Dear Comrade
-
ఆ సినిమా నా కెరీర్లో ఎంతో ప్రత్యేకం: రష్మిక
నేషనల్ క్రష్, కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. పార్ట్-1లో శ్రీవల్లిగా మెప్పించిన పుష్ప-2లోనూ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.అయితే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరించలేకపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.తాజాగా ఈ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తి కావడంతో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మరిచిపోలేనివని తెలిపింది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. క్రికెట్ ట్రైనింగ్‌లో నెలల తరబడి గాయాల బారిన పడ్డామని ఆ రోజులను గుర్తు చేసుకుంది. అయితే షూటింగ్ రోజు కన్నీళ్లు, నవ్వులు, చెమటతో ఇచ్చిన సంతృప్తి తమ కష్టాన్ని మరిచిపోయేలా చేసిందన్నారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకమైందని రష్మిక పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సాయిపల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా?.. అన్ని డిజాస్టర్లే!
దక్షిణాది హీరోయిన్లలో నటి సాయిపల్లవిది ప్రత్యేక శైలి. ఈమె స్వతహాగా వైద్యురాలు. నటనంటే ఇష్టంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అందుకే పెళ్లిని కూడా వాయిదా వేసి తన చెల్లెలి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. సాయిపల్లవి కెరీర్లో మరచిపోలేని చిత్రం ప్రేమమ్. ఆ చిత్రం లేకపోతే ఈమె లేరనే చెప్పవచ్చు. సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సాయిపల్లవి చేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు. అలా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు అపజయం పాలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల చిరంజీవితో భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయిపల్లవి నిర్భంధంగా తోసి పుచ్చారు. తీరా ఆ చిత్రం విడుదలై బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకు ముందు కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అయితే అందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉండడంతో అందులో నటించనన్నారట. ఆ తరువాత ఆ పాత్రలో రష్మిక నటించారు. ఆ చిత్రం నిరాశపరచింది. ఇక తమిళంలో అజిత్ సరసన వలిమై చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టినా, పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పారు. ఇటీవల నటుడు విజయ్‌కు జంటగా లియో చిత్రంలోనూ నాయకిగా సాయిపల్లవిని నటింపచేసే ప్రయత్నం జరిగింది. అందులోని పాత్రలో నటనకు అవకాశం లేదంటూ వద్దన్నారు. ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టినా విమర్శలను ఎదుర్కొంది. ఇక చంద్రముఖి–2 నటి కంగనా రనౌత్ పోషించిన పాత్రలో ముందు సాయిపల్లవిని సంప్రదించారు. ఆ కథ నచ్చకపోవడంతో సారీ చెప్పేశారు. ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇలా సాయిపల్లవి రిజెక్ట్ చేస్తే.. ఇక అంతే అనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. కాగా ప్రస్తుతం కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. -
హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్, తమిళ్లో వరుస అవకాశాలు అందుకుంది. ఛలో, గీతా గోవిందంతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె పుష్పతో రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో వరుస ప్రాజెక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఆమె నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం గుడ్‌బై విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన కాగా తన క్యూట్ క్యూట్ స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు ఆకట్టుకుంటున్న రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో.. అలాగే విమర్శించే వారు సైతం ఉన్నారు. అయితే తాజాగా తనపై వచ్చే విమర్శలపై స్పందించింది రష్మిక. డియర్ కామ్రేడ్ సమయంలో విజయ్ లిప్‌లాక్ సీన్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అదే విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంటూ భావోద్వేడానికి గురైంది. ‘ఆ రోజులను నేను ఎప్పటికి మర్చిపోలేను. చెప్పాలంటే అవి నాకు కఠినమైన రోజులు. డియర్ కామ్రేడ్ సినిమాలోని లిప్‌లాక్ సీన్‌పై వచ్చిన ట్రోల్స్ ఎలా అధిగమించానో, ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికి నాకర్థం కావడం లేదు. నేను చాలా సెన్సిటీవ్ పర్సన్‌ని, విమర్శలని అసలు తట్టుకోలేకపోయేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. చదవండి: ‘ఓం రౌత్‌కు రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు అలాగే ‘ఆ సమయంలో కొందరు నాకు ఫోన్ చేసి అంతా సర్దుకుంటుంది.. ఏం కాదు అని ధైర్యం చెప్పేవారు. మరి కొందరు మాత్రం నన్ను దారుణంగా విమర్శించారు. అవి నన్ను తీవ్రంగా బాధించాయి. ఎంతో ఒత్తిడికి గురయ్యా. రాత్రి పడుకుంటే పీడకలలు వచ్చేవి. నేను ఎవరినో వేడుకుంటున్నట్టుగా కలలు వచ్చేవి. అందరు నన్ను దూరంగా పెడుతున్నట్టు, నన్ను అసహ్యించుకుంటున్నట్లు వచ్చేవి. దీంతో మధ్య రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచి ఏడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అవి తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయమేస్తుంది’ అంటూ రష్మిక ఎమోషనల్ అయ్యింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప మూవీతో పాటు హిందీలో యానిమల్, తమిళంలో వారీసు చిత్రాలతో బిజీగా ఉంది. -
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
దూసుకుపోతున్న రౌడీ!
విజయ్ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. అర్జున్ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయినా, గీతాగోవిందంలో సైలెంట్ అబ్బాయిలా ఉన్న ఈ హీరో, ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. అయితే విజయ్ నటించి తెలుగులో ఘోరంగా విఫలమైన ఆ సినిమా హిందీలో దూసుకుపోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి. . -
రౌడీ క్రేజ్: యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే..
విజయ్ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. గీతాగోవిందంతో సైలెంట్ అబ్బాయిలా, అర్జున్ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయిన ఈ హీరో ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. కాగా రౌడీ స్టార్ విజయ్ గతేడాది నటించిన డియర్ కామ్రేడ్ తెలుగులో ఘోరంగా విఫలమైంది. కానీ దీనికి భిన్నంగా హిందీలో మాత్రం ఈ సినిమా ఫెయిల్ కాలేదు. తెలుగులో చతికిలపడ్డ ఈ సినిమాను హిందీ ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో డబ్ చేసి రిలీజ్ చేయగా కేవలం ఒక్క రోజులోనే 12 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టిస్తోంది. హిందీ ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని రౌడీ నటనను కొనియాడుతున్నారు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించిన విషయం తెలిసిందే. చదవండి: రౌడీ.. ఫైటింగ్ షురూ ఫైటర్‌కు జోడి? రౌడీ ఫ్యాన్స్‌కు లవ్‌సాంగ్ గిఫ్ట్ -
ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్!
‘నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడినా.. ఆడకపోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను’ అని అంటున్నాడు ‘అర్జున్ రెడ్డి’ స్టార్ విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార’ని తెలిపారు. అలాగే విజయ్ గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయంలో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డియర్ కామ్రేడ్‌లోని మొదటి సగ భాగం మాత్రమే తనకు నచ్చిందని రెండవ భాగం నచ్చలేదని చెప్పింది. అది నిజమైన విమర్శ.. అని దానిని తాను అంగీకరిస్తాను. అయితే దానిపై నేను ఎటువంటి విమర్శ చేయను. నేను చేసే సినిమాలను ఇష్టపడతాన’ని తెలిపాడు. సినీ పరిశ్రమల్లో రాజకీయాల గురించి విజయ్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు, అధికారం ఇలా చాలా అంశాల ప్రభావం ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమా విజయవంతం అవుతుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్టపడకతే.. నేను అంటే ఏంటో నా తరువాతి చిత్రంలో చూపిస్తాను’ అని చెప్పారు. -
వైరల్ : విజయ్ దేవరకొండ న్యూ లుక్
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. రీసెంట్గా విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ అంటూ పలకరించాడు. అయితే ఈ సినిమాతో దక్షిణాదిన స్టార్‌గా ఎదుగుదామనుకున్న ఈ హీరోకు నిరాశే ఎదురైంది. డియర్ కామ్రేడ్ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా.. విజయ్ మాత్రం తదుపరి సినిమా షూటింగ్‌లతో బిజీగానే గడిపేస్తున్నాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అయితే తాజాగా విజయ్ న్యూ లుక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ కొత్త లుక్ తన కొత్త సినిమా కోసమే అయి ఉంటుంది. ఈ కొత్త లుక్‌లో విజయ్ సూపర్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. -
ఆస్కార్స్‌కు గల్లీ బాయ్
‘అప్నా టైమ్ ఆయేగా!’... గల్లీ బాయ్ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. అంటే ‘మన టైమ్ కూడా వస్తుంది’ అని అర్థం. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కావాలని కలలు కంటాడు ముంబై మురికివాడల్లో నివసించే మురాద్ అనే సాధారణ గల్లీ బాయ్. మురాద్ అంటే కోరిక అని అర్థం. తను బలంగా కోరుకున్నదాని కోసం కష్టపడి శ్రమిస్తాడు. ఏదో రోజు తన టైమ్ కూడా వస్తుందని నమ్ముతాడు. తను కలలు కన్నట్టే, కోరుకున్నట్టే టైమ్ వస్తుంది. ‘గల్లీ బాయ్’ పేరుతో ఫేమస్ ర్యాపర్ అవుతాడు. ఇప్పుడు ఆ గల్లీ బా యే 92వ ఆస్కార్‌కు మన దేశం తరఫున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపిక అయ్యాడు. ఇ ప్పుడు ఆ గల్లీ బాయే ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన ఆస్కార్‌ను మనకు తీసుకురావాలని చాలామంది మురాద్. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఆలియా భట్ కథానాయిక. 18 పాటలున్న ఈ సినిమా ఆల్బమ్‌లో దాదాపు 7 పాటలు రణ్వీర్ సింగ్ పాడటం (ర్యాప్ చేయడం) విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్ అవార్డులకు రేస్ మొదలైంది. ఆస్కార్స్‌కు పంపబోయే చిత్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు అందరూ. మన దేశం నుంచి ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి పోటీపడే చిత్రానికి కోల్‌కత్తాలో ఎంపిక జరిగింది. 28 చిత్రాలు పోటీపడగా, ‘గల్లీ బాయ్’ ఫైనల్‌గా నిలిచింది. నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరిగింది. పోటీపడ్డ చిత్రాలు: హిందీ చిత్రాలు ‘అంధాధూన్, ఆర్టికల్ 15, బదాయి హో, బద్లా, కేసరి, గల్లీ బాయ్, ద తస్కెన్ట్ ఫైల్స్, ఉరి : ద సర్జికల్ స్ట్రయిక్, గోదే కో జలేబీ కిలానే లే జా రియా హూ, తెలుగు చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ చిత్రాలు ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ.., ఉయిరే, ఒలు, తమిళ సినిమాలు ఒత్త సెరుప్పు సైజ్ 7, వడ చెన్నై, సూపర్ డీలక్స్, మరాఠీ చిత్రాలు బాబా, ఆనంది గోపాల్, బందీషాలా, మై గాట్ : క్రైమ్ నెం 103/2005, అస్సామీ చిత్రం బుల్ బుల్ కెన్ సింగ్, గుజరాతీ చాల్ జీవీ లాయియే, గుజరాతీ సినిమా హెల్లోరి, కురుక్షేత్ర (కన్నడ), నేపాలీ చిత్రం పహూనా: ద లిటిల్ విజిటర్స్, బెంగాలీ చిత్రాలు తరీఖ్ : ఏ టైమ్‌లైన్, కోంతో, నగర్కీర్తన్లను పరిశీలనలోకి తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం వరకూ సాగింది. ఈ 28 సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు (అంధాధూన్, బదాయి హో, ఆర్టికల్ 15) ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ‘అంధాధూన్’, ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు. తెలుగు నుంచి కామ్రేడ్ ఒక్కడే గత ఏడాది తెలుగు నుంచి ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రానికి ఎంపికవ్వడం కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు నుంచి ‘డియర్ కామ్రేడ్’ ఒక్క సినిమానే ఈ 28 సినిమాల్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి. -
ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియర్ కామ్రేడ్’
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలను ఈ జాబితాలోకి ఎంపికయ్యాయి. ఈ చిత్రాలన్నింటినీ స్క్రీనింగ్ చేసి, వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. `డియర్ కామ్రేడ్` మాత్రమే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మించాయి. -
ఇస్మార్ట్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ
‘ఇస్మార్ట్ శంకర్’తో తిరిగి ఫామ్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా హీరోకు క్రేజీ హీరోను ఎంచుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ అండ్ క్రేజీ హీరో విజయ దేవరకొండతో కలిసి పూరి ఓ సినిమాను పట్టాలెక్కించునున్నాడు. ఈ విషయాన్ని నటి, నిర్మాత చార్మీ కౌర్ అధికారికంగా ప్రకటించారు. డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహపరిచినప్పటికీ.. నటన, లుక్స్ పరంగా విజయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇప్పటికే బ్లాక్ బస్టర్ సాధించి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో దించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డియర్ కామ్రేడ్‌తో నిరుత్సాహపరిచిన విజయ్, పూరి సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలని ఆశిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్ ఊపులోనే మరో హిట్ కొట్టాలని పూరి అండ్ టీమ్ తెగ ఆరాటపడుతోంది. -
‘డియర్ కామ్రేడ్’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. స్లో నేరేషన్ సినిమాకు మైనస్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ రీమేక్ హక్కులను తీసుకున్నట్టుగా కరణ్ జోహర్ ప్రకటించారు. ఈ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా షాహిద్ డియర్ కామ్రేడ్లో నటించబోనని తేల్చి చెప్పేశారట. ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటించిన షాహిద్, డియర్ కామ్రేడ్ రీమేక్‌లోనూ నటిస్తే రొటీన్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. -
రష్మిక కోరికేంటో తెలుసా?
