూలు అత్యంత ఖరీదైనవి. ఇక ఆ క్రీడాకారుడు విజయంలో పాత్ర పోషించిన ఆ షూలకు ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. తొలిసారిగా 1991లో ఎన్బీఏ ఫైనల్స్‌లో పోటీ పడుతున్న సమయంలో మైఖేల్‌ని పీఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హాలండ్ జట్టు విజయం సాధిస్తే తాను ధరించిన ఎయిర్ జోర్డాన్ బ్రాండ్ షూ జతను తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మైకేల్ విజయం సాధించిన తదనంతరం అతడి కోరికను తీర్చాడు. ఆ షూను హాలండ్‌కు బహుమతిగా ఇచ్చే ముందుకు దానిపై సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఇలా ఐదు ఛాంపియన్‌షిప్‌లో అతడు ఆ సంప్రదాయన్ని కొనసాగించాడు. ఇలా చేస్తే గెలుస్తానని మైఖేల్ సెంటిమెంట్‌గా ఫీలయ్యాడో ఏమో గానీ అలా హాలండ్ వద్ద ఆరు జతల షూలు ఉండటం జరిగింది. ఆయన సాధించిన ఆరు చాంపియన్ షిప్‌ల్లో పాత్ర వహించిన ఆ ఆరు ఎయిర్ జోర్డాన్ షూల జతను ప్రముఖ వేలం సంస్థ సోథెబిన్ శుక్రవారం వేలం వేయగా ఆ బ్రాండ్‌కి తగ్గ రేంజ్‌లోనే రికార్డు స్థాయిలో ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ బ్రాండ్‌కి ఎప్పటికీ అత్యంత విలువైందని ఫ్రూవ్ చేసుకుందని పలువురు ప్రశంసించారు. ఇలా మైఖేల్ ధరించిన షూలు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఇలానే ఎయిర్ జోర్డాన్ 13 షూ, అలాగే 1988లో ఎన్బీఏ ఛాంపియన్ గేమ్‌లో విజయాన్ని తెచ్చిన అదే బ్రాండ్‌కి చెందిన మరో రకం షూ వేలంలో రూ 18 కోట్ల ధర పలికింది. అలాగే అక్టోబర్‌లో నవంబర్ 1, 1984లో రూకీ సీజన్లో ఐదవ ఎన్బీఏ చాంఫీయన్ షిప్‌ను గెలుచుకున్నప్పుడూ ధరించిన రెడ్ అండ్ వైట్ ఎయిర్ షూ జత ఏకంగా రూ. 12 కోట్లు పలికింది. ఇప్పుడూ ఏకంగా వాటన్నింటిని తలదన్నేలా ఆ బ్రాండ్‌కి తగ్గట్లుగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 66 కోట్లు పలకడం విశేషం. (చదవండి: అఖండ హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!) -
మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది. ఈస్ట్ హార్ట్‌ఫోర్డ్‌లోని గుడ్విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్ అంటే బూట్లు ఒకటని తెలిపారు. ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్‌ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు. మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి. విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్‌హార్డ్ జిప్‌ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్‌లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్‌ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
ఇలాంటి షూస్ ఎప్పుడైనా చూసారా! ధర ఎక్కువే..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల సరికొత్త 'మూన్‌వాకర్స్' అనే ఎలక్ట్రిక్ షూస్ పుట్టుకొచ్చాయి. ఈ లేటెస్ట్ షూస్ ధర ఎంత? దీన్ని ఎలా ఉపయోగించాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికన్ బేస్డ్ కంపెనీ 'షిఫ్ట్ రోబోటిక్స్' అభివృద్ధి చేసిన మూన్‌వాకర్స్ షూస్ సాధారణ ఎలక్ట్రిక్ షూస్ కంటే కూడా వేగంగా ఉంటాయని సంస్థ ప్రకటించింది. ఇది రోజు వారీ వినియోగానికి ఉపయోగించే షూస్ మాదిరిగానే ఉపయోగించాల్సి ఉంటుంది. స్కేటింగ్ షూస్ మాదిరిగా ఉపయోగించవచ్చనుకుంటే పొరపాటే. మూన్‌వాకర్స్ ఎలక్ట్రిక్ షూస్ బ్యాటరీ మీద ఆధారపడి, ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి ఐపీ45 వాటర్ రెసిస్టెంట్ కావడం వల్ల వర్షం సమయంలో నీటిలో తడిచినా సురక్షితంగా ఉంటాయి. ఛార్జింగ్ కోసం USB టైప్-సీ పోర్ట్ ఇందులో లభిస్తుంది. ఇదీ చదవండి: నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - వైరల్ వీడియో రెండు కేజీల బరువున్న ఈ షూస్ కేవలం EU 42-45 సైజులో పురుషులకు మాత్రమే తయారు చేశారు. అంతే కాకుండా ఈ షూస్ ధరించేవారు బరువు 100 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. దీని ధర 1399 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1.16 లక్షలు). -
ఇంటి బయట ‘షూ’ విడుస్తున్నారా?.. ఈ వీడియో మీకోసమే..
సాక్షి, హైదరాబాద్: పాములను చూస్తే భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది.. ఇటీవలే ఒకరి హెల్మెట్‌లో పాము పిల్ల దూరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా భయంకరమైన కింగ్ కోబ్రా.. ఒక మహిళ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పాముకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. నాగుపాము షూలోకి దూరింది. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. Cobra trying a new footwear😳😳 Jokes apart, as the monsoon is coming to a close, please be extra careful. pic.twitter.com/IWmwuMW3gF — Susanta Nanda (@susantananda3) October 5, 2023 ఇంతలో షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: భార్యకు గుడ్‌బై.. ఇజ్రాయెల్ కోసం భర్త సంచలన నిర్ణయం -
గుర్రాలకు బ్రాండెడ్ షూ.. ధర తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండరు
గుర్రాలకు నాడాలు ఉంటాయి కదా! మరి స్నీకర్స్ ఏమిటి అనుకుంటున్నారా? విడ్డూరంగా అనిపించినా, గుర్రాలకూ స్నీకర్స్ అందుబాటులోకి వచ్చేశాయి. దౌడుతీసే గుర్రాలకు నాడాలు బిగించడమే మనకు తెలుసు. ఈ నాడాలు బిగించడం కొంత హింసాత్మకమైన ప్రక్రియ. స్నీకర్స్ వల్ల గుర్రాలకు నాడాల బెడద ఇకపై ఉండదంటున్నారు ప్రముఖ షూ సర్జన్, స్నీకర్స్ కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ మార్కస్ ఫ్లాయిడ్. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండెడ్ స్నీకర్స్‌ను పోలి ఉండే స్నీకర్స్‌ను ఆయన గుర్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ‘హార్స్ కిక్స్’ పేరుతో ఆన్లైన్ స్టోర్ ప్రారంభించి, దాని ద్వారా వీటిని ఆయన విక్రయిస్తున్నారు. ‘ఎస్పీఎల్వై–350’, ‘న్యూ బ్యాలెన్స్–650’ పేరిట గుర్రాల కోసం ఇటీవల రెండు అందమైన మోడల్స్‌లో కొత్త తరహా స్నీకర్స్‌ను కూడా విడుదల చేశారు. గుర్రాల పాదాల సైజుకు అనుగుణంగా వీటిని ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు. వీటి ప్రారంభ ధర లక్ష రూపాయల నుంచి ఉంటుంది. ప్రస్తుతం వీటిలో కొద్ది మోడల్స్ మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని డిజైన్స్, మోడల్స్‌తో పాటు లెగ్జింగ్టన్, కెంచూరీలలో ప్రత్యేక స్టోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు మార్కస్ తెలిపారు. (చదవండి: జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!) -
మార్కెట్లోకి యాపిల్ కంపెనీ బూట్లు.. ధర వింటే గుండెల్లో దడపుట్టాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ఎంత ధర ఉన్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి ఊహించని ధర పలికాయి. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్‌లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ఆ బూట్లు ఎంత ధర పలికిందంటే.. ధర వింటే భయపడతారు దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్ల విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు విక్రయించారు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. యాపిల్ వంటి వంటి దిగ్గజ టెక్ కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అసాధారణంగా అనిపించినప్పటికీ, ఆ సంస్థ ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతాన్ని పరీశిలిస్తే తెలుస్తుంది. 1986లో ఈ కంపెనీ "ది యాపిల్ కలెక్షన్"ను ప్రారంభించింది. ఇది రెయిన్బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు, ఉపకరణాల శ్రేణి. ఇందులో మగ్లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్లు, సెయిల్బోర్డ్తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి. యాపిల్ ఉత్పత్తులంటే డిమాండ్ అట్లుంటది ఆసక్తికరమైన విషయమేమిటంటే, వింటేజ్ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల వేలంలో యాపిల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గత నెలలో, ఐఫోన్ 2007 మొదటి-ఎడిషన్‌ను $190,000కి విక్రయించగా.. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి. చదవండి బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు! -
'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఐదోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతారా.. లేక ఆసీస్ బ్యాటర్లు సమర్థంగా రాణించి ఆసీస్‌కు విజయాన్ని అందిస్తారా అనేది చూడాలి. బజ్‌బాల్ క్రికెట్లో జోరుమీదున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ ముకుతాడు వేస్తుందో లేక చతికిలపడుతుందో చూడాలి. ఇక ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ చర్య నవ్వులు పూయిస్తోంది. బౌలింగ్‌కు వచ్చిన రాబిన్సన్ తన కాళ్లకు వేర్వేరు షూ వేయడం ఆసక్తి కలిగించింది. సంబంధం లేకుండా ఎడమకాలికి అడిడాస్(Adidas)వేసిన రాబిన్సన్.. తన కుడికాలికి రాజోర్(Razor) షూ వేసుకున్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన సందర్భంలో ఓలీ రాబిన్సన్ ఇలా మిస్‌మ్యాచ్ షూ వేసుకొచ్చి సీరియస్‌గా సాగిపోతున్న మ్యాచ్‌లో తన చర్యతో అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇందులో తప్పేముంది.. బహుశా రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుంటాడు.. అందుకే ఇలా వేసుకొచ్చి సమన్యాయం చేశాడు. 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్‌మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు కావాలి. pic.twitter.com/abYYFCVMub — Out Of Context Cricket (@GemsOfCricket) June 18, 2023 చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్ -
Fact Check: ‘కానుక’పైనా కక్ష సాధింపే.. ‘ఈనాడు’ విషప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండి అబద్ధం చెప్పినా ఈనాడు రామోజీకి అమృత వాక్యంలా వినబడుతుంది. ప్రజలను మోసం చేసినా సరే అదే సరైనది అవుతుంది.. బాబు తప్ప మరే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా అది నేరంగానే కనిపిస్తుంది.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జగనన్న విద్యా కానుక పేరుతో మూడేళ్లుగా నాణ్యమైన స్కూలు బ్యాగు లు, పుస్తకాలు, బూట్లు, యూనిఫారం వంటి వస్తువులను అందిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా ‘ఈనాడు’కు మాత్రం కడుపుమంటగా ఉంటోంది. అందుకే 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే విద్యా కానుకపై శనివారం విషం కక్కింది. వాస్తవాలను వక్రీకరించి ‘పిల్లలు తగ్గినా.. కానుక ఖర్చు పెరిగింది’ అంటూ అడ్డగోలుగా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. అదేంటంటే.. ♦ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో మరింత నాణ్యత ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత మూడేళ్లలో జగనన్న విద్యాకానుకలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. అయితే, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణలో కాకుండా, అన్ని దశల్లోనూ.. అంటే ముడి సరుకు నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోను పర్యవేక్షణ అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ విద్యా కానుకలోని వస్తువులను మూడు దశల్లో (ముడిసరుకు నుంచి స్టాక్ పాయింట్ వరకు) నాణ్యత పరీక్షలు చేసి మన్నికైన వస్తువులకు మాత్రమే అనుమతినిస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం డబ్బు వృథా చేసినట్లు కాదు. ♦ సరఫరా చేసిన బ్యాగుల్లో 6 లక్షల బ్యాగులు చినిగిపోతే ప్రభుత్వం తిరిగి మంచి స్టాకును తెప్పించింది. అదనంగా వచ్చిన ఈ బ్యాగులకు ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు. ♦ గత ఏడాదికి ఈ ఏడాదికి మార్కెట్ రేటు 6.85 శాతం పెరిగింది. కొలతల్లో మార్పులు, గ్లాసీ ఫినిషింగ్, సాధారణ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని వస్తువు ధర నిర్ణయం జరుగుతుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ఇన్సెట్ పేపర్ ధర టన్నుకు రూ.91,492.24, కవర్ పేపరు ధర టన్ను రూ.99,866.40 ఉండేది. 2023–24 విద్యా సంవత్సరానికి పేపరు సేకరణ కోసం టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ ‘తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ (టీఎన్‌పీఎల్) సంస్థ సరఫరాకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఇన్సెట్ పేపర్ ధర టన్ను రూ.1,15,500, కవర్ పేపర్ ధర టన్ను రూ.1,21,000గా టెండర్ వేసింది. ఈ ధర గతేడాది ధరతో పోలిస్తే.. పేపర్ ధర టన్నుకు రూ.24,007 (26.23 శాతం), కవర్ పేపర్ ధర రూ.21,134 (21.16 శాతం) పెరిగింది. ఈ ధరను ప్రభుత్వం అంగీకరించి 15,711 మెట్రిక్ టన్నుల ఇన్సెట్ పేపర్, 1,400 మెట్రిక్ టన్నుల కవర్ పేపర్‌ను పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, పిక్టోరియల్ డిక్షనరీల ముద్రణకు కొనుగోలు చేసింది. పేపర్ ధర పెరగడంతో పుస్తకాల ధర కూడా స్వల్పంగా పెరిగింది. ♦ ఇక ఈ ఏడాది విద్యార్థులకిచ్చే యూనిఫారం మూడు జతల్లో క్లాత్ పరిమాణం 23 శాతం పెంచడంతో పాటు, ప్లెయిన్ యూనిఫారం నుంచి చెక్ యూనిఫాంకు డిజైన్ మారింది. బ్యాగుల పరిమాణం, నాణ్యత భారీగా పెంచారు. ♦43 లక్షల యూనిట్లకు టెండర్ పిలిచినప్పటికీ బడులు తెరిచే నాటికి వాస్తవ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే వస్తువులను కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటారు. దానికి తగ్గట్లుగానే చెల్లింపులు ఉంటాయి. జాతీయ స్థాయిలోను అన్ని వస్తువుల ధరలు 26.23 శాతం పెరిగాయి. ఏటా ధరల పెరుగుదల సహజ ఆర్థిక పరిణామమైనప్పటికీ దీన్ని ‘ఈనాడు’ వక్రీకరించడం దురదృష్టకరం. -
భారత్ నుంచి వాల్‌మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!
Satyajith Mittal: చిన్న పిల్లల బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు మిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ సత్యజిత్ మిట్టల్. చిన్నప్పుడు తాను పడిన ఇబ్బంది వేరే పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో వినూత్న షూ రూపొందించి విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న పిల్లల పాదాలకు అనుగుణంగా విస్తరించగలిగే వినూత్న బూట్ల శ్రేణి మ్యాజిక్ షూను అభివృద్ధి చేసింది ఆయన స్థాపించిన షూ కంపెనీ అరెట్టో (Aretto). ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! చిన్నప్పుడు పడిన ఇబ్బందే.. మ్యాజిక్ షూ ఆవిష్కరణ కోసం సత్యజిత్‌కు తన చిన్ననాటి అనుభవం ప్రేరణనిచ్చింది. చిన్నప్పుడు తన అన్నయ వాడిన బూట్లను సత్యజిత్‌కు ఇచ్చేవారు. అయితే ఆ బూట్లు సత్యజిత్‌కు చాలా వదులు అయ్యేవి. దాంతో నడవడానికి ఆయన చాలా ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి మంచి నాణ్యత గల బూట్లు ధరించాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సమయంలో భారతదేశంలో అవి చాలా తక్కువగా ఉండేవి. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ చిన్నతనంలో ఏదో ఒక సమయంలో తమకు సరిపోని సైజు షూ ధరించి ఇబ్బందులు పడినవాళ్లు ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి పాదాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని రోజులకే ఎక్కువ జతల బూట్లు కొనాల్సి వస్తోంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు సత్యజిత్. పెరుగుతున్న పాదాల సైజ్‌కు అనుగుణంగా విస్తరించే మ్యాజిక్ షూను రూపొందించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు మేలు కలిగిస్తోంది. ఇవి కొంటే పదే పదే కొత్త బూట్లు కొనాల్సిన అవసరం ఉండదు. నిరంతర పరిశోధనలు, పోడియాట్రిస్ట్ (పాదాలకు సంబంధించిన వైద్య నిపుణులు)లతో సంప్రదింపుల ద్వారా సత్యజిత్ పిల్లల పాదాల అనాటమీ గురించి లోతైన అవగాహన పొందాడు. వారి పాదాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయని, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లు అవసరమని గ్రహించాడు. ఈ జ్ఞానంతో రెండేళ్ల పాటు కష్టపడి మ్యాజిక్ షూను రూపొందించాడు. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్రాండ్ అరెట్టో. దీనికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను పొందింది ఆ కంపెనీ. అలాగే యూకే, యూఎస్ఏ, జపాన్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఎనిమిది నెలల్లో రూ.80 లక్షలకుపైగా గతేడాది ఆయన ప్రారంభించిన ఫుట్‌వేర్ బ్రాండ్ అరెట్టో కేవలం ఎనిమిది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా విక్రయించి రూ.80 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తమ బ్రాండ్ షూ తయారీకి థర్మోప్లాస్టిక్ రబ్బర్ రీసైకిల్ మెటీరియల్, స్థానికంగా లభించే త్రీడీ అల్లికల మెటీరియల్‌ని ఉపయోగిస్తున్నారు. సత్యజిత్ పుణెలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్మేట్ అయిన కృతిక లాల్‌ను సహ వ్యవస్థాపకురాలిగా చేర్చుకున్నారు. అరెట్టో 0-2, 5-7, 5-9 సంవత్సరాల వయసు పిల్లలకు బూట్లను అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ, త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభించాడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ బ్రాండ్ షూలు తొమ్మిది స్టైల్స్, ఐదు సైజులు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు రూ.1,699 నుంచి రూ.2,899 వరకు ఉంటాయి. ఈ బ్రాండ్ బూట్లు 18 మిల్లీ మీటర్ల వరకు విస్తరించవచ్చు. వారి అమ్మకాలలో ఎక్కువ భాగం వారి వెబ్సైట్ ద్వారా వస్తాయి. వారు ఇటీవల నైకాలో కూడా అమ్మడం ప్రారంభించారు. ఇవికాక పిల్లల కార్నివాల్‌లు, పిల్లల షూ ప్రదర్శనలు, పాఠశాల, ఇతర పాప్-అప్ ఈవెంట్లలో పాల్గొంటారు. అరెట్టో కంటే ముందు, సత్యజిత్ స్క్వాట్ ఈజ్ అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఇది భారతీయ టాయిలెట్లను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ వెంచర్ అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్! ఆ తర్వాత..
