Abhinandan Varthaman
-
బాలాకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ‘గ్రూప్ కెప్టెన్’ ర్యాంక్ దక్కనుంది. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక ఆయనకు ఆ ర్యాంక్ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై భారత వాయుసేన విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 27న భారత దాడి తర్వాతి రోజునే పాకిస్తాన్ తన వాయుసేన దళాలను ప్రతిదాడి కోసం భారత్ వైపునకు పంపింది. వీటిని తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాను నడుపుతున్న మిగ్–21 బైసాన్ వాయుసేన యుద్ధవిమానంతో పాక్ ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
రేర్ ఫోన్‌కాల్, రహస్య లేఖ.. అభినందన్‌ను వదిలేశారు
న్యూఢిల్లీ : 2019, ఫిబ్రవరి నెలలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగి పాక్ ఆర్మీకి చిక్కారు. దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలో ఉంచి జనీవా ఒప్పందం ప్రకారం పాక్ అభినందన్‌ను వదిలేసింది. అయితే అభినందన్‌ను వదిలేయటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆయన పాక్ చెరలో ఉన్న సమయంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) చీఫ్ అనిల్ ధస్మనా పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. అభినందన్‌కు ఏమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ సూచనల మేరకు.. ఐఎస్ఐ కౌంటర్ పార్ట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సయ్యద్ అసిమ్ మునిర్ అహ్మద్ షాకు రేర్ ఫోన్ కాల్, రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్ వెనక్కు తగ్గి అభినందన్‌ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది. 2019, ఫిబ్రవరి 28వ తేదీన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత సైనికుడ్ని వదిలేస్తున్నట్లు నేషనల్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చదవండి : నాడు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్.. నేడు కూలీ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
అందుకే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: ధనోవా
న్యూఢిల్లీ: ‘‘ఆరోజు నేను, అభినందన్ తండ్రి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం. మేమిద్దరం కలిసి పనిచేసిన నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నాం. కార్గిల్ యుద్ధ సమయంలో నా ఫ్లైట్ కమాండర్ అహుజా పట్టుబడ్డారు. ఆయన విమానం కూలిపోయింది. అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కినపుడు అహుజా విషయం నా మదిలో మెదిలింది. అప్పుడు.. ‘‘సర్.. అహుజాను వెనక్కి తీసుకురాలేకపోయాం. కానీ అభినందన్‌ను కచ్చితంగా తీసుకొస్తాం’’ అని నేను ఆయన తండ్రికి చెప్పాను. పాకిస్తాన్‌కు భారత్ సామర్థ్యమేమిటో తెలుసు. అందుకే అభినందన్‌ను అప్పగించారు’’ అని భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా గతేడాది ఫిబ్రవరి నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.(చదవండి: పుల్వామా దాడి; పాక్ సంచలన ప్రకటన) కాగా పాకిస్తాన్ ఎంపీ అయాజ్ సాదిఖ్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయని, ఆ సమయంలో అభినందన్ విడుదల చేయడమే తప్ప తమకు వేరే మార్గం లేదని మంత్రి చెప్పినట్లు ఆయాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. లేనిపక్షంలో భారత్ ప్రతీకారం తీర్చుకోనుందన్న సమాచారం నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా కాళ్లు వణికాయని, ఒళ్లంతా చెమటతో తడిసిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ధనోవా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ ఆనాడు పాకిస్తాన్‌పై రెండు అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఒకటి, దౌత్య, రాజకీయపరంగా వస్తున్న ఒత్తిడి. మరోవైపు భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలు తెలిసి ఉండటం. ఆయన(సాదిఖ్) చెప్పినట్లు అతడి(జనరల్ కమర్ జావేద్ బజ్వా) కాళ్లు వణకడం వంటివి జరిగింది అందుకే. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం గురించి వారికి అవగాహన ఉంది. ఫిబ్రవరి 27న వాళ్లు దాడికి సిద్ధమయ్యారు. అందుకు దీటుగా బదులిచ్చేందుకు, వాళ్ల ఫార్వర్డ్ బ్రిగేడ్స్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు సన్నద్ధమయ్యాం. అప్పటికే వాళ్లకు విషయం అర్థమైంది. భారత ఆర్మీని తట్టుకుని నిలబడిగే శక్తి తమ మిలిటరీకి ఉందా లేదా అన్న విషయం గురించి ఆలోచన మొదలైంది. ‘‘స్పీక్ సాఫ్ట్ అండ్ క్యారీ ఏ బిగ్ స్టిక్(శాంతియుతంగా చర్చలు జరుపుతూనే, తోకజాడిస్తే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలనే అర్థంలో)’’ అని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ చెబుతూ ఉండేవారు కదా.. ఇక్కడ బిగ్‌స్టిక్‌గా మిలిటరీ పనిచేసింది. అభినందన్‌ను విడిచిపెట్టడం తప్ప వాళ్లకు వేరే మార్గం లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: అప్పటికే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: పాక్ నేత)) బీఎస్ ధనోవా(ఫైల్ ఫొటో) పాక్ ఆర్మీ దురాగతానికి బలైన ఆహుజా కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నెరవేర్చిన అభినందన్‌కు యావత్ భారతావని నీరాజనాలు పట్టింది. ఇక అభినందన్ తండ్రి ఎస్ వర్థమాన్ సైతం ఐఏఎఫ్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాగా స్వ్యాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా 1999లో పాకిస్తానీ సాయుధ బలగాల చేతిలో మరణించారు. తాను నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో పాక్ ఆర్మీ చేతికి చిక్కిన ఆహుజా.. దేశ రక్షణకై ప్రాణాలు అర్పించారు. -
పుల్వామా దాడి; పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ఆ దేశ మంత్రి ఒకరు ప్రకటించడం సంచలనం రేపింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్ చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘భారత్‌ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూ భాగస్వాములమే’’అని అన్నారు. పుల్వామాలో విజయం అని మంత్రి పేర్కొనడంపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఫావద్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామా ఘటన అనంతరం పాక్ బలగాలు దాడి చేసేందుకు భారత్ భూభాగంలోకి వెళ్లగలిగాయని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో విజయం అన్న వ్యాఖ్యలను మాత్రం వెనక్కు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అభినందన్‌ని విడుదల చేయకపోతే భారత్ దాడి చేస్తుందని ఆర్మీ చీఫ్‌కే కాళ్లలో వణుకు పుట్టినట్టుగా పీఎంఎల్–ఎన్ నేత అయాజ్ సాధిక్ ప్రకటన చేసిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన చౌధరి ఈ వ్యాఖ్యలు చేశారు. సాధిక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, జాతిని కించపరచడం తగదు’ అని తెలిపారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత్ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. కాళ్లు వణికాయి.. చెమటలు పట్టాయి మేజర్ అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతా చెమటలు పట్టాయి, పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’అని పాకిస్తాన్ ఎంపీ, పాక్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. పుల్వామా దాడి ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఫిబ్రవరి 26, 2019న భారత్ బాంబులతో దాడి చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ యుద్ధవిమానం ఎఫ్–16ని అభినందన్ మిగ్–21 విమానంతో వెంబడించారు. పాక్ విమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అభినందన్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆనాటి సమావేశంలో ఏం జరిగిందంటే..! మేజర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ చెరలోకి తీసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పాక్‌లో పార్లమెంటరీ పార్టీ నాయకులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశంలో జరిగిన విషయాలను సాధిక్ వెల్లడించారు. ‘‘ఆనాటి సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సమావేశంలో ఉన్నారు. అప్పుడే గదిలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలతో నిండిపోయింది. చర్చలు జరిగిన అనంతరం ఖురేషి అభినందన్‌ను వెంటనే విడుదల చేయనివ్వండి. లేకపోతే భారత్ రాత్రి 9 గంటలకి మన దేశంపై దాడికి దిగుతుందని ఖురేషి అన్నారు’’ అంటూ సాధిక్ ఆనాటి సమావేశ వివరాలను గుర్తు చేసుకున్నారు. భారత్ దాడి చేయడానికి సన్నాహాలు చేయకపోయినా, పాక్ సర్కార్ భారత్ ముందు మోకరిల్లి అభినందన్‌ని అప్పగించిందంటూ సాధిక్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాటల తూటాలు విసిరారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ఆ తర్వాత సాధిక్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. -
పాక్ నేత వీడియో: రాహుల్‌పై నడ్డా ఫైర్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హితవు పలికారు. రాహుల్ ఎంతగానో విశ్వసించే దేశమైన పాకిస్తాన్‌కు చెందిన నేత మాటలైనా ఆయన కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నానన్నారు. ఇకనైనా భారత ఆర్మీని తక్కువ చేసి మాట్లాడే రాజకీయాలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ ప్రతిపక్ష నేత అయాజ్ సాదిఖ్ బుధవారం నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. అభినందన్ వర్ధమాన్ విడుదల నాటి పరిస్థితులను గుర్తుచేసిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయని, ఆ సమయంలో అభినందన్ విడుదల చేయడమే తప్ప తమకు వేరే మార్గం లేదని మంత్రి చెప్పినట్లు ఆయాజ్ పేర్కొన్నారు.(చదవండి: అప్పటికే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: పాక్ నేత) అదే విధంగా భారత్ ప్రతీకారానికి సిద్ధమవుతుందని, వెంటనే భారత వింగ్ కమాండర్‌ను విడుదల చేయాలన్నారని, ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా భయంతో వణికిపోయారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘మన దేశ ఆర్మీని బలహీనమైనదిగా చూపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తెరతీసింది. సాయుధ దళాలలను, వారి ధైర్యసాహసాలను విమర్శించే విధంగా మాట్లాడింది. అంతేకాదు రఫేల్ జెట్లు భారత్‌లో ల్యాండ్ కాలేవంటూ ప్రచారం చేసింది. ఇలాంటి రాజకీయాలను భారత ప్రజలు తిప్పికొట్టారు. ఓటమి రూపంలో వారికి శిక్ష విధించారు. భారతీయులను, భారత ఆర్మీని, ప్రభుత్వాన్ని నమ్మని కాంగ్రెస్ పార్టీ, వాళ్లకు ఎంతో విశ్వాసపాత్రమైన పాకిస్తాన్ వల్లనైనా కళ్లు తెరుస్తోందేమో.. ఇప్పుడైనా రాహుల్ గాంధీ కాస్త కళ్లు తెరవండి’’అని చురకలు అంటించారు. -
ఆరోజు ఆర్మీ చీఫ్ కాళ్లు వణికాయి: పాక్ నేత
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇప్పటివరకు అన్నిరకాలుగా మద్దతుగా నిలిచాయని, అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్(పీఎంఎల్-ఎన్) నేత ఆయాజ్ సాదిక్ అన్నారు. భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ విడుదల విషయంలో ఇమ్రాన్ సర్కారు నిర్ణయంతో తాము ఏకీభవించినట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో గత కొన్నిరోజులుగా పాకిస్తాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా వ్యాప్తితో అతలాకుతలమవుతున్న వేళ, మరోవైపు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలు క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.(చదవండి: పాకిస్తాన్లో అంతర్యుద్ధం?) ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అయాజ్ సాదిఖ్ బుధవారం నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ. అభినందన్ వర్ధమాన్ విడుదల నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు ఇమ్రాన్‌ఖాన్ నిరాకరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా గదిలోకి వచ్చారు. అప్పటికే ఆయన కాళ్లు వణుకుతున్నాయి. చెమటలు పట్టాయి. భారత వింగ్ కమాండర్‌ను విడుదల చేయనట్లయితే, రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌పై, ఇండియా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఖురేషి చెప్పారు. అభినందన్‌ను విడుదల చేయడం ఒక్కటే మార్గమని, పార్లమెంటరీ సమావేశానికి హాజరైన పీపీపీ, పీఎంఎల్-ఎన్ తదితర పార్టీలను అభ్యర్థించారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి’’ అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. -
బాలీవుడ్‌కి హాయ్
‘అర్జున్‌రెడ్డి’ విజయంతో క్రేజీ స్టార్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడాయన బాలీవుడ్ ఎంట్రీ ఖరారయిందని సమాచారమ్. హిందీలో ‘కాయ్ పో చే’, ‘కేదార్నాథ్’ తదితర హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ సినిమాతో విజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. గత ఏడాది భారత్–పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజులు బంధీగా ఉంచి, పాక్ ప్రభుత్వం అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. అభినందన్ జీవితం ఆధారంగా అభిషేక్ కపూర్ ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ స్క్రిప్ట్‌ని విజయ్ దేవరకొండ విని, నటించడానికి అంగీకరించారని సమాచారం. అభినందన్ పాత్రనే విజయ్ చేయనున్నారట. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి విజయ్ దేవరకొండ సంతకం చేయలేదని బాలీవుడ్ టాక్. -
పట్టు పట్టు ట్రెండే పట్టు.. మనసులు కొల్లగొట్టు!
పట్టు పట్టు.. ట్రెండే పట్టు కాదేదీ సినిమా కథకు అనర్హం. రకరకాల కథల్ని సినిమాలుగా చూస్తూ వస్తున్నాం. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతుంది. మారిన ట్రెండ్‌కి తగ్గట్టే.. కథలు రాయాలి.. సినిమాలు తీయాలి. పౌరాణికం, సాంఘికం. ఫ్యాక్షన్. యాక్షన్. ఇలా ట్రెండ్ మారుతూ వచ్చింది. ఆ మధ్య బయోపిక్స్ హవా నడిచింది. ఇప్పుడేమో సమాజంలో జరిగే సంఘటనలతో సినిమాలు తీయడమనే ట్రెండ్ బాగా ఎక్కువైంది. ట్రెండ్‌ని పట్టుకొని కథల్ని అల్లితే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టొచ్చు.. కలెక్షన్లు రాబట్టవచ్చు. అందుకే ఏదైనా సంచలనాత్మక సంఘటనలు జరగడం ఆలస్యం ‘పట్టు పట్టు ట్రెండే పట్టు’ అంటూ ఆ అంశం మీద సినిమాలు ప్రకటిస్తున్నారు దర్శక–నిర్మాతలు. ఈ మధ్య కాలంలో ఇలా ప్రకటించిన సినిమాల వివరాలు గల్వాన్ ఘటన పాకిస్తాన్ మీద ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఉడి’. ఈ చిత్రం భారీ హిట్ అవడమే కాకుండా కలెక్షన్స్ దుమ్ము దులిపింది. గతకొన్ని రోజులుగా లడఖ్ సమీపంలో గల్వాన్ లోయలో భారత్ – చైనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ సంఘటన మీద సినిమా తీస్తున్నట్టు అజయ్ దేవగణ్ ప్రకటించారు. ఇందులో నటించడమే కాకుండా ఈ చిత్రాన్ని అజయ్ దేవగనే నిర్మిస్తున్నారు కూడా. దర్శకుడు, మిగతా నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. (ఈ హీరోయిన్లు.. భ‘లేడీ’ విలన్లు) అభినందన్ వర్థమాన్ బాల్కోట్ ఎయిర్ అటాక్స్ ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కనున్నట్లు బాలీవుడ్ నుంచి ప్రకటన వచ్చింది. ఉగ్రస్థావరాలపై వైమానిక దళం దాడులు, పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్, ఆ తర్వాత ఆయన ఎలా తిరిగి వచ్చారు? అనే కథాంశంతో ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. భన్సాలీ అభిషేక్ కపూర్ కూడా ఓ సినిమాను ప్రకటించారు. అలానే ఆభినందన్గా నటించాలనుందని జాన్ అబ్రహాం తన మనసులోని మాట బయటపెట్టారు. కాబట్టి పైన పేర్కొన్న సినిమాల్లో జాన్ కనిపిస్తారేమో చూడాలి. అయోధ్య కథ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నం జరిగింది. కృషి ఫలించింది. ఇటీవలే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సంఘటనను సినిమాగా తీయడానికి బాలీవుడ్లో ఓ నిర్మాత సిద్ధమయ్యారు. అయోధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘అయోధ్యకీ కథ’ అనే సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు పహ్లాజ్ నిహ్లానీ. వివిధ భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో అన్ని భాషలకు సంబంధించిన నటీనటులు నటిస్తారని తెలిసింది. ఈ ఏడాది నవంబర్ 21న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్‌ని ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత బాలీవుడ్లో నెపోటిజం వివాదం మరింత ముదిరింది. అవుట్ సైడర్స్ – ఇన్ సైడర్స్ డిబేట్ జరుగుతోంది. ఇదే సమయంలో సుశాంత్ పై ఓ సినిమా ప్రకటించారు హిందీ దర్శకుడు షామిక్ మౌలిక్. ‘సూసైడ్ ఆర్ మర్డర్?’ అనే టైటిల్‌తో సుశాంత్ పై ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది సుశాంత్ బయోపిక్ కాదని కేవలం హీరోగా తన జర్నీ ని చూపించే చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రం పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు. ఇలా తాజా సంఘటనలను, దాని తాలూకు క్రేజ్‌ని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచనల్లోంచే ఇలా హడావిడిగా సినిమాలను ప్రకటిస్తుంటారు కొందరు. మరి.. ప్రకటించిన సినిమాలన్నీ తెరకొస్తాయా? కేవలం క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనే కాకుండా ఆ సంఘటనలకు న్యాయం చేసే విధంగా ఈ సినిమాలు రూపొందుతాయా? వేచి చూడాలి. లాక్డౌన్, కరోనా టైటిళ్లతో.. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్డౌన్ ద్వారా ప్రపంచం స్తంభించిపోయింది. పనులన్నీ ఆగిపోయాయి. వలస కూలీలు పొట్ట చేత పట్టుకొని వందల మైళ్లు ప్రయాణించారు. సామాన్యులు చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కథలు కనబడ్డాయి మన దర్శక – నిర్మాతలకు. లాక్డౌన్ బ్యాక్‌డ్రాప్ లో పలు సినిమాలను ప్రకటించారు. కన్నడ దర్శకుడు గురు ప్రసాద్ ‘లాక్డౌన్’ అనే టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించారు. లాక్డౌన్ బ్యాక్‌డ్రాప్ లో ఓ క్రైమ్ కామెడీ కథను రెడీ చేస్తున్నారట. అలాగే ‘కరోనా’ అనే టైటిల్‌ను ఉమేష్ బంకర్ అనే కన్నడ దర్శకుడు రిజిస్టర్ చేసుకున్నారు. కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ‘కరోనా ప్యార్ హై’ (‘కహోనా ప్యార్ హై’కి పేరడీగా) అనే టైటిల్‌ను నమోదు చేసుకున్నారు. ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్ కూడా హిందీలో నమోదు అయినట్టు సమాచారం. మరో వైపు లాక్ డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక చిక్కుకుపోయిన కొంతమంది విద్యార్థుల కథతో ‘21 డేస్’ అనే చిత్రాన్ని ప్రకటించారు తమిళ దర్శకుడు విజయ్ భాస్కర్. హిందీ వైపు వస్తే... సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా, కేతన్ మెహతా, సుభాష్ కపూర్ లతో కలసి అనుభవ్ సిన్హా ఓ ఆంథాలజీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదుగురు దర్శకులు ఐదు కథలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని కథలు కరోనా బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అనుభవ్ సిన్హా తెలిపారు. ఈ సినిమాను ఆయనే నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ గాంధీ ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ చిత్రం వైరస్, లాక్ డౌన్ చుట్టూ తిరుగుతుందని తెలిపారు. -
అభినందన్ నన్ను మెచ్చుకున్నారు: పాక్ వ్యక్తి
ఇస్లామాబాద్: తాను చేసిన టీ తాగి.. భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ తనను ప్రశంసించారని పాకిస్తాన్‌కు చెందిన అన్వర్ అలీ అన్నాడు. రుచికరమైన టీ ఇచ్చినందుకు తనకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొన్నాడు. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అభినందన్ నుంచి భారత సైన్యానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ముఖం నిండా రక్తంతో ఉన్న అభినందన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అంతర్జాతీయంగా.. చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో పాక్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో అభినందన్ టీ తాగుతూ.. కాస్త ప్రశాంతమైన వదనంతో కనిపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.(పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ) కాగా ఇదంతా జరిగి గురువారం నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరు.. అభినందన్‌కు టీ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న అన్వర్ అలీతో మాట్లాడాడు. ‘‘శత్రుసైన్యానికి చెందిన పైలట్’’కు మర్యాద చేయడాన్ని ఎలా భావిస్తున్నారని సదరు జర్నలిస్టు అతడి అడుగగా... ‘‘ ఆయన మా అతిథి. టీ తాగి బాగుందని చెప్పారు’’అని పేర్కొన్నాడు. అభినందన్‌కు ఆనాడు అందించిన కప్, సాసర్ను ఈ సందర్భంగా అందరికీ చూపించాడు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ భూభాగంలో దిగిన ఆయన.. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. This gentleman Anwar Ali made tea for Indian Air Force Pilot Wing Commander #abhinandan he told me “woh mehman tha” no bad words pic.twitter.com/KNby8Q2XpQ — Hamid Mir (@HamidMirPAK) February 26, 2020 -
అభినందన్ రాఫెల్‌తో కౌంటర్ ఇచ్చుంటే..!