చెన్నై : ఆశ పడవచ్చు. అత్యాసకు పోకూడదు అన్నది పెద్దల మాట. అయినా అతిగా ఆశ పడిన ఆడది..అంత పెద్ద డైలాగులు వద్దు గానీ, నటి రష్కిక కోరిక చూస్తుంటే ఎవరికైనా అలా అనాలనిపిస్తుంది. అయినా అదృష్టం అందలం ఎక్కిస్తుంటే రష్కికనే కాదు ఎవరికైనా అలాంటి కోరికలే పుడతాయేమో. 2016లో కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక. తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అ బ్యూటీ వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం ఛలో చిత్రం సక్సెస్‌నిస్తే, ఆ తరువాత విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసిన గీతగోవిందం సంచలన విజయాన్ని అందించింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఇక్కడ నటుడు కార్తీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతే కాదు దళపతి విజయ్‌తో జతకట్టే అవకాశం రష్కికను వరించిందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తెలుగు చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రం మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో అల్లుఅర్జున్తోనూ రొమాన్స్ చేయబోతోంది. ఇలా చాలా వేగంగా నటి రష్మిక సక్సెస్ గ్రాఫ్ పెరుగుతూ పోతోంది. దీంతో ఈ అమ్మడి భావాలకు, కోరికలకు పగ్గాలు ఉంటాయని భావించలేం. ఇంతకీ ఈ అమ్మడు ఏమంటుందో చూద్దాం. నటించడానికి వచ్చిన ప్రారంభంలో నా ముఖాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు. ప్రయత్నం చేద్దాం అని సినీ జీవితాన్ని ప్రారంభించాను. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు ముంగిట వచ్చి వాలుతున్నాయి. అయితే ఇలా వేగంగా ఎదిగి, వెంటనే పడిపోకూడదు. అందుకే ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటున్నాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఒకరు నచ్చితే ఆ వ్యక్తికి గుడి కట్టించే అభిమానులు ఇక్కడ ఉంటూనే ఉంటారు. మా నాన్న నటి కుష్భూకు గుడి కట్టించిన విషయాన్ని చెబుతూనే ఉంటారు. ఆ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. అయితే ఇప్పుడు నాకూ గుడి కట్టిస్తే బాగుంటుందని బావిస్తున్నాను అని నటి రష్మిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీన్నేమంటారు ఆశ అంటారా? అత్యాశ అంటారా? -
‘డియర్ కామ్రేడ్’కు నష్టాలు తప్పేలా లేవు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రీ ఎడిట్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తొలి మూడు రోజుల్లో 18 కోట్ల వసూళ్లు సాధించిన కామ్రేడ్, వీక్ డేస్‌లో డీలా పడిపోయాడు. తొలివారం ఈ సినిమా కేవలం 21 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, గుణ 369 సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో ఇక కామ్రేడ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపించటం లేదు. డియర్ కామ్రేడ్ దాదాపు 34 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే కనీసం 34 కోట్ల వసూళ్లు సాధించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు. దాదాపు అన్ని ఏరియాల్లో కామ్రేడ్ నష్టాలనే మిగల్చనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
‘‘డియర్ కామ్రేడ్’ విజయం సంతోషాన్నిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: డియర్ కామ్రేడ్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు హీరోయిన్ రష్మిక మందన్న. బేగంపేట భారతీ ఎయిర్టెల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా రష్మిక ‘డియర్ కామ్రేడ్’ కాంటెస్ట్ విజేతలను కలిసి ముచ్చటించారు. సినిమా విడుదలకు ముందే ఎయిర్టెల్.. ఏపీ, తెలంగాణల్లోని తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ‘డియర్ కామ్రేడ్’ సినిమాపై ఓ కాంటెస్ట్ నిర్వహించింది. దానిలో గెలుపొందిన 40 మంది విజేతలు నేడు బేగంపేట ఎయిర్టెల్ కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ సంస్థ సీఈవో అవ్నిత్ సింగ్ విజేతలను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ సంస్థ నిర్వహించిన కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలను కలవడం చాలా సంతోషంగా ఉంది. గత నెల 26న విడుదలయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాను తెలుగు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది’ అన్నారు. -
‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనందపడ్డా’
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్.భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇటీవల విడుదలైంది. కాగా, ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ నటుడు నటించారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావటం పట్ట ఆనందం వ్యక్తం చేసిన రాజ్ అర్జున్, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మీ సినీ రంగప్రవేశం ఎలా జరిగింది? భోపాల్ మా సొంత ఊరు. చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం. స్టేజ్ ఆర్టిస్ట్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఆ తర్వాత ముంబయిలో పదిహేను సంవత్సరాలు ఉన్నాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాను కాని నాకు అమీర్‌ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్స్టార్లో విలన్ క్యారెక్టర్లో చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పాత్రతో నాకు ఒక యాక్టర్‌గా మంచి పేరు వచ్చింది. డియర్ కామ్రేడ్లో అవకాశం ఎలా వచ్చింది? దర్శకుడు భరత్ కమ్మ సూపర్ సీక్రెట్ సినిమా చూశారు. అందులో నా పెర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఫోన్ చేసి పిలిపించారు. అలా ఆ సినిమా ద్వారా నాకు డియర్ కామ్రేడ్ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో మహిళలను వేధించే పాత్రలో నటించారు. .. నిజ జీవితంలో అలాంటివి ఎప్పుడైనా చూశారా? ఇటువంటివి బయట నేను చాలానే చూశాను. ప్రస్తుతం మన సొసైటీలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఇంకా చాలా విన్నాను. బట్ నాకు పర్సనల్‌గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. సినిమాల్లోకి రాకముందు మీరు ఏమి చేసేవారు? నేను భూపాల్‌లో ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడ్ని. ఇప్పటికీ ఆ బిజినెస్ ఉంది మా అన్నయ్య అవన్నీ చూసుకుంటున్నారు. విజయ్ దేవరకొండతో పని చేయడం ఎలా అనిపించింది? చాలా బావుంది. విజయ్ చాలా మంచి వాడు. ఎలాంటి వారినైనా గౌరవిస్తాడు. చిన్నా, పెద్దా అని చూడడు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు. సెట్స్‌లో కూడా అందరితో బాగా కలిసిపోతాడు. షూటింగ్‌కి కూడా చాలా డెడికేటెడ్‌గా టైమ్‌కి వస్తాడు. ఒక్కోసారి తన పంచువాలిటీ చూస్తే నాకే ఆశ్చర్యమేసేది. అతనికి మధ్యతరగతి విలువలు బాగా తెలుసు. అందరినీ తన వారిలో చూస్తాడు. నాకు ఎక్కడా నేను ఒక పెద్ద హీరోతో నటిస్తున్నాను అన్న ఫీలింగ్ కలగలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. రష్మిక క్లైమాక్స్‌లో మీ చెంప చెల్లుమనిపించింది కదా అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫీలయ్యానండి. చాలా ఆనందంగా ఫీలయ్యా. ఎందుకంటే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో నేను చాలా ఇబ్బంది పెట్టా, చాలా టార్చర్ కూడా పెట్టాను. నటనలో భాగంగానే మెంటల్‌గా, ఫిజికల్‌గా తనను చాలా ఇబ్బంది పెట్టాను. తను సీన్ అయిపోయాక కూడా అరగంట వరకు ఏడ్చేది. నేను మళ్ళీ తన దగ్గరకు వెళ్ళి చాలా సేపు మంచిగా మాట్లాడేవాడ్ని అవి కేవలం సీన్స్ మాత్రమే నువ్వు బాధపడివుంటే నన్ను క్షమించు. బాధపడొద్దు అని చెప్పేవాడ్ని. ఆఖరికి తను నన్ను కొట్టినప్పుడు చాలా ఆనందపడ్డాను. హమ్మయ్య.. తన కోపం అంతా పోయింది కదా అని. ఎక్కడా కూడా ఒక విలన్, హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ అవ్వరు. కానీ ఈ సినిమాతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విజయ్, రష్మిక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇండస్ట్రీ నుంచి మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్? తమిళ , తెలుగు ఇండస్ట్రీల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. తమిళ డైరెక్టర్ విజయ్, నటుడు కృష్ణ చాలా బాగా చేశారని అభినందించారు. అలాగే సినిమా అయిపోయాక కొంత మంది థియేటర్లో నన్ను చూసిన ఆడపిల్లలు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా కొందరు భయపడ్డారు. నేను ఆ పాత్రకు తగ్గట్టే ఉన్నానని. కొంతమంది నన్ను క్రూయల్ మెంటాలిటీ అని అనుకుంటున్నారు. దాదాపుగా ఈ మధ్య నేను నటించిన మూడు చిత్రాలు కూడా అలా నెగిటివ్ క్యారెక్టర్స్ కావడంతో అలా అనుకుంటున్నారు. మీకు తమిళ, తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో ఏది కంఫర్ట్‌గా ఉంది? రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన షాభీ చిత్రం మంచిగా అనిపించింది. ఆ తర్వాత సూపర్ సీక్రెట్ కూడా ఓకే. కాకపోతే నా వరకు డియర్ కామ్రేడ్ తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్ అనిపించింది. ప్రొడ్యూసర్ మంచి వారు. పెద్ద బ్యానర్ నాకు భాష రాకపోయినా ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బావుంది. హైదరాబాద్ నాకు నా సొంత ఇల్లులా అనిపించింది. నా వరకు అయితే తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్. మీ తర్వాత నటించే చిత్రాలు? హిందీ షీర్షా అనే చిత్రంలో నటిస్తున్నాను. కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. అందులో నేనొక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాను. కరణ్ జోహర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అని ప్రత్యేకించి ఏమీ లేదు. కాని నేను నటించే పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. కథ నచ్చి నా పాత్రకి ప్రాముఖ్యత ఉంటే ఏ పాత్రలోనైనా నటిస్తా. మీకు తెలుగు రాదు కదా ఏమైనా ఇబ్బంది అయిందా? లేదండి. నా డైలాగ్స్ అన్నీ ముందుగానే న్యారేట్ చేసేవారు. రాము డైలాగ్స్‌కి హెల్ప్ చేశారు. దాని పై చాలా పెద్ద హోమ్ వర్క్ చేసేవాడ్ని భాష గురించి ఎప్పుడూ అంతగా ఇబ్బంది కలగలేదు. -
అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక
చెన్నై : తరువాత బాధ పడదలుచుకోలేదు అంటోంది నటి రష్మిక మందన. అసలీ జాన బాధేంటో చూస్తే పోలా.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌హాట్‌గా వినిపిస్తున్న పేరు రష్మిక. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ అమ్మడి పేరు టాలీవుడ్లో గీతాగోవిందం చిత్రంతో మారుమోగిపోయింది. అంతే అక్కడ క్రేజీ నటి అయిపోయింది. తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంతో మరోసారి లైమ్‌టైమ్‌లోకి వచ్చింది. కారణం గీతాగోవిందం చిత్ర కాంబినేషన్ రిపీట్ కావడం, చిత్రం టాక్‌కు సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించడం, చిత్రంలో ఘాటుఘాటు చుంబన దృశ్యాలు చోటుచేసుకోవడం వంటి అంశాలు రష్మికను మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఇక ఈ బ్యూటీ క్రేజ్ కోలీవుడ్ వరకూ పాకేసింది. ఇప్పటికే నటుడు కార్తీకి జంటగా నటిస్తోంది. ఇక దళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఆయన 64వ చిత్రంలో ఎదురుచూస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇక తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్న లక్కీ నటి రష్మిక. ఇలా ఒక రేంజ్లో ఖుషీ అవుతున్న ఈ బ్యూటీకి వాయిస్ పెరగడంలో ఆశ్చర్యం ఏం ఉంటుంది. అదే చేస్తోందీ అమ్మడు. అసలేమంటోందీ ముద్దుగుమ్మ చూద్దామా..తమిళంలో కమర్శియల్ చిత్రాల్లో నటించమని చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని నేను అంగీకరించడం లేదు. సత్తా లేని పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కాలాన్ని వృథాచేయడం నాకిష్టం లేదు. ఇకపోతే ఈగో అన్నది అందరికీ ఉంటుంది. నేను కమర్శియల్ చిత్రాల్లో నటించనని చెప్పడం దర్శకులకు కచ్చితంగా నచ్చదు. అయితే వారికి నా స్థానంలో ఉండి చూస్తే నేనెందుకు అలా అంటున్నానన్నది అర్థం అవుతుంది. నేను బొమ్మను కాను. కమర్శియల్ చిత్రాల్లోనే నటించుకుంటూపోతే నిర్ణీత కాలమే ఇక్కడ నిలబడగలను. ఎన్నేళ్లు ఈ రంగంలో ఉన్నానన్నదానికంటే నేను నటించిన చిత్రాలను చేసి గర్వపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి కమర్శియల్ చిత్రాల్లోనే నటించి ఆ తరువాత కాలంలో బాధ పడదలచుకోలేదు. ఒక చిత్రానికి హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమే. హీరో, హీరోయిన్ ఒకే లాగా శ్రమించి నటించినా, హీరోయిన్లు ఎక్కువ కాలం నిలబడడంలేదు. హీరోయిన్లు 15 ఏళ్ల పాటు ఈ రంగంలో కొనసాగినా, ఒకే లాగా ఉండదు అని రష్మిక పేర్కొంది. -
‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా కూడా ఏదోరకంగా విజయ్ పేరు సోషల్ మీడియాలో నానుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్న విజయ్.. డియర్ కామ్రేడ్‌తో దక్షిణాదిన పాగా వేసేందుకు స్కెచ్ వేశాడు. అయితే డియర్ కామ్రేడ్ అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్చేసిన విజయ్.. బాలీవుడ్‌లోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. అక్కడ ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయిన ఈ చిత్రంతో షాహిద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. నటనలో మాత్రం విజయ్‌తో పోలిక తప్పలేదు. ఇక షాహిద్ పేరు కంటే బాలీవుడ్లో విజయ్ పేరే ఎక్కువగా వినపడింది. దానికి తోడు విజయ్ కూడా బాలీవుడ్ వెళ్లేందుకు సుముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకే డియర్ కామ్రేడ్ చిత్రాన్ని కరణ్ జోహార్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించి బాలీవుడ్లో రీమేక్ చేసేట్లుగా ఒప్పించాడు. ఇక ఈ రీమేక్‌లో విజయ్ నటిస్తున్నాడు అని ప్రచారం జరిగినా.. అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఇలా బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిన విజయ్.. తాజాగా ఓ అభిమానిని ఓదారుస్తూ వైరల్ అయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ అభిమాని సడెన్‌గా వచ్చి తోయడంతో కిందపడిపోయాడు.. వెంటనే లేచిన విజయ్.. ‘మీరు ప్రేమ చూపిస్తున్నారా? లేక నాపై దాడి చేస్తున్నారా’ అని సరదాగా అడగడం.. అటుపై ఆ అభిమానిని ఏమి అనొద్దని సైగలు చేయడం.. దీంతో విజయ్‌కు తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటడం ఇలా ప్రతీ విషయంలోనూ విజయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌తో తీయబోతోన్న చిత్రంతో బిజీకానున్నాడు. -
‘కామ్రేడ్’ని కాపాడే ప్రయత్నం!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి ఎడిటింగ్ చేసే పనిలో పడ్డారన్న టాక్ వినిపించింది. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో సర్ప్రైజ్ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీ సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకు మించి నేనేం చెప్పలేను’ అంటూ ట్వీట్ చేశారు రష్మిక. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ తొలి మూడు రోజులు సెలవుల కావటంతో మంచి వసూళ్లు సాధించింది. సోమవారం కూడా తెలంగాణలో బోనాలు సెలవు ఉండటంతో ఇక్కడ మంచి కలెక్షన్లు వచ్చినా ఆంధ్రాలో మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిలో చిత్రయూనిట్ చేసిన మార్పులు సినిమాను ఎంతవరకు కాపాడతాయో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించాడు. LISTEN!!🔊 We DEAR COMRADE team have a surprise for all of you in the theatres😉 I won't let you know what exactly it is- I want you all to experience it. We've taken into consideration all your feedback and more than this I won't give you any clues. Now go go!! see see!!😉💃🏻 — Rashmika Mandanna (@iamRashmika) July 29, 2019 -
కరెక్ట్ టైమ్‌లో చెప్పిన కథ ఇది
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్, యశ్ రంగినేని నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌తో ప్రదర్శింపబడుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ 21 కోట్లు వచ్చింది. పెట్టినదానికి 80శాతం రికవరీ అయింది. గురువారంతో 100 శాతం రికవరీ అవుతుంది. సినిమాను కొన్న అందరూ లాభాల్లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఓ 5 శాతం ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుంది. ఓపెనింగ్స్ బావున్నాయి. కొంచెం స్లోగా ఉంది అనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. వెంటనే పదమూడు నిమిషాలు తగ్గించాం. క్యాంటీన్ సాంగ్ చాలా పాపులర్ అయింది. దాని రన్‌టైమ్ ఎక్కువైందని తీశాం. ఇప్పుడు కలిపాం. బుక్ మై షోలో కూడా సెకండ్ డేలా బుకింగ్స్ జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళలో కూడా మంచి రన్ ఉంది. సక్సెస్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ ఓ సోషల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. అమ్మాయిలకు పని చేసే చోట వేధింపులు ఉండటంతో పాటు ఇంట్లో ఒత్తిడి వల్ల నచ్చిన పనిని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మా సినిమాలో చూపించాం. ప్రస్తుతం ‘మీటూ’ మూమెంట్ జరుగుతోంది. కరెక్ట్ టైమ్‌లో చెప్పిన కథ ఇది. కొందరు సినిమా ల్యాగ్ ఉంది అంటున్నారు. ట్రిమ్ చేసిన వెర్షన్ చూస్తే చాలా నచ్చుతుంది. ఫ్యామిలీలు, స్త్రీలు, యూత్ అందరికీ నచ్చే సినిమా ఇది. ‘అర్జున్ రెడ్డి’కి ముందు ఓకే చేసిన కథ అయినప్పటికీ కథలో మార్పులు చేయలేదు. ముందు అనుకున్నదాని కంటే పెద్ద స్కేల్లో తీయాల్సి వచ్చింది. విజయ్ తన ఇమేజ్‌ని పట్టించుకోడు. మంచి కథలను చెప్పాలనుకుంటాడు’’ అన్నారు యశ్ రంగినేని. ‘‘విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘హీరో’ సినిమా ఆగిపోలేదు. బైక్ రేసింగ్‌తో కూడుకున్న సినిమా కాబట్టి రేస్ ట్రాక్ మీద నచ్చిన సమయంలో షూట్ చేయడానికి వీలుపడదు. వాళ్లు అనుమతించినప్పుడే షూట్ చేయాలి’’ అన్నారు రవి శంకర్. -
నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక
చెన్నై : నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేం. నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. అత్యుత్సాహం ఒక్కోసారి చిక్కుల్లో పడేస్తుంది. ముఖ్యంగా బహిరంగ వేదికల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే నటి రష్మిక బుక్కయ్యింది. గీతాగోవిందం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్ర అనూహ్య విజయంతో అనుకోకుండా స్టార్ అయిపోయిన కన్నడ నటి రష్మిక మందనా అన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాత టాలీవుడ్లో అవకాశాలు వరుసకడుతున్నాయి. గీతాగోవిందం చిత్ర హీరో విజయ్‌దేవరకొండతోనే మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో జత కట్టింది. అంతే కాదు ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో జతకట్టే అవకాశాన్ని కొట్టేసింది. ఇక కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తోంది. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను దక్కించుకుంటున్న రష్మిక పనిలో పనిగా తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయం అటుంచితే ఈ అమ్మడు విజయ్‌దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఇటీవల తెరపైకి వచ్చింది. మిశ్రమ స్పందనతో చిత్రం ప్రదర్శింపబడుతోంది. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్ కోసం రష్మిక విజయ్‌దేవరకొండ, చిత్ర యూనిట్‌తో కలిసి నాలుగు రాష్ట్రాల్లోనూ చుట్టేసింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నారు. ఏ భాషలో నటించడం కష్టం అనిపిస్తోందన్న మీడియా వాళ్ల ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా కన్నడ భాషలో మాట్లాడి నటించడం కష్టం అనిపిస్తోందని టక్కున చెప్పింది. అంతే బుక్కయ్యిపోయింది. అలా చెప్పి సొంత రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. మాతృభాషను మాట్లాడడం కష్టంగా ఉందంటావా అంటూ కన్నడ సంఘాలు రష్మికపై మండిపడుతున్నారు. అంతే కాదు బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్ అంటూ ఈ అమ్మడి చిత్రాలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీనికి నటి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే విజయ్‌కు క్రేజ్ ఎక్కువ. అయితే తాజాగా ఓ మహిళా అభిమాని విజయ్ను చూడటంతో ఎమోషన్ అయ్యారు. తన అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆనందంతో బోరున విలపించారు. ఇది గమనించిన విజయ్ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగినప్పటికీ.. ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. విజయ్ తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ ప్రమోషన్లో భాగంగా చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లలో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించారు. అప్పుడే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. -
విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అయితే వీకెండ్ తరువాత సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందన్న టెన్షన్లో ఉన్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. హీరో సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రకరించారు. అయితే ఈ సన్నివేశాలపై చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో తెరకెక్కించిన రేసింగ్ సీన్స్ ఆకట్టుకునేలా లేకపోవటంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
నా కామ్రేడ్స్ అందరికీ థ్యాంక్స్
‘‘డియర్ కామ్రేడ్’ నాకు చాలా పర్సనల్ ఫిల్మ్. చాలా స్పెషల్ ఫిల్మ్. సంవత్సరం నుంచి మా ఎమోషన్స్ అన్నీ ఇందులో పెట్టాం. బాబీ, లిల్లీ అనే రెండు పాత్రల ప్రయాణం, కలలు, కష్టాలు, వాళ్ల ఫైట్ నాకు పర్సనల్. మా ఫ్రెండ్స్ అందరూ ఊరికే ఏడుస్తున్నావ్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈ సినిమా తర్వాత నేను ఎమోషనల్‌గా మారిపోయాను’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్, యష్ రంగినేని నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. మొదటిరోజు 11.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. సోమవారం–మంగళవారంలోపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్, స్త్రీలు, ఫ్యామిలీ అందరూ ఎంటర్టైనర్ అవుతున్నారు. ఇదే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు యష్. ‘‘సొసైటీలో ఉన్న సీరియస్ ఇష్యూను బాగా డీల్ చేసిన సినిమా ఇది’’ అన్నారు చెర్రీ. ‘‘నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నమిది. నిన్న కొన్ని థియేటర్స్ సందర్శించాం. సినిమా పూర్తయిన తర్వాత నిలబడిని చప్పట్లు కొడుతున్నారు. చూసిన వాళ్లందరూ ఎమోషనల్ అవుతున్నారు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఫస్ట్ నుంచి చెబుతున్నట్టుగానే ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. ‘మేం చాలా కనెక్ట్ అయ్యాం’ అని అంటున్నారు’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘నాకు కలెక్షన్స్ సరిగ్గా అర్థం కావు కానీ మా సినిమాను చాలామంది చూశారు, ఇంత ప్రేమను మాకు అందించారు. అందరికీ థ్యాంక్స్. నాలుగు భాషల్లో ఈ సినిమా చేశాం. థియేటర్స్‌కు ప్రేక్షకుల్ని తీసుకురావడం నా బాధ్యత. చాలా మందికి రీచ్ అయింది. థియేటర్స్‌ను నింపిన నా కామ్రేడ్స్ అందరికీ థ్యాంక్స్. అన్ని రకాల ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటున్నాం. స్లోగా ఉంది అంటున్నారు, టచ్ చేశావ్ అంటున్నారు. ఈ కథను ఇలానే చెప్పాలి. స్లోగా ఉన్నా ఎంజాయ్ చేస్తారు. మా టీమ్‌ను చూసి గర్వంగా ఉంది. అన్నీ కుదిరితే సక్సెస్‌మీట్ కాకినాడలో చేస్తాం’’ అన్నారు విజయ్ దేవరకొండ. -
‘ఎక్కడ మాట్లాడినా ఏడుపొచ్చేస్తుంది’
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు భరత్ కమ్మ, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా పర్సనల్. బాబీ క్యారెక్టర్లో నటించిన తరువాత నేను కూడా చాలా ఎమోషనల్ పర్సన్ అయ్యాను. అందుకే మా తమ్ముడు (ఆనంద్ దేవరకొండ) సినిమా ఫంక్షన్లో కూడా ఏడ్చేశా. ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా ఏడుపొస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. ఈ సినిమాలో చేసిన ఎమోషనల్ సీన్స్, ఆ జర్నీ కారణంగా నేను మారిపోయా. డియర్ కామ్రేడ్ అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించటం ఆనందంగా ఉంది. డియర్ కామ్రేడ్ టీంను మిస్ అవుతున్నా’ అన్నారు. -
కన్నడనాట ‘కామ్రేడ్’కి కష్టాలు!
విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాకు సాండల్‌వుడ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్ణాటకలో కన్నడ వర్షన్ కన్నా తెలుగు వర్షన్‌కే ఎక్కువగా థియేటర్లు కేటాయించటంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమపై తెలుగు భాషను రుద్దుతున్నారంటూ ‘బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్’ (#BoycottDearComrade) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రధాన నగరాల్లో కూడా డియర్ కామ్రేడ్ కన్నడ వర్షన్‌కు పెద్దగా థియేటర్లు దక్కకపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కన్నడలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక హీరోయిన్గా నటించటం, ప్రమోషన్ కార్యక్రమాలకు కేజీఎఫ్ హీరో యష్ హాజరు కావటంతో డియర్ కామ్రేడ్పై కర్ణాటకలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. సినిమా నిడివి, స్లో నేరేషన్లపై విమర్శలు వినిపించాయి. అయితే సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావటం, విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ అన్ని కలిసి డియర్ కామ్రేడ్ సినిమా తొలి రోజు 11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శని, ఆది వారాలు సెలవు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. (మూవీ రివ్యూ : డియర్ కామ్రేడ్) -
‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ
టైటిల్ : డియర్ కామ్రేడ్ జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్, సుహాస్ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ దర్శకత్వం : భరత్ కమ్మ నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్, యష్ రంగినేని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా డియర్ కామ్రేడ్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల తరువాత విజయ్ మార్కెట్ స్టామినాకు ఈ సినిమా యాసిడ్ టెస్ట్ లాంటిదని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విజయ్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని తానే అయి ప్రమోట్ చేస్తూ వచ్చాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవటంతో సినిమా సక్సెస్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి డియర్ కామ్రేడ్‌తో విజయ్ ఆశించిన సక్సెస్ వచ్చిందా..? కథ : చైతన్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్. కాకినాడలోని కాలేజ్‌లో చదువుకునే బాబీ తన కోపం కారణంగా చాలా మందితో గొడవలు పడతాడు. అపర్ణా దేవీ అలియాస్ లిల్లీ (రష్మిక మందన్న) స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్. తన కజిన్ పెళ్లి కోసం కాకినాడ వచ్చిన లిల్లీ, బాబీతో ప్రేమలో పడుతుంది. కానీ అతని కోపం, గొడవల కారణంగా వారిద్దరూ దూరమవుతారు. లిల్లీ దూరం అవ్వటంతో బాబీ పిచ్చివాడైపోతాడు. మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఆ బాధను మరిచిపోయిన బాబీ ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వస్తాడు. అక్కడ లిల్లీని కలుస్తాడు. తను మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని తెలుసుకొని ఆమె కోలుకునేలా చేస్తాడు. అదే సమయంలో లిల్లీ ఆరోగ్యం పాడవ్వడానికి, క్రికెట్‌కు దూరమవ్వటానికి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ వేదింపులే కారణమని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి బాబీ ఏం చేశాడు..? లిల్లీ తిరిగి క్రికెటర్ అయ్యిందా? లేదా? అన్నదే మిగతా కథ. నటీనటులు : డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ దేవరకొండ మరోసారి ఆకట్టుకున్నాడు. విద్యార్థి నాయకుడిగా, ప్రేమికుడిగా, ప్రేమ దూరమై బాధలో ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. విజయ్ మార్క్ అగ్రెసివ్ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. చాలా సందర్భాల్లో అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తాడు విజయ్. రష్మిక మందన్న లిల్లీ పాత్రలో ఒదిగిపోయారు. రొమాంటిక్ సీన్స్‌లో సూపర్బ్ అనిపించిన రష్మిక, ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించారు. అక్కడక్కడా డబ్బింగ్ చెప్పటంలో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. మల్టీ లింగ్యువల్ సినిమా కావటంతో ఇతర పాత్రల్లో ఎక్కువగా పరభాష నటులే కనిపించారు. అంతా తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : విప్లవ భావాలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడటం. ఆ తరువాత తన భావాలకు, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ, వాటి వల్ల ఎదురైన పరిస్థితుల, మహిళా క్రికెట్ అసోషియేషన్‌లో వేదింపుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. కథా పరంగా బాగానే ఉన్న కథనంలో మాత్రం దర్శకుడు మెప్పించలేకపోయాడు. తను అనుకున్న కథను సుధీర్ఘంగా చెప్పిన దర్శకుడు ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథనంలోనూ కొత్తదనం లేకపోవటం నిరుత్సాహం కలిగిస్తుంది. కథ అంతా సెకండ్ హాఫ్ కోసం దాచిపెట్టిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్ ఎలివేషన్ కోసం తీసుకున్నాడు. ప్రథమార్థంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్, కాలేజ్ సీన్స్‌తో కాస్త పరవాలేదనిపిస్తాయి. కానీ ద్వితీయార్థం మరీ సాగదీసినట్టుగా ఉంది. అయితే కొన్ని రియలిస్టిక్ సీన్స్, లోకేషన్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. పోయిటిక్ స్టైల్ టేకింగ్, నేరేషన్ ఓ సెక్షన్ ఆడియన్స్‌ను మెప్పించినా అన్ని వర్గాలను అలరించటం కష్టమే. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ పాటలు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతానికి సాహిత్యం, టేకింగ్ అన్నీ కలిసి పాటలను విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి. దర్శకుడు మెప్పించలేకపోయిన సన్నివేశాల్లో కూడా జస్టిన్ సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. కేరళ అందాలతో పాటు నార్త్‌లో తెరకెక్కించిన రోడ్ సీన్స్ విజువల్స్ కూడా మెప్పిస్తాయి. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ప్రతీ సన్నివేశం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : విజయ్ దేవరకొండ లవ్ ట్రాక్ సంగీతం మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే స్లో నేరేషన్ సినిమా నిడివి సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
'కరణ్ నాతో సినిమా చేస్తానన్నారు'
సాక్షి, బీచ్‌రోడ్డు(విశాఖపట్నం) : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ డియర్ కామ్రేడ్ సినిమాను చూసి మెచ్చుకున్నారని ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన సినిమా చూసిన విధానం నచ్చిందని, నాతో పాటు హీరోయిన్, దర్శకుడు, ఇతర నటీనటులను అభినందిస్తూ.. తనతో సినిమా చేయాలని కోరారని చెప్పారు. ఆయన అలా అడగడంతో చాలా గర్వంగా ఫీలయ్యానని తెలిపారు. డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. డియర్ కామ్రేడ్ అలరిస్తుంది డియర్ కామ్రేడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసి అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుంది. దక్షిణాది ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం మొదట డియర్ కామ్రేడ్‌ను తెలుగులోనే అనుకున్నాం. దక్షిణాదికి సంబంధించిన వారు ఈ చిత్రంలో నటించారు. పనిచేశారు. అందువలన ఈ సినిమాను దక్షిణ భాషల్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ విషయం నిర్మాతలకు చెప్పగానే.. ఒప్పుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ మరువలేను. ఇప్పటి వరకు పది నగరాల్లో సినిమా ప్రమోషన్లు నిర్వహించాం. చివరిగా వైజాగ్‌లో డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటి. వైజాగ్ అనే ఫీల్ భలేగా ఉంటుంది. మైత్రీ మూవీస్‌తో మరో సినిమా డియర్ కామ్రేడ్ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్‌తో నాకు మంచి బంధం ఏర్పడింది. త్వరలోనే వారితో మరో సినిమా చేయనున్నాను. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. 100 కోట్ల క్లబ్లో చేరడం చాలా హ్యాపీ గీత గోవిందం చిత్రం ప్రేక్షకులను అలరించిన తీరు మాటల్లో చెప్పలేను. ఆ చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరడం చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు కలెక్షన్ల పై పెద్దగా ఆసక్తి లేదు. నేను చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయా లేదా అనేదే ముఖ్యం. సరైన సమయంలో విడుదల మూడేళ్ల కిందట డైరెక్టర్ భరత్ నాకు డియర్ కామ్రేడ్ కథ చెప్పారు. అయితే అప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకోవడంతో ఈ కథ చేయడానికి కొంత సమయం పట్టింది. ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్ చేశాం. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సరైన సమయంలో సినిమా విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. -
నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం
‘‘నేను నటుణ్ణి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడికెళ్లినా మీరు (ఫ్యాన్స్) సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘డియర్‌కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్స్ సక్సెస్ అయ్యాయి. నేను నాలా ఉండటమే మీ అందరికీ నచ్చుతుంది’’ అని విజయ్‌దేవరకొండ అన్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘డియర్‌కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భరత్ నాకు చాలా కాలంగా తెలుసు. మూడేళ్లుగా నా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశాడు. ఇప్పుడు ఒక అందమైన సినిమా నాకు ఇచ్చాడు. తను ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా నా డియర్ కామ్రేడ్స్ అందరికీ, భరత్ కమ్మ వాళ్ల నాన్నగారికి అంకితం. లిల్లీ పాత్రలో రష్మిక ఎంత కష్టపడిందో సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ మా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా’’ అన్నారు వై. రవిశంకర్. ‘‘భరత్ కమ్మ అండ్ టీమ్ ఒకటిన్నర సంవత్సరం ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించినందుకు థ్యాంక్స్’’ అన్నారు యష్ రంగినేని. ‘‘మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘2017లో ఎడిట్ రూమ్‌లో ‘పెళ్ళిచూపులు’ సినిమా చూశాను.. చాలా నచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ టైమ్‌లో ‘డియర్ కామ్రేడ్’ కథ చెప్పాను. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి కారణం విజయ్ వాళ్ల నాన్నగారు. ‘డియర్ కామ్రేడ్’ తప్పకుండా మంచి హిట్ అవుతుంది’’ అని భరత్ కమ్మ అన్నారు. ‘‘భరత్ సార్ పంపిన ఈ కథ పిచ్చిగా నచ్చింది. మా పేరెంట్స్ వద్దన్నా ఈ సినిమా కోసం పెద్ద ఫైట్ చేయాల్సి వచ్చింది. క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్నో గాయాలైనా లెక్క చేయకుండా ఈ సినిమా చేశా. విజయ్ అమేజింగ్ యాక్టర్’’ అన్నారు రష్మికా మండన్న. -
తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా
యంగ్ హీరో రానా ఆరోగ్య పరిస్థితిపై చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా రానా బాగా సన్నబడటంతో హెల్త్ ఇష్యూ కారణంగా రానా అలా తగ్గిపోయాడన్న ప్రచారం జరిగింది. తాజాగా రానా అమెరికా పర్యటన విషయంలో ఇవే వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. రానా ఆరోగ్య పరిస్థితి విషమించిందని కిడ్నీ మార్పిడి జరిగిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై సూటిగా స్పందించకపోయినా అవన్నీ పుకార్లంటూ కొట్టి పారేశాడు రానా. బుధవారం ఉదయం డియర్ కామ్రేడ్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెపుతూ ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశాడు రానా. అయితే వీడియో పోస్ట్‌కు కామెంట్స్‌లో అభిమానులు రానాను ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నించటంతో ‘అలాంటి వార్తలను చదవడం మానేయండి’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా అక్కడే డియర్ కామ్రేడ్ సినిమా చూడబోతున్నట్టుగా తెలిపారు. -
కరణ్‌కు నో చెప్పిన విజయ్ దేవరకొండ
ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ సినీ జనాలను కూడా ఆకట్టుకున్న విజయ్, ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి తరువాత దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా డియర్ కామ్రేడ్ రికార్డ్ సృష్టించనుంది. డియర్ కామ్రేడ్ సినిమా చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే కరణ్ బాలీవుడ్‌లోనూ విజయ్‌ని హీరోగా నటించమని కోరినా, విజయ్ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. గతంలో అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలోనూ నో చెప్పిన విజయ్ తాజాగా డియర్ కామ్రేడ్ రీమేక్ విషయంలో కూడా అదే విధంగా స్పందించాడు. ఒకే కథలో రెండు సార్లు నటించటం తనకు ఇష్టముండదని, అందుకే రీమేక్ చిత్రాలకు నో చెపుతున్నాని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. హిందీ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానన్న విజయ్, ముంబైలో సెటిల్ అయ్యే ఆలోచన మాత్రం లేదని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో వర్క్ అవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే బాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అని తెలిపారు. విజయ్ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు రిలీజ్ అవుతోంది. -
ప్రతి రోజూ పరీక్షే!
