Kanimozhi
-
TN: అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి డీఎంకే ఎంపీ కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మార్చ్ 28)రాత్రి కరూర్‌లో నిర్వహించిన సభలో కనిమొళి మాట్లాడారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో కరూర్ నుంచి పోటీ చేశారు. సెంథిల్ బాలాజీ భయంతోనే ఈ ఎన్నికల్లో అన్నామలై కరూర్ నుంచి పోటీ చేయడం లేదు’ అని కనిమొళి సెటైర్లు వేశారు. గతంలో కరూర్ నుంచి ఒక మంత్రి ఉండేవాడని, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో అన్నామలై ప్రస్తావించినందునే కనిమొళి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటులో మాట్లాడిన ఎంపీలను సస్పెండ్ చేస్తారని, బయటమాట్లాడిన వారిని జైలుకు పంపుతారని కేంద్ర ప్రభుత్వంపై కనిమొళి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ప్రస్తుతం కరూర్ నుంచి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జోతిమణి పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ రాజీనామా -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్‌సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్‌సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్‌రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
మహిళా డ్రైవర్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ గొప్ప మనసు చాటుకున్నారు. వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్డ్రై వర్కు మహిళకు కారును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్యర్యపరిచారు. కొయంబత్తూర్‌కు చెందిన మహిళా డ్రైవర్ షర్మిలను కమల హాసన్ తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతికి అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కొయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ ఇటీవల జరిగిన చర్చతో కలత చెందాను. తన వయసులోని ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శం. షర్మిల కేవలం డ్రైవర్‌గా మాత్రమే ఉండిపోకూడదు. తనలాంటి అనేకమంది షర్మిలలను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నా. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున ఆమెకు కారును అందిస్తున్నాం. దానిని ఆమెకు అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా’ అని కమల్ పేర్కొన్నారు. (చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..) కాగా, 24 ఏళ్ల షర్మిల కొయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్. గాంధీపురం నుంచి సోమనూర్ వరకు వ్రైవేటు సంస్థకు చెందిన బస్సును నడుపుతున్నారు. గతంలో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ఈమె బస్సులో ప్రయాణించగా.. గత శుక్రవారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి.. షర్మిల నడిపిన ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు. అయితే, షర్మిల పబ్లిసిటీ మోజులో పడిందని ఆ బస్సు యాజమాన్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు బస్ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపర్చిందని, అందుకే కలల కొలువుకు దూరమైనట్టు షర్మిల మాట్లాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..) Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing of bus ticket to DMK MP Kanimozhi, has now been presented a new car by MNM leader #KamalHaasan to continue her journey as an entrepreneur. @IndianExpress pic.twitter.com/SyMS059KvS — Janardhan Koushik (@koushiktweets) June 26, 2023 -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?..
-
సుప్రీం కోర్టులో కనిమొళికి భారీ ఊరట
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్‌ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను. అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్‌కు సంబంధించిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా? -
కనిమొళిపై కుష్బు ప్రశంసల జల్లు
డీఎంకే ఎంపీ కనిమొళిపై నటి, బీజేపీ నాయకురాలు కుష్బు ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల డీఎంకే పార్టీ ప్రచారకర్త సాధిక్ ఒక కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాళ్లు కుష్బు, గౌతమి, నమిత, గాయత్రి రఘురాంను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద దుమారానికే దారి తీశా యి. సాధిక్ వ్యాఖ్యలతో కుష్బు తీవ్రంగానే ఖండించారు. కాగా సాధిక్ వ్యవహారంపై తాజాగా డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. (చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత పోటీలో విజయ్, అజిత్ సినిమాలు) ఏ పార్టీకి చెందిన వారైనా, సందర్భం ఏమైనా మహిళలను అవమానించడం సహించరానిదన్నారు. ఒక స్త్రీగా, మనిషిగా తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్టాలిన్, పార్టీ తరఫున కూడా క్షమాపణ చెప్పుకుంటున్నానని ట్వీట్ చేశారు. కనిమొళి క్షమాపణపై స్పందించిన కుష్బు ధన్యవాదాలు, కానీ మీ మనస్త్వత్వం, ఆచరణకు నిజంగా అభినందనీయం. మహిళల మానానికి, ఆత్మాభిమానానికి మీరెప్పుడు అండగా నిలుస్తారని ట్విట్టర్లో ప్రశంసించారు. -
బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్’లు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ‘ఐటమ్’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@arivalayam functionary Saidai Sadiq's derogatory remarks on women BJP leaders left many in the state's ruling party red-faced. Sadiq's remarks targetting leaders including @khushsundar drew sharp criticism from BJP leaders and others. Watch here : https://t.co/DVbwYrAz6G pic.twitter.com/6NpvZH6Khk — South First (@TheSouthfirst) October 28, 2022 డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్ వేదికగా సాధిక్ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్ చేశారు. When men abuse women,it just shows wat kind of upbringing they have had & the toxic environment they were brought up in.These men insult the womb of a woman.Such men call themselves followers of #Kalaignar Is this new Dravidian model under H'ble CM @mkstalin rule?@KanimozhiDMK — KhushbuSundar (@khushsundar) October 27, 2022 దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్‌గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అనంతరం సాధిక్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా?
ఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ నేత వినయ్ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ అనే విషయం విదితమే. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం తీవ్రంగా స్పందించారు. ‘ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 30 మంది పురుషులు, ఒక మహిళ ఉన్న ప్యానెల్ (కమిటీ)కి అప్పగించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతీ యువతిపై ప్రభావం చూపే కీలకాంశమిది. స్త్రీలకు ఏ హక్కులుండాలనేది ఇంకా మగవాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌనప్రేక్షకుల్లా మార్చేస్తున్నారు’ అని ట్విట్టర్ వేదికగా కనిమొళి ధ్వజమెత్తారు. ‘స్రీలకు, భారత సమాజానికి సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అందువల్ల ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. భాగస్వామ్యపక్షాలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అందరి వాదనలూ... ముఖ్యంగా మహిళల అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలి.. అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. మహిళా ఎంపీల అందరి అభిప్రాయాలు వినండి: సుస్మితా దేవ్ కనీస వివాహ వయసు పెంపుపై మహిళా ఎంపీలు అందరి అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలని సుస్మితా దేవ్ కమిటీ చైర్మన్ సహస్రబుద్దేకు లేఖ రాశారు. ‘రాజ్యసభ నియమావళిలోని 84(3), 275 నిబంధనల కింద కమిటీ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యి లేదా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని మహిళా ఎంపీలకు కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దానికోసం కమిటీ ఛైర్మన్‌గా మీకున్న అధికారాలను ఉపయోగించండి. మహిళా ఎంపీలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. రాజ్యసభలో 29 మంది, లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలున్నారు’ అని సుస్మిత లేఖలో పేర్కొన్నారు. -
TN: కేసుల నుంచి ఆ ముగ్గురికీ ఉపశమనం