ఏదో మిరాకిల్ లేక ఏదైనా దెయ్యమా! తెలియదుగానీ ఒక్కసారిగా ట్రాక్టర్ దానికదే స్టార్ట్ అయ్యింది. అదీకూడా పట్టపగలే అలా జరగడంతో.. ఒక్కసారిగా అక్కడున్న వారికెవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ భయానక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..బిజ్నోర్‌లోని చెప్పులకు సంబంధించిన చైనా షాపు ఉంది దానికి సమీపంలో ఓ టాక్టర్ పార్క్ చేసి ఉంది. ఏమైందో ఏమో! హఠాత్తుగా ఆ ట్రాక్టర్ దానికదే స్టార్ట్్ అయ్యి ఆ చెప్పుల షాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఆ షాప్‌లోని ఉద్యోగులు భయంతో కేకలు వేస్తూ..బయటకు వచ్చేశారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ ట్రాక్టర్ ఇంజన్ని ఆపి పెద్ద మొత్తంలో షాప్‌కి డ్యామేజ్ జరగకుండా కాపాడాడు. ఈ ఘటనలో ఆ షాపు అద్ధం మొత్తం పగిలిపోయి కొద్ది మొత్తంలో ఆ షాపు ఓనర్‌కి మాత్రం నష్టం వాటిల్లింది. దీంతో ఆ షాపు ఓనర్ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ ట్రాక్టర్ యజమానిపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఐతే స్థానికుల సమాచారం ప్రకారం..రాబోయే హోలీ పండుగ కోసం పోలీసులు బిజ్నోర్ పోలీస్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆ ట్రాక్టర్ యజమాని కిషన్ కుమార్ కూడా పాల్గొన్నారు. అతను తన ట్రాక్టర్ని ఈ చైనా చెప్పుల దుకాణం వద్ద పార్క్ చేశాడు. సుమారు గంట తర్వాత ఆగి ఉన్న ట్రాక్టర్ దానంతటే అదే స్టార్ట్ అయ్యి చెప్పుల దుకాణంలోకి వచ్చేయడంతో..ఆషాపు అద్దం మొత్త పగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో.. ఈ వింత ఘటన అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. #Tarzan #tractor #bijnaur #CCTV #बिजनौर में जब बिना चालक के अचानक चल पड़ा ट्रैक्टर pic.twitter.com/MCl6RK3ORE — Preety Pandey Bhardwaj (@prreeti1) March 3, 2023 (చదవండి: ఆమె నాకు వద్దు.. వధువు చిన్న తప్పు కారణంగా షాకిచ్చిన వరుడు!) -
బూట్లు వేసుకోలేదని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, వరంగల్: బూట్లు ఎందుకు వేసుకురాలేదు అంటూ విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపాడు. ఏకంగా కంక కట్టెతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం...మోడల్ స్కూల్లో పదవ తరగతి వరకు మొత్తం 490 మంది విద్యార్థులున్నారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు తమ క్లాస్‌లోకి వెళ్తన్న క్రమంలో 10వ తరగతికి చెందిన హర్షిత్, చరణ్, శ్రావణ్, రాంచరణ్, అక్షయ్‌కుమార్, హనీఫ్, ఫరూక్ అబ్దుల్‌తోపాటు 12మంది విద్యార్థులు బూట్లు వేసుకురాలేదు. గమనించిన ప్రిన్సిపాల్ ప్రణయ్‌కుమార్ వారందరిని పక్కకు నిలబెట్టి బూట్లు ఎందుకు వేసుకురాలేదని అడుగుతూ కొట్టడం ప్రారంభించాడు. ‘రేపు వేసుకువస్తాం కొట్టకండి సార్’అంటూ కన్నీరు పెట్టుకున్నప్పటికి వినకుండా విచక్షణా రహితంగా చితకబాదాబడు. దీంతో విద్యార్థుల పిరుదల కిందబాగంలో కమిలిపోయి కొంతమంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో కొందరు ఉపాధ్యాయులు వారిని సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకొని తమ పిల్లల్ని ఈ విధంగా కొట్టడం తగదు అంటూ ప్రిన్సిపాల్‌ని నిలదీశారు. షూస్ వేసుకురాకుంటే క్రమశిక్షణలో భాగంగా కొట్టానని, కొట్టకుంటే వారు వినరు అని ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ వివరణ ఇచ్చాడు. -
షూస్‌ను పదికాలాలు కాపాడే డివైజ్, ధర ఎంతంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం పాదరక్షలకు రక్షణ సాధనం. ఖరీదైన షూస్‌ను పదిలంగా పదికాలాలు కాపాడుకోవడం కష్టమే! అయితే, ఈ పరికరం చెంతనుంటే, ఎంత సున్నితమైన, ఎంత ఖరీదైన పాదరక్షలనైనా పదిలంగా కాపాడుకోవచ్చు. బహుళజాతి సంస్థ ‘నెసుగర్’ ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది షూ డ్రైయర్–డీయాడరైజర్. చెమ్మదేరిన లేదా తడిసిపోయిన పాదరక్షలను ఇది నిమిషాల్లో పొడిగా తయారుచేస్తుంది. ఇందులో రెండు రకాల ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. షూ రకాలను బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే, ఇందులోని ఓజోన్ స్టెరిలైజేషన్ మోడ్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, షూస్లోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా వాటి ద్వారా వ్యాపించే దుర్గంధం కూడా నశిస్తుంది. ఈ పరికరాన్ని చక్కగా మడిచిపెట్టి భద్రపరచుకునే సౌలభ్యం ఉండటం మరో విశేషం. -
గురుభ్యోనమః.. నిరుపేద విద్యార్థుల కోసం షూ పాలీష్ చేస్తున్న ప్రొఫెసర్
తిరువళ్లూరు (చెన్నై): పేద, నిరాశ్రయ విద్యార్థుల చదువు కోసం నిధుల సేకరణలో భాగంగా తమిళ ప్రొఫెసర్ సెల్వకుమార్ పళవేర్కాడులో చెప్పులు, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరుకు చెందిన ప్రొఫెసర్ సెల్వకుమార్. అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కళాశాలలో తమిళ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. 2004లో మదర్ థెరిసా పాఠశాలను ఏర్పాటు చేసి 19 ఏళ్లుగా పేద, అనాథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వాహణ కష్టంగా మారడంతో వినూత్న రీతిలో నిధులను సేకరిస్తున్నాడు. కళాశాలకు సెలవు ఉన్న సమయంలో ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి.. నేను మీ చెప్పులను తుడుస్తా. మీరు నావద్ద ఉన్న పిల్లల కన్నీటిని తుడవాలని కోరుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి తద్వారా వచ్చే నిధులను పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నాడు. ఇతడి ప్రయాణం ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సాగింది. తాజాగా తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని కామరాజర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. కోటైకుప్పం పంచాయతీ అధ్యక్షుడు సంపత్, మీంజూరు ధామోదరన్, పళవేర్కాడు సంజయ్‌గాంధీ సాయం అందించారు. -
సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..
నాటకాలు బాగా ప్రదర్శిస్తున్న రోజుల్లో ఓ సరదా సంభాషణ ప్రాచుర్యంలో ఉండేది. ‘ఏమోయ్.. నాటకం బాగా రక్తి కట్టిందటగా ఏ మాత్రం కలెక్ష వచ్చిందేమిటి?’.. కొంచెం వ్యంగ్యంగా అన్న ప్రశ్నకు.. ‘మహా బాగా వచ్చాయి.. బాటా తొంభై, నాటు నలభై.. అన్నీ ఎడమ కాలివే..’ అని నిష్ఠూరపు సమాధానం. ఇప్పుడు నాటకాలు పాలిటిక్స్‌లో బాగా రక్తి కడుతుండడంతో ఆ బాటా, నాటు జోళ్ల అవసరం, ప్రస్తావన ఇక్కడ బాగా పెరిగింది.. ఏదైనా పరస్పర విరుద్ధం అని చెప్పడానికి ఉప్పు, నిప్పు అంటారు. రాజకీయాల్లో విరుద్ధమైన రెండింటికీ ‘చెప్పు’ ఒక్కటే చాలు. స్వామిభక్తిని చాటడానికైనా. నిరసన తెలప డానికైనా.. ‘చెప్పు’ చేతపడితే చాలు. ఇలారండి .. భారత రాజకీయాలు ఎలా చెప్పుచేతుల్లో ఉన్నాయో చూద్దాం.. ‘షూ’ట్ ఎట్ షార్ట్‌కట్.. నిజానికి చెప్పుల కథ ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టంగానీ.. రామ భరతుల కాలంనాటి ‘పాదుకా పట్టాభిషేకం’ మనకు ఎరుకే. ఆ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ. అసలు ఏ అధికార పదవిలోనూ లేని సంజయ్ గాంధీ చెప్పులు తివారీ చేతందు కోవడం మొదలు తరచుగా నాయకులు పాదుకా స్పర్శలో ‘అమితా’నందాన్ని పొందుతూనే ఉన్నారు. నిన్నటి బండి సంజయ్ – అమిత్ షా చెప్పుల ఉదంతం చూశాం... ఎప్పుడో 2015 నాటి నారాయణసామి – రాహుల్ చెప్పుల కథను ప్రధాని మోదీ ప్రస్తావించడం.. ఇప్పుడది ట్రోల్ అవుతుండటం చూస్తున్నాం.. నాడు రాహుల్ కాళ్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని.. కాంగ్రెస్ నేత నారా యణసామి చెప్పులు చేతబట్టుకుని మరీ కాపలా కాశారు. రాహుల్ బూట్లు అలా విప్పగానే చటుక్కున తన చెప్పులు ఆయన కాళ్ల వద్ద పెట్టి స్వామి భక్తిని ‘చెప్పు’కున్నారు. ‘రాహుల్ వంటి సీనియర్‌ను గౌరవించుకోవడం తప్పా..?’ అని కూడా ఈ 68 ఏళ్ల వయసున్న పెద్దాయన అప్పట్లో చెప్పారు. 2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి రమేశ్ బాగ్వే ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పులను కాసేపు ‘గౌరవం’గా చేత పట్టుకున్నారు. ఇదే రాహుల్‌గాంధీ ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ‘చెప్పు’డు విమర్శ లకు దిగారు. తాము అమిత్‌షా నివాసానికి వెళితే ఇంటి బయటే చెప్పులు విప్పించారని, లోపల అమిత్‌షా మాత్రం చెప్పులు వేసుకునే ఉన్నారని మణిపూర్ ప్రజాప్రతినిధులు తనతో చెప్పారంటూ.. అమిత్‌షా క్షమాపణ చెప్పా లంటూ డిమాండ్ చేశారు కూడా. కొన్నేళ్ల కింద బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి.. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోసేందుకే అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా రనుకోండి ‘షూ’ట్ ఎట్ ఫైట్ ఇక యూపీలోని సంత్ కబీర్‌నగర్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పబ్లిక్ ముందే చెప్పులాటకు దిగారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ బఘేల్‌ను చెప్పుతో కొడితే.. రాకేశ్ తిరిగి లెంపకాయతో బదులిచ్చారు. ‘షూ’ట్ ఎట్ సైట్ ఎప్పుడూ భక్తి తన్మయత్వమేనా.. అప్పు డప్పుడూ నిరసనల కోపం కూడా చెప్పులను చేతబట్టించింది. ► 2009లో దైనిక్ జాగరణ్ రిపోర్టర్ జర్నైల్ సింగ్ నాటి కేంద్ర మంత్రి చిదంబరంపై విసిరిన బూటు దేశంలో కలకలం రేపింది. ► 2016లో యూపీలోని సీతాపూర్ జిల్లాలో రోడ్‌షో చేస్తున్న రాహుల్ గాంధీ వైపు హరిఓం మిశ్రా అనే సామాజిక కార్యకర్త విసిరిన నిరసన బూటు దూసుకొచ్చింది. 2012లో డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ► 2016లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడుతుంటే.. వేద ప్రకాశ్ శర్మ అనే రాజకీయ కార్యకర్త చెప్పు విసిరి తన నిరసన చెప్పుకున్నాడు. ► విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదంటూ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలూ వచ్చాయి. ► అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్పపై చెప్పుదాడి జరగడంతో.. చెప్పుల లొల్లి చెప్పలేనంత తలనొప్పిగా మారిందని నాటి ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ తల పట్టుకున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఆపడానికి ఏదో ఒకటి చేయాలనీ అన్నారు. ‘షూ’ట్ ఎట్ హైట్ కొందరు రాజకీయ నేతలు చెప్పుల ఎత్తు పెంచుకుని.. కొత్త ఎత్తులకు వెళ్లారని పాశ్చాత్య మీడియా అప్పుడప్పుడూ కోడై కూస్తుంటుంది. లీడర్ల అసలు ఎత్తుకు, అధికారికంగా చెప్పే ఎత్తుకు సంబంధం ఉండదని అంటూ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎత్తు బూట్లు వేసుకుని ఎత్తయిన వ్యక్తిలా కనిపించే ప్రయత్నం చేస్తారని అది ఆయన విజయ రహస్యమనీ చాలాసార్లు వార్తలూ వచ్చాయి. కొన్నేళ్ల కింద అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తు చెప్పులు వేసుకెళ్లారని గోల చేశారు కూడా. ఇక మన దీదీ మమతా బెనర్జీ హవాయి చెప్పుల ‘సింప్లిసిటీ’కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా! నువ్వేం ‘షూ’టర్? అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్‌పై ఓ నిరసనకారుడు బూటు విసిరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ జోక్.. బూటు విసిరిన వ్యక్తికి జడ్జి మూడేళ్లు జైలుశిక్ష వేశారు. ‘కేవలం బూటు విసిరితే మూడేళ్లు జైలా?’ అని నిందితుడు వాపోతే.. ‘కాదు.. విసిరినందుకు ఒక్క ఏడాదే.. అది తగలకుండా మిస్సయినందుకు మిగతా రెండేళ్లు జైలు’ అని జడ్జి ఆగ్రహం! (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇది ‘షూ’పర్.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మన అమ్మల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ‘చెప్పు’ లేనట.. ఆ భయం చూపి.. అల్లరిపిల్లలను దారిలో పెడుతున్నారని సరదా కామెంట్. ఇలా అమ్మలు వారి ఆయుధాన్ని విరివిగా వాడి పిల్లలను డిసిప్లిన్‌లో పెడితే... ముందు తరాల రాజకీయాల్లో చెప్పుల అవసరం బాగా తగ్గుతుందని ఓ నెటిజన్ ఉవాచ. -
బూట్లు ఉతికే లాండ్రి.. కొత్త తరహా ఉపాధి
జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరగవు. కొంతమంది అనుకున్నవి జరగకపోయినా... ఇప్పటికి ఇదే ప్రాప్తం అనుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతుంటారు. మరికొందరు మాత్రం తాము చేసే పనిలో సంతృప్తి దొరకక నిత్యం మధనపడుతుంటారు. ఇలా మధనపడుతూనే తనకు నచ్చిన పనిని ఎంచుకుని షూ లాండ్రీ యజమానిగా మారి ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది షాజియా కైజర్. బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన షాజియా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెళ్లి చేశారు. షాజియాకేమో పై చదువులు చదవాలని ఆశ. తన కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవాలన్న కోరిక. ఈ క్రమంలోనే భర్త అనుమతితో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేయకుండా రెండేళ్లపాటు టీచర్ ఉద్యోగం చేసింది. తనకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మనసులో ఇంకా ఏదో చేయాలన్న తపన. అదికూడా పెద్దగా చేయాలి. దీంతో టీచర్ ఉద్యోగం మానేసే యూనిసెఫ్‌లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కనిపించకపోవడంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంది. బూట్లు ఉతికే లాండ్రి ఓ రోజు మ్యాగజీన్ చదువుతోన్న షాజియాకు బూట్లు శుభ్రం చేసే లాండ్రి సర్వీస్ గురించి తెలిసింది. బూట్ల లాండ్రీ పెడితే బావుంటుందన్న ఆలోచనతో షూస్‌ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకోవడం ప్రారంభించింది. లెదర్‌తో తయారు చేసే షూలను వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తారని తెలిసింది. షూ క్లీనింగ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు చెన్నైలోని ‘సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరి పాదరక్షలను తయారు చేసే టెక్నాలజీ, డిజైనింగ్ గురించి పూర్తిగా స్టడీ చేసింది. ఆ తరువాత నోయిడాలోని ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేరి లెదర్‌తో తయారు చేసే చెప్పులు, బూట్లు, వివిధ రకాల బ్యాగ్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. పట్నాలో 2014లో బూట్లు శుభ్రం చేసే ‘రివైవల్ షూ లాండ్రి’ పేరుతో ఇద్దరు పనివాళ్లతో కలిసి ఒక చిన్నపాటి షాపును ప్రారంభించింది. అయితే షూ లాండ్రీ అంటే ఏమిటో తెలియక వీరి షాపుకు చాలామంది చినిగిపోయిన బూట్లు తెచ్చి ఇచ్చేవారు. వారిని ఏమాత్రం విసుక్కోకుండా వాటిని చక్కగా కుట్టి శుభ్రంగా కడిగి కొత్తవాటిలా మార్చి తిరిగి ఇవ్వడంతో లాండ్రీకి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దాంతో చూస్తుండగానే ఈ బిజినెస్ పెరిగిపోయింది. వీరి లాండ్రీకి కస్టమర్ల నుంచి ఆదరణ లభించడంతో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 2016లో షాజియా షూ లాండ్రిని ‘బెస్ట్స్టార్టప్’ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు లక్షల టర్నోవర్‌తో లాండ్రీ నడుస్తోంది. సీఎం నితీష్‌కుమార్, ఇంకా సీనియర్ ఉన్నతాధికారులు సైతం షాజియా లాండ్రిలో బూట్లు సర్వీసింగ్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పాట్న వ్యాప్తంగా ఐదు అవుట్లెట్లతో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది షాజియా లాండ్రీ. అంతేగాక షాజియా దగ్గర షూ క్లీనింగ్‌లో శిక్షణ తీసుకున్న కొంతమంది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిషాలలో షూ లాండ్రీలను నడుపుతున్నారు. రంగు వెలిసినా... షాజియా లాండ్రీలో రంగువెలిసిన బూట్లకు కొత్త రంగు వేయడం, ట్రాలీబ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, లెదర్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను రిపేర్ చేయడంతోపాటు షూస్‌ను ఆవిరి మెషిన్ మీద శుభ్రం చేసి ఇస్తుంది. -
వామ్మో.. షూలో నాగుపాము.. ‘షూ’ వేసుకుందామనేసరికి.. బుసలు కొడుతూ..
శివమొగ్గ(కర్ణాటక): ఓ వ్యక్తి ‘షూ’ లోపల నాగుపాము పడకేసింది. ‘షూ’ వేసుకుందామని కదిలించేసరికి.. బుసకొడుతూ బెంబేలెత్తించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో మంగళవారం చోటుచేసుకుంది. బొమ్మానకట్టెకు చెందిన మంజప్ప మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా నాగుపాము బుసలు కొట్టింది. చదవండి: వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య సహించలేక.. దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగు తీశారు. దీని గురించి స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న కిరణ్.. పామును జాగ్రత్తగా బయటకు తీసి గ్రామానికి దూరంగా తీసుకెళ్లి వదిలివేశాడు. వర్షాకాలంలో షూ వేసుకునేముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని స్నేక్ కిరణ్ సూచించాడు. -
పాదరక్షలు పదిలంగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటించండి..!