‘‘బయట నుంచి చూసే కొందరికి నటన చాలా ఈజీ కదా అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. యాక్టింగ్ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. సెట్‌కు వెళ్లిన ప్రతిరోజూ పరీక్షే’’ అన్నారు రష్మికా మండన్నా. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మికా మండన్నా చెప్పిన విశేషాలు. బాబీ (సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు) అండ్ లిల్లీ (రష్మికా పాత్ర పేరు)ల జర్నీ ఈ సినిమా. ఇందులో జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలనే లక్ష్యం ఉన్న రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడాకారిణి లిల్లీ పాత్రలో నటించాను. ఈ పాత్ర కోసం చాలా సాధన చేశా. గాయాలు కూడా అయ్యాయి. ముఖ్యంగా క్రికెటర్ల బాడీ లాంగ్వేజ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమాకు ముందు నా జీవితంలో క్రికెట్ ఆడలేదు. క్రికెట్ గురించి కూడా అంతగా తెలియదు. లిల్లీ పాత్ర వల్ల క్రికెట్ పట్ల అవగాహన కలిగింది. సిక్సులు తక్కువ, ఫోర్లు ఎక్కువగా కొట్టాను. ఇప్పుడు క్రికెట్ ఆడితే నా వికెట్‌ను నేను కాపాడుకోగలననే నమ్మకం కలిగింది. ఆన్‌డ్రైవ్, ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్.. ఇలా క్రికెట్ టెర్మినాలజీ గురించి కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాను. తొలిసారి క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను చూశాను. సెమీ ఫైనల్లో ధోనీ రనౌట్ నన్ను బాధించింది. చూస్తున్న మనకే ఇలా ఉంటే ఆ టైమ్‌లో గ్రౌండ్లో క్రికెట్ అడుతున్నవారికి ఇంకెంత ఆందోళనగా ఉంటుందో కదా అనిపించింది. ‘గీతగోవిందం’ సినిమా హిట్ సాధించింది కాబట్టి మళ్లీ విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఈ సినిమా ఒప్పుకోలేదు. దర్శకుడు భరత్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రం చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఆసక్తికరంగా అనిపించింది. లిల్లీ పాత్ర జ్ఞాపకశక్తి కోల్పోతుందా? అంటే ఆ విషయం గురించి ఇప్పుడు చెప్పను. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మంచి స్క్రిప్ట్స్‌తో వస్తున్న కొత్త దర్శకులతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మైత్రీ బేనర్, భరత్సార్తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావడం ఎగై్జటింగ్‌గా ఉంది. కన్నడ, తెలుగు వెర్షన్స్‌కు నేనే డబ్బింగ్ చెప్పాను. ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లో పూర్తిగా లీనమైపోతాను. కానీ సెట్లో సీన్ అయిపోయిందని యూనిట్ సందడి చేయడం మొదలుపెడితే అప్పుడు ఆ మూడ్ నుంచి బయటకు వస్తాను. కానీ పర్సనల్‌గా కొన్ని క్యారెక్టర్స్‌కు మాత్రమే కనెక్ట్ అవుతాం. పెద్ద సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశం రావడాన్ని నేను కేవలం లక్ అనుకోవడం లేదు. హార్డ్‌వర్క్‌ని నమ్ముతాను. ఎవరైనా ఏదైనా నాకు రాదని చెబితే.. తిరిగి నేనేమీ అనను. చేసి చూపిస్తా. అందుకోసం ఎంతైనా కష్టపడతాను. కెరీర్లో ముందుకు వెళ్తూ, లాంగ్ రన్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే కష్డపడాల్సిందే. ఇండస్ట్రీలోని ప్రతి హీరోయిన్‌కి వారి పర్సనల్ స్టేటస్ గురించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. నా వరకైతే లొకేషన్‌కు వెళ్లి షూటింగ్లో పాల్గొనడం, వర్కౌట్స్, షెడ్యూల్స్ ప్లానింగ్ వీటితోనే గడిచిపోతోంది. ఖాళీ సమయం లేదు. కొన్ని సార్లు తినడం కూడా మర్చిపోతున్నాను. భోజనం టైమ్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది.. అయ్యో.. ఈ రోజు నేను తినలేదు కదా అని. ఇక నా పర్సనల్ విషయానికి వస్తే నేను సింగిలే. కన్నడలో సినిమాలు చేయడాన్ని నేను తగ్గించలేదు. కరెక్ట్‌గా డేట్స్ ఇస్తే ఏడాదిలో నాలుగు సినిమాలు చేయవచ్చు. నేను చేయాల్సిన సినిమాలను స్క్రిప్ట్స్ పరంగా ఎంచుకుంటున్నాను. కన్నడలో ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీలాంటి విషయాలు నా చేతిలో ఉండవు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌బాబుగారితో వర్క్ చేయబోతున్నాను. ఇంకా నా పాత్ర షూటింగ్ ఆరంభం కాలేదు. దానికోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నితిన్ ‘భీష్మ’ షూటింగ్ ఫుల్ మస్తీగా సాగుతోంది. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయనున్నా. తమిళంలో కార్తీ సరసన ఓ సినిమా చేయబోతున్నాను. మరొక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. -
బాలీవుడ్‌కు ‘డియర్ కామ్రేడ్’
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో పాగావేసిన విజయ్.. ఈ చిత్రంలో మొత్తం దక్షిణాదిలో హస్తగతం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సినిమాను చూసిన అనంతరం డియర్ కామ్రేడ్ హక్కులను తీసుకుని, రీమేక్ చేసేందుకు సిద్దమైనట్లు ప్రకటించారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్నలు అద్భుతంగా నటించారని, దర్శకుడిగా తొలిచిత్రమైనా.. భరత్ కమ్మ అత్యద్భుతంగా చిత్రీకరించారని, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం బాగుందని పేర్కొన్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై రీమేక్ కానున్న ఈ చిత్రంలో ఎవరు నటించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. Stunning and powerful love story! With top notch performances and exceptional music by @justin_tunes On point debut direction by @bharatkamma @TheDeverakonda is BRILLIANT as is @iamRashmika well done @MythriOfficial ! ANNOUNCING that @DharmaMovies to REMAKE this beautiful film pic.twitter.com/IRZJ7fTZ9L — Karan Johar (@karanjohar) July 23, 2019 -
ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?
‘‘మ్యూజికల్ ఫెస్టివల్’ అని కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు.. వేరే హీరోలు చేయనివి చేస్తున్నారు? అని మేం ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్ట్ చేసిప్పుడు కొందరు అడిగారు. వేరే యాక్టర్లు చేయనిది చేద్దామనో, ఇండస్ట్రీలో లేనిది చేద్దామనో కాదు. నా సినిమాకి నాకు నచ్చినట్టు చేద్దామని ‘మ్యూజిక్ ఫెస్ట్’ నిర్వహించాం’’ అన్నారు విజయ్ దేవరకొండ. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమా కోసం జస్టిన్ ప్రభాకరన్ స్వరపరచిన పాటలు నాకు బాగా నచ్చాయి. ఓ సినిమాలో రెండు హిట్ పాటలొస్తే చాలా సంతోషం. ఇందులో 8 పాటలుంటే 5 పాటలు సూపర్‌గా ఉన్నాయి. పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రమోషన్ కోసం నాలుగు సిటీలు తిరగాలి. ప్రతిసారీ ఏం మాట్లాడతాం.. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేద్దామనుకుని మ్యూజిక్ ఫెస్ట్ ప్లాన్ చేశాం. కర్నాటక, కేరళ ప్రేక్షకులు నా సినిమాలు చూస్తున్నారు. వారి మధ్య ‘మ్యూజిక్ ఫెస్టివల్’ చేద్దామనుకున్నాం. ఫస్ట్ బెంగళూరులో చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్ ఉండేది. అక్కడ సూపర్ సక్సెస్ అయింది. చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లోనూ సక్సెస్ అయింది. ఇది నాకొక తీపి గుర్తు. డ్యాన్స్‌లు చూడటం ఇష్టం. కానీ, చేయడమంటే భయం. సాంగ్ షూట్ ఉందంటే.. ఓ భయం. రెండు రోజులు రిహార్సల్ చేస్తే కానీ షూటింగ్ జరగదు. డ్యాన్స్ నాకు సహజంగా రాదు. కానీ, ఎంజాయ్ చేస్తాను. ► ‘డియర్ కామ్రేడ్’ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకి మంచి డైరెక్టర్, సంగీతం, కెమెరా, డైలాగ్స్, నటన... ఇలా ప్రతిదీ బాగా కుదిరింది. చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా. ‘అర్జున్ రెడ్డి’ టైమ్‌లో ఈ కథ విన్నా. అప్పటి నుంచి ఈ ప్రయాణం సాగుతోంది. భావోద్వేగంతో కూడుకున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. థియేటర్ నుంచి ప్రేక్షకులు వెళ్లేటప్పుడు ఒక ఎమోషన్ని, ఆలోచనని ఇంటికి తీసుకెళ్తారు. చూసి, ఎంజాయ్ చేసి థియేటర్లో వదిలేసే సినిమా కాదు. బాబీ, లిల్లీ పాత్రల ప్రయాణం ఇది. బాబీపై లిల్లీ ప్రభావం ఏంటి? లిల్లీపై బాబీ ప్రభావం ఏంటి? అన్నది ముఖ్యం. ► తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇది. ‘బాహుబలి’ తెలుగు, తమిళ్, మలయాళంలో విడుదలైంది కానీ కన్నడలో రిలీజ్ కాలేదు. కానీ, ‘బాహుబలి’తో మా సినిమాకి పోలికే లేదు. ఎందుకంటే ఆ కథే వేరు. ‘డియర్ కామ్రేడ్’ని తెలుగులోనే తీద్దామని స్టార్ట్ చేశాం. 50శాతం షూటింగ్ అయ్యాక ఈ కథ అందరికీ నచ్చుతుందనిపించి నాలుగు భాషల్లో చేశాం. ► తెలుగు సినిమా ‘అర్జున్‌రెడ్డి’ 250 కోట్లు వసూలు చేసిందంటే మన వద్ద ఏదో మ్యాజిక్ ఫార్ములా ఉందని బాలీవుడ్ వాళ్లు షాక్ అయ్యారు. నాకు బాగా ఎగై్జటింగ్‌గా అనిపిస్తే బాలీవుడ్ సినిమా చేస్తా. తెలుగు ఇండస్ట్రీలో ఉండి నేషనల్ వైడ్ షేక్ చేస్తేనే మజా ఉంటుంది. ‘బాహుబలి, ‘అర్జున్‌రెడ్డి, కేజీఎఫ్’తో షేక్ చేశారు. ఇప్పుడు ‘సాహో’తో షేక్ చేస్తున్నారు. మణిరత్నం, శంకర్‌గార్లు కూడా షేక్ చేశారు. ‘డియర్ కామ్రేడ్’ బాలీవుడ్ రీమేక్ హక్కులు అడుగుతున్నారు. తర్వాత ఎలాగూ నన్నే చేయమంటారు కాబట్టి నా వల్ల కాదని చెప్పా. చెప్పిన కథనే మళ్లీ ఏం చెబుతాం? హిందీలో ‘కబీర్ సింగ్’ పూర ్తయ్యేటప్పటికి ‘నోటా, టాక్సీవాలా, గీత గోవిందం, కామ్రేడ్’..నాలుగు కథలు చెప్పా. ఈ జర్నీలో వేరే భాషల్లో సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో తెలిసింది. ► నేను నటుణ్ణి. ప్రతి సీన్ రియల్‌గా ఉండేలా చేయాలి. రష్మిక నాకు రెండేళ్లుగా తెలుసు. సినిమాలో బాబీ, లిల్లీలకు చిన్నçప్పుడే పరిచయం అవుతుంది. సినిమాలో వాళ్ల ప్రయాణం కనిపించాలి. రష్మిక స్థానంలో వేరే ఎవరు ఉన్నా చేసేవాడిని. ఓ నటుడిగా నాకు ఓ కుర్చీ ఇచ్చినా కెమిస్ట్రీ తీసుకొస్తా. ఫైట్ సీన్స్ తీస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో.. ముద్దు సీన్లు తీస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభూతే ఉంటుంది.. అంతేకానీ, ఇంటర్నల్‌గా ఎలాంటి ఫీల్ ఉండదు. నాకు తెలిసి ఏడాది తర్వాత సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సాధారణం అయిపోతాయనుకుంటున్నా. ముద్దు సన్నివేశాలు పెడితే సినిమాలు నడుస్తాయనడం కరెక్ట్ కాదు. రియల్ లైఫ్‌లో ఉండే ఎమోషన్స్ రీల్ లైఫ్‌లో ఉండవు. కానీ, ఓ నటుడిగా వృత్తికి న్యాయం చేయడం నా బాధ్యత. ► ప్రతి అబ్బాయి బాబీ కాదేమో కానీ, ప్రతి అమ్మాయి లిల్లీ. నాకు తెలిసిన పదిమందిలో తొమ్మిది మంది అమ్మాయిల జీవితం ఈ సినిమా. ఇలాంటి కథ చెప్పాలనిపించింది. దాన్ని చక్కగా చెబుతాడనే నమ్మకం భరత్‌పై ఉంది.. చెప్పాడు. ► పూరి జగన్నాథ్‌గారితో సినిమా అని వస్తున్న వార్తలు నిజం కాదు. కొరటాల శివగారు చిరంజీవి సార్ సినిమా పూర్తి చెయ్యాలి. అది పూర్తయ్యేసరికి నేను ఏ సినిమాలు చేస్తుంటానో, ఆయన ఏ సినిమా చేస్తుంటారో తెలియదు. కానీ, ఆయనంటే నాకు ఇష్టం. ఆయనతో పని చేయాలనుంది. ► గెడ్డం పెంచి, బైక్‌లపై తిరిగేవాళ్లంతా విజయ్ దేవరకొండ కాలేరు. దాని వెనకాల కొన్నివేల ఆలోచనలు పనిచేస్తుంటాయి. అలా అవ్వాలనుకునేవాళ్లకి ఆల్ ది బెస్ట్. ప్రతిభ, ప్యాషన్, ఇంటెలిజెంట్ అనేవి ఉంటేనే ఇక్కడ ఎవరైనా స్టార్ అవ్వొచ్చు. ఇక్కడ ఎవరి స్థానం వారిది. ఇమేజ్ అన్నది శాశ్వతం కాదు. నేను ‘అర్జున్‌రెడ్డి’ కి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ► క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా తర్వాత విజయ్ అనే కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది. మైత్రీ మూవీస్‌లోనే ఈ సినిమా ఉంటుంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాసల్లో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతీ స్టేట్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఈవెంట్స్‌ను నిర్వహించిన చిత్రయూనిట్ ఈసినిమా మంచి హైప్ క్రియేట్ చేశారు. తాజాగా డియర్ కామ్రేడ్ సెన్సార్ కార్యక్రామలు పూర్తి చేసుకుంది. 2 గంటల 49 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి సెన్సేషనల్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి. -