ముంబై: భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతరం పాక్‌పై దాడికి అభినందన్ వర్ధమాన్ వెళ్లిన సమయంలో మనం వాడిన యుద్ధ విమానం మిగ్ -21. అయితే ఆ రోజు అభినందన్ దాని స్థానంలో రాఫెల్ యుద్ధ విమానంలో వెళ్లి కౌంటర్ ఇచ్చి ఉంటే పరస్థితి మరోలా ఉండేదని అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. చదవండి: అభినందన్ మనోధైర్యానికి మరో గుర్తింపు ఆ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాల్లో మిగ్-21పై దాడి చేయడంతో అది కూలిపోయి వింగ్ కమాండర్ అభినందన్ శత్రు దేశానికి చిక్కాడం తెలిసిందే. అదే ఎఫ్-16 కన్నా శక్తిమంతమైన రాఫెల్ మన చేతిలో ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరడం శుభపరిణామమని, రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందని బీఎస్ ధనోవా పేర్కొన్నారు. చదవండి: ఆ జాబితాలో అభినందన్, సారా అలీఖాన్! ఆ సమయానికి భారత్ చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడానికి కారణమెవరంటూ ధనోవా పరోక్షంగా రాజకీయ పార్టీలనుద్దేశించి విమర్శలు చేశారు. నాడు అభినందన్ వర్థమాన్ రాఫెల్లో వెళ్లకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఏ యుద్ధ విమానాన్ని కొనాలన్నది నిర్ణయించడానికి 10 సంవత్సరాల టైం తీసుకున్నారంటూ గతంలో అధికారంలో ఉన్న పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గూగుల్ ట్రెండింగ్.. ‘కబీర్‌సింగ్’ ఈజ్ కింగ్
సాక్షి, హైదరాబాద్: 2019లో ఇండియన్ నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిలో నగరవాసి, టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి రూపొందించిన కబీర్‌సింగ్ చిత్రం దుమ్మురేపింది. హీరో విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా మార్చిన అర్జున్‌రెడ్డి సినిమా బాలీవుడ్లో కబీర్‌సింగ్‌గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌కపూర్, అతడికి జంటగా కియారా అద్వానీ నటించిన ఈ చిత్రానికి కూడా సందీప్రెడ్డియే దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా.. తాజాగా దేశంలోనే గూగుల్‌లో ట్రెండింగ్ అయిన వాటిల్లో ఓవరాల్‌గా టాప్–5లో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్ టాప్‌లో క్రికెట్ కప్.. అత్యధికంగా నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ వరల్డ్ కప్ తొలి ప్లేస్‌లో నిలిచింది. దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికలు రెండో స్థానంలో, చంద్రయాన్–2 అంతరిక్ష ప్రయోగం 3వ స్థానం దక్కించుకోగా కబీర్ సింగ్ సినిమా 4వ స్థానాన్ని, ఎవెంజర్స్ ది ఎండ్‌గేమ్ 5వ స్థానాన్ని అందుకున్నాయి. నృత్యం, అందం కోసం అన్వేషణ.. నగరాల్లో డ్యాన్స్ క్లాసెస్‌పై పెరుగుతున్న ఆసక్తికి గూగుల్ ట్రెండింగ్ జాబితా అద్దం పట్టింది. ఈ ఏడాది తమకు దగ్గర్లో ఉన్న వాటి గురించి నెటిజన్లు జరిపిన అన్వేషణలో నృత్య శిక్షణ తరగతులు మొదటి స్థానంలో ఉన్నాయి. అందాన్ని తీర్చిదిద్దే సెలూన్ల వెదుకులాట రెండో స్థానాన్ని ఆక్రమించగా.. ఆహార్యాన్ని మెరిపించే కాస్ట్యూమ్స్ (దుస్తులు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మొబైల్ ఫోన్లు 4వ స్థానంలో, చీరల షాపులు 5వ స్థానంలో నిలిచాయి. సినిమాల్లో కబీర్‌సింగ్ టాప్.. నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రాల్లో తెలుగు దర్శకుడు రూపొందించిన కబీర్‌సింగ్ చిత్రం ఈ ఏటి మేటి సెర్చ్‌గా ప్రథమస్థానం అందుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్ ఎండ్‌గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, సూపర్ 30 నిలిచాయి. పాటల్లో.. లే ఫొటో లే.. నెటిజన్లు ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన పాటల్లో రాజు రావల్, మహీందర్ చౌదరిలు పాడిన ఆల్బమ్ సాంగ్ ‘లే ఫొటో లే’తొలిస్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హిమేశ్ రేష్మియా పాడిన తెరీ మేరీ కహానీ, మోస్ట్ వాంటెడ్ ఆల్బమ్ కోసం బిందా అజులా, బాబీ లాయల్లు పాడిన తేరీ ప్యారీ ప్యారీ దో అఖియా, ధ్వని భన్సాలి, నిఖిల్ డిసౌజాలు పాడిన వాస్తే ఆల్బమ్‌లోని వాస్తే టైటిల్ సాంగ్, లూకా చుప్పి సినిమాలోని టోని కక్కర్ పాడిన కోకోకోలా తూ.. ఉన్నాయి. క్రికెట్‌కే కిరీటం.. సహజంగానే క్రీడా పోటీలకు సంబంధించిన అన్వేషణలో క్రికెట్ వరల్డ్ కప్ నంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది. ఇక ప్రో కబడ్డీ లీగ్, వింబుల్డన్, కోపా అమెరికా, ఆస్ట్రేలియన్ ఓపెన్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫలితాల వార్తలకే ప్రథమ తాంబూలం.. తాము తెలుసుకోవాలనుకున్న వార్తలకు సంబంధించి నెటిజన్లు అత్యధికంగా అన్వేషించిన వాటిలో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వార్తలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో.. చంద్రయాన్ 2, ఆర్టికల్ 370, ప్రధానమంత్రి కిసాన్ యోజన, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. అభినందన్‌కి అగ్రస్థానం.. వ్యక్తుల గురిం చి నెటిజన్ల అన్వేషణలో పాక్ ముష్కరుల చేతికి చిక్కి క్షేమంగా విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ప్రముఖ సినీగాయని లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, సూపర్ 30 కోచింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఉచిత బోధన చేస్తూ, హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 బయోపిక్కు నేపథ్య కథానాయకుడిగా మారిన ఆనంద్‌కుమార్ 4వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ సంచలన యువ నటుడు విక్కీ కౌశల్ (యురి సినిమా ఫేమ్) 5వ స్థానం దక్కించుకున్నాడు. ఆర్టికల్ 370 ఏమిటి? కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి? అనేది తెలుసుకోవాలని నెటిజన్లు బాగా ఆసక్తి చూపించారు. ఈ ఏడాది వాట్ ఈజ్... అంటూ నెటిజన్లు సెర్చ్ చేసిన వాటిల్లో ఆర్టికల్ 370 టాప్ ప్లేస్‌లో ఉంది. ఎన్నికల్లో పోలింగ్ అయిన వెంటనే వచ్చే ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటో తెలుసుకోవాలనే అంశం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బ్లాక్‌హోల్, హౌడీ మోడీ, ఈ–సిగరెట్లు ఉన్నాయి. ఎలా ఓటు వేయాలి..? తెలియని పనులు ఎలా చేయాలో తెలుసుకోవడం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన నెటిజన్లలో అత్యధికులు ‘హౌ టు ఓట్’అంటూ అన్వేషించారు. ఆ తర్వాత క్రమంలో వరుసగా ఆధార్‌ను పాన్‌కార్డ్‌కి ఎలా లింక్ చేయాలి? ఓటర్ జాబితాలో నా పేరు ఎలా చెక్ చేసుకోవాలి? నీట్ పరీక్ష ఫలితం ఎలా తెలుసుకోవాలి? ట్రాయ్ ప్రకారం చానల్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వంటివి ఉన్నాయి. -
పాకిస్తానీయులు ఎక్కువగా వెతికింది వీరి కోసమే!
ఇస్లామాబాద్: ఈ ఏడాదిగానూ పాకిస్తానీయులు గూగుల్‌లో అత్యధికంగా వెదికిన వ్యక్తుల జాబితాలో భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌లు టాప్-10లో నిలిచారు. పాకిస్తాన్లో అత్యధిక మంది వీరికి సంబంధించిన సమాచారం గురించే వెదికినట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. అదే విధంగా ఇండియన్ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్- 13, మోటూ పాట్లూ షోపై కూడా వారు అత్యంత ఆసక్తిని కనబరిచారని వెల్లడించింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ విమానాన్ని వెంబడిస్తూ అక్కడి భూభాగంలో దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేసినా రహస్య సమాచారం వారికి ఇవ్వకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత్‌తో పాటు పాక్ మీడియా కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఇక సారా అలీఖాన్.. పటౌడీ వంశ వారసురాలు, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సారా.. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు పొందారు. అదే విధంగా వివిధ కార్యక్రమాల్లో తన కట్టూబొట్టుతో ఫ్యాషన్ ఐకాన్‌గా యువతలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ నంబర్.1’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా భారతీయులు ఆర్టికల్ 370, అయోధ్య కేసు, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి తదితర అంశాల గురించి అత్యధికంగా వెదికినట్లు గూగుల్ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే.(మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?) -
పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
కరాచీ: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘అభినందన్ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నప్పుడు పాక్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కరాచీ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
ఇస్లామాబాద్ : బాలాకోట్ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్ వైమానిక దళ కేంద్ర స్థానమైన కరాచీలోని మ్యూజియంలో పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పాక్ జర్నలిస్టు అన్వర్ లోధీ శనివారం అర్ధరాత్రి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభినందన్ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్ వెల్లడించలేదు. అంతేకాక, అభినందన్ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించారు. -
అభినందన్ మనోధైర్యానికి మరో గుర్తింపు
న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత, ప్రతీకార ధోరణిలో పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న భారత్‌పై వాయుదాడులకు ప్రయత్నించినప్పుడు ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కుప్పకూల్చడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ టీమ్ మొత్తానికి 51వ స్క్వాడ్రన్‌కు యూనిట్ సైటేషన్ అవార్డు దక్కింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అక్టోబర్ 8న జరిగే ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా అవార్డును అందించనున్నారు. పాక్ విమానాల సమాచారాన్ని ముందుగానే గ్రహించి భారత వాయుసేన బృందాన్ని అప్రమత్తం చేసిన మింటీ అగర్వాల్ నాయకత్వంలోని 601 సిగ్నల్ యూనిట్‌కి కూడా ఈ అవార్డు అందించనున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు అతనిపై దేశరహస్యాల కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అభినందన్ వాటిని బయటపెట్టలేదు. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ, ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ను వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని కూడా అందజేశారు. -
గగనతలంలో అరుదైన ఘట్టం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ 21 సోర్టీ యుద్ధవిమానాన్ని చివరిసారిగా నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. అంతేకాదు.. ఈ విహారానికో ప్రత్యేకత ఉంది. గతంలో అభినందన్ తండ్రి సింహకుట్టి వర్థమాన్‌తో కలిసి ధనోవా యుద్ధవిమానాన్ని నడిపించారు. ఎయిర్ మార్షల్‌గా సింహకుట్టి రిటైరయ్యారు. ఆయన కొడుకు అయిన అభినందన్ భారత వైమానిక దళంలో పనిచేస్తుండటమే కాదు.. గత ఫిబ్రవరిలో గగనతలంలో పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరి వైమానిక పోరులో దాయాదికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వీరోచితంగా కూల్చేసిన సంగతి తెలిసిందే. దాయాదితో వీరోచిత పోరులో అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన అభినందన్‌తో కలిసి మిగ్ 21 యుద్ధవిమానాన్ని నడిపించిన ధనోవా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభినందన్‌తో తనకు పలు విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని, అందుకే అతనితో కలిసి చివరిసారిగా యుద్ధవిమానాన్ని నడిపించానని తెలిపారు. తాము ఇద్దరం కూలిపోతున్న యుద్ధవిమానం నుంచి తప్పించుకొని కిందకు దిగామని, అదేవిధంగా పాకిస్థానీలతో పోరాడామని ధనోవా వివరించారు. ఇక, అభినందన్ తండ్రి సింహకుట్టితో కలిసి తాను గతంలో యుద్ధ విమానం నడిపించానని, ఇప్పుడు ఆయన కొడుకుతో కలిసి యుద్ధ విమానం నడిపించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. -
విధుల్లో చేరిన వింగ్ కమాండర్ అభినందన్
-
భారతీయుడిగా అది నా బాధ్యత
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ ఎయిర్‌పోర్స్ బృందం అరెస్టు చేయడం, తర్వాత పాకిస్తాన్ అతన్ని విడిచిపెట్టేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. ఫైనల్‌గా అభినందన్ తిరిగి భారత్‌కు రావడం.. ఇలా అన్ని విషయాలను దేశ ప్రజలు చాలా ఆసక్తితో గమనించారు. ఇప్పుడు ఈ విషయాలనే వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ‘‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగం నాకు అనుమతులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడిగా, దేశ భక్తుడిగా, మన ఆర్మీ బలగాల సమర్థతను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పుల్వామా ఎటాక్స్, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ ఘటనలకు చెందిన వార్తలను నేను ఫాలో అవుతూనే ఉన్నాను. తమ ఆర్మీ, ఇంటెలిజెన్సీ ఇండస్ట్రీస్, పొలిటికల్ లీడర్స్ గురించి హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ గొప్పగా చెప్పుకుంటారు. మనం ఎందుకు అలా చేయకూడదు? అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు వివేక్. ఈ చిత్రానికి ‘బాలాకోట్: ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. హిందీ, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. మరి.. ఈ సినిమాలో వివేక్ నటిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
అభినందన్ ఆకాశయానం..!