సాక్షి, చెన్నై: గత ప్రభుత్వం వేసిన పరువు నష్టం దావా కేసుల్లో డీఎంకే ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు విముక్తి లభించింది. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేసినట్టు గత ప్రభుత్వ హయాంలో వీరిపై దావా దాఖలైంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా, రాష్ట్రంలో అధికారం మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఆ కేసుల్ని కొనసాగించలేమని, రద్దు చేయాలని కోర్టుకు సూచించింది. దీంతో ఆ ముగ్గురి మీద వేర్వేరుగా దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ, కేసు నుంచి విముక్తి కల్పిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిక్కుల్లో ఎస్పీ వేలుమణి.. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్‌పై పది వారాల్లో చార్జ్‌షీట్ దాఖలుకు ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఎస్పీ వేలుమణిపై టెండ్లర్లలో అక్రమాలు అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు సైతం జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎస్పీ వేలుమణికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ ఆర్ ఎస్‌భారతి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, విచారణను త్వరితగతిన ముగించాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. -
90 వేలకు చేరువలో కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. 80 వేల మార్క్ చూసిన మర్నాడే ఒక్క రోజులో 90 వేలకి దగ్గరలో కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో మూడు రెట్ల వేగంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. కరోనా మరణాలు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. మొత్తంగా 714 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,58,909కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 5.32శాతంగా ఉన్నాయి. ► ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 81.42% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ► దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10 జిల్లాల నుంచే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, బెంగుళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్ జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ► గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసుల్ని పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా కేసులు నమోదవుతూ ఉంటే, పంజాబ్‌లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ► కరోనా మరణాల్లో 85శాతం ఆరు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఒడిశాలో 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ ఒడిశాలో ముందుజాగ్రత్తగా 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. కనిమొళికి కరోనా పాజిటివ్ డీఎంకే లోక్‌సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సోకడంతో కనిమొళి ఎన్నికల సభలన్నీ రద్దు చేసుకొని ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. -
కరుణానిధి కుమార్తెకు కరోనా.. ఆందోళనలో డీఎంకే
చెన్నె: స్టార్ క్యాంపెయినర్‌గా ఉండడం.. అధికారంలోకి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో మునిగారు. రోజు భారీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఆమెకు తాజాగా కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలింది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి. ఆమె తూత్తుకుడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తి మేర కష్టపడుతున్నారు. ఈ క్రమంలో విస్తృత పర్యటనలు చేయడం.. ప్రజలను కలవడం చేయడంతో ఆమెకు కరోనా సోకింది. పాజిటివ్ తేలిన వెంటనే ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే ఆమె చెన్నెలోని అపోలో ఆస్పత్రి చేరినట్లు తెలుస్తోంది. ఆమెకు కరోనా సోకిన విషయం తెలియగానే ఆమె సోదరుడు స్టాలిన్ ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారానికి దూరం ఉండనున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కనిమొళి కరోనా సోకడంతో డీఎంకే ఆందోళనలో పడింది. చదవండి: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని -
'నా కొడుకు రాజకీయాల్లోకి రాడు'
సాక్షి, చెన్నై: తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. డీఎంకేలో వారసత్వ రాజకీయాలు ఎక్కువే అన్న విష యం తెలిసిందే. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు, చేపాక్కం– ట్రిప్లికేన్ నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. కరుణ గారాల పట్టి కని మొళి సైతం డీఎంకేలో కీలకంగానే ఉన్నారు. భవిష్యత్తులో ఈమె కుమారుడు సైతం రాజకీయాల్లోకి రావచ్చన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఓ మీడియా ఇంటర్వ్యూలో తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అన్న, చెల్లెల అనుబంధమేగానీ, తమ మధ్య గొడవలు ఇప్పటివరకు లేదని, ఎన్నటికీ రావని స్పష్టం చేశారు. చదవండి: డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు 215వ సారి నామినేషన్; భార్య నగలు కుదువపెట్టైనా సరే -
ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!