కాలమేదైనా పాదరక్షలు ధరించాల్సిందే. రోజూ కురుస్తోన్న వర్షాలకు చెప్పులు, బూట్లకు బురద, మురికి పట్టి దుర్వాసన వస్తుంటాయి. వీటికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రెండోరోజు వేసుకోవడం కూడా కష్టమే. ఈ కింది చిన్నపాటి చిట్కాలు పాటించారంటే మీ పాదరక్షలు భద్రంగా ఉంటాయి. అవేంటో చూద్దాం... వర్షంలో బయటకు వెళ్లివచ్చిన తరువాత తడిసిపోయిన షూస్ సరిగా ఆరవు. షూ లోపల ఉన్న తేమ శిలీంధ్రాలు పెరగడానికి దోహద పడుతుంది. దీంతో షూస్ త్వరగా పాడవ్వడమేగాక, దుర్వాసన వస్తుంటుంది. తడిసిన బూట్లను గాలి తగిలే ప్రదేశంలో ఆరబెట్టడంతోపాటు, షూస్ లోపల టిష్యూ పేపర్లను ఉంచాలి. టిష్యూ పేపర్లు లోపలి తేమను పీల్చి షూ ను పొడిగా మారుస్తాయి. ఒకోసారి ఎంత శుభ్రంగా కడిగినప్పటికీ చెప్పులపైన పేరుకుపోయిన బురద ఒకపట్టాన వదలదు. ఇలాంటప్పుడు పాత టూత్‌బ్రష్‌కు కొద్దిగా టూత్ పేస్టు రాసి పది నిమిషాలపాటు రుద్దితే మురికి అంతా పోతుంది. తరువాత బట్ట లేదా టిష్యూ పేపర్‌తో తుడిచి ఆరబెడితే కొత్తవాటిలా తళతళ మెరుస్తాయి. పాదరక్షల దుర్వాసన పోవాలంటే షూస్‌లో టీబ్యాగ్స్‌ను పెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ బ్యాగ్‌లు లోపలి దుర్వాసనను లాగేస్తాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల చెప్పులు, షూలేగాక మీ పాదాలు కూడా పదిలంగా ఉంటాయి. -
పొట్టు పొట్టు చినిగిన షూస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం
పారిస్: అరచేతిలో ఫోన్ ద్వారానే ఆర్డర్లు చేసుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. బయటి మార్కెట్ల కన్నా.. ఆన్లైన్లోనే ఇప్పుడు అడ్డగోలు ప్రొడక్టులు దర్శనమిస్తున్నాయి. అదే టైంలో చిత్రవిచిత్రమైనవి కూడా కనిపిస్తున్నాయి. తాజాగా బాగా పేరున్న ఓ కంపెనీ వాళ్లు చేసిన పని.. సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ కావడం లేదు. అందుకు కారణం.. పొట్టు పొట్టుగా చినిగిన షూస్‌ను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడం. లగ్జరీ బ్రాండ్లకు కేరాఫ్ అయిన ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్ స్నీకర్ కలెక్షన్ పేరుతో లాంచ్ చేసింది. ఈ షూస్ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా పనికి రానంతగా! Balenciaga's New "Fully Destroyed" Shoe Set👟 x R36 000 per pair💵 Would you wear these? pic.twitter.com/oEduoUs1Fj — claztik🕊 (@claztik17) May 11, 2022 కానీ, వాళ్లు ఆ షూస్‌ను రిలీజ్ చేసింది వేసుకోవడానికేనట. పైగా అదే ఫ్యాషన్ అని ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్‌ను రిలీజ్ చేయగా.. మినిమమ్ ధర 495 డాలర్లు (మన కరెన్సీలో 38 వేల డాలర్లు) నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు (మన కరెన్సీలో లక్షా 44 వేల రూపాయల) దాకా ఉంది. మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్‌ను లిమిటెడ్ ఎడిషన్ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్ చేసిందట. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్ సైతం ఉంచింది బలెన్షియాగా. ఇంత దరిద్రాన్ని చూశాక ట్రోల్ రాజాలు ఊరుకుంటారా?.. ఆ ప్యాషన్‌ను పేకాట ఆడేసుకుంటున్నారు. Nueva Barbie Balenciaga pic.twitter.com/Wg9RCIvViA — Zorrito Zorrales (@ZorritoZorrales) May 9, 2022 Anyone who buys Balenciaga needs to go see the therapist https://t.co/xHG5N75x9y — Shabib Siddiqui 👨🏻🦯 (@shabibazam) May 10, 2022 -
గతంలో పట్టు జారితే ప్రాణాలకే ముప్పు.. కానీ ఇప్పుడా భయం లేదు
సాక్షి, కోదాడ: ఒకప్పుడు విద్యుత్ హెల్పర్లు, లైన్మన్లు, కార్మికులు స్తంభం ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. ఏమాత్రం పట్టు జారినా ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. కానీ ఇప్పుడు క్లైంబింగ్ షూతో సులువుగా ఎలాంటి భయం లేకుండా విద్యుత్ స్తంభం ఎక్కేస్తున్నారు. పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై విద్యుత్ తీగలు గజిబిజిగా ఉంటాయి. గంటల తరబడి స్తంభాలపై కనెక్షన్లు వెతుక్కోవలసి వస్తుండటంతో శరీరం బరువు కాళ్లు, చేతులపై పడుతోంది. ఆ సమయంలో లైన్మన్లు, హెల్పర్లు, కార్మికులు పట్టు కోల్పోయి జారిపడే ప్రమాదం ఉంది. క్లైంబింగ్ షూతో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడింది. క్లైంబింగ్ షూతో స్తంభంపై ఎక్కడ అంటే అక్కడ తాపీగా నిలబడుతున్నారు. దీంతో రాత్రివేళ కూడా సులువుగా స్తంభాలు ఎక్కి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యుత్ ఉద్యోగి క్లైంబింగ్ షూకి రూపకల్పన చేసి ఉపయోగించిన వీడియో యూట్యూబ్, వాట్సాప్‌లలో హల్చల్ చేసింది. దీనిని చూసి తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ శాఖల హెల్పర్లు, లైన్మన్లు విరివిగా దీని వాడకం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లో కేవలం రూ.300 నుంచి రూ.450 ఖర్చుతో క్లైంబింగ్ షూ తయారు చేసుకోవచ్చు. -
ఎంత మంచి పని ! ఈ స్టార్టప్‌కి నేను అండగా ఉంటా - ఆనంద్ మహీంద్రా
Ashay Bhave Who made Thealy Brand shoes from Plastc covers and bottles: ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్‌ని నివారిద్దాం అనే స్లోగన్లు ఎన్నిసార్లు వింటున్న వాటి వాడకం ఆపడం లేదు. కానీ ఢిల్లీకి చెందిన ఈ 23 ఏళ్ల కుర్రాడు మాటలు కట్టి పెట్టి చేతల్లోకి దిగాడు. ఇంత గొప్ప ఐడియాను అమలు చేస్తున్న వ్యక్తి గురించి నేనింకా ఎందుకు తెలుసుకోలేకపోయానంటూ సాక్షత్తూ ఆనంద్ మహీంద్రాలాంటి బిజినెస్ టైకూన్ బాధపడేంతంగా ఫలితాలు సాధిస్తున్నాడు. ఆశయ్ భావే నెలకొల్పిన స్టార్టప్ కంపెనీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాలబుగ్గల పసివాడిగా కనిపస్తున ఓ మేనేజ్మెంట్ స్కూల్ విద్యార్థి నెలకొల్పిన కుటీర పరిశ్రమ వందల మందికి ఉపాధిని ఇస్తోంటే లక్షల మందిని ఆలోచనలో పడేసింది. స్టార్టప్ ఐడియా ప్లాస్టిక్ నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు అంతంతగానే ఉంటున్నాయి. ప్రతీ ఊరిలో ప్రతీ విధీలో చెత్త కుప్పల నిండా ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ ఆక్రమించేస్తున్నాయి. డ్రైనేజీలకు అడ్డం పడుతున్నాయి. ఇలాంటి చెత్త నుంచి ఓ అద్భుతమైన పరిశ్రమకు ఊపిరి పోశాడు ఢిల్లీకి చెందిన ఆశయ్ భావే. చెత్తకుప్పల్లో పడేసిన ప్లాస్టిక్ కవర్లు, పెట్బాటిల్స్తో ప్రొఫెషనల్ షూ తయారీ కంపెనీని ఏర్పాటు చేశాడు. వాటిని ఆన్లైన్ వేదికగా టిక్‌టాక్‌గా అమ్మేస్తున్నాడు. ఢిల్లీ టూ గురుగ్రామ్ చెత్త సేకరించే ఏజెన్సీలతో మొదట ఒప్పందం చేసుకున్నాడు ఆశయ్.ఢిల్లీ నగర వ్యాప్తంగా ఉన్న రాగ్‌పికర్స్ (చెత్త ఏరుకునే వాళ్లు)కి ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ తీసుకురావాలంటూ ఏజెన్సీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతే వారం రోజుల వ్యవధిలోనే టన్నుల కొద్ది చెత్త సేకరించేందుకు గురుగ్రామ్‌లో ఓ యూనిట్ ఏర్పాటు చేశారు. నలుదిశల నుంచి వచ్చి పడిన ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్‌ని శుభ్రంగా నీటితో కడిగి తేమ పోయే వరకు ఆరపెడతారు. ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లను ఒకదాని మీద ఒకటిగా ఎనిమిది లేయర్లుగా పేర్చుతారు. కావాల్సిన డిజైన్‌లో కట్ చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్దతిలో దాన్ని వేడి చేసి.. షూ తయారీకి అవసరమైన తేలే టెక్ట్స్ అనే రా మెటీరియల్‌గా మారుస్తారు. ఢిల్లీ టూ జలంధర్ గురగ్రామ్ ఫ్యాక్టరీలో తయారైన షూ మెటీరియల్‌ని పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న షూ తయారీ యూనిట్‌కి పంపిస్తారు. అక్కడ ఈ మెటీరియల్‌తో స్నీకర్ షూకి తగ్గట్టుగా కట్ అండ్ స్టిచ్ వర్క్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ వేస్ట్ రబ్బరు నుంచి తయారు సోల్‌ని ఉయోగించి షూని రెడీ చేస్తారు. షూకి సంబంధించిన లేస్, ప్యాకింగ్‌కు ఉపయోగించే కవర్లు సైతం పూర్తిగా ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్‌తో హ్యాండ్ మేడ్‌గా తయారు చేస్తారు. బ్రాండ్ తేలే ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తున్నా.. క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. అందువల్లే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా బ్రాండింగ్ , మార్కెటింగ్ చేస్తున్నారను. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన షూస్‌ని తేలే బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్నారు. దీని కోసం thaely.com అనే వెబ్‌సైట్‌ని అందుబాటులో ఉంచారు. తేలే బ్రాండ్‌లో వివిధ మోడళ్ల షూస్ ధర 110 యూఎస్ డాలర్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఆన్లైన్లో పేమెంట్ చేసి షూస్ పొందవచ్చు. డెలివరీ అందగానే షూ ప్యాక్ చేసిన కవర్ని భూమిలో పాతితే పది రోజుల్లో ఓ తులసి మొక్క మొలిచేలా బ్యాగ్‌ని రూపొందించారు. అదిరిపోయే సేల్స్ ఆశయ్ భావే తేలే షూ తయారీని 2021 జులైలో ప్రారంభించారు. ప్రస్తుతం వారానికి 15 వేల జతల షూస్ ఇక్కడ తయారవుతున్నాయి. మొదటి వారం 300 షూలు తయారు చేయగా ఇప్పుడా సంఖ్య 15 వేలకు చేరుకుంది. రెడీ అయిన షూ రెడీ అయినట్టే అమ్ముడైపోతుంది. జలంధర్, గురుగ్రామ్‌లో ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్య 170కి చేరుకుంది. ఢిల్లీ నగరంలో ఉన్న రాగ్ పికర్స్‌కి ఆదాయం పెరిగింది. చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు క్రమంగా కనుమరుగు అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. Embarrassed I didn’t know about this inspiring startup. These are the kinds of startups we need to cheer on—not just the obvious unicorns. I’m going to buy a pair today. (Can someone tell me the best way to get them?) And when he raises funds-count me in! https://t.co/nFY3GEyWRY — anand mahindra (@anandmahindra) November 17, 2021 సిగ్గుపడుతున్నా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి షూ తయారు చేస్తున్న ఆశయ్ భావే సక్సెస్ స్టోరి ఇటీవల ప్రసారం అయ్యింది. అది చూసిన వెంటనే ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇలాంటి స్టార్టప్ గురించి ఇంత కాలం తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజే నేను ఓ జత షూ కొనుక్కుంటాను అంటూ చెప్పుకొచ్చారు. తన ట్విట్టర్ పేజీలో సక్సెస్ స్టోరీని షేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి షూస్‌ని ప్రముఖ కంపెనీలు కూడా గతేడాది నుంచి తయారు చేస్తున్నాయి. 2020 జూన్ నుంచి స్పేస్ హైవే సిరీస్‌తో నైక్ సంస్థ ప్రత్యేకంగా మార్కెట్లోకి షూస్‌ని తెచ్చింది. సముద్రంలో పోగుపడిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అడిడాస్ సంస్థ షూస్ తయారు చేస్తోంది. ఈ రెండు బ్రాండ్ల నుంచి ఇప్పటి వరకు కోటి జతలకు పైగా షూస్ ప్రపంచ వ్యాప్తంగా విక్రయించారు. - సాక్షివెబ్, ప్రత్యేకం చదవండి:బిల్‌గేట్స్ పేరెత్తితే ఆనంద్ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే? -
గిన్నిస్ రికార్డు: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు 30 వేల జతల బూట్లు
గచ్చిబౌలి (హైదరాబాద్): బాలల దినోత్సవం సందర్భంగా 6.118 కిలోమీటర్ల పొడవునా.. 30,107 జతల బూట్లను ప్రదర్శనకు పెట్టి రియల్‌పేజ్ ఇండియా సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ బూట్లను 100 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆదివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ బూట్లను ప్రదర్శనకు ఉంచారు. రియల్ఎస్టేట్ రంగానికి సాఫ్ట్వేర్ సేవలు అందించే రియల్‌పేజ్ సంస్థ.. సామాజిక బాధ్యతలో భాగంగా ఇటీవల ‘రియల్ సోల్స్ ఫ్రమ్ రియల్ సోల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులోభాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా బూట్లను అందిస్తోంది. అమెరికా రికార్డును అధిగమించి.. అత్యంత ఎక్కువ బూట్లను వరుసగా పేర్చిన రికార్డు ఇంతకుముందు అమెరికాలో నమోదైందని, అక్కడ 2011లో 24,962 జతల బూట్లతో ‘లాంగెస్ట్ లైన్ ఆఫ్ షూస్’గా రికార్డ్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ స్వప్నిల్ డంగరికర్ వెల్లడించారు. ఆదివారం గచ్చిబౌలిలో బూట్ల ప్రదర్శనను పరిశీలించి.. రియల్‌పేజ్ సంస్థ కొత్త రికార్డును సాధించిందని తెలిపారు. కాగా.. రియల్ పేజ్ సంస్థ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయడం అభినందనీయమని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. మరింత సాయం అందిస్తాం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరింత తోడ్పాటు అందిస్తామని రియల్ పేజ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సందీప్‌శర్మ తెలిపారు. ప్రస్తుతం బూట్లు పంపిణీ చేస్తున్నామని.. బ్యాగులు, యూనిఫాం, బెంచీలు, కిచెన్ వంటివి కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను
క్వీన్స్‌ల్యాండ్: అనుకోని విధంగా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల్లో చాలా మటుకు బయటపడటం కష్టం. ఒకవేళ బయటపడితే చాలా అదృష్టవంతులుగా భావింస్తాం జౌనా. అచ్చం అలాంటి భయంకరమైన ప్రమాదం ఆస్ట్రేలియాలో సంభవించింది. వివరాల్లోకెళ్లితే ఆస్ట్రేలియాకు చెందిన టాలిన్ రోస్ అనే బాలుడు తన తండ్రితో కలిసి కారులో సమీపంలోని తన పాఠశాలకు వస్తాడు. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) ఆ తర్వాత కారు దిగి నెమ్మదిగా తన పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాడు. అంతే ఒక్కసారిగి ఆ యువకుడి పిడుగుపాటుకి గురవుతాడు. ఈ మేరకు శక్తివంతమైన మెరుపు ఒక మెటల్ స్తంభం నుండి ఆ యువకుడి శరీరంలోకి చొచ్చుకుపోయి కాల్చి అతని చేతి గుండా బయటకు వస్తుంది. దీంతో ఆ యువకుడు పాఠశాల వెలుపల నేలపైకి విసిరిపడతాడు. అంతేకాదు అతని కండరాలు బిగుసుకుపోయి, పూర్తిగా మొద్దుబారిపోతాయి. అయితే అదృష్టవశాత్తు అతని తండ్రి కారులోంచి ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అప్రమత్తమై అంబులెన్స్‌కి సమాచారం ఇస్తాడు. కానీ టాలిన్ మాత్రం షాక్‌కి గురై ఏమి వినలేని స్థితిలో ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ షాక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు డాక్టర్లు టాలిన్ ధరించిన రబ్బరు ష్యూస్ ఆ శక్తివంతమైన విద్యుదావేశాన్ని శోషించుకోవటంతో సులభంగా బయటపడగలిగాడని చెప్పారు. పిడుగుపాటు జరిగినపుడు ఇలా సజీవంగా ఉండటం జరగదని టాలిన్ చాలా అదృష్టవంతుడంటూ ఆస్ట్రేయిన్ న్యూస్ ఏజెన్సీ డైలీమెయిల్ పేర్కొంది. అంతేకాదు ఆ మెరుపు దాడి చేసినప్పుడు ఏర్పడిన కాలిన మచ్చలు పాదాలపై భుజాలపై ఉన్నాయి. (చదవండి: 'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే) -
జగనన్న విద్యాకానుక : బ్యాగ్‌లు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం జగన్ ఫోటోలు
-
విద్యా కానుక: బ్యాగ్‌లు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ‘జగనన్న విద్యాకానుక’ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి అదనంగా అయ్యే ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది. జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. 1 నుంచి 10 వ తరగతి బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు. చదవండి: వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్ -
అమ్మకానికి రీబాక్.... ఆడిడాస్ సంచలన నిర్ణయం
స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. దాదాపు వందేళ్లకు పైబడి కొనసాగుతున్న ఈ ప్రముఖ బ్రాండ్ యాజమాన్యం మరోసారి మారనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. రీబాక్ బ్రాండ్ తెలియని యూత్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు నూట ఇరవై ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, ఫిట్నెస్ కేర్‌లో రీబాక్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏతో రీబాక్కి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని 2.5 బిలియన్ డాలర్లకు అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ) సొంతం చేసుకోనుంది. రీబాక్ బ్రాండ్‌ని మరో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ అడిడాస్ 2006లో 3.8 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. నైక్‌కి పోటీగా రీబాక్‌ను తీర్చిదిద్దేంకు ప్రయత్నించింది. అయితే ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్ వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో ఆడిడాస్లోని ఇన్వెస్టర్లు రీబాక్‌ను అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో రీబాక్ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు అడిడాస్ సిద్ధమైంది. -
వైరల్: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’
చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు, పంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. TN's Fisheries Minister Anitha Radhakrishnan, who doesn't want to get his shoes wet, carried by a fisherman, reports @PramodMadhav6. Was at Palaverkadu to inspect effects of sea erosion. (via @polimernews) pic.twitter.com/uJ88rAdg5i — Shiv Aroor (@ShivAroor) July 8, 2021 -
నేను బిక్షగాడిని కాదు సార్ .. బూట్ పాలిష్ చేస్తాను!
బెంగళూరు: లాక్‌డౌన్‌తో కార్మికులు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారో తేటతెల్లం చేసే సంఘటన ఇది. జిల్లా ఇన్చార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తుండగా ఓ కార్మికుడు కారు వద్దకు వచ్చి పార్ బూట్ పాలిష్ చేస్తా అంటూ వెట్టర్ను ప్రాధేయపడ్డాడు. నగరంలోని కిమ్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంత్రి డబ్బులు ఇవ్వపోగా..‘నేను బిక్షగాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్’ అని ప్రాధేయపడ్డాడు. చివరకు మంత్రి రూ. 500 నగదు ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు. చదవండి: ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’ -
షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన
''మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.. సిరీస్ ముగిసిన ప్రతీసారి విరిగిపోయిన మా షూస్‌కు గ్లూ రాసుకొని వాటిని కాసేపు ఎండబెడుతున్నాం.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు మళ్లీ అవే షూతో సిద్ధమవుతున్నాం. ఇలా కొన్ని నెలలు పాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు... ఎవరైనా స్పాన్సర్ ఉంటే సాయం చేయండి.. అప్పుడు మా షూస్‌కు గ్లూ పెట్టే అవసరం రాదు.'' ఇది జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ ఆవేదన. ఈ ఒక్క అంశం చాలు జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పడానికి. అయితే ర్యాన్ బర్ల్ పోస్టుకు స్పందించిన స్పోర్ట్స్ కంపెనీ పూమా షూస్.. అతనితో ఒప్పందం చేసుకోవడమే గాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్‌ను గిఫ్ట్‌గా పంపి తన ఉదారతను చాటుకుంది. ర్యాన్ బర్ల్ కన్నీటిపర్యంతమవుతూ పెట్టిన పోస్ట్ సగటు క్రికెట్ అభిమానులను కదిలిచింది. దీన స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.'' బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా మీకు ఒక విజ్ఞప్తి.. దయచేసి జింబాబ్వేతో సిరీస్‌లు ఉంటే పోస్ట్‌పోన్ చేయకండి. ఇప్పుడు వారితో క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కచ్చితంగా జింబాబ్వే మంచి టీమ్.. కానీ అక్కడి కుళ్లు రాజకీయాలు క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నాయి.జింబాబ్వేతో సిరీస్‌లు ఆడుతూ వారికి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది.'' ఒక అభిమాని ఆవేదన చెందాడు. ''జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి చూసి బాధేస్తోంది. క్రికెట్లో కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం అవసరం పడుతుందేమో. జెంటిల్మెన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలి. దయనీయ స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లను ఆదుకోవాలి'' అంటూ మరొకరు కామెంట్ చేశారు. ర్యాన్ బర్ల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. మరి ఐసీసీతో పాటు బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు బర్ల్ పోస్టుకు స్పందిస్తాయేమో చూడాలి.జింబాబ్వే తరపున 2017లో అరంగేట్రం చేసిన ర్యాన్ బర్ల్ 3 టెస్టుల్లో 24 పరుగులు, 18 వన్డేల్లో 243 పరుగులతో పాటు 7 వికెట్లు, 25 టీ20ల్లో 393 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. ఇక ప్రపంచ దేశాల్లో పేదరికంతో అలమటిస్తున్న దేశాల్లో జింబాబ్వే ఒకటి. నల్లజాతీయులు అనే వివక్ష వారిని మరింత వెనక్కి నెట్టేసింది. దశాబ్దాలకు పైగా వారు కనీసం ఏ క్రీడల్లో కూడా ఆడేందుకు అనుమతించలేదు. అలాంటిది కాస్త కూస్తో జింబాబ్వేకు పేరు వచ్చింది క్రికెట్ ద్వారానే అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాల కిందటి వరకు జింబాబ్వే జట్టులో కాస్త పేరున్న ఆటగాళ్లు ఎక్కువగా కనిపించేవారు. హిత్ స్ట్రీక్, ఆండీ ప్లవర్, గ్రాంట్ ఫ్లవర్,హెన్రీ ఒలాంగా, తైబూ, స్టువర్ట్ క్యాంప్‌బెల్ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. వీరు ఉన్నంతకాలం జింబాబ్వే ఆటతీరు కాస్త మెరుగ్గానే ఉండేది. బలహీన జట్టుగా కనిపించినా.. కాస్త పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించేది. వీళ్లంతా రిటైర్ అయ్యాకా జింబాబ్వే ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అప్ఘనిస్తాన్‌ల కంటే ఎంతో ముందు అంతర్జాతీయ క్రికెటలోకి వచ్చిన జింబాబ్వే వారి చేతిలో కూడా పరాజయం పాలై అనామక జట్టుగా తయారైంది. దీనికి తోడూ క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడంతో 2019 జూలైలో ఐసీసీ జింబాబ్వేను ఆట నుంచి బహిష్కరించింది. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎంతలా అంటే కనీసం జింబాబ్వే క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేకపోయింది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో ఐసీసీ జింబాబ్వేపై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. రెండు టెస్టుల సిరీస్‌ను పాక్ 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో గెలిచిన జింబాబ్వే మిగతా రెండు ఓడిపోయి 2-1 తేడాతో సిరీస్‌ను పాక్‌కు అప్పగించింది. చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్ నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా Any chance we can get a sponsor so we don’t have to glue our shoes back after every series 😢 @newbalance @NewBalance_SA @NBCricket @ICAssociation pic.twitter.com/HH1hxzPC0m — Ryan Burl (@ryanburl3) May 22, 2021 Such a sad state of affairs concerning Zimbabwe cricket. Democratization of Cricket is necessary. We can't allow the beautiful game of cricket to continue like the Super League in football. — Satrajeet Sen (@Sen_Satrajeet) May 23, 2021 @BCCI @ECB_cricket @CricketAus Please do not keep postponing your tours with Zim. It brings them much needed experience and money, with all the viewers watching. Zim sure had a great team, but even the current team has splendid potential. Let's not ignore them — Niranjan Jha (@njanjha17) May 22, 2021 -
వేలానికి అమెరికా మాజీ అధ్యక్షుడి బూట్లు
ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ నైకీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వినియోగించిన ‘షూస్’ని వేలానికి పెట్టింది. దీని ప్రారంభ ధర 25 వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో రూ.18 లక్షలపైనే ఉంది. తెల్లరంగులో ఉన్న ఈ బూట్లను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా తరచూ వినియోగించారు. ఈ బూట్లను ప్రత్యేకంగా రూపొందించి నైకీ ఒబామాకు అందించింది. ఇవి ఒబామాకా చాలా ఇష్టమట. ఈ షూలపై ఒబామా సంతకం కూడా ఉంది. 2009 నుంచి 2017 వరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒబామా కొనసాగిన విషయం తెలిసిందే. ఒబామా రాజకీయాలతో పాటు క్రీడలు తరచూ ఆడేవారు. ముఖ్యంగా బాస్కెట్ బాల్ ఆడేవాడు. దీంతో ఆయన కోసం నైకీ 2009లో ప్రత్యేకంగా షూస్‌ని తయారు చేసి ఇచ్చింది. ఈ బూట్లను ఫ్లై వేర్ టెక్నాలజీతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒబామా బయటికి వెళ్తే ఎక్కువగా ఈ షూస్నే వినియోగించారట. ప్రస్తుతం వేలానికి పెట్టడంతో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాలి. కొన్ని నెలల కిందట ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం హాట్‌కేకులా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బూట్లకు కూడా అంతే డిమాండ్ ఉండేలా ఉంది. Coming to Sotheby's this President’s Day Weekend! President Barack #Obama Player Exclusive Nike Hyperdunk—one of two pairs in existence —for immediate purchase this Friday at 4:44 PM EST, in celebration of America’s 44th President. #Sneakers #PresidentsDay https://t.co/s92RVU9L1m — Sotheby's (@Sothebys) February 8, 2021 -
చెప్పులు మధ్యాహ్నమే ఎందుకు కొనాలి?