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విమానాలను నడపడం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలతో జరిగిన పోరులో వర్ధమాన్ నడుపుతున్న మిగ్–21 విమానం కూలిపోయి ఆయన గాయాలపాలై పాకిస్తాన్లో పడిపోవడం తెలిసిందే. తన విమానం కూలిపోవడానికి ముందే వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్లో పడిపోయినా ఎంతో ధైర్యం ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకున్నారు. ఇటీవలే కేంద్రం ఆయనకు వీరచక్ర అవార్డును కూడా ప్రకటించింది. మార్చి 1న రాత్రి వర్ధమాన్‌ను పాక్ భారత్‌కు అప్పగించాక, దాదాపు రెండు వారాలపాటు వర్ధమాన్ చికిత్స అందుకుంటూ భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్నారు. వారి విచారణను ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా మళ్లీ యుద్ధ విమానాన్ని నడపాలని తాను కోరుకుంటున్నట్లు అప్పట్లో వర్ధమాన్ చెప్పారు. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వర్ధమాన్‌కు వైద్య పరీక్షలన్నీ చేసి, ఆయన మళ్లీ విమానం నడిపేందుకు అన్ని రకాలుగా సిద్ధమేనని మూడు వారాల క్రితం వెల్లడించింది. దీంతో వర్ధమాన్ మళ్లీ యుద్ధ విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
‘పాక్ విమానాన్ని కూల్చడం నేను చూశాను’
న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడాన్ని తాను చూసినట్లు స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మింటీకి ‘యుద్ధ్ సేవా’ పతకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘అభినందన్ వర్ధమాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం నా స్క్రీన్ నుంచి చూశాను. ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాను. బాలాకోట్ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువులను నుంచి స్పందన వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. పాక్ దాడి చేస్తే.. తిప్పి కొట్టేందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్ ఫెయిలైంది’ అని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16ను అభినందన్ తన మిగ్ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్ కూడా కూలిపోవడంతో అభినందన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్ సైనికులకు అప్పగించారు. మూడు రోజుల తర్వాత పాక్ అభినందన్‌ను విడిచిపెట్టింది. దాయది చెరలో ఉన్నప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ వర్ధమాన్‌కు కేంద్రం ‘వీర్ చక్ర’ ప్రకటించారు. -
అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్‌లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్‌కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్‌గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్‌కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
అభినందన్‌కు వీర్‌చక్ర.. లేడీ స్క్వాడ్రన్‌కు మెడల్
న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వర్ధమాన్‌కు కేంద్ర ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రదానం చేయనుంది. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలోకి చొరబడిన పాక్ F16 యుద్ధవిమానాన్ని మిగ్-21 ఫైటర్‌జెట్‌తో అభినందన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో అతని మిగ్ 21 ఫైటర్ జెట్ కూలిపోయింది. దీంతో తమ భూభాగంలో ల్యాండ్ అయిన వర్థమాన్‌ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే, భారత్ తీసుకొచ్చిన దౌత్య ఒత్తిడితో మార్చి 1వ ఆయనను తేదీన విడుదలచేసింది. శత్రుచెరలో 60 గంటలు గడిపి.. దాయాది సైన్యం ఎంత ఒత్తిడిచేసినా సైనిక రహస్యాల గుట్టువిప్పకుండా... సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన వర్థమాన్‌పై ప్రశంసల జల్లుకురిసింది. అతడి వీరత్వానికి గుర్తింపుగా కేంద్రప్రభుత్వం వీరచక్రతో సత్కరించింది. జవాన్లకిచ్చే పరమవీరచక్ర, మహావీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. ఇక, భారత ఆర్మీకి చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్‌కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం దక్కింది. ఇక భారత సైన్యానికి ఎనిమిది శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేన మెడళ్లు (గాలంట్రీ), నాలుగు మెన్షన్ ఇన్ డిస్పాచెస్ దక్కాయి. ఇక, భారత వాయుసేనకు ఐదు యోధ సేవ మెడళ్లు, ఏడు వాయుసేన మెడళ్లు వచ్చాయి. ఈ మెడళ్లు సాధించిన వారిలో బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన మిరాజ్ ఫైటర్ పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 13మందికి ఈ మెడళ్లు దక్కగా.. అందులో 12మంది ఫైటర్ ఫైలట్లు కాగా, ఒకరు లేడీ స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్. భూతలంలో ఫ్లయిట్ కంట్రోలర్‌గా ఉన్న ఆమె.. బాలాకోట్ దాడుల అనంతరం గగనతలంలో పాక్ ఫైటర్ జెట్ దాడులను భారత పైలట్లు తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకుగాను ఆమెను యోధ సేవ మెడల్ వరించింది. -
పైలట్ అభినందన్‌కు అత్యున్నత పురస్కారం?
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్-21 బిసన్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్‌ను బహూకరించనుంది. పాక్ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్-21 బిసన్ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్ యాడ్‌కు దిమ్మతిరిగే కౌంటర్..!
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక దాయాదుల పోరు నేపథ్యంలో అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు ‘సమరమే ’ అంటూ రంగంలోకి దిగుతారు. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇండియన్ హీరో, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అవమానిస్తూ పాకిస్తాన్‌కు చెందిన జాజ్టీవీ ఓ యాడ్ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘వీ సెవెన్ పిక్చర్స్’ యూట్యూబ్ ఛానెల్ పాకిస్తాన్ యాడ్‌కు కౌంటర్‌గా ఓ వీడియో రూపొందించి శభాష్ అనిపించుకుంది. (వైరల్ : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్..!) వీడియో ప్రకారం.. ఓ సెలూన్ షాప్‌లో షేవింగ్ చేసుకుని టీమిండియా ఆటగాడొకరు టీవీలో యువరాజ్‌సింగ్ ఆటను ఆస్వాదిస్తుంటాడు. కొందరు ఆటగాళ్లని మర్చిపోలేం అంటాడు. అంతలోనే పాక్ ఆటగాడొకరు లోనికి వస్తాడు. అతనివైపు చూసి మరికొందరినీ మర్చిపోవాలి అనుకుంటాం అంటాడు. ఇండియన్ ఆటగాడికి ఫాదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పిన పాక్ ఆటగాడు.. చేతి రుమాలుని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఓడిపోయిన తర్వాత ముఖం దాచుకోవడానికి ఈ కర్చీఫ్ ఉపయోగపడుతుంది డాడీ అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు. అనంతరం హెయిర్ స్టైలిస్ట్‌ని షేవ్ చేయమంటాడు. పాక్ ఆటగాడి వెకిలి చేష్టలతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఇండియన్ క్రికెటర్, హెయిర్ స్టైలిస్ట్ వైపు చూసి ఓ సైగ చేస్తాడు. (చదవండి : ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!) దాంతో పాక్ ఆటగాడి కళ్లపై దోసకాయ ముక్కల్ని పెట్టి.. షేవింగ్ కానిచ్చేస్తాడు. ఆఫ్రిదిలా ఉన్నానా..? అంటూ పాక్ ఆటగాడు ఆనందంతో అడుగుతాడు. అద్దంలో ముఖం చూసుకుని బిత్తరపోతాడు. తను చెప్పిన విధంగా కాకుండా.. అభినందన్ గన్స్లింగర్ మీసంతో షేవ్ చేశావేంటని ప్రశ్నిస్తాడు. అది మా నేషనల్ హీరో అభినందన్ స్టైల్ అంటాడు హెయిర్ స్టైలిస్ట్. ఇప్పుడు బయటికి వెళ్లడం ఎలా అని పరేషాన్ అవుతున్న పాక్ ఆటగాడికి కర్చీఫ్ ఇచ్చి ఇప్పుడు మఖం దాచుకోపో అంటాడు టీమిండియా ఆటగాడు. బిడ్డకు ఏం కావాలో తండ్రికి తెలుసు.. మీకు ప్రపంచకప్ అవసరం లేదు, అభినందన్ టీకప్పు చాలు అని అర్థం అయింది అంటాడు టీమిండియా ఆటగాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా భారత్ పాక్ వన్డే మ్యాచ్ ఆదివారం మాంచెస్టర్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. -
పాక్ మీకు కావాల్సిన కప్ ఇదే : పూనమ్ ఫైర్
ముంబై : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను అవమానిస్తూ పాక్ మీడియా రూపొందించిన యాడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పటికే ఈ యాడ్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత టెన్నిస్ స్టార్, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జా సైతం మండిపడింది. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని చివాట్లుపెట్టింది. ఇక తాజాగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఈ యాడ్‌పై తీవ్రంగా మండిపడింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ‘నిన్ననే నా వాట్సాప్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన ఈ యాడ్‌ను చూశాను. ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాకిస్తాన్ ఇది మంచిది కాదు. ఈ యాడ్‌పై నా సమాధానం ఏంటంటే? టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్( తన లోదుస్తులు చూపిస్తూ) డబుల్ కప్’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక పూనమ్ చర్యపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమె చేసిన పనిని మెచ్చుకోగా మరికొందరు తప్పుబడుతున్నారు. (వైరల్ : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్..!) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దాదాపు 60 గంటల పాటు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గన్స్లింగర్ మీసంతో ఉండే అభినందన్ ఆహార్యం అందరికీ సుపరిచితమే. అయితే అతని ఆహర్యంతో ఉన్న వ్యక్తితో భారత వ్యూహాలపై వ్యంగ్యమైన ప్రకటన పాక్‌కు చెందిన జాజ్ టీవీ చానెల్ రూపొందించింది. ఆ యాడ్‌లో పాక్ వర్గాలు మీ ఎత్తుగడలేంటని అడిగితే ఆ వ్యక్తి ‘క్షమించాలి. నేను ఆ విషయాలు చెప్పదల్చుకోలేదు’ అని ముందుకు కదలగా అతని చేతిలోని టీకప్పును లాక్కుంటారు. ఈ యాడ్ ప్రతి భారతీయుడికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ చరిత్రలో పాక్‌పై భారత్ ఓడి సందర్భాలు లేవు. ప్రస్తుత జట్ల బలబలగాలను గమనిస్తే పాక్ కన్నా భారత జట్టే అభేద్యంగా కనిపిస్తోంది. -
వైరల్ : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్..!
న్యూఢిల్లీ : అసలే అది పాకిస్తాన్.. ఆపై ఓ మ్యాచ్ గెలిచింది.. వర్షం కారణంగా ఆట రద్దవడంతో మరో పాయింట్ కూడా ఖాతాలో పడింది. ఇంకేముంది కప్పుపై కన్నేసింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చేతిలో నుంచి టీకప్పు లాక్కెళ్లిపోయింది. అవును ఇది నిజం. దానికి సంబంధించిన విశేషాలు..! ప్రపంచకప్‌లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య వచ్చే ఆదివారం (జూన్ 16) మ్యాచ్ జరుగనుంది. అయితే, పాక్ చేతిలో టీమిండియా ఓటమి ఖాయమన్న తీరులో జాజ్ టీవీ ఓ యాడ్ రూపొందించి విమర్శలపాలైంది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దాదాపు 60 గంటల పాటు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గన్స్లింగర్ మీసంతో ఉండే అభినందన్ ఆహార్యం అందరికీ సుపరిచితమే. ఇక 33 సెకండ్ల నిడివి గల యాడ్‌లోని అంశాలు.. ‘అభినందన్ వేషధారణతో, టీమిండియా జెర్సీతో ఓ వ్యక్తి విచారణ గదిలో ఉంటాడు. మీ జట్టు టాస్ గెలిస్తే ఏం చేస్తుంది..ఐయామ్ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి బదులిస్తాడు. పైనల్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారు అని మళ్లీ ప్రశ్నిస్తారు. ఐయామ్ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి అంటాడు. చివరలో టీ ఎలా ఉంది అనే ప్రశ్నకు.. చాలా బాగుంది అంటాడు. ఇక నువ్ వెళ్లొచ్చు అనగానే.. అక్కడ నుంచి ముందుకు కదులుతాడు. అంతలోనే... కప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.. అని చేతిలో నుంచి లాక్కుంటారు’. ఇదిలాఉండగా.. జాజ్ టీవీ అత్యుత్సాహంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని టీ కప్పులు కావాలో తీస్కోండి అని చురకలంటిస్తున్నారు. వచ్చే ప్రపంకప్‌నకు సంబంధించి కూడా మరిన్ని కప్పులు కావాలంటే తీస్కోండని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. (చదవండి : వాళ్లతోనే కలిసి ఉంటా; అభినందన్ అంకిత భావం) Jazz TV advt on #CWC19 takes the Indo-Pak air duel to new level. It uses the air duel over Nowshera and Wing Co Abhinandan Varthaman's issue as a prop. @IAF_MCC @thetribunechd @SpokespersonMoD @DefenceMinIndia pic.twitter.com/30v4H6MOpU — Ajay Banerjee (@ajaynewsman) June 11, 2019 -
పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చా
పటన్/జైపూర్: పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీనే గెలిపించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా అదే పెద్ద చర్చకు దారి తీస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పటన్, రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు. బాలాకోట్ దాడి అనంతరం పాక్ ప్రతీకార యత్నం, ఆ దేశ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసే క్రమంలో అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడటం, ఆ తర్వాత విడుదలైన తీరును ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అభినందన్ శత్రుదేశానికి పట్టుబడటంపై ప్రతిపక్షాలు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రధాని పదవి ఉన్నా పోయినా ఒకటే. అయితే నేనైనా ఉండాలి లేదా ఉగ్రవాదులైనా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే, మీడియా సమావేశం పెట్టి, మా పైలట్‌కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని, ఆ తర్వాత మోదీ ఏం చేశాడో మీరు ప్రపంచానికి చెప్పుకోవాల్సి ఉంటుందని పాక్‌ను హెచ్చరించా. ‘పాక్‌పై దాడి చేసేందుకు మోదీ వద్ద 12 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. దాడి జరిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అంటూ ఆ మరునాడే అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. దీంతో దిగివచ్చిన పాక్, అభినందన్‌ను వెనక్కి పంపుతున్నట్లు ప్రకటించింది. లేకుంటే పాక్‌కు ఆ రాత్రి కాళరాత్రే అయి ఉండేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘పుల్వామా ఘటన అనంతరం ప్రజలు మోదీ నుంచి ఏం ఆశించారు? ముంబై ఉగ్రదాడుల తర్వాత మన్మోహన్సింగ్ మాదిరిగా వ్యవహరించి ఉంటే దేశం నన్ను క్షమించేదా? అందుకే సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా. పాకిస్తాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ, హనుమాన్ భక్తుల్లాగా మన వాళ్లు బాలాకోట్‌పై విరుచుకుపడి, వాళ్ల అంతు చూశారు’ అని తెలిపారు. బాలాకోట్ దాడి ప్రతిపక్షాలకు అసౌకర్యంగా మారిందన్న ప్రధాని..భారత్ తమపై దాడి చేసిందంటూ పాక్ పదేపదే చెబుతుంటే మన ప్రతిపక్షాలు కూడా బాలాకోట్ భారత్‌లోనే ఉందన్నట్టుగా ఆధారాలు చూపాలంటూ గగ్గోలు పెట్టాయని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడు ఎలా స్పందిస్తారోనని తనకు భయంగా ఉందన్న ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘రేపు మోదీ ఏం చేస్తాడో శరద్ పవార్‌కే తెలియనప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలా తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. శరద్‌పవార్ తనకు రాజకీయ గురువు అని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. కమలంతో ఉగ్రవాదం అంతం ‘కష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు తోడుగా ఉంటాం. వారికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధం’ అని ప్రకటించారు. ‘మీరు పోలింగ్ బూత్‌కు వెళ్లి, కమలం(బీజేపీ ఎన్నికల చిహ్నం) గుర్తు మీట నొక్కేటప్పుడు.. అది ఉగ్రవాదాన్ని అంతం చేసే మీట అని గుర్తుంచుకోండి. మీ వేలికి అంతటి శక్తి ఉంది. మీరు మీట నొక్కడం ద్వారా ఉగ్రవాదంపై పోరాడాలన్న నా సంకల్పం బలపడుతుంది’ అని అన్నారు. అన్ని సీట్లూ నాకే ఇవ్వండి బీజేపీని గెలిపించాలని గుజరాత్ ప్రజలను కోరిన ప్రధాని.. ‘ఈ గడ్డపై పుట్టిన బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం నా సొంత రాష్ట్రం ప్రజల ధర్మం. రాష్ట్రంలోని 26 లోక్‌సభ స్థానాలను నాకు ఇవ్వండి. మీ సహకారంతో నా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ మీరు బీజేపీకి 26 సీట్లు ఇవ్వకుంటే ఎందుకలా జరిగిందంటూ మే 23వ తేదీ(ఎన్నికల ఫలితాల రోజు)న టీవీల్లో చర్చలు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అభిమానులు బహూకరించిన తన చిత్తరువుతో ప్రధాని మోదీ -
తిరిగి విధుల్లోకి అభినందన్!?