డియర్ కామ్రేడ్ : మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్
-
భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం
‘‘కామ్రేడ్ అంటే అర్థం ఏంటి? మన కష్టాలలో, మన సక్సెస్‌లో, మన ఫైట్‌లో మనతో ఉండేవాడే కామ్రేడ్. నా చిన్ననాటి ఫ్రెండ్స్, సినిమా ఫ్రెండ్స్ అందరూ నా కామ్రేడ్సే’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని నిర్మించారు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ‘మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్’ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ప్రతిరోజూ ఎవరి కష్టాలు వాళ్లకి ఉంటాయి. ‘భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే..’ అనే లైన్ మా సినిమా థీమ్ సాంగ్‌లో ఉంటుంది. నాకు నచ్చిన వాక్యం అది. మ్యూజిక్ ఫెస్టివల్ చేద్దాం అనే ఐడియా వచ్చినప్పుడు భయమేసింది. భయమున్నా చేశాం. ఇక్కడి వరకూ వచ్చాం. యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు భయమేసింది. మనందరికీ భయాలుంటాయి. దాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం. నవీన్‌గారు, రవిగారు, మోహన్‌గారు, యశ్గారు వీళ్లే మా ధైర్యం’’ అన్నారు. రష్మికా మండన్నా మాట్లాడుతూ – ‘‘మన ఇంట్లో అమ్మ, అక్క, గర్ల్‌ఫ్రెండ్ ఇలా అందరూ గౌరవం కోసం స్ట్రగుల్ అవుతున్నారు. మీరెప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారా? మా ఇంట్లో నేను హీరోయిన్ అవ్వాలి అన్నప్పుడు ‘నో’ అన్నారు. నువ్వెందుకు అంత కష్టపడాలి? ఇంట్లో ఉండొచ్చు కదా అన్నారు. కానీ నాకు నచ్చిన దానికోసం పోరాడాను. పోరాడి మీ అందరి ముందు నిలబడ్డాను. ఇష్టమైన దానికోసం పోరాడితే మీరూ (ప్రేక్షకులు) నా పొజిషన్లో ఉండొచ్చు. అందరూ మీకు నచ్చినదాని కోసం పోరాడండి. నచ్చింది సాధిస్తే చాలా బావుంటుంది. రొమాన్స్, యాక్షన్ కోసం కాదు మేమిస్తున్న మెసేజ్ కోసం గర్ల్స్. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. నా మాట కచ్చితంగా వినండి. ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇదో అద్భుతమైన సినిమా. నా మాట నిజంగా వింటారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రంలో సినిమాలోని పాటలన్నింటికీ చిత్రబృందంతో కలసి స్టేజ్ మీద ప్రదర్శించారు. యాంకర్లతో కలసి తానూ అప్పుడప్పుడూ యాంకరింగ్ చేయడంతో పాటు విజయ్ దేవరకొండ డ్యాన్సులు చేసి అలరించారు. -
లిప్ లాక్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
సాక్షి, చెన్నై: లిప్ లాక్‌లపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ తమిళ ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మీడియాతో మాట్లాడారు. లిప్ లాక్‌లపై మీడియా అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ కొంత ఉద్వేగంగా మాట్లాడాడు. ‘సినిమాలో వచ్చే లిప్ లాక్ దృశ్యాలు చూసేవాళ్లకు వినోదంగా, సరదాగా ఉంటుంది. ఈ సన్నివేశాల్లో పాల్గొన్న నటీనటుల గురించి హేళనగా మాట్లాడతారు. కానీ.. సినిమా అనేది చాలా సీరియస్ విషయం, సినిమా అంటే మంచి కథ, అందులోనే భవిష్యత్తు, నిర్మాత డబ్బులు, దర్శకుడి జీవితం, కొత్త ఆర్టిస్టులకు వాళ్లని వాళ్లు నిరూపించుకునే వేదిక. ఇక హీరోయిన్లు వాళ్ల కెరీయర్, తాము ఎన్నుకున్న రంగంలో ఏదైనా సాధించాలనే తపనతో వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం. ఇవన్నీ సినిమాతో ముడిపడి ఉంటాయి. సినిమాల్లో లిప్ లాక్ సీన్లు రొమాంటిక్‌గా చూడటాపిరి వినోదంగా ఉంటాయి. కానీ.. ఆయా సన్నివేశాలు మా జీవితాలపై సీరియస్‌గా ఉంటుంది. ఆ సీన్లు చూసి నటీనటుల గురించి చాలా ఈజీగా కామెంట్ చేస్తారు. అంతేకాదు సినిమా చూసి ....ఆయా క్యారెక్టర్లను వీళ్లు ఇంతే అనటం ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు. సినిమా విడుదల తర్వాత లభించే హిట్‌తో మాకు రిలాక్స్ దొరుకుతుంది. ఇది ఆటలాడుకునే విషయం కాదు. సినిమా అంటేనే సీరియస్. డియర్ కామ్రేడ్ అలాంటి సినిమానే కానీ లిప్ లాక్ సినిమా కాదు. ఇక నేను హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు తెలంగాణా, అదీ పక్కా హైదరాబాదీ యాస అలవాటైంది. సినిమాల్లో సాధారణంగా యాస లేకుండా తెలుగు మాట్లాడాలని చెప్పేవారు. కానీ నా యాసలోనే మాట్లాడటం, అది సక్సెస్ కావటంతో మిగిలిన చిత్రాల్లో కూడా ఇలాగే కొనసాగిస్తున్నా.’ అని తెలిపాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న కన్నా ముందు హీరోయిన్ సాయి పల్లవి సంప్రదించారని అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను ఆమె తిరస్కరించినట్లు సమాచారం. -
అందుకే ‘కామ్రేడ్’కి నో చెప్పిందా!
తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను ‘ఫిదా’ చేసిన బ్యూటీ సాయి పల్లవి. తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఫుల్ ఫాంతో దూసుకుపోతున్న ఈ భామ ఓ క్రేజీ హీరో సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పారట. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా సాయి పల్లవి సంప్రదించారట. అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను సాయి పల్లవి తిరస్కరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈ భామ ఎక్స్పోజింగ్, ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకే డియర్ కామ్రేడ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న డియర్ కామ్రేడ్ ఈ నెల 26 ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినమాతో భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్
-
‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ విడుదల
-
వాళ్లంతా కామ్రేడ్సే
‘‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్‌తో ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘సినిమా విడుదలవుతుందంటే కొన్ని రోజులుగా నిద్రపట్టడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి నేడు బెంగుళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం. మన కష్టసుఖాల్లో తోడుగా ఉండే వ్యక్తుల్ని, స్నేహితులను కామ్రేడ్ అంటాం. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకుల అభిమానం, ప్రేమ, సపోర్ట్.. వాళ్లంతా కామ్రేడ్సే. అందరూ ఈ మ్యూజికల్ ఫెస్టివల్‌కి రావచ్చు. బెంగుళూరులో జరిగే ఈవెంట్‌కి అతిథిగా వస్తున్న యశ్ (‘కేజీఎఫ్’ ఫేమ్)కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇదొక అందమైన ప్రేమకథ. పది నిమిషాల సన్నివేశాల కోసం మూడు, నాలుగు నెలలు క్రికెట్ నేర్చుకోవాల్సి వచ్చింది. సెట్లో నన్ను 20 రోజులపాటు ఏడిపించారు. డబ్బింగ్ చెప్పడానికి నాలుగు నెలలు పట్టింది’’ అన్నారు రష్మికా మండన్నా. ‘‘ఇదొక లాంగ్ జర్నీ. మూడేళ్లుగా దీనిపై వర్క్ చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. నేను మాట్లాడటం కంటే సినిమానే మాట్లాడుతుందనుకుంటున్నా’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఈ సినిమా ద్వారా ఓ కొత్త విజయ్‌ని చూస్తారు’’ అన్నారు యష్ రంగినేని. ‘‘ఈ నెల 22న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు నవీన్ ఎర్నేని. నిర్మాత రవిశంకర్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.అనిల్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: సుజిత్ సారంగ్. -
నన్ను భయపెడుతున్నా అనుకుంటున్నారేమో!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 3 నిమిషాల ట్రైలర్లో సినిమా కథ అంతా చెప్పేశారు. యాక్షన్ ఎమోషన్‌తో పాటు విజయ్ మార్క్ లిప్‌లాక్స్‌తో కూడా ట్రైలర్‌ను కట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. శృతి రామచంద్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. -
‘కామ్రేడ్స్’ సిద్ధంగా ఉన్నారా!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచే స్థాయిలో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కామ్రేడ్స్ సిద్ధంగా ఉన్నారా అంటూ ఈ నెల 11త తారీఖు గురువారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ అవుతున్న డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జూలై నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎయిర్టెల్ ‘డియర్ కామ్రేడ్’ డీల్ : బంపర్ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్ : టెలికాం సేవల సంస్థ భారతీ ఎయిర్టెల్ (ఎయిర్టెల్), టాలీవుడ్ అప్ కమింగ్ మూవీ ‘డియర్ కామ్రెడ్’తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజా ఒప్పందం ద్వారా ఎయిర్టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ కేటగిరీలలో స్పెషల్ `డియర్ కామ్రెడ్` ప్యాక్‌లు లాంచ్ చేసింది. అలాగే ప్యాక్‌ల రీచార్జ్‌లపై ఎంపిక చేసిన లక్కీ వినియోగదారులకు ఉచితంగా సినిమా టికెట్లతోపాటు, డియర్ కామ్రేడ్ మూవీ నటీ నటులను కలుసుకునే బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎయిర్టెల్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్‌తో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. రూ.169 ప్రీపెయిడ్‌తో రీచార్జ్ చేసుకున్న వారు లేదా ఎయిర్టెల్ లైఫ్ స్టైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.499 లేదా అంతకుమించి రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ బంపర్ ఆఫర్లను అందించనుంది. ఎంపిక చేసిన లక్కీ కస్టమర్లు ఎయిర్టెల్ మీట్ అండ్ గ్రీట్‌లో భాగంగా, డియర్ కామ్రెడ్ సినిమాలో నటీనటులను కలుసుకునే అవకాశం దొరుకుతుంది. దీంతోపాటుగా వినియోగదారులు ప్రత్యేకమైన డాటా, టాక్‌టైం ప్రయోజనాలు తదితర మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆఫర్లను అందిస్తోంది. ఏపీ, తెలంగాణ ఎయిర్టెల్ సీఈఓ అవ్నీత్ సింగ్ పూరి, మైత్రీ మూవీ మేకర్స్ అధిపతులు పరస్పరం ఈ ఒప్పందంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. డియర్ కామ్రెడ్ సినిమాతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ భాషల కంటెంట్ స్పష్టమైన సమాచార మార్పిడికి ఉపయోగపడుతుందని ఎయిర్టెల్ భావిస్తోందని పూరి అన్నారు. సినిమా హీరో విజయ దేవర్కొండ స్పందిస్తూ డియర్ కామ్రెడ్ సినీ ప్రయాణంలో ఎయిర్టెల్ భాగస్వామ్యం తనకు సంతోషాన్ని, ఉత్కంఠను కలిగిస్తోందన్నారు. వినియోగదారులు డియర్ కామ్రేడ్ ఎయిర్టెల్ ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవాలని, తద్వారా మనమంతా కలుసుకోవాలని ఆకాంక్షించారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో డియర్ కామ్రేడ్ రూపుదిద్దుకుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన శృతి రామచంద్రన్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. -
విజయ్ దేవరకొండకు 50 కోట్ల బడ్జెటా?