సుష్మ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తోంది. ఎప్పుడూ పాదాల పగుళ్లు, కాలి గోర్ల చివరన ఇన్ఫెక్షన్తో బాధపడేది. ఆయింట్మెంట్లు, ఇతర మందులు వాడినా ఫలితం లేదు. ఇటీవల ఓ డాక్టర్‌ను సంప్రదించి తన సమస్యను వివరించగా.. ఆయన అది మీరు వేసుకునే చెప్పుల లోపంగా చెప్పడంతో సుష్మ విస్తుపోయింది. ఆయన సలహా మేరకు పాదరక్షలు వినియోగించడంతో ఆర్నెల్లలోనే ఆమె సమస్య నుంచి బయట పడింది. సాక్షి, హైదరాబాద్: దుస్తుల విషయంలో ప్రతి ఒక్కరూ చాలా వరకు నిక్కచ్చిగానే వ్యవహరిస్తుంటారు. అంటే కొలతలు కరెక్టుగా ఉండాలని భావిస్తుంటారు. వాటి ప్రాధాన్యత అలాంటిది మరి. వినడానికి కాస్త వింతగా అని్పంచవచ్చు కానీ మనం వేసుకునే పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మన పాదాలకు అతుక్కుని ఉండి, వాటిని కాపాడేది పాదరక్షలే. ఈ పాదరక్షల విషయంలో ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యగా కూడా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదరక్షలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సరైన సైజును ఎంచుకోవాలని చెబుతున్నారు. మరి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, డయాబెటిస్ రోగులు, సర్జరీలు చేయించుకున్న వాళ్లు తప్పకుండా మధ్యాహ్నం, సాయంత్రం మధ్య వేళలో (లేట్ ఆఫ్టర్నూన్) చెప్పులైనా, బూట్లైనా కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు. మధ్యాహ్నమే ఎందుకు...? గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్ పేషంట్లకు సహజంగా కాళ్ల వాపులుంటాయి. అదే విధంగా ఎక్కువ సమయం కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం విధినిర్వహణలో ఉన్నంత సేపు కాళ్లు కాస్త వాచి కనిపిస్తుంటాయి. ఎక్కువసేపు కూర్చోవడంతో కండరాల్లో ఎక్కువ సేపు కదలికలు నిలిచిపోవడంతో వాపు వస్తుంది. ఈ కేటగిరీలోనివారికి ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దది తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగని బాగా పెద్ద సైజు తీసుకుంటే మామూలు సమయంలో వదులవుతాయనుకోండి. అయితే పనివేళలో సరైన సైజ్ చెప్పులు, బూట్లు వేసుకోవడం సౌకర్యంగా ఉంటుందని, ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. బిగుతు చెప్పులతో తిప్పలు... కాలి సైజు కంటే చిన్నగా, బిగుతుగా ఉండేవి ధరిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాదాలకు పగుళ్లు వస్తాయి. అవి దీర్ఘకాలికంగా తగ్గవు. కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు సైతం ఎదురవుతాయి. బిగుతైన బూట్లు వేసుకుంటే గోర్లు పెరుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లకు గురై తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడంతో మడమల సమస్యలు ఎదురవుతాయి. అలాగే తరుచూ కాళ్లు బెణకడంతో పాటు నడకలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రెండు కాళ్లకూ వేసుకుని చూడాలి పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్ వేసి ఖరారు చేసుకోవద్దు. రెండు కాళ్లకు వేసుకుని కాస్త ముందు, వెనక్కి నడిచిన తర్వాత సౌకర్యవంతంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. బూట్లు కొనుగోలు చేసేటప్పుడు సాక్స్ ధరించి ట్రయల్ వేయాలి. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ కుమార్ కృష్ణమోహన్, సీనియర్ జనరల్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ -
జోర్డాన్ బూట్లు అ‘ధర’హో...
న్యూయార్క్: బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. ఎన్బీఏలో ఆడేందుకు జోర్డాన్ కోసమే ప్రత్యేకంగా నైకీ సంస్థ తయారు చేసిన ‘ఎయిర్ జోర్డాన్ స్నీకర్స్’ షూస్‌కు 5 లక్షల 60 వేల అమెరికా డాలర్లు (రూ.4 కోట్ల 25 లక్షలు) లభించాయి. ఇది ఆల్‌టైమ్ రికార్డు ధర అని వేలం నిర్వహించిన ‘సొ ద బై’ సంస్థ వెల్లడించింది. 1985లో తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో నైకీ ఈ బూట్లను ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ షూస్‌ను ఎన్బీఏ పోటీల్లో జోర్డాన్ ధరించాడు. గతంలో కూడా జోర్డాన్ బూట్లు వేలంలో అసాధారణ ధర పలికాయి. అప్పట్లో జోర్డాన్ కోసం తొలిసారిగా స్నీకర్స్ తరహా బూట్లను నైకీ రూపొందించింది. వాటిని గత ఏడాది వేలానికి పెట్టగా 4 లక్షల 37 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 30 లక్షలు) లభించాయి. ఎన్బీఏలో చికాగో బుల్స్ తరఫున జోర్డాన్ మెరుపులపై ‘ది లాస్ట్ డాన్స్’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ఇది కూడా అతను ఆడే మ్యాచ్‌ల్లాగే బాగా పాపులర్ అయింది. -
అదిరిపోయే ‘స్మార్ట్ షూస్’
వియన్నా: ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో గత అక్టోబర్‌లో జరిగిన రెండు గంటల ప్రపంచ మారథాన్‌లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్చోజ్ విజయం సాధించారు. సుదూర మారథాన్‌లో ఓ అథ్లెట్ విజయం సాధించడం ప్రపంచంలోనే మొదటిసారి. అందుకు కారణం ఆయన కాదు. ఆయన ధరించిన ‘నైక్ స్మార్ట్ షూ’యే కారణం. ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ బూట్లపై వివాదం మొదలయింది. అథ్లెట్లు ఈ బూట్లు ధరించకుండా నిషేధం విధించాలని ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం డిమాండ్ చేస్తోంది. షూస్ అడుగు భాగాన కార్బన్ ఫైబర్ ప్లేట్‌కు ఫోమ్ కుషన్ జతచేసి కుట్టడం వల్ల అది స్ప్రింగ్‌లాగా పనిచేస్తుంది. వాటిని ధరించడం వల్ల పరుగెత్తుతున్నప్పుడు గాల్లో ఎగురుతున్నట్లు ఉంటుంది. వీటిని ఇప్పుడు అథ్లెట్స్‌కు ట్రెయినర్స్గాను పిలుస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ‘కెంట్ అథ్లెటిక్స్ క్లబ్’లో 90 శాతం మంది అథ్లెటిక్స్ ఇప్పుడు ఈ షూస్నే వాడుతున్నారని మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఓవెన్ హింద్ తెలిపారు. బూట్లకు స్ప్రింగ్ యాక్షన్ ఉండడం వల్ల అడుగు దూరంగా పడడంతో ఎక్కువ దూరం ఎక్కువ ప్రయాసం లేకుండా పరుగెత్తవచ్చని ఆయన తెలిపారు. ఒక తెలుపు రంగులోనే కాకుండా రకరకాల రంగుల్లో ఇవి లభిస్తుండడం వల్ల కూడా అథ్లెటిక్స్ను, రన్నర్లకు ఈ షూస్ ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. ధర తెలిస్తే మాత్రం కాళ్లు వణకడం ఖాయం. కనీస ధర 240 పౌండ్లు (దాదాపు 22 వేల రూపాయలు)గా ఉంది. -
‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’
సాధారణంగా కూల్‌డ్రింక్, బీర్ సీసాల మూత తీయడానికి ఓపెనర్లు ఉపమోగిస్తాము. అవీ కూడా మార్కెట్లో వివిధ రూపాల్లో లభిస్తాయన్న విషయం తెలిసిందే. కానీ, షూస్ తయారు చేసే ఓ సంస్థ వినూత్నంగా ఓపెనర్లను బూటు మడమ మీద ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సంస్థ షూస్ మడమ మీద వెండిపూతతో దీన్ని రూపొందించింది. ఈ షూస్‌కి ‘పార్టీ పంప్స్’ అనే పేరును పెట్టింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత షూపై ప్రముఖ డిజైనర్ మార్క్ జాకబ్స్ ‘తెలివైన ఆలోచన’గా పేర్కొంది. ‘ఎంతో వినూత్నమైన ఆలోచన’అని ఒకరు, ‘పురుషుల ఎంపిక?’ అని మరొకరు ‘షూస్‌కి ఓపెనర్ ఏంటిరా బాబు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా ఈ షూ ధరను రూ. 98,995 గా నిర్ణయించింది. -
మీకు షూస్ ఇవ్వాలా?
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ షూస్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన మండల విద్యాశాఖాధికారులు వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలోని కనిగిరి, కంభం, పెద్దారవీడు, అర్ధవీడు, బల్లికురవ, అద్దంకి, మార్టూరు మండలాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు షూస్ ఇవ్వకుండా అక్కడి మండల విద్యాశాఖాధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌తో పాటు షూస్ ఇవ్వాలని సాక్షాత్తు విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొంతమంది విద్యాశాఖాధికారులు మోకాలడ్డుతుండటంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎక్కువ శాతం ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ పంపిణీ చేసినా ఆ ఏడు మండలాల పరిధిలోని మండల విద్యాశాఖాధికారుల నుంచి వింత సమాధానం రావడంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు షూస్ ఇచ్చి, తమ విద్యార్థులకు ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలే విద్యార్థుల శాతం తక్కువగా ఉందని కలత చెందుతున్న తరుణంలో షూస్ అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఏ ఏడు మండలాల పరిధిలోని ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ అందించేలా సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. -
క్రికెట్ పిచ్‌పై..గోల్డ్ షూ
సాక్షి, సిటీబ్యూరో: రానున్న వరల్డ్‌కప్ క్రికెట్ ఫీవర్‌ను పురస్కరించుకుని ప్రముఖ షూ తయారీ బ్రాండ్ ప్యూమా వన్8 క్రికెట్ షూస్ పేరిట సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. బంగారపు రంగులో ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం తయారైన ఈ గోల్డెన్ షూ మొత్తం 150 జతలు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, భారత క్రికెట్ కెప్టెన్ వీటిని ధరించి మైదానంలో కనువిందు చేయనున్నట్లు తెలిపారు. -
12 వేళ్ల స్వప్నకు ప్రత్యేక బూట్లు
న్యూఢిల్లీ: భారత అథ్లెట్, ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ చాంపియన్ స్వప్న బర్మన్ ఎట్టకేలకు ప్రత్యేక బూట్లు అందుకుంది. ఆమె రెండు పాదాలకు ఆరేసి వేళ్లున్నాయి. డజను వేళ్లతో ఉన్న ఆమెకు సాధారణ స్పోర్ట్స్ షూస్ ఇరుకుగా, అసౌకర్యంగా ఉండటంతో పరుగు పెట్టడంలో ఇబ్బంది పడుతోంది. మొత్తానికి ఎన్ని ఇబ్బందులెదురైనా... ఇండోనేసియాలో గతేడాది జరిగిన ఏషియాడ్‌లో ఆమె దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టింది. చివరకు జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అడిడాస్ ప్రత్యేకించి స్వప్న పాదాల కోసమే బూట్లను తయారు చేసింది. ఇందుకోసం ఆమెను హెర్జోజెనరచ్లో ఉన్న తమ అథ్లెట్ సర్వీసెస్ ల్యాబ్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆమె పాదాలకు అనుగుణమైన కొలతల్ని తీసుకొని సౌకర్యవంతమైన ఆకృతిలో బూట్లను తయారు చేసింది. తనకు ఏ ఇబ్బంది లేకుండా పూర్తి సౌకర్యవంతమైన బూట్లు రావడంతో స్వప్న తెగ సంబరపడిపోతోంది. అడిడాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కష్టపడతానని ఈ సందర్భంగా చెప్పింది. -
షూ లో దాక్కున్న పాము
కర్ణాటక , దొడ్డబళ్లాపురం : ఇంట్లోకి వచ్చి న పాము ఒకటి ఇంటి ఆవరణలో విడిచిన షూలో దాక్కుని ఇంట్లోవారిని బెంబేలెత్తించిన సంఘటన నెలంగలలో చోటుచేసుకుంది. తాలూకాలోని నారాయణప్పనపాళ్య గ్రామం శివారులో మూర్తి అనే వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించి గృహప్రవేశం చేశాడు. మంగళవారం ఉదయం ఇల్లు క్లీన్ చేసే క్రమంలో షూలో పాము చేరుకున్న సంఘటన గుర్తించారు. దీంతో భయపడిపోయిన మూర్తి స్నేక్ లోకేశ్‌కు సమాచారం ఇచ్చాడు. తక్షణం ఇంటికి వచ్చిన స్నేక్ లోకేశ్ పామును పట్టుకున్నాడు. పట్టుబడ్డ పాము సుమారు 5 అడుగుల పొడవు ఉంది. పాత వస్తువులు బయట పెట్టరాదని స్నేక్ లోకేశ్ సూచించారు. -
షావోమి న్యూ ఎంట్రీ.. ఎంఐ షూస్
సాక్షి,ముంబై : చైనా కంపెనీ షావోమి మరో ఎత్తుగడతో భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైపోయింది. స్మార్ట్ఫోన్లతో ఇండియాలో అడుగుపెట్టి స్మార్ట్‌ఫోన్ రంగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న షావోమి తాజాగా పాదరక్షల మార్కెట్‌పై కన్నేసింది. గత రెండు రోజులుగా ట్విటర్ ద్వారా ఊరిస్తూ వస్తున్న షావోమి అంచనాలకనుగుణంగానే ఎంఐ బ్రాండ్ ద్వారా 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2' పేరుతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధర రూ.2,499గా నిర్ణయించింది. ఎంఐ ఇండియా వెబ్సైట్ ద్వారా ప్రీ ఆర్డర్ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. బ్లాక్, గ్రే, బ్లు రంగుల్లో లభ్యమవుతున్నాయి. ఎం షూస్ 5ఇన్ 1 మౌల్డింగ్ టెక్నాలజీ, 5 రకాల మెటీరియల్స్‌తో మేళవించిన ఇంజనీరింగ్ టెక్నాలజీతో (షాక్ అబ్సార్బెంట్) , జారకుండా, దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. పలు ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లో విస్తరిస్తున్న షావోమి ఎంఐటీవీలు, ఎయిర్ ప్యూరిఫైర్లు, మాస్కులు, సన్ గ్లాసెస్, సూట్‌కేస్‌లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక యువజనమే టార్గెట్‌గా 'ఎంఐ మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2' లను రిలీజ్ చేసింది. Mi fans, here comes, the Mi Men's Sports Shoes 2. 👟 Unique Fishbone Structure 👟 5-in-1 Uni-Moulding technology 👟 Shock Absorbent Available at a special price. RT to spread the word! #BFF Show some ❤: https://t.co/rV0jopos68 pic.twitter.com/Bm9d6l7D3m — Mi India (@XiaomiIndia) February 6, 2019 -
15 ఏళ్ల తర్వాత చెప్పులు తొడిగాడు..!
భోపాల్ : పార్టీ గెలుపు కోసం నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తలే కృషి చేస్తారు. ఈ క్రమంలో గెలుపు కోసం పూజలు, యాగాలు చేసేవారు కొందరైతే భీష్మ ప్రతిజ్ఞలు చేసేవారు మరి కొందరు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ గెలిస్తేనే గడ్డం గీసుకుంటానని ఓ నాయకుడు.. ఓడిపోతే పీక కోసుకుంటానంటూ మరో నాయకుడు శపథాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్ని జరిగేవి కావని జనాలకు కూడా తెలుసు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కార్యకర్త మాత్రం చేసిన శపథాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏకంగా 15 ఏళ్ల పాటు చెప్పులు లేకుండా తిరిగాడు. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత తిరిగి విజయం సాధించింది. 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు గాను కాంగ్రెస్ కేవలం 38 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అంత ఘోరంగా ఓటమి పాలయ్యంది. ఆ ఫలితాలకు బాధ్యత వహిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని, దశాబ్దం పాటు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని అన్నారు. ఈ క్రమంలోనే దుర్గా లాల్ కిరార్ అనే కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. దాని ప్రకారం ఆయన ఈ 15 ఏళ్లు చెప్పులు లేకుండానే తిరిగారు. ఎట్టకేలకు ఈ ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దుర్గాలాల్ తన 15 ఏళ్ల శపథానికి స్వస్తి పలికారు. బుధవారం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో దుర్గా లాల్ బూట్లు వేసుకున్నారు. ఈ విషయం గురించి కమల్ నాథ్ తన ట్విటర్లో ‘కాంగ్రెస్ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించిన ఇలాంటి కార్యకర్తలందరికి సాల్యూట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
గుడిలోకి తుపాకులు, బూట్లతో వెళ్లొద్దు!
న్యూఢిల్లీ: ఒడిశాలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి పోలీసులు తుపాకులు, బూట్లతో ప్రవేశించరాదని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూరీ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 3న చెలరేగిన ఆందోళనపై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకూ 47 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. జగన్నాథ ఆలయానికి 500 మీటర్ల దూరంలోని పరిపాలన కార్యాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయనీ, ఆలయం లోపల ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. అయితే ఆలయం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఘర్షణ సందర్భంగా పోలీసులు ఆయుధాలు, బూట్లతో ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఇకపై అలా జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. జగన్నాథ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ శ్రీ జగన్నాథ సేన అనే సంస్థ ఇచ్చిన అక్టోబర్ 3న పన్నెండు గంటల బంద్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. -
షూ @ 123 కోట్లు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ నమూనా ఇది. జత ధర అక్షరాలా రూ.123కోట్లు. అంత నగదు చెల్లించి సొంతంచేసుకున్న తర్వాత కొనుగోలుదారునికి సైజు తగ్గట్లుగా అచ్చం ఇదే డిజైన్‌లో తయారుచేసి ఇస్తారు. వందలాది చిన్నచిన్న వజ్రాలు, ముందుభాగంలో 15 కేరట్ల బరువైన రెండు పెద్దవజ్రాలను అమర్చి, మేలిమి బంగారంతో వీటిని తయారుచేయనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్లో బుధవారం వీటి నమూనాను ఆవిష్కరిస్తారు. -
బెడిసి కొట్టిన బూట్ల స్కీం!