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే గతంలో ఆయన పనిచేసిన శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో కాకుండా మరో చోట పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు... ‘ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్‌కు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాం. పాక్ సరిహద్దులోని ఓ ఎయిర్‌బేస్‌లో తను విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే అది శ్రీనగర్లోనా.. మరే ఇతర చోటా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అతడు తన విధుల్లో చేరతాడు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు. -
అభినందన్ నిజంగా ఓటేశారా!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా బయటకు వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారంటూ ఓ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. బీజేపీకి మద్దతు తెలియజేస్తున్న ఫేస్బుక్ పేజీలు, గ్రూపులు ఈ పోస్ట్‌ను తెగ షేర్ చేస్తున్నాయి. షేర్ చేయాల్సిందిగా మిత్రులను కోరుతున్నాయి. (చదవండి: ఇదొక నకిలీ వార్తల ఫ్యాక్టరీ!) ‘వింగ్ కమాండర్ అభినందన్ బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేయడం కోసం ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. మోదీకి మించిన మంచి ప్రధాని మరొకరు లేరన్నారు. మిత్రులారా! ఈ విషయం జిహాదీలు, కాంగ్రెసీలకు చేరే వరకు షేర్ చేయండి’ అన్న వ్యాఖ్యలతో వర్థమాన్‌ను కాస్త పోలిన వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు. మెడలో కమలం గుర్గు కలిగిన కాషాయ కండువాను ధరించిన ఆ ఫొటోలోని వ్యక్తికి అభినందన్‌కు ఒక్క మీషాల విషయంలోనే పోలిక ఎక్కువ ఉంది. భారత వైమానిక దళం తరఫున పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన అభినందన్ విమానాన్ని పాక్ సైనికులు కూల్చివేయడం, రెండు రోజుల నిర్బంధం అనంతర అభినందన్ హీరోలాగా దేశానికి తిరిగి రావడం తదితర పరిణామాలు తెల్సినవే. (చదవండి: ప్రచారం కోసం ఇంత అబద్ధమా!) పోలికల్లో తేడాలు 1. అభినందన్ వర్థమాన్ వయస్సుకన్నా ఆ ఫొటోలోని వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉంది. 2. ఫొటోలోకి వ్యక్తి బుగ్గల కింద, మీసాలపైన ముడతలు ఉన్నాయి. వయస్సు రీత్యా, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అలాంటి ముడతలు వస్తాయి. అభినందన్‌కు వృత్తిరీత్యా వ్యాయామం ఉంటుంది కనుక అలాంటి ముడతలు లేవు. 3. ఫొటోలోని వ్యక్తి భుజాలు జారీ పోయినట్లుగా ఉన్నాయి. అభినందన్ భుజాలు అలా లేవు. 4. ఫొటోలోని వ్యక్తి మెడపైన ముడతలు ఉన్నాయి. అభినందన్‌కు లేవు. పైగా అభినందన్ మెడ పొడుగ్గా ఉంటుంది. 5. ఫొటోలోని వ్యక్తి ముక్కు కొద్దిగా లావుగా కూడా ఉంది. 6. అన్నింటికంటే అభినందన్ పెదవుల కింద పుట్టుమచ్చ ఉంది. ఫొటోలోని వ్యక్తికి కుడికన్ను దిగువున పుట్టుమచ్చ ఉంది. అభినందన్‌కు లేదు. 7. కళ్లను చూసి మనిషిని ఇట్టే గుర్తు పట్టవచ్చ. అందుకని కళ్లు కనపడకుండా ఫొటోలోని వ్యక్తికి కళ్లజోడు టోపీ పెట్టి మనల్ని బురడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. భారత వైమానిక దళంలో ఉన్న వాళ్లు సాధారణంగా విధుల్లో ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారు. అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయన ఓటు హక్కు ఉంటే తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో ఇంతవరకు పోలింగే జరగలేదు. ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. వర్ధమాన్ ఒక్కరి కోసం పోలింగ్ నిర్వహించారా? (చదవండి: మార్ఫింగ్ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం) 1969, ఎయిర్స్ ఫోర్స్ రూల్స్ 1969 నాటి వైమానిక దళం నిబంధనల ప్రకారం ‘ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకారాదు. వాటిని ఉద్దేశించి ప్రసంగించరాదు. అసలు రాజకీయ కార్యకలాపాలతోనే ప్రమేయం ఉండరాదు. ఉద్యమాల్లోను పాల్గొనరాదు. సహాయం చేయరాదు. ఓటర్లను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు’ ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపైన శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయి. అంటే అభినందన్ ఉద్యోగానికి ఎసరు తీసుకరావడం కోసమే బీజేపీ వర్గాలు ఈ నకిలీ వార్తను సృష్టించాయా? -
మరోసారి అంకిత భావం చాటుకున్న అభినందన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ మరోసారి దేశ సేవ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. నాలుగు వారాల పాటు సెలవులు లభించినప్పటికీ ఇంట్లో గడపకుండా తన స్క్వాడ్రాన్‌తో కలిసి ఉండటానికే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన శ్రీనగర్‌లోని వాయుదళం చెంతకు చేరుకున్నట్లు సమాచారం. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు.(చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభినందన్‌కు వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాల పాటు వైద్య పరీక్షలన్నీ పూర్తైన అనంతరం 12 రోజుల క్రితం ఆయనకు సెలవు ఇచ్చారు. ఈ క్రమంలో కుటుంబంతో గడిపేందుకు అభినందన్ చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే చెన్నైకి వెళ్లకుండా తన స్క్వాడ్రాన్, మిషన్లతో కలిసి పనిచేయడమే తనకు ఇష్టమని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.(చదవండి : ‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’) కాగా ప్రస్తుతం అభినందన్ అభీష్టం ప్రకారం ఆయన శ్రీనగర్ చేరుకున్నప్పటికీ నాలుగు వారాల సిక్ పీరియడ్ పూర్తైన తర్వాత మెడికల్ బోర్డు ఆయనకు మరోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. వీటి ఫలితంపైనే అభినందన్ యుద్ధ విమానాన్ని నడపగలరా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది.(పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!) -
అభినందన్‌కు డీబ్రీఫింగ్, కొద్దికాలం విశ్రాంతి
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు. వీటిలో ముఖ్యంగా సైనికుడి మానసిక పరిస్థితులను విశ్లేషిస్తారు.) పూర్తయింది. కొంతకాలం పాటు అభినందన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఆయనకు గత కొద్దికాలంగా వైద్యపరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ...కొద్దిరోజుల క్రితం సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగింది. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించి ఓ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. అప్పుడు కొందరు పాకిస్తాన్ ప్రజలు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో అభినందన్ ప్రక్కటెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత పాక్ ఆర్మీ ఆయన్ని వారినుంచి రక్షించి యుద్ధ ఖైదీగా వెంట తీసుకెళ్లింది. అలా పాకిస్తాన్ ఆర్మీ చెరలో 60 గంటల పాటు ఉన్న అభినందన్ ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు. చదవండి : మానసికంగా వేధించారు -
ఫేస్బుక్ పోస్ట్..‘సీ విజిల్’ అలర్ట్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఎన్నికల నియమావళిని 2013 నుంచి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప చేశారు. కానీ తగిన యంత్రాంగం లేక సామాజిక మాధ్యమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫేస్‌బుక్‌పై కొరడా ఝుళిపించింది. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడి విడుదలయిన వైమానిక దళం పైలట్ అభినందన్‌తో బీజేపీ నేతలు ఉన్న రెండు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఈసీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. ఆ పోస్టర్లలో అభినందన్‌తో పాటు బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా, ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ తదితరులు ఉన్నారు. అభినందన్‌ను, మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిని మార్చి 1న ఫేస్బుక్లో షేర్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి చెందిన ‘సి విజిల్’ యాప్‌కు ఫిర్యాదు అందింది. పరిశీలించిన ఎన్నికల సంఘం సైనికుల ఫొటోలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం నియమావళికి విరుద్ధం కాబట్టి ఆ పోస్టర్లను ఉపసంహరించుకోవాలని ఫేస్బుక్ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాజకీయ ప్రచారం కోసం సాయుధ దళాల ఫొటోలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించినా కూడా చాలా పార్టీలు ముఖ్యంగా బీజేపీ బాలాకోట్ దాడి, అభినందన్ ఫొటోలను ఉపయోగించుకుంటోందని ద వైర్ పత్రిక పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అభినందన్ విడుదలను ప్రచారానికి ఉపయోగించుకుంటోందని తెలిపింది. -
సైనికుల ఫొటోలు వాడొద్దు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో సైనికుల ఫొటోలను ప్రదర్శించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్, బీజేపీ నాయకులతో కూడిన హోర్డింగ్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ హోర్డింగ్ ఎక్కడ ఏర్పాటుచేశారో తెలియరాలేదు. ప్రచార చిత్రాలు, హోర్డింగ్‌లలో సైనిక సిబ్బంది ఫొటోలు లేకుండా చూడాలని 2013లోనూ ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. సైనికుల ఫొటోలను రాజకీయ నాయకులు, పోటీచేస్తున్న అభ్యర్థులు వాడుకుంటున్నారని, ఈ పోకడను నియంత్రించేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అప్పట్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈసీని కోరింది. -
ఎఫ్16ను కూల్చింది అభినందనే
న్యూఢిల్లీ / వాషింగ్టన్: పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానే కూల్చివేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అభినందన్ పాక్ విమానాన్ని కూల్చడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ చెప్పారు. కూల్చడంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఎఫ్–16 ఫైటర్ జెట్లలో వాడే అమ్రామ్ క్షిపణి శకలాలను ఇప్పటికే మీడియా ముందు ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో సాక్ష్యాలను ఎందుకు చూపలేదు? భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ చెప్పడాన్ని రవీశ్ తప్పుపట్టారు. పాక్‌తో ఘర్షణ సమయంలో మనం ఒక మిగ్–21 బైసన్ యుద్ధవిమానాన్ని మాత్రమే కోల్పోయిందని, దాన్ని నడుపుతున్న అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారని చెప్పారు. నిజంగానే పాక్ మరో విమానాన్ని కూల్చివేస్తే, వారం రోజులైనా ఆ సాక్ష్యాలను అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ రెండో విమానం శకలాలు ఎక్కడున్నాయి? దాన్ని నడుపుతున్న పైలెట్లకు ఏమైంది? అనే విషయాలను పాక్ వెల్లడించాలన్నారు. పాక్‌లోనే ఉన్నాడని అందరికీ తెలుసు.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాక్‌లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సభ్యులకు తెలుసని రవీశ్ చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారకులైన జైషే ఉగ్రశిబిరాలు పాక్‌లో స్వేచ్ఛగా నడుస్తున్నాయన్న విషయం భద్రతామండలికి తెలుసని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంత పరిణామాలతో భారత్–పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్‌తో చర్చించారు. -
‘అభినందన్‌కు పరమవీరచక్ర అవార్డు ఇవ్వాలి’
చెన్నై : పాక్ చెరలో వేధింపులు ఎదుర్కొన్ని అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీరచక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని విశ్వాసం, సంయమనం పాటించిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో పాటు ప్రధాని దౌత్యపరమైన వ్యూహాలతో అభినందన్‌ను పాకిస్తాన్ విడుదల చేసిందని చెప్పారు. మాతృదేశం పట్ల అభినందన్ ప్రదర్శించిన విశ్వాసం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చెదరని సంకల్పం దేశవ్యాప్తంగా కోట్లాది హృదయాలను గెలుచుకుకుందని, పరమవీరచక్ర పురస్కారంతో ఆయనను గౌరవించడం సముచితమని సీఎం పళనిస్వామి ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగించింది. -
‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’
న్యూఢిల్లీ : శత్రు దేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్‌పై యావత్ భారతావని ప్రశంసలు కురిపిస్తోంది. అసలైన సైనికుడు అంటూ కొనియాడుతోంది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు కూడా. అయితే పాక్ సైన్యానికి చిక్కడానికి ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అభినందన్ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇండియా టుడే ఆరా తీసింది.(అభినందన్ ఆగయా..) ఈ నేపథ్యంలో స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... మిగ్-21 విమానం కూలిపోగానే అభినందన్ పారాచూట్ సాయంతో హోరన్ గ్రామంలో దిగారు. ఈ విషయం గురించి మహ్మద్ కమ్రాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ... ‘ గాల్లో ఆరు విమానాలు తలపడటం నేను చూశాను. అందులో ఒకటి ఇండియా వైపు నుంచి వచ్చింది. నాకు తెలిసి పాకిస్తాన్ వైమానిక దళం ఆ విమానాన్ని వెంబడించింది. అప్పుడే ఆ విమానం కూలిపోయింది. అందులో నుంచి ఓ వ్యక్తి పక్షిలా కిందకు వచ్చాడు. అతడు పారాచూట్ తెరవడం నేను చూశాను. దానిపై భారత జెండా ఉంది. సమీపంలో ఉన్న కొండ మీద దిగగానే.. ఎక్కడ ఉన్నానో అన్న విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు అనిపించింది. మెల్లగా కిందకి దిగి ఇది ఇండియానా .. పాకిస్తానా అని అడిగాడు. ఇండియా అని చెప్పగానే మన ప్రధాని ఎవరు అని అడిగాడు’ అని చెప్పుకొచ్చాడు.(ఎవరీ విక్రమ్ అభినందన్?) రాళ్లతో కొట్టి చంపేవాళ్లం.. తాను శత్రు సైన్యానికి చిక్కానని గ్రహించిన అభినందన్ వెంటనే తుపాకీ బయటకు తీశారు. అంతేకాదు తన దగ్గర ఉన్న కొన్ని పత్రాలను మింగేశారు. మరికొన్నింటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేస్తూ భారత్ మాతా కీ జై అని నినదించారు. అయితే ఇదంతా గమనించిన స్థానిక యువత అభినందన్‌ను రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ విషయం గురించి చెబుతూ... ‘ భారత పైలట్ నినాదాలు చేయగానే మాకు భయం వేసింది. అతడి దగ్గర గనుక తుపాకీ లేకపోయి ఉంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్లం. అంతేకాదు మాపై అతను దాడి చేయకపోవడం కూడా మంచిది అయింది. లేదంటే అక్కడున్న మూక చేతిలో హతమయ్యేవాడే. తెలివిగా ఆలోచించి తన ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా అపాయంలో పడకుండా చేశాడు’ అని వ్యాఖ్యానించాడు. -
‘అభినందన్ విమానాన్ని కూల్చింది వీరే’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. భారత్ చర్యలతో రెచ్చిపోయిన పాక్ మన సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు యత్నించింది. ఈ దాడిలో మిగ్ 21 యుద్ధం విమానం కూలిపోగా.. అభినందన్ వర్థమాన్ పాక్ భూభాగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కానీ పాక్ మాత్రం రెండు భారత యుద్ధ విమానాలకు కూల్చినట్లు చెప్పుకుంటుంది. తాజాగా భారత యుద్ధ విమానాలను కూల్చిన ఫైటర్ పైలెట్లను గుర్తించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాక్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వైమానిక దళం రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసింది. దానిలో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చిన వ్యక్తి స్వ్కాడ్రన్ లీడర్ హసన్ సిద్దిఖీ కాగా మరొకరు.. నమౌన అలీ ఖాన్‌గా గుర్తించమ’న్నారు. అయితే ఈ దాడిలో పాక్ పైలెట్ హసన్ సిద్దిఖీ మరణించాడని ఖురేషి తెలిపాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన సిద్దిఖీకి పాక్ పార్లమెంట్ నివాళులర్పించింది. అంతేకాక తాము కూల్చిన రెండు భారత యుద్ధ విమానల్లో ఒకటి జమ్మూకశ్మీర్‌లో కూలగా మరోటి పాక్ ఆక్రమిత్ కశ్మీర్ భూభాగంలో కూలిట్లు గతంలో పాక్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్) -
అభినందన్ ఫేక్ వీడియో వైరల్
ఇస్లామాబాద్ : ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత అభినందన్‌పై దాడికి సంబంధించి వీడియోలు వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా పాక్ ఆర్మీ సిబ్బంది అభినందన్‌కు సపర్యలు చేసినట్లుగా వీడియో తీశారు. అందులో అభినందన్ టీ తాగుతూ పాక్ అధికారుల ప్రశ్నలకు బదులివ్వడం తెలిసిందే. అభినందన్ టీ తాగుతూ 'టీ చాలా బాగుంది.. థాంక్యూ'అంటూ పాక్ ఆర్మీ అధికారులకు కితాబిస్తారు. మార్ఫ్ చేసిన తాపల్ టీ వాణిజ్య ప్రకటన అయితే కొందరు ఫేక్ రాయుళ్లు తమ క్రీయేటివిటీకి పదునుపెట్టారు. కరాచీకి చెందిన టీ కంపెనీ 'తాపల్' వాణిజ్య ప్రకటనను మార్ఫ్ చేసి అభినందన్ మాటలను జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది నిజమేమోనని భావించి తాపల్ వాణిజ్య ప్రకటనలో అభినందన్ నటించారంటూ.. పాక్, భారత్‌లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రకటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తాపల్ సిబ్బంది చెబుతున్నా, అప్పటికే వీడియో తెగ చక్కర్లు కొట్టడంతో ఇప్పుడా టీ బ్రాండ్ పేరు పాకిస్తాన్, భారత్‌లో మారుమోగిపోతుంది. అసలైన తాపల్ టీ వాణిజ్య ప్రకటన -
అసలైన తాపల్ టీ వాణిజ్య ప్రకటన
-
వైరల్ అవుతున్న అభినందన్ ఫేక్ వీడియో!