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంటూ వస్తున్నాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. డియర్ కామ్రేడ్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న హీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు బైక్ రేసింగ్ సన్నివేశాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఫార్ములా వర్మ ట్రాక్ కోసం పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావటంతో పాటు ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు, కాస్ట్లీ బైక్‌లు ఇలా అన్నింటికీ కలిపి భారీగానే ఖర్చయినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈసినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి విజయం ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తాడో లేదో చూడాలి. -
రేపే ‘డియర్ కామ్రేడ్’ నుంచి క్యాంటిన్ సాంగ్
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తున్నాడు. గీతగోవిందంతో ప్రేక్షకులను అలరించిన విజయ్, రష్మిక జోడి మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను విడుదల చేయనున్నుట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే వరకు మెలోడి సాంగ్స్‌నే విడుదల చేసిన డియర్ కామ్రేడ్ బృందం.. రేపు మంచి బీట్ సాంగ్‌ను విడుదల చేయనుంది. కాలేజ్ క్యాటీన్ సాంగ్‌ను ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకురానుంది. Our Comrade Gang Our Malayali Cinematographer and Editor Our Tamil Music Director Our Kannadiga Dearest Lilly Our Telugu Director & Choreographer And your Man. All tell you What's Next!#DearComrade - this movie and team is fullllll loooooveeee ❤ pic.twitter.com/sKToTs4flA — Vijay Deverakonda (@TheDeverakonda) June 28, 2019 -
కామ్రేడ్ కోసం
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటుడే కాదు మంచి సింగర్ కూడా. ఇది వరకు తన సినిమాల్లో కొన్ని పాటలను తానే పాడారు. ‘ఏబీసీడి, చార్లీ, పరవా’ సినిమాల్లో తన గొంతుని వినిపించారు. తన తండ్రి మమ్ముట్టి నటించిన ‘మంగ్లీష్’ కోసం ఓ పాట పాడారు. లేటెస్ట్గా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం ఓ పాట పాడారు. అయితే ఇది తెలుగు పాట కాదు, మలయాళ పాట. ‘డియర్ కామ్రేడ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం మలయాళ పాటను ఇటీవలే రికార్డ్ చేశారట దుల్కర్. -
రైటర్‌గా విజయ్ దేవరకొండ
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విజయ్ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్, రచయితగా కనిపించనున్నాడట. తాను రాసిన కథల్లోని హీరో పాత్రల్లో తానే కనిపించే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేయస్ రామారావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. -
మరో సినిమా లైన్లో పెట్టిన విజయ్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి చేసిన విజయ్, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి తరువాత కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తరువాత వరుసగా లై, పడి పడి లేచే మనసు సినిమాలతో ఫెయిల్ అయిన హను ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
విజయ్ చెప్పిన ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ ఇదే!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ సరసన రష్మిక మందన్న మరో సారి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలోని రెండో పాటను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. తొలి పాట తరహాలనే రొమాంటిక్ మెలోడిగా రూపొందించిన ‘కదలల్లే’ పాటను సిద్ధ్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్‌లు ఆలపించారు. విజయ్ దేవరకొండ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ ముందుగానే ప్రకటించటంతో ఈ సాంగ్ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతసారధ్యంలో రూపొందిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యమందించారు. విజువల్గానూ పాటను పోయటిక్‌గా తెరకెక్కించారు. ‘కదలల్లే వేచే కనులే’ అంటూ సాగే ఈ పాట నిజంగానే సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనిపించుకుంటుందేమో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఓకేసారి రిలీజ్ చేయనున్నారు. తాజాగా రెండో పాటను కూడా నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. -
‘అర్జున్ రెడ్డి’ని చూసి సిగ్గుపడాలి : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌కు నాంధి పలికిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ కంటెంట్‌తో సంచలన విజయం సాదించిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మీ గోల్స్ ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను కొన్నేళ్ల తరువాత అర్జున్ రెడ్డి సినిమా చూస్తే సిగ్గుపడాలి. కొన్ని సంవత్సరాల తరువాత కూడా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డే అంటే నటుడిగా నేను ఏ మాత్రం ఇంప్రూవ్ కాలేదని అర్ధం. నటుడిగా నేను ఇంకా ఎంతో సాధించాలి’ అన్నాడు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషలన్నింటి మీద దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. -
ట్వీట్‌లోనూ అదే యాటిట్యూడ్
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ... తరువాత కూడా తనదైన యాటిట్యూడ్‌తో టాలీవుడ్లో స్టార్ గా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న విజయ్ తన సినిమాల ప్రమోషన్ విషయంలోనూ అంతా తానే అయి వ్యవహరిస్తున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న డియర్ కామ్రేడ్ సినిమాలోని సెకండ్ సింగిల్ ఆదివారం విడుదల కానుంది. అయితే విషయాన్ని తన ట్విటర్లో ప్రకటించిన విజయ్ ఏకంగా ఆ పాటను సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సెకండ్ సింగిల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే పాట రిలీజ్ కాకముందే విజయ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని ప్రకటించటంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. This Sunday. The 12th of May. You will experience what I call "The Song of the Year"#DearComrade pic.twitter.com/zZg2QTBTSu — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2019 -
చెన్నైలో విజయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
కొరుక్కుపేట: సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు గురువారం చెన్నైలోనూ కోలాహలంగా జరుపుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని ఏడు నగరాల్లో విజయదేవరకొండ బర్త్ డే ట్రక్ ద్వారా క్రీమ్‌స్టోన్ ఐస్‌క్రీమ్ ‘ మిస్టర్ ఆల్ఫోన్స్ ’లను వేలాదిమంది అభిమానులకు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా గురువారం చెన్నైలోని అన్నానగర్ రోడ్డు సమీపంలోని అన్నా ఆదర్శ్ కాలేజ్ వద్ద అందరికీ పంచిపెట్టారు. అలాగే నగరంలోని కోయంబేడు, అశోక్‌నగర్, గిండి కత్తిపర ఫ్లైఓవర్ ఏరియా, సైదాపేట ప్రాంతాల్లో బర్త్‌డే ట్రక్ వెళ్లి అక్కడ ప్రజలకు ఐస్‌క్రీమ్‌లను అందించి విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. -
‘డియర్ కామ్రేడ్’ నుంచి రెండో పాట
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నేడు పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాడు. తన అభిమానులు మాత్రం తదుపరి చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే డియర్ కామ్రేడ్ జూలై 26న వస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం మరో అప్డేట్ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆదివారం మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మొదటి పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. This Sunday. The 12th of May. You will experience what I call "The Song of the Year"#DearComrade pic.twitter.com/zZg2QTBTSu — Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2019 -
అటెన్షన్ కామ్రేడ్స్
సామాజిక బాధ్యతను ఫీలైన ఓ పవర్ఫుల్ స్టూడెంట్‌గా తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాల ఆధారంగా ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెరకెక్కిందట. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జూలై 26న విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు వై. అనిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేస్తున్నారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. -
గుమ్మడికాయ కొట్టారు
సెట్లో గుమ్మడికాయ కొట్టారు కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా రూపొందిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. ‘గీతగోవిందం’ వంటి హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ఇది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో భరత్ కమ్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూమెంట్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు టీమ్. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన యువకుడి పాత్రలో నటించారు విజయ్. క్రికెటర్ లిల్లీ పాత్రలో కనిపిస్తారు రష్మిక. ఈ సినిమాకు జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందించారు. త్వరలో ‘డియర్ కామ్రేడ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
విజయ్ దేవరకొండ భయపడ్డాడా?
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాస్త వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. వరుస సూపర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విజయ్ దేవరకొండ దక్షిణాదిలో పాగ వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని దక్షిణాది అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీని పోస్ట్‌పోన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే31 విడుదల చేయాలని తొలుత భావించినా.. అదే రోజున సూర్య నటించిన ఎన్జీకే చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగు, తమిళంలో మార్కెట్ ఉండటం, ఇప్పటికే ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ కావడంతో డియర్ కామ్రేడ్‌ను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డియర్ కామ్రేడ్.. టీజర్, సాంగ్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. -
రేపే ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ సింగిల్
గీతగోవిందం మూవీతో హిట్ పెయిర్‌గా నిలిచారు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న. గీతగా నటించి మెప్పించిన రష్మిక.. ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో డియర్‌కామ్రేడ్ మూవీ రాబోతోన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్‌తో హీట్ పెంచేసిన చిత్రయూనిట్.. ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్చేయబోతోంది. రేపు (ఏప్రిల్ 8) ఉదయం 11:11 గంటలకు ఈ మూవీలోని మొదటిసాంగ్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నీ నీలికన్నుల్లోనా.. అంటూ సాగే ఈ పాట దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. ఇప్పటికే ఈ పాటను కొన్ని వేలసార్లు విన్నాను అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. స్టూడెంట్ లీడర్ పాత్రలో విజయ్ నటిస్తుండగా.. క్రికెటర్‌గా లిల్లీ పాత్రలో రష్మిక మందాన్న నటిస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. I've heard this song a hundred times. Yet, I cannot stop ☺ And tomorrow you'll all get to hear this lovely song with an even more amazing lyrical video. Tomorrow begins the launch of a music album that'll be remembered for a long long time. #DearComrade pic.twitter.com/ySH0LrfIlC — Vijay Deverakonda (@TheDeverakonda) April 7, 2019 -
అప్పడు గీత.. ఇప్పుడు లిల్లీ
‘గీత గోవిందం’ సినిమాతో విజయ్‌దేవరకొండ, రష్మిక మందాన యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆ చిత్రంలో గీత పాత్రలో రష్మిక విజయ్ను ఏడిపించగా.. బాక్సాఫీస్ షేక్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ‘డియర్ కామ్రేడ్’ రాబోతోన్న సంగతి తెలిసిందే. కాలేజ్ బ్యాగ్రౌండ్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. క్రికెటర్‌గా రష్మిక నటించనుంది. మరి గీతగా విజయ్ను ఆటపట్టించిన రష్మిక.. లిల్లీగా డియర్ కామ్రేడ్లో ఏం చేయనుందో. ఇప్పటికే విడుదల చేసిన టీజర్.. మూవీపై హైప్‌ను క్రియేట్చేసింది. నేడు రష్మిక పుట్టిన రోజు కానుకగా.. ఈ మూవీ కొత్తపోస్టర్‌ను విడుదల చేసిందీ చిత్రయూనిట్. సోషల్ మీడియాలో రష్మికకు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ తన స్టైల్లో రష్మికకు విషెస్ తెలిపాడు. ఈ నెల 8వ తేదీన ఉదయం 11గంటల 11నిమిషాలకి ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. Dear Lilly, We were just kidding, don't be upset with us. You are the joy of our set, you make us tear up with your performance and smile through the day. This 8th at 11.11 AM, we dedicate the First Song to you, this is how you make us all feel. #HappyBirthdayDearLilly pic.twitter.com/zF13DJeQrT — Vijay Deverakonda (@TheDeverakonda) 5 April 2019 -
బుల్లితెర పైనా.. చాన్సే లేదు! : విజయ్
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న స్టార్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్లో అయితే టాప్ స్టార్లు కూడా డిజిటల్ మీడియంలో సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్లో రానా, జగపతి బాబు లాంటి స్టార్స్ ఇప్పటికే వెబ్ సిరీస్‌లలో సందడి చేశారు. డిజిటల్ మార్కెట్ భారీగా విస్తరిస్తుండటంతో తారలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం డిజిటల్ మీడియంకు నో చెప్పేశాడు. తనని తాను బుల్లితెర చూసుకోవటం ఇష్టం లేదన్న విజయ్, ఎప్పటికీ వెబ్ సిరీస్‌లో నటించనని చెప్పేశాడు. అయితే భవిష్యత్తులో వెబ్ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న విజయ్ ఈ కామెంట్స్ చేశాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తమిళ దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. -
కామ్రేడ్ వెనక్కి తగ్గుతాడా..?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈసినిమా మే 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే తమిళ్లో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమాను మే 31న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో డియర్ కామ్రేడ్ టీం ఆలోచనలో పడింది. సూర్య సినిమా అంటే తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తారు. అదే రోజు తమ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట అందుకే వారం ఆలస్యంగా జూన్ 6న సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
ఆ సీన్‌తో సినిమాని అంచనా వేస్తారా?