భోపాల్ : పాదుకలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవాలనుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాచిక పారలేదు. ఉచితంగా అందించే బూట్లు తీసుకుని ఓట్లు వేస్తారనుకుంటే మొదటికే మోసం వచ్చింది. ఓట్ల సంగతి ఎలా ఉన్నా బూట్ల సంగతి ఎత్తితేనే ప్రజలు భయపడిపోతున్నారు. కనీసం వాటిని ముట్టుకునే సాహసం కూడా చేయడం లేదు. మధ్యప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పేదలను ఆకట్టుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చరణ్ పాదుకా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. తునికాకు సేకరించే స్త్రీలకు చెప్పులు, పురుషులకు బూట్లూ ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. ఈ పథకం కింద పంపిణి చేసిన వాటిలో కొన్నింటిని సైంటిఫిక్ అండ్ ఇండ్రస్ట్రీయల్ రీసెర్చ్ కౌన్సిల్‌కు అనుబంధంగా ఉన్న కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థకు పరిశీలన నిమిత్తం పంపారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బూట్లలోని ఇన్నర్ సోల్‌కు ‘ఏజెడ్‌ఓ’ రసాయనాన్ని వాడారు.. ఇది క్యాన్సర్ కారకం అని కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ(సీఎల్ఆర్ఐ) నివేదికలో వెల్లడైంది. ఇది మినహా మిగతా అంతా బాగానే ఉందని ఆ రిపోర్టు తేల్చింది. దీంతో లబ్ధిదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ‘నేను బూట్లు తీసుకుని నెల రోజులయింది..క్యాన్సర్ వస్తుందనే భయంతో వాటిని ఇప్పటి వరకు కనీసం ముట్టుకోలేదని’ బిందియా బాయ్ అనే లబ్ధిదారుడు తెలిపాడు. అతనే కాదు బూట్లు తీసుకున్న లబ్ధిదారులెవరూ వాటిని వాడడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో బూట్ల పంపిణీని నిలిపివేశారు. పర్యావరణానికి హాని ఈ బూట్లు బయటపడేస్తే పర్యావరణానికి మరింత హాని కలుగుతుందని, ఏజెడ్‌వో రసాయనాన్ని లెదర్, కాటన్ పరిశ్రమల్లో వాడతారని, ఈ రసాయనం పూసిన వస్తువులు వాడడం ద్వారా చర్మ క్యాన్సర్, గర్భ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పర్యావరణవేత్త సుభాష్ పాండే పేర్కొన్నారు. ‘ఏజెడ్‌ఓ’ వల్ల నీళ్లు, భూమి కూడా కలుషితం అవుతాయని తెలిపారు. సోల్ మార్చి పంపిణీ చేస్తాం మొత్తం రెండు లక్షల బూట్లలో లోపలి సోల్‌కు ఏజెడ్‌వో రసాయనం పూసినట్లు గుర్తించాం. మొత్తం 11.23 లక్షల బూట్లు, 11.11 లక్షల చెప్పుల జతలు లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రెండు లక్షల బూట్లలో లోపలి సోల్ మార్చి, మరోసారి పరీక్షించిన తర్వాతే లబ్ధిదారులకు తిరిగి వాటిని పంపిణీ చేస్తామని అటవీశాఖ మంత్రి గౌరీశంకర్ సెజ్వార్ తెలిపారు. -
బూట్లు.. సరదా..ఓ రికార్డు
1251 రోజులపాటు...రోజుకో కొత్త షూ తొడుక్కొని స్కూల్‌కు వెళ్లిందో విద్యార్థిని. ఆరేళ్లపాటు సాగిన ఈ సరదా రికార్డుకు చేరువైంది. సాక్షి, సిటీబ్యూరో : ఓ తండ్రి రికార్డుల కల కన్నాడు.అందుకు చిన్నప్పటి నుంచి నాణేలుసేకరించాడు. అయితే ఇందులో కొత్తేం ఉంది? అందరూ సేకరిస్తారు కదా అనుకున్నాడు. ఏదైనా కొత్తగా చేయాలని తపించాడు.తాను సాధించలేనిది.. తన కూతురితోనైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు. కుమార్తెకు రోజుకో కొత్త షూ, సాక్సుల జతను కొనిచ్చి స్కూల్‌కు పంపించాడు. అలా 1997–2003 వరకు ఆరేళ్లు ఇలా చేశాడు. అయితే మధ్యలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో మానేశాడు.ఆ షూలు, సాక్సుల జతలను భద్రపరిచి, వివిధ సంస్థలకు పంపించగా ఇన్నేళ్లకువరల్డ్ రికార్డులు వరించాయి. మొత్తానికిఆ తండ్రి కల ఫలించింది. పాతబస్తీలోని శాలిబండకు చెందిన డాక్టర్ అలీం ఖాద్రి రికార్డు కథ ఇది. తన కుమార్తె అస్ఫియాను 1997లో గన్‌ఫౌండ్రీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. ఆ రోజు జూన్ 16. అస్ఫియా తొలి రోజు స్కూల్‌కు వెళ్తోంది. కొత్త యూనిఫామ్, కొత్త షూలు ధరించింది. మరుసటి రోజు మరో కొత్త జత షూలు, సాక్సులతో వెళ్లింది. ఇలా 1997లో ఎల్కేజీ నుంచి 2003లో నాలుగో తరగతి పూర్తి చేసే వరకు మొత్తం 1251 షూ, సాక్సుల జతలు ధరించింది. వాటన్నింటినీ భద్రపరిచిన అలీం ఖాద్రి... వాటి ఫొటోలను వివిధ సంస్థలకు పంపించగా రికార్డులు వచ్చాయి. గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సహా మరిన్ని రికార్డులు వరించాయి. ఎంకరేజ్ చేశారు.. ‘నేను ప్రతిరోజు స్కూల్‌కు కొత్త షూలు ధరించి వెళ్తే టీచర్లు, స్నేహితులు చాలా ఎంకరేజ్ చేసేవారు. అలా ఎల్కేజీ నుంచి నాల్గో తరగత వరకు కొత్త షూలు వేసుకున్నాను. ఆ షూస్, సాక్సులు, వాటిని తీసుకొచ్చిన కవర్లు, స్టికర్లు... ఇలా ప్రతిదీ షూ బాక్స్‌లో వేసి భద్రపరిచాం. మొత్తం 1251 షూ సహా 9,368 వస్తువులు ఉన్నాయ’ని అస్ఫియా తెలిపారు. తాను ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి, ఎంఎస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అలా ఆలోచన... ‘నేను చిన్నప్పటి నుంచి వివిధ దేశాల, ప్రాంతాల్లోని నాణేలు సేకరించేవాడిని. కానీ ఎంతో మంది దేశవిదేశాల నాణేలు సేకరిస్తుంటారు. నాణేలకు హద్దు ఉండదు. నాణేలు సేకరించినా ఎలాంటి రికార్డులు సాధించలేమని, ఏదైనా కొత్తగా చేయాలని ఉండేది. మా అమ్మాయి అస్ఫియాను అప్పుడే స్కూల్లో చేర్పించాం. అమ్మాయి కోసం కొత్త పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, షూలు కొన్నాను. అస్ఫియా మొదటి రోజు స్కూల్‌కు వెళ్లినప్పుడు నాకొక ఆలోచన తట్టింది. ప్రతిరోజు ఓ కొత్త షూ జతను మా అమ్మాయికి కొనివ్వాలని అనుకున్నాను. అలా 1997 జూన్ 16 నుంచి 2003 జూన్ 14 వరకు స్కూల్‌కు వెళ్లే ప్రతిరోజు ఓ కొత్త షూ జతను వేసుకునేద’ని వివరించారు అలీం ఖాద్రీ. ⇒ ఆరేళ్లు రోజుకో షూ, సాక్సుల జత ⇒ పాతబస్తీలోని డాక్టర్ అలీం ఖాద్రీ వినూత్న ప్రయత్నం ⇒ రికార్డు సాధించాలనే తపనతోకూతురికి కొనిచ్చిన తండ్రి ⇒ ప్రతిరోజు కొత్త షూలతో స్కూల్కువెళ్లిన కూతురు అస్ఫియా ⇒ మొత్తం 1251 షూలు, సాక్సులను భద్రంగా దాచిన వైనం ⇒ ఇది 1997–2003లో జరిగిన విషయం ⇒ ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసిన అస్ఫియా ⇒ ఇన్నేళ్లకు వరల్డ్ రికార్డులు సొంతం ⇒ ఈ నెల 20న అవార్డుల ప్రదానం భార్య, కూతురుసహకారంతో... ‘నా భార్య, కూతరు సహకారంతో నా కల నెరవేరింది. అందరం కలిసి షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. కొన్ని సందర్భాల్లో మా అమ్మాయి షూ నంబర్ లభించేది కాదు. దీంతో ముందస్తుగానే షూలు కొనుగోలు చేశాం. షూల కోసం ఇంటిలోని ఓ గదిని కేటాయించాం. మొత్తం షూల కొనుగోలుకు దాదాపు రూ.2లక్షలు ఖర్చు అయ్యాయి. డబ్బు ఖర్చు అయినందుకు ఎలాంటి బాధ లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంద’ని చెప్పారు అలీం ఖాద్రి. ఆలస్యానికి కారణమిదీ... ‘అప్పట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండడంతో సరదాగా ప్రతిరోజు కొత్త షూలు కొనిచ్చాను. అయితే అమ్మాయి ఐదో తరగతిలో రాగానే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో షూలు కొనలేకపోయాను. ఆ తర్వాత నేను భద్రపరిచిన షూల ఫొటోలతో రికార్డుల కోసం పలు సంస్థలకు పంపించాను. అయితే షూలు డిస్ప్లే చేస్తూ వీడియో రికార్డింగ్ పంపించుమన్నారు. తదితర కారణాలతో అది ఆగిపోయింది. 2016 నుంచి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాను. గతేడాది షూలు మొత్తం ఒకే దగ్గర డిస్ప్లే చేసి.. వీడియో రికార్డింగ్, ఫొటోలు పంపించాం. దీంతో గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సహా మరిన్ని రికార్డులు వరించాయి. అందరూ ఒకేసారి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించార’ని చెప్పారు అలీం ఖాద్రి. వీటిని ఈ నెల 20న నయాపూల్ మినార్ గార్డెన్స్‌లో ప్రదానం చేయనున్నారు. -
వెచ్చటి పాదాల తల్లి
నెస్సెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్... ఈ సామెత ఇప్పటికి ఎన్నో వందలసార్లు నిరూపితమైంది. ఇప్పుడు మణిపూర్‌లోని ముక్తామణిదేవి మరోసారి నిరూపించింది. ఒకప్పుడు కూతురికి చెప్పులు కొనడానికి డబ్బుల్లేని మహిళ ఇప్పుడు చెప్పుల తయారీలో అవార్డులందుకుంటోంది. విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఆమె చేతిలో అల్లాఉద్దీన్ అద్భుత దీపమేదీ లేదు. ఉన్నదల్లా ఊలుతో చక్కగా అల్లగలిగిన కళ మాత్రమే. తన చేతిలో ఉన్న కళ తనకు అన్నం పెడుతుందని ముక్తమణి ఊహించను కూడా లేదు. ఇల్లు గడవడానికి చేతినిండా డబ్బు ఉంటే ఆమెలో దాగిన ఆ కళ ఎప్పటికీ బయటకు వచ్చేది కాదేమో. ఓ రోజు... ముక్తామణి దేవి చిన్న కూతురు స్కూలు షూని చించేసుకుని వచ్చింది. కొత్త షూస్ కొనడానికి చేతిలో డబ్బు లేదు. ‘కొత్త షూస్ వచ్చేనెలలో కొందాం, అప్పటి వరకు స్లిప్పర్స్ వేసుకుని వెళ్లు’ అనడానికి వీల్లేదు. ఆ కాన్వెంట్ స్కూల్లో యూనిఫామ్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా రాజీ పడరు. ఏదో ఒకటి చేసి స్కూలుకి షూస్‌తోనే వెళ్లాలి. రాత్రి భోజనాలయిన తర్వాత ఊలు ముందేసుకుని కూర్చుంది. చిరుగును కనిపించనివ్వకుండా ఊలుతో అల్లింది. రెండో షూని కూడా జత షూతో పోలి ఉండేటట్లు ఊలుతో అల్లేసింది. ఇప్పటికైతే గండం గడిచింది... చాలనుకుందామె. కొత్త షూస్ కొనేవరకు వీటినే వేసుకెళ్లు అని కూతురికి నచ్చచెప్పి పంపించింది. టీచర్ కళ్లు పడ్డాయి స్కూల్లో సాయంత్రం డ్రిల్ క్లాస్. టీచర్పర్యవేక్షణలో పిల్లలందరూ లైన్లో నిలబడ్డారు. టీచర్ కళ్లు ఆ అమ్మాయి షూస్ మీద పడ్డాయి. టీచర్ ఆ అమ్మాయి కాళ్ల వైపే చూస్తూ దగ్గరకు వస్తోంది. యూనిఫామ్ ప్రకారం లెదర్ షూస్ ఉండాలి లేదా లెదర్‌ను పోలిన రెగ్జిన్ షూస్ అయినా ఉండాలి. టీచర్ తన షూస్‌ను చూస్తూ రావడంతో భయపడిపోయింది. ‘‘ఇలాంటి షూస్ మా అమ్మాయికి కావాలి. ఎక్కడ దొరుకుతాయి’’ అని అడిగింది. ఇది జరిగింది 1989లో. అలా మొదలైంది ముక్తామణి దేవికి ఆర్థిక కష్టాల నుంచి అలా విముక్తి దొరికింది. టీచర్ కోసం ఒక జత ఉలెన్ షూస్‌ను అల్లి ఇచ్చింది. మణిపూర్‌లో దాదాపు ప్రతి ఒక్కరికీ నిట్టింగ్ (ఊలుతో అల్లడం) వచ్చి ఉంటుంది. స్వెట్టర్లు, టోపీలు, సాక్స్ అల్లుతారు. అవసరార్థం... గండం గట్టెక్కడానికి తాను చేసిన పని ఓ ప్రయోగం అని తెలిసొచ్చిందామెకి. దాంతో 1990లో ‘ముక్త షూస్ ఇండస్ట్రీ’కి శ్రీకారం చుట్టింది. ఊలుతో చిన్న పిల్లలకు, మహిళలకు, మగవాళ్లకు రకరకాల షూస్, సాండల్స్‌ను అల్లడం మొదలుపెట్టారు. ఇప్పుడామె దగ్గర పన్నెండు మంది మహిళలు పని చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో స్టాల్స్ పెడుతోంది. ఢిల్లీలో జరిగిన మణిపూర్ సంగయ్ ఫెస్టివల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఆమెలో ఉత్సాహాన్ని ఇనుమడింపచేసింది. పాదాలకు వెచ్చని రక్షణనిచ్చే ఉలెన్ షూస్‌కి చలిదేశాల్లో ఆదరణ ఉంటుందనుకుంది. ముక్త షూస్ ఇప్పుడు ఆస్ట్రేలియా , యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, మెక్సికోతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ముక్తా మణి దేవికి ఇప్పుడు 59 ఏళ్లు. దాదాపుగా ముప్పయ్ ఏళ్ల అనుభవం. ఇన్నేళ్లలో ఆమె సుమారు వెయ్యి మందికి ఊలుతో షూ తయారీలో శిక్షణనిచ్చింది. సిటీ గ్రూప్ నుంచి మైక్రో ఎంట్రప్రెన్యూర్షిప్ నేషనల్ అవార్డు (2006), మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నేషనల్ అవార్డు (2008), మాస్టర్ క్రాఫ్ట్స్పర్సన్ స్టేట్ అవార్డు (2008), వసుంధర ఎన్ ఈ ఉమన్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2013–14 అవార్డు (2015) అందుకున్నది. నేషనల్ ఇన్సూరెన్స్, టెలిగ్రాఫ్ కంపెనీలు... తాము సంయుక్తంగా నిర్వహిస్తున్న అవార్డులకు ఈ ఏడాది ముక్తామణిదేవిని ‘ట్రూ లెజెండ్స్ అవార్డ్స్ 2018’కు ఎంపిక చేశాయి. ఈ అవార్డు అందరిదీ! అవార్డు అందుకోవడం ఎవరికైనా సంతోషదాయకమే. అయితే ఇది నేను ఒక్కదాన్నే అందుకోవాల్సింది కాదు. మా యూనిట్ అభివృద్ధి కోసం నాతోపాటు పని చేస్తున్న మహిళలందరిదీ. నా ప్రయత్నంలో ఇంతమంది సహకరిస్తున్నారు. – ముక్తామణి దేవి, ముక్త షూస్ పరిశ్రమ ఫౌండర్ – మంజీర -
పెళ్లి కోసం పాకిస్తానీ ఏంచేశాడంటే..?
లాహోర్ : పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి ఏంటి వైరల్ అవడం ఏంటి అని అనుకోకండి. అది సాదా సీదా పెళ్లికాదు. ఎందుకంటే పెళ్లికొడుకు ధరించిన టై, షూలు అంత కాస్ట్లీ మరి. వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌కు చెందిన హఫీజ్ సల్మాన్ షాహిద్ పెద్ద వ్యాపార వేత్త. కుటుంబానికి ఏకైక కుమారుడు. ఇంకేముంది తన పెళ్లి అందరూ చెప్పుకునే విధంగా ఉండాలని భావించాడు. అనుకున్నదే తడవుగా 17లక్షల రూపాయలు పెట్టి బంగారు షూ చేయించాడు. అంతేకాదు మరో ఐదు లక్షలు పెట్టి టై కూడా తయారు చేయించాడు. దీనితో పాటు బంగారు షూట్ చేయించాడు. వాటికి అదనంగా రంగురాళ్లతో డిజైన్ కూడా కుట్టించాడు. వీటితో పాటు పలు అదనపు హంగులు అన్నీ కలిపి సుమారు 25లక్షల రూపాయలను పెట్టి ప్రత్యేకంగా పెళ్లి వస్తువులను డిజైన్ చేయించుకున్నాడు. పెళ్లిలో వాటికి కాపలాగా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాడు. "The Golden Groom" This groom in Lahore wore an outfit on his valima which consisted GOLD and was worth around Rs. 25 lakhs! Imagine if he got kidnapped💲💲💲#GoldRush pic.twitter.com/aNXyL9ZXgH — Rayan Ibrahim (@Rayanibrahim77) April 11, 2018 -
అగ్ని ప్రమాదంలో నలుగురి మృతి
న్యూఢిల్లీ : బూట్ల ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పురి రాజా పార్క్ ఫ్యాక్టరీలో ఉదయం 6.35 గంటలకు జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 12 మంది కార్మికులు ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖాధికారి చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో నలుగురు కార్మికులు అప్పటికే చనిపోయారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చనిపోయిన వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. -
లక్కీ డ్రా పేరుతో టోకరా
కర్నూలు, సి.బెళగల్: లక్కీ డ్రా పేరుతో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు మోసగించారు. బాధితుడి వివరాల మేరకు.. కంబదహాల్ గ్రామానికి చెందిన ఉప్పర రాముడు కుమారుడు ఉప్పర గోవిందు సెల్‌ఫోన్‌కు గత వారం గుర్తుతెలియని వ్యక్తులు 9711153027 నంబర్ నుంచి ఫోన్ చేశారు. మీ సెల్ నంబర్‌కు లక్కీ డ్రాలో రూ.15 వేల విలువ చేసే సెల్‌ఫోన్, బూట్లు తగిలాయని రూ.4500 చెల్లిస్తే చాలని నమ్మించారు. దీంతో సదరు యువకుడు ఆర్డర్ చేశాడు. గురువారం పోస్టల్ ద్వారా పార్శిల్ రాగా రూ.4500 చెల్లించి తీసుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.500 విలువచేసే బూట్లు మాత్రమే కనిపించాయి. బాధితుడు తాను ఆర్డర్ చేసిన సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా తాము ఇచ్చేది ఇంతేనని, ఎవరికి చెప్పకుంటావో చెప్పుకో పో అంటూ గుర్తు తెలియని వ్యక్తి దబాయించాడు. చివరకు బాధితుడు తనకు జరిగిన మోసంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశాడు. -
ఎంపీ ఇంటికెళ్లిన వెంకయ్య షాకయ్యారు
-
ఉప రాష్ట్రపతి చెప్పులు దొంగతనం!