-
అభినందన్‌పై అదిరిపోయే మీమ్స్..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతవారం పాక్ చెరలో చిక్కుకుని.. క్షేమంగా తిరిగివచ్చిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తుచేసేలా షేర్ చేసిన మీమ్స్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు ఆమె వెడ్నెస్ డే విజ్డమ్ ట్యాగ్‌ను జత చేశారు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి పరీక్ష రాస్తుంటారు. వారిలో గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి పాకిస్తాన్ కాగా, పింక్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి అభినందన్. పాకిస్తాన్ ఏదో అడుగుతుండగా.. అభినందన్ వెనుక నుంచి ఓ కాగితాన్ని అందజేస్తారు. అయితే ఆ కాగితాన్ని తెరచి చూసిన పాకిస్తాన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అందులో.. ఇది నేను మీకు చెప్పకూడదు(i'm not supposed to tell you this) అని రాసి ఉంటుంది’ ఇది స్మతి ఇరానీ షేర్ చేసిన మీమ్స్. అయితే అందులో చాలనే అర్థం ఉంది. అభినందన్ పాక్ చెరలో ఉన్నప్పుడు అక్కడి ఆర్మీ అధికారులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినప్పటికీ.. తాను ఎటువంటి రహస్యాలను వారికి వెల్లడించలేదు. అంతేకాకుండా ధైర్యంగా ఈ విషయాలు నేను మీతో చెప్పకూడదు అంటూ వారికి సమాధానం ఇచ్చారు. ఈ ఘటనను గుర్తుకు తెచ్చేలా స్మృతి ఈ పోస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. View this post on Instagram #wednesdaywisdom ... 🇮🇳 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Mar 5, 2019 at 7:11pm PST -
పాఠ్యాంశంగా ‘అభినందన్’
జైపూర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధీరత్వం రాజస్తాన్ స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా అభినందన్ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు ట్విట్టర్లో వెల్లడించారు. ‘పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి. వింగ్ కమాండర్ అభినందన్‌ను గౌరవిస్తూ ఆయన సాహసాన్ని స్కూలు సిలబస్‌లో చేర్చబోతున్నాం’ అని వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. -
650మందికి ఉచితంగా ‘అభినందన్ హెయిర్‌కట్’
బెంగళూరు : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హెయిర్ డిజైనర్ ననేష్ ఠాకూర్ ఏకంగా 650 మందికి ఉచితంగా అభినందన్‌ను పోలిన జుట్టు, మీసాలు కత్తిరించి సంచలనం సృష్టించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది. ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని నా సెలూన్లో ఒక రోజంతా ఉచితంగా అభినందన్ హెయిర్‌స్టైల్ చేయాలని భావించాను. యువతలో దేశ భక్తిని పెంపొందించి.. వారిని డిఫెన్స్ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సాహించేందుకుగాను ఇలా చేశాను’ అంటూ చెపుకొచ్చారు. ఇదిలా ఉండగా బొమ్మనహళ్లికి చెందిన ఓ సేల్స్‌మెన్ చాంద్ మహ్మద్ అభినందన్‌కు వీరాభిమాగా మారాడు. దాంతో ఆయన లాగా మీసాలను సెట్ చేయించుకున్నాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘అభినందన్ రియల్ హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయనలాగా నా మీసాలు సెట్ చేయించుకున్నాను’ అని తెలిపారు. Wing Commander #AbhinandanVarthaman's moustache style getting popular. A Bengaluru local Mohammed Chand says,' I'm his fan, we follow him. I like his style. He is the real hero; I'm happy.' pic.twitter.com/cT7QGXntMs — ANI (@ANI) March 3, 2019 -
ఆ తర్వాతే అభినందన్ విధుల్లోకి
-
ఆ తర్వాతే అభినందన్ విధుల్లోకి
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా బాధ్యతలు చేపడతారని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్ బీఎస్ ధనోవా తెలిపారు. ఫైలట్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయంలో రెండో ఆలోచన లేదన్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నపుడే అభినందన్‌ని విధుల్లోకి తీసుకోవటం జరుగుతుందని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించి ఓ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. అప్పుడు కొందరు పాకిస్తాన్ ప్రజలు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో అభినందన్ ప్రక్కటెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత పాక్ ఆర్మీ ఆయన్ని వారినుంచి రక్షించి యుద్ధ ఖైదీగా వెంట తీసుకెళ్లింది. -
పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిందే : బ్రిటన్
లండన్ : పాక్ ఉగ్రవాద సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిదేనంటూ బ్రిటన్ ప్రధాని థెరిసా మే సూచించారు. పుల్వామా ఉగ్ర దాడులు - మెరుపు దాడుల ఫలితంగా భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థెరిసా, ఆదివారం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. ఈ విషయం గురించి బ్రిటన్ ప్రధాని కార్యలయ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రధాని థెరిసా మే పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను చక్కదిద్దేందుకు పాక్ ప్రధాని చూపిన చొరవను థెరిసా స్వాగతించారు. అంతేకాక ఉగ్రవాద సంస్థల పట్ల పాక్ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. పాక్ కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలని థెరిసా, ఇమ్రాన్ ఖాన్‌కు తెలిపారన్నా’రు. పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను యూకే 2001లోనే బ్యాన్ చేసింది. బాలాకోట్ మెరుపు దాడి అనంతరం థెరిసా మే పరిస్థితులను గమనిస్తున్నామని.. తాము ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నామని తెలిపారు. భారత్ - పాక్ దౌత్యపరమైన విధానాలతో ముందుకు వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని థెరిసా కోరారు. (మసూద్ బతికేఉన్నాడు : పాక్ మీడియా) -
అరుదైన ఘనత సాధించిన అభినందన్
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం నేషనల్ హీరోగా నీరాజనాలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో అభినందన్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేల కూల్చిన తొలి ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చడం సాహసోపేతమైన చర్య అని ఆయన కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగ్-21 బైసన్ అత్యాధునిక ఫైటర్ జెట్టే అయినా.. ఎఫ్-16కు ఇది సాటిరాదు. ఎఫ్-16కు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా పేరుంది. అయితే మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునేందుకు అప్పుడప్పుడూ మిరాజ్ - 2000, మిత్ర దేశాల ఎఫ్-16 విమానాలతో శిక్షణ పొందుతుంటారు. అలా అభినందన్ పొందిన శిక్షణ ఎఫ్-16ను కూల్చేందుకు పనికొచ్చింది. క్షణాల్లో జరిగిపోయే గగనతల యుద్ధ సమయంలో ప్రత్యర్థి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో మన పైలట్లు ఎల్వోసీ దాటి వెళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభినందన్.. ఎఫ్-16 జెట్‌ను కూల్చడం సాధారణ విషయమేం’ కాదని ఆయన ప్రశంసించారు. అంతేకాక ‘పాకిస్థాన్ ఎఫ్-16 విమానాల్ని పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి కొన్నది. ఐఏఎఫ్ కూడా ఎప్పట్నుంచో 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వంతో రక్షణ శాఖ సామాగ్రి కొనుగోలుకు చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాక ఐఏఎఫ్ రెండు దశాబ్దాలుగా ఎస్‌యూ - 30 ఎమ్కేఐలను వినియోగిస్తుంది. వీటిని కూడా ఆధునికీకరించడం అవసరం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి పుష్కర కాలం పడుతుంది. అంతేకాక బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి చాలా నామమాత్రంగానే కేటాయిస్తారు. ఈ అరకొర నిధులతో కొత్తవి కొనలేం. పాతవాటిని కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేయలేం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సమయం కాదని తెలిపారు. రక్షణ వ్యవస్థల్ని ఆధునికీకరించాలని కోరారు. పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..! సరిహద్దుకు అటూ.. ఇటూ.. -
‘ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎపిసోడ్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. అభినందన్ యూపీఏ హయాంలోనే పైలట్‌గా ఎదిగాడని సల్మాన్ ఖుర్షీద్ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి ఆయన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అభినందన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయనకు చురకలు అంటించగా, మరికొందరు 1983లో వింగ్ కమాండర్ అభినందన్ జన్మించారని, ఇందుకు ఇందిరా గాంధీకి క్రెడిట్ ఇవ్వాలా అంటూ ఎద్దేవా చేశారు. ఖుర్షీద్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చేలా చూడలంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కాగా, అభినందన్ శత్రుదేశంలో చూపిన సంయమనం, ధైర్యసాహసాలపై దేశవ్యాప్తంగా ఆయనకు ప్రజలు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. కాగా పాక్‌పై భారత్ మెరుపుదాడులతో పాటు అభినందన్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలపైనా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. -
అభినందన్ మీసకట్టుకు 50 శాతం డిస్కౌంట్
బొమ్మనహళ్లి : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం శత్రుదేశ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలెట్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలు, మీసాలు ఆయన స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి. బెంగళూరు యువతలో అభి మీసాల క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరహా మీసకట్టు కోసం క్షౌరశాలలకు వెళ్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నగరానికి చెందిన ఓ సేల్స్‌మెన్ చాంద్ మహ్మద్ అభినందన్ ఫ్యాన్‌గా మారిపోయాడు. దీంతో ఆయన లాగా మీసాలను సెట్ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ... అభినందన్ ధైర్య, సాహసం ఆయన మీసకట్టులోనే ఉందని, చివరకు పాక్ సైనికులు కూడా భయపడ్డారని అన్నారు. గతంలో బాలీవుడ్ హీరోల తరహాలో గడ్డం, మీసాలు ఉండేవని, ఇప్పుడు రియల్ హీరో అభినందన్ స్పూర్తితో ఆయన తరహా మీసకట్టు పెట్టుకున్నట్లు తెలిపారు. హెయిర్ సెలూన్ యజమాని సమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన వద్దకు రోజు 15 మందికి పైగా యువత అభినందన్ మీసకట్టు చేయించుకుని వెళ్తున్నారని అన్నారు. అభినందన్ మీసకట్టు కోసం వచ్చే వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. -
అభినందన్ వెన్నెముకకు గాయం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్(సూక్ష్మ నిఘా పరికరాలు) లేనట్లు తేలిందని పేర్కొన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో అభినందన్‌కు చికిత్స కొనసాగుతోంది. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని తన మిగ్–21 ద్వారా అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన విమానం కూడా దెబ్బతినడంతో పారాచూట్‌తో అభినందన్ ఎజెక్ట్ అయ్యారు. విమానం నుంచి బయటకొచ్చే క్రమంలోనే ఆయన వెన్నెముకకు గాయమై ఉంటుందని భావిస్తున్నారు. అభినందన్ ఆరోగ్యస్థితిని అంచనా వేసే ‘కూలింగ్ డౌన్’ ప్రక్రియలో భాగంగా మరిన్ని పరీక్షలు చేయనున్నారు. కొనసాగుతున్న విచారణ.. పైలట్ అభినందన్‌ను ఆదివారం భద్రతాసంస్థల ఉన్నతాధికారులు విచారించారు. పాక్ ఆర్మీకి చిక్కాక ఐఏఎఫ్ రహస్యాలను ఏమైనా బయటపెట్టారా? అనే కోణంలో ఈ విచారణ సాగుతోంది. ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా తిరిగి కాక్‌పిట్‌లో కూర్చునేందుకు అభినందన్ ఆత్రుతగా, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారన్నారు. ఎఫ్–16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చిన తొలి భారత పైలట్‌గా అభినందన్ చరిత్ర సృష్టించారన్నారు. ‘మహవీర్ అహింసా పురస్కారం’.. అభినందన్‌కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ను అందజేస్తామని అఖిల భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి వ్యక్తి అభినందనేనని సమితి చైర్మన్ మందిరా జైన్ తెలిపారు. త్వరలో బెంగళూరుకు.. సాక్షి, బెంగళూరు: భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ త్వరలో బెంగళూరుకు రానున్నట్లు ఐఏఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్ ఫిట్‌గా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఉండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఫిట్నెస్ చాటుకుంటే మళ్లీ యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ను అనుమతిస్తామని పేర్కొన్నారు. -
అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ చెర నుంచి మాతృ దేశంలో అడుగుపెట్టిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ వైద్యులు ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేపడుతున్నారు. కూలింగ్ డౌన్ విధానంలో భాగంగా ఆయన మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతులను అధికారులు సమీక్షిస్తున్నారు. అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేపట్టిన వైద్యులు.. వెన్నుముక్క కింది భాగంలో గాయమైనట్టు గుర్తించారు. అలాగే అభినందన్ శరీరంలో ఎటాంటి బగ్స్‌ను వైద్యులు గుర్తించలేదు. అతనికి మరో పది రోజుల పాటు మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. శనివారం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అభినందన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ చెరలో అనుభవాల్ని ఆయన మంత్రితో పంచుకున్నారు. అభినందన్‌కు ఆరోగ్య పరీక్షలు ముగిసిన తరువాత పాకిస్తాన్ నిర్భంధంలో ఎదుర్కొన్న పరిస్థితులపై అధికారులు ఆయనను విచారిస్తారు. -
‘ఓటీపీ అడిగితే.. అభినందన్ డైలాగ్ చెప్పండి’
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీ పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడానికి భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ చెప్పిన డైలాగ్‌తో ప్రచారం చేశారు. శత్రు చెరలో బందీగా ఉండి కూడా దైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్వించిన సంగతి తెలిసిందే. మాతృ దేశంపై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను తిప్పికొడుతున్న క్రమంలో ఆయన విమానం పాక్ భూభాగంలో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆయన.. పాక్ సైన్యం చేతికి చిక్కారు. ఆ తర్వాత ఆయన్ని బందీగా చేసుకుని పాక్ సైన్యం నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. దాయాది దేశం ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ఆయన వాటికి తట్టుకుని నిలబడ్డారు. పాక్ సైనిక అదికారులు అభినందన్‌ను విచారిస్తున్న సమయంలో తన మిషన్ గురించి వివరాలు రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించిన అభినందన్ మాత్రం ‘అవన్నీ నేను మీకు చెప్పకూడదు(I am not supposed to tell you this)’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు కూడా తాను శత్రు దేశం చెరలో ఉన్నానని భయపడకుండా, ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్‌ను రోజున భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్‌పూర్ పోలీసులు ‘ఓటీపీ’లతో జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అభినందన్ చెప్పిన మాటలను ఉపయోగించారు. దుండగులు బ్యాంకుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ చేసి వినియోగదారుల నుంచి ఓటీపీలను సేకరించి వారి ఖాతాల నుంచి డబ్బును దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇటువంటి మోసాలు అధికంగా జరుగుతుండటంతో.. ఇకపై ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే.. అభినందన్ చెప్పినట్టు ఈ వివరాలు నేను మీకు చెప్పకూడదనే సమాధానం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు నాగ్‌పూర్ పోలీసుల చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పోలీసులు ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. When someone asks for your OTP : "I am not supposed to tell you this"#WelcomeHomeAbhinandan 🇮🇳#NagpurPolice — NagpurCityPolice (@NagpurPolice) March 1, 2019 -
అభినందన్‌పై అమూల్ సరికొత్త యాడ్
న్యూఢిల్లీ : శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు యావత్ భారత్ జేజేలు పలుకుతుండగా.. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఆయన సాహసాన్ని కొనియాడుతూ ప్రత్యేక యాడ్‌ను రూపొందించింది. అమూల్ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్టైజింగ్లో ఎంతో ఉన్నతంగా నిలుస్తాయన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమ్యూనికేషన్స్‌లో అమూల్ మించిన వారు ఇంకెవ్వరూ ఉండరని చాలా సార్లు నిరూపితమైంది. అయితే తాజాగా అభినందన్ ధీరత్వాన్ని ఆయన మీసంతో పోల్చుతూ.. ఇది అముల్ మీసం అంటూ, మీసం లేనిది ఏం లేదూ అనే క్యాప్షన్‌తో సృజనాత్మకమైన ప్రకటనను విడుదల చేసింది. (చదవండి: అభి మీసం) యాడ్ మొత్తం భారత హీరో వర్థమాన్‌ను కొనియాడుతూ ఉండగా.. అతన్ని సాహసాన్ని మెచ్చిన జనాలు అతని మీసం స్టైల్‌ను ఫాలో అవుతూ గర్వంగా ఫీలవుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వీడియోను అమూల్ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆయన మీసం స్టైల్ ఫొటోలను పోస్ట్ చేస్తూ భారత హీరోపై ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా యాడ్స్ రూపొందించి అమూల్ మార్కెట్‌ను క్యాచ్ చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. గతంలో కరుణానిధి మరణించినప్పుడు ఆయనకు నివాళులర్పిస్తూ రూపొందించిన యాడ్ కూడా జనాలకు చేరువైంది. (చదవండి: సరిహద్దుకు అటూ.. ఇటూ..) #Amul Mooch: To Abhinandan from Amul! pic.twitter.com/NAG3zNMlIL — Amul.coop (@Amul_Coop) 2 March 2019 భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. అభినందన్‌ను శుక్రవారం విడుదల చేసింది. (చదవండి : ఆకాశం ముద్దాడిన వేళ..) -
సరిహద్దుకు అటూ.. ఇటూ..
శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌కు యావత్ జాతి జేజేలు పలుకుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్లో ఒక పైలట్ కుటుంబం తమ కొడుకు చేసిన త్యాగాన్ని బయటకు చెప్పుకోలేక, బడబాగ్నిలాంటి నిజాన్ని మనసులో దాచుకోనూలేక మౌనంగా రోదిస్తోంది. ఇద్దరూ పైలెట్లే. ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒక్కటే. ఇద్దరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయే అల్లరిమూక చేతికి చిక్కారు. కానీ ఒకరి కథ సుఖాంతం. మరొకరిది అంతులేని విషాదం. పాకిస్తాన్ వాయుసేన భారత సైనిక స్థావరాలపై దాడికి దిగినప్పుడు ఒక ఎఫ్16 యుద్ధ విమానాన్ని షాహాజుద్దీన్ అనే పైలట్ నడుపుతున్నారు. ఆ విమానాన్ని మన సైనికులు కూల్చేశారు. ఆఖరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని నౌషెరా సెక్టార్లో దిగారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పీవోకే యువతలో భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పారాచూట్ నుంచి కిందకి దిగుతున్న షాహాజుద్దీన్‌ను చూసి లామ్వ్యాలీ గ్రామంలో అల్లరిమూక భారత పైలట్ అని పొరపడింది. చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అభినందన్ వర్ధమాన్ కూడా అల్లరిమూకకు చిక్కినప్పటికీ పాక్ ఆర్మీ ఆయన్ను కాపాడగలిగింది. ఇద్దరిదీ ఒకటే కథ అభినందన్ వర్థమాన్, షాహాజుద్దీన్‌ది ఇంచుమించుగా ఒక్కటే కథ. అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ మాజీ ఎయిర్‌మార్షల్ కాగా, షాహాజుద్దీన్ తండ్రి వసీముద్దీన్ కూడా పాకిస్తాన్ వైమానిక దళంలో ఎయిర్మార్షలే. ఎఫ్–16, మిరాజ్ విమానాలను నడపడంలో ఆయన దిట్ట. ఆ ఇద్దరి పైలెట్ల కుమారులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి, తమ దేశాల రక్షణ కోసం యుద్ధవిమానాల్లో గగనతలంలో ఒకరితో మరొకరు తలపడ్డారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు వీరుడై తిరిగొచ్చి కోట్లాది గుండెల్లో విజేతగా నిలిస్తే, మరొకరు తోటి పాకిస్తానీల చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుని కోట్లాది గుండెల్లో విషాదాన్ని నింపేశారు. పాక్వి ఎప్పుడూ కట్టుకథలే యుద్ధ సమయాల్లో నిజాలు చెప్పే చరిత్ర పాక్‌కి లేనేలేదు. 1965 యుద్ధం, 1971 యుద్ధం, కార్గిల్ ఇలా అన్ని సమయల్లో కట్టు కథలే చెప్పింది. ఈసారి కూడా తమ సొంత పైలట్ విషయంలోనూ సరైన సమాచారం లేక మొదట నోరుజారింది. పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ ఫిబ్రవరి 28న ఇద్దరు భారతీయ పైలెట్లను పట్టుకున్నామన్నారు. ఒకరు ఆర్మీ కస్టడీలో ఉన్నారని, మరొకరు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి ఒక్కరే తమ చేతికి చిక్కారని వెల్లడించారు. ఆ రెండో పైలట్ ఎక్కడున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ విషయం లండన్‌కి చెందిన లాయర్ ఖలిద్ ఉమర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అల్లరి మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ పైలట్ షాహజుద్దీన్ ఉమర్‌కు బంధువు కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. -
బాలాకోట్‌లో దాడులు నిజమే: అజర్ సోదరుడు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న తమ శిక్షణ శిబిరాలపై దాడులు చేయడం వాస్తవమేనని జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సోదరుడు మౌలానా అమ్మార్ ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. భారత యుద్ధ విమానాలు ఐఎస్ఐ, పాక్ సైన్యంపై కాకుండా బాలాకోట్‌లోని శిక్షణ శిబిరాలపై దాడులు జరిపాయని మౌలానా అమ్మార్ వెల్లడిస్తున్నట్లుగా అందులో ఉంది. అయితే, పాక్ సైన్యానికి పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అతడు విమర్శించాడు. ‘భారత విమానాలు బాంబులు వేసింది ఉగ్ర సంస్థల ప్రధాన కేంద్రంపైనో, కీలక నేతల సమావేశ ప్రాంతంపైనో కాదు.. జిహాద్ లక్ష్యాలపై తరగతులు నిర్వహించే కేంద్రంపైన బాంబులు వేశాయి’ అని వివరించాడు. ఐఏఎఫ్ దాడుల్లో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చెందిన కల్నల్ సలీమ్ కరీ, జైషే సంస్థ శిక్షకుడు మౌలానా మోయిన్ చనిపోయినట్లు సమాచారం. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా జైషే సంస్థకు చెందిన అతిపెద్ద ఉగ్ర శిక్షణ శిబిరంపై బాంబు దాడులు జరిపినట్లు భారత్ ఇంతకుముందే ప్రకటించింది. -
అభి మీసం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలకు ఇప్పుడు బాగా ప్రాచుర్యం ఏర్పడింది. అదొక ‘అభినందన్ బ్రాండ్’గా, భూషణంగా మారిపోయింది. దేశంలోని అనేక మంది యువకులు ఆ తరహా గడ్డం, మీసాలను ఇష్టపడుతున్నారు. తాము కూడా ఆయనలా మీసకట్టు పెంచుతామని అంటున్నారు. అభినందన్ గడ్డం, మీసాల స్టైల్‌పై సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాఖ్యలు, చర్చలు నడుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్–21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం, ఆయనను ఆ దేశ ఆర్మీ తొలుత బంధించి అనంతరం శుక్రవారం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉన్న అభినందన్ తన క్షేమ వివరాలు చెబుతున్న వీడియో గత బుధవారం బయటకొచ్చినప్పటి నుంచి ఆయనకు దేశంలో క్రేజ్ పెరిగిపోయింది. అభినందన్ గురించి, పాకిస్తాన్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ఒక్కో వివరం బయటకొచ్చే కొద్దీ అందరిలో ఆసక్తి ఎక్కువైంది. ఆయన తెగువను మెచ్చిన భారత ప్రజలు ఇప్పుడు ఆయన ‘తమిళ’ స్టైల్‌ను అనుసరించాలనుకుంటున్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ఓ పోస్ట్ చేస్తూ ‘అభినందన్‌కు ఉన్నటువంటి మీసాలు నాకూ కావాలి. జయహో’ అని పేర్కొన్నారు. ‘మొత్తం భారత దేశంలో తర్వాతి స్టైల్ సంచలనంగా అభినందన్ మీసాలు ఉండబోతున్నాయి. ఈసారి మీరు క్షౌ ర శాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యక్తి మిమ్మల్ని అభినందన్ స్టైల్ కావాలా? అని అడిగితే ఆశ్చర్యపోకండి’ అని మరొకరు ట్విట్టర్లో రాశారు. ముందుగా గుర్తొచ్చేది మీసాలే.. అభినందన్‌ను ఎవరైనా గుర్తుపట్టేది ముందుగా ఆయన మీసాలతోనేనని బ్రాండ్ వ్యూహకర్త రమేశ్ తహిలియాని అంటున్నారు. ‘దేశభక్తి, ఇతర ఉద్రేకాలు ప్రస్తుతం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్ల్లో అభినందన్‌ను చూసిన వారిని మీరు అడగండి. ఆయనను తలచుకుంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే అత్యధిక శాతం మంది ఆయన గడ్డం, మీసాలేనంటారు. ఆయన చూపిన ధైర్య సాహసాలే ఇప్పుడు ఆ స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఇదంతా తాత్కాలిక హాంగామానేననీ, ఆయన స్టైల్ ఇకపై ఫ్యాషన్‌గా మారుతుందా, లేదా అనే విషయాన్ని కాలమే చెబుతుందని తహిలియాని పేర్కొన్నారు. మరో బ్రాండ్ నిపుణుడు మాట్లాడుతూ ‘అభినందన్ మీసాలు ఆయన చెక్కిళ్లపైకి వ్యాపించి ఉంటాయి. ఆకాశంలో ఎంతో నైపుణ్యంతో విమానం విన్యాసాలు చేసిన గుర్తుల్లా అది ఉంటుంది. ఆ స్టైల్‌ను ఇప్పుడు ఎంతోమంది కావాలనుకుంటున్నారు’ అని అన్నారు. -
మానసికంగా వేధించారు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా చాలా వేధింపులకు గురిచేశారని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శనివారం వైమానిక దళ ఉన్నతాధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం ఆరోగ్య పరీక్షల సమయంలో తనను కలవడానికి వచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అధికారులతో ఆయన ఈ విషయాలు పంచుకున్నట్లు తెలిసింది. పాకిస్తాన్లో వేధింపులకు గురైనా అభినందన్ మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నారని అధికారులు తెలిపారు. తమ భూభాగంలో దొరికిపోయిన తరువాత అభినందన్‌పై కొందరు స్థానికులు భౌతిక దాడికి పాల్పడ్డారని, కానీ తాము ఆయనని రక్షించి జెనీవా ఒప్పంద మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించామని పాకిస్తాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. గాయాలతో రక్తం కారుతుండగా అభినందన్‌ను పాకిస్తాన్ సైనికులు తీసుకెళ్తున్న వీడియో బహిర్గతం కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అక్కడి సైనికులతో మాట్లాడుతూ అభినందన్ టీ తాగుతున్న మరో వీడియో విడుదలైంది. భారత్‌కు అప్పగించే ముందు అభినందన్‌తో పాకిస్తాన్ సైన్యాన్ని పొగుడుతూ ఓ వీడియోను రూపొందించినట్లు శుక్రవారం మీడియాలో కథనాలు వచ్చాయి. అల్లరి మూక నుంచి పాకిస్తాన్ ఆర్మీయే తనను కాపాడిందని చెప్పిన ఆ వీడియో షూటింగ్ వల్లే అభినందన్ అప్పగింత ఆలస్యమైందని కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన తరువాత అభినందన్ కుడి కన్ను ఉబ్బినట్లు కనిపించింది. నిర్మలకు వివరించిన అభినందన్.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్రంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందన్‌ను కలుసుకున్నారు. ఆయన ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ఆమె కొనియాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చెరలో ఉన్న 60 గంటల పాటు తానెదుర్కొన్న అనుభవాలు, పరిస్థితుల్ని అభినందన్ నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అభినందన్ భార్య స్క్వాడ్రన్ లీడర్ తాన్వి మార్వా(రిటైర్డ్), ఏడేళ్ల కొడుకు, సోదరి అదితి కూడా అక్కడే ఉన్నారు. ‘కూలింగ్ డౌన్’ పరీక్షలు పాక్ నిర్బంధం నుంచి విడుదలైన పైలట్ అభినందన్‌కు శనివారం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వాఘా సరిహద్దులో ఆయన్ని పాక్ అధికారులు అప్పగించాక నేరుగా ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ‘కూలింగ్ డౌన్’ విధానంలో భాగంగా అభినందన్ మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతుల్ని మదింపు చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఆదివారం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఆర్మీ, నిఘా అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఎఫ్‌సీఎంఈ) కేంద్రంలో అభినందన్ హెల్త్ చెకప్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఆయన్ని విచారిస్తామని అధికారులు తెలిపారు. అంతకుముందు, అభినందన్‌ను ఆయన తల్లిదండ్రులు, వైమానిక దళ ఉన్నతాధికారులు కలుసుకున్నారు. అభినందన్ రాకతో శనివారం ఢిల్లీలో బీజేపీ కార్యకర్తల సంబరాలు -
ఆకాశం ముద్దాడిన వేళ..
యుద్ధాకాశాన్ని ముద్దాడి, మరణపుటంచులు తాకి వచ్చిన యుద్ధవీరుడు అభినందన్ ఈ దేశ ప్రజల మదిలో శాశ్వత అభినందనీయుడు. మూడు రోజుల అనంతరం మాతృదేశంలోకి అభినందన్ వర్ధమాన్ రాక కోసం యావత్ దేశం సరిహద్దుల్లో కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూసింది. అజరామరమైన అతడి శౌర్యం, త్యాగశీలత ప్రశంసల జల్లులా కురిసింది. సోషల్ మీడియాలో అభినందన్‌ని కృతజ్ఞతాభినందనలతో ముంచెత్తారు. అలాంటి అద్భుతమైన సందర్భంలో ఆయనకు ఆకాశమే స్వయంగా స్వాగతం పలికింది. విశ్వాంతరాళాల్లోని మరో గ్రహం నుంచి అభినందన్‌కు అభినందనలు అందాయి. భారతీయుల సృష్టితో అంగారక గ్రహంపై అడుగుపెట్టిన మంగళ్యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) అభినందన్‌కు నిండైన ఆహ్వనం పలికింది. అది కూడా మన తెలుగు గడ్డపై తయారై, అంగారక గ్రహంలోకి పంపిన మంగళ్యాన్ మిషన్ ఇస్రో అధికారిక ట్విటర్ ‘వింగ్ కమాండర్ అభినందన్! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’అని ట్వీట్ చేసింది. బహుశా ఒక వీరుడి జీవితంలో ఇంతటి అరుదైన, అద్భుతమైన అవకాశం ఎవరికీ దక్కకపోవచ్చు. ఎందుకంటే అంతరిక్షం నుంచి మంగళ్యాన్ భూమిపైకి పంపిన రెండో మెసేజ్ ఇది. గత ఏడు నెలల్లో అంగారకుడి నుంచి ఏకైక సందేశం కూడా ఇదే. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 29న అంగారకగ్రహంపై తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మంగళ్యాన్ ఓ సందేశాన్ని పంపింది. మంగళ్యాన్ ఆవిష్కరణ ముందు 2013లో ఇస్రో అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లను ప్రారంభించి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంది. అయితే 2014లో మంగళ్యాన్ పేరిట అధికారిక ఖాతా తెరిచింది. -
నన్ను బాగా వేధించారు : అభినందన్
సాక్షి, న్యూఢిల్లీ : శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను ఆ దేశ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. దాదాపు 60గంటల పాటు అభినందన్ పాకిస్తాన్లో ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే..దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. (అభినందన్ ఆగయా..) పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్–21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.ముందుగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేసినా తర్వాత పాక్ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్.. అభినందన్‌ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్‌కు పాక్ అప్పగించింది. స్వదేశంలో అడుగుపెట్టిన అభినందన్‌ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. (అభినందన్‌ను కలిసిన రక్షణ మంత్రి) A day after his return from Pakistan, Wing Commander Abhinandan informed the top brass of IAF that he was subjected to a lot of mental harassment, though he was not physically tortured by Pakistan military authorities, said a source. Read @ANI Story | https://t.co/5SkjqinLgz pic.twitter.com/sHR3IPjSNU — ANI Digital (@ani_digital) March 2, 2019 -
అభినందన్‌ను కలిసిన రక్షణ మంత్రి
న్యూఢిల్లీ : భారత వైమానిక దళానికి చెందిన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఆస్పత్రిలో కలుసుకున్నారు. పాకిస్తాన్ నుంచి శుక్రవారం రాత్రి వాఘా సరిహద్దు గుండా స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత అభినందన్‌ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన అభినందన్ వర్థమాన్‌ను మంత్రి అభినందించారు. రక్షణ మంత్రి రాక సందర్భంగా యూనిఫామ్‌ను ధరించి డ్యూటీలో ఉన్న సైనికుడిలా అభినందన్ తయారయ్యారు. పాకిస్తాన్లో ఉన్న 60 గంటల సమయంలో ఏమేం జరిగిందో మంత్రికి అభినందన్ వివరించారు. వైద్య చికిత్సల అనంతరం డీ-బ్రీఫింగ్ సెషన్ ప్రారంభం కానుంది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు ఐబీ, రా అధికారులు కూడా అభినందన్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. -
‘అభినందన్’కు ఇక కొత్త అర్థం..