చెన్నై: ‘‘నాకు హిందీ మాట్లాడటం వచ్చా? రాదా? అన్నది కాదు ఇక్కడ సమస్య. హిందీ వస్తేనే నన్ను భారతీయురాలిగా గుర్తిస్తాననడం సిగ్గుచేటు’’ అంటూ డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిందీ అనువాదకురాలిగా పనిచేశారంటూ తన గురించి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత హెచ్ రాజా తీరుపై మండిపడ్డారు. హిందీ భాషకు జాతీయతకు ముడిపెట్టడం సరికాదంటూ హితవు పలికారు. కాగా కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కనిమొళికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని తనను ప్రశ్నించినట్లు ఈ తూతుక్కుడి ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హిందీ భాష వ్యతిరేకోద్యమానికి నిలయమైన తమిళనాడులో ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రాజకీయ దుమారం రేగింది.(ఎన్ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంతో పాటు పలువురు తమిళనేతలు సీఎస్ఐఎఫ్ తీరును ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. అయితే తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మాత్రం కనిమొళి ట్వీట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘భారత ఉప ప్రధాని దేవీలాల్ తమిళనాడుకు వచ్చినపుడు ఆయన హిందీ ప్రసంగాన్ని కనిమొళి తమిళంలోకి అనువదించారు. కాబట్టి తనకు హిందీ తెలియదని చెప్పడం పచ్చి అబద్ధం అని తేలింది. ఎన్నికలు ఇంకా సమీపించలేదు కదా’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (కేరళలో కనిమొళికి చేదు అనుభవం) ఇందుకు ఆమె సైతం అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ నేనెవరికీ హిందీ అనువాదకురాలిగా పనిచేయలేదు. తెలియని భాషలో నేనెలా మాట్లాడగలను? నా విద్యాభ్యాసం అంతా తమిళ, ఆంగ్ల భాషల్లోనే సాగింది. ఢిల్లీలో ఉన్నా నాకు హిందీ రాదు. ఈ విషయం చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయినా ఇక్కడ సమస్య భాష గురించి కాదు. భాషను జాతీయతతో ముడిపెట్టడం గురించి. ఒకే భాష, ఒకే మతం, ఒకే సిద్ధాంతం పాటిస్తేనే భారతీయులా. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కొందరు ఈ విషయం గురించి రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య’’ అంటూ కనిమొళి కౌంటర్ ఇచ్చారు. -
కేరళలో కనిమొళికి చేదు అనుభవం
సాక్షి, చెన్నై: ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన డీఎంకే నేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి దయానిధికి చేదు అనుభవం ఎదురైంది. ఘటనాస్థలంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని ప్రశ్నించి కనిమొళిని అవమానించారు. ఈ విషయాన్ని కనిమొళి ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ విమానం ప్రమాదం జరిగిన కోళీవుడ్ ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఉదయం వెళ్లాను. అయితే, అక్కడున్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా జవాను హిందీలో నాతో ఏదో చెబుతోంది. నాకు హిందీ రాదని, దయచేసి తమిళం లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించాను. దానికి ఆ జవాను స్పందన చూసి మతి పోయింది. హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా? అని ఆమె నన్ను ప్రశ్నించింది. అంటే హిందీ భాష వచ్చినవారు భారతీయులు అన్నట్టేనా!’అని ఎంపీ కనిమొళి ట్విటర్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. #hindiimpostion హ్యాష్ టాగ్‌ను పోస్టు చేశారు. కాగా, కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది. (26కి చేరిన మృతుల సంఖ్య) Today at the airport a CISF officer asked me if “I am an Indian” when I asked her to speak to me in tamil or English as I did not know Hindi. I would like to know from when being indian is equal to knowing Hindi.#hindiimposition -
దీపికపై ట్రోలింగ్.. స్పందించిన కనిమొళి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. బుధవారం జేఎన్యూకు వెళ్లిన కనిమొళి యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనేపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తప్పుబట్టారు. తను చాలా వరకు హిందీ సినిమాలు చూడనని.. కానీ దీపికకు మద్దతుగా ఛపాక్ సినిమాను చూస్తానని చెప్పారు. కాగా, మంగళవారం సాయంత్రం జేఎన్యూకు వెళ్లిన దీపిక.. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది : కనిమొళి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్లో పెను దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలు మహిళలపై లైంగిక దాడులను ప్రోత్సహించేవిలా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతూ ఆయన క్షమాపణను డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ తేల్చిచెప్పినా ఆయన వ్యాఖ్యలపై పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారని, దాన్ని తాము గౌరవిస్తామని అయితే వాస్తవంగా దేశంలో జరుగుతున్నదేంటని కనిమొళి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ మేకిన్ ఇండియా జరగకపోయినా దేశంలో మహిళలపై లైంగికదాడులు మాత్రం జరుగుతున్నాయని ఇదే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చెప్పారు. కనిమొళి వ్యాఖ్యలపైనా స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కూడా మీరు పార్టీలకు అతీతంగా వ్యవహరించలేకపోతున్నారని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా కనిమొళి..!