సాక్షి, బెంగళూరు : చెప్పులు పోవడం సహజం. తారుమారుకావడమనేది ఇందుకు ఒక కారణంకాగా.. కావాలని ఎత్తుకొనిపోయేవారు కొంతమంది. ఇలాంటి సహజంగా రద్దీ ప్రదేశాలైన ఆలయాలు, సమావేశాలు, సందర్శన ప్రాంతాల్లో చోటుచేసుకుంటుంటాయి. ఇండియాలో ఇవి సహజం అని అనడం కూడా పరిపాటి. అయితే, ఇలాంటి సంఘటనకు ఆఖరికి ఉపరాష్ట్రపతి కూడా బాధితుడిగా మిగిలారు. అవును.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పులు పోయాయి. నిన్న (శుక్రవారం) బెంగళూరు పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అల్పాహారం నిమిత్తం నగర బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంటికి వచ్చారు. అల్పాహారం ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఆయన చెప్పులు కనిపించలేదు. అటుఇటూ చూశారు. వెంకయ్య భద్రతా సిబ్బంది కూడా ఇల్లు పరిసరాలు కలియతిరిగి వెతికారు కానీ చెప్పుల జాడను కనుగొనలేకపోయారు. అయితే చివరకు తమ చెప్పులు అనుకుని ఎవరో వేసుకుని వెళ్లి ఉంటారని సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత పీసీ మోహన్ విలేకరులతో మాట్లాడుతూ సమీపంలోని బాటా స్టోర్ నుంచి ఉపరాష్ట్రపతికి కొత్త చెప్పులు తెప్పించామని తెలిపారు. వెంకయ్య చెప్పులను ఎవరైనా దొంగతనం చేశారా లేక పొరపాటున వేసుకెళ్లారా అనేది మిస్టరీగా మారింది. -
బీజేపీ నేత మెడలో చెప్పుల దండ
-
బీజేపీ నేతకు అవమానం.. మెడలో చెప్పుల దండ
సాక్షి, భోపాల్ : ఓ బీజేపీ నేతకు తీవ్ర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు అనూహ్యంగా బూట్ల దండ వేసి స్వాగతం పలికారు. దీంతో అప్పటి వరకు హుషారుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం అది వారి కోపం మాత్రమేనని, తననుంచి వారు ఏదో కోరుకుంటున్నారని, అందుకే తమ అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని అన్నారు. తానెప్పుడూ వారి బిడ్డనేనని, వారి అవసరాలు తీర్చేందుకు మరింత బాగా పనిచేస్తానని అన్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో థామ్నోడ్ అనే ప్రాంతంలో దినేశ్ శర్మ అనే బీజేపీ నేత ప్రచారానికి వెళ్లారు. ప్రతి ఇంటికి ఓట్లు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అంతే తన ప్రయత్నాన్ని కొనసాగించడంతో ఇక తప్పదని చెప్పుల దండ వేయించుకున్నాడు. అనంతరం ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను ఇలా చేశానని అన్నారు. ఇక దండ వేయించుకున్న బీజేపీ నేత దినేశ్ మాత్రం ఆ చర్యపట్ల తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు. అయితే, ఈ సమస్యపై తాము మాట్లాడబోతున్నామని చెప్పారు. -
ఆకతాయిలకు షాక్
మృగాళ్ల అకృత్యాలకు ఎందరో అతివలుబలవుతున్నారు. దేశంలో ఏదో ఒక చోట రోజూ అత్యాచారాలు, మహిళలపై దాడులుజరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆ యువశాస్త్రవేత్తలో ఆలోచనలు రేకెత్తించాయి. మహిళా భద్రతకు ఏదైనా చేయాలనే సంకల్పాన్నికల్పించాయి. నిర్భయ ఘటనను చూసి చలించిన ఆ యువకుడు... రెండేళ్లు శ్రమించి ‘ఎలక్ట్రో షూ’లను రూపొందించాడు.ఆకతాయిలు మహిళలపై దాడికి పాల్పడినప్పుడు ఈ షూల ద్వారా షాక్ రావడంతో పాటు...పోలీసులు, బంధువులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఈ పరికరం, తన పరిశోధన గురించి నగరానికి చెందిన సిద్ధార్థ్ మందల చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... నాకు 12 ఏళ్లున్నప్పుడు నిర్భయ ఘటన జరిగింది. నిరసన ర్యాలీల్లో అమ్మతో పాటు నేనూ పాల్గొన్నాను. అప్పుడు మనసులో ఒకటే ఆలోచన... ఈ ఘోరం మనవాళ్లలో ఎవరికైనా జరిగితే? ఆ ఆలోచన చాలా రోజులు వెంటాడింది. అప్పుడే లక్ష్యం నిర్దేశించుకున్నాను. మహిళా భద్రతకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా ఆలోచనకు అనుగుణంగా స్నేహితుడు అభిషేక్ సహాయంతో ఈ ఎలక్ట్రో షూలను తయారు చేశాను. ఆటోమేటిక్ చార్జింగ్.. అలర్ట్ మెసేజ్ పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆధారంగా సర్క్యూట్ బోర్డులను తయారు చేసి ఈ షూలలో అమర్చాను. వీటిని ధరించిన మహిళలపై ఎవరైనా దాడికి పాల్పడితే.. వాటి ద్వారా 0.1 ఆంపియర్ షాక్ వస్తుంది. అదే సమయంలో పోలీసులు, బంధువులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. నడుస్తున్నప్పుడే ఆటోమేటిక్‌గా ఇవి చార్జింగ్ అవుతాయి. రెండేళ్ల శ్రమ... ఈ షూలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డాం. సోషల్ మీడియా ద్వారా చాలా మంది గైడ్లను కాంటాక్ట్ చేశాను. వివిధ భాషల్లో ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు కరెంట్ షాక్‌లు తగిలాయి. ఓసారి నా స్నేహితుడికి గాయమైంది. ఏదైతేనేం అనేక ప్రయత్నాల అనంతరం ఫలితం వచ్చింది. రెండేళ్ల తర్వాత నా ప్రయోగం సక్సెస్ అయింది. ఈ షూలు కొందరి జీవితాలు కాపాడినా చాలు. ఎలక్ట్రో షూతో పాటు పోర్టబుల్ వాటర్ ప్యూరిఫయర్నూ రూపొందించాను. మిత్రులతో కలిసి ‘కాగ్నిజెన్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎన్నో చర్చలు.. సెషన్స్ వేసవి సెలవుల్లో డాక్టర్ ఏఎస్ కుమార్ దగ్గర ఇంటర్న్‌షిప్ చేశాం. జెనోమిక్స్, ప్రొటీన్, మలిగ్నంట్ మెలనోమా పనితీరుపై.. పోలరైజ్డ్ లెన్సెస్ సహాయంతో చర్మ కణాల తీరులో తేడాలు గుర్తించాను. అప్పుడే చిత్రాల ద్వారా కంప్యూటర్లో ఈ తేడాను గుర్తించే అవకాశం ఉందా? అని ఆలోచించాను. ప్రణీత్, నేను ట్రై చేయగా వర్కవుట్ అవుతుందనిపించింది. ఇక డాక్టర్‌తో అనేక చర్చలు, ప్రాక్టికల్ సెషన్స్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టాం. – సిద్ధార్థ్ స్కిన్ కేన్సర్ గుర్తించే సాఫ్ట్వేర్ ఎలక్ట్రో షూని కనిపెట్టిన సిద్ధార్థ్... స్నేహితుడు ప్రణీత్ షాతో కలిసి మరో ఆవిష్కరణకు బీజం పోశాడు. వీరిద్దరు కలిసి చర్మ కేన్సర్‌ను కనుగొనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్ చర్మ కేన్సర్ తొలి దశలో.. అంటే మలిగ్నంట్ మెలనోమాని గుర్తిస్తుంది. ఫోన్ కెమెరా సహాయంతో లైవ్ స్ట్రీమ్ చేస్తూ కంప్యూటర్లో కనిపించే ఫీడ్ ద్వారా అది కేన్సరో? కాదో? గుర్తించొచ్చు. ‘మాకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే దీన్ని కనిపెట్టే విషయంలో అపోలో హాస్పిటల్ డాక్టర్ ఏఎస్ కుమార్ అవగాహన కల్పించారు. ఖరీదైన పరికరాలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో చర్మ కేన్సర్‌ను గుర్తించేందుకు ఇది ఉపయుక్తం’ అని చెప్పారు సిద్ధార్థ్. ఇంటర్నెట్ మాడ్యూల్‌కి మారుస్తా.. – ప్రణీత్ షా కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ చదువుతున్నాను. ఓ సోషల్ ఇంటర్న్‌షిప్‌లో సిద్ధార్థ్‌ని కలిశాను. ఈ ప్రయోగంలో టెక్నికల్‌కు సంబంధించి నేను సహాయం చేశాను. ఏ ప్రాంతంలో అయినా వినియోగించే విధంగా సాధారణ మొబైల్, కంప్యూటర్ని ఒకే రూటర్కి కనెక్ట్ చేయాలి. దీనిని భవిష్యత్తులో ఇంటర్నెట్ మాడ్యూల్‌కి మార్చే ప్రయత్నం చేస్తాం. -
కేర్... ఇంత
పేరెంటింగ్ టిప్స్ వర్షాకాలంలో నేల చిత్తడిగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో పిల్లలకు తడి నేల మీద జారకుండా పట్టు దొరికే షూస్, చెప్పులు వేయాలి. అడుగు బాగం గరుకుగా, నొక్కులుండాలి. ఎగురుతూ, దూకుతూ ఉంటారు కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తప్పదు. దోమల నివారణకు వాడే కృత్రిమ పరికరాల నుంచి వెలువడే వాయువులు పిల్లలకు ఆరోగ్యకరం కాదు. రాత్రంతా అదే గాలి పీల్చడంతో ఆ దుష్పభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. వీటికి బదులుగా ఒక కప్పు నీటిలో ఒక ముక్క కర్పూరం వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రావు. పైగా దోమలను పారదోలే కృత్రిమ పరికరాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి వీటి వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవుతారు. చంటి పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మసాజ్ చేసే ఆయిల్‌ను గోరువెచ్చగా వేడి చేసి వాడాలి. ఫ్రిజ్‌లో ఉన్న వెన్నను బయటకు తీసిన తర్వాత నార్మల్‌గా మెత్తబడినప్పటికీ చల్లదనం ఎక్కువసేపు ఉంటుంది. ఉష్ణోగ్రత చూసుకుని అవసరమైతే మసాజ్‌కు కావలసినంత ఒక కప్పులోకి తీసుకుని వేడిగా ఉన్న పాలగిన్నెలాంటి దాని మీద పెట్టి ఆ తరువాత వాడాలి. చిన్న పిల్లలున్న ఇంట్లో ప్రతి పనినీ కేర్‌ఫుల్‌గానే చేయాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ... ఇంట్లో రోజంతా కేరింతలు ఉండాలంటే ఈ మాత్రం కేర్ తీసుకోవాల్సిందే. -
చెప్పులు, దుస్తులపై జీఎస్టీ మోత
-
చెప్పులు, దుస్తులపై జీఎస్టీ మోత
న్యూఢిల్లీ: ఖరీదైన చెప్పులు, రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగించనుంది. రూ. 500 లోపు ఉన్న చెప్పులపై 5శాతం పన్ను విధించాలని, రూ. 500లు దాటితే ఏకంగా 18శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలి తాజాగా నిర్ణయించింది. అలాగే రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం పన్ను విధించనుండగా, రెడీమెడ్ దుస్తులపై 12శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి 15వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఈటల రాజేందర్, యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగారం, బీడీలు, చెప్పులు, దుస్తులు సహా పలు నిత్యావసరాల వస్తువులపై ఈ సమావేశంలో జీఎస్టీ కింద పన్ను ఖరారు చేశారు. తినే బిస్కెట్లపై ఏకంగా 18శాతం పన్ను విధించగా, సామాన్యులు తాగే బీడీలపై 28శాతం పన్నుతో మోత మోగించారు. భారతీయులకు బాగా ఇష్టమైన బంగారం మీద మాత్రం కాస్తా కనికరం చూపించారు. స్వర్ణం మీద కేవలం 3శాతం జీఎస్టీతో సరిపెట్టారు. -
షూ ధర రూ. 17 లక్షలు!
దుబాయ్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బూట్లను బంగారంతో తయారు చేశారు. బంగారంతో షూ అంటే ఏదో పూతపూశారనుకోకండి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి షూ గా ఇవి రికార్డులకెక్కాయి. వీటి ధర రూ. 17 లక్షలు. ఒక్కో దానిలో 230 గ్రాముల బంగారంతో పాటు.. త్రీడీ ఫూట్ స్కానర్స్‌ను వాడటం వీటి ప్రత్యేకత. ఇటలీకి చెందిన షూ తయారీదారుడు ఆంటోనియో వీట్రి వీటిని రూపొందించారు. సంపన్న అరబ్ షేక్‌లను ఆకట్టుకునేలా బ్లూ, బ్లాక్ వేరియంట్లలో వీటిని డిజైన్ చేశారు. ఇందులో వాడిన బంగారాన్ని ఏదో అలంకారం కోసం కాకుండా బూట్లలో అంతర్భాగంగా వాడినట్లు వీట్రీ తెలిపారు. షూ వాడటానికి సౌకర్యవంతంగా ఉండేలా బంగారు తీగలను లెదర్లోకి చొప్పించి వీటిని అల్లారు. కఠినమైన బంగారాన్ని సౌకర్యవంతంగా ఉండేలా షూలో కూర్చడం అనేది సవాల్‌తో కూడుకున్నది అని వీట్రి వెల్లడించారు. గల్ఫ్ ఫ్యాషన్ మార్కెట్.. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాల్లో ఈ ఇటాలియన్ తయారీదారుడికి మంచి డిమాండ్ ఉంది. -
షూలో వజ్రాల సంచులు..
చైనా: బూట్లలో 1000పైగా వజ్రాలను అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. హాంగ్ కాంగ్ సిటీ నుంచి షెన్జెన్ నగరానికి ప్రవేశిస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..షూ వేసుకున్న యువకుడు సాధారణనడకకు భిన్నంగా అడుగులు ఎత్తి ఎత్తివేస్తూ అధికారుల కంటబడ్డాడు. అధికారులు గమనిస్తూ ఉండడటంతో మళ్లీ మామూలుగా నడవడానికి ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ నిర్వహించారు. దీంతో సాక్స్ లోదాచిన డైమండ్ బ్యాగులు బయటపడ్డాయి. 212.9 క్యారెట్ల సుమారు వెయ్యిగాపైగా వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారి వాంగ్ తెలిపారు.అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గతంలో లువోహుకు పోర్ట్ లో అల్పాహారం ఆహార ప్యాకేజీలో 164 క్యారెట్ల బరువున్న 1,554 వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు లువోహుకు పోర్ట్ అధికారులు ప్రకటించారు. -
పైత్యాన్ని మరోసారి చూపించిన అమేజాన్
-
హవ్వా.. పబ్లిక్ లో సీఎం ఏం చేశారో తెలుసా?
తనను తాను సోషలిస్టునని చెప్పుకునే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. శనివారం శాండల్ వుడ్ వెటరన్ నటుడు కన్నుమూసిన సందర్భంగా మైసూరులో ఆయన గృహానికి వెళ్లిన సిద్ధారామయ్య పీఏ చేత బూట్లు తొడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. పేరు బయటకు తెలపడానికి ఇష్టపడని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి చేతన రామారావు మరణించిన వార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి.. శనివారం ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లారు. అనంతరం చేతన రామారావు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు నిల్చున్నారు. ఇంతలో సిద్ధారామయ్య పీఏ కుమార్ అక్కడకు చేరుకుని బూట్లు తొడిగినట్లు చెప్పారు. ఈ సంఘటనను చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురి కాగా సీఎం మాత్రం స్పందించలేదని తెలిపారు. అసిస్టెంట్లతో ఇలాంటి పనులు చేయించే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారని ఆ సమయంలో సీఎం సిద్ధారామయ్యతో పాటు ఉన్న కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. అందరూ సమానులే అనే సీఎం ఇలాంటి పనులు చేస్తుండటం సిగ్గు చేటని అన్నారు. కాగా, ఘటనపై మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించిన సిద్ధారామయ్య తాను ఎవరిచేతా బూట్లు తొడిగించుకోలేదని చెప్పారు. తెలిసిన వ్యక్తి ఒకరు తన బూట్లు వెదకడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఫోటో తీశారని అన్నారు. -
తోలు తీయక్కర్లేదు...
షూస్, పర్స్, హ్యాండ్ బ్యాగులను లెదర్ లేదా క్లాత్‌లతో తయారు చేస్తారనే మనకు తెలుసు. అసలు లెదర్‌తో తయారు చేసిన ఏ ఐటమ్నైనా ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎందుకంటే... క్లాత్ వస్తువులతో పోలిస్తే లెదర్ వస్తువుల నాణ్యత, మన్నిక భేషుగ్గా ఉంటాయి. ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న షూస్, బ్యాగ్స్ అచ్చం లెదర్‌తో తయారు చేసినవే అనిపిస్తున్నాయి కదూ! కానే కాదు. వీటి తయారీకి.. జంతువుల తోలు తీయక్కర్లేదు. వినడానికి వింతగా.. కొత్తగా ఉన్నా... ఈ వస్తువులన్నింటికీ ముడి పదార్థం పైనాపిల్ (అనాస పండు) ఆకులు. ఈ పైనాపిల్ ఆకులతో లెదర్ వంటి పదార్థం తయారీకి పెద్ద కృషే జరిగింది. ఐర్లాండ్‌లో కార్మెన్ హిజోసా అనే మహిళ ఓ లెదర్ కంపెనీలో పనిచేసేది. ఎప్పుడూ ఇన్నొవేటివ్‌గా ఆలోచించే తనకు, ఓ రోజు కొత్త ఐడియా వచ్చింది. దానిని ఆచరణలో పెట్టేందుకు ఐదేళ్లు అవిశ్రాంతంగా శ్రమించి, జంతుచర్మం అవసరంలేని కొత్తరకం లెదర్ తయారీకి శ్రీకారం చుట్టింది. పైనాపిల్ ఆకులను గుజ్జుగా చేసి, దానికి మరికొన్ని పదార్థాలు జతకలిపి, జంతుచర్మంతో తయారయ్యే లెదర్‌కు దీటైన పదార్థాన్ని తయారు చేసింది. పైనాపిల్ ఆకులతో తయారు చేసినందున దీనికి ‘పైనాటెక్స్’ అని కూడా నామకరణం చేసింది. జంతుచర్మంతో తయారైన లెదర్ వస్తువుల కంటే పైనాటెక్స్తో తయారు చేసిన వస్తువులు ధృడంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఒక చిన్నసైజు హ్యాండ్‌బ్యాగ్ తయారీకి 16 పైనాపిల్స్ ఆకులు సరిపోతాయట. జంతువధను ఇష్టపడని జంతుప్రేమికులకు ‘పైనాటెక్స్’ వస్తువులు కచ్చితంగా నచ్చుతాయి. స్వచ్ఛంద లెదర్ నిషేధం పాటించే వారు సైతం, ‘పైనాటెక్స్’ వస్తువులతో ఫ్యాషన్ రంగంలో దూసుకుపోయేందుకూ ఇవి ఇంచక్కా పనికొస్తాయి. -
ఏ పూజకైనా బూటుతోనే హాజరు
-
షూస్ పాలిష్ చేస్తున్నారా!!
ఇంటిప్స్ పాఠశాలలు మొదలవబోతున్నాయి. పిల్లలకు కొనాల్సిన జాబితాలో యూనిఫామ్స్, షూస్ (బూట్లు) తప్పనిసరి. నలుపు, తెలుపు రంగు అంటూ ఓ రెండు రకాల షూస్ కొంటే ఏడాదంతా చూసుకోనవసరం లేదు అనుకోవడానికి లేదు. ఇంట్లోనూ, స్కూల్లోనూ చదువుల ఒత్తిడితో నలిగిపోయే పిల్లలకు షూస్ పెద్ద భారం కాకూడదు. ఏడాది పొడవునా పిల్లల పాదాలను సంరక్షించే షూస్ విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు షూస్ తయారీదారులు, సప్లయర్ల కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ సాహిల్ గుప్తా. వారు ఇస్తున్న కొన్ని సూచనలు ఇవి. స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఎగుడుదిగుడు రోడ్లలో పరిగెడుతుంటారు. దుమ్ములో నడుస్తుంటారు. ఇసుకలో గెంతులేస్తుంటారు. పాదాన్ని సంరక్షిస్తున్నట్టుగా షూస్ లేకపోతే అడ్డంకే. అందుకే ఎదిగే పాదానికి తగ్గట్టుగా షూస్ ఎంపిక ఉండాలి. పిల్లవాడి పాదానికన్నా ఒక అంగుళం పెద్ద సైజు షూస్ తీసుకోవాలి.చర్మం ఏ తరహా మెటీరియల్‌ను ఇష్టపడుతుందో షూస్‌ని బట్టి తెలుసుకోవచ్చు. మిగతావాటన్నింటికన్నా లెదర్‌ని మాత్రమే చర్మం భరిస్తుంది. పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. మురికిపటినా, ఇసుక చేరినా ఏ రోజుకారోజు శుభ్రం చేయకపోతే.. పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని రోజూ పాఠశాల నుంచి రాగానే ముందుగా షూస్ బయటే వదిలేయమని చెప్పాలి. {పతీరోజూ పాలిష్ చేస్తే షూస్ ఎక్కువ రోజులు మన్నుతాయి. షూ పాలిష్‌లో రెండు పద్ధతులున్నాయి. క్రీమ్ పాలిష్ పోయిన కలర్‌ని తిరిగి తెప్పిస్తుంది. వ్యాక్స్ పాలిష్ షూ మెరిసేలా చేస్తుంది. అందుకని స్కూల్ షూస్‌కి ఎప్పుడైనా క్రీమ్ పాలిష్ బెస్ట్ ఆప్షన్. దీని తర్వాత వ్యాక్స్ పాలిష్‌తో ఒక కోట్ వేస్తే షూస్ మెరుస్తాయి. షూస్ పాలిషింగ్ రోజూ చేయడం వల్ల ఎక్కడైనా చిరిగినా, మడమ దగ్గర విడిపోయినా, లేసులు ఊడిపోయినా తెలుసుకోవడం సులువు అవుతుంది. ఇవన్నీ పిల్లలు బాగా గుర్తించగలరు కాబట్టి రోజూ తమ షూస్ పాలిష్ చేసే బాధ్యతను వారికే అప్పగించాలి. అందరివీ ఒకే చోట కాకుండా పిల్లలకోసం షూస్ కేస్ ప్రత్యేకంగా కేటాయించడం వల్ల శుభ్రత బాగుంటుంది. పని సులువు అవుతుంది.వర్షాకాలంలో షూస్ తడిగా ఉండే అవకాశాలు ఎక్కువ. వాటిని పొడిబార్చడానికి వేడి చేయడం, లోపల న్యూస్ పేపర్లు పెట్టడం వంటివి చేస్తే... అవి దుర్వాసన రావడంతో పాటు, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకని, రాత్రిపూట సోడా బై కార్బనేట్ను షూస్ లోపల చల్లి ఉంచాలి. దీని వల్ల తేమ తగ్గడమూ, బాక్టీరియా నశించడమూ రెండూ జరుగుతాయి.స్కూళ్లలో చెప్పే పాఠాలలో టీచర్లు షూస్ కేర్ గురించి కూడా వివరిస్తే పిల్లలు తమ పాదాల సంరక్షణ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. షూ పాలిష్ చేయడం ఎలాగో పిల్లలకే చెబితే తల్లిదండ్రులకూ పని సులువు అవుతుంది. ఈ అలవాటు వల్ల పిల్లలకు షూస్ పరిశుభ్రత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. -
కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి
నాగ్‌పూర్: నాగ్ పూర్ ర్యాలీ రసాభాసగా మారింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా జేఎన్‌యూ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ నిర్వహించిన ర్యాలీలో చెప్పులు, బూట్లు గాల్లోకి లేచాయి. కుప్పలుగా కొందరు వ్యక్తులు కన్హయ్య కుమార్ పై చెప్పులు, షూలతో దాడి చేశారు. నాగ్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక వద్దకు తొలుత కన్హయ్య వచ్చాడు. అలా వచ్చాడో లేదో వెంటనే ఒక్కసారిగా చెప్పులు, షూలు అతడిపైకి కొందరు వ్యక్తులు విసిరారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెప్పులు విసరడం ద్వారా ఎలాంటి దేశభక్తిని చూపించాలని అనుకుంటున్నారని కన్హయ్య కుమార్ ఈ సందర్భంగా వారిని ప్రశ్నించాడు. అంతకుముందు నాగ్ పూర్ లోకి ప్రవేశించగానే కన్హయ్య కుమార్ కారుపై బజరంగ్ దళ్ కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. -
కన్హయ్యకుమార్పై బూట్ల దాడి
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సదస్సులో ఘటన {పసంగం ప్రారంభంలో బూట్లు విసిరిన వ్యక్తి అడ్డుకుని చితకబాదిన వామపక్షాల కార్యకర్తలు, విద్యార్థులు.. ఇద్దరి అరెస్టు హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌పై ఓ వ్యక్తి బూట్లు విసిరి దాడికి యత్నించాడు. దేశద్రోహి కన్హయ్యకు మాట్లాడే హక్కులేదంటూ నినాదాలు చేశాడు. అతను విసిరిన బూట్లు కన్హయ్య మీద కాకుండా.. అక్కడే ఉన్న వీడియో జర్నలిస్టుల మీద పడ్డాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తిని గోరక్షాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొం టున్న అంతారం నరేశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని, అతడితోపాటు వచ్చిన పవన్‌రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ‘‘మిత్రులారా క్షమించండి. నాకు తెలుగు రాదు. తెలుగులో ‘గారు’ పదం ఒక్కటే తెలుసు. మీరందరూ నాకు గారు..’’ అంటూ కన్హయ్య హిందీలో ప్రసంగం ప్రారంభించారు. ఇంతలోనే ప్రేక్షకుల్లోంచి లేచిన నరేశ్ ఆయన వైపు రెండు బూట్లు విసిరాడు. దీంతో సదస్సులో కలకలం రేగింది. సమీపంలో కూర్చున్న కొందరు వ్యక్తులు నరేశ్‌ను అడ్డుకుని ప్రతిదాడికి దిగారు. ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించారు. అతడికి ఎలాంటి హానీ చేయకుండా వదిలేయాలని కన్హయ్య కోరారు. నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు నిమిషాల అనంతరం సదస్సు తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య అక్కడున్న వారిని శాంతింపజేశారు. అల్లరి చేయడానికి ప్రయత్నిస్తారని, ఇంకా ఎవరైనా ఉంటే వారినీ లేచి, మాట్లాడనీయాలన్నారు. తమకు సమాధానం చెప్పే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నాయని.. ఎవరినీ ఏమీ అనవద్దంటూ వామపక్షాల కార్యకర్తలు,విద్యార్థులను శాంతింపజేశారు. గాడ్సే దేశంగా ఎప్పటికీ మారదు: కన్హయ్య అంతరాయం అనంతరం కన్హయ్యకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇది గాంధీ పుట్టిన దేశమని, గాడ్సే మందిరంగా ఎప్పటికీ మారదన్నారు. ఎవరు భయపెట్టినా భయపడనని, వంగదీస్తే వంగిపోనని వ్యాఖ్యానించారు. ‘‘వర్సిటీలో వెళ్లకుండా అడ్డుకుంటే రోహిత్ మాట ఎత్తనని అనుకుంటున్నారు. సదస్సులో చెప్పులతో కొడితే మాట్లాడకుండా ఉంటానని అనుకుంటున్నారు. భాయ్ సాబ్.. భయపడే వాళ్లం కాదు. ఏమైనా చేసుకోండి. మాట్లాడే స్వేచ్ఛ కోసం సంఘర్షిస్తున్నాం. మీరేమైనా చేస్తే అది మాకు ప్రచారాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకు ప్రధాని మోదీకి, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా...’’ అని పేర్కొన్నారు. అగ్రకులాల వాళ్లు ఇళ్లు ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ అబద్ధమాడి ఇళ్లు తీసుకునేవారని, దళితుడని తెలిసిన తర్వాత వారు ఆయన సామాన్లను బయటకి విసిరేసేవారని కన్హయ్య చెప్పారు. అయినా అంబేడ్కర్ ఆగ్రహానికి గురయ్యేవారు కాదని, అరవడం, కొట్టడం వంటివి చేసేవారు కాదని... అంబేడ్కర్‌ను నమ్మేవారైతే అరవడం, కొట్టడం చేయకూడదని పేర్కొన్నారు. సహనాన్ని కోల్పోవద్దని సూచించారు. హెచ్‌సీయూ వద్ద రాయి విసిరినా, జేఎన్‌యూలో చెంపదెబ్బ కొట్టినా, ఇప్పుడు బూట్లు విసిరినా సదరు వ్యక్తులతో తనకు బాధేమీ కలగలేదని పేర్కొన్నారు. -
ఇక భూమిపైనా మూన్‌వాక్ చేయొచ్చు!