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరుముతూ.. ప్రమాదవశాత్తూ ఆ దేశ సైన్యానికి చిక్కిన అభినందన్.. ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా అసామాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌కు చేరుకున్న అభినందన్ గురించి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘అభినందన్’ అర్థం ఇక మారిపోతుందని ఆయన అన్నారు. ‘భారత్ ఏం చేసినా ప్రపంచం నిశితంగా గమనిస్తుంది. నిఘంటువులోని పదాల అర్థలను సైతం మార్చగల శక్తి మన దేశానికి ఉంది. ‘అభినందన్’ అంటే ఆంగ్లంలో ‘కంగ్రాచ్యులేషన్’. కానీ. ఇప్పుడు ‘అభినందన్’ అర్థమే మారిపోనుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అభినందన్‌ను పాకిస్థాన్ శుక్రవారం రాత్రి 9. 15 గంటలకు అప్పగించిన సంగతి తెలిసిందే. -
‘మా చిన్నారి అభినందన్ ఎలా ఉన్నాడు’
న్యూఢిల్లీ : గడిచిన మూడు రోజులు దేశవ్యాప్తంగా అభినందన్ నామస్మరణే. అతనికి సంబంధించిన వార్తలతోనే ఈ మూడు రోజులు తెల్లవారింది.. చీకటి పడింది. శత్రు సైనికులకు చిక్కినప్పడు అతడు చూపిన తెగువ వల్ల ఒక్కసారిగా నేషనల్ హీరో అయ్యారు అభినందన్. ‘ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరవలేదని.. రియల్ హీరో’ అంటూ అభినందిస్తున్నారు జనాలు. తమ భూభాగంలో దిగిన అభినందన్‌ను పాకిస్తాన్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. అయితే ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో అభినందన్ గురించి వచ్చే మెసేజ్‌ల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. అభినందన్ ధైర్య సాహసాలకు గౌరవంగా.. పుట్టిన బిడ్డలకు అతని పేరు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ నిండా ఇలాంటి మెసేజ్‌లే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వింగ్ కమాండర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. ‘‘అభినందన్’ అనే ఈ సంస్కృత పదానికి నేడు కొత్త అర్థం రూపొందింది’ అంటూ ప్రశంసించారు. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. -
అభినందన్ అప్పగింత.. ఇమ్రాన్ ఎక్కడ?
లాహోర్: భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను అప్పగించినప్పుడు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. లాహోర్‌లో ఉన్నారని పాక్ అధికార వర్గాలు వెల్లడించాయి. వాఘా సరిహద్దులో శుక్రవారం రాత్రి అభినందన్‌ను భారత్‌కు పాక్ బలగాలు అప్పగించాయి. ఈ నేపథ్యంలో అప్పగింత ప్రక్రియ సవ్యంగా సాగేలా చూసేందుకు ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం సాయంత్రం లాహోర్ చేరుకున్నారు. అభినందన్‌ను భారత్‌కు అప్పగించడానికి కొద్ది గంటల ముందు గట్టి భద్రత నడుమ ఆయన లాహోర్‌కు వచ్చారని పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. లాహోర్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్, గవర్నర్ చౌదరి సార్వార్లతో ఆయన సమావేశమయినట్టు తెలిపారు. అభినందన్‌ను క్షేమంగా స్వదేశానికి అప్పగించిన తర్వాతే ఇస్లామాబాద్‌కు ఇమ్రాన్ ఖాన్ తిరిగి వెళ్లారని వెల్లడించారు. తమది శాంతికాముక దేశమని చాటి చెప్పేందుకు, పొరుగు దేశంతో సౌహార్ద్ర సంబంధాలు కోరుకుంటున్నామన్న సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇమ్రాన్ ఖాన్ స్వయంగా లాహోర్‌కు వచ్చినట్టు వివరించారు. (పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!) అభినందన్‌ను అప్పగించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని ఉస్మాన్ బుజ్దార్ అభిప్రాయపడ్డారు. కాగా, భారత్‌తో తలెత్తిన ఉద్రిక్తతలను సడలించాలన్న లక్ష్యంతో తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అభినందన్ విడుదలకు మొగ్గుచూపినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. (‘ఇమ్రాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’) -
పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ప్రత్యర్థి దాడులను ఐఏఎఫ్ దీటుగా తిప్పి కొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని మనోళ్లు కూల్చేశారు. పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చడానికి అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించాడు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్‌ను జెనీవా ఒప్పందంలో భాగంగా శుక్రవారం రాత్రి పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది. (అభినందన్ ఆగయా..) ఆర్-73 మిస్సైల్.. లక్ష్యం గురి తప్పదు.. ఆర్-73 మిస్సైల్.. ఏ సమయంలోనైనా ప్రత్యర్థి విమానాలపై దాడి చేయగలదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. దశ దిశా మార్చుకుని కావాల్సిన లక్ష్యాన్ని ఛేదించగలదు. ఏరో డైనమిక్ సిస్టమ్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. దాంతో ఇది సమర్థవంతంగా పనిచేసి ప్రత్యర్థి యుద్ధ విమానలను నేల కూల్చగలదు. గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విమాలను.. 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ వేటాడగలదు. (ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!) 58 ఏళ్ల వయసు..అయినా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న మిగ్-21యుద్ధ విమానం వయస్సు సుమారు 58 సంవత్సరాలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రతిష్టాత్మక హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. 1961లో తొలిసారిగా భారత వైమానిక దళంలో చేరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపురేఖలు మార్చుకుంది. ఐఏఎఫ్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా అందుబాటులో ఉంది. మిగ్- 21 దెబ్బకు పేలిపోయిన ఎఫ్-16తో పోల్చుకుంటే.. దాని సత్తా తక్కువే. మిగ్ పూర్తి పేరు.. మికోయన్-గురేవిచ్. మొదట్లో రష్యా సంయుక్త రాష్ట్రాలు దీన్ని డిజైన్ చేశాయి. రష్యా నుంచి అనుమతి పొందిన హెచ్ఏఎల్ మిగ్-21 ఎఫ్ ఎల్, మిగ్-21ఎం, మిగ్-21 బైసన్ రకాలను రూపొందించింది. ఇక పాక్ వైమానిక దళంలో ఉన్న ఎఫ్-16 విమానలకు వైపర్ యుద్ధ విమానాలు అని కూడా అంటారు. 1980 ప్రాంతంలో వీటిని పాక్ దిగుమతి చేసుకుంది. -
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
శ్రీనగర్ : ఓ వైపు అభినందన్ వర్థమాన్ విడుదలతో భారత్ పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. దాయాది దేశం మాత్రం పాత పాటే పాడుతోంది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పోయారు. ఒక పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలో పాక్ రేంజర్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్ (24), ఆమె కుమారుడు ఫజాన్ (5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె ఫబ్నమ్ చనిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయలతో బయటపడ్డాడని వెల్లడించారు. అంతకు ముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. గత వారం రోజుల్లో పాక్ 60 సార్లు కాల్పువ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5 కిలోమీటరల పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భయాందోళనలతో సరిహద్దు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌పై పాక్ వైమానిక దాడులను తిప్పికొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్యారాచూట్ సాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిపోవాల్సి వచ్చింది. అభినందన్ క్షేమంగా తిరిగి భారత్‌కు తిరిగి రావాలని యావత్ భరత ఖండం వేయి కళ్లతో ఎదురు చూసింది. పూజలు, యాగాలు చేసింది. గడిచిన మూడు రోజులుగా దేశమంతా ‘అభినందన’ స్మరణే. ఇక ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరువలేదని, అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం కూడా ప్రచురించింది. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. (అభినందన్ ఆగయా..) మరచిపోలేని మీసం.. ఓవైపు భారత్ వింగ్ హీరో అభినందన్ తిరిగి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంటే.. మరోవైపు అందంగా, ఒడుపుగా తీర్చిద్దిన అభినందన్ మీసం పట్ల ఆకర్షణ మొదలైంది. తమిళ సంస్కృతిలోని ఆయన కట్టూ బొట్టూను అనుసరిచేందుకు మనోళ్లు రెడీ అయిపోయారు. ఆయనలా ‘గన్స్లింగర్’ మీసం తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడీ గన్స్లింగర్ మీసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందన్ వీరత్వంపై ప్రశంసలు కురిపించాడు. ‘మీ వల్లే మేమేంతా నిశ్చింతగా.. గర్వంగా ఉండగలుగుతున్నాం. మీకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఇంతకూ గన్స్లింగర్ అంటే..! పురాతన కాలంలో ప్రత్యర్థి ఎత్తులకు చిక్కకుండా.. వారి సైన్యంపై గుళ్ల వర్షం కురిపిస్తూ గన్‌తో తుత్తునియలు చేసేవారిని గన్స్లింగర్ అనేవారు. ధీరత్వం, ఠీవీ కలగలిసిన గన్స్లింగర్ శత్రువుల కంటబడినా చాకచక్యంగా తప్పించుకోవడం అతని నైజం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ అభినందన్ మాదిరి గుర్రెపు డెక్క మీసం కలిగి ఉండడం గమనార్హం. అసాధారణ పోరాటపటిమ చూపిన ఈ అమెరికా జనరల్‌కు మిలటరీలో అత్యున్నతమైన మెడల్ ఆఫ్ హానర్ దక్కడం విశేషం. (‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’) (చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) How proud we are to have you ! Bow down to your skills and even more your grit and courage 🙏 #WelcomeBackAbhinandan . We love you and are filled with pride because of you.#WeAreSupposedToTellYouThis pic.twitter.com/IfqBFNNa3T — Virender Sehwag (@virendersehwag) 1 March 2019 -
వాఘా సరిహద్దు : అభినందన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్
-
స్వదేశానికి తిరిగొచ్చిన అభినందన్
-
ట్రెండ్‌ని టైటిల్ చేసుకుంటున్నారు
కొత్త ట్రెండ్, హాట్ టాపిక్స్‌ను క్యాచ్ చేసి సినిమా టైటిల్స్‌గా ఫిక్స్ చేస్తుంటారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం సంగతి తెలిసిందే. ఈ హీట్‌ను సినిమా టైటిల్స్ రూపంలో వాడుకోవాలనుకుంటున్నారు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఆల్రెడీ ‘పుల్వామా ఎటాక్, సర్జికల్ స్ట్రైయిక్ 2.0, అభినందన్, హిందుస్తాన్ హమారా హై’ అనే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేశారట. అంతే కాకుండా ప్రస్తుతం బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వెబ్‌సిరీస్ ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట. మరి ఈ టైటిల్స్, ఐడియాలన్నీ సినిమా నిర్మాణం వరకూ వెళ్తాయా? వేచి చూడాలి. -
వీడియో రికార్డింగ్ వల్లే ఆలస్యం
లాహోర్: వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్తానీ అధికారులు ఆయన చేత మాట్లాడించి ఓ వీడియోను రికార్డ్ చేశారనీ, ఈ కారణంగానే అభినందన్‌ను భారత్‌కు పంపే విషయంలో జాప్యం చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన చేత బలవంతంగా మాట్లాడించి ఈ వీడియో రికార్డ్ చేశారా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. వీడియోను అనేక చోట్ల భారీగా ఎడిట్ చేసిన అనంతరం పాకిస్తానీ మీడియాకు అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అభినందన్ కొంత పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది. వర్ధమాన్ ఆ వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘నేను ఒక లక్ష్యాన్ని (దాడి చేసేందుకు) వెతుకుతుండగా పాకిస్తాన్ వైమానిక దళం నా విమానంపై దాడి చేసింది. దాంతో విమానం దెబ్బతినగా, నేను ప్యారాచూట్ సాయంతో కిందకు దూకాను. ఆ సమయంలో నా దగ్గర తుపాకీ ఉంది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. నన్ను నేను కాపాడుకోవడానికి ఒకే దారి ఉంది. తుపాకీని పడేసి పరుగెత్తేందుకు ప్రయత్నించాను. ప్రజలు నన్ను వెంబడించారు. వారు అప్పుడు తీవ్ర ఆవేశంతో ఉన్నారు. అప్పుడే ఇద్దరు పాకిస్తానీ ఆర్మీ అధికారులు నన్ను వారి నుంచి రక్షించారు. వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. పాకిస్తాన్ ఆర్మీ వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగినది. అది నన్ను ఆకట్టుకుంది’ అని అభినందన్ ఆ వీడియోలో అన్నారు. అభినందన్ విడుదలకు పాక్ హైకోర్టూ ఓకే ఇస్లామాబాద్: భారత వైమానిక పైలట్ అభినందన్ విడుదలను నిలిపేయాలని పాకిస్తాన్ పౌరుడు దాఖలుచేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. అభినందన్ నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ గగనతలంలోకి చొరబడ్డాడని, బాంబులు విసిరి దేశానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డాడని పిటిషనర్ ఆరోపించారు. ఆయనపై పాకిస్తాన్‌లోనే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అభినందన్‌ను భారత్‌కు అప్పగించకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు అంగీకరించిన ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించారు. -
‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపుపై భారత వాయుసేన జరిపిన దాడికి కారణాలను వివరించాల్సిందిగా పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన తర్వాత భారత్, పాక్‌ల మధ్య చోటుచేసుకున్న సంఘటనలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం వివరిం చారు. ఈ సందర్భంగా బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడి ఘటనను, ఆ తర్వాత పాకిస్తాన్ జెట్ విమానాలు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్నీ చెప్పారు. భారత్‌లోని మిలటరీ స్థావరాలపై దాడికి పాకిస్తాన్ వాయుసేన ప్రయత్నిం చిందని, అయితే భారత్ ఆ దేశ విమానాలను చాకచక్యంగా తిప్పికొట్టిందని తెలిపారు. ఆ విమానాలను వెనక్కి పంపే క్రమంలో భారత్‌కు చెందిన ఓ విమానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. పాక్‌లోని ఉగ్రవాద క్యాంపుపై దాడి చేయ డానికి గల కారణాలు చెప్పాలని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, ఈ విషయంలో రక్షణశాఖ సరైన సమాధానం చెప్పగలదని గోఖలే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్ సమాఖ్య సభ్య దేశాలు ఈ విషయంలో భారత్‌కు మద్దతివ్వడాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఐఏఎఫ్తో పాటు భద్రతా బలగాలను కమిటీ సభ్యులు కొనియాడారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్‌ను ఎంతో ఘనమైన, పరాక్రమమైన దాడిగా అభివర్ణించారు. పాక్ కాల్పుల ఉల్లంఘన.. ముగ్గురు దుర్మరణం జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ వరుసగా 8వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడింది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా సలోట్రి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్(24), ఆమె కుమారుడు ఫజాన్(5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె షబ్నమ్ చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయాలతో బయటపడ్డాడని వెల్లడించారు. పాక్ జరిపిన మోర్టార్ల దాడితో పూంచ్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యా యని పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అక్తర్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. పాక్ రేంజర్ల దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని తెలిపారు. గత వారం రోజు ల్లో పాక్ 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5కి.మీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఓ సరిహద్దు గ్రామంలో పాక్ మోర్టార్లు దాడిలో ధ్వంసమైన ఇల్లు వీరుడి తల్లిదండ్రులకు జేజేలు... న్యూఢిల్లీ: మృత్యువు ముంచుకొస్తోందని తెలిసినా కళ్లల్లో ధీరత్వం, అల్లరి మూక చావబాదుతున్నా స్థిరచిత్తంతో కూడిన మనో నిబ్బరం, మన దేశ రహస్యాలు శత్రువులకు చిక్కకూడదని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నమిలి మింగేసే సాహసం.. ఎంత మంది ఇలా చేయగలరు ? పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక పైలట్ అభినందన్ వర్ధమాన్ నిజమైన హీరో. ఆ వీరుడి తల్లిదండ్రులకు ఢిల్లీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులు జేజేలు పలికారు. చెన్నై నుంచి బయల్దేరిన విమానం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజధాని ఢిల్లీ చేరుకుంది. కన్న కొడుక్కి స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దుకు వెళ్లేందుకు అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్, డాక్టర్ శోభ వర్ధమాన్లు ఆ విమానంలోనే ప్రయాణించారు. ఢిల్లీలో వారు విమానం దిగే ముందు తోటి ప్రయాణికులంతా గౌరవసూచకంగా లేచి కరతాళ ధ్వనులతో వర్ధమాన్ దంపతులే మొదట దిగడానికి దారిచ్చారు. వారు విమానంలో నడుస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తామే తొందరగా దిగాలని, లగేజీని తీసుకోవాలనే ఆత్రుత ప్రయాణికుల్లో కనిపించలేదు. కొందరు యువతీ యువకులు అభినందన్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు చేశారు. మరికొందరు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాయు మార్గంలో కుదరదు: పాక్ న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అత్తారీ–వాఘా సరిహద్దులో కాకుండా వాయు మార్గంలో అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన తరువాత, ఆయన్ని వాయు మార్గంలో అప్పగించాలని భారత్ కోరింది. కానీ అభినందన్‌ను రోడ్డు మార్గం ద్వారా అత్తారీ–వాఘా సరిహద్దులోనే అప్పగిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అంగీకరిస్తే అభినందన్‌ను తీసుకొచ్చేం దుకు ప్రత్యేక విమానం పంపాలని రక్షణ శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. మిగ్ విమానం కూలిపోయి పాకిస్తాన్ చెరలో ఉన్న మన పైలట్ అభినందన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఇస్లామాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకురావడం. రెండోది..వాఘా సరిహద్దులో స్వాగతం పలకడం. రెండో మార్గంలో అయితే వాఘా సరిహద్దులో జనసందోహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని, మీడియా కంటపడకుండా అభినందన్‌ను విమానంలో తీసుకురావడమే ఉత్తమమని భారత్ భావించింది. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. -
ఆ వీడియోలే కాపాడాయి
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో నక్కజిత్తుల మారి అయిన పాకిస్తాన్ అంత ఔదార్యంగా ఎందుకు వ్యవహరించిందన్న ప్రశ్నలు అందరి మనసులను తొలుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్ విమానం కూలిపోయిన ప్రాంతంలో స్థానికులు ఆయనను తీవ్రంగా కొట్టడమే కాకుండా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఆయన ప్రాణాలు కాపాడాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరగడమే అభినందన్‌ను రక్షించిందని 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాక్ ఆర్మీకి చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉన్న ఎయిర్ కమాండర్ జేఎల్ భార్గవ అభిప్రాయపడుతున్నారు. ‘అభినందన్‌పై ఆ అల్లరి మూక దాడి చేసి, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం. అభినందన్ ప్రాణాలతో ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలుండేవి కావు. అభినందన్ తమ దగ్గరే లేడని పచ్చి అబద్ధాలు చెప్పే పాకిస్తాన్ బుకాయించి ఉండేది. ఇక మిగిలిన జీవితం అంతా ఆయన పాక్‌లోనే ఊచలు లెక్కించాల్సి వచ్చేది. అభినందన్ అదృష్టవంతుడు కాబట్టి ఆయన వీడియోలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. దెబ్బకు పాక్ దారికి వచ్చి అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది’అని 77 ఏళ్ల భార్గవ పేర్కొన్నారు. 1971 పాక్ యుద్ధం సమయంలో ఆ దేశానికి పట్టుబడ్డ 12 మంది భారత పైలట్లలో భార్గవ ఒకరు. హరియాణాలోని పంచ్కులలో ఆయన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవాల్ని ఆయన పంచుకున్నారు. అల్లరి మూకలతో ఎప్పుడూ ప్రమాదమే పాకిస్తాన్లో పనీపాట లేకుండా భారత్‌పై ద్వేషభావంతో రగిలిపోయే అల్లరిమూకలతో ఎప్పుడూ ప్రమాదమే. అభినందన్ వారి బారిన పడినా ప్రాణాలతో బయటపడటానికి అక్కడి ఆర్మీయే కారణం. ఆర్మీ అప్పుడు రాకపోయింటే అభినందన్ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. 1965 యుద్ధం సమయంలో కూడా లెఫ్టినెంట్ హుస్సేన్ ఇలాగే పాక్‌లో అల్లరి మూకలకు చిక్కారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి అతడు చనిపోయేవాడే. తన పేరు చెప్పడంతో ముస్లిం కాబట్టి కొట్టిన వారే ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్తం ఇచ్చి బతికించారు. పాక్ ఆర్మీ ప్రశ్నలతో చంపేస్తుంది 1971 డిసెంబర్ 5న పాక్‌తో యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో బర్మార్ నుంచి పైలట్ భార్గవ హిందూస్తాన్ ఫైటర్ 24 విమానాన్ని నడుపుతుండగా పాక్ ఆర్మీ దాన్ని కూల్చేసి ఆయన్ను నిర్బంధించింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తీవ్రమైన ఒత్తిడికి లోను చేసింది. నిద్ర కూడా పోనివ్వకుండా అధికారులు వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతుంటారు. ఎంతటి శిక్షణ పొందిన సైనికుడికైనా ఆ ఒత్తిడి భరించడం కష్టం. ఒకసారి ఏం చెబితే మళ్లీ అదే చెప్పాలి. లేదంటే దొరికిపోతాం. ‘‘భారత వాయుసేన గురించి వాళ్లు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. తోటి పైలట్ల వివరాలు అడిగారు. మీ బ్యాచ్‌లో అత్యుత్తమ పైలట్ ఎవరు అని వారు అడిగితే, ‘అతను మీ ముందే కూర్చున్నాడు’అని బదులిచ్చాను’’అని భార్గవ చెప్పారు. ఇది జరిగిన ఏడాది తర్వాత కానీ భార్గవ పాక్‌కు బందీగా చిక్కారన్న విషయం ప్రపంచానికి తెలియలేదు. మొత్తానికి భారత్ ప్రయత్నాలు ఫలించి ఆయన క్షేమంగా వెనక్కి వచ్చారు. అప్పటి పంజాబ్ సీఎం జ్ఞానీ జైల్‌సింగ్ వాఘా సరిహద్దుల దగ్గర తనకు స్వాగతం పలికారని ఆ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. -
అభినందన్ ఈ పరీక్షలు... పాసైతేనే...