‘గీత గోవిందం’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా. తాజాగా ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో విజయ్–రష్మికల మధ్య లిప్‌లాక్ సన్నివేశంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘గీత గోవిందం’ సినిమాలోనూ ముద్దు సీన్ ఉందని, అది హిట్ అవడంతో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ పెట్టారని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై రష్మిక మండన్నా స్పందిస్తూ– ‘‘లిప్‌లాక్ సన్నివేశం ఆధారంగా ఓ సినిమాని ఎలా అంచనా వేస్తారు? అది కరెక్ట్ కాదు. సినిమాలోని సన్నివేశం ముద్దుని డిమాండ్ చేసింది. నా పాత్రకు న్యాయం చేయాలంటే ఆ సీన్లో నేను నటించాలి. అందుకే నటించా. ఎవరైనా మొత్తం సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. ‘గీత గోవిందం’ సినిమాను హిట్ చేసినట్టే, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ సినిమాని మే 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ముద్దు సీన్‌పై స్పందించిన రష్మిక
‘గీతగోవిందం’లో విజయ్ దేవరకొండతో స్ర్కీన్ షేర్ చేసుకున్న కన్నడ నటి రష్మిక మంధాన.. మరోసారి డియర్ కామ్రేడ్లో ఆయన పక్కన నటిస్తోంది. ఈ చిత్రంలోని ముద్దు సీన్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజా వివాదంపై రష్మిక స్పందిస్తూ ‘లిప్‌లాక్ సీన్‌తో సినిమాని అంచనా వేయడం తగదు. పాత్ర డిమాండ్ చేసింది. కనుక నేను నా పాత్రకు న్యాయం చేశాను’ అని చెప్పింది. గీతగోవిందాన్ని ఆదరించినట్టుగానే ఈ సినిమాని కూడా ఆదరిస్తారనుకుంటున్నానని సెలవిచ్చింది. రష్మికతోపాటు ట్రోల్ అయిన మరో వ్యక్తి విజయ్ దేవరకొండ. తను నటించిన అర్జున్‌రెడ్డి నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘డియర్ కామ్రేడ్’ వరకు లిప్‌లాక్ లేకుండా ఒక్క సినిమా అయినా లేదు. దీంతో అందరూ విజయ్‌ని ముద్దుగా ‘టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ’గా పిలుచుకుంటున్నారు. విజయ్ మాత్రం ఇప్పటివరకు దీనిపై నోరు మెదపలేదు. డియర్ కామ్రేడ్ సినిమా విషయానికొస్తే కాలేజీ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా ఇది. దేవరకొండ, రష్మిక విద్యార్థి నాయకులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 31న విడుదల కానుంది. -
మాస్.. రొమాన్స్ : డియర్ కామ్రేడ్
టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ జోడి అనిపించుకున్న విజయ్, రష్మికలు మరోసారి మ్యాజిక్ చేయటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్ ఇన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. -
అఫీషియల్ : విజయ్ దేవరకొండ ‘హీరో’
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్ పరిదిని మరింత విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహుభాషా చిత్రాలుగా ప్లాన్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన విజయ్, మరో సినిమాను కూడా మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది. -
నాలుగు భాషల కామ్రేడ్
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చేస్తోన్న ప్రతి సినిమా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా చూసుకుంటున్నారు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మికా మండన్నా కథానాయిక. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం కానున్నారు. సామాజిక బాధ్యత కలిగిన ఇన్టెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను మార్చి 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకర్, కెమెరా: సుజిత్ సారంగ్, డైలాగ్స్: జై కృష్ణ. -
నాలుగు భాషల్లో విజయ్ కొత్త సినిమా
టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే నోటా సినిమాతో తమిళనాట అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు మరిన్ని భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో పాటు తమిళ, మళయాల, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 17న నాలుగు భాషలకు సంబంధించిన టీజర్లను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మరోసారి రష్మిక మందన్న అలరించనుంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. Telugu Tamil Malayalam Kannada Comrades - are we ready? The 17th of March. pic.twitter.com/dEllWg6ecp — Vijay Deverakonda (@TheDeverakonda) 7 March 2019 -
మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ దేవరకొండ
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో ఓ ట్రై లింగ్యువల్ మూవీ చేసేందుకు విజయ్ ఓకె చెప్పాడట. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడలోనూ ఒకే సారి తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రీపరేషన్స్ కూడా మొదలు పెట్టేశాడు విజయ్. ఈ సినిమాలో బైక్ రేసర్‌గా నటించేందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు విజయ్. తమిళనాడు లోని రేసింగ్ ట్రాక్స్ మీద తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్లోనే ఢిల్లీలో బైక్ రేసింగ్ దృశ్యాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయ్ దేవరకొండ ‘హీరో’నా..?
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కోలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాడు. దీనిలో భాగంగానే నోటాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశాడు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయినా విజయ్ మాత్రం.. కోలీవుడ్ మార్కెట్‌పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. నోటా తరువాత మరో ద్విభాషా చిత్రాన్ని చేయడానికి విజయ్ సిద్దమయ్యాడు. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బైలింగ్వల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. ఈ మూవీ టైటిల్‌పై ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ సరిపోతుందని యూనిట్ భావిస్తోందట. అయితే హీరో అనే టైటిల్ టాలీవుడ్‌కు కలిసిరాలేదు. చిరంజీవి, నితిన్‌లు ఈ టైటిల్‌తో సినిమాను తీసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఉంటే.. ఈ టైటిల్‌తో విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి. -
లేడీ సూపర్ స్టార్‌తో విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ, ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విజయ్, ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మరోసారి కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తమిళంలోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ ఎప్పుడంటే!
వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ సినిమాలో గీత గోవిందంలో నటించిన రష్మిక మరోసారి విజయ్‌తో జోడి కడుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విద్యార్థి నాయకుడిగా నటిస్తుండగా రష్మిక క్రికెట్ పాత్రలో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పాటు కాంత్రి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాతోనూ బిజీగా ఉన్నాడు విజయ్. -
8 ఏళ్ల పిల్లాడికి తండ్రిగా ‘అర్జున్ రెడ్డి’
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ప్రతీ చిత్రలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపిస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలో తన వయసుకు మించిన పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం విజయ్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఫేం కాంత్రి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్ ఎనిమిదేళ్ల పిల్లాడికి తండ్రిగా కనిపించనున్నాడట. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
ప్రేమలో పడిపోయా : విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ రోజు రోజుకి తన ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. కేవలం ఒక సెక్షన్‌కే పరిమితమై పోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యూత్‌లోనే కాదు చిన్నారుల్లోనే విజయ్‌కి మంచి ఫాలోయింగ్. తాజాగా ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఇద్దరు తెలుగు చిన్నారులు విజయ్ దేవరకొండకు గురంచి మాట్లాడుతున్న వీడియోపై ఈ యంగ్ హీరో స్పందించాడు. డియర్ కామ్రేడ్ షూటింగ్ లో గాయపడిన విజయ్ ఫోటోను చూస్తూ ‘విజయ్ దేవరకొండ డాక్టర్ దగ్గరికి వెళ్లు’అంటూ ఇద్దరు చిన్నారు ముద్దు ముద్దుగా మాట్లాడిన వీడియోను వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన విజయ్ ‘ప్రేమలో పడ్డా.. నాకు డాక్టర్ అవసరం లేదు. మిమ్మల్ని కలవాలనుంది. కలుస్తారా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. వెంటనే స్పందించిన చిన్నారుల తండ్రి ‘మా పిల్లలు నిన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ శనివారం మేం హైదరాబాద్ వస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. I Just fell in ❤ Vijay Konda doesn't need a doctor, but he would love to meet you two. Will you? https://t.co/82jhgz1Drl — Vijay Deverakonda (@TheDeverakonda) 7 February 2019 -
నా అకౌంట్‌ను లాక్ చేసిన్రు : విజయ్ దేవరకొండ
కలలు కనడం సహజం. కానీ వాటిని ఏ కొద్దిమందో నిజం చేస్తుంటారు. కష్టానికి తగ్గ ఫలితం వస్తే ఆ కిక్కే వేరు. టాలీవుడ్లో సెన్సేషన్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం అలాంటి మూడ్‌లోనే ఉన్నాడేమో. ఈ యంగ్ హీరో ఫోర్బ్స్ జాబితాలో టాప్ 30లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. సరైన టైమ్కోసం.. సరైన సినిమా కోసం ఎదురుచూశాడు విజయ్. సినిమాలు తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు మాత్రమే సొంతమైన నటనాశైలితో ఆకట్టుకున్నాడు. ఇక స్టేజ్ ఎక్కితే.. మాటలతో అందర్నీ మాయ చేసేస్తాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడంతో.. తన అభిమానులతో ఓ విషయాన్ని పంచుకున్నాడు. ‘నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు.. రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చెయ్యలేదని నా అకౌంట్‌ను లాక్ చేసిన్రు. అప్పుడు మా నాన్న.. ముప్పై వచ్చే లోపు బాగా సెటిల్ కావాలని, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడే.. సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలవని అన్నారు. నాలుగేళ్ల తరువాత.. ఫోర్బ్స్ సెలబ్రెటీలో స్థానంలో సంపాదించాను’ అంటూ ట్వీట్ చేశాడు. విజయ్ ప్రస్తుతం డియర్‌కామ్రేడ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. I was 25. Andhra Bank lo 500 Rs. min balance maintain cheyakapothe lock chesinru account. Dad said settle before 30 - That way you can enjoy your success when you are young and parents are healthy. 4 years later - Forbes Celebrity 100, Forbes 30 under 30. pic.twitter.com/6EVUJwmeZA — Vijay Deverakonda (@TheDeverakonda) 4 February 2019 -
నేను నమ్మను.. ప్రూఫ్ కావాలి : రష్మిక
‘ఛలో’ అంటూ హిట్ కొట్టిన కన్నడ భామ రష్మిక మందాన్న.. తెలుగునాట భారీ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ‘గీత గోవిందం’తో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని తిరుగులేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అయితే ఈ భామ కన్నడ పరిశ్రమ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని, దీంతో శాండల్‌వుడ్ రష్మికపై గుర్రుగా ఉందంటూ కథనాలు వెలువడ్డాయి. వీటిపై రష్మిక స్పందిస్తూ.. ‘ఇది ఎవరు చెప్పారు? తప్పుగా తీసుకోవద్దు. జస్ట్ ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలని ఉంది. డైరెక్ట్‌గా నాకే మెసేజ్ చేయండి.. నేనేం అనుకోను. నా ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉందా? ఇది రాసాక మీకు సెన్స్ లేదని అర్ధమయ్యింది. ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉంది అంటే నేను నమ్మను. నాకు ప్రూఫ్ కావాలి. ఇవ్వండి..ఇవ్వండి.. డైరెక్ట్‌గా నాకే మెసేజ్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక.. విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తోంది. Says this WHO?! Don’t take me wrong but I am just curious😇 DM me the answer..I won’t mind😉 Cz it doesn’t make any sense when U write about my industry,and say they are angry with me..I wont believe it -I need proof🤷🏻♀️give!give! DM me ok..😉♥️’night 😁https://t.co/aFsqjIoRKZ — Rashmika Mandanna (@iamRashmika) January 31, 2019 -
‘గూడెం’లో అర్జున్ రెడ్డి సందడి
సాక్షి, కొత్తగూడెం : అర్జున్‌రెడ్డితో తెలుగు సినిమా రంగంలో సంచలనం సృష్టించి, గీతగోవిందం, ట్యాక్సీవాలా లాంటి సూపర్హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ కొత్తగూడెంలోని కార్మిక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా జరుగుతోంది. సోమవారం చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రుద్రంపూర్‌లోని సెయింట్ జోసెఫ్స్ పాఠశాల, ధన్‌బాద్‌లలో చిత్రీకరించారు. ఈ షూటింగ్లో విజయ్ దేవరకొండ పాల్గొనడంతో ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య చిత్ర షూటింగ్ కొనసాగింది. మరో నాలుగైదు రోజులపాటు ఈ చిత్రషూటింగ్ జిల్లాలో జరగనున్నట్లు సమాచారం. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని ఈ సినిమాకు నిర్మాతలు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఈ బుడ్డోడు ఇప్పుడు సెన్సేషనల్ స్టార్..!
ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగా ఉంది కదు. అవును ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ ఆలోచననే మార్చేసిన హీరో. తన యాటిట్యూడ్‌తో అమ్మాయిల మనసు గెలుచుకున్న రౌడీ. ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ చిన్ననాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 1999లో ఓ టీవీ సీరియల్లో షావుకారు జానకితో కలిసి విజయ్ నటించిన వీడియోను ఓ అభిమాని విజయ్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియ పేజ్‌లో పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ వీడియోను పోస్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. My childhood trends so much 😂 that little fellow is also a star - even I am watching it on loop. Whoever found this you made my mum's day, mine and so many others. https://t.co/EEE9Rkq6uo — Vijay Deverakonda (@TheDeverakonda) 21 January 2019 -
మా అమ్మ నాపై కోపంగా ఉంది