సాక్షి, చెన్నై: పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవి డీఎంకేకు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జోరందుకుంది. ఇందులో ఆ పార్టీ ఎంపీ కనిమొళి పేరు ప్రప్రథమంగా పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రతి పక్షాల తరఫున ఆమెకు చాన్స్ దక్కడం ఖాయం అన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి దేశ ప్రజలు ఊహించని రీతిలో మళ్లీ పట్టం కట్టారు. బీజేపీ కూటమి 352 స్థానాల్ని దక్కించుకోగా, అందులో బీజేపీ అభ్యర్థులే 303 మంది విజయఢంకా మోగించారు. ఇక, కాంగ్రెస్ తరఫున 52 మంది, ఆ కూటమిలోని డీఎంకే తరఫున 23 మంది పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా ప్రధాని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. 2014లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతి పక్షానికి అప్పగించడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకేకు ఆ చాన్స్ దక్కింది. ఆ పార్టీ తరఫున తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. అదే బాణిలో తాజాగా కూడా ప్రతిపక్షాలకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించే అవకాశాలు ఎక్కువేనని సమాచారం. అయితే, కాంగ్రెస్‌లో ఆ పదవిని చేపట్టేందుకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో మిత్ర పక్షం డీఎంకేకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ కాంగ్రెస్ వర్గాలు చర్చించినట్టు ప్రచారం. కనిమొళికి చాన్స్ ..... దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి గతంలో రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు. రెండుసార్లు ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఢిల్లీ కొత్తేమీ కాదు. అక్కడి ఎంపీలతో ఆమెకు పరిచయాలు ఎక్కువే. తాజాగా ఆమె తూత్తుకుడి నుంచి ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయకేతనం ఎగుర వేశారు. తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టనున్న కనిమొళికి పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల ఉప నేత పదవిని స్టాలిన్ కేటాయించారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేత పదవిని సీనియర్ నేత టీఆర్‌బాలుకు, విప్ పదవి ఎ.రాజాలకు అప్పగించారు. అయితే, ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్‌సభలో అడుగు పెట్టనున్న కనిమొళిని అందలం ఎక్కించే విధంగా కాంగ్రెస్ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ అభ్యర్థిత్వం తమిళనాడు నుంచి దక్కే విధంగా డీఎంకేతో ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదింపుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి ఫలం అన్నట్టుగా కనిమొళికి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించే విధంగా చర్చ సాగి ఉన్నట్టు ప్రచారం. మన్మోహన్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి పరోక్షంగా స్టాలిన్ అంగీకరించి ఉన్నట్టు, అందుకే కనిమొళి పేరును కాంగ్రెస్ పరిశీలనలోకి తీసుకున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ పేరు పరిశీలనలో ఉన్న దృష్ట్యా, ప్రతి పక్షాల తరఫున మహిళగా కనిమొళికి చాన్స్ ఇచ్చే రీతిలో ప్రయత్నాలు సాగుతున్నట్టు డీఎంకేలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. కనిమొళి విషయంలో స్టాలిన్ సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు చర్చ సాగుతున్న దృష్ట్యా, కనిమొళి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అయ్యేనా అన్నది మరి కొద్దిరోజుల్లో తేలనుంది. ఇక, తమిళ మీడియాల్లో సైతం కనిమొళి డిప్యూటీ స్పీకర్ ఖాయం అన్నట్టుగా చర్చ జోరందుకోవడం గమనార్హం. -
డిఎంకే కార్యాలయంపైనా ఐటీ దాడి
-
కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