న్యూయార్క్: చంద్రుడిపై కాలు మోపిన తొలి దేశం తమదేనని అమెరికా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. మీకు కూడా అలా చంద్రుడిపై నడిచే అవకాశం వస్తే బావుండునని ఎప్పుడైనా అనుకున్నారా.. అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ల కోరిక తీరే ప్రత్యామ్నాం ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. చంద్రుడిపై నడిచే వారు ఎలాంటి అనుభూతికి లోనవుతారో అచ్చం అలాంటి ఫీలింగ్‌నే భూమ్మీద కూడా అందించే కొత్త రకం షూలను అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూపొందించింది. వీటికి ‘20: 16 మూన్ వాకర్’ అని నామకరణం చేశారు. భూమి, చంద్రుడి మీద ఉన్న వాతావరణంలో తేడాకు ప్రధాన కారణం అక్కడ భూమ్యాకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉండటమే. అందుకే ఈ షూలలో అమర్చే ఎన్45 నియోడిమియమ్ అనే ప్రత్యేక అయస్కాంతాలు భూమి ఆకర్షణను నిరోధిస్తాయి. అప్పడు మనకు చంద్రుడిపై నడిచేవారికి ఎలాంటి అనుభవం కలుగుతుందో అలానే ఉంటుంది. ఈ అయస్కాంతాల్లో ఎన్40, 42, 45.. అనే భిన్న రకాల అయస్కాంతాలను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎన్45 అత్యంత శక్తిమంతమైనదనీ.. ధర కూడా అందుబాటులో ఉంటుందని వీటిని రూపొందిస్తున్న పాట్రిక్ జిజిరీ వెల్లడించారు. -
25 వేల మందికి పాదరక్షలు
ఆ కలెక్టర్ కృషి..! రాజస్థాన్ : జితేంద్ర కుమార్ సోని.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా కలెక్టర్. ఎప్పటిలాగే తన అధికార వాహనంలో కార్యాలయానికి బయలు దేరారు. మార్గమధ్యంలో బడికి వెళ్తోన్న ముగ్గురు చిన్నారులను చూశారు. పుస్తకాల బ్యాగులు మోసుకుంటూ స్కూలు దిశగా పరుగులు తీస్తున్నారు. కలెక్టర్ ఎంతగానో ఆనందించారు. అయితే, అప్పటికే ఆయన కళ్లు మరో విషయాన్ని గమనిస్తున్నాయి. ఆ ముగ్గురి పాదాలకూ పాదరక్షలు లేవు. చలికాలం.. అందులోనూ వణికించే డిసెంబర్ రోజులు. ఆ చిన్నారులు మెండిపాదాలతో ఎలా స్కూలుకు వెళ్లగలుగుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. మనసులో ఎన్నో ఆలోచనలు, పేదరిక బాల్యపు జ్ఞాపకాలు! వెంటనే కారు దిగారు. తన దగ్గరున్న డబ్బుతో ముగ్గురినీ బజారుకి తీసుకెళ్లి బూట్లు కొన్నారు. అక్కడితో ఆ పూటకి జితేంద్ర మనసు సంతృప్తి చెందింది. కానీ, అతడి కంటికి కనిపించని చిన్నారుల పరిస్థితేంటి..? అందుకే, జితేంద్ర అక్కడితో ఆగిపోలేదు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడి టీచర్లను కలిసి, ఎంతమంది షూ లేకుండా పాఠశాలకు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో కొందరు చిన్నారులున్నారని తెలియడంతో తిరిగి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారుల నుంచి సమాచారం సేకరించారు. దాని ప్రకారం జిల్లాలోని 2,500 పాఠశాలల్లో సగటున పదిమంది చొప్పున పాదరక్షలు కొనుక్కోలేనివారున్నారని గ్రహించారు. వెంటనే ‘చరణ్ పాదుకా యోజనా’ అనే కొత్త స్కీమును ప్రవేశపెట్టారు. నిరుపేద విద్యార్థులకు పాదరక్షలు సమకూర్చడమే దీని ఉద్దేశం. అయితే, నిధుల కొరత వేధించింది. వెంటనే దాతల సాయం కోరారు. ఈ పథకం గురించి తెలుసుకున్న ప్రజలు ప్రతి రోజూ కలెక్టరేట్‌కు వస్తూ తమకు తోచినంత ఇచ్చి వెళ్తున్నారు. దీంతో తన జిల్లాలోని 25 వేల మంది చిన్నారులకు షూస్ కొనడానికి సరిపడా మొత్తం ఖాతాలో చేరింది. ఈ గణతంత్ర దినోత్సవంలోగా పాదరక్షలను వారికి అందజేయాలని కలెక్టర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ‘‘సాధారణ, నాన్ బ్రాండెడ్ స్కూల్ షూ మార్కెట్లో రూ.200 నుంచి 300 మధ్యలో లభిస్తోంది. దీంతో నా ఆలోచన సాధ్యమే అని అర్థమైంది. ప్రజలనే దానం చేయండంటూ అభ్యర్థించా. వారిచ్చిన నిధులే ఈ పథకానికి ఊపిరి. ఏటా బూట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు కలెక్టర్ జితేంద్ర. పేదరికంలో మగ్గిన తన బాల్యం ఇప్పటికీ గుర్తుందనీ, తండ్రి ఎంతో కష్టపడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చారనీ చెప్పారు. కలెక్టర్గారిది ఎంత మంచి మనసో కదా!! -
'వాడిని బూట్లతో తన్ను'
లక్నో: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులను బూట్లతో తన్నాలని ఉత్తరప్రదేశ్‌లోని ఓ పంచాయతీ పెద్దలు రేప్ బాధితురాలికి సూచిస్తూ తీర్పునిచ్చారు. అలాంటి వ్యక్తిని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని హెచ్చరించింది. రాష్ట్రంలోని తోడల్పూర్ అనే గ్రామంలో ఓ మహిళపై ఈ నెల 19న ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు లోనై ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం పంచాయతీ పెద్దలకు తెలియడంతో వారు విభిన్నంగా తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.ఐదు లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే, లైంగిక దాడికి పాల్పడినవారిలో ఒకరు ఆ మొత్తం చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో వారి ముఖంపై అందరూ చూస్తుండగానే ఇంకు చల్లేందుకు, బూట్లతో తన్నేందుకు ఆ పంచాయతీ బాధితురాలికి అనుమతిస్తూ తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపట్ల పలువురు సామాజిక వేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు గాలికొదిలేయడం వల్లే పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. -
భేషూగ్గా వెళ్లొచ్చు!
విహంగం ‘‘ఎందుకు ఆ పాత షూస్‌ను అలా మూటగడుతున్నావ్?’’ ‘‘న్యూజిలాండ్‌కు వెళుతున్నానులే’’ ‘‘ఓహో... ‘వాయిహోల’కు వెళు తున్నావా? ఏం వదులుకుంటున్నావు?’’ ‘‘బద్దకాన్ని!’’ న్యూజిలాండ్‌కు వెళ్లే పర్యాటకులలో చాలామంది వాయిహోల గురించి ఆరా తీస్తారు. అక్కడి ‘షూ ఫెన్స్’ గురించి వివరాలు తెలుసుకుంటారు. దాన్ని వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ ఉన్న తీగెకు తమతో తీసుకెళ్లిన బూట్లు, చెప్పులను తగిలిస్తారు. ఎందుకలా చేస్తారు అంటే... దాని వెనుక ఎన్నో నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవా లంటే ఒక్కసారి ‘చెప్పుల స్వర్గం’ అని పిలిచే వాయిహోలకు వెళ్లి రావాల్సిందే. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లో డునెడిన్, మిల్టన్ పట్టణాల మధ్య స్టేట్ హైవే-1ను ఆనుకొని ఉంటుంది వాయిహోల టౌన్షిప్. ఇక్కడి టూరిజం అట్రాక్షన్ లేక్ వాయిహోల. వాటర్ స్కైయింగ్, రోయింగ్ మొదలైన జల క్రీడాలకు అది ప్రసిద్ధి. ఇంతకు మించి వాయిహోల గురించి చెప్పుకోవడానికి పర్యాటక ఆకర్షణలేవీ లేకపోయినప్పటికీ, ఆ ప్రాంతం టూరిస్టు కేంద్రం కావడానికి ప్రధాన కారణం మాత్రం... షూ ఫెన్స్! న్యూజిలాండ్ వచ్చే పర్యాటకుల్లో చాలామంది, షూ ఫెన్స్ని చూడటానికి పని గట్టుకుని వాయిహోలకు వస్తారు. హైవేకు ఒక పక్క... పొడవాటి కంచెకు రకరకాల బూట్లు కట్టి ఉంటాయి. వాటికి తమతో తెచ్చిన బూట్లను కూడా జత చేస్తుంటారు సందర్శకులు. ఇలా కట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ‘ఇక్కడ ప్రతి చెప్పుకు ఒక ఆత్మ ఉంటుంది’ అంటారు స్థానికులు. ఆ ఆత్మ ఏం చెప్తుంది అంటే, చెడు అలవాట్లను వదిలేయమంటుంది అంటారు. అందుకే చాలామంది వచ్చి, బూట్ల జతను కంచెకు వేళ్లాడదీసి, తమకున్న చెడు అలవాట్ల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించి వెళ్తుంటారు. అలాగే... వాడేసిన పాత బూట్లను ఈ రకంగా దూరం చేసుకుంటే, తమను వెంటాడుతోన్న దురదృష్టం కూడా దూరమవుతుందని నమ్ముతారు. అయితే ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అనేదాని గురించి స్పష్టత లేదు. కాకపోతే ఇమెల్డా మార్కోస్ లాంటి అభిరుచిని పోలిన వ్యక్తి ఎవరో వాయి హోల చుట్టుపక్కల ఉండి ఉండొచ్చనేది ఒక అంచనా. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ భార్య అయిన ఇమెల్డా, ఎంత రేటు పెట్టి కొన్న పాద రక్షలనైనా ఒక్కరోజు మాత్రమే వేసుకొనే దట. దాంతో ఆమె దగ్గర వందలాది పాద రక్షలుండేవి. వీటిని ‘ఇమెల్డా సంపద’ అని పిలిచేవారు. ఆమె సేకరించిన చెప్పులన్నీ ప్రసుత్తం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్స్, మార్కిన నగరంలోని షూ మ్యూజియమ్‌లలో ఉన్నాయి. న్యూజి లాండ్లో కూడా ఇమెల్డా లాంటి వ్యక్తి ఎవరైనా తాను సేకరించిన షూస్‌ను సరదాగా ఈ కంచెకు కట్టి ఉండొచ్చు, కాలక్రమంలో ఆ సరదా కాస్తా సంప్ర దాయమై ఉండొచ్చు అనేది ఒక కథనం. కంచెకు షూ కడితే... నేషనల్ హైవే మీద ప్రయాణించే వాళ్లకు ఎలాంటి ప్రమాదాలూ జరగవనే నమ్మకం కూడా షూ ఫెన్స్‌కు డిమాండ్‌ను పెంచింది. నమ్మకం కావచ్చు, మూఢనమ్మకం కావచ్చు. వాస్తవం కావచ్చు, కల్పన కావచ్చు. షూ ఫెన్స ఏర్పడటానికి కారణం ఏదైనా, అది ఓ సెంటిమెంటుగా మారింది. చెడును, దురలవాట్లను దూరం చేసే ప్రదేశంగా పేరొందింది. ఓ ప్రముఖ సందర్శనీయ స్థలంగానూ ఖ్యాతికెక్కింది. ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫుట్‌వేర్ డిజైనర్ క్రిస్టియన్ లోబోటిన్ ఒక చక్కని మాట చెప్పాడు... ‘షూ అంటే కేవలం డిజైన్ మాత్రమే కాదు. అది మన శరీరభాషలో ఒక భాగం. దారి చూపే నేస్తం’ అని! న్యూజిలాండ్‌లోని షూ ఫెన్స్‌ను చూస్తే... షూ అనేది దారి చూపే నేస్తమే కాదు, మనసులోని కోరికను తీర్చే సాధనం అని కూడా అనిపిస్తుంది. -
డీ-హైడ్రేషన్‌ను గుర్తించేదెలా?
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 35. రోజూ జాగింగ్‌ను చేస్తాను. నాకు చెమటలు ఎక్కువ. నాలాంటి వారికి డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని విన్నాను. నాకు తగిన సూచనలు ఇవ్వండి. - రఘురామ్, నకిరేకల్ జాగింగ్ మొదలుపెట్టడానికి ముందుగా కనీసం నాలుగు వారాల పాటు వేగంగా నడక (బ్రిస్క్‌వాకింగ్) కొనసాగించడం మేలు. జాగింగ్‌కు అనువైన షూస్ ఎంచుకోవడం చాలా అవసరం. సుమారు ప్రతి 1000 కి.మీ. పరుగు తర్వాత ఆ షూస్ మార్చేయాలి. లేకపోతే చూడటానికి షూ బాగానే అనిపించినా సోల్ అరుగుదల వల్ల అడుగులు పడే తీరులో మార్పు వచ్చి దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు కనిపిస్తాయి. ఇక జాగింగ్ వ్యవధి విషయానికి వస్తే రోజూ కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు స్లోజాగింగ్ చేయడం మేలు. జాగింగ్ చేయడానికి ముందుగా ఎవరైనా సరే... జాగింగ్‌కు ముందూ, జాగింగ్ తర్వాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. డీ-హైడ్రేషన్‌ను దీన్ని గుర్తించడం చాలా తేలిక. మీరు పరుగెత్తుతున్నప్పుడు చెమటల వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, లవణాలను కోల్పోయి, వాటి (ఎలక్ట్రోలైట్స్) సమతౌల్యత చెబుతుంది. ఈ కండిషన్‌ను డీ-హైడ్రేషన్‌గా పేర్కొనవచ్చు. మీరు డీ-హైడ్రేషన్‌కు గురైతే మీకు స్వల్పంగా తలనొప్పి రావడం, దాహం వేస్తూ ఉండటం, చురుకుతనం తగ్గినట్లుగా అనిపించడం, వికారం, కండరాలు బిగుసుకుపోయి, పట్టివేసినట్లుగా అయిపోవడం (మజిల్ క్రాంప్స్), నీరసం, ఉమ్ము కూడా రాకపోవడం, ఒకవేళ ఊసినా అది చాలా చిక్కగా ఉండటం, తీవ్రమైన నిస్సత్తువకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే జాగింగ్ లేదా రన్నింగ్ చేసేవారు తగినంతగా నీళ్లు తాగాలి. లేకపోతే అది హైపోనేట్రీమియా (శరీరంలో సోడియమ్ లవణాల పాళ్లు తగ్గడం) అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితే. దీన్ని నివారించాలంటే మీరు స్థూలకాయులైతే జాగింగ్ మొదలుపెట్టడానికి ముందే శరీర బరువును తగ్గించుకోవడం అవసరం. ఇక జాగింగ్ చేసే సమయాల్లో తమ శరీరం ఉజ్జాయింపుగా ఎన్ని నీళ్లను కోల్పోతుందో గుర్తించి ఆ మేరకు (లవణాలతో కూడిన నీళ్లు లేదా కొబ్బరినీళ్లు) తీసుకోవాలి. ఉదాహరణకు జాగింగ్ చేయడానికి ముందు మీ శరీరం బరువు 63 కిలోలు ఉందనుకుందాం. అరగంట జాగింగ్ తర్వాత మీ బరువు 62.6 కిలోలు ఉందనుకుందా. అంటే అరగంటలో మీరు 0.4 కిలోల బరువు కోల్పోయారు. అందుకే ఉజ్జాయింపుగా మీరు 400 మిల్లీలీటర్లు లేదా గంట జాగింగ్ చేసేవారైతే 800 మిల్లీలీటర్లు (దాదాపు ఒక లీటరు నీరు) తాగి, మీరు కోల్పోయిన ఫ్లూయిడ్స్ భర్తీ చేసుకోవడం మేలు. అయితే నీటిని గింగ్/రన్నింగ్ ముగిసిన కొద్ది వ్యవధి / విశ్రాంతి తర్వాత తీసుకోవడం అన్నివిధాలా మేలు. డాక్టర్ ప్రవీణ్‌రావు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
షూలో మూడు కిలోల బంగారం..
శంషాబాద్(హైదరాబాద్): బూట్లలో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం అర్ధరాత్రి దుబాయి నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు అతడిని పూర్తిగా తనిఖీ చేశారు. అతడు వేసుకున్న షూ లోపలి భాగంలో మూడు కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'చెప్పు'కోలేని పనులు..!
(వెబ్సైట్ ప్రత్యేకం) అధికారం ఉంటే చాలు! నాయకులు అవతార పురుషులవుతారు. వీరికి తమవాళ్లు తప్ప.. బహుశా మిగతావారు మనుషులుగా కనిపించరనుకుంటా.. ఎంతైతే అంత... ఏపనైతే ఆపని.. చెప్పేముందు వాళ్లు తమలాంటి మనుషులేనని, మనోభావాలతోపాటు, వారికీ ఆత్మ గౌరవం ఉంటుందని గుర్తులేక ఇలా చేస్తారో... గుర్తుంచుకొనే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారో వారి చర్యలు చూస్తే ఇట్టే బోధపడుతుంది. అడిగేవాడు లేకపోవాలేగానీ ముక్కున వేలేసుకుని ఫక్కున నవ్వే పనులు ఏవైనా చేయించుకోగల సమర్థులు వీరు. అందుకే కొందరు తమ వెంట ఉండే అధికారులకు సంబంధించిన బాధ్యతలు ఇస్తుంటే ఇంకొందరు నాయకులేమో స్వయంపాలన(సొంతసేవ)కు ఉపయోగించుకుంటున్నారు. ఈమధ్యకాలంలో నాయకుల వెంట ఉండే కొందరు అధికారుల పరిస్థితి దీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన అమాత్యులు... వారితో తమ చెప్పులు,బూట్లు మోయించుకుంటున్నారు... తుడిపించుకుంటున్నారు.. .. తొడిగించుకుంటున్నారు. ఇది వారి అధికారం, ఆధిపత్యం, అహంకారాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవేళ అధికారంలో లేకున్నా ఆ వాసనలు మాత్రం వారిని వదిలిపెట్టవనేది వాస్తవం. అందివచ్చినంతవరకూ 'సేవ'లలో తరించటం పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ విమర్శలు వెల్లువెత్తినా నవ్విపోదురూ గాక నాకేంటి సిగ్గన్నట్లు దులుపుకోవటం చూస్తూనే ఉన్నాం. అనుచరులనే కాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పొలిటికల్ లీడర్లు వదలడం లేదు. తాజాగా ఓ మంత్రివర్యుడు ఏకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో షూ లేస్‌లు కట్టించుకుంటూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్న రచ్‌పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ విమర్శల పాలయ్యారు. ఇక మన రాష్ట్రానికి వస్తే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు...రాయల్ ఠీవీ చెప్పనవసరం లేదు. బహిరంగంగానే ఆయన తన అనుచరుల సేవలను ఆస్వాదిస్తుంటారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన తన వ్యక్తిగత సహాయకుడితో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీనే బాహాటంగా ఇలా వ్యవహరించటం చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మూడు ఆకులు ఎక్కువే చదివారు. సీఎం పదవి వెలగబెట్టిన సమయంలో మాయావతి బూట్లు మురికిగా ఉన్నాయని రక్షణగా వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి ఆమె బూట్లు శుభ్రం చేసిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గారు ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్ చేత బూట్లు తొడిగించుకున్నారు. అది కాస్తా వివాదం కావటంతో ఆయన గారు ఛాఛా...నేను బూట్లు తొడిగించుకోవటం ఏంటీ.., బూటు తాడును మాత్రమే ఎమ్మెల్యే ముడివేశారని వివరణతో ఆ వివాదాన్నికి తెరపెట్టేశారు. కింది స్థాయి ఉద్యోగుల చేత చెప్పులు , బూట్లూ మోయించుకుని కాళ్ళకు తొడిగించుకుంటున్నారంటే సమాజం ఎటు పోతోందని చూసిన ... అయితే అక్కడే మీడియా సిబ్బంది ఉండడంతో మంత్రి గారి అనుచరులు బూట్లను దూరంగా పడేశారు. అంతటితో ఊరుకున్నారా... గడ్డి స్కామ్‌లో జైలుకు వెళ్లివచ్చినా... తన దర్పాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఓ పోలీసుతో చెప్పులు మోయించి, మరో డీఎస్పీ స్థాయి అధికారితో ఏకంగా కాళ్లు కడిగించుకుని అప్పట్లో పతాక శీర్షికలకెక్కిన విషయం తెలిసిందే. భజనపరులతో భుజ కీర్తులు తొడిగించుకున్న నేతలు తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో పాదసేవల్లో తరించిపోతున్నారు. చెబితే చాంతండంత అన్నట్లుగా ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే.. -
చెప్పులు కరుస్తుంటే..!