ఎట్టకేలకు అభినందన్ భారత్‌లో అడుగుపెట్టారు. అన్ని ప్రక్రియలు ముగిసినా 2 రోజులపాటు పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. పరాయిదేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. అవేంటంటే.. ► అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అప్పగిస్తారు. ► అభినందన్ శారీరకంగా ఎంత ఫిట్నెస్తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. ► శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. అంటే గూఢచర్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు. ► వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో కూడా పరీక్షలు చేసి తెలుసుకుంటారు. శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్లేమీ అతిథి మర్యాదలు చేయరు. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరైనా పెదవి విప్పకపోతే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా చెప్పారేమోనన్న దిశగా అభినందన్‌ను విచారిస్తారు. ► ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు. ► సాధారణ యుద్ధ ఖైదీలైతే ఈ రెండు సంస్థల విచారణ చేయనక్కర్లేదు. కానీ అభినందన్‌ను యుద్ధఖైదీగా పరిగణించాలో అక్కర్లేదో అన్న సందేహాలు ఉండటంతో ఐబీ, రా అధికారులు కూడా ప్రశ్నలు వేస్తారు. సందేహాల నివృత్తి తర్వాతే ఇంటికి.. మొత్తం వ్యవహారంలో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. అభినందన్ పాక్ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, భారతీయ అధికారులకు ఆయనంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి ఉండే అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పుడు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? ఇలాంటి సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి వెళ్లనిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని వివరించారు. చదవండి...(అభినందన్ ఆగయా..) కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాక్‌కి చిక్కి భారత్‌కు తిరిగి వచ్చిన పైలట్ కె.నచికేతను విచారించిన సమయంలో దగ్గరుండి ఈ వ్యవహారాలన్నీ చూశానన్నారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కుమారుడు కేసీ నంద కరియప్పను 1965 యుద్ధ సమయంలో బంధించి తిరిగి వచ్చాక జరిగిన ఘటనలపై ఆ అధికారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. పాక్ వారిని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ రహస్యాలు వాళ్లు బయటపెట్టలేదని చెప్పారు. అభినందన్ విషయంలో కూడా తమకు ఆ నమ్మకం ఉందని, కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు, విచారణలు చేయాల్సిందేనని చెప్పారు. అభినందన్ అయినా, మరో యుద్ధ ఖైదీ అయినా ఈ విధివిధానాలు పూర్తి చేసినప్పుడు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పారు. -
అభినందన్ ఆగయా..
వాఘా/అట్టారీ : శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను శుక్రవారం రాత్రి అట్టారీ–వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డాక్యుమెంటేషన్, విధానపర ప్రక్రియ కారణంగా ఆయన అప్పగింత కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. స్వదేశం తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అధికారులకు చెప్పారు. అభినందన్‌ను ఆ వెంటనే ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక విమానంలో అమృత్సర్ నుంచి ఢిల్లీకి తరలించారు. ఆర్మీ, నిఘా అధికారుల పర్యవేక్షణలో శనివారం అభినందన్ మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు అభినందన్ స్వదేశం చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ యుద్ధఖైదీయే అని ఆయన్ని అప్పగించిన తరువాత పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్–21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ను ఆయన్ని విడుదలచేసేందుకు అంగీకరించింది. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోయేందుకు ముందడుగు పడినట్లయింది. ఆలస్యంగా అప్పగింత.. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించడంతో తమ యుద్ధ హీరో రాక కోసం భారత్ ఎంతో ఉద్వేగంగా ఎదురుచూడసాగింది. శుక్రవారం ఉదయం నుంచే అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అట్టారీ–వాఘా సరిహద్దుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ కొన్ని లాంఛనాల వల్ల అభినందన్ అప్పగింత ప్రక్రియ ఆలస్యమైంది. తొలుత సాయంత్రం నాలుగు గంటలకు అప్పగిస్తారని భావించినా, తరువాత సాయంత్రం 6.30 గంటలకు వాయిదా పడింది. చివరకు నలుపు రంగు జాకెట్, ఖాకీ ప్యాంటు ధరించిన అభినందన్ రాత్రి 9.10 గంటలకు పాకిస్తాన్ వైపున్న వాఘా చెక్‌పోస్టును దాటి రెండు దేశాలను వేరుపరుస్తున్న గేటు వైపు నడిచారు. ఆ సమయంలో ఆయన వెంట పాకిస్తాన్ రేంజర్లు, ఇస్లామాబాద్ హైకమిషనర్‌లో భారత వైమానిక దళ అధికారి ఉన్నారు. అట్టారీ–వాఘా సరిహద్దులో అధికారిక లాంఛనాలు ముగిసిన తరువాత 9.21 గంటలకు పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. తరువాత వైమానిక దళ అధికారులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అభినందన్ ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. సాయుధ బలగాలు 130 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. ఉప్పొంగిన దేశభక్తి.. భారత్ మాతాకీ జై, వందేమాతరం..నినాదాలతో భారత్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మార్మోగింది. పాకిస్తాన్ నుంచి విడుదలవుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అట్టారీ–వాఘా సరిహద్దులో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు భారీ ఎత్తున గుమిగూడారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, డప్పులు వాయిస్తూ, త్రివర్ణ పతాకాలు ప్రదర్శిస్తూ, మిఠాయిలు పంచుకుంటూ కోలాహలం సృష్టించారు. ఒక్కడి కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. పలువురు తమ ముఖాలపై త్రివర్ణ పతాకాలను పచ్చబొట్టుగా వేసుకున్నారు. అమృత్సర్ డిప్యూటీ మేయర్ రమణ్ బక్షి కూడా ప్రజలతో కలసి పాటలు పాడారు. గజమాలతో సమీప ప్రాంతానికి చెందిన ఓ సిక్కు యువకుడు, డోలు వాయిస్తూ ఓ వృద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అధికారులు అనుమతిస్తే తన వద్ద ఉన్న గజమాలతో అభినందన్‌కు స్వాగతం పలుకుతానని ఆ యువకుడు సంబరంతో చెప్పాడు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన యోధుడిని నేరాగా చూడబోతున్నందుకు గర్వంగా ఉందని ఢిల్లీకి చెందిన యువ పర్యాటకురాలు నేహ ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పంజాబ్ పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు. నిరీక్షణ.. నిరీక్షణ.. అట్టారీ–వాఘా సరిహద్దులో వేలాది మంది ప్రజలు, మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వెయిటింగ్....దేశవ్యాప్తంగా కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి వెయిటింగ్. అందరూ ఎదురుచూస్తున్నది ఒక్కడి కోసమే. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం వచ్చింది. అంతలోనే చీకటి కూడా పడింది. అమృత్సర్ వర్షంలో తడిసి ముద్దయింది. అయినా అదే ఉత్కంఠ, ఉత్సాహం. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రకటించినా.. ఆయన ఎప్పుడు మాతృభూమిపై అడుగుపెడుతాడని రోజంతా దేశం నిరీక్షించింది. ప్రాంతీయ, జాతీయ స్థాయి అనే తేడా లేకుండా అన్ని టీవీ చానెళ్లలో భారత్, పాకిస్తాన్ సంబంధాలపై ఎడతెగని చర్చ, నిపుణుల వ్యాఖ్యలు, అభినందన్ విడుదలపై సమాచారం కోసం ఎదురుచూపులతో రోజంతా హడావుడిగా గడిచిపోయింది. దేశభక్తితో దేశం మొత్తం కనెక్ట్ అయిపోయింది. అహ్మదాబాద్‌లో గార్బా నృత్యాలు, బెంగళూరులో జోష్ నృత్యాలు, పూరిలో సైకత శిల్పం, పలు ప్రాంతాల్లో యజ్ఞాలు నిర్వహించారు. రోజూవారీ పనులు చేసుకుంటూనే..అభినందన్ భారత్‌లో అడుగుపెట్టాడన్న సమాచారం కోసం ఓ కన్ను టీవీలు, మొబైల్లపై వేశారు. అట్టారీ అవతలి నుంచి ఏ కారొచ్చినా, అందులో అభినందన్ ఉన్నాడా? అన్న ఆసక్తి పెరుగుతూనే ఉంది. లేకపోతే ఆయన్ని నేరుగా ఢిల్లీకే తీసుకెళ్తారా? మీడియాతో మాట్లాడనిస్తారా?..ఇలా అధికారిక సమాచారం కొరవడి, ఊహాగానాలు ఊపందుకున్నాయి. అత్తారీలో పొద్దుపోయే వరకూ వేచి చూసిన ప్రజలు నెమ్మదిగా వెనుదిరగగా, కొందరు పాత్రికేయులు అక్కడే ఉన్నారు. ఏదేమైనా అభినందన్ రాకకోసం సుదీర్ఘ నిరీక్షణ కొనసాగింది. హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు సుస్వాగతం. మీ అసమాన ధైర్యసాహసాల పట్ల యావత్ దేశం గర్విస్తోంది. భారత సాయుధ బలగాలు దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వందేమాతరం’ – ప్రధాని నరేంద్ర మోదీ అభినందన్ వర్ధమాన్ మీ హుందాతనం, స్థిర చిత్తం, ధైర్య సాహసాలు మాలో ప్రతీఒక్కరినీ గర్వపడేలా చేశాయి. సొంతగడ్డకు సుస్వాగతం. మిమ్మల్ని మేమంతా ప్రేమిస్తున్నాం – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రియమైన అభినందన్.. దేశమంతా మీ ధైర్యసాహసం, పరాక్రమంపై గర్వపడుతోంది. మీరు సురక్షితంగా తిరిగిరావడంపై భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే అంకితభావం, ఉత్సాహంతో మీరు ఐఏఎఫ్, భారత్‌కు సేవలందించాలని ఆశిస్తున్నా. – బీజేపీ చీఫ్ అమిత్ షా భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థించాను. ఈ సమయంలో అభినందన్‌కు, ఆయన కుటుంబసభ్యులకు దేవుడు మనోస్థైర్యం, శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి చదవండి: ‘అభినందన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్’ ట్రెండింగ్: వెల్కమ్ బ్యాక్ అభినందన్ తొలిసారి మోదీ నోట అభినందన్ మాట ‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?! -
వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం
సాక్షి ప్రతినిధి, చెన్నై/కన్యాకుమారి: ఉగ్రవాదులపై పోరాటం విషయంలో భారత్ ఇకపై నిస్సహాయంగా ఉండబోదని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రమూకలు దుశ్చర్యలకు పాల్పడితే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. తమిళనాడు పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోదీ, విపక్షాల తీరును ఎండగట్టారు. ఎవరివైపు ఉన్నారో స్పష్టం చేయండి.. ఐఏఎఫ్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్ల దేశమంతా గర్వపడుతోందని మోదీ తెలిపారు. భారత తొలి మహిళా రక్షణమంత్రిగా తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ ఉండటంపై నేను గర్వపడుతున్నానని వెల్లడించారు. బాలాకోట్ జైషే స్థావరంపై వైమానిక దాడి, పాక్‌కు చెందిన ఎఫ్–16ను కుప్పకూల్చడం ద్వారా భారత సాయుధ బలగాల సామర్థ్యం మరోసారి తేటతెల్లమయిందన్నారు. కానీ కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు దేశానికి చేటు చేసేలా, పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నేతలు భారత బలగాలవైపు ఉన్నారా? లేక స్వదేశంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారి తరఫున ఉన్నారా? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎఫ్ సిద్ధమైనా యూపీఏ ఒప్పుకోలేదు మోదీ తాత్కాలికమనీ, దేశమే శాశ్వతమని ప్రధాని అన్నారు. 2008లో ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాదులను శిక్షిస్తారని దేశమంతా భావించినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పట్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుమతించలేదని ఆరోపించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేత విషయంలో సాయుధ బలగాలకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 1.1 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. -
భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
-
‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’
ఢిల్లీ: తాను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారని, ఆ గందరళగోళంలో తన పిస్టల్ కింద పడిపోయినట్లు పాక్ చేతికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ తెలిపారు. ఈ మేరకు కొత్తగా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. నన్ను నేను రక్షించుకోవడానికి పరుగులు తీశానని, అల్లరి మూక తన వెంట పడినట్లు పేర్కొన్నారు. వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారని, అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారని, వాళ్లే నన్ను మూక నుంచి రక్షించినట్లు అభినందన్ తెలిపారు. తర్వాత వారు తనను వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లారు.. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. అక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని చెప్పారు. నా విషయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిందని అభినందన్ వెల్లడించారు. -
వీరుడి కోసం వేయి కళ్లతో..
-
అభినందన్ విడుదలపై అలస్యం
-
భారత్‌లో అడుగుపెట్టిన అభినందన్