హిందూ మతం: ఇవేమి తిప్పలు స్టాలిన్ బాబు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తాము హిందూ వ్యతిరేకులం కాదని, మత వ్యతిరేకులం అస్సలు కాదని పదే పదే చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఏప్రిల్ 9వ తేదీన దక్షిణ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమది హిందూ వ్యతిరేక పార్టీ కాదని, హిందూయిజం ఒక్క భారతీయ జనతా పార్టీ సొత్తు కాదని అన్నారు. ఒక దశలో ఆయన డీఎంకే హిందూత్వ పార్టీ కాకపోతే డీఎంకేలో ఉన్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు ఆయన ఎందుకు పదే పదే హిందూ వ్యతిరేకులం కాదని చెప్పుకోవాల్సి వస్తోంది? అందుకు దారితీసిన కారణాలు ఏమిటీ? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతిస్తున్న ‘ద్రావిడార్ కళగం’ అధ్యక్షుడు కే. వీరమణి గత మార్చి 27వ తేదీన ఓ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో సంచలనం సృష్టించిన ‘పొలాచ్చి సెక్స్ కుంభకోణం’ కేసు నిందితులను హిందువులు ఆరాధించే శ్రీకష్ణుడితో పోల్చారు. అందుకు హిందూ మక్కల్ కాట్చి అనే పార్టీ ఏప్రిల్ నాలుగో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి బీజేపీ, పాలకపక్ష ఏఐఏడీఎంకే.. డీఎంకే, ద్రావిడార్ కళగంలు హిందూ వ్యతిరేకులంటూ విమర్శిస్తూ వస్తున్నాయి. ఈవీ రామస్వామి పెరియార్ 1920లో ఓ సామాజిక ఉద్యమంలో భాగంగా ద్రావిడార్ కళగంను ఏర్పాటు చేశారు. డీఎంకేగానీ, అన్నా ఏఐఏడీఎంకేగానీ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చాయి. హిందువులను, హిందువుల ఆచారాలను విమర్శిస్తూనే ఈ రెండు ద్రావిడ పార్టీలు ఎదిగాయి. డీఎంకే నాయకుడు, స్టాలిన్ తండ్రి ఎం. కరుణానిధి నాస్తికుడు. ఏ రోజున గుళ్లూ గోపురాలు దర్శించలేదు. నాస్తికుడిగానే ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తూత్తుకుడి నుంచి డీఎంకే అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న స్టాలిన్ సోదరి కనిమోళి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పైగా తండ్రి కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో పలు మత కార్యక్రమాలు జరిగేవని చెబుతున్నారు. హిందు వ్యతిరేకులు అన్న ముద్ర పడితే ఎక్కడ ఓట్లు రాలవేమోనన్న భయం పట్టుకున్నది వారికి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమంటే ఇదేనేమో! -
కోడ్ ఉల్లంఘించిన నటుడిపై కేసులు
టీ.నగర్: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలతో డీఎంకే నేతలపై శుక్రవారం కేసులు నమోదయ్యాయి. కనిమొళిపై కేసు: హారతి పట్టిన వారికి నగదు అందజేయడంతో కనిమొళిపై శుక్రవారం కేసు నమోదైంది. తూత్తుకుడి నియోజకవర్గంలో డీఎం కే అభ్యర్థి కనిమొళి ప్రచారం చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుచెందూర్ అసెంబ్లీ పరిధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌తో కని మొళి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హారతి పడుతూ కనిమొళికి స్వాగతం పలికిన మహిళలకు అనితా రాధాకృష్ణన్ నగదు అందజేసి న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నట్లు ఏరల్ తహసీల్దార్ ముత్తురామలింగంకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కనిమొళి, అనితా రాధాకృష్ణన్ సహా ఏడుగురిపై తిరుచెందూర్ తాలూకా పోలీసు స్టేషన్లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు: కల్లకురిచ్చిలో ఉదయనిధి స్టాలిన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పార్లమెంటు ఎన్నికల్లో కల్లకురిచ్చి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి పొన్ గౌతమ్ సిఖామణి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ గత 23వ తేది కల్లకురిచ్చి కూడలిలో ఓపెన్‌టాప్ వ్యాన్‌లో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఉదయసూర్యుడి చిహ్నా నికి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట శంకరాపురం అసెంబ్లీ సభ్యుడు ఉదయసూర్యన్, ఇతరులు ఉన్నారు. ఇదిలాఉండగా ఎన్నికల స్క్వాడ్ అధికారి ముఖిలన్ కల్లకురిచ్చి పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు.అందులో ఉదయనిధి స్టాలిన్, ఉదయసూర్యన్ ఇతర నిర్వాహకులు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను మీరి ఒకే చోట గుంపుగా ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఉదయనిధి స్టాలిన్, ఎమ్మెల్యే ఉదయసూర్యన్లపై పోలీసులు మూడు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేశారు. -
అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే
చెన్నై: తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు లోక్‌సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించాయి. కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజ, టీఆర్ బాలు సహా పలువురికి డీఎంకే లోక్‌సభ టికెట్లను కేటాయించింది. డీఎంకే జాబితాలో ఏకంగా 12 కొత్త ముఖాలున్నాయి. 20లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌తోపాటు తమిళనాడులోని పలు చిన్న పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు చిన్న పార్టీలు ఉండటం తెలిసిందే. అన్నాడీఎంకే తమ పార్టీనేగాక, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కలిపి 40 లోక్‌సభ స్థానాలుండగా, డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశాయి. 8 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. డీఎంకే కూటమిలో అత్యధికంగా కాంగ్రెస్‌కు పది స్థానాలు దక్కగా, సీపీఐ, సీపీఎం, వీసీకేలు చెరో రెండు, మిగిలిన చిన్న పార్టీలు తలో సీటును దక్కించుకున్నాయి. ఇక అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే 7, బీజేపీ 5, డీఎండీకే 4 చోట్ల పోటీ చేయనున్నాయి. మిగిలిన నాలుగు సీట్లను చిన్న పార్టీలకిచ్చారు. తొలిసారి లోక్‌సభకు కనిమొళి పోటీ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే తమిళనాడు లో 18 నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా డీఎంకే ప్రకటించింది. -
కరుణ అందుకే శాకాహారి అయ్యారు!
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి ఒకప్పుడు మాంసాహారి. అయితే, ఒకే ఒక్క ఘటన ఆయన్ను పూర్తి శాకాహారిగా మార్చి వేసింది. శాకాహారిగా మారడం వెనుక ఉన్న నేపథ్యాన్ని డీఎంకే ఎంపీ, ఆయన కూతురు కనిమొళి శనివారం మీడియాతో చెప్పారు. ‘కరుణానిధి మాంసాహారి. ఆయన ఇంట్లో ఉన్నంతసేపూ నల్ల రంగు పెంపుడు కుక్క వెన్నంటే ఉండేది. తాను తినే ప్రతీదాన్ని ఆ కుక్కకు ఆయన పెట్టేవారు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన ఆ కుక్క మరణంతో కరుణానిధి మారిపోయారు. మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారి అయ్యారు. ఆ కుక్క కళేబరాన్ని మా ఇంటి వెనుక ఖాళీ స్థలంలో పూడ్చి పెట్టి, ఓ మొక్క నాటారు. ఆనాటి మొక్క నేడు పెద్ద చెట్టుగా ఎదిగింది’ అని కనిమొళి గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...
సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..? ‘స్టెరిలైట్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్ అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్ వైద్యనాథన్(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్ చేశారు. Vedanta approached the NGT against this order & Senior Counsel CS.Vaidhyanathan represented TN govt. Counsel for TN govt should have prepared adequately to defend the TN govt order of closure. But, the briefing & discussion on yesterday's hearing was done only at 10am yesterday. — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 The briefing and discussion on the hearing should have been done by Counsel CS.Vaidhyanathan at least a day before. But, CS.Vaidhyanathan was busy justifying the denial of space to our leader Kalaignar at Marina in Madras HC yesterday. 3/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 Or was this done deliberately by the government for Edappadi Palaniswami is taking TN to its lowest point in governance. 4/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018