ఇంటిప్స్ ఇల్లు తుడవడానికి వాడే నీళ్లలో కాస్త ఉప్పు వేస్తే... ఇంట్లో ఈగలు, దోమలు చేరకుండా ఉంటాయి. చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే... కరుస్తున్నచోట పెరుగు రాసి రాత్రంతా ఉంచి, పొద్దున్న తొడుక్కోవాలి. స్క్రూలు తుప్పు పట్టి బిగిసిపోతే... వాటి మీద కాస్త వెనిగర్ వేస్తే తేలికగా ఊడి వస్తాయి. టాల్కం పౌడర్ సువాసనను కోల్పోయినట్టు అనిపిస్తే... డబ్బాను కాసేపు ఎండలో ఉంచాలి. ప్లాస్టిక్ కంటెయినర్లకు అంటిన పసుపు మరకలు వదలాలంటే శెనగపిండితో తోమాలి. -
గంట నడిస్తే.. రెండున్నర గంటల చార్జింగ్!
మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అయిందా? అందుబాటులో చార్జ్ చేసుకునే అవకాశం లేదా? ఏం ఫరవాలేదు. ఈ బూట్లు వేసుకుని నడిస్తే చాలు.. మీ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. వీటిని వేసుకుని ఒక గంట నడిస్తే.. రెండున్నర గంటల పాటు ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వీటిని తయారు చేశారు. ఇవెలా పనిచేస్తాయంటే.. బూట్ల కింది సోల్భాగం లోపల చిన్న జనరేటర్, మెకానికల్ వ్యవస్థ ఉంటుంది. నడిచినప్పుడు ఏర్పడే గతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఈ వ్యవస్థ బూటుపైన ఉండే బ్యాటరీకి అనుసంధానమై ఉంటుంది. ఇంకేం.. నడిచినప్పుడు పుట్టే కరెంటు ఎప్పటికప్పుడు ఈ బ్యాటరీలో నిల్వ అవుతుంది. తర్వాత బ్యాటరీని తీసి కేబుల్ ద్వారా ఫోన్‌కు పెట్టుకోవడమే. వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘సోల్పవర్’ కంపెనీ వెల్లడించింది. -
ఆశ నిరాశ బడ్జెట్
కొన్ని మెరుపులు.. ఇంకొన్ని పెదవి విరుపులు.. ఇదీ అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై నగరవాసుల స్పందన. ఆదాయ పన్ను పరిమితి వేతన జీవుల్లో కొందరికి ఊరటనివ్వగా, ఇంకొందరిని ఉస్సూరుమనిపించింది. రూ.2 లక్షలలోపు గృహ రుణాలపై పన్ను మినహాయింపు, సిమెంటు, స్టీలు ధరల తగ్గింపుతో మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలను సొంతింటి నిర్మాణం వైపు దృష్టిసారించేలా చేసింది. సాక్షి, సిటీబ్యూరో: పెరిగిన ధరలతో ఇంటి బడ్జెట్ తల్లకిందులైన నగరవాసికి సబ్బులు, వంట నూనెల ధరలు కాస్త దిగిరానుండడం స్వల్ప ఉపశమనం కలిగించింది. పాదరక్షలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు దిగిరావడం షాపింగ్ ప్రియులైన సిటీజన్లకు పండగే. బర్గర్లు, పిజ్జాలు, బేకరీ ఉత్పత్తులపై సుంకం తగ్గడంతో వెరైటీ రుచులు ఆస్వాదించే ‘భాగ్యం’ దక్కనుంది. స్మార్ట్ఫోన్లు, సెల్ఫోన్ల ధరలు స్వల్పంగా పెరగడం నెటిజన్లయిన మన గ్రేటర్ యూత్‌కు నిరాశే మిగిల్చింది. ఇక ఎల్సీడీ, ఎల్ఈడీ, సోలార్ కాంతులతో ఇళ్లను ధగదగలు చేసుకునేందుకు మక్కువ చూపే ఎగుమ మధ్యతరగతి వర్గం ఆశలు ఈ ఏడాది నెరవేరే అవకాశాలున్నాయి. వంట పాత్రల ధరలు తగ్గుముఖం పట్టనుండడం గృహిణులకు ఉపశమనం కల్పించింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరల పెంపు జేబులు గుల్ల చేయనుంది. తాజా బడ్జెట్ గ్రేటర్ వాసిపై చూపనున్న ప్రభావంపై ‘సాక్షి’ ఫోకస్.. ‘రేడియో క్యాబ్’కు రెక్కలు రేడియో క్యాబ్ ప్రయాణంపై సేవా పన్ను రూపంలో భారం మోపారు. ప్రస్తుతం గ్రేటర్లో హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారు. సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు విరివిగా వినియోగించే రేడియో క్యాబ్‌లపైన కిలోమీటర్‌కు రూ.2 నుంచి రూ.3 చొప్పున సేవా పన్ను విధించారు. ఈ క్రమంలో చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.40, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున క్యాబ్ చార్జీలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ చార్జీల పై రూ.25 శాతం అదనంగా వసూలు చేస్తారు. సర్వీసు ట్యాక్సీ వల్ల కనీస చార్జీ రూ.45కి, ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.25 చొప్పున పెరగొచ్చని క్యాబ్ నిర్వహణ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు ఈ పన్ను విధింపుపై క్యాబ్ నిర్వాహకులూ పెదవి విరుస్తున్నారు. ప్రయాణికుల నుంచి విముఖత వచ్చే అవకాశం ఉందని, ఇది తమ ఉపాధిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మిడిల్‌క్లాస్‌కు ఓకే.. బడ్జెట్లో మహిళలకు ఒరిగిందేమీ లేదు. దిగుమతి వస్తువులు, రెస్టారెంట్స్ ఖరీదుగా మారనున్నాయి. విలాస వస్తువులు ధరలూ పెరగనున్నాయి. ఇవన్నీ సంపన్నులకు భారమైనా భరించగలరు. మరోవైపు జ్యువెలరీ, ఫుట్‌వేర్ ధరలు తగ్గనున్నాయి. ఇది మిడిల్‌క్లాస్‌కి మేలు చేసేదే. రూరల్ యూత్‌కి స్టార్టప్స్‌కి ఎంకరేజింగ్‌గా ఉంది. వ్యవసాయంపై మరింత దృష్టి పెట్టాల్సింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు రూ.37 వేల కోట్ల కేటాయింపు మంచి పరిణామం. - పార్వతీరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, నార్ ఇన్ఫ్రా ఏపీ,టీజీలపై కేంద్రం వివక్ష ఇది పూర్తిగా ధరలు పెంచే బడ్జెట్. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమైంది. ప్రభుత్వ వ్యయాన్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. ఈ నిర్ణయం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. మధ్య తరగతి ప్రజలు ఆశించిన స్థాయిలో పన్నులకు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బడ్జెట్లో ప్రాధాన్యంఇవ్వలేదు. సాధారణ ఇన్స్టిట్యూట్లు మినహా కొత్త కేటాయింపుల్లేవు. రెండు తెలుగు రాష్ట్రాల పైనా కేంద్రం వివక్ష చూపింది. రక్షణ, బీమా, మైనింగ్, రైల్వే వంటి కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల భవిష్యత్తులో దేశ సార్వభౌమాధికారం దెబ్బతినే ప్రమాదం ఉంది. ధరల స్థిరీకరణ నిధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించ లేదు. రూ.150 కోట్లతో మహిళలకు భద్రత ఎలా కల్పిస్తారో అర్థం కావడం లే దు. ఓ వైపు వ్యవసాయానికి పెద ్దపీట వేస్తామని చెబుతూనే మరోవైపు నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఇది ఏదో రకంగా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఆ దిశగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. - ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉంది మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ అల్పాదాయ వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేవిధంగా లేదు. ద్ర వ్యోల్బణాన్ని నియంత్రించే కోణంలో లేదు. బడ్జెట్ కేటాయింపులు వివిధ రంగాలకు అనుకున్నంత మేరకు లేవు. ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం నిత్యవసరాలు, విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు తగ్గించే చర్యలు తీసుకోకుండా సబ్బుల ధరలు తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రాధాన్య రంగాలను ఇది పూర్తిగా నిరుత్సాహ పరించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. - యనగందుల మురళీధర్‌రావు, హెచ్ఓడీ, ఎకనామిక్స్, ఓయూ -
‘జూన్’జాటం
నిత్యావసరాల ధరలు ఎన్నిమార్లు పెరిగినా ఎలాగోలా తట్టుకున్నారు. వేసవి రోజులన్నాళ్లు కరెంటు లేక పోయినా ఇంటిలో కాసింతైనా నిశ్చింతగా ఉండగలిగారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో నేటినుంచి బడిగంటలు మోగబోతున్నాయి. ఇంటి బడ్జెట్లో పిల్లాడి చదువు ఖర్చులు వచ్చి చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు, బూట్లు, స్టేషనరీ సామగ్రి కొనుగోళ్లకు తల్లిదండ్రులు బడ్జెట్ లెక్కలు వేసుకుంటున్నారు. పెరిగిన ఖర్చుతో వారి గుండె ఝల్లుమంటోంది. అంచనాలకు మించిన పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితిల్లో తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అదనపు బడ్జెట్‌తో అన్నీ సమకూర్చి బడికి పంపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాగులు ... పాఠశాలలు మొదలుకొని కళాశాలల విద్యార్థుల వరకు పుస్తకాల మోతకు బ్యాగులు అవసరం. మార్కెట్లో అన్ని రకాల తరగతులకు సంబంధించిన బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. నర్సరీ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు రకరకాల అనువైన బ్యాగులు విక్రయిస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు రూ.250 నుంచి రూ.700 ధరల్లో బ్యాగులు దొరుకుతున్నా యి. కళాశాల విద్యార్థులకు పాఠ్య, నోట్‌బుక్స్ పెట్టుకోవడంతోపా టు ల్యాప్‌టాప్ పెట్టుకునే సౌలభ్యం గల బ్యాగులూ లభిస్తున్నాయి. ఒక్కో బ్యాగు రూ.వెయ్యి నుంచి రూ..1500 వరకు ధర ఉంది. నోట్‌బుక్స్ గతంతో పోలిస్తే నోట్ బుక్స్ ధర 20 శాతం మేర పెరిగింది. నిరుడు రూ.10 ధర పలికిన పుస్తకం నేడు రూ.12కు చేరింది. లాంగ్ నోట్‌బుక్ రూ.20 నుంచి రూ.22 పలుకుతోంది. రఫ్ నోట్స్లైతే రూ.12 నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నారుు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నోట్ బుక్స్ ధరల్ని విపరీతంగా పెంచేయడంతో బయటి మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. సైకిళ్లు ఇంచుమించు అన్ని ప్రైవేటు పాఠశాలలకు స్కూల్ బస్సులు ఉన్నారుు. బస్సు సౌకర్యం అందుబాటులో లేక, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులుసైకిళ్లు వినియోగిస్తున్నారు. బాలురు, బాలికలకు సంబంధించి వివిధ రకాల మోడళ్లలో సైకిళ్లు మార్కెట్లో లభ్యమవుతున్నారుు. ఒక్కోటి రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. కవర్లు, నేమ్ స్టిక్కర్లు.. ఏడాది పాటు పుస్తకాలు భద్రంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు అవసరం. పుస్తకాలు చిరగకుండా, మారిపోకుండా ఉండేందుకు అట్టలు, నేమ్ సిక్కర్లు తప్పనిసరి. వివిధ రకాల బొమ్మలతోకూడిన కాగితం, సింథటిక్ అట్టలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పుస్తకాలకు భ ద్రతతో పాటు అందాన్నిఇచ్చే కవర్లు నాణ్యతనుబట్టి రూ.15నుంచి రూ.75వరకు, స్టిక్కర్లురూ.3 నుంచిరూ.10 వరకుమార్కెట్లో ధరపలుకుతున్నాయి. స్కేలు రూ.10 నుంచి రూ.45, పరీక్ష ప్యాడ్ రూ.20 నుంచి రూ.135 వరకు ధర ఉంది. టిఫిన్ బాక్స్‌లు.. విద్యార్థులు పాఠశాలకు తీసుకెళ్లేందుకు టిఫిన్ బాక్స్‌లు కావా లి. మార్కెట్లో వాటి ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఉన్నాయి. రక రకాల కంపెనీలతో కూడిన టిఫిన్ బాక్స్‌లు లభిస్తున్నాయి. టిఫిన్ డబ్బాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బ్యాగులు అమ్ముతున్నారు. ఒక్కో బ్యాగు ధర రూ.60 నుంచి రూ.140 వరకు ఉన్నాయి. వాటర్ బాటిళ్లు.. కొన్ని పాఠశాలల్లో తాగునీరు అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్‌ల వెంట తా గునీరు తీసుకెళ్తున్నారు. నీటిని చల్లగా ఉంచే బాటిల్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలం, చలికాలాల్లో చల్లని నీరు పడని విద్యార్థులు వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లవచ్చు. వాటర్ బాటిళ్ల ధర రూ.20 నుంచి రూ.100 వరకు ఉంటోంది. నీటిని చల్లగా ఉంచే విధంగా రూపొందించిన ప్రత్యేక బాటిళ్లురూ.200కు విక్రయిస్తున్నారు. షూస్.. సాక్స్‌లు.. నలుపు, తెలుపు బూట్లు, సాక్స్‌లు కూడా పాఠశాల ప్రారంభంతో కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. తరగతి, వయసు పెరగడంతో ఏటా బూట్లు కొనుగోలు చేయక తప్పడం లేదు. నర్సరీ విద్యార్థులకు రూ.150 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులకు రూ.200 నుంచి రూ.500 వరకు బూట్ల ధరలు ఉన్నాయి. సాక్స్‌ల ధరలు రూ.25 నుంచి రూ.40 వరకు ఉన్నాయి. కాటన్, నైలాన్ సాక్స్‌లు కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సాక్స్లపై పాఠశాల పేరును ముద్రించి అక్కడే విక్రయిస్తున్నాయి. పెన్నులు, పెన్సిళ్లు.. పెన్నులు, పెన్సిళ్లు లేకపోతే విద్యార్థులకు చదువు సాగదు. పెన్నులు రూ.3 నుంచి రూ.200 వరకు ఉన్నాయి. పెన్సిల్ రూ.2 నుంచి రూ.50 వరకు, ఎరేజర్ రూ.1 నుంచి రూ.5 వరకు లభిస్తున్నాయి. పలకలు, జామెట్రీ బాక్స్‌లు నర్సరీ నుంచి యూకేజీ వరకు పలకల వినియోగం తప్పనిసరి. మార్కెట్లో పిల్లలను ఆకట్టుకునేందుకు రకరకాల పలకలను ప్రవేశపెట్టారు. నలుపు రంగుపలక రూ.20కు లభిస్తోంది. చిన్నారుల్ని ఆకట్టుకునే మ్యాజిక్ స్లేట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఒక్కోటి రూ.200. వివిధ రకాల జామెట్రీ బాక్స్‌లు రూ.20 నుంచి రూ.300 వరకు లభిస్తున్నాయి. యూనిఫాం.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు తప్పనిసరి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు యూనిఫాం ఉండాల్సిందే. వయసు, తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ.300 నుంచి రూ.1000 వరకు యూనిఫాంకు ఖర్చు చేయాల్సి వస్తుంది. యూనిఫాం బట్టల అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కుట్టు కూలీ ఖర్చు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు రెడీమేడ్ దుస్తులపై మొగ్గు చూపుతున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక్కో రకమైన యూనిఫాం ఉండడంతో అన్ని షాపుల్లో వాటి అమ్మకాలు సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్లోనే యూనిఫాంలు విక్రయిస్తున్నాయి. టై.. బెల్ట్.. టై.. బెల్ట్‌లు కూడా మార్కెట్లో అన్ని పాఠశాలలకు సంబంధించినవి అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్కూళ్లో ఒక్కో టై రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. బయట మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరకే టై, బెల్టుల అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో టై రూ.10 నుంచి రూ.20, బెల్ట్‌లు రూ.15 నుంచి రూ.30లకే లభిస్తున్నాయి. అప్పులు చేస్తున్నాం.. ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. ఖరీఫ్ కోసం ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు పెట్టే కాలం వచ్చింది. ఎరువులు, విత్తనాలు కొనడానికే అప్పులు చేస్తున్నాం. ఇప్పుడే పిల్లలను స్కూలుకు పంపే సమయం వచ్చింది. వాళ్లకూ పైసలు కావాలి. మరింత అప్పు చేయక తప్పేలా లేదు. - శేఖర్‌రెడ్డి, నారెగూడ భారం పెరుగుతోంది.. పిల్లలను పాఠశాలలకు పంపాలంటే వారికి పుస్తకాలు, బూట్లు, యూనిఫాంలు, బ్యాగులు కొనాలి. సీజన్ కావడంతో వాటి ధరలు మండిపోతున్నాయి. స్కూలు ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. బస్‌ల ఫీజులు కూడా బాగా పెరిగాయి. ఏం చేస్తాం పిల్లల కోసం భారం మోయాల్సిందే. - ప్రభాకర్, గుబ్బడిపత్తేపూర్ ప్రభుత్వ ఆజమాయిషీ లేదు.. ఫీజుల వసూలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేలకువేల రూపాయలు వసూలుచేస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - డి. లలిత, విద్యార్థి తల్లి అప్పుల నెలగా మారింది.. ప్రైవేటు స్కూళ్ల అడ్డగోలు నిబంధనలతో జూన్ అంటేనే తల్లితండ్రులకు అప్పుల నెలగా మారింది. పుస్తకాలు, టైలు, పెన్నులు తదితర వస్తువులన్నీ పాఠశాలల్లోనే కొనుగోలు చేయలనడంతో ఎక్కువ ధరలు వెచ్చించి అప్పుల పాలవుతున్నాం. - మామిండ్ల ముత్యాలుయాదవ్, విద్యార్థి తండ్రి -
చలికాలంలో పాదాల జాగ్రత్తలు...
చలికాలం వచ్చిందంటే మా పాదాలు పగులుతున్నాయి. ఈ సీజన్లో పాదాల ఆరోగ్యం గురించి మాకు తగిన సలహా ఇవ్వండి. - సుమతి, పలాస చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. ఇవి చేయకూడదు : చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోకూడదు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
భేషూగ్గా...!
పూలమొక్కలు బూట్లలో ఉన్నాయేంటని ఆశ్చర్యపోతున్నారా! పాతబూట్లని పడేయకుండా వాటిని పూలకుండీలుగా మారిస్తే ఇలాగే ఉంటాయి. పాతబూట్లలో కాసింత మట్టిపోసి మొక్కనాటడం ఫారిన్లో ఫాలో అవుతున్న ట్రెండ్. కొన్నాళ్లకు మన ఇళ్లలో కూడా ఇలాంటి బూట్లు కనపడతాయనుకోండి. ‘ఎంచక్కా కుండీల్లో పెట్టుకోకుండా బూట్లలో, చెప్పుల్లో మొక్కలేంటి?’ అని తీసిపారేయకండి. ఇక్కడ ఒక అద్భుతమైన సౌకర్యం ఉంది. కుండీలైతే నేలమీద పెట్టుకోవాలి. వేలాడేకుండీలు ఉన్నా...వాటిని ప్రత్యేకంగా కొనుక్కోవాలి. అదే బూట్లనుకోండి. చిన్న తాడు కట్టి గేటుకో, గోడకో వేలాడదీస్తే సరిపోతుంది. పైగా మొక్కల అందానికి బూటు స్పెషల్ ఎఫెక్టుగా పనిచేస్తుంది. బూటు పెద్దగా బరువు ఉండదు కాబట్టి కావలసినప్పుడల్లా మట్టిని తీసేసి సులువుగా కొత్త మట్టిని నింపుకోవచ్చు. కాస్త ఓపికుంటే మొక్కలు పెట్టిన బూట్లకు మీకు నచ్చిన రంగులు కూడా వేసుకోవచ్చు. ఇంకా సరదా ఉంటే పేర్లు కూడా రాసుకోవచ్చు. మీ ఇంటి గోడలకు మ్యాచ్ అయ్యే రంగులు వేసుకుంటే గార్డెన్ లుక్ అదిరిపోతుంది. మీరు కూడా పాతబూట్లు పారేసేముందు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేసి చూడండి.